కొన్ని ఇతర సంక్షిప్త రచనలు


మోక్ష స్వరూపం

తేది 26-9-2015 సాక్షి దినపత్రికలోనిది...

     ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థ చతుష్టయంలో మోక్షమే ఉత్తమ పురుషార్థం. ఈ మోక్ష పురుషార్థ సాధనకు కర్మ-జ్ఞాన-భక్తి-ప్రవత్తులు అనే నాలుగు మోక్షోపాయాలు కలవు. వీనిలో ఏదేని ఒక మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించిన వారు ఈ శరీర త్యాగానంతరం సూక్ష్మ రూపంతో అర్చిరాది మార్గంలో వివిధ లోకాధిపతుల మార్గదర్శకత్వంలో ఉర్థ్వలోకాలను దాటి అవరణసప్తకాన్ని మూలప్రకృతినిదాటి విరజానదిలో ప్రవేశిస్తారని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి.

     అటు పిమ్మట సారూప్యాన్ని పరమాత్మతో సమానమైన రూపాన్ని ముక్తాత్మ పరమాత్మతో సమానమైన రూపాన్ని పొందడమేకాక పరమాత్మలో ఉండే పాపాలు ఆంటకుండటం, ముసలితనం లేకుండటం, ఆకలి లేకుండటం, సంకల్పించినది వెంటనే సిద్ధించుటం అనే అష్టగుణాలను కూడా పొందుదురు. ఆ తరువాత పరమాత్మతో సమానమైన లోకాన్ని పొందుతారు. అటు పిమ్మట మైకంఠ నాథుని పాదాల దగ్గరకు సామీప్యాన్ని పొందుతారు. తదనంతరం సాయుజ్యమనే మోక్ష స్థితి లభిస్తుంది. వ్యాసమహర్షి తాని రచించిన బ్రహ్మ సూత్రాలలోని ఒక సూత్రంలో సాయుజ్య రూపమైన మోక్షస్థితిని వివరించాడు. దాని ప్రకారం ముక్తాత్మ పరమాత్మలకు గుణాలను అనుభవించడంలో సాదృశ్యం ఉంటుంది. పరబ్రహ్మతో కుడి సకల గుణాలను ముక్తపురుషుడు అనుభవిస్తూ ఉంటాడు. ముక్తాత్మ పరమాత్మవలె సృష్టి స్థితిలయాలను చేయడు. ముక్తపురుషుడు జగత్సృష్టి చేయడంవల్ల పరమాత్మకు కలిగే రసానుభవం ఏదైతే ఉందో దానిని ముక్తపురుషుడు పరమాత్మతో సమానంగా పొందుతాడని సారరూపమైన అర్థం.

     ముక్తపురుషునికి జగద్వ్యాపారం లేదు. భోగానుభవంలో మాత్రం సాదృశ్యం (పోలిక) కలదు. ముక్తాత్మ పరమాత్మ సాయుజ్య రూపమైన మోక్షాన్ని పొందిన తరువాత మళ్లీ ఏదో ఒక లోకంలో పుట్టడం అనేది ఉండదు. వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాలలోని చివరి సూత్రంలో "అనావృత్తి శ్శబబ్దాత్ అనావృత్తి శ్శబ్దాత్" అని రెండుసార్లు ముక్తాత్మకు పునరావృత్తి లేదని నొక్కి చెప్పారు. ఐశ్వర్యం వల్ల కలిగే సుఖం కంటెను, కైవల్య రూపమైన ఆత్మానందమును పొందుటకంటెను, భగవంతుణ్ణి పొందటం అనే మోక్షరూప సుఖం కోటిరెట్లు ఎక్కువది.

     పరమానంద భరితమైన మోక్షస్వరూపమును తెలుసుకొని మోక్షప్రాప్తికై ప్రయత్నిద్దాం. మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.

--::--


తులాధరుని తపస్సు


     అహంకారం లేని మనిషి ఉండడు, అహంకారం ఆ 'మహాశక్తికి' ఏ కోశానా ఉండదు. మనిషి భగవంతుడు కావాలంటే - దర్శనమంటే అదే - భగవంతుడి 'అహంకారలేమి' లక్షణం ఉండాలి. కానీ దానిని వదులుకోడం మనిషికి సాధ్యం కాదు. ఎంత చిన్న విషయం చూసుకొనైనా అహంకరిస్తాడు. ధన గర్వం, విద్యా గర్వం, అధికార గర్వం, సౌందర్య గర్వం-ఎన్నో.

     'గర్వించకు, నేడు నీ నివాసము ఉన్నతమైనదే కావచ్చు. కానీ రేపు నీవు భూమిలో ఉండగా పైన గడ్డి మొలుస్తుంది' అని హెచ్చరిస్తాడు అధ్యైత సమ్రాట్ స్వామి రామతీర్థ.

     తపస్సు చేయాలనే సంకల్పం కలిగినప్పుడు, ముందు తనలోని అరిషడ్వర్గాలు తొలగించుకోవాలనే దృఢవైఖరి లేకుండా జాబాలి అనే రుషి తపస్సుకు పూనుకున్నాడేమోననిపిస్తుంది. గట్టి తపస్సే చేశాడు. జడలు కట్టినై. వానిలో పక్షులు గూడుకట్టుకున్నై. ఒక సారి ఓ హంస వచ్చింది. గూటిలోని పక్షుల్ని పలకరించినప్పుడు. ఆ హంసతో క్షేమంగానే ఉన్నామని అవి బదులిచ్చాయి. ఈ కింద ఉన్నది ఎవరని హంస పక్షులనడుగగా, 'జాబాలి అనే మహర్షి' అని చెప్పనై. కానీ తపస్సుమరిచి, నా తల మీద పక్షులు గూడుకట్టుకున్నై కదా. నేనెంత లోకోపకారిని అని భావిస్తున్నాడు. అహంకారం అలముకుంది అని కూడా చెప్పాయి.

     జాబాలికి పక్షి భాష తెలుసు. 'అయితే ఇంత కన్నా మహాతపస్వి తులాధరుడు, కాశీలో ఉన్నాడు. మహాదాన శీలి' అని అన్నాయి.

     హంస కాశీ వెళ్ళింది. కుతూహలం కొద్దీ జాబాలి కూడా బయలుదేరి వెళ్ళాడు ఈ బంగారం, ఆ మట్టీ రెండూ ఒకటే అంటున్నాడు తులాధరుడు. కేవలం భగవంతుడి సొత్తుకు కాపలాగా ఉంటున్నాను. ఇంతే నా తపస్సు. ఈ మొత్తం, నేను దానమిచ్చే దానితోసహా ఆ పరమాత్ముడిదే అని ప్రకటిస్తున్నాడు.

     అప్పుడు జాబాలి తలపైని గూటిలోని పక్షులు (అవి నిజానికి ధర్మధూతలు) 'నీ తప్సు వేరు, ఇతడి తపస్సు వేరు, నీవు నీ తపస్సు గురించి పక్షులకు ఎంత ఉపకారం చేస్తున్నావో అనే భావంలో పడిపోయావు. అంటే అహంకారం ప్రవేశించిందన్నమాట. తపస్సేమైనట్లు? అందువల్ల సర్వం పరమాత్మదే అని భావిస్తున్న తులాధరుడే నీకన్నా ఉత్తముడు అన్నాయి ఆ పక్షులు.

     అందుకే భక్తుడైన వాడు ఏవైనా దానధర్మాలు చేసినా, సేవారూపంలో ఏదైనా కార్యం చేసినా, అంతా ఆ పరమాత్మయే చేయిస్తున్నాడు. ఉన్నది అతడే ఈ సమయానికి నేనిక్కడ ఉన్నాను కాబట్టి నన్ను వినియోగించుకొని ఈ పని జరిపించాడు అని సంతోషిస్తాడు. తాని మంచివాడు కాబట్టి చేశానని అడుగుతున్నాడంటే, చేసిన సేవ యావత్తూ కలుషితమైపోతుంది.

     అహం చాలా సూక్ష్మంగా ప్రవేశిస్తుంది. విస్వార్థంగా కనిపించే పనులు తరచి చూస్తే స్వార్థ పూరితమైనవేనని తేలుతుంది. పరాయి లేక తనది కాని పనిలో జోక్యం చేసుకోడమంటే- అది సదుద్దేశంతోనే కాదు- అహం రానివ్వకుండా చేశారా అనేదే ముఖ్యం.

--::--


అసూయ

(సముద్రాల గోపాలాచార్యులు)

     ‘గుణేషు దోషారోపణం అసూయా (ఎదుటి వారిలో అన్నీ గుణాలే ఉన్నా గుణాలను దోషాలుగా వక్రీకరించి చెప్పుట) అనేది అసూయా శబ్దానికి నిర్వచనం. లోకంలోని కొందరు ఇతరుల అభివృద్ధిని ఓర్వలేక ఇతరులలో ఉండే గుణాలను చూసి సహించలేక ఈర్ష్యాసూయలతో కొందరు రగిలిపోతూ ఉంటారు. కాని ఇది సరియైన విధానం కాదు. అభివృద్ధిలో  ఉన్న వారిని ఆదర్శంగా గ్రహించి, వారితో ఆరోగ్యకరమైన రీతిలో పోటీపడి సత్ఫలితాలను పొందడమే సరైన విధానం. ఇతరులకు ఉన్న దానిని చూసి ఓర్వలేక ఎప్పుడూ ఏడుస్తూ, కుళ్లుతో కుమిలిపోతూ ఉండటం దుశ్యర్య దీనివల్ల సమయం వృథా అవుతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతే తప్ప ఏ సత్ఫలితం లభించదు.
     
భరతుడు సపరివారంగా అరణ్యవాసం చేయచున్న శ్రీరామ చంద్రుని వద్దకు వస్తూ ఉండగా అతని రాకను లక్ష్మణుడు ముందే గర్తించాడు. ఇతని తల్లి రాజ్యం లాక్కొని అడవులకు పంపినది ఇప్పుడు ఇతడు ఏ విధమైన అపకారమును చేయదలచి సపరివారంగా వస్తున్నాడో అని లక్ష్మణుడు భరతుని దూషిస్తూ ఉండగా, శ్రీరాముడు లక్ష్మణునితో – నీవు భరతుని రాకలో దోషాన్ని చూడకు. అతనికి రాజ్యకాంక్ష లేదు. నాకే కాదు నీకు రాజ్యాన్ని ఇమ్మని నేను చెప్పినా వెంటనే భరతుడు అంగీకరిస్తాడు. కాదని చెప్పడు. అటువంటి సచ్చరితుని దూషించవద్దు అని పరికాడు.

     మరొక సందర్భంలో లక్ష్మణస్వామి కైకేయిని నిందిస్తున్నప్పుడు కూడా శ్రీరాముడు లక్ష్మణునితో మన ముగ్గురు తల్లులలో మధ్యమురాలైన కైకేయూ మాతను నీవు నిందిస్తే నేను భరించలేను అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ విధంగా శ్రీరాముడు అనేక సందర్భాలలో దోషారోపణములను ఖండించినాడు. ఇతరులలో గుణాలనే దర్శించాడు. దోషాలను ఎత్తి చూపే స్వభావం శ్రీరామచంద్రునికి లేనేలేదు.

     తన రాజ్యంలో ఎవరింట్లో ఉత్సవం జరిగినా, ఎవరికి శుభఫలితాలు లభించినా ఒక తండ్రిలాగా శ్రీరామచంద్రుడు సంతోషిస్తాడు. ‘‘ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి‘‘. అంతేకాని అసూయ చెందనే చెందడు అని రామాయణంలో ఏ మాత్రం అసూయ లేనట్టి శ్రీరామచంద్రుని ప్రశస్తిని వర్ణించారు.

     వాల్మీకి మహర్షి దేవర్షియైన నారదుని వద్ద కొన్ని గుణాలను ఉటంకిస్తూ, ఇవి కలవాడు ఎవడు అని ప్రశ్నించే సంర్భంలో కో నసూయకః?’ లోకంలో అసూయ లేనివాడు ఏవడు? అని ప్రశ్నించాడు.

     ఎన్నెన్నో సద్గుణాలకు నిధిగా పేర్కొనబడిన (గుణానాం ఆకరో మహాన్) శ్రీరామచంద్రుడిలో అసూయ ఏ మాత్రం లేనేలేదు అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి తేలిపాడు. గుణాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శింగా గ్రహించి, మనలో కూడా అసూయాది దుర్గుణాలు దరిచేరకుండా జాగ్రత్తపడదాం. ఇతరుల అభివృద్ధిని, క్షేమాన్ని చూసి సంతోషించగలిగే స్థితికి చేరుకుందాం.

--::--


ధర్మాధర్మాలు

(యండి ఉస్మాన్ ఖాన్)

     ధర్మాధర్మాలను పట్టించుకోకుండా బాగా సంపాదించే వారిని, తమకు నచ్చిన విధంగా ఇష్టానుసార జీవితం గడిపే వారిని సాధారణంగా ప్రజలు తెలివైనవారని, వివేకవంతులని భావిస్తారు. ఎంత సంపాదిస్తే అంత గొప్ప వారుగా, దూరదృష్టిగల వారుగా పరిగణిస్తారు. కాస్తంత నీతిగా బతకడానికి ప్రయత్నించే వారిని ప్రజలు తెలివి తక్కువ వారుగా ముద్రవేస్తారు.
   
  కాని ముహమ్మద్ ప్రవక్త(న) మనోవాంఛల్ని అదుపులో ఉంచుకొని, మరణానంతరం పరలోక జీవితానికి పనికొచ్చే కర్మలు ఆచరించినవాడే వివేకి అనీ, మనోవాంఛల బానిసగా మారిన వాడు అవివేకి, బుద్ధిహీనుడు, దైవంపై మిధ్యాభావం పెట్టుకున్న వంచకుడని ప్రవచించారు. అంతేకాదు అవినీతికి పాల్పడి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పోషితమైన శరీరం నరకానికి మాత్రమే తగినదని సెలవిచ్చారు.

     అంటే నీతికి పాతరేసి, ధర్మానికి నీళ్లొదిలి దొడ్డి దారిన అధర్మంగా, అన్యాయంగా ఎంత సంపాదించినా, అది వివేకంతో బుద్ధి బలంతో సమకూర్చుకున్న ధర్మసంపాదన ఎంతమాత్రం కాబోదు. సాధారణంగా ప్రజలు ఇలాంటి సంపన్నులను ఎంతో తెలివైన వారుగా, వివేక వంతులుగా భావిస్తే భావించవచ్చు. కాని వారి మోసాలు, అవినీతి, వారి ఇష్టానుసారమైన విలాసవంతమైన జీవన విధానం వారి నిజస్వరూపాన్ని ఎల్లకాలం కాపాడలేవు. ఏదో ఒకరోజు వారి అవినీతి పాపాల పుట్ట బద్దలవుతుంది. అప్పుడు, తెలివైన వారు, వివేక సంపన్నులు అని కొనియాడిన జనమే పరమ అసహ్యంగా ఈసడించుకుంటారు. ఇది ఇక్కడే, ఇహలోకంలోనే ఎదురయ్యే ఘోరపరాభవం, ఇక పరలోకంలోనైతే ఇంతకంటే ఎక్కువ పరాభవాన్ని చవిచూడవలసి ఉంటుంది.

     అందుకే ఇలాంటి వారిని ప్రవక్త మహనీయులు అవివేకులని, బుద్ధిహీనులని, దైవంపై మిధ్యా నమ్మకం పెట్టుకున్న నయవంచకులని అసహనం వ్యక్తపరిచారు. అంతేకాదు. ప్రజల హక్కల్ని కొల్లగొట్టి, వంచనతో, మోసంతో, అవినీతికి, అక్రమాలకు పాల్పడి సంపాదించిన సొమ్ముతో పోషితమైన దేహం నరకానికి మాత్రమే పోతుందని హెచ్చరించారు. ఇలాంటి అవి నీతి సొమ్ముతో ఒకవేళ సత్కార్యాలు ఆచరించినా అవీ స్వీకార భాగ్యానికి నోచుకోవు. ఎన్ని దానధర్మాలు చేసినా ఎలాంటి ప్రయోజనమూ చేకూరదు. అధర్మంగా సంపాదించడమే కాక ఆ అక్రమ సొమ్ముతో సత్కార్యాలు, దైవకార్యాలు ఆచరించి పుణ్యం పొందాలను కోవడం అవివేకం గాదు, దుస్సాహసం కూడా!

     కాబట్టి ధర్మబద్ధమైన సంపాదనతో మాత్రమే జీవనం సాగించాలి, పరలోకంపై దృష్టి పెట్టాలి. పరలోక విశ్వాసం, దైవానికి సమాధానం చెప్పుకోవాలన్న భావన గనక ఉన్నట్లయితే మానవులు ధర్మాధర్మాల విచక్షణ తప్పక పాటిస్తారు. అంతా ఇక్కడే అనుభవించాలి అనుకున్నప్పుడే సమస్యలన్నీ, అందుకని, దైవాన్ని నమ్మి ధర్మబద్ధ జీవితం గడిపితే ఇహలోక గౌరవమూ, పరలోక సాఫల్యమూ మన సొంతమవుతాయి. దైవం మానవులందరికీ శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం.

--::--

తామర పువ్వు

(ఎం మారుతి శాస్త్రి)

     భారతీయ సంస్కృతికీ తామరపూవుకూ అవినాభావ సంబంధం. ఒకప్పుడు మన దేశంలో సౌందర్యానికీ, శోభకూ, సమృద్ధికీ తామరపూవు ఒక చిహ్నంగా ఉండేది. ప్రాచీన సాహిత్యంలో అడుగడుగునా కనిపించే పద్మాల ప్రస్తావన గురించి పదుల కొద్దీ పరిశోధన వ్యాసాలు రాయవచ్చు.
 
 శ్రీరాముడు, శ్రీకృష్టుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ సరస్వతి, లక్ష్మీదే ఇలా మన దేవతలందరికీ తామర పూలంటే ఎంత ఇష్టమో! ఇక సాహిత్యంలో అయితే ఆదికవి వాల్మీకి నుంచి ఆచంట జానకిరాంగారి దాకా అందరూ పద్మప్రియులే. ఈ లోకంలో ఇన్ని పూలుండగా తామ పూలకే ఎందుకింత లోక ప్రియత?

     ప్రాచీన భారతదేశంలో ప్రతి జనావాసంలోనూ పెద్ద పెద్ద చెరువులుండేవి. ఆ చెరువుల్లో విస్తారంగా తామరలు ఉండేవి. వేళ్లూ, దుంపలూ ఎక్కడో నీటి అడుగున నేలలో ఉన్నా వెడల్పాటి ఆకులు మాత్రం నీటి ఉపరితలం మీద నీటుగా పరచుకొని ఉండేవి. ఆ ఆకుల మీద పేర్చినట్లు అందమైన పూలు. వాటి అసాధారణమైన సౌందర్యం. లావన్యం వల్లే తామర పూలు లోకప్రియమైన సాహిత్య వస్తువులైపోయాయి.

     జన సమ్మర్థం తక్కువగా ఉన్న ప్రశాంతమైన ప్రాంతాలలో వికసించే తామర పూల కొలనులు భావుకుల మనసులను దోచుకొని తీరయి. కేవలం బురదలో నుంచి అలాంటి సౌందర్యం ఆవిర్భవించటం ఎప్పటికీ అర్థంగాని ప్రకృతి విలాసం, అందీ అందని తత్వశాస్త్ర రహస్యం. అందుకే అరవిరిసిన సరోజాలను స్వచ్ఛతకూ, సౌందర్యానికీ, పరిపూర్ణతకూ చిహ్నాలుగా గుర్తించారు.

     అనువై పరిస్థితుల్లో తామర దుంప వెయ్యేళ్లదాకా సజీవంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆ మధ్యన చైనాలో 1200 ఏళ్ళ నాటి తామర గింజలు లభించాయి. వాటిని నాటి చూడగా అవి చక్కగా మొలకెత్తాయని వార్త. ఇటీవల ఆస్ట్రేలియాలో పరిశోధకులు తామరపూలకు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకొనే శక్తి ఉందని కనుక్కొన్నారట. పరిసరాల ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల దాకా ఉన్నట్టు గమనించారట. ఈ శక్తివల్లే తామర పూలు తుమ్మెదలను బాగా ఆకర్షించగలుగుతాయట.

     తామర పూలూ, ఆకులూ కాడలూ, వేళ్లూ, దుంపలూ ఇలా అన్ని భాగాలకూ వాటి వాటి ఔషధి విలువలు ఉన్నాయి. తామర పూల కేసరాలను తేయకుతో కలిపి చైనాలో తేనీరు తయారు చేసి ఔషధంగా సేవిస్తారు. తామ పూలూ, గింజలూ తింటే ప్రాపంచిక విషయాలపై తీవ్ర అనాసక్తి కలుగుతుందని ప్రాచీస గ్రీకుల నమ్మిక, అవి తిన్నవారు లోకంలో ఏ విషయం కోసం, బంధాల కోసం తాపత్రయ పడకుండా, వ్యర్థ శ్రమ లేని విశ్రాంతి జీవితం గడపటం ఇష్టపడతారట.

--::--


కొత్త వత్సరం "మొహర్రం"

యండి. ఉస్మాన్ ఖాన్
(ముస్లిముల కొత్త సంవత్సరం "మొహర్రం" ప్రారంభమైన సందర్భంగా...) అక్టోబర్ 2015


     చాలా విలువైనది. అమూల్యమైనది, నిరంతరం, తరంతరం పరుగులు తీయడమే దాని నైజం. అది ఎవరినీ ఉపేక్షించదు, రాజులు, రారాజులు, పండితులు, పామరులు, సామాన్యులు, అసామాన్యులు అందరూ కాలానికి తలొగ్గిన వారే. కాలాన్ని మనం ఎన్నో రకాలుగా విభజించుకున్నాం. క్షణాలు, నిమిషాలు, గడియలు, గంటలు, ఝాములు ఇలా... ప్రకృతి పరంగా కూడా ఈ విభజన ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, అమావాస్య, పౌర్ణమి, రేయి, పగలు, రోజు, వారం, నెల సంవత్సరం... ఈ ప్రకృతి ఆధారంగానే మానవుడు అనాదిగా మనుగడ సాగిస్తున్నాడు. కాలగతిలో క్యాలెండర్లు మారిపోతూ ఉంటాయి. కొత్త వత్సరాలు ప్రపంచంలోని పలు దేశాల్లో, పలు మతాల్లో రకరకాల పేర్లతో ప్రాచుర్యం పొందాయి.
   
     హి.శ. మొదటి మాసం " మొహర్రం"తో ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది ముస్లిం జగత్తుకు కొత్త సంవత్సరం. ఇస్లామీయ చరిత్రలో దీనికొక ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ముహమ్మద్ ప్రవక్త మహనీయులు(స) మక్కా నగరం నుండి, మదీనా నగరానికి వలస వెళ్లిన సందర్భాన్ని"హిజ్రి" అంటారు. నాటి నుండి ఓ నవశకం అరంభమైంది. ఒక నూతన మానవీయ వ్యవస్థ ఉనికిలోకొచ్చింది. రాజకీయ, సాంఘిక, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాలన్నిటిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. సర్వత్రా సత్యం, న్యాయం, ధర్మం, సమతూకం నెలకొన్నాయి. అందుకే హి.శ.తో ప్రారంభమయ్యే ఈ "మొహర్రం" మాసానికి ఇంతటి ప్రత్యేకత. ఈ నెల పదో తేదీని "అషూరా" అంటారు. పూర్వ చరిత్రలో కూడా దీనికి పెద్ద విశేషమే ఉంది. ఆదిమానవుని సృజన, ఆయన స్వర్గ ప్రవేశం, మొట్టమొదట ఆకాశం నుండి వర్షం కురవడం, నూహ్ ప్రవక్త నావను రక్షించడం, యూసుస్ ప్రవక్తను చేప కడుపు నుండి కాపాడడం, ఇబ్రాహీం ప్రవక్తను అగ్ని గుండం నుండి రక్షించడం, మూసా ప్రవక్తను ఫిరౌస్ బారి నుండి కాపాడడం, ఈసా ప్రవక్తను ఆకాశంపైకి ఎత్తుకోవడం, ఇవన్నీ ఆషూరా రోజునే సంభవించాయి. ఆరోజు ముస్లిములు ఉపవాసం పాటిస్తారు. మూసా ప్రవక్త అసుయాయులు అషూరా ఉపవాసం పాటించేవారు. ఇది తెలుసుకున్న ప్రవక్త మహనీయులు, మూసా ప్రవక్త పట్ల వారి కంటే మనకే ఎక్కువ గౌరవం ఉంది. కనుక మనం రెండు రోజులు ఉపవాసం పాటిద్దాం, అన్నారు. అందుకని మొహర్రం తొమ్మిది పది కాని, పది పదకొండు కాని ఉపవాసం ఆచరిస్తారు.

     కనుక, ప్రవక్త మహనీయుల వారి ఉపదేశానుసారం "అషూరా" ఉపవాసం పాటించి సుధీర్ఘకాల ఉపవాసాలు పాటించిన పుణ్యం మూటకట్టుకోవాలి. ఏ లక్ష్యసాధన కోసం ప్రవక్త మహనీయుల వారి మనుమడు ఇమామె హుసైన్ (ర) త్యాగాలు చేశారో, దాని కోసం మనమూ ప్రయత్నించాలి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం శక్తిమేర పాటుపడాలి.

--::--



నిష్కల్మషం

సముద్రాల శఠగోపాచార్యులు

     పసిపిల్లలను దేవుళ్లతో సమానంగా భావిస్తారనే విషయం మనందరికీ తెలిసినదే. భగవంతుడు ఒకనిపై అమిత ప్రేమను మరొకరిపై అధిక ద్వేషాన్ని కలిగివుండడు (సమేద్వేష్యోస్తి న చ ప్రియః అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు) అట్లే పసిపిల్లలకు కూడా మీరు మనవారా పరాయివారా అనే భేదభావం ఉండదు. ఎవరు అదరిస్తే, ప్రేమతో ఎవరు ధగ్గరకు తీస్తే వారి దగ్గరకు చేరుతారు. పరమాత్మ కూడా అంతేకదా. ఈ భావాన్నే పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపటమెరుగని కరుణా మయులే అనే ప్రసిద్ధమైన పాటలోని పంక్తులు పేర్కొంటున్నాయి.

     వయసు పెరుగుతున్న కొద్దీ కొందరిలో ఈర్ష్య అసూయ అనేనో పోటీ తత్వమో స్వార్థమో చోటుచేసుకుంటూ ఉంటాయి. అందువల్ల కొందరిని ఇష్టంగా మరి కొందరిని అయిష్టంగా భావించడం మొదలవుతూ ఉంటుంది. చిన్న పిల్లలు తోటి వారితో కలసి మెలసి ఉండే అలవాటుని సహజంగానే కలిగియున్నట్లే పక్షపాత బుద్ధి స్వార్థచింతన రాగద్వేషాలు అసూయ అహంకారము అనేవి లేని సాధుపుంగవులైన మహనీయులు కూడా అందరితో సన్నిహితంగా ఉంటూ లోకహితాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు.

     నిష్కల్మషంగా ఉండే సత్పురుషుల మనసును ఏ మాత్రం బురదలేనట్టి ఒక స్వచ్ఛమైన నదీ ప్రవాహంతో వాల్మీకి మహర్షి పోల్చడాన్ని బట్టి నిష్కల్మషంగా ఉండటం ఎంత అవసరమో లోకులు గుర్తించాలి.

     నారదమునీంద్రుని నుండి వెలువడిన శ్రీరామ గుణామృతమును వాల్మీకి మహర్షి స్మరిస్తూ స్నాన సంధ్యాదులను ఆచరించుకటై తమసా నది వద్దకు భరద్వాజుడు అను శిష్యునితో కలసి వెళ్లాడు. ఏమాత్రం కూడా బురదలేని స్వచ్ఛమైన రమణీయమైన ప్రవాహాన్ని చూడగానే ఏ కల్మషాలు ఎరుగని మహాత్ముల నిర్మలమైన మనస్కులు వాల్మీకి మహర్షికి గుర్తుకు వచ్చాయ విషయాన్ని మనకు శ్రీమద్రామాయణం బాలకాండలోని అకర్ధమమిదం తీర్థం భరద్వాజ నిశామయ ! రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా !! అనే శ్లోకం తెలుపుచున్నది.

     స్వచ్ఛమైన నీటి ప్రవాహాన్ని చూస్తే అందరికీ ఎటువంటి అహ్లాదం కలుగుతుందో నిష్కల్మషమైన మనస్తత్వం కలవారిని చూసినప్పుడు వారితో మాట్లాడినప్పుడు వారి సాంగత్యాన్ని పొందినప్పుడు కూడా అంతటి అహ్లాదమే కలుగుతుంది. పరిమితమైన ఈ జీవన ప్రమాణంలో కక్షలు కుట్రలు కుతంత్రాలు కల్మషాలు ప్రవేశిస్తే అవి అహ్లాదాన్ని ఆనందాన్ని దూరం చేస్తాయి.

     అందుకే కల్మషాన్ని దరిచేరనీయకుండా జాగ్రత్త వహిద్దాం. నిష్కల్మషమైన మనసుతో నిష్కళంకమైన జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం.

--::--

ఉపదేశం

ప్రయాగ రామకృష్ణ

     ఒక రాజు, ఆయనకో మంత్రి ఇద్దరూ కలసి చదువుకున్నారు. దాంతో మంచి స్నేహం, సాన్నిహిత్యం ఉన్నాయి. ఒకరోజు రాజుగారు మంత్రిగారింటికి వెళ్లారు. అప్పుడు మంత్రి సంధ్యావందనం చేసుకుంటున్నారు. అదయ్యాక చాలాసేపు అనుష్ఠానంలో కూర్చున్నారు. బయటకు వచ్చాక, మిత్రమా! నువ్వు ఇంతసేపూ చేసిన మంత్ర జపమేమిటో తెలుసుకోవాలని ఉంది నాకు కూడా ఉపదేశించు. భక్తిశ్రద్ధలతో అనుష్ఠానం చేస్తాను అని అభ్యర్థించాడు. మిత్రుని కోరికను సున్నితంగా తోసిపుచ్చుతూ మంత్రి, రాజా! నాకింకా మంత్రసిద్ధి కాలేదు. నేనూ నేర్చుకునే దశలోనే ఉన్నాను. నాకు ఉపదేశార్హత లేదు అన్నాడు. నాకు మంత్రోపదేశం చేయడం ఇష్టంలేకనే అబద్ధాలు చెబుతున్నావు. నీకు మంత్రార్థం చెలుసు. కావాలనే చెప్పడం లేదు. ఇప్పటికైనా నీకు చెపాపలనిపిస్తే ఆ మంత్రాక్షరాలను చెప్పు. పొల్లుపోకుండా చెబుతాను అన్నాడు రాజు. ఈ ఆజ్ఞలను విని మంత్రి లోలోన నవ్వుకున్నాడు. రాజా! మంత్రం అంటే అక్షరాలూ, వాటిని అనుసరించి ఉండే వేద స్వరమే కాదు. అంగన్యాస, కరన్యాసాలుంటాయి. ప్రత్యేకంగా అనుష్ఠాన విధి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తమ గురువు ఉండాలి. ఆయన మంత్రసిద్ధి పొంది ఉండాలి. కాబట్టి నేను ఉపదేశిస్తే ఫలితం ఉండదు. అని చెప్పాడు.

     ఇది రుచింపక మళ్లీమళ్లీ అడిగాడు రాజు. మొదటి సమాధానమే మళ్లీ చెప్పాడు మంత్రి. రేపు సభాభవనంలో కలుసుకుందాం! అని విసవిస వెళ్లిపోయాడు రాజు.

     మరునాడు మంత్రి కొలువుకు వెళ్లాడు. వెళుతూనే ఎత్తయిన సంహాసనం మీద కూర్చుని ఉన్న రాజుని చూపుడు వేలుతో చూపి. ఆయనను అదుపులోకి తీసుకోండి! అని రక్షక భటులను ఆదేశించాడు.

     భటులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారే కానీ, కదలలేదు. రాజు లేచి మంత్రిని అదుపులోకి తీసుకోండి! అని ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే మంత్రిని చుట్టు ముట్టారు. మంత్రి వారిని అడ్డుకుంటూ, చూశారా మహారాజా! మీరూ, నేనూ ఒకే రకమైన ఆదేశాలు ఇచ్చాం. ఇద్దరం ఒకే రకమైన ఆగ్రహాన్ని ప్రదర్శించాం. కానీ భటులు మీ ఆజ్ఞనే శిరసావహించారు. కారణం మీకు అధికారం ఉంది. ఈ రాజ్యాన్ని పాలిస్తున్న చక్రవర్తి మీరు. ఏం చేయాలన్నా మీకు అర్హత ఉంది. నాకు లేదు. అలాగే, మంత్రసిద్ధి పొందిన ఉత్తమ గురువుకు మాత్రమే ఉపదేశం చేసే అధికారం, అర్హత ఉంటాయి. అలాంటి వారిని ఆశ్రయించి విద్య నేర్వాలేగానీ, అర్హత లేని వాళ్లను ఆశ్రయించకూడదు. ఫలితం ఉండదు. అన్నాడు. రాజుగారు తన తప్పు తెలుసుకున్నారు. అప్పటి నుంచి గురు శుశ్రూష చేస్తూ చక్కగా పాలించాడు రాజు.


--::--



కబీరు వచనాలు

దీవి సుబ్బారావు

     లోకంలో అందరు కవులు, ఆధ్యాత్మికంగా సద్గురువులు కాకపోవచ్చు. అలాగే అందరు సద్గురువులు సత్కవులు కాకపోవచ్చు. సద్గురువులుగానే కాకుండా సత్కవులుగా కూడా ఉన్న వాళ్లు చరిత్రలో ఉన్నారు. సూఫిలలో జలాలుద్ధీన్ రూమీ, హాఫీజ్ షిరాజి అలాంటి వారు, వారు మహాకవులే కాక, సద్గురువులు కూడా. మన దేశంలో కబీర్, తుకారాం అలాంటివారు.
   
     వారిలో కబీర్ గురించి చెప్పవలసి వస్తే, వారి కబీర్ వాణి గొప్ప కవిత్వపు విలువలు ఉన్నట్టిదే కాక, ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నింటినో నిక్షిప్తం చేసుకొన్న గ్రంథం భగవత్తత్వం గురించి, భగవత్ ప్రేమ గురించి, ఆధ్యాత్మిక మార్గం గురించి, మాయా ప్రపంచం గురించి వారు చెప్పిన విషయాలు, చేసిన విశ్లేషనలను విశిష్టమైనవిగా పరిగణిస్తారు. కబీర్ సామాన్య మానవుడికి, సాధకుడికి ఇద్దరినీ ఉద్దేశించి, అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పినారు. అయితే వాటిలో కొన్నింటిని సామాన్యులకు అందుబాటులో ఉన్న భాషలో, మరి కొన్నింటిని ద్వంద్వార్థాలతో కూడిన భాషలో చెప్పినారు. వారి వచనాలను హిందీ భాషలో దోహాలని పిలుస్తారు. వారు తమ దోహాలలో అనేక విషయాల గురించి ప్రస్తావించి, మానవుడికి మార్గదర్శిగా నిలిచారు. వారి కొన్ని వచనాలు....
    
     సద్గురువుకు సమానమైన వారు లేరు. భగవంతుని చూసిన వాడు సద్గురువు కాబట్టి, మొదటి నమస్కారం గురువుకే, మానవుడిని మాధవుడిగా మార్చగలశక్తి గురువుకు ఉన్నది. గురువు కుమ్మరి, శిష్యుడు అనే కుండను తట్టి తట్టి వంకలు సరి చేస్తాడు. భగవంతుడికి కోపం వస్తే, గురువు ఆదుకొంటాడు. గురువుకు కోపం వస్తే దిక్కులేదు. భగవంతుడు కాదు అంటే గురువును చేరవచ్చు. గురువు కాదు అంటే వేరే ఆశ్రయం లేదు. లోకం మీద ప్రీతి ఉన్నంతదాకా. భగవంతుని మీద భక్తి కుదరదు. తెచ్చి పెట్టుకొన్న భక్తి ఎక్కువ కాలం నిలవదు. కష్టాలు వచ్చినప్పుడు పాము కుబుసాన్ని విడిచి పెట్టినట్లు, ప్రపంచం మీద కోరిక భక్తిని చెడగొడుతుంది. కలుపు మొక్కలు పొలాన్ని పాడుచేసినట్లు ప్రపంచం మీద కోరిక భక్తిని చెడగొడుతుంది. కామం, క్రోధం మొదలైన అరిషడ్వర్గాలు భక్తి దూరం. జాతి మతం, కులం, ఎవరు విడిచి పెట్టారో, వారు నిజమైన భక్తులు ఏ శరీరంలో ప్రేమ లేదో అది శ్మశానంతో సమానం, భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు. దేహంలోనే ఉన్నాడు. భగవంతుని నామస్కరణ స్పర్శవేది వంటిది. మనస్సు మలినమైన ఇనుము వంటిది. నామస్మరణ చేత మనస్సులో ఉన్న మాలిన్యం పోయి స్వచ్ఛం అవుతుంది. హంస, కొంగ ఒకేలా ఉన్నా హంస వెతికేది ముత్యాల కోసం. కొంగ చేపల కోసం. చెప్పేది ఒకటి. చేసేది ఒకటి కాకుండా రెండూ ఒకటే అయినవాడు బంధ విముక్తుడవుతాడు.

--::--


ఆత్మజ్ఞానం

     సముద్రాల శఠగోపాచార్యులు


     ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, భయపడటం, సంతానాన్ని పొందడమనే విషయాలు పశుపక్ష్యాదులకు మానవులకు సమానమే. యుక్తాయుక్తాలను గుర్తించగల వివేకంవల్ల, సందేహ నివారణకై శాస్త్ర సహాయాన్ని పొందగలిగే శక్తి కలవాడైనందున మానవుడు పశుపక్ష్యాదులకన్నా విశిష్టుడైనాడు.

     మానవునికి ఉండే జ్ఞానసంపద అపారమైనదే. అందులో ఎట్టి సందేహం లేదు. అయితే అతడు భౌతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వరకే పరిమితం కారాదు. ఆత్మస్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని ఆత్మపరమాత్మను చేరుకొనుటకు ఉపకరించే ఉపాయ స్వరూపాన్ని ఫల స్వరూపాన్ని కూడా తెలుసు కునేందుకు మానవుడు దృష్టి సారించాలి.

     ఆత్మ పరమాత్మ విరోధి. ఉపాయ, ఫల స్వరూపాలను 'అర్థపంచకము' అనే పేరుతో వ్యవహరిస్తారు. ఈ అయిదింటిని తెలుసుకోవడం వల్లనే మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుందని మన పూర్వులు పేర్కొన్నారు.

     వివేక సంపన్నుడైన మానవుడు శరీరాత్మలకు ఉండే భేదాన్ని కూడా గుర్తించగలుగుతాడు. శరీర మేమో పుట్టుట, ఉండుట, వృద్ధి పొందుట, పరిణామాన్ని పొందుట, క్షీణించుట, వినాశాన్ని పొందుట (జాయతే, అస్తి, పర్థతే,  పరిణమతే, అపక్షీయతే, నశ్యతి) అను ఆరు భావవికారాలను కలిగివుండు నట్టిది అని తెలుసుకుంటాడు.

     ఆత్మకు ఈ భావవికారాలు లేవని అవగాహన చేసుకుంటాడు. ఆత్మ నిత్యము, అవినాశి, శుద్ధము, ఏకము, క్షేత్రజ్ఞము, ఆశ్రయము, నిర్వికారము, స్వయం ప్రకాశము, సర్వకారణము, వ్యాపకము, అసంగము, అవరణ రహితము అను పన్నేెండు ఉత్కృష్టమైన లక్షణములు కలదని శ్రీమద్భాగవత సప్తమ స్కంధములోనది.

     'ఆత్మా నిత్యో వ్యయంః శుద్ధః ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః ! అవిక్రియః స్వదృగ్ హేతుః వ్యాపకో సంగ్యనావృతః' అనే శ్లోకం వెల్లడించిన విషయాన్ని పెద్దల నుండి ఉపదేశంగా పొందుతాడు.

     అజ్ఞానం వల్ల శరీరంలోనే ఆత్మ అనే స్థితి ముందుగ ఏర్పడినా, ఆ తర్వాత ఆత్మ తత్వ్తజ్ఞానం ఏర్పడిన పిదప నేను నాది అనే మిధ్యాభావాన్ని విడిచిపెట్టగలుగుతాడు.

     ఆధ్యాత్మతత్వాన్ని తెలుసుకోవాలనే తపన జిజ్ఞాస కలిగిన ఈ మానవుడు శరీరం అనే ఈ క్షేత్రంలోనే బ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలుగుతాడు.
   
     మానవుడు శుద్ధమైన బుద్ధితో నెమ్మదిగా జగత్తు యొక్క సృష్టి స్థితిలయాలను గూర్చి, సత్త్వ తజస్, తమో గుణభరితమైన ప్రకృతి స్వరూపాన్ని జ్ఞానేంద్రియ పంచకాన్ని కర్మేంద్రియ పంచకాన్ని ఉభయేంద్రియమైన మనస్సును గూర్చి వివేచన చేయగలుగుతాడు.

     బాహ్యమైన లౌకిక విజ్ఞానాన్ని తెలుసుకోవడమే కాకుండా శాస్త్ర సహాయంతో, శాస్త్రజ్ఞుల ఉపదేశాలతో ఆత్మజ్ఞానాన్ని కూడా క్షుణ్ణంగా సొంతం చేసుకోవాలనే తపన అందరిలో ఏర్పడాలని ఆశిద్దాం.


--::--

విశ్వాసం

దీవి సుబ్బారావు


     ఒక సాధువు తన చుట్టూ జేరిన వాళ్లకు ఈ కథను చెబుతున్నాడు. ఒక పెద్ద కొండ శిఖరం అంచున ఓ పెద్ద మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు, చూసుకోకుండా అక్కడవున్న గులకరాళ్లమీద కాలువేసి జారిపడ్డాడు. అక్కడే ఆ కొండ కొమ్ము అంచున ఓ చెట్టు పెరుగుతోంది. జారుతూ ఉన్న పెద్ద మనిషి చేతికి ఆ చెట్టుకొమ్మ ఒకటి తగిలింది. ఆ కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు.


     ఇంతదాకా చెప్పి సాధువు ఒక్క క్షణం ఆగాడు. చుట్టూ అందర్నీ ఓసారి చూసి తిరిగి చెప్పటం మొదలుపెట్టాడు. కొండ అంచున చెట్లు పెరగటం మీరు చూసే ఉంటారు. ఆ చెట్లు అక్కడ ఎట్లా మొలుస్తాయో, ఎట్లా పెరిగి పెద్దవి అవుతాయో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి ఆశ్చర్యాలు ప్రకృతిలో సహజంగా జరుగుతూనే ఉంటవి. సరే, ఆ పెద్ద మనిషికి కొండ కొమ్ము అంచున పెరుగుతున్న చెట్టు కొమ్మ దొరకటం, అతడు దాన్ని గట్టిగా పట్టుకోవటం అదృష్టవశాత్తు జరిగింది. అప్పుడు అతడికి ప్రాణభయం పట్టుకొంది. చెట్టుకొమ్మని గట్టిగా పట్టుకొని వేలాడుతూ, అతడు సహాయం కోసం గట్టిగా అరిచాడు. 'ఎవరైనా ఉన్నారా పైన కొండమీ? ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించేవారు?'

     అతడు భయంతో ణికిపోతూ సహాయం కోసం అర్థిస్తూ అరుస్తూ ఉండగా, కొండపైన మేఘం ఉరిమినదే అన్నట్టుగా అక్కడ నుండి ఓ కంఠధ్వని వినవచ్చింది. ఆ కంఠధ్వని అతడితో ఇలా అన్నది. 'నేను భగవంతుణ్ణి, నీకు నా మీద విశ్వాసం ఉండి, నేను చెప్పినట్లు చేస్తే, నేను నీకు సహాయం చేస్తాను.' ఆ పెద్ద మనిషి ఆ క్షణమే బదులు చెప్పాడు. 'సరే, నీవు చెప్పినట్లే చేస్తాను. ముందు నన్ను రక్షించు నా చేయి పట్టు తప్పుతోంది.' అప్పుడా కంఠధ్వని  అన్నిది. 'అలాగయితే, పట్టుకున్న కొమ్మను వదిలిపెట్టు, నీ ప్రాణాన్ని రక్షించే పూచీనాదీ.'

     అప్పుడు అక్కడ గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. చాలా సేపటిదాకా ఆ పెద్దమనిషి నుండి సమాధానం రాలేదు. అలా కొంత సమయం గడిచాక. ఆ పెద్దమనిషి మళ్లీ పెద్దగా కేకలు పెట్టడం మొదలు పెట్టాడు. 'ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా పైన?'

     సాధువు చుట్టూ ఉన్న జనం ఒక్కసారి ఘొల్లున నవ్వారు. నవ్వులు అణిగాక సాధువు చెప్పాడు. 'మనం అంతా అలాంటి వాళ్లమే, భగవంతుడి మీద విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి భగవంతుడికి సంపూర్ణ శరణాగతి అనేసరికి, మనమీద ఎంతో దయతో, ప్రేమతో భగవంతుడు మానవరూపం ధరించి మన మధ్యకు వస్తాడు. మాయ నుండి మనల్ని విడిపించి రక్షించటానికి, మనం చేయాల్సిందల్లా అతణ్ణి సంపూర్ణంగా విశ్వసించడం. మనం గట్టిగా పట్టుకొని వేలాడుతున్న మాయను వదిలించుకోవటం. ఆ పెద్ద మనిషి ఎట్లా చెట్టు కొమ్మను పట్టుకొని విడువలేకుండా ఉన్నాడో, మనం కూడా మాయను పట్టుకొని విడువకుండా వేలాడుతున్నాము.'

--::--


నిర్వేదం ఒక అవకాశం

నీలంరాజు లక్ష్మీ ప్రసాద్

     "ప్రాతఃకాల మారుతము వలె స్వేచ్ఛామయమై, నవకుసుమములీల సుకోశలమై, మంచు బిందువు చందమున స్వచ్ఛమై తనరారు బాల్యము ఆజన్మాంతము ఎవ్వనియందు శోభిల్లునో, వాడే ధన్యాతుడు" అన్నాడొక అనుభవజ్ఞుడు. ఈ ప్రొద్దు పొడిచే వేళ, స్వేచ్ఛగా వీచేగాలి, కొత్తగా పుష్పించిన పూవు కోమలత్వం, గడ్డి పరకల మీద తెలతెల వారేప్పుడు కనుపించే మంచు బిందువులు. చెట్లలో పక్షుల కిలకిలారావాలు, వీటిని గురించే చిన్న చిన్న విద్యార్థులతో మాట్లాడేవారు జిడ్డు కృష్ణమూర్తి తన రూపం మాట తీరు అంత నాజూకుగాను, అంత మృదువుగాను ఉండేది. భోధించే వేళ ఎంతైనా నిష్కర్శ ప్రదర్శించేవారు. కానీ ఈ సుకుమారుణ్ణి కలిసిన ఇండియన్ ఎక్స్ ప్రేస్ గ్రూప్ చైర్మన్ శ్రీ రామనాథ గోయెంకా కానీ, దేశ ప్రధాని ఇందిరా గాంధీగానీ, తీరా ఇతడి సన్నిధిలో కాసేపు ఉండేటప్పటికల్లా వలవల ఏడ్చేవారు.

     ఇంకా ఎంత మందికో ఇదే అనుభవం కలిగింది. కారణమేమీ లేదు. కృష్ణమూర్తి కూడా ఎన్నో బాధలు పడినప్పటికీ, ఎన్నో దుఃఖాలు అనుభవించినప్పటికీ, ఆయన మనస్సు మీద అవి తమ శాశ్వత ముద్ర వేయలేదు. ఆయనకుండే సహజమైన అమాయకత్వం మళ్లీ యథా స్థానంలోకి వచ్చేసేది. ఆ అమాయకత్వమే ఆయన్ని ధైవం వద్దకు చేరుస్తుండేది.

     అందుకే ఎప్పుడూ ఆనందంగా తాజా మల్లెపుష్పంలాగా ఉండేవాడు. ఆయన సౌకుమార్యమూ, స్వచ్ఛతా చూసినప్పుడు, తమతమ భాల్యంలోని అమాయకత్వాన్ని కోల్పోయి, తామీనాడు ఎంతటి బరువైన జీవితం గడుపుతున్నామో గుర్తు తెచ్చుకుంటే దుఃఖం ముంచెత్తుతుంది.


    ఈ రకమైన నిర్వేదం మనందరికీ అనుభవమే. కానీ ఇది ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మన దోవమారే అవకాశం కూడా లభిస్తుంది. శ్రీ రామానుజుల వారి శిష్యుడు ఒకరి నేత్ర సౌందర్యం చూసి, ముగ్ధుడవుతుండేవాడు. ఇంతకన్నా మంచి నేత్రాలు చూపిస్తాను. రా... అని శ్రీ రంగనాథుడి విగ్రహం వద్దకు శిష్యుణ్ణి తీసుకుపోయాడు. గురువు అక్కడ రంగనాథుణ్ణి ప్రార్థించి సజీవ శ్రీ రంగనాథుని నేత్రాలను అటుచూడు, అని శిష్యునితో అన్నాడు. ఆ విగ్రహం కళ్లను శిష్యుడు అంతకుముందు ఎన్నోసార్లు చూశాడు. కానీ ఈ నాడు గురువు చూడు అనగానే, ఆ లోకోత్తర సజీవ నేత్రాలను చూచి, ఆనందం ముంచెత్తగా అయ్యో ఇంతటి సౌందర్యాన్ని వదలి, వ్యర్థమైన మానవ నేత్ర సౌందర్యాన్ని ఆరాధిస్తూ ఉండిపోయానే అని నిర్వేదం పొందాడు.


     రైతు తన కృషి మానడు, ఒకవేళ ఏదానై పండకపోయినా, కృషి మాత్రం వీడడు. అలాగే భగవంతుడు మనల్ని తనవద్దకు చేర్చుకోడానికి తన కృషిని మనం ఫలించనివ్వం అతడు నిర్విరామంగా తన ప్రయత్నం తాను సాగిస్తూనే ఉంటాడు. "కర్మణ్యే వాధికారస్తే" అనే సూత్రం తనకు తానే వర్తింపజేసుకుంటాడు మానవుడి ప్రతిఘటన అంత రీవ్రమైనది.

--::--



ఆధ్యాత్మిక జ్ఞానం

బ్రహ్మకుమారి వాణి

     ఆధ్యాత్మికత అంటే ఏ ఒక్క మతానికో, ధర్మానికో పరిమితమైనది కాదు. ఇది అంతరికీ సమంగా చెందినది. అందరికీ అవసరమైనది. మనిషి తనకు అవసరం లేకున్నా ఎప్పటికైనా పనికి వస్తాయని ఎన్నో వస్తువులు సమీకరిస్తాడు. మరి అలాగే ఆధ్యాత్మికతను ఉంచుకుంటున్నామా? ఎందుకంటే రామ రామ భౌతికత పెరిగిపోతూ, మానవుడు యాంత్రిక జీవనం సాగిస్తూ, ఆణాల కోసం గుణాలను విస్మరిస్తున్న విపరీత పోకడల విముక్తికి తరుణోపాయం ఆధ్యాత్మిక జ్ఞానం శ్రేష్టకర్మల అచరణే











No comments: