Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - సుందర కాండ 33వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Sundara Kanda 33rd Day



సుందర కాండ


ముప్పై మూడవ రోజు ప్రవచనము





సీతమ్మతల్లిని అన్వేషిస్తూ అశోక వనంలో శింశుపా వృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి సీతమ్మతల్లి యొక్క దర్శనాన్ని పొందినటువంటివారై స్వామి హనుమా ఆమె వైభవాన్ని ఆమె పాతివ్రత్యాన్ని ఆమెను అక్కడ నిర్భందించాను అనుకుని ఆమెను బాధపెడుతున్నాననుకున్నటువంటి రావణుడు తన మృత్యువుని తాను ఎలా కొనితెచ్చుకుంటున్నాడన్న విషయాన్ని సుందర కాండ మనముందు ఒక అద్దంలా నిలబడి మన దోషాన్ని మనం గుర్తించి మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలో తెలియజెప్పేటటువంటి ఒక అపురూపమైన ప్రక్రియతో కూడిన రచనా విధానమనీ, నిన్ననూ ఆ సీతమ్మతల్లి అక్కడ కూర్చుని ఉన్న విశేషాల్ని మహర్షి వర్ణించిన తీరుగురుంచి నిన్నటిరోజున రామ చంద్ర మూర్తి పలికించినమేర నేను మీతో వివరించి ఉన్నాను. ఆ సీతమ్మతల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి రాక్షస స్త్రీల గురించి మాట్లాడుతారు మహర్షి, వీళ్ళూ వీళ్ళ పేర్లూ చాలా విచిత్రంగా ఉంటాయి
ఏకాఽక్షీమ్ ఏక కర్ణాం చ కర్ణ ప్రావరణాం తథా ! అకర్ణాం శంకు కర్ణాం చ మస్తకో చ్ఛ్వాస నాసికామ్ !!
అతి కాయో త్తమాంఽగీం చ తను దీర్ఘ శిరో ధరామా ! ధ్వస్త కేశీం తథాకేశీం కేశ కమ్బళ ధారిణీమ్ !!
లమ్బ కర్ణ లలాటాం చ లమ్బోదర పయోధరామ్ ! లమ్బౌష్ఠీం చిబుకౌష్ఠీం చ లమ్బాఽఽస్యాం లమ్బ జానుకామ్ !!
వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహ ప్రియాః ! కాలాఽఽయస మహా శూల కూట ముద్గర ధారిణీః !!
హస్తి పాదా మహా పాదా గో పాధాః పాద చూళికాః ! అతిమాత్ర శిరో గ్రీవా అతిమాత్ర కుచోదరీః !!
వాళ్ళ పేర్లూ అలా ఉంటాయి ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ చదివితే లక్ష్మీ అష్టోత్తరంగాదు లలితా సహస్త్రంగాదు వచ్చేప్రయోజనం లేదు, కానీ అందులో ఉండేతత్వాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటివాళ్ళు ఒక్క కన్ను మాత్రమే కలిగినటువంటిది, ఒక చెవి కలిగినటువంటిది, తల చుట్టూ చెవులు పెరిగినటువంటిది అంటే ఇక్కడ ఉండవలసిన చెవి ఈ చెవికి ఇక్కడ ఉండవలసిన ఈ చెవికి ఇక్కడ వరకూ పెరిగితే అది చాలా విక్రుతంగా ఉంటుంది అలా విక్రుతంగా పెరిగినటువంటి చెవులు కలిగినటువంటిది. విశేషంగా జుట్టు పెరిగిపోయింది, ఆ పెరిగిపోయినటువంటి జుట్టు జల్లుకుపోయినటువంటిది పొడవైన నాల్క కల్గినది గోళ్ళు కలిగినది పెద్ద ముక్కున్నది చిన్న ముక్కున్నది పెద్ద పెద్ద పాదములున్నది ఏనుగు మొఖమున్నదీ గుఱ్ఱాలూ ఒంటెలు ఏనుగులూ గాడిదలు వీటి నోళ్ళు ఎలా ఉంటాయో అటువంటి నోళ్ళు కలిగినటువంటివాళ్ళు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
Image result for sitaఇలాంటి వాళ్ళందరూ సీతమ్మతల్లి చుట్టూ పర్యవేక్షించి ఉన్నారు, ఎందుకు వీళ్ళని పెట్టడం రావణాసురుడు అంటే ఇందులో రెండు కారణములు శ్రీరామాయణంలో మీకు ప్రస్పటంగా కనపడుతాయి రావణుడు ఎంత వ్యగ్రతతో కూడిన బుద్ధితో అక్కడ ఉంచాడో అంత ప్రసన్నమైనటువంటి మనసు కలిగినతల్లి సీతమ్మ దీన్ని మహర్షి నిరూపిస్తారు సుందర కాండలో, అన్నిటికన్నా శక్తివంతమైన ఇంద్రియము నాయకత్వము వహించగలిగినటువంటి ఇంద్రియము నయనము అందుకే అది మళ్ళీ జ్ఞానేంద్రియాల్లో నాయకత్వస్థాయిలో ఉంటుంది అసలు మనసుని ముందు బహిర్ముఖం చేసి ఇంకొక విషయం మీదకి ప్రసరింపజేయగలిగిన శక్తి కలిగిన ఇంద్రియం నయనమే. కన్నూ... అదే ముందు తీసుకెళ్తూంది అటువంటి కంటికి మిగిలిన ఇంద్రియాల్తో ఒక సంబంధముంటుంది ఏమా సంబంధమంటే అసలు నవరసములు ఆవిష్కరించాలంటే శరీరంలో ఏ ఇంద్రియమూ ఆవిష్కరించలేదు మీకు ఒక్క కన్ను ద్వారానే ఆవిష్కరించాలి, అందుకే శంకర భగవత్పాదులు శివే శృంగారార్ద్రా – తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం అంటూ నవరసాలు అమ్మవారివీ అమ్మవారి నేత్రముల ద్వారా ఆవిష్కరింపజేస్తారు. లేదా ఆవిష్కరింపబడిన నవరసములను శంకరులు దర్శనం చేస్తారు. ఇక్కడా మీరు ఒక విషయాన్ని వింటున్నారనుకోండి మీరు చూస్తూ వినడంవేరు చూడకుండా వినడంవేరు.
సభలో ముందుకు కూర్చోవాలని ప్రయత్నం చేస్తూంటారు, ఏమిటీ అలా కూర్చుంటే వచ్చే ప్రయోజనం అంటే ఎవరు చెప్తున్నారో ఉపన్యాసాన్ని ఆయన ముఖాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ముఖాన్ని చూడ్డానికి ధార్మికోపాన్యాం చేసేటటువంటి వ్యక్తి యొక్క ముఖం అదేం సినీకళాకారుడి ముఖం కాదు ఆయనేం మేకప్పు వేసుకురాడు మరెందుకు చూడ్డం అంటే మీరు చూస్తూ ఉన్నటువంటి దాని శక్తివేరు  చూడకుండా విన్నదాని శక్తివేరు మీరు ఎప్పుడైనా సరే ధార్మికోపన్యాసమే అక్కర్లేదు ఒక ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠమైనా సరే ఎదురుగుండా మీరు చూస్తూ వింటే తొందరగా దాన్ని మీ మనసు పుచ్చుకుంటుంది. మీరు చూడకుండా కేవలం శబ్ధాన్ని మాత్రమే గ్రహించాలంటే మీకు దానియందు నిష్ట ఎక్కువుండాలి అలా మీ దృష్టిని కేంద్రీకరించగలిగిన శక్తి కూడా మీకు పటుతరంగా ఉండాలి. చూస్తూ విన్నదానికన్నా చూడకుండా వినడంలో చాలా జారిపోతాయి ఎందుకనీ అంటే మనసు తొందరగా అటూ ఇటూ వెళ్ళిపోతూంది. మనసుని కట్టగలిగన కట్టగలిగిన లక్షణం దేనికుంటుందంటే ఆ కన్నుకుంటుంది. ఆ కన్ను మిగిలిన ఇంద్రియాల్నీ తీసుకెళ్ళి కూర్చోబెట్టగలదు, నడిచేటప్పుడు చేతులెందుకు ఊపడం చేతులు ఊపడం ప్రధానం కాదు చేతులు ఊపడంవల్ల గమనవేగం పెరుగుతుంది, ఊగుతున్న చేతులు నడకని సులభతరం చేసినట్లే చూస్తూ వినవడం వినే శక్తిని పెంచుతుంది.
అలాగే మీకు ప్రతీకూలమైనటువంటి విషయాన్ని స్థాపించేటప్పుడు మొట్ట మొదట మీ కంటికి జుగుప్త్స కలిగించేది మీ మనసుకి అప్రీతిని కలిగించేది అస్తమానం మీ కన్ను చూడవలసి వచ్చిందనుకోండి బేగుడు పడుతూంది మనసు మీరు చూడండి, దేనికి భయపడుతాడంటే మనిషి తాను చూడలేనిది అనుకోండి తాను చూడలేని దృశ్యం తన కళ్ళ ముందు అలా కనపడుతూందనుకోండి గంట చూస్తాడు రెండు గంటలు చూస్తాడు మూడు గంటలు చూస్తాడు తరువాత బెగుడు పడిపోతుంది మనసు ఈ బెగుడు పడడమన్నది దేనికి దారితీస్తుందంటే అసలు మనకు ఇది కనపడకుండా ఉండాలంటే ముందు ఏ పని కోసమనీ నీతో ఏది చేయించడం కోసమనీ అటువంటి దృశ్యాన్ని మీ ముందుపెట్టారో దానికి మీరు వశులౌతారు, ఇక్కడ్నుంచి తప్పుకుంటే చాలు అన్న బుద్ధి ఏర్పడుతుంది, అది చాలా సహజం. భయానకరమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నారనుకోండి చిన్నపిల్లలు మనం వెళ్ళిపోదాం నాన్నగారండీ ఇక్కడొద్దు నాన్నగారండీ ఈసినిమా వద్దు నాన్నగారండీ వెళ్ళిపోదాం నాన్నగారండీ లేదా ఆ టీవి కట్టేయండి నాన్నగారండీ అంటారు. ముందు అక్కడ కళ్ళముందు నుంచి వెళ్ళిపోవాలి ముందు అప్పుడు అయితే రేపు స్కూలుకు వెళ్తావా అని అడిగారనుకోండి వెళ్ళిపోతాను నాన్నగారండీ కట్టేయండి అంటారు. కళ్ళ ముందు ఏదైనా భయంకరమైంది కనపడడం అనేటటువంటిది మీరు కోరుకున్న కోర్కె అంగీకరింపజేయ్యడానికి చేసే ప్రక్రియల్లో ఒక భాగమై ఉంటుంది ఎందుకంటే అది మనసు మీద తిన్నగా ప్రభావాన్ని చూపించగలదు, అసలు ఆలోచనా శక్తిని ఆపు చేయగలిగినటువంటి స్థితిని కంటిముందు కనపడే దృశ్యానికుంటుంది.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
మీరు చూడండి ఏదో ఆలోచిస్తూ వెల్తూన్నారనుకోండి హఠాత్తుగా మీ ముందు కారు కింద ఒక పిల్లి పడిపోయిందనుకోండి అబ్బాహ్ అని ఒక్కసారి మీ ఆలోచనా స్రవంతంతా ఆగిపోతూంది కన్ను చూసినటువంటి విషయం ఏదుందో దానికి మనసు తొందరగా స్తబ్ధమౌతుంది. విన్న విషయాన్ని వదలగలరేమో, కానీ కన్ను చూసిన దాన్ని అంత దొందరగా వదలడం కష్టం. అది కుదటపడిపోతూంది లోపలికెళ్ళి ఆ ముద్ర తీయాలంటే వచ్చే సమస్యేమిటంటే ఒకటి విన్నదాన్ని మర్చిపోవడానికి ఇంకోటి వింటూంటే ఫర్వాలేదు, ఒకటి భయానకమైన విషయం విన్న తరువాత పదిమంది మధ్యలో కూర్చుంటే ఫర్వాలేదు కానీ మీరు వెళ్ళి పడుకున్నా మీరు కళ్ళుమూసినా మీమనసు చూపిస్తూంది మళ్ళీ చూసినదాన్ని చూపిస్తూంది. ఇప్పుడు సీతమ్మయందు ఉన్నటువంటి ప్రజ్ఞ మీరు గమనించవలసి ఉంటుంది. ఆవిడా ఈ బాహ్య నేత్రాన్ని తెరిస్తే భయంకరమైన స్వరూపాలన్నీ ఉన్నాయి, ఈ బాహ్య నేత్రాన్ని మూస్తే పరమ సుకుమారుడు రాశీభూతమైనటువంటి సౌందర్యమూర్తియైన రామ చంద్ర మూర్తిని ఆవిడ దర్శనం చేస్తూంది, ఆవిడ యొక్క మనస్సు యొక్క శక్తిని మీరు గమనించవలసి ఉంటుంది అందుకే శోక ధ్యానపరాం దీనాం కృశామ్ ఒకటికి పదిమాట్లు అంటారు మహర్షి. అదీ ధ్యానము చేయగలిగినటువంటి వ్యక్తి యొక్క స్థితీ, అతని ఉద్ధరణ ఎలా ఉంటూందీ అనేది అతడు ఏ స్థానాన్ని పొందుతాడు అన్నది పరాకాష్ట అదే పరీక్ష. సుందర కాండలో వేరొకరు పరీక్షపెట్టి నిర్ణయాలు చేయరు.
Related imageమీరు అక్కడ ఎలా కూర్చున్నారు ప్రతిబంధకాన్ని ఎలా పట్టుకున్నారు అన్నదాన్నిబట్టీ మీ అభ్యున్నతి ఉంటూంది అనేదాన్ని నిరూపణ చేస్తూంటాడు. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించగలిగితే, అంతర్ముఖత్వము అనేటటువంటిది అలవాడైనవాడికి బాహ్యంలో ఉండేటటువంటి ఎంత భయానకమైన పరిస్థితిని నేను కల్పించినా ధ్వంశం చేయగలననుకున్న వాడైనా విఫలమైపోకతప్పదు. ఎందుచేతా అంటే అమ్మవారు అలాగని అసలు కళ్ళు తెరవలేదని మీరు అనుకుంటున్నారేమో..? నిన్ననే చెప్పాడు మహర్షి ఆవిడ కళ్ళు తెరిచింది ఆవిడకి చెట్లు కనపట్టంలేదు పువ్వులు కనపట్టంలేదు పళ్ళు కనపట్టంలేదని అంటే ఆవిడ కళ్ళు తెరిచి చూస్తూంది ఇదీ నేను చెప్పింత తేలిక విషయం కాదు నేను బాగా పట్టోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీరు చూడండి, మీరు ఈశ్వరార్చన చేసినటువంటి పువ్వులవంక చూసి కళ్ళు ఇలా మూసుకోండి మీకా పువ్వులు కనపడాలనేంలేదు, వేంకటాచలం వెళ్ళి వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసొచ్చీ ఏదీ వేంకటేశ్వరున్ని చెప్పండీ ఆపాదమస్తకం చెప్పలేరు. అందుకే దీపాన్ని వేలిగించిన తరువాత మీరు అలా దీపాన్ని చూసిన తరువాత కళ్ళు మూసుకోండి వెంటనే కదులుతున్న ఆ జ్యోతి మీ కళ్ళల్లో కనిపిస్తూంది. కంటికున్న శక్తేమిటంటే ఎదురుగుండా బాగా చూసినదేదో కన్ను దృశ్యాన్ని కూడా దాన్నే చూపిస్తూంది. ఇదీ ఒకనాడు ఉండచ్చూ రెండు రోజులు ఉండచ్చు. అలా చూసి కూడా తట్టుకునే శక్తి. కానీ కాలంలో ఏమైపోతూందంటే కొన్నాళ్ళు కాకపోతే కొన్నాళ్ళు కాకపోతే కొన్నాళ్ళైనా ఈవిడ జ్ఞానేంద్రయములన్నీ కూడా ఢస్సిపోయేటట్టు చేస్తున్నాడు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
రావణుని యొక్క రాక్షసత్వము అక్కడుంది, రాక్షసుడు రాక్షసుడు అని మీరు కేవలం అనడం కాదు రావణుని యొక్క రాక్షసత్వపు ఉద్ధతీ ఎన్ని కోణాలలో ఉంటుందో మీరు చూడగలగాలి. జ్ఞానేంద్రియములు ఢస్సిపోయిన వ్యక్తికి పిచ్చొస్తూంది. తను చూడలేనిది చూసి తను వినలేనిది విని తను స్పృశించలేనిది స్పృశించి తను ఉండలేనిచోట ఉండి ఐదు జ్ఞానేంద్రియములు కూడా చూడకూడనివి చూసి చెయ్యవలసి వచ్చిందనుకోండి, కొన్నాళ్ళకేమౌతుందో తెలుసాండీ చిత్త చాంచల్యమొస్తూంది. ఇదీ దాని తాలూకా విశేషఫలితం, ఎందుకంటే నాకు రక్తపు వాసనా మాంసపు వాసనా పడదనుకోండి నా ఎదురుగుండా ఇంత దగ్గరా ఓ రెండువేల మందీ ఒంటినిండా నెత్తురు పూసుకుని  మాంసంతింటూ కూర్చున్నారనుకోండి, ఇప్పుడు నాకావాసన ఏం చేస్తూంది కొంతసేపటికి కడుపులో తిప్పేస్తుంది. నాకూ ఏది అస్సలు ఇష్టముండదో ఏది నేను పుట్టిన పర్యంతమూ చూడలేదో అటువంటిదే అదే నా కళ్ళముందు కొన్ని నెలలుగా కనపడుతూందనుకోండి, నా కన్ను ఏమైపోతూంది బడలిపోతూంది. నాకిష్టమైన రామ చంద్ర మూర్తి గురించి చెప్పడం ఒక్కడూ లేక రామ చంద్ర మూర్తి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు ఇష్టంలేని రావణున్ని స్తోత్రం చేయడం, అదే విందనుకోండి చెవి ఏమైపోతూంది బడలిపోతూంది. నేను ఏమి స్పృశిద్దామని కోరుకున్నానో ఏ రామ పాదాలని ప్రతిరోజూ ముట్టుకోవాలని కోరుకుంటానో అంటే మీకు తెలికగా అర్థమవ్వడానికి నన్ను సీతమ్మగా ఊహించి చెప్తున్నానని మీరు భావించవలసి ఉంటుంది. నేను ఏ రామ పాద స్పర్శను అభిలషిస్తానో ఆ స్పర్శనాకు దొరకకుండా నేను అక్కడ ఏ వస్తువును స్పృశించాలన్నా అది ఏ ఆవేశంతో వచ్చి కనపడుతూందోనన్న భయానికి నేను లోనై ఉన్నాననుకోండి నేనేదీ స్పృశించలేని స్థితి.
ఇప్పుడు ఐదు జ్ఞానేంద్రయాలు బెదిరిపోయి బడలిపోయి ఉన్నాయనుకోండి ఐదు జ్ఞానేంద్రియముల యొక్క కిటికీతోటే చూడవలసిన మనసేమైపోతూంది బడలిపోతూంది. అప్పుడు జాగృత్తిలో ఇవే చూస్తే స్వప్నంలో ఏం చూపిస్తుంది ఇదే చూపిస్తుంది. అప్పుడు ఇంక శుశుప్తేదీ బడలిపోయినప్పుడు కూడా నిదట్లో భయపడి ఉలిక్కిపడిపోతే ఆ ఉలికిపాటుకు ఉపశాంతిని కల్పించేది మీకు కనపడాలి కదా... అప్పుడు మీకు ఆ ఉలికిపాటు పోతూంది. నాకు కలలో ఏదో ఒక భయంకరమైంది కనపడిందనుకోండి నేను ఏదో ఒక నదీ తీరంలో నడూస్తోంటే ఆ నదీ తీరంలో పెల్ల విరిగిపోయి నేను నదీ తీరంలో కొట్టుకుపోతున్నట్లు కల వచ్చిందనుకోండి నాకు ఊపిరాడక పేద్ద ప్రవాహంలో కొట్టుకుపోతూ నేను ఈతరాక కొట్టుకుపోతూన్నట్లు కలొస్తే, నేను కళ్ళు విప్పేటప్పటికి ప్రశాంతంగా చక్కగా నా గదీ గోడల మీద నా ఆరాధ్యదైవం తాలూకా మూర్తులతో చిన్న వెలుతురులో పడకగది ఉందనుకోండి ఉపశాంతి పొందుతుంది మనసు. ఇంతకన్నా భయంకరమైంది నేను ఏదో కళ్ళు తెరిచేటప్పటికి కనపడిందనుకోండి ఇప్పుడు ఈ ఉలికిపాటు పెరుగుతూందా ఉలికిపాటు తగ్గుతుందా... ఇంకా పెరిగిపోతూంది ఇలా జరిగి జరిగి జరిగి జరిగి శరీరమూ ఢస్సిపోయింది మనసూ ఢస్సిపోయి నిస్సత్తువా వచ్చి నీరసమూ వచ్చి తను

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
కోరుకున్న వస్తువు వస్తూందో రాదో తెలియక అసలు లోకంలో ఏది చూసినా ఒక అనుమానాస్పదమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి సన్నాసి కనపడితే సన్యాసో కాదో నమ్మని పరిస్థితి ఒక మృగం కనపడితే అది మృగమో మృగంకాదో తెలియదు ఇటువంటి బెగుడుతో కూడిన వాతావరణం నందు ఉన్నటువంటి వ్యక్తి రెండే రెండు పొందాలి పొందితే అవతలివాడు ఏది కోరి ఇవన్నీ సృష్టించాడో వాడికి లొంగిపోవాలి.
Image result for రాక్షసుల మధ్యలో సీతఅయ్యబాబోయ్ ఈ బాధ ఎక్కడ పడతావని, రెండవది మీకు వీటిని దాటగలిగిన శక్తుంటే ఇన్నిటిని చూసి కళ్ళు మూసుకొని కూడా మీరు కోరుకున్నదాన్ని ధానించి మీరు కోరుకున్నదాన్ని మీ పక్కన ధ్యానంలో కూర్చుని మీరు మానసిక ఉపశాంతిని పొందగలిగి ఉండాలి. రెండే ఉండాలి సీతమ్మ ఏ స్థితిలో ఉంది ఏదైనా చెప్పారా మహర్షి, బయటవీ చెప్తారు లోపలవీ చెప్తారు ఇలాంటి పరిస్థితిలో ఇలా ఉందనిమాత్రం ఆయన చెప్పరు అది సుందర కాండ. ఇక్కడ ఈ పరిస్థితిని మీరు చూస్తున్నారు ఎటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారో ఆవిడ ఎలా ఉంది ఉపవాస కృశాం దీనాం నిశ్శ్వసన్తీం పునః పునః ! దదర్శ శుక్లపక్షాఽఽదౌ చన్ద్ర రేఖామ్ ఇవాఽమలామ్ !! మన్ద ప్రఖ్యాయమానే రూపేణ రుచిర ప్రభామ్ ! బాహ్యంలో ఆవిడ సుష్కించిపోయింది, ఆంతరమునందు ఆవిడ నిర్భయస్థితిలో ఉంది, ఎక్కడదీ నిర్భయస్థితి అంటే ఆవిడ విశ్వాసము నీసన్మాత్రము చెక్కు చెదరలేదు, రాముడు రాడేమన్న భయం ఆవిడకి కించిత్ లేదు ఆవిడకి అంత విశ్వాసముంది అస్సలు మొట్టమొదట విశ్వాసము అన్న మాట ఎక్కడ అవసరమంటే మీకు కాలంలో అన్నీ మీకు కోరుకున్నవి కలిసొచ్చినప్పుడు విశ్వాసమన్నమాటకు అర్థం మేమీ ఉండదు. ఇప్పుడూ నేను తెల్లవారిగట్లా లేచి సంథ్యావందనం చేసుకుందామనుకున్నాననుకోండి, చక్కగా తెల్లవారు ఝామున నేను నిద్రలేచేటప్పటికి సంతోషంగా నిద్రలేచి మా ఆవిడ మడ్నీళ్ళు పెట్టేటప్పటికి నీళ్ళూ కావడి కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాననుకోండి, ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడూ అని అనవలసినపని నాకేం ఉండదు, లేచాను అన్ని హాయిగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి చేసుకున్నాను. నేను నిద్రలేచేటప్పటికీ ఇవ్వాళ పంపులు రావట్లేదు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులో నీళ్లులేవు అన్నారనుకోండి, పోనీ ఎక్కడైనా దగ్గర్లో నుయ్యి ఉందాంటే ఈ సందు మొత్తం మీద నుయ్యుండదన్నారనుకోండి, ఇప్పుడూ సంధ్యావందం చెయ్యడానికి చుక్కనీరు దొరకని పరిస్థితిల్లో కూడా ఈశ్వరుడున్నాడు ఎక్కడోక్కడ దొరుకుతుంది  ప్రాయశ్చితంలతోనైనా ఇవ్వాళ చేయిస్తాడు తప్పా నన్ను కర్మ భ్రష్టున్ను చేయించడు ఈశ్వరుడు అని నేను అన్నాననుకోండి, అది విశ్వాసము కదీండీ!.
విశ్వాసము దేనియందు నిలబడాలంటే ప్రతిబంధకమునందు నిలబడాలి ఆనుకూల్యమునందు నిలబడడం పెద్ద గొప్పేంకాదు మంచిదే అది చెడు అని నేను అనను, తక్కువని నేను అనను కానీ తేలికని మాత్రం అంటాను. మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి వచ్చేసింది. నేను ఈశ్వరున్ని నమ్మాను ఏమిటి కష్టం. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం రావాలి ఏమిటి కష్టం వచ్చేసింది ఏమిటి కష్టం మంచి అల్లుడు వచ్చేశాడు మంచి వియ్యాలవారు వచ్చేశారు ఈశ్వరుడికి నమస్కారం చేశాను ఏమిటి నీ గొప్పా... ఓ ప్రతిబంధకమొచ్చింది నీవు అనుకున్నది ఒకటి జరగట్లేదు ఈశ్వరున్నే పట్టుకుని ఉన్నాను వాడు చూపిస్తాడు దారి, వాడు నా కర్మ క్షయం చేస్తున్నాడు ఏదో పాపాన్ని వాడు నాకు మంచి మాట వినిపిస్తాడన్నాను ఇది భక్తి కదాండీ. ప్రతిబంధకమునందు ఊంచుకుంటే భక్తి, ఆనుకూల్యమునందు స్మరిస్తే కృతజ్ఞత, స్మరించకపోతే కృతఘ్నత

