తేది 29-6-09-2015
మూడవ విలువ.. క్యారెక్టర్ బిల్డింగ్
మీకంటూ ఒక పెద్ద పుస్తకాల షెల్ఫ్ ఆస్తిగా ఉండాలి. మీరేమేమి చదివారో వాటిని అనుసరించే మీ క్యరెక్టర్ మౌల్డ్ అవుతుంది. రామాయణం, భారతం, భాగవతం పట్ల చిన్నచూపుతో ఉండకండి. విభీషణుడు రావణాసురుడు వెళ్ళిపో అనేంతవరకు ఆయన దగ్గరే ఉండిపోయాడు. ఎందుకంటే ధర్మాచరణం చేసేవాడు ఎక్కడైనా ఉండగలడు. తన ధర్మ చెడగొట్టుకోకుండా ఉండటం సెల్ఫ్ రెస్పెక్ట్. దుర్యోధనుడి దగ్గర భీష్ముడు ఉంటే ఆయన ధర్మ ఏమీ చెడిపోలేదు. చెడు మధ్యలో ఉండికూడా మంచిగా ఉండగలిగితే వాడు మంచివాడు. అంతేకానీ మంచిగా ఉండడానికి అవకాశం ఉంది మంచిగా ఉండటం గొప్పకాదు. దుర్యోధన, దుశ్శాసనుల వంటి పరమ దుర్మార్ఘుల మధ్యలో ఉండీ ధర్మంగా ఉండిన భీష్మాచార్యుడు గొప్ప.
విభీషణుడు ఉంటే రావణాసురుడు చచ్చిపోడు. విభీషణుడి మాట రావణాసురుడు విని ఉంటే అతను బతికిపోయేవాడు. రావణాసురుడి వద్ద ఉండి కూడా విభీషణుడు అంత గొప్పవాడయ్యడంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ వేళ రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు కేవలం ఎమోషన్స్ని రగులు కొల్పేవే. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహరీ వజపేయి గారు ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ మాట్లాడుతుంటే అధికార కాంగ్రెస్ నాయకులు అడ్డుకోబోయారు. నెహ్రూ వారిని వారిస్తూ అన్నారు.- ఎంత అద్భుతమైన విమర్శ, వినండి, వినండి, గోల చేస్తారెందుకు, నిశ్శబ్దంగా వినండి అన్నారు. అదీ ఉండవలసిన లక్షణం వ్యతిరేక పక్షంలోనే ఉండవచ్చు. కానీ వాజ్పేయి చేస్తున్న ప్రసంగంలో ఉన్న విషయాన్ని అంతశ్రద్ధగా ప్రభుత్వాధినేత విన్నారు. వాళ్ళు అంత గొప్పగా వినగలిగేవారు. అలా మాట్లాడగలిగే వారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఈ దేశంలో వేయింటికి పైగా స్వతంత్ర సంస్థానాలుననాయి. వాళ్లెవ్వరూ ఒప్పుకోకపోతే భారతదేశ పటం ఇవాళ మనం చూస్తున్న పటం కాదు. చుక్కల ముగ్గు గీసినట్లు వంకర టింకరగా ఉండేది. అన్ని స్వతంత్ర దేశాలలో వేటిమీదా యుద్దం ప్రకటించలేదు పటేల్ గారు. హోం మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని స్వతంత్ర దేశాల సంస్థానాధీశులని పిలిచి సమావేశం పెట్టి ఒక గంటసేపు ప్రసంగించారు. ఒకటి రెండు సంస్థానాలు తప్ప అన్ని సంస్థానాలు తమ రాజ్యాలన్నీ భారత భాగంలో విలీనం చేశాయి. ఒక్క ప్రసంగంతో ఈ దేశంలో మిలటరీ యాక్షన్ జరగవలసిన దాన్ని జరగకుండా ఆపి దాన్ని శాంతియుతంగా దేశంలో కలిపారు పటేల్. క్లారిటీ ఆఫ్ థాట్ అంటే ఎలా ఉండేదో తెలుసా? గాంధీగారిని హత్య చేసినప్పుడు సర్ధార్ పటేల్ హోమ్ మినిస్టర్. మొదటి ఫోన్ ఆయనకి వెళ్ళింది. ఆయన వెంటనే అడిగి ప్రశ్న హిందువా? ముస్లిమా?
ఆయన ఆలోచనలో గాంధీగారిని ఒక హిందువు హత్య చేస్తే దేశంలో ఉండే శాంతి భద్రతల పరిస్థితి వేరు. ఒక మహ్మదీయుడు హత్య చేస్తే దేశంలోని శాంతి భద్రతల పరిస్థితి వేరు. దానికి దగిన నెక్ట్స్ యాక్షన్ కి రెడిగా ఉండాలి హోమ్ మినిస్టర్. అది క్లారిటీ ఇన్ థాట్, తాను ఉన్న స్థితి గురించి ఉన్నటువంటి ఆలోచన, కర్తవ్యతానిష్ఠ. దృష్టికోణం, సమగ్రమైన పరిశీలన, కదలకుండా ఉండటం.
ఈ రోజుల్లోని పిల్లలు ప్రేమాదోమా అనీ ఆత్మ హత్యల దాక వెళుతున్నారు. ఏది ప్రతిఫలాన్ని ఆశించదో అదే నిజమైన ప్రేమ. తల్లిదండ్రులది నిజమైన ప్రేమ. వాకాటి పాండురంగారావు గారంటారు. ఎవడైతే అమ్మకు కృతజ్ఞత చెప్పాలనుకుంటాడో వాడికన్నా మూర్ఖుడీ ప్రపంచంలో ఇంకోడు లేడు అని. ఎందుకంటే అమ్మ ఋణం ఎంతసేవ చేసినా తీరనిది. యాభై రూపాయల టికెట్ కోసం భారీ డైలాగులు చెప్పి మీ ఎమోషన్స్ తో ఆడుకునే హీరోతమ సినిమాలో నైతిక విలువలకు తిలోదకాలిచ్చే వాళ్లు ఈ దేశానికి నాయకులెలా అవుతారు క్లారిటీ ఇన్ థాట్ అన్నది మనిషికి చాలా చాలా అవసరం. మీరు బాగా ఆలోచించండి ఈ వయసులో మీకు కావల్సింది ఒక్కటే- మీ తల్లిదండ్రులు మీమీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చండి. మీ ఉపాధ్యాయుడు. మీ అధ్యాపకుడు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయకండి. ఒక మాట మాట్లాడితే ఆ మాట అగ్ని అని తెలుసుకోండి.
ఇటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ మీకు అలవాటయితే, ఇటువంటి కాండక్ట్ మీకు అలవాటయితే ఆ కాండక్ట్, ఆ క్యారెక్టరే ఎడ్యుకేషన్ యొక్క రిజల్ట్, పోతనగారు జ్ఞానఖలునిలోని శారదయువోలె అన్నారు. జ్ఞానఖలుడు అంటే పాము పడగమీద మణి ఉంటే ఎవరికి ఉపయోగం అవుతుంది? చందన వృక్షంపై తాచుపాముంటే ఆ చందన వృక్షం దగ్గరకు మనం వెళ్లగలమా? మీ సౌందర్యం మిమ్మల్ని అభివృద్ధి పరిచేది కావాలి. మీ సౌందర్యం మిమ్మల్ని పాడుచేసేది కాకూడదు. శంకరాచార్యుల వారు చెప్పిన సౌందర్యలహరి కంటికింపైన బాహ్యసౌందర్యం కాదు. అమ్మలగన్న అమ్మ, జగన్మాత అంత స్సౌందర్యాన్ని లహరి ప్రవానహంగా గానం చేశాడు. అందం అంటే ఏమిటో అర్థం తెలుకోండి. ఏ వయస్సులో ఏది చేయాలో అదే చెయ్యండి. ఏ వయసుకు ఏది పనికి రాదో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మీరు ఆలోచనలో ముందు క్లారిటీ పెంటుకోండి. ఇదే నా దృష్టిలో వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్.
నాకిది తెలియదు అని జీవితాంతం వినయంతో బతకగలగడం, మీ కన్నపెద్దవారు కనబడినప్పుడు నమస్కరించగలగడం, మీతో సమానులు కలిసినప్పుడు స్నేహం చేయగలగడం, మీకన్నా కిందివారు కనపడ్డప్పుడు వృద్ధిలోకి రావాలని కోరుకోగలగడం, మీకన్న గొప్పవాడు కనపడ్డప్పుడు అసూయ పెంచుకోకుండా, వారి పట్ల గౌరవం పెంచుకోవడం... ఇవీ క్యారక్టర్ బిల్డింగ్ కు ప్రధానాంశాలు. వాళ్ళు అంతగొప్ప వాళ్ళు ఎలా అయ్యారో మీకొక ఉదాహరణ చెబుతా.
ఎపిజె అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేసిన ఆ కాలం పూర్తయిపోతే పదవీ విరమణ సమయంలో అంతర్జాతీయంగా ఆయన ఈమెయిల్స్ వచ్చాయి ఆనకి. మీరు మళ్లీ రాష్ట్రపతిగా కొనసాగండి అని కానీ భారతదేశంలో ఆయనను రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి తగిన సంఖ్యాబలం ఉన్న కొంతమంది ఆయన భారత రాష్ట్రపతిగా తిరిగి ఎన్నిక కావడం ఇష్టం లేదన్న సంకేతాలు వెలువరించారు. ఆయన నిస్సంకోచంగా పోటీతో రాష్ట్రపతిగా నిలబడడం నాకిష్టంలేదు అని చెప్పి తప్పుకున్నారు జీవితంలో నాకత్యంత ఇష్టమయినది పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పకోవడం అని వెంటనే రాష్ట్రపతి భవన్ ఖాలీ చేసేసి చెన్నై యూనివర్సిటీకి వచ్చి పిల్లల మధ్యే తరించిపోయారు.
వింగ్స్ ఆఫ్ ఫైర్ కి పీఠిక మీరు చదివి ఉంటారు. ఆయన రాసుకున్నారు. అమ్మామా.. ఒకానొకనాడు రామేశ్వరంలో నేను విద్యార్థిగా ఉండగా చదువుకుంటూ... ఆకలితో, అమ్మా ఆకలేస్తోందని వచ్చి కూర్చున్నప్పుడు, పొయ్యి మీద రొట్టె వేసి, అత్యంత ప్రేమతో నాకు పెట్టిన గోధుమ రొట్టెలోంచి ఈ అబ్ధుల్ కలాం అన్న మేధ పెరిగి పెద్దదయ్యి భారతదేశ రక్షణ రంగంలో క్షిపణులు తయారు చేయగల శక్తిగా పరిణమించింది. అమ్మా ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత ఏ లోకంలో ఉన్నా నీ పాదాలు పట్టి నమస్కారం చేస్తానమ్మా అని రాసుకున్నాడు. అబ్ధుల్ కలాం లాంటి క్లారిటీ ఇన్ ధాట్ ని, ఇటువంటి డివోషన్ని పెండుకోండి. ఆయన తన చెల్లెలిని ఎంతగా ప్రేమించారో, తనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టారినీ అంతగా ప్రేమించారు. చెన్నై వెళితే ఇల్లు వెతుక్కుని మరీ కలుసుకున్నారు. కలాంగారి జీవితం, పటేల్ గారి జీవితం, రాజారాంమోహన్ రాయ్ గారి జీవితం. అటువంటి మహానుభావుల జీవిత చరిత్రల పుస్తకాలు మీ షెల్ఫ్ లో పెట్టుకోండి. మీ సబ్జెక్టుతో పాటూ వాటినీ చదవండి.
మీ క్యారెక్టర్ని కరెక్టుగా మలుచుకోండి. మీరు బాగా విశ్వసించండి. ఇతరులు చెప్పిన మాట బాగా వినండి. ప్రిజుడీస్ తో తొందరపడిపోయి ఎవరో ఏదో చెప్పారని తిరగబడి మాట్లాడడం అలవాటు చేసుకోకండి. ఎమోషన్ లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఒక వేళ మీరు ఖండించదలచుకుంటే చక్కగా ప్రశాంత చిత్తంతో ఖండించండి. అవతలివారు అప్పుడు అంగీకరించకపోయినా తరువాతనైనా అంగీకరిస్తారు. ముందు మీరు మాట్లాడుతున్న దానిపట్ల మీరు నమ్మకం పెంచుకోండి. మీరు మాట్లాడుతున్నది సత్యమని విశ్వసించంది. ఏది పడితే అది మాట్లాడకండి.
నేను వయస్సులో మీకన్నా పెద్దవాణ్ణి. నేనూ మీలానే చదువుకున్నాను. ఉద్యోగం చేశాను. గృహస్థాశ్రం నిర్వహిస్తున్నాను. ఎంతో మందితో సత్సంబంధాలు నెరపాను. నా అనుభవాన్ని మీకు చెబితే రేప్పాద్దున మీ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
ఒకసారి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వేదపాఠశాల వైపు వెళుతున్నారు. పిల్లలందరూ పెద్దగా అరుచుకుంటూ, మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు.
ఆయన ఇద్దరు పిల్లలను పిలిచి 'ఏరా మీరిలా ఆడుకుంటున్నారు. మీకు పాఠం చెప్పవలసిన ఉపాధ్యాయుడు రాలేదా?' అని అడిగాడు.
ఒక పిల్లాడు అన్నాడు 'గురువుగారు రాలేదండీ- ఇంకా' అన్నాడు. రెండో పిల్లాడు అన్నాడు 'మా గురువుగారు వచ్చి పాఠం చెబుతున్నారండి. మేమే బయటికి వచ్చి ఆడుకుంటున్నాం' అన్నాడు. దీంతో పరమాచార్య సంకటస్థితిలో పడ్డాడు. నిజానిజాలు తెల్చుకోవడానికి ఆ పిల్లలను వెంట బెట్టుకొని పాఠశాలలోకి వెళ్ళి వాకబు చేశారు. అక్కడివారు వీళ్ల గురువుగారు రాలేదని చెప్పారు. అప్పుడు ఆయన 'ఎందుకిలా చెప్పావ్' అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు. 'శిష్యుడు తమకు అమర్యాద తెచ్చుకునైనా గురువుగారి ప్రతిష్ఠ కాపాడాలి. గురువుగారంటే సాక్ష్యాత్తు ఈశ్వరుడని మీరే ఒకనాడు అనుగ్రహ భాషణంలో చెప్పారు. రోజూ వేళకి వచ్చి పాఠం చెప్పే మా గురువుగారు ఏ కారణం చేతనో ఇవాళ రానంత మాత్రం చేత కూర్చొని చదువుకోకుండా బయటికొచ్చి ఆడుకోవడం వల్ల మా గురువుగారు రాలేదన్న విషయం మీ దృష్టిలోకి వచ్చింది. ఆ పాపం నాది. ఇప్పుడు మా గురువుగారి మీద మీకు కోపం వస్తే, నేను చాలా పాపం మూట కట్టుకున్నవాణ్ణి అవుతాను. గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం కోసం ఈసారి ఆ పాపం నా మీద వేసుకున్నాను. గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం కోసం చిన్న అబద్ధం ఆడడం చేత దోషం రాదు అని మీరే చెప్పారు. కాబట్టి నేను దోషం చేయలేదు అనే అనుకుంటున్నాను' అన్నాడు. 'గురువంటే నీకర్థమైంది రా నిజంగా' అన్నారు పరమాచార్య స్వామివారు.
ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఒకటుంది. ఒకరు చెబితే వినకపోవడం. సృస్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడి కొక్కడికే ఉన్నది. కాని దురదృష్టం ఏమంటే నేటి రోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే చాలా గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి వారున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడు. అంటే ఒకటే కారణం చెబుతారు పెద్దలు. మహర్షులందరూ చెప్పారు ఒకచోట కూర్చోబెట్టి, 'నీవు చేస్తున్నది తప్పు, నీ పనివల్ల ఇలా పాడైపోతావు, కాబట్టి మా మాట విను, నీవు ఇలా చెయ్యకు' అన్నారు. అంటే ఆయనన్నాడు.
'జానామి ధర్మం నచమే ప్రవృత్తిః, జానామి అ ధర్మం సచమేమివృత్తిః' మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను. ఇది చెడు అని తెలిస్తే చెయ్యకుండా నిగ్రహించుకోవడానికే మనుష్యుని జన్మ. ఇది చెడు అని చెప్పినా చెయ్యకుండా ఉండలేనూ అన్నాడంటే అతడు పశువు కన్నా హీనం. ఇది చాలా ప్రమాదకరం.
నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. సామాజిక స్పృహ అంటే నేను మీకు ఒక విషయాన్ని మనవి చేస్తున్నా. జాగ్రత్తగా వినండి. రేప్పొద్దున మీరు ఉద్యోగాలు చేశాక మీ జీవితాల్లోంచి ట్రస్టులు పెట్టండి. మీరు పిల్లలని చదివించండి, మీరు దేశానికి సేవ చేయండి, ఇలా నేను ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సిద్ధంగా లేను, ఎందుకు లేను అని మీరంటారేమో, అది మీరు చేసి తీరుతారు అని నా నమ్మకం, మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పది మందికి అతను పనికొస్తాడు, పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, 'మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం' చెప్పండి.
ఒక పెద్ద చందన వృక్షం ఉంది. దాంట్లోంచి ఒక కొమ్మ విరుద్దాం అంటే దానిపై పెద్ద త్రాచుపాము ఉంది. ఎవరైనా పొరపాటున చందనవృక్షం దగ్గరికి వెడతారా? ఒక చింత చెట్టు కింద ముళ్లుంటే తుడుచుకుని పడుకొంటారు కానీ చందన వృక్షం దగ్గరికి వెళ్లరు. అది చందన వృక్ష దోషమా? లేక చందన వృక్షం నల్లత్రాచుపాముని కలిగి ఉన్నదోషమా? ఒక నల్లత్రాచు చందన వృక్షం చేరింది. చందన వృక్షం దేనికీ పనికి రాకుండా పోయింది. కేవలం కోపం కారణంగా ఇంట్లో శాంతి ఉండదు. తను పని చేస్తున్న ఆఫీసులో శాంతి ఉండదు. మీరు ఇవాళ బీటెక్ చదవచ్చు, యం టెక్ చదవొచ్చు రేపొద్దున పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు. కానీ మీరు కోపాన్ని పెంచుకుంటే, ఎవరు చెప్పినా వినిపించుకోకపోతే, మీరే ఎందుకూ పనికి రాకుండాపోతారు. కోపం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. కోపం మీలోనే ఉంటుంది. మీలోనే ఉన్న కోపం అవకాశం కోసం ఎదురు చూస్తూంటుంది. దానికి అవకాశం ఏమిటో తెలుసాండీ మీ వ్యక్తిత్వం దెబ్బతిన్నది అనే భావన మీకు కలిగిన ఉత్తర క్షణంలో అది ప్రకోపిస్తుంది. నాకు చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏమిటి అంటే నా యందు లోపాలు చాలా ఉన్నాయి. అనడానికి గుర్తు. నేనెంతటి వాడిని అనుకున్నావాడు పోనీలెద్దు అందరూ ఒక్కలా ఉంటారా? అని క్షమించి విడిచిపెడతాడు. లేదా అలా ఉండకూడదమ్మ తప్పు, దానివల్ల నీవేం ప్రయోజనం సాధిస్తావు. నీవు పాడైతే నా మనస్సుకు బాధగా ఉంటుంది. అలా ప్రవర్తించకు అని చెబుతాడు. కోపం లేకపోతే అవతలి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వ్యక్తిత్వం దెబ్బతిని కోపం వచ్చినవాడు ఎంతటి పాపమైనా చేస్తాడు.
కోపావేశం వచ్చినటువంటి వాడు గురువుగారిని చంపేయడానికి కూడా వెనుకాడడు. క్షణికావేశంలో చేయకూడని పని చేసేసి జీవిత పర్యంతం కారాగారంలో ఉండిపోయిన మేధావులున్నారు. మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప, నాకు కోపం వచ్చేసిందండీ, నేను కోపిష్ఠివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు, దానికన్నా శత్రువు లేడు, కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్ధం ముందు మీకు మీరు నిలబడి చూసుకోండి, బ్లడ్ ప్రెసర్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు దేవాలంయంలోకి వెళ్లి ఈశ్వరుడి ముందు కూర్చున్నా సరే... మీరు ఎవరి పట్ల వ్యగ్రతతో ఉన్నారో అదే గుర్తుకు వస్తుంది. ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన పెరిగిపోయి మీరు ఊగిపోతుంటారు. ఉద్రేకపడిపోతుంటారు. ఆ సమయంలో అతనికి మనుష్యుడు కాడు, రాక్షసత్వం ఆవహించేస్తుంది.
నేను ఇలా ఉండవచ్చా? ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీ కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు ఎలా విడిచిపెట్టవచ్చు. పాము తన శరీరంలోంచి వచ్చిన కుబుసాన్ని తనెలా విడిచిపెడుతుందో 'యథోరగస్తతం! జీర్ణం సవైపూర్ణాం పురుషముచ్యతే' అంటుంది రామాయణం. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు, తన కోపాన్ని తను పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడే దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు. మీకందులో సందేహం ఏమీలేదు. ఎందుకో తెలుసా... పదిమంది అతనితో మాట్లాడగలుగుతారు. అసలు కోపమున్నది లేకపోయేసరికి మీరు ఇంకొకరి మాటలో ఉన్న ఔన్నత్యాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించే అలవాటవుతుంది. తద్వారా మంచి ప్రణాళిక అందడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఏది చేస్తే అది కరెక్ట్ అనే వాళ్లు మీకు జీవితంలో చాలామంది దొరుకుతారు. మీరు చేసేది తప్పు, ఇలా చెయొద్దు అనేటటువంటి మిత్రులు ఒక్కరు కూడా ఉండరు. మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు చెప్పేవారు దొరకరు, మీరు ఆఫీసరు అయ్యారనుకోండి, మీరు తప్పు చేస్తే ఆఫీసులో మాట్లాడుకుంటారుగానీ, మీ ఎదురుగా వచ్చి మాట్లాడరు, ఒకవేళ చెప్పినా నిష్పక్షపాతంగా మీ అభ్యున్నతి కోరి చెప్పరు. మీరు గోతిలో పడిపోతున్నా మిమ్మల్ని పొగిడే వారు మీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. కానీ మీకు మేలు కలిగించే అప్రియమైన మాటలు చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. మీ మేలు కోరి చెప్పేవారి మాటలు పట్టించుకోకుండా మీ అహం దెబ్బతింటుందని మాటలు పట్టించుకోకుండా, మీ అహం దెబ్బతింటుందని దూరంగా పెడితే, మీరు గోతిలో పడిపోక తప్పదు. మారీచుడు చెప్పన మాట రావణాసురుడు విని ఉంటే రావణుని పతనమే తప్పేది. చెప్పిన మాట వినకపోవడమన్న దోషం నీతో పోదు. నిన్ను నమ్ముకున్న కోట్లాది మంది నీతో పోతారు అన్నాడు. అందుకనే మీరు ఎప్పుడూ శాస్త్ర పఠనం చేస్తూ ఉండాలి. రాక్షసులకు ఎంత జ్ఞానం ఉంటే అంత అపాయం.
ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలా మంది ఉంటారు. బాగా చదువుకుని, పెద్ద పనిలో ఉన్నవాడు తప్పు చేస్తుంటే చెప్పడానికి ఎవరూ ఉండరు. జ్ఞాని ఖలుడైపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది. చదువుకునే వాడికే క్యారెక్టర్ చాలా అవసరం రేపొద్దున మీరే సంఘానికి ఉదాహరణలవుతారు. మీకు ఒక మాట మనవి చేస్తాను బాగా గుర్తు పెట్టుకోండి. సచ్చిదానంద శివాభినందనృసింహ భారతి అని శృంగేరి పీఠాధిపతులు అరణ్యంగుండా వెళుతున్నారు. చీకటి పడితే ఆ అరణ్యంలో ఒక చోట గుడారులు వేసుకుని పూజ చేసుకుంటున్నారు. ఫారెస్టు రేంజర్ వచ్చాడు అక్కడికి, వచ్చి నమస్కారం చేసి నిలుచున్నాడు. పీఠాదిపతి త్రికాలవేది, మనిషిని చూడగానే అతనిలో ఉన్నది అంతా చెప్పేస్తారు. అతన్ని చూడగానే ఒక మాటన్నారు.
'నేను మూడు లక్షణాలు చెబుతాను, ఇందులో నీవేస్థాయిలో ఉన్నావో నీవు చెప్పు.' అడగండి అన్నాడతను, 'అసలు నీ మనసులోకి ఒక అభిప్రాయం రాగానే అవతలి వాడిని వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపయే అంత కోపమున్నవాడివా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తరువాత వివరణ చేసి విరుచుకుపడే కోపమున్నవాడివా? అసలు విచారం అన్నదే లేకుండా కోప్పడిపోయి వెళ్లిపోతుండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా?' అని అడిగారు అది ఎందుకడిగారో అడిగినాయనకు తెలుసు, విన్నాయనకు తెలుసు, ఆయనన్నారు నేను మొదటి కోవకి చెందినవాణ్ణి. నాకు కోపం వస్తే అవతలివాడు తప్పు చేశాడని నమ్మేస్తాను. ఆయనన్నారు. ' నీవు నా దర్శనానికి వచ్చావు కదా! నేను నీకిచ్చే కానుక ఒకటే నీవు రెండవ స్థితిలోకి మారు. నీకు కోపం వచ్చేయగానే ఒక్కసారి ఆగు, 'ఎందుకిలా చేశావ్' అని అడుగు, నీ జీవితంలో నీవెన్నితప్పులు చేశావో తెలుస్తుంది.
అతను ఇంటికి వెళ్లిపోయాడు, వెళ్లిపోయేసరికి బాగా చీకటి పడింది. వంటవాడిని 'బాగా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు' అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే గోధుమ రొట్టెలు తీసుకువచ్చి వణికిపోతూ అక్కడ పళ్లెంలో పెట్టాడు. ఈయనకు ఎక్కడాలేని కోపం వచ్చింది. అతను ఓ ఏడెనిమిది రొట్టెలు తింటాడు.
ఓ రెండు కూరల్తోటి రెండు పలుచని రొట్టెలు, అంటే నేను రాననుకొని వీడు తినేశాడు అనుకుని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తుకొచ్చింది.
ఇవాళ రెండో స్థాయికి మారి చూద్దామని, 'ఎందుకు రెండు రొట్టెలు తెచ్చావ్?' అని అడిగాడు. అతనన్నాడు. 'మీ అటెండర్ ని పంపించి కదా! సరుకు తెప్పించుకుంటాం, అతను ఏ కారణం చేతనో ఇవాళ సరుకు తేలేదు. నాకోసం మిగుల్చుకున్న ఈ రొట్టెలు నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నా మీరు తిని వస్తారో, రారో అని అట్టే పెట్టాను. రెండు రొట్టెలే పెట్టిన నా దోషాన్ని మన్నించండి' అన్నాడు. నిజంగా ఆ రెంజర్ వలవలా ఏడ్చేశాడు. నేను ఇలా తొందరపడి కొట్టేసి ఉంటే? ఇలా ఎందరిని నా కోపం చేత కొట్టానో, నేను ఇలా అడిగితే వీడు నా కోసం పడ్డ కష్టం తెలిసిందే, ఇంతలా నా కోసం కష్టపడ్డ వీణ్ణి కొట్టబోయాను. నిజంగా మహానుభావుడు ఈ మూడు తరగతులలో దేనికి చెందినవాడవని ప్రశ్నించి ఒకటి నుంచి రెండవస్థికి మారమని చెప్పి వెళ్లిపోయాడు.
నేను రెండోస్థాయికి వస్తే నా దోషాలు కనపడ్డాయి. నేను ఎంతమందిని కొట్టానో అని ఏడ్చి, ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడాయన. నేనెందుకు మీకు మనవి చేస్తున్నానంటే మీరు దుర్గుణాలను మీరు గ్రహించగలరు. మీలో ఉన్న దుర్గుణాలను మీ ముందు ఎవరూ చెప్పలేరు. మీ లోపాలని మీరు దిద్దుకోవడం ప్రారంభిస్తే, సమాజానికి ఎంతో సేవచేసిన వాళ్లు అవుతారు. మిమ్మల్ని మీరు దోషరహితంగా దిద్దుకోగలిగితే ఈ దేశానికి నీడనిచ్చే చెట్టులాంటి వారు అవుతారు. మీ నీడన ఎందరో సేద తీరుతారు. మీరు రేప్పొద్దున్న ఓ మంచి ఆఫీసర్ అయ్యారనుకోండి. మీ డ్రాఫ్ట్ రాసే అతను ఓ డ్రాఫ్ట్ రాసి పట్టుకొచ్చి మీకిచ్చాడనుకోండి, మీరు అతని డ్రాఫ్ట్ ని మెచ్చుకుంటే అతను ఇంకా బాగా పనిచేస్తాడు. బాగా పనిచేసేవాళ్లని అభినందించండి. సంకుచితత్వ్తంతో మీకు బాగా ఇష్టమున్న వాళ్లని మాత్రమే అభినందించకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అతని వ్యక్తిత్వం నచ్చినా నచ్చకపోయినా, ఆ పనిని అతను సమర్థంగా చేస్తాడనుకుంటే ఆ పనిని అతనికే అప్పగించాలి. కాళిదాను రఘమహారాజు గురించి చెబుతూ... అతను ఎలా పనులు అప్పగించే వాడంటే 'రోగి ఔషధిని సేవించినట్లు' అని చెబుతాడు. తనకు ప్రియుడా... అప్రియుడా... అన్నదతనికి అనవసరం. అతను ఆ పనికి అర్హుడు అనుకుంటే ఇచ్చేసేవాడు అంతే! ఈవాళ దేశానికి ఉన్న దరిద్రం ఏమిటంటే అది పాటించకపోవడం. కాళిదాసు ఇంకో మాటంటాడు, 'ఆ పదవికి అతను అనర్హుడు అనుకుంటే తనకు అత్యంత ప్రియుడైనా సరే పాముకరిచిన వేలు తీయించుకున్నట్లు తీసివేసేటటువంటి వాడు.'
మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి. నేను మీకు ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహారురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు, వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. మీరు ఒక గ్రూపు సబ్జెక్ట్ మీ జీవితంలో వచ్చే ఉత్థానపతనాల నుంచి రక్షించలేదని తెలుసుకోండి. మట్టిముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారి కిందపడి పోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంత పైకి లేస్తుంది. అలా పైకి లేవగలిగిన శక్తి కోసం మీరు విద్యార్థులయి ఉన్నారు తప్ప చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంక పెట్టారని మీరు మృత్పిండమై పోకండి, మీ వల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిన నాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి. నిర్భయంగా అంగీకరించండి. నేనిది చేశాను. ఈ కారణానికి నేనిది చేశాను. ఒకవేళ మీరు నిజంగా స్వార్థంతో చేస్తుంటే ఇంకా ధైర్యంగా చెప్పేయండి.
--::--
క్రోధం తొలగించుకోవాలి
నాకు పిల్లని ఉద్ధేశించి మాట్లాడడం అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందకనీ అంటే ఒకటే కారణం... అందులో నా కర్తవ్యం ఒకటి ఉంది.నేను వయస్సులో మీకన్నా పెద్దవాణ్ణి. నేనూ మీలానే చదువుకున్నాను. ఉద్యోగం చేశాను. గృహస్థాశ్రం నిర్వహిస్తున్నాను. ఎంతో మందితో సత్సంబంధాలు నెరపాను. నా అనుభవాన్ని మీకు చెబితే రేప్పాద్దున మీ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
ఒకసారి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వేదపాఠశాల వైపు వెళుతున్నారు. పిల్లలందరూ పెద్దగా అరుచుకుంటూ, మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు.
ఆయన ఇద్దరు పిల్లలను పిలిచి 'ఏరా మీరిలా ఆడుకుంటున్నారు. మీకు పాఠం చెప్పవలసిన ఉపాధ్యాయుడు రాలేదా?' అని అడిగాడు.
ఒక పిల్లాడు అన్నాడు 'గురువుగారు రాలేదండీ- ఇంకా' అన్నాడు. రెండో పిల్లాడు అన్నాడు 'మా గురువుగారు వచ్చి పాఠం చెబుతున్నారండి. మేమే బయటికి వచ్చి ఆడుకుంటున్నాం' అన్నాడు. దీంతో పరమాచార్య సంకటస్థితిలో పడ్డాడు. నిజానిజాలు తెల్చుకోవడానికి ఆ పిల్లలను వెంట బెట్టుకొని పాఠశాలలోకి వెళ్ళి వాకబు చేశారు. అక్కడివారు వీళ్ల గురువుగారు రాలేదని చెప్పారు. అప్పుడు ఆయన 'ఎందుకిలా చెప్పావ్' అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు. 'శిష్యుడు తమకు అమర్యాద తెచ్చుకునైనా గురువుగారి ప్రతిష్ఠ కాపాడాలి. గురువుగారంటే సాక్ష్యాత్తు ఈశ్వరుడని మీరే ఒకనాడు అనుగ్రహ భాషణంలో చెప్పారు. రోజూ వేళకి వచ్చి పాఠం చెప్పే మా గురువుగారు ఏ కారణం చేతనో ఇవాళ రానంత మాత్రం చేత కూర్చొని చదువుకోకుండా బయటికొచ్చి ఆడుకోవడం వల్ల మా గురువుగారు రాలేదన్న విషయం మీ దృష్టిలోకి వచ్చింది. ఆ పాపం నాది. ఇప్పుడు మా గురువుగారి మీద మీకు కోపం వస్తే, నేను చాలా పాపం మూట కట్టుకున్నవాణ్ణి అవుతాను. గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం కోసం ఈసారి ఆ పాపం నా మీద వేసుకున్నాను. గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం కోసం చిన్న అబద్ధం ఆడడం చేత దోషం రాదు అని మీరే చెప్పారు. కాబట్టి నేను దోషం చేయలేదు అనే అనుకుంటున్నాను' అన్నాడు. 'గురువంటే నీకర్థమైంది రా నిజంగా' అన్నారు పరమాచార్య స్వామివారు.
ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఒకటుంది. ఒకరు చెబితే వినకపోవడం. సృస్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడి కొక్కడికే ఉన్నది. కాని దురదృష్టం ఏమంటే నేటి రోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే చాలా గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి వారున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడు. అంటే ఒకటే కారణం చెబుతారు పెద్దలు. మహర్షులందరూ చెప్పారు ఒకచోట కూర్చోబెట్టి, 'నీవు చేస్తున్నది తప్పు, నీ పనివల్ల ఇలా పాడైపోతావు, కాబట్టి మా మాట విను, నీవు ఇలా చెయ్యకు' అన్నారు. అంటే ఆయనన్నాడు.
'జానామి ధర్మం నచమే ప్రవృత్తిః, జానామి అ ధర్మం సచమేమివృత్తిః' మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను. ఇది చెడు అని తెలిస్తే చెయ్యకుండా నిగ్రహించుకోవడానికే మనుష్యుని జన్మ. ఇది చెడు అని చెప్పినా చెయ్యకుండా ఉండలేనూ అన్నాడంటే అతడు పశువు కన్నా హీనం. ఇది చాలా ప్రమాదకరం.
నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. సామాజిక స్పృహ అంటే నేను మీకు ఒక విషయాన్ని మనవి చేస్తున్నా. జాగ్రత్తగా వినండి. రేప్పొద్దున మీరు ఉద్యోగాలు చేశాక మీ జీవితాల్లోంచి ట్రస్టులు పెట్టండి. మీరు పిల్లలని చదివించండి, మీరు దేశానికి సేవ చేయండి, ఇలా నేను ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సిద్ధంగా లేను, ఎందుకు లేను అని మీరంటారేమో, అది మీరు చేసి తీరుతారు అని నా నమ్మకం, మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పది మందికి అతను పనికొస్తాడు, పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, 'మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం' చెప్పండి.
ఒక పెద్ద చందన వృక్షం ఉంది. దాంట్లోంచి ఒక కొమ్మ విరుద్దాం అంటే దానిపై పెద్ద త్రాచుపాము ఉంది. ఎవరైనా పొరపాటున చందనవృక్షం దగ్గరికి వెడతారా? ఒక చింత చెట్టు కింద ముళ్లుంటే తుడుచుకుని పడుకొంటారు కానీ చందన వృక్షం దగ్గరికి వెళ్లరు. అది చందన వృక్ష దోషమా? లేక చందన వృక్షం నల్లత్రాచుపాముని కలిగి ఉన్నదోషమా? ఒక నల్లత్రాచు చందన వృక్షం చేరింది. చందన వృక్షం దేనికీ పనికి రాకుండా పోయింది. కేవలం కోపం కారణంగా ఇంట్లో శాంతి ఉండదు. తను పని చేస్తున్న ఆఫీసులో శాంతి ఉండదు. మీరు ఇవాళ బీటెక్ చదవచ్చు, యం టెక్ చదవొచ్చు రేపొద్దున పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు. కానీ మీరు కోపాన్ని పెంచుకుంటే, ఎవరు చెప్పినా వినిపించుకోకపోతే, మీరే ఎందుకూ పనికి రాకుండాపోతారు. కోపం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. కోపం మీలోనే ఉంటుంది. మీలోనే ఉన్న కోపం అవకాశం కోసం ఎదురు చూస్తూంటుంది. దానికి అవకాశం ఏమిటో తెలుసాండీ మీ వ్యక్తిత్వం దెబ్బతిన్నది అనే భావన మీకు కలిగిన ఉత్తర క్షణంలో అది ప్రకోపిస్తుంది. నాకు చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏమిటి అంటే నా యందు లోపాలు చాలా ఉన్నాయి. అనడానికి గుర్తు. నేనెంతటి వాడిని అనుకున్నావాడు పోనీలెద్దు అందరూ ఒక్కలా ఉంటారా? అని క్షమించి విడిచిపెడతాడు. లేదా అలా ఉండకూడదమ్మ తప్పు, దానివల్ల నీవేం ప్రయోజనం సాధిస్తావు. నీవు పాడైతే నా మనస్సుకు బాధగా ఉంటుంది. అలా ప్రవర్తించకు అని చెబుతాడు. కోపం లేకపోతే అవతలి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వ్యక్తిత్వం దెబ్బతిని కోపం వచ్చినవాడు ఎంతటి పాపమైనా చేస్తాడు.
కోపావేశం వచ్చినటువంటి వాడు గురువుగారిని చంపేయడానికి కూడా వెనుకాడడు. క్షణికావేశంలో చేయకూడని పని చేసేసి జీవిత పర్యంతం కారాగారంలో ఉండిపోయిన మేధావులున్నారు. మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప, నాకు కోపం వచ్చేసిందండీ, నేను కోపిష్ఠివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు, దానికన్నా శత్రువు లేడు, కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్ధం ముందు మీకు మీరు నిలబడి చూసుకోండి, బ్లడ్ ప్రెసర్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు దేవాలంయంలోకి వెళ్లి ఈశ్వరుడి ముందు కూర్చున్నా సరే... మీరు ఎవరి పట్ల వ్యగ్రతతో ఉన్నారో అదే గుర్తుకు వస్తుంది. ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన పెరిగిపోయి మీరు ఊగిపోతుంటారు. ఉద్రేకపడిపోతుంటారు. ఆ సమయంలో అతనికి మనుష్యుడు కాడు, రాక్షసత్వం ఆవహించేస్తుంది.
నేను ఇలా ఉండవచ్చా? ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీ కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు ఎలా విడిచిపెట్టవచ్చు. పాము తన శరీరంలోంచి వచ్చిన కుబుసాన్ని తనెలా విడిచిపెడుతుందో 'యథోరగస్తతం! జీర్ణం సవైపూర్ణాం పురుషముచ్యతే' అంటుంది రామాయణం. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు, తన కోపాన్ని తను పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడే దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు. మీకందులో సందేహం ఏమీలేదు. ఎందుకో తెలుసా... పదిమంది అతనితో మాట్లాడగలుగుతారు. అసలు కోపమున్నది లేకపోయేసరికి మీరు ఇంకొకరి మాటలో ఉన్న ఔన్నత్యాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించే అలవాటవుతుంది. తద్వారా మంచి ప్రణాళిక అందడానికి అవకాశం ఉంటుంది.
--::--
వినండి... వినడం నేర్చుకోండి
ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్నిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే, ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, మీరు కానీ, ఒక్క మాట అందులో పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... అటువంటి వాడి జీవితం చక్కదిద్దబడటానికి అవకాశం ఉంటుంది. రామాయణంలో మారీచుడు రావణాసురుడితో ఒక మాట చెప్పాడు. రామాయణమంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క శ్లోకం ఒక ఎత్తు. అది రాముడు చెప్పడు, విశ్వామిత్రుడు చెప్పడు, వశిష్టుడు చెప్పడు. రాక్షసుడైన మారీచుడు చెబుతాడు. కానీ నాకు ఎంతిష్టమో ఆ శ్లోకం. 'రాజన్ సతతం ప్రియవాదినః ప్రియస్యతు పత్యస్య క్తాశ్రోతాచ దుర్లభః'మీరు ఏది చేస్తే అది కరెక్ట్ అనే వాళ్లు మీకు జీవితంలో చాలామంది దొరుకుతారు. మీరు చేసేది తప్పు, ఇలా చెయొద్దు అనేటటువంటి మిత్రులు ఒక్కరు కూడా ఉండరు. మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు చెప్పేవారు దొరకరు, మీరు ఆఫీసరు అయ్యారనుకోండి, మీరు తప్పు చేస్తే ఆఫీసులో మాట్లాడుకుంటారుగానీ, మీ ఎదురుగా వచ్చి మాట్లాడరు, ఒకవేళ చెప్పినా నిష్పక్షపాతంగా మీ అభ్యున్నతి కోరి చెప్పరు. మీరు గోతిలో పడిపోతున్నా మిమ్మల్ని పొగిడే వారు మీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. కానీ మీకు మేలు కలిగించే అప్రియమైన మాటలు చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. మీ మేలు కోరి చెప్పేవారి మాటలు పట్టించుకోకుండా మీ అహం దెబ్బతింటుందని మాటలు పట్టించుకోకుండా, మీ అహం దెబ్బతింటుందని దూరంగా పెడితే, మీరు గోతిలో పడిపోక తప్పదు. మారీచుడు చెప్పన మాట రావణాసురుడు విని ఉంటే రావణుని పతనమే తప్పేది. చెప్పిన మాట వినకపోవడమన్న దోషం నీతో పోదు. నిన్ను నమ్ముకున్న కోట్లాది మంది నీతో పోతారు అన్నాడు. అందుకనే మీరు ఎప్పుడూ శాస్త్ర పఠనం చేస్తూ ఉండాలి. రాక్షసులకు ఎంత జ్ఞానం ఉంటే అంత అపాయం.
ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలా మంది ఉంటారు. బాగా చదువుకుని, పెద్ద పనిలో ఉన్నవాడు తప్పు చేస్తుంటే చెప్పడానికి ఎవరూ ఉండరు. జ్ఞాని ఖలుడైపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది. చదువుకునే వాడికే క్యారెక్టర్ చాలా అవసరం రేపొద్దున మీరే సంఘానికి ఉదాహరణలవుతారు. మీకు ఒక మాట మనవి చేస్తాను బాగా గుర్తు పెట్టుకోండి. సచ్చిదానంద శివాభినందనృసింహ భారతి అని శృంగేరి పీఠాధిపతులు అరణ్యంగుండా వెళుతున్నారు. చీకటి పడితే ఆ అరణ్యంలో ఒక చోట గుడారులు వేసుకుని పూజ చేసుకుంటున్నారు. ఫారెస్టు రేంజర్ వచ్చాడు అక్కడికి, వచ్చి నమస్కారం చేసి నిలుచున్నాడు. పీఠాదిపతి త్రికాలవేది, మనిషిని చూడగానే అతనిలో ఉన్నది అంతా చెప్పేస్తారు. అతన్ని చూడగానే ఒక మాటన్నారు.
'నేను మూడు లక్షణాలు చెబుతాను, ఇందులో నీవేస్థాయిలో ఉన్నావో నీవు చెప్పు.' అడగండి అన్నాడతను, 'అసలు నీ మనసులోకి ఒక అభిప్రాయం రాగానే అవతలి వాడిని వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపయే అంత కోపమున్నవాడివా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తరువాత వివరణ చేసి విరుచుకుపడే కోపమున్నవాడివా? అసలు విచారం అన్నదే లేకుండా కోప్పడిపోయి వెళ్లిపోతుండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా?' అని అడిగారు అది ఎందుకడిగారో అడిగినాయనకు తెలుసు, విన్నాయనకు తెలుసు, ఆయనన్నారు నేను మొదటి కోవకి చెందినవాణ్ణి. నాకు కోపం వస్తే అవతలివాడు తప్పు చేశాడని నమ్మేస్తాను. ఆయనన్నారు. ' నీవు నా దర్శనానికి వచ్చావు కదా! నేను నీకిచ్చే కానుక ఒకటే నీవు రెండవ స్థితిలోకి మారు. నీకు కోపం వచ్చేయగానే ఒక్కసారి ఆగు, 'ఎందుకిలా చేశావ్' అని అడుగు, నీ జీవితంలో నీవెన్నితప్పులు చేశావో తెలుస్తుంది.
అతను ఇంటికి వెళ్లిపోయాడు, వెళ్లిపోయేసరికి బాగా చీకటి పడింది. వంటవాడిని 'బాగా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు' అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే గోధుమ రొట్టెలు తీసుకువచ్చి వణికిపోతూ అక్కడ పళ్లెంలో పెట్టాడు. ఈయనకు ఎక్కడాలేని కోపం వచ్చింది. అతను ఓ ఏడెనిమిది రొట్టెలు తింటాడు.
ఓ రెండు కూరల్తోటి రెండు పలుచని రొట్టెలు, అంటే నేను రాననుకొని వీడు తినేశాడు అనుకుని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తుకొచ్చింది.
ఇవాళ రెండో స్థాయికి మారి చూద్దామని, 'ఎందుకు రెండు రొట్టెలు తెచ్చావ్?' అని అడిగాడు. అతనన్నాడు. 'మీ అటెండర్ ని పంపించి కదా! సరుకు తెప్పించుకుంటాం, అతను ఏ కారణం చేతనో ఇవాళ సరుకు తేలేదు. నాకోసం మిగుల్చుకున్న ఈ రొట్టెలు నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నా మీరు తిని వస్తారో, రారో అని అట్టే పెట్టాను. రెండు రొట్టెలే పెట్టిన నా దోషాన్ని మన్నించండి' అన్నాడు. నిజంగా ఆ రెంజర్ వలవలా ఏడ్చేశాడు. నేను ఇలా తొందరపడి కొట్టేసి ఉంటే? ఇలా ఎందరిని నా కోపం చేత కొట్టానో, నేను ఇలా అడిగితే వీడు నా కోసం పడ్డ కష్టం తెలిసిందే, ఇంతలా నా కోసం కష్టపడ్డ వీణ్ణి కొట్టబోయాను. నిజంగా మహానుభావుడు ఈ మూడు తరగతులలో దేనికి చెందినవాడవని ప్రశ్నించి ఒకటి నుంచి రెండవస్థికి మారమని చెప్పి వెళ్లిపోయాడు.
నేను రెండోస్థాయికి వస్తే నా దోషాలు కనపడ్డాయి. నేను ఎంతమందిని కొట్టానో అని ఏడ్చి, ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడాయన. నేనెందుకు మీకు మనవి చేస్తున్నానంటే మీరు దుర్గుణాలను మీరు గ్రహించగలరు. మీలో ఉన్న దుర్గుణాలను మీ ముందు ఎవరూ చెప్పలేరు. మీ లోపాలని మీరు దిద్దుకోవడం ప్రారంభిస్తే, సమాజానికి ఎంతో సేవచేసిన వాళ్లు అవుతారు. మిమ్మల్ని మీరు దోషరహితంగా దిద్దుకోగలిగితే ఈ దేశానికి నీడనిచ్చే చెట్టులాంటి వారు అవుతారు. మీ నీడన ఎందరో సేద తీరుతారు. మీరు రేప్పొద్దున్న ఓ మంచి ఆఫీసర్ అయ్యారనుకోండి. మీ డ్రాఫ్ట్ రాసే అతను ఓ డ్రాఫ్ట్ రాసి పట్టుకొచ్చి మీకిచ్చాడనుకోండి, మీరు అతని డ్రాఫ్ట్ ని మెచ్చుకుంటే అతను ఇంకా బాగా పనిచేస్తాడు. బాగా పనిచేసేవాళ్లని అభినందించండి. సంకుచితత్వ్తంతో మీకు బాగా ఇష్టమున్న వాళ్లని మాత్రమే అభినందించకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అతని వ్యక్తిత్వం నచ్చినా నచ్చకపోయినా, ఆ పనిని అతను సమర్థంగా చేస్తాడనుకుంటే ఆ పనిని అతనికే అప్పగించాలి. కాళిదాను రఘమహారాజు గురించి చెబుతూ... అతను ఎలా పనులు అప్పగించే వాడంటే 'రోగి ఔషధిని సేవించినట్లు' అని చెబుతాడు. తనకు ప్రియుడా... అప్రియుడా... అన్నదతనికి అనవసరం. అతను ఆ పనికి అర్హుడు అనుకుంటే ఇచ్చేసేవాడు అంతే! ఈవాళ దేశానికి ఉన్న దరిద్రం ఏమిటంటే అది పాటించకపోవడం. కాళిదాసు ఇంకో మాటంటాడు, 'ఆ పదవికి అతను అనర్హుడు అనుకుంటే తనకు అత్యంత ప్రియుడైనా సరే పాముకరిచిన వేలు తీయించుకున్నట్లు తీసివేసేటటువంటి వాడు.'
మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి. నేను మీకు ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహారురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు, వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. మీరు ఒక గ్రూపు సబ్జెక్ట్ మీ జీవితంలో వచ్చే ఉత్థానపతనాల నుంచి రక్షించలేదని తెలుసుకోండి. మట్టిముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారి కిందపడి పోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంత పైకి లేస్తుంది. అలా పైకి లేవగలిగిన శక్తి కోసం మీరు విద్యార్థులయి ఉన్నారు తప్ప చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంక పెట్టారని మీరు మృత్పిండమై పోకండి, మీ వల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిన నాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి. నిర్భయంగా అంగీకరించండి. నేనిది చేశాను. ఈ కారణానికి నేనిది చేశాను. ఒకవేళ మీరు నిజంగా స్వార్థంతో చేస్తుంటే ఇంకా ధైర్యంగా చెప్పేయండి.
--::--
వజ్రం వంటిది వాక్కు
సమాజంలో ఎప్పుడూ మూడు రకాల వ్యక్తులు ఎదురవుతుంటారు. నీకన్నా అధికులు, నీతో
సమానులు, నీకన్నా తక్కువ వారు, ఈ ముగ్గురితో ఎలా ప్రవర్తించాలో వేదం చెప్పింది.
నీకన్నా అధికులు కనబడ్డారు. వారి అధిక్యాన్ని నీవు అంగీకరించాలి. మహానుభావుడు
ఎంత సాధన చేశాడండీ... ఎప్పటికయినా వచ్చే జన్మకయినా అంత ఎత్తుకు ఎదగాలి అని మీరు
వారికి నమస్కరించారనుకోండి. ఇప్పుడు మీరు ఎవరకి నమస్కరించారో వారు గొప్పవారన్నమాట
పక్కనబెట్టండి. మీరు గొప్పవారయ్యారు. మీరు సంస్కారవంతులయ్యారు. మీరు నమస్కరించ
లేదనుకోండి. అవతలివాడి అధిక్యం కించిత్ కూడా పోదు. వారి గౌరవం, వారి విద్వత్తు,
వారి జ్ఞానం అలానే ఉంటాయి. పోయింది ఎవరి అధిక్యమంటే మనదే. వారి ఔన్నత్యాన్ని మనం
అంగీకరించలేకపోయాం. తేడా మనలో ఉంది. పెద్దలు కనబడితే గౌరవించు, సమానులు కనబడితే...
ఎదుటివ్యక్తి నీలాగా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటాడన్న ఆలోచన రావాలి. నీవెంత
కష్టపడిందీ నీకు తెలుసు. ఆయనను చూసినప్పుడు ఆదరాభావం కలగాలి ప్రేమతో
మాట్లాడగలగాలి. నీకన్నా తక్కువ రు కనబడితే... ఈశ్వరానుగ్రహంతో ఇతనుకూడా వృద్ధిలోకి
రావాలని కోరుకోవాలి. ఇతనికన్నా పై నేనున్నాను. నా అంతవాడయి నా స్థాయిని
చేరుకోగలనన్న తృప్తి ఇతనికి కలుగుగాక, అని ప్రార్థించారనుకోండి. మీ పెద్దరికం
నిలబడింది. మీ లాలిత్వం నిలబడింది. ఈ మూడు రకాలుగా కాకుండా ఏ రకంగా ప్రవర్తించినా
అది తెగడ్త.
జీవిత పర్యంతం చదువుకుంటూనే ఉంటాం. దేనికి! సంస్కారబలం
వృద్ధి చెందడం కోసం, సమాజంలో మనిషి మనిషిలాగా బతకాలి. పశువులాగా బతకకూడదు కనుక.
దానికోసం చదువుకోవాలి. ఈ మూడింటికి నీవు లొంగ లేదు. నిన్ను తెగిడేవాడు కనబడ్డాడు.
అప్పుడేం చేయాలి. అతన్ని సంస్కరించే పని చేయాలి. ఈశ్వరా! జారుడుమెట్ల మీద నిలబడి
పైకెక్కాలనుకుంటున్నాడు. నిచ్చెన పైకెక్కడానికి కానీ దిగడానికి కాదుగదా, భగవాన్!
ఇతను అహంకారంతో ఉన్నాడు. దాన్ని తొలగించి వృద్ధిలోకి వచ్చేటట్లు ప్రయత్నించు. అని
వేడుకోవాలి. తెగడ్తను నీవు పుచ్చుకోకూడదు. నీవు స్వీకరించకూడదు. అందుకే వాదన
చేయవద్దు అని శాస్త్రం చెప్పింది.
వాదన అగ్నిలో ఆజ్యం పోసినట్లే ఉంటుంది. అది అసూయజనితం, నీవు తెగడ్తను
పుచ్చుకుంటే పాడయిపోయేది నువ్వే. అసూయతో ఉన్నవాడు బాగానే ఉంటాడు. నీ ఆగ్రహం
ఎక్కువుతుంటుంది. చాలాసార్లు పొరపాట్లు జరిగేది ఇక్కడే. అందుకే సంయక్ బాగా
తయారవడానికి... సంస్కారాన్ని వినియోగించు... అని శాస్త్రం చెప్పింది. లోకహితానికి
కావలసిన రీతిలో సంస్కారాన్ని పొందు కేవలం చదువుతో వెళ్లి కూర్చుంటే సమాజంలో
ప్రయోజనాన్ని పొందడంలో వైక్లవ్యాన్ని పొందుతారు.
తెగడ్త-స్వప్రయోజనాన్ని సాధించుకోడానికి దాన్ని సాధనంగా వాడుకోవడం ఒకడు ఇదిలా
ఉండకూడదు. అదలా జరగకూడదు అనుకుంటుంటాడు. ఆది ఎంత మంచి కార్యమయినా అది తను
అనుకున్నట్లుగా మారిపోవడానికి తన వాక్కును ఉపయోగిస్తాడు.
అసలు శ్రీరామాయణం అంతా ఎక్కడ మలుపుతిగింది! పుట్టినప్పటినుంచి
కైకమ్మకు దాదిగా ఉన్న మంధర తప్ప శ్రీరామపట్టాభిషేకానికి అందరూ సంతోషించారు. ఇలా
జరగకుండా ఉంటే బాగుండుననే ఆలోచన ఆమెకు వచ్చింది. అంతే... కైక మనసులో కల్మషం
నింపింది. శ్రీరాముడు, భరతుడు కొద్ది వ్యవధితో పుట్టిన వారు. ఒకసారి రాముడు
రాజయితే ఇక నీ వంశంలో ఎవరూ రాజుకాలేరు. రాముడి తర్వాత రాముడికొడుకే రాజు
రాజవుతాడు. భరతుడే కాదు భరతుడి కొడుకు కూడా రాజు కాలేడు. కౌసల్య రాజమాత అవుతుంది.
ఇప్పటిదాకా ఇద్దరూ సమానులే. ఇక అలా కుదరదు. రాజమాత వెడుతుంటే నీవు చేతులు
కట్టుకుని నమస్కరిస్తూ ఆమె వెనక వెళ్ళాల్సి ఉంటుంది. అని, మాటలు విషాన్ని ప్రోది
చేసేసాయి. రాజయిన దశరథుడు, కౌసల్య, సుమిత్రలు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు,
మహర్షులు, యావత్ ప్రజలు అంతా ఒకవైపు నిలబడినా ఒక దాసి మాటలకారణంగా పట్టాభిషేకం
జరపలేక పోయారు. నిజానికి కైకేయి కూడా పట్టాభిషేకానికి సంతోషించింది. కానీ మంధర తన
మాటలతో మొత్తం కథను మార్చేసింది. అలా మాట్లాడేవారు రేపు మీ జీవితాల్లోకూడా
తటస్థపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు మీరు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళినా,
ఎన్ని మంచి పనులు చేస్తున్నా, మీ పక్కనే చేరి ఎవడో దారి తప్పిన వాడిని చూసి
నీకెందుకీ మంచితనం, నీ కెందుకీ ప్రవర్తన, అని హితబోధ చేస్తున్నట్లుగా
చెప్పేవారుండారు.
వాల్మీకి ఇంటాడు... ఎవరు ఎలా మాట్లాడతారన్నది
తెలుసుకోలేని వాడు కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం నాశనమవుతుంది. వాడు ఒక అధికారి
అయితే అక్కడి వ్యవస్థ నాశనమవుతుంది. ఒక గ్రామాధికారయితే గ్రామం, దేశాధినేతయితే
దేశం నాశనమవుతాయి. ఆవుల మంద వెనుక ఒక గొల్లవాడు వెడుతుంటే ఆవులు రక్షింపబడతాయి.
నక్కవెడితే ఆవులు కనబడవు. అందుకే స్వభావం అన్నారు. నీకు పుట్టుకతో వచ్చినది ఏది,
దాన్ని దిద్ది మార్చగలిగినది ఏది... అంటే ఒక్క మంచిమాట, అదే మిమ్మల్ని
మారుస్తుంది.
నీవు చేస్తున్నపని మీద విశ్వాసం ఉంచి ఇటువంటి మాటలను తోసేయడం అలవాటు
చేసుకోలేకపోతే వాడు నిన్నువాడుకుని వదిలేస్తాడు. నీ పని పులిస్తరాకులా
తయారయిపోతుంది. అన్నం పెట్టుకుని తింటున్నంతసేపే విస్తరాకుకు గౌరవం, స్వకార్యాన్ని
సాధించుకోవడానికి మీ పక్కన చేరినవారి మాటలకు లొంగిపోవడానికి మీరు అలవాటుపడి పోయారో
జీవితంలో మీరు వృద్ధిలోకి రాలేరు. మీ తల్లిదండ్రుల కష్టం, మీ కష్టం, అప్పటిదాకా
మీరు సంపాదించుకున్న కీర్తి అడుక్కి వెళ్ళిపోతాయి.
మహామంత్రి తిమ్మరుసు పోతే తప్ప విజయనగర సామ్రాజ్యం పడిపోదు అని
తీర్మానించుకున్న వారు చివరకు ఆయనమీద రాయలవారికి లేనిపోనివన్నీ చెప్పారు. రాయలు
తిమ్మరుసు కళ్ళు పొడిపించేసాడు. అప్పటికీ రామరాయల వల్ల సామ్రాజ్యం నిలబడినా ఆయనను
కూడా తప్పుదోవ పట్టించారు. చివరకు ఇవ్వాళ శిథిలాలు మిగిలాయి. క్కమాటలో రాజ్యం
పడిపోయింది. ఒక్కమాటతో మహామంత్రి పడిపోయాడు. ఒక్క మాటతో రామాయణ కథ అడ్డంతిరిగింది.
ఒక్క మాటతో రామచంద్ర మూర్తి జీవిత పర్యంతం భార్య పక్కన లేకుండా గడిపేశాడు.
మాట అంత శక్తిమంతమైనది. అందుకే ఒక వాక్కు మిమ్మల్ని సర్వ నాశనం చేయగలదు, ఒక
వాక్కు మిమ్మల్ని అందుకోలేని ఎత్తులకు తీసుకెళ్ళగలదు అంటాడు. ఏమిటీ, నువ్వు కూడా ఈ
ఉద్యోగంలో చేరదామనే వచ్చావా? అని ఎవరయినా
అన్నారనుకోండి. మీరు చిన్నబుచ్చుకుంటారు. మిమ్మల్నీ మాటలు పదేపదే బాధిస్తుంటాయి.
అప్పుడు నేను వచ్చి ఏం తక్కువయిందని నీకు! నీవెన్ని
సాధించలేదు, నీవు తప్పకుండా సాధించగలవు అన్నాననుకోండి, నీ శక్తి ప్రజ్వలనం
అవుతుంది. ఒక్క వాక్కు మిమ్మల్ని పతనం చేయగలదు, ఒక వాక్కు మిమ్మల్ని ఉన్నత
శిఖరాలకు చేర్చగలదు. అయితే అది పొగడ్త కాకూడదు. యుక్తాయుక్త విచక్షణతో
కూడుకున్నదయి ఉండాలి. పెద్దల హితవాక్కులు ఎప్పుడూ వింటూ ఉండాలి. అవే మీకు
సంస్కారబలాన్ని నేర్పుతాయి.
మీరు ఎంత గొప్పవారయినా, ఎంత చదువుకున్నవారయినా సమాజంలోని ఇతర వ్యక్తులతో
సమన్వయం మీకు చేతకాకపోతే ఎవర్ని దగ్గరగా ఉంచాలో ఎవరాని దూరంగా ఉంచాలో చేతకానినాడు
చాలా చాలా ఇబ్బంది పడతారు. స్వప్రయోజనాభిషాషుడయి మీ దగ్గరచేరి మాట్లాడుతున్నప్పుడు
తన కార్యాన్ని సాధించుకోవడానికి నీ శక్తిని వాడుకుంటాడు. ఎందుకో తెలుసా! వాజు నీ అంత చదువుకోలేదు, నీ అంత కష్టపడలేదు.
నీవు రాసినన్ని పరీక్షలు రాయలేదు, నీవు కూర్చున్న పదవిలోకి వాడు ఈ జన్మకు రాలేడు.
కానీ వాడికి ఒక్కటి వచ్చు, మాటలతో మభ్యపెట్టి మీ స్థానాన్ని తన ప్రయోజనం కోసం
వాడుకోవడం వచ్చు. ఆ అప్రతిష్ఠ నీది, ప్రయోజనం వాడిది, నీకు జాగ్రత్త పడడం
చేతకాకపోతే నీ పెట్టుబడికి వాడు యజమాని ఔతాడు, అందుకే జాగ్రత్త పడమని శాస్త్రం
హెచ్చరిస్తుంది.
హితవాక్కు అన్ని వేళలా వృదువుగా, మధురంగా ఉండదు, ప్రతిసారీ చాలా మర్యాదగా,
మెత్తగా మాట్లాడటం కుదరదు. రాజశాసనం ఎలా ఉంటుందో అలా ఉండాలి. సత్యంవద ధర్మంచర,
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ... అంతేగానీ మీ అమ్మగారిని బాగా చూడు నాన్నా,
మీ నాన్నగారిని బాగాచూడు నాన్నా అని చెప్పదు. రాజశాసనం ఎలా కఠినంగా ఉంటుందో అలా
ఉంటుంది. మరీ ఇంత కఠినంగా ఉంటే ఎలా అని మనపురాణాలు ఒక స్నేహితుడు తన స్నేహితులతో
మాట్లాడినట్టు... ఇదిగో రేయ్, నీకు ఆఖరిసారి చెబుతున్నా వినకపోతే పాడయిపోతావ్
తర్వాత నీఖర్మ...! ఇలా చెబుతాయి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది... ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్లు,
ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్లు అనునయంగా మాట్లాడితే వినే వాడొకడుంటాడు.
తారమాట్లాడితే సుగ్రీవుడు వింటాడు. శ్రీరామాయణం ఎక్కడా కఠినంగా ఉండదు. అందుకే
దానిని కావ్యభాష అంటారు.
--::--
సాహిత్య సౌరభం... శీలవైభవం
ఒక ఆపీసర్ ఓ అయిదుగురు అసిస్టెంట్స్ ను రిక్రూట్ చేయవలసి వచ్చింది. ఓ వంద మంది
ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో స్టేట్ చీఫ్ సెక్రటరీ ఒకతన్ని రికమెండ్ చేశాడు. అయన ఆ
అబ్బాయికి ఉద్యోగం ఇస్తూ ఫైలు మీద ఇలా రాశాడు. ‘ఈ ఒక్క అపాయింట్
మెంటు చీఫ్ సెక్రటరీ రికమెండేషన్ మీద చేయకపోతే రేపు సంస్థకు సమస్యలు రావచ్చు.
అందువల్ల ఆ అభ్యర్థికి ఉద్యోగం ఇస్తున్నాను, దీనివల్ల సంస్థకు పెద్ద నష్టమేమీ కలగదు.
దిస్ మే అప్రూవ్’ అని రాసి బోర్డ్ ఆఫ్
డైకెక్టర్ కి ఇచ్చాడు. మరొక ఆఫీసర్ ఉండేవాడు. అయననేవాడు. ‘ఎప్పుడూ రూల్, రూల్ అండ్ జస్టిఫై ఇట్. నిజంగా
అది నీవు మంచని నమ్మితే రాయి ఫైలు మీద. దాన్ని నేను ఆయోదిస్తాను’ అనేవాడు. మీరు మీకిందవాళ్లకి అలాంటి
స్ఫూర్తినివ్వగల ఆఫీసర్సుగా తయారుకండి. మీరు నమ్మిన సిద్ధాంతానికి నిలబడగలిగిన
వారుగా తయారుకండి. ఎప్పుడైనా మీ జీవితంలో చిన్న పొరపాటు జరిగితే మృతపిండాలు
కాకండి. బంతులు కండి. అబ్దుల్ కలాంగారి కేరీర్ ఎక్కడండి ప్రారంభం, ఆయన కోరుకున్న
ఉద్యోగం ఒకటి, ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి, ఆయన నిరాశతో రుషికేశ్ లోని ఒక స్వామీజీ
దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామీజీ అలా వెళుతూ కూర్చున్న కలాంగారిని పిలిచి
అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని ఈయనన్నారు. ‘నేను ఫలానా
ఉద్యోగానికి వెళ్లాను ఉంటర్వ్యూకు, అది పొందడం నాకిష్టం కాని నేను సెలక్ట్
అవ్వలేదు. ఈ ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. ఏదో ఈ ఇంటర్వ్యూకి వెళ్లాను. దీనికి
సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టం లేదు’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని
ఎందుకనుకుంటున్నావు. ఈశ్వరుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచించి ఈశ్వర
నిర్ణయంగా ఎందుకు వెళ్లలేకపోతున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జారితి యేం
చేయించాలనుకుంటున్నాడో’ ఆ మాట ఆయన
మీద పని చేసింది. అంతే! ఈ దేశానికి
ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు కలాం.
రెండవమారు రాష్ట్రపతి ఎన్నికయ్యే అవకాశం ఉన్నా దాన్ని తృణప్రాయంగా వదిలి
విద్యార్థులతో మాట్లాడటమే నాకిష్టమనీ, ప్రతి కాలేజీకి, యూనివర్సిటీలకి వెళ్లి
విద్యార్థులతో మాట్లాడుతూనే వాళ్ల మధ్యనే కన్నుమూశారాయన.
తల్లిదండ్రులను, గురువులను గౌరవించగలిగిన శీల వైభవం లేని వాడు ఎవడికి కావాలి.
మీరు ఎదగడం కాదు, మిమ్మల్ని ఆదర్శంగా మీ వెనుకనున్నవాళ్ళు తీసుకోవాలి. అది మీ
ప్రవర్తన చేత సాధ్యమవుతుందేమో, కేవలం నాలాగ ఉపన్యాసాలు చెప్పడం వల్ల సాధ్యం కాదు.
ఏ ఒక్కరైనా నా ఈ మాటల వల్ల మీ జీవితాలను దిద్దుకోగలిగితే ఆది చాలు. పెద్దలు ఇచ్చిన
సాహిత్యం మీదగ్గర పెట్టుకోండి. ఎత్తు పల్లాలను తట్టుకోగలిగిన శక్తి ఎక్కడినుంచి
వస్తుందంటే ఒక భగవత్ గీతను మీ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ఒక శ్లోకాన్ని
చదువుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చదువుతున్న చంద్రశేఖరేంద్ర సరస్వతిగారి
బోధనల్ని మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు చదవండి.
మంచి మంచి పుస్తకాలు కొని చదవండి. ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని
ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగు పుట్టి పెరినట్లు
బతకకూడదు. మంచిగా బతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలా
మందికి తెలుగు మాట్లాడాలా? ఇంగ్లీషు
మాట్లాడాలా? అన్న సందిగ్ధం మీరు ఇంగ్లీషు బాగా చదువుకుని చక్కగా పాసవ్వండి. చక్కగా
తెలుగులో మాట్లాడండి, మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథ ప్రతుల్ని వేయి ముద్రించి
పంచిపెట్టండి. అది వారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి.
పోతనగారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల
మర్యాదను సంతరించుకోండి. సినిమాను వినోదంగా తీసుకోండి. సినిమాలు ఆదర్శం కావని
గుర్తుంచుకోండి. ఎక్కడైనా మీ జీవితాలలో వెలుగు నింపగలిగే ఆదర్శాలు కనిపిస్తే...
మీరు దానిని అనుసరిస్తే నేను తప్పుపట్టడానికి సిద్ధంగా లేను. అది మంచి పనే అని చెపుతాను.
కిందివారికి పని చెప్పడం తేలికే!
--::--
No comments:
Post a Comment