Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అరణ్య కాండ 20వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Aranya Kanda 20th Day

అరణ్య కాండ


ఇరవైవ రోజు ప్రవచనము



సీతాపహరణం జరిగి సీతమ్మతల్లిని లంకాపట్టణంలోకి తీసుకొనివెళ్ళి రాక్షసకాంతల మధ్య రక్షణతో ఆతల్లిని అశోకవనానికి రావణాసురుడు చేర్చినటువంటి ఘట్టం దగ్గర నేను నిన్నటి ఉపన్యాసాన్ని పూర్తిచేసి ఉన్నాము. అక్కడ మారీచ సంహారం చేసినటువంటి రామ చంద్ర మూర్తి తిరిగి పంచవటికి వస్తున్నారు, పంచవటినుంచి సీతమ్మ తల్లిచేత అధిక్షేపించబడిన లక్ష్మణ మూర్తి రామున్ని కలుసుకోవడానికి వెళ్తున్నారు, అక్కడా అశోకవనంలో లంకాపట్టణంలో ఉన్న సందర్భం అదైతే రామ లక్ష్మణుల మధ్య ఏర్పడినటువంటి సందర్భం గురించి ఇవ్వాళ మహర్షి ప్రస్తావన చేస్తున్నారు. ఆయన అంటారు తస్య సంత్వరమాణ స్య ద్రష్టు కామస్య మైథిలీమ్ ! క్రూర స్వరోథ గోమాయుః విననాదాస్య పృష్ఠతః !! రాముడు మారీచ సంహారం చేసి పంచవటివైపు వస్తుండగా ఆయన మనసు ఆందోళనతో ఉంది ఎందుకనీ అంటే ఒకటీ మారీచుడు తనని దూరంగా తీసుకెళ్ళడం రెండవది ప్రాణాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో హా సీతా హా లక్ష్మణా అని రాముని గొంతుని అనుకరిస్తూ కేకలు వేయడం. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడుకాని అక్కడనుంచి కదిలిపోతాడేమో కదిలిపోతే ఏదో ఉపద్రవం వస్తుందని భయపడిపోతున్నాడు, భయపడుతూ పంచవటికి వెళ్ళుతున్నటువంటి రాముడు తస్య సంత్వరమాణ స్య తొందర తొందరగా వెళ్ళుతున్నటువంటి రాముడు ద్రష్టు కామస్య మైథిలీమ్ తొందరగా సీతను చూడాలనేటటువంటి త్వరతో ఉన్నటువంటివాడు క్రూర స్వరోథ గోమాయుః వెనక నుంచి ఒక నక్క అరిచింది విననాదస్య పృష్ఠతః నక్క అలా వెనక నుంచి పెద్ద కూత పెడితే అది దుఃశకునం.
శ్రీరామాయణాన్ని మీరు బహుభంగిమలలో చూడవలసి ఉంటుంది, శ్రీరామాయణం ఒక మధుర మధురమైనటువంటి కావ్యం అందుకే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ ! ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ !! అని కదా అందులో లేనటువంటి ధర్మమేమీ ఉండదు అందులోలేనటువంటి విషయమేమీ ఉండదు అది శకున శాస్త్రం కూడా జ్యోతిష్య శాస్త్రం కూడా అందులో అనేక విషయాలు ప్రస్తావన చేయబడుతాయి. కాబట్టి ఇప్పుడు ఒక శకునం గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైతే తాను సీతమ్మని చూడాలనేటటువంటి త్వరతో రాముడు బయలుదేరగానే వెనకనుంచి ఒక నక్క కూత వినపడిందో రాముడు ఆందోళన చెందాడు, ఇది దుఃశకునం కాబట్టి నేను ఏదో

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ప్రమాదకరమైనటువంటి వార్త వినవలసి ఉంటుంది అశుభ సూచన నాకు కనపడుతుంది అని ఆంధోళన చెందాడు. ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికీ జనస్థానంవైపుకు శంకతోకూడినటువంటి మనసుకలవాడై బయలుదేరిన సందర్భంలో తం దీన మానసం దీనమ్ అసేదుః మృగ పక్షిణః ! సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాం శ్చ ససృజుః స్వరాన్ !! చాలా దీనమైనటువంటి మనసుతో బయలుదేరినటువంటి రాముడికి ఎడమ చేతివైపునుంచి పక్షులు మృగములూ తిరిగుతూ ఆయన వంక చాలా దీనంగా చూస్తూ అరుపులు అరుస్తూ వెడుతున్నాయి, అలా తన ఎడమచేతివైపుగా వెడుతున్నటువంటి మృగములను పక్షులను చూసి ఇది వేరొక దుఃశకునం కాబట్టి ఖచ్చితంగా జనస్థానంలో ఏదో జరిగిందీ అని భయపడుతూ నడుస్తున్నాడు.
Image result for మారీచుడుఈలోగా మహాబలశాలియైనటువంటి లక్ష్మణ మూర్తికాని తొందరపడి ఆ పంచవటిలో ఉన్న సితమ్మతల్లివున్న పర్ణశాలను విడిచిపెట్టి రాడుగదా..? అని భయపడుతున్నాడు. ఆయనా బయలుదేరి వెడుతూ ఇంకొంచెం దూరంలో జనస్థానంలో ఆ పంచవటిని చేరుతున్నాడు అనుకొనే సమయానికి యథా వై మృగ సంఘా శ్చ గోమాయు శ్చైవ భైరవం ! వాశ్యన్తే శకునా శ్చాపి ప్రదీప్తాం అభితో దిశం !! సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మృగములు నక్కలు కాకులు మొదలైనటువంటివి అందునా ప్రత్యేకించి నలుపు రంగు కలిగినటువంటి జంతువులూ పక్షులన్నీ సూర్యుడికి అభిముఖంగా నిలబడి చాలా వ్యధతో కూడిన కంఠంతో అరుస్తున్నాయ్ ఇవన్నీ కూడా దుర్నిమిత్తములే. ప్రారంభం మధ్యలో దగ్గరికి చేరేటప్పుడు అన్నీ అశుభ సూచనలే కనపడుతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా నేను ఏదో ప్రమాదకరమైన వార్త వింటాను అని భయపడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి రామునికి లక్ష్మణ మూర్తి ఎదురొచ్చారు, ఎదురొస్తే ఆయనా ఉలిక్కిపడ్డాడు. లక్ష్మణుడు వచ్చేశాడూ అంటే సీతమ్మతల్లికి తప్పకుండా ఎదో ప్రమాదం జరిగి ఉంటుంది, తను ఏది శంకించాడో అది జరిగేటటువంటి అవకాశం ఉంది వెంటనే లక్ష్మణున్ని పట్టుకుని అన్నాడూ... నేను నిన్ను సీతమ్మకి కాపలాగ ఉండమని ఆజ్ఞాపించి వచ్చానుగదా నీవు ఎందుకు సీతమ్మని విడిచిపెట్టి వచ్చేశావు నీవు ఇప్పుడు సీతమ్మని విడిచిపెట్టి వచ్చేసినటువంటి కారణం వల్ల సీతమ్మకి ఏదో ఉపద్రవం జరిగిందీ అని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ నేను వెళ్ళేసరికి పర్ణశాలలో సీతమ్మలేకపోతే రాక్షసులు సీతమ్మని అపహరించినా సీతమ్మ రాక్షసులచేత భక్షింపబడినా నేను ప్రాణములతో నిలబడడమనేటటువంటిది ఉండదు పతిత్వమ్ అమరాణాం వా పృథివ్యా శ్చాపి లక్ష్మణ ! వినా తాం తపనీయాభాం నేచ్ఛేయం జనకాఽఽత్మజామ్ !! తపనీయాభాం అంటారు అంటే బంగారు రంగు కాంతి కలిగినటువంటి సీతమ్మ నాపక్కన లేకపోతే నాకు పతిత్వమ్ అమరాణాం వా నాకు దేవేంద్రలోకమే ఇచ్చినా లేదా పృథివ్యా శ్చాపి లక్ష్మణ ఈ భూమండలాన్నంతటిని నాకిచ్చినా నాకు దానివలన ఏవిధమైనటువంటి మనఃశాంతికాని తృప్తికాని కలగవు కచ్చి జ్జీవతి వైదేహీ ప్రాణైః ప్రియతరా మమ ! కచ్చిత్ ప్రవ్రాజనం సౌమ్య న మే మిథ్యా భవిష్యతి !! నేను పర్ణశాలలో ప్రవేశించేసరికి సీతమ్మ జీవించి సంతోషంగా నాకు కనపడకపోతే నేను చేసినటువంటి ఈ వనవాసమంతా కూడా వృథాప్రయాస అయిపోతుంది. ఎందుకంటే ఏ ధర్మంకోసమని నేను ఇక్కడికి వచ్చానో ఆ ధర్మంకోసం వచ్చినటువంటివాన్ని తదనంతరము నేను అనుష్టించవలసినటువంటి ధర్మమునకు ఎవరునాకు ప్రాతిపధికయో ఎవరు నా పక్కన జీవితాంతం నిలబడవలసి ఉంటుందో అటువంటి ధర్మపత్నియే నాపక్కనుంచి తొలగిపోతే ఆవిడ జీవితమే సంశయాత్మకమైతే ఆవిడకి ప్రమాదముకలిగితే దానివలన నేను పొందేటటువంటి దుఃఖం ఇక వర్ణించడానికి శక్యమైనటువంటిదిగా ఉండదు.
కాబట్టి సీతమ్మకాని కనపడకపోతే నా అరణ్యవాసమంతా నిరుపయోగమౌతుంది సర్వథా తు కృతం కష్టం సీతామ్ ఉత్సృజతా వనే ! ప్రతికర్తుం నృశంసానాం రక్షసాం దత్తమ్ అన్తరమ్ !! ఏదైనాచెప్పుకాని లక్ష్మణా! నేను నిన్ను ఒకసారి సీతమ్మకు కాపలాగా ఉండు అనిచెప్పి స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చివచ్చిన తరువాత నీవు సీతమ్మని విడిచిపెట్టి అరణ్యములోకి రాకుండా ఉండవలసింది నీవు ఎందుకొచ్చావో నాకు తెలియదుకానీ నీవు రావడంవల్ల ఏదో ఉపద్రవం జరుగుతుందీ అని నేను అనుకుంటున్నాను అంటూ లక్ష్మణ మూర్తితో కలసి పర్ణశాలలోకి ప్రవేశించారు. తీరా పర్ణశాలలో ప్రవేశించి చూస్తే సీతమ్మ జాడలేదు, ఆ పర్ణశాలలో ఉన్నటువంటి గదులన్నీ చూశారు బయటికి వచ్చారు అక్కడ ఆవిడ తిరిగేటటువంటి ఆ పూలతోటలు మొదలైనటువంటివన్నీ గాలించారు ఎక్కడా... లక్ష్మణునితో కలిసి వెతికినటువంటి రామ చంద్ర మూర్తికి సీతమ్మ కనపడలేదు స్వమ్ ఆశ్రమం సంప్రవిగాహ్య వీరో విహార దేశాన్ అనుసృత్య కాంశ్చిత్ ఏతత్ త దిత్యేవ నివాస భూమౌ ప్రహృష్ట రోమా వ్యథితో బభూవ !! ఆమె కొరకు వెతకనటువంటి ప్రదేశం లేకుండా ఆ పర్ణశాలకు సమీపంలో ఉన్నటువంటి ఉపవనములను ఉద్యానవనములను మామిడితోపుల్ని వారు తిరిగేటటువంటి ప్రదేశాల్ని పెంచుకున్నటువంటి పూలతోటలలో పర్ణశాలలో ఉన్నటువంటి గదులూ అన్నిటినీ గాలించినా ఆయనకి సీతమ్మ యొక్క జాడ కనపడలేదు. ఆయనా ప్రశ్నవేశారు లక్ష్మణా నీకు నేను స్పష్టముగా ఆదేశించివచ్చానుకదా నీవు సీతమ్మని ఎందుకు విడిచిపెట్టివచ్చావు? నీవు సీతమ్మని విడిచిపెట్టిరావడంవల్లే ఇంత ప్రమాదం జరిగింది.
మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఏదో కథాభాగంగా వినడం ఒకెత్తు కథా భాగంగా కాకుండా ఇందులో నిక్షిప్తమైనటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకోవలసి ఉండడం ఒకెత్తు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదకరముగా ప్రజ్వలించేటటువంటి పదార్థం మీద ప్రజ్వలించకుండా మీరు ఒక కప్పు పెట్టి ఉంచారనుకోండి అంటే మీకు తేలిగ్గా అర్థమవ్వడానికి ఒకమాట చెప్పాలీ అంటే ఒక్కొక్కసారి రాత్రివేళ చేస్తారు అగ్నిహోత్రం వివాహంలో రాత్రివేళ ఒక ప్రధాన హోమమూని చేస్తారు, ఆ అగ్నిహోత్రాన్ని మరునాడు కూడా ఆ హోమం చెయ్యవలసి ఉంటుంది కాబట్టి అగ్నిహోత్ర సంరక్షణ కొరకు ఏం చేస్తారంటే ఎవరినైనా కాపుదలపెట్టి అందరూ వెళ్ళిపోతే గబుక్కున ఏదైనా నీళ్ళు అదీపడీ ఆరిపోతుంది ఆ అగ్ని, అందుకనీ ఆ అగ్ని అలా నిలబడడానికి ఉంచి పైకి లేవకుండా జ్వాల పైన ఏదైనా కప్పుపెట్టి ఉంచుతారు. ఇప్పుడు లోపల రాజుకుంటున్నా దానితాలుక జ్వాల పైకిలేవదు, లోపల లోపల ఏది మిగిలిపోయిందో మీకు తెలియదు అంటుకుంటున్నది, ఏదో ఒక పెద్ద కర్రో చెక్కో మీరు పడేసి అంటుకుంటుండవచ్చు మీరు పైన కప్పు పెట్టిఉండకపోతే జ్వాల అకస్మాత్తుగా పైకిలేస్తుంది. మీరు బాగా పట్టుకోగలిగితే రామాయణంలో సీతమ్మ అనబడేటటువంటిది రామ చంద్ర మూర్తి యొక్క హృదయము అనబడేటటువంటి ఒక పెద్ద యజ్ఞగుండముమీద పెట్టినటువంటి ఒక పెద్ద అచ్ఛాదనం ఒక కప్పు, ఈ కప్పు పైన ఉందికాబట్టి దానిలోపల ఎంత అగ్నిహోత్రమున్నా అది పైకిరాదు.
రాముడు చల్లగా ఉన్నట్లే కనపడుతాడు రాముడు ప్రశాంతంగా ఉంటాడుకూడా ఎందుకుంటాడూ అంటే పక్కన సీతమ్మ ఉన్నటువంటి కారణం. మీకు శాస్త్రంలో ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది ఏమారహస్యం అంటే సీతమ్మ తలుచుకుంటే రావణాసురున్ని అక్కడ చంపలేదా..? అక్కడ చంపగలదు, అటువంటి పనికి పురుగొల్పినటువంటివారు గనుకా లంకాపట్టణాన్ని నాశనం చెయ్యాలి అంటే చెయ్యలేరా..! కాదు అమ్మవారు ఏం చేస్తుంటూందీ అని మనకు శాస్త్రం ఏం

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
చెప్తుందంటే తెల్లవారలేస్తే పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తాం రుద్రాధ్యాయంలో శివా రుద్రస్య భేషజీ ! శివా లోకస్య భేషజీ ! ఆమే లోకమునకు ఔషదమే, ఆమే రుద్రునకూ ఔషదమే, ఓషదీ అంటే ʻస్త్రీలింగంʼ ఆమె రుద్రున్ని శివున్ని చేస్తుంది శివున్ని రుద్రున్ని చేస్తుంది, ప్రశాంతంగా ఉన్నటువంటి భర్తలో కోపాన్నిరగల్చి రుద్రున్ని చేసి లోకాన్ని శిక్షింపజేస్తుంది, ఎప్పుడూ ధర్మమార్గంలోకి తీసుకురావాలి అనుకుంటే అదే తల్లి ఇంక ఇయ్యన కోపం పోగొట్టి లోకాన్ని రక్షిద్దామనుకుంటే రుద్రున్ని శివున్ని చేస్తుంది రెండూ చెయ్యగలిగినటువంటి శక్తి అమ్మవారికే ఉంటుంది.
Image result for సీతా రాములుకాబట్టి ఇప్పుడు అమ్మవారు రాముని యొక్క శోకాగ్ని పైకిరాకుండా కప్పుకింద ఉంది, పైన ఈ కప్పు ఉన్నకారణం చేత రాముడు ఎంత శోకానైనాసరే అస్సలు ఆయన్ని సృశించదు ఆయన్ని ముట్టుకోదు, మీరు జాగ్రత్తగా గమనించండీ రాముడి శోకం అనేటటువంటి ప్రవాహానికి ఎక్కడా ఒడ్డులేదు అంతపెద్ద ప్రవాహం ప్రారంభమైంది ఎందుకంటే... రాజ్యం వస్తుందీ అనుకుని వెళ్ళినటువంటివానికి యవ్వరాజ్యపట్టాభిషేకం జరగకుండా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళమన్న దశరథ మహారాజు గారిదగ్గర ప్రవాహంగా ప్రారంభమైన దుఃఖం ఆ తరువాత వెంటనే తండ్రిగారి యొక్క మరణం ఆతరువాత వెంటనే సంతోషంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అక్కడినుంచి పంచవటికి వచ్చేసేయ్యడం, తీరా పంచవటికి వచ్చిన తరువాతా ఖర-దూషనాదులతో వైరం, ఖర-దూషనాదులను సంహరించిన తరువాతా ప్రతిక్షణం భయమే ఎటునుంచి ఏ రాక్షసులు వస్తారోయని జనస్థానమంతా రాక్షసమయం రామాయణంలో కాబట్టి ఏ క్షణంలో ఎవరొస్తారోనన్న భయం, ఎవరొస్తారోనన్న భయం ఎటువైపునుంచీ తనవైపు నుంచికాదు సీతమ్మవైపునుంచి ఆమె అమాయకురాలు ఆమెను ఎత్తుకుపోతారు, ఆమెను తినేస్తారూ అని రాముడి భయం. సీతమ్మతల్లి పక్కన ఉన్నంతసేపు ఆయనలోన ఉన్నటువంటి బాధ కోపంగా పైకిరాదు, ఆ కప్పు తీసేశారనుకోండి మీరు, తీసేస్తే అది రగులుకుంటుంది రగులుకుని జ్వాల పైకి వస్తుంది. మీరు ఎలా చూడవలసి ఉంటుందంటే రామాయణంలో ఈ ఘట్టాన్నీ ఇదంతా రాజుకుంటున్నటువంటి మంట ఈ శ్లోకాలు ఇవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నిప్పుని ఊది మంట చేస్తుంటే మంట రేగేముందు ఎలా ఉంటుందో రాముని యొక్క స్థితి అలా ఉంటుంది.
కానీ ఆయన ఇంకా ఇప్పటికి కూడా మాట్లాడేటప్పుడు అంత పెద్ద జ్వాలగాలేడు అందుకనీ ఉన్న విషయాన్ని మాట్లాడేటప్పుడు మాత్రం చాలా నైపుణ్యంతో కౌషలంతో బుద్ధిబలంతో సమర్థతతో బాగా విచారణచేసి నిర్ణయం చేస్తాడు. రాముడు మాట్లాడటం అంటే ఎదో కోపంలో కష్టంలో ఉన్నాడు కదాని కష్టంలో కోపంతో అలౌకిగా లక్ష్మణునితో మాట్లాడినట్లు ఉండదు చాలా జాగ్రత్తగా మాట్లాడుతాడు విషయాన్ని చాలా బాగా విశ్లేషిస్తాడు, రామునికున్నటువంటి ఆ విశ్లేషణా శక్తిని మీరు రామాయణంలో చూస్తే మీరు ఎప్పుడైనా ఒక సమస్యా అనేటటువంటిదాన్ని మీరు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ విశ్లేషణ శక్తి మీకు అలవాటు అవుతుంది. ఆ లెక్క కట్టడమన్నది మీకు బాగా అలవాటు అవుతుంది. కాబట్టి చూడండీ ఆయనా ఇప్పుడు లక్ష్మణునితో అన్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చివచ్చానుగదా నీవు సీతమ్మని ఎందుకు విడిచివచ్చావు, ఇప్పటివరకు లక్ష్మణుడు చెప్పలేదు అన్నయ్య ఇంత శోకిస్తున్నా సీతమ్మ కనపడకపోయినా రాముడు వ్యధ చెందుతున్నా ఆయనేం మాట్లాడలేదు తొందరపడి గబుక్కున వదిన గురించి మాట్లాడటం ఎందుకూ అని, నీవు తప్పు చేశావు లక్ష్మణా నీవు రాకుండా ఉండాల్సింది అని ఒక మాట అన్నాకూడా ఊరుకున్నాడు. ఇప్పుడు సీతమ్మ ఎక్కడా కనపడకపోయేసరికి తను ఊహిస్తున్న ప్రమాదం ధృవపడిపోతుంది, ఇప్పుడు రాముడి ధృష్టికోణంలో రెండు జరిగుండాలి ఒకటి సీతమ్మ అపహరింపబడి ఉండాలి, రెండు సీతమ్మ సంహరింపబడి ఉండాలి. సీతమ్మ సంహరింపబడితే శాశ్వత దుఃఖం సీతమ్మ అపహరింపబడితే మళ్ళీ తిరిగి తెచ్చుకుని పక్కన పెట్టుకునేంతవరకు దుఃఖం ఏదైనా దుఃఖంతో కూడుకున్నదే.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఎప్పుడైతే మనిషికి శోకము దుఃఖము ప్రారంభమయ్యాయో అది కొంతసేపు ఆ నిగ్రహం ఉంటుంది, ఆ తరువాత దానికి కారకుడు అని ఎవరు అనిపిస్తారో ఆయన్ని నిలదీసి ప్రశ్నించడమనేటటువంటి స్థితి ఉంటుంది కాని రాముడు కూడా దానికి అతీతుడుకాడు. ఎందుకు అతీతుడు కాడూ అని నేను అంటున్నానంటే ఆయన దానికి అతీతుడు అన్నమాట మీరు నేను అనగలిగాము అనుకోండి ʻశ్రీరామాయణం నరుడికథ కాదుʼ, వెంటనే కాదని చెప్పాలి. రాముడు కూడా ఆ సమయంలో ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తాడు అందుకే రామాయణం ఎప్పుడూ ఒక మనుష్యుడి కథే, కాని అంత పెద్ద వైక్లవ్యంలో కూడా రాముడు ఎలా ఊంచుకుంటాడు అనేది మీరు చూస్తే అది మీకు జీవితంలో మాత్రం ఒక పెద్ద బిక్ష పెట్టేస్తుంది. అది అసలు రామాయణంలోంచి మీరు గ్రహించవలసినటువంటి సారాంశం ఏమైనా ఉంటే ఇదిగో ఇటువంటి కీలక ఘట్టాల్లోనే ఉంటుంది, మీకేమీ రామాయణం తెలియదూ అని కాసేపు వినండీ అంటే నాకు తెలుసండీ సీతమ్మని ఎత్తుకుపోయారని చెప్పేసేసి రావణాసురుడు ఎత్తుకుపోయాడని మాకు తెలుసు అని కాదు ఇప్పుడు రాముడు ఈ పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని మీకేమీ తెలియని వాళ్ళలా ఒకసారి లెక్కకట్టి వినండి.
ఇప్పుడు లక్ష్మణున్ని నిలదీసి ప్రశ్నవేశాడు నీవు ఎందుకు వెళ్ళావు అరణ్యానికి సీతమ్మని ఎందుకు వదిలిపెట్టివచ్చావు? ఇప్పుడు లక్ష్మణుడు అసత్యం చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు జరిగినటువంటి సంఘటన ఏది ఉందో దాన్ని యదార్థంగా చెప్పాడు, యదార్థంగా చెప్తే... యదార్థంగా చెప్పడమంటే జరిగిన సంఘన మీకు తెలుసు ఒకటికి పదిమార్లు చెప్పక్కరలేదు హా లక్ష్మణా హా సీతా అన్న కేకలు విన్నటువంటి సీతమ్మతల్లి కృద్ధురాలైంది నేను వెళ్ళకపోతే చాలా కోపాన్ని పొందినటువంటిదై, కోపం పొందేకదాండి ఆమాటంది... కోపం లేకుండా మాత్రం అనలేదు, చాలా ప్రశాంతగా ఉన్నప్పుడు లక్ష్మణుని నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది నీవు నాకోసం వచ్చావని ఎప్పుడు అనలేదు ఆవిడా... ఆవిడ భర్త యొక్క కేకలు విన్నటువంటి బాధలోంచి జనించినటువంటి క్రోధంతో ఆవిడ ఆమాటలంది అంతే, కాబట్టీ అమ్మ కోపంలో ఉంది లక్ష్మణుని యొక్క గొప్పతనం ఎక్కడుందంటే..? సీతమ్మని అంచనావేయడంలో ఆయన పొరపాటుపడలేదు. వదినె నన్ను ఎంతమాట అందో తెలుసా..? అంతమాట అంది ఇంకా సిగ్గులేక నేను కాబట్టి ఇక్కడ ఉన్నాను అనలేదు ఆయన, అంత కష్టంలో ఏ స్త్రీయైనా ఆమాట అంటుంది కాబట్టి వెళ్ళమని నన్ను అంది, నీవు గొప్పవాడివని నాకు తెలుసు నిన్ను మూడులోకములు కూడా ఎదిరించలేవని నాకు తెలుసు అందుకని నేను వెళ్ళనన్నాను, కానీ స్త్రీ సహజమైనటువంటి దుఃఖంతో ఆమె నీకు ప్రమాదము వాటిల్లినప్పుడు నేను కదలటం లేదనేటటువంటి బాధలోంచి ఉత్పన్నమైనటువంటి మాట ఒకటి నోటివెంట జారిపోయింది.
నీవు నాకొరకే వచ్చావు అందుకే అన్నగారికి ఆపదవస్తే నీవు వెళ్ళటంలేదు లేదా ప్రయుక్తో భరతేన వా నీవు భరతుని చేత పంపబడివుండి ఉండాలి రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవడం కోసమనీ అవకాశం చూసి మీ అన్నగారిని మట్టుపెట్టడానికి నాతో వచ్చావు, ఈ మాటలు విన్న నేను చాలా బాధపడి అక్కడ్నుంచి వెళ్ళిపోయాను లేదా నేను కూడా ఆ మాటలకు

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
కోపాన్ని చెందాను మీరు ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి లక్ష్మణునికి కూడా కోపమొచ్చి ఉండాలి లక్ష్మణుడు కూడా బాధపడి ఉండాలి కదా! లేకపోతే అక్కడ్నుంచి వెళ్ళడు. రామాయణం మనస్తత్వ శాస్త్రం అందుకే మీతో నేను తరచు మనవి చేస్తుంటాను, రామాయణాన్ని ఎప్పుడూ ఒక్క కోణంలో వినే ప్రయత్నం చేయకండి. లక్ష్మణుడికి కోపమన్నా వచ్చి ఉండాలి లక్ష్మణునికి బాధన్నా కలిగి ఉండాలి. బాధ కలిగిందీ అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం పడరానిమాటపడ్డాను అన్న ఉద్దేశ్యమైనా ఉండాలి, పడరానిమాటపడ్డానూ అంటే ఆవిడ స్వస్థతతో ఉండి ఆరోపణ చేసిందా..! స్వస్థతతోలేని స్థితిలో ఆరోపణ చేసిందా..? స్వస్థతలేని స్థితితో ఆరోపణ చేసిందీ అని తనకు తెలుసుకాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు ఏం చెయ్యవలసి ఉంటుంది, కొద్దిగా ఉదారుడై ప్రవర్తించవలసి ఉంటుంది. వదినె ఈ కష్టంలో అలా అనడం చాలా సామాన్యం కానీ నేను వెళ్ళిపోతే ఏదైనా ఉపద్రవం జరిగితే అప్పుడూ వదినె పరిస్థితి దారుణం అన్నయ్య పరిస్థితి దారుణం. నేను ఇప్పుడు కోపం తెచ్చుకుంటే నేను ఇప్పుడు శోకాన్నిపొంది ఇక్కడ్నుంచి వెళ్ళిపోతే నా మనసుమీద దీని ప్రభావము ఏ వికారము చూపించినా క్రోధమైనా శోకమైనా ఏ వికారం నా మనసుమీదపడ్డా దానివల్ల వచ్చేటటువంటి నా కదలిక అనేక కదలికలకు దారితీస్తుంది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది.
కాబట్టి నేను ఒక్క పదినిమిషములు ఓర్పు పట్టవలసి ఉంటుంది, అని లక్ష్మణుడు ఆలోచించి ఉండి ఉంటే రామ కథ ఎలా ఉండి ఉండేది. రాముడు ఈ ప్రశ్న వేస్తున్నాడు ఎంత సునిశితంగా సమస్యని పరిశీలించి అడుగుతాడో చూడండీ ఆయన అన్నాడూ జానన్ అపి సమర్థం మాం రక్షసాం వినివారణే ! అనేన క్రోధ వాక్యేన మైథిల్యా నిస్సృతో భవాన్ !! లక్ష్మణా నీకు నా సమర్థత తెలుసు అందులో నాకు కూడా అనుమానం లేదు మూడు లోకములు వచ్చి ఎదురుగుండా నిలబడినా నన్ను నిర్జించలేవు నాకు అంతటి పరాక్రమముందీ అంతటి వీర్యముందీ అన్న విషయం నీకు తెలుసు, ఈ విషయం నీకు తెలుసు కాబట్టి నేను తిరిగి వచ్చేస్తానని కూడా నీకు తెలుసు, నేను తిరుగొచ్చేస్తానన్న విషయమూ నీకు తెలుసు నిస్సృతో అంటే బాధతో నీకు ఏ విషయం తెలుసో ఆ విషయం తనకీ తెలుసున్నా స్త్రీ సహజమైనటువంటి చాపల్యం చేత బాధ చేత సీతమ్మ అన్నదన్న విషయమూ నీకు తెలుసు, రెండు తెలిసున్నవాడికి బాధ్యత ఏమిటీ..? అన్నయ్య తప్పకుండా వచ్చేస్తాడు అన్నవాడివి నీవు రాకూడదు, నీవు వచ్చేశావు అంటే నీమనసు ఒక వికారమునకు లోనైందికాబట్టి నీకో శోకం కలిగిందీ నీకో బాధ కలిగిందీ నీకో కోపం కలిగిందీ నీవు నీ బాధ్యతను విడిచిపెట్టావు. కానీ దానికి అనుభవం ఎవరిది నాది తప్పిపోయింది నా భార్య, ఇప్పుడు నా భార్యే కనపడకపోతే రాక్షసులు భక్షించేస్తే నేను ఎందుకు జీవించడమేందుకు ఇక నాకు ఈ శరీతంతో పనేమీలేదు ఈ శరీరమే విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. మనసు మీద కలగకూడని వికారం కలుగుతూందనుకోండి మీరు ఆ వికారం యొక్క పరిణామమును పరిశీలించడం మీకు చేతకాకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి పరిస్థితిలు.
అసలు లోకంలో సుఖ దుఃఖములన్నీనూ మనిషి యొక్క వ్యక్తిత్వము శీల సంపద అన్నవి ఎక్కడుంటాయంటే..? తన మనసుకు కలుగుతున్నటువంటి వికారాన్ని పరిశీనం చేసి దాన్ని నిగ్రహించాలా లేకపోతే ఇప్పుడు ఈ వికారము ఇది పొందింది కాబట్టి ఒక మాట మనం అనచ్చా..! ఆ మాట అంటే ఎన్నమాట్లు అనాలి ఎంత వ్యగ్రతతో అనాలీ ఎంత కోపంతో అనాలీ లేకపోతే ఎంత అనకుండా ఉండచ్చు... ఈ వికారానికి నేనులోనవ్వచ్చా అవ్వకూడదా లేకపోతే ఇప్పుడు నీవు నాకు అటువంటివన్నీ ప్రభోదం చెయ్యక్కరలేదు కసేపు అలా ఉండు అని నా కర్తవ్యతా నిష్ఠతో నేను నిలబడడమా..? మీరు మీ మనసుకు లొంగడమా మీ మనసును మీరు నియంత్రించడమా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి మనస్సనేటటువంటిది ఏం చేస్తుందంటే బయట జరిగేటటువంటి విషయముల యొక్క ప్రభావాన్ని తీసుకుని ఎప్పుడు కూడా మీ వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చి ఎదుట నిలబెట్టి తీర్పులిస్తుంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలని అనుకున్నానుకోండి... “ఏంటండీ కోటేశ్వరావుగారు ఆ రామాయణం చెప్పడం” అన్నారనుకోండి వెంటనే ఎంతమాటన్నాడు నన్ను ఏమిటీ ఆ రామాయణం చెప్పడం అంత చులకనగా... ఆయన చెప్తే తెలిసొస్తుంది అందులో కష్టమేమిటో... ఆయనకేం తెలుస్తుంది ఆ బాధా అనీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అందులో సమిధలు వేస్తుంది వేసి నీవింత గొప్పవాడివి నీవింత కష్టపడుతున్నవాడివి ఆయనకేం తెలుసు నిన్ను ఇంతమాట అన్నాడు అంటుంది.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
అప్పుడూ మీరు పరిశీలించి ఓ... అంత వికారం చెందుతున్నావే ఈ వికారం పెరిగిపోతే కోపమొస్తుంది ఇంకొకటి కూడా ఆలోచించు ఒకవేళ ఆయన నీకన్నా కూడా మహాప్రాజ్ఞుడై ఉండచ్చు, అయ్యో మీరు రామాయణాన్ని అంతబాగా చెప్పలేకపోతున్నారన్నబాధతో ఏమిటండీ ఆ చెప్పడం అన్నారేమో? కాబట్టి ఒకవేళ నేను చెప్పినదాంట్లో ఏదైనా సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో ఒకసారి విచారణచెద్దాం లేకపోతే ఇంటికెళ్ళి వారిని అడుగుదాం ఏం ఎక్కడ నేను సరిగ్గా చెప్పలేదో? మీ మనస్సు ఎక్కడ తృప్తి చెందలేదో? అడుగుదాం ఒకవేళ ఆయనే సరిగా ఆలోచించి ఉండి ఉండకపోతే అలాగ కాదు మీరు కూడా చక్కగా చదవండీ అని ఒకమాట చెప్పుదాం అని మీరు అన్నారనుకోండి ఊరుకుంటుంది. లేకపోతే అదేం చేస్తుందో తెలుసాండీ రెచ్చగొడుతుంది మిమ్మల్ని. ఆ రెచ్చగొట్టేటటువంటి మనస్సు అది పొందేటటువంటి వికారములకు మీరు సాక్షిగా నిలబడాలి దానిమీద నిలబడి మీరు దాన్ని అదుపుచెయ్యాలి, మీరు అదుపు చెయ్యలేదు అనుకోండి అది మిమ్మల్ని తనిష్టమొచ్చినట్లుగా రెచ్చగొడుతుంది. తన మనసుకి తాను సాక్షికావాలి కొన్ని కొన్ని సందర్భాలలో, కనీసం కొన్ని కొన్ని సందర్భాలలో లేకపోతే ఏమౌతుందో తెలుసాండీ అది ఆడిందే ఆటా అదిపాడిందే పాట కింద ఉంటుంది.
కాబట్టి ఎంత పెద్ద ప్రశ్నండీ ఈ శ్లోకం నీకు నేను సమర్థుడనని తెలుసు వదినె కోపంతో మాట్లాడిందని తెలుసు మరి నీవు ఎందుకు వచ్చేసినట్లూ అని అడిగాడు ఆయన, ఏది జవాబు లక్ష్మణుని దగ్గరా..? ఒక్క ప్రశ్నవెయ్యడమంటే రాముడు ప్రశ్నవేస్తే అలా ఉంటుంది. ఇన్ని చెప్పాడు లక్ష్మణుడు ఏమైనా నిలబడుతాయా..? ఇప్పుడు వదినగారిని లక్ష్మణుడు నన్ను అనకూడదని మీరు అంటారా వదినగారు ఆ పరిస్థితిలో అలా అనడం సహజమే తప్పులేదని మీరు అంటారా..! తప్పులేదనే అనవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఆయన అన్నాడూ న హి తే పరితుష్యామి త్యక్త్వా యద్యాసి మైథిలీమ్ ! క్రుద్ధాయాః పరుషం శ్రుత్వా స్త్రియా శ్చ త్వమ్ ఇహాఽఽగతః !! లక్ష్మణుడి నుంచి ఆయన వేసిన ప్రశ్నకు వెంటనే జవాబేం లేదు ఆయన వెంటనే అన్నాడు న హి తే పురితుష్యామి నేను సంతోషించట్లేదు నీవు ప్రవర్తించిన ప్రవర్తనపట్ల నీవు ఇలా ప్రవర్తించకుండా ఉండి ఉండవలసింది. ఆ ఒక్కమాట చాలు పెద్దలైనటువంటివారు మాట్లాడితే మిమ్మల్ని తిట్టక్కరలేదు మిమ్మల్ని కొట్టక్కరలేదు మీరు అలా ఉండకుండా ఉండవలసింది మీరు అలా ప్రవర్తించకూడదు అని ఒక్క మాట అన్నారనుకోండి చాలు అంటే మీరు అక్కడ ఆ స్థానాన్ని ఆ విషయంలో వదులుకుని కిందకి జారారనే గుర్తు.
కాబట్టి రాముడు అంటున్నాడు న హి తే పరితుష్యామి నేను నీ విషయంలో సంతోషించట్లేదు ఈ విషయంలో త్యక్త్వా యద్యాసి మైథిలీమ్ మైథిలిని విడిచిపెట్టి నీవు వచ్చావు క్రుద్ధాయాః పరుషం శ్రుత్వా స్త్రియా శ్చ త్వమ్ ఇహాఽఽగతః ఆమే కోపంతో ఈ మాట అందీ అన్నవిషయం తెలిసి కూడా ఒంటరిగా వదిలేసి వచ్చేశావు సర్వథా తు అపనీతం తే సీతయా యత్ ప్రచోదితః ! క్రోధస్య వశమ్ ఆపన్నో నాకరో శ్శాసనం మమ !! తీర్పు చెప్పాడు ఇప్పుడు, ఇదీ ఒక రాజు తీర్పు చెప్పడమంటే అంటే ఆయన

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడా లేడా అనికాదు తీర్పు చెప్పేటప్పుడు ఎందుకు  తాను అవతలివాడిది తప్పు అంటున్నాడో చెప్పగలిగినటువంటి సమర్థతత కలిగినటువంటివాడై ఉండాలి కానీ ఇప్పుడేం ఆయన దానికి శిక్షేం వేయడంలేదు కానీ ఇలా చేసి ఉండి ఉండకుండా నేను ఇలా చెయ్యకుండా ఉంటే నా అన్నగారి జీవితం ఇంకోలా ఉండేదీ ఇది చాలదాండీ బాధపడ్డానికి లక్ష్మణునికి ఎంత బాధగా ఉంటుంది ఆ విషయాన్ని ఆ కోణంలో ఇంక ఆలోచించినప్పుడల్లా రాముడు ఏడ్చినప్పుడల్లా ఈ ఏడుపుకి నేనే బాధ్యతా అన్నది ఒకటి కదుపుతూ ఉంటుందా లేదా లక్ష్మణున్ని ఆయన అన్నాడూ క్రోధస్య వశమ్ ఆపన్నో నీవు క్రోధమునకు వశుడవైపోయావు క్రోధమును నీవు నియంత్రించగలిగి ఉంటే..? వదినె అలా అంటే నీవు వెంటనే కోప్పడిపోవడమే ఎందుకు, వదినె కన్నతల్లి లాంటిది కోపంలో ఉంది ఇవ్వాళ మా అమ్మ ఆ మాట అందీ, అమ్మ ఆ మాట అన్నంత మాత్రంచేత కాసేపాగి రామ చంద్ర మూర్తి వచ్చేసిన తరువాత ఇక్కడే ఎక్కడో ఎవరో కుట్ర చేసినవారిని బయటపెట్టి పట్టుకుంటే ఆ వదినే అంటుంది లక్ష్మణా నీవు వెళ్ళిపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో సుమా..!
Image result for లక్ష్మణుడుఎంత పెద్దమాట అన్నానయ్యా నిన్ను పుత్రుడులాంటివాన్ని అంటుంది వదినె కాబట్టి, ఇప్పుడు కోపంలో ఉంది సరే ఊరుకుందాం అని ఒక్కమాట అనగలిగి ఉంటే అనుకుని ఉండి ఉంటే సీతమ్మని ఒంటరిదాన్ని వదిలేవాడివికావు, అలా అనుకోలేదు క్రోధమునకు వశుడవైపోయావు అంటే ఆవిడోమాట అందీ నీవు దానికి కోపం చెందావు ఆవిడ కోపం ఎంత అర్థంలేకుండా ఉందని నీవు అంటున్నావో నిన్ను మాటనడంలో నీవు వదిలిరావడం కూడా అంతే అర్థ రహితం కదా..! ఇప్పుడు ఆవిడకి కోపమొచ్చి ఆవిడందీ నీకు కోపమొచ్చి నీవు వదిలేశావు, మీ ఇద్దరి కోపాలు బాగానే ఉన్నాయి పరిణామమేమిటి దానికి నాకరో శ్శాసనం మమ నేను చెప్పిన మాట నీవు వినలేదు. నేనోమాట చెప్పాను సీతమ్మను వదిలిపెట్టద్దూ అని చెప్పాను వదిలిపెట్టేశావాలేదా అంతవరకే, ఎందుకు వదిలిపెట్టేశావు క్రోధస్య వశమ్ ఆపన్నో క్రోధమునకు వశమై విడిచిపెట్టేశావు కాబట్టి ఇప్పుడు కష్టము ఎవరిది నాది. ఇప్పుడు ఇక మాట్లాడితే చాలా ధారుణంగా మాట్లాడుతాడు రాముడు ధారుణంగా మాట్లాడడం అంటే ఏం తిట్టడండి, నేను దండకారణ్యానికి ధర్మంకోసం వచ్చేశాను లక్ష్మణా నాన్నగారి మాట నిలబెట్టడం కోసం వచ్చేశాను ఇప్పుడు నేను సీతమ్మ కనపడకపోతే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను ఎందుకో తెలుసా సీతమ్మలేకపోతే నేను బతకలేను, నేను సీతమ్మలేకుండా బతకకుండా చనిపోతే నేను పైలోకాలకి వెడుతాను వెడితే దశరథుడు కనపడుతాడు నిన్ను 14 యేళ్ళు అరణ్యవాసం చేయమన్నానుకదా... 14 యేళ్ళు పూర్తవకుండా నీవు ఇక్కడికి ఎలా వచ్చేశావు అని అడుగుతాడు నేనేం చెప్పను అని అడిగాడు. నేనేం చెప్పాను ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది, అంటే నెగడూ రగులుకూంటుంది అంటే సీతమ్మలేకపోతే అసలు రాముడు బ్రతకలేడు అంటే సీతమ్మ ఉంటే బ్రతుకుతాడు ఎలా బ్రతుకుతాడు ఎన్ని కష్టాలు ఉన్నా బ్రతుకుతాడు ఎన్ని కష్టాలు ఉన్నా బ్రతుకుతాడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే రాముడు మరిచిపోయేటట్టు ఎవ్వరు చెయ్యగలరు సీతమ్మ చెయ్యగలదు అది ఆవిడ భార్యా స్థానంలో పొందినటువంటి గౌరవం, ఆవిడ సంపాదించుకున్నటువంటి గౌరవం.
అంటే ఒక భార్య ఎంత కష్టంలో ఉన్నటువంటి భర్తనైనా సరే- శాంతిగా సుఖంగా సంతోషంగా ఉండగలిగేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది లోకంలో భార్యకు ఒక్కదానికే ఉన్నది. ఆ స్థానంలో ఎవ్వరూ అలా ఊంచలేరు అందుకే పురుషుడు పుట్టగానె మొట్టమొదట తను ఎవరిని చూస్తాడంటే తల్లిని, తరువాత తల్లి చెప్తుంది ఇయ్యన నీ తండ్రీ అని

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
చెప్తుంది. ఆయనని తండ్రీ అని గౌరవిస్తాడు వీళ్ళు నీకు ముందు పుట్టారు వీళ్ళు నీకు తరువాత పుడుతున్నారు వాళ్ళతో Related imageఅన్నదమ్ములూ అక్క చెల్లెల్లూ అను అనుభందం పొందుతాడు, ఇంతమంది ఉన్నా ఎవ్వరితోనూ ఒకమాట అనడు నేను ఉన్నానని గుర్తు నీ మెడలో ఉన్నతాడు ఈ మాట ఒక్క భార్యతోనే అంటాడు మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే భద్నామి సుభగే త్వం జీవీ శరదాం శతం !! నీవు నూరేళ్ళు జీవించి ఉండు నేను ఉన్నానని గుర్తు ఎమిటో తెలుసా ఆయన ఈ మధ్య కనపడ్డంలేదేమిటండీ అని అడగరు ఆవిడ మెడలో మంగళ సూత్రం ఉంటే ఆయన ఉన్నట్లే గుర్తు. ఒక తాడుకి అంత గొప్పతనం ఎక్కడనుంచి వచ్చిందండీ అంటే న్యాసము పురుషుడు అందుకని అవిడ సర్వమంగళా దేవతా మంగళ సూత్రము అయ్యాయి భార్య కూడా అంత గౌరవంగానూ చూస్తుంది ఆ మంగళ సూత్రాన్ని ఇది నా మెడలో ఉండాలని కోరుకుంటుంది ఎప్పుడు అందుకే లేవగానే పక్కనే పడుకున్నా భర్తకు కాదు నమస్కారం, ఇవ్వాళ పక్కన పడుకున్నటువంటి భర్త ఎప్పటికీ నాకు ఇలాగే కనపడుతూ ఒకనాడు నేను ఆయన చేతులలో ప్రాణం విడిచిపెట్టాలి తప్పా అంతకన్నా రెండో స్థితిని నేను చూడకూడదు అందుకని ముందు ఆ మంగళ సూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటారు ఆ సర్వమంగళా దేవత యొక్క అనుగ్రహం తనమీద ఉండాలని.
కాబట్టి లక్ష్మణా నాకు ఆమె భార్యా అన్నమాట కాదు ఆమె నా యొక్క భార్యగా సంపాదించుకున్న స్థానము యొక్క స్థితి లెక్క కట్టడానికి వీలులేనిదీ, ఒక భార్య గొప్పతనం ఏమిటో తెలుసాండీ! ఆ భార్యా స్థానం ఖాలీ అయితే భర్త ఎంత ఆరోగ్యవంతుడూ పడిపోతాడు కూడా ఒక్కొక్కసారి పడిపోవడం అంటే శరీరం వదిలిపెట్టేస్తాడు. శామ శాస్త్రిగారని మహానుభావుడు ఆంత పొడగరి మనిషి పంచ కట్టుకుని రాజ విధుల్లో నడిచి వెళ్తుంటే రామ చంద్ర మూర్తిని చూసినట్టు చూసేవారట ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆయన్ని అటువంటివాడు ఆయన, భార్య మరణిస్తే ఆవిడ పదకొండో రోజు వచ్చేలోపల ఆయన కూడా శరీరం వదిలిపెట్టేశారు, అంటే ఆ భార్యా స్థానం అలా ఉంటుంది ఒక్కొక్కరికి ఆ స్థానం మనసులో ఆమె ఉన్నది చాలు ఎంత కష్టాన్ని ఎంత శోకాన్ని మరిచిపోతాడు ఎందుకంటే ఆవిడ ఎప్పుడు శాంతి స్థానంగా కూర్చుంటుంది, ఇలా శాంతి స్థానంగా భార్య ఉండడం ఆవిడ గొప్పతనానికి నిదర్శనం, అది ఎంత అగ్నిహోత్రం కానివ్వండి భర్త ఎంత కష్టంలో ఉండనివ్వండి ఎంత కోపంలో ఉండనివ్వండి ఆ నెగడు చల్లార్చగలిగినటువంటి శక్తి భార్యకు ఒక్కదానికే ఉంది. రామాయణంలో ఇన్ని కష్టాలలో ఉన్నటువంటి రాముడు ఎప్పుడూ నేను చచ్చిపోతాను అన్నమాట అనలేదు ఇవ్వాళ సీతమ్మ కనపడలేదు ఇంకాను ఆవిడ చనిపోయిందో రాక్షసులు అపహరించారో నిర్ధారణ కాలేదు కాని ఆయన నేను చచ్చిపోతాను అంటున్నాడు నేను ఉండలేను అంటున్నాడు, ఆత్మ హత్య చేసుకుంటాను అంటాలేదు సీతమ్మ కనపడకపోతే నేను ఉండను, నేను ఉంటానన్నమాట అసత్యం. సీతమ్మకు బదులు మూడు లోకములు ఇస్తానన్నా నాకు అక్కరలేదు అంటే మళ్ళీ తిరిగి నేను అయోధ్యకు వచ్చి నేను ఏదో రాజరికం చేస్తాననేటటువంటిది శుద్ధ అబద్ధం. ఇక నేను తిరిగి రావలసి అవసరం లేదు ఎందుకో తెలుసా నేను రాజుగా కూర్చోవడమూ అంటే సీతా రాముడిగా కూర్చోవడమే తప్పా సీతమ్మ అసలు లేదు అన్న తరువాత నాకిక ఈ లోకంతో సంబంధం లేదు. నా శరీరంలోంచి ప్రాణములు ఉద్గమిస్తాయి వెళ్ళిపోతాయి.
అంటే ఆవిడా ఎటువంటి స్థానాన్ని భర్త యొక్క హృదయంలో సంపాదించుకోగలిగిందో అందుకు కదాండీ సీతారాములు ఎన్నాళ్ళు పక్కపక్కన ఉన్నారూ అని చూడరు శుభలేక వేస్తే జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మ రాగాయితాః అన్న శ్లోకాన్ని ఎందుకు రాస్తారు, సీతారాముల్లా బ్రతకండని ఎందుకంటారు భార్యా స్థానంలో అంతగొప్పతనాన్ని ఆవిడపొందాలి, భతృస్థానంలో ఆయన అంతగొప్ప స్థానాన్ని భార్య దగ్గర తానుపొందాలి. మూడు లోకములు తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టినా సరే రాముడి కాలి గోటికి పనికిరావని ఆవిడ అంటుంది ఆవిడకి భర్తపట్ల ఉన్న గౌరవం అటువంటిది ఆవిడ పాతివ్రత్యము అటువంటిది భార్యమీద ఆయనకున్న ప్రేమ అటువంటిది. సీతమ్మతల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి రాముడు చెప్పే శ్లోకాల యొక్క అద్దంలోంచి మీరు చూడవలసి ఉంటుంది అలా చూసినప్పుడు దాంపత్యమంటే ఎమిటో అవగాహన అవుతుంది మీకు దాంపత్యమంటే ఎమిటో అవగాహన కలిగిన తరువాత మనసులు కలవడం ఒకరి శాంతికి ఒకరు స్థానం కావడం ఎంత గొప్పదో అర్థమైతే అసలు ఆ దాంపత్యమన్నమాటే ఒక అనిర్వచనీయమైనటువంటి మాధ్యుర్యానికి మారుపేరుగా నిలబడుతుంది.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
అది లేకపోతే పశ్చిమ దేశాల సంస్కృతిలా ఉంటుంది, ఇవ్వాళ పెళ్ళి చేసుకోవడం మూడు రోజుల పోయిన తరువాత విడాకులు ఇచ్చుకోవడం, అది ఏ కారణానికి పెళ్ళి చేసుకుంటారో ఏ కారణానికి విడిపోతారో వాళ్ళకే తెలియదు, కాని సనాతన ధర్మంలో అలా ఉండదు వివాహమంటే. సనాతన ధర్మంలో వివాహమంటే ఇద్దరు ఒక్కటైపోవడం కిందే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాముడు లక్ష్మణ మూర్తితో ఈ మాట అని ఇద్దరం కలిసి అన్నిటినీ వెతుకుదాం ఇక్కడే ఉంటుంది సీతమ్మ ఎక్కడో ఆమెకి బాగా తామర పూలతో కూడినటువంటి సరోవరములలో స్నానం చెయ్యడం ఆవిడకి మిక్కిలి ప్రీతిపాత్రం కాబట్టి స్నానమునకు వెళ్ళి ఉండవచ్చు లేకపోతే పర్ణశాలలోనే అవిడ ఏదైనా ఇతరమైనటువంటి గదులలో ఉండవచ్చు, ఆవిడకి ఇష్టమైనటువంటి ఇతరమైన ప్రదేశాలలో ఏ పూలవనంలోనూ ఉండవచ్చు లేకపోతే అసలు రామ చంద్ర మూర్తి నేను కనపడకపోతే ఏం చేస్తారో చూద్దామని పరిహాసానికి దాక్కొని ఉండవచ్చు అందుకని అన్నయ్యా అంత తీవ్రంగా ఖేదపడకు వెతుకుదాం అంటే ఇద్దరూ కలిసి వెతకడం ప్రారంభం చేశారు.
Image result for సీతా రాములుఈ వెతకడం అనేటటువంటిది ఎలా ఉందట వృక్షాత్ వృక్షం ప్రధావన్ స గిరే శ్చాద్రిం నదాన్ నదీమ్ ! బభూవ విలపన్ రామః శోక పంకాఽఽర్ణవాఽఽప్లుతః !! నది దగ్గరికి నదము దగ్గరికి పరుగెడుతున్నాడు చెట్టుకీ చెట్టుకీ మధ్యలో ఎక్కడైనా చోటు ఉంటే ఈ చెట్టు దగ్గరకెళ్ళి పరుగెత్తి అడుగుతున్నాడు పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ చెట్టుదగ్గరకెళ్ళి అడుగుతున్నాడు ఇప్పుడు ఇలా అడుగుతుండడంలో ఆయన అసలు శోకమనేటటువంటి సముద్రమునందుపడి కొట్టుకొపోతున్నవాడిలా ఉన్నాడు. అంటే శోక పంకాఽఽర్ణవాఽఽప్లుతః శోకమనేటటువంటి సముద్రం అనేటప్పటికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకాయన హఠాత్తుగా సముద్రంలో పడిపోయాడనుకోండి ఏ ఓడలోనూ వెళ్తూ ఇప్పుడు ఆయన ఏ దిక్కుకు వెడుతాడు ఎటువైపుకి ఈత్తాడు ఎటువైపుకి చేతులు ఊపుతాడు అన్నదానికి ఒక దిశ ఏమీ ఉండదు. ఎందుకంటే తలెత్తి చూస్తే ఏం కనపడుతుంది అనంతమైన జలరాశి ఎటుచూసినా అనంతమైన జలరాశిలో పడిపోయినటువంటివాడు ఎటువైపుకు ఈదుతున్నాడు అంటే ఎటువైపుకు ఈదాలనిపించిందో అటువైపుకి ఈదుతాడండి అటు భూముందాని మీరు అడిగారనుకోండి దానికి అర్థమేమీ ఉండదు అటువైపు భూముందని అతనికేం తెలియదు ఆయన ఈదుతుంటాడు అంతే, ఒకవేళా అలా ఈదుతుండగా అటువైపుకు పెద్ద చేప ఒకటి ఉండి ఈయన్ని తినేయగలిగినటువంటి భయంకరమైన తిమింగళం ఉందనుకోండి అదేమిటండీ ఒడ్డుకు వెళ్ళవలసినవాడు అటువైపుకి వెళ్తున్నాడు అని మీరు అన్నారనుకోండి అది మీకు తెలుసు ఆయనకు తెలియదు అది, ఆయన ఎందుకు ఈత్తున్నాడో ఆయనకే తెలియదు ఒకవేళ ఒడ్డుకు వెళ్ళవలసినవాడు సముద్ర మధ్యలోకి ఈదుతున్నా ఈదేస్తాడు అప్పుడు అంతే అంటే తన మీద తనకు నియంత్రణ పోతూంది, పోతూ శోకమనేటటువంటి సముద్రంలోకి కూరుకు పోతున్నాడు.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
సీతమ్మ కనపడటంలేదు ఏమైపోయిందో చనిపోయిందో తినేశారో చంపేశారో ఇది మనసులో ఈ ఖేదము అనేటటువంటిది ఎలా పెరిగిపోతూందో తెలుసాండి శ్రీరామాయణంలో ఆ సర్గలో చూడాలి, ఆయనా చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతాయి ఆయనకి సీతమ్మకి అసలే భయమెక్కువా రాక్షసులు వచ్చి మీద పడ్డారేమో మీద పడ్డప్పుడు ఆమె ఇంకెంత భయపడిపోయిందో ఆ భయపడిపోతున్నటువంటి సీతమ్మ చేతలు వాళ్ళు గట్టిగా పట్టుకుని ఆ రెక్కలు విరిచేసి ఆవిడ కంఠాన్ని నులిమేస్తుంటే ఆ కోమలమైన కంఠం నలిగిపోతుంటే ఆవిడ ముక్కులోంచి నోట్లోంచి నెత్తురు కారుతుంటే రాక్షసులు జుర్రుకున్నారేమో భర్తనై వుండి నేను పక్కన లేక సీతమ్మ ఎంత బాధపడిపోయిందో ఇప్పుడు లోపల బాధ ఈ బాధ చేత ఎక్కడ వెతుకుతున్నాను నేను ఎక్కడికి వెడుతున్నాను అన్నది ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో కూడిన వెతకడమేమి ఉండదు. లోపల శోకం తన్నుకొచ్చేస్తుంది. రావడంలో వృక్షాత్ వృక్షం ప్రధావన్ స గిరే శ్చాద్రిం నదామ్ నదీమ్ ! బభూవ విలపన్ రామః శోక పంకాఽఽర్ణవాఽఽప్లుతః !! ఆ పర్వతాలు నదులు నదములు ఆ వృక్షములు చెట్లు దీన్ని అడగడం దీన్ని అడకపోవడం అనేం లేదు ఇంక కనపడ్డవాటినన్నిటిని అడిగేస్తున్నాడు ఇక ఆయన దృష్టిలో ఎలా ఉందో తెలుసాండి, అసలు ఆ దృష్టికోణంలో రాముడు అడిగినటువంటి తీరుకి మీరు తెల్లబోతారు.
నేను ఒకటి రెండు ఉదాహరణలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆయన ఒక వనస్పతి వృక్షం దగ్గరికి వెళ్ళాడు వనస్పతి వృక్షం బాగా ఎత్తుగా పెరిగి ఉంటుంది, అది పూవ్వు పుయ్యదూ అని లోకంలో ఒక నానుడి అది పువ్వు పుయ్యకుండా ఫలిస్తుందీ అని, కానీ ఆ వృక్షం దగ్గరికెళ్ళి ఆయన ఒక మాట అంటున్నాడు కకుభః కకుభోరుం తాం వ్యక్తం జనానాతి మైథిలీమ్ ! యథా పల్లవ పుష్పాఢ్యో భాతి హ్యేష వనస్పతిః !! నీవు ఈ వనస్పతి వృక్షాన్ని చూస్తే పూలతో అంతెత్తునుంది అంతెత్తున పువ్వులతో ఉన్నావు కాబట్టి సీతమ్మ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా నీకు కనపడుతుంది అంత ఎత్తుగా ఉన్నావు కాబట్టి, నేనంటే ఇక్కడున్నాను ఎక్కడుందో కనపడక ఏడుస్తున్నాను ఓ వనస్పతి వృక్షమా! నీవు అంత ఎత్తున్నావు అంత ఎత్తున ఉన్నావు కాబట్టి నీకు కనపడుతుంది, నీకు కనపడుతుంది కాబట్టి సంతోషంగా పువ్వు పెట్టుకుని నవ్వుతున్నావు రాముడు ఏడుస్తున్నాడు అదిగో సీతమ్మ అక్కడే ఉంది తెలియట్లేదని, నాయందు దయయుంచి చెప్పావా ఎక్కడుందో నా భార్యా..! అలా అడగచ్చా వనస్పతి వృక్షాన్ని రాముడు అని మీరు అడిగారనుకోండి అలా అడగడంలో వనస్పతి వృక్షం మాట్లాడుతుందాండీ! అదేంటండీ అలా అడగటమేంటండీ అన్నారనుకోండి ఆ బాధలో ఉన్నటువంటివాడు శోకమనే మహా సముద్రంలో కొట్టుకుపోతున్నవాడు, ఒక చీపురు పుల్ల కనపడ్డా సాయానికి ఇలా పట్టుకున్నట్టు ఆయన ఒక ఎత్తైన చెట్టు కనపడితే చెట్టుకు కనపడుతుంది సీతమ్మా అని చెట్టును అడుగుతున్నాడు.
ఆయన ఒక తిలక వృక్షం దగ్గరకి వెళ్ళాడు భ్రమరైః ఉపగీత శ్చ యథా ద్రుమవరో హ్యయమ్ ! ఏష వ్యక్తం విజానాతి తిలక స్తిలక ప్రియామ్ !! నీ పేరే తిలక వృక్షం, సీతమ్మకి తిలకమంటే చాలా ఇష్టం ఓ తిలక వృక్షమా తిలకమంటే ఇష్టం ఉన్నటువంటి సీతమ్మా ఇటుగా ఎటువైపు వెళ్ళిందో నీకు తప్పకుండా కనపడుతుంది. నీకు ఇష్టమైందిగా ఆమెకు తిలకమంటే

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
Image result for సీతా రాములుఇష్టం కదా అందుకని మీ ఇద్దరి మధ్యా అనుబంధముందిగా కాబట్టి నీవు ఎప్పుడూ ఆవిడని చూస్తుంటావు ఆవిడ నీయందు ప్రీతితో ఉంటుంది. నేనంటే ఇక్కడలేనుగాని నీవంటే ఇక్కడే ఉన్నావు కాబట్టి ఆవిడ ఎక్కడికెళ్ళిందో నీకు కనపడి ఉంటుంది కాబట్టి ఓ తిలక వృక్షమా నాకు చెప్పవా ఎక్కడుందో సీతమ్మా, ఇది దీన్ని మనసులో పెట్టుకుని మహర్షి అంటున్నారు వృక్షాత్ వృక్షం ప్రధావన్ స చెట్టుకీ చెట్టుకీ మధ్యలో పరుగెడుతూ చెట్లను అడుగుతున్నాడు రాముడు అంటే పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు ఎంత భీతిల్లిపోయి ఉంటాడో అసలు ఆ పరిస్థితిని చూసి మీరు గమనించండి. అంత స్వస్థతకలిగినటువంటి రాముడు ఇవ్వాళ చెట్లదగ్గరకెళ్ళి చెట్లను పట్టుకుని అలా పిచ్చిపిచ్చిగా అడుగుతూ పరుగులు తీస్తూ కనపడ్డ గుహల్లోకి దూరిపోతూ సీతా సీతా అని అరుస్తుంటే లక్ష్మణుడి హృదయం ఎంత కదిలిపోయి ఉంటుందో ఎంత బాధపడి ఉంటాడో ఏ తప్పు చెయ్యనటువంటి అక్కడ సీతమ్మ ఇక్కడ రాముడు రామునివలన లక్ష్మణుడు ముగ్గురు ఏడుస్తున్న ఏడుపులు, ఈ ఏడుపులకి కారణమైనవాన్ని కట్టి కుదపవని మీరు అనుకుంటున్నారా..! ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండి ఉండవచ్చు.
కానీ ఈ ఏడుపు పెద్ద అగ్నిహోత్రమై రాజుకుంటుంది రాజుకున్నప్పుడు కాల్చేస్తుంది, ఇదీ శ్రీరామాయణంలో ఇంకో కోణం నీవు ఏడిపించి వదిలేయడం చాలా తేలిక వాళ్ళు ఏడుస్తుంటారు నీవు నవ్వుతావు, నీవు నవ్వుతున్నావని అనుకుంటున్నావు కాని ఒక బీజం వృక్షం అవ్వడానికి సమయం పట్టినట్లే నీవ్వు ఏడిపించిన ఏడుపు నిన్ను కాల్చడం కూడా ప్రారంభం చేస్తుంది ఒకప్పుడు. అప్పుడు నిన్ను ఆదుకునేవాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే చేసిన కర్మ ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్పా ఎవడు కర్మ చేశాడో దాన్ని మాత్రం భార్యా పుత్రులు కాని బంధువులు కాని ఎవ్వరూ అనుభవించేవారు ఉండరు అందులో భాగస్వామ్యాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు, అందుకే శరీరములు మాత్రమే వేరుగానే ఉంటాయి మనసులు ఒకటవ్వచ్చుకాని శరీరములు ఎప్పుడూ వేరే. ఒకాయనకి రాచపుండు పుట్టిందనుకోండి భార్య ఏం చేస్తుందండి... పోనీ ఆవిడా అన్నం తినడం మానేసి ఏడుస్తుంది, ఆవిడా హాస్పెటల్లో ఆయన మంచం మీద పడుకుని ఉంటే అవిడా పక్కన బల్లమీద పడుకుని ఉంటుంది. ఇంట్లో మేనల్లుడి పెళ్ళైనా పెళ్ళికి వెళ్ళడం మానేస్తుంది. కానీ భర్తగారి యొక్క రాచపుండు నెప్పిని ఆవిడ పుచ్చుకుంటుందా ఆవిడ పుచ్చుకోలేదు. ఎందుకు పుచ్చుకోలేదూ అంటే ఇక్కడే ఈశ్వరుడి యొక్క చమత్కారము ఉంది.
జీవుడు ఏ జీవుడు చేసుకున్న సుఖ దుఃఖములను ఆ జీవుడు అనుభవించాలి ఆ జీవుడితో అనుబంధమున్నందుకు మానసికంగా వాళ్ళు పంచుకుంటారేమోకానీ శారీరకంగా మాత్రం వాళ్ళు పంచుకోవడం కుదరదు. ఈయన పుండుబాగై ఈయనే అనుభవించాలి శరీరం ఉన్నది ఎందుకంటే ఇది సుఖ దుఃఖములను అనుభవింపజేయడానికే వచ్చింది, అది వంటపట్టినవాడికి ఏమౌతుందో తెలుసాండి? శరీరం ఒక క్లేశాన్ని పొందిందనుకోండి అమయ్యా చేసిన పాపం ఏదో క్షయమైపోతుందన్నమాట ఈశ్వరా! ఏదో చేసుంటాను పాపం పోతోంది ఇలాగ మరి వచ్చిందెందుకు దీంతోనే సుఖపడాలి దీంతోనే దుఃఖపడాలి కాబట్టి దీంతోపోతోంది కాబట్టి ఇప్పుడు దీనికి బాధగా అనిపిస్తే మళ్ళీ నీవు ఇలా బాధ పడకుండా ఉండాలంటే నీవు ఏం చెయ్యాల్సి ఉంటుంది, పాపం చేయకుండా ఉండాల్సింది కదూ! పాపం చేస్తూ సుఖం రమ్మంటే ఎలా వస్తుంది రాదు. సుఖం కావాలంటే పుణ్యం చెయ్యి పాపం చేస్తూ నీకు సుఖం కావాలని మాత్రం అడక్కు ఎందుకో తెలుసా దానికి సాక్షి నీవ్వే నీ శరీరంతో అనుభవిస్తున్నావు అసలు ఇది ఉన్నది అందుకే అనుభవింపజెయ్యడానికే ఇది పొంచి ఉంటుంది. అందుకే దీని పేరు కూడా శాస్త్రంలో చిత్రంగా ఉంటుందండీ, దీన్ని అనేక పేర్లతో పిలుస్తారు “శరీరము” దీనికొక పేరు “దేహము” ఒక పేరు. 50 సంవత్సరాలవరకూ ఇది శరీరము యాభయ్యో పుట్టిన రోజు దాటిపోయిందనుకోండి దీన్ని ఏమని పిలవాలో తెలుసా..? దేహం అని పిలవాలి తప్ప శరీరం అని పిలవకూడదు, ఎందుకంటే 50 వరకు పెరిగే అవకాశం ఉంటుంది బలాన్ని పొందే అవకాశం ఉంటుంది, 50 తరువాత అదేం చేస్తుందో తెలుసా..! దహింపబడడానికి సిద్ధమౌతుంటుంది. తను కాలిపోవడానికి సిద్ధపడుతుంటుంది ఎందుకంటే అయిపోతుంది దాని ప్రయోజనం దాని సన్నిబంధములు సడలిపోతుంటాయి, అందుకని మీరు ఎంత జాగ్రత్తగా మీరు చూడండి అది ప్రకోపిస్తుంటుంది. ఇంకా ఎన్నాళ్ళయ్యా ఇంకా ఎన్నాళ్ళయ్యా అని అంటూనే ఉంటుంది అది, అలా కాదయ్యా ఉండాలయా ఉండాలయా అని నీవు అంటావు... ఇంకా ఎన్నాళ్ళయ్యా అని అదంటుంది.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
“అన్నవికారం” నీవేం చేస్తుంటావంటే నేను ఇలా అన్నం పెట్టి దీన్ని రక్షిస్తాను అంటావు అదేం చేస్తుందో తెలుసా..! నీకు తెలియకుండా నీవు పెట్టిన అన్నాన్ని విషంగా మార్చుకోవడం మొదలు పెడుతుంది. అందుకే “అన్నం” అన్న మాటకు శాస్త్రంలో రెండు అర్థాలు ʻమనము తినునదీ-మనని తినునదిʼ మనం దాన్ని తింటాం మనల్ని అది తింటుంది. కొన్నాళ్ళు నేను తిన్నాను స్వీట్లు- ఇప్పుడు స్వీట్లు నేను తింటే నన్నుతింటుంది అంటే సుగర్ వచ్చిందని గుర్తు. అంటే స్వీట్లు ఎక్కువ తిన్నామనుకోండి ఏమౌతుంది సుగర్ రేటింగ్ పెరిగిపోతుంది. పూర్వం పులుపు పచ్చళ్ళు తిన్నాను ఇప్పుడు పులుపు పచ్చల్ళు తిన్నాననుకోండి అది నన్ను తింటుంది బిపి పెరుగుతుంది అంటే అవన్ని నీకు ఉన్నాయా అనుకునేరు. నాకేం లేవు ఈశ్వరానుగ్రహంతో కాని ఒక ఉదాహరణకి అటువంటి నీచోపమానం ఇంకోళ్ళ మీదకి పెట్టడం ఎందుకని నామీద పెట్టుకు చెప్పుకుంటున్నాను అంతే. కాబట్టి మనము తినునది మనని తినునది అన్నము అన్నమాటకు రెండు అర్థాలు ఉంటాయి. అన్నవికారం ఈ శరీరం కాబట్టి అన్నము చేత పోషింపబడుతుంది.
Image result for సీతా రాములుఈ శరీరము ఉంటే కదా సుఖ దుఃఖాలు అనేటటువంటివి అనుభవించడం కాబట్టి ఇప్పుడు రాముడు సీతమ్మ పక్కన లేకపోతే నేను ఇదే మీతో మనవి చేసింది అగ్ని గుండం మీద ఉన్నటువంటి అచ్చాదన తొలగిపోయింది, ఇప్పుడు ఎంత శోకాన్ని పొందేస్తున్నాడో చూడండి. ఇంతకు ముందు ఇంత శోకం ఎప్పుడైనా ఉందాండీ ఇంతకు ముందు ఏమన్నాడు రాజ్యంపోతే ఈశ్వరుడన్నవాడు ఒకడు ఉన్నాడు వాడు అలా చేస్తూ ఉంటాడు వాడు మనకు ఎదుట కనపడుతాడా..! అని అన్నాడు. ఇప్పుడు అమేమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా..? అంటే ఇప్పుడు మీరు రెండు కోణాలలో చూడాలి, రాముడికి తెలియదని మీరు అనుకోకూడదు రాముడు శోకిస్తున్నాడూ అంటే అన్ని తెలుసున్న రామున్ని కూడా శోకింపజేసేటంతగా ఆయన మనస్సులో సీతమ్మ తల్లి స్థానమును కల్పించుకుని... ఎన్ని శోకములైనా తను ఆపగలదు తనులేకపోతే మాత్రం రాముని శోకాన్ని ఆపగలిగినవాళ్ళు ఉండరు. ఇది చూపిస్తూంది అంటే సీతమ్మ భార్యా స్థానంలో ఎంత గొప్ప స్థితిని పొందింది ఇదీ రామాయణం. ఇదీ రామాయణం అంటే ʻరమʼ ʻరామʼ ఇద్దరు సీతమ్మ కథా నడిచేస్తోంది ఇందులోనే రామ కథా నడిచేస్తోంది ఇందులో పైకి రాముడి ఏడుపు కనపడుతోంది లోపల సీతమ్మ స్థానం కనపడుతోంది మూడో కోణంలో మనం ఎలా బ్రతకాలో గృహస్తాశ్రమంలో నేర్పుతోంది. శోకము మనిషిని ఎంత కదపగలదో అసలు అది పై హేతువులకు ఎలా అందదో అలా... అదేంటండీ పై చెట్లను పట్టుకుని ఏడవం ఏమిటండీ అంటే అది నీకు అర్థం కాదు ఆ శోకం ఆయనకు తెలుసు ఆ శోకం.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
మా ఆవిడనైతే నేను ఇలా ఏడవను సుమాండీ! అంటే అది నీ ఖర్మ, నీ భార్య అంత గొప్పది కాదని అర్థం నీవు అలా అనకూడదు తప్పు అది, కాబట్టి రామాయణం మీద మీరు అలాంటి తీర్పులు చెప్పడం ఏం కుదరదు, రాముడైతే అలా ఏడ్చాడు కానీయ్యండీ నేను అలా ఏడవనండీ అని అన్నారనుకోండి అప్పుడు మీ ఆవిడని అవమానించినట్లు అవుతుంది అది. మీ ఆవిడ స్థానం సీతమ్మంత స్థానం మీ దగ్గర లేదని గుర్తు అప్పడు మీ ఆవిడ వెంటనే... సరే ఇప్పుడు ఆ మాటలు ఎందుకు కానివ్వండీ... కాబట్టి రాముడు ఆ చెట్లను కూడా అడుగుతున్నాడు మల్లికా మధవీ శ్చైవ చంపకాన్ కేతకీ స్తథా ! పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్త ఇవ లక్ష్యతే !! ఉన్మత్తడూ అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు ఉన్మత్తుడూ అంటే పిచ్చివాడు అంటాము మనం కదా! పిచ్చివాడికి నేను అర్థం కాను నేను పిచ్చివానికి అర్థం కాదు వాడు పిచ్చివాడు కదా! పిచ్చివాడి మనసులో భావాలు లేవని మీరు అనుకోకండి, పరమ శివుడికి ఓ పేరుంది ఉన్మత్త శేఖరాయ నమః అని పిచ్చివాళ్ళలో ఆయన పెద్ద పిచ్చోడని, అదేమిటండీ అలాగని అంటారేమో మీరు నేను మీకొక ఉదాహరణ చెప్పితే పట్టుకుంటారు, నేను ఒకసారి మా ఊళ్ళో సినిమా చూసి బయటికి వస్తున్నాను అంటే బయట డ్రైనేజి ఉంది అక్కడ కూర్చుని కాఫీ తాగి బైటపడేసినటువంటి ప్లాస్టిక్ గ్రాసు ఒకటి పట్టుకుని థావళీ కట్టుకుంటారు బ్రాహ్మణులు అలా చిన్న గుడ్డ కట్టుకుని గోచి పోసి కట్టుకుని ఆ తుము పక్కన కూర్చుని ఒకతను ఆ మురికి నీళ్ళు తీసుకొని ఒకతను ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా అని పుచ్చుకుని ఏమైందో తెలియదు కసేపు అలా కళ్ళు మూసుకుని లేచి ఆ గ్లాసు అవతల పడేసి అందులో దూకి నీళ్ళు ఇలా ఇలా చల్లుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కాసేపు అలా ఉండిపోయాను అతన్ని చూస్తూ ఏదో గొప్ప సంస్కార బలముంది అతనిలో కాని అతని అలా ఎందుకు చేస్తున్నాడో మీకు అర్థం కావడంలేదు అందుకని మీరు పిచ్చాడన్నారు.
Image result for చంద్రశేఖర భారతీఅందుకే చంద్రశేఖర భారతి స్వామివారు ఇదే అన్నారు నీకు నేను అర్థం కాలేదు కాబట్టి నన్ను పిచ్చివాడు అంటున్నావు, అర్థం కానివాళ్ళందరు పిచ్చివాళ్ళే అలా అయితే నీవు నాకు అర్థం కాకపోతే నీవు పిచ్చోడివా..? పిచ్చి అన్నమాటకు అర్థమేమిటి అని అడిగారు ఆయన, నన్ను అర్థం చేసుకునే స్థాయి నీకులేదు ఆ స్థాయిలేక నన్ను పిచ్చివాడు అంటారేమిటి అడిగారాయన. నిజమే రామకృష్ణ పరమహంసని పిచ్చాడంది ఈ లోకం ఆయనకు పట్టినటువంటి పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అని ఏడిచారు చాలా మంది అదీ ఉన్మత్త స్థితీ అంటే నీకు పిచ్చాడులా కనపడుతాడు ఆయనలోని భావమును నీవు ఎప్పటికీ పసిగట్టలేవు, దానికే ఉన్మత్త స్థితి అని పేరు. లోపలా ఏమీ ఆలోచన లేకుండా చేస్తున్నవాడు కాడు లోపల ఏదో బడబాగ్ని ఉంది కాని అది నీకు అర్థం కాదు. హేతువులతో చూడ్డానికి భార్య కనపడకపోతే అలా చెట్ల దగ్గరకెళ్ళి ఏడుస్తారాండీ..? అంటే ఆ భార్య సంపాదించుకున్న స్థానాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు భర్త మరణించాడు అని చెప్పగానే ప్రాణాలు వదిలేసిన ఆడవాళ్ళు ఉన్నారు, పద్మావతి జయదేవులు లేరూ ఉన్నారు లోకంలో అలా వదిలేస్తారాండి అంటే... వాళ్ళిద్దరి మధ్య ఉన్న గాఢానురాగం అటువంటిది ఆ అనురాగం ఎలా ఉంటుందండీ అంటే... వాళ్ళ మనః పరిపక్వతను బట్టి ఉంటుంది, అంతేగాని ఒక్కొక్కసారి భర్త గొప్ప అనురాగమున్నవాడై ఉండచ్చు, భార్య పింకిదై ఉండచ్చు, అదో అదృష్టం అదేంటండీ అలా అంటారు అంటారేమో...