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
సుమాండీ! ఇదీ ఈశ్వరానుగ్రహం అంటేనే ప్రాసాద బుద్ధి. ప్రసాదముగా అనుభవించడం వీరు అనుభవిస్తున్నదాన్ని, ప్రతికూలమునందు విడిచిపెట్టకుండా ఉండాలి, ఇలా విడిచిపెట్టకుండా ఉండగలిగిన ప్రజ్ఞ ఇమ్మని ఈశ్వరున్ని అడగాలి మీరు ఎప్పుడైనా అడిగితే ఈశ్వరా నాకు అన్ని కలిసిరావాలి అని అడక్కూడదు, అన్ని కలిసిరావాలని మీరు అడగడానికి మీకు అన్నీ మీరు కోరుకున్నట్లు ఉంటే మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమేయైయుండాలి, మీరు ఆలోచించండి. అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకిరారు మీరు దేవతలై ఉంటారు, అంతా పుణ్యమే అయితే దేవతలౌతారు, అంతా పాపమే అయితే తిర్యక్ʼలు అవుతారు పుణ్యమూ పాపమూ కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు ఇవ్వాళ ఏడిస్తే రేపు నవ్వుతారు చీకటుంటే వెన్నెలుంటూంది, ఎత్తుంటే పల్లముంటుంది.
కాబట్టి ఓ కష్టమొచ్చింది ఓ ఈశ్వరా ఉదారుడవు నా పాపం తీసేస్తున్నావు కానీ తండ్రీ నీ పాదములను పట్టుకోవడంలో వైక్లవ్యం రాకుండా చూడు, ఇది మీరు అడగగలిగారనుకోండి మనుష్య జన్మయొక్క సార్థకతను పొందినట్లు. ఇది మనుష్య జన్మయొక్క సార్థకత అందుకే దూర్జటీ... నాకు అందుకే దూర్జటి పద్యాలంటే అంత ఇష్టం ఇది ఆవిష్కరిస్తాడాయన నిను సేవింపగ నాపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ, జనమాత్రుండననీ, మహాత్ము డననీ, సంసార మోహంబు పై కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వచ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా! పొగడనీ తెగడనీ కలిసిరానీ పోనీ సుఖమనిపించనీ దుఃఖమనిపించనీ అవన్నీ నాకు భూషణములే అని నేను అనుకోగలిగితే ఆనాడు నేను నీ అనుగ్రహాన్ని పొందినవాడు ఈశ్వరా! తప్పా కలిసొస్తే నీవు ఉన్నావని కలిసిరాకపోతే నీవు లేవనీ అని అన్ననాడు నా భక్తి భక్తికాదు కాబట్టి నాకు వద్దు ప్రతికూలమైన పరిస్థితిలో పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి దానికి చాలా గొప్ప అత్యావసాయముతో కూడినటువంటి బుద్ధి ఉండాలి, రామా నీతో వస్తాను నీవు ఉండగా నాకేంటి భయం అనడం తేలికా, రామా నీతో వస్తాననీ తను లక్ష్మణునియందో ఆ పరిస్థితి ఎటువంటిదో పదినెలలు గడిచిపోయిందో రాముడు రాలేదు అయినా రాముడు వస్తాడని ఇన్ని ప్రతికూల పరిస్థితితులలో లోపల రామున్నే పట్టుకుంది, ఇది నీవు చేయగలవా ఒక్కరోజైనా నీకో కష్టమొస్తే నీ కన్నుల నీరు కారుతూంటే నీ మనసు బాధతో ఉంటే నీవు కదిలిపోకుండా నీ పూజా మందిరంలోకెళ్ళి కూర్చుని సర్వేశ్వరా నీవు ఉన్నావు నన్ను ఒడ్డుకు చేరుస్తావు అనీ వాళ్ళ కాళ్ళూ వీళ్ళు కాళ్ళు పట్టుకునే ముందు వాడి కాళ్ళు పట్టుకోగలవా..? వాడికాళ్ళూ వీడికాళ్ళూ అని ఎందుకంటూన్నానో తెలుసాండీ..? అస్సలు పట్టుకోకుండా మనం ఉండలేము, అలా పట్టుకోకుండా ఉంటే శరణాగతండీ! అది వేరు సిద్ధాంతం అసలు మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఈశ్వరుని కాళ్ళే పట్టుకుని ఉండిపోయారనుకోండి అది శరణాగతి, అది నోటితో చెప్పడం కాదు శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే నోటితో చెప్పడం శరణం కాదు. మీరు సమస్త ప్రయత్నములను విరమించి ఈశ్వరుడు వచ్చి నన్ను రక్షిస్తాడని మీరు నిలబడిపోగలిగితే అది శరణాగతి.
అదేమంత తేలికకాదు నోటితో చెప్పేటంత తేలిక కానిది భక్తిలో ఏదంటే ఒక్క శరణాగతే... జ్ఞానమును పొందడము ఎంత కష్టమో... శరణా గతి చేయడం అంత కష్టం సాధారణంగా ఏం చెప్తుంటారంటే ఈశ్వరున్ని శరణాగతి చేయండి అంటారు అంత అర్థ రహితమైనమాట ఇంకోటిలేదు ఈశ్వరున్ని శరణాగతి నీవు చెయ్యలేవూ శరణాగతి చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ నీవు

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఈశ్వరానుగ్రహంగా పొందవలసి ఉంటుంది అది అంత తేలిక కాదండీ ఈశ్వర స్థానాన్ని కదుపుతుంది శరణాగతి తెలుసాండీ! శరణాగతి చేసినటువటివాడి యొక్క ప్రార్థనకీ ఈశ్వరుడు ఈయ్యన ఏం చెప్పాడో దానికి ఈశ్వరుడు వినవలసి ఉంటుంది. ఇక్కడే పోతనగారి భాగవతమూనూ సంస్కృత భాగవతమూనూ విడివడ్డాయి ఈ శరణాగతిని పోతనగారు ఆవిష్కరించినట్టూ వ్యాస భాగవతం నిజానికి ఆవిష్కరించలేదు ఎందుచేతా అంటే ఆయన ఒక పెద్ద చిత్రమే చేశారు పోతనగారు శ్వేచ్చానువాదం చేస్తూ గజేంద్ర మోక్షణంలో “లీలతో నా మొరలింపడే మొరగుల మొర లెరున్గుచు దన్ను మొరగువాడు” అన్నాడాయన, భక్తులైనటువంటివారు శరణాగతి చేసినప్పుడు తనను తాను మరిచిపోయి భక్తులు ఎలా అంటారో అలావచ్చేటటువంటివాడు అన్నారాయన. ఇప్పుడు నీవు రావాలి నన్ను రక్షించాలన్నాడు, వెనకనే షష్ఠస్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాదోపాఖ్యానంలో “ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సరోపగతుండు” అని స్తంభంలోంచి వచ్చాడు, గజేంద్ర మోక్షణంలో నీళ్ళలోంచి రాలేదాండీ ఆ నీళ్ళల్లోంచిరావడం పెద్ద కష్టమాయనికి లేడా నీళ్ళల్లో ఏం మరి అలా వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్ని ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము పాహి పాహి యనఁ గుయ్యాలించి సంరంభి యై ! సిరికం జెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సందింపడే, పరివారంబున జీరడబ్రకపథి మన్నింప డాకర్ణికామ్, తరధమ్మిల్లము జక్కనొత్తదు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో, పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై ! అలా రావలసిన అవసరమేమిటీ? పోతనగారు శరణాగతి తత్వాన్ని చాలా వైభవోపేతంగా ఆవిష్కరించారు.
భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని ఈశ్వరుడు పాటిస్తాడు ఇంతకుముందేం చేశాడనికూడా చూడకుండా నీవేం చేశావు ఇంతకుముందు నన్నలా చెప్పడానికి అని అడగడు, సర్వ ప్రయత్నములు మానేశాడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్,­ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా ! నాకు ఇప్పుడు శక్తి దైర్యము ఎంతమాత్రము లేవు... ప్రాణాలు గతి తప్పుతున్నది ఇక నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు అని సంపూర్ణ శరణా గతి చేసింది. మూల స్థానం నుంచి కదిలొచ్చాడు పెట్టిన శరతు తనను తాను మరిచి రావాలన్నాడు అలావచ్చాడు, తనను తాను మరిచిపోయి ఆఖరికి అమ్మవారి కొంగుపట్టుకున్నారన్నది కూడా మర్చిపోయి వచ్చాడు. శరణాగతీ అంతలోతైనటువంటి విషయం శరణాగతి ఈశ్వరుడి ముందు నిలబడి 14 శ్లోకాలు చెప్పడం కాదు, నేను మన్నింపబడెదనుగాక, శరణాగతి భక్తి అందుకు చాలా తీవ్రమైనటువంటి నిష్టకలిగినటువంటివాడు ఈశ్వరున్ని శాసించగలిగినటువంటి స్థితికి పెరిగిపోతే భక్తిచేతా అది  శరణాగతి ఇదీ చిట్ట చివరకు ఎక్కడెళ్ళిపోతూందంటే ఇంచుమించుగా భక్తి యొక్క చిట్టచివరికి స్థితీ జ్ఞాన స్థితి రెండూ ఒక్కచోటా కలుసుకుంటాయి. దానికి ఒక్కడుగు వెనక్కి శరణాగతి వెళ్ళిపోతూంది అంత తీవ్రమైన భక్తి శరణాగతి ఇప్పుడు ఇంచు మించు అమ్మవారు ఉన్నది ఆ స్థితి. ఆవిడ తనని తాను రక్షించుకోలేదు ఎందుకు రక్షించుకోదు శక్తిలేకనా కాదు ఆవిడ తల్చుకుంటే కాల్చేయగలదు అయోనిజ నరకాంత కాదు సాక్ష్యాత్ జగన్మాత ఎందుకు కాల్చదు, ఒక ధర్మాన్ని పట్టుకుని శరణాగతి చేస్తూంది ఏమిటా ధర్మం ఎందుకు? శ్రీరామాయణం ధర్మ శాస్త్రం, మనుష్యులకి ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
రామాయణం అయోనిజగనుకా ఆమె నరకాంత కాదు కాబట్టీ ఏదైనా స్పష్టంగా తెలుస్తూంది కాబట్టి ఆవిడ మాయాస్వరూపం ఆవిడ మాయా స్వరూపం కనుకనే అయోధ్యని ఆవిడ నిర్వచించింది, పరాత్పరుడు ఎక్కడున్నాడు అన్నది మాయనుబట్టే తెలియాలి ఎవడు మాయనుంచి తరించగలడో వాడు పరాత్పరుడు, ఎవడు శివధనస్సును ఎక్కిపెట్టీ సీతమ్మని చేపట్టాడో వాడే పరమేశ్వరుడు నరుడిగా పుట్టిన పరమేశ్వరుడు ఎవడో ఆవిడ చెప్పింది సీతమ్మ. కాబట్టి ఆవిడే మాయ మహామాయే విశ్వం బ్రమయసి పరబ్రహ్మమహిషి ఆవిడ లోకాన్ని తిప్పగలదు.
ఇప్పుడు రావణుని యొక్క ఇంద్రియములకు లౌల్యము కల్పించి ఆయన మృత్యువువైపుకు వెళ్ళేటట్లు చేస్తున్నది ఆవిడే, తాను జగన్మాతననీ మహాపతివ్రతననీ ఆవిడ రామ చంద్ర మూర్తి ఇల్లాలనీ ఆవిడ శోకిస్తోందనీ ఆవిడ అలాగే ఉంటుందన్న బుద్ధికల్పించీ హనుమకి ఎంత సేపు తదున్నసం పాణ్డుర దన్త మఽవ్రణం శుచి స్మితం పద్మ పలాశ లోచనమ్ ద్రక్ష్యే తదాఽఽర్యా వదనం కదా న్వఽహం ప్రసన్న తారాఽధిప తుల్య దర్శనమ్ అలా ఉంటుంది సీతమ్మ అనేటట్టుగా బుద్దిని ప్రచోదనం చేసిందీ ఆవిడే బుద్ధి ప్రచోదన శక్తి, శక్తి యొక్క లక్షణం అందుకే కదాండీ గాయిత్రీ చేస్తే దియోయాత్ ప్రచోదయాత్ నా బుద్ధిని ప్రచోదనము చేయుగాకా అని అడుగుతుంది. ఏది కదిలినా కదిలించినా శక్తి అన్ని కదలికలు ఆమెశక్తే. కాబట్టి ఇప్పుడు కదిలిస్తున్నటువంటిది ఎవరు ఆవిడే, కదిలిస్తున్న ఆవిడా ధర్మముచేతా నరకాంత ఇది సుందర కాండ ఇది ఆ సౌందర్యము. ఆవిడే త్రిపుర సుందరి ఆవిడే ధర్మముచేతా నరుని యొక్క ఇల్లాలు ఒక క్షత్రియుని యొక్క ఇల్లాలు. కాబట్టి ఇప్పడు ఆవిడ తనని తాను రక్షించుకోకూడదు, తనను తాను రక్షించించుకోకపోయినా బాహ్యంలో తన శక్తిని ప్రదర్శించకపోయినా ఏ శక్తి తనని ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వదో ఏ శక్తి ఎంత బలవంతుడినైనా పడగొట్టేయగలదో అటువంటి పాతివ్రత్యాన్ని ఆవిడ ఆవిష్కరిస్తూంది ఇవ్వాళ.
అటువంటి నరకాంత యొక్క ధర్మాన్ని చూపిస్తోంది, ఒక ఇల్లాలు యొక్క ధర్మము ఎంత గొప్పదో ఇప్పుడు ఆవిడింత శరణాగతి చేసింది కాబట్టి కదలవలసిందే రామ చంద్ర మూర్తి కదిలివచ్చీ రక్షించవలసిందే ఇంక తన ప్రయత్నమేమీ లేదు ఆవిడకి ఏనాడు ఆవిడ రావణాసురుడు అపహరించటమనేటటువంటి కృత్యాన్ని మొదలుపెట్టాడో ఆనాడే ఆవిడ శరణాగతి అక్కడ మొదలెట్టింది ఇప్పటికీ ఆ శరణాగతిలోనే ఉందావిడా ఇప్పుడుదాంతో బాహ్యమునందు ఇన్ని ప్రతికూలమైన విషయములతో ఐదు ఇంద్రియములకు ప్రతికూలమైనవీ ఇంద్రియములచేత కదలవలసినటువంటి మనసుకి ప్రతికూలమైనవి ఉన్నా తన మనసుకి అనుకూలమైనదానితో ఒకటి చేరి ఇంద్రియములకు ప్రతికూలమైనది చూసి చూడలేదు వినివినలేదు ఇది ఆవిడ ప్రజ్ఞ, ఇది ఒక మనుష్య జన్మ ఉద్ధరణకు కారణం. నీవు నీ ఇంద్రియములు మంచికి ఉపయోగించుకోవాలి, ఒక్కొక్కప్పుడు నీ ఇంద్రియములు చూడకూడనివి చూసినా నీకు రక్షణ ఏదీ అంటే నీ ప్రియమైన వస్తువుని ఉద్ధరించగలిగినదై ఉండాలి, నా ప్రియమైన వస్తువూ అన్నది నన్ను కిందకి లాగేసిందనుకోండి. ఉదాహరణ చెప్పాలంటే మా ఇంట్లో ఒక కుక్కమీద చాలా ప్రియమైన వస్తువు అనుకోండి దాన్ని ఉంచుకుంటే నేను ఉపశాంతి పొందుతాను సేద తీరుతాను, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
పిచ్చీ నా పిచ్చుంటే నీకేమభ్యంతరం మై పెట్ డాగ్ అంటూంటారు చూశారా... ఇష్టమైన కుక్క వాడు కూడా వెళ్ళడు వాకింగ్ʼకి కుక్కతో కలిసే వెళ్తాడు.
Related imageకాబట్టి ఇంటికి రాగానే భార్యేదని అడగడు కుక్కేదని అడుగుతాడు ఎందుకంటే అదే మీదబడినాకాలి ముందు ఓసారి అసలు ఇప్పుడు నేను ఆ కుక్కని తలచుకున్నాననుకోండి ఉపశాంతి ఏమండీ అప్పుడు ఉద్ధరణకాదా అని మీరు నన్ను అడిగారనుకోండి ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసాండీ అదీ కాలంలో పోయేదే కాలంలో పోయేదాన్ని పట్టుకున్నవాడివి నిన్నేం ఉద్ధరిస్తుంది. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడం అంటారు చూశారా..! తను మునిగిపోయేది మిమ్మల్నేం తేలుస్తూంది. కాలములో పుట్టి కాలములో పెరిగి కాలములో కలిసిపోయేదాన్ని కాలములో పడిపోకుండా ఉంచాలంటే కాలాతీతమైనదాన్నే పట్టుకోవాలి. “కాలాతీత పరాత్పరరామా” అందుకే పైకి నరుడు కానీ ఈశ్వరుడు. కాదు అలాయితే ఏమండీ మరి మా ఆయన పాదాలు పట్టుకుంటే మా ఆయన ఈశ్వరుడా..? ఒక స్త్రీ ధర్మానికి సంభందించినంతవరకు పతియే పరమేశ్వరుడు అంతే ఇంక దానికేమీ ఇతర వ్యాఖ్యానంలేదు. మగవాడికైతే తను తరించడానికి కాలాతీతమైన వస్తువు పట్టుకోవాలి అది కూడా వేదముచేతా ప్రతిపాదింపబడినటువంటి ఒక స్వరూపమును పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందాలి. స్త్రీకి అలా ఏం లేదు వాడు నీచుడా నీచుడు కాడా మంచివాడా మంచివాడుకాడా ఇవేమీ అక్కరలేదు పతిని అనుగమిస్తే చాలు, రావణుడు చెడ్డవాడు మండోదరి, మండోదరి మహాపతివ్రతే... అనుభవించింది పతీవ్రతే, తారా పతీవ్రతే, సీతమ్మ పతీవ్రతే అదేంటండీ సీతమ్మ పాతివ్రత్యానికి ఒక గ్రేడు మండోదరి పాతివ్రత్యానికి ఒక గ్రేడు ఉండవా ఉండవు. పతిని అనుభవించడం ప్రధానం సీతమ్మ ఎలా అనుభవించిందో మండోధరి అలా అనుభవించింది పాతివ్రత్యం సంభందంగా చెప్పాలంటే... శ్రీరామాయణంలో సీతమ్మని ఒక తక్కెట్లో కూర్చోబెడితే ఎంతో మండోదరిని అటు కూర్చోబెడితే అంత. అంతకన్నా తేడా ఉంటుందని మీరు చెప్పకూడదు రామాయణంలో అంతే ధర్మము.
వాళ్ళిద్దరే కాదు నేను మీ అందరిదీ అదేస్థాయి అని చెప్తాను తప్పా మీది అంతకన్నా తక్కువ వారు మీరు అని మాట్లాడే అధికారం రామాయణం నమ్ముకున్న ఈ దేశంలో లేదు. ఈ జాతిలో పుట్టిన ప్రతి స్త్రీ సీతమ్మయే అని నమ్మినవాడు అని లెక్కా. కాబట్టి మీ అందరూ కూడా సీతమ్మలే మీ అందరూ కూడా మీ భర్తను అనుగమించేవారే అంటే పతిని అనుగమించి భార్య ఉద్ధరణ పొందుతుంది పతి సతిని అనుగమించి పొందలేడు ఆయన ఈశ్వరున్ని పట్టుకోవాలి, కాలాతీతమైన ఈశ్వరున్ని ఆయన పట్టుకోవాలి మీరు మీరంటే భార్యా భర్తకాళ్ళు పట్టుకోవాలి పట్టుకుని ఉద్ధరణ పొందుతారు. ఇది ఎలా ఉంటుందో తెలుసాండీ సనాతన ధర్మంలో సర్కస్ లో చూడండీ ఒకాయనా ఉయ్యాలా పట్టుకుంటాడు ఆయన కాళ్ళు కిందుంటాయి ఆ కాళ్లు ఇంకోడు పట్టుకుంటాడు ఆ కాళ్లు పట్టుకుని వేలాడుతున్నవాడి కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు ఇప్పుడు మూడవ వాడి భద్రత ఎక్కడుంది పైన పట్టుకున్నవాడి పట్టుకున్న పట్టుమీద ఉంది కదా... వాడు జాగ్రత్తగా పట్టుకున్నానుకోండి ఈ కిందవన్నీ

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
కూడా సంతోషంగా ఉంటాయి అది బాహ్యంలో కానీ నీకు ఇక్కడ వచ్చేటప్పటికీ ఈ అనుగమించడం విషయంలోకొచేటప్పటికి మొదటివాడు పట్టుకున్నపట్టు వాడికొక్కడికే రక్షణ కానీ ఆయన వదిలిపెట్టేసినవాడైనా కూడా ఆయన కాళ్లు పతికాళ్ళు పట్టుకున్న స్త్రీ మాత్రం దెబ్బతినదు.
వాడు చెడ్డవాడు కావచ్చు, కానీ భర్తని ఈశ్వరుడిగా ఉపాసనచేసినటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడా ఈశ్వరుడికే చేసినట్లు వేస్తూంది అంతే శాస్త్రం, ఆయనకి ఇడ్లీలు చేసిపెట్టింది ఈశ్వరుడికి పాలభోగం చేసినట్లు, ఆయనకి అన్నమెండిపెట్టింది ఈశ్వరుడికి మహానైవేధ్యం పెట్టింది, నేను మహా నైవేధ్యపెడితే ఈశ్వరుడు తినాలీ అంటే ఒక నియమముంటూంది ఏది పెట్టినా తింటాడు, కానీ ఒక్క చిన్న శరతు పెడుతాడు పత్రం పష్పం ఫలం తోయం ఏదైనా తింటాను ఎప్పుడు యో మే భక్త్యా ప్రయచ్ఛతి భక్తితో పెడితే తింటాను అదేగా ఇబ్బంది అక్కడొస్తూంది ఇబ్బందంతా... అది పురుషునికి కష్టం. స్త్రీ దగ్గరకొచ్చేటప్పటికీ ప్రీతితో పెట్టడమన్నది చాలా సాధారణంగా జరిగిపోతూంటుంది. అయ్యోపాపం ఆయన అలసిపోయి వచ్చారని పెడుతూంది. నేను ఈశ్వరుడికి పెట్టేటప్పుడు మహానైవేధ్యం పెట్టేటప్పుడు తొందరగా నేను భోజనంచేయ్యాలి గబగబా ఏదో నైవేధ్యం పెడదాం మధ్యమధ్యో తోయం సమర్పయామి అనీ... గబగబా నేను పెట్టేస్తాను, పెట్టేసి వెల్ళిపోతాను. మీరు అలా వెళ్ళరు మీరు మెల్లిగా తినండీ నేను తింటానులేండీ నేను తింటానులేండీ అంటాను, మీరన్న మాటచేత మీరు తరించిపోయారు అంతే. పతిని అనుగమించి సనాతన ధర్మంలో ఆడది బాగా తరిస్తూంది యదార్థానికి పురుషుడు తరించడంలో భక్తితో పట్టుకోవడమన్నది రావాలి ఎందుకంటేనండీ నేను మీతో ఒక యదార్థం మనవిచేస్తున్నాను. ఉపాదికి ఒక లక్షణముంటూంది అన్ని ఉపాదులకు ఒకలా తరించే అవకాశం లేనట్లే మనుష్య ఉపాధియందు కూడా మల్లీ పురుష ఉపాధికి స్త్రీ ఉపాధికి తరించడం తార తమ్యమొస్తూంది స్త్రీ వివాహమై పతిని పట్టుకుంటే చాలు తరిస్తుంది. పతిని పట్టుకోవడమంటే అనుగమించి. పతి పతిం విశ్వʻస్యాత్మేశ్వʼరగ్ శాశ్వʼతగ్ మ్ శివ-మచ్యుతమ్ పతిని పట్టుకుని తరిస్తూంది. ఒకవేళ ఆయనా అలా పట్టుకుని ఆయన కాళ్ళను ఈవిడా పట్టుకుని ఉంటే వీళ్ళిద్దరూ కాదు దశ పూర్వేశాం దశ పరేశాం తరిస్తారు ఇదీ తెలుసుకుని ఉండడం స్త్రీ రామాయణం యొక్క సందేశం ఇది సుందరము అది సౌందర్యము.
అది పట్టుకోనప్పుడు ఇంక మీరు ఎన్ని సౌందర్యాలు పట్టుకున్నా పట్టుకోవలసిన సౌందర్యం విడిచి పట్టుకున్నట్లు ఉపయోగమేముందండీ దానివల్లా దానివల్ల ఉపయోగముండదు. ఏది పట్టుకోవాలో అది విడిచిపెట్టారు అందుకే మనకీ పెద్దలు ఎప్పుడూ ఒకమాట చెప్తారు వీడికి పట్టూ విడుపూ రావండీ అంటారు. అసలు మనకి నేర్పేదేమిటో తెలుసాండీ, సనాతన ధర్మంలో తరించడమన్నది దేనిమీద ఉంటుందో తెలుసాండీ పట్టూ విడుపూమీదే ఉంటుంది. పట్టుకోవాలి వదిలేసేటప్పుడు వదిలేయాలి వదలకుండా పట్టుకున్నా తరించరు పట్టుకుని వదలకపోయినా తరించరు అందేమిటండీ అంటారేమో మీరు అందుకే కట్లు అలా వేస్తారు. గుంటూరు జిల్లావాళ్ళకు బాగా తెలుస్తూంది పత్తికి కట్టేస్తే ముందు ఒక తాటితో గట్టిగా దగ్గరికి మోకాళ్ళతో ఒత్తి కట్టేస్తారు. ఆ పత్తి కిందకి రాలకుండా ఊంటూంది భేల్నీ ఇప్పుడు ఆ భేల్ మషీన్ మీదకి పంపిస్తారు మీషీన్ ఏం చేస్తుందంటే గట్టిగా నొక్కుతుంది దగ్గరగా అది బాగా దగ్గరగా నొక్కేస్తే ఇంక ఈ కట్టేమి చేస్తుందో తెలుసాండీ అది బాగా దగ్గరిగా నొక్కుకుపోయిందిగా కట్టూడిపోతూంది అప్పుడదీ బీడింగ్ వేస్తూంది. ఓ స్టీల్ బేడింగ్ వేసి క్లిప్ చేసేస్తుంది ఇప్పుడు

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
మీరు ఆ బ్లేడ్ని ఆబ్లేడ్ మీద శానం పెట్టీ పేద్ద సుత్తి పట్టుకొచ్చీ దాన్ని బద్దలు కొడితే తప్పా ఆ భేల్ లోనుంచి కాటన్ పత్తి బయటికి ఊడిరాదు. చుట్టనైనా అంతే మీకు గోనె సంచులు అలాంటివే అంతే భేల్ చేసేస్తారు మీకు ఇంక దాన్ని వ్యాగన్లో

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
పాడేయండీ కిందకి దొర్లించండి గోను సంచిలోకి వేస్తారు, ఏం చేయండీ ఒక సంచి కూడా కింద పడదు అలాగ వేసేస్తారు కట్టు. ఒక కట్టు వేసేది ఊడిపోయి ఇంకోకట్టు వేసేదానికి, ఈ కట్టేస్తే బాగుంటూందా గోను సంచులు వాడుకోవడానికి బాగుంటుందా గునపం పెట్టి బద్దలు కొట్టి గోను సంచులు తీసుకొనివాడుకోవాలి.
Image result for marriage card symbolsబ్రహ్మచర్యమన్నకట్టూ గృహస్తాశ్రమాన్ని కట్టేసేటప్పుడు ఈ కట్టు విప్పేస్తారు, గృహస్తాశ్రమ కట్టు ఇది సుఖం కాదన్నాక ఇక వైరాగ్యం వచ్చాక ఈ కట్టుతీసి వాన ప్రస్తమన్న కట్టేస్తారు వానప్రస్తం యొక్క ప్రయోజనం యొక్క కట్టు వచ్చాక ఇక కట్టు తీసేసి సన్యాసమన్న కట్టు వేస్తారు, అన్ని కట్లూ వదిలిపోయాక అసలు  కట్లు వేసుకోవడం అవసరములేని అనంతములోకి కలిసిపోతారు. కట్టుటా వదులుటా కట్టుటా వదులుటా కట్టుటా వదులుటా ఇది సనాతన ధర్మంలో అంతర్లీనంగా వెడుతూంటుంది. ఈ పట్టూ విడుపూరావలి బాగాను ఇది వస్తేనే తరిస్తారు అది రాలేదనుకోండి ఎన్ని ఆశ్రమాలు మారినా ఒక్కటే ఎందుకు మారావు ఏది పట్టుకున్నావ్ ఎందుకు వదిలావ్ ఒక్కనాటికీ తెలియదు. అందుకే ఆశ్రమం మారితే గురువుగారు ఉంటారు మీరు చూడండీ సనాతన ధర్మంలో బ్రహ్మ చర్యంలోకి వెడితే గురువుగారు ʻఉపనయనముʼ అంటే వేదాధ్యనము కొరకు గురువుగారి దగ్గరకు పంపుట గురు సంపర్కము, గృహస్తాశ్రమం మీరు కాదు పెళ్ళి చేసుకుంటానని చెప్పవలసినవాళ్ళు “వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ ఇట్ ఆర్ నాట్ ఇట్ డిసైడెడ్ బై ఎ గురు”, ఒక గృహస్తాశ్రమంలో స్నాతకోత్సవం గురువుగారు చేస్తారు, చేసి ఆ వీడు గృహస్తాశ్రమంలోకి వెళ్ళవచ్చూ... గురువుగారు చెప్తారు, అయ్యింది వానప్రస్తంలోకి వెళ్ళవచ్చూ గురువుగారు చెప్తారు, సన్యాసమివవవచ్చూ గురువుగారు చెప్తారు, గురువిస్తారు. సన్యాసం ప్రభుత్వాలు ఇవ్వవు సన్యాసం సత్ సంఘాలేమీ ఇవ్వవు అదేం సర్టిఫికెట్టుకాదు నీ వైరాగ్యాన్ని చూసి ఇంతకు ముందు సన్యసించినవాడు మీకు సన్యాసం ఇవ్వాలి.
కాబట్టి మీరు తరించడం అన్నది ఎవరి మీద ఆధారపడింది గురువుమీదే కట్టువేసినా కట్టు విప్పినా గురువుగారే యో మే భక్తా స మే గురుః అన్నారు నా గురువు ఎవడో తెలుసా రాముడే అన్నాలి. ఆవిడ వేసుకుంది కట్లు అలాగా ఇదీ సౌందర్యము అది ధ్యాన నిష్ఠా, ఈ నిష్ట కలిగినటువంటి తల్లి ఏం చేసిందో తెలుసాండీ తను రామునితో కలిసి ఉంటే ధ్యానమునందు ఏమవ్వాలి, రాముడి లక్షణాలే సీతమ్మకి రావాలి. మీరు ఓ ఇనుప ముక్క పట్టుకొచ్చి మేకొటి పట్టుకొచ్చి  అయస్కాంతం మీద అదేపనిగా రుద్ధారనుకోండి ఈ మేకేమౌతుందో తెలుసాండీ అయస్కాంతమైపోతుంది, అయిపోయి ఇప్పుడు ఈ మేకుని గుండుసూది దగ్గరికి పట్టుకెళ్తే గుండుసూదిని మేకు లాక్కుంటుంది. రాముడి లక్షణాలు సీతమ్మకి రావాలి ఉపాసనలో అది ధ్యానమునందు నిష్టా అంటే అదే అందుకే ఒక పురుగు వెళ్ళి ఒక కందిరీగా అదే పనిగా తిరిగిందనుకోండి ఏదో భ్రమరకీటక న్యాయం అంటారు చూశారా అలా కీటకం చూసి చూసి చూసి పుట్టలోంచి సీతాకోక చిలుక పైన గండు తుమ్మేద తిరుగుతూంటే చూసి చూసి చూసి ముందు భయంతోటే విశ్వలతతోటో అది దానివంకే చూసి చూసి చూసి దృష్టి కేంద్రీకరించి ఇది అదైపోతూంది. అయిపోయి ఇది ఎగిరిపోతూంది అంతే, ఒక కీటకము భ్రమరమైపోతూంది. ధ్యానమునందు మీరు ఏ వస్తువుని బాగా పట్టేసుకుంటారో మీరు ఆ వస్తువైపోతారు లేకపోతే దానికి అర్థములేదు ఎప్పుడూ విడివడి ఉంటే అర్థంలేదండీ, ఒక్కటి ఐపోతూంటేనే అర్థం అందుకే కదా శంకరులు రెండు కానిదీ అన్నారు. ఒకటీ అని ఆయన అనలేదు ఒకటీ అని అనాలంటే ఆయన ఏకం అనాలి అద్వైతం అంటే రెండుకానిది అన్నారు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
బహు వచనంగా బయలుదేరి ఏకవచనంలోకి వెళ్ళాలని అసలు దాని ప్రయాణం అలా ఉంటుంది, గమ్మత్తలా ఉంటూంది. కాబట్టి ఇప్పుడు ఈవిడ రాముడు కావాలి, ఈవిడ రాముడైతే ఏమవ్వాలి, రాముడి దగ్గర ఒక గొప్ప లక్షణముంది ఏమిటా లక్షణమంటే ఆయనకి సమాజంలో రామాయణంలో ఎవ్వర్నీ పనికిమాలినవాడనడు శంకరాచార్యులవారు ఎలా అనరో రాముడు అలా అనరు, శంకరభగవత్పాదులు చూడండీ అన్నిటిలో మంచినీ తీసుకుంటారాయన తప్పా చూడగానే ఇది పనికిమాలిందనరు ఆయన ఎక్కడా మీరు శంకర విజయాలు చదివితే రాముడు అంతే వీరు పనికిమాలినవారు అనరు, వాడిలో మంచి గుణాన్ని తీసుకుంటారు. చెడు తొలగిపోవాలని కోరుతాడు వాడింక పూర్తి చెడైపోయాడనుకోండి వాడివల్ల సమాజం పాడైపోతూంది ఇక వాడు ఇక ఆ శరీరంతో ఉండడం మంచిదికాదని తీసేస్తాడు దయతో సంహార ప్రక్రియ దయాస్వరూపము అన్నారు పెద్దలు కాబట్టి అందుకు తీసేస్తారు రాముడు. లేకపోతే అవకాశం ఇచ్చాడు రావణాసురిడికి కూడా. ఇప్పుడు సీతమ్మతల్లీ రాముడైపోయిందని గుర్తేమిటీ ధ్యానంలో హనుమ చెప్తున్నారండీ హనుమ కన్నులలోంచి చెప్తున్నారు మహర్షి ఏం చెప్పినా మీరు గుర్తు పెట్టుకోవాలి. సుందర కాండ వాల్మీకి రచనా అని మీరు అనేయడానికి కుదరదు ఎందుకంటే హనుమ చూస్తున్నారు ఆమె మనసుని చూస్తున్నారు. బాహ్య నేత్రానికి మనసుని చూసే శక్తిలేదు, మరి హనుమ చూస్తున్నదేదో బుద్ధిచేతా దాన్ని వాల్మీకి ఎలా తీసుకోగలిగారు బ్రహ్మగారి వరం నీకు ఆచమనం చేస్తే తెలుస్తూందని, మనసులలో ఉన్న విషయాలు కూడా మీకు తెలుస్తాయి, కాబట్టి ఇప్పుడు ఆవిడా ధ్యానమునందు రాముడైంది. అందుకే చిట్ట చివర ఆవిడ ఏమంటూందంటే మీకేం భయంలేదూ నిజంగా నేను రామునితో కలిసిపోయిన రోజునా మిమ్మల్నందర్నీ కూడా క్షమించేస్తానులేండీ అంది.
Image result for అశోకవనం సీతమిమ్మల్నీ ఎవ్వర్నీ నేనేం చేయను అంటూంది ఏమనాలండీ మీరు నన్ను చాలా బాధ పెట్టేశరనుకోండి, ఒరేయ్ మీరు ఆయన్ని అంత బాధపెడుతున్నారూ ఆయన్ని ఆదుకునేవాడు వచ్చేస్తాడు తొందరలోనూ అయ్యబాబోయ్ ఆయన వచ్చాడంటే ఆయన స్థితి ఎలా ఉంటుందో తెలుసా అన్నారనుకోండి, అయ్యబాబోయ్ ఏమండీ నిజంగా ఒకవేళ వచ్చేస్తాడేమిటోయని మీరు నా కాళ్ళమీదపడి నిజంగా మీ రక్షకుడెవరో ఉన్నాడటా ఆయన వచ్చేసిన తరువాత మమ్మల్నేమీ అనకండీ అన్నారనుకోండి... ఏం? ఊరుకుంటాననుకుంటావా..! రానీ చెప్తానన్నారనుకోండి మీరు ఆయనైనట్లు ఎలా అయ్యారు ధ్యానంలో ఆయన దయామయుడు నేను క్రూరున్ని ఏమయ్యాను ధ్యానంలో ఏం చేశాను ధ్యానంలో మీకేం ఫర్వాలేదన్నాననుకోండి నేను ఏమి ధ్యానం చేశానో అది నేను అయ్యాను కదాండి! ఇదీ నిరూపిస్తారు మహర్షి ఎదర, రాక్షస స్త్రీలందరికీ ఆవిడ అభయమిస్తూంది అప్పుడే, త్రిజటా స్వప్నంలో రాముడు వస్తాడని ఆవిడంటే రాముడు వచ్చేశుభవార్త విన్నరోజున మీ అందరికి నా రక్ష అది రాముడి రక్ష. పది నెలల ధ్యానఫలితమేమిటంటే ఆవిడ రాముడు కాబడింది. సనాతన ధర్మంలో ఇది చాలా గొప్ప విషయము. మీరు దేన్ని

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
పట్టుకున్నారో అది మీరు కావాలి తప్పా ఎప్పటికీ విడివడే ఉంటావు తప్పా అలా అనుకోవడమే తప్పు అన్నారనుకోండి అప్పుడు మిగిలిన ప్రక్రియ్యల్లో చాలావాటికి అర్థంలేకుండా అయిపోతుంది.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
Image result for అశోకవనం సీతఅది లేకుండా పూరించే ఉపాసనా రహస్యాన్ని ఆవిష్కరించిన కాండ కాబట్టి సుందర కాండ, ఇది ఇవ్వాళ కళ్ళు మూసేటప్పటికి నేను ధ్యానించేవస్తువునైపోనూ అలా నేను చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఆ వస్తువునౌతాను, సుందర కాండలో సీతమ్మ ఇలా కొన్ని నెలలు ఎంత ప్రతిబంధకమొచ్చి ధ్యాన వ్యగ్రతని పొందిందో అంత బాగా అ బాగా మేకుని లాగేసుకున్నట్లు ఆయస్కాంతమీదా.... ఇప్పుడూ ఆనుకూల్యత ఎవరికి కోస్తోంది, సీతమ్మకోస్తోంది ప్రతికూలత ఎవరికోస్తోంది రావణుడికి వస్తూంది ఇది ఈశ్వర శాసనము ఆవిడ ఎంత ఉపవసించి ధ్యాన నిష్టలో ఉండగా ప్రతికూలమైన మాటలు మాట్లాడుతున్నాడో అంత పాపం పెరిగిపోతూంది. ఏదో మీ పనిలో మీరుంటే నేను వచ్చి ఓ మాటన్నాననుకోండి ఆపాపం వేరు మీరు మనసు కుదురుగా పెట్టుకుని ఏకాంతంలో ఈశ్వరున్ని ధ్యానం చేస్తూండగా వచ్చి మరీ మిమ్మల్ని తిట్టాననుకోండి ఆ పాపం వేరుకదాండి. తపో భంగం చేసిన పాప ఫలితం కూడా నాకు పడిందా లేదా... ఎందుకంటే ధ్యానము తపస్సే ఇప్పుడు ఆవిడ ధ్యానము చేయడం వల్లా రావణుడి మరణం మరింత దగ్గరౌతూంది. కాబట్టి మీరు సుందర కాండని బహుబంగిమల చూడవలసి ఉంటుంది. కాట్టి వీళ్ళందరున్నారు వీళ్ళందరు చూశావా దిక్కుమాలిన్నోడు వీళ్ళందర్నీ పెట్టేశాడు పాపం ఎంత బాధ పెట్టేశాడో అనకూడదు, బాధ పెట్టేద్దాం అనుకున్నాడు కాని నిజానికి ఆవిడకేం బాధకలిగిపోలేదు ఆవిడ బాధకలిగిపోతే ప్రమాదమెవరికంటే రావణునికే నిన్న మీకు చెప్పానుగా హనుమ ఎందుకు రావలసి వచ్చిందో ఆ నీరు ఇంకా ఉంటే ఎంత ప్రమాదమొచ్చేదో.
కాబట్టి మహర్షి ఈ స్థితిని చాలా అందంగా చూపిస్తారు, నిన్నన మీతో అన్నానే కంటికి చెవికీ కూడా బాధ పెట్టేరూపంగా ఉండడమూ అనీ మాంస శోణిత దిగ్ధాంఽగీ ర్మాంస శోణిత భోజనాః­ ! తా దదర్శ కపి శ్రేష్ఠో రోమ హర్షణ దర్శనాః !! ఎంత చమత్కారంగా మాట్లాడుతారో మహర్షి ఆ మాంసము తింటూ ఒంటినిండా నెత్తురు పూసుకున్నటువంటి రాక్షస స్త్రీలు అక్కడ ఉన్నారు. ఇది ఎవరు చూస్తున్నారంటున్నారు తా దదర్శ కపి శ్రేష్ఠో హనుమ చూస్తున్నారు, చూస్తున్న హనుమకీ ఆవిడ ధ్యాన నిష్ఠ తెలుస్తోంది, ఆవిడ పాతివ్రత్యం తెలుస్తోంది, ఇన్నిటిమధ్యా ఆవిడ దేన్ని పట్టుకుందో తెలుస్తోంది, ఇది తెలియట్లేదు ఎదురుగుండా ఉన్నవాడికి ఎవరింట్లోకి తీసుకొచ్చానని ఒకడనుకుంటున్నాడో వాడికి ఆవిడ అర్థం కావడంలేదు ఆవిడే చెప్పినా అర్థం కావడంలేదు. ఏమీ చెప్పకుండా ఈయ్యనకి అర్థమౌతుంది. ఈయ్యనకి అర్థమవ్వడం ఈయ్యన బుద్ధి ప్రచోదనం అర్థమవ్వకపోవడం ఆయన బుద్ధి వైక్లవ్యము, బుద్దికి వైక్లవ్యమొచ్చినా బుద్ధికి ప్రచోదనమొచ్చినా భగవదనుగ్రహము అంతే. అంతకన్నా ఇంకోమాట అనడానికిలేదు శాస్త్రంలో లేదు కాబట్టి అది ఆ తల్లి వైభవంగా సుందర కాండ. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటున్నారు తెల్లవారింది. మరి రాత్రి వచ్చి కదాండి వచ్చి అన్వేషణ మొదలుపెట్టింది. తెల్లవారుతూంది సా రామా రామ మహిషీ రాఘవ స్య ప్రియా సదా వన సంచార కుశలా నూనమ్ ఏష్యతి జానకీ సంధ్యావందనానికి వస్తూందన్నారుగదా... ఈ సమయంలో చెట్లువంకా చూస్తూ సీతా మాత దర్శనాన్ని చేసుకునే సమయానికి ఆయన ఈ పరివేదన పొంది ఆవిడ యొక్క శీల వైభవానికి ఆంతరమునందు ప్రశంసిచేటటువంటి సమయంలో తెల్లవారింది.
షడంఽగ వేద విదుషాం క్రతు ప్రవర యాజినామ్ ! శుశ్రావ బ్రహ్మఘోషాం శ్చ విరాత్రే బ్రహ్మ రక్షసామ్ !! వేదములలో ఉండేటటువంటి మంత్రములను సుస్వరముతో చదువుతున్నటువంటి ఘోష వినపడుతూంది, వేదనాదం వినపడడం చాలా మంచిది, మనం వేదం చదవక్కరలేదు, వేదాన్ని వినగలిగితే చాలు వేదం దగ్గరికి వెళ్ళేటప్పటికి అదొక గొప్ప విషయము మీరు వేదం చదువుకుని ఉండక్కరలేదు, చదువుకుని ఉండక్కరలేదు అంటే చదవద్దన్నది నా ఉద్దేశ్యం కాదు చదువుకోలేదని బెంగపెట్టుకోక్కర్లేలేదు వయసుదాటిపోయాక చదువుకోకపోయినా వేదం చదువుకున్నవాడు కనపడ్డప్పుడు ఆ గౌరవమిచ్చీ అయ్యా! స్వరంతో ఒక్క స్వరంతో ఒక్క పన్నం చెప్పండీ అని వారు పన్నం చెప్తే నీకున్నది తాంబూలమిచ్చి మీరు నమస్కరించగలిగితే అదొక ప్రజ్ఞ. అదీ భక్తి ఎందుకంటే వేదము ప్రమాణము. మీ జీవితానికి కర్మకంతటకి కూడా ఏది చెయ్యాలన్నా వేదమే ప్రమాణంగా ఉంటూంది తప్పా “ వేదోనిద్య మదీయతాం సదువితం స్వకర్మ స్వనీష్ఠీయతాం ” దాన్నిబట్టే చేయవలసి ఉంటుంది. వేదం వినపడుతోంది తెల్లవారుఝామునలేచాడు మంచిదా కాదా చాలా మంచిది లేవడమనేటటువంటిది శరీరానికి సంబంధించినవిషయం మనసు లే అనిందనుకోండి లేస్తుంది లేచిన శరీరం దేనికి పనికిరావాలి ఉత్తర క్షణంలో స్నానం చేయడానికి వెళ్ళాలి, మనసేం చేయాలి శరీరాన్ని స్నానం చేయడానికి వెళ్ళమనీ మనసుకో శక్తుంది అది విడిపోతుంది, విడిపోయి అదేదో స్మరించడం మొదలుపెడుతోంది, అది ఏదో పనికిమాలినవీ స్మరించకూడనివీ స్మరించిందనుకోండి తెల్లవారుఝామునా మళ్ళీ దోషభూయిస్టమౌతుంది.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
Image result for ఆది దంపతులుఇందుకోసమే శంకర భగవత్పాదులు మహానుభావుడై జగత్ గురువై సమస్త జాతినీ ఉద్ధరించారంటే స్మరణము మనసు యొక్క లక్షణం కాబట్టీ ఆయన ప్రాతఃకాలమునందు స్నానం చేస్తే కానీ కర్మాధికారంలేదు, స్మరించే మనసుకి అధికారమేమిటీ దానికి సౌచమేమీ ఈశ్వర స్మరణమే దానికి సౌచము, బాహ్య స్నానమే శరీర సౌచము, దీనిమీద నీళ్ళు పోస్తే తప్పా ఇది సంద్యావందనానికి కూర్చోకూడదు, భగవంతున్ని తలచుకోవడానికి మనసుకేం చేస్తావు తలచుకునేటట్టు చేస్తే చాలు కాబట్టి ఎలా తెలుసుకోవచ్చో శంకరులు నేర్పారు ఈజాతికి ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం, ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసమ్ పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం అనీ మహానుభావుడు కదాండీ శంకర భగవత్పాదులంటే అందుకే ఆఖరికి దాంట్లోంచి కదూ వేంకటేశ్వర సుప్రభాతాన్ని ఇమిటేట్ చేశారు అన్నాను, అమ్మవారు... అమ్మవారి యొక్క కపోలములను బుగ్గలను ముట్టుకునీ రాత్రి అమ్మవారి గాఢంగా కౌగలించుకుని తల్లి యొక్క స్తనముల మీద పరమేశ్వరుని చెయ్యిపడిన కారణము చేతా అమ్మవారి ఒంటికున్న అంగరాగములు పరమశివుడి యొక్క చేతులకు అంటుకున్నాయి అలా అంటుకున్నటువంటి చేతులను నేను చూస్తున్నాను అన్నారు ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర అంటూ ఆ మహర్షులు పూజ చేసినటువంటి పాదములను, అమ్మవారి బుగ్గలను పునకడంవల్లా ఆ చేతులకు అంటుకున్నటువటి అంగరాగములతోకూడిన పరమశివహస్తాన్ని తల్లిదండ్రుల మధ్య అనురాగాన్నీ కొడుకుగా దర్శించడం “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” దాంట్లోంచే “ కమలాకుచ చూచుక కుంకుమతో, నియతారుణి తాతుల నీలతనో, కమలాయత లోచన లోకపతే విజయీ భవ వేంకటశైల పతే ” అనేదాంట్లోంచే ఆండాళ్వార్ సుప్రభాతంలోకి తీసుకున్నాడు.
శంకర భగవత్పాదులు ఇచ్చిందే ఆ శ్లోకము అంతకుముందు అనుభవించినటువంటి నృత్యమైనటువంటి సన్నివేశమది. కాబట్టి ప్రాతఃస్మరామి తెల్లవారిలేస్తే స్మరణ మనసుకి మనసుకి కర్మ శరీరానికి, స్మరణ శరీరానికేమీలేదు నిన్న మీకు చెప్పానుగా చిత్ జఢ గ్రంధీ ఈ శరీరము. స్మరించగలిగగలిగిన శక్తున్న మనస్సు దేన్ని స్మరిస్తే తరిస్తుందో దాన్ని

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
స్మరించడానికి అవకాశం ఇచ్చారు శంకరాచార్యులవారు. ఇప్పుడు లేవడం గొప్పా లేచి స్మరించవలసింది స్మరించడం గొప్పా లేవడం గొప్పకాదు, లేవడం గొప్ప కాదనడానికిలేదు లేవడం కూడా మంచిదే అసలు లేవకపోవడం కన్నా లేవడం మంచిదేకదా... కానీ లేచి స్మరించకూడనివి స్మరిస్తే అత్యంత ప్రమాదహేతువు, మహర్షి ఎక్కడైనా చెప్పారా అలాగా... అలా చెప్పరు నేను మీతో మనవిచేసింది అదే అలా ఏమీ సర్టిఫికెట్లూ ఇవ్వకుండా మాట్లాడటమే సుందర కాండ కానీ మహర్షి ఒకమాట చెప్పారు, అక్కడొక తివాచీ ఉంది మహీ కృతా పర్వత రాజి పూర్ణా శైలాః కృతా వృక్ష వితాన పూర్ణాః వృక్షాః కృతాః పుష్ప వితాన పూర్ణాః పుష్పం కృతం కేసర పత్ర పూర్ణమ్ ! ఈ బ్రహ్మాండము భూమి భూమి మీద ఉన్న పర్వతాలు పర్వతాల మీద ఉన్న చెట్లూ చెట్లకున్న పువ్వులు పువ్వులకున్న కేసరములు చెక్కారు, ఈ భూమి తల్లి నీవు నిద్రలేచేటప్పుడు కాలుపెట్టేముందు, ముందు భూమాతకు నమస్కరించి తప్పక కాలుపెడుతున్నానని నీవు దిగుతూంటే నీవు లేచి నీ మనసులేచీ మీ ఇద్దరూ లేవడం లోక కంటకుడవు కావు అనడానికి గుర్తు. అలాగ కాకుండా పరకాంతనో పరుల ద్రవ్యాన్ని మనం ఇవ్వాళ ఎలా అపహరించచ్చనో ఆలోచిస్తూ లేచారనుకోండి, స్నానం చేయడా చేస్తాడు, సంధ్యావదనం చేయడా చేస్తాడు, పూజ చేయడా చేస్తాడు తరువాత ఏం చేస్తాడు ఇది చేస్తాడు.
టీవీలో తెల్లవారఝామున అరగంటసేపు భక్తి సంగీతమిచ్చి ఇరవైమూడున్నర గంటలసేపూ చత్తంతా ఇస్తే ఎలా ఉంటుందో అరగంటసేపు పూజగదిలో కూర్చుని ఇరవైమూడున్నర గంటలసేపు లోకాన్నివేధిస్తే ఎలా ఉంటుందో అదే రావణాసురుడు నియుజ్యమానా శ్చ గజాః సుహస్తాః సకేసరా శ్చోత్సల పత్ర హస్తాః బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీ స్తథా పద్నిని పద్మ హస్తా ! అక్కడికెళ్ళి పూజ చేస్తాడు బయటికొచ్చి సీతమ్మని కాముఖంతో చూస్తాడు చాలాదా పాడైపోవడానికి. లేవడమన్నదీ శరీరం లేవడం కాదు మనసులేచేటప్పుడు ఎలా ఉండాలో చూపిస్తారు, ఎంత సాత్వికంగా ఉంటారో లేచినవాడి యొక్క జీవితం ఎలా ఉండాలో చూపిస్తారు. పోనీ ఎలా ఉండాలో ఎక్కడైనా చూపించారా మహర్షీ చూపించారు ఎక్కడ చూపించారు, అరణ్యకాండలో చూపించారు హేమంత ఋతువులో తైలమెక్కువగా ఉన్నటువంటి పదార్థాలు రాత్రి దుంపలు తిన్న కారణం చేత దాహంతో ఉన్నటువంటి ఏనుగూ బాగా దాహమేసి నీళ్ళు తాగుదామని తెల్లవారుఝామున మూడున్నగంటలకి గోదావరి నది ఒడ్డుకెళ్ళీ నీరు తాగుదామని తొండం పెడుతూంది తీసేస్తూంది పెడుతూంది తీసేస్తూంది తప్పా నీళ్ళు తాగట్లేదు అంత చల్లాగ ఉన్నాయి, జల పక్షులు నీటిలో ఉండవలసినవి నీటిలో ఉండకుండా ఒడ్డున ఉన్నాయి యుద్ధం చేయ్యవలసిన సైన్యం శత్రువుల్ని చూసి వెళ్ళకుండా పారిపోయి వచ్చినట్టూ అన్నారు మహర్షి. రాముడు మాత్రం స్నానం చేశారు. మరి ఏనుగు తొండం పెట్టలేని చోటా జల పక్షులు వెళ్ళలేనిచోటా రాముడు ఎలా స్నానం చేశాడు. లేవడం స్నానం చేయడం కోసమం అందుకు చేశాడాయన ఇది ఆయన ధార్మిక నిష్ట, అప్పుడు లక్ష్మణుడన్నాడు పక్కన నిలబడీ మీరు విన్నారు అరణ్యకాండలో అన్నయ్యా భరతుడు కూడా ఇలాగే అక్కరలేని కష్టాన్ని నెత్తిమీద వేసుకుని నీ మీద భక్తితో సరయూనదిలో స్నానం చేస్తుంటాడన్నయ్యా అన్నాడు అవునురా తమ్ముడూ అన్నాడు.
అన్నయ్యా! అంత మంచి తమ్ముడు భరతునికి ఈయ్యనకి అన్నగారికి గదా... నీకు అంత మంచి తమ్ముడైన భరతుడు అంతగొప్ప తండ్రి దశరథుడి కొడుకు అంత నీచ స్వభావమున్న కైక తల్లెలా అయ్యిందన్నయ్యా అన్నాడు. రాముడు అన్నాడు వెంటనే భరతుని గురించి ఇంకా ఏమైనా మాట్లాడు అమ్మగురించి ఇంక ఎప్పుడు ఏమీ మాట్లాడకు అన్నాడు. ప్రాతః

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
స్మరామి పొద్దున్న ఏమైనా తల్చుకుంటే నమస్కారానికి తల్చుకో అంతేగాని పొద్దున్నే తల్చుకున్నప్పుడు అత్తగారి మీద కోపంతోటీ నాన్నగారిమీద కోపంతోటీ తల్చుకోకూడదు, నాన్నగారి మీద కోపంతోటీ తల్చుకోకూడదు అమ్మమీద కోపంతోటీ

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
గురువుగారి మీద కోపంతోటీ తల్చుకోకూడదు. కాలము అటువంటిది అందుకే... దేశము కాలము ఈ రెండింటికీ చాలా గొప్ప పాత్ర ఉందండీ..! సనాతన ధర్మంలో ఎప్పుడు పడితే అప్పుడు చేయరు దానికి ఒక నియముంటుంది, సంవత్సరాలు ఎప్పుడూ అని మీరు అడిగారనుకోండి దానికో పద్ధతుంటూంది. ఏదో పన్నెండు నెలలు పూర్తవ్వాలి చైత్రమాస ప్రారంభంలో సూర్యోదయం పాఢ్యమి ఉండాలి ఉంటే ఉగాది కొత్తసంవత్సరం ప్రారంభం అంతేకాని సూర్యోదయమయ్యిందో సర్యాస్తమయమయ్యిందో అసలు ఏముందో ఏమూడిపోయిందో గడియారం ఆగిపోయి చూపించిందో పావుగంట ముందు చూపించిందో ఏమీ తెలియకుండా అర్థరాత్రి పన్నెండింటికి కొత్త సంవత్సరం వచ్చిందనడం ఈ జాతికి తెలియదు సనాతన ధర్మానికి తెలియదు. సనాతన ధర్మానికి తెలిసినదేమంటే ఖచ్చితమైన లెక్కతో సూర్యోదయ సూర్యాస్తమాల్ని చంద్రోదయ చంద్రాస్తమయాల్నీ లెక్క కట్టీ నక్షత్రాలని మొత్తం సంవత్సరాలతో శుక్ల పక్షాన్నికానీ కృష్ణ పక్షాన్నికానీ తిథిని గానీ చెప్తూంది. అది ఈ జాతి యొక్క గొప్ప ఐశ్వర్యానికి మనం వారసులం సనాతన ధర్మంలో ఇటువంటి ఐశ్వర్యం మరెవరికీ లేదు ఇది మన అదృష్టం.
Image result for sita ramaకాబట్టీ నీవు లేవడం గొప్ప కాదు లేచి ఏం చేస్తున్నావు ఎప్పుడు గొప్పకాదు నీవు లేచి చెయ్యకూడని పని చేసినప్పుడు లెచి ప్రయోజనమేమిటీ ఇది మహర్షి చెప్తారా చెప్పరు, ఆయన అక్కడ ఏం చేస్తున్నారో చెప్తాడు ఈయ్యన ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్తాడు. మీరు ఇయ్యన ఎలా చేస్తాడో అలా చేస్తే ఇంకో తొమ్మిది తలకాయలు ఇచ్చినా ఉండవు, ఆయన ఎలా చేశాడో మీరు అలా చేశారనుకోండి యుగాలు మారిపోయినా పూజింపబడుతారు. ఇది చెప్పడం సుందర కాండ అంతే. నేను అందుకే మీతో మనవి చేసేది అడుగడుగున ఉపాసన కాండ సుందర కాండాని. కాబట్టి ఇప్పుడూ వేదం వినపడుతూందీ అథ మంగళ వాదిత్రైః శబ్దైః శ్రోత్ర మనోహరైః ! ప్రాబోధ్యత మహాబాహు ర్దశగ్రీవో మహా బలః !! దశకంఠుడు అతని అనుచరులూ కూడా మంగళ కరమైనటువంటి ధ్వనులకు మేల్కొన్నారు ఏ ధ్వనికి పడితే ఆ ధ్వనికి మేల్కొన కూడదుగదా, అలా ఎందుకండీ మేల్కొన కూడదు అని మీరు నన్ను అడగవచ్చు  ఓమాట అలా లేస్తే ఏమౌతుందంటే మీ మనసు యొక్క ఉద్విగ్నత అటు వెళ్ళిపోతూంది. అలా లేవద్దూ అని శాస్త్రం. ఎందుకంటే మీరు లేచేటప్పుడు విష్ణు స్వరూపంతో ఉన్నటువంటిదాన్ని ధ్యానించి ముందు ఆపేరే నోటివెంట పలకాలి రాత్రంతా పడుకున్న తరువాత మొదటిమాట నోటివెంట ఏదిరావాలంటే ప్రాతః కాలంలో “శ్రీహరి” అన్న మాట తప్పా ఇంకొకటి మాట వాడడమన్నది మంచిదికాదు యదార్థానికి. ఒక్క శ్రీహరి “శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ” మూడు మాట్లు.
ఎందుచేతానంటే ʻశ్రీʼకారంతో ప్రారంభమై, ఆరోజు కాలముచేత మీరు అనుభవించవలసిన పాపము దుఃఖ రూపంలో రాబోతుంటే అది జాగృతావస్తకి ప్రారంభం కాబట్టీ ఆయన ఆ పాపమును హరించి దానిస్థానంలో మీమనసు సుఖపడేటట్టు సంతోషించేటట్టు, మీరు బాధపడకుండా ఉండేటట్టు మీరు చేసిన పాపమును మన్నించి మిమ్ములను సంతోషపెట్టగలిగినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆయనా, ఆయన మీ పాపాన్ని మన్నించి మీకు మంచినిచ్చినా అడగగలిగినవాడులేడు ఆయన అలా క్షమించకపోతే ఈశ్వరుడు కాడు. పాపానికి పాప ఫలితమే పుణ్యానికి పుణ్యఫలితమే నీవు అంటేమాత్రం నేను ఇస్తానా అన్నాడనుకోండి ఇంకెందుకు మీరు నేనుండేది ఎందుకు స్మరించడం అందుకే “నమః శివాభ్యాం అశుపాపభ్యాం” మీరు భక్తితో స్మరిస్తే మీ పాపం తీస్తాడు లేకపోతే వేంకటేశ్వరుడన్నమాటకు అర్థమేలేదు వేంకట యతీతి వెంకటః నీపాపాన్ని తీయగలడు, ఏదీ నెప్పి పెట్టకుండా వెంట్రుకల రూపంలో తీసేస్తాడు అందుకు కదాండీ తలనీలాలు ఇచ్చేస్తాము పాపములను తీయ్యగలిగినవాడు కాబట్టి వేంకటేశ్వరుడు. పాపమేం తీయడు ఈశ్వరుడు అంటే అప్పుడు క్షమాభిక్ష పెట్టడూ అని దాని అర్థము. ఆయన క్షమాభిక్ష పెట్టనివాడైతే మీరు ఇంక వెళ్ళి ఆయన కాళ్లు పట్టుకోవడమెందుకండీ అసలు, అసలు మీ పాపమును మన్నించగలిగిన ప్రజ్ఞ ఈశ్వరునికీ గురువుకీ లేకపోతే ఈ ఇద్దరినీ పట్టుకోవడం లోకంలో అనౌసరం.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
డాక్టరుగారు ఎప్పుడూ కడుపునొప్పీ కాలునొప్పీ అని వచ్చివాడే... ʻఒక్కడు లేడే సినిమా గురించి చెప్పేవాడుʼ లేడని విసుక్కుంటే ఏమైనా అర్థముందా డాక్టరుగారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఏమైనా సినిమా గురించి మాట్లాడటానికి ఎందుకు వెళ్తాడండీ..? అలా వెళ్ళడు అక్కడికి వెళ్ళేవాళ్ళందరూ ఎలా వెళ్తారంటే ఒంట్లోబాగాలేదని చెప్పేవాడే వెళ్తాడు. ఈశ్వరుడి గురించి వెళ్ళేవాడు నూటికి తొంభై ఎనిమిది మంది ఎవరెళ్తారంటే అయ్యో..! ఈశ్వరా నా వలన ఎన్ని పాపాలు జరిగిపోయాయో తండ్రీ నీవు తప్పా నన్ను ఎవరు మన్నిస్తారు అని అడిగే వాడు వెళ్తాడు. గురువుగారి దగ్గరికి ఎవరు వెళ్తారు అయ్యో మేము చీకట్లో ఉండిపోయామండీ... మాకు మార్గం తెలియట్లేదూ మమ్మల్ని మంచి మార్గంలో నడిపించండీ అని అడగడానికి వెళ్ళేవాడు వెళ్తాడు, వాడూ నీయంత వెలుతురులోనూ నీకన్నా వెలుతురులోనూ ఉంటే నీ అవసరం వాడికెందుకు ఒక గురువు ఉన్నాడూ అంటే ముందు ఏం అర్థం చేసుకోవాలంటే తనని ఆశ్రయించేటటువంటివాళ్ళు ఒక మంచి మార్గంకోసం తన్ని పట్టుకుంటారు కాబట్టి తాను ఉదారుడుగా ఉండాలని గురువుకు ఉండాలి. అసలు ఆమాట గురువు ఆమాట ఈశ్వరుడు అనలేదనుకోండి అసలు ఉద్ధరణా అన్న ప్రక్రియ అక్కడలేదు కదాండీ... ఇది చాలా జాగ్రత్తగా మీకు ఉపకరణములుగా దేశకాలములయందు ఉద్ధరణ రూపంలో వస్తూంది. అందుకే మీకు ఇవన్నీ ఎక్కడా కనపడవు అంత విశాల హృదయంతో సనాతన ధర్మంలో ఋషులు పెట్టారు. అందుకు ప్రతిరోజూ దేశకాల సంకీర్తనమే ఆయనకి తెలియదేమిటీ నేను ఎక్కడుండి పూజ చేస్తున్నానని ఎందుకు చెప్పడం గంగా కావేరీయోః మధ్య దేశే దత్తపురి క్షేత్రే శారదాపీఠే వసతి గృహే అని నేను చెప్పుకోవడం ఎందుకు అంటే నీవు ఎక్కడున్నావో తెలియనివాడు ఆయన కాదు దేశ కాలములు నీకు తెలిసి ఉండాలి ఈ దేశ కాలములయందు ఫలితమును నీవు అనుభవిస్తావు అనుభవించకుండా నేను పాపము చేసి ఉంటాను నన్ను ఏడిపించద్దని నేను వాని పాదములు పట్టుకుంటున్నానని నీవు తెలుసుకుంటున్నావు ఇవి రెండే నీ పాపమును అనుభవింపజేయడానికి వస్తాయి.
Related imageఅందుకే దేవీ భాగవతంలో “ సర్వదా సర్వదేశేషు పాపుత్వాం భువనేశ్వరీ మహా మాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ ” అంటారు, కాబట్టి ఆయన ఇప్పుడు నిద్రలేచాడు లేచి భృశం నియుక్త స్తస్యాం చ మదనేన మదోత్కటః ! న స తం రాక్షసః కామం శశాకాఽఽత్మని గూహితుమ్ !! తన కామమును తాను అనుచుకోలేకపోయాడు, విశేషమైనటువంటి కామ వికారమును పొంది మధోన్మత్తుడై సీతమ్మతల్లిని స్మరించుటచేతా... ఇక ఈ శ్లోకం ఎటువంటిదో తెలుసాండీ! శిలా శాసనం లాంటిది, రావణాసురున్ని మీరు ఏ కారణం చేత మీరు వెనకేసుకురావడానికి అవకాశంలేదు ఈ శ్లోకంవల్లా, ఆయన వికారమును పొందాడు, సీతమ్మ తల్లిని స్మరించడంవల్లా భక్తితో స్మరిస్తే ఉండే స్థితి వేరుగా ఉంటూంది. కేవలము కామ వికారము. ఎప్పుడూ తెల్లవారు ఝామునా ఎవరిమీదా ఒక అబలమీద కాబట్టి ఇప్పుడు ఆయనా కామ వికారమును పొందగానే యదేచ్చా నన్నడిగేవాడు ఎవడు..? అదేమిట్రా... ఇప్పుడు నీవు సంధ్యావందనం చేయాలిగదా విశ్రవసు బ్రహ్మ కొడుకువుకదా మరి ఇటువైపు వెళ్ళచ్చా... ఆయన్ని అడిగేవాడు లేడు కాబట్టి ఇప్పుడు ఆయనా అశోకవనానికి బయలుదేరాడు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
Image result for లలితా దేవిఅంటే మీరు ఇప్పుడు రావణుని యొక్క గొప్పతనంగా ఎప్పుడూ వినకూడదు ఇది, ఇది చెయ్యకూడనిదని మీరు గ్రహించవలసి ఉంటుంది, నిద్రలేస్తూ స్మరించవలసినదేదో అది మీకు తెలియదేమోననీ పెద్దలైనటువంటివారు ప్రాతః స్మరామీ స్తోత్రాల కింద ఇచ్చారు, అందుకే ఏది పడితే అది చదవకూడదు, సాధికారికంగా చెప్పగలిగిన ప్రజ్ఞ ఉన్న పెద్దలు చెప్పినవే చదువుకోవాలి, తప్పా ఎవరో నాబోటి అల్పజ్ఞుడు రాసేసిన స్తోత్రాలు అవీ పట్టుకుని అదేపనిగా చదివేసుకోవడం, ఆ భాష మనది కాకపోయినా ఏదో బాగుందీ అని చదువుతూండడం అలాంటి పిచ్చిపనులు చేయకూడదు. నీకు అది అర్థమవ్వాలి అర్థమైతే మీ మనసు నిలబడుతుంది. మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నోటికున్న లక్షణమేమిటో తెలుసాండీ... ఒకటి తరింపజేస్తుంది అర్థమైతే. నోటికొస్తే మనసు నిలబెట్టటం తేలికా నేను ఇలా పుస్తకం పెట్టుకుని చదవడానికీ ప్రాతః స్మరామి లలితా వదనార విందం బింబాధరం పృధుల మౌక్తిక సోభినాశమ్ ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ అన్నాననుకోండి నేను అనుభవించడానికి మనసుకు తేలిక, కానీ ఇదే చాలా ప్రమాదం ఎందుకో తెలుసాండీ, మనసుకున్న లక్షణమేమిటంటే యాంత్రీకరిస్తూంది, నీవు చదువూ... అనీ ప్రాతః స్మరామి లలితా వదనార విందం బింబాధరం పృధుల మౌక్తిక సోభినాశమ్ అని చదువుతూంటాడు. పాలు పోయడానికి వచ్చినవాని దృష్టిలో ఈయ్యన భక్తుడు. పైకి చదువుతున్నాడు కాబట్టి ఇయ్యన మనసు ఎక్కడుంది. కాఫీ గ్లాసులో తిరగపోస్తూంది తాగుతుందో ఏమిటో పాలొచ్చాకన్నా కూర్చోవలసింది పూజకి పాలొచ్చినట్లున్నాయ్ కాఫీ గ్లాసులోంచి గ్లాసులోకి జొరుగుతున్న చప్పుడొస్తూందీ అని మనసు కాఫీ గ్లాసులో జొరుగుతున్న చప్పుడు వింటూ ప్రాతః స్మరామి లలితా వదనార విందం బింబాధరం అంటూందనుకోండి అప్పుడు పుస్తకం చూసి చదువుకోవడమే మంచిది. కనీసం ఇంద్రియాలు ఇక్కడైనా ఉంటాయి కదా.
ఇదీ పెద్ద ఇబ్బందండీ... ఋషులు తీసుకొచ్చి అన్నిటినీ ఎక్కడ పెట్టారంటే నీ మనసుని తరింపజేయడం దగ్గర పెట్టారు, అది వదిలిపెట్టి ఇంక మిగిలినవి ఎన్నిచేసినా వాళ్ళు వద్దన్నారు, దానికి దీన్ని ఉపకరణంగా వాడు అంతేకానీ అది వదిలేసి ఇంకోదానికి వాడితే ప్రయోజనం తక్కువాని చెప్పేశారు అంతే. మనసుకి శుద్ధిలేకుండా మీరు దీనితో అల్లరంతా చేశారనుకోండి ఏదో శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు, ఎందుకురా ఇలా తిరుగుతావు నీవు అనవసరంగానూ పర్వతాలెక్కుతావు చెట్లెక్కుతావు చెరువుల్లోకెళ్తావు తామరలుతెస్తావ్ బిళ్వధలాలు తెస్తావ్ అన్నీ తెస్తావ్ తీసుకొచ్చి పూజ చేస్తావు ఎవడికికావాలి ఇవన్నీ నీ మనసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టావా... నీ వెంటపడడానికి సర్వేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు ఒక అక్షతలోకి అన్నీవస్తాయి. అది నీకు చేతకాలేదా ఉపయోగమేమిటీ ఇన్ని చేసినా దానివల్ల ఉపయోగము తక్కువా అంటే చెయ్యద్దాండీ మీ మనుసు బాగా నిలబడాలంటే ముందు కాయికంగా వాచికంగా చేయడం మొదలుపెడితే మనసు నిలబడుతుంది, మనసుతో చేయమన్నారు గదాండీ అందుకని మేము ఇవన్నీ మానేశామండీ అని

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
అంటే ఎలా నిలబడుతూంది. మామిడి పండు తెలియనివానికి మామిడి పండు ఎలా ఉంటుందో చెప్పమనండీ. మారేడుధళం మీరు చేత్తో పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తే ఎలా అంటుకుంటుందో మీరు చూశారనుకోండి అప్పుడు మనసుతో చేయండి మనసుతో చేయమన్నారు గదాండీ నేను మానేశనండీ బిల్వధళాలతో పుజచేయడం అనకండీ మరి నన్ను ఇరికించకండి అందులో అదీ మీరు రెండిటికీ మధ్య ఉన్నటువంటి స్థితిలో ఎదగగలగడం ఉపాసన ఇది ఎదగకుండా తిరగడం అదీ అంత సమంజసంగా ఉంటూందీ అని అంగీకరించరు పెద్దలు.
Image result for అనుగ్రహంఇప్పుడు పది తలకాయలుంటే ఎవనికి కావాలి వేదం చదువుకుంటే ఎవనికి కావాలి ఘనమైతే ఎవడికావాలి జడమైతే ఎవడికి కావాలి, అందుకే ఎవడికి కావాలనే అన్నారు శంకరాచార్యులవారు నరత్వం దేవత్వం అన్న శ్లోకంలోనా ఆయన ఒకచోట అంటారు నీవు వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చిత్భవతు భవ కిం తేన భవతి ! యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి !! నీవు ఎవడవోయ్ నీవు బ్రహ్మచారివైతే ఎక్కువా గృహస్తువైతే ఎక్కువా సన్యాసివైతే ఎక్కువా నీ మనసు పెట్టావా నాకు చెప్పు నీ మనసు పెడితే ఈశ్వరుడు నీవెనక పడుతాడు. వాడు నాకొరకు రక్షింపవలయువాడు అన్నాడు బాగవతంలో ఆయనా వాన్నీ వాడికోసం కాదు భక్తున్ని రక్షించకపోతే నేను ఉన్నానని ఎవడు నమ్మడు ఇక అందుకని వాడు నాకొరకు రక్షింపవలయువాడు ఎంత పెద్ద మాటండీ నిజంగా పోతనగారిది. ఏమి ఆంద్రీకరణ ఇది పట్టుకోవడం నీ సంస్కారం నీ ఉపాసన ఇది నేర్చుకోకుండా సుందర కాండ వింటే ఉట్టిగనే నేను ఈ శ్లోకాలన్నీ చదివీ కథంతా  చెప్పడం ఎంతసేపండీ పదినిమిషాలు ఇవ్వాళ పూర్తి రామాయణమే పూర్తి చేసి వెళ్ళిపోతాను, ఏం ఎందుకనీ ఇదేం సిలబస్సా... అది పూర్తి చేస్తే నాకో ఇంక్రిమెంటు ఇస్తారంటే ఆ సిలబస్ పూర్తి చేయవచ్చు, నావలన మీకేమైనా ప్రయోజనం కలిగితే నేను సుందర కాండ చెప్పినట్లు, మీ సమయం నేను తినేశాననుకోండి ఇక్కడో మూడువేల మంది ఉంటే మూడువేల మంది యొక్క రెండు గంటలు అంటే ఆరువేల గంటల యొక్క సమయం ఎందుకూ పనికిరాకుండా మీకు ఒక కొత్త విషయం తెలియకుండా చెప్పి వెళ్ళితే ఆ కాలానికంతటికీ నేను జవాబుదారే. కాబట్టి ఎక్కడో ఒక్క విషయమైనా ప్రస్థావన చేయకపోతే దేనికి గబగబా చదవడం దేనికి చెప్పడంనేను, కాబట్టి మీకు ఉపాసనా రహస్యాల్ని గమనించవలసి ఉంటుంది.
ఆయన వెడుతున్నాడు అశోకవనానికి అశోకవనానికి వెడుతున్నప్పుడు ఆయన్ని అనుగమించారు రాజు కాబట్టి అనుగమించారు, అబ్బో శ్వేధఛత్రం పట్టారు ముందు కొంత మంది వాద్యపరికారాలు పట్టుకున్నారు, కొంతమంది విచ్చుకత్తులు పట్టుకున్నారు, కొంతమంది తొలగండీ తొలగండీ అని తొలగడానికి ఎవరున్నారు అక్కడ వాడు తప్పా అయినా అదో మర్యాదా తొలగండీ తొలగండీ అంటున్నారు తీసుకెళ్తున్నారు అయితే చిత్రమేమిటో తెలుసాండీ మహర్షి చాలా అందంగా మాట్లాడుతాడు ఆయన అన్నారూ కాచి ద్రత్నమయీం పాత్రీం పూర్ణాం పాన స్య భామినీ ! దక్షిణా దక్షిణే నైవ తదా జగ్రాహ పాణినా !! రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశి ప్రభమ్ ! సౌవర్ణ దణ్డమ్ అపరా గృహీత్వా పృష్ఠతో మయౌ !! చంద్రమండల సన్నిభమైనటువంటి ఒక గొడుగుని వెనక పట్టుకుని ఒకరు వెడుతున్నారు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
గొడుగు ముందు పట్టికెళ్ళిపోతూంటారు ఇదో విచిత్రం ఊరేగింపులు వెళ్తూంటాయికదూ గొడుగు పట్టుకున్నవాడు గొడుగు పట్టుకుంటే చాలు అక్కడ ఏమైనాకనపడిందనుకోండి ఈశ్వరుడి సేవచెయ్యాలి తాపత్రయం అది. కాబట్టి ఏం చేస్తూంటాడంటే ఆ గొడుగు పట్టుకుని తిరుగుతూంటాడు. ఈశ్వరుడు ఇక్కడుంటాడు ఎందుకా గొడుగు అంటే వాడు గొడుగు పట్టుకున్నాడు చాలు, గొడుగుని పట్టుకోవడం కాదు గొడుగుని ఈశ్వరునికి పట్టాలి కదాండీ! కాబట్టి ఈశ్వరునికి ఎండ పడకుండా నీడపట్టడానికి గొడుగు పట్టాలి, నేను ఇక్కడే ఎక్కడో చూశాను గొడుగు పట్టుకుని వెళ్ళిపోతూంటారు, గొడుగు పట్టుకుపోతూంటాడు, గొడుగు పట్టుకున్నవాడు ముందుంటాడు... వెనక ఉంటే ఆయన మీదికి క్షత్రం పట్టుకోవచ్చు అదీ కాదు ఇదీ కాదు అదో విచిత్రమైన పద్ధతి ఏమిటో రెండు పెద్ద గొడుగులు అటోటి ఇటోటి పట్టుకుంటారు ఆయన మధ్యలో ఎండలోనే ఉంటాడు అదీ విచిత్రం, అదేమిటో మరి నీడలో ఎవరుంటారంటే వీళ్ళిద్దరే ఉంటారు నీడలో గొడుగుపట్టుకున్నవారు మీరు చూడండీ ఈశ్వరునిమీద నీడేం ఉండదు, వీళ్ళిద్దరూ గొడుగుపట్టుకుని పక్కన నిల్చుంటారు చూడ్డానికి బాగుంటుంది అది ఎంత బాగుంటుందంటే ఈశ్వరుడు వాహనం మీద వెళ్తూంటే ఒకాయనా ఇటువైపుకు తిరిగి ఛామరం వేస్తూంటాడు మీరు చూశారో లేదో టీవీల్లో కనపడుతూంటూంది. ఈశ్వరుడువెళ్తూంటాడు వాహనంమీద ఒకాయన నిల్చొనీ మీకు బాగా కనపడేటట్టు వేస్తాడు ఎందుకంటే ఎదురుగుండా టీవీ ఛానెల్స్ చూస్తున్నాయి.
ఛామరం టీవీ కోసం నీకా ఈశ్వరుడికా ఈశ్వరుడికైతే ఇటు తిరిగివేయ్, నీవు టీవీ ఛానెల్లో బాగా కనపడాలని వేయ్యమాకు మీరు చూడ్డంలే... అలా ఉంటాయి సేవలంటే అదికాదు సేవ ఇక్కడ్నుంచి వస్తే సేవ, కాబట్టి కాచి ద్రత్నమయీం పాత్రీం పూర్ణాం పాన స్య భామినీ ఒకావిడా దక్షిణా దక్షిణే నైవ తదా జగ్రాహ పాణినా కుడిచేత్తో పట్టుకుని మళ్ళీ వాడికి శాస్త్రం ఎడమ చేత్తో పట్టుకుంటే దోషం వాడికీ శాస్త్రం అవమానించినట్టు చాలా జాగ్రత్తగా కుడిపక్కన కుడిచేత్తో పట్టుకుని ఒక భామ బంగారు పాత్రలో మధ్యం పట్టుకెళ్తూంది ఎవరికి విశ్రవసో బ్రహ్మ కుమారునికి వేదం చదువుకున్నాడు దేనికి కాల్చనా... నీచదువు ఎవరికి అంటే మీరు బాగాపట్టుకోవలసిందేమిటంటే ధర్మం అన్నమాటకు అర్థం తెలిసి ఉండుటకాదు ఆచరించుట, ఆచరించుట ప్రీ సపోజస్ తెలిసి ఉండుట, ఆచరణనెప్పుడు వస్తూందండీ తెలిసి ఉంటే ఆచరణ తెలియక తప్పుగా ఉంటే ఈశ్వరుడు మన్నిస్తాడు ఏం ప్రమాదం లేదు, తెలియదు ఎవరికి తెలియదు, తెలుసుకోవలసినవాడు తెలుసుకోకుండా నాకు తెలియదంటే ఇక క్షమార్పణలేదు. తెలుసుకోవలసినవాడు తెలుసుకోవలసిందే ఒంటిమీద యజ్ఞోపవీతం వేసుకున్నవాడికి తెలిసుండాలి అంతే ఒంటిమీద యజ్ఞోపవీతం వేసుకుని నాకు తెలియదంటే క్షమార్పణలేదు. ఎవరు అలా తెలుసుకునే అవకాశం లేనివారున్నారో వారు ఉపాసనలో వైక్లవ్యం వచ్చిందనుకోండి, ఈశ్వరుడున్నాడు క్షమించేదందుకే కర్మ భ్రష్టుడైనా ఆయన తెలుసుకునే అవకాశం లేనివాడై ఉన్నప్పుడు ఈశ్వరుడు క్షమిస్తాడు తెలుసుకోవలసిన అవసరం ఉండీ కర్మభష్టుడైతే ఈశ్వరుడు మన్నించడు. క్షమార్పణయందు ఈ లక్షణముంటూందండీ... అందుకే శంకరాచార్యుల వారు మాటలు ఏం ఉత్తిగనే అనలేదు శ్లోకాలు మార్గా-వర్తిత పాదుకా పశు-పతేర్-అఙ్గస్య కూర్చాయతే గణ్డూశామ్బు-నిశేచనం పుర-రిపోర్-దివ్యాభిశేకాయతే కిన్చిద్-భక్శిత-మాంస-శేశ-కబలం నవ్యోపహారాయతే భక్తిః కిం నకరోతి-అహో వన-చరో భక్తావతమ్సాయతే తిన్నడు అడవిలో తిరుగొచ్చినటువంటి చెప్పుతో కూర్చగా నిర్మాల్యం తీశాడు ఈశ్వరుడు అంగీకరించాడు, ఆయనకేమీ తెలియదు ఏమీ తెలియనివాడు అలా చేస్తే

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఒప్పుకున్నాడు. తిన్నడు అలా తీస్తే బాగుందటాండీ మా గుళ్ళో అలా చేస్తామంటే మూడోకన్ను తెరుస్తాడు, నీకు తెలిసుంటే తెలిసినట్లే చెయ్యాలి అంతే.
Image result for లలితా దేవిఅంతేకానీ ఆయనకేమీ తెలియకచేశాడు అంగీకరించాడు, ఏమీ తెలియదు శివుడికి పెట్టాలనుకున్నాడు, ఓ మాంసం ముక్క నోట్లో పెట్టుకుని నైవేధ్యంపెట్టి పట్టుకొచ్చాడు తిన్నాడు, ఎంగిలి మీరు గుక్కిటపట్టి తీసుకొచ్చి అభిషేకమన్నాడు ఉమ్మేశాడు స్వీకరించాడు తప్పా నీకు తెలిసుండీ నీవు అది చేస్తానంటే ఒప్పుకోరు అలాగ నీకు తెలుసుకోవలసినవారు తెలుసుకున్నవారు తెలుసున్నది ఆచరణలోకి తీసుకొస్తే ధర్మం, తెలుసుకోవడం తెలుసూ... ఆచరించడం పనికిరాదు అది ధర్మంకాదు అది నేను మీతో అన్నది అదే... ఫరవాలేదండీకీ - ఛ్ కి సంఘర్షణ సుందర కాండ. ఫరవాలేదండీ ఏమిటీ నీవు శాస్త్రాన్ని అంగీకరించినట్లా వ్యతిరేకించినట్లా అంటే అలా ఉందిలేండి కానీయండి ఏంటంటే ఫర్వాలేదులేండి అంటే చేసేయ్యండి, అంటే శాస్త్రోల్లంఘనం చేయమని చెప్పడం ఫర్వాలేదండీ అని చెప్పడం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మధ్యపాత్ర తీసుకెళ్ళడమేమిటండీ బ్రాహ్మణుడికి విశ్రవసో బ్రహ్మయొక్క కుమారుడు సంధ్యావందనం చేసేవాడికీ తెల్లవారిగట్ల కామం కలగడం ఏమిటీ సీతమ్మదగ్గరకెళ్ళటమేమిటీ పక్కన మధ్యపాత్ర పట్టుకెళ్ళడమేమిటీ, వొంటిమీద బట్టలు సరిగ్గాలేనివారందరు బట్టలు సరిగ్గా కట్టుకోకుండా కళ్ళు తిరుగుడు పడుతూ వాళ్ళు స్నానాల్లేకుండా వెళ్ళడమేమిటీ అసలు అంతకన్నా అహస్యకరమైనటువంటి ప్రవర్తన ఇంకోటి ఉంటూందా..?
ధర్మమంటే ʻధయతేవా జనైరితి ధర్మంʼ పట్టుకున్నది ధర్మం తప్పా తెలుసుకున్నది ధర్మం కాదు, నాకు సంధ్యావందనం చెయ్యాలని తెలుసండి నాకు సంధ్యావందనం గురించి రెండు గంటలు ఉపన్యాసం చెప్తానన్నాడనుకోండి అది ధర్మంకాదు. సంధ్యావందనం చేశాడనుకోండి అది ధర్మం, ధర్మం అంటే చేయడం తప్పా తెలిసి ఉండడం ఎప్పుడూ ధర్మంకాదు, తెలిసి ఉన్నది ఆచరిస్తేనే ధర్మం కాబట్టి ఇప్పుడు ఏమి చెప్తున్నట్లు మహర్షి మనకీ తెలుసున్నవాడే కాని చేసేవాడు కాదు, తెలిసుండి చేసేవాడు రాముడు, తెలిసుండి చేసేవాడి ముందు తెలిసుండి చెయ్యనివాడు నిలబడుతాడా..! ఇది ఉపాసన ఇది ప్రశ్న, తెలిసుండి చేసేవాడికి ఒక తలకాయ, తెలిసుండి చెయ్యనివానికి పదితలకాయలు అంత తపస్సు ఈశ్వరుని అనుగ్రహం కత్తీ నిలబడుతాయా... కాంచనలంక నిలబడవు పోతాయి ధర్మో రక్షిత రక్షితః నీవ్వు ధర్మాన్ని పట్టుకోవడమంటే అనుష్టిస్తే నిన్ను ధర్మం రక్షిస్తూంది ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్నా నిన్ను రక్షించవు ఇది చెప్పడం సుందర కాండలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ధర్మానురక్తి పెరగాలీ అంటే శ్రీరామాయణం చదవడం వినా మార్గంలేదని పెద్దలు అంగీకరించారు, శ్రీరామాయణం చదువుకో శ్రీరామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం కావాలి ఎందుకంటే ధర్మం మనుష్యులకోసమే చెప్పబడింది తప్పా పశువులకోసం కాదు, పశు ధర్మం ఒక్కటే పశుధర్మం కోసం ఒక్కటే ధర్మం. మనకి అలాగ కాదు ప్రతి క్షణం మారుతూంది ధర్మం మారే ధర్మం ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి, ఏకాదశినాడు ఉపవాసం ధర్మం ద్వాదశినాడు తొందరగా భోజనం చేయడం ధర్మం మా అమ్మగారి నిల్చుంటే పుత్ర ధర్మం, మా అమ్మాయి ముందు నిల్చుంటే పితృధర్మం అస్తమానం మారుతూంది ధర్మం మారుతున్నటువంటిదాన్ని ఎలా పట్టుకోవాలో నేర్పడం ఏది పట్టుకోవాలో ఏది విడిచిపెట్టాలో ఏది విడిచి ఏది పట్టుకోవాలో ధర్మం కాబట్టి ఆ పట్టూ విడుపూ అనుష్టానం ప్రక్రియలోకి రానప్పుడు ధర్మమేలా అవుతూంది అవ్వదు అవ్వనప్పుడు అనుష్టిస్తున్న ధర్మం ముందు తెలుసుకున్న ధర్మం నిలబడదు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఇది చెప్పడం సుందర కాండ. కాబట్టి ఇప్పుడు మనం అభ్యున్నతిని పొందాలీ అంటే ఏం చెయ్యాలీ అని రామాయణం యొక్క తీర్పు ఖచ్చితంగా మీరు ధర్మాన్ని తెలుసుకోవడం కాదు ధర్మాన్ని అనుష్టించాలీ అంటాడు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
Image result for అశోకవనం సీతకాబట్టి సమీపం రాజ సింహ స్య రామ స్య విదితాత్మనః ! సంకల్ప హయ సంయుక్తై ర్యాన్తీమ్ ఇవ మనోరథైః !! ఇయ్యనా అశోకవనంలో ఉన్న సీతమ్మదగ్గరికి వెళ్ళాడు, సీతమ్మేలా ఉందంటున్నాడు ఇది మహర్షి సుందర కాండంటే మహానుభావుడు ఏమి రచన చేశాడండీ సంకల్పములనేటటువంటి గుఱ్ఱములను పూంచిందట ఆవిడా దేనికీ మనస్సనేటటువంటి రథానికి ఇప్పుడు కదులుతూంది మనస్సు మనస్సు దేనిచేత కదులుతూందండీ సంకల్ప వికల్ప సంఘాతమే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి సీతమ్మ మనసూ కదిలింది, సంకల్ప వికల్ప సంఘాతమైన రావణుని మనసూ కదిలింది. కదలడం మనసు ధర్మం, ఆయన మనసు తెల్లవారుఝామున పరకాంతయందు కామోద్రిక్తుడై వికారములతో కదిలింది, ఆయన మనసు పొందిన వికారము పైకి తెలుస్తూంది ఇప్పుడు, ఆవిడ మనసూ కదిలింది ఆవిడ మనసు ఎలా కదిలింది సంకల్పములన్న గుఱ్ఱాలు కట్టబడి మనస్సన్న రథం మీద కూర్చుని రామ చంద్ర మూర్తిని చేరింది, ఎవరు నిలబడుతారు ఎవరు పడిపోతారు ఆవిడ ధర్మంలో ఆవిడ ఉంది ఆవిడ భర్తను స్మరించింది, ఈయ్యనెవరిని స్మరిస్తున్నాడు పరకాంతని స్మరించాడు భ్రష్టత్వంకాదు ఎంత అద్భుతమండీ... సంకల్పవికల్పములు మనసు యొక్క లక్షణమది అది ఆపరేషన్ చేసి చూస్తానంటే ఏం కనపడదు కన్నులాగా గుండెలాగా ఊపిరితిత్తుల్లాగా మూత్రపిండాల్లాగా అదేం కనపడదు, కనపడకపోయినా అదే నడిపిస్తూంది శరీరాన్ని ఉద్ధరణకాని పథనం కాని దానివల్లే మనం మనో హి హేతుః సర్వేషామ్ ఇన్ద్రియాణాం ప్రవర్తనే నిన్ననేకదా ఆయన అన్నారు హనుమా.
కాబట్టీ సీతమ్మ అటువంటి ధ్యాన స్థితిలో ఉంటే ఆవిడ ఎలా ఉందో రావణుడు వెళ్ళేటప్పటికి చెప్తున్నారు అభూతే నాఽపవాదేన కీర్తిం నిపతితా మివ ! ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రశిధిలా మివ !! అంటే అది నిజమైనటువంటి ఆరోపణ కాదు, ఆరోపణా అంటే ఎదో దొంగతనం చేశాడండీ అన్నాననుకోండి, అండర్ ట్రయల్ అంటారు, వీడు నిజంగా దొంగతనం చేశాడా చేయలేదా న్యాయవిచారణ జరుగుతూంది. ఇయ్యన దొంగతనం చేశాడా చేయలేదా అని విచారణ జరుగుతున్నంతకామూ అపకీర్తి ఉంటుంది, ఎందుకంటే ఏమో దొంగతనం చేశాడేమిటోనండీ తీసుకెళ్ళారంటారు. ఆయన దొంగ కాదు అసలు దొంగని ఇంకొకళ్ళని పట్టుకున్నారు ఇప్పుడు ఆయన కీర్తి ఏమైంది మళ్ళీ ప్రకాశించింది అలా ఒక దోశము లేకపోయినా ఆరోపింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉందట సీతమ్మ అభూతే నాఽపవాదేన కీర్తిం నిపతితా మివ ! ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రశిధిలా మివ !! అంటే ఆమ్నాయం అంటే బాగా అదేపనిగా  పునఃచరణ చేసేటటువంటి మంత్ర భాగాన్ని చెయ్యడం మానేశాడనుకోండి మంత్రం జ్ఞాపకంలోకి రాలేదు లేకపోతే తాను ఏ విధ్యని అమ్నాయం చేస్తున్నాడో ఏ విద్యని నిరంతరము ఎందుకంటే ఇది మళ్ళీ చెప్తాను చాలా గమ్మతైన విషయం, మళ్ళీ ఇది ధర్మంతో కూడకుని ఉంటుంది తెలుసాండీ..? ఎవరుపడితేవాళ్ళు ఏది పడితే అది తిప్పడానికి వీళ్ళేదు ఏది నీవు ధర్మంగా తిప్పావో దాన్నిబట్టే నీకు సంస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడూ ఒక గృహస్తు ఉన్నాడనుకోండి గృహస్తు ఎప్పుడూ ఒక ఆత్మ సంబంధమైన విషయాన్నే తిప్పడం శాస్త్రం అంగీకరించదు అందుకే చిన్న పిల్లలకు ప్రణవం పలకించకండి అని చెప్తారు. చిన్న పిల్లలతో ఓంకారాన్ని అస్తమానం పలకించద్దూ అని చెప్తారు, అది ఒక వయసుదాటిన తరువాత ప్రణవతం తప్పా అందరూ ప్రణవం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ప్రణవం చిన్న పిల్లలు చెప్తే దానివల్ల వచ్చే ప్రయోజనం వేరుగా ఉంటుంది. అలా చెప్పించకూడదనే చెప్పింది శాస్త్రాలు, సాధికారిక వ్యాఖ్యానాలు చేస్తే అలాగే చెప్పారు పెద్దలు, చెప్పించకూడదు పిల్లలతో అని చెప్పారు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
అయినప్పుడు ఒక సన్యాసి ఉన్నాడనుకోండి, సన్యాసి ఎప్పుడూ ఏం తిప్పాలి మనసులో సన్యాసి ఎప్పుడూ ఆత్మవిచారమే తిప్పాలి తప్పా ఆయన ఇంకా ఏదీ ముట్టుకోడు, అసలు ఇంకొకటి ఏదీ తిప్పకూడదు ఆయన కేవలం ఆత్మ విచారం. ఆత్మ విచారమే తిప్పీ ఎప్పుడు ఆయన నేను ఇవి తిందామని వండుకుంటున్నానండీ అని కూడా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు, తినడానికి ఒండుకోడు తను ఒక కర్మ చేసి ఉద్దరణ పొందడానికి అగ్నిహోత్రం చేయడు. అసలు అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టేశాడు కాబట్టీ ఆయన శరీరం పడిపోయినా కడా అగ్ని సంస్కారం చేయడు ఆయన్ని భూ స్థాపితం చేసేస్తాయి, ఎవరి ధర్మం లోపల తిప్పే విద్యకూడా ʻవిత్ʼ అంటే తెలుసుకునేది కదాండి మీరు తిప్పడాన్ని బట్టి తెలుసుకుంటుంది మనసు, దానివల్ల తరిస్తారుమీరు ఏది పడితే అది ఎవరుపడితే వాళ్ళు తిప్పడమేం కుదరదు. నేను నాకు ఆయనంటే ఇష్టమని ఆత్మవిచారం తిప్పుతానని తిప్పకూడదు, అస్తమానం ఆత్మవిచారణ తిప్పకూడదు గృహస్తైనటువంటివాడు ఇంట్లో ఉన్నవాళ్ళందరి అభ్యున్నతిలోకి రావడానికి కావలసినటువంటి కామ్య సంకల్పం చేసి పూజ చేయవలసి ఉంటుంది లేకపోతే ప్రతిరోజు మీరు ధర్మేచా కామేచా అర్థేచా అంటూ ధర్మార్థకామ పురుషార్థ సిద్ధర్థం అని ఎందుకు చెప్తాం. గృహస్తు సంకల్పం వేరు సన్యాసి సంకల్పం వేరు బ్రహ్మచారి సంకల్పం వేరు ఆయన ధర్మం వేరు ఇయ్యన ధర్మం వేరు ఇంక అన్నీ ఎవడు తిప్పేదివాడు, ఎవడు తిప్పవలసింది వాడు తిప్పుతున్నప్పుడు వాడికది జ్ఞాపకం రాకుండా మరిచిపోయాడంటే వాడు తిప్పడంలో వాడి శ్రద్ధలో లోపమొచ్చిందని గుర్తు అది ఎలా ఉందో అమ్మవారు అలా ఉందటా.
Related imageఇది నిజానికి పైకి లోపల దాని అర్థమేమిటీ ఈవిడా పదినెలలు సీతమ్మని తీసుకెళ్ళి లంకారాజ్యంలో శింశుపా వృక్షంకింద కూర్చోబెట్టాడు సీతమ్మని అనుభవించచ్చు అనుకుంటున్నాడూ ఇవి ఏమన్నా నిలబడుతాయా సీతమ్మ రాముని దగ్గరకి వెళ్ళిపోతూంది, సీతమ్మ తపస్సు ఫలిస్తుంది తను ఏది చదువుకున్నాడో అది మరిచిపోయాడు, తెల్లవారిగట్ల లేచి వేదం చదువుకున్నవాడు సంధ్యావందనం చేయాలన్నది మరిచిపోయాడు చదువుకున్నాడు మర్చిపోవడమంటే... జ్ఞాపకం రాలేదండీ కాదు శ్రద్ధ పోయింది దానికి చాలా ముఖ్యమైన విషయం నేను ఇంతకు ముందు సంధ్యావందనం చెయ్యాలి అసలు దానిమీద బుద్ధే... లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు పాడైపోతారు రావణుడు పాడైపోతాడు ఎవరు ప్రకాశిస్తారు సీతమ్మ ప్రకాశిస్తూంది కాబట్టి ఆమ్నాయనాం ఆయోగేన విద్యాం ప్రశిధిలా మివ అని సన్నామ్ ఇవ మహా కీర్తిం శ్రద్ధామ్ ఇవ విమానితామ్ ! పూజాం ఇవ పరిక్షీణామ్ ఆశాం ప్రతిహతామ్ ఇవ !! కీర్తి తరిగిపోతే ఆవిడ కీర్తి తరిగిపోవడం ఉండదు, ప్రస్తుతానికి అలా ఉందికాని ఆవిడ కీర్తి రెట్టించిన శోభతో ఉంటుంది, తరిగిపోతున్న కీర్తి రావణాసురుంది శ్రద్ధామ్ ఇవ విమానితామ్ శ్రద్ధా అంటే ఇది సత్యమన్న బుద్ధి చదువుకుని అది వాడికి లేదు ఆవిడకి ఏది ఉండాలో అది ఆవిడకి ఉంది సంకల్పమనే గుఱ్ఱంతో మనస్సనే రథమెక్కి రాముని దగ్గరకి వెళ్ళింది.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇప్పుడు ఎవరికి శ్రద్ధలేదు పైకి తరిగిపోయిన శ్రద్ధలా సీతమ్ముంది కానీ తరిగిపోయిన శ్రద్ధకి ప్రతి స్వరూపం రావణాసురుడు పాడైపోయేవాడు వాడు పూజాం ఇవ పరిక్షీణామ్ క్షీణించిపోయిన పూజలా ఉంది చెయ్యవలసిన పూజ చెయ్యనివాడు ఎవడు ఇప్పుడు ఆయన, చెయ్యవలసింది చేస్తున్నది ఎవరు ప్రతిబంధకంలో కూడా ఆవిడా... ఆశాం ప్రతిహతామివ అనుకున్న ఆశ నెరవేరనట్లూ ఎవరికి నెరవేరకుండా ఉంటుంది రావణుడికి కదాండీ నెరవేరేదెవరికి సీతమ్మకి శ్లోకం ఒకలా ఉంటుంది సీతమ్మ అలా ఉందంటారు, పైకి చూస్తే దానివలన ఫలితం ఎలా ఉంటుందో అలా అమ్మవారు ఉంటుంది. కానీ ఫలితమెవరిమీద ఉంటుంది రావణుడిమీద ఉంటుంది ఇదీ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం. కాబట్టి ఇప్పుడు ఆయనా సీతమ్మదగ్గరికి వెళ్ళాడు వెళ్ళీ మాట్లాడటం ప్రారంభం చేశాడు, తెల్లవారుఝామున కాముకతో వెళ్ళిన రావణుడు ఏం మాట్లాడుతాడో దాన్ని మహర్షి ఆవిష్కరించడంలో ఒక వైభవమొకటుంది దాన్ని మనం గమనించవలసి ఉంటుంది. ఒకటి వెళ్ళడం తప్పు కాబట్టి ఇప్పుడు వెళ్ళి మాట్లాడేమాటలు కూడా ఖచ్చితంగా మంచివై ఉంటాయి అని మీరు ఊహించలేరు. కానీ ప్రమాదపుటంచులన్నవి ఎంతదూరముంటాయో అంతదూరమూవెళ్ళిమాట్లాడాడు ఎందుకంటే మాటా అనేటటువంటిదే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. రామ రామ రామ రామా రామా రామా అనుకుంటూ రామ నామాన్ని మీరు మాటగా మార్చుకున్నారనుకోండి అంతే తరిస్తారు. మాట మనుష్యుడికే కదాండి ఉంది అందుకే.
అందుకేగా పెద్దలందరూ ఏడ్చింది దేనికంటే... ఇంకోటీ ఇంకోటీ అని ఏడ్వలేదు అయ్యా నీ నాలుకమీద నామం తిప్పవయ్యా అని ఏడ్చారు హరునకు నవ్వభిషణున కుద్రిజనకున్ దిరుమంత్రరాజమై, కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నా ర్తిహరించు చుర్త్తమై పరగినయట్టి నీ పతితపావన నామము జిహ్వపై నిరం తరం నటింపజేయు మిక దాశరథీ కరుణాపయోనిధీ !! అని గోపరాజుగారు ఏడ్చారు పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారంబు భూమిస్థలం బవు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివ సద్భుద్ధిని మాకు నిచ్చుటెపుడో శ్రీ కాళహస్తీశ్వరా అని దూర్జటి ఏడ్చాడు. ఆ నామం నా నాలుక మీద పలికించవయ్యా కాలం అయిపోకముందే అనీ ఉన్న శక్తి ఈశ్వరనామంగా ఉండాలని ఏడ్చారు, నీవు నామం పలకకపోతే ఒకెత్తు మాట మాట్లాడేటప్పుడు కేవలం మాటకు ఏదో చిన్న శక్తి ఉంటుందని మీరు అనుకోకండి, బల్జేపల్లివారు “కడుపుల్ రంపపుకోత కోయునదియే గాయాలు కాకుండినన్” అంటారు, ఒక మనిషిని రంపం పట్టుకుని అటూ ఇటూ ఇద్దరు మనుషులు నిలబడీ అనేస్తీషియా ఇవ్వకుండా కోసేశారనుకోండి ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ మీరు అనకూడని మాటటొకటి అంటే కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మాట వలన ఎంత బాధ అవతలివారు పొందుతారో ఆ మాట యొక్క ఫలితాన్ని మీ ఖాతాలో వేసి అనుభవింపజేస్తారు. ఇప్పుడు రావణుడు తెల్లవారిగట్ల వెళ్ళి ఒండుకుంటున్నది ఏమిటీ తన మృత్యువు, వెళ్ళి ఈశ్వరుడి దగ్గర నామాలు చెప్పాడనుకోండి తన అభ్యున్నతి, కాలమూ దేశమూ దానికి ఉపయోగపడేవి, తత్ వ్యతిరిక్తముగా మాట్లాడుతున్నాడు తెలియకా..? తెలిసి ఆ కాలంలో చేయకూడదది, ఇది ఇంకోపాపం ఇది చేయ్యకూడదు నీవు, కాబట్టి నీవు కూడా తెల్లవారుఝామున లేస్తే చెయ్యవలసిందేదో తెలుసా... లేచి కూర్చుని కాఫీ తాగుతూ పేపరు చదువుతూ ప్రతివాన్నీ తిడుతూ అక్కరలేని విషయాలజోలికెళ్ళడం కాదు ఎందుకంటే పేపరన్నతరువాత ఇవ్వాళ రోజుల్లో ఉండేదేమిటంటే వీడి వాన్నేం తిట్టాడు వాడు వీన్నేం తిట్టాడు, నీకెందుకదీ సంధ్యావందనం చేయ్ తీసుకొచ్చి చదువు గొడవ వదిలిపోతుంది. ఆ తరువాత వ్యగ్రతపొందినా గొడవుండదు. నీవు ఇది చదివి సంధ్యావందనానికి వెళ్ళితే పళ్ళు పట పట కొరుకుతూ గాయిత్రి చేస్తావు నీవు, కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో ఇది కదాండీ చెయ్యవలసిన కర్తవ్యా అంమృతం కార్యం సతాం మన్య మునీనయేత్ అంటారు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
చెయ్యవలసినపని దేశకాలముల గురించి సుందర కాండలో ఎంత గొప్పగా మాట్లాడుతారో కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళీ ఆవిడతో అంటున్నాడు. కామయే త్వాం విశాలాఽక్షీ బహు మన్యస్వ మాం ప్రియే ! సర్వాంగ గుణ సంపన్నే సర్వ లోక మనోహరే !! నేనూ చెప్పలేకా నోరురాకా అంత చెప్పాలా వాళ్ళు చదువుకుంటారు కదాని వదిలేస్తున్నాను కానీ... ఆవిడ

