Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - యుద్ధ కాండ 40వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Yuddha Kanda 40th Day

యుద్ధ కాండ

ముప్పై నలబైయ్యవ రోజు ప్రవచనము





అపూజయత్ కర్మ స లక్ష్మణస్య సుదుష్కరం దాశరథి ర్మహాత్మా హృష్టా బభూవ ర్యుధి యూథపేన్ద్రా నిపాతితమ్ శక్రజితం నిశమ్య ! మహర్షి అంటారు, బాగా బడలిపోయి ఒంటినిండా గాయాలైనటువంటి లక్ష్మణమూర్తికి సుషేణుడు ఓషదీచేత చికిత్సచేసిన తరువాత ఆయన తిరిగి స్వాంతనపొంది పూర్ణమైనటువంటి శరీరారోగ్యమును మానసికమైనటువంటి ఉత్తేజమును తిరిగి పొందగలిగారు. ఆ స్థితిలో లక్ష్మణస్వామితో కలిసివున్నటువంటి రామ చంద్ర మూర్తిని చూసి అక్కడున్న వానరులందరూకూడా ఎంతోసంతోషాన్ని వ్యక్తంచేశారు, నిన్న ఇంద్రజిత్ సంహారముచేసిన తరువాత లక్ష్మణస్వామితో కూడినటువంటి రామ చంద్ర మూర్తి యొక్క స్థితి. ఎందుకంటే... ఎప్పుడైనా ఒక ప్రసంగాన్ని ప్రారంభం చేసేముందు ఒక లక్షణంతో ప్రారంభం చెయ్యాలీని శాస్త్రవాక్కు, మంగళంతో ప్రారంభంచేసి మధ్యలో మంగళముండి చివర మంగళంతో పూర్తిచెయ్యాలి, ఎందుకంటే ఉపన్యాస ప్రారంభంలోనే ఏదైనా శోకంతోకూడిన ఘట్టముంటే ఒక్కసారి వెనక్కెళ్ళి మంగళంతో మొదలుపెట్టాలి మళ్ళీని, ఎందుకంటే మరి కొడుకు మరణించాడని రావణాసురుడు ఏడుస్తాడు అందుకని వెనక్కివెళ్ళొ వస్తూంటాను ఎందుకనీ అలా వెనక్కివెళ్తుంటాడీయ్యనాని మీకు అనుమానమొస్తుంది అని నేను నివృత్తిచేయడానికి నేను ఆ విషయం తెలియజేశాను.
తదనంతరము రావణాసురుని దగ్గరకు వెళ్ళినటువంటి రాక్షసులు ఆయనకు నివేదించారు నీ ప్రియకుమారుడైనటువంటి ఇంద్రజిత్తు యుద్ధములో లక్ష్మణస్వామి చేతిలో నిహతుడైపోయాడు, కానీ ప్రభూ... మరణించే సమయంలోకూడా  చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ లక్ష్మణుని చేతిలో ప్రాణములను విడిచిపెట్టాడూ అని చెప్పారు, చాలా విశేషమైన శోకానికి గురైయ్యాడు ʻఆయనా మూర్ఛపోయాడు ఆమాటవినగానేʼ రావణాసురుడు. నీ శరములతో యమున్ని కాలపురుషున్నిసైతము మట్టుపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటివాడివి, మంధరపర్వత శిఖరములను కూడా పిండిచేయగలిగినటువంటి భుజబలమున్నవాడివి అటువంటివాడివి ఇవ్వాళ ఒక నరుడిచేతిలో పడిపోయి మరణించావు అని ఏష పన్థాః సుయోధానాం సర్వామర గణేష్వపి ! యః కృతే హన్యతే భర్తుః పుమాన్ స్వర్గ మృచ్ఛతి !! అద్య దేవ గణాః సర్వే లోకపాలా స్తథర్షయః ! హతమ్ ఇన్ద్రజితం శృత్వా సుఖం స్వప్స్యన్తి నిర్భయాః !! చాలా చిత్రంగా మాట్లాడుతుంటాడు రావణాసురుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలకి ఆయనకి అన్నీతెలుసనే అనిపిస్తుంది ఆయనకున్నటువంటి మౌఢ్యమూ అర్థమౌతుంది, ఆయన అన్నాడూ “ఒక్కొక్కప్పుడు దేవతలుకూడా ఇలా మరణించవలసి వస్తూంది” కాబట్టి కొడుకు మరణించాడని బాధపడుతున్నాడో కొడుకు మరణించడాన్ని సరిపెట్టుకుంటున్నాడో లేక రామ చంద్ర మూర్తి యొక్క


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
అవతార ప్రయోజనములలో చాలా ప్రధానమైనభాగము ఈ రాక్షస సంహారమేకనుకా అటువంటి బుద్ధి పుడితేతప్పా రావణుడు బయటికిరాడుగనుకా అటువంటి మూర్ఖపు ప్రవర్తనతో ఉండిపోయాడనుకోవాలో కాబట్టి ఆయన అంటాడు దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు మహాయోధులైనటువంటివారు యుద్ధరంగంలో పడిపోతూంటారు కానీ ఎవరైతే యః కృతే హన్యతే భర్తుః ప్రభువు యొక్క ప్రయోజనము కొరకు ప్రభుకార్యమును అనుసరించి యుద్ధముచేసి యుద్ధంలో శరీర త్యాగం చేస్తారో అటువంటివాళ్ళందరు కూడా ఉత్తమ గతులనుపొందుతారు  ఊర్ధ్వలోకాలు పొందుతారు.
నిజంగా అది ప్రభుకార్యమా ఆ రాజ్యనికివచ్చినటువంటి ఆపదా? లేకపోతే ఈయ్యన తెచ్చిపెట్టుకున్న వ్యక్తిగత విషయాన్ని దేశ సమస్యగా మార్చాడా అన్నది మీరు ఆలోచిస్తే అది యదార్థానికి రాజ్యానికి వచ్చిన సమస్యకాదు ప్రభువు తన తుంటరితనంతో తన వ్యక్తిగతమైనటువంటి సమస్యని దేశముయొక్క సమస్యగా మార్చాడు, మార్చి మొత్తం రాజ్యంలో ఉన్నవాళ్ళందరు నశించిపోతున్నాకూడా విడిచిపెట్టనటువంటి మౌఢ్యంతో తాను నిలబడ్డాడు అది తెలుసుకుని ఉండి ఉంటే ఒక వ్యక్తి ప్రయోజనానికి దేశ ప్రయోజనాన్ని బలిపెట్టకూడదు అని ఆలోచించి ఉండివుంటే బాగుండి ఉండేది కాని ఆయనకి అటువంటి ఆలోచనరాదు కాబట్టి హతమ్ ఇన్ద్రజితం శృత్వా సుఖం స్వప్స్యన్తి నిర్భయాః ఇంద్రజిత్తు మరణించాడూ అన్నవార్తవిన్న దేవతలు ఇవ్వాళ బాగానిద్రపోతారు అన్నాడు. అంటే ఇంద్రజిత్తు బ్రతికుంటే చేసే పనేమిటంటే దేవతలు పడుకోకుండాచేస్తాడు దేవతలేం చేస్తూంటారు దేవతలు మనలోకానికి ఉపకారం చేస్తూంటారు వాళ్ళు ఎలా ఉపకారంచేస్తారు మనమీద ఆధారపడి మనకు ఉపకారంచేస్తారు. అదో గమ్మత్తు ఆ ప్రక్రియలో ఎందుకంటే వాళ్ళకి కావలసినవి మనమిస్తాము మనం ఇవ్వడమంటే యజ్ఞయాగాది క్రతువులతో హవిస్సులిస్తే మనమిచ్చిన హవిస్సులు దేవతలుపుచ్చుకుంటారు పుచ్చుకుని దేవతలు వీళ్ళు మనకు హవిస్సులిచ్చారన్న తృప్తిచేతా ఆ ఆనందం చేతా మనకు వర్షములనిస్తారు పాడిపంటలనిస్తారు అవి పుచ్చుకున్నమనం మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులుచేసి మళ్ళీ దేవతలకి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తాము.
ఇదీ ఒక మర్యాదతో కూడుకున్నటువంటివ్యవస్థ అందులో దేవతలను అవమానించవలసినటువంటి అవసరం ఉండకూడదు ఆ ఆలోచన రాకూడదు కానీ దేవతలతో విభేదించాడంటే కారణం ఏమిటంటే ఈ దేవతలకన్నా నేను గొప్పవాన్నన్న ఒకభావన ఆ భావన ఎందుకొచ్చిందీ అంటే చేసిన తపస్సు అహంకారం పెంచుకోవడానికి పనికొచ్చింది తప్పా చేసిన తపస్సు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాలేదు, కాబట్టి అటువంటి ఆలోచనవచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా బాధపడ్డాడు. రామ లక్ష్మణులు కేవలమునరులు అటువంటివారిచేతిలో అంతగొప్పవాడైన నాకొడుకు నిహతుడైపోయాడు స పుత్ర వధ సంతప్తః శూరః క్రోధ వశం గతః ! సమీక్ష్య రావణో బుద్ద్యా వైదేహ్యా రోచయ ద్వధం ఆయనా నేను మీతో మనవిచేశాను ఇతః పూర్వము అనేక పర్యాయాలు కామమునకు ఉండేటటువంటి లక్షణము ఎప్పుడూ రెండుగానే వెళ్తూంది ఒకటి తీరడము రెండు క్రోధము, అయితే ఇందులో మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయమేమిటో తెలుసాండి... మనిషియొక్క శక్తి వ్యయం ఎప్పుడు జరుగుతూందంటే కామము తీరితే జరుగుతుందా కామము తీరకపోవడంవల్ల వచ్చిన క్రోధమువల్ల ఎక్కువ శక్తి వినియోగం అవుతూందా అంటే కామము తీరకపోవడంవల్ల కలిగేటటువంటి క్రోధంవల్ల వినియోగమయ్యేటటువంటి శక్తికన్నా కామము తీరిందన్న తృప్తివల్ల వ్యయమైనటువంటి శక్తి ఎక్కువ.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
లోకంలో అదొక విచిత్రమైనటువంటివిషయం మనిషి తన తేజస్సునంతటిని ఎందుకు పోగొట్టుకుంటాడంటే కోర్కె కోరుకున్నతరువాతా ఆ కోర్కె సిద్ధించినప్పుడు కలిగినటువంటి తృప్తివలన తేజస్సు నశిస్తుంది. క్రోధం ఆ కోర్కె తీరకపోతే పుడుతుంది. ఆ క్రోధమువలన కూడా తేజస్సు నశిస్తుంది కానీ క్రోధమువలన ఎక్కువ తేజస్సు నశిస్తుందా కామం తీరడంవల్లా ఎక్కువ తేజస్సునశిస్తుందా అంటే కామము తీరడంవలననే ఎక్కువ తేజస్సు పోతూంది. నేను అంతకన్నా ఇంకా లోపల విచారణచేయడానికి తగిన సమయంకాదు అదీ ఎదర ఉపన్యాసానికి ప్రతిబంధకమౌతూంది, కాబట్టి కామమునకు రెండే లక్షణాలు ఉంటాయి ఒకటి క్రోధముగా పరిణమించాలి తీరకపోతే, రెండూ తీరితే తృప్తిగా పరిమమించాలి రెండిటికి మనసే ఆలంబనము. ఇందులో చిత్రమేమిటంటే రెండిటిచేతాకూడా తేజస్సుని క్షయం చేస్తూంది అందుకే తెజస్సుని నిలబెట్టుకోగలిగినవాళ్ళెవరై ఉంటారంటే అకాములై ఉంటారు. మీరు చూడండి ఏ కోర్కాలేనటువంటివాడికి తేజస్సు దినదినాభివృద్ధి పొందుతుంది ఎందుకోతెలుసాండి వాడికి క్షయమయ్యే అవకాశంలేదు ఎందుకంటే వాడికి కోరికుంటేకదా తీరిందనడానికి అసలుకోరుకోడు కోరికుంటేకదూ క్రోధం పుట్టడానికి తీరదని అందుకనీ ఆ రెండుమార్గములు మూసుకుపోతాయి మూసుకుపోతే ఏమౌతూందంటే ఆయన తేజస్సుపెరిగిపోతూంటుంది తేజస్సు పెరగడానికి ఉండేటటువంటి ప్రధానమైనకారణము అదే. ఎక్కడ నిత్య తృప్తితో కూడిన జీవనముంటుందో అక్కడ తేజస్సు ఎప్పుడూ ఉంటుంది తృప్తిలేనిచోటా తేజస్సు క్షయమౌతుంది అందుకే ఎప్పుడూ కూడా మనిషి తన జీవితంలో నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం తృప్తితో బ్రతకడం నేర్చుకోవాలి.
నేను మీతో ఇతఃపూర్వం అనేక పర్యాయాలు మనవిచేశాను ఈ ʻతృప్తిʼ అన్నదాన్ని ఎలా వస్తూందీ అంటే మీరు కోరి కోరి తీసుకొస్తే వచ్చేదికాదు, ఎందుకంటే నీవు తృప్తిగా ఉండు అన్నారనుకోండి అదేం ఉండదు, ʻనాకదిలేదుగా అంటూందిʼ, నాకది లేదుగా అంటే మీరేం చేయవలసిందంటే ʻనీకేమివ్వలేదని ఈశ్వరుడుʼ అని అడుగుతూ ఊండాలిమీరు, మీరు దాన్ని తిరగబడ్డారనుకోండి దానిమీద అది వింటూంది నీమాట. మీరు తిరగబడలేదనుకోండి మనసుమీద అది ఎప్పుడూ కోరుతూనేవుంటుంది. ఎప్పుడు కోరినా దానిపగంతా ఎలా ఉంటుందంటే ఇదే “రోహిణి వంక అంగారకుడు చూడ్డమూ” అంటారు. తేజస్సుని నింపేవాళ్ళు ఒకరు శరీరంలో మనం తిన్న ఆహారంలో ఆరోవంతుని మనసుగా తేజస్సుగా మారుస్తూంటాడు ఈశ్వరుడు ఈ తేజస్సుని క్షయం చేస్తూంటాడు ఇంకొకడు లోపల కోర్కెలుపుట్టించి మనస్సులో తీరితే తృప్తి తీరకపోతే క్రోధం, ఈ రెండిటిచేతా తేజస్సు క్షయమైపోతూంటుంది చిట్టచివరికి ఏమైపోతూందంటే అసలు జీవితంలో తేజస్సును నిలబెట్టుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మనుష్య శరీరం పొందడవల్ల ఏ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవాలో దానిని సిద్దింపజేసుకోలేడు అందుకే తృప్తి అన్నమాటకి ఆలంబనంకింద ఏది తీసుకొమ్మని పెద్దలు చెప్తారంటే పదిమందికి పనికొచ్చేటటువంటిపని ఈశ్వరకార్యంగా చెయ్యమని చెప్తారు పదిమందికి పనికొచ్చేపనీ అంటే  మీరు మళ్ళీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి.
నేను పదిమందికి అన్నం పెడుతున్నాననుకోండి, మళ్ళీ అదో అహంకారానికి కారణమౌతూంది ఎందుకంటే నేనో పదిమందికి అన్నంపెడుతున్నానండీ నేను రోజు అన్నదానం చేస్తుంటానండీ రోజు పదిమందికి అన్నంపెడుతుంటానండీ అని అంటాడు. నేను పదిమందికి కంటాపరేషన్ చేయించానండీ అన్నాడనుకోండి మళ్ళీ అదేమౌతుందో తెలుసాండి అదో అహంకారానికి కారణమౌతూంది మీరు చూడండి కొంత కొంతమంది చిత్రమైనమాట మాట్లాడుతారు మేము ఫలానావాళ్ళను


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ఉపన్యాసానికి తీసుకెళ్ళామండి, ఫలానావాళ్ళని ఉపన్యాసానికి తీసుకెళ్యామండి అంటారు, తీసుకెళ్ళడమేమిటీ తీసుకెళ్తే నీకేమొచ్చింది అహంకారమొచ్చింది విని నీవేమైనామారావా ఫలానావారు అనుగ్రహించి మా ఊరువస్తే వారిదగ్గర వినేభాగ్యం మాకు కలిగిందండనాలి అప్పుడు నీవు నిన్ను బాగా సంస్కరించుకున్నాని గుర్తు. వాక్కు హృదయ సంస్కారమునకు ప్రతిబింబంగా నిలబడుతూంది అందుకే మీరు మాట్లాడేమాటనుబట్టీ మీరు ఎంత స్థాయి సంస్కారాన్నిపొందివున్నారోన్నదాన్ని పెద్దలు లెక్కకట్టేస్తారు. అందుకే పెద్దలదగ్గరికెళ్ళితే వినడమెక్కువ తక్కువ మాడ్లాడూని ఎందుకనవసరంగా సంస్కారాన్ని బయటపెట్టడం, వారు పెద్దలూ అని నీవు అంగీకరించి ఉంటే చాలా తక్కువగా మాట్లాడి ఉంటే బాగుంటుందీని కనుకా... ఇప్పుడు రావణాసురుని యొక్క హృదయంలో ఎప్పుడూ కామము ఉండిపోయింది కాబట్టి అదీ ఈశ్వరపరంకాదు ఈశ్వరపరం అయిందనుకోండి వచ్చే అనుగ్రహమేమిటో తెలుసాండి నేనన్నంపెట్టాననడు ʻభగవంతుడు రోజూ నాతో పదిమందికి అన్నం పెట్టిస్తున్నాడండీʼ అంటాడు. ఇప్పుడు నీవు పెడుతున్నావా ఈశ్వరుడు పెట్టిస్తున్నాడా... ఈశ్వరుడు పెట్టిస్తున్నాడు తాను ఈశ్వరునికి పనిముట్టు అహంకారం ప్రభలడానికేం ఉండదు అందులో తన కోరికేదో తీరిందీ అనేం ఉండదు తనకోర్కెల్నీ తన కదలికల్నీ ఏం చేస్తాడంటే ఈశ్వరపరంచేస్తాడు ఈశ్వరసేవగా మారుస్తాడు. కాబట్టి మనసు కామముతో కూడిన సంకల్పములుచేసే అవకాశమివ్వకుండా సంకల్పములన్నీ భగవత్ సేవగాచేసేటటువంటి సంకల్పములుగా మారుస్తాడు. అప్పుడు మనసుని ఖాలీగా ఉండూ అంటే ఉండకుండా ఉండేదాని బలహీనతని బలంగామార్చుకుని వాడుకుంటాడు.
దానివల్లా తేజస్సుని నిలబెట్టుకుంటాడు నిలబెట్టుకున్న తేజస్సుతో ఈశ్వరాభిముఖుడౌతాడు ఆ ఈశ్వరాభిముఖుడై చాలా తొందర తొందరగా ప్రయాణంచేస్తాడు, ప్రయాణంచేసి ఈశ్వరున్ని చేరుకుంటాడు దానివల్లా ఈ ఉపాదిని ఈశ్వరుడు ఇచ్చినందుకు తత్ ప్రయోజనమును పొందుతాడు. ఇది తెలియకుండా ఇంక ఎన్ని చెయ్యండీ అవి ఎందుకు పనికొస్తాయంటే మళ్ళీ పథనమౌవ్వడానికే పనికొస్తాయి. ఇదీ అసలు చాలా పెద్ద రహస్యం, రహస్యమంటే ఇది మనం పట్టుకోవలసిందీ అంతే కానీ మీకెవరికీ తెలియదు నాకొక్కనికే తెలుసనికాదు నా ఉద్దేశ్యం. ఇది లేదనుకోండి ఎన్ని ఉన్నా ఏమౌతుందంటే ఇదంతా నావల్లే అంటూంటాడు ఇదంతా నావల్లే అన్నకొద్దీ ఇబ్బంది వస్తూంటుంది. అంత తపస్సుచేశాడు ఏమంటూంటాడు ఇది కదూ పాడైపోవడానికి కారణం, నేను పడగొడుతాను వీళ్ళందర్నీ అంటాడు. నాకు తపస్సుందంటాడు నాకు ఒకడు బల్లెమిచ్చాడు అంటాడు నాకు శూలమిచ్చాడు అంటాడు అవి నాదగ్గరుంటే వాడేం చేస్తాడంటాడు ఇలా అనకుండా రావణుడి పదితలకాయలూ ఈశ్వరసేవకోసం పనికొచ్చాయనుకోండి. రావణాసురుడు ఎటువంటి గొప్ప స్థితిని పొంది ఉండేవాడో అది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచనచేస్తే అసలు ఆ దృష్టికోణం ఏర్పడకపోవడంవల్లా వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీరు పసిగడుతారు.
కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి మళ్ళీ ఎటువైపుకు వెళ్తూంది ఇందులోంచి అంకురించాలి అది మహర్షీ అంతగొప్పగా ఆ మాటలన్నింటినీ అందుకని ఆయన శ్లోకాల రూపంలో ఇస్తూంటారు. తిరిగి తిరిగి తిరిగి ఎక్కడికెళ్తూందంటే తనకామములోంచి ఇవన్నీజనించాయి కాబట్టి ఆ స్థానంమీదకి వెడుతూంది, తనకు సీతమ్మలొంగలేదు సరికదా... లొంగని సీతమ్మవల్ల తనకొడుకు పడిపోయాడు అని ఆలోచిస్తాడుతప్పా... అసలు నేను సీతమ్మని కోరకుండా ఉంటే ఇలా జరిగేది


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
కాదుకదా..! ఆ ఒక్కమాట అన్నాడనుకోండి అయిపోయింది అంతే రామాయణం మారిపోయింది. అలా అనలేడూ... అలా అనలేడు రావణుడు అనుకోకండి మనం కూడా అలా అనుకోకపోతే ఎప్పుడైనా మనం కూడా ప్రమాదపుటంచులకు వెళ్ళిపోతున్నట్లు లెక్కా. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలుగుతూంది అన్నదాన్ని మీరు గమనించి అక్కడ మీరు మారడము అలువాటు చేసుకోవలసి ఉంటుంది అది లేనంతకాలం ప్రయోజనమేమై ఉంటుందంటే చాలా కష్టం దానికి జవాబు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఉన్న భావములు క్రోధముగా పరిణమించాయి. అందుకే మహర్షి అంటారు వైదేహ్యా రోచయ ద్వదం నేను విదేహవంశమునకు చెందినటువంటి సీతమ్మని వధిస్తాను అని కోర్కె ఆయనయందు జనించినది. అంటే కామము పక్కన క్రోధము పుట్టింది అంటే ఇంద్రజిత్తు మరణానికి ఇప్పుడు ఆయన ఎవ్వరిని బలిచేస్తున్నాడు ఎవర్ని దానికి బాధ్యతా అంటున్నాడు అంటే సీతమ్మని బాధ్యత అంటూన్నాడు.
సీతమ్మలొంగిపోయి ఉండివుంటే ఇంద్రజిత్తు మరణించి ఉండేవాడుకాదుకదా..! సీతమ్మలొంగలేదు అందుకే ఇంద్రజిత్తు మరణించాడు ఏమైనా తర్కానికి అర్థముందా? అంటే కామం పక్కన క్రోధం పుట్టేటప్పుడు యుక్తా యుక్త విచక్షణము మరిచిపోయేటట్టుచేస్తూందీ... అందుకే నరకద్వారమూ అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు “నరకద్వారములు కామక్రోధములు” అన్నాడు. అవి మనిషిని ఎంత క్రూరమైన ఆలోచనచేయిస్తాయో చూడండి, తప్పా... నిజాయితితో నిష్పక్షపాతంగా తనని తాను విచారణ చేసుకునేటటువంటి అవకాశాన్ని అవి ఇవ్వవు కాబట్టి ఇప్పుడు సీతమ్మని చంపాలి అన్న కోరిక పుట్టింది తస్య క్రుద్ధస్య నేద్రాభ్యాం ప్రాపతన్ అస్రబిన్దవః ! దీప్తాభ్యా మివ దీపాభ్యాం సార్చిషః స్నేహ బిన్దవః !! ఆయన యొక్క కనులలోంచి అగ్నిహోత్రంతో కూడినటువంటి తైలబిందువు దీపంలోంచిపడినట్లు నీటి బిందువులు కిందపడ్డాయి ఎప్పుడైతే మనిషి ఇంతగా కామక్రోధములకు వశుడయ్యాడో అప్పుడు ఒకరు చెప్పినది వినడంకానీ తన మనసులో వేరొక ఆలోచన రావడంకానీ ఇక ఏమీ ఉండదు. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మహాపాపమువైపుకు అడుగువేయిస్తుంది, ఇప్పుడిది సీతమ్మకాకుండా ఇంకొకరున్నారనుకోండి ఒక బలహీనుడెవరో ఉన్నాడనుకోండి చెలకుతాడు, ఎందుచేతాంటే తనని తాను రక్షించుకోగలిగినంత ధర్మము చాలా తీవ్రస్థాయిలో ఉందనుకోండి ఈయన బుద్ది ఎప్పుడూ విననివాడు ఒకనిమాట వింటాడు అది విన్నాడూ అంటే అది రావణునిప్రజ్ఞకాదు చిత్రమేమిటంటే ఎవరిమీదికి వెళ్ళాడో వాడు చెలకబడడానికి వీలులేదు కారణం ఆవిడ ధర్మం అంతగొప్పదన్నమాట. ఆవిడ పతివ్రతా ధర్మం అంతగొప్పది అదేంచేస్తుందంటే ఇప్పుడు ఎన్నడూ విననివాడు ఒకనిమాటవినీ చంపుతానన్నవాడు చంపడం మానేస్తాడు అదేం ఎప్పుడూ వినడన్నాడుగదా మీరు ఇవ్వాళ రావణుడు ఎందుకువిన్నాడు అంటే మీరు దీన్ని పట్టుకోవలసి ఉంటుంది రామాయణంలో.
ఇది పట్టుకుంటే మనకు ప్రయోజనం ఇది పట్టుకోకపోతే కథా... కథగా వింటే తప్పనినేనను ఉద్దరించి తీరుతుంది రామాయణం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ! ఆరుహ్య కవితాశాఖామ్ వందే వాల్మీకి కోకిలమ్ !! సృన్వన్ రామ కథా నాదం కో న యతి పరం గతిం పైకివిన్నా మధురు మధురంగావున్న కథా... రామకథలోవున్న నాదము


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
అంతరార్థమును గుర్తెరిగితే అటువంటివాడు కోనయాతి పరం గతిం ఎందుకెళ్ళడు పరగతులకు ఎందుకుపొందకపోతాడు ఈశ్వరున్ని పొందితీరుతాడు అసలు అనుమానంలేదన్నారు. రామాయణం యొక్క అంతరార్థముతెలిస్తే అటువంటివాటిని కామ క్రోధములు వశం చేసుకోవడం కుదరనిస్థితికి తానుపెరగగలిగిన అభ్యాసమునందు నిలబడగలడు అంటే ఉత్తర క్షణం కటాక్షింపబడుతుందని నేనను ఎందుకంటే మార్గము తెలియడంవేరు తెలిసున్నదాన్ని మీరు అనుష్టించడంవేరు, మీకు ఆకలివేసి ఇంట్లో అన్నం వండడంవేరు ʻమీరు తినడంవేరుʼ మీరు తినకపోతే తీరదుగా రామాయణంలో మార్గం  మీకు తెలియకపోవడంవేరు తెలిసున్నదాన్ని మీరు అనుష్టించడంవేరు మీకు అనుష్టానంలోకిరాకపోతే మిమ్మల్ని రక్షిస్తుందన్నంతపెద్దమాట నేను అనలేను చాలా కష్టం అంతపెద్దమాట అనడం అంటే ఒకవేళ అన్నా... అది చాలా చౌకుబారుమాట. కాబట్టి ఇప్పుడు ఆయన అపారమైన క్రోధమును పొందాడు పొంది ఇప్పుడు ఈ క్రోధము ఎలా పరిణమించిందంటే అంటుకోడమంటే అంటుకోవాలికానీ దావానలం అరణ్యానంతట్నీకాల్చేస్తుంది.
మీరెప్పుడైనా చూశారోలేదో దావానలము అంటుకుంటే... అరణ్యం అంటుకుంటే ఉండే స్థితి అత్యంత భయానకంగా ఉంటుంది నేను ఒక్కసారి అనుభవించాను, నేను ఒకసారి శ్రీశైలం నుంచి మంచి వేసవిలో రాత్రివేళ ఆరుగంటలకో ఏడుగంటలో బయలుదేరి దిగిపోతున్నాము బస్సు ఆపుచేశారు దావానలమండి అరణ్యం అంటుకుంది ఎటువైపునుంచి మంటవస్తూందో తెలియదన్నారు నిజంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నాము ఎందుకంటే ఎటుచూసినా అగ్నిజ్వాలలే ఆకాశాన్నంటుతున్నట్లే ఉంటాయి ఆచీకట్లో ఏదో ఈశ్వరానుగ్రహం నీవు ఎదర ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్పడానికి చూస్తే బాగా చెప్తావని నీకు చూపించానన్నాడేమో ఈశ్వరుడు క్షేమంగా కొండదిగిపోయామనుకోండి ఆ లోయలోంచి కాబట్టి ఇప్పుడది అంటుకుంది అది ఎంతదూరమంటుకుందంటే కవచం బ్రహ్మ దత్తం మే య దాఽఽదిత్య సమ ప్రభమ్ ! దేవాసుర విమర్దేషు న భిన్నం వజ్ర శక్తిభిః !! నాకు చతుర్ముఖ బ్రహ్మగారు నా తపస్సు యొక్క ఫలితముగా నాకనుగ్రహించినటువంటి స్వర్ణకవచముంది ఆ కవచము ఇంద్రుని యొక్క వజ్రాయుధముచేత కూడా భేదింపబడదు దాన్ని బయటికి తీయ్యండి య త్తదాభి ప్రసన్నేన సశరం కార్ముకం మహత్ ! దేవాసుర విమర్దేషు మమ దత్తం స్వయమ్భువా !! నాకు చతుర్మఖ బ్రహ్మగారు యుద్ధంలో వాడం కోసమని ఇచ్చిన కార్ముకం అంటే స్వర్ణమయమైనటువంటి ధనస్సు బాణములు ఉన్నాయి వాటినికూడా పైకి తీయ్యండి అద్య తూర్య శతై ర్భిమం ధను రుత్థాప్యతాం మమ ! రామ లక్ష్మణయో రేవ వధాయ వరమాఽఽహవే !! నేను ఆ ధనస్సుని బాణములను తీసుకుని రామలక్ష్మణుల్ని వధిస్తాను, కాబట్టి మీరు వాటిని తీసి సిద్ధంగా ఉంచండి.
వాటిని సిద్ధంగా ఉంచండీ అన్నాడంటే... ఇప్పుడు యుద్ధానికి ముందు రామ లక్ష్మణుల దగ్గరికి వెళ్ళడంలేదు ఇంకొకచోటికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మంత్రుల్ని పిలిచి అన్నాడు నా కొడుకు మాయాసీతని సంహరించాడు రథంమీద తీసుకెళ్ళి కానీ అతను అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేకపోయాడు నేను ఇవ్వాళ నిజంగా సీతనే సంహరించేస్తాను, కాబట్టి ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణమైనటువంటిది ఎవరో ఆ సీతమ్మని నిగ్రహిస్తాను అని ఒక పెద్ద కత్తి తీసుకొని విపరీతమైన వేగంతో ఆశోకవనంలోకి వెళ్తున్నాడు ఆయన వేగాన్ని ఆ చేతిలో కత్తిని చూసింది సీతమ్మ, నేను మీతో మనవిచేశానుకదూ... నరుడికథా ఇది మీరు ఆవిధంగా ఆలోచించాలని, ఆవిడ అనుకుందీ నేను ఆనాడు హనుమా


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ʻనాతోరామ్మా రామ చంద్ర మూర్తి దగ్గర దింపేస్తానంటే రానన్నాను వెళ్ళిపోయి ఉండి ఉంటే బాగుండేది రామ చంద్ర మూర్తి ఒడిలో కూర్చిండి ఉండేదాన్నిʼ ఇప్పుడు ఈ దుర్మార్గుడు కత్తిపట్టుకుని వస్తున్నాడు యుద్ధ భూమిలో రామ లక్ష్మణుల్ని నిర్జించివస్తున్నాడా నన్నుచంపడానికి వస్తున్నాడా? ఇప్పుడిక్కడ నాకు దిక్కెవరు అని ఆవిడా భయముచేతా విశ్వలయై గాలికి అరిటిచెట్టు కదిలిపోయినట్లు కదిలిపోయి శోకిస్తూంది. అంత క్రోధంలోవున్నటువంటి రావణుడు ఒకరిమాట వింటాడన్న నమ్మకమేంలేదు  అసలు మామూలుగానే ఎప్పుడు వినడాయన ఇక అంత కృద్ధుడై ఉన్నప్పుడు మాటవింటాడా..? కాని ఒక వృద్ధుడైనటువంటి మంత్రి సుపార్శుడు అన్నమంత్రి రావణునితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
మీరు జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మవిషయంలో ఇది రెండో పర్యాయం రావణుడు మాటవింటున్నాడు, ఒకసారి ఇలాగే సీతమ్మమీదకి ఆగ్రహంతో వెళ్ళాడు ధాన్యమాలిని చెప్పినమాటవిని వెనక్కివెళ్ళాడు, ఇప్పుడు సుపార్శుడు చెప్పినమాటలు వింటున్నాడు ఇప్పటివరకు బయలుదేరినదాదిగా ఎంతమంది చెప్పినా వినలేదు కాని ఇక్కడికి వచ్చాక మాత్రము సుపార్శుడి మాటలు వింటున్నాడు అంటే అసలు ఎన్నడూ విననివాడు విని మనసు మార్చుకుంటున్నాడంటే అలా మనసు మార్చుకుంటే ఎవరు బ్రతుకుతారో వాళ్ళు బ్రతికేటట్టుగా ఈశ్వరుడు సంకల్పంచేసి వాళ్ళని రక్షిస్తున్నాడు. వాళ్ళని అలా రక్షించడానికి ఈశ్వరుడి పక్షపాతము కారణమా వాళ్ళధర్మము కారణమా మీరు నన్ను అడిగారనుకోండి ఈశ్వర పక్షపాతము కారణమూ అని నేనునంటే ఈశ్వరునిమీద దోశము చేసినట్లౌతుంది కాదు, సీతమ్మతల్లి యొక్క ధర్మమే సీతమ్మకు రక్ష ఏమి ఆమే ధర్మము “పాతివ్రత్యమే ఆమే ధర్మము పతిని అనుగమించడమే త్రికరణశుద్ధిగా అందుకే ʻరామాయణము ధర్మశాస్త్రముʼ”. రాముడికి ధర్మమువేరుగా ఉంటుంది రాముడు సంధ్యావందనం చెయ్యాలి రాముడు అగ్నికార్యంచెయ్యాలి రాముడు ధర్మయుద్ధం చెయ్యాలి రాముడు ఈశ్వరోపాసన చెయ్యాలి. సీతమ్మకి మనసా వాచా కర్మణా భర్తయందు మనసుపెట్టుకుని ఉంటేచాలు ధర్మంపూర్తైపోయినట్లే పెళ్ళికాకముందు మంచి భర్తకోసం నోములు వ్రతాలు, పెళ్ళైయ్యాక భర్త అభ్యున్నతి కోరకు ఈశ్వరుడికి నమస్కారం భర్తని సేవించడమే పరమ ధర్మం అంతకన్నా వేరొక ధర్మంలేదు దానిచేత తపస్సు సిద్ధిస్తుంది కాబట్టి ఆవిడయొక్క తపస్సు ఆవిడయొక్క పాతివ్రత్యము ఆవిడ్ని రక్షచేస్తోంది.
ఇప్పుడు సుపార్శుడన్నాడు కథం నామ దశగ్రీవ సాక్షా ద్వైశ్రవణానుజ ! హన్తుమ్ ఇచ్ఛసి వైదేహీం క్రోధా ద్ధర్మ మపాస్య హి !! నీవు సాక్ష్యాత్తుగా కుబేరుని యొక్క సోదరుడివి అటువంటివాడివి ఒక అబలను చంపుతావా? ఒక ఆడదానిపై క్రోధముచేత ధర్మమును విడిచిపెడుతున్నావా..? అన్నాడు. అసలు ఈ మాటలు రావణుని తలకెక్కేవికావు క్రోధముచేత ధర్మమును విడిచిపెట్టావా..! రామాయణంలో ఎప్పుడూ మహర్షి ప్రతిపాదనస్తూనే ఉంటారు ప్రమాదమెటునుంచి వస్తూందో వేద విద్య వ్రత స్నాతః స్వ ధర్మ నిరతః సదా ! స్త్రియాః కస్మా ద్వధం వీర మన్యసే రాక్షసేశ్వర !! నీవు వేదం చదువుకున్నావు వేదం చదువుకుని వ్రతస్నానంచేశావు అంటే వేదములను వేదాంగములను గుక్కిటపట్టావు అంటే మీరు ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని గమనించాలి మనకీ అన్నిటినీ కూడా ఎలా ఇస్తారంటే శ్లోకరూపంలో ఇస్తారు వేదంలో ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ కూడా శ్లోకరూపంలోనే ఉంటాయి శ్లోకరూపంలో ఉన్నటువంటి మంత్రములు స్వరంతో యజుర్వేదంలోకి వచ్చేటప్పటికీ మీరు ఒక క్రియా కలాపం చెయ్యడానికి వీలైనటువంటి మంత్రంగా మారుతుంది. అందుకే యజుర్వేదంలో మీరు చేసేటటువంటికార్యాలు ఋగ్వేద మంత్రాలు యజుర్వేద శ్లోకాలు స్వరంతో మంత్రాలౌతాయి (ఏం శర్మగారూ?) యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి మంత్రాలౌతాయి. అయితే ఇవి వాక్యాల రూపంలో ఉన్నాయనుకోండి యథాతథంగా మీరు ధారణచెయ్యలేరు చాలా కష్టం. ఇదీ ఛందోబద్ధంచేశారనుకోండి అందుకొచ్చింది ఛందస్సు అందుకే మీకు సంస్కృతము తెలుగూ ఇలాంటి భాషలకున్న గొప్పతనం ల్చేభాషలకీ ఎప్పుడూరాదు, ఎప్పుడూరాదు.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ఎందుకో తెలుసాండి నేను మీతో ఒక్కమాట మనవి చేస్తాను  “ధర్మం” ఇది సంస్కృతంలో ఉంది. ధర్మము తెలుగులో ఉంది, ధర్మము ఇంగ్లీషులో చెప్పండి ఓమాట, లేదుకాబట్టే వాళ్ళేం చేస్తారంటే ఇంగ్లీషులో ఉపన్యాసం చెప్పేటప్పుడు ʻవెన్ రామా ఫాలోడ్ ధర్మాʼ అంటాడు, తప్పా ఫాలోడ్ అంటాడుకానీ ప్రోపర్ నౌన్ వాడడు తర్చుమా ఉండదు దానికి అదేవాడాలి ధర్మాకి ధర్మాయే అంటాడు ఎందుకండి? అసలు ధర్మమన్నమాట తెలియనే తెలియదు పాశ్చాత్తులకి. పశ్చిమదేశాలవారికి ధర్మమన్నమాటే తెలియదుకాబట్టి వాళ్ళకి ధర్మంతో తుల్యమైనా మాటే తెలియదు వాళ్ళ వాగ్మయంలో వాళ్ళకి ఆ మాటే తెలియని రోజుల్లో ఈ ధర్మమన్నమాటవాడి మొట్టమొదటగా చూపించారు. అంటే ఈ దేశం గొప్పతనం సనాతన ధర్మంలో పుట్టిన మనగొప్పతనమేమిటో ఆలోచించండి. అటువంటిమనం వ్యాలన్టైన్సడే వాళ్ళదగ్గర నేర్చుకోవడం ఎంతదారుణమో ఆలోచించండి అది మన ధౌర్భాగ్యం. కాబట్టి ఛందోబద్ధంచేస్తారు ఛందోబద్ధంచేస్తే శ్లోకమౌతుంది తెలుగులోనైతే పద్యం శ్లోకం పద్యం వీటికుండే లక్షణమేమిటంటే ధారణ చెయ్యొచ్చు ధారణకు నిలబడుతుంది, అంటే మీరు నాలుగుమాట్లు చదివినా నాలుగుమాట్లువిన్నా అంటుకుంటుంది మనసుమీద. అలాగ కాకుండా వాక్యాలు వాక్యాలుగా ఉందనుకోండి ఒక్కనాటికి మీరు పట్టుకోలేరు నేను ఏదో పెద్ద “లావలీ లవలీలుంగలవంగసంగతలతాలాస్యంబు లీక్షించుచున్” అన్నాననుకోండి అదీ మాటలు కొంచెం అందులో వృత్తాను ప్రాసగా తిరిగినా మీరు పట్టుకోగలరు ఎందుకంటే ఛందోబద్ధమైంది.
అదే నేనొక పెద్ద వాక్యాన్ని నిర్మాణంచేసిచ్చీ దీన్నిబాగా గుర్తుపెట్టుకోండన్నాననుకోండి అది కాలమునందు ఏమైపోతూందో తెలుసాండీ ఒకమాటకు బదులు ఇంకొక మాట వెళ్ళిపోతూంది అందులోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళకి ఏమైపోతూందంటే ఆమాట వాక్యమంతాకూడా ప్రశ్నింపవలసిన రీతిలోకి మారిపోతూంది ధారణకి కుదరవు, ఎప్పుడూ పుస్తకం పట్టుకుని ఉండాలి అందుకే ఎప్పుడూ పుస్తకాలు అవి పట్టుకుని ప్రార్థనలు అవి చేస్తుంటారు కొంతమంది సనాతన ధర్మంలో అలా ఉండదు నోటికి ధారణ చేస్తారు. ఒక క్రియ జరుగుతూందనుకోండి క్రియకి మంత్రభాగాన్ని గురువుగారు చెప్తూంటారు అందుకే శృతీని పేరుదానికి శృతీ అంటే చెవికి ఆధారంగా అందుకే ఏది అడుగుతారంటే భద్రం కర్ణేభి శృణుయామ దేవాః  మాకు చెవులు భద్రముగా ఉండుగాకా... అప్పుడు భద్రం పశ్యే మాక్ష భిర్యజత్రాః మేము మంచివి చూడుగాకా... చెవిద్వారా వింటాడు గురువుదగ్గర, గురువుగారు మూడుమాట్లు అనిపిస్తుంటాడు ఎప్పుడైనా ఈ పాఠం చెప్పేటప్పుడు విన్నారో లేదో నమః సోమాయచ రుద్రాయచ అంటాడు, నమః సోమాయచ రుద్రాయచ నమః సోమాయచ రుద్రాయచ నమః సోమాయచ రుద్రాయచ అంటారు అన్న తరువాత మళ్ళీ చెప్తూంటారు శృతి, అంటే గురువుగారు చెప్తే శిశ్యుడు అంటూంటాడు అర్థం తెలుస్తుందా..! శిశ్యుడికి బాగా మంచి దృష్టికోణముంటే తరువాత అర్థముకూడా నేర్చుకుంటాడు గురువుగారిదగ్గర లేకపోయినా ఏమైపోతూందంటే ధారణలోకి వెళ్ళిపోతూంది. ఆయన్ని నిద్రలలోంచిలేపండీ నమః సోమాయచ అంటే నమః సోమాయచ రుద్రాయచ నమః స్తామ్రాయచ అరుణాయచ అంటూ... వెళ్ళిపోతూంది అంతే తప్పా ఇక మళ్ళీ మరిచిపోవడమన్నదేం ఉండదు. ఇంకా జాగ్రత్త చెయ్యడం కోసం ప్రధానమైనటువంటి దెబ్బతింటాయోమోననీ దాన్నే ఘన చేస్తాడు దాన్నే జట చేస్తాడు దాన్ని ముడేసినట్లు ఇటుమాటని అటువైపు అటువైపుది ఇటువేస్తూ మాటలు వేసి అల్లుతారు ఎప్పటికీ కూడా కాలంలో దెబ్బతిని ఆ పదములు మారకుండా ఉండడంకోసం తీసుకున్న జాగ్రత్త. ఆ స్థాయిలో వేదం చదువుకున్నాడనుకోండి బాగా పరిశ్రమ చేశాడనిగుర్తు ఆయన వేదము దెబ్బ తినకుండా రక్షించేవాళ్ళల్లో ఒకడౌతాడు అందుకే ఘనాపాటిగారు వచ్చారండీ అంటే ఎక్కువ గౌరవిస్తారు. కారణమేమిటంటే అది ఆయన వేదము దెబ్బ తినకుండా కాపాడగలిగినవాడై వేదపురుషున్ని రక్షించేవాడై లోపల గాయిత్రి స్వరూపాన్ని పట్టుకుని ఉన్నాడు, అందుకే ఒక ఘనాపాటీ వచ్చారూ అంటే మర్యాదే గౌరవమే.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
కాబట్టి ఇప్పుడూ ఛందోబద్దమై జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలైనరీతిలో శ్లోకములను మంత్రములను పద్యములను ఇచ్చింది మన ధర్మంలో అలా ఇచ్చినటువంటివాళ్ళని ఇంకోళ్ళని నాకు చూపించండి ఎక్కడా మీకు కనపడదు ఎందుకో తెలుసాండీ అసలు మన పూర్వ ఋషుల యొక్క గొప్పతనము ఇది. వాళ్ళు అంతదూరము ఆలోచించారు, ఆలోచించి చందస్సు అన్నది అందుకే వేదము యొక్క ఉపాంగములలో ఒకటి, అందుకని వేదము చదువుకున్నవాడికి వేదము యొక్క ఉపాంగములు చదువుకున్నవాడికి గొప్ప గొప్ప విషయాలను నేర్చుకున్నవాడికి అన్నీ ధారణలో ఉండకపోవచ్చు. కానీ మనసు రమించిన ప్రధానమైన విషయాలు కంఠగతమై ఉంటాయి అంటే గుక్కిటపట్టాడు అంటారు అంటే గుక్కిటపట్టడమంటే ఏమిటంటో తెలుసాండీ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వదిలిపెట్టేస్తాడు. అలా కంటగతంమైవున్నది ఏమౌతుంది. అప్పుడూ ఏం చెయ్యమని చెప్పారుమనకీ అంటే ఆ పుస్తకంలో ఆ పేజీ తీసి చదవాలనే వాక్యంలా ఉండదు మనసుని పట్టుకుని ఉంటుంది కాబట్టి వెంటనే “సత్యం వదా ధర్మం చరా” చెప్పగలుగుతాడు.
ఇది అడుగుతున్నాడు సుపార్శుడు నీవు వేద విద్య వ్రత స్నాతః నీవు వేదవిద్య నేర్చుకుని వ్రత స్నాతుడవైవున్నావు కదా ఈ “స్నాతః” అన్నమాటనే విశ్వవిద్యాలయాలు ఇవ్వాళ వాడుకుంటున్నాయి. స్నాతకోత్సవము అని శ్రీరామాయణంలో వాడారు ఈమాటని ʻవ్రత స్నాతుడవుʼ అంటే నీకు బాగా వేదం మనసుకు పట్టింది నోటితో చెప్పగలవు ఏ మంత్రానైనా వేదమే కదాండీ కర్మభాగం చెప్పినా జ్ఞాన భాగం చెప్పినా వేదమే చెప్పాలి అనుష్టానమంతా వేదమే నేర్పుతూంది, కాబట్టి నీకన్నీ తెలుసు నీకు కంఠగతం ఇన్ని చదువుకున్నా ఒక ఆడదాన్ని చంపేస్తున్నావంటే కాల్చనా చదువుకోవడం, ఇంక ఎందుకు చదువుకోవడం అసలు వేద విద్య చదువుకోవడమెందుకు దాన్నికి అంత వ్రతస్నాతుడవడమెందుకు అవన్నీ ఉత్తిగనే నేర్చుకుని వల్లించుకోవడానికా... అనుష్టానంలో లేనప్పుడు నిన్నుచూస్తే నాకొక పెద్ద ప్రశ్నగా ఉంది రావణా..? అన్నాడు సుపార్శుడు ఇంతగొప్పగా రాక్షసుడితో ఎలా మాట్లాడిచ్చాడండీ ఈ సుపార్శుడే యుద్ధానికెళ్ళి చచ్చిపోయాడు మళ్ళీ, అంటే ఈశ్వరుడు సీతమ్మని రక్షించాలి ఎందుకు రక్షించాలి ʻఆవిడ ప్రాతివత్య ధర్మం ఆవిడ్నికాపాడాలిʼ ఇప్పుడు కాపాడలేదనుకోండి ఆవిడ చెలకబడిందనుకోండి అసలు మీరు నేను ఇంక అనుష్టించడానికి ధర్మమన్నదిలేదు లోకంలో.
ధర్మాన్ని మీరు పట్టుకుంటే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని ఎలా చెప్తారు ఉపన్యాసంలో ఏ ప్రమాణం తీసుకుని మీరు ధర్మాచరణం చెయ్యాలి ఇప్పుడు మీకు పూనికి కలగాలంటే దీన్ని తీసుకురావాలి ఈ సన్నివేశాన్ని ఇదీ ఎంత గొప్పగా


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
మహర్షీ అందుకే అక్కడ అన్నీ శ్లోకాలను తీసుకొచ్చి చెప్తూంటారు లేకపోతే ఆయన కేవలంగా ఇలా వెళ్ళింది అలా జరిగింది అని చెప్పేసి వదిలిపారేయచ్చు కాదూ, శ్రీరామాయణాన్ని మీరు అందుకే చాలా జాగ్రత్తగా చూస్తుండాలి ఒక్కొక్కమాటా ఎంతెంత దూరం వెడుతూంటుందో అందుకే నేను ప్రశాంతంగా చదవండి ప్రశాంతంగా చదవండి రామాయణాన్ని అందుకే మీరు రామాయణం చదవడం అలా ప్రశాంతంగా చదివితే ఏమైపోతూందో తెలుసాండీ అదో లౌల్యమైపోతూంది, నిద్రపోతూన్నా లేచి ఎప్పుడు చదువుదాము ఎప్పుడు చదువుదాము అని ఒక మంచి వ్యామోహం కింద మారిపోతూంది, కారణమేమిటంటే అంత గొప్పగా ప్రతిపాదించారు మహర్షి శ్రీరామాయణంలో కాబట్టి నీవు ఈ పని చెయ్యొచ్చా ఒక స్త్రీని నీవు చంపొచ్చా..? మైథిలీం రూప సంపన్నాం ప్రత్యవేక్షస్వ పార్థివ ! త్వ మేవ తు సహాస్మాభీ రాఘవే క్రోధమ్ ఉత్సృజ !! నీవు సౌందర్యవతియైనటువంటి ఒక సద్గుణశోభితయైనటువంటి ఒక స్త్రీని చంపుతానంటున్నావు కాదు నీవు ఎవరినిచంపాలి నీవేదో అనుకున్నావు నీవేదో అనుకున్నదానికి అడ్డెవరు రాముడు ఆయనా వచ్చి నిలబడినవాడు నీకు ఏమైనా కోపముంటే వెళ్ళి ఆయనతోనయ్యా యుద్ధంచెయ్యాలీ గెలిచావా వేరు విషయం గెలవలేదా పో ఆ యుద్ధంలో పో కనీసం ఆ ధర్మమన్నా మిగులుతుంది.
ఆడదాన్ని చంపడమేమిటి? కాబట్టి మహారాజా! నీవు ఏం చెయ్యవలసి ఉంటుందో తెలుసా... అభ్యుత్థానం త్వమద్యైవ కృష్ణ పక్ష చతుర్థశీమ్ ! కృత్వా నిర్యా హ్యమావాస్యాం విజయాయ బలై ర్వృతః !! ఈ నాడు కృష్ణపక్ష చతుర్దశి రేపటిరోజు అమావాస్య అంటే నా ఉద్ద్యేశం ఇవ్వాళనికాదు సుపార్శుడు చెప్తున్నప్పుడు, కాబట్టి ఇవ్వాళ చతుర్ధశి తిథి కాబట్టి క్రోధాన్ని ఎక్కువకాలం నీవు వహించలేవు కాబట్టి ఇవ్వాళ యుద్ధానికి కావలసిన ఏర్పాట్లుచేసుకో రేపు యుద్ధానికి వెళ్ళు నీ క్రోధాన్ని రామునిమీద విడిచిపెట్టు. ఎంతపెద్దమాట అన్నాడో చూడండి అనడంకూడా ఎంత అందంగా మాట్లాడుతాడో నీకున్నటువంటి క్రోధాన్ని రామునిమీద విడిచిపెడితే ఆయన దానికి పడిపోయేవాడైతే పడిపోతాడు పడిపోకుండా దాన్ని పుచ్చుకుని నిన్ను పడగొట్టేవాడైతే నీవు పడిపోతావు. కాబట్టి ఇవ్వాల్టికి ఊరుకో ఊరుకుని కృత్వా నిర్యా హ్యమావాస్యాం రేపు అమావాస్య రేపు యుద్ధానికి వెళ్ళు శూరో ధీమాన్ రథీ ఖడ్గీ రథ ప్రవర మాఽఽస్థితః ! హత్వా దాశరథిం రామం భవాన్ ప్రాప్స్యతి మైథిలీమ్ !! నీవు నిజంగా అంతబలవంతుడవూ అని నమ్మి ఉంటే నీవు రామ చంద్ర మూర్తిని నిగ్రహించగలిగితే సీతమ్మనీదౌతుంది. కాబట్టి మళ్ళీ రాక్షసబోధ ఎక్కడో ఉండాలికదాండి చివరా... కాబట్టి నీవు రాముడిమీద కోపం చూపించు ఈ మాటలు విన్నాడటా స తద్దురాత్మా సుహృదా నివేదితం వచః సుధర్మ్యం ప్రతిగృహ్య రావణః ! గృహం జగామాథ తత శ్చ వీర్యవాన్ పునః సభాం చ ప్రయయౌ సుహృ ద్వృతః !! ఆ సుపార్శుడు చెప్పినటువంటి మాటలనువిన్నవాడై చాలా ఇది ధర్మంతోకూడుకున్నమాటలా ఉంది నేను ఆచరించవలసినదిలా ఉందని సీతమ్మని సంహరించేటటువంటి ప్రయత్నమును విడిచిపెట్టి లోపలికివెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి పెద్ద పెద్ద యోధులందరు వెళ్ళిపోయారుకదాండి అది ఒక లోక కల్యాణయజ్ఞం ఇంక ఎవడూ మిగలడానికివీల్లేదు వీళ్ళు వెతుక్కొక్కరలేదు ఆయనే పంపిస్తాడు.
కాబట్టి ఏకం రామం పరిక్షిప్య సమరే హన్తు మర్హథ ! వర్షంతః శర వర్షేణ ప్రావృట్కాల ఇవామ్భుదాః !! ఆయన వెళ్ళి కొంతమంది యోధులను పిలిచాడు, పిలిచి వాళ్ళతో ఏం చెప్పాడంటే మీరు అందరూ కలిసి రామునిమీదకి యుద్ధానికి వెళ్ళండి మంచి వర్షాకాల మేఘం ఎలా వర్షిస్తుందో అలా అందరూ అన్నివైపులనుంచి రామునిమీద బాణాలువేయండి ఒకడూ ఇద్దరూ వెడితే లొంగడేమోకానీ ఇంతమంది వెళ్ళి యుద్ధం చేస్తే లొంగకపోతాడా రాముడు కాబట్టి మీరు బయలుదేరండి నేను కూడా


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
బయలుదేరుతాను బయలుదేరి మనం యుద్ధం చేద్దాం అన్నాడు. ఇటువంటి లక్షణాలున్నవారందర్నీ తీసుకొచ్చి


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
లంకలోపెట్టాడు ఇప్పుడేమైందంటే ఒక్క లంకకి రాముడు వెడితే అందరూ అక్కడికిపోయారు ఇంక ప్రత్యేకంగా అందరిదగ్గరికివెళ్ళి చంపవలసిన అవసరంలేకపోయింది ఇంతమందిని చేరదీశానని రావణుడు అనుకున్నాడు ఇంతమందిని ఈశ్వరుడు ఒక్కచోటికి చేర్చి ఒక్కసారి చనిపోయే అవకాశాన్ని ఈశ్వరుడు సిద్ధం చేశాడు. కాబట్టి ధర్మం రక్షిస్తుంది తప్పా అధర్మముతో కూడిన ప్రవర్తన ఎంతగొప్ప హ్యూహాన్ని రచనచేశాననుకున్నా అది నిలబడేదికాదు ఏప్పుడో ఒకప్పుడు పడిపోతూంది. కాబట్టి తతో రామో మహా తేజా ధను రాఽఽదాయ వీర్యవాన్ ! ప్రవిశ్య రాక్షసం సైన్యం శర వర్షం వవర్ష హ !! ఈ రావణాసురుడు ఇతర రాక్షసయోధులు కలిసి యుద్ధానికి వెళ్ళితే రామ చంద్ర మూర్తి మండలాకారంగా తన ధనస్సుని నిలబెట్టి బాణ పరంపరని విడిచిపెడుతూంటే ఒక కాలు ముందుకు పెట్టి ఒకకాలు వెనక్కిపెట్టి ఎడం చేత్తో ధనస్సు పట్టుకుని కుడిచేత్తో బాణ తూనీరములు తీసి ఆయన గుండ్రంగా తిరుగుతూ బాణములను విడిచిపెడుతున్నప్పుడు వర్షధారలు పడిపోయి కొన్నివేలమంది తడిసిపోతే ఎలా ఉంటుందో అలా ఏకకాలంలో ఇంతమందీ పడిపోతున్నారు కానీ ఎవరిదగ్గర్నుంచి బాణాలొస్తున్నాయో కనపడ్డంలేదు.
అంటే ఇలా చూడ్డానికి అవకాశంలేదు చూస్తే కళ్ళు ఎగిరిపోతాయి పడిపోతాయి బాణాలు ఇన్నివేల బాణములును చెయ్యినెప్పెడ్డమన్నదిలేకుండా నడుం నెప్పెడుతూందనుకుండా తీస్తున్నాడు విడిచిపెడుతున్నాడు దీన్ని మహర్షిబాగా అర్థమవ్వడానికి రామునియోక్క ధనుర్విద్యా నైపుణ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన అన్నారూ చాలయన్తం మహానీకం విధమన్తం మహా రథాన్ ! దదృశు స్తు న వై రామం వాతం వన గతం యథా !! మీరు మంచి గాలి వీస్తున్నప్పుడు ఒక అరణ్యం దగ్గరికెళ్ళి ఒక పర్వత శిఖరంమీద నిల్చున్నారనుకోండి మీరున్నవైపుగాలిలేదు అవతలివైపు పెద్ద గాలివీస్తూంది ఇప్పుడు చెట్లూ ఏదో భూతాలు ఆవేసించినట్లుగా ఊగిపోతున్నాయి ఊగిపోతున్న చెట్లుకనపడుతుంటాయి గాలి కనపడుతుందా నీకు గాలి కనపడకుండా ఊగిపోతున్న చెట్లు కనపడుతున్నట్లు బాణములు వేస్తున్న రాముడు కనపడకుండా రాముడువేస్తున్న బాణములు ఒక్కటే కనపడుతున్నాయన్నాడు ఛిన్నం భిన్నం శరై ర్దగ్ధం ప్రభగ్నం శస్త్ర పీడితమ్ ! బలం రామేణ దదృశు ర్న రామం శీఘ్ర కారిణమ్ !! ఆ వస్తున్నటువంటి బాణములకు ఛిన్నం తెగిపోతున్నారు భిన్నం ముక్కలైపోతున్నారు శరై ర్దగ్ధం కాలిపోతున్నారు, శస్త్రములచేత పీడింపబడుతున్నారు కానీ రాముడు మాత్రం ఎవ్వరికీ కనపడటంలేదు.
అంటే ఇంద్రజిత్తులా ఏ మేఘాలచాటునో ఉన్నాడా... కాదు మీరు చూడ్డం కుదరదు ఎందుకు చూడ్డం కుదరదు అంతవేగంతో రాముడు ఎక్కడున్నాడో అక్కడ్నుంచి ఆయన గుండ్రంగా తిరుగుతూ ధనస్సు మండలాకారంగాపెట్టి విడిచిపెట్టినటువంటి ఆ బాణపరంపరా అంత వేగంగా చల్లుకుంటూవచ్చి మీద పడిపోతూంది. అందకుని ఎవరూ అసలు ఎదురుతిరిగి నిలబడీ ఎవరు వేస్తున్నారు ఎంతవేగంగా వేస్తున్నారు బాణం ఎప్పుడు తీస్తున్నాడు ఎప్పుడు సంధిస్తున్నాడు ఎప్పుడు విడిచిపెడుతున్నాడో అన్నది చూడడం ఎవరికీ కుదరదు అన్ని బాణములను ప్రయోగిస్తున్నాడు. మహర్షి అన్నారు ప్రహరన్తం శరీరేషు న తే పశ్యన్తి రాఘవమ్ ! ఇన్ద్రియార్ధేషు తిష్ఠన్తం భూతాఽఽత్మాన మివ ప్రజాః !! ఒక వ్యక్తి ఇంద్రియములచేతా పొందుతున్నటువంటి లౌల్యము తెలుస్తూంది, ఒకాయన చూడకూడని రీతిలో వెర్రిచూపు చూస్తున్నాడనుకోండి, చూడండీ ఎలా వెర్రిచూపు చూస్తున్నాడో అంటాము, చూస్తున్నవెర్రిచూపు తెలుస్తూంది కానీ ఆయన అలా చూడడంవల్లా ఆయనలోని జీవుడు పొందుతున్న తృప్తిని మీరు చూడగలరా..! మీరు చూడలేరు ఆ తృప్తి ఆ జీవుడికొక్కడికే తెలుసు ఇంద్రియములు పొందుతున్నటువంటి సుఖాన్ని ఇంద్రియములవలన ఇంద్రియముల యొక్క లౌల్యము ఇంద్రియముల యొక్క వికారముగా కనపడుతుంది తప్పా తృప్తిమాత్రము జీవుడికే తెలుస్తుంది.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
మీకు బాగా అర్థమైందోలేదో నాకు తెలియదు అంటే ఒకాయనా అదేపనిగా లడ్డూలు తింటున్నాడనుకోండి, అదేంటండీ అలా తినేస్తున్నాడు అని తినేస్తున్నాయన లౌల్యం కనపడుతుంది కానీ ఆయన అలా తినేయటంలో పొందుతున్న తృప్తి ఆయనకొక్కడికే తెలుసుతప్పా... ఆయన ఎంత తృప్తి పొందుతున్నాడన్నది మీకు మాత్రం తెలియదు అలా ఎలా బాణములు వేస్తున్నాడో ఎక్కడుండి వేస్తున్నాడో ఎలా సంధిస్తున్నాడో రాముడు ఒక్కడికే తెలుసు తప్పా చూసేవాళ్ళకిమాత్రం బాణాలుకనపడుతున్నాయిగానీ రాముడు కనపడడు అంతగొప్పగా వేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్పరీతిలో బాణములు వేస్తున్నప్పుడు ఆ రాక్షసులందరూ కూడా అక్కడ ఉన్నటువంటివారు రామ చంద్ర మూర్తి పట్ల క్రుద్ధులై ఆయన వేసినటువంటి గాంధర్వాస్త్ర ప్రభావమునకు సమ్మోహితులై ఆయన కనపడకా వాళ్ళందరూ వ్యామోహమునకుగురైపోయి మోహమునకు వశులై కిందపడిపోయారు. వాళ్ళకి ఆ గాంధర్వాస్త్ర ప్రయోగంచేత ఏమైపోయిందంటే ఒకడికి ఒక రాముడు కనపడుతున్నాడు ఒకడికి వేలమంది రాములు కనపడుతున్నారు దాంతో అసలు ఎవరు రాముడు ఎవరు రాముడు కాదో రాముడు బాణం వేస్తున్నాడు రాముడు నిల్చున్నాడో తన ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడో తన ఎదురుగుండా ఉన్నవాడు వానరుడో రాముడో తెలియనటువంటి దిగ్బ్రాంతిస్థితికి వెళ్ళిపోయారు. అసలు వేస్తున్నవే అంతవేగమైన బాణాలు ఇప్పుడు ఎవరు ఎవరన్నది తెలుసున్నవాడు రాముడొక్కడే, ఎవరు ఎవరన్నది తెలియనివాళ్ళు మిగిలినవాళ్ళందరు కాబట్టి తనవాళ్ళు తెలిసున్నవాడు కాబట్టి వానరులమీదవేయడు తనవారు కారన్నవారు తెలుసుకాబట్టి రాక్షసుల్ని చంపుతాడు. తనవారెవరో పైవావారెవరో రాముడుకానివారెవరో తెలియనంత దిగ్భ్రాంతికి వశులైయ్యారుకాబట్టి అసలు చేతిలో కత్తున్నా బాణమున్నా శూలమున్నా ప్రయోగించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినవాళ్ళు రాక్షసులు.
కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో సేన నిలబడిపోయింది శత్రుసేన, ఇదీ రామ చంద్ర మూర్తి యొక్క పరాక్రమంటే కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక్కడే ఒక్కరాముడు ధనస్సుపట్టుకుని భూమిమీద నిలబడి పద్దెనిమిదివేల ఏనుగుల్ని పదివేల రథములని పదివేల రథములమీద ఉన్నటువంటి ఆశ్వికుల్ని పదునాల్గువేల అశ్వములను రెండు లక్షలమంది కాలిబంటులై నడిచి యుద్ధం చేసేటటువంటివాళ్ళని కేవలం ఒకటిన్నరగంటలలో పడగొట్టేశాడు, ఒకటిన్నరగంటలలో ఇంతమంది నిహతులైపోయారు. ఈ మాటా రావణాసురునికి వెళ్ళింది ఇప్పటివరకు వానరులు లంకాపట్టణానికి వచ్చాకా రామ చంద్ర మూర్తి చేసేటటువంటి యుద్ధమంటే ఇలా ఉంటుందనివాళ్ళు చూడలేదు. ఎప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే ఇటువంటి పరిస్థితివచ్చాకా వాళ్ళుకూడా అసలు యుద్ధంమానేశారు, మానేసి అసలు అదేమిట్రాని ఆశ్చర్యంగా అందరూ రామునివంక చూస్తున్నారు కానీ రాముడు ఎవరికైనా కనపడ్డాడా ఎవరికీ కనపడలేదు ఎప్పుడు కనపడ్డాడు గంటన్నరలో వీళ్ళందర్నీ పడగొట్టేసిన తరువాత ఏడ్చి రావలసినవాడొకడున్నాడు వాన్నీ కొట్టవలసింది వాని సమక్షంలో కొట్టాలి ఇలాగా కాబట్టి ఆగాడాయన ఆగితే ఇప్పుడు పరుగెత్తుకుంటూ వచ్చారు జాంబవంతుడు మైందుడూ


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ద్వివిదుడూ వీళ్లందరూ వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అసలు ఆ బాణ ప్రయోగమేమిటీ ఆ ధనస్సు పట్టుకోవడమేమిటీ ఆ యుద్ధం చెయ్యడమేమిటీ రామా చంద్రా! అని ఆశ్చర్యపోతే ఆయన అన్నారు జామ్బవంతం హరి శ్రేష్ఠం మైందం ద్వివిద మేవ చ ! ఏత దస్త్ర బలం దివ్యం మమ వా త్ర్యమ్బకస్య వా !! నాయనా ఇలా యుద్ధం చెయ్యడమనేటటువంటిది ఇటువంటి యుద్ధం చూడడమనేటటువంటిది అన్నివేళలా సంభవంకాదు ఎందుకంటే ఇలా యుద్ధం చేసేవాళ్ళు లోకంలో ఇద్దరే ఒకడు నేను ఇంకొకడు “త్రయంబకుడు” పరమశివుడు.
బయటమనం కొట్టుకోవడమేకానీ వాళ్ళు ఎప్పుడూ అలా ఏం తేడాలు చెప్పరు, ఆయన ఈయనపట్ల పొగుడుతాడు ఈయ్యన్ని ఆయన పొగడుతారు, ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నది రెండురూపాల్లో ఒకడు ఇద్దరుగా ముగ్గురుగా కనపడుతున్నాడుకానీ అసలు వాళ్ళమధ్య భేదాలు ఉంటేగా వాళ్ళు అలా చెప్పుకోవడానికి అందుకే వాళ్ళెప్పుడూ ఆలా వాళ్ళను ఒకళ్ళనొకళ్ళు నిందించుకుని ఒకళ్ళనొకళ్ళు తక్కువచేసుకుని వాళ్ళెప్పుడూ మాట్లాడుకోరు లేనిపోని అల్లర్లేమైనా ఉంటేమనకే ఉంటాయి అలాంటివన్నీ. కాబట్టి నేను చెయ్యాలి ఇలాంటియుద్ధం లేకపోతే త్రయంబకుడుచెయ్యాలి అని రామచంద్ర మూర్తి చెప్పిన తరువాత అక్కడ ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలకి వార్త అందింది. దీనివెనక ఉన్నటువంటి ఒక వాక్కును మీరు గమనించాలి, ఇదీ సుందరకాండ అయిపోయిన తరువాత హనుమచెప్పారు, నేను మీతో ఒకమాట చెప్పాను అక్కడా ఇద్దరిమాటలు కలిశాయి ఇద్దరు ʻయోగీ-యోగీనీʼ ఇద్దరు దానికి నిమిత్తం రాముడు. ఒకరు ఎవరు హనుమ అన్నారు ఆరోజునా ప్రాసాద స్య మహాన్త స్య స్తమ్భం హేమ పరిష్కృతమ్ ! ఉత్పాటయిత్వా వేగేన హనూమాన్ పవనాఽఽత్మజః !! తత స్తం భ్రామయా మాస శతధారం మహాబలః ! తత్ర చాగ్ని స్సమభవ త్ప్రాసాద శ్చాప్యదహ్యత !! చైత్యప్రాసాదన్ని కాల్చేటప్పుడు ఆయన తోరణం మీద కూర్చుని ఒకమాట చెప్పారు మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనామ్ ! బలినాం వానరేన్ద్రాణాం సుగ్రీవ వశ వర్తినామ్ !! ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం వో నిషూదనః ! నేయమ్ అస్తి పురీ లంకా న యూయం న చ రావణః !! అన్నారాయన, నావంటివారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వస్తున్నారు సుగ్రీవుడితో కలిసి మీరు ఉండరు మీ లంక ఉండదు రావణుడుండూ అన్నారు. ఇప్పుడు ఆయన అన్నారు ఆయనా సీతామాత దర్శనమైన తరువాత ఆత్మస్థితి అనుభవించినయోగిగా... అన్నారామాట.
ఇప్పుడు ఆయన అన్నది సత్యమవ్వాలి తప్పా సత్యాన్ని ఆయన పలకడంకాదు హనుమ ʻఏదన్నారో అది సత్యమైతీరుతుందిʼ ఇప్పుడు, యోగివాక్కు సత్యమౌతూంది ఇప్పుడు. మోగి నోటివెంట ఏదివస్తూందో అది సత్యమైకూర్చుంటుంది రెండవవారెవరు మహాపతివ్రతయై యోగినిగా కూర్చున్న సీతమ్మ ఒక్కమాటంది నేను ఎలా ఏడుస్తున్నానో లంకలో ప్రతి ఇంటా రాక్షస స్త్రీలు ఇలాగే గుండెలుబాదుకుని ఏడుస్తారంది, ప్రతి ఇంటా శవాలు కనపడుతాయంది, ప్రతి ఇంటినుంచి శవం వెళ్తూంది శవాలు కాల్తాయన్నారు, గ్రద్ధలు రాబందులు ఎగురుతాయి ఈ లంకమీదంది ఆవిడ ఏమాటందో ఆ రెండుమాటలను నిజంచెయ్యడానికి రామ చంద్ర మూర్తి నిమిత్తంగా నిలబడ్డారు. ఈమాటకూడా ఎవరుచెప్పారు వాడు చచ్చిపోవడానికి కావలసిన పాపం చేసేశారు కాకపోతే ప్రతిజ్ఞచేశారు కాబట్టి రాముడు


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
వెడుతాడు రామునిచేత నిహతులైపోతారని ఈ మాట చెప్పినవారుకూడా హనుమయే చెప్పారు సుందర కాండ చిట్టచివర అందుకే సుందర కాండ చెప్తే యుద్ధకాండ చెప్పకుండా పట్టాభిషేక సర్గకివెళ్తారు సుందర కాండ ఒక్కటేచెప్తే కారణమేమిటంటే ఇవన్నీ అయన మాటల్లోకి వెళ్ళిపోయాయి అందుకు పట్టాభిషేకం చెప్పే అధికారం వస్తూంది సుందర కాండ ఒక్కటి చెప్తే. కాబట్టి ఇప్పుడు రాముని చేతిలో నిహతులైపోయినటువంటి రాక్షసులయొక్క శరీరములను చూసుకుని ప్రతి ఇంటా స్త్రీలు ఏడుస్తున్నారు అందరూ ఒకలా ఏడుస్తున్నారు అది విచిత్రం.
అందరూ రకరకాలుగా ఏడ్వడంలేదు ఏవరు ఏడ్చినా ఒకలాగనే ఏమని కథం శూర్పణఖా వృద్ధా కరాళా నిర్ణతోదరీ ! ఆససాద వనే రామం కన్దర్పమ్ ఇవ రూపిణమ్ !! సుకుమారం మహా సత్త్వం సర్వ భూత హితే రతమ్ ! తం దృష్ట్వా లోక వధ్యా సా హీన రూపా ప్రకామితా !! ఇదీ విచిత్రం వాళ్ళు రామున్ని నిందించలేదు రాముడు చంపాడుమావాళ్ళనని వాళ్ళు అనలేదు, వాళ్ళంటున్నారు అసలు ఈ దిక్కుమాలిన శూర్పణఖ ఉందే ఇది వృద్ధా ఇది ముసల్ది కరాళా నిర్ణతోదరీ క్రూరమైన స్వభావమున్నది భయంకరమైనటువంటి స్వరూపమున్నది దీనికి కన్దర్పమ్ ఇవ రూపిణమ్ మన్మథునిలాంటి రూపమున్న రాముడు కావలసివచ్చాడా సుకుమారం మహా సత్త్వం సర్వ భూత హితే రతమ్ ఆయన సుకుమారుడు మహాసత్వగుణము కలిగినవాడు సర్వభూతముల యొక్క హితమును కోరేటటువంటివాడు అటువంటివాన్ని శూర్ఫణఖ కోరుకోవటమేమిటీ వెళ్ళి కోరి ఆయనమీద పడ్డమేమిటీ, సీతమ్మని చంపుతాననడమేమిటీ, ఆయన అంగీకరించలేదూ అంటే ఆయన ఏక పత్నీవ్రతుడు మహానుభావుడాయన అటువంటివాడు అంగీకరించలేదని కోపమొచ్చి ఖరదూషణాదులకు ఇంకొకలా చెప్పడమేమిటీ? ఈ మూర్ఖుడు వినకుండా ఆయనమీద పడ్డమేమిటీ? పడితే మహాతేజోమూర్తి ఊరుకుంటాడా... పద్నాలుగువేలమందిని పురుగులు కాల్చినట్లుకాల్చాడు కాల్చితే ఊరుకుందా... వచ్చి రావణునికి చెప్పింది, ఈ దురాత్మునికి బుద్దుండద్దూ వీడు శూర్పణఖ మాటలు వెంటనే నమ్మి వెళ్ళి సీతమ్మను తీసుకొచ్చాడు సీతమ్మని తీసుకొస్తే ఊరుకుంటాడా రాముడు, సీతమ్మని తీసుకొచ్చినవాడు ʻరాముడి ప్రయోజం పొందినవాడు సుగ్రీవుడుʼ అన్నారు. ఎంత విచిత్రమో చూడండి దారిలో వస్తూండగా “అధర్మంలో వాలివున్నాడు ఆయన ఊరుకోడు ఒక్కబాణంతో కొట్టాడు సుగ్రీవుడికి రాజ్యమిచ్చాడు, సుగ్రీవుడు కృతజ్ఞతతో రామున్ని అనుసరించాడు” అనుసరించి రామునివెంట వానరుల్ని తీసుకొచ్చాడు ఇప్పుడూ ఇక్కడికి వచ్చిన తరువాత కూడా పైవాళ్ళు చెప్తే వినకపోవచ్చు తోడబుట్టినవాడు విభీషణుడు చెప్పాడుగా..? చెప్పినా వినలేదు.
పోనీ... తమ్ముడు చెప్పాడు వినలేదు తమ్ముడు వెళ్ళిపొయ్యాడు వినలేదు తనకళ్ళతో తాను చూశాడుగా రాముడు ఎంతగొప్పవాడో అక్కడంటే ఏదో చంపాడు ఏదో చంపాడన్నాడు ఇన్నాళ్లు ఇక్కడేం జరిగింది కుమ్భకర్ణం హతం శ్రుత్వా రాఘవేణ మహా బలమ్ ! అతికాయం చ దుర్ధర్షం లక్ష్మణేన హతం పునః !! ప్రియం చే న్ద్రజితం పుత్రం రావణో నావబుధ్యతే ! స్వంత తమ్ముడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు, కడుపున పుట్టినటువంటివాడు ఇంద్రజిత్తు చనిపోయాడు వారితోపాటు అతికాయుడు చనిపోయాడు ఇంతమందినీ రాముడు లక్ష్మణుడే చంపుతున్నారు, ఎవరెవరు మహాయోధులో అటువంటి కుంభకర్ణున్ని రాముడే చంపాడు ఇంద్రజిత్తుని లక్ష్మణుడు చంపాడు అతికాయున్ని మళ్ళీ రామ లక్ష్మణులే చంపారు. ʻవాళ్ళిద్దరూ నరులూ నరులూ నన్నేంచేస్తారంటాడుʼ తప్పా ఇంతమందిని చంపుతున్నారు ఒరేయ్ వాళ్ళు పరాక్రమంకలిగినవాళ్ళురా సీతమ్మని


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ఇచ్చేయరా అంటే ఇవ్వడే ʻతన కామానికి మన భర్తలందర్నీ ఎరచేశాడు యుద్ధానికి  పట్టుకెళ్ళిʼ, ఇటువంటి దురాత్ముడి


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
యొక్క కొలువులో మనం ఉండడం మన దౌర్భాగ్యం కానీ మన భర్తలతో ఏమీ ఆగదు ఈ యజ్ఞం, ఈ మారణ హోమంలో చిట్టచివర పడిపోయేటటువంటి సమిధ రావణుడే ఎందుకు పడిపోతాడో తెలుసా కథయిష్యన్తి రామేణ రావణస్య నిబర్హణమ్ ! పితామహేన ప్రీతేన దేవ దానవ రాక్షసైః !! రావణస్యాభయం దత్తం మానుషేభ్యో న యాచితమ్ ! చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సుకు ప్రత్యక్షమైనప్పుడు రావణాసురుడు మిగిలినవారిచేతా వధపొందకుండా వరాన్ని కోరుకున్నాడుకానీ నరవానరులచేత కోరలేదుగా ఇంతటి మహాత్ముడే ఇంతమందిని చంపినవానికి రావణున్ని చంపడం పెద్ద కష్టమా..! చంపి తీరుతాడు ఎందుకంటే ఆయన నరుడు.
కాబట్టి రావణుడుకూడా మడిసిపోతాడు పైగా ఒకానొకప్పుడు పరమశివుడుచెప్పాడూని మండోదరిచెప్తూంటుంది, పైగా మండోదరి ఇప్పటివరకు ఎక్కడా కనపడదు. ఒక్కసారి మయుని కూతురిగా రావణాసురునికిచ్చి వివాహం చేశారూని అది కూడా ఉత్తకాండలో కొంచెం వివరంగా ఉందితప్పా ఇక్కడ ఎక్కడాలేవు ఆ విషయాలు. కానీ మండోదరి పాతివ్రత్యమేమిటో రావణుడు నిహతుడైనతరువాత మాట్లాడటంలో అర్థమౌతూంది ఆవిడ పాతివ్రత్యం అదొక చమత్కారం. మహర్షి కొంత కొంత మంది వ్యక్తుల గురించి ఎక్కువ చెప్పరు ఎందుకంటే పాత్రలగురించి అన్నమాట అనకూడదు, పాత్ర అన్నమాట ఎవరికి వాడాలో తెలుసాండీ కల్పితమైన రచనైతే పాత్ర, ఆయన పాత్ర బాగా పోషించాడండీ అన్నాననుకోండి వాడు కోటీశ్వరుడు సింగపూర్ వెళ్ళి అన్ని కొనుక్కూంటూంటాడు ʻఅన్నానికి లేనివాడిలా నటించాడుʼ అంటే అది పాత్ర, అంటే ఆయన నిజజీవితంలో కోటీశ్వరుడు కానీ అన్నానికిలేనివాడిలా బాగానటిస్తే మీరూ నేను వందరూపాయలు టికెట్టికొని బాగా నటించాడంటూంటాం. అదీ పాత్రపోషణా అంటూంటాం అంటే ఆయనవేరు ఆయన నటించడంవేరు అలా నటించినట్లుగా కల్పిత కథలైతే పాత్రలనాలి యదార్థమైతే వ్యక్తులనాలి. ఆ పాత్ర ఎంతగొప్పగా ఉందో చూశారా... “ఆ పాత్ర వైశిష్ట్యం చూశారా అనకూడదు, ఆ వ్యక్తి వైశిష్ఠం చూశారా అనవలసి ఉంటుంది”. ఇప్పుడు సీతమ్మ గొప్పతనం “సీతమ్మగొప్పతనమే” సీతమ్మతల్లి పాత్రకాదు అదేం ఎవరో నటించిందికాదు యదార్థము వాల్మీకి రామాయణం ఇప్పుడు చెప్పేదంతా ఇదంతా ఏదో వాల్మీకి రచనకాదు మీరు మొదట్నుంటి వింటున్నారుగా ఇది యదార్థముగా జరిగినగాధ యదార్థమైనగాధ ఇందులో ఒక్క అక్షరము అనృతములేదు అని చెప్పారు మహర్షి చిట్ట చివర మీరు ఎల్లుండి వింటారుగా ఫలసృతి సర్గ విన్నప్పుడు అందుకే అందులో ఈ శ్లోకం తప్పకుండా చెప్తారు ఇందులో ఒక అక్షరము కల్పితములేదు ప్రతి అక్షరము యాదార్థముగా జరిగినటువంటి విషయాన్ని ఒక అక్షరము ఎక్కువ వాడకుండా ఒక అక్షరము తక్కువవాడకుండా పొదుపరియైనటువంటి ఇల్లాలు ఎలా వంటసామానువాడుతుందో అలావాడి రచనచేశారు మహర్షి.
అదేంటండీ మళ్ళీ అలాంటి ఉపమానంవేశారు మీరు అంటారేమో... శంకరభగవత్పాదులు గురించి చెప్తే ఈ మాట చెప్తుంటారు ఒక విషయాన్ని వివరించేటప్పుడు రచన చేసేటప్పుడు ఉన్నవిషయంకన్నా కూడా ఎక్కువాగా వర్ణణచేస్తే పదములను ఎక్కువ వాడుకున్నట్లు, బాగా చెప్పడానికి కావలసినన్ని పదములను వాడకపోతే తక్కువవాడినట్లు ఎక్కువా వాడకుండా తక్కువా వాడకుండా మంచి మధురమధురముగా అందించి ఎంతవాడాలో అంతేవాడగలిగినటువంటి ప్రజ్ఞ కవియందు ఉండే ఆయన రచనకు ఉండేటటువంటి వైశిష్ట్యము చాలా గొప్పగా ఉంటుంది. శంకర భగవత్పాదుల రచనలో అలా ఉంటుంది అందుకే శంకరాచార్యులవారు ఎక్కడైనా ఒక అక్షరాన్ని వేశారనుకోండి కొన్ని వందల సంవత్సరాలతరువాత కూడా మీరు ఆ అక్షాన్ని మార్చలేరు. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ తీర్థస్వామివారు పీఠాధిపత్యంలో ఉండగా గణపతి సభలని చేస్తుంటారు, వేదవాక్కు విచారణ సభలని చెప్పి వేదవాక్యాలను విచారణ చేస్తారు, అంటే జ్ఞాన సంబంధమైన విచారణమీద జ్ఞాన సభలని ఉంటాయి అందులో ఒకాయన శంకరభగవత్పాదులు చేసినటువంటి వాఖ్యానాన్ని చెప్తూ ఒక అక్షరాన్ని మార్చి చెప్పారు, వెంటనే చంద్రశేఖర భారతి ఆగు అన్నారు ఆ అక్షరం శంకరలు ఉపయోగించారా అని ఆయన అన్నారు లేదు ఉపయోగించలేదు అన్నారు మరి నీవెందుకు ఉపయోగించారని అడిగారు ఈ అక్షరం ఉపయోగిస్తే ఇంకా బాగుంటుందని ఉపయోగించాను అన్నారు అంటే నీకున్న ఆలోచన శంకరులకు లేదనుకుంటున్నావా? ఇదీ శంకరులయందు భక్తి అంటే... అందుకే చంద్రశేఖర భారతి ప్రాతఃస్మరణీయులైనారు అంటే ఆయన అన్నారు నేను ఒక్కనాటికి అలా అనుకోలేదు శంకరుల ప్రజ్ఞ ఎక్కడ నా ప్రజ్ఞ ఎక్కడ నేను ఉపయోగించిన అక్షరం శంకరులు చేతకాక ఉపయోగించలేరు అని నేను అనుకోలేదు అన్నారు అప్పుడు చంద్రశేఖర భారతీస్వామి వ్యాఖానంచేశారు.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
నీవనుకున్న అక్షరాన్నివాడితే ఇంత తప్పర్థమొస్తుంది శంకరులు ఏదనుకున్నారో దానికన్నా పరిమితమై పోయినటువంటి అర్థమొస్తుంది శంకరులు ఏ అక్షరాన్ని ఉపయోగించారో ఆ అక్షరాన్నేవాడితే ఇంతవిశాలమైన అర్థమొస్తుంది ఇంక ఎప్పుడైనా మారుస్తావా శంకరులయొక్క వ్యాఖ్యానంలోని అక్షరాలని అని ఆడిగారు ఎప్పుడూ మార్చనూ అన్నారాయన, అంత పొదుపుగా వాడుతారు శంకరాచార్యులవారియొక్క భాషా ఆ పొదుపు మీరు చూడాలంటే ప్రత్యేకించి సౌందర్యలహరి అసలు నిజంగా సౌందర్యలహరిలో ఆయన వేసేమాటా ఒక్కొక్కమాట ఆయనవేస్తే శ్లోకంలో ఏమి అందమో ఇకదాన్ని మీరు మార్చడం కుదరదు అంతే... ఒక్కమాటమీద సౌందర్యలహరిలో ఆయన వాడిన వాఖ్యానం అలా ఎందుకువాడారు అన్నదానిమీద మళ్ళీ రోజులు రోజులు వెళ్ళాయి అంత అద్భుతమైనటువంటి రచనాశైలి శంకరభగవత్పాదులది. వాల్మీకి మహర్షి అంతగొప్ప రచనచేశారు మహర్షి మహానుభావుడు ఈ జాతికి వాల్మీకి మహర్షి పెట్టిన భిక్షా శ్రీరామాయణము.
కాబట్టి ఇంతమంది మరణించారు కానీ వినడు మండోదరి చెప్తూండగా విన్నారు చెలికత్తెలు ఆ చెలికత్తెలు ఆడవారు కాబట్టి రాక్షస స్త్రీలతో చెప్పారు. ఏమనీ ఒకానొకప్పుడు దేవతలందరు కలిసి పరమశివున్ని ప్రార్థన చేశారు అయ్యా! ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిః బ్రాహ్మాణోధి పతిః బ్రహ్మశివోమే అస్తు సదాశివోమ్ నీకు తెలియనిదేంలేదు కాబట్టి అసలు రావణ సంహారం ఎలా జరుగుతూంది అని అడిగారు దేవతలు అడిగితే ఆయనొక రహస్యం చెప్పారు అందుకు కదాండి మహర్షి సీతాయాం చరితం మహత్ అని చెప్పారు, రామాయణము అన్నపేరొక్కటే ఆయన పెట్టలేదు కావ్యం రామాయణం కృత్స్నం సీతాయా శ్చరితం మహత్ ! పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రతః !! బాల కాండ మొదట్లో మీరు విన్నారు మూడు పేర్లు పెట్టాడాయన “శ్రీరామాయణము, పౌలస్త్యవధ, సీతాదేవి యొక్క కథా” సీతా చరిత్రం. ఆ పరమ శివుడు అన్నాడు దేవతలతోటి ప్రసన్న స్తు మహాదేవో దేవా నేత ద్వచోబ్రవీత్ ! ఉత్పత్స్యతి హితార్థం వో నారీ రక్షః క్షయావహా !! ఒకానొకప్పుడు ఈ రావణున్ని నిర్జించడానికి రాక్షసుల్ని


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
నిర్జించడానికి ఒక స్త్రీ ʻతనంతతాను


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ఆవిర్భవిస్తుందిʼ పుడుతుంది కాదు తనంతతాను ఆవిర్భవస్తుంది అందుకని ʻఅయోనిజగాʼ వచ్చింది సీతమ్మ ఏషా దేవైః ప్రయుక్తా తు క్షుద్యథా దానవాన్ పురా ! భక్షయిష్యతి నః సీతా రాక్షసఘ్నీ సరావణాన్ !! ఒకానొకప్పుడు అంమృతం పంచకపోతే దానవుల్ని ఆకలి తినేసినట్లు ఆకలి తినేస్తుంది.
అందుకే కదాండి నీరసపడిపోతాడు మనిషి, ఆకలి దానవుల్ని తినేసినట్లు రావణునితో కలిసినటువంటి రాక్షసులనందర్నీ ఆ స్త్రీ తినేస్తుంది ఇది ఎవరికి అర్థమయ్యిందో ఆయన అన్నారు నీకంఠార్పిత కాలపాశము శిరోనిర్ఘాంత పాతంబు లంకోకస్సంచయ కాళరాత్రి గళ బద్ధోదగ్ర కాలాహి క న్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ యొప్పించి లో కైక త్రాణుని రామునిం గనుము నీకీ బుద్ధి కాకుండినన్ అన్నాడు భాస్కర రామాయణంలో అందుకే “ఓరేయ్! లంకని నాశనం చేయడానికి వచ్చిందిరా ఆవిడ ఐదు ʻతలల పాముʼ తీసుకెళ్ళి అప్పజెప్పైరా” అన్నారు హనుమ విన్నాడా..!, పరమశివుడు ఆనాడే చెప్పాడు దేవతలకీ అని మండోదరి అంటూంటుంది, “ఒక స్త్రీ పుడుతుంది ఆవిడే ఇక్కడికొచ్చి కూర్చుని తినేస్తుంది రావణున్ని రాక్షసుల్నీని” ఆవిడే కూర్చుంది ఇప్పుడు అశోకవనంలో శింశుపా వృక్షంకిందా ఏమీ చేతకానిదానిలా కూర్చుంది కానీ ఆవిడే వీరియందు ఈ మోహాన్ని పుట్టించి రామ బాణములకు తెగటారిపోయెటట్టుగా పంపిస్తూంది వరుసక్రమంలో ఆతల్లిరా! సీతమ్మని వీడనుకుంటున్నాడు కామముచేత మోహించాడనుకుంటున్నాడు అది అడ్డుపెట్టే ఆవిడ వీళ్ళని నశింపజేస్తుంది అందుకే రోజు ఆమాట అన్నావు సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ! పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ !! ఆతల్లి అనుగ్రహించిందా..! ఇంద్రియములను మనస్సుని ఈశ్వరుడివైపుకు తిప్పుతుంది ఆ తల్లి అనుగ్రహంలేదా మాయయందు పరిభ్రమిస్తూ మహామాయా విశ్వమ భ్రమయతి పరబ్రహ్మ మహిషి మాయయందు తిప్పుతూ ఈశ్వరుడి వైపుకు వెళ్ళకుండాచేసి ఇంద్రియ లౌల్యములకు వశున్నిచేసి నశింపజేస్తుంది.
కాబట్టి పైనున్నాయన్ని అనుగ్రహించిది హనుమని ఎదురుగుండా ఉన్నవాళ్ళందర్నీ నశింపజేస్తుంది పరమశివుడు ఆనాడే చెప్పాడురా... కాబట్టి ఈ లంక ఇలాగే నాశనమైపోతూంది కానీ ఈ లంకలో పుట్టి లంకలో పెరిగి లంకలో ఉండి నశించనివాడెవడైనా ఉంటే మొహమాటానికి పోకుండా విడిచిపోయినవాడే కాబట్టి ప్రాప్త కాలం కృతం తేన పౌలస్త్యేన మహాత్మనా ! యత ఏవ భయం దృష్టం తమేవ శరణం గతః !! ఈ రావణుడి యొక్క అధర్మాన్ని తెలుసుకునీ ఇక్కడ ఉంటే ప్రమాదమొస్తుంది సీతమ్మని విడిచిపెట్టకపోతే ఆవిడ వీళ్ళని తినేస్తుందని గ్రహించి విడిచిపెట్టి వెళ్ళిపోయి దేశకాలములను గుర్తించినవాడున్నాడే వాడు ధర్మాత్ముడు వాడు మహానుభావుడు ఆయన విభీషణుడు వెళ్ళిపోయాడు ఇక్కడ్నుంచి కాబట్టి లంకలో అభ్యున్నతిని పొందేవాళ్ళూ అంటూ ఉంటే విభీషణుడొక్కడే అందుకే కదాండీ వెంటనే పట్టాభిషేకం చేసేశాడు. ఆ కుటుంబమంతా సేవించింది సీతమ్మని ఒక్క విభీషణుడు కాడు ఆయన భార్య సరమ సేవించింది ఆయన కూతురు త్రిజటా సేవించింది ఆ విభీషణుడు రామున్ని సేవించాడు అందుకే ఆ కుటుంబమే అప్పట్నుంచి ఇప్పటివరకూ కూడా ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉన్న కాంచనలంకలో విభీషణుడు ఇప్పటికీ పూజ చేస్తూనే ఉంటారనీ ఇప్పటికీ విభీషణుడు చిరాయువై ఉన్నాడని పెద్దలు చెప్తారు.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
అనడమే... ఒకానొకసారి నా దగ్గర చాలా కాలంగా ఉండేది ఒకాయన చదువుతానని పట్టుకునిపోయాడు ట్రాస్ఫరైపోయి. ఒకానొక మ్యాగజైన్లో ఒక విషయం వచ్చింది, శ్రీరంగం గుళ్ళో ఒకాయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున నిద్రపోతే తెల్లవారుఝామున చీకట్లో పూజ చేయడానికి వస్తాడటా విభీషణుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి పూలు అవీ పట్టుకెళ్ళడంలో ఈ వీన్ని కూడా బుట్టలో వేసుకుని పట్టుకుపోయారు అంటే వాళ్ళ పర్వతాకారములముందు ఈయన చిన్న కీటకం పట్టుకుపోతే ఆయన్ని కాంచన లంకకి పట్టుకుపోయారు పూజామందిరంలో పెట్టారు ఆ బుట్టా విభీషణుడు రామ పాదాలని అర్చన చేస్తున్నాడు అర్చన చేస్తూ బుట్టలో చెయ్యిపెట్టి తీస్తే ఈయ్యనొచ్చాడు హడిలిపోయి కాళ్ళమీదపడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు పొరపాటున వచ్చావు కాబట్టి నిన్ను నేను విడిచిపెడుతున్నానని మళ్ళీ రాక్షసులు వచ్చి శ్రీరంగంలో దింపేశారని తన అనుభవాన్ని వివరించినటువంటి గాధపడింది ఓసారి ఒక మ్యాగజైన్లో అయితే మన దౌర్భాగ్యమేమిటంటే ఇలాంటివాటికి వేటికీ తగినంత ప్రచారముండదు అక్కర్లేనివి అనవసరమైనవి పనికిమాలివాళ్ళమాటలు పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుంటాము మనం. మనం ఆ స్థాయికి వచ్చేశాము కాబట్టి ఒకానొకప్పుడు ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడూ అనడానికి ఋజువు దొరికాయి, మనకేమిటంటే మన పురాణంలో చెప్తామన్నారనుకోండి మనం నమ్మం. అమెరికావాడి శాటిలైటుకి ద్వారక దొరికిందని ఫొటో చూపించాడనుకోండి మనం నమ్ముతున్నాం. మన దరిద్రమేమిటంటే ప్రపంచానికి చెప్పిన దేశమిదీని నమ్మకంలేదు అమెరికావాడు చెప్తే మనం నమ్ముతాం.
మనకి మన వారధి మీద నమ్మకం ఉండదు ఎవడో చెప్పాడనుకోండి మనం నమ్ముతున్నాం ఓ... ఆ సేతువు మనం కట్టిందేనని నమ్ముతాం ఆస్థితికి ఇవ్వాళ మనం జారిపోయాం ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించి మళ్ళీ పూర్వసంస్కారం ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థనచెయ్యావలసి ఉంటుంది. కాబట్టి ఆ విభీషణుడు మంచిపనిచేశాడు ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ్నుంచి కాబట్టి బతికిపోయాడు అన్నారు, సరే రావణుడు ఈ వెళ్ళినటువంటి రాక్షసులందరూ మడిసిపోయారు గంటన్నరలో ఇంతమందిని రాముడు నిహతుల్నిచేశాడూని తెలుసుకున్నాడు విశేషమైనటువంటి కోపాన్నిపొందాడు. దంతములతో పెదవిని అదిమిపట్టాడు పటపటపళ్ళు కొరికాడు ఏం చేస్తాడు క్రోధం శేషేనపూరయేత్ అని, చేతగానివాడికి కోపమే కాబట్టి మహోదర మహాపార్శ్వౌ విరూపాక్షం చ రాక్షసం ! శీఘ్రం వదత సైన్యాని నిర్యాతేతి మమాజ్ఞయా !! మహోదర మహాపార్వులు విరూపాక్షుడు అనబడేటటువంటి ముగ్గురు రాక్షసుల్ని యుద్ధానికి పంపించాడు వాళ్ళతోపాటు రావణాసురుడుకూడా బయలుదేరాడు బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. ఇంతమంది తెగటారిపొయ్యారు వెళ్తున్నవాళ్ళందరు మరణిస్తున్నారు కానీ ఒక్కడంటే ఒక్కయోధుడు అటువైపు మరణించాడన్నవార్తలేదు ఏదో కొన్ని లక్షలమంది పడిపోయారులే ఇంద్రజిత్తు చేతులో అనుకుంటే ఆ హనుమమోమో ఓషధీ పర్వతాన్ని తీసుకొచ్చాడు చచ్చిపోయినవాళ్ళుకూడా బ్రతికేశారు ఇటువైపు తనవాళ్ళందరి శవాలు సముద్రంలో కలిపేశాడు బ్రతికినవాడు ఒక్కడులేడు అన్నివిధాలా ఏడుపే మిగిలింది రావణునికి ఈ ఏడుపు కామం తీరకపోవడం క్రోధం జ్వాలగా మారిపోయింది.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ఇప్పుడు తానూ యుద్ధానికి బయలుదేరాడు తనతోపాటు తీసుకెళ్ళినటువంటి వీరులలో విరూపాక్షున్ని  మహోదరున్ని సుగ్రీవుడు చంపేశాడు మహాపార్వున్ని అంగదుడు చంపేశాడు ఆ ముగ్గురూ మరణించారు, ఈ క్రోధం కడుపులో ఉండిపోయింది ఉండిపోయి రావణుడు చాలా భయంకరమైన యుద్ధమే చేశాడు ఆ రావణ యుద్ధం చేతకాని యుద్దమన్నమాట మీరు అనకూడదు ఎందుకో తెలుసాండి మహర్షి ఆమాట వాడలేదు, రామున్నికూడా నీరసపడిపోయేటట్లు రాముడుకూడా అసలు ఈ రావణుడు ఎలా సంహరింపబడుతాడు అనేటట్లు బెంగపెట్టుకునేటట్లు యుద్ధం చేశాడండీ..! రామున్ని యుద్ధం చేస్తుంటే ఎలా చూశారో రావణున్ని అలా చూశారు, నిష్పక్షపాతంగా మాట్లాడుతారు మహర్షి మీరు కూడా అలాగే మాట్లాడవలసి ఉంటుంది మీరు చదివినప్పుడు అంత భయంకరమైన యుద్ధం చేశాడు. ఆయన యుద్ధభూమిలోకెళ్ళి
తతః క్రుద్ధో దశగ్రీవః శరైః కాంచన భూషణైః ! వానరాణామ్ అనీకేషు చకార కదనం మహత్ !!
నికృత్త శిరసః కేచి ద్రావణేన వలీముఖాః ! కేచి ద్విచ్ఛిన్న హృదయాః  కేచి చ్ఛోత్ర వివర్జితాః !!
నిరుచ్ఛ్వాసా హతాః కేచిత్ కేచిత్ పార్శ్వేషు దారితాః ! కేచి ద్విభిన్న శిరసః కేచి చ్చక్షు ర్వివర్జితాః !!
ధశాననః క్రోధ వివృత్త నేత్రో యతో యతోభ్యేతి రథేన సంఖ్యే తత స్తత స్తస్య శర ప్రవేగం సోఢుం న శేకు ర్హరి యూథపా స్తే !
ఆయనా రామ చంద్ర మూర్తి ఎలా యుద్ధం చేస్తారో అలా ఆయన కూడా ధనస్సుపట్టుకుని బాణప్రయోగం చేస్తూంటే ఆయన ఎదుట నిలబడగలిగినటువంటి వానర యోధులుడులేరు ఆ రోజున ఎంతమందిని తెగటార్చాడంటే పడిపోతున్నవి కనపడుతున్నాయి దొర్లి కిందపడిపోతున్న శిరస్సులు బద్ధలైపోతున్నటువంటి వక్షస్థలాలు తెగిపోతున్నటువంటి చెవులు అంటే ఇక ఎక్కుపెట్టు కొట్టడం కూడా లేదు బాణ పరంపర విడిచిపెట్టేయడమే తేగిపోతున్నటువంటి చెవులు ఎగిరిపోతున్నటువంటి ప్రాణాలు రావణుడు ఎటువెడుతున్నాడో అటువైపు పీనుగుల తెట్ట అటువైపు పరుగులు పారిపోవడం తప్పా ఆసలు ఎదురునిలబడడమన్నదిలేదు అందరు పారిపోవడమే అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు. అప్పుడు తామసం సుమహా ఘోరం చకారాస్త్రం సుదారుణమ్ ! నిర్దదాహ కపీన్ సర్వాం స్తే ప్రవేతుః సమన్తతః !! చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా నిర్మించినటువంటి తామసాస్త్రమనేటటువంటి ఒక అస్త్రాన్నితీసి రావణాసురుడు ప్రయోగించాడు ఆ భయంకరమైనటువంటి ఆ అస్త్రముయొక్క ప్రహారముచేత వానరసైన్యమంతా చెల్లాచెదరై కొట్టబడుతూంది, అందరూ కూడా రామున్ని శరణాగతి చేశారు అసలు ఈ అస్త్ర ప్రభావాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం.
ఇదేమి యుద్ధం ఇదేమి రావణాసురునియొక్క పరాక్రమమని తతో రామో మహా తేజాః సౌమిత్రి సహితో బలీ ! వానరాం శ్చ రణే భగ్నాన్ ఆపతన్తం చ రావణమ్ !! సమీక్ష్య రాఘవో హృష్టో మధ్యే జగ్రాహ కార్ముకమ్ ! విస్ఫారయితుమ్ ఆరేభే తతః స ధను రుత్తమమ్ !! మహా వేగం మహా నాదం నిర్భిన్ద న్నివ మేదినీమ్ ! అప్పుడు రామ చంద్ర మూర్తిని ఇప్పుడు నేను రావణున్ని నిగ్రహించడానికి నేను కూడా ఎటువంటి యుద్ధం చేస్తానో చూడండని ఆయన కూడా ధనస్సుని తీసుకుని ఆ ధనస్సుని భూమి మీద నిలబెట్టి ఆ వింటి నారిని టంకారం చేశారు, ఆ టంకారమునకు భూమి పర్వతములతోసహా కదిలిపోయింది సముద్రమంతా ఘోషించింది ఆ సమయంలో త మిచ్ఛన్ ప్రథమం యోద్ధుం లక్ష్మణో నిశితైః శరైః ! ముయోచ ధను రాఽఽయమ్య శరాన్ అగ్ని శిఖోపమాన్ !! లక్ష్మణ మూర్తి పరుగుపరుగున వచ్చి అన్నయ్యా ఇప్పుడు నీవు యుద్ధం చెయ్యక్కరలేదు ముందు నేను యుద్ధం ప్రారంభం చేస్తాననిచెప్పి కొన్ని బాణములు తీసుకొని రావణాసురినిమీద ప్రయోగించాడు. కానీ రావణుడన్నాడు నీతో నాకు యుద్ధమేమిటీ అని లక్ష్మణున్ని అధిగమించి నేను రామునితోనే యుద్ధం చేస్తానని రామునిదగ్గరకు వచ్చాడు


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
రాఘవో రావణం తూర్ణం రావణో రాఘవం తథా ! అన్యోన్యం వివిధై స్తీక్షైః శరైః అభి వవర్షతుః !!
చేరతు శ్చ చిరం చిత్రం మణ్డలం సవ్య దక్షిణమ్ ! బాణ వేగాన్ సముతిక్షప్తా వన్యోన్య మపరాజితౌ !!
మహా వేగైః సుతీక్షాగ్రై ర్గృధ్ర పత్రైః సువాజితైః ! శరాన్ధకార మాఽఽకాశం చక్రతుః సరమం తదా !!
ఉభౌ హి పరమేష్వాసా వుభౌ శస్త్ర విశారధౌ ! ఉభౌ చాస్త్రవిదాం ముఖ్యా వుభౌ యుద్ధే విచేరతుః !!
మహర్షి అంతటి నిష్పక్షపాతంగా మాట్లాడుతాడు ఇందరూ కూడా ధనస్సులు పట్టుకున్నారు ఇందరూ కూడా మండలాకారంగా తిరుగుతున్నారు ఇద్దరూ గుండ్రంగా బాణములను విడిచిపెడుతున్నారు ఒకాయన నేలమీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఒకాయన రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఇద్దరూ ఒకరికొకరు తీసుపోవట్లేదు ఒకరు అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకొకరు నిర్వీర్యం చేస్తున్నారు ఇంకొకరు ప్రయోగించన అస్త్రాన్ని వేరొకరు నిర్వీర్యం చేస్తున్నారు, ఇద్దరూ ఎప్పుడు బాణాలు తీస్తున్నారో ఎప్పుడు ఎక్కుపెడుతున్నారో ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియదు ఇంత భయంకరంగా విడిచిపెడుతున్నటువంటి బాణపరంపరా అహోరాత్రములు జరిగితే బాణములచేతా ఆకాశమంతా కప్పబడి సూర్యుని యొక్క కిరణములు భూమిమీదపడడం ఆగిపోయి లంకాపట్టణమంతా పట్టపగటివేళే కటిక చీకటైపోయింది, చీకటైపోయి ఆ చీకట్లో రామ రావణులు ప్రయోగించినటువంటి బాణములు కొట్టుకోవడంవల్ల ఎదురుగుండా మెరుపులుగా ఉల్కలుగా పడుతున్నాయి ఎమి ఆశ్చర్యం ఎదురుగుండా శ్లోకం చదివేటప్పటికి అలాగే కనిపిస్తుంది కాబట్టి అంత భయంకరంగా యుద్దం జరుగుతూ ఆ చీకటిలో ఆకాశంలో అంతటి ఉల్కలు మెరుపులు తప్పా ఆసలు ఇద్దరు వేసుకున్నటువంటి బాణాలుగానీ ఇద్దరూకానీ కనపడ్డంలేదు అంతఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది.
అటువంటి సమయంలో నిహ్తయ రాఘవస్యాస్త్రం రావణః క్రోధ మూర్చితః ! అసురం సుమహా ఘోరమ్ అన్య దస్త్రం సమాఽఽదదే !! ఆ రావణాసురుడు మహాకృద్ధుడై కోపంతో అసురాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు అందులోంచి పెద్దపులులు రాబందులు కాకులు గద్దలు డేగలు నక్కలు భయంకరంగా అందులోంచి వరాహములు  ఇవన్నీకూడా విషపూరితమైనటువంటి మొసళ్ళు పాములు నోళ్ళు తెరుచుకుని పుంకానుపుంకలంగా పుట్టేస్తున్నాయి, పుట్టేసి వచ్చి మీదపడిపోయున్నాయి ఇది చూసినటువంటి రామ చంద్ర మూర్తి ఆసురేణ సమావిష్టః సోస్త్రేణ రఘు నన్దనః ! ససర్జాస్త్రం మహౌత్సాహః పావకం పావకోపమః !! రామ చంద్ర మూర్తి ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టారు వెంటనే ఆకాశంలో ఎక్కడ చూసినా ఉల్కలూ సూర్యునియొక్క తేజస్సు చంద్రుని యొక్క తేజస్సు నక్షత్రములయొక్క తేజస్సుతోటీ ఆ చీకటిని భగ్నంచేస్తూ నిప్పురవ్వలు రంగురంగులుగా ఆకాశమంతావిచ్చుకుంటూ ఒక్కొక్కబాణంలోంచి అదిగో ఎదురుగుండా చీకట్లో ఆకాశంలోంచి ఎలా విచ్చుకుని కనపడుతున్నాయో రంగు రంగులుగా అలా రాముని యొక్క బాణములు నిప్పురవ్వలతో పడుతూంటే ఆ నిప్పురవ్వలకి భయపడినటువంటి పాములు మొసళ్ళు పులులు సింహాలన్నీ వెనక్కి వెనక్కి పారిపోతున్నాయి.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
రాముని యొక్క బాణముల తేజస్సు ఆయన యొక్క బాణములలోంచి పుట్టిన వెలుతురు కనపడుతూంది ఆయన ప్రయోగించిన ఆగ్నేయాస్త్రంచేతా ఆ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రముచేతా ప్రజ్వలించినవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి, సూర్యుడు చంద్రుడు అర్ధచంద్రుడు తోకచుక్కలు గ్రహములు నక్షత్రములు ఉల్కలు మెరుపుతీగలు ఆయన బాణములలోంచి పుట్టాయటా... పుట్టి ఈ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రంలోంచి వచ్చినటువంటి ప్రాణులన్నింటిని నిగ్రహించాడు. ఆ విధంగా రామ-రావణ యుద్ధం ఎంతభయంకరంగా జరగాలో అంత భయంకరంగా జరుగుతోంది. ఈ మధ్యలో ఏతస్మి న్నన్తరే క్రుద్ధో రాఘవస్యానుజో బలీ ! లక్ష్మణః సాయకాన్ సప్త జగ్రాహ పర వీరహా !! రామ చంద్ర మూర్తి అంత కష్టపడుతున్నాడన్న విషయాన్ని లక్ష్మణుడు తట్టుకోలేకపోయాడు ఆయనకి అంత భక్తి రాముడంటే వెంటనే లక్ష్మణుడొచ్చి ఏతస్మి న్నన్తరే క్రుద్ధో అపారమైన కోపం పొందినటువంటి లక్ష్మణుడు అన్నయ్యా!.. కాసేపాగు అన్నాడు అనీ తన ధనస్సు తీసుకొని తైః సాయకై ర్మహా వేగై రావణస్య మహా ద్యుతిః ! ధ్వజం మనుష్య శీర్షం తు తస్య చిచ్ఛేద నైకదా !! వెంటనే ఆ సౌమిత్రి ఏడు బాణములతో మానవ కఫాలములను ముద్రలుగా వేసుకున్నటువంటి రావణాసురుని యొక్క ధనస్సుని విరగ్గొట్టేశాడు మూడు బాణాలతోటి సారథే శ్చాపి బాణేన శిరో జ్వలిత కుణ్డలమ్ ! జహార లక్ష్మణః శ్రీమాన్ నైరృతస్య మహా బలః !! ఆయనా కుండలములతో ప్రకాశిస్తున్నటువంటి రావణాసురునియొక్క సారథి శిరస్సుని ఒక్కబాణంతో తెగగొట్టి ఆ సారథి శిరస్సు కిందపడపోయేటట్లుగా చేశాడు తస్య బాణై శ్చ చిచ్ఛేద ధను ర్గజ కరోపమమ్ ! లక్ష్మణో రాక్షసేన్ద్రస్య పంచభి ర్నిశితైః శరైః !! ఐదు బాణములతో ఆ చేతిలో రావణుడు పట్టుకున్నటువంటి ఏనుగు తొండంలాంటి ధనస్సుని పడగొట్టారు. మానవుల యొక్క పుర్రెలు ముద్రలు కలిగినటువంటి ధ్వజాన్ని ఆ ముందువేసినటువంటి బాణములతో ఏడు బాణములతో మానవ కఫాల చిహ్నములు కలిగినటువంటి పథాకాన్ని పడగొట్టేశారు.
అది ఎంత ప్రీతో చూడండివాడికి మానవ కఫాల చిహ్నములువేసుకున్నటువంటి ధ్వజాన్ని పెట్టుకునిరావడమేమిటండీ..! కాబట్టి ఎవరి ధ్వజం వాళ్ళయొక్క హృదయాన్ని చెప్తూంది, అందుకే విరాటపర్వంచెప్తే విరాటపర్వంలో అర్జునున్ని అడుగుతాడు ఉత్తరకుమారుడు ఎవరెవరు ఏమిటో నాకుచెప్పు అంటాడు ఎవరెవరో చెప్పడు కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు అంటూ ఒక్కొక్కరియొక్క పథాకాన్ని వర్ణిస్తాడు అందుకని అదిగో మహానుభావుడు సురనదీసూనుఁ డేర్పడఁ జూచికొనుము అంటూ ఎవరెవరి పథాకము ఎలా ఉంటుందో చెప్తాడు. ఇక్ష్వాకువంశంవాళ్ళు ʻకోవిదార వృక్షాన్నిʼ పథాకానికి ధ్వజంగా పెట్టుకుంటారు, ఎందుకు వృక్షాన్ని పెట్టుకుంటారంటే కోవిదారము అంటే అమరకోశము వ్యాఖానంచేసింది “భూమియొక్క పెళ్ళని పెళ్ళగించగలిగినటువంటి చెట్టు” అంత స్థిరమైనటువంటి చెట్టు, ఆ చెట్టు నీడనిస్తుంది, మేము ప్రజలకు నీడనిస్తామని చెప్పడానికి వాళ్ళు అటువంటి చెట్టుపెట్టుకున్నారు. వీడు మానవ కఫాలాలనుపెట్టుకోవడమేమిటీ ధ్వజానికి ఎవరిబుద్ధి ఎటువంటిదో బుద్దిలోవుండే వ్యగ్రత ఎటువంటిదో మీకు తెలిసిపోతూంటుంది. పీతాంబరదరుడు అనేటటువంటి పేరు పెట్టుకోవడం నేను అసలు ఎక్కడా వినలేదు చాలా గొప్పపేరు ఎవరుపెట్టారంటే మా తాతగారు పెట్టారండీ ఆయనకు చాలా ఇష్టము శ్రీమహావిష్ణువంటే అందుకని పీతాంబరధరుడు అని పెడతానంటే పెట్టామండీ అన్నారు, చాలా సంతోషమండీ అన్నాను. వాళ్ళు అలా పిలుస్తారనుకున్నాను నేను ʻఓరేయ్ పిచ్చికాయ్ మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇవ్వరా ఆయనకుʼ అన్నారు, నేను తెల్లబోయాను అదేమిటమ్మా మరి పీతాంబరధరుడు అని అన్నారుకదా మీ అబ్బాయిపేరు అన్నాను అంత ఎవరు పిలుస్తారండీ అందుకని వాళ్ళాయనంటే ఛాదస్తంగా పెట్టారుకానీ అందుకనీ పిచ్చికాయ పిచ్చికాయ అని పిలుస్తామన్నారు.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
పీతాంబరధరుడెక్కడా పిచ్చికాయెక్కడా..! ఏమైనా అర్థముందా... పోనీ అదీకూడా... పోనీ అదేమైనా మారేడికాయో ఏదో అనచ్చుకదా అదికాదు ఏమిటదీ అర్థంలేనటువంటి పిచ్చీ... వెర్రీ... ఏమిటవీ అంటే మంచిపేరుపెట్టినా దానియొక్క పవిత్రతని ఉపయోగించుకోలేరు కొందరు లేకపోతే మున్నీ నన్నీ వెర్రీ పిచ్చీ ఆ పేర్లు ఇతః పూర్వం కుక్కల్ని పిలిచేవారు నా చిన్నతనంలో టామీ అనీ ఇప్పుడు ఇప్పుడు కుక్కలపేర్లే పిల్లలపేర్లు. పిల్లల్నీ అందరూ కాదు మహాతల్లులున్నారు నేను అనటంలేదు, అలా పిల్లల్నీ పిల్చుకోవడం పిల్లలకి ఏ సంస్కారమొస్తుంది? కుక్కసంస్కారమే వస్తుందివాడికి ఎవరైనావస్తే కలియబడుతూండడం అలాంటి లక్షణాలేవస్తాయి ఆగరాంటే ఆగడు. కాబట్టి ఇప్పుడూ లక్ష్మణ మూర్తి ఆ యుద్ధంలో ఆ ధ్వజాన్ని పడగొట్టారు అశ్వములను పడగొట్టారు సారధిని పడగొట్టారు నీల మేఘ నిభాం శ్చాస్య సదశ్వాన్ పర్వతోపమాన్ ! జఘానాఽఽప్లుత్య గదయా రావణస్య విభీషణః !! ఆ రథమంతాకూడా భగ్నమైపోయినటువంటి రావణుడు అపారమైనటువంటి క్రుద్ధుడై లక్ష్మణుని పక్కన నిల్చున్నటువంటి విభీషణుని మీదికి కోపమెల్లింది కారణమేమిటీ లక్ష్మణుడు యుద్ధం చేస్తుండగా విభీషణుడు అకస్మాత్తుగా గధపట్టుకునివచ్చి ఆ గధతో రావణాసురుని యొక్క రథాన్నంతటినికూడా ప్రహారముచేత విరగ్గొట్టేశాడు, ఇప్పుడు కోపము ఎవరిమీదికి వెళ్ళిపోయిందంటే రాముడినుంచి కోపం లక్ష్మణునిమీదికి లక్ష్మణునినుంచి కోపం విభీషణునిమీదికి వెళ్ళింది. నా తమ్ముడవైవుండి వాళ్ళతోచేరి లక్ష్మణునితో యుద్ధం చేస్తుంటే వచ్చి గధతో కొడతావా నారథాన్నని వెంటనే పిడుగులు ఎలా పడుతాయో అటువంటి ఒక భయంకరమైనటువంటి బల్యాన్ని ఒకదాన్ని చేత్తో పట్టుకున్నాడు నిప్పులు కక్కుతున్నటువంటి పిడుగుఎలా ఉంటుందో అలా ఉంది.
ఆయన దగ్గర ఉండేటటువంటివేవీ సామాన్యమైనవికావు ఆ బల్యాన్ని మధ్యలో పట్టుకుని అపారమైన వేగంతో విభీషణునిమీదకి విసిరాడు ఆ బల్యమేగుచ్చుకుంటే ఇక విభీషణుడు ప్రాణాలతో ఉండడు ఇది గమనించినటువంటి లక్ష్మణమూర్తి మూడు బాణములు తీసుకుని ఆ వస్తున్నటువంటి బల్యాన్ని ముక్కలుచేశారు ఆ బల్యెము పడిపోయేటప్పటికీ ఎక్కడలేనటువంటికోపము వచ్చింది అప్పుడు రావణాసురుడు యముడుసైతము తాకజాలనటువంటి భయంకరమైన బల్యాన్ని ఇంకోదాన్ని తీసి విభీషణునిమీదకి విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు విభీషణునికి ప్రాణానికి ఆపద కలుగుతుందేమో అయోమయ స్థితిలోకి రావణున్ని తీసుకెళ్దామనీ పుంకానుపుంకలంగా బాణములను లక్ష్మణ మూర్తి రావణాసురునిమీదికి విడిచిపెట్టాడు ఇన్నిబాణములు లక్ష్మణుడువేస్తుంటే ఛీకాకుపడినటువంటి రావణుడు ఆ చేతిలో పట్టుకున్నటువంటి బల్యాన్ని లక్ష్మణమూర్తి గుండెల్ని గురిపెట్టి విసిరాడు ఆ బల్యెంవచ్చి మీదపడిపోతూంది అది ఇతః పూర్వమే ఎందరో మహావీరులను సంహరించినటువంటి బల్యెం కాబట్టి దానియొక్క శక్తి ఇత్యేవమ్ ఉక్త్వా తాం శక్తిమ్ అష్ట ఘణ్టాం మహా స్వనామ్ ! మయేన


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
మాయా విహితామ్ అమోఘాం శత్రు ఘాతినీమ్ !! లక్ష్మణాయ సముద్దిశ్య జ్వలన్తీమ్ ఇవ తేజసా ! రావణః పరమ క్రుద్ధ శ్చిక్షేప చ ననాద చ !! అదీ ఎనిమిది గంటలు కట్టబడి ఉంటుంది అందునా ఆ బల్యెం మయుడు అనబడేటటువంటి దానవుడు తన శక్తిచేత నిర్మించినటువంటి బల్యెం అటువంటి బల్యెం ఇతః పూర్వం ఎవరిమీద ప్రయోగించాడో వాళ్ళ ప్రాణములు తియ్యకుండా వెళ్ళడంలేదు అటువంటి బల్యాన్ని పట్టుకుని పైకెత్తి ఒక మహానాదం చేస్తూ లక్ష్మణ మూర్తి మీదకి విసిరాడు.
ఆ బల్యెం వెడుతున్నప్పుడే రామ చంద్ర మూర్తి గమనించాడు, ఈ బల్యెం తప్పకుండా ఎవరిమీద పడుతుందో వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తుందని, లక్ష్మణునిమీదికి విడిచిపెట్టాడని ఆయన పరమ ధర్మాత్ముడు ఆయన పట్టుకున్న ధర్మం ఆయన అనుష్టించిన ధర్మం ఆయన నోటివెంటవచ్చిన మాటను సత్యంచేస్తుంది. కాబట్టి ఆయన అన్నారు స్వస్త్యస్తు లక్ష్మణా యేతి మోఘా భవ హతోద్యమా ఈ బల్యెం నాతమ్ముడైన లక్ష్మణ మూర్తి యొక్క ప్రాణములు తీసేటటువంటి శక్తిని పొందకుండుగాకా... అన్నాడు. ఇప్పుడు ఆ బల్యెము లక్ష్మణ మూర్తి గుండెల్ని చీల్చుకుంటూవెళ్ళి భూమిలో గుచ్చుకుంది అంతే తతో రావణ వేగేన సుదూరమ్ అవగాఢయా ! శక్త్యా నిర్భిన్న హృదయః పపాత భువి లక్ష్మణః !! ఆ గుండెలు బద్దలైపోయినటువంటి లక్ష్మణ మూర్తి నెత్తురోడిపోతూ భూమిమీద కిందపడిపోయాడు. పడిపోగానే రాముడు లక్ష్మణ మూర్తి పడిపోయినటువంటి స్థితినిచూచి బాధపడినవాడై చేతిలో ఇక ధనస్సుపట్టుకోగలిగినటువంటి శక్తికూడా జారిపోతున్నా రావణుడు పరమ క్రుద్ధుడై ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తూంటే... పక్కన పడిపోయిన లక్ష్మణుడు ఆగి తమ్ముడా నీకింత ఆపద వచ్చిందిరా... అని మాట్లాడదామంటే అవకాశమివ్వడు ధర్మ యుద్ధం చెయ్యడు బాణ ప్రయోగం చేస్తున్నాడు. అటువంటప్పుడు మహాక్రోధాన్ని పొందిన రామ చంద్ర మూర్తి అన్నాడు అస్మిన్ ముహూర్తే న చిరాత్ సత్యం ప్రతిశృణోమి వః ! అరావణమ్ అరామం వా జగ ద్ద్రక్ష్యథ వానరాః !! ఈ క్షణం నుంచి వానరులారా భూమిమీద ఉంటే రాముడుంటాడు లేకపోతే రావణుడుంటాడు, రాముడు రావణుడు ఇద్దరూ భూమిమీద ఉండడం ఇక జరగదు అటువంటి యుద్ధాన్ని మీరు చూసెదరుగాకా... ఇక మీరు యుద్ధం చెయ్యక్కరలేదు రాముడో రావణుడో తేలిపోవలసిందే అన్నాడు
అద్య రామస్య రామత్వం పశ్యన్తు మమ సంయుగే ! త్రయో లోకాః సగన్ధర్వాః సదేవాః సర్షి చారణాః !!
ఆద్య కర్మ కరిష్యామి య ల్లోకాః సచరాచరాః ! సదేవాః కథయిష్యన్తి యావ ద్భూమి ర్ధరిష్యత్రి !!
సమాఽఽగమ్య సదా లోకే యథా యుద్ధం ప్రవర్తితం ! ఏవ ముక్త్వా శితై ర్బాణై స్తప్త కాంచన భూషణైః !!
ఆజఘాన దశగ్రీవం రణే రామః సమాహితః !
స కిర్యమాణః శర జాల వృష్టిభిః మహాత్మనా దీప్త ధనుష్మతార్థితః భయాత్ ప్రదుద్రావ సమేత్య రావణో యథానిలేనాభిహతో వలాహకః !
ఆ రామ చంద్ర మూర్తి అంత పౌరుషంతో కూడినటువంటి ప్రతిజ్ఞ చేసి ధనస్సుపట్టుకుని విడిచిపెడుతున్నటువంటి బాణముల పరంపరకు తట్టుకోలేక వాటికి ఎదురుగుండా ఇంక నిలబడడం కూడా సాధ్యంకాక రావణాసురుడు యుద్ధభూమిలోంచి నిలబడలేక వర్షపుధారలచేత కొట్టబడినటువంటి పెనుగాలులచేత కొట్టబడినటువంటి మేఘములు ఎలా వెళ్ళిపోతాయో అలా యదార్థంగా యుద్ధభూమిలోంచి పరుగుపరుగున యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయిన


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
తరువాత రామ చంద్ర మూర్తి లక్ష్మణుని వంక చూసి ఈ లక్ష్మణుడు ప్రాణములతో లేకపోతే ఈయన ప్రాణములు విడిచిపెట్టేస్తే ఇక కిం కార్యం సీతయా మమ నాకెందుకు సీత కాబట్టి నేను ఇంక ఈ యుద్ధం చెయ్యలేకపోతున్నాను ధనస్సు పట్టుకోలేకపోతున్నాను నేను బాణ ప్రయోగం చెయ్యలేకపోతున్నాను నీరసించి పోతున్నాను నాకు ఈ లక్ష్మణునికి స్వస్థత కలిగితే తప్ప నాకు మళ్ళీ బుద్ధి ప్రకాశించదని బాధ పడుతున్న సమయంలో ఆయనంటారు దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః ! తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః !! ఏదేశం వెళ్ళినా మళ్ళీ భార్య దొరకచ్చు అంటే ఆయన సీతమ్మని తక్కువ చేశారనికాదు ఒక తమ్ముడి గొప్పతనాన్ని ఒక తోడబుట్టినవాని గొప్పతనాన్ని చెప్తున్నారు దేశే దేశే కళత్రాణి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వివాహం చేసుకుంటే భార్య దొరుకుతుంది దేశే దేశే చ బాంధవాః ఎక్కడికివెళ్ళినా బంధువులు కనపడుతారు తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః తోడబుడ్డినవాళ్ళన్నవారు మాత్రం ఇంక ఆ జన్మకి ఎవరు ఆ అమ్మకడుపులోంచి కలిసిపుట్టారో వాళ్ళే.
కాబట్టి అటువంటివాడు పడిపోతే ఇక నా జీవితమెందుకు అని ఆయన ఆ లక్ష్మణుని మీదపడి శోకిస్తున్న సమయంలో సుషేణాది వానరవీరులు వచ్చి రామా నీవు శోకించవద్దు స్వస్థతని కోల్పోవద్దు లక్ష్మణ మూర్తి ప్రాణములతోనే ఉన్నారు ఆయన గుండెలను ఆ బల్లెం ఛీల్చినా ఆయన ప్రానోత్క్రమణం జరుగలేదు ఆయన ఇంకా ఊపిరి తీస్తున్నారని వెంటనే హనుమని పిలిచి నీకు జాంబవంతుడు చెప్పినటువంటి ఓషధీ పర్వతాన్ని ఉత్తర క్షణంలో మళ్ళీ పట్టుకురా తొందరగా తీసుకురావాలి ప్రాణోత్క్రణం అవ్వకుండాని అంతే ఉత్తర క్షణంలో మహానుభావుడు త్రికుటాచల పర్వతంమీద నిలబడి అక్కడ్నుంచి కైలాస పర్వతం దగ్గరికెళ్ళి ఆ ఓషధిని గుర్తించలేకపోయాడు ఓషధి ఎలా ఉంటుందీ అని మళ్ళీ సుషేణున్ని అడిగొచ్చేలోపల లక్ష్మణ మూర్తి ప్రాణములకు ప్రమాదము కలుగుతుందని వెంటనే ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకుని ఎగిరి లంకాపట్టణానికొచ్చి లక్ష్మణ మూర్తికి ఆ సుషేణుడు సంజీవనీ మృతసంజీవనీ అనేటటువంటి ఓషధిని తీసుకెళ్ళి వాసన చూపించగానే విశల్యకరణి సంధాన కరిణి సావర్ణ కరిణి ఆ ఓషధుల్ని ఉపయోగించగానే లక్ష్మణ మూర్తి మళ్ళీ పూర్ణమైన ఆరోగ్యంతో గాయం మానిపోయి పూర్తి స్వస్థతో మళ్ళీ లేచి కూర్చున్నాడు. రామ చంద్ర మూర్తి సంతోషించారు వెంటనే ఆ తీసుకొచ్చినటువంటి పర్వత శిఖరము ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఉత్తర దిక్కున ఉన్నటువంటి కైలాస పర్వతం పక్కన పెట్టేశాడు.
అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యపోయారు విస్మితా స్తు బభూవు స్తే రణే వానర రాక్షసాః ! దృష్ట్వా హనుమతః కర్మ సురై రపి సుదుష్కరం !! వానరులు కాదు రాక్షసులుకూడా చూసి ఈ మహానుభావుడే లేకుంటే రామ రావణ సంగ్రామం ఎంత విచిత్రమైన మలుపులు తిరిగేదో ఎప్పుడెప్పు ఆపద ఏర్పడుతుందో అప్పుడప్పుడు ఏమివేగం మహానుభావుడిది అంతగొప్పగా పర్వతాలు పర్వతాలు తీసుకొచ్చేస్తాడు బ్రతికించేస్తాడు, ఏమీ చేతకానివాడిలా ఇలా నమస్కారంపెట్టేస్తాడు కూడా ఆయన దగ్గర కూర్చుని ఉంటాడు. ఏమి వినయమనీ వానరులు రాక్షసులు అందరు కూడా హనుమయొక్క తేజస్సుకి ఆశ్చర్యపోయారు. రావణుడు వేరొక గొప్ప రథాన్ని పూంజుకున్నవాడై అక్కడ్నుంచి బయలుదేరి మళ్ళీ యుద్ధ భూమిలో ప్రవేశించాడు అథాన్యం రథ మాఽఽరుహ్య రావణో రాక్షసాధిపః ! అభ్యద్రవత కాకుస్థం స్వర్భాను రివ భాస్కరం !! సూర్యుడెటువంటి ప్రకాశంతో ఉంటాడో అటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి రథాన్ని పూంచుకుని యుద్ధభూమిలోకి వచ్చాడు వచ్చి రామునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. రామ చంద్ర మూర్తి నేలమీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు పైన దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు మహర్షులు అందరూ నిలబడ్డారు రామ-రావణ యుద్ధం చూసి తీరాలని నిలబడ్డారు.
ఆ చూస్తున్నప్పుడు దేవేంద్రుడన్నాడటా భూమౌ స్థితస్య రామస్య రథ స్థస్య చ రక్షసః ! న సమం యుద్ధ మిత్యాఽఽహు ర్దేవ గన్ధర్వ దానవాః !! అక్కడ ఉన్నటువంటి దేవ గంధర్వ దానవములన్నారు నేల మీద నిలబడి మహానుభావుడు రాముడు యుద్ధం చేస్తున్నాడు.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
 రథంలో నిలబడి సారథి సహకరిస్తూండగా రావణుడు యుద్ధం చేస్తున్నాడు ఇది అన్యాయం రాముడు ఒక్కడు అలా నిలబడి యుద్ధం చేస్తున్నాడు రామునికి కూడా రథముండాలన్నారు తతః కాంచన చిత్రాంఽగః కింకిణీ శత భూషితః ! తరుణాఽఽదిత్య సంకాశో వైడూర్య మయ కూబరః !! సదఽశ్వైః కాంచనాపీడై ర్యుక్తః శ్వేత ప్రకీర్ణకైః ! హరిభిః సూర్య సంకాశై ర్హేమ జాల విభూషితైః !! రుక్మ వేణు ధ్వజః శ్రీమాన్ దేవ రాజ రథో వరః ! దేవ రాజేన సందిష్టో రథ మాఽఽరుహ్య మాతలిః !! ఆ దేవేంద్రుడు వెంటనే చూసి ఆకుపచ్చటి గుఱ్ఱములు పూన్చబడి బంగారముతో చెక్కబడిన తన రథాన్ని వైఢూర్యములతో పొదగబడినటువంటి ఒక గొప్ప రథం తనదైనటువంటిదాన్ని చిరుగంటలతో ఎప్పుడూ గంటల సవ్వడి చేస్తూ ఉండేటటువంటి ఒక సూర్యుడాని కనబడేటటువంటి తన రథాన్ని తాను దిగి తన సారథియైన మాతలి పిలిచి ఈ రథాన్ని తీసుకెళ్ళి నీవు యుద్ధభూమికెళ్ళి రామ చంద్ర మూర్తిని ఎక్కించుకుని రావణునితో యుద్ధానికి రామునికి సహకరించు ఈ రథం తీసుకెళ్ళు అన్నాడు. ఆ దేవేంద్రుని రథం పట్టుకుని మాతలి భూమిమీదకి వచ్చాడు, వచ్చి మహానుభావా! సహస్రాక్షేణ కాకుత్స్న రథోయం విజయాయ తే ! దత్త స్తవ మహా సత్త్వ శ్రీమాన్ శత్రు నిబర్హణ !! ఆ దేవేంద్రుడు నీకొరకు ఈ రథాన్ని పంపించాడు విజయాన్ని సాధించడంకోసం ఈ రథాన్నెక్కి యుద్ధం చెయ్యి ఇదమ్ ఐన్ద్రం మహ చ్చాపం కవచం చాగ్నిసన్నిభమ్ ! శరా చ్చాఽఽదిత్య సంకాశాః శక్తి శ్చ విమలా శితాః !! నీకొరకు దేవేంద్రుడు ఒక గొప్ప ధనస్సుని బాణ తూనీరములను దానితోపాటుగా బంగారముతో చేయబడినటువంటి భేదింపవీలులేనటువంటి కవచాన్ని శక్తీ అనబడేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్నికూడా పంపాడు అవి రథంలో ఉన్నాయి కాబట్టి స్వామీ! మీరు ఇవి స్వీకరించి రథమెక్కండీ అన్నాడు. వెంటనే రామ చంద్ర మూర్తి ఆ రథమెక్కారు.
ఇద్దరి మధ్యా సంకులసమరం ఆయన గాంధర్వాస్త్రమేస్తే ఈయ్యన  గాంధర్వాస్త్రమేస్తాడు ఆయన దివ్యాస్త్రమేస్తే ఈయ్యన దివ్యాస్త్రమేస్తున్నాడు ఆయన రాక్షసాస్త్రములు వేస్తే ఈయ్యన దేవతాస్త్రములు వేస్తున్నాడు. రెండు పక్షములలో ఉండేటటువంటి వానరయోధులు రాక్షసయోధులు యుద్ధం మానేశారు, దిక్కుమాలిన యుద్ధం మనం తరువాత చేసుకోవచ్చు కొట్టుకోవచ్చు ఇలాంటి యుద్ధం మళ్ళీ చూసేవాడెవడు మనకు ఈ అదృష్టంరాదని నిలబడిపోయారు. వాళ్లుకాదు నిలబడిపోయింది ఇటు వానరులు నిలబడిపోయారు అటు రాక్షసులు నిలబడిపోయారు లోకాలలో ఎక్కడా ఋషన్నవాడు ఎక్కడా ఆగిపోలేదు మహర్షులు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు తమ తమ రథాలెక్కీ అత్యద్భుతము ఈ యుద్ధం ఇటువంటి యుద్ధం మనమెన్నడూ చూడలేదు. యుద్ధమంటే ʻరామ-రావణ యుద్ధమేʼ దీన్ని చూడాలనివచ్చి ఆకాశంలో నిలబడిపోయారు ఈ కింద యుద్ధం జరుగుతూంది ఈ జరుగుతున్నటువంటి యుద్ధానికి అసలు ఇంక చూడడానికి వర్ణించడానికి అశక్తమైనటువంటి యుద్ధమన్నమాట
అస్త్రే ప్రతిహతే క్రుద్ధో రావణో రాక్షసాధిపః ! అభ్యవర్షత్ తదా రామం ఘోరాభిః శర వృష్టిభిః !!
తతః శర సహస్రేణ రామమ్ అక్లిష్ట కారిణమ్ ! అర్దయిత్వా శరౌఘేణ మాతలిం ప్రత్యమిధ్యత !!


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
చిచ్ఛేద కేతు ముద్దిశ్య శరే ణైకేన రావణః ! పాతయిత్వా రథోపన్థే రథాత్ కేతుం చ కాంచనమ్ !!
ఐన్ద్రాన్ అభిజఘానాశ్వాన్ శర జాలేన రావణః ! త ద్ద్రుష్ట్వా సుమహ త్కర్మ రావణస్య దురాత్మనః !!
ఆ రావణాసురుడు క్రుద్ధుడై యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుని యొక్క రథానికి సారథిగా ఉండేటటువంటి మాతలిని గాయపరిచాడు ఆ ఇంద్రుడి రథం మీద ఉండేటటువంటి ధ్వజాన్ని బాణంతో కిందపడేటట్టుగా కొట్టేశాడు అది కాకుండా రథ చక్రాల్ని ముక్కలుగా కొట్టాడు దానితోపాటు ఇంద్రుని యొక్క అశ్వాల్నీ శర పరంపరతో దెబ్బతీశాడు. ఆనాడు దేవతలందరూ కూడా భయపడి ఆకాశనుంచి రామ చంద్ర మూర్తి గెలవాలని ఆశీర్వచనాలుచేశారు. రాహువుచేత పీడింపబడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా రావణుడు పది తలలతో ఇరవై చేతులతో ధనస్సునిపట్టి బాణములను కురిపిస్తే వేల బాణములువచ్చి రామ చంద్ర మూర్తి ఒంటినిండా నాటుకుపోయాయి, రక్తం ఏరులైకారిపోతూంది అంత భయంకరమైన యుద్ధం. ఆనాడు అన్నారు చంద్రునికి గ్రహణం పట్టిందా అన్నట్టుగా అంతటి రామ మూర్తి కూడా నీరసపడిపోయి అసలు ఈ రావణున్ని నిగ్రహించడం ఎలా? ఇంత పరాక్రమమాని ఆయన కూడా ఆశ్చర్యపోయాడు కానీ తమాయించుకున్నవారై
ఏతస్మిన్ అన్తరే క్రోధా ద్రాఘవస్య స రావణః ! ప్రహర్తు కామో దుష్టాత్మా స్పృశన్ ప్రహరణం మహత్ !!
వజ్ర సారం నాదం సర్వ శత్రు నిబర్హణమ్ ! శైల శృంగ నిభైః కూటై శ్చితం దృష్టి భయావహమ్ !!
సధూమమ్ ఇవ తీక్ష్ణాగ్రం యుగాన్తాగ్ని చయోపమమ్ ! అతి రౌద్రమ్ అనాసాద్యం కాలే నాపి దురాసదమ్ !!
త్రాసనం సర్వ భూతానాం దారణం  భేదనం తథా ! ప్రదీప్త మివ రోషేణ శూలం జగ్రాహ రావణః !!
రావణుడు పరమ దుష్టాత్ముడై ఆగ్రపహోగ్రుడై రామ చంద్ర మూర్తిని చంపాలి అన్న కోరికతో ఎటువంటి శత్రువులనైనా తుదిముట్టించగలది పర్వత శిఖరములతో సమానమైన బలం కలిగినటువంటిది అసలు చూసినవారికి భయముకొల్పేటటువంటిది పరమ శివుడు పట్టుకునేటటువంటి త్రిశూలం ఎంత పదునుగా ఉంటుందో అంత పదునైనది దేన్నైనాసరే తగిలితే రంపంలాగా రెండుకింద కోయగలిగినది అటువంటి శూలాన్ని ఒకదాన్ని తీసి మధ్యలో పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ శూలం నిప్పులు కక్కుతూ వస్తూంది రామ చంద్ర మూర్తి దానిమీదికి కొన్నివేల బాణములు ప్రయోగించాడు అన్నిబాణములను పడగొట్టి ఆశూలం రాముని మీదకి వచ్చేస్తుంది వెంటనే రామ చంద్ర మూర్తి తన రథంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆశక్తి జ్ఞాపకానికివచ్చింది సా క్షిప్తా రాక్షసేన్ద్రస్య తస్మిన్ శూలే పపాత హ ! భిన్నః శక్త్యా మహాన్ శూలో నిపపాత గత ద్యుతిః !! ఆ శక్తిని రథంలోంచి తీసి ఒక్కసారి ఆయన విడిచిపెట్టారు ఈ శక్తీ ఆయనవేసిన శూలం రెండూ ఆకాశంలో రెండూ కొట్టుకుంటే రెండిటినుంచి వచ్చిన నిప్పురవ్వలన్నీ ఆ ఆకాశంలో ఒక్కసారి పైకిలేచి రెండూ కిందపడిపోయాయి. అప్పుడు రామ చంద్ర మూర్తి విడిచిపెట్టినటువంటి బాణం పరంపరకీ రావణాసురుడు ఇక కదలేని స్థితికి వచ్చేసింది నీరసపడిపోయాడు ఇక యుద్ధం చెయ్యలేక రాముడి చేతిలో పడిపోతాడనేటటువంటి సంకేతం స్పష్టంగా కనపడిపోతూంది.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
అటువంటి స్థితిలో ఇక తన ప్రభువు పడిపోతాడూ బాణములతో రాముడు క్రుద్ధుడై వేస్తున్నాడని గ్రహించినటువంటి సారథి సూత స్తు రథ నేతాస్య త దవస్థం నిరీక్ష్య తమ్ ! శనై ర్యుద్ధా దసంభ్రాన్తో రథం త స్యాపవాహయత్ !! ఆ సారథి రథాన్ని అక్కడ్నుంచి తప్పించి యుద్ధభూమి బయటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయేటప్పటికి రథం వెనక్కి వెళ్ళిపోతూంటే బాణ ప్రయోగం చెయ్యకూడదుకాబట్టి మహానుభావుడైనటువంటి రామ చంద్ర మూర్తి ఆగిపోయారు. ఆ వెళ్ళిపోయిన తరువాత రావణాసురునికి ఎక్కడలేని కోపమొచ్చింది, కోపమొచ్చి సారథితో అన్నాడు
హీన వీర్యమ్ ఇవాశక్తం పౌరుషేణ వివర్జితమ్ ! భీరుం లఘు మివాసత్వం విహీనమ్ ఇవ తేజసా !!
మామ్ అవజ్ఞాయ దుర్భుద్ధే స్వయా బూద్ధ్యా విచేష్టసే ! యశో వీర్యం చ తేజ శ్చ ప్రత్యయ శ్చ వినాశితః !!
య స్త్వం రథమ్ ఇమం మోహా న్న చోద్వహసి దుర్మతే ! సత్యోయం ప్రతితర్కో మే పరేణ త్వమ్ ఉపస్కృతః !!
న హీ దం విద్యతే కర్మ సుహృదో హిత కాంక్షిణః ! రిపూణాం సదృశం చైత న్న త్వ యైతత్ స్వనుష్ఠితమ్ !!
నీవు శత్రువీరులదగ్గర లంచాన్ని పుచ్చుకున్నవాడివి కాబట్టే... నేను ఏదో పరాక్రమంలేనివాన్ని చేతకానివాన్నీ అన్నట్టుగా ఎదురుగుండా ఉన్నటువంటి రామునితో అంతగొప్ప యుద్ధం నేను చేస్తూంటే నాకు అపకీర్తి కలిగేటట్టుగా చేతకానివాన్నన్నట్టుగా రథాన్ని తిప్పి నీవు వెనక్కుతీసుకొస్తావా..? ఎందుకు తీసుకొచ్చావునీవు రథాన్ని? నీవు తీవ్రమైనటువంటి నేరాన్నిచేశావు ఇవ్వాళ అన్నాడు. ఆ సారథన్నాడు న భీతోస్మి న మూఢోస్మి నోపజప్తోస్మి శత్రుభిః ! న ప్రమత్తో న నిస్స్నేహో విస్మృతా న చ సత్క్రియా !! నాయనా! నేనూ కావాలని నీపట్ల అపచారముచెయ్యాలని కానీ భయంతో కానీ మూఢుడై కానీ నిన్ను ఈ రథంమీద వెనక్కి తీసుకురాలేదు, సారథి యుద్ధం చేస్తున్నప్పుడు రథం నడిపేటప్పుడు ఆయన కొన్ని విషయాల్ని గమనించవలసి ఉంటుంది శ్రమం తవావ గచ్ఛామి మహతా రణ కర్మణా ! న హితే వీర సౌముఖ్యం ప్రహర్షం వోపధారయే !! నీవు బడలిపోయావు నీ ముఖంలో నీరసం కొట్టొచ్చినట్లు కనపడుతోంది నీకు అస్త్రములు జ్ఞాపకానికి రావడంలేదు నీవు బాణములను సంధించడంలో ఉత్సాహాన్ని కోల్పోయావు రథో ద్వహన ఖిన్నా శ్చ త ఇమే రథ వాజినః ! దీనా ఘర్మ పరిశ్రాన్తా గావో వర్ష హతా ఇవ !! వర్షముచేత కొట్టబడిన ఆవులు ఎలా బిక్కుబిక్కుమంటూ నిలబడుతాయో అలా ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో రథాన్ని లాగీ లాగీ లాగినటువంటి గుఱ్ఱాలు బడలిపోయి కదలలేని స్థితినిపొందాయి నిమిత్తాని చ భూయిష్ఠం యాని ప్రాదుర్భవన్తి నః ! తేషు తేషు అభిపన్నేషు లక్షయామి అప్రదక్షిణమ్ !! నాకు అక్కడ కలిగినటువంటి నిమిత్తములు శకునములను చూస్తే ప్రమాదము జరగబోతూందీని నాకు అర్థమైంది దేశ కాలౌ చ విజ్ఞైయౌ లక్షణా నీంగితాని చ ! దైన్యం హర్ష శ్చ ఖేద శ్చ రథిన శ్చ బలాబలమ్ !! సారథియైనవాడు తన వెనకాల నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి రథి యొక్క దైన్యమునుకాని సంతోషాన్నికాని హర్షాన్నికాని ఆయన పడుతున్నటువంటి ఖేదాన్నికాని గమనించవలసినవాడై ఉంటాడు.
గుఱ్ఱములు బడలిపోయాయా ఎత్తుపల్లములలో ఉన్నామా ప్రమాదకర పరిస్తితిలో ఉన్నామా అన్నది చూడవలసినవాడై ఉంటాడు. ఒకవేళ రథి ఢస్సిపోయి ఉంటే రథాన్ని తప్పించి మళ్ళీ ఉత్సాహం పొందిన తరువాత తీసుకెళ్ళవలసినటువంటి కర్తవ్యం సారథమీద ఉంటుంది అందుచేత నేను ఆ స్థితిని గమనించినవాడై తీసుకొచ్చానుతప్పా నేను వేరు కారణంచేత నిన్ను తీసుకొనిరాలేదు కాబట్టి నేను లంచాలు తిన్నవాన్నికాను నీయందు భక్తిలేనివాన్నికాను నిన్ను


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ఎంతకాలంగానో సేవిస్తున్నవాన్ని నీవంటే ఎంతో గౌరవమున్నవాన్ని అన్నాడు. సంతోషించినటువంటి రావణాసురుడు తన హస్తాభరణాన్ని తీసి ఆ సారథికి బహుకరించాడు ఈలోగా ఇక్కడ వీళ్ళ ఇద్దరి సంవాదం అవుతోంది రామ చంద్ర మూర్తి కూడా బాగా ఢస్సిపోయారు ఒంట్లో ఎక్కడా అంగుళంమేర ఖాలీలేదు ఇంద్రుడిచ్చిన కవచాన్ని కూడా డొళ్ళగొట్టొడు రావణాసురుడు ఒంటినిండా బాణాలే లలాటము నిండా కూడా బాణాలే నెత్తురు ధారలకింద కారిపోతూంది రాముడు నీరసించినవాడై మనసులో వ్యాకులత చెందాడు అసలు ఈ రావణుడిని ఎలా సంహరించడం ఇతన్ని తెగటార్చటం కుదురుతుందా ఇంత గొప్ప పరాక్రమమున్నవాడు ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఎలా సంహరింపబడుతాడు రాముడంతటివాడు ఈ ధైన్యాన్ని పొందితే... మహర్షి అంటారు
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ ! రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ !!
దైవతై శ్చ సమాఽఽగమ్య ద్రష్టు మభ్యాఽఽగతో రణమ్ ! ఉపాగమ్యాబ్రవీ ద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః !!
రామ రామ మహా బాహా శృణు గుహ్యం సనాతనమ్ ! యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి !!
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనమ్ ! జయావహం జపే న్నిత్యమ్ అక్షయ్యం పరమం శివమ్ !!
సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ ! చింతా శోక ప్రశమనమ్ ఆయు ర్వర్దన ముత్తమ్ !!
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ !! పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ !!
సర్వ దేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః ! ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః !!
ఏష బ్రహ్మా చ విష్ణు  శ్చ శివః స్కందః ప్రజాపతిః ! మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః !!
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ! వాయు ర్వహ్నిః ప్రజా ప్రాణ ఋతు కర్తా ప్రభాకరః !!
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ! సువర్ణ సదృశో భానుః హిరణ్య రేతా దివాకరః !!
హరిదశ్వః సహస్రార్చిః సప్త సప్తి ర్మరీచిమాన్ ! తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ !!
హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ! అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః !!
వ్యోమనాథ స్తమో భేదీ ఋగ్యజు స్సామ పారగః ! ఘన వృష్టి రపాం మిత్రో  వింధ్య వీథీ ప్లవంగమః !!
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః ! కవిర్విశ్వో మహా తేజా రక్తః సర్వభవోద్భవః !!
నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః ! తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే !!
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః ! జ్యోతి ర్గణానాం పతయే దినాధిపతయే నమః !!
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ! నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః !!
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ! నమః పద్మ ప్రభోధాయ మార్తాండాయ నమో నమః !!
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాఽఽదిత్య వర్చసే ! భాస్వతే సర్వ భక్షాయ రౌద్రాయ వపుషే నమః !!
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే ! కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః !!
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ! నమస్తమోభి నిఘ్నాయ రుచయే లోక సాక్షిణే !!
నాశయత్యేష వై భూతం త దేవ సృజతి ప్రభుః ! పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః !!
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః ! ఏష ఏవాగ్ని హోత్రం ఫలం చై వాగ్ని హోత్రిణామ్ !!


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
వేదా శ్చ క్రతవ శ్చైవ క్రతూనాం ఫలమేవ చ ! యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః !!
ఏన మాఽఽపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ ! కీర్తయన్ పురుషః కశ్చి న్నావశీదతి రాఘవ !!
పూజయ స్వైన మేకాగ్రో దేవ దేవం జగత్పతిమ్ ! ఏత త్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి !!
అస్మిన్ క్షణే మహా బాహో రావణం త్వం వధిష్యసి ! ఏవ ముక్త్వా తదాగస్తో జగామ చ యథాఽఽగతమ్ !!
ఏత చ్ఛ్రుత్వా మహా తేజా నష్ట శోకోభవ త్తదా ! ధారయా మాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ !!
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్ష మవాప్తవాన్ ! త్రి రాఽఽచమ్య శుచి ర్భూత్వా ధనురాఽఽదాయ వీర్యవాన్ !!
రావణం ప్రేక్ష్య హృష్టాఽఽత్మా యుద్ధాయ సముపాగతమ్ ! సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్ !!
అధ రవిరవద న్నిరీక్ష్య రామం ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచర పతి సంక్షయం విదిత్వా సుర గణ మధ్య గతో వ చస్త్వరేతి !
అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి విరామ సమయంలో భగవానుడైనటువంటి అగస్త్యమహర్షి గబగబా ఆ యుద్ధభూమిలోకి దిగారు. రామాయణంలో విచిత్రమేమిటంటే అవతార ప్రయోజనం సమకూరడానికి రావణ సంహారం చేయడానికి ఈ సీతమ్మతల్లి ఎక్కడ ఉంటే అపహరింపడుతుందో అటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అరణ్యకాండలో చెప్పినవాడు అగస్త్యమహర్షి అందుకే మీకారోజున నేను స్పష్టంగా చెప్పాను, ఇక్కడే ఉండు అని బాగా ఆలోచించి ʻలేదులే ఇంక సీతమ్మ ఒక్కతే ఉండవలసిన సమయం ఆసన్నమైందిʼ అక్కడుండూ అని చెప్పారు. ఆ అగస్త్య మహర్షియే బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కావలసినటువంటి మంత్రాన్ని రాముడికి ఉపదేశం చేశారు. ఆ అగస్త్యమహర్షియే రాముడు నీరసపడిపోతే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. శ్రీరామాయణంలో ఎక్కడా స్తోత్రాలివ్వరు మహర్షి అటువంటి మహర్షి ఆదిత్యహృదయాన్నిచ్చారు.
కురుపాండవ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి భగవద్గీత ఎటువంటిదో రామ-రావణ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి ఆదిత్యహృదయంకూడా అటువంటిది. 31 శ్లోకాలతో ఉంటుంది ఈ సర్గ 107వ సర్గలో చెప్పారు ఈ ఆదిత్యహృదయాన్ని ఇందులో ఒకటి శాంతిపాఠంగా ఉంటుంది, ఇకపోతే 30 సర్గలు, 30 సర్గలలో 9 సర్గలు పీఠికని చెప్తాయి అంటే ఆదిత్యహృదయాన్ని పరిచయంచేస్తాయి, ఇక 21 సర్గలు. 21 సర్గలలో తొమ్మిది సర్గలు ఆదిత్యహృదయ ప్రాసస్త్యాన్ని వివరిస్తుంది. కాబట్టి ఇంక మిగిలినవి 12 సర్గలు, ఈ 12 సర్గలలో 12గురు ఆదిత్యులన్ని చెప్పారు. ఆదిత్యహృదయం ద్వాదశాదిత్యుల సమ్మేళనంగా సమాహారంగా ఇచ్చారు. అందులో మొదటి విష్ణు స్వరూపం ఆదిత్య స్వరూపం దానిగురించి మాట్లాడారు సూర్యమండలాంతరవర్తియైనటువంటి భగవానుడియొక్క తేజస్సుని గురించి మాట్లాడారు. ఆ మాట్లాడేటప్పుడు శిష్యునిమీద గురువుగారికుండేటటువంటి వాత్సల్యం తండ్రి కొడుకుమీద ఎటువంటి వాత్సల్యం ఉంటుందో అటువంటి వాత్సల్యం అందుకే రామ రామ మహా బాహా శృణు గుహ్యం సనాతనమ్ అంటారు, నేను చెప్తున్నది కొత్తగా ఓ మంత్రాన్ని తీసుకొచ్చి చెప్పట్లేదు ఇది సనాతనం మంత్రాలెప్పుడు కనిపెట్టకూడదు. మంత్రాలెప్పుడు కొత్త కొత్తవి కనిపెట్టడం... ఇదోటి కొత్తగా బయలుదేరింది లోకంలో కొత్త కొత్త మంత్రాలు కొత్త కొత్త దేవతాస్వరూపాలు కొత్త కొత్త లఘు గాయిత్రులు వీళ్ళే రాస్తున్నారు లఘు గాయిత్రులు వీళ్ళెవరు రాయడానికి వేదప్రోక్తమై ఉండాలి, ఇది ఈశ్వర స్వరూపం వేదప్రోక్తమై ఉండాలి.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
అంతేగాని మీ ఇష్టమొచ్చిన మూర్తిని ఆరాధించే అధికారం మీకుండదు పూజ నిరుపయోగమైపోతూంది, వేదప్రోక్తమైనటువంటి స్వరూపాలైవుండాలి శ్లోకాలై ఉండాలి లేకపోతే ధ్యాన శ్లోకాలు ఎక్కడ్నుంచొస్తాయి మీరు ఆరాధన చేయడానికి సశక్తియుతమై ఉండాలి. లఘు గాయిత్రి వేదంలో చెప్పబడినదై ఉండాలి కాబట్టి “సనాతనం” వేదంలో చెప్పబడినటువంటిదాన్నే నీకు సమాహారం చేసి చెప్తున్నాను రామా..! “రామ! రామ!” ఎంత ఆర్తో చూడండి ఆయనకి రామా రామా అని పిలిచారు అని రెండుమాట్లు ఎందుకుపిలవాలి, నాకొడుకేదో ఇబ్బందిగా ఉన్నాడనుకోండి ఒరేయ్ శణ్ముఖా శణ్ముఖా అని నేను రెండుమాట్లు పిలుస్తాను తండ్రిని కాబట్టి వాన్ని ఒరేయ్ ఏదోవాడికి రిజర్వేషన్ దొరకలేదు రైలెక్కాడు ఓ జనరల్ కంపార్టమెంట్ ఎక్కాడు త్వరగా వెళ్ళిపోవాలని ఇంతలో ఎవరో టిటి గబగబా వచ్చి నాకు నమస్కారంపెట్టి కోటేశ్వరావుగారు కదండి మీరు మీరు చెప్పిన ప్రసంగాలు విన్నాను అన్నారు. అయ్యా ఏమి అనుకోకండి ఒకచిన్న ఉపకారం అడుగుతాను మా అబ్బాయి జనరల్ భోగీ ఎక్కాడు చలికాలం డోరుదగ్గర నిల్చున్నాడు. కొంచెం మీ భోగిలో ఏమైనా కూర్చోబెట్టగలరా అన్నాను. అయ్యోయ్యో తప్పకుండా నాసీట్లో కూర్చోబెడుతాను పంపించండి అన్నాడు. ఇప్పుడు నేను ఎలా పిలుస్తాను రైలు వెళ్ళిపోతూందేమో అనుకుంటుంటే నేను ఎలా పిలుస్తాను... కూతేస్తుంది రైలు ఎలా పిలుస్తాను ఒరేయ్ శణ్ముఖా శణ్ముఖా దిగుదిగు అని రెండుమాట్లు పిలుస్తాను అంటే ఆర్తి. నాన్నా కంగారుపడకు కంగారుపడకు అని పిలిచేటటువంటి తండ్రి కొడుకుని ఎలా పిలుస్తాడో... అని రామ రామ మహాబాహో ఏమిటా నీరసం, ఇరవై చేతులవాడి బలమా నీ రెండు చేతులు బలమా..? ఒకటి పరుషురామ బలం ఒకటి రఘురామ బలం లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి బాహువులయ్యా ఆ బాహువులు.
ఏమిటీ నీరసపడుతున్నావేమిటీ? భయపడకు ఏమీ నీరసంపొందకు పది తలలున్నా ఇరవై చేతులున్నా నశించిపోవలసిందే ఉపాసనచై ఒక్కసారి సూర్యమండలాంతరవర్తియైనటువంటి మహానుభావుడు మీరు సూర్యబింబం ఉదయించడానికి ఎంత సమయంపడుతుందో అంత సమయం పడుతుంది ఆదిత్యహృదయం చదవడానికి అది ఆశ్చర్యం, మహర్షి అంత గొప్పగా ఇచ్చారు ఇచ్చినటువంటి శ్లోకాల్ని. మీరు ఎప్పుడైనా మంత్రాన్ని ఉపాసన చేస్తే సౌచంతో ఉపాసనచెయ్యాలి ఆదిత్యహృదయంచేస్తే సాక్షాత్తుగా వాల్మీకి మహర్షియే చెప్తున్నారు ఇది కాంతారేషు భయేషు చా మహారణ్యంలో ఉన్నా భయంతో ఉన్నా ఒక్కసారి మీరు ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కారంచేసి అర్ధరాత్రైనా అరణ్యంలో ఉన్నా మీరు ఆదిత్యహృదయాన్ని పఠించేయ్యొచ్చు. ఆదిత్యహృదయం చదవగానే మీకు రక్షణ కలుగుతుంది. ఆదిత్యహృదయం అంతశక్తివంతమైనది. ఆదిత్యహృదయం ఎంత శక్తివంతమైందో నేను మా గురువుగారిదగ్గర దానివైభవమేమిటో అనుభవించినవాన్ని అంతశక్తివంతము ఆదిత్యహృదయం అది ఎంతటి పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది రోగాలకు కూడా ఉపశాంతిగా నిలబడుతుంది అందులో ఆ సూర్యమండలాకృతిగా ఉండేటటువంటి భగవానునియొక్క లక్షణాల్నిచెప్తూ దానిలోని నమక చమకాల్ని కూడా తీసుకొచ్చి కలిపారు రుద్రాధ్యాయం ఎలా ఉంటుందో అలా ఉభయ స్వరాలతో అలా వస్తాయి ఆ శ్లోకాలవన్నీకూడా అందుకే ఆ చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే చెప్పేటప్పుడు స్తోత్రం అక్కడక్కడ


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః ! జ్యోతి ర్గణానాం పతయే దినాధిపతయే నమః !!
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ! నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః !!
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ! నమః పద్మ ప్రభోధాయ మార్తాండాయ నమో నమః !!
నమకాలు రుద్రంలో ఎలా ఉంటుందో అలా అంత అందమైనటువంటి స్తోత్రభాగాన్ని మంత్రభాగంలోకి తీసుకొచ్చి ఇచ్చారు మహర్షి. అందుకే “శ్రీరామాయణమే ఒక మాలామంత్రమంటారు” పెద్దలు. అంతగొప్ప ఆదిత్యహృదయాన్ని రామ చంద్ర మూర్తికి ఉపదేశంచేసి ఆయన అన్నారూ... ఓ రామా! దీన్ని మూడుమాట్లు పఠించు ఒక్క మూడు మాట్లుగానీ దీన్ని ఆచమనంచేసి పఠించావా అస్మిన్ క్షణే మహా బాహో రావణం త్వం వధిష్యసి ఈ క్షణంలోనే రావణున్ని చంపేస్తావు. ఇక ఎదురులేదు రామా దీన్ని మూడుమాట్లుపఠించు అని ఏత త్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి మూడుమాట్లు పఠించు నీకు విజయం కలుగుతుంది. నమ్మకం ఉండాలి మణి మంత్రం ఔషధం ఈ మూడు నమ్మకంచేతనే ప్రకాశిస్తాయి. కాబట్టి గురువుగారి ఇచ్చినటువంటి మంత్రాన్ని స్వీకరించాడు. ఇచ్చేసినటువంటి అగస్త్యుడు రావణుడు చచ్చిపోయాడో లేదో చూడ్డానికి ఉన్నారా అక్కడా..! చిత్రమేమిటో తెలుసాండీ! ఆయనా ఇచ్చేసేసి ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ ఏవ ముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాఽఽగతమ్ ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమేమిటీ అంటే ఇక నేను ఆదిత్యహృదయం ఉపదేశం చేసిన తరువాత రావణుడెక్కడ బ్రతికుంటాడు చచ్చిపోయి తీరుతాడు ఇది గురువుకుండే నమ్మకం. ఒక గురువుకి తను చెప్పేవిషయంమీద తను ఇచ్చే మంత్రమీద అంతనమ్మకం ఉండాలి అందుకే తాను ముందు బాగా అనుష్టించాలి. తానుబాగా అనుష్టించి ఆ మంత్రమునందు తాను బాగా సిద్దిని పొందితే తప్పా తాను వేరొకరికి ఉపదేశం చెయ్యకూడదు. అంత అగస్త్యుడి యొక్క నమ్మకం చూడండి మహానుభావుడిది అది ఆస్థిక్యబుద్ధి అంటే. కాబట్టి నాయనా! ఇది నీవు మూడుమాట్లు బాగా పఠించి సూర్యమండలాంతరవర్తియైన శ్రీమన్నారాయణుని భగవంతున్ని అందుకే సూర్యమండలాంతరనువర్తి శివుడు సూర్యమండలాంతరనువర్తి నారాయణుడు సూర్యమండలాంతరనువర్తి గాయిత్రి అందుకేకదాండి మూడుమాట్లు గాయిత్రి సూర్యు బింబాన్ని చూసే గదా ఇస్తారు.
కాబట్టి నీవు దీన్ని చక్కగా మూడుమాట్లు బాగా పారాయణచేసి యుద్ధభూమిలో రథాన్ని ఎక్కవలసిందీని అన్నారు, రామ చంద్ర మూర్తి ఈలోగా ఆదిత్యహృదయాన్ని పఠించారు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమౌతూంది నీరసపడుతున్న రామ చంద్ర మూర్తికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశం చెయ్యడంకోసమే ఈ విరాం కల్పింపబడ్డంకోసమే ఆ సారథి బుద్దిలో ఈశ్వరుడు ప్రవేశించి రథాన్ని పక్కకెళ్ళిపోయ్యేటట్లుచేశాడు రావణుడు బడలిపోయ్యేటట్లు చేశాడు. నమ్ముకున్న ధర్మం ఎలా కాపాడుతుందో చూడండి శ్రీరామాయణాన్ని మీరు ఇంకోకోణంలో చూస్తే, రామాయణమంతా గురువులయొక్క వైభవమే ఎందుకో తెలుసాండీ! ఎవరు చెక్కారు రామున్ని ఇలా వశిష్టుడు-విశ్వామిత్రుడు, ఎవరు రామ చంద్ర మూర్తి అస్త్రాలన్నిటిని ఉపదేశంచేశారు గురువులు, ఎవరు సీతమ్మతల్లి అపహరణం జరగడానికి కావలసిన ప్రదేశం చెప్పారు గురువులు ఋషులు, చిట్టచివరా నీరసపడితే వచ్చి ఆదిత్యహృదయం ఉపదేశం చేసింది ఎవరు గురువులు. శ్రీరామాయణమంతా గురువైభవమే, గురువుగారియొక్క గొప్పతనమెంతటిదో చెప్పడమే శ్రీరామాయణము. కాబట్టి ఇప్పుడు రామ చంద్ర మూర్తి ఆదిత్యహృదయాన్ని పారాయణ చేశారు. రావణాసురుడు మళ్ళీ రథంమీద కాస్త విశ్రాంతిపొందినవాడై అపారమైనటువంటి క్రోధంతో యుద్ధభూమిలోకి వచ్చాడు కానీ వచ్చేటప్పుడు రాముని యొక్క రథం దగ్గరికి అపసౌవ్యంగా బయలుదేరి వస్తున్నాడు.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
వెంటనే రాముడు అన్నాడు, చూశావా మాతలీ! రావణాసురుడు రావడం అపసవ్యంగా వస్తున్నాడు మనం సవ్యంగా వెడుదాం అతని రథానికి కుడిపక్కకి వెడుదాం, విజయం కలగాలి అనుకున్నవాడు కార్యం సిద్ధించాలి అనుకున్నవాడు ఎలా పడితే అలా చెయ్యకూడదు చేసేవి పద్ధతిలో చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి వవర్ష రుధిరం దేవో రావణస్య రథోపరి ! వాతా మణ్డలిన స్తీక్ష్ణా హ్యపసవ్యం ప్రచక్రముః !! అకస్మాత్తుగా మేఘ మండలములోంచి రక్తం వర్షం కురిసి రావణాసురుని యొక్క రథమంతా రక్తంతో తడిసిపోయింది మహ ద్గృధ్ర కులం చాస్య భ్రమమాణం నభ స్తలే ! యేన యేన రథో యాతి తేన తేన ప్రధావతి !! ఎక్కడెక్కడికి రావణాసురుని రథం మెలికలు తిరుగుతూ వస్తూంటే అక్కడక్కడా గ్రద్ధల గుంపులు తిరుగుతూ రావణాసురుని యొక్క రథంమీద వాలుతున్నాయి సంధ్యయా చాఽఽవృతా లంకా జపా పుష్ప నికాశయా ! దృశ్యతే సంప్రదీప్తేవ దివసేపి వసుంధరా !! జపా పుష్పం ఎర్రటి మందారపూలు ఎలా ఉంటాయో రాసిగాపోస్తే అకస్మాత్తుగా లంకాపట్టణమంతా మందారుపువ్వు యొక్క వన్నెలో కాగుతున్నట్లుగా కనపడుతూంది రావణ శ్చ యత స్తత్ర సంచచాల వసుంధరా ! రక్షసాం చ ప్రహరతాం గృహీతా ఇవ బాహవః !! రావణుడి రథం ఎక్కడికి వెడుతుంటే అక్కడికి భూమి కంపిస్తూంది, రావణుని వెనక నున్నటువంటి రాక్షసులు ఏదైనా బాణంకానీ కత్తికానీ తీద్దామంటే ఎవరో తన చేతుల్ని వెనక్కి పట్టి కట్టినట్లుగా అనిపించి చేతులు కాళ్ళు కదలడం మానేశాయి తామ్రాః పితాః సితాః శ్వేతాః పతితాః సూర్య రశ్మియః ! దృశ్యన్తే రావమస్యాంఽకే పర్వత స్యేవ ధాతవః !! తెల్లగా ఉన్నవి ఎర్రగా ఉన్నవి పచ్చగా ఉన్నవి ఉల్కలవంటివీ ఆకాశంనుంచి వర్షింపబడి రావణుని శరీరంమీదపడి పర్వతంమీద ధాతువులు పడినట్లుగాపడి ప్రకాశిస్తున్నాయి.
ఆడనక్కలు ఎక్కడ్నుంచో వచ్చి ఎదురుగా నిలబడి నోళ్ళుతెరిచి అగ్నిహోత్రం కక్కుతున్నాయా అన్నట్లుగా పెద్దగా కూతలు కూశాయి, అక్కడా ఇటువంటి దుశ్శకునములు దీనితోపాటు గోరువంకలు గుంపులు గుంపులుగా దెబ్బలాడుకుంటూవచ్చి రావణాసురునియొక్క రథంమీదపడ్డాయి ఇన్ని అపశకునాలు కనపడ్డాయి. అప్పుడు ఆ రామ-రావణులమధ్య యుద్ధం ప్రారంభమైంది ఎంతగొప్ప యుద్ధమంటే... అది చూసినటువంటివాళ్ళు ఉత్కంఠతో నిలబడి రాముడు గెలుస్తాడా అని అనుమానం పొందారు, అంటే ఇంత ఆదిత్యహృదయాన్ని చదివి రథంమీద కూర్చున్నా... రావణున్ని నిగ్రహించడం అంతతేలిగ్గాయేం అయిపోలేదు తతో రాక్షస సైన్యం చ హరీణాం చ మహా ద్భలమ్ ! ప్రగృహీత ప్రహరణం నిశ్చేష్టం సమతిష్ఠత !! రాముడు వేస్తున్నబాణాలు రావణుడు వేస్తున్నబాణాలు వాళ్ళిద్దరూ తిప్పుకుంటున్న రథాలు ఒకరినొకరు ఢీకొంటున్నతీరు గుఱ్ఱాలు గుఱ్ఱాలతో రథాలు రథాలతో పథాకాలు పథాకాలతో గుద్దుకుంటూ నెత్తురోడిపోతున్న శరీరాలతో వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యచకితులై రాక్షసులు వానరులు కూడా యుద్ధాన్ని మానేసి నిలబడిపోయారు ఈ యుద్ధం గురించి వర్ణించి వర్ణించి మహర్షి అన్నారు రామ-రావణ యుద్ధాన్ని వర్ణించడానికి ఉపమానములేదు అన్నారు. రామ-రావణ యుద్ధానికి పోలికా రామ-రావణ యుద్ధమే ఇంకోటిలేదు అంటే అప్పటివరకు సృష్టిలో ఇటువంటి యుద్ధంలేదు. మహాక్రుద్ధుడైనటువంటి రామ చంద్ర మూర్తి అహోరాత్రములు నిలబడి యుద్ధం చేస్తున్నారు ఎంతకాలము ఈ యుద్ధము ఇక రావణుడు తెగటార్చబడడా..? అని కోపగించినవాడై బాణ పరంపరచేత శిరస్సుల్ని కొట్టేశాడు రావణునివి ఒక్కొక్క తల తెగి కిందపడిపోతూంది ఎంత వేగంగా తలలు కిందపడిపోతున్నాయో అంత వేగంగా మళ్ళీ తలలు పుట్టేస్తున్నాయి


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
రావణస్య శిరోచ్ఛన్ద చ్ఛ్రీమ జ్జ్వలిత కుణ్డలమ్ ! త చ్ఛిరః పతితం భూమౌ దృష్టం లోకై స్త్రిభి స్తదా !!
త స్యైవ సదృశం చాన్య ద్రావణ స్యోత్థితం శిరః ! త త్షిప్రం క్షిప్ర హస్తేన రామేణ క్షిప్ర కారిణా !!
ద్వితీయం రావణ శిర శ్ఛిన్నం సంయతి సాయకైః ! ఛిన్న మాత్రం చ త చ్ఛీర్షం పున రన్యత్ స్మ దృశ్యతే !!
త దప్యశని సంకాశై శ్చిన్నం రామేణ సాయకైః ! ఏవ మేవ శతం ఛిన్నం శిరసాం తుల్య వర్చసామ్ !!
రామ చంద్ర మూర్తి బాణం తీసి ఒక తలనికొడితే ఆ తల తెగి ఇలా కిందపడగానే మళ్ళీ తలొచ్చేస్తుంది రెండో తలను కొట్టగానే తల తెగగానే మళ్ళీ తల వచ్చేస్తుంది. వందల మార్లు తలలు తెగి కిందపడిపోయాయి ఎన్ని వందలమార్లు తలలు తెగి కిందపడిపోయాయో అన్నివందలమార్లు మళ్ళీ ఆ తలలులేసి శరీరానికి అతుక్కుంటున్నాయి, ఆశ్చర్యపోయినటువంటి రామ చంద్ర మూర్తి మరింతగా ఖేదాన్నిపొందారు. ఇదేంటిదీ తలలే తెంచేసినా మళ్ళీ పుట్టేస్తున్నాయి నేను ఏ బాణంతో వాలిని కొట్టానో ఆ బాణాన్ని ప్రయోగించినా రావణుడు చావలేదు, ఏ బాణంతో ఏడు సాలవృక్షములను కొట్టానో ఆ బాణం ప్రయోగించినా రావణుడు చావలేదు ఏ బాణంతో పద్నాలుగువేలమంది ఖర-దూషణాదులను కొట్టానో ఆ బాణంతో కొట్టినా రావణుడు చావలేదు ఎన్ని అస్త్రములు ఉన్నాయో అన్ని అస్త్రములు ప్రయోగించినా రావణుడు మరణించలేదు. ఎన్ని నారాచబాణములను ప్రయోగించినా రావణుడు నిహతుడుకాలేదు అసలు ఈ రావణుడు ఎలా నిహతుడౌతాడు అనీ ఇంతటి రామ చంద్ర మూర్తి ఖేదాన్ని పొందాడు.
అప్పుడు ఇంద్రుని యొక్క సారథియైన మాతలి వెనక్కి తిరిగి రామున్ని చూసి అన్నాడు అథ సంస్మారయా మాస రాఘవం మాతలి స్తదా ! ఆజాన న్నివ కిం వీర త్వ మేనమ్ అనువర్తసే !! విసృజాస్మై వధాయ త్వమ్ అస్త్రం వైతామహం ప్రభో ! వినాశకాలః కథితో యః సురైః సోద్య వర్తతే !! కనపడుతున్న నిమిత్తములబట్టి రావణుడు పొందుతున్న నీరసాన్నిబట్టి రావణుడి అస్త్రములు జ్ఞాపకానికి రావట్లేదు అన్న స్థితినిబట్టీ వినాశకాలము దాపురించింది రావణునికి ఇప్పుడే రామా! దివ్యమైన అస్త్రాన్ని నీవు జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నావు ఇన్నివేల బాణములు నీ మీద పడ్డంలో బాణములు ప్రయోగించడంలో నీకు జ్ఞాపకంరాలేదు నీ దగ్గర పైతామహస్త్రం ఉంది అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించు య మస్మై ప్రథమం ప్రాదా దగస్త్యో భగవాన్ ఋషిః ! బ్రహ్మ దత్తం మహ ద్బాణ మమోఘం యుధి వీర్యవాన్ !! ఆ బాణాన్ని నీకు అగస్త్యమహర్షి ఉపదేశం చేశాడు, సాక్ష్యాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆ బాణాన్ని నిర్మాణం చేశాడు, నిర్మాణం చేయడమంటే ఆ మంత్రాన్ని చతుర్ముఖ బ్రహ్మగారే సంకల్పంచేశారు ఆ మంత్రాన్ని అభిమంత్రిస్తే బాణంమీద బ్రహ్మణా నిర్మితం పూర్వ మిన్ద్రార్థ మమితేజసా ! దత్తం సుర పతేః పూర్వం త్రి లోక జయ కాంక్షిణః !! మూడు లోకములను ఇంద్రుడు జయించాలన్న కాంక్షతో ఆ బ్రహ్మగారు ఆ అస్త్రాన్ని నిర్మాణం చేసి దేవేంద్రునికి ఉపదేశం చేశారు ఆ తరువాత కాలంలో దాన్ని అగస్త్యమహర్షి పొందారు అగస్త్యమహర్షి పొందడానికి కారణం అది రాముడికి అందాలనే కాబట్టి దాన్ని నీకు అగస్త్ర మహర్షి నీకు ఇచ్చారు ఆ బ్రహాస్త్రం నీవు గుర్తుచేసుకోలేదు రామా..! నీవు ఆ బ్రహ్మాస్త్రప్రయోగం చెయ్యాలి


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
యస్య వాజేషు పవనః ఫలే పావక భాస్కరౌ ! శరీర మాఽఽకాశ మయం గౌరవే మేరు మన్దరౌ !!
జాజ్వల్య మానం వపుషా సుపుంఖం హేమ భూషితమ్ ! తేజసా సర్వ భూతానాం కృతం భాస్కర వర్చసం !!
సధూమ మివ కాలాగ్నిం దీప్త మాఽఽశీ విషం యథా ! పర నాగాశ్వ బృన్దానాం భేదనం క్షిప్ర కారిణమ్ !!
ద్వారాణాం పరిఘాణాం చ గిరీణా మపి భేదనమ్ ! నానా రుధిర సిక్తాంఽగం మేదో దిగ్ధం సుధారుణమ్ !!
వజ్ర సారం మహా నాదం నానా సమితి దారుణమ్ ! సర్వ మిత్రాసనం భీమం శ్వసన్త మివ పన్నగమ్ !!
దాని బరువులో మేరు పర్వతం మందర పర్వతం ఎంతబరువుంటాయో అంత బరువుని పొందుతుంది ఆ మంత్రాన్ని అభిమంత్రించగానే బాణం దాని రెక్కలలోకి వాయుదేవుడు ప్రవేశిస్తాడు దాని ములుకులోకి అగ్ని సూర్యుడు ప్రవేశిస్తారు ఆ బాణం విడిచిపెట్టగానే అభిమంత్రించగానే వాయువేగంతో వెళ్తూంది. అది పెద్ద పెద్ద పర్వతములను కూడా చూర్ణం చేస్తుంది, అది కొవ్వుచేత పూత పూయబడి ఉంటుంది, అది అపారమైనటువంటి తేజస్సుతో ఉంటుంది మహాసర్పమెలా మెరుస్తుందో అలా మెరుస్తుంది ఎవరిమీద ప్రయోగించారో ఆ పుర ద్వారములను తోరణములను పర్వత శిఖరములను ఆ పట్టణంలో ఉన్నటువంటివాళ్ళనందర్నీ కూడా గడగడలాడిస్తుంది ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగం ప్రారంభం చేస్తే చాలు సముద్రం కలతచెందుతుంది భూమి అంతాకూడా కదులుతుంది పర్వతములు క్షోభిస్తాయి. అంత భయంకరమైనటువంటి అస్త్రమది రామా! అటువంటి అస్త్రాన్ని ప్రయోగంచేస్తే ఎంతకాలంగానో ఆహారంకోసం ఎదురుచూస్తున్నటువంటి కాకులకు గ్రద్ధలకు రాబందులకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. అంటే ఆ బ్రహ్మాస్త్రప్రయోగంచేత అంత మంది నిహతులైపోతారు అన్నాడు. అటువంటి అస్త్రం నీదగ్గరుంది కాబట్టి వానరులకు ఆనందమును కలిగించేది ఇక్ష్వాకువంశానికి కలిగినటువంటి భయాన్ని పోగొట్టేదైనటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని నీవు అభిమంత్రించు అన్నాడు. అనేటప్పటికి వెంటనే రామ చంద్ర మూర్తికి బ్రహ్మాస్త్రము జ్ఞాపకానికి వచ్చింది, ఒక్కసారి సావధానచిత్తుడై బాగా నిర్మలమైన బుద్ధిని కల్పించుకుని ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని బాగా జ్ఞాపకానికి తెచ్చుకుని మెరిసిపోతున్నటువంటి బాణాన్ని ఒకదాన్ని తన అక్షయ బాణ తూనీరంలోంచి తీసి దానిమీదకి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి మెరిసిపోతున్నటువంటి తన యొక్క ఇంద్రచాపంలోకి ఆ వింటినారికి తొడిగి ఆకర్ణాంతములాగి ఆ బాణాన్ని ఒక్కసారి విడిచిపెట్టాడు. ఆ ధనస్సునుండి వినుర్ముక్తమైనటువంటి బాణం అపారమైన తేజస్సు విరజిమ్ముతూ బయలుదేరి ముందుకు ప్రయాణం చేసింది
స విసృష్టో మహా వేగః శరీరాన్తకరః శరః ! బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః !!
రుధిరాక్తః స వేగేన జీవితాన్తకరః శరః ! రావణస్య హర న్ప్రాణాన్ వివేశ ధరణీ తలమ్ !!
స శరో రావణం హత్వా రుధిరార్ద్రీ కృత చ్ఛవిః ! కృత కర్మా నిభృతవత్ స్వ తూణీం పునః ఆవిశత్ !!


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
అప్పుడూ ఆ విడిచిపెట్టబడినటువంటి బ్రహ్మాస్త్రము ఉత్తర క్షణం ఆ రావణాసురుని యొక్క వక్షస్థలంలోకి దూరి అది ఆ కింద ఉన్నటువంటి భూమిలోకి ప్రవేశించి నెత్తుటితో కూడినదే భూమిలోకి వెళ్ళి బాగా కుచ్చుకుని పైకిలేచి మళ్ళీ వచ్చి అక్షయ బాణ తూనీరంలోకి ప్రవేశించింది. అంతే చేత పట్టుకున్నటువంటి ధనస్సుని విడిచిపెట్టేసినటవంటివాడై గుండెలలోంచి నెత్తురు కారిపోతూండగా ఒక్కసారి పదితలలతో కూడినటువంటి రావణుడు రథంనుంచి తుళ్ళి నెత్తుటిలో కింద యుద్ధభూమిలో పడిపోయాడు. అంతే పడిపోగానే ఒక్కసారి పైన ఉన్నటువంటి దేవతలు మహర్షులు యుద్ధభూమిలో ఉన్న వానరులు అందరూ కూడా సంతోషంతో భేరీలు ఢంకాలు అన్నింటినీ మోగించారు తతో వినేదుః సంహృష్టా వానరా జితకాశినః ! వదన్తో రాఘవ జయం రావణస్య చ త ద్వధమ్ !! మహానుభావుడు అంత కష్టపడి బ్రహ్మాస్త్ర ప్రయోగంచేసి రావణాసురున్ని వధించి మానవజాతికి కీర్తి తెస్తే లోకంలో ఎక్కడ చూసినా జయజయధ్వానాలే ఎక్కడ చూసినా భేరీనాదాలే ఆకాశంలోంచి పుష్పవృష్టి కురిసింది ఆయనమీద ఆ విధంగా రావణ వధ జరిగిపోయింది.
అందరూ లోకంలోవున్నవాళ్ళందరూ ఎంతో సంతోషించారు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆకాశంలోంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఆ పుష్పవృష్టిలో రామ చంద్ర మూర్తి పూర్తిగా తడిచిపోయారు. అందరూ వచ్చి ఎంతో సంతోషంగా వానరులు వచ్చి ఎంతో సంతోషంగా కిల కిల ధ్వనులు చేశారు అక్మాత్తుగా తమ ప్రభువు రథంలోంచి డొల్లి కిందపడగానే అక్కడ ఉన్న రాక్షసులందరూ కూడా భపడినవారై తలో దిక్కుకు పారిపోయారు ఎవ్వరినీ విడిచిపెట్టకుండా వానరులు వెంటపడి రాక్షసులందర్నీ సంహరించారు అక్కడితో సాధు సాధ్వితి వాగగ్ర్యా దైవతానాం మహాత్మనామ్ సాధు సాధువు భళీ భళీ అంటూ దేవతలందరూ కూడా పొంగిపోయారు ఎక్కడ చూసినా రామో రామో రామః ఆహా! ఏమి రాముడు ఏమి రాముడు పది తలలు ఇరవై చేతులున్న రావణాసురున్ని అహోరాత్రములు యుద్ధంచేసి ఆదిత్యహృదయాన్ని ఉపదేశంపొంది అన్నివేల బాణములతో కొట్టినా నిగ్రహించుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగంచేసి రావణున్ని సంహరించిన మహానుభావుడు మొనగాడంటే రామ చంద్ర మూర్తి. ఒక్కనాడు ధర్మం తప్పకుండా ఇంతగొప్ప యుద్ధం చేసి ఆ విజయాన్ని సాధించినటువంటి రామ చంద్ర మూర్తి యొక్క జయమే జయము అని నరలోకంలో కాదటా దేవతాలోకాల్లో అన్ని లోకాల్లో ఈ విజయోత్సవ వేడుకలు చేసుకున్నారు.
ఎంత పొంగిపోయారో ఎవరినోటవిన్నా రామకథే ఎవరినోట విన్నా రావణవధే ఎవరినోట విన్నా రామ పరాక్రమమే ఎవరినోట విన్నా రామ జయమే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు పరమ సంతోషం లంకాపట్టణమంతా కూడా నిశ్శేషంగా రాక్షసులులేకుండా నిర్మూలింపబడింది. లోకమంతా శాంతిపొందింది ఇంతకాలం ఎవడు ధర్మానికి హానికల్పించాడో వాడు నశించిపోయాడు ఎవడు శ్రీమహావిష్ణువు యొక్క వైకుంఠం దగ్గర ద్వారపాలకులుగా ఉండగలిగినవాడో ఎవడు నీచ యోనిలోకి ప్రవేశించాడో వాడు శాపవిమోచనుడై మళ్ళీ జయ విజయులుగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. ఏ నరులు కీర్తిలేక ఆ నరులెంతటివారు అనిపించుకున్నారో అటువంటి నరులు రావణాసురున్ని కూడా నిగ్రహించగలిగినటువంటి ధర్మం పాలించగలిగినటువంటి శక్తి రావణాసురున్ని నిర్జించగలిగిన శక్తి నరుడికే ఉందని నరుడియొక్క వైభవాన్ని చాటిచెప్పిన రామ చంద్ర మూర్తి నరుడిగా పుట్టినందుకు నరులు పండగే చేసుకున్నారు సంతోషపడిపోయారు. అందుకే నరుడిగా పుట్టినవాడు


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
రామ కథ వినకపోతే రాముని యొక్క పట్టాభిషేకంలో పాల్గొనలేకపోతే రామ చంద్ర మూర్తికి జయజయ ద్వానం చెయ్యకపోతే రామున్ని పూజించకపోతే శ్రీ రామ నామం రాయకపోతే శ్రీరామ చుట్టకపోతే రామాలయాన్ని దర్శించకపోతే వాడు కృతఘ్నుడై ఉంటాడు. కాబట్టి అంతటి మహానుభావుడు రామ చంద్ర మూర్తి రావణ వధ చేశారు ఇక రేపు కించిత్ మనసుకు కాస్త కష్టమనిపించేటటువంటి ఘట్టమొక్కటే ఉంటుంది సీతమ్మతల్లి అగ్నిప్రవేశం ఇంక ఆ తరువాత మనందరం పట్టాభిషేక దిశగా ప్రయాణం చేస్తాం.
అటు రామ కథా పట్టాభిషేకం వైపుకు వెళ్తూంది పైన కూడా పట్టాభిషేకం వైపుకు ప్రారంభమైపోతూంది, అప్పుడే ఋత్విక్కులలో బ్రహ్మస్థానంలో కూర్చోవలసినవారు వచ్చేశారు ఒక్కొక్క ఋత్విక్కు ఒక్కొక్క ఋత్విక్కు బయలుదేరి వచ్చేస్తున్నారు రేపటికి ఈ వేదిక యొక్క స్వరూపం కూడా మారిపోతూంది. ఇక భరద్వాజమహర్షి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు రామ చంద్ర మూర్తి, ఎల్లుండి మనందరం సంతోషంగా పొద్దున్నే రామ నామ క్షేత్రంనుంచి ఖచ్చితంగా ఆరుగంటలకి బయలుదేరిపోతాం ఆరు అయ్యేటప్పటికి బయలుదేరుతామంటే ఏదో గుంపులు గుంపులుగా వెళ్ళకూడదా ఊరెరిగింపులో వెళ్ళేటప్పుడు నిజంగా పట్టాభిషేకాని వెళ్ళే ఊరెరిగింపు ఎలా ఉంటుందో అంత అందంగా వెళ్ళాలి అటువంటి పట్టాభిషేకపు ఊరెరిగింపులో పాల్గొనడం మన జీవితంలో మహద్భాగ్యం మీరు బాగాజ్ఞాపకంపెట్టుకోండి నేను ఉత్తిగనే అంటున్నాను ఈ మాటలని అనుకోకండి అనౌసరంగా నేనేమాటాచెప్పను. అత్యద్భుతంగా ఉంటుంది రామ చంద్ర మూర్తి రాజా రాముడై పట్టాభిషేకానికి వెళ్తూంటే ఆ రోడ్లు ఊడుస్తారు ఎందుకో తెలుసాండీ! స్కాంధ పురాణాంతర్గతంగా ప్రత్యేకంగా బ్రహ్మోత్తరఖండమూ అనిచెప్పి ఒక ఖండము, బ్రహ్మోత్కరఖండములో ఒక విషయం చెప్తారు. వేంకటాచల క్షేత్రంలో ఇంకా పొద్దున్న తుడవనప్పుడు ఒక పక్షి ఒకానొకప్పుడు బలమైన పక్షి తరుముకొచ్చిందని లోపలికెళ్ళి ఆ చిన్ని పక్షి ఎగిరింది ఎగిరినప్పుడు దాని రెక్కల యొక్క చప్పుడికి ఆ రెక్కల యొక్క గాలికీ వేంకటాచల క్షేత్రంలో ఉన్న కొన్ని ధూళికనాలు పక్కకి తుడవబడ్డాయి. అలా తుడిచినందుకుగాను తన రెక్కలతో ఆ పక్షికి ఉత్తర జన్మలలో చక్రవర్తిత్వాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు.
అన్నిటికన్నా గొప్ప సేవలుగా రెండిటినే చెప్తారు పెద్దలు, ఒకటి భోజనం చేసినటువంటి విస్తర తీయ్యడం. అందుకే రామ కృష్ణపరమహంస అందరూ భోజనం చేసిన తరువాత చేత్తో విస్తరలు తీస్తే ఒప్పుకునేవారుకాదు తన గడ్డంతో తుడిచేవారు ఎంగిళ్ళని ఆయన నేను చేత్తో తుడవను మా అమ్మ ఇన్ని ముఖాలతో తింది ఇక్కడ మా అమ్మ తినగా మిగిలినటువంటి ఎంగిలి నా చేత్తో తుడవనా నా గడ్డంతో తుడుస్తాను మెత్తగా ఉంటుందని గడ్డంతో తుడిచేవారాయన. అందునా మహాత్ములైనటువంటివారు భోజనం చేసిన తరువాత మిగిలినటువంటి పాత్ర వారు ఉత్తరాపోషణం పట్టగా మిగిలినటువంటి పాత్ర తీయ్యడం చాలా చాలా గొప్పసేవ అందుకే అది దొరకదు ఎందుకు దొరకదో తెలుసాండీ... ఒక్కటే కారణం మీరు ఆయనా అస్తమానం భోజనానికేం ఎక్కడికిరాడు, రాడు కాబట్టి ఆయనయొక్క పాత్ర భోజనం చేసినటువంటి శేషం ఆ పాత్ర మీకు ఎత్తే అవకాశం ఉండదు. అది ఎవరికి దొరుకుతుందంటే ఒక్క ఇద్దరికే దొరుకుతుంది. ఒకటి భార్యా రెండు బిడ్డలు. బిడ్డలలోకి శిష్యులొస్తారు శిష్యులకీ బిడ్డలకీ అభేదం గురువుగారి విస్తర తీసేటటువంటి మహద్భాగ్యాన్ని ఎవరు పొందుతారంటే గురువుగారితో ఉండి సేవ చేస్తున్నటువంటి శిష్యునికొక్కనికే ఆ అధికారం లభిస్తుంది తప్పా ఇతరులకది తీద్దామన్నా లభించదు.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
దానివల్ల ఎంత మహద్భాగ్యాన్ని పొందుతారో ఈశ్వరుడు వేసేటటువంటి పుణ్యమేమిటో లెక్క కట్టడం ఎవ్వరికీ సాధ్యంకాదు. రెండవ మహోత్కృష్టమైనకార్యము ఈశ్వరుడు ఊరెరిగింపు వెడుతున్నప్పుడు ఈశ్వరుడు వస్తున్నాడు కాబట్టి తుడవడం ఆ తుడవడానికి నేను గొప్ప చేసి చెప్తున్నాని మీరు అనుకోవద్దు కాకినాడ ఒక కన్నైతే గుంటూరు ఇంకొక కన్ను నేను ఎక్కువ తక్కువ చేయను. కాకినాడ పట్టణంలో ఊరెరిగింపు ఇంకొక నెలలో బయలుదేరుతుంది అంటే ఈ ముందు రోడ్డు ఊడుస్తాము అన్నదానికోసం పెద్ద పెద్ద రెకమెండేషన్లుంటాయి. ఇంకా దేవీ నవరాత్రులు ఎప్పుడు ఆశ్వీజమాసంలో జరుగుతాయి ఆశ్వీజమాసంలో జరిగేటటువంటి దేవీనవరాత్రుల్లో కొన్ని సేవలకోసం అక్కడ కాకినాడలో లేరని అప్పుడే గోపాలకృష్ణగారికి ఫోన్లు వచ్చేస్తున్నాయి అయ్యా మీరు పోన్ చేసి మేనేజరుగారికి చెప్పి మాపేరు రాయించరాండీ మళ్ళీ మాకు దొరుకుతుందో దొరకదో అవకాశం మాకు ఆ సేవకు మాపేరు రాయించండని అక్కడ ఎన్ ఎచ్ సి ఎల్ జనరల్ మేనేజరు పక్కనే ఉంటాడు ఆయన తుడుస్తాడు రోడ్లు. ఒక కళాశాలకు ప్రిన్సిపాల్ కాదగినవ్యక్తి మహాతల్లి మహాభక్తురాలు ఆవిడ తుడుస్తారు రోడ్డు అంత పెద్ద పెద్ద పొజిషన్సులో ఉన్నవాళ్లు, వాళ్ళు కోరి కోరి ఎంతో బతిమాల్తూ అమ్మా మీరు కిందటిసారి చేశారుకదమ్మా ఈసారి వీళ్ళకిద్దామని చెప్పి ఇస్తూంటాము. అంత పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు స్వామి ఊరెరిగింపు అయ్యేంతవరకు ముందు నిలబడి రోడ్లు తుడుస్తారు. నాకు ఈ ఒక్క విషయాన్ని మన్నించవలసి ఉంటుంది నాకు ఎవ్వరూ ప్రత్యక్షంగా పరిచయంకారు నేను మిమ్మల్ని అలా అడగచ్చో అడగకూడదో నేను మిమ్మల్ని అలా అడిగితే ఏమనుకుంటోరని నేను మిమ్మల్ని అడగలేదు. నేను ఆ సేవను కూడా కాకినాడ పట్టణం నుంచి వచ్చేవాళ్ళకు తెలుసుకాబట్టి దానివైభవము వాళ్ళకిద్దామనుకున్నాను కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీలో ఎవరైనా ముందుకొస్తే మాత్రం ఉత్సవం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆ సేవ మీకే ఇచ్చేస్తాము.
కానీ ఏదో చేస్తున్నామని కాదు అంత భక్తితో చేస్తామని వస్తేనే ఇస్తాము లేకపోతే మాత్రం అది చేసుకుని తరించిపోతామని అదిమాకు ఇస్తారా ఇస్తారా అని అడిగివస్తున్నవారున్నారు వాళ్ళకిస్తారు అది. చేసుకుంటాము అని ముందుకొస్తే చీపురుపట్టుకుని రోడ్లు తుడవాలి ఎప్పుడు ఊరెరిగింపువెళ్లినా ఒక్కసారి చీపురు పట్టుకుని నేను కూడా కొంతదూరం తుడుస్తుంటాను, ఈసారి కూడా తుడుస్తాను ఎప్పుడూ తుడుస్తాను ఎందుకంటే అంతగొప్ప సేవ ఆ సేవ అలా ఈశ్వరుడికి సేవ చేస్తు ముందు తుడుస్తారు ఆ రోడ్డుని వెనక వెళ్లేటప్పుడు ఊరి పెద్దలు నడుస్తారు ఊరి పెద్దల వెనకా మంగళవాయిద్యాలు వెడుతాయి ఊరి పెద్దలకన్నా మధ్యలో  శంకర భగవత్పాదాచార్య స్వామివారు గొడుగుకింద వెడుతారు ఆ వెనక భారతీ తీర్థ స్వామివారు వెడుతారు ఆ వెనకా వేద పండితులు స్వస్థి వాచకం చెబుతూ వెడుతుంటారు ఆ వెనకా కన్నెపిల్లలు చేతిలో పిండివంటలు పట్టుకుని వెడుతుంటారు ఇదీ


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ఆరు గంటలకి ఊరెరిగింపు బయలుదేరుతుందీ అంటే ఐదు గంటలకు మీరు ఆరోజున ఉండవలసి ఉంటుంది అలా ఉన్నవాళ్ళనే ఊరెరిగింపులో నిలబెట్టవలసి వస్తుంది. అది పదిమంది కానివ్వండి పదిహేనుమంది కానివ్వండి, దాని ప్రయోజనం సామాన్యమైనదని మీరు అనుకోకండి కన్నెపిల్ల ఆ మధుర పదార్థాన్ని చేతిలో పళ్ళెంలో పట్టుకుని ఊరేగింపులో వెడితే ఈశ్వరుడు నొసటన వ్రాయబడిన చెడ్డవ్రాతను కూడా తూడ్చేస్తాడు, అంతగొప్పది కన్నెపిల్ల మధుర పదార్థం పట్టుకునివెళ్ళడం కాబట్టి కన్నె పిల్లలకి మధుర పదార్థాన్నిస్తారు ఎవరు ముందొచ్చి నిల్చుంటారో వాళ్ళని ఫాం చేస్తారు లైను. ఫాం చేసి దానికి కార్యకర్తలుంటారు వాళ్ళు చెప్పినమాట మీరు వినవలసి ఉంటుంది.
నిలబెట్టి మధుర పదార్థాలు ఇస్తారు చక్కగా సాప్రయదాయ దుస్తుల్లో రావాలి అంటే లంగా పవిటా జాకెట్టు కట్టుకుని రావలసి ఉంటుంది తప్పా ఏవో ఇతరమైనవి నాకు అవి సరిగ్గా తెలియవుకాని అలాంటివి వేసుకుని రాకూడదు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి వస్తే చక్కగా మధుర పదార్థాలు ఇస్తారు అవి పట్టుకుని వెళ్ళచ్చు. ఆ వెనక సువాసినిత్వానికి సిద్ధి సువాసినీలకు ఉండేటటువంటి అదృష్టమేమిటో తెలుసాండి పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి పట్టాభిషేకానికి వెడుతుంటే పరిమళ ద్రవ్యాన్ని ఒక్క సువాసినిమాత్రమే చల్లాలి అలా చల్లుతుంటేనటా రాముడి పక్కన కూర్చున్న సీతమ్మ పరాశక్తి ఆవిడ చూసి అంటూందటా నా ముందు నడుస్తూ మేము వస్తున్నామని స్వామికి దుర్వాసన తగలకూడదనీ పరిమళ ద్రవ్యాన్ని చల్లుతూంది సువాసినీ ఎప్పటికీ ఈవిడ ఈ సువాసీనీత్వంతో పసుపు కుంకాలతో పిల్లాపాపలతో బోగ భాగ్యాలతో ఉండాలని సీతమ్మ అనుగ్రహిస్తుంది. మీరు పాత్ర తెచ్చుకుంటే చాలు పరిమళ జలాలనన్నింటినీ కూడా కార్యకర్తలే పోస్తారు మన మందరము “రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము” అంటాం, పురుషులేం చేస్తాం మేమందరం రామ చంద్ర మూర్తి వెనకాతల బయలుదేరుతాము మేమందరు రామ నామము చెప్తూ బయలుదేరుతాము. మేమందరము కోసలదేశవాసులం కాబట్టి అప్పుడు మేము అలా బయలుదేరుతాము. కాబట్టి అప్పుడు ఇది గుంటూరుకాదు ఇది అయోధ్య మనమందరము అయోధ్యావాసులం. ఇలా ముందు కన్నె పిల్లలు కన్నె పిల్లలు వెనక రామ చంద్ర మూర్తి రథం, రామ చంద్ర మూర్తి రథం వెనక కొంతమంది కన్నె పిల్లలు, కన్నెపిల్లలవెనక కొంతమంది సువాసినులు ఉంటారు సువాసునిలకీ సువాసునిలకి మధ్యలో రథం పెడతూంది. ఈ సువాసునిలు కొంతమంది పరిమళ ద్రవ్యాలు జల్లుతారు కొంతమంది కన్నె పిల్లలు కొంతమంది సువాసునిలు ఫేలాలు చల్లుతారు ఇవి రోడ్డుమధ్యలో ఎక్కడో వచ్చి చేరితే ఇవ్వరు ఒక్క ప్రధానంగా ప్రారంభమయ్యే స్థానంలోనే ఇస్తారు అవి పేలాలు మీ దగ్గరున్న పాత్రలో పోస్తారు అలా పేలాలను చల్లుతూ సువాసినీలు నడిస్తే సమస్త దేవతల్ని రండీ పట్టాభిషేకానికి అని పిలిచినట్లు.


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
పిలుపుకి ఎవర్ని పిలిపిస్తారండీ వీడిదిలో దిగారనుకోండి అమ్మా భోజనానికి రండీ అని ఎవర్ని పిలుపిస్తారు జ్యోతులు తీసుకురావాలనుకోండి ఎవరుతీసుకొస్తారు పోయి తలంబ్రాలు బియ్యం తీసుకురావాలనుకోండి ఎవరుతీసుకొస్తారు అవన్నీ ఒక్క సువాసినీలే తీసుకొస్తారు ఆరోజు రామ చంద్ర మూర్తి పట్టాభిషేకానికి దేవతల్ని రండీ రండీ అని పిలిచే అధికారం ఎవరిదో తెలుసా..! ఒక్క సువాసినీలదే అది వాళ్ళ అదృష్టం అందుకే “సువాసినీ సువాసిన్యాక్షిత ప్రీత” అమ్మవారు అంత పొంగిపోతుందటా కాబట్టి మీకు పేలాలిస్తారు ఎన్ని వందల మంది ఎన్నివేలమంది ఉండనివ్వండి పదార్థానికి లోటులేదు మీరు రావడమే తరువాయి ఐదు గంటలకొచ్చేస్తే బయలుదేరేది రామ నామ క్షేత్రంలో ఏ వరుస క్రమంలో నిలబెట్టాలో అలా ఆ కార్యకర్తలు ఉండి మిమ్మల్ని బహుజాగ్రత్తగా వాళ్లు నిలబెట్టేస్తారు. అంతే దానిని ఊరెరిగింపు నిర్వహించడంలో గొప్ప సిద్ధహస్తుడొకడున్నాడు మాకు కాకినాడలో ఆయన ప్రత్యేకం బయలుదేరివస్తున్నాడు ఆయనొక పెద్ద పథాకాన్ని మోటారు సైకిలుకి పెట్టుకుని దానికి అంచలెచలమీద కార్యకర్యలు ఈలలు పట్టుకుని ఉంటారు, ఆయన మొదట నిలబడి ఈల వేస్తాడు ఈ ఈలను బట్టి ఈలలు వేస్తారు అంటే అంతా కదులుతుంది, ఒక గంటసేపు మధ్య రథంలో రామ నామంతో ఈ ఊరెరిగింపు ఇదంతా తిరుగుతుంది తిరిగి ఆలయ ప్రవేశం చేస్తుంది. ఆ ద్వారంలోంచి లోపలికి వస్తాం వచ్చిన తరువాత రామ చంద్ర మూర్తికి పట్టాభిషేకము అభిషేకము జరుగుతుంది. అద్బుతంగా మంత్రభాగాన్ని ఋత్విక్కులు చదువుతారు అదంతా లైవ్ టెలిక్యాస్టు చేస్తారు స్క్రీన్స్ మీద, మీ అందరూ చక్కగా కూర్చునుంటే అపురూపమైనటువంటి దృశ్యం లోపల మూల విరాట్టుకీ హనుమకీ ఏకకాలంలో అబిషేకం జరుగుతుంది.
ఆ అభిషేక ద్రవ్యాల్నీ మీ శిరస్సున ప్రోక్షణ చేస్తారు ఇక్కడ హోమంచేసే యజ్ఞ వేదిక తయారైపోయింది దానిమీద దేవతల్నందర్నీ పిలిచి హవిస్సులిస్తారు ఆ మంత్రభాగం ఆ హవిస్సులివ్వడం పిలవడం మంటపాలలో అనేక నదీ జలాలు సముద్రజలాలను పెడుతారు అవన్నీ అభిషేకానికి వెడుతాయి ఒక గంటసేపు గంధర్వగానం జరుగుతుంది రామ చంద్ర మూర్తి మీద గంటసేపు కచేరి జరుగుతుంది లోపల ఆ కచే  రి అయిపోయిన తరువాత మధ్యాన్నం భోజన విరామ సమయం ఇస్తారు. మళ్ళీ సాయంకాలం ఆరుగంటలకే సభ ప్రారంభమౌతూంది అప్పుడు మీరు ఈ వేదిక ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలా ఉండదు. ఇదంతా రామ చంద్ర మూర్తి పట్టాభిషేకానికి యోగ్యమైనటువంటి దర్భారుహాలు ఎలా ఉంటుందో అలా తయారైపోతుంది. పుష్పాలంకృతమై ఉంటుంది ఎంత మంది కళాకారులో ఎంతమంది ఋత్విక్కులో ఎంతమంది వేదపండిలో ఇంతమంది వస్తారు అప్పుడు పట్టాభిషేకానికి వచ్చి కూర్చున్నటువంటి రామ చంద్ర మూర్తి పాదాలదగ్గర కూర్చుని పట్టాభిషేక సర్గ చెప్తాం. చెప్పినప్పుడు స్వామికి అలంకారమయ్యేటటువంటి కిరీటాల్ని పెడుతారు


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
శ్రీ రామ నవమినాడు ఎదురుగుండా కిరీటంలేకపోయినా రామ చంద్ర మూర్తికి ధరింపజేసే కిరీటం ఉందీ అనుకుని పట్టాభిషేకంలో మఖుటధారణ సర్గా అంటారు, ఆ సర్గని పారాణ చేస్తారు, చెయ్యాలి ఈ సంవత్సరం మేము పారాయణ చేశాము అయ్యప్పస్వామి గుళ్ళో. ఎక్కడ పట్టాభిషేకం చేసినా అక్షతవేస్తారు తప్పా నిజంగా కిరీటాలు తీసుకొచ్చి ఎవ్వరూ పెట్టరు ఎందుకంటే స్వర్ణ కిరీటాలు చేయించడమంటే అంత మాటలుకాదు.
మహానుభావుడు ఈశ్వరుడు ఆయనకిచ్చిన వైభవాన్ని సార్థకం చేసుకున్నారు మూడు బంగారు కిరీటములు చేయించారు ఆ కిరీటములు ఇక్కడ వేదికమీద పెట్టి వాటికి ప్రోక్షణ జరిగిన తరువాత అప్పుడు పట్టాభిషేక సర్గ చెప్తారు, చెప్పినప్పుడే ఫలశృతి చెప్తారు. పట్టాభిషేకం అక్కడ ఎలా జరిగిందో సభ ప్రారంభమౌతుంది ప్రారంభమై చక్కగానూ రామ చంద్ర మూర్తి పట్టాభిషేకం శ్రీరామాయణం విన్నందుకు మీరు పొందుతున్నటువంటి అనుగ్రహం ఆ ఫలశృతి చెప్తాం అప్పుడు. అప్పుడే దేవతలందరూ వచ్చి ఆకాశంలో నిలబడుతారు అప్పుడు రామ చంద్ర మూర్తికి రాజ లాంచనాలు ఇస్తారు, చేత్తో పట్టుకోమని రాజదండం, వేసుకోవడానికి పాదుకలు, కింద పెట్టడానికి పాదపీఠం అలాగే ఆయనకి కిరీఠధారణ చేయిస్తారు సింహాసనంమీద కూర్చోబెడుతారు ఆ నదీ జలాల్ని ప్రోక్షణచేస్తారు ఇన్ని జరుగుతాయి ఆయనకి, ఆరోజునా రామ చంద్ర మూర్తికి వైఢూర్యములతో కూడినటువంటి వజ్రాలతో కూడినటువంటి పథకము లక్ష్మణ స్వామికి కెంపులతో కూడిన పథకము సీతమ్మ తల్లికి పచ్చల పథకము స్వామి హనుమకి ముత్యాలహారం ఇవన్నీ కూడా చేయించి సమర్పణం చేయిస్తున్నారు. ఆరోజు నిజంగా రామ చంద్ర మూర్తికి ఎలా చేశారో... అలా ఇవన్నీ సమర్పణం చేస్తారు చేసిన తరువాత స్వామికి దర్భారులో నిజంగా ఎలా జరుగుతుందో ఏదో గజాన్నారోహయామి అంటారు అక్షతలు వేస్తారు అలాగ కాదు ఇంత పెద్ద వెండి ఏనుగును తీసుకొచ్చి స్వామివారికి అక్కడ పెడతారు అది ఇంతకు ముందు వాడబడిన ఏనుగుకాదు కొత్త ఏనుగు, ఆ ఏనుగును అక్కడపెట్టి కూర్చోబెడుతారు. ఊయల తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ పెడుతారు పెట్టి స్వామికి దర్పణం దర్శయామి అంటే ఆ మంత్రంతోటి ఆ అద్దం చూపిస్తారు.
నృత్యం దర్శయామి అంటే నిజంగా డాన్సు చేసి చూపిస్తారు, వాద్యం ఘోషయామి వీణ వాయించి చూపిస్తారు అలాగే స్వామికి గీతం శ్రావయామి మంచి రెండు కీర్తనలు పాడి వినిపిస్తారు, ఇలా దర్భారు జరుగుతుంది ఆరోజు రామ పట్టాభిషేకంలో మనందరం అయోధ్యావాసులం అపురూపంగా జరుగుతుంది. ఇలాంటి అవకాశం అసాధారణము అని చెప్తారు ఎందుకంటే నరుడికథ రామ కథా సత్యమైన కథ పట్టాభిషేకంలో ఇన్ని సంబారాలతో పట్టాభిషేకం జరగడం సాధారణంగా లోకంలో ఎక్కడా ఉండదు. ఎక్కడో ఒకసారి అక్షతలు వాడేస్తారు కానీ ఇన్ని సంబారములతో జరుగుతూంది ఈ పట్టాభిషేకం చూసినవారిది వైభోగం కాబట్టి ఆరోజున మళ్ళీ సాయంకాలం ఆరుగంటలకు వచ్చేస్తే ఉద్యోగాలు చేసేవారందరూ సెలవు పెట్టేయండి ఏం ఫర్వాలేదు సంతోషంగా మనం ఈ కార్యం చేసుకుందాం. దానివల్ల మీకు రెండు ప్రయోజనాలు ఏమిటంటే ఒకటి మీరు పట్టాభిషేకంలో పాల్గొంటారు ఊరెరిగింపుకి వస్తారు, రెండు పాపం ఆరోజున నేను ఎలాగో వచ్చేశాను ఆయనకు టిఫిను ఎలాగో అని ఈవిడ ఖేదపడుతూ నడవక్కరలేదు సంతోషంగా నడుస్తుంది ఆయనా నా వెనకాలే ఉన్నారని కాబట్టి మీ భార్యని


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
సంతోషపెట్టడానికి వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించడానికి ఇదొకమహదవకాశం కాబట్టి సెలవుతోటి చక్కగా భార్య పిల్లలూ అందరూ రండి మీరు ఈ లోపలికి ప్రవేశించగానే మీమ్మల్లందర్నీ రామ చంద్ర మూర్తియొక్క ఆంతరమైనటువంటి సన్నిహితులుగా భావిస్తారు.
దానికి ఏం చేస్తారో తెలుసాండి... మీరు లోపలికి రాగానే రామ చంద్ర మూర్తి మీకు ఆహ్వానమిచ్చాడన్నమాట మీరు నా పట్టాభిషేకానికి రండని కాబట్టి మీరు లోపలికి ప్రవేశిస్తే ఎలా పడితే అలాగ అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అనకూడదు మీరు రామ చంద్ర మూర్తి ఆంతరంగికులు కాబట్టి మధుపర్కం పుచ్చుకోండని చెప్పి నిమ్మకాయ నీళ్ళు పంచదార నీళ్ళు కలిపి తేనె కలిపి మీకిస్తారు మధుపర్కం పుచ్చుకోండని, ఆ మధుపర్కాన్ని త్రాగుతారు అంటే ఎవరు ఊరెరిగింపులోవచ్చి అందులో నడుస్తారో వారందరూ మధుపర్కం పుచ్చుకుని రాముడికి ఆంతరంగికులౌతారు. ఆంతరంగికులై లోపల కూర్చుని పట్టాభిషేకం చూస్తారు. ఇంతటి మహత్కార్యం కాబట్టి చక్కగా మీ అందరూ రేపు సాయంకాలం నుంచి ఇంక చక్కగా పట్టాభిషేక సర్గవైపుకి అడుగులు ప్రారంభమౌతాయి. ఎల్లుండి తెల్లవారుఘాము గుంటూరికి ఇతః పూర్వం ఎన్నడూలేని తెల్లవారుఝాము అంతగొప్పరోజుగా ఈ గుంటూరు చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించబడవలసిన అక్షరములుగా మిగిలిపోయేటట్టుగా మనందరం పరమ భక్తితో రామ చంద్ర మూర్తిని సేవించుకుందాం. కాబట్టి మీలో ఎవరైనా ఉత్సాహికులు మిమ్మల్ని నేను నిర్బందం చెయ్యట్లేదు భక్తితో మాత్రమే చేస్తానంతే తప్పితే నేను మిమ్మల్ని నిర్భందంగా చెయ్యమని అడగను. ఆ సేవ మిగిలితే నేను చేసుకుంటాను తప్పా మిమ్మల్ని నిర్భిందించడం నా లక్ష్యంకాదు. అయ్యో ఏమయ్యా! మేం చేసుకుందుకుముకదా... ఆ ఊళ్ళోనూ వాళ్ళే ఇక్కడా వాళ్ళే నీవు మమ్మల్ని ఎందుకు అడగలేదు అంటారేమోనని నేను చెప్తున్నాను. మీరెవరైనాకాని రోడ్లు తుడవడానికి ఒక్క ఎనమండుగురు సిద్దంగా ఉంటే స్వామి వచ్చే ముందు తుడుస్తారు పెద్ద పెద్ద చీపుళ్ళిస్తారు కర్రకు కట్టినవి మేము నిర్మొహమాటంగా తుడుస్తాం మాకు భయంలేదు ఈశ్వరసేవ అనుకున్నవారుంటే కొంచెం బలంగా చెయ్యగలిగినవాళ్ళైతే శరీరము అనుమతిస్తే మగవాళ్ళుకాని ఆడవాళ్ళుకాని మీ పేర్లు నాకివ్వకండి నా దగ్గర అక్కరలేదు పట్టుకెళ్లి హరిప్రసాదుగారికి ఇవ్వండి ఆయన రాసుకుంటారు పేర్లు ఆ యనమండుగురికీ కూడా పసుపురాసి బొట్టుపెట్టిన చీపుళ్ళు ఇస్తామండీ ఆ రోజునా అదేదో పెద్ద పట్టాభిషేకంలో ఇచ్చినట్లు ఇస్తాము ఆ చీపురుకూడా అంత గౌరవంగా ఉంటుంది పట్టాభిషేకంలో తుడవడమంటే మాటలుకాదు జన్మ పరంపరే మారుతుంది ఒక్కొక్కసారి వీదుల మీద తుడుస్తే. కాబట్టి అంతటి మహద్భాగ్యం అలా తుడవగలిగినవాళ్ళెవరైనా ఉంటే పేర్లివ్వండి ఇప్పుడుకాదు సభా అయిపోయిన తరువాత లేకపోతే దానికి రామ చంద్ర మూర్తి నిర్ణయించుకున్నవారు చేస్తారు.

కాబట్టి ఇవ్వాళ ఒక్క పదకొండుమార్లు రామా నామాన్ని పరమ సంతోషంగా చెప్పుకుందాం రావణ వధ పూర్తైయ్యిందికాబట్టి

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామ నామము !!రా!!
భక్తితో భజియించువారికి ముక్తి నొసగును రామ నామము !!రా!!
యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగ ధ్వంసము రామ నామము !!రా!!
మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీ రామ నామము !!రా!!
జీవితంబున నిత్యజపముగా చేయవలె శ్రీ రామ నామము !!రా!!
విషయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీ రామ నామము !!రా!!
అష్టదళముల కమలమందున అమరి యున్నది రామ నామము !!రా!!
నిజ స్వరూపము బోదకంబగు తారకము శ్రీ రామ నామము !!రా!!
జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీ రామ నామము !!రా!!
త్రికుటమధ్యమునందు వెలిగే జ్ఞానజోతియే రామ నామము !!రా!!
బ్రహ్మపుత్ర కరాబ్జవీణ పక్షమైనది రామ నామము !!రా!!
జానకీ హృత్ కమలమందున అలరు చున్నది రామ నామము !!రా!!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీ రామ నామము

ఇవ్వాళ ఆదిత్యహృదయం జరిగింది కాబట్టి రేపు ఉదయం సూర్యనమస్కారాలు జరుగుతాయి, చక్కగా సూర్యనమస్కారాలు జరుగుతూండగా మీ అందరూ కూర్చుని ఆదిత్యహృదయాన్ని పార్థనచెయ్యండి. మీ అందరు చక్కగా కూర్చుని మీలో ఎవరైనా ఆదిత్యహృదయం తప్పులు లేకుండా ఉచ్చారణ దోషంలేకుండా చెప్పగలిగినటువంటివారిని వేదికమీద కూర్చోబెట్టుకుని ఆయన చెప్తూండగా మీరు చెప్తే మీకు కూడా చక్కగా ఆదిత్యహృదయ పారాయణ చేస్తే ఇవ్వాళ అంతగొప్ప ఘట్టం నడిచింది కాబట్టి మీరు తత్సంబధమైన అభ్యున్నతిని పొందుతారు. ఏదో ఒకవేళ పెట్టుకుంటే అందరూ కూర్చుని దాన్ని చక్కగా పూర్తిచెయ్యెచ్చు. పది గంటలకి సూర్య నమస్కారాలు ప్రారంభమౌతాయి, ఆయన నమస్కారం చేస్తుంటాడు కాబట్టి పదిన్నరకి మీరు ఆదిత్యహృదయాన్ని పారాయణ చేసుకోవడము మొదలు పెట్టండి చక్కగా లోపల కూర్చుని మీరు ఆదిత్యహృదయం పారాయణ చేసుకుని తీర్థాన్ని తీసుకుని అందురూ వెళ్ళండి. వెళ్ళితే ఆదిత్యహృదయం సూర్యనమస్కారాలతో చేసి ఆ తీర్థం పుచ్చుకుంటే చాలు గొప్ప అనుగ్రహం కలుగుతుంది సూర్యనారాయణ మూర్తిది. కాబట్టి రేపు చెయ్యండి నాకు అవకాశం ఉంటే నేను వచ్చి చెప్పిస్తాను ఒక వేళ ఏ కారణం చేతనైనా నేను రాకపోతే రేపు పదిన్నరకి వేరొకరు ఎవరైనా ఆదిత్యహృదయాన్ని, నవగ్రహాలలో సూర్యనారాయణ మూర్తికి తప్పకుండా చేయించాలి అక్కడ చేయిస్తూ ఇక్కడ సూర్య నమస్కారాలు జరుగుతాయి, నవగ్రహాలలో సూర్యనారాయణ మూర్తికి అభిషేకం జరిగి రేపు ఇక్కడా సూర్య నమస్కారాలు జరుగుతాయి పదిన్నరకీ 99.5 పాళ్లు నేను వస్తాను సాధ్యమైనంతవరకు వచ్చి నేను చెప్పిస్తాను,


  యుద్ధ కాండ నలభైయవ రోజు ప్రవచనము
ఎంతసేపు ఆదిత్యహృదయం నేను చెప్పించి వెళ్ళడానికే శతదా ప్రయత్నిస్తాను ఏ .0001 నేను రాలేకపోతే అప్పుడు అక్కడ ఆ స్థానంలో కూర్చుని చెప్పించేవాళ్ళని హరిప్రసాదుగారు నిర్ణయంచేస్తారు, బహుశః అలా ఈశ్వరుడు వచ్చే అవకాశం కల్పిస్తాడనే నేను అనుకుంటున్నాను కాబట్టి...
మంగళా....

No comments: