Tuesday, 15 May 2018

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - యుద్ధ కాండ 41వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Yuddha Kanda 41 Day

యుద్ధ కాండ

నలభై ఒకటవ రోజు ప్రవచనము



దశకంఠుడైన ʻరావణ సంహారాన్నిʼ దశకంఠుడైన రావణాసురుని సంహారించినటువంటి రామ చంద్ర మూర్తిని చూసి దేవతలు ఋషులు మొదలైనటువంటివారు ఎంతో సంతోషించి పుష్పవృష్టిని కురిపించి మంగళవాద్యములను మోగించినటువంటి సందర్భం దగ్గర నేను నిన్నటిరోజు ఉపన్యాసాన్ని పూర్తిచేసియున్నాం. ఆ యుద్ధభూమిలో పడిపోయివున్నటువంటి రావణాసురునియొక్క మృతదేహాన్ని చూసి తోడబుట్టినవాడుకదా..! విభీషణుడు, బ్రతికున్నంతకాలం ఒకలా ఉంటుంది చనిపోయిన తరువాత ఒకలా ఉంటుంది, అదీ రామాయణం- అందుకే... చాలా యదార్థమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది. సుగ్రీవుడు చూడండి ʻవాలి బ్రతికున్నాన్నాళ్ళూ రాజ్యంకోసం వైరం భార్యకోసం వైరంʼ నిజంగా వాలి నిహతుడైపోయిన తరువాత యుద్ధభూమిలో వెళ్ళి అయ్యో అన్నాయ్యా! ఇలా పడిపోయావా... ఎటువంటివాడివి ఎంతమందిని ఓడించావు ఎన్ని గౌరవాలు పొందావు ఇలా పడిపోయావు ఎంతధారణమంటాడు, అన్నదమ్ములు బ్రతికున్నప్పుడు కొట్టుకుని చచ్చిపోయిన తరువాత ఏడ్వడమంత ధారుణమైన విషయం లోకంలో ఇంకోటుండదు.
అదే రాముడి దగ్గరికి వచ్చేటప్పటికీ దేశే దేశే కళద్రాణి దేశే దేశే చ బాంధవాః ! తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః !! అని అన్నాడు, ఆ జన్మకి తోడబుట్టినవాళ్ళన్నవారు ఒక్కరే, ఇక ఆ జన్మలో మళ్ళీ తోడబుట్టినవాళ్ళు కొత్తవాళ్ళు రావడమనేటటువంటిది జరగదు. కాబట్టి నేను సోదరులపట్ల అటువంటి ప్రేమను కలిగి ఉంటానూ అంటాడు ధర్మం అర్థం చ కామం చ పృథివీ చాపి లక్ష్మణ ! ఇచ్ఛామి భవతామఽర్థే ఏతత్ ప్రతి శృణోమి తే !! అంటాడు అయోధ్య కాండలో, నేను ధర్మం కానీ అర్థం కానీ కామం కానీ ఈ మూడిటిలో ఏది అనుభవించినా నా సోదరులతో కలిసి అనుభవించవలసిందే తప్పా నేను వేరుగా అనుభవించడానికి ఇష్టపడేవానిని కాను అని అంటాడు, అది రామ లక్ష్మణ భరత శతృజ్ఞుల మధ్యనున్నటివంటి ప్రేమ. అటువంటి ప్రేమకు నోచుకోనటువంటి అన్నదమ్ములు బ్రతికున్నన్నాళ్ళు మాట్లాడుకోకుండా ఉండడం బ్రతికున్నన్నాళ్లు వైరంతో ఉండడం, తీరా ఎవరో ముందువెనకాల ఉంటాయికదా... అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఎక్కడో... యుద్ధ భూమిలోనో ఎక్కడో మరణించినటువంటి ప్రేతాన్ని చూసో అప్పుడు ʻఆ గత వైభవాన్ని స్మరించి ఏడ్వడంʼ ఏమిటి ప్రయోజనం.
మనుష్య జన్మ అనేటటువంటిదీ బాగా బుద్ధిచేత వివేచనచేసి ఎటువంటి

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
పథంలో ప్రయాణించాలో అటువంటి పథంలో ప్రయాణించడంకోసం వచ్చినటువంటి జన్మ దాన్ని తెలుసుకుని అనుష్టించిననాడే అందం. కాబట్టి విభీషణుడు అంటాడూ వీర విక్రాన్త విఖ్యాత వినీత నయ కోవిద ! మహార్హ శయనోపేత కిం శేషేద్య హతో భువి !! “మహార్హశయ” నీవు సామాన్యుడవుకావు వీరుడవు విక్రాంతుడవు విఖ్యాతుడవు వినీతుడవి కోవిదుడవు అటువంటివాడివి ఇవ్వాళ ఎలాపడిపోయి ఉన్నావు భూమిమీద మహార్హ శయనోపేత కిం శేషేద్య హతో భువి ఒక్క మనుష్యుని చేత సంహరింపబడినవాడై ఈ భూమిమీద నీ శరీరం పడిపోయివుంటే పరాగమంతా ఒంటికంటుకునీ ఇంత ధారుణమైనటువంటి స్థితిలో నీవు పడిపోయివున్నావు త దిదం వీర సంప్రాప్తం మయా పూర్వం సమీరితం ! కామ మోహ పరీతస్య య త్తే న రుచితం వచః !! నేను గతంలోనే నీకు రాబోయేటటువంటి ఆపదనుగురించి వివరించాను అన్నయ్యా! నీవు కామమోహితుడవై ఉన్నావు నేను చెప్పేమాటలు నీ చెవికెక్కట్లేదు వద్దన్నయ్యా నామాటవిను సీతమ్మజోలికి వెళ్ళవద్దూని చెప్పాను కానీ నీ ప్రారబ్దమో నా ప్రారబ్దమో నా మాటలు నీ చెవికెక్కలేదు ఎక్కనటువంటిదాని పర్యావసానమేమిటంటే ఇదిగో ఇవ్వాళ నీవు యుద్ధభూమిలో పడిపోయివున్నావు అని సహజంగా యుద్ధ భూమిలో ఒక అన్నాగారు మరణిస్తే తమ్ముడు ఆ సమయంలో ఎలా విలపిస్తుంటాడో అలాగే సహజంగా విభీషణుడు విలపించాడు ఎందుకంటే సున్నిత హృదయుడు ధర్మాత్ముడు.
రామ చంద్ర మూర్తి జోక్యంచేసుకుని మాట్లాడుతాడు, మీరు రాముని యొక్క శీలాన్ని చూసినప్పుడు గమనించవలసిందిదే, రాముడు ఒక వ్యక్తి చనిపోయినా శత్రువు చనిపోయినా తన తండ్రి చనిపోయినా వేరొకరు చనిపోయినా ఒక పక్షి చనిపోయినా తను పరిపాలించినా తనకు కష్టమొచ్చినా తనకు సుఖమొచ్చినా తను చాలా కాలం నుంచి కోరుకున్నది తనకి ప్రాప్తించినా తాను చాలా కాలం నుంచి కోరుకుని తనతో ఉన్నటువంటివి తనకి దూరమైనా రాముడు మాత్రం ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడుతాడు, ఏమిటి మాట్లాడుతాడంటే? శాస్త్రం ఏమి మాట్లాడిందని మాట్లాడుతాడు లేకపోతే ఇతః పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి  నా వంశంలోని పెద్దలు ఏమన్నారోయన్నది మాట్లాడుతాడు తప్పా ʻనేను ఇలా అనుకుంటున్నాను అని రాముడు ఎప్పుడూ తన బుద్ధిచేత నిర్ణయం చేయడంకాని తన బుద్ధిచేత నిర్ణయించినదానిని అనుష్టించి పరిపాలించడంకాని రాముడు ఎప్పుడూ చేయలేదుʼ. రామ రాజ్యం రామ రాజ్యం అని ఒకమాట అంటూంటారు, రామ రాజ్యమన్నమాటకి మిగిలిన రాజ్యాలన్నమాటకు ఒకమాట తేడా ఉంది ఎందుకంటే ఎందరో రాజులు పరిపాలించారు ఈ భూమండలాన్ని ఇంతమంది పరిపాలించినా అప్పటికవి స్వర్ణయుగాలు.
కానీ గుప్త రాజ్యం లేకపోతే హర్షవర్ధన రాజ్యం లేకపోతే ఏదో చోళరాజ్యం ఇలా వాటిని ఆదర్శంగా రాజ్యమన్నపేరుతో వ్యక్తిపేరుపెట్టిచెప్పరు. అన్నీ అప్పటికి వచ్చాయి ఆ తరువాత కాలగర్బంలో కలిసిపోయాయి కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాలములై యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా! అంటారు పోతనగారు భాగవతంలో అలా వచ్చారు వెళ్ళిపోయారు యుగం మారిపోయింది త్రేతాయుగం మారిపోయి కలియుగమొచ్చేసింది, త్రేతాయుగం తరువాత ద్వాపర యుగం ద్వపర యుగం తరువాత కలియుగం వచ్చింది అయినాకూడా ఇప్పటికీ మనం పరిపాలనా అంటే

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ఏమంటామంటే రామ రాజ్యమంటాము, రామ రాజ్యమంటే ఏమిటీ రహదారులకు రెండు ప్రక్కలా చెట్లు నాటించెను చెరువులు తవ్వించెను వ్యవసాయమునకు నీటి సౌకర్యము కల్పించెను వాటిచేత రామ రాజ్యమా? ఏమి మిగిలనవాళ్ళు కూడా చేసివాళ్ళు ఉన్నారుకదా అశోక రాజ్యమని ఎందుకు చెప్పరు, హర్షవర్ధన రాజ్యమని ఎందుకు చెప్పరు, రామ రాజ్యమంటారు దేనికైనా రాముడే మనకీ ఆదర్శంగా మాట్లాడుతాము. రామ రాజ్యమన్నమాటకి ఏమిటి అర్థం, రాముడు అలా పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడు? అని అప్పుడు అది వైభవము చెప్పకుండా అందరూ రామ రాజ్యమండీ రామ రాజ్యమండీ అంటూంటారు.
రామ రాజ్యమన్నమాటకు అర్థమేమిటో తెలుసా... రాముడు పరిపాలించేటప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకుని పరిపాలించినది ఒక్కటే, ఆయన దృష్టిలో ఉన్న ఒకేఒక్క కోణమేమంటే ధర్మము. రాజ్య పరిపాలనా పరమ ధార్మికంగా ఉండాలి, నేను ఎలా కూర్చుంటే ఆ ధర్మమన్న చట్రములోనికి ఇమిడి ఉంటాను అంతే అదొక్కటే ఆయన చూశారు. దాని ఫలితమేమిటీ రాజ్యమంతా ధర్మమే రేపు మీరు వింటారు పట్టాభిషేక సర్గలో రామ రాజ్యమన్నమాటకు రెండు శ్లోకాలలోంచి తీసి కలిపారు, రాముడు ధర్మమునకు కట్టుబడిపోయాడు అందుకే రాజా రాముడిగా కూర్చోవాలీ అంటే ప్రజలచేత ఏ విషయంలో ఎత్తి చూపబడ్డాడో ఆ విషయంలో ఆయన అంగీకరించడు, ధర్మమునకు కట్టుబడిపోయి ఉంటాడు ఎంత ధర్మమునకు కట్టుబడుతాడంటే ఆయనా సింహాసనంమీద కూర్చున్నదెందుకు ప్రజా సంక్షేమముకొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత అందుబాటులో ఉంటాడంటే ప్రజలకి ఉత్తరకాండ మీరు చదివితే ఒక కుక్కా రామునితో మాట్లాడింది. అది ఆయన అందుబాటు తనమంటే. ప్రజలవద్దకు ప్రభుత్వం రామ రాజ్యం అంటే ఆయనా అంతబాగా ప్రజలవద్దకు చొచ్చుకుపోయాడు అంత తేలికగా వెళ్ళగలిగాడు అంత సులభుడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు ఎప్పుడూ కూడా తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞతో ఉండేవాడు ఆయనకీ నావాడా పైవాడా ఈయ్యనెవరూ ఆయనెవరు ఆయనకు అనౌసరము ఆయనకి ధర్మమొక్కటే ఆ ధర్మాన్ని పట్టుకునే పరిపాలనచేశాడు, ఆ ధర్మంతో బ్రతికాడు ఆ ధర్మంతో వెళ్ళిపోయాడు రామావతారంలో, అందుకే ఇంక ఇతర రాజ్యాలని వేటినీ మనం ఆదర్శంగా చెప్పము, రాజ్యము బాగా పరిపాలన చెయ్యబడితే రామ రాజ్యమే చెప్తాము కారణమేమిటంటే అది ధర్మమునకు కట్టుబడినటువంటి పరిపాలనగనుకా.
కాబట్టి మీరు ఎప్పుడు రాముడు మాట్లాడినా దీన్ని విచారణ చేస్తుండాలి రాముడు ఇప్పుడు రావణాసురుడు తన యొక్క ప్రగాఢశత్రువు తన భార్యని అపహరించినవాడు అటువంటివాడు భూమిమీద పడిపోయాడు, తనని ఆశ్రయించినవాడు తనచేత లంకారాజ్యమును పొందినటువంటివాడు ఏడుస్తున్నాడు. రాజయకీయ్యమని ఒకమాటుంటుంది, రాజకీయ్యంవేరు రాజనీతి వేరు, రాజ నీతిజ్ఞులు ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు  లేరనల్లేను చాలా తక్కువుంటారు కాబట్టి ఆయన కూడా నా శత్రువు నా భార్యని ఎత్తుకునిపోయినవాడు చనిపోతే వీడు అన్నయ్యని ఏడుస్తున్నాడని అన్నాడనుకోండి, విభీషణునికి ఏడ్చే అధికారంకూడా ఉండదు. అప్పుడు “పుష్పక విమానంలో తీసుకొచ్చీ సృహతప్పిపోయినటువంటి రామున్ని చూపించి నీ భర్త మరణించాడూ అని చెప్పి పుష్పకం దింపకుండా ఏడ్వడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సీతమ్మని బాధపెట్టిన రావణాసురునికీ”... తన అన్నగారు మరణిస్తే ఏడ్చే అవకాశం ఇవ్వనటువంటి రామునికీ ఏం తేడా ఉంటుంది నాకు చెప్పండి.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
రామ హృదయంటే ఏమిటో తెలుసాండీ అలా ఏడ్వకపోతే అసహ్యించుకుంటాడు. రాముడు మహాజ్ఞాని ఆయన్ని మించినటువంటివాడులేడు అందుకే మీరు చూస్తే రామ చంద్ర మూర్తికి అష్టోత్తరంలో ఆయనకి ఒక నామముంది జగత్ గురవేనమః అని, రాముడు జగత్ గురువు, జగత్ గురువుకనుకనే ఆయనకి వ్యాఖ్యాంతం భరతాభిః పరివృతం రామం భజే శ్మామలమ్ ఆయనా వీరాసనం వేసుకుని కూర్చుని, హనుమాది వానరులకు తన సోదరులకు తత్వాన్నిభోధ చేస్తుంటాడు, తత్వబోధ చేసే రాముడు పట్టేముద్రా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇలా ఛిన్ముద్రపట్టి ఉంటాడాయన.
మిగిలినటువంటివి మీరు ఎక్కడా ఏ మూర్తిని చూసినా అలా ఉండడు, ఒక్క తత్వబోధచేసేటటువంటి రాముడు ఛిన్ముద్రపట్టి ఉంటాడు. మొన్నన ఎవరో బహుమానంచేశారు చాలా అద్భుతమైనటువంటి మూర్తి దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచా కాకినాడ తీసుకెళ్దామని కాబట్టి వ్యాఖ్యాంతం భరతాభిః పరివృతం రామం భజే శ్మామలమ్ ఆయన జగత్ గురువు, జగత్ గురువైనటువంటి రామ చంద్ర మూర్తి ఎక్కడ ఏది మాట్లాడినా దానికో విలువ ఉంటుంది. అది భవిష్యత్ తరమునకు మార్గదర్శకమై ఉంటుంది తప్పా ఏదో మాట్లాడటంకింద రాముడు మాట్లాడడు, పడిపోయినవాడు రావణుడు ఏడుస్తున్నవాడు విభీషణుడు జోక్యం చేసుకుని మాట్లాడుతున్నవాడు రామ చంద్ర మూర్తి ఆయన ఎంత అందంగా మాట్లాడాడో చూడండీ నాయం వినష్టో నిశ్చేష్ట స్సమరే చండ విక్రమః ! అత్యున్నత మహోత్సాహః పతితోయ మశంకితః !! ఈ పడిపోయినటువంటి రావణాసురుడు ఒక పిరికిపంద ఎలా చచ్చిపోతాడో అలా చచ్చిపోలేదు ఆయన బత్రికున్నప్పుడు ఎలా ఉన్నాడో మాట్లాడటంలేదు రాముడు ఇదీ బుద్ధివైభవము ఇదీ మనిషి నేర్చుకోవలసినటువంటి ధర్మము. ఈ దుర్మార్గుడు నా భార్యని అపహరించాడు ఎన్నిపాపాలు చేశాడు నీ మాట విన్నాడా... వినుంటే ఇలా అయ్యేవాడా అని అనలేదు రాముడు. చచ్చిపోవడము ఎలా చచ్చిపోయాడో మాట్లాడాడు అంటే చనిపోయినవాన్ని చూసినప్పుడు నీవు స్మరించడానికి ఏదో ఒక చిన్న మంచిగుణం ఉంటుంది, ఆ ఒక్క మంచిగుణం మాట్లాడు తప్పా... ప్రేతం దగ్గరికెళ్ళి మాత్రం నీవు ఆయన గతజీవితం తవ్వి తప్పులుగురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చెయ్యకూడదు ఇదే తీర్పు చెప్తాడు రామ చంద్ర మూర్తి. కాబట్టి ఆయన అన్నాడు ఎలా చనిపోయాడన్నది ఆలోచించు ఒక పిరికిపంద చనిపోయినట్లు చనిపోలేదు బీరువై పారిపోయి చచ్చిపోలేదు ఇతని రథోత్సాహము మహోన్నతమైనది ఎటువంటి యుద్ధం చేశాడు ఇతను నాతో చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూడడానికి సమస్త దేవతలు ఋషులూ ఆకాశంలో నిలబడి చూశారు అంత గొప్ప యుద్ధం చేశాడు నిర్భయంగా చేశాడు ఆ యుద్ధాన్ని తప్పా ʻఎలాగోలాగ మనం తప్పించుకుని పారిపోయి మళ్ళీ అభ్యున్నతిని పొందలేమాన్న ఆలోచనʼ చెయ్యలేదు.
ఉండడమో ఊడిపోవడమో రెండేమార్గాలు అన్నంతగా యుద్ధం చేశాడు నైవం వినష్టా శోచ్యన్తే క్షత్ర ధర్మ మవస్థితా ! వృద్ధి మాఽఽసంసమానా యే నిపతంతి రణాజిరే !! ఈయ్యనా క్షత్రియులు ఎటువంటి ధర్మాన్ని అనుష్టిస్తారో అంటే విజయమో వీరస్వర్గమో ఎదురుగుండా ఉండేటటువంటి వీరునితో పోరాటం చేసేటప్పుడు ఉంటే ఉండడం రాజ్యాభ్యున్నతి పొందడం పోతే శరీరం పోవడం తప్పా బ్రతకడం కోసమని చెప్పి గడ్డి కరవడమన్నది మాత్రం ఇక చెయ్యరు. అటువంటి ఉత్తమమైనటువంటి క్షాత్ర ధర్మమును అవలంభించాడు యుద్ధంలో వెన్నిచ్చిపారిపోలేదు, సారథి తీసుకెళ్తే సారథిని

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
దెబ్బలాడాడు తప్పా ఎదురు నిలబడి పోరాడాడు అటువంటివాడు కిందపడిపోయాడు. ఒకప్పుడు ఇంద్రాది దేవతల్నీ గజగజలాడించాడు అంతటి పరాక్రమంతో బ్రతికాడు, యుద్ధమనేటటువంటిది ఒక పక్షం గెలవడానికే చెయ్యబడుతుంది రెండు పక్షాలు గెలవడమన్నది ఎప్పుడూ సంభవంకాదు విభీషణా..! రెండు పక్షాలు గెలిచినదానిని యుద్ధమనరు కాబట్టి ఒక పక్షమే గెలవాలి. కాబట్టి మనమన్నా గెలవాలి రావణుడన్నా గెలవాలి ఇది మనకు యుద్ధ ప్రారంభమునుండి తెలుసు ఈ విషయము. మనమన్నా గెలుస్తాం రావణుడన్నా గెలుస్తాడని, రావణుడు పడిపోయాడు మనం గెలిచాం కానీ పడిపోయిన రావణుడు తన జీవితంలో మాత్రం చిట్టచివరి దశలో అత్యద్భుతమైన యుద్ధంచేసి వీర స్వర్గాన్ని అలంకరించాడు. ఇంత గొప్ప స్థితినిపొంది వీర స్వర్గాన్ని అలంకరించినటువంటి మహాపురుషునికి తమ్ముడవైనందుకు నీవు ఆయన్ని చూసి ఇయం హి పూర్వైః సందిష్టా గతిః క్షత్రియ సమ్మతా ! క్షత్రియో నిహత స్సంఖ్యే న శోచ్య ఇతి నిశ్చయః !! క్షత్రియ సమ్మతమైనటువంటి పథంలో వెళ్ళిపోయినటువంటివాన్ని చూసి నీవు ఇలా ఏడ్వకూడదు.
అంటే విభీషణుడన్నాడు అనేన దత్తాని సుపూజితాని భుక్తా శ్చ భోగా నిభృతా శ్చ భృత్యాః ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్యమిత్రేషు చ యాపితాని ! ఎప్పుడైనాంతే లోకంలో సందర్భమెలా ఉంటుందంటే ఒక్క ధార్మికుడు సభలో ఉన్నాడనుకోండి సభలో కనీసం ధర్మగురించి మాట్లాడేటటువంటివాడు ఆయన ఉన్నారు బాగుండదనిచెప్పి కనీసం అప్పటికైనా సరిగ్గా ఉండడం తటస్థిస్తుంది అదికూడా లేకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిని పొందుతుంది అందరూ చెప్పినా వినని రావణులే అయిపోతారు, ధార్మికుడైనవారిపట్ల ఆ మర్యాద ఎప్పడూ ఉండాలి. ఇప్పుడు రావణుడు చెప్పినటువంటిమాటచేత ప్రచోదనం పొందాడు విభీషణుడు పొంది అంటున్నాడు మా అన్నయ్యా అడిగినవాళ్ళకి కొల్లలుగా దానం చేశాడు, గురువుల్ని సేవించాడు, ఇష్టదైవాన్ని ఆరాధనచేసి చేశాడు, ఆయన అనుభవించని భోగమేమీలేదు సమస్తభోగాల్ని అనుభవించాడు ధనాని మిత్రేషు సమర్పితాని తనని నమ్ముకున్నటువంటి మిత్రులకు విపరీతమైనటువంటి ధనమిచ్చాడు అటువంటివాడు ఇవ్వాళ పడిపోయాడు అని రాముడు చెప్పినటువంటి మాటలు దృష్టిలోపెట్టుకుని అంటే మనుష్యుల మాటలు ఇతరులవి వినేవాళ్ళని ఎంత ప్రభావితంచేస్తాయో మీరు గమనించాలి. నేను మీతో అనేక పర్యాయాలు ప్రస్తావనచేశాను శ్రీరామాయణం ఒక ధర్మ శాస్త్రం, శ్రీరామాయణం ఒక జోతిష్య శాస్త్రం, శ్రీరామాయణం ఒక గురువైభవము, శ్రీరామాయణం వాక్ వైభవము మీరు ఈ ఘట్టాల్ని ఈ రెండు సర్గల్ని పక్కపక్కనపెట్టి చూస్తే కదులుతున్నవాడొకడు కనపడుతాడు పరమ ధర్మాత్ముడు విభీషణుడు అంతటి విభీషణుని నోటివెంట రాకూడని మాటొకటి వచ్చింది యుద్ధకాండలో అసలు మనం ఊహించం అటువంటి మాట వస్తూందని, వచ్చింది విభీషణుని నోటివెంట, కానీ సర్దుకోగలిగాడు ఎందుకు సర్దుకోగలిగాడూ అంటే బ్రహ్మగారి దగ్గర వరంపొందాడు నేను ఆపత్కాలమునందుకూడా ధర్మమునుండి నా బుద్ధి వైక్లవ్యము పొందకుండుగాకా... అని అడిగాడు కాబట్టి సర్దుకోగలిగాడు.
మాటలు మనుషలమీద ఎంత ప్రభావం చూపిస్తాయి అన్నదానికి నేను ఎదర జరగబోయేటటువంటి విషయాలలో దాన్ని మనవిచేస్తాను, ఇంత గొప్పగా రావణుడిగురించి మాట్లాడి రామ చంద్ర మూర్తితో అన్నాడు ఏషో హితాగ్ని శ్చ మహా తపా శ్చ వేదాన్తగః కర్మసు చాగ్ర్య వీర్యః ఏతస్యయ త్ప్రేత గతస్య కృత్యం తత్ కర్తు మిచ్చామి తవ ప్రసాదాత్ ! ఈయనా ఒక

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
గొప్ప తపస్వి వేదాంతవేత్త యజ్ఞ యాగాది క్రతువులని ఆచరించినవారిలో ప్రముఖుడు అటువంటివాడు ఇంత దయనీయంగా

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
పడిపోయాడు, ఈ శరీరం ఇలా పడిపోయి ఉండకూడదు మనుష్య జాతికి ఉండవలసిన లక్షణమేమిటంటే ఎక్కడైనా ఒక మనుష్య ప్రేతం పడిపోయి ఉంటే అంతేష్టి సంస్కారం చెయ్యవలసి ఉంటుంది అందుకే కలియుగంలో ఇక అశ్వమేధ యాగం ఇవ్వలేదు, కలియుగంలో అశ్వమేధ యాగంలేదు అశ్వమేధ యాగమునకు తుల్యము ఏదీ అంటే అనాథ ప్రేతసంస్కారమే. ఎక్కడైనా ఒక ప్రేతము ఉండిపోతే ఆ ప్రేతమునకు సంస్కారం చెయ్యడమే అశ్వమేధంతో సమానమైనటువంటి స్థితిని పొందుతుంది కాబట్టి మీరు అనుమతిస్తే నేను ఈ రావణాసురుని యొక్క భౌతిక కాయమునకు అంతేష్టి సంస్కారం చేస్తాను అంటే పిండాడము బ్రహ్మాండములోకి కలుపుతాను అదొక ప్రక్రియ మంత్రములతో ఇందులో ఉన్నటువంటి పంచభూతాల్నీ పైన ఉన్నటువంటి పంచ భూతాలతో కలిపేస్తారు అంటే సమన్వయం ఆగిపోతూంది సమన్వయం ఆగిపోయిందీ అనీ గుర్తు. దానికేం చేస్తారంటే మంత్రబద్ధంగా ఇందులో ఉండేటటువంటి వాయువులన్నీకూడా విడదీసేసి ఈ శరీరాన్ని ఆ బ్రహ్మాండంతో కలిపేసేసి విడిపోయినటువంటి జీవుడు పితృదేవతా స్థానాన్ని పొందుతాడు కాబట్టి ఆశీర్వచనాన్ని పుచ్చుకోండనిచెప్పి జ్ఞాతులందరి అభ్యున్నతికొరకు ఒక హోమం చేస్తారు.
అందుకే దాన్ని జ్ఞాతి హోమము అని పిలుస్తారు అందుకే పదకొండురోజులు అసౌచం జ్ఞాతి తప్పకుండా వెళ్ళి తినడమన్నది ఆరోజున ఒక సాంప్రదాయంగా వస్తూంది. ఏది పెట్టినా సనాతన ధర్మంలో చాలా విశాలమైనటువంటి దృక్పథంతో పెడతారు. కాబట్టి నేను అంతేష్టిసంస్కారం చేస్తాను అని అడిగాడు, అయితే రాముడన్నాడు మరణాంఽతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనం ! క్రియతా మఽస్య సంస్కారో మమాఽప్యేష యథా తవ !! ఇది చాలా చాలా చాలా చాలా... పెద్దమాట రాముడు తప్పా అన్యులు అనలేనిమాట ఎంతగొప్పమాటన్నాడంటే మరణాంతాని వైరాణి మరణంతోనే వైరంపోయింది రావణుడు కదిలినప్పుడు వైరం నాకు రావణునికి, రావణుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు రావణునియొక్క శరీరం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు వైరమన్న సమస్య ఏమీలేదు, నీవు ఏ అంతేష్టి సంస్కారం తప్పకుండా చెయ్యాలో ఆ సంస్కారంను నీవు చేసి తీరాలి విభీషణా..! ఎందుకనీ? ఆయన చేత్తో ఆయనే ఒక పెద్ద పొరపాటు చేసుకున్నాడు, తన తల కొరివి పెట్టవలసినటువంటి కొడుకులందద్నీ తనకన్నా ముందు చంపుకున్నాడు కాబట్టి ఇప్పుడు తమ్ముడు సంస్కారం చెయ్యవలసి వచ్చింది. కాబట్టి నీవు చెయ్యి అంటూ మమాప్యేష యథా తవ నీకు రావణుడు ఎలాగో నాకు రావణుడు అంతే. అంటే ఇప్పుడు రావణుడు రామునికి ఏమౌతాడు అన్నగారౌతాడు ఏధర్మంచేత అవుతాడు ఏదోక ప్రాతిపధిక ఉండాలిగా... నీవునాకు మిత్రుడవు మిత్రుడి అన్నగారు నాకు కూడా అన్నగారే కాబట్టి అందులో హెచ్చరిక ఏమంటే నీవు ఏకారణంచేతనైనా మానితే నేను చేస్తాను సంస్కారం నీవు ఎలా తమ్ముడవో నేను కూడా అలాగే తమ్ముడను. తమ్ముడైతే మరి అన్నయ్య నీకు అంత ద్రోహంచేశాడే అని అంటావేమో మరణాంతాని వైరాణి ఆమాట అసలు ప్రస్తావన చెయ్యొద్దు, ఇప్పుడు చెయ్యవలసింది నా ధర్మం నేను చెయ్యాలి అంతే నీ ధర్మం నీవు చెయ్యాలి నీ ధర్మం నీవు చెయ్యడానికి నా ధర్మం నేను చెయ్యడానికి గతాన్ని తవ్వుకోవడం అనౌసరం నీది నీవు చెయ్యాలి. ఇదీ పట్టుకోగలిగినటువంటి హృదయమున్నటువంటి పెద్దలమాటలు రామాయణంలోంచే వస్తాయి.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
అందుకే ఒకప్పుడు శృంగేరీ పీఠానికి ఆధిపత్యవహించనటువంటి మహాపురుషుడు చంద్రశేఖర భారతీ... అబ్బో ఏమి మాటలో పరమాచార్య స్వామివారి మాటలు ఎలా ఉంటాయో... చంద్రశేఖర భారతీ స్వామివారి మాటలు అలా ఉంటాయి. ఆయన దగ్గరికెళ్ళి మా నాన్నగారిని బాగ చూస్తున్నాను మా అమ్మగారిని బాగా చూస్తున్నాను అని చెప్తే చాలా సంతోషము చాలా సంతోషము, కానీ మా నాన్నగారే నన్ను సరిగ్గా చూడరండీ అన్నాడు, ఆమాటనకు నీ తండ్రిని నీవు చూడ్డం నీ ధర్మం నీ తండ్రి నిన్నెలా చూడాలో ఆయన ధర్మం ఆయన ధర్మం నీకెందుకు నీ ధర్మం నీవుచెయ్యి అంతే. ఎంతగొప్ప మాటో చూడండి, పట్టుకోగలిగినటువంటిదేదో అదే ధర్మం ధయతేవా జనైరితి ధర్మం నీవు పట్టుకుని అనుష్టించేది ధర్మం. నీవు తెలుసుకున్నది ధర్మమెప్పుటికీ కాదు. ʻనాకు తెలుసండీʼ ధర్మం కాదు తెలిసి అనుష్టిస్తావా? తెలుసండి అనుష్టించను ʻనీది రావణ బుద్దనిʼ గుర్తు. తెలిసి అనుష్టించనిది ప్రమాదకారి, తెలుసండీ అనుష్టిస్తాను నీవు రామ చంద్ర మూర్తివి అంతే తేడా కాబట్టి ఆయనా నీకు ఎంతో రావణుడు నాకు అంతే మరణాంతాని వైరాణి కాబట్టి నీవు అంతేష్టిసంస్కారము చెయ్యవలసినది.
సరే, ఆ రావణాసురునియొక్క రాణులు కొన్ని వందలమంది ఉన్నారు వాళ్ళందరు యుద్ధభూమికి వచ్చారు ఆశరీరం కాళ్ళు పట్టుకున్నారు పాదాలు పట్టుకున్నారు చేతులు పట్టుకున్నారు గుండెలమీద పడ్డారు వాళ్ళందరు ఏడుస్తున్నారు, కానీ మహర్షి యొక్క గొప్పతనమెక్కడుందంటే... ఆయన ఒక్కొక్క పథాక సన్నివేషంలో ప్రవేశ పెట్టినటువంటి ఒక్కొక స్త్రీ మాటలచేత ఆమెయొక్క శీల వైభవాన్ని ఆవిష్కరింపజేశాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే రామాయణంలో కొన్ని మెరుపులున్నాయి మీతో మనవిచేశా అయోధ్యకాండలో సుమిత్రాదేవి మాట్లాడితే ఎలా ఉంటుంది, కిష్కింధ కాండలో తార మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు చాశారు. తార ఒక మెరుపు అలాగే యుద్ధ కాండలో మండోదరి ఒక మెరిపు, శ్రీరామాయణంలో మండోదరి గురించినటువంటి ప్రస్తావన పెద్ద ఎక్కడా ఏమిరాదసలు, ఎక్కడొచ్చిందంటే ఒక్క ఉత్తర కాండలో చెప్పారు మహర్షి, రావణాసురుడికి మండోదరికి వివాహమెలా అయ్యిందో చెప్పారు ముగ్గురన్నదమ్ములకి శూర్ఫణకకి వివాహలు జరిగినటువంటి ఘట్టాలు చెప్తూ అందులో రావణాసురుడు మయుణ్ని కలుసుకోవడం, మయుడు తనకూతురితో తిరుగుతున్నప్పుడు ఈమె నా కూతురు మండోదరి అని చెప్తే ఆవిడని ఈయ్యన స్వీకరించడం. అప్పట్నుంచి ఆవిడ మహా పతివ్రతగా ఉంది అంతే, కానీ... ఆమె పాతివ్రత్యమేమీ మీరు చూడ్డానికి మీకు రామాయణంలో ఎక్కడా ఏమీ కనపడదు ఒక్క చోటమాత్రం ఆవిడ తళుక్కని మెరుస్తుంది, ఎక్కడ మెరుస్తుందంటే సుందర కాండలో తాసామ్ ఏకాన్త విన్యస్తే శయానాం శయనే శుభే ! దదర్శ రూప సంపన్నామ్ అపరాం స కపిః స్త్రియమ్ !! అంటారు మహర్షి.
అందరూ క్రీడించి క్రీడించి ఆయన ప్రియురాళ్ళు ఆయన చుట్టూ మధించినటువంటి ఎద్దుచేత భోగింపబడినటుంటి ఆవుల మందలలో ఆంబోతు పడుకున్నట్లు రావణుడు పడుకున్నా... ఆమె మాత్రం దాన్నికూడా సహించి భర్తయందు అపారమైన ప్రేమకలిగినదై మహాపతివ్రతయై పక్కన ఉన్న హంసతూలికా తల్పంమీద పడుకుంటే ఆతల్లిని చూసే సీతమ్మాని హనుమ అంతటివారు కూడా బ్రమపడ్డారు. అదొక్కటి తప్పా ఇంకొకటి కనపడదు కానీ రావణ సంహారమైన తరువాత మండోదరి యుద్ధభూమిలో ప్రవేశించింది, ప్రవేశించినటువంటి మండోదరి మాట్లాడుతుంది రావణాసురుని యొక్క శరీరాన్ని పట్టుకుని, ఆవిడ మాట్లాడేటప్పుడు ఎంతైనా మాట్లాడచ్చు అంటే శ్రీరామాయణాంతర్గతంగా లేదు కాని వాల్మీకి రామాయణంలో

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
లేదు కాని రామాయణాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు ఎక్కడైనా ఏమైనా అనుమానముంటే సాధారణంగా పెద్దలు చూసేటటువంటి గ్రంధాలు పద్మపురాణాన్ని ఎక్కువగా ఆధారంగా తీసుకుని చూస్తారు, ఇతర పురాణములను ఆధారంగా తీసుకుని చూస్తే ఒక విషయం కనపడుతుంది వాల్మీకి రామాయణంలో మాత్రంలేదు. ʻతారా రామ చంద్ర మూర్తిని శపించిందీని ఒక వాక్కుʼ ఏమని? ఎందువల్లాంటే నీవు నా భర్తను చంపావుగనుకా నీవు సీతమ్మని పొందినా ఎక్కువకాలము సీతమ్మతల్లితో కలిసి ఉండకుందువుగాకా... అని మహాపతివ్రతయైన తార శపించింది, ఆ కారణం చేతనే సీతావియోగం సంభవించిందంటారు. వాల్మీకి రామాయణంలో అది లేదు కానీ వాల్మీకి రామాయణం పరమ ప్రమాణంగా స్వీకరించినప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టండి, మరి ఎందుకు ప్రస్తావన చేశావు అని మీరు నన్ను అడగచ్చు.
మహా పతివ్రతలై తారాదులు తమ వాక్కులచేత కథని మలుపుతిప్పారు, అంతవరకెందుకు లక్ష్మణ మూర్తి కోపాన్ని ఉపశమింపజేసింది తారకదా తన వాక్కులచేతా... విశ్వామిత్ర ప్రస్థావన తీసుకొచ్చీ.., కానీ అసలు నిజానికి రామ చంద్ర మూర్తిపట్ల పరమ క్రుద్ధురాలు కావలసినటువంటి ఏకైక వ్యక్తి రామాయణంలో మండోదరి ఎందుకో తెలుసాండీ, ఆమె యొక్క రాణి పదవిపోయింది, ఎందుచేతాంటే విభీషణుడు రాజైపోయాడు, తన భర్త ఇంత కీర్తిమంతుడుపోయాడు, అన్నింటినీమించి ఇంద్రున్ని గెలిచినటువంటి తన కొడుకు ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో పోయాడు. ఒకే స్త్రీకి భర్త రాచరికము వైభవము (కొడుకు) ముగ్గురూ ఒకరివల్లే నశించారు, ఆ స్త్రీ ఇప్పటివరకు రామ లక్ష్మణుల్ని చూడలేదు ఆమె ఇప్పుడే చూస్తుంది ఎందుకంటే ఆవిడ మహాపతివ్రతా ఆవిడ ఎన్నడూ పైకిరాలేదు భర్త పక్కనలేకుండగా ఆవిడ ఇప్పుడు బయటికొస్తుంది, బయటికొస్తున్నప్పుడు రాముడు అక్కడే నిలబడి ఉన్నాడు రాముని పక్కన లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు సహజంగా ఆ స్థితిలో యుక్తాయుక్త విచక్షణ అన్నది ఉండడం చాలా కష్టం, ʻఉండకుండా కోపంʼ ఎటువైపుకి వెళ్తూందంటే నా భర్త మరణమునకు కారణమైనవాడూని రామునివైపుకు వెళ్ళాలి, వెళ్ళి మండోదరి శాపవాక్కు విడిచిపెట్టగలదు మీరిదిగుర్తుపెట్టుకోవాలి ఆవిడ మహాపతివ్రత. ఆవిడ ఒక స్థితిలో చెప్పింది ʻసీతమ్మ నాకన్నా ఏపాటి ఎక్కువైందిʼ అని అడిగింది ఆవిడ అంతటి పతివ్రత కూడా. అటువంటి మండోదరి శపించలేదు రామున్ని ఇదీ ఆవిడయొక్క వైభవాన్ని ద్విగుణీకృతం చేసింది రామాయణంలో. మండోదరి యొక్క శీలాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ఉద్దీపింపజేశారంటే మహర్షి రావణవధ అయినతరువాత ఆవిడ యుద్ధభూమిలో మాట్లాడిన మాటలు ఏవున్నాయో ఆ మాటలు మండోదరియొక్క బుద్ధి వైశిష్ట్యానికి ఆవిడ ఎంత ఎత్తు ఎదిగిపోయింది అన్నదానికి ఉదాహరణలు.
ఈ ఘట్టం చదివినవాళ్ళు మండోదరికి నమస్కరించకుండా ఉండలేరు అంతగొప్పగా మాట్లాడింది ఆవిడ, ఆవిడంది నను నామ మహా బాహో తవ వైశ్రవణానుజ ! క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం త్రస్యత్యపి పురందరః !! నీవు సాక్ష్యాత్తుగా కుబేరుని యొక్క సోదరుడివి విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారిడివి నీవే ఆగ్రహిస్తే ఇంద్రుడంతటివాడు గజగజా వణికిపోతాడు ఋషయ శ్చ మహీ దేవా గన్ధర్వా శ్చ యశస్వినః ! నను నామ తవో ద్వేగా చ్చారణా శ్చ దిసో గతాః !! నీకేగాని ఆగ్రహమొచ్చి నీవు ధనస్సు పట్టుకున్నావా ఋషులు దేవతలు ఇతరమైనటువంటి గంధర్వులు కీర్తివహించినటువంటివాళ్ళందరూ కూడా దిక్కులుపట్టి పారిపోతారు అంతటి పరాక్రమము కలిగినవాడివి అటువంటివాడివి స త్వం మానుష మాత్రేణ రామేణ యుధి నిర్జితః ! న వ్యపత్రపసే రాజన్ కిమ్ ఇదం రాక్షసర్షభ !! అటువంటివాడివి అంతగొప్పవాడివి చిట్టచివరకి ఒక మనుష్యుడి చేతిలో చచ్చిపోయావు నీకిది సిగ్గుగాలేదా అని అడిగింది ఆవిడ, ఇక్కడిదాకా వచ్చాక మనమేం ఊహిస్తామంటే సాధారణంగా మీరు ఈ శ్లోకం యొక్క రెండోపాదాన్నిమూసి తరువాత ఏమంటుంది అన్నారనుకోండి ఇంతటివాడివి ఒక మనుష్యుని చేతిలో పడిపోయావు అన్నతరువాత ఏమంటుంది అంటే ఈ దుర్మార్గుడు నిన్ను చంపేశాడంటుందని అనుకుంటాం కానీ ఆవిడేమందో తెలుసాండీ... న వ్యపత్రపసే రాజన్ నీకు సిగ్గుగాలేదాని అడిగింది, సిగ్గుగాలేదాని ఎందుకడగాలి అంతటివాళ్ళని గెలిచినవాడివి ఒక మనుష్యుడి చేతిలో ఎందుకు చావాల్సివచ్చిందని అడిగిందావిడా? ఆవిడ ప్రశ్ననీ మీరు తిప్పి చదవాలి అంతగొప్పవాడివిగా ఇంద్రుడు పారిపోతాడుగా గంధర్వులు పారిపోతారుగా ఋషులు పారిపోతారుగా... మరి ఒక మనిషి చేతిలో చచ్చిపోయేస్థితి నీకెందుకొచ్చింది, అటువంటి స్థితీ ఎందుకు తెచ్చుకున్నావ్ అలా తెచ్చుకున్నందుకు సిగ్గుపడద్దునీవు అంది.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
అంటే ఆవిడ ఇప్పడు రామున్ని ఏ నిందా చేయలేదు ఆవిడ రావణున్నే నిందచేసింది, నిందచేసిందీ అంటే ఆయన శీలాన్ని ప్రశ్నించింది ఎందుకు ప్రశ్నించిందోకూడా చెప్తుంది ఒకచోట అన్యాపదేశంగా చెప్తుంది ఆమాట ఎంత అందమైన మాట చెప్పిందంటే... ఒకానొకప్పుడు జనస్థానంలో ఈ రాముడి చేతిలోనే 14వేలమంది రాక్షసులు ఖర-దూషనాదులు నిహతులైపోయారు నీకు తెలియదా? నీకు తెలుసు ఆయన పరాక్రమవంతుడని, ఇతని సేవకుడు ఒక్కవానరుడు హనుమ లంకా పట్టణంలో ప్రవేశించి లంకనంతటినీ కాల్చి నీ యొక్క సైన్యంలో కొంతభాగం నశింపజేసి కుమాడైన అక్షకుమారున్ని కూడా సంహరించి వెళ్ళిపోయాడు తెలియదా? నీకు అప్పుడు ఆయన పరాక్రమం నూరు యోజనములు సముద్రము మీద సేతువుని నిర్మించి ఆయన నీమీద దాడి చెయ్యడం కోసమని దాటివచ్చాడు అప్పుడైనా నీకు తెలియలేదా ఆయన పరాక్రమము
వ్యక్త మేష మహా యోగీ పరమాత్మా సనాతనః ! అ నాఽఽది మధ్య నిధనో మహతః పరమో మహాన్ !!
తమసః పరమో ధాతా శంఖ చక్ర గదా ధరః ! శ్రీవత్స వక్షా నిత్యశ్రీః అజయ్యః శాశ్వతో ధ్రువః !!
మానుషం వపుః ఆస్థాయ విష్ణుః సత్య పరాక్రమః ! సర్వైః పరివృతో దేవైః వానరత్వ ముపాగతైః !!
సర్వ లోకేశ్వరః సాక్షాత్ లోకానాం హిత కామ్యయా ! సరాక్షస పరీవారం హతవాం స్త్వాం మహా ద్యుతిః !!
నీకు అర్థంకాలేదేమో... నాకర్థమౌతుంది వచ్చినటువంటివాడు మనుష్యుడు కాడు, నీవు వరమడగలేదు కాబట్టి మనుష్యునియొక్క శరీరమును పొందాడు ఆయన, ఎవరుపొందాలి? నీవు ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ధర్మమునకు హానికలిగితే ఎవడు సహించడో వాడే స్థితికారుడు ఈ రూపంలోవచ్చాడు విష్ణువు వచ్చాడు ఈరూపంలో, మనుష్యరూపంలోవచ్చి నిలబడ్డాడు నీకు కేవలము మనుష్యుడుగా కనబడ్డాడు కానీ కేవల మనుష్యుడుకాడు, కేవలము మనుష్యుడుగా కనపడుతున్న ఈ రాముడెవడో నాకర్థమయ్యింది. వ్యక్త మేష మహా యోగీ పరమాత్మా సనాతనః ఈయనా మహాయోగి పరమాత్మ సనాతనుడు ఆదిమద్యాంతరహితుడు మహత్తులకు మించిన మహత్తైనవాడు అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటివాడు శంఖు చక్ర గధా పద్మములను పీతాంబరమును ధరించేటటువంటివాడు మానుషం వపుః ఆస్థాయ మనుష్యునియొక్క దేహమునుపొందాడు అంటే వేదవాక్కును చెప్తూంది “అజాయమానో బహుదావిజాయతే” అంటే పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతూంటాడు ఈశ్వరుడు, దేనికిపుడుతుంటాడు అంటే ధర్మమును రక్షించడానికి పుడుతుంటాడు. నీవలన ధర్మము నశిస్తుంటే ఆ ధర్మమును రక్షించడానికి నీవు అడగలేదుకాబట్టి  ఆ మనుష్య శరీరముచేత మరణిస్తావుగనుకా మనుష్య శరీరంలోకి విష్ణువు ప్రవేశించి ఈ రూపంలోవచ్చి నిల్చున్నారు సర్వ లోకేశ్వరః సాక్ష్యాత్ లోకానాం హిత కామ్యయా ఈయనా సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటివాడు లోకము యొక్క హితముకోరి వచ్చినటువంటివాడు ఆయనా ఈ రాక్షసులందరిని సంహరించి లోకమునకు శాంతి కల్పించడంకోసమే ఇటువంటి ద్యుతిః కాంతితో కూడినటువంటి స్వరూపాన్నిపొంది ఉన్నాడు.
ఇక్కడున్నవాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆయన నిన్ను చంపాడంటున్నారు, కానీ నీ భార్యని ʻనాకు తెలుసు నీవు ఎందుకు చచ్చిపోయావో నేను చెప్తానందావిడాʼ... ఇదీ ధారుణాతి ధారణమైన  తీర్పు సుందర కాండలో సీతమ్మచెప్పింది ఈ మాట ఇవ్వాళ బాగుంటుందికాని రావణా చపలం చలితేన్ద్రియమ్ నీ శరీరము పడిపోయిన రోజునగానీ, నీ శరీరము కదలలేని స్థితికి వచ్చిన రోజునకానీ నీ భార్య నీపక్కన నిలబడి ʻవీడు చపలుడు చలించిన ఇంద్రియములున్నవాడు వీడు ఇంద్రియములును అదుపుచేసుకోలేకా భార్యని అతిక్రమించినవాడు అనిʼ నీ భార్య అన్ననాడు నీవు చచ్చిన వెయ్యిమాట్లు చచ్చినట్లు బ్రతికుంటే నూరుమాట్లు చచ్చినట్లు కాబట్టి వద్దు నామాట విను నివర్తయ మనో మత్తః స్వజనే క్రియతాం మనః ! ఆత్మానమ్ ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతామ్ !! అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేన్ద్రియమ్ !!! నామాట విను నీ ఇంద్రియములను నీ మనసుని తిప్పి నీవారియందుంచుకో నీవు శాశ్వతమైనకీర్తిగడిస్తావని చెప్పిందాతల్లి అది ఇప్పుడు యదార్థమౌతుంది. ఎందుకో తెలుసాండీ నేనొకమాట చెప్తాను సహృదయంతోమాత్రమే దాన్ని పుచ్చుకోవలసి ఉంటుంది, కన్నతల్లికి కూడా ʻకొడుకు గురించి కొంతే తెలుస్తుంది భార్యకి మాత్రం పరిపూర్ణంగా తెలుస్తుందిʼ ఒక వయసొచ్చేసిన తరువాత కొడుకు యొక్క బలం బలహీనతలు ఏవి అన్నవి చెప్పగలిగినటువంటిది మనసులో తెలుసుకోగలిగినటువంటిది  భార్య ఒక్కతే ఆమెకు తెలుస్తుంది. ఈయన ఫలానా విషయంలో చపలుడు చలితేంద్రియుడు ఈయనకి స్వాస్థ్యత కలిగినటువంటి చిత్తమున్నవాడుకాడు ఈయన మనసు కదిలిపోతుంది ఫలానా విషయానికనీ పట్టుకోగలిగిన ప్రజ్ఞ ఉన్న ఒక్క భార్య ఒక్కతే.
అది రసేంద్రియం దగ్గర్నుంచి నాలుక దగ్గర్నుంచి ఆయన బలహీనతలన్నీ ఆవిడకి తెలిసుంటాయి, అయినా “ఇవి కామమనేటటువంటి చట్రాన్ని భార్యని అతిక్రమించనంతసేపు ఆవిడ తీర్పుచెప్పదు”, మీరు లోకంలో చూడండి, ఎంత తిండిపోతుభర్తైనా అవ్వనీవ్వండి ఆవిడ పవిట అడ్డంపెట్టి అన్నంపెడుతుంది. మళ్లీ వాళ్ళందరొస్తారు మీరు తినరు మీరు చేసేయ్యండి వాళ్ళతో కలిపి తక్కువగా తిందురుకానీ అంటుంది. కన్నతల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది అవసరమైతే రెండు పళ్ళు ఎవరూచూడకుండా పవిటచాటున పట్టుకొచ్చి పడకగదిలోకొచ్చి తినేసి పడుకోండంటుంది, ఆయన బాగా చపలుడు చలితేంద్రియుడైతే ఆవిడ ఆయనయొక్క కామోపశాంతిని ఇస్తుంది తద్వారా గొప్ప అర్థము కొడుకనేటటువంటివాన్ని కూతురనేటటువంటి సంతానాన్ననుగ్రహించి వృద్ధాప్యంలో కాపాడమని ఇచ్చేస్తుంది. కానీ ఇవికాని భార్య అన్న చెలిమిలి కట్టను దాటాడనుకోండి తీర్పేముంటుంది అదొక్కటిమాత్రం అంగీకరించదు, ఇక ఆ చెలిమిలి కట్టనుదాటాడో చపలం చలితేన్ద్రియమ్ అంటుంది. వీడి చిత్తము మంచిదికాదు వీడు చపలుడు వీడి ఇంద్రియములు చలిస్తాయంటుంది ఈ మాట నీవు అనిపించుకోవద్దు అనేసింది. ఎంతపెద్దమాటో చూడండి ఇది ఆధారంచేసుకొని చెలిమిలికట్టాని ఒక నవలే తీసుకొచ్చాడు. సముద్రము తలచుకుంటే దాటలేదా తనకు అడ్డుండేతీరాన్ని ఒక్క క్షణము సముద్రమే పొంగితే భూమిమీదవచ్చి పడిపోతుంది. ఏచేతకాని తనముందని కెరటము అలా వెనక్కెళ్ళిపోతూంది ఎందుకు సముద్రము పొంగి భూమిమీదికిరాదు చేతకాక కాదు తనొక నియంపెట్టుకుంది నేను దాటనని.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ఆ నియమమే ధర్మే చ అర్థే చ నాతి చరామి  కాబట్టి నీవు ఎవరిచేతిలో చచ్చిపోయావో నేను చెప్తానంది, ఇదే రావణాసురుని జీవితంలో అత్యంత ఘోరాతి ఘోరమైన ఘట్టమంటూ ఏమైనావుంటే రాముడి చేతులో చచ్చిపోవడం అదృష్టం,  మండోదరిచేత ఇలా అనిపించుకోవడం దురదృష్టం. ఏ భార్యయైనా భర్త వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తరువాత వెళ్ళడమన్నఘోరము ఇంకొకటిలేదు సనాతన ధర్మంలో ఎందుకంటే ఏ స్త్రీ కోరదు, కానీ ఏకారణం చేతనైనా భర్త వెళ్ళిపోతే శేషజీవితంలో భార్యనోటివెంట ఎప్పుడూ ఒక్కమాటే రావాలి “మళ్ళీ నేనంటూ పుడితే ఆయనకే ఇల్లాలినవ్వాలని కోరుకోవాలి” అలా కోరుకోగలిగితే నీకింకా ఎవ్వరూ సర్టిఫికెట్టు ఇవ్వక్కరలేదు నీజన్మధన్యము నీ భార్యవలన ఆ కితాబును పొందగలగాలి అది నీవు పొందలేకపోతే అమ్మబాబోయ్ ఎంత చపలచిత్తుడాయనా అందనుకోండి ఆవిడా మిగిలిన ఎన్ని సన్మానపత్రాలున్నా అనౌసరం కాబట్టి ఇప్పుడావిడందీ ఇన్ద్రియాణి పురా జిత్వా జితం త్రి భువనం త్వయా ! స్మరద్భిః ఇవ త ద్వైరమ్ ఇన్ద్రియైః ఏవ నిర్జితః !! నీవు ఇంద్రియములను పాములను తొక్కినట్లు తొక్కిపెట్టావు తపస్సన్నపేరుతో చాలా కష్టపడి అది నీవు జ్ఞానముచేత గెలిచినవాడివికావు చలించిపోయే ఇంద్రియాల్ని స్వార్థప్రయోజనాలకోసం బ్రహ్మగారి అనుగ్రహంకోసం కొంతకాలము భోగాన్నివాయిదా వేశావంతే మార్పురాలేదంతే ఇంద్రియములను పాములను కాళ్ళకింద పెట్టుకున్నట్లు తొక్కిపెట్టావు కాలికింద బతికున్న పాము పగపెంచుకుని కాలు ఎత్తితే కాటువేసినట్లు కొంతకాలం మమ్మల్ని తొక్కిపెట్టాడు కాబట్టి ఎప్పుడు కాలు తీస్తాడు కరుద్దామని నీ ఇంద్రియాలు చూశాయి, నీ తపస్సైపోయింది నీ ఇంద్రియాలు కరవడం మొదలుపెట్టాయి, నీ ఇంద్రియాలువేసిన కాట్లు చిట్టచివరకు ఎక్కడికెళ్ళిందంటే నీ అంతఃపురంలో సీతమ్మకన్నా అందగత్తెనైన నాకన్నా సీతమ్మకన్నా అందగత్తెలైన కొన్నివేల కాంతలకన్నా సీతమ్మ అందగత్తెగా కనపడేటట్లుచేసినాయి. ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కమాట అనగలను అంతే స్పష్టతకోసం అంతకన్నా నేను దానిమీద ఉపన్యాసం చెప్పడం నా పరిధుల్ని అతిక్రమించడమే అవుతుంది.
ఏ గ్లాసులో పోసుకుని తాగినా పాయసం రుచిగానే ఉంటుంది అదొక్కటి తెలుసుకోగలిగితే ఎవడి హద్దులోవాడుంటాడు, కాబట్టి క్రియతా మవిరోధ శ్చ రాఘవేణేతి యన్ మయా ! ఉచ్యమానో న గృహ్ణాసి తస్యేయం వ్యుష్టి రాఽఽగతా !! నీవు రామ చంద్ర మూర్తితో విరోధంపెట్టుకోవద్దు ఆయనతో స్నేహభావమును నెరపు అనీ నేను ఎంతగానో నీతో ప్రాధేయపడ్డాను ఇవేమైనా ఉన్నాయా రామాయణంలో అవన్నీ చెప్పక్కరలేదు ఇప్పుడు చెప్తేచాలు ఎందుకనీ? రామాయణంలో ఉన్న ప్రతి అక్షరము సత్యమే కాబట్టి ఇప్పుడు మండోదరి ఏకాంతంలో అంతఃపురంలో ఎన్నోమాట్లు ప్రదేయపడింది వద్దునామాటవినండీ సీతమ్మని తిరిగి ఇచ్చేయ్యండి అది మన వంశాన్ని నశింపజేస్తుంది మీరు చేసినపని మంచిదికాదూని ప్రాధేయపడింది, నేను ఎన్నోమాట్లు నిన్ను ప్రాధేయపడ్డాను

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
దీని ఫలితంగా నీవు మరణిస్తావనికూడా నేను నీకు చెప్పాను కానీ రాక్షసేశ్వరా కామాతురుడవైనటువంటి నీకు సీతమ్మని విడిచిపెట్టాలన్న కోర్కె పుట్టలేదు అకస్మా చ్చాభికామోసి సీతాం రాక్షస పుంగవ ! ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వ జనస్య చ !! నీ దేహాన్ని పాడుచేసుకున్నావు నీ శరీరమునకు బంధువులైనవాళ్ళనీ పాడుచేసుకున్నావు అందరి ఐశ్వర్యమును పాడుచేశావు దేనివల్ల పాడుచేశావు? హద్దులేని నీ కామముచేత. ఒక స్త్రీని కోరితెచ్చి బంధించిన కారణంచేతా ఎటువంటి స్థితినిపొందావు?, అయితే ఒక స్త్రీని బంధించి తీసుకొచ్చినంతమాత్రాన ఇంత స్థితిని పొందాడా అనుకుంటున్నారేమో... ఆమే సామాన్య స్త్రీ కాదు.
ఈమాట అనాలంటే హృదయవైశాల్యముండాలి చాలా గొప్ప జ్ఞానముండాలి ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పొగడుతున్నది రామున్నికాదు సీతమ్మని పొగుడుతుంది, తన భర్త మరణానికి కారణమైనటువంటి కాంత ఎవరో ఆవిడ ఎంతగొప్పదో చెప్తూంది ఆవిడ ఇదీ మహా తల్లంటే మహా పతివ్రతాంటే అరున్ధత్యా విశిష్టాం తాం రోహిణ్యా శ్చాపి దుర్మతే ! సీతాం దర్షయతా మాన్యాం త్వయా హ్యసదృశం  కృతమ్ !! ఆవిడకి ఒక మహాపతివ్రతకి కాముకుడైనవాడు ఎదురు నిలబడి మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు పొందేటప్పుడు పొందినటువంటి బాధ ఆవిడ మనసులో కదిలితే అటువంటివాడు తనభర్తే అని స్మరణకొచ్చినప్పుడు చచ్చిపోయాడన్న విషయం గుర్తులోవున్నా ఆవిడ ʻనాథా!ʼ అనలేకపోయింది దుర్మతే అంది దుష్టబుద్ధి కలిగినవాడా..! అంది, ఇదికదాండి సీతమ్మంది ప్రమాదం తెచ్చుకుంటావురా రేప్పొద్దున్నా అందావిడా దుర్మతే అరున్ధత్యా విశిష్టాం ఎవరనుకున్నావురా సీతమ్మా..? అరుంధతికన్నా గొప్పది రోహిణ్యాశ్చాపి దుర్మతే ఓ దుర్మతీ ఆవిడ చంద్రునియొక్క స్వక్షేత్రమైన రోహిణీకన్నా గొప్పది అటువంటి సీతమ్మని అపహరించి తీసుకొస్తావా..? అటువంటి మాన్యురాలి దగ్గరికెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతావా అది కదురా నిన్ను కట్టి కుదిపేశాయి, వసుధాయా శ్చ వసుధాం శ్రియః శ్రీం భర్త్రు వత్సలాం ! సీతాం సర్వానవద్యాంగీం అరణ్యే విజనే శుభాం !! ఆవిడా ఓర్పులో భూమికి భూమి ఆ తల్లి ఐశ్వర్యమునకు ఐశ్వర్యము భర్తయందు అంతటి ప్రేమకలిగినది మహాపతివ్రత అటువంటి అందగత్తెయైన సీతమ్మయొక్క బాహ్యసౌందర్యము ఒక్కటే కనపడిందికానీ ఆవిడ అంతః సౌందర్యం నీకు కనపడితే ఆవిడపాదాలకు నమస్కారంచేసేవాడివి, నీకు అంతః సౌందర్యం కనపడలేదు బాహ్యసౌందర్యం కనపడింది ఆ అంతః సౌందర్యం నీవు కోరుకున్న బాహ్య సౌందర్యానికి ప్రతిబంధకంగా నిలబడుతుంది, నీ యొక్క పట్టుదల పెరిగినకొద్దీ ఆవిడ అంతః సౌందర్యమే నిన్నుకాలుస్తుందని నీవు గుర్తించలేకపోయావు గుర్తించలేక అరణ్యంలో ఆవిడ్ని మోసగించి తీసుకొచ్చావు అసలు తీసుకురావడంలోనే ప్రమాదకరమైన పోకడ.
మారీచున్ని మాయామృగ రూపంలో పంపించి రామ లక్ష్మణుల్ని వంచించి నీవు సన్యాసివేషంవేసుకుని సీతమ్మతల్లిని అపహరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని నెలలు బంధీకృతురాలిని చేశావు ఈ పాపము ఉట్టిగనేపోతూందా అవశ్య మేవ లభతే ఫలం పాపస్య కర్మణః ! ఘోరం పర్యాగతే కాలే కర్తా నాస్త్యత్ర సంశయః !! ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా పుణ్యంచేశావు అనుభవించావు పాపం చేశావు అనుభవిస్తున్నావు కాబట్టి ఇప్పుడు పరాగంలో పడిపోయావు ఒక్కనాడు పెద్ద పెద్ద ఆభరణములు పెట్టుకున్నావు గొప్ప వైభవాన్ని అనుభవించావు నీవు చేసిన పాపమెక్కడికి పోతూంది ఎదురుగుండా

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
రాముడు కనపడితే కాళ్ళమీదపడలేదుగా ఇంటికిపో అన్నాడు ఆరోజున, రాముడికాళ్ళమీద పడిపోయివుంటే నీ పాపంపోయివుండేది నీవు పడలేదుగా కాబట్టి ఏమైంది అనుభవించవలసి వచ్చింది నీవు చేసింది నీవు అనుభవిస్తున్నావు ఎవడు చేసింది వాడే అనుభవించడానికి ఈ తార్కాణం. నీ తమ్ముడు చేసింది నీ తమ్ముడు అనుభవిస్తున్నాడు చూడు విభీషణుడెక్కడున్నాడు రాముని పక్కన నిల్చున్నాడు ఎటువంటి తమ్మునిగా లంకారాజ్యానికి రాజై ఉన్నాడు. నీవు మరణించి ఉన్నావు ఏమి నీ ప్రారబ్దము, నీ తరువాత నీ కొడుకులవ్వాలి, నీ కొడుకులుకూడా లేకుండా నీవంశాన్ని నీవే నిర్మూలించుకుని కుటుంబాన్ని నీ తమ్ముడికి రాజ్యమొచ్చేటట్లుచేశావు కారణం ఆయన నిన్ను వదిలాడు రామున్ని పట్టుకున్నాడు.
నీవు ఇవన్నీ వదిలేశావు సీతమ్మని పట్టుకున్నావు, పట్టుకోవడంలో కామంతో పట్టుకున్నావు కాల్చేసింది చూశావా? కాబట్టి శుభ కృత్ శుభ మాఽఽప్నోతి పాప కృత్ పాప మశ్నుతే ! విభీషణ స్సుఖం ప్రాప్త స్త్వం ప్రాప్తః పాప మీదృశం !! విభీషణుడు ఏదిపొందాలో దాన్ని విభీషణుడు పొందాడు నీవు ఏది పొందాలో అది నీవు పొందావు ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా రావణా సంత్యన్యాః ప్రమదాః తుభ్యం రూపైణాభ్యధికా స్తతః ! అనంఽగ వశ మాఽఽపన్న స్త్వం తు మోహా న్న బుద్ధ్యసే !! ఎంతగొప్ప తీర్పండీ నిజంగా... యదార్థంగా నిష్పక్షపాతంగా ఆలోచనచేస్తే రావణా... నీవు కోరుకున్న సీతమ్మకన్నా అందగత్తెలు కొన్ని వేలమంది మన అంతఃపురంలోనే ఉన్నారు, నీయందు ప్రేమ ఉన్నవారు అంతకన్నా గొప్పదాన్ని నేనున్నాను నీయందు అనురాగమున్నదాన్ని కానీ మన్మథ బాణాలు నీమీద అలా పడ్డాయి ఇందులో కనపడని అందం ఆవిడలో నీకేం కనపడింది అదే నీ కొంపముంచింది. ఆ దృష్టికోణం మార్చుకోలేకపోయావు ఇంతమంది నీయందు అనురక్తలున్నారు నిజంగా బయటవాళ్ళు ఎవరైనాచూస్తే సీతమ్మకన్నా వీళ్ళు అందగత్తెలంటారు కానీ నీకు అలా అనిపించలేదు నీ ప్రారబ్దమంతే న కులేన న రూపేణ న దాక్షిణ్యేన మైథిలీ ! మయాధికా వా తుల్యా వా త్వం తు మోహా న్న బుధ్యసే !! న కులేన ఆమే... సీతమ్మతల్లి వంశాన్నిబట్టి చూస్తే నాకన్నా గొప్పదికాదు అంటే అలా అనచ్చాండీ..! మండోదరీ అంటే... ఆవిడ అయోనిజ మండోదరి వైవి యొక్క కుమార్తె. ఈవిడ వంశం గురించి చెప్పడం కుదురుతుంది తల్లి పరాశక్తిగా నిలబడింది అంతే ఆవిడ అలా చెప్పుకుందీ అంటే “ఇన్ బిట్వీన్ ది లెటర్స్” అంటే అలా చూసి దానిలోని యోగ్యతా యోగ్యతలను నిర్ణయించకూడదు ఆవిడ చెప్తున్నది మాత్రం యదార్థం న రూపేణ రూపంలోకూడా సీతమ్మకన్నా అందగత్తెని న దాక్షిణ్యేన మైథిలీ అలాగే నేను నీ మీద ఉండేటటువంటి ప్రేమచేతకాని అందంలోకాని చదువులోకాని సంస్కారంలోకాని నేను సీతమ్మతల్లికన్నా తక్కువదాన్నికాను మయాధికా వా తుల్యా వా త్వం తు మోహా న్న బుధ్యసే నాతో సమానురాలుకాదు నా కన్నా అధికురాలుకాదు సీతమ్మ.
కానీ... నీ ప్రారబ్దమేమిటంటే ఇదీ నీకు కనపడలేదు, నా ప్రారబ్దమేమిటంటే నేను నీకు అలా కనపడలేదు. ఎంతపెద్దమాటండీ..! ఆయన పారబ్దమేమిటంటే అలా మండోదరి ఆయనకి కనపడకపోవడం, ఈవిడ ప్రారబ్దమేమిటంటే ఈవిడ ఆయనకి అలా కనపడలేకపోవడము నేను నీకు అలా కనపడుంటే నీతో కలసి నేను హాయిగా విహరిస్తుండేదానిని. లేక నేను నీకు అలా కనపడుంటే నీవు సీతమ్మని తెచ్చేవాడివికావు కాబట్టి నీ ప్రారబ్దమలా ఏడ్చింది నా ప్రారబ్దమిలా ఏడ్చింది. కారణం మన్నథబాణములు నీమీద పడినప్పుడు అవి ఎంత విసృంకలత్వాన్ని పొందాయంటే నీకు ఆమె అందగత్తెగా కనపడ్డమే సృష్టిలో ఆశ్చర్యం. నేను నిన్నన మనవిచేశానుగా మనసుని ధార్మికమైన తృప్తివైపుకి తిప్పలేకపోతే ఇలాంటి అల్లర్లే బయలుదేరుతాయి కాబట్టి సర్వథా సర్వ భూతానాం నాస్తి మృత్యు రలక్షణః ! తవ తావ దయం మృత్యుః మైథిలీ కృత లక్షణః !! కాబట్టి నేనేమంటానంటే రావణా నిందలేకుండా బొందిపోదు పోకూడదు, ఏదో ఒక నిందవుండాలికదా నిందంటే కారణం డెత్ సర్టిఫికెట్టు ఇవ్వడానికి ఒక రీజను అడుగుతారు. డాక్టరుగారినడిగి ఒక సర్టిఫికెట్టు తీసుకురండంటారు మున్సిపాల్టీవారు, అంటే డాక్టరుగారేదో టెక్నికల్ టర్మ్ రాస్తాడు అది మనకు అర్థమవ్వచ్చూ అర్థంకాకపోవచ్చు ఆయనకర్థమైతే చాలు ఎందుకు చచ్చిపోయాడో మనకర్థమవ్వాలంటే ఏదో హార్టుఫెల్యూరో లేకపోతే ఏదో కిడ్నీస్ ఫెల్యూరో ఏదో ఒకటి ఇలాంటి మాట్లైతే మనకు అర్థమై డాక్టరైపోయినంత సంతోషపడిపోతుంటామనుకోండి అదివేరు విషయం.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
కాబట్టి ఆయనో సర్టిఫికెట్టు ఇస్తారు దాన్నిబట్టి మున్సిపాల్టివాళ్ళు వాళ్ళొక డెత్ సర్టిఫికెట్టిస్తారు ఏదో కారణం ఏ కారణంలేకుండా ఏ బొందీ వెళ్ళిపోకూడు ఏ శరీరం వెళ్ళిపోకూడదు ఏదో కారణం చెప్పాలి, ఎందుకు చచ్చిపోయాడండీ అనాలంతే, కానీ అసలు లోపల వేరే కారణముంటుంది చచ్చిపోవడానికి ఆ కారణానికి నీవు ఏ లోపలి కారణానికి చచ్చిపోయావో నేను చెప్తున్నాను, రాముని చేతిలోని బాణం నీమీదపడి నీవు చచ్చిపోయావు బాహ్యకారణం అది అందరికీ కనపడుతుంది, భార్యగా నేను చెప్పగలిగిన సత్యమేమిటో తెలుసా... నీ మృత్యువుకి మైథిలి కారణం. సీతమ్మయందు నీ మనసు ఇరుక్కోవడమే నీవు చచ్చిపోవడానికి కారణం అనేసిందండీ... ఇంకా ఇంకేమి రావణుడు అందుకు కదూ ఏపేరైనా పెట్టుకుంటారుగానీ  రామ అని రాయబోయి రావణా అని రాసిచ్చారనుకోండి ఇదేమిటండీ ఇలాంటిపేరు రాసిచ్చారంటారుకానీ ఆ పేరు పెట్టుకుంటారా ఎవరైనా ఎవ్వరూ పెట్టుకోరు. ఏం అంత వేదం చదువుకున్నాడగదాండీ అంతగొప్ప పరాక్రమముందికదా పెట్టుకోండి మీ అబ్బాయికి పేరంటే వద్దండిబాబోయ్ ఇంకో పేరు పెట్టుకుంటాము కానీ నాకా పేరొద్దంటారు. కాబట్టి ఆ తల్లి చెప్పేసింది ఈ మాటలు చెప్పి అందీ... మైథిలీ సహ రామేణ విశోకా విహరిష్యతి ! అల్పపుణ్యా త్వహం ఘోరే పతితా శోక సాగరే !! ఇప్పుడు నీవు మరణించావు బాగానే ఉంది ఇప్పుడు నీవు మరణిస్తే... శోకిస్తూ చీకటిగదిలో ఎవరు కూర్చోవాలి నేను, నీమనసు ఆవిడయందు ఇరుక్కుని నీవు చచ్చిపోయావు ఫలితం నేను అనుభవిస్తున్నాను, ఇప్పుడు ఆయన ధర్మాత్ముడు ఆయన నిన్నుపడగొట్టాడు ఆయన నిన్నుపడగొట్తే వైభవమెవరికొస్తుంది సీతమ్మ రామునిపక్కన చేరి అగ్నికార్యాలుచేస్తుంది చూశావా..? ధర్మాన్నిపట్టుకోని భర్త దొరికితే ధర్మాన్ని పట్టుకున్న భార్య దొరికినా భోగంలేకుండా పోతుంది. ఎంత పెద్దమాటండీ..! మండోదరి మహాపతివ్రత ఏదీ ఇప్పుడేం సీతమ్మకి సహస్రంతో పూజచేశాం, మండోదరికేదైనా ఉందా సహస్రం అష్టోత్తరంతో చేయలేదు ఎందుకు చేయలేదు, ఒక్కటే కారణం ఆవిడ అంత మహాపతివ్రతైన కారణంగా ఆవిడ శీలము అంతగా ప్రకాశించకపోవడానికి కారణం రావణుడే.
కాబట్టి నీవు మరణించావు నా భోగంపోయింది నీవు మరణించావు సీతమ్మకి భోగం ప్రారంభమైంది, కాబట్టి కైలాసే మన్దరే మేరౌ తథా చైత్ర రథే వనే ! దేవో ద్యానేషు సర్వేషు విహృత్య సహితా త్వయా !! నేను ఒకానొకప్పుడు కైలాస పర్వతంమీద మందరపర్వతంమీద మేరుపర్వతంమీద చైత్ర రథంమీద నీతో కలసి ఎంతోసంతోషంగా గడుపుతుండేదాన్ని, సామాన్యంగా పెద్ద పెద్ద భోగాలు అనుభవించకుండా ఏవో ఉన్నంతలో భోగాలు అనుభవించేవి కొన్నుంటాయి ఏదో ఉన్న ఇత్తడి చెంబులు చూసి సంతోషపడిపోతుంటారు, ఒక్క వెండి చెంబుకి విశ్వనాథ సత్యనారాయణగారు వేయిపడగల నవలలో ఆ వెండి చెంబుకోసం దెబ్బలాడుకుంటున్న దంపతులగురించి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్క దంపతుల యొక్క జీవితమంతా దేనిచుట్టు తిరుగుతుందంటే వాళ్ళ దాంపత్యంలో పెద్దగా చెప్పుకోవడానికి ఏముంటాయో తెలుసాండీ... ఆశ్చర్యకరమైన సందర్భాలుకొన్నుంటాయి అవి వింటే మనం తెల్లబోతాం. నేనొకప్పుడు శృంగేరి పీఠానికి అధిపతులు భారతీ తీర్థస్వామివారి తల్లిగారిని దర్శనం చేసుకున్నా, చేసుకుంటే ఆ తల్లి నాతో మాట్లాడుతూ ఓ మాటంది నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మా వారికి నాయనా ప్రతీనెల సత్యనారాయణ వ్రతం చెయ్యాలని కోరికా... ప్రతీనెల సత్యనారాయణ వ్రతం చేస్తే ఐదు కథలకు కొట్టడానికి ఐదు కొబ్బరికాయలు కొనుక్కోగల స్తోమతకాదు మాదప్పుడు, ఐదు కథలకీ ఐదు కొబ్బరికాయలు కొట్టలేక అసలు కొబ్బరికాయే కొట్టకుండా నైవేద్యంపెట్టి వ్రతం చేసేవాళ్ళం ఆ తరువాత తరువాత సత్యనారాయణ వ్రతానికి ఒక్క కొబ్బరికాయ కొనుక్కోగలిగిన రోజులొచ్చినప్పుడు ఎంత సంతోషించామో... అని అందావిడా...

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
అది ధార్మికమైనటువంటి అభివృద్దిలో ఆనందం, నాకు నిజంగా ఎంత ఏమి గొప్పమాటలురా... ఈ మాటలు నిజంగా ఏమి ధార్మికంరా అద్భుతంరా ఎంత తృప్తిరా వీళ్ళదీ... సత్యనారాయణ వ్రతానికి ఒక్క కొబ్బరికాయ కొనుక్కున్ననాడు మేము తృప్తి పొందామందావిడా... ఎన్నికొనుక్కున్నా దిక్కుమాలిందసంతృప్తే, ఎన్ని కొనుక్కున్నా అసంతృప్తే. అసలు సత్యనారాయణ వ్రతానికి ఐదు కొబ్బరికాయలు కొనుక్కున్నామని తృప్తికి స్థితి ఎక్కడుంది నీకూ... నీకసలు ఆ వ్రతాలు ఆచరిద్దామని ఆలోచనుంటేకదూ... కాబట్టి ఆవిడందీ పెద్ద పెద్ద భోగాలన్ని అకస్మాత్తుగా ఎప్పుడాగిపోతాయంటే ఇదిగో ఈ రాచ కుటుంబాల్లోనే ఆగిపోతాయి వచ్చిన పెద్ద గొడవ అదే... రాణిగారిగా ఉన్నంత కాలం ఫర్వాలేదు ఎవడో వచ్చి యుద్ధం చేస్తాడు రాజుగారు చనిపోతాడు ఈవిడా ఏ పాతాళ గహల్లోంచో కొడుకునెత్తుకుని అరణ్యాలకి పారిపోతుంది. శత్రువులొస్తారేమోనని మారువేషంలో ఇంత పల్లక్కీల్లో ఊరేగినావిడా పరుల పంచన పాచీపనులుచేసి బ్రతుకుతుంటుంది. కాబట్టి ఆవిడందీ సై వాన్యే వాస్మి సంవృత్తా థిక్ రాజ్ఞాం చంచలా శ్శ్రియః ! థిక్ అంటే ఛీఁ... అని సంస్కృతంలో ఛీఁ... ఈ రాచరికంలో ఉండేటటువంటి సౌఖ్యాలున్నాయి చూశారా... ఇవి అత్యంత ప్రమాదము ఆకాశమంత ఎత్తులో తిప్పుతాయి పాతాళమంత కిందకి తోసేస్తాయందావిడా చూశావా నీ మరణంతో నేను ఏ స్థితిలోకి వెళ్లానో..? అందావిడా... అంటూ ఆవిడందీ య స్త్వయా విధవా రాజన్ కతా నైకాః కుల స్త్రీయః ! పతివ్రతా ధర్మ పరా గురు శుశ్రూషణే రతాః !! తాభిః శోకాభి తప్తాభిః శప్తః పర వశం గతః ! ఇది నీకు అకస్మాత్తుగా వచ్చిందికాదు, నీవల్ల ఇలా... ఎంతమంది ఏడ్చారో ఎన్ని లక్షలమంది కాంతలు కుల స్త్రీలు పతివ్రతుల ధర్మపరాయణులు పెద్దలకు సుశ్రూష చేసేటటువంటి ఆడవాళ్ళు ఎన్ని లక్షలమందో ఏడిస్తే ఎక్కడికిపోతుందిరా ఆపాపం కట్టుకున్నందుకు నేను ఏడుస్తున్నాను ఇవ్వాళ చాశావా అని సుకృతం దుష్కృతం చ త్వం గృహీత్వా స్వాం గతిం గతః ! ఆత్మానమ్ అనుశోచామి త్వ ద్వియోగేన దుఃఖితా !! పుణ్యమో పాపమో నీమూట నీవు పట్టుకునివెళ్ళిపోయావు అయిపోయింది కానీ నా బతుకే భయంగా తయారైంది అంది.
ఎందుకో తెలుసాండీ..! ఆవిడ అనడంలో ఒక చమత్కారముంది ఎంత పెద్దమాట అనాలో అంతపెద్దమాట ఇందులో దాచేసింది ఆవిడా, పుణ్యమే చేశావో పాపమే చేశావో రాముడిచేతిలో చచ్చిపోయావు ధర్మాత్ముడుగా... ʻవిభీషణున్ని నీకు అంతేష్టి చెయ్యమన్నాడుʼ కాబట్టి చేసేస్తాడు, రేపు నేనుపోతే ఏదీ..? కొడుకును చంపేశావుగా నీ కామానికి ఇంద్రజిత్తుని చంపేశావుగా కొడుకులందర్నీ చంపేశావుగా... నీకు నీ తమ్ముడు చేస్తున్నాడు రేపు నాకు చెయ్యడానికి కొడుకుని

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
మిగల్చకుండా చచ్చిపోయావు ఇది దారుణం. మామూలుగా కొడుకు తనంత తానుగా వెళ్ళిపోతే ఏం లేదు ʻకామానికి చంపి

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
నీవు చచ్చిపోయావుʼ, నీపుణ్యం నీ పాపం నీవు మూటకట్టుకునిపోయావు నా పరిస్థితేమిటీ మరి వెళ్ళకురా ప్రమాదకమైనదానిజోలికి వెళ్ళకు ఇలాంటి నిందలే పడిపోతాయి, ఎలా బ్రతికామన్నదికాదు ఎలా చచ్చిపోయావన్నది చూస్తారు అందుకని అన్నీ తెలుసున్నవానికి అమావాస్యమరణం ఏమీ తెలియనివానికి ఏకాదశి మరణమనీ అందుకంటారు. కాబట్టీ నీకెన్ని తెలుసుకాదు నీవు ఎంత అనుష్టిస్తావు ఎంత జాగ్రత్తగా బ్రతుకుతావని ʻఆనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితంʼ ఇది చాలా ప్రదానం ఇవన్నీ ఎక్కడా... ఇంత మంది చూస్తుండగా ఇంతటిమహానుభావుడని అందరూ చెప్పుకుంటున్న రాక్షసులముందు పట్టమహిశి ఇస్తున్నకితాబు రావణాసురునికి.
అనీ ఈ మాటలు చెప్పి మారీచ కుంభకర్ణాభ్యాం వాక్యం  మమ పితు స్తదా ! న శ్రుతం వీరమత్తేన తస్యేదం ఫల మీద్రుశం !! మారీచుడు చెప్పాడు కుంభకర్ణుడు చెప్పాడు మా నాన్నగారు చెప్పారు నేను చెప్పాను నీ తమ్ముడు చెప్పాడు చిట్ట చివరికేమైంది నీలజీమూత సంకాశ పీతామ్బర శుభాంఽగదః ! సర్వ గాత్రాణి విక్షిప్య కిం శేషే రుధిరాఽఽప్లుతః !! ఎవరిమాటా విననందుకొచ్చినటువంటి ఫలితమేమిటంటే అంగుళం శరీరం కనపడకుండా బంగారు ఆభరణాలు పెట్టుకున్నటువంటి నీవు ఒక్కసారి కౌగలించుకుందామంటే అవకాశంలేనిరీతిలో ఒంటినిండా బాణాలతో చచ్చిపోయావు, నెత్తుటి మడుగులో పడిపోయావు పక్షులు గుంపులు తిరుగుతున్నాయిపైన కాబట్టి చూశావారావణా అందీ... పాపం ఆయన యొక్క వైభవాన్ని తలచుకుని పాపం ఆవిడ ఏడ్చింది. రామ చంద్ర మూర్తి ఆన్నారు, ఆవిడ ఏడుస్తూ బాధపడుతూంటే అలా మాట్లాడుతుంటే అలా ఉంచడం ధర్మంకాదు కాబట్టి జరగవలసిన పెద్ద ధర్మం జరగాలి కాబట్టి విభీషణా వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి రావణాసురునికి యొక్క అంతేష్టి సంస్కారమునకు ఏర్పాటుచెయ్యి. అంటే విభీషణుడన్నాడు “నేను చెయ్యను అన్నాడు” నేను ఇదే మీతో అన్నది, నేను చెయ్యను రావణునికి అంత్యక్రియలు ఇన్ని తెలిసున్నటువంటి ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు రావణాసురునికి అంత్యక్రియలు చెయ్యలేదు యుద్ధభూమిలో శరీరాన్నివదిలేస్తే పక్షులు మృగాలు తినేశాయి అని లోకం రేపు అంటూంది, నన్ను అంటాయని నాకు తెలుసు కాని ధర్మం తప్పిపోయానని అంటూంది. కానీ వెంటనే ఏమంటుందంటే ఎందుకు చెయ్యలేదు విభీషణుడు అని అడుగుతారు. ఎంత దౌర్భాగ్యపు బ్రతుకు బ్రతికాడువాడు అటువంటివాడి శరీరానికి ఎలా చేస్తాడు అంతేష్టి విభీషణుడు అహ్యమేసింది వదిలేశాడంటారు.
కాబట్టి రామా! నేను చెయ్యను అన్నాడు, అప్పుడు మళ్ళీ రాముడు ఏమన్నాడో తెలుసాండీ మరణాంతాని వైరాణి ఇది ఎందుకు తెలుసుకోవాలి పాత కథా... మరణంతో ఆ వైరంపోయింది, నీవు చేస్తావా... నీకు ఎంతో నాకు అంతే కాబట్టి నేను చెయ్యాలా? అని నిలదీశాడు, అప్పుడు విభీషణుడన్నాడు నేనే చేస్తానన్నాడు అప్పుడు రావణాసురుని శరీరానికి అంత్య క్రియలు జరిగాయి. ఇది రామ చంద్ర మూర్తి యొక్క ధార్మికనిష్టాంటే... మహానుభావుడు అంతటి ధర్మమున్నవాడు కాబట్టి ఇప్పుడు అంతేష్టి సంస్కారం అయిపోయింది ఆ రాక్షసులందరూ వచ్చారు వానర యోధులూ కలిసి రామ చంద్ర మూర్తి దగ్గర నమస్కారం చేస్తూ నిలబడ్డారు. లక్ష్మణ మూర్తిని పిలిచి
తత స్త్వేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమాఽఽసనే ! ఘటేన తేన సౌమిత్రిః అభ్యషించ ద్విభీషణమ్ !!

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
లంకాయాం రక్షసాం మధ్యే రాజానం రామ శాసనాత్ !
విధినా మంత్ర దృష్టేన సుహృ ద్గణ సమా వృతం ! అభ్యషించత్ స ధర్మాత్మా శుద్ధాత్మానం విభీషణమ్ !!
శుద్ధాత్ముడైనటువంటి విభీషణున్ని రాముని యొక్క అనుజ్ఞమేరకీ లక్ష్మణ స్వామి సముద్రంలో ఉండేటటువంటి జలాల్నీ ఒక ఘటంతో తీసుకొచ్చి అభిషేకం చేసి విభీషణున్ని రాజ్యమునందు ప్రతిష్టించాడు. లంకకురాజు విభీషణుడయ్యాడు రావణ పాలితయైన లంక విభీషణపాలితయైనటువంటి లంకగా మారిపోయింది. ఇప్పుడు రామ చంద్ర మూర్తి హనుమను పిలిచి ఒకమాట చెప్పారు ప్రతిగృహ్య చ సందేశమ్ ఉపావర్తితు మర్హసి ఇప్పుడు రావణుడు నిహతుడయ్యాడని నేను బయట ఎదురు చూస్తున్నాననీ... ఈ విజయవార్తను సీతమ్మకు అందించి నా సందేశాన్ని చెప్పి సీతమ్మ ఏమంటుందో కనుక్కురా అన్నాడు. అంటే హనుమా బయలుదేరి అశోకవనములోకి రివ్వున వెళ్ళారు ఒక నమస్కారం చేశారు. ఆ తల్లి ధ్యాన పరాయణయై కూర్చుంది. అక్కడికి వెళ్ళినటువంటి హనుమ ఎంతో సంతోషంగా చెప్పారు అమ్మా... ఇప్పుడు నీవు ఇంత భయంగా ఉండవలసినటువంటి పరిస్థితికాదు ఎందుచేతాంటే... సంభ్రమ శ్చ న గంతవ్యో వర్తన్త్యా రావణాఽఽలయే ! విభీషణ విధేయం హి లంకైశ్వర్యమ్ ఇదం కృతమ్ !! ఇప్పుడు ఈ లంకా రావణపాలితయైన లంకకాదు విభీషణుడు పరిపాలిస్తున్న లంక. విభీషణుడు రామ చంద్ర మూర్తి యొక్క మిత్రుడు కాబట్టి తల్లీ నీవు ఇప్పుడు సంతోషంగా ఉండచ్చమ్మా... రావణుడు నిహతుడైపోయాడు రామ చంద్ర మూర్తి విజయాన్ని సాధించారు, తల్లీ! రాముడు ఎదురు చూస్తున్నాడు అంటే వెంటనే సీతమ్మందీ... శ్రీరామాయణంలో రాముని చేతా సీతమ్మ చేతా కూడా ఇదే కీతాబును పొందగలిగే ఏకైక యోధుడు హనుమ ఒక్కరే... ఆవిడందీ
ప్రియమ్ ఏత దుపశ్రుత్య భర్తు ర్విజయ సంశ్రితమ్ !
ప్రహర్ష వశమ్ ఆపన్నా నిర్వాక్యాస్మి క్షణాన్తరమ్ ! న హి పశ్యామి సదృశం చిన్తయన్తీ ప్లవంగమ !!
మ త్ప్రియాఽఽఖ్యానక స్యేహ తవ ప్రత్యభినన్దనమ్ ! న హి  పశ్యామి తత్ సౌమ్య పృథివ్యామ్ అపి వానర !!
సదృశం మ  త్ప్రియాఽఽఖ్యానే తవ దాతుం భవేత్ సమమ్ ! హిరణ్యం వా సువర్మం వా రత్నాని వివిధాని చ !!
రాజ్యం వా త్రిషు లోకేషు నైత దర్హతి భాషితుమ్ !
ఇవ్వాళ నీవు చెప్పినటువంటి ఈ శుభవార్తకీ నీకు నేను ఇవ్వగలిగినటువంటి కానుకా అన్నది నాకేదీ కనపట్టంలేదు... సుందర కాండ చివర రాముడు ఏ మాటన్నాడో అదేమాట సీతమ్మంది, ఇంతకన్నా గొప్ప శుభవార్త నా జీవితంలో ఇంకొకటి ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు, బంగారముకాని రత్నములుకాని మూడు లోకముల రాజ్యముకాని నీకు ఇచ్చినా నీవు చెప్పినటువంటి శుభవార్తకి తుల్యమైనటువంటి కానుక ఇవ్వడం నాకు చేతనైనటువంటి విషయంకాదు అంత గొప్ప సంతోషకరమైన వార్త చెప్పావు హనుమా అని సీతమ్మ తల్లి ఎంతో సంతోషించింది. అటువంటి సమయంలో స్వామి హనుమ అన్నారు, అమ్మా! ఆనాడు నేను శింశుపా వృక్షం మీద కూర్చుని నీ దర్శనానికి

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
వచ్చిన రోజుల్లో చూశాను నీ చుట్టూ ఉన్న ఈ రాక్షస కాంతలందరూ ʻనిన్ను పరిపరివిధముల వేధిస్తూండగా మాటలతో హింసిస్తూండగా విన్నానుʼ తల్లీ నీవు నన్ను అనుగ్రహించావా? అనుమతించావా? నా వాడి గోళ్ళతో వీళ్ళ హృదయములను ఛీల్చేసి వీళ్ళ పొట్టలు పగలగొట్టి నా మోకాళ్ళతో కుమ్మి ఈ రాక్షస స్త్రీలనందరినీ సంహరిస్తానమ్మా అన్నాడు.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
సీతమ్మతల్లందీ అయం వ్యాఘ్ర సమీపే తు పురాణో ధర్మ సంహితః ! ఋక్షేణ గీతః శ్లోకో మే త న్నిభోధ ప్లవంగమ !! న పరః పాపమ్ ఆదత్తే పరేషాం పాప కర్మణామ్ ! సమయో రక్షితవ్య స్తు సన్త శ్చారిత్ర భూషణాః !! నాయనా నేను నీతో ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినూ... ప్రభువు ఏంచెప్పాడో అది చెయ్యడం సేవకుల యొక్క కర్తవ్యం, రావణాసురుడు వాళ్ళ ప్రభువు రావణుడు ఏం చెప్పాడో వాళ్ళది చేశారు ఇప్పుడు విభీషణుడు ప్రభువు విభీషణుడు ఏం చెప్తాడో అది చేస్తారు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారాలేదా అది ముఖ్యం వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు, నీ ప్రభువు చెప్పిన కర్తవ్యం నీవు చేశావు ఇప్పుడు దాన్ని కోపంగా పెట్టుకునీ వాళ్ళని సంహరించవలసిన అవసరమేమిటీ?, నాకు ఈ సందర్భంలో ఒక శ్లోకం ఒక సందర్భం జ్ఞాపకం వస్తూంది హనుమా..! అని ఆ తల్లి ఈ విషయాన్ని చెప్తోంది న పరః పాపమ్ ఆదత్తే పరేషాం పాప కర్మణామ్ ! సమయో రక్షితవ్య స్తు సన్త శ్చారిత్ర భూషణాః !! ఒకానొకప్పుడు ఒక వ్యాధుడు అంటే ఒక కిరాతుడు బోయవాడు అరణ్యంలోకి ప్రవేశించాడు ప్రవేశించి జంతువుల్ని వేటాడుతున్నాడు ఆ వేటాడుతున్న సమయంలో అతన్ని ఓ పెద్ద పులి తరిమింది ఆ వేటగాడు భయపడి పరుగెత్తి పరుగెత్తి పెద్ద పులినుంచి తప్పించుకోవడానికి ఒక పెద్ద చెట్టెక్కేశాడు, తీరా చెట్టుమీదకెక్కేసిన తరువాత పైన చూసేటప్పటికి పైన ఒక ఎలుగుబంటి పడుకుని ఉంది ఇప్పుడు ఆ ఎలుగుబంటిని చూసి అతను భయపడ్డాడు.
కిందనున్న పులి అందీ ఓ ఎలుగుబంటీ నీవు వనంలో తిరిగే మృగానివి నేనూ వనంలో తిరిగే మృగాన్ని ఈ మనుష్యుడు నీకూ నాకూ కూడా చెందనివాడు కాబట్టి నీవు మనుష్యుని కిందకి తోసై నేను మనుష్యుని తిని వెళ్ళిపోతాను నీవు చెట్టుదిగివెల్లిపో అంది, అంటే ఆ ఎలుగుబంటి అందీ నేను ఉన్న చెట్టుమీదకి ఆర్తితో పరుగెత్తుకొచ్చాడు కాబట్టి నాకు శరణాగతి చేశాడు రక్షించమని, తెలిసో తెలియకో నాదగ్గరకొచ్చాడు కాబట్టి నేను మనుష్యున్ని తొయ్యను, నేను ఇతన్ని రక్షిస్తాను ఇది నా ధర్మము అంది ఇద్దరూ చెట్టుమీద కూర్చున్నారు పులి కింద కూర్చుంది. ఎవరో ఒకరు దొరక్కపోతారాని, కాసేపటికి ఎలుగుబంటికి నిద్రవచ్చింది, నిద్రవచ్చి నాయనా నేను నిద్రొచ్చి పడిపోతానేమో నీ ఒళ్ళో తలపెట్టుకుని కొమ్మలమద్య గుబురుగావున్నచోట పడుకుంటాను కునుకొస్తుంది జారిపోతానేమోంది అయితే మనుష్యుడన్నాడు అయితే నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకో అన్నాడు. ఎలుగుబంటి మనుషి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతూంది నిద్రపోయిన తరువాత పెద్దపులి అందీ ఆ ఎలుగుబంటి వనమృగం అది నిద్రలేస్తే ఆకలేస్తుంది ఆకలేశాక నిన్ను తినేస్తుంది అంతన్నా నిద్రలో ఉంది కాబట్టి దాన్ని తొసై కిందపడిపోతూంది నేను ఎలుగుబంటిని తిని వెళ్ళిపోతాను నీవు చెట్టుదిగి వెళ్ళిపో అంది. వెంటనే మనుష్యుడు ఎలుగుబంటిని తోసేశాడు ఆ ఎలుగుబంటి నిద్దట్లో కిందపడిపోతూంది. కింద పడిపోతూ కింద పడిపోతూ అదృష్టవశాత్తూ అది కొమ్మలు పట్టుకుంది పట్టుకుని మళ్ళీ పైకెక్కింది పై కెక్కిన తరువాత కింద నుంచి పెద్దపులి అందీ చూశావా మనుష్యుడు ఎంత కృతఘ్నుడో నీవు నిద్రపోతే వాడు తోసేశాడు కాబట్టి నా మాటవినూ ఇప్పటికైనా నమ్ము నేను చెప్పింది మనుష్యున్ని తోసై నేను మనుష్యున్నితిని వెళ్ళిపోతానంది.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
అంటే ఎలుగుబంటి అందీ వాడు వాడి ధర్మం తప్పి ఉండవచ్చు కానీ నేను నా ధర్మం తప్పను నేను మాత్రం ʻఆర్తితో నా చెట్టుమీదకి వచ్చాడుʼ కాబట్టి నేను కాపాడుతాను నేను తొయ్యనూ అని తన ధర్మానికి తాను కట్టబడి ఉంది. నాయనా! ఎవరి ధర్మానికి వాళ్ళు కట్టుబడాలికదా... నా సమక్షంలో ఉన్నటువంటివారు ఎవరైనా సరే నా దగ్గర ఉన్నవాళ్ళకి నా రక్ష వాళ్ళు చెలకబడ్డానికివీల్లేదు, కాబట్టి హనుమా వాళ్ళని చంపడానికివీల్లేదు వాళ్ళధర్మం వాళ్ళుచేశారు వాళ్ళ ప్రభువు చెప్పినమాట, మనమెందుకు చంపాలిదానికి కాబట్టి చంపవద్దంది. అంతే తల్లి యొక్క వాత్సల్యం ఎంతగొప్పగా ఉంటుందో అమ్మవారిది ఈ సందర్భం వివరిస్తూంది, అని సీతమ్మతల్లిని అమ్మా! రామ చంద్ర మూర్తి లక్ష్మణ సహితుడై సుగ్రీవ సహితుడై కూర్చుని ఉన్నారమ్మా నీకు ఈ విజయవార్త చెప్పమన్నారు అంటే ఏవమ్ ఉక్తా హనుమతా వైదేహీ జనకాఽఽత్మజా ! అబ్రవీ ద్ద్రష్టు మిచ్ఛామి భర్తారం వానరోత్తమ !! నేను రామున్ని దర్శించాలని అనుకుంటున్నాను అన్నవిషయాన్ని నా నాథుడికి తెలియజేయవలసింది. ఇప్పుడు ఎంతో సంతోషంగా హనుమ రివ్వున ఎగిరి ఆ లంకా పట్టణం యొక్క బాహ్యదేశానికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి రామ చంద్ర మూర్తి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి నేను సీతమ్మను చూసొచ్చాను రావణ సంహారమైందన్నవార్త విని ఆ తల్లి ఎంతో ఆనందించింది త్వరగా నిన్ను కలుసుకోవాలనుకుంటుంది నిన్ను చూడాలనుకోంటుంది రామ చంద్ర ప్రభూ అన్నాడు. అనేటప్పటికి ఆయన తలవొంచుకున్నాడు ఏవమ్ ఉక్తో హనుమతా రామో ధర్మ భృతాం వరః ! అగచ్ఛత్ సహసా ధ్యాన మీష ద్భాష్ప పరిప్లుతః !! ఏదో ఆలోచిస్తూ ధ్యానం చేస్తున్నవాడిలా తల వంచుకున్నటువంటి రామునియొక్క కళ్ళల్లోంచి  నీళ్ళు కారి కిందపడ్డాయి.
ఎందుకూ అన్నదీ మళ్ళీ తొందరపడి మనం తీర్పులు చెప్పేస్తామని రేప్పొద్దున్నా ఈ సందర్భంలోనని చెప్పీ మహర్షి ముందే ఓ మాటవేస్తున్నారు రామో ధర్మ భృతాం వరః ధార్మికుడైనటువంటి రామ చంద్ర మూర్తియొక్క కన్నులవెంట నీరుకారింది దీర్ఘమ్ ఉష్ణం వినిశ్వస్య మేదినీమ్ అవలోకయన్ ! ఉవాచ మేఘ సంకాశం విభీషణమ్ ఉపస్థితమ్ !! ఆయనా ఆ నేలవంకే చూస్తూ మేఘం ఉరిమినట్టుగా చాలా దీర్ఘమైనటువంటి నిట్టూర్పు ఒకటి విడిచిపెట్టి ఒకమాట అన్నారు, ఎవరితో హనుమతో కాదు విభీషణునితో దివ్యాంగ రాగాం వైదేహీం దివ్యాఽఽభరణ భూషితామ్ ! ఇహ సీతాం శిరః స్నాతామ్ ఉపస్థాపయ మా చిరమ్ !! శిర స్నానం చేసి పట్టుబట్టలుకట్టుకుని సమస్త భూషణములను అలంకరించి అంగరాగాదులను పైన పూసుకున్నటువంటి సీతమ్మతల్లిని నా దగ్గరికి ప్రవేశపెట్టండి. వెంటనే విభీషణుడు ఒక పల్లకీని సిద్ధంచేసి అశోక వనంలో శింశుపా వృక్షం దగ్గరికి తీసుకువెళ్ళారు, అమ్మా! నిన్ను రామ చంద్ర మూర్తి స్నానంచేసి ఆభరణములను ధరించి ఉత్తమమైనటువంటి వస్త్రములను ధరించి అంగరాగమును అలంకరింపజేసుకుని తన సన్నిధికి రమ్మన్నారు. అంటే ఆ తల్లందీ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను భర్తకోసం ఇంత అలంకారం చేసుకుని రావాలా భర్తను చూడడానికి ఇప్పుడే ఇలాగే వస్తానంది అంటే ఆయనన్నాడు అమ్మా రాజాజ్ఞ రాముడు అలా రమ్మన్నాడు ʻఅలా రమ్మనడమేమిటీ అని అడగగలిగిన ధైర్యంమాకులేదుʼ కాబట్టి నీవు అలా వస్తే బాగుంటుంది.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
కాబట్టి ఇప్పుడు ఆ తల్లిని అలా అలంకారం చేసుకున్న తరువాత పల్లకిలో కూర్చున్న సీతమ్మని రామ చంద్ర మూర్తి యొక్క సమక్షానికి తీసుకొచ్చారు. ఇప్పటివరకూ అక్కడ ఉన్నటువంటి రాక్షసులుకానీ వానరులుకానీ చూడలేదు సీతమ్మని ఎందుకంటే రాక్షసీ స్త్రీలు తప్పా రాక్షసులన్నవారిని చూడనివ్వలేదు రావణుడు. ఆయన కామ వ్యామోహం అటువంటిది, మండోదరి రావణుడు యుద్ధభూమిలో పడిపోతే లోపలికి వెడుతూ మొదటే ఒకమాటంది, నేను నీవు మరణించావన్నవార్తవినీ ʻరాచకాంతలు వేసుకోవలసిన వల్లెవాటు వేసుకోకుండా వచ్చినందుకు అందరూ నన్ను చూసినందుకు కోపగించకు రావణాందిʼ. అంటే ఆయన తనభార్యనైతే అలా మాట్లాడుతాడు ఇతర స్త్రీలని ఎత్తుకొచ్చేటప్పుడు ఈ ధర్మముండదు, మండోదరి మాట్లాడటంలో రామునియొక్క శీలమును ఆవిష్కరిస్తారు మహర్షి. కాబట్టి ఇప్పుడూ ఆవిడ పల్లకీ దిగీ కిందకి అడుగుపెట్టింది. ఒక్కసారి ఆవిడని చూడాలనీ ఈ వానరులు అందరూ కోలాహలంతో పెద్ద ధ్వని చేస్తూ ఒకరిమీద ఒకరు ఒకరిమీద ఒకరు ఎగిరి చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విభీషణుని కింకరులు కదాండి రాక్షసులు ఇప్పుడు వాళ్ళు బెత్తహస్తులై అంటే బెత్తాలు పట్టుకునీ ఆ బెత్తాలతో ఈ వానరులందరినీ కొడుతున్నారు దూరంగా తొలగండీ దూరంగా తొలగండీ సీతమ్మొస్తూంది ఏమిటా మీద పట్టం అని, రాముడికి ఎక్కడలేని కోపమొచ్చింది.
ఈ సీతమ్మకోసం యుద్ధం చేసి ప్రాణాలు వదిలేశారు, ఈ సీతమ్మని చూస్తానని ఎగిరెగిరి చూస్తే మాత్రం బెత్తాలు పెట్టి కొడుతున్నారు ఇదెక్కడి మర్యాదా అని ఆయన ఎక్కడలేని కోపాన్ని పొందినవాడై ఆయన అన్నాడూ వ్యసనేషు న కృచ్ఛ్రేషు న యుద్ధే న స్వయం వరే ! న క్రతౌ నో వివాహే చ దర్శనం దుష్యతి స్త్రియాః !! రాచకాంత వ్యసనేషు ఏదైనా చాలా గొప్ప రాచకార్యము ఏర్పడితే కృచ్ఛ్రేషు ఏదైనా క్షోభ ఏర్పడితే లేకపోతే యుద్ధేషు యుద్ధమొస్తే స్వయం వరే స్వయంవరంలో న క్రతౌ ఏదైనా పెద్ద ఉత్సవం జరుగుతుంటే యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు వివాహే చ వివాహం జరుగుతున్నప్పుడు దర్శనం దుష్యతి స్త్రియాః స్త్రీ భర్త పక్కన ఉండగా వచ్చి నిలబడినా కూర్చున్నా అందరూ చూసినా అది రాచరికపు మర్యాదలకి తక్కువేంకాదు. కాబట్టి సీతమ్మను ఇలాగే వచ్చి నా పక్కన నిలబడమను అన్నాడు. ఇప్పుడు సీతమ్మ వచ్చి పక్కన నిలబడింది రాముడు చూశాడు ఆతల్లి సీతమ్మకూడా రామ చంద్ర మూర్తివంక ఒక్కసారి చూసింది, చూసి రురోదాఽఽసాద్య భర్తారమ్ ఆర్య పుత్రేతి భాషణిణీ రాముడు తలెత్తలేదు. సీతమ్మతో మాట్లాడి సీతా రా అని అనలేదు ఆవిడా అడుగుతీసి అడుగు వేసుకుంటూ రామ చంద్ర మూర్తి దగ్గర వెళ్ళి నిలబడింది ఆయనేమీ మాట్లాడలేదు ఇలా తలెత్తికూడా ఇలా కన్నెత్తి కూడా ఆవిడవంక చూడలేదు. హడిలిపోయారు సుగ్రీవాదులు హనుమతో సహా ఇప్పటివరకు ఒకలా ఉన్నాడు తీరా సీతమ్మ వచ్చాక ఒకలా ఉన్నాడు ఏమిటి దీని తాత్పర్యము, రామునికి సీతమ్మమీది ప్రేమ తరిగిపోలేదుకదాని అనుకున్నారు. ఇప్పుడు ఆ తల్లీ... ఎవరో ఒకరు మాట్లాడాలికదాండీ కాబట్టి బేలతనం బేలతనమే... కాబట్టి ఆతల్లందీ రురోదాఽఽసాద్య భర్తారమ్ ఆర్య పుత్రేతి భాషిణే ! విస్మయా చ్చ ప్రహర్షా చ్చ స్నేహా చ్చ పతిదేవతా ! ఉదైక్షత ముఖం భర్తుః సౌమ్యం సౌమ్యతరాఽఽననా !! ఏమి వర్ణిస్తారో మహర్షి నిజంగా ఆ చూపులు మనస్సుని రురోదాఽఽసాద్య భర్తారమ్ ఇంతకాలానికి ఆ భర్తను చూసేటప్పటికి తను

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
పడిన కష్టాలన్నీ గుర్తొచ్చి వలవలవల ఏడుస్తూ నోటమాటరాకా ఆర్యపుత్రా అనిమాత్రమే అంది ఆవిడా, అని విస్మయా చ్చ అబ్బాహ్ నాకోసం ఇంత కష్టపడి గెలిచారా అని అలా రామున్ని చూస్తూ విస్మయంతో ప్రహర్షా చ్చ ఎంతో సంతోషంతో స్నేహా చ్చ తన భర్తా అన్న సంతోషంతో పతిదేవతా నేను అనుగవించవలసినటువంటి ఈశ్వర శ్వరూపమిదీ అనేటటువంటి భక్తితో ఆయన వంకచూసి సౌమ్యం సౌమ్యతరాఽఽననా ఆవిడ ముఖంలో మాత్రం ఏవిధమైన మార్పూలేదు పరమ సౌమ్యంతో ఆమె వదనము నిర్మలమైనటువంటి చంద్రుడికాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఆతల్లి అక్కడ నిలబడి ఉంది.
రాముడు మాత్రం ఇలా కన్నెత్తి చూడలేదు చూడకుండా సీతమ్మతో అంటున్నాడు ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వా మయా రణే ! పౌరుషా ద్యదనుష్ఠేయం తదేత దుపపాదితమ్ !! నేను శత్రువుని జయించాను రాక్షసుని యొక్క చెరనుంచి నిన్ను విడుదలచేశాను, ఒక పరాక్రమశాలి పురుషార్థియైనటువంటివాడు తనకు అవమానం జరిగితే ఏమి చెయ్యాలో అవన్నీ చేశాను చేసి నిన్ను విడిపించాము గతోస్మ్యన్తమ్ అమర్షస్య ధర్షణా సంప్రమార్జితా ! అవమాన శ్చ శత్రు శ్చ మయా యుగపత్ ఉద్ధృతౌ !! ఇప్పటివరకు నేను ఎంత క్రోధాన్ని పొందివున్నానో రావణునిమీద ఆ క్రోధం నాకు ఇక్కడితో పోయింది. రామ చంద్ర భార్యని సీతమ్మని అపహరించాడూ రాముడు ఇంకా రక్షించలేదన్న కళంకంనాకు తొలగిపోయింది, నాకు కలిగిన అవమానం నశించిపోయింది వీటన్నిటితోపాటూ నా శత్రువుకూడా నశించిపోయాడు అన్నీ ఏక కాలంలో సాధించాను అద్య మే పౌరుషం దృష్టమ్ అద్య మే సఫలః శ్రమః ! అద్య తీర్ణ ప్రతిజ్ఞత్వాత్ ప్రభవా మీహ చాఽఽత్మనః !! నా పౌరుషం ఫలించింది నా శ్రమ ఫలించింది నేను చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలిగాను యా త్వం విరహితా నీతా చల చిత్తేన రక్షసా ! దైవ సంపాదితో దోషో మానుషేణ మయా జితః !! చపల చిత్తుడైనటువంటి ఒక రాక్షసుడు కాముకుడై నిన్ను అపహరించి తీసుకెళ్ళితే నీవు ఆయన చేత అపహరింపబడటం దైవముచేత నిర్ణయింపబడిన కార్యమైతే నేను కేవలము మనుష్యుడనై నేను నా పౌరుషంతో దాన్ని దిద్దేప్రయత్నంచేసి విజయం సాధించగలిగాను సంప్రాప్తమ్ అవమానం య స్తేజసా న ప్రమార్జతి ! క స్తస్య పురుషార్థోస్తి పురుష స్యాల్ప తేజసః !! మనుష్యుడు తన మీద వచ్చినటువంటి నిందపోగొట్టుకునుటకు తన పరాక్రమంతో తనకు కలిగినటువంటి ఇబ్బందిని తొలగించుకోనటువంటివాడు తేజస్సు ఉన్నాకూడా అటువంటివాన్ని అల్ప తేజస్సున్నవాడూని లోకం నిందచేస్తుంది.
కాబట్టి నేను ఇంత శ్రమపడ్డాను ఆ వాయుసుతుడైనటువంటి హనుమ నూరు యోజనముల సముద్రాన్నిగడచి లంకా పట్టణానికి రావడమనేటటువంటి క్లిష్టమైనకార్యము యొక్క ప్రయోజనము ఇవ్వాళపూర్తైంది. ఈ వానరులందరూ కష్టపడి ఈ లంకారాజ్యంమీద వీరోచితంగా నాకు యుద్ధం చెయ్యడంలో సహకరించారు వారు ధన్యతపొందారు ఈ విభీషణుడు అధర్మాత్ముడూని రావణున్ని విడిచిపెట్టి ధర్మాత్ముడనని నన్ను ఆశ్రయించాడు ఆయనకు రాక్షస రాజ్యమిచ్చాను కృతార్థుడనయ్యాను యత్ కర్తవ్యం మనుష్యేణ ధర్షణాం పరిమార్జతా ! తత్ కృతం సకలం సీతే శత్రు హస్తాత్ అమర్షణాత్ !! ఇవన్నీకూడా నేను ఒక మనుష్యుడు తనకి కలిగినటువంటి నింద తొలగించుకోవడానికి పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి తన వంశం కళంకం పొందకుండా ఉండడానికి చేశానుతప్పా నా మనసులో వేరొక ప్రయోజనాన్ని పెట్టుకుని చేసినవికావు అంటే నీకోసం చేసినవి కావు --- ప్రాప్త చారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థితా ! దీపో నేత్రాఽఽతుర స్యేవ ప్రతికూలాసి మే దృఢమ్ !! ఒక పెద్దమాటే వేసేశాడిక్కడా... ఆయన అన్నాడు ప్రాప్త చారిత్ర సందేహా అనుమానాస్పదమైనటువంటి నడవడి కలిగినదానా... అన్నాడు, నిన్ను నేను కన్నులెత్తి చూడలేక పోతున్నాను.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ఎందుకో తెలుసా..? కంటివ్యాధి ఉన్నవాడు దీపాన్ని చూడలేనట్లు అన్నాడు, ఇదీ ఇక్కడే కదాండీ..! రామాయణంలో అయ్యబాబోయ్ ఇక్కడ్నుంచి ఇక రాముడి మీద ఎప్పటి త్రేతాయుగము ఇప్పటివరకు నిందవేస్తూనే ఉన్నారు, నేను అగ్ని ప్రేవేశం చేయించిన రామున్నికాను నేను అటువంటి అనుమానపు మనిషిని అనుకుంటున్నావా... రాముడి ధర్మం అక్కరలేదు అనుమానం ఒకటి మాత్రం కావలసి వచ్చింది, అసలు రామాయణంలో ఆ ఘట్టమేమిటో సరిగా అర్థమయితే ఆ అల్లరిచేయం. కాబట్టి ఆయన అన్నారు కంటి కలక నాకు వచ్చింది దీపం ఎదురుగుండా ఉంది నేను దీపాన్ని చూడలేకపోతున్నాను ఇప్పుడు దీపాంది దోషమా నాది దోషమా... నాది దోషం నా కంటికి వ్యాదుంది అందుకనీ నా కన్ను దీపాన్ని చూడలేకపోతూంది. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి... నేను నిన్ను నీ నడవడి అనుమానాస్పదము అని ఏమాట అన్నానో ఆమాట నా కంటికి పుట్టిన జబ్బు. నీవు దీప శిఖ, దీప శిఖకు ఏదైనా తగిలిందనుకోండి దీపానికి అగౌరవమేమీ ఉండదు దీపము ఎప్పుడూ దీపమే అది ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది, ఏది పాడైపోతూందంటే దీపంలోకి వెళ్ళిన పురుగు కాలిపోతూంది తప్పా దీపానికేమీ ఇబ్బంది ఉండదు. ఇది తెలిసి నన్ను దీపం ఎందుకనలేకపోతున్నావ్? నా కంటికి జబ్బొచ్చింది సీతా... ఏమిటో ఆ జబ్బు ఎదర చెప్తాడు. ఆయన సీతమ్మని అనుమానించినవాడుకాదు మీరు ఇవ్వాళ లోకం ఎలా చూస్తుందో ఆ కళ్ళజోడు పెట్టుకుని చెప్తున్నాడు ఎందుకో తెలుసా... రేపు నిన్ను లోకమంటే నేను తట్టుకోలేనని నీమీదనాకు ప్రీతి అటువంటిది. ఇదీ ఆయన బాధ అందుకనీ నిన్ను ఈ మాట అనలేకా... నిన్ను ఇలా కన్నులెత్తి చూస్తే నీ వంక చూస్తే ఇంక నేను అనలేను, అందుకు నేను అసలు చూడటంలేదు తెలుసా... ఇదీ ఆయన ప్రేమ ఇదీ ఆయన ప్రీతి. కానీ, ఎందుకు అనవలసి వచ్చిందో చెప్తాడు
తద్గచ్ఛ హ్యభ్యనుజ్ఞాతా యథేష్టం జనకాఽఽత్మజే ! ఏతా దశ దిశో భద్రే కార్య మస్తి న మే త్వయా !!
కః పుమా న్హి కులే జాతః స్త్రియం పర గృహోషితామ్ ! తేజస్వీ పునః ఆదద్యాత్ సుహృల్లేఖ్యేన చేతసా!!
రావణాంక పరిభ్రష్టాం దృష్టాం దుష్టేన చక్షుషా ! కథం త్వాం పునరాఽఽదద్యాం కులం వ్యపదిశన్ మహత్ !!
లక్ష్మణే భరతే వా త్వం కురు బుద్ధిం యథా సుఖమ్ !
సుగ్రీవే వానరేన్ద్రే వా రాక్షసేన్ద్రే విభీషణే ! నివేశయ మనః సీతే యథా వా సుఖమ్ ఆత్మనః !!
ఆయనన్నాడు సీతా ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టం నుంచి నీవు విడిదల పొందావు రావణుని భయం నీకులేదు కాబట్టి ఇప్పుడు నీవు దశ దిశలలో నీవు ఎక్కడ సంతోషంగా ఉంటాననుకుంటావో అక్కడికి నీవు వెళ్ళవచ్చు. ఒకవేళ నీకు రక్షణ లక్ష్మణుని దగ్గర లభిస్తుందనుకుంటే లక్ష్మణుని దగ్గర ఉండవచ్చు, భరతుని దగ్గర లభిస్తుందీ అంటే భరతుని దగ్గర ఉండవచ్చు, శత్రుఘ్నుడి దగ్గర లభిస్తుందంటే శత్రుఘ్నుడి దగ్గర ఉండవచ్చు, కాదు కపిరాజైన సుగ్రీవుడి దగ్గర లభిస్తుందంటే ఆయన దగ్గర ఉండవచ్చు, కానీ రావణాసురుడు బలవంతంగా తన చేతితో పట్టుకుని పైకెత్తి తొడమీద కూర్చోబెట్టుకుని చాలా దగ్గరగా నిన్ను పట్టుకుని కామమేహితమైన

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
కన్నులతో చూసినటువంటి నిన్నూ మళ్ళీ తీసుకొచ్చి నా ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకునేంత ఔదార్యంతో మాత్రం నేను ఇప్పుడు మాత్రం లేను అటువంటి స్థితి కుదరదు కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నీవు వెళ్ళవచ్చు. అంటే సీతమ్మందీ కిం మామ్ అసదృశం వాక్య మీదృశం శ్రోత్ర దారుణమ్ ! రూక్షం శ్రావయసే వీర ప్రాకృతః ప్రాకృతామ్ ఇవ !! ఆవిడందీ రామా! మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా... అసలు ధర్మ శాస్త్రము ప్రవర్తన ఏమీ తెలియనటువంటి అత్యంత చౌకబారు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని అంత చౌకబారుతనం కలిగిన ఒక పురుషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. తప్పా ఇది రాముడు సీతతో మాట్లాడే మాటలల్లా లేవు న తథాస్మి మహా బాహో యథా త్వమ్ అవగచ్ఛసి ! ప్రత్యయం గచ్ఛ మే యేన చారిత్రే ణైవ తే శపే !! నీవు ఏ నా నడవడిని సందేహించావో ఆ నా ప్రవర్తనమీద ఒట్టుపెట్టు చెప్తున్నాను ఇలా స్త్రీజాతిని శంకించడమనేటటువంటిది తగదు నా పాతివ్రత్యముమీద ఆన నీవు నన్ను విశ్వసించు పృథక్ స్త్రీణాం ప్రచారేణ జాతిం త్వం పరిశంకనే ! పరిత్యజ ఇమాం శంకాం తు యది తేహం పరీక్షితా !! మనుష్యులయందు ఎప్పుడూ కూడా ప్రతివారియందుకూడా ఎక్కడో అక్కడా అల్పమైనటువంటి బుద్ధి కలిగినవాళ్ళుంటారు అది ఆడవారియందు కావచ్చు మగవారియందు కావచ్చు అంత మాత్రంచేతా అందర్నీ ఆ గాడి కట్టి మాట్లాడటం తప్పు.
ఎక్కడో ఎవరో అటువంటివారిని నీవు చూసుండవచ్చు అంత మాత్రం చేత నన్ను కూడా అలా మాట్లాడటం చాలా తప్పు రామా య ద్యహం గాత్ర సంస్పర్శం గాతాస్మి వివశా ప్రభో ! కామ కారో న మే తత్ర దైవం తాత్రాపరాధ్యతి !! రావణుడు నన్ను పట్టుకున్నాడు తొడమీద కూర్చోబెట్టుకున్నాడు అంటున్నావు రావణుడు నన్ను పట్టుకున్నప్పుడు తన తొడమీద కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను నేను రక్షించుకోగలిగిన స్థితినాదికాదు నేను పతివ్రతనుగనుక నీవు నన్ను రక్షించాలి నా ధర్మం నీచేత రక్షింపబడటం, నన్ను నేను రక్షించుకోగలగినంత బలం నాకు లేదు నా శరీరానికి అవతల శరీరము యొక్క బలమెక్కువ అవతలవాడు తన శరీరంతో బలంతో నన్ను పట్టుకుని తన తొడమీద కూర్చోబెట్టుకున్నాడు అప్పుడు నా మనసుమారి ఉంటే నాది తప్పు మదదీనం తు య త్త న్మే హృదయం త్వయి వర్తతే ! పరాధీనేషు గాత్రేషు కిం కరిష్యా మ్యనీశ్వరా !! నా శరీరమునువాడు పట్టుకున్నాడు నా మనసు నిన్ను పట్టుకుంది ఏది దోషము చెప్పు ఇప్పుడు నాది దోషముందా... నా మనసు నిన్ను పట్టుకుందీ అని నీవు నమ్మడానికి నేను ఏమి చెయవలసి ఉంటుంది, శరీరం రావణుడు పట్టుకుంటే నా తప్పేముంది అంటే సందర్భమొచ్చింది కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్థావన చేస్తాను సనాతన ధర్మంలో ఒక చాలా పెద్ద మాటొకటి ఉంది తెలుసాండీ తెలుసాండీ... వివాహమునకు పూర్వము వివాహము చెయ్యబడకముందు బలాత్కారముగా స్త్రీ అపహరింపబడి ఆమె యొక్క శీలము చరపబడితే దుర్మార్గునివలనా ధర్మాత్ముడైన వేరొక పురుషుడు ఆమెను భార్యగా స్వీకరించవచ్చు ఆమెకు ఏదోషమూ కలగదు.
అంత ఉదారంగా మాట్లాడాయి శాస్త్రాలు ఆమె మనసు ప్రధానమని చెప్పాయి, వాడు పశుబలంతో నన్ను  తొడమీద కూర్చోబెట్టుకున్నాడు నా మనసు నిన్ను ఆశ్రయించింది హా రామా... హా లక్ష్మణా అన్నాను నా దోషమేముందీ... కాబట్టీ సహ సంవృద్ధ భావా చ్చ సంసర్గేణ చ మానద ! య ద్యహం తే న విజ్ఞాతా హతా తే నాస్మి శాశ్వతమ్ !! ఆవిడ ఎంత గొప్పగా

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ఎదిరించిందండి భర్తని ʻదుర్మతేʼ అని మండోదరి పిలిస్తే మానదా అని ఆవిడ పిలిచింది సీతమ్మ భర్తని, “మానదా” అంటే నీ భార్య యొక్క ప్రవర్తనని నీ భార్య యొక్క మానమును (మానము అంటే గౌరవము) గౌరవమును కాపాడవలసినవాడా..! పదిమంది మధ్యలో ఇంత కాలం కలిసిమెలిసి తిరిగినవాళ్ళమే కొన్ని నెలలు ఆపదవచ్చి నేను ఇక్కడ ఉన్నానే అంతమాత్రానికి నీవు ఇంత శంకించి ఇన్నివేల మంది ముందు మాట్లాడావే ఇప్పుడు నేను ఉన్నట్లా నశించిపోయినట్లా... అని అడిగిందావిడా... వ్రేషిత స్తే యదా వీరో హనూమాన్ అవలోకకః ! లంకా స్థాహం త్వయా వీర కిం తదా న విసర్జితా !! ప్రత్యక్షం వానరేన్ద్రస్య త్వ ద్వాక్య సమనన్తరమ్ ! త్వయా సంత్యక్తయా వీర త్యక్తం స్యా జ్జీవితం మయా !! హనుమని నీవు పంపించావు హనుమ వచ్చి శింశుపా వృక్షం మీద కూర్చుని చూశారు నేను ఎటువంటి ప్రవర్తనతో ఉన్నానో ఆయన చూశారు, చూసి నాకు నీ ఉంగరమిచ్చారు నా కేశ భూషణాన్ని పుచ్చుకున్నాడు నీ దగ్గరకొచ్చాడు నీకు నా ఆభరణాలు ఇచ్చాడు, నీవు చాలా సంతోషించావు సీతమ్మను వదిలి నేను ఉండలేనని సేతువు కట్టుకొచ్చావు, వచ్చి యుద్ధం చేశావు, ఇప్పుడేమంటున్నావు నీ చారిత్రము అనుమానాస్పదము అంటున్నావు, ఈ మాట నీవు ఎప్పుడనాలి హనుమతో కబురుచేసినప్పుడే నీ చారిత్రము అనుమానాస్పదము నాకు కళంకము తొలగించుకోవడానికి రావణున్ని చంపుతానేమోకాని నిన్ను స్వీకరించననుంటే నేను నా శరీరము వదిలిపెట్టుండేదాన్ని అప్పుడెందుకు చెప్పలేదు ఈ మాట, ఇప్పుడెందుకొచ్చింది ఈ మాట అప్పుడెందుకనలేదు అప్పుడులేని బుద్ధి ఇప్పుడెందుకు పుట్టిందినీలో.
ఆవిడేం ఊరుకోలేదండీ మీరు నేను అడగక్కరలేదు నిలదీసేసింది ఒకటికి పది న ప్రమాణి కృతః పాణిః బాల్యే బాలేన పీడితః ! మమ భక్తి శ్చ శీలం చ సర్వం తే పృష్ఠతః కృతమ్ !! ఎప్పుడో చిన్నప్పుడు వివాహమైంది మనిద్దరికి అప్పుడు చేశావు పాణీగ్రహణం అ తరువాత ఎన్ని సంవత్సరాలు మనిద్దరం కలిసున్నాం నేను ఎటువంటిదాననో నీకు తెలియదా... నీ కంటితో చూడనిదానికీ నా చేతిలో లేనిదానికీ నేను కొన్ని నెలల పాటు పర గృహంలో ఉండిపోవలసి వస్తే నా చారిత్రమును నా మంచి తనాన్నీ పక్కకు తోసేసీ నీ కంటితో చూడనిదానికి నింద చేసేసి నన్ను దూరం చేసి మాట్లాడుతావా... ఏవం బ్రువాణా రుదతే బాష్ప గద్గద భాషిణే ! అబ్రవీ ల్లక్ష్మణం సీతా దీనం ధ్యానపరం స్థితమ్ !! చితాం మే కురు సౌమిత్రే వ్యసన స్యౌస్య భేషజమ్ ! మిథ్యోప ఘాతోపహతా నాహం జీవితుమ్ ఉత్సహే !! ఆవిడా వెంటనే లక్ష్మణుని వంక తిరిగి అందీ... లక్ష్మణా క్షితి పేర్చు లేనటువంటి అపవాదు నామీద మీ అన్న వేసినప్పుడు నేను ఈ శరీరంతో ఉండదల్చుకోలేదు అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను క్షితి పేర్చంది. హడిలిపోయి లక్ష్మణ స్వామి రామునివంక చూశాడు, రాముడు ఎవరిచేతా తేరిపారి చూడడానికి వీలులేనంత స్వరూపంతో ఉన్నాడు, ఆయనా... ఆమె ఏం చెప్పిందో అది నీవు చెయ్యొచ్చు అన్నట్లు చూశాడు. వెంటనే లక్ష్మణ స్వామి క్షితిపేర్చాడు, ఆ తల్లి
ప్రణమ్య దేవతాభ్య శ్చ బ్రాహ్మణేభ్య శ్చ మైథిలీ ! బద్ధాంజలిపుటా చేదమ్ ఉవాచాగ్ని సమీపతః !!
యథా మే హృదయం నిత్యం నాపరస్పతి రాఘవాత్ ! తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః !!
యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవః ! తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః !!
కర్మణా మనసా వాచా యథా నాతి చరామ్యహం ! రాఘవం సర్వ ధర్మజ్ఞం యథా మాం పాతు పావకః !!
ఆదిత్యో భగవాన్ వాయుః దిశ శ్చంద్ర స్తథైవ చ ! అహ శ్చాపి తథా సంథ్యే రాత్రి శ్చ పృథివీ తథా !!

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతామ్ ! ఏవ ముక్త్వా తు వైదేహీ పరిక్రమ్య హుతాశనమ్ !!
వివేశ జ్వలనం దీప్తం నిస్సంగేనాన్తరాఽఽత్మనా !
ఆతల్లి అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి దిక్పాలకులకు నమస్కారంచేసి భూమికి నమస్కారంచేసి పంచభూతములకు నమస్కరించి నేను ఎన్నడూ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలచేత కేవలము రామ చంద్ర మూర్తియందు మాత్రమే మనసున్నదాననైతే, నేను ఎన్నడూ అన్యపురుషునివైపు మనసు పెట్టనిదాననైతే, నా చారిత్రము కళంకములేనిదైతే, ఇంతమంది దిక్పాలకులు సాక్షిగా ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన దాననుగనుకా... నా శీలమునందు దోశములేకపోతే నేను రక్షింపబడుదునుగాకా... అని ఆమె అగ్నిలో ప్రవేశించింది.
ఇప్పుడు ఆమె ఏమంది లక్ష్మణునితో క్షితి పేర్చమంది నేను ఇక బతకను, ఆవిడ ప్రవేశించేటప్పుడు ఏమందీ ʻనా శీలము ప్రకటింపబడి నేను రక్షింపబడెదనుగాకాʼ... అందావిడా. చచ్చిపోవడానికి అగ్నిలోకి వెళ్ళిందా... తన శీలమెంతగొప్పదో చెప్పడానికి అగ్నిలోకెళ్ళిందా..? తన శీలమెంతగొప్పదో చెప్పడానికి అగ్నిలోకెళ్ళింది, ఆమె శీలమెంత గొప్పదో రామునికి చెప్పడానికి అగ్నిలోకెళ్ళిందా...? ఆమె శీలమెంతగొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకెళ్ళిందా..? ఎందుకో తెలుసాండీ..! దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టిందనుకోకండి సీతమ్మని, ఇంత పెద్ద పరీక్ష రామ చంద్ర మూర్తి ʻఎక్కడంటారో రేప్పొద్దున్న నా భార్యననీʼ అలంకారాలు చేసి తీసుకురమ్మన్నాడు, ఎగబడి ఎగబడి చూశారావిడని రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంతందగత్తే కాబట్టేరా రావణుడు తీసుకెళ్ళాడనుకుంటారు కదాండీ..! ఈ మాట అంటారనీ, ఇన్ని నెలల తరువాత భార్యను చూసినా... ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో లేచి గభాల్నా  చేతులు పట్టుకుని ఆవిడ కళ్లు తుడవాలని ఉన్నా... ఇవ్వాళ నేను ఒక్క ఐదు నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీమీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడ్వవలసి వస్తుంది సీతా..! నీవు అంతఃపురంలో ఉంటావు ముందు నా చెవినపడుతాయి. కాబట్టి నీ చారిత్రమేమిటో  లోకానికి తెలియచెప్పాలి అందుకనీ ఆయన నాకంటికి జబ్బొచ్చింది సీతా నీవు దీప శిఖకవి అన్నాడు, ఆయనకు అనుమానంలేదు.
ఇప్పుడు సీతమ్మ రాముడి హృదయాన్ని అర్థం చేసుకుంది, రాముడికి కాదు అనుమానం ఈలోకం మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో ఆయన అగ్నిలోకి ప్రవేశించి తన గొప్పతనాన్ని చాటిచెప్పమంటున్నాడూని ఆవిడ తెసుకుంది, అందుకే నా శీలము ప్రకటింపబడుగాకా... అని కోరింది తప్పా నేను యమ స్థానమునో లేక దేవతా స్థానమునో పొందుదునుగాకాని అనిచెప్పి ఆవిడేం సంకల్పంచేయలేదు అగ్నిలో ప్రవేశించేటప్పుడు, వాళ్ళిద్దరి హృదయాలు ఒకటి అందుకే అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం ! తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి !! రాముడి మనసు సీతమ్మదగ్గరుంటుంది సీతమ్మమనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడు ఏదెందుకు చేస్తున్నాడో సీతమ్మకి తెలుసు, సీతమ్మ ఏది ఎందుకు చేస్తున్నదో రామునికి తెలుసు. తప్పా అసలు సీతారాముల మధ్య ఏవిధమైనటువంటి అవగాహనా రాహిత్యమూలేదు. అందుకే సీతమ్మా ప్రశ్నవేసింది నిజంగా రాముడి అనుమానమై ఉంటే హనుమ చెప్పిననాడే నేను సీతమ్మకోసం యుద్ధం చెయ్యడంలేదని ఎక్కడైనా చెప్పారా రామాయణంలో అలాగా ʻమధురా మధురా భాషీʼ అన్నారు. నేను ఒక్కరోజు ఉండలేను అన్నారు, ఇంకా నెలరోజులు ఉంటానంది సీతమ్మ. నేనొక్క క్షణం ఉండలేను నన్ను ఇక్కడ్నుంచి తీసుకెళ్ళి లంకలో దింపేయవా..? హనుమా సీతమ్మని చూడకుండా ఉండలేనన్నారాయన అంత ప్రేమైక మూర్తి మధ్యలో ఏ సంఘటన జరిగితే ఇలా మాట్లాడుతారు.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
జరిగిన సంఘటన ఒక్కటే అపవాదు లోకం వేస్తుంది, నింద అన్న భయమొక్కటే, అయితే అంత పిరికితనం ఉండచ్చా... పిరికితనం కాదు ధర్మం ఎందుకో తెలుసా... రేపు రాజా రాముడిగా కూర్చోవలసివస్తే... పట్టాభిషేకంలో సీతమ్మతల్లితో కలిపి పట్టాభిషేకం చేస్తారు అభిషేకం చేస్తే సీతమ్మతో కలిపిచేస్తారు, చేసేటప్పుడు ఎదురుగుండా ఉన్నవాళ్ళందరూ చెవులు ఇంకోలా కొరుక్కున్నారనుకోండి బాధ ఎవరికి కలుగుతుంది. అప్పుడు అగ్ని ప్రవేశం చేయించడం గొప్పదా ఇప్పుడు చేయించి సీతమ్మ ఎంతగొప్పదో రాముడు లోకానికి చాటి చెప్పడం గొప్పదా... రామున్ని తప్పు పడుతామే మనం నేను మిమ్మల్ని ఒక్కమాట అడుగుతాను గమనించండి, ఇంతగొప్ప పరీక్షపెట్టారు నోరు మూసినవాడు ఎవడైనా ఉన్నాడా..! ఇలా పట్టాభిషేకం అయ్యిందోలేదో ఆవిడ గర్భిణి అయ్యిందోలేదో అనరాని మాటలు అన్నారాలేదా..! అన్నారు కాబట్టి రాజా రాముడా... సీతా రాముడా... అని సీతమ్మని గంగ వొడ్డున సీతమ్మని దింపవలసి వచ్చిందాలేదా నీమీద నాకు అనుమానం లేదు సీతాని బోరు బోరున ఏడ్వవలసి వచ్చిందాలేదా..? ఆఖరికి ఆయన వంశాకురాన్ని ఆయనకి ఒప్పజెప్పేసి సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోవలసి వచ్చిందాలేదా..! ఎంత పవిత్రమైన వ్యక్తైనా లోకం మాత్రం పొడిచేయడం వదిలిపెట్టిందా ఇంత అగ్ని ప్రవేశం చేసినా... పోనీ త్రేతాయుగమైపోయింది ఆ చాకలి అక్కడితో వదిలిపెట్టాడా... ఆ వాక్క్ ధోరణి ఎక్కడివరకు ఉందంటే ద్వాపర యుగంలో కృష్ణపరమాత్మగా రాముడు మళ్లీ అవతారము స్వీకరించి ఇప్పుడైనా సరే ఇంకా మాట్లాడుతాడేమో చూద్దామనీ ఏదీ రెండు పట్టుపంచలీయ్యీ అన్నాడు, ఎట్టేట్రా? మనుజేంద్రు చేలములు మీకీఁ బాడియే? అనీ, నేను కంసుని భంటునీ ఒక్క గుద్దు గుద్దుతాను చచ్చిపోతావన్నాడు, నీకెందుకురా గొల్లవాడివీ అంటే అన్నాడు లక్ష్మణ స్వామి ఇప్పుడు బలరాముడు, బలరాముడు అన్నాడు అన్నయ్యా... ఓరేయ్ తమ్ముడా ఆనాడు పేలడం మొదలు పెట్టిన నోరు ఎన్ని పుర్రెలుగా మారినా దీనికి బుద్దిపోలేదు ఈ పుర్రె నీ చేత్తో పగలగొట్టేయ్ అన్నాడు.
అంటే కృష్ణ పరమాత్మ తన పిడికిలి బిగించి వేయ్యి వ్రక్కల్లయ్యేట్లు కొట్టారు ఆ పుర్రెని, అంటే... ఆ నోటి దురుసుతనానికీ ఏది అవకాశంగా దొరుకుతుందని చూడ్డమే... యుక్తా యుక్త విచక్షణతో మాట్లాడటం అన్నది లోకంలో అందరికీ ఉండదు. దీని నుంచి భార్యని రక్షించడం రాముని యొక్క ప్రయోజనం ఆ రక్షించడం... అందుకే ఆవిడందీ “మానదా” అంది నన్ను రక్షిస్తున్నవాడా..! నా గౌరవాన్ని రక్షిస్తున్నవాడా..! ఇది ఆవిడకి అర్థమైంది అర్థమవ్వంది ఎవరికంటే మనకి. ఇప్పటికీ దిక్కుమాలిన సినిమా డైలాగేమిటంటే... నేనేం రామున్ని అనుకుంటున్నవా అనుమానించడానికి? అని అంటారు. అదొక్కటేపనా ఆయనకింకా... అలాగైతే నీ పెళ్ళి శుభలేక వాళ్ళపేరుమీదే వేశారు జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మ రాగాయితాః  మీ నాన్నగారిని అడుగు ఎందుకేశారో..? అనుమానం, రామున్నెందుకేశావు నీవలాంటప్పుడు? ధర్మమర్థం చేసుకునే ప్రయత్నించాలి, రామ చంద్ర మూర్తంటే ʻరాశీ భూతమైనటువంటి ధర్మముʼ సీతమ్మతల్లి యొక్క కీర్తిని ప్రకాశింపజేసేటటువంటి ప్రయత్నంచేసిన మహాపురుషుడని వాళ్ళిద్దరికీ లేని గొడవా... ఎన్నికోణాలో ఎన్ని కళ్ళజోళ్ళు పెట్టుకుని ఎన్ని రకరకాలుగానో చూసి ఎన్ని రాకాల వ్యాఖ్యానాలో ఎన్ని రకాలు ఉపన్యాసాలో ఎన్ని రకాల మాటలో అప్పుడు చేసిన అగ్ని పరీక్షకి కట్టుబడి మనం ఇప్పటికైనా రామునిమీద అనకుండా ఉన్నామా... నాకు చెప్పండి. ఎన్ని తప్పుడు మాటలు, రాముడు ఆపాటి జాగ్రత్తకూడా తీసుకుని ఉండి ఉండకపోతే మనం ఎంతమాట్లాడుకునుండేవాళ్ళము. ఆసలు రామాయణం పరిస్థితేమిటప్పుడు అయ్యబాబోయ్... ఇదొక్కటే పట్టుకుంటారు. రామాయణంలో మిగిలినవన్నీ వదిలేసి ఇదొక్క ఘట్టమే పట్టుకుంటారు కాబట్టి రాముని యొక్క ధార్మిక నిష్టను మీరు చూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లీ నమస్కారం చేసి అగ్నిలోకి ప్రవేశించగానే అగ్నిహోత్రుడు రావడంకాదు, మొత్తం దేవతలందరూ త్రిమూర్తులు విష్ణుస్వరూపం తప్పా మొత్తం కదిలొచ్చేసింది

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
తతో వైశ్రవణో రాజా యమ శ్చామిత్ర కర్శనః ! సహస్త్రాక్షో మహేన్ద్రా శ్చ వరుణ శ్చ జలేశ్వరః !!
షడర్ధ నయనః శ్రీమాన్ మహాదేవో వృష ధ్వజః ! కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మా బ్రహ్మ విదాం వరః !!
ఏతే సర్వే సమాఽఽగమ్య విమానైః సూర్య సన్నిభైః ! ఆగమ్య నగరీం లంకామ్ అభిజగ్ము శ్చ రాఘవమ్ !!
బ్రహ్మగారు నూరు నేత్రములున్నటువంటివాడు పరమశివుడు త్రయంబకుడు ఆయనతో పాటుగా వరుణుడు ఆయనతోపాటుగా ఇంద్రుడు ఆయనతోపాటుగా కుబేరుడు వీళ్ళందరూ సూర్యునితో సమానమైనటువంటి విమానములనెక్కి అక్కడికొచ్చారు, వచ్చి బ్రహ్మగారు మాట్లాడుతున్నారు నాయనా నీవు దేవాతి దేవుడవు నీవు శ్రీమన్నారాయుణిడివి సృష్టికర్తవి స్వయంభువివి ఈ లోకాలన్నీ నీయందే పుట్టి నీయందే పెరిగి నీయందే లయమౌతాయి అటువంటివాడివి రామా..! నీవు ఇవ్వాళ ఇలా సామాన్యమానవుడిగా నీవు తలదించుకోవడం ఆశ్చర్యంగా ఉందీ అన్నాడు.
అంటే వెంటనే రాముడు అన్నాడూ ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాఽఽత్మజమ్ ! యోహం  యస్య యత శ్చాహం భగవాం స్త ద్బ్రవీతు మే !! ఏమిటీ?... ఏమిటో అంటున్నారు మీరు, ఆదిమధ్యాంతరహితుడంటున్నారు, శ్రీమన్నాయణుడంటున్నారు, సృష్టి కర్త అంటున్నారు, స్థితి కర్త అంటున్నారు, ప్రళయకర్త అంటున్నారు నేను అలా అనుకోవట్లేదు అన్నారు. ఆయన అన్నాడు ఆత్మానం మానుషం మన్యే నన్నునేను ఏమనుకుంటున్నానో తెలుసా... ఒక మనుష్యున్ని అనుకుంటున్నాను “అందుకే మనుష్యజ్యాతి ఋణపడిందీని అని అన్నది రామునికి”. ఆయనా ఆద్యంతములూ మనిషిగానే ప్రవర్తించాడు నేను కేవలం మనుష్యున్ని రామం దశరథాఽఽత్మజమ్ నేను దాశరథిని దశరథ మహారాజుకొడుకుని ఒకవేళ మీరు అంతన్నా మీరేదో అంటున్నారు, అది ఏదైనా అయితే అది సత్యమా ఏదీ నాకు చెప్పండీ అంటారు. ఇదీ చాలా శక్తివంతమైన స్తోత్రమూ అంటారు యుద్ధకాండలో ఇది కేవలం చదివినంత మాత్రం చేతా కేవలం పారాయణ చేసినా దీన్ని విన్నా... ఉత్తర క్షణం ప్రయోజనం సమకూరుస్తుందీని వాల్మీకి మహర్షి కాదు దీని ఫల సృతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు
ఇతి బ్రువన్తం కాకుత్స్యం బ్రహ్మా బ్రహ్మవిదాం వరః ! అబ్రవీ చ్ఛృణు మే రామ సత్యం సత్య పరాక్రమ !!
భగవాన్ నారాయణో దేవః శ్రీమాం శ్చక్రాఽఽయుధో విభుః ! ఏక శృంగో వరాహ స్త్వం భూత భవ్య సపత్నజిత్ !!
అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాన్తే చ రాఘవ ! లోకానాం త్వం పరో ధర్మో విష్వక్సేన శ్చతు ర్భుజః !!
శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః ! అజితః ఖడ్గ ధృద్విష్ణుః కృష్ణ శ్చైవ బృహ ద్బలః !!
సహస్ర శృంగో వేదాత్మా శత జిహ్వో మహర్షభః ! త్వం త్రయాణాం హి లోకానా  మాఽఽది కర్తా స్వయం ప్రభుః !!

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
త్వం యజ్ఞ స్త్వం వషట్కార స్త్వమ్ ఓంకారః పరంతప ! ప్రభవం నిధనం వాతే న విధుః కోభవాన్ ఇతి !!
దృశ్యసే సర్వ భూతేషు బ్రహ్మణేషు చ ఘోషు చ ! దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ !!
సహస్ర చరణః శ్రీమాన్ శత శీర్షః సహస్రదృక్ ! త్వం ధారయసి భూతాని వసుధాం చ సపర్వతామ్ !!
అహం తే హృదయం రామ జిహ్వా దేవీ సరస్వతీ ! దేవా గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణః ప్రభో !!
నిమేష స్తే భవే ద్రాత్రిః ఉన్మేష స్తేభవ ద్దివా ! సంస్కారా స్తే భవే న్వేదా న త దప్తి త్వయా వినా !
జగత్ సర్వం శరీరం తే స్థైర్యమ్ తే వసుధా తలమ్ ! అగ్నిః కోపః ప్రసాద స్తే సోమః శ్రీవత్స లక్షణ !!
త్వయా లోకా స్త్రయః క్రాన్తాః పురాణే విక్రమై స్త్రీభిః ! మహేన్ద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురమ్ !!
సీతా లక్ష్మీ ర్భవాన్ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః ! వదార్థం రావణ స్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్ !!
త దిదం నః కృతం కార్యం త్వయా ధర్మ భృతాం వర ! నిహతో రావణో రామ ప్రహృష్టో దివ మాఽఽక్రమ !!
అమోఘం బల వీర్యం తే అమోఘ స్తే పరాక్రమః ! అమోఘం దర్శనం రామ న చ మోఘః స్తవ స్తవః !!
అమోఘా స్తే భవిష్యన్తి భక్తిమన్తి భక్తిమన్త శ్చ యే నరాః ! యే త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమమ్ !!
ప్రాప్నువంతి సదా కామాన్ ఇహ లోకే పరత్ర చ !
ఇమా మాఽఽర్ష స్తవం నిత్య మితిహాసం పురాతనం ! యే నరాః కీర్తయిష్యన్తి నాస్తి తేషాం పరాభవః !!
అని చతుర్ముఖ బ్రహ్మగారు ఆరోజున రామ చంద్ర మూర్తిని స్తోత్రం చేశారు. మహానుభావా నీవు ఇవ్వాళ సాక్షాత్తుగా కాకుత్సవంశంలో జన్మించినటువంటి నరుడివైన రాముడిగా కనపడుతున్నా... నీవే ఆధిమధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడివి శంఖ చక్ర గధా పద్మములను పట్టుకున్నటువంటివాడివి శాంగమనేటటువంటి ధనస్సుని గోమోధకీ అనబడేటటువంటి గధని పట్టుకుంటావు అటువంటివాడివి నందకమూ అనబడేటటువంటి ఖడ్గము నీయొక్క ఆయుధము, అన్నివైపులా సైన్యము కలిగినవాడివి కాబట్టి విష్వక్సేనుడని నీకొక పేరుంది, సమస్త ప్రాణికోటిలో నీవు లయమై ఉంటావు, నీవే ఉండి అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు, ఇంద్రుడిని సైతము సృజించేటటువంటివాడివి, నీ నాభి గొట్టంలోంచే చతుర్ముఖ బ్రహ్మనైన నేను ఉద్భవింపబడ్డాను నేవే యజ్ఞ స్వరూపము నీవే వశట్కారము నీవే ఓంకారము నీవే గోస్వరూపము ఈ గగనము ఈ దిక్కులు అన్నీకూడా నీచేత పరివ్యాప్తమై ఉన్నాయి, నీవే అనేక నామములతో అనేక పర్వతములతో భూమిగా అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు నేను నీ యొక్క హృదయాన్ని అంటే బ్రహ్మగారు, నేను నీ యొక్క హృదయాన్ని నా భార్యయైన సరస్వతి నీ యొక్క జిహ్వ దేవతలందరూ నీ రోమములు ఇదీ స్వయముగా నీ రూపముగా చూసినప్పుడు స్వాకారముగా నీవు అది నీ యొక్క స్థితి. అటువంటివాడివి ఉచ్వాస నిస్వాసలే వేదములుగా ఉంటాయి, నీవు కన్ను మూస్తే రాత్రి కన్ను తెరిస్తే పగలు అటివంటి నీవు శ్రీవత్సవము అనబడేటటుంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణిడివి.
బలి చక్రవర్తిని అదుపుచేసి ఈ భూమి మీదికి పంపి ఈ భూమి నంతటిని ఇంద్రుడికి దానము చేసినటువంటి ఉపేంద్రుడివి, ఇంద్రుడు లోక కంటకుడైన రావణున్ని వధించడానికే ఈ భూమండలంలో రామ చంద్ర మూర్తిగా

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
దశరథమహారాజుగారి యొక్క కుమారుడిగా అవతరించినవాడివి సాక్ష్యాత్తు శ్రీమహాలక్ష్మియే సీతమ్మ. ఆమెయే సీతమ్మగా అవతరించింది, మీ తేజో బల పరాక్రములు అమోఘములు ఇవ్వాళ నీయొక్క యదార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రమేదుందో ఆ స్తోత్రము ప్రతినిత్యమూ ఎవరు చదువుతారో అటువంటివారికి పునర్జన్మ ఉండదు. వారు మోక్షాన్ని పొందుతారు కైవల్యాన్ని పొందుతారు ఇది శాశ్వతమైనది దీనివలన జీవులకు సమస్తపాపము ధ్వంశమౌతుంది ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామ చంద్ర మూర్తిని గూర్చి యదార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు అయినా... రాముడు మాత్రం మనుష్యుడిగానే కనపడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు సీతమ్మతల్లి ప్రవేశించినటువంటి క్షితి గుండంలోంచి బయటికొచ్చి అబ్రవీ చ్చ తదా రామం సాక్షీ లోకస్య పావకః ! ఏషా తే రామ వైదేహీ పాపమ్ అస్యాం న విద్యతే !! నాయనా రామా! ఈ తల్లి సీతమ్మ ఏ పాపమూ అంటనిది త్రికరణ శుద్ధిగా ఈ తల్లి నిరంతరము నిన్నుమాత్రమే సేవించినది ప్రలోభ్యమానా వివిధం భర్త్స్యమానా చ మైథిలీ ! నాచిన్తయత త ద్రక్ష ద్గతే నాన్తరాఽఽత్మనా !! విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీష్వ రాఘవ ! న కించి దభిధాతవ్యమ్ అహ మాఽఽజ్ఞాపయామి తే !! దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్ప వ్యాకుల లోచనః ! ఇప్పుడు అగ్నిహోత్రుడన్నాడు ఎన్నిరకాలుగా రావణుడు ప్రలోభలెట్టాలో అన్నిరకాలుగా ప్రలోభపెట్టినా ఈమె మాత్రం తన మనసుని నీయందుమాత్రమే నిలబెట్టుకున్నతల్లి ఉత్తమమైనటువంటి చారిత్రము కలిగినటువంటిది ఎన్నడూ ఏదోషమూ ఎరుగనటువంటి ఇటువంటి సీతమ్మతల్లిని నీవు అతిక్రమించి మాట్లాడకూడదు.
కాబట్టి ఈ సీతమ్మతల్లిని నీవు స్వీకరించవలసిందీ ఇది నా ఆజ్ఞా అన్నాడు, అప్పుడు రాముడు సీతమ్మవంక చూశాడటా... ఇలా చూడగానే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్ప వ్యాకుల లోచనః ఇలా చూడగానే ఆయన కన్నులవెంట బడబడబడా నీళ్ళు కారిపోయాయటా... సీతా! నీవు ఇటువంటిదానివని తెలిసికూడా లోకానికి నీవు ఇటువంటిదానివని  నిరూపించడానికి ఎంతపెద్దమాట అనవలసి వచ్చిందో అని బాధతో వలవలా ఎడ్చాడటా... ఏడ్చి రాముడు అగ్నిహోత్రుడితో అన్నాడు అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాప మర్హతి ! దీర్ఘ కాలోషితా చేయం రావణాన్తః పురే శుభా !! నాకు తెలుసు సీతమ్మయందు ఏదోషమూలేదని నాకు ష్పష్టంగా తెలుసు రావణాంతఃపురంకాదు ఎక్కడ ఉన్నా సీతమ్మ సీత్మమే బాలిశః ఖలు కామాత్మా రామో దశరథాత్మజః ! ఇతి వక్ష్యన్తి మాం సన్తో జానకీ మవిసోధ్య హి !! నేనుకాని సీతమ్మతల్లి యొక్క వైభవాన్ని ప్రకటింపజేసే అవకాశం ఇవ్వకపోతే రేప్పొద్దున్న లోకమంతా ఏమంటుందంటే బాలిశః ఖలు కామాత్మా జ్ఞానములేనివాడు రాముడు కాముకుడు అందుకని పదినెలలు ఆ రావణుడి కొలువులు కూటమిలో ఉన్నటువంటి సీతమ్మని ఏలుకున్నాడని నన్ను నిందవేస్తుంది, ఆ మాట నన్ననీ సీతమ్మని నిందజేస్తే నేను సీతమ్మతల్లి గురించి ఆ మాటలు వినలేనుగనుకా ఆవిడ వైభవాన్ని ప్రకటించడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించాను తప్పా... సీతమ్మ తల్లిపట్ల నాకు కించిత్ కూడా అన్యమైనటువంటి అభిప్రాయంలేదు. అనన్య హృదయాం భక్తాం మ చ్చిత్త పరివర్తినీమ్ ! అహ మప్యవగచ్ఛామి మైథిలీం జనకాఽఽత్మజామ్ !! ఈ జనకుని కూతురైనటువంటి మైథిలి యొక్క మనస్సు నిరంతరము నాయందే ఉంటుందనీ నన్ను అనుసరించి ఉంటుందనీ నాకు స్పష్టంగా తెలుసు అనీ... విశుద్దా త్రిషు లోకేషు మైథిలీ జనకాఽఽత్మజా ! న హి హాతుమ్ ఇయం శక్యా కీర్తిః ఆత్మవతా యథా !! మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తికీ కీర్తి నీడలా అనుసరిస్తుంది. ఒక వ్యక్తి తన కీర్తిని విడిచిపెట్టేయ్ అంటే విడిచిపెడతాడా తన కీర్తిని తాను ఎలా విడిచిపెట్టలేడో ఈ సీతమ్మని విడిచిపెట్టడం కూడా అలాగే సంభవంకాదు.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ఈమెను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం బ్రతకలేను నాకు సీతమ్మపట్ల ఉన్న అభిప్రాయం అదీ అనీ ఆమెను స్వీకరించి తన తొడమీద కూర్చోబెట్టుకున్నారు. ఆ తదనంతరము దేవతలందరూ అక్కడికొచ్చిన నిలబడ్డారు నిలబడిన తరువాత పరమేశ్వరుడు గ్రహించాడు, పరమశివుడు ʻమనుష్యునిగా ఇక్కడ పుట్టి పదుకొండవేల సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటారన్నాడుʼ కాబట్టి ఇంకా పదివేల సంవత్సరములు రాజ్యమేలాలి ఏలితే తప్పా శరీరాన్ని విడిచిపెట్టిరాడు కాబట్టి ఈయ్యన తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు, పరమశివుడు అన్నాడు
ఆశ్వాస్య భరతం దీనం కౌసల్యాం చ యశస్వినీమ్ ! కైకేయీం చ సుమిత్రాం చ దృష్ట్వా లక్ష్మణ మాతరమ్ !!
ప్రాప్య రాజ్యమ్ అయోధ్యాయాం నన్దయిత్వా సుహృజ్జనమ్ ! ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహా బల !!
ఇష్ట్వా తురగ మేధేన ప్రాప్య చానుత్తమం యశః ! బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా త్రిదివం గన్తుమ్ అర్హసి !!
నాయనా రామా! నీవు ఇంత కష్టపడి రావణ సంహారం చేశావు అక్కడా కౌసల్యా సుమిత్రా కైకేయీ పరితపిస్తూంటారు, భరతుడు నీగురించి పరితపిస్తుంటాడు, పద్నాలుగు సంవత్సరాలైన తరువాత రాకపోతే ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞచేసి ఉన్నాడు కాబట్టి నీవు అయోధ్యకు వెళ్ళు నీ తల్లుల్నీ సేదదీర్చు భరతున్ని సేదదీర్చు పట్టంకట్టుకో పదివేల సంవత్సరములు రాజ్య పాలనచెయి అశ్వమేదాది ఎన్నో యాగములు చేయి, ధర్మం అన్న మాటకి పర్యాయ పదంగా నీయొక్క నడవిడి ఉంటుంది, అటువంటివాడివి బ్రాహ్మణులకు కావలసినంత ధనాన్ని దానం చేస్తావు, చిట్ట చివర పదకొండు వేల సంవత్సరములు పూర్తైన తరువాత నీవు మళ్ళీ నీ యధాలోకాన్ని చేరుకుంటావు. ఒక మనుష్యుడు తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తాడో తన పితృ ఋణాన్ని ఎలా తీర్చుకుంటాడో అలా ఇక్ష్వాకు వంశాభి వృద్ధికి నీవు కొడుకుల్ని కూడా కను. కన్న తరువాత 11వేల సంతవత్సరములు పూర్తైన తరువాత తిరిగి నీ యొక్క లోకానికి నీవు వద్దువుకానీ... అదిగో నీ చారిత్రమునకు మురిసిపోయినటువంటి నీ తండ్రి స్వర్గలోకంలోంచి ఇంద్రుడి యొక్క విమానంలో వచ్చి యున్నాడు వెళ్ళి చూడవలసిందీ అన్నారు
ఏష రాజా విమాన స్థః పితా దశరథ స్తవ ! కాకుత్స్న మానుషే లోకే గురు స్తవ మహా యశాః !!
ఇన్ద్ర లోకం గతః శ్రీమాం స్త్వయా పుత్రేణ తారితః ! లక్ష్మణేన సహ భ్రాత్రా త్వమ్ ఏనమ్ అభివాదయ !!
మహాదేవ వచః శ్రుత్వా కాకుత్స్నః సహ లక్ష్మణః ! విమాన శిఖర స్థస్య ప్రణామమ్ అకరో త్ పితుః !!
ఆయన వెంటనే ఆ విమానంలో కూర్చున్నటువంటి దశరథ మహారాజుగారికి లక్ష్మణ సహితుడై సీతమ్మతో కలిసి నమస్కరించాడు. వెంటనే దశరథ మహారాజుగారు రామ చంద్ర మూర్తిని తన తొడమీద కూర్చోబెట్టుకుని సంతోషంతో చెయ్యివేసి దగ్గరకు తీసుకుని నాయనా! నీలాంటి కొడుకు పుట్టినందుకు నేను ఇవ్వాళ ఊర్ధ్వలోకాలు పొందాను సత్యంలో నిలబడ్డాను అన్న  ప్రతిష్టపొందాను, స్వర్గలోకంలో ఉన్నాను ఇంద్రుని యొక్క విమానంలో నిన్ను చూడ్డానికి వచ్చాను, నేను నీకు పట్టాభిషేకం చేసి రాజ్యమివ్వాలనుకున్నాను కానీ పట్టాభిషేకం భగ్నమైపోయిందని బెంగపెట్టుకుని 14 యేళ్ళు నిన్ను చూడకుండా ఉండలేనని ప్రాణం వదిలిపెట్టాను, ఊర్ధ్వలోకాలకి వెళ్ళిన తరువాత నాతో దేవతలు చెప్పారు ఇదానీం చ విజానామి యథా సౌమ్య సురేశ్వరైః ! వధార్థం రావణస్యేహ విహితం పురుషోత్తమ !! రావణ వధ కొరకే పట్టాభిషేకాన్ని భగ్నం చేయడానికి దేవతలు ఆ మందరని ప్రయోగించారు కాబట్టి నాయనా రామా..! నీవు వెళ్ళి చక్కగా పట్టాభిషేకం చేసుకుని రాజ్యపరిపాలన చెయ్యి నీ తల్లులు ఊరడిల్లుతారు.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
అన్న తరువాత రామ చంద్ర మూర్తి దశరథ మహారాజుగారిని ఒక వరమడిగారు కురు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ ! స పుత్రాం త్వాం త్యజా మీతి య దుక్తా కైకయీ త్వయా !! స శాపః కైకయీం ఘోరః స పుత్రాం న స్పృశేత్ ప్రభో !!! నీవు ఒకానొకప్పుడు నాకు రాజ్యం ఇవ్వకుండా కైకేయీ అడ్డుపడిందన్న ఆగ్రహావేశంలో ఒకమాటన్నావు శాపవాక్కును విడిచిపెట్టావు, ఈ నాటి నుంచి కైకమ్మగాని భరతుడుకానీ నా భార్యా కుమారులు కాకండాపోతారన్నావు చూడూ... ఆ శాపవాక్కుని ఉపసంహారం చెయ్యీ... కైకమ్మ నీకు భార్యయే మాకు తల్లియే భరతుడు నీకు కుమారుడే నాకు తమ్ముడే తండ్రీ అది అనుగ్రహించమన్నాడు అది రాముడి ధర్మమంటే, దశరథ మహారాజుగారు సంతోషించి ఎంతో ఆనందించి తప్పకుండా అలాగే అన్నారు. సీతమ్మవంక తిరిగి అమ్మా నీవంటి కోడలు పెద్ద కోడలుగా లభించినందుకు పొంగిపోతున్నాను తల్లీ అని కర్తవ్యో న తు వైదేహి మన్యు స్త్యాగమ్ ఇమం ప్రతి ! రామేణ త్వ ద్విశుద్ధ్యర్థం కృత మేత ద్ధితైషిణా !! అమ్మా రాముడు నీవు కనపడగానే స్వీకరించలేదూ అని నీవేమీ మనసులో కోపం పెట్టుకోకు రాముని యొక్క అంతరంగము మేమిటో ఇవ్వాళ నేను పితృదేవతల అనుష్టానంలో ఉన్నాను కాబట్టి తెలుసు, నీ శీల వైభవము అందరూ తెలుసుకోవాలన్నది ఆయన కోరిక తప్పా ఈషన్మాత్రముకూడా రామునికి నీమీద అనుమానంలేదమ్మాని.
కాబట్టి మీరు బయలుదేరి సంతోషంగా హాయిగా ఆనందంగా జీవితాన్నిగడపండీని దశరథ మహారాజుగారు ఆశ్వీరదించి దేవతలందరూ తిరిగి వెళ్ళిపోతూంటే ఇంద్రుడన్నాడు మేము కనపడిన తరువాత ఉత్తిగనే వెళ్ళిపోకూడదు దేవతలకు అదో లక్షణం ఏదో ఒక వరమివ్వాలి కాబట్టి రామా నీకు మేము ఏమి ఉపకారం చెయ్యగలమూ అని చెప్పండి అన్నాడు అంటే రామ చంద్ర మూర్తి అన్నాడు మమ హేతోః పరాక్రాన్తా యే గతా యమ సాదనమ్ ! తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠన్తు వానరాః !! నీరుజో నిర్వ్రణాం శ్చైవ సంపన్న బల పౌరుషాన్ ! గోలాంగూలాం స్తథైవ ర్థాన్ ద్రష్టుమ్ ఇచ్చామి మానద !! ఇతఃపూర్వం నాతో యుద్ధం చెయ్యడం కోసం సీతమ్మతల్లిని రక్షించడం కోసమనీ కొన్ని కోట్ల వానరములు భల్లూకములు కొండముచ్చులూ అన్నీ కూడా నాతో బయలుదేరివచ్చాయి, రామ రావణ యుద్ధంలో కొన్ని కోట్ల వానరములు మరణించాయి మరణించినటువంటి వానరములు ఏవున్నాయో అవన్నీ తిరిగి బ్రతకాలి దెబ్బలు తగిలి పుళ్ళుపడి శరీరంతో బాధపడేవాళ్ళెవరున్నారో వాళ్లందరిగాయాలు పూర్తిగా మానిపోవాలి, అకాలమైనా సరే ఈ వానరములందరికీ కూడా ఫలాలు తేనే కందమూలములు సంవృద్దిగా దొరకాలి ఈ వరాన్ని నాకిమ్మన్నారు.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ఇంద్రుడు సంతోషించి మరణించినటువంటి వానరములన్నింటినీ తిరిగి బ్రతికేటట్టుగా అనుగ్రహించాడు దాంతో మొత్తం వానరాలన్నీ బ్రతికేశాయి, “ʻఒక్క వానరం రామునివెంట వెళ్ళింది చనిపోయింది లేదుʼ రామున్ని నమ్ముకున్నందుకు అలా ఉంటారు”, అలాగే వేటివేటికి దెబ్బలు తగిలాయో వ్రణాలు కలిగాయో వాళ్ళ వాళ్ళ వ్రణాలన్ని పోయి చక్కగా ఇప్పుడు అందరూ సంతోషించారు రాత్రి రామ చంద్ర మూర్తి పడుకున్నారు మరునాడు ఉదయం నిద్రలేచారు విభీషణుడు వెళ్ళాడు ఆయన నిద్రలేచిన తరువాత ఆయన కలుసుకున్నాడు మహానుభావా మా భాగ్యవిశేషం సీతమ్మతల్లి పుణ్యమాంటు మా లంకాపట్టణానికి వచ్చావు కాబట్టి నీవు వెళ్ళిపోకుండా ఇక్కడ కొద్దిరోజులు ఉండవలసిందీ అన్నాడు. నాయనా కుదరదు 14 సంవత్సరములు పూర్తైయ్యేసరికి అక్కడ భరతుడు ఎదురు చూస్తుంటాడు కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంత దూరం కాలినడకనా ఎంతతొందరగా చేరగలనా అన్నదే నేను బెంగపెట్టుకున్నాను అన్నాడు. విభీషణుడన్నాడు ఆ బెంగ అవసరంలేదు నా దగ్గర పుష్పక విమానం ఉంది పుష్పక విమానంలో బయలుదేరుదురుగానీ అన్నాడు సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని రామ చంద్ర మూర్తి లక్ష్మణ సహితుడై పుష్పక విమానమెక్కి అక్కడ ఉన్నటువంటి విభీషణున్ని సుగ్రీవున్నీ వానర నాయకుల్నీ పిలిచి మీ మీ సామ్రాజ్యములకు మీరు చేరి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని రాజ్యపాలన చెయ్యండీని అన్నారు.
అంటే విభీషణాదులు అన్నారు రామా! మాకు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చూడాలని కోరికగా ఉందీ అన్నారు అయ్యో..! దానికేంపోయింది రండి ఎక్కడన్నాడు వానరులు రాక్షసులు అందరూ విమానమెక్కారు ఎంత మంది ఎక్కినా ఒకళ్ళకు చోటు ఉంటుంది విమానం పైకి లేచింది లంకా పట్టణం నుంచి విమానం వెళ్ళిపోతూంది సీతమ్మతల్లిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిటికీలోంచి చూపిస్తున్నారు రామ చంద్ర మూర్తి, సీతా చూశావా... అదిగో లంకా పట్టణం యొక్క యుద్ధ భూమి ఆ యుద్ధ భూమిలోనే నేను రావణాసురున్ని పడగొట్టాను అదిగో రావణుడు కాలిపోయి బూది అయిపోయిన ఆయన అంతేష్ఠి సంస్కారం జరిగిన భూమి, ఇది కుంభకర్ణున్నిచంపిన భూమి ఇది ఇంద్రజిత్తుని సంహరించి భూమి ఇది ఆయన హోమం చేసినటువంటి యగ్రోధం, ఇదిగో ఈ సముద్రపు ఒడ్డునే కుంభకర్ణుని శరీరం పడిపోయింది, ఇదిగో సముద్రం మీద కనపడుతున్న సేతువు ఈ సేతువుని నిర్మాణం చేసే మేమందరము నూరు యోజనముల సముద్రాన్ని దాటాము ఇదిగో ఉత్తర తీరము సీతా నేను ఇక్కడే మూడు రాత్రులు భూ శయనం చేసి సముద్రున్ని వేడుకున్నాను సముద్రుడు అనుగ్రహించకపోతే అప్పుడు బాణాన్ని సంధించాను, ఇదిగో సీతా చూశావా ఇదే కిష్కింధ, కిష్కింధా పట్టణంలోనే నేను సుగ్రీవుడితో సంధిచేసుకుని వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసేటప్పటి... సీతమ్మందటా ఆగండి ఆగండి విమానం వెళ్ళిపోతుంది ఈ కిష్కింధలో సుగ్రీవుడి భార్య తారా రుమా ఉంటారుకదా ఆ వానర కాంతలందరినీ కూడా ఎక్కించుకుందామంది అయ్యో అదెంతపని మళ్ళీ విమానం కిష్కింధలో దింపారు.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
సుగ్రీవుడు పరుగు పరుగున అంతః పురానికివెళ్ళాడు మనందరం పట్టాభిషేకాని వెళ్ళాలి రండి రండి అన్నాడు వెంటనే వాళ్ళందరు సీతమ్మని చూడాలన్న ఉత్సాహంతో వాళ్ళంతా కామరూపిణిలు కాబట్టి నరకాంతలుగా మారిపోయి చీరలు కట్టుకుని మంచి ఆభరణాలు పెట్టుకుని గబగబా పరుగెత్తుకొచ్చి సీతమ్మ పక్కన కూర్చున్నారు మళ్ళీ విమానం ఎగిరింది కిష్కింధనుంచి వెళ్ళిపోతూంది ఇదిగో సీతా చూశావా ఇదే నేను విరాధున్ని సంహరించిన భూమి ఇదే సీతా చూశావా నీ నుంచి విడిపోయిన తరువాత నేను కబంధున్ని సంహరించిన భూమి, ఇక్కడే నేను శబరిని కలుసుకున్నాను ఈ పంపా తీరంలోనే నేను శోకాన్ని పొందాను. ఇదిగో చూశావా ఇక్కడే మనందరం కలిసి లక్ష్మణ సహితంగా ఉండేవాళ్ళం ఇదే జటాయువు సంహరింపబడిన భూమి ఇక్కడే నిన్ను రావణాసురుడు అపహరించినటువంటి పంచవటి. ఇదిగో అగస్త్యుడు మనకు దర్శనమిచ్చినటువంటి ఆగస్త్యుడు నివశించినటువంటి గొప్ప ఆశ్రమము, ఇదిగో గోదావరి ఇదిగో పంచవటి ఇక్కడే మనం మొట్టమొదట వచ్చి ఉన్నాము ఇక్కడికే భరతుడు తల్లులతోటీ మిగిలినటువంటి సైన్యంతోటీ వస్తే బెంగపెట్టుకుని ఇక్కడ్నుంచి పంచవటికి వెళ్ళిపోయాము. ఇదిగో సూదీష్ణుని యొక్క ఆశ్రమము సీతా ఇదిగో ఇది దాటిన తరువాత భారద్వాజ ఆశ్రమం మొట్ట మొదట మనం ఈ భారద్వాజ ఆశ్రమానికే వెళ్ళాము అనేసరికి ఒక్కసారి భరధ్వాజ అశ్రమంలో విమానాన్ని దింపారు. దింపి లోపలికి వెళ్ళారు ఆయన దర్శనం చేసుకున్నారు వెంటనే ఆయన చూడకుండానే చెప్పేశాడు రామా! నాకు అన్నీ తెలుసు పంచవటి చేరావు సీతాపహరణం జరిగింది బెంగపెట్టుకున్నావు చాలా కష్టపడ్డావు సుగ్రీవుడితో స్నేహం చేశావు వాలిని చంపావు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశావు హనుమ సీతమ్మ జాడ కనిపెట్టారు వానర సైన్యంతో బయలుదేరావు సముద్రానికి సేతువు కట్టావు కాంచన లంక దగ్గరకు చేరావు రాక్షస సంహారం చేశావు విభీషణున్ని రాజ్యమునందు ప్రతిష్టించావు సీతమ్మ కోరిక మేరకు వానర స్త్రీలను కూడా ఎక్కించుకున్నావు ఇంతమందీ కలిసి పట్టాభిషేకానికి వెళ్తున్నారు నన్ను చూసి వెడుదామని ఇక్కడ దిగావు అవునా... అన్నారు, చాలా సంతోషం త్రికాలజ్ఞానులు మహానుభావా! మీకు తెలియందేముంది.
దానితోపాటు నాకు ఒక్కమాటు చెప్పండి మా భరతుడు కుశలమా మా తల్లులు కుశలమా అక్కడ ఉన్నవారందరూ కుశలమా అన్నాడు, అందరూ కుశలమే నీ గురించే ఎదురు చూస్తున్నారు అన్నారు. హనుమని పిలిచారు నాయనా నీవు ఇక్కడ్నుంచి ఉత్తర క్షణం బయలుదేరి గంగాతీరంలో నా ప్రాణ సమానమైన సన్నిహితుడు గుహుడున్నాడు, ఆ గుహుడు దగ్గరికి వెళ్ళి నా క్షేమ సమాచారం చెప్పి గుహుడు కుశలంగా ఉన్నాడా కనుక్కో కనుక్కొని అక్కడ్నుంచి నీకు నంది గ్రామానికి దారి గుహుడు చూపిస్తాడు అక్కడ్నుంచి నీవు నంది గ్రామానికి వెళ్ళు భరతుడుంటాడు, భరతునికి నా విజయవార్తలన్నీ చెప్పు నేను తిరిగి వస్తున్నాను చెప్పు చెప్పినప్పుడు భరతుని ముఖ కవలికలను బాగా పరిశీలించు ʻఇన్జార్జి పోస్టైనా ప్రమాదకరం కదాʼ అది అధికారమునందు వ్యామోహం కలుగుతుంది కాబట్టి ఇన్నాళ్ళు నా తరుపున పరిపాలించాడు కాబట్టి  అధికారమునందు ఒకవేళ వ్యామోహం పొంది ఉంటే వెంటనే వచ్చి నాకు చెప్పు నేను రాజ్యం భరతునికి వదిలిపెట్టి తాపసిగా జీవిస్తాను అన్నాడు. వెంటనే హనుమా ఆ గంగానది తీరంలో ఉన్న గుహుడు దగ్గరికెళ్ళి క్షేమసమాచారమడిగి నంది గ్రామానికెళ్ళాడు. భరతుడు సంతోషంగా రామ పాదుకులను అర్చించి రాజ్యాన్ని చక్కగా సుసంపన్నాంగా పెంచి

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
పోషిస్తున్నారు రేపటి రోజున పుష్యమీ నక్షత్రంరోజున రామ చంద్ర మూర్తి దర్శనం ఇస్తున్నారు వచ్చేస్తున్నారు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు అన్నారు.
పరమ సంతోషపడిపోయాడు భరతుడు మరునాడు ఉదయము ఎప్పుడౌతుందాని ఎదురు చూశాడు కాబట్టి వాళ్ళందరికీ కాలసిన ఆహారము సమకూర్చబడింది వచ్చేస్తున్నారు రామ చంద్ర మూర్తి అన్నారు ఇంతలో పుష్పక విమానం కనపడింది, పరుగు పరుగున భరతుడు పాదుకలు పట్టుకుని ఎదురెళ్ళాడు ఆ విమానం లోపలికి ప్రవేశించి అన్నగారి పాదాల మీదపడ్డాడు అన్నగారి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుని ఆ పాదుకలు తొడిగాడు, తొడిగి అన్నా..! ఎంత కాలానికి దర్శనమిచ్చావన్నా ఇంతకాలం ఏ రాజ్యాన్ని నీవు నాకు అప్పజెప్పావో దాన్ని పదింతలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా జాగ్రత్తగా చేశాను నీదైన రాజ్యాన్ని నీవు స్వీకరించూ అన్నాడు. రామ చంద్ర మూర్తి అంగీకరించి విమానంలోంచి కిందకి దిగాడు వెంటనే లక్ష్మణ భరత శత్రుఘ్నులు పట్టాభిషేకానికి ఏర్పాటు చేశారు. మంత్రులకు పురమాయించారు ఓఁ... ఎక్కడ చూసినా కోలాహలం సీతమ్మ వచ్చేసింది రామ చంద్ర మూర్తి వచ్చేశాడు రేపే పట్టాభిషేకం అని గబగబా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా రామో రామో రామః ఎవరి ముఖములో చూసినా సంతోషమే ఎవరి కళ్ళల్లో చూసినా సంతోషము ఎవరి నోటవిన్నా అదే మాట ఎక్కడ విన్నా రేపే రామ పట్టాభిషేకం రేపే రామ పట్టాభిషేకం ఆరోజు ఆ అయోధ్యలో ఏలాగు జరిగిందో ఇవ్వాళ ఇక్కడ ఈ రోజు అదే వాతావరణం కాబట్టి తెల్లవారితే మనం రామ చంద్ర మూర్తికి పట్టాభిషేకం. మళ్ళీ చెప్తున్నారనుకోకుంటే ఏమిటీ మళ్ళీ మాకు జ్ఞాపకం ఉండదనుకుంటున్నారా... అనుకోవద్దు.
 రేపు తెల్లవారుఝామున ఐదు అయ్యేటప్పటికి రామ నా క్షేత్రానికి మనందరం చేరుకోవాలి అక్కడ్నుంచి మొట్ట మొదట రహదార్లు తుడిచేవాళ్ళు ఆ సేవ చేసుకునేటటువంటివాళ్ళు ఆసేవ హరిప్రసాదుగారు ఎవరికిచ్చారో వాళ్ళు బయలుదేరుతారు వాళ్ళ వెనకాతలా మంగళ వాయిద్యాలు వీళ్ళకన్నా ముందు గోవు నడుస్తుంది. ఆ వెనక మంగళవాయిద్యాలు నడుస్తాయి మంగళ వాయిద్యాల వెనకాతల వేద పండితులు నడుస్తారు మంగళ వాయిద్యాలకు ముందు ఊరి పెద్దలు నడుస్తారు ఆవెనక కన్నెపిల్లలు వాళ్ళ చేతులలో మధుర పదార్థాలు కన్నె పిల్లల వెనక సువాసినీలు సువాసీనుల చేతుల్లో పాత్రలు పాత్రలలో పరిమళ జలాలు ఆ పరిమళ జలాలు రాజా రామునికి పట్టాభిషేకానికి వస్తుంటే చల్లుతుంటారు, చల్లుతుండగా అందరూ “రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము “ అంటూండగా ఆ మధ్యలో రథం రథం మీద పట్టాభిషేకానికి వస్తున్నటువంటి సీతారామ లక్ష్మణ హనుమలు వాళ్ళతో కలిసి ఆ వెనకాతల మళ్ళీ సువాసినీలు సమస్త దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఫేలాలు జల్లుతుంటారు ఆ వెనక పురుషులు పురుషులు కూడా కొంతమంది పిండివంటలు పట్టుకుంటారు పట్టుకుని ఇంతమంది బయలుదేరి మళ్ళీ చిట్ట చివర ఊరి పెద్దలు ఉంటారు. ఊరెరిగింపు అంతా తిరిగి చక్కగా ఒక గంట తరువాత ఆలయ ప్రాంగణంలోకి ఈశాన్య ద్వారంగుండా లోపలికి ప్రవేశిస్తుంది.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ప్రవేశించిన తరువాత అదిగో అక్కడ మండపంవేసి ఋత్విక్కులు సిద్ధంచేశారు ఐదు వందల నదుల జలాలు నాలుగు సముద్ర జలాలు ఇన్ని నదీ జలాలను ఆవాహన చేస్తారు మండపంలోకి కొన్ని నదీ జలాలు యదార్థంగా తెప్పించారు, ఈ నదీ జలాలు సముద్ర జలాలు అన్నిటినీ కూడా ఓషధులని కలిపి ఉంచుతారు, కలిపినటువంటివాటిని రేపు సీతా రాములకి లక్ష్మణ స్వామికి అభిషేకం ఉంటుంది నిజ మూర్తికి యదార్థంగా పట్టాభిషేకంలో చేసినట్లే అభిషేకం చేస్తారు, ఈ అభిషేకం చేసేటప్పుడు ఒక కన్యా చిన్న పిల్లా చక్కగా పట్టుబట్టులు కట్టుకుని ఒక కళశ పట్టుకుని కన్నెపిల్ల వెళ్తుంది. వెళ్ళితే అ కళశ పట్టుకుని అభిషేకం చేస్తారు మామూలు అభిషేకంలో చెయ్యనిదీ పట్టాభిషేకంలో చేసేటప్పుడు కన్నె పిల్ల తెచ్చినటువంటి ఒక కళశతో కూడా చేస్తారు. కాబట్టి ఆ అభిషేకం కూడా జరుగుతుంది దాన్ని రేపు ఇదంతా కూడా లైవ్ టెలిక్యాష్టుచేస్తారు, కాబట్టి మీ అందరు చక్కగా ఆ ఏసి ఆడిటోరియంలో అక్కడా పట్టాభిషేకానికి వచ్చినవాళ్ళు ఎక్కడపడితే అక్కడ కూర్చుని చూసినట్లు మనందరం చక్కగా పట్టాభిషేకాన్ని అక్కడ జరిగిన అభిషేకాన్ని చూస్తాము.
రామ చంద్ర మూర్తి గొప్ప గోదానం చేశారు ఆ గోదానంతో తుల్యమైనటువంటి రీతిలో ఇది ఆవా? మేరు పర్వతమా అనబడేటటువంటి ఒక సాధు గోమాతని ఒక దూడతో ఉన్న వత్సంతో ఉన్నటువంటి ఆవుని తెప్పించారు దానికీ బంగారు కొమ్ములు బంగాలు గిట్టలు దానికి పట్టబట్టలతో అచ్చాదన ఇన్నిటితో ఉన్నటువంటి ఆవుని దూడనీ ఆరోజు రాముడు ఎలా దానం చేశాడో అలా రామ పట్టాభిషేక సమయంలో అటువంటి ఆవునీ దూడనీ గో పూజ చేసి దానం చేస్తారు. ఆ బంగారు గిట్టలతో బంగారు కొమ్ములతో ఉన్న ఆవుని రేపు మీరు చూడచ్చు. ఆ గోదానం జరుగుతుంది తరువాత గంధర్వగానం తల్లి పెద్దావిడ సూర్య కుమారిగారి కచేరి జరుగుతుంది, ఒక గంటసేపు ఆరోజు గంధర్వులు గానం చేశారు రామ చంద్ర మూర్తి పట్టాభిషేకంలో రామ సంబంధమైన కీర్తనలు పాడుతారు. ఇక్కడ హోమం జరుగుతుంది దేవతలందరికి హవిస్సులిస్తారు, ఆ హవిస్సుల్ని దేవతలందరూ పుచ్చుకుంటారు, పుచ్చుకున్న తరువాత మధ్యాహాన్న విరామ సమయంలో మనం ఒక్కసారి ఇంటికివెళ్ళి భోజనం చేసి పడుకుని స్నానం చేసి మళ్ళీ వచ్చేస్తాం.
మళ్ళీ సాయంత్రం ఆరుగంటలకి సభా ప్రారంభమౌతుంది పట్టాభిషేక సర్గ ఫలశృతి వినిపిస్తారు  అది అయిపోయిన తరువాత వేదిక అందుకే ఇంత పెద్ద వేదిక అయిపోయింది. ఋత్విక్కులందరూ వచ్చి కూర్చుంటారు, స్వామివారికి రేపు పట్టాభిషేక సర్గ చెప్పేటప్పుడు నాలుగు బంగారు కిరీటాలు చేయించారు నాలుగు బంగారు కిరీటాల్నీ ఇక్కడ పెడుతారు మకుఠ ధారణ సర్గాని రేపు మీ అందరితోటీ ఆ సర్గని చెప్పినప్పుడు అందులో శ్లోకాలని చెప్పిస్తారు. అది పట్టాభిషేకంలో శ్రీ రామ నవమినాడు కూడా అవి చెప్పాలి ఆ శ్లోకాలని కాబట్టి రేపు ఆ కిరీటాలు అక్కడ పెట్టి అందరూ చూస్తుండగా వాటికి సంప్రోక్షణచేసి ఆ శ్లోకాలు చెప్పిస్తాము. చెప్పించిన తరువాత ఈ ప్రవచనం అయిపోగానే ప్రవచనం రేపు ఎక్కువ సేపు ఉండదు ఒక నలభై నిమిషాలు గంటసేపు, అయిపోగానే రామ చంద్ర మూర్తికి లక్ష్మణస్వామికీ హనుమకీ సీతమ్మకీ అభిషేకంగా జలములు సంప్రోక్షించి అభిషేకం మొదటే అయిపోతుంది కాబట్టి రాత్రి వేళ స్వామికి కిరీఠధారణ చేయిస్తారు. తరువాత ఆయన చేతికి రాజ దండాన్ని ఇస్తారు ఆ తరువాత బంగారు పాదుకలు తీసుకెళ్ళి ఆయన పాదాలకు తొడుగుతారు ఆ తరువాత రామ చంద్ర మూర్తికి వజ్ర వైఢూర్యములతో కూడిన పథకాన్ని బహూకరిస్తున్నారు లక్ష్మణ స్వామికి కెంపులతో కూడినటువంటి పథకము మాయమ్మ సీతమ్మకి పచ్చల పథకము మా స్వామి హనుమకి ముత్యాల హారం, వైఢూర్య పథకము ఇవన్నీ సిద్ధం చేశారు.

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ఇవన్నీ రేపు యదార్థంగా పట్టాభిషేకంలో ఎలా ఇస్తారో అలా ఇవన్నీకూడా మీకు చూపించి లైవ్ స్క్రీన్స్ మీద టెలిక్యాష్ట్ చేశాక ఇవన్నీ స్వామకి బహూకరణ జరుగుతాయి జరిగిన తరువాత పట్టాభిషక్తుడైనటువంటి రామ చంద్ర మూర్తి సమక్షంలో ఆయనకి పూజ జరుగుతుంది. ఆ పూజ అవగానే దర్బారు జరుగుతుంది, ఆరోజున ఆయోధ్యలో కూర్చుని ఎలా చూశారో అలా చిత్రంగా రాజ దండం పట్టుకుని కూర్చున్నటువంటి రామ చంద్ర మూర్తి దగ్గరకు ఆయనకు నిజంగా గీతం శ్రావయామి అంటే గీతం పాడుతారు, నృత్యం దర్శయామి ఇక్కడ నాట్యం చేసి చూపిస్తారు స్వామికి అలాగే వాధ్యం ఘోషయామి వీణ మీద ఆయనకి సంగీతం వినిపిస్తారు అలాగే అశ్వాన్నారోహయామి ఇతఃపూర్వం వాడినది కాదు వెండితో ఇంత పెద్ద గుఱ్ఱం చేయించారు, ఆ గుఱ్ఱం తీసుకొస్తారు, అలాగే గజాన్నారోహయామి ఇంతపెద్ద ఏనుగు చేయించారు ఆ ఏనుగు తీసుకొస్తారు అలాగే రేపు ఆందోళితాం సమర్పయామి అన్నప్పుడు ఒక ఊయల తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి సీతారాముల్ని అందులో కూర్చోబెట్టి ఊపుతూ ఒక కీర్తన చేస్తారు అలాగే స్వామికి అందులో కూర్చోబెట్టి చక్కగా గంధము అదీ అలదుతూ చామరం వేస్తూ ఊపుతున్నప్పుడు ఒక కీర్తన జరుగుతున్నప్పుడు ఊంజల్ సేవ జరుగుతుంది.
ఇవన్నీ అయిన తరువాత రామ చంద్ర మూర్తి యొక్క పట్టాభిషేకం పూర్తౌతుంది, పూర్తైపోయిన తరువాత మనం చక్కగా రాజా రామున్ని దర్శనం చేసుకుని మరునాడు పట్టాభిషేక భోజనాన్ని అందరం కలసి ఎన్నివేలమందైనాసరే షడ్రుషోపేతమైనటువంటి భోజనాన్ని ఏర్పాటుచేస్తున్నారు, ఆ భోజనాన్ని చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం “చెప్పవలసిందొక్కటే ఇంకాతెలవారదేమీ ఈ చీకటి విడిపోతేమీ” అని తొందరగా తెల్లవారితే మనందరం పట్టాభిషేకంలో ఊరెరిగింపుగా వచ్చి ఆ వైభవాన్ని కన్నులతో జుర్రుకునేటటువంటి సమయం చాలా దగ్గరల్లోకి వచ్చేసింది, రేపు ఈ క్రతువులో పాల్గొని మీ అందరూ కూడా ధన్యులు కావలసిందిగా కార్యవర్గం తరఫున పీఠం తరఫున మీమ్మల్లందర్నీ స్వతంత్రించి నేనే ఆహ్వానం పలుకుచున్నాను.
కాబట్టి ఇప్పుడు మనం పెట్టుకున్న సాంప్రదాయాన్ని అనుసరించి చక్కగా ఒక్క పదకొండుమాట్లు రామ నామం చెప్దాం. మీరు వెళ్ళిపోకండీ ఇవ్వాళ మీకు చాలా గొప్ప గొప్ప వానర యోధుల గురించి విన్నారు గయుడు గవాక్షుడు కుముదుడు శరభుడు నీలుడు మైందుడు ద్వివిదుడు హనుమా ఇటువంటి మహావీరులైనటువంటివారిని వేదికమీదికి పిలుస్తారు, మీకు ఆ వానర వీరులని చూడాలని ఉంటే అలాగే ఉండండీ చూద్దురుగానీ రామ కార్యంలో సాయపడి ప్రాణములు ఒడ్డించి అహోరాత్రములు పనిచేసినటువంటి వానరవీరులని వేదికమీదికి పిలుస్తారు మీరు ఆ వీరులందర్నీ దర్శనం చేద్దురుగానీ... పదకొండమాట్లు రామ నామం చెప్పుకుందాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీ రామ నామము !!రా!!
కోరికొలచినవారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రా!!

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము
ఆలుబిడ్డల సౌఖ్యముగన్నను అధికమైనది రామ నామము !!రా!!
నీవు నేనను బేధమేమియు లేకయున్నది రామ నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
బ్రహ్మసత్యము జగన్మిథ్యా భావమే శ్రీ రామ నామము !!రా!!
సాత్వమెరిగెడి తత్వవిధులకు సాధనము శ్రీ రామ నామము !!రా!!
రాకడయు పోకడయులేనిది రమ్యమైనది రామ నామము !!రా!!
కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామ నామము !!రా!!
జానకీ హృత్ కమలమందున అలరుచున్నది రామ నామము !!రా!!
బ్రహ్మపుత్ర కరాబ్జవీణా పక్షమైనది రామ నామము !!రా!!
రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామ నామము !!రా!!
రామ నామ స్మరణ చేసిన క్షేమమొసగును రామ నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామ నామము !!రా!!
రేపు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండమ్మా మీరు రామ నామ క్షేత్రానికి వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ నిలబడాలనేది మిమ్మల్నీ కార్యకర్తలే పదిలంగా నిలబెట్టీ సువాసినీలకు పరిమళద్రవ్యం మీరు పాత్ర తెచ్చుకోవాలీ... మంగళ ద్రవ్యాన్ని పోస్తారు, కొంతమందికి ఫేలాలిస్తారు కన్యెపిల్లలందర్నీ నిల్చోబెట్టి వాళ్ళందరికీ మధుర పదార్థాల పళ్ళాలు ఇస్తారు. చక్కగా మీరు ఆ వైభవాన్ని పురుషులకి కొంతమందికి మధుర పదార్థాలిస్తారు. మనందరం చక్కగా బయలుదేరి సంతోషంగా రావచ్చు. కార్యకర్తలతో సహకరించండి ఒక్కటి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ఇది మనందరం చేసేటటువంటి కార్యక్రమం తప్పా ఒకరు చేస్తున్నది ఒకిరి చేత చేయింపబడుతున్నది అన్నభావన పెట్టుకోకండి రామ కార్యంలో మనందరం భాగస్వాములమే ఆ సంతోషంతో ఆ ప్రీతితో పాల్గొనేటటువంటి స్పృహతో మీ అందరూ కూడా వస్తే మనం చక్కగా సంతోషంగా రేపటి ఊరెరిగింపు కార్యక్రమాన్ని అత్యంత శోభాయమానంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం వానరయోధులకు జరిగేటటువంటి సత్కారము తరువాత నేను శంకర భగవత్పాదులమీద జరిగేటటువంటి ఆ అష్టకంతోటి నమస్కారాన్ని మనం చేద్దాం. చిట్ట చివర జగత్ గురువులకి నమస్కారం చేసి వెళ్తున్నాము కాబట్టి జగత్ గురువుల నమస్కారంతో కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అప్పటివరకు మీరు అలాగే కూర్చోండి నేను ఉపన్యాసానికి మాత్రమే మంగళం చెప్తున్నాను కానీ... నేను శంకర భగవత్పాదుల నమస్కారం చేయించలేదు కాబట్టి వేదిక దిగను వేదిక దిగకుండా నేను ఇలాగే కూర్చున్నాను కాబట్టి మీరు కూడా అలాగే కూర్చోవచ్చు ఏం ఫర్వాలేదు.
ఎందుకంటే నాకన్నా మీరు సౌకర్యంగానే కూర్చున్నారన్నది గుర్తుపెట్టుకోవాలి ఎందుకో తెలుసా..? మీరు కనీసం కాళ్ళు కావాలంటే కదపగలరు, కదపడం నేను కూర్చున్న తరువాత కాళ్ళు కదపడమంటే లేచిన తరువాతే ఎందుకంటే నేను కదపాలంటే ఇదీ ఏదో పెద్ద పెద్ద బంధనాలు లాంటివి చేతులు కదుపుదామంటే ఇదీ...
మంగళా శాసన....

  యుద్ధ కాండ నలభై ఒకటవ రోజు ప్రవచనము

No comments: