Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అరణ్య కాండ 19వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Aranya Kanda 19th Day

అరణ్య కాండ


పందొమ్మిదవ రోజు ప్రవచనము



మారీచుడు రావణాసురినితో పరిపరి విధములుగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నిన్నటి రోజున మీతో నేను ప్రస్తావనచేస్తూ ఉన్నాను, ఇంత బోధచేసినప్పటికీ రావణాసురుడు మాత్రం చిట్ట చివర చెప్పిన విషయం ఏమిటంటే... నీకు ఉన్నటువంటి అవకాశములు రెండే ఒకటి మరణిస్తే నాచేతిలో మరణించాలి, నాఆజ్ఞ కాదంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను వధిస్తాను ఒకవేళ నాఆజ్ఞ అవదలదాల్చితే మరణిస్తే మరణిస్తావు బ్రతికితే బ్రతుకుతావు ఎందుకంటే రామ బాణం తగిలితే మరణిస్తావు ఏమో రాముడికి కనపడకుండాపోతే బ్రతుకుతావు. ఇప్పుడు మారీచుడు ఇంకొక్క ప్రయత్నం ఆఖరి ప్రయత్నం ఆయనకు తెలుసు ఎలాగో రావణుడు వినడని విననివాడే రావణుడు, కాబట్టి ఇంకొక ప్రయత్నంగా తన కర్తవ్యంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కే నేదమ్ ఉపదిష్టం తే క్షుత్రేణాహిత వాదినా ! య స్త్వామ్ ఇచ్ఛతి నశ్యన్తం స్వ కృతేన నిశాచర !! ఆయనా... అసలు నీకు ఈ మాటలు తలకు ఎక్కించినటువంటివాడు ఎవడూ అన్నది నాకు అర్థం కావడం లేదు ఇలాంటి పని ఒక్కటి నీవు చెయ్యి అని నీతో చెప్పినవారు ఎవరో నాకు అర్థం కావడంలేదూ, కానీ నీ వినాశనాన్ని కోరుకుంటున్నటువంటివాడే చాలా అందంగా నీతో ఈ మాటలు మాట్లాడి ఇలా చేసేటట్టుగా నిన్ను ఈ రంగంలోకి దింపాడు.
కాబట్టి ఇది నువ్వు గమనిస్తున్నటువంటివాడివి కావు, నీ హితముకోరినవాడు మాత్రం నీకు ఈ మాట చెప్పలేదు ధర్మమ్ అర్థం చ కామం చ యశ శ్చ జయతాం వర ! స్వామి ప్రసాదాత్ సచివాః ప్రాప్నువన్తి నిశాచర !! ఒక రాజు ఎలా ప్రవర్తిస్తాడూ అన్నదాన్నిబట్టి ఒక రాజు తన మంత్రులతో ఏమి మాట్లాడుతుంటాడూ అన్నదాన్ని బట్టీ మంత్రులకు కూడా ధర్మము, అర్థము కామము నిర్ణయింపబడి ఉంటాయి, తప్పా రాజే ధర్మార్థకామములను సరిగ్గా సమన్వయం చేసుకోలేనివాడైతే ధర్మబద్ధమైన అర్థకామములయందు రాజుకీ అనురక్తి లేకపోతే ఆ మంత్రులు మాత్రం అలా ఎందుకు ప్రవర్తిస్తారు, మంత్రులు అలా ప్రవర్తించనప్పుడు ప్రజలు ఎందుకు ప్రవర్తిస్తారు విపర్యయే తు తత్ సర్వం వ్యర్థం భవతి రావణ ! వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్ను వన్తీతరే జనాః !! ప్రభువే పాడైపోతే ప్రభువే చెడుమార్గంలో ప్రవర్తిస్తుంటే ప్రజలందరూ కూడా అలాగే పాడైపోయి పురుషార్థ సమన్వయమును మరిచిపోతారు.
అంటే పురుషార్థ సమన్వయమును మరిచిపోవడమూ అంటే అసలు దేనికొరకు ప్రయత్నం చెయ్యాలో దేన్నిపొందడానికి ధర్మబద్ధమైన అర్థమునూ కామమునూ వినియోగించుకోవాలో ఆవిషయాన్ని మరిచిపోతారు ఆ కట్టు తప్పిపోతారు తప్పిపోతే ధర్మమును ఉల్లంఘించినటువంటి అర్థము ధర్మ వితిరిక్తమైనటువంటి కామము, కాబట్టి

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఏమైపోతుందంటే అర్థకామములు ప్రధానమౌతాయి ధర్మము అప్రదానము అవుతుంది. అప్రధానమౌతుంది అన్న విషయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ధర్మము తెలియక అప్రధానవుడం ఒకటి ధర్మం తెలిసీ అప్రధానమైపోయి తనకు అనుగుణంగా ధర్మాన్ని మాట్లాడుతూ ఉండడం ఒకటి, రావణుడు రెండవకోవకు చెందినవాడు. ఎందుకంటే వేదముచేత చెప్పబడినటువంటి ధర్మమేదో అది తెలియనివాడు మాత్రం కాడు అది తెలిసున్నవాడే... కాని తన ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ అర్థకామములకు పెద్దపీఠవేస్తాడు వేసి నేను చేసినది ధర్మబద్ధమే అని బుకాయిస్తూ ఉంటాడు.
కాబట్టి నీ ప్రజలకు కూడా ఇదే అలవాటు పడిపోతుంటుంది, పడిపోతే ఇలా పెచ్చు పెరిగిపోయినటువంటి అధర్మం చిట్ట చివరకి పెనుప్రమాదాన్ని తీసుకొస్తుంది రాజ మూలో హి ధర్మ శ్చ జయ శ్చ జయతాం వర ! తస్మాత్ సర్వా స్వవస్థాసు రక్షితవ్యో నరాధిపాః !! రావణా! ప్రజల యొక్క ధర్మాచరణము వారి శ్రేయస్సు రాజు యొక్క ప్రవర్తనమీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా రాజులు ధర్మ మార్గంలో నిలబడాలి ఎందుకంటే... ఆదర్శమేమిటీ అంటే నడవడి ఆదర్శం మీరు ఎప్పడూ ఒకటి గుర్తుపెట్టుకోండీ... కోటి మాటలు చెప్పనీయండి ఆయన ఎలా ఉంటాడూ అన్నదానికి పెద్దపీఠ, లోకము యొక్క గౌరవాన్ని మీరు పక్కనపెట్టేసైయ్యండి, లోకంలో అలా నేను ఉంటే..? నేను అలా ఉన్నాను లోకం గౌరవిస్తుంది కాబట్టి నేను లోకం కోసం చేస్తున్నాను అన్నాకూడా అందులో తప్పేం లేదు అందులో కొంతలో కొంత ఏదో ధర్మానికి నడుస్తుంది, కానీ ఒక స్థాయిలో అదికూడా మంచిదికాదు. తాను జ్ఞానియై అలా లోకం కోసం కర్మాచరణం చేయడం ఒకెత్తు, కానీ ఎప్పుడూ ఏదో లోకం దృష్టిలో తాను ధర్మమూర్తిగా ఉన్నానుపించుకోవడానికి కర్మ చెయ్యడం కాదు, ధర్మం చెయ్యకుండా ఉండడం తప్పా ధర్మం చెయ్యకుండా ఉండడం తనకు చేతకానివాడై ధర్మాం చెయ్యాలి. నేను ఇలాగే చేస్తాను ఇది నాకు అలవాటు కాబట్టి నేను ఎప్పుడూ ధర్మావలంబకుడునై ఉంటాను అన్న ఉద్దేశ్యంతో అలా రాజు ఉంటే ఆ రాజు యొక్క ప్రవర్తనను ఆదర్శంగా తీసుకుంటారు ప్రజలు.
రాజుగారు ఇలా ప్రవర్తిస్తున్నారు మనము ఇలా ప్రవర్తించాలి అసలు రాజుగారికే ఆ ప్రవర్తన లేకపోతే ఇంక ప్రవర్తనలేనివాడు ఎదురుగుండా ఉంటే... కొత్తగా వినవలసిన అవసరం ఎక్కడనుంచి వచ్చింది. ఎదురుగుండా ఉన్నవాడు ముందు సత్ ప్రవర్తనతో ఉంటే మీరు కొత్తగా సత్ ప్రవర్తన నేర్చుకోవాలి, తెలిసున్నవాడే ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తే మిగిలినవాళ్ళు ఏమనుకుంటారు, తెలిసున్నవాడే వదిలేశాడు కాబట్టి అది ఆచరణీయం కాదనుకుంటారు అది చాలా పెద్ద ప్రమాదం తెలియనివాడు విడిచిపెట్టడానికీ తెలిసినవాడు విడిచిపెట్టడానికీ చాలా పెద్ద ప్రమాదము ఉంది. వారికేం తెలుసండీ అనడంవేరు అన్ని తెలుసున్నవాడే వదిలేశాడండీ అంటే అది పనికిరానిది కదా అని అన్నారనుకోండీ అప్పుడు మీరు సమర్థించడం కష్టమైపోతుంది. కాబట్టి ఆచరణా అనేటటువంటిది మీఒక్కరితోపోదు తెలిసున్నవాడు ఆచరించకపోతే లోకమునకు మార్గదర్శకత్వము పోతుంది కాబట్టి తెలిసున్నవాడు ఎప్పుడూ అనుష్టిస్తూనే ఉండాలి ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. తెలియడం వేరు చెయ్యడం వేరు ఎందుకంటే తెలిసున్నవాడే చెయ్యకపోతే దానిమీద విశ్వాసమే లోకానికిపోతుంది.
ఆ ప్రమాదం తేకూడదు కాబట్టి అనుష్టానాన్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉండాలి, ఆచనరణ అన్నది ఎప్పుడూ అవసరం ఇదిలేదు రావణా నీ దగ్గర, ఇది లేకపోవడం ఏమౌతుందంటే ప్రజలందరూ కూడా రావణుడు వేదం చదువుకున్నాడూ రావణుడు శాస్త్రం చదువుకున్నాడు రావణుడు తపస్సు చేశాడు కాని రావణుడు ఎలా ఉంటుంన్నాడు, తన ఇష్టమొచ్చినట్లు ఉంటున్నాడు కాబట్టి శాస్త్రం అన్నదాన్ని వదిలిపెట్టి తిరగచ్చన్నది రావణుడే చెప్తున్నాడుగా ఇంక మనమెందుకు శాస్త్రాన్ని పట్టుకోవడం అన్న దృష్టికోణం ప్రజలలో ఏర్పడుతుంది. కాబట్టి నీవు అలా ఉండ కూడదు అది తప్పు ప్రజలు పాడైపోవడానికి నీవు కారణమౌతున్నావు నీవు రాజుగా ఉండి ఏ ప్రజల్ని నీవు ధర్మమార్గంలో పెట్టాలో అలా పెట్టడంలో నీవు వైఫల్యం చెందుతున్నావు నీకే నడవడిలేని కారణం చేత స్వామినా ప్రతికూలేన ప్రజా స్తీక్ష్ణేన రావణ ! రక్ష్యమాణా న వర్ధన్తే మేషా గోమాయునా యథా !! ఎంత పెద్ద మాటండీ నిజంగా శ్లోకం చాలా గంభీరమైనటువంటి మాట, కాపాడడమూ అనే మాట ఒకటి ఉంటుంది లోకంలో రక్షించడమూ అన్నమాట ఒకటి ఉంటుంది లోకంలో, ఈ రక్షించడమూ అన్నమాటలో మీరు దేన్నిపడితే దాన్ని తీసుకొచ్చి రక్షకస్థానంలో పెట్టకూడదు పెట్టలేరు కూడా... ఎందుకంటే ఇదే అంటున్నాడు మారీచుడు, ఒక తండ్రి పిల్లవాన్ని కొడతాడు కొట్టకుండా ఏ తండ్రీ పెంచడు ఏ తల్లీ పెంచదు తల్లీ తండ్రీ కూడా కొడతారు తల్లీ తండ్రీ కొట్టేటప్పుడు శిక్షవేడం ప్రధానమా చేసినటువంటి తప్పును దిద్ది పిల్లవాడు మళ్ళీ ఎప్పుడూ అటువంటి తప్పు చేయ్యకుండా ఉండడానికి శిక్షవేడం ప్రధానమా..? మళ్ళీ తప్పు చెయ్యకుండా ఉండడానికి శిక్షించడం ప్రధానం తప్పా... తప్పు చేశాడు కాబట్టి శిక్షించడం ప్రధానం కాదు.
అదే ఒక మేకల మంద వెనకాల ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి అతనికేమీ పాండిత్యమూలేదు ఏమీ లేదు అటువంటివాడు పాండిత్యము వరకూ ఎందుకండీ... అతనికి ఏమీ తెలియదు అసలు లౌకింకంగా కూడా ఏమీ తెలియదు, అతనికి సంతకం పెట్టడం కూడా ఏమీ రాదు అటువంటివాడు కంబళి భుజం మీద వేసుకొని ఒక కర్రపట్టుకును వెనుకాల వెళ్ళుతున్నాడు. ఇప్పుడు అతనికి ఏం తెలుసండీ అతను బలహీనుడు అతను ఏమీ ఎటువైపునుంచి ఏ క్రూర మృగాలు వస్తాయో కూడా అతనేం కనిపెట్టలేడూ అతని కన్నా ఒక నక్కవెనకాల వెళ్ళితే నక్క చిత్తులమారి కాబట్టి బాగా కుయుక్తులు తెలుసుకాబట్టి ఎటువైపునుంచి ఏ మృగం ఎలా వచ్చి మేకల మీద దాడి చేస్తుందో తెలుసుకుని ఉంటుంది కాబట్టి ఒక నక్క మేకల వెనుకాల వెళ్ళుతుంది వెళ్ళితే బాగుంటుంది అని మీరన్నారనుకోండీ అది పైకి వినడానికి బాగుంటుంది కానీ ఆ నక్కేతినేస్తుంది మేకల్ని ఇప్పుడు బయటివాళ్ళు అక్కరలేదు ఈ నక్క మేకల్ని తింటుంది. ఎలా తింటూందీ అంటే తాను తిన్నాను అని తెలియకుండా తింటుంది, నక్కే తినేసిందీ అని యజమాని కూడా కనిపెట్టలేడు తనకు ఏ జిత్తులమారి తనముందో ఆ జిత్తులమారితనం దేనికి పనికివస్తుందంటే కాయవలసినవాళ్ళని కాయకుండా తాను తినేస్తుంది ఆ జిత్తులమారి తనం ఎందుకంటే నక్క బుద్దే అంత దాని తెలివి తేటలు వక్రంగానే ఉపయోగపడతాయి దాని తెలివితేటలు సక్రమంగా ఉపయోగపడవు.
కాబట్టి రావణా నీవంటివాడు పరిపాలకుడుగా ఉంటే స్వామినా ప్రతికూలేన ప్రజా స్తీక్ష్ణేన రావణ రక్ష్యమాణా న వర్ధన్తే ప్రజలకు రక్షణ ఉండదు మేషా గోమాయునా యథా మేకల వెనకాల ఒక నక్క వెళ్ళితే ఎలా ఉంటుందో..? అలా ఉంటుంది నీవు పరిపాలించడం నీవు ఏం చేస్తావంటే నీవు ప్రజల్ని పరిపాలిస్తున్నట్లు కనపడుతుంది నీవే తినేస్తావు ప్రజల్ని. నీ అధర్మాచరణం వాళ్ళకి నేర్పి క్రమంగా నీ వలననే రాజ్యమూ ప్రజలూ నశించిపోతారు ఆ స్థితి వస్తుంది ఇదీ రావణాసురున్ని ఉద్దేశించి చెప్తున్నాడు కానీండీ... యదార్థానికి ఇవ్వాళ బాగుందికదా అని సంతోషంగా ఉందికాదాని ధర్మాన్ని విడిచిపెట్టి చెయ్యరాని

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
పనులు చేసినటువంటివాళ్ళు తుట్టతుదకు పొందేటటువంటి ఎంత ప్రమాదకరమైన ఫలితములు ఉంటాయో మారీచుడు చూపిస్తున్నాడు. కాబట్టి దర్శనాత్ ఏవ రామ స్య హతం మామ్ ఉపధారయ ! ఆత్మానం చ హతం విద్ధి హృత్వా సీతాం సబాన్ధవమ్ !! ఇక్కడ చెప్పాడు తీర్పు, మారీచుడి యొక్క తీర్పంతా ఇక్కడ ఉంది ఆయన అంటున్నాడు దర్శనాత్ ఏవ రామ స్య హతం మామ్ ఉపధారయ రాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోయినట్టే అక్కడితో అయిపోయింది.
Image result for మారీచుడురాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోతాను సీతమ్మ నిన్ను చూడగానే..? నీవు అపహరిద్దామనుకుంటున్నావుగా..! సీతమ్మకూడా తేజోవంతురాలని నేను చెప్పానుగా నిన్నా అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాఽఽత్మజా ! న త్వం సమర్థ స్తాం హర్తుం రామ చాపాఽఽశ్రయాం వనే !!  చెప్పారుగా నిన్నేమరి మారీచుడు మరి సీతమ్మని చూస్తే యదార్థ స్వరూపంగా ఉంటుంది. రావణుడిగా నీవు కనపడ్డప్పుడు నీవు సీతమ్మని అపహరించే సమయంలో సీతమ్మ నిన్ను చూస్తే నీవు మరణిస్తావా..? నీవు మరణించవు అన్నాడాయన నీవు మరణించవు ఎందుకు మరణించవో తెలుసా..? చంపదు సీతమ్మ నిన్ను కనుకా, ఎందుకు చంపదో తెలుసా..? నిన్ను చంపడం కాదు ఇప్పుడు ప్రధానం ఆత్మానం చ హతం విద్ధి హృత్వా సీతాం సబాన్ధవమ్ ! ఆనయిష్యసి చేత్ సీతామ్ ఆశ్రమాత్ సహితో మయా ! నైవ త్వమ్ అసి నైవాహం నైవ లంకా న రాక్షసాః !! నీవు సీతమ్మని తీసుకుని వెళ్ళిపోయిన తరువాత ఏమౌతుందో తెలుసా..? ఇక్కడైతే సీతమ్మ నిన్ను చంపేయగలదు, కానీ చంపదు ఆమె తేజస్సుతో ఆమె తలచుకుంటే రావణ సంహారం పెద్ద విశేషమేం కాదండి ఆవిడ సంకల్పంతో చంపేస్తుంది ఆవిడ ప్రాతివత్యంతో చంపేస్తుంది. నిన్ను చంపదు నీవు తీసుకెళ్తావు సీతమ్మని, తీసుకెళ్ళాక ఏమౌతుందో తెలుసా..? ఇక్కడైతే ఒక్కడివే పోతావు అక్కడికొస్తే సీతమ్మ మీ అందరూ పోతారు నైవ త్వమ అసి నీవు ఉండవు నా హంచ నేను ఎలాగో ఉండను, నీవు తీసుకెళ్ళడమూ అన్నది జరిగిందీ అంటే ఏమిటండీ... నేను హా... లక్ష్మణా హా... సీతా అన్నాననే గుర్తు నేను ఉండను, నైవ లంకా ఇంక లంకా రాజ్యం ఉండదు న రాక్షసాః  రాక్షసులన్నవారు ఎవ్వరూ ఉండరు అందరూ పోతారు.
ఎందుకుపోతారో తెలుసా? నీవు చెప్పిన ప్రణాళికలో అంతపెద్ద ప్రమాదము ఇమిడి ఉంది, నీవు ఏమంటున్నావు నేను మాయా మృగం కింద వెళ్ళికనపడితే నేనేదో హా రామా హా సీతా హా లక్ష్మణా అంటే.? ఆ లక్ష్మణుడు వెళ్ళిపోతాడూ సీతమ్మని అపహరిస్తానంటున్నావు కానీ సీతమ్మను అపహరిస్తానని నీవు అనుకుంటున్నావు కానీ... సీతమ్మని అపహరించడమే నీ మృత్యువుకి కారణం నీతో పాటూ లంకా రాక్షసులు అందరూ నశించడానికి కారణం ఇది నీ బుర్రెకు పుట్టింది ఎందుకు పుట్టిందో తెలుసా..? నిన్ను నీ వారితో నశింపజేయడానికి ఎవరో నీ పుర్రెలో పెట్టారు ఈ బుద్దిని, ఇది తెలుసుకోకా నేను సీతమ్మని ఎత్తుకెళ్తున్నాను అంటున్నావు పిచ్చోడా నీవు పట్టుకెళ్ళి పొందేది ఏమీ ఉండదు సుఖం. నీవు పట్టుకెళ్ళినది మొదలు నీకు శోకం ప్రారంభం ఈ మాట ఎవరు చెప్పారో తెలుసాండీ ఎంతమంది చెప్పారో తెలుసా రామాయణంలో మొదట చెప్పినవాడు మారీచుడు. ఇక ఈ తరువాత సీతమ్మ చెప్తుంది నీ దుఃఖం ఇక ప్రారంభమైంది అని చెప్తుంది.
కానీ ఎంత గొప్ప లెక్కకట్టాడో చూడండీ... రాముడు నన్ను చూసినప్పుడు నేను ఒక్కన్నే పోతాను సీతమ్మను తీసుకెళ్ళాక నీవు సరాక్షసంగాపోతావు అన్నాడు. ఆయనకీ ఇవేమీ అర్థం కాలేదు ఆయనా హఠంతోటే నిలబడ్డాడు నీవు

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
వెడతావా కాంచన మృగంగా నేను నిన్ను సంహరించనా..? అప్పుడు మారీచుడు అన్నాడూ ఏమమ్ ఉక్త్వా తు పరుషం

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
మారీచో రావణం తతః ! గచ్ఛావః ఇత్యబ్రవీ ద్దీనో భయా ద్రాత్రించర ప్రభోః !! ఆ రాత్రించరుడైనటువంటి రావణప్రభువు దగ్గర దీనుడై దీనత్వం ఎందుకొచ్చింది అంటే తన మనసులో ఉన్నది తాను చెయ్యలేని స్థితి, తనకు రాముడంటే భక్తి ఈ అపచారం చెయ్యడం తనకు ఇష్టంలేదు కానీ చెయ్యడం వినా మార్గం లేని పరిస్థితి ఇది ఆయన ధైన్యం. కాబట్టి ఇప్పుడు దీనుడై భయంతో భయమన్నమాట ఎందుకొచ్చింది, అంటే రాముడి వలన భయం కలిగినా బ్రతికే ఉన్నాడు వృక్షే వృక్షే హి పశ్యామి చీర కృష్ణాజినాఽమ్భరమ్ అనీ ప్రతి చెట్టుమీదా రాముడే కనపడినా ప్రాణంపోయిందేం లేదు రామున్ని భీత భక్తితో ఉపాసన చేస్తూ బ్రతికే ఉన్నాడు.
Image result for మారీచుడుకానీ ఇప్పుడు రావణున్ని కాదంటే చచ్చిపోతాడు చచ్చిపోవడం రావణుని చేతిలో చచ్చిపోయినటువంటివానికి ఉత్తమ లోకాలు వస్తాయని నమ్మకంలేదు కానీ ప్రభువు మాట అవదలదాల్చి రామున్ని శత్రువుగా భావించి రామునితో యుద్ధంగా భావించి రాముని చేతిలో మరణిస్తే తను ఊర్ధ్వలోకాలు పొందే అవకాశం ఉంటుందేమో..? పైగా రామ బాణమే చాలు రామున్ని చూస్తూ చావడమే చాలు. ఇది మారీచుని ఆలోచన కాబట్టి ఇప్పుడు రావణుని వలన కలిగిన భయం చేత రావణుడు చెప్పిన మాటలు వినడం వినా మార్గంలేని స్థితికి దైన్యమును పొందాడు భయాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాడు కిం ను శక్యం మయా కర్తుం ఏవం త్వయి దురాఽఽత్మని ! ఏష గచ్ఛా మ్యహం తాత స్వస్తి తేస్తు నిశాచర !! ఆయన అన్నాడూ నీ ఆదీనంలో ఉన్నటువంటి నేను ఇప్పుడు ఇంతకన్నా చెయ్యవలసినటువంటి పరిస్థితిలేదు అంటే ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఇన్ని తెలిసున్న మారీచుడు కనక మృగంగా కనపడ్డం తప్పా మార్గంలేని పరిస్థితి బిగుసుకోంటుంది. అంటే దీని వెనకాతల దేవతలు కూడా ఉన్నారు, రావణవధ జరగాలీ అంటే రాముడు వెంట వెళ్ళాలి కాబట్టి ఆయన బుద్ధిలోకి అటువంటి ఆలోచన వచ్చింది మీరు ఎప్పుడూ ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎవడి పథనమైనా ఎక్కడ ప్రారంభమో తెలుసాండీ..? ఆలోచన దగ్గరే ప్రారంభం ఆలోచన దగ్గరే ప్రారంభమౌతుంది అంతే రాకూడని ఆలోచన అనేది పుర్రెలోకి వచ్చింది అనుకోండి ప్రమాదము వచ్చేసినట్లే దాన్ని మీరు తొలగించుకోగలిగిన సమర్థత మీయందు ఉంటే..? ఏమో నేను చెప్పలేను, అటువంటి ఆలోచనను అమలు చెయ్యగలగకుండా ఉండగలిగితే అటువంటి ఆలోచనని అమలు చెయ్యకుండా ఉండలేని బలహీనతకికాని మీరు లోనైతే ఉపద్రవం తీసుకొస్తుంది.
ప్రమాదం ఎప్పుడూ ఆలోచనా రూపంలోనే వస్తుంది అంతకన్నా ఇంకొక రకంగా ఏమీ ఉండదు ఆలోచన రూపంలోనే ఉంటుంది, అందుకే ఆలోచనలు ఎప్పుడూ కూడా భగవత్ పరం చేస్తే ఏమౌతుందో తెలుసాండీ మీకూ మీ వారికి కూడా రక్షణ కలుగుతుంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి మనం అష్టోత్తరంతోటే పూజ ఏదేవతకైనా వినా సహస్త్రంతో చేస్తాము 108 దాటితే వేయ్యి, 108కి వేయ్యికీ మధ్యలో అంకెలు లేవాండీ బోలెడన్ని అంకెలు ఉన్నాయి మరేం ఎందుకులేవు పూజకు 200 తోటో 300 తోటో 400 నామాల్ని 500 నామాల్తో ఎందుకులేవు, 116 నామాలతో పూజా ఒక్క శంకరాచార్యులకే ఉంది లోకంలో 108 నామాలతోటి దేవతలందరికి చేస్తాం, 116 నామాలతో శంకరాచార్యులవారికి చేస్తాం. ఎందుకంటే శంకర భగవత్ పాదులకి గురు కట్నంగా అనిచెప్పి 116 ఇవ్వాలి మనకి ప్రత్యేకించి తెలుగు దేశంలో ఒక సాంప్రదాయం ఉంది, తెలుగు దేశం అంటే నా ఉద్దేశ్యం ఆంద్ర దేశము. ఒక సాంప్రదాయం ఉంది గురువు గారికి కాని ఎవరికైనా బహుమానంగా ఇస్తే 116ల్లు ఇస్తాం. రేపు ఆయన పుట్టినరోజు శంకర జయంతి కాబట్టి ఆయనకు కూడా 116ల్లు కట్నం ఇవ్వాలి

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి 116ల్లు కట్నం ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి, ఆయన నీ 116ల్లు నా 116ల్లు వెంపర్లాడేయాన కాదు ఒక వృద్ధ బ్రాహ్మణికి కనకధారచేసి బంగారు ఉశిరకలు ఇచ్చి తాను ఒక్క పిసరు ముట్టుకోకుండా వెళ్ళిపోయిన మహాపురుషుడు ఆయన అటువంటి సర్వతంత్ర స్వతంత్ర ఆయనకు మనమిచ్చే రూపాయలు ఎందుకు, కాదు ఆయన సాధించిన విజయములను ఆయన నామములుగా చెప్తాం చెప్పితే 108 నామములు శంకర భగవత్ పాదుల యొక్క అష్టోత్తరం ఉంటుంది. దానికి 8 నామములు కలపాలి, ఈ 8 నామములు ఎక్కడ నుంచి కలపాలీ ఏవి కలపాలి ఇదీ రేపు శంకరాచార్యులవారికి చెప్పవలసినటువంటి నామాలలో ఉన్న గొప్ప మలుపు. ఈ 108+8 కలిపితే 116 అవుతాయి, ఈ 116 మనిషిగా పుట్టినటువంటి ప్రతివాడూ రేపు చెప్పాలి. ఎందుకంటే శంకరాచార్యులవారికి జగత్ గురువుగా మీరు ఇచ్చే గౌరవం అదొక్కటే శంకర జయంతినాడు.
Image result for అష్టోత్తరంకాబట్టి దేవతలకైతే 108 నామాలే తప్పితే వేయ్యి వేయ్యి అంటే సహస్త్రం, సహస్త్రం అంటే అనంతం అంటే లెక్కలేదూ అని ఇంతకన్నా చెప్పలేము అందుకని ఇలా చెప్పాము అని వేయ్యి అంటే వేయ్యి అని కాదు సంస్కృతంలో సహస్త్రం అనికాదు. 108 అంటే 108దే ఎందుకు 108దో తెలుసాండీ, ఈ లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రాలలోనే పుట్టాలి 27 నక్షత్రాలకీ 4గేసి పాదాలు ఉన్నాయి 27 నక్షత్రాలకీ 4 పాదాలు చొప్పున 108, అంటే 108 పాదములలో పుట్టడం తప్పా ఈ 27 నక్షత్రముల యొక్క నాలుగేసి పాదములు చొప్పున 108 పాదాలలో తప్పా... అసలు పుట్టడానికి వేరొక సమయములేదూ ఎవరు పుట్టినా నక్షత్రాన్ని బట్టేగా గుణించేది, కాబట్టి నక్షత్రాన్ని ఆధారంగా తీసుకుంటే ఈ సమస్త భూతములు కూడా ఈ 108 పాదములలో పుట్టాయి ఈ 108 పాదములలో పుట్టిన సమస్త భూతముల యొక్క శాంతిని కోరడం లోకశాంతిని కోరడం. సనాతన ధర్మంలో నేను బాగుండాలి మా ఆవిడ బాగుండాలి మా అబ్బాయి బాగుండాలని పూజ చెయ్యము “సర్వే జనాః సుఖినోభవంతు” జనులు కూడా కాదు లోకా సమస్తా సుఖినోభవంతు లోకమంటే శమ్ చతుష్పదే ద్విపదే అందులో నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు సమస్త ప్రాణులు బాగుండాలి సమస్త ప్రాణులు బాగుండాలంటే 108 పాదములలో పుట్టినవన్నీ బాగుండాలి 108 పాదములలో పుట్టినవన్నీ సమస్త భూతకోటి బాగుండాలని 108 నామాలతో పూజ.
కాబట్టి 108దే మనవాళ్ళు పెట్టారంటే ఏదో చేతకాక అష్టోత్తరం పెట్టారని 109దో నామం ఏమిటో వాళ్ళకు గుర్తురాలేదు అందుకే వాళ్ళు 108 నామాలే పెట్టారని అనుకోకూడదు, అందుకే లక్ష్మికీ 108 శారదకి 108 సరస్వతికి 108 శివుడికి 108 విష్ణువుకి 108 అందరికి అందరికీ 108దే, ఇది దాని అంతర్లీనమైన రహస్యం అది తెలుసుకుని మీరు అష్టోత్తరం చెప్పాలి. తప్పా అష్టోత్తరం చెప్తున్నామంటే 108 నామాలు చెప్తున్నామండీ అనిచెప్తే అది ఎప్పటికీ మీకు ఆ 108 నామాలు మీరు ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి భావశుద్ధి మీయందు కలగదు, అసలు మీకు ఆ భావన ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది మీరు ఎప్పుడు జ్ఞాపకంపెట్టుకోండి భావము చేతనే మీరు కృపచేయబడుతారు భావనామాత్ర సంతుష్టాయైనమోనమః ఆ భావన తెలియకుండా దానిలోపలి రహస్యం తెలియకుండా మీరు ఎన్ని చెయ్యండీ దానివలన పూర్తి ప్రయోజనం సిద్ధించడం చాలా కష్టం అవుతుంది, మీరు అందుకే చేసేటటువంటి కర్మకీ ఎందుకు చేస్తున్నామన్నదాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని చేస్తే మీ బుద్ధి నిలబడుతుంది మీ బుద్ది నిలబడిన ఉత్తర క్షణంలో మీరు ఆ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
కనుకా ఇప్పుడు ఆయన అంటున్నారు కిం ను శక్యం మయా కర్తుం ఏవం త్వయి దురాఽఽత్మని ! ఏష గచ్ఛా మ్యహం తాత స్వస్తి తేస్తు నిశాచర !! నేను నీతోనే వస్తున్నాను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇంతకన్నా చేయగలిగినటువంటిది లేదు కాబట్టి నేను నీతో వస్తాను అంటే..? రాముడి చేతిలో మరణించడానికి సిద్ధపడుతున్నాను అని అన్యాపదేశంగా చెప్పడం నీ చేతిలో చావడానికి ఇష్టపడను రాముడి చేతిలోనే మరణిస్తాను. కాని మీరు జాగ్రత్తగా గమనించండీ మారీచుడి యొక్క ఈ కథా ఒక విచిత్రమైన రీతిలో ఒక ముగింపుకు వస్తుంది, చాలా జాగ్రత్తగా గమనించండి మారీచుడు చెప్పేదీ మారీచుడి చేసేదీ మారీచుడు వెళ్ళేక్రమం దీన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయండి మీకొక విషయం అందుతుంది ఏత చ్ఛౌణ్డీర్య యుక్తం తే మ చ్ఛందాదివ భాషితమ్ ! ఇదానీమ్ అసి మారీచః పూర్వమ్ అన్యో నిశాచరః !! నీవు ఇప్పుడు మారీచుడివి పూర్వం అన్యో నిశాచరః ఇంకో రాక్షసుడివి, అసలు నీలో ఆ మారీచుడనబడేటటువంటివాడికి ఉండవలసిన రాక్షసత్వం అసలు కనపడలేదు, ఇందాకటిదాకా అంత పిరికితనంగా మాట్లాడావు అంటే మారీచుడు చేసినటువంటి హితబోధ రావణుడికి అంత కంఠకప్రాయంగా అనిపించింది. తను అనుకున్నది చేస్తానంటే ఉత్తముడు తను అనుకున్నది చెయ్యొద్దూ అనిచెప్తే మారీచుడు కాడు ఎవరో రాక్షసుడు అంటే రావణుని బుద్ధీ అంటే ఏమిటంటే తను అనుకున్నది సాధించుకోవడానికి ఎన్ని రకాలైన యుక్తులైనా పన్నుతాడు ఎన్ని రాకాలుగానైనా మాట్లాడుతాడు తను అనుకున్న కార్యాన్ని సాధించడానికోసమని చెప్పీ తను ఏది మాట్లాడినా శాస్త్రం అదే అంటాడు తను ఏది చేసినా అదే శాస్త్రీయం అంటాడు ఇదీ అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఇది దేనికొరకు చేస్తారు తనకొరకే చేస్తుంటారు తన కొరకు చేయడం తప్పా ఇతరుల యొక్క సుఖాన్ని తన దృష్టిలో ఎప్పుడూ పెట్టుకోడు, ఈ పెట్టుకోకపోవడం వల్ల ఏమౌతుందంటే రావణునితో సంబంధంలోకి వెళ్ళినవాళ్ళందరూ ఏడుస్తారు, ఇలా ఏడిపించే స్వభావం ఉన్నవాడు కాబట్టే రావణుడు అయ్యాడు రావం కరోతి ఇతి రావణః ఆయన ఎప్పుడూ ఇలాంటి అసంబద్ధమైన మాటలు మాట్లాడుతూ ఇతరులను ఏడిపించేటటువంటివాడు భయంకరమైనటువంటి రవం చేస్తాడు అంటే భయంకరమైన ధ్వని చేస్తాడు ఆయన పేరు రావణుడు కాదు అసలు ఆయన పేరు ʻదశగ్రీవుడుʼ ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు 10 తలలతో పుడితే దుర్నిమిత్తములు కనపడ్డాయి ఉత్తరకాండలో చెప్తారు అప్పుడు విశ్వవసో బ్రహ్మగారు వచ్చి చూశారు, చూసి వీడు ఇలా పుట్టాడు 10 తలకాయలతోటి పుట్టాడేమిటి? వీడు పుట్టగానే ఇన్ని దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి 10 కంఠములతో పుట్టాడు కాబట్టి వీడికి దశగ్రీవుడు అని నామ కరణం చేస్తున్నానూ అన్నాడు. కానీ అయన బిరుదు నామం కింద ఏది పెట్టుకున్నాడో తెలుసాండీ ఆయన బిరుదు రావణా అన్నది, ఆయన కైలాస పర్వతాన్ని కదిపాడు ఒకసారి పార్వతీ పరమేశ్వర దర్శనం వెంటనే జరగలేదని కోపమొచ్చి చేతులతో ఎత్తి కదపబోయాడు పరమ శివుడు కాలి బొటనవేలితో నొక్కితే చేతులు దానికింద ఉండిపోయాయి, ఉండిపోయినప్పుడు రావణుడు అరిచిన అరుపులకి మూడు లోకములు తల్లడిల్లిపోయాయి అలా అరిచాడు అంత ధ్వని చేశాడు అంత ధ్వని చేస్తే శివుడు ఆయన్ని పిలుస్తూ అన్నాడూ ఎంతెంత పెద్ద కేకలు పెట్టావు ఎంత కంఠముందిరా నీకూ అని ఇంత రవం చేశావు కాబట్టి రావణా అన్నాడు వాడికి అది నచ్చింది అంటే రావణా అని పిలిపించుకున్నాడు. చేతులు తొక్కేస్తే అంత అరుపు అరిచావని నన్ను అసహ్యంగా దాన్నిపెట్టి పిలుపించుకోవడం ఎమిటిరా? అని లేదు దాన్ని పెట్టే పిలుపిచ్చుకున్నాడు ఆయన ఆయన జీవితం అంత గొప్ప జీవితం అలా ఉండ కూడదు రావణాసురున్ని అనుకరించే ప్రయత్నం చేయకూడదు ఎప్పుడూనూ.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇది ఆయనయందు ఉండేటటువంటి లక్షణం అందుకే మీరు రాముడు మాట్లాడినా రావణుడు మాట్లాడినా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఏత చ్ఛౌణ్డీర్య యుక్తం తే ఇదీ పరాక్రమంటే ఇన్నాళ్ళు వీరోచితంగా కాకుండా ఏం పిరికిమాటలు మాట్లాడావు ఇప్పుడూ నాకు అనుకూలంగా మ చ్ఛందాదివ భాషితమ్ నా అభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడావు, తన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడినంతసేపూ మారీచుడు కాదు తన అభిప్రాయానికి అనుగుణంగా సరే వస్తానులే అన్నాడు, సరే వస్తానులే వీనితో ఒప్పుకుని కాదు వీని చేతులో చావడం ఇష్టలేక అయినా సరే ఆయనకేం బాధలేదు వస్తానన్నాడు చాలు. కాబట్టి ఇదానీమ్ అసి మారీచః ఇదీ మారీచుడు అంటే పూర్వమ్ అన్యో నిశాచరః ఇతః పూర్వం మాట్లాడినవాడు మారీచుడు కాదు ఎవడో రాక్షసుడు అంటే తనమాట ఒప్పుకుంటే మారీచుడు తన మాట ఒప్పుకోనివాడు మారీచుడు కాదు. అదే రాముడైతే రాజ్యం ఇస్తానన్నా తండ్రే ఇవ్వకపోయినా తండ్రే అంతే తేడా మీరు ఇదే గమనించవలసి ఉంటుంది రామాయణంలో ఇది గమనించనంత సేపూ రామాయణం మీకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే నేను చెప్పలేను ఇది గమనిస్తేనే మీకు ఉపయోగపడుతుంది.
Image result for మారీచుడుకాబట్టి ఇప్పుడు బయలుదేరారు ఆ బంగారు రథాన్ని చూపించాడు దీన్ని అధిరోహించమన్నాడు ఆ రథమెక్కారు ఆకాశమార్గంలో వచ్చారు అరటి చెట్లతో కూడినటువంటి రామ చంద్ర మూర్తి యొక్క పర్ణశాల ప్రాంగణమునందు దిగారు, దిగిన వెంటనే మారీచుని చెయ్యిపట్టుకుని అన్నాడూ మారీచా! ఏదీ నేను కోరుకున్నటువంటి బంగారు మృగంగా మారిపో అన్నాడు అంటే... అవతలివాడు చచ్చిపోతాడూ అంటే వీనికేం లెక్కుండదు అయ్యాడూ అంటే చచ్చిపోయాడూ అని లెక్కే, వీడికేమైనా బాదుందా పోనిలేరా కావలసినవి ఏవైనా ఉన్నాయా పోనీ ఆఖరికి కోరిక ఏమైనా ఉందా అని కూడా అడగడు అంత దయా రహితుడు, సాధారణంగా ఎంత నేరం చేసినవాడిని ఉరి తీసేటప్పుడు కూడా నీకు ఏమైనా ఆఖరి కోరిక ఉందా అని అడుగుతారు. రావణాసురుడు అలాగ కూడా ఏమీ అడగడు అయిపో బంగారు మృగము అన్నాడు, అయిపో బంగారు మృగం అంటే పో రాముడి చేతిలో అని ఎందుకాతొందరా తను సీతను అపహరించాలి అంతే ఆయనకు కావలసింది, తప్పా అవతలి వాడు పోనివ్వండి ఏడవనివ్వండీ చావనివ్వండీ ఏమైపోనివ్వండీ రావణునికి అక్కరలేదు అది రావణాసురిని యొక్క మనస్తత్వము, అది అత్యంత ప్రమాదకరము అటువంటి వ్యక్తిత్వము కాని ఎవరికైనా ఉంటే..? ఇంక అంతకన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉండడు మీరు అటువంటి వారి దృష్టిలో పడకూడదు మీ దృష్టిలో వారు ఉండకూడదు, చాలా ప్రమాదము రావణుడి దృష్టిలో మారీచుడు ఉండడం కదాండి కొంప ముంచేసింది లేకపోతే ఆయన ఏమౌనో పాపం...
అలాంటి వారి దృష్టిలో కూడా మీరు ఉండకూడదు ఒకవేళ అవతలి వ్యక్తిత్వము అటువంటిది అని మీరు గుర్తించారనుకోండి మీరు తప్పుకోవాలంతే ఆయన దృష్టిలోకి ఇక మీరు వెళ్ళకూడదు మీరు దాటిపోవలసి ఉంటుంది అది మీకు క్షేమము, మీరు ఏ మాత్రం మొహమాటపడి ఉన్నాసరే ప్రమాదం వచ్చేస్తుంది, మారీచ రావణోపాఖ్యం మీరు చూస్తున్నారుగా వారి ఇద్దరి సంభందాన్ని, కాబట్టి ఇప్పుడు మారీచుడు

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
స తు రూపం సమాస్థాయ మహత్ అద్భుత దర్శనం ! మణి ప్రవర శృంగాగ్రః సితాసిత ముఖాఽఽకృతిః !!
రక్త పద్మోత్పల ముక ఇన్ద్ర నీలోత్పల శ్రవాః ! కించి దభ్యున్నత గ్రీవ ఇన్ద్ర నీల నిభోదరః !!
కుందేందు వజ్ర సంకాశం ఉదరం చాస్య భాస్వరం ! మధూక నిభ పార్శ్వ శ్చ పద్మ కింజల్క సన్నిభః !!
వైడూర్య సంకాశ ఖర స్తను జఙ్ఘః సుసంహతః ! ఇంద్రాఽఽయుధ సవర్ణేన పుచ్ఛే నోర్ధ్వం విరాజితా !!
మనోహర స్నిగ్ధ వర్ణో రత్నై ర్నానా విధై ర్వృతః ! క్షణేన రాక్షసో జాతో మృగః పరమ శోభనః !!
వనం ప్రజ్వలయన్ రమ్యం రామాఽఽశ్రమ పదం చ తత్ !
Image result for బంగారు జింకవెంటనే ఆ మారీచుడు బంగారు మృగం కింద మారిపోయాడు, ఆ బంగారు మృగం కింద మారినప్పుడు ఆయన పొందినటువంటి అందానికి ఆ అడవి అంతా శోభిల్లింది, దాని కొమ్ములు ఇంద్ర నీలములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట, ముఖము తెలుపూ నలుపూ వన్నెలతో కలసి ప్రకాశిస్తోందట ఒకటి పై పెదవి ఎర్ర మందారంలా ఉందట మరి ఒకటీ నల్ల కలువ ఎలా ఉందో అలా ఉందట చెవులు ఇంద్రనీల మణుల్లాగ అటూ ఇటూ కదులుతూ అంత ప్రకాశవంతంగా ఉన్నాయట మెడ కొంచెం ఇలా పైకెత్తి చూస్తుందట ఈ పైదవడలు ఆడిస్తూ చూస్తుంటాయి జింకలు, కాబట్టి దవడలు ఆడిస్తూ చూస్తుందట, అధరము ఇంద్రనీలము ఎలా ఉంటుందో అలా ముదురు రంగుతో వెలసిల్లుతోందట ఆ లేడి యొక్క కడుపూ మల్లెపువ్వు చంద్ర బింబము ఎలా ఉంటాయో అంత తెల్లగా వజ్రము ఎలా ఉంటుందో అలా మెరిసిపోతుందట దాని పక్క భాగాలు నెమలి వన్నెతోటి పద్మకేసరముల యొక్క రంగుతోటీ ప్రకాశిస్తున్నాయట గిట్టలు వైఢ్యూర్య మణులు ఎలా ఉన్నాయో అలా ప్రకాశిస్తున్నాయట ఆ పక్కన ఉండేటటువంటి సన్ని బంధములు పిక్కలు మంచి ధృడంగా ఉన్నాయి, తోక చిన్న తోకను పైకెత్తి ఇంద్ర ధనస్సుని నిలబెట్టినట్లు నిలబెట్టింది.
పలు వన్నెలతో మెరిసిపోతూంది రత్నాలతో కూడినటివంటి చుక్కలతో నిగనగలాడిపోతూ ఆ మారీచుడు ఇలా చూసినటువంటివారి యొక్కదృష్టిని ఆకర్షించేటటువంటి రీతిలో ఆ రాముని యొక్క పర్ణశాల ప్రాంతమునందు తిరిగుతున్నాడు, మరి రావణుడు రథం, ఆయన ఎక్కిన రథం మాయలతో కూడుకున్న రథం కాబట్టి అది కనపడకుండా అదృశ్యమౌతుంది, ఆయన అక్కడే ఉంటాడు ఉండి చూస్తూ ఉంటాడు ఆయన కనపడడు రథం కనపడు మళ్ళీ ఆయన సంకల్పం చేస్తే రథం కనపడుతుంది అంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు సీతమ్మ యొక్క దృష్టిలోపడాలి ఈ మృగం కాబట్టి ఆ మృగం దగ్గరకోస్తోంది ఆకులు తింటోందీ అటు పరుగెడుతోంది ఇటు పరుగెడుతోంది దూరంగా పరుగెడుతోంది దగ్గరికి వస్తూంది చల్లగా చెట్ల నీడలో పడుకుంటుంది అంతలో లేస్తుంది ఆడుతోంది దూకుతోంది, మిగిలినటువంటి మృగముల మధ్యలోకి కానీ ఈ మృగం వెళ్ళితే రాక్షసుడు ఈ మృగరూపములో ఉన్నాడూ అని వాసపట్టి మిగిలిన మృగాలు కనిపెట్టాయట, కనిపెట్టి ఈ మృగం కనపడగానె దీని వాసన చూసి మిగిలిన మృగాలన్ని కూడా అరణ్యంలోకి పారిపోతున్నాయట.
ఇది మాత్రం అనుమానం రాకుండా ఉండడంకోసం మృగరూపంలోనే పరుగెడుతున్నటువంటి ఆ మృగాలను తినేద్దామని కోరిక ఉన్నా తినకుండా నిగ్రహించుకుంటుంది ఎందుకంటే ఒక జింక ఇంకొక జింకను తింటే బయటపడిపోదాండి, అందుకని తినకుండా ఆ మృగములతో కలసి పరిగెడుతున్నట్లు పరిగెడుతుంది. కాని అసలు నిజానికి మృగాలన్ని ఎందుకు పరిగెడుతున్నాయంటే దీన్ని చూసే పరుగెడుతున్నాయి, దీని వాసన చూసి అవి కనిపెట్టాయి ఇది మామూలు మృగం కాదు ఇది రాక్షసుడని, జంతువులకి ఈశ్వరుడు అటువంటి శక్తి ఇస్తాడు. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క అపూర్వమైనటువంటి లక్షణం

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఉంటుంది పేపర్లలల్లో కూడా వచ్చింది ఆ మధ్య భూకంపం వచ్చే ముందు కొన్ని కొన్ని జంతువులు భూమిలోంచి బయటికి

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
వచ్చేస్తాయని వాటికి ఈశ్వరుడు అటువంటి శక్తిని ఇచ్చేస్తాడులా ఉంది, కాబట్టి తెల్లవారుతుంటే కోడి కొక్కరొకో అని కోడి కూస్తుంది దానికి ఎవరు చెప్పారు తెల్లవారింది కూయమని అంటే ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క ప్రాణికి ఈశ్వరుడు ఒక్కొక్క విభూతిని ఇస్తాడు.
Related imageకాబట్టి ఇప్పుడు సీతమ్మతల్లి పువ్వులు కోయడం కోసమని బయటికి వచ్చింది బయటికి వచ్చి ఆ మృగాన్ని చూసింది ఆవిడ ఆశ్చర్యపోయింది అబ్భాహ్..! ఎంత అందమైన మృగం ఈ మృగం అంది, అని వెంటనే రామ లక్ష్మణుల్ని పిలిచింది అక్కడ ఉన్నవాళ్ళను వెంటనే బయటికి రమ్మని పిలిచింది, ఆర్యపుత్రా! అని పిలిస్తే రామ చంద్ర మూర్తి వచ్చారు లక్ష్మణుడు వచ్చాడు చూడండి చూడండి ఆ మృగం ఎంత అందంగా ఉందో బంగారు చుక్కలతో మెరిసిపోతూంది అంది. వెంటనే లక్ష్మణుడు అన్నాడూ
శంకమాన స్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమ్ అబ్రవీత్ ! తమ్ ఏవైనమ్ అహం మన్యే మారీచం రాక్షసం మృగమ్ !!
చరన్తో మృగయాం హృష్టాః పాపేన ఉపాధినా వనే ! అనేన నిహతా రామ రాజానః కామ రూపిణా !!
మృగో హ్యేవం విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ ! జగత్యాం జగతీ నాథ మాయైషా హి న సంశయః !!
Image result for మారీచుడులక్ష్మణుడు అన్నాడూ శంకమాన స్తు తం తృష్ట్వా లక్ష్మణో రామమ్ అబ్రవీత్ అనుమానాస్పదంగా మృగంవంక చూసి లక్ష్మణుడు రాముడితో అన్నాడూ అన్నయ్యా ఇది మృగం కాదు ఎందుకో తెలుసా... అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఇటువంటి బంగారు చుక్కలు కలిగినటువంటి మృగం ఉంది భూమండలం మీద అని ఉన్నదా..? ఎక్కడా లేదు ఈ మృగం మారీచుడు, మారీచుడు ఇటువంటి వేషాలలో తిరుగుతూ వేటకు వచ్చినటువంటి రాజుల్ని భక్షించి ఎందరో రాజుల్ని తిన్నాడు, ఆ మారీచుడే మనకేదో ప్రమాదాన్ని తలపెట్టడం కోసమని ఇటువంటి మృగరూపంలో ఇక్కడ తిరుగుతున్నాడు కాబట్టి అన్నయ్యా నీవు నమ్మద్దు అన్నాడు. అంటే సీతమ్మ అందీ యది గ్రహణమ్ అభ్యేతి జీవన్ ఏవ మృగ స్తవ ! ఆశ్చర్య భూతం భవతి విస్మయం జనయిష్యతి !! సమాప్త వన వాసానాం రాజ్యస్థానాం చ నః పునః ! అంతః పుర విభూషార్థో మృగ ఏష భవిష్యతి !! అసలు లక్ష్మణుడు చెప్తున్నటువంటిమాటల్ని పట్టించుకోనిదాల్నా ఆవిడందీ ఏమండీ ఏమండీ! నేను చెప్పింది వినండీ..! అని రామునితో యది గ్రహణమ్ అభ్యేతి మీరు కాని ఈ మృగాన్ని పట్టుకుంటే అది బ్రతికున్న మృగాన్ని తీసుకొచ్చారా సమప్త వనవాసానాం రాజ్యస్థానాం చ నః పునః మనకు వనవాసం అయిపోతుందిగా, మనం మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతాముగా చక్కగా ఈ మృగాన్ని పట్టుకెళ్ళి మనం ఉద్యానవనంలో విడిచిపెడితే ఈ మృగం తిరుగుతుంటే అందరూ చూసి ఎంత సంతోషిస్తారో... ఎంత బాగుందో మృగం అంటారు.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
Related imageఒకవేళ ఈ మృగం ప్రాణాలతో దొరకలేదు అనుకోండి మీరు ఈ మృగము యొక్క చర్మాన్ని తీసుకొస్తే నేను మీతో కలిసి ఈ పచ్చికబయళ్ళలలో ఈ మృగచర్మం మీద కూర్చుని వినోదిస్తాను కాబట్టి జీవన్ న యది తేభ్యేతి గ్రహణం మృగ సత్తమః ! అజినం నర శార్దూల రుచిరం మే భవిష్యతి !! ప్రాణాలతో జింక దొరకకపోతే ఇబ్బందిలేదు దాన్ని చంపేసి ఆ చర్మాన్ని తీసుకురండి, కానీ ఒక ఆడది ఇంతలా నిగ్రహించి తీసుకురండీ తీసుకరండీ తీసుకరండీ అని చెప్పేసి ఒక జింకమీదకు పంపిస్తుందీ అని అనుకుంటున్నారా ఆర్యపుత్రా..! కామ వృత్తమ్ ఇదం రౌద్రం స్త్రీణామ్ అసదృశం మతమ్ ! వపుషా తు అస్య సత్త్వస్య విస్మయో జనితో మమ!! ఆడది భర్తని నిగ్రహించి అందులో ప్రమాదము ఉందేమోనని భర్త తత్తరపడుతున్నాకూడా... అదే కావాలి అదే కావాలని రౌద్ర ప్రవృత్తితో హఠం చేసి తెమ్మని అడగకూడదు, కానీ నాకు కుతూహలం కలిగింది అంది ఆవిడ. కుతూహలమూ అంటే ఎలాగైనా ఇంత అందంగా ఉంది కాబట్టి దీన్ని నాదాన్నిచేసుకోవాలన్ని తాపత్రయం ఏర్పడింది, కాబట్టి రామా! మీరు నాకు దాన్ని తెచ్చిపెట్టవలసింది.
రాముడు అన్నాడు వెంటనే చాలా చమత్కారమైన విషయమండీ శ్రీరామాయణం రాముడు అన్నాడూ యది వాయం తథా య న్మాం భవేత్ వదసి లక్ష్మణ ! మాయైషా రాక్షస స్యేతి కర్తవ్యోస్య వధో మయా !! ఆయన వెడదామని నిశ్చయించుకుని లక్ష్మణునికి చెప్తున్నాడు, సీతమ్మకు చెప్పట్లేదు నేను వెళ్ళొచ్చేస్తానులే నేను తప్పకుండా మృగాన్ని పట్టుకొచ్చేస్తానులే నీకేం భయంలేదు అని చెప్పి వెళ్ళడంలేదు ఆయన లక్ష్మణునితో మాట్లాడుతున్నాడు అంటే లక్ష్మణుడు అన్నమాటలలో ఉన్న సత్యాన్ని రాముడు గుర్తించలేదూ అని అనుకోవడానికి మనము అనుకోకూడదు, ఆయన బాగా ఆలోచించాడు ఆయన అన్నాడూ ఒకవేళ లక్ష్మణా! నీవు చెప్పినట్లుగా ఇది మృగం కాకపోతే రాక్షసుడై ఉంటే అప్పుడైనా చంపేయాలిగా రాక్షసుడు ఇలా తిరుగుతుంటే ఊరుకోకూడదుగా చంపేయాలిగా కాబట్టి వెడుతాను ఏతేన హి నృశంసేన మారీచేనాకృతాఽఽత్మనా ! వనే విచరతా పూర్వం హింసితా ముని పుంగవాః !! మారీచుడు ఇతః పూర్వం తమ ధర్మాన్ని తాము అనుష్టిస్తున్నటువంటి మునిపుంగవులనీ బాధ పెట్టాడూ, వేటకు వచ్చిన రాజులను కూడా కబళించి తిన్నాడు కాబట్టి ఒకవేళ ఆ మారీచుడైతే ఆ మారీచున్నైనా నేను సంహరించవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చంపడం కోసం బయలుదేరవలసి ఉంటుంది.
ఆ మారీచునికి రాముడు రెండుమాట్లు ప్రాణభిక్ష పెట్టాడు రెండుమాట్లు ప్రాణభిక్ష పెట్టబడినటువంటి మారీచుడు మూడోమాటు రాముడికి ఏదటపడుతున్నాడు మూడోమాటు ఎదటపడ్డాక మరణించాడు రెండు మాట్లు ప్రాణభిక్ష రాముడి దగ్గర పెట్టుకున్నటువంటి మారీచుడే మూడోమాటు చచ్చిపోతూ రాముడికి జీవితంలో ఎన్నడూ కలగనంత దుఃఖానికి కారణమయ్యాడు. రాముడు దుఃఖపడ్డాడూ అనే చెప్పవలసి వస్తుంది ఒక నరుడిగా... అలా చెప్పకపోతే నరత్వానికి అర్థంలేదు కాబట్టి లక్ష్మణునితో అన్నాడూ ఇహ త్వం భవ సన్నద్ధో యన్త్రితో రక్ష మైథిలీమ్ ! అస్యామ్ ఆయత్తమ్ అస్మాకం యత్ కృత్యం రఘు నన్దన !! నేను ఇప్పుడు ఆ మృగాన్ని వేటాడటానికి వెళ్తున్నాను లక్ష్మణా నీవు మాత్రం తస్మాత్ జాగ్రత్త. ధనస్సు పట్టుకుని సీతమ్మని చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ ఉండు సీతమ్మని ఒంటిరిగా విడిచిపెట్టి మాత్రం నీవు ఎక్కడికీ వెళ్ళద్దూ ఇక్కడే ఉండి సీతమ్మని కాపాడు అహమ్ ఏనం వధిష్యామి గ్రహీష్యామి అథ వా మృగమ్ ! యావత్ గచ్ఛామి సౌమిత్రే

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
మృగమ్ ఆనయితుం ద్రుతమ్ !! నేను ఈ మృగాన్ని తీసుకురావడానికి వెడుతున్నాను దీన్ని సజీవంగానైనా తీసుకొస్తాను చంపైనా తీసుకొస్తాను నేను సజీవంగా తీసుకొచ్చినా చంపి తీసుకొచ్చినా నేను తీసుకొనివచ్చేలోపల మాత్రం నీవు ఇది విడిచిపెట్టి వెళ్ళకూడదు సీతమ్మ దగ్గరే ఉండాలి.
Image result for మారీచుడుఇప్పటివరకు లక్ష్మణుడు రాముని మాటని తిరస్కరించినటువంటి సందర్భమేలేదు, ఇప్పుడు రాముడు వెడుతున్నా అక్కడ ఒక పెద్ద రక్షణ పెట్టేవెళ్ళాడు సీతమ్మ దగ్గర లక్ష్మణున్ని కాపుదలపెట్టి వెళ్ళాడు ప్రదక్షిణే నాతి బలేన పక్షిణా జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ భవాప్రమత్తః ప్రతిగృష్య మైథిలీం ప్రతి క్షణం సర్వత ఏవ శంకితః !! ఆయన చాలా పెద్దమాట చెప్పివెళ్ళాడు వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం సర్వత ఏవ శంకితః ప్రతి క్షణం అనుమానమును పొందుతూనే ఉండు సీతమ్మని రక్షించేటప్పుడు అని చెప్పాడు అంటే..? నీ కంటికి కనపడినది నీ కంటికి కనపడిన యదార్థస్వరూపమని నమ్మవద్దూ అంటే బయలుదేరుతున్న రాముని మనసులో ఏదో అనుమానం ఉన్నదీ అన్న విషయాన్ని ధృవికరీస్తుంది. సీతమ్మ అంతగట్టి పట్టుబట్టి అడగడంవల్ల అగస్త్యుడు అన్నాడుగా... ఆవిడ ఏది అడిగితే అది చెయ్యి అన్నాడుగా ఆఁసమయం వచ్చేసింది కాబట్టి అంతగట్టి పట్టుబట్టి ఎన్నడూ అడగని సీతమ్మ అడిగితే కాదనలేక బయలుదేరుతున్నాడు తప్పా మనసులో ఏదో అనుమానం రాముడుకి ఉంది అందుకే ప్రతిక్షణం శంకతోటేవుండు నీవు జటాయువుతోకలసి రక్షణ చేస్తూవుండు అని చెప్పాడు. ఇందులో తనంతతాను చెప్పంది జటాయుకి, జటాయువుకి ఈ సందర్భంలో ఏం చెప్పలేదు ఆయన నీవు చూస్తూండు జాగ్రత్తా నేను మారీచుడికోసం వెళ్తున్నాను లేకపోతే మృగంకోసం వెళ్తున్నానని చెప్పలేదు చెప్పింది లక్ష్మణునికి చెప్పాడు జటాయువుతో కలసి జాగ్రత్తగావుండూ అని బలవంతుడైన జటాయువుతో కలసి ఎందుకంటే ప్రదక్షిణే నాతి బలేన పక్షిణా చెప్పి రాముడు అరణ్యములోకి బయలుదేరాడు.
ఆయనా ఆ విష్ణు ధనస్సు మూడుచోట్ల వంగి ఉన్నటువంటి ఆ విష్ణు ధనస్సుని, బ్రహ్మగారు ఇచ్చినటువంటి బాణాన్ని అక్షయబాణ తూనీరాల్ని ఇన్నిటిని కట్టుకుని బయలుదేరాడు, ఆయనేం తక్కువ అంచనావేసి బయలుదేరాడు అని మీరేం అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఏం ఓ జింక దాన్ని కొట్టడానికి ఓ అల్లరేమిటీ అని ఏదో బోలెడు ధనస్సులుండి ధనస్సులంటే ఎప్పుడూ ఒక ధనస్సే ఉంటుందని మీరు అనుకోకండి చాలా ఉంటాయి, పీఠాలలో బోలెడన్ని సత్యదండాలుంటాయి గదా... పక్కన అలాగే బోలెడన్ని ధనస్సులుంటాయి, ఏదో ఒక ఎదురు ధనస్సుని ఏదో ఒకటి పట్టుకుని జింకనే కదా అని కొట్టడమని వెళ్ళలేదు. అలా వెళ్ళాడు అంటే ఆయనకు కూడా ఒకవేళ మారీచుడేమో నిగ్రహించవలసి ఉంటుందేమోనన్న అనుమానం ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారో కంటికి కనపడకుండా కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలన్న పరాకుతోటే రాముడు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కూడా సీతమ్మకి రక్షణని కల్పించే వెళ్ళాడు, కానీ దేవతాకార్యం జరగాలి.
కాబట్టి వెంట తరుముతున్నాడు కనపడుతోంది అదృష్యమైపోతూంది పొదలమాటుకు వెళ్ళుతోంది మళ్ళీ ఆశ కల్పిస్తోంది మళ్ళీ కనపడుతోంది ఆకాశంలోకి వెళ్ళిపోతోంది అంతర్ధానమౌతూంది మళ్ళీ కనపడుతోంది ఇలా రామున్ని వెనక పరుగెత్తిస్తూ ఆశ్చర్యమొందించి చాలా దూరం తీసుకెళ్ళిపోయింది. చాలా దూరం తీసుకెళ్ళిపోయిన తరువాత రాముడుకి కించిత్ ఖేదం కలిగింది, ఒక మృగం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఇప్పటికీ గురి కదరట్లేదు ఎందుకు పరుగెత్తుకొచ్చాడు అంటే Related image

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఆయన బాణం తీసి వింటినారి ఎప్పుడు తగల్చి విడిచిపెడతాడో తెలియదూ అని చెప్పింది శూర్పణఖ అంత వేగంగా బాణాన్ని సంధించగలిగినటువంటి రామునికి బాణాన్ని సంధించగలగినటువంటి అవకాశాన్ని మారీచుడు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అంటే రాముని యొక్క ప్రజ్ఞ రెండుమాట్లు తెలుసుకుని ఉన్నాడు దూరంగా వెళ్ళాలంటే తను ఎన్ని మాయలు పన్నాలో అన్ని మాయలు పన్నుతూనేవున్నాడు, అంటే మీకొక విషయం అర్థం కావాలి. మారీచుడు రామ భక్తితో ఉన్నాడా రావణ భక్తితో ఉన్నాడా! నాకు చెప్పండీ... రామ భక్తితోటే రావణ భక్తితో కూడా ఉన్నాడు. గుండెలలో ఉన్నది రామ భక్తి రాముని గొప్పతనం అర్థమయ్యింది కానీ ఇప్పుడు రాముని చేతిలో చచ్చిపోవడం ప్రభువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎందుకంటే ఎలాగో రావణుడు పోతాడు లంకతో సహా... అందుకే వచ్చింది వాడి పుర్రెలోకి ఈ ఆలోచన.
కాబట్టి ఇప్పుడు ఈ ఉద్దేశ్యంతోటే ఆయన రామున్ని దూరంగా తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తరువాత ఒకసారి ఆ మృగం కనపడింది రామునికి కోపం వచ్చింది ఇక ఈ మృగాన్ని విడిచిపెట్టడం కుదరదు అనుకున్నాడు, గభాల్నా ఎంత పెద్ద బాణం పడితే అంత పెద్ద బాణాన్ని చటుక్కున తీసి వెయ్యకూడదు అలా వేశారనుకోండి అటువంటి వారికి ఉపదేశం చేయకూడదు ధనుర్వేదాన్ని, ఎందు చేతా అంటే..? అంత తొందరపాటున్న వ్యక్తి చాలా చిన్న ప్రాణి మీద అధికమైన శక్తి కలిగి ఉన్న బాణాన్ని ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి లోకానికి ఉపద్రవాన్ని కల్పిస్తాడు అశ్వథామ బ్రహ్మాస్త్రాన్ని వేసేసినట్టు. అందుకని అటువంటి వారికి నేర్పకూడదు, నేర్పవలసి వచ్చినా ద్రోణాచార్చులవారు ప్రయోగం నేర్పారు తప్పా ఉపసంహరణ నేర్పలేదు అందుకే ఉపసంహారం తెలియదు కాబట్టి వేయడేమో అనుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రాముడు ముందే వేసేయచ్చుగదాండీ... ఆశ్రమంలో నిలబడి ఈ బాణం వేసేస్తే బ్రహ్మదత్తమైనటువంటి బాణం ఎక్కడున్నా కొట్టేస్తుంది మారీచున్ని, అది రాముడి శీలం కాదు ఆ రాముని యొక్క ధర్మాన్ని అడ్డుపెట్టే..? రాముని ధర్మం మీద ఇంత నమ్మకం ఉంది కాబట్టే... రామో విగ్రహవాన్ ధర్మః అని చెప్పాడు కాబట్టే తను కనపడీ కనపడక రామున్ని దూరంగా తీసుకెళ్ళగలనన్న నమ్మకంతో మారీచుడు ఉన్నాడు ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది.
కాబట్టి తీసుకెళ్ళగలిగాడు లేకపోతే ఒక్కసారి సంకల్పంచేసి అస్త్రప్రయోగం చేశాడనుకోండీ, దర్భని వేశాడండీ కాకాసురిని మీదా..! బాణం కాదు దర్భా... మూడు లోకాలు తిరిగింది కాకి. రాముడి కంటికి ఎదురుగుండా కనపడుతూ కాదు మూడులోకాలు తిరిగినప్పుడు రాముడి కంటికి కనపడుతుందేమిటీ మూడు లోకాల్లోనూ వెనకతిరిగింది బ్రహ్మాస్త్రం ఆయనవెంట, మరీ జింకమీద ఎందువేయలేదు అలాగా..? అప్పుడు అపచారం వేరు ఇప్పుడు సీతమ్మ కోరికవేరు జింకగా కనపడుతోంది మారీచుగా నిర్ధారణ కాలేదు జింకని అనుమానం. అనుమానంతో రాముడు అంత బాణం వేయడు. ఆయన అనుమానం బాగా ఎప్పుడు నిర్ధారణ అవుతుందంటే..? అతను పన్నుతున్న మాయలు ఒక జింక ప్రవర్తించవలసిన విధానం కన్నా అసాధారణంగా ఉన్నటువంటి అతని యొక్క మాయ అతను తన్ను అంత దూరం తీసుకెళ్ళడం ఏదో అతను కోరుకున్న స్థానానికి ఎక్కడికో తన్ను తీసుకెళ్తున్నాడు ఇలాగా అన్న అనుమానం వచ్చాక ఇక నేను వెళ్ళకుండా వీన్ని ఇక్కడ పడగొట్టటం మంచిదనిపించింది. అనిపించి సూర్య రశ్మి ప్రతీకాశం జ్వలంతం అరి మర్దనః ! సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవ ద్బహు !! తమ్ ఏవ మృగమ్ ఉద్దిశ్య జ్వలన్తమ్ ఇవ పన్నగమ్ ! ముమోచ జ్వలితం దీప్తమ్ అస్త్రం బ్రహ్మ వినిర్మితమ్ !!

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
బ్రహ్మగారిచేత నిర్మింపబడినటువంటి ఆ బాణం ఒక పాము ఎలా బయలుదేరుతుందో అలా బయలుదేరి ప్రకాశిస్తూ అరి మర్దనః శత్రువుని మర్దించగలిగినటువంటి ఆ బాణాన్ని బాగా దృఢంగా సంధించి వింటినారిని లాగి రామ చంద్ర మూర్తి విడిచిపెట్టారు.
Image result for జింకరాముని బాణానికి ఒక గొప్పతనముంటుంది, రాముని బాణం యొక్క వేగాన్ని ఎవ్వరూ లెక్కపెట్టలేరు అసలు అది కుదరదు కిష్కిందకాండలో అది దీనిమీదే కదా పెద్ద చర్చంతానూ ఈ అనుమానంతోనే అడుగాతాడు ఎదర వింటారుగా వచ్చేస్తుంది ఇంక ఒక్క రెండు మూడు రోజుల్లో... రామ బాణం యొక్క వేగం అటువంటిది అంత వేగమున్న బాణం మారీచుడి యొక్క గుండెల్ని చీల్చేసింది, చీల్చేస్తే మరణ సమయమునందు సంభోగ సమయమునందు కాము రూపులకి అసలు రూపం వచ్చేస్తుంది అప్పటివరకు మాయావేశంలో ఉన్నా ఆ సమయంలో మాత్రం వాళ్ళు కామ రూపంతో ఉండడం కుదరదు అసలు రూపం బయటికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు తను వేసుకున్నటువంటి మిథ్యా రూపం పోయింది రామ బాణం తగలగానే అంటే ప్రాణం పోతోందని గుర్తు మిథ్యా రూపాన్ని మారీచుడు వదలలేదు అదే పోయింది. అంటే మారీచుడు మృత్యువుకి దగ్గరయ్యాడు ఆ బాణం ఆయన గుండెల్ని చీల్చింది. ఒక్కసారి ఎగిరి అంత ఎత్తు ఎగిరి కిందపడ్డాడు అంటే దెబ్బయొక్క ధాటి అంతలా కొట్టింది మారీచున్ని మ్రియమాణ స్తు మారీచో జహౌ తాం కృత్రిమాం తనుమ్ కృత్రిమంగా తను ధరించినటువంటి తనువుని వదిలిపెట్టేశాడు. అసలు మారీచుడు ఎలా ఉంటాడో పర్వతాకార సన్నిధిడై అటువంటి మారీచుడు అయిపోయాడు. ఇప్పుడూ మీరు ఒక్క విషయాన్ని పట్టుకోవాలి, ఈ బాణపు దెబ్బతిన్నటువంటి మారీచుడికీ అసలు రామ బాణం గుండెల్ని ఛీల్చి పైకెత్తి కిందపాడేసిన తరువాత ఉత్తర క్షణం ప్రాణాలు ఎగిరిపోవాలి, కానీ ఇంకా బ్రతికున్నాడు అంటే ఎంతటి భలాడ్యుడో మీరు గుర్తించండి, రామ బాణం తగిలాక కూడా కొంత సేపు మాట్లాడాలీ అంటే అపారమైన బలమున్నవాడై ఉండాలి.
వాలి మాట్లాడాడు అలాగ కిష్కింద కాండలో బాణం తగిలాక కూడా... ఈయనా ఇంకా స్మరణ మిగిలింది ఇంకా ఆలోచించగలిగినంత శక్తి మిగిలే ఉంది, ఆలోచించవలసినటువంటి శక్తి నశించిపోయినటువంటి వాడుకాడు మారీచుడు. వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకో తెలుసా..? స్మృత్వా తత్ వచనం రక్షో అతనికి రావణాసురిని యొక్క మాట జ్ఞాపకానికి వచ్చింది, ఏమనీ నేను సీతాపహరణం చెయ్యడానికి నీవు మాయా మృగంగా వెళ్ళాలి అన్నమాట జ్ఞాపకానికి వచ్చింది రామున్ని దూరంగా తీసుకెళ్ళాలి రాముని చేతిలో నీవు మరణిస్తావు ఇప్పుడు తన మరణం రావణుని కొరకు మరణించాడు, రావణుని కొరకు మరణించినా రాముని చేతిలో మరణించాడు. రాముని చేతిలో మరణించడం వల్లా ప్రభువు యొక్క సేవకుడుగా తాను మరణిస్తే తన ధర్మం తాను తప్పకుండా మరణించినట్టు అవుతుంది ఇప్పుడు ధర్మ మూర్తిని అర్థం చేసుకున్నవాడు తన ధర్మమునకు కట్టుబడిపోయాడు.
కాబట్టి స్మృత్వా తత్ వచనం రక్షో దధ్యౌ కేన తు లక్ష్మణం అలోచించాడు నేను మరణిస్తున్నాను రామ బాణం తగిలింది రామున్ని దూరంగా తీసుకొచ్చేశాను లక్ష్మణున్ని తీసుకొచ్చేయ్యాలి ఇప్పుడు తీసుకొచ్చేస్తే తప్పా అక్కడ సీతాపహరణం జరగదు అక్కడ ఉన్నాడు రావణుడు లక్ష్మణుడు ఎలా వచ్చేస్తాడు ఆలోచించి ఇహ ప్రస్తాపయేత్ సీతా శూన్యే తాం రావణో హరేత్ అక్కడ్నుంచి లక్ష్మణుడు బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తే తప్పా అక్కడ ఖాలీ సూన్యమైతే తప్పా సీతమ్మకి రక్షకులు

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
లేకుండా ఉంటే తప్పా సీతాపహరణము జరగదు కాబట్టి స ప్రాప్త కాలమ్ ఆజ్ఞాయ వెంటనే అతనికి ఆలోచన వచ్చింది ఏం చెయ్యాలో చకార చ తతః స్వరమ్ రాముని యొక్క కంఠమును అనుకరించాడు మాయలున్నవాడు కాబట్టి అంటే అనుకరణ విద్యా అన్నది అప్పుడే ఉన్నదన్నమాట, చకార చ తతః స్వరమ్ సదృశం రాఘవ స్యైవ అచ్చు రాముడి కంఠంతో హా సీతే లక్ష్మణేతి చ హా సీతా... హా లక్ష్మణా... అని రాముడిలా... ఉన్న శక్తి నంతటిని కూడదీసుకుని సీతా లక్ష్మణులకు వినిపించేటట్టుగా పెద్ద కేకవేసి కిందపడి శరీరం విడిచిపెట్టేశాడు. అంటే..! మీరొకటి బాగా... జ్ఞాపకంపెట్టుకోవాలి ఇక్కడ మారీచుడు మరణించడానికి ఆఖర్న తెలివుంది కాబట్టి రెండు మార్గాలు ఉన్నాయి అతనికి ఒకటి హా రామా..! అంటూ మరణించడం ఒకటి హా సీతా... హా లక్ష్మణా అంటూ మరణించడం ఒకటి.
Image result for హా సీతా హా లక్ష్మణాకదాండీ! కొద్దిగా తెలివుంది కాబట్టి ఇప్పుడు నేను ఏమంటూ చచ్చిపోవచ్చూ అన్నది ఆలోచించగలిగాడు అని మహర్షి చెప్తున్నాడు గదా..! ఈ ఆలోచన వచ్చిన వాడికి హా రామా... అంటూ చచ్చిపోదాము అని ఈ నామం నన్ను గట్టెక్కించగలదని తెలియనటువంటివాడా? తెలియనివాడేం కాడు. రాముని యొక్క గొప్పతనాన్ని అంతగొప్పగా చెప్పాడు కళత్రాణి సౌమ్యాని మిత్ర వర్గం తథైవ చ ! యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియమ్ !! ఇన్ని చెప్పినటువంటి వాడు నిజంగా హా రామా... అంటూ చచ్చిపోవాలి అంటే హా రామా... అంటూ చచ్చిపోలేడా..? చచ్చిపోగలడు. కాని హా రామా అంటూ తాను చచ్చిపోతే సీతాపహరణం జరగదు. ఇప్పుడు తనేం అనుకుంటున్నాడు సీతాపహరణం జరిపించాలి సీతాపహరణం జరిపించాలంటే ఎవరి కోర్కె తీర్చాలనుకొంటున్నాడు రావణుని కోర్కె తీర్చాలనుకుంటున్నాడు, రావణుడి కోర్కె తీర్చినట్టు కనపడీ జరగవలసిన దేవతాకార్యానికి తాను పనిముట్టు అవుతున్నాడు తాను సమిధనౌతున్నాడు, అంటే సీతమ్మ తేజస్సు మీద అంత నమ్మకమున్నా..! సీతమ్మ తనను తాను రక్షించుకోదూ ఎందుకంటే ఆవిడ పతివ్రతా ధర్మానికి కట్టుబడుతుంది. భర్తచేత రక్షింపబడాలని కోరుకుంటుంది, కాబట్టి తీసుకెళ్ళుతాడు కానీ రావణుడు కోరుకున్న కోరిక మాత్రం తీరదు, సీతమ్మని ఏ కోర్కె కొరకు తీసుకెళుతున్నాడో... అది మాత్రం సాధించలేడు, ఎందుకంటే ఆమె సౌశీల్యవతి మహా పతివ్రత ఇప్పుడు ఆమెను రక్షించాలంటే తనను తాను రక్షించుకోని భార్యను రక్షించడానికి భతృధర్మం బాగా ఎరిగిన రాముడు వెడుతాడు. రాముడు వెళ్ళిన తరువాత మూర్ఖుడైన రావణుడు నా భార్యని ఇచ్చైయ్ అంటే ఇవ్వడు మాట వినడు, వినని కారణంచేత యుద్ధం వస్తుంది యుద్ధంలో లంకకు వెళ్ళినటువంటి రాముడు రావణున్ని ఒక్కన్నే చంపడు రావణుని తరుపున అందరూ వస్తారు కాబట్టి ఇంకా రావణుడు రాక్షసులు సర్వనాశనమై తీరుతారు ఇది నేను ఇంతకుముందే చెప్పాను, కాబట్టి నా ధర్మం ఇక్కడితో పూర్తైపోయింది ప్రభు కార్యం పూర్తిచేసి రామ బాణానికి నిహతుడైపోతున్నాను.
ఇంత ఆలోచనా... ఈ ఆలోచన అడుగున దాక్కుందీ అని మీరు కనిపెట్టగలగి ఉండాలి, కాబట్టి ఆలోచనా అంటూ ఉంది కాబట్టి దానిలోపల పరంపరగా ఇంత ఆలోచనా కూడా ఉంది, కాబట్టి హా రామా... అనకుండా హా సీతే లక్ష్మణేతి చ హా సీతా హా లక్ష్మణా అంటూ మారీచుడు మరణినించడం వెనక ఇంత కథ ఉంది. ఇటువంటి భావమే ఆయన మనసులోకి వచ్చేటట్టుగా రాముడు అర్థమయ్యేటట్టు ఆయన బుద్దిని ప్రచోదనం చేసి సిద్ధం చేసినటువంటి వారు ఎవరై ఉండి ఉండాలని మీరు అనుకుంటున్నారని మీరు నేను ఊహించగలరు దేవతలే, కాబట్టే రెండుసార్లు బ్రతికి మూడవమాటు మరణించి రామ కథను మలుపు తిప్పాడు. ఇప్పుడు ఈ మాట వినగానేటా రాముడు నిర్ఘాంతపోయాడట, ఎదురుగుండా ఎంతటి హరివీర భయంకరుడైనా చంపగలడు కుట్ర చేసేటటువంటివాన్ని కొట్టటం చాలా కష్టం ఎందుకంటే చచ్చిపోయాడండీ ఇంకేం చేస్తారు మీరు చచ్చినవాన్ని చంపలేరుగా అరిచిన అరుపు ఖచ్చితంగా ఇప్పుడు సీతయందూ లక్ష్మణునియందు ఆందోళన కలిగిస్తుంది ఇది ఏ ప్రమాదం తెస్తుందో అని రాముడు కాసేపు విచలితుడైపోయాడట. అంటే తను శంకిస్తున్నది ఏదైతే ఉందో ఆ ప్రమాదము దాపురించినది ఆ ప్రమాదము వచ్చేసింది ఇందుకు తీసుకొచ్చాడు నన్ను ఇంత దూరం, ఇంత దూరం నేను వచ్చేయడం నేను పెట్టినటువంటి కాపుదల భగ్నమైపోయింది ఇప్పుడు.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు లక్ష్మణుడు కదలడు కదా..? సీతకు అపకారం జరుగదు కదాని... ఈ భయం రామ చంద్ర మూర్తిని ఆవహించింది, ఎంత గమ్మత్తుగా తీసుకొస్తారండీ, అయితే హా సీతే లక్ష్మణేతి చ అని అరచినా సీతమ్మ లక్ష్మణుడు అనుమాన పడకపోతే ఏం ఉపయోగం ఏమీలేదు మారీచ వధ అవుతుంది అంతే... ఇప్పుడు లక్ష్మణుడు కదలాలంటే రామాజ్ఞ లేకుండా కదులుతాడా..? వదినా నీవు ఇక్కడే ఉండు అన్నయ్య అరుస్తున్నాడని పరుగెత్తుక వెళ్ళిపోతాడా..! అలా లక్ష్మణుడు తనంత తాను పరిగెడితే సీతను తీసుకొనే పరుగెడుతాడు తప్పా సీతను విడచి వెళ్ళడు. మరి ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళాలి కథకి అత్యంత కీలక ఘట్టం ఎక్కడుందంటే... లక్ష్మణుడు వదలాలి సీతమ్మతల్లి ఉన్న స్థానాన్ని వదిలిపెట్టేయాలి, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి లక్ష్మణుడు ఎలా వెళ్ళిపోవాలో తెలుసా..? వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సమీపంలో ఉండడానికి కూడా ఆయన మనసు అంగీకరించనంతగా త్రికరణ శుద్ధిగా వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేటట్టు మనసు విరిగిపోవాలి లక్ష్మణునికి. ఎందుకనీ అన్నయ్య ఒక మాట చెప్పాడు నేను మరణించిన మృగాన్ని కాని బ్రతికున్న మృగాన్ని కాని తెచ్చేవరకు నీవు వెళ్ళకూడదు అన్నాడు.
ఇప్పుడు తాను చేసేది రామాజ్ఞను ధిక్కరించడమే... అసలు భరతుడుకాని శత్రుజ్ఞుడు కాని లక్ష్మణుడుకాని రామాజ్ఞను ధిక్కరించడము అన్నది మీరు రామాయణంలో ఎక్కడైనా చూశారా..! లేదు రామాజ్ఞనే ధిక్కరించవలసినంత పరిస్థితి ఎలా రావాలి... చాలా సహజంగా తీసుకొచ్చేశారు. అందుకే నరుడి కథని నరుడి కథగానే అల్లారు ఎంత అందంగా అల్లారంటే ఇందులోని సహజత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సహజత్వము అన్న మాట నేను అన్నాను కాబట్టి నేనొక ఉపమానము చెప్తే పట్టుకుంటారు. నేను రాముడి పాత్ర వేస్తున్నాననుకోండి నా బిడ్డలిద్దరూ లవకుశల పాత్రలు వేస్తున్నారనుకోండి, నేను రాముడి పాత్ర వేస్తూ లవకుశలేవరో నాకు తెలియదుగా... నా బిడ్డలూ అని తెలియదుగా రామునికి లవకుశలెవరో తెలియదు. కాబట్టి నేను ఆశ్రమానికి వచ్చాను వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నా బిడ్డలిద్దరూ లవకుశుల వేషంలో ఉన్నారు. ఎంతటి తోజో మూర్తులు ఎవరి బిడ్డలో అన్నాను నేను, ఆ నాటకంలో ముందు కూర్చున్న హరి ప్రసాద్ గారు గోపాల కృష్ణగారు లేచి మూర్ఖుడా నీ బిడ్డల్ని నీవు గుర్తు పట్టలేవురా..! అన్నారనుకోండి ఆ ఏమైనా అందముందా అందులో... నేను నా బిడ్డలిద్దరినీ గుర్తు పట్టేశాననుకోండి, ఏరా... ఓరేయ్ బాగ కట్టావురా వేషం అన్నాననుకోండి ప్రేక్షకులందరూ ఏమంటారు అక్కడ నేను నా బిడ్డలను ఎంత గుర్తు పట్టనట్టు ఉంటే... అంత సహజత్వము అవునా కాదా, అదే నటన కదాండీ! సహజత్వం అనేటటువంటిది ప్రాణం పోస్తుంది ఎప్పుడూనూ సహజత్వం ఎక్కడ నుంచి ప్రాణం పోస్తుంది ఇప్పుడు కథకి మహా పతివ్రతయైన సీతమ్మను మీరు నరకాంతగా ఊహించండి.
Image result for హా సీతా హా లక్ష్మణాకాసేపు ఆవిడ దేవతా స్త్రీ అండీ త్రికాలవేదండీ అది పక్కన పెట్టండి హా సీతా హా లక్ష్మణా అని ప్రాణం పోయేటప్పుడు ఉన్నటువంటి బాధతో రామ కంఠంతో అరచినటువంటి మారీచుడి యొక్క కేక విన్న సీతమ్మ ఏమనుకుంటుంది అయ్యబాబోయ్... ఎంత పెద్ద కేక వినపడుతూందీ... ఆయనకి ఏం ప్రమాదం వచ్చిందో అనుకుంటుందా... ఏమీ అవదు ఆయనకు అంటుందా..? నేను అన్నది ఇదే ఏమీ అవదాయనికి అని మీరు అన్నారనుకోండి అలా అనాలండీ అని మీరు అన్నారనుకోండి రామాయణంలో నేను మా అబ్బాయినీ అమ్మాయినీ గుర్తుపట్టాలని చెప్పినట్టు అలా అనకూదండీ అని మీరు

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
చెప్పినప్పుడు, సహజమండదీ భార్య ఎలా గుర్తు పడుతుందండీ అదీ అయ్యో బాబాయ్ మా ఆయన అంత కష్టంలో ఉన్నారు కాబట్టి నేను పరుగెడుతామంటుందా... లక్ష్మణా వెళ్ళు రక్షణకు ఉంటుందా క్షత్రియుడు పక్కన అన్నీ తెలిసున్నవాడు కాబట్టి తమ్మున్ని నీవు వెళ్ళు ముందు అంటుంది. వదినా నీకు ఎలాగ అంటే నాకేమయ్య బాబు నేను శుభ్రంగా ఉన్నాను నాకేం ఇప్పుడు గొడవేముంది ఇక్కడ ఎవరు రాక్షసులు లేరు. ముందు మీ అన్నయ్య బాధపడుతున్నారు వెళ్ళు అంటుందా..? లేకపోతే అవును అవును నాకేమైనా అయిపోతుందేమోనని నీవు ఇక్కడే ఉండు నీవు ఎక్కడికీ వెళ్ళుకు వస్తే వస్తాడు లేకపోతే లేదు మీ అన్నయ్య అంటుందా..! పైగా మహా పతీవ్రత వెళ్ళమనే అంటుంది.
ఈ సహజత్వంతోటే రామాయణం ప్రకాశించింది మీరు ఇది అర్థం చేసుకోవాలి అత్యంత కీలక ఘట్టం ఎవరికో తెలుసాండీ సీతా రామ లక్ష్మణులకే కాదు అది చదివే శ్రోతకు కూడా... రామాయణం చదివే శ్రోత కూడా ఇక్కడ రామాయణాన్ని యదార్థంగా అలాగే నరుడి యొక్క కథగానే భావించి చూడవలసి ఉంటుంది. అలా చూడ్డంలో మీరు విఫలమైపోయారనుకోండి ఇక్కడ రామ కథ ఏమైపోతుందంటే కృతకంగా ఉందండీ అనిపిస్తుంది మీకు అలా అనిపించకూడదూ అంటే..? మీరు బాగా జ్ఞాపకంపెట్టుకోండి మీరు ఆ సహజత్వము అన్నదాన్ని ఎప్పుడు మీరు ఆ దృష్టిలో పెట్టుకునే రామాయణాన్ని చదవవలసి ఉంటుంది. కాబట్టి ఆర్త స్వరం తు తం భర్తు ర్విజ్ఞాయ సదృశం వనే ! ఉవాచ లక్ష్మణం సీతా గచ్ఛ జానీహి రాఘవమ్ !! అంతేగదాండీ ఏ భార్యయైనా అనేది పేద్ద కేక వినపడింది హా సీతా హా లక్ష్మణా... అని అయ్యేయ్యో అడవిలో మీ అన్నగారు పేద్ద ఆర్థనాదాం చేస్తున్నారు లక్ష్మణా తొందరగా బయలుదేరు అంది ఆవిడ న హి మే హృదయం స్థానే జీవితం వావతిష్ఠతే ! క్రోశతః పరమాఽఽర్తస్య శ్రుతః శబ్దో మయా భృశమ్!! ఆక్రన్దమానం తు వనే భ్రాతరం త్రాతుమ్ అర్హసి ! వెళ్ళు లక్ష్మణా వెళ్ళు అంటే ఆయనేం కదల్లేదు ఇంకా అయ్యెయ్యో అరణ్యంలోంచి మీ అన్నగారు రక్షించు రక్షించు అన్న అర్థం వచ్చేటట్టుగా అరుస్తున్నాడు హా సీతా హా లక్ష్మణా అని ఎంత ప్రమాదం వచ్చిందో ఆయనకి వెళ్ళు తొందరగా ఇంకా నిలబడుతామేమిటి కదులు అందావిడా... అనదాండి ఆమాట భార్య అంటుంది, అనదూ అని ఎవరిమైనా అనగలమా... ఈ కథలో, కాబట్టి కదులూ అంది ఆవిడా   జగామ తథోక్త స్తు బ్రాతుః ఆజ్ఞాయ శాసనమ్ ! తమ్ ఉవాచ తత స్తత్ర కుపితా జనకాఽఽత్మజా !! కదలలేదు లక్ష్మణుడు ఎందుకు కదలలేదటా..! వాల్మీకి రామాయణంలో ఓ గమ్మత్తు ఉంది మనమేమీ పెద్ద తీర్పులు చెప్పక్కరలేదు ఎవరు ఎందుకు కదలలేదో ఆచమనం చేస్తే మనస్సులు కూడా తెలుసుకోగలిగిన వాల్మీకి మహర్షి ఉన్న సత్యాన్ని ఆయనే చెప్తారు భ్రాతుః ఆజ్ఞాయ శాసనమ్ తన అన్నగారు ఏది చెప్పాడో అది ఆయనకీ శాసనం, ఆయన ఆజ్ఞాపించి వెళ్ళాడు నేను వచ్చేవరకు నీవు ఎక్కడికి వెళ్ళకూడదూ అని చెప్పాడు.
నేను వచ్చేవరకు అనేమాట బాగానే ఉంది కదాండీ..? ఇప్పుడు అక్కడ ప్రమాదంలో ఉన్నాడు కదా వస్తాడో రాడో అన్న అనుమానం కదా ఉన్నది, అనుమానం సీతమ్మకుంది లక్ష్మణునికుందని మీకెవరు చెప్పారు లక్ష్మణునికి లేదు లక్ష్మణుని అనుమానం ఏమిటంటే మొదటినుంచి శంకమాన స్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమ్ అబ్రవీత్ అన్నారు మహర్షి అనుమానాస్పదంగా ఇది రాక్షస మాయా అని గమనించి అనుమానంతో చూస్తున్నటువంటివాడు లక్ష్మణుడు ఆయన దృష్టికోణం అటే ఉంది మా అన్నయ్యని ఎవ్వడూ చెలకలేడు. ఎవడో రాక్షసుడు సీతమ్మకు ఆపద కల్పించడం కోసమే నన్ను ఇక్కడనుంచి కదపడానికి అలా అరిచాడు లెక్క కట్టేశాడు లక్ష్మణుడు, ఆయన కట్టిన లెక్క ఖచ్చితమే అనడానికి ఇయ్యన మారీచుడు అని చెప్పాడు మారీచుడే అయ్యాడాలేదా..? అయ్యాడు అదే లక్ష్మణుడు మళ్ళీ లెక్క కడుతున్నాడు సీతమ్మకి

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఉపద్రవం తేవడానికి నన్ను కదపడానికి ఎవడో అరిచాడు కాబట్టి ఆయన కదలలేదు. ఇప్పుడు రాక్షసమాయ భగ్నమవ్వాలంటే తను కదలకూడదు కాబట్టి తాను కదలలేదు కానీ కుపితా జనకాఽఽత్మజా చాలా కోపమొచ్చినటువంటి సీతమ్మందీ... న జగామ తథోక్త స్తు భ్రాతుః ఆజ్ఞాయ శాసనమ్ ఆ మనసులో అన్నగారి మాట పట్టుకుని ఉండాలని నిలబడిపోయినటువంటి లక్ష్మణుని వంక తిరిగి ఇచ్ఛసి త్వం వినశ్యన్తం రామం లక్ష్మణ మత్కృతే ! లోభా న్మమ కృతే నూనం నానుగచ్ఛసి రాఘవం !! నీకు నామీద ఆశ ఉంది అందుకే అక్కడ అన్నగారు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నీవు వెళ్ళటం లేదు అన్నగారికి ఏదైనా ప్రమాదము వచ్చి అన్నగారు పడిపోయినా వెళ్ళటం లేదంటే..? ఇక్కడ నాకోసం నన్ను పొందడం కోసం నీవు ప్రయత్నిస్తున్నావు తప్పా అక్కడ అన్నగారిని రక్షించాలన్న ఉద్దేశ్యం నీలో లేదు అందుకే నీవు ఇక్కడే నిలబడ్డావంది.
మారీచుడైనా కదపలేకపోయాడేమో కానీ వదినమ్మ మాట కదిపేస్తుంది లక్ష్మణున్ని కాబట్టి సీతమ్మందీ కి హి సంశయమ్ ఆపన్నే తస్మిన్ ఇహ మయా భవేత్ ! కర్తవ్యమ్ ఇహ తిష్ఠన్త్యా యత్ ప్రధాన స్త్వమ్ ఆగతః !! నీవు ప్రధానంగా ఎందుకొచ్చావ్ అరణ్యానికి రాముడి వెంట ఉండడానికి రామునికి పక్కన చేదోడు వాదోడుగా ఉండడానికి వచ్చావ్ తప్పా నాకు రక్షణగా ఉండి రామున్ని వదిలేయడానికి నీవు రాలేదు మరి ఇవ్వళ రాముడు ఆపదలో ఉండి హా సీతా హా లక్ష్మణా అని నీ పేరు కూడా పెట్టి పిలిస్తే నీవు ఎందుకు కదలటం లేదు నన్ను రక్షిస్తాను అంటేవేమిటీ ఇక్కడా నన్ను రక్షించడానికి నాకేమాపద వచ్చింది నాకేం రాలేదే పరుగెత్తుకెళ్ళి అన్న ఎలా ఉన్నాడో చూసిరావలసినవాడు చూసిరాకుండా నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను నీకేమైనా అవుతుందంటావేమిటి నాకేమైనా అవ్వడానికి ఏముందు ఇక్కడ శంక అసలు ఏమీ లేదుగా నా దగ్గర ఉంటానంటావేమిటీ నీవు తప్పకుండా ఏదో మనసులో పెట్టుకునే ఇక్కడ ఉంటున్నావు మీ అన్నకు ఆపద కలగాలనే ఉన్నావు లేకపోతే నీవు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి నీ ప్రధాన కర్తవ్యం మీ అన్నదగ్గరికి వెళ్ళడం వెళ్ళకుండా ఇక్కడ నిలబడుతామేమిటీ వెళ్ళు వెంటనే... అంటే లక్ష్మణుడు రెండు చేతులు జోడించి నమస్కరించి సీతమ్మతో అన్నాడూ అమ్మా
దేవి దేవ మనుష్యేషు గన్ధర్వేషు పతిత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ
దానవేషు చ ఘోరేషు న స విద్యేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమమ్
అవధ్యః సమరే రామో నైవం త్వం వక్తుమ్ అర్హసి ! న త్వామ్ అస్మిన్ వనే హాతుమ్ ఉత్సహే రాఘవం వినా
అమ్మా! నేను నీతో యదార్థం చెప్తున్నానమ్మా... నన్ను అర్థం చేసుకో తల్లీ రామున్ని నాగులు అసురులు గంధర్వులు దేవతలు మానవులు రాక్షసులు ఈ మూడు లోకములలో దేవతలందరూ ఇంద్రుడితోసహా కట్ట కట్టకొచ్చి రాముడి ముందు నిలబడినా ఆయన భుజ పరాక్రమం ముందు నిలబడరమ్మా వీగిపోతారు కాని తల్లీ ఎవడో రాక్షసుడు మాయలు కల్పించాడు నా మాట నమ్ము ఇది దండకారణ్యం ఖరుడు మొదలైన వాళ్ళని రాముడు చంపినప్పట్నుంచీ వాళ్ళ మనసులో పగపెట్టుకున్నారు అన్నమీద ఏదో ఉపద్రవం తేవడం కోసమేనమ్మా ఎవడో మాయా కంఠంతో అరిచాడు రాముడి కంఠంలా, రాముడికి ఆపద రాదు రాముడు అలా ఎప్పుడూ అరవడు న చ తస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః ! గన్ధర్వ నగర ప్రఖ్యా మాయా సా తస్య రక్షసః !! ఎవడో రాక్షసుడు మాయలు పన్ని అరిచాడని నన్ను నమ్మమ్మా... అన్నాడు. అంటే ఆ తల్లి అందీ నీవు ఇలా కావాలని నీకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు కాని మేక వన్నె పులి లాంటి శత్రువువైన నిన్ను రాముడు తెలియక వెంట వచ్చేందుకు అంగీకరించాడు, నీవు ఎందుకొచ్చావు అన్నది నాకు ఇప్పుడు రెండు కారణాల వల్ల బలపడుతుంది ఈ రెండు కారణాల వల్లే నీవు వచ్చావు సుదుష్ట స్త్వం వనే రామమ్ ఏకమ్ ఏకోనుగచ్ఛసి ! మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా !! ఒకటి రామునివెంట వచ్చినట్టు వచ్చి ఒక్కడే ఉన్న రాముడు ఎప్పుడు మట్టుబెట్టబడతాడాయని చూస్తూ రాముడు మట్టు బెట్టబడిన తరువాత నన్ను పొందాలని రాముడివెంట వచ్చి ఉండి ఉంటావు.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
లేకపోతే ప్రయుక్తో భరతేన వా రాముడు అరణ్యవాసానికి వచ్చి 14 యేళ్ళు పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడేమోనని భరతుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు, నీవు అన్నయ్య వెనకాతలే రక్షణకు వెళ్ళినట్లుగా వెళ్ళి అన్నయ్య మరణించేటట్టు చూడూ అని చెప్పి ఉంటాడు వెనక్కి రాకుండా అందుకని మీ అన్నయ్య మరణించేటట్టు పన్నాగమేదో నీవే చేశావు, భరతుని యొక్క కోర్కెమేరకైనా వచ్చావు నా మీద కోర్కెతోనైనా వచ్చావు అందుకే నీవు కదలటం లేదు. లక్ష్మణా మీ అన్నకి జరగరానిది జరిగితే నీవు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావు సమక్షం తవ సౌమిత్రే ప్రాణం స్త్యక్ష్యే న సంశయః ! రామం వినా క్షణమ్ అపి న హి జీవామి భూతలే !! నిజంగా రామ చంద్ర మూర్తికే ఏదైనా జరగ కూడనిది జరిగితే లక్ష్మణా నీ సమక్షంలోనే నేను ప్రాణాలను విడిచిపెట్టేస్తాను తప్పా రాముడు లేకుండా క్షణం కూడా నేను ఈ భూమి మీద బతకనూ అని తెలుసుకో ఉపశృష్వన్తు మే సర్వే సాక్షి భూతా వనే చరాః ! న్యాయ వాదీ యథాన్యాయ ఉక్తోహం పరుషం త్వయా !! లక్ష్మణుడు అంటున్నాడు అమ్మా! నేను త్రికరణశుద్ధిగా పరమ భక్తితో పరమ గౌరవంతో మాట్లాడాను నేను ఎటువంటివాన్నో నేను ఎందుకొచ్చానో నీకు తెలుసు కానీ నీవు ఇవ్వాళ మాట్లాడినటువంటి మాటలు ములుకులు కలిగినటువంటి బాణములు చెవులలోకి తగిలితే ఎలా ఉంటాయో అంత బాధ కలుగుతోంది అమ్మా అంత అనరాని మాటలు ఇవ్వాళ నువ్వు నన్ను అనేశావు.
కాబట్టి తల్లీ ఇంక ఇక్కడ నేను ఉండను నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను నిమిత్తాని హి ఘోరాణి యాని ప్రాదుర్భవన్తి మే ! అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునర్ ఆగతః !! నా బాధల్లా ఒకటేనమ్మా వదినమ్మా మీ ఇద్దరినీ కలిపి సేవించుకుంటున్నాను, నేను వెళ్ళి రామునితో వచ్చిన తరువాత ఇక మీ ఇద్దరీని కలిపి సేవించడం నాకు కుదురుతుందా..! కలిసి చూస్తానా సీతారాములని ఇదొక్కటే బెంగతప్పా... నాకు ఇంకేమీ బెంగలేదమ్మా... అంటూ ఆయన అన్నాడూ... ఈ వనదేవతలందరూ సాక్షి రామాజ్ఞని నేను ఇవ్వాళ ఎందుకు ధిక్కరిస్తున్నానో ఎందుకు రామాజ్ఞను ఉల్లంఘించి వెళ్ళిపోతున్నానో నేను ఈ మాటలు వదినమ్మ అందీ అని అన్నయ్యకు ఏమని చెప్పుకోను ఇంత మాటలు అందని చెప్తున్నావా వదిలేసొచ్చీ అని రాముడంటే నాకు ఎవరు సాక్షి ఎవరున్నారు చెప్పడానికి అంటే..? నేను వచ్చేటప్పటికి నీవు ఉండవూ చెప్పేస్తున్నాడు లక్ష్మణుడు అలా ఎందుకు జరుగుతుందయ్యా రాముడు వచ్చేసిన తరువాత నేనే పంపించానని చెప్పడానికి నీవు ఉండవమ్మా..! నిన్ను రాక్షసుడు అపహరిస్తాడు చెప్పేస్తున్నాడు ఆయన కాబట్టి అమ్మా! నాకు వనదేవతలు సాక్షి ఆ వనదేవతలే నువ్వు ఇలా మాట్లాడితే వెళ్ళాను అని తెలుసుకుందురు గాక అని ఒక్కసారి ఆ వనదేవతల్నీ సూర్య

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
చంద్రుల్ని భూమిని ప్రార్థన చేశాడు. సీతమ్మ అందీ నీవు ఇంకా కదలడం లేదు గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ ఆబన్ధిష్యేథవా త్యక్ష్యే విషమే దేహమ్ ఆత్మనః పిబా మ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనమ్ న త్వహం రాఘవాత్ అన్యం పదాపి పురుషం స్పృశే ! రాముడు పక్కన లేకపోతే లక్ష్మణా ఏమనుకుంటున్నావో నీవు నన్ను పొందవచ్చుననుకుంటున్నావేమో..? గోదావరిలో దూకి చచ్చిపోతాను, ఉరిపోసుకుని చచ్చిపోతాను ఎత్తైన పర్వతం మీద నుంచి దూకి చచ్చిపోతాను లేకపోతే తీవ్రమైన విషాన్ని తాగి చచ్చిపోతాను అగ్నిహోత్రంలో ప్రవేశించి చచ్చిపోతాను తప్పా పరపురుషున్ని నా పాదంతో కూడా సృషించనూ అన్న విషయాన్ని నీవు తెలుసుకో... ఇతి లక్ష్మణమ్ ఆక్రుశ్య సీతా దుఃఖ సమన్వితా పాణిభ్యాం రుదతీ దుఃఖాత్ ఉదరం ప్రజఘాన హ !! ఆ తల్లి పరమ దుఃఖంతో లక్ష్మణునితో ఈ మాటలు అంటూ రాముడికి ఏదో ఉపద్రవం జరిగిపోయిందనేటటువంటి శోకం తన్ని ఆవహించీ ఇంత శోకంలో లక్ష్మణున్ని కూడా శంకించేసి, లక్ష్మణుడు కదలలేదన్నబాధతో తన కడుపుమీద రెండు చేతులతో గట్టిగా బాదుకుంటూ ఏడుపు మొదలు పెట్టింది.
Image result for సీత నిందవెంటనే లక్ష్మణ మూర్తి అక్కడనుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు తత స్తు సీతామ్ అభివాద్య లక్ష్మణః కృతాంజలిః కించిత్ అభిప్రణమ్య అన్వీక్షమాణో బహుశ శ్చ మైథిలీం జగామ రామ స్య సమీపమ్ ఆత్మవాన్ !! ఆయనా అంజలి ఘటించి సీతమ్మకి నమస్కరించి అమ్మా నేను వెళుతున్నానమ్మా అని చెప్పీ తిరిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి సీతమ్మ వంక చూస్తూనే... వదినకు ప్రమాదం రాదుకదా ప్రమాదం రాదుకదా... అని భయపడుతూ భయపడుతూ భయపడుతూ భయపడుతూ ఆశ్రమ ప్రాంతానికి దూరంగా వెళ్ళలేక వెళ్ళలేక రాముడు ఎటువెళ్ళాడో అటువైపుకి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ అవకాశం కోసమే కదాండీ ఎదురుచూస్తున్నాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, తొందరపడిపోయి సీతమ్మ అధిక్షేపించేసిందీ అని తీర్పు చెప్పడం కుదరదు ఎందుకో తెలుసాండీ మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకంపెట్టుకోండి అక్కడ జరగవలసినటువంటి అవతార ప్రయోజనం ఒకటి ఇమిడి ఉంది అవతార ప్రయోజనం అన్నది ఎలా జరుగుతుందీ అన్నది మహర్షి స్పష్టంగా మారీచ స్య మహాత్మనః అంటూ సీతమ్మ కదిలిన తరువాతే రావణ సంహారం జరుగుతుంది తప్పా తనను తాను రక్షించుకోగలిగిన తేజస్సు ఉన్నదైనా సీతమ్మ తనని తాను రక్షించుకోదు.
ఆమె రావణుని చేత తీసుకుపోబడుతుందని లంకకు అని స్పష్టంగా చెప్పిస్తున్నారు మనకు, ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. సీతమ్మ నరకాంత కాదు మీరు ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించాలి ఎందుకు అంగీకరించాలీ అంటే అంగీకరించకుండా ఉండడానికి మనకు అవకాశంలేదు. వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు లాంగలా ఉద్ధితా మయా అని చెప్పారు ఆమె భూమిని చీల్చుకుని పైకి లేచినటువంటి తల్లి, కాబట్టి ఆమె అయోనిజ నరకాంత కాదు అమె ఎప్పుడైనా మాట్లాడితే పుంజ్వనాం మానుషాం బోగాః అంటుంది. నేను మనుషులు అనుభవించే సుఖాలను అనుభవించాను అంటుంది మనుషులు అనుభవించే సుఖాలను అనుభవించడం అంటే మనుషులు అనుభవించే సుఖాలంటే ఏమిటీ నేను ʻఎసిʻలో ఉన్నానండీ అంటారు అంతేకాని మనుషులు అనుభవించే ఎసి నేను అనుభవించాను అంటానా..? నీవు మనిషి కాకపోతే అలా అనాలి. సీతమ్మ నోటివెంట తరచూ ఈ మాట వస్తూ ఉంటుంది ఇప్పుడు రావణుడితో కూడా చెప్తుంది ఆమాట ఆవిడ, నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో మనుషులు అనుభవించే భోగాలు అనుభవించాను అంటుంది, ఆవిడా నరకాంత కాదు నరకాంత కానిది నరకాంతగానే నిలబడింది అయోనిజ కాని నరకాంతగానే ఇవ్వాళ నిలబడింది.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
రాముడిది ఎంత ధర్మమో సీతమ్మది అంతే ధర్మము ఇద్దరిదీ ఆ ధర్మంలో ఇంక ఎగుడూ దిగుడూ ఏమి ఉండదు, ఉండదు కాబట్టి అందుకే మారీచుడు అన్నాడు రాముడి కంటపడగానే నేను మరణిస్తా సీతమ్మ లంకకువచ్చాక నీవు మరణిస్తావు అన్నాడు ఎందుకంటే సీతమ్మ తనని తాను రక్షించుకోదు కాబట్టి ఆవిడే చెప్పింది సుందరకాండలో ఈమాట నిన్ను నేను చంపడం పెద్ద విషయం కాదు చంపేస్తాను కానీ నేను తపస్సు చేస్తున్నాను రాముడు వచ్చి రక్షించాలి తప్పా... నన్ను నేను రక్షించుకోను అంది. కాబట్టి ఇప్పుడు సీతాపహరణం జరిగితీరాలి సీతాపహరణం జరగడానికి ఉన్న ఏకైక ప్రతి బంధకం లక్ష్మణస్వామి, లక్ష్మణస్వామి కదలడం అన్నదీ ఎందుకు జరుగుతున్నదీ అన్నది రావణుడు ముందే ఊహించాడు, హా సీతా హా లక్ష్మణా అను లక్ష్మణుడు వెడతాడు అన్నాడు. లక్ష్మణుడు తనంతతానైనా వెళ్ళుతాడు లక్ష్మణుడు వెళ్ళకుండా ఉండడానికి ప్రతిబంధకం రామాజ్ఞ, రామాజ్ఞను ధిక్కరించైనా వెళ్ళేటట్టుగా ఆపరిస్థితుల్లో సహజంగా ఏఆడదైనా మాట్లాడి తీరవలసిందే... నేను ఇందాక ఆ మాట ఉపమానంతో సహా మనవి చేశాను, అలా మాట్లాడకుండా సీతమ్మ ఏమీ అవదు రామునికి నాకు తెలుసు అన్నదనుకోండి ఖచ్చితంగా ఆమె నరకాంతగా నిలబడటంలేదని గుర్తు.
Image result for సీత నిందఒక నరకాంత తన భర్తకి దుర్గమమైన అరణ్యంలో అందునా తానే పంపించి జింకను తీసుకురమ్మని పంపిస్తే వెళ్ళినవాడు అంతపెద్ద అరుపు అరిస్తే తన మనసులో ఒక బాధ ఉంటుంది, నేనే పంపించాను ఆయన్ని అన్నబాధ ఒకటి ఉంటుంది. కాబట్టి లక్ష్మణా వెళ్ళు లక్ష్మణా వెళ్ళూ అనడంలో వెళ్ళకపోతే ఆ కోపంలో ఆవిడ ఏం మాట్లాడుతుందో తెలియని స్థితిలో ఉన్మత్తస్థితిలో ఆవిడ మాట్లాడితే అందులో మీరు వెంటనే తీర్పు చెప్పేసి దోషాలు పట్టుకోవలసిన అవసరం ఉండదు. నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం కుదరదు ఏ ఆడదాని స్థితైనా అంతే, ఆడది అంటేనే స్త్రీ అంటేనే అటువంటి సున్నిత హృదయంతో ఉంటుంది. ఏదైనా భరిస్తుందేమోకాని భర్తకు ప్రమాదం వచ్చిందన్న అనుమానం వచ్చిన తరువాత ఉన్న ఏకైక ఆసరా కదలకపోతే ఆవిడలో ఉన్నటువంటి సహనం చచ్చిపోయిన తరువాత ఎంత కఠినమైన మాట్లైనా నోటివెంట వచ్చేస్తాయి,  కాబట్టి ఇప్పుడు ఆవిడ మాటలలలోని కాఠిన్యం వెనక రాముని మీద ఉన్న ప్రేమను మీరు దర్శనం చెయ్యవలసి ఉంటుంది అంతే... అంతకన్నా అందులో మీరు తీర్పు చెప్పడానికి ఏమీలేదని నేను అనుకుంటాను అలా మీరు అనుకున్ననాడు రామ కథ నరకథా అని మీరు చెప్పుకున్ననాడు సాక్ష్యాలన్నీ నశించిపోతాయి.
మీరు అలా చదివినప్పుడే అలా చూసినప్పుడు రామ కథలో ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు అనుభవించగలరు లేనినాడు ఆ సౌందర్యం నశించిపోయి ఏమైపోతుందంటే అన్నీ ఇలా ఎందుకు జరుగుతాయి అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఘట్టంలో మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే..? మారీచుడు లక్ష్మణున్ని కదపలేడు రావణుడు లక్ష్మణున్ని కదపలేడు ఏది కదపగలిగింది లక్ష్మణున్ని మాట కదిపేసింది అప్పటి వరకు రామాజ్ఞను ఉల్లంఘించడం చేతకానటువంటి లక్ష్మణుడు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయాడూ అంటే ఒకమాట కదిపింది. రామాయణమంతా మాట చేత కదలికలే... నేను మీకు తరచు మనవి చేస్తున్నాను. ఒక కైకమ్మా అంత ప్రేమ కలిగింది అంత క్రూరురాలు అయిపోయిందంటే మందర వాఖ్యానికి క్రూరురాలు అయిపోయింది. రావణునియందు పుట్టకూడని బుద్ధి పుట్టిందీ అంటే శూర్పణఖ యొక్క మాటలకు పుట్టింది. మాటలు ఎంత దూరం వెడుతాయో ఒక్కమాట ఇచ్చినందుకు రెండు వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది, రెండు వరాలు ఇచ్చినందుకు దశరథుడు శరీరమే త్యాగం చెయ్యవలసి వచ్చింది.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
మాట అన్నది ఎంత దూరం ఉంటుందో మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాటా మాట్లాడలేరు ఒక్క మాట మీరు అంటే ఏమో అది ఎంతదూరం వెళ్ళుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్పా అస్తమానం మాట్లాడుతుండడం అస్తమానం క్షమించండి అంటుండడం అయ్యొయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండీ అనడం సాధారణంగా ఉండదు దిద్దుకోగలిగినటువంటి నిగ్రహశక్తి వస్తుంది. అన్నిటికన్నా పొదుపుగా అన్నిటికన్నా జాగ్రత్తగా మాట్లాడటమన్నది అలువాటు పడాలి అంటే మీరు శ్రీరామాయణాన్ని చదవాలి, శ్రీరామాయణాన్ని చదివితే మాటవిలువ మీకుతెలిస్తే ఈశ్వరుడు మీకిచ్చిన వరం మీకు తెలుస్తుంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించగలిగితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇన్ని లక్షల జీవరాసులలో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనేలేదు. అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే, ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు. ఆ మాట చేత రాజ్యాలు పడగొట్టగలడు తాను ఖైదు కాగలడు తాను ప్రాణం తీసుకోగలడు ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తిపెట్టి పొడిస్తే గాయం తగ్గేవరకే మంచం మీద పడుకొంటాడు, ఒక మాటకు జీవితాంతం పొడుచుకు పొడుచుకు చనిపోవలసి ఉంటుంది. అంత బాధపడవలసి ఉంటుంది ఒక్కమాట మాట విలువేమిటో మాట ఎంతదూరం తీసుకెళ్ళగలదో మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు అన్న సందేశాన్ని మీకు అందిస్తూంటుంది నర కథయైనటువంటి రామ కథ.
కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అదునుకోసం ఎదురు చూస్తున్నాడు అక్కడే ఉన్నాడు మీతో నేను మనవి చేశాను ఆయన సమస్తమైనటువంటి మాయలు తెలిసున్నవాడు, కాబట్టి ఆ పర్ణశాల ప్రాంతలోనే ఆకాశంలో నిలబడి ఉన్నాడు ఎవ్వరికీ కనపడడు రథ సహితుడై ఉన్నాడు రథంలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం కనపడిందో సీతమ్మ ఒక్కతే ఉన్నదో ఆయనా ఉత్తర క్షణంలో రథం కనపడకుండా ఉంచి తాను మాత్రం భూమి మీదకు దిగి వేషాన్ని మార్పు చేసుకున్నాడు. మార్పు చేసుకున్నాడు అంటే ఆయనకేం మెకప్ కిట్టు అక్కరలేదు, ఆయన సంకల్పంతో Related imageమారుతుంది, ఎలా మార్పు తెచ్చుకుంటాడో తెలుసాండీ... లోకంలో అన్నిటికన్నా మీరు నమ్మదగినది ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడూ అనుమానించడానికి అవకాశం లేనటువంటి ఏమిటో తెలుసాండీ సన్యాసి ఎందుకూ అంటే ఆయనకి సంకల్పం లేదు సన్యాసికి రోజూ గురు వందనంలో చెప్తాం కదా నకర్మణా నప్రజయా ధనేన, త్యాగే నైకే అమృతత్వమానశుః ! పరేణ నాకం నిహితం గుహాయాం, విభ్రాజదేతద్యతయో విశంతి అని చదువుతుంటారు కదా ఆ కైవల్యోపనిషత్తులో... ఆయన తనకొరకూ అని చేయడానికి ఇంక తనకేమీ ఉండదు ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉంటాడు అంతే సన్యాసి. కాబట్టి సన్యాసి ఒకళ్ళని పొందుదామనికానీ ఒకళ్ళది తీసుకుందామని కానీ ఆయనకేమీ కోరిక ఉండదు. మరి ఎందుకు రావాలి అప్పుడు సన్యాసి, అంటే సన్యాసికి ఒక లక్షణం ఉంటుంది గృహస్తు ఎక్కడ ఉంటే అక్కడికి వెడతాడు ఎందుకు వెడుతాడు అంటే భిక్షకోసం వెడుతాడు సన్యాసికి ఆ అధికారం ఉంది.
Image result for యోగి

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఆకలేస్తే గృహస్తు ఇంటి ముందుకు వెడుతాడు ʻభవతి భిక్షాందేహిʼ అని అంటే గృహస్తుకు ఒక ధర్మం ఉంది, ఎమిటో తెలుసాండీ అలా వచ్చినవాడికి అతిథి పూజ చేయాలి తప్పదు గృహస్తాశ్రమమందు, గృహస్తాశ్రమంలో ఉన్నది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికే, సన్యాసి బ్రహ్మచారి ఎవరిమీద ఆధారపడి బ్రతకాలంటే గృహస్తుమీదే ఆధారపడే బ్రతకాలి కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వచ్చాడనుకోండి సీతమ్మ అనుమానపడదు. సన్యాసి అంటే ఇంత ఆందోళనలో ఉన్నా సరే... ఉన్న ప్రమాదానికి తోడు ఇప్పుడు ఇయ్యనకి అతిథి పూజ చెయ్యకపోతే ప్రమాదమొస్తుందని మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్నవేస్తే దాపరికంలేకుండా జవాబు చెప్పేస్తుంది ఎందుకంటే సన్యాసిని మనసులోకూడా శంకించరు ఎవ్వరుకూడాను కాబట్టి కాషాయదండ మాత్రేణ యతి పూజ్యో న శంసయేత్ కాషాయం కట్టుకున్న దండం పట్టుకున్నంత మాత్రం చేత యతి పూజింపబడుతాడు అందులో సందేహంలేదు ఇంక అన్ని విడిచిపెట్టేసినవాడు. రామకృష్ణ పరమహంసా ఒక విషయం చెప్తుండేవారు వెనకటికి ఒక దొంగ రాజుగారి అంతఃపురంలోకి కన్నమేసి దొంగతనానికి వెళ్ళాడు వెళితే రాజు రాణి అంతఃపురంలో వాళ్ళిద్దరు పడుకుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కతే కూతురు కదా ఎవరికిద్దాం అని రాణి గారు ఏదో చెప్తున్నారు రాజు గారు అన్నారు కాదు కాదు, ఒక సన్యసించినటువంటి వ్యక్తికి బతిమాలి బామాలి నేను నా కూతుర్ని పరిచారికగా ఇస్తాను ఎందుకంటే అటువంటి సన్యాసిని సేవిస్తే చాలా గొప్ప అవకాశం వస్తుంది ఏ కోరికా ఉండదు కాబట్టి అటువంటి వాడికి నా కూతుర్నిచ్చి ఆసన్యాసిని తీసుకొచ్చి రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. అంటే మరి కొడుకులు లేరుగా... ఇది విని ఈ దొంగ అనుకున్నాడు ఇవ్వాళ రాత్రికి ఇక్కడ కన్నమేసి పట్టుకెళ్ళితే ఏం వస్తుంది. గుళ్ళో మెట్లమీద కూర్చుంటే రేపు రాజుగారు దర్శనానికి వచ్చినప్పుడు చూసి పిల్లనిస్తాడు. చాలా వైరాగ్యమున్నవాడిలా కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. అంటే రాజుగారు మర్నాడు వచ్చి చూశారు చూసి ఆఁ! ఏమయ్యా చాలా బాగుందీ చాలా తేజోవంతుడివిగా ఉన్నావు వచ్చి నా సింహసనం మీద కూర్చో అన్నాడు.
అంటే వెంటనే అతను అన్నాడూ ఛీ ఛీ ఒక్కసారి నిన్న నా కోరికతో కూర్చున్నాను కాని రాజా... ఈ బట్ట కట్టుకున్న తరువాత ఇంక నాకా కోరికపోయింది వద్దు అన్నాడు. సన్యాసి అంటే అలా ఉండడం అందుకే కదాండీ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతకథలో సన్యాసి రూపంలో వస్తాడు సత్యనారాయణ స్వామి ఇప్పటికైనా వీడు నిజం చెప్తాడోలేదో చూద్దామని. సన్యాసి అడిగినా సరే లతా పత్రం చైవ అవన్నీ ఆకులూ తీగలూ అన్నాడు అలాగే జరుగుగాకా అని ఒక సంకల్పం చేశాడు అంతే ఆ పడవంత్ధానమైపోయింది కాబట్టి సన్యాసిని అనుమానించడం అన్నది చేయకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ ధర్మ సూక్ష్మముందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఉంటాడు తెలుసుకొని ఉండడం చాలా మంచిది దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకోవద్దు. అంతగొప్ప సన్యాసి వేషం కట్టచ్చా..? అని చూడడు, పరమ హంసే ఒక మాట చెప్తుండేవారు, వెనకటికి ఎవరో రామ చంద్ర మూర్తి వేషం వేసుకొని పగటి వేషగాళ్ళు ఉంటారు గదాండీ ఇళ్ళ ముందు నుంచి అలా వెళ్ళుతుంటే ఎవరో వ్యాపారం చేసుకుంటుంటే ఆయన బయటికొచ్చి అబ్బా బలేకట్టావుగా వేషం నీకు బాగా నప్పింది ఈ వేషం ఇదిగో తీసుకొమ్మని డబ్బులు ఇచ్చాడు. నేను పుచ్చుకోను అన్నాడు

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఆయన ఆయన వెళ్ళిపోయి వేషం విప్పేసి వచ్చాడు విప్పేసి వచ్చి ఏదీ ఇందాక డబ్బులు ఇస్తానన్నారు ఇవ్విండి అన్నాడు, ఏరా ఇందాకా పుచ్చుకోలేదు ఏం అన్నాడు నేను రామ పాత్రలో ఉన్నాను ఒక్కడికి పెట్టడం తప్పా ఒక్కడి దగ్గర పుచ్చుకోను అన్నాడు అదీ ఆ లక్షణం ఆ పాత్రకు ఉంటుంది ఆ విశిష్టమైనటువంటి స్థానాలు అవి.
కాబట్టి ఆ స్థానం యొక్క విలువ తెలిసి ఆ స్థానాన్ని సీతమ్మ గౌరవిస్తుంది కాబట్టి దగ్గరగా వెళ్ళడం తేలికౌతుంది, ఆవిడేం అరవదు గౌరవిస్తుంది కూర్చోబెడుతుంది మాట్లాడుతుంది పైగా..! ఒక సన్యాసిని గౌరవంగా మాట్లాడి ఆదరించకపోతే శాపవాక్కు విడిచిపెడతాడేమోనని బయపడుతుంది అసలే భయంతో ఉంది ఇప్పుడు, కాబట్టి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళచ్చూ అనుకొని శ్లక్ష్ణ కాషాయ సంవీతః శిఖీ ఛత్రీ ఉపానహీ ! వామే చ అంసే అవసజ్యాథ శుభే యష్టి కమణ్డలూ !! పరివ్రాజక రూపేణ వైదేహీ సముపాగమత్ ! ఆయనా ఆ చేతులో ఒక దండాన్ని పట్టుకుని కమండలం పట్టుకుని ఒక గొడుగు పట్టుకుని ఒక సన్యాసి వేశం వేసుకొని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించాడు. సీతమ్మ తల్లి ఆయనకు స్వాగతం పలికి కూర్చోబెట్టింది ఆర్ఘపాద్యాదులు ఇచ్చింది పచనం చేసిన పదార్థం ఉంది తీసుకుంటారా అంది, నీకు ఇంకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములేమైనా ఉంటే చెప్పు నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను వాటిని నీవు తీసుకొని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించూ అని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోయని పరమ మర్యాదా పురస్కరంగా ఆవిడ అతిథి పూజ చేసింది.
ఆయనా ఆవిడ వంక చూసి అనకూడని రీతిలోనే ఆవిడని వర్ణించాడు, కాని ఆవిడేమనుకుందంటే మనసులో కామం ఉండే అవకాశం లేదుగా సన్యాసికి కాబట్టి సన్యాసి ఒక రూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్పా ఆవిడ అంతకన్నా అనుమానించలేదు. ఎందుకంటే అనుమానించవలసిన రూపంలో లేడు నీది సన్నని నడుముందు ఏదో కోటేరు లాంటి ముక్కుంది ఏదో నీ కళ్ళు అందంగా ఉన్నాయి అని ఆవిడ శరీరంలో ఉండేటటువంటి అంగాగములను వర్ణించాడు. నేను అంతకన్నా ఇంకా వేరే మాట చెప్పక్కరలేదు మీరు ప్రాజ్ఞులు గ్రహిస్తారు, అయినా సీతమ్మ తల్లికి అనుమానం రాలేదు ఎందుకు అనుమానం రాలేదూ అంటే ఒక్కటే కారణం, కామ వికారములు పొందేటటువంటి మనసు కాదు ఆ వేషం కాషాయం కట్టుకున్నాడంటే, అరే తల్లీ ఎంత అందంగా ఉన్నావ్ ఎందుకమ్మా అడవిలో ఉన్నావ్ అంటున్నాడు అనుకుంది అంతే పాపం పిచ్చి తల్లి అని మీరు అనవలసి ఉంటుంది, నరుడి కథగా కదా నేను చూడమన్నాను తప్పా సీతమ్మకు అన్నీ తెలుసండి అని అనకండి సీతమ్మకు అన్ని తెలుసంటే రామాయణం అంతటితో మంగళం చెప్పేయాలి మీరు నేనునూ, నరుడి కథగానే మీరు చదువుతూ ఉండాలి అంతే.
Image result for రావణుడు సీతనుకాబట్టి ఇప్పుడు ఆవిడా తన గురించి అంతా చెప్పింది ఎంత చెప్పిందో తెలుసాండీ..? మళ్ళీ నేను మీకు ఆ రామ కథంతా బాలకాండ మీకు ఎంత వివరంగా శ్లోకాలన్నీ చెప్పానో అంత వివరంగానూ చెప్పింది ఆవిడా కోసల దేశం దశరథ మహారాజుగారుకి లేకలేక పిల్లలు పుట్టడం ఆయనకి ముగ్గురు భార్యలు పెద్ద భార్య కౌసల్యా, కౌసల్య కుమారుడు

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ధర్మాత్ముడైనటువంటి రామ చంద్ర మూర్తి మూడవ భార్య కైకేయి, యౌవ్వరాజ్య పట్టాభిషేకం రామునికి చేద్దామనుకున్నారు రాత్రికి రాత్రి కైకమ్మ రెండు వరాల కోరుకుంది ఆ వరాల్లో భరతుడికి రాజ్యం అడిగింది రామున్ని అరణ్యవాసాలకు వెళ్ళిపొమ్మందీ దశరథ మహారాజుగారు ఏడ్చారు మూర్ఛపోయారు, కానీ దశరథ మహారాజు పెద్ద కుమారుడు దశరథ మహారాజుగారిని ఎలాగైనా సత్యంలో నిలబెట్టడం కోసమని తనే బాధ్యతలు తీసుకొని 14 సంవత్సరములు దండకారణ్యంలో వనవాసం చేస్తానని వస్తే ఆయన వెనుక ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఆయన భార్యనైన నేను అనుగమించి వచ్చాం అందుకని మేము ఇక్కడున్నాం పదమూడేళ్ళు అయిపోయింది ఇంక ఒక్క యేడాది తిరిగి మేం వనవాసం చేసేసి వెళ్ళిపోతాం నా భర్త ఇప్పుడే అరణ్యంలోకి వెళ్ళాడు, లక్ష్మణ మూర్తి కూడా రాముని కోసం వెళ్ళాడు. ఆక్రంద వినపడింది అది ఆవిడ చెప్పలేదు వెళ్ళారు వాళ్ళిద్దరు తిరిగి వచ్చేస్తారు తిరిగి వచ్చిన తరువాత ఆయన వచ్చేటప్పుడు ఆయనతోపాటుగా దుంపలు తేనే మొదలైనవి పట్టుకొస్తాడు వాటిని కూడా నీకు సమర్పిస్తాను ఇంతకు నీవు ఇంత దండకారణ్యంలో ఇక్కడికి బిక్షకి ఎందుకు వచ్చావు నీవు ఎవరు నీ పూర్వాశ్రమంలో నీ పేరేమీ అని ఇప్పుడు అడిగింది.
ఆవిడ తనవైపు దాపరికంలేకుండా మాట్లాడి అడిగింది, అడిగితే ఆయన వెంటనే తన యొక్క నిజమైన రూపాన్ని ప్రకాశింపజేశాడు. రావణాసురినిగా ఎదురుగుండా నిలబడీ శ్రోత్కర్ష కదాండీ రావణుదేముంది ఇంకా ఎదర సుందరకాండలోనూ అక్కడా విందురుకాని... నేను అంతటివాన్ని ఇంతటివాన్ని కాంచనలంకాదేశున్ని నాదగ్గర 32 కోట్ల మంది రాక్షసులు నాకు ఊడిగం చేస్తుంటారు, మా అన్నగారు కుబేరుడు కుబేరునికి తోడబుట్టినటువంటివాన్ని విశ్వవసు బ్రహ్మయొక్క కుమారున్ని, ఆ కుబేరున్ని నిగ్రహించి ఆయన యొక్క పుష్పకవిమానాన్ని అపహరించి తీసుకొచ్చినటువంటివాన్ని నన్నుచూస్తే దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు భయపడుతారు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి కోసం పదివేల సంవత్సరములు తపస్సు చేసి శిరస్సును ఆహుతి చేస్తే ఆయన నాకు ఎవ్వరి చేతా నిగ్రహింపబడకుండా వరమిచ్చాడు, కాబట్టి నేను ఆకాశంలో నిలబడి నేను ఈ భూమిని పైకెత్తగలను నేను తలచుకుంటే ఈ లోకాలన్నిటినీ శాశించగలను నన్ను చూసి పక్షులు ఎలా గడగడలాడిపోతున్నాయో వనదేవతలు ఎలా పారిపోతున్నారో గోదావరి గబగబా ప్రవహించకుండా నెమ్మదిగా ఎలా పరుగెడుతూందో సూర్యుడు మబ్బుల చాటుకు ఎలా వెళ్ళాడో చూడు, నన్ను చూస్తే అందరూ అంత భయపడుతారు. నేను అటువంటి రోష పరాక్రమములు కలిగినటువంటివాన్ని, చేతకానివాడు ఆడదాని మాటకు అడవికి వచ్చినవాడు క్షీణ Image result for రావణుడు సీతనుజీవితుడైనటువంటివాడు ధర్మమూ ధర్మమూ అని పట్టుకుని తిరిగేటటువంటివాడూ కృద్ధుడైనటువంటివాడూ యుక్తా యుక్త విచక్షణలేనటువంటివాడు నరుడు అరణ్యములు పట్టి తిరిగుతున్నవాడు రాముడితో నీకేంపని ఇంత అందెగత్తెవి శాశ్వతంగా నా భార్యవికా... అమర సుఖాలను అనుభవిద్దువుకాని నిన్ను లంకాపట్టాణానికి తీసుకెళ్ళుతాను ఒక్కసారి లంకకొచ్చి నా భోగాలేమిటో రుచిచూసిన తరువాత ఇక రమ్మన్నా నీవు తిరిగిరావు కాబట్టి నిన్ను లంకకు తీసుకెళ్ళుతాను వచ్చేయ్ అన్నాడు.
అంటే ఆయన దృష్టి ఎలా ఉంటుంది అంటే ఎదురుగుండా ఉన్నటువంటివాళ్ళ యొక్క భౌతికమైన పరిస్థితిని అంచనావేయగలడు తప్పా ఆంతరమైనటువంటి తేజస్సును లెక్కకట్టగలిగినటువంటివాడు కాదు, తనది ఎంత లేకిమనసో అవతలివారు కూడా అంతలేకిగా ఉంటారు అని అనుకుంటాడు, అలా అనుకుని మాట్లాడేవాడు ఎవడో వాడే రావణుడు. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి అంతలేకిగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా అవతలివాళ్ళు చాలా చౌకుబారుగా ఉంటారు అని మాట్లాడేస్తుంటారు. నాదగ్గరికీ చాలా మంది వస్తూంటారు వచ్చి మాట్లాడుతుంటారు నేను పేర్లు ఎందుకు చెప్పాలి... నేనూ ఫలానావాళ్ళను మావూరికి ఉపన్యాసాలకు తీసుకెళ్ళానండీ అంటారు నేను రెండు మూడు పర్యాయాలు వింటాను వీరు తీసుకెళ్ళారా మీరు వారిదగ్గర విన్నారా..? అని అడుగుతుంటాను. తీసుకెళ్ళడమేమిటీ అదేం పశువా అదా నీ హంకారం అంటే నీ సంస్థతరుపున తీసుకెళ్ళానని క్రెడెన్సియల్గా చెప్తున్నావా? అటువంటి మహానుభావుడు మూడు రోజులు వచ్చి ప్రవచనం చేస్తే ఆయన దగ్గర విని మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యం మేము మూడుమాట్లు పొందివున్నాము అని అనడం మీ సంస్కారమా..? నేను వారిని తీసుకెళ్ళాను వీరిని తీసుకెళ్ళాను అంటావేమిటీ... తీసుకెళ్ళానండీ అంటే నీ ఆభిజాక్షం నీ అహంకారం, వాళ్ళు అనుగ్రహించి వచ్చారండీ వచ్చీ వారు మాచేత సేవలుపొందీ సంతోషాన్ని పొందీ వేరొకపర్యాయము కూడా మీ దగ్గరకు తప్పకుండా వస్తామని చెప్పి వెళ్ళారు, దానికి మేము ఎంతో సంతోషించాము.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలి అని అడిగినప్పుడు అడిగినవాడి దగ్గరికి రేపే వస్తానని రేపే నీవు వెళ్ళాలి తప్పా నీవు తీసుకెళ్ళడమేమిటీ, నేను తీసుకెళ్ళానండీ... నీ ఉపన్యాసానికి రాలేదు ఏమనుకోకండీ... నీవు రాకపోతే నాకేమిటీ మా అమ్మాయి పెళ్ళా ఇదేమైనా నువ్వొస్తే నీకు అదృష్టం నీవు రాకపోతే నాకు అదృష్టం. తప్పా నాకెందుకు బాధ మధ్యలో అంటే లోపల ఆభిజాక్ష్యం పోకపోవడం... పోకపోతే ఏమౌతుందండీ అంటే మాటలో లేకితనం ఉంటుంది. ఆ లేకితనం ఎప్పుడు పోతుందంటే మనసుకు సంస్కారంవస్తే పోతుంది. ఆ సంస్కారం ఏర్పాటు చేసుకోవాలి, ఈ సంస్కారం రాకపోతే అలాగే ఉంటాయి మాటలన్నీ కాబట్టి రావణుడి మాటలన్నీ అలాగే ఉన్నాయి. అందుకే రావణకాష్టం రగులుతూంది అంటారు ఎక్కడో తెలుసాండీ ఇగో ఇలాంటిమాటలే అర్థంపర్థంలేకుండా అసందర్భంగా మాట్లాడేమాటలు ఉంటాయి ఆ మాటలన్నిటిలోనూ రావణుడు బ్రతికే ఉంటాడు.
సీతమ్మతల్లి మాట్లాడింది ఓ పెద్ద దండకమే చదివింది ఆవిడ, ఆవిడందీ సర్వ లక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం ! సత్యసంధం మహాభాగం అహం రామం అనువ్రతా !! ఏమిట్రా పిచ్చోడా నీవు మాట్లాడేది! సర్వలక్షణ సంపన్నం రాముడు అంటే సర్వలక్షణ శోభితిడు మహానుభావుడు లక్షణం అనేది పుట్టుకతో ఉండాలి, సంస్కారం అనేటటువంటిది పెద్దల యొక్క సుశ్రూష చేసి రావలసిందే తప్పా అజ్ఞానం అవివేకం అహంకారం తొలగించుకోకపోతే అవే ఉండిపోతాయి నీలో అవే కనపడుతున్నాయి. Image result for రావణుడు సీతనుపెద్దల యొక్క మాటలు విని శిక్షింపబడినటువంటి బుద్ధికలిగి సర్వలక్షణ శోభితుడుగా నా భర్త శోభించినటువంటివాడు న్యగ్రోధ పరిమండలం ఒక చెట్టు ఎలా నీడనిస్తుందో అలా నా భర్త అందరికీ నీడనివ్వగలిగినటువంటివాడు, ఒక చెట్టు నీడకోసం మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాలు అడిగి చెట్టు నీడ నివ్వదు, చెట్టును ఆశ్రయిస్తే చాలు నీడను ఇచ్చేస్తుంది. ఇదే కిష్కింద కాండలో తార అంటుంది నివాస వృక్షః సాధూనాం ఆపన్నానాం పరా గతిః ! ఆర్తానాం సంశ్రయః చైవ యశసః చ ఏక భాజనం !! అంటుంది అటువంటివాడు రాముడు అంటే సర్వలక్షణ సంపన్నుడు సత్యసంధం ఎన్నడూ అపద్ధమాడడు నీ బతుకో తెలిసిపోతూనే ఉంది, అసలు వస్తూనే సన్యాసి వేషం గట్టి వచ్చావు, ఇంత అసత్యమైనటువంటి రూపమున్నవాడివి నీవు సత్యసంధం మహాభాగం అహం రామం అనువ్రతా నేను రామ చంద్ర మూర్తిని అనువర్తించేటటువంటిదానిని మహా బాహుం మహోరస్కం సింహ విక్రాన్త గామినమ్ ! నృసింహం సింహ సంకాశమ్ అహం రామమ్ అనువ్రతా !! ఆవిడకి నేను రామున్ని అనుగమిస్తానని చెప్పుకోవడంలో ఎంత సంతోషముందో చూడండి...

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
నేను ఫలానా గురువుగారి శిష్యున్నండి అని చెప్పుకునేటప్పుడు ఆ గురువుగారి గురించి చెప్పుకుని అలాంటి గురువుగారు నేను ఆయన శిశ్యున్ని అలాంటి గురువుగారు నేను ఆయన శిష్యున్ని అని చెప్పుకోవడం ఎలా ఉంటుందో... మా నాన్నగారు అటువంటివారు వారికి నేను కొడుకుని మా నాన్నగారు మహానుభావుడు ఎన్నడూ దాచుకోవడం చేతకానివాడు ఎంతమందికి అన్నం పెట్టాడో మా నాన్నగారు అటువంటివాడికి కొడుకుని మా నాన్నగారు ఎప్పుడూ బ్యాంకులో ఎస్ బి అకౌంటు కూడా ఓపెన్ చేయలేదు తాను తినగా మిగిలిన డబ్బు ఉంటే 10 మందికి స్కూలుకి ఫీజులు కట్టి చదివించాడు అందుకే మా నాన్నగారి ఫొటోలు ఎంతమంది ఇళ్ళల్లో ఇప్పటికీ ఉంటాయో అటువంటి నాన్నగారికి కొడుకుని నేను అని చెప్పుకున్నవాడిలో ఆయనకి చెందినవాడని చెప్పుకున్నప్పుడు లోపల పొందిన సంతోషం వాక్కులుగా ఎలా ప్రవహిస్తుందో... రాముడి గురించి స్తోత్రం చేయడంలో సీతమ్మ అలా పులకించిపోతుంది. ఇది తెలిసి ఉంటేవాడికి ఆవిడ కాళ్ళమీదపడి నమస్కారంచేసి వెళ్ళిపోవాలి. ఇంత గొప్ప భార్యా భర్తలు వాళ్ళ మధ్యలోకి నేను ప్రవేశించడమా అని అది లేకపోవడమే రాక్షసత్వము అటువంటి భర్తని అనుగమిస్తున్న ఆడదానిని భర్తని నింద చేసి ఆవిడ మనసు ఖేద పెట్టడమే రాక్షసత్వం.
కాబట్టి పూర్ణ చన్ద్రాఽఽననం రామం రాజ వత్సం జితేన్ద్రియమ్ ! పృథు కీర్తిం మహాత్మానం అహం రామమ్ అనువ్రతా !! రామ చంద్ర మూర్తి యొక్క ముఖమండలం పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది, ఆయనా రాజ వత్సం జితేన్ద్రియమ్ ఇంద్రియములను గెలిచినటువంటివాడు గొప్ప రాజకుమారుడు, ఆయనా ఆత్మతత్వమును పూర్ణముగా ఎరిగినటువంటివాడు అటువంటి రామ చంద్ర మూర్తిని నిరంతరము అనువర్తించేదానిని నేను మన్దరం పర్వత శ్రేష్ఠం పాణినా హర్తుమ్ ఇచ్ఛసి ! కాలకూటం విషం పీత్వా స్వస్తిమాన్ గన్తుమ్ ఇచ్ఛసి !! ఎవడైనా మందర పర్వతం యొక్క శిఖరాల్ని తన అరిచేత్తో పిండి చేద్దామనుకుంటాడా కుదురుతుందా కాలకూట విషాన్ని తాగి తాను బతికుందామని ఎవడైనా అనుకుంటాడా..! అక్షి సూచ్యా ప్రమృజసి జిహ్వయా లేక్షి చ క్షురమ్ ఎవడైనా కంట్లో ఓ చిన్న నలకపడితే కన్ను శుబ్రం చేసుకోవడానికి సూది తీసుకుని కన్ను శుబ్రం చేసుకుంటాడా... లేకపోతే ఎవడైనా పదునుగా ఉన్నటువంటి కత్తిని శుబ్రం చేయవలసి వస్తే తన నాలికతో నాకి శుబ్రం చేస్తాడా..? రాఘవ స్య ప్రియాం భార్యామ్ అధిగన్తుం త్వమ్ ఇచ్ఛసి అలా రామ చంద్ర మూర్తిని అనువర్తించేటటువంటి నన్ను రాముని నుంచి అపహరించాలని అనుకోవడం అంత ప్రమాదకరమైనటువంటి పని .
అవసజ్య శిలాం కణ్ఠే సముద్రం తర్తుమ్ ఎవడైనా కంఠలో పెద్ద బండకట్టుకుని సముద్రంలో దూకి సముద్రంలో ఈది అవతల ఒడ్డుకు వెళ్ళగలం అని అనుకుంటాడా..! అలా అనుకోవడం ఎంత హాస్యాస్పదమైన విషయమో... సూర్యా చన్ద్రమసౌ చోభౌ ప్రాణిభ్యాం హర్తుమ్ ఇచ్ఛిసి ఎవడైనా సూర్య చంద్రుల్ని ఇద్దర్నీ తన చేత్తో ఒసారి తడిమి వాళ్ళను చేత్తో పట్టుకోగలను అని అనుకుంటాడా అలా అనుకోవడం ఎంత అర్థంలేనటువంటి ఆలోచనో అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేణాఽఽహర్తుమ్ ఇచ్ఛసి రఘులు కుంటున్నటువంటి అగ్నిహోత్రాన్ని అగ్ని శిఖలని ఓ బట్టలో మూట కట్టి పట్టుకెళదామనుకుంటాడా ఎవడైనా అనుకోగలడా అది సాధ్యమౌతుందా అలా రామున్ని అనువర్తించే నన్నుకూడా తీసుకెళదామనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి విషయం.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
నన్ను తీసుకెళ్ళడం నీకు సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అయోముఖానాం శూలానామ్ అగ్రే చతితుమ్ ఇచ్ఛసి ఎవడైనా పదునైనటువంటి ఇనుప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా అందులోకి దిగబడిపోడా అది ఎటువంటి ఆలోచనో నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది. అయినా సింహానికీ నక్కకీ, సముద్రానికీ పిల్ల కాల్వకీ, బియ్యము కడుగు నీటికి అంమృతానికీ, బంగారానికీ సీసానికి, మంచి గంధానికి బురద నీటికీ, ఏనుగుకీ పిల్లికీ, గరుత్మంతునికీ కాకికీ, నెమలికి నీటి కాకికీ, హంసకీ గ్రద్ధకీ ఎంత వ్యత్యాసముందో రావణా! నీకూ నా నాభర్తయైన రామ చంద్ర మూర్తికి అంత వ్యత్యాసముంది. నీవు రామ చంద్ర మూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెళ్తానంటావేమిటీ ఒక్కనాటికి నేను నీయందు మనసు పెట్టేటటువంటి దాననుకాను నేను సర్వ కాలములందు రామ చంద్ర మూర్తిని అనువర్తించేదానినని గుర్తెరుగు.
Image result for రావణుడు సీతనుఅంటే ఆయన అన్నాడూ త్రిషు లోకేషు విఖ్యాతం యది భర్తారమ్ ఇచ్ఛసి ! మామ్ ఆశ్రయ వరారోహే తవాహం సదృశః పతిః !! నీకు తెలియట్లేదు సీతా నేను మూడు లోకములు గెలిచినటువంటివాన్ని నాకు భార్య కావడం నీ అదృష్టం, నీవు నన్ను భార్యగా పొందాలి నేనే నీకు తగినటువంటి భర్తని ఇంతకాలం తెలియక ఆయన పక్కన భార్యగా ఉండిపోయావు, అసలు నీకు తగిన భర్తను నేను నాకు తగిన భార్యవు నీవు. కాబట్టి నీవు నాతో లంకకువచ్చి నాతో ఉండిపో... ఇంతకన్నా ధారుణమైన మాట... అసలు రామాయణం చెప్పాలి కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పక తప్పడం లేదు కానీయ్యండీ అసలు ఇంతకన్నా ఆవిడ అంత బాధపడి నేను ఇంత పతివ్రతనీ అని చెప్పుకున్నటువంటి తల్లితో ఇలా మాట్లాడడం కన్నా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి ఏమిటుంటుందండీ..? కాబట్టి ఆయనంటాడూ... ఎప్పుడూ శ్రీరామాయణంలో మీరు ఇదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది త్యజ్యతాం మానుషో భావో మయి భావః ప్రణీయతామ్ ! రాజ్యా చ్చ్యుతమ్ అసిద్ధార్థం రామం పరిమితాఽఽయుషమ్ !! ఆఁ.. రాముడు నరుడు ఎప్పుడు చూసినా జనకుడంతటివాడు క్వ గతిః మానుషాణాం చ ధనుషో అస్య ప్రపూరణే అంటాడు, హాఁ..! నరుడు రాముడు ఎక్కుపెడతాడా..? అంటాడు. రావణుడు హాఁ.. నరుడు రాముడు ఏం చేస్తాడు అంటాడు. నిజానికీ మనుష్య జాతంతా రామ చంద్ర మూర్తికి ఋణపడిపోయింది. అంతగా మనుష్యుడు నీచంగా భావించబడితే దశవర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ 11వేల సంవత్సరములు ఈ భూమండలము మీద ఉండి మనుష్యుడు అంటే ఎంతగొప్పవాడో నిరూపించి చూపిస్తానని మానవజన్మకి అంత గొప్పతం ఉందీ అని నిరూపించన మహనీయ మూర్తి రామ చంద్ర మూర్తి.
అందుకే మనిషిగా పుట్టినవాడు రామ నామం చెప్పకపోతే రామ నామం రాయకపోతే రామున్ని స్తోత్రం చెయ్యకపోతే రాముడికి పూజ చెయ్యకపోతే వాడు కృతజ్ఞుడు అయిపోయినట్లులెక్క లక్ష్మణుడు అంటాడు కిష్కింద కాండలో బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవతే తథా నిష్కృతిః ! విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః !! అంటాడు, ఎవడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమోకాని కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తంలేదు. కాబట్టి రామ నామం చెప్పాలి రామ పూజ చెయ్యాలి రామ స్తోత్రం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి ఆ మనుష్యుడైనటువంటి రామున్ని విడిచిపెట్టేసై అని రావణుడు అంటున్నాడు, విడిచిపెట్టి నన్ను చేరు, అతను పరిమితమైనటువంటి ఆయుర్ధాయం ఉన్నవాడు ఈ అరణ్యంలో తిరుగుతున్నవాడు, నేను మూడు లోకములు జయించినటువంటివాన్ని కాబట్టి ఎంతకాలం రాముడు ఉంటాడు అనుకుంటున్నావ్ ఇక్కడ అరణ్యంలో... ఒక

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఆడదానిమాటకు అంతఃపురాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయినటువటువంటి రాముడు ఒక రాముడా..! అతడు కృద్ధుడు యుక్తా యుక్త విచక్షణలేనివాడు కాబట్టి విడిచిపెట్టేసై అన్నాడు. ఇవ్వాళ సీతమ్మదగ్గరకెళ్ళి ఇంతకాలం నుంచి భర్తను అనువర్తించి ఉన్నటువంటి ఒక మహా పతివ్రతతో ఆయన మాట్లాడుతున్నమాటలు. నేను మీతో తరచూ మనవి చేస్తున్నాను... మాట యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండీయని ఇంత తపఃశక్తి ఉన్న రావణుడు మరణించడానికి సిద్దమైనటువంటి పండులా ఉన్నాడూ అంటారు సుందర కాండ చివర, దేనివల్ల సిద్ధమయ్యాడలాగ తన మాటలతో తన పాపాన్ని తాను రోజు మూటకట్టుకున్నాడు.
Image result for రావణుడు సీతనుసీతమ్మ తల్లిని ఏ రోజు చూసి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల ఒంటికి గాయం చేసినా కలిగేటటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని సీతమ్మతల్లి పొంది పరితపించి కంటివెంట భాష్పధారలు కారుతూ ఎప్పుడూ చెక్కిళ్ళమీద చారికలు కట్టి, కట్టిన బట్ట విప్పకుండా కట్టిన బట్టతోటే పెట్టుకున్న నగలతోటే ఆ చెట్టుకింద పది నెలలపాటు లంకలో ఉండిపోయి ఏడ్చిందో..? ఆ కంటినుంచి జారినటువంటి భాష్పబిందువులు లంకాపట్టణం యొక్క నేలమీద పడి వాడికి కారకుడైన రావణుడు మరణించడానికి సిద్ధమైన రీతిలో తన మరణాన్ని తాను వండుకున్నాడు. మాటలతో వండుకున్నాడు తన మృత్యువుని జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్ర బాంధవాః జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధృవం కాబట్టి ఆ వాక్కు ఎంత గొప్పదో... వేరొక మహానుభావుడు ఇలా ముట్టుకోకుండా తన వాక్కులతో ఇనాళ్ళు ఏడుస్తున్న తల్లిన సంతోషింపజేసి సింతోషించిన సీతమ్మ తల్లి ముఖాన్ని లంకాపట్టణంలో చూసినటువంటి మహాపురుషుడిగా ఖ్యాతికెక్కిన ఆనాటి నుంచి ఈ నాటివరకు పూజింపబడుతున్నాడు స్వామి హనుమా.
మాట వైభవం కదాండీ రామాయణం... రామాయణం వాక్ వైభవం, వాక్కు ఎంత గొప్పదో రామాయణం చెప్తుంది. మీ దగ్గరా ఇంతగొప్ప మణి ఉందండీ అని చెప్పారనుకోండి అది మణికాదూ అనుకుని అది గాజు పూస అని కబ్బోర్డులో పెట్టారు, దానిమీద దుమ్ముపడిపోయింది ధూళి పడిపోయింది మీరు పట్టించుకోలేదు దాని యొక్క విలువ తెలుసున్నటువంటి వాడు ఒకడు అయ్యా! మీ ఇంట్లో ఉన్నటువంటిది సాటిలేని మణి అది మూడు లోకాలలో లేదు అటువంటి మణి మీసొత్తు మీరు దానికి యజమాని అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంక దాన్ని కబ్బోర్డులో ఉంచుతారా..? అలా ఉంచితే రావణాసురుడు, కబ్బోర్డులోంచి తీసి వెంటనే ఇంతగొప్ప మణీ అని దాచుకుని అక్కడేపడుకుంటారు మీరు రాత్రి. అలా పడుకుంటే దానివిలువ మీరు గుర్తించినట్లు. రామాయణం చదివినవాడికి గుర్తించవలసిన విషయం ఏమిటంటే..? వాక్కు ఎంత గొప్పదో తెలుసుకోవాలి ఎంతగొప్పదో తెలుసుకున్న ఉత్తర క్షణంలో మనుష్య జన్మ సార్థకం అయిపోవడం మొదలుపెడుతుంది. మాటల వల్ల కదాండి ఇన్ని గొడవలు ఎన్ని అక్కరలేని మాటలో ఇవ్వాళ అసలు సమాజాన్ని కలుషితం చేసేస్తున్నవి ఏమైనా ఉంటే..? దిక్కుమాలిన మాటలన్నీ... పేపరు తీస్తే అవే మాటలు టీవీలు చూస్తే అవే మాటలు ఎక్కడెక్కడ పనికిమాలిన మాటలు ఉద్రేక పూరితమైన మాటలు తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగిపోతే ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదేమో అని లైవ్ టెలిక్యాస్టు చేసి మరీ ఆ మాటలు తీసుకొచ్చి ఉత్తర క్షణంలో ఉద్రిక్తత అన్నిచోట్ల రాసుకునేటట్టుగా చేసేస్తున్నవి మాటలు కావూ..?
మాట విలువ తెలుసున్ననాడు ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసున్ననాడు ఎలా ఉండాలో రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది, అది తెలుసున్ననాడు మీరు మహాత్ములౌతారు మీరు అంటే నేను అయిపోయానని కాదు నా ఉద్దేశ్యం

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
తరచూ చెప్తున్నాను ఉపణ్యాసం చెప్తున్నాను కాబట్టి అలా అంటాను, ఇది నాకు నేను గుర్తు చేసుకోవడం మిమ్మల్ని అడ్డుపెట్టి ఓరి వెర్రి కోటేశ్వరరావ్? ఎప్పుటికి తగ్గుతుంది నీకీ వెర్రిమాట్లు చూశావా రామాయణం చెప్తున్నావ్ దిద్దుకో నిన్ను నివ్వు అని నాకు నేను చేసుకున్న మాటలు అని నాకు చేసుకుంటున్న హెచ్చరిక, మీకు చెప్తున్నది కాదు మీరు ప్రాజ్ఞులు మహా పురుషులు మీకు తెలుసు దానిగురించి. ఏదో తెలియనట్టు మీరు వింటూంటారు అంతే కాబట్టి ఇప్పుడు సీతమ్మని అపహరించి లంకకి తీసుకెళ్ళడం కోసమనీ వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సః ! ఊర్వో స్తు దక్షిణే నైవ పరిజగ్రాహ పాణినా !! ఆమెని ఎడం చేత్తో అమ్మవారి యొక్కజుట్టు పట్టుకున్నాడు కుడిచెయ్యి అమ్మవారి యొక్క ఊర్వో స్తు తొడలకింద కుడిచెయ్యి పెట్టాడు పెట్టి ఒక్కసారి అమాంతంగా ఆ తల్లిని పైకెత్తి ఏదో భూమిని పెళ్ళగించి తీసుకెళ్ళాడు అది వెంటనే నాకు తెలుసు చాలా మందికి ఆ అనుమానం ఒకటి వచ్చేస్తుందీ అని, అలా లేదు వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యమని మీరు గ్రహించెదరుగాక! ఎందుకనీ అంటే..? వాల్మీకికి ఒక్కరికే వరం. చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం, ఆచమనం చేసి నీవు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు పాత్రల మనసులలోని భావములు కూడా నీవు తెలుసుకోగలుగుతావు. సీతమ్మతో మొదలు పెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాలు వరకు నీకు తెలుస్తాయి, తెలిసిన దానిని నీవు రామాయణ రూపంగా రచన చేస్తావని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని కనుక వాల్మీకి మహర్షి నోటివెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి అలా భావించడానికి ఏది మీకు ప్రతిబంధకమో కూడా నాకు తెలుసు.
Image result for సీతాహరణంసీతమ్మ తల్లి జుట్టు పట్టుకుని తొడలకింద చెయ్యి పెట్టి తీసుకెళ్ళడమా..? వాడు కాలిపోలేదాండీ..? ఈ మాట మీరు నేను అనక్కరలేదు సుందర కాండ చివర్లో హనుమ చెప్పారు, అసలు వాడు సీతమ్మ తల్లిని వాడు జుట్టుపట్టుకుని తొడలకింద చెయ్యివేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడూ అంటే..? వాడు వెంటనే బూది కుప్పకింద అయిపోవాలే అయినా వాడు బ్రతికున్నాడంటే వాడి తపఃశక్తి ఎంతగొప్పదో..? అన్నాడు. ఇంత తపఃశక్తి ఉన్నవాడు కాబట్టే ఎదర అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడీ నీ చావుకి కావలసిన పాపం ఇప్పుడు చేశావురా... అన్నాడు. ఆ తపస్సు అడ్డుపెట్టుకొని కదాండీ బాధిస్తున్నాడు, అది నశించిపోవాలంటే ఒక మహా పతివ్రతను ముట్టుకోవాలి వాడు ఆ కామ భావనతో. తల్లి మనకోసమని ఇంత ధారుణమైనటువంటి చేష్టితము రావణుడు చేస్తున్నా... పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా... ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది. పరాశరబట్టర్లని ఆయనా ఒక మహా భక్తుడు ఆయన శ్రీగుణ రక్తకోశము అని ఒక గ్రంథాన్ని చేశారు ఆ శ్రీగుణ రక్తకోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నారు. అమ్మా నీవు ఎన్నో అవతారములను స్వీకరించావు ప్రత్యేకించి నీవు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడూ రావద్దమ్మా అన్నాడు ఆయన. ఎందుకో తెలుసా మిగిలిన అవతారాలు చదవ బుద్దేస్తుంది అమ్మా మాకోసం ఇంత కష్టపడ్డావా..? నీవు ఒక మహా పతివ్రతవై నీవు అక్కడికి వెళ్ళి అంత బాధ పడితే తప్పా... నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యడని మమ్మల్ని రక్షించడానికి అయోనిజవూ జగన్మాతవు త్రిలోక మాతవు తల్లీ నీవు ఇవ్వాళ నీవు ఒక రావణుడి పంచన అంత ఏడిచావామ్మా.
వద్దమ్మా ఇంకెప్పుడూ నీవు ʻవాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్నీ చంపితే చంపేనీ అది తేలికʼ తప్పా... సీతమ్మా నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా ఇంకొక్క సారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దూ అని

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
పరాశర బట్టరులు వేడుకున్నారంటే..? ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో... రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి జగన్మాతగా ఆతల్లి మనల్ని రక్షించడానికి రావణుడిచేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆతల్లి పొందిందీ అంటే..? ఇందుకు కదాండీ చెప్పాడు మారీచుడు రాముడు చూస్తేనే చచ్చిపోతా... సీతమ్మ వచ్చాక నీవు రాక్షసులతో లంకంతా కలిసి నాశనమౌతుంది అన్నాడు కాబట్టి తల్లీ ఇంత కష్టపడ్డావా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడని తీసుకెళ్ళి తన బంగారు రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే వనదేవతలందరూ పారిపోయారంట చూసి రావణున్ని, గోదావరి చాలా మెల్లగా ప్రవహించిందట పక్షులు చప్పుడు చేయకుండా కూర్చున్నాయట చెట్లు కదలలేదట వాయువు చాలా మెల్లగా వీచిందట సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడట ఎందుచేత అంటే ఆయన దిక్పాలకులందరినీ శాశించాడు. ఆయన తపస్సుని అడ్డుపెట్టుకుని లోకలములన్నింటినీ ఏడిపించినటువంటివాడు తం దృష్ట్వా గిరి శృంగాఽఽభం తీక్ష్ణ దంష్ట్రం మహా భుజమ్ ! ప్రాద్రవన్ మృత్యు సంకాశం భయాఽఽర్తా వన దేవతాః !! ఆ వనదేవతలందరూ కూడా మృత్యువు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో భంకరమైనటువంటి కోరలతో పెద్ద పెద్ద భుజాలతో ఉన్నటువంటి ఆ రావణాసురున్ని చూసి అరణ్యంలోపలికి పారిపోయారు.
Image result for సీతాహరణంవెంటనే తనొక సంకల్పం చేశాడు మాయమైనటువంటి ఆ రథం కిందకి దిగింది, స చ మాయామయో దివ్యః ఖర యుక్తః ఖర స్వనః ! ప్రత్యదృశ్యత హేమాంగో రావణ స్య మహా రథః !! మళ్ళీ ఆ గాడిదలు పూంచినటువంటి రథం కిందకి దిగింది. ఆయన సీతమ్మ తల్లిని ఎత్తి తన రథంలో కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తత స్తాం పరుషై ర్వాక్యై ర్భర్త్సయన్ స మహా స్వనః ! అంకేనాఽఽదాయ వైదేహీం రథమ్ ఆరోపయ త్తదా !! తను రథంలో కూర్చుని ఆవిడని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆడత్రాచుపాము ఎలా గించుకుంటుందో అలా గించుకుంటున్నటువంటి తల్లిని గట్టిగా ఒడిసి పట్టుకుని సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు, ఆకాశంలోకి ఆరథం ఎగిరి వెళ్ళిపోతుంటే సీతమ్మ అరణ్యం వంక చూస్తూ అరుస్తుంది ఆతల్లి తతః సా రాక్షసేన్ద్రేణ హ్రియమాణా విహాయసా ! భృశం చుక్రోశ మత్తేవ భ్రాన్త చిత్తా యథాఽఽతురా !! హా లక్ష్మణ మహా బాహో గురు చిత్త ప్రసాదక ! ప్రియమాణాం న జానీషే రక్షసా కామ రూపిణా !! ఇక్కడ అంటుంది లక్ష్మణుడి గురించి గురు చిత్త ప్రసాదక పెద్దల మనసెరిగి ప్రవర్తించేవాడా..! అంటుంది. ఆవిడకి అన్యభావన ఏం లేదు ఆక్రోషం అటువంటిది. కాబట్టి ఆవిడ బాధతో రావణుడు తనని అపహరించి తీసుకెళ్ళి పోతున్నటువంటి సమయంలో కలవరము కలిగినటువంటి ఉన్మత్త స్థితిచేత అంటే అసలు తనమీద తనకు ఎరుకలేని స్థితి.
ఒక ఉన్మాదముతో కూడిన అవస్తలో ఆవిడ హా రామా... హా లక్ష్మణా..! అని అరుస్తూ వచ్చి రక్షించవలసిందీ అని పెద్ద పెద్ద కేకలు పెట్టీ వెళ్ళిపోతుంటే... ఆ చెట్టుమీద కూర్చుని జటాయువు పక్షి కనపడింది. అయ్యెయ్యో వృద్ధుడవైపోయావు వీడు రాజు పైగా ఆయుధములతో ఉన్నాడు బలవంతుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు, నీవు నిగ్రహించలేవు కానీ రామాయ తు యథా తత్త్వం జటాయో హరణం మమ ! లక్ష్మణాయ చ త త్సర్వమ్ ఆఖ్యాతవ్యమ్ అశేషతః !! నీవు మళ్ళీ రామ చంద్ర మూర్తి లక్ష్మణ మూర్తి తిరిగి పర్ణశాలకు వచ్చిన తరువాత రావణుడు నన్ను అపహరించినటువంటి వృత్తాంతాన్ని వారికి చెప్పవలసిందీ అని ఆ జటాయువుకి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆ వనదేవతలకి చెట్లకీ గోదవరికీ ప్రస్రవణ పర్వత శిఖరానికి నమస్కరించి వాళ్ళందర్నీ వేడుకుంటుంది. రాముడు తిరిగి వచ్చిన తరువాత నన్ను అపహరించాడు అన్న విషయాన్ని మీరు

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
రాముడికి తెలియజేయండి, రామునికి తెలిసిన తరువాత ఈ రావణుడు బ్రతకడు వీడు ఎక్కడ దాక్కున్నా రామ చంద్ర మూర్తి వచ్చి వీన్ని పట్టి నిగ్రహించి నన్ను తీసుకొస్తారు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే...
Image result for జటాయువుImage result for జటాయువుఆ జటాయువు వెంటనే లేచి అన్నాడు నేను ఇప్పుడే వెళ్ళి రామ లక్ష్మణులను తీసుకొద్దును కాని నేను వెళ్ళి తీసుకొచ్చే సమయంలేదు నీవు అపహరించి తీసుకెళ్ళిపోతున్నావు కాబట్టి రావణా! నేనొక మంచి మాట చెప్తాను విను దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయః ! జటాయు ర్నామ నామ్మాహం గృధ్ర రాజో మహాబలః !! నేను ధర్మాన్ని నమ్ముకున్నవాన్ని వేదవాఖ్యాన్ని నమ్ముకున్నటువంటివాన్ని సత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటివాన్ని నన్ను జటాయువూ అంటారు. నేను వృద్ధుడైపోయినటువంటి పక్షిరాజుని ఒక పెద్ద గ్రద్ధని రాజా సర్వ స్య లోక స్య మహేన్ద్ర వరుణోపమః ! లోకానాం చ హితే యుక్తో రామో దశరథాఽఽత్మజః !! అన్ని లోకములకు రాజు మహేంద్రుడితో వరుణుడితో పోల్చదగినవాడు అన్ని లోకముల యొక్క హితాన్ని కోరుకునేవాడు దశరథాత్ముజుడైనటువంటి వాడు రామ చంద్ర మూర్తి తస్యైషా లోక నాథస్య ధర్మపత్నీ యశస్వినీ ! సీతా నామ వరారోహా యా త్వం హర్తుమ్ ఇహేచ్ఛసి !! అటువంటి రామ చంద్ర మూర్తి యొక్క ధర్మపత్ని కీర్తిగాంచిన తల్లి సీతా అని పేరున్న తల్లి మహా పతివ్రత ఇటువంటి ఆవిడ్ని నీవు ఇలా అపహరించవచ్చా కథం రాజా స్థితో ధర్మే పర దారాన్ పరామృశేత్ ! రక్షణీయా విశేషేణ రాజ దారా మహాబల !! నీవు రాజువైనటువంటివాడివి ధర్మాన్ని నీవు అనుష్టించాలి నువ్వే ఇలా పరుల కాంతలని అపహరించి తీసుకెళ్ళిపోతూంటే అందునా సాటి రాజ పత్ని నువ్వు ఎలా రాజో అలా రాముడు రాజు అటువంటి రాజ పత్నిని నీవే అపహరించి తీసుకెళ్ళితే ఇంక లోకంలో ధర్మమూ అన్నమాటకీ అర్థమేముంటుంది. నీవు రాచపదవిలో ఎలా కూర్చుంటావ్ నిన్ను చూసి ఎవరు ధర్మం నేర్చుకుంటారు కాబట్టి ఆ తల్లిని విడిచిపెట్టూ అన్నాడు వాడు విడిచిపెడతాడా..? వాడు తీసుకెళ్తున్నాడు జటాయువు ఆయనతో పాపం చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని తాను చెయ్యగలిగినంత యుద్ధాన్ని చేశాడు.
Image result for జటాయువుఎంత యుద్ధం చేశాడంటే రావణాసురుని యొక్క ధనస్సుని విరిచేశాడు ఆయన శరీరం మీద అనేకమైన ఘాట్లు చేశాడు, ఆ పైన ఉన్నటువంటి ఛత్రము ఛామరము వీటిని పడగొట్టాడు ధ్వజాన్ని పడగొట్టాడు ఆ గాడిదల్నీ తన వాడి ముక్కులతో పొడిచి చంపేశాడు సారథిని చంపేశాడు ఆ రథాన్ని భగ్నం చేసి కిందపడేశాడు. రావణాసురుడు సీతమ్మని ఒడిలో పెట్టుకొని కిందకి దిగి ఆవిడని ఎడం చేత్తో పట్టుకుని ఉండి జటాయువుతో యుద్ధం చేశాడు. కాని జటాయువు తన రెక్కల చేత ప్రహారము చేస్తుంటే ఇంక తట్టుకోలేక సీతమ్మని విడిచిపెట్టి తన ఖడ్గాన్ని పైకి తీసి జటాయువు యొక్క రెండు రెక్కెలు రెండు కాళ్ళు నరికేశాడు నరికేస్తే ఆ జటాయువు కుప్పకూలి పోయాడు ఆ నెత్తుటి మడుగులో పడిపోతే సీతమ్మ పరుగెత్తుకెళ్ళి తండ్రి మరణిస్తే ఎలా బాధపడుతుందో అలా ఆతల్లి ఆ జటాయువు యొక్క గుండెల మీద పడి

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
ఆలింగనం చేసుకొని ఏడ్చింది. అది చాలా హృదయవిదారకమైన సన్నివేషం, అటువంటప్పుడుకూడా కామ ప్రవృత్తి కలిగి ఉన్నాడూ అంటే ఇంక అసలు ఆ రాక్షసత్వం అన్నమాటకి ఎంత దూరపు హద్దు చెప్పచ్చో రాక్షసత్వానికి అంత దూరపు హద్దు రావణాసునిది వాడికి హద్దులేదు రాక్షసత్వానికి. ఎంత ఇతరులు బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటుంది వాడికి ఇప్పుడు బాధపడి చెట్లచాటుకు వెళ్ళి చెట్లను అడ్డుపెట్టి కౌగలించుకుని ఏడ్చి వణికిపోతున్నటువంటి సీతమ్మని ఒడిసిపట్టి తీసుకొచ్చి మళ్ళీ తన ఒడిలో కూర్చోబెట్టుకుని పైకెగరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు.
Related imageఆవిడని పట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నప్పుడు ఆవిడ కదలీ బంధం కదిలిపోయి ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పద్మముల యొక్క రేకులు విచ్చిపోయి రావణాసురుని మీద పడ్డాయట. ఆవిడ పెట్టుకున్న హారములలో ఉన్న మణులు చల్లా చదురై కిందపడుతూంటే నగలు జారిపోతూంటే రెండు చేతులెత్తి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కన్నులవెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వ భూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకొని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి బాధ చూసి తామందరూ కూడా బాదాపరితప్త హృదయములతో ఉన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా ! కృతం కార్యమ్ ఇతి శ్రీమాన్ వ్యాజహార పితామహః !! బ్రహ్మగారు అన్నారటా... హాఁ... ఇప్పుడు కదరా ఇంత తపస్సుండి లోకాల్ని బాధపెడుతున్నవాడివి చావడానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలు పెట్టావు. ఎందుకీమాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే... భాగవతంలో ఒక పద్యముంది. పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవ్వరో ఏదో తప్పు చేస్తున్నారుగదా అని చెప్పి వెంటనే వాళ్ళని చెలకేయడు వాళ్ళనేం చంపేయడు ఆయన ఆయన ఒక మాట చెప్పాడు శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు దలిగి నాయందు వా డెన్న గులుగు నాడె హింస జెందు అన్నారు. వీటి జోలికి వెళ్ళాలి వీటి జోలికి వెళ్ళి వీటిని బాధపెడితే మాత్రం ఇక ఈశ్వరుడు ఓర్చడు. వేటితోటి శుద్ధ సాధులందు పరమేశ్వరునే నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి మహా భక్తుల జోలికి వెళ్ళినా సురలందు దేవతల్ని అదే పనిగా నింద చెయ్యడమే లక్షణంగా పెట్టుకున్నవాళ్ళయందు శ్రుతులందు వేదం జోలికి వెళ్ళినా ధర్మపదవియందు ధర్మాన్ని బ్రష్టుపట్టించే ప్రయత్నం చేసినా గోవులందు గోవులను హింస పెట్టే ప్రయత్నం చేసినా నాయందు చిట్ట చివరకి పరమేశ్వరున్నే నిందించేటటువంటి ప్రయత్నం చేసినా ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను అప్పటివరకు వధించను అవకాశం ఇస్తునట్లు గుర్తు మారుతాడేమోనని.
ఇప్పుడూ చెయ్యకూడనంత పెద్ద తప్పు చేశాడు మహా పతివ్రత సౌశీల్యవతి అయోనిజ రామ చంద్ర మూర్తి యొక్క ఇల్లాలు అటువంటి సీతమ్మని బలవంతంగా ముట్టుకుని అపహరించి తీసుకుని వెళ్ళుతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడి చేతి బాణం నీమీద పడడానికి కావలసినటువంటి యోగ్యతని నీకు నీవు సిద్ధింపజేసుకున్నావు. ఇప్పటిదాకా మేం చెప్పాము వేయడు రాముడు బాణం, వేళ్ళాడా 13 యేళ్ళు అయిపోయింది. నీవు తెచ్చుకున్నావురా నీ మరణం కాబట్టి ఇప్పుడు మాకు సంతోషం కానీ సీతమ్మ బాధచూస్తే మాత్రం బాధ కలుగుతుంది. కాబట్టి మహర్షులు అన్నారటా..! ప్రహృష్టా వ్యథితా శ్చాఽఽసన్ సర్వే తే పరమర్షయః ! దృష్ట్వా సీతాం పరామృష్టాం దణ్డకారణ్య వాసినః !! రావణ స్య వినాశం చ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా !! దైవికంగా రావణుడు మరణించడానికి ఏర్పడినటువంటి సీతాపహరణమనేటటువంటి కారణాన్ని చూసి మహర్షులు మనసులో సంతోషించినప్పటికీ సీతమ్మ తల్లి పొందినటువంటి ఖేదాన్ని చూసి బాధపడ్డారు.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
అపహరించాడు తీసుకెళ్ళాడు ఆ తీసుకెళ్తున్నప్పుడు మాత్రం తల్లీ ఒక్క మనుష్యుడన్నవాడు కనిపించట్లేదు నా ఆర్తి చెప్పడానికీ అని చూస్తుంది. కింద ఒక ఐదుగురు వానరములు కనపడ్డాయి మహానుభావుడు వచ్చేస్తాడు కిష్కింద కాండలో ఇంకా... ఆ పర్వతం మీద నాలుగు వానరములు కూర్చుని ఉన్నాయి
ప్రియమాణా తు వైదేహీ కం చి న్నాథమ్ అపశ్యతీ ! దదర్శ గిరి శృంగస్థాన్ పంచ వానర పుంగవాన్ !!
తేషాం మధ్యే విశాలాక్షీ కౌశేయం కనక ప్రభమ్ ! ఉత్తరీయం వరారోహా శుభాన్యాఽఽభరణాని చ !!
ముమోచ యది రామాయ శంసేయురితి మైథిలీ !!
తన పట్టుబట్ట యొక్క ముక్కని ఒకదానిని చింపి అందులో తన ఆభరణులను కొన్నిటిని తీసి మూటకట్టి ఆ కూర్చున్నటువంటి ఐదురుగు వానరుల యొక్క మధ్యలోకి ఆ తల్లి విడిచిపెట్టిందట, ఐదుగురి వానరుల మధ్యలో ఆ నగల మూట పడింది. ఎప్పటికైనా రాముడు ఇటు రాకపోతాడా ఈ నగల మూట చూపించకపోతారా చూపించిన తరువాత రాముడు ఇలా సీతాపహరణం జరిగిందని నన్ను గుర్తించి రక్షించకపోతాడా అని ఆ తల్లి ఒక కారణం, కేవలం ఒక ఊహ చేసి విడిచిపెట్టినటువంటి ఆ నగల మూట రామాయణంలో పెద్ద పాత్రే పోషించింది. కాబట్టి ఇప్పుడు ఆ నగల మూట విడిచి పెట్టింది. లంకా నగరానికి తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళి ఆతల్లిని తన యొక్క వైభవమంతా చూడమంటాడు, నేను ఇంత గొప్పవాన్ని అంటాడు అన్నీ చెప్పిన తరువాత సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చీ ఒక మాట చెప్తాడు ఇది రావణ ప్రవృత్తీ అంటే. మీగిలినదేముంది అస్తమానం తనని పొగుడుకోవడం రావణుడు ఎప్పుడు చెప్పినా అదే చెప్తాడు. నాకు ఇంత అంతఃపురం ఉంది ఇన్ని వజ్రాలు ఉన్నాయి వైఢూర్యాలు ఉన్నాయి నగలున్నాయి దాస దాసీమనులున్నారు ఇంత మంది భార్యలున్నారు ఇంత మందిని జయించాను కుభేరున్ని జయించాను పుష్పక విమానాన్ని తెచ్చాను సముద్రాన్ని అల్లకల్లోలం చేశాను పంచ భూతాలను శాశిస్తాను దిక్పాలకులు నా మాట వింటారు దేవతలు భయపడిపోతారు భూమిని పైకెత్తేస్తాను పర్వతాలని పిండి చేసేస్తాను కొండలను విసిరేస్తాను చెట్లు పీకేస్తాను వాళ్ళను కొట్టేస్తాను వీళ్ళను కొట్టేస్తాను కాబట్టి నీవు నన్ను కామించు నా పాన్పుచేరు చివరికి అడిగేది అది.
కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గరకి వచ్చి అన్నాడు అలం వ్రీడేన వైదేహి ధర్మ లోప కృతేన చ ! ఆర్షోయం దైవ నిష్యన్దో య స్త్వామ్ అభిగమిష్యతి !! సీతా ఎందుకు ఏడుస్తావ్ నీవు ఎందుకంత ఏడుపు ఏదో ధర్మలోపం జరిగిపోయిందని కదా ఏడుస్తున్నావ్, ధర్మలోపం జరిగిపోయిందని ఏడవకు ఇది ఈశ్వరుడు నిర్ణయించినటువంటి విధి విధానము అని నీవు అంగీకరించు ఆర్షోయం దానివల్ల నీవు హర్షాన్ని పొందు, పొందీ ఇది ఈశ్వర కృత్యమూ ఈశ్వరుడు నన్ను భర్తగా పొందమన్నాడూ అని చక్కగా అంగీకరించి నీవు నా పాన్పు చేరవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఈశ్వర నిర్ణయంగా భావన చేయ్యి ఏదోషమూ ఉండదు అంటే..? ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటాయాండీ! ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటాయని చెప్పిందా వేదం, అలా ఉండమని చెప్పాయా శాస్త్రాలు. చదువు చదువుకోవడం గొప్పా చదువుకున్న చదువుని అనుష్టించడం గొప్పా. తను చదువుకున్న చదువుమీద తనకే నమ్మకం ఉండడం ఆస్తిక్య బుద్ధి. తను చదువుకున్న చదువుమీద తనకే నమ్మకంలేక తనకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడేవాడేవడో వాడే రావణుడు. యదార్థంగా శాస్త్రవచనం ఏదో దానికి కట్టుబడేవాడెవడో వాడు మహాత్ముడు.
Image result for సీతాహరణం

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఈ మాట చెప్పి సీతమ్మ తల్లి పాదముల వంక చూసి అన్నాడూ తెలిసి చేశాడో తెలియక చేశాడో నచ్చిందేదైనా ఉంటే ఇదొక్కటే ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ ! ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసోహమ్ అస్మి తే !! ఎర్రగా ఉన్నటువంటి ఆ సీతమ్మతల్లి పాదముల వంక చూసి నా పది తలలతో నేను ఇప్పటివరకూ ఏ ఆడదానికీ నమస్కరించలేదు, సీతా నీ పాదములకు నమస్కరిస్తున్నాను ఉత్తర క్షణం క్షిప్రం ఇప్పుడే నన్ను అనుగ్రహించి నాకు కలిగినటువంటి కోర్కె తీర్చు అని మనసులో అనుకున్నాడటా... నేను ఇలా మాట్లాడి ఇలా కాళ్ళమీద పడ్డాను కాబట్టి తప్పకుండా సీతమ్మ నా కోరిక తీరుస్తుంది అనుకున్నాడు. సీతమ్మందీ గతాఽఽయు స్త్వం గత శ్రీకో గత సత్త్వో గతే న్ద్రియః ! లంకా వైధవ్య సంయుక్తా త్వ త్కృతేన భవిష్యతి !! ఓరి పిచ్చివాడా! పరసతిని అపహరించి తీసుకొచ్చిన పాపం ఉత్తిగనే పోతుందనుకోకు నీ ఆయుర్ధాయం పోతుంది నీ ఐశ్వర్యం పోతుంది నీ సత్వం పోతుంది నీ ఇంద్రియములు నశించిపోతాయి లంక విధవ కావడానికి నన్ను తీసుకొచ్చావు. ఇక్కడ ఉన్నవాళ్లందరూ మరణించడానికే నీవు నన్ను తీసుకొచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నావు న తే పాపమ్ ఇదం కర్మ సుఖోదర్కం భవిష్యతి ! యాహం నీతా వినా భావం పతి పార్శ్వాత్ త్వయా వనాత్ !! నీవు అరణ్యంలో కూడా భర్త పక్కన ఉండడం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్న నన్ను భర్త నుండి దూరం చేశావు, ఐశ్వర్యంలో ఉంటే నాకు సుఖం ఉంటుందీ అనుకుంటే నేను అంతఃపురంలో ఉండచ్చు కానీ... అంతఃపురాన్ని విడిచిపెట్టి నా భర్త పక్కనుంటే నాకు సుఖమూ సంతోషమూ అని నేను వనంలో కూడా నా భర్త పక్కనే చేరి సంతోషంగా గడుపుతున్నదాన్ని నీవునుకున్నది నాకు సుఖము సంతోషమూ అనుకొని నా భర్త పక్కనుంచి తెచ్చి నీదగ్గర అంతఃపురంలో నీవు బంధించావు కానీ ఈ బంధనం ఏదైతే నీవు చేశావో దానివల్ల ఇక నుంచి నీకు సుఖము సంతోషము అన్నమాట ఉండదు.
Image result for జటాయువుఇది నీవు తెచ్చుకున్నానని తెలుసుకోలేక నన్ను తెచ్చావని నీవనుకుంటున్నావు, నా సుఖ సంతోషములను దూరం చేశానని నీవు అనుకుంటున్నావు నేను మళ్ళీ పొందుతాను ఎందుకంటే రాముడు వస్తాడు నిన్ను చంపేస్తాడు కానీ ఇక నుంచి సుఖ సంతోషములన్నవి పోవడమన్నది ప్రారంభమై నీవ్వే పోవడము లంకే పోవడం రాక్షసులే పోవడంతో పరిసమాప్తమౌతుంది కథ. కాబట్టి రావణా! తెలియక ప్రవర్తిస్తున్నావు యదా వినాశో భూతానాం దృశ్యతే కాల చోదితః ! తదా కార్యే ప్రమాద్యన్తి నరాః కాల వశం గతాః !! బాగా పొగరు పట్టినటువంటి వాడు యుక్తా యుక్త విచక్షణ లేకుండా కాల చోదితుడై తొందరగా ఇంక శరీరాన్ని విడిచిపెట్టేయ్యవలసినటువంటి స్థితి కలిగినప్పుడు యమ దండన పొందాలనుకుంటున్నవాని పుర్రెలో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో అటువంటి ఆలోచన నీ పుర్రెలోకి ప్రవేశించింది ఇదం శరీరం నిస్సంజ్ఞం బన్ధ వా ఖాదయస్వ వా ! నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస !! న హి శక్ష్యామి ఉపక్రోశం పృథివ్యాం దాతుమ్ ఆత్మనః ! నీవు ఈ శరీరముంది జడం, ఇదేముంది ఇదేం కదలగలిగినది కాదు, కదిలించేది ఏదుందో అది లోపలుంది అది చైతన్యము. నా చైతన్యముతో నేను మాత్రం శాశ్వతంగా నాకు కాని రామునికి కాని అపరీక్తి కలిగేటటువంటి పనికి అంగీకరించి నేను ఎన్నడూ ఏపనీ చేయను, మచ్చ తెచ్చుకునే పని నేను చెయ్యను. జడమైన ఈ శరీరం మీద వ్యామోహాన్ని పొందుతున్నవు కాబట్టి మనసుతో అంగీకరించి నేను నీ పాన్పు చేరను కనుక, కోర్కె తీరనటువంటి నీ వంటి రాక్షసునకు కలిగేది క్రోధం కనుక ఆ క్రోధంతో ఈ శరీరాన్ని నీవు చంపేస్తానంటావా..! చంపేసై, దీన్ని బంధించేస్తానంటావా బందించేసై, దీన్ని కాల్చేస్తానంటున్నావా కాల్చేసై నీవు ఏది చేస్తాననుకుంటున్నావో ఈ శరీరాన్ని అది నీవు చేసై ముక్కలు చేసేస్తావా చేసేసై అదినాకు భయం లేదు.

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
కానీ శరీరము లోపల ఉన్న చైతన్యము మాత్రము ఆ చైతన్యమును ఆలంబనము చేసుకుని ఆలోచన చేసేటటువంటి మనసు దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః  అని కదా... శంకర భాగవత్పాదులు నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ! జానామీత తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !! కాబట్టి లోపల నేను చైతన్యముతో ఉండగా నాకు నేను నా మనసులో నేను నీ పక్కన చేరి నేను మచ్చతెచ్చుకునేటటువంటి పని మాత్రం ఎన్నడూ చేయను. నీకు దక్కలేదని ఈ శరీరం మీద కసితీర్చుకుంటావా? నీ ఇష్టం నేను మాత్రం ఎన్నడూ తప్పు చెయ్యను. ఇదీ శాస్త్రమునకు కట్టుబడడము ఇదీ ధర్మానికి కట్టుబడడం ఇదీ సీతమ్మ తల్లి ఈ ధర్మం ముందు అధర్మం పది తలకాయలు తెగినా నిలబడలేదు. ఈ రామాయణం మనకు ధర్మాన్ని అనుష్టించడంలో పూనికని ఇస్తుంది గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది.
ధర్మానికి కట్టుబడినవాడు పాడైపోడు అన్న విశ్వాసాన్ని కల్గిస్తుంది శృణు మైథిలి మ ద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని ! కాలేనానేన నాభ్యేషి యది మాం చారు హాసిని !! ఆవిడ అంత ఏడుస్తుంటే వాడికి చిరునవ్వు ఎలా కనపడిందో నాకు అర్థం కాదు అసలు సంభోదించేటప్పుడు చారు హాసిని అంటాడు సుందరమైన చిరునవ్వు ఉన్నదానా! అంటాడు. అంటే తననుకున్నదే వాడికి సంతోషం తప్పా ఆవిడ అంత ఏడుస్తుందన్నది మాత్రం వాడి చెవికి ఎక్కలేదు. నీకు ఒక సంవత్సర కాలాన్ని అనుమతిస్తున్నాను ఈ సంవత్సరం లోపల నీ మనసు మార్చుకుని నీయంతల నీవు నా పాన్పు చేరితే పట్టపు రాణివి అవుతావు, ఈ దాస దాసీ జనమందరూ నిన్ను సేవిస్తారు నేను నీవాడను అవుతాను ఎన్నడూ నీ మాటను నేను Related imageకాదనను, చక్కగా మూడు లోకముల వాళ్ళూ కూడా నీ మాట వినేటట్టుగా సమస్తమూ తీసుకొచ్చి నీ పాదముల దగ్గర పెడతాను. కాదని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఇదిగో ఈ రాక్షస కాంతలు ఉన్నారే వీరు ఒక యేడాది తరువాత ఉదయం ఎప్పుడొస్తుందో ఆ ప్రాతః కాలంలో నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి పచనం చేసి నాకు అల్పాహారంగా నాకు ఉదయం వేళ వడ్డిస్తారు ఈ విషయాన్ని తెలుసుకో సీతా అని హూంకరించి, అక్కడ ఉన్న రాక్షస కాంతలను పిలిచి ఈవిడని అశోక వనానికి తీసుకెళ్ళి బంధించి నయానా భయానా నచ్చజెప్పి ఈమె నా మార్గంలోకి వచ్చేటట్టు మాట్లాడండీ అని సీతమ్మని అశోక వనంలోకి ప్రవేశ పెట్టాడు.
తల్లి అశోక వనంలోకి వెళ్ళింది అక్కడ ఉన్న బలాఢ్యులైన కొంతమంది రాక్షసుల్ని పిలిచి దండకారణ్యంలో నేను పెట్టినటువంటి ఖర-దూశనాదులు రాముని చేతిలో నిహతులయ్యారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉండి రాముని యొక్క కదలికలను నాకు ఎప్పటికప్పుడు చేరవేయండీ అని ఆజ్ఞాపించి రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతమ్మ తల్లి తన మనసులో రామ చంద్ర మూర్తినే స్మరిస్తూ... ఆ స్మరణలచేత ఆనందాన్ని పొందుతూ నాతల్లి ఆ అశోకవనంలో శింశుపా వృక్షిం కింద కూర్చుని ఉన్నదీ... అన్నమాట దగ్గర ఇవ్వాలికి ఉపన్యాసాన్ని పూర్తిచేస్తూ... మీతో ఒక్క విషయాన్ని నేను పూర్తి చేయవలసి ఉంటుంది నా మనవిని కొంచెను గమనించెదరు గాకా...

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
మనకి శ్రీ రామ నమమీ అని ఒక పండగ రాముడు పుట్టాడూ అని, కృష్ణాష్టమి అని ఒక పండుగ కృష్ణుడు పుట్టాడూ అని, దేవీ నవరాత్రులు అని మనకు ఒక నవరాత్రులు అవి ఎవరు నిర్ణయం చేశారూ అంటే వేదం నిర్ణయం చేసింది, శాస్త్రం నిర్ణయం చేసింది ఇలా అనుష్టించండి ఆశ్వీజ మాసంలో అని వసంత నవరాత్రులు ఈ కాలంలో ఫలానా మాసంలో ఫలానా సమయంలో అనుష్టించండి ఋషి ప్రోక్తం శాస్త్ర ప్రోక్తం అసలు ఇవన్నీ మనం చేసుకోవాలీ అంటే వేదం శాస్త్రం కదాండీ ప్రమాణం ఈ వేదమూ శాస్త్రమూ రెండూ కూడా ప్రశ్నార్థకమై ఈ రెండిటి యొక్క ఉనికియే ప్రశ్నింపబడింది వేదమే వ్యతిరేకమైనటువంటి వాదనల చేత ఒకానొకప్పుడు. అప్పుడు కైలాస శంకరుడే ఈ లోకంలో కాలడి శంకరుడిగా అవతరించి సత్యదండాన్ని చేత పట్టుకుని “శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్యరూపా” శంకరాచార్యులవారి రూపంలో ఆసేతు హిమాలయ పర్యంతం పర్యటించి, అవైధికమైన వాదనలను ఖండించి వేద ప్రమాణానికి పట్టంకట్టి ఎన్నోచోట్ల యంత్ర స్థాపనచేసి అనేక దేవాలయాలను పునరుద్ధరించి మహానుభావుడు షణ్మతా స్థాపనాచార్యుడై అద్వైత సత్య ప్రచారకుడై ఈ దేశంలో వేదప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడు శంకరభగవత్పాదులు శంకరుల పుట్టబట్టి అవన్నీ ఉన్నాయి, శంకరులే పుట్టకపోతే ఆ పుట్టిన రోజులన్నీవి మనం ఇవ్వాళ చేసుకోగలిగి ఉండేవాళ్ళమా? అన్నది అనుమానాస్పదమే.
Image result for శంకర జయంతిఆ మహానుభావుడు పుట్టాడు కాబట్టి చేసుకుంటున్నాం కాబట్టి ఆయన పుట్టిన రోజుని మనం చేసుకోవడం మనిషిగా పుట్టినవాడి ప్రతివాడి కర్తవ్యం ఎందుకంటే సనాతన ధర్మంలో మనం ఒక్కటే మాట చెప్తాం గురుర్ బ్రహ్మ గురుర్విష్షుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మః తస్మైశ్రీ గురవేన్నమః అని బ్రహ్మచారిగానే గురువుగారి మాటకు కట్టుబడి ఎక్కడో ఒకచోట ఉండాలి, గృహస్తుగా ఉంటే భార్యా బిడ్డల్ని పోషించడానికి ఒకచోట ఉండాలి, వానప్రస్తు అయితే ఏ అరణ్యంలో కూర్చుని తపస్సు చెయ్యాలి, సన్యాసి అయితే తన ధర్మంచేత ఒకచోట ఉండవలసిన అవసరం లేకుండా అన్ని చోట్లా పర్యటిస్తూ జ్ఞానబోధ చెయ్యవచ్చని సన్యాసము స్వీకరించి ఈ దేశంలో వైదిక ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడైనటువంటి శంకరభగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమినాడు మిట్ట మధాహ్నం వేళ రామ చంద్ర మూర్తి ఎలా అభజిత్ లగ్నంలో జన్మించారో అలా అవతారాన్ని నందన సంవత్సరంలో స్వీకరించినటువంటి మహానుభావుడు అటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి రేపటిరోజున వైశాఖ శుక్ల పంచమినాడు జగత్ గురవులకి కట్నమివ్వాలీ అని పెద్దలు చెప్తారు. గురు కట్నం అంటాం గదాండీ! గురు దక్షిణ అంటాం కదా... గురువుగారికి కట్నం ఇవ్వాలి.
గురువుగారికి కట్నం ఇవ్వడం అంటే..? తను స్తోత్రంచేసి బంగారు ఉసిరికలే కురిపించగలిగినచువంటి మహాపురుషునికి ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు పెరిగి అహం బ్రహ్మాస్మి చెప్పీ పాతాళం ఎంతుంటుందో అంత కిందకి దిగి అమ్మా దృశా ద్రాఘీయస్యా దరదలితనీలోత్పలరుదా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి నన్ను కూడా అని తనంత కిందపడిపోయినవాడిలా మాట్లాడినటువంటి శంకర భగవత్పాదులు మనకోసం ఇంత సాహిత్యం ఇన్ని స్తోత్రాలు ఇన్ని వ్యాఖ్యానాలు ఇన్ని ప్రకరణ గ్రంధాలు ఇన్ని ఇచ్చిన మహాపురుషుడు 32 సంవత్సరములు మాత్రమే ఈ భూమి మీద శరీరంతో నడయాడి మళ్ళీ అవైదిక వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథలో గోవర్దన పీఠము పడమర కాళికా పీఠము ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతి పీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము స్థాపించి అవైదిక వాదనలను ఖండించడానికి పరంపరాగతంగా ఆ పీఠాలు నిర్వహింపబడే విధంగా ఏర్పాటు చేసిన మహాపురుషుడు శంకరభగవత్పాదాచార్య స్వామి అటువంటి శంకరుడూ సాక్ష్యాత్ పార్వతీ పరమేశ్వర స్వరూపము.
Image result for శంకర జయంతి

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
పరమ శివుడైతే ఒక చోట కూర్చొని దక్షిణామూర్తిగా ఆయనా ఎప్పుడు తన చిన్ముద్ర పట్టి దగ్గరికి వచ్చిన సనక సనందనాదులకు మాత్రమే జ్ఞానబోధ చేశారు కానీ గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః ! చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా గురోస్తు మౌనవాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః కానీ అలా మౌన ముద్ర పడితే ఎవ్వరికీ అర్థం కాదని పరమ శివుడు తనలో తాను రమిస్తూ ఒకచోట కూర్చుంటాడు. శక్తి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది కదిలితే శక్తి కదలకుండా తనలోతాను అంతర్ముఖుడైపోయి బ్రహ్మమును అనుభవిస్తూ నిలబడిపోయినటువంటివాడు శివుడు. కెరటములు లేకుండా కదలికలేని సరోవరం శివుడు కదులుతున్న కెరటములు ఉంటే పార్వతి. తాను భూ మండలమంతా తిరుగుతూ ఆసేతు హిమాచల పర్యంతం కదలడం పార్వతీ దేవి కదులుతూ బోధ చేయడం పరమశివుడు పార్వతి పరమేశ్వర సమాగమ స్వరూపంగా నమః కపర్థి నే చ వ్యుప్తకేశాయ చ అని జటజూటంతో ఉన్న పరమ శివుడు వ్యుప్తకేశాయ చ బోడిగుండుతో శంకరభగవత్పాదులుగా ఈ భారత దేశంలో నడయాడారు అటువంటి మహాపురుషుడికి రేపు ఉదయం నమక చమకాలతో అభిషేకం జరుగుతుంది అందునా ఇది శృంగగిరి శారదా పీఠానికి ప్రతిబింబ స్వరూపం బింబము ప్రతి బింబము అభేదమేమి అంటే శృంగగిరి పీఠానికి ఈ శాఖకి భేదమేమీ ఉండదు.
అద్వైయిత సాంప్రదాయానికి పట్టంకట్టినటువంటి స్థానాల్లో ఒకటి ఈ శృంగేరీ శారదా పీఠము శాఖ, అటువంటి శాఖలో రేపటి రోజున శంకరభగవత్పాదులకి సక్రమంగా పూజ జరగకపోతే పీఠాలు శాఖలు ఉండి ఊడిపోయినట్లే నేను నిస్సంకోచంగా అందులో మళ్ళీ మొహమాటంలేకుండగా చెప్తున్నాను. ఉన్నది ఎందుకు ఇటువంటి పీఠాలు శాఖలు మొదట శంకరాచార్యులవారికి పూజ చేయడానికే, శంకరుల పూజ చేయకపోతే శంకరులకు ముందు ఇక్కడ సరిగ్గా కార్యం జరగకపోతే మిగిలినవి ఎన్ని జరిగిన ఎంత హెచ్చవేత వేసినా పక్కన సున్న పెట్టి హెచ్చవేసినట్లే, ఎంత పెట్టి హెచ్చవేస్తే పక్కన సున్నా పెట్టి హెచ్చవేస్తే సున్నే వస్తుంది. శంకరులకు మనం చేసే ఒక్క శంకరజయంతి ఆయనేం మనల్ని 365 రోజులు ఉత్సవం అడగలేదు, ఒక్క శంకరజయంతినాడు పెద్దలు ఏమి నిర్ణయం చేశారంటే గురు కట్నం ఇమ్మని చెప్పారు 116లు నూట పదహార్లు అంటే డబ్బులు అని అనుకుంటున్నారేమో డబ్బులు కాదు, అష్టోత్తరం ప్రతివాళ్ళు శంకరాచార్యుల ముందు కూర్చుని నామం చెప్పాలి. శంకరభగవత్పాదులకొక్కరికే పెద్దలు ఒకమాట చెప్తారు గురువులేనివారు శంకరులని గురువుగా భావించవచ్చూ అని అంతటి మహాపురుషుడు అంతటి మహానుభావుడు ఏ శంకరుల పేరు చెప్తే ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా లేచి నమస్కరిస్తున్నారో, శంకరుల అధ్వైత సిందాంతము పరమ సత్యమని నమ్ముతున్నారో లోకమంతా ఇవ్వాళ కీర్తిస్తుందో అటువంటి మహాపురుషుని జయంతి.
మనందరం రేపు వచ్చి కూర్చుంటే గొప్ప సంస్కృత పండితులు అనంతపూర్లో సంస్కృతాన్ని ఫ్రోషేసర్ ర్యాంక్ లో చాలా కాలం బోధ చేసినటువంటి విశ్రాంత ఆచార్యులు మహా భక్తి తత్పరులు బ్రహ్మ శ్రీ శలాక్ రఘునాత శర్మగారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజుల నుంచి శంకర విజయాలని పారాయణ చేస్తున్నారు, శంకర విజయాలని పారాయణ చేసి శంకరాచార్యులవారిని నాలుగు రోజులుగా సేవిస్తున్నటువంటి అత్యంత వినయం కలిగినటువంటి మహాపండితుడు ఆయన అటువంటి వారు రేపు చక్కగా పొద్దున్న అభిషేకం జరగగానే కూర్చుని అటువంటి పెద్దలు యొక్క నోటితో పలికాక పలకడం

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
మన అదృష్టం వారు రేపు 116 Image result for శంకర జయంతినామమలు చెప్తారు. ఆ 116 నామములు మనం తిరిగి చెప్పడమే శంకరాచార్యులవారికి ఇచ్చేటటువంటి కట్నం తప్పా మనమేం 116లు కాదు చిల్లిగవ్వ ఆయనకు ఇవ్వక్కరలేదు. అయితే మీరు ఇందాక 108 ఉంటాయి వెయ్యుంటాయి 116 ఎక్కడ నుంచి ఉంటాయి అన్నారు కదా..? మరి 116లు ఎక్కడ ఉంటాయి మరి శంకరాచార్యులకైనా అష్టోత్తరమేగా ఉంటుంది, మరి మిగిలిన 8 నామములు ఎక్కడ నుంచి వస్తాయి అంటే దీన్ని కూడా పెద్దలు నిర్ణయం చేశారు, శంకరాచార్యస్వామి అష్టోత్తరం చెప్పీ 8 నామములు పరమశివుని యొక్క అష్టమూర్తులకు సంబంధించినవి ఉన్నాయి. ఓం భవాయ దేవాయ నమః ! ఓం శర్వాయ దేవాయ నమః ! ఓం ఈశానాయ దేవాయ నమః ! ఓం పశుపతయే దేవాయ నమః ! ఓం రుద్రాయ దేవాయ నమః ! ఓం ఉగ్రాయ దేవాయ నమః ! ఓం భీమాయ దేవాయ నమః ! ఓం మహతే దేవాయ నమః ! అని ఎనిమిది నామాలు ఈ ఎనిమిది నామాల్ని శంకరాచార్యులవారి అష్టోత్తరం దగ్గర కలుపుతారు కలిపితే 116లు అవుతాయి, ఈ 116 నామాలని రేపు శంకరాచార్యులవారి దగ్గర కూర్చుని చెప్పాలి అందరు తప్పకుండా కాబట్టి ఇవి చెప్తే మనం మన గురువుగార్ని గౌరవించుకున్నట్లు ఇటువంటి పీఠాలు తను చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించినట్లు.
కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా 6 గంటలకి అభిషేకం ప్రారంభమౌతుంది, దేనికైనా కాలమంటే కాలమే అలా పాటించవలసి ఉంటుంది. ఖచ్చితంగా 6 గంటలకి అభిషేకం ప్రారంభమౌతుంది. ఒక గంటా పదిహేను నిమిషాలు 7 గంటల పదిహేను నిమిషాలకీ ఏకమానాభిషేకమే కాబట్టీ నమక చమకాలు పోనూ ఒక ఆవృత్తిని నమకం చమకం చక్కగా చెప్పినా శంకరుల ముందు చెప్తున్నాము. మన దరిద్రం ఇవ్వాళ దేశంలో ఏమైపోయిందంటే..? ఏ వేదం శంకరాచార్యులవారి వల్ల రక్షింపబడిందో ఆ శంకర భగవత్పాదుల పల్లకీ వెడుతుంటే మంత్రం నేర్చుకున్నందుకు చెప్పడం నాబాధ్యతాని వచ్చేవాళ్ళు కొదవైపోయారు. సంభావన ఇస్తే వస్తున్నారు నేను నిర్మొహమాటంగా చెప్తున్నాను నాకేం భయంలేదు, శంకరాచార్యుల ముందు నడిచి ప్రవాడు తాను నేర్చుకున్న మంత్రం చెప్పాలి రేపు, నీకు ఏమీ రాకపోతే ఆయన జయంతినాడు ప్రారంభమైన జయ పరంపరవల్ల నీవు వేదాన్ని చదువుకోగలిగావు. ఒక్క మాట చెప్పాలి “జయ జయ శంకర హర హర శంకర” మేము కాకినాడ పట్టణంలో నేను ఇవ్వాళ అక్కడ లేకపోయాను కాని సాయంకాలం పాపం ఫోను చేసి చెప్పారు. ఉంటే ఐదు రోజులు మేము శంకరాచార్యుల మీద ఉపన్యాసాలు చెప్పుకుని చక్కగా రాత్రయ్యేటప్పటికి ప్రతిరోజు తోటకాష్టకంతో నమస్కారం చేస్తాం విధితాఖిల శాస్త్ర సుధాజలదే మహితోపనిషద్కధితార్థనిధే అంటూ ఆయనకు తోటకాష్టకంతో నమస్కారం చెయ్యాలి శంకరజయంతినాడు ఆయనకు చెయ్యనప్పుడు ఇంక పీఠమన్న మాటకు అర్థముండదు శర్మగారు నేను తప్పు మాట్లాడుతున్నానా..! లేదుకదా..? తోటకాష్టకంతో మనం నమస్కారం చెయ్యాలి అది మన కర్తవ్యం.
కాబట్టి రేపు దయచేసి అందరు ఆర్తితో తప్పకుండా రండి! ఒక పీఠానికి గౌరవము మనం అందరం వచ్చి అలా ఉంటేనే సనాతన ధర్మానికి గౌరవము, మన గురవుల్ని మనం గౌరవించుకోవాలి రేపు 6 గంటలకు ప్రారంభమై 7 గంటల పదిహేను 30 నిమిషాల మధ్యలో అభిషేకం పూర్తైపోతుంది. పూర్తైపోగానే ఒక్కసారి స్వామిని పోతవస్త్రం పెట్టి తుడిచి లఘువుగా అలంకారం చేసి ఆయనకి అప్పుడు నామాలతో రాత్రికి లక్ష మల్లికార్చన జరుగుతుంది పొద్దున్నా 116 నామాలు బ్రహ్మ శ్రీ రఘునాథ శర్మగారు చక్కగా మనతో చెప్పిస్తారు మనందరం ఆ నామాలు చెప్పుదాం. మనం నామాలు చెప్తూండగా...

  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
మల్లెపూలతో శంకరాచార్యులవారి మీద ఒక శ్లోకముంది సరస్వతీ దేవి సిగలో తురుముకున్నటువంటి మల్లెపూవ్వులలోని మకరందంకన్నా తీయనైన మాటలంట ఇవి కాబట్టి రేపు ఆ మల్లెపువ్వులతో మారేడు దళాలతో శంకర భగవత్పాదులకు పూజ జరుగుతుంటే మనందరం కూడా ఆ నామాలు చెప్పుదాం. ఎంతసేపు పడుతుందండీ 116 నామాలు చెప్పడమంటే ఒక 20 నిమిషాలు పడుతుంది అంటే 8 గంటలకు మనం శంకరాచార్య స్వామివారిని ఒక్కసారి పల్లకిలో కూర్చోబెట్టి జయ జయ శంకర హర హర శంకర అంటూ ఎండపడకుండా గొడుగుపట్టీ గురువుగారికి పల్లకీసేవ, ఎప్పుడూ కూడా గురువుగారు పల్లకీలోనే కూర్చుంటారు, గురువుగారికి చెయ్యవలసిన సుశ్రూష కైంకర్యమూ ఆయన పాదములు పట్టడము ఆయన పల్లకీ మోయడము.
Related imageనేను మొన్న కంచి వెళ్ళినప్పుడు పరమాచార్య స్వామి వారి పల్లకీ చూసి ఎంత మురిసిపోయానో... ఆ పల్లకీ రేపు శంకరాచార్యులవారి పల్లకీ పురుషులకు మాత్రమే అధికారము ఉంది స్త్రీలు పల్లకీ పట్టుకోరు అటువంటి బరువుపని చేయించరు, కానీ వారు జయ జయ శంక హర హర శంకర అంటూ ముందు నడవచ్చు. జగత్ గురువుల పల్లకీ పట్టుకుంటున్నాము కాబట్టి పల్లకీ పట్టుకునేటప్పుడు మర్యాదా ఏమిటంటే చొక్కా బనీను విప్పేసి పల్లకీ పట్టుకోవాలి. మాకూ కాకినాడ పట్టణంలో కొన్ని వందల మంది స్వచ్ఛందంగా బట్టలు విప్పేసి పల్లకీ పట్టుకుంటారు రేపటి రోజున రేపు నేను అక్కడ లేకపోయినా పల్లకీ సేవ జరుగుతోందనీ రెండుచోట్ల అభిషేకం జరుగుతోందనీ నేను వచ్చే ముందు కార్లో కూడా గోపాల కృష్ణగారు ఫోన్ చేసి కనుకుంటున్నారు. కాబట్టి అందునా శృంగేరి శారదా పీఠంలో ఉన్నాం ఇటువంటి చోట ఉండి కూడా అయ్యో జరగలేదనే అసంతృప్తి ఉండకూడదు. కాబట్టి రేపు మనం సంతోషంగా చేద్దాం గురువు మనకు ప్రసన్న మనస్కుడు ఇంతా అని ఉండదు, మీరు ఏది చేసినా గురువుగారు పొంగిపోతారు ఆ 116 నామాలు చెప్పడం కోసం రేపు మీ అందరూ చక్కగా ఉదయం ఖచ్చితంగా 7 అయ్యేసరికి వచ్చేస్తే మనందరం ఆ శారదాదేవి మంటపంలో కూర్చుని జగత్ గురువుల నామాలు చెప్పీ జగత్ గురువుల పల్లకీ పట్టుకునీ జయ జయ శంకర హర హర శంకర అంటూ ప్రాంగణము చుట్టూ ఒక్క మూడు పర్యాయములు తిరిగి వెళ్ళి ఆ పల్లకిని అక్కడ పెట్టేసి నీరాజనం ఇచ్చేస్తే అప్పుడు మనం ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు.
తరువాత చెయ్యవలసిన అలంకారాలు తరువాత జరుగుతాయి రాత్రి లక్ష మల్లికా పుష్పములతో మల్లెపువ్వులతో పూజ చేస్తారు. అప్పుడు అన్ని మల్లెపువ్వులతో పూజింపబడిన శంకభగవత్పాదులని సాయంకాలం మనం ఒక్కసారి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి నా ఆర్తిని మీరు మన్నించి ఎక్కడైనా నేను ఎక్కువ చేసి మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి, నాకు శంకరులయందు భక్తితో తప్పా ఎవ్వరిమీద నాకు క్రోధంతో కాని అందులో గుంటూరులో మీ క్రమ శిక్షణ చూసి నేను పొంగిపోతున్నాను, ఒక యదార్థం చెప్పాలంటే మా కాకినాడ పట్టణంలో కూడా మీ అంత క్రమశిక్షణ లేదు అంత క్రమశిక్షణ మీరు చూపిస్తున్నారు, నేను ఏదో నోటిమాటగా అంటున్నానని అనుకోకండి యదార్థం చెప్తున్నాను మా గోపాల కృష్టగారు కూడా అన్నారు నాతో అబ్బో... ఏమి క్రమశిక్షణండీ అని చక్కగా రేపు మీరు కూడా వచ్చి మనందరం శంకరజయంతిని అత్యద్భుతంగా నిర్వహించి భారతీ తీర్థ స్వామివారికి ఈ వార్త అందితే వారు ఎంతో సంతోషించి ప్రసన్నులై ఆనందంగా ఆయన ఒక్క నవ్వు నవ్వితే అది మనకు అంగ రక్ష కాబట్టి అటువంటి కార్యక్రమానికి రేపు ఉదయం మీ అందరు రావలసినదిగా పీఠం తరపున నేనే మిమ్మల్ని ఆహ్వానం చేస్తూ మనం ఒక్క పదకొండు పర్యాయములు రామ నామాన్ని ఇప్పుడు చెప్పుకుందాం.


  అరణ్య కాండ పంతొమ్మిదవ రోజు ప్రవచనము
 
శ్రీ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
నారాదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీ రామ నామము !!రా!!
పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీ రామ నామము !!రా!!
అండ పిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామ నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
వాదాభేదా తీతమగు వైరాగ్యమే శ్రీ రామ నామము !!రా!!
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము రామ నామము !!రా!!
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !!రా!!
రజతగిరి పతికినెప్పుడు రమ్యమైనది రామ నామము !!రా!!
పంచభూతాతీతమగు పరమాత్మ తత్వము శ్రీ రామ నామము !!రా!!
చిత్తశాంతిని కలుగుజేసెడి చిత్ స్వరూపము శ్రీ రామ నామము !!రా!!
దూర దృష్టియు లేనివారికి దుర్లభము శ్రీ రామ నామము !!రా!!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !!రా!!
మంగళా...

No comments: