నిన్నను మీరు గమనించారు మొదటి
పర్యాయం జరిగినటువంటి రామ-రావణ యుద్ధంలో రావణునితో యుద్ధం చేస్తున్నటువంటి లక్ష్మణ
మూర్తి స్పృహతప్పి పడిపోయినప్పుడు రావణాసురుడు లక్ష్మణ మూర్తిని తీసుకునివెళ్ళి తన
రథం మీద పెట్టుకుని లంకా పట్టణంలోకి తీసుకెళ్దామని ప్రయత్నించినప్పుడు ఆయనయందు
విష్ణుస్వరూపం ఆవాహనమైతే రావణుడు లక్ష్మణమూర్తిని కదపలేకపోయాడు, కానీ హనుమ మాత్రం
వెంటనే వచ్చి కదపగలిగారు ఇదీ ఒక గమనించవలసినటువంటి విషయం. ఈశ్వర స్వరూపమును
కదపగలిగినశక్తి ఒక భక్తునియందు ప్రవేశించింది కానీ శతృత్వాన్ని పోలినటువంటి
రావణుడు మాత్రం బాహ్యంలో ఎంత బలవంతుడైనా ఆ పనిని మాత్రం చెయ్యలేకపోయాడు అంటే ఈశ్వరున్ని కదపడం అన్నదాన్ని మీరు జాగ్రత్తగా
అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఎంతవరకు వెడుతుందంటే భగవంతుని
యొక్క స్వరూపము భక్తునకు వశమౌతుంది, భక్తుడు ఎలా చెప్తాడో భగవంతుడు అలా నిలబడుతాడు ఒక స్థాయిలో భక్తుడు
పొందేటటువంటి గొప్ప అనుగ్రహం. విష్ణుస్వరూపాల్లో యధోక్తకారీ అని ఒక
స్వరూపముంది “యధోక్తకారీ” అంటే ʻఆయన ఒకనాడు బయలుదేరి వెళ్ళిపోతూంటే ఒక ఆళ్వార్ʼ ఆయనవెనకాల శ్రీ మహా విష్ణువు కూడా శేషషయనాన్ని చుట్టుకుని
చంకలో పెట్టుకుని ఆయనతోపాటు వెళ్ళిపోయారు ఇక్కడ పడుకుందామంటే ఓ నది ఒడ్డున
పడుకున్నారు.
ఇప్పటికీ తమిళనాడులో ఉందాక్షేత్రం
అందుకని ʻయధోక్తకారీʼ తన భక్తుడు ఎలా చెప్తే అలా చేసినవాడూ అని... అలాగే శంకర
భగవత్పాదుల విషయంలో కూడా ఒకానొకప్పుడు దక్షిణ దేశంలో మద్వాచలం దగ్గర ఆయన ఒక
శివాలంయంలో “అద్వైతమే ప్రమాణమాకాదా...” అని పరమేశ్వరున్ని అడిగితే శివలింగంలోంచి
రెండు చెతులు పైకొచ్చీ “అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం” అని
మూడు మాట్లు చేతులు ఊగీ... రెండు చేతులతో ఉన్న శివలింగం ఇప్పటికీ తమిళనాట
క్షేత్రంలో ఉంది కాబట్టి ఈశ్వరుడు భక్తుడైనటువంటివాడికి వశుడై ఉంటాడు దీన్ని చూపించడం
నిన్నను చర్చించినటువంటి ఘట్టంలో ఉన్నటువంటి అంతరార్థం, భక్తి ఎంత గొప్పదో మీరు
గ్రహించవలసి ఉంటుంది.
ఇప్పుడు మొట్ట మొదటిసారి జీవితంలో
ఓడిపోయి, మొట్ట మొదటిసారి ఓడిపోవడమంటే ఇంతకు ముందుకూడా ఓడిపోయాడు వాలిచేతులో ఓడిపోయాడు, కార్తవీరార్జునిడి
చేతులో ఓడిపోయాడు కానీ తాను ఇన్ని డాంభికాలుపలికి ʻమానవుడు నన్నేమి చేయగలడూ అని అధిక్షేపించినటువంటివాడుʼ, రాముడు తనని ఏమీ చేయలేడు అని కృతనిశ్చయంతో
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఎంతమంది చెప్పినా వినకుండా యుద్ధభూమికి వెళ్ళినవాడు, ఒక్క
క్షణకాలంలో అంత తక్కువ కాలంలో తన రథాన్ని గుఱ్ఱాల్ని సారథిని పడగొట్టి నిన్ను
చంపకుండా వదిలేస్తున్నాను చేతిలో నీకు అస్త్రములేదు కాబట్టి శస్త్రములేదు కాబట్టి,
కాబట్టి నీవు బయలుదేరి మళ్ళీ నీ అంతఃపురంలోకి వెళ్ళి నేటి రాత్రి విశ్రాంతి
తీసుకుని రేపు ఆయుధాలతోపాటు కలసి యుద్ధానికిరా... అప్పుడు నీతో యుద్ధం చేస్తాను
అంటే... అంతగా అవమానింపబడి అంతఃపురాన్ని చేరుకున్నటువంటి రావణాసురుడు చాలా
మదనపడ్డాడు. విచిత్రమేమిటంటే ఆయనకి ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చాయి ఆయనకున్న శాపాలు
ఇంత కాలం ఆయనకు జ్ఞాపకం రాలేదు సర్వంత తత్ ఖలు మే మోఘం య త్తప్తం పరమం తపః ! య
త్సమానో మహేద్ద్రేణ మానుషే ణాఽస్మి నిర్జితః !! ఇంద్రునిచేత కూడా గెలవబడనివాన్ని
ఇంద్రున్ని గెలిచినవాన్ని అంతగొప్ప తపస్సు చేసినవాన్ని కేవలం ఒక మనుష్యుడి చేతిలో ఇవ్వాళ
నేను ఓడిపోయాను దేవ దానవ గన్ధర్వై ర్యక్ష రాక్షస పన్నగైః ! అవధ్యత్వం మయా
ప్రాప్తం మానుషేభ్యో న యాచితమ్ !! నిజంగా మనుష్య జాతంతా సంతోషించవలసినటువంటి
శ్లోకము ఈ శ్లోకము ఎందుకంటే మనుష్యులు నన్నేం చేస్తారు అని చెప్పి కనీసం నేను
వాళ్ళ చేతిలో ఓడిపోనన్న వరం కూడా అడగనూ అని ప్రగల్ఫాలు పలికినవాడు ఇవ్వాళ అంటున్నాడూ...
నేను దేవ దానవ గన్ధర్వై ర్యక్ష రాక్షస పన్నగములచేత సంహరింపబడకుండా
బ్రహ్మగారిని వరం కోరాను కానీ మనుష్యునిచేత నేను వధింపబడనూ అని వరం కోరుకోకపోవడం
ఎంత పొరపాటైందో నాకు ఇవ్వాళ అర్థమైంది.
అంటే ఒక మనుష్యుడు అంత శక్తి కలిగి
ఉంటాడు అని మహానుభావుడు రామ
చంద్ర మూర్తి ఒక నరుడిగా ఈ భూమిమీద నడిచి మనుష్య జాతికే అంతకీర్తిప్రతిష్టలు తెచ్చినటువంటి
అవతారము రామావతారము. అందుకే రామావతారాన్ని రామ చంద్ర మూర్తిని ఉపాసన చెయ్యకుండా
ఆయనని పూజించి ఆయనపట్ల భక్తిలేకుండా ఉన్నటువంటి నరజన్మ సార్ధకతలేని నరజన్మ విదితం
మానుషం మన్యే రామం దశరథాఽఽత్మజం ! ఉత్పత్యతే హి మద్వంశే పురుషో రాక్షసాఽధమ !!
ఇహనిష్యతి సంగ్రామే త్వాం కులాఽధ మ దుర్మతే !! ఒకానొకప్పుడు అవధ్యత్వం మయా
ప్రాప్తం మానుషేభ్యో న యాచితమ్ నేను చాలా గర్వంతో ఉన్నాను మనుష్యులేమిచేయగలరని
కానీ ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి అనరణ్యుడు అనబడేటటువంటి రాజుతో నేను యుద్ధం
చేసి ఆయనపట్ల అమర్యాదతో ప్రవర్తించినప్పుడు ఆయనపట్ల హింసాత్మకంగా నేను
ప్రవర్తించినప్పుడు ఆయనా ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు “మా వంశంలో జన్మించినవాడే నీ
మృత్యువునకు హేతువౌతాడూ అని”. నాకు ఇప్పుడు అర్థమౌతూంది ఇక్ష్వాకు వంశంలో
పుట్టినటువంటివాడే మహానుభావుడైనటువంటి రామ చంద్ర మూర్తి నాకు ఇక్ష్వాకు కుల
నాథేన అనరణ్యేన య త్పురా పూర్వ కాలంలో నాకు అనరణ్యుడిచ్చినటువంటి శాపము
జ్ఞాపకానికి వస్తూంది శప్తోఽహం వేదవత్యాచ యదా సా ధర్శితా పురా ! సేఽయం సీతా మహా
భాగా జాతా జనక నందినీ !! నేను ʻఒకానొకప్పుడు వేదవతి అన్నపేరుతో అమ్మవారు జన్మించింది, ఆమె పుట్టినప్పుడు
వేదఘోష వినపడింది అటువంటి తల్లి సాక్ష్యాత్ పరాశక్తి అంశతో జన్మించినటువంటి ఆమెను
తపస్సులో ఉండగాʼ నేను ఆమెను మోహించి
బలాత్కరించబోయాను, బలత్కరించబోతే ఆ తల్లి యోగాగ్నియందు శరీరాన్ని విడిచిపెడుతూ ఒక
శాపవాక్కు విడిచిపెట్టింది ʻనేనే ఒక స్త్రీగా జన్మించి నీయొక్క కుల నాశనమునకు కారణమౌతాను అందిʼ ఆనాడు నేను “ఆడది” అంటే అంత చులకనగా చూశాను, చులకనగా చూసి
తపశ్వినియైన వేదవతి పట్ల మోహాన్ని పెంచుకుని ఆమె
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
శీలాన్ని హరించే ప్రయత్నంచేశాను ఆమె విడిచిపెట్టినటువంటి
శాపవాక్కు ఇవ్వాళ ఈ రూపంలో వచ్చింది అందుకే సేఽయం సీతా మహా భాగా జాతా జనక
నందినీ ఆ వేదవతియే సీతమ్మగా వచ్చిందీ అని నాకు అర్థమౌతూంది.
ఉమా నందీశ్వర శ్చాఽపి రంభా వరుణ కన్యకా ! యథోక్తా స్తపసా ప్రాప్తం న మిథ్యా
ఋషి భాషితం !! ఇప్పుడు అంటున్నాడు న మిథ్యా ఋషి భాషితం ఋషులైనటువంటివారు మాట్లాడిన మాటలు
ఎన్నటికీ నిజం కాకుండా పోవడమన్నది ఉండదు అవి నిజమైతీరుతాయి. ఒకప్పుడు ఉమా పార్వతీదేవి నన్ను
శపించింది. పరమేశ్వరునితో కలసి క్రీడిస్తున్నటువంటి తల్లి (నర్తిస్తున్నటువంటి)
తల్లి కైలాస పర్వతంమీద ఉండగా నేను కైలాస పర్వతాన్ని కదిపాను అప్పుడు ఆమె ఆ హఠాత్
పరిణామమునకు ఉలికిపాటు చెందినదై ఇంత ఉద్ధతితో ప్రవర్తించినవాడెవరో వాడు
స్త్రీలచేతనే కుల నాశనమును పొందుతాడూ అంది కాబట్టి నేను ఇప్పుడు “ఆ సీతమ్మతల్లి
చేతిలో శాపవాక్కుని అనుభవించడానికే సీతమ్మతల్లిని తీసుకొచ్చి లంకాపట్టణంలో ఉంచాను
అని నాకు అర్థమౌతూంది” నందీశ్వర శ్చాఽపి మీకు ఇతః పూర్వం
చెప్పియున్నాను. నందీశ్వరునిపట్ల అమర్యాదగా ప్రవర్తించి వానర ముఖమున్నవాడివీ అని
రావణాసురుడు ఆయన్ని నిందిస్తే “వానరములే వచ్చి రాక్షస వంశ వినాశనమునకు కారణమౌతాయీ”
అని నందీశ్వరుడు శపించాడు. కాబట్టి నందీశ్వరుని యొక్క శాపం నాకుంది. రంభా వరుణ
కణ్యకా రంభా నలకూభరుడూ అనేటటువంటి తన యొక్క ప్రియుని ఇంటికి వెడుతూంటే నేను ఆ
రంభను చూసి మోహించి బలాత్కారంగా ఆవిడని అనుభవించాను ఆనాడు నలకూభరుడు నాకు
శాపాన్నిచ్చాడు. ఆ అధర్మమునకు పాల్పడినప్పుడు పరస్త్రీమీద నీవు వ్యామోహం
పెంచుకుంటే (కుంజికస్థల విషయంలో కూడా ఇదే జరిగింది) నీవు ఒక స్త్రీ వలననే ʻబలాత్కారమైనటువంటి
ధోరణిలో ఒక మహాపతివ్రతను తీసుకొచ్చి ఏనాడు అశోకవనంలో ఉంచి ఆమెపట్ల కృద్ధుడవై కామ
మోహితుడవై ప్రవర్తిస్తావోʼ ఆనాడు నీకు
మరణమాసన్నమౌతూందని నాకు శాపవాక్కుంది.
న మిథ్యా ఋషి భాషితం కుంజికస్థల
అనబడేటటువంటి ఒక అప్సరస విషయంలో కూడా నేను ఇలాగే అమర్యాదగా ప్రవర్తించి ఆమెనుకూడా
బలవంతంగా అనుభవిస్తే అమె చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉండగా వెళ్ళి నీ వంశంలో
జన్మించినవాడు స్త్రీలపట్ల ఇంత అమర్యాదతో ప్రవర్తిస్తున్నాడని తనగోడు వినిపిస్తే
కృద్ధుడైన చతుర్ముఖ బ్రహ్మగారు “ఇకనుండి నీవు ఏ స్త్రీ జోలికైనా ఆమె ఇష్టములేని
స్త్రీని నీవు అనుభవించే ప్రయత్నంచేస్తే నీ తల వ్రక్కలైపోతూందని శాపవాక్కు
విడిచిపెట్టాడు” కాబట్టి ఇన్ని కారణములను చూస్తే నా మృత్యువుకి ఏవి హేతువులో
వాటన్నిటినీ నేను ఇక్కడికి తీసుకొచ్చానూ అని నాకర్థమౌతూంది, కాబట్టి ఇప్పుడు నన్ను
ఈ కష్టం నుంచి గట్టెంకించగలిగినవాడు ఎవడు? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు
న్యాయంగా ఎవరు జ్ఞాపకానికి రావాలి రావణాసురునికి విభీషణుడు జ్ఞాపకానికి రావాలి,
ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాడు నాకీమాట అన్నయ్యాపాడైపోతావ్ వంశనాషనమైపోతూంది
అన్నయ్యా అని చెప్పాడు కాబట్టి విభీషణుడు చెప్పినటువంటి మాటల్ని నేను ఇప్పుడు
పాటించి సీతమ్మని తీసుకెళ్ళి రామ చంద్ర మూర్తికి సమర్పించేస్తే నేను బ్రతికిపోతాను
అనుకోవాలి కానీ... ఆయన మూర్ఖత్వం అలివిలేని మూర్ఖత్వం. అన్నాడు కదా!
మాల్యవంతుడొచ్చి తనతో మాట చెప్తే ʻఏం చెయ్యమంటావు ఇదినా
స్వభావము స్వభావో దురతిక్రమః దాన్ని నేను అతిక్రమించలేను నా శరీరాన్ని
రెండుగా నరికేసినా నేను అనుకున్నదే నేను చేస్తాను అన్నాడుʼ
ఆ మూర్ఖత్వం పెంచుకోవడం
ఎంతమంది చెప్పినవి జ్ఞాపకానికివచ్చినా ఎన్ని శాపవాక్కులు జ్ఞాపకానికి వచ్చినా
చిట్ట చివర నిర్ణయంమాత్రం తనని బాగుచేసే నిర్ణయంవైపుకు మాత్రం బుద్ధి ప్రచోదనం
ఉండదు కాబట్టి అతనికి విభీషణుడు జ్ఞాపకానికి రాలేదు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కుంభకర్ణుడు జ్ఞాపకానికి
వచ్చాడు, జ్ఞాపకానికి వచ్చినప్పుడు నా సోదరుడైనటువంటి కుంభకర్ణున్ని నిద్రలేపితే
అతడు నాకు తప్పకుండా ఉపయోగపడుతాడు, ఈ మధ్యనే నాతో మాట్లాడివెళ్ళాడు ఆయన ఆరు ఏడు
మాసములపాటు అలా నిద్రపోతూంటాడు ఆయన వెళ్ళికూడా ఎన్నోరోజులవ్వలేదు ఈ మధ్యనే
తొమ్మిదిరోజుల క్రితమే నాతోమాట్లాడి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు గాఢనిద్రలో
ప్రవేశించి ఉంటాడు, అది ఆ నెలలు దాటిపోతూంటే కొద్దిగా తెలివొచ్చే స్థితికొస్తాడు. తొమ్మిదిరోజుల
క్రితమే పడుకున్నాడు కాబట్టి చాలాగాఢ నిద్రలో ఉంటాడు. కొంచెం లేపడం కష్టమే కాని
మీరు ఎలాగైనా ప్రయత్నంచేసి ఆయన్ని నిద్రలేపండీ అన్నారు. అంటే కుంభకర్ణుని యొక్క
అంతఃపురమే కుంభకర్ణుడు ఉండేటటువంటి ప్రాసాదమే చాలా విచిత్రమైన నిర్మాణము ఎందుకంటే
ఆయన పర్వత కాయుడు రాక్షసుల్లో అంత శరీరమున్నటువంటి రాక్షసుడు ఇంకొకడులేడు అంత
పెద్ద శరీరంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు నడిచివెళ్ళడానికి వీలుగా అంతంత స్తంభాలతో
నిర్మాణంచేశారు ఆ ప్రాసాదాన్ని అందులోకి రాక్షసులు కొన్నివేల మంది ప్రవేశించారు
ఆయన ఒక పెద్ద గదిలో పడుకుని ఉన్నాడు ఇప్పుడా గదిలోకి వెళ్ళాలి లేపడానికి ఆ గదిలోకి
వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కుమ్భకర్ణస్య నిశ్వాసాదఽవధూతా
మహా బలాః ! ప్రతిష్ఠమానాః కృచ్చ్రేణ యత్నాత్ ప్రవివిశు ర్గుహామ్ !! వీళ్ళు వెళ్ళుదామని
ప్రయత్నంచేసినా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు ఊపిరి గట్టిగా తీసి ఊపిరి
విడిచిపెడుతుంటే ఆ విడిచిపెట్టినటువంటి ఊపిరి యొక్క ధాటికీ వీళ్ళందరూ ఎగిరిపోయి
దూరంగా పడిపోతున్నారు కాబట్టి వెళ్ళడం కష్టంగా ఉంది అగదిలోకి అంటే ఆయన ఎంతగాలి పీలుస్తాడో
ఎంతగాలి విడిచిపెడుతాడో ఆయన ఊపిరి విడిచిపెడితే అంత వేగంగా ఉంటుందంటే
నిద్రపోతున్నవాడు కోప్పడికాదు ఆయాసపడికాదు ఆయాసపడి కోప్పడినప్పుడు ఉండేటటువంటి
ఊపిరి ఇంకెంత వేగంగా ఉంటుందో చూడండి.
ఆయన నిద్రపోతూ తీసేటటువంటి ఊపిరి గాఢ సుసుప్తిలో
ఉండేటప్పుడు తీసేటటువంటి ఊపిరి మంద్రంగా ఉంటుంది కానీ అప్పుడే ఆయన విడిచిపెట్టినటువంటి
ఊపిరి అంతగొప్పగా ఉందంటే అసలు ఆయన లేచి నిలబడి కోపంతో ఊగిపోయినప్పుడు
విడిచిపెట్టిన ఊపిరి ఎలా ఉంటుందో మీరు ఊహచేయవచ్చు. కాబట్టి ఎంతోకష్టంమీద వాళ్ళు
లోపలికి ప్రవేశించి ఆ విడిచిపెట్టిన ఊపిరిచేత కొట్టుకొని పోకుండగా ఊంచుకుని
జాగ్రత్తగా నిలబడ్డారు ఊర్ధ్వ రోమాంచిత తనుం శ్వసన్త మివ పన్నగమ్ ! త్రాసంయన్తం
మహా శ్వాసైః శయానం భీమ దర్శనమ్ !! ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన ఒంటి మీద
ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా అలా నిక్కబొడుచుకుని నిలబడి ఉన్నాయి, ఒకపెద్ద పాము
పడుకుని బుసకొడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అలా పడుకున్నటువంటి కుంభకర్ణుని
దగ్గరికి వీళ్ళు వెళ్ళారు భీమ నాసా పుటం తం తు పాతాళ విపులాఽఽననమ్
! శయ్యాయాం న్యస్త సర్వాంగం మేదో రుధిర గంధినం !! ఆయనా పడుకున్నప్పుడు
ఆయన ముక్కు రంద్రములు కనపడుతున్నాయి ఆ కనపడుతున్నటువంటి ముక్కు రంద్రములు ఎంత
ఘోరంగా ఉన్నాయంటే అవి ఏవో పెద్ద పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి, పాతాళ
విపులాఽఽననమ్ పాతాళలోకం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన యొక్క నోరు
ముఖమండలం శయ్యాయాం న్యస్త సర్వాంగం మేదో రుధిర గంధినం సాధారణంగా లోకంలో ఏ
పదార్థాన్ని తీసుకునిపడుకున్నాడో ఆ పదార్థానికి సంబంధించినటువంటిది ఊపిరియందు
కనపడుతూంటుంది, కొంచెం తెలిగ్గా అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాలంటే వెల్లుళ్ళిపాయి
చాలా విశేషంగా తినేస్తే ఏమౌతుందంటే ముక్కు ఊపిరిలో వెల్లుళ్ళి వాసన వస్తూంది మీరు
ఎప్పుడైనా గమనించారో లేదో.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఆయన
పడుకున్నటువంటి పర్యంకం అస్తరణమంతాకూడా రక్తపువాసనా మాంసపువాసనతో ఉంది అంటే ఆయన
కొన్ని వేల కడవల నెత్తురు తాగుతాడు దాహం తీరడానికి ఆయన వాడేది మంచినీరు కాదు ఆయన
నెత్తురే తాగుతాడు కాబట్టి ఆయనకి వండిపెట్టడమన్నది సాధ్యమయ్యే విషయంకాదు
పచ్చికూరగాయలు పెట్టినట్లే పశువులకి అవి ఏ భూతములన్నవికూడా ఆయనకేం నియమేంలేదు ఇవి
తినడమా ఇవి తినకపోవడమా ఆ గొడవేంలేదు, ఆయన భార్య చాలా అదృష్టవంతురాలు ఆవిడ
వండిపెట్టక్కరలేదు ఆయనకి రుచితో సంబధంలేదు ప్రాణులను తెచ్చి సంహరించి కుప్పలుగా
పడేస్తే వాటన్నింటిని ఏదో శివలింగం మీద అభిషేకం చేసేవాడూ... ఇక్కడే కోటప్పకొండలో
భారతీ తీర్థ స్వామివారితో కలిసి చదువుకున్నటువంటి వేదపడితుడున్నాడు ఉన్నారు
మహానుభావుడు ఆయన అభిషేకం చేస్తుంటే చూడాలి శివలింగానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది
ఒక దానిమ్మపండు ఇస్తే మంత్రభాగము అలాగే చదువుతారు ఆ దానిమ్మపండుని రెండు చేతులతో
పట్టుకుని నలిపేస్తే చక్కగా ధారగా దాన్నిమ్మరసం ఆ శివలింగం మీద పడిపోతూంది ఆయనా
అంత వైభవోపేతంగా చేస్తారు ఆ అభిషేకం.
అలా ఆ తెచ్చిన
జంతువులనన్నింటిని పిండేస్తే పాత్రల్లోకి ఆ పిప్పిగా పడేసినవాటిని తినేస్తాడు ఈ
కుండల్లో పోసినటువంటి రక్తాన్ని తాగేస్తాడు అదీ ఆయన ఆహారము అసలు తినే ఆహారము అలా
ఉంటుందంటే ఇంక ఆయన యొక్క యుద్ధం ఆయన యొక్క అలజడీ ఎలా ఉంటుందో ఉద్ధతి ఎలా ఉంటుందో
మీరు ఊహచెయ్యెచ్చు కాబట్టి మాంసానాం మేరు సంకాశం రాశిం పరమ తర్ఫణమ్ ఇప్పుడు
ఆయన్ని ఎలా నిద్రలేపడం అంటే పిచ్చి తిండి పిచ్చి నిద్ర రెండూ ఉన్నవాడు కాబట్టి ఆ
ఆహారపు వాసన తగిలితే లేస్తాడేమోననీ భూతానాం మేరు సంకాశం చంపబడినటువంటి అనేక
ప్రాణులు అవి మేకలు కావచ్చు జింకలు కావచ్చు లేళ్ళు కావచ్చు మేరు పర్వతం
ఎంతెత్తుంటుందో అంతతంత రాశులు పోశారు ఆయన చుట్టూ పోస్తే ఆ చనిపోయిన జంతువుల నుంచి
ఆ పుల్లటి నెత్తుటివాసనవస్తే లేస్తాడేమో ఆకలితోటని ఆయనేం లేవలేదు మృగాణాం
మహిషాణాం చ వరాహాణాం చ సంచయాన్ వీటిని తీసుకొచ్చీ ఎటువంటివాటినంటే మృగాణాం మహిషాణాం
చ అక్కడా జింకలు దున్నపోతులు అడవి పందులు వీటిని పోగులు పోగుల కింద కోసేశారు రాశి
మఽన్నస్య చాఽద్భుతమ్ పేద్ద రాసులకింద
అన్నాన్ని తీసుకొచ్చి పోసేశారు చక్రు ర్నైరృత శార్దూలాః ఈ తీసుకొచ్చి
రాక్షసులు పెద్ద పెద్ద కుప్పలకింద పోసినా కూడా ఆయన మాత్రం ఆ వాసన తగులుతున్నా ఆయనేమీ
నిద్రలేవలేదు తతః శోణిత కుమ్భాం శ్చ మద్యాని వివిధాని చ ! దానితోపాటు
కొన్నివేల కడవల నిండా పచ్చి నెత్తురు నింపి ఆ నెత్తుటి కుండలు అక్కడ పెట్టారు ఆ
నెత్తుటి మీద వాసనొస్తే లేస్తాడేమోనని
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఆయన
వాసన పీలుస్తున్నాడు, పీలుస్తున్నాడంటే ఊపిరి పీల్చుకున్నప్పుడు లోపలికి వెడుతూంది
కాని ఆయనేం కదలలేదు అంటే అంత గాఢనిద్రలో ఉన్నాడని అంత సుసుప్తిలో ఉన్నాడు మద్యాని
వివిధాని చ వివిధ రకాలైన కల్లు కొన్ని వేల కుండలలో పెట్టారు ఆయన లేవలేదు, పోనీ
సువాసన తగిలితే లేస్తాడేమోనని అగరు ధూప చందనం మొదలైనటువంటివి ముద్దలు తీసుకొచ్చీ ఆ
శరీరమంతా అలదారు లేవలేదు.
మేఘములు ఎలా గర్జిస్తాయో అలా రాక్షసులందరూ కలిసి పెద్ద
పెద్ద గర్జనలు చేశారు లేవలేదు, శంఖములు తీసుకొచ్చి కొన్నివేలమంది ఏక కాలంలో
పూరించారు లేవలేదు, ఆవేశం తెచ్చుకునీ పెద్ద పెద్ద కేకలు పెట్టారు అయినాకూడా
లేవలేదు అందరూ కలిసి చప్పట్లు కొట్టారు అయినా లేవలేదు ఆయన్ని కొన్ని వేల మంది
కలిసి అతి కష్టం మీద కదిపారు అటూ ఇటూ అయినా ఆయనేం లేవలేదు తం శైల శృంగై ర్ముసలై
ర్గదాభిః వృక్షై స్తలై ర్ముద్గర ముష్టిభి శ్చ సుఖ ప్రసుప్తం భువి కుమ్భకర్ణం రక్షాం
స్యుదగ్రాణి తదా నిజఘ్నుః ! పెద్ద పెద్ద రోకళ్ళు పట్టుకొచ్చీ ఆయన గుండెల మీద
కొన్నివేలమంది కొట్టారు ఆయనేం కదలలేదు, రోకలిబండలు పనికిరాలేదని గదలు తెచ్చారు
పెద్ద పెద్ద వృక్షాలు పట్టుకొచ్చారు అరచేతులతో పెద్ద పెద్ద ఇనుప గుదియలతో
పిడికిళ్ళతో బలంకొద్ది కొన్ని వేల మంది కొట్టారు గుద్దారు ఏక కాలంలో ఆయనేం కదలలేదు
అప్పుడు మృదంగాలు తప్పెట్లు ఢంకాలు శంఖాలు ఘన వాధ్యములు మొదలైనటువంటివన్నీ
తీసుకొచ్చి అతి బలవంతులైనటువంటి రాక్షసులు కొన్ని వేలమంది ఏకకాలంలో చెవుల పక్కన
నిలబడి మోగించారు ఆ శబ్దానికి లేస్తాడేమోనని ఆయన ఇంకాబాగా నిద్రపోయాడు. ఇలా కాదూ
అని చెప్పి మూలు కర్రలు తీసుకొచ్చి కొరడాలు తీసుకొచ్చీ అంకుశాలు తీసుకొచ్చి
గుఱ్ఱాల్నీ ఒంటెల్నీ గాడిదల్నీ ఏనుగుల్నీ పొడిచి రెచ్చగొట్టి చాలా ఆవేశంతో ఇవన్నీ
పరుగెత్తుతూ ఆయన శరీరం మీద తిరిగేటట్టుగా చేశారు. చేస్తే ఈ జంతువుల యొక్క
సమూహములన్నీ కూడా ఒక్కసారి లేచి ఆ కుంభకర్ణుడి యొక్క శరీరంమీదకి ఎక్కీ పరిగెత్తాయి
అయినా సరే ఆయన మాత్రం లేవలేదు, అప్పుడు వేయి ఢంకాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద బంగారు
స్థంభాలుపెట్టి ఈ వేయి ఢంకాలు కట్టారు ఏక కాలంలో వేయ్యి ఢంకాలు మోగించారు అయినా
సరే ఆయనేమీ లేవలేదు, ఇంక ఎలా లేపుదాం చాలా కోపమొచ్చింది చాలా అహస్యమేసింది.
ఇదేమి పిచ్చి నిద్ర చూడండీ ఎంత లేపినా లేవలేదనుకోండి ఏమిటి
మొద్దునిద్రేమిటి అంటారు ఆ మొద్దు నిద్రేమిటి అన్నట్లే లేపమని రావణ ప్రభువు అంటారు
ఇయ్యనేమో లేవరు వాళ్ళకు ఎంత ఆగ్రహం వచ్చిందంటే కొన్నివేల మంది ఆయన తల వెనకాల
నిల్చున్నారు కొన్ని వేల మంది రెండు చెవులకింద చేరారు చేరి ఏక కాలంలో ఇన్నివేలమంది
కలిసి జుట్టుపీకేశారు ఇన్నివేలమంది కలిసి చెవులు కొరికేశారు అయినా ఆయన కదలను కూడా
కదలలేదు ఎంత పిచ్చి నిద్రో బ్రహ్మగారి శాపమది కాబట్టి అలా నిద్రపోతూంటాడు ఆయన.
ఆయన్నెందుకనాలి కృతఘ్నః అని ఒకమాట కృతఘ్నఘ్నాయ దేవాయ జోతిషాం పతయే నమః
అని “సూర్యోదయమైపోతూంది అనీ
ఏపని లేనట్లు పడుకోవడానికి ఉలికిపాటుతో లేచి పూజా గృహంలోకి వెళ్ళాలన్న ఉత్సాహం
లేకుండా పడుకున్నవాళ్ళందరూ కుంభకర్ణులే” ఆయన్నే అనక్కరలేదు. కాబట్టి
ఇప్పుడు లేవట్లేదు అన్నబాధతో కొన్ని వందల కడవల నీళ్ళు పట్టుకొచ్చి ఆయన చెవుల్లో
పోసేశారు, పోసేస్తే మంగళగిరి
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
పానకాలస్వామి
కడుపులోకి పానకం వెళ్ళిపోయినట్లు ఈ వందల కడవల నీళ్ళన్నీ చక్కగా వెళ్ళిపోయాయి తప్పా
ఆయన మాత్రంలేవలేదు. ఇంక ఏం చేస్తే లేస్తాడు వాళ్ళకి అర్థం కాలేదు ఆఖరి ప్రయత్నంగా
ఒక్కపని చేద్దామనుకున్నారు వారణానాం సహస్రం తు శరీరేఽస్య
ప్రధావితమ్ ! కుమ్భకర్ణ స్తతో బుద్ధః స్పర్శం పర మఽబుధ్యత
!!
ఒక్కసారి కొన్ని వేల ఏనుగులును తీసుకొచ్చి అన్ని ఏనుగులని ఆయన శరీరంమీదకి
ఎక్కించేశారు ఎక్కించేస్తే కాళ్ళమీద చేతుల మీద కడుపుమీద గుండెల మీద కొన్ని వేల
ఏనుగులెక్కాయి ఎక్కి ఏనుగుల్ని తిప్పారు ఎనుగు బరువంటే మాటలాండీ ఇన్నివేల ఏనుగులు
ఆయన శరీరంమీద పడతాయంటే ఇంకా పడుకుంటే ఎక్కడానికి ఇంకో ప్రదేశం కూడా ఉంది వెనకనుంచి
వెనక వీపూ అదీ సాధరణంగా “వీపు ఎక్కరా అని ఎక్కించుకుంటుంటారు తాతగారు మనవన్ని”
ఎక్కించుకోవలసిన వీపు ఖాళీగానే ఉంది బరువు పెట్టుకో కూడని వీపుల మీద బరువెక్కిస్తే
గబుక్కున ఉలికిపడేటటువంటి కడుపుమీద తొడలమీద కాళ్ళమీద ఇన్నివేల ఏనుగులు
తిరుగుతున్నాయి నిలబెట్టడం కాదు ఏదోను అవి తిరుగుతున్నాయి అంటే ఇంకా ఎక్కుతాయి
వాటికిచోటుంది ఇక ఊరుకుంటారేమిటి తిరిగితే లేస్తాడేమోనని.
ఇన్నివేల ఏనుగులు శరీరం మీద తిరగడం మొదలు పెట్టిన తరువాత
ఆయనకు కొంచెం తెలివొచ్చినట్లైంది ఆయనకి తెలివొస్తే వచ్చే పెద్ద సమస్యేమిటో
తెలుసాండీ తినేస్తాడు ఎదురుగుండా ఏది కనపడితే అది, ఇప్పుడు వీడితో ఉన్న బాధేమిటంటే
వానరులా రాక్షసులా అదేమీ చూడడు. మొహం కడుక్కోవక్కరలేదు బెడ్ కాఫీ తాగేయవచ్చు అంటే కుంభకర్ణిడి లక్షణముందీ
అని గుర్తు కదాండీ! అందుకనీ... ఆయన ఎదురుగుండా ఏది కనపడితే దాన్నేనోట్లో
పడేసుకుంటాడు వండక్కరలేదు అదేం పచనం చెయ్యక్కరలేదు అది పరిగెడుతున్నా బతికున్నా
ఎలా ఉన్నా తీసి నోట్లో పడేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు భయమేసింది
లేస్తాడేమోనని భయమేసింది అనుమానమొచ్చి వాల్లందరు పారిపోయారు పక్కకి, కానీ లేచాడో
ఆకలి కడుపు నిండిదో నిద్ర లేరని మీరు అనుకుంటున్నారా కుంభకర్ణుని అంశవాళ్ళు చాలా
మంది ఉన్నారు. నాకు తెలిసున్నాయన ఒకాయన ఉన్నాడు ఆశ్చర్యపోయాను ఓసారి తలకి కట్టుకట్టుకుని
కనపడ్డాడునాకు, ఏమండీ అలా ఉన్నారేమి అని అడిగాను నేను అడిగితే ఆయన అన్నాడు
ఏమిలేదండీ నాకు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక పొలముంది అక్కడికెళ్ళి బాగా ముంజి కాయలు
తినేశాను కోటేశ్వరావుగారు తీసి రైతిచ్చాడు చాలా ముంజికాయలు తినేసి సాయంకాలం
పడుకుని నిద్రపోయానండీ నిద్రపోతే మరునాటి సాయంకాలం తాటిపండు తలమీద పడిందండి
అప్పుడులేచాను దెబ్బతగిలితే కట్టుకట్టారు అన్నాడు. నేను తెల్లబోయాను అదేమిటి
ముందురోజు సాయంకాలం పడుకోవడమేమిటి ఆసుర సంధ్యవేళలో ఉత్తర సంధ్యలో పడుకోకూడదు
కదా... అన్నాను, మీరు అన్ని అలా అంటారండీ అన్నాడు.
మరి ఇవ్వాళ సాయంకాలం పడుకుంటే మర్నాటి సాయంకాలం తాటి పండుపడ్డాక
తెలివొచ్చింది కట్టుకట్టుకుని కనుపడ్డారు నాకు, ఎంత అసహ్యమేసిందో ఆ తాటిచెట్టుకి
నా ముంజలన్నీ తినేసి అలా పడుకున్నాడని ఓ పండు పారేసింది తలమీద అది కట్టు కట్టుక
తిరుగుతున్నాడు ఇంకా అది పడకపోతే అంటే ఎప్పుడు లేచేవాడో అలా రెండు మూడురోజులు
పడుకునేవాడులా ఉంది. నాకు చాలా ఆశ్చర్యమేసింది వాల్మీకి మహర్షి ఉత్తిగనే రచన
చేయలేదు ఇలాంటివాళ్ళు ఉంటారన్నమాట అదేంటీ ప్రసంగం ఎక్కడో ఏ టీవీలోనో వింటే
నాగురించే చెప్పారు కోటేశ్వరరావుగారు అనుకుంటాడు. పేరు చెప్పలేదు కాబట్టి
గొడవలేదు. కాబట్టి స నాగ భోగాఽచల శృంగ కల్పౌ విక్షిప్య
బాహూ గిరి శృంగ సారౌ వివృత్య వక్త్రం బడబా
యుద్ధ కాండ ముప్పయ్
తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ముఖాఽభం నిశాచరోఽసౌ
వికృతం జుజృమ్భే ! నిద్రలేచినవాడికి మంచి నిద్రట్లో లేచాడనుకోండి ఆవలింతలు
మొదలౌతాయి మంచి గాఢనిద్రలో లేపేశారు కదాండి కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన కళ్ళు
నులుముకున్నాడు ఎర్రని సూర్యబింబము ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆయన కళ్ళు. లేచి
చేతులు ఇలా చాపాడు ఎందుకూ అంటే ఓసారి ఇలా అనుకోవడానికి ఇలా అన్నాడు ఇలా అంటే
ఇప్పుడు ఆయన చేతులు ఎలా ఉన్నాయటాంటే పర్వతము యొక్క శిఖరములు ఎలా ఉంటాయో అలా
ఉన్నాయట ఆ చేతులు మహా సర్పాలు ఎంత పొడుగ్గా ఉంటాయో అంత పొడుగ్గా ఉండి ఆ చెయ్యి ఇలా
ముట్టుకుందామంటే దిక్కుమాలిన చెయ్యి ఎక్కడ మెత్తదనంగా ఉడడంలేదు గిరిశృంగములు ఎంత
కఠినంగా ఉంటాయో అంత కఠినంగా ఉన్నాయి. ఆసలు ఆయన్ని ఎలా పడుగొట్టాలో అర్థంకాదు
యుద్ధంలో, యుద్ధ భూమిలో ఆయన యుద్ధానికి వెళ్తే మీరు ఎలాగో ఎదర వింటారుగా...
కాబట్టి ఇప్పుడు అంత
కఠినమైనటువంటి చేతులు అటువంటి బలమైనటువంటి తన బాహువులను ఒకసారి చాపాడు, చాపి
సముద్ర గర్భంలో ఉండేటటువంటి బడబాలనము ఎలా ఉంటుందో అటువంటినోరు అక్కడొక
అగ్నిహోత్రము ఉంటుందీ అని అటువంటి నోరు తెరిచాడు అంటే ఆ నోరు అంత ఎర్రగా ఎప్పుడూ
మరి నెత్తురే తాగి ఎర్రగానే ఉంటుంది ఎప్పుడు ఏది తాగితే ఆలానే ఉండేలా ఉంది తస్య
జాజృమ్భమాణస్య వక్త్రం పాతాళ సన్నిభమ్ ! దదృశే మేరు శృంగాఽగ్రే
దివాకర ఇవోదితః !! ఆయనొక పెద్ద ఆవళింత ఆవలించాడు, ఆవలిస్తే ఆ నోరు బాగా
ఎప్పుడు చేరుస్తారంటే ఆవలించినప్పుడే అదో గొప్ప సంతోషమనుకుంటారు అదో గొప్ప ప్రజ్ఞా
అనుకుంటారు అనుకుని ఉపన్యాసం వినడానికొచ్చి మైకులోచెప్పే ఉపన్యాసం వినపడుతుందోలేదో
కానీ వాడి ఆవలించిన ఆవలింత రామ నామ క్షేత్రంవరకు వినపడుతుంది. అలా ఆవలించి అదేదో
చాలా గొప్ప అనుకుంటాడు రాక్షసాంశలోకివెడుతారు అలాంటి పిచ్చిపన్లుచేస్తే
ఉపన్యాసానికి వచ్చి నిద్రపోతూండడం ఉపన్యాసానికి వచ్చి ఆవళిస్తూండడం, వచ్చినప్పుడు భగవత్ కార్యం మీద వెళ్ళినప్పుడు
ఎప్పుడు కూడా పూనికతో ఉండేటట్లు వెళ్ళాలి అంతేతప్పా భగవత్ కార్యమునందు
పిచ్చినిద్రా భగవత్ కార్యమునందు అలసత్వముతో ఉండడం సోమరితనంతో ఉండడం
మంచిపద్ధతికాదు. కాబట్టి ఆయన ఓ పెద్ద ఆవళింత ఆవలించాడు ఇప్పుడు నోరు బాగా పగలతీసి
ఆవలిస్తే పాతాళ లోకమేలావుంటుందో అలా ఉందట అంటే ఒక లోకమే ఆ నోటిలో పడుతుందా
అన్నట్లుగా ఉంది.
ఆయనా దదృశే మేరు శృంగాఽగ్రే
దివాకర ఇవోదితః మేరు శృంగం మీద ఉదయించేటటువంటి సూర్యబింబమేలా ఉంటుందో అంత
ఎర్రగా ఉన్నాయి పైతట్టు ఆ దవడలు ఆనాలుకభాగము మొదలైనటువంటివన్నీనూ ఆయన నిద్రలేచారు
లేవగానే నన్నెవరులేపారు అన్న ఆలోచన తరువాత లేపినవారు కనపడుతారు తరువాత మాట్లాడచ్చు
ముందు ఆకలీ లేవగానే ఆకలేయడం
అంత మంచి లక్షణంకాదు అలా ఉండకూడదు, లేవగానే ఆకలేమిటీ లేచిన తరువాత ముందు
కనీసం అనుష్టానమయ్యేంతవరకు శరీరం నిలబడగలగాలి ఏదో కొన్ని కొన్ని వ్యాధులుంటాయి
ఆరుగంటలు దాటితే తినకుండా ఉండకూడదు ఏదో ఒకటి కాబట్టి తినాలి అదోప్రారబ్దము కాబట్టి
అటువంటప్పుడు దానికేం దోషం పట్టదుకానీ... శరీరాన్ని
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
నిలబెట్టవలసి
వచ్చినప్పుడు అదొక ధర్మం కిందకి వెళ్ళిపోతూంది తప్పూ అని చెప్పడం కూడా చాలా కష్టం
అలా చెప్పకూడదు కూడా... ఎందుకంటే ఇది ఉంటే కదా ధర్మసాధన తప్పా ఉత్తిగానే లేవగానే
ఆకలేసేసైడము లేవగానే ముందు ఏదో ఒకటి తినేసైడము అదే పనిగా తాగేస్తుండడము అలా
ఉండకూడదు. ఈశ్వర కార్యమునకు
వెళ్ళిపోయే పూనిక ఎక్కువుండాలి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో దాని గురించి
తప్పా అంత మరీ ఆహారమునందు వ్యామోహం ఆహారం తినేసిన తరువాత నిద్రపోవడం ఎప్పుడు
బతుకంతా దేనిమీదా అంటే ʻకడుపు కన్నుʼ
ఇది (కడుపు) నింపుతూ ఉండడం ఇది(కన్ను) పడిపోతూండడం ఇది (కన్ను) విప్పడం
ఇది(కడుపు)నింపడం, ఇది (కడుపు) నింపడం ఇది (కన్ను) పడిపోవడం, ఇది (కన్ను) విప్పడం
మళ్ళీ తినడం అలా ఉండ కూడదు. కొంతమంది చూడండీ ఎందుకు తినేస్తారో తెలియదు
పిచ్చితిండి అంటారు మా అమ్మగారు ఒకమాట అంటూండేది కూర బాగుంది అని రెండోమాట
వేసుకుని కూరబాగుందని అని మూడోమాట అంటే ఆవిడ అనేది కడంటి కడాప భుజంగం నేర్చుకో
జీవితంలో అనేది అది వ్యామోహం, ఆహారమును అలా తినకూడదు ఒకే పదార్థంతో రుచిగా
జుర్రుకి తినడం మంచిపద్ధతికాదు అది వ్యామోహం కిందకి వెళ్ళిపోతూంది కొన్నాళ్ళకి
పదార్థం బాగుంది అంతే దానియందు వ్యామోహం లేకుంగా అభినందించి ఇంకొకటి తినడం కూడా
నేర్చుకోవాలి అలా ఉండాలి తప్పా కడంటి కడాపు తినకండి అని చెప్పేది ఆవిడ,
పెద్దలు మహాతల్లు వాళ్ళు అలా నేర్పారు మంచిమాటలు చెప్పారు.
కాబట్టి దదృశే మేరు
శృంగాఽగ్రే దివాకర ఇవోదితః లేవగానే తినేయాలి
ఇప్పుడు కాబట్టి చేతులు చాపి వెతుక్కుని చూశాడు ఓసారి అబ్బో పెద్ద పర్వత శిఖరాల్లా
పోసేశారు ఎలాగో తినేస్తాడని అన్నం జంతువులు వీటినన్నింటిని ఇవన్నీ తినేశాడు
తినేసిన తరువాత అక్కడ పెట్టినటువంటి రక్తాన్నంతటినీ కూడా కొన్నివేల కడవల రక్తాన్ని
తాగేశాడు తాగేయడం వల్ల కొవ్వు తినేశాడు మాంసం తినేశాడు అదంతా ఒళ్ళంతా
పోసేసుకున్నాడు ఇప్పుడు లేచాడు ఇప్పుడు బాగాలేచి ఎవరో ఆ గోడపక్కన నిల్చున్నారు
నన్ను ఎందుకు లేపారన్నాడు. ఇప్పుడు అంటే ఇంక తినడు కడుపు నిండింది అలా అని కూడా
నమ్మకమేమీ ఉండదు తినేస్తుంటాడు కుంభకర్ణుడు మీరు యుద్ధకాండలో చూద్దురుకాని ఆయన
యుద్ధం చేయ్యడం కన్నా తినేస్తుంటాడు ఎక్కువ, అదే ఆయన యుద్ధమంతే అసలు లోకంలో చాలా
విచిత్రమైన స్థితి ఏమిటంటే ఈయన గురించి దేవతలు బెంగపెట్టుకున్నారు ఈయ్యన లేసుంటే
నేను మీరు మన వంశాలు అని ఏమి ఉండవు ఎందుకంటే దేవతలు బ్రహ్మగారిని అడిగారు
ఈయ్యనుంటే లోకముండదు తినేస్తాడు అన్నారు. పసితనంలో తినేశాడు సగం మందిని, ఆయన
తినడానికి ఋషి ఉండడు రాక్షసుడుండడు వానరముండదు తొండ బల్లి కుక్క పిల్లి ఏది
కనపడ్డా తింటాడు అలా నిద్రపోతాడు అంతే. అది అసలు ఆ విచ్రిం చూసి బ్రహ్మగారు
ఉలిక్కి పడ్డాడు ఆయన్ని చూసి ఒరే నిన్ను ఎలాగ కన్నాడురా విశ్రవసోబ్రహాని అడిగాడంటే
మీరు ఆలోచించండి, రాముడంతటివాడు నేను ఎన్నడు చూడలేదు ఇలాంటి ప్రాణిని ఇదేమిటని
అడిగాడాయన అంత విచిత్రమైనటువంటి ప్రాణి అసలా కుంభకర్ణుడు.
కాబట్టి ఇప్పుడు ఎవరు గోడచాటున ఉన్నవాళ్ళు ఎందుకులేపారు
నన్ను ఎవరైనా లేపారా..? లేపారు కాబట్టే కదా ఇవన్నీ సిద్ధంగా పెట్టారు ఇంకా నేను
నిద్రపోలేదే కంటినిండా ఎందుకు లేపేశారు ఏమంత అవసరమొచ్చేసింది. రాజుకేమైనా ఇబ్బంది
వచ్చిందా అన్నాడు అంటే అంత అవసరమైతే తప్పా ఇయన్ని లేపరెవరు, ఈయన్ని లేపవలసినటువంటి
అవసరం ఆ
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఊళ్ళో
ఏమి ఉండదు ఎందుకంటే వీళ్ళ తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళే
చక్కబెట్టేస్తారు, కాబట్టి ఎందుకు ఇబ్బంది వచ్చేసింది. ఇప్పుడు విరూపాక్షుడు
అనేటటువంటివాడు చాలా జాగ్రత్తగా అంజలి ఘటించి మాట్లాడాడు “మనుష్యుని వలన మనకు
తీరనటువంటి భయమేర్పడింది” అని అన్నాడు మానుషా న్నో భయం రాజం స్తుములం
సంప్రభాధతే మనకి మనుష్యుల వలన పెద్ద ఆపద వచ్చింది “ఉలిక్కి పడ్డాడు” సీతాపహరణం
కారణంగా చాలా కోపాన్ని పొందినటువంటి రామ చంద్ర మూర్తి వానరసైన్యంతో కలసి
లంకాపట్టణం మీద యుద్ధానికొచ్చారు ఒక వానరుడైనటువంటి హనుమా లంకా పట్టణ ప్రవేశం చేసి లంకనంతట్నీ
కాల్చి కొన్నివేలమంది యోధుల్ని సంహరించి రావణుని యొక్క కుమారుడైన అక్ష కుమారున్ని
కూడా సంహరించాడు నేడు మీ అన్నయైనటువంటి రావణాసురుడు రామ చంద్ర మూర్తి చేతిలో
ఓడిపోయి పరాభవాన్నిపొంది అంతఃపురంలో కుమిలిపోతూ కూర్చున్నాడు కాబట్టి నిన్ను లేపి
తీసుకురమ్మని అడిగారు కాబట్టి నీవు బయలుదేరి మీ అన్నగారి దర్శనానికి వస్తే
బాగుంటుంది అన్నారు. అంటే ఆయనన్నారు ఎందుకు యుద్భ భూమికి వెళ్ళిపోతాను అన్నాడు రామ
లక్ష్మణుల్ని తెగటార్చేస్తాను ప్రతీవాడికీ ఇదో తేలిక, వెళ్ళిపోతాను అన్నాడు. అంటే
వాళ్ళన్నారు కాదు ముందు నీవు మీ అన్నగారిని చూసి ఆయన మాటలువిని వెళ్ళితేనే
బాగుంటుంది కాబట్టి నీవు లంకాపట్టణంలో ఉన్న రావణ అంతఃపురానికి రావలసింది అన్నారు.
ఆయన లేచి స్నానం చేశాడు స్నానం చేసి వస్త్రములు
కట్టుకునేటప్పటికి ఆయనకి దాహం వేసింది అంటే ఈశ్వరుడి విషయంలో మనం ఇది పాటిస్తుంటాం
ఈశ్వరుడికి అభిషేకం చేసిన్నప్పుడు ఎక్కువ ఆకలేస్తుందని అభిషేకం చేశారనుకోండి మీరు
ఈశ్వరునికి వెయ్యదూ అని మీరు అనుకోకండి దృవ మూర్తికి అభిషేకం చేస్తే ప్రతిష్ట
చేయబడనటువంటి మూర్తిని మీరు సరిగ్గా నివేదనలు పెట్టలేదనుకోండి అవి ఆకలిపొందుతాయి.
కాబట్టి దేవాలయ నిర్వహణ సరిగ్గాలేకపోతే ఎవరు నిర్వహిస్తున్నారో వారు ఈశ్వరుని
యొక్క ఆగ్రహానికి గురౌతారు. అందుకనీ దేవతలు అభిషేకాన్నిపొందితే ఆకలి బాగావేస్తుందీ
అని కొచెం రాసి గట్టిగా ఉంచి అభిషేకానంతరం నివేదన చేస్తారు. అభిషేకం చేస్తే దాహం
కూడా వేస్తుందీ అనీ స్నానంతరం శుద్ధ
ఆచమనీయం సమర్పయామీ అని ఒక మంత్రం అందుకే షోడశోపచారాల్లో స్నానం చేస్తే
కొద్దిగా నీళ్ళు తాగండీ అంటాం ఎందుకంటే స్నానం చేసిన తరువాత కుడా బడలికపోతూంది
శరీరం దానివల్ల కొద్దిగా నీటిని పుట్టుకుంటుందీని అలా ఇప్పుడు ఆయన అలా స్నానం
చెయ్యగానే ఆయనకి దాహమేసింది. ఆయనకి దాహమేస్తే ఏదో కొద్దిగా మంచినీళ్ళుతాగి
రావణాసురున్ని కలుసుకోవాలి ఆయనకు కొద్దిగా దాహం తీరడమూ అంటే రెండువేల కడవల మద్యం
తాగాడు, కొద్దిగా అంటే ఒక గ్లాసుడు రెండు గుటకలు మంచినీళ్ళు తాగి ఎక్కడికైనా బయలుదేరుతుంటారు
చూశారా గొంతు తడారిపోకూడదనుకుంటే ఒక్క రెండు గటకలు తాగి బయలుదేరుతారు అలా ఒక
రెండువేల మద్యపు కడవలని స్వీకరించాడు, స్వీకరించి రావణాంతఃపురానికి వెళ్ళడం కోసమనీ
చక్కగా ఆయన్ని తీసుకెళ్ళే వాహనాలేముంటాయండీ కష్టం కదా బహుషః రావణాసురునికి ఎందుకో ఆ
ఆలోచన కూడా రాలేదులా ఉంది ఆలా తయారుచేద్దామని ఆయనా లంకాపట్టణ రాజవీధుల్లో నడిచి
వెళ్తున్నాడు, వెళ్తూంటే లంకా ప్రాకారము బయట వానరులున్నారు వాళ్ళకి కనపడ్డాడు ఈయ్యన
కనపడగానే వాళ్ళు పారిపోవడం మొదలెట్టారు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఎందుకనీ అంటే అసలు
అదేమిటి అంతప్రాణి ఏమిటి అదొస్తుందా ఏమిటి? యుద్ధానికని అడిగారు అడిగితే మరి అక్కడ
లేచిందంటే వస్తూంది లంకలో లేచిందంటే ఇక్కడ వస్తూంది కదా వానరులమీదికి అనగానే అసలు
దాంతో మనకి యుద్ధమేమిటని పారిపోవడం మొదలు పెట్టారు అప్పుడు రామ చంద్ర మూర్తి కూడా
ఆశ్చర్యపోయాడు. నేను ఇతఃపూర్వం ఎప్పుడూ ఇటువంటి ప్రాణిని కాని ఇంత పెద్ద శరీరమున్న
రాక్షసున్ని కాని నేను చూడలేదు విభీషణా అసలు ఎవరీయ్యనా అని అడిగాడు అడిగితే అస్య
ప్రమాణా త్సదృశో రాక్షసోఽన్యో న విద్యతే ఈయ్యనా మా
అన్నగారైనటువంటి రావణాసురుని యొక్క తమ్ముడు నాకు అన్నగారు మధ్యలో
పుట్టినటువంటివాడు కుంభకర్ణుడనేటటువంటి పేరు కలిగినటువంటివాడు విశ్రవసోబ్రహ్మ యొక్క
కుమారుడు ఈయ్యనా అస్య ప్రమాణా త్సదృశో రాక్షసోఽన్యో
న విద్యతే
రాక్షస జాతి మొత్తంలో ఇంత పెద్ద శరీరమున్న రాక్షసుడు ఇప్పటివరకులేడు అంతపెద్ద
రాక్షసుడు శూల పాణిం విరూపాక్షం కుమ్భకర్ణం మహా బలమ్ ఈయ్యనా కొన్ని బారువుల
పొడవుండేటటువంటి ఒక పెద్ద శూలాన్ని పట్టుకుంటాడు అది కాల్చినటువంటి నల్ల ఇనుముతో తయారుచేయబడిన
శూలమది ఆ శూలానికి బంగారు పూత పూయించాడు రావణాసురుడు ఏదో ఆ విగ్రహాలకీ వాటికీ
బంగారు పూత పూయిస్తుంటారు చూడండి గోపురాలకి అలా ఆయన పట్టుకునే శూలానికి బంగారు పూత
పూయించాడు ఆ శూలం పట్టుకుని యుద్ధం చేస్తుంటాడు అలా వాళ్ళు విశేష బలంతో ఉంటారు.
కానీ కుంభకర్ణుని యొక్క గొప్పతనమేమిటంటే అతనిది దేవతానుగ్రహంచేత వచ్చినటువంటి
బలంకాదు దేవతలు ఆ బలం కనపడకుండా ఆయన్ని నిద్రపుచ్చారు. నిజంగా ఆయన్ని
వదిలేశారనుకోండిమీరు ఆయన్ని వదిలేస్తే మీరు పట్టుకోలేరు ఎందుకో తెలుసాండి ఆయన ఇంకా
తినేస్తాడు ఆర్నెల్లు పడుకోలేదనుకోండి పడుకోకపోతే ఇంకా తినేస్తాడు ఇంకా తినేస్తే
ఇంకా పెరిగిపోతాడు ఇంకా పడుకుంటాడు అదే పనిగా తినీ పడుకునీ తినీ పడుకునీ చేస్తే
ఇంకా ఎంత పెరిగిపోతాడు కాబట్టి అతని బలము దేవతానుగ్రహంగా వచ్చినది కాదు పుట్టుకతో
వచ్చింది.
అన్యేషాం రాక్షసేన్ద్రాణాం వర దాన కృతం బలమ్ ఇతరమైనటువంటి రాక్షసులు
యొక్క బలం ఇలా పుట్టుకతో వచ్చిన బలంకాదు వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహంగా వచ్చినటువంటి
బలం ఏతేన జాత మాత్రేణ క్షుధాఽర్తేన మహాత్మనా !
భక్షితాని సహస్రాణి సత్త్వానాం సుబహూ న్యఽపి
!! ఆయన
ఆకలి కూడా అలాగే ఉంటుంది రామా! ఆయనకి చాలా ఆకలివేస్తే ఎన్నిప్రాణులను ఆయన తింటాడో
అన్నది లెక్కకట్టడం చాలా కష్టం. సాధారణంగా లోకంలో ఇంకనాకు చాలండీ అని తృప్తితో అనేది ఏదంటే ఒక్క అన్నం
విషయంలోనే మీరు ఎన్నిచ్చినా నాకింక చాలండీ అని మనిషి అంటాడోయని ఊహించడం
చాలా కష్టం ఒక్క భోజనమైతే మాత్రం ఏదో ఒక స్థితిలో అమ్మా కడుపునిండిపోయింది ఇంక
వద్దూ అంటాడు ఆ మాటలేని ప్రాణి ఎవరైనా ఉంటే లోకంలో కుంభకర్ణుడు ఒకడే కాబట్టి ఎంత
తింటాడూ అన్నది చెప్పడం కుదరదు రామా! ఈయ్యనా ఒకానొకప్పుడు దేవతలతో యుద్ధం
జరుగుతున్నప్పుడు మా అన్నయ్య తరుపున యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళితే పాపం
ఆ ఇంద్రుడూ ఏదో పెద్ద ప్రాణి అనుకొని తన వజ్రాయుధాన్నిపెట్టి గుండెలమీద కొట్టాడు
ఈయ్యన ఓసారి ఇలా గోక్కుని ఏ ఆయుధమేమీ పట్టుకురాకుండా వెళ్ళాడు ఆ ఐరావతం యొక్క దంతం
ఒకటి పీకేశాడు, పీకేసి ఆ దంతం పెట్టి ఇంద్రున్ని కొట్టేశాడు ఇంక కొత్తగా ఆయుధమేమీ
తెచ్చుకోలేదు అదిపెట్టే కొట్టాడు కొడ్తే ఇంద్రుడు అదిరిపోయాడు దెబ్బకి అదిరిపోయి
దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారిదగ్గరికి వెళ్ళారు అసలు ఈ ప్రాణి ఏమిటీ దీని
స్థితి ఏమిటీ అని వాళ్ళన్నారూ ఏవం ప్రజా యది త్వేష భక్షయిష్యతి నిత్యశః ! అచిరే
ణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి !! ఓ బ్రహ్మా..! మీరు సృష్టి చేస్తుంటారు మీరు
ఎంత వేగంగా సృష్టి చేసినా ఈ కుంభకర్ణుడనేటటువంటివాడు లోకంలో తిరగడం మొదలుపెడితే...
మీరు ఇలా సృష్టిచేసి ఇలా వదలగానే వీడు తింటుంటాడు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అంటే
ఒక్కొక్కడు చూడండి పెసరట్టు తినడంమీద ఉత్సాహం ఉండదు, అప్పుడే వేసిన పెసరట్టు
తింటాడు, ఒక్కొక్కడి స్థితి అలా ఉంటుంది అంటే ఏమో అది మంచిదో చెడ్డదో నేను చెప్పడం
అలా నాకేం ఉత్సాహంలేదు కానీ... నేను వచ్చేలోపల వేసేయద్దు అని చెప్తారు, తొమ్మిదైనా
పాపం అలా ఆవిడ అలా కూర్చోవాలి, కూర్చుని అది ఎండవనీవ్వండి కొండవ్వనీవ్వండి
ఏమవనీవ్వండి అప్పుడు కూర్చుని ఒక్కొక్క వంటింట్లోకి ఏదో తొమ్మిదో పదో
అయ్యేటప్పటికి ఎండ లోపలికి కొట్టేస్తుంటుంది తూర్పు సాధారణంగా ఆగ్నేయంలో కదాండి
వంటశాలలు ఉంటాయి. అప్పుడు తూర్పునుండి ఎండ పడుతూంది వేసవి కాలంలో ఈయ్యనేమంటాడంటే
నేను పదింటికి తింటాను అప్పుడు వేద్దువుకాని వేడిగా పెసరట్లు అంటాడు, పెసరట్టంటే
అది వేసేసి వెళ్ళిపోయ్యేదికాదు అక్కడే నిలబడాలి మాడిపోతూంది మాడిపోతే ఆయన కోప్పడుతాడు.
ఆయనేం చేస్తాడంటే హాల్లో కూర్చుంటాడు టేబులుమీద ఈవిడేం చెయ్యాలంటే వంటింట్లో
నిల్చోవాలి దిక్కుమాలిన పెసరట్టుకాలద్దూ చిన్నగా పెట్టాలి హైలో పట్టడానికి ఉండదు
పెట్టి ఈవిడ అలా నిలబడాలి, ఈవిడ ఒక వేడి పెసరట్టు ఒకటి అక్కడ పెడితే అది తినేలోపలే
ఇంకొక పెసరట్టు వేసేయ్యాలి అది చల్లారితే ఆయనకి కోపం బాగుండదని ఇదే... సరే... ఇంత
దానిగురించి ఇంక అంతకన్నా ఎందుకండీ...
కాబట్టి దేవతలన్నారు
బ్రహ్మగారితోటి నీవు సృష్టిచేసిన ప్రాణులు ఈ లోకంలో ఏమీ ఉండవిక ఖాలీగా ఉంటుంది
నీవు ఎవరికోసం సృష్టిచెయ్యాలో తెలుసా... ఆయన తినడానికి సృష్టించాలి ఆఖరికి ఒకానొకప్పుడు
ఆకలేసి అంత ఆలస్యమేమిటనీ నిన్నే పడేసుకుంటాడు నోట్లోకి కాబట్టి అచిరే ణైవ కాలేన
శూన్యో లోకో భవిష్యతి లోకమేం ఉండదు ఖాలీయైపోతూంది, అంటే చతుర్ముఖ
బ్రహ్మగారంతటివారు ఆశ్చర్యంతో గడ్డం కింద చెయ్యిపెట్టుకుని అన్నాడూ... ʻఅసలు
ఆ విశ్రవసోబ్రహ్మ అలాంటి పిల్లాన్ని ఎలా కన్నాడుʼ
అన్నాడు. అది లోకోద్దారణ కొరకు, ఆయన అన్నాడు తస్మాత్ త్వమ్ అద్య ప్రభృతి మృత
కల్పః శయిష్యసే వీడు చచ్చిపోయినవాడిలా ఇవ్వాల్టి నుంచి పడుకుని నిద్రపోతాడు,
బ్రతికుంటాడు కాని పడుకుని నిద్రపోతూంటాడు. అంటే వెంటనే పడుకున్నాడు బ్రహ్మగారి
వాక్కు కదాండి నిద్రపోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఇక తినేయడు కదా గొడవొదిలిపోతూంది,
ఈశ్వరుడు నిద్ర ఇవ్వడం ఒక రకంగా అదృష్టం లేకపోతే ఏమీ తోచలేదని వేయించిన సెనగపప్పులు
వేస్తుంటారు కొంతమంది ఆ తినడానికి అర్థమేముండదు ఏదైనా తినేస్తారు. కాబట్టి ఇప్పుడూ
ఈయ్యన నిద్రపోతాడూ అన్నారు అంటే ఆయన నిద్రపోయాడు ఇప్పుడు బాధ ఎవరికి కలిగిందంటే
రావణాసురునికి కలిగింది తను విచిత్రమైనటువంటి బంధుప్రీతి.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఇప్పుడు ఆయన
అకస్మాత్తుగా లేచి బ్రహ్మగారిదగ్గరికి వచ్చాడు మత్యవంశంలో పుట్టాడు నీ వంశంలో
బంగారు చెట్టు పెంచినట్లు పెంచావు నీవే ఇంత చక్కటి పిల్లాడు ఎంత చక్కటి పిల్లాడు
ఇలాంటివాడు ఉన్నాడేమిటి లోకంలో ఎంత ముద్దు ముద్దుగా తింటాడూ ఎంత బొద్దుగా ఉంటాడూ
అలాంటి పిల్లాన్ని నిద్రపుచ్చేస్తావా వాడు గుణ గుణ తిరుగుతూ ఆడుకుంటూ తింటూ తిరుగుతూంటే
ఎంతబాగుటూంది వాన్ని అలా శపించావేమిటీ ఇంకొక మాట చెప్పు అన్నాడు అంటే ఆయన అన్నాడు
ఆరు నెలలు తింటాడు ఆరు నెలలు పడుకుంటాడు ఆరు నెలలకి ఒక్కరోజు లేస్తాడు ఆ రోజున
వీడు తినడానికి నేను చేసిన సృష్టిలో చాలా సరిపోతూంది అన్నాడు అది కూడా
కణకణలాడిపోతున్న ఆకలితో అగ్నిహోత్రమెలా ఉంటుందో అలా తినేస్తాడు అగ్నిహోత్రంలో ఏది
పాడేస్తే అది కాలిపోతుంది దాన్నేం పచనం చేయడమేం ఉండదు ఆయనకి అంత టైమేం ఇవ్వడు,
కాబట్టి ఆరు నెలలకు లేస్తూంటాడు లేచి ఒకరోజు ఉంటూంటాడు ఉండి తింటూంటాడు కాబట్టి
నేను ఆ ఒక్క ఉపశాంతి వాక్కు ఇస్తాను అంటే అప్పట్నుంచి ఆయనా ఆరు నెలలు నిద్రపోవడం
లేస్తూ ఉండడమనేటటువంటిది అలవాటుగా మారిపోయింది అటువంటివాడు. చాలా భయంకరమైనటువంటి
యుద్ధం చేస్తాడు కుంభకర్ణుడు యుద్ధానికొస్తే అసలు ఆ ప్రాణినిని చూసి యుద్ధ భూమిలో
నిలబడడం ఎవరికైనా చాలా కష్టం. అంటే రామ చంద్ర మూర్తి ఆశ్చర్యపోయే లోపలే చాలా మంది
వానరులు సేతువుదాగా వెళ్ళిపోయారు అసలు ఆ యుద్ధానికి వచ్చిన తరువాత దాంతో
యుద్ధమేమిటీ అని వాళ్ళు వెళ్ళిపోతే విభీషణుడన్నాడూ అది ప్రాణియని అది కదిలివచ్చి
తింటూందని అది బతికున్నటువంటి ఒక జీవియని వానరులకు చెప్పకండి చెబితే వాళ్ళు భయపడిపోతారు వాళ్ళుకాదు ఎవరూ
నిలబడరు యుద్ధభూమిలో.
కాబట్టి ఒక యంత్రమొకటి తిరుగుతూ ఉంటుంది లంకా పట్టణంలో ఒక
పెద్ద యంత్రమొకటి నడుపుతారు అప్పుడప్పుడు అది యంత్రము అది లంకలో తిరుగుతూంది అని
చెప్పండి ఆయంత్రం బయటకొస్తుంది వచ్చినప్పుడు చెట్లను విసరాలి శిఖరాలని విసరాలి ఆ
యంత్రం పడిపోతూంది అని చెప్దాం చెప్తే తినదుకదా అనుకుంటారు, కాబట్టి విసురుతారు
చెట్లూ కొమ్మలు తరువాత చూద్దాం వాడి సంగతి, రామ చంద్ర మూర్తి ఉన్నారు కదా... అది
వాళ్ళ ధైర్యం అందుకనీ ఉచ్యన్తాం వానరాః సర్వే యన్త్ర మేతత్ సముచ్ఛ్రితమ్ ! ఇతి
విజ్ఞాయ హరయో భవిష్య న్తీహ నిర్భయాః !! మనము యంత్రము అని చెప్తే నిర్భయంగా
ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పడూ... సరే వానర సైన్యానంతట్నీ మళ్ళీ పిలిచారు
మీరు భయపడద్దన్నారు యంత్రమన్నారు మీరు అలా పారిపోకూడదన్నారు పిరికులుగా
బ్రతకకూడదన్నారు మళ్ళీ వానర సైన్యమంతా వచ్చారు అంత పెద్ద యంత్రం బయటికొస్తే మనం
విసరాలికదాని పర్వత శిఖరాలు పెళ్ళగించారు తీసుకొచ్చారు సిద్ధంగా పట్టుకున్నారు
పెద్ద పెద్ద శిలలు పట్టుకున్నారు చెట్లు పట్టుకున్నారు అది బయటికొస్తుంది
బయటికొచ్చినప్పుడు మనందరము దాన్నిపడగొట్టాలని ఎంతో ఉత్సుకతతో నిలబడి ఉన్నారు. ఆ
సమయంలో కుంభకర్ణుడు రావణున దర్శనంకోసమని రావణాంతఃపురంలోకి వెళ్ళాడు ఆయనో పెద్ద
ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. పాపం మర్యాదా మాత్రం పాటిస్తాడు ఏవిషయంలోనైనా ఒక్కటే
కుంభకర్ణుడు ఒక్కొక్కసారి ధర్మం గురించి మాట్లాడుతాడు కొద్దిగా అలా నిద్రపోయి అలా
లేచాడు కాబట్టి ఆయనకేమీ తెలియదూ అని అనుకోవడానికి లేదు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అంతమరీ బొత్తిగా
అజ్ఞానిగా ఉంటాడా అంటే... ధర్మాన్ని మాట్లాడుతుంటాడు, ఆయన అన్నగారి పాదములకు ఒంగి
నమస్కరించాడు నమస్కరించి కూర్చున్నాడు, కూర్చుంటే చాలా పెద్ద ఆపదొచ్చింది కాబట్టి
నీవు నాకు సహాయం చెయ్యాలి రామ లక్ష్మణుల్ని నిర్జించాలని రావణుడు అడిగాడు. ఓ పెద్ద
నవ్వు నవ్వాడు నవ్వి రావణునితో అన్నాడు దృష్టో దోషో హి యోఽస్మాభిః
పురా మన్త్ర వినిర్ణయే ! హితే ష్వఽనభియుక్తేన సోఽయ
మాఽఽసాదిత స్త్వయా !! నీకు ఇతః పూర్వమే
తమ్ముడు చెప్పాడు మంత్రులు చెప్పారు అసలు మంత్రులను సంప్రదించకుండా సీతమ్మను
తీసుకురావడమే పెద్దనేరము. సీతమ్మని మంత్రులను సంప్రదించకుండా తీసుకొచ్చావు
తీసుకొచ్చిన తరువాత యుద్ధమొచ్చింది ఇప్పటికైనా మంత్రులందరూ ఏం చెప్పారో అది
చెయ్యడం న్యాయం అది చెయ్యలేదు, కాబట్టి ఇప్పుడు ఈ ఫలితం ఎందుకొచ్చిందీ... నీవు
చేసుకున్నపనికే వచ్చింది కాబట్టి నీవు చేసినపనికొచ్చిన ఫలితాన్ని నీవు అనుభవించవలసి
ఉంటుంది. కాబట్టి రామ లక్ష్మణుల చేతిలో లంకా నీవు నేను అందరం కూడా బాధపడవలసి
ఉంటుంది దేశ కాల విహీనాని కర్మాణి విపరీత వత్ ! క్రియ మాణాని దుష్యన్తి హవీం
ష్యఽప్రయతే ష్వివ !! ఒక యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో
పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రమునకు హవిస్సుని సమర్పణ చేసేటప్పుడు దాన్ని కూడా
శాస్త్రాన్ని అనుసరించి సమర్పణం చెయ్యాలి ఆ అధికారం ఉన్నవారు సమర్పణం చెయ్యాలి
లేకపోతే శాస్త్ర రహితంగా అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిస్సుకు ఎలా నశించిపోతూందో
దేవతలెలా స్వీకరించరో అలా దేశమూ కాలమూ ఈ రెండిటినీ పట్టించుకోకుండా ఎప్పుడూ నా
పౌరుషమూ ప్రతాపము ఉన్నాయనుకున్నవాడు చేసేపనులు ఇలానే కట్టి కుదుపుతాయి అన్నాడు.
చాలా గొప్పమాట కదాండి! ఎప్పుడూ నేను ఇంతవాన్ని అనుకోవడమేతప్పా
“కొండ అందమందు కొంచమై ఉండదా...” అన్నమాట ఆలోచించడం చేతకాలేదనుకోండి చాలా కష్టంగా
ఉంటుంది జీవితం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేశకాలములను పట్టించుకోవడం నీకు చేతకాలేదు
కాబట్టి ఇటువంటి విపరీత పరిస్థితిని ఎదుర్కొంటున్నావు త్రిషు చైతేషు య
చ్ఛ్రేష్ఠం శ్రుత్వా త న్నాఽవబుధ్యతే ! రాజా వా రాజ
మాత్రో వా వ్యర్థం తస్య బహు శ్రుతమ్ !! ఎన్ని వినడమన్న విషయాన్ని
పక్కనపెట్టన్నయ్యా..! నీవు చాలా విన్నావు వేదం నేర్చుకున్నావు, ఎన్నివిన్నావు అన్నది ప్రధానంకాదు
విన్నదాంట్లో పురుషార్థములయందు మూడిటిని నీవు ఎలా వాడుకుంటావో అన్నది చాలా
ప్రధానమైనది. పురుషార్థములు
మూడని ఎందుకన్నాడంటే మూడు పురుషార్థములను సక్రమంగా వినియోగిస్తే నాలుగవ
పురుషార్థమైన మోక్షము చేకూరుతుంది. ఇందులో అన్నయ్యా! కామమును ధర్మముతో
ముడివేశారు అర్థమును ధర్మంతో ముడివేసి అనుభవించాలి, ఒకవేళ ధర్మమునకు అర్థకామములకు మధ్య తార తమ్యంలో దేనికి
ఎక్కువ స్థానాన్నిగాని ఇవ్వాలని అనుమానమొస్తే ధర్మానికే పెద్దపీఠవేయాలి. కాబట్టి
ధర్మంతో ముడివేయని అర్థం ధర్మంతో ముడివేయని కామం ఈ రెండు చాలా చాలా ప్రమాదం
తీసుకొస్తాయి, అర్థం ధర్మంతో ముడిపడిపోతే రక్షిస్తుంది, కామం ధర్మంతో ముడిపడిపోతే
రక్షణే ఇస్తుంది అవి రెండు దోష భూయిష్టాలుకావు. కానీ నీ కామము ధర్మముతో
ముడిపడలేదు ఇదే నీకు ఉపద్రవాన్ని తీసుకొస్తుంది నీయందు అనురక్తం కాని స్త్రీని
తీసుకొచ్చావు కామమునకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ధర్మమునకివ్వలేదు నీతో యుద్ధానికి
కొచ్చినాయనా అర్ధకామములను పక్కనపెట్టి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు, ఇప్పుడు ఒకడు
పురుషార్థములలో ధర్మమును విడిచిపెట్టి కామాన్నిపట్టుకున్నవాడు ఒకడు అర్థ కామములను
ధర్మంతో ముడివేసి ధర్మాన్ని బాగా పట్టుకున్నవాడు. ఇప్పుడు యుద్ధము పురుషార్థములను
సరిగా పట్టుకోనివాడికి పట్టుకున్నవాడికి మధ్యజరుగుతోంది ధర్మం జయించడం నిశ్చయంకదా
అన్నయ్యా..! కాబట్టి నీ అనుష్టానంలో నీ ప్రవర్తనలో దోషముంది నీవు ఇది ఎందుకు
దిద్దుకోలేకపోయావు అని అడిగాడు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
నీ
దగ్గరున్న మంత్రులు సరియైనవారుకారు నీ ప్రీతికొరకు మాట్లాడేవాళ్లు నీ దగ్గర కానుకలు అపేక్షించేవారే తప్పా
శాస్త్రమును బాగా అధ్యయనంచేసి అవతలివారి అభ్యున్నతికొరకు శాస్త్రవాక్కు నిర్భయంగా
మాట్లాడాలి తప్పా కేవలము అవతలివారిదగ్గర బహుమానము పుచ్చుకోవడముకోసము
శాస్త్రవాక్కును విస్మరించి వారి ప్రీతికొరకు మాట్లాడి వెళ్ళిపోవడం అలవాటైతే
అవతలివారి పథనమును తీసుకోరాగలవుతప్పా నీవు శాస్త్రాన్ని మాట్లాడలేవు అవతలివారిని
ఉద్ధరించలేవు కాబట్టి అన్నయ్యా! శాస్త్రములో ప్రవేశములేనివాడు శాస్త్రవాక్కు
ధైర్యముగా చెప్పలేనివాడు ఇలాంటివాళ్ళను నీ మంత్రులుగా ఉంచుకున్నావు అనఽభిజ్ఞాయ
శాస్త్రాఽర్థాన్ పురుషాః పశు బుద్ధయః ! ఎంత పెద్దమాట వేశారో
చూడండి, వాళ్ళు పశువులన్నయ్యా.., శాస్త్రము తెలిసి ధైర్యముగా చెప్పనివాడు శాస్త్రము తెలియకుండా సలహాలు
చెప్పేవాడు ఈ ఇద్దరూ కూడా ప్రమాదమే అది పశుబుద్ధి అన్నయ్యా ప్రాగల్భ్యా
ద్వక్తు మిచ్ఛన్తి మన్త్రే ష్వఽభ్యన్తరీ కృతాః !! ʻఅటువంటివాళ్ళు
చెప్పేటటువంటి మాటని ఉపదేశము అనరు ప్రగల్పముʼ
అంటారు. అటువంటి ప్రగల్పములను నీవు బాగా వింటూ ఉంటావు అలాంటి మంత్రుల్నీ అలా
మాట్లాడేటటువంటివాళ్ళని ప్రగల్పాలు పలికేవాళ్ళని నిజంగా యుద్ధ భూమిలో నిలబడి ఏమి
చెయ్యలేని చేతగానివాళ్ళని నీ చుట్టూ పెట్టుకున్నావు.
అన్నయ్యా! ఇది జీవితంలో
దోషం, కాబట్టి నీవు నన్ను పిలిచావు కాబట్టి నిద్రలేపావు కాబట్టి ఒకమాట చెప్తాను య
దుక్త మిహ తే పూర్వం క్రియతా మఽనుఙేన చ ! త దేవ నో హితం
కార్యం య దిచ్ఛసి తత్ కురు !! మన తోడబుట్టినవాడు ధర్మాత్ముడైనటువంటివాడు విభీషణుడు
చాలా న్యాయమైనమాట చెప్పాడన్నయ్యా... అసలు నిజంగా నీ హితాన్నికోరిమాట్లాడినవాడు
ధైర్యంగా మాట్లాడినవాడు విభీషణుడొక్కడే విభీషణుడేదిచెప్పాడో అది నీవు చెయ్యి
అన్నయ్యా, నీకు ఎవరో చెప్పక్కరలేదు నీ తోడ బుట్టినవాడు చెప్పాడు ఆయన చెప్పిన
మాటలోని పరిపక్వతను అర్థం చేసుకో సీతమ్మని తీసుకెళ్ళి రామ చంద్ర మూర్తికి
సమర్పించేసై ఈ యుద్ధముండదు నీవు క్షేమంగా ఉంటావు నా మాటవిను అన్నాడు. ఇప్పుడు
ఆయనకి ఎక్కడలేనికోపమొచ్చింది రావణాసురునికి మాన్యో గురు రివాఽఽచార్యః
కిం మాం త్వమఽనుశాసతి ! కి మేవం
వాక్శ్రామం కృత్వా కాలే యుక్తం విధీయతామ్ !! ఎందుకింత
శ్రమపడుతున్నావు? నీవునాకు ఆచార్యుడివా..? నీవు నాకు గురువువా? నీకన్నాముందు నేను
పుట్టానా నాకన్నా ముందు నీవు పుట్టావా? పెద్దవాడు గురువు అన్నమాట నీకు తెలియదా..!
పెద్దవాడు తండ్రితో సమానమని నీకు తెలియదా..! నాకు బోధచేసే ప్రయత్నం
చేస్తున్నావేమిటి? నీవు నాకు బోధ చెయ్యవలసిన అవసరంలేదు కష్టపడి మాట్లాడి శ్రమపడకు.
ఎంత ధారుణంగా ఉంటుందో చూడండి రావణుని మాట అంటే ఏదో మంచిమాట
చెప్పారనుకోండి కొంతమంది అంటారు మీకంత శ్రమతీసుకోక్కరలేదు అంటారు అంటే వాళ్ళు అంత
తేలికగా... మీ సలహాలిస్తుంటారనిగుర్తు విభ్రమా చ్ఛిత్త
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మోహా ద్వా బల వీర్యాఽఽశ్రయేణ
వా ! నాఽభిపన్న మిదానీం య ద్వ్యర్థా స్తస్య పునః కథాః !! ఆయనంటాడూ... అందుకే
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
శ్రీరామాయణాన్ని
మీరు బాగా... బాగా... మీరు చదువుకున్నా కొన్ని కొన్నిమాటలు జీవితంలో మాట్లాడలేవు ఆ
మాట మాట్లాడడానికి మీకు భయంగా ఉంటుంది. మీరంతశ్రమపడకండి మీరు నాకు సలహాచెప్పకండి మీరునాకు చెప్పేంతవాళ్లుకారు
ఒకసారి నిర్ణయంతీసుకుంటే నామాట నేనేవినను ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు లోకంలో
ప్రచారంలోకి రావు మీరు మీరు అనరు. అవి ఎవరిమాటలు రావణాసురునిమాటలు అవి ఏం చేశాయి పది
తలకాయలు కోయించాయి కాబట్టి అటువంటి మాటలకు ప్రాధాన్యతా ఉండదు అటువంటి మాటలు
పిల్లలు అనడంకాని అటువంటివి వినే అవకాశంకాని మనం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి, ఎప్పుడూ
రామాయణ సంస్కారం మనకబ్బితే. కాబట్టి ఆయన అన్నాడూ విభ్రమా చ్ఛిత్త మోహా ద్వా
పోనిలే నేను భ్రాంతిచేత చేశాను అజ్ఞానంచేత చేశాను బల వీర్యాఽఽశ్రయేణ
వా
నేను బలగర్వంతో చేశాను నాఽభిపన్న మిదానీం య ఇప్పుడు నేను ఏం
చేశానన్నది వదిలిపెట్టేసై ద్వ్యర్థా స్తస్య పునః కథాః నేనేం
చేశానన్నదానిగురించి మాట్లాడతావేమిటీ? గతాన్ని తవ్వకు నేనేం చేశానో చెప్పకు అస్మిన్
కాలే తు య ద్యుక్తం త దిదానీం విధీయతామ్ ! గతం తు నాఽనుశోచంతి
గతం తు గత మేవ హి !! జరిగింది జరిగిపోయింది దానిగురించి ఇప్పుడు మాట్లాడకు అస్మిన్
కాలే తు య ద్యుక్తం ఇప్పుడేంచెయ్యాలో మాట్లాడు నీకేమైనా చేతనైతే త దిదానీం
విధీయతామ్ ఇప్పుడేం చెయ్యాలోకదాండి చెప్పాడు..? కుంభకర్ణుడు సీతమ్మని
పట్టుకుని ఇచ్చేయమనేగదా చెప్పాడు నేను మీకు మొదట్నుంచి చెప్తున్నాను తను ఏమనుకుంటాడో అది చెప్తేనే
ప్రీతి ప్రీతిపొందుతాడు తప్పా తను ఇప్పుడు చెప్పమన్నాడు కదాని ఆయన
ఇష్టపడనిది మీరు చెప్పారనుకోండి ఆయనేం ఒప్పుకోడుదానికి ఆయనేమనుకుంటాడో అది
చెప్పాలి.
అయితే కుంభకర్ణుడు ఏమని
చెప్పాలి అన్నయ్యా నేను వెళ్ళి యుద్ధం చేస్తానన్నయ్యా... రామ లక్ష్మణుల్ని
ఎంతసేపన్నయ్యా చంపేస్తానన్నయ్యా అన్నారనుకోండి తమ్ముడా నీవు ఎంతమంచివాడువురా
అంటాడు. అన్నయ్యా సీతమ్మనిచ్చేయ్ అన్నాయా అన్నాడనుకోండి నీవు ఎంత దురాత్ముడివిరా
అంటాడు. విభీషణున్ని వదిలేసినవాడు కుంభకర్ణున్ని వదిలేయడం పెద్దలెక్కాండీ! పెద్ద
లెక్కేంకాదు. నన్నడిగితే రామాయణం
బాగా పరిశీలనం చేస్తే రజోగుణంకన్నా తమోగుణమే కొంచెం శ్రేష్టమేమోనిపిస్తుంది,
కుంభకర్ణుడే రావణాసురునికన్నా మంచివాడేమోనిపిస్తుంది. కాబట్టి నీ మనస్సుకి నాకు సహకారం
చెయ్యాలి అని అనిపించిందా సహకారం చెయ్యి వెళ్ళి యుద్ధం చెయ్యి పరాక్రమించు
చిక్కులలోపడి ఉన్నప్పుడు ఎవడు చేయుతనిచ్చి ఆదుకుంటాడో అది గొప్ప విషయంతప్పా
చిక్కులలో ఉన్నప్పుడు లేచి విమర్షించినటువంటివాడు అప్పుడు నీవు తప్పుచేశావనీ చూపినవాడు
వాడు ఏవిధంగా బంధువు, కాబట్టి నీవు నాకేమైనా ఉపకారం చెయ్యాలనుకుంటున్నావా అని
అడిగాడు. ధారుణమైన ఈ మాటలు విన్నటువంటి కుంభకర్ణుడు అన్నాడు ఒక్క నవ్వు నవ్వి
అన్నయ్యా..! నా కన్నా ముందుపుట్టినవాడివి కదా... నీ వెనక పుట్టానుకదా... నీవు నాకు
అన్నవికదా నేను నీకు తమ్మున్ని కదా అన్నయ్యా... మనిద్దరిమధ్య ఒక సహజమైన ప్రేమ
ఉంటుంది కదా... ఆ ప్రేమచేత నేను మాట్లాడానుతప్పా నీకు చెప్పగలిగినవాన్నీ అని నా
ఉద్దేశ్యంకాదు నీవు చెప్పింది చెయ్యనూ అని కూడా నీవు అనుకోవద్దు అన్నయ్యా నీవు
కోరుకున్నట్లే నేను తప్పకుండా యుద్ధానికి వెళ్తాను.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
రామ
లక్ష్మణులు పెద్ద విషయంకాదు వానరులు అంతకన్నా పెద్ద విషయంకాదు వాళ్ళందర్ని నేను
తెగటార్చేస్తాను అథ పూర్వం హతే తేన మయి త్వాం హంతి రాఘవః ! నాఽహ
మాఽఽత్మని సంతాపం గచ్ఛేయం రాక్షసాఽధిప
!! ఇక్కడా
ఈశ్వరుడు ఆయన నోటినుంచి ఒకమాట పలికించేశాడు అన్నయ్యా నీవు చచ్చిపోవడం నేను
చచ్చిపోయాకే అన్నాడు. ఇదీ యథాలాపంగా అన్నాకూడా సోదరప్రేమ ఉన్నవాడైతే రావణుడు
కుంభకర్ణున్ని పంపకూడదు ఎందుకంటే అది ధర్మ యుద్ధంకాదు, రాజ్య ప్రయోజనం కోసం
జరుగుతున్న యుద్ధంకాదు ఎవరో దండెత్తివస్తే జరుగుతున్న యుద్ధంకాదు ʻతాను
కామ మోహితుడై వేరొకరి భార్యను అపహరించి తీసుకొచ్చి తన అంతఃపురంలో బంధిస్తే ఆమె
భర్తవచ్చి చేస్తున్నయుద్ధంʼ. ఇటువంటి తన కామంకోసం
తన తమ్మున్ని బలిపెట్టడం చాలా అరుదు అది ఎంత క్రూరమైనటువంటి
మనస్తత్వమున్నటువంటివాడో చెయ్యవలసినటువంటిపని. కాబట్టి ఈ మాటను కుంభకర్ణుడు అన్నాకూడా
ʻఆయన యుద్ధానికి వెళ్ళు అనగలిగాడంటేʼ ఆయన
కాముకత్వము ఎంత ధారుణమైనదో ఎంతమందిపోయినా ఆయనకి అక్కరలేదు, ఎందుకంటే లోకంలో ఒక
నానుడి ఉంటుంది. మనము ఏదైనా
ఒకవస్తువును సంపాదించేప్రయత్నం చేశామనుకోండి అప్పుడు ఆ వస్తువు ఆర్జింపబడింది కానీ
అతను మిగలలేదు, మీకు బాగా అర్థమవ్వాలీ అంటే ఇది నాకు ఇది చెప్తే పాపం ఆయన
తెలిస్తే బాధపడుతాడేమో కాని దానిని నేను ఇంకొకలాగా మీకు ఆ ఉదాహరణనని తెలియజేసే
ప్రయత్నం చేస్తాను, ఉన్నఊళ్ళో కొడుక్కి ఉద్యోగమొచ్చి ఇక్కడ ఓ ఇరవైవేలు
ఇస్తున్నారనుకోండి ఏదో ʻరోజు రెండు గంటలు
ప్రయాణంచేసి రాత్రి రెండుగంటలు ప్రయాణంచేసి ఇంటికొచ్చేదగ్గర ఇరవైరెండువేలు
ఇస్తున్నారనుకోండిʼ ఓ వెయ్యిరూపాయలు
దారికర్చులకుపోయినా ఇంకొక వెయ్యిరూపాయలు ఎక్కువొస్తుందికదానీ... నీవు అక్కడకి
వెళ్ళూ అనిచెప్పి కొడుకుని బలవంతంగా ఈ ఉద్యోగం మాన్పించి ఆ ఉద్యోగం తండ్రి
చేర్పించాడనుకోండి ఒక వెయ్యిరూపాయలు ఎక్కువొస్తుందని, ఒక ఆరునెలలు పనిచేసిన తరువాత
కొడుకు ఆ ఊరినుంచి వస్తూ బస్సుకి ప్రమాదం జరిగి మరణించాడనుకోండి ఇప్పుడు ఆ తండ్రి
పరిస్థితి ఏమిటి?.
అప్పుడు ఆ తండ్రికి కొడుకు వారసుడేగా ఆ డబ్బు బ్యాంకులోంచి
ఇయ్యనే తీసుకోవాలి ఇప్పుడు సంతోషంగా ఆ డబ్బుతీసుకుని తండ్రి ఓ గది కట్టించడమో ఓ
ఇల్లు కట్టించడమో లేకపోతే ఏదో వస్తువులు కొనుక్కోవడమో చేయగలడా..? తన యొక్క పొరపాటువలన తాను
కోరుకున్నటువంటి అర్థము తనకి దొరికినా తనకి ప్రియమైన వస్తువు పడిపోయిన తరువాత
కామము తీర్చుకోవడం కష్టం మీరు ఆ కోర్కెయందు మీరు తృప్తిని పొందడం కష్టం.
రావనుని యొక్క మనస్తత్వం ఏమిటో తెలుసాండి ఎంతమందిపోయినా పర్వాలేదు సీతమ్మ తనకి
దక్కితేచాలు అంటే ఆయన మనస్తత్వం ఎంత ఘోరంగా ఉంటుందో ఇది రావణుని యొక్క క్రౌర్యము ʻఈ
క్రౌర్యము బాధ పెట్టింది లోకాన్ని ఇది అవతార స్వీకారం చేయవలసి వచ్చిందిʼ.
ఇంకా ఉంచాడనుకోండి రామ చంద్ర మూర్తి (ఈశ్వరుడు) ఆయన్ను ఉంచాడనుకోండి ʻఆయన
బలము ఆయన తపస్సు మీకేమిటండి? అన్నారనుకోండి! ఆయన సంతోషించడం ప్రధానం దానికోసం ఆయన
ఏదైనా చేస్తాడు అప్పుడు ఎంతమంది ఏడుస్తారుʼ,
కాబట్టి ఇక ఉండడానికి వీలులేదు ఇంక అంత పాడు మనస్తత్వమున్నవాడు ఆ శరీరంలోంచి విడిపించేస్తే ఆ
అపకీర్తి అక్కడితో పోతూంది. కాబట్టి అది కూడా దయయే అందుకే నేను మీకు పునః పునహా మనవి
చేస్తుంటాను. ఈశ్వరుడు అవతారమును స్వీకరించి రాక్షస సంహారము చెయ్యడము కూడా
కారుణ్యము యొక్క పరాకాష్ఠయే కాబట్టి
నాఽహ మాఽఽత్నని
సంతాపం గచ్ఛేయం రాక్షసాఽధిప నేను మరణించిన తరువాతే అన్నయ్యా
నీవు మరణిస్తావు.
కాబట్టి నీకు ఏమీ బెంగలేదు కామం త్విదానీ మఽపి
మాం వ్యాదిశ త్వం పరంతప ! న పరః ప్రేషణీయ స్తే యుద్ధా యాఽతుల
విక్రమ !!
అన్నయ్యా ఇంకెవరిని యుద్ధానికి పంపించద్దూ నేను ఒక్కన్ని చాలు నాతోపాటుగా కూడా
ఎవర్నీ పంపక్కరలేదు నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని యది శక్రో యది యమో యది
పావక మారుతౌ ! తాన్ అహం
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
యోధయిష్యామి కుబేర వరుణా వఽపి
!! ఆ
వచ్చినటువంటివాడు ఇంద్రుడేకానీ యముడేకానీ అగ్నిహోత్రుడేకానీ ఎంతటి గొప్ప
యోధుడేకానీ కుబేరుడేకాని గిరి మాత్ర శరీరస్య శిత శూల ధరస్య మే ! నర్ధత
స్థీక్ష్ణ దంష్ట్రస్య బిభీయా చ్ఛ పురందరః !! నాది పర్వతం వంటి శరీరం భయంకరమైన
కోరలు అసలు నా శరీరం చాలన్నయ్యా? యుద్ధం చేయడానికి ఈ శరీరంతో యుద్ధం చేస్తాను
కాబట్టి ఇంత గొప్ప శరీరము అటువంటి శూలము ఉన్నవాన్ని యుద్ధానికి వెళ్ళితే
ఎవ్వరినైనా మట్టుపెట్టేస్తాను కాబట్టి నీవు బెంగపెట్టుకోకన్నయ్యా అన్నాడు. ఈలోపలా
అక్కడ ఉన్నటువంటి మహోదరుడు అనేటటువంటి ఒక రాక్షసుడు లేచాడు రాక్షస బోధలు చాలా
విచిత్రంగా ఉంటాయి, అందుకే కనీసం జీవితంలో మంచిమాట చెప్పేటటువంటివాన్ని దగ్గరుంచుకోవాలి అది కఠినంగా ఉన్నా
మంచిమాట చెప్పేవాన్ని దగ్గరుంచుకుంటే అప్పుడప్పుడు కనీసం ఆ మాట వింటూంటే కొంతైనా
గాడినపడే అవకాశ ముంటుంది. ఇప్పుడు ఆ మహోదరుడు లేచి అన్నాడు ఈ కుంభకర్ణుడు
మంత్రులగురించి ధర్మం గురించి ఇన్నిమాట్లాడాడు నీవు ప్రభువివి నీకు కామం కలిగింది
నీ కామాన్ని నీవు తీర్చుకోవడమే ధర్మమంతే ధర్మమింకేమిటీ ప్రభువుకి ఏం కోరిక కలిగిందో
ఆ కోరిక తీర్చుకోవడమే ధర్మము నీకు సీతమ్మను అనుభవించాలనిపించింది సీతమ్మని
తీసుకొచ్చావు అదే ధర్మము ఇప్పుడు నీ కోరిక తీరకపోవడం విచారకరం నీ కోరిక తీరనందుకు
ఎలా తీరుతుందని మేము ఆలోచించడం మా ధర్మం.
ఎంత చమత్కారంగా ఉంటాయో చూశారండి లోకంలో ఇప్పటికీ...
ధర్మమన్నపేరుతో చాలా చిత్ర విచిత్రమైన బోధలు ఉంటాయి అందుకే నేను మీకు స్వతంత్రించి
ఒక సలహా చెప్తున్నాను ఎప్పుడు కూడా రెండు ప్రమాదకరమైన వస్తువుల్ని మీ దగ్గర ఎప్పుడూ
కూడా ఉంచకూడదు ఏమిటో తెలుసాండి ఎవరుపడితే వాళ్ళు రాసిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకో
తెలుసా... పుస్తకం మీ ఇంట్లో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మీరు ఏ పుస్తకాన్ని
పడితే ఆ పూస్తకాన్ని చదివి ఇందులో స్వీకరించవలసినంత మంచిలేదు ఇందులో తప్పులు
చెప్పబడ్డాయి ఇది ప్రమాదకరము వక్రభాష్యము ఇది స్వీకరించద్దూ అని మీకు తెలుస్తూంది.
మీరు గూట్లోపెట్టి వెళ్ళిపోతారు మీరు ఏ ఊరో వెళ్తారు మీ అబ్బాయి చదువుతాడు అన్నీ
మీకు చెప్పడుకదా... వాడు ఆ పుస్తకంచేత ప్రచోదనం పొందుతాడు ఇలా చెయ్యెచ్చు
అనుకుంటాడు, నేను రామాయణం మీదే ఒకప్పుడు నేను ఆఫీసులో ఉంటే ఒకాయన పట్టుకొచ్చినాకొక
పుస్తకమిచ్చారు నేను రామాయణం మీద ఆ వాఖ్యానం చదివి తెల్లబోయాను నిజంగా, ఇంతఘోరమా
రామాయణంగురించి రాయడం ఇలా ఉందా రామాయణంలోనని, సరె అది వేరువిషయమనుకోండి
అథెంటికేటెడ్ రైటర్స్ చెప్పడానికి అధికారము ఉండి ఏది చెప్పచ్చూ ఏది చెప్పకూడదు
చెప్పకూడనివి చెప్పేవాళ్ళుంటారు మీరు ఏ ఉపాసన చెయ్యకూడదో అన్ని ఉపాసనలు అందరూ
చెయ్యలేరు ఏ ఉపాసనా అందరు చెయ్యడం సాధ్యంకాదో దాన్ని చాలా గొప్పగా ఇవతలివాడు
దానికి ఆకర్షితుడయ్యేటట్టుగా ఓహో ఇది చాలా తేలికది ఇది పొందచ్చనుకుని మీరు
దానిపట్ల ఉత్సాహపడేటట్లుగా రచనలుచేసి పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నారు.
ఇష్టమొచ్చినట్లు యంత్రాలను వీధి అరుగులమీద పెట్టినట్లు అరుగుల మీద పెట్టి అమ్ముతున్నారు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
యంత్రమంటే అంతతేలికాండి యంత్రాన్ని హ్యాండిల్ చేయడమంటే? ఇవి
ఎక్కడపడితే అక్కడ ఏవి పడితే అవి వినడం, ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది ఆ
పుస్తకాన్ని కొనితెచ్చి ఇంట్లో పెట్టుకుని పుస్తకంలో చెప్పింది సత్యమనుకొని ప్రవర్తించడం
ఈ రెండూ ప్రమాదమే.
ఒక శతజ్ఞి ఇవ్వగలిగిన ప్రమాదంకన్నా ఒక సరియైనటువంటి రచయితకానివాడు
పరిపక్వతలేనివాడు రచించినటువంటి పుస్తకము అత్యంత ప్రమాదకరము, పుస్తకం విషయంలో బహుదా జాగ్రత్త.
ప్రింటింగ్ ప్రెస్లు వచ్చిన తరువాత పుస్తకాల సంఖ్య పెరిగిపోయింది సంస్కృతి
నశించిపోవడానికి ఎవరుపడితే వాళ్ళు గ్రంధరచన చెయ్యడం కూడా ప్రమాదహేతువైంది ఈ మాట
చెప్పింది నేనుకాదు ʻనడిచే దేవుడుగా
పేరుగాంచి ఆసేతు హిమాచలం పర్యంతం కాలినడకన తిరిగి కొన్ని కోట్ల మందికి తన
ప్రవచనములచేతా అనుగ్రహ భాషణములచేత ఉద్ధరించిన మహాపురుషుడు పరమాచార్య స్వామిʼ
చేసిన హెచ్చరిక. కాబట్టి చాలా
జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో ఏదిపడితే అది బోధిస్తే స్వీకరించకూడదు బోధయే
గ్రంధంలో ఉంటుంది, పరిణితి ఉన్నదా చూడవలసి ఉంటుంది ఆ బోధని, లేకపోతే ప్రమాదాన్ని
తీసుకొస్తుంది. ఇదే మహోదరుని బోధలో ఉండేటటువంటి తత్వము అలా ఉంటుంది.
ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొద్దిగా పరిపక్వత తక్కువస్థాయిలో ఉన్నవాళ్ళు వింటే
నిజమే అది ధర్మమే కదా ఆయన అడిగినదాంట్లో అధర్మమేముందీ అని అనిపించేటట్లుగా అంత
దగ్గరగా ఉంటుంది ధర్మానికి. కానీ అసలు మూలం మాత్రం ధర్మానికి దగ్గరిగా ఉండదు మీరు
ఎంత చిలవలు పలవలు చేస్తేమాత్రం శవానికి చేసిన అలంకారంలా ఉంటుంది. శవానికి ఎంత
అలంకారం చేస్తేమాత్రం ఉపయోగమేముంటుంది శవాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తేమాత్రం ఉపయోగమేముంటుంది
అది భయకారకమే ప్రీతికారకముకాదు. చాలా అందంగా అలంకారంచేసి శవాన్ని అక్కడ పెట్టినా
ఎవరు వెళ్ళి పడుకుంటారు దానిపక్కన ఎవరూ పడుకోరు, అందుకే హరినామ స్తుతిచేయు కావ్యము
సువర్ణాంభోజహంసావళి సురుచి భ్రాజితమైన మానస సరః స్పూర్తిన్ వెలుంగొందు (భాగవతంలో)
అంటారు పోతనగారు, ఏది భగవత్
నామాన్ని భగవత్ వైభవాన్ని చెప్పగలవో అవి రాజ హంసలు తిరిగేటటువంటి మానస సరోవరాలు
కాబట్టి చక్కగా ఒక భాగవతం పెద్దలు చేసినటువంటి వ్యాఖానాలు అటువంటి పుస్తకాలు మీరు
తీసుకోండి అటువంటి పుస్తకాలు మీ ఇంట్లో ఉంచుకోండి.
ప్రశ్నవేయడం జిజ్ఞాసువులై వినడం చాలా అందంగా ఉంటుంది నేను
ఇప్పుడు కూడా సాయంకాలం సంధ్యావందనానికి వెళ్ళిపోయే ముందు మా గోపాల కృష్ణగారితో అదే
అంటున్నాను, నిన్నను నన్ను పిల్లలు అడిగిన ప్రశ్నలకి నేను ఎంత సంతోషించానో తెలుసా
గోపాల కృష్ణగారూ నిన్నను నన్ను వాళ్ళు అడిగిన ప్రశ్నలు చూడండీ వాళ్ళు ఎంత
జాగ్రత్తగా విన్నారో వాళ్ళు అనుష్టానంలోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో
వాళ్ళ ప్రశ్నలవల్ల తెలుస్తూంది. నాకు దీన్ని బట్టి ఏమర్థమౌతూందంటే మనం జాగ్రత్తగా చెప్పాలికానీ
వినడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. చెప్పకపోతే అది మన తప్పే తప్పా
పిల్లలమీద వినరూ అన్నవాదనా వినడానికి అవకాశంలేదు అని నాకు అర్థమౌతూంది అని అన్నాను
నేనిందాకే. కాబట్టి మహోదరుడంటాడు దీనికి పెద్ద అల్లరేమిటి మమ్మల్ని ఓ పదిహేను
మందినో ఇరవై మందినో పంపించు మేమందరం వెడుతాం రాముడు కొడతాడు మమ్మల్ని మేము
రామున్ని కొట్టము, రామ నామాంకితమైన బాణములు మాకు
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కుచ్చుకుంటాయి
మేమేంచేస్తామంటే బాణాలు గుచ్చుకున్నాక పారిపోయి వచ్చేస్తాము, వచ్చేసి రామ చంద్ర
మూర్తిని వధించేశాము అందరం కలిసి అని పెద్ద చెప్పట్లు చెరుస్తూ అల్లరిచేస్తూ మేము
ప్రకటిస్తాం నువ్వేం చేస్తావో తెలుసా... నిజంగా శత్రువు మరణించినప్పుడు ఏం చేస్తావో
అదేచెయ్యి వెంటనే నీ మెడలోంచి హారాలుతీసి మాకియ్యి నీ కంకణాలు తీసి మాకివ్వు మాకు
పెద్ద పెద్ద బహుమానాలివ్వు అక్కడ ఉన్నవాళ్లని పిలిచి లంకాపట్టణమంతా ఉత్సవం
చేసుకోండి భేరీనాదాలు మోగించండి రామ చంద్ర మూర్తి హతుడైపోయాడని ప్రకటించండి అనీ
సీతమ్మతల్లి దగ్గరికి వెళ్ళకు, వెళ్ళి చెప్పకు లేకపోతే అనుమానిస్తుంది అని
ఊరుకోండి పెద్ద ఉత్సవం చేయించండి లంకలో, ఇప్పుడిదీ కర్ణాకర్ణిగా కర్ణాకర్ణిగా
రాముడు మరణించాడని చెప్పుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే అలా నిజంగా శత్రువు
మరణిస్తే ఏం జరుగుతుందో అలా జరిగింది కాబట్టి ఇప్పుడిది సీతమ్మకి వెళ్తుంది అప్పుడు
సీతమ్మ ఏం చేస్తుందో తెలుసా? ʻఅసలు అనడానికి కూడా
అసహ్యంగా ఉంటుందినాకుʼ ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు నేను ఈ తప్పు
చేస్తే తప్పేమిటని ఆవిడ అలంకరించుకుని నీ పాన్పుచేరుతుంది.
దానికి యుద్ధమేమిటీ
కుంభకర్ణుడు వెళ్ళడమేమిటీ ఇదంతా ఏమిటీ నేను చెప్పినట్లుచెయ్యి అన్నాడు అంటే
కుంభకర్ణుడు అన్నాడు ఇదిగో..! ఇలాంటి మంత్రులవల్లే నీవుపాడైంది ఇలా
చెప్పేవాళ్ళవల్లే నీకు ఇబ్బందులొచ్చాయి కాబట్టి నీవు వీళ్ళని విడిచిపెట్టు నేను
యుద్ధానికి వెళ్ళి యుద్ధభూమిలో నిలబడి యుద్ధంచేసి రామ లక్ష్మణుల్ని
నిహతుల్నిచేస్తాను అని ఆయన యుద్ధానికి బయలుదేరాడు ఆయన యుద్ధానికి బయలుదేరుతుంటే
ఆయనకి మంచి మంచి కుండలములు చెవులకు పెట్టాడు రావణాసురుడు తెచ్చి, ఆయనకీ ఒక చక్కటి
కిరీటంపెట్టాడు ఆయనకి మెడలో మంచి మంచి హారములువేశారు ఆయనకి మంచి ఉత్తరీయ్యంవేశారు
ఎందుకివన్నీ శవానికి అలంకారం చేసే అవకాశంలేదు ఎందుకంటే కుంభకర్ణుడి యొక్క శవం ఇంక
లంకకురాలేదు ఆ శరీరం పడిపోతూంది సముద్రంలో కొద్దిసేపట్లో శవానికి చేయవలసిన
అలంకారములు ముందే చేస్తున్నాడు అన్నగారు. హాయిగా ఎక్కడో నిద్రపోతున్నవాన్నిలేపి
యుద్ధానికి పంపి తన కామానికి బలిచేస్తున్నాడు “క్రౌర్యము అన్నమాటకు పరాకాష్ఠ
రాక్షసత్వమునకు పరాకాష్ఠయే ఈ రావణాసురుడు”. కాబట్టి ఇప్పుడు ఆ కుంభకర్ణుడు
యుద్ధానికి బయలుదేరి పెద్ద పెద్ద అడుగులువేసుకుంటా ఆ ప్రాకారమునుంచి యుద్ధభూమిలోకి
ప్రవేశించాడు. ఇప్పటివరకు యుద్ధం చేయడంలో చాలా చాలా గొప్పవాళ్ళుగా ప్రఖ్యాతివహించి
పెద్ద పెద్ద రాక్ష యోధుల్ని నిర్జించారు ఎవరూ నీలునివంటివారు. నిన్నన మీరు చూశారు
రావణాసురునంతటివాని కిరీటం మీద కూడా చిన్న కోతిరూపంలో ఎగిరాడాయన అంతటి బలవంతుడు
ఇప్పుడు నళం నీలం గవాక్షం చ కుముదం చ మహా బలమ్ ఎటువంటివాళ్ళూ నళుడంటే ఏకంగా
నూరు యోజనముల సముద్రానికి సేతువుకట్టినవాడు నీలుడంటే వానర సైన్యానికి సర్వసైన్యాధిపతి
ఇంకా గవాక్షుడెటువంటివాడు గొప్ప వానరయోధుడు అంతటివాడు కుముదుడు వీళ్లు ఒక్కొక్క
దిక్కులో ఉన్నటువంటి ద్వారాలకీ యుద్ధం చెయ్యడంకోసమని రామ చంద్ర మూర్తి తరఫున
నియోగింపబడినటువంటి యోధులు.
వీళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు సర్వసైన్యాధిపతి యుద్ధం
చెయ్యలేదు కుంభకర్ణున్ని చూసి పారిపోతున్నాడు వీళ్ళేపారిపోతే ఇంక వానరులెవరు
నిలబడుతారు. వానరులందరూ కూడా పారిపోవడం మొదలుపెట్టారు ఇప్పుడు ఉన్నటువంటివారు ఎవరుంటారో
యుద్ధభూమిలో ఇప్పటికే చెట్లు చేమలు శిలలు శిఖరాలు పట్టుకుని ఉన్నవాళ్ళు తస్య
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
గాత్రేషు పతితా
భిద్యన్తే శతశః శిలాః ! పాదపాః పుష్పితాఽగ్రా
శ్చ భగ్నాః పేతుర్ మహీ తలే !! పెద్ద పెద్ద చెట్లని పెద్ద పెద్ద పర్వత శిఖరాలని
పెద్ద పెద్ద శిలలని ఒక్కసారి ఇన్నికోట్లమంది కలిసి కుంభకర్ణుడి యొక్క శరీరంమీద
విసిరేశారు అవన్నీ ఈయ్యన శరీరానికి తగిలి చూర్ణములై కిందపడిపోయాయి ముక్కలైపోయాయి
ఆయనకి మాత్రం ఏమీ అవలేదు ఆయన అలాగే యుద్ధం చేస్తున్నాడు కేచిత్ సముద్రే పతితాః
కేచి ద్గగన మాఽఽశ్రితాః ! మధ్యమానా స్తు
తే వీరా రాక్షసేన బలీయసా !! కొంతమంది సముద్రంలోకి ధూకేశారు అసలు ఈది బ్రతికితేబతుకుదామని
ముందు ధూకేద్దామని అంటే ఆ తొందర అలా ఉంది ఇంక సేతువుమీద వెళ్ళడానికి అంతమందికి చోటులేదు
కాబట్టి ముందు బ్రతికితే బ్రతుతాం వాడు చెయ్యిచాపి పట్టుకుంటాడని సముద్రంలో ధూకారు
కేచిత్ ద్గగన మాఽఽశ్రితాః కొంతమంది ఆకాశంలోకి
ఎగిరిపోయారు. మధ్యమానా స్తు తే వీరా రాక్షేసన బలీయసా బలవంతుడైన కుంభకర్ణుని
చేతులో మరణిస్తామోననీ వీళ్ళందరూ ఈ రకంగా పారిపోతున్నారు అప్పుడు అంగదుడు పెద్ద
పెద్ద కేకలువేసి ధర్మ
యుద్ధంలో శత్రువుతో యుద్ధం చేసి ప్రాణాలుపోయినా ఫర్వాలేదుకానీ వెన్నిచ్చి
పారిపోవడం ఏం సమంజసం మీరు వానరయోధులు ఇప్పటివరకు అవిజ్ఞ ప్రరాక్రమంతో
యుద్ధంచేసినవాళ్ళు మనందరం కలిసి యుద్ధం చేస్తే ఈ కుంభకర్ణుడు మనల్నేం చెయ్యగలడు
కాబట్టి రండి యుద్ధానికి అన్నాడు.
మళ్ళీ ఈయ్యన మాటచేత ప్రచోదనం పొందినటువంటి వానరులందరూ యుద్ధ
భూమిలోకి వచ్చారు, కృతం నః కదనం ఘోరం కుమ్భకర్ణేన రక్షసా ! న స్థాన కాలో
గచ్ఛామో దయితం జీవితం హి నః !! ఆయనన్నాడు మీరు రాక్షసుడైన కుంభకర్ణుడు
యుద్ధంలో మమ్మల్ని ఘోరంగా మర్ధించాడు ఇప్పటికే ముందున్నవాళ్ళందర్నీ ఇంతలా
మర్ధించాడు నీవు ఎన్ని నీతులైనా చెప్తావ్ యుద్ధంలో నిలబడండని మీరు యోధులు వీరులూని
కామీ మేము వచ్చి యుద్ధం చెయ్యడానికి ఆయన మమ్మల్ని మర్ధించి తినేస్తుంటే మేం
యుద్ధమేంచేస్తాము కాబట్టి న స్థాన కాలో గచ్ఛామో ఇప్పుడు మేము
ఉండవలసినటువంటి కాలమూ కాదు దేశమూ కాదు మేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము దయితం
జీవితం హి నః బతికుంటే బలిశాకు తినచ్చు అని వానరులందరూ పారిపోవడం
మొదలుపెట్టారు. పారిపోతూంటే ఉన్నవానరుల్ని మిగిలినటువంటి నాయకులందరూ కలిసి
సుగ్రీవుడు వెళ్ళి ఆజ్ఞాపించి తీసుకొచ్చి వాళ్ళందరితోటి చెట్లతో వాళ్ళదగ్గరున్న శిఖరాలతో
యుద్ధాన్ని నడిపిస్తున్నారు, నడిపిస్తున్నటువంటి సమయంలో ఈయన గుప్పిడేసి గుప్పిడేసి
అంటే ఒక పాతిక ముప్పైమంది వానర యోధుల్ని పట్టుకుని తీసుకొని నోట్లోపడేసుకుంటున్నాడు.
నోట్లో పడేసుకున్నవాడు ఇంత మంది వానరుల్ని చూసి ఆనందపడిపోయాడు, ఆనందపడిపోయి
వాళ్ళను నమిలితే సమయంపడుతుంది కొంత ఇంతమందిని చంపడమేదుకని చప్పరించేస్తానని
వాళ్ళని నోట్లోపాడేసుకుని ఇలాని మింగేస్తున్నాడు, ఆయన మింగేస్తే వీళ్ళూ ఆయన ముక్కు
కన్నాల్లోంచి చెవుల్లోంచి బయటికి ధూకేస్తున్నారు అసలు మీరు ఎంత ఆశ్చర్యకరమైన
యుద్ధమో ఒకసారి ఆలోచన చెయ్యండి అటువంటి పర్వతాకారుడన్నమాట అంటే ముప్పైమంది వానరులు
ఒక్కసారి లోపలికెళ్ళి ఇటుపక్కనుంచి కొందరు ఇటుపక్కనుంచి కొందరూ, కొందరు ఇక్కడదాకా
వెళ్ళి మళ్ళీ ఇలా ముక్కకన్నాల్లోంచి బయటికేయచ్చు అంటే అంతంత పెద్ద ముక్కు కన్నాలూ
అంతంత చెవికన్నాలూ వాటిలోకి వెళ్లే బారున పక్క కన్నాలు నోటికి కఠం నుంచి చెవి
దగ్గరకి ఉన్నకన్నాలే ముప్పైమంది వెళ్ళడానికి వీలుగావుంటే ఆ శరీరమెంతుంటుందండీ..?.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఒక స్థితిలో రామ
లక్ష్మణులు సుగ్రీవుడు అంగదుడూ అందరూ కలిసి అన్నారూ ఈయ్యన ఏం చెయ్యగలడు
పర్వతాకారులం మనందరం కాబట్టి ఇంతమందీ కలిసి ఎగిరి ఒక్కసారి కుంభకర్ణుడి
శరీరంమీదికి ఎక్కేద్దం బరువుకి కిందపడిపోతాడు అన్నారు, ఇంతమంది ఎగిరి కుంభకర్ణుడి
శరీరంమీదకి ఎక్కారు ఎక్కితే ఆయనేం చేశాడంటే ఇలా అన్నాడు ఒళ్ళు దులిపాడు అందరు
కిందపడిపోయారు. అంతబలం ఆయన శరీరం అటువంటిది ఆయన బలం అటువంటిది, ఆసలు శ్రీరామాయణంలో
కుంభకర్ణుడిగురించి చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది అంత మహాబలవంతుడు అటువంటివాడు
అంగదుడు వెళ్ళి ఆయన్ని ఒక్కసారి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు కానీ అంగదుడు
కొట్టిన దెబ్బకి మాత్రం కదిలి మూర్ఛపోయినంత స్థితికి వెళ్ళిపోయాడు, మళ్లీ ఆయన లేచి
పిడికిలితో అంగదున్ని ఒక్క గుద్దు గుద్దాడు అది ఎడమ పిడికిలితో గుద్దితే అంగదుడు
యుద్ధభూమిలో బోర్లపడి మూర్చపడిపోయాడు. ఆ తరువాత ఆయన పట్టుకున్నటువంటి శూలం వెయ్యి
బారువుల బరువు ఉంటుందంట ఇనుప శూలం వెయ్యి బారువుల బరువు, ఆయన ఆ శూలం పెట్టి ఇలా
ఇలా (అటూ ఇటూ ఊపుతూ) కొడుతూంటే ఊరెరిగింపు వెళ్తూంటే రోడ్లు ఊడుస్తారు పెద్ద
చీపురుపెట్టి అలా ఆ దెబ్బకి పడిపోతున్నారు కొన్నివేలమంది ఇటు కొన్నివేలమంది అటూ
అది తీసి ఇలా కొడుతూంటే (ధాన్యం గడ్డిని కొట్టినట్లు) ఎక్కడ మంది అక్కడ ఈగలు
పడిపోయినట్లు పడిపోవడమే. ఆశూలం పెట్టి మర్థిస్తూ వెడుతున్నాడు ఈ వానరులందరూ
లోపలనుంచి బయటికి వస్తూంటే ఆయనకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకంటే
దృష్టిపెట్టలేకపోతున్నాడు ఎందుకంటే ఆ ముక్కలో దురదపెట్టి చెవుల్లో దురదపెట్టీ
అలాగా కాదు ఇక నుంచి నమిలేస్తానని నమిలి మింగేశాడు ఆ నమిలి మింగేస్తుండడంలో కొన్ని
లక్షల వానరములు తెగటారిపోయారు ఆరోజు యుద్దంలో అటువంటి స్థితిలో సుగ్రీవుడు
పడిపోయాడు. ఆయన ఎంత సేపు యుద్ధం చేస్తాడు ఈ యుద్ధం అయిపోయినట్టే ఈ సుగ్రీవున్ని పట్టుకుని లంకాపట్టణంలోకి
వెళ్ళిపోతాను ఈ సుగ్రీవున్ని బంధిస్తే ఇంక రామ లక్ష్మణులు యుద్ధమేం చేస్తారు,
అపారమైన ప్రేమకలిగినవాడు రాముడు యుద్ధమాపేస్తాడు కాబట్టి పట్టుకుపోతానని ఆయన్ని
తీసుకుని భూజం మీద వేసుకొని ఏదో ఉత్తరీయ్యం వేసుకుని వెళ్తున్నట్లు వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళిపోతూంటే హనుమా వెంటనే లేచి ఆ కుంభకర్ణున్ని
నిగ్రహించి సంహరించే ప్రయత్నంచేస్తానని బయలుదేరారు కానీ ఆయన ఒకటి అనుకున్నారు నేను
కాని కుంభకర్ణున్ని కొట్టి సుగ్రీవున్ని విడిపిస్తే నా ప్రభువు ʻనేను
మూర్చపోయి ఉండగా నన్ను తీసుకెళ్తూంటే నీవు నన్ను విడిపించావుగనుకా అది నా
పరాక్రమానికే సిగ్గుచేటు నీవు నన్నలా ఎందుకు విడిపించావు నేనే తేరిపారి
విడిపిద్దును కదా అంటాడేమోననిʼ సుగ్రీవుడు
విడిపించుకుంటాడేమోనని చూద్దామని ఊరుకున్నాడు. ఆయన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆ
తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటివాళ్ళందరూ ఆయనమీదికి చందనం
పువ్వులూ అవి విసురుతున్నారు ఆ పువ్వుల వాసనా చందనపు వాసనా వీటిచేతా ఆయన స్ప్రహనిపొందాడు
సుగ్రీవుడు వెంటనే ఎలా విడిపించుకుందామని ఆలోచించి ʻభుజం
మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడుకదాండిʼ వెంటనే ఆయన చెవులు
కొరికేశాడు ఆ చెవులు కొరికేసటప్పటికి ఆయనకి ఇబ్బంది కలిగి కిందపడేశాడు కింద పారేయగానే
ఒక్క ఎగురు ఎగిరి రామ చంద్ర మూర్తి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మో రామా! అవధ్యుడు
కుంభకర్ణుడు సామాన్యుడుకాడు అనీ చాలా జాగ్రత్తగా నీవు నిగ్రహించవలసిందే ఈ కుంభకర్ణున్ని,
అయన మళ్ళీ యుద్ధానికొచ్చాడు ఋషభుడు అనబడేటటువంటి ఒక గొప్ప వానర యోధున్ని ఇలా
చేత్తో పట్టుకుని చిక్కించుకుని తన బాహువులమధ్య పెట్టుకుని ఇలా ఓ నొక్కు నొక్కాడు
నొక్కేటప్పటికి ఇంత భయంకర రూపుడు వానర శ్రేష్ఠుడైనటువంటివాడు ఉక్కిరిబిక్కిరైపోయి
శరీరంలో ఉన్న రంధ్రాలన్నిటిలోంచి నొత్తురోడిపోయాడు ఆయన్ని కిందపడేశాడు. తరువాత
ముష్ఠిఘాతంతో శరబున్నికొట్టాడు మోకాలితో తన్నాడు, గవాక్షున్ని గుద్దాడు
గంధమాధనున్ని పాదాలతో తన్నాడు ఆ నోటిలో అనేకమంది వానరుల్నివేసేసుకుంటున్నాడు ఈ
స్థితిలో ఎక్కడ రాముడు అని అడిగాడు.
యుద్ధ కాండ ముప్పయ్
తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
నేనే
రాముడు అని రామ చంద్ర మూర్తి... “నీవు నా కంటపడిన తరువాత వెనక్కి వెళ్ళడం
ఉండదుʼ అన్నాడు, ఆ రామ చంద్ర మూర్తిమీద యుద్ధంచేసి ఆయన్ని
సంహరించాలనేటటువంటి కోరికతో గబగబా ఆయనమీదికి పరుగెత్తుకొస్తున్నాడు వచ్చి
ఆయనమీదికి తన చేతిలో ఉన్న శూలాన్ని విసిరాడు గాలిలోనే ఆ శూలాన్ని ముక్కలుచేశారు
రామ చంద్ర మూర్తి తరువాత రెండు చేతులూ చాపి కిందపడుతున్నవాన్ని వాయవ్య మాఽఽదాయ
తతో వరాఽస్త్రం రామః ప్రచిక్షేప నిశాచరాయ సముద్గరం తేన జహార
బాహుం స కృత్త బాహు స్తుములం ననాద !! వాయువ్యాస్త్రాన్ని
ప్రయోగించి ఒక చేతిని భుజందాకా నరికేశాడు ఆ చెయ్యి ఊడి కిందపడిపోతే ఆచేతికింద
పడిపోయి వేలమంది వానరులు మడిసిపోయారు, ఇప్పుడు ఆయనకి మిగిలినటువంటి ఒకే ఒక్క
చేత్తో సాల వృక్షాన్ని ఒకదాన్ని పెకలించి అది పట్టుకొని రాముని మీదకు వస్తున్నాడు స
తస్య బాహుం సహ సాల వృక్షం సముద్యతం పన్నగ భోగ కల్పమ్ ఐన్ద్రాఽస్త్ర
యుక్తేన జహార రామో బాణేన జామ్భూనద చిత్రితేన !! ఐందాస్త్రాన్ని
ప్రయోగించి బాంగారు చుక్కలతో కలిగినటువంటి ఆ బాణాన్ని విడిచిపెట్టి ఆ రెండో చేతిని
కూడా నరికేశారు రెండు చేతులూ నరకబడీ పర్వతానికి ఏరులు ప్రవహిస్తున్నట్లుగా ఆ
నెత్తురు వరదలలై కింద పారుతున్నా ఆయన గబగబా పరుగెత్తుకూంటూ రామునిమీదకి వచ్చారు తం
చిన్న బాహుం సమవేక్ష్య రామః సమాఽఽపతన్తం సహసా నదన్తమ్
ద్వా వఽర్ధ చన్ద్రౌ నిశితౌ ప్రగృహ్య చిచ్ఛేద పాదౌ యుధి
రాక్షసస్య !! అర్ధచంద్రాకారముగల
బాణములు రెండింటిని సంధించి ఒకేసారి విడిచిపెట్టి రెండు పాదములు నరికేశాడు,
రెండుపాదములు నరికేసి ఇప్పుడు వాడియైనటువంటి మొనలు కలిగినటువంటి బాణాన్ని
కుంభకర్ణుడి యొక్క ముఖమంతా గుచ్చుకునేటట్టుగా వేసేశాడు.
వాడియైన ఐందాస్త్రాన్ని
చేతపట్టుకుని దాన్ని రామచంద్ర మూర్తి వింటినారికి సంధించి ఆకర్నాంతములాగి ఆ
కుంభకర్ణుని యొక్క గుండెలమీద ప్రయోగించాడు స తన్ మహా పర్వత కూట సన్నిభం వివృత్త
దంష్ట్రం చల చారు కుణ్డలమ్ చకర్త రక్షోఽధిపతేః
శిర స్తదా య థైవ వృత్రస్య పురా పురందరః !! ఆ ప్రయోగింపబడినటువంటి
అస్త్రము ఆ రాక్షసుని యొక్క గుండెలపైన ఈ కంఠం కలిసేటటువంటి ప్రదేశం దగ్గరకి వచ్చి
తగలగానే ఆ తలపడిపోయి యుద్ధ భూమిలో పడిపోయింది తల లేనటువంటి శరీరం మాత్రం ఒక్కసారి
విరిగిన చెట్టు పడిపోయినట్టుగా సముద్రంలో పడిపోయింది తల ఒక్కటే యుద్ధ భూమిలో
పడిపోయింది కుంభకర్ణుడు మరణించాడూ అన్నవార్త లంకాపట్టణంలోకి వెళ్ళింది, వానరులందరూ
పరమోత్సాహంగా ఇంత భయంకరమైనటువంటి రావణుని తమ్ముడు కుంభకర్ణుడు. వీళ్ళిద్దరే కదాండి
“జయ-విజయులు” శాపవశాత్తు వచ్చినవారు, లోక కంటకులైనటువంటివారిలో ఒకడు
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మడిసిపోయాడు,
ఇప్పుడు ఋషులు దేవతలు గంధర్వులు వానరులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. రావణుడు
ఈ వార్త విన్నాడు రాజ్యేన నాఽస్తి మే కార్యం
కిం కరిష్యామి సీతయా ! కుమ్భకర్ణ విహీనస్య జీవితే నాఽస్తి మే రతిః !! ʻకుంభకర్ణుడు
లేనప్పుడు నాకు సీతమ్మ వశురాలైనా ఉపయోగమేముంది కుంభకర్ణుడు లేని జీవితమేనాకులేదు
నా అనుంగు తమ్మున్ని పోగొట్టుకున్న తరువాత నేను క్షణకాలం బ్రకనన్నాడుʼ
ఉత్తిగనే అలా అంటూంటాడు త దిదం మా మఽనుప్రాప్తం
విభీషణ వచః శుభమ్ ! య దఽజ్ఞానా న్మయా తస్య న
గృహీతం మహాత్మనః !! ఇంతకు ముందు ధీశాయైనటువంటి విభీషణుడు నాకు మంచిమాటలు
చెప్పాడు సీతమ్మను ఇచ్చేయ్యమని నేను వినలేదు. వినలేదూ ఆ తమ్ముడు వెళ్ళిపోయాడు, ఈ
తమ్ముడు నిద్రపోతున్నవాన్నిలేపి “తమ్ముడు చెప్పిన పని చెయ్యి అన్నయ్యా” అని
చెప్పాడు వినకుండా పంపించాను, ఈ తమ్ముడు తెగటారిపొయాడు విభీషణ వచో యావత్
కుమ్భకర్ణ ప్రహస్తయోః ! వినాశోఽయం సముత్పన్నో మాం
వ్రీడయతి దారుణః !! విభీషణుని మాట వినకపోవడంవల్ల నా కుడిచెయ్యిలాంటి
కుంభకర్ణుడు అంత ఆప్తుడైన ప్రహస్తుడు ఇతరమైనటువంటి యోధులు అందరూ మరణించారు.
విభీషణుని మాట వినందుకు
నేను సిగ్గుపడుతున్నాను అనుకున్నాడు త స్యాఽయం
కర్మణః ప్రాప్తో విపాకో మమ శోక దః ! య న్మయా ధార్మికః శ్రీమాన్ స నిరస్తో విభీషణః
!! నా మేలుకోరి మంచిమాటలు
చెప్పినటువంటి విభీషణుని యొక్క మాటలను వినని ఫలితమే నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడట.
అలా అంటాడు కానీ ఇంత జరిగిందికదాని ఇప్పటికైనా మనిషిమాత్రం మారడు, మిగిలిన
రాక్షసయోధుల్ని కొందరిని పిలిచాడు వాళ్ళను వెళ్ళి ఆ రామలక్ష్మణులతో వానర యోధులతో
యుద్ధం చెయ్యమని పంపించాడు. అంగదుని చేత నరాంతకుడు హనుమ చేతిలో త్రిశురుడు నీలుని
చేతిలో మహోదరుడు ఋషభుని చేతులో మహాపార్షుడు అనబడేటటువంటి రాక్షసులు ఒక్కొక్కరూ
ఒక్కొక్కరూ మరణించారు మరణించిన తరువాత అతికాయుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి
రాక్షసుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు, ఆయన్ని చూసి మళ్ళీ ఇంకో కుంభకర్ణుడే వచ్చాడూ
అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఎవరీయ్యనా అని అడిగాడు విభీషణున్ని రామ
చంద్ర మూర్తితో అప్పుడు ఆయన చెప్పాడు
యస్య బాహుం సమాఽఽశ్రిత్య
లంకా భవతి నిర్భయా ! తనయం ధాన్యమాలిన్యా అతికాయ మిమం విదుః !!
ఏతే నాఽఽరాధితో బ్రహ్మా తపసా
భావితాఽఽత్మనా ! అస్త్రాణి చాఽప్యఽవాప్తారి
రిపవ శ్చ పరాజితాః !!
సురాఽసురైః అవధ్యత్వం దత్త మఽస్మై
స్వయమ్భువా ! ఏత చ్చ కవచం దివ్యం రథ శ్చైషోఽర్క
భాస్కరః !!
వజ్రం
విష్టమ్భితం యేన బాణైః ఇన్ద్రస్య ధీమతః ! పాశః సలిల రాజస్య యుద్ధే ప్రతిహత స్తథా
!!
ఈయ్యన రావణాసురుని యొక్క కుమారుడు చాలా గొప్ప తపస్సు
చేసినటువంటివాడు బ్రహ్మగారి దగ్గర వరాలుపొందినటువంటివాడు సురా-అసురులచేత సంహరింపబడనటువంటివాడు
ఇంద్రుని యొక్క వజ్రము పశ్చిమ దిక్కునకు జలములకు అదిదేవతగా ఉండేటటువంటి వరుని
యొక్క పాశమూ కూడా ఈయ్యన మీద పనిచెయ్యలేదు అటువంటి మహాయోధుడు కాబట్టి రామా! అతనిని
జాగ్రత్తగా నిగ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు కుముదుడు ద్వివిదుడు మైందుడు శరబుడు
నీలుడు మొదలగున్నవారు పర్వత శిఖరములన్నీ పట్టుకుని ఆయన మీదకి ఒక్కసారి యుద్ధానికి
వెళ్ళారు. అటువంటి రాక్షసుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తుంటే ఆయన్ని నిగ్రహించవలసి
వచ్చి లక్ష్మణ మూర్తి ఎదురుగుండా వెళ్ళారు ఆ లక్ష్మణుని మూర్తిని చూసినటువంటి ఆ
రాక్షసుడు చాలా కృద్ధుడై మాట్లాడాడు
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అథాఽతికాయః కుపితో దృష్ట్వా
లక్ష్మణ ముత్థితమ్ ! ఆదాయ నిశితం బాణ మిదం వచన మఽబ్రవీత్
!!
బాల స్త్వ మఽసి
సౌమిత్రే విక్రమే ష్వఽవిచక్షణః ! గచ్ఛ కిం కాల
సదృశం మాం యోధయితు మి చ్ఛసి !!
న హి మ ద్బాహు నృష్టానా మఽస్త్రాణాం
హిమవా నఽపి ! సోఢు ము త్సహతే వేగ మఽన్తరిక్ష
మఽథో మహీ !!
సుఖ
ప్రసుప్తం కాలాఽగ్నిం ప్రబోదయితు
మిచ్ఛసి ! న్యస్య చాపం నివర్తస్వ మా ప్రాణాన్ జహి మ ద్గతః !!
అతికాయుడు లక్ష్మణునితో అన్నాడు నీవు బాలుడివి చిన్నవాడివి
నీకు నాతో యుద్ధమేమిటి నీవు బ్రతకాలనుకుంటే ఆ ధనుర్భాణములను అక్కడ పెట్టి తిరిగి
వెళ్ళిపో నేనుకాని బాణప్రయోగం ప్రారంభిస్తే హిమత్ పర్వతము ఈ భూమండలము మేరు పర్వతము
కూడా నా ముందు నిలబడవు అంతరిక్షము కూడా క్షోభిస్తుంది కాబట్టి అటువంటి యుద్ధం నాతో
చెయ్యలేవు వెళ్ళిపోమన్నాడు. ఇటువంటి ప్రగల్పాలు పలకక్కరలేదు నిలబడగలిగితే నాతో
యుద్ధం చెయ్యమని లక్ష్మణ స్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వచ్చినటువంటి
అతికాయుడు అనబడేటటువంటి రాక్షసున్ని సంహరించాడు. తన కొడుకు మరణించాడూ అని రావణుడు ఘోరంగా
ఏడ్చాడు, ఏడుస్తాడు కానీ ఆయనేమి తన మనసు మార్చుకునేటటువంటి అవకాశముండదు. అటువంటి
సమయంలో తోడబుట్టినవాడు మరణించాడు కన్నవాడు మరణించాడు ఇద్దరు మరణించారన్న తరువాతకూడా
మార్పురానివాడు ఇక మారుతాడని మీరు ఆశించకూడదు కదాండీ!... ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని
సమిధలకింద వేసేస్తున్నాడు అంతే ఆ యుద్ధంలో. ఇప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు ఆ
ఇంద్రజిత్తుతో అన్నాడు నీమీదే నా ఆశలు నీవు తప్పకుండా ఈ యుద్ధంలో నాకు విజయాన్ని
సాధించిపెట్టాలి అన్నాడు, నాన్నగారు మీరేమీ బెంగపెట్టుకోకండి నేను వెళ్ళి ఆ
వానరులందర్నీ నిగ్రహించి రామ లక్ష్మణ సంహారం చేస్తానని ఇంద్రజిత్తు బయలుదేరాడు అయనా...
స హవి ర్లాజ సంస్కారైః మాల్య గన్ద పురస్కృతైః !
జుహువే పావకం తత్ర రాక్షసేన్ద్ర ప్రతాపవాన్ !!
స తత్రాఽగ్నిం
సమాస్తీర్య శర పత్రైః సతోమరైః ! ఛాగస్య సర్వ కృష్ణస్య గళం జగ్రాహ జీవతః !!
సకృ
దేవ సమిద్ధస్య విధూమస్య మహాఽర్చిషః ! బభూవు స్తాని
లింగాని విజయం యాన్యఽదర్శయన్ !!
ఆయనా... అభిచార హోమం చేస్తూంటాడు ఎర్రటి బట్టలు కట్టుకుని
అగ్నిహోత్రంలోకి ఏ ఏ కార్యాన్ని అలా చెయ్యకూడదో అటువంటి ఉపాసన చెయ్యకూడదోయని
శాస్త్రాలు చెప్తున్నాయో అటువంటి ఆకులు తీసుకొచ్చి అలా అగ్నిహోత్రంలో సమర్పించి
ఇనుమును సమర్పిస్తాడు, సమర్పించి ఒక నల్లమేకనొకదాన్ని బ్రతికున్నదాన్ని కంఠంతో
పట్టుకుని పైకెత్తి బ్రహ్మాస్త్రమంత్రాన్ని ఆవాహనచేస్తూ అగ్నిలో సమర్పిస్తాడు
అంతకన్నా దానిగురించి పెద్ద వివరణలు అనవసరమైనవి, అవి అభిచారహోమాలు అవి చాలా అత్యంత
ప్రమాదకరమైన ఉపాసనలు. అగ్నిహోత్రుడు దానిని స్వీకరించి ఇంద్రజిత్తుకు విజయము
కలుగుతుంది అన్న సూచనలను ఇచ్చాడు వెంటనే ఆ బ్రహ్మాస్త్రము చేత తన రథాన్ని సారథిని
తన ధనస్సుని అన్నిటిని అభిమంత్రించాడు. అభిమంత్రించి రథంలోకి ప్రవేశించాడు స
పావకం పావక దీప్త తేజా హుత్వా మహేన్ద్ర ప్రతిమ ప్రభావః సచాప బాణాఽసి
రథాఽశ్వ సూతః ఖేఽన్తర్దధేఽఽత్మాన
మఽచిన్త్య రూపః !! తన సారథితో గుఱ్ఱాలతో
రథంతో కూడా ఒక్కసారి ఆకాశంలోకెళ్ళి అంతర్ధానమైపోయాడు అంతర్ధానమైపోయి
భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు, ఎంత భయంకరమైన యుద్ధమంటే మేఘాలలోంచి తాను
కనపడడు కానీ పుంఖాను పుంఖలంగా కొన్ని వేల బాణములను ప్రయోగించి వానరవీరులందర్నీ
శరీరాల్ని చీల్చేశాడు ఎటువైపునుంచి బాణాలొస్తాయో తెలియదు ఎక్కడ్నుంచి వేస్తాడో
తెలియదు. రథం ఆకాశంలో తిరుగుతూంటుంది తిరుగుతూబాణ ప్రయోగం చేస్తాడు తే కేవలం
సందదృశుః శితాఽగ్రాన్ బాణాన్ రణే వానర వాహినీషు మాయా నిగూఢం చ సురేన్ద్ర శత్రుం
న చాఽత్ర తం రాక్షస మఽభ్యపశ్యన్
!! పైకి
కనపడకుండా కేవలము బాణములు మాత్రం వచ్చి మీద పడిపోతుంటాయి.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అంత భయంకరమైన రీతిలో
యుద్ధం చేస్తూ ఆయనా అందర్నీకూడా నిహతుల్నిచేసి లేదా చాలా మందిని కొట్టి కొన్ని లక్షలమందిని
పడగొట్టాడు. వానర యోధులైనటువంటివారు ఓర్చుకోగలిగారు తప్పా ఆ బాణపరంపరకి ఇక తిరిగి
యుద్ధం చెయ్యలేనంత స్థితికి తీసుకెళ్ళిపోయారు. చిట్టచివరకు బ్రహ్మాస్త్ర ప్రయోగం
చేశాడు మన్యే స్వయమ్భూ ర్భగవాన్ అచిన్త్యో యస్యై తదఽస్త్రం
ప్రభవ శ్చ యోఽస్య బాణావపాతాం స్త్వ
మిహాఽద్య ధీమన్ మయా సహాఽవ్యగ్ర
మనాః సహస్వ !! సాక్షాత్తు
ఆ భగవానుడైనటువంటివాడు ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అస్త్రాన్ని
అభిమంత్రించి ఆ యుద్ధభూమిలోకి విడిచిపెట్టాడు ఈ బ్రహ్మాస్త్రముచేత కట్టుబడి రామ
లక్ష్మణులు కూడా యుద్ధ భూమిలో నేలమీద పడిపోయారు. వానరులందరూ నేలమీద పడిపోయారు ఆ
బ్రహ్మాస్త్రము స్వామి హనుమనుకూడా పట్టింది పట్టడంలో ఆయన కూడా కిందపడ్డారు కానీ
ఆయనకి వరం ఎందుకనీ అంత గొప్పవరం జగత్తుకు సృష్టికర్త బ్రహ్మగారు ఆయన పేరుతో ఉన్నటువంటి
అస్త్రానికి కాసేపైనా కట్టుబడకపోతే దానికి గౌరవముండదని ఆయన కట్టుబడతాడు అంతే.
వెంటనే విడిచిపెట్టేసింది ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నవాళ్ళు ఇద్దరే, ఇంద్రజిత్తు
యొక్క మాయు యుద్ధం తెలిసున్నవాడు ఒక్క విభీషణుడు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రపు
బంధనం నుంచి తప్పుకోగలిగినవారు హనుమ వీళ్ళిద్దరుతప్పా ఇంకెవ్వరూలేరు, అసుర
సంధ్యవేళలో విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని కాబట్టి వీళ్ళందరు యుద్ధ భూమిలో
పడిపోయేటప్పటికి చీకటిపడిపోయింది.
ఇప్పుడు కటిక చీకటి ఒక్క వానర వీరుడు కదులుతున్నవాడులేడు
ఎంతమందిని కొట్టాడని చెప్పారు తెలుసాండి ఆరోజున ఆశ్చర్యంగా ఉంటుంది అరవై ఏడుకోట్ల
మంది వానరాల్ని బ్రహ్మాస్త్రంతో కొట్టాడు. ఇంతమంది పడిపోయి ఉన్నారు,
పడిపోయినప్పుడు బ్రాహ్మ మఽస్త్రం తదా ధీమాన్ మానయిత్వా
తు మారుతిః ! విభీషణ వచః శ్రుత్వా హనూమాం స్త మఽథాఽబ్రవీత్
!!
ఆ పడిపోయినటువంటివాళ్ళల్లో సుగ్రీవ మఽగదం
నీలం శరభం గన్ధమాదనమ్ ! గవాక్షం చ సుషేణం చ వేగదర్శిన మాఽఽహుకమ్
!! మైన్దం నళం జ్యోతిముఖం ద్వివిదం పనసం తథా ! ఏతాం శ్చాఽన్యాం
స్తతో వీరౌ దద్రుశాతే హతాన్ రణే !! వీళ్ళందరూ కూడా ఎటువంటివీరులు
సుగ్రీవుడు అంగదు నీలుడు శరభుడు గన్దమాదనుడు గవాక్షుడు సుషేణుడు వేగదర్శి మైందుడు
నళుడు జ్యోతిముఖుడు ద్వివిదుడు పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
వానరయోధులందరూ
బ్రహ్మాస్త్రముచేత కొట్టబడి నేలమీద పడిపోయారు సప్త షష్టి ర్హతాః కోట్యో
వానరాణాం తరస్వినామ్ ! అరవై ఏడుకోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారు అహ్నః
పంచమ శేషేణ అంటే ప్రదోషవేళ వచ్చేటప్పటికి ఐదవ వేళలో వల్లభేన స్వయమ్భువః చతుర్ముఖ
బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రముచేత ఇంద్రజిత్తు ఇంత
ప్రమాదాన్ని సృష్టించి రామ లక్ష్మణులతో సహా అరవై ఏడుకోట్ల మంది వానరుల్ని యోధులతో
కలిపి పడగొట్టాడు. అప్పుడు మిగిలినవాళ్ళు ఇద్దరే ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు అసలు
పరమయోధులైనవారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడ్డం కోసమని రెండు కాగడాలు చేత్తోపట్టుకుని
విభీషణుడు హనుమా ఇద్దరూ బయలుదేరి ఒక్కరిదగ్గరికి వెళ్తున్నారు.
జాంబవంతుడు మహావీరుడు
మహానుభావుడు చాలావృద్ధుడు బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటివాడు ఆయన పడిపోయిన
ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరూ అంజనా సుప్రజా యేన మాతరిశ్వా చ నైరృతా !
హనూమాన్ వానర శ్రేష్ఠః ప్రాణాన్ ధారయతే క్వచిత్ !! చిత్రమేమిటంటే ఆ జాంబవంతుడి
దగ్గరికెళ్ళి అడిగాడు విభీషణుడు తాతా! నీ ప్రాణములకు ముప్పువాటిల్లలేదుకదా
బ్రహ్మాస్త్రము దెబ్బతగిలీ అన్నాడు, ఆయన అన్నాడు బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయానురా
కన్నులు విప్పి చూడగలిగినంత స్థితికూడాలేదునాకు చాలా నీరసించాను కానీ నేనొక్క
విషయమడుగుతాను చెప్పూ అన్నాడు విభీషణునితో అన్నాడు. ఏమిటి తాతా అన్నాడు అంజనా
సుప్రజా యేన మాతరిశ్వా చ నైరృతా ! హనూమాన్ వానర శ్రేష్ఠః ప్రాణాన్ ధారయతే క్వచిత్
!! అంజనా నన్దనుడు వాయు నన్దనుడైనటువంటి ఆంజనేయుడు మహానుభావులైన హనుమ
ప్రాణములతో ఉన్నారా! అని అడిగాడు, విభీషణుడన్నాడు శ్రుత్వా జామ్బవత్ వాక్యమ్
ఉవా చేదం విభీషణః ! ఆర్య పుత్రా వఽతిక్రమ్య కస్మాత్
పృచ్ఛసి మారుతిమ్ !! నైవ రాజని సుగ్రీవే నాంఽగదే నాఽపి రాఘవే ! ఆర్య సందర్శితః స్నేహః యథా వాయు సుతే పరః !! నీవు
ఆర్యపుత్రుడైనటువంటి రామ చంద్ర మూర్తిని కుశలమాని అడగలేదు లక్ష్మణుడు కుశలమాని
అడగలేదు వానర రాజైన సుగ్రీవుడు కుశలమాని అడగలేదు హనుమ కుశలమాని అడుగుతున్నావు ఇలా
ఎందుకడిగావని అడిగాడు. అడిగితే జాంబవంతుడన్నాడు విభీషణ వచః శ్రుత్వా జామ్బవాన్
వాక్యమ్ అబ్రవీత్ ! శృణు నైరృత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిమ్ !! నేను
ఎందుకు మారుతి హనుమా ఆంజనేయుడు వాయుపుత్రుడు పవన సృతీ జీవించి ఉన్నాడాని అడిగానో
కారణం చెప్తాను బాగా విను అన్నాడు తస్మిన్ జీవతి వీరే తు హత మఽప్యఽహతం
బలమ్ ! హనూమ త్యుజ్ఘిత ప్రాణే జీవన్తోఽపి
వయం హతాః !! హనుమ
బ్రతికివుండీ ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కడుంటే అందరం బ్రతుకుతాం అందరం
బ్రతికుండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం.
కాబట్టి హనుమ ఒక్కరు ఉంటేచాలు ఉన్నాడా అని, నేను
అందుకడిగాను ధరతే మారుతి స్తాత మారుత ప్రతిమో యది ! వైశ్వానర సమో వీర్యే జీవితాఽఽశా
తతో భవేత్ !! ఆయన
మహానుభావుడు ఆ మారుతి హనుమా సాక్ష్యాత్తుగా అగ్నియొక్క తేజస్సు ఎటువంటిదో ఆయన
యొక్క తేజస్సు అటువంటిది ఈ మాటలు వినగానే ఇంకొకడైతే ఇంతమంది పడిపోయారు నేను
ఇంతగొప్పవాన్ని నాగురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బార జాపుతాడు,
హనుమా ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో
వృద్ధమ్ ఉపాగమ్య నియమే నాఽభ్యవాదయత్ ʻనియమే
నాఽభ్యవాదయత్ʼ అంటే నియమంతో
అభివాదము తాతా ఈ హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు నమస్కరించుచున్నాడని చెప్తే
అభివాదము, అభివాదము చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కారించాడు ఎవరికి
పడిపోయినాయనకి పడకుండా నిలబడగలిగినవాడు ఇదీ హనుమ యొక్క వినయమంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో
అటువంటివాళ్ళందరికీ ఆ వినయంవస్తూంది గృహ్య జామ్బవతః పాదౌ హనూమాన్ మారుతాఽఽత్మజః
ఆ
జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమా ఈ మాటలు చెప్పి ఆయనకి మనస్కరించారు,
జాంబవంతుడన్నాడు
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఆగచ్ఛ హరి శార్దూల వానరాం స్త్రాతు మఽర్హసి
! నాఽన్యో విక్రమ పర్యాప్త స్త్వ మేషాం పరమ స్సఖా !!
హిమవన్తం నగ శ్రేష్ఠం హనూమన్ గన్తు మఽర్హసి
! తతః కాంచన మఽత్యుచ్ఛమ్ ఋషభం
పర్వతోత్తమమ్ !!
మృత
సంజీవనీం చైవ విశల్య కరణీమ్ అపి ! సావర్ణ్య కరణీం చైవ సంధాన కరణీం తథా !!
నాయనా! ఇప్పుడు నీవే ఈ
వానరజాతిని ఈ రామ లక్ష్మణుల్ని ఈ సుగ్రీవున్ని అందర్నీ బ్రతికించగలిగినవాడివి నీవు
తప్ప మార్గంలేదు నీవు వెంటనే ఇక్కడ్నుంచి
బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతంచేరాలి చీకటి పడిపోయింది బ్రహ్మాస్త్ర
బంధనానికి పడిపోయారు అందులో అరవై ఏడు కోట్లమంది మృత్యువుని పొందారు ఇంక మిగిలిన
కొన్ని కోట్ల మంది శరీరములలో బాణపు ములుకులున్నాయి కొన్ని కోట్లమందికి ఎముకలు
ఇరిగిపోయాయి కొన్ని కోట్లమంది మబ్బుబారిపోయి ఉన్నారు అంతకు ముందే యుద్ధం చేసినటువంటివాళ్ళల్లో
చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్ని లంకలో పడున్నాయి వానరులవి, రావణుడు మాత్రం మరణించినటువంటి
రాక్షసుల యొక్క శవాలను ఉండనిచ్చేవాడుకాదు భయపడుతారు ఇంతమంది చచ్చిపోయారని
తెలుసుకొని యుద్ధానికెళ్ళరని ఏరోజు శవాలని ఆరోజు సముద్రంలో కలిపించేశాడు కాబట్టి
యుద్ధ భూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి కాబట్టి నాయనా! నీవు
ఎక్కడ లంకా పట్టణం దక్షిణ దిక్కున నూరు యోజనముల సముద్రమును దాటివెళ్ళితే కాంచనంక
ఎక్కడ కైలాస పర్వతం ఉత్తరమున హిమాలయ పర్వతములుదాటిపోయిన తరువాత కైలాస పర్వతం ఆ
కైలాస ప్వతానికి ఋషభమూ అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతముంది నీవు ఆ ఓషధీ పర్వతం
దగ్గరికి వెళ్ళాలి ʻమృత సంజీవనీ విషల్యకరణీ
సావర్ణకరణీ సంధానకరణీʼ అని నాలుగు ఓషధులు, ఆ
నాలుగు ఓషధుల్ని ఆ పర్వతంనుంచి వెతికి పట్టుకునిరావాలి వాటి వాసన తగిలితే
చనిపోయినవాళ్ళు లేస్తారు విషల్యకరణీ బాగా ములుకులు లోపలుండిపోయినవారికి బాణపు
ములుకులు ఊడిపోయి స్వస్థత పొందుతారు సందానకరిణి ఎముకలు విరిగిపోయినవారికి ఎముకలు అంటుకుంటాయి
సావర్ణకరిణి రంగుమారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మళ్ళీ తేజస్సుపొందుతారు ఆ
నాలుగు ఓషధులు పట్టుకునిరా అన్నాడు. అంతే మాటొక్కటే వినపడింది మహానుభావుడు ఎగిరి
త్రికూటాచలం మీదకెళ్ళి అక్కడ్నుంచి మలయపర్వతంమీదికి ఎగిరి మలయపర్వతం నుంచి
ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కిందపడిపోయేటట్లుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస
పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడంతే, కన్నుమూసి కన్నుతెరిసేంతలోపలే వెళ్ళిపోయాడు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అదీ
హనుమ యొక్క వేగమంటే అందుకే హనుమని
నమ్మినవాడికి ఎన్నడూ ఏ ఇబ్బందీ ఉండదు కాపాడి తీరుతారు మహానుభావుడు, ఆయన
ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతంమీద స బ్రహ్మకోశం రజతాఽఽలయం
చ శక్రాఽఽలయం రుద్ర శర ప్రమోక్షమ్ హయాఽఽననం
బ్రహ్మ శిర శ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాం శ్చ !! వజ్రాఽఽలయం
వైశ్రవణాఽఽలయం చ సూర్య ప్రభం సూర్య నిబన్దనం చ బ్రహ్మాఽఽసనం
శంకర కార్ముకం చ దదర్శ నాభిం చ వసుందరాయాః !! ఆ కైలాస పర్వతం మీద
బ్రహ్మగారు నివశించే ప్రదేశం కైలాస పర్వతం ఇంద్రుడు నివశించే ప్రదేశం శివుడు
విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం ఈశ్వరునిచేత
బ్రహ్మగారి యొక్క ఐదవతల ఖండింపబడి కిందపడేసినటువంటి ప్రదేశం బ్రహ్మ ఇంద్రునకు
వజ్రాయుధాన్ని ఇచ్చిన ప్రదేశం కుబేరుని యొక్క నిలయం సూర్యకాంతిని దట్టించడానికి
ఒరిపిడి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బందించి నిలబెట్టినటువంటి
ప్రదేశం దర్శనం ఇవ్వడం కోసమనీ దేవతలకు దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి
కూర్చునేటటువంటి ఆసనమున్నటువంటి ప్రదేశం శంకరుడు విలాసంగా తన ధనస్సుని
నిలబెట్టేటటువంటి ప్రదేశం పాతంళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారమున్న
ప్రదేశం వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి ఋషభ
పర్వతానికి మధ్యలోవున్న ఓషధీ పర్వతందగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ ఓషధుల్ని
వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టుకెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి
దాక్కున్నాయి.
రామ కార్యం మీద కావలసివచ్చి
నేను మీ దగ్గరికి వస్తే... మీరు రామ కార్యంమీద ఉపకారం చెయ్యకుండా ఓషదుల్ని
దాస్తారా ఉండండి మీ పనిచెప్తానన్నారు స తం సముత్పాట్య ఖ ముత్పపాత విత్రాస్య
లోకాన్ ససురాన్ సురేన్ద్రాన్ సంస్తూయమానః ఖ చరైః అనేకైః జగామ వేగా ద్గరుడోగ్ర వేగః
!! ఆయనా యక్షులు సిద్దులు దేవతలు అందరూ ఆకాశంమీద నిలబడి స్తోత్రం చేస్తూండగా
రామ కార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వెళ్ళతో పెళ్ళఘించి
చేతిలో పట్టుకుని అంతేవేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్నుమూసి కన్ను
తెరిచేలోపలే ఆకాశ మార్గంలో గరుత్మంతుడొస్తున్నాడా అన్నట్లుగా ఆ సంజీవనీ పర్వతాన్ని
తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధభూమిలో దింపారు. దింపగానే ఆ మృతసంజీవనీ యొక్క
వాసనకి విషల్యకరణీ సంధానకరణీ సావర్ణకరిణీ ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత అప్పటివరకూ
మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు, పూర్వం కన్నా విశేషమైన
తేజస్సుపొందారు వీళ్ళందరూ లేచి ఇక్కడ సంతోషాన్నిపొందారు. అక్కడ ఇంద్రజిత్తు వెళ్ళి
రావణాసురునితో కొన్ని కోట్లమంది వానరములతోసహా రామ లక్ష్మణుల్ని నేను సంహరించానని
చెప్పాడు.
ఆయన అక్కడ సంతోషించేలోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద
పెద్ద కేకలేస్తున్నారు, కేకలువేసి ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని
మనమంటాం ఇవ్వాళ తీసుకొచ్చానుకదా నాకు కనపడని ఓషధులను మళ్ళీ తీసుకెళ్ళి నేనెందుకు
పెట్టాలని ఊరుకోవాలి, ఎక్కడనుంచి తెచ్చారో అక్కడ, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించారు
ఆ శిఖరాన్ని కాబట్టి దాన్ని నేను ఇక్కడుంచకూడదని ఆ సంజీవనీ పర్వతాన్ని అలా
తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉంచేశాడు మహానుభావుడు తప్పా ఆ పర్వత శిఖరము పెళ్ళ ఏదో విరిగిపోయిందనీ
ఎక్కడో పడిపోయిందనీ రామాయణంలో ఎక్కడాలేదు. శ్రీ
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
రామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో
అలాగే ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకెళ్ళి ఓషధీ పర్వతాన్ని మళ్ళీ కైలసమూ ఋషభమూ
అనేటటువంటి రెండు పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి
సుగ్రీవుడు లేచి అన్నాడు ఇంత కృద్ధుడై ఇంద్రజిత్తు చేసినటువంటి ఈ పనికి ప్రతీకారము
బాగా చీకటిపడిపోయింది అందరూ సంహరింపబడ్డారని ఏమారి ఉన్నారు రాక్షసులు కాబట్టి
కాగడాలు పట్టుకుని మీ అందరూ ప్రాకారంలోకి లంకాపట్టణంలోకి ప్రవేశించి
లంకాపట్టణాన్నంతట్నీ కాల్చేసేయండి అన్నాడు. వానరులందరూ కాగడాలు పట్టుకుని
లంకాపట్టణంలోకి ధూకేశారు అంటించేశారు ఎక్కడ చూసినా స తం సముత్పాట్య ఖ ముత్పపాత
ఆ శిఖరాలతో వచ్చినటువంటి హనుమ మళ్ళీ ఆ శిఖరాల్నీతీసుకొని వెళ్ళిపోగానే వీళ్ళందరు
లంకాపట్టణాన్ని దహించేశారు, ఆ బంగారు స్తంభాలు కరిగిపోతున్నాయి బంగారము వెండి
కరిగి ప్రవహిస్తున్నాయి వజ్రములు వైఢూర్యములు మణులు పెటిల్లు పెటిల్లుమని
పగిలిపోతున్నాయి. ఆ రాత్రివేళ మరణిస్తున్నటువంటివాళ్ళు పెద్ద పెద్ద కేకలు
వేసుకుంటూ ఆ రాక్షసులందరూ పరుగులుతీస్తున్నారు.
రావణాసురుడు ఖరుని యొక్క కుమారుడైన నటరాక్షుడు అనబడేటటువంటి
రాక్షసున్ని పిలిచి ఆయన్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆయన రాక్షసులతో కలిసి
యుద్ధానికొచ్చాడు ఆ వచ్చినటువంటివాన్ని రామ చంద్ర మూర్తి మట్టుపెట్టాడు. అయిపోయింది
అప్పుడు మళ్ళీ తాను చంపినటువంటివాన్ని మళ్ళీ హనుమ పర్వాతాన్ని తీసుకొచ్చి ఓషదుల్ని
తీసుకొచ్చి బ్రతికించాడనే విషయాన్ని విని ఆగ్రహించినటువంటి ఇంద్రజిత్తు మళ్ళీ
యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరి మళ్ళీ పూర్వం ఎలా చేస్తాడో అలాగే
వెళ్తాడు అభిచార హోమం చెయ్యడానికి వెళ్ళి మళ్ళీ అభిచార హోమం చేశాడు మళ్ళీ
అగ్నహోత్రం విజయ సూచనలిచ్చింది, మళ్ళీ రథమెక్కాడు మళ్ళీ మేఘాల చాటుకెళ్ళి మళ్ళీ
బాణ పరంపర కురిపిస్తున్నాడు. బాణ పరంపర కురిపిస్తుంటే రామ లక్ష్మణులకు కూడా
ఒంటినిండా బాణములు తగిలాయి, ఎంతోమంది యోధుపు పడిపోతున్నారు చూసి చూసి లక్ష్మణ
మూర్తి అన్నాడు ఎన్నిమాట్లు వస్తాడు ఎన్నిమాట్లు ఇలా ఇబ్బంది పెడతాడు ఎప్పుడూ
అధర్మయుద్ధమే ఎప్పుడూ మాయా యుద్ధమే కంటికి కనపడడు మేఘాల చాటునుంచి యుద్ధం
చేస్తున్నాడు కాబట్టి ఈసారి ఓర్చనన్నయ్యా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి
ఇంద్రజిత్తుని సంహరిస్తాను అన్నాడు.
అంటే రామ చంద్ర మూర్తి అన్నారు అయుధ్యమానం ప్రచ్ఛన్నం
ప్రాంజలిం శరణాఽఽగతమ్ ! పలాయన్తం
ప్రమత్తం వా న త్వం హన్తుమ్ ఇహాఽర్హసి !! ఆయుధం చేతిలో
పట్టుకోనివాన్ని కంటికి ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చెయ్యనివాన్ని అంజలి
ఘటించినవాన్ని శరణాగతి చేసినవాన్ని ఫలాయనమంత్రం పఠిస్తూ పారిపోతున్నవాన్ని
చంపకూడదు. కాబట్టి మన కంటికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యట్లేదు ప్రచ్ఛన్నంగా
యుద్ధం చేసేవాన్ని సంహరించే అధికారం మనకిలేదు కాబట్టి లక్ష్మణా మనం ధర్మానికి
కట్టుబడాలి కానీ ఇవ్వాళ ఇంద్రజిత్తు మాత్రం ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు
ఓర్చుకుంటూ బహు పరాకుగా చూసి ఎటువైపు నుంచి బాణములను ప్రయోగిస్తున్నాడో ఆ బాణములను
ఆకాశంలోనే విరగ్గొట్టు విరగ్గొడుతూ మేఘములలో మేఘనాథుడు ఎక్కడున్నాడో చూసి అటు
బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని సంహరిద్దాం
అన్నాడు. ఈ మాటలు విన్నాడు ఇంద్రజిత్తు రామ లక్ష్మణులు చాలా పరాకుగా ఉన్నారు
ఇప్పుడు యుద్దం చేస్తే చాలా ప్రమాదం వీళ్ళ బుద్ధియందు మోహాన్ని పుట్టించాలి
వీళ్ళందరూ ఏమరపాటు చెందాలి ఏమరపాటు చెందిన తరువాత మళ్ళీ నేను మేఘాలలో
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
నిలబడి
వీళ్ళందరినీ సంహరిస్తాను. వీళ్ళ బుద్ధికి వైక్లవ్యం కల్పించాలని లంకలోకి
వెళ్ళిపోయాడు లంకలోకి వెళ్ళిపోయి మళ్ళీ రథమెక్కి యుద్ధానికొచ్చాడు వచ్చినవాడు ఈ
సారి రామ చంద్ర మూర్తి ఉన్నటువంటి ఉత్తర ద్వారంవైపుకు రాలేదు హనుమ ఉన్న పశ్చిమ
ద్వారం వైపుకు వెళ్లాడు హనుమకదా తీసుకొచ్చారు ఇప్పుడు హనుమ బుద్ధిని మోహపెట్టాలి
అందుకనీ ఇన్ద్రజి త్తు తతో దృష్ట్వా భ్రాతరౌ రామ లక్ష్మణౌ ! రణాయాఽభ్యుద్యతౌ
వీరౌ మాయాం ప్రాదుష్కరోత్ తదా !! ఒక మాయ చేసి రామ లక్ష్మణుల్ని ఏమార్చాలి యుద్ధం
చెయ్యకుండా చేసెయ్యాలి, చేసేసి రామ లక్ష్మణులతోపాటు వానరసైన్యాన్ని
సంహరించాలనుకున్నాడు ఇన్ద్రజి త్తు రథే స్థాప్య సీతాం మాయా మయీం తదా ! బలేన
మహతాఽఽవృత్య తస్యా వధ మఽరోచయత్ !! తన రథంలో మాయ చేత
సృష్టించినటువంటి ఒక సీతమ్మని తీసుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు.
ఆ రథంలో ఉన్నటువంటి
సీతమ్మ ముమ్మూర్తిలా అసలు సీతమ్మలాగే ఉంది ఆవిడా స దదర్శ హతాఽఽనన్దాం
సీతా మిన్ద్రజితో రథే ! ఏక వేణి ధరాం ముపవాస కృశాఽఽననామ్!!
పరిక్లిప్లైక వసనా మఽమృజాం రాఘవ ప్రియామ్ !
రజో మలాభ్యామ్ అలిప్తైః సర్వ గాత్రై ర్వర స్త్రియమ్ !! ఆవిడా ఒంటి జడవేసుకుని
ఉపవాసములతో కృషించిపోయినదై మట్టి పట్టినటువంటి ఒక పట్టుబట్ట కట్టుకుని రామా రామా
లక్ష్మణా అని ఏడుస్తూ అరుస్తూ కంటివెంట బాష్పధారలు కారుస్తూ ఏడుస్తూ భయంతో
కదిలిపోతూ సీతమ్మతల్లి అశోకవనంలో శింశుపా వృక్షంకింది ఎలా ఉంటుందో అటువంటి
మాయాసీతను సృష్టించి రథంలో పెట్టుకుని పశ్చిమద్వారం దగ్గరికి వచ్చాడు, ఆవిడా ఆ
మాయాసీతా అచ్చు సీతమ్మలాగే ఏడుస్తూంది ఈయ్యనా గృహీత మూర్ధజాం దృష్ట్వా హనూమాన్
దైన్య మాఽఽగతః ! శోక జం వారి నేత్రాభ్యామ్ ఉత్సృజ న్మారుతాఽఽత్మజః
!! హనుమ
ఒక్కరే ఆశోకవనంలో సీత ఎలా ఉందో ఇన్ని కోట్ల వానరములలో చూసినవాడు సీతమ్మని అలా ఉంటే
సీతమ్మాకాదా అని గుర్తుపట్టి చెప్పగలిగినవారు హనుమ ఒక్కరే హనుమ బుద్ధినిగానీ
ఇప్పుడు మోహపెడితే ఈవిడే సీతమ్మాని హనుమ నమ్మితే సీతమ్మని తాను మాయాసీతను చంపేస్తే
ఆ సీతమ్మ తలనీ మొండాన్ని హనుమ చూస్తే ఆయన కాని రాముడితో చెప్తే రాముడు కూడా నమ్మి
కూలిపోతాడు, రాముడు కూలిపోతే లక్ష్మణుడు కూలిపోతాడు వాళ్ళిద్దరి బుద్ధియందు
మోహమొస్తే, రామ లక్ష్మణ హనుమల బుద్ధిలో మోహమొస్తే యుద్ధం చెయ్యడం మానేస్తే ఇప్పుడు
ఇంక పడగొట్టేయ్యడం చాలా తేలిక. కాబట్టి ఆవిడని ఆ వచ్చినటువంటివాడు గృహీత
మూర్ధజాం దృష్ట్వా ఆవిడ జుట్టుపట్టుకుని ఘోరంగా ఏడుస్తూంటే ఎడం చేత్తో
జుట్టుపట్టుకుని రథంలో ఈడుస్తూ నిలబడ్డాడు, అది చూడగానే హనుమ యొక్క మనస్సు
విచలితమైంది. ఆతల్లి సీతమ్మే ఎంత ధారుణము ఆతల్లి జుట్టుపట్టుకుని ఈడ్వడమా
ఏడుస్తూంటే అని ఆయనింక చూడలేక కన్నుల వెంట భాష్పధారులు కారుస్తూ నా తల్లికి ఇంత
ఆపదా అని ఆ ఇంద్రజిత్తుని చూసి
దురాత్మ న్నాఽఽత్మ
నాశాయ కేశపక్షే పరామృశః ! బ్రహ్మర్షీణాం కులే జాతో రాక్షసీం యోని మాఽఽశ్రితః
!!
ధిక్ త్వాం పాప సమాచారం యస్య తే మతి రీదృశీ ! నృశంసాఽనార్య
దుర్వృత్త క్షుద్ర పాప పరాక్రమ !!
అనాఽఽర్య
స్యేదృశం కర్మ ఘృణా తే నాఽస్తి నిర్ఘృణ ! చ్యుతా
గృహా చ్చ రాజ్యా చ్చ రామ హస్తా చ్చ మైథిలీ !!
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
నీవు
ఎంత తేజోవంతుడవైనా రాక్షసుడుగా జన్మించినవాడువు కాబట్టి ఇంత నిర్దయతో ఇంత క్రూర
కర్మని చెయ్యగలిగావు నృశంసమైనటువంటి ప్రవర్తన కలిగినవాడా! దుర్వృత్తుడా క్షుద్రుడా
పాప కర్మ కలిగినవాడా ఒక స్త్రీని అలా హింసించడానికి నీకు సిగ్గులేదా అని
అడుగుతున్నారు. ఈలోగా సుగ్రీవ స్త్వం చ రామ శ్చ య న్నిమిత్త మిహాఽఽగతాః
! తాం హనిష్యామి వైదేహి మఽద్యైవ తవ పశ్చతః !! ఆ ఇంద్రజిత్తు ఆ
సుగ్రీవుడు రామ లక్ష్మణులు అందరు అటువైపు యుద్ధాన్ని చేస్తున్నారన్న విషయాన్ని
చూసినవారై ఒక్కసారి హనుమ చూస్తూండగా ఆ మాయా సీత యొక్క కంఠాన్ని తన కత్తితో కోసేశాడు,
కోసేసేటప్పటికి గిలగిలగిల తన్నుకుంటూ ఆ రెండు శరీర భాగములూ కిందపడిపోయాయి
కిందపడగానే చాలా వికృతమైనటువంటి నవ్వు నవ్వుతూ నేను సీతమ్మతల్లిని సంహరించాను అన్నటువంటి
క్రౌర్యంతో పెద్ద నవ్వు నవ్వుతూ అభిచార హోమంతో కూడిన “నికుంభ అభిచార హోమం” అంటారు.
నికుంభినా అని పేరు కలిగిన ఒక పెద్ద మఱ్ఱిచెట్టు ఆ మఱ్ఱి చెట్టుకింద కూర్చుని
చేస్తాడు హోమం అక్కడికి వెళ్ళి హోమం కానీ చేసి లేచాడో... ఇక ఇంద్రజిత్తును ఆపడం
సురాసురులకు కూడా సాధ్యంకాదు. ఇప్పుడు వీళ్ళ బుద్ధి వ్యామోహానికి గురైపోయింది
ఇప్పుడు సీతమ్మ మరణించిందని ఏడుస్తారు ఇక యుద్ధం చేసే ఉద్ధేశ్యంలో ఉండరు, ఈ కాళీ
సమయంలో నేను నికుంభినీ అభిచార హోమం పూర్తి చేస్తానని పెద్ద నవ్వు నవ్వుతూ ఈ
సీతమ్మకోసమేగా మీరందరూ యుద్ధానికొచ్చింది మా నాన్నగారికి దక్కని ఈ సీతమ్మని మీకు
విడిచిపెడతానా ఇక ఎవరికోసం చేస్తారో యుద్ధం చెయ్యండని ఆవిడ కంఠం తరిగి శరీరాన్ని
కిందపారేసి లోపలికి వెళ్ళిపోయాడు.
కొంతసేపు యుద్ధం చేసే ప్రయత్నం చేసాడు కానీ హనుమ యొక్క
స్వస్థత నిలబడలేదు అంతటి మహానుభావుడు మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం
బుద్ధిమతాం వరిష్ఠం సీతమ్మతల్లి మరణించిన తరువాత ఇంక ఈ యుద్ధమెందుకని యుద్ధం
మానేశాడు, మానేసి చాలా బాధపడుతూ వెళ్ళి రామ చంద్ర మూర్తితో చెప్పాడు వెళ్ళి రామా!
సీతమ్మని సంహరించాడు ఆమె శరీరాన్ని అక్కడ పడేశాడు ఇది వినగానే ధనస్సు పట్టుకున్న
రామ చంద్ర మూర్తి మూర్చపొంది నేలమీద పడిపోయాడు, రాముడు పడిపోగానే లక్ష్మణుడు
పడిపోయాడు, రామ లక్ష్మణులు పడిపోగానే సుగ్రీవుడు పడిపోయాడు. లక్ష్మణుడు అత్యంత
శోకాగ్నితో చాలా బాధతో ʻఎందుకసలు ఈ ధర్మం పట్టుకున్నావన్నయ్యా
ఏమిటి సాధించాం ధర్మంవల్లా... అధర్మం పట్టుకున్న రావణుడు విజయం సాధించాడు ఏమి
సాధించామనిʼ ఆర్థితో ఉద్వేగంతో ప్రశ్నవేస్తూ ఎంతో బాధతో
ఉన్నటువంటి సమయంలో విభీషణుడు అక్కడికొచ్చాడు ఏం జరిగిందని మీ అందరు ఇలా పడిపోయారు
అని అడిగాడు, అడిగితే అక్కడ ఉన్నటువంటి సుగ్రీవాదులు చెప్పారు హనుమయే స్వయంగా
చూశారు పడిపోవడం ఆ సీతమ్మతల్లిని సంహరించాడు ఇంద్రజిత్తు ఆమె శరీరం పడిపోయింది,
అది తెలిసివచ్చి రామ చంద్ర మూర్తితో చెప్పాడు కాబట్టి ఇక యుద్ధం చెయ్యలేక మేమందరం
కిందపడిపొయ్యామని చెప్పారు. చెప్తే విభీషణుడన్నాడు ఇది ఒక్కనాటికి
జరిగేటటువంటిదికాదు ఎందుచేతాంటే నాకు మా అన్నయ్య యొక్క బుద్ధి బాగా తెలుసు మనుజేన్ద్రాఽఽర్త
రూపేణ య దుక్త స్త్వం హనూమతా ! త దఽయుక్త మఽహం
మన్యే సాగర స్యేవ శోషణమ్ !! ఈ సముద్రమంతా ఎండిపోయింది అని నేనంటే మీరు నమ్మితే
ఎంత అసత్యమో హనుమ సీతమ్మతల్లి మరణించిందీ అని చూసినది నమ్మడం కూడా అంత అసత్యమైనది.
అంటే ఆవిడ సంహరింపబడినదని అనుకోవడం అంత అసత్యం ఆవిడ
సంహరింపబడదు ఎందుకో తెలుసా అభిప్రాయం తు జానామి రావణస్య దురాత్మనః ! సీతాం
ప్రతి మహా బాహో న చ ఘాతం కరిష్యతి !! మా అన్న రావణాసురునికి సీతమ్మ తల్లిమీద ఉన్న కామమటువంటిది, వారు
సీతమ్మని ఒక్కనాటికి చంపరు ఇంద్రజిత్తు చంపడాన్ని అంగీకరించడు, నాకు తెలుసు అసలు
రహస్యం నికుంభినీ హోమం చెయ్యడానికి వెళ్ళాడు ఆ ఇంద్రజిత్తు అతని కాని హోమం చేసి
లేచి రథమెక్కాడా అగ్నిహోత్రంలోంచి వస్తుంది రథం ఆ రథంమీద ఎక్కొస్తాడు ఇక రథమెక్కి
వచ్చిన తరువాత మనం విజయం
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
సాధించడమన్నది
అసంభవం రామా! మనం యుద్ధం చెయ్యలేము కానీ ఈ మాటలు చెప్తూంటేటా... నేను అందుకే మీతో
చెప్తూంది రామ కథా నరునికథా..ని, ఇంత చెప్తూంటే రాముడు పరాకుగా ఉంటాడు, ఎందుకో
తెలుసాండి. ఇప్పుడే మీరు ఒక్క శ్లోకం సీతా సంహారమన్న ʻఅది
మాయా సీతాని తెలిసి ఎన్నోమార్లది చదివి చెప్పినవాడనైనా అది చెప్పినంతచేత కించిత్
కాలము నాకు బుద్ధి దీనిమీద ఇక్కడ నిలబడడంలో వైక్లవ్యమైందిʼ,
అటువంటిది రామ చంద్ర మూర్తికి అది అసత్యమన్నాకూడా... ఆయన బుద్ధి నిలకడ పొందలేదు
పరాకుగా ఉండి ఏం మాట్లాడావు నీవు మళ్ళీ చెప్పూ..? అన్నాడు, అంటే ఎంత
శోకాగ్నిపొందాడో... ఎంత పాప కార్యాన్ని ఇంద్రజిత్తు చెయ్యగలడో ఎంత అధర్మయుద్ధం
చేస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు. నేనందుకే ఇవ్వాళ బయలుదేరుతూ ఓమాటన్నాను గోపాల
కృష్ణగారితో ఇక ఇంద్రజిత్తు యుద్ధ రంగంలో కనపడ్డానికి వీల్లేదు నాకు చెప్పడం కష్టంగా
ఉంది, ఆనాడు లక్ష్మణుడు చంపాడు ఇవ్వాళ నేను చంపేస్తాను అన్నాను ప్రవచనంలో, చంపేసే
ఇంటికొస్తాను గోపాల కృష్ణగారూ అన్నాను. పదకొండైనా పన్నెండైనా ఒంటిగంటైనా అందరూ
వెళ్ళిపోయినా నేను కూర్చుని ఇంద్రజిత్తుని చంపొస్తాను అన్నాను తప్పా ఇంద్రజిత్తు
బ్రతికుండి నేను ఇక తిరిగిరాను విడిదికి. నేను చెప్పలేకపోతున్నాను వాడి ఉద్ధతి అంత
కష్టంగా ఉంది, నాకు చదవడం క్లేశంగా ఉంది అన్నాను అంతటి క్రూరకర్ముడు అంటే మీరు ఆ
సర్గలు చదువుతూంటే అంతబాధగా ఉంటుంది. అంత ధారుణమా ఇంత క్రౌర్యమా..ని ఇంత మాయా
యుద్ధమా ఇంత అధర్మయుద్ధమాని అనిపిస్తూంది. నీవు ఇంక ఆయన్ని ఆపలేవు, హోమం పూర్తి
చెయ్యకుండా పీఠలమీదనుంచి లేచాడో ఆరోజున నిహతుడైపోతాడు.
కాబట్టి తొందరగా
లేపేయ్యాలి వెళ్ళిపోయివుంటాడు హోమానికి కాబట్టి నేను లక్ష్మణున్ని తీసుకొని
వెళ్ళిపోతాను అన్నాడు, వెంటనే రామ చంద్ర మూర్తి లక్ష్మణున్ని ఆశీర్వదించి లక్ష్మణ
స్వామిని పంపారు లక్ష్మణునితోపాటు స్వామి హనుమ బయలుదేరారు ఇతర వానర యోధులు
అంగదాదులు బయలుదేరారు అందరూ కలిసి ఆ ఇంద్రజిత్తు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు.
ఆ హోమం జరుగుతోంది ఎర్రటి వస్త్రములు కట్టుకుని కూర్చున్నాడు ఎవ్వరూ ఆ హోమ గుండం
దగ్గరికి రాకుండా పెద్ద న్యగ్రోధం కటిక చీకటిలో రుద్రభూమి దగ్గర ఉన్న మఱ్ఱిచెట్టు
ఆ మఱ్ఱి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళలేము ఆ చెట్టు నీడలో కూర్చుని చేస్తారు. దానికి
బాగా దూరంవరకు సైన్యాన్ని మోహరించాడు దగ్గరికి రాకుండా చూడండని, ఈ
వెళ్ళినటువంటివాళ్ళు ఆ సైన్యాన్ని చీకాకుపరచి లక్ష్మణస్వామి ఆ హోమ గుండం దగ్గర
ఉన్న ఇంద్రజిత్తు లేచిపోవాలి పీఠలనుంచి దానికోసమనీ త్రోవచేసుకుని వెళ్తున్నారు,
వెళ్తున్నప్పుడు ఆ ఇంద్రజిత్తు పీఠలనుంచి లేపేటట్టుగా చెయ్యడం కోసమనీ ఎంత
ప్రయత్నంచేసినా ఎంత రాక్షసులతో యుద్ధం చేసినా లేచి ఆయుధం పట్టుకుంటేతప్పా
లక్ష్మణస్వామి యుద్ధం చెయ్యడు, ఆయనలెవ్వడు. మహానుభావుడు స్వామి హనుమా రేపేకదాండి
హనుమత్ జయంతీ ఎంతగొప్పగా ఆయన్ని రేపటిరోజున మనం ఆనందించాలి, ఎంత గొప్పకార్యం
చేద్దాంమనం హనుమత్ జయంతినాడు ఏం చేద్దాం ఆయన ప్రీతి చెందడానికి, మీరు ఏం చేసినా
ఆయనని ప్రీతిపడేటట్లు చెయ్యలేరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆయనకి అబిషేకం
చెయ్యండి ఆయన సంతోషించరు, మీరు ఆయన కళ్యాణం చెయ్యండి ఆయన సంతోషించరు, మీరు ఆయన పూజ
చెయ్యండి ఆయన సంతోషించరు, ఆయన సంతోషించేది ఎప్పుడో తెలుసాండి రేపటిరోజున మనం చెయ్యబోతున్నాం
అంత గొప్పకార్యాన్ని.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఒకరు
వేదికమీద నిబడి కూర్చుని “శ్రీ రా మ” అంటూంటారు. మనందరం కూడా ఆయనతో కంఠం కలిపి
శ్రీ రా మ అంటూ... 108 మాట్లో మూడువందల ముప్పైమూడు మాట్లో మొత్తం అందరం కూర్చుని
రేపు ఉదయం రామ నామాన్ని రాస్తాం. ఇంకేమీ వినపడకుండా రాస్తూ శ్రీ రా మ అంటూ
రాస్తున్నారనుకోండి పులకాంకితుడైపోతాడు స్వామి హనుమా ఆనంద తాండవం చేస్తాడు ఈ
ప్రాంగణంలో ఈవ్వాళ ఇంద్రజిత్తు వధ రేపు శ్రీ రా మ అంటూ ఉచ్ఛరిస్తూ పైకి
రాస్తామందరం. రేపు ఎంతమందొస్తే అంతమంది హనుమత్ కటాక్షాన్ని పొందడానికి దాన్ని
హేతువుగా స్వీకరిస్తాము. (అయ్యా కాగితాలు సిద్ధం చెయ్యండి) కాబట్టి ఇప్పుడు హనుమా
గొప్పకార్యమే చేశారు మహానుభావుడు అరివీరభయంకరుడై అపారమైన వేగంతో అక్కడ ఉన్నటువంటి
రాక్షసులందర్నీ మర్ధించడం మొదలుపెట్టాడు, ఈ రాక్షసులందరూ ఈ హనుయొక్క పరాక్రమాన్ని
తట్టుకోలేక మమ్మల్ని మర్ధించేస్తున్నాడు ఓ ఇంద్రజిత్తూ నీవులేచిరా మమ్మల్ని
రక్షించూ అని పెద్ద పెద్ద కేకలేశారు ఇంతమంది కేకలువేసి తన సైన్యం మడిసిపోతూంటే
కూర్చుని హోమం చెయ్యలేకపొయ్యాడు చెయ్యలేక లేచిపోయి బయటికొచ్చాడు, లేచిపోయి రథం
దగ్గరికొచ్చాడు ఈ లోగా ఆ న్యగ్రోధమవి చూపించి లక్ష్మణ స్వామితో కలిసి
విభీషణుడొచ్చాడు. ఆ విభీషణున్ని చూశాడు పసిగట్టాడు అందుకే “ఇంటిగుట్టు లంకకి చేటూ”
అంటూంటారు. వీడు విభీషణుడిలా పుట్టాడురా అంటూంటారు. విభీషణుడు ధర్మాత్ముడు
మహానుభావుడు. విభీషణుడు లేకపోతే ఆ వంశమెలా అభివృద్ధవుతుంది, కాబట్టి నాగుట్టు
బయటపెట్టినవాడివి ఇదే నేను మీతో మనవిచేసేది “ధర్మం పట్టుకున్నవాన్ని ఏదో రూపంలో ఎవరో ఒకరు వచ్చి
రక్షిస్తారు” అధర్మం పట్టుకున్నవాడు
ఎంతగొప్ప వ్యూహం రచించినా అది నశించిపోతూంది.
కాబట్టి ఇప్పుడు ఇంద్రజిత్తన్నాడు ఇహ త్వం జాత సంవృద్ధః
సాక్షా ద్భ్రాతా పితు ర్మమ ! కథం ద్రుహ్యఽసి
పుత్రస్య పితృవ్యో మమ రాక్షస !! నీవు నా తండ్రితో సమానము, తండ్రికి తమ్ముడవైన కారణం
చేత నీవు నాకు తండ్రితో సమానమైనవాడివి, నీకు సిగ్గులేదా ఇలా నీవు లక్ష్మణ మూర్తిని
నా దగ్గరకి తీసుకొచ్చి, నా రహస్యాన్ని చెప్పేసి నేను హోమం దగ్గరకి పీఠలమీద ఉండగా
నన్ను లేపేశావే న జ్ఞాతిత్వం న సౌహార్ధం న జాతి స్తవ దుర్మతే ! ప్రమాణం న చ
సోదర్యం న ధర్మో ధర్మ దూషణ !! ఓ ధర్మ ధూషణము కలిగినటువంటివాడా నీకు అయ్యో
జ్ఞాతి అన్న గౌరవంలేదు, నా అన్నకొడుకూ అన్న ప్రేమలేదు మనజాతివాడు అన్న ప్రేమలేదు ఇవేవీలేకుండా
ఈ ధర్మమేదీ పాటించకుండా ధర్మాన్ని అతిక్రమించినటువంటివాడు నీవు ఏపాటి
ధర్మాత్ముడివి, ఇదే నేను అన్నది చాలా విచిత్రంగా ఉంటాయి మాట్లాడేమాటలు ధర్మంలా
ఉంటాయి కానీ ధర్మమెలావుతాయి ధర్మంతో కూడుకున్నవేంకావు శోచ్య స్త్వ మఽసి
దుర్బుద్ధే నిన్దనీయ శ్చ సాధుభిః ! య స్త్వం స్వజన ముత్సృజ్య పర భృత్యత్వ మాఽఽగతః
!!
నీవు నీవారైనటువంటివారిని రక్షించుకోవడం నీవారైనటువంటివారిని కాపాడడం మానేసి
పరులకు ఊడిగంచేస్తూ సేవలుచేస్తూ వాళ్ళచేత నీవాళ్ళను చంపించే ప్రయత్నంలో ఉన్నావు
నీకు సిగ్గుగాలేదా ఈ విషయం అని అడిగాడు. అంటే విభీషణుడన్నాడు కులే యద్యఽప్యఽహం
జాతో రక్షసాం క్రూర కర్మణామ్ ! గుణోఽయం ప్రథమో నృణాం త న్మే
శీలమఽరాక్షసం !! ఎక్కడ పుట్టావు ఎక్కడ
పెరుగుతున్నావన్నదికాదు గుణం ప్రధానం.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
గుణములులేనిచోటను విడిచిపెట్టాలి గుణమున్నచోటుకు చేరుకోవాలి, నా అన్న గుణములేనివాడై
ఉన్నాడు నేను చెప్పినా వినలేదు అందుకే నేను రాముని సన్నిధానములోకి వెళ్ళిపోయాను న
రమే దారుణే నాఽహం న చాఽధర్మేణ
వై రమే ! భ్రాత్రా విషమ శీలేన కథం భ్రాతా నిరస్యతే !! నేను ధర్మ
వ్యతిరిక్తమైన ఆలోచనల్నీ ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తనని నేను అంగీకరించలేదు ధర్మ
బ్ధమైనటువంటి నడవడినీ నీ తండ్రి అంగీకరించలేడు, అటువంటప్పుడు పాపకృత్యములు
చేసేటటువంటివానితో కలిసి నేను ఎలా ఉంటాననుకుంటావు ధర్మాత్ ప్రచ్యుత శీలం హి
పురుషం పాప నిశ్చయం ! త్యక్త్వా సుఖ మఽవాప్నోతి
హస్తా దాఽఽశీ విషం యథా !! ఒక పాము చేతికి
చుట్టుకుంటే చుట్టుకున్న పాముని విదిల్చి అవతల పారేస్తారా పారేయరా అలా పాపాచరణము
కలిగినటువంటి రావణుడు నాకు అన్నాగారిగా ఉండి ఆయనతో కలిసున్నా రోజు రోజుకీ అతని
యొక్క అధర్మముతో కూడిన పాపము ఎక్కువౌతుంటే నేను అతనితో కలసి ఎలా సహజీవనం చేస్తాను
అందుకే అతన్ని విడిచిపటెట్టి వచ్చేశాను హింసా పరస్వ హరణే పర దారాఽభిమర్శనం
! త్యాజ్య మాఽఽహు ర్దురాఽఽచారం
వేశ్మ ప్రజ్వలితం యథా !! పరస్వానాం చ హరణం పర దారాఽభిమర్శనమ్
! సుహృదా మఽతి శంకాం చ త్రయో దోషాః క్షయావహాః !! ఎప్పుడూ పెద్దలైనటువంటివారినీ
ధర్మాన్ని నమ్ముకున్నటువంటివారినీ హింస చేస్తూండడం, ఇతరులసొత్తు అపహరించి
తీసుకురావడం, మహాపతివ్రతలైనటువంటి పరకాంతలని అపహరించి తీసుకురావడం ఈ మూడు
ఎప్పటికైనా మూలాన్ని పాడుచేస్తాయి.
ఈ మూడు చెయ్యడమే పనిగా మీ నాన్న పెట్టుకున్నాడు
అటువంటివాన్ని విడిచిపెట్టివెళ్ళిపోవడం వినా నాకు మార్గమేముంది, నా అంతనేను
వెళ్ళలేదు నేను మీ నాన్నకు బోధ చేస్తూనే ఉన్నాను. వద్దూ అన్నా... ఈ పని చెయ్యవద్దూ
చెయ్యవద్దూ అని చెప్పాను, ఒక అన్న తమ్ముడిపట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా
ప్రవర్తించి నన్ను ఇంటినుంచి వెళ్ళగొట్టాడు. తాను వెళ్ళగొడితే నేను వెళ్ళిపోయానా
లేదా తనని విడిచిపెట్టి నేను వెళ్లానా తను విడిచిపెట్టుకున్నాడు నన్ను, నేను ధర్మకోసం రామున్ని
ఆశ్రయించాను నీకు ఏపాటి ధర్మం తెలుసని నన్ను అధిక్షేపించి
మాట్లాడుతున్నావు, పెద్దలైనటువంటి
వారిదగ్గర పెద్దలను అధిక్షేపించి మాట్లాడాడటం ఆయుర్ధాయం నశించిపోవడానికి
హేతువౌతుంది, నీకేం తెలుసని మాట్లాడావు నీకు చేతనైతే లక్ష్మణునితో
యుద్ధంచెయ్యి అనిచెప్పారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది, మూడు రాత్రిలు
జరిగిందండీ... ఎన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు ఇంచు మించు
ధనుర్వేధంలో ఉన్న రౌద్రాస్త్రం వాయువ్యాస్త్రం ఐందవాస్త్రం మహేశ్వరాస్త్రం ఇన్ని
అస్త్రములు ప్రయోగించాడు ఇన్ని అస్త్రములను కూడా అవతల ఉన్నటువంటి ఇంద్రజిత్తు ఆయన
అస్త్ర ప్రయోగం చేత నిర్వీర్యంచేశాడు. ఇద్దరిమధ్యా జరిగినటువంటి యుద్ధంలో ఇద్దరి
శరీరాలు పూచిన మోదుగుచెట్లైపోయాయి, నెత్తురు కాల్వలుకట్టింది అంత భయంకరమైన యుద్ధం గరుత్మంతునితోసహా
దేవతలు సిద్దులు యక్షులు గంధర్వులు మహర్షులు అందరూ ఆకాశమార్గంలో నిలబడి లక్ష్మణుని
యొక్క శరీరమునకు తేజస్సు నశించకుండా బలము తరిగిపోకుండా వాళ్ళు ఆశీర్వచనాలు
చేస్తున్నారు ఇంద్రజిత్తు నిగ్రహింపబడాలని.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కొద్దిగా
క్షోభకు గురైనట్లు ముఖ కవళికలు కనపడ్డాయి ముఖ కవళికలు, వెంటనే విభీషణుడువచ్చి
కించిత్ నీరసపడుతున్నటువంటి ఇంద్రజిత్తుని విడిచిపెట్టవద్దు తొందర తొందరగా
బాణప్రయోగంచేసి పడగొట్టూ అన్నాడు, ఈలోగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మాట్లాడుతూ
లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ లక్ష్మణున్ని రెచ్చగొట్టిమాట్లాడుతూ లక్ష్మణుని యొక్క
ఏకాగ్రతని కించిత్ భంగం కలిగిస్తూ, మీరు నావెంట లక్ష్మణుడు తరమకుండా చూడండి నేను
ఒక్కసారి ఇంటికివెళ్ళి ఇంతకన్నా గొప్ప రథంతో బలమైన రథాన్ని చాలాగొప్ప అస్త్రములను
తీసుకొనివస్తానని ఒక్కఛాలున మాయమై లంకకువెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి మళ్ళీ అనేక
ముసలములతో గొప్ప రథంతో శూలములు కఢ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ
యుద్ధభూమిలోకి వచ్చేశాడు ఇంత లక్ష్మణ స్వామి ఆశ్చర్యపోయాడు ఇటువంటివాడు ఇంతవేగం
ఇంతగా అవతలివాళ్ళను మోహపెట్టి వెళ్ళిపోతూంటాడు ఇంత మాయాయుద్ధం చేస్తాడు ఇంత యుద్ధ
విశారదుడు ఏక కాలంలో ఇన్ని అస్త్రములను తెలిసున్నవాడు ఇన్ని బాణప్రయోగములను
చేసినవాడు ఇంత బాణ ప్రయోగం చెయ్యగలిగినవాడు అని లక్ష్మణ మూర్తి భూమి మీద నిలబడి
యుద్ధం చేస్తున్నాడు తనవారిమధ్య రథంలో నిలబడి ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నాడు.
ఇన్నాళ్ళకి ఎదురుగుండా చూస్తూ యుద్ధంచేసే అదృష్టం లభించింది ఎప్పుడు కనపడడు
మేఘాలచాటుకుపోతాడు హోమం అవ్వలేదు కాబట్టి అదృష్టం దొరికింది.
ఇలా యుద్ధం జరిగుతుంటే
లక్ష్మణుస్వామికి జ్ఞాపకానికివచ్చింది, తనకు ʻనిద్రలో
ఉండగా కుబేరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు ఒక అస్త్రాన్నిʼ
ఆ అస్త్రాన్ని తీసి ఇంద్రజిత్తుమీద ప్రయోగించారు, ప్రయోగిస్తే దానిచేతా
వ్యధనిపొందాడుకానీ సంహారము మాత్రము జరుగలేదు నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇలా
యుద్ధం చేస్తూ పోతే చీకటి పెరిగినకొద్దీ రాత్రి పెరిగినకొద్దీ బలం పెరుగుతుంది,
లక్ష్మణా నీవు నరుడివి కాబట్టి నీ బలం క్షీణించడం ప్రారంభమౌతుంది ఇప్పటివరకు నీ
యొక్క తేజస్సువల్ల విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహంవల్ల పెద్దల ఆశీర్వచనంవల్ల
నిలబడి యుద్ధం చెయ్యగలగుతున్నావు ఇంద్రజిత్తుతో కాబట్టి ఇక ఆలస్యంలేకుండా
ఇంద్రిజిత్తుని నిగ్రహించు అన్నారు. ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఏ అస్త్రాన్ని
ప్రయోగిద్దామన్నా ఇంద్రజిత్తు విఫలం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకానొకప్పుడు ఇంద్రుడు
ఆకుపచ్చటి గుఱ్ఱములను కలిగినటువంటివాడు దానవసంహారమునందు ఉపయోగించినటువంటి
ఐంద్రాస్త్రమమును సంబంధమైన బాణాన్ని వింటినారియందు సంధించి ఆకర్నాంతములాగి
ధనుర్వేదంలో ఎక్కడాలేనటువంటి ఒక మంత్రాన్ని అభిమంత్రించారు అది ఏ అస్త్ర
ప్రయోగానికి ఉపయోగించేటటువంటి మంత్రంకాదు ధర్మాత్మా సత్యసంధ శ్చ రామో దాశరథి ర్యది ! పౌరుషే చాఽప్రతి ద్వన్దః శరైనం జహి రావణిమ్ !! ఇది రామాయణానికి మూలమంత్రమంటారు రామాయణ మూలమంత్రానికి
వ్యాఖానం జరిగిన మరునాడు హనుమత్ జయంతిరావడం చాలా చాలా గొప్ప విశేషమని చెప్పవచ్చును
కాబట్టి ఆయన అన్నారు ధర్మాత్మా రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధ శ్చ
రాముడు సత్యమును తప్పా ఎన్నడూ అసత్యము పలకనివాడైతే రామో దాశరథి ర్యది
రాముడు నిజంగా దశరథమహారాజుగారి కొడుకే అయితే పౌరుషే చా రాముడికి నిజంగా
పౌరుషముంటే ప్రతి ద్వన్ద్వః నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతి ద్వంది
నాతో యుద్ధం చేస్తున్నవాడు శరైనం ఈ బాణముచేత జహి మరణించుగాక రావణిమ్
రావన కుమారుడైన ఇంద్రజిత్తు.
అని సంకల్పంచేసి బాణ ప్రయోగం చేశాడు వెంటనే గొప్ప త
చ్ఛిరః సశిర స్త్రాణం శ్రీమజ్జ్వలిత కుణ్డలమ్ ! ప్రమథ్యైన్ద్రజితః కాయాత్ పాతయా
మాస భూ తలే !! గొప్ప కిరీటముతో కుండలములతో శిరస్త్రాణంతో వెలిగిపోతున్నటువంటి
ఇంద్రజిత్తు శిరస్సు కంఠమునుండి వేరై భూమిమీద పడిపోయింది. ఇంద్రజిత్తు మరణించాడు
దేవతలు గంధర్వులు ఋషులు మహర్షులు అందరూ పెద్ద పడంగే చేసుకున్నారు ఎంత
సంతోషపడిపోయారో ఇంద్రజిత్తు మరణంతోటి. ఇప్పుడూ అంతటి గొప్పయోధుడే
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అంతటి
భక్తి తత్పరుడే లక్ష్మణస్వామి ఈ మాట అనచ్చా..! బాణ ప్రయోగం చేస్తే..? రాముడు ఎంత
ధర్మాత్ముడో లక్ష్మణునికి తెలుసు కానీ లోకం రామ చంద్ర మూర్తి మీద కొన్ని అపవాదులువేసింది
అవేవంటే ధర్మాత్మా రాముడు ధర్మం తప్పాడూ అన్నారు ఎక్కడ ధర్మం తప్పాడు అంటే చెట్టు
చాటునుంచి వాలిమీద బాణం వేశాడూ అన్నారు అందుకని ధర్మం తప్పాడూ అన్నారు, రాముడు
ధర్మం తప్పలేదు అని మనకు గొప్ప రుజువేమిటంటే రాముడు ధర్మం తప్పింటే ఇంద్రజిత్తుని
ఈ బాణం కొట్టి ఉండదు, రాముడు ఎన్నడూ ధర్మం తప్పనివాడు కాబట్టే ఆఖరికి లక్ష్మణ
స్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగంచేస్తాను అన్నా కంటికి కనపడనివాన్ని చంపకూడదు అన్న
ధర్మాత్ముడుకాబట్టే ఇంద్రజిత్తు నిగ్రహింపబడ్డాడు. అటువంటి ధర్మాత్ముడు రామ చంద్ర
మూర్తి నిరూపించింది ఈ శ్లోకం సత్యసంధ శ్చ రాముడెన్నడూ అబద్ధము
తెలియనివాడు, కానీ రాముడు అబద్ధమాడాడు అన్నారు ఎక్కడాడాడు అన్నారు,
అయోధ్యకాండలో
పట్టాభిషేకం జరగకుండా రామ చంద్ర మూర్తి అరణ్యవాసానికి బయలుదేరివెళ్ళిపోతున్న
సమయంలో అంతః పురంలోంచి బయటికొచ్చినటువంటి దశరథమహారాజుగారు ఉత్తరీయం జారి
పడిపోయివుండగా రామ చంద్ర మూర్తి కూర్చున్నటువంటి రథాన్ని తోలుతున్నటువంటి సుమంత్రున్ని
రథాన్ని ఆపూ ఆపూ తీసుకువెళ్ళవద్దు పెద్దగా అరుపులు అరుస్తూంటే... రథ
స్థితుడైనటువంటి రామ చంద్ర మూర్తి రథాన్ని ఇక్కడ ఆపకుండా నడుపూ నడుపూ అంటూంటే ప్రభువైన
దశరథమహారాజుగారు రేపు తిరిగొచ్చిన తరువాత నేను రథాన్ని ఆపూ అన్నతరువాత రథాన్ని
ఎందుకు ఆపలేదూ అని నన్ను దశరథుడు అడిగితే నేను ఏం చెప్పనూ అని రామున్ని అడిగితే
రాముడు నేను ఆపకూ అన్నాను కాబట్టి రథాన్ని అరణ్యానికి తీసుకెళ్ళిపోయి తిరిగొచ్చిన
తరువాత రథచక్ర సవ్వడిలో నీవన్నమాట నాకు వినపడలేదని చెప్పై అన్నాడు. అబద్ధం
చెప్పడమొకటి చెప్పించడమొకటీ కాదుకదా... కాబట్టి రాముడు అసత్యమాడాడు అన్నారు,
రాముడి రథాన్ని ఆరోజున ఆపి ఉంటే కౌసల్యానాథ ధశరథుడు వచ్చి రామ చంద్ర మూర్తిని
గట్టిగా పట్టుకుంటే తిరిగి అరణ్యానికి వెళ్ళలేనటువంటి స్థితిని కల్పిస్తే తండ్రి
అసత్యమునందు పడిపోయి పొందవలసినటువంటి ప్రయోజనం పొందకుండా పోతాడుకాబట్టి తండ్రిని
సత్యమునందు నిలబెట్టడమనేటటువంటి పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడంకోసం ఒక చిన్న
అనృతాన్ని అడిస్తే దోశంలేదు కాబట్టి, పెద్ద ధర్మాన్ని నిలబెట్టడంకోసం ఒక చిన్న
అధర్మాన్ని తప్పని శాస్త్రమనదు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కొడుకు
“తండ్రి మరణశయ్యమీద ఉండి సంధ్యావందనం చెయ్యలేకపోతే తండ్రిపేరుమీద సంధ్యావందనంచేసి
తాను ప్రాయశ్చిత్తంతో వేళ దాటాక సంధ్యావందనం చెయ్యొచ్చు” కాబట్టి చిన్న అధర్మం
పెద్ద ధర్మాన్ని నిలబెడితే దొషంకిందకిరాదు. ఒక గోవు ఇటువెళ్ళిపోతే కసాయివాడువచ్చి
ఆవు ఇటువెళ్ళిందా అని అడిగితే నాకు తెలియదు అని చెప్పితే అబద్ధం చెప్పినట్టుకాదు
గో ప్రాణ రక్షణచేసిన పుణ్యం తన ఖాతాలోకి వెళ్తూంది కాబట్టి రాముడు అసత్యమాడలేదు
నిరూపింపబడింది కాబట్టి ధర్మాత్మా సత్యసంధ శ్చ రామో దాశరథి ర్యది రాముడు
దశరథ మహారాజుగారి కొడుకు కాదు పాయసపాత్రవచ్చింది ఆనాడు బాలకాండలో ఆయజ్ఞం
చేసినప్పుడు పుత్రకామేష్టిలో వచ్చినటువంటి యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి పాయసపాత్రలో
ఆ పాయసాన్ని ఆరగించడంవల్ల నిర్మించాడుతప్పా దశరథమహారాజుగారి గొప్పతనం అందులో లేదూ
అని అన్నారు కొంతమంది రాముడు నరుడిగా జన్మించడం కోసం వచ్చనవాడు నరుడిగా ఉంటే తప్పా
రావణ సంహారంకాదు కాబట్టి నరుడిగా వచ్చాడు కాబట్టి నరుడిగా జన్మించాలంటే
దశరథమహారాజుగారి తేజస్సు కౌసల్యా సుమిత్రా కైకేయీలలోకి ప్రవేసిస్తేతప్పా
నరావిష్కారము నర ఉత్పత్తిజరగదు కాబట్టి దశరథ మహారాజుగారి కొడుకుగానే వచ్చాడంటే
పూర్ణమైనటువంటి నరుడిగానే రాముడు నడిచాడు తప్పా ఎక్కడా ఈశ్వరుడిగా రామాయణంలో
రాముడు నడిచిచూపించలేదు అని నిరూపించింది కాబట్టి ʻఆయన
దాశరథియే దశరథ మహారాజుకొడికేʼ అందుకే ఆయన్ని “దాశరథీ
కరుణాపయోనిధీ” అంటే పొంగిపోతాడని నిరూపించినటువంటి శ్లోకము కనుకా ధర్మాత్మా
సత్యసంధ శ్చ రామో దాశరథి ర్యది పౌరుషే చా రాముడికి పౌరుషంలేదన్నారు ఒకప్పుడు,
ఎప్పుడు పధ్నాలుగువేలమంది ఖరదూషనాదులతో ఆయన యుద్ధం చేస్తుంటే బాణ పరంపరచేత
దెబ్బతిన్న ఖరుడు ఒంటినుంచి రక్తం కారిపోతూ తాటిచెట్టు ప్రమాణంలో గబగబా నడిసొచ్చి
రామ చంద్ర మూర్తిమీద పడిపోతూంటే బాణం వెయ్యడానికి చోటులేకా వింటినారిని వెనక్కి
లాగడంకోసం మూడడుగులు వెనక్కివేశాడు యుద్ధంలో ధనస్సు పట్టుకున్నవాడు మూడడుగులు
వెనక్కివేస్తే పౌరుషంలేనివాడికింద లెక్కా, ఖరున్ని చంపేటప్పుడు మూడడుగులు
వెనక్కివేశాడు కాబట్టి పౌరుషంలేదూ అని కొంతమంది విమర్ష చేశారు.
కాని తన ఎదురుగుండా నిలబడినటువంటివాన్ని
సంహరించడానికి వింటినారిని ఆకర్ణాంతము లాగడానికి కావలసినంత వ్యవధానము లేనికారణంచేత
అటువంటి స్థితిని కల్పించుకోవడం ఒకయోధుడు మూడడుగులు వెనక్కివెస్తే అది అపసర్పణమౌతుందితప్పా
అది ఎప్పుడూ ధర్మధిక్కరణంకాదు అది పౌరుషము లేకపోవడము కాదూని
మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పౌరుషే చా రాముడు ఆనాడు చేసినది
తప్పుకాదని అపసర్పణమే తప్పా రాముడు బీరుడై మూడడుగులు వెనక్కివేయలేదూ అని ఈ శ్లోకము
నిరూపించింది. రాముని యొక్క వైభవాన్ని రాముని యొక్క శీలాన్ని రాముని యొక్క
గుణములను నిరూపించిన శ్లోకం కనుకా ఈ మాట అంటే ధనుర్వేదంలో లేని మంత్రానికి
ఇంద్రజిత్తు యొక్క శిరస్సు పడిపోయిందికనుకా... రాముడు ఎంతటి గుణవంతుడో
నిరూపించిందిగనుకా శ్రీరామాయణానంతటికి కూడా 24వేల శ్లోకాలలో రామాయణానికి
మహామూలమంత్రంగా ఈ శ్లోకాన్ని పెద్దలు స్వీకరిస్తారు అందుకే రామాయణానికి
మూలమంత్రమేమీ అంటే ఇదే మంత్రము ధర్మాత్మా సత్యసంధ శ్చ రామో దాశరథి ర్యది !
పౌరుషే చాఽప్రతి ద్వన్ద్వః శరైనం జహి రావణిమ్ !! కాబట్టి ఈ మాట చెప్పగానే
ఇంద్రజిత్తు యొక్క శిరస్సుపడిపోయింది. ఇంతగొప్పగా రామ చంద్ర మూర్తి యొక్క
వైభవాన్ని నిరూపించినటువంటి శ్లోకం తదనంతరము ఆ ఇంద్రజిత్తు పడిపోగానే ఒక్క
రాక్షసుడులేడు అందరూ పారిపోయారు అకడ్నుంచి.
ఇప్పుడు లక్ష్మణ స్వామి మెల్లిమెల్లిగా అడుగులువేసుకుంటూ
అక్కడ్నుంచి రామ చంద్ర మూర్తిదగ్గరికి వెళ్లాడు, మెల్లిమెల్లిగా అంటే నీరసంవల్లా
అనుకోకండి సిగ్గుపడిపోయాడటా... దేనికి సిగ్గు అంటే అన్నయ్యంతటి మహావీరుడిదగ్గరికెళ్ళి
అన్నయ్యా! నేను ఇంద్రజిత్తుని చంపానని ఎలా చెప్పను నేను చంపానన్నయ్యా అని చెప్పడం
శుభవార్త, కానీ అన్నయ్యంతటివాడిదగ్గరికెళ్ళి అన్నయ్యా నేను చంపానని చెప్పనా... అని
సిగ్గుపడి గట్టిగా చెప్పకుండా గొణిగాడటా గొణిగితే రామ చంద్ర మూర్తి ఏరా! నాన్నా...
ఇంద్రజిత్తు సంహారమైందిగా... అన్నాడటా, అప్పుడు పక్కనున్న విభీషణుడు గట్టిగా
చెప్పాడటా మహానుభావుడు ఈ లక్ష్మణస్వామియే ఇంద్రజిత్తుని సంహరించాడు అన్నాడటా అన్న
తరువాత రామ చంద్ర మూర్తి ప్రియమార తమ్మున్ని కౌగలించుకుని ఒళ్ళంతా తడిమి నాన్నా
ఎంత కార్యాన్ని సాధించావురాని తొడమీద కూర్చోబెట్టుకుని మూర్ధన్యస్థానంలో
ముద్దుపెట్టుకున్నాడు. అక్కడ శుషేణున్ని పిలిచి ముక్కు దగ్గర ఒక ఓషధి పెట్టించారు,
ఆ ఓషధి వాసన చూడగానే ఆయన గాయములన్నీ మానిపోయి ఒక్కసారి పూర్వము ఎటువంటి తేజస్సుతో
ఉండేవాడో అంతటి తేజస్సుతో లక్ష్మణస్వామి సంతోషంగా రామ చంద్ర మూర్తితో కలిసి
కూర్చున్నారు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఇంద్రజిత్తువధ
అయిపోయిందికాబట్టి ఇంక రావణ వధ కేవలము నిమిత్తమే ఇక కుడిబాహువులేనివాడు రావణుడు
కాబట్టి ఇవ్వాళ ఇంద్రజిత్తుపడిపోయాడు హనుమత్ జయంతినాడు రావణాసురుడు పడిపోతాడు
కాబట్టి నిజంగా ఇక్కడ రామాయణం చాలా ఆశ్చర్యమే హనుమత్ జయంతినాడు రావణవధరావడం
కాబట్టి రేపటిరోజున రావణ వధ చేయించుగాకా... రామ చంద్ర మూర్తి వాచికంగా రావణవధ
చేయించి హాయిగా ఇంక పట్టాభిషేకంవైపుకు అడుగులువేసేటటువంటి భాగ్యం అంతగొప్ప
ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి అదృష్టం ఆ సీతారామ చంద్ర ప్రభువు హనుమా కృపచెయ్యాలని
ప్రార్థనచేస్తూ ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మనం అనుకున్న
ఆచారం ప్రకారం ఇంద్రజిత్తు సంహారం జరిగింది కాబట్టి ఒక్కసారి మనం రామ నామం
చెప్పుకుందాం రేపు శంకరాచార్యుల స్వామివారి యొక్క నమస్కారం చేసుకుందాం ఇవ్వాళ
రామనామం చెప్తాం ఎందుకంటే ఇంక ఇంతకన్నా మిమ్మల్ని కూర్చోబెడితే నాకైతే అభ్యంతరంలేదు
ఎంతసేపైనా కూర్చుంటాను కాబట్టి మీ కొరకు నేను ఈ పదకొండునామాలు చెప్పి
ముగించేస్తాను. రేపు పదిగంటలకీ హనుమత్ కళ్యాణముంటుంది ʻసువర్చలా
సహిత హనుమత్ కళ్యాణంʼ కాబట్టి చక్కగా ఆ
హనుమత్ కళ్యాణం చూడ్డానికి రండి. నేనైతే ఏమిటి ప్రతిపాదన చేస్తున్నానంటే నేనంటే
ప్రతిపాదన చెయ్యడమంటే ఏమిటో తెలుసాండీ... నేనేం మీ అందరు రండీ అనిగానీ మీరొస్తే
చేస్తాననికానీ నేనెప్పుడూ చెయ్యను ఇది యోగ్యము అని నేను నమ్మాననుకోండి అది నేను
చేస్తానంతే నేను చేసేటప్పుడు దాన్ని ఇంకొళ్ళు కూడా చేశారనుకోండి అది ఇంకా
సంతోషిస్తానంతే పదిమంది చెయ్యలేదనుకోండి నేను విచారించనంతే రాముడు వాళ్ళకి ఆ
అనుగ్రహం కల్పించాలని కోరుకుంటాను, నేను ఎవ్వర్ని నిగ్రహించడం బలవంతపెట్టడం
చెయ్యను.
రేపు నేను తొమ్మిదిన్నరకే వస్తాను ఒక్క ముప్పై నిమిషాలపాటు
పెద్దవాళ్ళకి ముప్పైనిమిషాలుచాలు చాలా తక్కువనామాలున్నది ఏదుందో 108 నామాలున్న
కాగితాన్ని తీసుకొని పైకి అంటూ... అంతకన్నా హనుమ సంతోషానికి ఏమికావాలండీ... యత్ర
యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారిపరిపూర్ణ లోచనం మారుతిం
నమత రాక్షసాంతకం ఎవరికి ఏదిప్రీతో అది చేయడం ఆయన జన్మదినంనాడు కలిగినటువంటి
గొప్పకానుక కదా... పుట్టినరోజునాడు దిక్కుమాలిన సినిమా టికెట్లు తీసుకొచ్చి
ఇచ్చారనుకోండి రామాయణమంటే ఇష్టమున్నాయనకి ఆయనకేమిటిదానివల్ల సంతోంషం ఇంకొకనికిచ్చి
నీవువెళ్ళురాబాబు అంటారు, మీరు రామాయణం మీద అద్భుతవ్యాఖానాన్ని పట్టుకొచ్చి
ఇచ్చారనుకోండి ఆయన ఎంతో ప్రీతిచెంది కళ్ళకద్దుకుని నా అదృష్టం పుట్టినరోజునాడు
వచ్చింది అంటాడు. ఎవరికి
ఏదిష్టమో అదివ్వాలి. హనుమంతుడు పుట్టినరోజున మీరేమిస్తారు హనుమంతుడు పుట్టినరోజున
మీరు రామ నామం రాస్తే ఆయన సంతోషపడిపోతాడు. అబ్బా ఇక్కడరా రామ నామం రాశాడని
పరవశించి పోతారు అందరికీ
హనుమత్ కటాక్షం కలగాలనుంటే ఏం చెయ్యాలంటే ఆరోజున రామ నామం రాయించాలి.
కాబట్టి మనందరం రేపు ఏం చేద్దామంటే తొమ్మిది ముప్పై నుంచి పదిగంటలవరకు చక్కగా నేను
చెప్పను ఎవరికైనా మైకిస్తాను మీలో ఎవరికైనా ఎప్పుడు నేనే మైకాసురునిలాగా కాబట్టి
ఎవరికో ఒకరికి ఇస్తాను మీరు వేదికమీద కూర్చుని శ్రీ రా మ అంటూ శ్రీ ఎంత
సేపు రాస్తారో అంతసేపు శ్రీకారం శ్రీ రా మ అని ʻఅఆʼలు దిద్దుతారే అలా 108
పర్యాయములు మైకుదగ్గరు కూర్చున్నాయన అంటూ మెల్లగా అంటూ రామ నామం రాసేవాడితో
రాయిద్దాం. ఆయన అంటూంటే మనందరం కూడా ఇంకేమీ మాట్లాడకుండా నూటా ఎనిమిది నామాలు
అయ్యేవరకు శ్రీ రా మ శ్రీ రా మ అంటూ 108మాట్లు అన్ని కంఠాలు శ్రీ రా మ
అంటాయి వాచిక కైంకర్యము శ్రీ రా మ తలచుకుంటాయి మానసిక కైంకర్యము శ్రీ రా మ నోటితో
అంటాయి కాయిక కైంకర్యము మూడు రకాలుగా రేపు హనుమత్ జయింతికి కైంకర్యములు, అదికదాండి
దానికి కదాండి సంతోషిస్తారు.
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఇప్పుడు
ఇవ్వన్ని తీసుకెళ్ళి ఓ బుట్టలోవేసి అప్పుడుకూర్చుని హనుమత్ కళ్యాణ దర్శనం అప్పుడు
ఆయన ప్రీతిపొంది సంతోషిస్తాడు మీదగ్గిర వీడురా రామ నామం రాసివాడని మీరు రామ నామం
మానేసి ఏది చేసినా హనుమ స్వీకరిస్తాడని మీరు అనుకోవద్దు ఎందుకో తెలుసాండి మీకు
ఏమిటి అధికారం చెప్పడానికి అని అడగవచ్చు పెద్దలైనవారందరూ పరాశర సంహితంగా అదే
చెప్పింది మీరు తెల్లవారితే చెప్పట్లా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర
కృతమస్తకాంజలిం అనుమని స్త్రోత్రం చేస్తే హనుమ నేను రామ నామం చెప్పాననుకోండి
ఆనొచ్చేస్తాడు అది కూడా ఎలా వస్తాడో తెలుసాండి..! కృతమస్తకాంజలిం ఇలా
వస్తాడు తలవంచుకుని బాష్పవారిపరిపూర్ణ లోచనం ఆనందంతో కన్నుల నీరుకారుస్తూ
అలా నిల్చుంటారు పొంగిపోతారటా... మనందరం శ్రీ రా మ అంటూ రాస్తున్నామనుకోండి
వచ్చేస్తాడంతే వచ్చినిల్చుంటాడు. హనుమత్ కళ్యానం జరిగిందనుకోండి వీళ్ళు ముందు నా
స్వామి నామం చెప్పివచ్చారని ముందు కళ్యాణం చేసుకుంటాడని అప్పుడు మనకు భాగ్యం
కదా..! అందుకని తొమ్మిదిన్నరకి నేను వస్తాను మీరూ వస్తే మంచిదంటాను కాబట్టి అందరూ
కూర్చుని చక్కగా శ్రీ రా మ అని రాసి ఒక గంటుంటుందేమో అనుకుంటాను, ప్రసాదం
తీసుకుని చక్కగా బయలుదేరి సాయంకాలం మళ్ళీ శ్రీ రామాయణ ప్రవచనాన్ని విందాం.
కాబట్టి ఇప్పుడు ఒక పదకొండుమాట్లు రామనామం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
పాహి కృష్ణాయనుచు ద్రౌపతి పలికినది శ్రీ రామ నామము !!రా!!
దారినొంటిగ నడచువారికి తోడునీడే రామ నామము !!రా!!
నీవు నేనను భేదమేమియు లేక యున్నది రామ నామము !!రా!!
గౌరికిది ఉపదేశనామము కమలయజుడు జపియించు నామము !!రా!!
భగవదర్పిత
కర్మపరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
యుద్ధ కాండ
ముప్పయ్ తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఇంత చేసి శంకరాచార్యులవారు బరువైపోయారా...
ఆమైకు ఇటు పెట్టయ్యా అదీ చేసేద్దాము
రావణానుజ హృదయపంకజ రాచకీరము రామ నామము !!రా!!
వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామ నామము !!రా!!
నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించిన రామ నామము !!రా!!
శాంతిగా ప్రార్తించువారికి సౌఖ్యమైనది రామ నామము !!రా!!
ఆత్మశుద్ధిని కన్నవారికి అధికమగు రఘురామ నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామ నామము !!రా!!
మంగళా శాసన...
No comments:
Post a Comment