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
రావణుడు వస్తున్నాడూ అని గమనించిది, హనుమా గమనించాడు వస్తున్న శబ్దం తెలుస్తుంది కదాండి ఆయనా సర్దుకు కూర్చున్నారు ఎందుకంటే బాగా తెలుసుకోవాలని విషయాన్ని విని తెలుసుకోవాలని వినదగు నెవ్వరు చెప్పిన వినంతనె వేగపడక వివరింపదగున్ అసలు వీడు ఎటువంటివాడు, ఎటువంటి శిక్ష వేయవచ్చని ప్రభువుకు చెప్పవలసి ఉంటుంది, ఏమైనా చెప్తే మారే లక్షణమేమైనా ఉందా..! ఏం మాట్లాడుతాడు మాట బట్టి సంస్కారం తెలుస్తూంది, చూడాలి అటువంటి మాట విని ఈవిడెలా మాట్లాడుతుంది, ఈవిడా అంతే కోపం తెచ్చుకుంటూందా ఇదేకదా తార అడిగింది కిష్కింధ కాండలో ఆయన తప్పుచేశారయా వానరుడు ఆయన కామానికి లొంగాడు నీవు కోపానికి లొంగావు ఏమిటి తేడా మీ ఇద్దరికీ అని అడిగింది. ఇంత లక్ష్మణ మూర్తి ఏమైపోయాడు. కాబట్టి ఇప్పుడు పరిశీలిస్తున్నాడు పైన కూర్చున్నాయన, పరిశీలిస్తున్నాడన్నమాట కూడా సాహసమే ఎందుకంటే సీతమ్మని పరిశీలించడానికి ఆయన కూర్చోలేదు అయన అలా ఆభావనలేదు, కాకతాళీయం అనుషంగికం అది వినడం కానీ రావణుడి మాటలు మాత్రం ఆయన శ్రద్ధగా వింటున్నాడు. వీడు ఎలా మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి ఆయన సంస్కారాన్ని బట్టి అంచనావేయడానికి. రాత్రి పడుకున్నప్పుడు చూశారు జాగృత్తిలో వీడి సంస్కారం తెలియదు నిద్రలో వీడి సంస్కారం ఎలా తెలుస్తూందండీ జాగృత్తిలో సంస్కృతి తెలుస్తూంది ఎలా మాట్లాడుతాడు ఎలా కదులుతాడు డన్నదానిబట్టి తెలిసిపోతుంది.
Image result for అశోకవనం సీతకాబట్టి ఆయన చూడ్డానికి శ్రద్ధగా కూర్చున్నాడు, సీతమ్మా ఆవిడెలా కూర్చుందంటే నేను ఆ శ్లోకం చదివి తాత్పర్యంగా మాట్లాడనుకానీ చాలా జాగ్రత్తగా ఆవిడ శరీరంలో అసలు కొన్ని కొన్ని అవయవాలు లీలా మాత్రంగా కనపడ్డానికి కూడా వీలులేని రీతిలో ఆవిడ కూర్చుంది. ఎందుకంటే అసలు లీలా మాత్రంగా కనపడినా వాడు కామోద్రేకం పొందుతాడు వాడికి దేశ కాలములతో సంబంధంలేదు అంటే ఒక ఆడది అంత భయపడవలసి వచ్చింది, వాడి ఎదురుగుండా కూర్చోవడానికి కూడా అంటే వాడిది ఎంత విశృంకలత్వం పొందిన కామమో మీరు అర్థం చేసుకోవచ్చు. అదీ ఎవరిమధ్యలో ఇంత మంది కాంతల మధ్యలో అంత కామమంతో ఇంకో ఆడదానితో మాట్లాడుతాడు అసలు అలా మాట్లాడచ్చాన్న సిగ్గూ లజ్జా కూడా ఆయనకు ఉండవు. కాబట్టి కామయే త్వాం విశాలాఽక్షి నేను నీయందు కామం పొందాను బహు మన్యస్వ మాం ప్రియే నేను సకల లోకములలోను కూడా సకలలోకములలోనూ అహ్లాదమునుగొలుపునటువంటి చూపులు కలిగిన ఓ విశాలాక్షీ అంటే వాడి ఉద్ధేశ్యమేమిటో తెలుసాండీ, ఆమె ఎటువైపుకు చూస్తే అటువైపుకు చూడబడినవాళ్ళందరూ కూడా వశులై ఆవిడని తనదిగా చేసుకోవాలని కోరిక ఉన్నటువంటి నయన సౌందర్యమున్నటువంటి తల్లీ అని, తల్లీ అని కాదు కదా... అంటే నేనైతే అంటున్నాను కానీ... ఇప్పుడు తప్పెవరిది అంటున్నాడు అంత అందంగా నీకుండడం నీ తప్పు నీవు అందగత్తెవు కాకపోతే నేనెందుకు తీసుకొచ్చిండేవాడ్ని.
ఇదే విశాలాక్షి శంకరాచార్యులవారికైతే దృశా ద్రాఘ్రీయస్యా – దరదళిత నీలోత్పల రుచా లోకాలన్నింటికి కాపాడగలిగినటువంటి తల్లి, ఈయ్యనకీ లోకాలన్నింటినీ కూడా అహ్లాదకలిగించగలిగినటువంటి చూపున్న దానివి నేనేమిటీ ఎవరైనా నీ చూపు చూస్తే పడిపోతారు, నీవు చూసినా నిన్ను చూసినా పడిపోవడం తథ్యం. ఇదీ ఎంత ధారుణంగా ఉంటుందంటే ఇందులో ఆయన మనసులో ఒక దృష్టికోణం ఉన్నది, అందుకే తీసుకురాగానే తన ఐశ్వర్యాన్ని చూపించాడు. ప్రతి ఆడదీ ఐశ్వర్యానికి పడిపోతుందని ప్రతి ఆడదీ పొగిడితే పడిపోతుందనీ రావణుడికి లోపల ఒక నమ్మకం, అంటే ఎంత తప్పైనా చేసేస్తారు ఈ రెండు ఉంటే చాలు. కాదు వాళ్లు అలా ఉండరూ అన్న స్థితి ఉన్నవాడు రామ చంద్ర మూర్తి. అలా అనుకునేవాడు రావణాసురుడు. ఈ రెండింటిలో నీవు ఎలా ఉన్నావో నిన్ను పరిశీలించుకోవలసి ఉంటుంది. సుందర కాండ అన్న అద్దంలో నీ ప్రబింబాన్ని చూసుకోవాలి. దానికి నీవు ఎవరికీ చెప్పక్కరలేదు ఒకవేళ నీవు తేడాగా కనపడితే నీవు దిద్దుకోవలసి ఉంటుంది. కాబట్టి సర్వాంగ గుణ సంపన్నే సర్వ లేక మనోహరే గొప్ప అంగవైభవము కలిగినటువంటిదానా సర్వలోకముల యొక్క మనస్సును హరింపగలిగినటువంటిదానా నేను నీయందు కామమును పొంది యున్నాను అంటే అలా కామం పొందకుండా ఎవడుంటాడు అది ఆయన ఉద్ధేశ్యమన్నమాట అంటే తప్పు తాను చేశాననడు, దబాయించి మాట్లాడుతాడు ఇదీ రావణ ప్రవృత్తి. తప్పుని హా... నిజమే నేను అలా చేయకుండా ఉండవలసింది అని నన్ను క్షమించండి అని అన్నారనుకోండి మీరు రాముడు. ఎంత సేపటికీ దబాయించే ప్రయత్నం చేసి ఇంకేమీ కుదరలేదనుకోండి ఆ వ్యాఖ్యలు వక్రీకరింపబడ్డాయి అన్నారనుకోండి మీరు రావణుడు అంతే తప్పా... నిజమే నేను అలా అనకుండవలసి ఉండింది నేను క్షమార్పణ చెప్తున్నాను అన్నారనుకోండి మీరు రామ చంద్ర మూర్తని గుర్తు. హృదయ సంస్కారముందని గుర్తు అలా ఒక్కనాటికీ ఒంటికి ఎన్నేళ్ళు వచ్చినా అనరు అది ఏమి సంస్కారము అది వద్దు అలా ఉండకండి చెప్తోంది సుందర కాండ.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
Image result for అశోకవనం సీతతెలియకపోవడం తప్పుకాదు తప్పు చేయడం తప్పుకాదు తప్పని చేస్తే తప్పని మీ మనసుకు అనిపించగానే క్షమార్పణ చెప్పాలి అది సంస్కారం తప్పా, దభాయించే ప్రయత్నం చేయద్దు, అలా ప్రయత్నం చేస్తే జ్ఞాన ఖలునిలోని శారదవోలె అది మంచిపద్ధతికాదు. కాబట్టి నేహ కేచిన్ మనుష్యా వా రాక్షసాః కామ రూపేణః ! వ్యపసర్పతు తే సీతే భయం మత్తుః సముత్థితమ్ !! ఆయన అంటాడూ దేనికలా భయపడుతున్నావు అలా భయపడుతూ కూర్చున్నావు అలా ఒదిగిపోయి జాగ్రత్తగా మోకాళ్లూ ఒత్తుకు కూర్చుని మోకాళ్ళతోటీ చేతులతోటీ కనపడకుండా ఏదో గువ్వపిట్టలా అలా ముడుచుకుపోయి భయపడుతావు ఎందుకు, ఇక్కడ ఎవ్వరు మనుష్యులులేరు రాక్షసులూ లేరు మరి ఎదురుగుండా ఉన్నవాళ్లు నా కింకర్లే మరి మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నా ఎవరికి తెలియదు. అంటే ఆయన ఉద్ధేశ్యం ఏమిటంటే ఆవిడ కూడా విరాటపర్వంలో సైరంధ్రీరూపంలో ఉన్న ద్రౌపది మాట్లాడినట్లు ఏదో మాట్లాడుదామనుకుంటుంది కానీ వీళ్ళందరున్నారు ఇలా మాట్లాడానని రేపు పొద్దున్న అందరికీ తెలిసిపోతే అంటే ఎవరికి తెలియకుండా తప్పుచేయడానికి ఇష్టపడుతూందేమో అంటే వాడి ఊహల దరిద్రానికి అంతులేదు అసలు, అవతలవాళ్లు ఏ బ్రష్టత్వానికైనా సిద్ధమని తాను భ్రష్టత్వం పొందుతుంటారు తప్పా అసలు ఆయనైతే పైనున్నాయన ఉష్ణాఽర్దితాం సాఽనుసృతాఽస్ర కణ్ఠీం పురా వరాఽర్హోత్తమ నిష్క కణ్ఠీమ్ సుజాత పక్ష్మామ్ అభిరక్త కణ్ఠీం వనే ప్రనృతాన్ ఇవ నీల కణ్ఠీమ్ ! అంటారు ఆయన. వీడికి ఇలా కనపడుతుంది వీడికి నీ మనసు నిన్ను పాడు చేసేస్తుంది అలా ఆలోచించకు చాలా తప్పు ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకో ఇదీ సుందర కాండ తీర్పు కాబట్టి ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నారో... వీళ్ళందరున్నారని భయపడుతున్నావా ఏం భయంలేదు నీవేం బెంగపెట్టుకోవక్కరలేదు మనిద్దరం ఏం మాట్లాడుకున్నా ఏం తప్పుచేసినా ఎవ్వరికీ తెలియదు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః ! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా !! వాడొక విషయాన్ని తెలుసుకున్నాడు ఆవిడ దగ్గర ఏంటంటే ఆవిడకి ధర్మమంటే ఇష్టమూ అని తెలుసుకున్నాడు, ఏంటంటే నేను పతివ్రతనీ నా పతివ్రతా ధర్మం నా పతివ్రతా ధర్మం అంటూంది కదా రాముడు ధర్మాత్ముడు అంటూంది కదా... కాబట్టి నేనూ ధర్మాత్మున్నే అంటే పోటీకి రావడం తేలికా కాబట్టి ఇప్పుడు ఒక కొత్త భూకరింపు ఒకటి తీసుకొచ్చాడు కొత్త దభాయింపు ఒకటి తీసుకొచ్చాడు ఏమన్నాడో తెలుసా స్వధర్మో రక్షసాం భీరు అలా ధర్మంలో నిలబడినవాన్ని చూసి భయపడచ్చా, రామున్ని చూసి ఎందుకంత సంతోషపడుతున్నావ్ అలా నన్ను చూసి కూడా సంతోషపడు నేను నా ధర్మం నేను చేస్తున్నాను. ఏమిటి నా ధర్మం రాక్షసున్ని- కాబట్టి నాకు నచ్చింది ఎత్తుకొస్తాను, నాకు నచ్చితే అనుభవిస్తాను చూడూ ఎంతబాగా చేస్తున్నానో నా ధర్మాన్ని, నీవు సంతోషించద్దూ నా ధర్మం చూసి ఎంత ధర్మాత్ముడని నన్ననవేం ధర్మాత్ముడని. ఏమనాలీ...! ఇప్పుడూ ఎవరో ఒక డాక్టరుగారి దగ్గరికెడితే నాయనా నీవు ఎక్కువగా తాగేస్తున్నావయ్యా తాగకూడనటువంటి మధ్యాన్ని అంత మధ్యం తాగితే నీవు చచ్చిపోతావు ఇంక ఎందుకోతెలుసా ఇదిగో ఇలా చూడు అని గ్లాసులో కొంచెం మధ్యంపోసి రెండు క్రిముల్ని అందులో వేశాడు అవి గిల గిలా కొట్టుకుని మరణించాయి. చూశావా అందుకే తాగద్దన్నాను ఇవి ఎలా చచ్చిపోయావో అలా చచ్చిపోతావు నీవు తాగి అంటే ఆయనన్నాడు అందుకే తాగుతున్నాను కడుపులో క్రిములు చచ్చిపోవడానికి అన్నాడు ఇంకెవడేం చేస్తాడు.
అంటే తెలియక కాదు తెలిసి దబాయింపు అలా స్వధర్మో రక్షసాం భీరు పైగా భయపడుతావేం సర్వథైవ న సంశయః గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమధ్య వా !! ఏవం చైత దఽకామాం చ న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి ! కామం కామః శరీరే మే యథా కామం ప్రవర్తతామ్ !! నీయందు కూడా కామ ప్రచోదనమై నీయంత నీవు వచ్చి నా పాన్పుచేరితే తప్పా నేను భోగించను, నేను భోగించాలంటే ఎత్తుకొచ్చినవాన్ని బలవంతంగా నిన్ను అనుభవించలేనా చూడు ఎంతమంచివాన్నో అలా అనుభవించానా నీయంత నీవు కోరుకోవాలి నీ మనసు మారాలి మారి నీవు నా పాన్పుచేరాలి. అసలు ఈ రహస్యాన్ని వీడికన్నా గొప్పవాడు ఒకడున్నాడు యుద్ధకాండలో అడిగాడు అసలు ఇన్నాళ్ళెందుకురా బ్రతిమాలావ్ ముందు అన్యాయంగా అనుభవించకపోయావా? అన్నాడు, అంటే కోడిపుంచు కోడిపెట్టని అనుభవించినట్లు, అంటే నీయంత తెలివితేటలు లేనివాన్నేం కాదు ఈ ప్రభుత్వాంన్ని ఇన్నాళ్ళు నడిపిస్తున్నవాన్నీ నాకు బ్రహ్మగారి శాపముంది అలా ఎవరినైనా ఇంకో స్త్రీనికాని నేను అనుభవిస్తే ఒక్కప్పుడు ఒక అప్సరసవెంట ఇలాగే పడితే ఆవిడవెళ్ళి బ్రహ్మ సభలో చెప్పింది మీ వంశంలో పుట్టినవాడు ఇలాంటిపన్లు చేస్తున్నాడనీ... ఇంకొకసారి ఇంకొక స్త్రీని భలవంతంగా అనుభవిస్తే వీడి తలలు పగిలిపోతాయి అన్నాడు ఆయన. అందుకనీ ఆవిడ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాడురా అన్నాడు.
అది అసలు రహస్యం, అది దాచి అంటాడూ నీ మనసు మారి నీవు పాన్పు చేరాలి తప్పా నేను నిన్ను బలత్కరించానా చెప్పు ఎంతమంచి వాన్నో చూడు ఏక వేణీ ధరా శయ్యా ధ్యానం మలిన మఽమ్బరమ్ ! అస్థానేఽప్యుపవాస శ్చ నైతా న్యౌపయికాని తే !! ఏక వేణీ ధరా శయ్యా ఎమిటో ఒంటిజడ వేసుకుంటావ్ భూమి మీద పడుకుంటావ్ అలా ఉంటేనే అలా ఉపవసిస్తేనే అంత చిక్కిపోతేనే అంత ఇబ్బంది పెడుతున్నాడే... ఇంక ఆవిడ కబలీబంధం వేసుకుని కురులు దువ్వుకుంటే వీడి యొక్క కామానికి హద్దుంటుందా ఏక వేణీ ఎందుకా ఒంటిజడ వేసుకుంటావు అంటే ఆవిడా బాహ్యమునందు దృష్టిలేకా

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఆంతరమునందు రామోపాసన యందు మాత్రమే దృష్టితో ఉంది దానివల్ల బాహ్యాన్ని ఆవిడ విష్మరించింది మర్చిపోయింది, అదిగదాండి తపస్సంటే, కాబట్టి ఆవిడ తపస్సులో ఉందని గుర్తించలేనివాడు కాదు తాను తపస్సుచేశాడు, తపస్సు చేస్తే తన ఒంటిమీద పుట్టలు పెట్టలేదేమిటీ అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఏమిటి శుభ్రంగా దూవ్వుకోవద్దా తలకాయ అన్నారా..? మరి ఆవిడనెందుకంటాడు అంటే తెలుసు, తెలిసీ అయ్యెయ్యో అలా ఉండకూడదు తప్పు అని ఎలాగోలా... ఆవిడ్ని తన మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో మాట్లాడుతుంటాడు. ఇది ప్రమాద కరమైనటువంటి వాక్ ధోరణీ, ఎవ్వరూ అవతలివారి గురించి అంత నీచంగా ఆలోచించకూడదు, ఇది దేనికి ప్రతిబింభమౌతుందో తెలుసాండీ! మీరు ఎదుటివారి గురించి ఏమి ఆలోచిస్తున్నారన్నదానికి మీ మాటా... దానికి ఒక రుజువుగా నిలబడుతుంది.
Image result for sita ramaఇప్పుడు ఆయన చూస్తున్నారు దీన్ని ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు చెప్పలా రామ చంద్ర మూర్తితో చెబితే ఉత్తర క్షణంలో పరిగెత్తడు ఆయన ఊరుకున్నారు నేను ఆవిడకి ఉపశాంతిని కల్పించాలని చెప్పి ఊరుకున్నాను, నిజంగా ఇవన్నీ ఎరిగినవారు కాబట్టే చూసినవారు కాబట్టే నేను ఎంత కష్టంలో ఉన్నానో చూశావా రెండు నెలలు వాడు గడువిచ్చాడు ఒకనెలే ఇస్తాను ఇంక ఈ భాదా అంటే ఒక నెల కాదు ఒక క్షణంలో తెచ్చేస్తాను రామ చంద్ర మూర్తిని నన్ను నమ్మమ్మా... ఇప్పుడే వెళ్ళిపోతున్నాన్నారాయన, ఇదీ తొందరగా వాడి మాట వాడి మరణానికి పనికొచ్చింది. అనీ విచిత్రాణి చ మాల్యాని చన్దనా న్యఽగరూణి చ ! వివిధాని చ వాసాంసి దివ్యాని ఆభరణాని చ !! ఇంట్లోనేమో చక్కగా అంతఃపురంలో అగరుంది చందనముంది చక్కచక్కటి అనులేపనములున్నాయి అవన్నీ శరీరమునకు అలదుకుని మంచి మంచి బట్టలు కట్టుకుని సుఖంగా సంతోషంగా ఎందుకుండవు ఇదం తే చారు సంజాతం యౌవనం వ్యతివర్తతే ! య దఽతీతం పున ర్నైతి స్రోతః శీఘ్ర మఽపామ్ ఇవ !! ఈ యవ్వనం నీలో ఉంది కాబట్టి నీమీద నేను ఆకర్షణ పొందాను ఇదేం స్థిరంగా ఉండిపోతాదనుకుంటున్నావా... కాలంలో వెళ్ళిపోతూంది. నది ముందుకుపోతే వెనక్కు వస్తూందా కాలంలో యవ్వనం పోతే మళ్ళీ వస్తూందా... అప్పుడు నిన్ను రాముడు స్వీకరించడు ఇటు నేనూ ఆశించను కాబట్టి నీవు ఎటూ కాకుండా పాడైపోతావు. కాబట్టి నీవు తొందరగా నా పాన్పు చేరు. ఎంత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారో చూడండి లోకేభ్యో యాని రత్నాని సంప్రమ థ్యాఽఽహృతాని వై ! తాని తే భీరు సర్వాణి రాజ్యం చైత దఽహం చ తే ! నేను లోకంలో ఉండేటటువంటి సుప్రసిద్ధమైన వస్తువులు ఏవేవున్నాయో అవన్నీ పట్టుకొచ్చాను పట్టుకొచ్చి అంతః పురంలో ఉంచాను, నీవు నన్ను స్వీకరిస్తే నీవు వాటిని స్వీకరించవచ్చు.
అంటే ఒక లేకి లంచగొండి మనస్తత్వమున్నవాడు విజిత్య పృథివీం సర్వాం నానా నగర మాలినీమ్ ! జనకాయ ప్రదాస్యామి తవ హేతో ర్విలాసిని !! అసలు ఆ పిలుపులే అంద మదన వికారంతో ఉంటాయి, ఓ విలాసినీ ఎవరికిస్తాడటా... లోకాలన్నీ గెలిచి తెచ్చిన ఐశ్వర్యం నీ తండ్రి జనకమహారాజుగారి ఇస్తానన్నాడు, ఇంతకన్నా అన్యాయమైన మాట ఇంకోటిలేదు ఆయన విదేహ వంశానికి చెందినవాడు మహాజ్ఞాని తన మిథిల కాలిపోతుంటేనే తను పట్టించుకోనివాడు, అంతటిమహాజ్ఞానికటా వీడు అన్యాయంగా ఆర్జించినవన్నీ తీసుకొచ్చి జనకమహారాజుగారికి ఇస్తాడట, అంటే

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
పుట్టింటివాళ్ళవైపుకు ఇవన్నీ ఇస్తానంటే ఆ ఆడపిల్ల సంతోషించి లొంగిపోతుందని అంటే ఆవిడ లొంగిపోదూ అన్నది పరమ సత్యము ఆవిడే కాదు ఈ దేశంలో మన సనాతన ధర్మంలో ఏ స్త్రీయైనా చిత్తంలో అలా ఆలోచించినా ఎవడైనా రావణుడే. రావణులు ఉండచ్చేమో అలా లొంగిపోయేవాళ్ళు ఉండరు అందరూ సీతమ్మలే ఉంటారు అది ఈ ధర్మం యొక్క గొప్పతనం అందుకే కదాండి “సహస్ర పణ్” అని వేయి పడగలని ఈ జాతిలో స్త్రీ గొప్ప తనాన్ని వివాహము యొక్క ప్రాసస్త్యాన్ని విశ్వనాథ సత్యనారాయణగారు వేయ్యినోళ్ళతో ప్రశంసించి వేయిపడగలు రాసుకుని సంతోషించారు.
Image result for అశోకవనం సీతకాబట్టి ఆయనా ఈ మాటలు చెప్పి నిక్షిప్త విజయో రామో గత శ్రీ ర్వన గోచరః ! వ్రతీ స్థణ్డిల శాయీ చ శంకే జీవతి వా న వా ! ఎక్కడో ఇక విజయం పొందుతానన్న ఆశ పూర్తిగా వదిలిపెట్టి ఐశ్వర్యానంతటినీ పోగొట్టుకుని భూశయణం చేస్తూ అరణ్యాలలో తిరుగుతున్నటువంటి రాముడు అసలు బతికున్నాడోలేడో కూడా తెలియదు ఆ రాముడు వస్తాడు వస్తాడంటావేమిటీ చారు స్మితే చారు దతి చారు నేత్రే విలాసిని ! మనో హరసి మే భీరు సుపర్ణః పన్నగం యథా ! ఆవిడేమో అంత సర్దుకు కూర్చుని ఏడుస్తుంది ఈయన్నంటాడు చారు స్మితే చాలా అందంగా నవ్వుతున్నదానా... ఆవిడ నవ్విందా చారు దతి చారు నేత్రే విలాసినీ ఎన్ని పేర్లుపెట్టి ఆవిడని పిలిచాడో ఆయన లేకిమనస్తత్వాన్ని బయటపెడుతూంది. మనో హరసి మే భీరు సుపర్ణః పన్నగం యథా ఇదొక్కటి సత్యం చెప్పాడు కాల ప్రచోదితమే, నా మనసుని నా మనస్సనేబడేటటువంటి పామునీ నీ యొక్క అందం నీ యొక్క రూపం నీ తేజస్సు గరుత్మంతుడిలా తన్నుకపోతూంది అన్నాడు నిజమే ఆయన యొక్క జీవితం గర్ముత్మంతుని నోట చిక్కన పామే. ఇది అనుకోకుండా ఆయననోటివెంట వచ్చేసినటువంటిమాట కాబట్టి న రామ స్తపసా దేవి న బలేన న విక్రమైః ! న ధనేన మయా తుల్య స్తేజసా యశసాఽపి వా ! రాముడు నాతో తపస్సులోగాని బలములోగాని విక్రమంలోగాని ధనంలోగాని కీర్తిలోగాని దేనితోనూ సమానుడు కాడు, సమానుడు కానివాడు కాబట్టి విడిచిపెట్టేసై విడిచిపెట్టి నన్ను స్వీకరించు, ఒక వస్తువుకన్నా ఇంకొక వస్తువు బాగుంటుందీ అంటే స్వీకరిస్తారు తప్పా జీవితంలో ఒక్కమారు మాత్రమే స్వీకరించవలసినటువంటి వస్తువులు కొన్నుంటాయి అందులో చాలా చాలా ప్రధానం వివాహం, ఒకసారి భార్యని స్వీకరించిన తరువాత ఇక ఆ శరీరం పడిపోయేంతవరకూ ఆవిడే భార్యా. ఒక స్త్రీ ఒక పురుషున్ని స్వీకరించిన తరువాత ఇక ఆ శరీరం పడిపోయేవరకు ఆయనే భర్త తప్పా... ఇంతకన్నా బాగుందని ఇంకోన్ని స్వీకరించడం ఇంతకన్నా బాగుందని ఇంకోర్ని స్వీకరించడం ఎక్కడో అక్కడ ఉంది ఈ ప్రపంచంలో అది హేయాతి హేయమైనటువంటి సంస్కృతి అలా వస్తువుల్ని మార్చుకున్నట్లు అది టెప్ రికార్డను మార్చినట్లు సిడి బాగుందని టేప్ రికార్డుని అవతలపారేసినట్లు సిడీ కొనుక్కున్నట్లు ఈయ్యన కన్నా ఆయన బాగున్నాడని ఆయన్నా కన్నా ఇంకోకాయన బాగున్నాడని ఈయ్యనకన్నా ఆయన దగ్గర సంపత్తుందనీ భర్తని మార్చడం భర్త భార్యని మార్చడం ఈ జాతి సంస్కృతి కాదది.
మూడు ముళ్ళు వేస్తే ఇంక అంతే ఆ రెండు జీవితాలు అలా తరించిపోవలసిందే అది ఈ దేశ సంస్కృతి ఈ దేశంలో అటువంటి మాట మాట్లాడినవాడు మొట్టమొదట పుత్ర మిత్ర కళత్రాదులతో నశించిపోయాడూ అని మీరు రామాయణం వల్ల గ్రహిస్తే వేలంటైన్సడే లాంటి సంస్కృతులను దిగుమతులు చేసే ప్రయత్నం ఇక్కడ చెయ్యకూడని కూడా మీరు గ్రహించవలసి

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఉంటుంది. ఇది రామాయణం యొక్క తీర్పు ఏ తండ్రీ దాన్ని అంగీకరించకూడదు, ఏ తల్లీ దాన్ని అంగీకరించకూడదు, అలా అంగీకరించకపోతే మీరు సంతోషించాలి ఏ పిల్లలకీ అది మీరు అంగీకరించకూడదు చాలా తప్పు అది చేయడానికి నీవెవరు సలు ఆ పని చెయ్యనే కూడదు అసలా సంస్కృతేవేరు ఈ జ్యాతిది అలా చెయ్యడం ఈ జ్యాతికి మాతృ దినోత్సవం అని ఎక్కడా లేదు ఈ జాతిలో ప్రతి క్షణం అమ్మకి నమస్కారమే... ఓ రోజు తల్చుకుని నమస్కారం చేయ్యడం ఈ జాతి లక్షణం కాదు. నీవెందు స్క్రీన్ మీద చూపిస్తున్నావు అస్తమానం ఈ జాతి సంస్కృతి కానిదాన్ని కూకటివేళ్ళతో పెళ్ళగిస్తున్నారు ఇది పెద్ద ద్రోహం ఇదే నేను మనవిచేసింది. ఆవుని చంపుతూ ఆవని చెప్పకండా పామని చంపడం, ఆవుని చంపుతున్నానంటే చంపనివ్వరనీ పామును చంపుతున్నాని పేరు పెట్టి చంపేయడం. మూఢ నమ్మకాలని పేరు చెప్పి అవి విశాల హృదయాలని పేరు చెప్పి పిల్లోనికి రుద్ది వాడి భవిష్యత్తును పాడు చేస్తున్నది మనమే.
Image result for మాతృ దేవోభవఅమ్మల రోజేమిటండీ అమ్మల రోజుందా..? సౌందర్యలహరిలో అన్నారు శంకర భగవత్పాదులు జగన్మాత అమ్మ యొక్క సౌందర్యమంటే అమ్మతనం, అమ్మ తనం పుట్టినది మొదలు నాబీ బంధం తెగిపోతూందేమో కానీ అమ్మ హృదయ బందం తెగదు. కట్టెలలో కాలిపోవలసి వచ్చినా కొడుకుపెట్టినటువంటి అగ్నిహోత్రానికి కాలిపోతూంది తప్పా ఆవిడా ఇంకా ఏ అగ్నిహోత్రానికి కాలడానికి కూడా ఇష్టపడదు. అమ్మంటే- అమ్మ చచ్చిపోవడమంటూ ఉంటే ఎప్పుడంటూందంటే నాన్నా నా ఆయుర్ధాయం నీవు పోసుకుని బ్రతుకురా అంటూంది తప్పా నేను బ్రతకక్కరలేదు నాన్నా నీవు బ్రతికితే చాలు అంటూంది. అటువంటి అమ్మని తలచుకోవడానికి సంవత్సరానికి ఒక రోజు ఉంటూందా..? ప్రతి క్షణం తల్చుకోవడం ఈ జాతి సంస్కృతి, లేస్తే మాత్రు దేవోభవా పితృ దేవోభవా ఆచార్య దేవోభవా అతిథి దేవోభావా అని అవి ఈ జాతి జీవనాడులు. ఒక్కరోజు అమ్మని తల్చుకోవడం ఒక్కరోజు నాన్నని తల్చుకోవడం 364 రోజులు తిరస్కరించడం మనకు తెలియదు. రావణుడు ఏమయ్యాడో మనం ఈ మాటను తెలుసుకుంటే మనం ఇటువంటి మాటలు అనే సంస్కతిని మనం పోషించడం కూడదని మనం తెలుసుకోవాలి. కాబట్టి పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీం చ మయి లల లలనే యథా సుఖం త్వం త్వయి సమేత్య లలన్తు బాన్ధవా స్తే ! తాగు తిను అనుభవించు సుఖించి, తిను ఎందుకలా పడుకుంటావ్ ఎందుకలా బాధపడుతావ్ ఎందుకా తపస్సు అంటే ఆవిడ చేస్తున్నది తప్పూ ఈయ్యన భోదిస్తున్నది ఒప్పు అన్నరీతిలో మాట్లాడాడు.
ఆ తల్లీ తృణమ్ అన్తరతః కృత్వా ప్రత్యువాచ శుచి స్మితా ! నివర్తయ మనో మత్తః స్వజనే క్రియతాం మనః !! ఆవిడ ఓ గడ్డిపరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకు గడ్డిపరక పెట్టడం, ప్రధానమైన కారణం ఏమిటో తెలుసాండీ, పరపురుషున్ని ఆవిడ చూసిందో చూడలేదో కానీ చూడలేదో ఏమి చూసే ఉండలేదు ఆ తల్లి, కానీ మాటలు చెవినపడ్డాయిగా, ప్రతిస్పందించి జవాబు చెప్తుందిగా మధ్యలో ఏమీలేకుండా పరపురుషుడితో మాటవిన పరపురుషుడితో మాట్లాడే మాటలకు జవాబు చెప్తూందిగా తత్ దోషమొకటి వచ్చిందిగా మరి ఇప్పుడు ఆ దోషం పోగొట్టకోవడానికి ప్రాయశ్చిత్త కర్మ ఏమిటీ ఉత్తర క్షణంలో మనం ఒక మంత్రం జెప్తుంటాం వేద భాగంలో మనం ఏమంటామంటే దుశ్వప్న ఫలితం కూడా పోవడానికి ʻదురువాʼ అంటే గడ్డిపరకని ముట్టుకుంటున్నాను అంటాం. గడ్డిపరకను ముట్టుకుంటే దుశ్శప్న ఫలితం కూడా నశిస్తుందని, కాబట్టి ఆవిడ ఇప్పుడు గడ్డిపరకను ఎందుకు ముట్టుకుందంటే పరమ ధర్మాత్మురాలు కనుకా పతి పక్కన లేనప్పుడు కామంతో మాట్లాడేటప్పుడు పరపురుషుడి మాటవిని జవాబు చెప్పిన పాపాన్ని పోగొట్టకోవడానికి గడ్డిపపరకను అడ్డు పెట్టుకుంటారు, కాదు తృణమ్ అన్తరతః కృత్వా ఒక గడ్డిపరకనైనా ముట్టుకుంటానేమో కానీ నిన్ను మాత్రం ముట్టుకోను, కాదు గడ్డిపరక పశువులకి పెడతారు నీవు పశువువు కాబట్టి నీకు ఇదే పెట్టాలి నీవు మనిషివీ కావు నీవు రాక్షసుడివీ కావు కాదు ఒక గడ్డిపరక ఎంత తేలికైపోతూందో గడ్డిపరకతో సమానంరా నీవు అంటారు.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఇంత లేకి మాటలు మాట్లాడిన నీవు గడ్డిపరకతో సమానమయ్యావు కాదు ఒక గడ్డిపరక ఎండిపోయింది కాలిపోవడానికి ఎలా సిద్ధపడిందో అనరాని మాటలు పతివ్రత దగ్గర మాట్లాడి మరణించడానికి సిద్ధంగా నీ పాపాన్ని వండుకునేందుకు సిద్దపడ్డావు, కాదు ఒక గడ్డిపరకమీద బ్రహ్మాస్త్రాన్ని రామ చంద్ర మూర్తి అభిమంత్రించి విడిచిపెడితే కాకా సురుడు మూడు లోకాలు తిరిగాడు ఒక గడ్డి పొరక విడిచిపెడితే కాకా సురుడు బ్రతకలేదు ఒక గడ్డి పొరక రాముడు అభిమంత్రిస్తే నీవు ఎందుకు పనికి రాకుండా పోతావు ఏమనుకుంటున్నావు ఇది చెప్పడానికి గడ్డి పొరక. కాదు ఒక గడ్డి పరకైనా నదీ ప్రవాహంలో వరద వస్తే భూమివైపు తల వంచి తట్టుకుంటుంది తల వంచడం చేతకాదు కాబట్టి నీవు మాత్రం బ్రతకవు ఇది చెప్పడానికి గడ్డి పరక ముట్టుకుంది. కాదు ఎన్నోమార్లు వచ్చావు నీతో నేను మాట్లాడుతున్నాను గడ్డి పరక పెడుతున్నాను ఇది ఆఖరి గడ్డి పరక ఇక ఇంచు మించు నీవు రావక్కరల్లేదు నేను మాట్లాడక్కరలేదు అయిపోయింది టైము ఇది చెప్పడానికి గడ్డి పరక ఎన్ని భావాలో మనసులో ఉన్నాయి, ఇది శుచి స్మితా శుద్ధమైన నవ్వు నవ్వింది, అందుకని ఆవిడ నవ్వులో కల్తీలేదు దగాలేదు వాడిలా మాట్లాడలేదు ఉన్నమాట ఉన్నట్లు తల్లి బిడ్డతో మాట్లాడినట్లు మాట్లాడుతోంది తృణమ్ అన్తరతః కృత్వా ప్రత్యువాచ శుచి స్మితా ! నివర్తయ మనో మత్తః నీ మనసు నీదగ్గర పెట్టుకో అంతే స్వజనే క్రియతాం మనః నీ భార్యయందు నీవు మనసు పెట్టుకో ధర్మమైపోయింది అంతే, పరకాంతయందు మనసుపెట్టావు పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు.
నీ భార్యయందు నీ మనసు పెట్టుకున్నావు తరించిపోతావు కామము ధర్మ బద్ధమైంది, కామము ధర్మ వితిరిక్తమైంది ఎప్పుడు, పరకాంతయందు పెడితితే కాబట్టి పెట్టకు తిప్పు తిప్పి అటు పెట్టు ధర్మమౌతుంది నివర్తయ మనో మత్తః స్వజనే క్రియతాం మనః ఎంత ధర్మాన్ని అప్పటికేమిటండీ ఈమాట అప్పటికి పనికొస్తుందా ఎప్పటికీ పనికొస్తుందా? ఎప్పటికీ పనికొస్తూంది ధర్మాన్ని కామంతో ఎలా ముడేయగలమో చెప్తూంది అమ్మవారు కాబట్టి ఆ తల్లి అంది న మాం ప్రార్థయితుం యుక్త సుసిద్ధిమ్ ఇవ పాపకృత్ ! అకార్యం న మయా కార్యమ్ ఏక పత్న్యా విగర్హితమ్ !! కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జతయా ! ఏవమ్ ఉక్త్వా తు వైదేహీ రావణం తం యశస్వినీ !! నేను ఒక ఉన్నతమైన కులంలో పుట్టాను ఒక ఉన్నతమైనటువంటి కులాన్ని మెట్టాను, మహా పాపం చేసినవాడు సిద్ధిని కోరుకుంటే ఎలా దొరకదో అలా ఏక పత్నీవ్రతుడైనటువంటి రామ చంద్ర మూర్తికి పతివ్రతనైనటుంటి నేనుకూడా ఒక్కరినే భర్తగా స్వీకరించేటటువంటి నియమున్నదాన్ని అటువంటి నన్ను నీవు అసలు ఆశించకూడదు. అటువంటి ఆలోచన నీ మనసులో కదల కూడదు. కాబట్టి నీవు తప్పు చేస్తున్నావు యథా తవ తథాఽన్యేషాం దారా రక్ష్యా నిశాచర ! ఆత్మానమ్ ఉపమాం కృత్వా స్వేషు ధారేషు రమ్యతామ్ !! నీ భార్యను వేరొకడు అపహరించి కామంతో చూస్తే నీ మనసెలా బాధపడుతుందో ఇతరుల భార్యల్ని నీవు అపహరించి తెచ్చి చూసినప్పుడు వాళ్ళ మనసు కూడా అలా బాధపడుతుందని నీవు ఊహించగలిగితే నీవు ఇంత ధారుణ కృత్యాన్ని చేసి

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఉండేవాడివి కావు కాబట్టి నీవు ఇటువంటి పని చెయ్యకూడదు అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేన్ద్రియమ్ ! నయన్తి నికృతి ప్రజ్ఞాం పర దారాః పరాభవమ్ !! చలికమైన అంటే అస్తమానం కదిలిపోయేటటువంటి మనసు కదిలిపోయేటటువంటి ఇంద్రియములు ఉన్నటువంటివాడు పరకాంతలచేత పరాభవింపబడిననాడు అందరూ వాన్నిచూసి నవ్వుతారు తప్పా ఎవ్వరూ అయ్యో పాపం కష్టాన్ని పొందాడని ఉండడు వాడు ఆఖరికి పొందేది పరాభవమే.
Image result for సీతకాబట్టి పరకాంతల జోలికి వెళ్ళకు ఇహ సన్తో న వా సన్తి సతో వా నాఽనువర్తసే ! తథా హి విపరీతా తే బుద్ధిః ఆధార వర్జితా !! ఇక్కడ అసలు మంచి చెప్పేవారు లేరా..! చెప్తే నీవు వినవా..! విన్నది ఆచరించవా..! ఎక్కడుంది దోషం ఎంత పెద్ద మాటండిదీ. అప్పటికేమిటీ ఎప్పటికీ అసలు మంచి చెప్పేవారు లేరా చెప్తేవినవా వింటే అనుష్టించవా ఎక్కడుంది దోషం నీ దగ్గర అని అడిగింది ఆవిడ. అది ఆయన కాదు ఎవ్వరైనా తనకు తాను పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం అకృతాఽఽత్మానమ్ ఆసాద్య రాజానమ్ అనయే రతమ్ ! సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ ! ఇటువంటి అధర్మంలో ప్రవర్తించేటటువంటి ప్రభువు తాను ఒక్కడే పాడైపోడు ఆయనా ఆయన రాజ్యము పుత్ర మిత్ర కళత్రాదులతో నశిస్తాడు, కాబట్టి నీవలన నీ లంకా పట్టణమంతా కూడా  నషించిపోయేటటువంటి రోజు దగ్గరకొచేచేసింది శక్యా లోభయితుం నాఽహమ్ ఐశ్వర్యేణ ధనేన వా ! అనఽన్యా రాఘవేణాఽహం భాస్కరేణ ప్రభా యథా !! సూర్యుడు వద్దు సూర్యుని కాంతి కావాలంటే వస్తూందా అలా రాముడు వద్దూ సీత కావాలంటే వస్తుందనుకున్నావా అలా వచ్చేదికాదు, నేను రాముడు ఇద్దరం ఒక్కటే ఆయనకి ఎలా కనపడింది అస్యా దేవ్యా మన స్తస్మిం స్తస్య చాఽస్యాం ప్రతిష్ఠితమ్ ! తే నేయం స చ ధర్మాత్మా ముహూర్తమ్ అపి జీవతి !! అస్యా దేవ్యా యథా రూపమ్ అంగ ప్రత్యంగ సౌష్ఠవమ్ ! రామ స్య చ యథా రూపం తస్యేయమ్ అసితేక్షణా !! నిన్న హనుమకి సీతమ్మలో రాముడు కనపడ్డాడు, ఈయ్యనకి రామున్నుంచి సీతమ్మని వేరు చేయించాలనుకుంటున్నాడు అలా వేరు చేయడం కుదరదు సూర్యున్నుంచి సూర్యకాంతిని వేరుచేయగలవా... చెయ్యలేవు నేనూ ఆయనా విడివడం శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితతుం శివుడు శివశక్తి ఎలా వేరు కావో, నేనూ నా ఉపన్యాస శక్తి ఎలా వేరుకాదో అలా రాముడు సీతా వేరుకారు పిచ్చివాడా వేరు చేశానని నీవు అనుకుంటున్నావు దానివల్ల పాడైపోతానని తెలుసుకో కాబట్టి నీవు చెయ్యవలసిందేమో కూడా చెప్తాను మిత్రమ్ ఔపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా ! వధం చాఽనిచ్ఛతా ఘోరం త్వయాఽసౌ పురుషర్షభః !! నీవు ఘోరమైనటువంటి చావు చచ్చిపోకూడదూ అని నేను అనుకుంటున్నాను అందుకే రామున్ని మిత్రుడుగా భావించి, నన్ను తీసుకెళ్ళి అప్పజెప్పేసై.
ఇది చాలా పెద్దమాటండోయ్ రామాయణంలో చాలా చాలా పెద్ద మాట సుందర కాండలో వధం చాఽనిచ్చతా ఘోరం నీవు ఘోరమైన చావు చచ్చిపోకూడదనుకుంటే అది తల్లంటే... ఎందుకో తెలుసా అన్నిటికన్నా పెద్ద కష్టమేమిటో తెలుసాండీ చచ్చిపోవడమే అందుకే పూజ చేస్తే మనం అడిగేది రెండే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం (దేహంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీ పతే) ధైన్యంలేకుండా ఒకరి దగ్గర చెయ్యిచాపకుండా బ్రతకగలిగితే చాలు, చచ్చిపోయేటప్పుడు అబ్బా ఏప్పుడు పోతాడనుకుండా పోతేచాలు తప్పా శరీరంలోంచి జీవున్ని ఈశ్వరుడు విడిపించలేదనుకోండి అది అలా

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
పడుందనుకోండి ఇదంత మనకెందుకండీ ఒక్కమాట చెప్పేస్తాను మీరు పట్టుకుంటారు నేను పెద్ద అరగంట దానిగురించి చెప్పక్కరలేదు, తన మల మూత్రములు తాను విసర్జించలేకపోతే అయిపోయిందంతే... భార్యకూడా ఎన్నాళ్ళు చేస్తూందండీ మూన్నెల్లు చేస్తుంది నాలుగు నెల్లు చేస్తుంది, ఆ తరువాత ఏం చేస్తుందో తెలుసా అమంగళం పలకలేకా పాపం అలా చాలా బాధపడిపోతున్నారు ʻఅలా ఉండేకన్నాʼ.... అంటూంది. ఏమైనట్టు, అందుకే ఓరేయ్ బ్రతకడం కాదురా ఒంట్లో ఓపిక ఉంటే శుక్రవారం నాడు కొట్టు ముందు దిగతుడిచిన కొబ్బరిముక్కలు గోక్కు తినేసినా మున్సిపల్ పంపు దగ్గర నీళ్ళు తాగేసినా బతికేస్తావు చచ్చిపోవడం నీ చేతిలో లేదు, ఈశ్వరుడు విడపించక మంచాన పడేస్తే అప్పుడు తెలుస్తూంది చేసినపాపం అనుభవంలోకొచ్చి. ఆ స్థితి తెచ్చుకోకురా ఘోరంగా చచ్చిపోతావురా అంది ఆవిడా పోయాడా లేదా కొడుకులుపోయారు తమ్ముళ్ళుపోయారు సైన్యం పోయింది తను పోయాడు, భార్య వచ్చింది నీ ఇంద్రియాలకి నీవు చచ్చిపోయావురా సీతమ్మలో నా కన్నా నీకేం కనపడిందిరా అని అడిగింది.
చచ్చి ఏం సాధించాడు ఈ మాట ఆవిడ బ్రతికున్నప్పుడు చెప్పింది, వినుంటే తెలికపోవడం తప్పుకాదు, వినకపోవడం పెద్ద తప్పు మనుష్య జన్మలో కాబట్టి వధం చాఽనిచ్ఛతా ఘోరం త్వయాఽసౌ పురుషర్షభః ! విదితః స హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః ! తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి !! నీవు ధర్మజ్ఞుడు శరణాగతవత్సులడైన శ్రీ రామ చంద్ర మూర్తి దగ్గరకెళ్ళి నన్ను అప్పజెప్పావా ఆయన ఎంతో సంతోషిస్తారు నిన్నేం చేయడు కాబట్టి నా మాట విను, అని నీవు చాలా పరాక్రమ వంతుడంటావ్ రాముడు చేతకానివాడివంటావ్ ఇన్ని తెలిసున్నవాడివి రాముడు ఆశ్రమంలో లేనప్పుడు లక్ష్మణున్ని నా నుంచి దూరం చెయ్యడం కోసం మారీచున్ని మాయా మృగంగా పంపి ఎందుకెత్తుకొచ్చావు, నీ దగ్గర జవాబులేదు అంటే రాముని ముందు నీవు నిలబడలేవని నీకు కూడా తెలుసు న హి గన్ధమ్ ఉపాఘ్రాయ రామ లక్ష్మణయో స్త్వయా ! శక్యం సందర్శనే స్థాతుం శునా శార్దూలయో రివ !! పెద్ద పులివాసన తగిలినంత మాత్రంచేత పారిపోయేటటువంటి నక్కలా రామ లక్ష్మణులు ఉంటే నన్ను చేరలేకా మాయా మృగాన్ని పంపి వాళ్ళను దూరం చేసి నన్ను తీసుకొచ్చావు ఈపాటి చేతకానివాడివి రాముడు చేతకానివాడని నీవు మాట్లాడడమానాతోటి ఈ మాటంటే రావణుడు అన్నాడూ... మారడం ఆయన లక్షణం కాదు కోపం శేషేణ పూరయేత్ తాను మారకపోతే ఏం చేస్తాడంటే దభాయించనన్నా దభాయించాలి కోపమన్నాపడాలి.
కాబట్టి మూర్ఖుడు లక్షణం అలా ఉంటుంది యథా యథా సాన్త్వయితా వశ్యః స్త్రీణాం తథా తథా ! యథా యథా ప్రియం వక్తా పరిభూత స్తథా తథా !! కామంతో ప్రేమతో ప్రీతితో ఆడదాన్ని బ్రతిమాలి ఎంత మాట్లాడితే ఆడది పురుషున్ని అంతగా తేలికచేసి మాట్లాడుతుంది, ఇదో లక్షణం కానీ ఏం చేయను నాకు నీయందున్న ప్రేమ అటువంటిది ఇలా మాట్లాడినందుకు ఏం చేయను అన్నాడు, తప్పా నేను మారుతానన్న మాట మాత్రం వాడి జన్మాంతరంలో రాదు అది ఆయన మనస్సు. తప్పు చేయడం తప్పుకాదండీ మారే అవకాశం ఇచ్చి మాట్లాడినప్పుడు మారకపోడం తప్పు కాబట్టి రాక్షసాఽధమ రామ స్య భార్యామ్ అమిత తేజసః ! ఉక్తవాన్ అసి యత్ పాపం క్వ గత స్తస్య మోక్ష్యసే !! ఆవిడందీ ఓరి పిచ్చాడా రావాణాధమా అని పిలిచింది, ఆవిడ పిరికిదా ఓరి రావణాధమా! సీతమ్మతల్లి రామ చంద్ర మూర్తి యొక్క భార్య నీచేత అపహరింపబడడానికి యోగ్యమైనవస్తువేంకాదు, నీవు తెలుసుకోనటువంటి రహస్యమొకటుంది, ఇప్పుడు నీవు చేసిన పాపం నీవు ఎక్కడెళ్ళినా పోదు ఎందుకో తెలుసా... దీనికి ప్రాయశ్చిత్తం ఉన్నది ఒక్కటే నీవు తీసుకెళ్ళి రామునికి ఇవ్వడమే, ఇవ్వనంటావుగదా కాబట్టి ఈ పాపం పోదు. పాపం పోదన్నమాట ఎప్పుడొస్తుంది నేను నీ పాన్పు చేరను నీపాపం పోదు, పోదు కాబట్టి ఏం చేయాలి అనుభవించాలావద్దా... అనుభవించాలి అనుభవించడమనేటటువంటిది ఎలా వస్తూంది నీకు మృత్యు రూపంలో వస్తుంది.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి విధి స్తవ వధాఽర్థాయ విహితో నాఽత్ర సంశయః ! నిన్ను చంపడానికే ఈశ్వరుడు ఈ నాటకమాడించి నన్ను తీసుకొచ్చి ఇక్కడపెట్టాడు ఇది తెలిక పిచ్చాడా..! ఇలా మాట్లాడుతున్నావు చచ్చిపోతావురా అందావిడా. అయినకు అర్థం కాలేదండీ అది విచిత్రం అసందేశా త్తు రామ స్య తపస శ్చాఽనుపాలనాత్ ! న త్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మాఽర్హ తేజసా !! నేను నరకాంతగా భార్యగా పతివ్రతగా నాకో ధర్మముంది నన్ను నేను రక్షించుకోకూడదు రాముడు వచ్చి రక్షిస్తాడని ఎదురు చూస్తున్నాను లేకపోతే నా పాతివ్రత్య శక్తితో భస్మ భస్మాఽర్హ తేజసా నిన్ను బూది చేసేస్తానురా అదేం పెద్ద లెక్కా అంది ఆవిడ. నాఽపహర్తుమ్ అహం శక్యా తస్య రామ స్య ధీమతః ! విధి స్తవ వధాఽర్థాయ విహితో నాఽత్ర సంశయః !! నన్ను అపహరించడం నీ చేతనైన పని కాదు ఈశ్వరుడు ఆడిన నాకటకంలో నేను తీసుకురాబడ్డాను ఎందుకో తెలుసా నీవు చచ్చిపోవడానికి ఇది మార్గంగా స్వీకరింపబడింది. ఆవిడ ఇంత స్పష్టంగా చెప్పేస్తున్నా వాడికి అర్థం కాలేదు స కల్ప వృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ ! శ్మశాన చైత్య ప్రతిమో భూషితోఽపి భయంకరః !! ఎంత పెద్ద పెద్ద ఉపమానాలేస్తారో మహర్షి పైకి చూడడానికి పెద్ద పెద్ద హారాలు పెట్టుకున్నాడు పట్టు పంచ కట్టుకున్నాడు పది తలకాయలు గొడుగులు అల్లరి హడావిడీ అన్నీ ఉన్నాయి, ఏమండీ మా అమ్మాయి పెళ్ళవుతూంది, మీ ఊళ్ళో నీకు మంచి గెస్టహౌస్ ఉందని విన్నాను కొంచెం విడిదిస్తాను లేకపోతే పెళ్ళికి వచ్చినటువంటి బంధువులు వాళ్ళందరూ దిగుతారు కాస్త తాళాలు ఇస్తారాంటే... అయ్యో ఎవ్వరూ అందులో దిగేవాళ్ళు లేక బాధపడుతూంటే తాళాలు తీసుకొచ్చి శుభ్రంగా వాడుకోండి అని తాళాలిచ్చాడు ఎక్కడుందని భవంతి అడిగాడు అనుకోండి అదిగో శ్మశానం మధ్యలో కట్టామండీ అంటారనుకోండి ఎవడైనా వెళ్తాడా దాంట్లోకి.
అలా ఎన్ని ఆభరణాలు వేసుకుని ఎంత అలంకారం చేసుకున్నా స్మశానం మధ్యలో కట్టినటువంటి జైత్య ప్రసాదమెలా ఉంటుందో అలా ఉన్నాడటా రావణాసురుడు, అంటే ఆయన స్థితి అటువంటిది కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుడికి ఆగ్రహం కలిగింది సీతమ్మ తల్లి మీద తీవ్రమైనటువంటి కోపాన్ని పొందాడు రామాయణంలో అదొక చమత్కారం. ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుందనుకుంటే అప్పుడొక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూంది. కాబ్టటి ఇప్పుడు ఆయన వెంటనే చాలా ఆగ్రహాన్ని పొందాడు అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచాడు రెండునెలల గడువు సామ ధాన భేద దండోపాయములనుపయోగించి ఈమె నా పాన్పుచేరాలి రెండు నెలలు దాటిన మర్నాటి ఉపదయం వేళలో ఈమెను సంహరించి ముక్కలు చేసి నా ప్రాతఃకాల ఫలహారంలో వడ్డించండి అన్నాడు. మీరు ఏం చెప్తారో ఏమో మీ ఇష్టం అన్నాడు ఇన్ని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయాడు ఆవిడ మీదకెళ్ళి ఏం చేసి ఉండేవాడో నిన్ను చంపేస్తానన్నంత కోపంలో ఉన్నాడు. ధాన్యమాలినీ అని ఆయన భార్య ఆవిడంది మయా క్రీడా మహా రాజ సీతయా కిం తవాఽనయా ! వివర్ణయా కృపణయా మానుష్యా రాక్షసేశ్వర !! ఒక మనుష్య కాంత ఆవిడకి బ్రహ్మగారు రాసిపెట్టలేదు అదృష్టం నీవు సంపాయించినవన్నీ అనుభవించాలని ఆవిడా శుష్కించిపోయింది అంద వికారమైంది క్రూరురాలు ఏమితెలియంది ఆవిడెందుకు? నీయందు బోగమనుభవించాలనే అనురక్తి కలిగిన భార్యలం మేమున్నానం రా... అని అంటే వాడు పొంగిపోయి నవ్వాడు. ఆమెతో కలిసి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అంటే అక్కడ ఉండేటటుంటి రాక్షస స్త్రీలు ఇక వాళ్ళు లేచి స్తోత్రం మొదలెట్టారు రావణుసురున్ని

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
త్రైలోక్య వసు భోక్తారం రావణం రాక్షసేశ్వరం ! భార్తార ముపసంగమ్య విహరస్వ యథా సుఖం !!
మానుషీ మానుషం తం తు రామమ్ ఇచ్ఛసి శోభనే ! రాజ్యాధ్భ్రష్టమ్ అసిద్ధాఽర్థం విక్లబం తమ్ అనిన్ధితే !!
య దిదం లోక విద్విష్టమ్ ఉదాహరథ సంగతాః ! నైత న్మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతి వః !!
న మానుషీ రాక్షస స్య భార్యా భవితుమ్ అర్హతి ! కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి వో వదః !!
అంటూంది సీతమ్మ... వాళ్లంటారు ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళల్లో పులస్త్యబ్రహ్మ ఆయన కుమారుడు విశ్రవసో బ్రహ్మ విశ్రవసో యొక్క కుమారుడు రావణ బ్రహ్మ మూడు లోకములను జయించాడు ఆయన ఓడించనివాళ్ళులేరు, దేవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులను జయించాడు, లోకంలో ఉన్నవాళ్ళందరు ఆయన్ని కోరివచ్చినవాళ్ళే నీవేమిటి మనుష్య స్త్రీవి అంత బెట్టు చేస్తావు చాలు ఇంత కాలం ఏదో రాముడన్నావు పాతివ్రత్యమన్నావు రాముడు మీద ప్రేమన్నావ్ భక్తన్నావ్ కొన్నాళ్ళేదో సంతోషంగా ఉంది మీకు వినడానికి ఇంక ఆ మూర్ఖపుపట్టు పట్టకు రావణాసుడి యొక్క పాన్పుచేరు అలా చేరకపోతే పరిణామములు చాలా తీవ్రంగా ఉంటాయి ఇంతకాలం బెట్టు పట్టావు పోల్లే ఏదో తనే మారుతుందని ఊరుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఏదో నాన్నగారండీ నాన్నగారండీ దసరా సెలవులు అయిపోయాక రెండు రోజులన్నావ్ ఐపియల్ అన్నావ్ ఏదో వర్లుడ్ కప్ప్ అన్నావ్ ఊరుకున్నాను, ఇక ఎన్నాళ్ళకి స్కూలుకెళ్ళకపోతే అది తండ్రి ఏదో మంచి చెప్తున్నట్ల చెప్తున్నారు వాళ్ళు అది విచిత్రం. చెడుని అంత గొప్పగా చెప్తారు వాళ్ళు చెప్తే ఆవిడందీ... ఒక్కనాటికి నేను ఆ పాపపుపని చేయను
దీనో వా రాజ్య హీనో వా యో మే భర్తా స మే గురుః ! తం నిత్యం అనురక్తాఽస్మి యథా సూర్యం సుర్చలా !!
యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్ఠతి ! అరుంధతీ వశిష్ఠం చ రోహిణీ శశినం యథా !!
లోపా ముద్రా యథాఽగస్త్యం సుకన్యా చ్యవనం యథా ! సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా !!
సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా ! నైషధం దమయంతీవ భైమీ పతి మఽనువ్రతా !!
తథాఽహ మిక్ష్వాకువరం రామం పతిమఽనువ్రతా ! సీతాయా వచనం శ్రుత్వా రాక్షస్యః క్రోధ మూర్ఛితాః !!
నేను ఇతః పూర్వం మహా పతివ్రతలైనటువంటి స్త్రీలు సచీదేవి ఏవిధంగానైతే ఇంద్రున్ని అనుగమించిందో అరుంధతి వశిష్ఠున్ని అలాగే లోపాముద్ర అగస్త్యున్ని, సుకన్యా చవరున్ని, సావిత్రి సత్యవంతున్ని, శ్రీమతి కపిలున్ని, మదయంతి సౌదాసునిన్ని, కేశినీ సగరున్ని, దమయంతీ భైమిలి పుత్రుడైన నలున్ని అనుగమించినట్లుగా నేను రామ చంద్ర మూర్తిని అనుగమిస్తాను. దీనో వా రాజ్య హీనో వా భర్త అంటే తాళికట్టినవాడే కాని ఆయన కష్టములలో సుఖములలో ఉన్నప్పుడు ఆయన అనువర్తించేది భార్య తప్పా ఆయనకి కష్టమొచ్చిందని వదిలేసి సుఖాల్లో ఉన్నప్పుడు మెచ్చుకునేది భార్యకాదు. కాబట్టి హీనో వా రాజ్య హీనో వా యో మే భర్తా స మే గురుః తం నిత్యం అనురక్తాఽస్మి ఆయన్ని అనుగమిస్తాను తప్పా నేను ఇంకొక భర్తను ఎంచుకునేటటువంటి చౌకుబారు మనస్తత్వమున్నదానను కాను మీరు నన్ను నరకండి చంపండి ముక్కలు

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
చేయండి అగ్నిహోత్రంలో వ్రేల్చండి నన్ను తినేసేయండి నేను మాత్రం ఒక్కనాటికి రామ చంద్ర మూర్తిని విడిచిపెట్టి పరపురుషున్ని నా కాలి గోటితో కూడా తాకను అంది ఆవిడ.
ఎక్కడలేని కోపం వచ్చింది ఆ రాక్షస స్త్రీలందరికీనూ లేచి చండోదరి అన్న రాక్షసి చాలా కోపంతో ఓ శూలం తిప్పూ అంది తత శ్చణ్డోదరీ నామ రాక్షసీ క్రూర దర్శనా ! భ్రామయన్తీ మహ చ్ఛూలమ్ ఇదం వచనమ్ అబ్రవీత్ !! ఇమాం హరిణ లోలాఽక్షీం త్రాస్కో త్కమ్పి పయోధరామ్ ! రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహాన్ అభూత్ !! ఈమెను రావణాసురుడు అపహరించి తెచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతూంది, మనుష్య కాంత చచ్చిపోయిందని చెప్పండి రావణాసురునికివెళ్ళి, చచ్చిపోయిందని చెప్తే ఆయనంటాడూ చచ్చిపోయిందికదా తినేయండి అంటాడు తరువాత దెబ్బలాడుకోవడానికి వీలులేదు ఇప్పుడే చెప్తున్నాను ఈమె యొక్క హృదయపు పైభాగము కింది భాగము పక్కన ఉండేటటువంటి మాంసమూ హృదయాన్ని పట్టి ఉంచేటటువంటి ప్రేగులూ నా వాట మీరు కూడా వాటాలు వేసేసుకోండి వెళ్ళి కల్లు తేండి ఈ మనుష్య కాంతని మాంసం తినినా కుంభలా నృత్యం చేద్దాం అంటే ఆవిడ ముందే ఎంత క్రౌర్యంతో కూడిన మాటలు మాట్లాడారో చూడండి, అజాముఖి సూర్ఫణఖ వీళ్ళందరూ కలిపి చేసిన ప్రతిపాదన అది. ఇప్పుడు సీతమ్మ తల్లి అందీ... న మానుషీ రాక్షస స్య భార్యా భవితుమ్ అర్హతి ! కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి వో వచః !! నేను మీరు చెప్పినటువంటి పని మాత్రం ఎప్పుడూ చేయను, మనుష్య కాంత ధర్మం మనుష్య కాంతదే ఆమె రాక్షసున్ని స్వీకరించడం అన్నది ఒక్కనాటికి జరగదు మీరు మీ మాట వినలేదని తినేస్తారా... తినేసేయండి అనీ ఆ తల్లి ఒక అరిటిచెట్లు పెను గాలికి ఎలా కదిలిపోతూందో అలా కదిలిపోయింది. కదిలిపోయి నేను నా జీవితాన్ని అలా విడిచిపెడతాను అంది. ఈ రాక్షస స్త్రీల చేతిలో ఉన్నటువంటి నేను ఎలా రామ చంద్ర మూర్తిని చేరుకుంటానూ అంది, ఆవిడ శోకం ఎంత తీవ్ర స్థాయిని పొందిందో ఆవిడ మనసు పొందిన వ్యాకులత చేత మహర్షి ఆవిష్కరిస్తారు ఇదీ రావణుని యొక్క పాపం.
ఆయనంటారు జీవితం త్యక్తుమ్ ఇచ్ఛామి శోకేన మహతా వృతా ! రాక్షసీభి శ్చ రక్షన్యా రామో నాఽఽసాద్యతే మయా !! ఈ రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి రామ దర్శనం పొందినటువంటి నేను మరణించడమే మంచిది నేను మరణిస్తాను అని ఆవిడ అంటూంది ధిగ్ అస్తు ఖలు మానుష్యం ధిగ్ అస్తు పర వశ్యతామ్ ! న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మ చ్ఛన్ధేన జీవితమ్ !! ఛ్... దిక్కుమాలిన మానుష్య జన్మ చావడానికి కూడా కుదరదంది, ఏమి? ఏమిటి బాధ మనుష్య జన్మలో తనంత తాను చచ్చిపోవడమన్నది ఎప్పుడూ చేయ్యకూడదు కాబట్టి ఆమరణ నీరాహర దీక్షలు సనాతన ధర్మంలో భాగము కాదని తెలుసుకోవలసి ఉంటుంది. శరీరాన్ని ఖేద పెట్టి చంపే అధికారం మనకు లేదు. మరణం వచ్చినప్పుడు దాన్ని అప్పజెప్పాలి, కాబట్టి మనుష్య కాంతను కనుక నన్నునేను చంపుకునే స్వేచ్ఛలేదు బ్రతికి రామున్ని చేరుతానన్న ఆశలేదు ఇది కల్పించినవాడు రాక్షసుడు వాడు ఈ పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అది సుందర కాండ యొక్క తీర్పు. కాబట్టి సీతమ్మందీ ప్రత్యాఽఽఖ్యాతం న జానాతి నాఽఽత్మానం నా ఽఽత్మనః కులమ్ ! యో నృశంస స్వభావేన మాం ప్రార్థియితుమ్ ఇచ్ఛతి !! నేను ఎటువంటిదాన్నో వాడు ఎటువంటివాడో తన వంశమేమిటో నా వంశమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక్కనాటికి నేను రావణాసురుని యొక్క పాన్పుచేరను ఆయన కోర్కె తీరేది కాదు తల్లీ పరి పరి విధాలుగా పరి పరి విధాలుగా ఆలోచించింది.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఈ ఆలోచన ఎంతదూరం వెళ్ళిపోయిందంటే అసలు రామ చంద్ర మూర్తి నన్ను మర్చిపోయారా రామ చంద్ర మూర్తి నా గురించి ఆలోచించకుండా కేవలము ధర్మమును పట్టుకుని రాజర్షి కావడం చేత వైరాగ్యం పట్టుకుని ఇక నన్ను పట్టించుకోవడం మాని ధర్మంలో నిలబడి ఉండిపోయాడా... లేకా మాయచేసి ఈ రావణుడే రామ లక్ష్మణుల్ని మట్టుపెట్టాడా అసలు భూమి మీద రామ లక్ష్మణులు ఉన్నారా లేక నేను ఆయన స్మృతిలో లేకుండా పోయానా ఎన్ని ఆలోచనలు ఆవిడకి వచ్చేశాయో తెలుసాండి, అంటే ఆలోచనలయందు ఇంత వ్యగ్రతతో కూడి ఆవిడ కదిలిపోయేటటువంటి స్థితిని కల్పించి అంత శోకానికి గురిచేసిన పాపం తీసుకొచ్చి అలా మాట్లాడేటట్లు రాక్షస స్త్రీలను ఆదేశించి వెళ్ళినవాడి ఖాతాలోకి వెడుతందా వెళ్ళదా వెళ్ళినప్పుడు వాడు అనుభవించాలా అనుభవించక్కరలేదా? మాట్లాడి వెళ్ళిన పాపం ఎంత దూరం ఉంటుందో చూడండి దాని ఫలితం వెళ్ళిపోతే ఊరుకోదది ఆ తరువాత పొందేటటువంటి దుఃఖం వల్ల పొందేటటువంటి పాపం కూడా ఆ ఖాతాలోకే పడుతూంటుంది ఎన్నాళ్ళు ఏడ్చిందో అన్నాళ్ళు ఆ పాపం రావణుడు ఖాతాలోకే అందుకే కదాండి చచ్చిపోయాడు.
Image result for త్రిజటకాబట్టి నూనం మమైవ సోకేన స వీరో లక్ష్మణాఽగ్రజః ! దేవ లోకమ్ ఇతో యాత స్త్యక్త్వా దేహం మహీతలే !! ధన్యా దేవాః సగన్ధర్వాః సిద్ధా శ్చ పరమర్షయః ! మమ పశ్యన్తి యే నాథం రామం రాజీవ లోచనమ్ !! శరీరం విడిచిపెట్టిన రామున్ని దేవతలు సిద్ధులు మహర్షు చూస్తారు వారు అదృష్టవంతులు అథ వా న హి తస్యాఽర్థే ధర్మ కామస్య ధీమతః ! మయా రామ స్య రాజర్షే ర్భార్యయా పరమాత్మనః !! ధర్మ దృష్టి కలిగి జ్ఞాన నిధియైనటువంటి రామ చంద్ర మూర్తి వైరాగ్యాన్ని ముందసలు నా గురించి మర్చిపోయాడు దృశ్యమానే భవేత్ ప్రీతః సౌహృదం నాస్త్యఽపశ్యతః ! నాశయన్తి కృతఘ్నాస్తు న రామో నాశయిష్యతి !! ఎదురగుండా కంటికి కనపడకుండా ఒక వస్తువు చాలా కాలం దూరంగా ఉంటే మనసులోంచి కూడా దూరమైపోతూంది ఔటాఫ్ సైట్ ఔటాఫ్ మైండ్ అంటూంటారు చూశారా అలా రాముడు కూడా నన్ను మర్చిపోయాడా కాని అలా మర్చిపోవడం కృతఘ్నుల లక్షణం రామ లక్ష్మణులు నన్ను అలా మర్చిపోరే కాబట్టి రామ లక్ష్మణులు అలా మర్చిపోయే అవకాశంలేదు. ఒకవేళ అథ వా న్యస్త శస్త్రౌ తౌ వనే మూల ఫలాఽశనౌ ! భ్రాతరౌ హి నర శ్రేష్ఠౌ చరన్తౌ వన గౌచరౌ !! అథ వా రాక్షసేన్ద్రేణ రావణేన దురాత్మనా ! ఛద్మనా ఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ !! ఒకవేళ మువృత్తినవలంభించి కందమూలాలు తింటూ చాత్ర ధర్మాన్ని విడిచిపెట్టి అస్త్రశస్త్రములు విడిచిపెట్టేశాడా లేకపోతే మాయ చేసి రావణుడే మట్టుపెట్టాడా..! అని ఆ ఆతల్లి పరి పరి విధములా ఖేదాన్నిపొంది చనిపోతానన్నంత వ్యగ్రతని పొంది, ఇక్కడ చచ్చిపోతానంటే విషాన్ని మహా దానం కింద ఇచ్చేటటువటివాడులేడు అని ఏడ్చింది అది విచిత్రము. విషాన్ని దానం కింద చెప్పలేదు ఆవిడ మహాదానంకింద చెప్పింది ఎందుకో తెలుసా అది పుచ్చేసుకుంటే చచ్చిపోతాను కానీ ఆవిషమిచ్చేవాడు కూడా ఇక్కడలేడు ఎందుకో తెలుసా చచ్చిపోతానంటే ఛావనివ్వరు నే కోరుకున్నట్లు బ్రతకనివ్వరు ఇది రాక్షస గుణం.
ఎంత అద్భుతమండి నిజంగా మహర్షి శ్లోక రచన అలా ఉంటుంది ఇంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ఇంక వాడు చెప్పినట్లు బ్రతకలేక చచ్చిపోతానంటే చావనివ్వడు, నేను బ్రతుకుతానన్నట్లు బ్రతుకుతానంటే బ్రతకనివ్వడు ఇది నేను లంకలో తట్టుకోలేని స్థితి, ఆవిడందీ నేను ఎలా ఎడుస్తున్నానో ఈ లంక అలా ఏడుస్తుంది నేను నా భర్తకోసం ఎలా అలమటిస్తున్నానో... మీ అందరూ భర్తలుపోయి అలా అలమటిస్తారు ఈ లంకలో ప్రతి ఇంటిలో ఉన్నవాడూ శవంగా కాలిపోతాడు ఆకాశమంతా పొగ ఆవరించి గ్రద్ధలు తిని పీనుగుల్ని పీక్కుతుంటాయి ఆ స్థితి ఈ లంకకు వస్తుందంతే.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
ఎందువల్ల వచ్చింది ఈ మాట మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్ మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు, మాటల చేత శాపాలు పొందుతారు ఈశ్వరుడు మాటనిచ్చాడు ఎలా మాట్లాడినా పిలిచేవాడు లేడనుకుంటున్నావు కానీ, కనిపెట్టి లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా నీవు మాట్లాడేమాటలు లెక్కలువేసే చిత్ర గుప్త రూపమొకటుంది, నా పోనేకదా నేను పుచ్చుకున్న కనెక్షనేగదాని, బొంబాయి కలకత్తా మాట్లాడేస్తే కంప్యూటర్ʼలో పట్టుకుని ఇన్ని సెకండ్లు మాట్లాడేశారని బిల్లు పంపించట్లా..? నీవు పెట్టుకున్న వ్యవస్థకే అంత శక్తి ఉంటే నీకు మాటిచ్చినటువంటివాడు అఖిలాండ బ్రహ్మాండనాయకుడు ఆయన కనిపెట్టలేడా నీవు ఏం మాట్లాడుతున్నావో కాబట్టి మాట ఉంది కదాని మాట్లాడకు ఎంత దూరం వెడుతుందో చూడు. కాబట్టి చెప్పాను కదాండీ రామాయణం పూర్తౌతుందోనని అనుమానం వచ్చిన చోట ఒక స్త్రీ పాత్ర ప్రవేశించాలి. ట్రిజటా అన్న ఒక రాక్షస స్త్రీ నిద్రలేచింది.
Image result for త్రిజట స్వప్నంనిద్రలేచి ఆవిడందీ మీరు తొందరపడకండీ ఆ తల్లిని తినేస్తానంటున్నారు అదంటున్నారు ఇదంటున్నారు, నేను ఇప్పుడే తెల్లవారుఝామున ఒక కల కన్నాను అది భయోద్వేగమును కల్పించేటటువంటి కల మీ అందరూ కూడా ఆ కలను సావధానంగా వినండీ అంది. గజ దన్తమయీం దివ్యాం శిబికామ్ అన్తరిక్షగామ్ ! యుక్తాం హంస సహస్రేణ స్వయమ్ ఆస్థాయ రాఘవ ! శుక్ల మాల్యాఽమ్బర ధరో లక్ష్మణేన సహ ఆగతః ! స్వప్నే చాఽద్య మయా దృష్టా సీతా శుక్లాఽమ్బరాఽఽవృతా ! సాగరేణ పరిక్షిప్తం శ్వేత పర్వతమ్ ఆస్థితా ! రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభా యథా ! ఆవిడందీ, నేను కలలో ఒక దివ్వమైనటువంటి దర్శనాన్ని పొందాను అందులో రామ చంద్ర మూర్తి ఏనుగు దంతములతో నిర్మింపబడి వేయి హంసలు పూన్చినటువంటి ఒక పల్లకీలో బయలుదేరి వచ్చారు, సీతమ్మతల్లి ఒక తెల్లటి పర్వత శిఖరం మీద కూర్చుంది, రామ లక్ష్మణులిద్దరూ ఆ శిభికలో సీతమ్మదగ్గరకొచ్చారు. సీతమ్మ లేచి నిలబడి సూర్యున్ని ఇలా తన చేత్తో రాస్తుండగా నేను చూశాను, సూర్యున్ని అలా రాస్తున్నట్టుగా ఆవిడకి కలలో కనపడితే సీతమ్మకి తొందరలో పట్టాభిషేకం జరుగుతుందీ అని అంటే భర్తతో కలిసి పట్టాభిశక్తిరాలౌతుంది. తొందరలో ఆవిడకి శుభముందీ అని.
రాఘవ స్ఛ మయా దృష్ట శ్చతు ర్దన్తం మహా గజమ్ ! ఆరూఢః శైల సంకాశం చదార సహ లక్ష్మణః !
తత స్తౌ నర శార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా ! శుక్ల మాల్యాఽమ్బుర ధరౌ జానకీం పర్యుపస్థితౌ !
తత స్తస్య సగస్యాఽగ్రే ఆకాశ స్థస్య దన్తినః ! భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కన్ధమ్ ఆశ్రితా !
భర్తుః అంకాత్ సముత్పత్య కమల లోచనా ! చన్ద్ర సూర్యౌ మయా దృష్టా పాణిభ్యాం పరిమార్జతీ !
రామ చంద్ర మూర్తి ఒక మహా జగం మీద ఆరూఢుడై ఆయన లక్ష్మణునితో కూడి వస్తుండగా చూసి నేను పులకించిపోయాను, తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి పుష్ప మాలలు ధరించినటువంటి ఆ రామ లక్ష్మణులు నాలుగు దంతములకు ఊంచినటువంటి ఆ ఏనుగు మీద వచ్చి సీతమ్మతల్లిని రామ చంద్ర మూర్తి స్వీకరించి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు వెడుతున్నటువంటి రాముడు శుక్ల మాల్యాఽమ్బర ధరౌ లక్ష్మణేన సహాగతః ఆయన్నీ ఆయనతరువాత పుష్పక విమానంలోకి మారారు సీతమ్మతో కలసి ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ! ఉత్తరాం దిశ మాఽఽలోక్య జగామ పురుషోత్తమః !! ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమః ! లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ భార్యయా !! నేను ఈ విషయాన్ని నా కలలో చూశాను, చూసినప్పుడు శంకు చక్ర గధ శ్రీమాన్ పుండరీకాయతేక్షణః శ్రీవత్సారక్షాః అప్రమేయః పరాక్రమః ఆ మహానుభావుడు నాకు చతుర్భుజయుడై శంఖు చక్ర గధా పద్మములను పట్టుకుని సాక్ష్యాత్ శ్రీ మన్నారాయునిడిగా దర్శనమిచ్చాడు. పుష్పక విమానమెక్కినటువంటి సీతారాములు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోవడము నేను చూశాను.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
 ఈ మారినటువంటి వాహనాల్ని ఒక రకమైనటువంటి లెక్కలోకి తీసుకుని తర్జుమా చేసినప్పుడు ఇది గాయిత్రీ మంత్రములో ఉండేటటువంటి బీజాక్షరములుగా మారి సీతమ్మతల్లి ఈ సర్గలో సాక్ష్యాత్ గాయిత్రీ దేవిగా సాక్ష్యత్కరించింది త్రిజటకీ అని పెద్దలు నిర్ధారించారు. బీజమంత్ర వ్యాఖ్యానం చేత కాబట్టి రావణ శ్చ మయా దృష్టః క్షితౌ తైల సముక్షితః ! రక్త వాసాః పిబ న్మత్తః కర వీర కృత స్రజః !! విమానాత్ పుష్పకా దఽద్య రావణః పతితో భువి ! తైలాన్ని తాగి పై నుంచి వస్తున్నటువంటి రావణుడు నేలమీద పడి గాడిదలు పూంచినటువంటి రథమెక్కి ఆ తైలాన్ని తాగుతూ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కిందకి పడి ఒక మల పంకంలో కూరుకుపోతూంటే నల్లని వస్త్రములు కట్టుకుని గుండు చేయించుకున్నటువంటి ఒక ఆడది నవ్వుతూ వచ్చి పాశములు వేసి రావణాసురున్ని లాగుతూంటే నేను స్వప్తనంలో చూశాను ఆ శ్వప్నంలో పైకి వచ్చినటువంటివాడు నూనె తాగుతూ పిబం స్తైలం హస నృత్యన్ భ్రాంత చిత్తాఽఽకులేంద్రియః ఆ నూనెను తాగుతూ బ్రాంత చిత్తుడై నృత్యం చేస్తూ కిందా మీదా పడుతూ ఏగువ పడుతున్నవాన్ని దక్షిణ దిక్కుకు వెళ్తున్నవాన్ని నేను చూశాను. అలాగే రావణుడు వరాహం మీద మొసలిమీద ఇంద్రజిత్తు ఒక్కడే ఒంటెమీద కుంభకర్ణుడు దక్షిణ దిశకు వెళ్ళిపోతుండగా నేను చూశాను
ఏక స్తత్ర మయా దృష్టా శ్వేత చ్ఛత్రో విబీషణః ! శుక్ల మాల్యాఽమ్బర ధర శ్శుక్ల గంధాఽనులేపన !
శంఖ దుందుభి నిర్ఘోషైః నృత్త గీతైః అలంకృతః ! ఆరుహ్య శైల సంకాశం మేఘ స్తనిత నిస్స్వనం !
చతుర్దంతం గజం దివ్య మాఽఽస్తే తత్ర విభీషణః ! చతుర్భి స్సచివై స్సార్థం వైహాయస ముపస్థితః !
 నలుగురు మంత్రులతో కూడుకున్నటువంటివాడై ఆకాశ మార్గంలో నిలబడి ఉంటే తెల్లటి గొడుగు పట్టబడినటువంటి విభీషణుడు తెల్లటి బట్టలు కట్టుకున్నవాన్ని తెల్లటి మాలల చేత అలంకరింపబడినవాన్ని శంఖము మొదలైనటువంటి ధ్వనులు మంచివి ప్రకాశిస్తున్నవాన్ని విభీషనున్ని ఒక్కన్ని మాత్రం నేను ఆకాశంలో నిలబడి ఉండగా చూశాను. ఎక్కడ్నుంచొచ్చిందో లంకా దృష్టా మయా స్వప్నే రావణేన అభిరక్షితా ! దగ్ధా రామ స్య దూతేన వానరే ణ తరస్వినా !! ఎక్కడ్నుంచో ఒక మహావానరమొకటి రామ చంద్ర మూర్తి దూతగా వచ్చింది ఆ వచ్చినటువంటి వానరము ఈ లంకా పట్టణాన్నంతటినీ కాల్చేస్తుంటే... ఇక్కడ ఉన్నవాళ్ళందరూ భీతితో గుడెంలు బాదుకుని శోకిస్తూండగా నాకు స్వప్నంలో దర్శనమైంది. కాబట్టి నేను కన్నటునటువంటి స్వప్నము నిజమూ అనడానికి ఆధారమేమిటీ అంటే అదిగో సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది ఎడమ తొడ అదురుతోంది కాబట్టి ఈ తల్లికి శుభముంది. ఈ తల్లికి శుభముందీ అని మీరు నమ్మారు కనుకా ఈ తల్లివలన మీరు ఆపద పొందకూడదూ అనుకుంటే ఉన్నవారు ఉన్నట్లే ఒక్కసారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి కాళ్ళుమీద పడిపోండి అంది. తనంత తాను కింద జాగ్రత్తగా మోకాళ్ళమీద వంచి కింద దండం పెడితే దండం పెట్టినట్లు, రెండు చేతులు కలిపి పెడితే నమస్కారం పెట్టినట్లు ప్రవర చెప్పితే అభివాదం చేసినట్లు పట్టు విడిచిన కర్రలా పడిపోతే ప్రణిపాతం చేసినట్లు ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాఽఽత్మజా ! అలమ్ ఏషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్ !! ఒక్కసారి మీరు కాని స్వర్ణదండం పడ్డట్టు నేలమీద పడిపోయారా ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది కారుణ్యమూర్తి.
Related image

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
నేను మీతో చెప్పింది ఇదే ధ్యానంలో ఆవిడ రాముడే అయ్యింది సీతారాములు అభేదం, చూడండి నేను చెప్పింది యదార్థం పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్టః పునః పున శ్చోత్తమ సాన్త్వ వాదీ సుఖాఽఽగతాం వాచమ్ ఉదీరయానః పునః పున శ్చోదయ తీవ హృష్టః ! అదిగో ఆవిడ కూర్చున్నటువంటి ఆ శింశుపా వృక్షం మీద ఆ తల్లి ఏ చెట్టు కింద కూర్చుందో ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని అలా పక్షి అరుస్తోంది అంటే తొందరలో ఈ తల్లి శుభాన్ని పొందబోతూంది రామ సమాగమాన్ని పొందుతూంది పట్టాభిషేకాన్ని పొందుతుంది ఈ తల్లివల్ల ఆపద రాకూడదూ అనుకుంటే మీ అందరూ నమస్కారం చెయ్యండీ అంది తతః సా హ్రీమతీ బాలా భర్తుః సందేశ హర్షితా ! పరితుష్టా ప్రియం శ్రుత్వా ప్రశశంస మహా కపిమ్ !! తతః సా హ్రీమతీ బాలా ఎంత గొప్ప మాట్లేసేస్తారో శ్రీ విద్యా రహస్యంలో ఉన్న రహస్యాల్ని తీసుకొస్తున్నారు మహర్షి ఇక్కడికి హ్రీమతీ బాలా ఆవిడా ఒక్కసారి లజ్జ పొందినదై సంతోషాన్ని పొందినదై భర్త యొక్క విజయాన్ని మనసులో ఆకాంక్షించినదై అది యదార్థమముగుగాకా అని సంకల్పించినదై త్రిజట కన్న కల నిజమౌతుందని విశ్వశించినదై వెంటే కింద పడిన రాక్షస స్త్రీలతో అంది ఈ స్వప్న విశేషములు నిజమైననాడు మీ అందరికీ అభయం మిమ్మల్ని ఎవ్వరూ చెలకరు మీ ప్రాణములకు నా రక్షా అంది ఆవిడ.
ఇది సీతమ్మ తల్లి యొక్క అనన్య సామాన్యమైన అనుగ్రహం ఇంత సేపు ఇంత బాధపెట్టినవాళ్ళని అనుగ్రహించడానికి తల్లి సిద్ధంగా ఉంది. ఎన్ని పాపాలు చేశానని నీవు బెంగపెట్టుకోకు ఒక్కసారి నీవు సీతమ్మముందు నీవు పడిపోగలిగితే నీ పాపాలన్నింటినీ క్షమింపజేయడానికి సీతమ్మ సిద్ధంగా ఉందీ అని మహర్షి యొక్క సందేశము. అటుంటి స్వరూపాన్ని మనకు ఆవిష్కరింపజేశారు ఒక మంగళాన్ని చేరకుండా సీతమ్మ శోకిస్తున్న శోకం దగ్గర ఆప కూడదు కనుకా మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతూందని అలా కూర్చోబెట్టేశారను తెలిసున్నా మిమ్మల్ని క్లేశానికి గురి చేసి నేను చెప్పవలసి వచ్చింది. నేను మీకు కల్పించిన అసౌకర్యమునకు నేను మన్నింపబడెదను గాక.


మనం పెట్టుకున్న నియమాన్ని అనుసరించి కొన్నిమార్లు రామ నామం చెప్పుకుని పూర్తి చేద్దాం.

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
దారినొంటిగ నడచువారికి తోడు నీడే రామ నామము !!రా!!
నారదాది మహా మునీంద్రుల నమ్మినది శ్రీ రామ నామము !!రా!!
కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రా!!
పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీ రామ నామము !!రా!!
నీవు నేనను బేధమేమియు లేక యున్నది రామ నామము !!రా!!
గౌరికిది ఉపదేశనామము కమలయజుడు జపియించు నామము !!రా!!

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీ రామ నామము !!రా!!
పెద్దలను ప్రేమించువారికి ప్రేమ నిచ్చును రామ నామము !!రా!!
కర్మ నేత్ర ద్వయము చేతను కానరానిది రామ నామము !!రా!!
జానకీ హృత్ కమలమందున అలరు చున్నది రామ నామము !!రా!!
బ్రహ్మ పుత్ర కరాబ్జవీణా సాటియైనది రామ నామము !!రా!!

అమ్మా నేను ఒక్క విషయాన్ని చెప్పి పూర్తి చేస్తాను రేపు సుందర కాండలో అత్యంత ప్రధానమైన ఘట్టమొకటి నడుస్తుంది. సంప్రదాయజ్ఞులు ఏమంటారంటే రెండు సిద్ధి సర్గలున్నాయి సుందర కాండలో అంటారు ఒకటి సీతమ్మతల్లిని హనుమ దర్శనం చేసినటువంటి ఘట్టం. హనుమని సీతమ్మని చూసినటువంటి ఘట్టం కూడా సిద్దిసర్గయే ఎందుకంటే చూసినటువంటి ఉత్తర క్షణంలో తల్లి నోటివెంట ఒక మాట వచ్చింది నీవు ఏమన్నావో అది నిజమగుగాకా అందులో మంగళముందు త్రిజటా స్వప్నం తరువాత మళ్ళీ అంత మంగళముందు అందులో పైగా హనుమా నేను మీతో ఒక మాట అంటూన్నాను ఒక యోగి నోటి వెంట వచ్చినది సత్యమౌతుంది. సత్యం యోగి కంఠం కాదూ అని రేపు హనుమ ఒక మాట చెప్తారు “క్షిణ దుఃఖ ఫలా హ్యాఽసి” అంటారు. అమ్మా నీకు ఇక్కడితో శోకం పోయిందీ అన్నారు. ఇదే వెళ్ళి రామునితో చెప్తారు ఇంక ఆ తల్లికి శోకం లేదూ అన్నారు. సీతమ్మతల్లి పరాశక్తీ మన వాఙ్మయంలో ఎక్కడా ఏడ్చినటువంటి సంఘటన లేదు మహా పతివ్రతగా పతివ్రత కంటి నీరు అస్రములుకన్నా ధనుర్వేదమంతటికన్నా ఎంత గొప్పదో చూపించినటువంటి కావ్యం రామాయణ కావ్యం.

  సుందర కాండ ముప్పయ్ మూడవ రోజు ప్రవచనము
 
అటువంటి సీతమ్మతల్లి మనస్సు ఊరడిల్లి సంతోషించినటువంటి ఘట్టం అత్యంత శక్తివంతమైన ఘట్టంగా పెద్దలు చెప్తారు, నేను కూడా నా జీవితంలో అనేక పర్యాయములు దాని యొక్క వైభవమేమిటో అనుభవించి ఉన్నవాన్ని ఇది నేను చెప్పకపోతే తెలియక మానేసినవాళ్ళు నీవు ధూర్తుడవు మాకీ మాట చెప్పలేదు చెప్తే మేము వచ్చి ఉండేవాళ్ళమేమో అంటారని అని నేను సామాజిక బాధ్యతగా ఈ మాట నేను చెప్తున్నాను.
కాబట్టి రేపు మీరు సంతోషంగా ఆ ఘట్టాన్ని వినేప్రయత్నం చేయండి చేస్తే ఆ ఘట్టం దగ్గరికి వచ్చిన తరువాత స్వామికి నీరాజనం ఇచ్చిన తరువాత వీలైతే ఆ ఘట్టం దగ్గర నిలిపే ప్రయత్నం చేస్తాను. రేపు అసలు ఎన్ని రకముల సుందర కాండో తిరుగుతుంది రేపు. ఉపాసన యొక్క పతాక స్థాయిలో ఏది రామున్ని చెప్పూ అంటూంది సీతమ్మ ఇవన్నీ రేపు నడుస్తాయి అత్యద్భుతం సుందర కాండ అందులో క్షిణ దుఃఖ ఫలా హ్యాఽసి రేపే వస్తూంది. మళ్ళీ ఇంకొక సిద్ధి సర్గా రేపే వస్తూంది. కాబట్టి దేశ కాలములను ఉపయోగించుకుని మనం ధన్యులయ్యేటటువంటి అదృష్టాన్ని సీతారామచంద్ర ప్రభువు మనకు కృపజేయుగాకా... అని ఆశిస్తూ...
మంగళా శాసన.....

No comments: