హనుమా సీతమ్మతల్లి దర్శనం కొరకూ అని
తన అన్వేషణని కొనసాగిస్తున్నారు, బాహ్యమునందు లంకాపట్టణంలో అన్వేషణ ఆంతరమునందున
ఉపాసనా, ఆ లంకాపట్టణంలో అన్వేషిస్తూ ప్రధానమైనటువంటి ఆ రావణాసురుని యొక్క
భవనముమునకు చేరుకున్నారు. ఇక్కడ మహర్షి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు,
ప్రతిపాదన అనగా యదార్థంగా రామాయణంలో ఉన్నదే, రామాయణం నేను మీకు తరచూ చెప్తూంటాను వాల్మీకి మహర్షి ఆచమనం చేసి
కూర్చుంటే జరిగిన కథా జరుగుతున్న కథా జరుగబోయే కథా ఆయనకి కేవలం పైన జరిగిన విషయాలు
కాదు మనః ప్రవృత్తితో సహా వాళ్ళు మనసులలో నిజంగా ఏమనుకుంటున్నారో అన్నదికూడా ఆయనకి
అవగతమైపోతూంది, అవగతమై చేసినటువంటి రచనా శ్రీరామాయణం. అందుకని అందులో
కించిత్ “అనృతం” అంటే ఎక్కడ కూడా కల్పితమైనటువంటి విషయము ఏదీ ఉండదు పరమ యదార్థమైనటువంటి విషయాన్నే ఆయన
ప్రతిపాదన చేశారు భేరీ మృదఙ్గాఽభిరుతం శంఖు ఘోష వినాదితమ్ ! నిత్యాఽర్చితం
పర్వ హుతం పూజితం రాక్షసై స్సదా !! భేరీ మృదఙ్గాఽభిరుతం ఇవీ ఒక పూజలో
వాడబడేటటువంటి ధ్వనులు వాద్య పరికరములు భేరీలు మోగిస్తున్నారు మృదంగములు
మోగిస్తున్నారు భేరీ మృదఙ్గాఽభిరుతం శంఖ ఘోష వినాదితమ్ శంఖాల్నీ
పూరిస్తున్నారు. శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు నిత్యాఽర్చితం
ప్రతిరోజు పూజ చేస్తారు లంకా పట్టణంలో ప్రత్యేకించి రావణ భవనంలో ప్రతిరోజు పూజ
జరుగుతోంటుంది పర్వ హుతం పర్వ హుతం అంటే పర్వదినములుగా మనం వేటిని చెప్తామంటే
ప్రధానంగా “పౌర్ణిమ-అమావాస్య” ఈ రెండు. ఇవి కాక నైమిక్తిక తిథులు ఉంటాయి.
నైమిక్తికతిథిలు అంటే విశేష కార్యక్రమాలు జరుగవలసినవంటి రోజులు అటువంటి రోజులులో పూజితం
రాక్షసై స్సదా అక్కడ రాక్షసులు ఎప్పుడూ పూజ చేస్తుంటారు.
ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు చాలా
జాగ్రత్తగా అన్వయం చేసుకోవలసి ఉంటుంది అదే సుందర కాండ, ఇప్పుడు రావణుడి తప్పు
ఎక్కడ కనపడుతోంది మీకు, ఆయన
నిత్యపూజా చేయిస్తాడు ఆయన నైమిక్తిక పూజా చేస్తాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళినా ఓ
శివలింగాన్ని తీసుకెళ్తాడు తీసుకెళ్ళి పూజచేస్తారు. ఇదీ వాల్మీకి రామాయం
మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మహర్షి ఇదీ చెడు అనరు ఇది మంచీ అనరు ఏది
ఎలా జరిగిందో మీకు చెప్తారు. మీరు దాంట్లోంచి సారాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇది
ఎవరు చూస్తున్నారు విషయాలన్నీ ఎవరు చూస్తే ఈ విషయం వాల్మీకి మహర్షి చెప్పవలసి వచ్చింది
మనకి, ఇది ఓసారి రావణుని గురించి చెప్తామని మనకు చెప్పారా... హనుమ చూస్తున్నారా ఈ
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
విషయాన్నీ... హనుమ చూస్తుంటే ఈ విషయం బయటకొచ్చింది. ఇప్పుడు
ఇది హనుమ కన్నులద్వారా మనకు వస్తుంది ఈశ్లోకం, ఆయన చూశారు ఏం చూశారు భేరీ
మృదఙ్గాఽభిరుతం భేరీ మృదంగాది ధ్వనులు వినపడుతున్నాయి శంఖ ఘోష వినాదితమ్ శంఖముల
యొక్క ఘోష వినపడుతూంది నిత్యాఽర్చితం ప్రతిరోజూ పూజచేస్తారు అనడానికి
సాక్ష్యాలు ఉన్నాయి, ప్రతిరోజు పూజ చేస్తాడు రావణుడు నిత్యార్చనయందు వైక్లవ్యముండదు ప్రతిరోజు
చెయ్యవలసింది చేస్తాడు ప్రతిరోజు చెయ్యవలసింది అంటే సంధ్యావందనం ప్రధానం.
సంధ్యావందనం కూడా చేస్తాడు అర్చనకూడా చేస్తాడు పర్వ హుతం
పర్వదినములలో ఏమి చేయాలో ఆ విశేషార్చనలు చేస్తాడు పూజితం పూజిస్తాడు రాక్షసై
రాక్షసులు రావణాంతఃపురమునందుండేటటువంటి రాక్షసులు స్సదా ఎప్పుడూ...
ఇప్పుడు హనుమవెళ్ళారని కాదు ఎప్పుడూ చేస్తారు.
ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి, రావణాసురుడు చెడ్డవాడూ
అనడానికి ఈ శ్లోకంలో ఏమైనా ఆధారముందా మరి ఈశ్వరుడి అనుగ్రహం రావణుడికి ఉండద్దా ఈ
శ్లోకాన్నిబట్టి, ఈశ్వరానుగ్రహం
కలగాలిగా... ఎందుకనీ అంటే స్సదా ఎల్లప్పుడు నిత్యనైమిక్తిక కార్యక్రమములను
నిర్వహించడంలో ఆయన ఏవిధమైనటువంటి అశ్రద్ధ లేనివాడు. ఎంత శ్రద్ధగా చేస్తాడూ
అనడానికి ఉదాహరణ ఏమిటంటే..? రాజోపచారాలని ఉంటాయి ఇవి నోటితోచెప్తామంతే సాధారణంగా రాజోపచారం
చెయ్యం, చెయ్యమని వదిలిపెట్టం ఓ పువ్వోటి తీసుకుని అక్షతలు వేస్తూ...
రాజోపచారాలన్నీ చెప్పేస్తాము, ఏదో విశ్వన్నారోహయామి ఓ అక్షతా, అంటే ఆ
స్వామి ఏనుగు ఎక్కితిరిగాడు కాసేపు అలా గజ్జాన్నారోహయామి ఏనుగెక్కాడు
గుర్రమెక్కాడు అలాగే ఓ నృత్యం నృత్యం దర్శయామి అంటే నిజంగా ఓ నృత్యం చేసి
చూపించాలి ఈశ్వరుడికి అయిపోయింది చేసేసినట్లే ఓ అక్షత, గీతం శ్రావ యామి ఓ అక్షత అయిపోయింది, గీతం శ్రావ యామి
అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు పడితేవాళ్ళు పాడకూడదు. మీ ఇంట్లో ఏమో... మీ
ఇంట్లో మీరు పాడుకుంటే అభ్యంతరంలేదు. కానీ ఈశ్వరుడికి గీతం శ్రావ యామి
అన్నప్పుడు మాత్రం మంగళహారతి పాడితేతప్పులేదు, కానీ గీతం శ్రావ యామి అని
రాజోపచారం చెప్పినప్పుడు మాత్రం గురుముఖతహా సంగీతం నేర్చుకుని రాగతాళ పరిజ్ఞానం
ఉంటేతప్పా ఆపాట ఈశ్వరుని ముందు పాడించకూడదు, నాకు పాటొచ్చండీ అంటే పాడించకూడదు,
రాగతాళముల యొక్క పరిజ్ఞానము కలిగి ఉండాలి, కలిగి ఉంటే మీరు అందులో పాడించచ్చు.
కాబట్టి ఇప్పుడు పూజితం
పూజిస్తుంటాడు, అంటే మామూలుగా కాదు అక్కడ వాడవలసినటువంటి గొప్ప గొప్ప
పరికరములన్నింటినీ వాడుతుంటాడు, మరి ఇన్ని చేసేటటుంటివాడికి ఈశ్వరకృప ఎందుకు
కలగలేదు, ఎందుకు పది తలకాయలు పడిపోయాయి దీన్ని మీరుజాగ్రత్తగా విచారణ చేయ్యగలగడం
సుందర కాండ. అలా మీరు విచారణ చెయ్యగలిగిననాడు మీకు అందులోంచి ఒక అమూల్యమైనటువంటి
సారమొకటి మీకు అందుతుంది, అది అందితే జీవితానికి ప్రయోజనం కలుగుతుంది, అది మీరు
అందుకోలేకపోయారనుకోండి. సుందర కాండ చదవడం తప్పా అంటే అని నేనేమీ అనను అది ఒకనాటికి
అవకాశాన్నిస్తుంది అర్థం చేసుకునే అవకాశాన్ని. కాబట్టి రావణునికి ఈశ్వరానుగ్రహం
పరిపుష్టమై ఉన్నది, ఉంది కాబట్టే మీరు నిన్నను విన్నటువంటి ఐశ్వర్యాన్నంతటిని ఆయన అనుభవిస్తున్నాడు,
అంత ఐశ్వర్యముంది కాంచన లంకాధిపత్యం ఉంది ఆయన అనుభవించనటువంటి బోగమన్నదిలేదు అన్ని
భోగాలు అనుభవిస్తున్నాడు.
ఇప్పుడు ఇది చూస్తున్నాయన
ఒకాయనున్నాడు ఆయనెవరు హనుమా, ఆయనా ఏది కోరి ఇక్కడికి వచ్చారు ఆయన కోరుకున్నది ఏమీలేదు తనకీ అని
ఆయన కోరుకున్నది ఏముంది ఏమీలేదు, విద్యాధరలో చెప్పారు రామార్థం
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
వానరార్థం చ చికీర్షన్ కర్మ దుర్కరమ్ ! సముద్రస్య పరం పారం దుష్ర్పాపం
ప్రాప్తుమిచ్ఛతి !! రాముని కొరకు వానరుల కోరకు తప్పా ఆయన కొరకు ఏమీ లేదు తన కొరకూ అని తాను
చేసుకోనివాడు తన కొరకూ అని పూజ చెయ్యనివాడు తన కొరకూ అని కోర్కెలేనివాడు ఒకడు,
పొందిన ఈశ్వరానుగ్రహాన్నంతట్నీ తనకొరకూ అని చూసుకుంటున్నవాడు ఒకడు. ఇప్పుడు ఈ
రెండు విభేదించనంత కాలం ఇబ్బందేమీ ఉండదు, ఈ రెండూ విభేదించాయనుకోండి అంటే
నిస్వార్థంగా అంటారు, ఏ కోరికా లేకుండా ఆయన ఒక సంకల్పం చేస్తే ఆయన సంకల్పానికి
వ్యతిరేకంగా ఈయ్యన ఉన్నాడనుకోండి, ఎవరు ఈశ్వరానుగ్రహాన్ని పొంది దాన్ని స్వార్ధానికి వాడుకుంటున్నవాడు,
కేవలం స్వార్ధానికి అది ధర్మ వ్యతిరిక్తమైనాసరే... తాను చేసిన తపస్సు చేత తాను
భోగమును అనుభవించడం అన్నదానికి కట్టుబడిపోయినవాడికి వీళ్ళిద్దరూ ఎదురుగుండా
వస్తే... ఎవరి శక్తి ఎవరి శక్తిని పడగొట్టగలదు ఎంతమంది వెనక ఉన్నారన్నది మీకు
అనౌసరం, పైకి చూడడానికి చాలా మంది రావణుని వెనక ఉన్నట్లు ఉంటారు, హనుమ వెనక ఎవరు
లేనట్లుంటారు కానీ నిష్కామంగా
ఉపాసన చేసేటటువంటి వ్యక్తి యొక్క వైభవం ముందు కామంతోటి అంటే కామ్యోపాసనయై
ఈశ్వరుడివలన పొందినటువంటి అనుగ్రహాన్ని తన స్వార్థము కొరకు ఇంద్రియ భోగము కొరకు
అనుభవిద్దామనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నిలబడలేడు.
ఉపాసన క్రమంలో ఎవరి ఉపాసన ముందు ఎవరి ఉపాసన నిలబడదో... బాహ్యంలో బలపరాక్రమములు
చంపడంకాదు రావణున్ని, రావణున్ని ఎవరు చంపేయడం మొదలు పెట్టారంటే ఇప్పుడు సుందర
కాండలో హనుమ చంపేయడం ప్రారంభంచేసేశారని గుర్తు. దీనికి ఎక్కడ పడింది బీజం, ఆయనా
నందీశ్వరుడుగా నిల్చున్నారు అని చెప్పారు మహర్షి దుష్కరం నిష్ప్రతిద్వందం
చికీర్షన్ కర్మ వానరః ! సముదగ్ర శిరో గ్రీవో గవాం పతి రివా బభౌ !! ఆ శివుడికే
ఘోరరూపముంది ఆ శివుడికే మంగళరూపముంది, ఆశివుడు ఆగ్రహిస్తే ఘోరరూపం కళ్ళంబట నీళ్ళు
తెప్పిస్తాడు ఉగ్రుడౌతాడు, ఆ శివుడు అనుగ్రహిస్తే మంగళప్రదుడౌతాడు. ఆ శివుడు శివుడిగా
ఉన్నాడు రావణునిపట్లా అనుగ్రహించాడు, ఒక ఖడ్గాన్నిచ్చాడు ఐశ్వర్యాన్నిచ్చాడు
వరాలిచ్చాడు పదితలకాయలిచ్చాడు, అవసరమైనప్పుడు పదితలకాయలు లేకుండా ఒక్క తలకాయతో
ఉండగలిగినటువంటి శక్తినిచ్చాడు వాటిని దుర్వినియోగం చేసినప్పుడు ఆయనే
రుద్రుడౌతాడు. ఆయనే రుద్రుడైతే ఇవేవీ నిలబడవు, ఆయనే రుద్రుడైనప్పుడు దాన్ని
పడగొట్టడానికి నిస్వార్థమైనటువంటి వ్యక్తి అటువంటి నిష్కామంగా ఉపాసన చేసేటటువంటి
వ్యక్తి త్యాగియైనటువంటి వాడు ఎవడుంటాడో, మాహాత్యాగి అంటే ఆయన తనకొరకు అని కోరుకునేది ఏదీ ఉండదు ఆయన
కోరుకునేది ఏమిటంటే కేవలము ఈశ్వర భక్తి ఎంత ఎదగనివ్వండీ ఎప్పుడూ ఒకటేమాట చెప్తాడు
ఈశ్వరానుగ్రహమండీ అంటాడు తప్పించి నేను సాధించాను అని ఆయనేమీ అనడు.
కానీ బాహ్యంలో ఎలా ఉంటుందో
తెలుసాండీ... ఆయన చాలా కష్టపడుతున్నాడు అనిపిస్తుంది నిజం కూడా అంతే యదార్థం కూడా
అంతే లోకంలో, నిష్కామమైనటువంటి ఉపాసనచేసేటటువంటివాడు ముందు నిలబడి విన్నవాళ్ళు
వెనకెళ్ళి తెంపేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ పాపం కట్టికుదిపేస్తుంది చాలా
మీరిది గుర్తుపెట్టుకోవలసిన విషయం, నిష్కామోపాసకుల జోలికి వెళ్ళకూడదు. ఏ కోరికాలేకుండా ఈశ్వరున్ని ఉపాసన
చేసేటటువంటివాడిముందు కామంతో ఉపాసన చేసి పుణ్యలబ్ది పొందినటువంటివాడు ఎంత హిమవత్
పర్వతమంతవాడైనా సరే... నిలబడలేడు ఆయన శక్తియే ఎక్కువ, ఎందుకంటే నిష్కామోపాసన
తన ఉపాసనా మళ్ళీ భగవత్ పరంగా పదిమంది ప్రయోజనం కోసం ఉపయోగించడమే
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
తప్పా తనకొరకూ
అని వాడుకుందామన్న ఆలోచనకూడా లేనివాడు ఎవడో... వాడిపట్ల మీరు మర్యాదతో
ప్రవర్తిస్తే మీకు పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం కలుగుతుంది, ఇది మీరు
పొందలేకపోతే మీకు అటువంటివాడి యొక్క మాట ఏది ఉందో అటువంటివాడి కోపం ఏదుందో అదే
పడగొట్టేస్తుంది అదే హనుమ యొక్క స్వరూపం.
అత్యద్భుతమైనటువంటి స్వరూపంతో ప్రకాశిస్తున్నాడు స్వామి ఇప్పుడు సుందర కాండలో,
ఇప్పుడు ఆయన దర్శనం మీరు ఆయన్ను అలా చూడ్డం ఆ కోణంలో మీకు ఆయన కనపడడం మీకు పరమ
మంగళ ప్రదమైనటువంటి దర్శనం సుందర కాండలో. అంటే అది ఏమి చెప్తోంది అంటే... మీ
జీవితాన్ని మార్చుకోవలసిన సందర్భాన్ని చెప్తూంది, ఎటుంటి ఉపాస చెయ్యవలసి ఉంటుంది
ఎటువంటి ఉపాసన వలన మీరు అభ్యున్నతిని పొందుతారు శాశ్వతమైన అభ్యున్నతి ఏమిటో తెలుసాండి ఈశ్వరానుగ్రహాన్ని
నిలబెట్టుకోవడమే... ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకున్నవాడు నిష్కామోపాస
చేసినవాడు యుగాలు మారిపోయినా అలాగే ఉంటాడు, యుగాలు మారిపోయిన తరువాత సృష్టికర్త
అవుతాడు. హనుమ చతుర్ముఖ బ్రహ్మగారు కావట్లా..! కానీ ఎవడు స్వార్దానికి
ఉపయోగించుకుంటాడో వాడు వెలుగుతాడు కొంతకాలం కానీ ఆవెలుగు ఎలా ఉంటుందంటే
ఆరిపోవడానికే పనికొస్తుంది. అది క్రమ క్రమంగా క్రమ క్రమంగా ఆ భోగము ఎటువైపుకు
వెళ్ళిపోతుందంటే అధర్మం వైపుకు వెళ్ళిపోతుంది, ఆ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి
భోగం ఎంతమంది ఏడుస్తున్నారు ఎంతమంది బాధపడుతున్నారు అన్నదాన్ని ఆలోచించడు.
ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి దీన్ని మహర్షి సుందరకాండలో చాలా చిత్రంగా
ఆవిష్కరిస్తాడు, నిద్రపోకుండా ఎవరుంటారండీ..! నిద్రపోకుండా ఎవరూ ఉండరు. మీకు ఇంకొక
రహస్యమేమిటంటే బాగా ఏడిస్తే బాగా నిద్రపడుతుంది, నేను మీతో ఒక యదార్థం
చెప్తున్నాను బాగా ఏడ్చాడనుకోండి ఒకాయనా ఏడ్చి ఏడ్చి ఏడ్చీ మగతొచ్చి పడుకుంటాడు
లేపకండీ పాపం ఏడ్చి ఏడ్చి ఏడ్చీ పడుకున్నాడు పడుకోనివ్వండి అలా అంటారు, కానీ మీ వలన ఏడ్చి
పడుకున్నాడనుకోండి మిమ్మల్ని కొట్టేస్తుందది ఎందుకో తెలుసా మీ వలన
ఏడ్వకూడదు.
మీ వలన ఏడ్చి పడుకుంటే అదే ప్రమాదం, మీ వలన ఎవ్వడూ ఏడ్వకూడదు అందుకే సనాతన ధర్మమంతా ఒక్కటే మాట చెప్తోంది “ఓం శాంతి శాంతి శాంతిః” పడుకున్నప్పుడు
కూడా ఆయన్ని చూసి ఆ పడుకున్న రీతికి ఏడుస్తుంది భార్య, ఇది ఎక్కడా మహర్షి ఏమీ అనరు
అలా ఏమీ ఆయనా ఇది తప్పనరు ఇది ఒప్పనరు. నేను మీకు ముందే ఒక ఉదాహరణ చెప్పాలీ అంటే
అప్పుడు ఆ ఘట్టంలో మీరు బాగా పట్టుకుంటారు, పట్టమహిషీ పక్కనే ఒక పట్టెమంచం మీద
పడుకుంది, హంసతూలికా తల్పంమీద, ఈయన కొన్ని వందల మంది కాంతలతో భోగించి అలసిపోయి
ఈయ్యన పడుకున్నాడు, ఇప్పుడు ఆ పడుకున్న పట్టమహిషి ప్రశాంతంగా పడుకుంటుందా..? ఎంత
బాధపడి నిద్రపోయి ఉండింటుంది, నిద్రపోతున్నాడు ఆవిడా నిద్రపోతూంది కానీ వీడికి భోగమనుభవించిన
నిద్ర వీడి యొక్క అధర్మంతో కూడినందుకు ఏడ్చి పడుకుంది పట్టమహిషి. ఇంటి ఇల్లాలి
యొక్కబాధ పడగొట్టక ఏం చేస్తుందండి మీకు సుందర కాండలో ఇంకొక పెద్ద రహస్యం
చెప్తున్నా యజమానిని
నశింపజేసేదేదో తెలుసా... యజమానురాలి కన్నీరే... ఇంక ఏమీ ఉండదు నేను మీకు
యదార్థం చెప్తున్నాను, మీ
అభివృద్ధి దేన్నిపట్టి ఉంటుందో తెలుసా... మీ ఆవిడ సంతోషాన్నిబట్టే ఉంటుంది. మీ
ఆవిడ సంతోషం దేన్నిబట్టి ఉంటుందో తెలుసా మీరు ప్రేమగా చూడ్డంబట్టే ఉంటుంది.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రపంచంలో ఏ భార్యా
కూడా మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని కోరదు, నేను నిజం చెప్తున్నాను మూడు
లోకాలలోనున్న ఐశ్వర్యాన్నంతటినీ నా దగ్గరికి తెచ్చుపెట్టూ అని ఏ భార్యాయైనా అంటే
ఆమె నిస్సందేహంగా దుర్మార్గురాలే... ఏ భార్యయైనా నేను మాట్లాడేటప్పుడు ఒక సత్
ప్రవర్తన కలిగిన వ్యక్తి అని, ఏ
భార్యయైనా కోరుకునేది ఏమిటంటే భర్త ప్రేమను కోరుకుంటుంది నిరంతరము భర్తతో కలిసి
ఉండాలనే కోరుకుంటుంది అంతే. దీనికి వైక్లవ్యం వచ్చిందనుకోండి భార్యకాని
బాధపడి కళ్ళంబటనీళ్ళు పెట్టిందో మీరు ఎన్ని ప్రయత్నాలు చెయ్యండి మీకు కలిసిరావు
మీరు ఎంత వృద్ధిలోకి వెళ్లారో అంత జారిపోతారు కారణమేమిటో తెలుసా భార్య కన్నీరే...
ఒక్కటే కారణం వేదం ఎప్పుడు చెప్పినా ఒక్కటే చెప్తుంది. మీ ఇంట్లో ఉన్న ఇల్లాలు
“లక్ష్మీమీ స్వరూపా” కాబట్టి ఆవిడ సంతోషంగా ఉండాలి, ఆవిడ సంతోషంగా ఉండడానికి
ఒక్కటే కారణం, ఏ కారణానికి
సంతోషిస్తుందో తెలుసాండి ఆయన మనసంతానేనే ఆ స్థానం ఇంకొకరు పొందకూడదు, ఆయన
మనసంతానేనే ఆయన నేనంటే అంతప్రేమ దీనికి ఇద్దరూ పక్క పక్కనున్నారాలేదాని కూడా
అనవసరం. పక్కపక్కన లేనప్పుడు తన భర్తయందు కొన్నివేల మంది కాంతలు అనురక్తలై ఉండగా
నా భార్య తప్పా ఇంకొకరు ఆ స్థానంలో ఉండడానికి వీళ్ళేదని అటువంటి చూపు చూడని భర్త
దొరికితే... దానికి భార్య పొంగిపోతుంది ఆ పొంగు పురుషున్ని ఎంత వృద్ధిలోకి
తీసుకువెళ్తుందంటే అంత వృద్ధిలోకి తీసుకెళ్తుంది. సీతమ్మతల్లిని తీసుకెళ్ళి రావణాసుడి
యొక్క అశోకవనంలో పెడితే ఆ తల్లి నిరంతరం రామ ధ్యానమే చేసింది తప్పా, ఒక్కనాడు..,
అదే సుందర కాండలో హనుమ అంటారు, ఇంతమంది ఇన్ని అనుభవిస్తున్నారు నాతల్లి సీతమ్మ
కూడా రామునిపక్కన ఇలా ఉండి ఉంటే, లేదా ఆ శ్లోకాన్ని చెప్పడం కూడా నాకు ఎక్కువ
ఇష్టముండదు సీతమ్మ తల్లి
వేరేలా ఇంకోలా బుద్ధి కలిగి ఉన్నా రాముడు అలా ఉండడు. కాబట్టి భార్యా అనేటటువంటిది నీ సంపదకి
కారణమై ఉంటుందని మీరెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
నీ అభ్యున్యతి అంతా ఎవరిమీద ఆధారపడుతుందో తెలుసాండి ఆవిడమీదే ఆధారపడి ఉంటుంది, మీరు ఆవిడ నవ్వుతూ ఉండేటట్టుగా మీరు చూసుకోవలసి ఉంటుంది మీరెప్పుడూ, అందుకే
పెద్దవారికిచ్చి పెళ్ళి చేస్తారు లేకపోతే చిన్నవారికిచ్చి ఎందుకు పెళ్ళి చేయకూడదు.
ఖచ్చితంగా భార్యయందు లోపమే
ఉంటుంది అంది శాస్త్రం. ఆమే యందు అపరిపక్వత ఉంటుంది పరిపక్వత ఉంటుందని నీవు
అనకూడదు, భర్తకన్నా ఎప్పుడూ భార్య పరిపక్వత తక్కువే. తక్కువ ఎందుకూ అంటే
అందుకే చిన్నపిల్లనిచ్చి పెళ్ళి చేస్తారు. నీవేంచేయాలి నీవు నీ కడుపులో పెట్టుకుని
దిద్దుకోవాలి తప్పా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పురుషున్ని నమ్మకూడదంటే
లోకంలో తన భార్యమీద నేరాన్నిగాని చెప్పాడో ఇంకో వ్యక్తితోటి వాన్ని మీరు ఎప్పుడు
విశ్వశించకూడదు. మా ఆవిడండీ ఇలా ఉంటుంది అని అన్నాడనుకోండి, వాడంత అధమాధముడైన
పురుషుడు లోకంలో ఇంకోడు లేడు, తన
భార్య గురించి తానే దిద్దుకోవాలి అసలు తన భార్యని దిద్దుకోవడం విషయంలో ఇంకొక
పురుషుడి జోఖ్యంకాని, ఇంకొకరి జోఖ్యాన్ని కాని పురుషుడు అపేక్షించకూడదు,
అలా అపేక్షిస్తే వాడే అధామధుముడు. కన్న తల్లైనా అంతే కన్న తల్లి విషయంలో కూడా
కన్నతల్లిని నీవు గౌరవించడం కన్నతల్లితో నీవు ఏదైనా దిద్దుబాటు చేసుకోవలసిన
వ్యవహారం వస్తే మూడో మనిషి జోక్యం ఉండకూడదు.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
రాణాప్రతాప్ సింగ్ గొప్పతనమంతా అదే కదాండీ, మహానుభావుడు
తల్లితో విభేదిస్తే మేనమామగారు నచ్చజెప్పడానికి వస్తే... ఆయన మాట్లాడటానికి అవకాశం
ఇవ్వలే తల్లిగారిని నమస్కారంచేసి తీసుకొచ్చాడు అంతే... రాచవ్యవహారంలో జోక్యం
చేసుకుందని అంతఃపురానికెళ్ళి తల్లికి నమస్కారం చేయడం మానేశాడు, ఎందుకు ఎప్పడూ వచ్చి
నమస్కరించే రాణాప్రతాప్ సింగ్ ఎందుకు రావట్లేదని ఆవిడ వాళ్ళ అన్నదమ్ములకు కబురుచేసింది.
మేనమామ వస్తున్నాడని తెలిసింది, మేనమామ వస్తున్నాడంటే నీవు ఎందుకు వెళ్ళడంలేదు ఈ
మధ్య అమ్మదగ్గరకి, అమ్మకు ఎందుకు నమస్కారం చేయలేదని మేనమామ అడుగుతాడని మేనమామ అడిగాక అమ్మకీ తనకీ రాజీ
ఉండకూడదు, అమ్మకీ తనకీ రాజీ చెయ్యవలసి అవసరం ఇంకొకడికి ఉండకూడదు లోకంలో అమ్మను తాను పూజిస్తాడు అమ్మతో ఏమైనా
ఉంటే తను దిద్దుకుంటాడు. అమ్మ అంత పూజనీయురాలు లోకంలో కాబట్టి అటువంటి
అమ్మకి నమస్కారం చేయ్ అని మళ్ళీ మేనమామ చెప్పడమేమిటీ? తనే వెళ్ళిపోయాడు, వెళ్ళి అమ్మకి
నమస్కారం చేసి నీతో నాకీవిషయంలో ఖేదం కలిగింది రాలేదు కాబట్టి నీవు ఇంకెప్పుడు
ఇటువంటి తప్పు చేయకు నీకు నా జీవితాంతం నేను నమస్కరిస్తాను చెప్పుకున్నాడు.
ఇదీ నీకు శ్రీరామాయణంలో సుందర కాండలోంచి మీరు ఏరుకోవలసినటువంటి
అద్భుతమైనటువంటి సత్యాలు, ఇవీ ప్రతి ఘట్టంలోనూ ప్రతిచోటా ప్రతి విషయాన్ని నేను
వివరణ చేస్తూ వెళ్ళడం సాధ్యమయ్యేటటుంటి విషయం కాదు, కాబట్టి నేను ఆ బాహ్యవైభవాన్ని
సౌందర్యంగా చెప్పేటప్పుడు లోపల ఉండేటటువంటి వైభవాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది.
అందుకే సుందర కాండ పారాయణ కాండ అంటారు. సుందర కాండని పారాయణ చేయండి అంటారు.
బాలకాండ పారాయణ చేయండి అని చెప్పరు లేకపోతే ఇంకో కాండని పారాయణ చేయమని చెప్పరు
సుందర కాండని పారాయణ చేయండి అంటారు ఎందుకంటాటో తెలుసాండి అలాగ మీరు ఎంత మిమ్మల్ని దిద్దుకుంటూండనీయ్యండి
చిలుం పట్టే ఇత్తడి
గిన్నెలాంటిది జీవితం, ఎప్పుడూ మళ్ళీ చిలుం పడుతుంది మళ్ళీ చింతపండుతో
తోముతుండాలి, మీలోకి ఏ తప్పులొస్తున్నాయో గమనించి దిద్దుకోవడానికి అవకాశం సుందర
కాండ ఇచ్చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తోముతూంటుంది సుందర కాండ అందుకే సుందర కాండ
పారాయణ కాండ నాకు తెలిసి కొంత
మంది పెద్దల జీవితాల్లో సుందర కాండ అంతర్భాగం, అసలు వాళ్ళు సుందర కాండ
చదవకుండా సుందర కాండ శ్లోకాలు ఒకసారి చదవకుండా వారి జీవితంలో ఒక్కరోజు కూడా
వెళ్ళదు, ప్రతిరోజు ఒక సర్గో కొన్ని శ్లోకాలో చదువుతుంటారు. ఎందుకంటే అది అంత మానసిక
పరిపుష్టినిస్తుంది వ్యక్తిని మహోన్నుతున్ని చేస్తుంది, మీరు చూడండి శ్రీ రామ
చంద్ర మూర్తి ఆఖర్నా అగ్నిపరీక్షకి వెళ్ళమన్నారు సీతమ్మతల్లిని, మా ఆవిడా నాకు
లభించిన తరువాత నేను ఆవిడకు శీల పరీక్ష చేయవలసి ఉంటుందని ఎప్పుడైనా ఎవరితోనైనా
అన్నారా..! ఎప్పుడూ అనలేదు రాముడి శీలమది, తనకీ తన భార్యకీ మధ్యలో ఉన్న వ్యవహారం
తనకీ తన భార్యకీ తెలుసు అంతే, దానికి మూడో వ్యక్తి కూర్చోవడం ఎలా ఉంటుందో
తెలుసా... ఇప్పటికీ మనం ఇప్పటికీ సీతమ్మ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుతాం
మాట్లాడినవాడిది పొరపాటు, సీతమ్మకి తెలుసు రామునికి తెలుసు వాళ్ళిద్దరూ ఎందుకు
పరీక్ష చేసుకున్నారో అది దంపతుల మధ్య ఉండవలసినటువంటి గొప్ప అవగాహన.
దానిచేత గొప్పవాళ్ళౌతారు, ఎంత
దగ్గరగా ఉన్నారన్నది కాదు హృదయాలు ఎంత దగ్గరగా ఉన్నాయన్నిది కావాలి, ఇది
చాలా చాలా ప్రధానం దానికి కావలసినటువంటి అవగాహన దంపతులమధ్య ఎంతో అవసరం, అందుకే
ఏతప్పైనాచేయి
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఫర్వాలేదు కాని దంపతులమధ్య కొంచెం దూరంపెరిగేలా మాత్రం ఏతప్పూ
చెయ్యవద్దు, దీన్ని శాస్త్రం ఎంత కఠినంగా చెప్పిందంటే అసలు ఇద్దరి మధ్యలోంచి నడవద్దని
చెప్పింది. మాట్లాడటంమాట దేవుడెరుగయ్యా... ఇద్దరి మధ్యలోంచి నీవు
నడవద్దంది, వాళ్ళిద్దరిమధ్య నడవడానికి ఆధికారంలేదు మనకి ఒకవేళ భార్యటూ భర్తిటూ
ఉంటే... అయ్యా మీరు ఇటురండని మీరు వెళ్ళాలి తప్పా, మధ్యలోంచి వెళ్ళడానికి కూడా మీకూ...
వెళ్తే ఏమైందండీ అంటే? ఇవ్వాళ వెళ్ళావు రేప్పొద్దున వాళ్ళ ఇద్దరు మధ్యన ఎందుకు
నిలబడవలసి వస్తుంది, వాళ్ళిద్దరు కలవడానికి నీవు అడ్డమొచ్చింది అలా అడ్డం
వెళ్ళవద్దూ ఎప్పుడూ, ఎప్పడూ కలిసి ఉండడమే చూడు అంతే. తప్పా ఎన్నడూ దాంపత్యం
మధ్యలోకి వెళ్ళకూడదు. ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకునే సుందర కాండ నడుస్తూంటుంది,
చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో కింది స్థాయి దగ్గర్నుంచీ ఉపాసన స్థాయివరకూ సుందర
కాండలో కలుపుకోనటువంటి విషయముండదు, ఏరుకోవడం మీవంతు ఏరుకోవడం మీకు చేతనైతే సుందర
కాండ వజ్రముల యొక్క గని. సాలగ్రామాలు ఎక్కడుంటాయండీ రాళ్ళల్లోనే ఉంటాయి,
సాలగ్రామాల రేవు అని ఉండదు అన్ని రాళ్ళల్లోంచే సాలగ్రామాలు తీస్తారు, అన్ని రాళ్ళు
తీసి ఇది సాలగ్రామం కాదు అని వదిలేసి, సాలగ్రామాన్ని అందులోంచే తెచ్చిపూజ
చేస్తారు, సాలగ్రామాలన్నీ రాళ్ళ రేవులోనే ఉన్నట్లూ మీకు ఏది సాలగ్రామంగా మీ
జీవితాన్ని ఉద్దరించాలో అది ఈ రేవులోనే దొరుకుతుంది అందుకే సుందర కాండ పారాయణ
కాండ.
కాబట్టి భేరీ మృదఙ్గాఽభిరుతం శంఖ
ఘోష వినాదితమ్ ! నిత్యాఽర్చితం పర్వ హుతం పూజితం రాక్షసై స్సదా !! నాకూ ఒక
విషయం జ్ఞాపకానికి వస్తూంది, నేను ఒకానొకప్పుడు, నేను మళ్ళీ ఊరు పేరు చెప్తే
తెలిసిపోతుంది, నేను ఒకూరెళ్ళా ఉపన్యాసం చెప్పడానికి ఆయనా చాలా గొప్ప ఉపాసకుడు ఆయన
కార్లో ఉపన్యాసానికి వెళ్తుంటే నన్ను ఒకటి అడిగారు “ఈశ్వరునికి ఏమని నమస్కారం
చేయాలి” రోజూ కోటేశ్వరావుగారు అని అడిగారు నన్ను. నేను ఎంత సంతోషించాను అసలు ఈ
ప్రశ్నవేసేవాడు ఎవరు? ఏదైనా చేయిగాని ముందు కామ్యం మా అబ్బాయి పెళ్ళో మా అమ్మాయి
పెళ్ళో అనేవాడేగానీ అసలు ఈశ్వరుడిని ఏమని నమస్కారం చెయ్యాలని అడిగేవాడు ఎవడుంటాడు
నాకు ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని ఊళ్ళు వెళ్ళాను ఎందరితోనో సమన్వయమయ్యాను, ఆ
ప్రశ్నవేసినవాడు ఒక్కడే ఆయన నన్ను ఎవ్వరూ వేయలేదు ఆయన ఒక్కడే వేశాడు నన్ను, అసలు
ఈశ్వరుడికి ఏమని నమస్కారం చెయనండీని అడిగారునన్ను ఇది భాగవతంలో మాలాకారుడు
చెప్పాడు నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాం తాపార భూతదయయుని
తాపల మందార నాకు దయసేయగదే!! ఏది అడినా ఎందుకడగాలంటే ఈశ్వరా! నా మనఃశాంతిని నీ అర్చనయందు వైక్లవ్యంరాకుండ
ఉండడానికి నాకు మనఃశాంతి ననుగ్రహించు అని అడగాలి, తప్పా నేను మనః శాంతిగా
కూర్చుని 15 సమోసాలు తినడానికి మనః శాంతినివ్వూ అని అడక్కూడదు, ఏదైనా మళ్ళీ ఈశ్వరాభిముఖమే
చెయ్యాలి. కాబట్టి ఏమని నమస్కారం చెయ్యాలంటే ఒక్కటే నమస్కారం నీ పాద
పద్మములయందు భక్తి చెక్కు చెదరిపోకుండా ఉండగలిగిన ప్రశాంత జీవితము నీ పాదములు వదలని
స్థితీ నాకు అనుగ్రహించు అదొక్కటే చాలు ఇంకేంకావాలి మీకు అందులోకే
అన్నివచ్చేస్తాయి.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇప్పుడు ఆయన వెతుకుతున్నారు చాలా మంది ఒకళ్ళా ఇద్దరా అందరూ రాక్షసులే,
రాక్షసులే అన్నమాటకు అర్థమేమిటండీ... తన ఉపాసనాబలాన్ని కేవలము తన భోగమునకే వాడుకునేవాడు అంతే ఆయనవల్ల
ఉపయోగం లోకానికేమీ ఉండదు. ఆయన ఇది అనుభవించాలని అనుకున్నాడనుకోండి ఆయన బలంతో వచ్చి
మీ మీద పడుతాడు, పడ్డాడనుకోండి మీరు ఎదిరిస్తే చంపుతాడు, మీరు బలవంతులనుకోండి కాళ్ళు పట్టుకుంటాడు
అంతే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటూంటారు చూడండి అలా అన్నమాట వాళ్ళవల్ల
లోకానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా..! ఏమీ ఉండదు వాళ్ళే రాక్షసులు, వాళ్ళు పేర్లు
ఎన్ని చెప్పుకుంటే అంటే అంతమందీ ఓ చోట చేరారంటే అలాంటివాళ్ళందర్నీ
చేర్చుకోగలిగినవాడు అక్కడున్నాడు. దుర్మార్గులందరికీ నాయకత్వం వహించగలిగిన పెద్ద
దుర్మార్గుడు ఒకడు చేరాడనుకోండి వాడి దగ్గరికి అందరూ చేరుపోరూ అలా అందరూ అక్కడ
చేరారు. ఇప్పుడు భగవంతునికి తేలికా ఎందుకంటే వెళ్ళి వెతికి వెతికి చంపక్కరలేదు
అందరూ ఒక్కచోటే ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి రావలసి వస్తూంది. కాబట్టి మహర్షి
అంటారు మహోదర స్య చ తథా విరూపాక్ష స్య చైవ హి ! విద్యుజ్జిహ్వా స్య భవనం
విద్యున్మాలే స్తథైవ చ !! శుకనాభ స్య వక్ర స్య శఠ స్య వికట స్య చ ! హ్రస్వకర్ణస్య
దంష్ట్రస్య రోమశ స్య చ రక్షసః !! వాళ్ళ పేర్లన్నీ అలానే ఉంటాయి, ఆ పేర్లు కూడా
ఏమీ వినడానికి సంతోషంగా ఉండవు ప్రహశ్వుడు మహోదరుడు విరూపాక్షుడు వజ్ర దంష్ట్రుడు శుకుడు
సారణుడు ఇంద్రజిత్తు జంబుమాలి రమ్మికేతువు సుమాలి ప్రియశత్రువు వజ్రకాయుడు
ధూంరాక్షుడు సంపాతి విద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు శుకనాసుడు వక్రుడు జఠుడు
వికటుడు విశ్వకర్ముడు యుద్ధోన్మత్తుడు ధ్వజగ్రీవుడు నాడి ఇంద్ర జిహ్ముడు ఖరాలుడు
పిశాచుడు శోణితాక్షుడు అటువంటి గొప్ప గొప్ప పేర్లు.
ఆ పేర్లే మీకు చెప్పేయట్లా అసలా
పేరు పెట్టిన తల్లిదండ్రుల గొప్పతనం మెచ్చుకోవాలి పెట్టించుకున్నవాన్ని ఆ పేరుతో
పిలిపించుకున్నవాన్ని అనాలి ఆయన పేరే చూడండీ ఎంత విచిత్రంగా ఉంటాయో శుకనాభ స్య
వక్ర స్య వాని పేరు వక్రుడు వంకర బ్రతుకున్నవాడు శఠుడు అంటే లోపల ఒకటి
పెట్టుకుంటాడు పైకి ఒకటి మాట్లాడుతాడు మోసం చేయడానికి వాన్ని శఠుడంటారు, అసలు వీడు
శఠుడురా అంటేనే చాలా బాధాకరమైన విషయం వానిపేరే శఠుడు అంటే ఇలాంటివాళ్లందరూ అక్కడ
చేరారు ఈ మనః ప్రవృత్తి
ఉన్నవాళ్ళందరు ఉండడమే రాక్షసత్వము కాబట్టి ఈ పేర్లవాళ్ళు లంకలో ఉన్నారని
అనుకోకండీ ఈ లంకలోకి వాళ్లు చేరకుండా చూసుకోవాలి ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోవాలంటే ఒక్కటే ఇక్కడ
సింహాసనముంది దానిమీద సీతారాములు కూర్చోవడానికి యోగ్యమైన స్థితిని మీరు అలా అక్కడేపెట్టి
ఉంచండి చాలు వాళ్లు కూర్చోవాలంటే పక్కన వీళ్ళు లేకుండా ఉంటే చాలు పక్కన
వీళ్ళు కూర్చుంటారు హాయిగా కూర్చుంటారు. కాబట్టి పక్కన ఎవర్ని ఉంచాలి మీరు లక్ష్మణ
భరత శత్రుజ్ఞుల్ని హనుమని ఉంచడి ఉంచితే వాళ్ళు వచ్చి కూర్చుంటారు వాళ్ళు వచ్చి
ఇక్కడ కూర్చుంటే మీ జన్మ ధన్యమౌతుంది. మిగిలినవంటారా నేను ఒక మాట యదార్థంగా
చెప్తున్నాను ఓ నవ్వు నవ్వి వదిలేయండి, మీ మనఃశాంతిని ఏకారణానికి పాడుచేసుకోకండీ నేను మీకిచ్చే
సలహా ఏమిటంటే... మీ ఈశ్వరోపాసనిని మాత్రం ఏ ఒక్క కారణానికి వదిలిపెట్టేయవద్దు
నీతో కలవడం వదలడం కలవడం వదలడం జీవితంలో ఎంతోమంది కలుస్తారు వదులుతారు ఇవన్నీ
బూటకమే ప్రవేశే నిర్గమేస్థదా ఈ కదలికలన్నీ ఆగిపోయేది ఎప్పుడంటే ఇది కదలండం
ఆగిపోయిన తరువాత అన్నీ అనుబంధాలు ఆగిపోతాయి ఆ అనుబంధాల వలన వచ్చేటటువంటి అశాంతి
ఈశ్వరోపాసనయందు
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ప్రతిఫలించకుండా దానివల్ల మీ ఉపాసన పాడైపోకుండా మీరు
రక్షించించబడుతారు ఎప్పుడూ. ఎందుకంటే జీవయాత్రలోని మనల్ని రక్షించేది ఏదైనా ఉంటే
అదొక్కటే అదొకటే రక్షిస్తుంది. మిగిలినవాళ్ళందరూ పాడు చేయడానికి పనికొస్తారు కానీ
వాళ్ళెవ్వరూ మీ మనఃశాంతిని నిలబెట్టడానికి ఉపకరించేవారు కారు అన్నివేళలా.
ఎప్పటికి ఏ సమయానికి ఎలా అనుకూలమో అలా ఉంటారు ఎవరైనా అంతే, కాబట్టి ద్యాన్
ఎనిథింగ్ అంటారు చూశారు ఇంగ్లీషులో దేనికన్నా అవసరమైతే భార్యకన్నా ఈశ్వరోపాసనే ప్రదానంగా పెట్టుకున్నారు ఇది
ఉండగా ఈశ్వరోపాసన కన్నా గొప్పది ఏదీ లేదూ నా జన్మకి ప్రయోజనమేమీ అదే ఆ స్థిర
చిత్తాన్ని మాత్రం బాగా నిలబెట్టుకునే పూనిక చూసుకుని ఎన్నడూ ఈశ్వరున్ని అదే
కోరుకోండి, ఈశ్వరా ఏ కారణం చేతా ఇది నశించిపోకూడదు, నేను బేలమనస్కున్ని
కదిలిపోతాను అందుకని నేను కదిలిపోని రీతిలో నా జీవితం ఉండేటట్లు నన్ను అనిగ్రహించూ
అని కోరాలి అది సమస్త సర్వశాంతులకు ఆయన అనుగ్రహిస్తాడు సుందర కాండ యోక్క సారాంశం
అదే. ఎన్ని చూస్తున్నా హనుమ చెదరలేదు చూశారా మీరు హనుమ చెదరిపోయారనుకోండి ఇకలేదు
సుందర కాండ కానీ ఉపాసకుల స్థితి ఎలా ఉంటుందంటే చచ్చిపోదామన్నంత స్థితికి
వెళ్ళిపోతాడు, అది ఈశ్వరుడి వైపునుంచి పరీక్షకావచ్చు సమాజం వైపునుంచి పరీక్ష
కావచ్చు రెండు రకాలుగా ఎలాగానా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానో
తెలుసా... ఉపాసకులందరూ అటువంటి స్థితిని అనుభవించినవారే నో బడీస్ లైఫ్స్ ఈజ్ బెట్ʼర్ ఫుల్ లైఫ్ ఏ ఉపాసకుని జీవితము కూడా సంతోషంగా గడిచిపోయిందని
మీరు అనుకుంటున్నారేమో... ఎప్పుడూ గడవదు ఎప్పుడూ రాళ్ళు పడుతూనే ఉంటాయి వాటిని
మీరు ఒక నవ్వు నవ్వి విడిచిపెట్టేశేయ్యాలి పైగా, లోపల ఒక కోరిక కోరుకుంటుండాలి అజ్ఞానము ఈశ్వరా
క్షమించునన్ను అనాలి తప్పా వాళ్ళు నశించిపోవాలని అనుకోకూడదు.
వాళ్ళు వృద్ధిలోకి రావాలనే మీరు
కోరాలి వారికి అవగాహన కావాలీ అని మీరు కోరుకోవాలి, ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానో
తెలుసాండీ నేను అనడం వెనకా ఒక నేపథ్యముంది. మీరు రామదాసుగారి జీవితం తీసుకోండి,
ఆయన జీవితం ఏం అంత తేలిగ్గా ఈశ్వరానుగ్రహం పొందేసిందాండీ ఎన్ని కష్టాలు పడ్డాడు
మహానుభావుడు, తుకారాంగారి జీవితం తీసుకోండి ఎన్ని కష్టాలుపడ్డాడు మహానుభావుడు ఒక
ఉపాసన చేయడమంటే ఒక రెండు గంటలపాటు ఇలా కూర్చుని మళ్ళీ కాలెత్తకుండా కూర్చోవడము అంటే
అందులో రెండు ప్రక్రియలుంటాయి, దాన్ని మీరు సాధించవలసి ఉంటుంది. ఒకటోది అసలు
కూర్చోవడం కష్టం. అయ్యబాబోయ్ అంతసేపు కూర్చోవడమే అంటుంది ఈ శరీరం నెప్పి ఉండదని
మీరు అనుకుంటున్నారా..! ఖచ్చితంగా ఉంటుంది. మొదట్లో నీవు అలవాటు చేయడం తప్పదు నీవు
అలా ఉండాలి తప్పదు నీవు అలా ఉండాలి. బడికి వెళ్ళని పిల్లాన్ని తల్లిదండ్రులు
లెంపకాయ్ కొట్టి పంపిస్తారు, కోపంతో
పంపిస్తారా కోపంతో కొడతారా అభ్యున్నతికి కొడతారు అలా ఏం చేస్తావో నాకు అనవసరం
తప్పది కదా కూర్చోవాలి కాబట్టి నీవు అలవాటు చేసుకో అని అలవాటు చేసి తరువాత తరువాత
అది ఏమైపోవాలంటే ఈశ్వరోపాసనయందు అసలు ఆ క్లేషం మీకు గుర్తురాకూడదు, అందులో
రమించిపోవడంలో ఇది ఏమైపోతుందో మీకు జ్ఞాపకం ఉండకూడదు. ఇది నెప్పెడుతూందో ఇది బాధపడుతోందో
మీ ఎరుకలో ఉండకూడదు అంటే దీని ఎరుకని ఆ ఎరుకయందు ఆ అనుభవముయందు మీరు మరిచిపోగలిగిన
స్థితికి మీరు ఎదిగిపోవాలి ఎదిగిపోయారనుకోండి
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఇది ఖచ్చితంగా శుష్కిస్తుంది. వెలుతురు ఇద్దామన్న కొవ్వొత్తి కరిగితీరాలి ఇది
దాద్దామన్నా జజ్జరీ భూతమైపోతుంది. దీన్ని మీరు కష్టపెట్టకూడదు అన్నా ఇలా
ఉంచుదామన్నా ఉండదు. అలా ఉండనిదాన్ని ఈశ్వరార్చనలో కరిగించడం మంచిది.
అందుకు కదాండీ నీరాజనం కళ్ళకు అద్దుకుంటాం, నీరాజనాన్ని కళ్ళకు అద్దుకోవడం
ఎందుకు ఏం దీపం కూడా వెలుగుతుందిగా మరి దాన్నెందుకు కళ్ళకు అద్దుకోరు. నీరాజనం
శుద్ధస్పటిక తెల్లగా ఉంటుంది ఏదైనా సరే, కాలిపోయే ముందు ఘనం ద్రవమై ద్రవం వాయువుగా
మారుతుంది, కర్పూరం మీరు జాగ్రత్తగా గమనించండి, కాలిపోయే ముందు కొంచెం నీరుకింద
వస్తుంది. కానీ బాగా నీరు అవదు ఘనం నుంచి వాయురూపంలోకి చాలా తొందరగా అయిపోతుంది, అయిపోయి
పొగలొచ్చేసి చాలా తొందరగా వ్రేలిపోతుంది. ఆలస్యమైపోయింది ఈశ్వరా! నేనేం
చేసిందిలేదు బ్రహ్మ చర్యంలో గురువుగారిని ఆశ్రయించి గురువుగారితో నేను చదువుకున్న వేదంలేదు,
పేరుకి పెద్దలదగ్గరకెళ్లి యజుశాఖాధ్యాయి అని చెప్పడం లేదు. నేను చదువుకున్న
యజుర్వేదంలేదు, నాకు పుస్తకం చూడకుండా స్త్రీ సూక్త పురుష సూక్తాలతో రుద్రత్వ అభిషేకాలు
చేయగలిగిన శక్తిలేదు నేను నాకున్న డబ్బుతో ఇన్ని పువ్వులు తీసుకొచ్చి నిన్ను
అర్చించగలిగినటువంటి స్థితిలేదు. కానీ నాకున్న పరిమితులను నీవు గమనించి నేను ఏమీ
చేయలేకపోయను జీవితం వృథాయైపోయినది. ఇంక మిగిలిందా వచ్చేస్తుంది జరా కాబట్టి నీవు తొందరగా నీలో ఐక్యమవ్వడానికి
కావలసిన మానసిక పరిపుష్ఠిని నాకు ఇవ్వు అని అడగడం నీరు కాకుండా వాయువై కరిగిపోయిన
నీరాజనాన్ని కళ్ళకు అద్దుకోవడం. ఆ స్థితిని నాకు ఇయ్యి అని అడుగాతాం మనం,
అందుకనీ హారతొక్కటే కళ్ళకుకద్దుకుంటాం.
అది బాగా పూనిక నిలబడాలి నేను ఆ
నేపధ్యములో నేను మీకు చెప్తున్నది ఇది పైకి నోటితో అనడం కాదు అస్తమానం మీరు పైకి
అనవసరంలేదు, మీ లోపలా దృఢంగా ఉండాలి ఏదైనా కదలకూడనిదుంటే అదొక్కటే ఏదైనా రాజీ ఉంది
అదొక్కదాంతో రాజీలేదు, దానికొరకు అడ్డొస్తే... దీన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది
తప్పా దాన్ని వదిలేసి పట్టుకోవలసిందన్నది మాత్రం నా జీవితంలో ఇంకొకటిలేదు దాందే
అగ్రస్థానం. దీనియందు ఇక గట్టి పూనికి నిలబడిపోవాలి అలా నిలబడినవారు కదాండి
హనుమా... లేకపోతే చూడగానే అయ్యబ్బోయ్ ఈ గొడవంతా మనకెందుకు ఎక్కడ రాముడు ఎక్కడ సీతా
ఆయన పెళ్లాన్ని ఎత్తుకుపోతే నాకెందుకు గొడవ అని ఆయనా వదిలేయవచ్చు వదిలారా?, మరి
ఎందుకు ఆ క్లేషం మరి ఆయన ఏమైనా తిన్నారా ఏం తాగారా ఏం సంతోషించారూ ఎందుకంత చిన్న
పిల్ల పిల్లంత రూపమవడం ఉపాసనా క్రమంలో నీవు తరించవలసినటువంటి విధానమేమిటో మీకు
చెప్తూన్నది సుందర కాండ, అలా తరించకుండా ఏదో ఈశ్వరున్ని ఆరాధన చేసి ఆ పుణ్య ఫలంతో
ఆ భోగాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్నవాడు అటువంటివాడు ఒక్కడొక్కడొచ్చి వాళ్ళనుకున్న
కారణానికి ఈయ్యన అనుకున్న కారణం వేరైతే ఇంతమందీ కాలిపోవల్సిందే, ఎంతమంది
తెల్లవారితే ఆయనే ఆగ్రహించగా ఇంత మందీ గుండెలు బాదుకుని ఏడుస్తారు, ఏడవలా లాంక
కాలిపోయినందుకు హనుమ తోకతో పెట్టేశారు నిప్పు కాలిపోయింది అంతే లంక.
అందుకే ఒకమాట అంటూంటారు అది మామూలు
నిప్పు కాదు యశ్శోక వహ్నిం జనకాత్మజాయ ఇంకొక మహాతల్లి ఏడ్చింది అక్కడ ఆ
ఏడుపేం చేసింది మొత్తం లంకని కాల్చింది. రావణాంతఃపురంతో సహా కాల్చేసింది. మళ్ళీ
కాలదంటూ ఉంటే
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
సీతమ్మ ఒక్కతే, ఇది
నీవు తెలుసుకోగలిగితే నీ జీవితం పండిపోయినట్లే, ఇది నీవు తెలుసుకోలేకపోతే తెలుసుకోవడానికి మళ్ళీ మనుష్య
జన్మలోకి వస్తావన్న నమ్మకమేమిటీ వచ్చీ ఇప్పుడు తెలుసుకోవట్లేదా మళ్ళీ ఎప్పుడో
వచ్చి ఎప్పుడో తెలుసుకుంటావా..? ఏమిటి నమ్మకం మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలు
దాటుతావో... ఎప్పుడో మనుష్యజన్మ అప్పుడు వస్తేమాత్రం ఇంత ఉపాసనా రహస్యాన్ని
తెలుసుకుని ఆ బిగింపు నీకు వస్తుందని ఏమిటి నమ్మకం? ఇప్పుడు ఇదే అడుగుతుంది సీతమ్మ
ఇహ సన్తో న వా సన్తి సతో వా నాఽనువర్తసే ! తథా హి విపరీతా తే బుద్ధిః ఆచార
వర్జితా !! అని అడిగింది ఆవిడా... ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా..? చెబితే నీవు
వినవా..? విని ఆచరించవా ఎక్కడుంది సమస్య నీకు అని అడిగింది అందుకని సుందర కాండ
అయిపోయిందది. అది రావణున్ని
అడిగింది కాదు సమస్త సమాజాన్ని అడిగింది, ఎన్ని యుగాలుమారినా అదే ప్రశ్న నీకు చెప్పేవాళ్ళులేకా...
చెప్పేవాళ్ళు చెప్పినా నీవు వినవా, విని విడిచిపెట్టవా... ఆచరించవా...? ఎక్కడుంది
నీకు సమస్య ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు, ఎందుకు ఈ జన్మ చిట్టచివరిజన్మ
చేసుకోవాలని లేకుండాపోతూంది. హరిబ్రహ్మాదులొచ్చినా నేను వినడండీ అంటాడు, హరి
బ్రహ్మాదులు వచ్చి నీకు చెప్పేదేమిటీ నీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే చాలు, వాళ్ళు
రావడమెందుకు నీకు చెప్పడానికి వాళ్ళు రావక్కరలేదు. ఈ మాట ఇంకోవిధంగా అన్వయం చేయ్? ఏది ఏమైపోయినా ఈశ్వరుడి పాదాలు
వదలనండీ అనవే... అలా అన్నవాళ్ళు పరీక్షకు లోనయ్యారు, అంత తేలిగ్గా ఏమీ అలా
అన్నారనేమి ఈశ్వరుడు వచ్చేయడు అది గమనించాలి అలా అన్నవాళ్ళు కొరడాల దెబ్బలు
తిన్నారు.
మహానుభావుడికి పావుసేరు అన్నంలో పదహైరుసేర్ల ఉప్పుకలిపి అన్నం వండారు, వండి
అన్నం పెట్టారు ఆయన రామ చంద్ర మూర్తికి పెట్టి నీకు పెట్టకుండా నేను ఏమీ తినను,
అది “క్షరాన్నమో క్షీరాన్నమో” నీవు తినూ నేను తింటాను అని అక్కడపెట్టి రామా నీకు
నివేదన తిను. తింటానన్నాడు ఆయనకు
పెట్టిన క్షరాన్నము రామదాసుకి క్షీరాన్నమైంది. నీవు నమ్మితే పరీక్షా
వస్తుందీ ఫలితమూ ఉంటుంది. పరీక్షలేని ఉపాసన ఉండదు, ఉపాసనలకీ పరీక్షలుంటాయి
నిలబడాలి నీవు నిలబడగలగాలి. అలా నిలబడ గలిగితేనే హనుమా! నిలబడ్డారు హనుమా తప్పా
ఏదో ఒక పరీక్షకు అయ్యబాబోయ్ ఇంతగొడవ నాకెందుకంటే పోయిందంతే మిగిలిన
పనికిమాలినవాటిమీద నిలబడుతున్నావ్, నిలబడదామమి ప్రయత్నం చేయ్ ఈశ్వరుడొచ్చి నిన్ను
కాపాడుతాడు అంతే. పూనికతో
నిలబడు చాలు ఈశ్వరుడొస్తాడు వచ్చి నిన్ను కాపాడి తీరుతాడు. మళ్ళీ మీ
ఉపాసనకు రక్ష ఆయనే ఇంకోడుండడు రక్షించడానికి ఇది బాగా పట్టుకోమని చెప్పేటటువంటి
కాండ సుందర కాండ. ఇది మీ మనసులో మీరు సుందర కాండని ఎంత అధ్యయనం చేస్తారో ఎంత
లోతుగా విశ్లేషిస్తారో ఎంతబాగా మీరు ఆ స్థితిని లోపల ధ్యానం చేసి పట్టుకుంటారో
మీరు అంత ఎదిగిపోతుంటారు ప్రతిక్షణం, ప్రతిక్షణం ఉపాసనలో పెరిగిపోతుంటారు. ఈస్థితి
ఎక్కడ్నుంచి వస్తుందంటే సుందర కాండలోంచే వస్తుంది అందుకే సుందర కాండ పారాయణ కాండ.
సరే ఆ కోణంలో మీరు వినండీ! ఇప్పుడు
ఆ రాక్షసులు అందరూ అక్కడున్నారు వాళ్ళ ఇళ్ళన్నీ వెతుకుతున్నారు ఎవరికోసం సీతమ్మకోసం
ఏమి ఆయన ఖర్మ రామార్థం వానరార్థం చ రామ కార్యం మీద వెతుకుతుతున్నారు
కాబట్టి శూల ముద్గర హస్తా శ్చ శక్తి తోమర ధారిణీః ! దదర్శ వివిధాన్ గుల్మాం స్తస్య
రక్షః పతే ర్గృహే !! ఎంత అందంగా మాట్లాడుతారండీ మహర్షి నీ ఇంట ఉన్న వస్తువులు నీ ఇంట
ఉండే వ్యక్తులు నీ సంస్కృతిని చెప్పేస్తాయి, నీ కొడుకు నీతో కలసి
సంధ్యావందనం
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
చేస్తే నీ ఇంటిది ఒక స్థాయి, నీవు నీ కొడుకూ కూడా పేపరే
చదివితే నీ ఇంటిదొక స్థాయి నీ ఇంటి స్థాయి చెప్పడానికి ఎవరి తీర్పులు అక్కరలేదు,
ఎవరి జోక్యం అక్కరలేదు ఎవరూ చెప్పక్కరలేదూ కూడా నీవు లేచి సంధ్యావందం చేసుకుని నీవు చేస్తే నీ కొడుకు కూడా
సంధ్యావందనం చేస్తే నీవు లేచేటప్పటికి మీ ఆవిడ నీకు మడినీళ్ళుపెట్టీ నీవు లేవగానే
పూజా మందిరంలోకి వెళ్ళగలిగితే చాలు, నీ జీవితానికి శ్రీరామ రక్ష. నీ ఇంటికి
వచ్చి చూసినప్పుడు అవేమీ లేకపోతే మీ ఇంట్లో మీ నాన్నగారి ఫొటో మీ అమ్మగారి ఫొటో
ఈశ్వరుడి ఫోటో మిగిలిన మహాత్ములవి తప్పా మిగిలిన పనికిమాలినవి ఉంటే మీరు మీ
గురించి ఏమీ చెప్పక్కరలేదు. మీరు చెప్పినా చాలా సంతోషమండీ చాలా సంతోషమండీ అని
చెప్పడమే.
కానీ ఆహాహా... ఏమి వైభవంరా నీ ఇల్లూ ఏ మూర్తులు ఎటు కళ్ళు తిప్పినా నీ సంసృతి
ఏమిటో నీ ఇల్లు చెప్తూంది, తెలిసిపోదూ కాబట్టి ఆయన పరిస్థితి ఏమిటో అక్కడ
ఉన్నవాళ్ళు చెప్తారు, రామ చంద్ర మూర్తి మీరు వెళ్ళి భోగమనుభవించండీ అని తాను గుహలో
పడుకుంటాడు, రావణుడు లోపల తాను భోగములనుభవిస్తూ వీళ్ళని విచ్చుకత్తులు పట్టుకుని
బయట ఉండండీ ఎందుకంటే నేను ఎత్తుకొచ్చిన ఆడవాళ్ళతో అనుభవిస్తున్నప్పుడు ఎవడొస్తాడో
అంటాడు, అంతే తేడా ఎవరి ముందు ఎవరు నిలబడ్డాడు. రాముని ముందు రావణుడు
నిలబడ్డాడా..? రావణుని చేతిలో రాముడు పడిపోయాడా నీ నడవడి నీ ధర్మం నీ ప్రవర్తన
నిన్ను కాపాడుతాయి, దానికి ఇతరుల కితాబెందుకూ... నీకు సుందర కాండ ఆదర్శం నీవు
నమ్ముకున్నది నిన్ను రక్షిస్తుంది సుందర కాండ కన్నా నీకు ఆదర్శం ఇంకొకటి లేదు.
నీకు ఇతరుల యొక్క ప్రమేయంతో సందర్భంతో నీకు ఏ ప్రయోజనం లేదు నీకు దాని గురించి
పట్టింపక్కరలేదు. అందుకే సుందర కాండ బాగా అర్థమైతే మీరు సర్టిఫికెట్ల గురించి తాపత్రయపడరు.
ఆయన భక్తుడండీ అని ఎవరో అనుకోవాలనీ,
ఆయన ఉపాసకుడు అని ఎవడో అనుకోవాలనీ లేకపోతే ఏదో పదిమంది నమస్కారం పెట్టాలనీ పది
మంది గౌరవించాలని ఈ వెర్రేమీ ఉండదు మీకు, మీరు వీటన్నిటికీ దూరంగా ఉంటారు కూడా
ఎందుకో తెలుసాండీ, ఎందుకవన్నీ నాకు? అవన్నీ ఎందుకు ఆ గుర్తింపులన్నీ? ఎందుకు ఈ
గుర్తింపా నీకు కావలసింది? సర్వేశ్వరుడు
నావాడివిరా నాన్నా అని చెయ్యేసి దగ్గరకి తీసుకోవడమా మీకు కావలసింది.
ప్రహ్లాదున్ని ఇలా ఒక్కసారి అన్నాడు అంతే... చాలు నా బ్రతుక్కి రాక్షస వంశంలో
పుట్టాను ఇలా అన్నావు తల నుంచి చెయ్యేసి వీపుదాకా చాలదా నాకు అని అడిగాడు
ప్రహ్లాదుడు, నీకు అది కావాలా ఇది కావాలా? ఎందుకానమస్కారాలు నీకూ... ఎందుకా
సన్మానాలు ఎందుకా సన్మాన పత్రాలు ఏం చేస్తావు నీ శరీరం పడిపోయిన తరువాత పెంట
కుప్పలో పాడేస్తాడు నీకొడుకు ఇంటినిండా ఏంటీ ఇవన్నీ ఆయన ఎప్పుడో పోయాడని ఎందుకవీ,
ఏం పనికిరావు నీవు ఈశ్వరుడిదగ్గర కూర్చుంటే సర్వేశ్వరుడు నాన్నా దా అని నిన్ను
ఎప్పుడైనా నిన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నాడా? అలా నీవు ప్రవర్తించాడని నమ్మకం
ఉందా... చాలు నీ జన్మకు ధన్యత.
ఈ సర్టిఫికెట్టు ఆయన దగ్గర పుచ్చుకో ఆయన ఆయనకు దగ్గరవ్వు ఆయనకు దగ్గరయ్యావని నీకు పదిమంది నమస్కారం పెడితే నీకు ఒరిగేదేముండదు ఎందుకు
నీకావ్యామోహం ఇది సుందర కాండ నేర్పుతుంది ఉపాసనయందు చిత్తశుద్ధి. అందుకే సుందర
కాండకున్న గమ్మత్తేమిటో తెలుసాండీ ఒకరి గొప్పతనాన్ని ఇంకొకరు చెప్పరు సుందర కాండలో
ఎవరి గొప్పతనం వాళ్ళ ఉపాసనచేత తెలుస్తుంది. సీతమ్మ గొప్పతనం ఆవిడ ఓ మాట అంటే
అగ్నిహోత్రం ఆగిపోవాల్సిందే,
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
హనుమ గొప్పతనం ఆయన నడవడితోనే తెలుస్తుంది రావణుని తక్కువ
తనం ఆయన పడుకోవడంలో ఆయన నడవడంలో ఆయన వీధిలో కాపలా పెట్టడంలో తెలుస్తుంది. నీకేం
కావాలనుకుంటున్నావు సుందర కాండలోంచి ఇవన్నీ విని, రావణుడిగా ఉందమనుకుంటావా ఇంకో తొమ్మిది తలకాయలు నీకు
తెచ్చిపెట్టినా ఉండవు, రాముడిగా ఉందామనుకుంటున్నావా ఈ యుగం కాదు ఎన్ని
యుగాలైనా నీవు కీర్తింపబడుతావు చాలు నీవు కాదు నీవు పుట్టినందుకు నీ వంశం
తరించిపోయింది. పది తరాలవాళ్ళు ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళిపోతారు చాలు వీడు పుట్టాడని
వాడు శరీరం విడిచిపెట్టేసిననాడు వాడు వెడుతుంటే సర్వేశ్వరుడు ఎదురొచ్చి చేతులిచ్చి
వాన్ని తీసుకెళ్తాడు రారాని నేను నున్ను నాలోకి కలుపుకుంటున్నానని, నీకేం కావాలి
మిగిలిన ధూర్తులు
మాట్లాడేటటువంటి మాటలు నిన్ను ఆపాయా నిన్ను ఉద్దరించాయా..? నీ కెందుకు ఇలా విని
ఇలా వదులు నీ ఉపాసనని పాడు చేసుకోవద్దు ఇదీ సుందర కాండ యొక్క తీర్పు.
మహత్తరమైన మాట సుందర కాండ మాట దాన్ని దేనికోసం ఫణంగా పెట్టవద్దు ఐహిక భోగముల కోసం కన్నా
నిష్కామోపాసనకి “కూడా” ప్రయత్నం చేయకు. “కూడా” అని నేను ఎందుకన్నానో
తెలుసాండీ..! భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అర్తో జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీచ
భరతర్షభ గృహస్తాశ్రమంలో ఉన్నవాడు కోరితే ఆయన్నే కోరాలి కదా... నాకో
కష్టముందండీ నేను ఎవరికి చెప్పాలి నేను అసలు ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ఒకరి
దగ్గరికి వెళ్ళేముందు నేను నా ఈశ్వరునికి చెప్పుకోవాలి. ఈశ్వరుడికి చెప్పుకుని
సర్వేశ్వరా కొంచెం బాధపడుతున్నానయ్యా మనఃశాంతి ఉండడంటంలేదు, నీవు నాకు ఈ మనఃశాంతి
ఇస్తే తప్పా నాకు మళ్ళీ ధ్యానం మీద మనస్సు కుదరదు కాబట్టి నాకు కొంచెం ఈ సమస్య
పరిష్కరించిపెట్టు అని మీరు ఈశ్వరున్ని అడగాలి ఇప్పుడు ఈశ్వరున్ని అడగకుండా ఎలా
ఉంటారు మీరు? కామ్యం తప్పదు కాబట్టి “కోపం ʻకూడాʼ” అన్నాను నేను, గృహస్తుకి కామ్యం
ఉండితీరుతుంది అడగాలి, కానీ అడిగితే ఈశ్వరున్ని అడగండి ముందు ఆయన్ని అడగండి ఆయనకి
చెప్పండి ఆయనకు చెప్పి వెళ్ళండి మీరు ఎక్కడికైనా వెళ్ళితే తప్పా మీరు మామూలుగా
వెళ్ళద్దూ, మీరు ఎలాగ ఉండవలసి ఉంటుందంటే... మీ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా మీకు
మిగిలినవన్నీ అనౌసరమండీ నేను ఒక్కమాట చెప్తున్నా ఎందుకో తెలుసా... మీరు ఏం చేసినా వంకపెట్టేవాళ్ళు
ఎప్పుడూ ఉంటారు లోకంలో ఉండకుండా ఉండరూ... నేను నీకు యదార్థం చెప్తున్నా
గాంధీ మహాత్మున్ని విమర్షించేవాళ్ళు ఉంటారు చచ్చిపోయేముందు “హే రామ్”
అన్నాకూడా విమర్షిస్తారు, పరమాచార్యస్వామంతటి మహానుభావున్ని మాటలనేవాళ్ళూ ఉంటారు.
వివేకానందునంటారు రామకృష్ణ పరమహంసని
అంటారు నోరుందిగా... ఏమైనా అంటారు మీకెందుకు వాటిగురించి నీవు నమ్ముకున్నది నీవు వదిలిపెట్టవద్దూ...
ఇదీ బాగా పట్టుకోవాలి సీతమ్మతల్లి భర్తను అంత నమ్ముకుంది అంత ఉపాసన చేసింది
ఎన్నిమాటలన్నాడు రావణుడు వెళ్ళి ఆవిడ చెదిరిపోయి ఉండి ఉంటే ఒక్కసారి ఆవిడకాని ఇన్నంటున్నాడు
నిజమేలే అనో, లేకపోతే వాడు అంటున్నాడని బాధపడ్డమో చేసుంటే... సీతమ్మతల్లికి మీరు
ఇవ్వాళ గుడికట్టి పూజచేసి ఉండేవారా! వాడు అంటాడు అన్నందుకు వాడుపోతాడు, కానీ నాకు నా రాముడు ఉన్నాడు వస్తాడు
నమ్మింది, మీకూ అంతే సుందర కాండ తీర్పు. కాబట్టి సుందర కాండని మీరు ఆ
కోణంలో వినవలసి ఉంటుంది, మీరా కోణంలోనివి అన్వయం చేసుకోవాలి జీవితంలో, చేసుకుంటే
అన్నివైపుల నుంచి మీకు రక్షణ కలుగుతుంది ఈశ్వర రక్షణ. ఎందుకంటే ఒక్కటే కారణమండీ...
ఇది అమూల్యం దిక్కుమాలిన గోల అంతా ఎందుకంటే ఇదికాదు వచ్చినగొడవ ఇది ఎందుకు
రాదంటున్నానో తెలుసాండీ, ఇది
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
మీకు ఇవ్వాలని నియమేమీలేదు చాలా మంది తెలియక ఏమంటారంటే
మళ్ళీ పుడతానండీ మనిషిగా అప్పుడు చేస్తానంటాడు అలా ఏం లేదు శాస్త్రంలో ఈశ్వరునికి అధికారంలేనిది ఏదైనా
ఉంటే మీకు మళ్ళీ జన్మనివ్వడంమీదే... ఈశ్వరుడికి అధికారంలేదు. ఈశ్వరుడు
నిన్ను నేను మళ్ళీ మనిషిగా పుట్టిస్తాను అని ప్రమాణము చేయ్యలేడు, ఎందుకో తెలుసాండీ..!
ఒక్కటే కారణం మీ మరుజన్మ
కానీ జన్మ లేకపోవడం కానీ మీ చేతిలోనే ఉంటుంది, కిందకి వెళ్ళిపోవడం కానీ...
కారణం ఏమిటంటే..? తీర్పు ఈశ్వరుడు తనమీద పెట్టుకోడు అందుకే.
నీవు ఏం చేస్తున్నా వాసనారూపంగా
వెళ్ళి మనసుపట్టుకుంటుంది, మీరు
ఒంట్లో ఓపికుండగా మీ అనురక్తిని బాగా దృఢతరం చేశారనుకోండి ఈశ్వరున్ని పట్టుకోవడం
అలువాటు చేశారనుకోండి. తలుపుసందులో వేలుపడింది శివ శివా అనడం
అలవాటైందనుకోండి, ఓ కష్టమొచ్చింది ఈశ్వరా అని ఏడ్వడం అలవాటైంది మీకు ప్రాణోత్క్రమణ
కూడా ఉంటుందిగా మరి పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవలసిందేగా అప్పుడు కూడా ఈశ్వరానే
ఏడుస్తాడు, ఈశ్వరుడు ఏం చూస్తాడో తెలుసాండీ నేను ఏడాదల్లా తెల్లారిగట్లా మూడింటికిలేచి
చదివానండీ అనటం కాదు నీవు యం సెట్ గంటన్నర ఎం రాశావ్ దాన్నిబట్టే నీ ర్యాంకు నీ
ప్రాణోత్క్రమణంలో నీవు దేన్ని స్మరించావ్ అదే నీవు పట్టుకున్నావ్ జీవితాంతం. నీ ప్రాణోత్క్రమణయందు నీవు
ఈశ్వరున్ని పట్టుకున్నావ్ ఎలా పట్టుకుంటావ్ అన్నిటికన్నా అధికం అదే అనే పూనికి
మీకు ఇక్కడుండాలి మీగిలినవన్నీ అది చేరడానికి ఉపకరణములను పట్టుకుంటున్నావు అంతే
దానికన్నా ఇవి ఎక్కువ కావు ఇప్పుడూ నీవు అదే స్మరిస్తావు అది స్మరిస్తే ఆయనలోకి
వెళ్ళిపోతావు లేదూ ఏవో మంచి విషయాలు స్మరిస్తూ వెళ్ళిపోయావు, పండిత వంశంలో
మహా పురుషుడి కడుపునపుట్టీ ఉపాసనా సిద్ధి కలిగేటట్టుగా పుడుతావు, లేదు ఏ
ఐశ్వర్యాన్నో లేదా ఏ పనికిమాలిన
విషయాన్నో స్మరిస్తున్నావ్ అయిపోయింది అంతే ʻతిర్యక్ʼ అంటారు వెన్నుపాము అడ్డంగా ఉండే
జీవికింద వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వచ్చే నష్టమేమిటో తెలుసాండీ...
ఇక బుద్ధుండదు. ఇంకేం చేయలేడు ఆ శరీరంతో. ʻఆవుʼ మీరు చూడండీ..! ఆవు పాలిస్తుంది,
అభిషేకం ఎవరు చేసుకుంటారు పాలు తెచ్చుకున్నవాడు చేసుకుంటాడు ఫలితమెవరిది?
ఆవుకేస్తారా? ఏమీ ఉండదు, ఆవు పాలిచ్చింది కదాండీ! బ్రతికున్నన్నాళ్ళు స్వామివారికి
అభిషేకం చేశాముగదా మరి గోవుకు
ఫలితంలేదా..? ఏమీలేదు. తెచ్చుకున్నవాడికి గడ్డిపెట్టినవాడికి అభిషేకం చేసినవాడికి,
తిర్యక్ కు ఉండేటటువంటి పరిమితి అది, అది ఇంక ఏమీ చేయలేదు ఆ ఉపాదులు ఉన్నా...
అవన్నీ కూడా దురద్రుష్టవంతమైన ఉపాదులు ఏ కోణంలో ఈశ్వరార్చన చేయలేవు, ఇంక సుందర
కాండ ఏం వింటాయి, సుందర కాండ ఏం చదువుతాయి.
అది ఒక్క దీనికే ఆ అర్హత ఇది
పడుపోతుంది వచ్చిన గొడవ ఇది ఉండదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడో అంటావేమిటీ?
అప్పటివరకు ఉంటుందని నమ్మకం ఏమిటీ? ఉన్న సమయం చాలా అపురూపం. కాబట్టి
దీన్నివాడవలసిందే ఈశ్వరార్చనకి అన్నిటికన్నా ప్రధాన కారణం అదే... కాబట్టి మీరు
అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతమేమిటంటే పునర్జన్మ సిద్ధాంతం ఏమిటీ
అంటే పునర్జన్మా, పునర్జన్మా
అని అంగీకరిస్తే... సనాతన ధర్మంలో ఉన్నాడని గుర్తు, పునర్జన్మ ఉన్నదీ అని
అంగీకరించడానికి గుర్తేమిటో తెలుసాండీ బొట్టుపెట్టుకుంటాడు బొట్టుపెట్టుకోలేదనుకోండి
వాడు సనాతన ధర్మంలో ఉన్నవాడుకాడు అనిగుర్తు. నేను నమ్మను వేదాన్ని నేను నమ్మను
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఉపనిషత్తుల్నీ నేను నమ్మను ఈశ్వరున్ని నేను నమ్మను
పునర్జన్మ ఉందీ అని బొట్టులేకపోతే వాడు ఎన్ని చేసినా నేను అంగీకరించనని చెప్పి
కూర్చున్నవాడు కాబట్టి వాడికి ఆ ఫలితం లేదు బొట్టు పెట్టుకుంటే వాడు అంగీకరించినట్లుగుర్తు.
అందుకే బొట్టు అంత ప్రధానమైపోయింది. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడన్న
గుర్తు బొట్టుపెట్టుకోవడం, అది అంగీకరించనివాడు ఎవ్వరూ బొట్టు పెట్టుకోరు. అందుకే
బొట్టుపెట్టుకోనివాళ్ళందరూ కూడా పునర్జన్మ సిద్ధాంతం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలలో
ఉండదు అది వేరుగా ఉంటుంది ఇప్పుడు దాన్ని గురించి మాట్లాడను నేను సుందర కాండ
గురించే మాట్లాడుతాను.
కాబట్టి శూల ముద్గర హస్తా శ్చ శక్తి తోమర ధారిణీః ! దదర్శ వివిధాన్ గుల్మాం
స్తస్య రక్షిః పతే ర్గృహే !! రాక్షసాం శ్చ మహా కాయాన్ నానా ప్రహరణోద్యతాన్ !
రక్తాన్ శ్వేతాన్ సితాం శ్చైవ హరీం శ్చైవ మహా జవాన్ !! అక్కడ ఉన్నటువంటివాళ్ళు
శూలాలు పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు, ఎప్పుడూ ఏదో ఇంకోన్ని కొడతారూ...
వాన్ని కొడతారని భయం, అంటే ఉపాధిని సక్రమముగా ఉపయోగించుకున్నవాడు కాడు వాడే
రాక్షసుడు. కాబట్టి శూలం పట్టుకుంటాడు ముద్గరం పట్టుకుంటాడు ఇంకోటి పట్టుకుంటాడు
ఇంకోటి పట్టుకుంటాడు తోమరం పట్టుకుంటాడు ఎప్పుడూ విచ్చుకత్తులు పట్టుకుని వాడు
ఎవడో లోపల నిద్రపోవడానికి ఇంతమంది బయట లేచి ఉంటే వాడుపడుకుంటాడు. వీళ్ళు పడుకుంటే తాను
పడుకోలేడు, అందరూ పడుకోనీవ్వండీ నేను పడుకుంటానూ అన్నాడనుకోండి, ఇంకా
ఎందుకయ్యాలేసుంటారు అని ఎవరన్నారు రామాయణంలో పక్షులు అరుస్తున్నాయి గూళ్ళల్లోకి
వెళ్ళిపోతున్నాయి, ఆవులన్నీ కూడా గోశాలలకి వెళ్ళిపోతున్నాయి, అరణ్యాలకు
వెళ్ళేటటువంటి కాంతలు ఆ పుల్లలేరుకునేటటువంటి వారు గృహోన్ముఖులై వెళ్ళిపోతున్నారు,
ధూమం ఆవరించినట్లు చీకటి ఆవరించింది ఇప్పటికే ఆలస్యమైపోయింది పడుకోండి నేనూ
పడుకుంటాను అని ఎవరన్నారు విశ్వామిత్రుడు అన్నాడు, అనసూయమ్మంది, అత్రి అన్నారు అందుకే
రామాయణంలో ప్రతి చిన్నవిషయం చెప్తారు. ఇప్పటికే బాగా చీకటిపడింది పడుకోండి అంటారు,
మీరు పడుకోండి నేనూ పడుకుంటాను అంటారు ఎవరూ..? నన్నెవడేం చేస్తాడు అన్నవాడు, మీరు
పడుకోకండి మీరు లక్షమంది తెలివిగా కత్తిపట్టుకుని తిరగండి నేను లోపల పడుకుంటాను
ఎవడు? వాడు పడుకుంటే తాను చచ్చిపోతాననుకున్నవాడు మరి ఆ పనెందుకు చేశావు? ఇది సుందర
కాండ.
మరి అంత చస్తూ బ్రతుకుతున్నానని
తెలిసీ నా అంత మొనగాడు లేడని ఎలా చెప్తున్నావు, నీవు నిద్రేపోలేవు ఓ లక్ష మంది
కత్తులు పట్టుకోకపోతే... నీ బతుకో బతుకా..? నీవు దానిగురించి గొప్పగా చెప్పుకోవడమా..?
ఎంత అసహ్యకరమైన విషయం విశ్వామిత్రుడు గొప్పవాడు వశిష్ఠుడు గొప్పవాడు అనసూయమ్మ
గొప్పది నీవా గొప్పవాడివి? లక్ష మంది కత్తి పట్టుకుంటేతప్పా నీవు పడుకోనివాడివి
నీవు మొనగాడివి అని మాట్లాడుతావా..? ఇదే రావణుడంటే? నీ మానాన నీవు పడుకోగలవా
పదిమందిని పడుకోండి నేను పడుకుంటాను అనగలనా నాకెందుకండీ నన్నేందుకు రక్షించాలి నన్నెవరేం చేస్తారండీ
అని అనగలవా? అలా అనాలంటే నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యనిరీతిలో నీవు జీవిస్తున్నవాడివని
గుర్తు. ఏమండీ ఎందుకైనా మంచిది నా చుట్టూ నలుగురు ఉండండనేమాట ఎందుకొచ్చింది
ఇది జీవితాలకి మీరు పడుకోవడంలో కూడా ఎంత భయం. అంటే ఇదే రాక్షస జీవితం అని గుర్తు.
అలా ఉండద్దు సుమా! అది సుందర కాండ హెచ్చరిక. అంతే కానీ కథా పరంగా రావణుడు లోపల
పడుకున్నాడని లక్ష మంది విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతున్నారాని అబ్బాహ్ అలా...
ఉండాలండీ నిజంగా ఏమి గొప్పవారండీ అని అన్నారనుకోండి కొంప మునిగిపోతుంది అందుకని
సుందర కాండని అలా వినకండి.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
పై సౌందర్యం వేరు అంతః సౌందర్యం వేరు లోపలా అలా ఉండకూడదని
పట్టుకోవాలి శ్లోకాన్ని తిప్పాలి తిప్పకపోతే రాదు ఎందుకంటే వెనకటికి ఒకాయనా ఒక
ఐశ్వర్యవంతుడూ కొడుకుల్ని పనికిమాలినవాళ్ళని అర్థమైపోయిందాయనకీ చచ్చిపోతూ
చచ్చిపోతూ ఓరేయ్ మీరు ఎలాగో పనికిరారు ప్రతీ ఇంటికీ వెళ్ళి బిక్షాటనము చేసి తినండి
ఒకవేళ ఇంకా కరువొచ్చేసి పెట్టేవాడు కూడా లేకపోతే నేను మీకు గొప్ప ఐశ్వర్యాన్ని
చెప్తాను అది చేద్దురుకానీ కానీ నేను ఒక
కాయితం మీద రాసిచ్చిన మూడు సూత్రాలు ఉంటాయి ఆ మూడు సూత్రాలు చదువుకోండి దాన్ని
బట్టి బ్రతకండి అన్నాడు. ఏమిట్రా ఈ నాన్నగారు అనిచెప్పి అనుకున్నారు. చచ్చిపోయాడు
ఆయన, బీరువాలు తీశారు ఏమీలేవు పెట్లు తీశారు ఏమీలేవు ఓరేయ్ ఇంత సంపాదించాడు ఎక్కడా
ఖాలీలే ఆ కాగితమేమిటని చదివారు. అమ్మకి అన్నం పెట్టవద్దూ మొదటి మాట, లోకంలో ఎవడైనా
తండ్రి చచ్చిపోయేముందు ఓరేయ్, మీ అమ్మని జాగ్రత్తగా చూడండి అంటారు అమ్మకి అన్నం
పెట్టవద్దూ అని రాశాడు, ఇదేమిటీ ఇలా ఉంది సరే... రెండో సూత్రం చదవండిపోనీ...
అన్నారు, విత్తుపెట్టి పందిరేయవద్దూ, ఇదేమిటి? విత్తనం పెట్టి పందిరేయకపోతే పాదెలా
కాస్తుంది, మానాన్ని సంధిప్రళాపం చచ్చిపోయే పైత్యంతో రాశాడేమో ఇవన్నీ అనుకున్నారు,
ఎక్కడా ఏమీ దొరకపోతే ఇల్లు తవ్వండీ... అనుంది,
ఏమిట్రీ ఇల్లు అమ్మేయండీ అంటాడు ఎవడైనా, ఏమీ దొరకపోతే ఇల్లు తవ్వెయ్యండి
అంటాడేమిటి? వచ్చేరూపాయి కూడా రాదు. పండితుల దగ్గరికెళ్ళాడు చూపించారు చూపించారు
చూపించారు ప్రతివాడు చూసి మీ నాన్న సంధిలో రాశాడులేవయ్యా... ఇవన్నేమిటీ అన్నారు.
ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు, ఆయన చూసి
అన్నాడు ఓరేయ్! మీ నాయన మహా ప్రాజ్ఞుడురా అన్నాడు. గొప్ప విషయాలు రాశాడు అనుభవంతో
అన్నాడు. అయ్యా ఏమిటి రాశాడు అమ్మకు అన్నం పెట్టవద్దూ అని రాశాడు అమ్మకు అన్నం
పెట్టకు అమ్మ చేతి అన్నం
తింటున్నానుకో నీవు అమ్మకు అన్నం పెట్టడమేమిటీ, ఏమండీ ఇన్నేళ్ళొచ్చినా మా అమ్మచేత
అన్నం తింటున్నాను అను అదిగొప్పగాని అంతేగాని, మా అమ్మగారిని నేనే
చూస్తున్నానండీ అని చెప్పకు ఎప్పుడూ గొప్పగా, అమ్మకి అన్నం పెట్టవద్దూ అమ్మదగ్గర
అన్నం నేను తింటున్నానను తిప్పి చూడు ఆ మాటని. విత్తుపెట్టి పందిరేయవద్దూ పందిరేసి
విత్తుపెట్టు విత్తుపెట్టినాటి పందిరేస్తానంటే ఎప్పుడో ఏదో టెలిగ్రామ్ వస్తుంది
ఊరెళ్ళిపోతావు ఈలోగా అది పైకి పాకడానికి పందిరిలేక కింద పాకి కాయవలసినన్ని కాయలు
కాయక ఏ మేకో వచ్చి తినేస్తుంది. పందిరేవేసి విత్తుపెట్టు, నీవు ఊరెళ్ళినా అది
పైకెక్కేస్తుంది. కాబట్టి విత్తుపెట్టి పందిరేయవద్దు పదింరేసి విత్తుపెట్టు. ఏమీ
దొరకకపోతే ఇల్లు తవ్వండీ ఇంక ఈ సూత్రాలు పాటించి నాలుగిళ్ళ ముందు కష్టపడి
బ్రతుకుదామన్నా కూడా రోజులు వెళ్ళకపోతే అప్పుడు మీకోసమని ఇంట్లోనే పాతుపెట్టాను
అప్పుడు ఇల్లు తవ్వుండి మీకు పాతు దొరుకుతుంది అప్పుడు వరకు మాత్రం తవ్వేయ్యకండి.
అందుకని తిప్పారు, తిప్పితే అందులోంచి సారమొచ్చింది. సుందర కాండని తిప్పి
చూస్తుండాలి ఒక్కొక్కసారి అంతేకాని రావణాసురుడు లోపలపడుకుంటే లక్షమంది సైన్యం
విచ్చుకత్తులు పట్టుకుని ఉన్నారు అబ్బాహ్ ఎంత గొప్పవాడడండీ అనకూడదు అని వెంటనే ఆయన
ఫొటో దొరుకుతుందాని అడక్కూడదు.
మనం అలా పడుకోకూడదని జీవితంలో
ఎప్పుడూ రాముడిలా గుహలోనైనా పడుకోగలగాలి అనాలి తప్పా... దాన్ని వైభవం కింద
స్వీకరించకూడదు. బాహ్య వైభమైనా ఆంతర ప్రమాణమెంతుందో చూపిస్తుంది సుందర కాండ ఇది
మీరు పట్టుకుని సౌందర్యాన్ని పిండుకోగలిగిన మీ నమః స్థితి సౌందర్యం అందుకని సుందర
కాండ మీ పట్ల సుందర కాండ. అందుకనీ ఏం సుందర కాండండీ..! అందుకనీ ప్రతీ శ్లోకం
సౌందర్యమే అలా తిరుగుతుంది. మీరు ఆ సారాన్ని పట్టుకుంటే చాలు ఇప్పుడు నేను
రావణాసురిడి అంతః పురమనగా..! మణులు ఇలా ఉండును వజ్రములుండును వైఢూర్యములుండును
దిక్కుమాలినవాడు పడుకోలేనివాడు ఎంత చెప్పితే ఏం ఏవడికి కావాలని అడగాలి మీరు.
అడిగితే అప్పుడు మీకు పట్టుకుంది సుందర కాండని గుహలో పడుకున్న రాముడు గొప్పవాడండీ
మూడు రోజుల నుంచి చెప్తున్నారు వాడి ఇంటికి వెండనీ బంగారమనీ రాగనీ అసలు సైటే
వాడిది కాదు మీరు ఇంక ఎంత గొప్పనైనా కట్టండి అసలు సైటు వాడిది కాదు ఎంత ప్రమాదం
అసలు లంక వాడిది కాదు పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ అది
విశ్వకర్మది వీడు నాదంటున్నాడు కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడో వచ్చి నీది కాదని
అవతలిపొమ్మని తీసేస్తాడు పోయిందంతే అవతలకి.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి పట్టుకోగలిగితే ధన్యత అది సుందర కాండ, ఆయన రావణ
భవనమంతా చూశారు ఎంత చూసినా ఎన్ని చూసినా ఏమీ కనపడలేదు వైభవం కనపడుతూంది
బాహ్యవైభవం, పుష్పక విమానంలోకి ప్రవేశించాలీ అని అనుకున్నారు, ఆ పుష్పక విమానంలో
పడుకుని ఉన్నాడు ఆయన కాబట్టి అక్కడకి వెళ్ళే ముందు ఒకసారి అంతః పురంలో ఉన్నటువంటి
గదులవంక చూశారు చూస్తే మహర్షి అత్యద్భుతమైన శ్లోకం ఈ ఒక్కశ్లోకాన్ని మీరు
పట్టుకోగలిగితే సుందర కాండలో రావణ వైభవాన్ని పట్టేసుకోగలరు స వేశ్మ జాలం బలవాన్
దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణ జాలమ్ యథా మహత్ ప్రావృషి మేఘ జాలం విద్యు త్పినద్ధం
సవిహంగ జాలమ్ ! అది వర్షా కాలంలో మెరుపులు ఎలా మెరుస్తాయో ఉండి ఉండి మెరుపు
మెరిస్తే వర్షా కాలంలో మెరిసేటటువంటి మెరుపు అందం వేరు వర్షా కాలంలో మెరుపు ఏం
చేస్తుందో తెలుసాండి మేఘాలు దట్టంగా పట్టేస్తాయి కాబట్టి ఆ మెరుపు తీగ మెరిస్తే
గుంటూరు పట్టణమంతా కనపడుతుంది ఆ మెరుపు తీగకి. అదీ వర్షాకాలం కాదనుకోండి ఏదో ఒక్క
మబ్బుండి ఓ చిన్ని మెరుపు తళుక్కున మెరిసిందనుకోండి ఏదో ఓ చిన్న ఫోటో తీసుకున్న
ఫ్లాష్ లా ఉంటుంది దానందం ఉండదు, వర్షాకాలపు మబ్బుమీద మెరుపు అందం వేరు ఆ అందంలో
మీరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ కూర్చులో కూర్చుని అలా మెరుపు తీగ వస్తుందని చూస్తూ
కూర్చున్నారనుకోండి మీ కంటికి తుదా మొదలు ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు ఇలా
ఆకాశంలోకి చూడకుండా ఒకసారి పట్టణంవంక అలా చూడండీ ఆ పైన మెరుపు తీగ మెరుస్తుంది
మెరిసినప్పుడు చూడండి మొత్తం గుంటూరు పట్టణం కనపడుతంది ఓసారి.
కరెంటు ఎలాగోనే తీసేస్తారు
గాలేయగానే కాబట్టి చక్కగా అనుభించడానికి యోగ్యంగా వాళ్ళు సిద్ధం చేస్తారు, కాబట్టి
ఇప్పుడు చీకటిగా ఉంటుంది, వాళ్ళు చేసే ఉపకారం అదే మీరు బాగా ఆంతరంగా ఎదగాలనివాళ్ళ
యొక్క కోరిక అందుకు తీసేస్తారు కరెంటు మీమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాబట్టి
ఇప్పుడు మీరు ఆ చీకట్లో కూర్చుంటే ఆ మెరుపు తీగ ఒక్కసారి తటిల్లతా అంతా మెరుపే
కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెరుస్తుంది. గుంటూరు గుంటూరంతా మెరుపులా కనపడుతుంది,
బృందావన్ గార్డెన్ వేంకటేశ్వర స్వామి శిఖరం నుంచి అన్నీ కనపడుతాయి మీరక్కడ ఉంటే
ఆవాసం ఒకవేళ. ఇప్పుడూ మీరు ఊరు చూడ్డంమానేసి ఆకాశం వంక్క చూడండి రెండోమాట ఇప్పుడు
మెరుపుతీగ ఒక్కసారి వస్తుంది అర్జునుడు పట్టుకున్న గాంఢీవంలా ఉంటుంది, అట్నుంచి
ఇక్కడివరకు మెరుస్తుంది ఆ మెరుపెలా ఉంటుందో మీకూ ఇంకా కాసేపు చూద్దామనిపిస్తుంది
కానీ అది ఉంటుందాండీ! అది ఉండదు అబ్బా... కాసేపు ఉంటేబాగుండు అలా చూద్దామంటే ఇలా
కనపడి అలా వెళ్ళిపోతూ కనిపిస్తుంది కింవా నే సధ నేను, వాజిక రిభిః ప్రాప్తేన
రాజ్యేన కిం? కింవా పుత్రా కళత్ర మిత్ర పశుభిః దేహేన గేహేన కిం? అంటూ
శంకరాచార్యులవారు అంటారు ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం మౌవనం
ప్రత్యాయాన్తి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః ! లక్ష్మీస్తోయతరఙ్గభఙ్గచపలా
విద్యచ్చలం జీవితం అంటారు, మెరుపు తీగలా ఈ జీవితం చపలం ఎన్నాళ్ళుంటుందో ఎవరకి
తెలుసురా..! అన్నారాయన.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇప్పుడు ఆ మెరుపు తీగె కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కాసేపు ఉండి
కనిపిస్తే అది రావణాసురుని యొక్క అంతః పురంలో ఓ గదికి కిటికి, అంటే ఆ కిటికి ఎంత
అందంగా ఉందో మీరు చూడండి, కిటికీ కూడా కాదు కిటికీ తెర మరి కిటికీ తెర అంత అందంగా
ఉంటే వాడి భవనం ఎలా ఉంటుంది లంకెలా ఉంటుంది, అక్కడ వెళ్ళినవాడికి ఇంక సీతమ్మ
గుర్తొస్తుందా..! అది చూడ్డంతో సరిపోతుంది, ఇవన్నీనాకొద్దు సీతమ్మేదని
తిరుగుతున్నాడాయన ఇప్పుడు ఇది సౌందర్యమా అది సౌందర్యమా..! అది సౌందర్యం హనుమ
సౌందర్యము. అందుకే సుందర కాండ హనుమత్ సుందరం, సుందర కాండ సీతా సౌందర్యం సుందర కాండ
రామ కథా సౌందర్యం. సుందర కాండ రామ నామ సౌందర్యం మీరు కోరుకోకూడని లంక బాహ్య
సౌందర్యం కాబట్టి స వేశ్మ జాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణ జాలమ్ యథా
మహత్ ప్రావృషి మేఘ జాలం విద్యు త్పినద్ధం సవిహంగ జాలమ్ ! అక్కడటా... ఉండేటటువంటి
ఆ పక్షులతో కూడుకున్నటువంటి వజ్ర వైఢూర్యములతో చెక్కబడినటువంటి ఆ ఛాందిని కిటికి
ఉండేటటువంటి తెరా ఆ విద్యుత్ కాంతులకు వెరజిమ్మేటటువంటి వర్షాకాలపు మేఘం ఎలా
ఉంటుందో అలా ఉంటుందట దాన్ని హనుమా స వేశ్వ జాలం బలవాన్ దదర్శ చాల బలం కూడగట్టుకుని
చూశారట అదేంటండీ అంతబాగుంటే చూడ్డానికి బలం కూడగట్టుకోవడం ఎందుకూ దేనికీ, దీనికి
బాగా మనసు స్థిమితం చేసుకునీ ఒకటికి రెండమాట్లు మనసుని స్థిరం చేసుకుని
చూడవలసిందేమిటీ నీవు చూడకూడనంత భయంకరంగా ఏదైనా ఉందనుకోండి ఆయన కారు కింద
పడిపోయారండీ చూడండీ అంటే చూడ్డానికి వెడితే మనసు ధిటవు చేసుకుని బలం తెచ్చుకుని
చూడవలసి ఉంటుంది.
పిల్లి పడిపోయిందండీ ఆటోకింద చూడండీ
అంటే అది చూడ్డానికి భయంకరంగా ఉంటుంది, కిటికీ అందంగా ఉంటే చూడ్డానికి భయమెందుకండీ
అంత అందంగా ఉన్న కిటికీ దగ్గర మనసు నిలబడిపోతే ఇంక సీతాన్వేషనం నడవదు కాబట్టీ
దీనిమీద మనసు నిలబడకుండా సీతమ్మవైపుకు మనసు నిలబడేటట్టుగా మనసుని బలంతో సిద్ధం
చేసుకున్నాడు, తన లక్ష్యం మీద దృష్టి పెట్టాడు తప్పా దీనిమీద దృష్టి పెట్టకుండా
ఉండడానికి బలాన్ని క్రోధి చేసుకున్నారు. అంటే ఆయన మనసు దేనిమీద పెట్టాలలో దానిమీదే
పెట్టారు, ఇది ఆయన యొక్క యోగి లక్షణం, ఇది ఆయన యొక్క సాధక లక్షణం, సీతా దర్శనానికి
ఆయన ఇంత కష్టపడ్డాడు గృహాణి నానా వసు రాజితాని దేవాఽసురై శ్చాఽపి సుపూజితాని
సర్వై శ్చ దోషైః పరివర్జితాని కపి ర్దదర్శ స్వ బలాఽఽర్జితాని ! మళ్ళీ బలమంటారు
మహర్షి గృహాణి నానా వసు రాజితాని ధన కనక వస్తు వాసన సమస్త సంపత్తితో నిండి
ఉన్నాయటా ఆ గృహాలు ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటారు చూశారా! ఒక్కొక్కసారి ఇల్లు
బాగుంటే ఇంట్లోవస్తువులు బాగుండవు ఇంట్లో వస్తువు బాగుంటే ఇల్లు బాగుండదు, రెండు
బాగుంటే గోడకు మేకులెక్కువుంటాయి అలాగ కాదు ఒక్కొక్క ఇంట్లో ఏమిటంటే ఎక్కడ ఏవి
ఉండకూడదో అవి ఉంటాయి అది విచిత్రం.
బెడ్రూమ్ʼలోకి తీసుకెళ్ళి ఆచార్యపురుషుల ఫొటోలు పెట్టకూడదు, ఆచార్య
పురుషుల ఫోటో ఎక్కడుండాలి, మీరు పవిత్రంగా నమస్కరించగలిగినచోట ఉండాలి అవి అంతేకాని
భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి తప్పా గురువుగారి ఫొటో ఎక్కడుండకూడదో అక్కడ
పెట్టకూడదు మీరు గురువుగారు ఉన్నారు అన్న భావన ఉందనుకోండిమీలో మీరు గురువుగారు ఉన్నారు అన్న భావనతో
మీరు చేయకూడని పనులు కొన్నుంటాయి గురువుగారి సమక్షంలో నీ మనసు ఏ వికారమూ చెందకూడదు.
మరి అప్పుడు బెడ్ రూంలో పెట్టుకోవడం ఎంతవరకు శ్రేష్ఠం, అందుకే జగద్గురువైన
కృష్ణున్ని పెట్టందంటారు తిరుభాగ్యులు, పెట్టకూడదు పెట్టకుండా ఉండడం భక్తి ఇక్కడ
ఎందుకు పెట్లేదండీ అన్నారనుకోండి ఇక్కడ ఎలా పెడతారండీ అన్నాననుకోండి అదే భక్తి
కదాండీ! ఏం బాత్ రూమ్ లో ఎందుకు అన్నం తినరు మీరు కట్టుకున్నదేగా, బాత్ రూంలో
అన్నమెలా తింటారండీ అంటున్నారుగా, మరి గురువుగారి ఫొటో బెడ్ రూంలో ఎలా పెట్టావు
పెట్ట కూడదు తప్పది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి ఇదీ అందం ఇది ఎవరి అందం ఇల్లు
అందం కాదు ఇంటి యజమాని హృదయ సంస్కారం యజమాని అందగాడు అందగాడు అంటే బాహ్యంలో కాడు.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఆంతరమునందు అందగాడు ఏమిటో తెలుసాండి, సీతారాములు
ఉన్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి వాళ్ళు తల్లితండ్రులు వాళ్ళూ,
తల్లిదండ్రులు కారాండి కొడుకులకు పెళ్ళిచేసి కోడల్ని తీసుకొచ్చేది, కూతురికి
పెళ్లిచేసి అల్లున్ని తెచ్చుకునేదిని అక్కడ స్వశక్తి స్వరూపమైన ప్రసన్న మూర్తుల్ని
పెట్టుకోవాలి, మేము ఆరాధిస్తామండీ అని భద్రకాళిని పెట్టకూడదు అక్కడ తీసికెళ్ళి
పూజామందిరంలో పెట్టుకో ఎందుకంటే అది స్వస్తతతో ఆచమనం చేసి ఉపాసన చేయవలసిన
గురువుగారు, గురువుగారు గురువుగారే, గురువుగారి ఫొటో ఎక్కడుండాలో అక్కడుండాలి
అంతే, గురువుగారి ఫొటో తెచ్చుకున్నాను భక్తి అని చెప్పి బాత్ రూంలో కూడా ఎందుకు
పెట్టుకోవు అక్కడ కూడా పెట్టుకో లెట్రీన్ లోకూడా పెట్టు మరి ఎందుకు పెట్టుకోకూడదు
అదేంటండీ మీరు గురువుగారి ఫొటో లెట్రిన్లో బుద్ధుందా మీకు ఆ ప్రశ్నేమిటి
పెట్టడానికి బెడ్ రూంలో ఎలా పెట్టావు, ఇదీ సంస్కారం ఈ సంస్కారంతో ఉంటే ఏమౌతుందంటే
దేవతలనుగ్రహిస్తారు దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసాండీ ఏది ఎక్కడ ఉండాలో
అది అక్కడ ఉండడం వలన అదీ పొందాలి ప్రయోజనం అది పొందడం అద్భుతం అలా ఉంటే
అర్థనారీశ్వర స్వరూపముందనుకోండి పార్వతీ పరమేశ్వరులలో సగం పర్వతీ దేవి సగం
పరమేశ్వరుడు కలిసిపోయిన మూర్తి మీకు ఎదురుగుండా ఉందనుకోండి అది దాంపత్యానికి
పరాకాష్ఠ. మీలో సగం మీ భార్యైపోయంది, అది ఎక్కడన్నా పెట్టండి ఇబ్బంది లేదు అసలు
కొన్నిచోట్లా ఈ ఈశ్వర మూర్తీని పెట్టము మన ఇంట్లో గదులైనా అవునా కాదా.
ఎందుకనీ ఫొటో కాదండదీ ఆయనే నమస్కారం
పెడుతున్నారుగా మీరు నమస్కారం పెడుతుంటే మా గురువుగారు మా ఈశ్వర స్వరూపము అంటే
దానికి తగిన స్వరూపాన్ని అక్కడ పెట్టాలి, కదాండీ కాబట్టి ఇది తెలుసుకోవడం ఇంటిని
అందంగా పెట్టుకోవడం అందుకే ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు పెట్టవలన రీతిలో పెట్టచ్చు,
ఇంట్లో ఉండవలసిన రీతిలో వస్తువులుంటే ఇల్లు బాగుంటుంది, రెండు పరస్పర విరుద్దంగా
ఉంటాయి, రెండూ బాగుంటే చాలా గొప్ప విషయం. గృహాణి నానా వసు రాజితాని ఇంటికి
ఏముండాలో అన్నీ ఉన్నాయి, కారుకు పెద్ద ఫోర్టికో పెడుతాడు, కాని కారుండదు
తుడుచుకుంటుంటాడు అంతే రోజూ ఎందుకండీ ఇదంతాను అంటే కారు ఎప్పటికైనా కొంటానేమోనని
కట్టానండీ అంటాడు, ఎప్పటికి కొంటాడు, అంటే ఏమో వాడి అదృష్టం కాని ఇప్పుడేం
చేస్తుంటాడంటే రోజూ తుడుస్తుంటాడు, ఆఖరికి అక్కడ ఏం చేస్తారంటే చిట్ట చివరికి
ఇంట్లో తీసుకొచ్చి ఓ కుక్కని పెంచి దాన్ని కడుతాడు, కారు ఉండవలసిన చోట కుక్క
ఉంటుంది, అది అప బ్రంశంగా ఉంటాయి అంటే ఇంటికి ఒక అందాన్ని ఇవ్వగలిగినటువంటికావు
చాలా పెద్ద ప్రారద్భమేమిటో తెలుసాండీ, కారు లేకుండా పార్కింగ్ ప్లేసుకొనుక్కోవడమే
అపార్ట్ మెంట్లో ఎందుకో తెలుసా మీరు ఉండరక్కడ, వీడు రోజు అక్కడ కూర్చోడుకదా
పార్కింగ్ ప్లేసులో వీడి స్కూటర్ అక్కడ పెట్టుకుంటాడు, కారు కొనుక్కుందాం ఎప్పుడో
అనుకున్నాడు, ఇప్పుడే లోను పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడు కారెప్పుడు కొనుక్కుటాడు ఈలోన్
తీరితే కొనాలి కనీసం ఆరేళ్లు కొనలేడు వాడో గీత గీసి వెళ్లిపోతాడు బిల్డరు, వీడు
స్కూటర్ అక్కడ పెడతాడు ఖాలీగానే ఉందికదానీ పాలవాడు తీసుకొచ్చి అక్కడ పెడుతాడు వీడు
స్కూటర్ తీద్దామంటే అది అడ్డు, నా కారు పార్కింగ్ ఏరియా నా స్కూటర్ తప్పా ఇంకేం
పెట్టద్దంటాడు ఎవడు వింటాడు నీమాట.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఇంక అది చూసినప్పుడల్లా బాధ, కారు కొందామా ఈ అప్పే తీర్చట్లేదు ఇంకో అప్పు
ఎక్కడ తెస్తావు, కాబట్టి ఉన్నదానికి ఉండవలసింది లేకుండా ఉండకూడని దానికి లేకపోతే
ఎప్పుడో వస్తుందానికి ఇప్పుడే సిద్ధం చేసి ఏడ్చినవాడిలా ఉండకుకండా అందంగా ఉండడం
అమరికగా ఉండడం అంటే అదీ. కాబట్టి గృహాణి నానా వసు రాజితాని దేవాఽసురై శ్చాఽపి
సుపూజితాని సర్వై శ్చ దో షైః పరివర్జితాని కపి ర్దదర్శ స్వ బలాఽఽర్జితాని ! చక్కగా
అన్నిరకాలైనటువంటివి అంటే ఇల్లు అంటే కేవలం ఇల్లుకాదు ధనము బంగారము వస్తువు
వాహనములు అన్నిటితోటి ఆ ఇల్లు అంత అందంగా ఉంది, పూజ చేసుకుందాం మారేడు చెట్టు
ఉంది, శనివారమొచ్చింది వేంకటేశ్వరారాధన చక్కగా తులసి వనం ఉంది అమ్మవారికి పూజ
చేసుకోవాలి ఎర్రటి పూలు ఉన్నాయి. చక్కగా ఏదో ఇంట్లో శుభకార్యం కోసుకోవడానికి ఓ గోరింటాకు చెట్టుంది, శుభకార్యం
ఆ వాళ్ళింటికెళ్ళితే అవతలపోవయ్యా ఎండ కాలం ఇప్పుడు చిగుల్లేస్తుంది ఇప్పుడు మామిడి
కొమ్మలేమిటీ మేము ఇవ్వమూ అంటారు, అలాగ కాకుండా మీ ఇంట్లోనే ఓ మామిడి చెట్టుంది,
కాస్త ఓ నాలుగు చెట్లు వేసుకోవడానికి వీలుగా ఉంది ఇంట్లో స్థలముంది కానీ
పూవ్వుకాయాలేని చెట్టొటివేశావు ఇంట్లో కోడలికి ఎంతకాలానికి గర్భంరాలేదని ఏడుస్తావు
పూవ్వూ కాయాలేని చెట్టుకి నీళ్ళు పోసి పాలుపోసి నీళ్లూ పోసీ పువ్వూ పండూ కాయా
అయ్యేటటువంటి చెట్టుని పీకించేసినటువంటివాడికి వంశాభివృద్ధి ఎక్కడ్నుంచి వస్తుంది
కదా జ్ఞానం కలుగుతుందేమో అంతటా ఈశ్వరుడున్నాడనితప్పా.
కాబట్టి ఏవి ఉండాలో అవి ఉండడం
ఇంటికి వైభవము, ఏవి ఉండకూడదో అవి ఉండకుండం వైభవము, చాలా బాగుంటుందండీ అందంగా
ఉంటుందండీ బ్రహ్మగండి ముళ్ళు తీసుకొచ్చి ఇంటినిండా వేసుకున్నావనుకో మీ మొహమోడ్చా
ఏమిటా అర్థముందా ఆ ముల్లేమేటీ ఆ ఇష్టమేమిటీ అంటారు. మీరు ఎప్పుడైనా కొంతమంది
ఇళ్ళకు వెళ్ళండీ ఇలా కాయల రూపంలో ముళ్ళు ఆకుల రూపంలో ముళ్ళు ఇంతంత ముళ్ళు
అక్కడ్నుంచి ఏమంటాడంటే ఇంటికి నా మనమన్ని తీసుకొద్దామంటే నాలుగు రోజులు ఉంచుకుందామనుకున్నానండీ
కాని ఇదే మొక్కలతో బాధ ఆడుకుని పడుతాడు.
అది మరి తీసై మొక్కలు అంటే మనమడు పడిపోతాడన్నందుకు తేవడం మానేస్తాడుకానీ మూళ్ళ
మొక్కలని మాత్రం తీయడు, వాడికి మోహం ఎక్కువ ఏమని చెప్పాలి చాలా విచిత్రంగా ఉంటుంది
మనుష్యులధోరణి అంటే నా ప్రారబ్దం నాకే కనపడుతారారో అలాగ, మీరు ధన్యాత్ములు మీకు
ఎవరు కనపడరేమో ఒకవేళ అలాగ ఒకవేళ కనపడినా మీరు నాలా ఏమీ మాట్లాడరు చక్కగా అన్ని
హాయిగా జ్ఞానులు కనుక అనుభవిస్తారు నేను నోరేసుకు పడిపోతుంటాను. కాబట్టి గృహాణి
నానా వసు రాజితాని అందుకే నేనంటా సుందర కాండ సుందర కాండ అనుకోకండి మీదాకా
తెచ్చుకోండి అంటూంటాను గృహాణి నానా వసు రాజితాని దేవాఽసురై శ్చాఽపి సుపూజితాని
సర్వై శ్చ దో షైః పరివర్జితాని కపి ర్దదర్శ స్వ బలాఽఽర్జితాని ! దేవతలందరూ
కూడా మొచ్చుకుంటారటా ఆ ఇంటిని చూసి.
అంటే దేవతలందరూ కూడా మెచ్చుకోవడమంటే
ఒక్కటే, దేవతలు ఏయే స్థానములలో ఉండాలో ఆయా స్థానములలో అలా ఉంటారు చక్కగా అలా
పెట్టి పూజింపబడుతుంటారు అలా అలంకారములై అందంగా ఉంటాయి ఆ స్వరూపాలు. కాబట్టి
ఇప్పుడు ఆయన ఆ పుష్పక విమానంలోకి ప్రవేశించాడు తతో దదర్శో చ్ఛ్రిత మేగ రూపం
మనోహరం కాంచన చారు రూపమ్ రక్షోఽధిపస్యాఽఽత్మబలాఽను రూపం గృహోత్తమ హ్యఽప్రతిరూప
రూపమ్ ! అది విశాలమైనటువంటి ప్రాంగణం ఎంత మంది
ఎక్కినా ఇక్కోళ్ళు ఎక్కవచ్చు పుష్పక విమానం అది బ్రహ్మగారు సృష్టిచేసి
కుబేరునికిస్తే కుబేరున్ని కొట్టి ఈయ్యన తీసుకొచ్చారు, కాబట్టి అందులో కళ్ళకు
మెరుగుడ్లు కొల్పుతూ నిరుపమానమై దాంతో పోల్చడానికి ఇంకొకటి లేకుండా అంత
విశాలమైనటువంటి పుష్పక విమానం కనపడింది, అందులో కొన్ని కొన్ని తివాచీలు వేశారు ఆ
తివాచీ ఎంత అందంగా ఉందంటే మహీ కృతా పర్వత రాజి పూర్ణా శైలాః కృతా వృక్ష వితాన
పూర్ణాః వృక్షాః పుష్ప వితాన పూర్ణాః పుష్పం కృతం కేసర పుత్ర పూర్ణమ్ ! అసలు
నిజంగా సౌందర్యమంటే... అందం పర్వతాలది, పర్వతాలు ఏమి అందంగా ఉంటాయో లోకంలో అది
నిజంగా కేన్వాస్ మీద చూస్తే మీకు చాలా అందంగా ఉంటుంది. ఒకానొకప్పుడు నేను తిరుమల
తిరుపతి దేవస్థానంలో చూశా అటువంటిది ఉహా చిత్రము అని ఒకటి చూశాను అప్పుడు కొండ
అద్దమందు కొంచెమై ఉండదా... గీయ్యాలనుకున్న ఆ చిత్రకారుడికి ఆ అభిప్రాయం ఉంటే
బావుటా ఒక కాగితం మీద గీయ్యగలడు అది విహంగ వీక్షణం చేశాడు నేను నా జీవితంలో మళ్ళీ
అలాంటి ఫోటో చూడలేదు.
ఆయనా సింహాచలం దగ్గర్నుంచి
వేంకటాచలం దగ్గరవరకు ఉన్న పర్వత సాలువుల్నీ గీశాడు గీస్తే అదేమైందో తెలుసాండీ..!
సింహాచలంలో తొకపెట్టి పడుకుని ఇలా ఉన్నటువంటి ఒక పెద్ద పాము ఖచ్చితంగా వేంకటాచలం
వచ్చేటప్పటికీ ఏడు పడగలు ఇలా విప్పింది, ఏడు పడగలలో ఒక పడగ ఇలా పైకుంది ఈ పడగ మీద
ఒక మణి ప్రకాశిస్తుంది అది ఆనంద నిలయం సింహాచలం దగ్గర తోక అక్కడ్నుంచి ప్రతి
కట్టులో కూడా ఒక్కొక్క కట్టులో అన్నవరం అన్నవరం దాటిన తరువాత ఇంద్ర కీలాద్రి
ఇంద్ర, కీలాద్రి దాటిన తరువాత శ్రీ శైలం, శ్రీ శైలం దాటిన తరువాత అహోభిలం, అహోభిలం
దాటిన తరువాత వేంకటాచలం ఈ పర్వతాల యొక్క వరుసక్రమంలో సింహాచలం నుంచి వేంకటాచలం
వరకూ ఏడు తలల పాము రూపంలో శేష రూపంలో ఎలా పడుకుందో పర్వతం పామురూపంలో ఆయన గీసి చూపించాడు
ఒక చిత్రం. అసలు నేను అటువంటి స్వరూపాన్ని ఇప్పటిదాకా చూడలేదు ఏమి అద్భుతంరా ఇది
నిజంగా అనుకున్నాను. అలా మహర్షి అంటారు మహీ కృతా పర్వత రాజి పూర్ణా పర్వతములన్నీ
ఈ భూ మండలం మీద ఎన్ని ఉన్నాయో అన్నిటినీ గీశారటా ఆ తివాచీమీద శైలాః కృతా వృక్ష
వితాన పూర్ణాః ఏ శైలం మీద ఏకొండ మీద ఏ చెట్టుంటాయో చెట్లన్నీ గీశారట వృక్షాః
కృతాః పుష్ప వితాన పూర్ణాః ! ఏ చెట్లకి ఏ పువ్వులు పూస్తాయో అటువంటి
పువ్వులన్నీ గీశారటా పుష్పం కృతం కేసర పత్ర పూర్ణమ్ ఆ పువ్వులలో
ఉండేటటువంటి కేసరములను కూడా గీశారటా కొన్నింటికి కేసరములుండవు కొన్నింటికి
కేసరములు ఉంటాయి.
మందారం పువ్వు ఉందనుకోండి దాంట్లోంచి ఇంత పెద్దదది పైకొచ్చి దాంట్లోంచి
పుప్పొడితో కూడినటువంటి చిన్న గుత్తులుండి పచ్చటి పరాగంతో కూడుకుని ఉండి రెక్కలు
ఇలా వంగిపోయి ఇలా బల్ల పరుపుగా తిరిగిపోయి పదకొడయ్యేటప్పటికి కింద ఉన్న
కాడదగ్గరికీ తిరిగిపోతాయి, మొర్నాడు పొద్దున్నైయ్యేటప్పటికి ఇటువైపునుంచి ఇలా
తిరిగిపోయి మళ్ళీ మొత్తం పూవ్వంతా కలిపి నా చిటుకనవేలంతైపోయి సన్నగైపోతుంది,
ప్రాణం పోయేటప్పుడు ఎలా బిగుస్తుందో మందారం పూవ్వు అలా బిగిసి మీరు ఆరాధ చేసే
మూర్తి దగ్గర పెడితే మూర్తిని కూడా అలా పెట్టేసకుంటుంది. నిజంగా దీని స్థితి
నాకొస్తే ఎంతద్రుష్టమో అనిపిస్తుంది ఆ మందార పువ్వుని చూస్తే. ఈశ్వరుని దగ్గరికి
వెళ్ళేటప్పుడు అంత హర్షం ప్రణోత్క్రమణ సమయంలో పరమేశ్వరున్ని పట్టుకోవడంలో అంత
బిగువుతో పట్టుకుని వెళ్ళిపోతుంది వాడిపోయిన
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
మందరాం పువ్వు ఎక్కడైనా విచ్చుకుంటుందేమో మీరు నాకు
చూపించండి, సన్నగైపోయింటుంది అందులో అది కూడా ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క గమ్మత్తు
ఇంక అన్ని పువ్వులు ఒక్కలా ఉంటాయని మీరు అనుకోకండి, కొన్ని పువ్వులు రేఖ మీద రేఖ
రేఖ మీద రేఖ ఒక వరుస క్రమంలో పేర్చి ఉంటాయి. కానీ మీరు ఆ పువ్వుని తీసీ పోనీ అసలు
అలా అనకూడదు పోనీ ఏదో మీరు ఇలా ఇలా అనండి అది ఏమీ అవదు అలాంటి అమరికతోనే ఉంటుంది
ఇంకొకపువ్వు ఇలా అనండి మొత్తం రేఖలు ఊడిపోయి పడిపోతుంది. గులాబి పూవ్వుని ఇలా
అనండి మొత్తం రేకులు ఊడిపోతాయి ఛామంతి పూవ్వుని ఇలా అనండి ఒక్క పూవ్వు ఊడదు ఇంత
చిన్న చిన్న రెకులన్నీ అలా రాత్రల్లా ఎవడు పేర్చాడురా అనిపిస్తుంది. మీరు ఆప్కోలో
కొనుక్కున్న గ్లాస్కో పంచె కూడా అంత తెల్లగా ఉండదు, రోజూ వెళ్ళేటటువంటి లారీలు
వెళ్లే దారిలో పూసిన ఉమ్మెత్తపువ్వు మార్నింగ్ వాక్కులో చూస్తే ఏ గ్లాస్కో పంచె
పనికిరాదు అంత తెల్లగా ఉంటుంది, ఎలా సృష్టించాడురా ఇంత తెల్లటి పూవ్వుని
అనిపిస్తుంది.
ఆయన సృష్టి, కావ్యగంట గణపతి ముని చెప్పినట్టు మీరు ఎక్కడ చూస్తారు ఈశ్వరున్ని ఆయన నిర్మాణ కౌశలాన్ని
ప్రతి క్షణం ప్రతిచోటా మీకు ఈశ్వర విభూతి కనపడుతూనే ఉంటుంది కాబట్టి మహీ
కృతా పర్వత రాజి పూర్ణా శైలాః కృతా వృక్ష వితాన పూర్ణాః వృక్షాః కృతాః పుష్ప వితాన
పూర్ణాః పుష్పం కృతం కేసర పుత్ర పూర్ణమ్ ! నాకీ మాటంటే ఒక మాట
గుర్తుకొస్తుంది, మీరు లోకంలో ఏ ప్రాణినైనా సరే ఇలా ముట్టుకునీ ఇలా వాసన చూడండి
దుర్వాసన వస్తుంది, ఆవు దగ్గరికెళ్ళి ఇలాంటి వాసన చూడండి తియ్యని వాసన వస్తుంది.
మరి ఆ ఆవు శరీరంలో దేవతలున్నారూ అంటే ఇంక అంతకన్నా తార్కాణమేమిటండీ అసలు దాని
శరీరం అటువంటి సువాసన దాని పేడ అంత సువాసన అందుకే గోవులాంటి ప్రాణి లోకంలో ఇంకోటి
లేదు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభాభి శ్చ వివర్ధమానమ్ వేశ్మోత్తమానమ్
అపి చోచ్చమానం మహా కపి స్తత్ర మహా విమానమ్ ! దానియొక్క రత్నకాంతులు దశ దిశలకీ
కాంతిని విరజిమ్ముతుంటే అందులోకి ఎవరైనా లోపలికి ప్రవేశిస్తేటా కాంతుల వలన ఎటవంటి
అనుభూతులు కలుగుతుందంటా వెంటనే ఆకాశంలో దాంట్లోవెడుతున్నామన్న అనుభూతి కలుగుతుందటా,
అటువంటి కాంతి చిమ్ముతుందటా ఒక్కొక్కటి అలా చేయగలదు, మీరు వెళ్ళనిది మీరు వెళ్ళని
రైల్లో కూర్చుని వెళ్ళుతున్న రైల్ని చూడండి మీరు వెళ్తున్నట్లు ఉంటుంది కదా.
దానికున్నప్పుడు పుష్పక విమానానికి
ఉండదని మీరు ఎందుకనుకుంటారు, పుష్పక విమానం రత్నకాంతులతో మీకు అటువంటి అనుభూతిని
ఇస్తుంది, తను ఎగిరిపోతున్నటువంటి భావనను మీకు కల్పిస్తుంది. ఎందుకుండదండీ మీరు
అలా అన్నానని మీరు ఏమీ అనుకోకండి మీరు ఆలా ఎక్కి కూర్చుంటే ఎలా ఉన్నట్లు ఉంటూందండీ
అని అన్నారకోకండి ఉండవూ మీరు జిమ్ కెళ్ళి చూడండి మనుష్య నిర్మితమైనటువంటి యంత్రమే
ఉంటుంది అది మీరు అడుగు తీసి అడుగేస్తుంటే రోడ్డు వెనక్కెడుతుంటుంది మీరు
ముందుకెల్తుంటారు కదా అలా మీరు వెళ్ళడానికి రోడ్డేమీ ఉండదు కాని అందులో మీకు
కావలసిన స్పీడ్ పెట్టుకుంటే కింద నుంచి నేల వెళ్ళినట్లు వెళ్ళిపోతుంటుంది. మీరు
అడుగులు తీసి వేసేసుకుంటుంటారు, చేయరు జిమ్ములో ఏమంటారు దాన్ని డ్రగ్మ్ʼన్ దాన్ని కావలసి స్పీడ్ʼలో సెట్ చేసుకుని డిస్క్ వాక్ శ్లోవాక్ చేస్తుండరూ ఏం
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
దానిమీద నిలబడితే మీకు నడుస్తున్న అనుభూతి కలుగుతున్నప్పుడు
పుష్పక విమానం ఎక్కితే ఎగురుతున్నాన్న అనుభూతి ఎందుకు కలగదు కలుగుతుంది.
కానీ మీరు ఎక్కలేదు కాబట్టి తెలియదు అది, కాబట్టి నియుజ్యమానా శ్చ గజాః
సుహస్తాః సకేసరా శ్చోత్పల పత్ర హస్తాః
బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీ స్తథా పద్మిని పద్మ హస్తా ! ఆయన పుష్పక
విమానంలో ఒక లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది నియుజ్యమానా శ్చ గజాః సుహస్తాః
దానికి ఎంత గొప్ప మూర్తంటే రెండు ఏనుగులు ఆకాశ గంగా జలాల్ని స్వర్ణకడవలతో
పట్టుకొచ్చింది, పట్టుకొచ్చి పోస్తున్నాయి పోస్తుంటే ఆ గంగాజలం ఆవిడ మీద
అభిషిక్తవౌతుంది, ఆ అభిషేకింపబడినటువంటి నీటిచేత తడపబడినటువంటి శరీరము
కలిగినటువంటి మూర్తిగా లక్ష్మీదేవి అక్కడ కనపడుతూంది లక్ష్మీర్దవ్యైర్గజేన్ద్రర్మణి
గణ ఖచితైహి స్నాహితా హేమ కుంభై హి ! నిత్యం సా పద్మ హస్తా మమ వసతు గృహే సర్వ
మాంగల్య యుక్తా !! అని మనం శ్రీ సూక్తంలో అడగం అలా మాకు కనపడు మా ఇంట మంగళం
కలుగుతుందీ అని అలాంటి మూర్తినిగాని చూస్తే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది అది శక్తి
శంకరాచార్యులువారు కనకధార చేస్తూ ప్రతిరోజూ కూడా అలా దిగ్ఘస్తిభిః కనకకుంభ
ముకావనృష్ట స్వర్వాహినీ విమలచారు ప్లుతాంగీమ్ ప్రాతర్నమామి జగతాం జననీం మశేష
లోకాధినాథ గృహిణీ మమఋతాబ్ధిపుత్రీమ్ అంటారు. ప్రాతః కాలంలోనమ్మా నేను అటువంటి
మూర్తి నమస్కరిస్తున్నాను, కాబట్టి అటువంటి మూర్తి ఇంట్లో ఉండాలని గుర్తు. గృహాణి
నానా వసు రాజితాని దేవాఽసురై శ్చాఽపి సుపూజితాని సర్వై శ్చ దోషైః పరివర్జితాని కపి
ర్దదర్శ స్వ బలాఽఽర్జితాని ! కాబట్టి అక్కడేముంది నియుజ్యమానా శ్చ గజాః
సుహస్తాః సకేసరా శ్చోత్పల పత్ర హస్తాః
బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీ స్తథా పద్మిని పద్మ హస్తా ! పద్మములు
పట్టుకున్న లక్ష్మీ దేవికి ఏనుగులు స్వర్ణభాండములతో అభిషేకం చేస్తున్నటువంటి
మూర్తి ఉంది.
చాలా బాగుంది అయితే ఇది రావణున్ని
మెచ్చుకోవడానికి కాదు ఉపాసనా
క్రమమేమిటో తెలుసాండీ మూర్తి ఉపాసన విస్తరణ జరగాలి అందుకే పూజా మందిరంలో
పూజ గొప్పది, పూజా మందిరంలో మరణించడం తప్పు అంటాడు వివేకానందుడు నీ పూజా మందిరం
లోకమంతా పూజా మందిరంగా మారడానికి పనికిరావాలి తప్పా, నా పూజామందిరం అదే తప్పా ఇంక
లోకంలో పూజించడానికిలేదంటే నీవు ఇంక రక్షసుడైపోయావని గుర్తు. రావణుడు ఏం
చేస్తాడంటే పుష్పకవిమాంలో ఇక్కడికి తీసుకొచ్చి తామరపూలు వేసి నమస్కారం చేస్తాడు
పొద్దున్నే సీతమ్మతల్లి దగ్గరికెళ్ళి ఆవిడని చూడ కూడని రీతిలో చూస్తాడు చూడడం ఇక్కడున్న
లక్ష్మీదేవే నీ పక్కింటివాడి భార్యా రూపంలో ఉన్న లక్ష్మీదేవి గృహలక్ష్మీ గృహే
హృహే ఎక్కడ చూస్తావు లక్ష్మీ దేవిని, సాయంకాలం ఈ సభలో కనపడుతున్న ఈ తల్లులందరూ
“సహస్త్రశీర్ష వదనా” వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే ఇన్ని రూపాల లక్ష్మీదేవిలను
చూడ్డమే నీ సౌభ్యం అంతే కాబట్టి పక్కింటివాడి భార్య ఎదురింటివాడి భార్య
ముందింటివాడి భార్య వెనకింటివాడి భార్య ఇంక ప్రతి ఇంట్లో ఉన్న గృహిణీ లక్ష్మియే,
కాబట్టి ఇక్కడ నీవు తామర పూలు వేస్తే అక్కడా అదే దృష్టితో ఉండాలి. కానీ ఇక్కడ
తామరపూలు వేస్తాడు అక్కడికెళ్ళి పనికిమాలిన మాటలు మాట్లాడుతాడు చూడకూడని దృష్టితో
చూస్తాడు.
ఇదీ గడ్డి తిన్న బుద్ధి, అంటే తను
చేసేదానిమీద తనకు నమ్మకంలేదు, నమ్మకంలేని పూజా చదువుకోలేదా చదువుకున్నాడు అందుకే
చేస్తాడు. కానీ ఇక్కడున్న లక్ష్మీ అక్కడున్న లక్ష్మీ ఈ లక్ష్మి ఏడిస్తే ఎంత
ప్రమాదమో ఆ లక్ష్మీ ఏడ్చినా ప్రమాదమే ఆవిడ పది నెలలనుంచి ఏడుస్తోంది కొంప
పడిపోతుంది ఆవిడని పంపించేసై వాళ్ళాయన దగ్గరికి అనరు. ఇక్కడ పూలేసి అక్కడ
కాల్చుతుంటే ఏమైనా కాపాడుతుందా? కాపాడదు కాబట్టి నీవు కూడా అలాంటి పూజలు చేయకు
ఇంట్లో మంచి మంచి మూర్తుల్ని పెట్టి
పూజల్ని చేసి చిట్ట చివరకి వచ్చేటప్పటికి వీధిలోకి వచ్చేటప్పటికి నీ దృష్టి
వంకర దృష్టితో ఉంటే అక్కడ చేసే పూజ నీవు ఇక్కడ చేసే పాపాన్ని ఆపలేదు. దాని పుణ్యం
దాంది, అది ఐశ్వర్యం వస్తుంది పాపం నిన్ను నశింపజేస్తుంది. అలా
తెచ్చుకోరాదనుకుంటారా అక్కడ పూజను ఇకడా చూడు అందరిలో లక్ష్మీదేవిని చూడు సీతమ్మని
చూడూ నీవు రాముడవైపోవాలి నీవు మర్యాదస్తుడవైపోతావు మర్యాద తెలిసున్నవాడివౌతావు ఇది
తెలయకపోతే రావణ పూజ, ఇది చెప్పడం అంతే గాని అక్కడ చాలా బాగుందండీ రావణుడు అలా
చేస్తాడండీ అని ఆయన గురించి గొప్పగా ఆలోచించమని కాదు, ఉపాసన వైక్లవ్యాన్ని చూడమని.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి న తత్ర కిచిత్ న కృతం ప్రయత్నతో న తత్ర కిచిత్ న
మహాఽఽర్హ రత్న వత్ న తే విశేషా నియతా స్సురేష్వఽపి న తత్ర కిచిత్ న మహా విశేష వత్
! అక్కడ అసలు వాడినటువంటి ఏ ఒక్కరత్నమూ కూడా సామాన్యమైందికాదు, అక్కడ
నిర్మించిన ఏదీ కూడా ఇది ఇంకోచోట కూడా ఉంటుందని చెప్పడం మీకు కుదరదు, మనసు పెట్టి
ఎవరో ఒక మహాత్ముడు నిర్మించాడు బ్రహ్మరు తప్పా, ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా
చూశానండీ అలానే ఉందని చెప్పడానికి నీకింకా ఉండదు. ఇక్కడ ఏ రత్నాలు ఉన్నాయో
అటువంటివి ఇంకోచోట కూడా ఉన్నాయీ అని నీవు చెప్పడం కుదరదు. అంతా ఇంతానేమి అసలు
అటువంటిది ఇంకోటుందని చెప్పడానికి లేదు. అటువంటిది వాడిదై ఉంది అంటే ఇప్పుడు అసలు
ఈ భూ మండలంలో ఎవరిదగ్గరాలేనంత ఐశ్వర్యము ఎవరిదగ్గరుంది? రావణుడి దగ్గరుంది ఇంత
ఐశ్వర్యానికి అధిపతి అంత దిక్కులేని ఛావెందుకు చచ్చిపోయాడు ఒక్క పాపానికి
చచ్చిపోయాడు, పరకాంత వ్యామోహమునకు నశించిపోయాడు అది కూడా మామూలుగా కాదు మిత్ర
పుత్ర కళత్రాదులతో ససైన్యంగా నశించిపోయాడు అంటే నీతి ఏమిటీ? ఈశ్వరుడు ఇచ్చింది
నిలబెట్టుకోవాలంటే దానిని నశించగలిగినదాని జోలికి నీవు వెళ్ళవద్దూ, ఇది
సుందర కాండ యొక్క తీర్పు.
కాబట్టి మీరు ఆ కోణంలో అన్వయం
చేసుకుంటుండాలి తప స్సమాధాన పరాక్రమాఽఽర్జితమ్ మన స్సమాధాన విచార చారిణం అనేక
సంస్థాన విశేష నిర్మితం తాత స్తత స్తుల్య విశేష దర్శనం ! ఇదీ ఎవరికి ఎవరు
ఎప్పుడిచ్చారు అంటే అది పట్టుకొచ్చి బహుమానంగా ఎవరిపెళ్ళికో ఇచ్చింది కాదు గొప్ప
తపస్సు చేస్తే తపస్సుకు ప్రీతి చెందినటువంటి బ్రహ్మగారు కుబేరునికి ఇచ్చారు
కాబట్టి అది తపస్సువలన వచ్చింది, ఈయ్యన దగ్గర తపస్సువల్లే ఉందా లేదు మరి దేనివలన
ఉంది తపస్సు చేసి సంపాదించుకున్నవాడు ఒకాయన ఆయన్ని కొట్టి తెచ్చి వీడి దగ్గర
పెట్టుకున్నవాడు ఈయ్యన, అంత తపస్సు చేసి సంపాదించినవాడంటే మహాత్ముడు అందునా ఆయన తనకన్నా
ముందు పుట్టినవాడంటే ఇంకా పూజ్యునీయుడు అటువంటి వాన్ని కొట్టి దాన్ని తెచ్చి ఇక్కడ
పెట్టుకుంటే అది అక్కడ ఉండడానికి యోగ్యమౌతుందా అది వెళ్లిపోతుంది అది ఉండదు.
ఎందుకుంది తాత్కాలికంగా నీ తపస్సు దాన్నుంచింది ఇది పోతుంది ఎందుకంటే మహా పాపమే
పుష్పక విమాన రూపంలో ఇప్పుడు అక్కడుంది ఇది చాలదన్నట్లు ఇంకోటి తెచ్చావు సీతమ్మని
తెచ్చావు అంటే పైకి
ఐశ్వర్యంగా కనపడుతున్నదేదో దానివెనక పాపమున్నది పైకి భోగమునకు ఉపకరించేదిగా
కనపడుతున్నదానివెక పాపం నిన్ను తినేస్తుంది పుష్పకం వెళ్ళిపోతుంది.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఎందుకనీ ఒక్కటే కారణం దాని వెనక అనుసరించిన మార్గము మంచిది
కాదు మార్గము మంచిది కానప్పుడు ఇది రక్షించదు, మార్గము మంచిదే ఒక్క దర్భాసనం
ఇంట్లో పెట్టుకో చాలు నిన్ను కాపాడేస్తుంది. ఏమీ అక్కరలేదు నీ ఇంట్లో ఏమీ
అక్కరలేదు ఓ వందరూపాలు పెట్టి గోరక్ పూర్ లేదా ఇంకో ప్రతో ఇంకో ప్రతో కొనుక్కుని ఒక
సుందర కాండని ఇంట్లో పెట్టుకో సుందర కాండ నా ప్రాణమండీ దీన్ని ఇలా కబ్బోర్డులో
పెట్టుకుని రోజూ ఓ నమస్కారం చేసుకుంటానను చాలు. అది నీ మహదైశ్వర్యం, ఈ ఐశ్వర్యం
ముందు నీవు ఏది ఐశ్వర్యం అనుకుంటున్నావో అది నిలబడే ఐశ్వర్యం కాదు ఇది
హనుమదైశ్వర్యం అది రావణ ఐశ్వర్యం ఇది చెప్పడం ఎంత చమత్కారంగా చెప్తున్నారో చూడండి తప
స్సమాధాన పరాక్రమాఽఽర్జితమ్ తపస్సుతో కుబేరుడు తెస్తే పరాక్రమంతో రావణుడు
తెచ్చాడు, మన స్సమాధాన విచార చారిణం మనస్సు ఎలా ఉంటే దాన్నిబట్టి అది
వెళ్ళితోంది, ఇప్పుడు అది ఎక్కడెక్కడికి వెళ్తుండుండాలి, మనసుని బట్టి వెళ్ళాలీ
అంటే అందులో ఎక్కేయాన మనసుని బట్టి కదాండి వెళ్ళాలి, ఇప్పుడు పుష్పకం ఎక్కడెక్కడి
వెళ్తూండాలి, రావణుడు రెండు చోట్లకే వెళ్తుంటాడు ఒకటి యుద్ధం చేయడానికి ఓరేయ్
బలమున్నవాడు ఎవడ్రాని వాడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. రజోగుణ ప్రకోపంతో
వెడుతాడు లేకపోతే అందమైన ఆడది ఎక్కడుందీ అని అడుగుతాడు పరుల భార్యయైనా సరే
ఆడదాన్ని తీసుకురావడానికి వెడతాడు కామ ప్రకోపంతో వెడుతాడు, రజోగుణ ప్రకోపం లేకపోతే
వాడి దగ్గర విలువైన వస్తువోదో ఉందటా దాన్ని తీసుకోరావడానికి వెడుతాడు లేకపోతే ఇంకా
తమోగుణ ప్రకోపము అక్కడ ఈశ్వరుడు నర్తిస్తున్నాడటా వాడు వినడు దాన్నుంచి వెళ్ళిపోతానంటాడు
అక్కడేగా కొంపముంచింది కైలాస పర్వత విషయంలో తేకూడని రీతిలో తెచ్చిన ఈ పుష్పక
విమానమే వాడి కొంప ముంచేసి దుఃఖం తీసుకొచ్చింది. కాబట్టి నీ దగ్గర వస్తువు ఉండడం కాదు నీవు ఆ వస్తువు తెచ్చిన
విదానం కూడా నిన్ను కాపాడుతుంది. కుబేరుడి దగ్గరుంటే అది రక్షణ రావణుడి
దగ్గరుంటే భక్షణ.
కారణమేమిటంటే నీవు తెచ్చిన విధానం బట్టి అది నీకు పనికొస్తుంది ఇది నీవు
తెలుసుకుని ఉంటే ఎర్నింగ్ ఈజ్ నత్తింగ్ బిపోర్ ది మీన్స్ ఆఫే ఎర్నింగ్ అంటారు,
మీరు పట్టుకుని ఉంటారు నేను అన్నమాట, అది మీరు పట్టుకుని ఉండాలి జాగ్రత్తగా.
కాబట్టి తప స్సమాధాన పరాక్రమాఽఽర్జితమ్ మన స్సమాధాన విచార చారిణం అనేక సంస్థాన
విశేష నిర్మితం తాత స్తత స్తుల్య విశేష దర్శనం ! అటువంటి పుష్పక విమానాన్ని
హనుమా చూస్తున్నారు. ఆయన చూడడం ఓ ఇక్కడుండ కూడదనిది ఇక్కడుంది, ఆయన అలా అంటారు ఆయన
అలా ఏమంటాడో అవన్నీ వెళ్లిపోతాయి, ఆయన అన్నాడు ఈ మాట ఇది వెళ్ళిపోతుంది రాముడేక్కి
తీసుకుపోతాడు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి ఆయోధ్యలో దిగిపోయి వెళ్ళిపో అన్నాడు అక్కడి
నుండి కుబేరుని దగ్గరకు వెళ్ళిపో అన్నాడు. అంటే ఒక మహాపురుషుడు ఉపాసనా బలం
కలిగినవాడు ఛీక్కరించాడో పాడయ్యింది అంతే. ఆయన ఛీ కారమునకు గురి కాకుండా
కాపాడుకోవాలి, అలా ఉండాలంటే ఆ మర్యదతో నిలబడుతుండాలి.
ఇది మహాద్భుతమండీ సుందర కాండ, ఇది
జీర్ణమైతే మీ తృప్తి వేరుగా ఉంటుంది, మీ జీవన విధానం వేరుగా ఉంటుంది పరేణ తపసా
లేభే యత్ కుభేరః పితామహాత్ ! కుబేరమ్ ఓజసా జిత్వా లేభే త ద్రాక్షసేశ్వరః !!
ఇంకా స్పష్టంగా చెప్తున్నారు మహర్షి, ఒకవేళ మనం పట్టుకోలేకపోయామోనని... ఇది
కుబేరునిది ఆయన్ని ఓడించి వీడు తెచ్చాడు, చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ !
సుపుణ్య గంధినా యుక్తం ఆదిత్య తరుణోపమం !! మధ్యాహ్న కాలంలో ఉండేటటువంటి
సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అందులో కాంతి అలా ఉంటుందట ఎర్ర చందనం యొక్క గుబాలింపు
ఎలా ఉంటుందో దానిలో సహజంగా అలాంటి సువాసన ఉందట అక్కడ స్వామి ఆ పుష్పక విమానంలో
తిరుగుతూ రావణా సురుని యొక్క శయనా గారంలోకి ప్రవేశించాడు తత స్తాం ప్రస్థితః
శాలాం దదర్శ మహతీం శుభామ్ ! రావణ స్య మనః కాన్తాం కాన్తామ్ ఇవ వర స్త్రియమ్ !!
అక్కడా ఆ హనుమ వెడుతున్నప్పుడు విశాలమైనటువంటి ఒక ప్రాంగణాన్ని భవనం ఒక గదిని
చూశారు అదీ అక్కడ ఆయనా మనోహరియైనటువంటి సర్వాంగ సుందరిని రావణుడు ఎలా
అభిమానిస్తాడో ఆయనకి అంత ప్రీతి పాత్రమైనటువంటి గది ఎందుకనీ అంటే ఆయన అక్కడ శయనిస్తాడు,
అక్కడ భోగమనుభవిస్తాడు.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
అటువంటి గది దగ్గరికెళ్ళి చూశాడు స్వర్గోఽయం దేవ లోకోఽయమ్
ఇన్ద్ర స్యేయం పురీ భవేత్ ! సిద్ధి ర్వేయం పరా హి స్యాత్ ఇత్యఽమన్యత మారుతిః !!
అసలా సోయగాన్ని చూసి హనుమ అంతటివాడు అన్నారూ స్వర్గోఽయం దేవ లోకోఽయమ్ ఇది
స్వర్గమా దేవలోకమా? ఇన్ద్ర స్యేయం పురీ భవేత్ ఇదికాని ఇంద్రలోకము కాదు
కదా..! ఒకవేళ ఇది సిద్దులుండే ప్రదేశం కాదు కదా... అన్నారు అంటే అటువంటి గది అసలు
ఆయన శయనాగారం అలా ఉంటుంది ఆయనా బెడ్ రూమ్ అలా ఉంటుంది. బెడ్ రూమ్ అంత గొప్పగా
ఉండడం పూజ గది అంత అహస్యంగా ఉండడం చాలా బాధా కరం కదాండి. చాలా పెద్ద హాలు ఖరీదైన ఫర్నీచర్
అద్భుతమైన ఫర్నీచర్ మంచం ఐదు లక్షలు పూజ గది మూడడుగులు ఇప్పుడు మీరు యజమాని
సంస్కారం పట్టుకోవలసి ఉంటుంది కదా ఏం ఆయనకి మాత్రం అలా ఉండాలని ఉండదా... బెడ్ రూమ్
ఏసీ హాల్ ఏసీ, పూజ గది మాత్రం నాన్ ఏసి ఎందుకు ఎందుకో తెలుసాండీ అక్కడ అక్కర్లేదు,
సెంట్రల్లీ ఏయిర్ కండిషన్డ్ ఏక్సిక్లూడింగ్ ది పూజ గది. అక్కడెందుకండీ ఏసీ, ఫ్యాన్
ఉంటే చాలు నేను ఐదు నిమిషాలేగా ఉండేది మీకోసం ఈశ్వరుడి కోసం కాదు.
కాదండీ అంటే? నీవు ముందు పూజ గది
కూడా ఏయిర్ కండిషన్ చేయించు అంటే ఏమంటాడంటే దీపం పెట్టడం కుదరు కదాండీ అంటాడు చాలా
చమత్కారంగా ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడూ అని నీవు నమ్మితే పూజా గదికి కూడా ఏసి
చేయించాలి చేయిస్తే నీవు చల్లతనాన్ని అనుభవిస్తూ ఆయనా చల్లగా ఉన్నారు నేనూ చల్లగా
ఉన్నాను ఇలాగే చల్లగా ఉండండి స్వామి అని కరెంటు బిల్లు గుర్తొస్తే ఆపిచేయండి,
కనీసం ఆయనకీ రెండు గంటలో మూడు గంటలో వేయండి, ఆయనేగా నీకు ఇస్తున్నదీ ఆయనకి మాత్రం
ఇవేమి అక్కర్లేదు ఎందుకనీ అంటే అవి విగ్రహాలండీ... అవి విగ్రహమైతే మీకేమిస్తుందండీ
అది విగ్రహం ఇంక మీకేం చేస్తుంది, కాదు అక్కడ మా స్వామి ఉన్నాడు మరి ఏసి ఆయనకి
పెట్టలేదేమిటండీ నీ దగ్గర సరియైన సమాధానం ఉంటే నీ లాగ కూడా ఇంకొకరు ఉంటారు కదా,
ఇది పూజ అన్నమాటకు పరమార్థం.
ఇక్కడ తెలిసిపోతుంటుంది జీవితాలు,
అందుకనీ మహర్షి అంటారు ప్రధ్యాయత ఇవాఽపశ్యత్ ప్రదీప్తాం స్తత్ర కాంచనాన్ !
ధూర్తాన్ ఇవ మహా ధూర్తై ర్దేవనేన పరాజితాన్ !! అక్కడ ఉండేవాడి దృష్టికోణం ఎలా
ఉంటుందో చెప్పడానికి మహర్షి ఎంచుకున్నటువంటి గొప్ప ఉపమానం అత్యద్భుతం అసలు
రామాయణంలో, ఆయన ఆ గదికి తీసుకొచ్చి ఎంత గొప్పమాట వేసేశారో... గోడలకి కాగడాలు
పెట్టారట ఇలాగ ఆ కాగడాలు వెలుగుతున్నాయి కాగడాలకు కూడా భయమే తెలుసాండీ కాగడానికి
భయమెందుకంటారేమో మీరు కాగడా మీద పెట్టినటువంటి దీపం కొంచం ఇలా ఇలా ఎప్పుడు
కదులుతుంది గాలేస్తే గాలేసి ఇలా ఇలా కదిలిందనుకోండి వెలుతురేమౌతుంది ఇలా ఇలా
ఊగుతుంది అలా ఊగుతూ ఆయనేదో చూద్దామనుకున్నాడు ఆయనకు బాగా కనపడలేదనుకోండి ఆయన బెడ్
రూంలో చూద్దామనుకున్నాడు ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి ఆయన ఇప్పుడు వాయువు మీద
ఆగ్రహించి చెలకుతాడు అందుకనీ గాలి వీచదు. కాళహస్తి అంతరాలయంలో అలా వెలగదు. వెలగడానికి ఎంత ఆక్సిజన్
కావాలో అంతే ఇవ్వాలి వాయుదేవుడు ఇది చమత్కారం ఆయన భూతములను ఎలా శాసిస్తాడో
చూడండి. అందుకని దీపాలు ఇలానే వెలుగుతాయి అవి ఇలా వెలుగుతుంటే మహర్షి అన్నారు అలా
వెలిగేతే ఎలా ఉన్నాయట తెలుసా... ప్యాకాట ఆడేవాళ్ళు ఓడిపోతాడు మర్యాద చాలా గొప్పగా
ఉంటుంది డబ్బు ఉన్నంతసేపే ఆడిస్తారు డబ్బులైపోయాయనుకోండి ఇంక వాడికి ముక్కలేయరు.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
మీకు అనుభవముందాని అడక్కండి అన్నిటికీ అనుభవమే ఉండక్కరలేదు,
ఒక సినీ నటీ ప్రసవవేదన చాలాబాగా అనుభవించినట్లు అనుభవిస్తుంది, ఆవిడ కుమారియై
ఉండవచ్చు అంత మాత్రం చేత చాలా గొప్ప అనుభవం ఉన్నవారిలా నటించారంటే పళ్ళు
రాలగొడుతుంది, అన్నిటికి గుండెపోటుతో మరణించ గలిగేటటువంటి అద్భుతనటుడు ఒకాయన
ఉన్నాడు, అంటే ఆయనకి ఇంతకు పూర్వం గుండె పోటు వచ్చిందాంటే అన్నిటికీ అనుభవాలే
ఉండక్కరలేదు చూస్తే చాలు కదాండీ..! విషయాలు కాబట్టి ప్యాకాడేవాడి దగ్గర
డబ్బులైపోతే నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు నీకు ముక్కలేయం లేచిపో అంటారు, ఇప్పుడు
ఆయనేం చేస్తాడో తెలుసాండీ ఛీ ఛీ ఛీ డబ్బులైపోగానే ఆట ఆడనీయలేదురా నన్ను పోని రేపు
ఇస్తానురా అంటే వాళ్లు ఒప్పుకోలేదు డబ్బులు ఉంటేనే... ఆయన వెళ్ళిపోతాడని మీరు
అనుకుంటున్నారా వెళ్ళిపోడు, ఇక్కడ లేచిపోయాక వాళ్లు సర్దేసుకుంటారు వీడేం
చేస్తాడంటే ఇంకోడి పేక ముక్కలు దగ్గరకొచ్చి ఇలా చూస్తుంటాడు తప్పా వాడు
ఇంటికెళ్ళడు ఓడిపోయినా ఇంటికెళ్ళకుండా పక్కవాడి పేకలు చూస్తున్నటువంటి జూదరి ఎలా
ఉంటాడో చూపు అలా చూస్తూ అలా ఉన్నాయట దీపాలు.
మహర్షి ఆ యజమాని తత్వాన్ని చెప్పడానికి పడకగది దీపాన్ని ఎలా చెప్తారో చూడండి ప్రధ్యాయత
ఇవాఽపశ్యత్ ప్రదీప్తాం స్తత్ర కాంచనాన్ ! ధూర్తాన్ ఇవ మహా ధూర్తై ర్దేవనేన
పరాజితాన్ !! దీపానాం చ ప్రకాశేన తేజసా రావణ స్య చ ! అర్చిర్భి ర్భూషణానాం చ
ప్రదీప్తే త్యఽభ్యమన్యత !! అక్కడ మంటపుట్టినట్టు ఉందట ఆ గదిలో ఎందుకనీ అంటే
ఒకపక్కనేమో కాగడాల యొక్క వెలుతురు ఒక పక్కనేమో రావణాసురిడి రోమ కూపాల్లోంచి
కోడుతున్న తపోశక్తి ఒక పక్కనేమో రావణాసురుడు పెట్టుకున్నటువంటి ఆభరణములలోంచి పైకొస్తున్నకాంతి
మూడు కాంతులు కలిసి మండుతున్నట్లు ఉందటా ఆ గది అంత కాంతిని ఇస్తున్నాయి తతోఽపశ్యత్
కుథాఽఽసీనం నానా వర్ణాఽమ్బర స్రజమ్ ! సహస్రం వర నారీణాం నానా వేష విభూషితమ్ !! కొన్నివేల మంది కాంతలు రావణుడితో రతీ క్రీడలు సలిపి నీరసించి ఆయన పాదాల చెంత
పడి ఉన్నారు ఆ ఒక్క శ్లోకం చాలు మీరు అర్థం చేసుకోండి తత్ ప్రసుప్తం విరురుచే
నిశ్శబ్దాఽన్తర భూషణమ్ ! నిశ్శబ్ద హంస భ్రమరం యథా పద్మ వనం మహత్ !! అక్కడ
ఉన్నటువంటి వాళ్ళు ఆభరణం తెగిపోయినవాళ్ళు ఒంటిమీద బట్ట సరిగ్గాలేనివాళ్ళు వీళ్ళ
ఒంటిమీద బట్ట వాళ్ళ ఒంటిమీద ఉన్నవాళ్ళు అంటారు మహర్షి అంటే వాళ్ళ ఒంటిమీద బట్టలేదు
అన్న మాట కు సంస్కారంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మీద బట్ట ఈవిడ మీద ఉందంటారు.
అంటే ఆవిడ మీద బట్టా లేదనే గదూ..?
దాని అర్థం, అంత సంస్కారంగా ఉంటుంది వాల్మీకి మహర్షి మాటలు. అక్కడా వీళ్ళందరూ ఎలా
నిద్రపోతున్నారటా నిశ్శబ్దంగా ఉన్నటువంటి సరస్సులో పద్మముల మధ్యా తుమ్మెదలతో
కూడినటువంటి ఆ పద్మములు ఉన్నటువంటి సరోవరంలో కదలక మెదలక ఉండే హంస ఉంటే ఎలా ఉంటుందో
పడుకున్న ఆడవాళ్లు అలా ఉన్నారట ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదాః ! అమ్బుజా
నీవ ఫుల్లాని ప్రార్థయన్తి పునః పునః !! వాళ్ళందరూ పనికిమాలిన
వాళ్ళనుకుంటున్నారేమోనని మహర్షి ఒక ఉపమానం చెప్పారు, వాళ్ళు పడుకుని నిద్రపోతుంటే
వాళ్ళ ముఖాల్ని చూసి తుమ్మెదలనుకున్నాయటా పద్మాలు అనుకుని వచ్చి వాలుతున్నాయట
వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళకు తెలియదు అంటే వాళ్ళు అంతంత అందగత్తెలు అటువంటివారందరూ
ఆ గదిలో కిందపడి ఉన్నారు. ఆ తరువాత ఆయన స్త్రీలు గురించి చేసేటటువంటి వర్ణణ మీరు
ఎప్పుడైనా సుందర కాండ చదివినప్పుడు చదువుకోవచ్చు అవన్నీ నేను ప్రత్యేకంగా నేను
చెప్పవలసిన విషయాలు కావు అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీ మాలా గ్రథితా హి సా !
మాలేవ గ్రథితా సూత్రే శుశుభే మత్త షట్పదా !! వాళ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ
మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పడుకుంటే ఈవిడ చేయి ఆవిడ మీద ఆవిడ చేయి ఈవిడ మీద ఇలా
పడుకుని ఉండిపోతే భుజములతో కూడిన మాల ఒకటి నిర్మాణం చేశారా అన్నట్టుగా ఆడవాళ్ళందరూ
పడుకున్నారు.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
వీళ్ళందరూ ఢమరుకని ఒకావిడా పిల్లగ్రోవిని ఒకావిడా విపంచిని
ఒకావిడా వీణని ఒకావిడా కౌగలించుకుని నిద్రపోతూ అప్పటి వరకూ వాళ్లు సంగీతవాద్యములను
మ్రోగించారు రావణుని యొక్క ఉల్లాసము కోసం వాళ్ళందరూ నిద్రలో చుంబిస్తున్నారు
వాటిని అవి రావణుని యొక్క ముఖమనుకొని రాజర్షి పితృ దైత్యానాం గన్ధర్వాణాం చ
యోషితః ! రక్షసానాం చ యాః కన్యా స్తన్య కామ వశం గతాః !! అక్కడా రాజర్షి కాంతలు
ఆ తరువాత పితృదేవతల యొక్క కాంతలు దైత్యుల యొక్క కాంతలు దేవతల యొక్క కాంతలు
గంధర్వుల యొక్క కాంతలు అందరూ రాక్షసుడి చేత తేబడినవారు, రాక్షసుని యందు
రావణునియందు అనురక్తి ఉన్నవారు తప్పా రావణుడు బలవంతంగా ఆమెకు ఇష్టంలేకపోయినా
తెచ్చినవారు ఎవరూ లేరు అందరూ ఆయన యందు అనురక్తి ఉన్నవారే. అలా అనురక్తిలేక
ఏడుస్తున్నది లంక మొత్తం మీద ఒక్క సీతమ్మే న తత్ర కాచిత్ ప్రమాద ప్రసహ్య
వీర్యోపపన్నేన గుణేన లబ్ధా న చాఽన్య కామాఽపి
న చాఽన్య పూర్వా వినా వరాఽర్హం జనకాఽఽత్మజాం తాం ! అంటారు, రావణుడు
కామాతురుతుడై పరాక్రమము చూపి బలవంతంగా తీసుకొచ్చిన కాంత ఒక్కతి కూడా లేదు.
అందరూ ఆయన్ని కావాలని వచ్చినవాళ్ళే, వాళ్ళు అలాగని చాలా పనికిమాలినవాళ్ళు చాలా
చేతకానివాళ్ళు చాలా హీనంగా జన్మించినవాళ్ళు అని అనుకుంటారేమో... న చాఽకులీనా న
చ హీన రూపా నాఽదక్షిణా నాఽనుపచార యుక్త భార్యాఽభవత్ తస్య న హీన సత్త్వా న చాఽపి
కాన్తస్య న కామనీయా ! న చాఽకులీనా ఉత్తమ వంశంలో పుట్టకుండా ఒక్కతీ లేదు అందులో
న చ హీన రూపా అందంగా లేక ఉన్నది ఒక్కతీ లేదు అందులో నఽదక్షిణా ఇంతకు
ముందు వేరొక భర్తను సేవించినది కాదు నాఽనుపచార యుక్త ఉపచారం తెలియంది కాదు భార్యాఽభవత్
న హీన సత్త్వా బుద్ధి లేనటువంటిది కాదు న చాఽపి కాన్తస్య న కామనీయా ఆయన
యందు మనసు లేనిది ఒక్కతీ లేదు. అందరూ ఆయన్ని కోరి వచ్చినవాళ్ళే ఇన్నివేల మంది
కాంతలు ఆయనతో కలసి భోగించి ఆ చుట్టు పడకగది నిండా ఇలా పడున్నారు ఇంత మందితో
భోగించి బడలి నిద్రపోతున్నాడు రావణాసురుడు తత్ర దివ్వోపమం ముఖ్యం స్ఫాటికం రత్న
భూషితమ్ ! అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాఽఽసనమ్ !! అక్కడే పరమ పవిత్రంగా
ఉన్నటువంటి స్ఫటికములతో నిర్మింపబడిన ఒక రత్న భూషణం మీద పడుకోవడానికి వీలైనటువంటి
ఒక గొప్ప తల్పాన్నొకదాన్ని హనుమ చూశారు, ఆ పడుకునేటటువంటి తల్పమే అంత గొప్పగా
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఉంది తస్య చైకతమే దేశే సౌఽగ్ర్య మాల్య విభూషితమ్ ! దదర్శ
పాణ్డురం ఛత్రం తారాఽధిపతి సన్నిభమ్ !! అమూల్యమైనటువంటి హారము ఒకటి కట్టబడి
దాని తలవైపు ఒక చక్కటి తెల్లటి గొడుగు ఒకటి పెట్టబడి ఉంది దానికి ఒక గొప్ప మాల
ఒకటి కట్టారు దానిమీద పడుకుని ఉన్నారు ఈయ్యన.
ఆయన ఎవరో హనుమ ఇంతకు ముందు చూడలేదు కానీ ఆ పడుకున్నాయన ఎలా ఉన్నాడంటే... తస్మిన్
జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుణ్డలమ్ ! లోహితాక్షం మహాబాహుం మహా రజతే వాసనం !!
జీమూత సంకాశం నీరు పట్టిన నల్లటి మబ్బొచ్చి తెల్లటి పక్కమీద పడుకుంటే ఎలా
ఉందో అలా పడుకున్నాడట ప్రదీప్తోత్తమ కుణ్డలమ్ చెవులకు పెట్టుకున్నటువంటి
కుండలముల కాంతి బుగ్గల మీద పడుతూంది లోహితాక్షం పడుకున్నా కూడా ఈ కనురెప్ప
కొద్దిగా తెరిచుండడం వల్లా ఎర్రటి కళ్ళల్లోంచి ఎరుపు కాంతి పైకొస్తుంది, అంత
తమకంలో పడుకని ఉన్నవాడు మహాబాహుం పెద్ద పెద్ద బాహువులున్నవాడు మహా రజతే
వాసనం బంగారంతో కూడిన జరి బట్ట అమూల్యమైనది వస్త్రం కట్టుకుని ఉన్నాడు లోహితేనాఽనులిప్తాంఽగం
చన్దనేన సుగన్ధినా ! సంధ్యారక్తమ్ ఇవాకాశే తోయదం సతటిద్గణమ్ !! ఎర్ర చందనాన్ని
ఒళ్ళంతా పూసుకున్నాడు, సంధ్యా కాలంలో ఉండేటటువంటి మేఘం మీద ఉండే మెరుపు ఎలా
ఉంటుందో అలా పడుకుని ఉన్నాడు వృతమ్
ఆభరణై ర్దివ్యైః సురూపం కామ రూపిణమ్ ! సవృక్ష వన గుల్మాఢ్యం ప్రసుప్తమ్ ఇవ మన్దరమ్
!! వృక్షములతోటీ గుహలతోటీ కూడినటువంటి మందర పర్వతమే నిద్రపోతే ఎలా ఉంటుందో ఆయన
అలా ఉన్నాడు.
పీత్వాఽప్యుపరతం చాఽపి దదర్శ స మహా
కపిః ! భాస్కరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాఽధిపమ్ !! బాగా తాగి తాగి నిద్రపోతున్నాడు స్త్రీలతో భోగించి భోగించి నిద్రపోతున్నాడు
రజో గుణములచేత బడలిపోయినవాడై నిద్రపోయినటువంటి ఆ రాక్షసాధికున్ని ఇప్పుడు చెప్పాడు
మహర్షి. రావణాసురున్ని హనుమ చూశారు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు నిశ్శ్వసన్తం
యథా నాగం రావణం వానరోత్తమః ! ఆసాద్య పరమోద్విగ్నః సోఽపాసర్స త్సుభీతవత్ !!
ఇంతటి మహానుభావుడైన హనుమా నిద్రపోతున్నటువంటి రావణాసురునికి కొంచెం దగ్గరగా వెళ్ళి
చూడబోయి అసలు ఆ స్వరూపాన్ని చూసి భయపడ్డారు, దిగులు చెందారు అదేమిటండీ హనుమ
భయపడడమేమిటండీ అనకండి మీరు ఆయన స్వరూపమటువంటిది, రావణుని తపస్సు అటువంటిది తేజస్సు
అటువంటిది రోమ కూపాల్లోంచి పుడుతుంది తేజస్సు నిద్రపోతుంటే ఇక లేచుంటే ఎలా ఉంటాడో
చూడండి. పది తలకాయలతో ఉంటాడు, ఇంకా పడుకున్నాడు కాబట్టి ఒక్క తలకాయి రెండు చేతులు
లేస్తే పది తలకాయలు ఇరవై చేతులతో ఉంటాడు కాబట్టి నిద్రపోతున్నవాడు ఎలా ఉన్నాడంటే నిశ్శ్వసన్తం
యథా నాగం నిద్రపోతున్నా పాము ఎలా బుసకొడుతుందో అలా పడుకుని ఉన్నాడు రావణం
వానరోత్తమః ఆ నిద్రపోతున్నరావణుని తేజస్సు చూసి భయపడినవారై హనుమ కొంచెం దూరంగా
తొలగిపోయారు.
ఐరావత నిషాణాఽగ్రైః ఆపీడిత కృత వ్రణౌ ! వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణు చక్ర
పరిక్షతౌ !! ఆయన పడుకున్నప్పుడు ఆయన భుజాల వంక చూస్తే ఐరావత నిషాణాఽగ్రైః
ఐరావతం కుమ్మడం వల్ల దాని యొక్క దంతములు కోసుకుని మానినటువంటి దెబ్బల మచ్చలు
కనపడుతున్నాయి ఆపీడిత కృత వ్రణౌ అలా దెబ్బలు తగ్గినన పుళ్ళ మచ్చలుపడి
ఉన్నాయి వజ్రోల్లిఖత పీనాంసౌ ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే తగిలినటువంటి
దెబ్బల మచ్చలు విష్ణు చక్ర పరిక్షతౌ శ్రీ మహా
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
విష్ణువు యొక్క సుదర్శన చక్రం పెట్టి కొడితే తెగినటువంటి
దెబ్బ దాని మచ్చ వాడు గొప్పగా చెప్పుకునేవాడు. వీళ్ళందరు ఎందుకు కొడతారు, ఇప్పుడూ
ఏంటండీ మీకు అవన్నీ అన్నారనుకోండి ఇదీ ఏలూరు పోలీస్ స్టేషన్లో కొట్టారు ఇది మచిలీ
పట్నం పోలీస్ స్టేషన్లో కొట్టారు ఇది ఒక యస్ పీ గారు కొట్టారు అని అన్నారనుకోండి
అప్పుడు మీరు ఆయన్ని ఏమంటారు, అబ్బాహ్... ఎంత గొప్ప గొప్పవారు కొట్టారండీ
అంటారా..! అంటే వీడు చాలా పెద్ద దొంగై ఉండాలనుకుంటారా..? అది దానర్థం. సుందర కాండలో
మహర్షి చెప్పే విషయాలు అంత విచిత్రంగా ఉంటాయి. ఇంద్రుడు కొట్టాడు విష్ణువు
కొట్టాడంటే... వీడు ఎంత తప్పుడు పన్లు చేసుంటాడో లేకపోతే ఎందుకు కొడతారు స్థితి
కారుడు ఇంద్రుడూ వాళ్ళెందుకు కొడతారు, కొట్టినా ఛావలేదంటే వీడి తపస్సు ఎంతగొప్పదో.
కాబట్టి ఇంత తపస్సుకు చావాలంటే లోకంలో ఇంతటి దురాత్మున్ని చావాలంటే లోకంలో
ఇంద్రుడి వజ్రాయుధం చంపలేదు విష్ణువు చక్రం చంపలేదు ఐరావతం యొక్క దంతం చంపలేదు ఒక
మహా పతివ్రత యొక్క కన్నీళ్ళు చంపేశాయి ఇది సుందర కాండ తీర్పు.
కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు పీనౌ
సమ సుజాతాంఽసౌ సంగతౌ బల సంయుతౌ ! సులక్షణ నఖాంఽగుష్ఠౌ స్వఙ్గళీ తల లక్షితౌ !! పీనౌ
బాగా బలసినటువంటి భుజాలు సమ సుజాతాంఽసౌ చక్కగా పెరిగినటువంటి భుజాలు సంగతౌ
బల సంయుతౌ శరీరం ఎలా ఉందో దానికి తగినట్లు ఉన్నాయటా ఆ భుజాలు వజ్రోల్లిఖిత
పీనాంసౌ విష్ణు చక్ర పరిక్షతౌ ! పీనౌ సమ సుజాతాంఽసౌ సంగతౌ బల సంయుతౌ !
సులక్షణ నఖాంఽగుష్ఠౌ స్వఙ్గళీ తల లక్షితౌ !! చేతి వేలి గోళ్ళు మెరిసిపోతూ
కాంతులతో ఐశ్వర్యంతో చిహ్నాలుగా ఉన్నాయట సంహతౌ పరిఘాఽఽకారౌ వృత్తౌ కరి కరోపమౌ !
విక్షిప్తా శయనే శుభ్రే పంచ శీర్షా వివోరగౌ !! పిరిఘాఽఽకారౌ మనం బీమ్స్ అంటాం
చూశారా పెద్ద పెద్ద దూలాల్నీ ఆ దూలం ఎలా ఉంటుందో ఆయన యొక్క భుజాలు అలా ఉన్నాయట, వృత్తౌ
కరోపమౌ ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా గుండ్రంగా ఉన్నాయటా విక్షిప్తా శయనే
శుభ్రే ఇలా చేతులు పెట్టుకుని నిద్రపోతూంటే ఆచేతులు వేళ్ళల్లా లేవటా ఐదు తలల
పాముల్లా ఉన్నాయటా, అంటే ఆ చేత్తో ముట్టుకున్నాడంటే పాము కాటేసిందని లెక్క అంతే
ఇంక అటువంటి పనులు చేస్తాడని. కాబట్టి మహర్షి అంటారు చూత పున్నాగ సురభి ర్వకుళో
త్తమ సంయుతః ! మృష్టాఽన్న రస సంయుక్తః పాన గన్ధ పురస్సరః !! తస్య రాక్షస సింహస్య
నిశ్చక్రామ మహా ముఖాత్ ! శయాన స్య వినిశ్శ్వాసః పూరయ న్నివ తద్గృహమ్ !! ఆయన
ఊపిరి విడిచి పెడుతుంటే బాగా వెల్లుపాయ తినేసి మాట్లాడితే వెళ్ళుల్లిపాయ వాసన
వస్తుంది అవతలవాళ్ళ నోట్లోంచి.
అలా ఈయన ఆ పదార్థాలు ఎంత తిని
పడుకున్నాడంటే ఊపిరి నిశ్వాసలోంచి విడిచిపెడుతున్నప్పుడు మామిడి పున్నాగ సురభి
మొదలైన పూల వాసనలు వస్తున్నాయట అంటే అంతంత సువాసనలతో కూడినటువంటి మధ్యాన్ని
తాగాడు, రెండోది దానితో పాటుగా ఆయన తిన్న పదార్థముల యొక్క వాసనలు పైకొస్తున్నాయి
అవన్నీ తినీ తాగి పడుకున్నాడు శుభ్రంగా. ముక్తా మణి విచిత్రేణ కాంచనేన విరాజితం
! మకుటేనాఽపవృత్తేన కుణ్డలో జ్జ్వలితాఽఽననమ్ !! నిద్రపోతున్నప్పుడు ఒక్క
తలకాయే ఉంటుంది ఆయనకి అందుకనీ కామ రూపిణి శివుడి యొక్క వరం కామరూపిణి అలా కావలనుకుంటే
పది తలకాయలు వచ్చేస్తాయి నిద్రపోతున్నాడు కాబట్టి ఒక తలకాయ రెండు చేతులు ఇప్పుడు
ఆయన
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
పడుకుంటే తల కొంచెం ఒరిగింది ఒరిగితే ఆ పైనున్న కిరీటం కొద్దిగా ఒరిగింది,
ఒరిగిపోయి ఆ కుండలములు ఒరిగినటువంటి కిరీటం ముక్తా మణి విచిత్రేణ కాంచనేన
విరాజితం ముత్యములతో మెరిసిపోతున్న ఒరిగిన కాంతితో కూడిన కిరీటము ఆయన కుండలముల
తేజస్సు కనపడుతున్నాయి మాష రాశి ప్రతీకాశం నిశ్శ్వసన్తం భుజంగవత్ ! గాంగే మహతి
తోయాఽన్తే ప్రసుప్త మివ కుంజరమ్ !! మాష రాశి ప్రతీకాశం రాశి పోసినటువంటి
మినుములు ఎలా ఉంటాయో అలా ఉన్నాడట నిశ్శ్వసన్తం భుజంగవత్ అది ఒక బుసలు
కొడుతున్నటువంటి మహాసర్పం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆ పడుకుని ఊపిరి తీస్తుంటే గాంగే
మహతి తోయాఽన్తే ప్రసుప్త మివ కుంజరమ్ గంగానదిలో స్నానం చేసినటువంటి ఏనుగు
అక్కడ పడుకుంటే ఎలా ఉందో అలా ఉన్నాడట, లేస్తే ఏనుగు ఏం చేస్తుంది గంగలో స్నానం చేసి
అది బయటికి రాగానే అదేం చేస్తుంది దుమ్ము తీసి మీదికేసుకుంటుంది, లేచాడంటే మొదలు
అల్లరి ఇప్పుడు నిద్రపోతున్నాడు కాబట్టి అలా పడుకున్నాడు ప్రశాంతంగా నిద్రపోతుంటే.
కాబట్టి ఈశ్వరుడు నిద్రా అన్నది
పెట్టి ఆపాటి ఉపకారం చేశాడు కొంతమందికి లేకపోతే వాళ్ళు 24 గంటలూ అల్లరిచేసేవాళ్ళు
కాబట్టి నిద్రుందికాబట్టి కొంతసేపు పడుకోబెట్టాడు. దయానంద సరస్వతి మహరాజుని ఇదే
ఒకావిడ అడిగింది భగవత్ భక్తి కలిగినవాళ్ళవల్ల చాలా సంతోషం ఉంటుందంటారూ మా అత్తగారు
ఎప్పుడూ గుళ్ళకీ గోపురాలకి వెళ్ళుతుందిగదాని నేను వాళ్ళబ్బాయిని
పెళ్ళిచేసుకున్నాను, రాచి రంపాన పెట్టేస్తుంది ఆ పూజామందిరంలో ఉన్న కాసేపే
ప్రశాంతత బయటికొచ్చిందో చంపేస్తుంది మరి అంత పూజలుచేసే ఆవిడా ఇలా ఎందుకుంటుంది అని
ఆడిగింది ఆ పూజేదో చేస్తుంది కాబట్టి నీకు ఆ రెండుగంటలూ ప్రశాంతంగా ఉందన్నారాయన
కాబట్టి వారి పరిస్థితి అది ప్రసుప్త మివ కుంజరమ్ పడుకున్నాడు కాబట్టి అలా
ఉన్నాడు లేచాడో అల్లరి మొదలు కాబట్టి ఇప్పుడు పాద మూల గతా శ్చాఽపి దదర్శ
సుమహాత్మనః ! పత్నీ స్స ప్రియ భార్య స్య తస్య రక్షః పతే ర్గృహే !! ఆయన పాదాల
చెంత పడి ఉన్నటువంటి ముద్దుల భార్యలందర్నీ చూశాడు వాళ్ళందరూ మంచి నృత్యం చేయగలరు
నాట్యం పరికరములను మ్రోగించగలరు గొప్ప కళ గలిగినంటివారు అని అనేకమైనటువంటి
విభూతులు కలిగినవారు.
వాళ్ళందరు కోరి కోరి వలచి వచ్చినటువంటివారు అన్యా కమల పత్రాఽక్షీ
పూర్ణేన్దు సదృశాఽఽననా ! అన్యామ్ ఆలింగ్య సుశ్రోణీ ప్రసుప్తా మద విహ్వలా !!
అంటాడు మహర్షి, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకుని రావణున్నే
కౌగలించుకున్నాననుకుంటున్నారు తాసామ్ ఏకాన్త విన్యస్తే శయానాం శయనే శుభే !
దదర్శ రూప సంపన్నామ్ అపరాం స కపిః స్త్రియమ్ !! అక్కడే హంస తూలికా తల్పం మీద
పరమ పవిత్రంగా ఒక తల్లి పట్టుబట్ట కట్టుకుని పరమమర్యాదతో వీళ్ళందరూ పడుకున్నట్లుగా
కాకుండా పడుకునుంది ఒకావిడా గౌరీం కనక వర్ణాఽఽభామ్ ఇష్టామ్ అన్తః పురేశ్వరీమ్ !
కపి ర్మన్దోదరీం తత్ర శయానాం చారు రూపిణీమ్ !! కనక వర్ణాం అంటే బంగారు వన్నెతో
ఉండి స్వచ్ఛమైన కాంతితో మనోహరమైన రూపంతో మెరిసిపోతూ ఏంతో ఉబ్బిడిగా హంసతూలికా
తల్పంమీద పడుకున్నటువంటి మండోదరిని హనుమ చూశాడు. చూసి ఆయన అనుకున్నాడు ఆఁ...
వీళ్ళల్లా ఇలా పడుకోకుండగా ఇలా పడుకుందంటే ఈ తల్లే సీతమ్మ అంతే ఇక సంతోషం
వచ్చేసింది ఆస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం ననన్ద చిక్రీడ జౌ జగామ స్తమ్భాన్
అరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్ ! మహర్షి అన్నారు కోతి
బుద్ధి బయటపెట్టుకున్నాడు అన్నారు, అస్హ్పోటయా మాస ఆభుజాలు రెండు
కొట్టేసుకున్నాడట చుచుమ్బ పుచ్ఛం తోక తీసి ముద్దు పెట్టేసుకున్నాడు
ననన్ద చిక్రీడ జౌ జగామ కసేపు నాట్యం చేసి గంతులేశాడు స్తమ్భాన్ ఆరోహన్
స్తంభాలెక్కేశారు నిపపాత భూమౌ కిందకి ధూకేశారు, సీతమ్మ దర్శనం
అయిపోయిందనుకున్నారు నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్ కోతి బుద్ధి
బయపెట్టుకున్నాడు అన్నారు.
సుందర కాండ ముప్పయ్
ఒకటవ రోజు ప్రవచనము
|
|
నిజంగా భగవత్
ధర్శనమైనప్పుడు ఆత్మ దర్శనమైనప్పుడు యోగిపుంగవుడి కన్నులవెంట నీరు కారుతుంటుంది
అన్నారు, అది మహోదృష్టమైన స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో సీతా దర్శనం అయిందని
మురిసిపోతూ ఆయనా ఇటువంటి పనులన్నీ చేశాడు, ఇది చెప్పినప్పుడు నేను ఒకమాట
చెప్పకుండా ఉండలేను వాల్మీకి మహర్షి కవిత యొక్క గొప్పతనం ఏమిటో తెలుసాండీ చుచుమ్బ
అంటే ముద్దుపెట్టుకోవడం, ఆయనా అస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం పుచ్ఛం
అంటే తోక యొక్క చివరి భాగం తోకని ఇలా తీసి పుచ్చాన్ని ముద్దుపెట్టుకున్నారు అదో
సంతోషం, చుచుమ్బ అన్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ఎలా ముందుకు
రావాలో ఆ మాట అన్నాకూడా అలాగే ముందుకు రావాలి, లేకపోతే ఆ పదం పలకదు చుచుమ్బ
అంటే ముద్దుపెట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇప్పుడు మీరు అదేం ప్రయత్నం
చేయకండి సభాంతా అసహ్యంగా ఉంటుంది చుచుమ్బ ఇంటికెళ్ళి శ్లోకం చదువుకుని
అద్దం పెట్టుకుని చూసుకోండి. ఆస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం ననన్ద చిక్రీడ జౌ
జగామ స్తమ్భాన్ అరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్ ! కోతి
బుద్ధి బయటపెట్టుకున్నాడు తాసాం మధ్యో మహా బాహుః శుశుభే రాక్షసేశ్వరః ! గోష్ఠే
మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథా వృషః ! నా తల్లి సీతమ్మా ఇలా రావణాంతఃపురంలో
రావణా హంసతీలికా తల్పమీద పట్టు పుట్టం కట్టుకుని నగలు పెట్టుకుని పడుకోదు నా తల్లి
రామ చంద్ర మూర్తి కనపడలేదని ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది మహాసాద్వి.
పరమ పతీవ్రత నా తల్లి ఇలా ఉంటుందా..! ఈశ్వరోపాసనయందు భక్తికలిగినవాడి వైక్లవ్యాన్ని ఈశ్వరుడే
దిద్దుతాడు అని ఆయన అనుకుని ఆ రావణుడి యొక్క అంతఃపురం చూసి అనుకుంటున్నారు,
ఎలా ఉన్నాడంటే రావణుడు అనేకమైన గోవులతో క్రీడించి పడుకున్న ఆంబోతు ఎలా ఉంటుందో అలా
ఉన్నాడట అంటే పశువులా ఉన్నాడు. లేకపోతే భార్య అక్కడ అంతఃపుర స్త్రీ మహాతల్లి
పట్టమహిషి ఆవిడ అలా పడుకుని ఉంటే వీడు ఇక్కడ ఇన్నివేల మంది కాంతలతో రమించి వీడు
పడుకుంటే ఆవిడ ఎంత ఏడ్చి పడుకుని ఉంటుంది అది వాడి శీలమని చెప్పను, కాబట్టి మృగాణాం
మహిషాణాం చ వరాహాణాం చ భాగశః ! తత్ర న్యస్తాని మాంసాని పాన భూమౌ దదర్శ సః ! పాన
భూమిని చూశారు ఆ పాన భూమిలో లేళ్లూ దున్నలు అడవి పందులు వీటి మాంసములన్ని చాలా
చక్కగా వండి బంగారు పాత్రలలో కొంత తిని కొంత ఉంచితే మహర్షి అన్నారు, వాటి వాసనలు
ఎలా ఉన్నాయంటే కన్నతల్లి రా నాయనా అన్నం తినూ అని పిలిచినట్లు ఉన్నాయటా...
ఇప్పటివరకు హనుమ ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్ళు తాగినట్లు ఉందాండీ! లేదు ఇవన్నీ
చూసినా సీతమ్మ కాదని వెళ్ళిపోతున్నాడు తప్పా ఆడగడు ఆయనా అది ఆయన అన్వేషణ. కాబట్టి
ఇప్పుడు పెద్ద పెద్ద బంగారు పాత్రలలో పెరుగుతోటి రుచకము అనబడేటటువంటి లవణముతోటి
కలిపి వండిన అడవి మృగాలు ఖడ్గమృగాలు ముళ్ళపందులు లేళ్ళూ నెమళ్ళు కొక్కెర పక్షులు
చకోరములు మనిషములు మధ్యములు మేకలు అక్కడ లేని మాంసం లేదని మీరు అనుకోండి అన్ని
రకాల మాంసాలు వండి ఉన్నాయి.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
దానితోపాటు దివ్యాః ప్రసన్నా వివిధాః సురాః కృతసురా అపి
! శర్కరాఽఽసవ మాధ్వీక పుష్పాఽఽసవ ఫలాఽఽసవాః ! వాస చూర్ణై శ్చ వివిధై ర్మృష్టా స్తై
స్తైః పృథ క్పృథక్ ! దివ్యమైనటువంటి సహజముగా ఉండేటటువంటి కల్లు, కొన్ని కొన్ని
ఇప్పపళ్ళూ పువ్వులు కొన్ని పులియబెట్టి తీసేటటువంటి కల్లు రక రకాల కల్లు
పదార్థాలు, వాటి సువాసనలు వాటితో కూడినటువంటి బంగారు పాత్రలు అక్కడ పెట్టి ఉన్నాయి
ఇవన్నీ చూసి ఇక్కడ మా తల్లి లేదు అని వెతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంత వెతికారు
సీతమ్మ కనపడలేదు ఆయన అనుకుంటారు మనో హి హేతుః సర్వేషామ్ ఇన్ద్రియాణాం ప్రవర్తనే
! శుభాఽశుభా స్వఽవస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్ !! ఓహో నేను రాత్రి
నిద్రపోతుండగా ఒంటిమీద బట్టకూడా సరిగ్గాలేని కాంతలని ఎందరినో చూశాను, ఆ తల్లి
ధర్మలోపం నన్ను ఇబ్బంది పెట్టిందీ అన్నారు, అనుకుని వెంటనే అనుకున్నారు నాన్యఽత్ర
హి మయా శక్యా వైదేహీ పరిమార్గితుమ్ ! స్త్రియో హి స్త్రీషు దృశ్యన్తే సదా
సంపరిమార్గణే !! ఆడదాన్ని తప్పిపోతే ఆడదాన్ని ఆడవాళ్ళల్లో వెతక్కా దూడలశాల్లో
వెతుకుతానా ఆడవాళ్ళల్లో వెతుకుతాను, నేను చూడ్డం ధర్మం కాబట్టి నేను సీతమ్మ కోసం నాకన్ను
చూసింది నా మనసేమైనా కదిలిందా నా మనసు కదలలేదు కాబట్టి నాయందు ధర్మలోపంలేదు
అన్నాడు. ఆ అంతః పురమంతా వెతికారు వెతికి వెతికి వెతికి ఆఖరికి అనుకున్నారు ఈ
తల్లిని రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు భయపడి నదీ నీళ్ళల్లో ఆ సముద్ర నీళ్ళల్లో
పడిపోయిందో భయ విష్పలమై కనపడకుండా దాక్కుందో లేకపోతే ఒకవేళ ఈ తల్లిని వీడే
తినేశాడో అయ్యో ఏమైందోనని బెంగబెట్టుకున్నాడు, నీరసమొచ్చేసింది బాధపడ్డాడు ఇంక
ఒంట్లో ఉన్నటువంటి ఉత్సాహమంతా నశించిపోయింది నశించిపోయి ఒక మూల కూర్చున్నారు
కూర్చుని మళ్లీ అనుకున్నారు అనిర్వేదః శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్ !
అనిర్వేదో హి సతతం సర్వాఽర్థేషు ప్రవర్తకః !! కరోతి సఫలం జంతోః కర్మ య త్తత్ కరోతి
సః ! తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేఽహ ముత్తమం !! అదృష్టాం శ్చ విచేష్యామి
దేశాన్ రావణ పాలితాన్ ! ఎవడు నిర్వేదాన్ని అంటే ఉత్సాహంగా ఉండకుండా నిరుత్సాహంగా ఉండేటటువంటి స్థితిని
ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టడో వాడు ఏమీ సాధించలేడు.
ఉత్సహమే దేనికైనా కారణం అనిర్వేదః
శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్ ! అనిర్వేదో హి సతతం సర్వాఽర్థేషు ప్రవర్తకః !! ఏది సాధించాలన్నా ఉత్సాహం ఉండాలి, కాబట్టి తస్మాత్
అనిర్వేద కృతం యత్నం చేష్టేఽహ ముత్తమం నేను ఇప్పుడు అనిర్వేదంతో ఉన్నాను,
ఉత్సాహంతో మళ్ళీ వెతుకుతాను అన్నాడు మళ్లీ లంకా పట్టణమంతా తిరిగి వచ్చేశారు ఎక్కడా
కనపడలేదు చతు రంఽగుళ మాత్రోఽపి నాఽవకాశః స విద్యతే ! రావణాఽన్తః పురే తస్మిన్
యం కపి ర్న జగామ సః !! నాలుగు అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా లంకా పట్టణమంతా
వెతికేశాను అయినా నా తల్లి సీతమ్మ నాకు ఎక్కడా కనపడలేదు, ఒకవేళ ఈ సీతమ్మ తల్లిని
తీసుకొని వచ్చేటప్పుడు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురునికి సీతమ్మతల్లి
వశమైపోయిందా..? అసంభవము నా తల్లి ఒక్కనాటికి అలా వశం కాదు, ఒకవేళ
తీసుకొచ్చేటప్పుడు నా తల్లి సముద్రంలో పడిపోయిందేమో..? ఒకవేళ ఈ రాక్షసుడి కొలువు
కూటంలో నేను ఇంకెన్నాళ్ళు ఇలా బ్రతుకుతాను పాతివ్రత్యం నిలబెట్టుకుంటాను అని
బెంగపెట్టుకుని ప్రాణములు విడిచిపెట్టిందేమో..? పెనుగులాడుతున్నప్పుడు సముద్రంలో
పడిపోయిందేమో..? ఈ రావణుడే తినేశాడేమో, ఆవిడ లొంగట్లేదని ఆ రాక్షస కాంతలు ఒకరోజు
ఉదయం ఆవిడని సంహరించారేమో లేదా పతి విరహమును భరించలేక ప్రాణాలు
విడిచిపెట్టిందేమో..?
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఇప్పుడు నాకు సీతమ్మ కనపడలేదన్నవార్త నూరు యోజనముల
సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డకువెళ్ళి రామ చంద్ర మూర్తికి చెప్తే రామ చంద్ర మూర్తి
తానింక జీవించలేక ప్రాణములు విడిచిపెడతారు రాముడు ప్రాణములు విడిచిపెడితే
లక్ష్మణుడు శత్రుఘ్నుడు భరతుడు కౌసల్య సుమిత్ర కైకేయూ సుగ్రీవుడు అంగదడు తారా రుమా
వానరులు నర వానరలు రెండు మహోత్కృష్టమైన వంశములు నషించిపోయేటటువంటి ఈ వార్తను నేను
ప్రయత్న పూర్వకంగా వెనక్కి వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరమేముంది, కాబట్టి నేను
వెళ్ళనే వెళ్ళను నేను చెప్పనే చెప్పను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు.
చావు నుండి అందరిని
రక్షించగలిగేటటువంటి మహానుబావుడు తాను చచ్చిపోతానంటున్నాడు అంటే పరీక్షలో విషమ
పరీక్ష ఉపాసన యందు భగవత్ దర్శనం పొందాలనుకున్న భక్తుడికి యొక్క స్థితి చిట్ట
చివరకి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. పరీక్షలలో చాలా గొప్ప పరీక్షకు
వచ్చాడు ఇప్పుడు హనుమా హస్తాఽఽదానో ముఖాఽఽదానో నియతో వృక్ష మూలికః ! వానప్రస్థో
భవిష్యామి అదృష్ట్వా జనకాఽఽత్మజామ్ ! ఏదో నేను వెళ్ళి ఏదో వనంలో చెట్టుకింద
కూర్చుని వానప్రస్తుగా ఉంటాను చేతిలో ఏదైనా పడిందా తింటాను లేదా అలా ఉంటాను
వానప్రస్తుగా బ్రతుకుతాను పక్షులు మృగాలు వచ్చి నన్ను తినేస్తే తినేస్తాయి ఇంతకు
ముందు నేను చాలా మాట్లువిన్నాను.
పెద్దలైనటువంటివారు ఒక మాట
చెప్తూంటారు ఇదమ్ మహర్షిభి ర్దృష్టం నిర్యాణమ్ ఇతి మే మతిః ! సమ్య గాపః
ప్రవేక్ష్యామి న చేత్ పశ్యామి జానకీమ్ ! సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నేను
సముద్రంలో ప్రవేశించి శరీరం వదిలిపెట్టేస్తాను అంతటి నీరాశ్యం కలిగినప్పుడు నీటిలో
ప్రవేశించవచ్చు అని పెద్దలు చెప్పారు, నాకు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నీటిలో
ప్రవేశిస్తాను అని మళ్ళీ అనుకుంటారు వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి !
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః ! ఎవ్వరూ కూడా కోరి కోరి
ప్రాణములు తీసుకోకూడదు, బ్రతికున్నటువంటివాడు ఎప్పటికైనా సుఖమును అనుభవిస్తాడు
మళ్ళీ తనవారితో కలుస్తాడు కాబట్టి నేను బ్రతికుంటాను ఉండి నేను సీతమ్మతల్లిని
చూస్తాను. రావణం వా వధిష్యామి దశగ్రీవం మహా బలమ్ ! కామమ్ అస్తు హృతా సీతా
ప్రత్యాచీర్ణం భవిష్యతి ! నేను ఏది ఏమైనా కానీ అవసరమైతే రావణున్నే
వధించేస్తాను వధించి సీతమ్మజాడ చెప్పాడా చెప్పాడు లేకపోతే రావణాసురున్ని వధించి
రామ చంద్ర మూర్తికి ప్రీతి కల్పిస్తాను అది కూడా కాకపోతే అథవా ఏనం సముత్
క్షిప్య ఉపర్యుపరి సాగరమ్ ! రామాయ ఉపహరిష్యామి పశుం పశుపతే రివ !! ఒక పశువుని
యజ్ఞశాలకు ఎలా తీసుకెళ్తారో అలా పది తలలు ఉన్న రావణా సురున్ని సముద్రం మీద
తీసుకెళ్ళి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్నటువంటి రామ చంద్ర మూర్తి
పాదారవిందములయందు పారేసి ఆయన ఏం చేస్తారో ఎలా చెప్పిస్తారో చూస్తాను తప్పా వీన్ని
విడిచిపెట్టను అనుకున్నారు.
అనుకుని మళ్ళీ ఉత్సాహం
తెచ్చుకున్నారు ఎదురుగుండా అశోకవనం కనపడింది ఈసారి అమ్మా నీవు నాకు కనపడి తీరాలి,
తల్లీ నేను ఈ అశోకవనం ఒక్కటే వెతకలేదు ఈ అశోక వనంలోకి ప్రవేశిద్దామనుకున్నారు, ఇదే
నేనన్నది ఉపాసనయందు భక్తితో
కూడిన ఉపాసనలో దోషముంటే భగవంతుడే దిద్దుతాడు దాన్ని వెళ్లేటప్పుడు సీతమ్మకి
నమస్కారం చేసి బయలుదేరలేదు ఇప్పుడు అంటున్నారు అమ్మా నేనా వెతికేవాన్ని నేను
వెతికితే నీవు దొరుకుతావా హనుమా సీతమ్మను చూశాడన్న కీర్తి నీవు నాకివ్వాలి, జనక మహారాజుగారు
నీవు దొరుకుతావని భూమిని దున్నారామ్మా..! భూమిని దున్నుతుంటే జనకునికి కనపడ్డావు
కనపడి ఆయనకి కూతురివై జానకీ అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చావు,
జనకుడికి కనపడి జనకుడి కూతురువై జానకియై ʻజానకీʼ అని పేరు పెట్టుకుని జనకున్ని
ఉద్దరించావు, హనుమకి సీతమ్మ దర్శనం అయ్యిందీ అన్న కీర్తిని నాకు కట్టబెట్టమ్మా..!
అమ్మా నాకు కనపడమ్మా అన్నారు ప్రార్థన చేశారు ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివితే
సుందర కాండంతా పారాయణ చేసిన ఫలితాన్ని వేస్తారు
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ
తస్యై జనకాఽఽత్మజాయై
నమోఽస్తు రుద్రే న్ద్ర
యమాఽనిలేభ్యో నమోఽస్తు చన్ద్రాఽర్క మరుద్గణేభ్యః !
సిద్ధిం మే
సంవిధాస్యన్తి దేవాః సర్షిగణా స్త్విహ ! బ్రహ్మా స్వయమ్భూ ర్భగవాన్ దేవా శ్చైవ
దిశన్తు మే !!
సిద్ధిమ్ అగ్ని శ్చ
వాయు శ్చ పురుహూత శ్చ వజ్రభృత్ ! వరుణః పాశహస్త శ్చ సోమాఽఽదిత్యౌ తథైవ చ !!
అశ్వినౌ చ మహాత్మానౌ
మరుతః శర్వ ఏవ చ ! సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః !!
దాస్యన్తి మమ యే చాఽన్యే అదృష్టాః పథి గోచరాః !
ఒక్కసారి నమస్కారం చేశారు నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణునితో
కూడిన రామ చంద్ర మూర్తికి నమస్కారం దేవ్యై చ తస్యై జనకాఽఽత్మజాయై అమ్మా
దేవ్యై నీవు ప్రకాశించే తల్లివి నీవు అనుగ్రహిస్తే కనపడుతావు నీవు అనుగ్రహించకపోతే
కనపడవు అమ్మా నన్ను అనుగ్రహించమ్మా నేను నీ కొడుకులాంటివాన్నమ్మా అన్నారు దేవ్యై
చ తస్యై జనకాఽఽత్మజాయై నమోఽస్తు రుద్రే న్ద్ర యమాఽనిలేభ్యో రుద్రుడికి యముడికి
వాయువుకి ఆ తరువాత ! బ్రహ్మా స్వయమ్భూ ర్భగవాన్ దేవా శ్చైవ దిశన్తు మే !! సిద్ధిమ్
అగ్ని శ్చ వాయు శ్చ పురుహూత శ్చ వజ్రభృత్ ! వరుణః పాశహస్త శ్చ సోమాఽఽదిత్యౌ తథైవ చ
!! ఈ దిక్పాలకులందరకీ నమస్కారం చేస్తున్నాను ! సిద్ధిం సర్వాణి భూతాని
భూతానాం చైవ యః ప్రభుః !! సమస్త భూత కోటికి నమస్కారం చేస్తున్నాను, నాకు
సీతాన్వేషణలో సాయపడి నాకు సీతమ్మ తల్లి దర్శనమగుగాకా! అని ఒక్కసారి ఉత్సాహం
పుంచుకున్నారు లేచి విడిచిపెట్టిన బాణం ఎలా వెళ్తుందే అలా ఎగిరి అశోకవంలోకి ధూకారు.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
అశోక వనమంతా పువ్వులతో పళ్ళతో నిండిపోయి ఉంది విధూత కేశీ
యువతి ర్యథా మృదిత వర్ణికా ! నిష్పీత శుభ దన్తోష్ఠీ నఖై ర్దన్తై శ్చ విక్షతా !!
అంటారు. పురుషుడి చేత భోగింపబడినటువంటి స్త్రీ అలంకారములు చెదిరి ఎలా ఉంటుందో అలా
ఉందటా, అశోక వనంలో ఉన్న చెట్లన్నీ స్వామి హనుమా చెట్టు నుంచి చెట్టు చెట్టు నుంచి
చెట్టుకి ధూకితే ఆ పువ్వులూ కాయలూ అన్నీ రాలిపోయి చెట్లలలా అయిపోయాయట, వెతికారు
వెతికారు వెతికారు ఆశోకవనంలో అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూశారు పునః
ఆవృత్త తోయాం చ దదర్శ స మహా కపిః ! ప్రసన్నామ్ ఇవ కాన్త స్య కాన్యాం పునః
ఉపస్థితామ్ !! ఎంత అద్భుతమైన విషయాలు చూశారో మహానుభావుడు ఒక పర్వత శిఖరం నుంచి
ఒక జల ప్రవాహం ఇలా కిందపడి వచ్చేస్తుంది వచ్చేస్తుంటే అక్కడ ఉన్న చెట్లన్నీ
కొమ్మలు ఆ నీళ్ళల్లోకి ఇలా కిందకి దిగాయి, మా కోన సీమలో కనపడుతుంటాయి ఇలాంటివి ఇలా
కొమ్మలు నీళ్ళల్లోకి దిగాయి ఆ కొమ్మలు అడ్డు రావడం వల్లా ఆ కిందకి దిగొస్తున్న
ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందటా ఇది చూస్తే ఎలా ఉందటటా... ఒక పురుషుడి తొడ
మీద కూర్చున్న ప్రియకాంత ఏదో హాస్యంలో పురుషుడు ఏదో అన్నాడని కోపంతో తొడమీద నూంచి
ధూకి కోపంతో వెళ్ళిపోతూంటే చెలికత్తెలు చేతులు అడ్డుపెట్టి తప్పమ్మా అలా
వెళ్ళిపోకూడదూ ఏదో హాస్యమాడాడు వెనక్కి వెళ్ళూ అని మళ్ళీ ప్రియురాలిని ప్రియుని
దగ్గరకి మళ్ళీ వెనక్కి పంపుతున్నట్లుగా ఉందటా ఆ నీళ్ళు అలా వెనక్కి వెళ్తుంటే,
అశోక వనంలో అంత రమ్యమైన దృశ్యాలు కనపడ్డాయి.
లతా ప్రతానై ర్బహుభిః పర్ణై శ్చ బహుభి ర్వృతామ్ ! కాంచనీం శింశుపామ్ ఏకాం
దదర్శ స మహా కపిః ! వృతాం హేమ మయూభిస్తు వేదికాభిః సమన్తతః ! అక్కడొక పెద్ద శింశుపా వృక్షం శుంశుపా వృక్షం కింద బంగారు వేదికా అక్కడ ఉన్న
అనేకమైన చెట్లు, చెట్ల చుట్టూ వేదికలు అశోక వనికా చేయం దృఢం రమ్యా దురాత్మనః !
చమ్పకై శ్చన్దనై శ్చాఽపి వకుళై శ్చ విభూషితా !! అక్కడ అనేకమైన చెట్లు చాలా
గొప్పగా పెంచబడి ఉన్నాయి ఎందుకంటే అది రావణాసురిని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి
సరోవరం ఆ వనం ఆయనకు అంత ప్రీతి పాత్రమైన వనం కాబట్టి అంత బాగా పెంచాడు అశోకవనాన్ని
ఇయం చ నళినీ రమ్యా ద్విజ సంఘ నిషేవితా ! ఇమాం సా రామ మహిషీ నూనమ్ ఏష్యతి జానకీ
!! సా రామా రామ మహిషీ రాఘవ స్య ప్రియా సదా ! వన సంచార కుశలా నూనమ్ ఏష్యతి జానకీ !!
ఇక్కడొక పెద్ద సరోవరం ఇందులో పద్మాలున్నాయి తెల్లవారబోతూంది బ్రాహ్మీ ముహూర్త
సమయం కాబట్టి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి సా రామా రామ మహిషీ రాఘవ స్య
ప్రియా సదా రామ చంద్ర మూర్తి యొక్క ప్రియ కాంతయైన ఈ సీతమ్మ తల్లి బ్రహ్మ
ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తూంది కాబట్టి
తప్పకుండా ఇక్కడికి వస్తూందని నాకు అనిపిస్తుంది నాకు ఇక్కడ సీతమ్మతల్లి దర్శనం
అవుతుందీ అనుకున్నాడు అంటే ఆ యుగంలో ఉపనయన సంస్కారమెప్పుడూ మగవానికి చేసి వివాహ
సంస్కారం - మగవానికి జంధ్యమెటువంటిదో ఆడదానికి మంగళ సూత్రం అటువంటిది.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
ఇద్దరికీ అంతే
ఈయ్యనికి జంధ్యం ఎంత గొప్పదో ఆవిడకు మంగళ సూత్రం అంత గొప్పది ఇద్దరూ దీని చేత
రెండో పుట్టుక పుడతారు కుమారిగా ఉన్నది శ్రీమతి అవుతుంది
ఇల్లాలౌతుంది. ద్విజుడు ఒకడుగా పుట్టినటువంటివాడు సంస్కారముచేత ద్విజుడౌతాడు రెండో
మారు పుట్టినవాడు అవౌతాడు ఉపనయనం చేసుకుని అందుకని రెండుతో పుట్టకౌతుంది ప్రతి
ఆడదానికి కూడా వివాహ సంస్కారం. కానీ త్రేతాయుగంలో ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఉండి
వాళ్ళు సంధ్యావందనం చేశారూ అని మనకు దీనివల్ల అవగతమౌతుంది కాబట్టి సంధ్యా కాల
మనాః శ్యామా ధ్రువమ్ ఏష్యతి జానకీ ! నదీం చేమాం శివ జలాం సంధ్యాఽర్థే వర వర్ణనీ !!
ఆవిడ సంధ్యావందనం చేయడానికి తప్పకుండా ఇక్కడికి వస్తుందీ అనుకున్నారు స దదర్శాఽవిదూర
స్థం చైత్య ప్రాపాదమ్ ఉఛ్ఛ్రితమ్ ! మధ్యే స్తమ్భ సహస్రేణ స్థితం కైలాస పాణ్డురమ్
!! ప్రవాళ కృత సోపానం తప్త కాంచన వేదికమ్ ! అక్కడ దూరంగా చూసేటప్పటికి అక్కడ
ఒక వెయ్యి స్తంభాల మేడ ఒకటి కనపడింది, ఆ వేయ్యి స్తంభాల మేడ మధ్యే స్తమ్భ
సహస్రేణ స్థితం కైలాస పాణ్డురమ్ కైలాసం ఎలా ఉంటుందో అంత తెల్లటి చైత్ర
ప్రాసాదం కనపడింది అక్కడే ఒక పెద్ద శింశుపా వృక్షం, శింశుపా వృక్షం చుట్టూ
స్వర్ణమయ వేదిక దానికి అనేకమైనటువంటి పగడములతో మణులు పొదగబడి ఉన్నాయి ఎగిరి ఆ
శింశిపా వృక్షం మీదికి వెళ్లాడు వెళ్ళి అశోకవనమంతా చుట్టూ చూశాడు ఎక్కడైనా నా
తల్లి కనపడుతుందాని ఎక్కడా కనపడలేదు.
ఈ అశోకవనంలో కూడా లేదా తల్లి అనుకున్నాడు అనుకుని ఆ చెట్టు కొమ్మల నుంచి చిన్ని
పిల్లి పిల్లంతున్నారు ఇక్కడ ఒక్కచోటే వెతకలేదు నా తల్లి ఇక్కడే కనపడాలీ
అనుకున్నారు కనపడుతూందీని నాకు అనిపిస్తూందీ అనుకున్నారు అనుకుని ఒక్కసారి తలవంచి
చెట్టుకింద చూశారు వేదికమీద తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమాఽఽవృతామ్ ! ఉపవాస
కృశాం దీనాం నిశ్శ్వసన్తీం పునః పునః ! దదర్శ శుక్లపక్షాఽఽదౌ చన్ద్ర రేఖామ్ ఇవాఽమలామ్
! ! మన్ద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రబామ్ ! ఆ తల్లి అటువంటి గొప్ప సీతమ్మ ఏవం
సీతా తదా దృష్ట్వా హృష్టః పవన సంభవః ! జగామ మనసా రామం ప్రశశంస చ తం ప్రభుమ్ !!
ఒక్కసారి ఆ శింశిపా వృక్షం నుంచి తలవంచి ఇలా ఇందకి చూసే సరికి తతో మలిన సంవీతాం
రాక్షసీభిః సమాఽఽవృతామ్ ! ఉపవాస కృశాం దీనాం నిశ్శ్వసన్తీం పునః పునః ! మట్టి పట్టినటువంటి పట్టుపుట్టం కట్టుకుని
భారంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బంగారు కాంతితో సీతమ్మ ఎలా ఉంటుందని తాను
విన్నారో అటువంటి సీతమ్మతల్లి యొక్క దర్శనాన్ని హనుమ పొంది కన్నుల వెంట ధారగా నీరు
కారిపోతుండగా ఆ తల్లి వైభవాన్ని చూసి పరమానందంగా రెండు చేతులు ఎత్తి నమస్కారం
చేస్తూ ఆనందంతో ఆ తల్లివంక చూసి ఆత్మదర్శనమై సీతా దర్శనాన్ని పొందిన యోగింపుంగవుడై భాష్ప ధారలతో
అలా నిలబడి పోయారు. ఈ సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందినటువంటి ఘట్టాన్ని సిద్ధి సర్గా
అంటారు ఈ దర్శనాన్ని విన్నంత మాత్రం చేత ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తృప్తి
పొందుతారు అంత గొప్ప సర్గా అంత గొప్ప కాండ. కాబట్టి కొబ్బరికాయ కొట్టి
నీరాజనమిస్తారు ఇక ఇవ్వాల్టితో ఈ ప్రవచనం పూర్తైపోయినట్లు కాబట్టి ఈరోజు సీతా
దర్శనం విన్నారు రేపు మహోత్కృష్టమైన ఘట్టం నడుస్తుంది చక్కగా నీరాజనాన్ని
కళ్ళకద్దుకోండి.
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
చక్కగా ఇవ్వాళ సిద్ది సర్గ విన్నటువంటి శుభ సందర్భం ఇవ్వాళ
మీరు నమ్మండీ నేను యదార్థం చెప్తున్నాను మీరు ముప్పై మూడు కోట్ల మంది దేవతల
అనుగ్రహం సీతా రామ చంద్ర మూర్తి యొక్క అనుగ్రహం హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా
లభించింది. సిద్ది సర్గ నడవాలీ అంటే సుందర కాండ నడవాలీ అంటే ఒక్క సీతారాముల
అనుగ్రహం హనుమ అనుగ్రహం లేకపోతే మీరు ఒక శ్లోకం కాదు ఒక్క అక్షరం పలుకలేరు నేను
మీకు పరమ సత్యం చెప్తున్నాను, ఒకవేళ మీరు పలికే ప్రయత్నం చేసినా ఆగిపోతుంది. ఏదో
ఒక కారణం వచ్చేసి సిద్ది సర్గ నడవదు సీతామాత దర్శనం మీరు చెప్పలేరు ఎక్కడో ఒక
కారణం ఏదో ఒక కారణానికి ఆగిపోతుంది అంటే అనుగ్రహం లేదని గుర్తు. అనుగ్రహం ఉంటేనే
సిద్ధి సర్గ ఇంత శక్తివంతంగా నడుస్తుంది. దీన్ని బట్టి సీతా రామ చంద్ర మూర్తి హనుమ
యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ ఉంది తిరుగులేదని గుర్తు. కాబట్టి ఇవ్వాళ పరమ
సంతోషంగా ఇంకొక సిద్ది సర్గ వస్తుంది మళ్ళీ ఆ రోజు ఇంకా ఆనందం సీతమ్మ హనుమని
చూస్తుంది. అది రెండో సిద్ది సర్గ అది కూడా మీరు విందురుకాని చక్కగా కాబట్టి మనం
ఇవ్వాళ పరమోత్సాహంగా పదకొండు మార్లు రామ నాం చెప్పుకందాం.
మీ అందరి మొఖాలు చూస్తే ఏదో
జీవితంలో ఒక గొప్ప విజయం పొందినవారిలా ఆనందం మీరే హనుమయై సీతా దర్శనం పొందిన ఆనందం
ఎవరి ముఖం వంక చూసినా కనపడుతుంది. ఇప్పటివరకు పడుకున్న పిల్లలు కూడా లేచి
కూర్చున్నారు
రామ నామము రామ నామము రమ్యమైనది రామ
నామము !!రా!!
కోరి కొలచిన వారికెల్లను కొంగు
బంగరు రామ నామము !!రా!!
బ్రహ్మ సత్యము జన్మిథ్యా భావమే శ్రీ
రామ నామము !!రా!!
మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది
రామ నామము !!రా!!
వెంటతిరిగెడి వారికెల్లను కంటిపాపే
రామ నామము !!రా!!
కుండలిని బేధించి చూసిన పండువెన్నెల
రామ నామము !!రా!!
అచలమై ఆనందమై పరమాణువైనది రామ నామము
!!రా!!
జానకీ హృత్ కమలమందున అలరుచున్నది
రామ నామము !!రా!!
చిత్త శాంతిని కలుగజేసెడి చిత్
స్వరూపము రామ నామము !!రా!!
సుందర కాండ
ముప్పయ్ ఒకటవ రోజు ప్రవచనము
|
|
చూపు మానసమొక్కటై మరి చూడవలె ఈ రామ నామము !!రా!!
బ్రహ్మపుత్ర కరాబ్జవీణా పక్షమైనది
రామ నామము !!రా!!
భక్తితో ప్రహ్లాదుడడిగిన
వరమునొసగెను రామ నామము !!రా!!
దాసులను రక్షించ దయగల ధర్మ నామము
రామ నామము !!రా!!
పెద్దలను ప్రేమించువారికి క్షేమ
మొసగును రామ నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనుల
నెల్లకాలము రామ నామము !!రా!!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు
రామ నామము !!రా!!
మంగళా శాసన పరై.....
No comments:
Post a Comment