ఈ మడింటినీ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
లోకంలో మూడిటిని ఎంత చూసినా చూడబుద్ధే వేస్తుందట, ఎంత చూడండీ చూడబుద్ధేస్తుందీ, అందుకే పార్వతీ దేవీ వినాయకుడికి ఏనుగుముఖం పెట్టించింది, పసిపిల్లలకు కూడా సంతోషం కలిగించేవి మూడు ఏమిటో తెలుసాండీ!
1. గజముఖం
2. చంద్రభింబం
3. సముద్రం.
ఈ మూడింటినీ ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.
----: : : : :----
ఎవరిని మీరు అను కరించాలి అంటే?
ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు, ఒక అజ్ఞానినీ మీరు అనుకరించ కూడదు.
పాపము లేని స్థితి అంటే
పాపము లేని స్థితి అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి పాపము లేని స్థితి అంటే ఎదో చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడమని కాదు నా ఉద్దేశం. పాపమూ అన్నమాట ఎలా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే... ఈశ్వర ప్రస్థాననమునందూ ప్రతిబంధక స్వరూపము అని అర్థం చేసుకోవాలి. భగవంతున్ని చేరుకొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అడ్డుగా వచ్చేది ఏదో... దానికి పాపం అని పేరు.
ఈ విషయాలు నిజమే కదా
అఖిలాండేశ్వరి అమ్మ వారి ఉంది జంబుకేశ్వరంలో, అమ్మగారి వారి యొక్క స్వరూపంలో ఉన్న తేజస్సు ముందు నిలబడలేక పోయాడు శంకరాచార్యుల వారు. ఇప్పటికీ అక్కడ అమ్మవారికి మధ్యాన్యం అమ్మవారికి నివేదన చెయ్యాలంటే చీరలు కట్టుకొని వెళ్ళాలి, ఆడవారిగా అలంకారం చేసుకొని నైవేద్యం పెడుతారు ఆలయ అర్ఛక స్వాములు.
అలాగే కంచిలో కామాక్షి అమ్మవారి తేజస్సుని తీసి పృద్విలో శ్రీ చక్రం వేసి, శ్రీ చక్రంలోకి ప్రవేశ పెట్టారు. అందుకే శంకర భగవత్ పాదులు ఈ జాతికి చేసినటువంటి ఉపకారం న భూతో న భవిష్యతే... ఇక ఎవ్వరూ చెయ్యలేరు, అంతటి మహాత్ముడు శంకరభగవత్ పాదులు అంటే, ఆయన పేరు స్మరిస్తే చాలు పాప రాశి దగ్ధమౌతుంది, అంతటి మహానుభావుడు.
గర్భిణీ స్త్రీలు ఇవి తప్పక వినాలి
గర్భిణీ స్త్రీ శ్రీ రామాయణంలో బాల కాండలో చెప్పిన శన్ముకోత్పత్తి వినాలి. ఆ శన్ముకోత్పత్తి వింటే కడుపులో ఉండే పిండానికి అటువంటి దోషాలేమైనా ఉంటే, ఆ దోశాలన్ని తొలగిపోతాయి. అందుకే శన్ముకోత్పత్తి వినండి అంటారూ, లేక పోతే భాగవతం దశమస్కంద కృష్ణ లీలలు వినమంటారు. (దీని గురురించి సమగ్ర వివరణ బాల కాండ 3వ రోజు ప్రవచనంలో వివరంగా ఉంది.)
No comments:
Post a Comment