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
భార్యకు అస్సలు సహకరించనివాడూ భార్యకు బాగా సహకరించేవాడు ఇద్దరు వెళ్ళి దేవాలయంలో నమస్కారం పెట్టారట. భార్యని ఎప్పుడూ తనను అనువర్తించేవాడు అన్నాడూ ఈశ్వరా! ఎంత దయాళువువి నాకు గొప్ప భార్యని ఇచ్చావు కాబట్టి నేను అన్నీ చక్కగా చేయగలుగుతున్నాను కాబట్టి ఇంత మంచి భార్యను ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞుడను. రెండవ వాడు అన్నాడు ఈశ్వరా! నాకు మహా గయ్యాళి భార్యను ఇచ్చావు ఎంత ప్రేమ మూర్తివి నాకు కానీ నీవు అనుకూలవతియైన భార్య ఇచ్చి ఉంటే... ఆ భార్య మీద ప్రేమతో కొట్టుకుపోయేవాడిని నాయందు ఆ అనుకూల్యత లేని భార్యను నాకు ఇవ్వడం వల్ల వైరాగ్యమొచ్చేసింది నీయందు భక్తి నిలబడింది ఈశ్వరా ఎంత కృతజ్ఞుడను అన్నాడు. మీ దృష్టి కోణంలో ఉంటుంది తప్పా... అందర్నీ అన్నిటినీ ఒకే గాట కట్టడానికి ఇవేం లెక్కలు కావు రెండు రెండ్లు నాలుగు అవ్వడానికి మనస్థత్వమండీ అదీ కాబట్టి మహర్షి అంటారు మల్లికా మధవీ శ్చైవ చంపకాన్ కేతకీ స్తథా ! పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్త ఇవ లక్ష్యతే !! ఆయనా మల్లె తీగల దగ్గరికీ మధవీ లతల దగ్గరికీ సంపంగి తీగల దగ్గరికి మొగలి పొదల దగ్గరికి వెళ్ళి నా సీతేదీ నా సీతేదీ అని ఏడుస్తున్నాడు, నా సీతేదీ మీరు చెప్పరా అని ఏడుస్తున్నాడు అదేమిటండీ అంటే అదీ ఆయనకే తెలుసు ఆ బాధ మనకు అర్థం కాదు కాబట్టి అది ఉన్మత్త స్థితి.
Image result for సీతా రాములుఆయన కేవలం ఏదో చెట్లనే అడిగాడని అనుకోకండి ఆయన ఒక జింక దగ్గరికి వెళ్ళాడు ఆయనకి ఇప్పుడు లోకంలో దేనివంక చూసినా దానికి సీతమ్మతో అనుబంధముందనీ అందుకని దానికి సీతమ్మ గురించి తెలిసుంటుందని అనిపిస్తుంది అంటే లోకమంతా సీతమ్మ కోణంలోనే చూస్తున్నాడు ఇప్పుడు ఆయనా, పువ్వులనెందుకు అడగాలి ఆ పువ్వులన్నీ సీతమ్మ పెట్టుకుంటుంది కాబట్టి తీగలకీ సీతమ్మకీ అనుబంధం రోజు ఆ పూల తీగల నుంచి పూలు కోస్తుంది ఆవిడ కాబట్టి ఆ తీగలకి సీతమ్మ ఎటు తిరుగుతున్నా తెలుస్తుంది కాబట్టి తీగలా! మీకు తెలిసుంటుంది చెప్పండి సీతమ్మ ఎక్కడుందో అంటున్నాడు. ఇప్పుడు ఒక జింక దగ్గరికి వెళ్ళాడు ఆ జింక ఆడుకుంటుంది జింక దగ్గరికి వెళ్ళి అన్నాడూ అథ వా మృగ శాబాక్షీం మృగ జానాసి మైథిలీమ్ ! మృగ విప్రేక్షణీ కాన్తా మృగీభిః సహితా భవేత్ !! నీ కన్నులు ఎంత అందంగా కదులుతాయో నా భార్య సీతమ్మ కన్నులు కూడా అంత అందంగా కదులుతాయి కాబట్టి మీ ఇద్దరిని కూడా కంటి సౌంధర్యంలో సమాన స్థాయిలో చెప్తారు అటువంటి కంటి సౌంధర్యమున్నటువంటి  ఓ జింకా! ఇదే కంటి సౌంధర్యమున్నటువంటి నా భార్య ఎక్కడుందో నీకు తెలిసుంటుంది ఏదీ నాకు చెప్పవా? అని అడిగాడు, జింకనైతే అడిగాడండీ ఒక క్రూర మృగాన్నైతే ఏమి అడుగుతాడు అప్పుడు క్రూర మృగానికి సీతమ్మకీ అనుబంధం ఉంటుందా..? జింకకీ సీతమ్మకీ ఉంటుంది.
క్రూర మృగం ఒకటి కనపడిందనుకోండి ఓ పెద్ద పులి కనపడిందనుకోండి పెద్ద పులి దగ్గరికెళ్ళి ఓ పెద్దపులీ నీకు సీతమ్మ కనపడిందా..! నీలాగే చాలా కోపంగాను అన్నిటినీనూ వేటాడుతూనూ అన్నిటిపట్ల క్రౌర్యంతోనూ మా ఆవిడ ఉంటుంది కాబట్టి మా ఆవిడ ఎక్కడుందో మా ఆవిడ నీకు కనపడిందా అని అడుగుతాడా పెద్ద పులిని, అడుగుతాడు అది ఉన్మత్త స్థితి. అడుగుతాడూ అంటే అడగడు అని మీరు అన్నారనుకోండి మీ స్తాయికి దొరెకేట్టుగా ఉన్నాడు మీ స్తాయికి దొరికెట్టుగా లేకపోతేనే ఉన్మత్త స్థితి. పెద్దపులి ఏమిటి కొండ చిలువను కూడా అడుగుతాడు పామును కూడా అడుగుతాడు, అడుగుతాడని చూపిస్తున్నాడు మహర్షి. ఇదే నేను అనేది రామాయణం చదివేటప్పుడు ఒక శ్లోకం చదివి దానిమీద చెయ్యిపెట్టి మీరు కాసేపు

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మీరు శ్లోకం చదివితే మీరు రామాయణాన్ని అనుభవిస్తారు, మీరు రామాయణం పుస్తకం ఒకటి మీరు ఒకటి కాదు మీరు రామాయణంలో పంచవటిలో రామ లక్ష్మణులతో పాటు మీరు కూడా ఉండి ఆ సన్నివేషాన్ని ఇక్కడ దర్శనంలో అనుభవిస్తారు. ఆ సమయంలో రాముని యొక్క శోకాన్ని చూసి మీరు విచలితులై మీ కన్నుల వెంట నీరు కారుతాయి. ఆ ప్రేమ ఆ భక్తి మీయందు పొంగిపోయిననాడు సీతారాములు ఎక్కడో ఉంటారని మీరు అనుకోకండి మీయందు ఆ భక్తి ప్రజ్వరిల్లిననాడు మీ పక్కనే సీతారాములు కూర్చుని అయ్యెయ్యో..! ఈ శ్లోకాలు చదువుకుని ఇప్పుడు ఎంత ఏడ్చేస్తున్నాడో చూడూ ఎంత ప్రేమో చూడు అని మీ పక్కనే కూర్చుంటారు. అందుకే నేను మీతో మనవి చేసింది రామాయణం మీకు రామ దర్శనం చేయించగలదు అని.
కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద పులి కనపడితే ఆయన అన్నాడూ శార్దూల యది సా దృష్టా ప్రియా చన్ద్ర నిభాఽఽననా ! మైథిలీ మమ విస్రబ్ధః కథయస్వ న తే భయమ్ !! ఓ పులీ భయపడకు భయపడకు నన్ను చూసి, ఎందుకంటే క్రూర మృగాలు కనపడితే బాణమేసి చంపేసేవాన్నిగా నీవు పెద్ద పులివి నీవు అడివంతా తిరుగుతుంటావు, నీవు అడివంతా తిరుగుతుంటావు కాబట్టి సీతమ్మ ఎక్కడైనా కనపడిందా..? అలా అడుగుతూ ఏదో మిషపెట్టి దగ్గరకొచ్చి బాణమేసి చంపేస్తాననుకుంటున్నావా..! నేను ఏం చేయను నిన్ను కాని నాకు ఇది చెప్పవా... నా సీతమ్మ ఎక్కడైనా కనపడిందా..? అంటే అడివంతా తిరిగే లక్షణాన్ని క్రూర మృగంలోంచి కలుపుకున్నాడు అంటే పెద్ద పులిని కూడా అడుగుతున్నాడు ఎందుకంటే పెద్ద పులి అడివంతా తిరిగొచ్చింది కాబట్టి పెద్దపులిని కూడా అడుగుతాడు సీతమ్మ ఎక్కడైనా కనపడిందేమోనని. ఇది ఉన్మత్త స్థితీ అంటే అంటే ఇప్పుడు ఆయన స్థితి మనకు అందేది కాదు మన స్థితిలో మనం ఆయన యొక్క శోకాన్ని గుర్తు పట్టడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దీన్ని అడగచ్చా దాన్ని అడగకూడదా అనేం లేదు అడుగుతున్నాడూ లక్ష్మణునితో మాట్లాడుతున్నాడు ఈ శోకం పెరుగుతున్న కొద్ది మాట స్థాయి ఎలా మారుతుందో తెలుసాండి ఆయన అంటున్నాడు నా భార్యని చేతులు విరిచేసి ఉంటారు, నా భార్యని ముక్కలు ముక్కలు కోసేసి తినేసి ఉంటారు, లేకపోతే ప్రియపత్ని జనకమహారాజుగారి కుమార్తె దశరథుని పెద్దకోడలు సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోయారు రాక్షసులు ఎక్కడో దాచేస్తారు నాకు కనపడలేదనుకో 14 యేళ్ళు అయిపోయాయనుకో నేను అప్పుడు అయోధ్యకు రావాలిగదా, నేను అయోధ్యలోకి వస్తున్నాననుకో రథం మీద నా పక్కన సీతమ్మ కనపడదుగా... పౌరులందరు సీతమ్మ ఏది రామా అని అడిగారనుకో నేను ఏం చెప్పను రాక్షసులు ఎత్తుకుపోయారు అని చెప్పారనుకో తన భార్యనే రక్షించుకోలేని చేతకానివాడు అన్నారనుకో నేను ఏ ముఖం పెట్టుకుని అయోధ్యకురాను లక్ష్మణా! నేను ఇంటికి వచ్చాననుకో జనకమహారాజుగారు వచ్చారనుకో కూతురు అల్లుడూ పాపం 14 యేళ్ళు అరణ్యవాసం చేసి వచ్చారూ అని వచ్చి ఏదీ నా కూతురు సీతమ్మ ఏదీ 14 యేళ్ళు అయ్యిందయ్యా ఎంత కష్టపడిందో నీతో కలిసి అడవిలో ఏదీ నా తల్లిని ఒక్కసారి చూస్తానని చెప్పి జనకుడు అడిగాడనుకో నేను ఏం చెప్పను.
నా మామ గారి దగ్గర కన్యాదానం చేసి ధర్మంలో నీకు ఉపకరణంగా ఉంటుందని నీకిస్తే... అరణ్యవాసానికి నిన్ను అనుగమించి వస్తే ఇంత గొప్పవాడివని లోకమంతా కీర్తిస్తే నీవు సీతమ్మని విడిచిపెట్టి అరణ్యం నుంచి తిరిగి వచ్చావా..! అని నన్ను జనకుడు అడగడు, కాబట్టి ఎందుకింక నేను అయోధ్యకు రావడం నేను రానే రాను అన్నాడు. తిరిగాడు తిరిగాడు

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
Image result for ramayana characters lakshmanaముఖం బడలిపోయింది అలసిపోయాడు దాహమేస్తోంది కొండలు కోనలు పర్వత గుహలు చెట్లు చేమలు తీగలు పొదరిళ్ళు అన్నీ తిరిగి తిరిగి బడలిపోయి పర్ణశాలకొచ్చి పడిపోయాడు. పడిపోయి లక్ష్మణున్ని పిలిచి నాయనా లక్ష్మణా! వదినె గోదావరి నది తీరంలో ఏమైనా ఒకవేళ ఉందేమో... ఎన్నిమాట్లాడేస్తాడో తెలుసాండి వదినె స్నానానికి వెళ్ళిందేమో... ఆ... నేను లేకుండా వెళ్ళదే, వదినె పువ్వులు తేవడానికి వెళ్ళిందమో ఆ... నేను లేకుండా వెళ్ళదే,  వదినె కందమూలాలకు వెళ్ళిందేమో నేను లేకుండా అడవిలోకి వెళ్ళదే, వదినె ఈ బండమీద కూర్చుని మనతో మాట్లాడినప్పుడు నీతో ఎంత ప్రియంగా మాట్లాడింది లక్ష్మణా ఏదీ వదినె ఇప్పుడు అంటే మనసు పూర్తిగా అదుపుతప్పి పోయింది. ఇక తిరగలేనంత ఓపిక తగ్గిపోయిన తరువాత లక్ష్మణున్ని పిలిచి గోదావరి ఒడ్డుకెళ్ళి చూసిరా అన్నాడు. గోదావరి ఒడ్డంతా తిరిగి సీతమ్మా సీతమ్మా సీతమ్మా అని పిలిచి జవాబు దొరకక లక్ష్మణుడు వెనక్కి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళి అన్నయ్యా కనపడలేదూ అన్నాడు.
లక్ష్మణుడి మీద నమ్మకం లేక కాదు, మనం చూడండీ ఉంగరం కనపడలేదనుకోండి ఒకవేళ ఆ బ్యాగులో పెట్టానేమో రామాయణం పుస్తకం సంచిలోనేమైనా పడేశానేమో చూడూ అంటే ఆవిడా పూలు అన్ని అవి తీసి ఇందులో లేదండీ అంటుంది. ఇందులో లేదండి అన్న తరువాత ఆయన ఊరుకుంటాడా ఏమిటి మళ్ళీ వెళ్ళి ఈయన పేజీలన్నీ తిప్పి ఓసారి మళ్ళీ ఆ బ్యాగులో పువ్వులన్నీ ఆ బ్యాగులో మళ్ళీ చూస్తాడు. నా మీద నమ్మకం లేదా నేను లేదని చెప్పానుగా మరి మీరెందుకు వెతుకుతున్నారూ అందనుకోండి ఛస్... మంటాడు, బుద్దుందాలేదా నీమీద నమ్మకంలేక కాదు ఏమో ఉందేమో అని వెతుకుతున్నాను. లక్ష్మణుడు వెతికిన చోట వెతకడానికి రాముడు మళ్ళీ వెళ్ళాడు, అంటే ఎక్కడైనా ఒక వేళ లక్ష్మణుడు సరిగా చూడలేకపోయాడేమో అక్కడే ఒసారి మనం కూడా వెడితే పోతుందిగా... ఏమో ఇక్కడ కూర్చుంటే ఏమొచ్చింది, పోనీ వెళ్ళి వెతుకుదాం అంటే అసలు ఇక ఉండలేకపోతున్నాడన్నమాట అంటే ఆయన ఎంతగా ఆయన భార్యను ప్రేమించాడో మీకు తెలుస్తుంది. ఇప్పుడు గోదావరి నది ఒడ్డుకెళ్ళి మళ్ళీ గోదావరి నది ఒడ్డంతా తిరుగుతూ గోదావరి నదిని అడిగాడు దీని మీద కవులు ఎంత చమత్కారం చేశారో దీన్ని అడ్డు పెట్టే గోదావరికి యమునకి మధ్యలో తీర్పు చెప్పారు.
కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడగా ఉన్నప్పుడు వసుదేవుడు తలమీద పెట్టుకుని వెల్తుంటే యమున దారిచ్చింది గోదావరిని రామ చంద్ర మూర్తి నా భార్యను ఎవరు తీసుకెళ్ళారని అడిగితే రావణాసురునికి బయపడి చెప్పలేదూ కాబట్టి గోదావరి కన్నా యమునే మంచిదీ అన్నారు. కాబట్టి ఆయన గోదావరి నదిని అడిగాడు, నీకు తెలుస్తుందికదా నదివి అన్ని వైపుల నుంచి ప్రవహించి వస్తున్నావుగా ఎక్కడ సీతమ్మ ఉన్నా నీకు తెలుస్తుంది భూతాని రాక్షసేన్ద్రేణ వధార్హేణ హృతామ్ అపి ! న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ !! రావణ స్య చ తద్రూపం కర్మాణి చ దురాత్మనః ! ధ్యాత్వా భయా త్తు వైదేహీం సా నదీ న శశంస తామ్ !! ఆ నదీ రావణాసురుని యొక్క భయంకరమైన రూపాన్ని మనసులో స్మరించి అమ్మబాబోయ్ రామ చంద్ర మూర్తితో రావణుడే సీతమ్మని అపహరించి తీసుకెళ్ళి పోయాడన్నమాట నేను చెప్తే... వచ్చి నా నీటినంతటిని ఇంకింప జేసేస్తాడు. కాబట్టి మనకెందుకొచ్చిన గొడవ మనమేం మాట్లాడద్దూ అని గోదావరి ఏం మాట్లాడకుండా ధ్యాత్వా భయా త్తు వైదేహీం సా నదీ న శశంస తామ్ ఏమీ మాట్లాడకుండా గోదావరి అలా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. ఆయన అక్కడ ఉన్నటువంటి జంతువులని అడిగాడు గుంపులు గుంపులుగా పరుగెడుతున్నాయి మృగాలు అవి ఆ మృగాలను అడిగాడు మీకు తెలుసా సీతమ్మ ఎక్కడికెళ్ళిందో అని.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
మన శోకాన్ని జంతువులు కూడా పంచుకుంటాయి జంతువుల యొక్క శోకాన్ని మనం కూడా పంచుకుంటాం, మీరు చూడండి లోకంలో ఇంటి కుక్క ఓ ఆరేళ్ళో ఏడేళ్ళో పెంచినటువంటి కుక్కా వీదిలో అలా పడుకుని ఉందనుకోండి, ఏమి తింటంలేదు ఇంక ఉండదండీ వెళ్ళిపోతుందండి అన్నారు డాక్టరుగారు, ఆ ఇంట్లో వాళ్ళు అన్నం తినడం మానేసినటువంటి సందర్భాలు నాకు తెలుసు. ఈ మధ్యనే నా మిత్రుడొకడు ఆ కుక్క అలా ఉందని రోజు చెప్పేవాడు కోటేశ్వరావుగారు ఆ కుక్క అలా ఉండిపోయిందండీ అలా ఉండిపోయిందండీ అని అంటూ ఉండేవాడు. ఆ కుక్క చచ్చిపోతే రెండు రోజులు అన్నం తినరు బెంగపెట్టుకుంటారు, మనుష్యులు కూడా జంతువులతో అటువంటి అనుబంధంతో ఉంటారు, జంతువులు వాటికి ఉంటుంది అనుబంధం. కాబట్టి ఆ మృగాలన్ని కూడా రాముడి యొక్క శోకాన్ని చూసి అవి శోకించాయట... కాని అవి మాత్రం అనుకున్నాయటా... చంపితే చంపి అవతల పాడేశాడు మనల్ని ఎవడో చంపేస్తాడు ఊరుకుంటాడేంటి ఇక్కడుంటే మాత్రం రేపు పెద్ద పులి తినేస్తుంది ఎల్లుండి సింహం తినేస్తుంది లేకపోతే ఇంకో చిరుత పులి తినేస్తుంది లేకపోతే వేటగాడు కొట్టేస్తాడు ఎలాగో చనిపోతాం అనుకున్నాయో ఏమో... అవి ధైర్యం చేశాయండీ, ధైర్యం చేసి చెప్పడానికి వాడికి నోరు లేదు వాటికి ఎలా చెప్పాలో అర్థం కాక రాముడికి అర్థమయ్యేటట్టు మూగగా సంజ్ఞచేశాయాట జంతువులన్నీ.
ఎలా తాం స్తు దృష్ట్వా నర వ్యాఘ్రో రాఘవః ప్రత్యువాచ హ ! క్వ సీతేతి నిరీక్షన్ వై బాష్ప సంరుద్ధయా దృశా !! ఏవం ఉక్తా నరేంద్రేణ తే మృగాః సహసోత్థితాః ! దక్షిణాభి ముఖాః సర్వే దర్శయంతో నభ స్థలం !! ఇటువైపుగా మందగా మేత మేస్తూ పరుగెడుతున్న జింకలు ఒక్కసారి మేత తినడం ఆపేసి బాధతో రాముడివంక చూసి అన్ని మృగాలు కలిసి దక్షిణ దిక్కుగా పరుగెడుతూ నభ స్థలం ఆకశం వంక ఇలా తలెత్తి చూస్తూ పరుగెడుతున్నాయట అంటే అలా చూస్తూ పరిగెడితే పడిపోవాండీ అవి అంటే పడిపోయినా ఫరవాలేదని అవి ముందుకు పరుగెడుతూ పైకి తలెత్తి ఆకాశంవైపుకు చూపించాయట అంటే దక్షిణం దిక్కుకుగా అపహరింపబడింది ఆకాశ మార్గంలో తీసుకోబడింది అని, రాముడు పట్టుకోలేక పోయాడు ఎందుకు పట్టుకోలేకపోయాడు చిత్తమునకు స్వస్థతలేదు మనస్సు సరిగ్గా ఉంటే కదాండి ఏదైనా పట్టుకోవడం మనసు అల్ల కల్లోలంగా ఉందనుకోండి రామాయణం వింటున్నా చికాగ్గానే ఉంటుంది ఇంకోటి చేస్తున్నా చికాగ్గానే ఉంటుంది ఎందుకంటే లోపల మనసు శాంతిగా లేదు. మనస్సు శాంతిగా ఉండడమే ప్రధానం అందుకే సనాతన ధర్మంలో మనం ఏం చేసినా ఒక్కటే చెప్తాం “శాంతి శాంతి శాంతిః” నా వలన ఇంకొకరి శాంతి చెడకూడదు అందరూ శాంతిగా ఉండాలి, ఇదే మనం సనాతన ధర్మంలో ఎప్పుడూ కోరుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆ మృగములన్నీ కూడా రాముడికి సీతమ్మ అపహరింపబడిన మార్గాన్ని చూపించాయి ఎందుకు చూపించాలి, అలా అందరికి చూపిస్తాయా అవి అంటే ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాన్ని లోకమంతా ప్రేమిస్తుంది, అది మృగములు కానివ్వండి చెట్లు కానివ్వండి చామలు కానివ్వండి ఏవి కానివ్వండి ఎవడు ధర్మాత్ముడో వానియందు సమస్త భూతములు కూడా అనురక్తితో ఉంటాయి సహాయపడుతాయి.
కాబట్టే అలా సహాయపడ్డాయి అప్పుడు లక్ష్మణుడు అన్నాడు... అన్నయ్యా నాకు అర్థమౌతూంది దక్షిణ దిక్కుగా అపహరించారు ఎవరో ఆకాశ మార్గంలో అపహరించారు ఈ జంతువులు మనకు దారి చూపిస్తున్నాయి, కాబట్టి అన్నయ్యా

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
దక్షిణ దిక్కుగా వెతుకుదాం పదా అన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళారు వెళ్ళితే కింద చల్లుకపోయిన పువ్వులు కనపడ్డాయి, ఆ పువ్వులు చూశాడట రాముడు వెంటనే అన్నాడు అభిజానామి పుష్పాణి తాని ఇమాని ఇహ లక్ష్మణ ! పినద్ధా నీహ వైదేహ్యా మయా దత్తాని కాననే !! లక్ష్మణా! ఈ పువ్వులు నేను తీసుకొచ్చినవే మీ వదినెకు, భర్త చేసేటటువంటి అత్యంత అనురాగ పూరితమైనటువంటి చేష్టితములలో ఇదొకటి కదాండి భార్యకు పువ్వులు తెచ్చి పెడ్డడం అన్నది ఒకటి భర్తకి ఏం వండి పెట్టిందో బాగా జ్ఞాపకం పెట్టుకోవడం భార్యకి మీరు గమనించండి, నేను నిన్ననా మల్లెపూలు తెచ్చాను గదా అందుకే ఇవ్వాళ జాజిపూలు తెచ్చాను అంటాడు ఆయన. మరోలా నన్ను అర్థం చేసుకోవద్దు మీరు దాన్ని పరమ పవిత్రంగా మాత్రమే అర్థం చేసుకోవలసి ఉంటుంది నేను హేయంగా అర్థంలేని ప్రసంగాలు చాలా లేకిమాటలు రామాయణం చెప్తూకాదు ఎప్పుడూ మాట్లాడవలసిన అగత్యం నాకు లేదు. పురషుడి ప్రీతి అది ఆయన ప్రీతితో ఆయనకు జ్ఞాపకం ఉంది. ఆవిడకేది ప్రీతి ఆయన శరీరాన్ని పోషించుకుని ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆవిడ కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ అంటుంది ʻవంకాయ కూర చేయవోయ్ʼ అన్నాడనుకోండి మొన్ననే కదాండి చేశాను, ఎన్నిమాట్లు చేసినా నీచేత్తో బాగుంటుందిలేవోయ్ అలా కాదు మీకు ఇవ్వాళ ఏదో బీరకాయ ధనియం పొడి కారం పెట్టి వండిపెడతాను అంటుంది.
Image result for సీతా రాములుఆయన శరీరాన్ని పోషించడానికి ఆవిడ తాపత్రయ పడుతుంది, ఆవిడ సంతోషంగా ఉండడానికి ఆయన తాపత్రయ పడుతాడు అది దాంపత్యమంటే ఏమి దాంపత్యం చూపిస్తారండి మహర్షీ, కాబట్టి అభిజానామి పుష్పాణి తాని ఇమాని ఇహ లక్ష్మణ ! లక్ష్మణుడితో అంటున్నాడు ఈ పువ్వులు నాకు తెలుసు లక్ష్మణా ఇవి చెట్లనుంచి పడినవి కావు తాని ఇమాని ఇహ లక్ష్మణ ! పినద్ధా నీహ వైదేహ్యా మయా దత్తాని కాననే !! ఇందులో ఇవి నేనే సీతమ్మకు తీసుకొచ్చి ఇచ్చాను తలలో పెట్టుకోమని, నేను తెచ్చి ఇవ్వగానే నేను తెచ్చానని ప్రీతితో సీతమ్మ సిగలో పెట్టుకుంది. హాఁ... నాకు ఇంకొకటి కూడా అర్థమవుతుంది లక్ష్మణ, ఈ పువ్వులు త్వరగా వాడిపోయే స్వభావమున్న పూలు, కొన్ని కొన్ని పూలు చూడండి చాలా తొందరగా వాడిపోతాయి, పువ్వుల్లో కూడా చాలా చిత్రం ఉంటుంది కొన్ని కొన్ని పువ్వులు ఏదో వ్యాయాం చేసేవాళ్ళు భుజాలు ఇలా వెనక్కంటు తిప్పినట్టు బాగా ఇలా బద్ధలైపోయినట్టు విచ్చుకుంటాయి. మందారం పూలు చూడండి ఇలా విచ్చుకుంటుంది. ఎంత విచ్చుకుంటుందో తన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అంత ముడుచుకుపోతుంది. అంత విచ్చుకోవడం అంత ముడుచుకుపోవడం మందారపువ్వు లక్షణం. అందుకే మందార పువ్వుని ఈశ్వరుడి దగ్గర పూజ చేస్తే భయమే వేస్తుంది మర్నాడు ఎందుకో తెలుసాండి మీరు మందార పువ్వును తీసుకొని ఇలా స్వామి వారి పాదల దగ్గర పెట్టారనుకోండి అంగుష్టమాత్ర విగ్రహాన్ని కదా పూజ చేస్తాం బొటనవేలంత విగ్రహాలే ఉంటాయి పూజా మందిరంలో ఇది ముందురోజు ఇలా చక్కగా పువ్వులా పడుతుంది. మర్నాడు ఏం చేస్తుందో తెలుసాండి ఆ స్వామిని అలా పట్టేసుకుంటుంది. పట్టేసుకుని దాంట్లో వచ్చినటువంటి కేసరములతో పుప్పొడితో కూడినటువంటి ఆ తీగతోటి పాదాల్ని పట్టుకుంటుంది.
మీరు నిర్మాల్యమే కదా అని ఇలా తీశారనుకోండి అది స్వామిని కూడా లాకొస్తుంది. నాకనిపిస్తుంది తన ప్రాణోత్కరసమయంలో తన శరీరం బిగిసిపోయేటప్పుడు ఎన్ని కోట్ల జన్మలెత్తానో ఏ శవంమీదో పడిపోకుండా ఈశ్వరా నీ అనుగ్రహంతో నీ పాదల దగ్గర ప్రాణం విడిచిపెడుతున్నాను అని ఇది ఎంత గట్టిగా ఈశ్వరున్ని పట్టుకుని ప్రాణం విడిచిపెట్టేసిందో, ఈశ్వరుడు ఎంత వశమైపోయాడో దీనికి దీన్ని తీస్తే ఆయన కూడా కదిలిపోతున్నాడు అనిపిస్తుంది. ఒక్కొక్క పువ్వు అలా ఉంటుంది.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ఒక్కొక్క పువ్వు తొందరగా మీరు కొద్దిగా అజాగ్రత్తగా పట్టుకుంటే గులాబి పువ్వు రేకులన్నీ విడిచిపెట్టేస్తాయి. ఒక్కొక్క పువ్వు తొందరగా వడిలిపోతాయి. పట్టుకున్నంతసేపు ఉండదు వడిలిపోతాయి కొన్ని పూలు అలా తొందరగా వడిలిపోయేటటువంటి స్వభావం ఉన్నవి ఈ పువ్వులు ఎండలో ఉంటే కానీ మన్యే సూర్య శ్చ వాయు శ్చ మేదినీ చ యశస్వినీ ! అభిరక్షంతి పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియం !! మన్యే సూర్య శ్చ వాయు శ్చ ఈ పువ్వులు ఇంకా ఇక్కడ ఇలాగే ఉన్నాయీ అంటే నేను ఏమనుకుంటున్నానంటే సూర్యుడు వీటిని వడిలిపోకుండా కాపాడాడు వాయు శ్చ గాలి వీటిని దూరంగా ఎగరగొట్టకుండా గాలి రక్షించింది మేదినీ చ యశస్వినీ భూమి ఏ ప్రాణీ దీన్ని తినేయకుండా మట్టిలో కలిసిపోకుండా ధూళిచేత కప్పబడకుండా భూమాత రక్షించింది అంటే రాముడి ధర్మం రాముడికి గుర్తులు ఎలా అందజేస్తుందో మీరు చూడండి, ఈ పువ్వుల్ని ఈ ముగ్గురు కాపాడి ఉంచారు ఎందుకుకో తెలుసా ప్రకుర్వంతో మమ ప్రియం నేను ఈ పువ్వులను చూసి గుర్తు పట్టడం కోసమే ఇవి ఇలా శోభిల్లుతూ పాడవకుండా ఈ పుష్పములు అరవిరిసి ఉన్నాయి ఇంకాను.
Image result for సీతా రాములుకాబట్టి ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కాబట్టి ఇవి సీతమ్మ తలలోవే కాబట్టి తలలోని పువ్వులు కిందపడిపోయాయి కాబట్టి ఇక్కడే ఎవరో రాక్షసులు సీతమ్మని కబళించి ఉంటారు దదర్శ భూమౌ నిష్క్రాన్తం రాక్షస స్య పదం మహత్ ! త్రస్తాయా రామ కాంక్షిణ్యాః ప్రధావంత్యా ఇత స్తతః !! రాక్షసేనాను వృత్తాయా మైథిల్యా శ్చ పదాన్యథ !!! ఇక్కడా పాద ముద్రలను చూస్తే సీతమ్మ తల్లి యొక్క పాద ముద్రలు కనపడుతున్నాయి, సీతమ్మ తల్లి పాద ముద్రలతో పాటు ఎవరివో రాక్షసుడివి పెద్ద పెద్దవి పాద ముద్రలు కూడా కనపడుతున్నాయి, అంటే ఇక్కడే సీతమ్మ ఎవరో రాక్షసుడితో పెనుగులాడింది అని ఇప్పుడు పువ్వులని బట్టి పాద ముద్రలు పాద ముద్రలను పట్టి ఆ ప్రాంతాన్ని గబగబా వెతికారు, వెతికితే
స సమీక్ష్య పరిక్రాన్తం సీతాయా రాక్షస స్య చ ! భగ్నం ధను శ్చ తూణీ చ వికీర్ణం బహుధా రథం !!
సంభ్రాన్త హృదయో రామః శశంస భ్రాతరం ప్రియమ్ !
పశ్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనక బిన్దవః ! భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ !!
తప్త బిన్దు నికాశై శ్చ చిత్రైః క్షతజ బిన్దుభిః ! ఆవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీ తలమ్ !!
మన్నే లక్ష్మణ వైదేహీ రాక్షసైః కామ రూపిభిః ! భిత్త్వా భిత్త్వా విభక్తం వా భక్షితా వా భవిష్యతి !!
 రాముడు అన్నాడు ఇదిగో ఇక్కడే సీతమ్మతల్లి ఎవరో రాక్షసులతో పెనుగులాడింది అందుకే నాకు ఇక్కడ కొన్ని కొన్ని గుర్తులు కనపడుతున్నాయి, ఒక ధనస్సు విరిగిపోయి కిందపడింది, బాణముల యొక్క ములుకులు కొన్ని విరిగి కిందపడి ఉన్నాయి, రెండు అమ్మల పొదిలి కిందపడి ఉంది వీటితో పాటుగా సీతమ్మతల్లి ధరించినటువంటి నగలలోని బంగారు ముక్కలు, నగలలో పొదగబడినటువంటి మణులు జారి కిందపడి ఉన్నాయి, కాబట్టి ఇక్కడే ఎవరో సీతమ్మని భిత్త్వా భిత్త్వా విభక్తం వా తరిమి తరిమి సీతమ్మని ఏ అవయవానికి ఆ అవయవం ఊడదీసి తినేశారనుకుంటాను అంటే ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తుంది మీరు ఎప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి. ఎక్కువ ప్రేమ ఎక్కడుంటుందో, అది ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తుంది, అందుకే తల్లి అందరికన్నా ఎక్కువ కదిలిపోతుంది లోకంలో పిల్లాడికి ఏమి అయిపోలేదుగదా..! అంటే నోటితో అమంగళాన్ని ఉచ్చరించలేకా పిల్లాడికి ఏమీ అవ్వదుకదా..? అంటుంది. చిన్న జ్వరమొచ్చిందండి అంతే పిల్లాడికి అమ్మ మూడు రోజులు ఉపవాసం చేసేస్తుంది. ఎందుకనీ అంటే అమ్మ ప్రేమ అటువంటిది తను నీరసపడిపోయినా తను ప్రాణంపోయినా ఫరవాలేదు పిల్లాడు బతకాలి. అందుకే లోకంలో అమ్మ ప్రేమలాంటి ప్రేమ అమ్మయే దైవ శ్వరూపం లోకంలో పరమేశ్వరున్ని చూడాలి అంటే తేలికగా చూడడానికి ఉన్నటువంటి మొట్ట మొదటి స్థానం అమ్మయే, అమ్మయే ఈశ్వరుడు అమ్మయే పరాశక్తి.
Image result for సీతా రాములు

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఆ సీతమ్మ తల్లి నగలలోంచి జారినటువంటి మణులు కనపడుతున్నాయి ఎవరో ఇద్దరు రాక్షసులు ఇక్కడ యుద్ధం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళిద్దరు కలియబడి సీతమ్మను పంచుకు తిన్నారని రాముడు అనుకుంటున్నాడు. ఇదిగో మహా ధనస్సు ఒకటి నేల మీద విరిగి పడిపోయింది, ఒక బంగారు కవచం ఒకటి పిట్లిపోయి కిందపడి ఉంది మూడు చువ్వలు కలిగినటువంటి ఒక ఛత్రం కిందపడి ఉంది, ఈ గొడుగు కర్ర విరిగిపోయింది బంగారు కవచములు పిశాచ ముఖములు కలిగినటువంటి ఈ రథమునకు పూన్చబడినటువంటి అశ్వములు కిందపడిపోయి ఉన్నాయి బాణపు ముక్కలు ఉన్నాయి రెండు అంబుల పొదలు ఉన్నాయి ఒక సారథి కిందపడి మరణించి ఉన్నాడు తలపాగాలు మణికుండలములు పెట్టుకున్నటువంటి ఇద్దరు ఛామర గ్రాహిణులు అంటే రథంలో కూర్చున్నవాడికి ఛామరం వేయడానికి ఉండేటటువంటి సేవకులు ఇద్దరు అటువంటి ఛామర గ్రాహిణులు నేల మీద పడి మరణించి ఉన్నారు. ఇంత మంది మరణించారు నెత్తుటి చుక్కలు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సీతమ్మ ఇక్కడ భక్షింపబడి ఉంటుంది లక్ష్మణా అనగానే... అంటే ఇంక ఏ ఆధారం కనపడ్డా సీతమ్మ చనిపోయిందనే ఆయన ఆలోచనే.
వెంటనే ఆయన నోటివెంట వచ్చిన మాట ఏమిటో తెలుసాండీ ఇంక హద్దులేని ఆగ్రహానికి కారణమైపోవడం అంటే ఎలాగుంటుందో చూడండి న ధర్మః త్రాయతే సీతాం ప్రియమాణాం మహా వనే ఇప్పటివరకూ ఏమన్నాడు భూమి కాపాడింది వాయువు కాపాడాడు సూర్యుడు కాపాడాడు అన్నాడు మృగములు దారి చూపించాయి, తన ధర్మం తన్ను రక్షిస్తుంది కాని సీతమ్మ మరణించింది అనుకున్నాడు నెత్తుటి చుక్కలు చూడగానే మరణించింది అనుకున్న వెంటనే నోటివెంట వచ్చిన మాట ఏమిటో తెలుసాండి నేను నమ్ముకున్న ధర్మం నన్ను కాపాడలేదు. ఇది కౌసల్య చెప్పి పంపించిన మాట నియమేన ధృతే న చ నీ మనసులో వచ్చినటువంటి ఆలోచనలకు ధర్మం మీద నిర్ణయం చేసి ధర్మమును వదిలిపెట్టవద్దు అన్నది కౌసల్య, నేను అందుకే మీతో ఆ రోజున నేను అయోధ్య కాండలో చెప్తూ మనవి చేశా ప్రయాణానికి సరిపడ్డ చద్దన్నపు మూట ఇచ్చినట్లు 14 యేళ్ళ అరణ్యవాసానికి సరిపోయే మాట కౌసల్య చెప్పి పంపించింది. తల్లులు పిల్లకు ఏం నేర్పాలో అయోధ్య కాండలోంచి నేర్చుకోవాలి అని చెప్పడానికి కారణం అది.
కాబట్టి రామ చంద్ర మూర్తి బాధపడుతూ అంటాడు కర్తారమ్ అపి లోకానాం శూరం కరుణ వేదినమ్ ! అజ్ఞానాత్ అవమన్యేరన్ సర్వ భూతాని లక్ష్మణ !! లోకంలో ఎవడైనా ప్రతాపవంతుడైనటువంటివాడు దయతో ప్రవర్తిస్తూ ఉంటే ధర్మబద్ధుడై చేతకానివాడూ అనుకుంటుంది లోకం మృదుం లోక హితే యుక్తం దాన్తం కరుమ వేదినమ్ ! నిర్వీర్య ఇతి మన్యన్తే నూనం మాం త్రిదశేశ్వరాః !! మనుష్యులేమి లక్ష్మణా దేవతలు కూడా ఏమనుకుంటున్నారో తెలుసా..? నేను మృదువుగా లోకహితంకోసం ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తుంటే హాఁ... రాముడు చేతకానివాడు అనుకుంటూంది కాబట్టి నేను ఇప్పుడు నా కోపం అంటే ఏమిటో చూపిస్తాను సంహృత్యైవ శశి జ్యోత్స్నాం మహాన్ సూర్య ఇవోదితః ! సంహృత్య ఏవ గుణాన్ సర్వాన్ మమ తేజః ప్రకాశతే !! సూర్యుడు ప్రకాశించాలి

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
అనుకున్నప్పుడు సూర్యోదయం జరిగేటప్పుడు చంద్రుని యొక్క కాంతిని తొక్కిపెట్టి అప్పుడు తాను ప్రకాశిస్తాడు అప్పుడు చంద్రుని కాంతి వెలవెలబోతుంది నేను ఇప్పుడు నా తేజస్సు చేత నా గుణాల్ని తొక్కేస్తాను, నేను ఏ ధర్మాన్ని పట్టుకున్నానో ఆ ధర్మముతో కూడిన గుణములను తొక్కి ఇప్పుడు నేను నా బాణ ప్రయోగములు చేయడం మొదలు పెడతాను, ఏం సీతమ్మని అపహరించి తీసుకెళ్తుంటే సీతమ్మని తీసుకెళ్తున్నప్పుడు రాక్షసులు తినేస్తుంటే నేను నమ్ముకున్న ధర్మం నా ధర్మాన్ని చూసి సంతోషించవలసిన దేవతలు నాకే ఉపకారం చేశారు తీసుకొచ్చి ఇచ్చారా సీతమ్మని దేవతలు ఈ క్షణంలో సీతమ్మ ఎక్కడున్నా నాముందు ప్రవేశపెట్టకపోతే లక్ష్మణా సీతమ్మ నాకు దొరకకుండా నేను ఇంత ధర్మంతో ఉన్నా దేవతలు ఆదరించలేదు కనుక అసలు ఈ లోకంలో ఇంక ఏ ప్రాణి బ్రతకడానికి వీలులేదు, నేను ఇప్పుడు ఈ మూడు లోకాలని లయం చేసేస్తున్నాను నైవ యక్షా న గన్ధర్వా న పిశాచా న రాక్షసాః ! కిన్నరా వా మనుష్యా వా సుఖం ప్రాప్స్యన్తి లక్ష్మణ !! లక్ష్మణా! నాకు సుఖంలేదు సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల నాకు లేని సుఖం ఈ లోకంలో ఎవ్వరికీ ఉండనవసరంలేదు అంటే ఇప్పుడు ఆ నెత్తుటి చుక్కలు చూసినటువంటి రాముడిలో క్రోధం పరవళ్ళు త్రొక్కి నోటివెంట రామ చంద్ర మూర్తి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు అనేస్తున్నాడూ అనడంలో ఏ అభ్యంతరమూ లేదు.
Image result for సీతా రాములురాముడేమిటీ ఈ మాటలు అనడమేమిటీ అంటే శోకమనేది మనిషిని ఏ స్థాయికి తీసుకుపోతుందో మీరు గమనించాలి, కాబట్టి కిన్నరా వా మనుష్యా వా సుకం ప్రాప్స్యన్తి లక్ష్మణ ఎవ్వరూ సుఖాన్ని పొందడానికి వీళ్ళేదు అందుకే ఏం చేస్తానో తెలుసా..? మమాస్త్ర బాణ సంపూర్ణమ్ ఆకాశం పశ్య లక్ష్మణ ! నిస్సంపాతం కరిష్యామి హి అద్య త్రైలోక్య చారిణామ్ !! నేను నారాచ బాణముల యొక్క పరంపరతో ఆకాశాన్నంతటిని కప్పేస్తాను ఇంక దేవతలు కాని యక్షులు కాని గంధర్వలు కాని కిన్నెరులు కాని కింపురుషులు కాని మనుష్యులు కాని అడుగు తీసి అడుగు వేయడానికి ఉండదు, నేను నా యొక్క బాణ పరంపరతో అడిగితే సమాధానం చెప్పలేదుగా ప్రశ్రమణ పర్వతం కాబట్టి పర్వత శిఖరాలన్నింటిని కూడా ఛేదించేస్తాను ఇంక పర్వతాలు అన్నవి లోకంలో ఉండవు, గోదావరి జవాబు చెప్పలేదుగా నా అగ్నితుల్యైన బాణాలతో నదులలోను సముద్రాలలోను ఉన్న నీటినంతటిని ఇంకింపజేస్తాను, అసలు లోకంలో ప్రాణి అన్నిది ఏదీ బ్రతికుండడానికి వీలులేదు, రాక్షస జాతికాని ఏ జాతి మిగలేదు నేను మూడు లోకములలోను ఉన్న ప్రాణులన్నింటిని కూడా లయం చేస్తాను లక్ష్మణా! ఇప్పుడు చూడు రాముడు అంటే ఏమిటో..! ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నాను ఇప్పుడు ఆ ధర్మాన్ని కాసేపు పక్కనపెట్టి నా తెజస్సేమిటో చూపిస్తాను, ధర్మం పట్టుకుంటే చేతకానివాడినని అనుకుంటారు, చేతకానివాన్ని అనుకుని బతిమాలి బామాలి అడిగితే చెట్లు చెప్పవు గోదావరి చెప్పదు పర్వత శిఖరాలు చెప్పవు ఒక్కళ్ళు నీ సీతని ఇలా తీసుకెళ్ళారు అని చెప్పినవాళ్ళు లేరు కాబట్టి వీళ్ళెవ్వరూ సుఖంగా ఉండడానికి వీలులేదు.
వీళ్ళు సుఖంగా ఉండడం నేను దుఃఖ పడ్డమా ధర్మం పట్టుకుని వీళ్ళని నేను సంతోషంగా ఉండనివ్వను ఇప్పుడు నా పరిస్థితి ఎటువంటిదో లక్ష్మణా నీకు నేను చెప్తున్నాను చూడు యథా జరా యథా మృత్యుః యథా కాలో యథా విధిః ! నిత్యం న ప్రతిహన్యన్తే సర్వ భూతేషు లక్ష్మణ !! తథాహం క్రోధ సంయుక్తో న నివార్యోస్మి అసంశయం !!! ఎంత పెద్దమాట అన్నాడంటే యథా జరా వృద్ధాప్యం పట్టుకోకుండా ఎవరు ఎలా తప్పించుకోలేరో మృత్యువు రాకుండా ఎవ్వరు ఎలా తప్పించుకోలేరో కాలము

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
Image result for సీతా రాములుకదలకుండా ఎవ్వరు ఎలా ఆపలేరో అవి ప్రతినిత్యము ఎలా కదిలి వెళ్ళిపోతున్నాయో దాన్ని ఎవరూ ఎలా ఆపలేరో అలా ఇవ్వాల లక్ష్మణా నా క్రోధాన్ని ఎవ్వరూ ఆపలేరు తథాహం క్రోధ సంయుక్తో న నివార్యోస్మి అసంశయం నా క్రోధాన్ని ఆపగలిగినటువంటి వాడులేడు కాబట్టి నేను ఇప్పుడు ఈ లోకాలన్నంతటిని కూడా లయం చేస్తాను అన్నాడు. అంత శోకంలోంచి పెళ్ళుభికినటువంటి ఆ క్రోధంతో ధనస్సు పట్టుకుని నిలబడి బాణ పరంపరని పైకి తీసి సంధించడానికి సిద్ధపడుతున్న రాముని యొక్క రూపాన్ని లక్ష్మణుడు పుట్టినదాదిగా ఇప్పటివరకు చూడలేదట అంత కోపంతో.
అంత రౌద్ర మూర్తిగా ప్రవర్తిస్తున్నటువంటి రామున్ని చూసి వీక్షమాణం ధనుః సజ్యం నిశ్శ్వసన్తం ముహు ర్ముహుః ! దగ్ధు కామం జగత్ సర్వం యుగాన్తే తు యథా హరం !! యుగములు పూర్తైపోయేటప్పుడు ప్రళయం సృష్టించే ముందు హరుడు ఎలా ఉంటాడో ఆ రుద్రుడు అలా ఉన్నటువంటి రామున్ని చూసి తెల్లబోయి స్థానువైపోయాడట లక్ష్మణుడు. ఆయన అన్నాడూ అ దృష్ట పూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామం స లక్ష్మణః ! అబ్రవీత్ ప్రాంజలి ర్వాక్యం ముఖేన పరిశుష్యతా !! అంజలి కట్టి నమస్కారం చేసి కూర్చుని అన్నయ్యా! నేను నాలుగు మాటలు చెప్తాను విను అన్నాయ్యా అన్నాడు, ఇవ్వాళ ఎంత క్రోధం వచ్చింది అన్నయ్యా..! అన్నాడు పురా భూత్వా మృదు ర్దాన్తః సర్వ భూత హితే రతః ! న క్రోధ వశమ్ ఆపన్నః ప్రకృతిం హాతుమ్ అర్హసి !! అన్నయ్యా ఇన్నాళ్ళు నీవు మృదు ర్దాన్తః చాలా మృదువైనటువంటివాడివి అని పేరు నీవు ఇంద్రియ నిగ్రహము కలిగినవాడివీ అని పేరు సర్వ భూతముల యొక్క హితాన్ని చేసేవాడివీ అని పేరు న క్రోధ వశమ్ ఆపన్నః నిన్నీ క్రోధం వశం చేసేసుకుంటే ప్రకృతిం హాతుమ్ అర్హసి అన్నయ్యా నీవు ఈ లోకాలన్నింటిని పాడుచేసేస్తావా ఇవ్వాళా... మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది జీవితంలో రాముని స్థితిని గమనించే ముందు మీరు కూడా ఒకటి ఎప్పుడూ గుర్తు పెట్టుకుని ఉండాలి మనం అగ్ని- అగ్నితో ఉపమానం వేసి కొన్నిటిని చెప్తాం.
అగ్ని బయట ప్రకాశిస్తూ కనిపిస్తుంది అలాగే దుఃఖాగ్ని శోకాగ్ని అంటాం, శోకమనే అగ్ని జఠరాగ్ని లోపల పుట్టే అగ్ని ఇందులో కొన్ని అగ్నులు ఏమిటో తెలుసాండీ! మీరు ఏదైనా దానికి సమర్పిస్తే ఊరుకుంటాయి మీరు గమనించండి జఠరాగ్ని నాకేదో కాస్త తొమ్మిదిన్నర పదో అయ్యాక ఆకలేస్తుంది వేస్తే నేనింత పదార్థం దీనిలోకి వేసేశాననుకోండి అది ఊరుకుంటుంది. మళ్ళీ రేపు ఉదయం వరకు ఏమందు ఇక అగ్నిహోత్రంలో పడేస్తే ఊరుకునే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి, మీరు ఏది వేసినా ఇంకా ప్రజ్వరిల్లే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి. మామూలు అగ్నిలో మీరు ఆజ్యం పోశారు అనుకోండి ఊరుకుంటుందా ఛస్... అని లేస్తుంది వేసిన కొద్దీ లేస్తుంది తప్పా వేస్తే అనగని అగ్నిహోత్రం ఒకటి ఉంటుంది. అలాంటి వాటిల్లో బయటి అగ్నిహోత్రం ఎటువంటిదో లోపల ఉండేటటువంటి అటువంటి అగ్నిహోత్రమే క్రోధాగ్ని, దగ్గర కూర్చుని నెయ్యిపోస్తే జ్వాల నీమీదకు వస్తుంది, నాకు నెయ్యిపోశాడు కదాని ఏమి ఊరుకోదు. అలాగే మీ క్రోధాగ్ని ఏం చేస్తుందో తెలుసాండి, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి క్రోధాగ్ని ఎప్పుడూ పరావర్తనము ఉంటుంది అంటే తిరిగి మీ మీదికి వస్తుంది. అది బంతిలాంటిది మీరు ఎదురుగుండా గొడ ఉందికదాని మీ ఎదురుగుండా బంతిపెట్టి మీరు గోడకు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి మీ మీదకి వస్తుంది బంతి మీ క్రోధం కూడా అంతే, క్రోధాగ్ని బయట ఉండే అగ్ని ఈ రెండూ వేస్తే చల్లారేవి కావు వేస్తే ప్రకోపిస్తాయి.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
అందుకే ఇప్పుడు నిజంగా రాముడు బాణాలు వేయడం మొదలెట్టాడనుకోండి ఎంతమంది ఏడవడం మొదలెట్టినా పెరుగుతుంది తప్పా అది తరగదు ఇప్పుదు దాన్ని చల్లార్చాలి అంటే ఒక్కటే ఒక్కటి ఉంటుంది ఏమిటో తెలుసాండి తనంత తాను చల్లారాలి, తనంత తాను చల్లారాలి అంటే ఎవడో చెప్తే చల్లారుతుందని మీరు అనుకోకండి చెప్పితే పుచ్చుకునే గుణం మీకు ఉంటే చల్లారుతుంది. చెప్పితే చల్లారుతుందంటే అప్పుడు చెప్పేవాడు గొప్పవాడు అలా అయితే నిన్న రావణుడు మారుండాలి, చెప్పితే విన్నవాడు గొప్పవాడు ఎంతకోపంలోను తప్పు నీవు అలా కోప్పడకూడదు అన్నారనుకోండి నేను చెప్తున్నానయ్యా పెద్దవాన్ని ఇంకనా పెద్దతనానికి గొప్పతనమేంటి చెప్తున్నాను అంతే ఇంక నీవు మాట్లాడటానికి వీల్లేదు లోపలికి వెళ్ళిపో అన్నారనుకోండి వెంటనే మీరు లోపలికి వెళ్ళిపోయారనుకోండి ఇప్పుడు చెప్పినవాడు గొప్పవాడా విన్నవాడు గొప్పవాడా అంటే విన్నవాడే చాలా గొప్పవాడు. తన క్రోధాన్ని నశింపజేసుకొని వెంటనే కిందకి దింపేశాడు అంతే తన కోపాన్ని అంటే ఆయన నీకిచ్చిన పెద్దరికం అంత గొప్పది అంత గొప్ప హృదయమున్నవాడు కాబట్టి ఆయనదా పెద్దరికం చెప్పినవాడిదా పెద్దరికం మీరు నాకు చెప్పండి రాముడి పెద్దరికం ఏమిటో ఇప్పుడు మనకి చూపిస్తాడు మహర్షి. ఇంత క్రోధ మూర్తి ఏమన్నారు నీవు తప్పు చేశావు లక్ష్మణా అన్నాడు ఇందాక ఇప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, నోర్మూయ్ నీవు నాకు చెప్పేవాడివా? అని లక్ష్మణుని మీద మొదటి బాణమేస్తే..!
కాదు హాఁ... మంచిమాట చెప్పావు లక్ష్మణా! అనగలిగితే దిద్దుకోవడం వచ్చినటువంటి పెద్దరికం ఉన్నవాడు రాముడు ఇది మీరు గ్రహించగలిగితే రాముడు ఏం చేశాడో మీకు ఉపయోగపడుతుంది. తప్పా రాముడు అది చేశాడని మీరు రామాయణం చదువుకుంటే ఏమి ఉపయోగపడుతుంది మీరు నాకు చెప్పండి. రాముడు అలా చేశాడండి రాముడు చాలా గొప్పవాడండీ అని అన్నారనుకోండి ఇప్పుడెందుకు రామునికి కితాబులు, రాముడు అంత గొప్పవాడు కాబట్టి అష్టోత్తరముతోటి సహస్త్రంతోటి పూజలు రామకోటి పారయణాలు రామకోటి రచనలు రామకోటి యజ్ఞాలు. మీరేం చేస్తారు రాముడిగురించి చదివి ఇది మీరు స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు పురా భూత్వా మృదు ర్దాన్తః అన్నయ్యా నీవు చాలా మృదువుగా ఉండేవాడివి అన్నయ్యా నీవు చాలా ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడివి సర్వ భూత హితే రతః అన్ని భూతముల యొక్క హితాన్ని చూసేటటువంటివాడివి అటువంటివాడివి నువ్వు ఇవ్వాళ క్రోధమునకు వశుడవు అవుతున్నావు అన్నయ్యా! చన్ద్రే లక్ష్ణీః ప్రభా సూర్యే గతి ర్వాయౌ భువి క్షమా ! ఏత చ్చ నియతం సర్వం త్వయి చానుత్తమం యశః !! అబ్భాహ్... ఏమి శ్లోకమండీ! అద్భుతం లక్ష్మణుడి నోటివెంట వచ్చినటువంటి ఈ శ్లోకం అమృత భాండమన్నమాట నిజంగా... చన్ద్రే లక్ష్మీః చంద్రుడికి చల్లటి వెన్నెల ప్రభా సూర్యే సూర్యుడికి  గొప్ప తేజస్సు గతి ర్వాయౌ వాయవుకి కదలగలిగినటువంటి శక్తి భువి క్షమా భూమికి ఓర్పు ఏత చ్చ నియతం సర్వం ఇవి వాటివాటికుండే లక్షణాలు త్వయి చానుత్తమం యశః అన్నయ్యా నీవు చాలా గొప్ప కీర్తిమంతుడివి అన్నది నీకున్న లక్షణం. భూమి ఏ కారణానికి ఓర్పుని వదలదుగా వాయువు ఏ కారణానికి కదలకుండా ఉండట్లేదుగా వాయువు కదిలేటప్పుడు అసుద్ధంమీదకి వెడుతుంది ఛీ ఛీ ఛీ... ఈ మనుషులు అసుద్ధం ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు అని గాలి కదలడం మానేస్తుందా..?
భూమిని పాదాలతో తొక్కుతున్నారు వీళ్ళు నన్ను పాదాలతో తొక్కుతున్నారని భూమి కోపమొచ్చి కదిలిపోతుందా... వాటికి ఎలా ఆ లక్షణముందో నీకు ఉత్తమమైన గుణములున్నవాడని కీర్తి నీకుంది, కీర్తి అన్నది

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
అశిధారావ్రతం కీర్తి అన్నది ఒకసారి సంపాదించుకుంటే ఉండిపోయేది కాదు ఆఖరి ఊపిరివరకు సంపాదించుకుంటునే ఉండాలి నీ ప్రవర్తనతో చాలా కీర్తి సంపాదించినా ఒకే ఒక పెద్దతప్పు ఎవరైనా చేసిశాడనుకోండి అంతే అపకీర్తి వచ్చేస్తుంది. మీరు అనుకుంటున్నారుగానీయండి ఆయన సంగతి మీకేం తెలుసు అంటాడు అంతే ముందు అది చెప్తాడు అయిపోయింది ఆయన కీర్తి, కాబట్టి అన్నయ్యా నీవు తొట్రుపడకూడదు, తొట్రుపడ్డావో అయిపోయింది అంతే నీ కీర్తి, తొట్రుపడుతున్నావు అన్నయ్యా! క్రోధానికి వశుడవైపోతున్నావు, వశుడవైపోతే సర్వ భూత హితేరతాః దాంతః జితేంద్రియః ఎగిరిపోతాయి అన్నయ్యా మృధుః ఏది ఆ మాటలు నిన్ను స్తోత్రం చేస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి యశస్సు ఉంది. క్రోధానికి వశుడవైపోయి ఇవన్నీ పోగొట్టుకుంటావా..? నీవు పోగొట్టుకో కూడదు అన్నయ్యా ఇవన్నీ ఉంచుకోవాలి ఏక స్య న అపరాధేన లోకాన్ హంతుం త్వ మర్హసి ! సీతమ్మతల్లిని అపహరించినవాడు ఎవడో ఒక్కడే అన్నయ్యా..! ఇద్దరు రాక్షసులు యుద్ధం చేయలేదు ఇక్కడ ఇద్దరు చేశారని నీవు అనుకుంటున్నావు కాని ఒక్కరే సీతమ్మని అపహరించే ప్రయత్నం చేశారు. ఆ ఒక్కణ్ణి చంపు నీ గొప్పతనం, నీకున్న శక్తినంతా పెట్టి ఎవడు తప్పు చేశాడో వాన్ని చంపి వాన్ని శిక్షించు అంతేకాని ఏక స్య న అపరాధేన ఒకడు తప్పు చేస్తే లోకాన్ హంతుం త్వ మర్హసి  ఈ లోకాన్నంతటిని చంపేస్తావా అన్నయ్యా నీవు.
Image result for ramayana characters sitaఅది న్యాయమా అన్నయ్యా అందుకా ఉన్నది అస్త్ర శస్త్ర విద్యలు- నీకిచ్చింది గురువుగారు ఇలా చేయమనా ఇచ్చింది, కాబట్టి ఏక స్య తు విమర్దోయం న ద్వయో ర్వదతాం వర ! ఇక్కడ ఇద్దరు యుద్ధం చేసినట్లు కనపడుతోందన్న ఆనవాళ్ళు లేవు అన్నయ్యా... ఒక్కడే చేశాడు నైకస్య తు కృతే లోకాన్ వినాశయితుమ్ అర్హసి ! యుక్త దణ్డా హి మృదవః ప్రశాన్తా వసుధాధిపాః !! రాజ దండం పట్టుకున్నటువంటి రాజు యుక్తా యుక్త విచక్షణతో తప్పు చేసినటువంటివాన్ని మాత్రమే శిక్షించవలసి ఉంటుంది సదా త్వం సర్వ భూతానాం శరణ్యః పరమా గతిః ! కో ను దార ప్రణాశం తే సాధు మన్యేత రాఘవ !! సర్వ భూతములయందు నీకు అనురక్తి సర్వ భూతములకూ నీయందు అనురక్తి అటువంటిది ఈ భూతములన్నీ కూడా... నీ భార్యని ఎవడో అపహరిస్తే అవి సంతోషిస్తున్నాయని నీవు ఎలా అనుకోగలుగుతున్నావు, నీవు వాటిని ఎంత ప్రేమించావో నిన్ను అవి అంత ప్రేమించాయి. అవి నిన్ను అంత ప్రేమించాయి కాబట్టి నీ బాధలో అవికూడా బాధ పడుతున్నాయి కాబట్టే ఇందాక అవి మనకు మార్గం చూపించాయి, నీకు ఉపకారం చేయనంత మాత్రం చేత అవి బాధపటంలేదని ఎక్కడుంది శాస్త్రం అలా ఏం లేదే, నీవు భూతములను ప్రేమిస్తావు కాబట్టి నిన్ను అవి ప్రేమించి తీరుతాయి కాబట్టి అన్నయ్యా ఇప్పుడు వాటినెందుకు చంపేస్తాను అంటున్నావు? సరితః సాగరాః శైలా దేవ గన్ధర్వ దానవాః ! న అలం తే విప్రియం కర్తుం దీక్షిత స్యేవ సాధవః !! అన్నయ్యా ఇక్కడ ఉన్నటువంటి నదులు నదములు సముద్రములు పర్వతములు దేవతలు గంధర్వులు వీళ్ళందరికి కూడా నీవే శరణ్యం, వీళ్ళందరు కూడా నిన్నే శరణు వేడుతారు ఎవరైనా ఉపద్రవం కల్పిస్తే రక్షించమని నిన్ను అడుగుతారు, అటువంటిది నివ్వే వాటిని చెలికితే వాళ్ళు ఎవరిని అడుగుతారు అన్నయ్యా..! వాల్మీకి మహర్షి యొక్క ఈ శ్లోకాన్ని తీసుకొని లోకంలో ఒక కథ చెప్తుంటారు.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
వెనకటికి రామ చంద్ర మూర్తి ఏదో తవ్వుతూ గుణపం పెట్టి తవ్వుతుంటే ఆ గుణపం కప్పమీద పడితే ఆ కప్ప ఏమీ అనలేదట అనకపోతే రాముడు చూసి అయ్యోయ్యో మరి నేను గుణపం వేస్తున్నప్పుడు రామా నీవు నామీద వేస్తున్నావు అని ఎందుకు అనలేదని అడిగాడట. నన్నెవరైనా చెలికితే రామా! అని నీకు చెప్పేవాన్ని నీవే చెలికితే నేను ఎవరికి చెప్పుకోను అందట ఆ కప్ప. అలా ఇవన్నీ నిన్ను శరణాగతి చేస్తాయి అలాంటి నువ్వే వాటిని చంపేస్తే ఎవరికి చెప్పుకుంటాయి అన్నయ్యా... లోకాలన్నింటిని నీవు లయంచేస్తావా..? యేన రాజన్ హృతా సీతా తమ్ అన్వేషితుమ్ అర్హసి ! మ ద్ద్వితీయో ధనుష్పాణిః సహాయైః పరమర్షిభిః !! అన్నయ్యా ఇద్దరం కలిసి ధనుస్సు పట్టుకుని సీతమ్మని వెతుకుదాం అంతేకాని నీవు ఇలా ఆగ్రహించకూడదు అన్నయ్యా..! అంటే శీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్స్యసి చే న్నరేన్ద్ర తతః సముత్సాదయ హేమ పుంఖైః మహేన్ద్ర వజ్ర ప్రతిమైః శరౌఘైః !! ఒక వేళ మనం ధర్మం పట్టుకుని ఓర్పుతో వెతికి వెతికి వెతికి వెతికి ఎంత వెతికినా సీతమ్మ కనపడకపోతే..? మనం చెయ్యవలసిన ప్రయత్నం మనం మంతా చేసిన తరువాత కూడా ఎవ్వరూ మనకి సహకరించకపోతే... అప్పుడు నీవు బంగారు ములుకులు పిడులు కలిగినటువంటి బాణాల్ని ప్రయోగిద్దువుగాని, తప్పా అసలు ప్రయత్నమే లేకుండా వాళ్ళయందు నేరము ఆరోపించి మనం చంపుతామంటే ఎలాగన్నయ్యా!
Image result for ramayana characters sitaకాబట్టి అటువంటి పని చెయ్యకూడదు మహతా తపసా రామ మహతా చాపి కర్మణా ! రాజ్ఞా దశరథే నాసీ ల్లబ్ధోమృతమ్ ఇవామరైః !! దేవతలు అంమృతాన్ని పొందినట్లు యజ్ఞ యాగాది క్రతువులు చేసి అశ్వమేధ యాగం చేసి పుత్రకామేష్టి చేసి దశరథ మహారాజుగారు నిన్ను పుత్రుడిగా పొందాడు యది దుఃఖమ్ ఇదం ప్రాప్తం కాకుత్స్థ న సహిష్యసే ! ప్రాకృత శ్చ అల్ప సత్త్వ శ్చ ఇతరః కః సహిష్యతి !! అన్నయ్యా ఇన్ని చదువుకున్నావ్ వశిష్ట, విశ్వామిత్ర వంటి గురువులచేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటివాడివి ఇంత పరాక్రమవంతుడివి ఇంత తేజోవంతుడివి ఇంతటి వీర్యవంతుడివి నీవే కష్టాన్ని ఓర్చుకోలేక లోకాన్ని లయం చేసేస్తానంటే ఇంకా లోకంలో ఉన్నవాళ్ళు కష్టంలో ఉంటే ప్రాకృతమైనటువంటి మానవులు ఇంక ఏం తట్టుకుంటారు అన్నయ్యా... ఆ రోజున వాళ్ళ భార్య కనపడకపోతే రాముడు మూడు లోకాల్ని లయం చేశాడని ఇప్పుడు నేను మాత్రం ఏం ఎందుకు చేయకూడదు అని అడగరా..?
కాబట్టి అన్నయ్యా కష్టాన్ని తట్టుకోవడంలో గొప్పతనముందికాని కష్టానికి విచలితుడవైపోతే ఎలాగ అన్నయ్యా... దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసా యది ధక్ష్యతే ! ఆర్తాః ప్రజా నర వ్యాఘ్ర క్వ ను యాన్యన్తి నిర్వృతిమ్ !! అసలు ఈ లోకంలో ఆపద వచ్చినవాళ్ళందరూ కూడా కనపడినదాన్నల్లా దహించేయడం మొదలుపెడితే నీవు ఒక్కటి ఆలోచించు లోకంలో ఆపదా అన్నది రానివాళ్ళు ఉన్నారా లోకంలో మహాత్ములైనవాళ్ళు ఎంతటి మహాత్ముడికి ఆపద వచ్చింది లోక స్వభావ ఏవైష యయాతిః నహుషాఽఽత్మజః ! గతః శక్రేణ సాలోక్యమ్ అనయ స్తం సమస్పృశత్ !! నహుషుని యొక్క కుమారుడు యయాతి ఎంతో పుణ్యం చేసి చేసి చేసి చేసి దేవలోకానికి వెళ్ళాడు ఇంద్రుడు స్వాగతం చెప్పాడు ఎంత పుణ్యం చేశానో తెలుసా? నేను ఇంత పుణ్యం చేశాను కాబట్టి అమరలోకానికి వచ్చాను వీళ్ళు నా అంత పుణ్యం చేశారా అన్నాడు అక్కడ ఉన్నవాళ్ళను చూపించి, నిన్ను నీవు పొగుడుకున్న మహా పాపాత్ముడివి కాబట్టి నీవు ఇక్కడ ఉండకూడదు పో అని కిందకి తోసేశాడు ఇంద్రుడు అంత కష్టపడి పుణ్యం చేసుకున్నటువంటి మహాత్ముడైనటువంటి యయాతి వెంటనే ఆపదను పొందలేదా అన్నయ్యా..? మహర్షిః వసిష్ఠ స్తు యః పితుః నః పురోహితః ! అహ్నా పుత్ర శతం జజ్ఞే తథై వాస్య పున ర్హతమ్ !! మన కుల గురువైనటువంటి వశిష్ట మహర్షికి ఒకే రోజు నూర్గురు పిల్లలు పుట్టారు ఆ నూర్గురు పిల్లల్ని విశ్వామిత్రుడు తన యొక్క శాప వాక్కుతో ఒక్కసారి చంపేశాడు నూర్గురు కొడుకులు ఒక్కసారి చనిపోయారు అన్నయ్యా..? వశిష్ఠ మహర్షి లోకాన్నంతటిని లయం చేశారా... య చేయం జగతో మాతా దేవీ లోక నమస్కృతా ! అస్యా శ్చ చలనం భూమేః దృశ్యతే సత్య సంశ్రవ !!  ఈ భూమి కష్టపడటంలేదా అన్నయ్యా..? ఎంత కష్టపడుతూంది ఈ భూమి మన పాద తాడనమును సహించట్లేదూ... అయినా ఎప్పుడైనా ఈ భూమి కోపమొచ్చి నేను కదులుతానని కసేపు కదులుతూందా అన్నయ్యా.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
భూమి కలిదిలితే ఎంత ప్రమాదం వస్తుంది యౌ ధర్మా జగతా నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితమ్ ! ఆదిత్య చన్ద్రౌ గ్రహణమ్ ! అభ్యుపేతౌ మహా బలౌ !! ఈ లోకమంతా ఎవరియందు ప్రతిష్టితమయ్యిందో కాలము ఎవరివల్ల నడుస్తూందో ఈలోకమంతా ఎవరివల్ల పుట్టి ఎవరివల్ల పెరిగి ఎవరివల్ల లయమౌతున్నాయో అటువంటి సూర్య చంద్రులు ఇద్దరు రాహువు కేతువు లనబడేటటువంటి గ్రహముల చేత పర్వకాలములందు గ్రసింపబడుతున్నారు, అంత మాత్రానికి వాళ్ళు కోపగించుకొని లోకాలను లయం చేస్తున్నారా అన్నయ్యా..! ఆపద వచ్చినవాళ్ళందరూ ఇలా విచలితులైపోతే... త్వత్ విధా హి న శోచన్తి సతతం సత్య దర్శినః ! సుమహత్సు అపి కృచ్ఛేషు రామానిర్విణ్ణ దర్శనాః !! లోపల కదిలిపోకుండా నిలబడగలిగినటువంటి జ్ఞానమున్నటువంటి రామ చంద్రా బాగా ఆలోచించు శోకము కలిగితే ఇలా కదిలిపోతారా... శోకము కలిగితే నిలదొక్కుకునే ప్రయత్నంచేసి ధర్మమార్గంలో ఇంకా నడవవలసి ఉంటుందా, కాబట్టి నీవు బాగా ఆలోచించు ఆపదవస్తే కదిలిపోకూడదు కదా అన్నయ్యా ఇంత ఘోరమైన ప్రతిజ్ఞ చేసి లోకాల్ని లయం చేస్తావా?
Image result for bheeshmaనాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తూంది అంత కష్టపడి ద్రౌపతి ఐదుగురికి భార్యయై ఐదుగురికి సంతానాన్ని కంది కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యింది, ఇప్పుడు ద్రౌపతి యొక్క బిడ్డలలో ధర్మరాజు గారికి కలిగినటువంటివాడు పట్టాభిషేకం చేయబడుతాడు, ఒకేరాత్రి శిభిరంలో పడుకున్నటువంటి ద్రౌపతి యొక్క ఐదుగురు పాండవుల బిడల్ని అశ్వత్థామ రాత్రికి రాత్రే చంపేశాడు. చంపేస్తే ముందు తెలిసున్నవాడు కాబట్టే కృష్ణ పరమాత్మ పాండవులను దూరంగా తీసుకెళ్ళాడు ఈ మాట కురు క్షేత్రంలో యుద్ధరంగంలో అంపశయ్యమీద పడిపోయి ఉన్నటువంటి భీష్మాచార్యులవారికి చెప్పారు. తాతగారూ రాత్రి పాండవుల యొక్క పిల్లలందరు సంహరింపబడ్డారు ద్రౌపతి సంతానమంతా నశించిపోయింది అశ్వత్థామ చంపేశాడు అన్నారు. భీష్ముడు ఏమన్నాడో తెలుసాండి... హనన్నా... అలాగా... అనలేదు, ఆయన అన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు రాజు కాడుగా... చచ్చిపోయాడుగా ధర్మ రాజేగా గెలిచినవాడు కాబట్టి ధర్మరాజు చేతిలోనేగా ఉంది రాచరికం రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి అర్జునుడో దేవేంద్రుడి యొక్క కొడుకు శాత్రవో ద్వేజకమైన గాండీవము విల్లట శత్రువుల్ని సంహరింగలిగినటువంటి గాండీవము అది టంకారం చేస్తే చాలు బలహీనమైన గుండెగల వాళ్ళందరు చచ్చిపోతారు అటువంటి టంకారము చెయ్యగలిగినటువంటి గాండీవము ధనస్సు సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రి యట అందరిని రక్షించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునిడికి సారథి, యుగ్ర గదాధరుడైన భీముడ య్యాజికి దోడు వచ్చునట ఎప్పుడూ గదా దండాన్ని పట్టుకుని కోపంతో తిరిగేటటువంటి భీమసేనుడు అర్జునినికి పక్కన ఉంటాడట యాపద గల్గుటిదేమి చోద్యమో! అన్నాడు. ఇంతమంది తండ్రులై ఉండగా ఇంత మంది గొప్పవాళ్ళు ఉండగా పిల్లలందరూ ఒక్కరాత్రి చచ్చిపోవడమంటే... ఇటువంటి ఆపద రావడమంటే ఇంతమంది ఉన్నచోటే ఆపద వచ్చిందంటే ఆపదా అన్నది ఈశ్వరుడి చేత ఎలా ఇవ్వబడతుందో ఆశ్చర్యం కదా అన్నాడు.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
తట్టుకుందాలేదా ద్రౌపతి ఐదుగురు కొడుకులుపోతే భీముడు కోపడ్డాడేమోకాని చంపేస్తానని ఆ ద్రౌపతి మాత్రం ధర్మాన్ని వీడలేదు మహాతల్లి నిజంగా మహాభారతంలో ఆ స్థితిలో ఆవిడ కాబట్టి ఆ మాట చెప్పగలిగింది, కొడుకులుపోయి నేను ఏడుస్తున్నట్టే ఎక్కడ ఏడుస్తుందో ద్రోణుడి యొక్క భార్య ఆ అశ్వథామ కోసం కాబట్టి ఈ పిల్లవాన్ని తీసుకొచ్చి అప్పజెప్పేయండయ్యా గురువు ఒకటి గురుపుత్రుడు ఒకటి కాదు తప్పు, తీసికెళ్ళి ఇచ్చేసేయండి అంది ఆవిడా... కాబట్టి మహాత్ములైనవాళ్ళకి ఆపదలు రాలేదా అన్నయ్యా కనుకా, అంటే ఇది భీష్ముడు చెప్పినటువంటి ఘట్టం పై ఘట్టాల వరకు మీకు వాల్మీకి రామాయణంలో ఉన్నటవంటి ఘట్టాలు. కాబట్టి విచలితుడు కాకుండా నిలదొక్కుకున్నవాడు ఎవడో వాడు కదా అన్నయ్యా మహాత్ముడు నీకు తెలియదని కాదు బుద్ధి శ్చ తే మహా ప్రాజ్ఞ దేవైః అపి దురన్వయా ! శోకానాభిప్రసుప్తం తే జ్ఞానం సంభోధయామి అహమ్ !! నీకు తెలియదూ అని నేను చెప్పట్లేదు అన్నయ్యా కేవలం నీ జ్ఞానమనేటటువంటిది అగ్నిహోత్రాన్ని బూది కప్పేసినట్లు బూది కప్పింది ఈ శోకం దాన్ని తొలగించడానికి కేవలం ఒక్క నాలుగు మాటలు చెప్పాను అంతే దేవతలు కూడా నీకు చెప్పడానికి సాహసిస్తారా అన్నయ్యా... నీకు తెలియనిది ఉంటుందా దివ్యం చ మానుషం చైవమ్ ఆత్మన శ్చ పరాక్రమమ్ ! ఇక్ష్వాకు వృషభావేక్ష్య యతస్వ ద్విషతాం వధే !! నీకు దేవతలకు ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం ఉంది వాళ్ళకు తెలిసున్న అస్త్ర శస్త్రాలన్ని నీకు తెలుసు, ఈ లోకంలో మనుష్యులకు ఎన్ని అస్త్ర శస్త్రాలు తెలుసో అన్ని నీకు తెలుసు, కాబట్టి అన్నయ్యా వాడు ఎవడో వెతికి పట్టుకుని చంపడం పెద్ద కష్టమా కాబట్టి మనం అలా చేస్తే బాగుంటుంది అన్నయ్యా అన్నాడు.
వినే లక్షణం ఉన్నవాడు రాముడు వినని లక్షణం ఉన్నవాడు రావణుడు, మారీచుడు అంత చెప్పాడు రావణుడు విన్నాడా... తమ్ముడా నీ తప్పువల్లరా ఇంత ఇబ్బంది వచ్చిందని ఏ రాముడు అన్నాడో ఆ లక్ష్మణుడు చెప్తే రాముడు అన్నాడు పూర్వజోపి ఉక్త మాత్ర స్తు లక్ష్మణేన సుభాషితమ్ ! సార గ్రాహీ మహా సారం ప్రతిజగ్రాహ రాఘవః !! హాఁ... తమ్ముడా! నీవు చాలా మంచి మాటలు చెప్పావురా నిజమే ఆ ఒక్కడి మీద నేను కసి తీర్చుకోవాలి కాని నేను లోకాన్ని లయం చేయడం ఏమిటీ చూశావా నన్ను శోకం కదిపిందని పదా... మనిద్దరం కలిసి వెతుకుదాం అన్నాడు. ఇదీ రాముని యొక్క గొప్పతనం, నేను నిన్న మీతో మనవి చేసింది ఇదే... మాట విన్నవాడు గొప్పవాడు తప్పా మాట చెప్పినవాడు గొప్పవాడు కాదు. మాట చెప్పినవాడిది గొప్పతనం విన్నవాడివల్ల నిలబడుతుంది ఏమయ్యా నేను చెప్తున్నాను నా పెద్దరికం ఏమౌతుంది లోపలికెళ్ళు అన్నానుకోండి, నీ పెద్దరికం మంటగలిసింది ఏం పక్కకెళ్ళి ఊరుకోవయ్యా అన్నాడనుకోండి ఏమైంది వీడి పెద్దరికం, పెద్ద చెప్పొచ్చావులేవయ్యా నే వెడితే ఏదో పనౌతుందన్నావు గడ్డిపరక్కింద తీసేశాడు అంటారు ఆయన, నీ గౌరవం కూడా పోయిందాలేదా... ఆయన గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే గౌరవాన్ని నిలబెట్టేవాడు ఉంటేను కదాండీ! క్రోధమనే అగ్నిహోత్రంలో నెయ్యిపోస్తే ఎలా పెరుగుతుందో క్రోధంతో మీరు పనులు చేసేకొద్ది పెరుగుతుంది తప్పా దానివల్ల ఉపశాంతి కలుగుతుందీ అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు.
Image result for happy and sad people

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
అందుకే మీరు చెప్పినంత తేలిక కాదనుకోండి కాని సాధన చెయ్యగా చెయ్యగా మీరు ఆ క్రోధాన్ని పరిశీలనం చేసి క్రోధమునకు విరుగుడేమిటో తెలుసాండి లోకంలో మౌనమే, అదొక్కటే విరుగుడు. అదుపుతప్పిన కోపం మీకు వస్తే మీరు ఉత్తర క్షణం మౌనంలోకి వెళ్ళిపోవాలి మీరు ఒక్క ముప్పైనిమిషాలో ఒక గంటసేపో తీవ్రమైన శోకం కలిగినా తీవ్రమైనటువంటి క్రోధము కలిగినా మౌనంలోకి వెళ్లాలి ఎందుకో తెలుసా తీవ్రమైన శోకం క్రోధాన్ని పుట్టిస్తుంది. అవి రెండు అక్కచెల్లెల్లు అందుకని తీవ్రమైన శోకం కలిగినా తీవ్రమైన క్రోధం కలిగినా మౌనంగా ఉంటే కొంతసేపు ఉపశమిస్తుంది. అది మళ్ళీ చల్లారిపోయే అవకాశం ఇవ్వాలి మీరు పాలు పొంగగానే మీరు ఇలా గ్యాస్ స్టవ్ కట్టేశారనుకోండి వెంటనే కిందకెళ్ళిపోతాయాండి, వెంటనే కిందకెళ్ళవు It take some time to settle down కొంచెం మెల్ల మెల్లగా ఇలా దిగి తొరక కట్టి అలా మళ్ళీ తమ స్థాయిలోకి తాము నిలబడుతాయి. మీరు ఇలా ఎదో తలుపేసుకొని లోపలికెళ్ళి కోపం తగ్గిపోయిందని బయటికొస్తే మళ్ళీ గొడవస్తుంది. మీరు ఒక్క గంటసేపు నన్ను విడిచిపెట్టేసేయండి నేను మౌనంలో ఉంటాను మీరు నన్ను దయచేసి ఎవరూ పలకరించకండి అని చెప్పేసి మీరు తలుపేసుకొని లోపలికెళ్ళిపోయి మీ మనసుని ప్రయత్నపూర్వకంగా శ్రీరామాయణాది కావ్యములవైపు క్రోధము ఎంత ప్రమాదహేతువో రామ చంద్ర మూర్తి ఎలా నిగ్రహించుకున్నారు అన్నదాన్ని మహాత్ములైనవాళ్ళు జీవితంలో ఎంత కష్టాలు పడ్డారు మనం పడిన కష్టమెంత మనం పడిన శోకమెంత అని మీరు బాగా ఆలోచనచేస్తే మీరు పాలు కిందకి దిగినట్లు దిగుతుంది, దిగిన తరువాత మీరు బయటకొచ్చారనుకోండి మీరు కీర్తిని పోగొట్టుకోకుండా మీ పెద్దరికం నిలబడేటట్లు మీరు మాట్లాడగలుగుతారు.
యుక్తా యుక్త విచక్షణ మళ్ళీ నిలబడుతుంది, క్రోధం ఆవహించివుండగా మీరున్నారనుకోండి నీకు మీ ఎదురుగుండా ఉన్నవారికి కూడా ప్రమాదమే చాలా దూరం వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి ఏమౌతుందంటే జీవితాంతం వగచవలసి ఉంటుంది. కొంతమంది చూడండి అప్పటి క్రోధంతో చాలా పెద్ద తప్పు ఒకటి చేస్తారు చేసి జీవితాంతం ఏ ఖైదులోనో కూర్చుంటారువాళ్ళు ఏమి ప్రయోజనం కాబట్టి క్రోధమనేటటువంటిది పెంచే ప్రయత్నము చేయకూడదు పాల పొంగు దిగినట్లు దింపే ప్రయత్నమే చేయవలసి ఉంటుంది, ఇదీ రామున్ని చూసి రామాయణంలో నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఘట్టానికి నేను వ్యక్తిగతంగా చాలా పెద్ద పీఠ వేస్తాను, ఎందుకంటే మనిషి తప్పకుండా చాలా జాగ్రత్తపడవలసిన శత్రువంటూ ఉంటే క్రోధమొకటే. మీరు చూడండి క్రోధమన్నది ఎప్పుడు దేన్ని ఆశ్రయిస్తుందో తెలుసాండి కామాన్ని ఆశ్రయిస్తుంది, కోరిక పక్కన క్రోధముంటుంది సాధరాణ సిద్ధాంతం అంతే. కామం లేకుండా క్రోధముంటుంది తెలుసా... మనకి కామంతో క్రోధముంటుంది, ఏదో కోరిక, కోరిక తీరలేదనుకోండి క్రోధమొస్తుంది. కామం లేకుండా క్రోధముంటుంది అదోగమ్మత్తు, ఏ కోరికా ఉండదు కాని క్రోధం మాత్రం ఉంటుంది అది ఇంక కోటలో ఉన్న క్రోధం లాంటిది తెలుసాండి, దుర్వాసో మహర్షి క్రోధం అంతే... ఆయనా మహర్షి మహానుభావుడు ఆయనకి ఏమి కోరికలు ఉండవు

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ఆయన ఎవ్వరినీ ఏమీ కోరుకోడు కాని ఇలా అని శాపవాక్కు ఇచ్చి వెళ్ళిపోతుంటాడు. క్రోధాన్ని మాత్రం నిగ్రహించలేదు, విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డారండీ కామ క్రోధాల్ని జయించి బయటికి రావడానికి.
Image result for ఉడుముకాబట్టి రామాయణంలో నేను చెప్పినంత తేలికాండీ మీరు విడిచిపెట్టేయండి అని చెప్పడం, మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు విడిచిపెట్టేయండి అని చెప్పడానికి మీరు పట్టుకోలేదు దానిని అదే మిమ్మల్ని పట్టుకుంది. ఇది తేడా పట్టుకోవాలి ఎప్పుడూ క్రోధం మిమ్మల్ని పట్టుకుంటుందా అవకాశం చూసి మీరు క్రోధాన్ని పట్టుకున్నారా... మీరు క్రోధాన్ని పట్టుకోలేదు మిమ్మల్ని క్రోధం పట్టుకుంది, కామం నన్ను పట్టుకుందా నేను కామాన్ని పట్టుకున్నానా కామం నన్ను పట్టుకుంది. ఇప్పుడు కామం నన్ను పట్టుకుంది కాబట్టి కామం నన్ను వదలాలి, క్రోధం నన్ను పట్టుకుంది కాబట్టి క్రోధం నన్ను వదలాలి, క్రోధం నన్ను వదలాలంటే అది వదిలేసెయ్యడానికి కావలసి స్థితిని మీరు కల్పించాలి. ఓ జలగ పట్టుకుందనుకోండి... నేను ఓ చెరువులో దిగి స్నానం చేద్దామని దిగాను టక్కున పట్టుకుంది, జలగ పట్టుకున్న తరువాత మీరు జలగను పట్టుకుని లాగారనుకోండి అది ఊడదు సాగుతుంది. జలగ సాగినట్టు సాగుతున్నాడురా అంటారు మీరు ఎంత లాగితే అంత సాగి మీ నెత్తురుని ఇంకా బాగా గబగబా తాగుతుంది కాబట్టి జలగ ఊడదు, జలగ పట్టుకున్నవాడు ఏం చెయ్యవలసిందంటే పెద్ద కేకలేసి అల్లరిచేసి జలగని లాగితే ఊడదు. గబగబా పరుగెత్తికెళ్ళి కాస్తా ముగ్గు పట్టుకొచ్చి జలగ ఎక్కడ కరిచిందో అక్కడ వేస్తారు ముగ్గు తగలగానే ముగ్గు అంటే మీకు తెలుసు కదా... అది కూడా మరిచిపోతే ఇంక చాలా కష్టం కదా... వీధుల్లో వేస్తాం ఇంటి ముందు ఆ ముగ్గుకాని తగిలితే దాని నోటి దగ్గర అది వదిలేస్తుంది.
ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లక్షణం, ఉడుముందనుకోండి మీరు నడుముకో తాడు కట్టి దాని మూతికి కాస్త మధుర పదార్థం రాస్తారు రాస్తే అది నాక్కుంటూ ఏం చేస్తుందంటే ముందు మధుర పదార్థం ఉందనుకును ఎక్కేస్తుంది నిలువుగా ఉన్న గోడ ఇలాగ దాన్నేం చేస్తారంటే ఇంక ఇంత ఎత్తు ఎక్కింది ఇంకా అంతకన్నా ఎక్కువ ఎత్తు ఎక్కక్కరలేదనుకొన్నప్పుడు నడుముకున్న తాడుని ఇలా అని లాగుతారు. ఇలా అనగానే అంతే అది అలాగే పట్టేసుకుంటుంది. ఇక మళ్ళీ అది కదలాలంటే మళ్ళీ దానికిమధుర పదార్థం రాయాల్సిందే దాన్నోటికి రాస్తే తప్ప అది కదలదు. అంతే ఇంక దాని తాడు పట్టుకుని పైకి ఎక్కేస్తారు ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం ఈశ్వరుడి విభూతి ఇప్పుడు జలగ మిమ్మల్ని పట్టుకుంటే వదల్చకోవడానికి జలగ మిమ్మల్ని పట్టుకుంటే జలగని మీరు వదిల్చుకుంటారా జలగకి ఇష్టం లేని పదార్థాన్ని చల్లి వదిలేసేటట్టు చేస్తారా..? జలగకి ఇష్టంలేనివి మీరు చల్లాలి జలగ వదిలేస్తుంది. పామును మీరు పిలిచారా పాము మీ ఇంట్లోకి వచ్చిందా పగయగల్గెనేని పామున్న ఇంటిలో ఉన్నయెట్లగాక ఎట్టులుండు అంటారు మహాభారతంలో, పగున్నవాడు ఎలా ఉంటుందంటే పగగల్గినవాడు ఉంటే పామున్న ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది పామున్న చోట చముడు చల్లాలి మంత్రించిన చముడు చల్లితే పామురాదు. క్రోధం మిమ్మల్ని పట్టుకుంది కాబట్టి ఇప్పుడు క్రోధం వదలాలంటే క్రోధం ఉండడానికి వీలులేని పరిస్థితి మీరు కల్పించాలి. అది కల్పించడం హఠాత్తుగా క్రోధం వస్తుంది కాని హఠాత్తుగా మీరు కల్పించలేరు కాబట్టి మీరు దానికి సమయాన్ని ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలంటే మీరు మౌనంలోకి వెళ్ళాలి ఇదీ శ్రీరామాయణంలోంచి మనుష్యుడు మనుష్యుడుగా బ్రతకడానికి చేసినటువంటి గొప్ప ఉపదేశము, ఈ ఘట్టాన్ని ఆధారం చేసుకొని మనిషి తన జీవితాన్ని మలుచుకోవలసి ఉంటుంది అప్పుడే

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
లోకం రామ రాజ్యం అవుతుంది. అందుకే రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలం మనుష్యత్వం ఉంటుంది అనడానికి కారణం అది.
Image result for అరణ్యకాండకాబట్టి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెతకడం మొదలు పెట్టారు, చాలా సంతోషించాడు రామ చంద్ర మూర్తి తన యొక్క కోపాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసిన తరువాత వాళ్ళు అటుగా వెళ్ళుతుంటే తతః పర్వత కూటాఽఽభం మహాభాగం ద్విజోత్తమమ్ ! దదర్శ పతితం భూమౌ క్షతజాఽఽర్ద్రం జటాయుషమ్ !! తం దృష్ట్వా గిరి శృంగాభం రామో లక్ష్మణమ్ అబ్రవీత్ ! అనేన సీతా వైదేహీ భక్షితా నాత్ర సంశయః !! గృధ్ర రూపమ్ ఇదం వ్యక్తం రక్షో భ్రమతి కాననమ్ ! భక్షయిత్వా విశాలాక్షీమ్ అస్తే సీతాం యథా సుఖం !! ఎదురుగుండా జటాయువు కనపడింది నెత్తుటితో ఉంది నోట్లోంచి నెత్తురు నురుగు వస్తున్నాయి, దూరం నుంచి చూశాడు రాముడు ఆయన హృదయమునకు స్వస్థత ఇంకా పూర్తిగా కలుగలేదు ఆయన ఎక్కడ నెత్తురు కనపడ్డా అది సీతమ్మ నెత్తురే అనే భావనలో ఉన్నాడు, అంటే నేను మీతో మనవి చేశానుగా అలా ఉండచ్చాండీ... నరుడు కథా ఎక్కడ అతి ప్రీతి ఉందో అక్కడ ప్రమాదాన్నే శంకిస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు ఈ జటాయువు రాక్షసుడు పక్షి రూపంలో మనకు చెట్టు మీద కనపడ్డాడు ఇప్పటివరకు అసలు జటాయువుకి అప్పజెప్పలేదు కదా ఎక్కడని ఆయన అడగలేదు అంటే ఆయన శోకంలో మరిచేపోయాడు జటాయువు గురించి, ఇప్పుడు కనపడగానే ఏమనుకున్నాడంటే నెత్తురు చూసి ఈ రాక్షస రూపంలో ఉన్న పక్షియే మన మిత్రుడిలా ఇన్నాళ్ళు మనతో ఉంది, మనిద్దరం బయటికి వెళ్ళగానే మీ ఇద్దరూ వెళ్ళాక రక్షిస్తానని అందుకే చెప్పింది అందుకే అరణ్య కాండలో కాబట్టి ఇప్పుడు మనిద్దరం వెళ్ళగానే ఇది సీతని తినేసింది అందుకే నెత్తురు ఒళ్ళంతా ఉంది చూడు ఇక్కడకొచ్చి పడుకుంది. ఇక్కడకొచ్చి కూర్చుంది ఇది రథమెక్కడిది మరి కవచమెక్కడిది లేవు ఎందుకులేవు మళ్ళీ వెంటనే పైకి రేగింది క్రోధం కాబట్టి దీన్ని ఇప్పుడు చంపేస్తున్నాను అన్నాడు.
Image result for అరణ్యకాండఅని ఒక బాణాన్ని  ధనస్సులో సంధించి గబగబగబా జటాయువువైపుకి గురిపెట్టి విడిచిపెట్టబోతున్నాడు, వెంటనే ఆ జటాయువు అంది సీతామాదాయ వైదేహీముత్పపాత విహాయసమ్ ! రక్షసా నిహతం పూర్వం న మాం హన్తుం త్వమర్హసి !! మాట్లాడలేక మాట్లాడలేక గొంతు పెగల్చుకుని ఆ జటాయువు అంది ఒక రాక్షసుడు సీతమ్మని ఆకాశ మార్గాన తీసుకెళ్తూ ఆమెను రక్షించే ప్రయత్నంచేస్తే రామా నన్నుచంపేశాడు ఇక నన్ను నీవు మళ్ళీ చంపవద్దు అన్నాడు, అంతే వెంటనే ఆ ధనస్సు వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ జటాయువుమీద పడిపోయాడు అప్పుడు చూశాడు రెండు రెక్కలు తెగిపోయి ఉన్నాయి కాళ్ళు తెగిపోయి ఉన్నాయి, నా కోసం నా భార్య కోసం యుద్దం చేసి నీ ప్రాణాల్ని ఫణంగాపెట్టావు అందరికి ఇష్టమైంది ఏదంటే ప్రాణమే- ఆ ప్రాణమే ఫణంగా పెట్టేశావు నా కోసం సీత కోసం అటువంటి నిన్ను ఇంతమాట అన్నానని కౌగలించుకుని నీవు నా తండ్రి మిత్రుడవు నీవు నాకు

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
తండ్రితో సమానుడవు అని కౌగలించుకుని దానిమీద పడి ఏడ్చి అన్నాడు లక్ష్మణా! ఇప్పటివరకు సీత కనపడలేదని శోకించాను ఇప్పుడు నాకు సీత కనపడలేదన్న శోకంకన్నా ఈ జటాయువు మరణిస్తున్నాడని శోకిస్తున్నాను ఈ శోకంతో పోలిస్తే ఆ శోకం గొప్పదికాదు అన్నాడు.
Related imageవిచిత్రమేమిటో తెలుసాండి ఒక్కొక్క శోకం ఇంకోక పెద్ద శోకంతో పోలిస్తే మందేముందిలేరా అంటాడు, మీరు చూడండి రెండు ఇండ్లలో దొంగతనం జరిగిందనుకోండి ఒకాయనింట్లో బట్టలు కొట్టేసి ఒకాయనిట్లో బట్టలు వెండి బంగారం డబ్బు దస్కం అన్ని ఎత్తుకుపోయారనుకోండి, మనందేముందిలే మనం అదృష్టవంతులం ఫరవాలేదు మహాయితే నాలుగు చీరలు పట్టుకుపోయాడు ఫరవాలేదు పాపం పక్కింట్లో చూడండి అదే వీడింట్లో ఒక్కటే ఎత్తుకుపోయారనుకోండి ఏడుస్తాడు. శోకాన్ని శోకంతో పోల్చి శోకమునందు సంతోషాన్ని పొందుతుంటారు. మానవనైజమండి ఇదీ ఎంత గొప్పగా చూపిస్తుందండీ రామాయణం నిజంగా. రాముని యొక్క కృతజ్ఞాతాభావము కూడా అటువంటిదే కాబట్టి ఇప్పుడు అంటాడు రాజ్యం భ్రష్టం వనే వాసస్సీతా నష్టా హతో ద్విజః ! ఈదృశీయం మమాలక్ష్మీర్నిర్దహేదపి పావకమ్ !! లక్ష్మణా చూశావా ఇది బాగా జ్ఞాపకంపెట్టుకోవాలి మనకు జరిగిన సంఘటనలను మనం చిన్న కష్టమొస్తే విచలితలమైపోయి అందులో ఈరోజుల్లో సమాజంలో ఈ జాఢ్యం ఎక్కవైపోయింది. పేపర్లలో చదివితే విచిత్రమనిపిస్తుంది అమ్మ దెబ్బలాడిందని ఆత్మహత్య చేసుకుందనీ కన్నకూతురు, టెన్తక్లాస్ పోయిందని ఏట్లో దూకేసిన కొడుకు, ఏదో మాస్టారు దెబ్బలాడాడనీ ఉరిపోసుకున్నటువంటి విద్యార్థి, మార్కులు తక్కువచ్చాయని నిద్రమాత్రలు మింగేసినటువంటి ఓ పిల్లాడు లేకపోతే పిల్లలు పుట్టలేదని భార్యా భర్త కలిసి ఆత్మహత్య ఏమిటి నా బుర్ర అంటే మనసులకు స్వస్థతలేదు వాళ్ళకి వాళ్ళకొచ్చిందే కష్టమన్నభావన తప్పా ఇంతకన్నా చాలా కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు వాళ్ళకష్టం ముందు మనకష్టం ఏపాటి అన్నభావనలేదు... ఆ భావన ఉంటే ఈశ్వరుడు నీకు ఏమిచ్చాడో గుర్తుంటుంది.
అది నీకు తెలియదు కాబట్టి అది నీకు లేదని ఏడుస్తున్నావు, అన్ని ఉండి ఏడుస్తుంటాడు ఒక్కొక్కడు రెండు కళ్ళు లేనివాడు ఎంత ఏడవాలి. నేను సామర్లకోట ట్రైను ఎక్కడానికి వెడుతుంటే ప్రతిరోజు నాతో పాటు అంధులైన విద్యార్థులు ఆ మూగ చెవుడు ఉన్నటువటి విద్యార్థులు ఎక్కుతుండేవారు వాళ్ళు పాపం నేను ఇవ్వాళ జగ్గం పేట బస్సెక్కితే రోపు రాజమండ్రి బస్సు ఎక్కేవాన్ని, వాళ్ళు పాపం సామర్లకోట వెళ్ళడానికి ఎక్కేవాళ్ళు. నేను సామర్లకోట టికెట్టు ఇవ్వండి అనేవాన్ని వాళ్ళు సామర్లకోటకి టికెట్టు ఇవ్వండి అనాలి ఎలా అంటారు. ఒక వేళ సామర్లకోటా అన్నారనుకోండి వాడికి వినపడదు, అవి అక్క చెల్లెల్లు. మూగ చెవుడు కూడా వాళ్ళుకు ఆ పిల్లలు అనేవారు (గట్టిగా గాలి పీల్చుకునేవారు) అంటే రైలు వస్తుందే అక్కడికీవ్వు టికెట్టు కాకినాడ కన్నా సామర్లకోట మేన్ లైన్లో ఉంది. సామర్లకోటా అనేవాడు ఈ పెదవుల కదలికని బట్టి వాళ్ళు (తలూపేవాళ్ళు) అదీ రాజమండ్రిలో కూడా రైళ్ళు ఆగుతాయిగా పెంకితనానికి రాజమండ్రిలో కూడా రైళ్ళు ఆగుతాయి కాబట్టి రాజమండ్రి టికెట్టు కొట్టానని అన్నాడనుకోండి ఏం చెయ్యాలప్పుడు అతను పాపం ఏముంది మాట్లాడటానికి నాకు వాళ్ళు సంజ్ఞలు చేసుకుని మాట్లాడుతుంటే ఈ లోకంలో ఈ పక్షుల కలకూచితాలు ఈ ధ్వనులు ఈ పురాణాలు ఈ ఉపన్యాసాలు సంగీతం సాహిత్యం మృధుమధురమైనటువంటి ధ్వనులు కడుపున పుట్టినటువంటి పిల్లవాడు నాన్నగారండీ అని పిలిస్తే అనుభవించగలిగిన మధురిమ భార్య ఏమండీ అని ప్రియమార పిలిచినప్పుడు కలిగేటటువంటి ఆనందం ఇన్నిటికి దూరమయ్యారు.
Related image

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ఈశ్వరా! నేను ఏమి చేసుకున్నానో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం దూరం చేయకుండా ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు నాకు వినపడుతుంది మాట్లాడగలను కాబట్టి నేను బ్రతికున్నన్నాళ్ళు నీవు నాకిచ్చిన మాట నీ కథ చెప్పుకోవడానికి పనికివస్తే చాలు తండ్రీ ఇంక అంతకన్నా ఏమికావాలి. ఇది మీకు ఉన్నదాన్ని మీరు గుర్తిస్తే మీరు ఎంత ఐశ్వర్యవంతులో తెలుస్తుంది. మీకు ఉన్నది వదిలేసి మీకు లేనిదానికి ఏడ్చిచస్తానంటే ఎవడేం చేస్తాడు. ఆపదా అన్నది ఎంత ధారుణంగా ఉంటుందో మీరు గ్రహించాలి. రాముడు పొందిన ఆపదకన్నా మనం పొందామా! ఏమంటున్నాడో చూడండి  రాజ్యం భ్రష్టం రాత్రి యౌవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు పొద్దున్న అరణ్యవాసం అన్నారు, వనే వాసః పోనీ ఊళ్ళో కూడా ఉండనివ్వలేదు అడవులకు వెళ్ళిపోమన్నారు సీతా నష్టా మరి ఇన్ని కష్టాలు ఓర్చుకున్నాను పక్కన భార్య ఉందని, సీత ఏమైపోయిందో తెలియదు పితో మృతః తండ్రి గారు చచ్చిపోయారు, అయ్యో నాన్నా నీకు ఇంత కష్టమా అని అక్కున చేర్చుకోవలసిన తండ్రి వెళ్ళిపోయాడు ఈదృశీయం మమాలక్ష్మీ నా దరిద్రం ఇలా ఉంది లక్ష్మణా..! నన్ను నమ్ముకుని నన్ను కాపాడుదామనుకున్నందుకు ఈ పక్షి కూడా చచ్చిపోతుంది నిర్దహేదపి పావకమ్ ఒకవేళ అగ్నిహోత్రం అన్నిటిని కాల్చుతుంది, నా దరిద్రాన్ని అగ్నిహోత్రం దగ్గర పెడితే నా దరిద్రం అగ్నిహోత్రాన్ని కాల్చేస్తుంది అన్నారు.
రాముడు పొందిన కష్టం కన్నా కష్టమాండి మనం పొందే కష్టాలు, ఏమిటి నీకు రైల్వే రిజర్వేషను ఆర్ ఏ సి వచ్చిందని ఇంక ఆపదా... గోరు తీసుకుంటుంటే ఇంత లోపలికి కోసుకుందని అబ్బో గోరు తెగిపోయిందని అబ్బో గోరు తెగిపోయిందని ఏమిటి అది ఆపదా...  ఏమిటి ఆపదా..? అయిందానికీ కాందానికి ఏడుస్తానంటే ఏమో సాకు దొరుకుతుంది, సంతోషించాలని నీవు అనుకొని ఆలోచించగలిగితే నీకు ఎన్నున్నాయో నీకు తెలుస్తుంది. కాబట్టి రామ చంద్ర మూర్తి ఈ మాట అని సా హృతా రాక్షసేన్ద్రేణ రావణేన విహాయసా ! మాయామ్ ఆస్థాయ విపులాం వాత దుర్దిన సంకులామ్ !! జటాయువు అంటున్నాడు మాయాప్రభావంతో ఆకాశమంతా మబ్బులు కమ్మేటట్టుగాచేసి ఆకాశ మార్గంలో అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తీసుకొని వెళ్ళడానికి పూర్వం అతడు తీసుకుని వెళ్తున్నటువంటి రథాన్ని నాకు ఉన్న బలంతో రామా! నిగ్రహించాను, ఆ రథాన్ని పడగొట్టాను సారథిని చంపాను పక్కన ఛామరాలు వేస్తున్నవారిని చంపాను, ఆ పైన ఉన్నటువంటి గొడుగు పడగొట్టాను Image result for జటాయువుధనస్సు పడగొట్టాను అంబులపొదను పడగొట్టాను కానీ అతడు యువకుడు బలవంతుడు ఆయుధములున్నవాడు నేను వృద్ధుడనైపోయినపక్షిని వెళ్ళి నిన్ను తీసుకొచ్చే సమయం లేదు నా చేతనైనంత పోరాటం చేశాను కాని నా రెక్కలు నరికేశాడు నా కాళ్ళు నరికేశాడు ఇక్కడ పడిపోయి నీకు ఈ వార్త చెప్పి ప్రాణం విడిచిపెడదామని కంఠంలో ప్రాణం పెట్టుకుని ఉన్నాను అంటూ ఉండగా మాంసముతో కూడినటువంటి నెత్తురు నురుగు కక్కాడట, కక్కి పక్కకి ఒరిగిపోతుంటే... రాముడు ఆ పక్షి తలని చేత్తో పట్టుకుని నా తండ్రిలాంటివాడివి నాకు ఇంత మహోపకారం చేశావు, నీవు వెళ్ళిపోతే నాకు ఎవరు చెప్తారు కాబట్టి నాకు చెప్పు చెప్పు ఎవరు పట్టుకెళ్ళారో అని అతనికి నేను చేసిన అపరాధము ఏమిటి రావణుడు ఎందుకు నా మీద క్రోధం వహించాడు ఎటు తీసుకెళ్ళాడు ఎలా తీసుకెళ్ళాడు ఎందుకు తీసుకెళ్ళాడు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు.
Image result for జటాయువు

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ప్రాణోత్ర్కరణం అయిపోతోంది చెప్పాలని తాపత్రయం ఉంది ఎవరికోసం పోరాటం చేశాడో ఆయనతో మాట్లాడాలని ఉంది కాని మాట్లాడటానికి అవకాశం లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మనకేమిటండీ అంటాం, ఏమో ఆయుర్దాయం ఎవరికి తెలుసు ఓపిక ఉండగా ఈశ్వరున్ని సేవించి ఆయన నామాన్ని కీర్తించకపోతే ఎంత ప్రమాద మొస్తుందో చూడండి. కాబట్టి మాట్లాడుదామనివున్నా మాట్లాడగలుగుతున్నాడా ఇప్పుడు పాపం అంత ఉపకారంచేసిన జటాయువు. కాబట్టి ఆఖర్న అన్నాడూ జోతిష్య శాస్త్రం రామాయణం మహానుభావుడు అంత ప్రాణంపోతూ కూడా యేన యాతి ముహూర్తేన సీతామ్ ఆదాయ రావణః ! విప్రణష్టం ధనం క్షిప్రం తత్ స్వామీ ప్రతిపద్యతే !! విన్దో నామ ముహూర్తోయం స చ కాకుత్స్థ నాబుధత్ !!! నాయనా! విందము అనేటటువంటి ముహూర్తంలో అపహరించాడు రావణుడు నీ యొక్క పత్నియైన సీతమ్మని, ʻపత్ని ధనంʼ అని అర్థం ఆమె వలననే సంతానం కలుగుతుంది. కాబట్టి నీ భార్యని ఆయన ఆ ముహూర్తంలో అపహరించాడు కనుక నీ భార్య నీకు దక్కుతుంది ఆ ముహూర్తంలో ఎవడు అపహరించాడో వాడు తన ప్రాణములను కోల్పోతాడు.
Image result for jatayu in ramayanకాబట్టి రావణ సంహారం జరుగుతుంది నీకు నీ ప్రియ భార్య దక్కుతుంది కాబట్టి నీవు ఏమీ బెంగపెట్టుకోవద్దూ అని చెప్పి పుత్రో విశ్రవసః సాక్షా ద్భ్రాతా వైశ్రవణ స్య చ ! ఇతి ఉక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతగేశ్వరః !! అన్ని ప్రాణులకు అత్యంత విలువైనదేదో ఆ ప్రాణములను ఆఖర్న అతి కష్టంమీద వాక్కుగా మార్చి విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు కుబేరుడి తమ్ముడు రావణ నామధేయుడు నీ భార్యను అపహరించాడు అన్నవాఖ్యాన్ని పూర్తిచేసి నోటి వెంట చటుక్కున మాంసముతో కూడిన నెత్తుటిని కక్కి రామ చంద్ర మూర్తి చేతులలో ఒరిగి తలవాల్చి కనుగుడ్లు పైకొచ్చి శరీరము ఉన్న మిగిలిపోయిన ఆ కాళ్ళు శరీర అవయాల్ని బాగా వెంబగా చేసి ఆ బాధ తట్టుకోలేక ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు జటాయువు. రాముడు అన్నాడూ చాలా దుఃఖించారు రామ లక్ష్మణులు ఇద్దరు ఆ పక్షిని చూసి తండ్రిపోయినంత ఏడ్చారు. ఏడ్చి సౌమిత్రే హర కాష్ఠాని నిర్మథిష్యామి పావకమ్ ! గృధ్రరాజం దిధక్షామి మత్కృతే నిధనం గతమ్ !! నాకోసం మరణించినటువంటి ఈ జటాయువు ఉందే దీనికి అంతేష్టి సంస్కారం చేస్తాను కాబట్టి కర్రలు పట్టుకొచ్చి క్షితిపేర్చి కర్రని కర్రతో రాపాడించు పుట్టినటువంటి అగ్నిహోత్రంతో ఈ పక్షిని మనం అంతేష్టి సంస్కారం చేద్దాం నాథం పతగ లోకస్య చితామ్ ఆరోపయామి అహమ్ ! ఇమం ధక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షసా!! రౌద్ర రూపంతో ఉన్న రాక్షసుని చేత వధింపబడినటువంటి ఆ పక్షి రూపాన్ని పొందివున్న ఆ జటాయువు యొక్క శరీరాన్నుంచి ప్రాణం వినిర్ముక్తంమైన తరువాత  ఆ శరీరాన్ని తీసుకెళ్ళి క్షితిమీద పెట్టి అగ్ని సంస్కారాన్ని రామ చంద్ర మూర్తి తండ్రికి చేసినట్లు చేశారు ఆయన మహానుభావుడు ఆ అంతేష్టి సంస్కారంలో పఠించేటటువంటి మంత్రములను కూడా ఆ సమయంలో పఠించాడు.
ఇక్కడా మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఎందుకీ పని చేయడం రాముడు- పక్షి గదా వదిలి వెళ్ళిపోవచ్చుగదా అంతేష్టి సంస్కారం అనేటటువంటిది సనాతన ధర్మంలో అంతర్భాగం ఒక అపురూపమైనటువంటి సృష్టి ఈశ్వరుడి చేత చేయబడిన ప్రాణి మనుష్యుడు. నేను ఇప్పుడు దాని గురించి ఉపన్యాసం చెప్పడం కుదరదు కానియ్యండి నేను

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ఒక్కమాట చెప్తాను ఈశ్వర సృష్టిలో ఉన్న గొప్పతనం చూడండి ఇంత పెద్ద శరీరం దేని మీద నిలబడుతుందంటే పాదముల మీద నిలబడుతుంది పాదములు భూమి మీద ఉంటాయి, ప్రాకే ప్రాణులు అపకారం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి దేనిచేత అపకారం చేస్తాయి అంటే భయంచేత అపకారం చేస్తాయి, పాకే ప్రాణులు ఎప్పుడూ కూడా అపకారం దేనికి చేస్తాయంటే భయానికి అంటే వీడు మనల్ని ఏమైనా చేస్తాడు అనుకుని చేస్తాయి తప్పా మనల్ని చూస్తే ముందుగా అవి పారిపోయే ప్రయత్నం చేస్తాయి ఒకవేళ అనుకోకుండా మనమూ అవి దగ్గరయ్యాము అనుకోండి అది అనుకోలేదు మనమూ అనుకోలేదు మనం అటు వెళ్ళాం అది వచ్చేసింది. ఇప్పుడు అది తప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి, సాధ్యమైనంతవరకు అది తప్పుకోవడానికి చూస్తుంది తప్పుకోవడానికి అవకాశం ఇచ్చి మనల్ని రక్షిండం కోసం ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప నిర్మాణ ప్రక్రియే ఏమిటో తెలుసాండి! పాదము అంతా నేలమీద ఆనకుండా పాదానికి మధ్యలో చిన్న జాగా అట్టే పెట్టాడు ఆయన ఖాలీ స్థలాన్ని అందుకే మీరు ఎప్పుడైనా చూడండి కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయిందంటారు.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
Image result for జటాయువుకి రాముడుమీరు ఎప్పుడైనా అనుభవంలో చూశారోలేదో కానీ ఇలా నిలబడి ఉండే ఏదైనా ప్రాణి పారిపోవాలనుకుంటే అతను మన్ని గమనించట్లేదు అనుకుని దగ్గరగా ఉన్నాడూ అనుకుంటే కాళ్ళ కిందకి దూరుతుంది ఆ కన్నంలోకి ఆ కన్నంలోకి దూరగానే అతనికి చల్లగా తగులుతుంది తగలగానే అయ్య బాబోయ్ అని కాళ్ళెత్తి రెండు గంతులు వేసేసరికి అది వెళ్ళిపోతుంది. వీడు దాని మీద ఏమైనా పడితే కరుస్తుందు లేకపోతే వెళ్ళిపోతుంది. నేను ఎన్నో సందర్భాలు నాకు తెలుసు ఎందుకంటే అలాంటి చోట్ల ఉద్యోగం చేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈశ్వర నిర్మాణం అంత అపురూపమండి అంత అపురూపంగా నిర్మింపబడినటువంటి ఈ శరీరాన్ని సమంత్రకంగా అగ్నిహోత్రంలో వ్రేల్చెయ్యాలి అంతేష్టి సంస్కారం జరగాలి, అది కొన్ని వేల సంవత్సరములు బతికి పక్షులకు రాజైనటువంటివాడు ఆ ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతంలో పెరిగి ఆ ప్రాంతంలో తన కార్యం మీద మరణించినవాడు పితృసమానుడు ఆ శరీరం అలా పడిపోయి తనంత తాను భూమిలో కలవకూడదు అంతేష్టి సంస్కారం చెయ్యాలి కాబట్టి క్షితిమీద పెట్టి కాల్చాడు రాముడు. “అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ యాగమంత మహా ఫలితం” మనిషి ప్రాథమికమైన ధర్మాలలో ఒకటి ప్రేతాన్ని సంస్కరించాలి, ప్రేతాన్ని సంస్కరించకుండా ఉండకూడదు అందుకే ఈ ధర్మం రామాయణంలో చెప్పడానికే రాముడు జటాయువును సంస్కరిస్తాడు, రాముడు సంస్కరిస్తాడంటే అంతేష్టి సంస్కారం చేస్తాడు, అలాగే వాలికి అంతేష్టి సంస్కారం చేయిస్తాడు, ఆయన ఎప్పుడూ అంతేష్టి సంస్కారం చెయ్యకుండా వదలడు.
అలాగే మీరు చూడండి కృష్ణ భగవానుడు, కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అంతమంది వీరులు మరణించారు, పేరు పేరు పేరు చెప్పించి ఉభయ వంశాల వారిని అటు కౌరవులు ఇటు పాండవులు అటు దృతరాష్ట్రునున్ని కూర్చోబెట్టారు ఇటు ధర్మరాజుగారు కూర్చోబెట్టారు చనిపోయిన ఒక్కొక్క వీరుని పేరు చెప్పేవారు నీకు చెందినవాడా నీకు చెందినవాడా..? ఎవరో ఒకడికి చెందినవాడు అనేవారు నువ్వులు నీళ్ళు విడిచి పెడుతుండేవారు ఇటు ధర్మరాజుగారుకాని అటు దృతరాష్ట్రుడు కాని ఇద్దరూ నావాడు కాదు అన్నవాడు ఎవరో తెలుసాండి ఒక్క కర్ణుడే, ఎందుకంటే కర్ణుడు కుంతీదేవి పుత్రుడు అని పాండవులకు తెలియదు, దృతరాష్ట్రుడు అన్నాడు నా సంబంధీకుడు కాడు అన్నాడు ధర్మరాజు అన్నాడు నా సంబంధీకుడు కాడు అన్నాడు, ఇప్పుడు నువ్వులు నీళ్ళూ వదలమన్నారు అప్పుడు- అప్పుడు బయటపడింది కుంతి. నా పుత్రుడేనయ్యా ఆఖరికి ప్రాణం కూడా పోయింది నేను వెళ్ళి అడిగినందుకు నువ్వులు నీళ్ళు కూడా దక్కవా నా కొడుక్కి నా కొడుకే వదలండి అన్నది. ఎంత పని చేశావమ్మా నా అన్నను నా చేత చంపించేశావు, ఒక ఆడదాని నోట రహస్యం దాచితే ఇంత ప్రమాదం వచ్చింది కాబట్టి నువ్వు గింజ నానినంత సేపు కూడా ఆడదాని నోట రహస్యం దాచకుండుగాకా! అన్నాడు ధర్మరాజుగారు. ఆఖరికి ఏ కొడుకుల కోసం ఇంత శ్రమించిందో ఆ కొడుకు చేతే శాపం పొందింది. అప్పుడంది యాదవులందు బాండవులయందు నధీశ్వర నాకు మోహావి విచ్ఛేదము సేయుమయ్య ఘనసిందువు జేరెడిగంగభంగి నీ పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న త్యాదరవృత్తితో గదియునట్లుగ జేయగదయ్య యీశ్వరా ! అని కృష్ణున్ని ప్రార్థన చేసింది. ఏమిటీ వెర్రిలూ వ్యామోహాలు వాడికోసం ఇంత తాప్రతయపడితే వాడు శపించాడు నన్ను అని కాబట్టి అంతేష్టి సంస్కారం కృష్ణుడు చేయించాడు. ప్రేత సంస్కారం రామ చంద్ర మూర్తి చేయించాడు.
Image result for jatayu in ramayan

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ధర్మాత్ముడైన రాముడు ఇది చెయ్యకపోతే లోకంలో మనం చెయ్యవలసిన ధర్మం ప్రకాశించదు కనుకా... మనకు ధర్మాన్ని నేర్పాడు రామ చంద్ర మూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు చిట్ట చివర యా గతి ర్యజ్ఞ శీలానామ్ ఆహితాగ్నేశ్చ యా గతిః ! అ పరి ఆవర్తినాం యా చ యా చ భూమి ప్రదాయినామ్ !! మయా త్వం సమనుజ్ఞాతో గచ్చ లోకాన్ అనుత్తమాన్ ! గధ్రరాజ మహా సత్త్వ సంస్కృత శ్చ మయా ప్రజ !! నా చేత సంస్కరించబడినటువంటి ఓ జటాయువా! నీవు ఎటువంటి లోకాలకు వెడుతావో తెలుసా... ఎప్పుడూ యజ్ఞములు చేసే అలువాటు ఉన్నవాడు ఏ లోకములను పొందుతారో గార్హపత్యాగ్ని ధక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అనబడేటటువంటి ʻత్రేతాగ్నులనుʼ మూడు అగ్నులను ఎప్పుడు నిరంతరము సేవించేవారు ఏ లోకములు పొందుతారో ఆ లోకాన్ని అలాగే పంట భూమిని దానం చేసినవాళ్ళు ఎటువంటి లోకమును పొందుతారో అటువంటిలోకాన్ని, లోకంలో సన్యాసం తీసుకున్న సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందుతారో అటువంటి లోకాల్ని గచ్ఛ లోకాన్ అనుత్తమాన్ అటువంటి లోకములను ఆ ఆజ్ఞచేత నీవు పొందుతున్నావ్ అని జటాయువుకి ఉత్తమలోకాలను రాముడు కటాక్షించాడు.
వెంటనే మనకు అనుమానం వస్తుంది నరుడు కదా ఇవ్వగలడా..? నరుడు సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః ! గురూన్ శుశ్రూషయా వీరో ధనుషా యుధి శాత్రవాన్ !! నిరంతరము సత్య ధర్మములను పట్టుకున్నటువంటి మహాత్ముడైనవాడు ఎవడున్నాడో ఆ పురుషుడే పురుషోత్తముడు. వాడు తన మాటచేత ఎవరికి ఏదైనా కృప చేయగలడు, మీకు నేను బాగా ఈ విషయంలో నమ్మకం కలగాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పటికీ నాకు ఆయన మిత్రుడు మా గోపాల కృష్ణగారికి బాగా తెలుసు నా దగ్గరికి వస్తూంటారు ఆయన అస్తమానం. కంచిలో వాళ్ళ పెద్దనాన్నగారికి ఒకానొకప్పుడు భయంకరమైన కడుపునొప్పి వచ్చింది. వస్తే వాళ్ళ తమ్ముడుగారు పరుగెత్తుకుంటూ పరమాచార్య స్వామి దగ్గరికి వెళ్ళారు. పరమాచార్య స్వామివారు కంచికి దూరంగా ఒక పల్లెటూళ్ళో విడిదిచేసి ఉన్నారు. అక్కడికి వెడితే ఆయన ఇలా చూశారు, సాధరణంగా జగద్గుగురువుల దగ్గరైతే నాలుగు నమస్కారాలు చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు తుర్యావస్థను దాటి ఉంటారు కాబట్టి ఒకసారి సాష్టాంగం చేసి మూడు మాట్లు నమస్కారం చెయ్యాలి, నాలుగు సార్లు చేస్తాం సన్యాసికి చేస్తే. అందునా పీఠాధిపతులు జగద్గురువులైరి కాబట్టి ఆయన నాలుగు మాట్లు నమస్కారం చేస్తుంటే ఆయన పక్కన అంతేవాసిని పిలిచి అన్నారు ఆయన్ని ఆపకుండా అలా చేస్తూ ఉండమనండి అన్నాడు.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
ఆయన అలా చేస్తూనే ఉన్నాడు నడుం నొప్పి పెట్టదాండీ! ఆయన అలా చేస్తూనే ఉన్నాడు పరమాచార్య ఆగమనలేదు అది సాంప్రదాయం కాదు అలా చేయించరు. అది వేరొకరియందు ఉన్నది ఆ సాంప్రదాయం నమస్కారం చేయించడం ఇందులో చేయించరు కానీ ఆయన చేయమన్నారు ఆయన అలా చేస్తూనే ఉన్నారు. ఆయనకీ ఈ పక్కటెముకలు డొక్కలు నడుము నొప్పేట్టుకపోతున్నాయి ఆపద్దను చేస్తూ ఉండమన్నారు- అలా చేస్తూనే ఉన్నారు కాసేపైన తరువాత ఆగమన్నారు, వాన్ని ఇలా రమ్మన్నారు ఆయన ఈయ్యనతో మాట్లాడలేదు ఈయ్యన ఆయనతో మాట్లాడలేదు ఆయన వచ్చారు నమస్కారం చేస్తున్నారు వాన్ని చేస్తూ ఉండమను ఆపకుండా అన్నారు వచ్చిందా మీ అన్నయ్యా కడుపునొప్పి నీ బాధతో తీసేశాను అన్నారు నాకు మనస్కారం చేయించడము పో ఇంటికి అన్నారు. ఈయన ఇంటికి వెళ్ళారు వాళ్ళన్నయ్యగారి కడుపునొప్పి ఎందుకు తగ్గిపోయిందో డాక్టర్లకు తెలియలేదు ఇంటికి పంపించేశారు యాదార్థంగా జరిగింది ఒక కుటుంబంలో మీరు నమ్ముతారా..! ఆ కుటుంబంలో వాళ్ళ పిన తండ్రిగారి అబ్బాయి నాకు అత్యంత సన్నిహితుడు నా దగ్గరికి అస్తమానం వస్తూంటాడు ఆయన. మహాత్ములు చెయ్యగలరు సత్య ధర్మములను అనుష్టించిన మహాత్ములు చెయ్యగలరు.
శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామివారు పీఠాధి పత్యం వహించినటుంటి రోజుల్లో ఇప్పుడున్నంత గొప్పగా పీఠం అప్పుడు ఉండేది కాదు ఆ వర్ణనలను బట్టి, వీధిలో అంటే ఆ తుంగానదిలో దాటి అవతలవైపుకు ఉన్నటువంటి జగద్గురువుల యొక్క ఆశ్రమానికి ఇవతలవైపుకి ప్రాంగణంలో ఒక గదిలో కొంతమంది ఆడవాళ్ళుదిగారు ఒక తల్లి ఒక పిల్లవాడితో దిగింది భర్త వొద్దు వొద్దు అంటుంటే ఆ కొడుకుని తీసుకొచ్చిందావిడ, జగద్గురువులు సాయంకాలం అసురసంధ్యావేళ దాటిన తరువాత చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు ఆవిడ వెడదాం అనుకుంటుంది. ఈ పిల్లాడు కళ్ళుతేలేసాడు ఈ మిగిలినవాళ్ళు అన్నారు అక్కడ ఆరాధన అవుతుంటే మేము వెళ్ళి ఎవరైనా ఉంటే పంపిస్తాము ఎవరైనా ఉంటే వాళ్ళు డాక్టరు దగ్గరికి తీసుకెళ్తారు, అప్పుడు పెద్ద జనం ఉండేవాళ్ళు కాదు వాళ్ళు వెళ్ళిపోయారు ఎవ్వరూ లేరు. ఈవిడ పిల్లావాన్ని చూస్తే వాడు కొయ్యబారిపోయాడు, నల్లగా అయిపోయి వాడు శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఈవిడ ఇంటికి వెళ్ళితే భర్త చంపేస్తాడు వద్దన్నాను వెళ్ళావని ఏం జరిగింది ఎందుకు చనిపోయాడని, ఆవిడకి ఏం చెయ్యాలో తెలియక బయటచూస్తే కటిక చీకటి తుంగానదిని దాటాలి అంటే వారధి ఉంది కాని చీకట్లో దాటి వెళ్ళాలి, ఇప్పటికే అక్కడ పాముల బొమ్మేసి Beware of Snakes అని బోర్డులు ఉంటాయి.
http://3.bp.blogspot.com/-FtBM5uzSEes/TU55DHUxDeI/AAAAAAAABAI/i4s2d0H4T6Q/Maha_Periyava_Idol.JPGకాబట్టి ఇప్పుడు ఆవిడ భయపడిపోయి ఆ పిల్లాన్ని అక్కడ పెట్టుకుని తలెత్తి చూస్తే చంద్రశేఖర భారతి ఫోటో కనపడింది ఆవిడకి ఆ ఫోటో వంక చూసి ఆవిడ ఫొటో అనుకోలేదు జగద్గురువులే అనుకుంది. స్వామీ నా కొడుకు చనిపోయాడు చంద్రమౌళీస్వర ఆరాధన చూడ్డానికి వచ్చాను మీరు జగద్గురువులు ఈశ్వరుడితో సమామైనవారు నాకు పుత్రభిక్ష పెట్టండి అని ఏడిచింది. ఆవిడ ఏడ్చిచూసేసరి ఈ పిల్లాడు నవ్వుతూ లేచి అమ్మకొంగు పట్టుకున్నాడు. ఆవిడ ఆ పిల్లాన్ని చంకన వేసుకొని పరుగుపరుగున ఆ తుంగానదిని దాటి చంద్రమౌళీశ్వరా రాధన జరుగుతున్నటువంటి గురునిలయంలోకి పరుగెత్తింది ఆవిడా, అప్పుడే చంద్రమౌళీశ్వరారాధన పూర్తైపోయి చంద్రశేఖర భారతీ స్వామి లోపలికి వెళ్ళిపోతున్నారు ఆవిడ పరుగు పరుగున వెళ్ళింది దగ్గరికి ఆయనా వెళ్ళుపోతూ ఆగకుండా ఇలా చూస్తూ ఏం కొడుకు కావాలన్నావ్ ఇచ్చాం సంతోషమా! అంటూ వెళ్ళిపోయారు లోపలికి ఎలా తెలిసింది సత్య ధర్మములను అనుష్టించ గలిగినటువంటి మహాపురుషులకు తెలుస్తుంది.

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
చంద్రశేఖర భారతీ సమాధిలో ఉండగా చంద్రశేఖరరేంద్ర సరస్వతి ఏదైనా వర్తమానం పంపిస్తే ఆయన బయటికొచ్చి కూర్చుని ఉండేవారు. పరమాచార్యులవారు కులాసాగా ఉన్నారా..! అని ఆ వర్తమానం అందుకుని చదివి ఆయన ఏదో వేద సమ్మేళనం జరిపిస్తున్నారట చాలా సంతోషం అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవారు. ఆ సమయానికి ఆయన బయటికి వచ్చేవారు. మహాత్ములు మాట్లాడుకుంటారు వాళ్ళకు అన్నీ తెలుస్తాయి. సత్య ధర్మములను ఎవడు అనుష్టిస్తాడో వాడికి కరతలామలకములు అవన్ని పట్టుకు కూర్చోరు అదే పనిగా అవన్ని ప్రదర్శిస్తూ కూర్చోరు. అది అవసరము అనుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళు అనుగ్రహిస్తే ఏదైనా చేసేస్తారు ప్రాణభిక్ష కూడా పెట్టేస్తారు అంతే. ఎన్ని జరిగాయే శృంగగిరి పీఠంలో ఇలాంటివి, ఎత్తుకుపోయిన యంత్రాలు ఎక్కడున్నాయో చెప్పేశారు పీఠాధిపతులు, ఎన్ని జరిగాయో... ఏమండీ! కాబట్టి మహాత్ములు మహాత్ములే, నమ్మకపోతే మనఖర్మ అంతే మన అపనమ్మకంకాని సత్యధర్మములు పట్టుకోగలిగినవాడికి ఎప్పుడూ ఆ శక్తి ఉంటుంది.
కాబట్టి గచ్ఛ లోకాన్ అనుత్తమాన్ నీవు ఆ లోకాలకి వెళ్ళూ అని జటాయువును పంపగలిగాడు రామ చంద్ర మూర్తి. ఎందుకూ అంటే అటువంటి సత్య ధర్మములను అనుష్టించాడు కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి రామ చంద్ర మూర్తి అత్యద్భుతమైన జటాయువుకు సంస్కారం చేసి ఆయన యోక్షాన్ని పొందడం, వాళ్ళిద్దరూ స్నానం చేసి, రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా తండ్రికి ఎలా చేస్తారో అలా కందమూలాలు తెప్పించి పిండము చేసి అక్కడ పెట్టి దర్బల మీద పిండ ప్రదానం చేశాడు. యామ్య సూక్తం తోటి తద్దినం పెట్టారు, నీళ్ళల్లో దిగి జల తర్పణ ఇచ్చి ఉదక శాంతి చేసి ఆయన ఉత్తమ లోకాలను పొందాడు అని, అప్పుడు రామ లక్ష్మణులు మళ్ళీ సీతమ్మని అన్వేషించడం ప్రారంభం చేశారు. కాబట్టి రామ చంద్ర మూర్తి ఒక మహాద్భుతమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించినటువంటి ఈ ఘట్టం దగ్గర నేను ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం మళ్ళీ ఆరుగంటల ముప్పై నిమిషాలకి పునః ప్రారంభం చేద్దాం.
ఒక్కసారి మనం 11 మాట్లు రామ నామం చెప్పుకుందాం. నోరు ఉండడం ఎంత గొప్పో ఇప్పుడే కదా చెప్పుకున్నాం కాబట్టి
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
ప్రణవమను ఓంకార నాదబ్రహ్మమే శ్రీ రామ నామము !!రా!!
జన్మ మృత్యు రహస్య మెరిగి జపియించవలె శ్రీ రామ నామము !!రా!!
పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
నిర్మలంబగు శోభచేసిన నేర్వదగు శ్రీ రామ నామము !!రా!!
మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీ రామ నామము !!రా!!

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
పాలు మీగడ పంచదారల తత్వమే శ్రీ రామ నామము !!రా!!
మేరు గిరి శిఖరాగ్రమందున మెరయు చున్నది రామ నామము !!రా!!
పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామ నామము !!రా!!
శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీ రామ నామము !!రా!!

  అరణ్య కాండ ఇరవైయవ రోజు ప్రవచనము
 
జానకీ హృత్ కమల మందున అలరు చున్నది రామ నామము !!రా!!
Image result for సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాంమంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామ నామము !!రా!!
ఇవ్వాళ ఒక్క విషయాన్ని మనం అదనంగా చెప్పవలసి ఉంటుందీ... ప్రతిరోజూ కూడా సాంప్రదాయంలో ఏమిటంటే రెండు మాట్లు చెప్పాలి ఒక శ్లోకాన్ని అని ఒక రోజు మొత్తం మీద సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం లోపల రెండు మాట్లు చెప్పాలి ఒక శ్లోకాన్ని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ! అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం !! ఈ శ్లోకం ఒక్క రోజులో రెండుమార్లు చెప్పాలి ప్రతి మనిషీ అని ఇవ్వాళ అందునా వైశాక శుక్ల పంచమి మళ్ళీ యేడాది తరువాత వస్తుంది మహానుభావుడు శంకరుల యొక్క పుట్టినరోజు అంటే పెద్ద పండగేనాకు కాబట్టి ఆ శ్లోకాన్ని ఇక్కడ రెండుమాట్లు చెప్దాం చాలు చాలా గొప్ప తిథి గనుక

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ! అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం !!
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ! అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం !!
మంగళా శాసన పరై....

No comments: