Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - సుందర కాండ 32వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Sundara Kanda 32nd Day


సుందర కాండ


ముప్పై రెండవ రోజు ప్రవచనము





నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాఽఽత్మజాయై నమోఽస్తు రుద్రే న్ద్ర యమాఽనిలేభ్యో నమోఽస్తు చన్ద్రాఽర్క మరుద్గణేభ్యః ! అంటూ ఈ అనుగ్రహం చేత నాకు దర్శనమవ్వాలి తప్పా నేను నిన్ను దర్శనం చయడమేంటమ్మాని, తాను పూర్వం చేసినటువంటి నమస్కారంలో ఉన్న దోపాన్ని దిద్దుతూ... ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించినటువంటివారై శరణాగతి చేసి హనుమకి భక్తి రక్షణ ఫలితంగా... భక్తి కలిగినటువంటివాడి ఉపాసనలో వచ్చేటటువంటి దోషాల్ని ఈశ్వరుడే దిద్ది సిద్దిని అనుగ్రహించడమనేటటువంటి సిద్ధాంతాన్ని ఋజువు చేస్తున్నట్లుగా అశోకవనం జ్యోతకమైతే వెంటనే అశోకవనంలోకి ప్రవేశించినటువంటి హనుమకి సీతమ్మ తల్లి యొక్క దర్శనమైన సిద్ది సర్గ గురించి నేను మీకు వివరణచేసి ఉన్నాను. అందులో ఆ తల్లిని చూసినప్పుడు హనుమ కళ్ళల్లోంచి చూసి మాట్లాడుతారు మహర్షి ఆ మాట్లాడినప్పుడు అంటారు తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమాఽఽవృతామ్ ! ఉపవాస కృశాం దీనాం నిశ్శ్వసన్తీం పునః పునః ! శ్రీరామాయణంలో మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి రచనా విధానం కంటి ముందు సీతమ్మని మనకి దర్శింపజేస్తారాయన.
హనుమా సీతమ్మ ఎలా ఉంటుంది అని భావన చేశారో అలాగే సీతమ్మతల్లి యొక్క దర్శనమైంది తతో మలిన సంవీతాం మలినమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంది, ఆవిడ మలినమైన వస్త్రాన్ని కట్టుకుందీ అంటే ఆవిడకి బట్టలులేక అలా కట్టుకుందా లేక కావాలని కట్టుకుందా అంటే ఆవిడ కట్టుకున్న బట్ట మట్టైపోవడానికి కారణం, అటువంటి బట్ట ఆవిడ కట్టుకుని అప్పటికి పదినెలలైంది తతో మలిన సంవీతాం అంటే మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకుందీ అని కాదు దాని ఉద్దేశ్యం పదినెలలు అప్పటికి పూర్తైపోయింది ఆ బట్ట కట్టుకుని, పది నెలలైనా ఆవిడ ఆ బట్ట విప్పలేదు అదే పట్టు బట్టతో ఉండిపోయింది రాక్షసీభిః సమాఽఽవృతామ్ రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది, చుట్టూ ఆ రాక్షస స్త్రీలు నిలబడి ఉన్నారు ఉపవాస కృశాం ఆవిడ ఉపవసించి ఉంది. ఉపవసించి ఆరోజు కాదు ప్రతిరోజూ ఉపవాసములే చేస్తుంది దీనాం చాలా దీనురాలై ఉంది నిశ్శ్వసన్తీం మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ నిట్టూర్పులు విడుస్తోంది పునః పునః ఒక్కమారు కాదు అనేకమార్లు, ఈ శ్లోకాల గొప్పతనమేమిటంటే బాహ్య స్వరూపాన్ని చెప్పడం కాదు ఆ ఒక్క శ్లోకంతో ఎన్ని కోణాలలోనో మహర్షి ఆ సౌందర్యాలని ఆవిష్కరిస్తారు. బాహ్యంలో సీతమ్మ ఎలా ఉంది అన్నది ఈ శ్లోకార్థం నేను మీకు చెప్పాను.
Image result for సీతమ్మ జాడ కోసం

  సుందర కాండ ముప్పయ్ రెండవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు దీంట్లోనే మీరు ఇంకొక కోణం చూసే ప్రయత్నం చేయండి తతో మలిన సంవీతాం ఆతల్లీ ఎందువల్ల అలా మాసిపోయిన పట్టుబట్టతో ఉంది అంటే ఆవిడకి లేక కాదు ఆవిడ అరణ్యవాసం చేసినా పద్నాలు సంవత్సరాలు కట్టుకోవడానికి సరిపడినన్ని పట్టుపుట్టములు కావిళ్ళకెత్తి పంపించాడు మామగారు, ఐనా ఇవ్వాళ ఆవిడ అలా పదినెలల క్రితం ఏ బట్ట కట్టుకుందో ఆ బట్టతోటే ఉండిపోయింది అందునా చింకిబట్ట కారణమేమిటంటే ఆవిడ ఉత్తరీయ్యాన్ని చింపి నగలు మూట కట్టి విడిచిపెట్టేసింది, కాబట్టి ఇప్పుడు అది వస్త్ర ఖండమే అనగా చినిగిపోయినటువంటి బట్టలోనున్నటువంటి భాగము, ఆవిడ సాక్ష్యాత్ త్రైలోక్యమాత శ్రీ మహాలక్ష్మి అటువంటి తల్లీ ఇవ్వాళ ఇటువంటి దైన్యమునుపొంది ఉంది ఇప్పుడు ఇది ఎవర్ని కట్టికుదుపుతుంది పది నెలల నుంచి సమస్త భోగములను అనుభవించవలసినటువంటి తల్లి ఏ బోగమూ అనుభవించకుండా సమస్తభోగములు అంటే రాజ్యంలేదు గదాండీ అని మీరు అనచ్చు, భోగములన్నీ ఒక్కెత్తు భర్త పక్కన ఉండగా అనుభవించినటువంటి ఏ భోగమైనా సమస్తభోగములకు సమానము ఎవరికి పతివ్రతకి, కాదూ ఆయన పక్కన లేకపోయినా ఫర్వాలేదూ మిగిలిన భోగాలన్నీ ఉంటే బాగుంటుంది అన్నారనుకోండి వాళ్ళగురించి రామాయణ ప్రసంగం చేసేటప్పుడు మాట్లాడే అవకాశం ఉండదు, ఎందుకంటే అలా ఉంటారని నీవు ఊహించవద్దు కూడా.
సనాతన ధర్మంలో ఏ ఆడదైనా భర్త పక్కన ఉంటేచాలనే కోరుకుంటుంది, కాబట్టి నీవు అలాగే మాట్లాడు, కాబట్టి అసలు రెండవ రకం వాళ్ళు ఉంటారన్న ఊహ కూడా నీవు చేయకూడదు, ఎందుకంటే సీతమ్మతల్లి యొక్క వైభవాన్ని చెప్తూ అలా ఉంటారన్నమాట అనడం కూడా తప్పే, కాబట్టి అందరూ అలా ఉంటారు అన్న పవిత్ర భావనతోనే మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి భర్త పక్కన ఉంటే ఆవిడకి అన్నీ ఉన్నట్లే... ఆవిడ అలా ఉందని రాముడేగా చెప్పాడు కిష్కింధ కాండలో, లక్ష్మణా నేను ఎందుకు ఉపశాంతిపొందానంటే... నేను ఎందుకు ఉగ్రుడను కాలేదంటే ఇంత అగ్నిహోత్రం లోపల ఉన్నా మీ వదిన పై కప్పుగా ఉంది అందుకే పైకిరాలేదు ఆ వేడి, ఆ పై కప్పు పోతే నా వేడి పైకొచ్చింది. ఆమె ఒక్కతి ఉంటే ఎన్ని కష్టాలైనా నేను తట్టుకున్నాను, ఆమె పక్కన లేకపోతే అది నాకు చాలా పెద్ద కష్టమై శోకం పైకి పెల్లూభుకుతూంది అన్నాడు. అంతటి మహాతల్లి ఏదీ ఆవిడకి భోగమన్నది యదార్థమునకు లేకపోయినా అన్నిటిని ఆవిడ పరిత్యజించి వచ్చినా... ఆవిడకి భర్త పక్కన ఉండడమే భోగంగా ఆవిడ సంతోషించింది.
అటువంటి తల్లీ పదినెలల నుంచి చీరెందుకు మార్చుకోలేదూ... అంటే ఇప్పుడు మార్చుకోవడం అంటూ జరిగితే రావణాసురుడు ఇచ్చిన చీర కట్టుకోవాలి, ఆ లంకా పట్టణంలో ఎవరు ఇచ్చినా అది ప్రభువుదే అవుతుంది. ఇప్పుడు తనని కామించి రామున్ని నిందించినటువంటి ఒక దూరాత్ముడి యొక్క ఐశ్వర్య సంబంధమైన చీర కట్టుకోవడం కన్నా... ఈ బట్టతో నేను ఉండిపోతాను. ఇప్పుడు ఆవిడ పొందిన ఆ క్లేశం ఆ బట్టకు పట్టిన చెమటా ఆ బట్టకు పట్టిన మట్టీ ఆ బట్టకు అంటినటువంటి ఆ మలినం ఆవిడ బాధకి కారణం ఎవర్ని కట్టి కుదుపబోతూంది రావణున్ని కట్టి కుదుపబోతూంది. మరణించేటటువంటివాడు రావణుడు అంటే ఆవిడ ఎన్ని నెలలు ఆ బట్ట కట్టుకుంటూందో అంత పాపం వాడి ఖాతాలో పడుతోంది. ఇదీ చెప్పకుండా చెప్పడం ఇలా చెప్పారా మహర్షి..? అలా చెప్పక్కరలేదు నీవు అలా తీసుకుంటే మన జీవితం చక్కబడుతుంది. మన వలన ఎక్కడ ఏ ఇల్లాలు శోకించినా... మన వలన ఎక్కడ ఏ ఆడది బాధపడుతున్నా... దాని శోకం ఉత్తిగనే పోదు, నీవు ఎంత పుణ్యం చేసినా ఎంత తపస్సు చేసినా అది ఇంత తపస్సు కూడా నిన్ను రక్షించలేని రీతిలో నీకు మృత్యువుని సిద్దం చేసేస్తుంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు.
Image result for లంకలో సీత

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
బాధపడిన ఒక ఆడది బట్ట మార్చుకోకపోతేచాలు నీవలన ఎంత ప్రమాదం వస్తూందో చూడండి, అంటే ఈ జాతియందు ఒక పతివ్రతయైనటువంటి స్త్రీ వైభవం ఎలా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందో మహర్షి చూపిస్తున్నారు రాక్షసీభిః సమాఽఽవృతామ్ రాక్షస స్త్రీల చేత ఆమే పరివేష్టింపబడి ఉంది, చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు, ఎందుకుండాలి?, అసలు రాక్షస స్త్రీలందరిని చుట్టూ పెట్టవలసిన అవసరమేముందండి ఆవిడ లంకారాజ్యంలో ఎక్కడెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం సాధ్యమా ఒక అబలకి? వెళ్ళలేదుకదా ఆవిడా, అంత మంది ఆవిడ చుట్టూ కూర్చుని ఉండడం ఎందుకూ... అంటే వాళ్ళు కూర్చున్నది ఆవిడ పారిపోతున్నదనికాదు, కూర్చోబెట్టినప్పుడు అరణ్యకాండలో వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఈవిడకి నేను పన్నెండునెలలు గడువిచ్చాను మీరు ఈవిడ చెవిలో ఇల్లు కట్టుకుని దూరాలి ఎలా రెండు రాకాలుగా ఒకటి ఈమె నా పాన్పు చేరేటట్టుగా నా వైభవాలన్ని స్తోత్రం చేయాలి, రెండవది ఈమె భర్తని తృణీకరించి భయపెడుతూ మీరు మాట్లాలి. ఇప్పుడు ఆవిడకి ఏది ప్రీతి పాత్రమో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఏది సుతారమూ ఆవిడ అంగీకరించదో మహా పతివ్రతగా ఆ తప్పు చెయ్యి చెయ్యి చెయ్యి అని చెవిలో ఇల్లు కట్టుకుని కోరుతున్నారు. ఇప్పుడు అలా రాక్షస స్త్రీలను కూర్చోబెట్టి ఆవిడ్ని అంతబాధ పెడుతున్నవాడెవడో వాడి ఖాతాలో ఈ ఫలితాలు వెల్తాయా వెళ్ళవా..? ఇది రెండు రకాలైనటువంటి ప్రమాదాల్ని ఏక కాలంలో తెచ్చుకున్నాడు, ఒకటి రాముని యొక్క నింద నిష్కారణ నింద. ఎందుకంటే రామున్ని నిందజేయడానికేం లేదు మీరు భూతద్దంపెట్టి వెతికినా రామ చంద్ర మూర్తిని తప్పు పట్టడానికి ఏమీలేదూ అని నేను బాల కాండనుంచి ప్రతి సంఘటనలోను చూపించుకొస్తున్నాను. అంతటి మహా ధర్మాత్ముడు ఒక రాక్షసుడు అన్నాడు “రామో విగ్రహవాన్ ధర్మః” అని, అటువంటి ధర్మాత్ముడైన రామ చంద్ర మూర్తిని అదే పనిగా విమర్శించాలి ఏమిపెట్టి విమర్శిస్తావ్? ఏముందని విమర్శిస్తావ్? ఏమీలేదు కానీ ఒక్కటే అంటూంటారు.
నరుడు, రాజ్య బ్రష్టుడు, ఎక్కడో అరణ్యంలో తిరుగుతున్నాడు, వస్తాడా..! నూరు యోజనాలుదాటీ రాడు బెట్టుచేయకు, బెట్టుచేసి నీవుకానీ అంగీకరించకపోతే నీవు బతికేది పన్నెండునెలలే పన్నెండు నెలలు పూర్తైన మరుక్షణం మరునాటి ఉదయం నిన్ను అల్పాహారంగా వడ్డించేస్తాం రావణుడికి. ఇప్పుడూ మీరు చూడండీ ఒక చిత్రమైనటువంటి పరిస్థితి, కాలం గడచిపోతున్నకొద్దీ చూశావా..! మేమన్నది నిజమా కాదా? వచ్చాడా రాముడు? అని వాళ్ళంటారు, కాలం గడుస్తున్నకొద్దీ మీరు ఇంత ధ్యానం చేసి ఇంత పతివ్రతగా నిలబడినా ఇంత సమర్థుడైన రాముడు రాలేదు, నా మాట నిలబట్టంలేదు ఆమెయందు ఆక్రోషం పెరిగిపోతూంటుంది, ఆక్రోషం ఎంతపెరిగిపోతూందో అంత వినరానిమాటలు నిరంతరం వినేది ఆవిడ ఒక్కతే... చెప్పేవాళ్ళు ఐదువందల మంది. కాబట్టి ఒకడే మాట్లాడాలి ఒకడే ప్రసంగం చేయాలి రెండు గంటలూ అనేంలేదు వంతులు వేసుకున్నా పదిహేనురోజులకు ఒకసారి వంతు ఒక్కొక్కరికి వస్తుందు. కాబట్టి రెండేసి గంటలు అదే ప్రసంగం కొత్తగా శ్లోకం చదవక్కరలేదు కొత్తగా వ్యాఖ్యానం చదువుకోక్కరలేదు ఇవే మాటలు చెప్తూండడమే, కానీ వినేతల్లిమాత్రం ఒక్కరే. ఇప్పుడు ఆవిడ ఇంత నిందవింటూ ఇంత తన చెవిన పడకూడని పరపురుషుని స్తోత్రం వింటూ ఆవిడ మాత్రం తన మనసుని రామునియందే పెట్టింది.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు ఆవిడ ఎంతగా రామునియందు మనసుపెట్టి ఉందో అంతగా ఈ మాట్లాడిన మాటల యొక్క ఫలితం మారిపోతూంటుంది, ఎందుకో తెలుసాండీ? మీరు మీ ఇంట్లో కూర్చుని విష్ణుసహస్త్రం చదువుకున్నారనుకోండి దానిఫలితం ఒకెత్తు, మీరు ఒక ప్రతిష్ఠ జరిగిన దేవాలయంలోకి వచ్చి కూర్చుని చదివారనుకోండి దాని ఫలితం ఒకెత్తు, మీరు ఒక స్వయంభూ దేవాలయంలోకి వెళ్ళి చదివారనుకోండి దాని ఫలితం ఒకెత్తు. విష్ణు సహస్త్రం మీ ఇంట్లో కూర్చుని చదివితే ఒక్క మారు, ఇక్కడకొచ్చి (దేవాలంయలోకి) కూర్చుని చదివితే వేయ్యిమార్లు, వేంకటాచల క్షేత్రంలోనూ శ్రీశైల క్షేత్రంలోనూ కాశీ పట్టణంలోనూ కూర్చుని చదివితే కోట్లి మార్లు దానికి ఫలితం మారిపోతూంది లెక్క మారుతూంది, స్వయంభూ క్షేత్రాలు అన్నిటికన్నా గొప్ప క్షేత్రాలుగా ఉంటాయి భూమిలో, కాబట్టి క్షేత్రాన్ని బట్టి మారుతుంది. క్షేత్రాన్ని బట్టి మీరు పలికినటువంటి పలుకు యొక్క ఫలితం మారిపోతూంటే ఒకటికి కోటైపోతూంటే ఆమె రామునియందు మనసుపెట్టుకుని ధ్యానావస్తలో ఉన్నా కూడా ధ్యానాన్ని పాడు చెయ్యడానికి మాడ్లాడినట్లు రెండు రకాలుగా మాట్లాడితే ఈ రెండూ ఆవిడకి ఇష్టమైనవి కావు, “రావణ స్తోత్రము-రామ నింద” ఇవి రెండూ ఆవిడ సుతారము అంగీకరించలేని విషయాలు. ఆవిడ అంగీకరించలేని ఈ రెండు విషయాల్ని అదే పనిగా మాట్లాడితే మాట్లాడిన దోషం ధ్యానమగ్నయైనటువంటి తల్లి యొక్క ధ్యానాన్ని పాడుచేసినటువంటి దోశం ఇప్పుడు ఇవన్నీ ఎవరి ఖాతాలో పడుతాయి రాక్షస స్త్రీల కాతాలోకి వెళ్ళడం అలా ఉంచండి, వాళ్ళని వినియోగించినందుకు రావణుడు మీరు ఇదే పని చేయాలి అంతే ఆవిడ ఎక్కడికో పారిపోతుందనో లేకపోతే ఆవిడ ఎక్కడికో పోతుందని ఏదో చేస్తుందని కాదు.
Related imageరెండవది ఆమె యందు భయాన్ని పెంచాలి ఉద్విఘ్నతను, అందుకని ఎలాంటివాళ్ళను పంపాడో తెలుసాండీ వాళ్ళు మామూలుగా ఉండడానికి వీల్లేదు, వాళ్ళు ఒళ్ళంతా నెత్తురు పూసుకొని అంటే పిల్లలు పాయసం తాగితే మీద  పోసుకున్నట్లు వాళ్ళు ఒళ్ళంతా నెత్తురోడుతూ మాంసం ఆవిడ దగ్గరే కూర్చుని నర మాంసమని తింటూంటారు, అంటే... మాట వినకపోతే నా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందన్న బెదురు ఆమెకు కల్పించాలని, ఒక అబలయందు ఇంత దుష్టచేష్టితములు చేసినటువంటి వ్యక్తి మీకు ఇక్కడ కనపడుతున్నాడా శ్లోకంలో మీకు ఇక్కడ శ్లోకంలో కనపడడడు, కానీ ఈ శ్లోకంలో సీతమ్మతల్లిని చూసినప్పుడు సీతమ్మ తల్లి యొక్క శోకం ఎలా ఉందో ఆవిడ బాధ ఎలా ఉందో పరివేదనతో చూడండీ ఆ పక్షి అరుపు అలాగే ఉంది. కాబట్టి ఉపవాస కృశాం ఆవిడా తతో మలిన సంవీతా రాక్షసీభిః సమాఽఽవృతామ్ ! ఈ పాపాలన్ని ఎవరివి ఇది మిమ్మల్ని ఆలోచించమని, కాదు మీరు బాహ్యంలో చదివారనుకోండి అది ఆవిడ స్థితి అనిపిస్తుంది అంతే రాక్షసీభిః సమాఽఽవృతామ్ ఉపవాస కృశాం ఆవిడ ఉపవాసములచేత కృషించింది, ఉపవాసముల చేత కృషించడం అంటే అన్నం తినకుండా నిరాహార దీక్షచేసి క్షీణించడం ఒకెత్తు, ఉపవాసం చేత క్షీణించడం ఒకెత్తు, ఉపవాసం చేత క్షీణిస్తే ఏమౌతుందో తెలుసాండీ శరీరం యొక్క బలం తగ్గుతుంది లోపల ఈశ్వర తేజస్సు పెరిగిపోతుంది.
కారణమేమిటంటే అది “ఉప వసి” ఈశ్వరునికి సమీపంలో మీరు నివసిస్తున్నారు. అలా నివశించడానికి ఎంత ఆహారం కావాలో అంతే తింటున్నారు, తప్పా ఇంక ఈ శరీరంలో ఇతరమైన ఏ కోర్కె పుట్టడానికి వీళ్ళేదు మనసుకు ఆ

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
బలముండదిక ఇంక ఏ ఇతరమైన కోర్కె పుట్టడానికి అవకాశం లేకుండా  ధ్యానించడానికి ఒక ప్రయోజనానికి శరీరాన్ని నిలబెట్టుకోవడం ఇతర భోగాపేక్షతో కాదు, ఈశ్వరున్ని ధ్యానించడానికి శరీరం నిలబడాలి కాబట్టి తగినంత ఆహారమే తీసుకుని ధ్యానం చేస్తే ఉపవాసం అంటారు. ఇప్పుడు మీరు చూడండి గమ్మత్తొకటుంది లోకంలో ఆటలాడుకునే పిల్లలు బల్లలుంటాయి బరువెక్కువైతే ఇటు దిపోయి అటు పెకెళ్ళిపోతుంది, ఈవిడ ఎంత ఉపవాసం చేసి ఎంత ధ్యానం చేస్తూందో అంత ఆవిడ తేజస్సు పెరుగుతూంది, ఆవిడ ఎంత ఉపసించి ఎంత ధ్యానం చేసి ఎంత రాముని యందు రమిస్తుండగా వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారో అంత పాపం వాడికిపెరుగుతూంది. ఇంత తొందరగా రావణాసురుడు మరణించడానికి వీలుగా వాన్ని సిద్ధం చెయ్యడానికి తగినటువంటి స్థితి ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలకి కానీ శ్రీ మహా విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి కానీ లేదు. ఎందుకో తెలుసాండీ..? అందుకే మహర్షి పడుకుంటే ఆమాటే చెప్పారు రావణుడి గురించి ఐరావత విషాణాఽగ్రైః విష్ణు చక్ర పరిక్షతౌ ఐరావతం యొక్క దంతం చేత ఒరిపిడి కలిగినటువంటి మచ్చలు కనపడినా, సాక్ష్యాత్ శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టికొట్టినా చిన్న మచ్చలుపడ్డాయి తప్పా వాడు చావలేదు.
Related imageమరి దేనికి చచ్చిపోతున్నాడు ఒక పతివ్రత దగ్గరకివెళ్ళి మాట్లాడ కూడని మాటల వలన చచ్చిపోతున్నాడు తానైతే ఏదో ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాడు పదినెలల్లో రోజూ వెళ్ళడానికి వాడి మొహం వాడికేం ఖాలీ ఉండదు కదా..? ఏదో రెండు రోజులకో మూడు రోజులకో నాల్గురోజులకో లేదా ప్రతిరోజూనే వెళ్ళాడనుకోండి పోనీ... వెళ్ళినా ఏదో అరగంట మాట్లాడుతాడు గంట మాట్లాడుతాడు ఇరవై మూడు గంటలు ఇంకా తపస్సు పెరిగి ఉండి ఉండేది కాపాడుతుండేది వాడి జీవిత కాలం పెరిగుండేది వాడు సీతమ్మతో ఏమన్నాడంటే నీకు ఏడాది సమయం ఇస్తున్నానన్నాడు, ఆవిడకి కాదు ఇచ్చింది వాడి జీవితానికి పెట్టుకున్నాడు, నేను ఏడాది బతుకుతానని పెట్టుకున్నాడు ఎందవల్ల తను వెళ్ళి మాట్లాడితే గంటే తన తరుపున మాట్లాడమని రాక్షస స్త్రీలను పెట్టాడు, ఇప్పుడు తను మాట్లాడిందంతా వాడు మాట్లాడినట్లే కదాండీ కాబట్టి ఎంత తొందర తొందరగా తన మృత్యువు కొని తెచ్చుకున్నాడో చూడండి, ఇది సుందర కాండలో అత్యంద్భుతమైనటువంటి విషయం. నీవు మాట్లాడినా నీవు దుష్ప్రచారాలు మొదలుపెట్టీ నిన్ను అడిగేవాడు లేడుకదా అనుకునీ నీవు ఈశ్వరున్ని నిందజేస్తూ వేదాన్ని ధిక్కరిస్తూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ నోరు ఈశ్వరుడిచ్చాడు కదాని నీవు అదే పనిగా ప్రచారాలు మొదలు పెట్టీ ఈశ్వర వ్యతిరేకమైన ప్రసంగాలు చేసి నీవెనుక ఇంకో పదిమందిని కూడగడితే నీ శరీరం పడిపోయిన తరువాత వీళ్ళు మాట్లాడినమాట్ల ఫలితాలు కూడా నీ ఖాతాలోకే వచ్చేస్తాయి.
నీవు నేర్పినవే ఇవన్నీ అందుకే “దుష్తర్కస్తు విరమ్యతాం” అంటారు శంకర భగవత్పాదులు, అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్ళి అడిగారు, మీరు ఇచ్చిన వాఙ్గ్మయం మహా సముద్రం మేము ఏం చదువుకోము అన్నారు, మాకు సూక్ష్మంగా ఏమైనా చెప్పండి అన్నారు. “వేదోనిద్య మదీయతాం సదువితం స్వకర్మ స్వనీష్టీయతాం” ఏమాటలూ నమ్మకండి వేదమే ప్రమాణమని నమ్మండి, “స్వకర్మ స్వనీష్టీయతాం” వేదం ఎలా చెప్పిందో అలాగే మీరు కర్మ చేయండి “దుష్టకాష్టువిర్యంతాం” ఎప్పుడూ వేదానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దూ... ఈశ్వరుడు ఏ మాట ఇచ్చాడో దానికి వేద వ్యతిరేకంగా మాట్లాడితే కొన్ని కోట్ల జన్మలు కట్టి కుదిపేస్తుంది అప్పుడు బాధపడుతావు. కాబట్టి అలా మాట్లాడవద్దని చెప్తారు శంకర భగవత్పాదులు. అలా మాట్లాడినవాడు ఎలా పాడైపోతున్నాడో చూడండి. కాబట్టి ఒక్క పాదంలో అంత మృత్యువుపొంచి ఉంది రావణుడిది. కాదు ఆవిడకి తెలిసే జరుగుతూందా ఇదంతా... ఆవిడ పాతివ్రత్యంతో రాముడికోసం ధ్యానం చేస్తుండడం వల్ల అనుషంగిక ప్రయోజనంగా రావణుడు చనిపోతున్నాడా... ఆవిడ రావణున్ను చంపడానికే అలా ఉందా అక్కడా ఎందుకో తెలుసాండీ ఈ ప్రశ్న అనుమానం వస్తూంది ఎందుకనీ అంటే కట్టిన బట్టను విప్పలేదు పదినెలలైంది వాడి అంతఃపురమంతా చూపించాడు ఐశ్వర్యమంతా చూపించాడు వాడి ఇంటినుంచి వెళ్ళిన అన్నపు ముద్ద ఆవిడ తినలేదు మరి ఈవిడ ఎలా బ్రతుకుదూంది అనుమానం రావద్దూ ఒక నరకాంతకదా ఎలా ఉంటూంది ఈవిడా? అని అనుమానం రావాలా అనుమానం వచ్చిందనుకోండి ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వస్తూంది, ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వచ్చిందనుకోండి ఒక సాక్ష్యం ఒకటి వాడికి దొరుకుతుంది.
మిగిలిన మాటలు ఎలా ఉన్నా ఒక్క సాక్ష్యం దొరికిపోతుంది, ఈవిడెవరు అసలు? అడిగితే ఎవడో ఒకడు చెప్తాడు, విభీషణుడులాంటివాడు ఒకడు ఉంటాడుగా... ఆవిడ అయోనిజ అసలు నరకాంత కాదు అంటాడు, ఇప్పుడు నరకాంత కాందంటే ఆవిడ ఎవరు? ఎందుకొచ్చింది ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చాను, నేను ఇక్కడ తీసుకొచ్చిపెట్టింది నా మృత్యువుకాని రావట్లేదుకదాని వాడికి అనుమానం వచ్చిందనుకోండి ఏమో..! వాడు తీసుకెళ్ళి అప్పజెప్పేస్తాడు. కాబట్టి ఇప్పుడు అసలు ఆవిడగురించిన ఆలోచన వాడికిరాకూడదు ఎవరు చేస్తున్నట్లు అలాగ ఆవిడే చేస్తుంది. ఎందుకో తెలుసాండీ? అందుకే మహర్షి దానికి “సీతాయాత్ చరితం మహత్” అని పేరు పెట్టారు. ఆవిడ నరకాంత ఎప్పుడో కాదు ఈ రహస్యాన్ని ఒక్క అనసూయమ్మకి మాత్రమే చెప్పింది రామాయణంలో, ఎక్కడా రామునితో మాట్లాడినప్పుడు కూడా అలా చెప్పలే ఎందుకంటే నరకాంతగా ధర్మాన్ని అనుష్టించినప్పుడు భర్తతో చెప్పకూడదు, మహా తపస్విని కాబట్టి అర్థం చేసుకోగలదు కాబట్టి ఆవిడ అనుసూయమ్మతో ఈ రహస్యం చెప్పేసింది. నేను నరకాంతను కానమ్మాని చెప్పింది, చెప్పీ జనకుడికి అశరీరవాణి చెప్పింది “ధర్మేణ తనయా తవా” అని చెప్పింది, ధర్మము చేత నీకు కూతుర్నినని చెప్పింది కాబట్టి జనకుడు నన్ను కూతురు అనుకున్నాడు తప్పా నేను నరకాంతను కాను అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నరకాంత కాకపోతే ఇంకేకాంతో అనడానికేం లేదు ఆవిడ సాక్ష్యాత్ జగన్మాత, ఇప్పుడు కొత్త ప్రచారమేమొచ్చిపడింది, పరకాంతతో మాట్లాడినటువంటి పాపమొకటీ పడలేదు, ఒక తల్లి దగ్గరికెళ్లి ఒక కొడుకు మాట్లాడితే ఇలాంటి మాటలు ఎంత తప్పో... ఒక తల్లి తన ఇంట్లో చీర మార్చుకోకుండా ఉండిపోతే ఎంత తప్పో తల్లిని కామించిన కొడుకుది ఎంత తప్పో మూడు లోకములకు తల్లిని కామించినవాడికి ఎంత తప్పు ఉంటుంది.
ఒక్కసారి పార్వతీదేవీ అని తెలియక హిమవత్ పర్వతం మీద ఎంతందగత్తె అని చూశాడు ఇలా కుబేరుడు ఓ కన్ను మెల్లైపోయింది, తెలియక చూసినందుకు, ఇదే అంటారు సుందర కాండ చివరల్లో అసలు వాడు బూడిదెందుకైపోలేదు అన్నారు, ముట్టుకోగానే బూడిదైపోవాలిగా ఎందుకవ్వలేదు అన్నారు, వాడి తపఃశక్తి అంతటిది అన్నారు. ఇప్పుడది క్షీణించాలి క్షీణించాలంటే ఈ బుద్ధివాడికి పుట్టకూడదు, తాను అయోనిజా... తనని తీసుకురావడం తనతో మాట్లాడటం అంత తేలిక కాదు అని వాడికి అర్థమవకూడదు, వాడికి అర్థమవకూడదు అంటే మీరొకటి చూడండీ... చెప్పినా వాడి బుర్రకెక్కకూడదు అంతే,

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు ఆవిడే చెప్తూంది ఒకప్పుడు దాచడం కాదు ఆవిడే చెప్తూంది చెప్తే... వాడికి ఒక్కనాటికి వాడి బుర్రలోకి వెళ్ళలేదు, ఎందుకనీ నిలువెల్లా అహంకారం, కాబట్టి వాన్ని చంపేసిందేదీ అంటే... ఒకప్పుడు ఈ రహస్యాన్ని సీతమ్మె చెప్పినా వాడికి తలకు ఎక్కలేదంటే వాడి అహంకారానికి వాడు చచ్చిపోయాడు. కాబట్టి నీకు ఎన్నున్నా నీకు చంపగలిగింది ఏమిటంటే నీ అహంకారమే నిన్ను చంపగలిగినప్పుడు నిన్ను ఎంతకైనా పాడు చేయగలదు, కాబట్టి నీవు వదలవసిందంటూ ఏమైనా ఉంటే అహంకారమే ఇదీ సుందర కాండలో ఒక శ్లోకంలో ఒక పాదంలో ఒక మాటకి అంత వ్యాఖ్యానం ఉంటుంది అన్ని కోణాలలో మీరు స్వీకరించండి అని దాని సందేశం.
Related imageఅయినప్పుడు పదిహేనో సర్గకి పదహారో సర్గకి అంత గౌరవం సుందర కాండలో ఉండడానికి కారణం అదే, కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమాఽఽమృతామ్ ! ఉపవాస కృశాం దీనాం ఆవిడ దీనురాలిగా ఉంది ఏమిటి దైన్యం, ఏమిటాడవికిబాధ, తనను తాను రక్షించుకోగలిగిన శక్తిని తాను ప్రకటించుకోగల అవకాశం లేకపోవడంవల్లా, “దైన్యం” అన్నమాట ఎప్పుడు వాడుతామంటే? పాపం వాడు దీనుడండీ అంటాం, దీనుడండీ అంటే తనకు కావలసినది తాను సమకూర్చుకోలేనివాడు, ఇప్పుడూ చూడండి ఆయన ఆకలితో అలమటించిపోతున్నాడు ఎంతటి దీనుడో అనుకున్నారనుకోండి తను తినడానికి కావలసిన అన్నాన్ని తాను సమకూర్చుకోలేనివాడు, సీతమ్మ తనని రక్షించుకోగలిగిన శక్తి తనకి లేనిది, లేనిదావిడా? ఒక్కనాటికి కాదు, ఆవిడే చెప్పింది ఆ రహస్యం, నిన్ను కాల్చేస్తానురా తల్చుకుంటే అంది, మరి ఎందుకు చంపదు? నరకాంతగా నరున్ను అనుగమిస్తూంది రాముడి భార్యగా... ఆవిడ అయోనిజయైనా... నరకాంతగా నేను ఉంటాను అని సంకల్పం చేసింది, నరుడి సొత్తుగా నరుడి భార్యగా ఉంది, కాబట్టి తనని తాను రక్షించుకుంది పతివ్రతా ధర్మంతో, రాముడు వచ్చి రక్షించాలి, ఇంత శక్తి ఉండి చంపట్లేదు. వీడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఇది ఆవిడ దైన్యం.
కాదు బాహ్యంలో దైన్యం ఏమిటో తెలుసాండీ! రాముడు రాలేదు రక్షించలేదు ఎన్ని మాటలు వినవలసి వస్తూందీ, ఇదీ కథా పరమైన సౌందర్యం, ఆవిడ పాతివ్రత్య సౌందర్యము కాబట్టి ఉపవాస కృశాం దీనాం నిశ్శ్వసన్తీం పునః పునః ఆవిడా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నిట్టూరుస్తూంది, సుందర కాండలో రెండు మీకు ఎక్కువ కనిపిస్తాయి, ఏం ఫర్వాలేదంటాడు రావణుడు చ్.. అంటూంది సీతమ్మ, ఈ రెండింటికి సంఘర్షణ సుందర కాండ. మీరు చూడండీ ఎప్పుడూ ఏం ఫర్వాలేదంటూంటారే... ఆ మాట చాలా ప్రమాదం. ఏం ఫరవాలేదంటే? నియమోల్లంఘన చేయమని దానర్థం. ఏమండీ ఇప్పుడు చెయ్యొచ్చా ఆ పనీ... అని అడిగారనుకోండి, ఏం ఫరవాలేదండీ అన్నారనుకోండి దాని అర్థమేమిటో తెలుసా... పక్కన పెట్టేసై శాస్త్రాలని అని, అబ్బా ఇలా చెయ్యొచ్చని చెప్పడం వేరు, చెయ్యకూడదను అన్నారనుకోండి, ఏమండీ ఇది చెద్దామనుకుంటున్నాం అన్నారనుకోండి తప్పు అలా చేయ్యకూడదు మనం అన్నాననుకోండి మీరేదో చెప్పారు చేద్దామని నేను అన్నాను తప్పు అలా చేయకూడదన్నాను, ఇప్పుడు నా స్థానానికి గౌరవం ఏమిటీ? నేను చెయ్యొద్దూ అంటే ఆగిపోవడం కదా... ఏం ఫర్వాలేదండీని మీరు నాకు చెప్పారనుకోండి, ఇప్పుడు ఏమిటి దానర్థం నీకు శాస్త్రం తెలిసున్నా నీవు ఉల్లంఘన చెయ్యాలి అంతేగదా..! అంతేగాని అది చెయ్యొచ్చండీ దీని ప్రకారం అని ఏమైనా చెప్పగలరా..? చెప్పలేరు కానీ ఫరవాలేదండీ

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
అంటారు, ఫరవాలేదండీ అంటే అలా చెయ్యండీ అని చెప్పడానికి శాస్త్రప్రమాణం లేకపోయినా మనకు ఇష్టమైంది కాబట్టి చేసైండీ అని చెప్పడం, దానికేం ఫరవాలేదులేండి అంటూంటాడు, ఏం ఫరవాలేదేమీటీ? ఏం పరవాలేదు అన్నది ఎంత ప్రమాదమో వీడికి ఎందుకు అర్థం కాదు ఛ్ అంటూంది ఆవిడా... ఈ రెండింటికీ మధ్య సంఘర్షణ సుందర కాండ.
Image result for అశోక వనంలో సీతమ్మఒకరు శాస్త్రోల్లాంఘనాన్ని అంగీకరించరు అది నిట్టూర్పు, ఒకడు తెలిసి శాస్త్రన్ని ఉంల్లంఘించి ఏం ఫరవాలేదులేండి అంటూంటాడు, ఈ రెండుటికి సంఘర్షణ జరుగుతూంటూంది రావణుడికి సీతమ్మకి. కాబట్టి ఇప్పుడు ఆవిడా విశ్శ్వసంతీం మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్లీ నిట్టూర్పు విడుస్తోంది దదర్శ శుక్లపక్షాఽఽదౌ చన్ద్ర రేఖామ్ ఇవాఽఽమలామ్ శుక్లపక్షం యొక్క ప్రారంభంలో అంటే తదియనాటి చంద్ర లేఖ అనుకోండి విదియ తదియలలో ఉండేటటువంటి చంద్ర రేఖా కనపడదు, ఎందుకంటే అమావాస్యనాటికి చంద్ర బింబం ఇంచు మించుగా కనపడ్డం మానేస్తుంది. తదియనాటికి చాలా సన్నని చంద్రరేఖ ఉంటుంది అది ఏ మాత్రం మబ్బున్నా ఏ మాత్రం ఆకాశంలో దర్శనానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి అత్యవసాయంతో నిలబడకపోయినా అది మీకు దర్శనం కాదు. మీరు ఎంతో పట్టి పట్టి చూస్తే... సీతమ్మేమో అనిపిస్తుంది... లేకపోతే మీరు సీతమ్మని గుర్తుపట్టలేరు, ఎందుకో తెలుసాండీ? ఒక్కటే కారణం ఆవిడ శుష్కించిపోయింది, అంత శుష్కించిపోయిన సీతమ్మని చూస్తే రాముడిపక్కనున్న సీతమ్మ మెరిసిపోతూంటూంది వెలిగిపోతూంటుంది అందంతో లంకలో ఉన్న సీతమ్మ శుష్కించిపోయి ఉంటుంది. ఇంత శుష్కించిపోతే లోకంలో ఒక కారణం ఉంటుంది మీరు చూడండీ... దేనికైనా ఎక్కడికైనా పంపరేమోకానీ బెంగపెట్టుకుంటారేమోనని పంపిస్తారు మీకు ఆమాటోటి ఉంది లోకంలో బెంగ పెట్టుకుంటుందేమోనని ఎందుకంటే ఎప్పుడూ మనసు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందో అక్కడికి పంపేస్తారు అసలు బెంగ రాకుండదనుకుంటే.
స్త్రీని తొలి కాన్పుకు ఎందుకు పంపిస్తారు పుట్టింటికి అంటే ఆడపిల్ల అలవాటు ఏంటంటే... ఏ చిన్న సమస్యొచ్చినా అమ్మా... అమ్మా ఏంటమ్మా అని అమ్మకు చెప్పండం అలవాటు అరమరిక లేకుండా, ఇప్పుడు ఆమెకు తొలికాన్పు ఆమె రకరకాల సమస్యలతో బాధపడుతూంటుంది, అమ్మలాంటి అత్తగారు ఉంటారు లోకంలో నేనేమి అత్తగారి స్థానాన్ని తక్కువ చెయట్లే నేనేమి తక్కువ చేసి మాట్లాడటంలేదు, అనపర్తిలో నాకు అటువంటి కుటుంబమొకటి పరిచముంది, అమ్మాయిని పుట్టింటికి పంపిస్తే బెంగపెట్టుకుని వెళ్ళిపోయింది అత్తగారింటికి, ఉంటారు మహాతల్లులు, కానీ నేనొక లోకసహజమైన పోకడ చెప్తున్నాను అంతే, అమ్మదగ్గరికెళ్లితే చెప్పగలదు, కాబట్టి చెప్పలేకా నేను నీకు చెప్పలేకపోతున్నాను అత్తయ్యగారూ అని అనదేమోననీ... బెంగపెట్టుకుంటే లోపల శిషువు సరిగ్గా తయారుకాడనీ అమ్మదగ్గరకెళ్ళి ఉండమ్మాని అమ్మదగ్గరికి పంపిస్తారు. అంటే బెంగా అన్నమాటకు అర్థం మీరు ఎంత బాహ్యంలో పోషించేవి పెట్టండీ... వాళ్ళు ఎన్ని తిన్నా కృషించిపోతూంటారు, దిగులు కారణం దిగులుందీ అంటే మీరు ఏం చేసినా వాళ్ళ మనసు మీ దగ్గర ఉండట్లేదూ అంటే ఎక్కడికో వెళ్ళిందని గుర్తు. ఎక్కడెళ్లుతుంది పుట్టింటికే మనసు పరుగుతీస్తూంది కదా... కాబట్టి ఓసారి పుట్టింటికి పంపిస్తుంటారు కదా. దిగులుకి అంత ప్రాధాన్యత మనం అన్నీ పెట్టాముగదా అనరు మనసు స్వాంతనపొందడానికి పంపిస్తారు ఒక్కసారి.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
Image result for లంకలో సీతఅయినప్పుడు మరి రోజూ వచ్చి చూస్తున్నాడు గదా ఆవిడ ఇంత దిగులు పొందుతూంది ఇంత కృషించిపోతూంది నేను తెచ్చిన సీతమ్మకీ ఈ సీతమ్మకి పోలిక లేదంటే వాడికి ఆ భావన ఉంటే వాడేంచేయాలి ఆవిడ్నిపంపియ్యాలి, వాడి రాక్షసత్వం అంటే ఏమిటంటే? ఆవిడ కృషించిపోయినా వాడికనవసరం నశించిపోయినా వాడినవసరం, నశించిపోతే తనకు లొంగని కారణానికి నశించిపోవాలి ఆవిడ జీవించి ఉంటే తనకు లొంగిన కారణానికి జీవించి ఉండాలి, తప్పా ఆవిడ సంతోషంగా ఉండి రాముని పక్కన మాత్రం ఇక ఉండడానికి వీళ్ళేదు. ఆవిడ కోరుకోవచ్చు తను అలా ఉండాలని, ఇదే రాక్షసత్వమని పేరు. “ప్రేమించి యాసిడ్ పోశాడు” పచ్చి అబద్దం కామించి ఆసిడ్ పోశాడు రాక్షసత్వం. అలా పేపర్లలల్లో వ్రాయడం మొదలు పెడితే ఎవడూ పోయడు, కానీ మన దరిద్రమేమిటంటే ప్రేమించి యాసిడ్ పోశాడని రాస్తారు. ప్రేమిస్తే ఆసిడ్ పోయడు. అక్కడొస్తూంది దరిద్రమంతా భాషలో మాట తారుమారు చేయడంలో వస్తూంది. ఒక్కక్షరంపోతే ఎగిరిపోతూందండీ... పరపతి సౌందర్యం కల్పించడానికి పరసతి సౌందర్యం కలిగించడానికి తేడాలేదూ..? ఒక పేపరు అలా రాస్తే... ఒక్కే ఒక్కక్షరం మార్చింది ఒకప్పుడు పొరపాట్నుపడింది ఆ అక్షరం పడితే పెద్ద ధూమారం రేగిపోయింది. పేపర్లో ఒక్క అక్షరం సరిగ్గా చూడనందుకు. అంతంత ప్రమాదాలు ఉంటాయి, అక్షరం పదం అంత విలువతో కూడుకుని ఉంటాయి, ఎవరు ఇష్టమొచ్చినట్లు వారు ప్రయోగిస్తే లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తాయి.
కాబట్టి ఉపవాస కృశాం దీనాం నిశ్శ్వసన్తీం పునః పునః ! దదర్శ శుక్లపక్షాఽఽదౌ చన్ద్ర రేఖామ్ ఇవాఽమలామ్ !! పట్టి పట్టి చూస్తే తప్పా ఈవిడే సీతమ్మ అని గుర్తుపట్టడానికి వీలులేని రీతిలో ఉంది సీతమ్మ అంటున్నారు హనుమా...! ఆయన చూశాడాండీ పూర్వం సీతమ్మనీ? ఆయన చూడలేదుగా? మరి చూడనాయనా ఇప్పుడు ఈవిడని పట్టి పట్టి చూస్తేగాని గుర్తుపట్టలేమని ఎలా అంటున్నారు, ఎవడు పూర్వమూ చూశాడో ఇప్పుడూ చూస్తున్నాడో వాడు ఈ మాట అంటంలేదు, అది వాడి రాక్షసత్వం, అయ్యో ఈ తల్లిని పట్టి పట్టి చూస్తేకానీ గుర్తుపట్టలేనట్లుగా ఉందనడం ఆయన పుత్రత్వం - ఆయన కొడుకుతనం, ఒకే తల్లి ఆయనకు అలా కనపడుతూంది, ఒకే తల్లి ఎదురుగుండా ఉన్నావానికి అలా కనపడుతూంది ఇదీ ఆవిడ మాయామానుసస్వరూపం, కాదు పతనమయ్యేవాడికి స్త్రీ అలా కనపడుతుంది - ఉద్దరణ పొందాలనుకున్నవాడికి జగన్మాథ కనపడుతుంది. ఒక అందమైన ఆడది కనపడిందనుకోండి తప్పేంలేదు. నా తల్లి కంచి కామాక్షి నడిచొస్తే ఇలాగే ఉంటుంది. అందుకే గదా మూగ శంకరులు ఏకంగా ఐదువందల శ్లోకాల్లో స్తోత్రం చేశారు. మా తల్లి విభూతి మా తల్లి జగన్మాథ అమ్మా నీ పాదాలకు నమస్కారం. నా తల్లి పాదాలకు పసుపు రాసి పారాణిపెట్టి పువ్వులు వేసి ముట్టుకుని పూజించుకొనేటువంటి భాగ్యం నాకు వేంటనే ముట్టుకుంటే ఏమైనా అనుకుంటావు తల్లీ నీ పాదాలకు నమస్కారం తల్లి కామాక్షి నాముందు నడిచొచ్చింది నాతల్లి కామాక్షి జగన్మాత ఎంత సౌందర్యవంతంగా ఉందో... అని మీకు మూక శంకరుల శ్లోకం ఒకటి గుర్తొచ్చిందనుకోండి మీరు ధన్యులు.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
Image result for లంకలో సీతచూడగానే ఎంత అందంగా ఉందీ అని మనసు ఇంకోలా ఆలోచించించిదనుకోండీ... నీ తపస్సు నశించిపోతూందని గుర్తు. నీ చూపూ లోపల ఎటువంటి ప్రభావాన్ని కల్పిస్తూందో దానివల్ల మీరు ఎక్కుతారో దిగిపోతారో లెక్కలోకి వెళ్ళిపోతూంటుంది. ఇదీ మీ దృష్టికోణంలో ఉంది పై ఆయన అలా ఉంటున్నారు, చూడలేదుగా సీతమ్మని మరి ఇంతకు ముందు ఈయ్యనెలా అంటున్నారు మరి ఇప్పుడు చూడక్కరలేదు, రాముడు చెప్పాడు ఇటువంటి ఆభరణములు పెట్టుకుని ఇలా ఇలా ఉంటుంది సీతమ్మని అలా అలా లేదావిడా... ఆవిడే అని తెలుస్తోంది కానీ, సుష్కించిపోయింది ఉపవాసముల చేతా అంటే రాముడు పక్కన లేనందుకు ఇంత బెంగపెట్టుకున్నావామ్మాని ఆయన బాధపడుతున్నారు. రెండవ వాడి గురించి నేను చెప్పక్కరలేదు ఇప్పుడే నేను ఇందాక చెప్పాగా... కాబట్టి దృష్టికోణము చేత ఎవరు పెరుగుతున్నారో దృష్టికోణము చేత ఎవరు తరుగుతున్నారో చెప్పడం ఆయన గొప్పతనం. ఒకడు తన భార్య కాదు ప్రతిరోజూ కొన్ని వేలమంది కాంతల్ని అనుభవించేటటువంటి దురాత్ముడు ఒకరూ అస్కలిత బ్రహ్మచారి ఒకరు, అటువంటి అస్కలిత బ్రహ్మచారికి సౌందర్య రాసి కనపడింది వెతికి వెతికితే ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాటా అబ్బాహ్ ఏం అందం అనలేదు ఉపవాస కృశాం దీనాం అమ్మా ఇంత కష్టంలో ఉన్నావా... అన్నారాయన, ఇంత శుష్కించిపోతూన్నా అందమే కనపడుతోంది వాడికి, ఏది సౌందర్యం? ఇప్పుడు ఏది సౌందర్యమని మీరు పిలుస్తారు, ఎవడి అంతఃకరుణమంత గొప్పదో వాడు సౌందర్యవంతుడు, వాడు సుందరుడు, సుందరాతి సుందరుడు, సుందరాతి సుందరుని గురించి కథ చెప్పింది కాబట్టి సుందర కాండ. అటువంటివాడు మీకు ఎక్కడ కనపడినా సుందరుడు వాడు బాహ్య సౌందర్యం కాదు ఆయన అంతః సౌందర్యం అంత గొప్పది, ఆయననే సుందరుడని పిలుస్తారు తప్పా... బాహ్యంలో చాలా ఢాబుగా ఉండి అది పదిమందిని పాడుచేయడానికి పనికొచ్చే సౌందర్యం సౌందర్యం కాదు, రావణుడిదా సౌందర్యం హనుమదా సౌందర్యం. హనుమది సౌందర్యం. ఇది చెప్పక చెప్పడం సుందర కాండ ఒక్క శ్లోకంలో ఎన్ని అద్దాలలోంచి చూపిస్తాడో చూడండి మహర్షి.
ఇది ఆయన ప్రజ్ఞ ఇన్ని అద్దాలల్లో మీకు చూడడం వచ్చిందనుకోండి, చూసినప్పుడల్లా మీరు పెరుగుతుంటారు, మీరు సుందర కాండ చూసినప్పుడల్లా మనల్ని దిద్దేస్తుంటుంది, అంతే మీ జీవితంలో ఒక కొత్త కోణం అలవాటై వృద్ధిలోకి వచ్చేస్తుంటారు మీరు అలా చూసిన ఉత్తర క్షణంలో అంతే అభ్యున్నతి కలుగుతుందా కలగదా కలిగి తీరుతుంది కాబట్టి దదర్శ శుక్లపక్షాఽఽదౌ చన్ద్ర రేఖామ్ ఇవాఽమలామ్ ! మన్ద ప్రఖ్యాయమానే రూపేణ రుచిర ప్రభామ్ ! పినద్ధాం ధూమ జాలేన శిఖామ్ ఇవ విభావసోః !! మన్ద ప్రఖ్యాయమానేన అంటే స్పష్టముగాలేనటువంటి మందమైన కాంతితో ఉన్నది అని, పినద్ధాం ధూమ జాలేన శిఖామ్ ఇవ విభావసోః ! పీతే నైకేన సంవీతాం క్లిష్టే నోత్తమ వాససా ! సంపంకామ్ అనఽలంకారాం విపద్మామ్ ఇవ పద్మినీమ్ !! క్లిష్టే నోత్తమ వాససా పినద్ధాం ధూమ జాలేన శిఖామ్ ఇవ విభావసోః అంటారు మహర్షి, అమ్మో ఏమి అందమైన ఉపమానాలు వేసేశారో అసలు హనుమ యొక్క దృష్టికోణంలో హనుమ యొక్క మనసులోనటా అనుభవించిన అనుభవాన్ని బ్రహ్మగారి వరం ఎవరి మనసులోని ఏముందో కూడా నీకు తెలుస్తుందీ అన్నాడు, హనుమ మనసులో ఏముందో దాన్ని శ్లోక రూపంలో ఇస్తారు పినద్ధాం ధూమ జాలేన శిఖామ్ ఇవ విభావసోః అగ్నిహోత్రాన్ని కట్టెలు పేర్చీ నెయ్యిపోసీ జ్వాల రగల్చారు పొగొచ్చి చుట్టూ ఆవరించింది పొగ ఉంటుందా మంట ఉంటుందా... పొగ కొంతసేపు ఉంటుంది శాశ్వతంగా ఉండేది మంట ఉంటుంది. పొగ పోతుంది మొదట పొగ పుట్టినా పొగ నసించిపోతుంది జ్వాల రగులుతుంది.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
జ్వాలని పొగ ఏమీ చేయలేదు పోతుంది కొంత సేపటికి పైగా మీకొక ఇంకో ఆశ్చర్యమేమిటో తెలుసా... పొగ ఎక్కడుండదో తెలుసాండీ పొగలేనిది ఎక్కడంటే... అగ్ని జ్వాల ప్రారంభస్థానం ఎక్కడుంటుందో అక్కడ పొగుండదసలు. ఒకసారి చంద్రశేఖర పరమాచార్య స్వామివారు సంచారం చేస్తున్నాప్పుడు ఒక చిన్న పెంకుటింట్లో ఉన్నారాయన ఓ పల్లెటూల్లో ఉన్నప్పుడు అందులో బ్రహ్మణ కుటుంబం ఆ బ్రాహ్మణి ఆవిడ ఏదో పొద్దున ఏదో కాస్తున్నారు, కాస్తుంటే పొగ ఇల్లంతా పట్టేసింది. ఆయన ఉదయానుష్టానానికి కూర్చున్నారు. అంతా పొగే శిష్యులొచ్చి అన్నారూ అంతా పొగపట్టేసిందండీ ఊపిరి ఆడటంలేదు ఎలాగన్నారు, అంటే ఆయన స్నానం చేసివస్తున్నారు తెల్లవారగట్లా ఆయన అన్నారు ఈ పాత్ర పట్టుకెళ్ళీ ఎక్కడ నుంచి పొగొస్తుందో అక్కడ పెట్టండి అన్నారు, అంటే తీసుకెళ్ళి పొగ ప్రారంభమెక్కడో అక్కడ పెట్టారు ఆయన చక్కగా కూర్చుని అభిషేకం చేసేసుకున్నారు. ఎందుకో తెలుసాండీ! అగ్ని ఎక్కడ నుంచి రగులుతూందో అక్కడుండదు ఆ పై నుంచి పొగ వస్తూంది. అంటే సీతమ్మ చుట్టూ రావణులు చేరారేమోకానీ సీతమ్మని ముట్టుకోవడం కూడా వాళ్ళకు సాధ్యంకాదు. ఈ పొగ నశిస్తుంది ఆ మంట ప్రకాశిస్తుంది. ఈ రాక్షసులందరూ నశించిపోతారు జాజ్వల్యమానమై యుగాలు మారిపోయినా సీతమ్మతల్లి కీర్తిమతిరాలై ప్రకాశిస్తుంది అగ్నిహోత్రంలా ఇది చెప్పడం మహర్షి యొక్క హృదయం. కాబట్టి పినద్ధాం ధూమ జాలేన శిఖామ్ ఇవ విభావసోః ! పీతే నైకేన సంవీతాం క్లిష్టే నోత్తమ వాసనా ! పచ్చటి పట్టుపుట్టం ఒకటి కట్టుకుంది ఆవిడా ఎంత అందమైన పట్టుపుట్టమంటే దానిమీద చెక్కబడినటువంటి జలతార ఏదైతే ఉందో అది పదినెలల తరువాత కూడా ఇంకా అటువంటి శోభని పొందే ఉంది, కానీ ఒక్క పట్టుబట్టతోటి పది నెలల నుంచి కట్టుకున్న ఆ ఒక్క బట్టతోటే ఆవిడ ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు అలా తనంత తాను ఆవిడింట్లో ఆవిడ ఉందనుకోండి, ఇప్పుడు ఆవడ్ని ఏమనాలి దరిద్రమనుభవస్తూందనాలి కదాండీ! ఆవిడా దారిద్ర్యాన్ని పొంది ఉంది అని అనుకోవాలి ఎందుకనీ అంటే తనింట్లో తనకు ఇంకొక బట్టలేదు, శంకరాచార్యులువారు కనకధార చేయడానికి వెళ్ళినప్పుడు కనపడినటువంటి వృద్ధ బ్రాహ్మణిలాగా, ఆవిడకి లేకా ఇప్పుడు ఇలా ఉంది ఆవిడకి లేక కాదు రావణుడు అనుభవిస్తున్న ఐశ్వర్యం కూడా ఆవిడ అనుగ్రహమే.
కానీ ఆవిడ అలా చీర మార్చుకోలేదంటే అలా మార్చుకుందామంటే తీసుకోవలసిన బట్ట ఉన్నట్లు నీవు ఇక్కడ్నుంచి తీసుకోవచ్చా అన్న ఇల్లూ ఒక్కటీ ఆ రాజ్యంలో లేదు ఇప్పుడు రావణుడొక్కడు పోతాడా లంకంతా పోతుందా లంకంతా పోతుంది, అలా పుచ్చుకోవచ్చన్న ఇల్లోటి ఉంది కదాండీ విభీషణుడిదీ మరి ఎందుకు పుచ్చుకోలేదు, అలా పుచ్చుకోవచ్చూ అన్న ఇల్లు ఉన్నా, ఆ ఇంటిని శోభ చేసి ప్రకాశించే గుణం రావణుడికి ఉంటేగదా మరి చెప్పిన మాట విన్నాడా విభీషణుడు చెప్పినమాట తాను విని ఉండడడు అలా ఉండేవాళ్ళని ఉండనీవ్వడు ఇదీ రావణ ప్రవృత్తి అంటే... ఆ రాక్షసత్వానికి హద్దులేదన్నమాట ఇంక తాను ఎలా ఉంటాడో అలా ఉన్నవాళ్ళను తన దగ్గరుంచుతాడు తప్పా తనలా ఉండనివాళ్ళని తన దగ్గర ఉండనీవ్వడు ఆ మార్గంలోకి తను వెళ్ళే ప్రయత్నం కూడా చేయడు, అసలు ఆ మాట కూడా వినడు ఇది కరడు కట్టిన రాక్షసత్వం కాబట్టి దీన్ని అనుగమించి ఆ పట్టణంలో ఉన్నవాళ్ళెవరున్నారో రాజ్యంలో ఉన్నవాళ్లు ఎవరున్నారో అందరూ నశించిపోవలసిందే ఈ కారణానికే ఈ ఒక్క కారణానికి పోతారు అందుకే అంటారు హనుమ కాసేపాగంటారు, ఎంత చిత్రమైన మాట్లు మాట్లాడుతారో చూడండి ఈవిడ వల్లే నశిస్తున్నారు అందరూ అన్నాడు.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
Related imageపట్టుకున్నారాయన మహా ప్రజ్ఞావంతులు హనుమ అంటే రాముడు నిమిత్తం, ఈవిడవలనే చనిపోతున్నారు చనిపోయే వారందరూ అన్నారు ఆవిడ అందుకొచ్చింది, అందుకే మహర్షీ “సీతాయా చరితం మహత్” అని ఆ కథకు పేరు పెట్టడానికి కారణం అది కాబట్టి పీతే నైకేన సంవీతాం క్లిష్టే నోత్తమ వాససా ! సంపంకామ్ అనఽలంకారాం విపద్మామ్ ఇవ పద్మినీమ్ !! ఆవిడా పద్మములు లేనటువంటి ఒక తీగ ఎలా ఉంటుందో అలా ఉంది ఏవిధమైనటువంటి అలంకారములు చేసుకోకుండా ఉంది, ఎందుకలా ఉండాలి, ఏమీ చేసుకోలేకపోతేనే వాడు అటువంటి దృష్టితో చూస్తున్నాడు, ఇప్పుడు అలంకారం చేసుకుంటే ఏమౌతుంది, తన యొక్క అందం ద్విగుణీ కృతమౌతుంది, ఆవిడ అందం రాముడి కోసమే ఆవిడ అందం రావణుడి కోసం కాదు, కాబట్టి ఇప్పుడు ఆవిడకి అలంకారములు లేక కాదు ఉన్నాయి ఆభరణాలు కానీ పెట్టుకోవడానికి కూడా ఆవిడ భయపడుతుంది ఎందుకంటే వాడి చూపు అటువంటిది, ఇది ఎంత తనకు లేనిది తాను కట్టుకోలేదు ఉన్నది పెట్టుకోలేదు దీనికి కారణం ఎవరూ వాడు నశించిపోతాడా అదేమైనా చెప్తున్నారా మహర్షీ ఇక్కడేం చెప్పరు, ఆవిడ అలా ఉంది అంటారు, ఆవిడ అలా ఉందీ అని చదివితే నీకు బాద కలిగిందనుకోండి ఒక వేళ మీరు ధన్యాత్ములు, ఎందుకో తెలుసాండీ? లోపల మనస్సు అలా ఒక ఆడది ఉండడాన్ని ఇష్టపడనటువంటి మనస్సు కాబట్టి మీరు ఉత్తమమైన సంస్కారంతో ఉన్నారని గుర్తు.
అది విని మీ మనసు సంతోషించిందనుకోండి మిమ్మల్ని మీరు ఎక్కడో దిద్దుకోవలసి ఉంటుందని గుర్తు, అది కూడా సుందర కాండ అద్దం మీ హృదయ సంస్కారానికి నిరూపణ చెయ్యగలిగినటువంటి దర్పణంగా నిలబడుతుంది ఎదురుగుండా. కాబట్టి ఇప్పుడు పద్మములు లేని లతలా ఉందావిడా వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీమ్ ! గ్రహే ణాంఽగారకే ణేవ పీడితామ్ ఇవ రోహిణీమ్ !! అబ్బో... ఏమి ఉపమానాలు వేస్తారో మహర్షి మహానుభావుడు వ్రీడితాం అంటే ఆవిడ సిగ్గుపడుతోంది, సిగ్గెందుకూ అంటే ఆవిడ సిగ్గు పడడం బాహ్యంలో ఏ కారణానికి ఇంత మంది మధ్యలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతాడు తెల్లవారితే లేసొచ్చి ఇది సిగ్గు, కాదు అమ్మా మంచంమీద ఉండీ కొడుకులకు పెళ్ళీల్లవలేదు కోడళ్ళు రాలేదు కూతుళ్ళు లేరు అమ్మ అనారోగ్యంగా ఉంది అమ్మకి ఒంటిమీద స్పృహలేదు, అమ్మకి స్నానం చేయించాల్సొచ్చింది, అమ్మ ఒళ్ళంతా తుడవాల్సొచ్చింది, అమ్మ మల మూత్రములు తుడవాల్సొచ్చింది, ఏ కొడుకు మనస్సులోనైనా అమ్మ తనాన్ని చూస్తాడు కానీ ఆడతనాన్ని చూసే మనసుంటుందా... అమ్మంటేనే సౌందర్యం, సౌందర్యం అంటే నా ఉద్దేశ్యంలో బాహ్య

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
సౌందర్యం కాదండోయ్..? అమ్మా అంటే నిరంతరము నీ అభ్యున్నతిని కోరుకునేటటువంటి నీ మాంస నేత్రమునకు కనపడేటటువంటి ఈశ్వర స్వరూపమే అమ్మ. అమ్మా... నేను ఆ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను మా నాన్నగారికి ఐదుగురు అన్నదమ్ములు మాకు మేనత్తలు లేరు మా నాయనమ్మగారు ఒకానొకప్పుడు మంచాన పడిపోతే మా నాన్నగార్ల ఐదుగురు అన్నదమ్ములు సెలవులు పెట్టి ఐదుగురూ కలిసి అమ్మని అక్కడే కూర్చోబెట్టి స్నానం చేయించీ అమ్మ మల మూత్రాలు తుడిచి అమ్మ ఆరోగ్యవంతురాలు అయ్యేటట్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
Image result for లంకలో సీతఅయితే వాళ్ళ కొడుకుల తనానికి దోషమొచ్చిందా... వాళ్ళు ధన్యులయ్యారు తపస్కులై, అమ్మా కొడుకు చూపు చూసి సర్దుకు కూర్చోవలసి వచ్చిందనుకోండి అంతకన్నా చావు కొడుక్కి ఇంకోటిలేదు, ఎందుకంటే అమ్మని అలా చూడడు ఏ కొడుకూ, కొడుకుని అలా చూశాడనుకోండి అంతకన్నా సిగ్గుతనం ఇంకోటిలేదు ఇలాంటి కొడుకునా నేను కన్నది అని. ఇందుకు ఆవిడ బాధపడుతూంది త్రైలోక్యమాతవి చూడకూడని చూపు చూస్తాడు పొద్దున్నుంచి ఇది ఆవిడ వ్రీడితాం దీనివల్ల చావెవరికి ఎవడు చూస్తున్నాడోవాడికి ఇవి చెప్పకుండా చెప్పడం మహర్షి యొక్క గొప్పతనం ఆవిడ సిగ్గుపడుతూంది అంటాడు. అంత అర్థమైనా మీకు చాలు మీరు ధన్యులే ఆవిడ సిగ్గుపడ్డం మీరు బాధపడ్డారనుకోండి ధన్యులే, ధన్యులు ఉత్తమ సంస్కారంతో ఉంటారు కాబట్టి వ్రీడితాం దుఃఖ సంతప్తాం ఆవిడ అదే పనిగా ఏడుస్తోంది, ఎందుకదే పనిగా ఏడ్వడం రాముడి కోసం రాముడు లేడా ఆవిడతోనే ఉన్నాడు ఎక్కడ ఆవిడ ధ్యానంలో మరి ఏం కావాలి బాహ్యంలో కూడా రామ సాన్నిధ్యం కావాలి ఆవిడ రాముడి పక్కనే కూర్చోవాలి రాముతో మాట్లాడాలి రాముడితో తినాలి రాముడితో ఉండాలి ఇది ఆవిడ కోరిక దానికి మధ్యలో అడ్డువచ్చాడు ఒకడు, ఇదే మహా పాపం అంటారు. ఏ కారణమైనా సరే మీకు అనౌసరం భార్యాని భర్తని పక్కపక్కన ఉంచేయాలి అంతే, ఏ ఒక్క కారణానికీ భార్యకీ భర్తకీ మధ్యలో వెళ్లి ఎడం కల్పించే అధికారం మనకు లేదు. ఇప్పుడు ఈయ్యన వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చాడు ఆవిడ ఏడుస్తోంది.
అలా కాని ఏడ్చిందనుకోండి చాలా ప్రమాదం అందుకే మీరు చూడండి లోకంలో ఒక చిత్రమైన పోకడ ఉంటుందండీ ఆడపిల్ల ఇక్కడ పుట్టిన పిల్లకాదూ, ఈ ఇంట్లో పుట్టిన పిల్ల ఈ ఇంట్లో పుట్టిన పిల్ల చమత్కారమేమో తెలియదు కానీ, ఎప్పుడు మా ఆయన దగ్గరకి వెళ్ళిపోదామాని చూస్తుంది. మీరు ఎక్కడ పెట్టండీ ఇంక తీసుకెళ్ళి ఆ అమ్మాయికి తృప్తి ఉండదు, వాళ్ళాయన దగ్గరే తృప్తి అది ఈ జాతి సంస్కారమండీ, జాతి జీవనాడి అది ఆమె స్వస్థానమనుకుంటూంది భర్తతో ఉన్నదే ఆమె స్వస్థానమని నమ్మకం ఏ ఆడదైనా సరే నేను ఏ ఒక్కరి గురించీ చెప్పట్లేదు, అయినప్పుడు అందుకే బాహ్యంలో కూడా మధ్యలోకి వెళ్ళద్దంటారు. పుట్టింటికొచ్చి ఆడపిల్ల బెంగ పెట్టుకుంటే పుట్టింటి నుంచి పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ అందరూ అటువంటి ఉన్నత సంస్కారం కలిగినటువంటి తల్లులే, వీళ్ళ భర్త పోల్లేవే వెళ్ళి ఓ పదిహేను రోజులు ఉండి రా అంటే అంటే మీరేం అంటారు మీకే వంటరాదు మీ ఆరోగ్యం పాడవదు రెండురోజులు ఉండి వస్తానులే అంటూంది. ఏమి అక్కడ పుట్టి అక్కడ పెరిగినవారికి వెళ్ళడం ఏమిటి ఇబ్బంది వాళ్ళు వెళ్ళరు భర్త అంటే అంత ఆపేక్ష. అక్కడ ఉండి మరి నీవు అంత తలచుకుంటే భర్తతో ఉండి లేవా మానసికంగా చాలదు వాళ్ళకు తనంటూ వండితే ఆయన కోసమే తనంటూ తిరిగితే ఆయన కోసమే తను అలంకరించుకుంటే ఆయన కోసమే తను ఎదురు చూస్తే ఆయన కోసమే, తను దెబ్బలాడినా ఆయన్నే ఆయన దెబ్బలాడినా తన్నే కొట్టుకున్నా వాళ్ళిద్దరే తిట్టుకున్నా వాళ్ళిద్దరే కలిసున్నా వాళ్ళిద్దరే అంతే ఇదే దాంపత్యమంటే కదాండీ!. ఇదీ దాంపత్యంలో ఉన్న అందం ఇది తెలిసున్నవాడు ఏ దంపతుల్నీ విడదీసే ప్రయత్నం వాగ్రూపంగా కూడా ఒక్కనాటికి చేయకూడదు. ఒక వేళ నేను ఈ మాట అంటే వాళ్ళిద్దరి మధ్యా ఎడం పెరుగుతుందేమోనని అనుమానం వచ్చిందనుకోండి ఒక కోటి రూపాయలిస్తాము ఆమాట అనండీ అన్నా కూడా అనకూడదు.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
భయంకరమైన పాపం అదే అవుతుంది అలా అనకూడదు చాలా ప్రమాదం కాబట్టి నా దగ్గరికి ఒకప్పుడూ ఒకాయనొచ్చాడు వచ్చి మా కోడల్తో పడ్లలేకపోతున్నానండీ మా అబ్బాయికి మీరంటే చాలా గౌరవం మీరు ఒక్కమాట చెప్పండి మా అబ్బాయికి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయమని మీ మాట వింటాడని చెప్పారు. ఇంకొకసారి మా ఇంటికొచ్చి ఈ మాటంటే నాతో ఇంత పరిచయమున్నవాడివని కూడా చూడను నీవు ఏమనుకున్నాసరే నిన్ను చెప్పిచ్చుకు కొడతాను లే ఇక్కడనుండి లే బయటికెళ్ళు అన్నాను. ఆ ప్రసక్తిరాకూడదు కాబట్టి అలా ఆమె ఏడుస్తుంటే వీడు సంతోషించడమేమిటండీ తీసుకొచ్చి, అదేమైనా పుట్టిల్లా ఏమైనా, పుట్టిల్లూ కాదు అత్తవారిల్లూ కాదు రెండూ కాదు, ఆయన కోసం ఆవిడ ఏడుస్తూంటే వీడు ఎత్తుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నీవు నాకు కావాలని అనడమేమిటీ ఎంత ధారుణమైన విషయమది, ఇదీ ఎవరి పట్ల ప్రమాదం ఆవిడకేం ఉందండీ ఇవ్వాళ కాకపోతే రేపూ ఇంకొక్క వారం పట్టాభిషేకం చెప్పేస్తాను రామ చంద్ర మూర్తి తొడమీద కూర్చుంటుంది నాతల్లి, పోయినవాడు పోయాడు ఇక అంతే తిరిగిరాడు రావణాసురుడు ఎందుకు తెచ్చుకున్నట్లు ఈ ప్రారబ్ధం, ఆవిడ జోలికి వెళ్ళాడు భర్తనుంచి వేరు చేశాడు, సుందర కాండని మీరు సుందర కాండగా వినకండి, సుందర కాండలోంచి జాతి వజ్రాల్ని ఏరుకోండి ఇవి ఏరుకున్నప్పుడు అసలు ఏ ఇంటా కూడా దంపతుల మధ్య అశాంతి అన్నమాట రాదు.
Image result for బంధువుల మధ్య కలహాలుఅందరూ సంతోషంగా ఉంటారు మీకు నేనొక మాట చెప్తాను మీరు తొందరపడి దానిగురించి ఏమనకండి బాగా ఆలోచించండి, సమస్యలు నూటికి 95 మనుష్యుల యొక్క మనః ప్రవృత్తులవల్ల ఏర్పడేవే నీ మనస్సును మీరు సక్రమంగా పెట్టగలిగితే అహంకారాన్ని కొంచెం తొక్కిపెట్టి సక్రమంగా ఉండగలిగితే నూటికి 95 శాతం సమస్యలు అసలు ఉండవు. నూటికి 95 సమస్యలు ఎందుకొస్తాయో తెలుసాండీ ఆభిజాజ్యముల వలన సృష్టించబడుతాయి, తండ్రితో కొడుకు ఎందుకు దెబ్బలాడాలి, కొడుకుతో తండ్రెందుకు దెబ్బలాడాలి, తల్లిమీద కొడుకుకెందుకు దెబ్బలాడాలాలి, అన్నతో తమ్ముడెందుకు దెబ్బలాడాలి, అధికారిమీద ఉద్యోగి ఎందుకు తిరగబడాలి పక్కవాడి మీద ఇంకొక పౌరుడు ఎందుకు తిరగబడాలి, నా అంతవాన్ని లేననే అహంకారం ఎక్కడో అక్కడ మానసికమైనటువంటి జాఢ్యానికే సమస్యలొస్తాయి, అసలు ఉన్నతమైన మనస్సుతో ఉన్నచోటా నూటికి 95 సమస్యలు ఉండవు మిగిలిన ఐదు శాతమే ఉంటాయి తెలుసాండీ, ప్రారబ్దవశాత్తు కలిగే అనారోగ్యంలాండివి ఉంటాయి. దగ్గొచ్చింది ఒకళ్ళవల్ల రాదది వాడి కర్మకొద్ది వాడికొచ్చిందది అంతే అలాంటి సమస్య నడవడి ఉద్యోగం రాదు ఏదో ఉండాలి అంతేగానీ ఆయన ఏమిటోనండీ అలా నన్ను అంతమాట అనేశాడూ అని ఏడ్వవలసిన అవసరం ఉండదు. దెబ్బలాడుకోవలసిన అవసరం ఉండదు. ఇవన్నీ ఎందుకొస్తాయంటే నూటికి 95 మనసువల్లే వస్తాయి, మనసు యొక్క కోణం ఎంత ప్రమాదాలు సృష్టించగలదో, ఎంత అగ్ని పర్వతాలు బద్దలు కొట్టగలదో ఎంత భీబత్సం సృష్టించగలదో మీరు రామాయణాన్ని బాగా అర్థం చేసుకుంటే సుందర కాండని అర్థం చేసుకుంటే మీకు అర్థమౌతుంది.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
తనకొరకే అని ఆలోచిస్తాడు తన సుఖపడితే చాలు తను అనుకున్నది జరిగితే చాలు మిగిలినవాళ్ళందరూ ఎంత ఏడ్వనివ్వండీ వానికి అక్కరలేదు ఒక్కొక్కడి ధోరణి అంతే, నేను సుఖపడుతున్నానా లేదా ఇంకొకడి ఏడుపు అక్కరలేదు ఇలాంటి వాళ్ళవల్లా ఏమౌతుందో తెలుసాండీ... ఏడిచేవాళ్ళ సంఖ్య పెరిగిపోయి వాళ్ళతో పోదు వాళ్ళని కన్నవాళ్ళు పైవాళ్ళు వాళ్ళ గురువులు అందరూ దెబ్బతింటారు సంకుచితత్వం ఎంత ప్రమాదమో స్వార్థం ఎంత ప్రమాదమో విశాల హృదయం ఎంత గొప్పదో సుందర కాండ మీకు చూపిస్తుంది. ఒక్క శ్లోకంలో ఒక్కొక్కమాట మీరు నమ్మండి నమ్మకపోండీ ఇంకొక్కరోజు ప్రసంగం నేను అందుకే మా గోపాల కృష్ణగారితో అప్పుడప్పుడు అంటూంటాను ఇప్పుడు కాదులేండి రామాయణం నేను రిటైర్డ్ అయిపోయాక మొదలు పెడుతానూ ఆఖరి శ్లోకం చెప్పి నా ఊపిరి వదిలేస్తే చాలు అంటూంటాను. అంతగొప్ప రామాయణమండీ అమృతభాండమండీ రామాయణం, కాబట్టి పీతే నైకేన సంవీతాం క్లిష్టే నోత్తమ వాససా ! వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీమ్ ! ఆవిడ వాడిపోయిందట పరిమ్లానాం వాడిపోవడమంటే, స్వరూపం అలానే ఉంటుంది కానీ నీరసించిపోయి శారీరకముగా కదలడానికి ఉండగలిగినంత స్థితిని తనకు తాను తెచ్చుకుంది ఉపవాసములచేత పరిమ్లానా ఎందువల్ల అలా వచ్చింది, అనారోగ్యానికి కాదు వాడు అందుకే శింశుపా వృక్షం కింద పెట్టాడు. శింశుపా వృక్షం ఏం చేస్తుందో తెలుసాండీ అనారోగ్యం రాకుండా చస్తుంది దానికో లక్షణముంది దానిగాలికి, ప్రత్యేకించి స్త్రీ సంబంధమైన అనారోగ్యం రాకుండా చేయడానికి అది దిట్టాని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది.
Image result for అశోక వనంలో సీతమ్మకాబట్టి అందుకని తీసుకెళ్ళి శింశుపా వృక్షం కింద కూర్చోబెట్టాడు వాడు, ఆమెకు ఏ అనారోగ్యం రాకూడదు రాముడు రాముడని కలవరించి లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకుంటుందేమోనని బ్రతికుండి మనసుమారి తన పాన్పు చేరాలని అది రాక్షసత్వమూ అంటే తనంత తాను జబ్బొచ్చి ఆ శరీరం పడిపోవడాన్ని కూడా వాడు అంగీకరించలేడు, జబ్బు రాకుండా ఉండే చెట్టుకింద కూర్చోబెట్టాడు అందులో అన్ని చెట్లూంటే ఎక్కడో ఒక్కడ కూర్చోబెట్టకూడా ఏమిటీ ఏ చంపకా వృక్షం కిందో, వాడు శింశిపా వృక్షం కిందే ఉంచండన్నాడు. హద్దులేని రాక్షసత్వం ఇంక మీరు అంటే... ఒక శ్లోకాన్ని ఇటు తిప్పితే రావణుని ఉద్ధతి ఆ శ్లోకాన్ని ఇటు తిప్పితే సీతమ్మ వైభవము ఇన్ని చుట్లు తిరుగుతుంటూంది సుందర కాండ కాబట్టి గ్రహే ణాంఽగారకే ణేవ పీడితామ్ ఇవ రోహిణీమ్ అంగారక గ్రహం రోహిణి వంక దుష్టమైన చూపు చూస్తే ఎలా ఉంటుందో ఆవిడ యొక్క పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే రోహిణీ చంద్రుని యొక్క స్వ క్షేత్రం ఆవిడ చంద్రుడి యొక్క ఇల్లాలు, చంద్రుని ఇల్లాల్నీ అంగారకుడు దుష్టబుద్ధితో చూడకూడదు, దుష్టబుత్తితో కూడుకున్నటువంటి అంగారకుడు రోహిణి వంక చూడ కూడని చూపు చూస్తే రోహిణి ఎంత బాధ పడుతూందో అంతబాధ పడుతూంది సీతమ్మతల్లి అశ్రు పూర్ణ ముఖీం దీనాం కృశామ్ అనఽశనేన చ ! శోక ధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖ

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
పరాయణామ్ !! అశ్రు పూర్ణ ముఖీం ఆవిడ కన్నుల వెంట నీరు కారి కారి కారి కారి జారిపోతూంది ఆవిడ వక్ష స్థలమంతా తడిసిపోయింది.
Image result for లంకలో సీతఈ మాట ఎందుకు వేశారో తెలుసాండీ? దీని మీద ఒకసారి అశ్రు పూర్ణ ముఖీం అన్న ఒక్క పదం మీద చంద్ర శేఖరీంద్ర సరస్వతి స్వామివారు ఒకసారి మాట్లాడారు, అసలు ఆయన అనుభవించిన దృష్టికోణానికీ అద్భుతమనిపిస్తూంది అశ్రు పూర్ణ ముఖీం అన్న మాట మహర్షి సుందర కాండలో ఎందుకు వాడారో చెప్పారాయన ఆవిడ ఎందుకేడ్చిందో చెప్పారాయన, పరాశక్తి ఎడ్చిన సందర్భం అసలు వాఙ్గ్మయంలో ఎక్కడా లేదు, అమ్మవారు ఏడ్వడమన్నది ఎక్కడా లేదు ఎప్పుడూ ఆవిడ ఇంకోళ్ళని చంపి అవతల పారేస్తుంది అంతే, రాక్షసుల్ని చంపడానికి విష్ణువు అవతార స్వీకారాల్లాగ ఆవిడ అవతారాలు చేస్తుంది, కానీ ఆవిడ ఏడ్చింది ఇక్కడ ఈ ఏడుపు ఏమైందో తెలుసాండీ ఆవిడ తపో ధూమమైందన్నారు పరమాచార్యులవారు, తపస్సు చేసిన వాడి శిరస్సులోంచి ధూమం బయలుదేరుతుంది అది అన్ని లోకాలకు వ్యాపిస్తే దేవతలకు కూడా కళ్ళు కనపడవు, కనపడకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మగారి దగ్గరికెళ్ళి అయ్యావాడి తపస్సు పెరిగిపోతూంది మీరు వెళ్ళండి అంటారు, మీరెళ్ళండీ అంటే అప్పుడు బ్రహ్మగారు వచ్చి నీకేం కావాలి అని అడుగుతాడు. వాడు ఉపశాంతి పొంది వరాలు అడగడానికి లేచి కూర్చుంటాడు అక్కడితో ఆ పొగ ఊరుకుంటుంది. సీతమ్మ తల్లీ అదే పనిగా ఏడిస్తే ఏమైందంటే ఆవిడ కల్ళల్లోంచి భాష్పధారలు కారీ ఆవిడ యొక్క వక్షస్థలమంతా తడిసిపోయిందట, ఇప్పుడు ఆవిడ ఇంకా ఏడుస్తూంది, ఇంకా ఏడుస్తూంటే హనుమని పంపించారు ఎందుకు పంపించారో తెలుసాండీ ఇంకా ఏడ్చిన తరువాత పడకూడనన్ని బిందువులుకాని భూమి పడితే అసలు ఇక ఈ భూమి ఉండదు.
పతివ్రత యొక్క కంటి బిందువులకు అవి ఎక్కువకాని భూమి మీద పడిపోతే, ధర్మరాజు గారి ఒక నెత్తుటి చుక్క కిందపడిపోతే కొన్ని సంవత్సరాల క్షామమొస్తుందనీ ద్రౌపది గబగబా పరుగెత్తుకొచ్చీ ఎవ్వనివాకిట నిభమద పంకంబు రాజభూషణరజోరాజి నడఁగు అంటూ గబగబా పవిటి చెరుగు చింపి కట్టు కట్టింది మహాత్ముల యొక్క స్థితి అలా ఉంటుంది. అటువంటిది సీతమ్మ తల్లి కంటి భాష్పధారలు భూమి మీద పడితే భూమి నశించిపోతుంది. నశించిపోకూడదు కాబట్టి హనుమని పంపించారు ఇప్పుడు హనుమవచ్చి ఏం చేశారు యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తే నైవ దదాహ లంకాం, నమామి తం ప్రాంజలి రాంజనేయం ఆంజనేయం ఆంజనేయం అని కన్నడ దేశంలో అంటారు, ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అని తమిళ దేశంలో అంటారు, హనుమా హనుమా అని మనం అంటాం, మారుతీ మారుతీ అని మహరాష్ట్ర ప్రాంతంలో అంటారు, జై భజరంగభళీ అని బాగా ఉత్తర భారతదేశం పైకి వెళ్ళిపోతే అక్కడ అంటారు ఒక్క హనుమకీ ఇన్ని పేర్లు దేశమంతటా అందుకే ఆయన్ని పిలిచేటప్పుడు అలా పిలుస్తుంటారు. ఇప్పుడు ఆయన ఎందుకొచ్చాడో తెలుసాండీ, శంకర భగవత్పాదులు ఎలా వచ్చారో అలా వచ్చారు హనుమా.
ఆవిడ కంటివెంట పడిపోయిన బాష్పధారలు ఎక్కువై భూమి భూమంతా కూడా నశిస్తుందేమో పుణ్యాత్ములు కూడా పాడైపోతారూ కాబట్టి ఇప్పుడు అది తీసేసీ ముందు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టి నాశనం చెయ్యాలి దాని శక్తి నాశనమే ఇంక ఆవిడ కంటి నుంచి పడ్డ నీరు ఎక్కడ పెట్టాలి అంటే ఏ భూమి దీనికి కారణమో ఎక్కడున్నవాళ్ళు సుఖాలు అనుభవిస్తూ కూడా ఆ ఆడది అనుభవించట్లేదని ఆ రాజులు అడగలేదో వాళ్ళ ఇళ్ళు కాల్చడానికి పెట్టు అన్నారు. ఆ పాపం ఎక్కడ జరిగిందో అక్కడ కాల్చేయ్ ఆ తరువాత రాముడు వచ్చి గబగబా ఆవిడ కళ్ళు ఏడ్వకుండా చేస్తాడు అందుకని హనుమ రామాయణంలో సుందర కాండలో సాధించినటువంటి అద్భుతమైన ఘనతేమిటో తెలుసాండీ ఈ భూమి నశించిపోకుండా కాపాడాడు పతివ్రతా కంటిధారల వలన ఆ పాపాన్ని అక్కడితో లంకని కాల్చారు, ఇక ఏడ్వవలసిన అవసరం లేకుండా ముట్టుకోకుండా కన్నీళ్ళు తుడిచి ఆవిడని స్వాంతన పొందేటట్లు చేశారు.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
దీనివలన సీతమ్మ దుఃఖోపశాంతి కాదు ఈ లోకమంతా శాంతిని అనుభవించింది లోకమంతా శాంతిని అనుభవించేటట్లు చేసిన హనుమ యొక్క వీర గాధ కాబట్టి ఇది విన్నవాళ్ళ యొక్క తాపాలు కూడా ఉశమిస్తాయి. అందుకే సుందర కాండ చదువుకోండి సుందర కాండ చదువుకోండి సుందర కాండ వినండి అంటారు. ఇది చెప్పడం అశ్రు పూర్ణ ముఖీం అంటారు అందుకని ఆవిడ కంటివెంట అదేపనిగా నీరు కారుతూంది దీనాం మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ మళ్ళీ మళ్ళీ అంటూంటారు మహర్షి ఆమాట, పురుషాం కృశామ్ అనఽశనేన చ ఆవిడ తినక పోవడం వల్ల కృషించిపోతూంది, ఆవిడ తినకపోవడానికి కారణం అక్కడ తిండి ఆవిడ తినదు అక్కడ తింటంలేదు కాబట్టి ఆవిడ్ని పంపించడు పంపించడు కాబట్టి పంపించకపోవడం రాక్షసత్వం ఆ రాక్షసత్వం నసిస్తూంది. శోక ధ్యానపరాం ఆవిడ శోకిస్తూంది ధ్యానంలో ఉంది ఎటువంటి ధ్యానం, మనమైతే పూజ గది తలపులు బిడాయించేసుకుని కిటికీలు వేసుకుని కూర్చున్నా కూడా... సెల్ మోగేటప్పటికి అయ్యో బాబోయ్ ఇంపార్టెంట్ ఫోన్ రాలేదుగదాని, భార్య తీసి ఆ ఎవరు? అలో అన్నయ్యగారు మీరా... అందనుకోండి, ఆ అన్నయ్యగారు అంటూంది ఎవరంటావ్, అని దృష్టి అదే ఉంటుంది మాల పెరుగుతూంటుంది, ఆవిడ ధ్యానం అటువంటిది కాదు, ఎవర్ని ఆవిడ ధ్యానిస్తోందో ఆవిడ్ని నిందిస్తున్నారు వాళ్ళు ఎవర్ని ఆవిడ విమర్షిస్తూందో ఎవర్ని అసహించు కుంటుందో అటువంటి వాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఐదు వందల మందో వెయ్యిమందో చుట్టూ కూర్చుని ఈ పని చేస్తున్నారు ఆవిడ ఒక్కతే, వీటన్నిటినుంచి విడిపోయీ ఆవిడ అంతర్ముఖురాలై రామ ధ్యానం చేస్తూంది. అందుకని ఆవిడకి అక్కడ చెట్లున్నాయో పుట్లున్నాయో పళ్ళున్నాయ్యో తెలియలేదూ అన్నారు హనుమ.
Related imageఅంటే ఆయన ఆవిడ మనసు చదివారు ఇది ఆయన బుద్ధిమతాం వరిష్ఠం, సుందర కాండలో గొప్పతనం పైకి కనపడదు, ఎవరి గొప్పతనం ఏమిటి అన్నది మీరు శ్లోకాన్ని బట్టి చెప్పాలి, ఇప్పుడు ఆవిడ మనః స్థితి ఏమిటి అన్నది ఎవరు చెప్పగలుగుతున్నారు హనుమ చెప్పగలుగుతున్నారు ఎందుకు చెప్పగలుగుతున్నారు, అంత బాగా అర్థం చేసుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలి, ఇంత మంది ఇన్ని మాట్లాడుతున్నా... నిర్ణయం చేసుకోలేక అటూ వింటూంది ఇటూ వింటూంది అన్నారనుకోండి ఇంకేమైనా ఉందా రామాయణంలో, కాదు ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా అది ఆవిడ లక్ష్యానికి వ్యతిరేకం అయినా అది ఆవిడ మాత్రం ఆంతరమునందు రాముని ధ్యానమునందే ఉంది. ఇదీ ఆవిడ యొక్క గొప్ప తనం ఆవిడ యొక్క జ్ఞాన శక్తి సీతమ్మది. ఆవిడ జ్ఞాన శక్తిని తెలుసుకున్న మహానుభావుడు పిల్లి పిల్లంత చెట్టుమీద

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
ఉన్నవాడిది హనుమా, అటువంటి వాడి నోటివెంట వచ్చిన శ్లోకాల్ని చెప్పుకుని మనం ధన్యులం ఇది అందిచిన వాల్మీకి మహర్షి మనం జన్మాంతరం ఋణపడి ఉన్నాం. ఆ ఋషి ఋణం తీరేది కాదు కాబట్టి గ్రహే ణాంఽగారకే ణేవ పీడి తామ్ ఇవ హోహిణీమ్ ! అశ్రు పూర్ణ ముఖీం దీనాం కృశామ్ అనఽశనేన చ ! శోక ధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖ పరాయణామ్ !! నిత్యం ప్రతిరోజు ఆవిడ దుఃఖిస్తూనే ఉంది, అంటే ఏ ఒక్కరోజూ ఆవిడ మనస్సు ఉపశాంతి పొందలేదు, ఏ ఒక్కరోజూ ఉపశాంతి పొందలేదూ అంటే ఉపశాంతి పొందకపోవడానికి ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ మాటలు ఉపశాంతిని పొందించలేవేమో వాళ్ళ రూపాలు ఉపశాంతిని పొందించలేవేమో కానీ పది నెలల నుంచి ఉన్నప్పుడు ఋతువులు మారాయి కదాండీ, ఋతువులు మారినప్పుడు మరి రామ చంద్ర మూర్తికి గుహలో కూర్చుంటే ఆకాశమంతా నల్లగా ఉంది చూడు లక్ష్మణా మెరుపులు మెరిశాయి చూడు లక్ష్మణా అని అన్ని చెప్పారు కదా చెప్పి ఆయన ఆనందాన్ని అనుభవించారుగా మరి సీతమ్మ అనుభవించదా అంటే ఆవిడ అసలు కళ్ళు తెరిచినా తెరిచిన స్థితిలో లేదు ఆవిడ అంతర్ముఖురాలై రామ ధ్యానమునందు ఉన్నది.
Image result for లంకలో సీతకాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు రంజిల్లే అవకాశం ఇవ్వగలిగినటువంటి బాహ్య వస్తువు ఆవిడకి లేదు. లేదు రెండవ కోణంలో ఆలోచించారనుకోండి ఒక పుష్పించిన చెట్టు కనపడితే రామునితో ఉంటే ఆ చెట్టు కిందకెళ్లి కూర్చునేది రాముడు లేడు కాబట్టి ఆ చెట్టు నాకెందుకు పళ్ళతో ఓ చెట్టుందనుకోండి నా స్వామి ఉంటే నా స్వామికి ఓ పండు పెట్టీ ఆయనను నా తొడమీద పడుకోబెట్టుకుని సేద తీర్చేదానిని నా స్వామి ఎక్కడున్నారో నేను కనపడక ఎంత కృషించిపోయారో ఆవిడ బాధని ఉద్దీపనం చేస్తుందీ తప్పా ఆవిడకి ఉపశాంతిని ఇవ్వలేకపోయింది. కాబట్టి ఋతువులు మారినా ఎదురుగుండా ఉన్నటువంటివి కొత్త కొత్త శోభలు సంతరించుకుంటున్నా ఆవిడ మాత్రము శోకమునే పొందుతూంది. ఇది ఆవిడ యొక్క పతి భక్తికి నిరూపణం. అంటే ఆవిడకి ఎదురుగుండా ఉన్న వస్తువు వలన సంతోషమా భర్తతో కూడి వస్తువు దగ్గర ఉండడం సంతోషమా భర్తతో ఉంటే వస్తువు సంతోషం తప్పా భర్త పక్కన లేనప్పుడు వస్తువు సంతోషకరమని మీరు అనుకున్నా కొన్ని కోట్ల మందికి సంతోషకరమైనా సీతమ్మకి సింతోషకరం కాదు. ఎందుకు కాదు ఆవిడ పతి భక్తివలన కాదు అంతే ఇది ఆవిడ పాతివ్రత్యానికి నిదర్శనం ఎన్ని చెప్తారండీ ఎక్కడా సీతమ్మ మహా పతివ్రతయై ఉన్నది అని చెప్పరు నిత్యం దుఃఖ పరాయణం అంటాడు. ఇప్పుడు ఆవిడ అలా అనుభవించకుండా చేసినవాడి ఖాతాలోకి ఎంత పాపం వెడుతూందిప్పుడు, వెడుతూందా వెళ్ళటంలేదా ఇప్పుడు తెగటారక పది తలకాయలుంటే నిలబడుతాయా ఏమిటి? ఇంకా... వండేస్తూంది ఆవిడ వీని మృత్యువుని  లేదు వాడే వండుకుంటున్నాడు కాబట్టి ప్రియం జనమ్ అపశ్యన్తీం పశ్యన్తీం రాక్షసీ గణమ్ ! స్వగణేన మృగీం హీనాం శ్వగణాఽభివృతామ్ ఇవ ! ఆవిడకి ప్రియమైనటువంటి జనమెవరో వాళ్ళు కనపడ్డంలేదు ఆవిడకి ప్రియము

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
కానటువంటి జనము ఎవరో వాళ్లు చుట్టూ ఉన్నారు, ఇప్పుడు ఆవిడ పరిస్థితి దానివలన ఎలా ఉందీ అంటే చుట్టూ ఒక్కసారి వేట కుక్కల యొక్క గుంపు చుట్టూ చేరీ మధ్యలో ఒక లేడిపిల్ల చిక్కితే ఇక ఆ వేట కుక్కలన్నీ మీద పడి కరిచి కండ పీకేయడమే తరువాయి అన్న స్థితిలో ఎటు తల తిప్పి చూసినా ఇంతంత నోళ్లు తెరిచి నాలుకలతో ఉన్న వేట కుక్కలు నిలబడి ముందు నేను పీకేయడమా నేను పీకేయడమా? అని చూస్తూంటే మధ్యలో ఉన్న లేడీ పిల్లకి అసలు ఆలోచనలేకా భయమంతా కళ్ళల్లో ఎలా కనపడుతూందో సీతమ్మకళ్ళు అంత భయంతో ఉన్నాయి.
Image result for లంకలో సీతఇంత భయం నిజంగా ఆవిడ పొందిందా..? అసలు ఆవిడా భయాలకి భయం కదాండీ అటువంటావిడా ఇంత భయపడుతోంది ఇంత భయపెడితే అవతలి వ్యక్తి స్థాణువైపోతే ఈ పాపం నిన్ను కట్టి కుదపదూ మహర్షి ఎంత చమత్కారంగా మాట్లాడుతారో చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతారో చూడండి. కాబట్టి నీల నాగాఽభయా వేణ్యా జఘనం గతయైకయా ! నీలయా నీరాదాపాయే వన రాజ్యా మహీ మివ !! శరత్ ఋతువులో వృక్ష పంక్తులతో కూడు కున్నటువంటి వనమెలా ఉంటుందో ఆమె యొక్క జడల భాగమువరకు వేలాడుతున్నటువంటి నల్లని జడా అలా ఉంది అంటే దీన్ని బట్టి ఏమి అర్థమౌతూంది అంటే ఆవిడ కబలీబంద సంస్కారము చేసుకోలేదు ఆవిడ ఒంటి జడతో ఉంది పోయింది అంటే తపశ్వినియై ఉంది. ఆవిడ ఇప్పుడు ఆ జుట్టుని కదలీబందంగా వేసుకుందనుకోండి సీతమ్మతల్లికి సహస్ర నామాల్లో ఒక నామం చాలా పెద్ద కదలీబంధమున్న తల్లీ అని స్త్రీ కేశపాషం పురుషుడికి మోహకారకము అని అంటారు, కాదు పరా శక్తిని చూడగలిగినప్పుడు “ధునోతు ధ్వాంతం న-స్తులిత-దలితేందీవరం-వనం” అని శంకర భగవత్పాదులు అంటారు, ఆడదాని జుట్టూ ఒకవేళ పొడుగ్గా ఉండి కనపడితే ఇది పరాశక్తి యొక్క శక్తిలాగే ఉంటుంది చంపకాశోక పున్నాగ సౌంగధి కలసత్కచా అని ఓ ఈ జుట్టుకి తల స్నానం చేయించిన తరువాత సాంబ్రాణివేసి అమ్మా నేను ఆ జుట్టుని నా చేత్తో పట్టుకుని ముడివేసి అందులో సంపంగిపూలు తురిమీ కనకాంబరాలు పెట్టీ మల్లెల దండ పెట్టీ నేను నీ కదలీబందానికి నమస్కారం చేస్తే పారిజాత వృక్షాలు కూడా కోరుకునేటటువంటి నీ చుట్టు సుగంధవాసనలు నేను పీల్చి అమ్మా నీ పాదములకు నమస్కరించ గలిగిన రోజు ఎన్నడో అని నీవు అనగలిగితే అది నీ మోహానికి కారకం కాదు ఉత్తర క్షణం నీ అజ్ఞాన ధ్వంసానికది కారణం ఎందుకంటే శంకరులన్నారు ఆమాట.
ధనోతు ధ్వాంతం న-స్తులిత-దలితేందీవర-వనం ఘనస్నిగ్ధ-శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే ! యదీయం సౌరభ్యం సహజ-ముపలబ్ధుం సమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ-విటపినామ్ !! అన్నారు సౌందర్యలహరి చేస్తూ నీవు మోహం పొందకుండా అలాగ కాని ఆలోచించగలిగితే నివర్తయు మనో భర్తా అంటూంది సీతమ్మ మనసు తిప్పడంలో ఉంది అంతే సంస్కారం, తిప్పావా అభ్యున్నతి తిప్పలేదా పథనంలో పడిపోతావు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒంటి జడ వేసుకుని ఉంది జుట్టు ముడి వేసుకోవడానికి కూడా భయమే... కాబట్టి నీల నాగాఽభయా వేణ్యా జఘనం గతయైకయా ! సుఖాఽర్హం దుఃఖ

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
Image result for లంకలో సీతసంతప్తాం వ్యసనానామ్ అకోవిదామ్ ! తాం సమీక్ష్య విశాలాఽక్షీమ్ అధికం మలినాం కృశామ్ !! ఆ తల్లి సర్వ సుఖములను పొందడానికి  యోగ్యురాలు, కానీ దుఃఖముల పాలైంది, ఆవిడా ఛీనీ ఛీనాంబురములు కట్టుకునీ అలంకారములు పొందడానికి యోగ్యురాలు అరణ్యవాసం చేస్తున్నా దశరథమహారాజుగారు అన్నీ ఇచ్చారు, కానీ ఆవిడ ఒక మట్టి పట్టిన పుట్టం కట్టుకుంది ఎంత విచిత్రం ఆవిడ పొందడానికి యోగ్యత ఉంది కానీ ఆవిడ పొందలేకుండా ఉంది. ఈ రెండిటింకి మధ్య ఏదుందనుకోవాలి ఈశ్వర శాసనముందనుకోవాలి యోగ్యత ఉండి అనుభవించలేకపోతున్నాడంటే ఈశ్వరుడి యొక్క శాసనం ఏమిటి ఈశ్వర శాసనం రావణ మరణం అందుకని సీతమ్మని తేవడం ఇది కూడా మీరు అంగీకరించవలసి ఉంటుంది. కాబట్టి తర్కయా మాస సీతేతి కారణైః ఉపపాదిభిః ! హ్రియమాణా తదా తేన రక్షసా కామ రూపిణా !! ఆయన బాగా మనసులో తర్కం చేసుకున్నారు అంటే చూడగానే సీతమ్మా అనిపిస్తూంది ఒకవేళ సీతమ్మకాదేమో అనిపిస్తోంది, హా... తల్లి పెట్టుకున్నటువంటి ఆభరణములు రాముడు చెప్పినవే ఇక్కడ లేని ఆభరణములు అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్నాయి ఆవిడ ఇతః పూర్వం ఆభరణములు పెట్టుకున్న చోట్లా మచ్చలు పడి ఉన్నాయి కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని మనసులో అనుకుంటున్నారు ­తాం నీల కేశీం బిమ్బోష్ఠీం సుమధ్యాం సుప్రతిష్ఠితామ్ ! సీతాం పద్మ పలాశాఽక్షీం మన్మథ స్య రతిం యథా !! ఇవి చాలా గొప్పగా ఉంటాయడీ ఈ శ్లోకాలు, మనసున్నవాడికి కదిపేసే శ్లోకాలు.
ఒకరి కూతురు పెళ్ళవ్వగానే అమెరికా వెళ్ళిపోయింది ఏదో రెండేళ్ళ తరువాతో మూడేళ్ళ తరువాతో నాన్నగారండీ నాన్నగారండీ అమెరికానుండి వస్తున్నాను అంది ఎంత సంతోషంగా వెళ్తారండీ తల్లిదండ్రులు విమానాశ్రయం దగ్గరికి తల్లిదండ్రులు అత్తమామలు బంధుగణము స్నేహితులు అందరూ వెడుతారు ఇప్పుడు కూతులు విమానంలోంచి కిందకి దిగుతూందని అలా చూస్తున్నాడు తండ్రి అమ్మాయి విమానంలోంచి దిగింది, సన్నబడిపోయి మొఖమంతా ఏదో పొరల పొరలకిందైపోయి ఆ పిల్ల దిగిందనుకోండి వేంటనే తండ్రికి ఏడుపు వచ్చేస్తుంది. అమ్మా ఎలా ఉండేదానివి నాన్నా ఏంటమ్మా ఇలా అయిపోయావ్ అని హత్తుకుంటాడు ఒక్కసారి ఆ ఏడుపు ఎందుకొచ్చింది ఎలా ఉండేదానివమ్మా ఇలా అయిపోయావేమిట్రా ఇప్పుడా అంటే తాను పోల్చి చూసుకుని ఏడుస్తాడు అలా లేదని ఏడుస్తాడు అది తండ్రి హృదయం, ఓ కొడుకు మూడేళ్ళ తరువాత అమెరికానుంచి తిరిగొచ్చాడనుకోండి అమ్మా అని పరుగెత్తుకుంటూ ఇంటికొచ్చాడు చెప్పలేదు అమ్మకు అనారోగ్యమొచ్చిందని అమ్మ శుష్కించిపోయి ఉంది అమ్మా ఏలా ఉండేదానివమ్మా ఏలా అయిపోయావమ్మా అని వలవల ఏడ్చేశాడు అమ్మా నాకు తెలియదమ్మా ఏందుకమ్మా దిక్కుమాలిన ఉద్యోగం అని వల వల ఏడ్చాడు ఎందుకేడ్చాడు ఒక్క పోలికా గుండెబద్ధలైపోయే ఏడుపు వస్తూంది కదాండీ పోలిక ఏడుపు తెప్పిస్తూంది ఎప్పుడు హృదయముంటే హృదయం లేకపోతే సంతోషంగా ఉంటుంది బలి, చిక్కి చచ్చినా సరే నేను అనుకున్నట్లే ఉండాలి  అది రావణుని బుద్ధి. కాదు అది తట్టుకోలేకపోతే పితృ హృదయమో పుత్ర హృదయో అయి ఉండాలి కదాండి!.
ఏమి చూపిస్తారండీ మహర్షీ, ఇప్పుడు ఆయన పోల్చుకుంటున్నారు పైన కూర్చుని నా స్వామి రామ చంద్ర మూర్తి చెప్పింది ఆనాడు లీలగా విమానంలో వెళ్ళిపోతుంటే ఇలా తలెత్తి చూశానంతే ఆ తల్లీ ఈ తల్లీ ఒక్కపోలికా తాం నీల కేశీం ఎటువంటి తల్లి నల్లటి జుట్టుతో ఆ రోజున ఇన్ని పువ్వులు పెట్టుకుని ఎంత అందంగా ఉంది మా అమ్మ బిమ్బోష్టీం ఎర్రటి పెదవి

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
సుమధ్యాం సన్నటి నడుము సుప్రతిష్టితామ్ చక్కగా కూర్చునేటటువంటి తల్లీ సీతాం  ఈ తల్లి పద్మ పలాశాఽక్షీం పద్మముల వంటి రేకులు గల కన్నులున్న అమ్మ సుమధ్యాం సుప్రదిష్ఠితాం చక్కగా ఉండవలసిన తల్లి రూపము భూమౌ సుతనుమ్ ఆసీనాం నియతామ్ ఇవ తాపసీమ్ ! నిశ్శ్వాస బహుళాం భీరం భుజగేన్ద్ర వధూమ్ ఇవ !! ఈ తల్లి ఇవ్వాళ కూర్చుని ఒక ఆడ త్రాచుపాము తన దగ్గరికి ఎవరో వచ్చేస్తున్నారేమోనని భయపడిపోయి అటూ ఇటూ భయంతో తిరిగేస్తున్నట్లూ ఈవిడ ఎంత భయపడిపోయి ఇటువంటి స్థితిని పొందిందీ అని బోరున ఏడ్చేశారాయన ఇది ఆయన పుత్ర హృదయం, ఎవరాయనకి సీతమ్మ..? ఆయన కన్న తల్లా ఆయన ఎప్పుడైనా చూశారా..! ఆవిడా ఎప్పుడైనా ఇంత మజ్జిగా అన్నం పెట్టిందా ఓ పండించ్చిందా కాదు కాదు అమ్మ తనాన్ని చూడ గలిగాడు. అమ్మని చూడగలిగాడు చూసినందుకు ఆయనకు ఏడుపొచ్చింది అలా ఏడ్వగలిగాడు కాబట్టి భవిష్యత్ బ్రహ్మ కాగలిగాడు.
Image result for జనక మహారాజుఅలా ఏడ్వగల్గిన హృదయం లేనివాడికి  పది తలకాయలున్నా తెగిపోయాయి, నీవు ఎలా ఉండాలో నీ హృదయం ఎంత కోమలంగా ఉండాలో సంస్కరించడం నేర్చుకో అలా ఉండకపోతే తప్పు, దాన్ని ఇంకొకరు సంస్కరించరు నీవు సంస్కరించుకోవడం మొదలుపెట్టు కొంచెం మార్చుకో రకరకాల ఉపమానాలు నీ దృష్టిలోకి తెచ్చుకునీ నేను అలా ఉండకూడదూ అని నేర్చుకోని అలవాటు చేసుకో ఇది, ఈ కోమలత్వం వచ్చిందనుకోండి పశుత్వం చచ్చిపోతూంది వెంటనే. ఒక తల్లికి తండ్రికి మెరుపు తీగలాంటి కూతురు పుట్టింది చాలా బాగా చదువుకూంటుంది, తల్లీ తండ్రీ ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, ఇంత చక్కటి పిల్లనిచ్చాడు ఈశ్వరుడు ఇంత బాగా చదువుకూంటూంది దీన్ని వాళ్ళకిద్దాం లేకపోతే వీళ్ళకిచ్చి పెళ్లిచేద్దామా? వీళ్ళకిచ్చి చేద్దామా నా తల్లి ఎంత వృద్ధిలోకి వస్తూందో మంచి మనమలు పుడతారు నా మనమల్ని పక్కలో పడుకోబెట్టుకుని నేను కథలు చెప్పుకుని సంతోషిస్తాను ఇన్ని కోరికలతో తండ్రి ఉంటే అందంగా పుట్టింది కాబట్టి వశురాలైతే నాకవ్వాలి లేకపోతే ఈ అందం ఉండకూడదు ఆసిడ్ పోస్తాను అన్నవాడిది ఎంత రాక్షస సంస్కృతి వాడిది. అది మీరు మార్చడం కుదరదు ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి పక్కన ఇద్దరు పోలీసులు పెట్టినా ఆ సంఘటనా జరగకుండా చేయలేరు.
మనసులు మారాలి మనసు మారి ఇది రాక్షసత్వం అందంగా ఉన్నది నాది కావాలని నేను కోరకూడదు, తప్పది ఆమె అభ్యున్నతిని కోరుకునేవారున్నారు వాళ్ళు కోరుకునేవాళ్ళలోకి నేను యోగ్యతను పొందిగలగాలి అది గొప్పతనం, నేను ఆ తల్లిదండ్రులు కోరుకున్నవాళ్ళల్లో ఒకన్నికావాలి ఆ అర్హతని సంపాదించుకుని ఆమె మెడలో తాళి కట్టాలి అన్న సంస్కృతి పిల్లలో వస్తే... మీరు ఏ చట్టాలూ అక్కరల్లేదూ ఏ పోలీసులూ అక్కర్లేదు. తప్పా ఈ సంస్కృతిని నశింపజేసేవన్నీ మీరు పిల్లలకి చూపించి అవి జరగకుండా ఆపుదామంటే ఎలా ఆపుతారు, అసలు తప్పెవరిది అలా పిల్లల సంస్కారం నశించిపోయేటట్టు తయారు చేసి చూపించగలిగినవాడెవడో వాడు తప్పుకు కారకుడు. కాదా మీరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండీ నేను దైర్యంగా అంటాను మీరు అనరు అంతే తేడా. కాబట్టి ఇప్పుడు ఒక భయపడిపోయిన ఆడ త్రాచు ఎలా ఉందో అలా ఉందాతల్లి. దీన్ని చూసి బాష్పాఽమ్బు పరిపూర్ణేన కృష్ట వక్త్రాఽక్షి పక్ష్మణా ! వదనేనాఽప్రసన్నేన నిశ్శ్వసన్తీం పునః పునః !! నల్లగా వంకరగా ఉన్నటువంటి ఆవిడ యొక్క కనురెప్పలు కన్నీటిచేత తడిసి ముద్దలైపోయి ఉన్నాయి ఆ తల్లి వదనేనాఽప్రసన్నేన ఆవిడ ముఖం అప్రసన్నంగా ఉంది. అంటే స్వస్థతతో శాంతింగా ఆవిడలేదు, అప్రసన్నంగా ఉంది విశ్శ్వసన్తీం పునః పునః ఆవిడ మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే పనిగా నిట్టూర్పులు విడిచిపెడుతూంది. భయపడిపోయినటువంటి ఒక ఆడ త్రాచుపాము ఎంత గిర గిర గిర తిరుగుతూంటుందో అలా తిరుగుతోంది. అస్తమానం అటూ ఇటూ చూస్తూంది, ఇదీ ఆవిడ ఇలా చూస్తుందన్న చూపు వెనక ఉన్న మర్మాన్ని చూడగలగడంలో ఉంది బుద్ధి వైశిష్ట్యం.
Image result for జనక మహారాజు

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
ఇదీ ఒక పట్టాణ అందే విషయం కాదు ఎందూకూ ఆయన అలా అనగలుగుతున్నారో తెలుసాండీ ఆయన పట్టుకున్నారు ఎక్కడ్నుంచి వచ్చింది ఈ పిరికితనం అంటే కంటికి కనపడినదేదో అదే ఆ వస్తువా అని ఆవిడ నమ్మలేకపోతూంది. ఇప్పుడూ నా ఎదురుగూండా మీరు కూర్చున్నారనుకోండి నేను మీరేని నమ్ముతున్నాను అందుకని నేను కూర్చోగలుగుతున్నాను కదాండీ! నేను ఎప్పుడైనా రామాయణం నేను ఎప్పుడైనా రాక్షసులొచ్చి కూర్చుని ఉపన్యాసమైన తరువాత నా వీపు చీల్చేశారనుకోండి మమ్మల్ని తిడుతూ ఉపన్యాసం చెప్తున్నావాని, ఆ మర్నాడు సభలో కూర్చుంటే సభలో నాకు ప్రియమైన వాళ్లు ఉపన్యాసం వింటూ కొట్టారనుకోండి నా ఎదురుగుండా రామాచార్యగారు కూర్చున్నా విజయ కుమారు గారు కూర్చున్నా నాకు అనుమానమే వీళ్ళేనాని అయిపోయిన తరువాత మంగళం చెప్పిన తరువాత అసలైన రూపాల్లోకి వస్తారా..! అది నా ఎదురుగుండా ఉన్నది నా ఎదురుగుండా కనపడుతున్నది ఉన్నట్టున్నది కనపడుతున్నదే అని నేను నమ్మగలమా..! నేను నమ్మలేను ఎందుకో తెలుసాండీ నా మనసుకి భయం అలవాటైపోయింది. ఎందుకంటే జీవితంలో ఒక సంఘటన అలా జరిగింది అదీ మర్చిపోలేనటువంటి పిరికిని కల్పించింది. సీతమ్మ జీవితంలో వరుస క్రమంలో జరిగాయి ఈ రెండూ ఒకటీ బంగారు చుక్కల జింక అది జింకే అనుకుంది ఆవిడా మీరు అలాగే అనాలి రామాయణంలో అలా అనకపోతే కథకు అందంలేదు, ఇప్పుడు చేప్పాను, అది జింకే అనుకుంది. ఇప్పుడది జింక కాదు కాబట్టి ఎత్తుకుపోగలిగాడు, మారీచుడు వాడు ఇప్పుడు ఆవిడకి అక్కడ భయం పట్టుకుంది. రెండు సన్యాసి రూపంలో వచ్చాడు రావణుడు సన్యాసీ అంటే ఇక నమ్మరూ అనడానికేం లేదు సన్యాసి అంటే నమ్మేయచ్చు. ఎందుకంటే ఆయనకు ఏ కోరికా ఉండదు కాబట్టి అలా వచ్చి సీతాపహరణం చేశాడు ఈ రెండూ ఆవిడ మనసులోకి వెళ్ళిన దగ్గర్నుంచీ ఆవిడ ఎదురుగుండా కనపడినదేదో అది అలా కనపడిన వస్తువే నిజమే అని ఆవిడ నమ్మకలేకపోతూంది ఆవిడయందు అపనమ్మకం ప్రభలిపోయింది ఇప్పుడు.
కాబట్టి ఇప్పుడు ఆవిడ దేన్నికూడా నమ్మదు. ఒకవేళ హనుమయే ఎదురుగుండా వచ్చారనుకోండి ఆవిడ నమ్మదు, ఆవిడకి రామ నామాంకితమైన ఉంగమిచ్చారనుకోండి ఆవిడ పుచ్చుకోదు, ఒకవేళ శ్రీరామ అని రాసిన ఉంగరం కనపడిందనుకోండి విసిరేస్తుంది, ఎందుకంటే ఆవిడకు పాములా కనపడుతుంది, రెండు సన్యాసి రూపంలో రావణుడు వచ్చిన తరువాత రామ నామాంకితమైన ఉంగరం తేవడం పెద్ద లెక్కాండీ అందుకనీ ఆవిడ నమ్మదు ఒక వానరుడొచ్చీ దగ్గర దగ్గరిగా దగ్గర దగ్గరిగా జరుగుతుంటే అలా స్పృహతప్పిపోయింది అంతే ఆవిడ వేటుపడిపోయిందంటారు చూశారా ఆంత భయానికి ఆవిడ లోనైపోయింది. ఆవిడ ఇప్పుడు చాలా భయపడుతూంది. కాబట్టి ఈవిడని అసలు నమ్మేటట్లుగా మాట్లాడటం ఎలా నేను అందుకే మీతో అంటాను రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రమని చూడండి మనః తత్వ శాస్త్రవేత్తలు ఏమండోయా చాలా ఒక భయానికి లోనైపోయారు హఠాత్ పరినామం వల్లా అలా అయిపోయారు క్రమ క్రమ క్రమ క్రమంగా మారి స్పృహలోకొస్తారు, జ్ఞాపకం రావడానికి కొంచెం సమయం పడుతూంది, భయం పోవడానికి కొంచెం సమయం పడుతూంది.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితుడికి అలా జరిగింది, తను ఒక రాత్రివేళ వస్తూంటే విశాఖపట్నంనుంచి మంచి సైక్లోన్ వస్తున్నప్పుడు రాత్రివేళ పెద్ద మెరుపు మెరిసి ఉరుము పడింది, అతని దరదృష్టమేమో గాలికి చెట్టు కొమ్మవిరిగి కిందపడింది అది అతని వీపుమీద పడింది ఆ విద్విగ్నతలో ఏదో మీద పడి పీకుతూంది వీపులో అనుకును కిందపడిపోయాడు, ఏదో పాపం హాస్పటల్ లో తీసుకెళ్ళారు పెట్టారు మేము కూడా వెళ్ళి చూశాం, అసలు అతను అలా కళ్లు తెరిచి చూస్తూ ఉండేవాడే తప్పా భయపడిపోతుండేవాడు అంటే ఆ సంఘటన అతని మీద అంత ప్రభావం చూపించింది. సీతమ్మ తల్లి జీవితంలో మీద పడ్డ కంపాకాదు కర్రాకాదు అది ఆవిడ జీవితంలో సుఖ శాంతుల్ని తీసేసింది మళ్ళీ అసలు రాముని దగ్గరికి వెళ్తానా అన్నంత స్థితిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆవిడ భయ విశ్వల అయ్యిందీ అన్న విషయాన్ని పట్టుకుంటున్నాడు ఒకాయన ఎలా పట్టుకుంటున్నాడు ఆయనా బుద్ధి చేత పట్టుకుంటున్నాడు, ఇది ఆయన గొప్పతనం “బుద్దిమతాం వరిష్ఠం వాతాత్మజం వారయోధ ముఖ్యం శ్రీ రామ ధూతాం శిరసానమామి” అందుకే పెద్దలు ఎప్పుడూ ఏమంటారో తెలుసాండీ! పిల్లల్ని తప్పకుండా హనుమ పూజ చేయించండి అంటారు. పెద్దవాళ్ళమాట అలా ఉంచండి, పిల్లలు తప్పకుండా ప్రదక్షిణం చేయవలసింది, పిల్లలు తప్పకుండా పూజ చేయవలసింది ఎవర్నో తెలుసాండి హనుమకి పూజ తప్పకుండా చేయాలి.
Image result for జై హనుమాన్ఎందుకో తెలుసా ఒక్కటే కారణం మీకోక శ్లోకముంది హనుమని సేవిస్తే ఏమొస్తుందీ అని బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యంవాక్పటుత్వంచ- హనుమత్పరణాన్ భవేత్ అని ఒక మాట అజాఢ్యం అంటే జాఢ్యం లేకపోవడం జాఢ్యం లేకపోవడం అంటే మిగిలినవి తెలుస్తాయి బుద్ధి యశస్సు బలం ఆరోగ్యం అరోగతా అంటే రోగం లేకపోవడం అజాఢ్యం అంటే జాఢ్యం లేకపోవడం అంటే ఏమిటి వస్తూంది హనుమని పూజిస్తే అంటే లోకంలో రెండు రకాలుగా ఉంటుంది. “జడము-చిత్తు” అని జడము అంటే ప్రతిస్పందన లేకుండా ఉండేది అని చిత్ అంటే చైతన్యముతో కూడి ఉండేది, ప్రతిస్పందిస్తుంది చాలా చురుగ్గా ఉంటుంది చురుగ్గా ఉండి ప్రతీది పట్టుకుంటుంది. పట్టుకుని ప్రతిస్పందిస్తుంది. నేను ఇలా ఉంటాను ఇది విన్నాను కాబట్టి ఇలా ఉండను అంటే చైతన్యము చిత్తు. ఎన్ని చెప్పనీవ్వండీ ఎన్ని విననీవ్వండీ ఏమీ మార్పుండదు దాన్ని జడం అంటారు. యదార్థానికి జడమంటే ఏమిటంటే ఇది జడమంటారు అంటే కరెంటు ప్రసారం వల్లా నా మాటను గట్టిగా చేయగలుగుతుంది లేదా నేను దీన్ని కాల్తో తన్నాననుకోండి అది లేచి నన్నేం తన్నదు ఎందుకంటే జడం దానికోక ప్రతిస్పందనేం ఉండదు, దానికొ దండేశాననుకోండి రోజు కోటేశ్వరావుగారికేంటండీ దండలేసేదీ పాపం ఆయనేమో మాట్లాడింది ఇంత గట్టిగా అక్కడవరకు వినపడేటట్లు చేసింది వాటికి కూడా దండలేయండి అన్నారనుకోండి, ఇప్పుడు ఈ రెండిటికీ దండలేశారనుకోండి ఇప్పుడు ఇవేం కళ్ళకద్దుకోవు పక్కనెట్టవు ఎందుకంటే వాటికి దండేవేశారో ఇంకోటి వేశారో అవేం పట్టించుకోవు.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
Image result for నిద్రా దేవతాబాగా చెప్పారు అంటే అది కోటేశ్వరావుగారి లోపలనుంచి రామ చంద్ర మూర్తి చెప్పేది ఆయన కీర్తి, అబ్బే ఆయన మొహం ఆయనేం చెప్పాడంటే ఇంకాబాగా తెలుసుకోవలసిన అవసరం ఉందీ నేనింకా బాగా చెప్పలేకపోతున్నానన్న అపకీర్తి నాది కానీ రెండు లేనిదిది కదాండీ! ఉపన్యాసంలో వీటికి భాగమున్నా వీటికా గొడవేం లేదు ఎందుకంటే వీటికి దండావేయరు వీటితో దెబ్బలాడనూ ఆడరు, ఇవి జఢాలు నేను చైతన్యం. అజాఢ్యం అంటే ఏమిటో తెలుసాండీ జడమునుంచి వచ్చేది జాఢ్యం చిత్ నుంచి వచ్చేది చైతన్యం. దీనికి పేరేమిటో తెలుసాండీ వేదాంతంలో “చిత్ జడ గ్రంధీ” అని పేరు. గంధ్రీ అంటే ముడి చిత్తుని జడాన్ని ముడేస్తాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు ఈ రెండిటిని ముడి వేస్తే చిత్ జడ గ్రంధీ అంటారు. చిత్ దీంట్లోంచి విడిచిపెడితే జడము, చిత్ గా ఉంటే చిత్ జడముగా తిరుగుతూంటూంది. ఇందులో ప్రాణముందనుకోండి చైతన్యముందనుకోండి అమ్మవారు తిరుగుతూందనుకోండి పరాశక్తి, పరాశక్తి ఉన్నంత సేపూ ఇందులో ఉంటాయి కొన్ని ఏవి యా దేవీ సర్వ భూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః !! ఆకలి రూపంలో ఉండి ఆకలేస్తుందంటారు, ప్రతిస్పందించింది యా దేవీ సర్వ భూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః !! ఆవిడ నిద్రా రూపంలో ఉండి అలసిపోయి పడుకో పడుకోని ప్రతిస్పందిస్తూంది. జఢమంటే చిత్తుని మరిపోయి జఢంగా బ్రతికేవాడు అరే మనకు ఇందులో చైతన్యముందిరా దీనివలన మనం ఉన్నతిని పొందాలి, మనం తెలుసుకోవాలి ప్రతిస్ఫందించాలి.
మనం మారాలి మనం ఇది చెయ్యాలి అని ఉత్సాహం లేకుండా ఎప్పుడూ ఏది చేద్దాం అన్న సంతోషం లేకుండా అలసత్వంతో దేనివలన ఏ ప్రయోజనం ఉండదో దేనివలన ఏ ఒక్క అడుగూ తాను పైకెక్కలేడో అటువంటివన్నీ చేస్తూ కాలాన్ని గడిపేవాన్ని జడమని పిలుస్తారు. చూడండీ ఒకప్పుడు ఏం తోచట్లేదని ఓ కప్పు కాఫీ పట్టుకురా అంటారు, ఏమీ తోచకపోతే కాఫీ ఎందుకూ, తోచంది మనసుకు కడుపుకెందుకు అంటే ఒక అయోమయావస్థితిలో అంటే ఏం తోచట్లేదు అలా కోటేశ్వరావుగారి ఇంటికిపోదామంటారు మధ్యలో వాడిల్లెందుకు నీకు ఒకవేళ వాడు రామాయణం చదువుకుంటూంటే వాడిని పాడుచేయడం కోసం ఏమీ తోచకపోతే కోటేశ్వరావు ఇల్లేమిటీ ఏం తోచట్లేదు అలా మేన్ రోడ్లోకి పోదాం రండీ అంటారు, లేని ట్రాఫిక్ʼని సృష్టించడానికి అంటే ఏది పనికిరాదో అది చేస్తూంటాడు ఏది తోచట్లేదు అంటూంటాడు. ఏదీ తోచట్లేదు అంటే ఏమిటీ ప్రపంచంలో ఉన్న వ్యాఖ్యానాల్లో పది చదవడానికి జీవితం సరిపోలేదని ఏడ్చారు మహానుభావులందరూ ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం నాకు పూర్తిగా అర్థమవ్వడంలేదూ ఎంత చదివినా క్రొత్తదొస్తూనే ఉందని పొంగిపోతున్నారు అంత పొంగిపోతూంటే నీకేమీ తోచట్లేదా... తోచకపోవడమేమిటీ వాడి ఇంటికి వెళ్ళడమేమిటీ ఎందుకొచ్చిందది అసలు అలాగా ఎందుకెళ్ళాలి ఇంకొకళ్ళ ఇంటికీ ఏం నీ ఇంటిలో కూర్చుని నీవొక పుస్తకం చదువుకోలేవా ధ్యానం చేసుకోలేవా విష్ణు సహస్త్రం చదువుకోలేవా? లక్ష్మీ అష్టోత్తరం చదువుకోలేవా? ఎప్పుడు చూసినా ఇలా ఇలా మారుస్తూండమూ చూడ్డం మారుస్తూండమూ చూడ్డం మారుస్తూండం చూడ్డం ఏమిటి అభ్యున్నతి నీకు ఏమీ ఉండదు దీనికి జడమని పేరు అంటే వీడు కదలటం లేదా కదులుతున్నాడు ఉయ్యాలా ఎక్కి కాశీకి వెళ్తున్నాడనుకోండి రైలెక్కారు కదులుతున్నారు కాశీ వెళ్ళారు నేను ఉయ్యాలెక్కాను కదులుతున్నాను కాశీ వెళ్తున్నానన్నాడు, నాకు టికెట్టు అక్కరలేదండీ నేనూ కదులు తున్నానా లేదా నేనూ కదులు తున్నాను ఉయ్యాలెక్కి కాశీ అన్నాడు. ఆయన కాశీ వెళ్ళడానికి రెండు రోజులు ప్రయాణం చేస్తే వీడూ రెండు రోజులు ఉయ్యాల దిగకుండా రెండు రోజులూ ఉయ్యాల ఊగాడు. ఎక్కడున్నాడు ఎక్కడెక్కాడో అక్కడే ఉన్నాడు, కాశీ వెళ్ళినాయన ఎక్కడున్నాడు రెండు రోజుల తరువాత కాశీలో ఉన్నారు.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
కదలడం ప్రధానం కాదు నీవు ఎలా కదులుతున్నావన్నది ప్రధానం, ఎలా కదులు తున్నావో తెలిసి కదలడం చైతన్యం ఏదో ఒకలా కదలడం జఢం. ఏదో ఒకలా కదలడం కాదు, కదిలేటప్పుడు బహుపరాకుతో కదిలి లోకోపకారం చేస్తూ ఉపకారం చెయ్యడంలో విశ్రాంతిలేకుండా ఉపకారం చేస్తూ “తనకన్న కోర్కెలేకుండా” గొప్ప బుద్ధి వైభవంతో అవతలివాళ్ళను చూస్తే ఇలా పట్టుకోగలిగినంతగా త్రిల్ చేయ గలిగినటువంటి అంత గొప్పగా ఆలోచించగలిగినంత శక్తిని బుద్దికి ఇవ్వగలిగితే దానికి తగినట్లు ప్రతిస్పందన ప్రతి ఊహ్యరచన చేసి ఉపకరించగలిగితే నీవు రాసీ భూత చైతన్యమని గుర్తు. ఈ జఢం విరగకపోతే ఏమౌతుందో తెలుసాండీ? రేపు పరీక్షన్నా ఒక్కసారి స్కోర్ చూస్తానంటాడు అంతే ఆయనదేం పోయింది 30-30 ఆడుతాడు 50-50 ఆడుతాడు డే అండ్ నైట్ ఆడుతాడు 5 డేస్ నైట్ ఆడుతాడు, వాడికి కోట్లు వస్తున్నాయి నీకేమొస్తుంది ఉన్న పరీక్షపోతూంది. ఇది నీ స్పృహలో ఉంటే నీవు జాగ్రత్తగా పరీక్షల్లో నెగ్గుతావు. చూడకుండా ఉండాలంటే నీవు చైతన్యమై ఉండాలి జడమై ఉండకూడదు. ఒక్కసారి స్కోరు చూద్దామని పెట్టామండీ పరీక్ష పోయిందంటే వాడి చిత్ జఢ గ్రంధిలో వాడు జఢమై ఉన్నాడు తప్పా, చిత్తుని చిత్తుగా జఢాన్ని వాడలేదు.
ఏమీ ఉండదు మీరు చూడండి, ఏం చేస్తూంటాడంటే ఎప్పుడూ పడుకూంటాడు, తినేస్తాడు పడుకుంటాడు తింటాడు పడుకుంటాడు, భోజనం చేస్తాడు పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, పొద్దున్నా పడుకుంటాడు, రైలెక్కుతాడు పడుకుంటాడు, సామర్లకోటలో రిజర్వేషన్ లో పడుకుంటాడు అనకాపల్లిలో లేస్తాడు టీటీ లేపితే, ఏదంటే చాలా నిద్రపట్టేసింది సార్ అంటాడు. పడుకుని టిటీకి చెప్తాడు ఇంకోడి చెప్తాడు ఇంకోడి చెప్తాడు ఇంకోడి చెప్తాడు లేకపోతే వాడుపడుకోడు ఇంకోడిని పడుకోనివ్వడు, సెల్ పోన్లో మొదలెడుతాడు పడుకుని బెర్తుమీద అదో అదృష్టవశాత్తు అన్ కవర్డ్ ఏరియాస్ అనికొన్ని ఉన్నాయి కాబట్టి పడుకుంటున్నారు, అన్నీ కవర్డ్ ఏరియాస్ అయిపోతే ఇంక చిత్తశాంతి ఉండదు లోకంలో, కాబట్టి లోకంలో ఇదీ జఢం. ఈ చిత్ జఢ గ్రంధిలో జాఢ్యం పోయి చైతన్యం రావాలంటే హనుమదోపాసన చెయ్యాలి, హనుమద్ ఉపాసన చేస్తే హనుమత్ ఉపాసన చేస్తా ఆయన అనుగ్రహం కలిగినవాడికి ఏమౌతుందో తెలుసాండీ, అలసటన్నమాట రాదు మనిషికి అసలు అలసట ఉండదు, మీరు ఏ కార్యం మీద ఉత్సాహంతో కూర్చున్నారో ఆ కార్యాన్ని ఎన్ని గంటలు ఏం చేస్తుండండి మీరు అలసటన్నమాట మీకుండాలేమోగాని ఆయనకు కూర్చున్నాయనకి అలసట ఉండదు. పూజా అలా చేస్తాడు చదువు అలా చదువుకుంటాడు వ్రాయడం అలా వ్రాస్తాడు, ఆలోచించడం అలా ఆలోచిస్తాడు ఏదైనా తపస్సే ఆయనకి శృన్వన్ తపః పఠనం తపః పూజా తపః ఏదైనా తపస్సే అలా ఉంటుంది ఆ బుర్ర పెట్టగలిగిన శక్తి జడమునుంచి వీడు చైతన్యంగా ఉంటాడు, వీడు చైతన్యాన్ని మర్చిపోయి జఢంగా ఉంటాడు అంటే ఎప్పుడూ పడుకుంటాడు. పడుకుందాం పడుకుందాం పడుకుందాం పైన ఎండగా ఉంది పడుకుంటాడు బయట సీతాకాలంలో ఎవడైనా లేస్తాడా అమ్మో బయట చలి అంటూ పడుకుండాడు, వానాకాలంలో అసలు గొడవేలేదు తడిసిపోతానని పడుకుంటాడు. కాబట్టి వానికి ఋతువులన్నీ ఎందుకు పనికొస్తాయంటే వాడికి పడుకోవడానికే పనికొస్తాయి. ఇదిపోవాలి ఈ జాఢ్యం పోవాలీ అంటే ఏమన్నారంటే హనుమత్ ఉపాసన చేయవయ్యా అన్నారు, మీకు హనుమత్ స్వరూప భాసా సుందర కాండలో కనపడుతూంది, ఆయనా చూడ్డం అంటే అలా చూస్తుంటుంటాడు. అందుకే శ్లోకాల్నీ శ్లోకాలుగా మీరు చూడకండి, శ్లోకాలలో హనుమద్ వైభవముంటుంది, శ్లోకాలలో రావణుడి పాపం ఉంటుంది. శ్లోకాలలో సీతా వైభవం ఉంటుంది శ్లోకాలలో మీకు పాఠాలు ఉంటాయి అందుకే మీకు సుందర కాండ పారాయణ కాండ.
కాబట్టి ఇప్పుడు అంటారు తాం స్మృతీమ్ ఇవ సంధిగ్ధామ్ బుద్ధిం నిపతితామ్ ఇవ ! పూజాం ఇవ పరిక్షీణామ్ ఆశాం ప్రతిహతామ్ ఇవ !! తాం స్మృతీమ్ ఇవ సంధిగ్ధామ్ ఇవ్వాళ కాసీ ప్రయాణమే పదిహేనవ సర్గలో మొదలు పెట్టి పదిహేనవ సర్గలోనే ఉన్నాం. తాం స్మృతీమ్ ఇవ సంధిగ్ధామ్ ఇదీ సందిగ్ధంలో ఉన్న స్మృతిలా ఉందటా కొన్ని కొన్ని మీకు బాహ్యంలో దొరికే ఉపమానాలు వేస్తారు కొన్ని కొన్ని దొరకని ఉపమాలేస్తారు, మీరు ఆలోచిస్తేనే దొరుకుతాయి ఆలోచించకపోతే దొరకవు, ఆ స్మృతి ఉందనుకోండి ఆ స్మృతి వాఖ్యానికి ఇలా చెప్పాలా అలా చెప్పాలా అని మీకు అనుమానముందనుకోండి ఎందుకంటే అలా ఉంటాయి కొన్ని కొన్ని మీకు సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది అందులో భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభంగవ్సనిని అని శంకర భగవత్ పాదులు ఒక శ్లోకం చేశారు, అందులో సవ్వేతరకరగృహీతం రతిపతేః అన్నారాయన, సవ్యముకాని చేత్తో ధనస్సు పట్టుకున్నాడూ అని అన్నాడు. సవ్యము కాని చేత్తో అంటే కుడి చేత్తోనా ఎడమ చేత్తోనా... ఇప్పుడు నేను ఇలా ఎడం చేత్తో ఎదో ఇచ్చాననుకోండి నీ మొఖం సవ్యంగా ఇవ్వరా అంటారు, అంటే కుడి చేత్తో ఇస్తారు. కాబట్టి ఇప్పుడు సవ్వేతర కరం అంటే, కుడి చేయ్యికానిది ఎడమ చెయ్యి. ఇప్పుడు నేను గుళ్ళోకి వచ్చాననుకోండి ఇలా ప్రదక్షిణానికి వెళ్తున్నాననుకోండి ప్రదక్షిణానికి సవ్యంగా ప్రదక్షిణం చేయరా అదేంటంటారు. అంటే ఎడం పక్కన వెడతాడు. ఇప్పుడు ఎడం పక్కనా సవ్యమే కుడిపక్కన్నా సవ్యమే సముస్కృతంలో సవ్యం అన్నమాటకి కుడి ఎడమా అని కూడా ఉన్నాయి ఇప్పుడు సవ్వేతరకరగృహీతం రతిపతేః మన్మథుడు సవ్యంకాని చేత్తో పట్టుకున్నాడు అన్నారనుకోండి మీరు ఉపన్యాసం చెప్పాలి.
ఎడం చేత్తో పుచ్చుకున్నాడని చెప్పనా కుడి చేత్తో పుచ్చుకున్నాడని చెప్పనా కుడి చేత్తో పుట్టుకున్నాడని చెప్తే శ్లోకం ఎలా వస్తూంది ఎడం చేత్తో పుచ్చుకున్నాడని చెప్తే ఎలా వస్తూంది. ఎందుకు స్పష్టంగా చెప్పలేదు ఆయన దక్షిణం వామం అన్నమాట ఎందుకేయలేదు అని మీకే అనుమానంతో ఉందనుకోండి మీరు ఏం చెప్తారు ఇంకా... అనుమానంతో ఉన్న ఒక మాట లేదా ఒక స్మృతి అనుమానంతో ఉన్న గౌతమ స్మృతీ, యాజ్ఞవల్క స్మృతీ, అత్రి స్మృతీ అని ఏ స్మృతైనా అనుమానంగా ఉంటే అది ఎలా ఉంటుందో సీతమ్మలా ఉంటుందటా... ఎంత గొప్ప ఉపమానమండీ, తాం స్మృతీమ్ ఇవ సంధిగ్ధామ్ బుద్ధిం నిపతితామ్ ఇవ  ఎంత గొప్ప ఉపనానాలేస్తారండీ... పూజాం ఇవ పరిక్షీణామ్ ఆశాం ప్రతిహతామ్ ఇవ చాలా గొప్ప బుద్ధి ఆయనది, ఆయన్ని చూస్తే అబ్బాహ్ ఏమి బుద్ధిమంతుడండీ మహానుబావుడు అనేవారు అకస్మాత్తుగా ఆయనే మీరు ఊహించలేని రీతిలో కనపడ్డాడనుకోండి అన్ని దుర్వసనాలకు బానిసైపోయాడు అన్ని దుర్వవ్యసనాలకి ఆయన బానిసైపోతే ఇప్పుడు ఏమంటారు, అయ్యెయ్యో ఎంత బుద్దిమంతుడండీ ఎటువంటివాడు, ఇలా అయిపోయాడా... అంటే ఎలా ఉంటుందో అలా ఉందట సీతమ్మ. బుద్ధిం నిపతితామ్ ఇవ చ శ్రద్ధామ్ శ్రద్ధ చెడిపోతే ఎలా ఉందో అలా ఉందటా...  శ్రద్దంటే సత్యమన్న బుద్ది.
ఇప్పుడు నేను రామాయణం చెప్తున్నాననుకోండి ఇందులో రెండు కోణాల ఉంటాయి, ఒకటి రామాయణ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుని రామాయణం చెప్పడం ఓ పద్దతి రామాయణం సత్యమూ అని నమ్మి రామాయణం చెప్పడం ఒక పద్ధతి, రామాయణం సత్యం అని నేను నమ్మాననుకోండి, ఇది నామీద ప్రభావం చూపించచ్చు ఇందులో ఏముందో ఇంకోలా ఉండడానికి నాకు భయముండాలి అప్పుడు శ్రద్ధుందంటారు. ఏదో వస్తారు సరదాగా వాళ్ళు అడిగారు కాబట్టి కాసేపు చెప్పొస్తాను అనుకున్నాననుకోండి, అప్పుడు దాని తాత్పర్యం చదువుకుని మీకు చెప్పేస్తే చాలు. అప్పుడు మీ మనసు మీద ప్రభావం చూపించాలని నాకేం కోరికుండదు, నా మనసు మీద ప్రభావం చూపిస్తుందన్న నమ్మకం నాకుండదు ఇది శ్రద్ధలేకపోవడం, కానీ ఒకనాడు శ్రద్ధుండి ఒకనాడు పోయిందనుకోండి ఎలా ఉందో అలా ఉందట సీతమ్మ, అసలు గుర్తించడానికి వీలులేని రీతిలో అసలు ఒకసారి సీతమ్మేనా...! ఒకసారి సీతమ్మే అలా అనిపిస్తూంది ఆవిడా... అంతగా ఆమె సుష్కించి ఉంది. కాబట్టి విహతామ్ ఇవ చ శ్రద్ధామ్ ఆశాం ప్రతిహతామ్ ఇవ ఆవిడ పెట్టుకున్న ఆశ నెరవేరుతుందీ అని అనుకున్నాడు, కానీ అకస్మాత్తుగా ఆశ నెరవేరకుండా పోయింది. నెరవేరని ఆశ ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది బాష్పాఽమ్బు పరిపూర్ణేన కృష్ణ వక్త్రాఽక్షి పక్ష్మణా ఆ కన్నుల వెంట నీరు కారుస్తూ ఆ తల్లి ధీనంగా భయముతో కూడిన నాగుపాములా త్రాచుపాములా ఉంది.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
అది ఆయన బుద్ధి యొక్క వైభవం ఆవిడ ఆ స్థితిలో ఉందని పసిగడుతున్నారు పసి గట్టారు కాబట్టే మహానుభావుడు సీతమ్మతల్లితో అసలు బాహ్యంలోకి ఆవిడ్ని తీసుకొచ్చీ బాగా నమ్మకం కల్గిస్తే తప్పా... అసలు ఆవిడ చేతిలో ఉంగరాన్ని పెట్టలేడు, అసలు ఆవిడ చేతిలో ఈ స్థితిలో ఉండగా ఉంగరం పెట్టేశాడనుకోండి, చాలా మందికి సుందర కాండలో అనుమానమేమిటంటే ఎందుకండీ ఆయన అంతసేపు మాట్లాడటం వెళ్ళి ఉంగరం చేతిలో పెట్టేస్తే అమ్మా రాముడు పంపించిన ఉంగరమమ్మాని అంటే ఆవిడ నమ్మదా? నమ్మదూ... ఆవిడ పరిస్థితి ఇదీ, నమ్మదూ అని ఎంత స్పష్టంగా ఎన్ని సాధికారితమైన సాక్ష్యాల చేత ఆయన నమ్ముతున్నారో చూడండి, ఇదీ హనుమ యొక్క ప్రజ్ఞ సుందర కాండలో లేకపోతే హనుమని సేవిస్తే ఇవి వస్తాయని చెప్పడానికి ఆధారముండదు మీకు కాబట్టీ ఇప్పుడు ఆయన నిర్ణయించుకునీ ఆ ఆభరణముల యొక్క ఆనవాళ్ళు కనబడుతున్నాయి కాబట్టి ఈ తల్లి సీతమ్మే... అని ఋజువులు కూడా చూసుకుంటున్నారు, చూసుకుని ఆయన ఒక చమత్కారమైనటువంటి దోరణిలో ఇప్పుడూ విషయాన్ని రాముడు వైపు నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంటారు ఇప్పుడు ఇక్కడ ఈ సీతమ్మ ఇంత ఏడుస్తూంది కదా ఇంత బాధ పడుతూందిగదా పది నెలల నుంచి పది నెలల నుంచి బాధపడుతున్నటువంటి సీతమ్మా రెండే రెండు జరగాలి.
ఒకటి రావణుడికి దక్కాలి అసంభవం రెండు రాముడికి దక్కాలి, రెండవది సంభవం రాముడికి దక్కుతుంది, రాముడికి దక్కితే ఈవిడ ఇక్కడికి వచ్చినందువల్ల రాముడు ఎన్ని రకాలుగా బాధపడుతూండి ఉండాలీ... సీతమ్మ కనపడ్డంలేదు అని బాధపడుతూండడం ఎలా ఉంటుందంటే ఉంగరం లేదని కూడా బాధపడుతాడు. కదాండీ ఇప్పుడూ నేను నా ఉంగరం రెండు రోజులు కనపడలేదనుకోండి అయ్యో ఉంగరం ఎక్కడికిపోయిందోని హరిప్రసాద్ గారు వేదికమీద ఏమైనా పడిపోయిందేమో కొంచెం ఎవర్నైనా పిలిచి చూడమందురూ అని ఇంటికెళ్ళి ఓ ఫోన్ చేసి ఆ తరువాత ఎక్కడికెళ్ళొచ్చాను ఎక్కడికెళ్ళొచ్చాను అని అంటే మీరు అంతా నాన్నగారండీ ఎప్పుడూ ఇంతేనండీ మీరు ఆఫ్ సెట్ మైండెడ్ అని మా అమ్మాయంటే ఏవో రకరకాలుగా ఆలోచనలు చేసి చేస్తాం కదా... ఉంగరం గురించినటువంటి బాధ ఒక్కటే ఉంటుంది అయ్యో బంగారం పోయిందని లేకపోతే అలాంటి ఉంగరం ఇంకోటి సృష్టిలో లేదనడానికేంలేదు అటువంటిది మళ్ళీ చేయించుకోవచ్చు. బాధల్లా ఏమిటంటే ఉంగరంలో బంగారముంది బంగారానికి ఓ విలువుంది అందులో బంగారానికి రేటుంది. ఇప్పుడు పోయింది ఉంగరం అది బాధ. కదాండీ! అంతేనా సీతమ్మ కనపడలేదని రాముడు ఏడ్చేది కూడా అంతేనా ఇంకేమైనా కూడా కారణాలు ఉన్నాయా... ఇప్పుడు ఏ కారణాలకు ఏడుస్తున్నాడన్నదాన్ని బట్టి రాముడు ఏడుస్తున్నాడన్నదాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. నేను ఏక పత్నీ వ్రతం పెట్టుకున్నానండీ ఉన్న ఒక్క పెళ్ళాన్ని వాడు ఎత్తుకుపోయాడు చచ్చిపోతున్నాడనుకోండి మన్మథ బాణాలకి అన్నాడనుకోండి ఆయనకి అంతే అర్థమైంది సీతమ్మని గుర్తు అంతే కదాండీ.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
ఇప్పుడూ ఆయనకీ కామ పత్నా ఇంకా ఏమైనానా సీతమ్మా ఆయనకి సీతమ్మేమిటో దానిని బట్టి రావణుడికి శిక్ష ఉంటుంది, కదాండీ! ఆయన చాలా రకాలుగా బాధపడుతున్నాడనుకోండి ఆ వ్యగ్రత రావణున్నొక్కన్ని విడిచిపెట్టదు చేరేవాళ్ళందర్నీ చంపేస్తుంది. కాదు ఏదో ఒకలా అనుకోండి ఏదో ఉంగరం కనపడలేదనుకోండి, ఆయన ఎవరికో దొరికిందటాండీ ఆయన ఇంట్లో పెట్టుకున్నారటా మళ్ళీ నాలుగు రోజులు పోయాక తీసుకొచ్చి పట్టుకొచ్చి ఇచ్చారటాండనో, లేకపోతే ఆయనెవరో ఏదో పట్టుకెళ్ళాడు వెతుకుతుంటే తెలిసింది అది గురువుగారి ఉంగరం, ఆ ఉంగరం తీసుకుంటే చాలా ఇబ్బందులొస్తాయి తెలుసా... అందులో ఆయన ఉంగరం ఘట్టం చెప్పబోతున్నాడు, చెప్పబోతుండగా అలాంటి ఉంగరం తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఏదో వచ్చేస్తుందని చెప్పావంటా చెప్తే ఇచ్చేశాడండీ అని అన్నారనుకోండి. ఇప్పుడు నేనేం అంటాను పోల్లేద్దురూ సుందర కాండ ఇలా కూడా పనికొచ్చిందన్నమాటా అంటాను కదా అక్కడితో అయిపోయింది. అంతేనా రాముడు కూడా సీతమ్మ విషయంలో ఏమి బుద్ధిమతాం వరిష్ఠమండీ హనుమా! మహానుభావుడు.
Related imageఆయన అంటారూ స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ రాముడు ఎందుకేడుస్తున్నాడో సీతమ్మగురించి చెప్తున్నారు, ఈ తల్లి గురించి ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా... ఆశ్రితేతి ఆనృశంస్యతః ! పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ !! నాలుగు కారణాలకు ఏడుస్తున్నాడు రాముడు ఈమె కనపడలేని ఒకటి స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఈమె స్త్రీ కాబట్టి ఈమె తనను తాను రక్షించుకోలేదు తన రక్షణకి రాముడిమీద ఆధారపడింది, రాముడు ఉండగా నాకేమౌతుంది అని నమ్మిందావిడా... ఇప్పుడు ఆవిడ నమ్మింది కాబట్టీ ఆవిడ తప్పుచేసిందా చేయలేదా వేరేవిషయం రక్షించడం నా కర్తవ్యం అలా నన్ను నమ్మివచ్చిన స్త్రీని నేను రక్షించలేకపోయాను కాబట్టి ఇప్పుడూ అయ్యో నన్ను నమ్మి ఎంత బాధపడుతూందో నన్ను నమ్మినందుకు ఇన్ని కష్టాలొచ్చాయి, ఇప్పుడు ఆయనకు చాలా జాలిగా ఉంది సీతమ్మమీద నా వల్ల ఇన్ని బాధలుపడుతున్నావా అని ఆశ్రితేతి ఆనృశంస్యతః తనని ఆశ్రయించిందావిడా నీవు నా భర్తవయ్యా నేను నీ పక్కన ఉంటే నాకు సంతోషం నాకు నీవులేని అయోధ్య అయోధ్యకాదు అడవీ అంది, అలా తనని ఆశ్రయించి అనుగమించి వచ్చినటువంటి స్త్రీ రావణుడు ఎత్తుకపోయి పదినెలలైంది, తాను జాడ కనిపెట్టలేకపోయాడు, ఇప్పుడు ఆయన దయతో ఉన్నాడు సీతమ్మమీద పత్నీ నష్టేతి శోకేన ఇప్పుడు ఆయన భార్య పక్కన కూర్చుంటే తప్పా చేయడానికి వీలులేని కార్యాలు ఏవున్నాయో అవి చెయ్యడానికి వీలులేని స్థితి వచ్చింది. ఎందుకంటే పత్ని పక్కనుండాలి, ఆ పత్నిలేదు కాబట్టి ఆయన శోకిస్తున్నాడు ఇప్పుడు ప్రియేతి మదనేన చ ఆయనకి మన్మథబాణం పడితే ఒక స్త్రీ కాదు కావలసింది కేవలము ఆయన ప్రియ పత్ని కావాలి, ఆయన ప్రియం మనసు ఎవరివల్ల రంజిల్లుతుంది ఆయన మనసు మన్మథ పరంగా పొంగేది ఒక్క సీతమ్మ విషయంలోనే... ఇదీ ఆయన ఏకపత్నీవ్రతము.
ఆయనా అంటూ కామ దృష్టితో చూసేది ఒక్క సీతమ్మనే తప్పా ఆయనని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు “పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం” శూర్ఫణకా చూస్తూంది ఆయన్ని కాని ఆయన చూడడు, ఆయనా

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
అంటూ అలా చూడాలంటే ఒక్క సీతమ్మే ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆయన మన్మథ పరంగా బాధపడుతున్నాడు, పత్నీ పక్కన లేదనీ శోకిస్తున్నాడు స్త్రీ తన వలన బాధపడిందని జాలి పడుతున్నాడు. ఆశ్రయించినది కనపడలేదని దయతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన భావాలన్నీ కూడా అన్ని విధాలుగానూ తను విఫలమైపోయానన్న క్రోధమంతా కూడా సీతమ్మ వలననే గూడు కట్టుకుని ఉంది. ఇప్పుడు ఇన్ని బాధలకు కారణం వీడే అని వీడు ఎదురుగూండా కనపడితే వీడిక మిగులుతాడా..? సీతమ్మ శోకంతో సరిపోదు, సీతమ్మ రాముడికోసం శోకిస్తూంది రాముడు సీతమ్మకోసం నాలుగు కారణాలకు శోకిస్తున్నాడు. కాదు ఇందులో చాలా గొప్ప విషయమేమిటో తెలుసాండీ! ఆయన శోకము ఆయన క్రోధమునకు ఎంత కారణమౌతుందో లెక్కకట్టారు ఈవిడ శోకం రాముడి బాధకి కారణమై ఈమె శోకం రామ శోకంకన్నా గొప్పదెందుకయ్యిందో లెక్క కడుతారు, ఏమి బుద్ధివరిష్టమండీ ఆయనా... అది ఎక్కడ ఎలా లెక్క కడుతారో మీకు నేను చూపిస్తాను అస్యా దేవ్యా యథా రూపమ్ అంగ ప్రత్యంగ సౌష్ఠవమ్ ! రామ స్య చ యథా రూపం తస్యేయమ్ అసితేక్షణా !! రామ చంద్ర మూర్తి యొక్క అంగ ప్రత్యంగములు ఎటువంటి సౌష్ఠవంతో ఉంటాయో సీతమ్మ తల్లి యొక్క అంగ ప్రత్యంగములు కూడా అటువంటి సౌష్ఠవంతోనే ఉన్నాయి.
Image result for జై హనుమాన్అంటే సీతమ్మలో ఎవరు కనపడ్డారు రాముడు కనపడ్డాడు విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లేకేశ్వరుడు కనపడాలి, ఇలా కనపడడం జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అధ్వైక దర్శనం. ఇదీ ఆయనకు కనపడింది. ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మయందు రాముడు కనపడ్డాడు ఇదీ పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం ఇప్పుడు ఆయన అటువంటి దర్సనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞానియైన యోగి, ఇప్పుడు ఆయన నోటివెంట ఒక మాట అన్నారనుకోండి అది సత్యమౌతుంది. శాస్త్రంలో ఏమిటంటే “బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి” బ్రహ్మమును అనుభవించినవాడు బ్రహ్మమైపోతాడు, అందుకేగా చతుర్ముఖ బ్రహ్మగారు అవుతున్నారు, ఇప్పుడు ఆయన నోటివెంట ఏదైనా అన్నారనుకోండి అదే నిజమౌతుంది. నీ పది తలలు తెగిపోతాయిరా అన్నారు తెగిపోయాయి, కొన్ని కోట్లమంది వానరములు వస్తాయన్నారు వచ్చాయి లంక కాలిపోతుంది అన్నారు కాలిపోయింది. ఇప్పుడు లంక కాలిపోతూందని ఆయన చెప్పలేదు ఆయన అన్నారు కాబట్టి కాలిపోయింది లంకని చెప్పాలి మీరు. ఎందుకో తెలుసాండీ యోగి వాక్కైంది ఆయందీ, ఇదీ ఆయన పొందిన స్థితి, ఇది పొందించిన తల్లి మాయామానుష స్వరూపిణి ఆవిడ అయోనిజయై ఆవిడ సాక్ష్యాత్ జగదాంబియయై ఉంది ఒకన్ని నశింపజేయడానికి అలా కనపడుతూంది ఒకర్ని ఉద్దరించడానికి అలా కనపడుతూంది. ఆయనికి అలా ప్రచోదనం చేస్తూంది దియోయోనః ప్రచోదయాత్, ఇంకోడికి అలా ప్రజోదనం చేస్తూంది ఇది ఆవిడ యొక్క వైభవము సీతా వైభవము సీతాయాత్ చరితం మహత్ ఇన్ని కోణాల్లో తిరుగుతూంది సుందర కాండ.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
కాబట్టి అస్యా దేవ్యా మన స్తస్మిం స్తస్య చాఽస్యాం ప్రతిష్ఠితిమ్ ! తే నేయం స చ ధర్మాత్మా ముహూర్తమ్ అపి జీవతి !! ఎంత పెద్ద మాటండీ ఇది నిజంగా... ఈ సీతమ్మ ఇంత ఏడుస్తూందిగదా రామున్ని విడిచి ఈవిడ బ్రతికి ఉండకూడదు ఇంత బెంగున్నది రాముడు అక్కడ ఏడుస్తున్నాడుగదా అక్కడ చూసొచ్చారుగా సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల ఏడుస్తున్న రామున్ని చూసినవారు ఈయ్యనే, రాముడు పక్కనలేకపోవడం వల్లా ఏడుస్తున్న సీతమ్మని చూసిందీ ఈయ్యనే, ఈయ్యన తప్పా అలా చూసినటువంటివాళ్ళలల్లో కోట్ల కోట్ల వానరులల్లో ఇంకొకరు లేరు, కాబట్టి ఇప్పుడు ఈయ్యనే చెప్పాలి ఏదైనా చెప్పితే ఈయ్యనేం చెప్తున్నారంటే, మరి సీతమ్మని విడిచి శోకిస్తున్న రాముడు బ్రతక కూడదు రామున్ని విడిచి శోకిస్తున్న సీతమ్మ బ్రతక కూడదు మరి వీళ్ళిద్దరూ ఎలా బ్రతికున్నారు నిజంగా శోకించడంలేదా శోకిస్తున్నట్లు శోకిస్తున్నారా... చచ్చిపోదామని నటించి ఏదో ఇంకోమార్గంలేక చచ్చిపోదామని ప్రయోపవేశం చేసిన అంగదుడిలా ఏదో భర్త కనపడలేదని ఏడుస్తున్నట్లు ఏడుస్తూందా నిజంగా ఏడుస్తూందా... సీతమ్మ కనపడ్డంలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడా నిజంగా ఏడుస్తున్నాడా... నిజంగా అన్నాళ్ళేడిస్తే చచ్చిపోవద్దూ..? మరి ఎలా బ్రతికున్నారు ముహూర్తమ విజీవతి నిజంగా ఇంత ప్రేమలున్నవారు ముహూర్తం బ్రతక కూడదే మరి ఎలా బ్రతికున్నారు హాఁ... నాకర్తమైంది అన్నారు అస్యా దేవ్యా మన స్తస్మిం స్తస్య చాఽస్యాం ప్రతిష్ఠితిమ్ ఈయ్యన మనసు ఈయ్యన దగ్గర లేదు ఈయ్యన మనసు ఆవిడ దగ్గర ఉంది, ఆవిడ మనసు ఆవిడ దగ్గర లేదు ఈయ్యన దగ్గర ఉంది. అందుకే శ్రీరామాయణంలో చమత్కారం ఏమిటంటే రామ చంద్ర మూర్తి యొక్క పట్టాభిషేకం జరిగితే రాముడు కొంత మందికి కానుకలు ఇచ్చాడు, సీతమ్మ కొంత మందికి కానుకలు ఇచ్చింది, సీతారాములు ఇద్దరూ కలిపి ఒక్కరికే కానుకలు ఇచ్చారు, అది ఎవరికి? ఆవిడ మెడలోంచి ముత్యాలహరం తీసి పట్టుకుని చూసింది ఏమీ మాట్లాడలేదు రాముని వంక చూసింది ఇలాగ అదేంటీ అందరికీ ఇచ్చాంగదా అని అడిగారనుకోండి అంటే ఈవిడ భాష ఆయనకి అర్థం కాలేదనేగదా గుర్తు.
Image result for రామ పట్టాభిషేకంలో హనుమఆయనేమన్నారో తెలుసాండీ! సీతా ఈ హారమిద్దామనుకుంటున్నావా? ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాఽసి భామిని ! పౌరుషం విక్రమో బుద్ధి ర్యస్మి న్నేతాని సర్వశః !! యుద్ధ కాండలో, నీవు ఇద్దామనుకుంటే పౌరుషము బుద్ధి పరాక్రమము బలము నీ సౌభాగ్యమునకు కారణం ఎవరో ఆయనకీయ్ అన్నారు, ఆవిడ వెంటనే హనుమకి ఇచ్చింది హనుమ మెడలో వేసుకున్నారు ఇద్దరూ కలిసి ఇచ్చింది హనుమకే ఇద్దరి మనసులు ఎవరి దగ్గర వారిది లేదు ఒకరిది ఇంకొకరి దగ్గరుంది, ఇదే మనం దాంపత్యంలో కోరుకుంటాం. ఆయనా ఏమిటో ఊరెళ్ళి పదిరోజులైపోయిందని బెంగపెట్టుకున్నట్టుగా ఉండడం కాదు, బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడంవల్ల నిద్రపట్టక, బెంగ పెట్టుకున్నందువల్ల సరిగ్గా అన్నం తినకా బెంగ పెట్టుకున్నందువల్లా మనిషి సరిగా స్వస్థతగా ఉండక ఉంటే మనసులు మారాయని గుర్తు. ఆయన కోసం ఆవిడ పరితపిస్తోంది ఆవిడ కోసం ఆయన పరితపిస్తున్నారు మనసులు మారాయి ఇద్దరివీ ఆయన మనసులో ఆవిడెళ్ళిందీ ఆవిడ మనసులో ఈయ్యన దగ్గరకొచ్చింది ఇది జరగాలని మనం కోరుకుంటాం, సనాతన ధర్మంలో పెళ్లి చేస్తే జీలకర్ర బెల్లం పెట్టిస్తే... జీలకర్రా బెల్లం పెట్టడం ముహూర్తమా... ఇద్దరూ చూసుకోవడం ముహూర్తమా... సుముహూర్తానికి జీలకర్రా బెల్లం పెట్టండీ అంటారు, సుముహూర్తానికి జీలకర్రా బెల్ల పెట్టడం ముహూర్తం కాదు, చూసుకోవడమే ముహూర్తం, చూసుకోవడం ముహూర్తం కాబట్టి తెరపెట్టారు, జీలకర్రా బెల్లం పెట్టుకోవడం సుమూహర్తమైతే అయితే తెరక్కరలేదు ఆ ముహూర్తానికి జీలకర్రా బెల్లం పెట్టితే చాలు.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
మంత్రం ఎలా నడిచిందంటే ఒకరినొకరు చూసుకోవడం సుమూహూర్తం, సుమూహూర్తం చూసుకోవడానికైంతరువాత వెంటనే అడుగుతాడు వరుడు ఈమె నా ఇంట ప్రవేశించిన తరువాత ఇదిగో ఏదో పశువులు బాగుండాలి అది బాగుండాలి ఇది బాగుండాలి అన్ని బాగుండాలని అడుగుతాడు అడిగిన తరువాత అప్పుడు జీలకర్రా బెల్లం పెట్టిస్తారు ఎందుకు పెట్టిస్తారో తెలుసాండీ నీ బాధ నా బాధ నీ సుఖం నా సుఖం నాకు సుఖం నీకు దుఃఖం, నీకు దుఃఖం నాకు సుఖం ఈ రెండూ లేవు ఆయన బాధపడితే ఆవిడ బాధ పడుతూంది, ఆవిడ సంతోషపడితే ఆయన సంతోషపడుతాడు, ఆయన సంతోషపడితే ఆవిడ సంతోషపడుతూంది. అంతేగాని ఆయన సంతోషంగా ఉండడం ఈవిడ దుఃఖంగా ఉండడం అలా ఉండవు, ఇది ఏకీకృతమవ్వడానికి జిలకర్రనీ బెల్లాన్ని నూరితే ధనాత్మక విద్యుత్ పుడుతూంది, అధి మూర్ధన్య స్థానములందు పెట్టిస్తే, ఒకరి కొరకు ఒకరు త్యాగం చేస్తారు, త్యాగం చేసి ఒకటౌతాయి మనసులు. ఆయనకి వెళ్ళిల్లిపాయేస్తే పప్పుపులుసు ఇష్టం ఈవిడికీ వెళ్ళుళ్ళిపాయ లేకపోతే ఇష్టం ఇప్పుడు ఆవిడా రెండు పప్పు పులుసులూ వండుతూంది లేదా వెళ్ళుళ్ళిపాయ పప్పేవండి తేట ఆవిడ పోసుకుంటూంది, ఏం నీవు వెళ్ళుళ్ళిపాయ లేకుండా పెట్టుకోలేకపోయావా ఆంటాడు. చ్ మీరు తినండీ... బాగుందా బాగుందా అంటూంది మీరు చూడండీ లోకంలో ఇద్దరే అడుగుతారు, హోటల్ వాడు అడగడు బాగుందాండీ పప్పు అని అడగడు. వాడికి ముప్పైరూపాయలిస్తే చాలు వాడికి, నీవు తింటే ఎవడికి కావాలి తినకపోతే ఎవడికి కావాలి లేకపోతే సత్రముల్లోనా అక్కడా ఏమండీ అన్ని బాగున్నాయాండీ అన్ని బాగున్నాయేమండీ అని వాళ్ళేం అడగరు నిన్నూ మీరు కడుపు నిండా తిన్నారా లేదా అంతే వాళ్ళకు కావలింది. కడుపునిండా తిన్నారా అన్నది కూడా కాస్త అనుమానమే అనుకోండీ, మేం పెట్టేశాం అనుకుంటే చాలు అది అన్నదానమైపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో.
కానీ భార్య తల్లి వడ్డిస్తే ఓ మాట అడుగుతారు ఏమండీ... బాగుందా బాగుందా అని అడుగుతారు, ఆ చాలా బాగుందని మీరు ఊరుకున్నారనుకోండి ఏం రెండోమాటేం వేసుకోలేదే రెండోమాటు వేసుకోలేదే రెండోమాటు వేసుకోలేదేని ఏం ఎందుకనాలి మీరు సరిగ్గా తినలేదు ఇవ్వాళ కూర బాగలేదా... ఏమైనా తేడా వచ్చిందా అంటే చస్తారా... ఆఖరికి లేదులే ఇవ్వాళ ఏదో రుచిరాలేదు నేను చాలా బాగా చేశాను ఎండాకాలం గదా దిక్కుమాలిన వంకాయలు ఎంత జాగ్రత్తగా చేసినా బాగుండవు, ఇవ్వాళ చాలా జాగ్రత్తగా చేశాను మీరు కడుపునిండా తింటారనుకున్నాను ఆ బీరకాయన్నా వండాల్సింది వంకాయ వండాను పీకేసుకుంటుంది ఆవిడా ఎందుకనీ..? వండేసేయడం ఆవిడకి తృప్తికాదు, మీరు హా... అబ్బా..హ్ ఏం వంకాయ కూరోయ్ అన్నారనుకోండి ఆవిడకి గజారోహణం. ఆడది ఇంక అంతకన్నా కోరుకునేదేముండదు, భర్త తృప్తి ఆవిడకి సమస్తం నేను అందుకే అంటుంటాను ఎవరన్నారోగాని, అది ఎక్కడన్నారు ఎవరన్నారన్నది వదిలేయండి ఆవిడికి తృప్తేమిటంటే “మగడుమెచ్చిన చాలు కాపురంలోన మొగలి పూలాగాలి ముత్యాలవాన”. కాబట్టీ ఈ మనసులు మారాలని కోరుకుంటూంది సనాతన ధర్మం, తప్పా నీ మొహం వెళ్ళుళ్ళి పాయ పులుసు మొన్న నీకు వండానుగా... ఇవ్వాళ నేను వండుకున్నాను తింటే తిను లేకపోతే మానేయ్ నీకోసం వండి నేనోటి తినల్లే, అస్తమానం మీకే వండుతారేంటీ... అలా ఏం కుదరదు నేనూ వండుకుంటాను అని.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
ఇంక అక్కడ్నుంచి నా అంతనేను ఇన్-కమ్ ట్యాక్స ఎస్ఎస్ సీ ననీ చిన్న కారణానికి వెంటనే డైవర్స్ ఇచ్చేసుకోవడం ఇచ్చేసుకునీ, పుచ్చేసుకొని ఓ ఇంట్లో ఉంటూండడం ఇలాంటి వెర్రి వెర్రి వేషాలు సనాతన ధర్మంలో ఉండవు, మనసులు మారి బ్రతుకుతారు ఇక్కడ, ఇదీ సీతారాముల యందు సిద్ధించింది ఈ దాంపత్యం అందుకని బతికుండగలిగారు కాబట్టి అస్యా దేవ్యా మన స్తస్మిం స్తస్య చాఽస్యాం ప్రతిష్ఠితిమ్ ! తే నేయం స చ ధర్మాత్మా ముహూర్తమ్ అపి జీవతి !! లేకపోతే క్షణ కాలం వీళ్ళిద్దరూ బ్రతకలేరు అంత ప్రేమైక మూర్తులు అందుకే ఇప్పటికీ శుభలేక వేస్తే... సీతారాములు లేని శుభలేక వేయవద్దూ జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మ రాగాయితాః రాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః ! న్యస్తా శ్యామల కాయ కాంతి కలితాః యా ఇంద్ర నీలాయితాః ముక్తాస్తా శ్శుభదా భవంతు భవితాం శ్రీ రామ వైవాహికాః !! ఈశ్లోకం లేకుండా మనం వేయ్యం శుభలేఖ అస్సలు, దాంపత్యం అంటే సీతారాములే, కాబట్టి ఆమాట అని ఆయన అంటారు దుష్కరం కురుతే రామో య ఇమాం మత్తకాశినీమ్ ! సీతాం వినా మహాబాహు ర్ముహూర్తమ్ అపి జీవతి !! అబ్బబ్బా ఈ రాముడు చెయ్యకూడని పని చేసేశాడు, చెయ్యరాని పని చేసేశాడు ఏమిటో తెలుసా ఇమాం మత్తకాశినీమ్ సీతాం వినా మహాబాహు ర్ముహూర్తమ్ అపి జీవతి ఇంత గొప్ప తల్లీ ఎంత శోకిస్తూంది ఇక్కడ ఈవిడ శోకం ఇలా ఉంటుందని తెలిసి కూడా బతికున్నారంటే... నిజంగా రాముని గుండె గుండెకాదు బండా. ఇప్పటి వరకు హనుమకి రామున్ని స్తోత్రం చేయడం వచ్చు తప్పా అసలు రామున్ని ఇలా అనడం ఆయనకి రాదు ఇప్పటివరకు అలాంటాయన ఎప్పుడుంటున్నారంటే సీతమ్మని చూశాక అంటున్నారు ఎందుకన్నాడు? ఈ మాట ఎందుకనాలండీ  ఆయనా... రాముడు కూడా బాధ పడుతున్నాడు నాలుగు కారణాలకి బాధపడుతున్నాడు అన్నాడుకదా ఇప్పుడు ఆ నాలుగు కారణాలకి బాదపడ్డం రావణ వధ ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడం, మరి సీతమ్మతల్లి బాధపడుతూంది అంటూన్నారుగదా సీతమ్మ తల్లి బాధపడుతూంటే చూసి ఆ రాముడు అసలు నిజంగా ఇంత బాధపడుతూందని తెలిసి బ్రతికున్నాడంటే ఆయన గుండె గుండెకాదు బండ ఎలాగ బ్రతికున్నారో అన్నారంటే ఏ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని అనాలి ఈమాట.
Related imageఆవిడ చాలా పతీవ్రత కాబట్టీ రాముడి గురించి ఇంత ప్రేమగా ఉంది కాబట్టీ ఇంత ప్రేమ కలిగినటువంటి భార్యని విడిచిపెట్టి కూడా బ్రతికున్నాడంటే ఆయన ఎంత బండయైనటువంటి గుండెన్నవాడంటే ఈవిడకున్నంత ప్రేమ ఆయనకి లేదన్నట్లు అదా ఆయన ఉద్దేశ్యం హనుమ యొక్క ఉద్దేశ్యం అది కాదు. ఆయన బుద్ధిమతాం వరిష్ఠం మీరు గుర్తు పట్టవలసిందేమిటో తెలుసాండీ శోకమునందు ఉండేటటువంటి తేడాని ఆయన లెక్క కట్టాడు, సీతమ్మా శోకిస్తూంది రాముడూ శోకిస్తున్నాడు కానీ ఇద్దరి శోకానికి ఏమిటి తేడా అంటే రాముడు శోకిస్తున్నా తనవారిమధ్య ఉన్నాడు. సుగ్రీవుడున్నాడు పక్కన లక్ష్మణమూర్తి ఉన్నాడు తను నమ్మిన ధనుర్వేధం ఉంది, తనకు అస్త్ర శస్త్రములు తెలుసు ఇవ్వాళ కాకపోతే రేపు సీతమ్మని తెచ్చుకోగలనన్న ధైర్యముంది ఋతువు మారితే తనవైపునుంచి వానరులు వెళుతారని తెలుసు, తను సైన్యాన్ని సమీకరించగలనని తెలుసు సీతమ్మ అబల. ఒక ఆడది భర్త నుంచి దూరంగా మోసగించి తేబడింది, ఉన్నది రాక్షస స్తావరంలో ప్రతిరోజూ కాముకుడైనడువంటి రావణుడు చూస్తున్నాడు తన మనస్సు మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు విశేషమైనటువంటి దుర్భోద చేస్తున్నాడు రామ నింద చేస్తున్నాడు ఈవిడిది కష్టమా రాముడిది కష్టమా ఎవరిది కష్టం శోకంలో ఇద్దరూ ఏడుస్తున్నారు కానీ శోకించడంలో చాలా భయంతో కూడి ఎక్కువ శోకంతో ఏడుస్తున్నవారు ఎవరు? ఈవిడ కష్టం ఎక్కువ ఏడ్చేటప్పుడు, ఈవిడ కష్టంతో పోల్చితే రాముడి కష్టం తక్కువ. ఇంత ఎక్కువ కష్టంలో ఆవిడ ఉండి ఉంటుందని తెలియని అమాయకుడా రాముడు కాడే, పది నెలల నుంచి రావణుని యొక్క బంధనంలో ఆవిడ ఉందీ అంటే తన భార్య మనసు మారదూ తన గురించే అలమటిస్తూందని తెలుసు అలమటిస్తూందని తెలుసు. కొన ఊపిరి వరకు తననే నమ్మి బ్రతుకుతుందని తెలుసు.
రావణుడు కాముకుడై అనకూడని మాటలు అంటూంటాడని తెలుసు, రాక్షస స్థావరంలో ఉండిపోయిందని తెలుసు, తెలిసీ తాను లక్ష్మణునితో ఉన్నాడు సుగ్రీవునితో ఉన్నాడు వానరుల మధ్యలో ఉన్నాడు తనకు అస్త్ర శస్త్రాలు తెలుసు తను శోకిస్తూండడం వేరు ఈవిడ శోకం వేరు తను శోకిస్తూ ఈవిడ శోకము యొక్క వ్యగ్రతను తెలిసికూడా తాను నిగ్రహించుకోగలిగాడంటే అయ్యబాబోయ్ అలా తట్టుకోగలిగిన శక్తి సామాన్యమైన శక్తి కలిగిన గుండె కాదది బండ. లేకపోతే తన భార్య ఇలా ఉంటుందనుకుంటే గుండె పగిలిపోతూంది ఇటువంటి ప్రేమైక మూర్తి గురించి శోకమునందు ఉండేటటువంటి తార తమ్యాన్ని లెక్క కట్టేటప్పుడు ఆవిడ పడుతున్న బాధ ఊహించినంత మాత్రం చేత ఎవరి గుండెలైనా వ్రక్కలైపోతూంది అన్నారు హనుమా అందుకే పరాశరబట్టర్లు శ్రీ గుణ రక్తకోశం చేస్తే అమ్మా నీవు ఏ అవతారమైనా స్వీకరించుకానీ... ఇంక ఎప్పుడూ సీతమ్మగా మాత్రం రావద్దూ ఏమౌతుంది రావణుడు బ్రతికుంటే..? మమ్మల్ని కొడతాడు మమ్మల్ని చంపుతాడు, అయినా కొట్టి చంపేసేంత యజ్ఞాలు యాగాలు ఇప్పుడు మేమేం చేయట్లేదు, రావణుడు అక్కర్లేదు మాకు ఇప్పుడు చాలా మంది ఉన్నారు బాధపెట్టేవాళ్ళు, అప్పుడు ఒక్కడే, కాబట్టి మా జోలికి వచ్చేవాళ్ళు ఎవరూ కొడితే కొట్టని అదే తేలిక మాకు అంతే తప్పా నీవు ఇంత కష్టపడీ ఈ అశోకవనంలో ఉండి ఇన్ని భాధలు పడడాన్నిమాత్రం మేం చదవలేం మావల్ల కాదు. అందుకనీ ఇంకెప్పుడూ నీవు సీతమ్మగా మాత్రం అవతారాన్ని స్వీకరించవద్దూ అని వేడుకున్నారు పరాశర భట్టర్లంటే ఆయన ఎంతగా ఉద్విగ్నత పొందారో శ్రీరామాయణ పఠనంచేత మీరు గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు సు ముహూర్తమ్ ఇవ థ్యాత్వా బాష్ప పర్యాఽఽకులేక్షణః ! సీతామ్ ఆశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాప హ !! సుందర కాండని ఎక్కడ పడితే అక్కడ ఆపడం కుదరదు అలా ఆప కూడదు సుందర కాండని ఏదో ఒక మంగళప్రదమైన ఘట్టం దగ్గర వెడితే తప్పా ఆపడం కుదరదు.
కాబట్టి సు ముహూర్తమ్ ఇవ థ్యాత్వా బాష్ప పర్యాఽఽకులేక్షణః ఆయనా సీతమ్మ తల్లిని చూసీ కన్నుల వెంట నీరు కారిపోయి ఏడిచేస్తున్నారా అన్నట్టుగా ఏడుస్తున్నారు, మరి ఏడవకపోతే ఏం చేస్తున్నారు అంటే ఆత్మను తెలుసుకున్నటువంటి యోగీ ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి యోగికి కన్నుల నుంచి ఇట్నుంచి భాష్పధారలు ఎలా కారుతున్నాయో అలా ఆయన కన్నుల వెంట భాష్పదారలు పడుతున్నాయి, కాదు బాహ్యంలో నిజంగా సీతమ్మ శోకానికి ఒక కొడుకుగా ఆయన శోకిస్తున్నాడు మాన్యా గురు వినీత స్య లక్ష్మణ స్య గురు ప్రియా ! యది సీతాఽపి దుఃఖాఽఽర్తా కాలో హి దురఽతిక్రమః !! ఈ శ్లోకం కానీ జీర్ణమైతేనండీ ప్రతి చిన్న విషయానికి ఏడ్వకుండా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కదిలిపోకుండా ఉండడం హపర్ సెన్సిటీవ్ అంటారు చూశారా..! ప్రతి చిన్న విషయానికి ఉద్వేగమే, ప్రతి చిన్న విషయానికి కదిలిపోవడమే అలా ఉండకుండా ఉండడం మీకు అలవాటైపోతుంది. గోరుచుట్టవేసింది అంతే ఇంక జీవితమే పోయినట్లు ఉంటాడు ఒక్కొక్కడు నీ గోరుచుట్టకీ సీతమ్మ పడ్డ దుఃఖానికి తుల్యమా..? ఆయన అంటున్నారు హనుమా... మాన్యా గురు వినీత స్య లక్ష్మణ స్య ఆ తల్లి ఏ లక్ష్మణ మూర్తి యొక్క బుద్ధి గురువుల చేత శిక్షీంపబడిందో ఏ లక్ష్మణ మూర్తి వశిష్ఠ మిశ్వామిత్ర మహర్షులను సేవించి సర్వోత్కృష్టమైన బుద్ధిపొందాడో అటువంటి లక్ష్మణ మూర్తి చేత సేవింపబడేటటువంటి తల్లి ఆ సీతమ్మ.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
ఆమె గురుప్రియా “గురు ప్రియాంటే” పెద్దల చేత అభినందింపబడిన నడవడి కలిగిన తల్లి  మీకు సీతా సహస్త్రంలో పూజ చేసినప్పుడు ఈ విషమే మనవి చేశాను సీతా సహస్త్రంలో ఆవిడకి రెండు నామాలు ఉన్నాయి ఆమె శతానంద ప్రియాయే నమః వశిష్ట ప్రియాయే నమః శతానందుడి చేత అభినందింపబడింది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఆమె నడవడికి పురోహితులు సంతోషించారు పుట్టింట్లో ఉంటే సంతోషించడమేమిటీ అంటే పుట్టింట్లోవున్న ఆడపిల్ల ఏనోము పట్టినా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా దేనికొరకు చేస్తుందంటే ఉత్తముడైన భర్త తనకు రావాలని చేస్తూంది. తప్పా అన్య ప్రయోజనం ఉండదు ఆడపిల్లలకి ఏదో అట్లతద్ది ఉండ్రాళ్ళ తద్దీ లేకపోతే గొబ్బిళ్ళు పెట్టించి ముద్దబంతి వంటి మొగిన్నియ్యవే అని పాటలు పాడిస్తారు ఏమి చేసినా దేనికీ అంటే మంచి భర్తకొరకు చేస్తూంది. పెళ్ళైపోయాక తన కొరకూ అని ఏం చేయదు పెళ్ళైపోయినటువంటి ఆడది తనకొరకు అని చేసేటటువంటి అధికారం కూడా లేదుకదా... ఎందుకో తెలుసాండీ ఆవిడ సుఖమేమిటీ ఆయన సుఖమే ఆయన సుఖమే ఆవిడ సుఖం ఆయన సుఖం కానిదీ ఆవిడకి సుఖం కాదు, ఆయన దుఖం ఆవిడ దుఖం కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి సుఖం అడగాలీ ఆయన సుఖం అడగాలీ తరువాత అడిగితే ఏమడగాలీ తన పుట్టింటి సుఖమడగాలీ అడగచ్చా అడగచ్చూ ఎందుకో తెలుసా ఆడ పిల్లనిచ్చి చతుర్తీ విభక్తి వేసి కన్నాదానం చేయరు. ఇదం నమమా అని కన్యాదానంలో చెప్పరు ఎందుకిస్తారో తెలుసా ప్రమాణం చేస్తే ఇస్తారు ఆడపిల్లని ధర్మేచా అర్థేచా కామేచా నాతి చరామీ అయ్యా నాకు ఒక పత్ని ఉంటే నేను యజ్ఞ యాగాది క్రతువులు చేసి తరిస్తాను అందుకనీ మీరు నాకు పిల్లనివ్వండీ అని అడుగుతారు ఆడ పిల్ల తండ్రి వెళ్ళి అడగలేదు మగపిల్లాన్ని ఇమ్మనీ మగ పిల్లాడి తండ్రొచ్చి అడిగాడు ఆడపిల్లని కన్యావరణం మీరు చూడండీ పెళ్ళిలిల్లో మగ పిల్లాడూ, మగపిల్లాడి తండ్రి పురోహితుల్ని పిలిచి తాంబూళమిచ్చి మా అబ్బాయికి తగిన భార్య ఎక్కడ ఉందో మీరు వెతికి రండీ అని పంపిస్తాడు, గౌరీ తపస్సు చేస్తున్నటువంటి ఆడపిల్లా పుట్టినిల్లుగా భావించీ పురోహితులు అక్కడికొచ్చి ప్రవర చెప్తారు మూడు మాట్లు ఈ అమ్మాయిని ఫలానా అబ్బాయికి ఇస్తే బాగుంటుందని అంగీకరించినవాడు కన్యాదాత. కాబట్టి సభావేదిక ఎవరిదీ అంటే కన్యాదాతదే వివాహంలో, ఉపనయనంలో  తండ్రిది.
ఉపనయనంలో తండ్రిదీ వివాహంలో కన్యాదాతది నా కూతురి పెళ్ళి చేస్తున్నాననుకోండీ వేదిక నాది నా కొడుకు పెల్లి చేస్తూన్నాననుకోండి నేను ఇంకోలా చెప్పుకోవాలి నిలబడాలి ఎందుకనీ అంటే అది నా వియ్యంకుడిది. ఆయన ఏం చేస్తూంటే నేను దానికి గౌరమిచ్చి నిలబడాలి ఇదీ మనకి సనాతన ధర్మం నేర్పుతూంది అలా ఉండూ అని చెప్తూంది. కాబట్టి ఆడ పిల్ల తండ్రి మగపిల్లవాడి తండ్రిదగ్గరికి వెళ్ళడు మగ పిల్లవాడి తండ్రే ఆడ పిల్ల తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఇదే బాల కాండలో చెప్తాడు ఆడ పిల్లని కన్న తండ్రి తల వంచుకుని మాటపడవలసినవాడేం కాదు నిన్ను ఉద్ధరించడానికి ఆడపిల్లనిచ్చినవాడు కాబట్టి నవమాచతుర్థి అని నీకు ఇవ్వలేదు నీకు ధర్మార్థ కామములయందు కావాలని అడిగావు కాబట్టి నా కూతుర్ని నీకిచ్చాను కాబట్టి నా కూతుర్ని ఎప్పుడైనా నేను తీసుకెళ్ళాలని నేను అనుకుంటే అదికారం ఉంటుంది. నా ఇంట్లో శుభకార్యం జరుగుతూందనుకోండి నా పిల్లని నేను తీసుకెళ్ళడానికి అధికారం ఉంటుంది. నీవు తీసుకెళ్ళద్దనగలగడం వేదం ఒప్పుకోదు, ఎందుకంటే నేను ఇవ్వలేదు చతుర్తీవిభక్తి ఆ పిల్ల చతుర్తీవిభక్తి వెయ్యలేదు కాబట్టి ఇప్పడు ఆడపిల్ల తన సౌశీల్యం చేత తన నడవడి చేతా తన ప్రవర్తన చేతా తన పాతివ్రత్యం చేతా రెండు వంశాలను ఉద్దరిస్తూంది. అత్తింటివారిని ఉద్దరిస్తూంది పుట్టింటివారిని ఉద్ధరిస్తూంది కన్న తల్లి దండ్రులు కూడా ఉద్ధరిని పొందుతారు అందుకే అత్తవారింటి కోసం మొదటి పూజా రెండవ పూజా పుట్టించినవారి కోసం ఆ తరువాత అడగాలి తప్పా మొదట మా పుట్టింటివారు బాగుండాలి మా అత్తగారు ఏమైనా ఫర్వాలేదు మా నాన్నగారు చూసుకుంటారులే మా ఆయన్ని అనకూడదు. ముందు మామగారి గురించి అడగాలి మా మామగారు సర్వశ్రేయస్సుతో ఉంటారు మా అత్తగారు సర్వ శ్రేయస్సుతో ఉండాలి నావారు నా మరుదులు నా బావగార్లు సంతోషంగా ఉండాలి. మా నాన్నగారూ అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి ఆడపిల్ల మొదటి స్తానం భర్తగారింటివైపునుంచే అడగాలి తప్పా పుట్టింటి వైపునుంచి అడక్కూడదు మొదటి స్థానం కానీ పుట్టింటివైపు అభ్యున్నతి కోరచ్చు ఆడపిల్లా రెండు తరాల్ని కూడా ఉద్ధరిస్తూంది, రెండు కుటుంబాలానీ ఉద్ధరిస్తూంది.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
సీతమ్మ ఉద్దరించింది కూడా ఆమెను కన్నందుకు జనకుడు కోడలిగా పొందినందుకు దశరథుడు ఇద్దరూ ఉన్నతమైన స్థితిని పొందారు. యదార్థంగా మాట్లాడితే సనాతన ధర్మంలో మీకు పక్షపాతం లేకుండా చెప్తున్నాను, తరింపజేయడంలో ఆడపిల్లగొప్పా మగపిల్లవాడు గొప్పా అంటే చచ్చింతరువాత ఓ గోధానమో చేస్తే ఏమైనా చేస్తాడేమో... బ్రతికున్నప్పుడే తన ప్రవర్తన చేత కీర్తి తెచ్చి ఉద్ధరింపగలిగిన శక్తి ఉన్నది ఆడపిల్లకి ఒక్కతే, మగ పిల్లవాడు ఒక్క తండ్రివైపు మాత్రమే ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల రెండువైపులా ఉద్ధరిస్తుంది, పుట్టినింటివారిని మెట్టినింటివార్నీ కూడా ఉద్ధరిస్తూంది. అందుకే మంచి భర్తకావాలని వివాహానికి ముందు, మంచి భర్త వచ్చాడని అనుకోవాలి అంతేగాని ఏమో... ఏమో అన్ని నోములు చేశాను కానీ అనకూడదు. ఉత్తమ భర్తా అని అనాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అభ్యున్నతి కొరకు మీరు రామాయణంలోనే చూడండి. సీతమ్మకి రాముడు గొప్పవాడు మీరు నేను ఒప్పుకుంటాము, మండోదరికి రావణుడు భర్త, మండోదరి మహా పతివ్రత సీతమ్మా మహాపతివ్రత సీతమ్మకి పూజుంది, రేపు వచ్చే ఆదివారం నేను మండోదరి పూజ అన్నాననుకోండి చాలమందిరారు ఎవరో ఒకరు ఇద్దరు నామీద నమ్మకంతో వస్తే రావచ్చు, వీని అసాధ్యం కూలా మండోదరి పూజేమిట్రా అంటారు, నేను ఎంత తల కొట్టుకుని చెప్పనీయ్యండీ మండోదరి పాతివ్రత్యం అయ్యా ఇంకోమారు సీతమ్మకి చేద్దామంటారు ఎందువల్ల ఆవిడ పాతివ్రత్య అదృష్టమేమిటంటే పక్కన గోడచేరుపు రామ చంద్ర మూర్తి భర్తగా లభించడం, ఈవిడ దురదృష్టమేమిటంటే రావణుడు భర్తగా లభించడం, కానీ ఈవిడ పాతివ్రత్యమునందు దోషముండదు. ఈవిడ ఉన్నతిని పొందుతుంది పోయినవాడు ఎవడైనా పోతే రావణుడే పోతాడు అంతే, కాబట్టి ఇది మనకి తెలిసి ఉంటే... ఆడ పిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు నోములూ వ్రతాలు ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే పుటింటివైపు పురోహితులు చూసి తరించి సంతోషిస్తారు, అత్తవారింటికి వెళ్ళిన తరువాత పూజ ఎందుకు చెయ్యాలో తెలిసి చేస్తే అత్తింటి పురోహితులు సంతోషిస్తారు, ఆవిడ వశిష్టుడుకీ ఇష్టం ఆవిడ శతానందుడికి ఇష్టం ఎందుకిష్టం రెండు చోట్లా ఎలా ప్రవర్తించిందో అలా ప్రవర్తించి అలా పూజ చేసింది, అందుకోసం ఇది చెప్పడం గురు వినీత స్య పురోహితులకు పెద్దలకు ఆవిడంటే ఇష్టం అంత మంది పెద్దలకు ఆవిడంటే ఇష్టం, పెద్దల చేత శిక్షింపబడిన లక్ష్మణుడిచేతా నిత్య నమస్కారములు పొందుతున్న తల్లి.
ఇటువంటి తల్లీ  మాన్యా గురు వినీత స్య లక్ష్మణ స్య గురు ప్రియా ! యది సీతాఽపి దుఃఖాఽఽర్తా కాలో హి దురఽతిక్రమః !! ఇటువంటి సీతమ్మా ఇన్ని పూజలు చేసిన సీతమ్మా ఇంత ధర్మం తెలిసిన సీతమ్మా ఈ సీతమ్మ కూడా ఇంత కష్టపడుతూందంటే కాలో హి దురఽతిక్రమః లోకంలో కాలం ఎవర్నైనా కష్టపెట్టగలదూ చేసిన పాప పుణ్యాలకి ఎవరైనా కష్టపడవలసిందే అంటే ఏమండీ సీతమ్మ కూడా చేసిందా..! నర కథగా ఆలోచించినప్పుడు ఎక్కడో ఏదో చేసి ఉంటుందని

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
అనుకోవాలి అంతే తప్పించి కాలమునకు నీవు వశుడవైపోయి నీవు భీత చిత్తంతో ఈశ్వర పాదాలను మాత్రం విస్మరించకూడదు. కష్టమన్నది అందరికీ వస్తూంది సీతమ్మకొచ్చిన కష్టం కన్నా కాదుగా..? అని తలుచుకుని నీవు నిభయించుకోవడానికి నీకు రామాయణం నీకు పనికిరావాలి అంతేగాని గోరుచుట్టైతే సీతమ్మ కష్టానికి నీ కష్టానికి పోలికాండీ. గోరుచుట్టేస్తే సీతమ్మ తట్టుకోగలదా అనుకోకూడదు ఎంత కష్టంలో ఉంది నీవు ఆలోచించగలగాలి ముందు ప్రమాదం ఎలా నిలబెట్టుకుంది కాబట్టి గోరు చుట్టేసినా నేను ఎల్లాగోలాగ ఒక్కసారైనా ఆచమనం చేసి సంధ్యావందనం చేస్తాను అనాలి. అంతేకానీ గోరు చుట్టువేస్తే తేరగాదొరికింది సంధ్యావందనం మానేస్తాననకూడదు. కాబట్టి తుల్య శీల వయోవృత్తాం తుల్యాఽభిజన లక్షణామ్ ! రాఘవోఽర్హతి వైదేహీం తం చేయమ్ అసితేఽక్షణా !! అబ్బాహ్ ఏమి శ్లోకాలండీ అంమృత భాండాలు తుల్య శీల వయోవృత్తాం తుల్యాఽభిజన లక్షణామ్ ! రాఘవోఽర్హతి వైదేహీం తం చేయమ్ అసితేఽక్షణా !! ఆమె శీలమునందు రామునితో సమానము వయసులో రామునికి భార్యగా ఉండడం యోగ్యం, వృత్తాం నడవడి చేతా రాముడికి అన్నివిధాలా యోగ్యమైనటువంటిది అటువంటి తల్లీ ఆమె వంశము చేతా సరియైనటువంటి తల్లి ఆవిడ వంశమెంత గొప్పదో ఆయన వంశమంత గొప్పది, అసలు ఆ మాటకొస్తే ఆయన కన్నా ఆవిడ ఓ మార్కెక్కెక్కువ.
Image result for ఖరుడు అనే రాక్షసుడుఎందుకండీ! అప్పుడప్పుడు రాముడు కోపించినట్లుగా కళ్ళు ఎరుపు చీరలొస్తాయి పద్నాలుగువేలమంది ఖరదూశనాదులువస్తే, ఇంత బాధపెడుతున్నా రావణుడు ఆ తల్లికి మాత్రం కళ్ళు ఎరుపెక్కలేదు ఇంకా నల్లగానే ఉన్నాయి, అంటే ఇంకా ఆవిడ పుత్ర ప్రేమతోనే ఉంది అటువంటి దుర్మార్గున్ని చూసి కూడా ఇదీ ఆ తల్లి యొక్క వైభవము నిజంగా కూడా అంతేనండీ లోకంలో తుల్య శీల వయోవృత్తాం వాళ్ళిద్దరూ కూడా ఆనాటి నుంచి ఈ నాటి వరకూ ఆర్తత్రాణ పరాయణులే ఎంత ఆత్రత్రాణ పరాయణత్వమో తెలుసాండీ సీతారాముల హృదయము ఎటువంటిదీ అన్నది నేను మీకుకొక ఉదాహరణ చెప్తాను, ఒకానొకప్పుడు రామ దాసుగారు తిరిగివచ్చేసిన తరువాత భద్రాచలం ఎప్పుడూ రామ చంద్ర మూర్తికి పూజ చేసుకుంటుండేవాడు, ఎప్పుడూ రామ నామ స్మరణే అస్తమానం ఆయనేమనేవారంటే భార్యని పిలిచి నేను వెళ్ళిపోతాను వైకంఠానికి విమానమొచ్చిందని ఆవిడ అనుకునేది ఇలాగే అనుకుంటారు పాపం పెద్దవారైపోయారు గురువుగారు కదా ఆ రామ భక్తిలో అలా అంటున్నారనుకునేదావిడా... భద్రాచలంలో అందరూ చూశారండీ! భద్రాచలంలో యదార్థంగా జరిగిన సంఘటన నిజంగా వైకుంఠం నుంచి విమానమొచ్చింది. నిజంగా విమానమొచ్చి రామదాసుగారి ఇంటిముందు వాలింది విష్ణు పార్శదులు బయటికొచ్చీ నిన్ను శ్రీమన్నారాయణుడు తీసుకురమ్మన్నాడూ సశరీరంగా తీసుకురమ్మన్నారు వైకుంఠానికి అది రామ దాసుగారు పొందిన అదృష్టం. కాబట్టి మీరు ఎక్కండీ అని చేతులు పట్టుకుని ఎక్కిస్తున్నారు. ఆయన భార్యని పిలిచీ ఏమోయ్ వైకుంఠం నుంచి విమానమొచ్చింది రా వెళ్ళిపోదామన్నాడు అంటే ఆవిడందీ ఎప్పుడూ ఇలాగే అంటున్నారని నేను అన్నమొండుతున్నాను మీరు వెళ్ళండీ అంది.
ఎవరి కర్మ వారిదీ అన్నారు ఆయన, ఆయనెక్కారు విమానం అందరూ రామదాసుగారికీ జై రామ చంద్ర మూర్తికీ జై  అని అరుస్తున్నారు, ఆవిడకి అనుమానం వచ్చింది ఏమిటీ ఎందుకరుస్తున్నారు ఇన్ని అరుపులు వినపడుతున్నాయని బయటికొచ్చింది. విమానంలో వెళ్ళిపోతూ రామ నామ భజన చేస్తూ కనపడ్డారు రామదాసుగారు మీరు యదార్థమైన

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
Image result for రామదాసు గారురామదాసుగారి చరిత్ర చదివితే యదార్థ చరిత్ర అంటే రకరకాలుగా ఏవో చెప్తుంటారు ఏమో చూపిస్తుంటారు అవన్నీకాదు నేను చెప్పేది, ఆవిడ నేలమీద పొర్లిపడి ఏడ్చింది, ఎటువంటి భర్త ఆయనతో కలసి జీవితాన్ని పంచుకున్నాను, రావే విమానమొచ్చింది వెళ్ళిపోదామన్నారు, మీరు వెళ్ళండీ నేను తరువాత వస్తాను అన్నాను, నీ ఖర్మా అని ఆయన వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను అని ఏడిస్తే నేను ఇక బతకను రామ చంద్ర మూర్తి పాదాల దగ్గర తల కొట్టేసుకుని శరీరం వదిలేస్తానూ నా భర్తను తీసుకెళ్ళి నన్ను వదిలేశాడనీ ఆవిడ వెళ్ళి రామ చంద్ర మూర్తి పాదపీఠమునందు తల కొట్టుకుంటూంటే... నేను యదార్థంగా చేప్తున్నాను అశరీరవాణిగా రాముడు మాట్లాడాడు. భద్రాచలంలో రామ చంద్ర మూర్తి యొక్క మూర్తి మాట్లాడింది, విచారించకు నిన్ను ఎక్కించలేకపోవడంలో కూడా కారణముంది, రామదాసు తరువాత ఈ రామాలయాన్ని రక్షించగలిగినటువంటి స్థితిలో అర్చన చెయ్యగలిగినటువంటి స్థితిలో నీ కొడుకుని సిద్ధం చేసిన తరువాత నిన్ను కూడా నాలో ఐక్యం చేసుకుంటాను అన్నాడు.
Image result for గోల్కొండవిమానం రాలేదు కాని, రామదాసుగారి భార్య కూడా రామ చంద్ర మూర్తిలోకి ఐక్యమయ్యారు, ఆనాడూ ఈనాడూ కూడా ఇదే పరిస్థితి, రామ దాసుగారిని కొరడాలు పెట్టి కొడుతూంటే “నను బ్రోవామని చెప్పావే సీతమ్మతల్లీ నను బ్రోవామని చెప్పావే” అన్న కీర్తనలో ఆయన ఎంత ఆక్రోషించాడో తెలుసాండీ! నేను అడగనమ్మా రామున్నీ నేను అడుగుతూనే ఉన్నాను చక్కగా అన్నీ పుచ్చుకున్నాడూ సీతమ్మకు చేయిస్తీ చింతాకు పథాకాము రామ చంద్రా అన్నీ పుచ్చుకున్నాడూ ఇప్పుడు మాత్రం పలకట్లేదూ అమ్మా... రాత్రి వచ్చి చక్కగా నీ పాన్పుపక్కన కూర్చునీ మంచి బలహీనమైన క్షణంలో నీ చెక్కీళీ నొక్కూచూ చక్కగా మరుకేళీ సొక్కీ ఉండెడువేళా నను బ్రోవామని చెప్పావే, అప్పుడు నీ బుగ్గలు నొక్కుతూ చాలా సంతోషంగా నీ పక్కన చేరుతాడు అప్పుడు నీవు ఏమైనా అంటే కాదనడమ్మోయ్ అందుకనీ ఆ రామదాసుగారి సంగతి ఏం చేశారూ అని అడుగు ఏం చెప్తాడో అమ్మా నాకు చెప్పమ్మా ఇప్పుడేమంటాడో తెలుసా... హ్ సీతా... నేను చూస్తానుగదా అంటాడు, మర్నాడు మళ్ళీ రాత్రి ఏమంటాడో తెలుసా అవును నౌను నిన్ననుకూడా చెప్పావు కదూ అంటాడు, అందుకనీ మర్నాడు పొద్దున మరి లేచి వెళ్ళిపోతుంటాడే ఆ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ గుర్తుచేయు సుమా! అమ్మా...  నను బ్రోవమని చెప్పావే అని ఏడ్చారండీ రామ దాసుగారు మీరు ఇప్పటికీ హైదరాబాదులులో బందికానా చూస్తే... రామ భక్తి అంటే ఏమిటో అర్థమౌతుంది, రాముడు అంటే ఏమిటో అర్థమౌతుంది. పిలిచినవారికి కొంగుబంగారము నాతండ్రి. ఆ తల్లీ కన్నుల నీరు పెట్టుకుంది, నీరు పెట్టుకుని రామ చంద్ర మూర్తిని నిలదీసేసింది ఏం ఎందుకు రక్షించలేదు రామదాసుగార్ని నాది కాదు దోషం సీతా ఆయనే మొక్కాడు కిందటి జన్మలో 365 రోజులు నియమం తప్పకుండా రుద్రాభిషేకం చేస్తాను, నాకు దర్శనమిమ్మని అడిగాడు 364 రోజులు అభిషేకం చేశాడు 365వ రేజున లెక్క కట్టుకున్నాడు, 365 రోజులైనా దర్శనం అవ్వలేదని బండతో శివలింగాన్ని బద్ధలు కొట్టబోయాడు నేను శివ లింగంలోంచి మాట్లాడాను, శివుడొకడు రాముడు ఒకడు కాదు కదాండీ, అందుకనీ ఈ జన్మలో నీకు దర్శనం అవ్వలేదు తప్పు నీమీదపెట్టుకునీ తప్పు ఎంచావు పైగా ఒక చిలుకని బంధించావు కాబట్టి వచ్చేజన్మలో నీవు కూడా ఖైదిలో ఉన్న తరువాత నీవు ఏ వేద ప్రమాణాన్ని ధిక్కరించి 364 రోజులు  చేసి 365 రోజులు చెయ్యకుండా నన్ను అన్నావో ఈ కారణం చేత నీవు వేద ప్రమాణాన్ని తిరస్కరించేటటువంటి వాడిగాపుడతావు కానీ నీకే నా మొదటి దర్శనం.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
చిలకని పాపం రెండేళ్ళ నుంచి బంధించినటువంటివాడు ఉన్నాడు రామదాసు ఆ రామ దాసుకి దర్శనమిస్తాను, నీ తరువాత ఆయనకు దర్శనమన్నారు. అందుకే 364 రోజులే అభిషేకం చేసి శివలింగాన్ని బద్ధలు కొడదామని ప్రయత్నం చేసిన భక్తుడు వేదప్రమాణాన్ని అంగీకరించనటువంటి మతంలో జన్మించి తానీషాగా ప్రభువయ్యాడు, ఆయనకి మొదటి దర్శనం, రామదాసుగారికి తరువాతి దర్శనం చిలుకని బంధించిన పాపం క్షయమైనపోయిన తరువాత రామదాసుగారికి దర్శనం. రామదాసు రామునికి దాసా... రాముడు రామదాసుకి దాసా రాముడే రామదాసుకి దాసుడు ఎందుకో తెలుసాండీ రామదాసుగారు కాదు ఆయన రామదాసుడని అన్నారంతే... కాని యదార్థమునకు రామ దాసుకి దాసుడు రాముడు, రామదాసుగారు ఖైదీలో ఉంటే నేను రామదాసు యొక్క కింకరున్ని ఆ డబ్బు నేను చెల్లించడానికి నేను వచ్చానని రామోజీ లక్ష్మోజీ మా పేర్లని చెప్పీ డబ్బుకట్టీ రసీదు పట్టుకునీ విషం తాగుతున్న రామదాసుని రక్షించి తీసుకొచ్చినవాడు రామ చంద్ర మూర్తి భక్తుల పాలిట కొంగుబంగారం మా స్వామి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాముడే ఆయన్ని నమ్మాలి కానీ ఆయన అవసరమైతే మీ పడకగది బయటకూడా నిల్చుంటాడు నిల్చుని కాపు కాస్తుంటాడు.
అంతటి మహానుభావుడు అంతటి సులభుడు రామ చంద్ర మూర్తి కాబట్టి మహర్షి అంటారు తుల్య శీల వయోవృత్తాం తుల్యాఽభిజన లక్షణామ్ ! రాఘవోఽర్హతి వైదేహీం తం చేయమ్ అసితేఽక్షణా !! అనీ ఈ తల్లి కోసమే అస్యా హేతో ర్విశాలాఽక్ష్యా హతో వాలీ మహా బలః ! రావణ ప్రతిమో వీర్యే కబన్ధ శ్చ నిపాతితః !! అసలు “సీతాయామ్ చరితం మహత్” ఎందుకో చెప్తున్నారు, అసలు ఖరధూషనాదులన్న పద్నాలుగువేల మంది రాక్షసులుగాని రావణునితో సమానమైన కబంధుడుకాని ఈ సీతమ్మకోసమే మట్టుపెట్టబడ్డారు. రావణునికన్నా బలవంతుడైన వాలి సీతమ్మకోసమే చచ్చిపోయాడు అసలు రాజ్యమే రాదనుకున్న సుగ్రీవుడు ఈవిడ కారణంగానే రాజ్యం పొందాడు వాలి మరణించాడు కాబట్టి ఈవిడ కారణంగానే రావణుడు మరణిస్తాడు కాబట్టి సీతమ్మ అవతారము దేనికీ అంటే అయోనిజగా రాక్షస సంహారం ప్రయోజనం కోసం వచ్చినటువంటి అమ్మవారి స్వరూపమో సీతమ్మతల్లి. అందుకే అయోనిజగా వచ్చింది కాబట్టి సీతాయాం చరితం మహత్ ఆమె జగత్ జననీ అనీ తన బుద్ధి బలంతో తన యొక్క తపో బలంతో రామ భక్తితో గుర్తించిన హనుమ నోటివెంట సీతమ్మ యొక్క యదార్థ స్వరూపాన్ని ఆవిష్కరించి రామ కథని వెనక జరిగిన సంఘటనల్ని సమాహరంగా అందించి అన్వయం చేసిన కాండ సుందర కాండ కాబట్టి చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమ కర్మణామ్ ! నిహతాని జనస్థానే శరైః అగ్ని శిఖోపమైః !! పధ్నాలువేల మంది ఈవిడకోసమే మరణించారు ఐశ్వర్యం వానారాణాం చ దుర్లభం వాలి పాలితమ్ ! అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక సత్కృతమ్ !! ఐశ్వర్యమన్నది ఎరగకుండా భార్య అన్నగారిచేత అనుభవింపబడుతూంటే రాజ్యంపోయి రాదనుకున్న సుగ్రీవుడు మళ్ళీ రాజ్యం పొందాడంటే ఈ సీతమ్మవల్లే.
సాగర శ్చ మయా క్రాన్తః శ్రీమాన్ నద నదీ పతిః ! అస్యా హేతో ర్విశాలాఽక్ష్యాః పురీ చేయం నిరీక్షితా !! నూరు యోజనములు సముద్రాన్ని నదీ నదములను దాటి నేను ఇవ్వాళ సీతమ్మ దర్శనం కోసం వచ్చానంటే కేవలం సీతమ్మకోసం

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
వచ్చాను రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాఽఽత్మజా ! త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాఽఽప్నుయాత్ కళామ్ !! మూడు లోకములలో ఉండేటటువంటి సమస్తమైన ఐశ్వర్యాన్ని ఒక పక్కా సీతమ్మని ఒక పక్కా పెడితే సీతమ్మలో పదహారవ వంతులోకూడా అవేవీ సరిపోవు అటువంటి ఇల్లాలు నాతల్లి సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృ స్నేహ బలాత్ కృతా ! అచిన్తయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనమ్ !! ఈ తల్లి భోగాల్నీ భాగ్యాల్నీ బంధుజనాల్నీ అంధర్నీ విడిచిపెట్టీ నాకు భర్త పక్కన ఉంటే చాలని పక్కకు వచ్చిన తల్లి నా తల్లి మహా పతివ్రత ఏ మాట చెప్పి అరణ్యానికి వచ్చిందో ఆ మాటకు కట్టుబడి రామ చంద్ర మూర్తికి ఉపశాంతిని ఇచ్చింది. రాముడే చెప్పుకున్నాడు గదా ఈమె ఉండబట్టి నేను కష్టాలు మరిచిపోయానన్నాడు గదా... అటువంటి సౌశీల్యవతి, అటువంటి తల్లిని తీసుకొచ్చి రామున్ని సీతమ్మని బాధపెట్టి తన మరణానాన్ని తాను కొని తెచ్చుపెట్టుకుంటున్నాడు ఇమాం తు శీల సంపన్నాం ద్రుష్టుమ్ ఇచ్ఛతి రాఘవః ! రావణేన ప్రమథితాం ప్రపామ్ ఇవ పిపాసితః !! ఒక్కసారి ఈ సీతమ్మతల్లిని రామ చంద్ర మూర్తి మళ్ళీ ఈ సముద్రాన్ని దాటి వచ్చి చూడడం జరగగానే ఎంత సంతోషంతో చూస్తాడో తెలుసా..! నాలుక పిడచకట్టుకుపోయి దాహార్తితో ఉన్న వ్యక్తికి చలివేంద్ర కనపడితే ఎలా సంతోషిస్తాడో ఈ సీతమ్మ కనపడితే అంత సంతోషిస్తాడు, ఈమె ఆయన దాహార్తిని తీర్చగలిగిన తల్లి రాముని యొక్క మనఃశాంతి రాముని మనసు చల్లబడడం ఈవిడ చేతిలోనే ఉంది.
Related imageఈవిడ యొక్క దర్శనం చేత చల్లబడాలంటే అప్పటివరకు వేడిగానే ఉంటాడు అప్పుడు ఉగ్రుడౌతాడు తరువాత శివుడౌతాడు ఇదీ రహస్యం కాబట్టి శివా విశ్వ స్య భేషజీ ! శివా రుద్ర స్య భేషజీ ! ఇప్పుడు రుద్రుడిగా ఉండి రావణున్ని సంహరిస్తాడు. ఆ రుద్రుడిగా ఉన్న రాముడు కన్నులు ఎర్రగా ఉంటే సీతమ్మ ప్రవేసించి రుద్రున్ని శివున్ని చేస్తూంది, రాక్షస సంహారం కోసం తను కనపడకపోటం వల్ల రామున్ని శివున్ని రుద్రున్ని చేసి రాక్షస సంహారం చేయిస్తుంది. తను కనపడి చలివేంద్రం కనపడితే నీరు తాగినవాడి మనసు చల్లబడ్డట్టు శివున్ని చేసి అనుగ్రహింపజేస్తుంది. శక్తి ఈ తల్లిలో ఉంది, ఇది ఇక్కడుంది ఈ కీలకం. అందుకని సీతాయాత్ చరితం మహత్, ఆ సీతమ్మ వైభవాన్ని ఎటువంటి సీతమ్మ వైభవాన్ని అనుభవిస్తున్నాడు మహానుభావుడు. కాబట్టి కామ భోగైః పరిత్యక్తా హీనా బన్ధు జనేన చ ! ధారయ త్యాత్మనో దేహం త త్సమాగమ కాంక్షిణీ !! నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫల ద్రుమాన్ ! ఏక స్థ హృదయా నూనం రామ్ ఏవాఽనుపశ్యతి !! ఈ తల్లి ఎదురుగుండా ఉన్న రాక్షస స్త్రీలనీ చూడుటలేదు, ఎదురుగా ఉన్న ఫల పుష్పములనూ చూడుటలేదు మరి మాంస నేత్రానికి కనపడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నా ఆవిడ చూసిందీ అని తెలియట్లేదు ఆవిడ చూస్తూ చూట్టంలేదని ఎలా తెలుస్తూంది, ఆవిడ చూస్తున్నది ఆవిడ చూట్టంలేదనీ ఆవిడ చూస్తున్నప్పుడు కళ్ళు తెరిచి ఉంది తప్పా లోపలి నేత్రం తెరుచుకుని రామ సన్నిధిలో ఉన్నదీ అని ఆవిడ ధ్యానాన్ని తను కన్నులు తెరిచి ఎలా చూడగలదు ఆవిడ ఆంతర స్థితిని. ఆవిడ ఆంతర స్థితిని చూడగలిగిన స్థితి హనుమకు ఎక్కడ్నుంచి వచ్చిందంటే... వాల్మీకి మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరంలోంచి వచ్చింది. వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి యొక్క వరం నీవు ఆచమనం చేస్తే రామాయణంలో ఏ వ్యక్తి మనసులో ఏముందో నీకు తెలుసూంది, దాన్ని బట్టి రచన చేస్తావని.
ఇప్పుడు హనుమ మనసులో ఏముందని సీతమ్మని చూసి ఈ సీతమ్మ చూస్తున్నది చూట్టంలో చూట్టంలేదుకానీ లోపలికన్నుతో రామున్ని చూస్తూందని లోపలికన్నుతో రామున్ని చూస్తున్న విషయాన్ని పైకన్నుతో చూస్తున్న హనుమ ఎలా చూడగలుగుతున్నారో చెప్పగలిగిన కంఠమున్న మహర్షి వాల్మీకి మహర్షి, అటువంటి మహర్షి చేత కృతమైన రామాయణాన్ని అనుభవించడం మన అదృష్టం. కాదాండీ “వేదోప బృంహణం” అది. అది రచనంటే అది అద్భుతం. అందుకే రామాయణంలో ఒక్కమాట అనృతం లేదు అన్నారు పెద్దలు. హనుమ సీతమ్మతల్లివారి వైభవం అనుభవించడమంటే అంత గొప్పగా అనుభవించారు ఆయన అంటారు, ఈ శ్లోకంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను, ఓ ఇప్పటికే చాలా వేళ దాటారు క్షితి క్షమా పుష్కర సన్నిభాఽక్షీ యా రక్షితా రాఘవ లక్ష్మణాభ్యామ్ సా రాక్షసీభి ర్వికృతేక్షణాభిః సంరక్ష్యతే సంప్రతి వృక్ష మూలే ! క్షితి క్షమా పుష్కర సన్నిభాఽక్షీ అబ్బాహ్... ఏమి ఓర్పు నా తల్లిది అన్నాడు కదాండీ..! భూజాత ఆమె భూమిలోంచి వచ్చింది భూమిలోకి వెళ్ళిపోయింది. అటువంటి తల్లి మధ్యలో ఉన్నదంతా తల్లికి ఎంత ఓర్పో అంత ఓర్పుతోనో ఉంది ఆతల్లి. భూమినే ఓర్పుకి మారుపేరుగా చెప్తాము, ఎందుకంటే ఇంటి యజమాని తీసుకొచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమానికున్న కీర్తిని అందరూ పంచుకుంటారు, ఇంటి యజమానికున్న వైభవాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమాని మల మూత్రాలు ఇన్ని అనుభవిస్తున్నాం గదాండీ మా దోషిట్లో విడిచిపెట్టండనీ ఎవ్వరూ పుచ్చుకోరు కదాండీ ఎవ్వరూ పుచ్చుకోరు ఎవరు పుచ్చుకోవాలి అమ్మ పుచ్చుకోవాలి ఆతల్లి పుచ్చుకుంటుంది. మల మూత్రాల్ని ఎవ్వరూ పుచ్చుకోరు ఆ తల్లే పుచ్చుకుంటుంది. కాలు తగిలిందనుకోండి ఏమ్ అంటాము, తెల్లవారి లేస్తే కాళ్ళు పెట్టే తంతున్నాము ఆ తల్లిని లేచి నమస్కారం చేయకపోయినా కాళ్ళుపెట్టి తంతున్నా తల్లి కాబట్టి ఓర్చుతుంది.
తాను పాలిస్తూంటే పిల్లవాడు పాలు తాగుతూ తాను ఐదవ తనానికి సూచియైన మంగళ సూత్రాన్ని ఇలా పట్టుకుంటే కోపగించే అమ్మా చిన్ని చిన్ని వేళ్ళతో వాడు మంగళ సూత్రాన్ని పట్టుకుని లాగుతూ కాల్లెత్తీ అమ్మ గుండెల మీద తంతుంటే మెళ్ళిగా ఆ చేతి వేళ్ళు విప్పీ ఆ చేతి వేళ్ళు ముద్దుపెట్టుకునీ అరికాళ్ళని పువ్వులని ముద్దు పెట్టుకున్నట్లు ముద్దుపెట్టుకుని ఓర్చిన కన్నతల్లికే అంత ఓర్పుంటే ఇంత మందిని కన్న తల్లి భూమాతకు ఎంత ఓర్పుండాలీ... ఇంత మంది తంతున్నా ఓర్చుతుంది ఆ తల్లి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే తల్లి గుండెల మీద గుచ్చి శంకుస్తాపన, నీ కడుపుకి అన్నం కావాలంటే నాగటి చాలుపట్టి అమ్మ గుండెలమీద కోత పెద్ద పెద్ద చారికలు పెడుతావు నీవు ఏదైనా దహనం చేయాలంటే అమ్మ గుండెలమీద పెట్టి కాలుస్తావు నీవు ఉమ్ము ఉమ్మేయ్యాలంటే అమ్మ ముఖం మీద ఉమ్ము వేస్తున్నావ్, అసలు ఉమ్ము వేయడమే తప్పూ దానికి తోడు రాక్షసుడిలా నెత్తురు కక్కినట్లు మాదక ద్రవ్యాలతో కూడిన తాంబూళాలు నిరంతర చర్వణం చేస్తూ నెత్తురు కక్కినట్లు రోడ్డుమీద పోతూ ఎంత కు సంస్కారం అసలు ఈ జాతి లక్షణం కాదు భూమి మీద కాలు పెట్టి దిగినందుకు అమ్మా నాకు బ్రతుకులేదమ్మా ఇది లేకపోతే అని క్షమార్పణ చెప్పిదిగుతావ్ సముద్ర వసనే దేవి పర్వత స్తనమండిలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే ! అమ్మా నన్ను క్షమించి కాలుపెట్టి దిగుతున్నానమ్మాని క్షమార్పణ చెప్పి భూమి మీద కాలుపెడుతాం.

  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
Image result for సీతఓర్పు అంటే నా తల్లి ఎంత కీర్తి గడించనీవ్వండీ ఎంత మంది ఎంత పొగడనీవ్వండీ ఎంత సంపాదించనీవ్వండీ ఎంత పరివారముండనీవ్వండీ యావత్-పవనో నివసతి దేహే, తావత్-పృచ్చతి కుశం గేహే ! గతివతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ! అమ్మా గుళ్ళోకెళ్ళొస్తానమ్మా లేనివాన్ని బయటికొస్తే రోహిణీ కార్తె నడవలేను పెద్దవాన్ని నా చెప్పులు ఎవరైనా పట్టుకుపోతే ఇవి కూడా కోనుక్కోలేనమ్మా మడమలరిగిపోయినటువంటి హవ్వయ్ చెప్పులు అమ్మా ఇక్కడ పెట్టి వెళ్తానంటే ఏ తల్లైనా సరే పెట్టి వెళ్ళిపో అంటే పెట్టుకో అంటూంది. అమ్మా చచ్చిపోయాడు మా ఊరు తీసుకెళ్ళాలి వర్షమొస్తూంది కష్టంగా ఉంది కాస్త ఈ శవాన్ని రెండు రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటారా అంటే ఎవరు ఉంచుకుంటారు. యజమాని చచ్చిపోయాడు అమ్మా వల్లకాట్లో శవం కాలదమ్మా బోర్నవాన రోజూ పడుకుంటున్నావుగా ఈ శరీరాన్ని పట్టుకునే శవాన్ని కూడా బెడ్ రూమ్ లో పడుకోబెట్టుకో అంటే బార్యంటూంది భిభ్యతి హడలిపోయి నీకు బుద్ధుందా లేదా తస్మిన్ కాయే అది శరీరమంటూంది. ఎవ్వరూ తీసుకోనటువంటి ఆ శరీరాన్ని తనలోకి ఆదరించి తీసుకుని తనలోకి కలిపేసుకునేది ఆ తల్లొక్కటే కుక్కకాని పిల్లికాని పందికాని మనిషికాని అయ్యో పిచ్చాడా ఇప్పుడు తెలిసిందా లోకమేమిటో దా అని అమ్మతనంతో కలుపుకునేది ఈ తల్లొక్కతే అమ్మా ఆ భూమాత కూతిరివి కదా ఆ భూమికి ఎంత ఓర్పో నీకు అంత ఓర్పు క్షితి క్షమా పుష్కర సన్నిభాఽక్షీ నీ ఓర్పు నీ కళ్ళల్లో కనపడుతూందమ్మా ఇన్ని అనరాని మాటలన్నా ఓర్చావా తల్లీ ఏడుస్తూ అన్నాడు కాబట్టి యా రక్షితా రాఘవ క్ష్మణాభ్యం, అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా – పృష్ట తస్తు ధనుష్పాణిః లక్ష్మణో నుజగామ సః అని రాముడు ముందు సీతమ్మ మధ్యలో వెనక లక్ష్మణ మూర్తి నడవవలసినటువటి తల్లీ వికృతమైన రాక్షస స్త్రీల మధ్యలోనే ఉండిపోయావామ్మా సంరక్ష్యతే సంప్రతి వృక్ష మూలే ఎక్కడో అంతః పురాలలో ఉండి సూర్యుడు కూడా నిన్ను చూడడం కుదరదు జనకమహారాజు యొక్క కూతురివి, దశరథ మహారాజుగారి పెద్ద కోడలివి రామ చంద్ర మూర్తి ఇల్లాలివి అమ్మా నీకు ఇవ్వాళ ఒక్క ఆవాసం కూడాలేక ఒకచెట్టున కట్టిపట్టుపుట్టం విప్పకుండా పవిటకొంగు చింపి పడేసినబట్ట పది నెలల నుంచి కట్టుకుని కృషించి ఏడుస్తూ చెట్టుకింద ఇంత ఓర్పుతో రామోపాసన చేస్తూ ఉన్నావామ్మా..? అమ్మా భూకాంత కుమార్తెవికదా ఓర్పుకి నువ్వే తగినదానివమ్మా సీతమ్మా... సీతమ్మంటే ఓర్పనీ... కన్నుల నీరు పెట్టుకుని హనుమ నమస్కారం చేసి ఆతల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తున్న ఈ ఘట్టం దగ్గర ఇవ్వాళ పూర్తిచేసి రేపు మళ్ళీ పునః ప్రారంభం చేస్తాను.
ఇవ్వాళ ఏం చెప్పావంటే పదిహేనో సర్గలో మొదలుపెట్టి పదహారవ సర్గ అయ్యింది అంతే, 68 సర్గలు ఎప్పటికయ్యేది సుందర కాండ రామ చంద్ర మూర్తి ఆయనే పూర్తి చేయిస్తారు మనం మనం పెట్టుకున్న సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క 11 పర్యాయాలు చక్కగా రామ నామాన్ని చెప్పుకుందాం.


  సుందర కాండ ముప్పయ్  రెండవ రోజు ప్రవచనము
 
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
పాలుమీగడ తేనెకన్నను తీయ్యనైనది రామ నామము !!రా!!
బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీ రామ నామము !!రా!!
రావణానుజ హృదయపంకజ రాచకీరము రామ నామము !!రా!!
జానకీ హృత్ కమలమందున వెలుగుచున్నది రామ నామము !!రా!!
రామ నామము నమ్మువారికి కంటిపాపే రామ నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామ నామము !!రా!!
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !!రా!!
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!

మంగళా శాసన....

No comments: