నిన్నా ఉపన్యాసం ముగించేసే సమయానికి “ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము”లు అనబడేటటువంటి
నాలుగు గుణములను ఆవిష్కరించినవారై స్వామి హనుమా నూరు యోజనముల సముద్రాన్ని గడిచి
ఆవలి ఒడ్డుకు వెళ్ళి తత స్స లమ్బస్య గిరేః సమృద్ధే విచిత్రకూటే నిపపాత కూటే అ
లంబ పర్వతం మీద దిగినటువంటి సన్నివేషాన్ని నిన్నటిరోజున చెప్పి మీతో పూర్తి చేసి
ఉన్నాను, మహర్షి అంటారూ స సాగరం దానవ పన్నగా యుతం బలేన విక్రమ్య మహోర్మి
మాలినమ్ నిపత్య తీరే చ మహోదధే స్తదా దదర్శ లఙ్కామ్ అమరావతీమ్ ఇవ ! అంటారు స
సాగరం దానవ పన్నగా యుతం ఆయనా సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు చేరారు, ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటి త్రికూటాచలం అనేటటువంటి పర్వతం యొక్క శిఖరం మీద కాంచన లంక ఉంది
దాన్ని విశ్వకర్మ అలా తయారు చేశాడు 30 యోజనముల వెడల్పు నూరు యోజనముల పొడవు
కల్గినటువంటి పట్టణం. దాని రాజద్వారం దగ్గర్నుంచి అన్నీ కూడా బంగారంతోటే చెక్కారు,
బంగారంతోటే తయారుచేయబడినటువంటి హర్మిమములతో కూడినటువంటి పట్టణము, దేవేంద్ర నగరము
ఎలా ఉంటుందో అమరావతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది.
ఎందుకు అలా ఉంటుందీ అంటే వాళ్ళు కోరుకున్న కోరిక
అలా కోరుకున్నారు రాక్షసులు, ఒకానొకప్పుడు వాళ్ళు దేవతల మీద విజయం
సాధించగలిగినటువంటి పట్టువాళ్ళకి లభించినప్పుడు వాళ్ళు అడిగారు వాళ్ళకి రాక్షసులు
అన్న పేరుకూడా ఆ సమయంలోనే వచ్చింది, నీటిని రక్షించేవాళ్ళు ఎవరూ అని అడిగారు
బ్రహ్మగారు, అడిగితే మేము రక్షిస్తామని అంగీకరించిన వాళ్ళందరికి రాక్షసులు అని
పేరు ఇచ్చారు బ్రహ్మగారు, కాబట్టి వాళ్ళు రాక్షసులయ్యారు, నీటిని రక్షించే
స్వభావము కలిగినవారు నీటిని రక్షిస్తాము అని అంగీకరించినవారు. కనుకా ప్రళయమైపోయిన
తరువాత పునః సృష్టి సమయంలో జలములలోంచి మొట్ట మొదట చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించినప్పుడు
ఆయన సృష్టించినటువంటి ప్రాణి జాతంలో మేము ఏంచెయ్యాలి అని అడిగినప్పుడు, మీరు నీటిని
ఏం చేస్తారు అంటే రక్షిస్తాము అన్నవాళ్ళు రాక్షసులయ్యారు. తదనంతర కాలంలో
వారే ఒకానొకప్పుడు దేవతలమీద పట్టుసాధించారు సాధించినప్పుడు వాళ్ళు అడిగినకోరిక
ఏమిటంటే దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడికి అమరావతి పట్టణం ఎలా ఉందో ఎంత
వైభవోపేతంగా ఉందో మాకు అటువంటి పట్టణం కావాలి అని అడిగారు, అడిగితే విశ్వకర్మ
వారితో ఏం చెప్పారంటే నేను దేవేంద్రుడి ఆదేశం మేరకు దక్షిణ దేశములో నూరు యోజనములు
సముద్రము దాటిన తరువాత
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
త్రికూటాచలం
అనపడేటటువంటి పర్వతం ఉందీ ఆ పర్వత శిఖరం మీద 30 యోజనముల వెడల్పు నూరు యోజనముల
పొడువూ కలిగినటువంటి ఒక అద్భుతమైన పట్టణాన్ని తయారుచేశాను.
ఆ తయారు చేయబడినటివంటి పట్టణం వజ్ర వైఢ్యూర్య
మణి మాణిక్యములు పొదగబడి ఉంటుంది, బంగారము చేత తాపడము చేయబడి ఉంటుంది. అది
అమరావతికి ఏవిధంగాను కూడా శోభలో తక్కువది కాదు దేవేంద్రుడు కోరి కోరి తయారు
చేయించుకున్న పట్టణము, కాబట్టి అమరావతి తరువాత అమరావతి లేదా అమరావతితో సమానమైనది
కాబట్టి మీరు అమరావతిలాంటి పట్టణం కావాలంటున్నారు కాబట్టి మీరు త్రికూటాచలం మీద
ఉన్నటువంటి కాంచన లంకలో వెళ్ళి ఉండండీ అన్నారు. విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి,
అయితే ఇక్కడలేదుకానీ ఉత్తరకాండలో విశ్వకర్మగురించి ఒక శ్లోకముందు. ఇప్పుడు నేను
చెప్పిన సందర్భాలన్ని అనుసరించి చెప్పినప్పుడే అక్కడ అవ్యయః అని విశేషణం
వేశాడు మహర్షి, అవ్యయః అంటే ఆయన ఎప్పుడూ కూడా నశించేటటువంటి స్వభావము ఉన్నవాడు
కాడు, విష్ణువే విశ్వకర్మగా ఉంటారు అందుకే మనం విష్ణు సహస్త్ర నామ స్తోత్రంలో విశ్వకర్మా
మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః అని చెప్తాం. అటువంటి విశ్వకర్మ చేత
చెక్కబడినటువంటి ఆ పట్టణం రాక్షసులకి ఆలవాలమైంది, ఆలవాలమైనటువంటి ఆ పట్టణంలో
రాక్షసులు ఉండి ఉద్ధతితో ప్రవర్తిస్తుంటే లోకాలకి ఇబ్బంది కల్పిస్తే ఒకానొకప్పుడు
శ్రీ మహావిష్ణువు వాళ్ళతో చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు, చాలా మంది రాక్షసులు ఆయన
చేతిలో తెగటారిపోయారు మిగిలిన వాళ్ళు సుమాల అనే పేరుకలిగిన రాక్షసుడు
మిగిలినవాళ్ళు పాతాళ లోకానికి పారిపోయారు, పారిపోయి పాతాళ లోకంలో ఉండిపోయారు కాంచన
లంక ఖాలీ అయిపోయింది, ఎవ్వరూలేరిప్పుడు ఎవ్వరూ లేకుండా శూన్యంగా ఉండిపోయినటువంటి
కాంచనలంకా అంత వైభవోపేతమైన పట్టణమైనా అసలు అక్కడ ఒక పట్టణముందనీ అక్కడ అంత గొప్ప గొప్ప
హర్య్నములున్నాయనీ అంత గొప్ప గొప్ప వీధులున్నాయనీ అంతఃపురం ఉందనీ ఎవరికీ ఎరుకలో
లేదు దాన్ని మొట్టమొదట మళ్ళీ చెప్పినవారు ఎవరంటే విశ్రవసో బ్రహ్మ చెప్పారు.
విశ్రవసో బ్రహ్మ పులస్త్య బ్రహ్మ కుమారుడు, పులస్త్య బ్రహ్మ బ్రహ్మమానస
పుత్రుడు, ప్రజాపతులలో ఒకడు, అటువంటి పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో
బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ కుమారుడు ʻవైశ్రవణుడుʼ కుబేరుడు, ఆయనా భారద్వాజ
మహర్షి కుమార్తెను విశ్రవసో బ్రహ్మకిచ్చి వివాహం చేశారు, విశ్రవసో బ్రహ్మయందు
జన్మించినవాడు వైశ్రవణుడు, ఆయనా చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు, చేసి
నాకు ధర్మం కావాలి అని అడిగాడు నీకు దిక్పాలకత్వం ఇచ్చి పుష్పకం కూడా
ఇస్తున్నానన్నాడు, అంటే ధర్మం
ఎక్కడుందో అక్కడ శాశ్వతత్వం ఉంటుంది. ఇప్పుడు ఆ పుష్పకాన్ని
తీసుకున్నటువంటి కుబేరుడు తండ్రిని అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారు ఏ
ప్రాణులకు పీడకలగకుండా నేను ఎక్కడుండాలి అని అడిగాడు, ఆయన అడిగిన మాటలు నావలన ఏ
భూతములకు ఖేదము కలగకూడదు అలా నేను ఎక్కడుండనూ అని అడిగాడు. దక్షిణ తీరంలో కాంచన
లంక ఉంది అది ఇప్పుడు ఖాళీగా ఉంది ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు ఇప్పుడు నీవు లంకా
పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉండూ అని చెప్పారు ఆ లంకా పట్టణంలో కుబేరుడు ఉండేవాడు.
మొట్ట మొదట దాన్ని స్వాదీనం చేసుకుని అక్కడ పరిపాలన చేయడం మొదలు పెట్టినవాడు కుబేరుడు
ఆ కుబేరుడు ఒకానొకప్పుడు పుష్పక విమానంలో వచ్చి తండ్రిగారికి తల్లిగారికి నమస్కారం
చేస్తున్నాడు ఆయన తేజస్సుని చూశారు రావణాసురుని యొక్క తాతగారు, చూసి ఇంత గొప్ప తేజోమూర్తి
ఒకడు పుడితే తప్పా మన రాక్షస జాతికి నాయకుడు దొరకడు ఇంత గొప్ప తేజస్సుగలిగినటువంటివాడు
జన్మించాలంటే ఇంత గొప్ప తేజస్సు కలిగినవాడివలనే జన్మించాలి.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి కుబేరుడు
ఎవరివలన జన్మించాడో ఆయన వలననే నా కూతురికి కూడా ఒక కొడుకు పుట్టాలి, పుడితే మళ్ళీ
అంతటి తేజోవంతుడౌతాడు అనీ ఒక తండ్రి ఒక కూతురికి చెప్పకూడని మాటలే
చెప్పాడనుకోవచ్చు... కైకసికి ప్రేరణ చేశాడు ఆమె రాకూడనటువంటి సమయంలో వచ్చింది,
అసుర సంధ్యవేళలో వచ్చి విశ్రవసో బ్రహ్మ సంధ్యావందనం చేసుకుని అగ్నిహోత్రం
చేసుకుంటుంటే ఆయన ముందుకొచ్చి నిలబడి బొటనవేలితో భూమి మీద రాస్తూ నిలబడింది. ఆయన
ఎందుకొచ్చావని అడిగాడు ఆవిడా నన్ను నా తండ్రి పంపించాడు నీ దగ్గరికీ కానీ నేను
ఎందుకొచ్చానో ఒక ఆడదాని హృదయం తెలుసుకోలేని వాడు కాదు, నీవు ఎందుకొచ్చావో నేను
గమనించాను నీవు కోరుకున్నట్లే సంతానాన్ని ఇస్తాను కానీ నీవు రాకూడని సమయంలో
వచ్చావు సాయంకాలపు అసుర సంధ్యావేళలో వచ్చావు స్త్రీ పురుష సమాగమం ఆ సమయంలో జరిగితే
ఘోరమైనటువంటి సంతానం కలుగుతుంది ఇప్పుడు వచ్చి సంతానాన్ని అపేక్షించావు కనుకా లోక
కంఠకులైనవారు నీకు బిడ్డలుగా కలుగపోతున్నారు అని రావణ కుంభకర్ణులను శూర్ఫణకని
అనుగ్రహించారు అప్పుడు ఆవిడ ఏడ్చింది, నీ వంటి మహాపురుషుడి వలన సంతానము కలగాలీ అని
నేను కోరుకున్నది ఆ తేజస్సుతో జన్మించినవారు లోకకంటకులు కావాలని కాదు వాళ్ళు
లోపోపకారులు కావాలి ధర్మాత్ములు కావాలీ అని కోరుకున్నాను నాకు అటువంటి బిడ్డడు
ఒకటు కలగడా అని అడిగింది. అప్పటికి వేళ దాటి చీకటి పడిపోయింది కాబట్టి ఇప్పుడు
నీకు కలిగే కుమారుడు ధర్మాత్ముడౌతాడు అని కనిష్టుడిగా ఆఖరివానిగా విభీషణుడు
జన్మించాడు. పుట్టగానే పది కంఠములతో పుట్టి ఏడ్చాడు కనుక దశగ్రీవుడు అని
పేరుపెట్టారు ఆయనకు, రావణా ఆయన నామం కాదు అంతగట్టిగా అరిచాడని పరమేశ్వరుడు
పిలిచాడు రావణా అని అది ఆయన ఉంచుకున్నాడు బాగుంది ఆ పేరుని.
కాబట్టి ఇప్పుడా దశగ్రీవుడు పెరిగి పెద్దవాడై
తపస్సుచేసి బ్రహ్మగారివలన వరములను పొందిన తరువాత ఆక్రమించాడు కుబేరుని దగ్గర,
ఎందుకంటే కుబేరుని దగ్గరికి వెళ్ళినప్పుడు రాక్షసులతో కలిసి ఆయనొక మాట అన్నాడు,
తమ్ముడా చాలా సంతోషం నీవు విశ్రవసో బ్రహ్మకుమారుడవే కాబట్టి నాకు తమ్ముడివి నీవు
నేను కలసి రాజ్యపరిపాలన చేద్దాం ఎందుకు మనిద్దరం దెబ్బలాడుకోవడం, కాబట్టి హాయిగా
నీవు కూడా స్వాగతిస్తున్నాను నీవు కూడా లోపలికి రా రాజ్యంలోకి అన్నాడు. రావణుడు
అంగీకరించలేదు ఉంటే నేను ఉండాలి లేకపోతే నీవు ఉండకుండా నేను చెయ్యాలి కాబట్టి
నీయంత నీవు వెళ్ళిపోతావా లేకపోతే నన్ను నిన్ను నిర్మూలించమంటావా అని అడిగాడు. కుబేరుడు
తండ్రిని వెళ్ళి అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారూ ఏం చేయమంటారూ తమ్ముడు
రావణుడు కాంచన లంకను అడుగుతున్నాడూ అని అడిగారు అంటే ఆయన అన్నాడు... వాడి అహంకారము
చేత వాడు నశించిపోయే రోజులు వాడికి దగ్గర పడుతున్నాయి కాబట్టి నీవు లంకని
విడిచిపెట్టేసై ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి వేరొక రాజధానిని నిర్మించుకో అన్నాడు.
అప్పుడు ఆయన కైలాస పర్వతం పక్కకు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయినా వెళ్ళి అన్నగార్ని
దండించి అన్నగారితో యుద్ధం చేసి ఓడించి పుష్పక విమానాన్ని ఎత్తుకొచ్చాడు కుబేరుని
దగ్గర నుంచి రావణాసురుడు. కాబట్టి దదర్శ లఙ్కామ్ అమరావతీమ్ ఇవ అని మహర్షి
అనడంలో... అసలు ఆ లంకా పట్టణాన్ని మొట్ట మొదటిసారి చూసినవాడు ఎవడికైనా కళ్ళు
చెదరిపోవాల్సిందే అదీ అంత తేలికేం కాదు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
అది హనుమ కాబట్టి
తట్టుకున్నారు కానీ అసలు హనుమ కాబట్టి ఆలోచించారు కానీ అసలు ఎందుకొచ్చాడో జ్ఞాపకం
రావడం కష్టం. ఎవడికీ జ్ఞాపకం రాదు ఎందుకంటే మహర్షి ఎన్ని శ్లోకాలు రచన చేశారో ఒకటీ
రెండు కావు ఎన్ని శ్లోకాలిచ్చారో అది కూడా ఆ శ్లోకాలు కూడా బహుబంగిమల చిత్రంగా
ఉంటాయి, కొన్ని మహర్షి చెప్పినవి కొన్ని హనుమా చూస్తున్నప్పుడు ఎలా కనపడ్డయో
చెప్పినటువంటి శ్లోకాలు, అరుగులు అలా ఉంటాయి చెట్లు అలా ఉంటాయి ఇళ్ళు అలా ఉంటాయి
ప్రాకారములు అలా ఉంటాయి వీధులు అలా ఉంటాయి రక్షణ అలా ఉంటుంది కొన్ని వేల కోట్ల
రాక్షసులు అక్కడ ఉంటారు. ఆభిచారిక హోమాలు చేసేవారుంటారు వారు అక్కడ వాళ్ళు కేవలం
మంత్రభాగం చేస్తుంటారు అక్కడ వాళ్ళు తలచుకోగానే ఆ అగ్నిహోత్రాన్ని ప్రయోగిస్తారు.
అంత భయంకర స్వరూపులతో నిండిపోయి ఒక చోట మహర్షే అంటారు పాములతో నిండిన పాతాళం ఎలా
ఉంటుందో లంక కూడా రావణ పరిపాలనలో అలా తయారయ్యింది. దుష్టులందరికీ కూడా ఆలవాలముగా
మారిపోయింది. ఒక్క ధర్మాత్ముడైన విభీషణుడు తప్పా. అటువంటి సమయంలో అసలు ఆయన నూరు
యోజనములు సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి నిలబడి చూడగానే అమరావతిలా కనపడిందీ
అంటే అందులో ఆశ్చర్యంలేదు, ఎందుకంటే వాళ్ళ కోరిక అదే అమరావతిలాంటి పట్టణం కావాలనే
వాళ్ళు అడిగారు, కాబట్టి అమరావతిలాగే ఉంటుంది ఆ కాంచన లంక. అటువంటి లంకా
పట్టణాన్ని చూసినప్పుడు మీరొకటి గుర్తించి కొంచెం జాగ్రత్తగా గమనించండి.
సుందర కాండ యొక్క గొప్పతనమును మీరు రెండు
కోణములలో చూడవలసి ఉంటుంది ఇక్కడ సర్గల్లో, ఒకటి బాహ్య సౌందర్యము లంక యొక్క బాహ్య సౌందర్యము.
ఇప్పుడూ మనం ఒక అద్భుతమైన మేడ గురించి ఏదో విన్నామనుకోండి ఇంటికి రాగానే ఏం
చెప్తామంటే అబ్బా ఎంతబాగుంటుందనుకుంటావు వాళ్ళిల్లూ అని మొదలు పెడతాము. అక్కడ
చిత్రమేమిటంటే మహర్షీ తివాచీని కూడా విడిచిపెట్టలేదు అంటే మీరు ఆలోచించండి ఒక
తివాచీ గురించి కూడా ఒక శ్లోకం చెప్పవలసిందే అక్కడ ఏదీ విడిచిపెట్టడానికి లేదు
అంతటి బాహ్య సౌందర్యము, అంతటి సౌందర్యము కలిగినటువంటి లంకా పట్టణంలోకి ప్రవేశించి
చూస్తున్నవాడి దృష్టి దానిమీద నిలబడి పోవాలి అది ఒక సౌందర్యము, రెండవది అక్కడ
ఉన్నటువంటి స్త్రీ అన్ని రకాలైనటువంటి వాళ్ళనీ లంకా పట్టణానికి తీసుకొచ్చాడు,
వారిని చూడకూడని రీతిలో చూశారు హనుమా ఒంటిమీద నూలు పోగులు లేనివారిని కూడా చూశాడు ఎందుకంటే
రాత్రి వెళ్ళాడు, సౌందర్యమునకు ఆటపట్లు వాళ్ళు మహర్షి మాటలలో చెప్పాలీ అంటే ఆసలు కొన్ని
కొన్ని శ్లోకాలు చెప్పడం కూడా కష్టంగా ఉంటాయి చదువుకుని మీరు అనుభవించవలసి
ఉంటుంది. పురుషునకు సుఖమివ్వడంలో అత్యంత సమర్ధతకలిగినటువంటి మెరుపుతీగల వంటి
స్త్రీలు వొంటిమీద బట్టలేనివారిని చూడబడినారు అని రాశాడు మహర్షి. అప్పుడు కనుచూపు
తప్పించి ఈమె సీత కాదూ అని వెళ్ళిపోగలిగాడు అది ఆయన సౌందర్యము, ఇదీ లంకా
సౌందర్యము.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఏక కాలమునందు రెండు
సౌందర్యాలు నడుస్తాయి మీ బుద్ధి ఎక్కడ నిలబడితే అది మీ సౌందర్యము అది మీకు పరీక్ష
సుందర కాండ దగ్గిరికి వెళ్ళితే, సుందర కాండ సర్గలలో చదివిన శ్లోకాలన్నీ
గుర్తున్నాయనుకోండి మీ బుద్ధి అక్కడ సౌందర్యాన్ని అనుభవిస్తుందన్నమాట, మీ బుద్ధి
హనుమత్ వైభవాన్ని అనుభవించగలిగిందనుకోండి మీ బుద్ధి పరిపక్వత చెందుతుంది. కాబట్టి
సుందర కాండ చాలా గమ్మత్తైనటువంటి కాండ స సాగరం దానవ పన్నగా యుతం బలేన విక్రమ్య మహోర్మి మాలినమ్ నిప్తయ తీరే చ మహోదధే స్తదా
దదర్శ లఙ్కామ్ అమరావతీమ్ ఇవ ! సముద్రం పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరం మీద ఉంది లంక కాబట్టి ఇప్పుడు యధేచ్చగా
ఆ సముద్ర కెరటములు ఎప్పుడు వచ్చి కొడుతుంటాయి, ఎక్కడ బయలుదేరారు హనుమా, దక్షిణ
సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరారు, దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరి
సముద్రాన్నిదాటి దక్షిణ తీరానికి చేరుకుంటే లంక కనపడింది. దక్షిణ తీరాన్నే ఉండేది
లంక ఎప్పుడు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుని చూడవలసి ఉంటుంది సుందర కాండలో, లంక ఎక్కడ
ఉంటుంది దక్షిణ తీరంలో ఉంటుంది. అయోధ్య ఎక్కడుంటుంది సరయూ నది ఒడ్డున ఉంటుంది,
హిమాలయాలు ఎక్కడ ఉంటాయి ఉత్తర దిక్కునే ఉంటాయి. కైలాసం ఉత్తర దిక్కునే ఉంటుంది
ఉత్తర దిక్కున కూర్చున్నవాడు దక్షిణ దిక్కును చూస్తుంటాడు దక్షిణాన్నుంచి
ఉత్తరానికి నమస్కారం చేసినవాడు మృత్యు భయం లేకుండా చేయగలిగినవాడు మృత్యుంజయుడు
అక్కడ కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు దక్షిణా మూర్తిగా.
మనవాళ్ళు ఏది మాట్లాడినా చాలా వైభవోపేతంగా ఉంటాయి ఆ మాటలు ఇప్పుడు దక్షిణ
తీరాన లంక ఉన్నదీ అంటే దీంట్లో ఒక చమత్కారం ఉంది. ఎప్పుడూ కూడా దక్షిణమనేటటువటంది యమధర్మరాజుగారి యొక్క
దిక్కు దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే యమధర్మరాజుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
యమధర్మరాజుగారి అనుగ్రహం కలిగితే ఏం చేస్తుంది ఆయన చేయగలిగింది ఆయన చేస్తారు కదా
కాబట్టి యమధర్మగారి యొక్క సదనాన్ని చేరుకోవాలన్నా శరీరము రోగ గ్రస్తము కావాలన్నా
దక్షిణ దిక్కుకు తిరిగి ఎక్కువ నమస్కారం చెయ్యాలి, రోగం వస్తే బాగుండూ
అన్నారనుకోండి దక్షిణ దిక్కుకి ఎక్కువ నమస్కారం చెయ్యాలి అయితే అదే
యమధర్మరాజుగారికి ఇంకో శక్తికూడా ఉందండోయ్ ఆయన అనుగ్రహిస్తే రోగం లేకుండా కూడా
చేస్తాడు కానీ సాధారణంగా దక్షిణ దిక్కుకి తిరిగి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం
మాత్రం ఒక గృహస్తు కోరుకోకూడదు కనుక దక్షిణ దిక్కుకు నమస్కారం చెయ్యవద్దని
చెప్తారు పెద్దలు, పెద్దలేమీ ఎక్కడైనా అంతే. నిన్నను మీరు సుందర కాండలో విన్నారుగా
అంజలిం ప్రాఙ్మఖః కుర్వన్ పవనాయాఽఽత్మ యోనయే తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేశారు తప్పా
దక్షిణానికి వెళ్ళుతూ దక్షిణానికి నమస్కారం చెయ్యలేదు, ఇదీ మీరు తెలుసుకోవలసిన
విషయం ఎందుకో తెలుసాండి, నమస్కారం చెయ్యడం ప్రధానం కాదు నమస్కారం చేసేటప్పుడు మీ నమస్కారం ఎవరికి
చేద్దామనుకున్నారో వారికంది ఆ ప్రయోజనం మీకు వస్తుందాలేదా అన్నది ప్రధానం.
మీకు నేను ఈ సంధర్భంలో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఒక జగత్ గురువు దగ్గరికైనా సరే
మీరు దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చేస్తే ఆయనకి వెళ్ళదు ఆ నమస్కారం,
భారతీతర్థస్వామే కానివ్వండి పరమాచార్య స్వామే కానియ్యండి ఇక్కడకొచ్చి ఇలా
కూర్చున్నారనుకోండి మీరు దక్షిణానికి తిరిగి నమస్కారం చేశారనుకోండి ఆ నమస్కారం
ఆయనకు వెళ్ళదు ఆ నమస్కారం యమధర్మరాజుగారికి వెళ్తుంది. మీరు
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
తూర్పు దిక్కుకు తిరిగో లేదా ఇంకో దిక్కుకు తిరిగో నమస్కారం
చెయ్యాలి కానీ దక్షిణానికి తిరిగి మాత్రం చెయ్యకూడదు. గురువుగారు ఎదురుగుండా కూర్చున్నా
గురువుగారికి కూడా చేయకూడదు అది, అందుకే ముందు వెళ్తూనే దిక్కేది అని అడిగి
తెలుసుకొని నమస్కారం చేస్తారు అది.
అధిష్టానాల దగ్గరైనా అంతే గురువుగారు శరీరం
విడిచిపెట్టేసిన తరువాత అధిష్టానాన్ని నిర్మాణం చేస్తారు, శరీరాన్ని అందులో పెట్టేసి
శివలింగం పెట్టేస్తారు, అధిష్టానం దగ్గరికెళ్ళినా దక్షిణానికి నమస్కారం చెయ్యరాదు,
ఉత్తరానికి తిరిగి కాని తూర్పుకు తిరిగికాని సాధ్యమైనంతవరకు ఆ రెండు దిక్కులే
నమస్కారానికి అంటే నేను ఎందుకు నేనీ మాట చెప్పవలసి వస్తూందీ అంటే అది కూడా సుందర
కాండలో అంతర్భాగమే, ప్రతి చిన్న విషయాన్ని ఉపాసనకు సంబంధించిన ప్రతివిషయాన్ని మీకు
చెప్తున్నది. నేను మీతో ఒక మాట మనవి చేశాను మనస్కారం మీ బాధ్యతని అవతలివారి యందు నిక్షేపిస్తుంది,
మీరు నమస్కారం చేశారనుకోండి ఆయన దాన్ని ఏదో సామాన్యంగా పూజ చేసుకోవడం కుదరదు ఆయన
ఏం చేయాలంటే ఓ ఆశీర్వచనం చెయ్యాలాయన అలా ఆశీర్వచనం చెయ్యకూడని వాళ్ళు ఎవరో
తెలుసాండి ఒక్కరే ఒక్క సన్యాసి చెయ్యకూడదు, సన్యాసి ఆశీర్వచనం చెయ్యరు, సన్యాసి ఏం చేస్తారు అంటే
ఆయన సన్యాసి నమస్కారాలన్ని పుచ్చుకుని మీకు ఆశీర్వచనాలన్నీ చేస్తూ
కూర్చున్నారనుకోండి ఇంక ఆయన ప్రయోజనమేమిటీ సన్యాసి ఎప్పుడూ ఆశీర్వచనం చేయకూడదు.
సన్యాసి ఏమనాలంటే నారాయణ నారాయణ నారాయణ అనేటప్పుడు నాలుకతో అనడం కాదు లోపల ఎప్పుడు
ఒక భావన ఉండాలి వీళ్ళందర్నీ ఉద్దరించేవాడు ఎవరో, కాబట్టి పీఠంలోకివెళ్ళి నమస్కారం
చేసి ఎంతమంది నమస్కారాలు చేశారో అంతమంది నమస్కారాలు అటువైపుకి తిప్పేసెయ్యాలి
కాబట్టి నారాయణ నారాయణ నారాయణ అంతే తప్పా ఆయన మళ్ళి వెంటనే ఆయుస్మాన్ భవ అనరు, అది
ఎవరనాలంటే గృహస్తాశ్రంలో ఉన్న గురువులకు ఆశీర్వచనం చెయ్యాలి, ఇప్పుడు మీరొక నమస్కారం చేస్తే ఆయన మీ నమస్కారానికి ఆశ్వీర్వచనం చెయ్యాలి అంటే
బాధ్యత ఆయన తీసుకోవలి, మీ బాధ్యత ఆయన తీసుకోవాలి అంటే ఆయనకి నమస్కారం
అందితేగదూ మీకు ఆశీర్వచనం ఆయన చేయడం, మీరు ఆ దిక్కుకు తిరిగి చేయకుండా మీరు అన్ని
దిక్కులకు చేసిన నమస్కారంతో ఆయన మీకేమి ఆశీర్వచనం చేస్తారు కుదరదు అప్పుడు ఆయన
కూడా చేయలేడు ఆశీర్వచనం ఆ నమస్కారం ఆయనకు అందదు.
కాబట్టి దక్షిణ దిక్కుకు పరిహరించవలసి ఉంటుంది నమస్కారం, ఇప్పుడు దక్షిణాన లంక
ఉందీ అంటే శరీరములన్నీ దక్షిణానికే వెళ్ళిపోతాయి ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది ఎప్పుడూను. ఏ
శరీరములైనా సరే ఏం తోచట్లేదండీ కాలక్షేపం చేయట్లేదు ఒకసారి స్మశానానికి
వెళ్ళొద్దామని ఎవరూ అనరు అలా ఎవరంటారు అలా ఎవ్వరూ అనరు కానీ... ఎప్పుడూ నేను
వెళ్ళనూ అన్నా చిట్ట చివర వెళ్లిపోవలసింది మాత్రం శాశ్వత చిరునామ అదే అక్కడికే
వెళ్ళిపోతుంది. పుట్టినటువంటి ప్రతి శరీరమూ కూడా పెరిగి పెద్దదై వికారమును పొందిన
తరువాత ఎక్కడ అంతరించిపోతుందంటే ఎక్కడ లయమైపోతుందంటే పంచభూతాల్లోకి శ్మశానవాటికయందు
లయమైపోతుంది. కాబట్టి లంక దక్షిణ తీరమున ఉన్నదీ అన్న మాటకు అర్థమేమిటంటే ఈ
శరీరమును యోగిగా చూస్తున్నారు హనుమా అందుకే ఓం యోగినే నమః అని హనుమకి
అష్టోత్తర శతనామావలిలో ఒక నామం, ఆయన యోగీ పుంగవుడు అంటే పతంజలి యోగ సూత్రాలలో అనేన
యుజ్జతే ఇతి యోగః ఆయనా ఏది ఒక్కటో ఏది సత్యమో ఏది శాశ్వతమో ఆ సత్యము తానుగా
నిలబడి ఏది అసత్యమో ఏది కాలమునందు వికారమును పొందుతుందో ఏది కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు
వెళ్ళిపోతుందో ఆ వెళ్ళిపోయేదాన్ని వెళ్ళనిదానిగా ఉండి చూడడం యోగి లక్షణం
మీరు పట్టుకున్నారో లేదో, మనం వెళ్ళిపోయేది మనం అనుకుంటాం వెళ్ళనిదేదో అది
తెలుసుకుని అది నేనని నిలబడుతాడు అది తేడా యోగిగి మనకి, ఎన్నాళ్ళు బ్రతకనివ్వండీ ఎంత
పక్కింటివాడు వెళ్ళిపోనివ్వండీ తండ్రిగారు వెళ్ళిపోనివ్వండి తాతగారు
వెళ్ళిపోనివ్వండీ తల్లిగారు వెళ్ళిపోనివ్వండి ఎన్ని తద్దినాలు పెట్టనివ్వండి
వాళ్ళు నేరుగా వెళ్ళిపోయారు మనం వెళ్తామేమిటండీ అంటారు, అంటే ఎందుకంటాడంటే
ఆమాటా... మనం చచ్చిపోము అన్న మాటవరకు సత్యమండి మనకు చావులేదు ఎప్పుడులేదు మీరు
ఆత్మా అని అనుభవంలోకి వస్తే చావులేదు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఆత్మకు చావేది, కానీ నేను ఆత్మను చావులేదన్నవాడు గొప్పవాడు నోటితో కాదు
అనుభవంలో నేను ఇదీ అని నాకు చావులేదు అన్నవాడు అజ్ఞాంలో ఉన్నవాడు, యోగి ఏం
చేస్తాడంటే తాను ఆత్మగా నిలబడి కదిలిపోయి పడిపోయేటటువంటి శరీరాన్ని సాక్షిగా
చూస్తుంటాడు, ఆ అనుభవంలోకి వెళ్ళిపోయినవాడి మాట చాలా గమ్మత్తుగా ఉంటుంది, అరె
ఏమిట్రా ఈ మాటలు అనిపిస్తుంది. ఒకప్పుడూ రమణ మహర్షి దగ్గరికెళ్లి ఒకాయన రాత్రి
బాగా నిద్రపోతారా అని అడిగారు, ఆయన అన్నారు, అవును “ఇది నిద్రపోతుంది” అన్నారు.
మరి మీరు అన్నారు, నేను నిద్రపోతున్నదానికి సాక్షిని అన్నారు. ఇది
నిద్రపోతూందని నేను తెలివిగా ఉండి చూస్తున్నాను, ఇది లెచిందని నేను
చూస్తుంటాను, ఇది కల కంటూందని నేను చూస్తుంటాను దీని మూడు అవస్థలకీ నేను సాక్షిని.
నాకు మాత్రం అవస్తలు లేవు ఆ నేను “ఏది యదార్థమైన నేనో” అది నేను. అది “ఆత్మ” ఆ ఆత్మగా నిలబడిన యోగి శరీరాన్ని
సాక్షిగా చూస్తాడు, ఒక శరీరాన్ని కాదు తన శరీరానికి తాను సాక్షియై
ఒక్కొక్కసారి ఆ స్థాయిలో ఉన్నప్పుడు సమస్త జగత్తుని ʻజగత్తుʼ అంటే వచ్చి వెళ్లిపోయేది,
ఒక శరీరం ఎలా వచ్చి వెళ్ళిపోతుందో అలా నేను శరీరమును లోకమంతటియందు చూస్తే వచ్చి వెళ్ళిపోయేటటువంటి
సమస్త ప్రాణుల యొక్క సమాహారమునకు జగత్ అని పేరు. “జాయతే గచ్చతే ఇతి జగత్” ఏది పుడుతుందో ఏది వెళ్ళిపోతుందో దానికి
ʻజగత్ʼ అని
పేరు అంటే మీకు ఇంకా
తేలికగా చెప్పాలంటే డేటాఫ్ బర్త్ ఉన్న ప్రతీదీ జగత్తులోకే వస్తుంది ఎందుకనీ డేటాఫ్
బర్త్ ప్రీ సపోజెస్ టు బి డేటాఫ్ డెత్. పుట్టింది అని మీరు అన్నారంటే చచ్చిపోతుంది
ఖాయం అది వెళ్ళిపోతుంది. ఈశరీరానికో డేటాఫ్ బర్త్ ఉంది ఇది ఓ తేదీన పుట్టింది
కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక తేదీన చచ్చిపోతుంది ఇది వెళ్ళిపోతుంది ఇది ఉండదు, ఇది
ఉండదూ అన్న విషయాన్ని ధైర్యంగా అంగీకరించగలిగితే అప్పుడు నీ దృష్టికోణం
ఎటువెళ్తుందంటే మరి వెళ్ళనిదేనీ అని అడుగుతుంది.
ఇది ఉంటుందండీ అని అనకూడదాండీ ఉంటుందండీ అని అస్తమానం అనుకోమని కాదు నా
ఉద్దేశ్యం, విచారణ యందు ఆత్మ తత్వ విచారణయందు మీరు ఆ నిర్ణయానికి రావచ్చు ఇది
ఉండదయా ఇది వెళ్ళిపోతుంది ఒకనాడు దీన్ని కట్టెల మీద పెట్టి అగ్నిహోత్రంలో సంస్కారం
చేస్తారు అప్పుడు ఇది కాలిపోతుంది కానీ ఇది కాలిపోతూండడాన్ని ఒకడు చూస్తుంటాడు అది
కాలిపోతుందని అది ఏదో అది నేను అన్ననాడు నేను నిజమైన నేను నందు నేనుగా నిలబడ్డారనుకోండి సత్యమునందు,
అసత్య వస్తువుని మీరు సత్య వస్తువుగా నిలబడి చూస్తారు అప్పుడు వీటితో
చూసేది బాహ్యము దానితో చూసేది ఆంతరము, తనలో తాను నిలబడి తనను తాను సాక్షిగా
చూస్తాడు. ఆ చూపుకి ఈ కన్ను పనికిరాదు ఆ లోకన్ను ఉన్నవాడి గురించి చెప్పడం సుందర
కాండ ప్రారంభం, అందుకే ఒక యోగి కథ ప్రారంభమౌతుంది. అంతః విచారణ ప్రారంభం
చేస్తున్నారు అందుకే ఉపాసన కాండ సుందర కాండ అన్నారు పెద్దలు ఇదీ ఆత్మ తత్వంవైపుకు
ఎలా వెళ్తుందో ఒక యోగి యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో చెప్తున్నారు. యెగికున్న
గొప్పతనమేమిటో తెలుసాండీ అటువంటి సత్యము అయినటువంటి వస్తువునందు “తాను సత్యముగా నిలబడిపోయినవాడి
నోటివెంట వచ్చినది సత్యము”, మీరు పట్టుకున్నారో లేదో నేను ఒక మాట
చెప్పాననుకోండి ఆయన సత్యం చెప్పారండీ అంటారు ఆయన సత్యం చెప్పారండీ అంటే
జరిగిపోయినది ఉన్నది నేను మాట్లాడితే నేను సత్యం చెప్పినట్లు. యోగి సత్యం చెప్పడం కాదు ఆయన
చెప్పింది సత్యమౌతుంది. నూరేళ్ళు ఆయుర్దాయం అని బ్రహ్మగారు రాశారనుకోండి
ఆయనకేదో చికాకు వచ్చింది నీవు కుక్కవౌదువుగాక అని అన్నారనుకోండి అంతే అయిపోతాడు
కుక్క. అదేంటి బ్రహ్మగారు నూరేళ్ళు రాశాడుగా బ్రహ్మగారు రాసిన లలాటలిఖితము ఆయన నోటివెంట వచ్చిన మాట
ముందు నిలబడదు ఆమాట సత్యమైపోతుంది అంతే, అంటే తాను సత్యముగా నిలబడిపోయినవాడి
నోటివెంటవచ్చినది సత్యమైపోతుంది.
ఈ స్థితిని పొందాడు కాబట్టే హనుమ నోటివెంట సుందర కాండలో ఏమాటలు వచ్చాయో తరువాత
రామాయణమంతా అదే... కాబట్టి ఇప్పుడు ఆయనా ఆత్మను అనుభవించినటువంటి ʻగొప్ప యోగి సాధకుడుʼ అంతే అంతకన్నా
ఇంకేమీ చెప్పకండి ఆయన గురించి, అలా చూస్తేనే మీకు రామాయణం అందం కాబట్టి ఇప్పుడు
ఆయనా ఆ లంకని చూస్తున్నారు అంటే ఒక శరీరానికి సాక్షిగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ
లంక కాంచన లంకకీ ఏవి తగులుతున్నాయి సముద్ర కెరటములు తగులుతున్నాయి కెరటం చూడండి ఎక్కడ
పుడుతుంది సముద్రంలో పుడుతుంది, సముద్రంలో పుట్టి సముద్రంలో పెరుగుతుంది సముద్రంలో
పెరిగి సముద్రంలో ప్రయాణం చేస్తుంది సముద్రంలో ప్రయాణం చేసి సముద్రంలో
విరిగిపడిపోతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. తప్పా సముద్రం కన్నా కెరటం వేరా? కాదు
సముద్రమునందే కెరటం పుట్టింది, అలా ఈ కెరటాలు ఎప్పుడూ సముద్రమునందే
వస్తూంటాయి పుడుతూంటాయి వెనక్కి కొడుతుంటాయి పోతుంటాయి కెరటములు లేని సముద్రం మీకు
ఎప్పుడూ ఉండదు కెరటాలు మాత్రం వస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి వెళ్ళుతూనే ఉంటాయి ʻఈ శరీరాన్ని కూడా
ఆరు కొడుతుంటాయిʼ అవే కెరటాలు దీన్ని ఎప్పుడూ కొడతాయి, ఆఖరి
కెరటం కొట్టినప్పుడు ఇది పడిపోతుంది మళ్ళీ ఇంకొక కొండని కొడుతుంటాయి శరీరాన్ని
కొడతాయి, శరీరమనే కొండని మాత్రం ఈ ఆరు కొట్టకుండా ఉండవు అవే ఆ కెరటములే ఆరుగా
చూసినప్పుడు ʻషడ్రువులుʼ అంటారు ఇవే మనుష్యునికే అనుకోకూడదు, ఇవీ సమస్త ప్రాణి జాతమునకు ఉంటాయి, ఇవి
అన్ని ప్రాణిజాతమునకు ఉంటాయి సమస్త ప్రాణిజాతమునకు ఉన్నటువంటి దీన్ని చూసి మీరు
కారుణ్యమును పొందగలిగితే మీ దృష్టి కోణంలో మార్పు వస్తుందని గుర్తు. మీరు ఋషి
అవుతున్నారు అని గుర్తేమిటంటే మీలో ఉన్న అనుభవాన్ని ఇతర ప్రాణులయందు ఉన్న
అనుభవాన్ని ఒకటిగా షడ్రూపులలో చూడగలిగితే ఆనాడు మీకు ఋషి దృష్టి మీకు ఏర్పడుతుంది,
ఏమిటా షడ్రూపులు ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము.
ఆకలి చూడండీ... ఏదో మధ్యహ్నం భోజనం చేస్తారు, సాయంకాలం ఓ కప్పు కాఫీ తాగుతాము
ఏదైనా వచ్చి తింటే ఓ రెండు పళ్ళ ముక్కలు తింటామోమో, రాత్రికైపోయిందా ఊరుకుంటుందా
పెట్టేశామనీ... రాత్రి మళ్ళీ సిద్ధం మళ్ళీ కొడుతుంది కెరటం మళ్ళీ వేస్తాం, మళ్ళీ
తెల్లవారుతుంది మళ్ళీ కొడుతుంది కెరటం మళ్ళీ వేస్తాం ఇలా ఎన్నాళ్ళు కొడుతుంది ఇది
ఉన్ననాళ్ళూ కొడుతుంది. ఇది పడిపోయిందనుకోండి తీసుకొచ్చి మీరేం పెట్టినా దానికి
అక్కరలేదు కదాండి. దప్పిక, దాహం వేస్తోంది పోస్తారు దగ్గతుంది వేస్తోంది పోస్తారు
దగ్గతుంది వేస్తుంది పోస్తారు దగ్గతుంది మళ్ళీ వస్తుంది, ఈ మనుష్యులకే కాదు సమస్త
భూతములకు అందుకే ఇది సనాతన ధర్మంలో భారత దేశం యొక్క గొప్పతనం భారత దేశం యొక్క
గొప్పతనం ఎక్కడుందంటే ఇది సమస్త ప్రాణులయందు చూడ్డం ప్రపంచ దేశాలన్నిటికి నేర్పిన
దేశం భారత దేశమే, నీలోవున్న
ఆకలే ఇంకొక ప్రాణిలో ఉన్న ఆకలి, అందుకని ఒకడికిపెట్టి నీవు తిను తప్ప పెట్టడానికి
సంఘాలు పెట్టుకోమని ఈ దేశంలోలేదు, పెట్టడానికి సంఘాలు పెట్టుకోవడం
పశ్చిమదేశాలవాళ్ళ సంస్కృతి, పెట్టడానికి నీవేపెట్టు దానికి సంఘమెందుకు అని
అడిగింది ఈ దేశం. పెట్టడానికి సంఘమెందుకు నీవే పెట్టు దానికి సంఘమెందుకురా
పెట్టేవాళ్ళ సంఘముంటే పెట్టనివాళ్ళంతా ఎవరు రాక్షసులైనట్లు. కాబట్టి అందరూ
పెట్టాలి దానికి సంఘాలేమిటీ? పెట్టమని
చెప్పడం ధర్మం స్నాతకం చేస్తే పెట్టమనేకదా చెప్తారు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఆకలి
దప్పిక జరా ఎలా పుట్టిన ప్రాణి అలానే ఉండదు వికారమును చెందిపోతుంది అన్నిటికన్నా
ముందు విచిత్రమేమిటో తెలుసాండి రెండు ఎగిరిపోతాయి ఏమిటా రెండు... మీరు చూడండి
నాయకా నయనా ఇవి రెండు చాలా దగ్గరి మాటలు ఇంద్రియాల్లో నాయకత్వం కన్నుది నాయక నయన
కన్నే ముందు అందరికన్నా బయటి ప్రపంచం మీదకి తీసుకెళ్తుంది మిగిలిన ఇంద్రియాలన్ని ఈ
శరీరాన్ని పోషించడంలో ముందుండేది కళ్ళు, కళ్ళు పళ్ళు, ముందు పోయేవేవంటే ఇంక శరీరం
సిథిలమైపోతుందిసుమా..! జాగ్రత్తా పుట్టి పెరిగిన శరీరం తరగడం మొదలౌతుంది ఆరు
వికారములు చెప్తారు పుట్టినది, పుట్టినది ఉండాలి కదాండి వేంటనే ఊడిపోతే, ఇప్పుడు
మాకు కాకినాడ అయ్యప్పస్వామి దేవాలయంలో గోశాలలో కొత్తగా ఒక దూడ పుట్టిందీ అని ఫోను
వచ్చింది మొన్న చాలా సంతోషించాము. సుందర కాండ మొదలెట్టే ముందు అయ్యప్పస్వామి
దేవస్థానంలో గోవుకు ఒక దూడ పుట్టింది అని. ఇంకో గంటకి ఇంకో ఫోను వచ్చింది ఆవు
బాధపడుతుంటే హాస్పటల్కి తీసుకెళ్ళారు ఆ ఆవు కడుపులో ఇంకో దూడ కూడా ఉంది కానీ ఆ దూడ
మరణించింది అని. అందుకని దాని శరీరాన్ని బయటికి తీసేశారు అని, పుట్టినది ఉన్నది, ఉంటేకదాండి
పుట్టినది, చచ్చిపుట్టినది ఉపయోగమోమిటీ పుట్టినది ఉన్నది ఎంత దూర దృష్టితో
మాట్లాడిందో చూడండి, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు
చెందినది, మార్పు చెందినది నశించినది. ఇవి ఆరు వికారాలు ఈ ఆరు వికారాలు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం
ఈ ఆరు ఊర్ములు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. అన్ని ప్రాణులకు ఆకలి దప్పిక
ఉంటుంది, అన్ని ప్రాణులకు శోకముంటుంది అన్ని ఏడుస్తున్నాయి ఏడుస్తున్నాయని తెలియదు
అంతే నవ్వుతున్నట్లు ఉంటాయి అన్ని ఏదో కారణానికి ఏడుస్తుంటాయి. ఏడవడానికి ఏ కారణం
లేకపోయినా తెచ్చుకుని ఏడుస్తాయి అది సహజమైన ప్రవృత్తి, శోకంలో ఉండి కూడా
ఆనందించాడు అంటే ఆయన యోగి ఆయనకి శోకమన్నమాటలేదు అన్నీ సంతోషంగా ఉండరా అన్నా ఏడ్చాడంటే వాడే మనిషి అంటే
ఇంకా ఎదుగుదల కావలసినవాడని గుర్తు కదాండి.
కాబట్టి నళినీ దళ గత జల మతి తరళం తద్వజ్జీవిత
మతిశయ చపలమ్ విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోక హతంచ సమస్తం అన్నారు
శంకరాచార్యులవారు, ఈ లోకం చచ్చిపోయిందిరా నా దృష్టిలో వీళ్ళు అక్కరలేని ఏడుపులు
ఎప్పుడూ ఏడుస్తుంటారు అన్నాడు. శోకం మోహం ఎప్పుటికప్పుడు అంటూంటాడు. ఆఁ.. ఏముందు
ఇవన్నీ అంటూంటాడు, అంటాడు మళ్ళీ సిద్ధం, ఆ అవునండి మావాళ్ళే మావాళ్ళే వీళ్ళే వీరు
నేనను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లగ ఎప్పుడూ ఈ వేలు పైకొస్తుంటుంది.
వాళ్ళు నేను అని రెండు చూపిస్తూనే ఉంటారు. ఎప్పుడు రెండేమిటండీ సభాభ్య
సభాపతిభ్య శ్చ వో నమో నమః సభా నేను ఒకటే అని ఒకటిలోకి వెళ్ళడం ఒకటిలోంచి
రెండులోకి వెళ్తుంటాడు, ఆఖరికి శంకర భగవత్ పాదులు అన్నారు “అద్వైతం” అన్నారు రెండు
కాదు అన్నారు, రెండు కాదంటే ఒకటి అంటారాని, మళ్ళీ ఆయన ఒకటంటారని ఇదొటి ఇదొటి ఇదొటి
అంటారేమోనని ఆయన పాపం రెండు కాదన్నారు, రెండు కాదంటే ఒకటని. అలా అన్నా ఒకటి చేశారు
రెండు చేశారు మూడు చేశారు నాలుగు చేశారు అదో చిత్రం లోకం యొక్క స్థితి. కాబట్టి లోకం
శోక హతంచ సమస్తం అందుకని లోకం శోకంతో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యులు వారు.
కాబట్టి శోకం మోహం రోజు చూస్తుండడము ఆయనా మళ్ళీ ఎప్పుడూ ఏదో కోరికా ఏడుస్తూండడం, “జరా”
వృద్ధాప్యం పట్టుకుంటుంది వచ్చి, “మరణం” అంటే ఈ శరీరం పోతుంది అక్కడితోటి ఈ ఆరు కెరటాలు ఎప్పుడూ లంకని
కొడుతూనే ఉంటాయి కాబట్టి స సాగరం దానవ పన్నగా యుతం అందులో
ఎవరున్నారు ఆ సముద్రంలో రాక్షసులున్నారు, పాములున్నాయి ఈ రెండు దేనికి ప్రసిద్ధి
ఒకడు ఏడిపించడానికి ఒకడు చంపడానికి. పాము కరిస్తే చావు రాక్షసుడొస్తే ఏడిపు,
ఏడిపిస్తారు గదాండి లంక దగ్గర ఉన్న రాక్షసులు ప్రసిద్ధి అందులో వాళ్ళు
ఏడిపిస్తుంటారు. సంసారమేం చేస్తుంది... సంసారమేమీ సంతోషదాయకమేం కాదు కానీ అదొక విచిత్రమైన వాహనము
విచిత్రమైన బరువు బాగా బరువెత్తుకుంటూ సంతోషిస్తుండడం అబ్బా ఎంత సంతోషమో
అబ్బా ఎంత సంతోషమో అంటూండడం, బరువెత్తుకున్నకొద్ది సంతోషంగా ఉండడం.
సుందర కాండ ముప్పైయవ
రోజు ప్రవచనము
|
|
కాబట్టి
సంసారమనేటటువంటి సముద్రంలో దిగిపోయినవాడికి అనేక అనేక కారణములు ఏడిపిస్తుంటే ఆ
నీటి నుంచే అడుగునుంచి వచ్చి పాము కరుస్తుంది, ఎమిటా పాము కాలమే... కాలమన్నపామే
వచ్చి కరుస్తుంది, కరిస్తే కాలములో కలిసిపోతాడు. సంసార సర్ప దష్టానాం జంతూనా
మవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అని మార్కెండేయుడు చంద్రశేఖరాష్టకంలో
ఒక మాట అంటాడు సంసార సర్ప దష్టానాం అంటాడు సంసారమనే సర్పము చేత కరవ బడినవాడు.
శ్రీవేంకటేశ్వరా ఆర్తులకు అభయంకరుడవు, సంసార సప్తవిపత్తులన్ తీర్ప గరుడధ్వజుడవు
తాపమున మొసలిచే పట్టుబడినవారిని బాధలు మాన్ప చక్రాయుధుండవు అని వేంకటేశ్వరున్ని
స్తోత్రం చేస్తారు. మన ప్రారబ్ధమేమిటంటే వేంకటేశ్వర స్వామి గుడిముందు ఆ దీర్ఘము
ఉండి ఉండదు. ʻవెంకటేశ్వరʼ దేవాలయం అని రాస్తారు, పెళ్ళి కార్డు వేసుకుంటాడు వాళ్ళ తండ్రిగారి పేరేమో
వేంకటేశ్వర శర్మా అని పేరు రాస్తాడు, తన పేరేమో వెంకటేశ్వర శర్మ అని రాసుకుంటాడు.
ఆ ʻవేʼ కి దీర్ఘం లేకుండానే పాపం చేశారాయన. “వేం” అంటే పాపం కటా అంటే తొలగించడం, ఆ
వే కి దీర్ఘం లేకుండా నీవు కొడుకు పేరు పెడితే పాపం తీసేవాడిని తీయ్యనివాడు పేరు
పెట్టినట్లు వే కి దీర్ఘం పెట్టి పెట్టాలి కాని మనవాళ్ళు ఏం చేస్తారంటే వె అని
రాస్తారు. వే కి దీర్ఘమివ్వరు కాబట్టి వేంకటతీతిః ఇతి వేంకటాః అని పాపలను
తొలగించువాడు వేంకటేశుడు అని అర్థము వాడు వేంకటేశ్వరుడు. అందుకనీ, అందులోనే
పాములున్నాయి అందులోనే రాక్షసులున్నారు అంటే ఈ సంసారమనేటటువంటి లంకా అనబడేటటువంటి
శరీరము సంసారమునందు ఉండి పరిబ్రమిస్తూ తాపమును పొందుతుంటుంది, దానివల్ల
వచ్చేదేంటంటే వేడి ఒకటే పుడుతుంటుంది ఎప్పుడూ సంసారప్రరిభ్రమనాతోప శమనం
అంటారు శంకరాచార్యులవారు శివానందల హరిలో కాబట్టి బలేన విక్రమ్య మహోర్మి మాలినమ్
నిపత్య తీరే చ మహోదధే స్తదా దదర్శ లఙ్కామ్ అమరావతీం ఇవ.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
పైకి శ్లోకాన్ని
చూస్తే రాక్షసులు కోరుకున్న అమరావతి పట్టణంలా లంక ఉంది, ఆంతరముగా చూస్తే అసలు
సమస్తమైన కష్టాలు కాలంలో రావడం కాలంలో పోవడం షడ్రూపులు షట్ వికారములు అన్నిటితో
కూడినదై ఆ లంక ఉన్నది. దానిని దశగ్రీవుడైనటువంటి రావణుడు పరిపాలిస్తున్నాడు.
ఇప్పుడు దాన్ని చూసి హనుమ అంటారు స సాగరమ్ అనాధృష్యమ్ అతిక్రమ్య మహాబలః !
త్రికూట శిఖరే లఙ్కాం స్థితాం స్వస్థో దదర్శ హ !! ఆయనా నూరు యోజనముల
సముద్రాన్ని దాటివెళ్ళి త్రికూటాచలం మీద త్రికూటము యొక్క శిఖరం మీద ఉన్న లంకని
చూస్తున్నారు అంటే ఆయన లంకలో లేరు కదాండి. లంకని చూడాలి అంటే లంకనుంచి
వేరుగా ఉంటేకదూ లంకని చూడ్డం, నేను ఈ మైకును ఎప్పుడు చూస్తాను నేను ఈ మైకు కన్నా
వేరుగా ఉంటే నేనే మైకైపోతే ఇంక మైకునేం చూడను. మైకుగా వేరుగా ఉండి మైకును
చూసినట్లు దీని కన్నా నేను
వేరుగా ఉంటే దీన్ని చూసినట్లు లంకకన్నా తాను వేరుగా ఉండి లంకను చూస్తున్నారు.
అంతే కదాండి! వెళ్ళింది అందుకేగా లంకను చూడడానికేగా అంటే ఇంకా లంకలో ప్రవేశించలేదు
బాహ్యార్థం. అంతరార్థం శరీరమును సాక్షిగా చూస్తున్నారు చూసినప్పుడు లంక ఎక్కడుంది
రెండు పర్వతాలు ఉన్నాయి అక్కడ నీలమ్ త్రికుటాచలం, కాని ఎక్కడుంటుందంటే లంకని
విశ్వకర్మ త్రికూటాచలం మీద పెట్టాడు, ఎందుకు త్రికూటాచలం మీద పెట్టాలంటే మనకు
ఉపనిషత్ లో ఒక మంత్రముంది పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం
విచిత్రం అని ఇదే బాలా త్రిపుర సుందరీ తత్వము అంటారు దీన్ని, త్రిపుర సుందరి
ఆవిడా త్రిపురాంతకుడు ఆయనా త్రిపుర సుందరీ త్రిపురాంతకులది అనాది నుంచి ఉన్న
దాంపత్యం.
అదొక గొప్ప శివతత్వం చాలా ఆశ్చర్యకమైన దాంపత్యము ఆవిడ త్రిపుర సుందరి ఆయన
త్రిపురాంతకుడు ఇది ఇప్పుడు త్రికూటాచలం మీద ఉంది పురత్రయే క్రీడతి యశ్చ జీవః
ఈ జీవుడు ఏం చేస్తుంటాడంటే పుర త్రయమునందు ఆడుకుంటాడు ఎప్పుడు. ఏమిటి పురత్రయం
అంటే? ఏమిటి త్రికూటాచలం అంటే నేను ఇనేళ్ళు బ్రతికున్నాను ఇన్నినాళ్ళు
బ్రతికున్నాను నేను ఇన్ని చేశాను అంటాడు కానీ... యదార్థమునకు వాడు అనుభవించిన
సుఖములన్నిటినీ కూడా మూడు అవస్తలకింద విభాగం చేసేసింది శాస్త్రం.
నాలుగోదాంట్లోకెళ్ళాడనుకోండి ʻతుర్యంలోకిʼ వెళ్ళిపోయారు,
నాలుగోదాంట్లోకెళ్ళితే జ్ఞానువు. నాలుగోదాంట్లోకి వెళ్ళడు కోట్ల కోట్ల కోట్ల కోట్ల
మంది ఈ మూడవస్తల్లోనే తిరుగుతారు ఏమిటా మూడవస్తలు ఇంద్రియములు లేచి జగత్తుతో తాదాత్మత పొందితే జాగ్రత్
అంటే కన్ను పనిచేస్తుందనుకోండి చూస్తాము చూసి ఆనందిస్తుంది ఏదో చూస్తుంది ఆ బాగుంది
చాలా బాగుందని ఉత్సాహపడిపోతుంది, చెవి లేచుందనుకోండి వింటూంటే ఆ ఎంత బాగుంది ఎంత
బాగుంది అని సంతోషిస్తాడు. కొంతమంది జాగృత్తిలో ఉన్నట్లుండి స్వప్నంలో ఉంటారు,
మీరు సభలోనే కొంతమంది ఇలా పడిపోతుంటాయి కళ్ళు అదేమిటీ పురాణంలోనే బాగా
పడిపోతుంటాయి కొంతమందికి అదే చిత్రం అందుకనీ... జాగృత్తి అంటే ఇంద్రియములు లేచి
ఉండడము లేచి ఉండి మీరు జగత్తుని అనుభవిస్తే జాగృత్తి, ఇంద్రియములలో ఉన్న శక్తినంతటినీ మనసు మూట కట్టుకునీ
ఇంకా తను కొన్నింటిని సృష్టిచేసి చూపిస్తే స్వప్నము.
కన్ను పనిచేయదు ఇంకా ఎందుకు ఇది కన్ను బడలిపోయింది కంటిలో ఉన్న శక్తిని మనసు
పుచ్చేసుకుంటుంది చెవి వినపడదు చెవిలో ఉన్న శక్తిని మనసు పుచ్చేసుకుంటుంది. మీరు
ఇలా ముట్టుకుంటే తెలియదు స్పర్షేంద్రియము యొక్క శక్తిని మనసు మూట కట్టుకుంటుంది.
నాలుక మీద తీసుకొచ్చి తిరుపతి లడ్డు ముక్కకి పెట్టినా తెలియదు దాన్ని
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
రుచిని చెప్పగలిగిన
సామర్థ్యాన్ని మనసు లాగేసుకుంటుంది. ఇలా ఐదు ఇంద్రుయముల యొక్క శక్తుల్నీ మనసు మూటకట్టుకుని
లాగేసుకుని ఆ మనసు ఏం చేస్తుందంటే కలను సృష్టిస్తుంది అంటే జాగృత్తిలో తాను ఏది
బాగా అనుభవించాడో దాన్నే స్వప్నంలో చూపిస్తుంది లేకపోతే తను ఎప్పుడూ మనసుతో ఏమీ
కోరుకుంటున్నాడో దాన్ని స్వప్నంలో చూపిస్తంది అందుకే గురువు ఎప్పుడు శిష్యున్ని
ఏమి అడగుతారంటే నీకు కలలేమొస్తుంటాయిరా అడుగుతుంటాడు అంటే కలని బట్టి అతని మనస్సు
ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు స్వప్నం మూడవది మనసు బడలిపోతుంది ఇంక
ఈ ఇంద్రియముల యొక్క శక్తిని తీసుకొని కాసేపు కల సృష్టించి చూపిస్తుంది ఆ తరువాత
ఇంక అది కూడా చేయలేకా అలసిపోతుంది అలసిపోయి ఈ ఐదు శక్తుల్నీ పట్టుకునీ మనసు
వెళ్ళిపోయి ఆత్మలోకి కలసిపోతుంది, ఇప్పుడు ఏముంటుంది ఏమీ ఉండదు. రమణ మహర్షి
మాటల్లో చెప్పాలంటే ఇంటి
ముందు కుక్క ఉండి ఇంటి యజమానిని పిలిచినట్లున్నది సషుప్తి అంటారు, ఎంత గొప్ప ఉపమానమండీ మహానుభావుంది
తుర్యావస్తలో ఉన్నవారు కాబట్టి చెప్పారు ఆ మాట, ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమానిని
పిలిచినట్లు ఇంటి యజమానికేం తెలియదు గాఢ నిద్రలో ఉన్నాడు, ఇప్పుడ మీరు ఆయనింట్లోకి
వెళ్ళినా ఎత్తుకుపోతున్నా ఆయన ఒంటిమీద ఉన్నవే తీసేసినా ఆయనకు తెలియదు కానీ ఆ ఇంటి
ముందు ఒక కుక్క తిరుగుతూంది, కుక్క తిరుగుతూంది కాబట్టి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి
బయటికి కుక్క తిరుగుతూంది కాబట్టి ఇంట్లో ఎవరో ఉన్నారని గుర్తు.
ఇంట్లో ఎవరు ఉన్నా ఇంట్లో ఎవరు లేకపోయినా యజమాని
తరపున తిరుగుతూంది కాబట్టి రక్షింపబడుతుందని గుర్తు ఇంకా ఉందని గుర్తు, అది
పాడుబడిపోయిందను గుర్తేమిటంటే ఇంక అక్కడ ఏమీ ఉండదు. ఊపిరి కుక్కలా తిరుగుతుంటుంది
లోపలా బయట లోపలా బయటికి ఈయన ఎక్కడున్నాడు ఆత్మయందు ఉన్నాడు ఏమీ తెలియవు అందుకే మీరు
చూడండీ ఆత్మగా ఉండిపోయాడనుకోండి సుఖం అదే శాంతి అందుకే మీరు చూడండి... ఏమిటో ఎంత ఇబ్బంది
పడిపోయానండి ఘాడ నిద్రపట్టిందని అని ఎవ్వడనడు, ఎంత హాయిగా ఉందండి నిద్రపట్టి
అంటాడు. ఆ హాయి ఏమిటంటే ఆత్మగా నిలబడిపోవడం కానీ అది మన ఎరుకలో ఉండదు, సషుప్తి
ఎరుక కాదు మన చేత తెలియబడేది కాదు నిద్రపోయే లాంటిది ఆత్మ ఒక్కటే ఉంటుంది. తురీయం
అంటే నాల్గవ దశలో మూడు దశల్నీ చూస్తారు, తాను అలా నిలబడి ఈ శరీరము నిద్రపోతుందనీ ఈశరీరము కలకంటూందనీ ఈ శరీరము
లేచి ఉందనీ దీని మూడు అవస్తల్నీ తాను చూస్తాడు తాను చూసి మూడు అవస్తల్నీ చెప్తే
నాలుగో అవస్తలో ఉన్నాడు అందుకనీ తురీయములో ఉన్నవాడు ఎవడో వాడే జ్ఞాని ఆ
స్థాయికి వెళ్ళగలిగినటువంటివాడు. ఇప్పుడూ స్వామి హనుమా అలా చూస్తున్నారు. పురత్రయే
క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం విచిత్రం ఈ మూడు అవస్తల్లోనే సమస్త
జీవకోటి తిరుగుతూంది, నాల్గవ అవస్తలోకి కానీ వెళ్లావో నీవు జ్ఞానివైపోయావని
గుర్తు. అలా కోట్ల కోట్ల మందిలో ఎవడో అంతర్ముకుడైనవాడు సాధనచేత ఆ స్తితిని
పొందుతాడు ఆ స్థితిని పొందేశాడనుకోండి అప్పుడు ఆయనా ఆత్మగా అంతటా వ్యాపించినటువంటి
ఒక్క ఆత్మగా, అత్మయేదో అది తానుగా ఎక్కడ ఏం జరుగుతుందో ఈయనికి తెలుస్తుంది అది విచిత్రం.
సిద్దులు శక్తులు అని మనకు లోకంలో ఓ మాట ఉంది కొన్ని సిద్దులొస్తాయండీ బాగా భక్తిగా ఉండే ఏవో కొన్ని సిద్దులు వస్తాయి
శక్తి వస్తాయి అంటూంటారు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
సిద్దులొస్తాయి అనుకుని సిద్దుల కొరకు వెంపర్లాడడం,
సిద్దుల్నీ అస్తమానం ప్రకటించడం అత్యంత హీనాతి హీనమైనటువంటి ప్రక్రియ నేను మీకు యదార్థం చెప్తున్నాను మీకు. ఎందుకో
తెలుసాండీ నేను శంకర భగవత్ పాదుల కింకరున్ని నేను ఆయన్ని నమ్ముకున్నవాన్ని, శంకర
భగవత్ పాదులు ఒకమాట చెప్తారు దక్షిణా మూర్తి స్తోత్రం చేప్తూ ఆఖర్న ఫలసృతి చెప్తూ
ఒకమాట చెప్పారాయన సర్వాత్మత్వమితి స్ఫటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ
శ్రవణాత్తదర్థ మననాద్థ్యానాస్చ సంక్షీర్తనాత్ ! సర్వాత్మత్వమహావిభూతి సహితం
స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్పునరష్టధా పిరిణతం చైశ్వర్య మహ్యహతమ్ !!
కొన్ని సిద్దులు వస్తాయి సత్యం తెలుస్తాయి కొందరికి విషయాలు కానీ మీరు వాటినిగాని
కోరుకున్నారనుకోండి, అవి
మిగులుతాయి మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది. హీనాతి హీనమైన సాధకుడిగా
నిలబడిపోతారు, ఏమిటి నీవు సాధించేది దానివల్ల ఏమీ ఉండదు, అది ఎటువంటిదో
శంకరాచార్యులవారు చెప్తే... సురేర్వరాచార్యులవారు అంటే మహానుభావుడు శృంగేరీ
పీఠానికి మొట్ట మొదటి పీఠాధిపతి ఆయన బండనమిశ్రురుడు కదాండి
సురేశ్వరాచార్యులయ్యారు, సురేశ్వరులు దానిమీద వార్తికం చేస్తూ దానిమీద ఒక ఉదాహరణ
చెప్పారు దానికి, ఒక భార్య భర్త మంచి చలిగాలిలో వచ్చాడు, వేడిగా ఒక్క రొట్టెవేసి పెట్టవోయ్
ఎముకలు కొరికేస్తుంది అన్నాడు, భార్య వెళ్ళి పొయ్యి వెలిగించి రొట్టెవేస్తుంది,
భర్తకి రొట్టె తయారుచేయడం ప్రధాన ప్రయోజనం, భర్తకి రొట్టె తయారుచేస్తున్నప్పుడు
పొయ్యి యొక్క మంట వలన సెగ తగలడం అంనుషంగిక ప్రయోజనం, సెగ తగులుతూంది వెచ్చగా ఉందికదాని
రొట్టెను పట్టించుకోలేదనుకోండి భార్య మాడి మసైపోతుంది రొట్టె భర్త తినడానికి ఏమీ
ఉండదు.
సిద్దులకోసం వెంపర్లాడినవాడు తన
రొట్టె తను కాల్చుకున్నవాడు, సిద్దుల్ని పక్కనపెట్టి తను తరించాలని
ప్రయత్నించినవాడు లోకాన్ని తరింపజేయగల సమర్థత యందు నిలబడినవాడు, అందుకే సిద్దులు ప్రకటించడమంత హేయమైన విషయం
ఏదీ ఉండదు. తపస్కులు జ్ఞానులు మహాపురుషులు అటువంటివాటి జోలికి వెళ్ళరు, శంకర భగవత్
పాదులు మాటలలో అయితే అది “కాకి రెట్టా” అన్నారు శంకరాచార్యులవారు ఇలా
తుడిచెయమన్నారు. సిద్ధి
కలిగితే మీకొక కొత్త విషయం తెలిస్తే దాన్ని ప్రకటించవద్దు... కాకి పెంట
దులిపినట్లు దులిపేసి ఈశ్వరుడివైపుకు అడుగులువేసై అని చెప్పారు. శాస్త్రాలు
అలా మాట్లాడాయి ఉన్న యదార్థాలు అవి. కాని ఇవ్వాళ మనం ఏమిటంటే శాస్త్రం ఏం కోణంలో
మాట్లాడిందో ఆ కోణంలో అర్థం చేసుకోగలిగిననటుంటి స్థితిని మనం అందుకోగలిగితే మనం ఒక
సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకున్నవాళ్ళం అవుతాం. కాబట్టి నేను రామాయణం చెప్తున్నాను
సుమాండీ..! ఆ విషయాన్ని మీరు గుర్తించుకోవలసి ఉంటుంది నేను ఏం మాట్లాడుతున్నానంటే
రామాయణం మాట్లాడుతున్నాను అంతే, కాబట్టి ఇప్పుడు స సాగరమ్ అనాధృష్యమ్ అతిక్రమ్య
మహాబలః ! త్రికూట శిఖరే లఙ్కాం స్థితాం స్వస్థో దదర్శ హ !! మూడు అవస్తలలో
ఉన్నటువంటి లంకని ఆయన చూస్తున్నారు. అంటే ఎవడు ఎన్ని ఏళ్ళు బ్రతకనివ్వండి 80
యేళ్ళు బ్రతకనివ్వండి 90 యేళ్ళు బ్రతకనివ్వండి 96 యేళ్ళు బ్రతకనివ్వండి ఏమిటి నీవు
సాధించింది అని అడిగారనుకోండి, నాల్గవ అవస్థలోకి వెళ్ళనంతకాలం వాడి జీవితంలో అనుభవించినవి మూడు అవస్థలే... అవి కుక్కవ్వచ్చు
పిల్లవ్వచ్చూ పందవ్వచ్చూ నక్కవ్వచ్చూ దోమవ్వచ్చూ మనిషవ్వచ్చూ ఎవడైనా కావచ్చు.
వాళ్ళు అనుభవించింది మాత్రం మూడే అవస్థయందు తిరుగుతాడు, ఈ మూడు అవస్తల్లో
తిరిగేటటువంటి వన్నీ కూడా శరీరంతో తాదాత్మతకత చెంది ఇదే నేనన్న చింతన, ఇది నేను కాదన్నవాడెవడో వాడు నాల్గో
అవస్తవైపుకి అడుగు పెట్టాడని గుర్తు. ఆ సాధన మొదలైతే ఇప్పుడు కాకపోతే
ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి ఈ జన్మలో కాకపోతే మీరు దగ్గరపడిపోయారని గుర్తు, ఏదో
ఒక జన్మలో అది లభిస్తుంది. ఒక్కోసారి హఠాత్తుగా ఏమౌతుందంటే అసలు గురువు లేకుండా
సాధ్యమౌతుంది అది. ఎందువల్ల సాధ్యమౌతుందంటే... గురువుగారు లేకుండా సాధ్యమౌతుందనికాదు
గురువుని పక్కన పెట్టినా సాధించచ్చని కాదు, గత జన్మలలో ఎక్కడో గొప్ప గురు సుశ్రూష చేసి గురువుగారి
దగ్గర కూర్చుని అదేపనిగా శాస్త్రాన్ని విని దానిమీద తాదాత్మకత విచ్చుకున్న కారణం
చేత జ్ఞానమావిర్భవించే సమయంలోపల ఈ శరీరం ప్రారబ్దవశాత్తు పడిపోతే... ఈ విన్న
వాసనాబలం జీవుడికి ఉండిపోతే తదనంతర జన్మలో ఏమౌతాడంటే ఒక్కొక్కసారి గురువుగారి
అవసరం కూడా లేకుండా తనంత తానుగా జ్ఞన విస్పోటనం జరుగుతుంది. అది అసాధారణంగా
జరుగుతుంటుంది. సాధారణంగా కష్టం అలాగ ఉన్నారు మహాత్ములు రామకృష్ణ పరమహంస ఆ కోవలోకి
వస్తారు. రామకృష్ణ పరమహంస కారణ జన్ముడు అందుకే, ఆయనా ఒక గురువుగారి దగ్గర వింటే
వచ్చినవికావు తనంతతాను భాషించినవవి ఆయన అలా పొందారంతే... అందుకే ఆయన అలా సమాధి
పొందేవారు ఆయన అలా దర్శనం చేసేవారు, ఆయన అలా మాట్లాడేవారు ఆయన ఇలా
చూస్తున్నట్లుండేవారు కానీ ఆయన చూపు ఎప్పుడూ కూడా మీరు ఆలోచిస్తున్నవి ఏవో ఆయనకి
తెలుసు, పరమహంసకి ఎలా తెలుస్తుందండీ అలాగ అదీ పరమహంస అంటే.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
పరమహంస అంటే జగత్తుని బ్రహ్మమును వేరు
చేసేస్తారు, వేరు చేసేసి బహ్మముగా తాను నిలబడుతాడు అప్పుడు అందరిలో ఉన్నది
బ్రహ్మమే కదాండీ... అందరిలో ఉన్న బ్రహ్మము తానైపోయినప్పుడు నీలో ఉన్నది నాకు
తెలియదాండీ తెలిసిపోదూ... తెలిసిపోతుందంతే కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది.
ఎందుకు తెలుస్తుందంటే తాను బ్రహ్మముగా నిలబడినప్పుడు లభించేటటువంటి అనుషంగిక
ప్రయోజనంగా తెలుస్తుందది. అందుకే మహాత్ములు జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయి
కానీ దాన్ని ఈశ్వరాభిముఖం చేస్తారు తప్పా... అన్య ప్రయోజనానికి వాడరు. రామకృష్ణ
పరమహంస కలకత్తాలో కాళికా దేవి ఆలయంలో కూర్చుని ఉంటే మహారాణి వచ్చింది ఓసారి, వచ్చి
ఆయన ఎప్పుడూ ఏదో పాట పాడుతుండేవారు సంతోషంగా నర్తకత్వం చేసేవారు, పాట పాడుతున్నారు
ఆవిడ పువ్వులు కడుతూంది కాళికాదేవికి దండ కడుతూంది. పాట పాడుతున్న పరమహంస ఒక్కసారి
కుర్చీ నుంచి కిందకి ధూకి రాణిని లాగి లెంపకాయ కొట్టారు, కొడితే ఆవిడకి తల
తిరిగిపోయింది, రాణిగారిని కొట్టారు ఏమి ఉపద్రవం వస్తుందోని హడలిపోయారు అందరూ అలా
ఎందుకు కొట్టారు అన్నారు, ఆయన కోపంతో ఊగిపోతూ అన్నారు, అమ్మకి దండ కడుతున్నావు
అమ్మకి దండకట్టేటప్పుడు ఇది అమ్మ మెడలో వేస్తే ఎంతపొడువస్తుందో పువ్వులు దగ్గరగా
ఉన్నాయా దీనిమీద ఉందా దృష్టి, ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్నవారు రేపుపొద్దున
నీదగ్గరకొస్తారు సభలోకి వాళ్ళకి మనం తీర్పు ఏం చెప్పొచ్చని ఆలోచిస్తున్నావు,
తీర్పు గురించి ఆలోచిస్తావేం దండకట్టేటప్పుడు దండ గురించి ఆలోచించవేం
దండకట్టేటప్పుడు అందుకు కొట్టానన్నారు ఆవిడ కాళ్ళమీద పడింది. మహానుభావా ఎంత గొప్ప
మాట చెప్పి నా బుద్ధి మార్చావయ్యా శరీరంతో చేయడం కాదు మనసుని కూడా అక్కడ పెట్టడం నేర్పారని వారు కారణ
జన్ములు, భగవాన్ రమణులకు కూడా గురువులేరు ఆయనకి భాషించింది అందుకే ఆయన
ఎప్పుడు చెప్పేవారు నాకు గురువు లేడన్నమాట పక్కనుంచండి నీకు గురువుండకూడదని నన్ను
మాత్రం అనుకరించకండి అని చెప్పేవాడు తప్పు జ్ఞానిని అనుకరించకూడదు, జ్ఞానిని
అనుకరించడమంత ప్రమాదం ఇక్కొకటి లేదు, ఎప్పుడూ అనుకరించకూడదు మీరైతే అప్పుడు అవ్వకుండా
మీరు ఆయన్ని ఇమిటేట్ చేస్తే మీకేమొస్తుంది, మీరుపెట్టుకుంటారా గోచి ఎందుకు భగవాన్
రమణులను అనుకరించడం, అయన స్థితిని పొందండి పొందిన తరువాత మీరేమౌతారో అప్పుడు మీ
గురించి ఉపన్యాసంలో చెప్పొచ్చు తప్పా. ఇప్పుడెందుకు అనుకరణ కాబట్టి మనం అజ్ఞానిని అనుసరించ కూడదు
జ్ఞానిని అనుకరించ కూడదు. అనుసరించడం వేరు అనుకరించడం వేరు అది జ్ఞాపకం
పెట్టుకోవాలి ఎప్పుడు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కనుకా హనుమా
సాక్షిగా చూస్తున్నారు ఆ లంకా పట్టణాన్ని అందుకే సుందర కాండ నడవదు స సాగరమ్
అనాధృష్మ్ అతిక్రమ్య మహాబలః ! త్రికూట శిఖరే లఙ్కాం స్థితాం స్వస్థో దదర్శ హ !!
ఆయనా ఆ లంకనీ లంక నుండి వేరుగా ఉండి యోగిగా దాన్ని చూస్తున్నారు, ఆ
లంకాపట్టాణాన్ని ఇది ఆంతరం సాధనా రహస్యం. బాహ్యం ఇంకా లంకలోకి వెళ్ళలేదు సముద్రపు
ఒడ్డున దిగి లంకా పట్టణాన్ని చూస్తున్నారు ఇప్పుడు మహర్షి అంటారూ యోజనానాం శతం
శ్రీమాం స్తీర్త్వాఽపి ఉత్తమవిక్రమః ! అనిశ్శ్వసన్ కపి స్తత్ర న
గ్లానిమ్ అధిగచ్ఛతి !! శతా న్యఽహం యోజనానాం క్రమేయం సుబహూ న్యఽపి ! కిం పునఋ
సాగరస్యఽన్తం సంఖ్యాతం శత యోజనమ్ !! ఆయన అంటున్నారూ నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చినా మధ్యలో
మైనాకున్ని కాదన్నా సురస నోట్లోకెళ్ళి బయటికి వచ్చినా సింహికని భంజించినా ఆయన
కనీసం అయ్య బాబోయ్ ఇంత కష్టపడ్డానని ఇంత అని నిట్టూర్పు విడవలేదు. అంటే మీరు
నిట్టూర్పు అన్నదాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి, నిట్టూర్పు అనేకమైనటుంటి వాటికి నిదర్శనం. హమ్మయ్యా
బయటపడ్డానురా బాబోయ్ ఎలాగోలాగా అన్నామనుకోండి ఊహ్ అంటారు లేదూ హూహ్ ఇది అయ్యేపనా
అనుకున్నారనుకోండి చిప్ అంటాడు. అది మీ మనసు చేసేసుకున్న నిర్ణయాన్ని వ్యక్తం
చేస్తుంది. ఆయన అలా అనలేదు అంటే ఆయనా అమ్మయ్యా ముందు ప్రయాణమైపోయింది
అనలేదు అంటే ఆయనకి అది శ్రమ అనిపించలేదు, అనిపించకపోతే ఒకెత్తు, ఇప్పుడు ఆయన అంటున్నారు
ఇలాంటి నూర్లు ఎన్నైనా గడచి వస్తా ఇదొక లెక్కా అన్నాడు వెనక్కి తిరిగి, దీనికి
నూరు యోజనాలని పేరా? ఇలాంటి నూర్లు ఎన్నైనా దాటొస్తానన్నాడు ఆయన ఇది బాహ్యంలో ఆయన
యొక్క పరాక్రమం.
అది మీరు సంతోషించవలసిన విషయం అది పొగడ్తాకాదు దాని గురించిన స్తోత్రం కాదు
అది ఆయనా శాపవిమోచనమైన తరువాత పొందినటువంటి గొప్ప స్థితి, నేను రామ కార్యం మీద
ఇలాంటివి ఎన్నైనా దాటొస్తాను కాబట్టి సీతామాత దర్శనం కూడా చెయ్యగలను, పట్టుదల
నిలబడుతుంది అదే సంతోషంతో ఉన్నారు. కాదు, ఆంతరంగము ఏమిటో తెలుసాండీ..! ఈశ్వర
కార్యానికి వెళ్ళేటప్పుడుకానీ, ఈశ్వర కార్యం అయిన తరువాత కానీ మీరు ప్రహృష్టవదన
శ్రీమాన్ ఎంతో సంతోషంతో వెళ్ళిపోవాలి తప్పా... బడలిపోయినట్లు ఏదో కష్టపడి
పూర్తి చేసినట్లూ అలా బరువుగా ఉండి వెళ్ళకూడదు చాలా సంతోషంగా వెళ్ళాలి ఆ ఇవ్వాళ ఈశ్వర కార్యం పూర్తి
చేశాము అబ్బబ్బా ఎంత సంతోషంగా ఉందండీ అని ఆనందంగా వెళ్ళగలిగాలి, అలా మీరు
వెళ్ళగలిగితే ఆ పనియందు పూనిక నిలబడిందీని గుర్తు సమధికోత్సాహము అంటారు చూశారా
అటువంటి ఉత్సాహంతో మీరున్నారు, ఇప్పుడు ఆయనా ఇంకా లంకా పట్టణం దాకా వెళ్ళకుండా
ముందు ఆ వనములలో ఒకసారి తిరిగారు శాద్వలాని చ నీలాని గన్ధవన్తి వనాని చ !
గండవన్తి చ మధ్యేన జాగామ నగవన్తి చ !! అక్కడా గొప్ప పచ్చగడ్డి బీళ్ళున్నాయి, ఆ
పచ్చగడ్డి మైదానాల్లో తిరిగారు చక్కటి రంగుతో సుగంధం వాటినుంచి వస్తూంది అంటే ఎవరు
వెడతారు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరు? వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు అందుకని ఆ చెట్లకు
ఉన్నటువంటి పువ్వుల నుంచి వస్తున్నటువంటి సువాసనలతో కూడుకున్నదై మధ్యలో పెద్ద
పెద్ద శిలలో కూడుకున్నదైనటువంటి ఆ లంకాపట్టణం బయట ఉన్నటువంటి వనములయందు స్వామి
విహరిస్తున్నారు, ఎంత ప్రత్యక్ష ప్రసారం చేస్తారో శాత్వికంగా సుందర కాండ
చదివేటప్పుడు మహర్షి శ్లోకంతోపాటు మిమ్మల్నీ కూడా తీసుకెల్ళిపోతారు. మీరు చూడండి
ప్రయాణము అని ఒకటుంటుంది, ప్రయాణమునందు ఉండేటటువంటి లక్షణమేమిటంటే మీకు విశ్వాసము
ఉండాలి దానియందు మీరు ఆలా మీరు బరువుని న్యాసం చెయ్యగలిగితే చాలు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఇప్పుడూ నేను ఇక్కడ
నుంచి కాకినాడ వెళ్ళిపోవాలనుకున్నరోజునా విజయవాడ వెళ్ళి రత్నాచల్ ఎక్సప్రెస్
ఎక్కాననుకోండి నేను కూర్చోవాలి కదా రత్నాచల్ ఎక్సప్రెస్ అని చూసుకుని కూర్చంటే
చాలు అంతేకాని గడి గడీకీనీ డ్రైవర్ ఎక్కడుంటాడండీ ఇది కాకినాడ వైపే వెళ్తుందాండీ
ఎటూ వెళ్ళపోవట్లేదు కదాండీని గార్డు దగ్గరికెళ్ళి ఏమండీ బాగానే వెళ్తుందాండీ మీరు
బాగానే తీసుకెళ్తున్నారాని మీరు ఎక్కడా మనం పట్టాలు మారిపోవట్లేదుకదాండీ అని
మీరేమీ అడగక్కరలేదు మీ బెర్తుమీద మీరు పడుకుంటే తెల్లవారేటప్పటికి మీరు తిరుపతి
వెళ్ళిపోతారు. ప్రయాణం అనగా నీవు ఆ సాధనములో చేరిపోయి మిమ్మల్ని మీరు మరిచిపోవడమే,
దానిమీద పూచి వదిలేయడమే, రామాయణం సుందర కాండ చదివేటప్పుడు అలా చదుకోవాలి, ఓ గంటలో
అయిపోతుందంటారాని చదవకూడదు మీరు అనుభవించాలి మీరు అనుభవించడమంటే మీరు ఆ శ్లోకాన్ని
చదువుతూ మీకు అబ్బాహ్ అనిపించిందనుకో మీరు కాసేపు కళ్ళు మూసుకొని హనుమ
తిరుగుతున్నటువంటి దాన్ని మీరు కాసేపు అనుభవించాలి, మహర్షి మిమ్మల్నీ
తీసుకెళ్తాడు, తీసుకెళ్ళడానికి మహర్షి సిద్ధంగా ఉన్నారు వాఙ్ఞ్మయ రూపంలో మీరు కూడా
సిద్ధంగా ఉండాలి అలా వెళ్ళడానికి అలా కాకుండా చదవడం దేనికీ అంటే చదవడం కోరకే అని
చదవారనుకోండి అంటే మీరు అనుభవించేదేమీ ఉండదు అందులో, అలాని అది నేనేమీ తప్పనను,
ఒకనాటికి అనుభవంలోకి తెస్తుంది అది తప్పకుండా. రామాయణం చదవడం అన్నది మంచిదే అసలు
చదవకుండా ఉండడం నేను ఎప్పుడూ నిరుత్సాహపరచను యూ స్టార్ట్ విత్ అంటారు చూశారూ...
మీరు మొదలంటూ పెట్టాలి కదా కాబట్టి శ్లోకాల వైభవం అలా ఉంటుంది హంస కారణ్డవా
కీర్ణా వాపీః పద్మోత్పలా యుతాః ! ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాం శ్చ జలాఽఽశయాన్ !! అక్కడా పెద్ద పెద్ద దిగుడు బావులున్నాయి
ఇప్పుడు ఈ దిగుడు బావుల యందు నీరు ఉంటుంది ఈ నీటియందు స్నానం చేయడానికి ఈ నీటిని
త్రాగడానికి కొన్ని జల పక్షులు అందులోకి వెళ్ళాయి.
హంసలు ఆ తరువాత కారండవములు మొదలైనటువంటి పక్షులు
ఆ కన్నెవీడ పిట్టలు ఇటువంటివన్నీ ఆ నీళ్ళలోకి నీళ్ళు త్రాగి రెక్కలు తడి చేసుకుని,
పక్షుల యొక్క స్నానం చాలా గమ్మత్తుగా ఉంటుంది అందుకే కాకి స్నానం రా వీడిదీ...
అంటారు. మంత్రం లేని స్నానం కాకి స్నానం. స్నానం బాహ్య అంతః రెండు సౌచములను
సిద్ధింపజేయాలి, కేవల బాహ్య సౌచము ఎప్పుడంటే మంచి సబ్బూ నీళ్ళూ చూసుకుంటే బాహ్య
సౌచము అంతః సౌచమూ అంటే మీరు ఇందాకా అన్నారే ఆయన త్రికూట శిఖరే లఙ్కాం స్థితాం
స్వస్థో దదర్శ హ అని మూడుగా అంటే స్థూల సూక్ష్మ కారణాలుగా మూడు శరీరాలు
ఉంటాయి. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరములు పైకి దొరకవు కానీ ఎప్పుడు మూడు శరీరాలతో
ఉంటాడు మనిషి. స్థూల అంటే పైకి కనపడేవి కాళ్ళు చేతులు అన్నీ కనపడుతుంటాయి, సూక్ష్మ
అంటే వెళ్ళుతుంది స్థూల శరీరంతో అక్కడ విడిపోయేదాన్ని సూక్ష్మ శరీరం అంటాము. అంటే
ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని కాకినాడ మా ఇంట్లోకి వెళ్ళి నా పూజా మందిరంలో నా
సింహాసనంలో ఎక్కడెక్కడ ఏయే మూర్తులు ఎక్కడున్నాయో నేను చూడగలను అని అన్నానుకోండి
నేను విడిపోయానన్నమాట నా శరీరనుంచి వెళ్ళిపోతాను మనసుతో వెళ్ళిపోతాను అలా మనసుతో
విడిపోగలిగినటువంటి ప్రజ్ఞ, అలా వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞకి సూక్ష్మ శరీరం
అంటారు. ఇది మీరు తిప్పడం మీద ఉంటుంది ఆ మనసుతోటే మీరు ఉత్తమ కార్యాలకు కూడా
వెళ్ళవచ్చు అధమ కార్యాలకు కూడా వెళ్ళవచ్చు ఎందుకంటే ఇక్కడ కూర్చుని అయ్యో అది ఎలా
ఉందో, అయ్యో అని సూక్ష్మ శరీరంతో చినిగిన సోఫా కూడా చూడచ్చు సింహాసనాన్ని చూడచ్చు
రెండు చూడచ్చు, దేన్ని చూస్తావన్నది నీ వివేకాన్ని బట్టి సమర్థతను బట్టి ఉంటుంది.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి సూక్ష్మ
శరీరం అంటే మనసు ఇంద్రియాలు, కారణ శరీరం అంటే ఈ రెండూ కూడా కాదు అది ఒక సుషుప్తిలో
తెలియబడుతుంది. కాబట్టి ఆ సుషుప్తిలో అనుభవించేది కారణ శరీరం కాబట్టి స్థూల సూక్ష్మ కారణ మూడు జాగృత్
స్వప్న సుషుప్తి మూడు అవస్థలు మూడిటిలో తిరిగే వీటన్నిటినీ చూడ్డం మూడు కాలములయందు
ఎప్పుడూ ఉండేది, భూత భవిష్యత్ వర్తమాన ఇప్పుడుండి కొన్నాళ్ళుంటుంది
కొన్నాళ్ళుంది, ఈ మూడు మీద తిరిగేవన్నీ త్రిపురసుందరీ తత్వము ఇదే త్రికూటాచలము మీద
ఉన్న లంక కాబట్టి ఇప్పుడు అక్కడేమున్నాయి దిగుడుబావులున్నాయి దిగుడు బావుల్లోకి
ఏవి వెళ్ళాయి పక్షులువెళ్ళాయి ఎందుకొచ్చారు ఆ విశయానికి స్నానం కాకి స్నానం
చెయ్యవద్దూ అంటే స్థూల శరీరమునకు కలిగిన తాప నివారణ జరగాలి సూక్ష్మ శరీరమునకు తాప
నివారణ జరగాలి కారణ శరీరమునకు తాప నివారణ జరగాలి మూడు తాపములు నివారణ అయితేకాని మీ
మనసు నిలబడదు ఈశ్వరుని దగ్గర అందుకని మూడు మాట్లు ఆచమనం చెయ్యాలి, ఓం కేశవాయ
స్వాహాః అది జుర్రకూడదు మినప గింజ మునిగినంత నీరు అమృత మార్గంలో పుచ్చుకుంటే ఆచమనం
కాబట్టి “ఓం కేశవాయ స్వాహాః ఓం నారాయనాయ స్వాహాః ఓం మాధవాయ స్వాహాః” అని
పుచ్చుకుంటారు. అసలు దాని యదార్థమైన తాత్పర్యమేమంటే... ఈ మూడు నామాలు ఆచమనం చేస్తూ
పైకి చెప్పాలి, అప్పటి వరకూ ఏదీ నోటితో పైకి మాట్లాడ కూడదు మనము అంటే
వాళ్ళేమనుకున్నారంటే ఎప్పుడూ లేవగానే స్నానం చేసి సంధ్యావందనానికి వెళ్తాడనుకున్నారు,
అంతేగాని కాఫీలు అవి తాగుతాడని వాళ్ళు అనుకుంటారా..? వాళ్ళు అలా అనుకోలేదు మనం అలా
అనుకుంటున్నాము ఇప్పుడు.
కాబట్టి సంధ్యావందనానికి వెడితే మొట్ట మొదట ఏం
చేస్తాడంటే ఓం కేశవాయ స్వాహాః అంటాడు. మీరు చూడండి కేశవా అంటే కే కే కే అన్నప్పుడూ
నాలుక ఇలా కొద్దిగా మడత పడుతుంది. కే కే కే అంటే పట్టుపడి, నా నా నా అన్నారనుకోండి
కంఠం దగ్గర నుండి వస్తుంది శబ్దం మా మా మా అన్నారనుకోండి పెదవుల నుండి వస్తుంది
శబ్దము. శబ్దము మూడు చోట్ల నుంచి వస్తుంది ఈ మూడు చోట్ల నుంచి వచ్చినప్పుడు
స్వరపేటికి ఇలా వెళ్తుంది. ఈ స్వరపేటికా బడలిపోతుంది, అది బడలిపోయి
పొడారిపోయిందనుకోండి శబ్దములు రావడం కష్టం. దాన్ని మీరు లేస్తూనే చాలా తడిపేసినా
చాలా ఎండ గట్టేసినా అది శక్తి క్షీణిస్తుంది. దాని శక్తి చాలా గొప్పగా ఉండాలంటే
లూబ్రికేషన్ అంటారు చూశారా కొద్దిగా నూనె వేస్తారు, అలా రాత్రి పడుకుని లేచిన
తరువాత ఆచమనమని మినుప గింజ మునిగినంత నీరు పుచ్చుకుని కే అన్నారనుకోండి అక్కడికి
వెళ్ళి తడుపుతుంది, నా అన్నారనుకోండి అక్కడికి వెళ్ళి తడుపుతుంది మా అన్నారనుకోండి
అక్కడికెళ్ళి తడుపుతుంది. మూడు రకాలుగానే అక్షరాలు పుట్టాలి అందుకనీ విష్ణు
సహస్త్రంలో అన్ని నామాలున్నా... ఆచమనానికి ఈ మూడు నామాలే పుచ్చుకున్నారు ఇదే
కారణం. శబ్దము ఉత్పత్తి అయ్యేచోట లూబ్రికేట్ చేస్తారు, లూబ్రికేట్ చేయడమంటే తైలము
చేత యంత్రాన్ని తడిపి పరిగెత్తించినట్టూ. అంత ఏదో తైలాభిషేకం చేయరుగదా దానికి
చిన్న చుక్క చుక్క వేస్తారు తిప్పుతూ అలా కంఠంలో శబ్దం ఎక్కడ పుట్టిందో మనిషికి
మనిషే మాట్లాడగలడు మనిషే తరించగలడు, ఆ మాట పోగొట్టుకోకుండా ఉండడానికి ముందు మాట
పుట్టిన స్థానాన్ని రక్షించుకుంటారు లేవగానే అది కూడా భగవన్ నామముతోనే రక్షిస్తారు
తప్పా మామూలుగా ఏదో నీళ్ళు పోయడాలు నిప్పులు పోయడాలు ఇలాంటి పిచ్చిపనులు చేయరు.
సనాతన ధర్మం అలా చెప్పింది అలా బతకమని చెప్పిందంతే ఈశ్వరాభిముఖుడవై బ్రతుకు అని
చెప్పింది.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
సరే, అందుకనీ
ఇప్పుడు మహర్షి అంటున్నారు హంస కారణ్డవా కీర్ణా వాపీః పద్మోత్పలా యుతాః ఆ జల పక్షులన్నీ కూడా దిగుడు బావులలోకి వెళ్ళి
తడిసి వస్తున్నాయి, ఆ పక్షులతో ఆ వనములన్నీ కూడా శోభిల్లు ఉన్నాయి ఆక్రీడాన్
వివిధాన్ రమ్యాన్ వివిధాం శ్చ జలాఽఽశయాన్ అక్కడా రమ్యమైనటువంటివి అన్ని ఋతువులలో ఉండేటటువంటివి అనేకములైన పుష్పములు
మొదలైనవి ఆ వనములలో కనపడుతున్నాయి, సంతతాన్ వివిధై ర్వృక్షైః సర్వర్తు ఫల
పుష్పితైః ! ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుఙ్జరః !! ఓ... ఎంతెంత పెద్ద పెద్ద
మాటలు వేస్తారో మహర్షి సంతతాన్ వివిధై ర్వృక్షైః అక్కడా అనేకమైన చెట్లు
ఉన్నాయి ఏం చేస్తాయవీ సర్వర్తు ఫల పుష్పతైః అన్ని ఋతువులలో రావలసినటువంటి
పళ్ళని పువ్వుల్నీ కాస్తాయి పూస్తాయి, ఉద్యానాని చ రమ్యాణి అక్కడున్న
ఉద్యాన వనములు చాలా రమ్యంగా ఉన్నాయి దదర్శ కపికుంఙ్ఞరః వాటిని ఏం
చేస్తున్నారు హనుమా చూస్తున్నారు. ఇది ఒక చిత్రమైన మాట కపి అన్నా చాలు కుంజరమన్నా
చాలు, కపికుఙ్ఞరః అన్నారు, కుంజరమంటే ఏనుగు కపి కుంజరః కపి అంటే కోతి,
ఏనుగు తన శరీరం వలన తను చాలా బరువైనటువంటి ప్రాణి లోకంలో ఏనుగంత బరువైన ప్రాణి
ఇంకోటి లేదు అందుకే ఏనుగు భూమికి చాలా తక్కువ ఎత్తు ఎగరగలదు, ఏనుగును
ఎగరమన్నామనుకోండి అదేం ఎగురుతుంది అది ఎగరదు ఎందుకంటే దాని ఒళ్ళే దానికి బరువు
ఎప్పుడూ ఎగిరేది ఎప్పుడూ తిరుగుతుండేది కోతి, కోతి ఎప్పుడూ ఒక చోట ఉండదు జ్ఞాని ఒక
చోట ఉండడానికి ఇష్టపడడు. లేదా ఇంకో చోటకి వెళ్ళడానికి అసలు ఇష్టపడడు. తనలోనే అన్నీ
అంటాడు, లేదా ఎప్పుడు తిరుగుతుంటారు ఎందుకు తిరుగుతారో తెలుసాండీ అలా తిరగకపోతే సంగమొస్తుంది,
సంఘము రాకుండా ఉండాలంటే
సన్యాసిని తిరుగుతూనే ఉండమని చెప్పింది శాస్త్రము.
ఎప్పుడూ తిరుగుతుండాలి సన్యాసి, సన్యాసి తిరగకపోతే బోధ ఎలా జరుగుతుంది మీకు
సన్యాసి తిరిగి తీరాలి తిరగకపోతే బోధ లేదు ఆగిపోతుంది అంతే, శంకర భగవత్ పాదులు
తిరిగారు మీరెవరు తిరగననడానికి ప్రతి సన్యాసి తిరిగాలి, సన్యాసి తిరుగుతాడు గృహస్తు
ఉండిపోతాడు, బ్రహ్మచారికి కట్టుబాటుంది, వానప్రస్తుకు కట్టుబాటుంది గృహస్తుకి
కట్టుబాటుంది సన్యాసికి కట్టుబాటు లేదు, తిరుగుతాడు అందుకే శంకర భగవత్ పాదులు ఈ
మూడు ఆశ్రమాలు ఉంచుకోలేదు, బ్రహ్మ చర్యంలో ఉండిపోయి బోధ చేయలేదు గృహస్తుగా ఉండి
బోధ చేయలేదు వానప్రస్తుగా బోధ చేయలేదు, సన్యాసిగా బోధ చేశారు ఎందుకో తెలుసాండి...
సన్యాసికి ధర్మ మొకటుంది తిరగడం తిరగచ్చు సన్యాసి తప్పా, గృహస్తు అలా
ఇష్టమొచ్చినట్లు తిరిగ కూడదు, తన భార్యా బిడ్డాలు తన వ్యవహారములు అవి తను చూసుకుంటుండాలి,
ఒక ఆశ్రమంలో ఉండి ఇంకొక ఆశ్రమంలో ఉన్నట్లు బ్రతక కూడదు అంటే నూవ్వు నలభై రెండు
రోజులు ఎందుకు తిరుగుతున్నావు గుంటూరులో అనకండి అడక్కండి నేను ఎప్పుడో ఒక్కసారి
వచ్చాను అంతే నేను ఇదే పనిగా అస్తమానం తిరుగుతుంటావని అనుకోకండి, కాబట్టి
ఎందుకంటున్నానంటే ఇవ్వాళ అలా ఇంటికెళ్ళి తిరగ్గలిగినవారు ఉన్నారు సభలో అందుకని
ముందు జాగ్రత్త చర్యగా కావాలని చెప్తున్నాను. హంస కారణ్డవా కీర్ణా వాపీః పద్మోత్పలా యుతాః !
ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాం శ్చ జలాఽఽశయాన్ !! సంతతాన్ వివిధై ర్వృక్షైః సర్వర్తు ఫల పుష్పితైః ! ఉద్యానాని చ రమ్యాణి
దదర్శ కపికుఙ్జరః !! ఎగరలేని ఏనుగు తిరగ గలిగిన కోతి తాను బ్రహ్మమును
అనుభవించి ఆ బ్రహ్మమును చెప్పడానికి వచ్చిన మహర్షి స్వరూపుడు ఆయన ఇవ్వాళ హనుమ, ఆయన
సుందర కాండలో ఇలా ఉండకపోతే మీకు నాకు ఈ సాధనా రహస్యాలు అవగతం కావు కథా అంతర్గతంగా,
మధుర మధురమైన కథలతో సాధనా రహస్యాన్ని దాచి చెప్తున్నారు హనుమ.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇదే మీరు బాహ్యంలో చూశారనుకోండి అసలు తాపమును
కలిగించేవి ఇక్కడే ఉంటాయి తాపోప శాంతిని కలిగించేవి ఇక్కడే ఉంటాయి అంతే తేడా.
లడ్డూ తినాలి ఒక కోరిక అమ్మ బాబోయ్ లడ్డు తినాలి లడ్డు తినాలి తపించిపోయాడు.
ఇప్పుడు లడ్డూ తినాలన్న కోరిక ఎక్కడ పుట్టింది ఇక్కడ పుట్టింది లడ్డూ తినేశాను ఈ
తృప్తి ఇక్కడ తీరింది ఇక్కడే తీరింది, లడ్డూ ఇలా పట్టుకున్నాననుకోండి తీరిపోతుందా,
ఇలా నాలుక దగ్గర పెట్టారనుకోండి తీరిపోతుందా, నాలుక మీద పెట్టి నమిలి మింగేసి మంచి
నీళ్ళు తాగేశారనుకోండి లడ్డూ తినేశానంటారు. తృప్తి ఇక్కడే తాపము ఇక్కడే దిగుడు
బావి ఇక్కడే, ఇక్కడే ఉద్యానవనము కోర్కె పుట్టేది ఇక్కడే ఆ పళ్ళు తినేది ఇక్కడే బత్తాయి
పళ్ళు బయటుండవు ఇక్కడే ఉంటాయి తినాలన్న రుచి, ఆపిల్ పండు బయట ఉండదు ఇక్కడే
ఉంటుంది. ఆపిల్ పండు తినాలన్న కోరికతో విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం
నిజాంతర్గతం నీలోనే విశ్వమంతా అంటారు శంకర భగవత్ పాదలు, కాబట్టి !! సంతతాన్
వివిధై ర్వృక్షైః సర్వర్తు ఫల పుష్పితైః ! ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుఙ్జరః
!! సీతాఽపహరణాఽర్థేన రావణేన సురక్షితామ్ ! సమన్తాత్ విచదర్భి శ్చ రాక్షసైః ఉగ్ర
ధన్విభిః !! సీతాఽపహరణాఽర్థేన రావణేన సురక్షితామ్ రావణుడుకి అసలు మామూలుగానే
భయమెక్కువ ఎందుకనీ అంటే తెల్లవార లేస్తే ఎవడి మీదకు యుద్ధానికి వెళ్ళాలని
చూస్తుంటాడు, కారణం ఉండదు కారణం లేకుండా యుద్ధం చేస్తుంటాడు అందరి మీద, ఒట్టి
పొగరు ఇప్పుడు అతనికి మరీ భయం ఎందుకంటే సీతమ్మని అపహరించి తెచ్చాడు, సీతమ్మని
అపహరించి తెచ్చినవాడు సీతమ్మతో ఏమని చెప్తుంటాడు రాముడు ఎంతటివాడు అంటాడు, రాముడు
ఎంతటివాడు అంటున్నవాడు రాముడు ఉండగా ఎందుకు తేలేదు ఇదే ఆవిడ అడిగింది అడిగితే
కోపమొచ్చింది.
లోకంలో ఒక మాటుంది కోపం శేషేణ
పూరయత్ నీవు జవాబు చెప్పలేకపోయినప్పుడు కోప్పడిపోతే సరిపోతుంది అంతే...
కాబట్టి తను జవాబు
చెప్పలేకపోయినప్పుడు తను ధర్మంలో లేనని చెప్పి క్షమార్పణ చెప్పి తప్పు
దిద్దుకున్నవాడు మహాత్ముడు, కోప్పడి తప్పుకున్నవాడు దురాత్ముడు అంతే తేడా...
కదాండీ, కాబట్టి ఇప్పుడు రావణుడు ఏం చేస్తుంటాడంటే సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా
ఆ రాముడు నరుడు ఆయనేం వస్తాడు రాలేడు అంటాడు తను లోపల ఏమనుకుంటాడంటే సీతమ్మను
తెచ్చాను కాబట్టి వచ్చేస్తాడు, ఖాయంగా వస్తాడు సముద్రమేమిటీ ఏదైనా దాటివచ్చేస్తాడు
ఆయన ఎప్పుడొస్తాడో మనకు తెలుస్తుందా ఏమిటి ఎప్పుడొస్తాడో పంపించాడు ఎనమండుగురు
గూఢచారుల్ని కానీ వాళ్ళేం పట్టుకోలేరు వచ్చేస్తాడు రాముడు, రాముడు వచ్చేస్తాడని
లోపల అంత నమ్మకం రాముడు రాడని పైకి చెప్తుంటాడు అంటే త్రికరణశుద్ధి లేనివాడు
రావణుడు. త్రికరణశుద్ధి ఉన్నవాడు రాముడు కాబట్టి ఇప్పుడు ఆయనేం చేశాడు సీతాపహరణం
చేసి సీతాఽపహరణాఽర్థేన రావణేన సురక్షితామ్ నేను సీతమ్మని అపహరించి
తీసుకొచ్చానన్న భయంచేతా మరింత ఎక్కువగా సైన్యాన్ని మోహరించాడు. కాబట్టి ఇప్పుడు
అక్కడ ఉన్నటువాళ్ళందరు కూడా చాలా జాగ్రత్తగా విచ్చుకత్తులు పట్టుకుని కాపలా
కాస్తున్నారు ఎప్పుడు హఠాత్తుగా వచ్చేస్తాడో రాముడని కాఙ్చనేనాఽఽవృతాం రమ్యాం
ప్రాకారేణ మహా పురీమ్ ! గ్రహై శ్చ గ్రహ సంకాశైః శారదాంబుద సన్నిభైః !! శారదాంబు అంబు
అంటే మేఘము తెల్లటి మేఘాల గుంపులు ఎలా ఉంటాయో లంకా పట్టణం బయట నుంచి
కనపడుతున్నటువంటి పెద్ద పెద్ద భవంతుల యొక్క సమూహాలు అలా ఉన్నాయి.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
అంటే అంతంత పెద్ద పెద్ద మేడలు అన్నీ కూడా బంగారంతో తాపడం చేయబడి ఉన్నాయి తోరణైః
కాఙ్చనై ర్దివ్యైః లతా పంక్తి విచిత్రితైః ! దదర్శ హనుమాన్ లఙ్కాం దివి దేవ పురీమ్
ఇవ !! అక్కడ తోరణములన్నీ కూడా బంగారముతో ఉన్నాయి బంగారముతో చేయబడినటువంటి లతలు
వాటిమీద చెక్కబడి ఉన్నాయి, మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి చాలా గొప్పగా తలుపు మీద
కొయ్యతో చెక్కితేనే అబ్బొ ఎంత బాగుందండీ ఎంత బాగుందండీ ఎలా చెక్కించారండీ అంటాం
మనం అటువంటిది వాడు ఏం చేశాడంటే తప్తమై కరిగించినటువంటి బంగారంతోటి మొత్తం ఒకటీ
రెండు కాదు అక్కడ ఉన్న ప్రాసాదములు హర్మములు అన్నిటిమీదా కూడా లతలు పువ్వులు పళ్ళు
పందిళ్ళు బంగారముతో చెక్కారు, తోరణములన్నీ కూడా బంగారముతో చెక్కారు అరుగులన్నీ
బంగారముతో తయారు చేయబడ్డాయి అంటే అసలు ఆ లంక ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. పాలితాం
రాక్షసేన్ద్రేణ నిర్మితాం విశ్వకర్మణా ! ప్లవమానామ్ ఇవాఽఽకాశే దదర్శ హనుమాన్
పురీమ్ !! ఎంత పెద్ద శ్లోకమండి ఇదీ పాలితాం రాక్షసేన్ద్రేణ
రాక్షసేంద్రుడి చేత పరిపాలించబడుతూంది కానీ... ఆయనంది మాత్రం కాదు, నిర్మితాం
విశ్వకర్మణా విశ్వకర్మ నిర్మించాడు దాన్ని కాబట్టి ఇది ఎవరిది అంటే ఎవరు
నిర్మించారో వారిది అని చెప్పలి, కదాండీ! న్యాయమేమిటీ ఇప్పుడు ఓ ఇల్లు నేను
కట్టుకున్నాననుకోండి కట్టుకుంటే ఏమంటారు ఆ ఇల్లు నాదండంటారు కదా... ఆ ఇంట్లో
అద్దెకు వచ్చారనుకోండి అద్దెకొచ్చి ఈ ఇల్లు నాదండి అన్నారనుకోండి తప్పుకదా.
అలా అనకూడదు ఆ ఇంటాయనకి తెలిసిందనుకోండి నాదీ అంటూన్నాడంటాండీ మునిస్పల్ ఆఫీసుకెళ్లి ట్యాక్స్ రిసీట్ కూడా
నాపేరు మీదే కట్టుకుంటానండీ పేరు మార్చేందుకు అప్లికేషన్ పెట్టుకున్నాడండీ అంటే
ఖాలీ చేయించడూ... అద్దెకున్నవాడు అద్దెకున్నట్లు ఉండాలి, ఆయన పేరుమీది టాక్స్
రిషీట్ పుచ్చుకోవాలి కానీ ఆయన పేరు మీద బిల్లు కట్టాలి కానీ కట్టేవాన్ని నేనని నీ
పేరుమీద కట్టేసుకుంటే ప్రమాదం రాదాండీ... ఆపాటిదాన్నే మనం అంగీకరించం అదేంటండీ
మాఇల్లండీ అద్దెకిచ్చామండీ అని అనమా? అమ్మగారు పడుకున్నారు ఒట్లో బాగాలేదు, ఒకసారి
చూసి వెళ్ళిపోతాను మళ్ళీ రెండు మూడు నెలల వరకు రానుకదా ఇటువైపు అని చెప్పి నీ
ఇల్లు నీవు చూసుకుంటావే... మరి ఇదెవరు నిర్మించారు, నీవు నిర్మించుకోలేదు అంతవరకు
తెలుసు, నీవు తేలేదుగా ఇప్పుడూ ఇది నా ఇల్లైతే ప్లింట్ బీమ్ ఇంతైందండీ ఫౌండేషన్ʼకి ఎంతైందండీ లోపలి శేషం పిల్లర్ శేషం ఇంత స్టీలు వాడాం
సిమెంటు ఇంత చెప్తాము, ఇందులో ఎన్ని ఎముకలున్నాయి మనకు తెలియదండీ మనమేం కొని
తెచ్చిపెట్టుకోలేదు ఇందులో ఎన్ని కీళ్ళున్నాయి ఎన్ని నరాలున్నాయి ఎన్ని
నాడులున్నాయ్ రక్తం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ప్రసరిస్తోంది కాలిపోని మోటారు ఒకటి పెట్టాడాయన
మన మోటార్లైతై దిక్కుమాలిన మోటార్లు 12 గంటలు పని
చేస్తాయి ఎక్కవేస్తే కాలిపోతాయి.
ఆయన పెట్టిన మోటారు అరికాలు
దగ్గర్నుంచి తల వరకు సన్నని రక్తనాళిక కేశం నుంచి ఇంత లావున్న శిరలు ధమనుల్లోంచి
రక్తాన్ని ఒకే వేగంతో నడిపిస్తోంది. కొద్దిగా ఎక్కువైతే కళ్ళు తిరుగుతాయి,
కొద్దిగా తక్కువైతే కిందపడిపోతాడు లో బిపి హై బిపి రెండూ లేకుండా రక్తాన్ని
తిప్పుతున్నాడు. రాత్రి నీవు నాలుక మీద రుచి తిని పడుకుంటే ఆయన తెలివిగా ఉండి
ఆయనేమో జీర్ణం చేస్తున్నాడు, తెల్లవారేటప్పటికి పిప్పిని బయటికి పంపిస్తున్నాడు.
నిజంగా ఒక్క పిసరు ఇలా చర్మం కాని ఉత్తరించుక పోయిందనుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది
మీరు చూడండి, ముందు ఎర్రగా ఉండి లోపల ఆ మాంసం కనపడి ఎముకలు కనపడిందనుకోండి
చూసేటటువంటివాళ్ళకు భయమేస్తుంది అయ్యోబోబోయ్ ఎలా ఉందో ఆ దెబ్బతగిలి ఈడ్చుకుపోయి
ఎలా కొట్టుకుపోయిందో ఆయనకు అంటారు, వెంటనే కట్టు కట్టేస్తారు మళ్ళీ సర్వేశ్వరుడు ఆనుగ్రహించినవాడు
కనుకా ఆయన మళ్ళీ చర్మం ఇస్తాడు, మళ్ళీ మాంసం ఇస్తాడు మళ్ళీ కలుపుతాడు. ఆయనా అసలు
వైద్యుడు. ఒక్క పిసర ఇలా రేగిందనుకోండి ఎన్ని రుషణాలో ఈగలో ఎన్ని చీమలో వచ్చి వాలి
తినేస్తాయి. అటువంటిది ఇందులో ఆయన ఏడు పదార్థములు పెట్టాడు “చర్మము రక్తము మాంసం
కొవ్వు అస్తి శుక్ల మేథ” మీరు కొద్దిగా పళ్ళ ముక్కల్లాంటివి ఏదైనా కోసేసి ఓ
గిన్నెలో పెట్టి మూత పెట్టేసేసి అలా ఉంచి మర్నాడు పెసర పప్పులాంటిదో పచ్చడిలాంటిదో
చేసేసి ఆ పచ్చడి కాస్త అన్నంలో కలిపేసేసి మూత పెట్టేసేసి ఓ పన్నెండు గంటల పోయిన
తరువాత చూడండి ఎంత పుల్లటి కంపు వస్తుందో ఇందులోకి ఎన్ని పడేస్తున్నాం పడేసినా ఆయన
నిజంగా మహానుభావుడు అగ్నిహోత్రంతోటి దీన్నంతటినీ కాల్చుతూ ఇక్కడ లోపల జ్వాల పెట్టి
ఇందులో ఏ విధమైన క్రిములు పుట్టకుండా చేస్తున్నాడు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
లోపలికి వెళ్ళిన సూక్ష్మ క్రిములను చంపడానికి మళ్ళీ కొన్ని
రసాయనాలను విడుదల చేస్తూ ఎంత నిజంగా వ్యవస్థ ఎటువంటి వ్యవస్థ, మనం స్టెప్నీ టైరు
పెట్టుకున్నామని మనం అంటాం ఓ టైర్ పంక్చర్ అయిపోతే ఇంకో టైర్ ఉంటుందని, ఓ కాలు
విరిచేసుకుంటాడేమో నని రెండు కాళ్ళు ఇచ్చాడాయన కనీసం కుంటు కుంటూ వెళ్తాడని వీడకి
చాలా ముఖ్యం పాపం ఒక్క కన్ను పెడితే ఏం బాగుంటుందని రెండు కళ్ళు పెట్టాడు, ఒక
కంట్లో నలుసు పడితే ఇంకో కన్నుతో
చూస్తాడని, రెండు చెవులిచ్చాడు ఒక చెవిలో అస్తమానం ఏదో పుల్లెట్టి
గెలుకుతుంటాడు ఓ చెవిలో దూది పెడితే ఇంకో చెవితోనైనా వింటాడని, సెల్ ఫోన్
పెట్టుకోవాలిగదామరి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సహజ కవచ కుండలాలు లాంటివి ఒక
చెవితో దూది పడితే ఒక చెవితోనైనా వింటాడని రెండవ చెవి పెట్టాడు ఇన్ని పెడితే
ఎందుకైనా మంచిదని ఒక్కదాంతో ఇచ్చినది మనకు పనికొస్తుంది ఆ నోరు ఎంత విచిత్రం
చూడండి. ఇది ఆయన నిర్మించాడు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాడు. అసలు పూజా మందిరంలోకి
వెళ్ళి కూర్చున్నప్పుడు ఈశ్వరా ఎంత గొప్ప నిర్మాణం చేశావయ్యాదీన్ని దీనికి
నిద్రిస్తావు దీనికి అన్నం పెడతావ్ దీనికి పచనం చేశావు దీనికి ఇంత కీర్చినిచ్చావు
దీంట్లోంచి మాట్లాడుతావు వీడు రామాయణం చెప్పాడని కీర్తి నాకు కట్టుపెడతావ్ ఎంత
మహోదరుడవయ్యా అన్న మాట ప్రాణం పోయినా అనడు, ఇలా అంటాడు ఎమిటి వీడి బుర్రా.
గుండె నీవు తెచ్చుకున్నావా మూత్ర
పిండాలు నీవు తెచ్చుకున్నావా నీవు తిన్న
దాంట్లోంచి బ్యాక్టిరియాస్ కొద్దిగా ఉత్పన్నమై వాల్ ఫంక్షనింగ్ʼకి వచ్చి అదికానీ ఏంఙ్జైన్ ను రిలీజ్ చెయ్యకపోతే అయిపోయింది
అంతే యూ ఆర్ ఎ డయాబిటిక్ పేషెంట్ కదాండి. ఈశ్వరుడు ఎంత స్వీటు నీవు తిన్నా దానికి
తగినంత రిలీజ్ చేస్తున్నాడు బ్యాక్టిరియా నుంచి ఎంత వంన్డర్ʼఫుల్ ఇన్టిట్యూషన్ʼనండిదీ అంత దీన్ని మించిన ఇన్టిష్ట్యూషన్ లోకంలో ఎక్కడుంది అసలు లోకంలో
ఎటువంటి జాయింట్స్ ఒకడికి పెట్టాలి కాబట్టి ఇలా వంగెట్టు చేశారు మామూలుగానే ఇలా
అహంకారంగానే ఉంటున్నాడు ఇలా బాగా ఇటువైపు వెనక్కి వెళ్ళితే ఎన్ని చేస్తాడోని
వెనక్కి చూడకుండా చేశాడు ఇలా పెట్టడానికి ఇలా తిప్పేట్టు చూశాడు అయినా ఇన్ని
దాచేస్తున్నాడు వీడు, ఈశ్వరుడు ఎంత గొప్ప సృష్టి చేశాడండి మహానుభావుడు పాలితాం
రాక్షసేన్ద్రేన ఇది ఆయన్నంది అంటారు ఎందుకూ పాలితాం రాక్షసేన్ద్రేన అంటే
నేను మీ గురించి చెప్పట్లేదు మీరు మహా ప్రాజ్ఞులు అందుకు కదాండీ కింద కూర్చుని
రామాయణం వింటున్నారూ... ఎంత వేడిగా ఉందో ఆ తల్లులైతే అసలు పరదా కూడా లేదు కింద
కూర్చుని వింటున్నారంటే ఎంత పూనికగా ఉన్నారో ఇంత వేదికమీద ఓ ఫ్యాని అది ఆగిపోతే
కోపము ఇన్ని మల్లెపూల దండలు సువాసనలు ఓ పుస్తకము ఇంత అల్లరి ఇన్ని ఎర్పాట్లు ఇంత
గౌరవము ఇన్ని నమస్కారాలు చేస్తే నాలుగు ముక్కలు చెప్పిన
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
నాదా కష్టం ఓర్చి విన్న మీరా గొప్పవాళ్ళు నేనా... మీరు గొప్పవాళ్ళు పాలితాం
రాక్షసేన్ద్రేణ నేను నేను అని ఇలా చూపిస్తాడు. వాడిది వైభవమంతా నిర్మాణం
చేశాడు ఈ భావన నీకు కలిగిన ఉత్తర క్షణంలో నీవు కృతజ్ఞత చెప్పకుండా నీవు ఎలా
ఉండగలవు నాకు చెప్పండి. ఎప్పుడో నీకో సారి వాడు ఓ బెర్తిప్పిచ్చాడా వాడు
కనపడినప్పుడల్లా సార్ మీరు నాలుగురోజుల క్రితం బెర్తిప్పిచ్చారు కాబట్టి నేను
వెళ్ళగలిగాను బాబూ... లేకపోతే ఎంత ఇబ్బందిపడిపోదునో థ్యాంకూ సార్ థ్యాంకూ సార్ అని
ఇలా ఊపేస్తావే, మరి ఇది ఇచ్చినవాడికి ఏం చెప్పావు థ్యాంక్సు, ఎప్పుడూ మెకానికల్
థ్యంక్సే, ఆయన దగ్గరికెళ్ళి హృదయ పూర్వకంగా చెప్పేటటువంటి కృతజ్ఞత ఎన్నడూ ఉండదు.
పరమానందంగా ఈశ్వరా ఏమిచ్చావయ్యా నిన్నటి రోజున ఎన్ని చూపిచ్చావు ఎన్ని
అనుభవింపజేశావు ఎంత వైభవం నాకు కృప చేశావు నాచేత గంధం తీయించి నీవు రాసుకున్నావా
తండ్రీ! ఎంత అనుగ్రహించావయ్యా అని సంతోషంగా ఆయన దగ్గరికెళ్ళి పరమానందంతో మాట్లాడినటువంటి
సందర్భమేదీ, అలా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉంటే... ఇది ఎవడు నిర్మించాడో నీవు
ఊహించగలిగితే చాలు.
అందుకే అందుకు కదాండి వాళ్ళు
జగద్గురువులయ్యారు, సామాన్యుడి స్థాయికి దిగిపోయి, ఇటువైపుకి తిప్పారు
శంకరాచార్యులవారు కా తే కాంతా పిచ్చెక్కిపోతున్నావు భార్య భార్యని ఎవరావిడ
ఎక్కడ్నుంచి వచ్చింది, కస్తే పుత్రః ఆ మా ఆవిడ సంగతి నాకేం తెలుసండీ మా
అత్తగారిని మామ గారిని అడగాలి వాళ్ళతో మాటలు లేవుమాకు అందుకు అడగం. అందులో
అదోటుంటుంది లోకంలో తేరగా దొరికేవాళ్ళెవరంటే వాళ్ళే, వాళ్ళతో మాట్లు మానేయచ్చు కస్తే
పుత్రః కొడుకెవరు? పోనీ మీ అబ్బాయేకదా తెలియాలికదా ఎక్కడ్నుంచి
వచ్చాడో, ఆ కొడుకు ఎక్కడ్నుంచి వచ్చాడో? నీవు తీసుకొచ్చి పెట్టావా వాడికి కాళ్ళు
చేతులు గోళ్ళు నీవేమైనా పెట్టావా వాడికి గుండెకాయి, నీవేం పెట్టలేదుగా మరి
ఎక్కడనుంచివచ్చాడు, నీ కొడుకు నీ కొడుకు అని నీవంటున్నావ్ వాడు ఎక్కడ్నుంచి
వచ్చాడో? ఎవరు తయారు చేశారో ఎప్పుడైనా అడిగావా? కా తే కాంత స్తే పుత్రః సంసారోఽయమతీవ
విచిత్రః ఈ పెళ్ళాన్ని ఈ కొడుకుని పట్టుకుని సంసారాన్ని పట్టుకుని ఎందుకు
తిరుగుతున్నావు ఇంకా విచిత్రం కదూ..! కస్య త్వం నీవెవరు? కుత ఆయాతః ఎక్కడ్నుంచి
వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చాను, మీ అమ్మాగారి కడుపులోంచి
ఎక్కడ్నుంచి వచ్చావు, ఎవరు పెట్టారు ఇవన్నీ మీ అమ్మగారు పెట్టారా పోనీ ఎవరు తయారు
చేశారు ఇవన్నీ వాడెవడో అని ఎప్పుడైనా ఆలోచించావా..? తత్త్వం చింతయ తదిహ భ్రాతః
ఓ తమ్ముడా! ఆలోచించవోయ్! ఏమి శంకర భగవత్ పాదులండీ..! ఆయన ఖర్మా మనల్ని పట్టుకుని
తమ్ముడా అని పిలవవలసిన ఆయనకి.
అలా అంటే కొంచెం ప్రేమగా పిలిస్తే
కాస్త ఆలోచిస్తాడేమో, ఆలోచిస్తే కొంచెం కృతజ్ఞత చూపిస్తాడేమో, చూపిస్తే
ఈశ్వరానుగ్రహం పొందుతాడేమో, పొందితే బాగుపడుతాడేమో వాడు బాగు పడ్డం కన్నా నాకు
ఇంకేం కావాలి పోతే పోయిందిలే తమ్ముడా అంటే వచ్చే నష్టమేమిటీ అందుకే మూర్ఖ మూఢః
అంటూ మొదలెట్టినాయన భ్రాతః అన్నారు మధ్యలో ఎంత ఉదారులు చూడండి మహానుభావులు శంకరులు.
శంకరులంటే శంకరులే వారికి నమస్కరించడం వినా మనమేం చేయగలం కాబట్టి పాలితాం
రాక్షసేన్ద్రేణ నిర్మితాం విశ్వకర్మణా ! ప్లవమానామ్ ఇవాఽఽకాశే దదర్శ హనుమాన్
పురీమ్ !! కథా పరంగా చూస్తే... వీడి ఢాబు వీడిది అంటున్నాడు లంక కానీ అసలు
వీడిది కాదు లంక విశ్వకర్మ నిర్మించాడు, కుబేరుకిచ్చాడు
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
విశ్రవసో
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
బ్రహ్మ, ఆయన్ని తరిమికొట్టి వీడు పుచ్చుకున్నాడు,
తరిమికొట్టి తెచ్చుకున్నది దొంగ తనంగా తెచ్చుకున్న సొత్తు తప్పా, వీడి సొత్త కానే
కాదు వీడు సొత్త కానిది వీడు సొత్తని వీడిది లంకని చెప్పుకుని తిరుగుతున్నాడు ఎంత
డాబురా వీడిది కృతఘ్నుడు కదురా వీడూ... అక్కడ రావణుడు అనుకోకండి రావణ కాష్టం రగులుతూంటుంది అని
ఎందుకన్నానంటే రావణ తత్వమును నిర్మూలింపబడాలి మనయందు, సుందర కాండ వింటే
ఏమౌతుందంటే రామానుగ్రహం కలుగుతుంది. సీతమ్మ తల్లి అనుగ్రహం కలుగుతుంది. సీతమ్మ
తల్లి రామ చంద్ర అనుగ్రహం కలిగితే వాల్లొస్తే వీళ్ళుడరు కాబట్టి వాళ్ళు లంకకొస్తే
ఏమవ్వాలి వీళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి సుందర కాండ వింటే ఏమౌతుందంటే ఇందులోంచి ఆయన
వెళ్ళిపోతాడు. ఆయన లేచి వెళ్ళిపోగానే ఏమౌతుందంటే ఇక్కడ తేనె పూస్తుంది అప్పుడు
వచ్చి సీతారాములు ఇద్దరు కూర్చుంటారు. మీరు రోజూ చెప్తున్నారుగా ఏంటీ రావణాసురుని
యొక్క సోదరుని యందు మనస్సు అబ్జకీరము రామ నామము అది రావణుని యొక్క సోదరుడైన
విభీషనుని హృదయ పద్మమునందు నిరంతరము శ్రమించేటటువంటి భక్తి అనే మకరందమును
తాగడానికి రామ చంద్ర మూర్తి అనేటటువంటి భ్రరము తిరిగేటటువంటి చోటైన విభీషణుని
యొక్క వైశిష్ఠమునకు వైభవమునకు కారణమైన ఓ రామ నామమా! అని మేము మూడు మాట్లు
అంటున్నాము రామ నామమును అని కదూ... రామ నామము రామ నామము రమ్యైనది రామ నామము
అంటున్నాం, రాచకీరము రామ నామము అంటున్నాం కదా ప్రతిరోజూనూ.
కాబట్టి మనసేవ కృతాం లంకాం నిర్మితా విశ్వకర్మణా ! ద్వార ముత్తర మాసాద్య
చింతయా మాస వానరః !! ఆ లంకా పట్టణము యొక్క ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళాడు,
వెళ్ళి ఆ ఉత్తర ద్వారం దగ్గర నిలబడి అనుకున్నారు ఓహో ఈ లంకా పట్టణాన్ని విశ్వకర్మ
మనసుపెట్టి నిర్మించాడు, మనసుపెట్టి చేయరా పనీ అంటాం చూశారా... మనసా చేసినది వైభవోపేతంగా ఉంటుంది,
మనసు పెట్టి నిర్మించాడు అందుకే అంత గొప్పగా ఉంది ఈ లంకాపట్టణం సంపూర్ణాం
రాక్షసై ర్ఘోరై ర్నాగై ర్భోగవతీమ్ ఇవ ! అచిన్త్యాం సుకృతాం స్పష్టాం
కుబేరాధ్యుషితా పురా !! ఒకనాడు కుబేరునిచేతా పరిపాలింపబడినటువండి ఈ లంకా
ఇప్పుడు రావణుని చేత పరిపాలింపబడుతూంది, స్పష్టంగా బాగుగా ఏర్పరచబడి చక్కగా
విలసిల్లుతున్నటువంటి ఈ లంకా పట్టణం ఇప్పుడెలా ఉంది, నాగు పాములచేత
నిండిపోయినటువంటి పాతాళ లోకం ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉంది రాక్షసులచేత
పరిపాలించేటటువంటి లంక. ఈశ్వరుడు మనకందరికి శరీరాన్ని ఇచ్చినప్పుడు నాడులు
ఇచ్చినప్పుడు నాడులు ఆపరేషన్ చేస్తే దొరకవు, నరాలు దొరుకుతాయి, నాడులిచ్చినప్పుడు
వాటిని చక్కగా జ్ఞాన ప్రసరణ మార్గంలో ఉంచుతాడు అంటే వాటివలన నీవు భగవత్ తత్వాన్ని
పొందు అని. మనమేం చేస్తామో తెలుసాండీ! వాటిలోకి రక రకాలైన విషాలన్నీ నింపేస్తాం,
ఎందుకనీ ఒక్కటే కారణం
ఆరుగురు శత్రువుల్ని తెచ్చుపెట్టుకునీ అన్ని రకాల విషాలు అందులోకి నింపేస్తాం.
అందుకని ఎప్పుడు ఒక పడగ తొక్కితే ఇంకొక పడగ ఎత్తుతాడు.
నీవ్వెంతటివాడివని, ఈశ్వరుడు తప్పు
నీవు అలా ఉండ కూడదని ఒక అహంకారమును తొక్కాడనుకోండి, ఇంకో అహంకారముతో పడగెత్తుతాడు. ఈశ్వరుడు
ఇచ్చినటువంటి 101 నాడుల్నీ విషంతో నింపుతాడు, ఆ విషంతో నిండిపోతే కాళీయుడైపోతాడు,
అదే కాళీయ మర్ధనం. కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడిగా కాళీయుడి పడగల మీద వేసి
తొక్కాడు పాదాలతో తొక్కాడు • ఆ పడగలమీద తొక పట్టుకుని పడగలమీద నాట్యం చేసి
తొక్కుతుంటే విషానంతటినీ కక్కేసింది.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కక్కేసిన తరువాత విషమంతా పోయిన తరువాత ఆయన్ని పట్టుకుని
అప్పుడు ఏడ్చింది నన్ను బ్రతికించమని నీవు చేయు పెళ్ళి పెండ్లి కాదు అన్నారు
కాళీడు భార్యలొచ్చి అప్పుడు, అప్పుడు
ఆయన్ని అనుగ్రహించాడు. ఇక నుంచి నీకు దోషం లేదులే నీ పడగల మీద నా పాద ముద్రలు
ఉంటాయి, గరుడుడు నిన్ను హింసించడు అన్నాడు. మనలో ఉన్నటువంటి నాడుల్ని విషపూరితం
చేసుకుని ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఈశ్వరుని యొక్క భక్తితో నింపుకోకుండా
తిరుగుతున్నది మనం. ఈ లంకను సర్వేశ్వరున్ని నన్ను సేవించి ధన్యుడివికా సంతోషముతో
నేను ఈ జగత్తును సృష్టించింది అందుకే నా ప్రసాదంగా అనుభవించు, సంతోషంగా చూడు
అందుకే ఇచ్చాను. అంటే ఈశ్వర ప్రసాదంగా అనుభవించకుండా నాది అని అనుభవించి వాడనుభవిస్తున్నాడని
తమకంబప్ప పరాంగనాజన పర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయు నెమ్మనము,
దొం గంబట్టి వైరాగ్య పా శములంజుట్టి బిగించి చర స్తంభమునంగట్టి వై చి ముందంబెప్పుడు
గల్గజేయగదవో శ్రీ కాళహస్తీశ్వరా అంటాడు ధూర్జటి, కాబట్టి విశ్వకర్మచేత
నిర్మింపబడినటువంటి లంకా ఇప్పుడు రావణ పాలితయైన లంకయై నాగులచేత నిండిన పాతాళం ఎలా
ఉంటుందో అలా రక్షసులచేత నింపబడినటువంటి లంకగా మారిపోయింది.
ఇమాం తు విషమాం దుర్గాం లఙ్కాం రవాణ పాలితామ్ ! ప్రాప్యాఽపి స మహాబాహుః కిం
కరిష్యతి రాఘవః !! ఈ మాట కొంచెం బాహ్యంలో విచారం
చేయడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది అనర్థంలా అనిపిస్తుంది. ఇటువంటి లంకా ఇంతటి
శక్తివంతమైన లంకా ఈ దుర్గములోకి ఎవ్వరు ప్రవేశించలేరు, ఇక్కడికి రాముడు వస్తే ఏం
చేస్తాడు, కిం కరిష్యతి రాఘవః కాదు, స్వామి హనుమయే... ముందుకి వెళ్ళిన
తరువాత అంటాడు, ఎంత గొప్ప లంక అయితే ఏమిటి రాముడు నాశనం చేయగలడు అంటాడు, రామున్ని
తక్కువ చేయడం హనుమ ఉద్దేశ్యంకాదు, ఆయన ఉద్దేశ్యమేమిటో తెలుసాండీ..! ఎమండీ ఆయనా
బొత్తిగా అలా బతికేస్తున్నాడు కదా..? నిజంగా ఒకవేళ ఈశ్వరుడే వచ్చి ఈయ్యన ఎదురుగుండా
నిలబడినా నాకిప్పుడు ఖాలీలేదని చెప్పి వెళ్ళిపోతాడు తప్పా ఈశ్వరుడొచ్చినా ఆయన్ని
బాగుచేయలేడండీ అంటారు, మనం అనమాండీ! లోకంలో ఒక మాట అంటూంటాం భగవంతుడొచ్చినా ఆయన్ని
బాగుచేయలేడండీ అంటాం. రాముడే వచ్చినా ఈ లంకనేం చేయగలడండి ఎవడు బాగుపడతాడు ఇందులో
బాగుపడేవాడు ఎవ్వడూ లేడు కాబట్టి ఏం చెయ్యాలి ఈ లంకలో ఎవ్వడూ లేకుండా చెయ్యాలండీ ఈ
లంక నశించిపోవాలి తప్పా రాముడంతటి ధర్మాత్ముడొచ్చి నిలబడినా ఆయన్ను చూసి మారేవాడు
ఇందులో ఉన్నట్టు నాకు కనపడ్డంలేదు అన్నాడు. కొన్నివేల కోట్లు రాక్షసులు ఉన్నారండీ
ఎంత మంది రాక్షసులు మారి రాముడి పాదాలు పట్టుకున్నారు అందులో ఒక్కడే
విభీషణుడొక్కడే పట్టుకున్నాడు ఇన్ని వేల కోట్లలలో రాముడే వచ్చాడు రాముని దగ్గరకి
వాళ్ళు వెళ్ళలేదు, నూరు యోజనములుదాటి వచ్చాడు రాముడు అందులో అడుగుపెట్టాడు
నిలబడ్డాడు యుద్ధం చేశాడు, ఎవరైనా నా దగ్గరికి వచ్చి అభయము అంటే చాలు ఎవరినైనా
రక్షిస్తాను అన్నాడు. వెళ్ళి పట్టుకున్నవాళ్ళు ఉన్నారా... రామా రక్షించు
అన్నవాళ్ళు ఉన్నారా..! ఓరేయ్ ఇంత మంది వడిసిపోతున్నారు ర్రా..! ఇప్పటికైనా ఆయన
తేజస్సు తెలుసుకోవద్దా అన్నవాడు ఎవడున్నాడు అందరూ మరిచిపోయినవాళ్ళే.
కాబట్టి హనుమ అంటే నీకెందుకు బెంగ ఇమాం
తు విషమాం దుర్గాం లఙ్కాం రవాణ పాలితామ్ ! ప్రాప్యాఽపి స మహాబాహుః కిం కరిష్యతి
రాఘవః !! ఇటువంటి లంకా పట్టణానికి రాముడొస్తే మాత్రం ఏమి చేయగలడు అంటే లంకను
ఎలా
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
మార్చగలడు మార్చరు ఎందుకు మార్చలేరూ అంటే అంత విషంతో
నింపేసుకున్నారు, ఈశ్వరుడు వచ్చినా మారని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏమైపోతుందో
తెలుసాండీ..! మనసంతా రాగ ద్వేషాలతో నిండిపోతే ఏమైపోతుందంటే చెత్తబుట్టకింద
తయారైపోతే ఈశ్వరుడు సర్దుకోగలిగినంత సర్దుకుంటాడు ఇలా ఇలా ఆఖరికి ఏం చేస్తాడు
వాళ్లందరు వచ్చి అక్కడ కూర్చుంటే ఆయన పక్కకెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు లోపలందరు
ఎవరుంటారు వాళ్ళుంటారు రాక్షసులు ఆయన బయటుంటాడు. అలా అయిపోయింది ఆ లంకానగరము.
కాబట్టి దీన్ని ఎవరు మార్చగలరు అని చతుర్ణామ్ ఏవ హి గతి ర్వానరాణాం మహాత్మనామ్
! వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞ శ్చ ధీమతః !! ఈ లంకా పట్టణంలోకి నలుగురు
వీరులు రాగలరూ అని కనిపిస్తూంది, వాలి పుత్రస్య వాలి యొక్క కుమారుడైన
అంగదుడు, నీలస్య అగ్నిహోత్రుని అంశలో జన్మించినటువంటి నీలుడు మమ రాజ్ఞ
శ్చ నా రాజైనటువంటి సుగ్రీవుడు నేను,
మేము నలుగురం ఈ లంకాపట్టణంలోకి రాగలం మీగిలినవాళ్లు రాలేరు. అయితే వీళ్ళు నలుగురు
మాత్రమే రాగలరు తప్పా ఇంక ఎవ్వరూ రాలేరని హనుమ చెప్పలేదు సుందర కాండలో ఇంకా మీరు
కొంత ముందుకెళ్ళి చూస్తే ఇంకా కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళందరు కూడా వస్తారని
చెప్పారు కాబట్టి ఎవరెవరు ఏయే భక్తి తత్పరత కలిగినటువంటివాళ్ళో ఈశ్వరున్ని
ఈశ్వరున్ని రామున్ని బాగా అనుసరించగలిగినవాళ్ళో ప్రజ్ఞా పాటవుమునందు అధికులో
వాళ్ళందరూ ఆయన అనుగ్రహంతో లోపలికి రాగలరు.
అవి ఏయే మార్గములన్నది నీ ఇష్టం, అది భక్తి మార్గం కావచ్చు కర్మ మార్గం
కావచ్చు జ్ఞాన మార్గం కావచ్చు ఈశ్వర భక్తిని ప్రధానం చేసుకున్న వాళ్ళందరూ అంతః పురముఖులు
కాగలరు, ఈశ్వరుని వైపుకు అడుగులు వెయ్యగలరు. కాబట్టి అనేన రూపేణ మయా న శక్యా
రక్షసాం పురీ ! ప్రవేష్టుం రాక్షసై ర్గుప్తా క్రూపై ర్బల సమన్వితైః !! ఇక్కడా
ఇంత బలంతో కూడుకున్న రాక్షసులు ఇన్నివేల కోట్ల మంది విచ్చుకత్తులు పట్టుకుని
తిరుగుతుంటే నేను ఎలా లంకా పట్టణంలో ప్రవేశించి సీతమ్మను అన్వేషించగలను, కాబట్టి ఈ
రూపంతో అంటే ఇంత పెద్ద శరీరంతో లంకా పట్టణంలోకి వెళ్ళడమన్నది కుదరనే కుదరదు ఇది ఆ
మహానుభావుని యొక్క చిత్తశుద్ధి. ఇదీ మీరు గమనించవలసిందేమిటంటే కేవలం కథా పరంగా
వినకండి అంత లంకని చూస్తూ ఆయన తన లక్ష్యాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు, తాను
వచ్చింది సీతమ్మతల్లిని అన్వేషించడానికి, సీతాన్వేషణమునకు నేను ఎలా వెళ్ళవలసి
ఉంటుంది, అందుకనీ బుద్ధిమతాం వరిష్ఠం తప్పా ఇప్పుడు ఆయన బలమేమిటి ఆయనకు
తెలుసు నేను వెళ్తే ఏమౌతుంది ఏం చేస్తారు ఈ రాక్షసులందరు వస్తారా రానీ... అన్నవాడు
అలా వెళ్ళిన తరువాత జయాప జయములు విధి నిర్ణీతములు ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని
నేను మర్థించేలోపల సీతమ్మని స్థానం మార్చేస్తే మీ అహంకారం మీ బలం బాగానే ఉంది రామ
కార్యం ఏమైనట్టు రామ కార్యం చెడిపోలేదూ ప్రభుకార్యం కోసం తను వచ్చిన లక్ష్యం కోసం
అవసరమైన రీతిలో ఒంగ గలిగితే ఒదగగలిగితే వాడు ప్రాజ్ఞుడు.
ఒక ధనస్సు ఎదుట ఉన్న లక్ష్యాన్ని
కొడుతుంది, కొట్టేటప్పుడు వంగుతుంది ధనుస్సు. వింటినారిని పెట్టి ధనుస్సుకి కడితే
వంగుతుంది ధనుస్సు వంగని ధనస్సు కొట్టదు వంగిన ధనస్సే కొడుతుంది. కిందకి వంగిన స్విచ్ఛు
లైటువేయగలదు పైకి వెళ్ళిన స్విచ్ఛు ఆర్పేస్తుంది. ఒంగినదేదో ప్రకాశించగలదు వంగనిది
ప్రకాశించదు కదాండీ అందుకేగా బహుశః స్విచ్చులన్నీ
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కిందకు అందుకే ఉంటాయేమో... లేకపోతే వీళ్ళకి మార్గం తెలియదు
కిందకి వొంగితే వెలుతురొస్తుంది పైకి లేస్తే వెలుతురు పోతుందని గుర్తిస్తే రోజూ వేస్తారు
కాబట్టి తల దించడం నేర్చుకుంటారని పెడతారేమో, అది స్విచ్ఛ అనుకొని మనం వదిలేస్తాం
కదాండీ ఇమాం తు విషమాం దుర్గాం లఙ్కాం రవాణ పాలితామ్ ! ప్రాప్యాఽపి స మహాబాహుః
కిం కరిష్యతి రాఘవః !! ఇలా అనుకున్నవాన్ని రాముడేం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు
ఆయన విచారణచేసి ఉగ్రౌజసో మహా వీర్యా బలవన్త శ్చ రాక్షసాః ! వఙ్చనీయా మయా సర్వే
జానకీం పరిమార్గితా !! మీరు ఇప్పుడు ఒకటి గమనించవలసి ఉంటుంది. సంప్రదించడానికి
ఎవరూ లేరు ఆయనకి, ఆయనా ఈవిషయాన్ని ఓసారి సెల్లో మాట్లాడుదామని అనడానికి అప్పుడు
సెల్ ఫోన్లూ లేకపోతే పక్కన ఇంకో వానరున్ని తెచ్చుకుని ఏంచేద్దామయ్యా మనం నీవు
ఇక్కడ ఉండు నేను వెళ్ళి చూస్తాను విషయమేమిటో అని అనడానికి మాట్లాడడానికి పక్కన
మనిషి కూడాలేడు. అటువంటి స్థితిలో ఇంత దుర్భేద్యమైన లంకను చూసినప్పుడు భయం కూడా
వేయవచ్చును అయ్యబాబోయ్ ఇందులోకి మనం ఎలా వెళ్తాం ఎందుకొచ్చిన గొడవ వెనక్కి
వెళ్ళిపోయి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పొచ్చేద్దాం ఎందుకంటే మనం నూరు యోజనములు
ఇట్టే వెళ్ళిపోదాము, కాబట్టి ఒసారి వెంటవే వెనక్కి వెళ్ళిపోయి అసలు పరిస్థితిని సమీక్షా
సమావేశము ఒకటిపెట్టి చూసి మళ్ళీ రావడమో ఇంకా నలుగురుని పట్రావడమో ఏమో చేద్దాం
అనుకోవాలిగదా..! ఆయన అలా అనుకోలేదు, కార్య సాధన యందు ఏంచేస్తే బాగుంటుందో
ఆలోచిస్తున్నాడు ఇదీ బుద్ధి అందుకే ఎవరెవరు హనుమ పాదములను ఆశ్రయిస్తారో వారి వారికి లక్ష్యమును ఛేదించగలిగి,
లక్ష్యమును సాధించగలిగిన బుద్ధివైభవము అబ్బుతుంది.
కాబట్టి ఆయన అంటారు లక్ష్యాఽలక్ష్యేణ
రూపేణ రాత్రౌ లఙ్కా పురీ మయా ! ప్రవేష్టుం ప్రాప్త కాలం మే కృత్యం సాధయితుం మహత్
!! కనపడీ కనపడనటువంటి రూపంతో అంటే ప్రయత్న పూర్వకంగా చూస్తే తప్ప కనపడకూడదు.
ఇలా చూసినా చ్ప్ ఏముందబ్బాని దృష్టిదానిమీద పెట్టవలసిన అవసరం లేనంత చిన్న ప్రాణిగా
మారిపోతాను మారిపోయి రాత్రివేళ లంకలోకి వెళ్తాను, రాత్రివేళ లంకలోకి వెళ్ళి
వెతుకుతాను, బాహ్యంలో రాత్రివేళ సీతమ్మని వెతకడమంటే ఆయన ఉదయం బయలుదేరారు ప్రదూషవేళ
లంక పట్టణాన్ని శోధించడానికి వెడుతున్నారాయన, రెండవ విషయం అందూరు అప్పడు
నిద్రపోతుంటారు కాబట్టి వెతికి సీతమ్మ జాడ కనిపెట్టడం తేలిక, ఆంతరమున ఉన్న వస్తువు
చీకటి కనుక ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనపడని స్థితి, ఉన్నవస్తువు కనపడకపోవడం వల్ల
వచ్చేటటువంటిది లక్షణం భయం, యదార్థం తెలియకపోతేనే భయం, యదార్థం తెలిస్తే నిర్భయం.
ఒక్కటే ఉంది అని ఎరుకలోకి వచ్చిందనుకోండి భయమెదుకుంటుంది రెండోది ఉంటేగదాండి భయం
ఒక్కటే ఉందంటే ఇంక భయంలేదు భయరహిత స్థితి రెండోదుంది భయం. అది మనల్ని ఏమైనా
చేస్తుందేమోనని, ఆ ఒక్కటే ఉందేమోనని తెలికపోవడం చీకటి, ఒక్క ఆత్మయే ఉందని తప్పా ఇంకోటి లేదని తెలుసుకోవడం
సత్యాన్ని తెలుసుకోవడం భయంలోంచి నిర్భయంలోకి వెళ్ళాలి అసతోమా సద్గమయా తమసోమా
జోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయా ఈ వెళ్ళడానికి చెప్పేటటువంటి ప్రక్రియ ఆంతరంగ
చీకట్లో వెతకడానికి వెళ్ళడం అజ్ఞాలోంచి జ్ఞానంలోకి వెళ్ళడం అంటే సాంద్రక ప్రవృత్తి
దీన్ని ఆవిష్కరించడం.
కాబట్టి నేను చిన్న శరీరంతో
వెళ్తాను అలా వెళ్తానని నిశ్చయం చేసుకుని న వినశ్యేత్ కథం కార్యం రామస్య
విదితాత్మనః ! ఏకామ్ ఏక శ్చ పశ్యేయం రహితే జనకాఽఽత్మజామ్ !! సీతమ్మ తల్లి
ఒక్కతే ఉండగా మీరు జాగ్రత్తగా ఎదురు
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
చూసి ఆవిడని నేను బాగా చూడడానికి మాట్లాడడానికి ఉన్న అవకాశం
కలిగేంతవరకు నేను ఎదురు చూడాలి అందుకే ఆయన మాట్లాలేదు, ఉంగరమివ్వలేదు ఆవిడకి బాగా
విశ్వాసం కుదరాలి తరువాత ʻవేటు పడిన ప్రాణంʼ అంటారు చూశారా... అలా, బాహ్యంలో సీతమ్మ తల్లికి ఎంత భయం పెరిగిపోయిందంటే,
ఆమెకు ఎవర్ని చూసినా అనుమానమే, సన్యాసి వేషంలో వచ్చి ఎత్తుకుపోయినప్పుడు ఇంక
ఎవర్ని చూస్తే ఆవిడ అనుమానపడదండీ..? ఎవరొచ్చినా రావణుడేనన్న భయం వచ్చేసిందావిడకి
కాబట్టి ఇప్పుడు ఆవిడకి బాగా నమ్మకం కల్గిన తరువాత ఉంగరమివ్వకుండా ఉండడానికి కారణం
అది. అదీ అవతలివారి యొక్క హృదయాన్ని తాను బాగా అర్థం చేసుకుని ప్రవర్తించగలగడం
ఏమండీ రాముడి శిరస్సునే సృష్టించినవాడు యుద్ధ భూమిలో రాముడు మరణించి
పడిపోయినట్లుగా సృష్టించగలిగినవాడు మాయా సీతను సృష్టించి తీసుకొచ్చి వానరుల ముందు
సీత యొక్క తల నరికేస్తే హనుమ అంతటివాడు నమ్మేశాడు యుద్ధకాండలో నమ్మేసి సీతమ్మ
చనిపోయిందని యుద్ధం మానేశారు అందరూ. ఇన్ని చేసినవాడు రాముని ఉంగరం
సృష్టించలేడాండీ. ముందు రాముడి ఉంగరమిస్తే తీసి అవతల పారేస్తుంది, ఛీ అవతలపో
మారువేశంలో వచ్చావని ముందు ఆవిడకి నమ్మకం కలిగాక ఉంగరమివ్వాలి లేకపోతే ఉంగరం
ప్రయోజనం సిద్ధిస్తుంది లేకపోతే రామ కార్యం భంగమౌతుంది.
ఇది బాగా అవతలివారి యొక్క స్థితిని గుర్తెరిగి ప్రవర్తించడం హనుమ యొక్క
బుద్ధివైభం సుందర కాండలో. అది దానికి బీజం ఇక్కడపడింది ఎలా ఆలోచిస్తున్నారో చూడండి
ఆయనా అందుకని ఆమెను ఒక్కతినే కలుసుకోవాలి ఎలా జరుగుతుంది. అలా నేను కలువకపోతే
ఏమౌతుంది రామ కార్యం భంగమైపోతుంది. రామ కార్యం భంగమైపోయిననాడు నాయందు ఎన్ని
విభూతులైనా ఉండచ్చు, నేను ఎంత గొప్పవాన్నైనా అవ్వచ్చు ఎవరికి కావాలి భూతా
శ్చార్థా విపద్యన్తే దేశ కాల విరోధితాః ! విక్లబం దూతమ్ అసాద్య తమః సూర్యోదయే యథా
!! అర్థాఽనర్థాఽన్తరే బుద్ధి ర్నిశ్చితాఽపి న శోభతే ! ఘాతయన్తి హి కార్యాణి దూతాః
పణ్డిత మానినః !! సూర్యోదయం అవ్వగానే చీకట్లు ఎగిరిపోయినట్లు తను చాలా గొప్పవాన్ని
అనుకొని అతిశయంతో ప్రవర్తించినటువంటి దూతవలన ప్రభుకార్యం భగ్నమైపోయిన తరువాత
అటువంటివాడు ఎంత పండితుడైతే ఎవడికి కావాలి ఎంత సమర్థత ఉన్నవాడైతే ఎవడికి కావాలి.
అలా కాకుండా ఉండడానికి ఒదిగి ఒదిగి జాగ్రత్తగా ఆలోచించి కార్యాన్ని సాధించవలసి
ఉంటుంది అనుకుని సూర్యే చాఽస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః ! పృషదంశక
మాత్రః సన్ బభూవాఽద్భుత దర్శనః !! ఇప్పుడు సూర్యే చాఽస్తం గతే రాత్రౌ
ప్రదూషవేళ అని గుర్తు పాల్గునా శుద్ధత్రయోదశి మంచి పండువెన్నెల పౌర్ణమికి ముందు
కదాండి.
మనం పౌర్ణమికి కొంచెం ముందర మన
ప్రమేయం లేకుండా అలాగే ప్రారంభమయ్యింది త్రయోదశి చతుర్దశి తిథుల్లోకివచ్చి,
ఇప్పుడు నేను ఆ వెన్నెలలో నేను సీతమ్మను అన్వేషిస్తానని ప్రదూషవేళలో హనుమ
బయలుదేరారు, బయలుదేరినప్పుడు దేహం సంక్షిప్య మారుతిః తన శరీరాన్ని బాగా
చిన్నది చేసేసుకున్నారు. ఎంత చిన్నది చేసుకున్నారు పృషదంశక మాత్రః సన్
పిల్లి పిల్లంత చేసుకున్నారు అద్భుత దర్శనః అద్భుతమైన దర్శన స్థితిలో
వెళ్తున్నారు, పిల్లికి రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి పిల్లి నడకతెలియదు లోకంలో
నడక తెలియని ప్రాణి పిల్లొకటే దానికి నడవడం తెలియదని కాదు అది నడుస్తుందని మనకు
తెలియదు ఎందుకో తెలుసాండీ... దాని పాదములయందు మాంసపు ముద్దలు ఉంటాయి అందుకే వీడిది
పిల్లినడకరా ఎట్నుంచి వచ్చాడు అంటారు, చప్పుడవదు పిల్లివస్తూంటే అస్సలు చప్పుడవదు
గమనం ఉంటుంది కదలిక
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఉంటుంది నడుస్తుంది కాని నడుస్తోందని తెలియబడదు, అన్ని ప్రాణులకు
కనపడనప్పుడు దానికి బాగా కనపడుతూంది ఈ రెండు లక్షణాలు ఉన్నది పిల్లి అందుకని
మహర్షి అద్భుత దర్శనః అంటారు. ఇప్పుడు ఆయన నడుస్తున్నారు ఎటు నడుస్తున్నారు
మీకు కనపడే నడక కాదది ఆంతరములో బాహ్యంలో ఆయన లంకలోకి వెళ్తున్నారు ఆంతరములో తనలోకి
తాను వెళ్తున్నాడు యోగిగా అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖ సుదుర్లబా
లోపలికెళ్ళితే దొరుకుతుంది సీతమ్మ - ʻఆత్మʼ. కాబట్టి ఇప్పుడు ʻఅంతర్ముఖంʼ పైవన్నీ మూసేశాడు కళ్ళు
మూసుకున్నాడు పద్మాసనమేసుకున్నాడు యోగి పుగవుడై అంతర్ముకులైనాడు, అంతర్ముకులై
లోపలికి వెళ్తున్నాడు. మనిషి
అంతర్ముకుడై లోపలికి ప్రయాణం చేసి ఆత్మ వస్తువుని తెలుసుకునే ప్రయత్నంలో
ఉన్నప్పుడు కదలిన కదలికలు పైన తెలియవు. ఆ కదలిక ఆ చప్పుడు మీకు తెలియదు ఎటు
వెడుతున్నాడు అంటే ఇక్కడేం చెప్పలేదు అంతర్ముకత్వం పొందినటువంటి వ్యక్తి యొక్క
గమనం మీకు తెలియదు. ఇది పిల్లి పిల్ల యొక్క నడక. అందుకని పిల్లి పిల్లంతయ్యాడు.
లోపలికి వెళ్ళి చూడబడేటటువంటి వస్తువు వేరు, వీటితో పై ఒక్కటే చూస్తారు ఈ పైన చూసే
కళ్ళు అందరికీ ఉన్నాయి లోపల
చూసేటటువంటి కన్ను కలిగినవాడు ఎవడో వాడు అదృష్టవంతుడు వాడు జ్ఞాన నేత్రమును
పొందినవాడు. కాబట్టి అందుకు కదాండి ʻఉపనయనంʼ కాబట్టి జ్ఞాన నేత్రమును
కలిగినవాడు అద్భుతమును దర్శించినవాడు ఆత్మకి “అద్భుతమని” పేరు, యోగి లోపలికెళ్ళి
దర్శనం చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ ఆంతరమునందు ప్రతిపాదన, బాహ్యమునందు లంకలోకి
వెడుతున్నటువంటి హనుమ.
కాబట్టి ఇప్పుడు ఆయనా ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ లంకా పట్టణాన్ని
చూశారు ప్రదోషకాలే హనుమాన్ స్తూర్ణమ్ ఉత్ప్లుత్య వీర్యవాన్ ! ప్రవివేశ పురీం
రమ్యాం సు విభక్త మహా పథామ్ !! ఆ ప్రదోష కాలంలో వేగంగా వెళ్ళి చూసినటువంటి
హనుమకి బాగుగా విభజింపబడి చక్కటి మార్గములతో కూడినటువంటి లంకా పట్టణము కనపడింది ప్రాసాద
మాలా వితతాం స్తమ్భైః కాఙ్చన రాజతైః ! సాతకుమ్భ మయై ర్జాలై ర్గన్ధర్వ నగరోపమామ్ !!
గన్ధర్వ నగరోపమామ్ మాయ చేత సృష్టింపబడినదా అన్నట్లుగా ఉంది. ఎందుకంటే బాహ్యంలో
అసలు అలా కడతారని మీరు ఊహించడం కుదరదు, ఇప్పుడు అలా అనగానే మీ దృష్టి ఏమౌతుంది
ఆగిపోతుంది అవునా కాదా..! అసలు బాహ్యంలో అటువంటి వస్తువు ఉండదూ అటువంటి వస్తువు
మీకు కనపడిందనుకోండి మీరు అలా ఉండిపోతారా ఉండిపోరా... అలా ఉండిపోయినటువంటి క్షణంలో
మీ మనస్సు కూడా మీ కన్నులు ద్వారా ఆ వస్తువు మీదికెళ్ళి నిలబడిపోయింది. నిలబడిపోగానే
మీరు దేనికోసం బయలుదేరారో అది మీరు మరిచిపోయారు. బాహ్యంలో వస్తువు అలా ఉందని చెప్పి దాన్ని చూడకుండా తాను
అనుకున్న వస్తువు కోసం తాను వేళ్ళిపోతే ఆయన ప్రాజ్ఞుడు కదా!. వస్తువు చాలా
గొప్పదని చూస్తూ ఆయన ఉండరు సీతమ్మకోసం వెళ్ళిపోతారు, ఇది ఆయన వైభవము ఆయన అంతఃసౌందర్యం
చెప్పడం ఆయన దేనిచేత సుందరుడో చెప్పడం సుందర కాండ. బాహ్య సౌందర్యము అంతః సౌందర్యమునకు ప్రతిబంధకంగా నిలబడలేకపోయింది
ఇది చెప్పగలగిన విషయం ఇంత ప్రజ్ఞతో ఈ సౌందర్యమునందు వచ్చేటటువంటి ఘట్టములలో
నిలబడగలిగిన ప్రజ్ఞను చూపించిన సౌందర్యావిష్కరణము చూపించిన కాండ సుందర కాండ.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఇదీ మీరు అనుభవించవలసినటువంటి విషయం అవి ఎలా ఉన్నాయి పైగా ప్రాసాద
మాలా వితతాం ఒక్కటి కాదు ఓ పెద్ద భవనము హార్యము పక్కన ఓ పాడుపడిపోయిన ఇల్లు
ఉందనుకోండి ఏదో ఓ రెండు లడ్లూ ఓ ఉప్పు పిడికె ఉన్నట్లు ఉంటుంది, రెండు లడ్లు
తినేసి ఓ ఉప్పు ముక్క నోట్లో వేసుకున్నట్లుంటుంది, అలాగ కాదు ప్రాసాద మాలా
వితతాం స్తమ్భైః కాఙ్చన రాజతైః ! సాతకుమ్భ మయై ర్జాలై ర్గన్ధర్వ నగరోపమామ్ !!
ప్రాసాద మాలా వితతాం ఆ ప్రాసాదముల్నీ అంతఃపురంలో భవనములన్నీ కూడా పెద్ద వరుసలకింద
ఉన్నాయి మాలల కింద అన్నీ సాతకుమ్భ మయై ర్జాలై ర్గన్ధర్వ నగరోపమామ్ అంటారు,
అన్నీ బంగారంతోటే నిర్మించారు, ఇప్పుడు చంద్ర కిరణాలు పడుతున్నాయి వాటిమీద ఎలా ఉంటుంది
అసలు ఆ సోబబు ఒక పచ్చటి తేజస్సు వస్తూంటుంది ఇటువంటి ఉద్యానవనాలు పక్షులు జంతువులు,
మహర్షి అన్నారు ర్జాలైః కిటికీలు కూడా నీవు ఎప్పుడు అటువంటిది చూడలేదు
అన్నాడు. కిటికీయే మనం చూడనిదైతే ప్రాసాద మాలా వితతాం నీవు చూసీ కూడా అలా
చూస్తూ ఉండిపోకుండా సీతమ్మని చూడాలని కదలగలిగితే ఆయన ఎంత సమర్థుడై ఉండాలి ఎంతటి
బుద్ధిమతాం వరిష్ఠం అయి ఉండాలి అని చెప్పడానికి మాటలు సరిపోతాయా..? చాలవు అది ఆయన
ప్రజ్ఞ. అందుకే హనుమత్ వైభవాన్ని ఆవిష్కరించింది. ఒక సాధకుని యొక్క వైభవాన్ని
ఆవిష్కరించింది సుందర కాండ గన్ధర్వ నగరోపమామ్ ! సప్త భౌమాఽష్ట భౌమై శ్చ
స దదర్శ మహా పురీమ్ ! తలైః స్ఫటిక సంపూర్ణైః కార్తస్వర విభూషితైః !! ఏడంతస్తుల
మేడలు ఎనిమిదంతస్తుల మేడలు ఈ మేడలన్నీ బంగారముతో కట్టబడి అక్కడ ఉండేటటువంటి భూమి ఆ
నేలా కేవలము ఏదో సిమెంటుతోటో ఇసుకతోటో మట్టితోటో చేసింది కాదటా...
స్ఫటిక మణులు తీసుకొచ్చి స్ఫటిక మణులతో నేల చేశారట సుద్ధస్ఫటికా ఉండేటటువంటి
శక్తి శ్రీ కాళహస్తిలో శుద్ధ స్ఫటిక లింగమును రామేశ్వర క్షేత్రంలో శుద్ధస్ఫటిక
లింగమును- ఈశ్వర క్షేత్రంలో ప్రతిరోజు తెల్లవారుఝామున శుద్ధస్ఫటిక లింగాన్ని
తీసుకొచ్చి పెడతారు మీరు ఎప్పుడైనా చూశారోలేదో... బాగా చీకట్లో వెళ్ళాలి
చీకట్లోనైతే ఇంకా బాగా సూర్యోదయం అయిపోతే పూజాపు చేసేస్తారు అంతే, అది ఒక్క
బ్రహ్మీ మూర్తములోనే లైట్లన్ని ఆర్పేస్తారు ఇంత పెద్ద స్ఫటిక లింగముంటుంది
శుద్ధస్ఫటికం అది స్ఫటికం గురించి తెలుసున్నవాళ్ళు పట్టుకుంటారు ప్రయోగం చేస్తారు
అది శుద్ధస్ఫటిక లింగం అని మీరు అనుభవించాలిగానీ ఆ శివలింగాన్ని అక్కడ పెట్టి ఏం
చేస్తారంటే ఎర్రటి పువ్వుని తీసుకొచ్చి ఆ లింగం వెనక పెడతారు అది మీరు చూడాలి ఆ
స్ఫటిక లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు, అది చూడగలిగిన ప్రజ్ఞ ఉంటేనే అనుభవిస్తాడు
లేకపోతే తెలియదది మీకు ఏం చేస్తున్నారో... ఎర్రపువ్వు ఇలా పెడతారు వెనక మొత్తం
శివలింగం ఎరుపైపోతుంది ఇలా తీసేస్తారు పచ్చటి పూవూ పెడతారు శివలింగమంతా
పసుపైపోతుంది మళ్ళీ తీసేస్తారు, ఓ ఆకుపచ్చని పువ్వువో నీలం పువ్వో ఇలా ఆయనకి
చూపిస్తారు శుద్ధస్ఫటిక నీలమైంది శుద్ధస్ఫటికకున్న
లక్షణం ఏమిటో తెలుసాండీ! ఏ రంగుతో కూడిన చిన్న పదార్థం దానిమీద ఇలా పెడితే ఆ
రంగులో అది కనపడుతుంది.
అందుకే స్ఫటిక లింగారాధన మనకు జ్ఞాన్ని ఆవిష్కరిస్తుంది. అసలు బ్రహ్మము స్ఫటికంలాంటిది అందులో
ఏమీ ఉండదు శుద్ధమైనది తెల్లగ ఉంటుంది పరమశివునిలాగ అందుకే మీరు ఏది తీసుకొచ్చి నామ
రూపాలుగా పెడితే దానిగా ఆయన కనపడుతుంటాడుకాని. ఆయన తనంత తానుగా శుద్ధస్పటికా.
ఒక్క స్ఫటికానికి అంత శక్తుంటే ఇటువంటి శుద్ధస్ఫటిక మణులకు వాడు ఎలాగ...
మహానుబావుడు విశ్వకర్మ ఎలా నిర్మించాడో ఆ శుద్ధస్ఫటిక మణులతో నేల తయారు చేశారు
అక్కడ, ఇప్పుడు ఎర్రటి పాదమున్నటువంటి ఒక స్త్రీ
గదినుంచి ఇలా అడుగెత్తి వేస్తుందనుకోండి నేలంతా ఎర్రగా ఉంటుంది కాళ్ళకు
పసుపు రాసుకున్నటువంటి స్త్రీ పాదమిలా ఎత్తిందనుకోండి ఆ పసుపు రంగంతా పడుతుంది పైన
ముద్ద బంగారం నేలంతా స్ఫటికం మణులేమో అన్ని స్తంబాలకి పొదిగారు అన్ని స్తంభాలకి చంద్ర
కాంతులు పడుతున్న ఇంద్ర ధనస్సు లేచినట్లు కాంతులు లేస్తున్నాయి. స్ఫటికంతో నేలుంది
ఇది శ్లోకం కాదు మీరు అనుభవించండి ఒక్కసారి అలా నేను ఎన్ని శ్లోకాలకు చెప్తాను,
నేను అన్ని శ్లోకాలకి చెప్పడం ఒక్కనాటికీ సాధ్యం కాదు. నేను కొన్ని అందించగలను
అంతే, అది నేను అనుభవించినటువంటి చాలా తక్కువ స్థాయిలో.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇప్పుడు అసలు ఒక్క భవనంవైపు ఇలా చూశారనుకోండి
అబ్భాహ్ ఆ కిటికి చూడు ఆ నేల చూడు ఆ పై ప్రాకారము చూడు ఆ మణులు ఆ స్తంభం చూడు ఆ
అరుగు చూడు అని ఉండిపోతారు. ఇప్పుడు ఆయనేం చేశాడంటే ప్రాసాద మాలా వితతాం
స్తమ్భైః కాఙ్చన రాజతైః ! సాతకుమ్భ మయై ర్జాలై ర్గన్ధర్వ నగరోపమామ్ !! తాకి
వెళ్ళిపోతుంటారు ఇవన్నీ నాకు అక్కరలేదు సీతమ్మ కాదుగా నయితి నయితి నయితి ఇది
సాధకుని లక్షణం. పైకి లంకా వైభవము పక్కన హనుమద్వైభవము ఇదే రెండు వైభవాలు ఏక కాలంలో
నడుపుతున్నారు మహర్షి. ఈ ఇద్దరికి మధ్యలో అద్భుతం సీతమ్మ కనపడక, కనపడకా రామ నామ
వైభవం రామ కథా వైభవం ఇన్ని వైభవాలు కలిపి వండిన కూర సుందర కాండ. ఏమి రుచి ఏమి రుచి
ఏమి రుచి ఏమి రుచి ఏమి రుచిరా శ్రీ రామ నీనామ మేమి రుచిరా, ఏమి రుచిరా అంటే రామా
అని రాసుకుని నాలుకమీద పెట్టుకుంటే రుచుందాండి అనకూడదు రుచి అంటే నాలుక
తెలుసుకునేటటువంటి రుచి దీన్ని పోషిస్తూంది, ఆ కథా రామ నామంలో ఉండేటటుంటి వైభవం
అర్థమైతే దీనిలో ఉన్న ʻఆత్మʼ పోషింపబడుతుంది, ఈ రుచి నాకు
అందింది రామా ఇది శ్రీ రామ శ్రీ రామ నీమామమెంత రుచిరా ! తప్పా రామ నామాన్ని కాగితం
మీద రాసుకుని నోట్లోవేసుకుంటే రుచిగా ఉంటుందని కాదు దాని అర్థం.
కాబట్టి మహర్షి అంటారూ అచిన్త్యామ్
అద్భుతాఽఽకారాం దృష్ట్వా లఙ్కాం మహా కపిః ! ఆసీత్ విషణ్ణో హృష్ట శ్చ వైదేహ్యా
దర్శనోత్సుకః !! ఆయనా అంత గొప్ప లంకా పట్టణాన్ని చూసి విషాదం పొందారు, సీతమ్మ
తల్లి దర్శనమౌతుందని సంతోషం పొందారట, ఏమిటండది..? తిరగేసినట్లు వినలేదు శ్లోకం అంత
గొప్ప లంకని చూసి సంతోషం పొందాలి అమ్మో ఇందులో ఎక్కడుందో బాబోయ్ ఇంత పెద్ద
పట్టణంలో అని దిగులుపొందాలి, ఇక్కడ సీతమ్మ ఎక్కడుందో వెతకాలి సంతోషం పొందారు, ఈ లంకింతలా ఉందేమిటని దిగులుపొందారు, అంటే దిక్కుమాలిన లంక బాహ్య
సౌందర్యమే కాని లోపలున్నవాడికి బుద్దిలేదురా బుద్ధి ఉండి ఉంటే... నా రామ చంద్ర
మూర్తికి కీర్తిగడించి ఇక్కడ నా రామ చంద్ర మూర్తినారాధిస్తే ఎంతబాగుండేదో... మీరు
ఒక మంచి ఇంటికెళ్లారనుకోండి కోటి రూపాయలు పెట్టి కట్టాడని ఏమిటో తెలియదు కాస్త
సిరాజల్లేసి మతపెట్టసి విప్పేసేస్తే ఏమిటి వస్తుందని దానిమీద బొమ్మంటే నేనేం
చెప్పలేను అది ఏదో బొమ్మ వస్తుంది అలాంటి ఫోటోలన్నీ ఉన్నాయనుకోండి ఏమిటండీ అది అని
మీరు అడిగారనుకోండి, నాకు తెలియదండీ మోడరన్ పెయింటింగ్ ఏమి అర్థం కాదు కాబట్టి
అంటే గొడవొదిలిపోతుంది. 35 వేలు పెట్టి ఒక్కొక్కటి కొన్నానన్నాడనుకోండి ఇప్పుడు
ఇవన్నీ కలిపితే పాతిక లక్షలు అరెరే..? చ్ప్. ఇక్కడ సీతారామ చంద్ర
పట్టాభిషేకమైనటువంటి దివ్యమైనటువంటి మంగళ ప్రమైన మూర్తొక్కటి ఉంటే ఎలా ఉండేదో అనే
దిగులు మీకు కలిగిందనుకోండి. ఆ దిగులు మీరు పొందితే ఉత్తములు దిగులు
పొందలేకపోయినవాడు దుర్మార్గుడు కదాండి.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఎవడికి కావాలి కోటి రూపాయలుపెట్టి కడితే సీతారాములు
ఫొటోలేని ఇళ్ళు వాళ్ళమ్మగారు లేని ఇల్లూ, వాళ్ళ నాన్నగారు లేని ఇల్లూ ఇది ఇల్లా
ఇంకోమారు మీరు వెళ్ళకూడదు. కదూ ఎవడికి కావాలి అలాంటి ఇల్లు ఇది దిగులు ఇక్కడ
సీతమ్ముంది ఫేసింగ్ ది ఛాలెంజ్ అంటారు చూశారా..! ఇటువంటి నీచుల మధ్యలో ఉండిపోయిన
నా తల్లిని అన్వేషించి తీసుకెళ్ళి నా రామునితో కలిపేయాలి. ఇక్కడ నా తల్లిని
ఉంచకూడదు ఇది నేను సాధించాలి, కాబట్టి నేను తొందరగా బయలుదేరాలి ఇది ఆయన ఉత్సాహము బాహ్య సౌందర్యాన్ని
తిరస్కరించగలగడం అంతః సౌందర్యముపట్ల ఆభిముఖ్యం కలగడం ఇది సాధకుడి యొక్క ఐశ్వర్యము
ఇది ఆవిష్కరించడం సుందర కాండ. ఏమి సుందర కాండండీ అద్భుతం కాదూ... కాబట్టి చన్ద్రోఽపి
సాచివ్యమ్ ఇవాఽస్య కుర్వన్ తారా గణై ర్మధ్య గతో విరాజన్ జ్యోత్స్నా వితానేన వితత్య
లోకమ్ ఉత్తిష్ఠతే నైక సహస్ర రశ్మిః ! అప్పుడటా చంద్ర భగవానునుడు పూర్ణంగా
ప్రకాశిస్తున్నాడట శుద్ధ త్రయోదసి కదాండి బాగా పూర్ణమైనటువంటి కాంతులతో ఉన్నాడు
ఆయన, సాచిన్యం చేయడానికి వచ్చాడా అన్నట్టు ఉన్నాడట ఆయన. అంటే మీతో అన్నానుగా
ఎవరున్నారు హనుమకి ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు ఆ చంద్రుడు ఎప్పుడూ ఉంటాడు • అంటారు
శంకర భగవత్పాదులు అష్టమూర్తులలో ఉండేవాడు పరమశివుడే ఈశ్వరుడే ఇప్పుడు భగవంతుడే
సాయంగా ఉన్నాడు భక్తుడు ఒక్కడే ఉండిపోవడం ఎప్పుడూ ఉండదు, భక్తునికి ఎప్పుడూ పక్కన
పరమేశ్వరుడు ఉంటాడు, ఆయన ఒక్కరే ఉన్నారండీ అని ఎప్పుడూ అనకూడదు అనయనతోపాటు
ఎవరున్నారో ఆయన్ని చూసి ఒక్కడే ఉన్నాడనుకుంటున్నావు అంతే. కాబట్టి ఆయనతో ఆయనకి
సాచిన్యం చేయడానికి అంటే ఈ చీకట్లో వెతుకుతున్నటువంటి హనుమకి ఏది ఏవస్తువో స్పష్టంగా
తెలియజేయడానికి రావణుడు నిగ్రహించలేని రీతిలో చంద్రుడు ఆకాశంలో ప్రకాశించి
వెన్నెలని కురిపించి సాయం చేస్తున్నాడు శంఖ ప్రభం క్షీర మృణాళ వర్ణమ్
ఉద్గచ్ఛమానం వ్యవభాసమానమ్ దదర్శ చన్ద్రం స కపి ప్రవీరః పోప్లూయమానం సర సీవ హంసం !
అబ్భాహ్... ఏమి విశేషనాలు వేస్తారో మహర్షి, తెల్లటి పాలు ఎలా ఉంటాయో తెల్లటి
పాలేమిటి, పాలలా తెల్లగా తెల్లటి పాలేమిటి నల్లటి పాలు కూడా ఉంటాయేమిటి? పాలలా
తెల్లగా తామర తుడులా పైకి వచ్చి ప్రకాశిస్తున్నటువంటి ఆ చంద్ర బింబం నీటిలో
ఈదుతున్నటువంటి హంసలా ఉందట.
ఎందుకనీ మీరు చూడండి చంద్రుడు కదులుతున్నట్లు ఉండదు, మీరలా చంద్ర బింబం వంక
చూస్తున్నారనుకోండి అలా మేఘాలన్నీ వచ్చి వెళ్ళిపోతుంటాయి ఆయనా ఏదో నీటిమీద తేలుతూ
ఈదుతున్నవాడు ఎలా ఉంటాడో ఆకాశంలో మేఘమండలంలో వెడుతున్న చంద్రుడు అలా ఉంటాడు, అది
ఇక్కడ అనుభవించినవాడి నోటివెంవచ్చేటటువంటి కవిత్వం మహానుభావుడు వాల్మీకి మహర్షి
అంటే మాటలాండి కాబట్టి పోప్లూయమానం సర సీవ హంసం ఆయనా మనోహరమైనటువంటి రీతిలో
సరస్సులో ఈదు తున్నటువంటి తెల్లటి హంస ఎలా ఉంటుందో అలా ఉందట ఆ చంద్ర బింబము. ఆ
చంద్రుని యొక్క వెన్నెలలే హనుమకి ఉపశాంతి కారకము చల్లబడుతూందీ అని గుర్తు. కథా
చల్లబడుతూందీ అంటే సీతమ్మకి మంగళం రామునికి మంగళం, భగవత్ భక్తుడైనవాడికి
భగవంతుడెప్పుడూ సహకరిస్తూంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన లంకా పట్టణంలోకి ప్రవేశించాలి
అని నిర్ణయం చేసుకున్నాడు ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమ్ అభిపేదివాన్ ! విస్మయాఽఽవిష్ట
హృదయః పురీమ్ ఆలోక్య సర్వతః ! వజ్ర మణి స్ఫటిక ముక్తాభి ర్మణి కుట్టిమ భూషితైః !
తప్త హాటక నిర్యూహై రాజతాఽమల పాణ్డురైః !! ఆయనా ఆ ప్రాకారం నుంచి లంకా పట్టణంలలోకి
చూశారు, చూస్తే ఎక్కడ చూసినా కూడా విశ్మయాన్ని కలిగించేటటువంటి రీతిలో ఉన్నాయి ఆ
వీధులన్నీ కూడా జామ్బూ నద మయై ర్ద్వారై ద్వారములంటే తలుపులు, తలుపూ అన్న
తరావాత ఎక్కడోక్కడ ఒక కొయ్య తలుపు కనపడాలి కదాండీ దిక్కుమాలింది, అసలు తలపన్న
తరువాత ఒక్కటి కొయ్య తలుపు లేకపోతే ఆయన అన్నారు ద్వారములన్నీ బంగారమే, ఒక్క ఇల్లు
తెల్ల రేషన్ కార్డు ఇవ్వవలసిన ఇల్లు ఇక్కడ లేదు అంటే అన్నీ బంగారు తలుపులే అంత
గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి నగరము, ఎందులో బాహ్యంలో అంతరంలో అంత దరిద్ర నగరం,
ఎందుకనీ అన్నీ తప్పు పన్లూ అదే కేంద్రంగా జరుగుతుంటాయి.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
వజ్ర మణి స్ఫటిక ముక్తాభి ర్మణి
కుట్టిమ భూషితైః ! తప్త హాటక నిర్యూహై రాజతాఽమల పాణ్డురైః !! వజ్రములు స్ఫటికములు ముత్యములు మణులు మొదలైనటువంటివి గచ్చులో కూడా నేలమీద
స్తంభాలలో గోడలలో పొదిగారు, దక్షారామంలో చీకటి కోణం అని ఒకటుంటుంది మీరు దర్శనం
చేస్తున్నప్పుడు శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మూల భాగం దగ్గర చీకటి కోణం అని
ఉంటుంది. అది ఒకప్పుడు లైట్లుండేవికావు, గోడలకి వజ్రాలు వైఢ్యూర్యాలు మణులు
పొదిగారు అది వెళ్తున్నప్పుడు చీకటిలో మణులు ప్రకాశిస్తుంటే మణులకాంతిలో
ప్రదక్షిణం చేసేవారు సరే ఆ తరువాత ఎత్తుకుపోయేవాళ్ళు వచ్చారు గుణపాలుపెట్టి కొట్టి
ఎత్తుకుపోయారు ఎత్తుకుపోతే అది నిజంగా చీకటి కోణంగానే మిగిలిపోయింది. కాబట్టి
అక్కడటా గోడలు స్తంభాలు నేల అన్నీ కూడా ఈ వజ్ర వైఢ్యూర్య స్ఫటిక ఇంద్ర నీల మణులు
తాపడం చేయబడి ఉన్నాయట. ఇదీ ఎంత గమ్మత్తుగానో ఆ శిల్పకళా వైభవము అది సామాన్యంగా
ఉంటుందీ అని మీరు ఊహించవద్దు. ఎందుకంటే లంకా పట్టణం నాటికి అలా ఉండడం కాదండీ
ఇప్పటికీ అవి అసలు భారత దేశానికి మించినటువంటి విజ్ఞాన గని మీకు ఇంకొకటి కనపడదు.
లేపాక్షి దేవాలయము యొక్క పై కప్పంతా కూడా హంగింగ్ పిల్లర్ మీద నిలబడింది. అంటే ఆ
స్తంభం నేల మీద ఆనదు మీరు కాగితాన్ని స్తంభం కిందనుంచి తీస్తే స్తంభం కింద నుంచి
కాగితం వెళ్ళిపోతుంది ఇట్నుంచి ఇటు. కాబట్టి అది వేలాడుతుంటుంది ఆ స్తంభం.
వ్రేలాడుతున్న ఒక్క స్తంభం మీద మొత్తం కప్పంతా నిలబడింది దేవాలయం కప్పు, దాన్ని
ఒప్పుకోలేదు బ్రిటీషర్స్.
బ్రిటీష్ వాళ్ళు ఈ దేశంలో
పరిపాలిస్తున్నప్పుడు ఇది అబద్దం అలా స్తంభం మీద పై కప్పు నిలబడదు భూమి మీద స్తంభం
లేనప్పుడు ఆ స్తంభం మీద పై కప్పు ఉండదు. సివిల్ ఇంజనీరింగ్ విల్ నాట్ అగ్రీ విత్
దిస్ అన్నారు. అని ఆ స్తంభాన్ని కొడతామన్నారు కొడతామంటే స్థానికులు భక్తి వాళ్ళు
అంగీకరించలేదు, కొద్దిగా కదిపి చూస్తాం పోనీ అని చెప్పి, ఇప్పటికీ రికార్డు
ఉన్నాయండి లేపాక్షిలో, ఆయన పేరుతో సహా ఉంది ఆ కదిపినాయన పేరుతో సహా, వచ్చి ఆ
స్తంభాన్ని గుణపాలు పెట్టి
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కొద్దిగా పక్కకి కొట్టారు ఇక్కడున్న స్తంభం ఇలా కదిలింది ఓ
అరంగుళం. పై కప్పంతా కిందకి దిగింది అలా ఎలా నిర్మాణం చేశారన్నది అంత గొప్ప దేశమని
ఇవ్వాళ మనమందరము ఆదర్శం తీసుకునేటటువంటి బ్రిటన్ కి ఆనాడు తెలియదు అది ఈ దేశపు
సామర్థ్యం. మన దరిద్రమేమిటంటే మన దేశానికి ఏమీ తెలియదనుకొని వాలైంటైన్సడేని
ఇంపోర్ట్ చేసుకునేటటువంటి ధౌర్భాగ్యానికి మనం దిగజారిపోయాము. కాబట్టి ఆయన అంటారూ
అటువంటి గొప్ప గొప్ప మేడలు అటువంటి గోడలు క్రౌఙ్చ బర్హిణ సంఘుష్టైః రాజహంస
నిషేవితైః ! తూర్యాఽఽభరణ నిర్ఘోషైః సర్వతః ప్రతినాదితామ్ !! కేవలం బాహ్యంలో
చైతన్యం లేనటువంటి మణులు ఆ ప్రకాశమే కాదట. అక్కడా ఏ ఇంటి ముందు చూసినా కొలనులు, ఏ
ఇంటి ముందు చూసినా రాజ హంసలు, ఏ ఇంటి ముందు చూసినా నెమళ్ళు, నెమళ్ళ క్రేంకణాలు
పురి విప్పి ఆడుకుంటున్నటువంటి నెమళ్ళు హంసలు వాటి కులుకులతో కూడినటువంటి నడకలు
వాటితో ఎంత అందగా ఉందోట నేయమ్ అన్యేన నగరీ శక్యా ధర్షయితుం బలాత్ ! రక్షితా
రావణ బలైః ఉద్యతాఽఽయుధ ధారిభిః !! ఇటువంటి లంకా పట్టణాన్ని ఎవరు జయించగలరు,
ఎవరు దీంట్లోకి ప్రవేశిస్తారు
కుముద అఙ్గదయో ర్వాఽపి
సుషేణస్య మహా కపేః ! ప్రసిద్ధేయం భవే ద్భూమిః మైన్ద ద్వివిదయో రఽపి !!
వివస్వత స్తనూజస్య హరే
శ్చ కుశపర్వణః ! ఋక్షస్య కేతుమాలస్య మమ చైవ గతి ర్భవేత్ !!
సమీక్ష్య తు మహాబాహో రాఘవస్య పరాక్రమమ్ ! లక్ష్మణస్య చ
విక్రాన్తమ్ అభవత్ ప్రీతిమాన్ కపిః !!
ఆయన అంటారు, ఈ లంకా పట్టణంలోకి
రాగలిగినవాళ్ళు మా వానరులు ఇంకా ఉన్నారు కుముదుడొస్తాడు, అంగదుడొస్తాడు,
సుషేణుడొస్తాడు, మా రాజైనటువంటి సుగ్రీవుడొస్తాడు, మైందుడొస్తాడు, ద్వివిదడొస్తాడు
అలాగే కుశపర్వణుడొస్తాడు అటువంటి శక్తి కలిగిన వానరులందరూ వస్తారు, దానితోపాటుగా ఈ
పట్టణం ఎంతగొప్పదైనా మా రామ చంద్ర మూర్తి లక్ష్మణ మూర్తి యొక్క బాణముల ధాటికి ఈ
లంక నిలబడలేదు. ఇందాకా ఏ స్వామి లంకా పట్టణానికి రాముడొచ్చి ఏం చేస్తాడన్నారో ఆయనే
మాట వినేవాడులేడు కాబట్టి రామ బాణమునకు నశిస్తుందని కూడా చెప్తున్నారు ఆయన హృదయం
అది. కాబట్టి సా తం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలితా ! స్వయ మేవోత్థితా తత్ర
వికృతాఽఽనన దర్శనా !! వికృతమైనటువంటి ముఖంతో ఆ లంక యొక్క ఉత్తర ద్వారం
దగ్గరికి వెళ్ళేటప్పటికి లంకయే కనపడింది. లంకా అధిష్టాన దైవముంది. ఆ లంక కంతటికి
అధిష్టాన దైవం. ఆవిడా తెలుగులో ʻలంకిణిʼ అంటూంటారు. సంస్కృతంలో లంకె, లంకయే
అధిష్టాన దైవతంగా లంకను కాపు కాస్తుంటుంది. ఆవిడ కనపడింది, ఇప్పటికీ అలా ఉంటుంది
ఎందుకనీ అంటే కాశీ పట్టణంలో వారాహి దేవతా ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీ పట్టణమంతా తిరుగుతుంది.
వెలుతురు పడగానే గుళ్ళోకి వెళ్ళిపోయి తలుపులేసేసుకుంటుంది. అందుకని సూర్యోదయం
అయిపోతే ఇంక వారాహి దర్శనం ఉండదిక కాశీలో మనం చూడలేము కూడా ఆ వారాహి యొక్క
స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోదు, అందుకనీ ఏం
చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పెక్కి సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి,
కన్నాలోంచి చూడాలి వారాహీని కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది అలా
ఉంటుంది అవిడ స్వరూపం. ఆ లలితా సహస్రంలో చెప్తారే దండనాయికి ఆమె సర్వ
సైన్యక్షురాలు ఆ లలితాదేవికి. ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది రాత్రివేళ లోపలికెళ్ళిపోతుంది.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
తెల్లవారుతుండగా లోపలికెళ్ళిపోతుంది. లోపలికి వెళుతూండగానే
చీకట్లోనే అర్చకులు అర్చన చేసేసి తలుపులేసేసి వెళ్ళిపోతారు. ఎవరైనా చూసేవారుంటే పై
నుంచి ఓసారి చూసి వెళ్ళిపోతారు. మీరు చూసింటారనుకుంటాను. చాలామంది మీరు చూశారా...
వారాహి, కాబట్టి వారాహి దేవాలయం కాశీ పట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి
దేవాలయం లేకపోతే ఎప్పుడైనా కాశీకి వెళ్తే చూడండి చూడనివాళ్ళైతేనే ఇప్పుడు ఆయనా
ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేట్పటికి లంకే ఈయ్యన్ని అడిగింది క స్త్వం కేన చ
కార్యేణ ఇహ ప్రాప్తో వనాఽఽలయ ! కథయ స్యేహ యత్తత్వం యావ త్ప్రాణా ధరంతి తే !! న
శక్యం ఖల్వియం లంకా ప్రవేష్టుం వానర త్వయా ! రక్షితా రావణ బలైః అభిగుప్తా సమంతతః !!
ఓ వానరా! ఏ పనిమీద ఇక్కడికి వచ్చావు ఎందుకు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎక్కడో
అడవిలో తిరిగేటటువంటివాడివి ఇక్కడకెందుకొచ్చావు అంటే మాటయందు పౌరుషం కొంతమంది
చూడండి ఆభిజాక్ష్యం, అసలు ఎవరో తెలియకుండా మాట్లాడటమే అంత గర్వంగా అంత అతిశయంగా
ఉంటుంది. అలా మాట్లాడింది ఆవిడ న శక్యం ఖల్వియం లంకా ప్రవేష్టుం వానర త్వయా
నీవు ఈ లంకలోకి వెళ్ళలేవు, నేను కాపు కాస్తున్నాను నేను కాపు కాస్తుండగా నన్ను
ఓడించి తప్పా ఇందులోకి వెళ్ళరు.
అంటే ఆయన అన్నారు కా త్వం విరూప నయనా పుర ద్వారే అవతిష్ఠసి ! కిమఽర్థం చాఽపి
మాం రుధ్వా నిర్భత్సయసి దారుణా !! ద్వారం దగ్గరే కనపడ్డావా..? విక్రుతములైన
నయనములున్నదానా... ఇంత వికారంగా ఉన్నావు ఎవరు నీవు, ఎందుకున్నావు ఇక్కడ అంటే హనుమ
ద్వచనం శ్రుత్వా లంకా సా కామ రూపిణీ ! ఉవాచ వచనం కృద్ధా పరుషం పవనాఽత్మజమ్ !!
చాలా కోపం పొందేసింది దేనికండి అంతకోపం నీవు ఎవరు ఇక్కడున్నావు విక్రూనానా అని
అన్నారు, ఆవిడ అంత పరుషంగా మాట్లాడచ్చా..? అంటే వికృతమైన కన్నులున్నదానా అన్నదానికి
అంత కోపమొచ్చేసింది ఆవిడకి, కోపమొచ్చి ఆవిడందీ చాలా కోపంతోటి అహం రాక్షస రాజస్య
రావణస్య మహాత్మనః ! ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీ మిమాం !! ఇదీ శరీర
భ్రాంతి, ఇదే నేను అనుకున్నటువంటివాడికి మీరు ఎవడి సంతోషం వాడిది కదాండీ అందుకే
అలా అంటారు కానీ దీక్షలో ఉండి గడ్డం పెరిగిపోయినా అద్దం దగ్గరికి పోయేటప్పటికి ఇలా
చూసుకుని ఇలా చూసుకుని ఆ అద్దం అందానికి మురిసిపోతుంటాడు ఏం దిక్కుమాలిన గడ్డం,
ఎరువేయాలా ఏంటీ దీక్షలో ఉండి గడ్డం పెరిగిందని ఊరికే ఉండచ్చుగదా దానికే గడ్డం చూసుకుని
మురిసిపోవడం ఎందుకూ అద్దం దొరికిననాడు తెలుస్తుంది వాడి మీద వాడికి ఎంత సంతోషం
ఉందో...
అద్దం లేకుండా ఆ ఏమైందండీ
పెద్దవాన్ని అయిపోతున్నాను అంటూంటాడు, అద్దం ఇవ్వండి, నేను చూస్తుంటాను 75యేళ్ళు
వచ్చినవాళ్లు కూడా సూర్యోదయం అయిపోయిన తరువాత కూడా ఓ అద్దం పెట్టుకుని
సూర్యాభిముఖంగా ఇంక ఇలా మొదలు పెట్టాడంటే చర్మం ఊడిపోతుందేమో అన్నట్లు ఏం రేపు
పొద్దునకొచ్చే గడ్డానికి ఇంకా అంత అల్లరెందుకండీ..? ఎంత ప్రయాస పడిపోతుంటారో అద్దం
దొరికితే తెలుస్తుంది నీ దేహాభిమానమెంతో దేహాభిమానం అంత గొప్పది. ఏమైనా అనండిగాని
70యేళ్ళు వచ్చాయిగదాండి మీకు అనండీ, అబ్బె పెద్దవయసేంటండీ..! అంటాడు. తను ముప్ఫైలో
ఉన్నప్పుడు ఇన్నేళ్ళొచ్చయ్ సరిగ్గా ఉండద్దండీ అంటాడు. ఎప్పుడు తను ఏ వయసులో ఉంటే
తను పెద్ద కాదంటాడు. పెద్దరికం అందమండీ అవును నేను పెద్దవాణ్ణి అవుతున్నానుండీ అని
అనడేం దిక్కుమాలిన గోల ఒక్కనాటి అనడు, ఒక్కొక్కరిని తాతగారు అంటే కోపమొస్తుంది,
తాతగారండీ అన్నారనుకోండి, అప్పుడే తాతగారేమిటమ్మా అంకుల్ అనండి అంటారు. అంకులంటే
వాడు మేనమామో తెలియదు పెద్ద తండ్రో తెలియదు చిన్న తండ్రో తెలియదు ఏమిటో తెలియదు ఓ
అయోమయావస్థలో పిలవబడితే అంకుల్ అంటే దరిద్రమొదలిపోతుంది. ఆంటీ అంటే సరిపోయే ఆవిడ
అత్తో తెలియదు చిన్నమో తెలియదు పెద్దమ్మో తెలియదు అంటీ అంటే సరిపోతుంది.
అత్తయ్యగారు అందనుకోండి ఓహో ఈయ్యన భార్యగారి తల్లిగారన్నమాట మాతృపంచకంలో అంటారు
ఆవిడ తల్లితో సమానమని. ఆంటీ అంటే ఏంటి? ఆంటీ ఆవిడ ఎవరు నీ పిన్నా నీ చిన తల్లా నీ
మేనత్తా నీ పెద తల్లా మీ అత్తా... ఎవరన్నా ఓ ప్రశ్నవేస్తేగాని తెలియదు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి దేహభిమానమంటే అంత విచిత్రంగా ఉంటుంది పోగరుగా
ఉంటుంది. ఏమండీ మీరంత బాగుండరండీ అన్నారనుకోండి మీరు అంతకన్నా గొడవ తెచ్చుకోవడానికి
ఇంకోటి ఉండదు, ఏటండీ మీరు అలా ఉంటారు బాగుండరు సుమా! మిమ్మల్ని చూస్తే కొంచెం
అదోలా ఉంటారన్నారనుకోండి, అని మీరు అన్నారనుకోండి ఎంతమాటన్నాడనుకుంటావ్
దుర్మార్గుడు వాడికేం తెలుస్తుంది, వాడేం బాగుంటాడంటావ్ అంటారు. పోల్లేద్దురూ
బాగుండకపోతే పదిమంది నన్ను చూడరు శరీరం మీద భ్రాంతి ఉండదు గొడవొదిలిపోయిందికదా అది
నాకు ఈశ్వరుడిచ్చిన అదృష్టం కదా అంటారని మీరు అనుకుంటారేమిటీ ఒక్కనాటికి అనరు.
కాబట్టి ఎవడికి వాడే అందం ఎవడి అందం వాడిది ఎవడికివాడు అందంగా కనపడకపోతే లోకం
ఉండదులేండి అదోటుంది, ఎవడికివాడు అందంగా కనపడకపోయినా ఎవడి భార్య వాడికి అందంగా
కనపడకపోయినా చాలా ప్రమాదాలు ఉంటాయి, కాబట్టి అలా కనపడ్డమే చాలా మంచిది. ఎవడి
భార్యని వాడు చూసి చాలా పొంగిపోతున్నాడనుకోండి మీరు ఏమీ అనకూడదు ఎంకరేజ్ చెయ్యాలి,
ఆ మంచిదండీ అనాలి అంతే, కానీ మీరు కూడా అలా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయకుండా ఉండడం
మంచిది అది మనసులో ఉంచుకోవలి.
కాబట్టి హనుమ ద్వచనం శ్రుత్వా
లంకా సా కామ రూపిణీ ! ఉవాచ వచనం కృద్ధా పరుషం పవనాఽత్మజమ్ !! అహం రాక్షస రాజస్య
రావణస్య మహాత్మనః ! ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీ మిమాం !! నేను
రావణుని తరుపున రావణ పాలితయైన లంకె, రావణుని చేత రక్షింపబడుతున్న లంకా పట్టణము
యొక్క అధిష్టాన దేవతని, నన్ను గెలిచికానీ నీవు లోపలికి వెళ్ళలేవు, అంటే ఆయన
అన్నారు, అమ్మా అంతంత పెద్ద మాట లెందుకమ్మా... గెలవడ మెందుకూ లోపలకెళ్ళడమెందుకూ
ఇంత కోతిపిల్లని నా కోరిక ఏమిటో తెలుసా... ద్రాక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార
తోరణాం ! ఇత్యఽర్ధ మిహ సంప్రాప్తః పరం కౌతూహలం హి మే !! ఏమ్మా నాకు అంతంత
అల్లరెందుకమ్మా ఇంతున్నాను ఆ యుద్ధాలు మంత్రాలు అధిష్టాన దేవతలూ లంకా ఇవన్నీ
నాకెందుకూ కోతినిగదా ఆ వనముల్నీ చూస్తే సంతోషం కలుగుతుంది. ఒకసారి అలా ధూకుతాను ఓ
నాలుగు చెట్లు చూస్తాను చూసి మళ్ళీ వెళ్ళిపోతాను, వెళ్ళనామ్మా సరే వెళ్ళిరా కోతి
పిల్లవి అంటే ఇంకోలా ఉండేది, ఆవిడకి చాలా కోపం వచ్చేసింది వచ్చి మామ్ అనిర్జత్య
దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం ! న శక్యం అద్య తే ద్రష్టుం పురీయం వానరాఽధమ !!
ఈమాట ఎందుకండీ ఆ అల్లరి అంటే ఒక్కొక్కళ్ళ పొగరు అలా ఉంటుంది. ఎంత అల్లరో అసలు ఇంక
వాడి గురించి వాడు స్తోత్రం చేసుకుంటూ ఎదుటివాడు పురుగు అన్నట్లు మాట్లాడుతుంటాడు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఎన్నిమాటలు వేసేసిందో చూడండి దుర్బుద్ధే ఓ దుర్బుద్దిన్నవాడా!
ఏమిటి ఇంత కోతిపిల్ల కింద ఉన్నాడాయన, అన్నిమాటలు అవసరమా..? దుర్బుద్ధే రాక్షసేశ్వర
పాలితాం రాక్షసేశ్వరుడు ఆయన, ఆయన చేత పాలింపబడుతూంది ఈ లంకా న శక్యం అద్య
తే ద్రష్టుం నీ శక్తే లోపలికెళ్ళి
చూడ్డం పురీయం వానరాఽధమ వానరాధమా! లోపలికెళ్తావా..? తత స్స కపి శార్దూల
స్తా మువాచ నిశాచరీం ! దృష్ట్వా పురీం ఇమాం భద్రే పునర్వ్యాస్యే యదాఽఽగతం !! అమ్మా
నాకు ఏమీ అక్కరలేదమ్మా! ఒక్కసారి ఇలా వెళ్ళి లంక చూసి వెనక్కి వెళ్ళిపోతానమ్మా...
అంతకన్నా నాకు ఇవన్నీ ఎందుకుతల్లీ! రాక్షసేశ్వరుడో ఇంకో అల్లరో ఇంకో అల్లరో నీవు అదిష్టాన
దేవతవో, పోన్లేమ్మా నేను నీతో యుద్ధం అవన్నీ ఎందుకు అలా ఓసారి చూసి వెళ్లిపోతాను
వెళ్ళచ్చా అని అడిగారాయన. అంటే ఆవిడ ఇప్పుడు జవాబు చెప్పలేదు కోపము యొక్క
తీవ్రస్థితి ఎలా ఉంటుందంటే తత కృత్వా మహా నాదం సా వై లంకా భయాఽఽవహం ! తలేన వానర
శ్రేష్ఠం తాడయా మాస వేగితా !! ఒక్కసారి కోపంతోటి అరిచేయి ఎత్తి ఒక్క
దెబ్బకొట్టింది, బుద్ధుందాలేదా లోపలికెళ్తానంటున్నావ్ చచ్చూరుకుంటావు కొట్టానంటే, అంతే
ఆయనకి ఎక్కడలేని కోపమొచ్చింది ఒక సింహనాదం చేశాడు. కానీ బుద్ధిమతాం వరిష్ఠం కదాండి
గట్టిగా కొడితే చచ్చిపోతుంది ఆడదాన్ని, కాబట్టి కుడిచేత్తో కొడితే బలం ఎక్కువగా
ఉంటుందని అందుకని ఎడం చేత్తో ఓ చిన్న దెబ్బకొడతానన్నాడు అని తత స్సంవర్తయా మాస
వామ హస్తస్య సోంఽగుళీః ! ముష్టి నాఽభిజఘా నైనాం హనుమాన్ క్రోధ మూర్చితః !!
హనుమా ఎడం చేయి అయినాసరే తెరిచి అరిచేత్తో కొట్టాడనుకోండి బేస్ ఉంటుంది నేలమీద
యుద్ధ కాండలో మీరు చూద్దురు కాని ఇంకేమీ ఉండదు ఆ టిన్నంతా ముద్ద అంటుకుంటుంది అలా
చచ్చిపోతుందేమో ఆడదీ ఎందుకొచ్చిన గొడవని ముష్టి నాఽభిజఘా నైనాం ఇలా ముడిచారట ముడిచి ఇలా ఓ గుద్దు గుద్దారు.
ఆ చిన్న గుద్ధుకే తత కృత్వా మహా
నాదం సా వై లంకా భయాఽఽవహం ! తలేన వానర శ్రేష్ఠం తాడయా మాస వేగితా !! ఒక్కసారి స్త్రీ
చేతి మన్యమానేన నాఽతి క్రోధ స్స్వఽయం కృత ! సా తు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ
!! ఒక చిన్న గుద్దు ఇలా గుద్దేతప్పటికీ కళ్ళు తిరుగుడుపడిపోయి నేలమీద పడిపోయి
కాళ్ళూ చేతులు చాపుకుని కిందపడిపోయింది, మీరు బాగా గుర్తించండీ
గబుక్కనేమనేస్తారంటే లంకిణి హనుమ చేతిలో చనిపోయింది అంటారు అలా చచ్చిపోవడం ఉండదు
మంత్రాధిష్టాన దేవతలు వశులౌతారు తప్పా అలా చచ్చిపోరు, కాబట్టి ఆవిడ ఇప్పుడు
కిందపడిపోయింది, కింద పడిపోయి వెంటనే ఆవిడ ఒక్కమాట అంది హనుమతోటి ప్రసీద సుమహా
బాహో త్రాయస్వ హరిసత్తమ ఓ మహా బాహు గొప్ప బాహువులున్నవాడా! నన్ను రక్షించు సమయే
సౌమ్య తిష్ఠన్తి సత్త్వవంతో మహా బలాః ! అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ !!
స్వయంభువా మయా దత్తం వర దానం యథా మమ ! యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాత్ వశమాఽఽనయేత్
!! ఒకానొకప్పుడు నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక వరమిచ్చారు నీవు ఈ రావణపాలితయైన
లంకను ఎంత కాలం కాపాడవలసి ఉంటుందో తెలుసా... ఒకానొకనాడు ఒక వానరుడొస్తాడు
ఆవానరుడొచ్చి ఏనాడు నిన్ను ఓడిస్తాడో ఆనాడు లంకా రాక్షసులుకూడా నాశనమైపోతున్నారని
గుర్తు. ఆనాడు లంక నశించిపోవడం ప్రారంభమైపోయిందని గుర్తు. అప్పటివరకే లంకావైభవము
కాబట్టి నీవు వచ్చావు నన్ను ఓడించావు కాబట్టి లంక నశించిపోతుందని గుర్తు ఆవిడ
వెనక్కి వెళ్ళింది.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఈయన ఎందుకు వచ్చి ఉండిండాలి అందరూ నవ్వుతూంటే లంకలో ఎవర్నీ
తీసుకొచ్చాక ఎవరి ఏడుపు వినపడుతూంది, ఏ తల్లిని రావణుడు వశం చేసుకోలేకపోయాడు, ఇప్పుడు
ఆవిడందీ తత్ ప్రవిశ్య హరి శ్రేష్ఠ పురీం రావణ పాలితాం ! విధత్స్వ సర్వ కార్యాణి
యాని యానీహ వాంఛసి ! నీవు లోపలికి వెళ్ళి యదేచ్ఛగా ఈ సుందర నగరంలో జానకిని
నీవు అన్వేషించి తెలుసుకో అంది, అంటే... ఆవిడకు అర్థమైపోయింది ఎప్పుడైతే
ఓడింపబడిందో, మంత్రానాధిష్టదేవత, లంకాధిష్టాన దేవత కనుక, జానకి జాడ కనిపెట్టడానికి
వచ్చినవాడు లోపలికివెళ్ళి జాడ కనిపెడతాడు జాడ కనిపెట్టాక రాముడు వస్తాడు రాముడు
వచ్చాక లంక నశిస్తుంది ఇప్పుడావిడకు తెలిసింది. కాబట్టి ఆవిడ లోపలికి వెళ్ళి జానకి
జాడ కనిపెట్టు అంది. అంటే ఆయన లోపలికి ఎలా వెళ్ళాడో తెలుసాండీ!
స నిర్జిత్య పురీం
శ్రేష్ఠాం లంకాం తాం కామ రూపిణీం ! విక్రమేణ మహా తేజా హనూమాన్ కపి సత్తమః !!
అద్వారేణ మహాబాహుః
ప్రాకార మఽభిపుప్లువే ! ప్రవిశ్య నగరీం లంకాం కపి రాజ హితం కరః !!
చక్రేఽధ పాదం సవ్యం చ శతృణాం స తు మూర్ధవి ! ప్రవిష్టః
సత్త్వ సంపన్నో నిశాయాం మారుతాఽఽత్మజః !!
ఆవిడ రాజ ద్వారం తెరిచి లోపలికి వెళ్ళిపోయింది, ఆయన రాజ ద్వారంలోంచి వెళ్ళలేదు
ఎందు చేతా అంటే రాజ ద్వారే రాజ గృహే అని ఆశీర్వచనం, రాజ ద్వారంలోంచి
లోపలికి వచ్చాడూ అంటే మిత్రుడని గుర్తు, మళ్ళీ మళ్ళీ వస్తాడూ అని గుర్తు, పెరటి
ద్వారంలోంచి లోపలికి వచ్చాడూ అంటే శత్రువని గుర్తు. అది కూడా ద్వారంలోంచి లోపలికి
రాకుండా ధూకి వచ్చాడు, ధూకివచ్చాడూ అంటే ఆ పట్టణానికి ఎవరు యజమానియో ఆయన నాశనాన్ని
కోరుకున్నాడు అని గుర్తు. దొంగలు ధూకొస్తుంటారు అందుకే ఉన్నది ఎత్తుకుపోయి
పాడుచేయడానికి వస్తారు కదా..., ఆ ధూకేటప్పుడు కూడా కుడికాలు ముందుపెడితే
గృహప్రవేశం మంగళాన్ని ఆశించినట్లు, ఏదో పెళ్ళికెళ్ళడం ప్రయాణానికెళ్ళడం కుడికాలు
ముందుపెట్టి వెళ్ళుతారు, ఎడం కాలు ముందు పెట్టారూ అంటే సర్వనాశనమైపోయిందని గుర్తు
అందుకే పెళ్ళిలో ఎంత చక్కగా ప్రసాంతంగానైనా కూర్చోవచ్చుగాని, కోడలు వచ్చేటప్పుడు
అత్తగారు చాలా జాగ్రత్తగా ఎప్పుడుండాలంటే మొట్ట మొదట కాలు లోపల పెట్టేటప్పుడే
జాగ్రత్తపడాలి. అందుకే కసేపు ఆపేస్తారు అక్కడ ఆవిడకి కుడి ఎడమ తెలుసో తెలియదో
ఆవిడకి తెలియక లెఫ్ట్ రైటు తెలిస్తే ఇంగ్లీషు మీడియంలో లేదు రైటు అనవలసింది
అత్తయ్యగారు అని ఎడం కాలు పెట్టేస్తే లేనిపోని ఇబ్బందిగదా... పైగా మీ రైటు నా రైటు
అనుకున్నానని ఎదురుగుండా అత్తగారు ఉంటే ఈవిడ లెఫ్ట్ పెట్టిందని అనుకోవడంలో అత్తయ్యకి
రైటు ఈవిడకి లెఫ్ట్ అయిందని ఇంక అత్తకి కోడలికి పడిచచ్చేదేముంది లోకంలో. కాబట్టి
అలా ఉండకూడదూ అంటే చాలా జాగ్రత్తగా దగ్గరుండి అమ్మా ఇది నీ కుడికాలు అని
చెప్పుకోవలసి ఉంటుంది.
అలా చెప్పుకుని ఇంట్లో ఎందుకు తెచ్చుకోవాలంటే మరి ఇంట్లో వృద్ధి అంతా తరువాత ఆవిడేగా
కోడలివల్లేగా వృద్ధంతాను, వంశం వృద్ధికాని ఐశ్వర్య వృద్ధికాని ఆవిడవల్లే, నేను చెప్పేది
నా కోడలివిషయంలోనైనా అంతే సుమాండీ! నేను పురాణం చెప్పి ఎక్కడో కూర్చుంటే మా కోడలు
గృహ ప్రవేశం చేస్తే కుదరదు, మా కోడలు వచ్చేటప్పుడు నేను కూడా బహు
సుందర కాండ ముప్పైయవ
రోజు ప్రవచనము
|
|
జాగ్రత్తగా ఆమె పాదములవంక చూసి తల్లీ అది నీ కుడికాలమ్మా
అది గడపదాటించి ముందుపెట్టు తల్లీ అని చెప్పుకుని తెచ్చుకోవాలి కోడలిని
తెచ్చుకునేటప్పుడు. కోడలి లక్ష్మీ ఆవిడనిపట్టేకదాండి ఇల్లూ... కాబట్టి నా కూతురైతే
ఓ న్యాయం రేపు కోడలొస్తే ఓ న్యాయం అనుకోకండి. నా కోడలొచ్చినా అలా చేస్తాననని
చెప్తున్నాన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆయనా చక్రేఽథ పాదం సవ్యం చ శతృణాం స తు
మూర్ధని కుడికాలు పెట్టకుండా ఎడం కాలు పెట్టారు, బుద్ధిమతాం వరిష్టం కదాండి,
ఎడమపాదం పెట్టారూ అంటే అది శత్రు పురం, నాశనమైపోతుంది తను జయిస్తాడు వాడు నసిస్తాడని
గుర్తు కాబట్టి ఆయన ఎడం కాలు పెట్టి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా
పట్టణంలో వెడుతున్నారు శుశ్రావ మధురం గీతం త్రి స్థాన సర్వ భూషితమ్ ! స్త్రీణాం
మద సమృద్ధానాం దివి చాఽప్సరసామ్ ఇవ !! దేవ లోకంలోంచి దిగి వచ్చినటువంటి
అప్సరసలు పాటలు పాడుతున్నారా అన్నట్లుగా చక్కటి పాటలు వినపడుతున్నాయి.
అవి కూడా మూడు స్థానములు మంద మధ్యమ
తార స్తాయిలలో పాటలు వినపడుతున్నాయి, అందమైనటువంటి స్త్రీలు తిరుగుతున్నారు శుశ్రావ
కాఙ్చీ నినాదం నూపురాణాం చ నిస్స్వనమ్ ! సోపాన నినదాం శ్చైవ భవనేషు మహాత్మనామ్ !!
ఆయన భవనాల దగ్గరకి వెళ్ళిచూస్తే ఆడవాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క
వడ్ఢాణములకు పెట్టబడినటువంటి మువ్వల చప్పుళ్ళు వాళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి మంజీరముల
యొక్క ధ్వనులు చేతులకు పెట్టుకున్న గాజుల సవ్వళ్ళూ వినపడుతున్నాయి. అంటే అంతమంది
ఆడవాళ్ళూ సంతోషంగా ఉన్నారు, ఒక్కతల్లే ఏడుస్తోంది అస్ఫోటిత నినాదాం శ్చ
క్ష్వేళితాం శ్చ తత స్తతః ! శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై !!
కొన్ని కొన్ని చోట్లా భుజాలు చరుచుకున్నటువంటి చప్పుళ్లు, కొన్ని చోట్లా ఆ
యోధులైనటువంటివాళ్ళు చేస్తున్నటువంటి గర్జనలు, కొన్ని కొన్ని చోట్లా జపం చేసుకుంటున్నటువంటి
స్థితి. కొన్ని కొన్ని కోట్లా మంత్రోచ్ఛాటనం చేస్తున్నటువంటి రాక్షసులు దీక్షితాన్
జటిలాన్ ముణ్డాన్ గోఽజినాఽమ్బర వాసనః ! దర్భ ముష్టి ప్రహరణాన్ అగ్ని కుణ్డాఽఽయుధాం
స్తథా !! ఏమి వర్ణిస్తారండి మహర్షీ! దీక్షితాన్ కొంతమంది దీక్షపట్టి
ఉన్నారు జటిలాన్ కొంతమంది జడలు కట్టేసినటువంటి వాళ్ళున్నారు ముణ్డాన్ కొంత
మంది పూర్ణంగా గుండు చేయించేసుకున్నవారు ఉన్నారు, గోఽజినాఽమ్బర కొంత మంది
ఎరుపు చర్మం కట్టుకున్నన్నారు. దర్భ ముష్టి ప్రహరణాన్ కొంత మంది
గుప్పిటినింఢా దర్భలు పట్టుకున్నారు అగ్ని కుణ్డాఽఽయుధాం స్తథా
అగ్నికుండాలు పట్టుకున్నారు. మళ్ళీ ఇంకా యుద్ధం చేయడమే, వాడికి ఎవరిమీదో
కోపమొచ్చిందనుకోండి వాడు అభిచారిక ప్రయోగం చేసి ఈ దేవతని ఈ మంత్రానిష్ట దేవతని
అగ్నిగుండాన్ని ప్రయోగం చేస్తాడంతే దర్భల్తోటి.
అంటే ఉగ్ర పూజలు చేసేవాడు రాత్రివేళ
లంకా పట్టణంలో ఆభిచారిక హోమాలు చేస్తున్నారు కూట ముద్గర పాణీం శ్చ దణ్డాఽఽయుధ
ధరాన్ అపి ! ఏకాఽక్షాఽనేక కర్ణాం శ్చ లమ్బోదర పయోధరాన్ !! కూటము ముద్గరము
దండము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకున్నవాళ్ళు ఒంటికన్ను ఉన్నవాళ్ళ ఒక్క చెవి
ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కడుపులున్నవాళ్ళు కరాళాన్ భగ్న వక్త్రాం శ్చ వికటాన్
వామనాం స్తథా ! ధన్వినః ఖడ్గిన శ్చైవ శతఘ్నీ ముసలాఽఽయుధాన్ !! కొంతమంది
భయంకరమైన స్వరూపమున్నవాళ్ళు, వంకర మూతులున్నవాళ్ళు, విక్రుతమైనవాళ్ళు పొట్టిగా
ఉన్నవాళ్ళు ధనస్సు పట్టుకున్నవాళ్ళు దంతాలు పట్టుకున్నవాళ్ళు పరిఘోత్తమ హస్తాం
శ్చ పరిగలు పట్టుకున్నవాళ్ళు విచిత్ర కవచో జ్జ్వలాన్ విచిత్రమైన కవచాలు
కట్టుకున్నవాళ్ళు నాఽతి స్థూలాన్ బాగుగా లావుగా ఉన్నవాళ్ళు, లావులేని
వాళ్ళు నాఽతి కృశాన్ బాగా సన్నగాలేనివాళ్ళు నాఽతి దీర్ఘాఽతి హ్రస్వకాన్ బాగా
పొడువు కానివాళ్ళు బాగా పొట్టి కానివాళ్ళు. అంటే పొట్టివాళ్ళు పొడుగువాళ్ళ
లావువాళ్ళు సన్నం వాళ్ళు నాఽతి గౌరా న్నాఽతి కృష్ణా తెల్లగా లేనివాళ్ళు
నల్లగా లేనివాళ్ళు అంటే తెల్లటివాళ్ళు నల్లటివాళ్ళు నాఽతి కుబ్జాన్ న వామనాన్ నడుము
వంగిపోనివాళ్లు వంగిపోయినవాళ్ళు, పొట్టివాళ్ళు పొడుగువాళ్ళు విరూపాన్ బహురూపాం
శ్చ వికృతమైనవాళ్ళు చాలా రూపాలున్నవాళ్ళు సురూపాం శ్చ సువర్చసః మంచి రూపమున్నవాళ్ళు మంచి వర్చస్సున్నవాళ్ళు
ఇటువంటి వాళ్ళందరూ లంకలో తిరుగుతున్నారు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
శత సాహస్రమ్ అవ్యగ్రమ్ ఆరక్షం
మధ్యమం కపిః ! రక్షోధిఽపతి నిర్దిష్టం దదర్శాంఽతః పురాఽగ్రతః !! రావణాసురిడి యొక్క భవనం దగ్గరికి వెళ్ళాడు, అక్కడా ఒక లక్ష మంది సైన్యం
గుఱ్ఱాల మీదా ఏనుగల మీదా నిలబడి విచ్చుకత్తులతో కాపలా కాస్తున్నారు, లక్షమంది
ప్రహరా కాస్తే తప్పా వాడు పడుకునేదానికి కుదరదు అంటే ఎంత మందిని ఛావగొట్టి ఇబ్బంది
పెట్టినవాడో మీరు ఆలోచించండి, కాబట్టి స తదా తత్ గృహం దృష్ట్వా మహా హాటక తోరణం
! రాక్షసేన్ద్రస్య విఖ్యాతమ్ అద్రి మూర్ధ్ని ప్రతిష్ఠితం !! అది బంగారు
పద్మాలతో చెక్కబడినటువంటి ఇల్లు అక్కడా ఒక శిఖరం మీద ఒక చిన్న కొండ శిఖరం మీద ఆ
రావణాసురిడి యొక్క అంతః పురం ఉంది పుండరీకాఽవతంసాభిః పరిఘాభిః అలంకృతం !
ప్రాకారాఽఽవృతమ్ అత్యన్తం దదర్శ స మహా కపిః !! అటువంటి ఆ గొప్ప భవనాన్ని ఆయన
చూశారు, సైన్యం గుఱ్రాలు ఏనుగులు, రథాలు, విమానాలు భూషణముల యొక్క చప్పుళ్ళు గంధం
తీసేవాళ్ళు పువ్వులు కట్టేవాళ్ళు అంత చీకటి పడిపోయింది కానీ అసలు రావణాంతః
పురంలోకి ప్రవేశించడానికి వీలులేని రీతిలో ఇంకా కక్ష్యలన్ని కూడా ʻకక్ష్యలుʼ అంటారు, లోపలికి వెళ్ళేటటువంటి భాగాలు అన్నీ కూడా అంత జాగ్రత్తగా రావణాంతః
పురాన్ని కాపలా కాస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఇంకొంచెం ఏమారితే తప్పా లోపలికి
వెళ్ళడం కుదరదు అని అనుకున్నారు.
అక్కడా స హేమ జాంబూనద చక్రవాళం
మహాఽర్హ ముక్తా మణి భూషితాంతం పరార్థ్య కాలాఽగరు చందనాక్తం స రావణాంతఃపురమ్ ఆవివేశ
! బాగా పొటం పెట్టి కాల్చినటువంటి బంగారముతో అక్కడ తల్పములు కూడా చేయబడ్డాయి,
అసలు సృష్టిలో గొప్ప గొప్ప మణులు ఏమున్నాయో ఆ మణులన్నీ తాపడం చేశారు, ఆయన లోపలికి
వెళ్ళేటటువంటి అంతఃపుర కక్ష్యలన్నీ కూడా గంధం కలిపినటువంటి చిక్కటి నీళ్ళతో
కళ్ళాపి చల్లారు. కాబట్టి నడిచి వెళ్తుంటే గంధపు సువాసనలు రావాలి, ఆయన అంతఃపురమంటే
ఆయన పడుకునే గధులంటే అలా ఉంటాయి, ముందు కక్ష్యలన్నీ సైన్యంతో ఉంటాయి, లోపలికి
వెళ్లేకొద్దీ ఒకదానికన్నా ఒకటి నిశ్శబ్దంగా ఉంటాయి, ముందు ఏనుగలమీద ఉంటారు ఆ
తరువాత గుర్రాల మీద ఉంటారు ఒంటెల మీద ఉంటారు ఆ తరువాత కాలి బంట్లు ఉంటారు ఆ వెనక గంధం
తీసేవాళ్ళు ఆ వెనక పువ్వులు కట్టేవాళ్ళు ఆ వెనక వీణ వాయించేవాళ్ళు మద్దెల
యోగించేవాళ్ళు ఆ లోపల స్త్రీలతో క్రీడిస్తు రావణుడు ఉంటాడు ఇన్ని ఏర్పాట్లమధ్యలో
ఉన్నాడు. ఒక్కసారి ఆ రావణుడి ఢాబు చూశారు ఇంత గొప్పగా తానున్నాడు ఇంకొక తల్లి తన
భర్తతో తాను ఉండకుండా చేసి తెచ్చి ఏడుస్తుండగా ఓ చెట్టుకింద పెట్టాడు, పైకి ఎంత
ఢాబుంటే ఎవడికి కావాలి లోపల సంస్కారం లేనివాడికి.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
మహర్షి ఏమి శ్లోక రచన ఇచ్చేశాడోనండీ నిజంగా చంద్రున్నిచూసి
అంటారూ తత స్స మధ్యం గత మంశుమన్తం జ్యోత్స్నా వితానం మహదుత్వమన్తమ్ దదర్శ
ధీమాన్ దివి భానుమన్తం గోష్ఠే వృషం మత్తమ్ ఇవ భ్రమన్తమ్ ! గోప్ప కిరణములతో
వెన్నెలను చిమ్ముతూ వెన్నెఛాందినీని వేశాడట చంద్రుడు, ఆయనా గోశాలలో
తిరుగుతున్నటువంటి తెల్లటి ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉన్నాడట ఆకాశంలో ఉన్నటువంటి
చంద్రుడు, లోకస్య పాపాని వినాశయన్తం మహోదధిం చాఽపి సమేధయన్తమ్ భూతాని సర్వాణి
విరాజయన్తం దదర్శ శీతాంశుమ్ అథాఽభియాన్తమ్ ! హనుమ చూస్తున్నారు, లోకస్య
పాపాని వినాశయన్తం లోకముల యొక్క పాపములను పోగొట్టగలిగిన భగవానుడై చంద్రుడు
ప్రకాశిస్తున్నాడు శివస్వరూపం కదాండి అది, ఆ చంద్రున్ని దర్శనం చేస్తే చాలు,
మొన్నటి వెళ్ళిపోయినటువంటి నెలలో కాంచీపురంలో ఏకామ్రేశ్వరిడికి చాలా గొప్ప కళ్యాణం
జరుగుతుంది అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగినప్పుడు ఒక నియమం చెప్తాడు,
ఏకామ్రేశ్వరుడికి రాత్రి కళ్యాణం జరుగుతుంది, కాంచీ పట్టణంలో ఏకామ్రేశ్వరుడికి
కళ్యానం జరుగుతున్నప్పుడు ఇక ఎవరైనా పెళ్ళి చేసుకోవడానికి ముహూర్తం ఉండదు. అప్పుడు
చుట్టు పక్కల ఊళ్ళనుంచి జనపదాల నుంచి పల్లెటూళ్ళనుంచి వచ్చేసి, పురోహితులు ఉండరు...
కొన్ని వేల మంది దంపతులు మంటపాలు ఉండవు, కళ్యాణ మండపాలు ఉండవు.
చిన్న చిన్న దర్భాసనాలు వేసేసి కూర్చుంటారు, మొత్తం ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల
అంతా కూర్చుంటారు, లోపల సర్వేశ్వరుడు జీలకర్రాబెల్లం పెడుతున్నాడంటారు ఇక్కడా
జీలకర్రాబెల్లం పెట్టుకుంటారు, అన్నిచోట్లా మైక్రోఫోన్సు పెడుతుంటారు. ఆయన మంగళ
సూత్రం కడుతుంటారు, ఇక్కడ మంగళ సూత్రం కడుతారు, ఆయన దివ్యకళ్యానానికి ముందు
అభిషేకం జరుగుతుంది ఏకామ్రేశ్వరుడికి ఆ అభిషేకం చూసితీరాలంటారు, అది తదియనాడు
జరుగుతుంది శుద్ధ తదియనాడు జరుగుతుంది, ఆ తదియనాడు చైత్రమాసంలో చేస్తారు
చేసినప్పుడు మీరు ఇక్కడ ఆకాశంలో తదియనాటి చంద్ర రేఖను చూస్తే కాంచీపురంలో అభిషేకం
ఆనాడు జరుగుతున్నటువంటి ఏకామ్రేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఎందుకంటే శివ
స్వరూపం చంద్రరేఖగా ఉంటుందని, కాంచీ పురంలో మీకు ఎవరైనా బాగా తెలిసినవాళ్ళుంటే ఆ
అభిషేకం జరుగుతున్నప్పుడు ఫోనే చేస్తారు అయ్యా బయటికెళ్ళి చంద్రరేఖను చూడండి అని ఫోన్ చేస్తారు. నాకు ఈ సంవత్సరం ఫోన్లు
వచ్చాయి అయ్యా అభిషేకం పర్తవుతోంది బయటికెళ్ళి చంద్ర రేఖని ఒకసారి దర్శనం చేయండి
అని, నిజంగా మీరు ఈ మారు గమనించండి ఆరోజు చంద్రుడు చాలా గమ్మత్తుగా ఉంటాడు. కాంచీ
పురంలో చాలా వైభవముందండీ, కాంచీ పురంలో శివలింగం అటుంటిది ఇక్కడ గోడకి పైన
కన్నాలుంటాయి కన్నాలు, ప్రతిరోజు సూర్య కిరణాలు పడతాయి పడినటువంటి సూర్య కిరణాలు
ఒక గడపవరకే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి తప్పా ఎప్పుడూ గడపదాటి లోపలికి వెళ్ళవు.
ఒక్క రథ సప్తమి తిథినాడు ఒకే ఒక్క లేత కిరణం లోపలికి వెళ్తుంది ఆ లోపలికి
వెళ్తున్నప్పుడు అర్చకుడు ఏం చేస్తాడంటే పళ్లాలు పట్టుకుని కిరణంతో పాటు లోపలికి
వెళ్తాడు అది తిన్నగా లోపలికెళ్ళిపోయి ఒక్క కిరణం రథసప్తమినాడు ఏకామ్రేశ్వర శివ
లింగ పాదాల మీద పడుతుంది. పడి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ కిరణం.
మహనీయమైన ఘట్టం మీరు చూడాలి
ఎప్పుడైన రథసప్తమికి కాంచీపురం ఏకామ్రేశ్వర క్షేత్రానికి వెళ్ళి చూడండి, ఆ శివుడే
చంద్ర భగవానుడు, చంద్రునిగా ఉన్నాను అని ఆయనే చెప్పారు అందుకే ఆ కంచిలో ఉన్నది
పృద్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశ
లింగం, శ్రీ కాళహస్తిలో వాయు లింగం, కోణార్కలో సూర్య లింగం, సీతా కుండంలో చంద్ర
లింగం, పశుపతినాథలో యజమాన లింగం అష్ట మూర్తులలో ఉంటాడు ఎనిమిది లింగాల రూపంలో
కాబట్టి ఆయన చంద్రుడే అందుకని ఆయన లోకముల యొక్క పాపములను తొలగించగలడూ అని చెప్పి
చంద్రుని వంక చూస్తూ వింటే అందునా వైశాఖమాసపు శుక్లపక్ష పౌర్ణమినాటి రాత్రి చంద్ర
కాంతులలో చంద్రుడు తిరుగుతుండగా, సుందర కాండ వినడమంటే చంద్రుని యొక్క ప్రకాశం
గురించి వింటూ మళ్ళీ ఇది దాటిందంటే మళ్ళీ వచ్చే కృష్ణపక్షంలో చెప్పాలి, శుక్లపక్ష
పౌర్ణమినాడే ఆ చంద్రుడి కాంతి గురించి హనుమా అన్వేషిస్తున్నది మీరు వినాలి వింటే ఆ
పదహారు కళలలతో చంద్ర బింబం ఏదుందో ఆ చంద్ర వదనయే సీతమ్మ ఆవిడే సీతమ్మతల్లి. ఆ
సీతమ్మ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహం రామ చంద్రుడు చంద్రుడు శివుడు సీతమ్మ చంద్రవదన
పదహారు కళల తల్లి ఆ తల్లి సీతమ్మ, సీతామాత కాబట్టి ఈనాడు వినద్దూ చంద్ర కిరణాల
గురించీ అందుకే వేళ దాటిపోతున్నా ఇవ్వాళ చెప్తున్నాను తప్పా... పోనిలే రేపు
చెప్తామని చెప్పి వెల్టంలేదు లేచి.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
నా ఆర్థిని అందుకు గమనించాలి అయ్యో పాపం ఇలా కూర్చున్నారే
ఇవ్వాళ చెప్పి నేను వీళ్ళకి ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలి లోకస్య పాపాని వినాశయన్తం
మహోదధిం చాఽపి సమేధయన్తమ్ సముద్రం పొంగుతుంది ఆయన్ని చూస్తే భూతాని సర్వాణి
విరాజయన్తం సమస్త భూతములు ఆనందిస్తాయి చంద్ర కిరణములకు దదర్శ సీతాంశుమ్ అథాఽభియాన్తమ్
అందరూ కూడా దదర్శ సీతాంశుమ్ చల్లని కిరణములు ఉన్నటువంటి చంద్రుని దర్శనం చేస్తున్నారు.
మనమూ చేద్దాం ఇవ్వాళ బయటికెళ్ళిన తరువాత యా భాతి లక్ష్మీ ర్భువి మన్దర స్థా తథా
ప్రదోషేషు చ సాగరస్థా తథైవ తోయేషు చ పుష్కర స్థా రరాజ సా చారు నిశాకరస్థా !
అబ్భాహ్! ఏమి శ్లోకాలు వేస్తారండీ..! లక్ష్మీ దేవి యొక్క వైభవమటా భువిమీద మంగళగిరి
పర్వతం మీద ఉందటా, సాయం సంధ్యవేళలో ప్రదూష వేళలో సముద్ర జలాలయందు ఉందట అట్లాగే
జలములలో ఉన్న పద్మములయందు ఉందటా త్రయోదశీ చతుర్దశీ పూర్ణిమలలో ఆకాశంలో ఉండేటటువంటి
చంద్ర కాంతులలో లక్ష్మీదేవి ఉందటా అందుకే కదాండి లక్ష్మీ దర్శనంతో సమానం. హంసో
యథా రాజత పంజర స్థః సింహో యథా మన్దరకన్దర స్థః వీరో యథా గర్విత కుఙ్ఞర స్థః
చన్ద్రోఽపి బభ్రాజ తథాఽమ్బర స్థః ! వెండి పంజరంలో పెట్టబడినటువంటి హంస ఎలా
ఉందో అలా ఉందట చంద్రుడు, మంధర పర్వత గుహలో పడుకున్న సింహం ఎలా ఉందో అలా ఉన్నాడట
చంద్రుడు, వీరుడైనటువంటివాడు మధగజము యొక్క కుంభస్థలంమీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా
ఉన్నాడట చంద్రుడు, అలా ఉన్న చంద్రున్ని హనుమ దర్శనం చేస్తున్నారుటా.
వినష్ట శీతాఽమ్బు తుషార పంకో మహా గ్రహ గ్రాహ వినష్ట పంకః ప్రకాశ లక్ష్మ్యాఽఽశ్రయ
నిర్మలాంకో రరాజ చంద్రో భగవాన్ శశాంకః ! అందుకని భగవాన్ అంటాడు ఆయన ఉదయించినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మంచుతెరలు
తొలగగొట్టబడ్డాయట ప్రకాశిస్తూంటే, ఆయన యొక్క కాంతి చేతా సూర్యుని యొక్క కిరణములు
గ్రహములకు అధిపతియైనటువంటి సూర్యుని యొక్క కిరణములు ఆయన మీదపడి ప్రతిఫలించిన
తరువాత పూర్ణ తేజస్సుని చంద్రుడు
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
పుంజుకుంటే చుట్టూ ఉన్నటువంటి మందమైన మంచుతెర తొలగిపోయిందట,
అటువంటి భగవానుడైన చంద్రున్ని హనుమ దర్శనం చేశారటా శిలా తలం ప్రాప్య యథా
మృగేంద్రో మహా రణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాఽఽసాద్య యథా నరేంద్రః తథా
ప్రకాశో విరాజ చంద్రః ! అలా నడిచి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి తను
కూర్చోవడానికి కావలసినటువంటి పర్వత శిఖరం మీద ఉన్న ఒక పెద్ద శిలను వెత్తుక్కుని
దానిమీద పడుకుని రెండు కాళ్ళూ ముందుకు చాపుకుని ఇలా తలయెత్తి చూస్తున్న సింహం ఎలా
ఉంటుందో అలా ఉన్నాడట చంద్రుడు మహా రణం ప్రాప్య యథా గజేంద్రః గొప్ప
యుద్ధమొచ్చినప్పుడు ఏనుగు ఎంత సంతోషంగా ఉంటుంటుందో అలా ఉన్నాడట రాజ్యం సమాఽఽసాద్య
యథా నరేంద్రః రాజైనా రాజ్యంలేనివాడు శోకంతో ఉండి రాజ్యం పొందిన తరువాత రాజు
ఎలా ఉన్నాడో అలా ఉన్నాడట చంద్రుడు ప్రకాశ చన్ద్రోదయ నష్ట దోషః ప్రవృద్ధ రక్షః
పిశితాఽఽశదోషః రామాఽభిరామేరిత చిత్త దోషః స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోషః ! ఆ
చంద్రుడు ప్రకాశిస్తున్న చీకటి సమయంలో రాక్షసులు మాంసం తింటున్నారు, అక్కడ
ఉన్నటువంటి స్త్రీలు సంతోషంగా తమ ప్రియుల్ని కలుసుకోవడానికని బయలుదేరారు, అక్కడ
స్వర్గలోకంలో ఉండేటటువంటి ప్రకాశం ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు.
ఇటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి స్థితిలో గొప్ప తంత్రుల యొక్క ధ్వనుల్ని,
అనేకములైన సంగీత వాద్య పరికరముల యొక్క ధ్వనుల్నీ హనుమ వింటున్నారు పరస్పరం చాఽధికమ్
ఆక్షిపన్తి భుజాం శ్చ పీనాన్ అధివిక్షిపన్తి మత్త ప్రలాపాన్ అధివిక్షిపన్తి
మత్తాని చాఽన్యోన్యమ్ అధిక్షిపన్తి అక్కడ ఉన్న రాక్షసులు రాత్రివేళ గుండెలు
చూపించి చూడరా నాకు ఎంత వక్షస్తలముందో అంటే నాకెంత వక్షస్తలముందోని
చూపించుకుంటున్నారు తాగినటువంటివారై మత్త ప్రళాపాలు చేస్తున్నారు రక్షాంసి వక్షాంసి
చ విక్షిపన్తి గాత్రాణి కాన్తాసు చ విక్షిపన్తి రూపాణి చిత్రాణి చ విక్షిపన్తి
దృఢాని చాపాని చ విక్షిపన్తి సుందర కాండ అంతా సౌందర్యమే శ్లోకాలు కూడా అంత
సుందరంగా అంత్యాను ప్రాసన రక్షాంసి వక్షాంసి చ విక్షిపన్తి తమ గుండెలు
చూపించుకుని వాటిమీద చేతులు వేసుకుని చరుచుకుని మత్త ప్రళాపాలు మాట్లాడుతున్నారు
ఆడది అలా వెళ్ళిపోతుంటే చాలు ఆమె శరీరానికి తమ శరీరాన్ని తగిలితే తప్ప తమకాన్ని
ఆపుకోలేకా శరీరాన్ని పట్టుకెళ్ళి ఆవిడ శరీరం మీదకి తగులుస్తున్నారు రూపాణి
చిత్రాణి చ విక్షిపన్తి అనేకమైన కామ రూపాలు పొందుతున్నారు దృఢాని చాపాని చ
విక్షిపన్తి పెద్ద పెద్ద ధనుస్సుల్ని చేతులో పట్టుకున్నారు న తు ఏవ సీతాం
పరమాఽభిజాతాం పథి స్థితే రాజ కులే ప్రజాతామ్ లతాం ప్రఫుల్లామ్ ఇవ సాధు జాతాం దదర్శ
తన్వీం మనసాఽభిజాతామ్ ! గొప్ప సౌందర్యం కలది ధార్మికమైనటువంటి వంశంలో
జన్మించినది చాలా భర్త కోసం పరితపిస్తున్నది రామ చంద్ర మూర్తి యందే మనసు పెట్టుకున్నది సుకుమారమైన లత ఎంత కోమలంగ ఉందో
అటువంటి కోమలమైన సీతమ్మతల్లి మాత్రం కనపడలేదు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం
రామేక్షణాం తాం మదనాఽభివిష్టామ్ భర్తు ర్మనః శ్రీమదఽనుప్రవిష్టాం స్త్రీభ్యో
వరాభ్య శ్చ సదా విశిష్టామ్ ! మహా పతివ్రతయై రామ చంద్ర మూర్తి మనసులో స్థానం
సంపాదించుకుని తాను ధ్యానములో రామున్ని అనుభవిస్తున్నా రామున్ని బాహ్యంలో కూడా
పక్కన చేరాలని పరితపిస్తున్న సీతమ్మ దర్శనం మాత్రం హనుమకి అవ్వలేదు.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
ఇదేమిటో తెలుసాండీ సీతమ్మ ఇలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నాడు
ఎందుకని వడ్డాణాల చప్పుళ్ళు వినపడుతున్నాయి అందేల చప్పుళ్ళు వినపడుతున్నాయి సంగీతం
వినపడుతూంది మంచి మంచి పాటలు వినపడుతున్నాయి ప్రియుని కౌగిళ్ళలోన ఉండేటటువంటి
ప్రియురాళ్ళు కనపడుతున్నారు ఒంటిమీద వస్త్రం లేని ఆడవాళ్ళు కనపడుతున్నారు స్త్రీ
సుఖాన్ని పొందుతున్న ఎందురో పురషుల్ని చూశారూ చూసి ఇన్ని చూసినటువంటి హనుమా...
సీతమ్మ కూడా అన్న ధోరణి ఆయన యందులేదు, నా తల్లి మహా పతీవ్రత రాముడు పక్కన లేడూ అని
నా తల్లి ఏడుస్తుంటుంది. నా తల్లి మహా పతీవ్రతయై ధార్మికమైన వంశంలో పుట్టింది
కాబట్టి రాముడి మనసు తెలుసుకున్న నా తల్లి, రాముడికోసం చూస్తూ ఉంటుంది ఆ ఆలోచన అంత
పవిత్రం ఈ కంటికి కనపడేవన్నీ అంత హేయమైనవైనా... అది హేయమనీ అనడానికి వీళ్ళేదు
అక్కడ ఆ దంపతుల మధ్య అది ధర్మము, అటువంటివి ఈ కంటికి కనపడుతున్నా ఆ కనపడినవాటివల్ల
మనసు ప్రకోపం చెందకుండా అంత పవిత్రమైన సీతమ్మనే ధ్యానం చేస్తుండడం హనుమ యొక్క
అద్భుతమైన ఉపాసనా బలానికి ఆయన నిష్టకి నిదర్శనం అదే సౌందర్యం అది సుందరకాండ.
ఆయన అంటారూ మా తల్లి ఎలా ఉంటుందో
తెలుసా ఉష్ణాఽర్దితాం సాఽనుసృతాఽస్ర కణ్ఠీం పురా వరాఽర్హోత్తమ నిష్క కణ్ఠీమ్
సుజాత పక్ష్మామ్ అభిరక్త కణ్ఠీం వనే ప్రనృత్తామ్ ఇవ నీల కణ్ఠీమ్ ఇలా ఉంటుంది
సీతమ్మ అన్నారు అలాగే కనపడింది ఆయనకి, ఆ తల్లి ఎలా కావాలంటే అలాగే కనపడుతుంది ఉష్ణాఽర్దితాం
సాఽనుసృతాఽస్ర కణ్ఠీం ఏడిచి ఏడిచి పదినెలలు అయిపోయినా ఇంకా ఆవిడ కంఠమంతా
ఏడుపుతోటే నిండిపోయి గద్గదమైపోయిందట, ఏడ్చీ ఏడ్చీ ఏడ్చీ కంటివెంట కారిన ధారలచేత
ఆవిడ యొక్క వక్షస్తలమంతా తడైపోయిందట. పురా వరాఽర్హోత్తమ నిష్క కణ్ఠీమ్ పూర్వం
ఆ కంఠం నిండా బాంగారు హారాలు ఉండేవి పక్కన భర్త లేడుగనుకా నా తల్లి ఇప్పుడు బంగారు
హారాలు వేసుకోలేదు పురా వరాఽర్హోత్తమ నిష్క కణ్ఠీమ్ ఒకప్పుడు బంగారు
ఆభరణములచేత అలంకరింపబడిన ఆ కంఠం ఇప్పుడు ఆభరణములు లేకుండా ఉంది సుజాత పక్ష్మామ్
అభిరక్త కణ్ఠీం ఇంత బాధలోనూ కూడా ఆ తల్లి కన్నులలో మాత్రం కారుణ్యమే
కనపడుతుంది. అలా ఉంటుంది మా అమ్మ అని ఊహ చేస్తున్నారు కనపడలేదు ఆయనకి, మా అమ్మ అలా
ఉంటుంది అది హనుమ యొక్క మనః స్థితి. మహానుభావుడు హనుమ అంటే వనే ప్రనృత్తామ్ ఇవ
నీల కణ్ఠీమ్ వనములలో తిరిగేటటువంటి నెమలి ఎలా ఉంటుందో మా తల్లి అలా ఉంటూంది. ʻమనః సంచాల కుశలాʼ ఆతల్లి అలా ఉంటుందని అవ్యక్త రేఖామ్ ఇవ చన్ద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామ్ ఇవ
హేమ రేఖామ్ క్షత ప్రరూఢామ్ ఇవ బాణ రేఖాం వాయు ప్రభిన్నామ్ ఇవ మేఘ రేఖామ్ ! మా
తల్లి వీళ్ళల్లా ఇలా చూస్తే కనపడేటట్టు ఉండదు, మా తల్లి తపించి తపించి కృషించి
కృషించి ఏడ్చి ఏడ్చి రామునికోసం బాధపడి బాధపడి ధ్యానించి ధ్యానించి తపించి తపించి
ప్రయత్న పూర్వకంగా చూస్తే కనపడనంతగా సుష్కించిపోయి ఉంటుంది మా తల్లి.
అవ్యక్త రేఖామ్ ఇవ చన్ద్రరేఖాం శుక్లపక్ష
తదియనాటి చంద్ర రేఖ పార్వతీ పరమేశ్వరుల కిరీటం మీద ఉండే చంద్రరేఖ, దాన్ని చూద్దాము
అనుకుంటే ఇలా చూస్తే కనపడదట గబ్బుక్కున మీరు ప్రయత్న పూర్వకంగా ఆకాశమంతా వెతికితే
కనపడేటటువంటి సన్నని చంద్ర రేఖలా బాగా వెతికితే తప్ప దొరకని తల్లి మా తల్లి అంత
కృషించిపోయింటుంది పాంసు ప్రదిగ్ధామ్ ఇవ హేమ రేఖామ్ నా తల్లి బంగారు తీగ
కాని ఇప్పుడు మట్టి పట్టింది, ఎందుకని పది నెలల నుంచి అదే పట్టుపుట్టంతో ఉంది కాబట్టి
మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది నా తల్లి. ఎంత పవిత్రమైన మనసండీ మహానుభావుడిది క్షత
ప్రరూఢామ్ ఇవ బాణ రేఖాం బాణపు దెబ్బ తగిలింది బాణపు ములుకు ఇంకా
లోపలుండిపోయింది, బాణపు ములుకు లోపల ఉండిపోయిన కారణం చేత బాధపడుతున్నటువంటి
వ్యక్తిలా ఆవిడ ధ్యానముతోటి రామునితోటే కలిసున్నా పైకి ఇంకా రాముని పక్కకు చేరలేదే
అని బాధపడుతున్న తల్లిలా ఉంటుంది అంత శోకిస్తుంటుంది నాతల్లి వాయు ప్రభిన్నామ్
ఇవ మేఘ రేఖామ్ పదమూడేళ్ళైపోయాయి ఇంటికెళ్ళిపోదాం పట్టాభిషేకం అయిపోతుందనుకున్న
సీతమ్మ అకస్మాత్తుగా అపహరింపబడి పదినెలల నుంచి రాక్షసుడైన రావణుడి యొక్క
అంతఃపురంలో బంధింపబడిన కారణం చేతా ఆవిడ ఆశలన్నీ కొట్టుకుపోతే బోలెడన్ని మేఘాలు
ఆకాశంలోకి వస్తే ఒక్కసారి పెనుగాలి వచ్చి మేఘాల్ని కొట్టేస్తే చెదర గొట్టబడిన
మేగాలు ఎలా ఉంటాయో అలా ఆశలు చెదరిన నా
తల్లి అలా ఉంటుంది.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
అలా ఉంటుంది తప్పా ఇలా ఉండి సంతోషంగా క్రీడిస్తూ ఆడుతూ
పాడుతూ నర్తిస్తూ నూపురపు చప్పుడు వినపడుతూ గజ్జల చప్పుడు వినపడుతూ నాతల్లి ఉండదు,
నా తల్లి మహా పతీవ్రత అలా ఉంటుంది, వెతుకుతాను నా తల్లినని ఆ సీతమ్మ వైభవాన్ని
గుర్తు తెచ్చుకుని సంతోషించి ఆనందంతో హనుమ వెతకడాన్ని ఇంకా నిర్వహిస్తున్నారు అన్న
ఘట్టం దగ్గర ఇవ్వాల్టిది ఆపు చేస్తాను ఎందుకంటే ఈ అన్వేషణ ఇలా చేస్తే ఇక రాత్రంతా
చెయ్యాలి కనుక ఇక్కడ ఆపుచేసి మనం ఇప్పుడు ఒక్క పదకొండు మాట్లు రామ నామం
చెప్పుకుందాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ
నామము !!రా!!
ఇడా పింళ మధ్యమందున ఇమిడి యున్నది
రామ నామము !!రా!!
చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి
చెప్తానమ్మా... రామ నామం అయిపోయేంతవరకు ఉండండి, చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్తాను
పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది
శ్రీ రామ నామము !!రా!!
నీవు నేనను భేదమేమియు లేకయున్నది
రామ నామము !!రా!!
బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే
శ్రీ రామ నామము !!రా!!
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ
రామ నామము !!రా!!
సకలజీవులలోనవెలిగే సాక్షిభూతము రామ
నామము !!రా!!
ఆంజనేయుని వంటిభక్తులకాశ్రయము శ్రీ
రామ నామము !!రా!!
శిష్టజనముల దివ్యదృష్టికి స్పష్టమగు
శ్రీ రామ నామము !!రా!!
చూపు మానసమొక్కటై మరి చూడవలే శ్రీ
రామ నామము !!రా!!
శరణు శరణని విభీషణునకు శరణమొసగిన
రామ నామము !!రా!!
రావణానుజ హృదయపంకజరాచకీరము రామ
నామము !!రా!!
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
పాలు మీగడ తేనెకన్ను తీయనైనది రామ నామము !!రా!!
జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే ఈ రామ
నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనుల
నెల్లకాలము రామ నామము !!రా!!
లోకంలో ఒక విషయాన్ని చెప్తారు
పెద్దలు పూర్ణమి వెళ్ళినటువంటి పాఢ్యమి సుభం పలుకుతుందని పెద్దలు చెప్తారు, అసలు ఆ
తిథికున్న లక్షణమేమిటంటే... అది శుభాన్ని పలుకుతుంటుందీని అప్పుడు ఏదైనా పని
చేస్తే జరిగితీరుతుంది, అది చాలా గొప్ప శక్తి నీయగలిగినటువంటి తిథి. అందునా
వైశాఖమాసం మరీ శక్తివంతమైన మధుమాసం మాధవమాసం మహాపురుషుల జయంతులన్నీ ఈ రెండు
మాసాల్లోనే అటువంటి మాధవ మాసంలో కృష్ణపక్ష పాఢ్యమి రేపు పాఢ్యమినాడు మనం సిద్ధి
సర్గను వినబోతున్నాం. ఇది నిజంగా ఈశ్వర కృపా నేను ఏదో వస్తుందని చెప్పి ఇన్ని
ప్రణాళిక వేసి ఉపన్యాసం చెప్పడం అనేటటుంటిది దుస్సాద్యం అది అలా ఎవ్వరూ ఎక్కడా
చేయరు కుదరదు. అది కేవలం రామానుగ్రహం సీతమ్మతల్లి అనుగ్రహం రేపు సిద్ధి సర్గ
వస్తుంది సిద్ధి సర్గ అంటే హనుమ సీతమ్మతల్లిని దర్శనం చేస్తాడు హనుమకి సీతమ్మతల్లి
దర్శనమైనటువంటి సర్గ సిద్ధి సర్గ. సిద్ధి సర్గ అంటే సిద్ధి సర్గ వింటే చాలా గొప్ప
ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్ర వాక్కు. అందుకే సిద్ధి సర్గ తప్పకుండా వింటారు.
సుందరకాండ యొక్క శక్తి పొందాలి దాని అనుగ్రహం పొందాలి అనుకునేవాళ్ళు సిద్ధిసర్గను
ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. నేను ఇది చెప్పకపోతే రేపు సిద్ధిసర్గని వినలేకపోయామని
అనుకుంటే అయ్యో ఈ మాట ముందు చెప్పింటే వచ్చేవాళ్ళం కదురా ధూర్తుడా అంటారు మీరు,
అందుకనీ నేను చెప్పకుండా చెప్పడం నా ధర్మం, అందుకని చెప్తున్నాను.
రెండు సిద్ధి సర్గనాడు సీతా దేవిని
సహస్ర నామాలతో అర్చించడం చాలా చాలా గొప్ప విషయం ఎనిమిది గంటలకు కదాండయ్యా
హరిప్రసాద్ గారూ ఏమిమిది గాంటలకు కదా అన్నారు. రేపు ఉదయం ఏమిమిది గంటలకు ఒక
అపురూపమైన సీతారాముల మూర్తి కొన్ని వందల సంవత్సరాల నాటి మూర్తి రామానుగ్రహంగానే
లభ్యమయ్యింది. అది రామాజ్ఞ, దానికే జరగాలని
సీతమ్మతల్లే ఆజ్ఞాపించింది మీరు నమ్మండి. కాబట్టి అటువంటి మూర్తికి రేపు
కుంకుమార్చన జరుగుతుంది. అది సువాసినుల యొక్క హక్కు. సువాసినీ సువాసీన్యాక్షిణప్రీత
ఐదోతనం అమ్మవారి అనుగ్రహం అమ్మవారు ఏం కోరుకుంటుందటా... నేను ఇచ్చిన ఐదో తనం
కాబట్టి ఆ ఐదోతనంతో నా పాదాల మీద కుంకుమ వేయడానికి అధికారం ఉంది కాబట్టి వేయ్యాలని
కోరుకుంటుంది, సీతమ్మ మహాపతీవ్రత కదాండి నరకాంతగా వచ్చినతల్లి. ఆవిడని అర్చిస్తే
ఆవిడ చాలా సంతోషిస్తుంది. రేపు సీతా సహస్రంతో పూజ ఉంటుంది. రామ చంద్ర మూర్తిని
పన్నెండు నామాలతో తులసీ దళంతో ఉంటుంది కేవలం సువాసునులకే పురుషులకి లేదు ఆ పూజ, ఆ
పూజ లేదూ అంటే చేసుకోవచ్చు కానీ అది సువాసునీలకు పరిమితం చేశాము.
రేపు ఉదయము ఎనిమిది గంటలకు ఆ పూజ
జరుగుతుంది. ఉదయం సంకల్పం చెప్పి వదిలేసిన తరువాత వచ్చి చేరకూడదు, అది మంచి
పద్దతికాదు అసలు, పావుతక్కువ ఎనిమిదికి లోపల ఉన్నవాళ్ళు ఎవరుంటారో టోకెన్స్
ఏమీలేవు ఇప్పుడు ఇస్తున్నారాండీ అంటే ఒక సంఖ్య తెలియకపోతే పదార్థాలన్నీ సిద్ధం
చేయడం కష్టం. మీరు తేవలసినవేవీ ఉండవు అన్నీ దేవస్థానం ఇస్తుంది. కాబట్టి మీరు
టోకెన్ తీసుకోవలసి ఉంటుంది. టోకెన్ తీసుకుంటే మీరు చేసుకోవచ్చు, నేను ఒక్క మార్గం
చెప్తాను ఒకవేళ టోకెన్ దొరకలేదనుకోండి ఇవ్వాళ మీరేమీ నిరుచ్సాహపడవద్దు మీరు పూజ
చేసుకోవాలి అనుకుంటే నేనొక మార్గం చెప్తాను మా కాకినాడ పట్టణంలో మేము ఈ పద్ధతిని
అనుమతిస్తుంటాం. టోకెన్ దొరకపోయినా మేమేం చేస్తామంటే టొకెన్ దొరకనివాళ్ళు
ఎల్లాగైనా నేను అమ్మవారి ఆరాధిద్దామనుకుంటే నాకు టోకెన్ దొరకలేదూ అని మీరు ఖేద
పడవద్దు. లోపల మీరు కూర్చుని చేయలేరేమో కాని మీకు స్పీకర్లో వినపడుతూంటుంది, మీరు
బయట కూర్చుని ఒక పాత్ర తెచ్చుకుంటే మూర్తిని ఇవ్వడానికి అభ్యంతరం లేకపోవచ్చేమో
మూర్తిని ఇస్తాం కదాండీ! కాబట్టి మీరు ఆ కుంకుమతో అర్చన చేసుకోవచ్చు. అయ్యో మాకు
టోకెన్ దొరకలేదు అని ఎవ్వరూ ఖేదపడకూడదు అని నేను అనౌన్సు చేస్తున్నాను కానీ టోకెన్
తీసుకుంటే చక్కగా సశాస్త్రీయంగా లోపల కూర్చుని ఆ వైదికమైనటువంటి అర్చన బ్రహ్మ
స్థానంలో కూర్చున్నవాళ్ళు చేయిస్తుండగా మీరు ఆ మంత్ర భాగాన్ని వింటూ చేసుకోవచ్చు
ప్రత్యక్షంగా.
సుందర కాండ
ముప్పైయవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి చక్కగా టోకెన్సు తీసుకోండి చక్కగా చేయండి సీతమ్మ
తల్లేగా మీ అందరి రూపాల్లో ఉంది ఇంత మంది సీతమ్మ తల్లులు సీతమ్మ తల్లిని
అర్చిస్తుంటే చూసిన కన్నులు కన్నులు ఆ భాగ్యం వదులుకుంటామా... నేను కూడా వచ్చిచూసి
తరిస్తాను రేపు. కాబట్టి రేపు చక్కగా అర్చన జరుగుతుంది, ఉదయం పావు తక్కువ
ఎనిమిదికి ప్రాంగణంలోకి ప్రవేశించండి టోకెన్ తీసుకున్నవాళ్ళు ఈ రెండు విషయాలు మీకు
జ్ఞాపకం చెయ్యాలి అనుకున్నాను. కాబట్టి రేపు సిద్ధి సర్గ. ఒకవేళ సిద్ధిసర్గ సీతా
దర్శన సమయానికి కించిత్ సమయం పట్టినా నేను ఎక్కడైనా ఛాదస్తపడిపోతే నన్ను
ఓర్చడానికి సిద్ధపడి ఆవిష్కరించండి.
మంగళా శాసన పరై....
No comments:
Post a Comment