Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - యుద్ధ కాండ 38వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Yuddha Kanda 38th Day


యుద్ధ కాండ

ముప్పై ఎనిమిదవ రోజు ప్రవచనము





పరమ ధర్మాత్ముడైన రామ చంద్ర మూర్తి అకస్మాత్ యుద్ధాన్ని ప్రారంభించకూడదని ఒక నాలుగు మాటలు రాయబార రూపంలో చెప్తే ఏమైనా మారుతాడేమోనని మరొక్కసారి అంగదున్ని రాయబారిగా పంపించినటువంటి ఘట్టాన్ని, రాయబారీ అనికూడా చూడకుండా ధూతను సంహరించేటటువంటి ప్రయత్నంచేసిన రావణుడు వైఫల్యం చెందిన ఘట్టాన్ని నిన్నన మీకు మనవిచేసియున్నాను. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు రాయబారం వైఫల్యం చెందినటువంటి కారణం చేత యుద్దోన్ముఖులైనటువంటి వానరసైన్యము యొక్క ఉద్ధతిని రావణాసురునికి తెలియజేశారు తత స్తే రాక్షసా స్తత్ర గత్వా రావణ మన్దిరమ్ ! న్యవేదయన్ పురీం రుద్ధాం రామేణ సహ వానరైః !! వానరులతో కూడినటువంటి రాముడు ఆ లంకాపట్టణాన్ని ముట్టడించడం కోసం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడూ అన్నవిషయాన్ని రావణాసురునికి తెలియజేశారు. రావణాసురుడు అంతఃపుర గవాక్షంలోంచి చూశాడు, లంకాపట్టణం చుట్టుపక్కలంతా కూడా కొన్ని కోట్ల కోట్ల వానరసైన్యముచేత ఆక్రమింపబడి ఉంది. వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండి ఎంతటి క్లిష్టమైనటువంటి కార్యానైనాసరే సులభంగా సాధించగలిగినటువంటి ప్రజ్ఞకలిగిన రామ చంద్ర మూర్తి యొక్క ఆజ్ఞచేత రాక్షసులను హతమార్చడానికి ఒకరితో ఒకరు పోటీపడుతూ ఉత్సాహంతో నిండినటువంటి హృదయం కలిగినవారై యుద్ధోన్ముకులైనటువంటివారి యొక్క పరిస్థితిని గమనించాడు. పైకి ఎంత డాంభికం ప్రదర్శించినా ఆ నర-వానరుల యొక్క తేజస్సుని గమనించినటువంటివాడై మనసులో కించిత్ వ్యధని పొందాడు.
వాళ్ళు వేరు ఆయుధములు తెచ్చుకోవలసినటువంటి అవసరములేనివాళ్ళు వానరులు అక్కడ దగ్గరలో ఉండేటటువంటి పర్వత శిఖరాల్ని, అరణ్యాలలో ఉండేటటువంటి వృక్షాలను పెద్ద పెద్ద శిలలనీ వాళ్ళ గోళ్ళని ఆయుధాలుగా వాళ్ళు సిద్ధంగా లంకాపట్టణం మీద దాడికి ఎదురు చూస్తున్నారు. ఇక్కడా విచిత్రమేమిటంటే... ఎక్కడైనా యుద్ధం చేస్తే వీళ్ళు ఎక్కడ యుద్ధం చేశారో ఆ నగరం ఆ కోట పాడవ్వాలి, కానీ దానితోపాటు అరణ్యములుకూడా పాడైపోయాయి ఎందుకు పాడయ్యాయంటే వీళ్ళు మరి చెట్లన్నీపీకేస్తారు కాబట్టి వానరులు ఆ చెట్లతో యుద్ధం చేస్తారు కాబట్టి అరణ్యములుకూడా ధ్వంశమయ్యాయి. మరి ఇన్ని కోట్ల కోట్ల వానరములు వృక్షములను పెకలించినప్పుడు అరణ్యముల యొక్క స్థితి మారిపోతుందికదా... అందుకని అరణ్యములు ధ్వంశమయ్యాయి. అక్కడా పెద్ద పెద్ద కోట బురుజులున్నాయి, కోట బురుజుల మీదకి వానరులందరూ బయలుదేరారు తే ద్రుమైః పర్వతాఽగ్రై శ్చ ముష్టిభి శ్చ ప్లవంగమాః ! ప్రాకారాఽగ్రాణి చోచ్చాని మమంథు స్తోరణాని చ !! వాళ్ళు తే ద్రుమైః పెద్ధ పెద్ద వృక్షాల్ని పర్వతాఽగ్రై శ్చ పర్వతముల మీద ఉండేటటువంటి శిఖరములను ముష్టిభి

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
శ్చ ప్లవంగమాః పిడిగుద్దులు గుద్ది పాడుచేయడానికి వాళ్ళు సిద్ధపడినటువంటివారై లంకాపట్టణం మీదకి వెళ్ళి ప్రాకారములన్నింటినీ కూడా తమ పిడికిలి గుద్దులచేతా ఆ చెట్లచేతా శిఖరములచేతా మోది ఆ లంకాపట్టణ వైభవాన్నంతటినీకూడా నశింపజేసి ఆ తోరణాలన్నీ కిందపడిపోయేటట్టుగా కొట్టేశారు పరిఘాః పూరయన్తి స్మ ప్రసన్న సలిలా యుతాః ! పాంసుభిః పర్వ తాఽగ్రై శ్చ తృణైః కాష్ఠై శ్చ వానరాః !! వాళ్ళు అక్కడ ఉండేటటువంటి అగర్తలు మంచి నీటితో నింపబడి ఉన్నాయి.
నేను యుద్ధకాండ ప్రారంభం రోజు కావచ్చు నేను మీతో అగర్తలగురించి మనవిచేశాను ʻజలదుర్గమూʼ అని ఆ నీటినీ ప్రవేశపెట్టి దాటడానికి వీలులేకుండా చేస్తారు, ఆ అగర్త దాటడం చాలా కష్టం కానీ రామ రావణ యుద్ధంలో కలిసిసొచ్చినటువంటి విషయమేమిటంటే వీళ్ళు అగర్తని పూడ్చడం చాలా తేలిక వీళ్ళకి ఎందుకనీ అంటే పరిఘాః పూరయన్తి స్మ ప్రసన్న సలిలా యుతాః పాంసుభిః వాళ్ళు ఇన్నికోట్లమందీ వెళ్ళి కనపడినటువంటి పెద్ద పెద్ద మట్టిగడ్డలన్నీపెకలించి తెచ్చి ఆ శుద్ధమైన నీళ్ళల్లోవేశారు పర్వతాఽగ్రై శ్చ పర్వత శిఖరములను తీసుకొచ్చి ఆ అగర్తలల్లో పాడేశారు ఎంత సేపట్లో కూరుకుపోవాలి తృణైః కనపడిన గడ్డంతా పట్టుకొచ్చి అందులో పడేశారు కాష్ఠై శ్చ కర్రలు కొమ్మలు మొదలైనవన్నీ తీసుకొచ్చి అందులో పడేశారు వానరాః ఆ వానర సైన్యం అక్కడ ఉన్నటువంటి అగర్తలని ఇటువంటి పదార్థాలతో నింపేసింది. నింపేసి ఇప్పుడు కోట ద్వారమును బద్ధలు కొట్టాలి, బద్ధలు కొడితే లోపలికి నగర ప్రవేశం చెయ్యవచ్చు జయ త్యఽతి బలో రామో లక్ష్మణ శ్చ మహా బలః ! రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాఽభి పాలితః !! ఇత్యేవం ఘోషయన్త శ్చ గర్జన్త శ్చ ప్లవంగమాః ! అభ్యధావన్త లంకాయాః ప్రాకారం కామ రూపిణః !! వాళ్ళు పెద్ద పెద్ద సింహగర్జన చేస్తూ రామ చంద్ర మూర్తికి లక్ష్మణ స్వామికి సుగ్రీవునికి జయనాదం చేస్తూ పెద్ద పెద్ద ఘోషలతో లంకాపట్టణంలోకి ప్రవేశించి ఆ లంకని ధ్వంశం చేయడానికి సిద్ధపడుతున్నారు. వ్యూహాత్మకంగా వేధించడంవేరు వ్యూహంలేకుండా వెళ్ళి యుద్ధం చేయడం వేరు వ్యూహరచనా అనేటటువంటిది యుద్ధంలో అత్యంత కీలకమైనపాత్ర పోషిస్తుంది, వ్యూహరచన చేసేటప్పుడు సాధారణంగా కోటకి నాలుగువైపులా ద్వారాలుంటాయి, నాలుగు ద్వారాల్నీ నలుగురు యోధులు రక్షిస్తూంటారు వాళ్ళ వెనక కొన్ని కోట్ల సైన్యం ఉంటుంది.
లోపల ఏ యోధుడు కోట యొక్క ద్వార రక్షణకు నిలబడ్డాడూ అన్నదాన్నిబట్టి ప్రతి వ్యూహరచన చేసినప్పుడు ఇటువైపుకూడా తుల్యమైనటువంటి నాయకున్ని అటువంటి యోధున్ని సైన్యంతో నియమించవలసి ఉంటుంది. కాబట్టి రామ చంద్ర మూర్తి తూర్పు ఈశాన్యము వైపు ఉన్నటువంటి ద్వారానికి కుముదుడూ అనేటటువంటి ఒక గొప్ప యోధపతిని నియమించి ఆయనకు పదికోట్ల వానరములను సైన్యంగా ఇచ్చారు, అలాగే శతవలి అనబడేటటువంటి వానర సేనాపతికి ఇరవైకోట్లమంది వానరులతో దక్షిణ ద్వారం దగ్గర నిలబడి యుద్ధం చేయవలసిన బాధ్యతని అప్పజెప్పారు. అలాగే సుశేణుడు అబడేటటువంటి వానరునకు అరువది కోట్ల మంది అనుచరులనిచ్చి పశ్చిమ ద్వారం దగ్గర యుద్ధం చేయవలసినటువంటి బాధ్యతని అప్పజెప్పారు. ఉత్తర ద్వారం దగ్గర రామ లక్ష్మణులే నిలబడ్డారు, నిలబడి సుగ్రీవుడు వారి సహాయంగా ఉన్నాడు. ఈ సుగ్రీవున్ని ఇటు ఉత్తర దిశకు అటు పశ్చిమ దిశకు ఈ రెండింటికీ మద్యలో ఉన్న వాయువ్యదిక్కు నిలబడి కాపాడమని చెప్పారు సైన్యాన్ని. ఎందుచేతా అంటే లోపల నుంచి యుద్ధం చేసేటప్పుడు ఉత్తర ద్వారాన్ని రావణాసురుడు స్వయంగా రక్షిస్తాడు, పశ్చిమ ద్వారాన్ని ఇంద్రజిత్ కాపాడుతుంటాడు. రావణాసురుడే చాలా ప్రమాదకారి ఇంద్రజిత్ అంతక్నాప్రమాదకారి.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడూ రావణుని యొక్క చూపు ఇంద్రజిత్ యొక్క చూపు ఇద్దరి చూపులు కలిసి ఏ దిక్కుమీద పడతాయంటే వాయువ్యదిక్కుమీద పడతాయి ఎందుకంటే ఉత్తర పశ్చమాలకి దగ్గర కదాండి వాయువ్యం, ఏ దిక్కుకుకి వాయువ్యం మూల వచ్చేది అందుకని ఈయన ఉత్తరం నుంచి ఆయన పశ్చిమం నుంచి చూసినప్పుడు వాయువ్యమూల చాలా ప్రధానమైనటువంటి ప్రాంతం అక్కడ ఉండేటటువంటి సైన్యాన్ని కాపాడగలిగినవాడుండాలి ఏదైనా చిన్న తేడా జరిగితే రావణుడు బయటికి రావడం ఇంద్రజిత్ బయటికి రావడం అంటే ఏం మామూలుగా ఉండదు యుద్ధం. వాళ్ళు మాయా యుద్ధం చేస్తారు టక్కరితనంతో కూడిన యుద్ధం చేస్తారు. ఆ యుద్ధాన్ని ధర్మాత్ములైనటువంటివారు ప్రతి ద్వంధిగా నిలబడి చెయ్యడం కూడా అంత తేలికకాదు ధర్మ యుద్ధమైతే అర్థమౌతుంది, ధర్మయుద్ధముకాని యుద్ధాన్ని ఎలా ఉంటూంది అన్నది ఊహచేయడం కూడా చాలా కష్టం.
Related imageఅందుకని ప్రత్యేకించి వాయువ్య దిక్కుని రక్షించించడం కోసమనీ సుగ్రీవున్ని నిలబెట్టారు, సుగ్రీవున్ని నిలబెడితే వచ్చే ప్రయోజనమేమిటంటే ఏదైనా ఒక జరగరానిది జరిగిందనుకోండి, కొంచెం సైన్యమంతా భయపడవలసిన సంఘటన జరిగిందనుకోండి, సహజంగా వానరులు కొంచెం చపలచిత్తులు వాళ్ళు భయపడిపోయి పారిపోతారు అందరూ పారిపోకుండా ఉండాలీ అంటే ఈ రెండు దిక్కులనుంచి ప్రమాదం ఎక్కువుంటుంది కాబట్టి రాజే అక్కడ నిలబడి ఉంటారు. రాజు నిలబడి ఉంటే వాళ్లు పారిపోయేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే రాజాజ్ఞ సుగ్రీవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సైన్యం నిలబడుతుంది. నిలబడ్డంకోసమనీ ఆ వాయువ్యదిక్కున సుగ్రీవున్ని ఉంచి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ద్వారం దగ్గర స్వయంగా రామ లక్ష్మణులే నిలబడి గవాక్షుడు అనబడేటటువంటి ఒక భీకరమైనటువంటి కొండముచ్చు నాయకుడు ఆయనకి దగ్గర ఉండి సైన్య సహకారంతో సహకరించడానికి ఏర్పాటు చెయ్యబడ్డాడు, అలాగే ధూమ్రుడు అనబడేటటువంటాయనకూడా రామ లక్ష్మణులకి సహకరిస్తున్నారు. ప్రచండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. లోపల్నుంచి రాక్షసవైపులనుంచి కూడా అరి వీర భయంకరులైన వీరులు అన్ని ద్వారాలలోంచి రాక్షస సైన్యంతో బయటికి వస్తున్నారు, వచ్చినటువంటి వాళ్ళతోటి బయట ఉన్నటువంటి వానరలు యుద్ధంచేసి సంహరించవలసినటువంటి ప్రయత్నం. ఇదీ రామ-రావణ యుద్ధం ఒక విశ్వకళ్యాణ యజ్ఞం ఎందుచేతాంటే లోకాన్ని నశింపజేసేటటువంటి రాక్షసులందరూ లంకాపట్టణానికి చేరారు, ధర్మాన్ని నశింపజేసేటటువంటి స్వభావమున్నవాళ్ళందరూ రావణాసురుని యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారు.
ఇప్పుడు రావణున్ని సంహరించడమంటే రావణునికన్నా ముందు ఈ రాక్షసులు అందరిసంహారమూ పూర్తవ్వాలి, ఇంతమంది రాక్షసుల్ని సంహరించిన తరువాత రావణాసురున్ని సంహరించాలి. ఇందులో మళ్ళీ లంకాపట్టణంలో మిగిలిన రాక్షసులందరూ ఒకెత్తు అత్యంత ప్రమాదకారి అగస్త్య మహర్షి మాటల్లోనైతే ʻరావణాసురునికన్నా ప్రమాదకారి ఇంద్రజిత్తుʼ. ఇంద్రజిత్తును ఎదుర్కోవడం అంత తేలికైన విషయంకాదు. ఇంద్రజిత్తు ఎంత ప్రమాదకారో అంతకన్నా ప్రమాదకారి కుంభకర్ణుడు ఎందుకంటే కుంభకర్ణుడు అసలు యుద్ధం చేయడు ఆయనతో వచ్చిన పెద్ద గొడవేమిటంటే ఆయన తినేస్తాడు. ఆయన ఎన్ని లక్షల వానరములు కనపడ్డా అన్నిటినీ నోట్లోపడేసుకుంటుంటాడు. కాబట్టి అసలు అతనితో యుద్ధం చాలా చాలా కష్టం. ఒక స్థితిలో ʻరెపు వస్తుందేమో కుంభకర్ణుడి యుద్ధంʼ అసలు అత్యద్భుతం రామాయణంలో కుంభకర్ణుని నిద్రలేపడం కుంభకర్ణుడు యుద్ధానికి రావడమన్నఘట్టమే ఆశ్చర్యంతో ఉంటుంది. అసలు ఆయన ఒక మనిషని ఎవరూ అనుకోలేదు అందరూ పారిపోతూంటే అది మర బొమ్మాని ప్రచారం చేయించాడు విభీషణుడు, అంత భయంకరంగా ఉంటుంది అసలా కుంభకర్ణుని స్వరూపం. రేపు మీరు బహుషః రేపు రావచ్చు కుంభకర్ణుడికి సంబందించిన ఘట్టం. కనుకా ఇప్పుడు ఇలా సిద్ధం చేసిన తరువాత నాలుగు ద్వారములలోంచి రాక్షస నాయకులు బయటికి వచ్చారు. విభీషణుని దగ్గర ఉండేటటువంటి నలుగురు మంత్రులలో ఒకడైన సంపాతీ అనబడేటటువంటి మంత్రీ... సంపాతీ అంటే పక్షిరాజైన సంపాతికాడు, విభీషుణుని యొక్క సచివులలో ఒకడైన సంపాతి. ఒకపేరుతో చాలా మంది ఉంటూంటారు ఎందుకంటే కోటేశ్వరావు లోకంలో ఒక్కడేకాడుగా... చాలా మంది కోటేశ్వర రావులుంటారు అలాగే ఒకే రాక్షసుడి పేరుతో చాలా మంది రాక్షసులుంటారు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
Image result for sugreeva LANKAఇక్కడ జంబుమాలీ అనబడేటటువటి రాక్షసున్ని హనుమ సంహరిస్తాడు, అప్పుడు మీరు సుందరకాండలో ఉన్న జంబుమాలీ అనుకోకూడదు, ఈయ్యన వేరొక జంబుమాలి, కనుక విభీషణ సచివుడైన సంపాతి ప్రజజ్ఘాసురుడు అనబడేటటువంటి రాక్షసునితో యుద్ధం చేసి సంహరించాడు, విభీషణుడు మిత్రఘ్నుడు అనబడేటటువంటి రాక్షసున్ని సంహరించాడు, గజుడు అనబడేటటువంటి వానర యోధుడు తపనాసురుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఇది నేను వాఖ్యంలో ʻయుద్ధంచేసి చంపాడు అంటూంటానుʼ కానీ యుద్ధం చేసి చంపాడు అన్న వాఖ్యం వెనుకా చాలా గొడవుంటుంది అది అంత తేలిగ్గా ఏదో అలా వస్తే ఇలా ఓ శూలంపెట్టి పొడిచి చంపేసేలా ఏం ఉండదది చాలా భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధం. అలాగే నీలుడు నికుమ్భుడు అనబడేటటువంటి రాక్షసునితో యుద్ధం చేశాడు సుగ్రీవుడు ప్రఘసుడు అనబడేటటువంటి రాక్షసునితో, లక్ష్మణ స్వామి విరూపాక్షుడు అన్న రాక్షసునితో అగ్నికేతువు రశ్మికేతువు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు అనబడేటటువంటి నలుగురు రాక్షసులు రామ చంద్ర మూర్తితో యుద్ధం చేశారు. వజ్రముష్టి అనబడేటటువంటి రాక్షసుడితో మైన్దుడు, అశనిప్రభడు అనబడేటటువంటి రాక్షసునితో ద్వివిదుడు అలాగే ప్రతపనుడు అనబడేటటువంటి రాక్షసుడు నళునితో యుద్ధం చేశాడు, సుషేణుడనే వానర ప్రముకుడు ఆయనా తార యొక్క తండ్రి విశేషించి సుగ్రీవుడికి మామగారు విద్యున్మాలీ అనబడేటటువంటి రాక్షసునితో యుద్ధం చేశాడు.
ఈ యుద్ధం చేయడమూ అంటే ఏం మామూలుగా ఉండదు ఇది ఎంత ఆశ్చర్యజనకంగా ఉంటుందంటే వానరులు ఎప్పుడు ప్రయోగించినా పెద్ద పెద్ద శిలలను పడేస్తుంటారు లేకపోతే కొన్నివందల పెద్దపులులూ ఏనుగులు సింహాలతోటీ చెట్లతోటీ కూడుకున్నటువంటి పర్వత శిఖరములను పెళ్ళగించి వచ్చినటువంటి యోధునిమీద పడేస్తుంటారు. వాళ్ళు తమ నిశితమైనటువంటి బాణ పరంపరచేతా ఆ పర్వతము వచ్చి మీద పడేలోపలే వాళ్ళు దాన్ని చూర్ణం చేస్తుంటారు. అంటే అసలు అందుకే రామ-రావణ యుద్ధంలాంటి యుద్ధం ఇంక లోకంలో లేదు అసలు ఆ వానరులకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం అంత ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. మీరు ఒక్కసారి ఊహచేయండి ఒక పర్వత శిఖరాన్ని పెకలించి ఒకడుకాదు వానర యోధులైనవారు అటువంటి పర్వత శిఖరాలని విసురుతుంటారు ఒక పెద్ద పర్వతాన్నే విసిరేస్తుంటారు అలాంటి పర్వతాలు వచ్చి పడిపోతూంటాయి, పడిపోతూంటే రాక్షస యోధులు వాటిని చూర్ణం చేస్తుంటారు అంటే జల్లుకపోతూంటుంది

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
మట్టి ఇది పడిపోయినప్పుడు ఏమౌతుందంటే అందులో ఉండేటటువంటి పాములు క్రూర మృగాలు ఇందులోంచి పడిపోతూంటాయి పడిపోయి అవి పరుగెడుతుంటాయి, మళ్ళీ వాటిని చంపుతుంటారు కొన్నిటిని రాక్షసులు తినేస్తుంటారు వాళ్ళకు లేళ్ళూ జింకలు ఇలాంటివి కనడితే అక్కడే వాళ్ళకి అల్పాహారం కూడా పూర్తైపోతుంది, వాళ్ళు వాట్ని తింటూ ఉంటారు చాలా ఆశ్చర్యకమైనటువంటి యుద్ధం కాబట్టి ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాధారణంగా యుద్ధాలలో ఎలా ఉంటుందంటే అది ధార్మికమైన యుద్ధమైతే సూర్యాస్తమయానికి యుద్ధాన్ని ఆపుచేస్తారు, అసలు ఇంకా ధార్మిక యుద్ధమైతే ఒక్కొక్క మహానుభావుడు ఎంత ధర్మనిష్టతో ఉంటాడంటే యుద్ధం జరుగుతుండగా కూడా సంధ్యావందనం చేస్తాడు. భీస్మాచ్యార్యులవారు కురుక్షేత్ర యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా ఉండగా యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యాన్నకాలమైతే ఆయన సంధ్యావందనం చేయవలసిన సమయమొస్తే ఆయన కూర్చుని ఆచమనం చేసి సంధ్యావందనం చేయడానికి సమయం లేదుకాబట్టి ఆయన రథం మీద నుంచిదిగి భూమి మీద మట్టిని నీటిగా భావన చేసి పైకి తీసి సూర్యుని ఆర్ఘమిడిచిపెట్టేవాడు విడిచిపెట్టి మళ్ళీ రథమెక్కి యుద్ధం చేసేవాడు.
Related imageఅంత ధార్మికంగా ఉండేవి యుద్ధాలు, ఒక యోధుడితో ఒక యోధుడు యుద్ధం చేస్తుంటే ఇంకొక యోధుడు కలియబడడమన్నది ఉండేదికాదు అది ఆ ధర్మనిష్ట కలిగినటువంటివారుచేశారు. కురుక్షేత్రంలోకూడా అక్కడక్కడా అధర్మాలతో కూడినటువంటి యుద్ధాలు జరిగాయి, అభిమన్యున్ని మట్టుపెట్టినప్పుడు అలాంటి సందర్భాల్లో. అంటే నేనూ ఈ సందర్భమొచ్చింది కాబట్టి నేను మనవి చేయవలసి ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉండేటటువంటి విషయమేమిటంటే నేను ఉదయం పిల్లలతో మాట్లాడేటప్పుడు ఓ పిల్లవాడు సాయం సంధ్యావందనం గురించి నాతో చాలా ఆర్థితో మాట్లాడాడు నేను ఎక్కువ సమయం గడపలేక నేను చెప్పగలిగిన జవాబు చెప్పానతనికీ కానీ సంధ్యావందనం గురించి పెద్దలేం చెప్తారంటే సంధ్యావందనాన్ని చెయ్యకుండాకాని వెళ్ళిపోతే వెళ్ళిపోయేటప్పుడు సంధ్యావందనంచేసే అలవాటున్నాయనకి చెప్పుకోవాలి అయ్యా! తీర్థముంచండి మీరని. మళ్ళీ ఇతను రాత్రి ఇంటికొచ్చిన తరువాత ఏదైనా తినేముందు ఆ తీర్థాన్ని పుచ్చుకొని ఈశ్వరునికి క్షమార్పణ చెప్తేకానీ తానేమీ తినకూడదు అంటే సంధ్యావందనానికి అంత ప్రాముఖ్యత ఉంది. మీరు ఏదైనా చేశారా చేయలేదా వేరేవిషయం సంధ్యావందనం చేశారా అన్నదే చాలా ప్రధానమైన విషయం. అంతగొప్ప స్థితీ వేదాలు సంధ్యావందనానికిచ్చాయి కనుకా రాక్షసుల  యొక్క యుద్ధమూ అంటే అలా ధార్మికంగా ఉండదు. చాలా మాయతో కూడుకుని చాలా భయంకరంగా ఉంటుంది అందుకనివారు రాత్రివేళ యుద్ధానికి వచ్చారు.
ఇదీ ఎంత చమత్కారంగా ఉంటుందంటే ఈ రాత్రివేళ యుద్ధంలో అడిగి కొట్టుకున్నారు ఎందుకంటే కటిక చీకటి, లంకాపట్టణం బయటా గాడాంధకారము కావాలనే అటువంటి అంధకారాన్ని సృష్టించారుకూడాను రావణాసురుడు. సృష్టించడమంటే దీపాలు ఎక్కువ పెట్టకుండా ఉంటే వెలుతురుండదు, ఇప్పుడు ఈ కఠిక చీకట్లో కొట్టుకునేటప్పుడు రాక్షసుడు రాక్షసున్ని కొట్టుకుంటున్నాడో వానరుడు వానరున్ని కొట్టుకుంటున్నారో తెలియదు అందుకని అడిగి కొట్టుకుంటున్నారు, తడుముకుని నీవు రాక్షసుడవా వానరుడవా? అంటే నేను రాక్షసున్ని అంటే వానరుడు రాక్షసున్ని కొట్టేవాడు, ఎవడు ఎవడికింద నలిగిపోయాడో తెలియదు ఎవడు ఎవడిచేత మరణించాడో తెలియదు అటువంటి సమయంలో వెలుతురు సృష్టింపబడి గుర్తింపబడి ఆ మనవాళ్ళందరూ ఉన్నారూ అని చూసుకోవడానికి అవకాశాన్నిచ్చినవాడు ఎవరుచేశారో తెలుసాండీ..! రామ చంద్ర మూర్తి యొక్క ధనస్సుచేత నిబిడీకృతమైనమటువంటి బాణములు ఆకాశంలో బంగారు కాంతులతో వెలుతురు విరజిమ్ముతూ వెళ్లేవటా ఆ వెళ్తున్నప్పడు ఆ బాణముల యొక్క కాంతిలో మెరుపుల్లాంటి కాంతులలో సైన్యం చూసుకుంటుండేవి ఒకరికి ఒకరు అంటే అసలా రామ చంద్ర మూర్తి పరాక్రమం ఆ యుద్ధం అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఎంత ప్రాణాలు ఒడ్డి వాళ్ళు యుద్ధం చేశారో... ధర్మంకోసం మహానుభావులు నిజంగా వానరులు సామాన్యమైనవాళ్ళు కారు అందుకే నిజంగా భరద్వాజ మహర్షి వరమిచ్చారు మీరు ఎక్కడుంటారో అక్కడ తేనె పళ్ళు సమృద్ధిగా ఉంటాయి అన్నారు.
ఆ వానరులు ధర్మంకోసం రామ చంద్ర మూర్తి మీద అంత భక్తితో వాళ్ళు అంత యుద్ధం చేశారు నిజంగా రామ చంద్ర మూర్తి మీద భక్తీ అంటే వానరజాతిదే అంత గొప్ప భక్తితో రామ చంద్ర మూర్తికి వాళ్ళంతచేశారు. రామ-రావణ యుద్ధాన్ని యుద్ధకాండనీ చదివినవాడికి రామ కార్యంమీద రాముడికోసం మనం కూడా కనీసం ఏదైనా చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండాలి అన్న విషయాన్ని మనం కూడా గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఇంద్రజిత్తు ఆ చీకట్లో యుద్ధానికి వచ్చాడు ఇంద్రజిత్తుతో ఉన్న చాలా పెద్ద ప్రమాదమేమంటే ఆయన కనపడాలనుకుంటే కనపడుతాడు, కానీ ఆయన సంకల్పం చేస్తే ఇంక ఆయన కనపడడు ఆయన మేఘముల చాటునకు వెళ్ళిపోతాడు ఆయన కనపడకుండా బాణం వేస్తాడు, ఎన్నిబాణాలు వేస్తాడంటే మండలాకారంగా ధనస్సుని తిప్పుతూ కొన్ని లక్షల బాణములను విడిచిపెట్టగలడు, కాబట్టి ఎదురుగుండా కనపడితే కదా ప్రతిధ్వంది యుద్ధము చేయడం అసలు అతను కనపడమన్న అవకాశం ఉండదు పైగా అతను ఆకాశ మండలంలో నిల్చుంటాడు నిల్చుని యుద్ధం చేస్తాడు ఆ నిల్చుని యుద్ధం చేసేటప్పుడు అతనికి ఎవరిమీద బాణ ప్రయోగం చెయ్యాలనుకుంటే వాళ్ళమీద చాలా తేలిగ్గా చేస్తాడు కానీ మీరు బాణ ప్రయోగం చేద్దామంటే ఎక్కడున్నాడో మీకు తెలియదు కాబట్టి అతనిది చాలా భయంకరమైనటువంటి మాయా యుద్ధము. అతడు దేవతల దగ్గర వరములు పొందాడు బ్రహ్మాది దేవతలదగ్గర అందుకనీ ఆయన్ని నిగ్రహించడం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు కాబట్టి అంగదుడికి ఇంద్రజిత్తుకి యుద్ధం జరుగుతూంది ఆ చీకటివేళలో
అంగద స్తు రణే శత్రుం నిహన్తుం సముపస్థితః ! రావణిం నిజఘానాఽఽశు సారథిం చ హయా నఽపి !!
వర్తమానే తదా ఘోరే సంగ్రామే భృశ దారుణే !
ఇన్ద్రజి త్తు రథం త్యక్త్వా హతాఽశ్వో హత సారథిః ! అంగదేన మహా కాయ స్తత్రై వాఽన్తర ధీయత !!
త త్కర్మ వాలి పుత్రస్య సర్వే దేవా స్సహర్షిభిః ! తుష్టువుః పూజనాఽర్హస్య తౌ చో భౌ రామ లక్ష్మణౌ !!
అంగదుడు చాలా బలశాలి పర్వతాకారుడు, పర్వతాకారుడైనటువంటి అంగదుడు ఇంద్రజిత్తు యొక్క రథం మీదకి ధూకి ఇంద్రజిత్తు యొక్క సారథిని సంహరించాడు అలాగే ఇంద్రజిత్తు యొక్క గుఱ్ఱములను పడగొట్టి వాటిని చంపాడు, ఆ రథం భగ్నమైపోయేటట్టుగా చేశారు, దీనిచేత ఆగ్రహం పొందాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తుతో అలా తలపడ్డమంటే అలా యుద్ధం చేయడమంటే సామాన్యమైన విషయమేంకాదు మీరు ఎదర చూస్తారు ఇంద్రజిత్తు యొక్క ప్రభావమంటే ఎలా ఉంటుందో నిజంగా మీరు రామాయణాన్ని పరిపూర్ణంగా చదువుతున్నప్పుడు ఒక స్థితిలో మీకొక పెద్ద దిగులు పట్టుకుంటుంది అసలు ఈ ఇంద్రజిత్తు చచ్చిపోతాడా... అసలు ఈ ఇంద్రజిత్తు చచ్చిపోతేగదా రామ చంద్ర మూర్తిని గెలవడం ఇతను ఎలాగా మరణిస్తాడు అన్న అనుమానం వస్తూంది ఎందుకో తెలుసాండీ? ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలున్నాయో అన్ని అస్త్రములచేతా అతను కట్టుబడడు అతన్ని చంపడం సాధ్యంకాదు అంతటి అరివీర భయంకరుడు ఇంద్రజిత్తంటే అటువంటివాన్ని చాలా ఆశ్చర్యకరమైన యుద్ధంలో చంపాడు లక్ష్మణస్వామి, ఏదో ఆయనేం తినలేదు అరటి పండ్లనుకూడా తొడలో దాచుకున్నాడు లాంటి పిచ్చిమాట్లన్నీ వాల్మీకి రామాయణంలోలేవు మీరు వింటారుగా యుద్ధ కాండలో సంబంధమైనవిషయాలన్నీ వింటారు అప్పుడు మీకు తేటతెల్లంగా అన్ని విషయాలు తెలుస్తాయి.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇప్పుడు రామ లక్ష్మణులు సంతోషించారు ఋషులు సంతోషించారు అందరూ కూడా అంగదున్ని ప్రశంశించారు కానీ ఆగ్రహించినటువంటి ఇంద్రజిత్తు మేఘములలోకి అంతర్ధానమైపోయాడు అంతర్ధానమైపోయి వేరొక రథాన్ని సృజించుకుంటాడాయన ఎందుకంటే ఆయన సంకల్పం చేస్తే సింహములను పూంచిన రథం ఆయనకు యజ్ఞగుండంలోంచి పైకొస్తుంది దాన్నెక్కి యుద్దానికొస్తుంటాడు. ఇప్పుడు ఆయన ఒక్కసారి మేఘమండలోకి వెళ్ళిపోయి ఆ మేఘ మండలంలో నిలబడి బాణప్రయోగం చెయ్యడం మొదలుపెట్టాడు, ఆయనా దొరికితే కదా ఆయన్ని పట్టుకోవడం ఆయన ఎక్కడున్నాడో తెలిస్తేగదా అసలు పట్టుకోవడం ఆకాశంలో చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటివాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి పదిమంది వానరుల్ని ఎంచుకున్నారు రామ చంద్ర మూర్తి సుషేణుని యొక్క కుమారులు ఇద్దరు, నీలుడు,  నీలుడంటే ఏం సామాన్యమైనటువంటి యోధుడుకాడు అగ్నిహోత్రుని యొక్క అంశతో వచ్చినటువంటివాడు అంగదుడు శరభుడు వినతుడు జాంబవంతుడు సాలుప్రస్తుడు ఋశభుడు, ఋషభస్కందుడూ అనబడేటటువంటి పదిమందిని ఎంచుకునీ మీరు పదిమంది ఆకాశంలోకి వెళ్ళి విపరీతమైన వేగంతో తిరిగి ఎక్కడున్నాడో ఇంద్రజిత్తుని పట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఈ పదిమంది వానరలూ ఆకాశంలోకి వెళ్ళారు వీళ్ళ యొక్క వేగం వీళ్ళ యొక్క గమన శక్తి అంచనాకి దొరికేది కాదు అంతవేగంగా తిరగగలిగినవాళ్లు కానీ వీళ్ళు పదిమంది ఆకాశాన్నంతట్నీ వెతికినా అంటే యుద్ధ భూమి మీద ఆకాశానంతట్నీ వాళ్ళు అన్వేషించినా వాళ్ళకి ఇంద్రజిత్తు లభించలేదు. కాబట్టి వాళ్ళు కిందకి దిగొచ్చి రామా! మాకు ఇంద్రజిత్తు కనపడలేదూ అని చెప్పారు.
Image result for indrajit ramayanaఇంద్రజిత్తు ఆకాశంలోంచి చూశాడు రామ లక్ష్మణుల్ని వీళ్ళిద్దర్నీ పడగొట్టేస్తే నాన్నగారి యొక్క కోర్కె తీరుతుంది, నాన్నగారి కోర్కె ధర్మబద్ధమా అధర్మమా... అతనికి అనౌసరము అతనికి కావలసింది రావణుని తరుఫున యుద్ధం చేస్తాడు అంతే ఆయన కూడా రావణుని కన్నా గొప్ప రాక్షసత్వమున్నవాడు కాబట్టి ఇప్పుడు ఆ మేఘమండలంలోంచి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు, ఈ నాగాస్త్రానికున్న శక్తేమిటంటే దాన్ని దేవతలుకాని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులుకాని మహర్షులుకూడా వాటిని విడిపించలేరు, అవి బాణములు పామురూపంలో ఉంటాయి ఆ బాణములను ప్రయోగిస్తే అది బాణమొచ్చి తగలగానే అవి నాగములై ప్రతీ అవయవాన్నీ చుట్టేస్తాయి చుట్టేస్తే పాముకు చుట్టుకునే అలవాటుంటుంది అది అనుభవంలోకి రావాలని మనం కోరుకో కూడదు కాబట్టి ఆ పాము చుట్టుకుంటే ఇంక కదపడం కష్టం. కాబట్టి కాళ్ళు చేతులు దగ్గర్నుంచి అవయవాలన్నింటినీ కూడా నాగాస్త్రం వేసి రామ లక్ష్మణులనిద్దర్నీ బంధించాడు, బంధిస్తే ఇద్దరూ భూమి మీద పడిపోయారు రామ లక్ష్మణులు తౌ తేన పురుష వ్యాఘ్రౌ కృద్దేనాఽఽశీ విషై శ్శరైః ! సహసా నిహతౌ వీరౌ తదా ప్రైక్షంత వానరాః

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
!! ఎప్పుడైతే రామ లక్ష్మణులు ఇద్దరూ నేలమీదకు ఒరిగిపోయి భూమి మీద పడిపోయారో వాళ్ళ చేతులు కూడా ఇంక ఇలా అనే అవకాశంలేదు ఇలా అంటే కదాండి ధనస్సు పట్టుకోవడం ఇలా అంటే కదా బాణం పట్టుకోవడం అసలు ఇంక అవయవములేవీ కదలవు కాబట్టి నేల మీద పడిపోయి కొయ్యలు ఎలా ఉంటాయో అలా పడిపోయి ఉన్నారు నాగాస్త్రాల్ని వేసి వాళ్ళిద్దర్నీ కూడా బంధించాడు బంధించడం చేత వాళ్ళిద్దరూ భూమి మీద పడిపోయారు.
Image result for indrajit Rama lakshmana ramayanaపడిపోయిన తరువాత తాను ఆకాశంలో నిలబడి మర్మస్థానములు ఉంటాయి, మర్మస్థానములు అంటే ఎక్కడ బాణములు తగిలితే ప్రాణములు ఉత్క్రమణం జరుగుతుందో అంటే ప్రాణాలు పోతాయో ఆ స్థానమును గుర్తించడం యోధుడైనటువంటి వీరుడికి అదొక గొప్పవిద్య, ఊరికే బాణాలు కొట్టడం కాదు ఏ మర్మస్థానాలమీద బాణం తగిలితే ప్రాణంపోతూందో అటువంటి పదేహేను స్థానములను గుర్తించారు. ఓ గుండెకాయ ఉందనుకోండి గుండెకాయమీద బాణము తగిలిందనుకోండి ప్రాణంపోతూంది అలాగే తల మధ్యలో బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతూంది అటువంటి పదిహేను మర్మస్థానములు సాధారణంగా ఏంటంటే యుద్ధంలో ఒక లక్షణం ఉంటుంది యోధుని యొక్క శక్తి పడిపోవడముమీదే ఉండదు పడిపోయిన తరువాత ఎంత తొందరగా తెప్పరిల్లగలడూ అనేదానిమీద కూడా ఉంటుంది, ఒక సామాన్యవీరుడైతే అటువంటి బాణపు దెబ్బతగిలితే ప్రాణం వదిలేస్తాడు మహాయోధుడని గుర్తేమిటంటే ఆయన భూమి మీద పడిపోయినా కూడా మళ్ళీ తొందరగా తెప్పరిప్పుతాడు త్వరగా స్పృహలోకి రాగలుగుతాడు అంటే ఊంచుకోగలడన్నమాట బాణపు దెబ్బని అలా ఓర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటే ప్రాణాలతో ఉంటాడు ఆ ఓర్చుకోగలిగిన శక్తి తక్కువైతే చాలా తొందరగా మరణిస్తాడు. పదిహేను మర్మస్థానముల మీద బాణ ప్రయోగం చేయడమంటే సామాన్యమైన విషయం కాదు అది కూడా నారాచ బాణములని ఉంటాయి నారాచ బాణముల దగ్గర్నుంచి రకరకాలైన బాణాలతో పదిహేను మర్మస్థానముల దగ్గర రామ లక్ష్మణులనిద్దర్నీ కొట్టాడు కవచములను భేధించి కవచాలు బద్ధలైపోయి నేలమీద పడిపోతే వాళ్ళ ఒంటిమీద ఎక్కడా జాగా లేకుండా బాణాలు పెట్టు కొట్టాడు. కొడితే వాళ్ళ ఒంట్లో ఉన్న నెత్తురంతా బయటికొచ్చీ నెత్తుటి మడుగుల్లో పడిపోయారు రామ లక్ష్మణులు.
నిశ్చేష్టౌ మన్ద నిశ్శ్వాసౌ శోణితౌఘ పరిప్లుతౌ ! శర జాలాఽచితౌ స్తబ్ధౌ శయానౌ శర తల్పయోః !! వాళ్ళు అశ్చేష్టౌ ఇంకే ఏమీ చేష్టలులేవు అంటే ఏమీ కదలికలు లేవు కాని ఉన్నారు ప్రాణములతో ఉన్నారను గుర్తేమిటంటే తట్టుకోగలిగిన శక్తి ఉన్నవారుకాబట్టి, ఎప్పుడూ ఎలా ఊపిరి తీస్తారో అలా తీయ్యలేకపోతున్నారు మన్ద నిశ్శ్వాసౌ చాల కష్టం మీద ప్రాణములను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద ఊపిరి తీస్తున్నారు ఎవరు రామ లక్ష్మణులంతటివారు అంటే ఇంద్రజిత్తు యొక్క మాయా యుద్ధమేలా ఉంటుందో మీరు చూడండి శోణితౌగ పరిప్లుతౌ నెత్తుడి మడుగు అంటే శరీరంలోంచి కారిపోయినటువంటి ఒక రక్తపు మడుగు ఏర్పడింది ఆ మడుగులో పడిపోయి ఉన్నారు శర జాలాఽచితౌ స్తబ్ధౌ తిరిగి యుద్ధం చేయడం కానీ కనీసం ఇలా కనురెప్ప ఎత్తి చూడ్డంకానీ చెయ్యి కదపడంకానీ కాలు కదపడంకానీ ఏమీలేదు ఇంతటి రాముడు ఇంతటి లక్ష్మణుడు కూడా బాణం వచ్చి కుచ్చుకుంటూంటే గుచ్చుకున్న బాణానికి ప్రతిస్పంధించి చెయ్యి ఇలా ఎత్తడం కూడా ఇకలేదు ఎందుకంటే నాగాస్త్ర బంధనం చేశాడు కాబట్టి అలా పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్న శరీరంమీద బాణములువేసి కొడుతున్నాడు

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు వాళ్ళుపడిపోయి నెత్తురోడిపోయి నెత్తుట్లో తడిసిపోయి పడుకొని ఉన్నారు అంటే ఎంత ధారుణమైన స్థితిలో రామ లక్ష్మణులు పడిపోయారో చూడండి. ఇలా పడిపోయి ఉండి నిశ్శ్వసన్తౌ యథా సర్పౌ నిశ్చేష్టౌ మన్ద విక్రమౌ ! రుధిర స్రావ దిగ్ధాంఽగౌ తాపనీయా వివ ధ్వజౌ !! కిందపడినటువంటి ధ్వజములు ఎలా ఉంటాయో అటువంటి స్థితిలో బంగారు స్తంభాలులా చాలా కష్టం మీద ఊపిరి తీసి విడిచిపెడుతున్నటువంటి పాముల్లా నిశ్చేష్టౌ ఏవిధమైనటువంటి చేష్టలు ఉడిగిపోయి అంటే ఏమి ప్రతిస్పంధనలేదు అంటే చైతన్యము స్పృహతప్పిన స్థితిలోకి వెళ్లిపోయింది ఇంకా వాళ్ళకి బాహ్యస్మృతిలేదు మన్ద విక్రమౌ మన్ద విక్రమౌ అంటే లోపల ఇంకా ఎక్కడో యుద్ధం చేద్దాం బాణాలు పెట్టికొడుతున్నాడు నాగాస్త్రం పెట్టి కొట్టాడనికి మీరు తెలుసుకోవాలి తప్పా ఇప్పుడు వాళ్ళు తిరిగి యుద్ధం చేస్తారని మీరు తిరిగి ఊహించడానికి కుదరదిక.
రుధిర స్రావ దిగ్ధాంఽగౌ ఆ శరీరంలోంచి కారిపోయినటువంటి రక్తంలో వాళ్ళ ఒళ్ళంతా తడిసిపోయింది, తడిసిపోవడంలో రక్తపు ముద్దలకింది ఉన్నారు ఇద్దరు, వొళ్ళంతా కొట్టేశాడు కదాండీ మరి బాణాలు తాపనీయా వివ ధ్వజౌ కిందపడిపోయినటువంటి బంగారు స్తంభాల్లా ఉన్నారు తౌ వీర శయనే వీరౌ శయనౌ మన్ద చేష్టితౌ ! యూథపై న్తైః పరివృతౌ బాష్ప వ్యాకుల లోచనైః !! ఏరామ లక్ష్మణుల యొక్క ధనస్సుని ఏలక్ష్మణునుని యొక్క బాణ పరంపరని ఏరామ లక్ష్మణుల యొక్క విక్రమాన్ని నమ్మి ఇంతమంది వచ్చారో ఇంతమంది మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభంమైనరోజు రాత్రే రామ లక్ష్మణులు అలా పడిపోతే వాళ్ళు స్తబ్దులైపోయారు. అయిపోయి యోధులు వానరులయందు ఉండేటటువంటి వీరులందరు కూడా పరుగెత్తుకుంటూ వచ్చి రామ లక్ష్మణుల దగ్గరికివచ్చి చుట్టూ చేరారు, రామ లక్ష్మణుల చుట్టూ చేరినటువంటి వారిమీద విహటాట్టహాసం చేస్తూ మేఘాల చాటునుంచి వానర యోధులందరిని కొట్టాడు బాణాలుపెట్టి ఆ దెబ్బలకి యోధులందరూ కిందపడిపోయారు వానర సైన్యానికి ఎట్నుంచివచ్చి బాణాలు పడుతున్నాయో తెలియదు వచ్చిపడిపోతున్నాయి పడిపోతున్నారు వానరులు, ఈ దెబ్బకి చెల్లా చెదరైపోయి వానరసైన్యమంతా పారిపోవడం మొదలుపెట్టింది దిక్కులపట్టి బ్రతికుంటే బలిసాకు తినచ్చని అందరూ కిష్కింధవైపుకు వెళ్తున్నారు మిగిలిన వానర వీరులు వాళ్ళని ఆపడానికి అవకాశంలేదు ఎందుకంటే రామ చంద్ర మూర్తి చుట్టూ చేరి వాళ్ళు నిలబడ్డారు ఎటువంటి స్థితిలో బాష్ప వ్యాకుల లోచనైః కన్నుల వెంట బాష్పధారలు కారుతుండగా పడిపోయి ఉన్నారు ఇటువంటి స్థితిలో వానర సైన్యమంతా చెల్లా చెదరై పారిపోతూంది ఒక పక్క రామ లక్ష్మణులు పడిపోయారు ఉంటే ఉన్నట్లు లేకపోతే మనం కూడా పడిపోయినట్లు అని మనం కూడా బాణపు దెబ్బలుతిని ఏడుస్తూ యోధులందరూ రామ లక్ష్మణుల చుట్టూ చేరివున్నారు.
ఒక్కసారి ʻమేఘనాథుడూʼ అంటారు ఆయన్ని ఇంద్రజిత్తుని తేరిపారి చూశాడు, హాఁ... ప్రాణములు వెళ్ళిపోయాయి రామ లక్ష్మణులు నిహతులైపోయారు కొట్టేశాను అని ఇంక ఎక్కడైనా కొద్దిగ ఊపిరుంటే కొంచెం సేపట్లో ఆగిపోతూంది ఎందుకంటే కదిలే అవకాశంలేదు వాళ్ళు కదలరిక ఎందుకంటే నాగాస్త్ర బంధమైపోయింది దాన్ని విడిపించడం ఇంక ఋషులకు కూడా సాధ్యంకాదు మహర్షులే వచ్చినా నాగాస్త్ర బంధనాన్ని మాత్రం విడిపించలేరు, అది దివ్యాతి దివ్యమైనటువంటి అస్త్రాన్ని దేవతల దగ్గర తపస్సుచేసి బ్రహ్మాది దేవతల దగ్గర పొందాడు ఇంద్రజిత్తు. కాబట్టి ఇక అది విడిచిపెట్టదు వీళ్లు కదలరు అవి ఏం చేస్తాయంటే మంత్ర రూపమైనటువంటి బాణపు దెబ్బలకి ఆ చుట్టుకున్నటువంటి పాములు కరిచి విషాన్నెక్కిస్తాయి శరీరంలోకి

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అవి విషమెక్కిస్తుంటాయి వీళ్ల ఊపిరి మందగిస్తుంటుంది అంత భయంకరమైనటువంటి అస్త్రములచేతా బంధనం చేశాడు. ఇప్పుడు తాను సంతోషంగా లంకాపట్టణంలోకి వెళ్ళి రావణాసురున్ని కలుసుకున్నాడు, కలుసుకుని అన్నాడు ఇన్ద్రజి త్తు మహా మాయః సర్వ సైన్య సమాఽఽవృతః ! వివేశ నగరీం లంకాం పితరం చాఽభ్యుపాగమత్ !! రాక్షస సైన్యమంతా సంతోషంగా జయహో రావణాసురునికి హయహో ఇంద్రజిత్తుకీ జయహో అని జయ జయ ధ్వానాలు చేస్తూంది వానర సైన్యమంతా ఆక్రందనలు చేసి ఏడుస్తూ చెల్లా చెదరై పారిపోతూంది, రామ లక్ష్మణులు నెత్తుటి మడుగులో ఉన్నారు చుట్టూ వానరయోధులు నిల్చున్నారు వాళ్ళూ బాణపు దెబ్బలలో ఉన్నారు ఇప్పుడు అక్కడ చూస్తే జరుగరానిది జరిగిపోయిందీ అని తెలుస్తూంది. వెళ్ళి ఆ కూర్చున్నటువంటి రావణాసురునితో అన్నారు తత్ర రావణ మాఽఽసీనమ్ అభివాద్య కృతాంజలిః ! ఆచచక్షే ప్రియం పిత్రే నిహతౌ రామ లక్ష్మణౌ !! నాన్నగారూ మీకు నేను శుభమైనటువంటి వార్త చెప్పాను రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా నాచేతిలో నిహతులైపోయారు నాగాస్త్ర బంధనం చేసి సంహరించాను. కాబట్టి మీరు ఇంక సంతోషంగా మీరు కోరుకున్నట్లుగా జీవించవచ్చు.
అంటే వాడు లేచి సంతోషంగా కొడుకుని కౌగలించుకుని ఒక్కసారి మూ ర్ద్న్యేనం అంటే మూర్దన్యం నందు ముద్దుపెట్టి ఎంతో ఆనందించాడు నాయనా! నీవు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక రావణుని మనస్సు సంతోషంతో పొంగిపోయింది అసలు యుద్ధం మొదలు పెట్టగానే కొడుకు రామ లక్ష్మణుల్ని పడగొట్టేశాడు కాబట్టి ఇప్పుడు వెంటనే అశోకవనంలో సీతమ్మతల్లికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలని నేను పిలుస్తున్నానని చెప్పండని చెప్పాడు. త్రిజటతో సహ అక్కడ కాపలా ఉన్న రాక్షస స్త్రీలను రమ్మన్నాడు. ఆ రాక్షస స్త్రీలందరు వచ్చి జయ జయ ధ్వానం చేసి వచ్చి రావణాసురుని ఎదుట నిలబడ్డారు వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ఠా అంటే ఇదే... హతా విన్ద్రజితాఽఽఖ్యాత వైదేహ్యా రామ లక్ష్మణౌ ! పుష్పకం చ సమారోప్యం దర్శయధ్వం హతౌ రణే !! మీరు పుష్పకవిమానం ఎక్కించండి సీతమ్మను ఎక్కించి పుష్పక విమానం మీద యుద్ధభూమిలోకి తీసుకెళ్ళండి ఆ పైనుంచి చూపించండి కిందపడిపోయి శరీరాల్ని విడిచిపెట్టేసినటువంటి రామ లక్ష్మణుల్ని విమానం మాత్రం అక్కడ దిగడానికి వీల్లేదు మళ్ళీ తీసుకొచ్చేసైండి చూపించి తీసుకొచ్చెయ్యండి, అని అంటాడూ నిర్విశంకా నిరుద్విగ్నా నిరఽపేక్షా చ మైథిలీ ! మా ముపస్థాస్యతే సీతా సర్వాఽఽభరణ భూషితా !! ఆ రామ లక్ష్మణులిద్దరూ నిహతులైనారన్నవిషయాన్ని చూడగానే సీతమ్మకి శంకపోతూంది ఆయన బ్రతికున్నారుకదా అన్న అనుమానంపోతూంది కాబట్టి ఇంక ఆయనలేరు అన్న ధైర్యంతో వెంటనే చక్కగా పట్టుబట్టకట్టుకుని సర్వాభరణభూషితయై నా పాన్పుచేరుతుంది.
కాబట్టి మీరు చూపించి తీసుకొచ్చేయండి, మీకు “నేను ఇదీ చెప్పలేకా నేను ఆ శ్లోకాలు చదవడం కూడా ఇష్టంలేకా ఎందుకంటే ఇవన్నీ చెప్తే దీనియందు మనసుపెడితే వచ్చే ఇబ్బందేమిటంటే మనసు పెడితే మనసు అక్కడ నిలబడిపోయి దీనిమీదే చాలా బెంగగా అనిపిస్తుంది” ఎప్పుడో జరిగిపోయింది చచ్చిపోయాడు రావణాసురుడు అనిపించినా... ఇంత కష్టమా ఇంత కష్టమా అనిపిస్తుంది. అంతటి మహాపతివ్రతా అంటువంటి తల్లి పుష్కపకవిమానంలో ఆకాశంలో పైకొచ్చింది చూపించారు కిందకి చూడు రామ లక్ష్మణులని నెత్తుటి మడుగులో పడిపోయివున్నారు భర్త మరిది అయ్యో..! నాకోసం మహానుభావుడు ఇంత యుద్ధం చేశాడు, ఆనాడు లక్ష్మణ మూర్తిని తొందరపడి పంపించేశాను ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలుపడ్డారో నూరు

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
యోజనములుదాటివచ్చారు నాకోసమని ఇంత యుద్దం చేసి యుద్ధ భూమిలో పడిపోయారు నేను ఆయనకిచేసిన సుశ్రూషలేదు, ఇప్పుడు ఏ భార్యకైనా ఒకసారివెళ్ళి ప్రియమార కౌగలించుకుని ఏడవాలని ఉంది దాన్ని అనుమతించలేదు ఇదీ రాక్షసత్వము అంటే ఆ విమానాన్ని కిందకి దింపడానికి ఆయన అంగీకరించడు ఆ విమానంలోంచి చూడాలి అంతే, ఎందుకు చూడాలీ? అంటే చనిపోయాడని నిర్ణయించుకుని ఆవిడ వెంటనే మంచి బట్టకట్టుకుని సర్వాభరణాలు పెట్టుకుని రావణాసురుని పాన్పుచేరాలి ఇదీ ఆయన రాక్షసత్వము. ఆవిడ మనసు ఎలా ఉంటుందన్నది ఆయన ఆలోచించడు ఇప్పుడు ఆవిడకి శంకవదిలిపోయి దిక్కులేదు కాబట్టి తాను దిక్కుగా స్వీకరిస్తుంది అంటాడు. ఇంక ఇంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయము ఆవిడ గుండెలు ఎంత బద్ధలైపోయింటాయో... మీరు సీతమ్మ తల్లి పరాశక్తి కదాండీ అన్నారనుకోండి అప్పుడు ఇలాంటి ఘట్టాల్లో రామ కథకి అర్థమే ఉండదు మీరు నరుడి కథగానే చదువవలసి ఉంటుంది అంతే.
Image result for indrajit ramayanaనేను అందుకే మీకు తరచూ మనవిచేస్తాను మీరు నరుడి కథగానే చదవండి అప్పుడే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం మధురాతి మధురమైన కథగా రామ కథా మీకు కనపడుతుంది, ఇప్పుడు తల్లి ఎంత కష్టానికి ఓర్చుందో నిజంగాచెప్పాలంటే, ఆతల్లిని ఒక్కసారి చూపించారు పారిపోతున్న వానరుల్ని చూసింది ఏడుస్తున్నటువంటి వానర యోధుల్ని చూసింది ఏడుస్తున్నటువంటి హనుమనికూడా చూసింది అందరూ బాణపు దెబ్బలతో ఉన్నారు నెత్తుటి మడుగులో పడిపోయి నెత్తురంటుకుని చేష్టితములు లేక కాళ్ళూ చేతులూ కదపకుండా పడిపోయినటువంటి రామ లక్ష్మణుల్ని చూసింది. పైన పుష్పకం వెళ్తూన్నా వాళ్ళల్లో పతిస్పందనలేదు, ఇప్పుడు ఆమె రామ లక్ష్మణులు శరీరం వదిలిపెట్టేశారనే నిర్ణయించుకుంది. చిత్రమేమిటో తెలుసాండీ..! అలా ఒక్కసారి చూపించి ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయి దిగు కూర్చో అన్నారు. ఇప్పుడు ఆవిడ బాధ ఆవిడ శోకం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. భర్తకి ఇలా జరిగిందన్న శోకం ఒకపక్క ఆవిడ నిజంగా ఏడ్చినటువంటి సర్గ చదివితే గుండె కదిలిపోతూందన్నమాట, ఆవిడ తన యొక్క పాతివ్రత్యాన్ని తన యొక్క సాముద్రకిని ప్రశ్నించుకుంది ఆ సర్గలో. నా చేతుల్లో ఇటువంటి ముద్రలున్నాయి నా అరికాళ్ళల్లో అటువంటి ముద్రలున్నాయి, సాముద్రిక లక్షణాలు ఇలా ఉన్నాయి నాకు వైధవ్యమెందుకొచ్చిందని ఏడ్చింది, అసలు అలా ఇలాగ కాదు అంత భయంకరంగా ఏడ్చింది తల్లి అందుకు కదాండీ లంక కాలిపోయింది, మహా పతివ్రత యొక్క కన్నీరు ఆవిడ పొందినటువంటి క్షోభ తండ్రి కొడుకులు ఇద్దరీ చేసినటువంటి దురాగతం అటువంటి రావణాసురున్ని నాయకున్నిచేసి మాట్లాడటం ఏమిటీ ఎప్పుడూ మాట్లాడకూడదు.
కనుకా అటువంటి స్థితిలో ఆ తల్లి నేల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూంటే మీతో నేను మనవిచేశాను ఎవరు ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారో వారిని ఎప్పుడూ ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షణ చేస్తూనే ఉంటాడు ఎవడు అధర్మంతోవున్నాడో వాడు నేను చాలా గొప్పగా చేశాననినుకున్నా వాడుచేసినటువంటి పనిలో ఎక్కడో డొల్లతనం ప్రవేశించి అది నశించిపోతూంటూంది. ధర్మాధర్మములే మీరు రక్షింపబడటానికి కారణమై ఉంటాయి. కాబట్టి త్రిజట వచ్చి అందీ సీతమ్మతల్లి కిందపడి పొర్లి ఏడుస్తుంటే న హి కోప పరీతాని హర్ష పర్యుత్సుకాని చ ! భవన్తి యుధి యోధానాం ముఖాని నిహతే

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
పతౌ !! అమ్మా ఎందుకలా ఏడుస్తావు? విభీషణుని భార్య అనలా నిన్న ఓదార్చింది ఆయన శిరస్సు తీసుకొచ్చి మాయా శిరస్సు అక్కడ పెట్టినప్పుడు, ఇవ్వాళ కూతురు త్రిజట ఓదార్చుతుంది ʻఎలా నమ్మావమ్మా రామ లక్ష్మణులు నిహతులైపోయారనిʼ నమ్మావా? ముఖంలో ప్రాణంపోతే పోయే తేజస్సు వేరుగా ఉంటుంది ప్రాణాలు ఉంటే ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది. నీవు వీళ్ళమాటలకు భయకంపిత చిత్తవైపోయావుకానీ నీవు జాగ్రత్తగా గమనించి చూస్తే రామ లక్ష్మణులు శరీరం విడిచిపెట్టలేదు వాళ్ళు బ్రతికే ఉన్నారు వాళ్ళ ముఖాలలో తేజస్సుపోలేదు ఇదం విమానం వైదేహీ పుష్పకం నామ నామతః ! దివ్యం త్వాం ధారయే న్నైవం య ద్యేతౌ గతి జీతితౌ !! అమ్మా నేను చెప్పేమాటలలో నీకు బాగా నమ్మకం కలగడానికి ఒకమాట చెప్తాను రామ లక్ష్మణులు మరణించి ఉంటే నీకు వైధవ్యం కలుగుతుంది నీకు వైధవ్యం కలిగితే పుష్పక విమానంలోకి విధవరాలు ఎక్కితే పుష్పకం పైకిలేవదు అమంగళము కనుక లేవదు పైకి ఎక్కినా అక్కడే ఉంటుంది కదలదు, నీవు ఎక్కితే పుష్పకం కదిలింది వెళ్ళిందీ వచ్చిందీ అంటే అమ్మా నీవు నిత్యసువాసినీవమ్మా..! నీకు అమంగళమా... ఒక్కనాటికి జరగదు రామ లక్ష్మణులిద్దరూ జీవించే ఉన్నారు తల్లీ! నామాట నమ్ము.
Related imageఇంక ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యమేమికావాలి హత వీర ప్రధానా హి హతో త్సాహా నిరుద్యమా ! సేనా భ్రమతి సంఖ్యేషు హత కర్ణేవ నౌ ర్జలే !! ఒక నావ సముద్రంలో వెడుతున్నప్పుడు తిక్సూచి లేకపోతే ఆ నావ సముద్రంలో అల్లకల్లోలంగా ఎలా తిరుగుతూందో నాయకుడు మరణిస్తే సైన్యము అతలాకుతలమైపోతూంది అతలాకుతలమైన లక్షణాలులేవు వానర యోధులందరూ రామ లక్ష్మణుల చుట్టూ నిలబడివున్నారు ఇంకా వానరసైన్యం భీతిచెంది ఉంది తప్పా నాయకుడు మరణించినప్పుడు పొందేటటువంటి స్థితిలోలేరు ఇంకా చుట్టూ నిలబడి ఉన్నారూ అంటే రామ లక్ష్మణులు రామ లక్ష్మణుల్ని రక్షించుకున్నారు ఊపిరితో ఉన్నారు వాళ్ళకు ఏ ప్రమాదము రాదమ్మా నన్ను నమ్ము ఇయం పున రఽసంభ్రాన్తా నిరుద్విగ్నా తరస్వినీ ! సేనా రక్షతి కాకుత్సౌ మాయయా నిర్జితౌ రణే !! అమ్మా ఆ వానరసేనా అంతా కూడా తొట్రుపాటు లేకుండా రామ లక్ష్మణులని రక్షింపబడాలని వారిని సేవిస్తూంది వాళ్ళు తొందరలో మళ్ళీ సంజ్ఞపొందుతారు వాళ్ళు స్పృహని పొందుతారు, వాళ్ళు సజీవులై నీవు చూస్తూ ఉండూ తప్పకుండా రావణ సంహారం చేస్తారు. అమ్మా నేను నీమీద ప్రేమతో చెప్తున్నాను నా మాట నమ్ము నేను నిన్ను ఊరడించడానికి పలుకులు పలుకుతున్నావని నీవు అనుకుంటున్నావేమో... అనృతం నోక్త పూర్వం మే న చ వక్ష్యే కదా చన ! చారిత్ర సుఖ శీల త్వాత్ ప్రవిష్టాఽసి మనో మమ !! నా జీవితంలో నేను ఎన్నడూ అబ్ధమాడలేదు ఇక ముందుకూడా ప్రాణాలు పోయినా ఇక అబద్ధం చెప్పను అందుకని నేను ఊరడించడానికి ఇందులో ఒక్కమాట కల్పించి చెప్తున్నదిలేదు.
నేను పరమసత్యం చెప్తున్నాను చారిత్ర సుఖ శీల త్వాత్ ప్రవిష్టాఽసి మనో మమ అమ్మా నేను చెప్పినటువంటి మాటా నీవు బాగా అర్థం చేసుకో నీ స్వభావము నీ మనస్సు ఏది ఉందో ఆ స్వభావము ఆ మనస్సు ఆ ధర్మము నిన్నుకాపాడి తీరుతాయి నేమౌ శక్యౌ రణే ఝేతుం నేస్త్రై రఽపి సురాఽసురైః ! ఏతయోః ఆననం దృష్ట్వా మయా చాఽఽవేదితం తవ !! ఇదం చ సుమహ చ్చిహ్నం శనైః పశ్యస్వ మైథిలీ !!! నేను నీతో సత్యం చెప్తున్నాను ఇంద్రాది దేవతలందరూ వచ్చి నిలబడినా రామ చంద్ర మూర్తిని గెలవలేరు ఆయన ప్రాణములతోనే ఉన్నారు, ఇతః పూర్వం నాకు కలిగినటువంటి స్వప్నాన్ని నేను నీకు చెప్పాను నీవు తొందరలో రామ చంద్ర మూర్తితో కలిసి పట్టాభిశక్తురాలివౌతావు రావణాసురుడు నిగ్రహింపబడుతాడు ఇది మధ్యలో వచ్చినటువంటి ఒక ఆపద కాబట్టి అమ్మా నీవు తొందరపడకూ నీవు అలా విలపించకూ నీవు స్వాంతన పొందు అని సీతమ్మతల్లిని ఊరడిస్తే త్రిజట చెప్పినటువంటి మాటలచేత సీతమ్మతల్లి కొంత ఓదార్పు పొందింది. ఆవిడ నమ్ముకున్న ధర్మం లంకాపట్టణం నుంచి విభీషణుడు వెళ్ళిపోతూ అనలనీ త్రిజటనీ తీసుకునిపోయి ఉంటే తన కుటుంబాన్ని? నలుగురు మంత్రులతో వెళ్ళిపోయాడు తప్పా ఆయన కుటుంబాన్ని తీసుకెళ్ళలేదు. విభీషణుడు శత్రుసైన్యంలో కలిశాడు ఆయన కుటుంబం ఇక్కడుంది వాళ్ళని తేగటార్చండని రావణుడు అనలేదు. వాళ్ళని చంపండని అనలేదుసరికదా త్రిజటనీ సీతమ్మదగ్గరే కాపలాగా ఉంచాడు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అంటే రావణాసురుని యొక్క బుద్ధిలో ఏ నమ్మకం కలిగిందంటే నా తమ్ముడు పనికిమాలినవాడు కానీ నా మరదలు నా తమ్ముని కూతురు వాళ్లు చాలా మంచివాళ్ళు అనుకుంటున్నాడు ఇదే దియోయనః ప్రచోదయాత్ అంటారు ఎవరి బుద్ధిలో ఎలా ప్రవేశించాలో అలా ప్రవేశించి ఈశ్వరుడు రక్షిస్తూంటాడు అది ఈశ్వర సంకల్పం ఆయన విభీషణుడు కుటుంబాన్ని తీసుకెళ్ళకుండా చేశాడు, ఈశ్వర సంకల్పం రావణాసురునికి వాళ్ళమీద అనుమానం రాకుండా చేశాడు, ఈశ్వర సంకల్పం భర్త ఊళ్ళో లేకపోయినా సీతమ్మని రక్షించడానికి మనం ఇక్కడ ఉండాలి అని ధర్మాన్ని నమ్ముకునీ వాళ్ళిద్దరూ సీతమ్మతల్లిని సేవిద్దామన్న బుద్ధిని అలా నిలబెట్టారు. నిలబెట్టీ వాళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు ప్రమాదమొస్తే అప్పుడప్పుడు సీతమ్మతల్లిని ఊరడిస్తూంటారు లేకపోతే ఏమో నా తల్లి ఆ శోకంలో గుండే పగిలిపోయి ఉండేదేమో..? అలా ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తునే ఉంటాడు దానికి ఎదురు లేదు ఇది సత్యం సత్యం పునః సత్యం. ఈవిషయాల్ని చెప్పడానికే యుద్ధ కాండలో జరిగేటటువంటి విశేషాల్లో అంతగా ఎంత వ్యూహాత్మకంగా రచన చేస్తాడో రావణాసురుడు అటువైపు అంత ప్రమాదం మిగులుతుంది ఇటువైపు అకస్మాత్తుగా ఊహించని రీతిలో ఎవరో వచ్చి రక్షణ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు సీతమ్మతల్లి ఊరట పొందింది అక్కడా లక్ష్మణునికన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగినవాడు ఎక్కువ పరాక్రమమున్నవాడు ఎక్కువ బలమున్నవాడు రామ చంద్ర మూర్తి నేను మీతో మనవి చేశాను నాగాస్త్ర ప్రయోగం చేస్తే ఇక బ్రతకడం కష్టం ఎందుకనీ అంటే దెబ్బలవలన నెత్తురు కారడంవల్ల కాదు నాగాస్త్ర బంధనం చేసినప్పుడు ఆ నాగముల (పాములు) విషాన్ని ఎక్కిస్తుంటాయి శరీరంలోకి ఎంతసేపు ఎక్కిస్తాయంటే ఆ వ్యక్తి మృతి చెందేంతవరకు ఎక్కిస్తూంటాయి.
ఒక పక్క విషమెక్కిస్తూనే రక్తం పోయింది అయినా సరే లక్ష్మణునికన్నా ముందు రాముడు స్పృహపొందాడు ఆయన సమస్త అస్త్ర శస్త్ర విశారుదుడు దనుర్వేదే చ వేదే చ వేదాంగేషు చ నిష్ఠితః అనికదా హనుమ చెప్పారు ఆయనకు తెలుసు సమస్త అస్త్రముల గురించి, కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, నేను స్పృహని పొందాను కానీ నేను లేచి నిలబడి ఏదో చెయ్యగలన్నన్న నమ్మకంలేదు ఎందుకంటే ఈ అస్త్రం విడిచిపెట్టదు ఎవరూ వచ్చి విడిపించగలిగినవారులేరు ఋషులే వచ్చినా దేవతలే వచ్చినా  ఇంద్రుడే వచ్చినా ఇక ఈ అస్త్రాన్ని విడిపించలేరు. నేను కనీసం స్పృహనిపొందాను లక్ష్మణుడు స్పృహని పొందలేదు కాబట్టి ఇతను మృత్యువుని పొందుతున్నాడు అనుకున్నారు రామ చంద్ర మూర్తి నేను నరుడి కథాగా కదాండి వినమన్నాను ఇప్పుడు రాముని యొక్క శీలవైభవం బయటికొస్తుంది. ఆయనా సీతమ్మ గురించి ఏడ్వలేదు ఆయన ముందు దేనికేడ్చాడంటే పక్కన పడిపోయినటువంటి లక్ష్మణున్ని చూసి ఏడ్చాడు అది

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
రాముని యొక్క ప్రేమా అంత గొప్పగా ఉంటుంది సహజం కదాండీ తమ్ముడు పక్కన అలా పడిపోయివున్నాడు కిం ను మే సీతయా కార్యం కిం కార్యం జీవితేన వా ! శయానం యోఽద్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితమ్ !! ఇలా ప్రాణములను పోగొట్టుకుని నా తమ్ముడైన లక్ష్మణుడు భూమిమీద నా పక్కన నెత్తుటి మడుగులోపడుంటే నేను కనీసం లేచి లేవనెత్తనటువంటి స్థితిలోవున్నాను ఇక నాకు సీత లభిస్తే మాత్రం ఏమి సంతోషం తమ్ముడు మరణించిన తరువాత ఇంక నాకేమానందముంటుంది, అంటే ఎంత మంది ఏడ్చేటట్టు చెయ్యగలిగాడో చూడండి ఆ ఇంద్రజిత్తు శక్యా సీతా సమా నారీ ప్రాప్తుం లోకే విచిన్వతా ! న లక్ష్మణ సమో భ్రాతా సచివః సమ్పరాయికః !! దీన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి సీతమ్మలాంటి కాంత అటువంటి గుణములు కలిగిన కాంత మల్లీ దొరకచ్చు కానీ తోడబుట్టినవాడన్నవాడుమాత్రం ఆజన్మకి వాడొక్కడే ఇక మళ్ళీ తోడబుట్టినవాడన్నవాడు ఉండడు.
Image result for indrajit ramayanaఇది బాగా జీర్ణమైతే అన్నదమ్ములతో దెబ్బలాడ్డం అన్నదమ్ముల్నీ ఇక నీవు నేను మాట్లాడుకోవద్దూ అన్నమాట అనడం చాలా కష్టం. ఇది ఒకరికే తెలిసి రెండవవాడికి తెలియకపోతే తెలిసున్నవాడు పొందేటటువంటి వ్యధ వేరుగా ఉంటుంది తెలియనివాడికి ఉండేటటువంటి ఉగ్రత వేరుగా ఉంటుంది. అన్నదమ్ములలో అన్నకో తమ్మునికో ధర్మం తెలుసనుకోండి అన్నకో తమ్మునికో తెలియదనుకోండి ఇద్దరే ఉండి చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి ఎవడికి ధర్మం తెలుసో వాడు నలిగిపోతూంటాడు జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా రెండవవాడు చాలా బాధ్యతా రహితంగా ఉంటాడు అది ఏదో గత జన్మలలో చేసుకున్న పాపం బహుశః అలా క్షయమౌతూంది అని అర్థం చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రామ చంద్ర మూర్తి అంటారు ఇటువంటి లక్ష్మణుడు ఇటువంటి సోదరుడు నేలపడిపోయివున్నాడు సీతమ్మలాంటి కాంత దొరుకుతుందేమో తోడబుట్టినవాళ్ళన్నమాత్రం ఈజన్మకి ఇంతే. ఇక కొత్తగా రావడమన్నది ఉండదుగా లోకంలో అయ్యో ఇలా పడిపోయాడు లక్ష్మణ మూర్తి పరిత్యక్ష్యా మ్యఽహం ప్రాణాన్ వానరాణాం తు పశ్యతామ్ ! యది పంచత్వ మాఽపన్నః సుమిత్రాఽఽనన్ద వర్ధనః !! నా సోదరుడైనటువంటి లక్ష్మణ మూర్తి ప్రాణములను విడిచిపెట్టాడు కాబట్టి ఈ వానరుల సమక్షంలో నేను కూడా విడిచిపెట్టేస్తాను ఈ సుమిత్రాన్దవర్థనుడైన లక్ష్మణ మూర్తి చాలా గొప్పవాడు నాకు కుడిభుమువంటివాడు గొప్ప సహాయకుడు ఇటువంటివాడు ఇలా నేలమీద పడిపోయిన తరువాత నిజంగా నేను బ్రతికి సీతమ్మనే పొందినా నేను తిరిగి కోసల రాజ్యానికి వెళ్ళినప్పుడు సుమిత్ర ఎదురొచ్చి నా కొడుకు నీకు సహాయం చేయడానికి వచ్చాడుకదా ఒక్కడివే వచ్చావేం నాకొడుకేదని అడిగితే ఏమనిచెప్పను.
నిజంగా రామ చంద్ర మూర్తి యొక్క ప్రేమ అన్నదమ్ముల ప్రేమంటే ఎలా ఉండాలి అన్నదానికి రాముడు మార్గదర్శకంగా నిలబడుతాడు నేను ఆనాడు చెప్పలేదు కాబట్టి అసలు నేను జీవితంలో చేసిన పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే ధి ఙ్మాం దుష్కృత కర్మాణ మఽనాఽఽర్యం యత్కృ హ్యసౌ ! లక్ష్మణః పతితః శేతే శర తల్పే గతాఽసువత్ !! లక్ష్మణున్ని అరణ్యవాసానికి తీసుకురావడమేమిటీ నేను తిరస్కరించద్దూ తమ్ముడా నీవెందుకురా అరణ్యవాసానికి అనవద్దూ అరణ్యవాసానికి తీసుకొచ్చాను నేను చేసినటవంటి పాప కార్యాము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఈ లక్ష్మణ మూర్తి ప్రాణాలను విడిచిపెట్టారు కానీ య థైవ మాం వనం యాన్త మఽనుయాతో మహాద్యుతిః ! అహ మఽప్యఽనుయాస్యామి త థైవైనం యమ క్షయమ్ !! నేను అరణ్యాలకు బయలుదేరుతున్నప్పుడు అన్నా నిన్ను సేవిస్తాను అని నా వెంటవచ్చాడు

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అటువంటి లక్ష్మణ మూర్తిని నేను దక్కించుకోలేకపోయాను ఇష్ట బన్ధు జనో నిత్యం మాం చ నిత్యమ్ అనువ్రతః ! ఇమా మఽద్య

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
గతోఽవస్థాం మ మాఽనార్యస్య దుర్జయైః !! ఆయనా బంధువులచేతా అందరిచేతా ప్రీతిని పొందినవాడు బంధువులందరిచేతా గౌరవింపబడినవాడు అటువంటివాడు ఇటువంటి దురవస్థకు లోనైననటువంటివాడు య న్మయా న కృతో రాజా రాక్షసానాం విభీషణః !! త చ్ఛ మిథ్యా ప్రలప్తం మాం ప్రదక్ష్యతి న సంశయః !! ఇటువంటి లక్ష్మణ మూర్తి పరమ ప్రీతితో నాతో మాట్లాడేవాడు ఎన్నడూ కోపగించేవాడు కాడు అటువంటి లక్ష్మణ మూర్తి మరణించాడన్నది నాకు పెద్దవేదన.
Image result for రావణ బ్రహ్మరెండవ పరివేదన ఏమిటి? రామో ద్విర్నాభి భాషతే అని ఒక పేరు, నేను విభీషణునికి మాటిచ్చాను నీకు లంకారాజ్యమిస్తాను అని పట్టాభిషేకం చేస్తాతాను అని ఇప్పుడు లక్ష్మణ మూర్తి వెళ్ళిపోయాడు నేను కూడా వెళ్ళిపోతున్నాను నాకు మిథ్యావాది అని పేరొస్తుంది ఎందుకంటే నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు నేను విభీషణుడికి లంకారాజ్యం ఇవ్వలేదు రావణాసురున్ని సంహరించలేదు అంగదం తు పురస్కృత్య ససైన్యః ససుహృజ్జనః ! సాగరం తర సుగ్రీవ నీలేన చ నళేన చ !! అంగదం తు పురస్కృత్య నీవు అంగదున్ని తీసుకొని ఓ సుగ్రీవా! ససైన్యః ససుహృజ్జనః నీ యొక్క సుహృత్తులు-స్నేహితులతోటీ సైన్యంతోటీ అంగదుడితోటీ కలిసి మళ్ళీ ఆ సేతువుమీద వానర రాజ్యానికి అందరూ తిరిగి వెళ్ళిపోండి సుగ్రీవా ఇక్కడ ఉండవద్దు ఎందుకంటే నీలేన చ నళేన చ నీలున్ని నళున్ని కూడా నీతో తీసుకెళ్ళిపో ఎందుకంటే ఇక మేమిద్దరము ప్రాణములతో ఉండేటటువంటిది సంభవమయ్యేదికాదు, మీరు ఇక్కడే ఉంటే ఇంకా సైన్యం ఇక్కడ నిలబడిందీ అని మళ్ళీ రావణాసురుడు ఇంద్రజిత్తుని పంపి మిమ్మల్నికూడా సంహరిస్తాడు  కాబట్టి ఇక మేమిద్దరం బ్రతకనప్పుడు రావణునితో యుద్ధము సీతమ్మను తీసుకొచ్చే ప్రయత్నము చేసేటటువంటిదానికి ఒక అర్థములేదు కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఈ మాటలు చెప్పి ఆయన పడిపోయి ఉంటే ఆ చుట్టూ చేరినటువంటి వానర యోధులు ధుఃఖిస్తున్నారు, ఒక స్థితిలో విభీషణుడంతటివాడన్నాడు రావణుడు కోరుకున్న కోరిక నెరవేరదుకదా..! అన్నాడు అంత భయంకరమైన స్థితిని కల్పించాడు ఇంద్రజిత్తూ అంటే నా ఉద్దేశ్యం సీతమ్మతల్లిని తక్కువ చేసి ఆలోచించాడనికాదు రామ లక్ష్మణులు లేకుండా చేస్తాను మానవులు గొప్పా?..ని అన్నాడు కదా ఆ కోరిక నెరవేరుదుకదా అన్నాడు. అంటే ఎంత శంక వాళ్ళల్లో ప్రభలిందో చూడండి.
అటువంటి సమయంలో సుషేణుడు ఆయన అన్నాడు పూర్వం దేవతలకు దానవులకు యుద్ధం జరిగిందని నాకు తెలుసు, ఒకపక్క ఈ అల్లరిజరుగుతుంటే ఉన్నవానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు అదోపెద్ద గొడవ ఎందుకో తెలుసాండీ, అదే సమయంలో విభీషణుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు రామ చంద్ర మూర్తి దగ్గరికి విభీషణుడు పరుగెత్తుకొస్తే అచ్చు ఇంద్రజిత్తులాగే ఉంటాడు విభీషణుడు పర్వతాకారుడై నల్లగా విభీషణునిలా ఉంటాడు ఇంద్రజిత్తే వచ్చాడు మిగిలినవాళ్ళను చంపడానికనీ వానరులు పారిపోవడం మొదలుపెట్టారు అప్పుడు అతను విభీషణుడు ఇంద్రజిత్తుకాడని సముదాయించమని వానరసైన్యాన్ని నిలబెట్టమని సుగ్రీవున్ని పంపించారు ఇంత ఉత్కంటతతో కూడిన పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో సుషేణుడు అనబడేటటువంటి వానర యోధుడు ఆయన అన్నాడు నేను ఇతః పూర్వం దేవదానవ సంగ్రామాన్ని చూశాను అంతగొప్ప సంగ్రామంలో దానవులచేత దేవతలు కూడా పడిపోయేవారు పడిపోతే విషల్యహరణి మృతసంజీవని సంధానకరణి సౌవర్ణకరిణి అని ఓషధులు, ఆ ఓషధులను చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిచేసి గుప్తంగా వాటిని పాలసముద్రం పక్కన ఉండేటటువంటి క్షీరసాగరం పక్కన ఉన్నటువంటి చంద్రగిరి ద్రోణాద్రి అనబడేటటువంటి పర్వతాలలో గుహలలో ఉంచాడు. ఆ దివ్య ఔషధులను మిగిలినటువంటి మొక్కల నుండి వేరుచేసి పట్టుకునిరావాలి అది పట్టుకునివస్తే ఈ పాములను విడిపించవచ్చు కానీ ఇది కుదిరే విషయం కాదు అలా అవి విడిచిపెట్టవు మహాయితే మృతసంజీవినిచేత మళ్ళీ బ్రతుకుతారేమోకానీ పాముల్ని అలా నాగాస్త్రాల్ని విడిపించడం ఈ ఓషధులచేత కుదురుతుందాంటే అలా కుదురుతూందని రామాయణంలోనేలేదు ఎక్కడా లేదు కాబట్టి ఈ ఓషధుల్ని తీసుకురావడానికి ʻమందమైన ఊపిరితోవున్నారు కాబట్టిʼ తొందరగా హనుమయే వేగంగా వెళ్ళి తేగలరు. కాబట్టి హనుమని పంపించండి అదే మనం చెయ్యగలిగిన ప్రయత్నం ఈ మాట అనుకొని పంపడమా హనుమని పిలవడమా అనుకుంటున్న సమయంలో ఏతస్మి న్నఽన్తరే ʻఏతస్మి న్నఽన్తరేʼ అంటే ఇలా అనుకుంటున్న సమయంలో

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఏతస్మి న్నఽన్తరే వాయు ర్మేఘాం శ్చాఽపి సవిద్యుతః ! పర్యస్యన్ సాగరే తోయం కమ్పయన్ ఇవ మేదినీమ్ !!
మహతా పక్ష వాతేన సర్వే ద్వీప మహా ద్రుమాః ! నిషేతు ర్భగ్నవిటపాః సమూలా లవణాఽమ్భసి !!
అభవన్ పన్నగా స్త్రస్తా భోగిన స్తత్ర వాసినః ! శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ము శ్చ లవణాఽఽర్ణవమ్ !!
తతో ముహూర్తా ద్గరుడం వైనతేయం మహా బలమ్ ! వానరా దదృశుః సర్వే జ్వలన్తమ్ ఇవ పావకమ్ !!
తామాఽఽగత మఽభిప్రేక్ష్య నాగా స్తే విప్రదుద్రువుః ! యై స్తౌ సత్పురుషౌ బద్ధౌ శర భూతై ర్మహా బలౌ !!
వాళ్ళు హనుమని పంపించి ఓషధులు తెచ్చుకుందాము అని ఆలోచిస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద గాలి ఒకటి బయలుదేరింది, ఏమిటి ఇంతపెద్దగాలి మళ్ళీ ఎవరైనా రాక్షసుడు వస్తున్నాడాని వాళ్ళు విష్మయంపొంది చూస్తున్నారు. బంగారు రెక్కలను అల్లారుస్తూ ఆ నూరు యోజనములు సముద్రం మీదనుంచి ఆకాశంలో మెరిసిపోతూ • ఆయన రెక్కలు అల్లారుస్తూంటే వేదనాదాలు వినపడుతుంటాయి అటువంటి వేదనాదం వినపడే రెక్కలు అల్లారుస్తూ గర్ముత్మంతుడొస్తున్నాడన్న భయంచేత సముద్రంలో ఉన్నటువంటి పాములుకూడా అడుక్కిపారిపోయేటట్టుగా ఒక్కసారి బంగారు స్వరూపంతో మెరిసిపోతున్నటువంటి వైనతేయుడైన గరుత్మంతుడు యుద్ధ భూమిలో రామ లక్ష్మణులు పడిపోయినచోటికి వచ్చి కిందకి దిగాడు, ఎప్పుడైతే గరుత్మంతుడొచ్చి కిందకి దిగాడో ఇంత నాగాస్త్రబంధనం చేసి అవయవాలన్నీంటినీ కట్టేసినా పక్కన ఆయన కోదండం పడిపోయి వింటితాడు ఊడిపోయి ఉన్నా చెయ్యిపట్టుకోవడానికి వీలులేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్ర రూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతున్ని చూసి భయపడి విడిచిపెట్టిపారిపోయాయి, ఒక్కసారి రామ లక్ష్మణులిద్దరు పూర్తిగా శ్వస్తతతని పొందారు, పొంది ఆ గరుడుడు ఎంతో సంతోషంగా రామ లక్ష్మణుల నిద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరాడు, నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటిమీద ఉన్నటువంటి గాయములన్నీకూడాపోయి పూర్వము ఎలా ఉండేవారో అలాంటి స్థితిని పొందేసి పుర్వమున్నటువంటి బలం పూర్వమున్నటువంటి శక్తికన్నా ఇప్పుడు ద్విగుణీకృతమైన శక్తితో ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
నిలబడితే రామ చంద్ర మూర్తి గరుత్మంతున్ని చూసి- ఇదే నేను నరుడికథా గుర్తుపెట్టుకోండంటాను విష్ణువైతే వెంటనే గరుడా! వచ్చావా... అనాలి రాముడు అలా అనడు భవత్ప్రసాదా త్వ్యసనం రావణి ప్రభవం మహత్ ! ఆవామ్ ఇహ వ్యతిక్రాన్తౌ శీఘ్రం చ బలినౌ కృతౌ !! మహానుభావా! మీరెవరో మాకు తెలియదు ఇటువంటి ఆపత్కాలంలో మీరు వచ్చారు మాకు కలిగినటువంటి ఆపద తొలగిపోయింది మేము పూర్వము ఎటువంటి బలం కలిగినవారమో అంతకన్నా ఎక్కువ బలాన్నిప్పుడు పొందాము మాకు మిమ్మల్ని చూస్తూంటే మనసులో ఎలా అనిపిస్తూందో తెలుసా యథా తాతం దశరథం య థాఽజం చ పితామహమ్ ! తథా బవన్తమ్ అసాద్య హృదయం మే ప్రసీదతి !! మిమ్మల్ని చూస్తూంటే మా తండ్రి దశరథ మహారాజుగారు చూసినట్టు మా తాతగారు రఘుమహారాజుగారిని చూసినట్టు ఎంతోసంతోషంగా ఉంది కో భవాన్ రూప సంపన్నో దివ్య స్రగఽనులేపనః ! వసానో విరజే దివ్యాఽఽభరణ భూషితః !! మీరు దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకున్నారు మంచి పుష్పహారములను వేసుకుని ఉన్నారు చాలా విలువైనటువంటి బట్టలు కట్టుకుని ఉన్నారు మహానుభావా మీరు ఎవరు ఎందుకొచ్చి రక్షించారు మాకు చెప్పవలసిందీ అన్నారు. వెంటనే ఆ గరుత్మంతుడు మాట్లాడుతూ అహం సఖా తే కాకుత్సృప్రియః ప్రాణో బహి శ్చరః ! గరుత్మాన్ ఇహ సంప్రాప్తో యువయోః సాహ్య కారణాత్ !! ఓ సఖుడా స్నేహితుడా... రామా! నేను నీకు బహిప్రాణమువంటివాడను ఎప్పుడూ నీతోకలిసి ఉండేవాడను అంతకన్నా ఇప్పుడు చెప్పడం కుదరదు నీకూ నాకు అంత స్నేహముంది గరుత్మాన్ ఇహ సంప్రాప్తో యువయోః సాహ్య కారణాత్ నన్ను గరుత్మంతుడంటారు నాకూ నీకు ఒక గొప్ప విడదీయరానటువంటి అనుబంధం అటువంటి స్నేహముంది
అసురా వా మహా వీర్యా దానవా వా మహా బలాః ! సురా శ్చాఽపి సగన్ధర్వాః పురస్కృత్య శతక్రతుమ్ !!
నేమం మోక్షయితుం శక్తాః శర బన్ధం సుదారుణమ్ ! మాయా బలా దిన్ద్రజితా నిర్మితం క్రూర కర్మణా !!
ఏతే నాగాః కాద్రవేయా స్తీక్ష్ణ దంష్ట్రా విషో ల్భణాః ! రక్షో మయా ప్రభావేన శరా భూత్వా త్వ దాఽఽశ్రితాః !!
Image result for garuthmanthudu imagesనాయనా! ఇంద్రజిత్తు నీమీద ప్రయోగించినటువంటి ఈ నాగాస్త్రముచేతా ఆ కద్రువ యొక్క కుమారులైనటువంటివారురెవరున్నారో అటువంటి క్రూర కర్ములైనటువంటి వారియొక్క ఆ కద్రువ కుమారులైనటువంటి నాగములు బాణముల రూపంలో వచ్చి మీకు తగిలి మిమ్మల్ని పట్టుకున్నాయి వీటిని విడిపించడం లోకంలో ఎవ్వరికీ సాధ్యంకాదు అసురా వా మహా వీర్యా రాక్షసులుకాని దానవా వా మహా బలాః దానవులుకాని సురా శ్చాఽపి సగన్ధర్వాః దేవతలందరూ కలిసొచ్చినా గంధర్వులందరూ కలిసొచ్చినా పురస్కృత్య శతక్రతుమ్ ఇంద్రుడే దిగొచ్చినా నేమం మోక్షయితుం శక్తాః ఈ నాగాస్త్రం నుంచి ఎవరూ రక్షించలేరు శర బన్ధం సుదారుణమ్ ఇది చాలా ధారుణాతి ధారుణమైన శర బందం. మాయా యుద్ధమునందు ఆరితేరినటువంటి ఇంద్రజిత్తు ఇటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని పడగొట్టాడు ప్రకృత్యా రాక్షసాః సర్వే సంగ్రామే కూట యోధినః ! వాళ్ళెప్పుడు మాయతో కూడినటువంటి యుద్ధం చేసి ఇలాగే పడగొడుతుంటారు శూరాణాం శుద్ధ భావానాం భవతామ్ ఆర్జవం బలమ్ !! ధర్మ మార్గంలో ప్రవర్తించి శూరులై అధర్మ మార్గంలో అడుగుపెట్టకుండా యుద్ధం చెయ్యగల మీవంటివారలకు ఎప్పుడూ రక్షణ కలుగుతూంది మీ ధర్మమే మీకు రక్ష ధర్మో రక్షతి రక్షితః దానికి ఉదాహరణ గరుత్మంతుడురావడమే... వచ్చి రక్షించడమే కాబట్టి ఇంతకన్నా నీవు నన్నుమాత్రం ʻనీవు ఎవరూ

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
నాకూ నీకు ఉన్న అనుభందమేమిటీ అనిమాత్రం గుచ్చి గుచ్చి ప్రశ్నవేయవద్దు రామా!ʼ సఖే రాఘవ ధర్మజ్ఞ రిపూణా మఽపి వత్సల ! అభ్యఽనుజ్ఞాతు మిచ్ఛామి గమిష్యామి యథాఽఽగతమ్ !! నీవు అనుమతిస్తే సఖా..! నేను బయలుదేరుతాను కానీ నీవు ఎవరూ అని మాత్రం న చ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ ! కృత కర్మారణే వీర సఖిత్వ మఽనువేత్స్యసి !! భవిష్యత్తులో ఒకానొకనాడు నీవేవరూ నేనెవరూ నీకూ నాకూ ఉన్న అనుబంధమేమిటీ నీకు తెలుస్తూందిలే ఇప్పుడు మాత్రం నీవు అంతకన్నా కుతూహలంగా ప్రశ్నలు వేయవద్దు.
Related imageనీవు ఎందుకొచ్చావు నాదగ్గరికీ ఎందుకు రక్షించావు మనిద్దరికి ఏ అనుబంధముంది అన్నమాట మాత్రం నీవు అడగద్దు ఎందుకనీ? నరుడిగా ఉన్నాడు రాముడు, నరుడిగా ఉన్న రాముడికి నేను నీ వాహనాన్ని అంటే ఆయన ఊరుకోడు నీవు నాకు వాహనమేమిటి? నేను నరున్నంటాడు నరుడిగా పూర్ణంగా ఉన్నాడు కాబట్టే రావణ సంహారం చేశాడు, కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు గరుత్మంతుడు చెప్పలేడు కాబట్టి మీరు ఇంతకన్నా నన్ను అడగవద్దు బాల వృద్ధాఽవ శేషాం తు లంకాం కృత్వా శరో ర్మిభిః ! రావణం చ రిపుం హత్వా సీతాం సముప లప్స్యసే !! వృద్ధులు బాలురను మాత్రము విడిచిపెట్టి లంకంతా నశింపజేసి సీతమ్మతల్లిని నీవు పొందగలవు ఇత్యేవ ముక్త్వా వచనం సుపర్ణః శీఘ్ర విక్రమః ! రామం చ విరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసామ్ !! ఈ మాటలు రామ చంద్ర మూర్తితో లక్ష్మణ మూర్తితో చెప్పి గరుత్మంతుడు పరమ సంతోషంగా ఎలా వచ్చాడో అలా మళ్ళీ రెక్కలల్లారుస్తూ సముద్రం మీదుగా వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినటువంటి కారణంచేతా వానర సైన్యమంతా మళ్ళీ ద్విగినీకృతమైనటువంటి ఆనందాన్ని పొందారు, పొంది రామ లక్ష్మణులనిద్దరూ మళ్ళీ లేచి తేజోవిరాజితులై లేచి కోదాండాలు చేత్తోపట్టుకునేటప్పటికీ వానర సైన్యమంతా ఉత్సాహాన్నిపొంది ధర్మమూర్తియైన రామ చంద్ర మూర్తి ఆపదొస్తే గరుత్మంతుడేవచ్చి రక్షించాడు మనకేమిటి లోటు రాముడుండగా అని ఒక్కసారి అందరూ జై శ్రీ రామ చంద్ర మూర్తికీ జై అని అరుస్తూ అందరూ మళ్ళి యుద్ధానికి సిద్ధపడి పెద్ధ పెద్ధ నాదములు చేశారు.
రావణుడులేచి ఏమైందో వెళ్ళి చూసిరండన్నాడు గబగబా గూఢచారులు మేడమీదకెక్కి చూశారు అయ్యా మీతో ఇంద్రజిత్తు ఎవరిని పడగొట్టానని చెప్పారో వాళ్ళి ఇతః పూర్వం మేము చూసినదానికన్నా తేజోమూర్తిలై నిలబడ్డారు అని చెప్పారు, ఏ వానర వీరులు పడిపోయారని చెప్పాడో ఆ వానర వీరులందరూ సంతోషంగా క్షేమంగా నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ పరమోత్సాహంగా లంకాపట్టణం మీద దాడిచేసి లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్లు రాక ముందు మీరు ఎవర్నో పంపించి వాళ్ళని అక్కడ నిలబడేటట్టు చేసి నిలబెట్టు అన్నారు. ఆశ్చర్యపోయినటువంటి రావణాసురుడు ఇంద్రజిత్తంటి యోధుడు స్వయంగా నాగాస్త్రబంధనంచేసి మర్మస్థానములనుకొట్టి మరణించారని చెప్పివెళ్ళిన తరువాత వాళ్ళు లేచి నిలబట్టమా నాగాస్త్రం విడిచిపెట్టడమా వాళ్ళు మళ్ళీ పునర్జీవితులు కావడమా? ఏమి ఆశ్చర్యమని తెల్లబోయాడు. ఎప్పటికీ ఆయనకి అర్థంకానిదేమిటంటే ధర్మాన్ని పట్టుకున్నవాడికి రక్షణ కలుగుతుందీ ఇన్ని విన్నా ఇన్ని చూస్తున్నా రావణుడు ఎలా నమ్మలేడో అలా నీవు నమ్మకపోతే నిన్ను బాగుచెయ్యగలిగినవాడు ఉండడు నీవు నమ్మగలిగితే నీకు కూడా రామానుగ్రహము పొందడానికి సిద్ధంగా ఉన్నట్లులెక్కా. కాబట్టి వెంటనే బలేన మహతా యుక్తో రక్షసాం భీమ విక్రమః ! త్వం వధాయాఽభి నిర్యాహి రామస్య సహ వానరైః !! ధూమ్రాక్షుడనేటటువంటి ఒక గొప్ప రాక్షస యోధున్ని పిలిచి నీవు రాక్షసులందరితో కలిసి బయలుదేరివెళ్ళి ఆ రామ లక్ష్మణుల్ని నిర్జింపవలసింది అన్నాడు. ఈ ధూమ్రాక్షుడు రాక్షస సైన్యాన్ని తీసుకుని ఆ ద్వారంలోంచి బయటికి బయలుదేరాడు

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
రథ శీర్షే మహా భీమో గృద్ర శ్చ నిప పాత హ ! ద్వజాఽగ్రే గ్రథితాశ్చైవ నివేతుః కుణపాఽశనాః !!
రుధిరాఽఽర్ద్రో మహాన్ శ్వేతః కబన్ధః పతితో భువి ! విస్వరం చోత్సృజన్ నాదం ధూమ్రాక్షస్య సమీపతః !!
వవర్ష రుధిరం దేవః సంచచాల చ మేదినీ !
ప్రతిలోమం వవౌ వాయు ర్నిర్ఘాత సమ నిస్వనః ! తిమిరౌఘా వృతా స్తత్ర దిశ శ్చ న చకాశిరే !!
Related imageఆయనా రథంమీద బయలుదేరి బయటికివస్తూంటే మేఘములు అకస్మాత్తుగా రక్తమును వర్షించాయి ఆ రక్తవర్షంలో ఆయన యొక్క రథం తడిసిపోయింది ఎక్కడనుంచో ఒక పెద్ద కంకాళము అంటే ఒక శవము మొండెమొక్కటి ఆయన రథంలోన పడింది, ఎన్నిమార్లు యుద్ధానికి బయలుదేరుదామని ప్రయత్నిస్తే అన్నమాట్లు పక్షులు అప్రదక్షిణంగా కూతలు కూస్తూ ఆకాశంలో తిరుగుతున్నాయి. భయంకరంగా అరుస్తూ ఒక గద్ధవచ్చి రథంమీద వాలింది ఇన్ని దుఃశ్శకునములు కనపడితే ఇక వెళ్ళినవాడు తిరిగిరాడూ అని, ఐనా సరే మూర్ఖత్వంతో ఆయన యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు వానరులమీద బాణ ప్రయోగం చేశాడు కొంతమంది వానరులను మట్టుపెట్టాడు యుద్ధానికి వెళ్ళినవాడు చెయ్యకుండా ఉండడుకదాండీ..! ఈ వానరులందరూ హనుమను ఆశ్రయించారు మహనుభావా ఆయన అంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేసి మమ్ములను మట్టుపెడుతున్నాడు నీవు కాపాడవలసిందీని. వెంటనే స్వామి హనుమా తన అరచేతిలో ఒక్కదెబ్బ గట్టిగా కొట్టారు కొట్టి ఆ రాక్షసున్ని మర్థిస్తే ఆ ధూమ్రాక్షుడనేటటువంటివాడు నెత్తురు కక్కుకునీ శరీరం విడిచిపెట్టి ఆ యుద్ధ భూమిలో పడి ప్రాణములను విడిచిపెట్టాడు అక్కడితో ధూమ్రాక్ష వధ పూర్తయింది అబ్రవీ ద్రాక్షసం ఘోరం వజ్రదంష్ట్రం మహా బలం ఒకడు వెళ్ళిపోతే ఇంకొకడు వెళ్ళాలికదాండీ.
నేను అందుకే అన్నది ʻలోక కళ్యాణ యజ్ఞంʼ ఇది రాక్షసులందరూ ఒకరి తరువాత ఒకరు తెగటారిపోతుంటారు ఇప్పుడు రావణుడు వజ్రదంష్టృడు అనబడేటటువంటి రాక్షసున్ని పిలిచాడు ఆయనకూడా పతాకాఽలం కృతం దీప్తం తప్త కాంచన భూషణం ! రథం ప్రదక్షిణం కృత్వా సమాఽఽరోహ చ్ఛమూ పతిః !! ఒక దివ్యమైనటువంటి రథం ఎక్కి అందులో సమస్తమైనటువంటి ఆయుధములు పెట్టబడి ఉన్నాయి ఆ రథానికి ప్రదక్షిణం చేసి ఆ రథాన్ని అధిరోహించాడు. ఆయనా బయలుదేరాడు ఆయనకి అపశకునములు కనపడ్డాయి అయినాసరే లెక్కపెట్టకుండా రాక్షసుడు కనుకా ఉద్ధతిలో యుద్ధ భూమికి బయలుదేరాడు తతః ప్రవృత్తం తుములం హరీణాం రాక్షసై స్సహ ! ఘోరాణాం భీమ రూపాణాం అన్యోన్య వధ కాంక్షిణాం !! భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది ఒకరినొకరు చంపుకోవాలనేటటువంటి కుతూహలంతో ఇటు వానరులు అటు రాక్షసులు అక్కడ చాలా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారు ఆ యుద్ధాన్ని చేస్తున్నటువంటి సమయంలో అంగదుడికి ఈ వచ్చినటువంటి రాక్షసునికి వజ్ర్రదంష్ట్రుడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఇవన్నీ వజద్రంష్ట్రుడి చేతిలో చాలా మంది వానరులు నిహతలైపోయారు అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. అంగదుడు నిఘ్నతో రాక్షసాన్ దృష్ట్వా సర్వాన్ వాలి సుతో రణే ! క్రోధేన ద్విగుణాఽఽవిష్ట స్సంవర్తక ఇవాఽఽనలః !! ఆయనా ప్రళయాగ్ని ఎలా ఉంటుందో యముడు ఎలా ఉంటాడో అలాంటి రూపాన్ని పొందినటువంటివాడై ఆ అంగదుడు ఈ వచ్చినటువంటి రాక్షసుడితో యుద్ధంచేసి చెట్టుపెట్టి కొట్టినా... పర్వత శిఖరం పెట్టి కొట్టినా కిందపడి మళ్ళీ స్పృహనుపొంది లేచి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకున్నారు ఇద్దరూ మల్లయుద్ధం చేశారు ఒకస్థితిలో ధనుర్భాణములు అన్నీకూడా విరిగిపోయి రథం విరిగిపోయింది అయినా విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా ఇద్దరూ మల్లయుద్ధం చేస్తున్నారు ఆ మల్లయుద్ధం చేస్తున్న సమయంలో ఇద్దరికి ఇంక లేచి యుద్ధంచెయ్యడానికి ఓపికలేనంతగా కొట్టుకునీ ఇద్దరూ నవ రంద్రములలోంచి నెత్తురు కక్కారు నెత్తురు కక్కి పడిపోయారు. చాలా ఆగ్రహించినటువంటి అంగదుడు ఒక్కపెట్టున లేచి చర్మంతో చేయబడినటువంటి డాలులో ఒక గొప్ప బంగారు కత్తి పెట్టుకుని వచ్చాడు ఆ రాక్షసుని యొక్క బంగారు కత్తిని పైకితీసి ఆయన యొక్క కంఠాన్ని దాంతోటే కోసేశాడు, కేసేస్తే ఆ వచ్చినటువంటి రాక్షసుడు అంతటితో మరణించాడు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
వచ్చినవాళ్ళు సామాన్యులుకారండి నేను ఏదో ఒక వాక్యరూపంలో చెప్తున్నాను కానీ అంత భయంకరమైన యుద్ధం చేశారు ఒక్కొక్కరిని చంపడానికి దేవతలు వాళ్ళ యొక్క తేజస్సును వానర రూపంలో పంపారు నరవానర రూపంలోవెళ్తేతప్పా రావణున్ని సంహరించడం కుదరదు వాళ్ళుకి కాబట్టి  మహానుభావులు యుద్ధంచేసి చంపగలిగారు. అప్పుడు అకంపనుడనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసున్ని మళ్ళీ రావణాసురుడు పంపించాడు
తతోఽన్యం వృక్ష ముత్పాట్య కృత్వా వేగ మఽనుత్తమమ్ ! శిర స్యఽభిజఘా నాఽఽశు రాక్షసేన్ద్రమ్ అకమ్పనమ్ !!
స వృక్షేణ హత స్తేన సక్రోధేన మహాత్మనా ! రాక్షసో వానరేన్ద్రేణ పపాత చ మమార చ !!
తం దృష్ట్వా నిహతం భూమౌ రాక్షసేన్ద్రమ్ అకమ్పనమ్ ! వ్యథితా రాక్షసాః సర్వే క్షితి కమ్ప ఇవ ద్రుమాః !!
అప్పుడూ ఆ వచ్చినటువంటి రాక్షసుడితో చాలా గొప్ప యుద్ధం జరిగింది అకమ్పనుడు వానరులను చంపాడు, అకమ్పనుడు అకమ్పనుని సైన్యంతో వానరులు యుద్ధం చేశారు. చాలా మంది వానరులను అంకపనుడు సంహరిస్తున్నాడన్ని కారణంచేత క్రోధాన్ని పొందిన స్వామి హనుమా ఒక పెద్ద వృక్షాన్ని పెకలించీ ఆ వృక్షాన్ని పళ్ళతో కాయలతో ఉన్న చెట్టుతో మోది అకమ్పనుడి యొక్క ప్రాణములు తీసేశాడు. అక్కడితో ఆ అకంపనుడు కిందపడి మరణించగానే ఆయనతో వచ్చినటువంటి సైన్యమంతా కూడా భూకంపమొస్తే చెట్లన్నికూడా ఎలా పడిపోతాయో అలా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్థనాదాలు చేస్తూ లంకాపట్టణంలోకి పారిపోయారు. ఈ వార్త తెలిసింది అకంపనుడు కూడా మరణించాడని, ఈ వార్త తెలిసిన తరువాత ఇక అసలు ఎంత సైన్యం మిగిలింది ఎంతమంది యోధులు మిగిలారు ఒకడికన్నా ఒకడు ఒకడికన్నా ఒకడు ఒకడికన్నా ఒకడు గొప్పవాడితో యుద్ధానికి వెడుతున్నాడు ఒక్కొక్కడు పడిపోతున్నాడు రావణాసురుడు మరునాటి ఉదయం స్వయంగా రాక్షసబలం అంచనావేయడానికి తానేబయలుదేరాడు తత స్తు రావణః పూర్వ దివసే రాక్షసాఽధిపః ! పురీం పరియయౌ లంకాం సర్వాన్ గుల్మానఽవేక్షితుమ్ !! ప్రాతః కాలంలో యుద్ధ శిభిరాలన్నిటిని ఒకసారి తాను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించాడు, వాళ్ళయందు కొంత శౌర్యాన్ని ఉత్సాహాన్ని నింపడంకోసం దదర్శ నగరీం లంకాం పతాకా ధ్వజ మాలినీమ్ ఆయన ఒక్కసారి ఆ

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
లంకాపట్టణంవంక చూస్తే ఎటు చూసినా సముద్రం చుట్టూ నిలబడినట్లుగా వానరసైన్యముతో రామ లక్ష్మణులున్నారు చాలా దిగులు చెందాడు.
Image result for ravana and sitaవెళ్ళినవాడిలో తిరిగొచ్చినవాడులేడు, అక్కడ దిగులు పొందేటట్టుగా మరణించినటువంటి పెద్ద పెద్ద నాయకులులేరు. పెద్ద పెద్ద నాయకులు ఆక్కడ ఒక్కడు మట్టుపడటంలేదు, ఇక్కన్నుంచి వెళ్ళినవాడు తిరిగిరావట్లేదు. చాలా దిగులు చెందాడు రుద్ధాం తు నగరీం దృష్ట్వా రావణో రాక్షసేశ్వరః ! ఉవాచాఽమర్షతః కాలే ప్రహస్తం యుద్ధ కోవిదమ్ ! ప్రహస్తున్ని పిలిచాడు తనకు అత్యంత ప్రీతి పాత్రుడు సర్వసైన్యాధిపతి ఆ ప్రహస్తున్ని పిలిచి ఆయనతో అన్నారు అహం వా కుమ్భకర్ణో వా త్వం వా సేనాపతి ర్మమ ! ఇన్ద్రజి ద్వా నికుమ్బో వా వహేయు ర్భార మీదృశమ్ !! మనం మాత్రమే ఇప్పుడు ఈ యుద్ధభారాన్ని వహించగలము ఇప్పుడు నా దృష్టిలో ఒక సామాన్యుడివెళ్ళి యుద్ధం చేయడమనేటటువంటిది సాధ్యంకాదూ అని అర్థమౌతుంది అహం వా వెడితే నేను వెళ్ళాలి కుమ్భకర్ణో వా లేకపోతే నా తమ్ముడు కుంభకర్ణుడు వెళ్ళాలి త్వం వా సేనాపతి ర్మమ నా సేనాపతియైన నీవు వెళ్ళాలి ఇన్ద్రజి ద్వా ఇంద్రజిత్తు వెళ్ళాలి నికుమ్భో వా లేకపోతే నికుంభుడు వెళ్ళాలి వహేయు ర్బార మీదృశమ్ ఈ భారాన్ని మనమే వహించాలి ఇంతకన్నా గొప్పవాళ్ళు నాకు కనపట్టంలేదు కాబట్టి నీవు తప్పకుండా ఈ యుద్ధానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ వెళ్ళినవాళ్ళు ఎవ్వరూ తిరిగి రావట్లేదుగా... ఇప్పుడు ఒకవేళా ప్రహస్తుడు ఆసలు ఈ యుద్ధంలో ఇంతమంది చచ్చిపోతున్నారుగదా నీవల్లకదూ నీ కారణంవల్లకదూ ఒకమాట అన్నాడనుకోండి సర్వసైన్యాధిపతి లేనిపోని ఇబ్బందివస్తుందికదూ అందుకనీ పంపేటప్పుడు ఎలా పంపుతాడో తెలుసాండి అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి జాగరూకుడవైవెళ్ళూ అని జాగ్రత్తచెప్పి పంపడు. తనవారన్నవారు చనిపోతున్నారని తానేం బాధపొందడు అదీ రాముని విషయంలో వేరుగా ఉంటుంది, రావణుడి విషయంలో వేరుగా ఉంటుంది.
ఎంత తేలిగ్గా చెప్పాడో తెలుసాండీ! యుద్ధం చేయడం అదేం పెద్ద విషయమేం కాదు ప్రహస్త్యా..! సరిగ్గాతెలియకా వాళ్ళు యుద్ధానికెళ్ళి నిహతులైపోతున్నారు చపలా హ్యఽవినీతా శ్చ చల చిత్తా శ్చ వానరాః ! న సహిష్యన్తి తే నాదం సింహనాదమ్ ఇవ ద్విపాః !! వాళ్ళు చపలచిత్తులు చెంచలమైన మనస్సున్నవాళ్ళు వానరులు చాలా భయంతో ఉంటారు అటువంటి భయంకలిగినటువంటి వానరులతో పెద్ద యుద్ధం చెయ్యవలసిన అవసరం ఏం ఉండదు. నీవు వెళ్ళి ఏం చెయ్యవలసి ఉంటుందంటే నీవు వెళ్ళి పెద్ద సింహనాదం చెయ్యాలి నీవు సింహనాదం చేస్తే భయపడిపోయి వానరులందరు పారిపోతారు ఎందుకంటే చపలచిత్తులుకదా వాళ్ళిక నిలబడరు వాళ్ళందరూ పారిపోతారు పారిపోతే ఎవరు మిగిలుతారు తన భార్య కోసమని రాముడు రామునికోసమని లక్ష్మణుడు వాళ్ళిద్దరే మిగులుతారు. అప్పుడు విద్రుతే చ బలే తస్మిన్ రామః సౌమిత్రిణా సహ ! అవశ స్తే నిరాఽఽలమ్బః ప్రహస్త వశ మేష్యతి !! అప్పుడు వాళ్ళిద్దరూ మిగిలిపోతారు అందరూ పారిపోతారు అప్పుడు ఇద్దరు మిగిలిపోతే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటారు అయ్యెయ్యో వానరులందరూ పారిపోయారేమిటాని అనివాళ్ళేంచేస్తారు ఎవ్వరూ లేరు మనిద్దరం మాత్రం ఏం చేస్తారని నీకు లొంగుతారు అప్పుడు నీవు ఏం చేస్తావు వాళ్ళని బంధించేసి తీసుకొస్తావు అయిపోతూంది యుద్ధం బయలుదేరు అన్నాడు.
అదా..? అంతతేలికాండీ..! సింహనాదం చేస్తే వెళ్ళిపోతారా వానరులందరు తనకి తెలియదా అంటే అవతలివారిని సమిధగా వేసెయ్యాలంటే ఇలా నేను మాట్లాడచ్చా ఇలా నేను పంపచ్చా నిజంగా ఇంత తేలికా యుద్ధం అతడికి తెలుసు అంత

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
తేలికకాదని కానీ అంత తేలికని చెప్పి పంపిస్తాడు. ఇదీ ఇన్నాళ్ళు రావణాసురిడితో అంటకాగి రావణాసురునికి ప్రీతికలిగేటట్టుగా మాట్లాడి తనకు సత్యం తెలిసున్నా మాట్లాడకుండా విభీషణుడు వెళ్ళినప్పుడు వెళ్ళకుండా రావణాసునికి అంటిపెట్టుకున్నందుకు ఫలితం అనుభవించవద్దూ అర్థమైంది ప్రహస్తుడికి. ఇప్పుడు నన్నువేశాడు సమిధకిందా అంటే నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు అనుకుని ఆయన అన్నాడూ సోఽహం దానై శ్చ మానై శ్చ సతతం పూజిత స్త్వయా ! సాన్త్వై శ్చ వివిధైః కాలే కిం న కుర్యాం ప్రియం తవ !! నీవు నాకు ఎన్నో ప్రియమైన కార్యాలు చేశావు నాకెన్నోదానాలిచ్చావు నాకెన్నో బహుమానాలిచ్చావు నన్ను అనేక పర్యాయాలు సంతోషపెట్టావు కాబట్టి ఇప్పుడు నీవు నన్ను ఒకటి అడిగితే నేను చేయకుండా ఎలా ఉంటాను కాబట్టి చేస్తాను న హి మే జీవితం రక్ష్యం పుత్ర దార ధనాని వా ! త్వం పశ్య మాం జుహూషన్తం త్వ దఽర్థం జీవితం యుధి !! ఆయన వెళ్ళేటప్పుడే అమంగళకరమైనమాట మాట్లాడేశాడు ఆయన అన్నాడు నా జీవితాన్ని ఈ యుద్ధమనబడేటటువంటి హోమంలో ఆజ్యముగా సమర్పించేస్తాను అంటే నేను గెలిచొస్తానని ఆయన చెప్పలేదు.
Image result for indrajit ramayanaఈయ్యన చెప్తున్నాడు కానీ నీవు సింహనాదంచేయ్ వానరులందరూ పారిపోతారు రామ లక్ష్మణులు నీకు లొంగిపోతారు నీవేం చేయక్కరలేదు వాళ్ళేలొంగిపోతారు ఎక్కండ్రాని అలా చెప్పి తీసుకురావడమే అని చెప్పాడు కానీ ఆయనకి తెలియుదూ... ఆయన అన్నాడు నా ప్రాణాల్ని హోమంలో వేసేస్తాను కాబట్టి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు బయలుదేరాడు బయలుదేరుతూ చాలా అట్టహాసం చేశాడు హుతాఽశనం తర్పయతాం బ్రాహ్మణాం శ్చ నమస్యతామ్ ! ఆజ్య గన్ధ ప్రతివహః సురభి ర్మారుతో వవౌ !! అక్కడ గొప్ప హోమం చేశాడు దేవతలకి ప్రీతి కలగాలీ అని కోరుకున్నాడు బ్రాహ్మణులకు నమస్కారం చేశాడు బయలుదేరాడు అయినా దుఃశకునాలే కనపడ్డాయి. అంటే మీరు ఒక్కమాట గమనించవలసి ఉంటుంది, అసలు ధర్మమన్నదానిమీద నమ్మకంలేకుండా ఈశ్వరుడన్నవాడు ఉన్నాడని నమ్మకంలేకుండా మనకు ఇష్టమొచ్చినట్లు మనం తిరిగి ఎప్పుడో ఓసారి ఆపదొచ్చినప్పుడు లోపల నమ్మకంలేకపోయినా అప్పుడు ధర్మమన్నమాటనుతెచ్చి అడ్డుపెట్టుకునేప్రయత్నం చేశారనుకోండి నమ్మని ధర్మం మీరు అనుష్టించని ధర్మం మీరు ధర్మంలో ఉన్నట్లు నటిస్తేమాత్రం మిమ్మల్ని ఎలా కాపాడుతూంది ఇది రాక్షసులతో వచ్చేటటువంటి పెద్ద సమస్య. కాబట్టి ఇప్పుడు దుశ్శకునాలు కనపడ్డాయి అయినా సరే ఆయన చాలా అట్టహాస్యంగా సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు అప్పుడు రామ చంద్ర మూర్తంతంతటివారు అడిగారు ఎంత కోలాహలంగా వస్తున్నాడు ఆ వస్తున్నవాడు ఎవరు? అని విభీషణున్ని అడిగాడు రాముడు ఇదో అదృష్టం రామునికి. ఎందుకంటే వచ్చేవాడెవరో విభీషణుడులేకపోతే ఎవ్వరికి తెలియదు వానర సైన్యంలో, కాబట్టి అసలు అతనెవరో అతని బలమేమిటో అతని శక్తేమిటో అతను ఎంత స్థితిలో ఉంటాడో ఎవరు యుద్ధం చెయ్యొచ్చో అన్నీ చెప్పడానికి ఎప్పుడూ విభీషణుడు సిద్ధంగా ఉన్నాడు.
నేను మీతో మనవిచేశానుకదూ... ఎవరు ధర్మాన్ని అవలంభించారో వాళ్ళ వెనక ఈశ్వరుడు ఎప్పుడూ రక్షించడానికి సలహాయివ్వడానికి ఎవరో ఒకర్నిపెడతాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో వాడు చాలా మందిని చుట్టూపెట్టుకున్నాననుకున్నా వాడు విజయాన్ని సాధించలేడు. కాబట్టి అప్పుడు విభీషణుడు అన్నాడు ఉవాచ సస్మితం రామో విభీషణ మఽరిందమః నవ్వుతూ విభీషణుడు చెప్పాడు ఏష సేనాపతి స్తస్య ప్రహస్తో నామ రాక్షసః ! లంకాయాం

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
రాక్షసేన్ద్రస్య త్రి భాగ బల సంవృతః ! వీర్యవా నఽస్త్రవి చ్ఛూరః ప్రఖ్యాత శ్చ పరాక్రమే !! రావణాసురునికి ఉన్న సైన్యంలో మూడవ వంతు సైన్యానికి ఇతను అధిపతి, సర్వసైన్యాధక్షుడు గొప్పయోధుడు అటువంటివాడు యుద్ధానికొస్తున్నాడు తతః ప్రహస్తం నిర్యాంతం భీమం భీమ పరాక్రమం ! గర్జన్తం సుమహా కాయం రాక్షసై రఽభిసంవృతమ్ !! చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు భీమ విక్రమము కలిగినటువంటివాడు చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు శరీరముకూడా చిన్నదికాదు పర్వతం ఎంతుంటుందో అంతటి ఆకారం కలిగినటువంటివాడు అనేకమంది రాక్షసులచేత పరివేష్టించి ఉంటాడు. ఇప్పుడు ఆయన సర్వసైన్యాధిపతి కాబట్టి ఆ సర్వసైన్యాధిపతితో ఎవరు యుద్ధం చేశారు ఇటువైపు సర్వసైన్యాధిపతి యుద్ధం చేశాడు ఇటువైపు సర్వసైన్యాధిపతి నీలుడు. కాబట్టి నీలుడు ఆ వచ్చినటువంటి ప్రహస్తుడితో యుద్ధం చేశాడు ఇద్దరూ కలిసి చాలా సంతులమైనటువంటి యుద్ధమేజరిగింది. ఇద్దరికీ అంత సంకుల సమరము జరిగిన తరువాత నీలుడు ఒక పెద్ద శిలను ఎత్తి అత్యంత వేగంతో వచ్చి ఆ వచ్చినటువంటి ప్రహస్తుడి తలమీద పడేశాడు. అంతపెద్ద శిల తలమీద పడేస్తే ఎవడు మాత్రం బ్రతుకుతాడండీ దానికిందపడి మాంసపు ముద్దైపోయాడు ప్రహస్తుడు ఆవిధంగా వచ్చినటువంటి ప్రహస్తుడు కూడా మరణించాడు అన్నమాట సర్వసైన్యాధిపతి కూడా మరణించాడన్నమాట రావణాసురునికి అందింది.
Related imageఅయ్యా నీవు పంపించినవాళ్ళల్లో నీ సర్వసైన్యాధిపతి కూడా మడిసిపోయాడు ఇప్పుడు స్వయమ్ ఏవ గమిష్యామి రణ శీర్షం త దఽద్భుతమ్ రావణుడన్నాడు నేనే వెడుతున్నాను యుద్ధానికి ఇక వీరుల్ని పంపను ఈ యుద్ధం తాడో పేడో తేలిపోవాల్సిందే రామ-రావణ సంగ్రామం ప్రారంభం కావలసిందే రామున్ని వధిస్తాను నేనే బయలుదేరుతాను అని అన్నాడు అద్య త ద్వానరాఽనీకం రామం చ సహ లక్ష్మణమ్ ! నిర్దహిష్యామి బాణౌఘై ర్వనం దీప్తైః ఇవాఽగ్నిభిః !! అద్య సంతర్పయిష్యామి పృథివీం కపి శోణితైః !!! ఎప్పుడూ పలుకుతాడు ఈ ఢాంబికాలు వానరుల యొక్క రక్తంతో ఈ భూమికి తర్పణ చేస్తాను ఒక అగ్నిహోత్రం అరణ్యంలో ఎండిపోయిన చెట్లనెలా కాల్చుతుందో అలా రామ లక్ష్మణుల్ని నా బాణపరంపరచేత నిగ్రహిస్తాను కాబట్టి నేనే స్వయంగా బయలుదేరుతానన్నాడు బయలుదేరాడు. ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరారంటే సామాన్యమైన విషయంకాదు. ఒక్కొక్కడు ఒక కోటిమందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధాన యోధులు ఆయనతో బయలుదేరారు అసలు ఆ స్వరూపం అలా ఉంటుంది రావణాసురుంది అంతటి తేజోమూర్తి అందులో సందేహంలేదు ఆయన చేసిన తపస్సటువంటిది కాబట్టి రాముడంతటివాడు ఆశ్చర్యపోయాడు అసలు ఆ కోలాహలాన్ని ఆ ధ్వనినివిని అలా వస్తూందేంటి అటువంటి గొడుగు చంద్రమండలసన్నిభమైనటువంటి తెల్లటిగొడుగు వస్తూంది ఆ వెనకాల అన్ని గొడుగులు వస్తున్నాయి అంతమంది యోధులు ఏనుగులు ఒంటెలు పులులు అన్నిటితో వస్తున్నారు ఎవరువాళ్ళు అని అడిగాడు విభీషణున్ని, రాముడు అడిగినప్పుడు నానా పతాకా ధ్వజ శస్త్ర జిష్టం ప్రాసాఽసి శూలాఽఽయుధ చక్ర జుష్టమ్ సైన్యం నగే న్ధ్రోపమ నాగ జుష్టం క స్యేదమ్ అక్షోభ్య మఽభీరు జుష్టమ్ ! వస్తున్నటువంటి సైన్యం అంత భయంకరంగా ఏనుగులతో అంతమంది వీరులతో వస్తూంది వాల్లెవరో నాకు చెప్పవలసిందీ అని అడిగాడు అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు, వస్తున్నవాళ్ళల్లో అంకపనుడు అనబడేవాడున్నాడు వాడు సింహధ్వజం కలిగినటువంటి రథంమీద ఎక్కి వస్తాడు ఇంద్ర ధనస్సు ఎలా ఉంటుందో ఆయన యొక్క ధనస్సు అలా ఉంటుంది. ఆ వెనకాతల వస్తున్నవాడు ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని యొక్క వరప్రభావంచేత మాయా యుద్ధం చేస్తాడు మేఘాలలో నిలబడి యుద్ధం చేస్తాడు ఇంద్రజిత్తు గురించి నేను చెప్పక్కరలేదు ఏనుగుల యొక్క దంతములు ఎలా పైకివచ్చి ఉంటాయో... అన్ని ప్రాణులకు దంతములు నోట్లో ఉంటే ఒక్క ఏనుగుకి దంతములు పైకి ఉంటాయి అలాగే ఇంద్రజిత్తుకు కూడా కోరలు పైకివచ్చి ఉంటాయి అంత భయంకరమైన రూపమున్నవాడు.
ఇంకొకడు అతికాయుడు ఆయనా రథికులలోకెల్లా చాలా శ్రేష్ఠుడైనవాడు అత్యంత వేగంగా వింటినారిని లాగుతూ యుద్ధం చేయగలడు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటివాడు మహోదరుడు, ఈయనా ఎక్కినటువంటి ఏనుగు యొక్క మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భయంకరంగా ఉంటుంది అటువంటి శబ్దముకలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునెక్కి యుద్ధం చేస్తుంటాడు ఇంకొకడు పిశాచుడు అనబడేటటువంటి రాక్షసుడు, ఆయన గుఱ్ఱమెక్కి చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఒక పర్వతమెంత ఉంటుందో అంత శరీరంతో ఉండి యుద్ధం చేసేవాడు త్రిసురుడు ఆయనకూడా యుద్ధానికి వస్తున్నాడు. వేరొకడు చాలా విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటివాడు ఆయన కుంభాసురుడు ఆయన ధనుష్టంకారం చేస్తూ ఇంద్రనీల మణులచేత పొదగబడినటువంటి అగ్ని మణులు చెరుగుతున్నటువంటి వజ్రఖచితమైన బంగారంతో నిర్మితమైన ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటాడు, వెరొకడు నరాంతకుడు ఆయన కేవలము పర్వత శిఖరములను విసిరి యుద్ధం చేస్తాడు అంత గొప్ప యోధులతో కలసి వస్తున్నాడు. అదిగో ఆ మధ్యలో వస్తున్నాడే ఆయనే రావణాసురుడు య శ్చైష నానా విధ ఘోర రూపైః వ్యాఘ్రో ష్ట్ర నాగేన్ద్ర మృగాఽశ్వ వక్త్రైః భూతైర్వృతో భాతి వివృత్త నేత్రైః సోఽసౌ సురాణా మఽపి దర్ప హన్తా ! ఆ రాక్షస రాజైనటువంటి రావణుడు భయంకరమైనటువంటి రాక్షసులతో కలసి వస్తున్నాడు. ఆయన వెనక వచ్చేటటువంటి రాక్షసులు ముఖాలు మామూలు ముఖాలలాగ కూడా ఉండవు, పెద్ద పులులయొక్క ముఖాలు మధపుటేనుగు యొక్క ముఖాలు ఒంటెల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ముఖములు కలిగిన రాక్షసులచేత పరివేష్టితుడై తెల్లటి గొడుగులో వస్తున్నాడు.
ఆ వస్తున్నటువంటి రావణాసురునికి యొక్క అసౌ కిరీటీ చల కుణ్డలాఽఽస్యౌ నాగేన్ద్ర వినధ్యోపమ భీమ కాయః మహేన్ద్ర వైవస్వత దర్ప హన్తా రక్షోఽధిపః సూర్య ఇవాఽవభాతి ! భూతగణములతో పరివేష్టితుడైనటువంటి రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో రాక్షస గణములచేత పరివేష్టింపబడిన ఆ రావణాసురుడు ఆ కుండలములు కదులుతూండగా ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో ఒకానొకనాడు ఆయన యమధర్మరాజుని ఇంద్రుని కూడా నిగ్రహించినటువంటివాడు అంతటి బలము కలిగినటువంటి ఆ రావణాసురుడు అదిగో వస్తున్నాడు. రామ చంద్ర మూర్తి రావణాసురున్ని చూశారు చూసి ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రశ్మిభి ర్భాతి రావణః ! సువ్యక్తం లక్షయే హ్యఽస్య రూపం తేజ స్సమాఽఽమృతమ్ !! దేవ దానవ వీరాణాం వపు ర్నైవం విధం భవేత్ ! యాదృశం రాక్షసేన్ద్రస్య వపుః ఏతత్ ప్రకాశతే !! ఈయన్ని చూస్తూంటే సాక్ష్యాత్తుగా సూర్యనారాయణ మూర్తి ఆకాశంలో ప్రకాశిస్తూంటే ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు, ఇతః పూర్వం ఇంతగొప్ప శోభతో ఇంతగొప్ప తేజస్సుతో ఉన్నటువంటి శరీరాన్ని నేనసలు దేవతలలోగాని దానవులలోగాని ఇప్పటివరకు చూడలేదు అంతగొప్ప కాంతితో ఉన్నాడు దిష్ట్యాఽయ మఽద్య పాపాత్మా మమ దృష్టి పథం గతః ! అద్య క్రోధం విమోక్ష్యామి సీతౌ హరణ సంభవం !! నేను ఈ రావణున్ని చూడగానే నాలో క్రోధం పెరిగిపోతూంది సీతాపహరణం చేసినటువంటి ఈ రాక్షసున్ని నేను మర్థిస్తాను అన్నాడు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఈలోగా సుగ్రీవుడు రావణాసురుడు వీళ్ళిద్దరు వచ్చినటువంటి రావణాసురునితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు, కానీ ఆ సుగ్రీవుడు రావణాసురునితో యుద్ధం చేయడమంటే ఏం అంత తేలికైన విషయమేంకాదు రావణాసురుడంటే అంత తక్కువ వీరుడేం కాదు. రామ చంద్ర మూర్తంతటివారు ఎదర విందురుగానీ అసలు భయమేస్తుంది ఆ యుద్ధం జరిగితే రామ చంద్ర మూర్తంతవారు బడలిపోయి అసలు ఈ రావణాసురుడు ఎలా తెగటార్చబడతాడూ అనుకున్నారు ఒక స్థితిలో అందరూ యుద్ధం మానేసి చూశారు రామ-రావణాసుర యుద్ధాన్ని అంతటి మహాబలవంతుడు అంతటి పరాక్రమశాలి స సాయకో రావణ బాహు ముక్తః శక్రాఽశని ప్రఖ్య వపుః శితాఽగ్రః సుగ్రీవ మాఽఽసాద్య బిభేద వేగాత్ గుహేరితా క్రౌంచ మి వోగ్ర శక్తిః ! సుబ్రమణ్యేశ్వర స్వామి చేతిలో పట్టుకునేటటువంటి శూలమేలా ఉంటుందో సుగ్రీవున్ని చూడగానే కోపగించినవాడై ఆ శూలాన్నటువంటిదాన్ని తీసి చోత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురిచూసి కోడ్తే ఆ శూలమువచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే సృహతప్పి సుగ్రీవుడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆ తరువాత గవాక్షుడు గవయుడు సుదంష్టృడు వృశభుడు జోతిర్ముఖుడు నకుడు అనబడేటటువంటి మహాకాయులైనటువంటి వానర వీరులు పెద్ద పెద్ద చెట్లు శిలలూ పర్వత శిఖరాలు పట్టుకుని రావణాసురునిమీదకి వెళ్ళారు అవలీలగా ఇరవై చేతులతో ధనస్సును తిప్పుతూ వాళ్ళందరు పట్టుకొచ్చినవన్నీపడగొట్టి వీళ్ళందర్నీ బాణప్రయోగం చేసి వీళ్ళందర్నీ యుద్ధభూమిలో పడగొట్టేశాడు పడగొట్టి ఏక కాలమునందు ఇన్నివేల వానరముల్ని పడగొడుతున్నాడు.
Image result for ravana and sitaపడగొడతుంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యమంతా గగ్గోలు పెట్టుకుంటూవెళ్ళి ఈ రావణాసురుని యుద్ధాన్ని మేము తట్టుకోలేమని లోకరక్షుడైనటువంటి రామ చంద్ర మూర్తిని ఆశ్రయించారు. రామ చంద్ర మూర్తి యుద్ధానికి బయలుదేరుతున్నారు. వచ్చినటువంటి రావణుడు చాలా గొప్ప రథమెక్కి వచ్చాడు రామునికి రథంలేదు నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు లక్ష్మణ స్వామి వచ్చి అన్నాడు అన్నయ్యా నీవు వెళ్ళడమా యుద్ధానికి నేను వెళ్ళి రావణున్ని నిగ్రహిస్తాను అన్నాడు చాలా జాగ్రత్తగా చూసి నీవు ఆయన మీద యుద్ధం చేయవలసింది. ఈలోగా లక్ష్మణుడు రావణాసురునిమీద యుద్ధానికి వెళ్ళేలోపలా స్వామి హనుమా రావణాసురునితో యుద్ధానికి వెళ్ళాడు ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను నిన్ను చంపడానికి అస్త్ర శస్త్రాలు అక్కరలేదు ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక పిడిగుద్దు ఒకటి రావణాసురుని గుండెలమీద గుద్దాడు గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచిలితుడైపోయినట్లుగా కదిలిపోయాడు రథంమీద, కానీ ఉత్తర క్షణంలో సంజ్ఞపొంది అది రావణ బలమంటే హనుమ అంతటివారు అంత క్రోధంతో కొట్టిదాన్ని తట్టుకుని తన పిడికిలి బిగించి ఆ వానరోత్తముడైన హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురిచూసి ఓ గుద్ధు గుద్ధాడు ఆ రావణాసురుని దెబ్బ తన గుండెలమీద తగిలేటప్పటికీ ఇంతటి హనుమా గిరగిర తిరిగి సృహతప్పి నేలమీద పడిపోయాడు. రావణాసురడంటే మీరేం తక్కువాగా

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అంచనావేయకండి. మహర్షి ఏది చెప్పేటప్పుడు అది చెప్తారు ఆయన బలం గురించి చెప్పేటప్పుడు ఆ బలంగురించే చెప్తాడు రావణున్ని అరిచేత్తో దెబ్బకొడ్తే రావణుడు చలించిపోయాడు ఆ వానరోత్తమున్ని అరిచేత్తో ఒక్క దెబ్బకొట్టి ఒక్క గుద్దు గుద్దితే హనుమ అంతటివారు విచిలితుడై ఒక్కసారి పర్వతం పడిపోయినట్లు పడిపోయాడు.
Related imageమహా బలవంతుడైనటువంటి హనుమ సృహతప్పిపోవడం చూసి సర్వసైన్యాధిపతియైనటువంటి నీలుడు విజృంభించాడు, విజృంభించి యుద్ధం చేస్తూంటే రావణాసురుడు ఆయన మీద బాణ ప్రయోగం చేస్తున్నాడు ఆయనకి దొరక కుండా తిరుగుతూ శిలలను వర్షిస్తూ వృక్షములను వర్షిస్తూ నీలుడు యుద్ధం చేస్తున్నాడు ఎన్నిటిని ప్రయోగిస్తున్నాడో అన్నిటిని ఆకాశంలోనే ముక్కలుచేసి బాణాలు ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు. రావణాసురున్ని ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఈగ ఎంత ఉంటుందో అంత చిన్న వానర రూపాన్ని పొందాడు నీలుడు అభివృష్టః శరౌఘేణ మేమే నేవ మహా బలః ! హ్రస్వం కృత్వా తదా రూపం ధ్వజాఽగ్రే నిపపాత హ !! చాలా చిన్న రూపాన్ని పొంది చిన్నకోతైపోయి ఆయనా ఆ రావణాసురుని యొక్క ధ్వజంపైన కూర్చున్నాడు ఇప్పుడు గురుచూసి కొట్టడానికి దొరకనంత చిన్న కోతిపిల్లై ఇబ్బందిపెడుతున్నాడు రావణాసురున్ని పావకాఽఽత్మజ మాఽఽలోక్య ధ్వజాఽగ్రే సమఽవస్థితమ్ ! జజ్వాల రావణః క్రోధా త్తతో నీలో ననాద చ !! అంత చిన్న రూపంతో ఉన్నటువంటి అగ్రిహోత్రుడి యొక్క అంశతో జన్మించినటువంటి నీలున్ని చూసి చాలా కోపగించినటువంటి రావణాసురుడు ఎలా నిగ్రహించాలని చూస్తున్నాడు. ఈలోగా చాలా చిన్న రూపంతో ఉన్నాడు కాబట్టి ధ్వజాఽగ్రే ధనుష శ్చాఽగ్రే కిరీటాఽగ్రే చ తం హరిమ్ ! లక్ష్మణోఽథ హనూమాం శ్చ దృష్ట్వా రామ శ్చ విస్మితాః !! మహా బలవంతుడు కాబట్టి హనుమ వెంటనే సృహనిపొందాడు ఈలోగా రామ లక్ష్మణులు హనుమ మొదలైనవారు ఆశ్చర్యంతో చూస్తుండగా చిన్న రూపంతో ఆ ధ్వజం నుంచి ఓసారి కిరీటంమీదకి ధూకుతున్నారు కిరీటం నుంచి ధనస్సుమీదకి ధూకుతున్నాడు పట్టుకుందామంటే దొరక్కుండా రావణాసురుడు వెర్రివాడిలా ఇలా ఇలా చూసేటట్టుగా ఆ రావణున్ని ఇబ్బందిపెడుతున్నాడు.
మహాక్రోధం పొందినటువంటి రావణాసురుడు ఈ వానరాన్ని నా అగ్నేయాస్త్రంతో కాల్చేస్తానని అగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీలుని మీదకి విడిచిపెట్టాడు విడిచిపెట్టేటప్పటికి ఆ అస్త్రం యొక్క దెబ్బతగిలింది తగిలేటప్పటికి అంత బలవంతుడైన నీలుడు ప్రహస్తున్ని సంహరించినటువంటి నీలుడు నెత్తురు కక్కుతూ పడిపోయాడు పితృ మహాత్మ్య సంయోగా దాఽఽత్మన శ్చాఽపి తేజసా ! జానుభ్యా మఽపత ద్భూమౌ న చ ప్రాణై ర్వ్యయుజ్యత !! సాక్షాత్తుగా అగ్నిహోత్రుడి కుమారుడు కనుకా ప్రయోగించింది అగ్నేయాస్త్రం కనుకా తన కొడుకు ప్రాణములను తాను తీయ్యకుండా అగ్నిహోత్రుడు కాపాడాడు కనుకా ఒక్కసారి సృహని కోల్పోయినవాడై రెండు మోకాళ్ళమీద యుద్ధభూమిలో కూలబడి ముందుకి ఒంగిపోయాడు. కానీ ప్రాణములు మాత్రంపోలేదు ఆ స్థితిలో లక్ష్మణస్వామి రావణాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇక నీవు నా కంటపడ్డావు తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తీ అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు అది వచ్చి తగలగానే లక్ష్మణుని యొక్క పాల భాగానికి తగలగానే ఆయనా నేలమీద పడిపోయారు, పడిపోయి గాయపడి మూర్ఛితిడైనాడు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఆయనా కిందపడి మూర్ఛితుడు కాగానే పెద్ద అగ్నిని వెదజిమ్ముతూందాన్నట్లుగా వస్తున్నటువంటి ఆ శక్తి ఆయుధాన్ని నిగ్రహించడం లక్ష్మణుడు ప్రయత్నించినా ఆయన బాణములు ఆ శక్తిని ఆపలేకపోయాయి అది వచ్చి తగిలింది సృహతప్పి నేలమీద పడిపోయాడు. పడిపోగానే రావణాసురుడు రథందిగాడు దిగి నేలపడిపోయినటువంటి లక్ష్మణున్ని తనతో తీసుకెళ్ళిపోవడం కోసమనీ ఆయన్ని పైకెత్తుతున్నాడు. ఆయన విష్ణు స్వరూపంకదాండి వచ్చింది విష్ణు స్వరూపం కాబట్టి లక్ష్మణస్వామి వెంటనే తన పరాక్రమంచేతా సృహని కోల్పోయినట్లు ఉన్నా ఒక్కసారి తన స్వరూపాన్ని స్మరణచేసి నేను ఈ రావణాసురుని చేత ఎత్తబడడానికి వీలులేనంత బరువౌదునుగాకా అని బాగా బలంగా అంటే భూమిని పట్టుకుని ఉండేటట్టుగా ఆయన పడుకున్నారు. వచ్చి రావణుడు అవలీలగా ఎత్తగలనని ఎత్తబోతున్నాడు స శక్తిమాన్ శక్తి సమాహత స్సన్ ముహుః ప్రజజ్జ్వల రఘుప్రవీరః తం విహ్వలంతం సహసాఽభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం ! తన భుజబలంతో లక్ష్మణున్ని ఎత్తి రథంలో పడేద్దామని ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మణున్ని ఎత్తడంలో చాలా కష్టంగా ఉంది ఎత్తలేకపోతున్నాడు ఇంతలో స్వామి హనుమ చూశాడు హిమవాన్ మంథరో మేరు స్త్రైలోక్యం వా సహాఽ మరైః ! శక్యం భుజాభ్యా ముద్ధుర్తుం న శక్యే భరతాఽనుజః !! నేను మేరుమంధర పర్వతములతో కూడినటువంటి ఈ భూమండమంతటినీ నేను బాహుభుజాలతో ఎత్తగలనుకానీ ఏమిటీ లక్ష్మణున్ని ఎత్తలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతున్న సమయంలో తేన ముష్టి ప్రహారేణ రావణో రాక్షసేశ్వరః ! జానుభ్యా మఽపత ద్భూమౌ చచాల చ పపాత చ !! ఒక్కసారి సృహపొందినటువంటి హనుమా నీవు లక్ష్మణున్ని ఎత్తుకుపోతావా అని పరుగెత్తుకొచ్చి పిడికిలి భిగించి ఒంగి లక్ష్మణున్ని ఎత్తుతున్నటువంటి రావణాసురుని గుండెల్లో ఒక్క గుద్ధు గుద్దాడు.
Related imageఆగుద్దు గుద్దెటప్పటికి ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తిలేక మోకాళ్ళ మీద యుద్ధ భూమిలో పడిపోయాడు రావణాసురుడు వెంటనే విఘూర్ణ మానో నిశ్చేష్టో రథోపస్థ ఉపావిశత్ ! విసంజ్ఞో మూరచ్ఛిత శ్ఛాఽఽసీ స్నచ స్థానం సమాఽఽలభత్ !! ఆ రథం మీదకి ఎక్కుదామనుకుంటున్నటువంటివాడు నిశ్చేష్టుడై ఇక కదలేక కూలబడిపోయాడు మోకాళ్ళమీద అటువంటి స్థితిలో స్వామి హనుమా సృపకోల్పోయివున్నటువంటి లక్ష్మణ స్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్ళిపోయారు అప్పుడు రామ చంద్ర మూర్తి రావణాసురునిమీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు రామ-రావణ యుద్ధం మొట్టమెదటిసారి ప్రారంభమౌతూంది, హనుమ లక్ష్మణున్ని క్షేమకరమైనటువంటి ప్రదేశంలో పడుకోబెట్టి పరుగు పరుగన వచ్చి స్వామీ వాడు రథంమీద ఉన్నాడు మీరు భూమి మీద నడుస్తున్నారు మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు మీరు నా భుజాల మీద కూర్చోండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చెయ్యండి అన్నాడు ఆరోహ మహా శూరో హనూమన్తం మహా కపిమ్ ! రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాఽధిపః !! ఆ హనుమ యొక్క భుజాలమీద కూర్చున్నవారై రావణాసురుని చూసి నిలు నిలు రావణా! నీవు ఎక్కడికి వెళ్ళిపోతావు నీవు ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా ఏ లోకాలకి వెళ్ళినా నీవు ఇంతకాలం నుంచి ఆరాధిస్తున్నటువంటి శంకరుని పాదాలేపట్టుకున్నా నీవు ఇవ్వాళ రక్షించపబడవు.
నా యొక్క ఆగ్రహాన్నిపొందావు కాబట్టి నీవు నశింపబడేటట్టుగా నా బాణములచేత నిన్ను నిగ్రహిస్తాను అన్నారు. వెంటనే రావణాసురుడు సంజ్ఞపొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకుని బాణాలు పట్టుకుని ఆ రామ చంద్ర మూర్తి ఎక్కివస్తున్నటువంటి హనుమమీద ఏక కాలంలో అనేక బాణములను ప్రయోగించాడు, ప్రయోగిస్తే అసలే ఎర్రటి ముఖం

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కలిగినవారు స్వామి ఆ శరీరమంతా బాణములచేత కొట్టబడి పూచిన మోదుగ చెట్టా అన్నట్టుగా పర్వతం నుంచి సెయేర్లు ప్రవహించినట్లుగా ఒంటిలోంచి రక్తము కాల్వలై ప్రవహిస్తోంది. ఒక్కసారి రామ చంద్ర మూర్తి ఇలా చూశారు హనుమని తనని ఆశ్రయించినవాడు తనపట్ల మహాభక్తి కలిగినవాడు తనకు వాహనమై తనని వహిస్తున్నవాన్ని అన్నిబాణములతో కొట్టేటప్పటికి తతో రామో మహా తేజా రావణేన కృత వ్రణమ్ ! దృష్ట్వా ప్లవగ శార్దూలం క్రోధస్య వశ మేయివాన్ !! ఎన్నడూ కోపం రానటువంటి రామ చంద్ర మూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చకచకచకా ఇంక అసలు ఆలోచించడానికి వీలులేని రీతిలో బాణప్రయోగం చేశాడు తస్యాఽభిసంక్రమ్య రథం స చక్రం సాఽశ్వ ధ్వజ చ్ఛత్ర మహా పతాకమ్ ససారథిం సాఽశని శూల ఖడ్గం రామః ప్రచిచ్ఛేద శరైః సుపుంఖైః ! అథేన్ద్ర శత్రుం తరసా జఘాన బాణేన వజ్రాఽశని సన్నిభేన భుజాఽన్తరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మేరుం భగవా నివేన్ద్రః ! ఆయనా వరుసగా బాణప్రయోగం చేసి రథాన్ని చక్రాల్ని అశ్వాల్ని ధ్వజ పథాకాల్ని ఛత్రాన్ని సారథిని అన్నిటిని పడగొట్టేశాడు పడగొట్టేస్తే రావణునికి రథంలేక సారథిలేక నేలమీద నిలబడ్డాడు. అలా నిలబడినటువంటి రావణాసురున్ని చూసి బాణేన వజ్రాఽశని సన్నిభేన వజ్రాయుధము ఇంద్రునిది ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి భుజాఽన్తరే ప్యూడ సుజాత రూపే వజ్రేణ మేరుం భగవా నివేన్ద్రః ఆ రావణాసురుని యొక్క వక్షస్థలంమీద ఒక్క దెబ్బ బాణంతో కొట్టాడు. ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్థుడై కంపించిపోతే ఆ రావణాసుడు చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సుని కూడా ఆయన పట్టుకోలేకపోయాడు పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బచేత కలిగినటువంటి అశక్తతకీ ధనస్సుని జార విడిచిపెట్టేశాడు తం విహ్వలన్తం ప్రసమీక్ష్య రామః హమాఽఽదదే దీప్త మఽథాఽర్థ చన్ద్రమ్ తే నాఽర్క వర్ణం సహసా కిరీటం చిచ్ఛేద రక్షోఽధిపతే ర్మహాత్మా ! ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుని తల మీద ఉన్నటువంటి కిరీటాన్నిముక్కముక్కలై కిందపడేటట్టుగా కొట్టేశాడు.
ఇప్పుడు చేతిలో ధనస్సులేదు బాణములులేవు తలమీద కిరీటంలేదు రథంలేదు గుఱ్ఱాలులేవు సారథిలేడు యుద్ధ భూమిలో నిలబడి చేతిలో ఏవిధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామ చంద్ర మూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటార్చాలి అంటే ఒక్క క్షణం గుండెలమీద బాణంవేసి కొట్టేయగలడు, ఆయనన్నారూ కృతం త్వయా కర్మ మహత్ సుభీమం హత ప్రవీర శ్చ కృత స్త్వయాఽహమ్ తస్మాత్ పరిశ్రాన్త ఇత వ్యవస్య న త్వం శరై ర్మృత్యు వశం నయామి ! గచ్ఛాఽనుజానామి రణాఽర్థిత స్త్వం ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం ఆశ్వాస్య నిర్యాహి రథీ చ దన్వీ తదా బలం ద్రక్ష్యసి మే రథస్థః ! రావణా! నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు బాగా అలసిపోయావు నీకు ఇంకా యుద్ధం చేసే ఓపికలేదు క్షీణించిపోయావు నీ కిరీటం పడిపోయింది నీ రథం భగ్నమైపోయింది నీ గుఱ్ఱాలు మరణించాయి నీ సారథి మరణించాడు నీ చేతిలో ఆయుధాలులేవు కాబట్టి నిన్ను నేను చంపను విడిచిపెట్టేస్తున్నాను పో అంతపురానికి ఇవ్వాళ రాత్రి విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపు రథమెక్కీ ధనస్సు పట్టుకుని యుద్ధానికిరా... నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను తప్పా చేతిలో ఆయుధంలేకుండా నిలబడిపోయినవాన్ని చంపను అది నా ఛాత్రం కాదు అది నా ధర్మం కాదు కాబట్టి పో వెళ్ళి విశ్రాంతి తీసుకో అంటే... తిరిగి వంద అడుగులు వెనక్కి వేసి లంకలోకి వెళ్ళిపోయాడు

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
తప్పా పది అడుగులు ముందుకేసి రామ చంద్ర మూర్తి పాదములమీద పడిపోయి ఉంటే రావణాసురుడు ఎటువంటి స్థితినిపొందేవాడో.
Related imageఇంత అవకాశమిచ్చినా ఆయనమాత్రం లంకలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడుతప్పా రాముడి కాళ్ళమీద పడ్డానికి మాత్రం ఇష్టపడలేదు, రావణాసురుడు దీనుడై దిగాలుతో నీరసపడిపోయి రామ చంద్ర మూర్తిచేత ఓడింపబడి సిగ్గుతో తలవంచుకుని వెనక్కితిరిగి వెళ్ళిపోతూంటే తస్మిన్ ప్రభగ్నే త్రిదశేన్ద్ర శత్రౌ సురాఽసురా భూత గణా దిశ శ్చ ససాగరాః సర్షి మహోరగా శ్చ త థైవ భూమ్యఽమ్బు చరా చరాశ్చ హృష్టాః ! ఆ రామ చంద్ర మూర్తి యొక్క వైభవానికి మూడు లోకంలో ఉండేటటువంటివాళ్ళు సురాసురులు దిక్పాలురూ సాగరవాసులూ మహర్షులూ మహానాగులూ భూమిలో జలాలలో ఉండేటటువంటి సమస్తప్రాణులు ఎంతోసంతోషించి ఇవ్వాళ కదా రావణునికి ఇంత అవమానం జరిగిందని ఎంతో  సంతోషించి ఎంతో ఆనందించి అందరూ కలిసి రామ చంద్ర మూర్తిని స్తోత్రం చేశారు. రావణునిమీద మొదటి విజయాన్ని రాముడు సాధించాడు అన్న ఈ ఘట్టం దగ్గర ఆయన అంతటి ధర్మాత్ముడై చేతిలో ఆయుధంలేనివానిని చంపనూ అని విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముడైన రామ చంద్ర మూర్తి యొక్క వైభవం దగ్గర ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని పూర్తిచేసి మళ్ళీ రేపు సాయంకాలం ప్రారంభం చేద్దాం. బహుశః రేపు చాలా ఘోరాతి ఘోరమైన యుద్ధం కుంభకర్ణుడు మేకొల్పబడుతాడు రేపు కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు ఆ వెనకా ఇంద్రజిత్తుకూడా వస్తాడు అక్కడవరకు నడిస్తే కథా భాగము నడవాలి నూట ముప్పైయొక్క సర్గలు ఎందుకంటే రేపు నాలుగో రోజు ఇక మిగిలింది మూడురోజులేగా... ఆఖరి రోజున పట్టాభిషేక సర్గ ఒకటే చెప్పాలి కాబట్టి నేను ఐదు ఆరు అంటే నాలుగు ఐదు ఆరు రోజులలో రావణాసురుడు నిహతుడైపోయేటట్టుగా చూడవలసి ఉంటుంది.
కాబట్టి చక్కగా మీరు ఆ వైభవాన్ని అనుభవిద్దురుకాని మనందరం రావణసంహారమై రామ చంద్ర మూర్తి రావణున్ని సంహరించిన రోజున ఆ సన్నివేశాన్ని విని మనందరం పరమానందంతో రామ నామం చెప్తాం. మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక్క పదకొండు మాట్లు రామ నామాన్ని చెప్పుకుందాం.

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రామ!!
దారినొంటిగ నడచువారికి తోడునీడే రామ నామము !!రామ!!
కోరికొలచినవారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రామ!!
గౌరికిది ఉపదేశనామము కమలజుడుజపియించు నామము !!రామ!!
బ్రహ్మసత్యము జగన్మిధ్యా భావమే శ్రీ రామ నామము !!రామ!!
భక్తితో భజియుంచువారికి ముక్తినొసగును రామ నామము !!రామ!!

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రామ!!
ఆంజనేయునివంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !!రామ!!
ఎందుచూచిన ఏకమై తావెలయుచున్నది రామ నామము !!రామ!!
శాంతి సంజ్ఞ అహింస సమ్మేళనముయే శ్రీ రామ నామము !!రామ!!
దాసులను రక్షించదయగల ధర్మ నామము రామ నామము !!రామ!!
శాంతిగా ప్రార్థించువారికి సౌఖ్యమైనది శ్రీ రామ నామము !!రామ!!
తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామ నామము !!రామ!!
జానకీహృత్ కమలమందున అలరుచున్నది రామ నామము !!రామ!!
నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను మంగళం చెప్పిన తరువాత మనం చక్కగా అందరం కలసి శంకర భగవత్పాదులకి నమస్కారం చేద్దాం, రామాయణాంతర్గతంగా గురువందనం ఆయనెంతో సంతోషిస్తారు. సాధారణంగా శ్రీరామాయణం సంపూర్ణంగా ప్రవచనం చేస్తే పట్టాభిషేకం చేస్తారు రామ చంద్ర మూర్తికి కానీ పట్టాభిషేకం చేయడమంటే అంత తేలికైన విషయంకాదు, ఎందుకంటే ఒక్క రామ పట్టాభిషేకంలో ఒక ఆశ్చర్యం జరిగింది, ఐదువందలనదుల జలాల్ని నాలుగు సముద్రజలాల్నీ వానరులు తీసుకొచ్చారు ఆ నదీ జలాలతో అభిషేకం చేసి రాజా రాముడిగా కూర్చుంటాడు సీతమ్మతో కలిసి. కూర్చున్నప్పుడు ఆయనకి రాజ లాంచనాలిస్తారు అంటే కిరీటాన్ని ధరింపజేస్తారు ఆరోజు ఉదయం “పట్ట-అభిషేకము” కదాండి..! అభిషేకం చేస్తారు ఆయనకి అభిషేకం చేస్తే రాజా రాముడౌతాడన్నమాట మనందర్నీ పరిపాలించి కాపాడుతాడాయన, అది దివ్యమైనటువంటి అభిషేకము దాంట్లో నదీ జలాలు ఎన్నున్నాయో అన్నీ కళసలుపెట్టి మంత్ర పూరస్కరంగా ఆవాహన చేస్తారు, వాటితో మూల విరాట్టుకు అభిషేకం జరుగుతుంది, ఏక కాలంలో సీతా రామ లక్ష్మణులకి హనుమకీ అద్భుతమైన అభిషేకం జరుగుతుంది అది మంత్రభాగ సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఋత్వికుల బృందాలు వస్తున్నాయి ఆ అభిషేకం జరిగేటప్పుడు అందరికీ కనపడ్డం కోసమనీ దాన్ని లైవ్ టెలిక్యాస్టు చేస్తున్నారు ఈ ప్రాంగణాల్లోకి మీ అందరూ కూడా ఇరవై ఒకటో తారీఖు పట్టాభిషేకం జరుగుతుంది ఇరవై ఒకటోతారీకు ఉదయం జరిగేటటువంటి ఈ అభిషేకాన్ని చూసినట్లైతే రాముడు రాజా రాముడౌతుండేటటువంటి పట్టాభిషేకానికి ఆరోజు హాజరైనటువంటి కోసలదేశవాసులు వానరులు ఎంత సంతోషంగా అంతఃపురంలోకెళ్ళి చూశారో అలా చూడగలిగిన అదృష్టం కొన్ని కోట్ల జన్మల తరువాత మళ్ళీ మనకు ఇప్పుడు లభిస్తుంది ఇరవై ఒకటోతారీఖున.
అలాగే సాధారణంగా పట్టాభిషేకంలో ఏం చేస్తారంటే కిరీటధారణ చెయ్యాలి ఈశ్వరుడికి కిరీటం పెడుతారుకదాండీ... ఆ కిరీటం గురించి ఒక సర్గ ఉంది, అది మనం ప్రత్యేకంగా ఆ సర్గని ఎప్పుడు వినాలో తెలుసా..? ఇవ్వాళ శ్రీ రామ నవమీ అంటే కళ్యానం చేసేసి ఊరుకుంటున్నారు అసలు శ్రీ రామ నవమీ అంటే కళ్యానమొక్కటి చేయడం కాదు శ్రీ రామ నవమినాడు మొన్న మేము మా కాకినాడలో అయ్యప్పస్వామి దేవాలయంలో చేశాము ఎలా చెయ్యాలో ఆ రోజు సాయంకాలం అందరూ కూర్చుని మఖుటదారణ సర్గాని ఉంటుంది, ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు వశిష్ట మహర్షి, పెడితే ఆ కిరీటం గురించి చెప్తారు ఆ కిరీటాన్ని ధరింపజేస్తారు మఖుటధారణ సర్గ చదవాలి ఆరోజున చదివితే రాజా రాముడైనటువంటి రాముని యొక్క అనుగ్రహము కలుగుతుంది. మనకి సాధారణంగా పట్టాభిషేకం చేశామన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ బంగారు కిరీటాల్ని చేయించడమంటే అంత సామాన్యమైన విషమేంకాదు, ఇప్పుడు ఆ కిరీటాలు చేసేవాళ్ళు ఎక్కడున్నారు, కాబట్టి ఆ కిరీటం పేరు చెప్పి ఒక దర్భకానీ అక్షతకాని సమర్పిస్తారు. కానీ... మళ్ళీ ఆనాడు అయోధ్యలో పట్టాభిషేకం ఎలా జరిగిందో అంత సశాస్త్రీయమైన పట్టాభిషేకం మన అదృష్టం గుంటూరు పట్టణంలో ఈ శారదా పీఠంలో జరగబోతూంది ఎందుకంటే వజ్ర వైఢూర్య ఖచితమైనటువంటి కిరీటాల్ని సీతారామ లక్ష్మణులకు హనుమకూ హరిప్రసాద్ గారు పరమ భక్తితో చేయించారు. ఆ కిరీటాల్నీ ఆరోజున మీకందరికీ సాయంకాలం చూపిస్తారు అది మఖుట సర్గ మానసికంగా చూడమంటారు ఆ కిరీటాన్ని ఆరోజు అద్భుతమేమిటో తెలుసాండీ..! ఆ కిరీటాల్ని మీ అందరూ నిజంగా చూస్తారు ఇక్కడ వేదిక మీద పెడుతారు పెట్టి వాటినన్నింటినీ కూడా ప్రోక్షణ చేస్తారు చేసి వాటిమీద అక్షతలూ అవీ చల్లి అప్పుడు ఏక కాలంలో ఈ ఆడిటోరియంలో ఆ పైన ఆడిటోరియంలోకి బయట ఉన్న ఓపెన్ ప్రాంగణంలోకి ఎందుకంటే ఇదీ అపురూపాతి-పురూపమైన అవకాశం ఆరోజునే పట్టాభిషేక సర్గ ఒక్కటే చెప్తాం.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఫలసృతి చెప్తాం ఈ రామాయణం విన్నవారికి ఈ ఫలితం వస్తూందని మీరు నమ్మండి నేనొక యదార్థం చెప్తున్నాను సంపూర్ణ రామాయణం జరిగిన చిట్ట చివరి రోజున పట్టాభిషేకం జరుగుతూంటే ముప్పైమూడు కోట్లమంది దేవతలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీసహితుడై ఎవరు ఇంత కార్యాన్ని నిర్వహించారో వాళ్ళ పితృదేవతల్నికూడా తీసుకొస్తారు చూడవయ్యా మీవాళ్ళు చేశారని తీసుకొచ్చి ఈ ఆకాశంలో నిలబడుతారు ఇదంతా తపో శక్తి ఉన్నవాళ్ళకి కనపడుతూంది కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడుతారు నిలబడితే మనందరం ఒక మాట చెప్తాం బలం విష్ణోః ప్రవర్థతాం అని చెప్తాం దానికి దేవతలు నారాయమూర్తి పరమ సంతోషాన్ని పొందుతారు, ఎక్కడైనా పట్టాభిషేకం చేస్తే అక్షత వేస్తారు కిరీటంకింద మన గుంటూరు అదృష్టం ప్రత్యక్షంగా కిరీటధారణ సర్గ జరుగుతుండగా మీరు వేదికమీద పెట్టబడినటువంటి ఆ కిరీటాలని అందరికి కనపడేటట్టుగా ఇన్ని స్క్రీన్స్ మీదకి లైవ్ టెలిక్యాస్ట్ చేస్తారు ఆనాడు వశిష్టాది మహర్షులు ఎలా పట్టాభిషేకం చేశారో అలా పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకంలో రాజలాంచనాలు ఇవ్వాలి స్వామికి రాజదండమివ్వాలి నిజంగా రాజదండము తయారుచేయిస్తున్నారు అలాగే స్వామివారికి స్వర్ణపాదుకలు తొడుగుతారు నిజంగా స్వర్ణపాదుకలు తొడుగుతున్నారు అలాగే సీతమ్మ తల్లికి పచ్చల పథం చేయిస్తున్నారు అలాగే రామ చంద్ర మూర్తికి వజ్రాల పథకం చేయిస్తున్నారు, లక్ష్మణ స్వామికి వైఢూర్యాలతో ముత్యాలతో పథకాలు చేయిస్తున్నారు మా స్వామి హనుమకి పుష్యరాగాలతో ఆయనకి పథకం చేయిస్తున్నారు ఇంత మంది స్వామికి ఆనాడు రామ దాసు చెప్పుకున్నాడే ʻసీతమ్మకు చేయిస్తీ చింతాకు పథకాము రామ చంద్రాʼఅనిʼ ఆనాడు నూరు పూసల హారాన్ని మహేంద్రుడు పంపించాడు రామునికి వేయమని అలా ఇన్ని లక్షల విలువైన వజ్రవైఢూర్యములు పొదగబడినటువంటి ఆభరణాల్ని హరిప్రసాద్ గారు చేయిస్తున్నారు. ఈ ఆభరణాలన్నీకూడా ఆరోజున తీసుకొచ్చి అందరికి లైవ్ టెలిక్యాస్ట్ లో చూపిస్తారు స్క్రీన్స్ మీద చూపించి సమంత్రకంగా వాటిని రామ చంద్ర మూర్తికి అలంకారం చేస్తారు.
ఆరోజున నిజంగా ఇప్పటివరకూ వాడనటువంటి ఒక కొత్త సింహాసనమొస్తుంది ఆ సింహాసనంలో రామ లక్ష్మణ సీతమ్మలు కూర్చుంటారు హనుమ కింద కూర్చుంటారు కూర్చుంటే ఆరోజు అయోధ్యలో ఎలా జరిగిందో అటువంటి పట్టాభిషేకమే జరుగుతుంది అటువంటి పట్టాభిషేకం చెయ్యగానే రాజా రామునికి పూజ జరుగుతూంది పూజ జరిగినప్పుడు దర్భారుచేస్తారు ఆయన అంటే రాముని దర్భారులో మనం కూర్చున్నట్లు ఆరోజున. మొట్ట మొదట రాజా రాముడిగా కూర్చోగానే ఆయన మనసుకి ఆనందం కలగాలని రాజోపచారాలు చేస్తారు అంటే స్వామి అశ్వానారోహయామి గజనారోహయామి అంధోళికాది సమర్పయామి అని అంక్షతలు వేసేస్తారు, అలా చెయ్యరిప్పుడు పట్టాభిషేకంలో యదార్థంగా జరుగుతాయి అశ్వానారోహయామి అంటే ఇంత వెండి గుఱ్ఱాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళదగ్గర పెడుతారు ఆయన ఆ గుఱ్ఱమెక్కివెళ్ళినట్లు ఇంత వెండి ఏనుగును తీసుకొచ్చి అక్కడ పెడతారు ఆయన అవన్నీ కూడా తెప్పిస్తున్నారు ఆ ఏనుగెక్కి స్వామి వెడుతారు అలాగే ఆందోళికాన్ అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఊయల పెట్టి ఆ మూర్తుల్ని అందులో పెట్టి ఒక కీర్తన జరుగుతూండగా ఊయల ఊపుతారు స్వామివారిని అలాగే స్వామికి వాద్యంఘోషయామి అంటారు కానీ అక్షతలేసేస్తారు అలా ఏం ఉండదు, ఇందులో దర్భారులో వాద్యంఘోషయామి అని తవ పట్టాభిషేకాంగర్గతేనా హే రామ చంద్ర భగవన్ వాద్యం ఘోషయామీ అంటారు అంటే ఓ రామ చంద్ర ప్రభో ఈ వాద్యం మోగుతూంది మీరు వినండి అంటారు అంటే వీణ మీద నిజంగా కీర్తన చేస్తారు, అప్పుడు వీణ మోగి కీర్తన జరుగుతుంది, అప్పుడు రామ చంద్ర మూర్తి సంతోషంగా వింటూంటే మీరు దర్భారులో కూర్చుని సంగీతం వినచ్చు. అలాగే గీతంశ్రావయామి అంటారు, నాద పాదములు తెలిసున్నటువంటివారు కొన్ని సంవత్సరములు గురువులను సేవించినవారే పాడాలి కాకినాడ నుంచి పెద్దావిడ సూర్యకుమారిగారు మళ్ళీ వస్తున్నారు ఆతల్లి గంధర్వగానంచేసి కీర్తన చేస్తారు, ఆ తరువాత నృత్యం దర్శయామి అంటారు నృత్యకళాకారులు వస్తున్నారు స్వామివారి ముందు నృత్యంచేసి చూపిస్తారు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఆరోజున ఇవన్నీ రాజోపచారాలతో పట్టాభిషేకమంతా పూర్తైన తరువాత 22వ తేది ఉదయం రామ చంద్ర మూర్తికి లోక శాంతి కోసమని సీతారామ కళ్యాణం జరుగుతుంది శాంతికర కళ్యాణం తదనంతరం మనందరం కలసి పట్టాభిషేకంలో ఏర్పరుచున్న నిధితో మనందరం కలిసి షడ్రషోపేతమైనటువంటి భోజనాన్ని మా రామ చంద్ర మూర్తి పట్టాభిషేకమైందని మా రాముడు మేమందరం రాముడి కుటుంబమనీ అందరం కలిసి ఇవన్నీ పంక్తులు వేసేస్తారు ఏక కాలంలో ఒక వెయ్యిమంది లేస్తారు అన్ని మధుర పదార్థాలతో అంత చక్కటి పట్టాభిషేక భోజనము పెడతారు. 22వ తారీఖు మనందరం రామ చంద్ర మూర్తి యొక్క పట్టాభిషేక సంబంధమైనటువంటి విందు స్వీకరిస్తాం అక్కడితో ఈ రామాయణ సంబంధమైన ఉత్సవాలు పూర్తౌతాయి. ఇందులో అత్యద్భుతమైన ఉత్సవముంది దాన్ని మినహాయించి మిగిలినవి మీకు చెప్పాను ఆ ఉత్సవమేమిటో తెలిసాండీ ʻరాముడితో కలిసి నడవడమేʼ రాజా రాముడు ఊరెరిగింపుగా వస్తారు పట్టాభిషేకం కోసం లోపలికివస్తాడాయన ఆనాడు నంది గ్రామం నుంచి వచ్చాడు కోసలదేశ వాసులందరూ ఆయన వెనకవెళ్ళారు హే రామా ఎన్నాళ్ళకు చూశాము రామో రామో రామః అంటారు మహర్షి. రామా రామా రామా అంటూ వెంటవెళ్ళారు.
ఈ ఊరెరిగింపుని అందరికి అభ్యున్నతి కలిగేటట్టుగా హ్యూహరచన చేస్తున్నారు, మీ కందరికూడా సుహాసినిలందరికి కూడా ఎన్ని జన్మలకీ పసుపు కుంకాలతో మంచి భర్తతో పిల్లపాపలతో సంతోషంగా ఉండడం కోసం కేవలం నడవడం కాదు సువాసిని ఏది చెయ్యాలో అది మీతో చేయిస్తారు ఆరోజున. రామ చంద్ర మూర్తి రథానికి ముందూ రామ చంద్ర మూర్తి రథానికి వెనకాల సువాసినీలు బారులుగా ఉంటారు ఆ ఉత్సవాన్ని నడపడానికి కొంతమంది సుశిక్షుతులైన కార్యకర్తలొస్తున్నారు, వాళ్ళు నడిపిస్తారు మీరు ఇంటినుంచి ఒక పాత్ర అంటే ఒక చెంబులాంటిది తెచ్చుకుంటే అందులో సువాసినిలందరికీ కూడా వాళ్ళు జన్మ సార్థకత పొందేటట్టుగా పరిమళ జలాలు పోస్తారు మీరు చెంబు తీసుకొనివస్తే చాలు అందులో ఒక మామిడాకు వేసుకొని వస్తే లేదా ఓ రెండు తమల పాకులు పరిమళ జలాలు అంటే మంచి సుగంధభరితమైన జలాలు పెద్ద పెద్ద గుంటికలలో చేసి ఉంచుతారు రామ నామ క్షేత్రం నుంచి బయలుదేరుతారు, గొప్ప క్షేత్రం కనుక అక్కడ మీరు తెచ్చుకుని నిలబడితే వాటిలోకి వాళ్ళు పోసేస్తారు ముందు అందరికన్నా ముందు కన్యపిల్లలు ఉంటారు, పెళ్ళికాని ఆడపిల్లలకి మహద్భాగ్యం మళ్ళీ మళ్ళీ రమ్మంటే ఒక్కనాటికి రాదు ఏ ఆడ పిల్లల్నీ దయచేసి ఊళ్ళకి పంపించకండి  మీ పిల్లలేకాదు మీ బందువుల పిల్లలు పిల్లలు పిల్లలు అందర్నీ తీసుకురండి. సాంప్రదాయకమైనటువంటి బట్టలతో తీసుకురండి వాళ్ళందరికీ కూడా సాధ్యమైనన్ని పిండివంటలు వండుతారు ఆరోజున, చాలా సంతోషం కాబట్టి ఆయనకి సాధ్యమైనన్ని పిండివంటలు చేసి పిల్లలందరు కూడా చేతిలో పళ్ళెం పట్టుకుని ఆ పళ్ళెంలో రెండేసి లడ్లో రెండేసి ఖాజాలో ఏవో పట్టుకుంటారు. కన్నెపిల్ల పిండివంటలు పట్టుకుని పట్టాభిషేక ఉత్సవంలో రామ చంద్ర మూర్తి ముందుకానీ ఈశ్వరుని ముందుకానీ నడిచి వెళ్ళితే ఆ పిల్లకి సమస్త అభ్యున్నతిని ఈశ్వరుడు కృపచేస్తాడు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి చక్కగా అవి పట్టుకుని కొంతమంది కన్నెపిల్లలకి ఫేలాలు ఇస్తారు వాళ్ళు ఫెలాలు జల్లితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వస్తారు కాబట్టి వాళ్ళు ఫెలాలు జల్లుతారు. పురుషులు రామ నామం చెప్తూ కట్టుగోగలిగినవాళ్ళు సాంప్రదాయ దుస్తులు కట్టుకుంటారు మనందరం ఒకటే నామం గుంటూరు పట్టణం ప్రతిధ్వనించేటట్టుగా “రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము” అంటూ రిక్షాలకి లౌడ్ స్పీకర్లుకట్టీ మైకుల్లో చెప్పిస్తుంటారు దానికి అదిగో అటువంటి పెద్దలు ఆధ్వర్యం వహిస్తారు నాలాంటి అమాయకులు వెనకాతల వస్తారు నేను ఏం చేస్తాను రావడం తప్పా... కాబట్టి అందరం కలిసి ఊరెరిగింపుగా బయలుదేరుదాం రామ నామ క్షేత్రం నుంచి బయలుదేరిన ఈ ఊరెరిగింపుకి ముందు ఊరి పెద్దలుంటారు ఆవెనకా మంగళ ధ్వని ఉంటుంది దాని వెనక వేదపండితులుంటారు వేద పండితుల వెనక ఈ పెళ్ళికాని కన్నెపిల్లలు ఉంటారు వాళ్ళ వెనక సువాసునిలు ఉంటారు సువాసునిల వెనక రామ చంద్ర మూర్తి రథం ఉంటుంది. రథానికి రక్షణగా కొంతమంది బలం కలిగిన యువకులు రథాన్ని లాగుతుంటారు రథాన్ని లాగడం ప్రథానమనుకోకండి ఊరెరిగింపులో నడవడం ప్రధానం దాని వెనక మళ్ళీ కొంతమంది యోధులు ఉంటారు అంటే కొంతమంది యువకులు రథానికి రక్షణగా రెండు పార్శవములలో ఉంటారు ఆరోజున నిజంగా రక్షకులే వెడుతున్నారు రాముడే వెడుతున్నాడు అన్నట్లుగా ఆ స్థితి మనకు కలగాలి అందుకనీ నిజంగా ఆయుధాలుకావుకాని శూలాలవంటివి పట్టుకుని కొంతమంది బయలుదేరుతారు రామ చంద్ర మూర్తి రథం మధ్యలో నడూస్తూంటూంది అందరికన్నా ముందు ఆది శంకర భగవత్పాదుల మూర్తి ఛత్రం కింద వెడుతూంది శంకరాచార్య స్వామి వెనక భారతీ తీర్థ స్వామి వెనకాతల రథంలో వెడుతాడు ఎందుకంటే ఇవన్నీ శంకర భగవత్ పాదులు పెట్టిన క్షేత్రాలు ఇవన్నీ కాబట్టి శంకరులు ముందు శంకరుల వెనక భారతీ తీర్థులు దానివల్ల భారతీ తీర్థ స్వామి ఎక్కువ సంతోషిస్తారు వారిద్దరూ ఛత్రాల్లో వెళ్తారు, ఒక పెద్ద స్వేత ఛత్రం రథం మీద పెట్టి మహానుభావుడు రామ చంద్ర మూర్తి యొక్క రథం సీతమ్మతో కలిసి వెడుతూంటూంది. ఆ సీతమ్మ పొంగిపోతూంది పరాశక్తి ఇంతమంది సువాసినీలు నా పట్టాభిషేకానికి వచ్చి సుగంధ ద్రవ్యాలు జల్లుతున్నారని పొంగిపోతూంది. ఆ వెనక పురుషులందరూ నడుస్తారు ఆవెనక మిగిలినటువంటి స్త్రీలు సువాసినీలు కానివాళ్ళు అందరూ.
ఇలా అందరం కలసి ఎంత ఛాలెంజ్ గా మనం హరిప్రసాద్ గారికి నిలబడాలంటే ఆయన బయలుదేరుదామూ అని ఊరెరిగింపుని తీస్తే తల ఇక్కడ బయలుదేరితే తోక మనం ఎక్కడ తిరగాలనుకుంటున్నామో అంత దూరమూ ఊరెరిగింపు నిలబడిపోయి ఉండాలి. ఇక కదలడానికి చోటేదని హరిప్రసాద్ గారు ఖంగారుపడిపోవాలి అంతమందిమి మనందరం రామ కార్యంలో మనందరము రామా మమ్ములను రక్షించమని ఇంత మందిమి కలిసి మీ పిల్లల్నీ పాపల్నీ అందర్నీ పిలిపించండి మీకు చెప్పడం కాదు మీకు ఏది చెప్పానో అది చేస్తాను. సెలవు లేకపోయినా నా భార్య ఆఫీసర్ని రిక్వెస్టు చేయించి మా ఆవిడని రప్పించారు, అలాగే కాకినాడ పట్టణం నుంచి నాయందు అభిమానం కలిగినవాళ్ళందరూ వానరులందరూ ఎలా వచ్చారో అలా అందరూ బస్సులెక్కీ రైళ్ళెక్కీ రకరకాల వాహనాలెక్కి వచ్చేస్తున్నారు ఈ ప్రాంగణాలు కళ్యాణ మండపాలు ఇవన్నీ నిండిపోయాయి వాళ్ళతో వాళ్ళందరూ వానర సైన్యం వచ్చినట్లు వస్తారు వాళ్ళందరు ఫలహారాలు భోజనాలు ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ ప్రాంగణం మరో అయోధ్యలా ఎక్కడ చూసినా రామో రామో రామః సాయంకాలం పట్టాభిషేకం అపురూపమైనటువంటి పట్టాభిషేకం ఇన్ని రాజలాంఛనాలతో జరుగుతూంది అందరూ రండి తప్పకుండా ఎక్కడకీ ఊళ్ళుకు వెళ్ళే ప్రయత్నం పెట్టుకోకండి అపురూపమైన అభిషేకం మళ్ళీ మళ్ళీ దొరకమంటే దొరికేటటువంటి అభిషేకం కాదు. ఎక్కడా ఇన్ని సంభారాలతో చేయడం కుదరదు అంత మంది ఋత్విక్కులొస్తున్నారు అంత అందమైనటువంటి పట్టాభిషేకాన్ని మీరు ఎక్కడ కూర్చున్నా కనపడేటట్టు టెలిక్యాస్టు చేయించి స్త్రీన్సు పెట్టేస్తున్నారు.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టీ ఈ ప్రాంగణాలు రోడ్లూ నిండిపోవాలి హరిప్రసాద్ గారు చేతులెత్తి నమస్కరించి నేను ఓడిపోయాను అని చెప్పాలి ఎన్ని స్క్రీన్స్ పెట్టగలననుకున్నానో అన్ని స్క్రీన్స్ పెట్టలేకపోయాను అంతమందికి కనపడేటట్టుగా చెయ్యలేకపోయాను అని ఆయన ఒప్పుకోవాలి ఆయన ఓడిపోతే మనం గెలిచినట్లు మన గెలుపులో ఆయన గెలుపున్నట్లు. అంతమంది వచ్చి అంత అందంగా కనీ వినీ ఎరుగని పట్టాభిషేకమని ఇదీ రేపు పొద్దున్న ఆంధ్ర దేశమంతా టెలిక్యాస్టు అవుతుంటే ముక్కున వేలేసుకుని ఏమి కర్తవ్య పట్టణం ఏమి గుంటూరు అబ్భాహ్ ఎక్కడ పట్టాభిషేకమనీ వేయి నోళ్ళ ఆంధ్ర దేశమంతా కీర్తించాలి. ఉత్తరోత్తర గుంటురు శారదాపీఠంలో ఉత్సవం జరుగుతూందంటే మనం వెళ్ళకపోతే రేపొద్దున్న స్క్రీన్ మీద చూడవలసి వస్తూందని ఎక్కడెక్కవాళ్ళు బయలుదేరి వచ్చేయ్యాలి అలా జరగాలి. ఒకానొకనాడు మేము కాకినాడ పట్టణంలో అలా ఉత్సవం చేస్తే నేను గొప్పకి చెప్పట్లేదు కాకినాడ పట్టణంలో ఇళ్ళూ లాడ్జీలు అద్దెలకు నిండిపోయాయి విదేశాలనుంచి వచ్చేశారు. ఒకానొకప్పుడు రుఖ్మిణీ కళ్యాణం చేయిస్తే కన్యపిల్లలతోటి పరిస్థితి ఏమైందో తెలుసాండీ నాకారు లోపలికి వెళ్ళడానికి చోటులేదు, చోటులేకపోతే పోలీసులు అయ్యా మీ కారు వెళ్ళదూ మీరు దిగి వెళ్ళండి అన్నారు దిగి వెళ్ళడానికి ఆ జన సముద్రంలో దిగి వెళ్ళడానికి లేదు అప్పుడు నేను ప్రత్యేకంగా ముందుకు వెళ్ళి ఇంకొక రోడ్డు మీదకి వెళ్ళి నన్ను తెలిసున్నవాళ్ళు ప్రసాద్ బాబుగారు మా గోపాల కృష్ణగారు వచ్చి అయ్యో గురువుగారు కార్యక్రమం చేస్తున్నది ఆయనే అని రెకమెండేషన్ చేసి నన్ను తీసుకెళ్ళాల్సివచ్చింది.
అంటే ఎంత జనంతో నిండిపోయిందో ప్రాంగణాలు రోడ్లు క్రిక్కిరిసిపోతే కాలేజీలకి సెలవిచ్చేశారు హస్టళ్ళకి సెలవిచ్చేశారు సర్క్యులర్ ఇచ్చేశారు అనితర నిర్వహణాదక్షుడు మా గోపాల కృష్ణగారు మహానుభావుడు అటువంటి కార్యం చేశాడు ఆయన. ఇప్పుడు ఏమీ తెలియనివాడిలాగా అనువుగా కూర్చుంటారు ఆయన. కాబట్టి ఎన్నివేలమంది ఆడపిల్లలో అప్పటికప్పుడు కుదిరిపోయాయి పెళ్ళిళ్లు ఎంతమందో శుభలేకల కట్టలొచ్చి పడిపోయాయి పెళ్ళిళ్ళకి రమ్మని అన్ని పెళ్ళిళ్ళు జరిగాయి ఆ రుఖ్మినీ కళ్యాణం జరిగితే. రోడ్లూ అవీ నిండిపోయాయి దేవాలయాలు మూసేశారు ఇక్కడ దర్శనానికి రాకండి వెళ్ళిపోండి రుక్మణీ కళ్యాణం చూడడానికని ఎన్ని స్క్రీన్సు పెట్టారో ఎంత టెలిక్యాస్టు చేశారో ఎన్నివాహనాలో ఎన్ని ఏర్పాట్లో కానీ అంత వైభవోపేతంగా జరిగింది. అంతమంది కన్నెపిల్లలు అక్కడ కూర్చుని చేస్తూంటే చాలా మంది తల్లిదండ్రులొచ్చి అక్కడే చూసుకుని పెళ్ళిళ్ళు సెట్ చేసేసుకున్నారు అంత గొప్పగా జరిగింది రుక్మిణీ కళ్యాణం కనీ వినీ ఎరుగని రీతిలో ఈశ్వరుడు మాచేత చేయించి మమ్మల్ని కృతార్థుల్ని చేశాడు ఎందరో ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయన్ని తృప్తి మాజీవితానికి చాలు అలా అపురూపమైనటువంటి పట్టాభిషేకాన్ని మళ్ళీ మనం మన ఊళ్ళో చేసుకుందాం.
కాబట్టి మీ ఆందరూ కూడా నీవు ధూర్తుడు నీవు ముందు చెప్పలేదు మేము ఊరెళ్ళాక చెప్పావని అనుకుంటారేమోనని మూడు రోజుల ముందే చెప్తున్నాను. కాబట్టి ఇక చక్కగా మీ పిల్లలతో పాపలతో దగ్గర ఊళ్ళల్లో ఎక్కడవున్న మీ బంధువులందర్నీ పిలిపించండి రామ కార్యం రెండు రోజులు మీ ఇంట్లో భోజనం చేయనీయ్యండి చక్కగాను ఒక రోజు రాముని కళ్యాణంలో ఇక్కడ భోజనం చేస్తారు. అందరూ చుట్టాలను తీసుకరండి పక్కవాళ్ళను తీసుకురాండి ఆనాడు పుష్పక విమానం వానరుల వానర కాంతలు ఎలా ఎక్కివెళ్ళిపోయారో అలా మనందరం పట్టాభిషేకంలో పాల్గొని అసలు ఇటువంటి కార్యక్రమం ఇప్పటిదాక గుంటూరు పట్టణంలో జరగలేదు అని రికార్డు బద్ధలు కొట్టేటటువంటి స్థితి మనం కల్పించి అంత గొప్పగా సనాతన ధర్మం యొక్క వైభవాన్ని చాటిచెప్తాం. కాబట్టి మీ అందరూ దానికి సిద్ధంగా ఉండవలసిందిగా మీ అందర్ని ప్రార్థన చేస్తూ ఇప్పటికే నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నానేమో... మీరు హారతియ్యండయ్యా అప్పుడు నేను వాళ్ళతో తోటకాష్టకం చెప్పిస్తాను.

  యుద్ధ కాండ ముప్పయ్ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
మంగళా....

No comments: