ముందు మాట
ఆధ్యాత్మిక జ్ఞాన దానం కళ్ళకు కనిపించకుండా
చెవులకు వినిపించకుండా కురుస్తూ రోజూ పువ్వుల రాశుల్ని వికసింపజేసే మంచులాగా
నిశ్శబ్దంగా జరుగవలసి ఉంది. భారతదేశం నీరాడంబరంగా లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ
వస్తున్న దానమిదే భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహం వెల్లువలా లోకాన్ని ముంచెత్తుతూ
వచ్చింది ఇందులో మనం కొంచెం మునకలు వేద్దాం.
శ్రీ
గురుభ్యోనమః
పూజ్య గురువుల
అనుగ్రహముతో నేనీ మాటలు అనగలుగుతున్నా...
వీరాంజినేయులైన
నేను,
అందరూ, ప్రియమిత్రులైన మీతో విన్నపము
చేయునదేమనగా...
గురువుగారైనా బ్రహ్మ
శ్రీ చాగంటి
కోటేశ్వరరావుగారు సంపూర్ణ
వాల్మీకి రామాయణం, "శ్రీరామాయణ
ప్రవచనం" గుంటూరు పట్టణమందు శారదా పీఠంలో 42 రోజులు ప్రవచనాన్ని దీక్షతో, నియమ నిష్టలతో ఎంతో
శ్రమకోర్చి మనందరిని తరించడానికి శ్రీరామాయణ యజ్ఞాన్ని 42 రోజులలో పూర్తిచేశారు. ఇంత
పవిత్రమైన ఈ రామాయణ కావ్య ప్రవచనాలను దైవానుగ్రహంగా భావనచేస్తూ నేను నావంతు భాగంగా
ప్రవచనాలను బాగావిని తరించాలనే తపనతో మరింతగా నన్నునేను తరింపజేసుకోవాలనే ఉద్దేశ్యంతో
మాత్రమే... ఎటువంటి ఇతరమైన వ్యాపారనిమిత్తంగా కాదని కేవలం తరించడానికి మాత్రమేనని
నాతో పాటు అందరూ తరించడానికి గురువుగారి కంఠం నుండి వెలువడిన దివ్యవాక్కులను
అందరికి పంచడం కోసం నేను గురువుగారి శ్వాసనుంచి ప్రవచన రూపకంగా వెలువడిన వాక్కులను
గ్రంధరూపకంగా రాసి తరించాలని నిర్ణయించుకుని గురువుగారి శ్వాసని గ్రంధ రూపకంగా మలిచాను.
నాకు
గురువుగారైన బ్రహ్మశ్రీ
శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి కంఠము అంటే నాకు వల్లమాలిన అభిమానము, గురువుగారి కంఠము ఒక అమృత
ధార. ఆ అమృతాన్ని నేను ఎప్పుడూ జుర్రుకునే ప్రయత్నంలో ఉంటాను. ఎందుకంటే నేను
సాధారణ మనిషిని, సాధారణం
కన్నా తక్కువ జ్ఞానం ఉన్నవాన్ని కనుక - నాకు ఎటువంటి సంస్కృతం యొక్క జ్ఞానం కానీ, అనుభవము కానీ లేదు.
సంస్కృతం నేను చదువలేదు. కనీసం వినలేదు. వింటే అది అర్థంకాదు కాబట్టి. దీనర్థం
ఏమిటంటే నాకు సంస్కృత జ్ఞానం బొత్తిగా తెలియదు అని.
నేను
గురువు గారైన శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి చెప్పినటువంటి ప్రవచనాలను క్రమం
తప్పకుండా వింటుంటాను. గురువుగారి ప్రవచనాల్ని వినడం వల్ల నాకు అంటే నాలో ఏదో
చిన్న (తరించాలనే) పని చేయాలనే తపన మొదలైంది. గురువుగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ
ఉంటారు, మీరు
ప్రవచనాలను వినేసమయంలో "ఇది మీరూ చాలా జాగ్రత్తగా వినాలి అనీ... దీన్ని
పట్టుకొనేదానికి ప్రయత్నించండీ అనీ.., కేవలం వినివదిలేస్తే, దానికన్నా విననటువంటి వారే మేలనిపిస్తుంది. ఇక్కడ పట్టుకోవడం అంటే, ఎలా పట్టుకోవాలి అనే ఆలోచన
నాలో కలిగింది. అందుకే నేను గురువుగారి ప్రవచనాల్ని వింటూ దాన్ని తెలుగులో వ్రాయడం
మొదలు పెట్టాను. ఈ విధంగా వింటూ దాన్ని నా ప్రయోజనం కోసం జుర్రుకునే దానికి
ప్రయత్నిస్తున్నాను. ఇందులో భాగంగా నేను గురువుగారు చెప్పిన విషయాల్ని అందరికీ
పంచే ప్రయత్నం కూడా చేయదలచుకున్నాను. ఇందులో నాకు చేతనైనంత వరకు గురువుగారి
ప్రవచనాల్ని చేరవేయడానికి చేసే ప్రయత్నము మాత్రమే. నాకు సంస్కృతం అవగాహన లేదు
కాబట్టి, గురువుగారు
సంస్కృతంలో ప్రవచించిన శ్లోకాలను,
ప్రవచన విషయాలను మాత్రము జాగ్రత్తగా చదువుకోగలరు. ఇంకా ఏవైనా
దోషములున్ననూ, సహృదయ
సహకారాన్ని అన్నింటినీ ఎంతో గౌరవంతో స్వీకరించడానికి నా యొక్క ఆనందాన్ని వ్యక్త
పరుస్తున్నాను. ఎందుకంటే గురువుగారి యొక్క ప్రవచనాన్నికానీ, ఆ సంస్కృత శ్లోకాల్ని కానీ, ప్రవచనాన్ని కానీ
స్ప్రుశించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. నేను చేస్తున్నది ఇది దుస్సాహసమనే
అనాలి ఈ విషయంలో అందురూ నన్ను మన్నింతురుగాక!
గురువుగారి
ప్రవచనంను చదివే సమయంలో మీరు ఏదైనా, మీకు తెలిసిన ప్రార్థనతో లేదా గురువుగారి చేసిన ప్రార్థనలతో
ప్రారంభించండి మంచి జరుగుతుందని నా అభిప్రాయము. దీనిని మీరు చిన్న పిల్లలతో
చదివించవచ్చు. వయో వృద్ధులైన వాళ్ళకు ఒక కాపీ తీసి పంచవచ్చు. మనకు తెలిసిన చాలా
మంది ఇది చదివి చదివించి తరిస్తారని నా
చిన్న కుతూహలము.
గురువుగారు జ్ఞానం
అనే సముద్రాన్ని చిలికి అమృతం లాంటి ప్రవచనాల్ని ఇస్తున్నారు.
ఇది నిజంగా అమృతమే. మీకు తెలుసు! అమృతాన్ని జుర్రుకున్నావారు ఎవరని, మీరూ అమరత్వాన్ని
పొందాలని... మీరు
నాతోపాటు గురు ప్రవచనాలద్వారా తరించాలంటే... అటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని మనకు
అందిస్తున్న గురువుగారైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారిని... మనుష్య
రూపంలోవున్న "విష్ణువుగా" నేను నమ్ముతున్నాను.
ఇట్లు మీ
యొక్క
వీరాంజినేయులు
హైదరాబాదు
9246340668
నా గురించిన
వివరాలు ఇందులో కలవు..
శుక్లాం బరధరం విష్ణుం
శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ
విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన
మహర్నిశమ్ !
అనేకదంతం
భక్తానా-మేకదంత-ముపాస్మహే !!
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః !
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః !!
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః !!
వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాసరూపాయ విష్ణవే !
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!
కూజంతం రామ రామేతి మధురం
మధురాక్షరమ్ !
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం !!
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం !!
శృతి శ్మ్రుతి పురాణానాం ఆలయం
కరుణాలయం !
నమామి భాగవత్ పాద శంకరం లోకశంకరం !!
నమామి భాగవత్ పాద శంకరం లోకశంకరం !!
విమలపటి కమలకుటి పుస్తక-రుద్రాక్ష-శస్త-హస్త-పుటీ !
కామాక్షి పక్షమలాక్షీం కలిటవిపంచీ త్వమేవ వైరించీ !!
కామాక్షి పక్షమలాక్షీం కలిటవిపంచీ త్వమేవ వైరించీ !!
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం !
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం !!
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ
ప్రతిపత్తయే !
జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ !!
జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ !!
సూక్తిం సమగ్రేతు నః స్వయమేవ
లక్ష్మీ: ! శ్రీరంగరాజమహిషీ
మధురైహి కటాక్షై: !!
వైధగ్ధ్యవర్ణ గుణ గుంభన గౌరవార్యాం ! ఖండోల కర్ణ కుహరాహ కవాయో దయంతి !!
వైధగ్ధ్యవర్ణ గుణ గుంభన గౌరవార్యాం ! ఖండోల కర్ణ కుహరాహ కవాయో దయంతి !!
హైమోత్ర పుండ్ర మజహన్ కుటంసు
నాశం ! మందస్మితం
మకర కుండల చారుగండం !!
బింబాదరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం ! శ్రీ వేంకటేశ ముఖమాత్మని సన్నిదాత్తాం !!
బింబాదరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం ! శ్రీ వేంకటేశ ముఖమాత్మని సన్నిదాత్తాం !!
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్దిమతా
వరిష్టం !
వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా
నమామి !!
ఆపదామప హర్తారం ధాతారం సర్వ సంపదం !
లోకాభిరామం శ్రీ రామం భూయో భూమో నమామ్యహం !!
శ్రీ రామ చంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహ
చంచరీకః !
సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళ మాతనోతు !!
శరజ్జ్యోత్స్నా శుద్దాం శశియుత జటాజూట మకుటా
వరత్రాసత్రాణ స్పటిక ఘటికా పుస్తక కరామ్
సకృన్నత్వా నత్వాకథమివ సతాం సన్నిదధతే
సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం
మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ !
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ !!
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ !
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ !!
No comments:
Post a Comment