నిన్నటి రోజు కార్యక్రమం
పూర్తయ్యేసరికి సీతమ్మతల్లి హనుమని శుభప్రదంగా మంగళప్రదంగా తన ప్రయాణాన్ని ప్రారంభం
చేయవలసిందిగా ఆశీర్వదించి పంపించినటువంటి సందర్భందగ్గర పూర్తిచేసి ఉన్నాను. ఆయన
అక్కడ సీతమ్మతల్లి యొక్క దర్శనం పూర్తైన తరువాత ఉత్తర దిక్కుగా తన ప్రయాణాన్ని
ప్రారంభం చేస్తున్నారు. ప్రత్యేకించి రామాయణం సుందర కాండలో ఒక విచిత్రమైన
విన్నూత్నమైన విషయమొకటి మీకు జ్యోతకమౌతుంది. రెండు ప్రధానమైనటువంటి ఆభరణములను హనుమ
తీసుకెళ్తారు ఆయనా ఋష్యమూక పర్వతం నుంచి బయలుదేరి సీతమ్మ ఉన్నటువంటి లంకా
పట్టణాన్ని చేరేంతవరకు రామ చంద్ర మూర్తి యొక్క ఉంగరాన్ని తీసుకెళ్తారు, లంకా
పట్టణంలో సీతమ్మ తల్లి దర్శన అయింతరువాత అక్కడ్నుంచి తిరిగి మళ్ళీ రామ చంద్ర
మూర్తి దగ్గరకి వచ్చే పర్యంతమూ సీతమ్మ తల్లి యొక్క కేశభూషణాన్ని పట్టుకొస్తారు.
వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిన ఆభరణం రామ చంద్ర మూర్తి ఉంగరం వచ్చేటప్పుడు
పట్టుకొచ్చిన ఆభరణము సీతమ్మ తల్లి యొక్క కేశభూషణము. ఇందులో విచిత్రమేమిటంటే... ఈ
ఆభరణాల్ని పట్టీ కథలో కొంత మార్పు వస్తూంటుంది. రామ చంద్రమూర్తి అన్నీ
విడిచిపెట్టి కదా బయలుదేరారు అన్నీ దానం చేసేసి కదా బయలుదేరారు మరి ఈ
ఉంగరమెక్కడిది దానిమీద కొంత తర్జన భర్జన పెద్దలు దాన్ని ఏమని నిర్ణయం చేశారంటే ఆయన
యౌవ్వరాజ్య పట్టాభిషేకమునకు సిద్ధపడినవాడు పెద్దవాడు కాబట్టి ఆయనకు రాజ్యాధికారము
పోయినవాడు కాదు తిరిగివెళ్ళి పట్టాభిషేకం చేసుకుంటాడు రాముడు కాబట్టి రామ
నామాంకితమైన ఉంగరమూ అంటే అది రాజ ముద్రిక కాబట్టి అది ఆయన వేలుకే ఉంటుంది.
అలా వేలుకు ఉండేటటువంటి ఉంగరాన్ని
పంపించడమూ అంటే తానే రావడము పైగా... పురుషుడికి ఉంగరం అనేటటువంటిది ఉపనయనం తరువాత
తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఉంగరం లేకుండా గాని ఆచమనం చేస్తే... నెత్తుటిని ఆచమనం
చేయడంతో సమానం. ఒకవేళ చేతికి ఉంగరం లేకపోతే దర్భ ముడి వేసుకోవాలి వేసుకుని ఆచమనం
చెయ్యాలి ఆయన నిత్యాగ్ని హోత్రీకుడు నిత్యము అగ్నిహోత్రం చేసేటటువంటివాడు నిత్యం
నైమిక్తిక కర్మలను ఆచరించేవాడు. కాబట్టి రామ నామాంకితమైన ఉంగరం ఆయన చేతికి ఏదుందో
ఆ ఉంగరాన్నే తీసి హనుమకి ఇచ్చి తన ఆభిజ్ఞానముగా సీతమ్మకి పంపించారు ప్రత్యయాఽర్థం
తవాఽఽనీతం తేన దత్తం మహాత్మనా ! సమాఽఽశ్వసిహి భద్రం తే క్షిణ దుఃఖ ఫలా హ్యాఽసి !! అంటారు
అందుకే, సీతమ్మ తల్లి దర్శనం అయ్యేంతవరకు రామ చంద్ర మూర్తి ఉంగరం దగ్గర ఉన్నటికీ
కూడా... ఒదిగి ఒదిగి భయంగా పిల్లి పిల్లంత స్వరూపంతో సీత్మ తల్లిని అన్వేషిస్తారు,
ఒక్కసారి సీతమ్మతల్లి దర్శనమైపోయిన తరువాత
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
హనుమ యొక్క పరిస్థితి వేరు. మీరు చూడండీ నిన్నటి ఉపన్యాసంలో
ఆయనా అప్పటి వరకూ పిల్లి పిల్లలా ఉన్నారు, సీతమ్మ తల్లికి తన యొక్క నిజస్వరూపాన్ని
చూపించారు. మేరు మన్దర సంకాశో బభౌ దీప్తాఽనల ప్రభః ! అగ్రతో వ్యవతస్థే చ సీతాయా
వానరర్షభః !! సుందర కాండలో సీతమ్మ తల్లి దర్శనంచేత అనుగ్రహింపబడినవారు హనుమా,
ఆయనా ఆత్మ స్వరూపమును అనుభవములోకి తెచ్చుకున్నవారు కొద్దిగా అర్థమయ్యే మాటలో అనాలీ
అంటే ఆత్మ దర్శనమైనటువంటి యోగి కాబట్టి ఇప్పుడు యోగి యొక్క పరిస్థితి ఎలా
ఉంటుందంటే అద్వైత స్థితిని పొందివుంటాడు. అద్వైత స్థితి అంటే “రెండు లేవన్న భావన
యందు నిలబడి” ఉంటాడు.
ఉన్నది ఒక్కటే పదార్థము శంకర
భగవత్పాదులు దేన్ని ప్రచారం చేశారో అటువంటి అద్వైత స్థితి, ఈ అద్వైత స్థితిని
చేరుకున్న యోగికి నిర్భయత్వం ఉంటుంది, ఆ నిర్భయత్వమును పొందడం ఒకెత్తు
నిర్భయత్వముతో పాటుగా ఆయన పరాక్రమును ఆవిష్కరించాలనేటటువంటి ఆలోచనవైపుకి
దృష్టికోణం మరల్చడానికి కారణం శాక్తేయమైనటువంటి ఆభరణం ఆయన చేతిలోకి వచ్చింది
ఇప్పుడు అమ్మవారి ఆభరణమది, అమ్మవారిని శక్తి స్వరూపంగా చెప్తాం శక్తీ ఎప్పుడూ
కదులుతుంది కదిలితే శక్తి, కదలికలు ఆగిపోతే శక్తి కాదు అందుకే శివుడు అంటే తనలో
తాను రమిస్తుంటాడు ఆత్మానందం. శక్తి ఇక అలా ఆగిపోతే శక్తి అనరు. మైకు పనిచేయడం మానేసిందనుకోండి
కరెంటుపోయిందంటాం, ఫ్యాను పనిచేయకపోతే కరెంటుపోయిందంటాం. ఒక ప్రవాహం ప్రవహించకపోతే
ఆ కాలవ ఎండిపోయిందంటాం. ఎప్పుడూ
సంతతమూ కదులుతూ ఉండేదేదో దానికి “శక్తి” అని పేరు కదలికచేత ప్రయోజన శక్తి. కదలకుండా
తనలో తాను ఆనందించి రమిస్తే శివుడు.
ఇప్పుడూ కదిలేటటువంటి స్వభావమును బాగా ఉద్దేపింపజేయగలిగినటువంటి ఆభరణం ఆ
ఆభరణం. ఎందుకంటే అది అమ్మవారి ఆభరణం. ఆ ఆభరణాన్ని చేత పుచ్చుకున్నప్పుడు దాని
ప్రభావము హనుమమీద ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ఆయనా ఆలోచనా క్రమంలో ఒక మార్పు
వచ్చింది. ఆయన అన్నారూ త్రీన్ ఉపాయాన్ అతిక్రమ్య చతుర్థ ఇహ విద్యతే అన్నారు
అల్ప శేషమ్ ఇదం కార్యం దృష్టేయ మఽసితేక్షణా నేను సీతమ్మ తల్లి యొక్క
“దర్శనాన్ని పొందాను”, దర్శనాన్ని చేశాను అనరు, ఎందుకంటే ఆయన ఆయన దర్శనం చేశారా
అమ్మవారు దర్శనం ఇచ్చారా..! ఆయన దర్శనం చేస్తే చతు రంఽగుళ మాత్రోఽపి నాఽవకాశః స
విద్యతే ! రావణాఽన్తః పురే తస్మిన్ యం కపి ర్న జగామ సః !! అని బాధ పడవలసినవసరం
ఏముంది తాను వెతికినంత సేపు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదు కానీ నమోఽస్తు రామాయ
సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాఽఽత్మజాయై అని నమస్కారం చేసిన తరువాత తల్లి
దర్శనమించచింది. కాబట్టి త్రీన్ ఉపాయాన్ అతిక్రమ్య చతుర్థ ఇహ విద్యతే
దేనికీ అంటే అల్ప శేషమ్ ఇదం కార్యం దృష్టేయ మఽసితేక్షణా ఏది చాలా ప్రధాన
కార్యమో అది పూర్తైపోయింది. ఏమిటి ప్రధానకార్యము సీతమ్మతల్లిని దర్శనచేయడం సీతమ్మ
తల్లి దర్శనమైపోయింది ఇప్పుడు ఇక మిగిలిందేమిటీ అల్ప శేషమ్ ఇదం కార్యం ఒక
చిన్నపనొకటి ఉండిపోయింది, ఏమిటా చిన్నపని రావణ దర్శనం ఇప్పుడు రావణాసురున్న
దర్శించాలి, దర్శించడమంటే ఆయన్ని ఒకసారి చూడాలి, ఎందుకు చూడ్డం ఆయనకో నాలుగు
మంచిమాటలు చెప్పాలి ఎందుకు చెప్పడం ఆయన వినడని తెలుసుగా...
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
దీని వెనుకా చాలా రహస్యములను దాచి ఉంచారు ఎందుకు చెప్పడమూ
అంటే రామావతారానికి ఉన్నటువంటి
గొప్ప లక్షణమేమిటీ అంటే కేవలం మాట వినలేదనో తప్పు చేశాడనో చంపేయడం రామావతారం యొక్క
ప్రయోజనం కాదు. మారడానికి చాలా అవకాశం ఇస్తాడు అందుకే నరుడిగా అవతరించి
ప్రవర్తించినటువంటి అవతారం కేవలం తప్పు చేశాడు శిక్షవేశాడు అని రాముని ఉద్దేశ్యం
కాదు మారడానికి ఆయన చాలా అవకాశం ఇస్తాడు. అలా మారే అవకాశం లేకపోతే అవతలి వ్యక్తి
మారకపోతే ఈశ్వరుడిచ్చిన ఉపాధితో కేవలం అధర్మమే ఆచరిస్తే దానివల్ల లోకంలో ధర్మమునకు
వైక్లవ్యం కలగడం తప్పా అన్యథా ప్రయోజనం లేకపోతే. అప్పుడు ఆ శరీరాన్ని తీసేయడం వల్ల ప్రయోజనం
ఉంటుందని అనుకున్ననాడు మాత్రమే సంహార క్రియ చేస్తాడు అది ఎలా ఉంటుందంటే,
పుండెక్కడ పుడుతుంది మన ఒంట్లోనే పుడుతుంద, పుండులో ఉన్న మాంసం ఎక్కడిది మన
ఒంట్లోదే పుండులో ఉన్న నెత్తురెక్కడిది మన ఒంట్లోదే, పుండు ఈ శరీరంలోనే పుట్టి ఈ
శరీరంలోనే పెరుగుతున్నా పుండు ఈ శరీరంలో అంతర్భాగం కాబట్టి దాన్ని ఉంచుకుందామని
ఎవరైనా అనుకుంటారా..! దాన్ని తీసేద్దామనుకుంటాడు ఆ పుండు మానలేదనుకోండి వైద్యుడు
శస్త్ర చికిత్స చేసి తీసేస్తాడు. ఇప్పుడు కత్తి పట్టుకుని చెక్కేస్తే వైద్యుడు ఆయన
హింస చేశాడని మీరు అంటారా అనరు ఆ పుండు తీసేయడం వల్లా ఆయన శరీరం రక్షింపబడుతుంది.
ఈ జగత్తంతా కూడా శరీరమే ఈశ్వరునికి అటువంటి శరీరాన్ని పాడు చేసేటటువంటి
పరిస్థితిలో ఉన్నవాళ్ళు రాక్షశోద్రేకము కలిగినటువంటివాళ్ళు, కాబట్టి ఇప్పుడు ఆ
పుండు తీసేయడం ఎటువంటిదో రాక్షస సంహారం ఇక తప్పని సరి పరిస్థితిల్లో చెయ్యడం కూడా
అటువంటిదే. కాబట్టి ఇప్పుడు రామ హృదయం తెలియడమంటే ఏమిటీ రామ కింకరుడంటే ఏమిటీ ఇదీ
నిన్న ఆవిడ చేసిన సౌందర్యోపాసన, ఏది చెప్పు రాముడంటే ఏమిటో నీకేది అర్థమయ్యిందో
చెప్పు క్వ తే రామేణ సంసర్గః కథం జానాఽసి లక్ష్మణమ్ ! వానరాణాం నరాణాం చ కథమ్
అసీత్ సమాగమః !! యాని రామ స్య లింగాని లక్ష్మణ స్య చ వానర !!! మీరు నరులు
వానరులు ఎలా కలుసుకున్నారు కథమ్ ఆసీత్ సమాగమః యాని రామ స్య లింగాని లక్ష్మణ స్య
చ వానర రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడెలా ఉంటాడు చెప్పు అంటే ఆయన దేనితో మొదలు
పెట్టాడు రామః కమల పత్రాక్షః ఆయన కమల పత్రము వంటి కన్ను కలిగినవాడు సర్వ
భూత హితే రతః అన్ని భూతములు ఆయన్ని చూసి సంతోషిస్తాయి. అంత ఉపాస చేసినటువంటి వ్యక్తికి
ఆయన లక్షణాలే రావద్దూ ఆయన లక్షణాలే వస్తే రాముడు ఎలా ప్రవర్తించాడో అలా
ప్రవర్తించాడు. ఇప్పుడు రాముడు ఎలా అవతలివార్ని మార్చే ప్రయత్నం చేస్తాడో
అలా తాను తన కర్తవ్యాన్ని నిర్వహించాలి తన కర్తవ్యం నిర్వహించిన తరువాత వినలేదు
మరణానికి సిద్ధపడ్డాడని గుర్తు.
సీతమ్మ నిన్ననే చెప్పింది ʻఅనలాʼ నాతో చంప్పింది తోడబుట్టిన విభీషణుడే చెప్పినా ఆయన మారలేదు, కాబట్టి
మారుతాడని నాకు నమ్మకంలేదు మీరు సుందర కాండలో శ్రీరామాయణంలో ఇది బాగా గమనించవలసి
ఉంటుంది. రావణుడు
పాడైపోవడానికి కారణమేదీ? అని మీరు అడిగారనుకోండి ఒక్క కారణానికే రావణుడు
చచ్చిపోయాడు. ఒకరు చెప్పినదివినడు, ఎంతమంది చెప్పారంటే రావణుడికి ఒక్కటే
మాట చెప్పారు సీతమ్మనిచ్చేయ్ ఇది ఎక్కడ మొదలైంది కలత్రాణి చ సౌమ్యాని
మిత్రవర్గం తథైవ చ ! యదీచ్ఛసి చిరం భోక్తం మా కృథా రామవిప్రియమ్ !! అరణ్యకాండలో
మొదలైంది. అరణ్య కాండలో మారీచుడు మొదలు పెట్టాడు. పాడైపోతావు నా మాటవిను సులభా
పురుషా రాజన్ సతతం ప్రియవాదినః ! అప్రియస్య చ పథస్య వక్తా శ్రోతా చ దుర్లభః !!
మంచి చెప్పేవాడు ఉంటాడు వినేవాడు
ఉండడు, మంచి వినేవాడు ఉంటాడు చెప్పేవాడు ఉండడు. మంచి చెప్పెవాడు మంచి
వినేవాడు కూడా దొరికితే అది క్షేత్రమయ్యా పొగిడేవాళ్ళు దొరుకుతారు యదార్థం
మాట్లాడేవాడు దొరకడు రావణా నా మాట విను అని ఆనాడు మొదలు పెట్టాడు. మారీచుడి మాట
వినకపోవడంతో మాట మొదలైనటువంటి రావణుని యొక్క మరణ ప్రస్థానం చిట్ట చివర హనుమ
చెప్పినా వినలేదు సుగ్రీవుడు చెప్పినా వినలేదు రాముడే చెప్పినా వినలేదు సుఖ
చారుణులు చెప్పినా వినలేదు మండోధరి చెప్పినా వినలేదు తల్లి కైకసి చెప్పినా వినలేదు
ఆకరికి మంత్రులు చెప్పినా వినలేదు వృద్ధ భాంధంవులు చెప్పినా వినలేదు చిట్ట చివరికి
ఇంత విననివాన్ని ఇంకేం చెయ్యాలి ఆ శరీరాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో
మార్గంలేదు.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
అందుకే సంహార
ప్రక్రియని ఎన్నడూ కూడా ఈశ్వరుని యొక్క క్రౌర్యముగా చూడకూడదు అని చెప్తూంది
శాస్త్రం, సంహార
ప్రక్రియ ఎన్నడూ ఈశ్వరుని యొక్క వ్యగ్రతతోకూడిన చేష్టితము కాదు తప్పని సరి
పరిస్థితితుల్లో చేస్తాడు. అయితే మరి మీరు నన్నో ప్రశ్న అడగవచ్చు అయితే మరి
పుణ్యాత్ముడు శరీరాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు అని మీరు నన్ను అడగచ్చు ఎంత
పుణ్యాత్ముడైనా ఎంత శాస్త్రం తెలిసున్నవాడైనా ఎంత అనుష్టానం తెలిసున్నవాడైనా ఇంక ఈ
శరీరము సహకరించని స్థితి ఒకటి వస్తూంది కాలంలో పరిణామ శీలములు శరీరములు ఇది జజ్జరీ
భూతమైపోతూంది, దీనికి వృద్ధాప్యమొచ్చేస్తుంది ఆచమనం చేయవే చేయదది ఈ చేతి ఉద్ధరిని
ఇలా పట్టుకోవే అంటే ఇలా అంటూంది. ఈ చేతిని ఇలా పట్టవే అంటే ఇలా అంటూంది. ఈ
కళ్ళజోడు పెట్టుకున్నా ʻపʼ ఏదో తెలియదు ʻవʼ ఏదో తెలియదు ʻనʼ యో తెలియదు ఆయన
ఒకటి చెప్తాడు ఈయ్యనకి ఒకటిలా వినపడుతుంది. అప్పటి వరకు అన్నీ ధారణలో ఉండేవి.
ఇప్పుడు ఓం కేశవాయ స్వాహాః, తరువాత నాయరాయణాయ స్వాహాః జ్ఞాపకం రాదు. ముక్కుక్కి
వాసన తెలియదు, పరాకు పడతాడు ఒక పదార్థానికి బదులు ఒక పదార్థం ముట్టుకుంటాడు
ఇప్పుడు ఆయనా ఇంకా వైభవాన్ని పొందాలీ అంటే ఈశ్వరుడు ఆయనకి ఒక కొత్త శరీరాన్ని
ఇవ్వాలి. పుణ్యం చేసుకున్నవాడు పాడైపోయేదేముండదు, ఈ జీవున్ని విడిపించి మళ్ళీ ఓ
పండితోత్తముడు, పండితోత్తముడు అంటే నా ఉద్దేశ్యంలో బాగా పద్యాలు చెప్పడమూన్నూ బాగా
ఉపన్యాసాలు చెప్పడమూన్నూ కాదు. “పండాః” అంటే జ్ఞానము.
ఈశ్వరునియందు చెక్కుచెదరనటువంటి భక్తిప్రపత్తులు
కలిగినటువంటివాడై అంటే పోతనగారి లాంటి మహానుభావుడుకి సహజ పండితుడని పేరు అలా
అనుష్టించినటువంటివాడి ధర్మము తెలుసున్నటువంటివాడి కడుపున పుడుతాడు. పుడితే
వచ్చేటటువంటి ప్రయోజనమేమిటీ ఇంక కొత్తగా ఆయనేం వెతుక్కోక్కరలేదు గురువుగార్ని
తండ్రి సహజంగా గురువు కదాండీ, గాయిత్రీ ఉపదేశం చేస్తాడు అటువంటి తండ్రి ప్రాజ్ఞుడై
కంటి ముందు తిరుగుతూంటే ఆయన అన్నిటినీ చేస్తూంటే కొడుకు అందుకుంటాడు ఆ జన్మలో తరిస్తాడు
కాబట్టి ఇప్పుడు పుణ్యాత్ముడి
శరీరం మారినా ఈశ్వరానుగ్రహమే పాపాత్ముడి యొక్క శరీరాన్ని ఈశ్వరుడు పడగొట్టినా ఈశ్వరానుగ్రహమే
తప్పా లయమన్న మాటని సంహార
ప్రక్రియని ఎన్నడూ కూడా తమోగుణ భూయిష్టమైన చేష్టితమన్న ప్రక్రియగా ఎప్పుడూ
చెప్పకూడదు. ఆలా గుణమన్నదానికి కూడా ఈశ్వరుడు వశుడైపోయి ఆయన కూడా ఎవర్నో
బాధపెట్టడానికి ఏదో చేస్తుంటాడూ అని మీరు అన్నారనుకోండి అప్పుడు మీరు ఈశ్వరుని
యందు కూడా ద్వేశమును ఆరోపించినవారు అవౌతారు. మన బుద్ధి పాడౌతున్నది కాకుండా లేని
వస్తువు నందు ఆరోపించి దానివల్ల పొందేదేముంటుంది కాబట్టి మీరు యదార్థాన్ని
యదార్థంగా అర్థం చేసుకోవాలి.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇప్పుడు
రావణుడు పాడైపోవడానికి
కారణం ఒక్కటే ఎవరు చెప్పినా వినడు మహా భారతంలో దుర్యోధనుడు కూడా ఇదే
చెప్తాడు మునులు వచ్చి చెప్తే అన్నీ వింటాడు ఈయ్యనంటాడు నా ప్రారబ్దమేమిటో నేను
అన్నీ వింటాను కానీ మీరు చెప్పినవేవీ నాకు చెయ్యాలనిపించదు అంటాడు. పైగా కష్టపడి
వచ్చినటువంటి గురువుగారి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా దరువేసుకుంటూ వింటాడు చాలా
నిర్లక్ష్యంగా, కోపమొచ్చిన మహర్షి అన్నారు నీ తొడలు విరిగిపోతాయి యుద్ధ భూమిలో అన్నారు.
ఒక గురువూ మాట్లాడటం
త్యాగమండీ భగవాన్ రమణులని కొంతమంది వెళ్ళి అడిగారు మీరు ఎక్కడికీ వెళ్ళరు
అరుణాచలం కొండమీద కూర్చుంటారు, మీరు మాట్లాడుతారని నమ్మకం కడా ఉండదు, మౌనమే మీ
స్వరూపము మీరు ఎప్పుడైనా నోరు విప్పుతారో ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పుతారు
మాట్లాడుతారు, మీరు ఒక్కసారి నోరువిప్పిమాట్లాడితే నెమలి నాట్యం చేసి కంటివెంట
విడిచిపెట్టబడినటువంటి బాష్పధారని ఆడనెమలి గ్రహించి గర్భం ధరించి నట్లుగా ఎదురుచూడాలి
నీ మాటకోసం, ఆ మాట మీరు మాట్లాడినప్పుడు మేము ఉండచ్చు ఉండకపోవచ్చు ఏమిటి ఉపయోగం
మీరు ఉండడంవల్లా అని ఆడిగారు. ఎవరికీ మీరేం చెప్పరుగదా ఏమిటి ఉపయోగమూ అని అడిగారు
రమణులు కోపగించలేదు ఆయన అన్నారూ గురువు శరీరంలో ఉండడం శిష్యుడికి ఉపయోగం ఎందుకంటే
గురువుకి తెలుసు తాను శరీరం కాదని గురువు శరీరాన్ని విడిచిపెట్టేయడానికి సిద్దంగా
ఉంటాడు. ఎందుకు విడిచి పెట్టేస్తాడు అంటే తను తొడుక్కున్న చోక్కా. ఈ లాల్చీ ఉంది ఈ
లాల్చితో నా ప్రాణం పోయేవరకు ఉంటానా ఉపన్యాసమై ఇంటికెళ్ళగానే లాల్చి విప్పి అవతల
పాడేస్తాను స్నానం చేస్తాను దీనిమీద నాకు వ్యామోహమేముంటుంది. జ్ఞానికి శరీరం మీద
కూడా అంతే తక్కువ వ్యామోహం ఉంటుంది. కాబట్టి ఆయనకి శరీరం మీద వ్యామోహం లేదు కానీ లేదని శరీరాన్ని తనంతతాను వదల
కూడదు. ఆత్మహత్య మహాపాతకము ఉన్నన్నాళ్ళు ఉంటుంది, ఊడిపోతే ఊడిపోతుంది.
కాబట్టి దాన్ని అలా చూస్తూ ఉంటాడు. కాని ఆయన అలా శరీరంలో ఉంటే ఎవరికి ఉపయోగం
శిష్యులకు ఉపయోగం ఏమిటి ఉపయోగం. ఎప్పుడోప్పడు మాట్లాడుతాడు ఒక్కమాట మాట్లాడుతారు
చాలు ఆ ఒక్కమాట జీవితానికి ఒక కొత్త దిశా నిర్దేశాన్ని చేస్తుంది.
ఒక కొత్త స్థితిని ఆవిష్కరిస్తుంది అది ఎంత
చమత్కారంగా ఉంటుందంటే గురవు మాట్లాడేటటువంటి మాటలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి,
నీతో నేను ఒక మాట చెప్పాలి అంటే రమణులకి శిష్యులన్నవారు ఎవరూ లేరు యదార్థానికి
అందరికన్నా ముందొచ్చినవాళ్లు కొంతమంది తరువాతి కాలంలో చేరినవారు కొంతమంది ఉన్నారు.
ఆయనా మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక్క గంట విశ్రమంచి మళ్ళీ వచ్చేవారు, అలా
వచ్చేలోపలా వీళ్ళు సీనియర్సు జూనియర్సు అని దెబ్బలాడటం మొదలు పెట్టారు మేం
ముందొచ్చినవాళ్ళం మేము వెనకొచ్చినవాళ్ళమని. ఒక రోజున ఇద్దరి మధ్య గొడవ పెరిగి
రెండు గుంపులకీ రమణులు మధ్యాహ్న భోజన విశ్రాంతి తీసుకున్న తరువాత వచ్చి కూర్చున్న
తరువాత మనం ఈ గొడవ చెప్పుకుందామనుకున్నారు. ఆయనకు ఎందుకు తెలియదు సర్వజ్ఞుడు ఆయన
లోపలికి వస్తున్నారు, ఆశ్రమం కట్టినప్పుడ్నుంచి కూడా ఒక కుక్క ఉండేది ఆ తరువాత
కాలంలో ఇంకొక కుక్క కూడా లెపలికి వస్తూంది. కొత్త కుక్క వస్తే పాత కుక్క
ఊరుకుంటుందా... భౌ... అని కలిబడి ఇది పరిగెత్తింది ఆయన గుమ్మందాక వచ్చారు ఈ కుక్క
అక్కడ పడుకున్నది కొత్త కుక్క వస్తున్నదాన్ని తరమడానికి పరుగెత్తింది. ఆయన తన
రెండు బృందాలుగా నిల్చున్నటువంటి తన
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
అంతేవాసుల వంక చూసీ
అన్నారూ... ఆశ్రమంలోనే ఉన్నా నాతోనే ఉన్నా అదేం నేర్చుకోలేదు కుక్కకదా అందుకనీ
కలియబడుతంది. పాత కుక్కా కొత్త కుక్కాని భేదాలుంటాయి అది కుక్క కాబట్టి అని
లోపలికెళ్ళిపోయాడు అంతే. ఇంక ఆతరువాత ఎప్పుడూ గొడవల్లేవు, జ్ఞానిమాట అలా ఉంటుంది.
ఒక్క గురువు మాట అందుకే ఆయన అంటూండేవారు “గురువు మాట సింహము యొక్క గర్జన” మిగిలినవారి
మాటలు జంతుల యొక్క అరుపులు.
కాకి అరుస్తూంది ఏమిటి దానివల్ల ప్రయోజనం ఓ
పిల్లి అరుస్తూంటుంది కుక్క అరూస్తూంటుంది ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు, ఒక్క
సింహం గర్జించిందనుకోండి అంతే అన్ని జంతువులు వెళ్ళిపోతాయి ఏ జంతువూ ఇక నిలబడదు గురువుగారి మాట నీలో ఉన్నటువంటి
సమస్తమైన శత్రువర్గాన్ని, శత్రువర్గమంటే బాహ్య శత్రువులు కాదు అంతః శత్రువులు
పారిపోయేట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞకు పూని ఉంటుంది. కనుకా ఏ స్థాయివారు
చెప్పినా ఎవరు చెప్పినా వినకపోవడం పది తలకాయలున్నా నిలబెట్టలేరు, ఎంత తపస్సున్నా
నిలబెట్టలేరు సాక్ష్యాత్తు పరమేశ్వర అనుగ్రహమే ఉన్నా నిలబెట్టలేరు. కాబట్టి వినడం
తెలియదా తెలుసు మరి చెప్పే ప్రయత్నమెందుకూ తన కర్తవ్యం నేను మీతో మొదటి నుంచి మనవి
చేసేది ఇదే “కర్తవ్యం” అక్కడికి కట్టుబడుతారు, తను చెయ్యాలి చేస్తారు ఫలితం
వాళ్ళకేం ఉండదు. అలా వాడువినకపోతే వాడికర్మ చెప్పడం నా పన్నైందాలేదా నా కర్తవ్యం
అయిపోయిందాలేదా... కాబట్టి ఇప్పుడు హనుమ ఉద్దేశ్యమేమంటే రావణున్ని చూడాలి నాలుగు
మంచి మాటలు చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేను అల్ప శేషమ్ ఇదం కార్యం వాడికి
చెప్పడం చాలా చిన్న వ్యవహారము నాలు మంచి మాటలు చెప్తాం వాడు వినాలా ఏమైనానా...
కాని వాడు వినడేమోనని తేలికగా చెప్పను.
చాలా మర్యాదగానే చెప్తాను వాడి తలకెక్కేతట్లే చెప్తాను పుచ్చుకోకపోతే వాడి
కర్మ, రావణుడు పుచ్చుకోక పోవచ్చు, కాని హనుమత్ సందేశ సర్గని మీరు
పట్టుకున్నారనుకోండి మీకు ప్రయోజనముంటుంది. మీకు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి
ఏమండీ! వాడు వినడని తెలుసుకదా... చెప్తే హనుమకు వచ్చే ప్రయోజనమేమిటీ వినక రావణుడు
పాడయ్యాడని మీరు తెలుసుకుంటున్నారా అదే హనుమ సాధించిన విజయం హనుమ మాట్లాడినది మీరు
గ్రహించి రావణుడిలా ఉండకుండా ఉండి మీరు మారుతున్నారా అదే హనుమ సాధించినవిజయం అదే.
ఇంతకన్నా రామాయణం మీకు ఏమి అభ్యున్నతిని కల్పించాలి ఒక మనిషి మనిషిగా బ్రతికేటట్టు
చేయగలిగితే రామాయణం విజయం కాదా..? అందుకు కదూ మనిషన్నవాడు ఉన్నంత కాలము రామాయణం
చెప్పబడుతూనే ఉండాలని చెప్పింది. కాబట్టి అల్ప శేషన్ ఇదం కార్యం దృష్టేయ మఽసితేక్షణా ! త్రీన్
ఉపాయాన్ అతిక్షమ్య చతుర్థ ఇహ విద్యతే !! అయితే... రావణున్ని చూస్తే గదా మాట్లాడటం
రావణున్ని చూట్టం అంత తేలికా..? మహా గర్విష్టి గొప్ప అహంకారం కలిగినటువంటివాడు
వరాలు కోరుకున్నప్పుడే అసలు నేను నరవానరముల పేరే ఎత్తనన్నాడు బ్రహ్మగారిదగ్గర
ఏమిరా ఎందుకెత్తవు ఇంత మందిచంపంది నన్ను నర వానరములు చంపుతాయా..? అసలు వాళ్ళ
పేర్లు కూడా ఎత్తను నాకు వాళ్ళంటే అంత చులకన అన్నాడు.
అంతటివాడు ఎంతటి తేజోంస సంభవుడైనా ఒక వానరమొచ్చింది నీతో మాట్లాడుతుందటా అంటే
మాట్లాడటానికి అంగీకరిస్తాడా... కాబట్టి ఇప్పుడు తానే రావణాశురుని దర్శనాన్ని
పొందాలీ అంటే తాను రావణున్ని చూట్టం కాదు రావణుడు తన్ను చూసేటట్లుగా మార్చాలి సన్నివేశాన్ని
అప్పుడు తన ప్రయోజనమూ నెరవేరుతుంది తాను మాట్లాడటానికి ఏమండీ నేను ఒక్క పావుగంట
మీతో మాట్లాడుతాను అన్నాడనుకోండి హనుమా... ʻఒక సెకండ్ కూడా నాకు ఖాళీలేదుʼ అంటాడు. ఇదో
దరిద్రం లోకంలో మంచిమాట ఏది చెప్తే వినాలో అప్పుడే టైం లేదంటారు. తులసీదాసుగారి
జీవితంలో యదార్థంగా జరిగింది రోజూ వెళ్ళి అడిగేవారు జమీందారిగారిని రామాయణం
చెప్తాను వినవయ్యాని నీకైతే పనాపాడా సాయంకాలం ఆ నది ఒడ్డున కూర్చుని రామాయణం
చెప్తుంటావు నాకు అంత ఖాలీలేదు ద్రవ్యార్జన చేస్తున్నాననేవాడు. వచ్చేసంవత్సరం
కనపడు చూద్దామనేవాడు నవ్వుతూ, ప్రతి యేడాది వెళ్ళి అడిగేవారు రామాయణం చెప్తాను
వింటావాని. ఒక యేడాది చాలా పరిహాసం చేసి వచ్చే యేడాది కనపడు అన్నాడు. ఆ పై యేడాది
గుర్తు పెట్టుకుని వెళ్ళి అడిగారు అతను వెళ్ళి అతన్ని చూసేటప్పటికి ఆ జమిందారి
యొక్క జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ ఇంట్లోనే ఉండేటటువంటి గోశాలలో ఒక
ఎద్దులోకి ప్రవేశించి ఉన్నాడు. ఆ ఎద్దుకు ఇక్కడ పుండు పుట్టింది. పుండు పుడితే
కాడి పెట్టడం కుదరదు ఎద్దు పుండు కాకికి నెప్పా..? అందులో మాంసాన్ని పొడుచుకు తింటూంది.
ఆ పుండు కొంచెం ఇలా ఒత్తుగిలించి దానిమీద కాడి పెడుతారు. నడుస్తున్నప్పుడు ఈ పుండు
కాడి కిందకి వస్తూంటూంది.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
ఈ కాడి పెట్టి
తోలుతున్నవాడు కొడుకు తోక మెలిపెట్టి ఆ కర్రపెట్టి కొట్టి నడిపిస్తున్నాడు
తులసీగారు వచ్చి శరీరం మారిందిగాని జీవుడు వాడేనా ఐశ్వర్య వ్యామోహంతో చచ్చిపోయావు
ఇక్కడ్నుంచి అందుకెళ్ళావు నీ కొడుకే కాని తెలియదు తోక మెలిపెట్టి పుండుమీద కాడి
పెట్టి నడిపిస్తున్నాడు చూశావా చూశాను. ఎద్దులోనున్న జీవున్ని మహాత్ముడైన
తులసీదాసుగారు గుర్తించారు, గుర్తించి కన్నుల నీరు పెట్టుకుని ఏడ్చాడు ఆనాడు నేను
రామాయణం చెప్తాను చెప్తాను అని ఇంటి చూట్టూ తిరిగాడు ఒక్కనాడు నేను రామాయణం
వినలేదు ఒక్కనాడు నేను “రామా” అని అనలేదు నేను రామాయణం వినుంటే “శ్రీరామా” అని
నోటితో అనుంటే నా జన్మ ఇలా ఉండేది కాదు ఎంత పాడు చేసుకున్నానో అన్నాడు. కాబట్టి
వినడమంత తేలికేం కాదు వినడానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి, శివః శక్త్యా
యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యాం అమ్మా... నిన్ను ఆరాధించనివాళ్ళకి ఎక్కన్నుంచివస్తుందమ్మా
వినడానికిగాని చూడ్డానికిగాని ఈశ్వర కార్యం చెయ్యడానికికాని పరమేశ్వరుడు
అనుగ్రహించడు ఉంటే పూర్వపుణ్యము దానివల్ల మాత్రమే అటువంటి అనుగ్రహం కలుగుతుంది.
కాబట్టి శంకరులంతటివారు సౌందర్యలహరి శ్లోకంలో ఇదే నిర్ధారణ చేస్తారు. కాబట్టి
వినడు వినకపోవడమే కొంప ముంచేసింది. అయినా తన కర్తవ్యం తాను చేస్తారు ఈ మహానుభావుడు.
మన పనైపోయింది మనం
వెళ్ళిపోదాం ఏదో ఎవ్వరికీ తెలియకుండా ఎందుకొచ్చిన గొడవ అనుకోరు ఆత్మ
దర్శనమైనటువంటి యోగికి ఉండేటటువంటి ధైర్యమూ మీకు హనుమ యందు కనపడుతూంది.
ఆత్మ దర్శనమైన యోగికి శరీర భ్రాంతి కాని భయం కాని ఏవీ ఉండవు అందుకే
శంకరభగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద కూర్చుని కాపాలికుడు వచ్చి తలకాయ కావాలంటే
తీసుకో అన్నాడు. ఆ స్థితిని వాళ్ళు పొందుతారు అద్వైత స్థితిని అద్వైత స్థితి అంటే భయ రహిత
స్థితి,
కాబట్టి ఇప్పుడాయనా చతుర్దః విద్యతే ఎలా? రావణుడు నన్ను చూడ్డానికి
పిలవడం ఎలా నేను మాట్లాటం కాదు, నేను ఒక సెకండ్ మాట్లాడుతానంటే ఒప్పుకోడు ఆయనే
నన్ను ప్రశ్నలువేయ్యాలి ఎవరు నీవు ఎక్కడ్నుంచి వచ్చావు ఎందుకొచ్చావు ఏం
చేస్తున్నావు అని నన్ను అడగాలి. అలా నన్ను అడిగేటట్టు చెయ్యాలి చేస్తే నేను
మాట్లాడాలి అప్పుడు వింటాడు నేను ఎవరో ఎందుకొచ్చానో తెలుకోవాలన్ని కోర్కె ఆయనకీ
కలగాలి కలిగి నన్ను ప్రశ్నించాలి అప్పుడు నేను చెప్పింది వింటాడు అంటే ఏదో యథాలాపంగా చెప్తామని
కాదు ఆయన తాపత్రయం తను చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయడం ఇది బాగా గుర్తుపెట్టుకోండి సుందర కాండలో మీరు చేసేటటువంటి ఏ పనైనా త్రికరణ
శుద్ధిగా చెయ్యాలి ఏ పని చేసినా యజ్ఞం కిందుండాలి. యజ్ఞమని పేరు పెట్టుకోవడం కాదు
మీరు ఒక పని చేస్తున్నారూ అంటే త్రికరణ శుద్ధిగా ఈశ్వరున్ని నమ్మి ముందు నీ పనిమీద
మీరు మీరు చేస్తున్న కార్యం మీద నమ్మకంతో ఇది ఈ ఫలితాన్ని ఇస్తుందీ అన్న
విశ్వాసంతో మీరు చెయ్వలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంత శ్రద్ధతోనూ చేస్తారు
హనుమ చేయడమంటే. కాబట్టి సామము పనికొస్తుందా అలా స్నేహముతోకలితే జరుగుతుందా దానము
పనికొస్తుందా మరి వాని దగ్గర లేందిలేదు అటువంటివాడికి ఏమిస్తానంటే పిలిచి
మాట్లాడుతాడు. భేదము ఇప్పుడు ఆయనతో ఏదైనా భేదం పెట్టుకోవడమంటే ఇప్పుడు కుదిరేపనా
కుదరదు కాబట్టి దండోపాయము ఆయనకి ఇష్టమైందేదో అది పాడు చేయడం దాన్ని
రక్షించేవాళ్ళెవరో వాళ్ళని నాలుగు దెబ్బలు కొట్టడం ఏమౌతుంది తన ధర్మం తనది.
చెట్లు పీకెయ్యక్కరలేదు చెట్లు కొమ్మలు
విరిచేస్తారు విరిచేస్తే ఏమౌతుంది కాపలావాళ్ళొచ్చి మీద పడుతారు మీద పడితే ఏమౌతుంది
నన్ను నేను రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళని మట్టుబెడుతాను మట్టుబెడితే ఏమౌతుంది.
ఒకళ్ళకన్నా ఒకళ్ళు బలమైనవాళ్ళు పంపించడం మొదలౌతుంది నన్ను పట్టుకొమ్మని
పట్టుకోగలిగినవాడు ఎవరు, మీకు నేను హనుమ యొక్క వైభవమేమిటో చెప్పానుగదా ఆయన్ని పట్టగలిగిన
అస్త్రం ఆయన్ని కొట్టగలిగిన శస్త్రం లోకంలో లేదు స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి
మహానుభావుడు ఆయన కాబట్టి నన్ను పట్టుకోగలిగినవాడు లేడు, కాబట్టి రావణాసురుని యొక్క
చాలా గొప్ప శక్తి ఏదో ఒకటి వచ్చేంతవరకు యుద్ధం చేస్తాను చిట్ట చివర లోపలికి
వెళ్తాను చాలా ఉత్సుకతో నన్ను చూస్తాడు, ప్రశ్నలు వేస్తాడు అప్పుడు నేను
చెప్పవలసిన మంచిమాటలు చెప్తాను, విన్నాడా విన్నాడు వినలేదా వాడి ఖర్మ కాబట్టి అల్ప
శేషన్ ఇదం కార్యం దృష్టేయ మఽసితేక్షణా ! త్రీన్ ఉపాయాన్ అతిక్షమ్య చతుర్థ ఇహ
విద్యతే !! అయితే ప్రధాన
కార్యం పూర్తైనప్పుడు అనుషంగిక కార్యం ఇలాంటివి చెయ్యొచ్చా..? ఆయనే అంటారు ప్రధాన కార్యమునకు భంగముకాని
అనుషంగిక కార్యం ఎప్పుడైనా చేయవచ్చు తప్పా అనుషంగిక కార్యమునందు దృష్టితో
ప్రధాన కార్యమును ఎవడూ భంగము చేయకూడదు దీని తార తమ్యం మీరు గమనించాలి.
నేను మొన్న మీకు సురేశ్వరాచార్యుల వారు దక్షిణా మూర్తి స్తోత్రానికి చేసిన వార్తికం
గురించి చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాను భర్త మంచి చలిగాలిలో ఇంటికొచ్చి నాకొక
రొట్టెవేసిపెట్టూ అంటే అగ్నిహోత్రం దగ్గర నిలబడి పొయ్యి మీద రొట్టె వేసేటప్పుడు
పొయ్యిలోవున్న వేడి భార్య శరీరానికి తగిలి కొంత ఉపశాంతిని పొందడమనేటటువంటిది
భర్తకి రొట్టె వేసి పెట్టి ఆయన ఆకలి తీర్చడమన్న
ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం. అనుషంగిక ప్రయోజమైన పొయ్యివేడి తగిలితే
హాయిగా ఉందికదాని రొట్టె గురించి మానేస్తే రొట్టె మాడి మసైపోతుంది నీ వొంటికి
హాయిగా ఉంటుంది చలిలో వచ్చిన భర్త చేతులు కాళ్ళు వంకర్ల తిరిగి కిందపడిపోతాడు
నీరసంతో, ఎంత వరకు నీవు వేడిని అనుభవించాలి రొట్టె ఎర్రగా కాలేవరకే రొట్టె ఎర్రగా
కలిందనుకో కట్టెలు కిందకి లాగేయ్యాలి రొట్టె భర్తకు పెట్టడం ప్రధానం అప్పటి వరకు
వేడి తగలడం అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనానికి భంగం కానంతసేపు అనుషంగిక ప్రయోజనం అనుభవించవచ్చు.
అనుషంగిక ప్రయోజనాన్ని
ప్రధానం చేసి ప్రధాన కార్యాన్ని భగ్నం చేస్తే అవివేకి అంటారు
అటువంటివారివల్ల పనులు నెరవేరవు భూతా శ్చార్థా విపద్యన్తే దేశ కాల విరోధితాః !
అర్థాఽనర్థాఽన్తరే బుద్ధి ర్నిశ్చితాఽపి న శోభతే ! ఘాతయన్తి హి కార్యాణి దూతాః పణ్డిత
మానినః !! తరచు అంటూంటారు
హనుమ ఈ మాటలు సుందర కాండలో కాబట్టి అలా ఉండ కూడదు బాగా ఆలోచించి చెయ్యాలి.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి నేను
ప్రధాన కార్యమేదో దానికి భంగపాటుకాని అనుషంగిక కార్యం చేస్తాను. ఏమిటి ఇప్పుడు
అనుషంగిక కార్యం?. రావణుడికి నాలుగు మంచి మాటలు చెప్పడం వాడు ఎలాగో వినడు, వినడు
కాబట్టి ఏం చేస్తాడు కక్ష పూనుతాడు నామీద అప్పుడేమౌతుంది మళ్లీ యుద్ధ మొస్తూంది నాకు
వస్తే ఏమౌతుంది అసలు వీళ్ళ బలా బలాలెంతో వీళ్ళ దుర్గాలెలా ఉంటాయో వీళ్ళ కోటలెలా
ఉంటాయో లంక ఎలా ఉంటూందో చూస్తాను రాత్రికదా అన్వేషించారు పగటిపూట చూడలేదుకదా...
చూస్తాను ఇందులో నాకు క్లేషం కలిగితే రామ కార్యంలో నాకు క్లేషం కలిగినా నాకు ధన్యతే ఇది ఎంత గొప్పమాటో
చూడండి కాబట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తాను అన్నారు అంతే సావిహ్వలాఽశోకలతాప్రతానా
వనస్థలీ శొకలతాప్రతానా జాతా దశాస్యప్రమదావనస్య కపేర్బలాద్ధి ప్రమదావనస్య ! “ప్రమదావనము” అన్నమాట మొట్టమొదట శ్రీ రామాయణంలో
వాడారు తరువాత ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాతివహించి పత్రిక దాంతో కొన్నాళ్ళు ఒక శీర్శిక
నడిపింది ʻప్రమాదావనముʼ అని కాబట్టి సావిహ్వలాఽశోకలతాప్రతానా వనస్థలీ శొకలతాప్రతానా జాతా
దశాస్యప్రమదావనస్య కపేర్బలాద్ధి ప్రమదావనస్య ! ఆయనా... రావణాసురునికి అత్యంత ప్రీతికతికలిగినటువంటి
ఈ అశోకవనం ఏదుందో ఈ అశోకవనాన్ని ప్రక్సిత్సా ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ
విరిచేస్తా విరిచేస్తే రావణాసురునికి కోపమొస్తుంది నాపైన కోపమొచ్చి నన్ను
పిలుస్తాడు కాబట్టి ఈ చెట్లన్నీ పాడు చేసేస్తానన్నాడు ఒక్క తద్వనం
మథితైర్వృక్షైః భినైశ్చ సలిలాశయైః ! చూర్ణితైః పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనమ్
!! అంటారు మహర్షి. ఒక్కసారి భీమ
విక్రముడై పేద్ద శరీరాన్ని పెంచాడు అపారమైన వేగమునకు పరాకాష్ఠ హనుమ యొక్క స్థితి
ముగ్గురే గరుత్మంతుడు వాయువు హనుమ, అపారమైన వేగంతో ఒక్కసారి తిరిగారు అంతే ఆయన
తొడల వేగమునకు చెట్ల కొమ్మల్నీ విరిగి కిందపడిపోయాయి.
అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద సరోవరములు జలాశయములు అవన్నీ కూడా ఒడ్లు
విరిగిపోయాయి, ఎందుకనీ ఆయన తొడల వేగానికి సముద్రమే చాప చుట్టునట్లు పైకి లేచింది
మీరు సుందర కాండ ప్రారంభంలోనే విన్నారుగా తిమి నక్ర ఝుషాః కూర్మా దృశ్యంతే
వివృతా స్తదా ! వస్త్రాఽపకర్షణే నేవ శరీరాణి శరీరిణామ్ !! ఒక వ్యక్తి నిద్రపోయేటప్పుడు బట్ట పైకిలేస్తే గుప్తమైన
అవయవములు కనపడినట్లు హనుమ యొక్క తొడల వేగానికి సముద్రం చాప చుట్టినట్లు
పైకిలేచింది లేస్తే సముద్ర గర్భంలో ఉన్న జంతువులు అన్నీ కనపడ్డాయి అటువంటిది ఆయన
అంత వేగంతో తిరిగితే అక్కడ ఉండేటటువంటి సరోవరములలో ఉన్న నీరు పైకిలేస్తే ఒడ్లు
తెగిపోయి అవన్నీ ప్రవహించాయి ఈంత పెద్ద గాలీ చెట్లన్నీ ఒక్కసారి పడిపోతే పర్వత
శిఖరములలో ఉండేటటువంటి క్రూర మృగములన్నీ కూడా వింత వింత ధ్వనులు చేసి పరుగులు
తీస్తున్నాయి ఒక్కసారి ఎక్కడ చూసినా ప్రళయమొచ్చిందా అన్నట్లుగా వాతావరణం
మారిపోయింది ఒక్కసారి పంపేసేసి గాలేస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి
ఏర్పడిపోయింది చూర్ణితైః పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనమ్ అంటారు. ఆ
వేగంతో వెళ్ళడం అక్కడ వక్షస్థలంతో కొడితే పర్వతము యొక్క శిఖరములు చూర్ణమై కింద
పడిపోయాయి. చూశారు ఆశ్చర్యపోయారు ఆ రాక్షస స్త్రీలు అందరూ ఒక్కసారి మేల్కొన్నారు
ఎదో సురంక్షిప్యాఽఽత్మనః కాయం బభూ వాంగుష్ఠ మాత్రకః బొటనవేలంత వాడు పిల్లి పిల్లంతవారు ఏదో కిచ కిచ
లాడుతోంది సీతమ్మతో అని ఊరుకున్నారు వాళ్ళు
పైగా త్రిజటా
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
స్వప్నం చెప్పిందని
ఇప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది అయ్యబాబోయ్ ఆ కోతే పర్వతాకారాన్ని పొందిందని,
వాళ్ళందరూ పరుగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికెళ్ళారు వెళ్ళి ఎవరాకోతి?
ఎక్కడ్నుంచివచ్చింది? భయపడకు నీతో ఏం కిచ కిచలాడింది ఏం మాట్లాడింది నిజం చెప్పూ
అన్నారు. ఆవిడందీ యూయ మేవాఽభి జానీత యోఽయం యద్వా కరిష్యతి
! అహి రేవ అహేః పాదాన్ విజానాతి న సంశయః !! పాము కాళ్ళు పాముకే తెలియాలి, నాకెలా
తెలుస్తాయి మీ శత్రువు ఎవరో మీకు తెలియాలి ఎందుకు వచ్చి ఈ వనం పాడుచేస్తున్నాడో
నన్నడుగుతారేం నాకు తెలియదు అంది..
మరి అపద్ధం కాదా... అంటే ఒక పెద్ద ధర్మాన్ని
ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చేయడం ఎప్పుడూ తప్పుకాదు, ఒక గోవు అలా
పరుగెత్తిందనుకోండి నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను కసాయివాళ్ళు వెనకాల తరుముకొచ్చి
అయ్యా గోవు ఇలా వెళ్ళిందాండీ అని అడిగారనుకోండి నేను చూడలేదండీ అన్నాననుకోండి
ఇప్పుడూ అనృతం చెప్పినటువంటి పాపం నా ఖాతాలో వేయరు అనృతం చెప్పియైనా ఒక గోవుని రక్షించినటువంటి
పుణ్యం నా ఖాతాలో పడుతుంది. అన్నిటికన్నా ప్రధానమైన లక్ష్యమేమిటంటే భూతములన్నీ
కూడా ప్రశాంతంగా ఉండేటట్టు చూడ్డం భూతములంటే ప్రాణులు హింసను నివారించడం
సాధ్యమైనంతవరకు తనను నమ్ముకున్నవాడు నూరు యోజనములు సముద్రాన్ని గడచి వచ్చినవాడు
రామ కింకరుడు దాసాంజనేయుడు తన కొడుకుతో సమానమైనవాడు పరమ భక్తుడు తనకు ఉంగరమిచ్చి
రామ కథ చెప్పినవాడు మనఃశాంతిని కృపచేసినవాడు అటువంటి మహానుభావుడు ఆ రాక్షస స్త్రీల
చేత సంహరింపబడడమో లేకపోతే వాళ్ళచేత చెలకబడడమో వాళ్ళతో యుద్ధం చేయ్యవలసి రావడమో తన
నామాట కారణమైతే సీతమ్మతల్లికి ఖేదం కదా అది అందుకని ఆవిడా నాకేం తెలుసు పాముకు
కాళ్ళుంటాయో లేదో పాముకే తెలియాలి.
పాముకి కాళ్ళుంటాయి అని నేనన్నాననుకోండి, ఎవరో అన్నారనుకోండి పాముకు
కాళ్ళుంటాయాని పాకుతున్నప్పుడు చూసేవాడు ఎవరు? ఎవరూ చూడరు, ఒకవేళ పాముకు
కాళ్ళులేవు అని తిరగేసి చెప్తామనుకుందామనుకోండి లేదు మేము కాళ్ళతోనే పాకుతాము అని
తిరగేసి చెప్పిందనుకోండి అదే నిజమై ఉండాలి. ఎందుకంటే ఇంకోపాముకైతే తెలుస్తుంది.
ఇప్పుడూ విమానానికి చక్రాలున్నాయి అని నేను అన్నాననుకోండి ఎగురుతున్నప్పుడు
చక్రాలేవి అని అడిగారనుకోండి ఆచక్రాలను తనలోకి తీసేసుకుంటుంది ఎగిరేటప్పుడు దానికో
లక్షణముంది. పాకి పాకి మీరు చూసేటప్పటికి అది లోపలికి తీసేసుకుంటుందేమో కనపడకుండా
పాము గురించి పాముకు తెలియాలి నాకేం తెలుస్తుంది. ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందో
చూడండి అహి రేవ అహిః పాదాన్ విజానాతి న సంశయః ! యూయ మేనాఽభి జానీత యోఽయం యద్వా కరిష్యతి
!! నాకేం తెలుసు. మీ
శత్రువులు మీకు తెలియాలి ఆయన ఈ అశోకవనాన్ని పాడు చేస్తున్నాడూ అంటే మీ శత్రువు మీ
శత్రువు గురించి మీకు తెలుస్తూందా నాకు తెలుస్తూందా మీకు తెలియాలంది. ఆహాఁ.. ఉండు
మేము రావణుడికి చెప్తామన్నారు వాళ్ళు ఏమి ఇక్కడ ఆలస్యం చేయడానికి అవకాశం లేదు
విపరీతమైనటువంటి ధ్వసం జరిగిపోతూంది. కాబట్టి వీళ్ళందరూ పరుగెత్తుకుంటూ రావణుని
దగ్గరకి వెళ్ళారు, వెళ్ళి సరే చెప్పేటప్పుడు రెండు మాటలను ప్రత్యేకంగా కలిపి
చెప్పారు. నీ మనసు బాధ పడేటటువంటి పని జరిగిందీ అన్నారు ఏం జరిగింది అన్నారాయన
ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరమొకటి వచ్చింది అది బ్రహ్మ శక్తియో విష్ణు శక్తియో
శివ శక్తియో కుబేరుడో ఇంద్రుడో తెలియదు కానీ ఆ వానరము నీకు ప్రీతి పాత్రమైన
అశోకవనాన్నంతట్నీ కూడా ధ్వంశం చేస్తూంది. అది ఒక్క సీతమ్మతల్లి కూర్చున్న శింశుపా
వృక్షం మాత్రం ఒక చిగురుకూడా పాడు చేయలేదు విడిచిపెట్టింది.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
ఆయనకి అనుమానం
ఎందుకంటే ఆయన ఒక్క పురుషుడు కూడా కాపలా ఉండడానికి వీల్లేదని అన్నాడు కాబట్టి తను
ఎలా ఉంటాడో లోకంలో అందరూ అలానే ఉంటారని లక్షణమాయంది కాబట్టి అటువంటివాడు సీతమ్మ
కూర్చున్నటువంటి చెట్టును ఒక కోతి విడిచిపెట్టిందంటే
ఆయనకు అనుమానం. వాళ్ళన్నారూ ఎవరూ మాట్లాడకూడదన్న నీవు శాసించిన సీతమ్మతో ఆ కోతి
మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలియదు సీతమ్మనడిగితే నాకు తెలయదంటూంది, ఇప్పుడు
నీవు ఆ వానరాన్ని పట్టి ఏమి శిక్షవేస్తావో నీయిష్టం అన్నారు. ఈ మాట విన్నారట,
మహర్షీ ఎంత అద్భుతమైన రచన చేస్తారంటే తస్య కృద్ధస్య నేద్రాభ్యాం ప్రాపత న్నాఽస్ర బిందవః !
దీప్తాభ్యా మివ తీపాభ్యాం సాఽర్చిష స్నేహ బిందవః !! దీపంలో వత్తి వేసేటప్పుడు మీరు ఇలా తిరిపెట్టీ
నేతిలో ఇలా వేసి బాగా నేతిలో తడిపిన వైపుకి తిప్పి తరువాత మళ్ళీ ఇవతలివైపుకు
తిప్పి ఇవతలివైపుది అవతలి వైపుకు వేస్తారు, ఎందుకంటే నేతిలో తడిసింది ఇటువైపు ఉంటే
కదా బాగా జ్వాలా అంటుకుంటూంది అని. ఇప్పుడు మీరు జ్వాలని వెలిగించారనుకోండి మీరు సంధ్యావందనానికి ముందే నేతిలో
ఒత్తేసేసి సంధ్యావందనం చేసి ఆదిత్యహృదయంచేసి ఇప్పుడు మీరు వెలిగించారనుకోండి
వెలిగిస్తే అదేమౌతుంది వేలిగేటప్పుడు పెద్ద జ్వాలావచ్చీ నేతి బందువు అగ్నిహోత్రంతో
కలసి కిందపడుతూంది రెండు మూడు పర్యాయాలు, నేతి బిందువు జ్వాలతోటే కిందపడుతూంది
మీరు చూసుంటారు దీపాలలోంచి పడుతుంది అలాగ ప్రత్యేకించి కాగడాలు పట్టుకు వెడుతుంటారు
ఈశ్వరుడి ముందు ఈ కాగడాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు కాగడాలకీ ముందే తైలపోసి
సిద్దంచేస్తారు అవి పట్టుకోవడం ఒక పెద్దకళా చాజా జాగ్రత్తగా... కాగడా పట్టుకోవడమూ
అంటే పట్టుకునేవాడు మాత్రం ఎప్పుడూ వెనక్కి చూడకూడదు ఈశ్వరున్ని, కాగడా
పట్టుకునేవాడు ఈశ్వరున్ని చూస్తే ఉపద్రమొస్తుంది ఎందుకో తెలుసాండీ... అందరూ అదే
పనిలోవుంటారు. ముందు కాగడా పట్టుకుని వెడుతుంటాడు ఈయ్యనా వెనక్కితిరిగి చూస్తూ
నడిచేశాడనుకోండి ఇంకో ఆయనా ఈశ్వరున్నే చూస్తూ నిల్చున్నాడనుకోండి ఆయనకీ సరిగ్గా
దృష్టిలేదు ఎందుకంటే ఆయన ఈశ్వరున్ని చూస్తున్నాడు. ఈయ్యన కాగడా వేల్ళి ఆయన
కంఠానికో ముఖానికో తగులుతుంది అందుకే కాగడా పట్టుకుని ఈశ్వరుని ముందువెళ్ళేవాడు
ఎప్పుడూ ఏ పరాకు చెప్పాలో తెలుసాండీ ఎప్పుడూ నీవు ఆగకూ నీవు ఈశ్వరున్ని చూడకు. అందుకే
ఊరెరిగింపు చేస్తున్న పెద్దలేం చేస్తారో తెలుసాండీ... కాగడా ఎవడు పట్టుకున్నాడో
వాడివెనక నడుస్తున్నారు. మొన్నా సీతా రామ కళ్యాణం జరుగుతున్నప్పుడు కాగడా
పట్టుకుని వచ్చారు ఎవరో నేను ఆయనతోనే వెళ్ళాను అక్కడ దాకారాగానే ఉపద్రవం రాబోయింది
నేను వెంటనే నేను ఆయనకు చెప్పాను ఈవు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు ఈవెందుకు
చూస్తావు కాగడా పట్టుకోవాలంటే వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడాలంటే
కాగడా పట్టుకోకు
నీవు ఏ మాత్రము నిర్లక్ష్యంగా ఉన్నా చూశావా ఎలా అంటుకుందో కాగడా... అది వెళ్ళి
గబుక్కున తగలరానిదానికి తగిలితే జ్వాల అంటుకుపోతూంది, కాగడా పట్టుకుంటే వెనక్కి
తిరిగి చూడకూడదు, కాగడాలోంచి పడుతుంటాయి అగ్ని
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
బిందువులు పెద్ద
ప్రమాదం కాబట్టి మహర్షికి ఎంత గొప్ప ఉపమానాలు తట్టాయో మహానుభావుడుకి అందుకు కదాండి
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
కాళిదాసాది కవులు
స్వీకరించారు వాల్మీకి మహర్షిని ఆదర్శంగా... కాబట్టి దీప్తాభ్యా మివ తీపాభ్యాం
సాఽర్చిష స్నేహ బిందవః లోపలా సీతమ్మ మీద కామం పైకి తనతో సరిగా మాట్లాడని సీతమ్మ ఎవరో ఒక కోతితో
మాట్లాడింది ఇది ఘోరం, ఈ రెండూ కలిపి ఆజ్యధార, ఆజ్య బిందువు నీటి బిందువు
అగ్నిహోత్రం కలిసిపడ్డట్టు ఆయన కంటివెంట క్రోధంతో నీటి బిందువులు చుక్కలు పడ్డాయట
అంత కోపంతో. ఒక వానరాన్ని పట్టడానికి అంత అవసరమా... హనుమ కాబట్టి సరిపోయింది, ఇదే
రాముడికి రావణుడికి ఉండే తేడా. ఎంత కోపమును ప్రదర్శించాలో అంత కోపమును, అంత
కోపమునకు శిక్షను రాముడు వాడుతాడు. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపము తెచ్చుకోవడము
అలవాటైందనుకోండి యుక్తా యుక్త విచ్ఛక్షణలేని శిక్షవేసేస్తారు, లేనిపోని గొడవలు
తెచ్చుకుంటారు, ఎక్కడ ఎంత కోపము అవసరమో అంత కోపమే తెచ్చుకోవాలి అప్పుడే ఆ కోపానికి
తగిన శిక్ష మీరు వేయగలుగుతారు లేకపోతే ఉపద్రవము వస్తాయి. చిన్నవాటికి పెద్ద శిక్షా
పెద్దవాటికి చిన్న శిక్షా చేసుకు కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు 80 వేల
మంది కింకర్ల మూకను పిలిచారు. మీరు 80 వేల మంది వెళ్ళి ఆ వానరాన్ని సంహరించండి
అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్ధేశ్యమేమిటంటే చాలా తేలిగ్గా చంపేస్తారని అంటే ఆయన
కోరికేమిటంటే వెళ్ళగానే వీళ్ళు 80 వేల మంది శూలాలు వేస్తే ఉత్తర క్షణం ఆ కోతి కింద
పడిపోతుంది అంటే మనసులో అంత క్రౌర్యము సీతమ్మ మాట్లాడింది సీతమ్మతో మాడ్లాడాడని.
ఇప్పుడు 80 వేల మంది కింకర్లు వెళ్ళారు, స్వామి ఒక తోరణ మెక్కి కూర్చున్నారు
దీన్ని జయ మంత్రము అంటారు ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఎంత మంది పెద్దలు ఈ జయ
మంత్రాన్ని ఉపాసన చేసి జీవితంలో ధన్యత పొందారు. ఆయన దానిమీద కూర్చుని చెప్తున్నారు.
మీతో నేను మనవి చేశానుగా ఆత్మదర్శనమైన యోగికి నిర్భయస్థితి ఇక భయముండదు ఇప్పటి
వరకు తానెవరో తెలియనివ్వలేదు, ఇప్పటి వరకు మాత్రం సూర్యే చాఽస్తం గతే రాత్రౌ
దేహం సంక్షిప్య మారుతిః ! పృషదంశక మాత్రః సన్ బభూవాఽద్భుత దర్శనః పిల్లి పిల్లంతవారై ఉంటారు. ఇప్పుడు మాత్రం
ఒక్కసారి సీతామాత దర్శనం అయిపోతే ఎవరో అడగడం కాదు తనే చెప్తున్నాడు
జయ త్యఽతి బలో రామో లక్ష్మణ శ్చ మహా బలః ! రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాఽభిపాలితః !!
దాసోఽహం కోసలేన్ద్రస్య రామ స్యాఽక్లిష్ట కర్మణః ! హనుమాన్ శత్రు సైన్యానాం
నిహన్తా మారుతాఽఽత్మజః !!
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్ ! శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ
సహస్రశః !!
అర్థయిత్వా పురీం
లంకా మఽభివాద్య చ మైథిలీమ్ ! సమృద్ధాఽర్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ !!
అన్నారు, దీన్నే జయ మంత్రం అంటారు జయ త్యఽతి బలో రామో
లక్ష్మణ శ్చ మహా బలః ! రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాఽభిపాలితః !! రామ చంద్ర మూర్తి పరాక్రమముతో జయముతో
శోభిల్లుతున్నారు, ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణ మూర్తి కూడా పరాక్రమంతో
ప్రకాశిస్తున్నాడు. రామ లక్ష్మణుల యొక్క అండదండలు కలిగిన నా ప్రభువు సుగ్రీవుడు
విజయంతో శోభిస్తున్నాడు నేను దాసోఽహం కోసలేన్ద్రస్య
రామ స్యాఽక్లిష్ట కర్మణః నేను ఎటువంటి కార్యంలోనైనా అవలీలగా చేయగలిగినటువటి సమర్థత నాలో
భాషించినటువంటి రామ చంద్ర మూర్తి యొక్క కింకరున్ని నేను, నేను ఆయన దాసాన దాసున్ని దాసోఽహం కోసలేన్ద్రస్య
రామ స్యాఽక్లిష్ట కర్మణః ! హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాఽఽత్మజః !! నా పేరు హనుమా నేను వాయు పుత్రున్ని శత్రు
సైన్యమును సంహరించడంలో నాకు నేనే సాటి కాబట్టి నిహన్తా మారుతాఽఽత్మజః న రావణ
సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్ వేయ్యిమంది రావణాసురులు వచ్చి కూర్చున్నాసరే... ఒక పురుగును చంపినట్లు
చంపేస్తాను శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః అర్థయిత్వా పురీం లంకా మఽభివాద్య చ మైథిలీమ్
సమృద్ధాఽర్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను,
రాళ్ళు పెట్టి కొట్టి చంపైస్తాను మోచేతులతో కుమ్మి చంపేస్తాను పాదముల కింద పెట్టి
తొక్కేస్తాను. అరి చేతులచే మర్థించి చంపేస్తాను గోళ్ళతో చీల్చి చంపేస్తాను నా
కోరలతో కొరికి చంపేస్తాను నాకు ఆయుధమక్కర్లేదు.
నేను వచ్చింది అర్థయిత్వా పురీం లంకా ఈ లంకా పట్టణాన్ని పీడిస్తాను
నాతల్లి సీతమ్మకోసం వచ్చాను అయిపోయింది దర్శనం మిమ్మల్నందర్నీ పీడించి ఎలా వచ్చానో
అలా నూరు యోజనములు సముద్రాన్ని గడిచి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగిన మొనగాడు లంకా
పట్టణంలో లేడు. వందమంది రాక్షసులైనా వేయి మంది రావణులైనా అందర్నీ నేను చంపేస్తాను
అనీ ఆ తోరణం మీద కూర్చుని చెప్తున్నారు. ఈ 80వేల మంది కింకరుల మూక వచ్చారు వచ్చి ఆ
చేతులో ఉన్న బాణాలు అవి ఏవో విసరబోయారు ఆయన అపారమైన లాఘవ శక్తి అయన ఏమీ అందేవారు
కాదు, లక్ష్యాన్ని తిరుగులేకుండా కొట్టగలిగిన మొనగాళ్ళే హనుమ మీద బాణం వేయడం
సాధ్యం కాదు అంత వేగంగా తప్పకుంటారు ఆయనా ఆయన వెంటనే వాటి మధ్యోలంచి తప్పుకునీ ఆ
తోరణానికి ఉన్న ఒక పేద్ద పరిహరిని పేరికి అది పెట్టి కొడితే 80 వేల మంది రాక్షసుల
మూక కన్ను మూసి కన్ను తెరిచే లోపలా నెత్తుడి మాంసపు ముద్దులై పడిపోయారు, ఆయన మళ్లీ
తోరణ మెక్కి కూర్చున్నారు. మళ్ళీ జయ త్యఽతి బలో రామో
లక్ష్మణ శ్చ మహా బలః ! రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాఽభిపాలితః !! ఈ వార్తా ఎవరికి ప్రకంపనలు సృష్టించింది
రావణునికి పరుగెత్తుకుంటూ రావణుని దగ్గరికి వెళ్ళారు 80 వేల మంది కింకరుల మూక మడిసిపోయింది.
ఇప్పుడు ఆశ్చర్యపోవడం రావణునివంతు అయ్యింది, ఇప్పటి వరకు ఒకళ్ళని ఏడిపించడమే కానీ
తాను ఏడ్వడం తెలియదు ఒకళ్ళని భయపెట్టడమే కానీ తాను ఆశ్చర్యపోవడం తెలియదు. ఇప్పుడు
జీవితంలో మొదటి సారి అనుభవిస్తున్నాడు.
ఇప్పుడు ఆయనా ఆ తోరణం మీద కూర్చున్నారు రావాలిగా మళ్ళీ అవతలి నుంచి శత్రు
మూకలు వస్తే కదా సంహారం చేయడం కానీ ఈలోపలా మంచి పౌరుష పరాక్రమంతో ఉద్వేగంతో
ఉన్నటువంటి హనుమ చైత్య ప్రాసాదాన్ని చూశారు, చూసి ఒక్కసారి ఎగిరి ఆ చైత్య ప్రాసాధం
మీద పడ్డారు సుందర కాండ ప్రారంభంలోనే సీతమ్మతల్లి దర్శనంలోనే మహర్షి చెప్తారు కదా
అక్కడ్నుంచి చూసినప్పుడు ఆయనకి వేయి స్తంభాల చైత్య ప్రాసాధం కనపడిందని. దానిమీదకి
వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కింకరులు దాన్ని కాపలా కాస్తున్నారు. ఆ కాపలా
కాస్తున్నటువంటి కింకర్లందరూ కుడా హనుమ మీద తిరుగబడి ఆయన్ని కొట్టబోయి వాళ్ళ
దగ్గరున్న ఆయుదాలతో కుమ్మే ప్రయత్నం చేసారు. ఆయన ఒక్కసారి ప్రాసాదస్య మహాంతస్య ప్రాసాద
స్య మహాన్త స్య స్తమభం హేమ పరిష్కృతమ్ ! ఉత్పాటయిత్వా వేగేన హనూమాన్ పవనాఽఽత్మజః !! తత స్తం
భ్రామయా మాస శతధారం మహాబలః ! తత్ర చాఽగ్ని స్సమఽభవ త్ప్రాసాద శ్చాఽప్యఽదహ్యత !! ఆ వెయ్యి స్తంభాల మంటపానికి ఆధారంగా ఉన్నటువంటి
ప్రదానమైనటువంటి బంగారు స్తంభాన్ని ఊడబెరికారు, ఊడబెరికి దాన్ని గాలిలో గిర గిర
తిప్పారు, బంగారు స్తంభం గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
యజ్ఞం చేసేటప్పుడు “ఆరడి
మంధరం” చేస్తారు అంటే లౌకికాగ్ని అంటే అగ్గిపుల్లతో గీసి అగ్నితో యజ్ఞం చేయకూడదు.
మీరు రేపు చూస్తారు పట్టాభిషేకం నాడు ʻఆరడి మంధరంʼ చేస్తారు, చేసి
అగ్ని మంత్రాన్ని పుట్టిస్తారు ఒక కొయ్యలేక వేరొక కొయ్యముక్కని గుచ్చి అత్యంత
వేగంగారాపాడిస్తారు రాపిడిస్తే అందులోంచి రవ్వలొస్తాయి దాన్ని దూదితో పట్టుకుంటారు
పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులోపెట్టి మెల్లిగా జ్వాల రగులుస్తారు
రగల్చి దాన్ని తీసుకెళ్ళి స్తాపిస్తారు, స్తాపించి ఆ యాగాగ్నిలోకి హవిస్సులిస్తారు,
రేపు పట్టాభిషేకం రోజు చూస్తారు మీరు ఆరడి మంథనం చేయడం. కాబట్టి ఆయన ఆ స్తంభాన్ని
పట్టుకుని గిర గిర తిప్పితే వాయువుతో సంఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది, అగ్నిహోత్రం
పుట్టి ఒక్కసారి ఆ చైత్య ప్రాసాదమంతా అంటుకుంది అంటుకోవడంతో దానికి తాపడం చేసిన
వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు పగడాలు పటిల్లుమని పేలిపోతున్నాయి ఆ బంగారు
స్తంబాలన్నీ కూడా కరిగిపోయి బంగారు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బంగారము
వెండీ అంతా కరిగి వెళ్ళిపోతుంది. ఇటువంటి స్తితిలో ఆయన చైత్య ప్రాసాద మెక్కి
చెప్తున్నారు మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనామ్ ! బలినాం
వానరేన్ద్రాణాం సుగ్రీవ వశ వర్తినామ్ !! ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం వో నిషూదనః !
నేయమ్ అస్తి పురీ లంకా న యూయం న చ రావమః ! యస్మా దిక్ష్వాకు నాథేన బద్ధం వైరం
మహాత్మనా !! అన్నారు మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనామ్ నాలాంటివాళ్లు కొన్నివేల కోట్ల వానరులు
సుగ్రీవున్ని అనుసరించి వస్తున్నారు ఈ భూ మండలమంతా సీతమ్మకోసం అన్వేషిస్తున్నారు.
పది ఏనుగులు నూరు ఏనుగులు వెయ్యి ఏనుగులు లక్ష ఏనుగులు కోటి ఏనుగులు బలం
కలిగినటువంటివారు గాలితో సమానమైన వేగమున్నవారు లంఘన శక్తి కలిగినటువంటివారు పర్వత
శిఖరములను పరడద్రోయగలిగినవారు సముద్రాన్ని తిరిగతోడగలిగినటువంటివారు అంతటి
బలవంతులైన వానరలు ఎందరో నా కన్నా బలవంతులు సుగ్రీవు చుట్టూ పరివేష్టించి ఉన్నారు.
యస్మా దిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మనా పరమ ధర్మాత్ముడైన రామ చంద్ర మూర్తితో మీరు
బద్దవైరాన్ని కల్పించుకున్న కారణం చేత సుగ్రీవుడు ఈ వానరములతో భల్లూకములతో కలిసి ఈ
పట్టణాన్ని చేరుకుంటాడు. రామ లక్ష్మణులతో కలసినటువంటి సుగ్రీవుడు సముద్రాన్నిదాటి
లంకా పట్టణంలోకి ప్రవేశించి బాణములను విడిచిపెడితే ఈ లంకా పట్టణమంతా రామ చంద్ర
మూర్తి యొక్క బాణ పరంపరలయందు కాలి ధ్వంసమైపోతూంది. ఈ లంక ఉండదు మీరు ఉండరు.
రావణుడు ఉండడు యోగి నోటి మాట ఎక్కడికి పోతూందండీ ఆయనన్నమాట సత్యమౌతుంది, సత్యాన్ని
ఆయన అనడం కాదు. నయమ్ అస్తి పురీ లంకా న యూయం న చ రావణః ! లంక ఉండదు మీరు
ఉండరు రావణుడుండడు. ఈ మాట చెప్పారు విన్నాడు రావణాసురుడు 80 వేల మంది కింకరులు మూక
మడిసిపోయారని జంబుమాలీ అని ప్రహస్తుడు ఆయన ప్రధాన మంత్రి, ఆ ప్రధాన మంత్రి కుమారుడైనటువంటి
జంబుమాలి పెద్ద పెద్ద కోరలతో ఉండేటటువంటి గొప్ప యోధుడు ఆయన్ని వెళ్ళి యుద్ధం
చేయమన్నాడు. ఆ జంబుమాలి వెంటనే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందాని ఎదురు
చూస్తున్నవాడిలా గాడిదలు పూంచిన రథమెక్కి హనుమ మీదికి యుద్ధానికి వచ్చాడు ఈలోగా
తోరణం మీద కూర్చుని మళ్ళీ చెప్తున్నారు ఆ మంత్రము
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
జయ త్యఽతి బలో రామో లక్ష్మణ శ్చ మహా బలః ! రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాఽభిపాలితః !!
దాసోఽహం కోసలేన్ద్రస్య రామ స్యాఽక్లిష్ట కర్మణః ! హనుమాన్ శత్రు సైన్యానాం
నిహన్తా మారుతాఽఽత్మజః !!
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్ ! శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ
సహస్రశః !!
అర్థయిత్వా పురీం
లంకా మఽభివాద్య చ మైథిలీమ్ ! సమృద్ధాఽర్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ !!
మళ్ళీ జయ మంత్రము చెప్తున్నారు. వచ్చారు
జంబుమాలి వచ్చి అర్ధ చంద్రాకార బాణములను ఆయన నుదిటికి తగిలేటట్టుగా కొట్టాడు, రక్తము
స్రవిస్తూంది హనుమ యొక్క శరీరంలోంచి చూసి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి పర్వత
సద్రుశమైన తన శరీరంతో కింద కొడుతూ తన అరిచేతులతో ఆ గాడిదల్ని కొట్టాడు, ఆ రథానికి
కట్టబడిన గాడిదలన్నీ కిందపడిపోయాయి ఆ సారథ పడిపోయాడు తస్య చైవ శిరో నాస్తి న
బాహూ న చ జానునీ ! న ధను ర్న రథో నాఽశ్వా స్తత్రాఽదృశ్యన్త న ఇషవః !! మహర్షి అంటారు తస్య చైవ శిరో నాస్తి
ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఇప్పటివరకూ కనపడినటువంటి రథంలో నిలబడినటువంటి జంబుమాలి
యొక్క తల కనపడలేదు తస్య చైవ శిరో నాస్తి న బాహూ భుజములు కనపడలేదు న చ
జానునీ మోకాళ్ళు కనపడలేదు, న రథః అక్కడ ఉన్నటువంటి రథం కనపడలేదు దాని
గాడిదలు కనపడలేదు అన్నిటికి బదులు ఆ మాంసపు ముద్ద కొద్దిగా ఆ నేలకు అంటుకుపోయి
కనపడింది. అరిచేత్తో కొడితే అలా కొడతారు. హనుమ యొక్క శక్తి అంటే హనుమ యొక్క
పరాక్రమంటే మహానుభావుడిది అలా ఉంటుంది. బుద్దిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా
! అజాడ్యం వాక్పుటుత్వం చ హనుమత్స్మ రుణాద్భవేత్ !! ఆయన్ని తలచుకున్నంత మాత్రం
చేత నిర్భయత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు జంబుమాలి మడిచిపోయాడు, మళ్ళీ వార్త
వెళ్ళింది, అయిపోయింది జంబుమాలి విషయం.
కాబట్టి ఇప్పుడు మళ్లీ కొత్తగా పంపించాలి ఈసారి రావణాసురుడిలో భయోద్విఘ్నత
పెరుగుతుంది. ఇప్పుడు ఆ వానరాన్ని చంపడం కాదు పట్టుకుంటే చాలు అంటున్నాడు అంటే
మొట్ట మొదటిసారి రావణాసురుని మనసులో ఏ ఆలోచన ప్రారంభమైంది. అంటే తానే వెళ్ళవలసిన
పరిస్థితి రాదుకదా..! వచ్చినది ఏ వానరము నిజంగా అది వానరమేనా ఒక వానరమునకు అంత
తేజస్సుంటుందా... అంత పరాక్రమం ఉంటుందా... ఇంత మందిని ఇంత స్వల్పకాలంలో చంపగలదా
ఇంతగా లంఘన శక్తితో ఎగురగలదా కాబట్టి ఏదో భూతం ఏ విష్ణుశక్తియో ఏ శివ శక్తియో కుబేర శక్తియో ఏదో వచ్చింది,
లంకా పట్టణానికి ఒక అయోమయావస్థ. ఒక భయానికి లోనై ఉన్నాడు భయమే మరణమునకు మొదటి
మెట్టు. కాబట్టి ఇప్పుడాయనా సామాన్యమైనవాళ్ళను పంపించడానికి వీలులేదు కాబట్టి
ఏడుగురు మంత్రి సుతుల్ని పిలిచాడు పిలిచి ఆ ఏడుగురూ కూడా చాలా గొప్ప పరాక్రమవంతులు
వాళ్ళను పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు ఏడుగురు మంత్రి సుతులు యుద్ధానికి
బయలుదేరారు వాళ్ళ వెనకాల అబ్బో చాలా పెద్ద సైన్యం అనుగమించింది. ఎంత సేపు
మహానుభావుడుకి ఎన్ని బాణములు వేసినా బాణములు అందకుండా మధ్యలో తిరుగుతున్నారు ఏదో
చుక్కబెట్టి పువ్వు గీస్తారే అలా అందకుండా వాటి మధ్య తిరిగారు ఆడుకున్నంత సేపు
ఆడుకున్నారు, మహర్షి అంటున్నారు తలే నాఽభ్యహనత్ కాంశ్చిత్
పాదైః కాంశ్చిత్ పరంతపః ! ముష్టినాఽభ్యహనత్ కాంశ్చిన్ నఖైః కాంశ్చి ద్వ్యదారయత్ !! కొంత మందిని కొన్ని వేల మందిని ఏక కాలంలో తన
బలమైనటువంటి గోళ్ళతో గుండెలు చీల్చి చంపేశాడు చాలా మందిని తన యొక్క దంతములతో
కొరికి చంపేశాడు, చాలా మందిని తన వక్షస్థలంతో కుమ్మి చంపేశాడు కొంత మందిని తన
మోచేతులతో పొడిచి చంపేశాడు. కొంత మందిని తన అరచేతులతో మర్థించి చంపేశాడు ఇంక కొంత
మందిని తన పాదములు కిందపెట్టి తొక్కి చంపేశాడు మోకాళ్ళతో పొడిచి చంపేశాడు.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
ఇంతమంది వచ్చారు
అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు అంత మందినీ చంపేశారు పైగా ఆయనా ఒక్కసారి కేచి
త్తస్య నినాదేన తత్రైవ పతితా భూవి ఆయన తొడలు చరిచి మహానాధం చేస్తే ఆకాశంలో
ఎగిరిపోతున్న పక్షులు కూడా గుండెలు బద్ధలై కిందపడిపోయాయి. ఆ వచ్చినటువంటి సైన్యంలో
కొన్నివేల మంది యొక్క గుండెలు పగిలిపోయి కేవలము ఆ శబ్దానికి ముక్కల్లోంచి
చెవుల్లోంచి నెత్తురు కారి కిందపడి మరణించారు ఏడుగురు మంత్రి సుతులు ఆయనతో కలిసి
వెళ్ళినటువంటి కొన్నివేల సైన్యము నశించిపోయిందన్నారు. మళ్ళీ విన్నాడు ఆశ్చర్యపోయాడు
ఏమిటి ఈ శక్తి నేను ఇతఃపూర్వం ఎక్కడా వినలేదు ఐదుగురు సేనాగ్రనాయకుల్ని పిలిచాడు
అందులో ఒక్కనాయకుడు వెళ్ళిత్తే చాలు అంతటి పురుషపరాక్రమము కలిగినవాళ్ళు స
విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం ! ప్రఘసం భాసకర్ణం చ పంచ సేనాఽగ్ర నాయకాన్ !! అని విరూపాక్ష యూపాక్షౌ విరూపాక్షుడు
యూపాక్షుడు దుర్దరం ప్రహసం భాసకర్ణం అని ఐదుగురు ఈ ఐదుగుర్ని యుద్ధానికి
పంపించాడు. ఆ ఐదుగురు రథాలెక్కారు యుద్ధానికొచ్చారు అబ్బో ఐదుగురు చుట్టుముట్టారు
హనుమని భుజముల మీద బాణాలేశారు వక్ష స్థలముల మీద బాణాలేశారు ఆయన తలమీద బాణాలు
వేశారు ప్రవాహములతో కూడిన కొండా అన్నట్లుగా నెత్తుటితో తడిసి ఉన్నారు ఆయన కన్నులు
కూడా నెత్తుటితో తడిసిపోయాయట.
హనుమకి ఆగ్రహమొచ్చింది వీళ్ళనిక ఉపేక్షించకూడదు అనుకున్నాడు ఒక్కసారి భీమ
సంకాసమైన రూపంతో ఆకాశంలోకి ఎగిరారు ఎగిరి అక్కడ్నుంచి ఒక్కసారి అత్యంత వేగంతో
కిందపడ్డారు కింద పడుతూ పడుతూ తన అరచేతులతో గుఱ్ఱాలనీ ఆ రథాలని ఆ రథాన్ని
నడుపుతున్న సారథిని నడుపుతూ యుద్ధం చేస్తున్నటువంటివాన్ని కలిపి దెబ్బతగిలేటట్టుగా
కొట్టారు అంతే అలా కొట్టేటప్పటికి విహాయ న్యపత ద్భూమౌ దుర్ధర స్త్యక్త జీవితః ఆ
దెబ్బకి దుర్దరుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు మాంసపు ముద్దైపోయి కిందపడిపోయాడు
అక్కడున్న సైన్యమంతా మరణించింది. మిగిలిన నలుగురు ఇద్దరు ఒకవైపు ఇద్దరు ఒకవైపు
నిబడి హనుమతో యుద్ధం చేస్తున్నారు పైగా ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి యుద్ధం మొదలు
పెట్టారు, వెంటనే ఆయనా స సాల వృక్షమ్ ఆసాద్య సముత్పాట్య చ వానరః ! తా వుభౌ
రాక్షసౌ వీరౌ జఘాన పవనాఽత్మజః !! ఒక పేద్ద సాలవృక్షాన్ని ఒకదాన్ని అవలీలగా
పెరికారు పెరికి చేత్తో పట్టుకుని ఆకాశంలోకి వెళ్ళి ఆ ధనస్సు ఎక్కుపెట్టి బాణాలను
ప్రయోగం చేసేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని ఒక్కసారి ఆ సాల వృక్షాన్ని గిర గిరా
తిప్పి కొట్టారు. అంతే రథాలతో సహా మడిసిపోయి పైనుంచి కిందపడిపోయారు ఇద్దరూ మరణించి
కింద పడ్డారు మిగిలినటువంటివాళ్ళు స విరూపాక్ష యూపాక్షౌ ప్రఘసం బాసకర్ణం
ప్రఘసుడు భాసకర్ణడు మిగిలారు వాళ్ళు యుద్దానికి వచ్చారు వెంటనే స్వామి చూశారు సముత్పాట్య
గిరే శ్శృంగం సమృగ వ్యాప పాదపమ్ అంటారు మహర్షి, పెద్ద పులులు సింహాలు పాములు
ఇలాంటివాటి అన్నిటితో కూడుకున్నటువంటి ఒక పెద్ద పర్వతం ఆ శిఖరాలకి గుహలున్నాయి ఆ
గహలలో క్రూర మృగాలున్నాయి ఆ పర్వతం నిండా పుట్టలున్నాయి పుట్టల నిండా పాములున్నాయి
అటువంటి పర్వతాన్ని ఒకదాన్ని తన చేతితో పైకెత్తారు సముత్పాట్య గిరే శ్శృంగం
సమృగ వ్యాప పాదపమ్ ! జఘాన హనుమాన్ వీరో రాక్షసౌ కపి కుంజరః !! ఆ పర్వతాన్ని
వాళ్ళిద్దరి మీద పడేశాడు, ఆ పర్వతం కింద పడిపోయి వాళ్ళిద్దరూ మరణించారు.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
అపారమైన శక్తండి
మీకు నేను కిష్కింధ కాండ ప్రారంభంలో చెప్పాను హనుమ యొక్క శక్తి అంటే ఎలా వచ్చిందో
దేవతలందరూ ధార పోసేశారు ఆయనకి వాళ్ళ శక్తుల్ని రామ కార్యంలో ఉపకరించగలిగినటువంటి
ఒక గొప్ప ప్రాణి సృజింపబడాలని, కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన రాక్షసులు చెప్పారు
ఒక్కసారి మళ్ళీ ఎగిరి పైకెక్కి కూర్చున్నారు హనుమా తోరణం మీద కింద చూస్తే యుద్ధం
ప్రారంభమై ఎంతసేపయ్యింది. గట్టిగా పదిహేడు నిమిషాలు అవ్వలేదు మహర్షి అంటారు హతై
ర్నాగై శ్చ తురగై ర్భగ్నాఽక్షై శ్చ మహా రథైః ! హతై శ్చ రాక్షసై ర్భూమి
రుద్ధ మార్గా సమన్తతః !! తొండాలు తెగిపోయినటువంటి ఏనుగులు కుంభ స్తలాలు బద్ధలైపోయినటువంటి ఏనుగులు
పొట్టలు చీలుకుపోయినటువంటి గుఱ్ఱాలు నెలకొరిగిపోయినటువంటి రథాలు
ముద్దలైపోయినటువంటి శవాలు నెత్తురు కాల్వల కింద ప్రవహిస్తూంది నురగలతోటి ఎక్కడలేని
గ్రద్ధలూ రాబందులూ అన్నీ ఒక్కసారి అశోకవనమంతా వచ్చేశాయి అమంగళ కరంగా పీనుగుల
ముద్దలతో ఆశోక వనమంతా నిండిపోయింది అంత గొప్ప యుద్ధం చేశారు. ఆఖరికి ఐదుగురు సేనాగ్రనాయకులు
కూడా మరణించారు అన్నారు మళ్ళీ రావణాసురునికి వార్త వెళ్ళింది.
కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద చాలా
దిగులుపడ్డాడు ఈసారి సైన్యాగ్రనాయకుల్ని మంత్రుల సుతుల్నీ కింకరుల మూకల్నీ ప్రధాన మంత్రి కొడుకునీ ఇటువంటి
వాళ్ళని పంపిస్తే లాభంలేదు చాలా గొప్పవాన్ని ఎవర్నో పంపించాలి అటూ ఇటూ చూశాడు తన
కొడుకు మీదే పడింది దృష్టి, “అక్ష కుమారుడు” రావణ ప్రవృత్తీ అంటే ఏమిటో
తెలుసాండీ..! తాను పట్టిన పట్టుకు అవసరమైతే తన బిడ్డలే చచిపోయినా ఫర్వాలేదు
పట్టించుకోడు అవసరమైతే తన బిడ్డలే పోనీ తన రాజ్యమే పోనీ తన మూర్ఖత్వమే తనది అంతే.
ఇదే మాట మీరు యుద్ధకాండలో విందురుకానీ ఆఖర్నా రావణాసురుడు పడి మరణించిన తరువాత
మండోదరి యుద్ధభూమిలోకి వస్తూంది అందరు అనుకున్నారు రామున్ని నిందిస్తుందనుకున్నారు
ఆవిడ వచ్చి అందీ ఆయనేం చేశాడు మహానుభావుడు ఆయన కాదు నిన్ను చంపింది నీ ఇంద్రియాలు
నిన్ను చంపేశాయ్ అంది. కాబట్టి రావణాసురుడు అంటే అంతటి మూర్కత్వానికి పరాకాష్ఠ
కాబట్టి ఆయన కొడుకులే చచ్చిపోయినా ఆయనకు పట్టింపులేదు. అక్ష కుమారుని వంక చూశాడు ఆ
పిల్లవాడు వెంటనే లేచాడు మహర్షి అంటారూ యజ్ఞంలో అగ్నిజ్వాల పైకి లేస్తుండగా
అందులోకి అజ్యాధార పోశారనుకోండి ఒక్కసారి జ్వాల లేస్తుంది.
అసలు ఆ యజ్ఞం చేయడం ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ ఎలాపడితే అలా చేయకూడదు,
అసలు భోగవస్తువు ఉండగా తనదీ అదులోకి అదేపనిగా హవిస్సు వేసేస్తే నేత్రములుండవు
ఉత్తర జన్మలో అందులో జ్వాల ఉండాలి జ్వాల ఉంటేనే వెయ్యాలి ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం
చేసేటప్పుడు మంత్రం చెప్పేవాళ్ళు చెరువు అంటారు చెరువువంటే
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
హవిస్సు మంత్రం
చెప్పేవాళ్ళు హవిస్సు ఇచ్చేటటువంటివాళ్ళు, ఆజ్యం ఆజ్యమంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు ఈ
ముగ్గురిదీ ఏకీ కృతమవ్వాలి ఒక్కటిగా నిలబడాలి. వాళ్ళూ నమో నారాయణ స్వాహాః అనేటప్పటికి ఈయ్యన ఆజ్యం
వెయ్యాలి ఆయన
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
చెరువు వెయ్యాలి ఎందుకంటే హవిశ్యష్యం ఆ పదార్థం
వెయ్యాలి ఏక కాలంలో స్వాహాకారము ఇదీ కూడా
పడిపోవాలి మీకు చాలా చోట్ల మనం చూస్తూంటాం ఆయన స్వాహాః అని చెప్పేస్తుంటాడు, ఏదో
నమో నారాయనాయ స్వాహాః కుబేరాయ స్వాహాః ఇంద్రాయ స్వాహాః ఓఁ...హ్ దేవతలపేర్లు చెప్తారు
మీరు సమంత్రకంగా దేవతల పేర్లు చెప్తే వాళ్ళు వాళ్ళు వచ్చి చెయ్యి చాపుతారు ఏదీ
హవిశ్యేది నెయ్యేది దేవతల్ని అవమానించినట్టు స్వాహాకారాన్ని చెప్పినప్పుడు
మంత్రాన్ని అందుకుని హవిస్సు ఇచ్చేవాళ్ళని పెట్టుకోవాలి పెట్టుకుని యజ్ఞం చెయ్యాలి
హోమం చెయ్యాలి అంతేకానీ... హోమం చేశామంటే చేశామని చేయకూడుదు ఎప్పుడూ... జ్వాల
చూసుకుంటూండాలి ఈ జ్వాలను రగులుతుండాలి “సుక్రుతంబయ్యే శిఖులున్ కళ్యాన
మిక్కాలమున్” అంటారు పోతనగారు, ఆ అగ్ని జ్వాల ఎంత లేస్తే అంత మంగళ కరము
అగ్నిజ్వాల ఒక్కసారి పైకిలేచి కిందికి దింగిందనుకోండి అమంగళ కరము ఏదో
అశుభమొస్తూందని నిమిత్తము మీకు నేను బాల కాండలో చెప్పాను దీనుగురించి రాక్షసులు
వచ్చే ముందు అగ్నహోత్రము ఒక్కసారి పైకిలేచి కిందకి దిగుతుంది. శ్రీరామాయణంలో
చెప్పనివిషయాలేముండవు శ్రీరామాయణంలో సమస్తమూ చెప్తారు. కాబట్టి ఇప్పుడు
ఆజ్యధారవేస్తే అగ్నిహోత్రంలో అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తుందో అలా లేచాడు అక్ష కుమారుడు
లేచి రథాన్ని పూంచుకుని హనుమ మీదికి వచ్చారు, చిన్న పిల్లవాడు ఆయనేం పెద్ద
వయస్సునవాడుకాడు హనుమతో యుద్ధం చేస్తున్నాడు ఎంత గురి చూసి లక్ష్యాన్ని కొట్టవచ్చో
అంత గురి చూసి బాణ ప్రయోగం చేస్తున్నాడు ఇప్పుడు ఆ పిల్లవాడు లాఘవంతో వేసేటటువంటి
బాణములకు చిక్కకుండా బాణముల మధ్యలో హనుమ తిరుగుతున్నాడు తిరుగుతూ తిరుగుతూ వచ్చి
ఒక్కసారి ఆయన రథాన్నంతటినీ తన అరచేత్తో కొట్టారు ఇప్పటి వరకు హనుమ అరిచేత్తో
కొడితే తప్పుకున్నవాడులేడు దాంతోపాటే మరణించారు కాని అక్ష కుమారుడు మాత్రం
రథంలోంచి తప్పుకుని అంతేవేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు.
హనుమ కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళాడు ఆయన ఈయ్యన్ని గురి చూసి బాణాలు
వేస్తున్నారు ఆయనకు సంతోషంగా ఉంది చిన్న పిల్లవాడు ఎంతగొప్ప యుద్ధం చేస్తున్నాడని
కానీ ఏదో రామ రాయల వారి గురించి చెప్తూ... ఓ మాట అంటారు “ముదుసలి ఇంటి దీపమునే ముద్దెడు
మూర్ఖుడు కాడా” అని, మా ఇంటి దీపమే కదా ఎంతబాగా వెలుగుతోందోని
ముద్దుపెట్టుకుంటే మూతి కాలిపోతుంది అలా సూర్యుడు ఉదయిస్తూంటే బాగుంది కదాని
కూర్చుంటే సూర్యుడు ప్రకాశించి మధ్యాందిన మార్తాండుడైతే ఆరోగ్యం చెడిపోతుంది
అప్పుడు తిరగకూడదు కదా వడదెబ్బ కొడుతుంది కాబట్టి పిల్లవాడు బాగా యుద్ధం
చేస్తున్నాడు కదాని చూస్తూ ఊరుకుంటే వీడు ప్రతాపాన్ని పుంజుకుని నన్నే
నిగ్రహిస్తాడో ఏమో కాబట్టి ఉపేక్షించ కూడదు అనుకున్నారు. ఒక్కసారి అత్యంత వేగంతో ఈ
అక్ష కుమారిడి కింద నుంచి వెడుతూ ఆయన రెండు కాళ్ళూ ఇలా పట్టుకున్నారు పాదాలు,
పట్టుకుని ఇలా కిందకి లాగితే తల కిందకొచ్చి ఆయన కాళ్ళు చేతిలోకి వచ్చాయి అంతే ఇక
మళ్ళీ ధనస్సు పట్టుకుని బాణాల్ని గురిచూసే అవకాశం ఇవ్వలేదు గిర గిర గిర గిర బట్ట
తిప్పినట్టు తిప్పేశారు తిప్పేస్తేమిటంటే గాలికి ఎగిరిపోయాయి వేగానికి ఆ తరువాత
తిప్పి నెలకేసి కొడుతుంటే మహర్షి శాత్విక ప్రత్యక్ష ప్రచారం చేస్తాడు, ఆసలు
నిజానికి ఎంత భయానకంగా కొట్టారో స భగ్న బాహూ రు కటీ శిరో ధరః ఆ దెబ్బ ఇలా
తగిలితే తల బద్దలైపోయి ఇక అందులో గుర్తు పట్టడానికేంలేదు ముక్కలైపోయి
ఎగిరిపోయింది.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
శుక్రవారం దిగ
దుడిచి కొట్టిన కొబ్బరి కాయలాగ ఆతరువాత బాహు భుజములు ఎగిరిపోయాయి కటీ
నడుము ఎగిరిపోయింది ఉధరః కడుపు చెదిరిపోయింది. ఇలా కొట్టేసి కొట్టేసిన
తరువాత రెండు పాదాలు ఆయన చేతిలో ఉన్నాయి విసిరి అవతల పాడేశారు అంతే ఎగిరిపోయాడు స
భగ్న బాహూ కటీ శిరో ధరః క్షరన్నఽసృన్ నిర్మిథితాఽస్థి లోచనః స భిన్న
సంధిః ప్రవికీర్ణ బన్ధనో హతః క్షితౌ వాయు సుతేన రాక్షసః ! ఆ అక్ష కుమారున్ని అలా సంహరించారు. మొట్టమొదటి సారి జీవితంలో రావణాసురినికి
తనవారన్నవారు చచ్చిపోవడమంటే బాధలెలా ఉంటుందో అర్థమైంది. ఇప్పటి వరకూ అందర్నీ చంపడం
అందర్నీ బాధపెట్టడం తెలుసు, తనదాకా ఆ బాధవచ్చేవరకు బాధంటే ఏమిటో అర్థమయ్యింది,
ఇప్పుడు అర్థమైనవాడు మారే అవకాశం పొందాలి అంటే రావణాసురుడికి మాట చెప్పేముందు ఆయన
మనసుని ఎంత అత్యవసాయంతో సిద్ధం చేయడానికి అవకాశముంటుందో అంత సిద్ధం చేసి ప్రయత్నం
చేస్తున్నారు హనుమ అయినా వాడి తలకెక్కలేదు అదే విచిత్రం. ఇప్పుడు ఇంద్రజిత్తు వంక
చూశాడు చూసి అన్నాడు నిన్ను నేను పంప కూడదు 48వ సర్గ ఈ సర్గ పారాయణ చేస్తే ఎలినాటి
శని దోశం కూడా ఉపశమిస్తుంది. కాబట్టి ఆ ఇంద్ర జిత్తు వంక చూసి అన్నాడు నీవు
యుద్ధానికి బయలుదేరి వెళ్ళవలసింది నిన్ను నేను యుద్ధానికి పంప కూడదు కానీ నీవు
చిన్నవాడివి ఇంక నేనే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది అది సామాన్య వానరం కాదు
అసలు దాన్ని చంపడం కాదు అసలు దాని వేగాన్ని ముందు నిగ్రహించి పట్టుకోవాలి నీవు
నీకు వచ్చినటువంటి అస్త్ర విద్యల మంత్రములన్నీ బాగా ఆమ్నాయం చేస్తూ వెళ్ళు
బ్రహ్మాస్త్రన్ని బాగా స్మరించు బ్రహ్మాస్త్రము ప్రయోగం చేసి ఆ వానరము వేగాన్ని
తగ్గించి పట్టుకో పట్టుకుని తీసుకరా.
అవద్యుడు ఆయనని చంపడం అంత తేలిక కాదని నాకు
అర్థమౌతూంది, ఎందుకంటే నేను చూసి ఇప్పటివరకు ఏ వానరమునందు వేగము అంత గమన శక్తి అంత
లాఘవము నేను ఎరుగను వాయువుతో గరుత్మంతునితో సమానవేగముతో ఉన్నాడు ఈ వారుడు అన్నాడు.
అన్న తరువాత ఇంద్రజిత్తు బయలుదేరాడు ఉత్తర కాండలో అగస్త్య మహర్షి రామ చంద్ర మూర్తి
దగ్గరికెళ్ళి మాట్లాడుతుంటే రామ చంద్ర మూర్తి అడిగారు రావణుడికి ఇంత పరాక్రమము
ఎక్కడదని అగస్త్య మహర్షి అన్నారు రావణుడు కాదు ప్రమాదకారి అంత కన్నా ప్రమాదకారి
ఇంద్రజిత్ అని చెప్పాడు. నిజంగా మీరు ఉత్తర కాండలో ఇంద్రజిత్ గురించి చదివితే ఎదర
యుద్ధ కాండ వస్తూందిగా యుద్ధ కాండలో ఇంద్రజిత్ గురించి చదివితే ఇంద్రజిత్
యుద్ధంచేసినంత సేపు మనం ఎంత బెంగపెట్టుకుంటామో తెలుసాండీ! అసలు రావణ సంహారం
అవుతుందాని బెంగపెట్టుకుంటాము ఒక స్థితిలో అయితే మొదటి సారి యుద్ధకాండ అంటే మొట్ట
మొదటిసారి జీవితంలో రామాయణం చదవడమైతే ఇంద్రజిత్ యుద్ధం చదువుతుంటే అసలు రాముడు
గెలుస్తాడా అని అనుమానం వస్తూంది.
ఎందుచేతా అంటే ఒకానొకప్పుడు రావణాసురుడు ఇంద్రునితో యుద్ధం చేయలేకా యుద్ధ
భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంద్రజిత్
మేఘనాతుడని పేరు మేఘాలను సృష్టించి మాయతో ఇంద్రున్ని పట్టుకున్నాడు పట్టుకుని
బంధించి తండ్రినొచ్చి నిద్రలేపాడు నాన్నా ఇంద్రున్ని పట్టుకున్నాను రా
ఇంటికెళ్ళిపోదామన్నాడు. తీసుకెళ్ళి కారాగారంలో పాడేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు
వచ్చారు విడిపించకోవడానికి లంకా పట్టణానికి వచ్చి పాకశాసనుడయ్యా ఇంద్రున్ని
విడిచిపెట్టు అన్నారు అంటే ఆయన అన్నారు ఇంద్రున్ని విడిచిపెడితే నాకేమిస్తావన్నాడు
నీకేం కావాలో అడుగు అన్నాడు నాకు అమృత్యువునై అంటే మరణించకుండా వరమివ్వాలి
అన్నాడు. సమస్త భూతములు మరణిస్తాయి ఆ వరం ఎలా కుదురుతుంది ఇంకొక మాట అడుగు నేను
యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక హోమం చేసి బయలుదేరుతాను ఆ హోమాన్ని పూర్తిచేసి నేను
వెడితే నేను ఎవ్వరికీ కనపడకూడదు నాకు అపజయం అన్నది ఉండకూడదు ఇక ఎవర్నైనా తెగటార్చగలగాలి,
నేను ఎప్పుడైనా ఆ హోమాన్ని పూర్తి చేయకుండా పీఠలనుంచి లేచిపోయి యుద్ధానికి వెడితే
ఆరోజే నాకు మరణం కలగాలి అలా వరం ఇవ్వన్నాడు ఇచ్చారు బ్రహ్మగారు.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
ఇచ్చి ఇంద్రున్ని
విడిపించుకున్నారు అందుకే ఇంద్రజిత్ అని బిరుదు ఆ ఇంద్రజిత్ ఎంత ఘోరాన్ని
సృష్టించాడో తెలుసాండి... ప్రారంభమౌతుంది కదా యుద్ధ కాండ మీరు విందురు కానీ ఒళ్ళు
గగుర్పొడుస్తూంది, జలధరిస్తుంది పులకరించదు, కొంత మంది జలధరింతకు పులకరింత
పులకరింతకు జలధరింత అంటారు ఆ శుభవార్త వినేటప్పటికి నా ఒళ్ళు జలధరించింది అంటూంటారు.
జలధరిస్తే భయం అసహ్యం పులకరిస్తే సంతోషం, పులకరింత పులకరింత కావాలి జలధరింత
జలధరింత కావాలి. మా ఆయన్ని చూస్తే నా ఒళ్ళు జలధరిస్తూంది అంటే అసహ్యంగా ఉంటుంది
అలా అనకూడదు, పులకరిస్తూంది అనాలి. పులకరింత ఎక్కడో జలధరింత ఎక్కడో మాటను
తెలుసుకుని ప్రయోగించాలి. కాబట్టి మన ఒళ్ళు జలధరిస్తుంది ఇంద్రజిత్ యొక్క
యుద్ధాన్ని వింటూంటే అటువంటి ఇంద్రజిత్ యుద్ధానికి బయలుదేరాడు. ఆయన రథానికి
కట్టబడేటటువంటివి ఆయన రథం ప్రాకృతమైనటువంటి నిర్మాణం కాదు అది యజ్ఞంలోంచి
బయకొచ్చినటువంటి రథం దానికి గుఱ్ఱాల్నీ కట్టరూ గాడిదల్నీ కట్టరు దానికి నాలుగు
సింహాలు లాగుతాయి ఆరథాన్ని అంటే ఆయన పరాక్రమం ఎటువంటిదో మీరు చూడండి ఇంద్రజిత్
అంటే నాకు నాలుగు సింహాములను పూంచినటువంటి రథముల మీద వచ్చాడు ఇంద్రజిత్ అంటే
రామాయణంలో గురిచూసి లక్ష్యాన్ని కొట్టాడంటే పడిపోవాల్సిందే అంత లక్ష్యసిద్ధి
కలిగినటువంటి మొనగాడు. అటువంటి ఇంద్ర జిత్తు ఒక్క బాణంతో కొడదామని చూశాడు బాణ
పరంపర కురిపించాడు మండలాకారంగా ధనస్సుతిప్పి ఇలా పట్టుకోవడం మానేసి ఇలా
పట్టుకుంటారు ఏక కాలమున అనేక బాణములు విడిచిపెడతారు.
ఇన్ని విడిచిపెట్టినా దొరకకుండా బాణాలకీ బాణాలకీ మధ్య గుండా తిరుగుతున్నారు
హనుమా! ఈ హరివీరుడి వేగాన్ని ముందు ఆపితే తప్పా ఈయన్ని పట్టుకోవడం కుదరదు ఈయన్ని
కొట్టలేము కాబట్టి ఈయన్ని ముందు అస్త్రము చేత బంధీంచాలి, అస్త్రము అంటే మంత్ర
శక్తి చేత ఉంటుంది. కాబట్టి ఈయన్ని పట్టుకోవాలంటే సామాన్యమైనటువంటి అస్త్రము
సరిపోదు బ్రహ్మాస్త్రము వేస్తానూ అనుకున్నాడు ఒక్కసారి బ్రహ్మాస్త్రమాన్ని
అభిమంత్రించి విడిచిపెట్టారు విడిచిపెడితే అది వచ్చి హనుమ యొక్క వేగాన్నంతటిని
తగ్గించి ఆయన్ని పట్టుకుంది. కానీ హనుమకి వరముంది ఒక గౌరవానికి బ్రహ్మగారు అంటే
మహానుభావుడు లోకములను సృష్టించిన పితామహుడు ఆయన యందు గౌరవముండాలి కదాండి ఇంటిపెద్దాయనంటే
ఆయన మీద గౌరవముండాలి అంతే గాని ఆయన్నంటే మాత్రం ఎందుకందాండి అంటే ఇంకేంటి ఆ గౌరవం
కాబట్టి ఆయన కొంచెం సేపు కట్టుబడ్డట్టు కట్టుబడ్డాడు కానీ ఆయన్నేం కట్టుబడలే
వదిలిపెట్టేసింది బ్రహ్మాస్త్రం కానీ తతః స్వాయమ్భువై ర్మన్త్రైర్బ్రహ్మాఽస్త్ర మఽభిమన్త్రితమ్ !
హనూమాం
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
శ్చిన్తయా మాస వర దానం పితామహాత్ !! బ్రహ్మగారి వరముంది ఈ బ్రహ్మాస్త్రం నన్నేం
చేయదు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఒక్కసారి కింద పడ్డారో అంతే చాలని
ఆ రాక్షసులందరూ గబగబా పరుగెత్తుకొచ్చారు.
తాళ్ళు కనపడితే తాళ్ళు తప్పెట్లు కనపడితే
తప్పెట్లు గుడ్డలు కనపడితే గుడ్డలు అన్నిటితో ఆయన్ని కట్టేశారు స బద్ధ స్తేన
వల్కేన విముక్తోఽస్త్రేణ వీర్యవాన్ ! అస్త్ర బన్ధః స చాఽన్యం హి న బన్ధమ్
అనువర్తతే !! బ్రహ్మాస్త్రానికి
ఒక గౌరవముంటుంది, బ్రహ్మాస్త్రానికి కట్టుబడినవాడిని ఇంకో అస్త్రంతో కట్టారనుకోండి
బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది, బ్రహ్మాస్త్రం వదిలేసిందనుకోండి ఇంక మళ్ళీ సూర్యోదయం
వరకు ఇంకో అస్త్రం కట్టదు. కాబట్టి ఆయన తలచుకుంటే ఆరోజే లంకా పట్టణాన్నంతటిని
సముద్రంలో ముంచేయగలడు ఎందుకంటే ఏ అస్త్రం కట్టలేదు ఆయన్ని ఇంద్రజిత్ చూశాడు ఈ
విషయాన్ని అహో మహత్ కర్మ కృతం నిరఽర్థకం న రాక్షసై
ర్మస్త్ర గతి ర్విమృష్టా పున శ్చ నాఽస్త్రే విహతేఽస్త్రమ్ అన్యత్
ప్రవర్తతే సంశయితాః స్మ సర్వే ! ఇప్పుడు నేను మళ్ళీ బ్రహ్మాస్త్రం వేయడం కుదరదు ఇంకొక ఏ అస్త్రం వేసినా
పట్టుకోదు ఇంక సూర్యోదయం వరకు ఈ హరివీరున్ని ఆపడం సాధ్యంకాదు ఎంత పని
చేశార్రావీళ్ళూ బట్టలతో తాళ్ళతో ఆయన్ని కట్టారు లేనిపోని ప్రమాదాన్ని తీసుకొచ్చారు
అనుకున్నారు. ఆయననుకున్నారు మనసులో సరే ఎంత సేపు యుద్ధం చేస్తాను చూడాలి కదా
పదితలల పురుగుని ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా సరే చూద్దామనుకున్నారు. ఈయన్ని
పట్టుకున్నారు కర్రలతో కొడుతున్నారు ఈడ్చుకుంటూ రావణుని యొక్క సభామంటపంలోకి
తీసుకెళ్ళారు. హనుమ రావణున్ని చూశారూ... నిద్రపోతూండగా చూశారూ అశోక వనానికి
వచ్చినప్పుడు చూశారు ఇప్పుడు పది తలలతో ఇరవై చేతులతో దొంగలబారు వెడుతున్నటువంటి
నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా తెల్లటి బట్ట కట్టుకుని, విశేషమైన విలువున్నటువటి వస్త్రం
కట్టుకుని ముత్యాల హారాలు వేసుకుని స్పటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైన
ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురున్ని చూశారు.
హనుమను చూసి అంటారు అహో ధైర్య మఽహో ద్యుతిః ఏమిటీ ఈ రావణాసురున్ని చూస్తే ఎంత కాంతితో
ఉన్నాడు ఎంత ధైర్యంతో ఉన్నాడు నిజంగా ఈయ్యన దగ్గరకానీ పరధారాపహరణం అనేటటువంటి ఒక్క
పాపం లేకపోతే ఈయ్యన ఇంద్ర పదవిని అలంకరించి మూడు లోకములను ఏల గలిగినటువంటివాడు
కానీ మహా పాతకము ఏది చేయ్యకూడదో అది చేశాడు. మహా పతివ్రయైనటువంటి సీతమ్మ తల్లిని
అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, పాపం కదా ఈయ్యన కొంప ముంచేస్తూంది ఎప్పుడైనా విచక్షణ
కలిగినటువంటివారు అవతలి వారిలో ఉండేటటువంటి తెజస్సును గుర్తించి మాట్లాడుతారు.
పక్ష పాతంలో సంకుచితత్వంతో ఉండేటటువంటివారు అవతలివారి యొక్క వైభవాన్ని
గుర్తించలేరు శంకా హృతాఽఽత్మా దధ్యౌ స కపీంద్రం తేజసా వృతం ! కిమేష భగవా
న్నందీ భవే త్సాక్షా దిహాఽఽగతః ! యేన శప్తోఽస్మి కైలాసే మయా
సంచాలితే పురా !! రావణుడు అనుకుంటున్నాడు శంకా హృతాఽఽత్మా దధ్యౌ స
కపీంద్రం తేజసా వృతం ఎప్పుడూ ఒక వానరుడు ఇంత తేజస్సుతో ఉండడం చూడలేదు, ఏమి ఈ వానరము ఇంత తేజస్సుగా
ఉంది ఒకనాడు నేను ఆ కైలాస పర్వతం మీద వెళ్ళినప్పుడు నందీశ్వరుడు నాకు వానరములు
వచ్చి లంకా పట్టాణాన్ని నాశింప చేస్తాయని శపించాడు ఆ నందీశ్వడే వచ్చాడా
అనుకున్నాడు.
ఈ రహస్యాన్ని ఉత్తర కాండలో చెప్పారు పుప్పక విమానం మీద కైలాస పర్వతం మీద
వెళ్ళిపోతున్నాడు రావణుడు కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు ఆ విమానం
వెళ్ళలేదు ఆగిపోయింది ఎందుకు విమానం వెళ్ళలేదని అడిగాడు కింద పార్వతీ పరమేశ్వరులు
ఉన్నారూ వెళ్ళదూ అన్నారు అంటే ఆయనన్నారూ పరమేశ్వరునికి బుద్ధుండక్కరలేదా రావణుడు
వెళ్తున్నాడని తెలియదా అన్నాడు అంత అహంకారము అని కిందకి దికి కైలాస పర్వతం మీదికి
ఎవరు పరమేశ్వరుడు నేను
చూడాలని అన్నాడు నేను వెళ్తూంటే ఎందుకు నాట్యం చేస్తున్నాడు అని అడిగాడు
నందీశ్వరుడు చూసి అన్నాడు ఆయన వరకు ఎందుకురా నేను ఆయన కింకరున్ని నేను ఆయన
వాహనాన్ని ఇంత అధిక్షేపించి మాట్లాడుతున్నావ్ ఎవరు నీవు అని అడిగాడు, నేను
రావణున్ని నీకు తెలియదా అని నందీశ్వరుడు పొట్టిగా ఉంటాడాయన ఆయన్ని చూసి కోతి
ముఖంతో ఉన్నావన్నటుగా నవ్వాడు. ఆ పరిహాసం చూసి నందీశ్వరుడన్నాడు నిన్ను ఏ కోతి
మొఖమని నన్ను చూసి నవ్వావో ఆ కోతులే వచ్చి నీ లంకాపట్టణాన్నంతటిని నశింపజేస్తాయి
నీ ఆయుర్ధాయాన్ని నశింపజేస్తాయి అన్నాడు. వేంటనే దేవతలు పుష్పవృష్టిని కురిపించారు
నందీశ్వరుని మీద నందీశ్వరుని యొక్క శాపానికి ఈ రావణాసురుని లంకని వానరములు
నశింపజేస్తాయి అప్పుడు సంతోషించారు, ఈ రావణాసురుడు కైలాస పర్వతాన్ని పరమ శివుడు
తనకు దర్శనం ఇవ్వలేదన్న కోపంతో కదిపేశాడు భుజములు ఆయనకి పది తలకాయలు ఇరవై చేతులు
కదాండీ ఇరవై చేతులూ కింద పెట్టి కదిపాడు కదిపితే పరమేశ్వరునికి ఆగ్రహం వచ్చింది,
ఆగ్రహమొచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడన్న కోపంతో ఒకసారి తన బొటనవేలితో
నొక్కాడు నొక్కితే ఇరవై చేతులూ కైలాసం కింద ఉండిపోయాయి.
ఒక సంవత్సరం పాటు అలా ఉండిపోయాడు ఉండిపోయి పేద్ద
రవం చేస్తున్నాడు ఆ రవానికి సముద్రములు పూర్ణిల్లాయి ఎక్కడా ఏమిట్రా ఈ అల్లరి మూడు
లోకాలలో ఉన్నవాళ్ళు దేవేంద్రుడితో సహా ఉలిక్కిపడ్డారు అంత పెద్ద అరుపు అరిచాడు.
మంత్రులన్నారు అరిస్తే ఏమొస్తుందిరా సామవేద మంత్రాలతో స్తోత్రం చేయి పరమేశ్వరున్ని
ఆయన అనుగ్రహించి బొటనవేలు తీస్తాడు అన్నారు. అప్పుడు సామ మంత్రములతో ఉపాసన చేశాడు
పరమేశ్వరుడువ వచ్చి దర్శనమిచ్చి బొటనవేలు తీసేశాడు. ఒరేయ్ ఇంత ఏడుపేడ్చావు ఇంత
కేకలు వేశావు కాబట్టి ఇంత రవాన్ని సృష్టించావు కాబట్టే నిన్ను “రావణా” అని
పిలుస్తున్నానన్నాడు. ఆయనకి ఆ పేరు నచ్చింది ఆయన పేరు “దశగ్రీవుడు” రావణా అని పేరు
పెట్టుకున్నాడు. అందరూ బాధపడి అంత పెద్ద పేరు పెట్టుకున్నారు కాబట్టి అంత అరుపు
అరిచానని ఆయనకేం సిగ్గులేదు ఆ రావణా అన్న పేరుతో ఉన్నాడు అప్పుడు పరమేశ్వరుడు
మెచ్చుకుని ఆయనకు గొప్ప ఖడ్గాన్ని ఇచ్చాడు నీవు ఏనాడు దాన్ని అనుమానిస్తావో ఆనాడు
తిరిగి వచ్చేస్తుంది అన్నాడు.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి
నందీశ్వరుడు ఆనాడు నన్ను శపించాడు ఆ నందీశ్వరుడు కానీ రాలేదు కదా... అనుకున్నాడు. కిమేష
భగవా న్నందీ భవే త్సాక్షా దిహాఽఽగతః ! యేన శప్తోఽస్మి కైలసే మయా
సంచాలితే పురా !! ఆనాడు నేను కైలాసాన్ని కదిపినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు కాదు కదాని మనసులో
తలపోసుకున్నాడు, కాని ఏనాడు అనుమానం వచ్చిందో ఆనాడే చచ్చిపోయినవాడితో సమానం
ఇప్పుడు హనుమ మాత్రం అహో రూప మఽహో ధైర్య మఽహో సత్త్వ మఽహో ద్యుతిః ! అహో
రాక్షస రాజస్య సర్వ లక్షణ యుక్తతా !! అంటారు. ఏమి ధైర్యము ఏమి పరాక్రమము ఏమి కాంతి
ఏమి తపఃశక్తి రావణునిది ఈ పాపం చేయకపోయి ఉంటే ఎంత గొప్ప స్థితిని పొందవలసినవాడో
అని అనుకున్నారు. తాను తిన్నగా హనుమతో మాట్లాడటం తనకు అవమానమనీ ఆయనతో మాట్లాడకుండా
ప్రహస్తుడి వంక తిరిగాడు ప్రధానమంత్రివంక తిరిగి ప్రహస్తుడుతో అన్నాడు ఎక్కడ నుంచి
వచ్చింది, ఊరుపేరు ఏమిటి ఇల్లేమిటి ఏ రాజ్యం నుంచి వచ్చింది, ఎందుకొచ్చింది ఎందుకు
అశోకవనాన్ని పాడు చేసింది కనుక్కో అన్నాడు. ఆ ప్రహస్తుడన్నాడు మా ప్రభువు చాలా
ఉదారుడు నీవు భయపడకు నీ ప్రాణములు నిలబడుతాయి నీవు మళ్ళీ సంతోషంగా వెళ్ళిపోవచ్చు
నిజం చెప్పు నీవు ఎవరి దూతవి ఎవరి కొరకని వచ్చావు ఎందుకు అశోకవనాన్ని ధ్వంచేశావు మా
ప్రభువుకి ఇష్టమైన ప్రమదావనాన్ని ఎందుకు పాడు చేశావ్? సీతమ్మతో ఏం మాట్లాడావ్?
ఉన్నది ఉన్నట్లు చెప్పు అన్నాడు.
అంటే ఆయన అన్నారూ నేను వచ్చింది రావణుడితో
మాట్లాడటానికి మధ్యలో నీతో మాట్లాడటమేమిటీ చెప్పేదేదో రావణునికే చెప్తాను అన్నాడు భ్రాతు
శ్శృణు సమాఽఽదేశం సుగ్రీవ స్య మహాత్మనః అని మొదలు పెట్టారు, నేను సుగ్రీవుని యొక్క రాయబారిని, రామ చంద్ర మూర్తి
యొక్క దూతని నీవు రాక్షసుడివి ఆయన నరుడు నీవు రాక్షసుడవైనా ఆయన నరుడైనా నేను
మాత్రం రాక్షసున్ని కాను నరున్ని కాను వానరున్ని తటస్థున్ని ఇద్దరి గురించి
తెలుసున్నవాన్ని మంచి మాట చెప్దామని వచ్చాను, సుగ్రీవుని యొక్క సచివున్ని
సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం ఎందుకంటే నీకు వాలితో అన్నదమ్ముల మధ్య ఆ సంధ్యిలాంటి
సంధి ఉందిగా కాబట్టి నీకు సుగ్రీవుడు తమ్మునితో సమానం సుగ్రీవుడు నీకు కబురుచేశాడు
అన్నారు. సుగ్రీవుడి యొక్క లక్షణమేమిటంటే ముందు కబురు చేస్తాడు వినకపోతే
చంపించేస్తాడు,
అన్నయ్యని చంపించలే ఇప్పుడు మాట వినకపోతే
చంపిస్తాడని గుర్తు. కాబట్టి భ్రాతు శ్శృణు సమాఽఽదేశం సుగ్రీవ స్య
మహాత్మనః సుగ్రీవుడు
పంపించినటువంటి మాట జాగ్రత్తగా విను, నీకు తెలుసుగా..! కోసల దేశాన్ని
పరిపాలించినటువంటి మహానుభావుడు దశరథ మహారాజుగారు రాజా దశరథో నామ రథ కుంజర
వాజిమాన్ ! పితేవ బన్ధు ర్లోక స్య సురేశ్వర సమ ద్యుతిః !! అటువంటి దశరథ
మహారాజుగారు పెద్ద కుమారుడైనటువంటి రామ చంద్ర మూర్తి మళ్ళీ రామ కథని హ్రస్వంగా
చెబుతారు అక్కడ, తండ్రిని సత్యవాఖ్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల
అరణ్యవాసం చేయడానికి భార్యయైన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణ మూర్తితో కలిసి జన
స్థానంలో ఉండగా నీ తరుపున వెళ్ళిన 14 వేలమంది రాక్షసుల్ని రాముడు నిగ్రహిస్తే ఆగ్రహించిన
నీవు మారీచుడన్న మాయా మృగాన్ని పంపించి రామ లక్ష్మణులు ఆశ్రమంలో లేకుండా చేసి
సీతమ్మని అపహరించి తెచ్చి లంకా పట్టణంలో
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
దాచావు ఆ సీతమ్మ జన
స్థానంలో ఉండగా నీచేత అపహరింపబడింది తస్య భార్యా వనే నష్టా సీతా పతిమ్ అనువ్రతా
! వైదేహ స్య సుతా రాజ్ఞో జనక స్య మహాత్మనః !! ఆ సీతమ్మ సాక్ష్యాత్ విదేహ వంశ
ప్రభువువైన మహా జ్ఞానియైన జనకుని యొక్క కుమార్తె రామ చంద్ర మూర్తి ఇల్లాలు దశరథుడి
పెద్ద కోడలు.
అటువంటి ధర్మాత్మురాలు మహా పతివ్రతని నీవు అపహరించి తీసుకొచ్చి లంకా పట్టణంలో
బంధించావు నేను బంధించలేదని నేను తీసుకురాలేదని నన్ను దబాయించే ప్రయత్నం
చేస్తావేమో లక్షి తేయం మయా సీతా తథా శోక పరాయణా ! గృహ్య యాం నాఽభిజానాఽసి పంచాఽఽస్యా మివ పన్నగీమ్
!! నేను ఆ సీతమ్మ
చూశాను దర్శించాను మాట్లాడాను ఆ సీతమ్మ నీచేత అనుభవించబడవలసినటువంటి సుందరీ అని
నీవు అనుకుంటున్నావ్ కానీ ఆమె ఐదు తలల పామూ అని నీవు తెలుసుకోలేక పోతున్నావు నీ
మృత్యువుని నీవు తెచ్చుకున్నావ్ రావణా! నీకు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది
దేవతలచేతా మృత్యువులేదేమో కానీ నరవానరములను నీవు కోరలేదుగా నరుల చేతులలో
చచ్చిపోతావు వానరముల చేతులలో చచ్చిపోతావు సుగ్రీవో న హి దేవోఽయం నాఽసురో న చ మానుషః !
న దానవో న గన్ధర్వో న యక్షో న చ పన్నగః !! సుగ్రీవుడు అసురుడుకాడు మనుషుడు కాడు
దానవుడుకాడు గన్ధర్వుడుకాడు యక్షుడుకాడు పన్నగుడుకాడు, కాబట్టి సుగ్రీవుడి చేతులో
చచ్చిపోతావు మానుసో రాఘవో రాజ స్య సుగ్రీవ స్య హరీశ్వరః రామ చంద్ర మూర్తి
ప్రభువులకు ప్రభువు పూర్ణమైనటువంటి నరుడు కాబట్టి నరుడైన రాముని చేతులో చచ్చిపోతావు.
లేదా సుగ్రీవుడి చేతులో చచ్చిపోతావు నెనేలా చచ్చిపోతాను నాకింత తపస్సుందని
అనుకుంటున్నావేమో మూలఘతకమైన పాపాన్ని చేశావు ఏదో చిన్నో చితకో పాపం చేస్తే శరీరంలో
రోగంగా వస్తూంది పైన బోగముంటుంది శరీరంలో రోగముంటుంది రోగము చేత భోగము అనుభవించలేడు కానీ జీవించి
మాత్రం ఉంటాడు, ఇంట్లో మధుర పదార్థాలు ఉంటాయి తిందామంటే శరీరంలో మధుమేహవ్యాధి
ఉంటుంది కాని చచ్చిపోడు బ్రతికే ఉంటాడు. ఎప్పుడో ఒక స్వీటు తింటే కొంప మునిగిపోదు,
రోజూ తిన్నాడంటే మాత్రం చచ్చిపోతాడు, కాబట్టి ఏక కాలమునందు రోగము భోగమూ కూడా
ఉంటాయి ఏదో కొంత పాపం చేస్తే కానీ నీవు చేసినది మూలఘాతము అంటే ఇంక శరీరము ఉండదు
పడిపోతుంది మహా పాతకం చేశావు మహా పతివ్రతను తీసుకొచ్చావు కాబట్టి నీ శరీరం ఉండదు
నేను చెప్పిన పనిచేయ్ త దేవ ఫలమ్ అన్వేతి ధర్మ శ్చాఽధర్మ నాశనః !
ప్రాప్తం ధర్మ ఫలం తావ ద్భవతా నాఽత్ర సంశయః !! ధర్మం ధర్మ ఫలాన్ని ఇస్తుంది అధర్మం అధర్మ
ఫలాన్ని ఇస్తుంది ధర్మం తన పని తాను ఇస్తున్నప్పుడు అధర్మం ఫలితాన్ని ఇవ్వదు
అధర్మం ఫలితాన్ని ఇస్తూంటే ధర్మం ఫలితాన్ని ఇవ్వదు. ధర్మం అధర్మాన్ని తీయ్యదు అధర్మం ధర్మాన్ని తీయ్యదు.
ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పాపం చేశావు పాప ఫలితాన్ని అన్వేషించాలి పుణ్యం
చేశావు పుణ్య ఫలితాన్ని అన్వేషించాలి ఇన్నాళ్ళు నీవు చేసిన ఫలితం యొక్క ఫలితం
అనుభవించావు కాంచన లంకా పట్టణం వచ్చింది. ఇంత మంది కాంతలతో సంతోషంగా హాయిగా
జీవితాన్ని గడిపావు అయిపోయింది ఆ పుణ్యఫలమంతా.
సుందర కాండ ముప్పయ్
ఐదవ రోజు ప్రవచనము
|
|
నీవు తీసుకొచ్చిన
ఒక ఇల్లాలు పదినెలలు పట్టి శింశుపా వృక్షం కింద కూర్చుని ఏడ్చినటువంటి పాప
ఫలితాన్ని నీవు అనుభవించవలసినటువంటి రోజు దగ్గరపడింది. అందుకేగా ఫలితం నీ కొడుకు
చచ్చిపోయాడు చూశావు, ప్రారంభమైపోయింది అధర్మ ఫలితం కాబట్టి రావణా నీవు ఇంక
తప్పుకోలేవు నీ శరీరము కూడా పడిపోయే లోపలే నా మాట
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
విను నేను చెప్పిన
పని చేయ్ సీతమ్మని తీసుకెళ్ళి రామ చంద్ర మూర్తికి సమర్పించు, సమర్పించావా రామ
చంద్ర మూర్తి ధర్మాత్ముడు శరణాగత వత్సలుడు ఎన్ని తప్పులు చేసినవాడైనా ఒక్కసారి
నేలమీద పడి నమస్కారం చేసిన పాదములు పట్టుకుని పాహిమామ్ అని పాహి రామ ప్రభో పాహి
రామ ప్రభో అంటే చాలు అన్ని తప్పులను క్షమిస్తాడు కాబట్టి రామ చంద్ర మూర్తి పాదములు
పట్టుకో అన్నారు. ఆయన చెప్తే మాత్రం వింటాడా చెప్పాలని వచ్చారాయన ఎంత చెప్పాలో అంత
చెప్తారాయన బ్రహ్మా స్వయంభూ శ్చతురాఽఽననో వా రుద్ర
స్త్రిణేత్ర స్త్రిపురాఽన్తకోవా ఎవరైనా సరే ఇంద్రో మహేంద్ర స్సుర నాయకో వా
త్రాతుం న శక్తా యుధి రామ వధ్యం రామ చంద్ర మూర్తి ఒక్కసారి చంపేస్తానని
ప్రతిజ్ఞ చేసినాడనుకో వాన్ని రక్షించడం ఎవరికీ సాధ్యం కాదు. అది బ్రహ్మా
స్వయంభూ శ్చతురాఽఽననో వా బ్రహ్మ కావచ్చు శ్వయంభూ కావచ్చు నాలుగు
తలకాయలున్నవాడు కావచ్చు రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు ఇంద్రుడు
మహేంద్రుడు స్వయం పాలకుడు కావచ్చు కానీ రాముడు చంపుతానన్నవాన్ని బ్రతికించడం
ఎవ్వనికీ సాధ్యంకాదు.
రాముడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కేవలము ఒక
నరుడు రాజ్య భ్రష్టుడని నీవు అనుకుంటున్నావ్ కాని రాముని యొక్క పరాక్రమమేమిటో నీకు
తెలియదు రాముడంటే సామాన్యమైన వీరుడనుకుంటున్నావ్ నాకు చాలా ఇష్టం వాల్మీకి
రామాయణంలో ఉన్న శ్లోకాల్నీ యథా తథం చేశారు మహానుభావుడు భాస్కర రామాయణంలో భాస్కరుడు
ఆయన అంటారు • రామ చంద్ర మూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని పట్టి నిలబెట్టి అక్షయ బాణ తూనీరములలోంచి బాణములు
తీసి వింటినారిని సందించి విడిచిపెడితే కళ్ళు తళుక్కుమనే మెరుపులతో లంకా పట్టణపు
ఆకాశానంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణా నీకు దిక్కన్నవాడు
ఎవ్వడూ ఉండడు నిన్నెవ్వడూ ఆదుకోలేడు రామ చంద్ర మూర్తి పరాక్రమంటే అటువంటిది ఆయన
యొక్క వీరోచితమైన లీల ఎటువంటిదో తెలుసా ఆయనా మహానుభావుడు శరణాగ్రమున నీ
భుజాదర్పమణచి (పాదాగ్రమ్మున నిన్ను తొక్కిన) ధూర్జటి విలు తుంచివైచె వాలపాశమ్మున
నిన్ను కట్టిన వాలిని ఒకమ్మున కులవైచె అని నిన్ను పురుగొన్న అర్జును బలిగొన్న
పరశురాముని యాజి భంగపరిచె కలిమియైయొక్కటి పదునాల్గువేవుల బారిసమరె అట్టి మహా
ధనుర్ధరునకున్ యెగ్గాచరించి, హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయద, నిర్గాత, సంఘాత
బాణ ఘాత శాత హతులుగాక బదుకగలరె ఆయనా మహానుభావుడు రామ చంద్ర మూర్తి. ఒకనాడు
నీవు ఈ కైలాస పర్వతాన్నంతటినీ కదిపేద్దామని ఇరవై చేతులతో కదుపుతూంటే పరమ శివుడు తన
బొటనవేలితో నొక్కితే నీ చేతులు దాని కింద ఉండిపోతే ఏడుస్తూ పడుకున్నావ్ అటువంటి
పరమ శివుడి యొక్క ధనస్సుని వింటినారిని అవలీలగా కట్టి టంకారం చేసి శివధనుర్భంగం
చేసిటువంటి మహాపురుషుడు రామ చంద్ర మూర్తంటే, శరణాగ్రమున నీ భుజాదర్పమును
ధూర్జటి విలు లీల తుంచివైచె వాల పాశంబున కట్టిన నిన్ను కట్టిన వాలిన ఒక్కమ్మున
కులవైచె వాలి సంగతి తెలుసుగా మీకు తెలుసుగా కిష్కింధ కాండలో మనవి చేశానుగా...
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
నిన్ను చంకలో
ఇరుకుంచుకుని నాలుగు సముద్రాలు తిప్పి అంతఃపురానికి తీసుకెళ్ళి కిందపడేసి ఎవడురా
పది తలల పురుగా నీవు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేశావని అడిగాడు, అటువంటి
వాలిని ఒక్కబాణంతో కొట్టేశాడు. అని నిన్ను పురుగొన్న అర్జును బలిగొన్న
పరశురాముని యాజి భంగపరిచె కార్తవీరార్జుని సంగతి నీకు తెలుసుగా...
ఒకానొకప్పుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి రావణాసురుడు వెళ్ళి స్నానం చేసి
బంగారు శివలింగాన్ని తీసుకెళ్ళి ఒడ్డున పెట్టి పూజ
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
చేస్తున్నాడు
బంగారు శివ లింగాన్ని పూజ చేసినా శివలింగానికి బంగారు కవచం ఇచ్చినా మహదైశ్వర్యం
కలుగుతుంది. హిరణ్యలింగాన్ని పూజ చేస్తే అందుకే మామూలు శివలింగానికి పూజ చేసినా
పూలు తీసి ఓం గనపతయే నమః ఓం గనపతాత్మకాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణ లింగాయ
నమః అంటాం బంగారు లింగంగా భావన చేస్తాము. కాబట్టి బంగారు లింగాన్ని పెట్టి పూజ
చేసేవాడు రావణాసురుడు ఒకనాడు బంగారు లింగాన్ని పూజ చేస్తున్నాడు నర్మదానది ఒడ్డున
ఆ కింద నది ఒడ్డున కార్తవీరార్జునుడు కాంతలతో జలక్రీడలు సలుపుతున్నాడు ఆయనకి
వెయ్యి చేతులు, వెయ్యి చేతులతో ప్రవాహాన్ని అపాడు ఏం జరుగుతుందో చూద్దామని ఆ
ప్రవాహం ముందుకు వెళ్ళలేక ఆ చెతులతో ఆనకట్ట కట్టినట్లు కట్టేస్తే ఆ ప్రవాహం
వెనక్కి తిరిగింది, వెనక్కి తిరికి పొంగి ప్రవహించి ఒడ్డున పూజ చేసుకుంటున్నటువంటి
రావణాసురుడు శివ పుజ చేస్తున్న పూల నన్నింటినీ తనతోపాటు ఆ ప్రవాహం
తీసుకెళ్ళిపోయింది.
కోపమొచ్చింది రావణాసురునికి కొపమొచ్చి ఎవడురా
కింద ప్రవాహం వెళ్ళకుండా ఆపినవాడు చూడమన్నాడు, సుఖచారుణులు యుద్ధ కాండలో వస్తారు
వాళ్ళు ఆ సుఖచారుణులు లిద్దరూ ఆకాశ మార్గంలో వెళ్ళి యోజనం కింద కార్తవీర్యార్జునుడు
వేయి చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడు అన్నారు. వెంటనే ఆయ్యన అక్కడికెళ్ళి
యుద్ధం చేస్తాను అన్నాడు. ఇద్దరికీ గొప్ప యుద్ధం జరిగింది కింద పారేసి వెయ్యి
చేతులతోను పట్టుకుని బంధించి ఒక పురుగును పట్టుకుపోయినట్లు పట్టుకెళ్ళి తన అంతఃపురంలో
కారాగారంలో పారేసి తలుపులేసేశాడు అంతే కార్తవీరార్జునుడు. స్వర్గలోకంనుంచి విశ్రవసో
బ్రహ్మ తండ్రి అంటే రావణాసురుని తాత పులస్త్య బ్రహ్మ బయలుదేరి వచ్చాడు వచ్చి
జరిగినదోషం జరిగిపోయింది విడిచిపెట్టమని అడిగితే అప్పుడు కార్తవీర్యార్జునుడు
విడిచిపెట్టాడు. అటువంటి కార్తవీరార్జునుడి యొక్క వెయ్యి చేతుల్నీ
నరికేసినటువంటివాడు పరుశురాముడు అటువంటి పరుశురాముడు చేతిలో ఉన్నటువంటి
విష్ణుచాపమును అందుకుని పరశురామున్ని వెళ్ళిపోయేటట్టుగా చేసినవాడు రామ చంద్ర
మూర్తి. కాబట్టి నీవెక్కడ నిలబడుతావురా ఆయన ముందు అని నిన్ను పురుగొన్న అర్జుని
బలిగొన్ని పరశురాముని యాజి భంగపరిచె కడిమియై యొక్కట ఖరదూశనాదులు పదునాల్గువేవుల బారిసరమరె
ఖరదూషనులనేటటువంటి పద్నాల్గువేలమంది రాక్షసులు ఒక పక్క రామ చంద్ర మూర్తి ఒక్కరు ఒక
పక్క ఎప్పుడు ధనస్సుకు వింటినారి తొడిగారో ఎప్పుడు ఎప్పుడు బాణం తీశారో ఎప్పుడు
సంధించారో ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు.
అరణ్య కాండలో శూర్పణఖ చెప్పింది మీరు విన్నారుగా... ఆయన బాణ ప్రయోగ శక్తంటే 14
వేల మంది రాక్షసుల్ని ఒక్క రాముడే తెగటార్చాడు భండన భీముడు ఆర్తజన బంధవుడు
ఉజ్జ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్కికన్ రెండవ సాటి దైవము
ఇక లేడనుచున్ కడకట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులు ఆజాండము నిండ
మత్తవేదండమును ఎక్కి చాటెదను దాశరతీ కరుణాపయోనిధీ ! అంటారు రామదాసుగారు. ఆయన
భుజములు తాండవము చేస్తాయి యుద్ధమొస్తే అటువంటి మహానుభావుడు 14 వేలమందిని
నిగ్రహించాడు అటువంటి రామ చంద్ర మూర్తితో నీవెక్కడ యుద్ధం చేస్తావురా... అని
నిన్ను పురుగొన్న అర్జును బలిగొన్న పరశురాముని యాజి భంగపరిచె కడిమియై ఒక్కడు
ఖరుదూషనాదుల పదునాల్గువేవుల బారిసమరె అట్టి మహా ధనుర్ధరునకున్ యెగ్గాచరించి, పరిహర
బ్రహ్మ శక్రాదులైన అతని భయద, నిర్గాత, సంఘాత బాణ ఘాత శాత హతులుగాక బదుకగలరె దురగచ్చందన
నత్తలారనతోపంతో కూడనీపని భస్మంబుగ గాల్చి సైనికస్పత్రానిక శ్రీనిది
నెత్తురు క్రక్కన్ పడ గ్రుద్ధి చంపి మరి మృత్యు క్రూరతన్ బట్టి నీ శిరమూ ద్రుంపగ
నేను చాలు జయ శ్రీ లద్బివర్ధిల్లగన్ సీతమ్మని తీసుకొచ్చి శింశుపా వృక్షం కింద
కూర్చోబెట్టి నీ నోటికొచ్చినట్లు మాట్లాడుతావురా నీవు దురగచ్చందన తటస్తోవందుతో
కూడ నీపని భస్మంబుగ గాల్చి సైనికస్పత్రానిక శ్రీనిది నెత్తురు క్రక్కన్ పడ
గ్రుద్ధి చంపి మరి మృత్యు క్రూరతన్ బట్టి నీ శిరమూ ద్రుంపగ నేను చాలు నీ గుఱ్ఱాల్నీ
నీ ఎనుగుల్నీ నీ వాహనాల్నీ అన్నింటినీ చంపి లంకని భస్మీ పటలం చేసి నీవారన్నవారు
మిగలకుండా సంహరించి నీ పదితలల్నీ గిల్లేస్తానురా రావణా ఏమనుకుంటున్నావో జయ శ్రీ
లబ్ది వర్ధిల్లగన్ సీతమ్మంటే ఎవరనుకుంటున్నావ్ నీకన్ తతర్పిత కాలపాశము శిలోనిర్ఘాత
పాతంబు లంకౌకసంచయ కాళరాత్రి గనబద్ధౌదగ్ర కాళాగ్ని కన్యాకారాగత మృత్యువున్
జనకకన్యకవేగనొప్పించి లోకైకనిద్రాడని రాముడింకానీకాబుద్ధి కాకుండినన్ శీతారాములు కోపాస్పు
కదయవేల్చుచు లంకా భూత వ్రాతము భస్మీ భూతముగా జేయునడెన్ పొడమినికింకన్ సీతమ్మ
అంటే నీ నెత్తిమీద పడుతున్నపిడుగు నీ మెడలో వేసుకున్న త్రాచుపాము నీవు తింటున్న
విషాన్నం ఏమనుకుంటున్నావ్ చచ్చిపోతావు సీతమ్మజోలికి వెళ్ళితే.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
సీతారాముల యొక్క
కోపాగ్ని శిఖలయందు బుడిదైపోతావు నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రామ చంద్ర
మూర్తికి సమర్పించి కతకృత్యుడవై బ్రతకరా రావణా అని ఇంత మాట సభామధ్యంలో తన్ని
అనేటప్పటికి కృద్ధుడై ఈ వానరాన్ని సంహరించండి అన్నాడు. అనేటప్పటికి యుక్తా యుక్త
విచక్షణేం ఉండదు “యథా రాజా తథా ప్రజాః” కాబట్టి వీళ్ళందరూ లేచిపోతున్నారు.
విభీషణుడు ధర్మాత్ముడు తమ్ముడు లేచి అన్నాడు అన్నయ్యా! సాధు ర్వా యది వాఽసాధు ర్పరై రేష
సమర్పితః ! బ్రువన్ పరాఽర్థం పరవాన్ న దూతో వధమ్ అర్హతి !! అన్నయ్యా రాయబారీ అనేటటువంటివాన్నీ దూతా
అనేటటువంటివాన్ని పంపించినవాడెరో ఆయన ఏం చెప్పమన్నాడో అది చెప్తాడు, నీవు
ఇంద్రున్ని ఓడించివాడివి దేవతల్ని ఓడించినవాడివి నీ పరాక్రం గురించి అందరికీ
తెలుసు ఎక్కడో నూరు యోజనములు సముద్రానికి ఆవతల ఉన్న దండకారణ్యంలో సుదూరంలో ఉన్న ఆ
రాజకుమారుడైనటువంటి రామ చంద్ర మూర్తి ఈ వానరముతోటి నీకు రాయబారము పంపించారు,
ఇప్పుడు ఈ వానరాన్ని చంపేస్తే వెనక్కివెళ్ళి నీపౌరుష ప్రతాపాలు చెప్పగలిగినవాడు
ఎవరుంటారు ఎప్పటికి తెలుస్తుంది అయినా దూతను సంహరించచ్చాన్నాయ్యా... ఇన్ని
శాస్త్రాలు చదువుకుని ఇంత వేదం చదువుకున్న నీవే దూతను సంహరిస్తే ఇంక
చదువుకోవడమన్నది అనవసరమనిపిస్తూంది.
కాబట్టి అన్నయ్యా నిగ్రహాన్ని పాటించు దూతమీద కోపమొస్తే అంగవైకల్యము చేయవచ్చు
ఏదో ఒక అవయవమును తీసేయవచ్చు కాల్చినటువంటి ముద్రలు వేయవచ్చు అటువంటి పనులు
చెయ్యాలి కానీ దూతని చంపకూడదు సాధు ర్వా యది వాఽసాధు ర్పరై రేష
సమర్పితః ! బ్రువన్ పరాఽర్థం పరవాన్ న దూతో వధమ్ అర్హతి !! దూతని మాత్రం చంపకూడదు మంచిగా ఉండనీ చెడుగా
ఉండనీ నీవు చేయవలసింది ఇంతవరకు మాత్రమే. తమ్ముడా మంచి మాట చెప్పావు అన్నాడు,
జీవితంలో విన్న మంచిమాట అంటూ ఉంటే ఇదొక్కటే కాబట్టి ఇప్పుడు ఆ వానరాలకీ తోకంటే
చాలా ఇష్టం తొకలేని కోతి
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
తోకలేని కోతీ అని
మళ్ళీ నూరు యోజనములు దాటివెళ్ళిన తరువాత దీని చూసి అందరూ గేళి చెయ్యాలి కాబట్టి
దీని తోకకి నిప్పు పెట్టి కాల్చేయండి అన్నాడు. ప్రభువు
ఆజ్ఞాపించడమేమిటీ ఆ కింకరులందరూ బయల్దేరారు ఆయన తోకకి బట్టలు చూట్టారు
నెయ్యిపోశారు అగ్నిహోత్రం వెలిగించారు గట్టిగా కట్లు కట్టారు రథమెక్కించారు వీధుల
యొక్క కూడళ్ళలోకి తీసుకొచ్చారు నిల్చోబెట్టారు కట్టెలతో కొడుతున్నారు చారుడు
చారీకుడు గూడచారీ గూడచాలీ అని ప్రకటిస్తున్నారు వృద్ధులు బాలురు స్త్రీలు అందరూ
బయటికొచ్చారు అశోక వననాన్ని ధ్వంశం చేశాడు ఇన్నివేలమందిని సంహరించాడు దుర్మార్గుడంటున్నారు
ఆయన్ని చూసి అందరూ నవ్వుతున్నారు. ఆయన్ని రథమెక్కించి ఊరేరిగింపుగా లంకా పట్టణమంతా
తిప్పుతున్నారు.
ఇంత కొడుతున్నా ఇంత అవమానిస్తున్నా పోల్లేనన్ను కొడితే కొట్టారు నా ప్రభు
కార్యంలో నాకు అవమానం జరిగినా అది నాకు సత్ కార్యమే పగటివేల చూస్తున్నాను కాబట్టి
ఈ దుర్గములు బలా బలములు చూస్తున్నాను వెళ్లి నా ప్రభువు సుగ్రీవునికి చెప్తాను రామ
చంద్ర మూర్తి కోసం దెబ్బలు తిన్నా పర్వాలేదనుకున్నాడు అని మహానుభావున్ని ఊరేరిగింపుజేసి
లంకా పట్టణమంతా చూపిస్తున్నారు ఊరేగింపు అంటారు ఊరేగింపు కాదు “ఊరెరిగింపు” వీడు
ఎలాగో గుళ్ళోకి రాడని ఈశ్వరుడే బయలుదేరి బయటికొస్తాడు, కనీసం ఇళ్ళముందుకు
వచ్చినప్పుడు కర్పూరం పట్టుకుని బయటికిరావాలి ఓ బెల్లం ముక్కా కర్పూరం పట్టుకొస్తే
ఈశ్వరుడు మీ ఇంటి ముందు ఆగుతాడు. ఈశ్వరా కిందటేడాది పెంకుటిల్లు ఈ యేడాది
రెండతస్తులేశాడు ఆయనకు గుళ్ళోకొచ్చే ఖాలీ ఉండదు అంటే ఈశ్వరుడే ఓసారి ఇలా చూసి చాలా
బాగుంది సంతోషం రా నాయనా... దిన దినాభి వృద్ధిరస్తూ అంటాడు. ఆయన అప్పుడు కూడా
బయటికిరాడు పాపం వాళ్ళావిడ పట్టుకుని వస్తుంది పట్టుకుని ఓ బెల్లంగడ్డా
కర్పూరమును. ఆయనకి టీవీ చాలా ఇంపార్టెంట్ కదా..? రిమోట్ నొక్కుతూ ఛానెల్స్
మార్చుతూ అందులో ఉంటాడాయన అయినా ఈశ్వరుడు ఆశీర్వచనం చేసి వెళ్తాడాయన కాబట్టి
ఊరెరిగింపు ఊరంతా ఆయనకి చూపించడానికి ఆయన్ని బయటికి తీసుకొస్తారు ఆయనే
బయటికొస్తాడు రాముడిలాగా వీళ్ళలాగ కాదు కాబట్టి.
హనుమను కూడా అలా లంకా పట్టణమంతా తిప్పుతున్నారు
తిప్పుతుంటే అందరూ వచ్చి చూస్తున్నారు ఆయనా అనుకున్నారటా ఈలోగా అక్కడ ఉన్న రాక్షస
స్త్రీలందరూ సీతమ్మ దగ్గరికి పరుగెత్తారు పరిగెత్తీ ఏదీ నీతో మాట్లాడింది ఒక చిన్ని
కోతి తరువాత పెద్ద స్వరూపాన్ని పొందింది అశోకవనాన్ని భంజించింది ఎవరని అడిగితే యూయ
మేవాఽభి జానీత యోఽయం యద్వా కరిష్యతి ! అహి రేవ అహేః పాదాన్
విజానాతి న సంశయః !! పాముకాళ్లు పాముకు తెలియాలి అన్నావుగా... ఇప్పుడు ఆకోతి తోకకి బట్టచుట్టీ
నెయ్యిపోసి నిప్పుపెట్టి మంటపెట్టారు. ఆ కోతిని ఊరంతా తిప్పుతున్నారు కట్లువేసి
కట్టేశారన్నారు అంటే తల్లందీ
యద్యఽస్తి పతి శుశ్రూషా యద్యఽస్తి చరితం తపః ! యది చా స్త్యేక పత్నీ త్వం
శీతో భవ నూమతః !!
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
యది కించి దఽనుక్రోశ స్తస్య మయ్యఽస్తి ధీమతః ! యది
వా భాగ్య శేషో మే శీతో భవ హనూమతః !!
యది మాం వృత్త సంపన్నాం త త్పమాగమ లాలసామ్ ! స విజానాతి ధర్మాత్మా శీతో భవ
హనూమతః !!
యది మాం తారయే దాఽర్యః
సుగ్రీవః సత్య సంగరః ! అస్మా ద్దుఃఖాంబు సంరోధా చ్ఛీతో భవ హనూమతః !!
సుందర కాండ తన పాతివత్ర్య విశేషాన్ని
తల్లి తానే ప్రతిజ్ఞరూపంలో నిలబెట్టింది ఆ తల్లంది యద్యఽస్తి పతి శుశ్రూషా
యద్యఽస్తి చరితం తపః నేను ఎప్పుడూ పతికి శుశ్రూష చేసినదానినైతే నేను రామ చంద్ర మూర్తి గురించి
నిరంతరము తపస్సు చేసి ధ్యానము చేసినది నిజమైతే హనుమ యొక్క తోకకి పెట్టబడిన
అగ్నిహోత్రము చల్లగా ఉండుగాకా... అంటే ఒక భూతమునకు ఏ లక్షణము ఉంటుందో తత్
వ్యతిరేకమైనటువంటి లక్షణముతో ఉండాలి, పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి తల్లి
శాశించింది అగ్నిదేవున్ని యది కించి దఽనుక్రోశ స్తస్య
మయ్యఽస్తి ధీమతః ! యది వా భాగ్య శేషో మే శీతో భవ హనూమతః !! నాకుగాని నిజంగా ఇంకా ఏదైనా భాగ్యవిశేషం మిగిలి
ఉంటే రామ చంద్ర మూర్తి ఇంకా నన్ను చూడాలనీ నన్ను పొందాలని పూనికతో పట్టుదలతో ఉంటే
నాకు భాగ్య విశేషము మిగిలి ఉంటే నిజమైతే నేను రామ చంద్ర మూర్తితో కలవడం నిజమైతే యది
మాం వృత్త సంపన్నాం త త్పమాగమ లాలసామ్ ! స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః !!
నేను మంచి నడవడి కలిగిన దాననైతే త్రికరణ శుధ్దిగా నేను ఎన్నడూ పాపము చేయనిదాననైతే
ఆయనకి తోకకి పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగుగాకా..! యది మాం తారయే దాఽర్యః
సుగ్రీవః సత్య సంగరః ! అస్మా ద్దుఃఖాంబు సంరోధా చ్ఛీతో భవ హనూమతః !! నిజంగా వానర ప్రభువైనటువంటి సుగ్రీవుడు నన్ను ఈ
కష్టాల కడలిలోంచి పైకి తీసుకొచ్చి వానర సైన్యం సహాయముతో మళ్ళీ సీతారాముల్ని ఏకం
చెయ్యాలనేటటువంటి ప్రతిజ్ఞ మన్స్పూర్తిగా చేసినవాడైతే హనుమ యొక్క తోకకు పెట్టబడిన
అగ్నిహోత్రము చల్లబడుగాకా... అంది తల్లి అంతే.
ఆయన తోకకి పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడిపోయి వెన్నముద్ద పెట్టినట్లుంది ఆయన
అనుకున్నారు అవునులే నూరు యోజనములు సముద్రాన్ని దాటి రామ కార్యం మీద వస్తూంటే
బంగారు శిఖరములున్న మేరు పర్వతం పైకిలేచింది ఆథిత్యం తీసుకోమని అన్తరిక్షే
స్థితః శ్రీమాన్ ఇదం వచనమ్ అబ్రవీత్ నాయనా విశ్రాంతి తీసుకోరా నాలుగు పళ్ళు
తినరా అంది రామ కార్యం మీద ఎవరు మాత్రం సాయం చేయరు కాబట్టి ఇప్పుడు రామ కార్యంలో
సీతమ్మ తల్లి అన్వేషణ చేసి దర్శించి తిరిగి వెళ్ళవలసినవాన్ని కాబట్టి నా తండ్రికి
స్నేహితుడు కాబట్టి అగ్నిహోత్రుడు కాల్చకుండా నా తోక చల్లగా ఉండేటట్టుగా
అనుగ్రహించిందీ అనుకున్నారు. అనుకుని ఒక్కసారి ఆ కట్లు తెంచుకున్నారు భీమ
స్వరూపాన్ని పొందారు ఒక పెద్ద అంతఃపుర గోపురం మీద నిలబడి భీమ రూపంతో ఇలా తోకని
చేత్తో పట్టుకుని చూస్తున్నారు అగ్నిహోత్రాన్ని చేత్తో పట్టుకుని ఆ తోకనిని చేత్తో
పట్టుకుని సూర్యునికి ఎదురుగా నిలబడిన సూర్యుడా అన్నట్లుగా ఉన్నారట. ఎక్కడ పెడదాము
అగ్నిహోత్రం మొట్టమొదటా అని చూశారు అవప్లుత్య మహా వేగః ప్రహస్త స్య నివేశనం !
అగ్నిం తత్ర స నిక్షిప్య స్వసనేన సమో బలీ !! తనని మొట్ట మొదట రావణ సభలో
ఉన్నప్పుడు రావణుని యొక్క ప్రధాన మంత్రియైన ప్రహస్తుడు ఏదో
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
పెద్ద ఉదారుడైనట్లు
తనతో
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
మాట్లాడినవాడెవడో
వానింట్లో పెడదామని అగ్నిహోత్రాన్ని నిక్షేపించి అక్కడ్నుంచి ఇక ఇళ్ళు తగులపెట్టే
కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నాడు. అని ఒక్కసారి అవప్లుత్య మహా వేగః ప్రహస్త
స్య నివేశనం ! అగ్నిం తత్ర స నిక్షిప్య స్వసనేన సమో బలీ !! ఆ ఇంట్లో అగ్నిహోత్రాన్ని పెట్టారు.
కపుడు మండిపోయి ఉన్నాడు అగ్నిహోత్రుడు ఎన్ని అకృత్యములు చేశాడు ఎంత మంది
రాక్షసుల్ని పెట్టి ఎన్నిమాట్లు యాగాగ్నిలో రక్తం పోయించాడు ఇన్నాళ్ళకు అవకాశం
దొరికింది ఆయన హనుమ యొక్క తండ్రి వాయుదేవుడు నా కొడుక్కి ఇంత బాధ పెడతాడాయని వాయువు అగ్ని ఒక
ఇంట్లో పెట్టేటప్పటికి పది ఇళ్ళల్లోకి పరుగెడుతుందా అగ్ని ఎక్కడ చూసినా
అగ్నిహోత్రమే యజ్ఞశత్రో శ్చ భవనం బ్రహ్మశత్రో స్తథైవ చ అనీ... ఆ
ఒక్కొక్కళ్ళ ఇంట్లో యజ్ఞశత్రో శ్చ భవనం బ్రహ్మశత్రో స్తథైవ చ ! నరాన్తక స్య
కుమ్భ స్య నికుంభ స్య దురాత్మనః !! ఒక్కక్కళ్ళ ఇంట్లో ఇంద్రజిత్తు ఆ తరువాత
కుంభకర్ణుడు ఆతరువాత రావణాసురుడు ధూంరాక్షుడు విజ్జుదుహ్ముడు విద్యున్మాలి
వీళ్ళందరి ఇళ్ళల్లో ధూకడం అగ్ని పెట్టడం ధూకడం అగ్ని పెట్టడం వెంటనే అగ్నిహోత్రుడు
రగులుకోవడం రాక్షసుల యొక్క శరీరాన్ని పట్టుకుంటున్నారు కొవ్వు పట్టి ఉన్నారేమో
ఒక్కొక్క రాక్షసుడు కాలిపోతున్నారు కాలిపోతూ లంకాపట్ట్ణం రావణుని యొక్క అంతఃపురం
మేడా ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే క్వచిత్ కింశుక సంకాశాః క్వచి చ్చాల్మలి
సన్నిభాః ! క్వచిత్ కుంకుమ సంకాశా శ్శిఖా వహ్నే శ్చకాశిరే !! అంటారు మహర్షి.
కొన్ని చోట్ల బూరుగుపువ్వుల్లా కొన్నికొన్ని చోట్ల మోదుగు పువ్వుల్లా కొన్నికొన్ని
చోట్ల కుంకుమ పువ్వుల్లా పెద్ద అగ్నిహోత్రం ఒక పక్క వాయువు తోడైంది, వాయువు తోడై
అగ్నిహోత్రాన్ని తీసుకెళ్తూంటే విలయం సృష్టింపబడిందా అన్నట్లుగా లంక లంకంతా
కాలిపోలోతూంది, ఇప్పటివరకూ నవ్వినవాళ్ళందరూ బయటకు వచ్చి హో తాత హా పుత్రక కాంత
మిత్ర హా జీవితం భోగ యుతం సుపుణ్యం రక్షోభి రేవం బహూధా బృవద్భిః శబ్ధః కృతో ఘోరతర
స్సుభీమః ! హో భార్యా అంటే హో భర్తా అని హో నాథా హో తండ్రీ హో కొడకా అని పెద్ద పెద్ద అరుపులు లంకా
పట్టణమంతా ఆర్థనాదాలు.
ఒక్కసారి స్వామి లంకా పట్టణం ఆవలి వైపుకి వెళ్ళి ఒక గోపురం మీద నిలబడి చూశారు
లంక లంకంతా అగ్నిజ్వాలలో తగులబడిపోతూంది అప్పుడనుకున్నాడు చంచల చిత్తులం కాబట్టి
మమ్మల్ని వానరలూ అన్నారు లంకనంతట్నీ కూడా కాల్చేశాను సీతమ్మ కూడా కాలిపోయింటుంది.
ఇప్పుడు వెనక్కెళ్ళి ఏం చెప్పను వెనక్కెళ్ళి ఈ వార్త చెప్తే సీతమ్మదర్శనం చేసి
లంకను కాల్చేశాను సీతమ్మ మంటల్లోపడి చనిపోయిందని నేను చెప్పినటువంటి ఈ
అశుభవార్తవల్ల రామ లక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు సుగ్రీవుడు ప్రాణం
విడిచిపెడతారు రుమ తారా ప్రాణం విడిచిపెడతారు అవతల కోసల దేశంలో ఉన్న భరత
శత్రుజ్ఞలు కౌసల్యా సుమిత్రా కైకేయీ అక్కడ ఉన్నటువంటి నరులు ఇక్కడ ఉన్నవానరు
ఇంతమందిని పాడుచేసిసేటటువంటి పనిని నేను వెళ్ళిచెబితే ఎంత చెప్పకపోతే ఎంతా కాబట్టి
మళ్ళీ హస్తాఽఽదానో ముఖాఽఽదానో నియతో వృక్ష
మూలికః ! వానప్రస్థో భవిష్యామి అదృష్ట్వా జనకాఽఽత్మజామ్ !! సాగరాఽనూపజే దేశే బహు మూల
ఫలోదకే ! మళ్ళీ వెళ్తాను
సముద్రపు ఒడ్డున కూర్చుంటాను దొరికితే తింటాను లేకపోతే సముద్రంలో పడిపోతాను
అనేకమైన ఆలోచనలు చేసి ఒక్కసారి మనసులో అనుకుంటారు ధన్యా స్తే పురుష శ్రేష్ఠా యే
బుద్ధ్యా కోప ముత్థితమ్ ! నిరున్ధన్తి మహాత్మానో దీప్తమ్ అగ్నిమ్ ఇవఽమ్భసా !! కృద్ధః
పాపం న కుర్యా త్కః క్రుద్ధో హన్యా ద్గురూ నఽపి ! కృద్ధః పరుషయా
వాచా నర స్సాధూన్ అధిక్షిపేత్ !! య
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
స్సముత్పతితం క్రోధం క్షమ యైవ నిరస్యతి ! అలా ఉండినటువంటివాడు ఎవరో వాన్ని ధన్యాత్ముడని
పిలుస్తారు ధన్యా స్తే పురుష శ్రేష్ఠా ఎవర్ని పురుష శ్రేష్టుడు ధన్యాత్ముడు
అని పిలుస్తారంటే పాము తన
శరీరమునకు పట్టినటువంటి కుబుసమును తానే విడిచిపెట్టినట్లు తనకు వచ్చిన కోపాన్ని
పరిశీలించి విడిచిపెట్టినవాడు ఎవడో వాడు ధన్యాత్ముడు.
కృద్ధః పాపం న కుర్యా త్కః క్రుద్ధో హన్యా
ద్గురూ నఽపి ! కృద్ధః పరుషయా వాచా నర స్సాధూన్ అధిక్షిపేత్ !! విపరీతమైన కోపానికి వసుడైపోయినటువంటివాడు అయ్యో
మా గురువుగారని కూడా చూడకుండా గురువుగారిని కూడా చంపేస్తాడు చంపేసి ఏడుస్తాడు నేను
ఇవ్వాళ క్రోధమునకు వశుడనైపోయాను వశున్నైపోయి లంకనంతట్నీ కాల్చేశాను ఈ మంటల్లో
సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుందనుకుంటున్నారు బెంగపెట్టుకున్నారు బాధపడ్డారు య
స్సముత్సతితం క్రోధం క్షమ యైవ నిరస్యతి ! యథో రోగ స్త్వచం జీర్ణాం స వైప పురుష
ఉచ్యతే !! ఎవర్ని పురుషుడని పిలుస్తారు, ఎవరికి కోపం వచ్చింది ఆ కోపాన్ని పరిశీలనం చేసి ఈ కోపం
పనికిరాదని బాగా నిర్ణయించుకుని ఆ కోపాన్ని విడిచిపెట్టగలిగినటువటిం సమర్థత
కలిగినటువంటివాన్ని కృద్ధుడని పిలుస్తారు. తప్పా క్రోధానికి వశుడై లంక
కాల్చినందుకు ఎవరు వానరమనీ ఎవరు పురుషుడనీ పిలుస్తారు నేను చాలా తప్పు
చేశాననుకున్నారు. అంతలో మళ్ళీ అనుకున్నారు అథ వా చారు సర్వాంగీ రక్షితా స్వేన
తేజసా ! న నశిష్యతి కల్యాణీ నాఽగ్ని రఽగ్నౌ ప్రవర్తతే !! ఏ తల్లి యొక్క పాతివ్రత్య మహిమచేత నేను
సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు మైనాకుడు లేచినిలబడ్డాడో ఏ తల్లిని నేను నమోఽస్తు రామాయ
సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాఽఽత్మజాయై నమోఽస్తు రుద్రే న్ద్ర
యమాఽనిలేభ్యో నమోఽస్తు చన్ద్రాఽర్క మరుద్గణేభ్యః ! అని స్తోత్రం చేస్తే నాకు దర్శనమిచ్చిందో ఏ
తల్లికి నమస్కారం చేస్తే అందరూ ప్రీతి పొందుతారో ఏ తల్లి ధర్మాత్ముడైన రామ చంద్ర
మూర్తి ఇల్లాలో అటువంటి తల్లిని అగ్నిహోత్రం కాల్చగలదా..! అగ్నిని
కాల్చగలిగినటువంటి పాతివ్రత్యమున్నతల్లి నాతల్లి కాబట్టి అగ్నిహోత్రం
చలకదనుకున్నారు.
ఈలోగా శుభవార్తలనందించే చారుణులు ఆకాశమార్గంలో
వెళ్ళిపోతూ ఆశ్చర్యం లంకాపట్టణాన్ని నేడు ఒక్క వానరుడు కాల్చాడు రావణుని యొక్క మేడ
తగుల బెట్టారు కొన్నివేల మంది యోధుల్ని సంహరించారు లంక లంకంతా కాలిపోయింది కాని
ఒక్క సీతమ్మ కూర్చున్న శింశుపా వృక్షం మాత్రం సీతమ్మ మాత్రం క్షేమంగా ఉన్నారు, ఏం
సంతోషం ఏమి సంతోషం అనుకున్నారు. ఒక్కసారి సంతోషించారు స్వామి, మళ్ళీ నా తల్లి
దర్శనం చేస్తానన్నారు. ఒక్క ధూకు ధూకారు అశోకవనంలోకి వెళ్ళారు అమ్మా నేను ఈ లంకా
పట్టణాన్నంతటినీ కాల్చేశనమ్మా వాళ్ళందరికీ బుద్ధొచ్చిందమ్మా నేను వెళ్ళి రామ చంద్ర
మూర్తిని లక్ష్మణ సహితున్ని సుగ్రీవున్ని కొన్ని కోట్ల వారములను తీసుకొని
వచ్చేస్తానమ్మా కొద్ది రోజుల్లోనే ఈ లంకా పట్టణమంతా నశించిపోయి నిన్ను రామ చంద్ర
మూర్తి తిరిగి తీసుక వెళ్ళగా మళ్ళీ నీవు పట్టాభిశక్తురాలివి అవుతావమ్మా అన్నారు.
తల్లి చాలా సంతోషించింది అక్కడ్నుంచి బయలుదేరారు. అరిష్టమనేటటువంటి పర్వత
శిఖరమెక్కి నిలబడ్డారు తుంగ పద్మక జుష్టాభి ర్నీలాభి స్వన
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
రాజిభిః అని మహర్షి ఎంత
చమత్కారంతో కూడు కున్నటువంటి ఒక గొప్ప ధర్మాన్ని చెప్తారంటే సోత్తరీయ మివాఽమ్భోధై అనీ ఆ పర్వతం, అరిష్టమనే పర్వతం మీద నిలబడి తుంగ
పద్మక జుష్టాభి ర్నీలాభి స్వన రాజిభిః నల్లటి వనములతో పెరిగినటువంటి కొండట
అది. ఆ కొండ మీద మేఘాలన్నీ తెల్లటి మేఘాలు కిందకి దిగాయటా అవి దిగితే ఎలా ఉందటా
అంటే ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకున్న విత్తా అన్నట్లుగా ఉందట పర్వతం ఎందుకనీ
ఇంటికి ఎవరైనా మహాత్ములు
వచ్చినప్పుడు ఎడం భుజం మీద ఉత్తరీయ్యం లేకుండా ఎదురెళ్ళకూడదు. ఏదైనా వస్త్రం పుచ్చుకునేటప్పుడు కూడా
ఆయూర్ధాయ సూచన కాబట్టి భుజం మీద వస్త్రం లేకుండా పుచ్చుకోకూడదు. కాబట్టి తుంగ
పద్మక జుష్టాభి ర్నీలాభి స్వన రాజిభిః ! సోత్తరీయ మివాఽమ్భోధై శ్శృంగాఽన్తర విలంబిభిః !! ఆ పర్వత శిఖరముల మీద ఉన్నటువంటి మేఘములు ఎడం
భుజం మీద ఉన్నటువంటి ఉత్తరీయ్యమా అన్నట్లుగా ఉన్నాయట.
చెట్లన్నీ అంతెత్తు పెరిగి చేతులు పైకెత్తి
ధ్యానం చేస్తున్న యోగులా అన్నట్లు ఉన్నాయట, వెదురు కర్రల్లోంచి వస్తున్నటువంటి
గాలికి అక్కడ చేస్తున్నటువంటి పెద్ద వేణు నాదమా అన్నట్లుగా ఉందటా అటువంటి పర్వతం
మీద నిలబడి ఒక్కసారి తన పాదములతో గట్టిగా నిలబడి దాన్ని కుంభించి ఆ పైకి లేవడం కోసమని
పర్వతాన్ని తొక్కారు ముప్ఫైయోజనములు పొడవు అరవై యోజనముల వెడల్పూ కలిగినటువంటి ఆ
అరిష్టమనే పర్వతము నేలతో సమానమైపోయింది. ఆ పాదముల యొక్క తాకిడికి ఒక్కసారి
ఆకాశంలోకి పైకి లేచి పిబన్ ఇవ బభౌ చాఽపి సోర్మిమాలం మహాఽఽర్ణవమ్ ! పిపాసుః
ఇవ చాఽఽకాశం దదృశీ స మహా కపిః !! మళ్ళి ఆకాశాన్ని తాగేస్తున్నాడా అన్నట్లుగా ఒక్కసారి ఆ ఆకాశ మండలంలో ప్రయాణం
చేస్తూ నూరు యోజనములు సముద్రాన్ని గడిచి ఆవలి ఒడ్డుకు చేరుపోతున్నారు హనుమ
వచ్చేస్తున్నారు అదిగో పెద్ద ధ్వని మహానుభావుడు వచ్చేస్తున్నాడు ఎర్రటి ముఖం
కనపడుతూంది ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమ్ ఆబభౌ అక్కడ ఉన్నటువంటి వానరులందరూ
ఒక్కసారి లేచినిలబడ్డారు మహానాదమొకటి చేశారు హనుమా పెద్దవాడు జాంబవంతున్ని అడిగారు
సీతమ్మని చూసినట్లా చూడనట్లా ఏంటా మహానాదం ఎందుకంటే ఆయన చూస్తే వీళ్ళు బ్రతుకుతారు
లేకపోతే సుగ్రీవుడు చంపేస్తాడని అంటే జాంబవంతుడు అన్నాడూ సర్వథా కృత కార్యోఽసౌ హనూమాన్ నాఽత్ర సంశయః ! న హ్యఽస్యా కృత కార్యస్య
నాద ఏవం విధో భవేత్ !! హనుమని ఉద్దేశించి
నమస్కరించి ఒక కార్యం అప్పజెప్పిన తరువాత అవ్వకపోవడమన్నది ఉండదు.
మహానుభావుడు అంతటి మహానాదం చేశాడంటే సీతామాత దర్శనం అయిపోయింది.
అందుకే అంత నాదం చేశాడన్నారు ఒక్కసారి వాళ్ళకి దగ్గరగా వచ్చారు దృష్టా సీతే
తి విక్రాన్తః సంక్షేపేణ న్యవేదయత్ ! నిషసాద చ హస్తేన గృహీత్వా వాలిన స్సుతమ్ !!
ఒక్కసారి ఆ కిందకి దిగి “చూడబడును సీతమ్మ” అన్నారు సీతమ్మ అని ముందన్నారనుకోండి
చూశాను అంటారో చూడలేదు అంటారో అని విపరీతమైన రక్తపోటుతో ఉన్నాయి ఆ వానరాలన్నీ
అందుకని చూడబడును సీతమ్మా అని అన్నాడట అంతే ఆ వానరాలన్నిటికి సంతోష మొచ్చేసిందట
ఒక్కసారి అందరూ ఎగిరేశారు చెట్లు ఎక్కేశారు తోకలన్నింటినీ కర్రల్లా నిలబెట్టేశారు
చెత్తో పట్టుకున్నారు పళ్లు పట్టుకొచ్చారు కాయలు పట్టుకొచ్చారు ఆకులు
పట్టుకొచ్చారు కొమ్మలు పట్టుకొచ్చారు అక్కడ వేసేశారు దీని మీద కూర్చోమన్నారు హనుమ
ముక్కు
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
పట్టుకునేవాడు మూతి
పట్టుకునేవాడు కాళ్ళు పట్టుకునేవాడు చేతులు పట్టుకునేవాళ్ళు నమస్కారం చేసేవాళ్ళు
స్తోత్రం చేసేవాళ్ళు పళ్ళు పెట్టేవాళ్ళు పొంగిపోయారు వాళ్ళను చూసి మహానుభావా నీవు
పుట్టడం వల్లా వానరజాతిలో పరువుప్రతిష్ఠలు నిమడించాయి, రామ కార్యంలో
సీతాదర్శనమైంది వానరులకీ అన్నఖ్యాతి మనకు దక్కిందన్నారు. అంగదుడన్నాడు ఇంత దూరమూ
వెళ్ళి సీతమ్మని చూసొచ్చిన తరువాత నీ బలంతోటే అక్కడ ఉన్న రాక్షసుల్ని సంహరించిన
తరువాత తిరిగి వెళ్ళి రామ చంద్ర మూర్తికి చెప్పడమెందుకు అందరూ ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం
వెళ్ళిపోయి రావణ సంహారం చేసి సీతమ్మను తీసుకొచ్చేద్దాం రామ చంద్ర మూర్తికి అప్పజెప్పేద్దాం అన్నారు.
అంటే పెద్దవాడు జాంబవంతుడన్నాడు తప్పు నాయనా మనకు రామ చంద్ర మూర్తిగాని
సుగ్రీవుడుగానీ ఏం చెప్పారు సీతమ్మ జాడ కనిపెట్టమని చెప్పారు అక్కడ వరకే అంతే
తప్పా మనకి అక్కరలేని విషయానికి ఎదిగి మనం ఆ ప్రయత్నం చెయ్యకూడదు. ప్రభుకార్యం
ఎంతవరకు శాశించబడిందో అంతవరకే చెయ్యాలి కాబట్టి మనం బయలుదేరి మళ్ళీ ఋష్యమూక పర్వతం
మీదకెళ్ళి ఈ విషయాన్ని ప్రస్రవణ పర్వతం మీద కూర్చున్న రామ చంద్ర మూర్తికి లక్ష్మణ
మూర్తికి సుగ్రీవునికి నివేదిద్దాం. అయితే సరేనన్నారు, స్వామి హనుమా తాను
బయలుదేరిన దగ్గర్నుంచి మధ్యలో వచ్చినటువంటి మైనాకుడు సురసా సింహికా లంకినీ
రాక్షసులు త్రిజటా అక్కడ ఉన్న విశేషాలు 80వేల మంది కింకరుల మూక జంబుమాలి
రావణాసురుడు ఏడుగురు మంత్రి సుతులు ఐదుగురు సేనాగ్రనాయకులు అక్ష కుమారులు
ఇంద్రజిత్తు లంకాధహనం తన పౌరుషం తన పరాక్రం అంతా చెప్తారు. రామ చంద్ర మూర్తి
దగ్గరికెళ్తే ఇవేమీ చెప్పరు వినయంతో మాట్లాడుతారు. పెద్దల దగ్గరకెళ్లినప్పుడు తన
గొప్పతనం చెప్పుకోరు వానరుల దగ్గర మాత్రమే తాను చేసినటువంటివన్నీ చెప్పి సీతమ్మ
తల్లి శింశిపా వృక్షం కింద ఇలా కూర్చుంది ఇలా భర్తకోసం ఏడుస్తోంది అన్నీ చెప్పారు.
వాళ్ళందరూ వాళ్ళే సీతమ్మని తీసుకొచ్చినంత సంతోషపడిపోయారు.
సరే పదండి అందరం కలిసి వెళ్ళిపోదామన్నారు అంత పతివ్రత సీతమ్మతల్లి రావణుడు
ముట్టుకుని కాలిపోలేదుకదా అన్నారు న త దఽగ్ని శిఖా కుర్యా
త్సంస్పృష్టా పాణినా సతీ ! జనక స్యాఽఽత్మజా కుర్యా దుత్త్రోధ కలుషీ కృతా !! అన్నారు హనుమ సీతమ్మ తల్లికోపంతో ఎవరిమీదైనా
చేయి వేసిందో బూడిదైపోవలసిందే. సీతమ్మతల్లిని ముట్టుకునికూడా వాడు కాలిపోలేదంటే
వాడి తపఃశక్తి అటువంటిది కానీ ఇవ్వాళ సీతమ్మతల్లిని అనకూడని మాటలను అని పదినెలల
నుంచి అన్నకారణంచేత వాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. సీతమ్మతల్లే చంపేయగలదు
ఎందుకు చంపేయలేదూ అంటే ప్రతిజ్ఞ చేసింది రాముని చేత నీవు చంపబడాలి అని. రాముడు
ప్రతిజ్ఞచేశాడు నేను చంపుతానూ అని కాబట్టి మనమూ చంపకూడదు సీతమ్మ చంపకూడదు రాముడు
వచ్చి చంపాలి కాబట్టి పదండి రామునికి చెప్తాం అన్నారు అందరూ ఆకాశంలో పెద్ద మబ్బులు
వెడుతున్నాయా అన్నట్టుగా ఎగిరిపోయారు ఎగిరిపోతే పెద్ద గాలి లేచిందా అన్నట్టుగా
వాతావరణం మారిపోయిందా అన్నట్టుగా మారింది అందరు లేచారు ఋష్యమూక పర్వతం చేరారు.
అక్కడ మధు వనం కనపడింది అందులోకి ఎవ్వరూ వెళ్ళరూ తేనె తాగరు సుగ్రీవుడి యొక్క
మేనమామ దధిముకుడనేటటువంటాయన ఎప్పుడూ ఆ వనాన్ని కాపలా కాస్తుంటాడు. అంగదుడు యువరాజు
ప్రభువు తరువాత ప్రభువంతటివాడు హనుమ ఇంత గొప్ప కార్యమును సాధించుకుని వచ్చారు సీతామాత
దర్శనం చేశారు కాబట్టి ఇవ్వాళ మనం ఈ వనంలోకి వెళ్ళి బాగా మధువు తాగుదాం అన్నారు.
అంటే ఆరోజుల్లోనే ఏదైనా కార్యాన్ని సాధిస్తే పార్టీలు చేసుకునే సంస్కృతి రామాయణం
నాటికే ఉండేలా ఉంది.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇప్పుడు
అంగదడన్నాడు ఓ మనం యధేచ్చగా వెళ్ళి మధువుని తాగుదాం అన్నారు వీళ్ళందరూ ఆ చెట్లమీద పడ్డారు
సుభ్రంగా తేనె పట్లు పిండేశారు ఆ తేనంతా తాగేశారు, విపరీతంగా తేనె తాగేయడంలో
మత్తెక్కిపోయింది. గాయన్తి కేచిత్ ప్రణమన్తి కేచిత్ నృత్యంన్తి కేచిత్
ప్రహసన్తి కేచిత్ పతన్తి కేచి ద్విచరన్తి కేచిత్ ప్లవన్తి కేచిత్ ప్రలపన్తి కేచిత్
చిన్నప్పుడు ఈ శ్లోకం చదివితేగాని మా అమ్మాయి
అన్నం తినేదికాదు అందుకని నవ్వుతున్నా గాయన్తి కేచిత్ ప్రణమన్తి కేచిత్
నృత్యంన్తి కేచిత్ ప్రహసన్తి కేచిత్ పతన్తి కేచి ద్విచరన్తి కేచిత్ ప్లవన్తి
కేచిత్ ప్రలపన్తి కేచిత్ మహర్షి ఏమి వర్ణ చేస్తారో ఆ విపరీతంగా తేనె తాగేసిన
వానరులు మత్తెక్కిపోయి కొంతమంది నాట్యం చేస్తున్నారు కొంతమంది పాట పాడుతున్నారు
కొంతమంది పైనుంచి కిందపడిపోతున్నారు ఒకరు అనవసరంగా ఇంకోన్ని కొడుతున్నారు కొంతమంది
తపస్సు చేసినవానిలా కూర్చుంటున్నారు కొంతమంది కిందపడిపోయారు కొంతమంది
ఏడుస్తున్నారు కొంతమంది నవ్వుతున్నారు ఎవడు ఏది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే
తెలియదు ఆ దధిముకుడు అన్నాయ వచ్చి వీళ్ళందర్నీ నిగ్రహించే ప్రయత్నం చేస్తే అందర్నీ
అందరూ కలిసి ఆయన మీద పడి రక్తం కారేటట్టుగా కొట్టి గోళ్ళతో చీలిస్తే సాక్ష్యాత్
తాతగారి వయసౌతారని కూడా చూడకుండా అంగదుడు తన మోకాళ్ళతో కుమ్మేస్తే నెత్తురు
కక్కుకుని ఆ దధిముకుడు బాధపడి అక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరం మీద రామ లక్ష్మణులు
కూర్చుని ఉంటే అక్కడ ఉన్నాడు సుగ్రీవుడు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాలి కాలంలో కూడా
నేను ఈ మధువనాన్ని కాపలా కాస్తున్నాను వాలి కూడా వచ్చి ఎప్పుడు ఈవనంలో తేనె
తాగలేదు అటువంటి వనంలోకి ఇవ్వాళ హనుమతో కూడినటువంటి అంగదుడు ఇతరవానరులు ప్రవేసించి
మధువునంతటినీ తాగేశారు వానర భాషలో బాధతో నేలమీద పడి సుగ్రీవుడి కాళ్ళమీద పడి
ఏడుస్తూ చెప్తున్నాడు.
మధ్య మధ్యలో హనుమంటాడు మధ్య మధ్యలో అంగదుడంటాడు
మధ్య మధ్యలో జాంబవంతుడంటాడు మాట్లాడే మాటర్థం కాదు ఒకపక్కనుంచేమో ఏడుస్తున్నాడు,
దక్షిణ దిక్కుకెళ్ళినవాళ్ళేమో ఒక్కళ్ళూ రాలేదు హనుమ సీతమ్మతల్లి దర్శనం
చేసొస్తారని ఆశపెట్టుకుని ఉన్నారు ఈయ్యన ఏడుస్తాడు వానర భాషలో మాట్లాడుతాడు మధ్యలో
హనుమ అంటాడు. ఏమిటో అర్థం కాదు రాముడికి లక్ష్మణుడికి వాళ్ళకి వానరభాష రాదు,
చూశాడు చూశాడు రాముడు ఓర్చుకుంటాడు కాని లక్ష్మణుడు ఓర్చుకోలేడు వీడు ఏడుపేమిటి
వీడు అల్లరేమిటి ఎందుకేడుస్తున్నాడని అడిగారు అడిగితే సుగ్రీడన్నాడు ఏమీలేదు
దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరములు మధువనంలో ప్రవేశించి మధువు తాగాయట ధదిముకున్ని
హింసించారటా హనుమ వెళ్ళిన దక్షిణ దిక్కు వెళ్ళిన వానరములు తప్పా ఎవరు సీతమ్మ
దర్శనం చెయ్యగలరు వాళ్ళులో కూడా హనుమయే దర్శనం చేసి ఉంటారు నాకు పరిపూర్ణమైన
విశ్వాసముంది ప్రభువు ఆజ్ఞ అని చెప్పండి అన్నారు. వెంటనే వానరులందర్నీ రమ్మనారని
చెప్పండీ అన్నారు. వెళ్ళి నీమీద ఫిర్యాదు చేశాను సుగ్రీవుడు సంతోషించి మిమ్మల్ని
రమ్మనాడు అన్నాడు. ఒక్కసారి అందరూ అప్పటిదాకా పుచ్చుకున్నదంతా ప్రభువు పిలిచాడు
అనేటప్పటికి దిగిపోయింది. ఒక్కసారి సంతోషంగా స్పృహవచ్చింది
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
సంతోషంగా మళ్ళీ
అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తరువాత హనుమ ప్రణిపాతం చేసి రామ చంద్ర
మూర్తికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనతో చెప్పారు నియతాం మఽక్షతాం దేవీం
రాఘవాయ న్యవేదయత్ నాతల్లి నియమమును పాటిస్తూ ఆరోగ్యముగా లంకాపట్టణములో ఉన్నది అన్నారు.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
అంతే హనుమను
వెనక్కి తోసేశారు ఈ వనరులందరూ ముందుకొచ్చేశారు అక్కడ సీతమ్మ ఎలా ఉందో ఇయ్యన
చెప్పారుగా అందుకనీ వీళ్ళే చూసేనట్లూ అందరూ వెళ్ళినట్లు చెప్పేశారు అన్ని విని రామ
చంద్ర మూర్తి అన్నారు నాయందు సీతమ్మ ఎట్లున్నది అన్నారు, పక్కకి తప్పుకుని హనుమా
ఇక్కడ రా ఇదేదో నీవు చెప్పే ప్రశ్నకు జవాబు చెప్పూ అన్నారు. ఆయనకు తెలియదా
చూసొచ్చినవాడు ఎవరో ఎలా బయటికి తీసుకురావోలో అప్పుడు హనుమని ముందుకు పంపించారు.
ఆయనొచ్చి శ్రుత్వా తు వచనం తేషాం హనూమాన్ మారుతాఽఽత్మజః ! ప్రణమ్య
శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి !! అంటారు మహర్షి. ఎంతటి బుద్దిమతాం వరిష్ఠమండి మా
తండ్రి ఒక్కసారి ఏమీ మాట్లాడలేదు సీతమ్మతల్లి ఎటువైపు ఉందో అటువైపుకి ఒక నమస్కారం
చేశాడు అంటే నాచేత నమస్కరింపబడవలసిన స్తితిలో నా తల్లి ఉంది అని ఒక మాట చెప్పారు
ఏమి చెప్పమంటావు మహానుభావా ఇదిగో నేను ఇక్కడ బయలుదేరాను మధ్యలో తన పరాక్రమం వైభవం
ఏమీ చెప్పలేదు లంకా పట్టణం చేరాను సీతమ్మ శింశిపా వృక్షం కింది బంధీరాలై కూర్చుంది
అక్కడ ఉన్న తల్లిని ప్రలోభ పెట్టాలని రావణాసురుడు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ నా
తల్లి నీయందే మనసు పెట్టుకుని ఉంది ఏకవేణి ఒంటిజడతో ఉంది. ఆ తల్లి దీనహః
పరమ దీనురాలిగా ఉంది ధరా శయ్యా భూమి మీద పడుకుని ఉంది, ఆతల్లి
నీయందే మనసుపెట్టుకుని ఉంది నిన్నే కావాలనుకోంటూంది రెండు నెలలు గడువిచ్చారు
రావణుడు ఒక్క నెల మాత్రమే తాను జీవించి ఉంటానంది. ఇదిగో ఈ అభిజ్ఞానముల నిచ్చింది
అని కాకాసుర వృత్తాంతము మనఃశిలా వృత్తాంతమూ ఆ తరువాత ఆ తల్లి ఇచ్చినటురవంటి
కేశభూషణమూ రామ చంద్ర మూర్తికి ఇచ్చారు. అది చూడగానే రామ చంద్ర మూర్తికి దశరథ
మహారాజుగారు జనక మహారాజుగారు జనకమహారాజుగారి భార్యయైన సునయన ఆ తరువాత తన తండ్రియైన
దశరథుడు జ్ఞాపకానికి వచ్చి గుండెల మీద పెట్టుకుని సీతమ్మతల్లే లభించినంతగా
విలపించి, సీతమ్మ తల్లి నెల్లాళ్ళు బతికుండనందికానీ నేను ఒక్క రోజు కూడా ఉండలేను
హనుమా నన్ను ఒక్కసారి ఇక్కడ్నుంచి లంకా పట్టాణానికి తీసుకెళ్ళి నాసీత దర్శనం
చేయించవా అని అడిగాడు రాముడు.
రామ చంద్ర మూర్తి అంటే అంతటి సౌజ్యమూర్తి అప్పుడు మహానుభావుడు హనుమ అన్నారు
బాధపడకు రామ చంద్రా ఇప్పుడు తల్లి శోకించట్లేదు ఆవిడ శోకమంతా పోయింది తతో మయా
వాగ్భః అదీన భాషిణా శివాభి రిష్టాభి రఽభిప్రసాదితా జగామ
శాన్తిం మమ మైథిలాఽఽత్మజా త వాఽపి శోకేన తథాఽభిపీడితా ! “తత్” తో మొదలైనటువంటి సుందర కాండ “తత్” తో
పూర్తైపోయింది. తతో మయా వాగ్భః అదీన భాషిణా శివాభి రిష్టాభి రఽభిప్రసాదితా జగామ
శాన్తిం మమ మైథిలాఽఽత్మజా ఆతల్లి ఇంతకపూర్వమే శోకిస్తున్న సీతమ్మకి నేను
వెళ్ళి నా వాక్కులచేతి సీతమ్మని ఊరడిల్లింపజేసి ఆవిడకి స్వాంతన వచనములు పలికి నెల
లోపలే నీవు లక్ష్మణ సహితుడవై సుగ్రీవ సహితుడవై వానర సహితుడవై వచ్చి రావణాది రాక్షసులని
తెగటార్చి సితమ్మతల్లిని రక్షించి వెనక్కి తీసుకొస్తావని నేను ఇచ్చిన మాటకి నా
తల్లి ఊరట చెంది ఉంది. ఇప్పుడు ఇంత మంది వానరులు అక్కడికి రాగలరని విశ్వశించిన
తల్లి విశ్రాంతి పొంది ఆనందంగా ఉంది. రామా నా వాక్కులచేత సీతమ్మ తల్లిని మళ్లీ
సంతోషం పొందేటట్లుగా చేసి వచ్చాను. నీవు కనిపించడంలేదని శోకం తప్ప ఇప్పుడు ఆ
తల్లికి ఇంకోశోకంలేదు అని హనుమ చెప్పిన మాట ఏది ఉందో జగామ శాన్తిం మమ మైథిలాఽఽత్మజా నేను సీతమ్మకి మనఃశాంతిని ఇచ్చాను అన్న మాటతో
సుందర కాండ పూర్తైంది కాబట్టి ఎవరు సుందర కాండ వింటారో వాళ్ళందరికి మనఃశాంతి
కలుగుతుందని ఆనాటి నుంచి ఈనాటి వరకు సుందర కాండ పారాయణ చేయడం సుందర కాండ వినడం
మనకి సనాతన ధర్మంలో అంతర్భాగాంగా అందరూ సుందర కాండని అనుష్టించడం ఆచరించడం పారాయణ
చేయడం ప్రవచనాలు వినడం ఎప్పటినుంచో వస్తున్నటువంటి సదాచారం కాబట్టి ఇవ్వాల్టితో
సుందర కాండ మీద ప్రసంగాలు పూర్తయ్యాయి.
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
మీరు ఇందులో ఒక్క
విషయాన్ని గుర్తించాలి తతో మయా వాగ్భః అదీన భాషితా నా మాటతో ఆవిడ యొక్క
దుఃఖాన్ని పోగొట్టాను ఈశ్వరుడు సమస్త భూతములలో వాక్కు ఇచ్చినది ఒక్క మనుష్యునికే
మనకు ఇచ్చినటువంటి వాక్కు ఇతరుల యొక్క దుఃఖాన్ని పోగొట్టుటటుకు పనికిరావాలి తప్పా
ఇతరులను దుఃఖపట్టడానికి మన మాటలు పనికి వస్తే మనం కూడా రావణాసురులం అయిపోయినట్లు
గుర్తు. కాబట్టి మన
వాక్కును సద్వినియోగం చేసుకుని పదిమంది మనఃశాంతికి కారకమయ్యేటట్టుగా మట్లాడగలిగిన
ప్రజ్ఞ ఆ హనుమత్ సమేత శ్రీ సీతారామ సమేత రామ చంద్ర ప్రభువు యొక్క నిర్హేతుక
కృపాకటాక్షవీక్షణములచేత మనందరికి లభించాలని ఆ భగవంతుని యొక్క పాదారవిందములను
సాంజలిబందముగా నమస్కరిస్తూ పాటించి ప్రార్థన చేస్తూ సుందర కాండ ఇవ్వాళ పూర్తి
చేయ్యకపోతే ఓ ఇబ్బందుంది. ఏడో రోజుతో పూర్తి చేయకపోతే మల్ళీ తొమ్మిదవ రోజు పూర్తి
చెయ్యాలి బెసి సంఖ్యలోనే పూర్తి చెయ్యాలి తప్పు మళ్ళీ రేపు చెయ్యకూడదు. కాబట్టి
నేను ఇవ్వాళ ఎట్టి పరిస్థితుల్లో నేను సుందర కాండ పూర్తి చేస్తేనే నేను రేపు యుద్ధ
కాండ మొదలెట్టగలను. యుద్ధ కాండ మొదలెడితే తప్పా వచ్చే నెల ఈవ్వాల్టికి పట్టాభిషేకం
అయిపోయి రామ చంద్ర మూర్తి సహజలాచనాలు జరుగుతూ ఉంటుంటూంది. అత్యద్భుతమైన కార్యక్రమం
కాబట్టి ఇవ్వాళ సుందర కాండ పూర్తి చేసి తీరాలి. అందుకని ఎక్కడైనా ఉండిపోతానేమోనని
ఒళ్ళు దగ్గర పెట్టుకుని సుందర కాండ పూర్తి చేశాను. దానికి సహకరించిన మీ అందరికి
కృతజ్ఞతలు ఆవిస్కరిస్తూ ఒక్క పదకొండమాట్లు
మనం పెట్టుకున్న సదాచారాన్ని అనుసరించి రామ నామం చెప్పుకుని అందులో సుందర కాండ పూర్తి
చేశాం కాబట్టి అందురూ చెప్పండి
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
జానకీహృత్ కమలమందుని వెలయు చున్నది రామ నామమం !!రా!!
నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీ రామ నామము !!రా!!
తల్లివలె సుజనుల నెప్పుడు రక్షించునది శ్రీ రామ నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
భక్తితో భజియించువారికి ముక్తి నొసగును రామ నామము !!రా!!
శిష్ఠజనములు దివ్యదృష్టికి ష్పష్టమగు శ్రీ రామ నామము !!రా!!
విజ్ఞుడగు గురు నాశ్రయించిన విషదమగు శ్రీ రామ నామము !!రా!!
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
మేము రామ నామం
చెప్తూంటాం హరిప్రసాద్ గారు మీరు ఏం చేస్తుంటారంటే సభా మర్యాదననుసరించి నేను
నిన్నను మాటిచ్చానుగాబట్టి నేను ఒక్కళ్ళని నామినేట్ చేస్తాను మిగిలిన వాళ్ళల్లో
మీరు ఏం చేస్తారంటే ఒక ఐదుగురిని మొగవాళ్ళని నామినేట్ చేయండి వాళ్ళతో పాటుగా
ఇంటికి ఇప్పుడు కాస్త దగ్గర ఇళ్ళూ భర్తగారు కూడా ఉండి తీసుకెళ్ళేటట్టుగా ఆలస్యంగా
ఆడవాళ్ళకు ఇబ్బంది గలిగితే వాళ్ళను ఉంచద్దు వాళ్ళు వచ్చేసినట్లే తప్పా వాళ్ళు
ఒక్కళ్ళు ఉండి తరువాత ఇబ్బంది పడి అలా జరగడానికి వీల్లేదు. ఇల్లు దగ్గరగా ఉన్న
ఆడవాళ్ళైతే ఉంచండి. లేకపోతే మగవాళ్ళని ఒక ఆరుగురుని మీరు వెళ్ళీ కాస్త సమర్తుల్నీ
లెక్కించ గలిగినవాళ్ళని ఎంచి తీసుకురండి. ఈలోగా మేము రామ నామం చెప్తూంటాం. ఆ ఇంకా
హుండీ అవకాశాన్ని వినియోగించుకోలేనివాళ్లు వినియోగించుకుంటారు ఈలోగా మీరు వెళ్ళి
ఒక ఆరుగురుని తీసుకురండి. తీసుకొస్తే ఇక్కడ నిల్చోబెడుదాం ఈలోగా మేమం నామం
చెప్పేస్తాం. ఆ అధికారం మీది మీరెళ్ళి తీసుకురండి పరకాణి లెక్కింపు విషయం.
తత్వ శిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామ నామము !!రా!!
జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీ రామ నామం !!రా!!
పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామ నామము !!రా!!
శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీ రామ నామము !!రా!!
బ్రహ్మపుత్ర కరాబ్జవీణా పక్షమైనది రామ నామము !!రా!!
భక్తితో ప్రహ్లాదుడడిగిన వరమునొసగెను రామ నామము !!రా!!
స్టేట్ బ్యాంక్ శ్రీనివాస్ గారు ఉంటే ఆయన్ని కూడా వేయండి వాళ్ళైతే టకటకా టకటకా
లెక్కెడుతారు
సుందర కాండ
ముప్పయ్ ఐదవ రోజు ప్రవచనము
|
|
పెద్దలను
ప్రేమించువారికి ప్రేమ నిచ్చును రామ నామము !!రా!!
వేదవాక్కు ప్రమాణములచే అలరుచున్నది రామ నామము !!రా!!
రావణానుజ హృదయపంకజ రాచకీరము రామ నామము !!రా!!
మంగళా శాసన...
No comments:
Post a Comment