Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - కిస్కింద కాండ 28వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Kishkinda Kanda 28th Day


కిష్కింధ కాండ


ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము





నిన్నటిరోజునా మీరు విన్నారు నూరు యోజనముల సముద్రాన్నిదాటి లంకా పట్టణానికి వెళ్ళితే సీతమ్మతల్లి దర్శనం అవుతుందీ అని సంపాతి చెప్పారు, సంపాతి చెప్పినటువంటి వాక్యం నిజమూ అని గుర్తేమిటంటే ఆ మాట సాయం చెయ్యగానే కాలిపోయిన రెక్కలు సంపాతికి మళ్ళీపుట్టాయి. కిష్కింధ కాండ పూర్తిచేస్తూ మహర్షి రెండు వైభవోపేతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తాడు, రామ కథ యొక్క గొప్పతనమెటువంటిది, రామనామం యొక్క గొప్పతనం రామ నామానికి రామ కథకీ మాటసాయం చేసినంతమాత్రంచేత వచ్చేటటువంటి ఫలితం. కేవలం మాటసాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి రామ కార్యంమీద వెడుతున్నవాడికే అంతసాయంచేస్తేనే అంతగొప్ప ఫలితం ఉంటే రామ కార్యం చేసినవాడికి? ఎంతగొప్ప స్థితి ఉంటుంది, అయితే ఇక్కడ మీరు ఒక విషయం చూడండి నిజంగా చాలా పెద్ద రామ కార్యం అన్నది ఏదుంటుందో అది చేసినవాడు కోరుకోవలసినది ఎటువంటివాడికి ఆ స్థితిని రామ చంద్ర మూర్తి ఇస్తారో తెలుసాండీ... కించిత్ ప్రతిఫలా పేక్షలేనివాడికే అంత స్థితిని ఇస్తాడు మీరది చాలా జాగ్రత్తగా గమనించాలి రామాయణంలో.
Image result for sampati and jatayuరామ కార్యంమీద వెళ్ళుతున్నవాడికి మాటసాయంచేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి మళ్ళీ యవ్వనం వచ్చింది అంటే మంచిదే, ఒక వైభవాన్ని పొందాడు కానీ రామ కార్యాన్నే చాలా ప్రయోజనమూ అని భావించి ఇంక అంతకన్నా వేరొక కార్యం లేదూ అని, ఆ కార్యంమీద సర్వశక్తులూ వడ్డి వెళ్ళినటువంటివాడికి ఏ ఫలితముండాలి రామ చంద్ర మూర్తి యొక్క ఆలింగనం లభిస్తుంది. రాముడే లభిస్తాడు అంతే, ఇకదానికి వేరొక ప్రయోజనం ఏమీ ఉండదు సరికదా... అలా ఎవరైనా నిలబడగలిగితే రామ కార్యాన్ని త్రికరణ శుద్ధిగా ఏ ప్రతిఫలాన్నీ ఆశించకుండా ఎందుకు చేశావు ఈ రామ కార్యం అంటే రాముని కొరకు తప్పా దీనివలన నాకు ఏ ప్రయోజనమూ నేను ఆశించి చెయ్యట్లేదు అని త్రికరణ శుద్ధిగా నిలబడగలిగితే దొరికేటటువంటిది ఏమిటో తెలుసాండీ... నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేను అన్న రామ చంద్ర మూర్తి యొక్క మాట. అంటే ఎంతటి సమున్నత స్థితినిపొందుతారో చూడండి ఇది ఎవరు పొందారంటే స్వామి హనుమ పొందారు. ఎందుచేతా అంటే ఆయన సుందర కాండలో బయలుదేరినప్పుడు రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుర్కరమ్ ! సముద్రస్య పరం పారం దుష్ర్పాపం ప్రాప్తుమిచ్ఛతి !! అన్నారు విద్యాధరలో, రాముని కొరకు వానరుల కొరకు చేస్తున్నారు తప్పా ఆయన తనకొరకు తాను చేసినది కాదు సముద్ర తరణం. అంతకష్టపడి ఆయన వెళ్ళి సీతమ్మతల్లి దర్శనంచేసి వచ్చి సీతారాములు ఒకటవడానికి కారణంగా ఆయన నిలబడితే ఆయన పొందినటువంటి భాగ్యంమేమీ అంటే, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యడం కుదరదు కాబట్టి మదఙ్గే జీర్ణతాం యాతు యత్ త్వయోపకృతం కపే అంటారు ఉత్తర కాండలో రామ చంద్ర మూర్తి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యడమన్నది కుదరదు హనుమా... కాబట్టి నీవు చేసిన ఉపకారమేదుందో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాకా... అంటారు. అంటే రాముడు కూడా ప్రత్యుపకారం చెయ్యగలను అని అనలేనంత గొప్ప స్థితిని పొందగలగడం త్రికరణ శుద్ధిగా రామ కార్యాన్ని చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పరచుకోవడం.
అయితే అది అంత తేలికైన విషయం కాదు శ్రీరామాయణంలో మహానుభావుడు కారణ జన్ముడు కాబట్టీ ఒక్క హనుమకి మాత్రమే అది లభించింది. నేను ఇప్పుడు కారణ జన్ముడు అన్నమాటవాడి ఉంటే హనుమ అసలు ఏ కారణం చేత జన్మించారో ఆయన జన్మ వృత్తాంతమేమిటో అది ఎలా సంభవించిందో ఇవ్వాళ బ్రహ్మగారి తరువాత బ్రహ్మగారిలాంటివాడు రామాయణంలో జాంబవంతుడు. ʻఆత్మావైపుత్రనామాసిʼ అని కదా... కొడుకు తండ్రి రూపంలో ఈలోకంలో తిరుగుతుంటాడూ అని, కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టినంతటినీ చేసినటువంటి మహాపురుషుడైతే ఆయన యొక్క అంశతో వచ్చిన జాంబవంతుడు కూడా శ్రీరామాయణంలో అంతస్థితినే పొందాడు, అందుకే రామాయణంలో ఎక్కడెక్కడ ఏ విపత్కర పరిస్థతి ఏర్పడినా జాంబవంతున్ని సంప్రదిస్తూ ఉంటారు సాధారణంగా ఎప్పుడైనా మహర్షులకి కానీ దేవతలకు కానీ ఇబ్బంది కలిగితే ముందు వాళ్ళు వెళ్ళి ఎవర్ని సంప్రదిస్తారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారినే, శ్రీరామాయణంలో జాంబవంతున్ని సంప్రదిస్తుంటారు ఆయన పెద్దరికం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఏమిటో కిష్కింధ కాండ పూర్తయ్యేటప్పుడు మహర్షి ఆవిష్కరిస్తారు, ఆయన వయసురీత్యాను పెద్దరికం వయసుతోపాటు ఆయన చేసినటువంటి కార్యాలు కూడా అంత దక్షతతో కూడుకుంటాయి, ఇప్పుడు నేను ఉడిగిపోయాను అని చెప్పడం కాదు, శరీరంలో ఉన్నటువంటి శక్తి ఉడిగిపోయినా తన అనుభవంతో చెయ్యగలిగినటువంటే మేలు ఏదో అంత గొప్ప మేలు జాంబవంతుడు చేస్తూంటాడు రామాయణంలో.
అందుకే దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్రపు ఉత్తర దిక్కున వానరులందరూ కూడా కూర్చుండిపోతే నూరు యోజనముల సముద్రాన్ని దాటేవాడు కనపడకపోతే దాటేవాడు ఎవడో నేను చెప్తాను, దాటేవాడు ఎవడో నేను చెప్పడం కాదు చెప్పీ ఆయనని నేను ప్రోత్సహిస్తాను అది జరిగితే తప్పా ఆయన వెళ్ళడు. ఆ విషయాన్ని కిష్కింధ కాండలో మాత్రం చెప్పలేదు, మీరు ఇది ఎక్కడ నుంచి చూడవలసి ఉంటుందీ అంటే శ్రీరామాయణంలో సుందర కాండ వరకూ కానీ యుద్ధ కాండ వరకూ కానీ మీకు ఎక్కడా ఈ ప్రస్తావన లేదు అసలు హనుమ గురించి మరి ఎక్కడ తెలుస్తూందీ అంటే ఉత్తర కాండ చదివితే హనుమకి శాపవిమోచనం ఎక్కడ అయ్యిందీ అన్న విషయాన్ని మీరు చూడవలసి ఉంటుంది. హనుమకి శాపవిమోచనం కిష్కింధ కాండ చిట్ట చివర్లో అయింది సుందర కాండ ప్రారంభం సుందర కాండ చివర అది కూడా జాంబవంతుడు చేసిన స్తోత్రం వల్ల అయ్యింది. నిన్ననూ ఆయన ఒకమాట అన్నాడు తతః ప్రతీతం ప్లవతాం వరిష్ఠమ్ ఏకాన్తమ్ ఆశ్రిత్య సుఖోపవిష్టమ్ సంచోదయా మాస హరి ప్రవీరో హరి ప్రవీరం హనుమన్తమ్ ఏవ నేను ఇదిగో ఏకాంతంగా కూర్చున్నటువంటి వాడు ఉన్నాడే ఆ హనుమా...

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఆయనే ఈ కార్యాన్ని చెయ్యగలడు, ఈ కార్యాన్ని చెయ్యగలిగినటువంటి హనుమ సమర్దత

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కలవాడైనప్పటికీ తన శక్తిని తాను మరిచి అలా కూర్చున్నాడు నేను ఆయనని ప్రేరణ చేస్తాను అన్నాడు. ప్రేరణ చేస్తే గుర్తురావడం ఏమిటండీ అంటే ప్రేరణ చేస్తే గుర్తు రావాలీ అంటే తన బలం తనచేత విస్మరింపబడి ఉండాలి. ఎందుకు విస్మరింపబడిందో ఎందకు ఆయనకి జ్ఞాపకంలేదో నేను మీకు కిష్కింధ కాండ ప్రారంభమైన రోజున మనవి చేశాను నాతి కృద్దాతి మన్మథః అని సేపురేనన్ రఘుశ్రేష్ఠా వాళ్ళు కోపం లేకపోయినా ఋషులు అప్పటికి హనుమకి అంత బలం అవసరంలేదూ అని ఒక అనుగ్రహవాక్కు శాపరూపంగా విడిచిపెట్టారు.
Image result for jambavanthaఎప్పుడెప్పుడు ఈయన యొక్క బలం లోకానికి అవసరం అవుతుందో ఆనాడు ఈయన్ని ఒకరు స్తోత్రం చేస్తారు ఆయన బలం ఆయనకి జ్ఞాపకం చేస్తారు, ఆ జ్ఞాపకం చేసిన రోజున ఈయ్యన శాపం తొలగిపోతుంది ఈయ్యన బలం మళ్ళీ ఈయ్యనకి జ్ఞాపకానికి వస్తుందీ ఇంక అక్కడ్నుంచీ ఆయన చెయ్యవలసిన పనిని ఆయన చేస్తారూ అని. అందుకే ఇంత బలవంతుడైనా అసలు ఆమాటకొస్తే నిజంగా హనుమ తలచుకుంటే వాలినీ నిగ్రహించగలరు, కానీ తన బలాన్ని తాను మరిచిపోవడంవల్లే వాలితోపాటుగా భూమండలమంతా ఆయనా తిరిగారు అటువంటి హనుమకి శాపవిమోచనమయ్యేటటువంటి సందర్భం చాలా మహోత్కృష్టమైనటువంటి సందర్భం శ్రీరామాయణంలో ఎందుకంటే ఇకనుంచి ఆయనకు శాపవిమోచనం జరిగితే ఆయనకున్న బలం దేనికి ఉపయోగపడుతుంది భక్తరక్షణ కొరకు ఉపయోగపడుతుంది భక్తులైనవారు ఎవరున్నారో ఈశ్వరున్ని ఆశ్రయించినవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు వీర వానర లోక స్య సర్వ శాస్త్ర విశారద ! తూష్ణీమ్ ఏకాన్తమ్ ఆశ్రిత్య హనుమన్ కిం న జల్పసి !! హనుమని ఉద్దేశించి మాట్లాడుతూ ఓ హనుమా! కి న జల్పసి నీవు ఎందుకు మాట్లాడటంలేదు వీళ్ళందరూ చెప్పారుగా ఇన్నిన్ని యోజనములు వెళ్తామని నీవు ఏమీ అంటంలేదు, నీవు ఏమీ అంటంలేదు అంటే శక్తిహీనుడవు అని అనుకుంటున్నావా? నీ శక్తేమిటో నాకు తెలుసు.
వీరా వానర లోక స్య సర్వ శాస్త్ర విశారద నీవు సర్వశాస్త్రములూ తెలిసున్నటువంటివాడివి గొప్ప వీరుడివి అంటే శరీరము మనసు రెండూ కూడా సంపత్తి కలిగినటువంటివి, శరీరం చాలా గొప్ప బలం కలిగినటువంటి శరీరం మనసు బుద్ధి శాస్త్రమెరిగినటువంటి బుద్ధి. కేవలం తనంతతాను నిశ్చయం చేసుకోవడం వేరు శాస్త్ర పరిజ్ఞానంతో నిశ్చయం చేసుకోవడం వేరు, శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా ఉండి మాట్లాడగలగటం వేరు, ఇది చాలా చాలా గొప్ప విషయం ఎందుకో తెలుసాండి ధైర్యం అని ఒక మాట ఉంది. ధైర్యం అంటే మీరు కేవలంగా ఏదో విపత్కర పరిస్థితుల్లోకి చొచ్చుకుపోగలగడం అన్నదే మీరు అనుకోకండి. శాస్త్రాన్ని నమ్మినవాడు శాస్త్రాన్ని నమ్మినట్టు ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడగలిగితే వాడు ధీరుడు వాడు ధైర్యవంతుడు ఎందుకంటే దానివలన ఆయన నమ్మకం ప్రకాశిస్తుంది. ఆయన ఎంత నమ్మినవాడో ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడో ఆ సందర్భాన్నిబట్టి తెలుస్తూంటుంది హనుమ అంత గొప్ప శాస్త్ర విశారదుడు శాస్త్రం తెలిసున్నవాడు. తెలుసు కాబట్టి దాన్ని ఆయన అనుష్టాన పర్యంతంలోకి తీసుకొస్తారు అందుకే మీరు ఎదర సుందరకాండలో వింటారు నమస్కారం దగ్గర నుంచి ఏ కాలుపెట్టి లంకా పట్టణంలోకి ప్రవేశించాలి అన్నదాన్నీ ఎటువంటి శరీరంతో లంకాపట్టణంలో ప్రవేశించాలీ అన్నదాన్నీ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలీ అన్నవిషయాన్నీ రావణ దర్శనం చెయ్యాలి అంటే ఏది చేసి రావణ దర్శనాన్ని సాధించవచ్చూ అన్నదాన్ని ప్రతి చిన్నవిషయాన్ని ఆయన ఎంత గొప్పగానో పర్యావలోకనం చేస్తారు.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఇదీ ఇంతగొప్ప ప్రజ్ఞవున్నా అప్పుడప్పుడు చిన్న చిన్న వైక్లవ్యాలు వస్తూంటాయి రాకపోవడమన్నిది ఉండదు, కానీ ఎవరికి శాస్త్ర పరిజ్ఞానం పక్కన భక్తి ఉందో వాడికి అటువంటి తొట్రుబాటు వచ్చినప్పుడు ఈశ్వరుడు వాడిని రక్షిస్తుంటాడు. నీవు తొట్రుపడ్డావు ఇవ్వాళ అలా తొట్రుపడకు అని మళ్ళీ ఊంచుకోగలిగినట్టి శక్తిని ఇస్తాడు, ఇదీ మీరు చాలా జాగ్రత్తగా రామాయణంలో గమనించవలసి ఉంటుంది. ఒకసారి తొట్రుపడితే పాతాళ లోకంవరకు పడిపోతాడు ఒక్కొక్కడు. ఎందుకు పడిపోతాడో తెలుసాండి శాస్త్రం తెలియక కాదు శాస్త్రం తెలిసే శాస్త్రం తెలిసున్నవాడే దేనికి పడిపోతాడంటే నాకు శాస్త్రం తెలుసన్న అహంకారం ఉంటుంది తప్పా ఈశ్వరుడియందు భక్తిలోపించి ఉంటుంది. ఈశ్వరునియందు భక్తిలేకుండా కేవలం శాస్త్రం ఒకటీతెలుసున్న వైక్లవ్యం పడగొట్టేస్తుంది, శాస్త్రం తెలిసీ వైక్లవ్యమొచ్చినా దిద్దుకోగలిగినా ఊంచుకోగలిగిన స్థితి ఎక్కడనుంచి వస్తుందంటే భక్తిలోంచి వస్తుంది. నేను ఇవ్వాళ ఏమాట అన్నానో ఆమాటను మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూండండి హనుమ విషయంలో ఇది మీకు ప్రస్పుటంగా తెలుస్తుంది. ఆయన కూడా అక్కడక్కడా కొద్దిగా తప్పటడుగు వేస్తుంటాడు, మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటుంటాడు, సీతమ్మ కనపడలేదని నేను చచ్చిపోతానంటాడు కానీ ఎక్కడెక్కడ హనుమ అటువంటి ఉద్వేగాన్ని పొందుతారో అక్కడక్కడా ఈశ్వరుడు ఆయనకి అండగా వచ్చి కాపాడుతుంటాడు. ఎందుకు వచ్చి కాపాడుతాడు, అంటే ముందు ఆయన బుద్ధిని నిలబెడుతుంటాడు. బుద్ధి నిలబడితే కదాండి శరీరం నిలబడడం బుద్ధి నిలబడకపోతే శరీరంలో బలముండి ప్రయోజనమేమిటీ ఇది హనుమయందు ప్రకాశించేటటువంటి గుణం కారణం ఏమిటంటే ఆయన భక్తిపరత్పరత. అందుకే కొద్దిగా ఒడుదొడుకులు వచ్చినా ఊంచుకోగలిగినవాడు ఎవరంటే భక్తి కలిగినవాడే, ఆ భక్తి అంటూ ఉందనుకోండి అది ఎన్ని ఇబ్బందులనుంచైనా బయటపడేస్తుంది అదొక్కటి లేదనుకోండి ఎప్పుడైనా జారిపోయే ప్రమాదముంటుంది.
ఎందుకంటే అహంకారమనేటటువంటిది పక్కన పెరిగిపోతూ భక్తి అనేటటువంటిది తరిగిపోతే తాను ఏది చదువుతాడో దానిమీదే నమ్మకంలేని స్థితికి వెళ్ళిపోతాడు అప్పుడేమౌతుందంటే ప్రమాదంలోకి జారిపోతాడు, రావణాసురినియందు ప్రకాశింసించేటటువంటి లక్షణం అదే. ఆయనకీ శాస్త్ర పరిజ్ఞానముంది ఆయనకీ తెలుసు కానీ ఆయన దేనికివాడుకుంటాడంటే తను చేస్తున్నదే మంచిపని అన్నదాన్ని సమర్ధించుకోవడానికి శాస్త్రాన్ని మార్చి చెప్పడానికి ఉపయోగిస్తాడు. తనకు అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడు తప్పా శాస్త్రం ఎలా ఉందో తనలా ప్రవర్తించడు ఎందుకనీ భక్తి అన్నది లోపించడమే దానికి కారణం. ఆ భక్తి లోపం వచ్చిందనుకోండి, భక్తి లోపం అంటే విశ్వాసమే నండీ సా శ్రద్ధా కవితా సిద్ధిః యయావ స్థూప లభ్యతే ఆ శ్రద్ధ ఉంటే గురువుయందు ఈశ్వరునియందు ఆ శ్రద్ధ ఉందనుకోండి అది మిమ్మల్ని కాపాడేస్తుంది, కాబట్టి జాంబవంతుడు అంటున్నాడు నీవు సర్వ శాస్త్ర విశారద తూష్ణీన్ ఏకాన్తమ్ ఆశ్రిత్య హనుమన్ కిం న జల్పసి నీవు ఏమీ మాట్లాడకుండా ఇన్ని ఎరిగున్నవాడివి ఒక్కడివే ఎందుకు కూర్చున్నావ్? హనుమన్ హరి రాజ స్య సుగ్రీవ స్య సమో హ్యాసి ! రామ లక్ష్మణయో శ్చాపి తేజసా చ బలేన చ !! ఓ హనుమా! నీవు వానరులకందరికీ ప్రభువైన సుగ్రీవుడికి ఏ స్థాయిలో ఉన్నవాడో ఎంతటి బలవంతుడో నీవు కూడా అంతటి బలవంతుడవే... ఈ మాట వెనక ఉన్నటువంటి తర్కాన్ని గమనించాలి.
ప్రభువుతో సమానమైనటువంటి బలవంతుడనుకోండి, ప్రభువుతో సమానమైన శాస్త్ర పరిజ్ఞానమున్నవాడు అనుకోండి నేను ఈయ్యన మాట వినేదేమిటనేటటువంటి లక్షణమున్నవాడనుకోండి కానీ ప్రభువుతో సమానమైనవాడైనా ప్రభుత్వాన్ని గౌరవించేవాడై ఉండాలి. ఆ బలాలు ఎప్పుడు చూసుకోవాలి ఆయన సింహాసనం మీద ఉన్నాడు నేను ఆయన

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
మాట వినాలి ఇదీ వినయం ఈ వినయం హనుమయందు చాలా చాలా గొప్పది. ఆందుకే ఈ వినయానికి పరాకాష్ట ఎక్కడంటే మీకు హనుమ ఎప్పుడు కనపడ్డా రామ చంద్ర మూర్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఆయన పాదాలవంక చూస్తూ ఇలా నమస్కారం చేస్తూంటాడు. మీరు చూడండీ లోకంలో ఇద్దరుంటారు వాళ్ళు మీరు పూజ చేద్దామని వెళ్ళినా సరే పిడుగులు పడిపోయినాసరే వడగళ్ళవాన పడిపోయినా సరే పెద్ద పెద్ద బాజాలు వాయించినా సరే వాళ్ళు మాత్రం తల తిప్పరు అలా తల తిప్పకుండా ఎప్పుడూ ఈశ్వరున్నే చూసేటటువంటివారు ఒకరు నందీశ్వరుడు రెండవవాడు హనుమ. ఎప్పుడూ రామ చంద్ర మూర్తి పాదాలవంక తదేక ధ్యానంతో చూసి మురిసిపోవడమే తప్పా అసలు ఇలా తలతిప్పి ఫొటోలు తీయించుకున్నది ఎప్పుడూ లేదు. మీరు చూడండీ ఆయన ఎప్పుడూ ఇలా ఉంటాడు ఏ ఫొటోలోనూ అలా ఉండడు ఆయన ఎప్పుడూ రామ పాదాలనే చూస్తు నమస్కారంచేస్తుంటాడు.
Related imageఅంటే ఆయన వినయం అటువంటిది కాళ్ళదగ్గర కూర్చుంటారు అదండీ కిందపడినట్లు ఉంటుంది కానీ మహోన్నతికి కారణం అదే అవుతుంది. పెద్దలైనవారు చాలా సంతోషించేది పెద్దలు సాధరణంగా పొంగిపోయేది ఆశీర్వచనమిచ్చేది వాళ్ళ ఉన్నతిని కోరుకునేది మనసులో వాళ్ళపేరు గుర్తొస్తే ఓ ఆయన వృద్ధిలోకిరావాలి ఆయన ఆయుష్మంతుడు కావాలి అని అనుకునేది దీనివల్లే తెలుసా... ఆ వినయంవల్లే. అసలు వినయమన్నది లేకపోతే పెద్దలైనవారు దరిదాపులకి రానివ్వరు వాళ్ళ మనసులో మిగిలే అవకాశం కూడా ఉండదు మనసులో ఆ స్థానాన్ని పొందలేరువీరు. ఎవరికి వినయం ఉంటుందో వారు బాగా దగ్గరౌతారు, గురువుకికాని ఈశ్వరునికికాని దగ్గరవడానికి హేతువేదీ అంటే కేవలం వినయమే. వినయం తప్పా మీరు ఆ ఇద్దరికి దగ్గరవ్వడానికి ఇంకొక హేతువులుండవు కారణమేమిటో తెలుసాండీ! లోకంలో ఇంక మిగిలిన ఏ అనుబంధానికి దగ్గరవ్వాలన్నా బాహ్య కారణాలుంటాయి, ఒక భర్తకి భార్య దగ్గరవ్వడానికి ఒక ప్రేమో ఏదో కారణం కొడుకు తండ్రికి ఒక కూతురు తల్లికి ఒక కోడలు మామగారికి అలా దగ్గరవ్వడానికి కొన్ని కారణాలుంటాయి. ఏదో బాహ్యమైనటువంటి కారణాలు ఆ ప్రేమలు కానీ గురువుగారికి ఈశ్వరుడికీ దగ్గరవ్వడానికి కారణమేమిటో తెలుసా వినయమొక్కటే కారణం ఎందుకు వినయం అడుగాతారు అని మీరు నన్ను ప్రశ్నవేయవచ్చు వాళ్ళుకి ఇవ్వడానికి వాళ్ళు కోరుకున్నది నీవద్దలేదు ఎందుకో తెలుసాండి ఈ మాట నేను అంటున్నాను, వారికసలు కోరికుంటే తృప్తి ఉంటుంది. తృప్తి ఎప్పుడుంటుందండీ కోరిక ఉంటే, ఇప్పుడూ నాకు తృప్తి అన్నమాట ఎప్పుడు నాకో కోరికుంటే నాకు ఏదో గుంటూరులో ఒక జిలేబీ తినాలని నాకు కొరికొచ్చిందనుకోండి పట్టుకొచ్చి హరిప్రసాద్ గారు నాకు జిలేబి పెట్టారనుకోండి నేను తింటే నాకు తృప్తి అసలు నాకు దేనిమీదా వ్యామోహంలేదు మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టినా నాకు దానిమీద అనురక్తి లేదు నేను దాన్నేం తినాలని కోరిక పడను అనుకోండి.
అనుకోండి ఉదాహరణకి నేను అలా అన్నానని అనుకోకండి జిహ్వచాపల్యమున్నవాన్నేండి నేనేం గొప్పవాడని చెప్పట్లేదు ఉదాహరణ చెప్తున్నానంతే ఇప్పుడు నాకు తృప్తిని ఎలా తీసుకొస్తారు చెప్పండి. నాకు ఏ కోరికాలేదు ఏ కోరికాలేని నాకు మీరు ఏం చేసి తృప్తినిస్తారు. మీరు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చీ రామ చంద్ర మూర్తికి బంగారు కవచం ఎలా కట్టారో అలా కట్టినా తీసి అవతలపారేసి వెళ్ళిపోతాననుకోండి నాకు దానిగురించి పట్టింపులేదు అదీ ఒక గడ్డిపొరకా రెండూ నా దృష్టిలో ఒకటే ఇప్పుడు ఇచ్చి నీ తృప్తేంలేదు పుచ్చుకుని నాకేం తృప్తిలేదు నా తృప్తి మీకు కావాలనుకుంటే మీరు వినయంగా ఉండడమొక్కటే తృప్తి. అది ఎవరి విషయంలో గురువుల విషయంలో ఉదాహరణ నా విషయంలో అన్నది బాగా అర్థమౌతుందని చెప్పాను తప్పా నేను ఆస్థాయని చెప్పట్లేదు అప్పుడు నాకు అహంకారం ఉన్నట్లు లెక్కా. ఏమీ ఆశించనివాడు గురువు కనుకా ఆ గురువు దేనికిలొంగుతాడు ఆయన పాదాల్ని పట్టుకుంటే గురువుగారి దగ్గర వినయంతో నిలబడగలిగితే చాలు గురువుగారు పొంగిపోతారు అంతే. అందుకే ఈ వినయానికి పరాకాష్టకింద ఉంటారు. ఈశ్వరుడి దగ్గరా అంతే మీరు ఈశ్వరుడికి ఏమిస్తారండీ మిమ్మల్నే ఈశ్వరుడు సృష్టించాడు మీ ఊపిరితిత్తులు ఈశ్వరుడిచ్చాడు మీ గుండెకాయ ఈశ్వరుడిచ్చాడు మీ మూత్రపిండాలు ఈశ్వరుడు పెట్టాడు మీ మాట ఈశ్వరుడిచ్చాడు మీరు తినడానికి పదార్థాలు ఈశ్వరుడిస్తున్నాడు పచనం ఆయన చేస్తున్నాడు జీర్ణం ఆయన చేస్తున్నాడు ఆయనకు మీరేమిస్తారు.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఆపిల్ పండు మీరు సృష్టించారేమిటి ఈశ్వరుడు సృష్టించాడు ఆపిల్ పండు కొనడానికి డబ్బుమీరు సృష్టించారేమిటీ, ఏదో శక్తి మీకిచ్చి విజ్ఞానం మీకిచ్చి ఏదో ఉద్యోంగం చేయించి డబ్బు మీకిస్తున్నాడు, అన్నీ ఆయనిచ్చినవే అన్నీ ఆయనిస్తే మీరేమిస్తారు ఈశ్వరుడికి, ఈశ్వరా నీవు ఇచ్చింది నీకివ్వడం తప్పా నేను ఇవ్వగలిగిందన్నది నాకు లేదన్న నీ భావనే నివేదన, ఈ భావన మీకు కలిగిందనుకోండి వినయానికి పరాకాష్ట అదే నివేదన నివేదన యొక్క ఫలితము ప్రసాదము, ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము ఆ అనుగ్రహము మనసుకు పరిపుష్టినిస్తుంది భక్తికి. అందుకే లోపలికి పులిహరపు పళ్లెం వెళ్ళుతుంటే బట్టవేసి తీసుకెళ్తారు బయటికి తీసుకొచ్చి చేతిలోపెడితే కళ్ళకు అద్దుకుని తింటారు. ఎందుకని అది ప్రసాదం ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం ఈశ్వరుడికి చూపించకపోతే పులిహారం కదా. ప్రసాదంగా అనుభవించడమంటే ఇవన్నీ ఈశ్వరుడివే అని నమ్మగలగడం కాబట్టి ఈశ్వరునికి మీరేమిస్తారు మేమేమీ ఇవ్వలేము, ఇవ్వలేము అనుకున్నప్పుడు వినయంతో కిందకి  వంగడమే. ఎంత పెద్దవారు మీరని లోకమంతా అంటున్నా నా పెద్దరికమేమిటండీ నా పెద్దరికమంతా ఆయనిచ్చిందని ఆయన పాదాలదగ్గర కూర్చుంటాడు తప్పా ఎప్పుడూ సమానంగా కూర్చోడు ఇది వినయం దీనికి గురువు లొంగుతాడు దీనికి ఈశ్వరుడు నమ్ముతాడు. అందుకే శంకరభగవత్ పాదులు గురించి ఎప్పుడు లోకంలో ఒకమాట అంటూంటారు ఆయన జ్ఞానాన్ని కదా బోధచేశారూ ఇంక భక్తి అన్నమాటకు తావెక్కడుంది, భక్తి అంటే రెండుంటేకదా భక్తి. ఓ పెద్దాయనున్నాడు ఓ చిన్నాయన ఉన్నాడు ఈయ్యన ఆయన్ని స్తోత్రం చేశాడు అప్పుడుకదా... కానీ శంకరుల దృష్టిలో ఉన్నది ఒక్కటే కదా ఇంక మళ్ళి భక్తి ఎక్కడనుంచి వచ్చిందంటారు.
Image result for adi shankaracharyaభక్తికి పరాకాష్ట జ్ఞానం. జ్ఞానానికి భక్తి ఎప్పుడూ ప్రతిబంధకం కాదు పిందెలేని పండు ఎక్కడ్నుంచి వస్తుందండీ భక్తితో కూడిన కర్మాచరణంవల్లే జ్ఞానం వస్తుంది, అసలు భక్తిలేకుండా జ్ఞానం ఎక్కడొస్తుంది రాదు కాబట్టి జ్ఞానమునకు భక్తి ప్రతిబంధకం కాదు అందుకే శంకర భగవత్ పాదులు మోక్షసాధన సామ గ్ర్యామ్ భక్తి రేవ గరీయసీ అని ప్రతిపాదించారు, మహానుభావుడు ఆయన జగత్ గురువు అమ్మో శంకరభగవత్ పాదులు చెప్పనిదేముంది ఆకాశమంత ఎత్తు పెరిగాడు పాతాళమంత కిందకీ దిగాడు ఇంకా తరువాత ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆ మధ్యోకి వచ్చి నిలబడాలి తప్పా శంకరుల్ని దాటి పైకి ఎక్కలేరు శంకరులకన్నా కిందకి వెళ్ళలేరు ఆయన కిందకెంతెళ్ళారో అంతా వెళ్ళారు ఎంత మీరు తక్కువ చేసి మాట్లాడుకోవాలో ఈశ్వరుని దగ్గర అంత తక్కువ చేసి శంకరాచార్యులవారు మాట్లాడారు పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఎంత పైకెక్కారంటే అహం బ్రహ్మాస్మీ అన్నారు ఇప్పుడు మీరు అంతకన్నా పైకేం వెడతారు అంతకన్నా కిందకేం దిగుతారు. కాబట్టి మీరు ఎంత మంది

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
వచ్చినా తరువాత ఎవరొచ్చినా ఏం మాట్లాడినా రెండింటిమధ్యలోనే మాట్లాడాలి. కాబట్టి శంకరులకన్నా కిందకి వెళ్ళలేరు శంకరులకన్నా పైకి వెళ్ళేరు. అది శంకరుల యొక్క తత్వము వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణాం మూర్తయే నమః.
Image result for jambavan and hanumanసరే, అందుచేతా నీవు సుగ్రీవుడితో సమానమైనవాడివేకాదు రామ లక్ష్మణయో శ్చాపి తేజసా చ బలేన చ రామ లక్ష్మణులు ఇద్దరూ తేజస్సులో ఎంత గొప్పవారో బలంలో ఎంత గొప్పవారో నీవు కూడా తత్యులమైనవాడవు అంతేబలం అంతే తేజస్సు ఉన్నవాడువు అంటే రామ లక్ష్మణులతో సమానమైన స్థాయికలిగినటువంటి వ్యక్తి హనుమ కానీ ఎక్కడ కూర్చుంటారు ఎప్పుడూ పాదాలదగ్గరే, ఎదిగినా ఒదగడం నేర్చుకోవాలీ అంటే హనుమ యొక్క ఉపాసన చేసితీరాలి, అందుకే మనకి లోకంలో చిన్నపిల్లల్తో కూడా మనం ఎవర్ని ఆరాధన చేయిస్తామంటే ఇద్దరిని ఆరాధన చేయిస్తాం ఒకరు హనుమా ఒకరు వినాయకుడు. సరే వినాయకున్ని ఎందుకు అలా చెయ్యవలసి ఉంటుందీ అన్నది రేపు వింటారు మళ్ళీ చదివిన చదువే ఎందుకూ... హనుమ కూడా అంతే అపారమైన వినయ సంపత్తికలిగినటువంటివాడు మహానుభావుడు ఆయన ఈమాటలు ఆయన యందు గర్వాన్ని పెంచలేదు ఈ మాటలు ఆయనయందు వినయాన్ని పెంచాయటా అదే విచిత్రం. మీరు అయ్యా చాలా వృద్ధిలోకి వచ్చారు చాలా చక్కటిపని చేశారు అంటే ఇలా అనుకూడదు హా... ఆయన చేత నేను పొందినటువంటి ప్రశంసా వాక్యం అరే నేను వాన్ని ఎందుకన్నాను అలాగా ఎంత పాడయ్యాడు ఇప్పుడు అని ఆయన పశ్చాతాప పడవలసినటువంటి రోజు రాకుండుగాక అని ఎప్పుడూ అడగలేదు.
అందుకే ఒక గురువు దగ్గరికి వెళ్ళితే శిష్యుడు ఎప్పడూ చెప్పవలసిన  మాట ఏమిటో తెలుసాండీ గురువుగారూ నా నడవడిచేతా నీ కీర్తికి ఎన్నడూ కళంకము కలగకుండుగాకా... ఫలానా ఆయన గురువుగారు అనీ సమాజం ఎప్పుడైనా మిమ్మల్ని మీ శిష్యుడు కదా ఆయనా అన్నప్పుడు మంచి శిష్యున్ని తయారుచేశాడండీ అని మిమ్మల్ని శ్లాఘించాలి తప్పా... ఏమండీ మీ శిష్యున్ని అటువంటివాన్ని తయారుచేశారు అన్ననాడు గురువు తలవంచుకోవలసి వస్తుంది. కాబట్టి నా నడవడి ఎన్నడూ అలా ఉండుకుండుగాకా... అని మనం గురువుగారి దగ్గర ప్రతిజ్ఞ చేసుకుంటుండాలి ఎప్పుడూ... గురువుగారి దగ్గరా చెయ్యవలసిన ప్రతిజ్ఞ అదే... తప్పా గురువుకి నువ్వు చెయ్యగలిగినది ఏమీ ఉండదు ఎందుకో తెలుసాండీ ఆయన నిత్యతృప్తుడు ఆయన ఎప్పుడూ తృప్తితోనే ఉంటాడు. అటువంటి అంతర తృప్తి అదీ ఆశ్చర్యకరమైన విషయం అసలు కోరిక పుట్టదు. అజాత శత్రువు అంటే ఆ గురువుగారియందు కోర్కె పుట్టదసలు పుట్టనప్పుడు మీరు ఇంకేం చేస్తారండి ఆయన్ని మీరు చేయడానికేం ఉండదు అదీ అందుకే ఆ గురుత్వాన్ని పొందడం ఆ గురుత్వమునందు నిలబడ గలగడం చాలా గొప్ప విషయాలు ఈశ్వరానుగ్రహం చేతనే సంభవిస్తుంది. ఆ గురువు ఆ ఈశ్వరుడు ఎవర్ని అనుగ్రహిస్తారో అనుగ్రహం ఎవరికుంటుందో వాళ్ళకు మాత్రమే గురువు చెప్పినమాట మనసులో నిలబడి అనుష్టానంలోకి వెళ్తుంది. గురువుగారి అనుగ్రహాన్ని మీరు పొందలేకపోయారనుకోండి మీరు ఎన్ని వినండి గురువుగారు చెప్పినవీ అవి మీ యందు బుద్ధిరూపంలో మాత్రం ప్రకాశించలేవు తేడా వచ్చేస్తుంది. ఈ రహస్యం ఎక్కడ చెప్పారో తెలుసాండీ ఇవ్వాళ సమయం చాలదని నేను విడిచిపెట్టానుకానీ ప్రహ్లాదోపాఖ్యానంలో ఉంది ఈ రహస్యం.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఎందుకనీ అంటే లీలావతి గర్భంతో ఉన్నప్పుడు లీలావతిని దేవేంద్రుడు తీసుకెళ్ళిపోతుంటే నారదుడొచ్చి దేనికి తీసుకెళ్ళిపోతున్నావు అని అడిగాడు, హిరణ్యకశ్యపుడు తపస్సుకెళ్ళాడయ్యా ఆయన యొక్క వీర్యము ఈమె గర్భమునందు Image result for leelavathi prahaladhaపిండముగా రూపముదాల్చుతుంది వాడితోనే వేగలేకపోతున్నాం మళ్ళీ ఇకోడా బయటికి, అందుకని ఆ పిల్లవాడు పుట్టగానే చంపేస్తాను. చంపి ఈమెను వదిలేస్తాను అన్నాడు ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఇంద్రుడు హిరణ్యకశ్యప ప్రజాపతి సంతానమే అంటే నారదుడు అన్నాడు నీకేం తెలుసు హిరణ్యకశ్యపుని కొడుకు కాబట్టి అలా ఉంటాడు అనుకుంటున్నావు కాదు ఆయన హిరణ్యకశ్యపుడు కొడుకైనా లోకమంతటిచేతా కీర్తింపబడేటటువంటి మహాభక్తున్ని పొందుతున్నాడు. నీవెవరివి చంపడానికి కాబట్టి నా ఆశ్రమానికి తీసుకెళ్తానన్నాడు అటువంటి  మహాభక్తుడు పుడితే నాకేం అభ్యంతరము తీసుకెళ్ళుండి అన్నాడు. నారదుడు ప్రహ్లాదునికి ఉపదేశం ఎప్పుడు చేశాడో తెలుసాండీ పుట్టాక కాదు లీలావతి గర్భమునందుండగా పిండము వింటుంది మీరు నమ్మండీ నమ్మకపోండీ ఇవ్వాళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. పిండానికి వినేశక్తి ఉంటుంది నేను ఇది చెప్పకుండా ఉండలేను నా వ్యక్తిగత అనుభవమైనా నా ఇంటికి ఒకానొకప్పుడు కాకినాడలో ఒక దంపతులొచ్చారు వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఆవిడా పెళ్ళి ముందునుంచీ ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడకేదో పాపం మంచివనిపించాయి ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడూనూ ఆవిడా కాకతాళీయంగా ఆవిడ భర్తగారికి కూడా అంతే ప్రీతి ఆ సీడీలంటే కాబట్టి ఇద్దరికీ అదే పని, అస్తమానం అవి వింటూ ఉండేవారట అమెరికాలో, వాళ్ళిద్దరికీ వారి అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటుంది ఆవిడ కడుపులో ఆవిడ అవే వింటుండేవారు అదే పనిగా వినేవారు ఆ పుట్టినటువంటి పాపా మెరిసిపోతుంది సీతమ్మతల్లిలా అది పాకేటటువంటి వయసు వచ్చింది ఆ పాకేటటువంటి పిల్లను తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడ్డానికివచ్చారు (మీరు నన్ను (మీరు ఉన్నారులా ఉన్నారు) ఆ పాపను). నాకు పేర్లు జ్ఞాపకం ఉండవు. తీసుకొస్తే ఆ పాప నిద్రపోతుంది మాఇంటికొచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి లోపల మంచం మీద పడుకోబెట్టండమ్మా ఎంతసేపు ఒళ్ళో పెట్టుకుంటారు అన్నాను.
లోపలా పడుకోబెట్టారు దానికి తెలివొచ్చింది, తెలివొచ్చిన తరువాత తీసుకొచ్చి వాళ్ళమ్మగారు కిందకిదింపారు, దింపితే నేను అంత దూరంలో కుర్చిలో కూర్చుని మాట్లాడుతున్నాను వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ పిల్లా గబగబగబగబా పాక్కుంటూ వచ్చీ నా రెండు కాళ్ళు పట్టుకునీ ఇలా తలెత్తి చూస్తూంది నేను దాన్ని ఎత్తుకుని తొడమీద కూర్చోబెట్టుకున్నాను. తొడమీద కూర్చోబెట్టుకుని ఏమమ్మా ఏం అలా చూస్తున్నావ్ అన్నాను అదీ ఇంట్లోంచి వెళ్ళిపోయేవరకూ నేను మాట్లాడుతుంటే నా నోటివంకా ముఖం వంకా అలా చూస్తూనే ఉంది, అంటే తల్లిగారు అది గర్భంలో ఉండగా అదేపనిగా వింది విని అది నిద్రపోతున్నది నా మాటలకు ఉలిక్కిపడిలేచింది నేను ఇన్ని నెలలుగా వింటున్న మాటలు ఈ శరీరంలోంచే వస్తున్నాయన్నమాట అందుకని నా నోటినీ నా ముఖాన్ని ఆశ్చర్యంగా అలా చూస్తు కూర్చుంది ఒళ్ళో. కాబట్టి వింటాయి గర్భస్తపిండాలు నారదుడు చెప్పినటువంటి మాటలు లీలావతీ తల ఊపుతూ వింది లోపల ప్రహ్లాదుడు విన్నాడు. ప్రహ్లాదుడు బయటికి వచ్చాడు లీలావతి అంతఃపురానికి వెళ్ళింది. అంతఃపురంతో ప్రహ్లాదుడు వెళ్ళాడు లీలావతి మరిచిపోయింది ప్రహ్లాదునికి గుర్తుండిపోయింది ఇది రాక్షసుల పిల్లలతో చెప్తూ ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు ఆయన అన్నాడు విల్లుగొనినాటినుండియు ఉల్లమునా మరుపు పుట్టదు ఒకనాడైనన్ నాకు పెద్దవాన్ని అవుతున్నా నా మనసులో నారదుడు చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా నేను మర్చిపోలేదు ఎందుకు మర్చిపోలేదో తెలుసా ఉల్లసమైన దైవ యోగంబున ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత గురువుగారి యొక్క అనుగ్రహం చేత గురువు యొక్క అనుగ్రహము ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఎక్కడుంటాయో అక్కడా గురువుగారి నోటివెంట వచ్చినటువంటి మాటల్నీ మర్చిపోవడం ఉండదు మనసు తిప్పి తిప్పి అనుష్టానంలోకి తీసుకొస్తుంది అది లేదనుకోండి మరుపు కిందకి వెళ్ళిపోతుంది.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఒక్కొక్కరి యందు భిన్నవిషయాలు, తెలుసుకున్న విషయాలు ఇంకా విషయంవైపుకు తీసుకెళ్తాయి కారణం ఏమంటే అదీ కారణజన్ములంటే తప్పా మీరు ఫలానావారితో సమానమండీ అన్నారనుకోండి అంతే ఇంక వాళ్ళేముందండీ వాళ్ళతో సమానమండీ అంటే ఇంక అహంకారం. అలా అంటారుకానీయండీ! ఆయనా నేను సమానమా..? అసలు నన్ను మాట్లాడిస్తున్నది ఆయనా మహానుభావుడు అనగలిగితే మీకు వినయముంటుంది. కాబట్టి చూడండీ హనుమన్ హరి రాజ స్య సుగ్రీవ స్య సమో హ్యపి ! రామ లక్ష్మణయో శ్చాపి తేజసా చ బలేన చ !! తేజస్సుయందు బలమునందూ నీవు రామ లక్ష్మణులతో సమానమైనటువంటివాడివి అరిష్ట నేమినః పుత్రో వైనతేయో మహాబలః ! గరుత్మాన్ ఇతి విఖ్యాత ఉత్తమః సర్వ పక్షిణామ్ !! బహుశో హి మయా దృష్టః సాగరే స మహా బలః ! భుజగాన్ ఉద్ధరన్ పక్షీ మహా వేగో మహాయశాః !! వైనతేయుడైన కశ్యప ప్రజాపతికి వినతయందు జన్మించినటువంటి సంతానమైనటువంటి గరుత్మంతుడు, అపారమైన వేగంతో సముద్రంలో ఉండేటటువంటి ప్రాణుల్ని తన్నుకపోతుండగా నేను ఎన్నో పర్యాయాలు చూశాను. ఆ సముద్రంలో ఉండేటటువంటి పాముల్ని తన్నుకపోయేటటువంటి గరుత్మంతుని యొక్క వేగము ఎంతగా ఉంటుందో నీ వేగము కూడా అంత తుల్యముగా ఉంటుంది. అంత వేగమున్నవాడు బలం బుద్ధి శ్చ తేజ శ్చ సత్త్వం చ హరి సత్తమ ! విశిష్టం సర్వ భూతేషు కిమ్ ఆత్మానం న బుధ్యసే !! మహానుభావా నీ బలం నీ బుద్ధి నీ తేజస్సు నీ సత్వం సమస్త భూతములకన్నా గొప్పవి నీతో సమానమైన భూతమే లేదు భూతము అంటే ప్రాణి, నీతో సమానమైనటువంటి ప్రాణిలేదు ఈ లోకంలో అంతటి బుద్ధి అంతటి బలం అటువంటి తేజస్సు ఉన్నవాడివి.
అటువంటివాడివి ఇలా కూర్చుని ఉంటావా నీవు ఇంత తేజస్సుతో ఇంత గొప్పవాడిగా పుట్టడమన్నది నీవు పుట్టిన తరువాత సంపాదించుకున్నది కాదు నీకు పుట్టుకయందే అనుగ్రహింపబడినది అసలు పుట్టీ పుట్టాగానే వచ్చింది నీ జన్మయే కారణ జన్మ ఏదో ప్రయోజనం లేకుండా నీకు ఇంత ప్రయోజనం కలగదు ఏదో కారణం లేకుండా నీకు ఇంత తేజస్సు ఇవ్వరు కాబట్టి ఇంతటి తేజో మూర్తిగా నీవు జన్మించావు ఇక్కడ ఎప్పుడూ కూడా మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. మీరు ఇటువంటి విషయాలు వినేటప్పుడు కారణజన్ముల యొక్క జన్మకు సంబంధించినటువంటి విషయాన్ని లౌకికమైనటువంటి దృష్టితో మీరు విచారణ చేయకూడదు ఎందుకో తెలుసాండీ అది పరాశక్తి యొక్క అనుగ్రహంచేత నిర్మిస్తారు. అందుకే ఒక్కొక్క మహానుభావుడు జన్మించేటప్పుడు ఆయన జన్మిస్తే అటువంటి గొప్ప తేజోమూర్తిని భరించగలిగినటువంటి క్షేత్రము ఉండదు. ఈశ్వరుడి అవతారాన్ని భరించగలదేమోకానీ మహర్షుల యొక్క తేజస్సుని భరించి వహించగలిగినటువంటి క్షేత్రాలు ఉండవు నేను మీతో యదార్థం చేప్తున్నాను రామ చంద్ర మూర్తిని కన గలిగిన కడుపుంటుందేమో వశిష్ఠ మహర్షిని కనగలిగిన కడుపు ఉండదు. అందుకే వాళ్ళు కుంభసంభవులు. ఒక కలసలోంచి ఉద్భవించారువాళ్ళు కారణమేమిటంటే ఆ తేజస్సుని భరించడం కష్టం, సుబ్రహ్మణ్యోత్పత్తిలో మీరు విన్నారు. ఏ క్షేత్రం భరించగలిగింది ఈశ్వర తేజస్సు అవి భరించలేవు కాబట్టి భరించగలిగినటువంటి క్షేత్రమునందు ప్రవేశపెడతారు ఆ తేజస్సుని ప్రేవేశపెట్టి ఆ తేజస్సుతో కలిపి కారణ జన్ములుగా వస్తారు తప్పా ఒక పతివ్రత యొక్క శీలాన్ని హరించడం లక్ష్యంగా దేవతలు ప్రవేశపెట్టరు. అందుకే శీలాపహరణం లేకుండా యోగ్యమైన క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టీ ఆ రూపంగా పుడితే తప్పా దేవతా కార్యం జరగదూ అంటే ఆ రూపంగా జన్మించడానికి వీలుగా గర్భస్తం చేస్తారు.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అందుకే శ్రీరామాయణంలో చాలామంది వానరులు ఆశ్చర్యకరమైనటువంటి జన్మలు స్వీకరించినవారు అలా పుట్టినవాళ్ళలలో వాలి సుగ్రీవులు కూడా... వాలి సుగ్రీవులు కూడా స్త్రీయందు జన్మించినవారు కారు ఋక్షకరజస్సు అని ఆయన గురించి ఉత్తర రామాయణంలో చాలా విశేషంగా ఉంది. ఆయనా చతుర్ముఖ బ్రహ్మగారికి ఒకానొకప్పుడు సమాధినిష్టలో ఉండగా కన్నులవెంట నీరు కారింది. ఇట్నుంచి కారితే దుఃఖమనీ ఇట్నుంచి కారితే అది ధ్యానావస్తలో వచ్చేటటువంటి బాష్పధారలనీ అంటారు. ఆ భాష్పధారలు పడుతుంటే ఆయనకెందుకో బుద్ధిపుట్టీ తన చేత్తో పట్టుకున్నారు ఆ నీటి చుక్కలు, అందులోంచి పుట్టాడు ఒక వానరుడు వృక్షకరజస్సుడు, ఆ పుట్టినటువంటి వానరున్ని ఆయన భూ మండలం మీద విడిచిపెట్టీ నీవు అక్కడ పళ్ళూ కాయలు తింటూ ఉండూ అన్నారు. ఆయన పళ్ళూ కాయలు తింటూ ఒకానొకప్పుడు ఆయన ఇంకొక ప్రాణిని ఎదురుగుండా చూసినదిలేదు. ఎప్పుడూ ఏవో కాయలు పళ్ళూ తింటూ బ్రహ్మగారు చెప్పిన ప్రదేశంలో బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరకెళ్ళి ఆ నీటిలోకి చూశాడు. ఆసలు నీటిలోకి ప్రతిబింబం చూసుకోకూడదు ఆయుష్యు క్షీణమౌతుంది. కాబట్టి నీటిలోకి చూశాడు ఇంకోవానరం కనపడింది. కనపడితే ఆయన ఇంకోవానరం వచ్చిందనుకొని దానితో యుద్ధం కోసమని నీళ్ళలోకి దిగాడు ఆ నీళ్ళలోకి దిగితే వానరం కనపడలేదు నీళ్ళు కదిలిపోతే నీళ్ళల్లో ప్రతిబింబమేముంటుందండీ మళ్ళీ పైకెక్కాడు ఆడదైపోయింది ఒకరోజు ఉంటుంది ఆ స్త్రీత్వం.
ఇప్పుడు వెంటనే ఆయన యందు ఇంద్రుడూ సూర్యుడు మోహం పొందారు, ఇంద్రుడు తన తేజస్సుని ఆయన శిరస్సుమీద విడిచిపెట్టాడు అది వాలందాకా వెళ్ళి వాలి పుట్టాడు. సూర్యభగవానుడు ఆ స్త్రీత్వాన్ని పొందిన వానరాన్ని మోహం పొంది ఆయన కంఠం మీద విడిచిపెట్టాడు తన తేజస్సుని సుగ్రీవుడు పుట్టాడు. ఇది విన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసాండి ఏమిటండీ ఈ కథలూ సూర్యభగవానుడు అంత గొప్పవాడు తెల్లవారితే ఆదిత్యహృదయంతో నమస్కరిస్తాం, ఒక వానర కాంత కనపడితే మోహం పొంది విడిచిపెట్టేశాడా కంఠం మీద పిల్లాడు పుట్టాడా ఏమిటండీ అనిపిస్తుంది. కాదు సూర్య భగవానుని యొక్క తేజస్సుని ఇంద్రుని యొక్క తేజస్సునీ ఒక వానర రూపంగా సృష్టించడానికి ఒక యోగ్యమైనటువంటి వానర కాంత క్షేత్రముగా దొరకడం కష్టం. ఆ రామ చంద్ర మూర్తికి సాహాయపడడానికి రావాలి తొందర తొందరగా దేవతాంశలన్నీ బ్రహ్మగారి ఆదేశం కాబట్టి వానర కాంతగా ఉన్నటువంటివాడు బ్రహ్మగారి యొక్క కన్నీటి బిందువులలోంచి పుట్టినటువంటివాడు ఒక్కరోజే ఆడతనము ఎందుకనీ పార్వతీ దేవి ఒకనాడు ఆ నీటిలో స్నానం చేస్తుంటే రాక్షసులు ఆడవేషాలతో వచ్చి స్నానాలు చేశారు అందులో ఆవిడ గ్రహించలేదూ... ఇందులో స్నానం చేసినవాడు ఆడదైపోతుంది ఒకరోజు అందావిడా కాబట్టి ఒకరోజు ఆడదైయింది. ఋక్ష్వరజస్వి. ఇప్పుడు తొందరగా వాళ్ళ యొక్క తేజస్సుని కంఠమునందు తోకయందు ప్రవేశపెట్టీ ఇద్దరు కుమారులు జన్మించేటట్టు చేశారు అయిపోయింది. అయితే మీరు మళ్ళీ ఇంకోప్రశ్నవేయవచ్చు. జన్మించారనుకోండి మరి వాలి ఇంద్ర తేజస్సు రామునికి పనికిరాలేదుగా అని మీరు ఒకమాట నన్ను అడగవచ్చు పనికొచ్చాడు రామ కార్యానికి వాలి ఎక్కడ పనికొచ్చాడో తెలుసాండీ వాలి చేతిలో దున్దుభి మాయావి ఇలాంటి చాలా పెద్ద పెద్ద రాక్షసులందర్నీ ఆయన చక్కబెట్టేసి ఆయన రాముని చేతులో వెళ్ళిపోయాడు.
లేకపోతే రామావతారం వచ్చిన తరువాత అందర్నీ నిగ్రహించాలంటే ఆయనకు ఎంత సమయం పడుతుంది, మాటలా వీళ్ళందరూ చేరితే ఒకచోటికి చేరకుండా వాలి వీళ్ళందర్నీ చంపేశాడు. వాలినీ ఆయన చంపేశాడు కాబట్టి అక్కడితో గొడవొదలిపోయింది. రామున్ని కలవకముందే చంపేశాడు సుగ్రీవుడు రామ కార్యానికి పనికిరావాలి అందుకని సుగ్రీవుడు

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
వానరాధిపత్యం వహించాడు, మళ్ళీ శ్రీరామాయణంలో ఉన్న ఆ జననములను మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కాబట్టి, కాబట్టి మీరు హనుమ యొక్క ఆవిర్భావాన్ని కూడా అటువంటి ప్రవిత్రమైన దృష్టికోణంతో వినవలసి ఉంటుంది తప్పా ఇదంతా ఏదో పరిహాసం కోసం వాల్మీకి మహర్షి ఆచమనంచేస్తే బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సత్యము భాషిస్తే ఆయనకు కనపడితే రచించినటువంటి కావ్యం అది వాల్మీకి రామాయణం కాబట్టి అందులో ఒక్క అబద్ధంలేదు చిట్ట చివర ఫలసృతిలో చెప్తారు ఒక్కమాట ఇందులో అబద్ధములేదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు చెప్తున్నాడు జాంబవంతుడు ఎందుకు చెప్పగలుగుతున్నాడు ఇవన్నీ మీతో నేను చెప్పానుగా బ్రహ్మగారు ఎలాంటివారో వానరులకి జాంబవంతుడు అలాంటివాడు అంత ఆయుర్దాయమున్నవాడు. జాంబవంతుడు శ్రీరామాయణంలో చాలా చిత్రమైన పాత్రండి, రామావతారం వెళ్ళిపోయింది కాని జాంబవంతుడు మాత్రం ఉండిపోయాడు ఎప్పటివరకు ఉండిపోయాడు మళ్ళీ జాంబవతిని తీసుకెళ్ళి వినాయక వ్రతకథలో ఆ కృష్టభగవానికిచ్చి వివాహం చెస్తాడే సత్రాజిత్తువ్యాఖానం అక్కడ వరకూ ఉంటాడు.
మళ్లీ అక్కడ మనం ఒక పొరపాటు చెప్పేస్తుంటాము ఆ కథా, అది ఎలా వచ్చిందో మరి ఆ కథా ఎలా చెప్పేస్తున్నారో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి పసిపిల్ల అంటే చిన్నపిల్ల అడిగింది ఒకసారి నేను ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతుంటే ఏమండీ జాంబవతి ఊయలలో ఊగుతుంటే అంత పసిపిల్లని కృష్ణభగవానుడు పెళ్ళిచేసుకున్నాడా అని అడిగింది. నేను పెద్దవాళ్ళు అడిగితే చికాకుపడుతుంటాను. మీరు పుస్తకం చదువుకోండి అంటూంటాను, మూలం చదవకుండా ఎదో దొరికాడుకదాని అడుగుతారేమిటీ చదువుకోండి అంటాను పిల్లలకి చెప్పడం అంటే నాకు చాలా సరదా ఎందుకంటే వాళ్ళు పాపం చదువుకునే ఉంటారు కుతూహలంతో అమాయకంగా మాత్రం పిల్లలు అడిగితే ఆగి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దీనికోసం మళ్ళీ ప్రయత్నపూర్వకంగా అసలు ఆ వినాయక వ్రతకథ యదార్థంగా స్కాంధంలో ఎలా ఉందో అంతట్నీ మళ్ళీచెప్పి చూపించానుకూడా ఒకప్పుడు. అది వేరు విషయమనుకోండి దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు మళ్ళీ అది చెప్తావా దాని జోలికి వెళ్ళకండి ఇప్పుడు, ఒక్కొక్కరి యొక్క జననము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహము చాలా పవిత్రమైన కోణంలో వినవలసి ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు అప్సరాప్సరసాం శ్రేష్ఠా విఖ్యాతా పుంజికస్థలా ! అంజనా ఇతి పరిఖ్యాతా పత్నీ కేసరిణో హరేః !! విఖ్యాతా త్రిషు లోకేషు రూపేణాప్రతిమా భువి ! అభిశాపాత్ అభూత్ తాత వానరీ కామ రూపిణీ !! దుహితా వానరేన్ద్ర స్య కుంజర స్య మహాత్మనః !!! పుంజికస్థలా అనబడేటటువంటి ఒక చాలా అందగత్తెయైనటువంటి అప్సరస ఒక ఆడది ఉండేది, ఆమె కామరూపిణి, ఆమెకు ఒకానొకప్పుడు ఒక శాపం కలిగింది అందు చేత ఆమె వానరకాంతగా జన్మించింది, వానరకాంతగా కుంజరుడనబడేటటువంటి ఒక మహాయోధుడికి జన్మించింది ఆమెకి కేసరీ అనబడేటటువంటి మరొక యోధుడికిచ్చి వివాహం జరిపించారు. కోతికి కేసరీ అన్నపేరు ఎలా వచ్చింది? మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే కేసరీ అంటే సింహం. ఒకానొకప్పుడు శంఖము శబళా అనుపేరుకలిగినటువంటి రెండు ఏనుగులు ఉండేవి అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బందిపెట్టీ రాత్రికి రాత్రివచ్చి ఆశ్రమాలమీదపడి ధ్వంశం

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
చేస్తుండేవి ఆ రెండు ఏనుగుల్నీ నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరూ అని ఆలోచిస్తున్న కాలంలో ఈయ్యన అంజనాదేవి భర్తయైనటుంటి వానరుడు ఆ రెండు ఏనుగులతో యుద్ధంచేసి వాటిని మట్టుపెట్టాడు. రెండు ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరధ్వాజ మహర్షి సింహంలాంటివాడివీ అని సింహం నామబిరుదు ఇచ్చాడు. ఆ బిరుదు నామమే ఉండిపోయింది లోకంలో, ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు. ఎవరు ఈ అంజనాదేవి పుంజికస్థలా అప్సరసయే ఆమే శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానకాంతనే తీసుకొచ్చీ ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు ఆమె పేరు అంజన.
Image result for bala hanumanఇప్పుడు ఈమె ఒక అప్సరస కానీ వానరకాంతగా ఉంది చాలా గొప్ప అందగత్తె కామ రూపిణి ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం పొందుతుంది. ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడింది, నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెను కౌగలించుకున్నాడు ఎవడీ ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది అడిగితే అంటే ఆయన వెంటనే ఒకమాట చెప్పాడు, ఆయన అన్నారు ఎందు చేతనంటే చాలా గొప్ప కారణ జన్ముడు రావాలి ఆయన వస్తే తప్పా రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం ఒకరికి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు శివ తేజస్సు వాయువు శివుని యొక్క అష్ట మూర్తులలో ఒకటి అంత తేలికగా ఆ అవతారం సంభవం కాదు చాలా జాగ్రత్తగా క్షేత్రమునందు చేరవలసి ఉంటుంది. సుబ్రహ్మణోత్పత్తిలాగా కాబట్టి వాయువు అన్నారు న త్వా హింసామి సుశ్రోణి మా భూత్ తే సుభగే భయమ్ ! మనసాస్మి గతో యత్ త్వాం పరిష్వజ్య యశస్వినీం !! అని పిలిచారాయన యశస్వినీం ఓ కీర్తి కలదానా! మహాపతివ్రతవు అన్న కీర్తినీకెందుకమ్మా... నీ కీర్తిని చెరపడానికి వచ్చినవాన్ని కాను, దేవతా కార్యమును నిర్వర్తిచడానికి ఒక అత్యంత తేజో వంతుడైన పిల్లవాడొకడు వానరుడిగా జన్మించాలి నీవు వానరకాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సును మనసా చేరుస్తాను అప్పుడు ఆ తేస్సుని వానరంగా వృద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది ఆ వానర రూపంతో వచ్చిన తేజోరూపం రేపు రామ కార్యానికి ఉపయోగపడుతుంది.
కాదు కాదు తదనంతరం లోకంలో రామ చంద్ర మూర్తిని నమ్ముకున్న ప్రతివాన్ని రక్షిస్తుంది యుగాలు మారిపోయినా అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది వీర్యవాన్ బుద్ధి సంపన్నః పుత్ర స్తవ భవిష్యతి ! మహా సత్వో మహా తేజా మహా బల పరాక్రమః !! లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః !!! భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగమున్నవాడు నాతో సమానమైన లంఘన శక్తి కలిగినవాడు అంటే ధూకకలిగినటువంటివాడు అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటివాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరముంది అందుకనీ అమ్మా నీయందు తేజస్సుని నిక్షేపిస్తున్నాను ఇప్పుడు తల్లి అంతటి మహాపురుషుడుకి తల్లి కావడానికి అంగీకరించింది ఎందుకనీ... ఆమెకు వానర రూపం శాశ్వతం కాదు ఆమె విడిచిపెట్టేస్తుంది, శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తరువాత వదిలేసి కుంజికస్థలా వెళ్ళిపోతుంది మళ్ళీ అప్సరసగా వెళ్ళిపోయినా ఆవిడ కీర్తి శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా ఆంజనేయ స్వామివారి తల్లిగా అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతములచేతా నమస్కరింపబడుతుంది.
ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతోంది అందుకే యశస్వినీ అన్నారు ఆయన, అమ్మా అటువంటి బిడ్డ నీ కడుపున పుట్టబోతున్నాడు చాలా సంతోషించింది ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది మీకు మనవి చేశాను ఉత్తర కాండలోంచి, పుట్టగానే నీవు హనుమా సూర్యమండలానికి పండు అనుకుని సూర్యబింబాన్ని ఆ సూర్యబింబాన్ని చెలకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు ఆ వజ్రపు దెబ్బకి నీవు పర్వత శిఖరములమీదపడితే నీ ఎడమ దవడా సొట్టబడింది తన వజ్రాయుధపు దెబ్బచేత సొట్టబడిన ʻహనుములుʼ అంటే ఆ దవడలు కలిగినటువంటి నిన్ను తన గౌరవార్థం హనుమా అని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నారు. ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడినవాడివి సొట్టబడిన హనుములు కలిగినవాడివి కాబట్టి నీకు హనుమా అని పేరు వచ్చింది. ఆనాడు దేవతలందరూ నీకు వరాలిచ్చారు నీకివ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరమేమిటో తెలుసా అశస్త్ర వధ్యతాం తాత సమరే సత్య విక్రమ ! వజ్ర స్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష్య చ !! సహస్ర నేత్రః ప్రీతాఽఽత్మా దదౌ తే వరమ్ ఉత్తమమ్ !!! నీవు యుద్ధంలో ఏ అస్త్రము చేతా ఏ శస్త్రము చేతా నిహతుడివి కావు నీకు దేవేంద్రుడిచ్చిన వరం ఉంది నిన్ను వజ్రాయుధము కూడా ఏమీ చెయ్యలేదు దానితోపాటు స్వచ్ఛన్దత శ్చ మరణం తే భూయాత్ ఇతి వై ప్రభో నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్పా శరీరాన్ని నీవు శరీరం విడిచిపెడతాను అని పూనుకోకపోతే నిన్ను పడగొట్టగలిగినవాడు సమస్తభూతములలో దేవతలలో ముల్లోకములలో ఎవ్వడూ లేడు గాలిన్ కుంభినిన్ అగ్ని అంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ అంటేనే అంత అల్లరి చేశాడు హిరణ్యకశ్యపుడు అసలు బ్రహ్మగారు వరమిచ్చారు నీకు స్వచ్ఛంద మరణము కోరుకుంటే శరీరంపడుతుంది లేకపోతే పడదు అన్నారు.
ఇంత బలమున్నాయనా ఇలా దండం పెడుతుంటాడు ఏమీ ఆయన కోరుకున్నదిలేదు వాల్మీకి రామాయణం కాదు కాని ఒకచోటా హనుమ యొక్క భక్తికి ఒకమాట చెప్తారు, వాల్మీకి రామాయణం కాదు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి కానీ అందం కోసం ఒక మాట చెప్తుంటారు రామ చంద్ర మూర్తి పట్టాభిషేకం అయిపోయింతర్వాత అందరూ అన్నివేదులు తీసుకున్నారు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని హనుమ అలా కూర్చున్నాడు నీవేం చేస్తావు హనుమా అని అడిగాడు రామ చంద్ర మూర్తి అందరూ అన్ని పనులు తీసేసుకున్నారుగా... ఇంక నీకేం పనుంది నీవేం చేస్తావు, ఏదైనా పని అడిగేటప్పుడు తన బల పరాక్రములకు సమానమైన పని అడుగుతారు తప్పా ఏదో ఒకటిలేద్దురూ ఈశ్వరసేవ చేయడానికి ఏది కావాలండీ అంటారు. నడుంకి తువ్వాలు కట్టుకునీ అక్కడ దేవాలయంలో బూజులు కనపడ్డాయనుకోండి అయ్యా బూజుల కర్రుందేమిటండీ రేపు నేను ఒక్కసారి వచ్చి దులిపేస్తాను ఒక్కసారి ఈ బుజులు పట్టుంది హరిప్రసాద్ గారు ఇది దులిపించండి అనడం కాదు అయ్యా మేము రేపు వచ్చి ఓ పదిమంది ఒక్కసారి పట్టాభిషేకం వచ్చేస్తుంది కదూ పదిహేను రోజులలో అది కోయూర్  ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం అంటే, అది కాయిక  కైంకర్యం ఎంత గొప్పదో తెలుసాండి పెరియ పురాణంలో అప్పర్ చేశారని చెప్తుండేవాళ్ళు దానికోసం వచ్చింది కోయిల్ ఆళ్వార్ మంజన్ అని.
ఇప్పుడు అదేదో టికెట్టు చేశారనుకోండి అది వేరే విషయం అసలు స్వయంగా చేయాలి మనిషి ఎందుకంటే మీకు ఆలయంలో చేసేటటువంటివి కొన్నుంటాయి మీరు చేసుకునేవి కొన్నుంటాయి మీరు కొన్ని చేసుకోవడం కుదరదు మీరు ఆ దర్శనాలు చేయలేరు బంగారు కవచం కట్టుచుండగా రామున్ని చూడాలనిపించిందనుకోండి, మీ ఇంట్లో మీరు కట్టడం కుదరదు ఎందుకంటే అంగుష్టమాత్ర విగ్రహాన్నే పూజ చేయాలి అంగుష్టమాత్ర విగ్రహానికి కవచం ఎలా కడుతారు. ఇప్పుడు బంగారు కవచం కట్టిన రామున్ని చూడాలి అంటే ఒక్క దేవాలంలో ఉన్న స్వామి బంగారు కవచం కట్టుకుంటేనే మీరు చూడాలి. చందన చర్చితున్ని చూడాలి అంటే ఇక్కడ చూడాలి, మీ ఇంట్లో అంగుష్ట మాత్ర మూర్తికి చందనంరాస్తే ఆ సోయగం రాదు, అలాగే మీ జీవితంలో ఈశ్వరుడు మీకిచ్చిన బలాన్ని ఈశ్వరడికి ఉపయోగించాలీ అంటే గొప్ప గొప్ప ఉత్సవాలు వస్తాయి లేదా శారదా

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
నవరాత్రులు శ్రీ రామ పట్టాభిషేక ఉత్సవం ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరో చేయడం కాదు భక్తులు చెయ్యాలివచ్చి దేవాలయంలో, తన ఇంటిని ఎలా చూసుకుంటాడో దేవాలయాన్ని అలా చూసుకోవాలి. అయ్యా వచ్చే ఆదివారంనాడు మేమందరం వచ్చి దేవాలయాన్ని దులిపేస్తున్నాం తుడిచేస్తున్నాం అంటే నేను గొప్పగా చెప్పాననుకోకండి మా కాకినాడ అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో చాలా పెద్ద ప్రాంగణం హరిప్రసాద్ గారుకి తెలుసు మేము పెద్ద పెద్ద ఉత్సవాలు చేసేముందు మేము ఎవ్వరము కూడా కార్మికలని పెట్టి ఈ పనులు చేయించము మేము రేపు కోయిల్ ఆల్వార్ తిరుమంజన్ ఉత్సవం అని అట్టపెట్టె ఒకటి పెడతాం పదిరూపాయలుకన్నా ఎవరూ వేయద్దని చెప్తాం అందరూ తలో పదిరూపాయలు అందులో వేస్తారు.
Image result for ayyappa temple kakinadaఈ డబ్బంతా పెట్టి ముందురోజు సాయంకాలం మా గోపాల కృష్ణగారు వచ్చి చీపుళ్ళు చాట్లు సామాను తోమేటటువంటి పిండి ఆ తరువాత బూజుల కర్రలూ ఇవన్నీ తెప్పిస్తారు, నా భార్య ఇంకొంతమంది ఆడవాళ్ళు కలిసి దేవాలయంలో వంటచేస్తారు ఒక పప్పు ఒక కూర ఒక పచ్చడి అందరం ఏం చేస్తామంటే తెల్లవారేటప్పటికీ మాసిపోయిన బట్టలు కట్టుకుని తలపాగాలు చుట్టుకుని వచ్చి కూర్చుంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు కొంచం పెద్దవారైతే అమ్మా మీరు దీపపు సమ్మెలన్నీ తోమేయండి అర్చన పాత్రలన్నీ తోమేయండి పీతాంబరం పెట్టి మెరిసిపోయేటట్టు సిద్ధం చేయండి, పెద్దాడవాళ్ళకి ఏమిస్తామమ్మా కొంచెం ఓపికున్నవాళ్ళు మీరు దేవాలయమంతా కడిగేసైయండి ఓపికున్నమగవాళ్ళు ఆలయ శిఖరాలెక్కి ఆలయ శిఖరాలన్నీ శుభ్రంగా దులిపేసేయండి, వానరాలు ఎలా ఎక్కేస్తాయో అలా ఏనిమిదీ అయ్యేటప్పటికీ ఎక్కేస్తారు దేవాలయ ప్రాంగణమంతా మొత్తం నూరు నుండి నూటాయాభై మంది సత్సంగ కార్యకర్తలు ఒక్కొక్కసారి రెండువందలు కూడా దాటిపోతుంటారు మధాహ్నమయ్యేటప్పటికి ఆలయ ప్రాంగణమంతా ఎలా ఉంటుందంటే ఒక్క బూజు కనపడదు మొత్తం ఆలయమంతా శుభ్రం చేసేసి అన్నీ తోమేస్తారు అందరు స్నానాలు చేసేసి పొడిబట్ట కట్టేసుకొచ్చేస్తారు.
మా గోపాల కృష్ణగారు అందరికీ కూడా చక్కగా పప్పన్నం కూర అన్నం పచ్చడి పెరుగు తెచ్చి పెట్టేస్తారు, అందరం కలిసి ఈశ్వర సేవకులం గురువుగారిలేడు శిష్యుడులేడు గొప్పతనాల్లేవు తక్కువల్లేవు అందరం కూర్చుని సహపక్తి భోజనం ఇవ్వాళ ఈశ్వర సేవ చేస్తున్నాం మనం అందరం కలిసి భోజనం చేసి అందరం కలిసి ఇంటికెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటాము. ప్రతి నాలుగు నెల్లకో ఐదు నెల్లకో మా దేవాలయాన్ని మేమే శుభ్రం చేసుకుంటాం దేవాలయాన్ని ఎవర్నీ శుభ్రం చేయడానికి మేము ఇవ్వం మేమే చేసుకుంటాం కాయింకి కైంకర్యంకింద ఆలయాన్ని శుభ్రం చేసుకుంటాం. నేను కూడా నేను కూడా అని గొప్పకి అనుకోకండి నేను కూడా తలపాగా కట్టుకుని అమ్మవారి దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటాను ఎక్కువగా నాకు అదొక ప్రీతి పరాశక్తి దేవాలయం అంటే అందులో అమ్మవారి దేవాలయం కడగడం తుడవడం అవన్నీ చేస్తుంటాను చిన్న చిన్న పిల్లలదగ్గర్నుంచి వచ్చి చేస్తుంటారు అది చేసుకోవాలి ఈశ్వర సేవయందు ఆ సంతోషం ఉండాలి. అంతేగాని నేను ఇంత మొనగాన్ని నేను చేయడమా అనకూడదు ఈశ్వరసేవ చేయడమంటే పొంగిపోవాలన్నమాట దానికి కోయిల్ ఆశ్వార్ తిరుమంజన్ అనిపేరు కాయిక కైకర్యం చెయ్యాలి అయ్యా పట్టాభిషేకం వస్తూంది రామ చంద్ర మూర్తి పట్టాభిషేకం రెండు వారాల్లో

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఆదివారం హరిప్రసాద్ గారు బూజుకర్రలు తెప్పించి పెట్టండి మీ డబ్బులతో వద్దు అట్టపెట్టే పెట్టండి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు మేము వేస్తాం పది రూపాయలకన్నా మించకుండా చీపుళ్లు అవీ అన్నీ తెప్పించండి మేము దులిపేస్తాం ఓ పూట వచ్చి.
Image result for guntur srunga giri peetamఅందరూ దులిపేసి అందరం కూర్చుని రామ నామం రామ నామం సంకీర్తనం వినపడుతుంటే అందరం కడుపునిండా భోజనం చేసి వెళ్ళిపోదాం ఎంత ధన్యతండి అది నిజంగా పొంగిపోతారు సీతారాములు నా పట్టాభిషేకానికి ఎలా చేశారో చూడు సీతా నా పిల్లలని అంటే మిమ్మల్ని చెయ్యమని నేనేం ప్రతిపాదన చెయ్యటంలేదు ఎందుకంటే అది ఉత్సాహముతో కూడిన విషయము అని నేను ప్రతిపాదన చేశాను అంతే ఇప్పుడు నా ఉద్దేశ్యం అలా ఏదో చేయించే ప్రతిపాదన పెట్టానని మీరు అనుకోవద్దు. కాబట్టి ఆయన వినయం కలిగినటుంటివాడు నా స్థాయికీ ఆ పని చేయడమా అని ఆలోచించడు అందరూ అన్ని పనులు చేస్తున్నారుగా హనుమా నీవేం చేస్తున్నావు అన్నాడు. అంటే స్వామి ప్రభువు ఆవలించినప్పుడు తనకు తాను చిటుకేసుకో కూడదు, చిటికవేయకుండా ఆవలించు, కాబట్టి మీరు ఆవలిస్తే చిటికేస్తానన్నాడు, అవలింత ఎప్పుడొస్తుంది నిద్రపోయే ముందు వస్తుంది, కాబట్టి నీవు నిద్రపోయే వరకు నీ కాళ్ళదగ్గర ఉంటాను, మిగిలినవాల్లేంచేస్తారు బయట పనిచేసుకొని వెళ్ళిపోతారు. నీవు ఎప్పుడావలిస్తావో కాబట్టి అన్నం తింటున్నా పడుకున్నా నీ పక్కనే కూర్చుంటాను ఇంక మా తల్లి జనకాత్మజ కొద్దిగా హనుమా ఇంకా కూర్చుంటే ఎలాగా స్వామితో కలిసి ఏకాంతసేవలో నేను ఉండాలికదా అంటే వెళ్ళాలంతే అప్పటివరకు నీ పక్కనే కూర్చుంటా ఏమో ఎప్పుడు అవలింతవస్తుందో చిటికేస్తా, కాబట్టి ఇప్పుడు ఆయన స్థాయి చూసుకున్నారా, రామ చంద్ర మూర్తి దగ్గరికి చేరడానికి ఇది పనికొచ్చింది బాగా... స్థాయి చూసుకొని ఈశ్వర సేవ చేయకూడదు. నేను అంత ఉద్యోగస్తున్నండి నీ మొఖం ఈశ్వరుడిస్తే వచ్చిందది. నేను ఇంత పండితున్నండి ఈశ్వరుడు పలికిస్తే పలికావు, నేను ఇంత ఐశ్వర్యవంతున్నండి ఈశ్వరుడిస్తే అనుభవిస్తున్నావ్ ఏమిటవన్నీ ఈశ్వరుడిచ్చిన విభూతులు ఇన్ని ఉండి స్వామి నేను నీ కింకరున్ని, ఏదీ బూజు కర్ర పట్టుకుని ఆయలాన్ని దులుపు అప్పుడు.
మీ జీవితానికి ధన్యతా అంటూ ఉంటే నీ మనమలు నీ పిల్లలు ఇంటికెళ్ళీ ఇవ్వాళ నేను ఎక్కడికెళ్ళానో తెలుసారా... ఆలయం దులపడానికి వెళ్ళానురా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. గుడిలో కసేపు గోడంతా దులిపేసి వచ్చేశాను, గోడలు మేము భాగం వేసేస్తాము ఈ గోడ నీది ఈ రేండు కిటికీలు నీవి అని ముక్కులకు గుడ్డలు కట్టేసుకుని మావాళ్ళు చిన్న చిన్న బ్రష్ లు కూడా పట్టుకుని దులిపేసి పీతాంబరాలు పట్టుకుని పైకెక్కేసి కళశలు తోమేసి వాటర్ జెట్స్ పెట్టి కొట్టేసి ఈ కుర్రాళ్ళందరు పైకెక్కేసి పెక్కుల మీద కూడా పక్షి రెట్టకూడా ఉండనీయరు శుభ్రంగా చేసేసి శరదా నవరాత్రులు ప్రారంభం చేస్తాము. అలా సంవత్సరంలో ఒక రెండు మూడు పర్యాయాలు చేస్తుంటాము. ఇప్పుడు ఇక్కడ్నుంచి వెళ్ళగానే బహుశహా ప్రారంభం చెయ్యవలసి ఉంటుంది మరి ఓసారి దేవాలయం ఎన్నాల్లైందో మరి వెళ్ళి ఓసారి అందరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం చేసుకోవాలి అదో సంతోషం. ఆ చేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసాండి కలిసి అందరం కూర్చుని భోజనం చేయడంలో ఎంత సంతోషమో... తల్లీ తండ్రి బిడ్డలు తిన్నట్లు ఉంటుంది. అందుకే నా భార్యా ఇంకో ఇద్దరు పెద్దలు కలిసి వండేస్తారు అందరికి, అందరూ కలసి అమ్మగారు వండారు ఇవ్వాళ అన్నం ఎంత సంతోషమో మావాళ్ళకి పెద్ద పెద్ద అధికారులు ఎవ్వరూ అలా అనుకోరు అమ్మగారు అన్నమొండారు అమ్మగారు పప్పువండారు అంతే ఆ ఆవకాయ్ ఆ కూరు పప్పు అన్న తినేసి పొంగిపోయి ఒళ్ళు ఊనమైటట్టు సేవ చేసేసి ఇంటికెళ్ళిపోయేవాళ్ళం.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఎంత సంతోషమండీ జీవితంలో నిజంగా అలా ఈశ్వరుడికి సేవ చేయడం కాబట్టి ఇప్పుడు అది అవాల్మీకం సుమాండి అది వాల్మీకంలోది కాదు ఆవలిస్తే చిటికేస్తానన్నది మీరు మళ్ళీ కోటేశ్వరావు చెప్పారు వాల్మీకి రామాయణంలో ఇదెక్కడుందండి శ్లోకం అని నన్ను అడక్కండి. అవాల్మీకం దాని అందానికి నేను చెప్పాను కాబట్టి హనుమా నీవు కేసరి యొక్క ఔరస పుత్రుడివి వాయు దేవుని యొక్క అంశతో జన్మించినటువంటివాడివి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడివి ఇంత శక్తి కలిగినవాడివి స త్వం కేసరిణః పుత్రః క్షేత్రజో భీమ విక్రమః ! మారుత స్య ఔరసః పుత్ర స్తేజసా చాపి త త్సమః !! వాయుదేవుని యొక్క ఔరస పుత్రుడివి కేసరి అంజనాదేవిల యొక్క కుమారిడివి పుట్టుకతోనే ఇంత బలపరాక్రములను పొందినవాడివి కారణ జన్ముడివి మహానుబావా నీవు ఈ కార్యం చెయ్యొద్దా ఏమి నీవు బలవంతుడవేగా నీవెందు చెయ్యవు అంటావేమో త్రివిక్రమే మయా తాతా స శైల వన కాననా ! త్రిః సప్త కృత్వః పృథివీ పరిక్రాన్తా ప్రదక్షిణమ్ !! ఒకానొకప్పుడు త్రివిక్రమావతారంతో వామన మూర్తి మూడడుగలతో ఈ బ్రహ్మానంతటినీ కొలిచేస్తే నేను ఆయనకి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నాకు ఓపికి ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసిపెట్టాను నీవు చేస్తే కదూ ఇంకొకళ్ళకి చెప్పే అధికారం నీవు చెప్పడమే తప్ప నీవు చేయకపోతే ఇంకొకరికి చెప్పే అధికారం నీకుండదు. నీవు ఒకరుకి చెప్పింది ఒకరు చేస్తుంటే నీవు కూడా చేసి వెళ్ళాలి, అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది తప్పా... నేను ఎప్పుడు చెప్పడమే తప్పాండి నేను చేయటమేమిటండీ అని అనకూడదు. నీవు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నీవు చెయ్యాలి, నీవు పదిమందికి గంధం తీయమని చేప్తే నీవు చెయ్యాలి నీవు ఉత్తరీయం తీసేసి నీవు చొక్కా బనీను విప్పేసి కాస్త గంధం తీసి వెళ్ళాలి. అంతేగాని చెప్పడానికి పనికొచ్చింది నీవు చేయడానికి పనికిరాకపోతే ఇంక వాళ్ళెందుకు చేస్తారు అదే నమ్మకంలేని ప్రవచనం అంటే అది రావణ బుద్ధి రామ బుద్ధైతే తను చెప్పి తాను ఆచరిస్తాడు. కాబట్టి తదా చ ఓషధయో అస్మాభిః సంచితా దేవ శాసనాత్ ! నిష్పన్న మమృతం యాభిః తదాఽఽసీ న్నో మహద్బలమ్ !! ఒకానొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసం క్షిరసాగర మధనం చేస్తుంటే నేను ఓషధులను తెచ్చి ఆ క్షీర సాగరంలో వేశాను ఆనాడు నేను చేయగలిగింది చేశాను.
Image result for jambavanthaఇప్పుడు నేను ఎగరలేను నూరు యోజనాలు స ఇదానీమ్ అహం వృద్ధః పరిహీన పరాక్రమః ! సామ్ప్రతం కాలమ్ అస్మాకం భవాన్ సర్వ గుణాన్వితః !! నాకు ఇప్పుడు ఆ ఓపికలేదు వృద్ధుడనైపోయాను కాబట్టి నూరు యోజనములు ఎగరలేను ఉత్తిష్ఠ హరి శార్దూల లంఘయస్వ మహాఽఽర్ణవమ్ ! పరా హి సర్వ భూతానాం హనుమన్ యా గతి స్తవ ! నాయనా హనుమా! ఇంత బల పరాక్రమములున్నవాడివి ఇంత తేజస్సున్నవాడివి ఇంత శాస్త్రవిశారదుడివి వానరజాతి పరువు ప్రతిష్టలు రామ కార్యం నీ చేతిలో ఉంది నీవే అలా కూర్చుంటే ఎలాగయ్యా, ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో ఒక్కసారి నీ తేజస్సుని పుంచుకో ఒక్కసారి పెరుగు పెరిగి నూరు యోజనములు బయలుదేరు నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో నీ వేగమెటువంటిదో అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికీ లేదు ఈ మాట చెప్పగానే విన్నారట హనుమ కూర్చున్నవాడు ఒక్కసారి పైకిలేచాడు సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహా బలః ! సమావిధ్య చ లాంగూలం హర్షాత్ బలమ్ ఏయివాన్ !! ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారట అంటే శాపవిమోచనం అయిపోయింది తన బలం తనకు జ్ఞాపకం వచ్చింది తానెంత బలవంతుడో తాను తెలుసుకున్నాడు ఒక్కసారి ఆ తోకను చేత్తోపట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దులిపాడట హనుమ సంతోషంతోటి తస్య సంస్తూయమాన స్య సర్వైః వానర పుంగవైః ! తేజసా ఆపూర్యమాణ స్య రూపమ్ ఆసీత్ అనుత్తమమ్ !! ఆ వృద్ధులైనటువంటి

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
వానర పుంగవులు చేసినటువంటి స్తుతిచేత శాపవిమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రములను తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు.
Image result for jambavan and hanumanఇతః పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడు ఎలా చూడలేదో అలాంటి స్వరూపాన్ని పొందారు అంటే ఆయన ఆనందాన్నిపొంది తన బలం తన శక్తి తనకు తెలుస్తున్నకొద్ది తను పెరిగిపోతున్నాడు అంతంత అంతంత పెరిగిపోయి ఇప్పటివరకు ఇలా చూసినవాళ్ళు ఇలా ఇలా ఇలా ఇలా చూసేటట్టు పెరిగిపోతున్నారు, పర్వత కాయుడై అంతెత్తు పెరిగిపోయాడు. పెరిగిపోయి యథా విజృమ్భతే సింహో వివృద్ధో గిరి గహ్వరే ! మారుత స్య ఔరసః పుత్ర స్తథా సంప్రతి జృమ్భతే !! అబ్బో ఏమి మాటలు వేసాస్తారండీ మహర్షి. గుహలో లేచినటువంటి సింహం తెరచి ఉంచినటువంటి గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నారటా ఆ స్వరూపం. సింహం గుహలో ఉందనుకోండి ఆ సింహం ఎలాలేచి వస్తుందో మీకేం కనపడదు గుహతెరిచి ఉంటేనే మీకు కనపడుతుంది కదాండి... సింహం కుక్కలేచి పరుగెత్తినట్టు పరుగెత్తదు కుక్క లేచిందనుకోండి లేచిందే తడువు అలా పారిపోతుంటుంది. ఓ పిల్లి లేచిందనుకోండి పడుకుంది లేచి అలా పరుగెత్తుకపోతుంది ఓ ఆవు పడుకున్నదనుకోండి పడుకున్నదిలేచీ నిలబడుతుంది. సింహం లేస్తే అలా ఉండదు, సింహం పడుకున్నటువంటి సింహకానీ ఇలా తల పక్కకి పెట్టి పడుకుంటుంది ఇలా... పడుకున్నటువంటి సింహం నిద్రలేవాలనుకుందనుకోండి ఒక్కసారి కళ్ళు రెండు బాగా తెరిచి ఇలా అని ఒక్కసారి గుహంతా కలయజూసి ఒక్కసారి ముందు రెండు కాళ్ళమీదు సాగి ఒళ్ళు పూర్తిగా సాగదీసి ఒళ్ళు ఒక్కసారి ఆ నడుము అడించి తోక దులిపి నాలుక పైకితీసి పెదవులు రెండు నాక్కుని జూలు విదల్చి నోరు తెరచి ఒక్క గర్జన చేసి అడుగుతీసి అడుగువేసి బయకొస్తుంటే ఇంక ఎదురుగుండా ఏ మృగం ఉండడానికి వీల్లేదు అలా ఉంటుంది దాని ఠీవీ దాని నడక ఆ సింహం ఎలా బయటికొస్తుందో గుహలో లేచి అలా హనుమ కూడా అలా ఒక్కసారి అటువంటిస్థితిని పొందారు అంటే అలా లేచి అంటే ప్రతి కదలిక ప్రతి పుంజుకోవడం ఆ తోక జాడించడం ఆ పైకి పెరుగుతుండడం అది అపూర్వంగా ఇంతమంది వానరులు మన హనుమే? అని ఆశ్చర్యపోతూ చూస్తూ..! అందరి చేతులు ఇలా కలుసుకున్నాయి.
అంతగొప్ప స్వరూపాన్ని పొందుకున్నాడు ఆ ముఖం వంక చూశారట అశోభత ముఖం తస్య జృమ్భమాణ స్య ధీమతః ! అమ్బరీష మివా దీప్తం విధూమ ఇవ పావకః !! ఎర్రగా కాలిపోయిందనుకోండి పెనం ఎలా ఉంటుందో అలా కాలిపోయిన ఎర్రటి ముఖంలా ఉందట ఆయన యొక్క ముఖ తేజస్సు, పొగలేకుండా ప్రకాశిస్తున్నటువంటి అగ్నిజ్వాలా చాలా గొప్పగా ఉంటుంది పొగ ఉన్నటువంటి అగ్నిజ్వాలకు ఆ అందం ఉండదు పొగ అన్నది కాని లేని అగ్నిజ్వాల పైకి లేస్తుందనుకోండి నాలుకను చాపుతాడు అగ్నిహోత్రుడు అప్పుడు చూడాలి ఆ అందం అప్పుడు పూర్ణాహుతి అందమంతా అప్పుడే అసలా అగ్ని జ్వాలా అలా లేవాలి అంతేత్తులేచి నాలుకలతో అందుకుంటాడు పూర్ణాయుతి కాయుడు అంటే ఇలా నిలబడదు శిఖ అగ్ని శిఖ నిలబడకుండా అందుకే ఒక్కొక్కసారి పూర్ణాహుతి చేసేటప్పుడు పెద్ద అరిటి దొప్పవాడుతారు అది చూడండీ ప్రాణి బాగా పొడుగ్గా నాలుక ఉన్నటువంటి ప్రాణులు ఏం చేస్తాయంటే అంత దూరంలో ఉన్నదాన్ని చటుక్కున నాలుక చాపి పట్టుకుంటాయి, అలా పూర్ణాహుతి దగ్గరకి వచ్చేటప్పటికి ఆయనే నాలుకని చాపుతాడు కాబట్టి ఇలా ఉన్న అగ్నిశిఖ ఇలా ఇలా ఊగుతుంది ఊగి నాలుకను చాపి పుచ్చుకుంటున్నాడాని ఆజ్యధారని అన్నట్లు ఉంటాడు. అలా పొగలేకుండా పెరిగినటువంటి తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉందట, ఆలా నిలబడి దీపపు వత్తి కాలినట్టు కాలడం కాదు నాలుకను కదుపుతూ అటూ ఇటూ ఊగుతున్న అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా ఊగుతూంది.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అంటే ఇలా ఇలా శిరఫలక్తం చేసి ఇలా చూస్తూ ఇలా పెరిగిపోతున్నారాయన అంత పెరిగిపోతుంటే అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమ్ అబ్రవీత్ అక్కడ ఉన్నటువంటి వానరులందరికీ వానరుల యొక్క పెద్దలకి ఇంత పెరిగినవారు నమస్కారం చేశాడు ఇది ఆయన వినయం. ఒక్క నమస్కారం చేసి అక్కడున్న పెద్దలందరికీ తను చెప్తున్నారు
అరుజన్ పర్వతాగ్రాణి హుతాశన సఖోనిలః ! బలవాన్ అప్రమేయ శ్చ వాయుః ఆకాశ గోచరః !!
యస్యాహం శీఘ్ర వేగ స్య శీఘ్రగ స్య మహాత్మనః ! మారుత స్య ఔరసః పుత్రః ప్లవనే నాస్తి మే సమః !!
ఉత్సహేయం హి విస్తీర్ణమ్ ఆలిఖన్తమ్ ఇవామ్బరమ్ ! మేరుం గిరిమ్ అసంగేన పరిగన్తుం సహస్రశః !!
బాహు వేగ ప్రణున్నేన సాగరేణాహమ్ ఉత్సహే ! సమాఽఽప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదమ్ !!
మమ ఊరు జంఘ వేగేన భవిష్యతి సముత్థితః ! సముత్థిత మహా గ్రాహః సముద్రో వరుణాఽఽలయః !!
పన్నగాశనమ్ ఆకాశే పతన్తం పక్షి సేవితమ్ ! వైనతేయమ్ అహం శక్తః పరిగన్తుం సహస్రశః !!
ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలన్తం రశ్మి మాలినమ్ ! అనన్తమితమ్ ఆదిత్యమ్ అభిగన్తుం సముత్సహే !!
తతో భూమిమ్ అసంస్పృశ్య పునః ఆగన్తుమ్ ఉత్సహే ! ప్రవేగే నైవ మహతా భీమేన ప్లవగర్షభాః !!
పర్వతాన్ చూర్ణయిష్యామి ప్లవమానః ప్లవంగమాః ! హరిష్యామి ఉరువేగేన ప్లవమానో మహాఽఽర్ణవమ్ !
లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వశః ! అనుయాస్యంతి మమ్ అద్య ప్లవమానం విహాయసా !!
భవిష్యతి హి మే పన్థాః స్వాతేః పన్థా ఇవామ్బరే ! అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః !
Related imageఆయనా ప్రతిజ్ఞ చేస్తున్నారు, వానరులందరివంకా చూసి నేను నా యొక్క బలమెటువంటిదో మీ అందరికీ చెప్తున్నాను వినండి, ఇది గొప్పకి చెప్తున్నది కాదు. నా బలం ఎటువంటిదో నా తేజస్సు ఎటువంటిదో మీరు తెలుసుకుంటే నేను మీకు సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను మీ ప్రాణముల గురించి మీకు భయములేదన్న విషయం గురించి తెలుసుకోండి. నేను ఈ పర్వతముల యొక్క శిఖరాన్నీ కూడా నా వక్షస్థలంతో కొట్టి చూర్ణం చేసేయగలను, అపారమైనటువంటి తేజస్సుతో ఆకాశాన్ని చుంభిస్తుందా అన్నట్టుగా పెరిగినటువంటి మేరు పర్వతానికి ఆగకుండా అపార వేగంతో కొన్నివేల మార్లు ప్రదక్షిణం చెయ్యగలను ఆకాశంలో అపారమైన వేగంతో వచ్చినటువంటి వైనతేయుడైన గరుత్మంతుడు సముద్రంలో పాములను అపహరించి తీసుకునివెళ్తుండుగా ఆ గర్ముత్మంతునికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను నేను ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగంచేత ఈ సముద్రంలో ఉన్న జలరాసి చాప చుట్టినట్టుపైకి లేచిపోతే సముద్రంలోల ఉండేటటువంటి జలచరములన్నీ కంటికి కనపడుతాయి అంత వేగంతో ఈ సముద్రాన్ని చాప చుట్టగలను ఈ భూ మండలం మీద నదులన్నీ సముద్రంలో కలిపి సముద్ర జలాల్నీ నదీ జలాల్నీ కలిపి తీసుకొచ్చి భూమిమీద పోసి ఈ భూమిని సముద్రంలో కలిపేయగలను ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాలమీద ఎక్కి నేను ఆనంద తాండవం చేసి వాటిని పిండి ముద్దలుగా చేసి భూమితో సమానంగా చూర్ణం చేసేయగలను.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
నేను ఈ సముద్రంమీద ఎగురుతున్నప్పుడు సముద్రాన్నంతట్నీ కూడా అల్ల కల్లోలం చెయ్యగలను సూర్యోదయం అవుతుండగా సూర్యుడితోబాటుగా బయలుదేరి సూర్యుని కన్నా వేగంగా పశ్చిమాద్రి చేరుకుని కిందకి దిగి భూమి మీద కాలు పెట్టకుండా మళ్ళీ వెనక్కి వేగంగా వచ్చి సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చేటప్పటికి సూర్యున్ని కలిసి మళ్ళీ సూర్యుడు పశ్చిమాద్రికెళ్ళేలోపల తిరిగి తూర్పుదిక్కున కిందకి దిగగలను అంతటి వేగమున్నవాన్ని, వాయుదేవుడు ఎంత వేగమున్నవాడో గరుత్మంతుడు ఎంత వేగమున్నవాడో వారితో సమానమైనటువంటి వేగము లాఘవము గమనశక్తి ధూకగలిగినటువంటి శక్తి కలిగినటువంటివాన్ని, నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రంమీదుగా ఎగిరివెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరములనుంచి ఈ పర్వతాలమీద పెరిగినటువంటి కూకటివేళ్ళతో ఉన్నటువంటి చెట్లను పెకల్చి నా తొడల వేగానికి నాతోపాటుగా సముద్రం మీదుగా తీసుకపోయి విడిచిపెట్టగలను, నాతోపాటు తీగలు లతలు పువ్వులు చెట్లు ఎగిరివచ్చేస్తాయి, ఏక కాలమునందు కొన్నివేలమందిని మర్ధించగలను నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమన శక్తిని చూడగలవు నేను ఇది గొప్పకి చెప్పడం కాదు నేను వెడుతుండగా సమస్తభూతములు చూస్తాయి నావైపు గమనాన్ని నా గమనశక్తి అలా ఉంటుంది, ఇంతమంది చస్తుండగా ఎగురుతాను అన్నాడు.
నేను ప్రయాణం చేస్తుంటే ఆకాశాన్ని నేను తాగేస్తానా అన్నట్లు ఉంటుంది అలా బయలుదేరి వెళ్తాను, ఆకాశంలో మెరుపువస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగకన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను, లోకములను ఆక్రమించడానికి విజృంభించినటువంటి శ్రీమహావిష్ణువు త్రివిక్రమ అవతారం పొందితే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో నేను ఎగురగలను, నా యొక్క తొడల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నిటినీ భూమి మీదకు తేగలను నదుల మీద ఎగిరి నదుల మీద ఉన్న నీటిని భూమి మీదకు తేగలను ఏక కాలంలో సముద్రాల్నీ నదుల్నీ ఎండింపజేస్తాను అంతటి పరాక్రమము అంతటి బుద్ధి అంతటి తేజస్సు అంతటి లాఘవం నాయందు ఉన్నాయి. నేను వెళ్ళి సీతమ్మతల్లి దర్శనం తప్పకుండా చేస్తాను చేసి మళ్ళీ నూరు యోజనములు తిరిగొచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను మీ అందరూ ఆనందించండి మీ ప్రాణాలకు భయంలేదు సీతమ్మ తల్లి దర్శనం అవ్వడం ఖాయం కాబట్టి సంతోషంగా ఉండండి అన్నారు.
ఒక్కసారి ఆ పెరిగిపోతున్నటువంటి హనుమవంకచూశారు ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నేను పైకి ఎగరడానికి భూమిని నా పాదములతో దట్టించి పైకిలేస్తే నా పాదముల యొక్క తాకిడికి భూమి తట్టుకోలేక పాతాళంలోకి కుంగిపోతుంది అందుకని భూమిని కుంగించలేక ఇక్కడ ఉన్న మహేంద్ర గిరి పర్వత శిఖరముల మీద నిలబడి బయలుదేరుతాను అని స్వామి హనుమ మహేంద్ర గిరి పర్వత శిఖరముల మీద నిలబడ్డారు ఆ నిలబడినప్పుడు కిందనిలబడి ఇంత మంది వానరులు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఏమి తేజో మూర్తి ఏమి పరాక్రమశాలి ఇంతకాలం మనతో ఏమీ చేతకానివాడిలా ఉన్నాడు అని ఆ వానరులందరూ అంటున్నారు వీర కేసరిణః పుత్ర హనుమన్ మారుతాఽఽత్మజ ! జ్ఞాతీనాం విపులం శోకః త్వయా తాత ప్రణాశితః !! తవ కల్యాణ రుచయః కపి ముఖ్యాః సమాగతాః ! మంగళం కార్య సిద్ధ్యర్థం కరిష్యన్తి సమాహితాః !! రామాలయంలో నీరాజనం ఇమ్మనండి ఋషీణాం చ ప్రసాదేన కపి వృద్ధ మతేన చ ! గురూణాం చ ప్రసాదేన ప్లవస్వ త్వం మహాఽఽర్ణవమ్ !! హనుమకు కూడా కాస్త విశేషంగా ఇవ్వమనండి కర్పూరం ఎక్కువ వేసి ఇవ్వమనండి, కాబట్టి ఓ వీరా!

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కేసరి పుత్రా నీ యొక్క ఆ ప్రయత్నాన్ని చూస్తే మేమందరము ఎంతో సంతోషిస్తున్నాము నీకు కళ్యాణము కలిగించుగాకా, మంగళము జరుగుగాకా, నీవు సీతా దర్శనం చేసి వచ్చి వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలను నిలబెట్టెదవుగాకా, రామ కార్యమునందు మనం సార్ధ్యక్యము పొందెదముగాకా. కాబట్టి ఋషుల యొక్క అనుగ్రహంతో పెద్దల యొక్క అనుగ్రహంతో ఏ ప్రతిబంధకం లేకుండా ఆకాశమార్గంలో నీవు ప్రయోణం జరిగి నీవు లంకాపట్టణం చేరి సీతమ్మతల్లిని చూసెదువుగాకా.
Image result for jambavan and hanumanఅంటూండగా స్వామి మహేంద్రగిరి పర్వతముల మీద ఒక్కసారి అట్నుంచి ఇటు తిరిగి ఋషులకి తెలిస్తే ఆయన యొక్క కదలికలకీ ఆయన యొక్క నడకకి పర్వత శిఖరాలు కదిలిపోతే విద్యాధరులందరూ లేచిపోయారటా ఋషులందరూ ఒక్కసారి కదిలిపోయారటా సింహాలు పెద్ద పులులు మృగాలు అన్నీ కూడా లేచి భీతితో పరుగెత్తాయటా కలువలలో నున్నటువంటి పాములు ఆయన పాద తాకిడికి కలుగులు మూసుకుపోతే అకస్మాత్తుగా కలుగులు మూసుకుపోతున్నాయని ఆ పాములు గభాలున బయటికి వచ్చేటప్పటికి సగంలో నొక్కేస్తే పర్వతం మీద పతాకాలు నిలబడ్డాయా అన్నట్లుగా విషాన్ని కక్కుతూ ఇలా నిలువుగా నిలబడ్డాయట పాములు అటువంటి స్థితిలో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి స్వామి హనుమా స వేగవాన్ వేగ సమాహితాఽఽత్మా హరి ప్రవీరః పర వీర హన్తా మనః సమాధాయ మహానుభావో జగామ లంకామ్ మనసా మనస్వీ ! ఆయన ఇంకా శరీరంతో మహేంద్ర గిరి శిఖర పర్వతం మీద ఉన్నారు కానీ ఎప్పుడెప్పుడు లంకాపట్టణానికి వెడుతానాని ఉన్న మానసికమైన ఉత్సాహముచేతా ఆయన నూరు యోజనములు దాటి మనసా లంకలో ప్రవేశించినారు. అని ఆయన మనోజవం పుంజుకున్నబలంతో ఆయనింక శారీరకంగా వెళ్ళాలి, మనసుతో లంకచేరిపోయారు అంతటి గొప్ప తేజోమూర్తి హనుమా అని హనుమ శాపవిమోచనంతో పరమ మంగళ ప్రదమమైన వార్తతో కిష్కింధ కాండను పూర్తిచేస్తారు కిష్కింధ కాండ పూర్తి చేసినప్పుడు ఈ శ్లోకాన్ని హనుమగురించి విన్నవాళ్ళకీ ఇదే లభిస్తుందీ అని శాస్త్ర ప్రమాణం.
Related imageఏది ఆయన పొందారు స వేగవాన్ వేగ సమాహితాఽఽత్మా హరి ప్రవీరః పర వీర హన్తా మనః సమాధాయ మహానుభావో జగామ లంకామ్ మనసా మనస్వీ ! ఒక్కొక్కరికి చూడండి శరీరంలో మంచి బలముంటుంది కానీ ఓరేయ్ ఈ పని చేద్దాం రా అన్నారనుకోండి ఏమండీ కాలుజారిపోతే అంటాడు మనసు బలహీనం బలముంటుంది కాని వాడి బతుకంతా భయంతోనే సరిపోతుంది. ఒక్కొక్కరికి శరీరబలం ఉండదు దానికి ఆయన శరీరంలో చాలా ఇబ్బందు ఉంటాయి కానీ ఆయన అసామాన్యమైన పనులు చేస్తుంటాడు ఎందుకంటే ఆయన మనసుకున్నబలం అటువంటిది. మనోజవం మారుత తుల్యవేగం. ఆ మనసుకి ఆజవం ఆ మనోబలం ఎవడు పొందుతాడో వాడు సమస్యలకి పరిష్కారం సాధించికోగలడు. కిష్కింధ కాండ చివరలో మహర్షి మనసుతో చేరిపోయినటువంటి హనుమ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ కిష్కింధ కాండను పరిసమాప్తం చేశారు.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
రేపటి నుంచి సుందరకాండ ప్రారంభమౌతుంది, సుందర కాండ అద్భుతమైనటువంటి కాండ ఉపాసన కాండ అసలు స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిల్చొని ఇక అక్కడ్నుంచి బయలుదేరడానికి మొదలు పెట్టిన శ్లోకం దగ్గర నుంచి రావణా అన్న ʻʼ బీజాక్షరంతో మొదలు అత్యద్భుతమైనటువంటి కాండ సుందర కాండ సుందర కాండే రేపు స్వామి బయలుదేరి ఆకాశ మార్గంలో బయలుదేరడాన్ని చూపిస్తారు మహర్షి, రేపట్నుంచి సుందర కాండని సమయాన్ని సక్రంగా వినియోగించడంకోసం ఆరున్నరకి ప్రవచనం ప్రారంభమైపోతుంది అంటే ప్రవచనా శ్లోకాలకి ముందు చేసేటటువంటి ప్రార్థనా శ్లోకాలు కూడా ఆరు ముప్పైకే పూర్తైపోతాయి అంటే గురు వందనం అవీ ఆరు ఇరవైకే ప్రారంభింపబడుతాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో సుందరకాండ జరిగిన ఏడు రోజులు ఈశ్వరానుగ్రహంతో ఆరు మప్పై ఒకటీ కూడా కాకుండా జాగ్రత్తపడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సుందరకాండ మహా సముద్రం అది ఎంత చెప్పుకుంటామో అంతగా మనకు సీతా రామ లక్ష్మణుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అంత గొప్ప కాండ కాబట్టి రేపట్నుంచి అందరూ చక్కగా సమయానికివచ్చి ఒక్క శ్లోకం కూడా విడిచిపెట్టకోకుండా అంటే నేను చెప్పానన్న అహంకారంతో చెప్పడం లేదు చక్కగా మీరు భక్తి కలిగినవారు కాబట్టి చెప్తున్నాను. సుందర కాండని పరిపూర్ణంగా విన మనందరం తరిద్దాం అది చెప్పగలిగిన శక్తిని నాకు రామ చంద్ర మూర్తి కటాక్షించుగాకా అని రామ చంద్ర మూర్తి పాదముల పట్టి ప్రార్థన చేస్తూ...
అందునా ఈ ఏడు రోజులూ సుందర కాండ జరిగేటప్పుడు చాలా గొప్ప గొప్ప విశేష కార్యక్రమాలు జరుగుతాయి హనుమ సింధూరము చేత అర్చింపబడుతాడు గణపతి సింధూరము చేత అర్చింపబడుతారు. రేపటిరోజున చాలా అపురూపమైనటువంటి పూజ స్వామికి గరికతో వినాయకునికి ఎర్రటి పూలతో పూజచేయమని ఆయనకి ఎర్రపూలతో సింధూరం పూలతో పూజ చెయ్యాలి ఈ మూడింటితో విశేష ద్రవ్యాలతో హనుమని సహస్రనామార్చన జరుగుతుంటుంది 108 కొబ్బరికాయలు కొడతారు పదహారు కొబ్బరి కాయలు నిలబడి కొడతారు వినాయకుడి దగ్గర కార్యసిద్ధికి ఎప్పుడు కూడా నిలబడి కొబ్బరికాయ కొట్టాలి ఇది శాస్త్రం. కాబట్టి నిలబడి పదహారు కాయలు కొడతారు అది చాలా గొప్పగా ఉంటుంది ఆ పూజ రేపు మీ అందరూ కూడా చక్కగా ఆ పూజని కూడా చూసి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు రేపు ఎనిమిది గంటలకి ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను మనం ప్రతివాళ్ళకి నోటికొచ్చి ఉండాలి ఒక శ్లోకం ఒకటి అది రాకుండా ఎవ్వరు ఉండకూడదు సుముక శైచకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబో స్కంధపూర్వజః షోఢశైతాని నామాని యఃపఠేచ్చక్షుణు యాదపి, విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే !! 16 నామాలతో పిలిచాడు వినాయకున్ని ఎందుకు ఆ పదహారు నామాలతో పిలవవలసి వచ్చింది దానికెందుకు అంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేశారు. నేను ఆ పదహారునామాల గురించి ఒకవేళ కొన్ని నామాలగురించి గుర్తుచేయలేకపోతే చెప్తే వినాయకుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వినాయకుని యొక్క అనుగ్రహం లభిస్తే కార్యానికి అడ్డుపడిన విజ్ఞం తొలగిపోతుంది. కార్యహాని జరగదు సంకల్పాలు నెరవేరుతాయి కాబట్టి రేపు ఉదయం ఎనిమిదిగంటలకి వినాయక తత్వంమీద ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను కాబట్టి ఏదో అవకాశం ఉన్నవారు చక్కగా ఎనిమిది గంటలకొచ్చి ఆ ప్రసంగాన్ని వినండి.
ప్రసంగమైపోయిన తరువాత వినాయకునికి విశేష అర్చన ఉంటుంది, చక్కగా ఆ అర్చనలో పాల్గొనండి. మనందరం రోజూ రామ నామం చెప్తున్నాం కాని ఇవ్వాళ ప్రత్యేకించి రామ నామాన్ని విడిచిపెట్టవద్దు ఎందుకంటే కిష్కింధ కాండ పూర్తిగా స్వామి హనుమకి శాపవిమోచనం జరిగి సంతోషంగా ఉన్నారు గనుక రామ నామం యొక్క కీర్తన ఎంతో ఆనందదాయకమౌతుంది కదా కాబట్టి ఇవ్వాళ నైమిక్తిక తిథి చాలా గొప్ప తిథి నృసింహజయంతి కనుకా మీతో నేను ప్రతిపాదన చేసినట్లుగా  ఒక్క పదకొండుమార్లు ఇది చెప్పిన తరువాత మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించి ప్రసాదము స్వీకరించి చందన చర్చితుడైన స్వామిని దర్శనం చేసుకొని తరించి వెడుదాం. ఆయన చల్లబడుతాడు ఇవ్వాళ చందనం తగిలితే చల్లబడిన మూర్తిని చూస్తే మన మనసుకి చల్లబడుతుంది అంటే మన కోర్కెలు తీరుతాయి అని, ఏవి మనకోర్కెలు తీరితే మంచిదో ఈశ్వరుడు తీరుస్తాడు. తప్పా నేను అమెరికా అధ్యక్షున్నైపోవాలండి అవ్వలేదూ  ఆలాగకాదు తెలిసిందా...

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
దారినొంటిగ నడచువారికి తోడునీడే రామ నామము !!రామ!!
గౌరికిది ఉపదేశనామము కమలజుడు జపియించునామము !!రామ!!
వాదాబేధాతీతమగు వైరాగ్యమే శ్రీ రామ నామము !!రామ!!
భక్తితో భజియించు వారికి ముక్తినొసగును రామ నామము !!రామ!!
భగదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రామ!!
ఆదిమధ్యాంతరహితయైన ఆది నామము రామ నామము !!రామ!!
సకలజీవులలోనవెలిగే సాక్షిభూతము రామ నామము !!రామ!!
జన్మమృత్యుజరాధివ్యాధుల చక్కబరుచును రామ నామము !!రామ!!
ద్వేషరాగలోభమోహములను త్రెంచునది శ్రీ రామ నామము !!రామ!!
ఆంజనేయునివంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !!రామ!!
సృష్టిస్థితిలయకారణంబగు సూక్ష్మరూపము రామ నామము !!రామ!!
శిష్టజనముల దివ్యదృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము !!రామ!!
సాంఖ్యమెరిగెడి తత్వ విధులకు సాధనము శ్రీ రామ నామము !!రామ!!
యుద్ధమందు మహోగ్రరాక్షస యాగధ్వంశం రామ నామము !!రామ!!
రాకడయు పోకడయులేనిది రమ్యమైనది రామ నామము !!రామ!!
ఆత్మసంయమ యోగసిద్ధికి ఆయుధము శ్రీ రామ నామము !!రామ!!

మీ అందరి దగ్గరా విష్ణు సహస్త్రనామ స్తోత్రం పుస్తకాలు ఉన్నాయి కాని ఒకటి గమనించండి విష్ణు సహస్త్ర నామాన్ని ఇన్నిమార్లు పారాయణ చేస్తాను అని అనుకుంటే పూర్వోత్తరపీఠకలు చదవాలి తప్పకుండా అలా కాకపోతే క్షీరో ధన్వత్ ప్రదేశే అని మొదలు పెట్టీ వనమాలీ గధీశాంకీ వరకు చదివితే సరిపోతుంది. కాబట్టీ ప్రార్థనా శ్లోకాలంటే మేఘశ్యామం పీత కౌసేయం శాంతాకారం భుజగశయనం అవి కూడా చదువుతాం కాబట్టి మీరు ఆ ఒరవడిలో చదవండి నేను చదువుతుంటాను మీరు కలిపి చదివేయవచ్చు. మీకు సహస్త్రనామం వచ్చిందే కాబట్టి అది నేనని మీరునక్కరలేదు కానీ ఇది శృంగగరిపీఠం శృంగగిరి పీఠానికి దీనికి అభేదం ఎందుకంటే అది తండ్రీ ఇది కొడుకు అది బింబం ఇది ప్రతిబింబం కాబట్టి ఇక్కడ ప్రారంభం చేసి చదివేటప్పుడు శంకర భగవత్ పాదాచార్యవారు స్థాపించినటువంటి పీఠాల యొక్క శాఖలు కనుకా ఇక్కడ మనం ఎప్పుడు

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కూడా అద్వైత ప్రసిద్ధమైనటువంటి ఆచార్యులకి ముందు నమస్కారం చేస్తే తప్పా ఏదీ చేయకూడదు గురు వందనం చేయాలి, చేసి చెయ్యాలి కాబట్టి నేను మీతో మనవిచేశాను సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ! అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం !! ముందు రెండు శ్లోకాలు నేను చెప్తాను మీరు అనండి అన్న తరువాత మనం విష్ణు సహస్త్ర నామాన్ని ప్రారంభం చేద్దాం కాబట్టి ఇప్పుడు అనండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !! సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ! అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం !!  వేరొకమారు అనండీ రెండుమార్లు అనాలి ఒక సూర్యోదయం నుండి ఇంకో సూర్యోదయంలోపల కాబట్టి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ! అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం !! దీంతోపాటు నాకొక్క కోరికుంది మీరు నా కోర్కె తీర్చగలిగితే నేను నేను ఎంతో సంతోషిస్తాను. మీరు నాకు చేయగలిగిన ఉపకారం అంటే అదొక్కటే మీరు దయచేసి అర్థం చేసుకోండి త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను నాకు మీరు ఏ బహుమానాలు ఇవ్వక్కరలేదు నేను అది అదో నోటిమాటగా చెప్తున్నవాన్నికాను నాకు నిజంగా రామ కార్యంకన్నా నాకు నిజంగా రామ కథ కన్నా జీవితంలో గొప్పది ఇంకోటి లేదు అది చెప్పుకోవడానికి నా జీవితానికి చాలు నాకు మీరు ఏదైనా ఉపకారం చెయ్యాలి అని అనుకుంటే నేను ఒకటి అడుగుతాను మీరు అది చెయ్యండి.
ఆ తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామికి సంభందించిన అష్టకముంది శంకరాచార్యులవారి దేవాలం ముందు ఉంటుంది విధితాఖిల శాస్త్ర సుధాజలదే మహితోపనిషద్కధితార్థనిధే హ్రిదయే కలయే విమలం చరణం భవ శంకరదేశిక శరణం ఆ తోటకాష్టకం మీ అందరికీ ప్రతులు అందుతాయి మనందరం కూడా శంకరాచార్య స్వామి పీఠాలలో ఒక మర్యాదా ఉంటుంది. కార్యక్రమం అయిపోయాక శంకరభగవత్ పాదులకి కూడా ఇక్కడ నీరాజనమిచ్చి మనం ఏం చెయ్యాలంటే గురు వందనం చిట్టచివర అందరం కలిసి అలా చెయ్యాలి ఎందుకంటే గురుపాదుకలకు చేసేటప్పుడు పై వస్త్రం లేకుండా చేస్తాం కానీ విధితాఖిల శాస్త్ర సుధాజలదే అని చెప్తే ఒంగి భూమిని ముట్టుకుంటాం చేత్తో అది మీకు ప్రతులందిన తరువాతా నేను ప్రతిరోజూ ఒక్క నాలుగైదు రోజులపాటు నేను చదివించి నమస్కారం చేయిస్తాను. చక్కగా సుందర కాండ అందే మధ్యలో అది ప్రయత్నం చేస్తే ప్రతిరోజు మనం తోటకాష్టకంతో అందరం మనం కంఠం కలిపి నమస్కరిస్తే ఇన్ని కంఠాలతో తోటకాష్టకం వింటే అదొక్కటే నేను కోరుకునేటటువంటి ప్రతిఫలం. ఇంతమంది కలిసి చదివితే నేను పొంగిపోతాను. ఆ ఇవ్వాళ వెళ్ళేటప్పుడు తోటకాష్టకం ఇస్తారు ఇంటిదగ్గర కూడా చదవండీ నేను ఒకటి రెండు రోజులు పోయిన తరువాత ప్రతిరోజూ ఆ తోటకాష్టకం చేయిస్తాను. ఇంకెంత ఇంకొక పద్నాలుగు రోజులేగా పధ్నాల్గోరోజు పట్టాభిషేక సర్గ కాబట్టి మిగిలింది పదమూడు రోజులే ఇక ప్రసంగముండేది. సుంధర కాండ యుద్ధ కాండ ఏడు ఏడు పధ్నాలుగు రోజులు కాబట్టి చక్కగా మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని శంకరభగవత్ పాదులకి తోటకాష్టకంతో నమస్కరిద్దాం.

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం        











శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || 
యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే ||

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 
యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే |

శ్రీ వైశంపాయన ఉవాచ:
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరే వాభ్యభాషత || 

యుధిష్ఠిర ఉవాచ:
కిమేకం దైవతం లోకే కింవా ‌ప్యేకం పరాయణం |
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్ ||
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసార బంధనాత్ || 

శ్రీ భీష్మ ఉవాచ:
జగజత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః || 

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవచ || 
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ||
బ్రహ్మణ్యం సర్వ ధర్మఙ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్ |
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్|| 
ఏష మే సర్వ ధర్మాణాం ధర్మో‌ ధికతమో మతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా || 
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |
దైవతం దేవతానాం చ భూతానాం యో‌ వ్యయః పితా || 
యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే |
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే ||
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహమ్ || 
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || 
విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహానృషిః ||
ఛందో‌నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః || 
అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ ||
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ || 

పూర్వన్యాసః

అస్య శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య | శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా | అమృతాం శూద్భవో భానురితి బీజమ్ | దేవకీ నందనః స్రష్టేతి శక్తిః | ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః | శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ | శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ | రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్ | త్రిసామాసామగః సామేతి కవచమ్ | ఆనందం పరబ్రహ్మేతి యోనిః | ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః | శ్రీ విశ్వరూప ఇతి ధ్యానమ్ | శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః|
ధ్యానమ్:

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానామ్ 
మాలాక్ ప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైర్మండితాంగః |
శుభ్రైరభ్రై రదభ్రై రుపరివిరచితైర్ముక్త పీయూష వర్షైః
ఆనందీ నః పునీయా దరినలిన గదా శంఖపాణిః ముకుందః ||

భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే 
కర్ణావాశాః శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయ మబ్ధిః |
అంతస్థం యస్య విశ్వం సుర నరఖగగో భోగి గంధర్వ దైత్యైః 
చిత్రంరం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి || 

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్ 
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యమ్ 
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథమ్ || 

మేఘ శ్యామం పీత కౌశేయ వాసం 
శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగమ్ |
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం 
విష్ణుం వందే సర్వలోకైక నాథమ్|| 

సశంఖచక్రం సకిరీట కుండలం 
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |
సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం 
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ ||

ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరిః 
ఆసీనమంబుదశ్యామ మాయతాక్ష మలంకృతమ్ |
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసమ్
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే || 

ఓం విశ్వస్మై నమః


1.                ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః |
భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ||
2.               

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రఙ్ఞో‌క్షర ఏవచ ||
3.                యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ||
4.                సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిర్నిధి రవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ||
5.                స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః || 
6.                అప్రమేయో హృషీకేశః పద్మనాభో‌ మరప్రభుః |
విశ్వకర్మా మను స్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ||
7.                అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతః త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ||
8.                ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ||
9.                ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతఙ్ఞః కృతిరాత్మవాన్||
10.             సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ||
11.             అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః ||
12.             వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః |
అమోఘః పుండరీకాక్ష వృషకర్మా వృషాకృతిః ||
13.             రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః |
అమృతః శాశ్వత స్థాణుః వరారోహో మహాతపాః ||
14.             సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||
15.             లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః ||
16.             భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుర్జగదారిజః |

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||
17.             ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ||
18.             వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||
19.             మహాబుద్ధిః మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ||
20.             మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ||
21.             మరీచిః దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ||
22.             అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ||
23.             గురుర్గురుతమో ధామ సత్యస్సత్య పరాక్రమః |
నిమిషో‌నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః ||
24.             అగ్రణీః గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః |
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ||
25.             ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ||
26.             సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వ భుగ్విభుః |
సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః ||
27.             అసంఖ్యేయో‌ ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |
సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ||
28.             వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ||
29.             సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ||
30.             ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఋద్దః స్పష్టాక్షరో మంత్ర చంద్రాంశుర్భాస్కరద్యుతిః ||
31.             అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |
ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః ||
32.             భూతభవ్య భవన్నాథః పవనః పావనో‌ నలః |
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ||
33.             యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః |
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ||
34.             ఇష్టో‌విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ||
35.             అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః |
అపాంనిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః ||
36.             స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః |
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురంధరః ||
37.             అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః |
అనుకూలః శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః ||
38.             పద్మనాభో‌ రవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ |
మహర్ధిః ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ||
39.             అతులః శరభో భీమః సమయఙ్ఞో హవిర్హవిః |
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ||
40.             విక్షరో రోహితో మార్గో హేతు ర్దామోదరః సహః |
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ||
41.             ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః |
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ||
42.             వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ||
43.             రామో విరామో విరజో మార్గోనేయో నయో‌ నయః |
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ||
44.             వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః |

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ||
45.             ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః |
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ||
46.             విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ |
అర్థో‌నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||
47.             అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః ||
48.             యఙ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుంస్సత్రం సతాంగతిః |
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వఙ్ఞో ఙ్ఞానముత్తమమ్ ||
49.             సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ |
మనోహరో జితక్రోధో వీర బాహు ర్విదారణః ||
50.             స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ |
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ||
51.             ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్ క్షరమక్షరమ్|
అవిఙ్ఞాతా సహస్త్రాంశుః విధాతా కృతలక్షణః ||
52.             గభస్తినేమిః సత్వస్థః సింహో భూత మహేశ్వరః |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ||
53.             ఉత్తరో గోపతిర్గోప్తా ఙ్ఞానగమ్యః పురాతనః |
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ||
54.             సోమపో‌మృతపః సోమః పురుజిత్ పురుసత్తమః |
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ||
55.             జీవో వినయితా సాక్షీ ముకుందో మితవిక్రమః |
అంభోనిధిరనంతాత్మా మహో దధిశయోంతకః ||
56.             అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |
ఆనందో‌ నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ||
57.             మహర్షిః కపిలాచార్యః కృతఙ్ఞో మేదినీపతిః |
త్రిపదః త్రిథశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ||
58.             మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ |

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ||
59.             వేధాః స్వాంగో‌ జితః కృష్ణో దృఢః సంకర్షణో‌చ్యుతః |
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ||
60.             భగవాన్ భగహా‌‌ నందీ వనమాలీ హలాయుధః |
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః ||
61.             సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః |
దివస్పృక్సర్వదృగ్వాసో వాచస్పతి రయోనిజః ||
62.             త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |
సన్యాస కృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం||
63.             శుభాంగః శాంతిదః స్రష్ఠా కుముదః కువలేశయః |
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ||
64.             అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాః వరః ||
65.             శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||
66.             స్వక్షః స్వంగః శతానందో నందిః జ్యోతిర్గణేశ్వరః |
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః ||
67.             ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ||
68.             అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
అనిరుద్ధో‌ ప్రతిరథః ప్రద్యుమ్నో ‌మిత విక్రమః ||
69.             కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ||
70.             కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |
అనిర్దేశ్యవపుర్విష్ణుః వీరో‌నంతో ధనంజయః ||
71.             బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మవివర్ధనః |
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మఙ్ఞో బ్రాహ్మణప్రియః ||
72.            

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |
మహాక్రతుర్మహాయజ్వా మహాయఙ్ఞో మహాహవిః ||
73.             స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్య కీర్తిరనామయః ||
74.             మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాః హవిః ||
75.             సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ||
76.             భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో‌ నలః |
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో‌ థాపరాజితః ||
77.             విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ |
అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తిః శతాననః ||
78.             ఏకోనైకః సవః కః కిం యత్తత్పద మనుత్తమమ్ |
లోకబంధుః లోకనాథో మాధవో భక్తవత్సలః ||
79.             సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచలశ్చలః ||
80.             అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్క్ |
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ||
81.             తేజో‌వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాంవరః |
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ||
82.             చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః |
చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్ ||
83.             సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ||
84.             శుభాంగో లోకసారంగః సుతంతుః తంతువర్ధనః |
            ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ||
85.             ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |
            అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ||
86.             సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీ శ్వరేశ్వరః |
            మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ||
87.            

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో‌ నిలః |
            అమృతాశో ‌అమృతవపుః సర్వఙ్ఞః సర్వతోముఖః ||
88.             సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః |
            న్యగ్రోధోదుంబరో ‌శ్వత్థః ఛాణూరాంధ్ర నిషూదనః ||
89.             సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |
            అమూర్తి రనఘో ‌చింత్యో భయకృద్భయనాశనః ||
90.             అణుర్బృహత్ కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |
            అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ||
91.             భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః |
            ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః ||
92.             ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |
            అపరాజితః సర్వసహోనియంతా ‌నియమో‌యమః ||
93.             సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్య ధర్మ పరాయణః |
            అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ||
94.             విహాయ సగతిర్జ్యోతిః సురుచిః హుతభుగ్విభుః |
            రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ||
95.             అనంతో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజో‌ గ్రజః |
            అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠాన మద్భుతః ||
96.             సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |
            స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||
97.             అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాశనః |
            శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ||
98.             అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
            విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః ||
99.             ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |
            వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ||
100.          అనంతరూపో ‌నంతశ్రీః జితమన్యుః భయాపహః |
            చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ||
101.         

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అనాదిః భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
            జననో జనజన్మాదిః భీమో భీమ పరాక్రమః ||
102.          ఆధార నిలయో ‌ధాతా పుష్పహాసః ప్రజాగరః |
            ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ||
103.          ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
            తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః ||
104.          భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |
            యఙ్ఞో యఙ్ఞపతిర్యజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః ||
105.          యఙ్ఞభృత్ యఙ్ఞకృత్ యఙ్ఞీ యఙ్ఞభుక్ యఙ్ఞసాధనః |
            యఙ్ఞాంతకృత్ యఙ్ఞ గుహ్య మన్నమన్నాద ఏవ చ ||
106.          ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |
            దేవకీనందనః స్రష్ఠా క్షితీశః పాపనాశనః ||
107.          శంఖభృన్నందకీ చక్రీ శార్ంగ ధన్వా గదాధరః |
            రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః || "2"
            శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి |
108.          వనమాలీ గదీ శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ |
            శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవో ‌భిరక్షతు || "2"
            శ్రీ వాసుదేవో‌ భిరక్షతు ఓం నమ ఇతి |

ఉత్తర పీఠిక:
1.                ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్ ||
2.                య ఇదం శృణుయాత్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్|
నా శుభం ప్రాప్నుయాత్కించిత్ -సో‌ముత్రేహచ మానవః ||
3.                వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ |
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖ మవాప్నుయాత్ ||
4.                ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మం అర్థార్థీ చార్థ మాప్నుయాత్ |
కామాన వాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ర్పజాః ||
5.               

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
భక్తిమాన్ యః సదోత్థాయ శుచిః సద్గతమానసః |
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ||
6.                యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ |
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్య నుత్తమమ్ ||
7.                న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ||
8.                రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ |
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః ||
9.                దుర్గాణ్య తితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ |
స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః ||
10.             వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః |
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ||
11.             న వాసుదేవ భక్తానా మశుభం విద్యతే క్వచిత్ |
జన్మ మృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే ||
12.             ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః |
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః ||
13.             న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః |
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ||
14.             ద్వౌః స చంద్రార్క నక్షత్రా ఖందిశో భూర్మహోదధిః |
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ||
15.             ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసమ్ |
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్ ||
16.             ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః |
వాసుదేవాత్మ కాన్యాహుః, క్షేత్రం క్షేత్రఙ్ఞ ఏవచ ||
17.             సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్పతే |
ఆచర ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ||
18.             ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః |
జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ||
19.             యోగోఙ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాది కర్మచ |
వేదాః శాస్త్రాణి విఙ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్ ||
20.            

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఏకో విష్ణు ర్మహద్భూతం పృథగ్భూతా న్యనేకశః |
త్రీన్ లోకాన్ వ్యాప్యభూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ||
21.            
ఇమం స్తవం భగవతో విష్ణో ర్వ్యాసేన కీర్తితమ్ |
పఠేద్య ఇచ్చేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖానిచ ||
22.             విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్|
భజంతి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవమ్ ||
నతే యాంతి పరాభవమ్ ఓం నమ ఇతి |
23.             అర్జున ఉవాచ:
పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ |
భక్తానా మనురక్తానాం త్రాతాభవ జనార్దన ||
24.             శ్రీభగవాన్ ఉవాచ:
యో మాం నామ సహస్రేణ స్తోతు మిచ్ఛతి పాండవ |
సో‌ హమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ||
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి |
25.             వ్యాస ఉవాచ:
వాసనా ద్వాసుదేవస్య వాసితం తే జగత్రయం |
సర్వభూత నివాసో‌సి వాసుదేవ నమోస్తుతే ||
శ్రీ వాసుదేవ నమోస్తుతే ఓం నమ ఇతి |
26.             పార్వత్యువాచ:
కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం |
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో ||
27.             ఈశ్వర ఉవాచ:
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||"3"
శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి |
28.             బ్రహ్మోవాచ:
నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ||
శ్రీ సహస్ర కోటీ యుగధారిణే ఓం నమ ఇతి |
29.            

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
సంజయ ఉవాచ:
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ ||
30.             శ్రీ భగవాన్ ఉవాచ:
అనన్యాశ్చింత యంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్||
31.             పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||
32.             ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి ||
33.             యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
తథ్సర్వం క్షమ్యతామ్ దేవ నారాయణ నమో‌స్తుతే |
34.             కాయేన వాచా మనసేంద్రి యైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
శ్రీ మన్నారాయణాయేతి సమర్పయామి |

ఓం తత్ సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

ఇతి శ్రీ మహాభారతే శతసహసిక్రాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ యుదిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్రం నామ చతుః పంచాశ దధిక ద్విశత తమోధ్యాయః

లక్ష్మీ అష్టోత్తరం
1. ఓం ప్రకృత్యై నమః
2. ఓం విద్యాయై నమః
3. ఓం వికృత్యై నమః
4. ఓం సర్వభూతహితప్రదాయై నమః
5. ఓం శ్రద్ధాయై నమః
6. ఓం విభూత్యై నమః
7. ఓం సురభ్యై నమః
8. ఓం పరమాత్మికాయై నమః
9. ఓం వాచే నమః
10. ఓం పద్మాలయాయై నమః
11. ఓం పద్మా నమః
12. ఓం శుచయే నమః

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
13. ఓం స్వాహాయై నమః
14. ఓం స్వధాయై నమః
15. ఓం సుధాయై నమః
16. ఓం ధన్యాయై నమః
17. ఓం హిరణ్యయై నమః
18. ఓం లక్ష్మ్యై నమః
19. ఓం నిత్యపుష్టాయై నమః
20. ఓం విభావర్యై నమః
21. ఓం ఆదిత్యై నమః
22. ఓం దిత్యై నమః
23. ఓం దీప్తాయై నమః
24. ఓం వసుధాయై నమః
25. ఓం వసుధారిణ్యై నమః
26. ఓం కమలాయై నమః
27. ఓం కాంతాయై నమః
28. ఓం కామాక్ష్యై నమః
29. ఓం క్రోధసంభవాయై నమః
30. ఓం అనుగ్రహప్రదాయై నమః
31. ఓం బుద్ధయే నమః
32. ఓం అనఘాయై నమః
33. ఓం హరివల్లభాయై నమః
34. ఓం అశోకాయై నమః
35. ఓం అమృతాయై నమః
36. ఓం దీప్తాయై నమః
37. ఓం లోకశోక వినాశిన్యై నమః
38. ఓం ధర్మనిలయాయై నమః
39. ఓం కరుణాలోకమాత్రే నమః
40. ఓం పద్మప్రియాయై నమః
41. ఓం పద్మహస్తాయై నమః
42. ఓం పద్మాక్ష్యై నమః

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
43. ఓం పద్మోద్భవాయై నమః
44. ఓం పద్మముఖ్యై నమః
45. ఓం పద్మనాభప్రియాయై నమః
46. ఓం రమాయై నమః
47. ఓం పద్మమాలాధరాయై నమః
48. ఓం దేవ్యె నమః
49. ఓం పద్మిన్యై నమః
50. ఓం పద్మగంధిన్యై నమః
51. ఓం పుణ్యగంధాయై నమః
52. ఓం సుప్రసన్నాయై నమః
53. ఓం ప్రసాదాభిముఖ్యై నమః
54. ఓం ప్రభాయై నమః
55. ఓం చంద్రవదనాయై నమః
56. ఓం చంద్రాయై నమః
57. ఓం చంద్రసోదర్యై నమః
58. ఓం చతుర్భుజాయై నమః
59. ఓం చంద్రరూపాయై నమః
60. ఓం ఇందిరాయై నమః
61. ఓం ఇందుశీతలాయై నమః
62. ఓం అహ్లాదజనన్యై నమః
63. ఓం పుష్ట్యై నమః
64. ఓం శివాయై నమః
65. ఓం శివకర్యై నమః
66. ఓం సత్యై నమః
67. ఓం విమలాయై నమః
68. ఓం విశ్వజనన్యై నమః
69. ఓం తుష్టయే నమః
70. ఓం దారిద్ర్యనాశిన్యై నమః
71. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
72. ఓం శాంతా నమః
73. ఓం శుక్లమాల్యాంబరాయై నమః
74. ఓం శ్రియై నమః

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
75. ఓం భాస్కర్యై నమః
76. ఓం బిల్వనిలయాయై నమః
77. ఓం వరారోహాయై నమః
78. ఓం యశస్విన్యై నమః
79. ఓం వసుంధరాయై నమః
80. ఓం ఉదారాంగాయై నమః
81. ఓం హారిణ్యై నమః
82. ఓం హేమమాలిన్యై నమః
83. ఓం ధనధాన్యకారిన్యై నమః
84. ఓం సిద్ధయే నమః
85. ఓం సౌమ్యాయై నమః
86. ఓం శుభప్రదాయై నమః
87. ఓం నృపావేషయుతానందా నమః
88. ఓం వరలక్ష్మ్యై నమః
89. ఓం వసుప్రదా నమః
90. ఓం శుభా నమః
91. ఓం హిరణ్య ప్రాకారా నమః
92. ఓం సముద్రతనయా నమః
93. ఓం జయా నమః
94. ఓం మంగళా నమః
95. ఓం దేవ్యై నమః
96. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
97. ఓం విష్ణుపత్న్యై నమః
98. ఓం ప్రసన్నాక్ష్యై నమః
99. ఓం నారాయణ సమాశ్రితాయై నమః
100. ఓం క్షీరసాగర కన్యకా నమః
101. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
102. ఓం లోకమాత్రే నమః
103. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
104. ఓం నవదుర్గా నమః
105. ఓం మాహాకాళ్యై నమః
106. ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికా నమః

  కిష్కింధ కాండ ఇరవై ఎనిమిదవ రోజు ప్రవచనము
 
107. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
108. ఓం భువనేశ్వర్యై నమః


మంగళా శాసన పరైః ....


No comments: