సుందర కాండ
ముప్పై నాల్గవ రోజు ప్రవచనము
త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని
విన్నటువంటి సీతమ్మతల్లి గొప్ప ఉపశాంతిని పొందింది, సంతోషాన్ని పొందినటువంటి
ఆతల్లీ తరువాత మళ్ళీ భయోద్వేగానికిలోనైంది, ఎందుకు భయోద్వేగం అక్కడ రాక్షస
స్త్రీలు కూడా ప్రణిపాతం చేసినట్లేకదా నిన్న చెప్పిన పరిస్థితినిబట్టి, మహర్షి
వాల్మీకి రామాయణంలో కథ చెప్పడం ఎలా ఉంటుందంటే చిన్న పిల్లవాడు సరిగ్గా అర్థం
చేసుకోలేడేమోనని ప్రతివిషయాన్ని వివరించిన తాతగారిలా చాలా అందంగా వివరణ చేస్తూ
చెప్తారు. కాబట్టి ఆయన అంటారు సా రాక్షసీ మధ్యగతా చ భీరు వాగ్భి ర్భృశం రావణ
తర్జితా చ కాన్తార మధ్యే విజనే విసృష్టా బాలే వ కన్యా విలలాప సీతా ! రావణ తర్జితా
చ ఇప్పటికి రాక్షస స్త్రీలు మారి ఉండవచ్చు కానీ మారవలసినవాడు ప్రధానంగా ఒకడున్నాడు
ఆయనా రావణాసురుడు, అయన మారుతాడన్న ఆశకూడా లేదు ఇప్పటికి వాళ్ళు మౌనం వహించినా
ఇప్పటికివాళ్ళు సీతమ్మపట్ల ఆనుకూల్యతను ప్రకటించినా ఆమెకు నమస్కరించినా ఈ విషయం
రావణాసురిడికి తెలిస్తే వాళ్ళని అక్కడనుంచి తీసేస్తాడు తీసేసి ఇంకా... అంతకన్నా
కఠినంగా ప్రవర్తించగలిగినవాళ్ళను తీసుకొచ్చి అక్కడ పెడతాడు తప్పా వాళ్ళు
వెళ్ళిపోయినంత మాత్రానో అక్కడున్న కొద్దిమంది మారినంత మాత్రానో ఒకసారి నమస్కారం
చేసినంత మాత్రానో త్రిజటా స్వప్నా వృత్తాంతానికి ప్రభావితులై ఒక నమస్కారం
చెయ్యడంవల్లో సీతమ్మతల్లి జీవితంలో ఆవిడ ఉన్న పరిస్థితుల్లో ఒక మౌళికమైన మార్పు
వస్తూందని చెప్పడం కష్టం, ఇది ఆవిడ పట్ల మీరు జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు
ఆవిడ పూర్తి స్థాయిలో ప్రశాంతత పొందడానికి అనువైన వాతావరణము వనగూడినట్లు కాదు.
కారణం ఒక్కటే మహర్షి చాలా స్పష్టంగా
చెప్తూంటారు సా రాక్షసీ మధ్యగతా చ భీరు వాగ్భి ర్భృశం రావణ తర్జితా చ కాన్తార
మధ్యే విజనే విసృష్టా బాలే వ కన్యా విలలాప సీతా ! ఎవరో భయపెట్టి
వెళ్ళిపోయారనుకోండి చూడు నిన్నేంచేస్తానోయని చిన్న పిల్ల అది తలచుకు తలచుకు
భయపడుతుంది, ఇప్పటికి పరిస్థితి బాగున్నా ʻఏం ఫర్వాలేదులే నాన్నా నీకేం నేను ఉన్నాను కదా అన్నాʼ పిల్ల దేనికి భయపడి ఏడుస్తుందంటే... రేపు నేను స్కూల్
నుంచి వచ్చేటప్పుడు నాన్నాగారండీ మీరు ఉండరు కదా మీరు ఆఫీసులో ఉంటారు కదా నేను
ఒక్కదాన్నే వచ్చేటప్పుడు కనపడి మళ్ళీ ఏమైనా అంటే అంటూంది. పిల్ల ఎలా భయపడుతూందో బాలే
వ కన్యా విలలాప సీతా ఒక చిన్న పిల్ల తలుచుకు తలుచుకు భయపడినట్లు రావణ
తర్జితా చ రావణుడు ఇలా వేలుపెట్టి చూపించి మాట్లాడి వెళ్ళాడే... రెండు నెలలోపు
నీవు నా పాన్పు చేరకపోతే నిన్ను సంహరించి నా ఉదయ ఫలహారంలో స్వీకరిస్తానని.
|
ఇది ఎలా ఉంటుందంటే ఛితగ్గొట్టేసి
ముఖం మీద నీళ్ళుచల్లేసి కాసిన్ని మంచినీళ్ళులిచ్చినట్లు, మళ్ళీ వాడు దెబ్బలు
తినడానికి వీలుగా సిద్ధపడడానికి కాస్త ఏదో ఫలహారం పెట్టి కొంచెం వాడు ఒక్క
గంటపడుకుని లేచిన తరువాత మళ్ళీ కొట్టినట్లు, కాలమేం చేస్తుందంటే పాప ఫలితాన్ని
ఇవ్వాలి పుణ్యఫలితాన్ని ఇవ్వాలి, కేవలం పాప ఫలితాన్ని ఇచ్చినా తట్టుకోలేడు, కేవలం పుణ్య ఫలితాన్ని ఇచ్చినా
మీరు పట్టుకోలేరు. ఎందుకో తెలుసాండీ కేవలం పుణ్యఫలితాన్ని ఇచ్చారనుకోండి
మహాత్ములుంటారు నేను వాళ్ళజోలికికాని వారి గురించికాని నేను మాట్లాడటంలేదు, చాలా
ఐశ్వర్యం ఉంటుంది కానీ వాళ్ళు ఒంగినట్లు ఎవరూ ఒంగలేరు, చాలా ఐశ్వర్యము ఉంటుంది
వాళ్ళు చేసినట్లు ఈశ్వర కార్యము ఎవ్వరూ చేయలేరు. అది భక్తి అది వినయం అది కేవలం
ఈశ్వరానుగ్రహం ఎక్కడ అహంకరించడానికి హేతువు ఉండీ కూడా అహంకరించుటలేదో అక్కడ
ఈశ్వరానుగ్రహం పరిపుష్టమై ఉన్నదీ అని గుర్తు. అందుకే దాన్ని నీవు పాడు చేయకూడదూ
అంటే దాన్ని నీవు పొగడకూడదు నిజంగా నీవు త్రికరణ శుద్ధిగా మనం వృద్ధిలోకి రావాలని
కోరుకున్నవాళ్ళమైతే ఎన్నడూ పొగడద్దు చాటున పొగడు, చాటున పొగడు నీమనసులో ఈశ్వరుని దగ్గర ప్రార్థన చేయ్ ఆయన ఇంకా
అలా వృద్ధిలోకి రావాలి ఈశ్వరా... ఎక్కడ ప్రవాహముంటుందో అక్కడ నీరు వెడితే
అందముంటుంది, ప్రవహించని చోటుకి నీరువెళ్ళి ఉపయోగమేముంటుంది. ఎక్కడ ఈశ్వర
కార్యమునందు వీక్షించడానికి సిద్ధముగా ఉంటాడో అక్కడ ఐశ్వర్యం కలగాలని మీరు
ప్రార్థన చేయాలి అప్పుడు అది తప్పుకాదు.
|
కాబట్టి ఆవిడ అంటూంది కాల రూపంలో వచ్చింది నాకు కాలమే మృగం రూపంలో వచ్చింది
వచ్చి నన్ను లోభ పెట్టింది లేకపోతే నన్ను ఇన్నాళ్ళు రాముడుంటే చాలు నాకు ఇంకేమీ
అక్కరలేదనుకుని ఐశ్వర్యమే వదిలేసినదాన్ని అంతఃపురమే వదిలేసినదాన్ని, పరిజనాన్ని
వదిలేసినదాన్ని బంధుజనాన్ని వదిలేసినదాన్ని అత్తమామలను వదిలేసినదాన్ని లక్ష్మణ
స్వామి వద్దువదినా... నా మాట వినూ అని అది మారీచుడూ అని స్పష్టంగా చెప్తున్నా
ఇప్పుడు కాకపోతే రేప్పొద్దున్న అరణ్యవాసం అయిపోయిన తరువాత అంతఃపురానికి
వెళ్ళినప్పుడు చూడ్డానికి బాగుంటుందని చెప్పి బంగారు మృగం మీరు ప్రాణాలతోనైనా
తేండీ చంపైనా తేండి అని ఎందుకు పంపించినట్లు? అంటే కాలము నన్ను లోభ పెట్టీంది. ఈ
కష్టాన్ని అనుభవింపజేయడానికే కారణం మామ్ అల్ప భాగ్యాం నేను పూర్తి స్థాయిలో
సుఖాన్ని పొందడానికి యోగ్యతను కలిగినదానను కాను, ఇదీ ఒక సాధకుడైనటువంటివాడు కష్టంలో ఉన్నప్పుడు తనను తాను
చక్కగా సమాధాన పరచుకునేటటువంటి ఒక గొప్ప స్థితి అంటే ఇతరుల మీదకు నెపం
నెట్టకుండా తనను తాను విచారణ చేసుకునేటటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ కాబట్టి నూనం
స కాలో మృగ రూప ధారీ మామ్ అల్ప భాగ్యాం లులుభే తదానీమ్ యత్రాఽఽర్య పుత్రం విససర్జ
మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజం చ ! యత్రాఽఽర్య పుత్రం ఒక మృగంకోసం నేను ఆర్యపుత్రున్ని వదిలేశాను,
వదిలేయడము ఎలా వదిలేశాను రామున్ని వదిలేయలేదు రామానుజం లక్ష్మణ పూర్వజం చ
వదలడంలో ఒక తప్పు మార్గంలో వదిలాను, రామున్ని ఎప్పుడు వదిలేసింది, రామున్ని ఆవిడ
ఎప్పుడూ వదిలేయలేదు.
మృగంకోసం పెంకిపట్టు పట్టడం
తప్పైంది కానీ రాముడు తాను శారీరకంగా అక్కడ లేకపోయినా రక్షణ మాత్రం ఉంచాడు ఏ
రూపంలో లక్ష్మణ స్వామి రూపంలో తను రామున్ని వదిలిపెట్టుకోవడం ఎవరిని వదిలిపెటట్టు
చేసింది లక్ష్మణున్ని పంపించేట్టు చేసింది, అప్పటికి ఆ పరిస్థితిలో సీతమ్మని
తప్పులేదని మీరన్నా లక్ష్మణ స్వామి వెళ్లిపోయేటట్టుమాట్లాడిన మాటలో వ్యగ్రతపాళ్లు కొంచెం
ఎక్కువున్నాయేమో... అది పట్టి కుదుపుతూ ఉండవచ్చు, కాబట్టి రామానుజం
లక్ష్మణున్ని వదిలానే అది రాముని వెనకనున్నవాన్ని వదిలిపెడితే లక్ష్మణ
పూర్వజంచా లక్ష్మణునికి ముందు పుట్టినవానికి
దూరమయ్యాను. ఎంత గొప్ప శ్లోకమండీ నిజంగా యత్రాఽఽర్య
పుత్రం విససర్జ మూఢా మూఢురాలునై నేను ఆర్యపుత్రున్ని రామున్ని వదిలిపెట్టాను,
రామున్ని నేను ఎన్నడూ వదిలిపెట్టలేదు, కానీ రామానుగ్రహాన్ని లక్ష్మణ స్వామి రూపంలో
ఉంచినప్పుడు అది వదిలేయడమే రామున్ని వదిలేయడం. ఈశ్వరానుగ్రహం మీకు ఎలా కలుగుతూందో
తెలుసాండీ... ఈశ్వరానుగ్రహం
ఈశ్వరుని యొక్క భక్తుల రూపంలో ఈశ్వర ప్రసాద రూపంలో ఈశ్వర నిర్మాల్య రూపంలో మీ
దగ్గరకొస్తుంది. మీకేదో అభ్యున్నతి ఇవ్వాలని అనుకున్నాడనుకోండి
సర్వేశ్వరుడు ఏదో ఒక గొప్ప ఫలితాన్ని ఇవ్వాలని అనుకున్నాడనుకోండి అదేం సామాన్యమైనది
కాదు ఏదోచాలా పేద్ద ఫలితాన్ని ఇవ్వాలి అనుకున్నాడనుకోండి ఏం చెయ్యాలి తనను నమ్ముకున్నవాడికి నీతో ఇంత
అన్నం పెట్టించాలి ఇప్పుడు ఆయన తిన్నాడనుకోండి ఇప్పుడు మీరు చేసే కొన్ని కోట్ల
యజ్ఞ యాగాలుకన్నా ఈశ్వరుడు దాన్నే ఎక్కువ చూస్తాడు.
|
నన్ను నమ్ముకున్నవాడు పట్టెడు అన్నం తిన్నాడు ఈయన దగ్గరని అది వేసుకుంటాడు
ఖాతాలోకి ఈశ్వర నిర్మాల్యం మీకు వస్తూంది. ఏదో ఒక గొప్ప ఈశ్వరుడి మెడలో అలంకారంచేయబడిన
ఒక గొప్ప హారాన్ని మీకిస్తాడు మీరు తీసుకెళ్ళి మీరు వెంటనే మీ కారుకి వేశారనుకోండి
ఉపద్రవమొస్తుంది. దుర్వాసో మహర్షి ఇచ్చిన మాల తీసుకెళ్ళి ఇంద్రుడు ఐరావతానికి
వేస్తే గదా ఉపద్రవం తెచ్చుకున్నాడు, మీరు దాన్ని వాసన చూసి కళ్ళకద్దుకుని
స్వీకరించి పక్కన పెట్టుకోవడమో ఇంటికి తీసుకెళ్ళడమో లేకపోతే నీటిలో
విడిచిపెట్టేయడమో ఏదో చేయవలసి ఉంటుంది అంతేగాని మీరు దాన్ని తీసుకెళ్ళి హేయమైన
ప్రయోజనానికి వాడుకుంటే ఈస్వరానుగ్రహం
కలగడం ఒకెత్తూ దాన్ని మీరు నిలబెట్టుకోవడం ఒక్కెత్తు, ఇది మీరు జాగ్రత్తగా
చూడాలి కలుగుతుంది కాని ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసాండి తెలుసుకోలేరు నాకు
కలిగిందని విడిచిపెట్టేసుకుంటారు. ఆ విడిచిపెట్టేసుకుంటే ఏమౌతుందంటే రాదు, అది అలా
విడివడడం కుదరదు మళ్ళీ జారిపోతూంది. చాలా మంది విషయంలో ఆ ఒక్క కోణంలో ఉపన్యాసాన్ని
తిప్పడం చాలా సమయాన్ని తీసేసుకుంటుంది. కానీ మీరు దాన్ని గమనించవలసి ఉంటుంది మీరు
ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఈశ్వరుడు ఎన్నడూ మీదగ్గరికి ఈశ్వరుడిగా రాడు రామ చంద్ర
మూర్తి రావాలంటే మీ దగ్గరకేం కోదండం పట్టుకుని వస్తారనుకుంటారా అలా ఏం రాడు రాముడు రావాలీ అనుకుంటే మీరు బాగా
పరాకు పడడానికి అవకాశం ఉన్నప్పుడే వస్తాడు, వచ్చి అప్పుడడుగుతాడు ఏదో మీరు
అప్పుడే విసుక్కుంటారు.
ఆయన నవ్వేసి వెళ్ళిపోతాడు, మీరు అప్పుడుగాని గ్రహించుకుని
పెట్టగలిగారనుకోండి, మీరు పెట్టినదానికి అక్షయ ఫలితాలను ఇచ్చేస్తాడు ఈశ్వరుడు,
ఈశ్వరుడు ఎప్పుడొచ్చినా
అలాగే వస్తాడు అందుకే ఈశ్వరానుగ్రహం ఎవరియందు ఉన్నదో ఒక ఈశ్వర ప్రసాదమైన
పువ్వు, అలా వెళ్ళిపోతూంటే మీకు ఒక పువ్వు కనపడిందనుకోండి ఈశ్వర పాదములమీద
ఉండవలసిన పువ్వు ఓ తల్లి తలలో పెట్టుకుంది. అది ఆవిడేం చూసుకోలేదు అది
కిందపడిందని, ఆవిడేం కావాలని కిందపడేయదు కిందపడిపోయింది, ఇప్పుడు మీరు ఆవిడ
తలలోంచి పడిపోయిందని వదిలిపెట్టేయకూడదు మీరు దాన్ని తీసి కళ్ళకద్దుకుని
పక్కకిపెట్టేయ్యాలి అంతే. మీ ముందు సీతమ్మ నడుస్తూంది. సీతమ్మ తలలోంచి
పువ్వుజారిపడిపోయింది మీరేం చేస్తారు ఎవర్నైనా తొక్కనిస్తారా... అమ్మో మా అమ్మ
తలలోంచి కిందపడిందని కళ్ళకద్దుకుని ఓ పక్కన పెట్టరూ అంతే మీ
భావన భావనా మాత్ర సంతుష్టాయై నమోనమః మీరు దాన్ని
పొందడం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి
ఒక్కొక్క పని వలన ఈశ్వరానుగ్రహం
కలుగుతుంది. దాన్ని మీరు అన్వయం చేసుకోవడంలో ఉంటుంది అందుకని కదాండీ
సుందర కాండైంది. లేకపోతే ఈశ్వర ప్రసాదమైందండీ అని మీరు ఒక పువ్విచ్చారనుకోండి
ఎక్కడ ధరించాలి మీరు దాన్ని తలమీద పెట్టుకోవాలి మీరు అంతేగాని ముందే తీసుకుని
చెవిలో పెట్టుకోకూడదు. చెవిలో పెట్టుకొమ్మని ఎక్కడా లేదు ఏ మంత్రంలోనూలేదు చెవిలో
ఎందుకు పెట్టుకుంటాడంటే తలలోంచి కింద పడిపోతుంది కాబట్టి కాని ముందెక్కడ
పెట్టుకోవాలి కళ్ళకద్దుకుని తలమీద పెట్టుకోవాలి ఒక్కసారి.
|
|
పెట్టుకునీ, ఇప్పుడు తలకు జుట్టేలేదు కిందపడిపోతూంది అనౌసరంగా ఎక్కడన్నో
తొక్కుతారేమోనని నీవు ఇంకా ఉంచుకుందామనుకుంటే చెవిలో పెట్టుకోవాలి, చెవిలో కూడా
స్థిరత్వం ఉండదు కళ్ళజోడు ఉన్నవానికి అసలు ఉండదు వాడు ఇలా అంటాడు అది
ఊడిపడిపోతుంది కాబట్టి మళ్ళీ ఒక భద్రమైన స్థానం నీకు కనపడగానే తీసి ఎవరూ తొక్కరన్నచోట
ఉంచేసెయ్యాలి. ప్రసాదం శిరసా దుర్నామి నేను ఈశ్వర ప్రసాదమును శిరస్సునందు
ధరించుచున్నాను. అంతేకాని చెవిలో పెట్టుకుంటానని మంత్రాల్లేవు కాబట్టి మీరు దాన్ని
ఎలా శాస్త్రం చెప్పిందో దాన్ని మీరు అలా పొందడంలో ఉంటుంది. శ్రద్ధా సా శ్రద్ధా
కవితా సిద్ధిః యయావ స్థూప లభ్యతే దానివల్ల ప్రసాదము మీకు అనుగ్రహాన్నిస్తుంది.
ఈశ్వర ప్రసాదమిస్తున్నారండీ అన్నారనుకోండి మీరు తీసుకోవాలి. తప్పకుండా తీసుకోవాలి ప్రసాదమే
అనుగ్రహము ప్రసాదాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి అనుగ్రహాన్ని
విడిచిపెట్టేసినట్లు
కాబట్టి సీతమ్మంటోంది నేను రామున్ని
వదిలిపెట్టలేదు కానీ రాముడు ఎందుకు జారిపోయాడు, రాముడు తన అనుగ్రహాన్ని ఏ రూపంలో
ఉంచాడో దాన్ని నేను వదిలిపెట్టేశాను అది నన్ను ఒక పట్టాన వదిలేది కాదు తనంత తాను
వెళ్ళిపోవడం తప్పా నిలబడడానికి వీలులేనటువంటి పరిస్థితిని కల్పించాను నేను ఆనాడు
మాట్లాడిన మాటలలో కించిత్ వ్యగ్రతా దోషం ఎక్కువా ఉందేమో అంత మాట్లాడకుండా ఉండవలసిందేమో
ఇప్పుడావిడ పరివేదన చెందుతూంది ఆ తల్లి. అది చాలా మంచి స్థితి నేనైతే వ్యక్తిగతంగా
సీతమ్మతల్లి ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఆవిడ మాట్లాడడాన్ని నేను ఎంతమాత్రమూ
తప్పుపట్టను, నేను అరణ్యకాండ చెప్తున్నప్పుడే సమర్థించాను నేను వ్యక్తిగతంగా అది
దోషమూ అని ఒక్కనాటికీ అంగీకరించను.
కానీ ఒక వ్యక్తి తాను మాట్లాడిన
మాట్లవల్లా అవతలవారు ఖేదపడ్డారేమోనని ఆలోచన చేయడానికి మాత్రం తప్పు
పట్టడానికివీల్లేదు. అది సౌశీల్యము చాలా గొప్ప లక్షణమది. అది చాలా మంచి
పరిస్థితికదాండీ అరే నేను
అన్నానని బాధపడ్డారేమో అని ఆలోచించగలగడం ఒక ప్రజ్ఞావిశేషం ఇతరుల గురించి
ఆలోచించగలిగినటువంటి నేర్పరితనం. కాబట్టి తల్లి అంటోంది నూనం స కాలో మృగ
రూప ధారీ మామ్ అల్ప భాగ్యాం లులుభే తదానీమ్ యత్రాఽఽర్య పుత్రం విససర్జ మూఢా
రామానుజం లక్ష్మణ పూర్వజం చ ! హా రామ సత్య వ్రత దీర్ఘబాహో హా పూర్ణ చన్ద్ర
ప్రతిమాన వక్త్ర హా జీవ లోక స్య హితః ప్రియ శ్చ వధ్యాం న మాం వేత్సి హి
రాక్షసానామ్ ! ఓ రామా! నీవు సత్య వ్రతా సత్యమును వ్రతముగా కలిగినవాడా దీర్ఘ
బాహో చాలా పొడుగైన చేతులున్నవాడా, అంటే రక్షించగలిగిన సమర్థతతకలగినవాడా హా
పూర్ణ చన్ద్ర ప్రతిమాన వక్త పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖము కలిగి
అవతలివారిని ప్రసన్నముగా ఉంచగలిగినటువంటి దర్శనము గలిగినటువంటివాడా...
జీవలోకమునంతకునూ కూడా హితమును ప్రియమునూ చెయ్యగలిగినటువంటివాడా... నన్ను రాక్షసులు
వధించబోతున్నారు నీకీవిషయం తెలయదుగదా..! నీయందు అత్యంత ప్రీతి కలిగినదానిని నీకు
అత్యంత ప్రీతి కలిగినదానిని రాక్షసులు బాధిస్తున్నారు నీయందు రక్షించగలిగిన
సమర్థతుంది. కానీ నాకు రక్షణ దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు నేను ఇక్కడ ఉండిపోయానని
నీకు తెలియదుగదా..! అంటే ఆవిడ నింద దగ్గరికి వెళ్ళలేదు కానీ మీరొక్కటి గమనించాలి
ఇది ఎలా ఉంటుందంటే... వ్యగ్రత
భగవంతుడివైపు వెళ్ళడం కుడా అభ్యున్నతి హేతువే అన్నివేళలా కూడా కాదు.
ఉపాసనా తీవ్రతయందు సాధారణంగా ఎలా
ఉంటుందంటే ఒక్కొక్కసారి భగవంతున్ని నిలదీయటమనేటటువంటిది ఉంటుంది, ఎందుకనీ అంటే
మీరు చూడండీ ఎక్కడ ప్రీతి ఎక్కువుందో
అక్కడే ఈ నిలదీయడమనేటటువంటిది ఉంటుంది. అనుమానం కూడా ఎక్కడుంటుందో
తెలుసాండి, అనుమానమూ అంటే నా ఉద్దేశ్యంలో పిచ్చి పిచ్చి అనుమానాలని కాదు నేను
అంటూన్నది అటువంటివాటి గురించి నేనేం మాట్లాడటంలేదు. శంకా అంటే క్షేమ సంభందమైన శంక
ఎక్కడుంటుందంటే ప్రీతి ఎక్కడ ఎక్కువుంటే అక్కడ శంక ఉంటుంది. పిల్లలయందు ప్రీతి
ఎక్కువుంటే పిల్లలు రావడం కొంచెం ఆలస్యమైతే బెంగుంటుంది మనసులో తల్లి విషయంలో ఇది
మరింత బాగా తెలుస్తూంటుంది. అమ్మా ఏనిమిదైతే ఆయన ఏదో టీవీ చూస్తూ కూర్చుంటాడు
ఫర్వాలేదు ఆవిడ మాత్రం ఎనిమిదైంది ఇంకా పిల్లాడు రాలేదేమీ ఎనిమిదైంది ఇంకా
పిల్లాడు రాలేదేమి అని తిరుగుతూంటుంది. ఎందుకంటే రాశీభూతమైన ప్రేమ తల్లి కనుక
ఇంకొక్క అరగంట దాటితే వీడికి ఏమీ అవ్వలేదుగదా అంటూంది అంటే శంక ఎందుకొస్తూందీ అంటే
ప్రేమవలన వస్తూంది. కాబట్టి ఇది క్రమ క్రమంగా పెరుగుతుంది ఈ భావనా నన్ను రాముడు
రక్షించలేదూ అన్నది ఆవిడయందు ఈ వ్యగ్రత ఎటువైపుకి వెళ్ళిపోతూందంటే క్రంగానూ ఛీ..
నేను చేసిన ఉపాసన వ్యర్థమైపోతూంది అన్న స్థితివైపుకు వెళ్ళిపోతూంది ఏభక్తుడి
హృదయంలోంచి వెళ్ళినా అలానే వెళ్తూంది, ఒక భార్య భర్తనుంచి రక్షణ కోరుతున్నది
ధర్మమమునకు కట్టుబడినది, తన భర్త చేతనే తను రక్షింపబడాలనుకున్నది ఒకనాడు ఏం
చేస్తూంది ఆయన్నే దెబ్బలాడుతుంది అప్పుడు మీరు దెబ్బలాడటంలో ఉన్న ప్రీతిని
గమనించాలి ఇదీ భతృత్వంలో ఉన్న గొప్పతనం అందుకని పెద్దాయనకిచ్చి పెళ్ళిచేస్తారు.
ఎన్నడూ భార్య ఇలా చేతులు కట్టుకుని నిల్చుంటే
అది అసలు దాంపత్యంకాదు, ఒక్కనాటికీ దాంపత్యం కాదు. అందులో ఏదో తేడా దాంపత్యం ఉంది.
భార్య ఎప్పుడోప్పుడు భర్తని నిలదీయ్యాలి, ఆయన్ని దెబ్బలాడాలి ఏమండీ ఏమిటి
బోధచేస్తున్నారు మాకు అనుకోకండి, నా ఉద్ధ్యేశం ఏదో వ్రతంకింద పెట్టుకుని రాత్రే
ప్రారంభం చేయమనికాదు, ఎప్పుడో ఏదో మనసు ఇబ్బంది పడుతూంది ఇబ్బందిపడి ఆ
బాధకలిగినప్పుడు భర్తని ఏం సుఖపడ్డాను మీవల్లా ఏం సుఖపెట్టారు ఎప్పుడూ ఇంతే అని
అందనుకోండి, మీరు దాన్ని ఇంగ్లీషులో ఇన్ బిట్వీన్ ది లైన్సు అంటారు, దాన్ని యథా
తథంగా అలా తీసుకుని అంటే నేను నిన్ను ఏనాడూ సుఖపెట్టలేదన్నమాట నావల్ల నీవు ఏసుఖమూ
పొందలేదన్నమాట అయితే పుట్టింటికెళ్ళిపో అనకూడదు. ఎంత ప్రేమ నా మీద ఉండబట్టి నా
వలననే సుఖపడాలని ఉన్నది కాబట్టి ఇంత సుఖం నావల్ల తక్కువైతే నన్ను ఏనాడు
సుఖపెట్టారంటూంది చూశారా ఇది ఇంకోళ్ళవల్ల పొందలేదా ఏం వాళ్ళ అన్నదమ్ములు
వండిపెడతారా ఆవిడకి
వాళ్ళనాన్నగారు బోలేడు పెట్టగలరు ఆవిడకి అక్కరలేదు ఆవిడ
పుచ్చుకోదు పదివేల రూపాయలు చీర తండ్రిగారు కొనివ్వనివ్వండి సంతోషంలేదు, భర్త
ఐదువందల చీర కొనివ్వనియ్యండి పరమసంతోషం భర్త చక్కగా ఉందోయ్ నీకు ఈ చీరా అందనుకోండి
గజారోహణం తండ్రిగారు
అన్నదమ్ములూ అందరూనూ చాలా బాగుందమ్మా చాలా బాగుంది నీ మొహం ఏమో ఉందిలే అందనుకోండి
ఆయనా... ఆవిడకేం ప్రీతి ఉండదు.
|
ఇంత కళ్ళకు నచ్చింది నీకు మాత్రం నచ్చలే అదీ భర్త భార్య యొక్క ప్రీతిని అర్థం
చేసుకోవాలి ఒక్కొక్కసారి దెబ్బలాడేటప్పుడు అంతేకానీ దెబ్బలాడిందని చూడకూడదు అది భతృత్వమంటే
ఆ సమర్థత ఆ విశాల హృదయము ఆ అవగాహన ఉన్నచోట్లా అదొక మధిరిమ అందుకే ఆ దెబ్బలాట్లో
కూడా నీవు మధ్యలోకి వెళ్ళవద్దూ అన్నారు. భార్యా భర్తల మధ్య దెబ్బలాట కూడా చివరికి
మధుర స్మృతౌతుంది నీకెందుకూ అసలు ఎప్పుడూ వేలు పెట్టకు వాళ్ళిద్దరి మధ్యలో. ఒక్కటే
కోరు వాళ్ళిద్దరు అలా ఉండాలి కలిసి, ఇంకొకటిలేదు దాంపత్యంలో కాబట్టి ఎంత గొప్పగా
మాట్లాడుతుందండీ ఆవిడా ఇప్పుడు వ్యగ్రత భర్తయందు పొందకపోతే ఎవరిదగ్గర
పొందుతుందండీ, మరి అలా పొందకపోతే అసలు అలా మధురిమా అన్నమాటకి దాంపత్యమన్నమాటకీ
అర్థమేమిటీ... మీ ఆవిడ మిమ్మల్ని దెబ్బలాడవచ్చు సీతమ్మ రామున్ని ఏమనకూడదు ఏమిటి
మీకా సంకుచితత్వం వాళ్ళు నరుడికథా వాళ్ళు కూడా ఆదర్శ దాంపత్యమంటే నేనంటాను ఆవిడ
భర్తను అనాలంటాను, ఏం మీకేమైనా అనుమానమా నాకైతే లేదు అలా అంటేనే నేను ఆదర్శదాంపత్యమంటాను.
ఆదర్శదాంపత్యమన్నమాట అలా ఉన్నప్పుడు బాగా పొసగుతుంది. లేకపోతే దానికేమీ అందముండదు.
ఇంక ఎప్పుడూ మీరు మోస్ట్ ఒబిడియంట్లీ కింద ఉంటే ఆయన సంతోషిస్తే ఆ
ప్రేమకర్థమేముందండీ..? నేనూ ఏదో మంచిగా ఉండి నేను చేసి పెట్టినన్నాళ్ళూ నేను జీతం
తీసుకొచ్చినన్నాళ్ళూ నాకు గౌరవమున్నన్నాళ్ళూ మా ఆయన మా ఆయన అని పొగిడేసి నేను
ఎప్పుడో ఓసారి నీ మొఖం నీకేం తెలసు నేను చెప్పినట్లు చెయ్ అన్నాననుకోండి.
ఇంక అక్కడ్నుంచి వెంటనే నన్నూ అంత
మాట అనేశారు నీ మొఖం అనేశారు అని చెప్పేసేసి, నా మీద విరుచుకపడిపోయిందనుకోండి మా ఆవిడా
అంటే నేను ముద్దు ముద్దుగా నా తల్లీ నా బుజ్జీ అన్నన్నాళ్ళు భార్యా ఏదైనా
ఒక్కమాటంటే భర్తను కానూ ఎందుకన్నారో..? పెట్టినా ఆయనే తిట్టినా ఆయనే కాబట్టి ఏమిటి
దానికి పెద్ద విశేషమేమిటీ? అందనుకోండి అది ప్రేమకి అర్థం కదాండి! అంతేగానీ ఎప్పుడూ
ఆనుకూల్యతా అంటే ఆయన చెప్పినట్లు ఈవిడ నడుచుకోవడం మంచిదే అది కూడా నేను
కాదనట్లేదు, కానీ అలా సీతమ్ముంటేనే పాతివ్రత్యమని మీరు సిద్ధాంతాలు చేయకండీ
తప్పది, మీ అవగాహనయందు దోషముందని గుర్తు అదెప్పుడూ దోశం కాదు. స్వేచ్ఛ ఉంటుంది
భగవంతునియందు భక్తునకి భర్తయందు భార్యకి ఈ ఇద్దరికీ ఎప్పుడూ ఉంటుంది. ఈ హద్దు దాటకూడదంది
ఎవరి విషయంలోనో తెలుసాండీ ఒక్క గురువుగారి విషయంలో మాత్రం శిష్యులు హద్దు దాటరాదు.
మా ఇద్దరి ప్రేమా చాలా గొప్పదని చెప్పుకోవడానికి మా గౌరవం చాలా గొప్పదని చెప్పుకోవడానికి
అప్పుడప్పుడు గురువుగార్ని అంటూనండీ అని అస్సలు అనకూడదు, అనకూడంది ఎవర్నీ అంటే కలలో కూడా నిందచేయని వ్యక్తి
ఒక్క గురువే. ఒక్క గురువు విషయంలోనే ఆ హద్దు. తప్పా భార్యా భర్తల మధ్యా
ఆపాటి మాటా ఉండడటమనేటటువంటిది సహజంగా ఉంటుంది. భగవంతునికీ భక్తునికీ మధ్య ఎప్పుడూ
ఉంటుంది. “ఎవడబ్బా సోమ్మాని కులుకూతూ తిరిగేవురామ చంద్రా” రామదాసుగారు అనలేదా! అదీ
మీరు వెంటనే అదొక మహాదోషమూ అని సిద్ధాంతం చేయకూడదు దాన్ని. కాబట్టి ఆవిడ అంటూంది
ఇప్పుడు అనఽన్య దైవత్వమ్ ఇయం క్షమా చ భూమౌ చ శయ్యా నియమ శ్చ ధర్మే పతివ్రతాత్వం
విఫలం మ మేదం కృతం కృతఘ్నే ష్వివ మానుషాణామ్ ! దీనికి రాముడు పట్టించుకుంటే
ఎప్పుడూ రాకూడదు ఈమాటకి స్వీకరించగలిగిన హృదయం గొప్పదైతే భార్య హార్తి
అర్థమౌతుంది.
|
నీవు ఫలానా ఫలానా తప్పుచేశావ్ అని
రాస్తాడు హెన్సు యువార్ డైరెక్టెడ్ టు ఎక్సప్లైన్ ద రీజన్సు హ్యాజ్ టు వైడ్
సెక్యూరిటీ యాక్సన్సు టీమ్డ్ సుడ్ నాట్ బి ఇన్షూయేటెడ్ ఆగెనెస్ట్ యూ, యువర్
ఎక్సప్లనేషన్ టు రీచ్ ది రీజన్ విత్ అండర్ సైన్ విత్ ఇన్ త్రీ డేస్ వెరిఫై రిషీట్
ఆఫ్ మెమో ఫేలింగ్ విచ్ ఆట్యూట్యూడ్ ద యు హ్యావ్ నథింగ్ టు ఆఫర్ ఆక్సన్ టీమ్డు బి
ఇన్షియేటెడ్ అని రాస్తాడు చార్జి సీట్లో. నీవు మూడు రోజులలోపల ఈ తప్పెందుకు చేశావో
చెప్పూ... నీవు ఆ పరిస్థితులను చెప్పలేకపోయావో లేకపోతే చెప్పడానికి నీ దగ్గర ఏదీ
లేదని బావించి నీమీద క్రమశిక్షణా చర్య తీసుకుంటానటాడు తప్పా... వెంటనేమి
చర్యతీసుకోరు, ఇప్పుడు మీరు ఏదో చెప్పారనుకోండి చెప్పి ఏదో పై పరిస్థితుల్లో నేను
తప్పు చేశాను కాబట్టి అండర్ దీస్ సర్కుమ్సస్టెన్సెస్ యాన్ ఇమ్మీడియట్ మే బి టేకన్
మెమో డ్రాప్డ్ హౌయెవర్ అ విల్ అష్యూర్ యు సార్ దట్ ఇన్ ఫ్యూచర్ మోర్ కేర్ ఫుల్ అని
మీరొక సంతకం పెట్టిచ్చారనుకోండి, పై పరిస్థితుల్లో నేనేదో తప్పు చేశాను కానీ ఇక
ముందు చేయను కాబట్టి మీరు ఈసారికి దాన్ని తేలికగా తీసుకుని క్షమించవలసింది.
అప్పుడు ఆయన కూడా ఏం రాస్తారంటే నీవ తప్పే చేశావు హౌవెవర్ యూ ఆర్ రిలీవ్ ఇట్
టెకెన్ ఇన్ టు మె మో డ్రాప్, స్టిల్ యు ఆర్ మోర్ కాషన్ టు ది డ్రాఫ్ట్ ఇన్ ఫూచర్
అని సంతకం పెట్టిస్తాడు కదా అంతే గాని ఇంక్రిమెంటేం కట్ చేసి ఇవ్వడు.
|
ఇప్పుడు ఇది భక్తి వ్యగ్రత కాబట్టి
మొదటి కోణాన్ని తీసుకుంటే భక్తిలో దోషం ఆ భక్తి యొక్క వ్యగ్రత చాలా
తీవ్రమైపోయిందని గుర్తేమిటంటే అసలు ఈ శరీరంతో ఉండననటం. శరీరంతో ఉండడననటం మరి ఒప్పేనాండీ
కచ్చితంగా తప్పే ఉండనూ అని అనకూడదు కానీ ఆ వ్యగ్రత అటువంటిది ఆ వ్యగ్రతలో ఆవిడా
అంతమాటంది కాబట్టి ఆవిడ నేను ఉండలేను సా జీవితం క్షిప్రమ్ అహం త్యజేయం విషేణ
శస్త్రేణ శితేన వాఽపి విషస్య దాతా న తు మేఽస్తి కశ్చిత్ శస్త్ర స్య వా వేశ్మని
రాక్షస స్య ! కాబట్టి ఇప్పుడు ప్రాణం విడిచిపెట్టేయడమంటే అదీ ఎదో ఎండిపోయిన
పుష్పమాల తీసి విడిచిపెట్టేయడంతో సమానం కాదు అది విడిచిపెట్టేయడానికి సాధనములు
కావాలి కాస్త విషమివ్వాలి ఇస్తే తాగేస్తే వెళ్ళిపోతూంది ప్రాణం, లేకపోతే పదునైన
ఆయుధమొకటి దొరకాలి దొరికితే దాంతో పొడిచేసుకుంటే చనిపోవచ్చు నాకు ఈ రెండు
ఇచ్చేవాళ్ళు ఎవరంది ఆవిడా... ఇప్పుడు ఆవిడ ఎప్పుడు శాంతిగా ఉంది, ఆవిడా ఇప్పుడు
మొగిని మీద అలిగొచ్చి ఏడ్వట్లేదు ఇప్పుడు కనపట్టంలేదని ఏడుస్తుంది ఇప్పుడు ఆవిడ్ని
భర్త దగ్గర వదిలేస్తే సంతోషంగా ఉంటుంది. వదలడు అలా ఉండలేదు చచ్చిపోతుంది. విషయం ఒక
ఆయుధం వాడు కాదు ఎవ్వరూ ఇవ్వరు ఇది రాక్షసత్వము యొక్క పరాకాష్ఠ. అని ఆవిడంది ఇతీవ
సీతా బహుధా విలప్య సర్వాత్మనా రామ మఽను స్మరన్తీ ప్రవేపమానా పరిశుష్క వక్త్రా
నగోత్తమం పుష్పిత మాఽఽససాద ! ఆవిడా ఏడ్చి ఏడ్చి ఏడ్చి సమ్మాత్మనా అన్ని
విధములుగా రామున్నే స్మరిస్తూ అంటే అంత భక్తి కలిగినటువంటి తల్లి అంతటి మహా
పతివ్రత ఇప్పుడు ఈ దోషము ఆయన ఖాతాలోకి వెళ్తూంది రావణుడి ఖాతాలోకి కాబట్టి నేను
శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని నిర్ణయించుకుంది.
|
ఇప్పుడు ఆ కొమ్మ పైకిలేచిపోతే ఆవిడ
ఉరికి వ్రేలాడీ తన కేశ పాశము చేత తాను మరణించాలని దాంట్లో వ్యగ్రతకూడా ఉంది, అది
ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఆవిడ మీద అంత మోహం చెందడానికి సాధారణంగా లోకంలో కారణం
ఏం చెప్తారంటే శ్రీ కేశపాశమే పురుషుని వ్యామోహమునకు కారణం అని చెప్తారు, కాబట్టి
ఇదిగో రావణుడు నన్ను మోహించడానికి నామీద వ్యామోహ పడడానికి కారణమేదో అదే నా
మరణానికి కూడా కారణం కావాలి అంత కోపానికి కొంత కొంత మంది చూడండి తప్పు చేసేస్తారు చేసేసి ఈ
దిక్కుమాలిన చెతులతోనే కొట్టానని చెయ్యి కాల్చుకుంటాడు ఒక్కొక్కడు, చెయ్యా చేసింది
తప్పు పూజ కూడా చేస్తుంది నీ మనసుని సంస్కరించాలి, నీ మనసుని సంస్కరించకుండా నీవు
కర్మేంద్రియాల్ని బాధపెడితే అవేం చేస్తాయి నీవు టీవీ చూడమంటే టీవీ చూస్తాయి
గాయిత్రి చేయమంటే గాయిత్రి చేస్తాయి నీవు ఏది చేయమన్నావో నీ మనసు యొక్క
అత్యవసాయాన్ని బట్టి ఉంటుంది నీ మనసు అలా ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగినదైతే ఎంత
సేపు వినోదాన్ని ఇవ్వాలో అంతసేపు వినోదాన్ని ఇస్తుంది, లే అంటే లేస్తుంది
దీందేముందండీ బానిస లోపల
ఉన్న మనస్సుకు బానిస శరీరము. శరీరాన్ని శాషించగలిగినటువంటి ప్రభువు
సంస్కరింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడా ఆ జుట్టుతోటి ఉరిపోసుకోవడానికి
సిద్ధపడింది.
|
కాబట్టి ఇప్పుడు నాలుగు శుభశకునములు ఆవిడకి కనపడ్డాయి సా వీత శోకా వ్యపనీత
తన్ద్రీ శాన్త జ్వరా హర్ష విబుద్ధ సత్త్వా అశోభతాఽఽర్యా వదనేన శుక్లే శీతాఽశునా
రాత్రి రివోదితేన ! ఆ తల్లి ఆకాశంలో చంద్రుడు శుక్ల పక్షంలో అత్యంత ప్రకాశవంతగా
ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఆవిడ తన శోకమును ఆంధోలనలను మనస్తాపమును
పోగొట్టుకున్నదై ఈ కనపడినటువంటి శకునములచేత ఆవిడ సుఖమును శాంతిని పొందినది. ఈ
సమయంలో పైన కూర్చున్నాయనకి ఏం కనపడుతూంది... బాహ్యంలో ఉన్న కదలికలే కనపడుతాయి ఆవిడ
ఆవిడ లోపల ఏమనుకుంటున్నది అన్నది ఆయన గ్రహిస్తున్నారు కానీ ఆవిడ ఏం నిర్ణయం
తీసుకుంటుంది అన్నది ఆయన గ్రహించలేదు, అకస్మాత్తుగా ఆమె ఒక్కసారి లేచింది లేచి తన
జుట్టు కంఠానికి ముడివేసుకుని ప్రాణాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడుతూంది,
అప్పుడు హనుమ మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేశాయి ఎందుకో తెలుసాండీ ఏం చెయ్యాలి ఒక్క
రెండు నిమిషాలు ఆలస్యమైపోయిందనుకోండి వేలాడిపోతే చెట్టుకి తను వచ్చినపనేమిటీ
ఇప్పుడేం చేయాలి తను దాన్ని మహర్షి ఒక సర్గలో చేశారు ఆయన సంకల్ప వికల్పములను,
సంకల్ప వికల్పములు మనసు బుద్ధి నిర్ణయం చెయ్యాలి, ఆయన బుద్ధిమతాం వరిష్ఠం.
ఇన్ని ఆలోచనలు
ప్రవహిస్తే ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి ఆ నిర్ణయం ఏం సామాన్యమైన నిర్ణయం కాదది, ఆ
నిర్ణయం మీద తనబ్రతుకు సీతమ్మ బ్రతుకు రామ చంద్ర మూర్తి బ్రతుకు వానరుల యొక్క
బ్రతుకు కోసల దేశము యొక్క బ్రతుకు ఇక్ష్వాకు వంశం యొక్క బ్రతుకు ఆధారపడి ఉన్నాయి
కాబట్టి మహర్షి అంటారు
|
తతో బహు విధాం చిన్తాం
చిన్తయా మాస వానరః ! సమాఽఽశ్వాసయితుం భార్యాం పతి దర్శన కాంక్షిణీమ్ !
అదృష్ట దుఃఖాం దుఃఖ స్య
న హ్యఽన్తమ్ అధిగచ్ఛతీమ్ ! అనాఽఽశ్వాస్య గమిష్యామి దోషవ ద్గమనం భవేత్ !
గతే హి మయి తత్రేయం రాజ
పుత్రీ యశస్వినీ ! పరిత్రాణమ్ అవిన్దన్తీ జానకీ జీవితం త్యజేత్ !!
యది వాచం ప్రదాస్యామి
ద్విజాతి రివ సంస్కృతామ్ ! రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి !!
వానర స్య విశేషేణ కథం
స్యాత్ అభిభాషణం ! అవశ్యమ్ ఏక వక్తవ్యం మానుషం వాక్యమ్ అర్థవత్ !!
మయా సాన్త్వయితుం శక్యా
నాఽన్యథా ఇయమ్ అనిన్దితా ! సా ఇమమ్ ఆలోక్య మే రూపం జానకీ భాషితం తథా !!
రక్షోభి స్త్రాసితా
పూర్వం భూయ స్త్రాసం గమిష్యతి ! జానమానా విశాలాఽక్షీ రావణం కామ రూపిణమ్ సితయా చ
కృతే సహసా రాక్షసీ గణః !!
నానా ప్రహరణో ఘోరః
సమేయా దఽన్తకోపమః ! అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే !
క శ్చ నిస్సంశయం కార్యం
కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయమ్ !! ఏష దోషో మహాన్ హి స్యాన్ మమ సీతాఽభిభాషణే !
ప్రాణ త్యాగ శ్చ వైదేహ్యా
భవేత్ అనఽభిభాషణే ! భూతా శ్చాఽర్థా వినశ్యన్తి దేశ కాల విరోధితాః !!
విక్లబం దూతమ్ ఆసాద్య
తమః సూర్యోదయే యథా ! అర్థాఽనర్థాఽన్తరే బుద్ధి ర్ని శ్చితాఽపి న శోభతే !!
ఘాతయన్తి హి కార్యాణి
దూతాః పణ్డిత మానినః ! న వినశ్యే త్కథం కార్యం వైక్లబ్యం న కథం భవేత్ !!
లంఘనం చ సముద్ర స్య కథం
ను న వృథా భవేత్ ! రామమ్ అక్లిష్ట కర్మాణం స్వబంన్ధుమ్ అనుకీర్తయన్ !!
న ఏనామ్ ఉద్వేజయిష్యామి
త ద్బన్ధు గత మానసామ్ ! ఇక్ష్వాకూణాం వరిష్ఠ స్య రామ స్య విదితాఽఽత్మనః !!
శుభాని ధర్మ యుక్తాని
వచనాని సమర్పయన్ ! శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరమ్ !!
శ్రద్ధాస్యతి యథా హి
ఇయం తథా సర్వం సమాఽఽదధే ! ఏవం బహువిధాం చిన్తాం చిన్తయిత్వా మహా కపిః !
సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ !!
ఎన్ని ఆలోచనలు దొర్లి పోయాయో చూడండి ఆయనకి, నేను ఇంత దూరం వచ్చి చెట్టుమీద
కూర్చున్నాను, నూరు యోజనములు సముద్రాన్ని గడచి లంకాపట్టణంలో ప్రవేశించాలి అంటే
సాధ్యం కాదూ అని అది దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి కొన్ని వేల వానరములు దాటలేక
ఉత్తర తీరంలో ఉండిపోయాయి. నన్ను నమ్మి వాళ్ళు పంపించారు ఇప్పుడు నేను వెళ్ళి
చెప్పే శుభవార్తను బట్టే ఆ వానరులు యొక్క బ్రతుకు నిర్ణయింపబడి ఉంది. ఇంత
దూరమొచ్చి నేను సీతమ్మ దర్శనం చేశాను ఇంత దూరము వచ్చి సీతమ్మ దర్శనం చేసినవాన్ని కానీ
ఆవిడ ఊరువేసుకుంటున్న సీతమ్మని దర్శించాను, కాని ఆవిడ ఉరిపోసుకుందని నేను
వెనక్కెళ్ళి చెప్తే రాముడు బ్రతకడు లక్ష్మణుడు బ్రతకడు భరతశత్రుజ్ఞలు బ్రతకరు,
కౌసల్యా సుమిత్రా కైకేయీ సుగ్రీవుడు ఇక్ష్వాకు వంశం వానర వంశం రెండు నశిస్తాయి.
కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడకుండా ఉండకూడదు నేను ఈవిడికి ఉపశాంతి కల్పించాలి
మాట్లాడాలి నేను ఒకవేళ మాట్లాడుదామంటే ఒక వానరున్ని సంస్కృతంలో బ్రాహ్మణుడిలా
మాట్లాడితే
ఒక వానరమేమీ సంస్కృతంలో మాట్లాడడమేమీ అనుకూంటుంది అనుమాన
పడుతూంది, సామాన్యమైన మనుష్య భాషలో మాట్లాడుదామంటే ఇక్కడ ఉండేటటువంటి మీగిలిన
రాక్షసీ స్త్రీలు వింటారు, విన్న తరువాత ఒక కోతి మనుష్య భాషలో ఎలా మాట్లాడుతూంది
అని అనుమానమొచ్చి నేను సీతమ్మ వంక చూస్తున్నానని సీతమ్మ నా వంక చూస్తూందని వాళ్ళు
అనుమాన పడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడు యుద్ధం జరుగుతుంది.
|
యుద్ధం జరిగిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు నేను సముద్రాన్ని దాటవచ్చు
దాటలేకపోవచ్చు నేను తిరిగి వెళ్ళవచ్చు వెళ్ళలేకపోవచ్చు నిగ్రహింపవచ్చు నిగ్రహింపబడకపోవచ్చు
కాని రామ కార్యం చెడిపోవచ్చు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చెదిరిపోవచ్చు అప్పుడు నేను
వచ్చి వెళ్ళిన కార్యం ఎలా జరుగుతూంది మళ్ళీ సీతమ్మని తీసుకెళ్ళి ఎవరికీ కనపడనంత గుప్తమైన
ప్రదేశంలో వీడు దాచవచ్చు నేను ఇన్నిటినీ అధిగమించి ముందు ఈ తల్లి ఉరిపోసుకున్నది ఉరిని
వదులుకొని ప్రాణములతో నిలబడాలంటే మళ్ళీ ఈవిడకి శరీర స్పృహకలగాలంటే బ్రతకాలన్న ఆశ
చిగురించాలంటే నేనేం చెప్పాలని ఆలోచించాడు, నేను చెప్పేది ఏదో చెప్పడం కాకూడదు ఏది
చెప్తే ఆవిడకి సంతోషం కలుగుతూందో ఏది చెప్తే ఆవిడ వింటూందో ఏది చెప్తే ఆవిడ ప్రీతి
చెందుతూందో ఏది వింటే ఆవిడకి బ్రతుకుమీద ఆశ కలుగుతూందో ఆ రామ నామం చెప్పాలి ఆ రామ
కథ చెప్పాలి, రామ కథ చచ్చిపోయేవాళ్ళని బ్రతికిస్తుంది ప్రత్యేకించి సీతమ్మతల్లి
అంత ప్రీతి పొందుతూంది కాబట్టి నేను రామ కథే చెప్తాననుకున్నారు, అని రాజా దశరథో
నామ రథ కుంజర వాజిమాన్ ! పుణ్య శీలో మహా కీర్తిః ఋజు రాఽసీన్ మహాశయాః !! మళ్ళీ
రామ కథని ప్రారంభించాడు సుందర కాండ బలమంతా రామ కథా బలమే ఒక్క చోట చెప్పినట్టు
ఇంకొక చోట చెప్పరు అంటే కథని మార్చేస్తారు కాదు, ఎక్కడ ఎంత వరకు అవసరమో అంతవరకు
తీసుకుంటూంటారు, అని మొదలు పెట్టారు.
ఒకానొకప్పుడు మహానుభావుడు పుణ్యమైనటువంటి
ప్రవర్తనగలిగినవాడు ఋజుస్వభావము కలిగినటువంటివాడు అనేక పుణ్యకార్యములు చేసినవాడు
యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు కొన్ని లక్షల ఏనుగులు గుఱ్ఱములు సంపదగా కలిగినవాడు
కోసల దేశాన్ని పరిపాలిచినవాడైన దశరథ మహారాజుగారికి కలిగిన నలుగురు పుత్రులలో
పెద్దవాడైన రామ చంద్ర మూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం అని ఆయన
ఆజ్ఞాపించిన విధంగా పధ్నాలు సంవత్సరములు దండకారణ్యంలో వశించడం కోసం భార్యయైన
సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి పధ్నాలువేల మంది
ఖరదూశనాదులను సంహరించి జనస్థానంలో ఉండగా రాక్షస సంహారం చేశాడని మనసులో కోపం
పెట్టుకున్నటువంటి రావణాసురుడు మారీచుడనబడేటటువంటి రాక్షసున్ని ప్రేరేపించి ఒక
మాయా మృగ రూపంలో పంపించి సీతమ్మన్ను లోభ పెట్టి రామ లక్ష్మణులను దూరం చేసి సీతమ్మ అపహరించి
తెచ్చి ఈ లంకావనంలో బంధించి ఉంచాడు. ఆ తల్లిని అణ్వేషించడానికి సుగ్రీవుడు అన్ని
దిక్కులకు వానరములను పంపగా దక్షిణ దిక్కునకి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్నివేల
వానరములు సముద్రాన్ని దాటలేక ఉత్తర దిక్కున ఉండిపోతే నేను నూరు యోజనముల
సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డున వచ్చిన దక్షిణ దిక్కున ఈ లంకా పట్టణంలో శింశుపా
వృక్షం మీద కూర్చుని సీతమ్మ ఎటువంటి అలంకారముతో ఎటువంటి కాంతితో ఎటువంటి నగలతో
ఎటువంటి ప్రభావంతో ఉంటుందని రామ చంద్ర మూర్తి నాకు చెప్పబడిందో యథా
రూపాం యథా వర్ణాం యథా లక్ష్మీం చ
నిశ్చితామ్ ! అశ్రౌషం రాఘవ స్యాఽహం సేయమ్ ఆసిదితా మయా !! అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అని ఆగిపోయాడు.
|
|
సీతమ్మ తల్లి హనుమని దర్శించినటువంటి ఈ ఘట్టమేదుందో దీన్ని ʻసిద్ధి సర్గాʼ అని పిలుస్తారు పెద్దలు. ఇది విన్నంత మాత్రం చేత సీతా రామ చంద్ర ప్రభువు
యొక్క హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేను మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను
మీరు నీరాజనాన్ని తీసుకోండి. ఇక్కడి వచ్చిన తరువాత స్వామికి నీరాజనమిస్తే కాని
చెప్పకూడదు. తతః శాఖాఽన్తరే లీనం దృష్ట్వా చలిత మానసా ! వేష్టితార్జున వస్త్రం
తం విద్యు త్సంఘాత పింగళం !! మెరిసి పోతున్నటువంటి బంగారమెలా ఉంటుందో అటువంటి
పోతపోసినటువంటి బంగారంలా ఉన్న శరీరంతో తెల్లటి బట్టలు కట్టుకున్నవాడై, హనుమకి
ఎప్పుడు తెల్లటి వస్త్రములు కట్టాలి. కాబట్టి మెరిసిపోతున్న బంగారు నేత్రములతో
ఉన్న హనుమని తల్లి చూసింది సా దదర్శ కపిం తత్ర ప్రశ్రిత్రం ప్రియ వాదినమ్ !
పుల్లా అశోకోత్కరా భాసం తప్త చామీక రేక్షణం !! సా తు దృష్ట్వా హరి శ్రేష్ఠం వినీత
వ దుపస్థితమ్ ! మైథిలీ చిన్తయా మాస స్వప్నోఽయయమ్ ఇతి భామినీ !! ఆ తల్లీ
పుష్పించినటువంటి అశోక వృక్షానికి పుష్పం అలా ఉన్నటువంటి ఆ హనుమ స్వరూపాన్ని చూసి
ఆ తల్లి ఒక్కసారి విశ్మయానికి లోనైపోయింది, ఏమిటి నాకేమిటీ ఈ కోతి కనపడ్డమేమిటీ
అని ఆశ్చర్యపోయింది.
|
దుర్నిరీక్షఁ ఇతి
జ్ఞాత్వా పున రేవ ముమోహ సా ! విలలాప భృశం సీతా కరుణం భయ మోహితా !!
రామ రామేతి దుఃఖాఽఽర్తా
లక్ష్మణేతి చ భామినీ ! రురోద బహుధా సీతా మందం మంద స్వరా సతీ !!
సా తు దృష్ట్వా హరి శ్రేష్ఠం వినీత వ దుపస్థితమ్ ! మైథిలీ
చిన్తయా మాస స్వప్నోఽయయమ్ ఇతి భామినీ !!
ఒక్కసారి ఆ భీమ రూపుడైనటువంటి
హనుమని చూసి చాలా విస్మయాన్ని పొందినదై ఇటువంటి కోతి నాకు కనపడింది స్వప్నంలో కోతి
కనపడుకూడదు దుర్నిమిత్తమంటారు కాబట్టి నాకు కోతి కనపడింది కనపడినటువటి కోతి నాకు
ఇటువంటి రామ కథ చెప్పింది. కానీ అది ఆ తల్లి అనుకూంటూంది స్వప్నే మయాఽయం వికృతోఽద్య దృష్టః శాఖా మృగః
శాస్త్ర గణై ర్నిసిద్ధః స్వస్త్యఽస్తు రామాయ స లక్ష్మణాయ తథా పితు ర్మే జనక స్య
రాజ్ఞః ! స్వప్నంలో కోతి కనపడ కూడదంటారు కానీ కోతి కనపడింది అసలు నిద్రపట్టని
నాకు కలెక్కడనుంచి వస్తూంది నిద్ర పడితే కదా కల రావడం కల వస్తే కదా కలలో కోతి
కనపడడం పైగా ఆ వానరం మాట్లాడిన మాటలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి, కానీ నన్ను
మోహము గురిచేయడానికి మళ్ళీ ఈ రూపముతో ఎవరైనా వచ్చారేమో అనుకుంది ఇదీ
వేటపడిపోవడమంటే, ఆవిడ మనసు అటువంటి ఉద్విజ్ఞతకు వేటుపడిపోయింది. అనుకుని ఆ తల్లి
అంది ఒక వేళ ఈ కపివరుడు చెప్పిన కథంతా నిజమైతే నిజంగా ఇంత శుభం జరిగి ఉంటే ఒక వేళ
కలలో కోతి కనపడకూడదూని శాస్త్రం కాబట్టి
ఒకవేళ నాకు నిజంగా కలలోనే కనపడి ఉంటే నాకు ఏదో పెద్ద ఆపద సంభవిస్తుందని గుర్తు. నా
కాపదా అంటే నా ఆపద ఆపద కాదు ఇదీ పాతివ్రత్యమంటే రామునికి ఆపద నాకు ఆపద ఇంకొకటి
ఉండదు, రాముని ఆపదే నా ఆపద కాబట్టి స్వస్త్యఽస్తు రామాయ స లక్ష్మణాయ
లక్ష్మణుడితో కూడిన రాముడు శుభముగా సంతోషముగా ఉండుగాకా తథా పితు ర్మే జనక స్య
రాజ్ఞః ఇది ఆడపిల్ల యొక్క హక్కు మా నాన్నగారు జనక మహారాజుగారు సుఖముగా
ఉండుగాకా... ముందు మెట్టినింటివారిని తల్చుకోవాలి, తరువాత పుట్టించివారిని
తల్చుకోవాలి రెండు వంశములు సంతోషముగా ఉండుగాక.
అనుకుని నాకు నిద్రేరాంది కలెక్కడ
నుంచి వచ్చింది కాబట్టి నేను కలలో చూడలేదు నేను రామగ్రహంతో బాధపడుతున్నాను
ఇటువంటప్పుడు నాకు రామ కథ వినపడూంది. పైగా స్పష్టమైన రూపంతో నాకు ఈ వానరం
కనపడుతూంది అని ఆ తల్లి ఒక్కసారి నమస్కారం చేసింది నమోఽస్తు వాచస్పతయే సవజ్రిణే
స్వయమ్భువే చైవ హుతాఽశనాయ చ అనేన చోక్తం య దిదం మమాఽగ్రతో వనౌకసా త చ్చ తథాఽస్తు
నాఽన్యథా ! అని, ఆ తల్లి సీతమ్మంటే సీతమ్మే ఆవిడ నమోఽస్తు వచస్పతయే
సవజ్రిణే నేను బ్రహ్మగారికి నమస్కరిస్తున్నాను, బృహస్పతికి నమస్కరిస్తున్నాను,
ఇంద్రుడికి నమస్కరిస్తున్నాను, అగ్నిహోత్రుడికి నమస్కరిస్తున్నాను, నేను విన్న
మాటలు నిజమౌగాక ఏం ఈ నలుగురికే ఎందుకు నమస్కరించాలి. అంటే ఎప్పుడూ సత్యవాక్కుని
సత్యమును పాటించమనీ దేవతలందరికీ చెప్పేటటువంటి గురువు బృహస్పతి అందుచేత ఆయన
వాక్కుల చేత సంస్కరిస్తాడు ఆయన చెప్పిన వాక్కులువిని జీవితం దిద్దుకునేటటువంటి
లక్షణ మున్నవాడు ఇంద్రుడు చతుర్ముఖ బ్రహ్మగారు లోకమునంతటికి ప్రమాణమైన వేద
వాక్కును ఆధారంగా చేసుకుని ఎప్పుడూ వేద వాక్కును వల్లిస్తూ స్తుతి చేస్తూ ఉంటారు
అలాగే ప్రతి మనిషి యొక్క నాలుక మీద కూడా అగ్నిహోత్రము వాక్కుకి అధిష్టాన దేవతగా
ఉంటుంది ఉండి మాటను పలికిస్తూంది మాటకి అధిష్టాన దేవత అగ్నిహోత్రుడు కాబట్టి
మాటలన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి ఈ
నలుగురు దేవతలు ఎవరున్నారో వాళ్ళకు నేను నమస్కరిస్తున్నాను,
వాళ్ళు ఈ పైన వానరము చెప్పినటువంటి మాటలు ఏమున్నాయో అవి నిజమయ్యేటట్టు చూడుగాకా ఈ చెప్పిన కథ అనృతము కాకుండు గాకా... అపద్ధము
కాకుండు గాకా ఇదియే సత్యమగు గాకా... అని ఆతల్లి నమస్కారం చేసింది.
|
వెంటనే హనుమ రెండు చేతులు శిరస్సుకి తగలకుండా ఇలా పైకి పెట్టి నమస్కారం చేస్తూ
దాసాంజనేయుడై మహా భక్తుడై వినమృడై అత్యంత వినయంతో కొమ్మల నుంచి కొద్దిగా కిందికి
దిగివచ్చి అమ్మవారి పాదాల దగ్గర నిలబడి చిన్న పిల్లి పిల్లంత రూపంతో వినయంతో
నమస్కరించి మాట్లాడుతున్నారు. సీతమ్మ తల్లి దర్శనంతో ధన్యత పొందానన్న ఆలోచన తప్పా
నేను సీతమ్మకి ఏదో ఉపకారం చేశాననే ఆలోచన సుందర కాండకి మీరు కోటి దీపాలు వేసి
వెతికినా మీకు ఎక్కడా కనపడదు. అందుకే సీతమ్మయందు పరమ భక్తి తత్పరుడు హనుమా అని
మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఆమె దర్శనము చేత పులకాంకితుడైనవాడు హనుమ మాత్రమేనని
మీరు చెప్పవలసి ఉంటుంది సుందర కాండలో. కాబట్టి శిర స్యంఽలిమ్ ఆధాయ సీతాం మధురయా
గిరా మధుర మధురమైన వాక్కులతో శిరస్సును అంజలి ఘటించి ఆయన మాట్లాడుతున్నారు కా
ను పద్మ పలాసాఽక్షీ క్లిష్ట కౌశేయ వాసినీ ! ద్రుమ స్య సాఖామ్ ఆలమ్భ్య తిష్ఠసి
త్వమ్ అనిన్దితే !! అమ్మా! ఎవరమ్మా పద్మముల వంటి కన్నులు కలిగి ఉన్నావ్,
నలిగిపోయినటువంటి పట్టుబట్ట కట్టుకున్నావ్ ఆ అశోకవృక్షము కొమ్మను వంచి శరీరమును దానికి
ఆధారం చేసి నిలబడి ఉన్నావు తల్లీ నీవు సురాణామ్ అసురాణాం చ నాగ గన్ధర్వ
రక్షసామ్ ! యక్షాణాం కిన్నరాణాం చ కా త్వం భవసి శోభనే !! కో ను పుత్రః పితా భ్రాతా
భర్త వా తే సుమధ్యమే ! అస్మా ల్లోకా దఽముం లోకం గతం త్వమ్ అనుశోచసి !! రావణేన
జనస్థానా ద్బలా దఽపహృతా యది సీతా త్వమఽసి భద్రం తే తన్మయాఽఽదక్ష్వ పృచ్ఛతః !! అమ్మా!
నీవు నిజం చెప్పూ చంద్రుడికి దూరమై భూమి మీదకు వచ్చిన రోహిణివా, వశిష్ఠుడి మీద
కోపమొచ్చి వచ్చిన అరుంధతివా? నీవు తల్లీ దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది జాతులకు
చెందిన దానివా... నీవు ఊపిరి విడిచిపెడుతున్నావు. భూమికి నీ పాదాలు తగులుతున్నాయి
నీ యొక్క రూపం చూస్తే ఎవరో ఒక మహారాజుకి ఇల్లాలివనిపీస్తూంది అమ్మా ఉన్న యదార్థం
యదార్థంగా చెప్పూ జన స్థానంలో రావణుని చేత అపహరింపబడిన మా అమ్మ జానకీ మాతవామ్మా నీవు
అమ్మా చెప్పమ్మా అని అడిగాడు.
తెలియదా హనుమకి ఆమె సీతమ్మా అని
తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట అంటే ఆవిడని స్వస్థతలోకి తీసుకురావాలి
అసలు ఆవిడ పరిపూర్ణంగా తనని నమ్మాలి, నమ్మితే తప్పా తాను రామ దాసుననీ రాముడు అంత
ప్రయత్నం చేస్తున్నాడనీ అమ్మా నీవు బెంగ పెట్టుకోవద్దనీ ఆవిడ్నీ ఊరడించ గలుగుతారు
లేకపోతే రాక్షస స్త్రీలు నమస్కరించినంత మాత్రాన ఉపశాంతి పొందకుండా అటువంటి రావణుడున్నాడూ
అని ఆవిడ సంతోషంతో ఉండకుండా బెంగ పెట్టుకున్న తల్లీ... హనుమ రామ కథ చెప్పేసి
వెంటనే ఉంగరం అక్కడ పెట్టిపోతే ఆవిడకి మనఃశాంతి కలగదు. ఎందుకంటే ఆవిడకి ఆ నమ్మకం
కలుగదు బాగా ఆవిడకి నమ్మకం కలగాలంటే ఆవిడకి కూడా బాహ్య స్మృతి బాగా కల్పించి
ఆవిడతో మాట్లాడించాలి, ఇప్పుడు నోటి వెంట ఆవిడ మళ్లీ రామ కథని చెప్పుకోవాలి
చెప్పుకుని పొంగిపోవాలి పొంగి పరవశించిపోయి పూర్తిగా బాహ్య స్మృతిని పొంది తాను
రామ భక్తుడని తన పట్ల ఆమెకు ఒక పుత్ర సద్రుశమైన ప్రేమ కలిగి అరమరికలేకుండా
మాట్లాడటానికి హనుమ చెప్పింది అనుమానం లేకుండా నమ్మడానికి ఆవిడ సిద్ధపడితే అప్పుడు
తాను వెళ్ళి రామున్ని తీసుకొచ్చేంతవరకు ఆవిడ ప్రాణములతో నిలబడుతుంది లేకపోతే
నిలబడదు. అందుకని వెంటనే ఉంగరము ఇవ్వలేదు తప్పా దానికి వేరు కారణాలేమీ ఉండవు.
కాబట్టి అమ్మా ఎవరమ్మా నీ తండ్రీ ఎవరమ్మా నీ అన్నదమ్ములూ, ఎవరమ్మా నీ భర్తా అమ్మా...
లేకపోతే ఒకవేళ నీవు జన స్థానంలో రావణుడిచేత అపహరింపబడిన సీతమ్మవా..? తల్లీ నాకు
చెప్పవలసిందీ అని అడిగాడు. ఎంత ధర్మ మూర్తి నరకాంతగా అనుగమిస్తూందిగదాండి రామ
చంద్ర మూర్తిని, పతివ్రతా ధర్మాన్ని పాటించింది
|
దుహితా జనక స్యాఽహం
వైదేహ స్య మహాత్మనః ! సీతా చ నామ నామ్నాఽహం భార్యా రామ స్య ధీమతః !
సమా ద్వాదశ త త్రాఽహం రాఘవ స్య నివేశనే ! భుంజానా మానుషాన్
భోగాన్ సర్వ కామ సమృద్ధినీ !
నేను ఈ పృథ్వి నంతటినీ
పరిపాలించినటువంటి రాజ సింహుడైన దశరథ మహారాజుగారి యొక్క కోడల్ని, ఒక
వివాహమైపోయినటువంటి ఆడపిల్లనీ అమ్మా మీ రెవరూ అని అడగితే సాంప్రదాయం
తెలిసున్నవారైతే నేను ఫలానా వారి కోడల్నండీ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆడ పిల్లకి
మామగారిలాంటి వ్యక్తి ఇంక జీవితంలో ఉండడూ అని శాస్త్ర వాక్కు. వివాహం చేసేంతవరకే
తండ్రి. వివాహం చేసిన తరువాత తండ్రి కన్నా కూడా బాధ్యతగల స్థానంలోకి ఎవరు
వెళ్ళిపోతారో తెలుసాండి మామగారు వెళ్ళిపోతారటా... ఎంత ప్రేమిస్తారటా నాకోసం ఎక్కడో
పుట్టిన పిల్ల అమాయకురాలు ఇంటిపేరు వదిలేసింది. తన వారిని వదిలేసింది నా వంశాన్ని
ఉద్దరించడానికి నా కొడుకు చెయ్యిపట్టుకుని తిరగడానికి వాడి సంతోషం తన సంతోషం అని
నమ్మివచ్చింది కాబట్టి పిల్ల సంతోషంగా ఉండేట్టు చూడాలని మురిసిపోతాడట మామగారు.
అందుకే మామగారి శరీరం
పడిపోయాక కూడా కొడుకు తద్దినం పెట్టితే ఒప్పుకోడు కోడలు దీపం పెడితేనే ఆది తద్దినం
అనుకుంటాడు. అంత ప్రేమతో ఉంటాడట మామగారు అందుకే తండ్రికన్నా గొప్పవాడు మామగారే శాస్త్రం తెలిసున్న
తండ్రైతే ఏం చెప్పాలంటే అమ్మా అందరు నాకు నమస్కారం చేసినా నీవు మాత్రం నేనూ మీ
మామగారు కూడా ఉంటే ముందు నీ మామగారికి నమస్కారం చేయాలి అని చెపాలి అంత
పూజనీయుడు మామగారంటే.
కాబట్టి ఆవిడా సాంప్రదాయం తెలిసున్నతల్లి ఆవిడ అంటూంది పృధివ్యాం రాజ
సింహానాం ముఖ్యస్య విదితాఽఽత్మన ! స్నుషా దశరథ స్యాఽహం శత్రు సైన్య ప్రతాపినః !! శత్రు
సైన్యములను గడగడలాడించ గలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడైన దశరథ మహారాజుగారి యొక్క పెద్దకోడలిని
నేను, దుహితా జనక స్యాఽహం వైదేహ స్య మహాత్మనః తరువాత తాను ఎవరి కూతురో
చెప్పాలి, నేను ఎన్నడూ దేహ బ్రాంతిలేనటువంటి విదేహ వంశంలో పుట్టినటువంటి
జనకమహారాజుగారి యొక్క కూతుర్ని ఇప్పుడు తన పేరు చెప్పుకోవాలి సీతా చ నామ నామ్నాఽహం
నన్ను సీతా అంటారు, ఇప్పుడు చిట్ట చివర భర్త పేరు చెప్పాలి భార్యా రామ స్య
ధీమతః భర్త ఈశ్వరుడితో సమానం అందుకని భర్త పేరు చెప్పేటప్పుడు పది మందిలో
మాట్లేటప్పుడు ఆయన మొహం ఆయనకేం వస్తూంది అని పరిచయం చేయకూడదు. ఆయన గురించి
చెప్పేటప్పుడు గొప్పగా అందంగా మాట్లాడగలగాలి ఒక విశేషణంతో చెప్పగలగాలి చాలా
మంచివారు మా ఆయన పేరాండీ! అని ఏదో విశేషణమేసి చెప్పాలి, భ్రతృప్రీతికి నిదర్శనం
కాబట్టి రామ స్య ధీమతః గొప్ప బుద్ధిశాలియైనటువంటి రామ చంద్ర మూర్తి యొక్క
భార్యని సమా ద్వాదశ త త్రాఽహం రాఘవ స్య నివేశనే ! భుంజానా మానుషాన్ భోగాన్ సర్వ
కామ సమృద్ధినీ ! మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తారో అన్నిభోగాలు
పన్నెండేళ్ళు నేను దశరథ మహారాజుగారి అంతఃపురంలో దశరథుడి పెద్ద కోడలిగా అనుభవించాను.
|
కాబట్టి మీరు ఆవిడ్ని ఒక పతివ్రతగా
ఆలోచించి రామ కథని వింటే దానిలో వచ్చే పరిపూర్ణత వేరుగా ఉంటుంది దానిలో ఉండే
మాధుర్యం వేరుగా ఉంటుంది అది ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. జరిగిన కథ దాన్ని
పూర్తిగా ఇంకోలా మార్చి చెప్పడం హేతువుకి దాని అందానికి దూరమైపోతూంది, జరిగిన కథా
అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు బ్రహ్మగారు చెప్తున్నారు నారదుడు చెప్తున్నారు
కాబట్టి జరిగిన కథా కథ అందాన్ని అలా ఉంచండి, కథా అందాన్ని తీసేసి అన్వయాలు చేయకండి
చేస్తే ఆ మాధ్యుర్యం దూరమైపోతుంది. కాబట్టి భుంజానా మానుషాన్ భోగాన్ సర్వ కామ
సమృద్ధినీ నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగాలు ఎన్నున్నాయో అన్ని భోగాలను
అనుభవించాను దద్యా న్న ప్రతిగృహ్ణీయా న్న బ్రూయా త్కించి దఽప్రియమ్ ! అపి జీవిత
హేతో ర్వా రామః సత్య పరాక్రమః ఒకానొకప్పుడు దాశరథమహారాజుగారు కైకమ్మకి మాట
ఇచ్చారు రెండు వరాలిచ్చారు రేపు రామ చంద్ర మూర్తికి పట్టాభిషేకం అన్న వేళలో కైకమ్మ
దశరథున్ని నిగ్రహించింది నాకా రెండు వరాలు కావాలంది, ఏమి అన్నారు దశరథ మహారాజుగారు
ఒకటి రామ చంద్ర మూర్తి అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం ఎన్నడూ ఎవరినీ ఎవరిదగ్గరా
ఏమీ కోరకుండా ధర్మాన్ని అనుష్టించడమే తన జీవిత ప్రయోజనంగా భావించేటటువంటి రామ
చంద్ర మూర్తి తండ్రిని సత్యవాఖ్యమునందు నిలబెట్టడం కోసమనీ నాతో లక్ష్మణునితో కలిసి
మా కన్నా ముందు బయలుదేరిన లక్ష్మణునితో కలిసి ʻఅంత ప్రీతి కలిగినవాడుʼ అరణ్యవాసానికి వచ్చారు, ఆయన ఎటువంటి వారంటే రామ చంద్ర
మూర్తి దద్యా న్య ప్రతిగృహ్ణీయా న్న బ్రూయాత్ ఒకరికి పెట్టడమే తప్పా ఆయన
తీసుకోవడమన్నది ఆయనకి ఎప్పుడూ రాదు అందుకే రాజ్యాన్ని కూడా ఒకరికి ఇచ్చి
సంతోషాన్ని పొందినవాడు.
|
తప్పా వెంటనే ఉంగరమివ్వలేదు ఆయనా...
నిన్ను కుశలమడగమన్నారమ్మా ఎందుకని ఆవిడ బాగా స్వాంతన పొందాలి, బ్రహ్మాస్త్రమును
తెలిసినవాడమ్మా, వేద వేదాంగములు తెలిసున్నవాడమ్మా రామ చంద్ర మూర్తి అటువటి రామ
చంద్ర మూర్తి కౌసల్యా కుమారుడైనటువంటి దాశరథీ నిన్ను క్షేమమడగమని చెప్పాడు,
లక్ష్మణుడు మహాతేజోమూర్తి రామ చంద్ర మూర్తికి తగినటువటి తమ్ముడు ఆయనా శిరసా నీకు
నమస్కరించానని చెప్పమన్నారు తల్లీ అంటే సీతమ్మ సంతోషపడిపోయింది ఎన్నాళ్ళకి
విన్నాను ఈ మాట చచ్చిపోదామన్న ప్రయత్నం కూడా తప్పే... ఆవిడేం అందులో నిర్మోహమాటం
సీతమ్మ చేసింది ఒప్పు ఇంకోడు చేసింది తప్పని రామాయణంలో ఏం చెప్పరు. ఇప్పుడు ఆవిడ
అంటూంది కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా ! ఏతి జీవన్తమ్ ఆనందో నరం వర్ష
శతా దఽపి !! ఎన్ని కష్టాలు వచ్చినా బ్రహ్మగారు మనకిచ్చిన నూరు సంవత్సరముల
ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకుని శరీరంతో ఉండాలని ప్రయత్నం చేసేటటువంటి
వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు శుభవార్త వినకుండా ఉండడం అన్నది జరగదు తప్పా...
తొందరపడిపోయి
ఏదో ఒక కష్టం
వచ్చిందని చెప్పి చేసేటటువంటి ప్రయత్నం చేయనటువంటివాడు శుభాన్ని వినలేడు మహాపాతకాన్ని
చేసినవాడు అవుతడు కాబట్టి కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా ! ఏతి
జీవన్తమ్ ఆనందో నరం వర్ష శతా దఽపి !! నిండు నూరేళ్ళు ప్రతివాళ్ళు బ్రతికి
పూర్ణమైనటువంటి ఆయుర్ధాయాన్ని అనుభవించి శుభవార్తలు వినవలసి ఉంటుంది. ఏమిటి
అంత్యమంలో వినవలసిన శుభవార్త ʻఈశ్వరున్ని చేరడమేʼ యథా యథా సమీపం స హనూమాన్ ఉపసర్పతి ! తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే !!
ఇందుకు కదాండి వెంటనే ఉంగరం ఇవ్వంది, ఆయన దగ్గరికి దగ్గరికి వస్తూ ఎలా పాపం ఏదో
నిలబడి కూడా ఆయన రాలేదు పిల్లి పిల్లంతవారై రెండు చెతులు ఇలా దోషులు వొగ్గి కన్నుల నీరు
కారుస్తూ దాసాంజనేయుడై నమస్కరిస్తూ ఒక తల్లి దగ్గరికి కొడుకు ఎలా వెళ్తాడో అలా
దగ్గరిగా నడిచి మాట్లాడబోతే ఆ తల్లికి అనుమానమేసింది.
|
రావణుడై ఉంటాడు వానర రూపంలో వచ్చాడు మళ్ళీ ఈ విషయాలన్ని చెప్పానని అత్యంత
శోకంతో ఉపవాసములచేత దీనురాలినై కృషించి ఉండగా రావణా నీవు నన్ను ఇలా వేధించడం తగదు
అని ఆతల్లి ఎటువంటి స్థితిని పొందేసిందంటే, నీవు ఒకనాడు సన్యాసి రూపలో మోసగించావు
ఒకనాడు మాయా మృగం రూపంలో మోసగించావు ఇవ్వాళ వానర రూపంలో వచ్చి మోసగిస్తున్నావు అనీ,
కానీ... నాకు ఈయ్యన్ని చూస్తే పుత్రసముడుగా అనిపిస్తున్నాడు ఆ తేజస్సు చూస్తే
సాత్వికంగా ఉంది ఇతడు అనిపించినా ఆతల్లి రావణుడే అనుకుంది, అనుకుని ఆవిడ ఇప్పుడు ఆ
భావనా వ్యగ్రత ఎలాగుంటుందంటే ఆవిడందీ స్వప్నేఽపి య ద్యఽహం వీరం రాఘవం సహ
లక్ష్మణమ్ ! పశ్యేయం నాఽవసీదేయం స్వప్నోఽపి మమ మత్సరీ !! నాకు కల వచ్చి కలలో
రామ లక్ష్మణులు కనపడితే బాగుండు అనుకున్నాను కానీ కల కూడా నామీద కక్ష్య కట్టింది
అందుకే కలా రాదు కలలో రామ లక్ష్మణులు కనపడరు, అంటే ఆవిడ ఎంత నిస్పృహతో ఉందో ఒక
పతివ్రతగా ఎంత బాధలో ఉందో మీరు గమనించాలి అటువంటావిడికి నమ్మకం కలిగితే తప్పా
ఆవిడా పూర్తిగా విశ్వాసంతో రెండు నెలలు బ్రతుకుతుందని మీరు చెప్పలేరు రాముడు
వచ్చేవరకు, ఇప్పుడు కార్యమైపోయిందని వెళ్ళిపోయాడనుకోండి ఆయన, ఆవిడకింకా అనుమానం
ధృవపడి వానర రూపంలో వచ్చింది రావణుడే అన్న అనుమానం వచ్చిందో ప్రాణం విడిచిపెడుతుందని
కథలో చెప్పవలసి వస్తూంది. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడి వెళ్ళి ఉండడం అంటే ఎలా
ఉండాలంటే పరిపూర్ణంగా ఆవిడ విశ్వసించాలి ఆవిడ అంత విశ్వశించిన తరువాత అప్పుడు
ఉంగరమివ్వాలి ఆవిడ దగ్గర అభిజ్ఞానము పుచ్చుకోవాలి.
అప్పుడు రాముడు వచ్చేవరకు ధైర్యంగా
ప్రాణాలతో నిలబడుతూంది, అంటే ఆవిడకి ఇప్పుడు శోకము పూర్తిగాపోయి ఆశ చిరుగురించాలి
ఇది చెయ్యాలి ఎలా చెయ్యాలి మాటల చేత చెయ్యాలి ఇంత స్వాంతన కల్పించాలి ఎంత కష్టంలో
ఉన్నారు చూడండి హనుమ కూడా, చుట్టూ రాక్షస స్త్రీలు ఎవరు చూసినా కార్యం
భగ్నమైపోతూంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట అని తల్లీ ఈ వచ్చినవాడు రావణుడే అన్న
అనుమానంతో ఆమె మాట్లాడటం మానేసి మౌనం వహించింది, స్పృహతప్పిపోయిందావిడ
స్పృహతప్పిపోయి మళ్ళీ తిరిగి స్పృహని పొందింది అసలు హనుమ వైపు ఇలా చూడ్డం కూడా
మానేసి ముఖం తిప్పుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. మహానుభావుడు మళ్ళీ చెప్పుకుంటున్నాడు
మళ్ళీ శిరస్సుమీద అంజలి ఘటించి అమ్మా నన్ను నమ్మా... సీతాయా శ్చిన్తితం
బుద్ధ్వా హనూమాన్ మారుతాఽఽత్మజః ! శ్రోత్రాఽనుకూలై ర్వచనై స్తదా తాం సంప్రహర్షయత్
!!
తల్లి తనని చూట్టంలేదనీ తన మాట వింటంలేదనీ తన మీద అనుమాన
పడిందనీ నిశ్చయించుకన్నవాడై అమ్మకు మళ్ళీ సంతోషం కలిగేటట్లు నేను మళ్ళీ
మాట్లాడుతానని నిశ్చియించుకున్నాడు ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాఽన్త శ్శశీ యథా !
రాజా సర్వ స్య లోక స్య దేవో వైశ్రవణో యథా ! మళ్ళీ రామ కథ చెప్పరు, రామ కథని
ఇంకోలా చెప్తారు అది ఆయన గొప్పతనం ఆయన అన్నారూ... అమ్మా ఈ లోకమునకు సూర్యుడు
ఎటువంటివాడో ఈలోకమునకు తాపాన్ని పోగొట్టి చల్లతనాన్ని ఇవ్వడంలో చంద్రుడు
ఎటువంటివాడో లోకమునకంతటికి కూడా రాజుగా కుబేరుడు ఎటువంటివాడో విక్రమే ణోపపన్న
శ్చ యథా విష్ణు ర్మహాయశాః ! సర్వలోక
పరిపాలకుడు విష్ణువు ఎటువంటివాడో సత్య వాదీ మధుర వాగ్ధేవో వాచస్పతి ర్యథా సత్యవాక్కు
మధురమైన వాక్కు మాట్లాడటంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఎటువంటివాడో రూపవాన్
సుభగః శ్రీమాన్ కన్దర్స ఇవ మూర్తిమాన్ ! అత్యంత అందమైన రూపంతో ఉండేవాడు
మన్మథునితో సమానమైనవాడు ఎవడో స్థాన క్రోథః ప్రహస్తా చ శ్రోష్ఠో లోకే మహారథః ! ఎప్పుడు
కోపం తెచ్చుకుని ఎవరిమీద ఎవరికి ఎంత దండనవేయాలని బాగాతెలిసినవాడు రామ చంద్ర మూర్తి.
|
అటువంటి రామ చంద్ర మూర్తి యొక్క కింకరున్నమ్మా దాసాన దాసున్నమ్మా... నన్ను
నమ్మమ్మా నేను రాముని తరపున వచ్చానమ్మా... న చిరా ద్రావణం సంఖ్యే యో వధిష్యతి
వీర్యవాన్ అమ్మా నీవు బెంగపెట్టుకోవక్కరలేదమ్మా చాలా కొద్ది కాలంలో రామ చంద్ర
మూర్తి వచ్చేస్తాడు లక్ష్మణునితో కలిసి వస్తారు వానరులతో కలిసి వస్తారు ఈ
రావణున్ని అతని పరివారాన్ని మట్టుపెడతారమ్మా... న చిరా ద్రావణం సంఖ్యే యో వధిష్యతి
వీర్యవాన్ చాలా కొద్ది కాలంలో నీవు రామ లక్ష్మణులను చూడగలవు మధ్యే వానర
కోటీనాం సుగ్రీవం చాఽమితౌజసం అపారమైన తేజో మూర్తులు మా ప్రభువు సుగ్రీవున్ని
అనేక వేలమంది వానరులను నీవు చూడగలవు అహం సుగ్రీవ సచివో హనూమాన్ నామ వానరః అమ్మా
నేను సుగ్రీవుని యొక్క సచివున్నమ్మా నన్ను హనుమా... అంటారు నన్ను నమ్మమ్మా. అంటే
సీతమ్మందీ మళ్ళీ రామ చంద్ర మూర్తి గురించి చెప్పేటప్పటికి మళ్ళీ ఆవిడకి ఆశ
చిగురించింది ఎంత ప్రయత్నిస్తారో చూడండి అందుకు కదాండీ బుద్ధిమతాం వరిష్ఠం అయ్యాడు
మహానుభావుడు. మళ్ళీ ఇటు తిరిగిందటా తల్లి, తిరిగింది కానీ ఇంకా కొంచెం అనుమానమే
అనుమానం సుందర కాండ కదాండీ, రాముని కింకరున్ని రామ దాసున్ని అని రాముడు ఆదిత్య
ఇవ సంకాశః అని ఇన్ని మాటలు చెప్తున్నాడే నీకు రాముడు అంత బాగా తెలిసుంటే ఏదీ?
నేనొక పరీక్షపెడుతాను నీకు అందావిడా క్వ తే రామేణ సంసర్గః కథం జానాఽసి లక్ష్మణమ్
! వానరాణాం నరాణాం చ కథమ్ ఆసీత్ సమాగమః !! రామున్ని ఎలా కలిశావు నీవు? కథమ్
ఆసీత్ సమాగమః బుద్ధిమతాం వరిష్ఠం అన్నమాట మీరు పట్టుకోవాలి, ఆవిడా ప్రశ్న
ఎక్కడకివేసింది క్వ తే రామేణ సంసర్గః రామున్ని నీవెక్కడ కలిశావని అడిగింది,
ఆయన జవాబు అక్కడే మొదలౌవ్వాలి అంతే కానీ రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ !
పుణ్య శీలో మహా కీర్తిః ఋజు రాఽసీన్ మహాశయాః !! అని మొదలు పెట్టకూడదు.
ఆబ్జెక్టీవ్ టైప్స్ ఆఫ్ కోశ్వచన్
లాగా ఆయన ఒక్కసారి ప్రశ్నలన్నీ బుర్రలో పెట్టేసుకున్నారు, వళ్ళీ వన్ వర్డ్
ఆన్సర్స్ ఉంటుంది చూశారా అలా మళ్ళీ శ్లోకాలన్నీ కూడా అలా చెప్పేవే, అది ఆయన
గొప్పతనం అందుకని ఆవిడ నమ్మింది ఎందుకని
గంటలు గంటలు ప్రసంగాలు చేయడానికి నాలా అవకాశం ఉన్నవాడేం
కాదు ఆయన ఏ రాక్షస స్త్రీలో ఏ రావణుడో వచ్చేలోపలా మాట్లాడి ఆవిడకి ఆశ్వాసమును
కల్పించాలి తల్లికి కాబట్టి వానరాణాం నరాణాం చ కథమ్ ఆసీత్ సమాగమః నీవు వానరుడివి
ఆయన నరుడు రాముడు లక్ష్మణుడు నీతో ఎలా కలిశారు, మీకూ మీకూ ఎలా స్నేహం కలిసిందసలు యాని
రామ స్య లింగాని లక్ష్మణ స్య చ వానర రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు,
రాముని యొక్క అవయవాలెలా ఉంటాయి రాముని యొక్క స్వరూపమెలా ఉంటుంది. లక్ష్మణుని యొక్క
స్వరూపమెలా ఉంటుంది తాని భూయః సమాఽఽచక్ష్వ న మాం సోక స్సమాఽఽవిశేత ఎంత
చమత్కారంగా అడిగింది, నాకు రామ కథన్నా రామ సౌందర్యమన్నా అంత ఇష్టం ఏదీ చెప్పు నేను
మళ్ళీ స్వాంతన పొందుతాను సంతోషిస్తాను, అంటే ఆవిడకి తెలియక అడుగుతోందా..? నిజంగా
అంత చెప్పగలిగితే రామదాసుడే రామ కింకరుడే హనుమయే నేను నమ్మచ్చు కాబట్టి ఇప్పుడు
తల్లీ సౌందర్యోపాసనని ప్రశ్నవేసింది, ఏదీ నీవు అంత తెలిసున్నవాడివైతే నీ స్వామి
ఎలా ఉంటాడో చెప్పు నాకుల దైవం ఇదాండీ నేను అథాంగ పూజ చేస్తాననుకోండి ఏదీ ఓ సారి
చెప్పండి ఎలా ఉంటాడో ఈశ్వరుడు అన్నారనుకోండి, మీరు మీ ధ్యాన శ్లోకాన్ని చెప్తే
అంటే ధ్యాన శ్లోకం చదివి కన్నులు మూసుకున్నారంటే మీ కన్నుల ముందు ఆ రూపం అలా
సాక్షాత్కరించాలి.
|
మీరు పాదముల నుంచి తల వరకు తల
నుంచి పాదముల వరకు రూపాన్ని చెప్పేయ్యాలి అలా చెప్పేశారూ
అంటే మీరు లోపల బాగా పట్టుకున్నారూ అని గుర్తు, ఈ ఉపాసనని తల్లి ప్రశ్నవేసింది
సుందర కాండలో ఏది ఎలా ఉండాడో చూపించు చెప్పు, ఆయన అన్నారూ అమ్మా! యాని రామ స్య
చిహ్నాని లక్ష్మణ స్య చ యాని వై ! లక్షితాని విశాలాఽక్షి వదతః శృణు తాని మే !!
అమ్మా నీకు తెలియదామ్మా నీకు అన్నీ తెలుసు రాముడు ఎలా ఉంటాడో తెలుసు లక్ష్మణుడు
ఎలా ఉంటాడో తెలుసు మరిదిలా చూసినదానివి కావుగా..! కొడుకులా చూశావు ఒక కన్నతల్లి
కొడుకుని చూసినట్లు చూశావు కాబట్టి లక్ష్మణుని గురించి తెలుసు రాముని గురించి
తెలుసు అయినా అమ్మా నన్ను అడిగావు చెప్తాను ఎందుకు చెప్తానో తెలుసా చెప్తే నీవు
సంతోషిస్తావమ్మా రాముని గురించి, నీ సంతోషం కన్నా నాకేం కావాలి తప్పకుండా
చెప్తానన్నాడు ఇది పుత్ర ప్రేమంటే ఆయన ఎవర్నైనా చూసినా ఆయన్ని ఎవరైనా చూసినా వసులైపోతారు అంత గొప్ప
కన్నులున్నవాడు అటువంటు చూపులున్నవాడు రామున్ని మనుష్యులు మోహించడం కాదు రాక్షసులు
వానరులు జంతువు చెట్లు చేమలు తిర్యక్కులు అన్నీ మోహించాయి అంత గొప్ప చూపులమ్మా...
అంత గొప్ప కళ్ళమ్మా రూప దాక్షిణ్య సంపన్నః ఇటువంటి అందముందని లోకాన్ని మోసం
చేసేవాడు కాదు, రూపమెంతదో ఆయన దాక్షిణ్యమటువంటిది, ఆయన దయ అటువంటిది ప్రసూతో
జనకాఽఽత్మజే అమ్మా పుట్టుకతో వచ్చాయమ్మా ఈ లక్షణాలూ.
అందం తెచ్చుకుంటే వచ్చేది కాదు పుట్టుకతో రావాలి, పుట్టుకతో వచ్చే అందం రాముడు అన్నీ విడిచిపెట్టీ వెళ్ళినా పుంసాం మోహన రూపాయ
పుణ్య శ్లోకాయ మంగళం అంతేగాని నీవు ఏవో కొత్త కొత్తవన్నీ అలంకరించుకుంటే అందంకాదు
యథా తథంగా నీ శరీర సౌష్ఠవం అలా ఉంటే అది అందం అందుకే రాముడు విమల్ సూట్ వేసుకుంటే
అని చెప్పలేదు, రాముడు అందమంటే యథా తథంగా ఆయన అందం చెప్పారు హనుమా కాబట్టి తేజసాఽఽదిత్య
సంకాశః క్షమయా పృథివీ
సమః ! బృహస్పతి సమో బుద్ధ్యా యశసా
వాసవోపమః !! అమ్మా!
లోపలి అందం కదామ్మా అందం పై అందం మంచిదే కానీ లోపల అందం లేనప్పుడు పై అందం
మోసగించడానికి పనికొస్తూంది, లోపలందం ఉన్నప్పుడు పై అందం లేకపోయినా పనికొస్తూంది.
లోపలి అందం పై అందం కూడా ఉంటే జగ్మమోహనైక మూర్తవుతుంది పెద్దవాడమ్మా రాముడు లోపలి
అందం పై అందం రెండూ ఉన్నవాడు తేజసాఽఽదిత్య సంకాశః సూర్యుడు ఎటువంటి తేజస్సు
కలిగనవాడో రాముడు అటువంటి తేజస్సు కలిగినవాడు క్షమయా పృథివీ సమః ఈ భూమికి
ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు బృహస్పతి సమో బుద్ధ్యా బృహస్పతికి ఎటువంటి
బుద్ధో రామునికి అటువంటి బుద్ధి యశసా వాసవోపమః కీర్తియందు ఇంద్రుడితో
సమానుడు. అమ్మా..! రక్షితా జీవలోక స్య స్వజన స్య చ రక్షితా ! రక్షితా స్వస్య
వృత్త స్య ధర్మ స్య చ పరంతపః !! జీవలోకాన్నంతటినీ రక్షిస్తాడు తనని
నమ్ముకున్నవాళ్ళన్ని ప్రత్యేకంగా రక్షణ చేస్తాడు ఆయన తన ధర్మాన్ని తాను
రక్షించుకుంటాడు, తన నడవడిక తాను రక్షించుకుంటాడు, ఇతరుల యొక్క ధర్మాన్ని కూడా
రక్షిస్తాడు రామో భామిని లోక స్య చాతు ర్వర్ణ్య స్య రక్షితా ! మర్యాదానాం చ లోక
స్య కర్తా కారయితా చ సః !! అమ్మా మహానుభావుడమ్మా లోక మర్యాద పాటించడమంటే
రామున్ని చూసే నేర్చుకోవాలి అందుకే రామునికి ఒక పేరు ʻమర్యాదా పురుషోత్తముడనిʼ పేరు అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలీ అంటే రామ చంద్ర మూర్తి ఎలా
ప్రవర్తించారో తెలుసుకుంటే చాలు మీరు కూడా మర్యాదా పురుషోత్తములౌతారు.
|
కాబట్టి అమ్మా రామో భామిని లోక స్య చాతు ర్వర్ణ్య స్య రక్షితా నాలుగు
వర్ణములను రక్షించేవాడమ్మా మర్యాదానాం చ లోక స్య కర్తా కారయితా చ సమః సాక్ష్యాత్
పరబ్రంహంగా చెప్తున్నారు ఇక్కడ ఆయనే కర్త ఆయనే కాల కారయితా చ సమః, ఆయనే ఈ లోకములను
సృజించి రక్షించి లయం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటివాడు రాజ విద్యా వినీత
శ్చ బ్రాహ్మణానామ్ ఉపాసితా ! శ్రుతవాన్ శీల సంపన్నో వినీత శ్చ పరంతపః !!
మహానుభావుడు రాజ విద్య అంటే రాజ్య పరిపాలనా మెళుకువలు బాగా తెలిసున్నటువంటివాడు,
బ్రాహ్మణులను ఆదరించేటటువంటి స్వభావమున్నవాడు సర్వవిద్యాపారంగతుడు సదాచార
సంపన్నుడు వినయశోభితుడు శత్రు భయంకరుడు యజుర్వేద వినీత శ్చ వేదవిద్భిః సుపూజితః
! ధనుర్వేదే చ వేదే చ వేదాంగేషు చ నిష్ఠితః !! యజుర్వేద వినీత శ్చ ప్రత్యేకంగా
యజుర్వేదం బాగా తెలుసుకున్నవాడు, యజుర్వేదం తెలిస్తే యజ్ అన్న ధాతువు నుంచి కదాండి
యజ్ అది కర్మ వేదప్రోక్తమైన ఏ కర్మ ఎలా చెసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది
కష్టములలోంచి పైకిరావచ్చో బాగా తెలిసున్నవాడు, ఆ మంత్రాన్ని ఆ కర్మతో కలిపి
చెయ్యగలిగినవాడు ఆ ప్రజ్ఞ ఉన్నవాడు కాబట్టి యజుర్వేద వినీత శ్చ వేదవిద్భిః
సుపూజితః అన్ని వేదములు తెలిసున్నవాడు దనుర్వేదే చ వేదే చ వేదాంగేషు చ
నిష్ఠితః ధనుర్వేదము వేదాంగములు కూడా తెలిసున్నటువాడు. వ్యాకరణము శిక్ష
మొదలైనటువంటివన్నీ బాగా తెలిసున్నవాడు విపులాంఽసో మహా బాహుః కమ్బు గ్రీవః శుభాఽఽననః
! గూఢ జత్రుః సుతామ్రాఽక్షో రామో దేవి జనై శ్శృతః !! విశాలమైనటువంటి గొప్ప
భుజములు శంఖము వంటి కంఠము మంగళ ప్రదమైనటువంటి ముఖము పైకి కనపడనటువంటి ఎముకలతో
కూడినటువంటి సొంపులతో కూడినవాడు, ఎర్రటి కన్నులున్నవాడు అటువంటి రామున్ని చూడనివారు రాముని
గురించి తెలియనివారు లోకంలో ఉంటారామ్మా..! ఉండరమ్మా అంతగొప్పవాడు రాముడంటే.
|
అమ్మా! ఒకానొకప్పుడు ఋష్యమూక పర్వతం
మీద మా ప్రభువైనటువంటి సుగ్రీవుడు వాలిచేత తరుమ బడినటువంటివాడై ఉండగా నేనూ ఇతర
ముగ్గురు మంత్రులు ఆయన్ని సేవిస్తున్నటువంటి సమయంలో నీల మేఘశ్యాముడైన రామ చంద్ర
మూర్తి కనక వర్ణంలో ఉండేటటువంటి లక్ష్మణ మూర్తితో కలిసి కోదండములు పట్టుకుని అక్కడ
ఉన్న అరణ్యములలో వెడుతుండగా తనని చంపడానికి వాలిచేత నియోగింపబడిన యోధులేమోనని గూఢాచారులని
భయపడిన సుగ్రీవుడు ఒక్కసారి ధూకి పారిపోతుంటే వచ్చినవారెవరో నేను తెలుసుని
వస్తానని సుగ్రీవున్ని నిలబెట్టి కిందకి వెళ్ళి రామ లక్ష్మణులతో మాట్లాడి
సుగ్రీవుని గురించి చెప్పి నా భుజముల మీద కూర్చోబెట్టుకుని ఋష్యమూక పర్వతం మీదకి
తీసుకెళ్ళి సుగ్రీవున్ని పరిచయం చేసి వాళ్ళిద్దరికి అగ్నిసాక్షిగా స్నేహం
చేయించానమ్మా... తరువాత సుగ్రీవుని యొక్క భార్య రుమని వాలి బలత్కారముగా
స్వీకరించాడని రాజ్య భ్రష్టున్ని చేశాడని విన్న రామ చంద్ర మూర్తి అధర్మాన్ని
అంగీకరించడు కనుక వాలి సుగ్రీవుల మధ్య ద్వంధ యుద్ధం జరుగుతున్నప్పుడు వాలిని
తెగతార్చి సుగ్రీవున్ని వానర
రాజ్యనికి పట్టభీషక్తున్ని చేశారు. సుగ్రీవుడు వానర రాజైన
తరువాత తన స్నేహాన్ని అనుసరించి తల్లీ నీవు నిన్ను రావణాసురుడు అపహరించే సమయంలో
నీవు నీ పవిట కొంగును చింపి నీ నగలు కొన్నింటిని అందుంచి నగల మూట
విడిచిపెట్టినప్పుడు ఋష్యమూక పర్వతంమీద సుగ్రీవ సహితులమై మేము నలుగురము మంత్రులం కూర్చున్నుప్పుడు
మా మధ్యలో పడిన ఆ నగల మూటని రాజ్యాన్ని పొందకముందే సుగ్రీవుడు రామ చంద్ర మూర్తికి
చూపించారు, చూపిస్తే ఆ నగల మూటను చూసిన రాముడు అపారమైన శోకాన్ని పొంది వాటిని
పట్టుకుని ఏడ్చి లక్ష్మణునికిచ్చీ పరితాపాన్ని పొందాడమ్మా...
|
రాజ్యాన్ని పొందినటువంటి సుగ్రీవుడు తదనంతరం సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని
అన్ని వైపులకి కొన్నివేల వానరములను పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుని నాయకత్వంలో
వచ్చిన కొన్నివేల వానరములు నూరు యోజనములు సముద్రమును గడచి రాలేక ఆవలి ఒడ్డున
ఉండిపోతే సీతాన్వేషణలోనే మేమందరమూ సుగ్రీవుడు ఇచ్చిన కాలంలోనే కాలాన్ని
అతిక్రమిస్తే సంపాతి అనబడేటటువంటి పక్షి మేము ప్రయోపవేశం చేసే సమయంలో మాకు కనపడి,
నాకు ఇక్కడ్నుంచి కనపడుతూంది సీతమ్మ కాంచన లంకలో ఉందీ అని మాకు చెప్తే ఆ
చెప్పినటువంటి సంపాతి నోటి వాక్కుని అనుసరించి నూరు యోజనముల సముద్రమును గడిచి
ఈవలికొచ్చి లంకా పట్టణంలో చేరి నిన్న రాత్రంతా వెతికి ఇవ్వాళ తెల్లవారి ఝామున
శింశుపా వృక్షం మీద కూర్చుని అమ్మా నేను దర్శనం పొందానమ్మా నేను కేసరి
పుత్రున్నమ్మా... నా తండ్రి మాల్యవత్ పర్వతం మీద ఉంటాడమ్మా శంబరాసురుడనే
రాక్షసున్ని సంహరించాడమ్మా ఆయన భార్య అంజనా దేవి వాయుదేవుడు అనుగ్రహించి
ఇచ్చినటువంటి ఫలితంగా నేను ఆయన కడుపున పుట్టినటువంటి వాన్నమ్మా వాయుదేవుని
పుత్రున్నమ్మా... వాయువుతో సమానమైన వేగమున్నవాన్ని అమ్మా నన్ను హనుమా అంటారమ్మా
నమ్మమ్మా నేను రావణుని కింకరున్ని కానమ్మా నేను రామ దూతన్నమ్మా... ఇంత జరిగిన
తరువాత రామునికి వానరులకీ కలిసిందంమ్మా నేను రామ భక్తున్ని రామ దాసున్ని రామున్ని
నమ్ముకుని బ్రతుకుతున్నవాన్ని అందుకని నన్ను పంపారమ్మా తల్లీ నన్ను అనుగ్రహించూ
అన్నారు.
ఈ మాటలు విందటా తల్లి పది నెలల
నుంచి ఏడుస్తున్న సీతమ్మ అతులం చ గతా హర్షం ప్రహర్షేణ చ జానకీ ! నేత్రాభ్యాం
వక్ర పక్ష్మాభ్యాం ముమోచ ఆనన్ద జం జలమ్ !! అపారమైన ఆనందంతో కన్నురెప్పలు
తడిసిపోయేటట్టుగా ఇన్నాళ్ళ నుంచి వచ్చిన తల్లి శోక ధారలు ఆనంద భాష్పాలుగా వచ్చాయట,
ముట్టుకోకుండా కన్నుల నీరు తుడవకుండా వాక్కుతో మంచి మాటలు చెప్పి ఆవిడకి స్వాంత
చేకూర్చీ మళ్ళీ తల్లి ఆనందంతో విశ్మయంతో సంతోషంతో ఆనంద భాష్పములు రాలుస్తుండగా
అమ్మా ఇన్ని లక్షల వానరములు భూ మండలమంతా వెతుకుతుంటే నీ దర్శనం చేశానన్న ఖ్యాతి
పొందిన మొట్ట మొదటి వానరున్ని నేనేనమ్మా... నాకీ కీర్తినిచ్చావమ్మా అన్నారు. తల్లి
పొంగిపోయింది చారు తచ్ఛాఽఽననం తస్యా స్తాఽఽమ్ర శుక్లాఽయ తేక్షణమ్ ! అశోభత విశాలాఽక్ష్యా
రాహు ముక్త ఇవోడురాట్ !! రాహువు నుంచి విముక్తమైనటువంటి చంద్ర బింబం ఎలా ఉందో
అలా ఎర్రని రేఖలతో ఉన్న విశాలమైన నేత్రమలుగలిగినటువంటి తల్లి మనోహరమైనటువంటి
ముఖంతో అత్యంత ఆనందంతో అత్యంత సంతోషంతో హనుమ వంక చూసిందటా చూస్తే అప్పుడు
మహానుభావుడైనటువంటి హనుమ అంటారు వనరోఽహం మహాభాగే దూతో రామ స్య ధీమతః ! రామ
నామాంఽకితం చేదం పశ్య దేవ్యంఽగుళీయకమ్ !!
ప్రత్యయాఽర్థం తావాఽఽనీతం తేన దత్తం
మహాత్మనా ! సమాఽఽశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖ ఫలా హ్యాఽసి !! ఇందుకోసం సుందర కాండ పారాయణ చేసేది.
|
ఇందుకోసం సుందర కాండ వింటారు (అయ్యా మీరు ఆగండి) దీని అర్థం చెప్పేస్తే బాగా
సంతోషిస్తారు, అమ్మా బుద్ధిమంతుడైన రామ చంద్ర మూర్తి యొక్క దూతనమ్మా నేను
వానరున్ని రామ నామాంఽకితం చేదం పశ్య దేవ్యంఽగుళీయకమ్ శ్రీరామా అని
వ్రాయబడినటువంటి రాజ ముద్రికా అంటారు, రాజులు తమ పేరు రాసుకుని ధరిస్తారు. రాజ
ముద్రిక వచ్చిందంటే రాజు వచ్చినట్లే, కాబట్టి రామ చంద్ర మూర్తి అమ్మా ఆ ఉంగరాన్ని
నాకిచ్చి పంపించారు తల్లి ఇదిగో నేను ఆ ఉంగరమిస్తున్నానమ్మా చూడు అన్నారు ప్రత్యయాఽర్థం
తావాఽఽనీతం తేన దత్తం మహాత్మనా నీకు ఉపశాంతి కలిగించడం కోసమని నీకు రామ చంద్ర
మూర్తి నాకీ ఉంగరమిచ్చి పంపించాడమ్మా స్వీకరించవలసిందీ అని చేతిలో పెట్టారు సమాఽఽశ్వసిహి
భద్రం తే క్షీణ దుఃఖ ఫలా హ్యాఽసి అమ్మా నీవు ఊరట పొంది ఇక ఈ క్షణం నుంచి తల్లీ
నీకు శోకములేదు అన్నారు. సుందర కాండలో యోగియైన హనుమ నోటి వెంట ఈ మాట ఎప్పుడు
వచ్చిందో అప్పటినుంచి సుందర కాండ తిరిగిపోయింది రామ కథ తిరిగిపోయింది. ఇంక
ఇక్కడ్నుంచి అంతా శుభమే ఇక సీతారాములు కసుకోవడం వైపుకి వెళ్ళిపోతుంది. రావణ వధ
వైపుకి వెళ్ళిపోతూంది. అందుకే ఈ ఉంగరమిచ్చిన ఘట్టంలో అమ్మా నీకు ఇంక దుఃఖములేదు “క్షీణ
దుఃఖ ఫలా హ్యాఽసి” ఇక్కడ హనుమ అన్నాడు కాబట్టి ఈ శ్లోకాన్ని మహా మంత్రంగా
భావిస్తారు. ఈ శ్లోకం రావడం కోసమనీ ఘట్టాలన్నీ చదువుతారు ఇక అక్కడ్నుంచి
ప్రత్యేకించి సుందర కాండ విశేషమైన పట్టుతో ఉంటుంది. చాలా శ్లోకాలు మంత్ర స్వరూపాలే
అసలు సుందర కాండనే “మాలా మంత్రం” అంటారు, అటువంటి స్థితిలో ఇప్పుడు ఆ ఉంగరాన్ని
పుచ్చుకన్నటువంటి తల్లటా ఇత్యుక్వా ప్రదదౌ తస్యై సీతయై వానరోత్తమః ! గృహీత్వా
ప్రేక్షమాణా సా భర్తుః కర విభూషణమ్ !! భర్తారమ్ ఇవ సంప్రాప్తా జానకీ ముదితాఽభవత్
!!! ఆ ఉంగరాన్ని పుచ్చుకుని ఉంగరం అనుకోలేదటా అకస్మాత్తుగా రాముడే వచ్చేస్తే
ఎంత ఆనందంపడిపోయి సంతోషంలో బుగ్గలు ఎర్రబడిపోతాయో అలా లజ్జపొందేసి ఆనందంతో తన
భర్తనే కౌగలించుకున్నాననంత ఆనందంతో ఆ తల్లి ఉంగరాన్ని పట్టుకుని గుండెల మీద
పెట్టుకున్నటువంటి ముదిత మానసయైన సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని అనుభవించిన
ఏకైక వానరుడు మహనీయ మూర్తి స్వామి హనుమ ఒక్కరే సుందర కాండలో అటువంటి మహానుభావుడు
రామ కథలో సుందర కాండలో.
ఇప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టి
నీరాజనం ఇవ్వండి. మళ్ళీ ఒక్కసారి ఈ ఘట్టాలు చదువు తున్నప్పుడు తప్పకుండా అపారమైన
శక్తి కలిగి అందరికీ అనుగ్రహం కలుగుతుందీ అని పెద్దలు అంటారు మళ్ళీ ఒక్కసారి శ్రీ
రామ ధూతం అని చెప్తాం. (శ్రీ రామ దూతం శిరసా నమామి) కాబట్టి గృహీత్వా
ప్రేక్షమాణా సా భర్తుః కర విభూషణమ్ !! భర్తారమ్ ఇవ సంప్రాప్తా జానకీ ముదితాఽభవత్
!! ఆతల్లీ ఎంతో సంతోషాన్ని పొందింది. అప్పుడు ఆతల్లి హనుమని చూసి అంటూంది, మహానుభావా
నాయనా నీవు కాబట్టి రాగలిగావు లేకపోతే ఈ లంకా పట్టణంలోకి ఎవరు రాగలరు సుందర కాండలో
సీతమ్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి భక్తుడు గొప్ప దాసుడు
మహానుభావుడు సిద్ధి పొందినవాడు హనుమ. కాబట్టి ఆవిడ దర్శనం చేత ఆయన
అనుగ్రహింపబడ్డానని అనుకున్నాడు తప్పా ఆయన ఎన్నడూ కూడా నేను సీతమ్మ తల్లిని ఉద్దరించాను అన్న భావన ఆయనలో
కలిగిందని ఒక అక్షరం కూడా సుందర కాండలో లేదు. నేను సీతమ్మ చేత
అనుగ్రహింపబడ్డానే అని అనుకున్నారు
|
శత యోజన విస్త్రీర్ణః
సాగరో మకరాఽఽలయః ! విక్రమ శ్లాఘనీయేన క్రమతా గోష్పదీ కృతః !!
న హి త్వాం ప్రాకృతం
మన్యే వానరం వానరర్షభ ! యస్య తే నాఽస్తి సంత్రాపో రావణా న్నాఽపి సంభ్రమః !!
అర్హసే చ కపి శ్రేష్ఠ
మయా సమఽభిభాషితుమ్ ! యద్యఽసి ప్రేషిత స్తేన రామేణ విదితాఽఽత్మనా !!
ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో న హ్యఽపరీక్షితమ్ ! పరాక్రమమ్
అవిజ్ఞాయ మ త్సకాశం విశేషతః !!
ఆతల్లందీ మహానుభావా! నీవు నిజంగా సమర్థుడవు పరమ ప్రాజ్ఞుడవు పరాక్రమశాలివి అందుకే
రాక్షసులతో మొసళ్ళతో కూడుకున్నటువంటి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి వొడ్డుకు
రాగలిగావు పిల్లకాల్వని ఒక ʻగోష్పదంʼ అంటే ʻఆవు యొక్క పాదముద్రోలో చేరిన నీళ్ళుʼ దాన్ని ఎంత తెలికగా దాటుతారో అంత తేలికగా దాటి వచ్చావు
నీవు సామాన్యమైన వానరానివని నేను అనుకోవట్లేదురా నాయనా అని ఒక పుత్రుడితో
మాట్లాడినంత ప్రేమగా సీతమ్మ మాట్లాడి, ఒక సామాన్యమైన వానరవైతే రామ చంద్ర మూర్తి
నాతో మాట్లాడటానికి ప్రభు దూతగా పంపరు ప్రత్యేకించి నాతో మాట్లాడటానికి ఒక
సామాన్యున్ని ఎన్నడూ పంపరు, కాబట్టి నీవు ఎంత సమర్థుడువో రామ చంద్ర మూర్తి నిన్ను పంపించడంలోనే నాకు
అర్థమౌతూంది కచ్చి చ్చ వ్యథితో రామః కచ్చి న్న పరిపత్యతే ! ఉత్తరాణి చ
కార్యాణి కురుతే పురుషోత్తమః !! కచ్చి న్న దీనః సంభ్రాన్తః కార్యేషు చ న ముహ్యతి !
కచ్చి త్పురుష కార్యాణి కురుతే నృపతే స్సుతః !! రాముడు నేను దూరమయ్యాననేటటువంటి బాధలో ఉన్నవాడై
పరితపిస్తూ ఉండి పోవట్లేదుగదా, తాను చెయ్యవలసినటువంటి పనులు చేస్తున్నాడా..! కేవలం నిస్పృహకి గురియైపోయి
ఉన్నాడా... ఆయన చెయ్యవలసిన
ప్రయత్నం చేస్తూ కేవలం నేను సాధించగలననుకుంటున్నాడా తను పురుష ప్రయత్నానికి
ఈశ్వరానుగ్రహం తోడు కూడా కావాలని అడుగుతున్నాడా.
ఇది చాలా అవసరము పురుష
ప్రయత్నం చేయాలి ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవాలి అందుకొచ్చింది పూజ
అందుకొచ్చింది భక్తి. కాబట్టి కచ్చి దాఽఽశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాఽఽత్మజః
! కచ్చి త్పురుషకారం చ దైవం చ ప్రతిపత్యతే !! తను చెయ్యవలసిన ప్రయత్నం తను
చేస్తూ ఈశ్వరానుగ్రహం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడా... దానివల్ల ఈశ్వరానుగ్రహం కలిసొస్తే తను
చేసిన పురుష ప్రయత్నం ఫలిస్తుంది. దానివల్ల రావణ వధ మళ్ళీ సీతారాముల సమాగమం కుదురుతాయి. కాబట్టి
నాయనా ఇలా జరుగుతూందా వానరాఽధిపతిః శ్రీమాన్ సుగ్రీవః కచ్చి దేష్యతి ! మ త్కృతే
హరిభి ర్వీరై ర్వృతో దన్త నఖాఽఽయుధైః !! దంతములు గోళ్ళు ఆయుధములుగా కలిగిన
వానరులు ఆ వానరముల నాయకుడైన సుగ్రీవుడు సుఖంగా సంతోషంగా ఉన్నారా కచ్చి చ్చ
లక్ష్మణః శూరః సుమిత్రాఽఽనన్ద వర్ధనః ! అస్త్రవి చ్ఛర జాలేన రాక్షసాన్ విధమిష్యతి
!! మహానుభావుడు సుమిత్ర యొక్క కుమారుడు సుమిత్ర యొక్క ఆనందాన్ని
పొందించేటటువంటివాడు శూరుడైన లక్ష్మణుడు తన హస్త్రములచేతా బాణములచేతా
లంకాపట్టణమునంతటినీ రాక్షసులందర్నీ చెల్లా చెదరు చేయగలిగినటువంటివాడు రౌద్రేణ
కచ్చి దఽస్త్రేణ రామేణ నిహతం రణే !
ద్రక్ష్యా మ్యఽల్సేన కాలేన రావణం ససుహృజ్జనమ్ !! నేన తొందరలో ఈ లంకా పట్టణం చీకాకుపడే విధంగా చేసేటటువంటి రామ లక్ష్మణుల్ని
చూస్తానా నాయనా అని అడిగిందటా, అడిగి రామునికి నాతో సమానమైన బంధువుకానీ నా కన్నా అధికమైనవారు కానీ లేరు
అలాగే నాకు కూడా రామునితో సమానమైన బంధువుకానీ రాముని కన్న అధికమైనవారు కానీ లేరు
ఇది దాంపత్యమంటే.
|
ఎంత మందైనా ఉండచ్చు అందరికన్నా
అధికురాలైనది భార్య, ఎంత మందైనా ఉండచ్చు అందరికన్నా అధికమైనవాడు భర్త. ఈ భావన
ఇద్దరి యొక్క హృదయాలలో ఉండడం దాంపత్యం. ఆ కారణం చేత నేను
కనపడకుండా పోవడమన్నదీ రాముడు తను చెయ్యవలసిన కార్యములు చెయ్యకుండా తన ప్రజ్ఞ
నశించిపోవడానికి ఇది హేతువు కాలేదుకదా ఆయన ప్రజ్ఞతో ఉన్నారు కదా... ఎవరితో స్నేహం
చెయ్యాలో వారితో చేస్తున్నాడు కదా ఎవర్ని నిగ్రహించాలో వారిని నిగ్రహిస్తున్నాడు
కదా నన్ను తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా రాముడు శీఘ్రముగా వానర
భల్లూకములతో కలిసి ఇక్కడికి వస్తాడు కదా వచ్చి వీళ్ళని సంహరించి నన్ను తిరిగి
పొందుతాడు కదా... ఎంత జాగ్రత్తగా అడుగుతూందో చూడండి తల్లి. సుందర కాండ భహుభంగిమల
సుందర కాండ అంటే స్వామి హనుమ అన్నారూ అమ్మా... మలయేన చ విన్ధ్యేన మేరుణా
మన్ధరేణ చ ! దర్దురేణ చ తే దేవి శపే మల ఫలేన చ !! అమ్మా నేను ఒట్టు
పెడుతున్నానమ్మా నేను చెప్పే మాటలు నిన్ను ఉత్సాహపరచడానికి నిన్ను
సంతోషపెట్టడానికి చెప్తున్నవికావమ్మా నిజం చెప్తున్నాను.
మా ఇంటి మీద ఒట్టు నేను ఉంటున్న
భూమి మీద ఒట్టు అంటూంటారు... మలయేన చ విన్ధ్యేన మేరుణా మన్ధరేణ చ ఆయన
అన్నారు అమ్మా మేము పర్వతాలమీద తిరుగుతాము మాకా పర్వతాలు పరమ ప్రీతిపాత్రము పరమ
పూజనీయ్యములు అటువంటి పర్వతాలమీద ఒట్టుపెడుతున్నాను మలయ పర్వతం మీద వింధ్య పర్వతం
మీద మేరు పర్వతం మీద మంధర పర్వతం మీద నేను తినేటటువంటి పళ్ళూ కాయలు తేనె మీద
ఒట్టుపెట్టి చెప్తున్నాను అమ్మా... క్షిప్రం ద్రక్ష్యసి వైదేహి రామం ప్రస్రవణే
గిరౌ ! శతక్రతుమ్ ఇవాఽఽసీనం నాక పృష్ఠస్య మూర్ధని !! అమ్మా నూరు క్రతువులు
చేసిన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా ఇవ్వాల్టి రోజున ప్రస్రవణ పర్వతం
మీద కూర్చున్నటువంటి రామ చంద్ర మూర్తి పాదారవిందముల దగ్గర నిన్ను సమర్పించి
ధన్యుడనౌతానమ్మా న మాంసం రాఘవో భంక్తే న చాఽపి మధు సేవతే ! వన్యం సువిహితం
నిత్యం భక్తమ్ అశ్నాతి పంచమమ్ !! ఆయనా ఏమీ తింటంలేదమ్మా ఆయన ఆఖరికి తేనె కూడా
స్వీకరించట్లేదమ్మా ఎప్పుడూ నిన్నే తలుచుక తలుచుకు తలుచుకు తలుచుకు బాధ
పడుతున్నాడమ్మా నైవ దంశాన్ న మశకాన్ న కీటాన్ న సరీసృపాన్ ! రాఘవోఽపనయే
ద్గాత్రా త్త్వ ద్గతే నాఽన్తరాఽఽత్మనా !! ఆయన నుంచి పురుగులు పాకుతున్నా తేళ్ళు
పాకుతున్నా పాములు పాకుతున్నా ఆయనకి ఒంటిమీద తెలివిలేదు కాయ చూసినా పండు చూసినా
పువ్వు చూసినా చెట్టు చూసినా పర్వతం చూసినా వాన చూసినా ఎండ చూసినా హా! సీతా... హా!
సీతా... అంటూనే ఉంటాడమ్మా... అంత భాధ రాముడు నీ గురించి పొంది ఉన్నాడూ అన్నారు సా
రామ సంకీర్తన వీత శోకా రామ స్య శోకేన సమాన శోకా శర న్ముఖేనాఽమ్బుద శేష చన్ద్రా
నిశేవ వైదేహ సుతా బభూవ ! రాముడు తన గురించి శోకిస్తున్నాడన్న శోకం తప్పా ఇప్పుడు
తనకంటూ వేరే శోకంలేనటువంటి స్థితిలో శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రున్ని ఇంకా కొద్దిగా
తెల్ల మబ్బులు వస్తున్నట్లు ఈ రావణున్నించి విడివడి ఎప్పుడు ఏనాడు నేను రామ చంద్ర
మూర్తిని నా గురించి శోకించవలసిన అవసరంలేకుండా వెళ్ళి రాముని పక్కన
కూర్చుంటానా అన్న శోకం తప్పా ఇంకొక శోకం
లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి సీతమ్మ తల్లిని హనుమ తన మాటలచేత ఊరడించి నిలబెట్టారు.
|
ఎలా తీసుకెళ్తానో తెలుసామ్మా... నీవు నా వీపు మీద కూర్చున్నప్పుడు వికారం
కలుగుతుందేమో అనుకుంటున్నావేమోమ్మా నేను హవ్యం హుతమ్ ఇవాఽనలః అగ్నిహోత్రంలో
హవిష్యు ఇచ్చి దేవతలకు ఇమ్మంటే ఎంత పవిత్రంగా అగ్నిహోత్రం తీసుకెళ్తూందో అంత
పవిత్రంగా తీసుకెళ్తానమ్మా... కాబట్టి అమ్మా నా వీపునధిరోహించూ అన్నాడు. సీతమ్మ తల్లీ
చటుక్కున ఒక చిన్న నవ్వు నవ్వింది, నవ్వి అందీ హనుమన్ దూర మఽధ్వానం కథం మాం
వోఢు మిచ్ఛసి ! త దేవ ఖలు తే మన్యే కపిత్వం హరి యూథప !! కథం వాఽల్ప శరీర స్త్వం
మామ్ ఇతో నేతుమ్ ఇచ్ఛసి ! సకాశం మానవేన్ద్రస్య భర్తు ర్మే ప్లవగర్షభ !! నీ శరీరమేమో పిల్లి పిల్లంతుందా నీవేమో
ఇంతున్నావా నీకో ఇంత వీపా ఓ ఇంత భుజమా...? దానిమీద నేను ఎక్కి కూర్చోనా నీవు నన్ను
నూరు యోజనాలు తీసుకెళ్తావా వానర బుద్ధి బయటపెట్టావు కదయ్యా... ఇలా అడిగావు నన్నూ
అంది. పాపం బ్రహ్మచారి ఆయన ఎప్పుడు మాట పడ్డవాడుకాడు, ఒక్కసారి చాలా బాధ వచ్చిందట
ఇంత మాట అంటూందా నన్ను అమ్మ అనుకున్నారు, అమ్మా... నా శక్తి ఇంతే అనుకుంటున్నావా
చూడమ్మా నేనంటే ఏమిటో అన్నారు మేరు మన్దర సంకాశో బభౌ దీప్తాఽనల ప్రభః ! అగ్రతో
వ్యవతస్థే చ సీతాయా వానరర్షభః !! హరిః పర్వత
సంకాశ స్తామ్ర వక్త్రో మహా బలః !
వజ్ర దంష్ట్ర నఖో భీమో వైదేహీమ్ ఇదమ్ అబ్రవీత్ !! స పర్వత వనో ద్దేశాం సాట్ట
ప్రాకార తోరణామ్ ! లంకామ్ ఇమాం సనాథాం వా నయితుం శక్తి రఽస్తి మే !! అమ్మా! నేనంటే ఇంతే అనుకుంటున్నావు కదా చూడు నా శరీరం ఏమిటో అని పెంచారు మేరు
పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అంతెత్తు పెరిగిపోయారు ఎర్రటి ముఖం పెద్ద నోరు ఈంత ముక్క
గరిమిటాక్కుల్లా ఈంతింత పెరిగిపోయినటువంటి చేతులు పేద్ద పేద్ద వేళ్ళు బలిసినటువంటి
తొడలు ఎర్రగా కాలినటువంటి ముఖము అటువంటి పేద్ద శ్వరూపంతో ఒకసారి నిలబడి అమ్మా
ఇప్పుడు నా శ్వరూపమేమిటో చూశావామ్మా... లంకనే తీసుకెళ్ళతానన్నాను కాదు ఈ చుట్టు
పక్కల పర్వతాలతో సహా ఉన్నటువంటి భవనములు తోరణములు పర్వతములు ఇవన్నీ కదలకుండా ఇలాగే
ఉంచి మట్టితో పెల్లగించి ఈ భాగాన్నంతటినీ నీతో కలిపి వెళ్ళి రాముని ముందు పెట్టేస్తాను
అంతటి బలవంతుడను అమ్మా ఇప్పుడు నమ్ముతావా నా బలాన్ని అన్నాడు.
|
అంటే తల్లందీ నాయనా నేను ఇవ్వాల నమ్మడమేమిటీ నూరు యోజనములు గడచి వచ్చిన నాడే
నీ బలాన్ని నమ్మాను నీవు ఇంత గొప్పవాడివనీ నాకు తెలుసు కానీ నాయనా... నేను నీతో
వస్తే నీ వేగాన్ని తట్టుకోలేక కింద జారి సముద్రంలో పడిపోవచ్చు లేదా రాక్షసులు
నీమీదకి యుద్ధానికొస్తే ఒక పక్క వాళ్ళతో యుద్ధం చేస్తావా నన్ను రక్షిస్తావా? ఆ
యుద్ధంలో నేను జారి కిందపడిపోవచ్చు. లేదా నేను మళ్ళీ రాక్షస స్త్రీలకి చిక్కితే మళ్ళీ
నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి దాచేస్తారో తెలియదు పైగా అన్నిటినీ మించి నాకొక
నియముంది భర్తు ర్భక్తిం పురస్కృత్య రామా దఽన్యస్య వానర ! న స్పృశామి శరీరం తు
పుంసో వానర పుంగవ !! నేను పరమ భక్తి తత్పరురాలినైన దానిని కాబట్టి రాముని యందు
రామున్ని తప్పా పరపురుషున్ని కోరి కోరి మాత్రం నేను నా చేతితో స్పృశించను, ఏమమ్మా
మరి ఆనాడు రావణుడు నిన్ను బలవంతంగా నిన్ను అపహరించి తీసుకొచ్చాడుగా మరి అప్పుడు
ఎలా వచ్చావంటావేమో... య దఽహం గాత్ర సంస్పర్శం రావణ స్య బలా ద్గతా ! అ నీశా కిం
కరిష్యామి వినాథా వివశా సతీ !! ఆరోజునా నేను అబలనీ నాకు సహాయకులులేరు వాడు
బలవంతంగా నన్ను జుట్టు పట్టి తొడమీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు హా! రామా, హా!
లక్ష్మణా అని శోకించడం వినా... నాకు మార్గంలేదు నా అంత నేను స్పృశించలేదు వాడు
బలవంతంగా తీసుకొచ్చాడు కానీ తెలిసి తెలిసి మాత్రం నేను ముట్టుకుని రాను.
రాముడే రావాలి రాక్షస సంహారం
చెయ్యాలి నన్ను తీసుకెళ్ళాలి నేను తరచూ అంటూంటాను శబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధి
దగ్గరికి సేవాదళ్ మహిళా కార్యకర్తలందరూ వెళ్ళి రాముడు గొప్పవాడా సీతమ్మ గొప్పదా
అని అడిగారు, సీతమ్మే గొప్పది అన్నారాయన అంటే వాళ్ళనుకున్నారు మహిళా కార్య కర్తలు
వెళ్ళి అడిగాం కదా అందుకు అలా చెప్పారనుకున్నారు అంటే ఆయన అన్నారు మీరు యథాలాపంగా
చెప్పాననుకుంటున్నారా రాముని కీర్తి ప్రకాశించడానికి కారణం సీతమ్మే, హనుమ వెళ్ళి
అడిగినప్పుడు హమ్మబాబోయ్ ఇంత కష్టంలో ఉన్నాను అని తీసికెళ్తేబాగుండు అని హనుమ వీపు
మీద కూర్చుని ఉండి ఉంటే..? రాముడి గౌరవం అలా నిలబడి ఉండేది కాదు రాముడు లేనప్పుడు
రావణుడెత్తుకెళ్ళాడు, రావణుడు చూడకుండా హనుమ తీసుకెళ్ళిపోయాడు అంతే రామాయణం. కాదు
రాముడే రావాలి రావణున్ని చంపాలి నన్ను తీసుకెళ్ళాలందీ ఆవిడ పాతివ్రత్యం పది నెలలు
రావణుడు ఆవిడకి అంత వైభోగం చూపించినా కన్నెత్తి చూడలేదు గోటితో తాకలేదు అక్కడ
అన్నపు మెతుకు తినలేదు బట్ట మార్చలేదు అంత సౌశీల్యవతియై అంత పవిత్రంగా నిలబడింది.
|
ఒకానొకప్పుడు నేను అక్కడ
ఉండేటటువంటి వనంలో విహరించి అలసి పోయినదాననై నా ఒంటినుంచి చెమటధారలు కారుతుంటే
నేను రామ చంద్ర మూర్తి యొక్క ఒడిలో కూర్చున్నాను సేదతీరడానికి తతో మాంస
సమాయుక్తో వాయసః పర్యతుణ్డయత్ ! తమ్ అహం లోష్టమ్ ఉద్యమ్య వారయామి స్మ వాయసం !!
ఒక కాకి ఇంద్రుని యొక్క కుమారుడు అది అపారమైన వేగం కలిగినది ఆ కాకి వచ్చి మాంస
భక్షణయందు ఆసక్తి కలిగినదై నా గుండెల మీద వాలీ నా స్థనముల యొక్క మధ్య భాగంలో ఉన్న
మాంసాన్ని తన కఠినమైన ముక్కుతో కొట్టి పీకి తింటూంది. నాకు బాధ కలిగి అక్కడ ఉన్న
మట్టి పెడ్డని ఒకదాన్ని తీసీ కాకిమీద విసిరాను ఆ కాకి వెడుతోంది వచ్చి మళ్ళీ
వాలుతోంది రాముడు చూశాడు చూసి ఆయనా త్వయాఽపహసితా చాఽహం క్రుద్ధా సంలజ్జితా తదా అప్పుడు
రాముడు నన్ను చూసి పరిహాస్యాస్పదంగా నవ్వాడు, హాస్యమాడాడు ఇది జ్ఞాపకం చేయ్. ఆ తరువాత
కొంత సేపటికీ నేను రామ చంద్ర మూర్తి యొక్క ఒడిలో పడుకుని నిద్రపోయాను, నిద్రపోయినప్పుడు
ఆ కాకి రాలేదు రాముడి ఒడిలో ఉన్నాను ఊరుకుంది, ఆ తరువాత కాసేపటికీ నేను
నిద్రలేచాను అప్పుడు రాముడు నా తొడమీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు.
ఇది కొంచెం చలా జాగ్రత్తాగ వినాలి
సుమాండీ! మళ్ళి నిద్రపోతున్నాడు స తత్ర పునరే వాఽథ వాయస స్సముపాగమత్ ! తత
స్సుప్త ప్రబుద్ధాం మాం రామ స్యాంఽకాత్ సముత్థితాం !! వాయస స్సహసాఽఽగమ్య విదదార
స్తనాఽన్తరే !! రాముడు నా ఒడిలో పడుకుని ఉండి నేను కూర్చున్నప్పుడు మళ్ళీ
వచ్చిందాకాకి మళ్ళీ నా స్థనముల మధ్యలో తన వాడి ముక్కుతో గాయం చేసి మాంసాన్ని
పీక్కు తింటూంది అప్పుడు వాయసేన తత స్తేన బలవత్ క్లిశ్యమానయా ! స మయా బోధిత శ్శ్రీమాన్ సుఖ సప్తః పరంతపః !! నా వక్షస్తలం
నుంచి కారిన రక్త బిందువులు ఒళ్ళోపడుకున్నటువంటి రామ చంద్ర మూర్తి యొక్క ముఖం మీద
పడ్డాయి, కాకా సురుడు నా వక్షస్థలం మీద కూర్చుని మాంసం పీకుతున్నాడు నేను ఆ బాధ
ఓర్వలేక రామున్ని నిద్రలేపాను రాముడు ఒక్కసారి నిద్రలేచాడు, నిద్ర లేస్తూనే కేన
తే నాగనాసోరు విక్షతం వై స్తనాఽన్తరమ్ ! కః క్రీడతి
సరోషేణ పంచ వక్త్రేణ భోగినా !! వెంటనే ఆయన అన్నాడు ఎవడురా ఐదు తలల పాముతో ఆటాడినవాడు ఎవడురా ఎవడూ అని
అడిగాడు. నిద్రలోంచి లేచిన రాముడు హఠత్ పరిణామాన్ని చూసిన రాముడు సీతమ్మ యొక్క
యదార్థ స్వరూపాన్ని బయట పెట్టేశాడు, ఎవడురా మా ఆవిడా ఐదు తలల పాము మా ఆవిడతో చెలగాటమాడుతున్నాడంటే
ఎంత నొచ్చుకుంటుంది. ఐదు తలల పామంటే ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ
క్షణైః పంచ ముఖ గాయిత్రీ స్వరూపం రా ఆవిడా! ఎవడురా ఆవిడతో చెలగాటం ఆడినవాడూ
అన్నాడు రాముడు. అనీ వీక్షమాణ స్తత స్తం వై వాయసం సముదైక్షత ! నఖై స్సరుధిరై
స్తీక్ష్ణై ర్మామే వాఽభిముఖం స్థితమ్ !! పుత్రః కిల స శక్రస్య వాయసః పతతాం వరః !
ధరాఽన్తర గతః శీఘ్రం పవన స్య గతౌ సమః !! అది ఇంద్రుడి యొక్క కుమారుడు ఆ కాకి,
ఆ కాకి అపారమైన వేగము కలిగినటువంటివాడు ఆయన కాళ్ళకి నెత్తురు నోటికి మాంసపు ముద్ద
చూశాడు, ఈ కాకియే నా భార్య యొక్క వక్ష స్థలం మీద వాలి మాంసం పీకింది అని గుర్తుపట్టాడు
గుర్తుపట్టి వెంటనే ఆయన ఒక గడ్డి పరకనొకదాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని
అభిమంత్రించాడు అంతే, అభిమంత్రించి ఆ కాకాసునిమీద విడిచిపెట్టాడు ఆ కాకి మూడు
లోకములు తిరిగిగింది. ఇంద్రుడి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళింది మూడు లోకములు
తిరిగితే రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని మేము ఎవ్వరూ ఉపసంహారం చెయ్యమన్నారు
ఆ కాకి తిరిగి తిరిగి వచ్చి ఎక్కడ రాముడు కూర్చున్నాడో అక్కడే నేల మీద పడిపోయింది.
|
పడిపోతే రాముడు చూశాడు తన
ఎదురుగుండా వచ్చి పడిపోయినా తనకు శరణాగతి చేసినట్లేనని భావన చేశాడు, వెన్నిచ్చినటువంటివాళ్ళని
బ్రహ్మాస్త్రము చెలకదు అదీ దాని మర్యాదకి భంగము కాబట్టి ఆయన పరుగెడుతుంటే అది వెంట
వెళ్ళింది అంతే ఇప్పటికీ పైనుంచి కింద పడ్డాడు చంపలేదు రాముడు అన్నాడు నీవు నా
ముందుకొచ్చి పడిపోయావు కాబట్టి నీవు నాకు శరణాగతి చేసినట్లు, కానీ ఒకసారి బ్రహాస్ర
ప్రయోగం చేశాం గనుకా బ్రహాస్త్రానికి ఏదో అత్యంత విలువైది ఏదో ఇచ్చేయాలి కాబట్టి
ఏమిస్తావు అని అడిగాడు దత్వా స దక్షిణం నేత్రం ప్రాణే భ్యః పరిరక్షితః ! స
రామాయ నమస్కృత్వా రాజ్ఞే దాశరథాయ చ !! ఎందు చేతనంటే సర్వేంద్రియనాం నయనం
ప్రధానం సర్వ స్య ధాత్ర స్య శిర ప్రదానం ఇప్పుడు తలకాయని రక్షించుకోవాలంటే కన్నిచ్చేయాలి
కాబట్టి కాకి అందీ, నా కుడి కన్ను తీసేసుకో నా కుడి కంటిలోని చూపు తీసేసై అంది
కాబట్టి కుడి కంటికి చూపులేదు కాకికి
అందుకే ఇలా ఇలా చూస్తుంటుంది కాకి చూపురా వీడది అంటూంటారు. అప్పటికీ
ఇప్పటికీ కాకి జాతికంతటికి ఓ కంట్లో చూపు పోయింది బ్రహ్మాస్త్రానికి తన కంటిలోని
చూపుని ఇచ్చేసింది ఇచ్చేసినటువంటి కాకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ స రామాయ
నమస్కృత్వా రాజ్ఞే దాశరథాయ చ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రామునికి నమస్కరించింది,
దశరథ మహారాజుగారికీ నమస్కరించింది, నమస్కరించి వెళ్ళిపోయింది ఇది నేను చెప్పానని
గుర్తుగా చెప్పు అంది.
ఎందుకిదీ ఏమి ఈ అభిజ్ఞానమంటే...
మనమందరం కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి అభిజ్ఞానం, సీతమ్మతల్లి ముందు రామ చంద్ర
మూర్తి ఒళ్ళో కూర్చుంది, కూర్చున్నప్పుడు ముందు కాకి వచ్చి వాలింది వాలి మాంసాన్ని
పెరికింది సీతమ్మ వెంటనే మట్టి గడ్డ తీసి కొట్టింది. రాముడు జోక్యం చేసుకోలేదు తన
రక్షణ తాను చేసుకున్నప్పుడు నేనెందుకు చేసుకుంటానని హాస్యమాడాడు ఈ మట్టి పెడ్డ
పెట్టి కొడుతూండడంలో ఆవిడ వడ్డాణం జారింది చీర జారింది రాముడు నవ్వాడు, తరువాత
ఆవిడ రాముడి ఒళ్ళో పడుకుంది. నిద్ర పోవడం ఆవిడ రక్షణ ఆవిడ చూసుకోలేదు ఇప్పుడు
రాముడు రక్షిస్తున్నాడు
కాకి రాలేదు, మళ్ళీ నిద్రలేచిన తరువాత రాముడు సీతమ్మ ఒళ్ళో పడుకున్నాడు సీతమ్మ
లేచి ఉంది రాముడు పడుకుని ఉన్నాడు ఇప్పుడు కాకి వచ్చి తనమీద వాలింది కానీ సీతమ్మ
పెడ్డ విసరలేదు ఎందుకంటే తాను పెడ్డ విసిరితే తాను కదిలితే రామునికి భంగం
కలుగుతుందని రాముడి యొక్క నిద్ర రక్షింపబడాలని తాను కదలకుండా కూర్చుంది. ఇప్పుడు
నెత్తుడి బిందువులు రాముని మీద పడ్డాయి. ఇప్పుడు తనని తాను రక్షించుకోవడం పెడ్డ
విసరడం మానేసి రామున్ని లేపింది. రాముడు లేస్తూనే తనను తాను రక్షించుకోకుండా తన రక్షణ రాముని మీద
అప్పజెప్పింది కాబట్టి ఒక కాకీ అని చూడకుండా బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు ఇది
శరణాగతి.
|
నిన్న మీతో మనవి చేసింది ఇది అంటే
అన్నివేళలా అందరూ చేయడం కాదు అటువంటి ప్రయత్నాలు చేసే పని చేయకండి, దానికి బాగా
పరిణితి కలగాలి, అసలు ఏ
ప్రయత్నమూ లేకుండా పూర్తిగా ఇక విపరీతమైన నమ్మకంతో రక్షణ భారాన్ని పరమేశ్వరుడియందు
న్యాసం చేసి విడిచిపెడితే పరమేశ్వరుడు ఆ రక్షణ భారాన్ని తాను స్వీకరిస్తాడు.
మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేసుకున్నంత సేపూ అది మీ శరణాగతిలోకి రాదు
భక్తిలోకి వస్తుంది తప్పులేదు పురుష ప్రయత్నం ఈశ్వర ప్రయత్నం చూడాలి, కాని శరణాగతిలోకి
రాదు శరణాగతి ఉత్తర క్షణం
ప్రయత్నాన్ని ఇచ్చేస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా రక్షించుకోకుండా ఆగిపోతే
వెంటనే లేచి రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఇది గుర్తు చేయ్ అంది ఆవిడా అని
ఆవిడందీ నా కొరకు ఒక కాకిమీద బ్రహ్మాస్త్రవేసినవాడు ఇవ్వాళ రావణున్ని ఎందుకు
సంహరించట్లేదు ఎందుకొచ్చి రక్షించట్లేదని అందీ అని అడుగూ అని అందావిడా. ఇప్పుడు
కూడా నన్ను నేను రక్షించుకోవట్లేదు పదినెలల నుంచి రాముడే రావాలని ప్రతిజ్ఞ చేసి
ఉన్నాను ఎందుకు రాలేదు రాముడు ఆనాడు ఒక కాకిమీద వేశాడే బ్రహ్మాస్త్రము మరి ఈనాడు
ఎందుకు రాలేదు బహుశః నాలో ఏదో తప్పుండాలి మమైవ దుష్కృతం కించిన్ మహ దఽస్తి న
సంశయః ! సమర్థా వఽపి తౌ య న్మాం నాఽవేక్షేతే పరంతపౌ !! చిన్నదో పెద్దదో నావలన
తప్పుంది. అందుకే రాముడు రాలేదు ఇది భక్తి యొక్క వ్యగ్రత పరాకాష్ఠ నేను శరణాగతి
చేశానని చెప్పు కౌసల్యా లోక భర్తారం సుషువే యం మనస్వినీ ! తం మమాఽర్థే సుఖం
పృచ్ఛ శిరసా చాఽభివాదయ !! కౌసల్యా పుత్రుడు ఏ మహానుభావున్ని కడుపార ఎవ్వాని
అని ఏ మాత అందో అటువంటి కౌసల్యా నంద వర్ధనుడైన కౌసల్యా మాత పుత్రుడిని శిరసా
నమస్కరించానని చెప్పు.
స్రజ శ్చ సర్వ రత్నాని
ప్రియా యా శ్చ వరాంఽగనాః !
ఐశ్వర్యం చ విశాలాయాం
పృథివ్యామ్ అపి దుర్లభమ్ ! పితరం మాతరం చైవ సమ్మాన్యాఽభి ప్రసాద్య చ !!
అనుప్రవ్రజితో రామం
సుమిత్రా యేన సుప్రజాః ! ఆనుకూల్యేన ధర్మాత్మా త్యక్త్వా సుఖమ్ అనుత్తమమ్ !!
అనుగచ్ఛతి కాకుత్స్థం
భ్రాతరం పాలయన్ వనే ! సింహ స్కన్ధో మహా బాహు ర్మనస్వీ ప్రియ దర్శనః !!
పితృ వ ద్వర్తతే రామే
మాతృవన్ మాం సమాఽఽచరన్ ! హ్రియమాణాం తదా వీరో న తు మాం వేద లక్ష్మణః !!
వృద్ధోప సేవీ
లక్ష్మీవాన్ శక్తో న బహు భాషితా ! రాజ పుత్రః ప్రియ శ్రేష్ఠః సదృశః శ్వశుర స్య మే
!!
మమ ప్రియతరో నిత్యం
భ్రాతా రామ స్య లక్ష్మణః ! నియుక్తో ధురి యస్యాం తు తామ్ ఉద్వహతి వీర్యవాన్ !!
ఏ లక్ష్మణ మూర్తి తన యొక్క ఐశ్వర్యాన్ని తన అంతఃపురాన్ని
తన భార్యని కూడా విడిచిపెట్టి రామ చంద్ర మూర్తి నా తండ్రి సీతమ్మ నా తల్లీ అని
భావించి అక్కరలేని అరణ్యవాసాన్ని స్వీకరించి రామున్ని నన్నూ విడిచిపెట్టి ఉండలేక
అనుగమించి మా వెంటవచ్చి శుశ్రూష చేసి పెద్దలయెడ భక్తిభావము కలిగినటువంటివాడో
అటువంటి లక్ష్మణ మూర్తిని నేను
మనసారా కుశలమడిగానని చెప్పు. ఎందుకంటే లక్ష్మణ మూర్తి పట్ల నేను అన్నమాటలు
అధికముగా మాట్లాడన్న భావనచేత లక్ష్మణ మూర్తి బాధపడ్డాడేమో అందుకని ఆ మహానుభావుడు
లక్ష్మణ మూర్తి నా వెంట వచ్చినటువంటి కారణం చేత నిజంగా దశరథుడే మరణించినా కౌసల్య
దూరంగా ఉన్నా దశరథుడు బ్రతికున్నట్లూ కౌసల్య పక్కనున్నట్లూ రాముడు భావించాడు, ఒక
తల్లీ తండ్రీ పక్కనుంటే పుత్రుడికి బెంగుండదు. ఎందుకంటే ఆయనకి కష్టమొస్తో కొడుక్కీ
ముందు ఆ కష్టం తనదిగా భావించి ఆ కష్టం నుంచి కొడుకుని ఉద్దరించే ప్రయత్నం
చేస్తాడు. అలా భావించగలిగిన తండ్రి దూరమైనా లక్ష్మణమూర్తి మాత్రం తండ్రిగా వచ్చి
నిలబడ్డాడు. అలా నిలబడిన లక్ష్మణమూర్తి ఉండగా నాకు అత్తమామలు లేరన్న లోటేలేదు
అటువంటి మహాత్ముని లక్ష్మణున్ని కుశలమడిగానని చెప్పు.
|
అని ఇది మాహా
మంత్రమంటారు సుందర కాండలో త్వ మఽస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి
సత్తమ ! రాఘవ స్త్వ త్సమారంభా న్మయి యత్న పరో భవేత్ !! నాయనా రామ చంద్ర
మూర్తియందు ప్రయత్నమును కల్పించి తొందరగా నన్ను నెలలో మళ్ళీ వెనక్కి
తీసుకెళ్ళేటట్టుగా చెయ్యగలిగిన సమర్థత నీయందే ఉందని నేను నమ్ముతున్నాను హనుమా
కాబట్టి నీవు రాముడు వచ్చేటట్టు చెయ్యవలసింది అని త్రాతుమ్ అర్హసి వీర త్వం
పాతాళా దివ కౌశికీమ్ ! తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్ !! ఆ
తల్లి తన చీర కొంగుకు ముడివేసుకున్నటువంటి ఆ చూడామణిని తీసి హనుమ యొక్క చేతిలో
పెట్టి నాయనా ఇది పట్టుకెళ్ళి రామ చంద్ర మూర్తికి ఇవ్వు మణిం తు దృష్ట్వా రామో
వై త్రయాణాం సంస్మరిష్యతి ! వీరో జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్య చ !! ఈ మణిని
చూడగానే రామ చంద్ర మూర్తికి ముగ్గురు గుర్తొస్తారు, ఎందుకో తెలుసా ఒకానొకప్పుడు
సముద్రంలో ఉన్నటువంటి ఈ మణిని సముద్రుడు వరుణుడికిచ్చాడు, వరుణుడు
జనకమహారాజుగారికి ఇచ్చారు, జనక మహారాజుగారు అత్యంత ప్రియ కుమార్తెను కాబట్టి నన్ను
కన్యాదానం చేసేటప్పుడు ఆ మణిని పెట్టి అలంకరించి కన్యాదానం చేశారు కాబట్టి ఆ
కన్యాదానం చేసినప్పుడు మా అమ్మా జనకుడు దశరథుడు రాముడు నేనూ కూడా ఉన్నాను, కాబట్టి
వాళ్ళు ముగ్గురూ కూడా జ్ఞాపకానికి వస్తారు. కాబట్టి ఈ మణిని పట్టుకెళ్ళి ఇవ్వూ అని
త్వమ్ అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ ! హనుమన్ యత్న మాస్థాయ దుఃఖ
క్షయకరో భవ !! అందుకే సుందర కాండ అంత శక్తివంతమైంది ఈ ఘట్టం ఇంత గొప్ప ఘట్టంగా
చెప్తారు పెద్దలు, ఆవిడండి నాయనా! నీవే... ప్రమాణము నా దుఃఖమును క్షయమయ్యేటట్టుగా
మళ్ళీ నేను శుఖమును శాంతిని పొందేటట్టుగా నీవు తప్పకుండా ప్రయత్నము చేయవలసింది అని
బాష్ప గద్గదయా వాదా మైథిలీ వాక్యమ్ అబ్రవీత్ ! కుశలం హనుమన్ బ్రూయా స్సహి తౌ
రామ లక్ష్మణౌ !! నాయనా వృద్ధులైన వారినందరిని అడిగానని చెప్పు అని కంఠం
గాద్గధికమై ఇంత కాలానికి మహానుభావుడు వచ్చాడు రామ కథ చెప్పాడు రామ నామం చెప్పాడు
బయలుదేరి వెళ్లిపోతున్నాడు నాయనా ఒక్కరోజు ఉండవయ్యా ఇక్కడెక్కడైనా జాగ్రత్తగా
రహస్య ప్రదేశంలో ఉండి అంటే మళ్ళీ రామ కథ చెప్పవయ్యా అని అడుగుతుంది అమ్మ.
|
నాయనా మరి మిగిలిన వానరాలు ఎలా
వస్తాయి? వాళ్ళకి అంత శక్తిలేదుకదా అంది, అంటే ఏ వ్యక్తైనా ఏమంటాడంటే నిజమే,
నిజమేనమ్మా నేనైతే ఇవన్నీ చేసేయగలననుకో కానీ మిగిలినవారు రాలేరు ఆ విషయం నేను
ఆలోచిస్తానులేమ్మా అనాలి. ఆయన అన్నారూ అమ్మా పది ఏనుగుల బలమున్నవాళ్ళు వంద ఏనుగుల
బలమున్నవాళ్ళు వేయ్యి ఏనుగుల బలం వాళ్ళు ఎంతంతో బలము కలిగినవాళ్ళు గాలిలో ఎగర
గలిగినవాళ్ళు సముద్రాన్ని అవపోసన పట్టగలిగినవాళ్ళు సుగ్రీవుడి దగ్గర లక్షల కోట్ల
మంది ఉన్నారమ్మా... అవలీలగా ఎగిరి ఇక్కడ ధూకేస్తారు రామ లక్ష్మణులకి ఇదో పెద్ద
లెక్కా తల్లీ యద్ధంలో అడ్డొస్తే యమధర్మరాజునే నిగ్రహించగల రాముడు సముద్రాన్ని దాటి
రావడం పెద్ద కష్టమనుకుంటున్నావామ్మా..? అమ్మా నేను నీకొక మాట చెప్పనా... మ
ద్విశిష్టా శ్చ తుల్యా శ్చ సన్తి తత్ర వనౌకసః ! మత్తః ప్రత్యవరః కశ్చిన్ నాస్తి
సుగ్రీవ సన్నిధౌ !! అమ్మా సుగ్రీవ సన్నిధానంలో నాతో సమానులైనవారున్నారు
నాకన్నా అధికులైనవారున్నారు నాకన్నా తక్కువవాడు లేడమ్మా నేనే ఆఖరివాన్ని ఎందుకో
తెలుసా ఎవరైనా పట్టపురాణి దగ్గరకు పంపించేటప్పుడు అంతఃపురంలో అందరికన్నా
పనికిమాలినవాన్ని పంపిస్తారు రాముడు ఉంగరమిచ్చి నన్ను పంపించాడంటే నా కన్నా
పనికిమాలినవాడు ఎవడున్నాడమ్మా నాతో సమానులున్నారు నాకన్నా అధికులున్నారు నేనే
వచ్చి ఉంటే మిగిలినవాళ్ళు రాకపోవడమేమిటమ్మా...! అందరు వస్తారు అన్నారు. ఇది ఆయన
వినయం సుందర కాండలో ఆయన వినయంతో మహానుభావుడు అసలు లోకానికి వినయం అన్న మాటకు
భాస్యం చెప్పారు.
అందుకే ఎక్కడెక్కడ హనుమనిసేవిస్తారో
ఎక్కడెక్కడ హనుమని ఆరాదిస్తారో అక్కడక్కడ బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వం మనోగతా
అజాఢ్యం వాక్పుటత్వం ఇవన్నీ వినయమూ ఆయనవల్ల కలుగుతాయి అంతటి మహానుభావుడు ఈ మాటలు
చెప్పి అమ్మా నేను బయలుదేరుతానమ్మా అన్నాడు. అంటే మళ్ళీ తల్లి అంటూంది వద్దునాయనా
వెళ్ళిపోవద్దు ఉండు రామ నామం చెప్పు రామ కథ చెప్పు అది వింటే నా మనసు ఊరడిల్లి
ఎన్నాళ్ళకు విన్నాను రామ కథా ఎన్నాళ్ళకు విన్నాను రామ నామము వెళ్ళిపోతావా వెళ్ళొద్దంది. అమ్మా నేను
వెళ్ళకపోతే ఎలా మళ్ళీ తల్లి అంది మనః శిలాయా స్తిలకో గణ్డ పార్శ్వే
నివేశితః ! త్వయా ప్రణష్టే తిలకే తం
కిల స్మర్తుమ్ అర్హసి !! నాయనా ఇంకోక అభిజ్ఞానం
చెప్పు ఒకానొకప్పుడు ఉపవనములలో విహరించి అలసిపోయినటువంటి నేను ఒళ్ళు చెమట పట్టడం వల్ల నేను పెట్టుకున్నటువంటి
బొట్టు చెమటతో కలిసి జారిపోయి మరుగున పడింది అప్పుడు రాముడు అక్కడే ఉన్నటువంటి
మణిశిలా అనబడేటటువంటి శిలని అరగదీసి ఆ బొట్టు తీసి నా పాల భాగముందు ఉంచాలి కానీ
బొట్టు పెట్టడం మానేసి బొట్టు పెడుతున్నాడని ఆవిడ చూస్తుంటే బొట్టు పెట్టకుండా బుగ్గన
చుక్కపెట్టాడు ఆయనా... అదొక పరిహాసము అదొక శృంగార చేష్ట అదొక ప్రియపత్ని యొక్క
మురిపానికి చేసిన చేష్ఠితము ఇది నేను జ్ఞాపకం చేశానని చెప్పు.
|
అంటే భర్తతో పంచుకున్న ఆక్షణాన్ని మధురాతి మధురమైన స్మృతులుగా
బ్రతుకుతున్నదానినే తప్పా... నా బ్రతుకుకి ఇంకొక ఆశలేదు నేను ఇన్నాళ్ళు రాముడితో
సమానంగా చూసుకున్నది ఏదైనా ఉంటే నా కేశ భూషణమొక్కటే ఎందుకో తెలుసా ఈ కేశము పురుష
వ్యామోహము అటువంటి కేష భూషణము నేను అలంకరించుకుంటే అది రాముడు సంతోషించాలనే అది
నేను పెట్టుకున్నపుప్పుడు రాముడు చూసిన చూపులకి చూసుకునేదాన్ని ఇది కూడా నీకు
ఇచ్చేశాను అంటే నా ప్రీతి రాముని యందే... రాముని ప్రీతియే నాకు సంతోషము తప్పా నాకి
ఇంక ఏదీ కాదని చెప్పారని చెప్పు అని ఆ తల్లి బాధపడుతూంటే ఆయన మహానుభావుడు హనుమ
అన్నారు అమ్మా నీవు ఏమాత్రం బెంగ పెట్టుకోవద్దమ్మా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా
ఉండు తల్లీ అని ఇమం ముహూర్తం ధుఃఖానామ్ అన్తం ద్రక్ష్యసి భామిని అమ్మా ఈ
క్షణమే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఏ మాట అంటున్నానో నీ యొక్క దుఃఖమంతా
పరిసామాప్తమైపోయింది నన్ను నమ్ము ఇక నీవు దుఃఖించవలసిన పనిలేదు. అతి కొద్ది
కాలములో రాముడు లక్ష్మణ సహితుడై వచ్చేస్తాడు ఈ లంకా పట్టణాన్నంతట్నీ తన బంగారు
బాణాల మెరుపులతో నశింపజేసి రావణ సంహారం చేసి నిన్ను స్వీకరించి సీతా రామ
పట్టాభిషేకం జరిగిపోతుందమ్మా అని కొద్దిరోజుల్లో ఆ పట్టాభిషేకం జరుగుతుండగా
మేమందరం చూస్తాము ఎంతో సంతోషిస్తాము కాబట్టి నీవు బెంగ పెట్టుకోవద్దు ఊరడిల్లు నేను
తొందరగా వెడితే వాళ్ళను తొందరగా తీసుకొస్తాను కాబట్టి అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా
అన్నాడు.
ఇమం చ తీవ్రం మమ శోక వేగం రక్షోభి
రేభిః పరిభర్త్సనం చ బ్రూయా స్తు రామ స్య గతః సమీపం శివ శ్చ తేఽధ్వాస్తు హరి
ప్రవీర నాయనా నీ ప్రయాణమునకు మంగళముగాకా నీవు సంతోషకరముగా నీ ప్రయాణమును
నిర్వహించేదవుగాకా నా చుట్టు ఇంతమంది రాక్షస స్త్రీలు బాధ పెడుతున్నారని చెప్పడం
మాత్రం రాముడికి చెప్పడం మర్చిపోకని స రాజ పుత్ర్యా ప్రతివేదితార్థః కపిః కృతాఽర్థ
పరిహృష్ట చేతాః త దఽల్ప శేషం ప్రసమీక్ష్య కార్యం దిశం హ్యుదీచీం మనసా జగామ !
సీతమ్మ తల్లి తనని మంగళ ప్రదంగా నాయనా నీ ప్రయాణం చెయ్యి అని తల్లి ఆశీర్వాద
పూర్వకంగా పలికేటప్పటికి హనుమ పరమ సంతోషాన్ని పొంది. హమ్మయ్యా సీతమ్మ దుఃఖాన్ని
దైన్యాన్ని విడిచిపెట్టేసింది ఇప్పుడు ఊరడిల్లి నమ్మి ఉంది కాబట్టి శాంతి పొందింది
కాబట్టి రాముడు వచ్చేంత వరకు ప్రశాంత చిత్తంతో ఉంటుంది రాముడు వచ్చేస్తాడు రావణ వధ
అయిపోతూంది సీతారామ పట్టాభిషేకం ఒక్క వారంలో పూర్తి చేసేస్తాం. కాబట్టి అయిపోతూంది
అని ఎంతో సంతోషంగా సీతారామ పట్టాభిషేకం
అయిపోయిన తరువాత నాకేం కావాలి కాబట్టి బయలుదేరుతాను ఇంకొక్క
పని మిగిలిపోయింది చిన్న పని ఆ పని చేసేస్తే
అయిపోతుంది అనుకున్నారు చాలా సంతోషించారు మహానుభావుడు ఆయన భయలుదేరుతానని
సంకల్పం చేసుకుని మహా సంతోషంతో పొంగిపోతూ ఉత్తర దిశగా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు.
అక్కడ సీతమ్మ తల్లీ హనుమ కూడా పరమ సంతోషంగా ఉన్నారన్న ఈ ఘట్టం దగ్గర ఇవ్వాల్టి
ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను.
|
ఈ సందర్భంలో నేను ఒకటి మనవి చేయాలి, నీవు రోజు ఇలాగే చెప్తున్నావ్ అనుకోకండి
నేను యదార్థమే చెప్తున్నాను. రేపు జయ మంత్రము అత్యద్భుతమైనటువంటి జయ మంత్రాన్ని
దేవాలయంలో అరాదిస్తారు జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః అది చదివినా
విన్నా కూడా జయము కలుగుతుందని అంత గొప్ప జయ మంత్రము రేపు ఉపన్యాసంలో వస్తూంది రేపు
హనుమ పూర్తిగా తన సందేశాన్ని కూడా ఇచ్చి లంకని దహించి సీతమ్మని దర్శించి తిరిగి
వెడుతాడు ఆ వానరులందరూ శుభవార్త వింటారు, అంత గొప్ప ఘట్టాన్ని రేపు చెప్పి రేపటితో
సుందర కాండ పూర్తైపోతుంది. సుందర కాండ పూర్తయ్యేటప్పుడు ఒక శ్లోకంతో పూర్తి
చేస్తారు అందుకు పారాయణ చేస్తారు. సందర కాండ పారాయణ చేయండని ఎందుకంటారంటే ఆ శ్లోకం
కోసం వింటారు తతో మయా వాగ్భః ఆదీన భాషణా ఆ శ్లోకం కోసం అందులో నేను శాంతినిచ్చాను
అని చెప్పారు హనుమ అది విన్నవాళ్ళందరికీ మనఃశాంతి కలుగుతుంది. కాబట్టి రేపు మనందరం
చక్కగా ఆ సందర్భంగా ఉపన్యాసాన్ని రేపు పూర్తి చేసుకందాం.
ఈ సందర్భంలో ఒకటి మనవి చేస్తాను మీకు హరి
ప్రసాద్ గారు మీతో చెప్పి ఉన్నారు శృంగగిరి పీఠం డబ్బుల కోసం వ్యామోహ పడే పీఠం
కాదు యదార్థం ఎందుకు వ్యామోహపడుతుంది. ఆ పీఠంలో ఎంత శక్తివంతమైన పీఠాధిపతులంటే
ఒక్కసారి గాలిలో ఇలా అంటే గణపతి వచ్చేస్తాడు తోరణ గణపతి అంత శక్తిమంతమైన పీఠం,
కేవలం కాకరకాయలు తిని అష్ఠసిద్ధులు పొందినటువంటి పీఠాధిపతులు దానికున్నారు
ఒకానొకప్పుడు ఉగ్రనరసింహ భారతీ స్వామివారు పీఠాధిపత్యంలో ఉన్నప్పుడు ఆయన మధురై
వెడితే ఆలయంలో ఉన్న అర్చకులు మీరు లోపలికొచ్చి పూజ చేయ కూడదు అమ్మవారిని మీరు
దర్శనం చేసుకోండి మేము పీఠం తరుపున ఇక్కడ పూజ చేస్తాము అన్నారు. ఆయన వెంటనే
కొబ్బరి బొండం ఒకటి తీసుకుని చేతులో పట్టుకుని మంత్రాలు చదివారు అమ్మవారిలో ఉన్న
కళలన్నీ కొబ్బరి బోండంలోకి వెళ్ళిపోయాయి ఆయన దాన్ని పట్టుకెళ్ళి పీఠంలో పెట్టి
విడిదిలో పెట్టి పూజ చేస్తున్నాడు అమ్మవారు వెల వెల పోయి విగ్రహమంతా
ఎండిపోయినట్లైంది. వాళ్ళకి అర్థమైంది అమ్మవారిలో కళల్నీ ఉగ్రనరసింహ భారతీ స్వామివారు
తీసుకెళ్ళిపోయారని అప్పుడు విడిదికొచ్చి ఆయన కాళ్ళమీద పడ్డారు మాది
పొరపాటైపోయింది అమ్మవారిలో మళ్ళీ ప్రతిష్ఠ
చేయండీ అని. ఆయన మళ్ళీ కొబ్బరి బోండం పట్టుకొచ్చి మంత్రం చదివారు మళ్ళీ కొబ్బరి
బోండంలో ఉన్న కళలన్నీ అమ్మవారిలోకి ప్రవేశించాయి.
జగత్తును పరిపాలించినటువంటి మధుర మీనాక్షి అమ్మవారి కళలనే కొబ్బరి
బోండంలోపలికి తీసుకోగలిగిన వాళ్ళకి మనం ఇచ్చే డబ్బులు అవసరమా... మనం
కృతార్థులవ్వడానికి మనం డబ్బులివ్వాలిగానీ మన రూపాయల కోసం పీఠాలున్నాయని ఎప్పుడూ
అనుకోకూడదు. సంకల్పం చేత తెల్లవారి లేస్తే గురుస్తోత్రరంలో మీరు వింటున్నారు
మహానుభావుడు వాళ్ళు ఈశ్వరున్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ సంకల్పంతో
ఈశ్వరానుగ్రహంతో ఏదైనా చేయగలరు. శృంగగిరి పీఠానికి అసలు అంత వైభవాన్ని
తీసుకొచ్చినవారు వేదాలకన్నిటికీ భాష్యమిచ్చినవారికి విద్యారణ్య స్వామి ఒక్కసారి
ప్రార్థన చేస్తే కురిసిందంతా బంగారమంతా కానీ వచ్చే జన్మలో తీసుకో ఇప్పుడు ఇవ్వనంది
అమ్మవారు, ఆయన వచ్చే జన్మలో తీసుకో ఇప్పుడు ఇవ్వనంది, కాబట్టి ఆయన వచ్చే జన్మలో
అంది కాబట్టి సన్యశించారు, ʻసన్యశిస్తే ఉత్తర జన్మʼ అమ్మా ఇప్పుడు తీసుకోనా అన్నాడు తీసుకో అంది. సన్యాసివి ఏం చేస్తావంది సనాతన
ధర్మాన్ని రక్షించడానికి నేనొక సామ్రాజ్యాన్ని నిర్మిస్తానమ్మా... అన్నాడు. ఆయనే
కర్ణాటక సింహాసన్నాన్ని విజయ నగర సామ్రాజ్యాన్ని నిర్మించి మొట్ట మొదట అంతఃపురాలు
సౌధాలు రాజ్య నిర్మాణం కోశం దానికి
లక్ష్మీదేవి యొక్క కృపగా వచ్చిన ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటివారు విద్యరణ్య స్వామి.
|
అందుకే మేము కాకినాడలో ఏం చేస్తామో
తెలుసాండీ అసలు ఎవరి డబ్బుకి రసీదివ్వము ఒక్కే ఒక్కరేజు ఆ మహత్కారం జరగడానికి
హుండీ పెడతాం ఒక్కరోజే ఆంతకు మించి పెట్టరు ఒకే ఒక్కరోజు అది కూడా మహాత్తరమైన రోజు
పెడతాం ఎందుకంటే వాళ్ళకి అది ఈశ్వరానుగ్రహం కల్పించాలి నీ శక్తికి నీవే సాక్షి
రాముడు దాన్ని చూస్తాడు మన రసీదులెందుకూ మన పేర్లేందుకు అర్ధానా వేయగలిగినవాడు
అర్థానా వేస్తాడు వంద వేయగలిగినవాడు వంద వేస్తాడు. వెయ్యి కలిగినవాడు వెయ్యి
వేస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఆ
ఉండి తీసినప్పుడు ఐదు వందల కట్టలు ఏం గోపాల కృష్ణగారూ ఫారిన్ ఏక్సేంజ్ కెళ్ళిన
రోజులు ఉన్నాయి బంగారు కాసులు వేసినవాళ్ళు ఉన్నారు ఆ కౌంటింగ్ కూడా మేము ఎక్కడో
చెయ్యము పర్టికులర్ టైమింగ్స్ ఇస్తాము ఈ టైం నుంచి ఈ టైం వరకే హుండీ ఉంటుంది అంతే
అయిపోయిన తరువాత కార్యక్రమంతో ఏ సంబందము లేకుండా సభలో ఉన్నవాళ్ళని ఎవరినో ఇలా చూసి
అయ్యా మీరు మీరు మీరు అని ఒక ఆరు ఏడు మందిని నామినేట్ చేస్తాము వాల్లే ఆ రాత్రి
ఈశ్వర పాదాల దగ్గరే లెక్కపెడతారు. పీఠము యొక్క నిర్వాహకులు ఎవరుంటారో, మాకు దేవాలయ
నిర్వాహకులు గోపాల కృష్ణగారు వారికి అందజేస్తాము వారికి ఇస్తాము మరునాడు సభలో
అనౌన్సు చేస్తాము ఎంతొచ్చింది హుండోనని దాన్ని ప్రతిజ్ఞ చేస్తారు ఇందులో ప్రతి రూపాయి
ఈశ్వరా నీతో ప్రతిజ్ఞ చేస్తున్నాను నీ కార్యానికి కర్చుపెడతాను అని చెప్పు అంతే.
ఎవరు ఈశ్వరుని డబ్బు వాడుకుంటారు
అందులో ఆయన కెందుకు ఆయనకేం కావాలి ఆయనే పాపం బోలెడు పీఠానికి భక్తితో
చేస్తున్నవారు కాబట్టి రేపు నేను
ఇది నమ్మినవాన్ని రామ కార్యం మీద ఉపకారం చెయ్యాలి అన్నవాళ్ళని ప్రోత్సహించి తీరాలి
తప్పా ఎప్పుడూ నిరుత్సాహ పర్చకూడదు. అందుకే రేపు సాంయకాలం ఆరు గంటల నుంచి
నా ఉపన్యాసం అయిపోయిన ఒక పదినిమిషాలో పదిహేను నిమిషాలో అంతే నేను ఇక్కడే ఉంటాను
రేపు ఉపన్యాసం అయిపోయాక ఉపన్యాసం పూర్తైన పోయిన తరువాత కొంత సేపటికి అది అలా ఎదురు
చూస్తూ ఇంకా మా అబ్బాయి వస్తాడండీ అని మా మేనల్లుడొస్తాడండీ అంటే ఉంచం ఆ తరువాత
మీరు వేసేది ఏమైనా ఉంటే అది దేవాలయాల్లోకి వెళ్ళిపోతుంది. రామ కార్యంలోకి వెళ్ళేది
అంటే పట్టాభిషేకానికి ఇతర కార్యక్రమాలకు రేపు అన్నదానంలోకి కానీ ఈ ద్రవ్యాన్ని రామ
కార్యంలో వాడుతారు దానికి రేపు సాయంకాలం ఆరు గంటలకు ఒక ప్రత్యేకమైన హుండీ ఒకటి
పెడతారు ఎక్కడ పెడతారు ఆ హుండి శారదా దేవి దగ్గర పెడతారు. శారదమ్మ ఎదురూగా
విశాలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు క్యూలో నిల్చున్నా విశాలంగా ఉంటుంది.
|
వాళ్ళకి కష్టముంటే లెక్క పెట్టడంలో
అయ్యా నన్ను వద్దు ఇంకోడిని పెట్టండంటే ఇంకోడికి ఇస్తాం. ఆడవాళ్ళకి కూడా అవకాశం
ఇస్తాము వాళ్ళు కూడా ఉద్దరించాలి వాళ్ళు కూడా వేసిందే ఆడ వాళ్ళల్లో కూడా ఎవరి మీద
నా చూపుడు వేలు ఆగితే ఆవిడకి నా అవకాశం. కాబట్టి మీ అందరు చూస్తారు ఇలా ఓ తాడు
కట్టేసి ఇక్కడే ఈ ఎదురు గుండానే పోసేసి ఒక భద్రత ఉండాలి కాబట్టి అలా ఒక తాడు
కట్టేసి రక్షణ నిలబడి అందరూ చూసేవాళ్ళు కూడా చూడవచ్చు హుండీ కిందపోసినప్పుడు,
చక్కగా లెక్క పెట్టి ముప్పై మూడు రూపాయలొస్తో ముప్పై మూడు రూపాయలు మూడు లక్షల
డెబ్బైవేలు వస్తే మూడు లక్షల డెబ్బైవేలు రామ కార్యంలో పాలు పంచుకుని కృతార్థులవుదాం
సంపూర్ణ రామాయణంలో ఇంత క్రతువులో ఇది మన భాగ్యం జీవితంలో మనం చెయ్యగలిగింది
చేద్దామన్న తృప్తితో చెయ్యండి తప్పా నేను అన్నానని వేయద్దు. మీకు చెప్పి నేను
చెయ్యనివాన్ని కాను. నేను కూడా నాకు ఈశ్వరుడు ఇచ్చిన దానికి లోటు లేకుండా నేను కూడా
హుండీలో వేస్తాను. నన్ను నన్నున్మండి మీ దగ్గర డబ్బులు పుచ్చుకోవడానికి నేను
చెప్పానని అనుకోకండి. నేను కూడా రేపు ఉపన్యాసానికి వస్తూ హుండిలో డబ్బులు వేసి
ఉపన్యాస వేదికమీదికి వస్తాను కాబట్టి రేపు అందరం రామ కార్యంలో పాలు పంచుకుని
సంతోషంగా ఒక్క కుటుంబ సభ్యులం అది ఎంత రానివ్వండీ దానికేం టార్గెట్లు లేవు ఇంత
రావాలి ఇంత వేయండనేం లేదు ఉండనే ఉంది పెద్ద పర్వతం. కానీ పర్వతం ఉందికదాని
మనమెందుకు అని అనుకోకూడదు, మనం వేసేది మనం వేయాలి అప్పుడు మనం పర్వతం అవుతాం
కాబట్టి వేసి చక్కగా కృతార్థులవౌదాం.
|
ఒక్క పదకొండు మాట్లు రామ నామం
చెప్పేద్దాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ
నామము !!రా!!
కోరి కొలచిన వారి కెల్లన్ను కొంగు
బంగరు రామ నామము !!రా!!
నీవు నేనను భేధమేమియు లేక యున్నది
రామ నామము !!రా!!
అండ పిండ బ్రహ్మాండములకా ధారమైనది
రామ నామము !!రా!!
బ్రహ్మ సత్యము జగన్మిత్యా భావమే
శ్రీ రామ నామము !!రా!!
సకల జీవుల లోన వెలిగే సాక్షి భూతము
రామ నామము !!రా!!
ఆంజనేయుని వంటి భక్తుల కాశ్రయము
శ్రీ రామ నామము !!రా!!
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామ
నామము !!రా!!
నీల మేఘశ్యామలము నిర్మలమైనది రామ
నామము !!రా!!
నిర్వికారము నిర్వి కల్పము నిర్గుణము
శ్రీ రామ నామము !!రా!!
పాలు మీగడ పంచదారల తత్వమే శ్రీ రామ
నామము !!రా!!
మంగళా శాసన....
No comments:
Post a Comment