Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అరణ్య కాండ 21వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Aranya Kanda 21st Day

అరణ్య కాండ

ఇరవైఒకటవ రోజు ప్రవచనము



జటాయువుకి ఉత్తమగతులను కల్పించినటువంటి రామ చంద్ర మూర్తి లక్ష్మణ సహితుడై సీతాన్వేషణ చేస్తూ అరణ్యంలో ప్రవేశించినటువంటి ఘట్టాన్ని నేను నిన్న మీకు వివరించాను. ఆ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు నైరుతిదిశగా ముందుకు సాగిపోయారు, దండకారణ్యం నుంచి మూడు క్రోసుల దూరం ప్రయాణించి క్రౌంచారణ్యము అనేటటువంటి అరణ్యములోకి చేరుకున్నారు. ఒక అరణ్యముకన్నా ఒక అరణ్యం ధారుణమైనటువంటి స్థితి, ధారుణమూ అంటే మనుష్యులు తిరగడానికి యోగ్యమైనటువంటి అరణ్యములు కావు, అంత విపరీతంగా చెట్లూ పొదలూ తుప్పలూ క్రూర మృగాలు సర్పాలతోటి నిండిపోయినటువంటి అరణ్యాలు, ఆ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ వాళ్ళు ఆ క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. ఆ క్రౌంచారణ్యం నుంచి మళ్ళీ మూడు క్రోసులు దూరం ప్రయాణం చేసి మతంగా మహర్షి ఆశ్రమానికి క్రౌంచారణ్యం యొక్క చివరి భాగానికి మధ్యలో ఉన్నటువంటి వేరొక వనంలోకి ప్రవేశించారు.
ఆ వనం చాలా మృగ పక్షి సంకీర్ణమై ఉంది చీకటిగా ఉన్నటువంటి అరణ్యం. అక్కడ వాళ్ళకు ఒక పెద్ద గుహ ఒకటి కనపడింది, ఆ గుహ సమీపంలోకి వెడితే గాంఢాంధకారంతో కూడుకున్నటువంటి ఆ గుహముందు ఒక రాక్షసి ఒకామె నిలబడి ఉంది భయదాం అల్ప సత్వానాం భీభత్సాం రౌద్ర దర్శనాం ! లంబోదరీం తీక్ష్ణ దంష్ట్రాం కరాళాం పరుష త్వచం !! వాల్మీకి మహర్షి రచన ఆ శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి, ఆయన అంటారూ భయదాం అల్ప సత్వానాం అల్ప సత్వము అంటే తక్కువ బలము కలిగినటువంటివాళ్ళు అని అర్థము, తక్కువ బలం కలిగినటువంటివాళ్ళకి ఆవిడ భయంకరమైనది అంటే అది ఆవిడ స్వభావము, తనకన్నా కొంచెం తక్కువ బలమున్నవాళ్ళు కనపడితే ఆవిడ వేధిస్తుంది వాళ్ళనీ చాలా దుఃఖపెడుతుంది. ఎందుకనీ అంటే అది ఆవిడ సహజమైనటువంటి ప్రవృత్తి, తనకన్నా తక్కువ బలంవాళ్ళు కనపడితే ఆదరించడమో వాళ్ళని రక్షించడమో ఆవిడకు ఉండేటటువంటి లక్షణంకాదు. రాక్షసత్వమూ అంటే ఇంకేదో అని మీరు ఏమీ అనుకోక్కరలేదు, కలియుగంలో ఒక పెద్ద విచిత్రమొకటి ఉంది, త్రేతాయుగము వాటిల్లో అయితే రాక్షసుల యొక్క ఉపాదులు తెలిసిపోయేవి ఒక భయంకరమైనటువంటి

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
శరీరము ఏదో పెద్ద పొట్ట నోరు దంష్ట్రములు అవి, కలియుగంలో బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే రాక్షసులెవరో మనుష్యులెవరో తెలియదు ప్రవృత్తిచేత తెలియాలి కాని తెలుసుకునే లోపలే ప్రమాదం వచ్చేస్తుంది.
Related imageకనుకా ఇప్పుడు ఆవిడా భయదాం అల్ప సత్వానాం తనకన్నా తక్కువ బలమున్నటువంటివారి పట్ల చాలా క్రోధంతో అవతలవారిని దుఃఖపెట్టేటట్టు ప్రవర్తిస్తుంది, అంటే తనకన్నా ఎక్కువ బలమున్నవాళ్ళు కనపడితే తాను పారిపోతుంది ఇది దానర్థం. అంటే ఆ జీవితానికి ఒక ఋజువర్తనకాని ఆ జీవితానికి ఒక పంధాకాని ఏమీలేవు, మనకన్నా బలవంతుడు కనపడ్డాడు వాడు మనకేదో ఇబ్బంది పెట్టాడు పారిపోవడం, మనకన్నా తక్కువ బలమున్నవాడు కనపడ్డాడు వాడ్ని ఏడిపించడం, ఈ ఏడిపించేటప్పుడు సిగ్గేయదు ఆ ఓడిపోయినప్పుడూ సిగ్గేయదు రెండు చోట్ల సిగ్గు లేకపోతే అవమానము ఇలాంటివేముండవు. ఎప్పుడూ ఉండేది ఏదంటే రెండు కాలములయందు కూడా దుఃఖపెట్టే ప్రయత్నము ఒకటి ఉంటుంది, ఆ ప్రయత్నంలో తను విజయం సాధిస్తే విజయం సాధిస్తుంది, విజయం సాధించకపోతే వెళ్ళిపోతుంటుంది. ఇక్కడా ఈవిడకి శూర్పణఖకి ఒక్క తేడాఒక్కటి కనపడుతుంది, అరణ్యకాండలో మహర్షి ఇద్దరికి ముక్కు చెవులు కోయిస్తారు, ఆడ రాక్షసులకి అందులో ఒకరు శూర్పణఖ ఒకరు అయోముఖి ఇద్దరూ రాక్షసి అయినటువంటివారే, కాని ఒకరు పగ పెంచుకునే తత్వము ఉన్నవారు ఒకరు పగ పెంచుకోకుండా అవకాశం దొరికితే ఏడిపిస్తారు అవకాశం దొరకకపోతే పారిపోతారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒకరికన్నా ఒకరు ప్రమాదం తక్కువా అని కాని ఒకరికన్నా ఒకరు ప్రమాదం ఎక్కువా అనికాని చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే పగపెంచుకునే స్వభావమూ ప్రమాదకరమే పగ పెంచుకోకుండా తనకన్నా తక్కువబలవంతుడు కనపడితే ఆ తక్కువ బలవంతుడిని నిగ్రహించడం కూడా ప్రమాదకరమే కదా..? ఎక్కువ బలవంతుడుకదా అనిచెప్పివచ్చి వాళ్ళకేమన్నా వాళ్ళొచ్చి వీళ్ళని ఇబ్బందిపెడితే వాళ్ళు అప్పటికి పారిపోతారు, పారిపోయారని జాఢ్యమో సమస్యా వదిలిపోయినట్టుకాదు మళ్ళీ వస్తూ ఉంటారు. ఎప్పుడు తెలుస్తుంది తనకన్నా అధిక బలవంతుడని తను ఓడిపోతే, ఓడిపోతే ఏమైనా సిగ్గుంటుందా ఏమీ ఉండదు మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడొస్తుంది మళ్ళీ ఇంకోడు దొరికితే మళ్ళీ వస్తుంది, వాడూ అధికబలవంతుడూ అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది తక్కువ బలవంతుడైతే ఇబ్బందిపెడుతుంది. అంటే ఆ మనస్తత్వం ఎటువంటిదీ అంటే దానికి మార్పు అన్నది కానీ పాఠం నేర్చుకోవడం అన్నది కానీ ఏమీ ఉండదూ...
సమాజంలో తాను తిరుగుతూ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి తాను ప్రతిరోజూ సమన్వయమౌతూ కూడా తాను ఏ పాఠాన్ని తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలనుంచి నేర్చుకోకుండా ఒకేరకమైన మోసపోసిన జీవితంతో బ్రతికేస్తూ ఆ అవకాశం దొరికినప్పుడు నేను గొప్పవాడినని అవకాశం లేనప్పుడు తను తక్కువ వాణ్నినన్న బాధలేకుండా పారిపోయేటటువంటి మనస్థితితో సరిపెట్టుకోగలిగినటువంటి స్థితి ఉన్నవాళ్ళు ఎవ్వరైనా అయోముఖి తత్వంలోకే వస్తారు. అంతకన్నా ఇంకాకొంచెం చెప్పడం కష్టం... మీకు సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉండరని మీరు అనుకుంటున్నారా..! చాలా మంది ఉంటారు, బలవంతుడు కనపడితే ఓడిపోతారు వాళ్ళకేం సిగ్గుండదు, మన ఎదురుగుండా వాళ్ళకి జరిగిన అవమానానికి మనం సిగ్గుపడతాం, అరె నిజంగా రేపు ఎలా తలెత్తుకు తిరుగుతాడురా ఎలా కనపడుతాడురా మళ్ళీనీ  ఇంత అవమానం పొందాడు నిన్న ఆయనా... తరువాతి రోజు పొద్దున ఎలా వస్తాడో తెలుసా..? అసలా సంఘటనే జరగనట్లు వస్తాడాయన చాలా మంది ఉంటారు ఇలాగ అంటే పేర్లు పెట్టి చెప్పడం బాగుండదు మీరు గ్రహించగలరు. ఉద్ధతితో ప్రవర్తిస్తారు ఎక్కడో దెబ్బతింటారు తిని సిగ్గుపడ్డం ఏమీ ఉండదు, మనకన్నా చాలా సంతోషంగా ఉంటాడు ఆయన, అదేంటీ అవమానం పడ్డాడుకదా రాత్రి నిద్రపోయిండడు పాపం కుమిలిపోయుంటాడేమోనని మీరు పలకరించడానికి వెళ్ళారనుకోండి ఆయన మిమ్మల్ని ఎలా పలకరిస్తాడో తెలుసా..! అంతబాధపడుతావెందుకోయ్ దానికి అంటాడు, మనల్ని అడుగుతాడు బాధపడుతావెందుకని పెద్ద విశేషమేముందు అంటాడు.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఒకవేళ అతడు విజయం సాధించాడనుకోండీ... మీరసలు పట్టుకోనేలేరు ఈ మనః ప్రవృత్తి అత్యంత ప్రమాదకరం అది ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేరు, వీళ్ళవల్ల ప్రమాదం ఎక్కడొస్తుందంటే..? వాళ్ళకేం ఉండదు, వాళ్ళకీ... ఒకరకంగా వాళ్ళకేంటంటే ఎప్పుడూ అలాగే గడిపేస్తూ జీవితాన్ని జీవించేస్తుంటారు. వాళ్ళని అంటిపెట్టుకుని ఉన్నటువంటివాళ్ళ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఏమిట్రా వీడికి మానావమానాలు లేవు వీడితో ఉండడం.?, ఆయనకో కొడుకు ఉన్నాడనుకోండి ఆ కొడుక్కి మానావమానాలు ఉన్నాయనుకోండి ఆయన చాలా ఇబ్బందిపడుతాడు, మా నాన్నగారు... చెప్పలేడు తండ్రికి, మా నాన్నగారు ఏమీ తెలుసుకోరు ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారు, ఇదీ చాలా కష్టంగావుందీ అని తనుబరువౌతుంటారు, తాను బరువయ్యేటటువంటి పరిస్థితి ప్రవర్తన మంచి ప్రవర్తనకాదు, అది దిద్దుకోవాలి ఎవ్వరైనా సరే దిద్దుకోవలసి ఉంటుంది దాన్ని. శ్రీరామాయణం కేవలం ఒక జరిగిపోయినటువంటి కథా అని మీరు వినాలి అనుకుంటే..? రామ చంద్ర మూర్తి ఒక నరుడిగా అవతారాన్ని స్వీకరించి ఈ పాత్రలన్నిటితోటీ సమన్వయం కావలసినటువంటి అవసరం ఆయనకు లేదు.
Related imageవాల్మీకి మహర్షి ఇన్నింటిని గ్రంథస్తం చెయ్యక్కరలేదు ఆయన కొన్ని కొన్ని వదిలిపెట్టేసైయ్యెచ్చు, అయోముఖీ వృత్తాంతం మీరు విన్నప్పుడు పైకి ఎలా అనిపిస్తుందంటే కేవలం కథా భాగం కింద వింటే ఈపాటిదానికి అసలు అరణ్య కాండలో ఈ స్థానం అవసరమా అనిపిస్తుంది, కాని మీరు లోతుగా తరచి చూస్తే ఒక మనిషి తననితాను దిద్దుకోవడానికి ఏవేవి అవసరమో అవన్నీ మనకు రామ చంద్ర మూర్తి చూపిస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు లంబోదరీం తీక్ష్ణ దంష్ట్రాం కరాళాం పరుష త్వచం ఆవిడా చాలా పెద్ద కడుపు కలిగినటువంటిది, పెద్ద పెద్ద కోరలున్నాయి చాలా పరుషమైనటువంటి అంటే మందమైనటువంటి చర్మము కలిగినటువంటిది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంటూందీ అంటే భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్త మూర్ధజాం !  ఆమె భయంకరమైన నవ్వు నవ్వుతూ కనపడినటువంటి మృగములు ఏవి దొరికితే ఆ మృగములను తింటూంటుంది వికటాం వికటమైనటువంటి నవ్వు నవ్వుతూంటుంది ముక్త మూర్ధజాం కేశములు సంస్కరింపబడి ఉండవు, ఆ జుట్టంతా విరబోసుకొని ఉంటుంది. ఇదీ ఒక ధారణమైనటువంటి ప్రవృత్తి నేను మన్నింపబడెదనుగాక నేను రామాయణం చెప్తున్నాను అంతే నేను ఎవ్వరిని ఉద్దేశించి చెప్పడమూ నా ఉద్ధేశ్యం కాదు. స్త్రీ కేశపాశం కింద కట్టబడి ఉండి తీరాలీ అని శాస్త్రవాక్కు, “స్త్రీ కేశపాశం కిందకాని చల్లుకుపోయి ఉంటే విచ్చుకుని ఉంటే అది దేశానికి కూడా అరిష్టము” అని అంతే అంతకన్నా ఇంక అక్కరలేదు కాబట్టి భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్త మూర్ధజాం ఆమె జుట్టు చల్లుకుపోయి ఉంది, అదే రాక్షసీత్వం అన్నమాటకు అర్థము. అంటే తను బాగున్నానని తను అనుకుంటే చాలు, ఆ అపచారమువల్ల ఇతరులు పోయినా తను పట్టించుకోక్కరలేదు.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
Image result for అయోముఖిఅహం తు అయోముఖీ నామ లాభ స్తే త్వం అసి ప్రియః ! నాథ పర్వత కూటేషు నదీనాం పుళినేషు చ !! ఆయుః శేషం ఇమం వీర త్వం మయా సహ రంస్యసే !! ఆవిడ అంటూందీ నా పేరు అయోముఖి, ఆవిడ దృష్టి లక్ష్మణ మూర్తి మీద పడింది రామ చంద్ర మూర్తి పైన పడలేదు ముక్కు చెవులు కోయించుకునే వాళ్ళందరి దృష్టి లక్ష్మణుని మీద పడుతుందో ఏమోమరి... ఆవిడందీ నీవే నాకు తగినటువంటి భర్తవి అంతే ఆవిడే నిర్ణయం చేసుకుంది, శూర్పణఖ ఎలా నిర్ణయం చేసుకుందో అలాగే ఆవిడా నిర్ణయం చేసుకుంది. కాబట్టి ఇక నీవు శేష జీవితమంతా కూడా నాతో ఆ నదుల యొక్క ఒడ్లయందు పర్వత శిఖరములయందు విహరిస్తూ సంతోషంగా గడుపుదువుగాని కాబట్టి నీవు నాతో సంతోషంగా గడపడం కోసం రా మనిద్దరం భార్యా భర్తలమై గడుపుదాం అని ఆమె లక్ష్మణున్ని పట్టుకుంది. పట్టుకుంటే ఏవం ఉక్త స్తు కుపితః ఖడ్గం ఉద్ధృత్య లక్ష్మణః ! కర్ణ నాసౌ స్తనౌ చ అస్యా నిచకర్త అరిసూదనః !! ఆ పట్టుకున్నటువంటి అయోముఖి యొక్క ముక్కు చెవులు స్థనములు వీటిని తన కత్తిపెట్టి ఆయనా తెగ కోసేశాడు, తెగ కోసేస్తే ఆవిడ లక్ష్మణున్ని విడిచిపెట్టేసింది, విడిచిపెట్టేసి అరణ్యంలోకి పెద్ద రవం చేస్తూ ఏడుస్తూ నెత్తురు కారిపోతూ పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అంటే యుక్తా యుక్త విచక్షణ లేనటువంటి నడువడితో తనుకామిస్తే చాలు ఇతరుల యొక్క అభిప్రాయంతో సంబంధంలేకుండా బలవంతులు కనపడితే పరాభవింపబడి బలహీనులైతే తననకుంటున్న కామాన్ని చెల్లించుకుంటూ జీవితం గడపగలగినటువంటి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి స్థితిలో ఉన్న ఒక ప్రాణి.
కాబట్టి ఇక అయోముఖి ఈ కాండలో ఏమీ ఇంక మనకు కనపడదు ఆవిడా, కాబట్టి ఆవిడ అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది, ఎందుకు శ్రీరామాయణంలో ఈ పాత్ర కనపడింది అన్నదాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. మొదట శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోతాయి, ఇక్కడ అయోముఖీకీ ముక్కు చెవులు తెగిపోతాయి, కాని ముక్కూ చెవులు తెగితే మనం ఉలిక్కి పడుతాము, ఎందుకంటే శ్రీరామాయణంలో అరణ్యకాండ మొదట్లో ఒక ఆడదాన్ని ముక్కు చెవులు ఇలా కామంతో వస్తేనే కోసిన కారణానికి సీతాపహరణం జరిగింది, ఇప్పుడు మళ్ళీ కోశాడు ఏమౌతుందో..? అని అనిపిస్తుంది కానీ ఏమీ అవ్వదు అయోముఖీ వెళ్ళీపోయింది. కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి తేడాని మీరు గమనించవలసి ఉంటుంది, ఆవిడది పగా ఈవిడది పగా ప్రతీకారము పెంచుకుని సాధించేటటువంటి మనస్తత్వం కాదు లక్ష్మణ స్తు మహా తేజాః సత్త్వవాన్ శీలవాన్ శుచిః ! అబ్రవీత్ ప్రాంజలి ర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం !! మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు చాలా ధర్మ సూక్ష్మణులను గ్రహించవలసి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది రామాయణం అందుకే రామాయణం జీర్ణమైతే అన్నగారిని గౌరవించే తమ్ముడు కనపడితే మీకు ఒంట్లో పులకింతవస్తుంది లక్ష్మణ స్తు మహా తేజాః సత్త్వవాన్ శీలవాన్ శుచిః ఆయనా రామ చంద్ర మూర్తితో మాట్లాడుతున్నాడు, ఎవరూ లక్ష్మణుడు అయోముఖీ పారిపోయి ఇద్దరూ నడుస్తున్నారు, ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనకు ఏదో రాముడితో మాట్లాడలని అనిపించింది.
ఎలా మాట్లాడాడో తెలుసాండీ..! ఇలా ఎడం చేత్తో రామా! అని పిలిచి కూడా మాట్లాడవచ్చు మాట్లాడాలంటే, కాని ఆయన ఎలా మాట్లాడడంటే అబ్రవీత్ ప్రాంజలి ర్వాక్యం ఆయన మాట్లాడేటప్పుడు అంజలి ఘటించి రాముడితోటి అన్నయ్యా! అని ఇలా నమస్కారం చేసి మాట్లాడుతాడు, ఎందుకంటే చాలా చోట్ల చెప్పుకున్నాడు లక్ష్మణుడు నేను రామున్ని అన్నగా

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
చూడను రామున్ని నా గురవుగా చూస్తాను అందుకనీ ఎప్పుడూ అంత గౌరవంతోనూ ఉంటాడు. అందుకే రామాయణం బాగా అనుభవించకుండా రామాయణంలోది ఏదీ గీచే ప్రయత్నం చేయకూడదు, అలా ప్రయత్నం చేస్తే ఏమౌతుందో తెలుసాండీ చూసేవారికి అలా ఉంటాడులా  అలా ఉంటాయిలా అందులో ఉన్న వ్యక్తిత్వాలు అని అనిపిస్తుంటూంది. శబరి పళ్ళు తీసుకొచ్చి రామునికి పెడుతుంటే రాముడు పుచ్చుకుంటుంటే రాముడు కూర్చున్న అరుగుమీద లక్ష్మణుడు ఎడమకాలు ఎత్తిపెట్టినట్టుగా ఉన్నట్లు ఉందనుకోండి ఒక ఫోటో అలా ఉంటాడా ఎప్పుడైనా లక్ష్మణుడు... అవి ఏమౌతాయంటే చూసేవాళ్ళ హృదయాల్లో తప్పుభావాలు ఎక్కుతాయి కాబట్టి శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. గమనించకుండా చేతిలో కలం ఉండడం వేరు రామాయణాన్ని గీయడం వేరు రామాయణాన్ని గీయాలీ అంటే రామాయణాన్ని చదివి రామాయణాన్ని గురించి కొంత అధికారం ఉండాలి. రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తిత్వాలు బహు విశిష్టమైనవి, అంత విశిష్టమైనటువంటిది అందులో ఉన్నటువంటి ఘట్టాల గురించి ఏదైనా కూర్పు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను దేన్ని దృష్టిలో పెట్టుకుని అన్నానో మీరు గమనించి ఉంటారు.
కాబట్టి ఇప్పుడు అబ్రవీత్ ప్రాంజలి ర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం అంజలి ఘటించి రామ చంద్ర మూర్తితో మాట్లాడుతున్నాడు స్పన్దతే మే దృఢం బాహుః ఉద్విగ్నమ్ ఇవ మే మనః ! ప్రాయశ శ్చాపి అనిష్టాని నిమిత్తాని ఉపలక్షయే !! నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూంటాను శ్రీరామాయణం ఒక ధర్మ శాస్త్రం శ్రీరామాయణం పరిపాలనా శాస్త్రం శ్రీరామాయణం జోతిష్య శాస్త్రం శ్రీరామాయణం శకున శాస్త్రం మీరు ఎలా చూస్తే రామాయణం మీకు అలా కనపడుతుంది, కాదు పక్షుల గురించి తెలుసుకోవాలా? రామాయణం చదవచ్చు, పర్వతాల గురించి తెలుకోవాలా? రామాయణం చదవచ్చు, భౌగోళిక శాస్త్రం పరిశీలనం చెయ్యాలా? రామాయణంలో తెలుసుకోవచ్చు, మృగములు గురించి తెలుసుకోవాలా శ్రీరామాయణం చదువుకోవచ్చు మీరు ఏది తెలుసుకోవాలన్నా రామాయణం చదువుకుంటే మీకు అందులో తెలియనివి ఉండవు. ప్రతి శ్లోకమూ అంమృతభాండమే, ప్రతి శ్లోకంలో మహర్షీ సందేశాన్నినింపి ఉంచుతారు. అందుకే ఆయన ఈయనతో మాట్లాడాడు అని ఆయన చెప్పరు, అలా చెప్పడం చాలా తేలిక అలా చెప్పరు, మాట్లాడేటప్పుడు ఎలా నిలబడి మాట్లాడాడు చెప్తాడు. ఒకాయనొచ్చాడు ఎవరు ముందులేచారు ఎవరు తరువాత లేచారు, ఎవరు ఎవరికి ఆర్ఘ్యమిచ్చారు పాద్యమిచ్చారు ఎవరు ఎవరితో ఏ ప్రశ్నవేశారు ఎవరు ఎలా జవాబు చెప్పారు. ఒక సంఘటన అయిపోయిన తరువాత రాముడు అన్ని లక్ష్మణునితో చెప్తూంటాడు. రాముడు లక్ష్మణునికి చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా చదవాలి ఆ సర్గని అందులో ఒక అత్యుత్తమమైనటువంటి సందేశం ఒకటి ఉంటుంది రాముడు ఒక సర్గ చివర ఒక వ్యక్తితో తాను చూసి మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు లక్ష్మణునితో చెప్తాడు, చూశావా లక్ష్మణా మనం ఇవ్వాళ ఇది చేశాముగదా దీనివల్ల ఇదన్నమాట ఫలితం అంటాడు. గురువుతో తిరిగేటటువంటి శిష్యుడికి అందే మహోత్కృష్టమైన ప్రయోజనం అదే. మీరు ఎన్నో శాస్త్రాలు మదిస్తే తప్పా అందనటువంటి విషయం అలవోకగా అందిపోతుంది, ఎందుచేతనంటే ఆయన అవలోకగా అనుభవించి ఉన్నాడు, ఆయన చదివి ఉన్నాడు, ఆయన మీకు అలా అందిచేస్తుంటాడు, ఆయన నడవడిని మీరు గమనిస్తూంటే చాలు మీకు అవన్నీ అందిపోతుంటాయి.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
చాలా తెలిగ్గా అందిపోతుంటాయి ఇది ఒక గురువు వెనకాతల ఉండేటటువంటి శిష్యునికి ఎలా ఉంటుందో ప్రాజ్ఞుడైన అన్నగారిని గురువుగా భావించి వెడుతున్నటువంటి లక్ష్మణుడికి అందుతున్న ఐశ్వర్యం అది, అది తరిగిపోని చెరగిపోని ఐశ్వర్యం అందుకే రాముడితో కలిసి ఉండడమే ఆయన ఐశ్వర్యం అందుచేత లక్ష్మణుడు అయ్యాడు. కాబట్టి చూడండీ ఇప్పుడు ఆయన అంటున్నాడూ స్పన్దతే మే దఢం బాహుః అన్నయ్యా! నా భుజం అదురుతూంది ఎడం భుజం, ఎడమ భుజం పురుషునికి అదిరితే అది అశుభ సూచన, ఏదో దుర్నిమిత్తము జరగకూడనిది జరిగుతోందీ అని ఉద్విగ్నమ్ ఇవ మే మనః నిష్కారణంగా నా మనసు తొట్రుపడుతోంది తొత్తరరపడుతోంది ఎందుకో ఉద్విగ్నతకు లోనవుతున్నాను కాబట్టి ప్రాయశ శ్చాపి అనిష్టాని నిమిత్తాని ఉపలక్షయే ఏదో భయంకరమైనటువంటి సంఘటనా మనసుకు పరివేదన కల్పించేటటువంటి సంఘటనా జరగబోతూందీ అని నాకు అనిపిస్తూందీ ఇప్పుడూ ఒక సంఘటన జరగబోతూందీ... అదేదో చాలా క్లేషమైనటువంటి విషయమే అందులోంచి బయటికివస్తావా బయటికిరావా..? అది ప్రధానం.
జబ్బొచ్చింది రైటే డాక్టరిగారి దగ్గరికి వెళ్ళి చేయించుకోండీ అన్నారు చేయించుకుంటే బతుకుతానాండీ అని అడుగుతారాలేదా..? అడుగుతాం కదా చేయించుకుంటే బతుకుతామాండీ అని అడుగుతారు అలాగే... బయటికొస్తావా రావా... దుర్నిమిత్తం కనపడుతోంది జరగకూడనిది జరుగుతోంది అని తెలుస్తోంది బయటికొస్తావా... కేవలం జరిగేది మాత్రమే చెప్తే బయటికొస్తావోరావో చెప్పనటువంటి అసమగ్రమున్నట్టు, సమగ్రత ఎప్పుడున్నట్టూ ఒక జరగకూడనిది జరుగుతుంది కాని నీవు బయటికొస్తావు అన్న విషయంలో బయటికి రావు అన్న విషయం కూడా చెప్పాలి, నిన్న రాముడు వస్తున్నప్పుడు కొన్ని దుర్నిమిత్తాలు చెప్పాను ఖచ్చితంగా ఏదో అమంగళం జరిగిపోయిందీ అన్నాడు రాముడు, ఏదో బాధాకరమైనటువంటి విషయం జరిగిపోయింది ఎందుకంటే శకునాలు అలా ఉన్నాయి అన్నాడు సీతాపహరణం అయిపోయింది, ఇవ్వాళ లక్ష్మణుడు చెప్తున్నాడు శకునాలు ఇవ్వాళ లక్ష్మణుడు చెప్పేటప్పుడు భయంకరమైనది జరుగుతుంది కాని పైకి వస్తావు అంటున్నాడు, ఎందుకు పైకొస్తారో ఇప్పుడు శకునం ఇంకోటి చెప్తారు నేను అందుకే మీకు చెప్పింది మళ్లీ శకున శాస్త్రం ఏం మీరు చదవక్కరలేదు రామాయణం చదివితే శకున శాస్త్రం వచ్చేస్తుంది అంతే... రామాయణం చదివితే మీకు తెలియకుండా మీకు జోతిష్యంలో కొన్ని విషయాలు తెలిసిపోతాయి.
నిన్న అనలేదూ... జటాయువు వింద ముహూర్తం గురించి మాట్లాడాడు, అందుకనీ ఏష వంచులకో నామ పక్షీ పరమ దారుణః ! ఆవయోః విజయం యుద్ధే శంసన్ ఇవ వినర్దతి !! అన్నయ్యా! వంచులకమూ అనబడేటటువంటి పక్షి కూస్తోంది, ఆ కూత వినపడుతోంది, అది నీజంగా ఆ రామ లక్ష్మణులకి ఆ పరిజ్ఞానం ఇందుకేనేమో ఆ బాల కాండలో విశ్వామిత్ర మహర్షి ముందుగానే వాళ్ళని అరణ్యాలన్నీ తిప్పి తీసుకెళ్ళి తీసుకొచ్చేశారు. ఎదర అవసరమౌతుంది ఈ జ్ఞానమంతానూ అనుకున్నారో ఏమో ఆయనా కాబట్టి ఆయనా పక్షి అరుపుని బట్టి చెప్పాడు వంచులకము అనబడేటటువంటి పక్షీ కూస్తుంది అన్నయ్యా ఆ పక్షి కూస్తే... చాలా తొందరగా యుద్ధం వస్తుంది, చాలా హఠాత్తుగా వచ్చేస్తుంది యుద్ధం కానీ ఆ యుద్ధంలో జయాన్ని పొందుతాం కాబట్టి నాకు ఇటువంటి శకునములు కనపడుతున్నాయి అని అన్నాడు అంతే.
ఒక పెద్ద శబ్దం ఎంత పెద్ద శబ్దం అంటే ఆ శబ్ధం ఎటువంటిదీ అని మీరు అర్థం చేసుకోవలసి ఉంటుందంటే ఒక్కటే ఉపమానం చెప్పవలసి ఉంటుంది అంతరిక్షం వరకూ ధ్వని వినపడేటట్టు ఒక పిడుగుపడితే ఎటువంటి ధ్వని ఉంటుందో అంత ధ్వని అక్కడ వినపడింది. అంటే ఇప్పుడు మీరు ముందు ఒక విషయమును గమనించవలసి ఉంటుంది మహర్షి హృదయమేమిటో తెలుసాండీ! రాముడు బాల కాండలో శివ ధనస్సుని ఎక్కుపెట్టినప్పుడు ధనుర్భంగమైంది, విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు జనకుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిలబడినవాళ్ళు లేరు. శబ్దము అనబడేటటువంటిది సామాన్యమైనది కాదు శబ్దమువేరు ధ్వని వేరు మీరు ఈ రెండిటికీ తేడా తెలుసుకోవాలి. శబ్దము అర్థ ప్రతిపాదకము శబ్దం ఎప్పుడు కూడా అర్థంతో ఉంటుంది. ధ్వని అర్థ ప్రతిపాదకము కాదు, ధ్వని రాపిడి వలన రావాలని నియమం లేదు శబ్దము రాపిడివలన వస్తుంది ఎప్పుడైనా అంటే శబ్దములన్నీ కూడా అర్థ ప్రతిపాదకములో లేదా మనస్సుకి సుఖదాయికములో అయి ఉంటాయి. అందుకే ఘర్షణచేత పుడుతాయి. నేను మీకొక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తున్నదాన్ని శబ్దము అని అనవలసి ఉంటుంది.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఎందుకంటే నా మూలాధార చక్రం దగ్గర్నుంచి లాగబడినటువంటి వాయువు అనేక చక్రాలకి తగులుతూ పైకి వస్తుంది, పైకి వచ్చేటప్పుడు ఒరిపిడి చెందుతుంది, రాపిడితో రాసుకుంటుంది చిట్ట చివరా నా యొక్క స్వరపేటిక దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాయువు బాగా రాపిడి చెంది ఒరుసుకొని అక్షరములుగా పదములుగా వాక్యములుగా మారి నానోటి వెంట బయటికి వస్తూంటుంది, ఒరిపిడి చేత బయటికి వస్తూంటుంది. నేను ఒక వయోలిన్ వాయించాననుకోండీ చేతితో ఒక తాడు ఉన్నటువంటి పరికరం లాంటిది పట్టుకునీ తీగలమీద లాగితే ఆ ఒరిపిడికి ధ్వని వస్తుంది. ఒక వీణని గోటితే పెనగితే ధ్వని వస్తుంది అలా మీకు ఎప్పుడైనా సరే ఒరిపిడి వలన వస్తే అంటే ఘర్షణ వలన పుడితే దాన్ని ʻశబ్దముʼ అంటారు, ఇప్పుడు ఆ శబ్దము ఏం చేస్తుంది, అందుకే వేదరాశికి శబ్దరాశి అనిపేరు. అర్థప్రతిపాదకమై దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది, ప్రయోజనం లేనిదీ అనుకోండి దానికి ఏమిటీ అంటే మీరు చెప్పలేరు అనుకోండి అప్పుడుదాన్ని శబ్దము అనకూడదు ʻధ్వనిʼ అనాలి. పిల్లాడు ఆడుకుంటూ గుంగా అన్నాడనుకోండి దానికి అర్థమేమిటి చెప్పండి అన్నాడనుకోండి ఏం చెప్తారు, గుంగా అన్నాడు చంటిపిల్లాడు ఏమయ్యా నీవ్వు రామాయణం చెప్పావుకదా దీనికి అర్థం చెప్పు అన్నాడనుకోండి ఎవరు చెప్తారు దానికి అప్పుడు దాన్ని ఏమనాలంటే ధ్వని అనాలి, అంటే దానికిక అర్థమేం ఉండదు. అర్థం లేకుండా చేయబడేటటువంటిది ఏదుంటుందో దానికి మీరు ఏ అర్థం చెప్పడం కుదరదో వాటికి ధ్వనులని పేరు.
Image result for ఉరుము పెద్ద శబ్దంకాబట్టి ఇప్పుడు ఏర్పడినది శబ్దమా ధ్వనా..? అంటే యదార్థమునకు పెద్ద ధ్వని అని మీరు అనవలసి ఉంటుంది, ఎందుకంటే దానికొక అర్థంలేదు కాని ఒక పిడుగు నేలమీద పడితే ఆ ధ్వని అంతరిక్షము వరకూ వినపడితే ఎంత ధ్వని ఉంటుందో అంత ధ్వని ఉంటుంది. అంత ధ్వని ఉండేటటువంటి లక్షణమేమిటో తెలుసాండీ ధ్వనికి కానివ్వండీ శబ్దమునకు కానివ్వండీ ప్రాణాలు పొయ్యగలదు ప్రాణాలు తియ్యగలదు రెండు ఉంటాయి ఎందుకో తెలుసాండీ, ఒక్కొక్కసారి ప్రాణం పోస్తుంది ఒక్కొక్కసారి ప్రాణం తీసేస్తుంది. మీరు చూడండీ నిచ్చేష్టుడైపోయాడనుకోండి ఎవరో మీరు వెళ్ళి ఏ చపట్లు కొట్టడమో చేస్తే స్పృహలోకి వస్తారు, తీసుకొస్తుంది దానికి ఆ శక్తి ఉంటుంది, శబ్దము మిమ్మల్ని జ్ఞానవంతుల్ని చేస్తుంది లేకపోతే వినడమెందుకండీ, వినడం వల్లా ఏదో మీకు తెలుస్తుందనికదా వింటూ ఉంటారు. అదే శబ్దము చాలా తీవ్రస్తాయిలో వచ్చిందనుకోండి మనిషి ప్రాణం వదలిపెట్టేస్తాడు అందుకే పిడుగుపడితే పిడుగు యొక్క ధ్వనికి ఆ భవనములు భవనములు కింపడిపోతుంటాయి అక్కడ ఉన్నటువంటి చెట్లు జీవరాశి కూడా నేలకొరిగిపోతుంటాయి ఎందుకనీ అంటే ఆ శబ్ద ప్రకంపనలు ధ్వని ప్రకంపనలయందు శక్తి తరంగములుంటాయి, దీన్ని మొట్ట మొదట ప్రతిపాదించినవాళ్ళు ఎవరంటే భారత దేశంలో ఆర్ష ధర్మంలో ఋషులు ప్రతిపాదించి కదలిక ఉన్న ప్రతిదాన్ని శక్తి శ్వరూపంగా భావన చేశారు మనవాళ్ళు అందుకే శబ్దబ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి తత్వాతీతమయి నిరంజనమయి నిత్యానందమయి పరాత్పరమయి మాయామయి అని అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మవారి స్తోత్రం చేశారు

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి కదులుతున్నది ఏదైనా శక్తిగా భావన చేశారు, కదిలి కదిలి ఇక కదలవలసిన అవసరం లేని రీతిలో నీలో నీవు అనుభవించవలసిన ఆనందాన్ని శివుడిగా సంకేతించారు, కాబట్టి ఇప్పుడు శివ శక్తులు రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి, ఈ రెండిటిని మీరు వేరు చేసి చూడటమనేది ఎప్పుడు కుదరదు.
Image result for పార్వతీ పరమేశ్వరులుఅందుకే ఈ ప్రపంచమంతా కూడా పరమశివ పార్వతి తాండవ లాస్య స్వరూపమూ అన్నారు శంకరాచార్యులవారు, లాస్యము అంటే భావము తాండవము అంటే కదలిక మీరు చూడండీ మీకు ప్రపంచమంతా శివ స్వరూపంగా మంగళ శ్వరూపంగా చూడడం ఎలాగా అంటే దానికి ఆ దృష్టికోణాన్ని శంకరులు అందించారు అందుకని వారు జగద్గురువులు అయ్యారు. కదలకుండా ఉండదు ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నాను... కదులుతుంటాను కదులుతూ ఉండడము శివ స్వరూపము ముఖమునందు భావ ప్రకటనము అమ్మవారు లాస్యము. ఒకాయన నవ్వుతుంటాడు ఒకాయన విచారంగా ఉంటాడు ఒకాయనా సంతోషంగా ఉంటాడు ఒకాయన హాస్యమాడుతుంటాడు మీరు అలా వెడుతూ చూస్తూ ఉంటే... రకరకాల భావనతో ఉంటారు అందరూ ఒక్కలా ఉండరు ఇన్ని భావనలు అమ్మవారు ఇన్ని కదలికలు ఈశ్వరుడు కదలిక భావన కలిసే ఉంటాయి ఎప్పుడూనూ చూడండి కలిసే ఉంటాయి అనేటప్పటికి నేని ఎలా అన్నానో ఇలా అన్నాను అంటే లోపల కలయిక అన్న భావన రాగానే నేను ఇలా సంకేతించాను ఈ భావనా ఈ కదలిక రెండు ఒకదాన్ని ఒకటి అనుసరించడం వాగర్ధ వివసంప్రుక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే ! జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ !! వాళ్ళిద్దరి స్వరూపమై ఈ జగమంతయు ఉందయా పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమంతా నిండి ఉన్నారు. నీవు అలా చూడగలిగితే జగత్తు తాండవ లాస్య స్వరూపము అని.
కాబట్టి దాన్ని వాల్మీకి మహర్షి ఎందుకండీ అంత గొప్పగా ఆవిషయం కూడా మాట్లాడటం అంటే అది ఇంకొకడు వింటే చచ్చి ఉండేవాళ్ళు, తట్టుకోగలిగారూ అంటే ఇప్పుడు దాని మూలస్థానమును కూడా ఛేదించగల పరాక్రమవంతులు చెవికే అంత బలముంటే చేతులకు ఎంత బలముండాలి కాబట్టి ఇప్పుడు మూలస్థానాన్ని ఛేదించగలరు, ఇదీ రామ చంద్ర మూర్తి యొక్క లక్ష్మణుని యొక్క వీర్యము పరాక్రమము. మీతో నేను చాలా మార్లు మనవి చేస్తున్నాను వీర్యము అన్న మాటకు అర్థము అదే ఎదుట వస్తున్నటువంటి ఎదిరింపునకు లేదా తనతో తలపడుతున్నటువంటి స్థితిలో ఉన్న ఎదురుగుండా కనపడుతున్నటువంటి ప్రతిధ్వంది యందు, లోపల తాను చెక్కు చెదరక ఎదుటివాడిని చెక్కు చెదిరిపోయ్యేటట్టు చెయ్యగలిగినటవంటి ప్రజ్ఞకి వీర్యమని పేరు. ఇది లోపల నిగుడీకృతమై ఉంటే పరాక్రమని పేరు. కాబట్టి ఈ వీర్య పరాక్రమాలు  ఉన్నవారు కాబట్టి అందుకని అడిగారు వాల్మికి మహర్షి కో నశ్విన్ సామ్ర్పతిం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ! ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ! చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః ! విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ! ఆత్మవాన్ కో జిత్రక్రోధో ద్యుతిమాన్ కో నసూచియకః ! కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ! ఇన్ని ప్రశ్నలు వేయడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు వారు ఆ ధ్వనిని విని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత పెద్ద ధ్వని ఎక్కడ్నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు వారు ఆశ్చర్యపోయేలోపలే వారికి ఎదురుగుండా ఒక స్వరూపమొకటి కనపడింది, ఒక పెద్ద ఆకారమొకటి కనపడింది.
ఆకారము అన్నమాట నేను ఎందుకు అనవలసి ఉంటుందంటే చూడగానే గుర్తుపట్టగలిగితే ఇది ఫలానా అని గుర్తుపట్టగలిగారనుకోండి మీ ప్రజ్ఞకి అందుతూందనిగుర్తు, ఇలా చూస్తే మనిషి అన్నాననుకోండి నా ప్రజ్ఞకి అందింది జింక నా ప్రజ్ఞకి అందింది లేడి నా ప్రజ్ఞకి అందింది సర్పము నా ప్రజ్ఞకి అందింది. అసలు అటువంటి రూపం ప్రపంచంలో ఎక్కడా

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
Image result for నామము రూపమువర్ణింపబడలేదు తాను చూడలేదు, నేను చూడకపోవచ్చు విన్నాననుకోండి తెలుస్తుంది ఒక హంస నేను చూడలేదు కాని కనపడిందనుకోండి నేను చూడలేదు కాని హంసకనపడిందనుకోండి ఇది హంస అనుకుంటానండీ అంటారు, మళ్ళీ ఇదో విచిత్రం తెలుసాండీ నామముంటే రూపముంటుంది రూపముంటే నామముంటుంది నామం రూపం కలిస్తే మాయమౌతుంది. అదే విచిత్రం శంకరభగవత్ పాదుల యొక్క ప్రతిపాదనంతా దీనిమీదే ఆధారపడి ఉంది. నాముంటే రూపముంటుంది, రూపముంటే నామముంటుంది. కోటేశ్వరావు గారు అన్నారనుకోండి మీకు వెంటనే నా రూపం మీ మనసులో అవలీలగా కదులుతుంది చూస్తున్నారుగా చాలా రోజులనుంచి కోటేశ్వరరావు అనేటప్పటికి నేను ఇలా వస్తూంటే ఆ కోటేశ్వరరావుగారు వస్తున్నారు అంటారు. అంటే నా రూపాన్ని నామంతో గుర్తిస్తారు, అలా ఇంకోళ్ళు వస్తున్నారనుకోండి కోటేశ్వరావుగారు వచ్చారాండీ అన్నారనుకోండి ఎవరైనా కొత్తవాళ్ళు ఆయన కాందండి రాలేదండి అంటారు. నామము రూపము పక్క పక్కనే ఉంటాయి ʻకుండాʼ అన్నాననుకోండి కుండ ఎలా ఉంటుందో మీకు వెంటనే చూపిస్తుంది ప్రొజెక్ట్ చేస్తుంది. అసలు నిజానికి మీరు పెట్టినపేరు మీరు చూపించిన పదార్థము రెండు అసత్యాలు, దాన్ని కుండా అనకుండా కర్రా అని కొత్తగా పేరు పెడుతున్నానన్నా దానికేం అభ్యంతరమేమీ ఉండదు. రెండు అది మట్టియొక్క వికారము అది అసలు దాని సత్యము అదికాదు సరే... నేను మళ్ళీ శంకర సిద్దాంతం మాయా అది కాదు కాని... నామ రూపములు అదొక గమ్మత్తు.
కాబట్టి మనసుకు ఉండేటటువంటి పరిమితి ఏమిటంటే తను వినన్నా ఉండాలి, తను చూసైనా ఉండాలి, వినికాని చూసి కాని ఉంటే ప్రాణిని గుర్తిస్తుంది. ఇప్పుడు రామ లక్ష్మణులు ఇద్దరు ఏమిటీ అలా ఉన్నాడూ అన్నారనుకోండి రామ లక్ష్మణులు కూడా ఎన్నడూ ఊహించలేదు అన్నమాట ఇటువంటి ప్రాణి ఒకటి లోకంలో ఉంటుందీ అని రామ లక్ష్మణులు ఊహించలేదు, వీళ్ళిద్దరు ఎటువంటివాళ్ళు వంచు రకం పక్షి కూస్తుందని చెప్పగలిగినవాళ్ళు ఒక పిట్ట అరుపుకి. మనం ఎంత తేలిగ్గా చెప్పగలమో కాకి అరుస్తుందని రామ లక్ష్మణులు అరణ్యంలో పిట్టలకూతలు అంత బాగా చెప్తారు అన్ని మృగాలు చెప్తారు వాళ్ళు అటువంటి వాళ్ళు ఆ ఎదురుగుండా కనపడినటువంటి ప్రాణిని గుర్తించలేకపోయారు ఇదీ విరూపము అన్నపేరు. అంటే అది ఎవరూ ఊహించలేనంతగా వికృతంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడదీ మనసుకీ ఖేదము కలిగించవచ్చు, ఒక్కొక్కసారి ఉల్లాసమును కలిగించవచ్చు రంజకత్వము ఉంటే అందులో, కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్న ఆ ప్రాణి వంక చూశారు వెంటనే మహర్షి ఏం చేస్తారంటే దాన్ని ముక్కలకింద విరవరు, విరవకుండా చూపిచ్చేస్తారు. అది ప్రజ్ఞ కవి యొక్క ప్రజ్ఞ మీరు చూడాలి ఎందుకో తెలుసాండి రాముడి యొక్క కన్నులలోంచి కంఠం కదులుతుంది ఇప్పుడు రాముడు చూస్తున్నాడు రాముడు చూసేటప్పుడు ఆచూపు చకచకచక నడిచేస్తుందంతే ఎలా చూశాడు అన్నది పైనుంచి కిందవరకు ఆ ప్రాణి ఎలా ఉందో చూస్తారు, అంతేకాని సగం చెప్పి మళ్ళీ ఎటో చూసి చెప్పి చెప్పి మళ్ళీ సగం చెప్పి అలా ఉండదు.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఆఁరచనలో ప్రజ్ఞ వాల్మీకి మహర్షి కంఠం రాముని కన్నులను బట్టి కదులుతుంది. రాముడిలో పరకాయ ప్రవేశం చేసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసున్నిచూసి ఘంటాన్ని కదుపుతున్నారు. మీరు శ్రీరామాయణాన్ని బహుభంగిమలు చూడవలసి ఉంటుంది ఎందుకంటే వాల్మీకి మహర్షి తరువాత కవులకు ఆదర్శమైనాడు కాళిదాసాది మహాకవులకు కూడా వాల్మీకి మహర్షినే అనుసరించారు కాబట్టి
వివృద్ధమ్ అశిరో గ్రీవం కబన్ధమ్ ఉదరే ముఖమ్ !
అగ్ని జ్వాలా నికాశేన లలాటస్థేన దీప్యతా ! మహా పక్ష్మేణ పింగేన విపులైనాఽఽయతేన చ !!
ఏకేన ఉరసి ఘోరేణ నయనేన అశు దర్శినా ! మహా దంష్ట్రోపపన్నం తం లేలిహానం మహా ముఖమ్ !!
భక్షయన్తం మహా ఘోరాన్ ఋక్ష సింహ మృగ ద్విపాన్ ! ఘోరౌ భుజౌ వికుర్వాణమ్ ఉభౌ యోజనమ్ ఆయతౌ !!
Image result for కబంధుడుఆయనా ఘోరౌ భుజౌ వికుర్వాణమ్ ఆ ఉన్నటువంటి ఎదురుగుండా ఉన్న ప్రాణి ఎలా ఉన్నాడంటే తల లేదు, తల లెకపోతే భీభత్సంగా ఉంటాడు, అదీ ఆ ప్రాణి ఏం చేస్తుందంటే మీకు భీభత్సరసాన్ని ఉద్భుతం చేస్తుంది ఆ లోపల్నుంచి, ఎదురుగుండా ఉన్న ప్రాణి తలకాయతో ఉందనుకోండి పరవాలేదు ఓ చెయ్యిలేకపోతే మీరు చూడ్డం కొంచెం తేలికా, ఒక కాలు పోతే మీరు చూడ్డం కొంచెం తెలికా. తల లేకపోతే మీరు వెంటనే అంటారు అయ్యో బాబోయ్ అంటారు చూడలేరు, ఇప్పుడూ ఆ ఎదురుగుండా కనపడుతున్న ప్రాణికి తలకాయలేదు ఆ ప్రాణికి కాళ్ళులేవు తలకాయి లేదు కాళ్ళు లేవు పోనీ తలకాయి కాళ్ళు లేకుండా అలా ఉందా ప్రాణీ అలా లేదు అదొక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది అశిరో గ్రీవం దానికి కంఠమూ లేదు తలకాయి లేదు కాని కబన్ధమ్ ఉదరే ముఖమ్ ఇక్కడా పొట్టదగ్గర ఉంది ముఖంలాగ, ఛాతి మీద లలాటభాగము ఉంది ఇక్కడ నుదురుంది ఈ కింద ఒక పెద్ద కన్నుంది ఆ కన్ను మీద ఒక పెద్ద రెప్ప ఉంది ఆ రెప్పకి పచ్చటి వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయి. ఆ కన్ను ఎత్తి చూస్తే అగ్నిజ్వాల ఎలా ఉందో అలా ఉంది ఆ కన్ను ఎర్రగాను అటువంటి కన్ను ఇక్కడ పెట్టుకుని ఉంది ఆ ప్రాణి ఇక్కడ గుండెల మీదకి ఉంది. పొట్టమీద నోరు ఉంది దానికి, దానికి కాళ్ళు లేవు కాబట్టి కదలలేదు అది అలా కూర్చుని ఉంది, కాని దానికి యోజనం దూరం వరకు వెళ్ళగలిగినటువంటి దీర్ఘ బాహువులు ఉన్నాయి, ఇప్పుడు అది ఏం చేస్తుందంటే... ఎంత దూరమైనా సరే దానికి ఉన్నటువంటి కళ్ళతో చూస్తుంటూంది నయనేన అశు దర్శినా అంటే ఒక్కకన్నే అయినా ఎంతదూరమైనా అది చూడగలదు చూడగలదు కానీ లేచివెళ్ళలేదు గమనం లేదు దానికి, గమనంలేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే చెయ్యి చాపుతుంది చాపి తడుముతుంది ఇలాగ అంటే అది ఎటెల్లిందో అటుగా తడిమి పట్టుకుంటుంది.
అది ఏనుగు కానివ్వండి పులికాని సింహం కాని ఏదైనా సరే పట్టుకోగలిగినటువంటి చేతులుదానివి ఎంతదూరం ఇక్కడనుంచి ఒక యోజనం దూరం వరకు ఉంటాయి ఆ చేతులు దాంతో పట్టుకుంటుంది, పట్టుకుని ఈడుస్తుంది ప్రాణుల్ని ఆఈడ్చి ఆకర్షన్తం వికర్షన్తమ్ అనేకాన్ మృగ యూథపాన్ ! స్థితమ్ ఆవృత్య పన్థానం తయోః భ్రాత్రోః ప్రపన్నయోః !! అది వాటిని పట్టుకుని ఈడుస్తుందట ఇలాగ అది నిజంగా మహర్షి ఒక లైవ్ టెలిక్యాస్ట్ అది నిజంగా అద్భుతం, ఎందుకంటే పట్టుకునీ ఇలా ఎత్తడం కొన్ని ప్రాణుల లక్షణం ఈడ్వడం కొన్ని ప్రాణుల లక్షణం. మీరు చూడండీ ఉత్తమమైనటువంటి సంస్కారం

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
కలిగినటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి, చాలా ఉత్తమైన సంస్కారము ఉన్న ప్రాణులు అన్న గుర్తేమిటో తెలుసాండీ... చేతితో పట్టుకుని ఎత్తి తింటాయి అవి లోకంలో ఒకటి మనుష్యుడు రెండు కోతి మూడు ఏనుగు వేదంలో మంత్రానిది ఇప్పుడు మీకు చెప్తున్నది చాలా ఉత్తమ సంస్కారంతో ఈశ్వరుడు సృష్టించిన ప్రాణీ అని గుర్తేమిటంటే చేతితో తింటుంది, ఏనుగు ఎత్తి తొండంతో నోట్లో పెట్టుకుంటుంది, కోతి అరిటి పండును ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది, మనిషి పదార్థాన్ని ఎత్తి చేత్తో తింటాడు. ఈడ్చి తినేటటువంటివి క్రౌర్యమున్నటువంటివి ఈడ్చి తీసుకెళ్తాయి ఒక పులి ఉందనుకోండి ఒక జింకని కొట్టి ఆ పంజాతో పట్టుకుని నోటితే పట్టుకుని భూమి మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నాయి, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి అది నెత్తురోడిపోతూ బాధపడిపోతూ ఆ దెబ్బకి నెత్తురోడిపోయి అరుస్తూంటే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కిందపెట్టి తన పంజాకింద తొక్కిపట్టి నోటితో పీకుతుంది మాంస కండల్ని అది క్రౌర్యానికి పరాకాష్ట, సాత్విక బుద్ధికి పరాకాష్ట ఏమిటంటే చేతితో ఎత్తి తినడమనేటటువంటిది అలవాటు ఉంటుంది.
Image result for కబంధుడుమహర్షి అంటున్నారు ఆకర్షన్తం వికర్షన్తమ్ పట్టి ఈడుస్తాడు అంటారు, అక్కడ పట్టి అలా ఎత్తి ఇలా తేడు ఇలా ఈడుస్తుంటాడు ఎందుకనీ అంటే ఈడ్చడంలో ఉంది ఆ పైశాచికభావన ఆ క్రౌర్యముంది అందులో అంటే అసలు ఉండడమే విచిత్రం ఆ తినడమూ విచిత్రము. అంటే ఎంత క్రౌర్యం కలిగినటువంటి ప్రాణో ఎంత విచిత్రమైన ప్రాణో మీరు ఊహించవలసి ఉంటుంది. ఇంత ఘోరమైనటువంటి స్వరూపం ఎలావచ్చింది ఎందుకొచ్చింది అన్న ఆలోచన మీకు వెంటనేరావాలి, ఇది చాలా ప్రధానం రామాయణంలో అది ఎందుకొచ్చిందీ అన్నది మీరు తెలుసుకుంటే అలా మనం రాకుండా ఉండడానికి అవకాశం దొరుకుతుంది కదా... అందుకనీ... ఇప్పుడూ... దానివంక చూశారు ఇద్దరూ చూసేటప్పటికి అది వీళ్ళిద్దరిని పట్టుకుంది పట్టుకుని ఈడ్చేసింది వాళ్ళిద్దరిని దగ్గరికి ఈడ్చేసి మీరు నాకు ఈశ్వరుడిచ్చిన ఆహారం తినేస్తాను అంది, తినేస్తానని నోట్లో పడేసుకోవాలిగదా మనకైతే ఇక్కడ దానికైతే ఇక్కడా, కాబట్టి ఆ ఈడ్చి తెచ్చీ లోపల పడేసుకోవడానికి సిద్ధపడుతుంది, వెంటనే లక్ష్మణుడు అన్నాడూ అన్నయ్యా దీన్ని మనం ఉపేక్షించకూడదు, ఈ ప్రాణిని మనం చంపకూడదు అన్నాడు. నిజంగా శ్రీరామాయణం ధర్మ శాస్త్రం అద్భుతం అందుకు మహర్షీ ప్రతి చిన్న విషయాన్ని కూడా... రచనలో చూపిస్తారు నిశ్చేష్టానాం వధో రాజన్ కుత్సితో జగతీ పతేః ! క్రతు మధ్య ఉపనీతానాం పశూనాం ఇవ రాఘవ !! లక్ష్మణుడు అంటున్నాడూ కదలికలేని ప్రాణిని చంపకూడదు ఎందుకంటే అది పారిపోవడానికి అవకాశం ఏమీలేదు, పారిపోవడానికో వెన్నిచ్చిపారిపోవడానికో నీ మీద కలియబడ్డానికో దానికి అవకాశం ఉంటే నీ వీరత్వం చంపాలి కదలలేనిదానిని చంపడమేమిటీ భళీ భళీ మా బావ బల్లెంబుచేబూని పుల్లాకు తూట్లుగా పొగవలేదే అన్నట్లు, కదలలేని ప్రాణిని చంపడమేమిటీ.
కాబట్టి అన్నయ్యా! మనం చంపకూడదు దీనిని, ఎంత ధర్మమండీ ఇంకోడైతే..? ఈఁధర్మం కదూ కాపాడిందీ అందుకుకదా అన్నాడు మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మః అన్నాడు అప్పుడు కూడా... ఇలా ఉన్నాడు బాబోయ్ ఇదేమిటి అంటే బుద్ధి వెంటనే స్వస్థతను తప్పీ చంపి అవతలపారేద్దాం అనరూ, వాళ్ళు బాగా ఆలోచిస్తారు వాళ్ళు ప్రతిదాన్ని ధర్మం కోణంలో చూస్తారండి అక్కడ ఎవరున్నారండి చంపేస్తే చంపేశారనుకోండి ఇద్దరూ కలిసి పోనిలే అన్నయ్యా ఎవరు చూడొచ్చారనవచ్చు, కాదు ఎవరుచూడొచ్చారు అనరు చూడవలసివాడు చూడకపోవడం అన్నది ఎలా జరుగుతుంది అంటారు వాళ్ళు ఇదీ ధర్మావలంబనకి కారణం, ధర్మ మూర్తిగా ఎందుకు ఉండగలుగుతున్నాడూ ఒక వ్యక్తి అంటే... నేను ఎలా

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
తప్పుకుంటానండీ ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తుంటాడు కదా అంటాడు. నేను ఒకవేళ తప్పుచేస్తే ఈశ్వరుడి యొక్క సన్నిధానంలోనే నేను తప్పు చెయ్యాలి తప్పా ఈశ్వరుడు చూడకుండా నేను తప్పు చెయ్యడం కుదరదు ఆయన ఎప్పుడూ చూస్తుంటాడు అంటాడు. ఎప్పుడూ చూస్తున్నాడూ వాడు అన్నవాడు చాలా తప్పులు చెయ్యలేడు చాలా అన్నమాట నేను ఎందుకన్నానో తెలుసాండీ ఏతప్పు చెయ్యలేడని నేను ముందే అనడం చాలా కష్టం, కొంత మార్పన్నది వస్తుంది ఎప్పుడంటే... చాలా తప్పులు చేయలేడు తరువాత ఏ తప్పూ చేయలేడు.
Image result for కబంధుడుకాబట్టి రాముడు ధర్మమూర్తిగా ఎందుకుండగలడూ ఎప్పుడూ అంటే ధర్మమనేటటువంటిది తాను అనుష్టిస్తున్నానో లేదో అనేటటువంటిది వృక్షములు దేవతా స్వరూపంగా చూస్తున్నాయని రాముడు నమ్ముతాడు, మనమైతే ఏమంటామంటే ఆ... ఎవరు చూడొచ్చారు అంటాము, ఇదే తేడా ఇది అలవాటు చేసుకోవడము ధర్మానికి పునాదిరాయి, ఇది నిలబడాలి ఇది నిలబడితే మార్పువస్తుంది మనసులో కాబట్టి చూపిస్తారు నిశ్చేష్టానాం వధో రాజన్ కుత్సితో జగతీ పతేః ఓ జగతీ పతీ రామా! మనము స్థాణువుగా కదలలేనివాన్ని చంపకూడదు కాబట్టి ఇతను తన నోట్లో పడేసుకొనేటట్లు ఉన్నాడు కాబట్టి రెండు బాహువులని తరిమేద్దాం. ఇతని శక్తి బాహువులే ఎందుకనీ గమనంలేదు కదలలేడు నోటితో కరవలేడు ఎందుకంటే పొట్టకుంది నోరు బోర్లా పడుకుని కరచిపట్టుకోగలిగిన శక్తి లేదు కానీ చేతులతో మాత్రం తడిమి పట్టుకుంటాడు కాబట్టి చేతులు నరికేస్తే వీడు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే అక్కడితో వీడుకూడా చచ్చిపోతాడు ఎందుకంటే ఆహారంలేదు ప్రాణానికి ఆహారము లేకపోతే ప్రాణము నిలబడదు శోషించిపడిపోతుంది మనం చంపక్కరలేదు వీడి యొక్క బలం ఎక్కడుందో దాన్ని తుంచేద్దాం దాన్ని మాత్రమే ఎందుకు తుంచాలి మనల్నిపట్టుకున్నాడు కాబట్టి మనల్ని ఇప్పుడు నోట్లో పడేస్తాడు కాబట్టి బాహువులు తుంచేద్దాం కాబట్టి దక్షిణో దక్షిణం బాహుమ్ అసక్తమ్ అసినా తతః ! చిచ్ఛేద రామో వేగేన సవ్యం వీర స్తు లక్ష్మణః !! రాముడు కుడి భుజాన్ని నరికేశాడు లక్ష్మణుడు ఎడమ భుజాన్ని నరికేశాడు, రెండు చేతులు ఊడి కిందపడిపోయాయి, కిందపడిపోగానే అతడు చాలా సంతోషించాడు ఇది విచిత్రం రామాయణంలో చాలా సంతోషపడిపోయాడు.
సంతోషపడి అన్నాడు ఓ... నేను ఎదురుచూసిన సంఘటన జరిగింది ఇన్నాళ్ళు ఈ రెండు చేతులు నరికేవాడికోసమే తడిమి చూస్తున్నాను ఇవ్వాళ వీటిని నరికేవాడు దొరికాడు ఎవరు మీ ఇద్దరు అన్నాడు వాళ్ళు ఛీ నోర్మూయ్ నీకు మేం చెప్పడమేమిటీ అనరు అది విచిత్రం, ఇది వినయం వాళ్ళు ఎవరు అడగనీయండి శూర్పణఖ అడిగినా చెప్తారు ఎవరు అడిగినా చెప్తారు ఎంత అందంగా మాట్లాడుతారు, అలాగనీ అనవసరమైనటువంటిచోటా దీర్ఘంగా మాట్లాడరు, సమయాన్ని ఎంత పొదుపుగా వాడి మాట్లాడుతారు అంటే ఎక్కడ ఎంతవరకు అవసరమో ఏది అవతలి ప్రాణికి చెప్పవలసి ఉంటుందో అక్కడవరకే చెప్తారు. తప్పా అదేపనిగా స్వధపెట్టి అర్థంలేకుండగా మాట్లాడటం అన్నది ఉండదు, అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, శ్రీరామాయణం మీరు బాగా చదివితే మాట్లాడటంలో ప్రజ్ఞ మీకు వస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఇవి బాగా అలవాటౌతుంది. అసలు మనిషి పాడైపోయేది అందుకేకదాండీ, అక్కరలేని మాట్లన్నీ మాట్లాడంవల్లే పాడైపోతుంటాడు. కాబట్టి అయమ్ ఇక్ష్వాకు దాయాదో రామో నామ జనైః శ్రుతః ! అస్యైవ అవరజం విద్ధి భ్రాతరం మాం చ లక్ష్మణమ్ !! నేను ఆయమ్ ఇక్ష్వాకు దాయాదో రామో నామ జనైః శ్రుతః ఇయ్యన మా అన్నగారు రామ చంద్ర మూర్తి అస్యైవ

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఆవరజం విద్ధి నేను

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఆయన తమ్మున్ని భ్రాతరం మాం చ లక్ష్మణమ్ నేను ఆయన తమ్మున్ని నన్ను లక్ష్మణుడు అంటారు అస్య దేవ ప్రభావస్య వసతో విజనే వనే ! రక్షసా అపహృతా పత్నీ యామ్ ఇచ్ఛన్తౌ ఇహ ఆగతౌ !! మా అన్నగారి పత్ని మా ఒదినెగారైనటువంటి తల్లిని ఒక రాక్షసుడు అపహరించాడు ఆవిడని వెతుకుంటూ మేము ఈ అడవిలో తిరుగుతున్నాము, నీవు ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగారు.
ఇప్పుడు తానెవరో సత్యం చెప్పి, నీవెవరు కైకమ్మ దశరథుడు వరాలు అయినచోటా కానిచోటా అన్నిచోట్లా వాళ్ళు మాట్లాడరు, ఇప్పుడు ఆయన అన్నాడూ పురా రామ మహా బాహో మహా బల పరాక్రమ ! రూపమ్ ఆసీనత్ మమ అచిన్త్యం త్రిషు లోకేషు విశ్రుతమ్ !! యథా సోమ స్య శక్ర స్య సూర్య స్య చ యథా వపుః ! ఎంత అందంగా మాట్లాడాడో... రెండు చేతులు తెగిపోయిన తరువాత అన్నాడూ రామా మహాబాహో! గొప్ప చేతులున్నవాడా... ఈ చేతులు నరికినవాడా మహా బల పరాక్రమ గొప్ప బలపరాక్రములు ఉన్నవాడా, నేను ఒకప్పుడు చాలా అందమైనటువంటివాన్ని మూడు లోకములలో నా అంత అందగాడు లేడు యథా సోమ స్య శక్ర స్య సోముడి అందం ఎటువంటిదో శక్రుడు అంటే ఇంద్రుడి యొక్క అందం ఎటువంటిదో సూర్యుని యొక్క తేజస్సు ఎటువంటిదో అటువంటి శరీరము కలిగినటువటింవాన్ని నేను అంటే శరీరమునకు అందము శరీరమునకు కాంతి అన్నియు ఉన్నవాడు అందుకని అటువంటి ఉపమానాలే వేశారు, ఆ తేజస్సు అవతలివారికి అహ్లాదాన్ని కలిగిస్తుంది కాబట్టి సోముడు అంత అందమైన అంత లావణ్యము అంత కాంతి కలిగినటువంటివాన్ని ఇది నాకు ఈశ్వరుడిచ్చినటువంటి బహుమానం కాబట్టి నేను ఏం చెయ్యాలి, ఈశ్వరుడు నీకు ఏదిచ్చాడో దాంతో నీవు పదిమందిని సంతోషపెట్టాలి అప్పుడు నీవు నీయొక్క విభూతిని ఈశ్వర పరంచేసినట్లు అవుతుంది.
అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి అక్షరాభ్యాసము అని ఒక సంస్కారం చేస్తారు మనవాళ్ళు అది చేయకుండా పంపించరు, బడికి పంపించడం కాని పలక ముట్టుకోవడం కానీ పుస్తకం ముట్టుకోవడం కానీ అక్షరం రాయడం కానీ ఒప్పుకోరు ముందు ఎవరు తమ జీవితంలో తమకు ఉన్న విభూతిని సమాజపరంచేసి ఈశ్వరుడిచ్చిన విభూతిని ఈశ్వరుడికి నైవేద్యంపెట్టి జీవితంలో ప్రసాద బుద్ధితో బ్రతికి పది మందిచేత శభాష్ అనిపించుకుని కీర్తిగడించాడో, ఎవడు భగవత్ భక్తి తత్పరుడో అటువంటి పెద్దల తొడమీద కూర్చోబెట్టి ఆయన చేత్తో పిల్లవాని చెయ్యిపట్టుకుని పలకలో ముందు దిద్దిస్తారు “ఓం నమః శివాయ సిద్ధం నమః” అని ఎందుకు రాయిస్తారో తెలుసాండి అలాగ, అలా రాయించడం వెనకా... ఒక రహస్యం ఒకటి దాగుంది సనాతన ధర్మంలో, నీవు రేపు పొద్దున్న ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడివి అవ్వచ్చు నిన్ను మించిన గణిత శాస్త్రజ్ఞుడు లేకపోవచ్చు కాని నీకొకటి తెలిసుండాలి నాకు ఎన్నిలెక్కలో వచ్చు అని అనడంకాదు ఇన్ని లెక్కలు తెలుసున్న నాకు కూడా అంతటా ఆవరించినటువంటి ఆత్మతత్వాన్ని లెక్కకట్టడం చేతకాదు అని చెప్పగలగాలి. ఏది లెక్క కట్టలేవో నీకొచ్చిన లెక్కలవలన నీవు తెలుసుకోవాలి అప్పుడు ఏమౌతుందంటే నీ విభూతి వినయానికి పరాకాష్ఠ అవుతుంది.
మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో నేను చెప్పింది, అందుకే అమ్మవారికీ శ్రీ మాతా అని పేరు. అందరికీ అన్ని ఇవ్వగలదు కాని ఆవిడ శక్తిని కొలవడం ఎవ్వరికీ సాధ్యంకాదు, ఏది మీరు కొలుద్దామంటే మీ కొలతలకి అందదదో మీ లెక్కలకి అందేది కాదో అందకా వేదమంతా కూడా ఇంక ఇంతకన్నా నాకు చెప్పడం చేతకాదు అని అలా చెప్పి ఊరుకుందో అది లెక్కలకు అందని పెద్ద లెక్కా అని తెలుసుకోవడం లెక్కలు బాగా వచ్చినన్నవాడికి ఉండవలసిన మొదటి లక్షణం. బాగా లెక్కలు వచ్చినవాడికి ఏం తెలియాలంటే ఇది నా లెక్కకి అందదని తెలిసుండాలి ఆ అందనిదేదో అది పరబ్రహ్మం సహస్ర శీర్షా పురషః సహస్రాక్షః సహస్రపాత్ ! స భూమిం విశ్వతో వృత్వా అత్య తిష్ఠద్దశాంగుళమ్ ! ఇది, ఇది బాగా అర్థమవ్వాలని గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని నీవు ఊహచేస్తున్నావో... ఎందుకంటే నీ కంటికి అందవు ఏదో నీవొక లెక్క కట్టావు కాంతి వేగము శబ్ద వేగము ధ్వని వేగము ఇలాగ ఈ వేగంతో కొలిస్తే ఎంతవరకు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అంతకన్నా ఒక పదంగుళాల పైవరకు ఈశ్వరుడున్నాడు. నీవు చూపుకి ఎంత శక్తి ఉందనుకున్నావో ఒక రాడార్ పెట్టారనుకోండి సముద్రపుటొడ్డున కొండమీద ఆ రాడార్ తిరగడానికి ఓ లెక్క కడతారు అది తిరుగుతున్నప్పుడు సముద్రంలోపల ఉన్న ఓడలకి ఇక్కడ ఒక నౌకాశ్రయమున్నది అన్న సూచన తెలియడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా తిరగాలి అని, మీరు విశాఖపట్టణం లాంటి ఊళ్ళలోకి వెళ్ళితే రాత్రివేళ ఒక్కసారి కొండలపై తిరుగుతుంటుంది లైట్ హౌస్ దానికో లెక్క కడుతారు.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
అమ్మవారి కన్ను ఇలా ఇక్కడ్నుంచి ఇక్కడికి తిప్పితే ఎంత దూరం వెడుతుంది మీరు లెక్కపెట్టండి, ఇది గణిత శాస్త్రజ్ఞుడంటే శంకరాచార్యులు పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు ఎందుకో తెలుసాండీ... ఎంత వెడుతుందో ఆయన చెప్పలేదు దృశా ద్రాఘీయస్యా దరదలితనీలోత్పలరుచా దవీయాంసం అన్నారు. అమ్మా..! ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఇటుపక్కకు ఉన్నాయో అంతకన్నా దాటి వెళ్ళుతుంది అన్నారు. అంతే తప్పా ఈ బ్రహ్మాండముల వరకు చూస్తావు అనలేదు, అలా అయితే లెక్క అందింది అమ్మవారి చూపికి, నీ లెక్కకి అందకపోతేనే నీ వినయం నీవు నేర్చుకున్న జ్ఞానానికి సార్ధకత ఒకటుందని చెప్పడం. కాబట్టి కంప్యారిటీవ్ డిగ్రీ, కాబట్టి ఈ బ్రహ్మాండములు ఎంత ఉన్నాయో అంతకన్నా ఎక్కవై ఉన్నది నీ చూపు ఎంత ఎక్కువ వరకు దాన్ని దాటి వెళ్తుంది ఆ చూపు లైట్ హౌస్ పడినట్టు. కాబట్టి దృశా ద్రాఘీయస్యా దరదలితనీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అది శంకర భగవత్ పాదులంటే మహానుభావుడు అందుకే శంకర జయింతి చేసుకోకపోతే కృతజ్ఞతా అన్నాను నేను, కాబట్టి నీవు లెక్కల నేర్చుకున్నవాడివీ అని ఎప్పుడు గుర్తంటే నీ లెక్కకందనిదీ ఒకటుందీ అని నీవు తెలుసుకోవలసి ఉంటుంది. నాకు తెలియకపోవడమేంటండీ లెక్కలు ఏదైనా అన్నావంటే నీయంత చేతకానివాడు లేడని గుర్తు ఇందుకు ఓం నమః శివాయ సిద్ధం నమః నీకు ఈశ్వరుడు ఎందులో ఎంతపెద్దవాన్ని చేసినా నీకు అందంది చూసి అందంది ఉందని తెలుసుకో. నీవొక పెద్ద జియాలజిష్టు అంటే ఈ భూమికి సంబంధించిన విషయాలన్ని తెలుసుకున్నవాడివైతే ఎవడు తన గుప్పిళ్ళతో ఇంత ఇసుకపోసి ఇంతింత పర్వతాల్ని ఇంతింత ఎడారుల్ని ఇంత సష్యశామలమైన నదీ తీరాల్ని ఈ పచ్చగడ్డితో కూడికున్నటువంటి పంటపొలాల్ని ఆ తరువాత పెద్ద పెద్ద బీడు భూముల్ని ఒక పక్కా కొండల్ని ఒక పక్కా నదుల్ని ఒక పక్కా సముద్రాల్ని ఎవడు తీసుకొచ్చి సృష్టించాడు, ఎవడి ఆజ్ఞకి సముద్ర చెలిమిలి కట్టదగ్గర ఆగిపోతూంది అనీ నాకు ప్రపంచపటం అంతా తెలుసండీ మీరు ఇలా పిన్ పెట్టండీ నేను ఆ దేశమేమిటో ఆ నగరమేమిటో చెప్తాననటం మీకు తెలిసుండడం కాదు ఇవన్నీ సృష్టించినవాడు ఎవరో మాత్రం నేను తెలుసుకోలేకపోయాను వాడికి నేనొక నమస్కారం అని నీవు అనగలిగితే నీవు బాగా బౌగోళిక శాస్త్రం నేర్చుకున్నవాడివి.
ఒకడు గొప్ప సంగీత విధ్వాసుడి ఎప్పుడంటే సంభావన ఇస్తే గంటన్నర కచేరి చేసినవాడు కాడు, ఎవడు నాదోపాసన చేశాడో ఎవరు ఆ లోపల నుంచి వచ్చినటువంటి నాదాన్ని వింటున్నాడో ఎక్కడ నుంచి అది కదులుతోందో ముందు అది కదులుతున్న శబ్దం ధ్వని ఆ నాదం వస్తున్నదాని యొక్క మూలాల్ని ఉపాసన చేసి మౌనంలో పట్టుకుని నాదోపాసన చేసి సంగీత విద్య ద్వారా ʻసరిగమపదనిసానిదపమగరిసʼ అంటారు ఆరోహణ అవరోహణ, అవరోహణ అంటే కిందపడిపోవడం ఈశ్వరుడ్నుంచి విడిపోయి అజ్ఞానంలోకి రావడం ఆరోహణ అంటే పైకెక్కి మళ్ళీ ʻసాʼ లోకి వెళ్ళిపోవడం ఆంటే ఈశ్వరుడి దగ్గరికి, మళ్ళీ సంగీతాన్నే పట్టుకుని కిందపడ్డవాడు సంగీతంతో మళ్ళీ పైకెక్కి ʻసాʼలోకి కలిసిపోవడం ఈశ్వరుడిలోకి కలిసిపోవడం. ఈ నాదోపాసన చేసినవాడు ఎవడున్నాడో వాడు సద్గురువై నిలబడిపోతాడు అందుకే త్యాగరాజుగారు ఎవరూ అన్నారనుకోండి మీరు సంగీత విధ్వాసుడు అనకూడదు సద్గురు త్యాగరాజస్వామి అనాలి, శ్యామశాస్త్రిగారు ఎవరు అన్నారనుకోండి సద్గురు శ్యామ శాస్త్రీ అనవలసి ఉంటుంది. అలాగే ఆ దీక్షితలవారు ఎవరూ అని అన్నారనుకోండి, సద్గురు దీక్షితుల వారు అనవలసి ఉంటుంది. వాళ్ళు సద్గురువులు ఎందుకంటే నాదోపాసన చేసి నాదోపాసన ద్వారా బ్రహ్మమును చేరిపోయారు వారు, ఇప్పుడు వారి సంగీతము ఎందుకుపనికి వచ్చిందంటే ఎవరు మనకు సంభావన ఇస్తారు కచేరికెడదాం డబ్బులు తెచ్చుకుందాం అనడానికి పనికిరాలేదు అంటే అలా వెళ్ళడం తప్పూ అని నేనేమి అంటంలేదు, కానీ అది ఎందుకు పనికిరావాలీ అంటే నాదోపాసనా అన్నదీ ఈశ్వరున్ని చేరడానికి పనికిరావాలి.
ఇప్పుడు అది అలా పనికొచ్చిందనుకోండి మీకు అలా పనికొచ్చినటువంటి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మీకిచ్చిన విభూతి మీకు అందనిదాన్ని అందుకునేందుకు పనికొచ్చేదే తప్పా అమ్ముకోడానికి పనికొచ్చేదికాదు. మీకు ఒక కలనం వచ్చూ అనుకోండి మీకు ఒక గొప్పగా ఒక పద్యం చెప్పడం వచ్చూ అనుకోండి అది ఈశ్వరుడిగురించి చెప్పగలగాలి పదిమందికి పనికివచ్చేది చెప్పాలి అందుకే హరినామస్తుతిసేయు కావ్యము సువర్ణాం భోజి హంసావళీ ! సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్వెలుగొందు అంటారు పోతనగారు, హరినామమును చెప్పినటువంటి సాహిత్యము ఏదుందో అది మానస సరోవరము ప్రజ్ఞ ఉంది కదాని పనికిమాలిన కవిత్వాలన్ని చెప్పాడనుకోండి అవి కాలగర్భంలో నసించిపోతాయి అవి ఇంకోడి సమయాన్ని పాడుచేస్తాయి అంతే అప్పుడు అది ఎందుకు పనికొచ్చింది భ్రష్టత్వానికి పనికొచ్చింది ఆ కవిత్వం దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే నత్కీరుడి అహంకారంలా ఉంటుంది అంతే ఆ కవిత్వం. కాబట్టి ఏది నీయందు బాగా ప్రకాశించిందో దాన్ని బాగా పట్టుకొని నాకు ఇది తెలియదు ఆ తెలియనిదేదో ఇది తెలియదని తెలుసుకోవడానికి నాకు తెలుసున్నది పనికొచ్చిందన్నవాడు ఎవడో వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. పండితుడు అన్నమాట ఎవరికి వర్తిస్తుందో తెలుసాండి పద్యాలు చెప్పేవాడికి కాదు “పండాహ” అంటే జ్ఞానము. ఈశ్వరున్ని నమ్మి ప్రతిరోజూ భక్తితో అనుష్టించి నడిచేవాడెవరో ఆయనకి పండితుడనిపేరు అందుకే పోతనగారు సహజపండితుడూ అంటారు. కాబట్టి ఈ స్థితిని ఓరే నాన్న నీవు పొందాలి తప్పా... నీవు ఏదో ఒక పెద్ద ఇంజనీయరువై లంచాలు తీసుకొని మూడోరోజు కూలిపోయే బ్రిడ్జి కట్టకూడదు, నీవొక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడవై నాకు అన్నీ తెలుసని అహంకరించి మట్టిలోకలిసిపోకూడదు. నీకు ఈశ్వరుడు నిన్ను గొప్ప విద్యాధికున్ని చేసి దానితోపాటుగా పండితున్ని చెయ్యాలి అంటే దాన్నే అడ్డుపెట్టి నీవు ఈశ్వరున్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
నేను మీకొక ఉదాహరణ చెప్తాను నాకాడాక్టరుగారి పేరు జ్ఞాపకం లేదు కానీ నేను లలితమ్మ గురించి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు తరచు కోట్ చేస్తుంటాను, ఆ పిల్లవాడు తల్లి గర్భంలో తల కిందకీ కాళ్ళుపైకీ పెట్టుకొని ఉంటాడు ఆయన పెద్ద గైయనకాలజిష్టు ఈ పుస్తకం రాసినాయన “మాతృదేవోభవ” అని పుస్తకం రాశాడు. నాకు కాకినాడలో డా. జగదీశ్వరి గారు అని ఆవిడొక పెద్ద గైనకాలజిష్టు ఆవిడ నాకో పుస్తకం ఇచ్చి చదవండి కోటేశ్వరావుగారు అన్నారు. అందులో ఆయన అన్నారూ తల కిందకీ కాళ్ళు పైకీ పెట్టీ తొమ్మిది నెలలు అయిపోతుంది, లోపల పెరిగిపోతాడు వీడు అమ్మ నాభి గొట్టంలోంచి ఆహారం వెడుతూంటుంది ఇప్పుడు అమ్మ తినకూడనిది తింది, లోపల వీడి యొక్క శరీరం ఎటుంవంటిదో తెలుసా నజ్జు శరీరం అనుకోండి వీడికి పడిసెం పట్టేస్తుంది, పడిసెం పట్టేస్తే ఏమౌతుంది తల కిందకుంది. ఇప్పుడు ముక్కుకి పట్టినటువంటి పదార్థం వెనక్కి వెళ్ళిపోతుంటుంది, గుటకవేయడం చాలా కష్టం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు, అమ్మ ఇంకోసీతాఫలం తింటుంది ఆవిడకి ఏం తెలుసు బయటికి వస్తే కదా నజ్జు శరీరమని తెలియడానికి లోపల జ్వరం తగులుతుంది, కాని వాడికి అబ్బా..హ్ చల్లగా ఉంటే బాగుండనిపిస్తుంది కటిక చీటకి ఇంతలో వాడికి ఏమౌతుందంటే లోపల అతిసారం పుడుతుంది లోపల వాడు మలం ఎక్కువ విసర్జించేస్తుంటాడు, విసర్జించేస్తే అందులోంచి చిన్న చిన్న పురుగులు పుట్టి కరుచేస్తుంటాయి ఒంటిని, ఇలా పడుంటాడు, తన మల మూత్రములు తన నోటిదగ్గరకు వచ్చేస్తుంటాయి, చెవుల్లోకి వెళ్ళుతుంటాయి అందుకే గర్భస్తనరకం అంటారు నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలన్ చెంది నాకవకాశంబుమిషుమంతలేక పడితిన్ నా కష్టములో భీతితో నవమాసంబులుఘటిల్లె చాలునాకా గర్భవాసంబు నివశింపన్ పనితీర్చి కావుమిక నన్నీ సత్ కృపన్ శంకరా అంటారు.
అప్పుడు ఈశ్వరున్ని ప్రార్థిస్తాడు నేను ఉండలేకపోతున్నాను ఈశ్వరా ఒక్కసారి ఈ శరీరంతో బయటికి వెళ్ళనీ దీంతోటే నిన్ను సేవించుకొని నీలోకలిసిపోతాను అంటాడు, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయు రూపంలో తల్లి యోనిలోంచి పైకితోసేస్తాడు. ఇప్పుడొచ్చి బయటపడుతాడు బయట పడగానే కటిక చీకట్లోంచి ఒక్కసారి పెద్ద వెల్తుర్లోకి వస్తాడు, ఇప్పటివరకు తానేమీ చూడలేదు ఆంతంత ప్రాణులు ముక్కుకి గుడ్డకట్టుకుని డాక్టరుగారు అమ్మ పెద్ద కడుపు ఎవరెవరో మనుషులు పెద్ద పెద్ద దీపాలు బొమ్మలు గోడలు వాడి ఇంతకన్ను అలా ఎత్తి చూసేటప్పటికి ఆ వెలుతురు తట్టుకోలేక వాతావరణాన్ని తట్టుకోలేక ఉత్తర క్షణంలో వాడి హృదయ స్పందనం ఆగిపోతుందట, వాడి ఊపిరి తిత్తులు ఇలా ఇలా ఇలా ఉన్నవి ముడుచుకోని పోతాయట, జీర్ణవ్యవస్థ ఇలా సంకోచించిపోయి వాడి శరీరంలో ఉన్న మలమంతా గడ్డకట్టి వాడి పాణోక్రమణం అయ్యేస్థితి వస్తుంది, వస్తే ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా తయారుకానటువంటి పదార్థం నా కడుపున పుట్టిన బిడ్డా అని వాణ్ని చూసుకొని మురిసిపోతుందట అమ్మ మురిసిపోయి తన స్థన్యాని తీసి వాడినోట్లో పెట్టగానే ఎలా ఊరుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కోలోస్ట్రం అనబడేటటువంటి ఒక పసుపు పచ్చని జిగురు పదార్థం అమ్మ స్థన్యంలోంచి కొడుకునోట్లోకి వెళ్తుంది. దాన్ని చప్పరిస్తాడు అంతే... ఊపిరి తిత్తులు పని చేసి గుండె పని చేసి జీర్ణాశయం పనిచేసి నల్లటి మలం విసర్జించగలిగిన శక్తి వస్తుంది, వచ్చి పిల్లాడు బ్రతుకుతాడు. పిల్లాడు బ్రతకడానికి కావలసినటువంటి ఆ కోలోస్త్రమ్ అనబడేటటువంటి పసుపు పచ్చని పదార్థం పిల్లవాడు కాని పిల్లకాని పుట్టగానే వాణ్ని చూసుకోగానే నా బిడ్డా అన్న ఆనందం కలగగానే మాతృత్వపు ఆనందపుటంచుల వలనా అమ్మశరీరంలో ఉత్పత్తియై స్థన్యంలోంచి స్రవించేటటువంటి పదార్థాన్ని నేను సాక్ష్యాత్ జగన్మాతగా చూస్తున్నాను ఆ కోలోస్ట్రాల్ వల్ల ఈ లోకంలో ఇన్ని ప్రాణులు పుట్టి బ్రతుకుతున్నాయి. నేను నేర్చుకున్న

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
గైనకాలజీతో నేను నేర్చుకున్నదేంటంటే ఆ కోలోస్ట్రం అన్న పదార్థంలో అమ్మవారు ఉందీ అని రాసుకున్నాడు ఆయన ఆ పుస్తకంలో.
Image result for అమ్మ జగన్మాతఇదీ ఆ డాక్టరుగారి ధన్యతకి కారణం, తను చదువుకున్న గైనకాలజీ ఎందుకు పనికివచ్చిందంటే ఈశ్వరున్ని తెలుసుకోవడానికి ఈ ప్రాణులను మేము కాదు ఆపరేట్ చేస్తున్నది ఇన్నాళ్ళకు ఒక పిల్లవాడు పుట్టాడు అంటే పిల్లవాన్ని లోపల ఉంచినవాడు పైకి తెచ్చినవాడు బతికించినవాడు ఆ తల్లి జగన్మాత ఆ పరాశక్తి ఆ పరాశక్తి అమ్మ రూపంలో వచ్చి బ్రతికించింది అని తను తెలుసుకుని నమస్కరించినవాడు ఉన్నాడే వాడు విద్వాంసుడు వాడు పండితుడు అందుకు పనికొచ్చింది ఆయన చదువు, ఆవిడ ప్రసవ వేదనతో అక్కడ కొట్టుమిట్టాడుతుంటే డబ్బు పట్టుకొస్తే తప్పా ఆపరేషన్ చేయనన్న డాక్టరు దౌర్భాగ్యుడు వాడి చదువు ఎందుకు పనికి వచ్చినట్లూ, ఏం భయమా రామాయణం చెప్పడానికి భయమేంటండీ నేను రామాయణం చెప్తున్నాను కదా..! కాబట్టి నీ కొడుకు అలా కాకూడదు నీ కూతురు అలా కాకూడదు అనుకుంటే ఒక్క డాక్టరు అవ్వాలని కోరుకోకు ఈ తత్వం తెలుసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని చూసి నేను ఇంకొక పిల్లాన్ని నేను అలా దర్శనం చేస్తున్నాని అర్ధరాత్రి కూడా సంతోషంగా వచ్చి ఐదుపైసలు అక్కరలేదమ్మా నీ మాతృత్వం చాలు నాకు పరాశక్తి దర్శనం అని పురుడు పోయ్యగలిగినటువంటి డాక్టరు కావాలని కోరుకుని రాయించు పలకలో అందుకని ఏది చదవాలన్నా “ఓం నమః శివాయ సిద్దం నమహాః” మంగళ ప్రదమైన చదువు కావాలీ అని మనం కోరుకుంటాము. లేకపోతే ఏమౌతుందో తెలుసాండి దీని రెండో కోణం అహంకారం ప్రతిదానికీ అహంకారమే ప్రతి చిన్న విషయానికి అహంకరించడానికి ఏదైనా కనిపిస్తుంది, అహంకారం పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. నేనెంతటివాన్నండీ అనడం చాలా కష్టం నేను ఇంతటివాన్నండీ అనడానికి ఏదో ఒకటి చెప్పొచ్చు. కదాండీ... ఏదో ఒకటి చెప్పొచ్చు ఇంతటివాణ్ని అని చెప్పడానికి ఈ అహంకార పరిత్యాగం లేకపోతే ఈశ్వరుడిచ్చినటువంటి విభూతియే మీకు శాపమై కూర్చుంటుంది ఇది చెప్పడం ఈ వాఖ్యానము యొక్క గొప్పతనం.
ఇది మీరు ఆ కోణంలో స్వీకరించగలిగితే ఎంత అందగాడు ఏమయ్యాడో మీకు తెలుస్తుంది, కాబట్టి ఇప్పుడు పురా రామ మహా బాహో మళ్ళిరండి కథలోకి రండి, ఎక్కడున్నాం మనం చాలా విచిత్రంగా కనపడినటువంటి ప్రాణిని రాముడు అడిగాడు నువ్వెవరని అడిగాడు అడిగితే చెప్తున్నాడు ఆయన, నేను చాలా అందగాన్ని యథా సోమ స్య శక్ర స్య సూర్య స్య చ యథా వపుః అటువంటి అందమైన శరీరం ఉన్నవాణ్ణి, అంత అందమైన శరీరం ఈశ్వరుడు ఇస్తే ఇలా ఎందుకయ్యావు, అలా నీవు అందంగా కనపడితే చాలు ఎదుటివాడి కంటికి కలిగినటువంటి బాధ తీరుతుంది నిన్ను చూస్తే చాలు అబ్బా ఎంత అందంగా ఉన్నాడోయని. కాని ఆయనేం చేసేవాడంటే చాలా చిత్ర విచిత్రమైన భయంకరమైనటువంటి వేషములలోకి మారేవాడు కామ రూపి కాబట్టి ఎవరూ ఊహించనంత ఘోరాతి ఘోరమైన రూపాన్ని తాను తీసుకొని ఈశ్వరుడిచ్చిన అందమైన రూపాన్ని వదిలిపెట్టి ఘోరమైన రూపాలతో అరణ్యంలో ప్రాణులకు అకస్మాత్తుగా కనపడి వాళ్ళు బయపడిపోయి విష్మయులై పడిపోతే మరణిస్తే బాధపడితే తను సంతోషించేవాడు ఇది రాక్షస ప్రవృత్తి. పైకి అందం ఉండడం గొప్పకాదు లోపల అందం ఉండడం గొప్ప, పైకి అందం లేకపోవడం తప్పుకాదు లోపల అందం ఉండడం గొప్ప. నా మాట బాగా పట్టుకున్నారో లేదో మీరు, యథాలాపంగా తీసుకున్నారో! పైకి అందం ఉండడం కాదు గొప్ప లోపల అందం ఉండడం గొప్ప పైకి అందం ఉండడం తప్పుకాదు లోపల అందం ఉండడమే గొప్ప. చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఇలా వెళ్ళిపోతున్నాడనుకోండి ఎమిటీ ఆయనేం లోటస్ షూ లు వేసుకుంటారా లేకపోతే విమల్ సూటు వేసుకుంటారా లేకపోతే ఏమైనా పెద్ద టై కట్టుకుంటారా

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
లేకపోతే ఫైర్ అండ్ లౌలీ రాసుకుంటారా ఆయనా ఏమీ ఉండవు పాదచారియై ఓ కాషాయవస్త్రం కట్టుకుని ఇలా తలనుంచి వేసుకొని ఇంత విభూతి వుండ్రాలు పెట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని అదికూడా గుండ్రంగా కూడా ఉండదు అద్దుకున్నట్లు పెట్టేసుకుని చేతిలో ఓ సత్యదండం పట్టుకుని ఆయన ఓ కమండలం పట్టుకుని గబగబగబ నడిచి వెళ్ళిపోతుంటారు.
Image result for చంద్రశేఖర పరమాచార్యఇప్పుడు నేను ఇలా చెప్తుంటే ఇలా వచ్చారనుకోండి అకస్మాత్తుగా ఉంటుందా ఇంకా నా రామాయణ ప్రసంగం లేచి ఒక్కసారి గభాల్నా స్వర్ణదండం పడ్డట్టు దెబ్బతగిలితే తరువాత చూద్దామని కిందపడిపోతాను అంతే... మీరు మీరంటే లేచి సభంతా కిందపడిపోతుంది. ఏ అందం చూసి గౌరవించారు అందం కాదు లోకాన్నంతటిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం శంకరాచార్యులవారి తరువాత ఆసేతు హిమాచల పర్యంతం తిరిగి జ్ఞానబోధ చేసిన మహాపురుషుడైన కారణంచేత కాబట్టి మీరు ఆయన పాదాలమీద పడిపోతారు అంతే, ఇప్పుడు లో అందం గొప్పదా పై అందం గొప్పదా... లోపలి అందం గొప్పది. లోపలి అందం ఎక్కడుంటుందో అది లోకాన్ని ఉద్ధరిస్తుంది పై అందం జజ్జరీ భూతమైపోతుంది ఇది కొన్నాళ్ళకు పోతుంది. పైగా దాన్ని సద్వినియోగం చేయకపోతే నీకు ప్రమాదహేతువై కూర్చుంటుంది. కాబట్టి చూశారూ పై అందంతో లోపలి అందం పెంచుకోలేదు పై అందంతో లోపలి అందవికారం పెంచుకున్నాడు లోపలి అందవికారం పై అందాన్ని కూడా తీసేసింది. ఇదే మీతో నేను మనవిచేసింది అక్షరాభ్యాసము అన్నది “మూఢ నమ్మకములు, ఛాదస్తములు” మీతో నేను ఒకరోజు మనవి చేశాను.
ఒకరోజు ఒకాయన ఆవును చంపేద్దామని అనుకున్నాడు, ఆవుని చంపేయ్ అన్నాడనుకోండి బుద్ధుందాలేదా అంటారు, కాబట్టి ఆవుని చంపేయ్ అనకుండా ఏమన్నాడంటే ఆ పులిని చంపేయ్ అన్నాడు. ఇప్పుడు చూడ్డంలేదు మీరు ఇప్పుడు అది ఆవో పులో మీరు చూడలేదు, పులిని చంపేయ్ అన్నాడు, అయ్యబాబోయ్ మీద పడుతుంది కాబట్టి చంపేయ్ అన్నాడు అనుకుంటారు. పాముని చంపేయ్ అన్నాడు పాము కాబట్టి చంపేయ్ అన్నాడనుకున్నాను ఆయన ఆవుని చంపేశాడు. ఆవని తెలుసు పాముని చంపేయ్ అని చంపేశాడు ఆవు అని చెప్తే అది పవిత్రం కాబట్టి దాన్ని చంపడానికి ఒప్పుకోరని, సనాతన ధర్మాన్ని వదిలేయ్ అని చెప్పలేక మూఢనమ్మకాలని వదిలేయ్ అని చెప్పారు. ఆవుని చంపేయ్ అని చెప్పకుండా పాముని చంపేయ్ అని చెప్పినట్లు. అక్షరాభ్యాసం మూఢనమ్మకం అంటే ఇదిగో ఇందుకే పనికొస్తుంది. కబంధుడవు కావడానికి పనికొస్తుంది. అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారంటే... నీకున్నటువంటి ఈశ్వర విభూతి లోకకంటకం కాకుండా నిన్ను రక్షించి ఈశ్వరానుగ్రహమని నీవు గుర్తెరగడానికి పనికొస్తుందని, లేకపోతే నిన్ను ఎక్కడ పడితే అక్కడ ప్రమాదం తీసుకొస్తావు నీ విభూతితోటి ఇది నాయందు దోషభూయిష్టమైంది.
నేను ఒకానొకనాడు అరణ్యంలో ఘోరమైన రూపంతో స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఒక ఋషికి కనపడ్డాను, ఆయన కందమూలములు ఏరుకొంటున్నారు ఆయన ఋషి, ఆయన వలన లోకానికేమీ బాధ ఉండదు ఆయన లోకాన్ని కాపాడుతారు. అటువంటి ఋషికి ఇప్పుడు నేను ఏ స్వరూపతో ఉన్నానో అటువంటి రూపంతో కనపడ్డాను, అయనకు ఏదో అలా కనపడితే హడలిపోతాడని, ఆయన వెనక్కి తిరిగిచూశాడు, నిజంగానే మనసులో ఉలిక్కిపడ్డాడు. అయ్యోబాబోయ్ ఏంటి ఇలా ఉంది ప్రాణి అని అయితే వాళ్ళకి నిర్భయత్వం. ఎక్కడ నిర్భయత్వం అద్వైతమే నిర్భయత్వం రెండోది ఉందంటే భయం. ఉన్నది ఒక్కటే అంటే భయమెందుకు ఇంకా, ఇంక భయపడ్డానికి ఏముంటుంది అదే అద్వైతం కాబట్టి ఆయన వెంటనే ఏమన్నాడంటే... శాపవాక్కుని విడిచిపెట్టాడు ఏతత్ ఏవ నృశంసం తే రూపమ్ అస్తు విగర్హితమ్ నీకు ఇటువంటి నింద్యమైనటువంటి రూపం కావాలనుకున్నావు నృశంసం విగర్షితమ్ క్రూరమైన నిందమైన రెండు మాటలు వేశారు, ఈ రూపం ఎలా ఉంది నింద్యంగా ఉంది చూడ్డానికి అసహ్యించుకునేలా ఉంది, ఘోరంగా ఉంది. చేతులొక్కటీ ఉండీ ఏమిటా స్వరూపము కనపడ్డం ఏమిటీ... అప్పటి తలకాయ ఉంది ఆయనకి ఇంకాను కాబట్టి నీవు ఇలానే అరణ్యంలో పడివుండు. ఇప్పుడు అసలు ఉన్న అందం పోయింది. ఇప్పుడేం చేశాడు ఉన్న అహంకారం అప్పుడు పోయింది పోయి మహర్షి కాళ్ళమీద పడ్డాడు.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు మీరు నన్నోమాట అడగచ్చు ఏంటండీ పాపం ఆపాటిదానికి బుద్ధి చెప్పాలికాని ఆపాటిదానికి అలా శాపమిచ్చేయడం ఏమిటండీ అని అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, శాపమెప్పుడూ కూడా అనుగ్రహము శాపవాక్కు అనరు శాపానుగ్రహము అంటారు దానిచేత మార్పు తీసుకొస్తారు తప్పా అలాగేపడి ఉండు అనరు ఆ బాధ తెలిస్తే ఆ తరువాతి కాలంలో ఇంకెప్పుడూ ఇటువంటి తప్పుడు పనిచేయకుండా లోకానికి ఉపకారం చేస్తాడు. ఇక లోకోపకారం మొదలుపెడతాడు అవతలివాడి బాధ తనబాధగా స్వీకరించి అవతలివాడికి మాట సాయమో చేతి సాయమో ఏదో ఒక సాయం మొదలుపెడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ రావాలంటే లోపల దిద్దుబాటు జరగాలి లోపల దిద్దుబాటు జరగాలీ అంటే కొంత కాలం కష్టపడాలి తప్పదు. ఏలినాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి ఎందుకు భయపడుతారు, ఆయన కష్టపెడుతాడు శనైః శనైః చరః మెల్లిమెల్లిగా వెడుతూ కష్టపెడుతాడు, కాని ఆ కష్టపెట్టడంవల్ల ఏమౌతుందో తెలుసాండి... గొప్ప పరిణితివస్తుంది. గొప్ప అనుభవం వస్తుంది. తరువాతి కాలంలో ఆయన కీర్తికి కారణం అవుతుంది అందుకే ఏలినాటి శనిని ఎప్పుడు దూసించకూడదు, మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థన చేస్తే ఆయన దాన్ని ఇంకొకలా మారుస్తాడు. ప్రతిరోజు తిరగవలసిందాన్ని గుడిచుట్టు తిరగడంగా మారుస్తాడు భక్తిచ్చి.
కాబట్టి ఇప్పుడు శాపనుగ్రహం ఇందుకు ఇస్తారు మార్పును తీసుకురావడం కోసం ఇస్తారు వెంటనే అతనికి అర్థమయ్యింది అతనికి అయ్య.. బాబోయ్... ఇలా ఉండడమా పడ్డాడు మహర్షి కాళ్ళమీద ఇప్పుడు పడి అన్నాడు ఎప్పుడు నాకు ఈ శాపవిమోచనము అని అడిగాడు. అయితే మారావుకదా ఇప్పుడే అన్నారనుకోండి. ఆ బుద్ధి మళ్ళీ మారిపోతుంది కాబట్టి ఆ బాధంటే ఏమిటో తెలియాలి ఆయన అన్నాడూ యదా ఛిత్త్వా భుజౌ రామః త్వాం దహేత్ విజనే వనే ! తదా త్వం ప్రాప్స్యసే రూపం స్వమ్ ఏవ విపులం శుభమ్ !! నీవు అరణ్యంలో పడి ఉండి ప్రాణులను తింటూ ఉంటే... ఒకానొకప్పుడు రామ చంద్ర మూర్తి అరణ్యంలోకి వచ్చీ నీ భుజములను తెగనరుకుతారు, తెగనరికి నిన్ను ఆ అరణ్యంలో కాల్చివేస్తారు, ఎందుకంటే ఆ ప్రాణి అలా ఉండిపోవడానికి వీల్లేదు కదా... కాల్చబడాలి రాముని దగ్గరున్న గొప్పతనం అదే మీతో ఇదే నేను మనవి చేశా అంతేష్టి సంస్కారం చేస్తారాయన ప్రాణిని కాల్చేస్తారు, అంటే చనిపోయినటువంటి ప్రాణిని అలా విడిచి వెళ్ళిపోడు దానికి అంతేష్టి చేస్తాడు.
పొద్దున్నే భోంచేస్తూ నేను గోపాల కృష్ణగారితో అదే కాసేపు ముచ్చటించాం, అలా ఎందుకు చేస్తాడండీ రాముడు అని ఆయన ఏదో ప్రశ్నవేస్తే... చెప్తున్నాను ప్రతి ప్రాణికి కూడా దేవతలు ఆవహించి ఉంటారు, పాణి చెయ్యి ఉందనుకోండి ఇంద్రుడు ఉంటాడు, వాక్కు అగ్నిహోత్రం ఉంటుంది, కన్ను సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి విడగొట్టాలి మంత్రం చేత విడగొట్టేసేసి అంటే ప్రత్యేకించి మనుష్యు శరీరానికైతే మిగిలినవాటికైతే ప్రాణ అపాణ వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుతర ధనుంజయ దేవ దత్తములలో ధనుంజయం అన్న వాయువు చేసేసుకుంటుంది. మనుష్య ప్రాణికి ఈ దేవతలందరిని కూడా మంత్ర భాగంతో విడదీసేస్తారు విడదీసి మళ్ళీ ఈ శక్తుల్ని దేవతలలో కలుపుతారు కలిపి జడమైపోయి మిగిలిపోయినటువంటి దేహాన్ని అగ్నియందు దహించేస్తారు కాబట్టి అది సంస్కారం అంతేష్టి సంస్కారం 16వ సంస్కారం. అన్ని 16 మీదే నడుస్తాయి సనాతన ధర్మంలో మనిషి జీవితం అందుకని శోషడష కలాపం ప్రపూర్ణుడు చంద్రుడు శోడష సంస్కార ప్రపూర్ణుడు మనుష్యుడు. 16వ సంస్కారంగా అంతేష్టి జరగాలి కాబట్టి రాముడు ఎక్కడెక్కడ ఇటువంటి శరీరాలు కనపడ్డా వాటినీ ఆయన దహిస్తాడు. అందుకని నీవు రాముడి చేత వధింపబడి దహింపబడితే నీ పూర్వ రూపం వస్తుంది.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఇక్కడ మీరు ఒక విషయాన్ని కనిపెట్టాలి, ఎవ్వరికైనా తెలియదేమోకానీ మునులకు మాత్రం తెలుసు రామావతారం వస్తుందని ఈ దేశంలో త్రికాలవేదులు వాళ్ళు అందుకే ఈ దేశంలోనే ఒక గొప్ప శాస్త్రం ఉంది. ʻజోతిష్యముʼ అని వేదపురుషునికి జోతిష్యము నేత్ర స్థానంలో ఉంటుంది. వేదాంగము అని అంటే ఇప్పుడూ కళ్ళులేనివాడు ఉన్నాడూ అనుకోండి మీరు గుళ్ళోకి తీసుకొచ్చి విగ్రహం దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో ముట్టుకో ఇది గణపతి ఇదిగో ఇది ముట్టుకో తొండం అన్నారనుకోండి ఆయన చూసి ఓహో అంటాడు. అదిగో అదే ధ్వజస్తంభం చిరుగంటలు అన్నారనుకోండి ఆయన చూడగలడా అదే గోపురం అన్నారనుకోండి ఆయన చూడగలడా... చూడలేడు మీరు గోపురం ఎక్కించలేరు. దూరంగా ఉన్నది చూడ్డానికి కన్ను పనికొస్తుంది కాలంలో వచ్చేదాన్ని లెక్కకట్టాడానికి జోతిష్యం పనికొస్తుంది, అందుకని వేదపురుషుడికి నేత్ర స్థానంలో ఉంటుంది జోతిష్య శాస్త్రం వేదాంగంగా. కాబట్టి మహర్షులు త్రికాలవేదులు వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు ఏం జరగబోతోందో. కాబట్టి వాళ్ళు రాబోయే రామావతారాన్ని లెక్కలోకి తీసుకున్నాడు ఆయన తీసుకుని రామావతారం వచ్చి రాముడు అడవికి వచ్చాక రాముడి చేతిలో నీ చేతులు ఖండింపబడి నీ దేహము దహింపబడితే నీకు మళ్ళీ యథారూపం వస్తుంది.
Image result for కబంధుడుకాబట్టి రామా! నేను ఇందుకు సంతోషించాను నా చేతులు నరికేవాడు ఎవడో వచ్చాడని ఎవడో నరికాడా రాముడే నరికాడా..? అందుకడిగాను కాబట్టి రామా! నేను ఎవరూ పూర్వం అంటే నేను శ్రియా విరాజితం పుత్రం దనోః త్వం విద్ధి లక్ష్ణణ ! ఇన్ద్ర కోపాత్ ఇదం రూపం ప్రాప్తమ్ ఏవం రణాజిరే !! శ్రీ అనేటటువంటివాని యొక్క మధ్యమ పుత్రుడైనటువంటి ʻధనువుʼ అను పేరున్నవాన్ని నాకు స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఋషి శపిస్తే నేను అక్కడితో ఊరుకోలేదు ఆ రూపం వచ్చేలోపలా నేను బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాను, బ్రహ్మగారు ప్రత్యక్షమై అన్నారూ దీర్ఘాయున్మాంభవ అన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత నా అహంకారం ఏమైపోయిందో తెలుసా..? నేను దీర్ఘయుష్మంతున్ని నన్ను ఇంద్రుడు ఏం చేస్తాడు ఇంద్రుని మీద యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళితే ఇంద్రుడేం చేశాడో తెలుసా..? ఆయన ఒక చమత్కారమైనటువంటి మనిషి ఆయనేం చేశాడంటే... ఒక్కసారి నా తలకాయని తన వజ్రాయుధం పెట్టీ ఒక్క దెబ్బ కొట్టీ నా తలకాయని కడుపులోనికి దింపేశాడు నా రెండు కాళ్ళని పొట్టలోకి తోసేశాడు, తోసేస్తే తలకాయలేదు కాళ్ళులేవు మనిషిని మాత్రం బ్రతికున్నాను పైగా అన్నాడు తోసేసి పితామహ వచః సత్యం తత్ అస్తు ఇతి మమ అబ్రవీత్ పితామహుడైన బ్రహ్మగారు నీకు దీర్ఘాయుస్సు ఇచ్చాడు చంపేయను పండుండు అన్నాడు.
అప్పుడు నేను అన్నాను అయ్యబాబోయ్... పితామహుడు ఇచ్చాడు వరం బాగానే ఉంది, అహంకారంతో నేనేదో సాధించాననుకున్నది ఇలాగే వస్తాయి తిరిగి, కాబట్టి వినయంతో చేసినవి భక్తితో చేసినవి ఉద్దరిస్తాయికాని అహంకృతితో చేసినవి పనికొచ్చేవికావు చిట్టచివరకు వచ్చి అలాగే కట్టి కుదుపుతాయి. కాబట్టి నేను అన్నానూ నాకు పితామహుడు దీర్ఘాయుస్సుమంతుడు అన్నాడు నిజమే... కడుపుకి ఆకలోటి ధర్మంకదా ప్రాణికి ఇప్పుడు నాకు తలకాయలేదుగా..? కాబట్టి నోరులేదుగా కాని కడుపుందిగా తినాలిగా..? వెడదామంటే కాళ్ళులేవు ఏం తిని బ్రతకనూ అని అడిగాడు. అడిగితే ఆయనేం చేశాడో తెలుసా... ఏవమ్ ఉక్త స్తు మే శక్రో బాహూ యోజనమ్ ఆయతౌ ! ప్రాదాత్ ఆస్యం చ మే కుక్షౌ తీక్ష్ణ దంష్ట్రమ్ అకల్పయత్ !! నాకు పెద్ద పెద్ద కోరలు పెట్టీ నా గుండెలు దగ్గర ఓ కన్నుపెట్టీ నాకు యోజనమంత పొడుగైన చేతులిచ్చీ నీవు బ్రతకవలసింది దీర్ఘాయుస్మంతుడవై బ్రతికుండడానికే తప్పా అంతకన్నా ఎందుకురా నీవు బతికుండి ఏం చెయ్యాలి లోకానికి అందుకు నీవు

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
చేతులతో తడుముతుండూ తింటూ ఉండూ అన్నాడు. అంటే ధారుణమైన జన్మఏదో తెలుసాండీ! తినడానికి బ్రతికే జన్మ కదాండీ! ఇప్పుడూ అంతిమంగా తీర్పు ఎక్కడకొచ్చింది, ఆయన దీర్ఘాయుస్మంతుడు దేనికి తింటాడు బ్రతుకుతాడు, ఎందుకు బ్రతుకుతాడు తిండానికి బ్రతుకుతాడు అంతే ఎక్కడికీ వెళ్ళడు ఏమీ చెయ్యడు ఈశ్వరుడి గురించి ఏమీ తెలుసుకోక్కరలేదు. ఓపికున్నా ఏమీ చెయ్యక్కరలేదు, ఓపిక ఉన్నరోజుల్లో భోగాలకి పెద్దవాడైపోయిన తరువాత ఉన్న ఓపిక ఎక్కడ పోతుందోని ఈశ్వరుడిదగ్గరకు వెళ్ళడు.
Image result for కాళహస్తీశ్వర శతకముమీకూ లోకం పోకడ ఎలా ఉంటుందో తెలుసాండీ! ఇప్పుడెందుకండీ అంటాడు, ఏమండీ రామాయణానికి వెళ్ళొద్దామని అన్నాడనుకోండి ఎవడైనా ఏంటండీ ఇప్పడ్నుంచి ఇవన్నీ రామాయణం అవన్నీనూ... మరి ఎప్పుడండీ అని మీరు అడిగారనుకోండి రిటైర్ అయిపోయాక, రిటైర్ అయిపోయిన తరువాత కూడా నీవు ఉంటావని ఎవరైనా రాసిచ్చారా నీకు బాండుపేపరు దంతంబుల్ పడనప్పుడే తనువునన్ దా రూడి యున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే, జరక్రంతాంబు కానప్పుడే వింతల్ మేనంజరిమ్పనప్పుడే కరుల్ వేల్వెల్ల గానప్పుడే చింతి ఇమ్పన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా ! ఇంక నీవేం చేస్తావు, 60 యేళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయినతరువాత అప్పుడు పూజపీఠమీదకెళ్ళి కూర్చుని ఆచమ్యా అంటే నీకు తెలియదు, ఓ గుళ్ళోకి వెళ్ళి ముందు మంత్ర పుష్పానికి నీళ్ళు వదలాలంటే తీర్థం కింద పుచ్చేసుకుంటుంటాడు లోపలికి ఎందుకంటే మంత్ర పుష్పం ముందు చెయ్యి కడుక్కోమని వేశారని చేయి కడుక్కోమని ఆయనకు తెలియదు. అప్పుడు మళ్ళీ అర్చకస్వాములు అయ్ యయ్... అయ్యో అది తాగేయకండి అలాగని తీర్థం కాదు చేయ్యి కడుకోండి అంటే అప్పుడు ఆ చేతినీళ్ళు తీసుకెళ్ళి ఆయన పళ్ళేంపోనే కడిగేస్తాడు అంటే అదో వాష్ బేషిన్ అనుకుంటాడు. అమ్మబాబోయ్ నా అదృష్టం రా ఇలాంటి భక్తుడు వచ్చాడు ఇవ్వాళ అని ఆయన అనుకోవాలి లేదని మీరు అనుకుంటున్నారా ఎక్కడిదీ అజ్ఞానం, ఓపిక ఉండగా ఆర్జించడానికి తినడానికి తప్పా ఈశ్వరుడిగురించి తెలుసుకోవడానికి పనికిరాదు, ఒక్కొక్కడి జీవితం అసలు అలాగే తెల్లారిపోతుంది, అసలు ఎప్పుడూ దేనికీ అంటే తినడం తింటూ ఉంటాడు తింటూ ఉంటాడు అది తింటుంది ఓ రోజున చెప్పానుగా అన్నమంటే తినునదీ తినబడునది, మనచేత తినుబడునది మనని తినునది రెండర్థాలు కాబట్టి అది తినేస్తుంది ఓ రోజు అయిపోందంతే.
కాబట్టి నీకు దీర్ఘాయుష్యే కదరా కావాలి నీకో నోరు చాలు, ఆహారాన్ని చూసుకోవడం కోసం ఓ కన్ను చాలు వెత్తుక్కోవడానికి ఓ కన్ను చాలు, నీవు ఎక్కడికెళ్ళాలి ఓ గుడికెళ్ళాలా గోపురానికెళ్ళాలా ఉంటే భయపడుతాడు ఎక్కడికన్నా వెళ్ళాలని, ఎందుకునాన్నా అలా పడుండు దీర్ఘాష్యమంతుడువై ఉండు. ఇప్పుడు తెలిసింది బాధేమిటో, ఎందుకు చేశానా తపస్సు ఎందుకు వెళ్ళానా ఇంద్రుడు మీదకి యుద్ధానికీ ఎందుకు కనపడ్డానా ఆ ఋషికి అలాగాని ఏడుస్తూ ఇన్నివేల సంవత్సరాలనుంచి ఇక్కడ పడున్నాను అలా వస్తే తడుముకోవడం తినడం ఎప్పుడు నరికేస్తాడా ఈ చేతులని చూస్తున్నాను రామా! ఇప్పుడు నీవు ఈ చేతులు నరికి ఈ దేహం కాల్చేయ్. ఎంత తొందరపడిపోయాడో తెలుసాండి, సూర్యాస్థమయం అయిపోతుంది అలసిపోయిన రథాలతో వెళ్ళిపోతున్నాడు సూర్యుడు సూర్యాస్థమయం అయితే కాల్చవు నీవు ధర్మం, రామ చంద్ర మూర్తి చెయ్యడు అంతేష్టి సూర్యాస్థమయం అయితే కాబట్టి అవకుండా తొందరగా నన్ను ఒక గొయి తీయించి అందులో పడేసి భూమిమీద పడుకోబెట్టి అంటించడానికేం కుదరదు అది అంత పెద్ద రాక్షసాకారమది, ఇప్పుడో గోతిలో పాడేసి దానిండా

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
కట్టెలు పారేసి అగ్నిహోత్రం పెట్టి వెలిగించేసై వెలిగించేస్తే నేనేం దొందరగా కాల్తాననుకుంటున్నావా? కదలిక లేదు కదాండీ ఫ్యాట్ ఎలా డెల్యూట్ అవుతుంది. కాబట్టి ఒళ్ళంతా నేతి ముద్దలా కొవ్వుపట్టేసింది ఇప్పుడు, కొవ్వు ఓ పట్టాన కాలదట అలా ఓ కాలుతూనే ఉంటుంది అందుకే కొవ్వొత్తి తొందరగా కాలుతుందేంటి? దీపారాధనలో ఒత్తి కాలిపోయినట్లు కాలదు అలా కొవ్వు కరుగుతూ కరుగుతూ దీపం అలా కిందకి వస్తూ వస్తూ ఉంటుంది. ఆ కొవ్వంతా కాలాలి కాబట్టి రామా చాలా సేపు పడుతుంది నా ఒళ్ళు కాలిపోవడానికి తొందరగా ఓ గొయ్యి తవ్వించి తోసేసి కాల్చేసై. నాకు ఇప్పుడు ఈ శరీరంతో ఉంటే స్మృతి ఉండదు, నా అసలు శరీరం నాకు వచ్చేస్తే నాకు దివ్య స్మృతి కలుగుతుంది ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలను, అప్పుడు నీ భార్యను ఎవరు అపహరించారో నేను చెప్తాను నీకు ఆ సాయం చేస్తాను. ఇతః పూర్వం ఎప్పుడైనా అన్నాడాండి ఇలాంటి మాటలు, ఎవడన్నా మంచిగా ఉంటే వాన్ని బాధపెట్టాడు ఇప్పుడు అవతలివాడి బాధలో ఆ శరీరమొస్తే వెంటనే నీకో మాట సహాయం చేస్తానంటున్నాడు ఈ మార్పు కోసం శాపానుగ్రహం ఇస్తారు.
Image result for ఋషి శాపంమీరు బాగా పట్టుకుంటే ఋషులు ఏదో తపస్సుందికదాని శాపవాక్కు విడిచిపెట్టరు వాళ్ళ తపస్సు పోతుంది పోనిలేరా ఒకనిని మార్చాను, ఇప్పుడు ఆయన పనికొచ్చాడు అందుకని ఇప్పుడు ఏమయ్యాడు కబంధ మహాత్మనః ఈ కబంధుడు మహాత్ముడు అన్నారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే మార్పు ఎక్కడ వచ్చిందో వాడు చాలా గొప్పవాడు ఈ మార్పు రాకపోతే వాడు లోక కంటకుడై కూర్చుంటాడు. కాబట్టి రామా నీవు ఛేత్స్యతే సమరే బాహూ తదా స్వర్గం గమిష్యసి ఇంద్రుడు కూడా ఏమన్నాడంటే నీ రెండు బాహువులు రామ లక్ష్మణులు ఎప్పుడు తరిగేస్తే అప్పుడు స్వర్గానికి వెళ్ళుదువులేరా అప్పటివరకూ ఇలానే పడుండు అన్నాడు, అందుకనీ తొందరగా నాకు అంతేష్టి సంస్కారం చేసేసై. సరే లక్ష్మణున్ని పిలిచాడు గుణపమిచ్చాడు గొయ్యి తవ్వించాడు శరీరాన్ని తోసేశాడు ఏనుగులు విరిచినటువంటి కొమ్మలు ఎండిపోతే ఏర్పడిన ఎండు కర్రలు, మహర్షీ! అమ్మో... వాల్మీకి రామాయణమండీ..! ఎంత జాగ్రత్తగా రచనచేస్తారో తెలుసా ఏమండీ అంత పెద్ద శరీరాన్ని అంతపెద్ద గోతిలో వేస్తే అంత పెద్ద శరీరాన్ని కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి ఎక్కడ్నుంచి ఏరి పట్టుకొచ్చారు సూర్యాస్తమంలోపలా అని నేను మీరు అంటారేమోనని అక్కరలేనివి ఇలాంటివి తీయడం మనంతగొప్పవాళ్ళు ఉండరు. కాబట్టి ఏనుగులు గుంపులు తిరుగుతాయి అక్కడ, వాటి పనేమిటంటే వాటి తొండం కాళిగా ఉండదు కొమ్మలు విరిచేస్తుంటాయి, ఆ విరిచేసినటువంటి కొమ్మలు కిందపడిపోయి ఎండిపోయాయి, కాబట్టి ఆ పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసుకొచ్చి రామ చంద్ర మూర్తి తీసుకొచ్చి ఆ గోతిలో పడేశారు, లక్ష్మణ మూర్తి ఆ గోతిలో పడేశారు పాడేసి ఇప్పుడు కబంధున్ని కాల్చేస్తున్నారు ఈ కబంధుడి దగ్గరే ఈ కబంధుడు కాలిపోతే సీతమ్మ తల్లిని పట్టుకోవడానికి సీతమ్మ తల్లిని అన్వేషించడానికి పేద్ద శుభవార్త దొరుకుతుంది, హనుమ ప్రవేశించడానికి ఇంక కథకి రంగం సిద్ధమౌతుంది ఇంక ఇక్కడ్నుంచి కిస్కింధ కాండకి పునాది పడుతూంది ఇక్కడ్నుంచి హనుమత్ ప్రవేశం ప్రారంభమౌతూందన్నమాట.
కాబట్టి ఇప్పుడు నాయనా! నీవు నా శరీరాన్ని అంటించేసై ఇప్పుడు ఆ ఏనుగులు విరిచేసినటువంటి ఎండిపోయిన కొమ్మలు తెచ్చి గోతిలో పడేసి అంటించేశారు ఆ శరీరాన్ని అంటించేస్తే అది మెళ్ళి మెళ్ళిగా కాలిందీ అన్నారు మహర్షి. కొవ్వుపట్టి ఉంది కదాండి అప్పుడు కూడా హ్యూమనాటమీ బాగా తెలుసన్నమాట అంటే కదలకుండా ఎక్కువ తినేస్తే కొవ్వుపట్టేస్తుంది. వాడు దీర్ఘాష్యుమంతుడుకనుక వాడికి హార్టబ్లాక్ లేదు వాడికి, కాబట్టి ఆయనలోంచి ఒక దివ్వమైన స్వరూపమొకటి బయటికొచ్చింది తత శ్చితాయా వేగేన భాస్వరో నిర్మలామ్బరః ! ఉత్పపాతాఽఽశు సంహృష్టః సర్వ ప్రత్యంగ భూషణః !! విమానే భాస్వరే తిష్ఠన్ హంస యుక్తే యశస్కరే ! ప్రభయా చ మహా తేజా దిశో దశ విరాజయన్ !! దశ దిశలు వెలిగిపోయేటట్టుగా హంసలు కూర్చినటువంటి రథం మీద తెల్లటి వస్త్రములు ధరించి అంగ ప్రత్యంగములన్నీ కూడా సువర్ణ మణిమయమైనటువంటి భూషణముల చేత అలంకరింపబడినటువంటివాడై వెలిగిపోతున్న పగిడి ఆ ఒక్కసారి కబంధుడు మళ్ళీ పూర్వ స్వరూపంతో ఆ రథంలో కూర్చుని కనపడ్డాడు, కనపడి ఒక్కసారి క్షణం ఇలా కళ్ళు మూసుకొని ఆలోచించాడు ఆలోచించి అన్నాడూ రామా! నేను ఆలోచించగా మీకు కలిగినటువంటి కష్టానికి ఒక విషయం అర్థమవుతోంది దశా భాగ గతో హీన స్త్వం రామ సహ లక్ష్మణః ! యత్ కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రధర్షణమ్ !! మీరు దుర్ధశ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారు, అందుకే భార్య దూరమైపోయింది మీ ఇద్దరికి జాడ తెలియట్లేదు ఎంత దూరం నడుస్తున్నారో కూడా తెలియనటువంటి దూరం నడిచి కష్టపడి వెతుకుతున్నారు, ఇప్పుడు ఇలా వెతికి తిరిగి ప్రయోజనంలేదు, మీకు సాయం చెయ్యగలిగిన మిత్రుడు ఒకడు కావాలి, ఒక గొప్ప మిత్రుడు ఆయన ఎటువంటివాడై ఉండాలి ఆయన ఈ లోకమంతా తిరిగినవాడై ఉండాలి భూ మండలమంతా తిరిగినవాడైతే ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసినవాడై ఉంటాడు ఎందుకనీ రావణుడు అన్నది ఒక్కటే తెలుసు తప్పా అతడు ఎక్కడుంటాడో తెలియదంటున్నావు కదా జటాయువు చెప్పాడని ఆ రావణుడెవరో ఎక్కడుంటాడో ఎలా పరిపాలిస్తాడో ఎంతమంది రాక్షసులుంటారో ఇవన్నీ తెలియాలంటే ఈ భూమండలమంతా తిరిగినవాడై ఉండాలి, అన్ని తెలిసున్నవాడై ఉండాలి ఎందుకు తిరిగాడన్న కారణం వేరు విందురుకాని కిష్కింధ కాండలో అలా తిరిగినవాడు ఒకడు ఉన్నాడు రామా! ఆయన గురించి చెప్తాను ఆయన్ను స్నేహం చేసుకో అటువంటి మిత్రున్ని సంపాధించావా... ఆ మిత్రుడివలన నీకు సీతమ్మ జాడ దొరుకుతుంది.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
కాబట్టి తత్ అవశ్యం త్వయా కార్యః స సుహృత్ సుహృదా వరం ఓ మంచి హృదయమున్నటువంటి రామా! నీకొక మంచి స్నేహితుడు కావాలి అకృత్వా న హి తే సిద్ధిమ్ అహం పశ్యామి చిన్తయన్ నాకు ఆలోచిస్తే అది అనిపిస్తుంది
శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానరః ! భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా శక్ర సూనునా !!
ఋశ్యమూకే గిరి వరే పమ్పా పర్యన్త శోభితే ! నివసతి ఆత్మవాన్ వీర శ్చతుర్భిః సహ వనరైః !!
వానరేంద్రో మహా వీర్యః తేజోవాన్ అమిత ప్రభః ! సత్య సంధో వినీత శ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్ !!
దక్షః ప్రగల్భో ద్యుతిమాన్ మహా బల ప్రరాక్రమః ! భ్రాత్రా వివాసితో రామ రాజ్యే హేతోః మహా బలః !!
స ఋక్షరజసః పుత్రః పమ్పామ్ అటతి శంకితః ! భాస్కర స్య ఔరసః పుత్రః వాలినా కృత కిల్బిషః !!
Image result for కబంధుడుసూర్యభగవానుడి యొక్క ఔరస పుత్రుడైనటువంటి సుగ్రీవుడనబడేటటువంటి ఒక వానర రాజు ఋశ్యమూక పర్వత శిఖరముల మీద ఉన్నాడు, కారణాంతరముల చేత తన అన్నగారైనటువంటి వాలిచేత రాజ్యంలోంచి బయటికి వెళ్ళగొట్టబడాడు, వెళ్ళగొట్టబడి నాలుగురు వానరులు తన చుట్టూ సేవిస్తూ ఉండగా... అందులోనే ఉన్నారు హనుమా, నలుగురు వానరలు సేవిస్తూ ఉండగా సుగ్రీవుడు ఋశ్యమూక పర్వతం మీద ఉన్నాడు. అపారమైన బలవంతుడు ఈ భూమండలంలో ఎక్కడ ఏమున్నాయో అన్నీ తెలిసున్నవాడు, అతనితో అగ్నిసాక్షిగా నీవు స్నేహం చేసుకుంటే అతను దశ దిశలకు వానరములను పంపించి సీతమ్మ యొక్క జాడ కనిపెడుతాడు నువ్వు ఇలా తిరిగి తెలుసుకోక్కరలేదు రామా కాబట్టి ఇప్పుడు నీకు మిత్ర సహాయం అవసరమై ఉంది, అతను మహా బలపరాక్రమములు కలిగినటువంటివాడు గొప్ప వీర్యవంతుడు

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
వానరేంద్రుడు తేజస్సున్నవాడు సత్యసంధుడు నీతి కలిగినటువంటివాడు పట్టుదల ఉన్నటువంటివాడు మంచి మతి కలిగినటువంటివాడు దక్షత కలిగినటువంటివాడు కాంతి కలిగినటువంటివాడు అటువంటి వాడితో నీవు స్నేహం చేసుకుంటే ఆయన నీ కార్యంలో సాయం చేస్తాడు.
కాబట్టి ఆ వృక్షరజస్వి యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవుడితో నీవు వెంటనే స్నేహం చేసుకోవడానికి ఋశ్యమూక పర్వతానికి బయలుదేరు, ఆ ఋశ్యమూక పర్వతం ఎక్కడుందీ అంటావేమో నీకు దారి చెప్తాను చూడు, రామాయణం ఎంత ఆప్యాయంగా ఉంటుందో తెలుసాండీ! హైద్రాబాదు ఎప్పుడూ ఆయన వెళ్ళలేదు, ఆయన కొడుకుని మొదటిసారి పంపిస్తున్నాడు ఉద్యోగానికి, హైద్రాబాదు వెడుతున్నటువంటి కొడుకుని కంగారు కంగారుగా తీసుకొచ్చి రైలు ఎక్కించడంలో ఆయనకి కట్టిన మినపరొట్టెలు తేవడం మర్చిపోయాడు తండ్రి, ఎప్పుడూ హైద్రాబాదు వెళ్ళేటటువంటి అలవాటున్న మేనమామగారు వచ్చాడు స్టేషనుకి ఇప్పుడు తండ్రి అంటాడు ఒరే నాన్నా రొట్టేతేవడం మర్చిపోయాను ఎలా తింటావు ఎలాగా ఎప్పటికెళ్ళుతుందో ఎప్పుడు దిగుతావో అక్కడ ఏముంటుందో ఏముండదో నాన్నా నా ప్రాణాలు నీమీదే ఉంటాయి సుమా! నీవు వెళ్ళాక ఉత్తరం రాయి అంటాడు. మేనమామ గారు అంటాడు ఇప్పుడు నీకేం భయంలేదు ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుందా బయలుదేరగానే మొదటి స్టేషను అనపర్తి రెండో స్టేషను ద్వారపూడి మూడో స్టేషనూ రాజమండ్రి, రాజమండ్రి వెళ్ళేటప్పటికి ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు నీవు రాజమండ్రి స్టేషన్లో దిగితే అక్కడ పది నిమిషాలు ఆగుతుంది దిగి నీవు చూస్తే అక్కడే మంచి అరటిపళ్ళు చాలా చక్కటి రొట్టెలు అన్నీ అమ్ముతూంటారు, కాబట్టి నీవు అక్కడ నీకు కావలసినవి ఓ రెండు ఇడ్లీలో రెండు అరటిపళ్ళు అవీ కొనుక్కొని చక్కగా తినేసేసి మళ్ళీ రైలెక్కి కూర్చుంటే పది నిమిషాలకన్నా ఆగదు గబగబా కొనేసుకో రైల్లో కూర్చుని తినేసి మంచినీళ్ళు తాగేసై వాటర్ బాటిల్ మర్చిపోకు ఎక్కిల్లోస్తాయి, వాటర్ బాటిల్ కొనుక్కున్నావనుకో ఎక్కి పడుకున్నావనుకో హాయిగా తెల్లారేటప్పటికి ఆరు హైద్రాబాదు వెళ్ళిపోతావు అంటాడు.
తెలిసున్నవాడు చెప్పేటప్పుడు రాజమండ్రి వస్తుంది ద్వారపూడి వస్తుందో అని చెప్పి ఎక్కడ ఏం తినాలో ఏం తాగాలో అని ఏం తినాలో ఎలా పడుకోవాలో ఎలా లేవాలో ఎందుకు చెప్తాడూ అంటే ఆత్మీయత అందులో కలిసిపోయి ఉంది. కలిసిపోయి ఉండడంలో అలా చెప్తాడు కాబట్టి ఇప్పుడు చూడండీ... నిజంగా ఆ మాట్లాడటంలో వాల్మీకి మహర్షి మాట్లాడించడంలో అందం చూడండి ఇందుకని మహాత్ముడయ్యాడు. ఇప్పుడు రాముడి మీద ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడంటే ఋష్యమూకానికి వెళ్ళి నీ పనౌతుందని ఎదో చేతకానివాడికి చెప్పినట్లు చెప్పటంలేదు, ఉపకారం చేయడం అంత శ్రద్ధతో చేస్తున్నాడు, మహానుభావుడివల్ల మళ్ళి నేను పునర్జన్మ పొందానని సంతోషిస్తున్నాడు. నాయనా రామా! నీవు లక్ష్మణ సహితుడువై పశ్చిమ దిశగా ఇదే మార్గంలో వెళ్ళితే బోలెడన్ని చెట్లు కనపడుతాయి, నేరేడు మోలేటీ పనసా జువ్వి మర్రీ తుమ్మికా రావి కొండగోగు మామిడీ చండ్రి పొన్న ఎర్రగోరింటా కానుగ నల్లవి అశోక వృక్షాలు కలిమి చెట్లు గన్నేరు చెట్లు నల్ల జీడి చెట్లు ఎర్ర చందన వృక్షాలు దేవదారు వృక్షాలు అన్నీ కనపడుతాయి, ఎందుకివన్నీ ఆప్యాయతకలిగిన మేనమామ చెప్పినట్టు చెప్పడం. వీటికి మంచి మంచి పళ్ళు ఉంటాయి, లక్ష్మణుడు ఎక్కి కోసి నీకు తెచ్చిపెట్టవచ్చు లేదా కొమ్మలు వంచినా కూడా అందుతాయి. అంటే కింద కొమ్మలకి కూడా అన్ని పళ్ళు ఉంటాయి ఆ పళ్ళు ఎవరూ కోయరు.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఎంత వివరంగా మాట్లాడుతాడో చూడండి, అక్కడే ఉంటుంది క్యాంటీను ఒక వేళ ఏకారణం చేతైనా మూసేసిఉంటే నీవు కంగారుపడకు ఇటువైపుకు కట్టేస్తారు కానీ అదే టైములో టిఫిను ఎక్కువ తినేవాళ్ళు ఇవతలి ప్లాట్ ఫారం మీదకు వస్తారు, ఇటు చెక్కలతో క్లోజ్ చేసి అటువైపుకు అమ్ముతుంటాడు అటువైపు వెళ్ళు అని చెప్తాడు చూశారా మేనమామగారు అలా చెప్తాడు చెప్పేటప్పుడు. మీరు ఆ శ్లోకాలలో అవతలివాడి ఆప్యాయత చూడాలి ఆ చెప్పడంలో ఎంత గొప్పరచనండీ వాల్మీకి మహర్షిది, కాబట్టి లక్ష్మణుడు కొమ్మలు వంచి పళ్ళు కొయ్యవచ్చు, తేనెపట్ల నుంచి తేనె కారుతుంటుంది రామా! అవి మీరు తినచ్చు, అది దాటి మీరు వెడితే అక్కడ ఒక చిక్కటి వనం కనపడుతుంది అక్కడ అంటే చిక్కటి వనం చక్కటి వనం, బాగా చెట్లు దగ్గరి దగ్గరిగా ఉంటాయి. అవన్నీ పూలతో పళ్ళతో నిండిపోయి ఉంటాయి సర్వ కామ ఫలా వృక్షాః పాదపాః తు మధు స్రవాః ! సర్వే చ ఋతువః తత్ర వనే చిత్రరథే యథా !! చైత్ర రథం అంటే ఎప్పుడూ అన్ని ఋతువులు ఉంటే దాన్ని చైత్ర రథం అంటారు, అన్ని ఋతువులు ఉన్నట్లే అక్కడ ఎప్పుడు పళ్ళుతో పూవ్వులతో తేనెపట్లతో చెట్లన్నీ శోభాయమానంగా ఉంటాయి అక్కడ చక్కగా మీరు తేనె తాగచ్చు పళ్ళు తినొచ్చు.
Image result for పంపా నదిఅది దాటి వెళ్ళిన తరువాత మీరు పంపానది సరోవర ప్రాంతానికి వెళ్తారు, రామా! పంపాసరోవర తీరంలో ఒడ్డునా ఎక్కడా కూడా అసలు గులకరాళ్ళు ఉండవు, సాధారణంగా నది ఒడ్డున అన్నిచోట్లా గులకరాళ్ళు ఉంటాయి, గులకరాళ్ళు ఉంటే ఏమిటీ అని మీరు అడగచ్చు, రాముడు పాదుకలు లేకుండా నడుస్తున్నాడు, గులకరాళ్ళు ఉంటే గుచ్చుకుంటాయి కాళ్ళకు. కాబట్టి రామా పంపానది తీరాన గులకరాళ్ళు ఉండవు అంటే ఆయన కాళ్ళకు గుచ్చుకునేవి లేవు ఎంత ప్రేమో చూడండి ఆ చెప్పడంలో పంపానది తీరంలో గలకరాళ్ళు ఉండవు, ఆ నీళ్ళు చల్లగా అందులో పుట్టినటువంటి పద్మములనుండి పుట్టినటువంటి కింజిల్కములనుండి రాలిన పుప్పొడితో సుగంధ పరిమళ భరితములై తియ్యగా చల్లగా ఉంటాయి, ఎప్పుడు స్నానం చేద్దామా ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది, రామా! అక్కడ నాచుండదు కాబట్టి నీవు జాగ్రత్తగా పంచె పైకితీసి కాలు జారుతుందేమోనని అడుగు వేయక్కరలేదు, ఆ కింద ఉన్నటువంటి ఇసుక నీకు కనపడుతుంది, నీరు వెండి పల్లెంలా ఉంటుంది అంత స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలో ఉంటుందే ఆ సరోవరం అలా ఉంటాయి నీళ్ళు రామా!, రామా నీకు ఇంకొక విషయం చెప్తున్నాను అక్కడ అనేకములైన పక్షులు ఆ ఒడ్డున తిరుగుతుంటాయి వాటికేం భయముండదు అవి చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి అవి ఎంత రుచిగా ఉంటాయో తెలుసా రామా..! ఘృత పిణ్డ ఉపమాన్ స్థూలాన్ తాన్ ద్విజాన్ భక్షయిష్యథః ! రోహితాన్ వక్ర తుణ్డాం శ్చ నల మీనాం శ్చ రాఘవ !! రామా! పెద్ద పెద్ద చేపలు ముళ్ళున్నవి రెక్కలున్నవి ఆ నదిలో తిరుగుతుంటాయి పంపా సరోవరంలో, నేతి ముద్ద ఎలా ఉంటుందో అలా కమ్మగా ఉంటాయి అక్కడున్న పక్షులు.
మాంసాహారులు ఎవరైనా ఉంటే నోరూరే ప్రయత్నంలో ఉండకండి కాబట్టి అంత కమ్మటి రుచి కలిగినటువంటి పక్షులు ఉంటాయి, కాబట్టి పమ్పాయామ్ ఇషుభిః మత్స్యాన్ తత్ర రామ వరాన్ హతాన్ ! నిస్త్వ క్పక్షాన్ అయ స్తప్తాన్ అకృశాన్ ఏక కణ్టకాన్ !! ఎంత వివరంగా చెప్తాడంటే ఆ నదిలో కొన్ని నదిలో తిరుగుతుంటాయి, గండుమీనులు స్వరమీనులు రొయ్యలు చేపలు అన్ని ఆడుకుంటుంటాయి, లక్ష్మణుడు బాణంతో గుచ్చి వాటిని పైకి తీస్తాడు, తీసి అగ్నిహోత్రం మీద ఆ బాణంతోటే ఇలా ఇలా తిప్పితే ఎర్రగా కాలుతాయి, నీవు అక్కడ ఒడ్డున కూర్చో రామా కూర్చుంటే నీకు ఒక్కొక్క చేపని కాల్చి పట్టుకొస్తాడు, ఆ

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
పక్షిని కొట్టి కాల్చి పచనం చేసి ఆ నేతి ముద్దలా ఉన్న పక్షి మాంసం తీసుకొచ్చి పెడతాడు చక్కగా నీవు ఆ ఒడ్డున కూర్చుని తిను. తిన్న తరువాత దాహమేస్తుంది, ఎందుకంటే నేతిముద్దలా కదా ఉంటాయి, దాహమేస్తే లక్ష్మణుడు ఏం చేస్తాడో తెలుసా భృశం తే ఖాదతో మత్స్యాన్ పమ్పాయాః పుష్ప సంచయే ! పద్మ గన్ధి శివం వారి సుఖ తీతమ్ అనామయమ్ !! ఉద్ధృత్య స తదా అక్లిష్టం రూప్య స్ఫాటిక సన్నిభమ్ ! అథ పుష్కర పర్ణేన లక్ష్మణః పాయయిష్యతి !! తామరాకులు ఉంటాయి రామా! ఆ తామరాలుకు దొప్పగా చేసి పంపాసరోవరంలోకి వెడుతాడు లక్ష్మణుడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా..! వెండి రేకు బోర్లించినట్లు ఉంటాయి తెల్లగా అడుగున ఉన్నటువంటి ఇసుక కనపడుతుంటుంది, దాంట్లో బోలెడన్ని పద్మాలుంటాయి, పద్మాలకి కింజిల్కాలు ఉంటాయి వాటిలోంచి ఆ పుప్పొడంతా నీటిలో పడుతుంది.
Image result for హిమాచల్ ప్రదేశ్అందుకనీ మాంచి, ఏదో అన్ని రకాల పదార్థాలతోటి శివాభిషేకం చేస్తే వచ్చే తీర్థం అన్ని రుచులూ కలిసి మంచి సుగంధ ద్రవ్యాలతో సువాసనతో ఎలా ఉంటుందో అలా ఉంటాయవి నీళ్ళు, ఆ నీళ్ళు తామరాకు దొప్పతో తెచ్చి నీకు ఇస్తాడు నీవు చక్కగా ఏం చేస్తావంటే తామ రాకు దొప్పతో చల్లగా ఉండే ఆ నీళ్ళు తాగు, సాయంకాల వేళలో నీవు ఆ పంపాసరోవరంలో తిరుగుతుంటే జింకలు లేళ్ళు తిరుగుతుంటాయి చెట్లన్నీ పువ్వులు పెట్టుకున్నాయా అన్నట్లుగా పువ్వులతో శోభిస్తుంటాయి, నీకు సీతమ్మ కనపడలేదూ అన్న బెంగ నీకు తీరుతుంది, రామా! అక్కడ పుష్పమాలలు కొన్ని పడుంటాయి, ఆ పుష్పమాలలు ఎన్ని సంవత్సరములైనా వాడవు ఎందుకో తెలుసా న తాని కశ్చిన్ మాల్యాని తత్ర ఆరోపయితా నరః ! న చ వై మ్లానతాం యాంతి న చ శీర్యంతి రాఘవ !! మతంగ మహర్షి యొక్క శిష్యులు గురవుగారికి సేవ చెయ్యడానికని అక్కడికి వచ్చి దర్భలు అవీ సేకరిస్తున్నప్పుడు వాళ్ళ శరీరానికి కలిగినటువంటి శ్రమవలన పుట్టినటువంటి స్వేధ బిందువుల నేలమీదపడి పువ్వులై దండలయ్యాయవి, ఆ దండలు ఎవ్వరూ తీసి ధరించరు, ఆ శిష్యుల యొక్క చమటా పువ్వులయ్యింది కాబట్టి ఆ పువ్వులు సూర్యరశ్మికి వాడవు గాలికి వడిలిపోవు, అవి ఎన్ని సంవత్సరములైనా అలాగే ఉండి ఉంటాయి, ఆ మాలలు ఎవ్వరూ ధరించరు.
నీకు అక్కడ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం కనపడుతుంది, లోపలికి వెళ్ళడం చాలా కష్టం గున్నఏనుగులు దాని చుట్టూ తిరుగుతుంటాయి రామా! అక్కడే శబరి ఉంది ఇప్పుడు ఆశ్రమంలో తేషామ్ అద్యాపి తత్రైవ దృశ్యతే పరిచారిణీ ! శ్రమణీ శబరీ నామ కాకుత్స్థ చిరంజీవినీ !! త్వాం తు ధర్మే స్థితా నిత్యం సర్వ భూత నమస్కృతమ్ ! దృష్ట్వా దేవోపమం రామ స్వర్గ లోకం గమిష్యతి !! నీవు ఒక్కసారి ఆశ్రమంలోకి వెళ్ళి శబరిని చూస్తే, శబరి నిన్ను చూసిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది నీకోసమే ఎదురు చూస్తోంది, రామా! అక్కడ నుంచి కొంచెం ముందుకు వెడితే ఎప్పుడూ ఏనుగులు తిరుగుతుంటాయి ఆ ఏనుగులు తిరుగుతున్నటువంటి ప్రాంతానికి లోపలే మతంగ మహర్షి చేత నిర్మింపబడిన మంతగ వనమూ అని ప్రసిద్ధికెక్కిన ఆశ్రమం ఉంది అక్కడే పంపాసరోవరానికి తూర్పున ఋశ్యమూకమూ అనబడేటటువంటి ఒక పెద్ద పర్వతము ఉంది, ఆ పర్వతము యొక్క గొప్పతనము ఏమో తెలుసా రామా!
ఋశ్యమూక స్తు పమ్పాయాః పురస్తాత్ పుష్పిత ద్రుమః ! సుదుఃఖారోహాణో నామ శిశు నాగాభిరక్షితః !!
ఉదారో బ్రహ్మణా చైవ పూర్వ కాలే వినిర్మితః !!!
శయానః పురుషో రామ తస్య శైల స్య మూర్ధని ! యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోధిగచ్ఛతి !!
యః తు ఏనం విషమాఽఽచారః పాప కర్మాధిరోహతి ! తత్రైవ ప్రహరన్తి ఏనం సుప్తమ్ ఆదాయ రాక్షసాః !!

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
తత్ర అపి శిశు నాగానామ్ ఆక్రన్దః శ్రూయతే మహాన్ ! క్రీడతాం రామ పంపాయాం మతంగ అరణ్య వాసినామ్ !!
Image result for హిమాచల్ ప్రదేశ్

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఆ ఋశ్యమూకము యొక్క పర్వతములున్నాయే ఆ శిఖరం పైకి ఎక్కడం చాలాచాల కష్టం రామా! అందుకే ఆ శిఖరానికి ఏమని పేరు పెట్టి పిలుస్తారో తెలుసా... దాన్ని సుదుఃఖారోహాణో శిఖరమూ అని పిలుస్తారు, ఎక్కడం చాలా కష్టం కాబట్టి ఆ శిఖరం మీదికి ఎవరు ఎక్కలేరు దాని చుట్టూ ఎప్పుడూ గున్నఏనుగులు తిరుగుతుంటాయి “శిశు నాగములు” కాబట్టి ఆ గున్నేనుగులు గుంపులు గుంపులుగా గంపులు గుంపులుగా తిరుగుతుంటాయి పంపా సరోవరంలో నీళ్ళు తాగి ఆడుకుంటుంటాయి, ఎవరైనా ఆశిఖరం పైకి ఎక్కి రాత్రి నిద్రపోయినప్పుడు వాళ్ళ కలలో ఏం కనపడుతుందో అది వాళ్ళకి దొరుకుతుంది తెల్లవారేటప్పటికి, పాపాచారం కలిగినవాళ్ళు ఋశ్యమూక పర్వతం ఎక్కి ఉండలేరు, ఒకవేళ ఉన్నా వాళ్ళకు నిద్రపట్టగానే రాక్షసులు వచ్చి చంపేస్తారు. కాబట్టి ఏమి అర్థమౌతూంది... ఋశ్యమూకం మీద ఉన్న సుగ్రీవుడు నలుగురు వానరులు పాపాచారము కలిగినవారు కారు, వాళ్ళు పాపాచారులు అని వాలి తరిమేశాడు తప్పా... వాళ్ళు నిజమునకు పాపాచారులు కారు, అటువంటి వారైతే రామా నిన్ను వాళ్ళతో సంధిచేసుకొమ్మని నేను చెప్పను ఇది దానర్థము.
కాబట్టి యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోధిగచ్ఛతి రాత్రి కల్లో ఏంకనపడితే అది తెల్లవారేటప్పటికి అది ఆ కొండమీద దొరుకుతుంది, కాబట్టి రామా! ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళితే అక్కడా ఒక గొప్ప గుహ ఒకటి ఉంది రామ తస్య తు శైల స్య మహతీ శోభతే గుహా ! శిలా పిధానా కాకుత్స్థ దుఃఖం చ అస్యాః ప్రవేశనమ్ !!  ఆ గుహకి ఒక పెద్ద శిలా అడ్డుపెట్టి ఉంటుంది, దానిలోనే సుగ్రీవుడు నలుగురు వానరులతో ఉంటాడు, ఆ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టం తస్యాం వసతి సుగ్రీవ శ్చతుర్భిః సహ వానరైః ! కదాచిత్ శిఖరే తస్య పర్వత స్య అవతిష్ఠతే !! రామా! ఆ శిశునాగములు ఆ గున్నేనుగులు ఉన్నాయే అవి పంపా సరోవరంలోకి వచ్చి నీళ్ళుతాగి పైకి చిమ్మి ఆడుకుని పెద్దగా అరుస్తుంటాయి, అవి అరిచినప్పుడు వాటియొక్క ఘీంకారములు ఆ పర్వతము యొక్క శిఖరం మీదికి వినపడుతుంటాయి, అప్పుడప్పుడూ సుగ్రీవుడు గుహలోంచి బయటికి వచ్చి నలుగురు వానరు కలిసి ఆ శిఖరం మీద కూర్చుని చూస్తుంటారు ఇవన్నీ అక్కడే ఉన్నారు. నిజంగా లైవ్ టెలిక్యాస్ట్ ఇస్తుంటారండీ మనం చదువుతుంటే... అబ్బా..హ్., మనం ఒక్కసారి ఆ ఋశ్యమూక పర్వతం ఆ పంపానది ఇంకా ఎన్ని చెప్తారో తెలుసాండీ... రామా! గుంపులు గుంపులుగా అడవి పందులు వస్తాయి, అడవి పందులు పంపాసరోవరంలో నీళ్ళుతాగి పర్వత గుహల్లో ఆడుకుంటూవెళ్ళి పడుకుంటాయి, పడుకుని అవి పెద్ద పెద్ద రంకెలు వేస్తాయి ఆ రంకెలు ఎలా ఉంటాయో తెలుసా..? ఆంబోతు రంకెలులా ఉంటాయి, అక్కడ గున్నేనుగులు ఏమి ఆటలాడుతుంటాయో రామా... ఆ పర్వత శిఖరం చుట్టూ అవి తిరుగుతుంటాయి వాటిని దాటి శిఖరం ఎక్కవలసి ఉంటుంది, ఇవన్నీ చెప్పి రామా! తొందరగా బయలుదేరు సుగ్రీవుడితో స్నేహం చేసుకో చాలా సంతోషమన్నారు మీరు ఆజ్ఞ ఇస్తే నేను బయలుదేరుతాను అన్నాడు ఆయనా వెళ్ళిపోయాడు, రామ లక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి శబరి ఉన్నటువంటి ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు.
శబరి వెంటనే స్వాగంతం చెప్పింది, స్వాగతం చెప్పి అందీ తౌ తు దృష్ట్వా తదా సిద్ధా సముత్థాయ కృతాంజలిః ! పాదౌ జగ్రాహ రామ స్య లక్ష్మణ స్య చ ధీమతః !! పాద్యం ఆచమనీయం చ ప్రాదాత్ యథా విధి !!! ఆవిడ వెంటనే రామ లక్ష్మణులకి ఇద్దరి పాదములు పట్టుకుని ఆర్ఘ్యపాదములిచ్చి కూర్చోబెట్టి నాయనా రామా! నీ దర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంది అంటే రాముడు ఆవిడ్ని ప్రశ్నించాడు. ఇదే నేను మీతో అన్నది రాముడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడుతాడో మీకు అలవాటైతే ఎక్కడ ఎలా మాట్లాడాలో మీకు వచ్చేస్తుంది కొన్నాళ్ళకి, తాపసితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి తామ్ ఉవాచ తతో రామః శ్రమణీం సంశిత వ్రతామ్ ! కచ్చి త్తే నిర్జితా విఘ్నాః కచ్చి త్తే వర్థతే తపః !! కచ్చి త్తే నియతః కోప ఆహార శ్చ తపో ధనే ! కచ్చి త్తే నియమాః ప్రాప్తాః కచ్చి త్తే మనసః సుఖమ్ !! కచ్చి త్తే గురు శుశ్రూషా సఫలా చారు భాషిణి !!! ఓ శబరీ నీ తపస్సు విజ్ఞం లేకుండా కొనసాగుతోందా..! నీవు ఆహారమును స్వీకరించేటప్పుడు నియమాన్ని ఉల్లంఘించకుండా ఆహారాన్ని తీసుకోవడంలో ఏ ఇబ్బంది లేకుండా తీసుకొంటున్నావా రుచికి లొంగకుండా ఉండగలుగుతున్నావా..? కచ్చి త్తే వర్థతే తపః తపస్సు రోజు రోజుకీ పెంచుకో గలుగుతున్నావా? ప్రతిరోజు నియమాలు పాటిస్తున్నావా? నీ మనసు సుఖంగా ఉంటూందా..! నీ గురు సుశ్రూష బాగా జరిగిందా నాకు వాటి గురించి చెప్పు. ఎవరిని ఏవి అడగాలో అవి అడగాలి, అడిగితే ఆవిడ చాలా సంతోషించి అందీ!

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
అద్య ప్రాప్తా తప స్సిద్ధిః తవ సందర్శనాత్ మయా ! అద్య మే సఫలం తప్తం గురవ శ్చ సుపూజితాః !!
అద్య మే సఫలం జన్మ స్వర్గ శ్చైవ భవిష్యతి ! త్వయి దేవ వరే రామ పూజితే పురుషర్షభ !!
చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘు నందన ! గమిష్యామి అక్షయాన్ లోకాన్ త్వత్ ప్రసాదాత్ అరిందమ !!
Image result for శబరినాయనా! ఎప్పటినుంచో నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను, నా తపస్సు ఇంతకాలం నిర్విజ్ఞంగా సాగిందీ అని అనడానికి గుర్తేమిటో తెలుసా? నా తపస్సు సిద్ధి పొందిందీ అనడానికి తార్కాణమే నీ దర్శనం, నీ దర్శనం కోసమే చూస్తున్నాను, నీ దర్శనం కోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తు ఉన్న నాకు ఈ కన్నులతో నిన్ను చూసే భాగ్యం కలిగింది కాబట్టి, నేను ఉన్న ప్రయోజనం పూర్తైపోయింది కాబట్టి నీవు అనుమతించిన తరువాత ఇంక నేను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను మయా తు వివిధం వన్యం సంచితం పురుషర్షభ ! తవార్థే పురుష వ్యాఘ్ర పమ్పాయా స్తీర సంభవమ్ !! పంపానది తీరమునందు ఉన్నటువంటి అనేకమైనటువంటి కందమూలములను ఫలములను నీవు ఎప్పుడొస్తావో నీకు పెడదామని నేను తీసుకొచ్చి దాచి ఉంచాను అంటే మీరు ఈ మాటలో ఒక విషయం గుర్తుపట్టుకోవాలి. ʻశ్రద్ధʼ అని ఒకటి ఉంటుంది, శ్రద్ధా అంటే ఏమిటో తెలుసాండి! ఎప్పుడో ఒకప్పుడు రాముడు వస్తాడని తీసుకొచ్చి ఓ రెండు దానిమ్మపండ్లు తీసుకొచ్చి హ్ చూద్దాం ఇవ్వాళ కూడా రాలేదు ఏమిట్లే పోనిలే దానిమ్మపళ్ళు రెండు మూడు రోజులు ఉంటాయిగా కాబట్టి రెండు మూడు రోజులు రాకపోతే అప్పుడు మళ్ళీ తీసుకొద్దాము అని పెట్టుకు కూర్చోవడం కాదు.
ద్రాక్ష పళ్ళ గుత్తి నైవేద్యం పెట్టడానికి ద్రాక్ష పళ్ళ గుత్తి నుంచి ద్రాక్షపళ్ళు విడదీసి కడిగి నైవేధ్యం పెట్టడానికి చాలా తేడా ఉందిగా... ఉందాలేదా..! మీకు గుత్తిస్తే తింటారా..? విడదీసి కడిగిపట్రా అంటారా అనరా... ఈశ్వరుడు తినాలంటే గుత్తేలా నైవేధ్యం పెడుతున్నావ్, నీకు తినాలని కోరికుంటే పూజలో అంతర్భాగం చక్కగా ఆ పళ్ళన్నీ విడదీసి నీళ్ళతో కడిగీ పళ్ళెంలో అందులో చక్కగా మెత్తబడిపోయిన పళ్ళు తీసేసీ మిగిలిన పళ్ళెంలో వెండి పళ్ళెంలో నీవు వెండి పళ్ళెం కూడా కాదుగా..? ఇచ్చారుగా పెద్ద పళ్ళెం నైవేధ్యం పెట్టమనీ అందులో చక్కగా విశాలంగా పెట్టి రామా! చక్కగా మెల్లగా అమ్మా నా తల్లి సీతమ్మా! లక్ష్మణయ్యా ఒక్కొక్క పండు తీసుకొని హాయిగా తినండీ! అని ఆ పళ్ళెం అక్కడ పెట్టీ ప్రశాంతంగా నివేదన చేయ్, నీవు కడిగినందుకు పొంగిపోతాడు ఆయన పూజ ఓరి ఓరి వీడు నేను తినాలని పళ్ళుకడుగుతున్నాడు సీతా చూశావా..! అంటాడు. గుత్తి అక్కడ పెట్టి నైవేధ్యం పెట్టు ఏమండి చూశారా! అందులో చప్పబడిపోయినవి మెత్తబడిపోయినవీ కుళ్ళిపోయినవీ అన్నీ పెట్టేస్తున్నాడు, ఎదురుగుండా కనపడుతున్నాసరే ధూళి, వీడు రామాయణం చెప్తాడు సాయంకాలం చూశారా వీడి నైవేధ్యం అంటుంది సీతమ్మ, నీ శ్రద్ధా నీ నివేదనయందు తెలుస్తుంది అందుకే పూజా అంటే ఎంతసేపు చేశావు కాదు, ఎలా చేశావు అన్నది ప్రధానం. నీవు నిజంగా అక్కడ ఉన్నాడని చేస్తున్నావా? నీవు చెయ్యాలి కాబట్టి చేస్తున్నావా? ఆయన పంపించారు కాబట్టి నైవేధ్యం పెడుతున్నావా! పళ్ళు ఎలా పెట్టాలో అలా పెడుతున్నావా..? అది నైవేధ్యమంటే ఇది మనస్సుయందు భావనా.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఓ రెండు దానిమ్మపళ్ళు ఇచ్చారు, ఓ గోటితో విప్పి చూసి స్వామీ ఎర్రదానిమ్మగింజలు నేను విప్పి పెడుదునూ కాని సీతమ్మ తల్లి చూస్తూందీ అన్ని ద్రాక్షపళ్ళు నీవే కడిగేసి అరటి పండు తొక్కలూ తీసేసి అన్ని నీవే తినిపిచ్చేస్తే మా ఆయనకి నేను తినుపించుకోవద్దయ్యా ప్రేమతో అవి నాకివ్వు నేను విప్పి పెట్టుకుంటాను ఎంతబాగుంటాయో అంటూంది, అమ్మకిస్తాను అమ్మవిప్పి పెడుతూంది, ఇదిగో అమ్మ చేతిలో పెడుతున్నాను ఇవి మీరు గింజలు వొలుచుకుతినండీ, ఇవి మాత్రం అమ్మ గింజలు వొలిచేవరకు తింటూ ఉండండి రామా! అని మీరు భావన చేసి సంతోషంగా ఓసారి ఆ పళ్ళెం అక్కడ పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు సంతోషపడిపోయి, మీ ఎదురుగుండా సీతారామ లక్ష్మణులు హనుమా ఉన్నారనుకొని అప్పుడు మీరు నైవేధ్యం పెట్టీ నా స్వామి తింటున్నాడు ఆయన తింటున్నప్పుడు ఆ పళ్ళరసం ఆ కంఠంలోకి దిగుతుంటే సంతోషంగా ఆయన చూస్తున్నాడని మీరు భావన చేస్తే నన్ను నమ్మండి అది ప్రసాదమే ఆయన తిన్న శేషమే ఇది. అసలా భావన లేకపోతే మిమ్మల్ని నైవేధ్యం పెట్టమని పంపించినాయన యొక్క ద్రవ్యము వృథావుతుంది తప్పా ఉపయోగమే ఉండదు.
Related imageకాబట్టి నేను రోజూ పంపాసరోవరంలోంచి తెచ్చాను పళ్ళు తెచ్చి అక్కడ పెట్టాను, రామా! మీరు స్వీకరించండి అని తెచ్చి అక్కడ పెట్టింది. అంతేకాని కొరికి చూసింది, కొరికి చూసి పెట్టింది ఇలాంటి పిచ్చి పిచ్చివేమిలేవు, ఆవిడ గురు సుశ్రూష చేసింది మతంగ మహర్షికి, ఆవిడకి తెలుసు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆవిడ శ్రద్ధెక్కడ మీకు అర్థమవుతుందని నేను ఈ మాటలు చెప్తున్నాను నైవేధ్యం పెట్టడం ద్రాక్షపళ్ళ గురించి, ఆవిడలా ప్రతిరోజూ సేకరించి తీసుకొచ్చి అక్కడ పెట్టిందేమో రాముడొస్తాడేమో అని పెట్టుకోవాలి ఎప్పటి పళ్ళు అప్పుడు అందుకని చైతన్య కుసుమప్రియా అని అమ్మవారు, అందుకే అమ్మవారికి బంగారు తాపడంతో బంగారం పూలు చేయించామండీ అంటారు, బంగారం పూలు చేయిస్తే మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా... చాలా మంది చేసేస్తారు కాని దానికొక కాడు ఉంటుంది, రెండోరోజు ఎవరో ఏం చేస్తారు ఇలా తీస్తాడు ఆ పూలు అది గీసుకుని అమ్మవారిపాదానికి ఎర్రగా ఉన్న నా తల్లి పాదం మీద గీతపడీ చిన్న నెత్తుటి చుక్క పైకి చిందిందనుకోండి మీకు కోటి జన్మలెత్తినా మీ పాపం పోదు, ఎవడు చేయమన్నాడు ఆపూజ, ఓ గడ్డి పువ్వుతెచ్చి అక్కడ పెట్టు చాలు. అందుకే ఆవిడ చెప్పింది చైతన్య కుసుమప్రియా నేను చైతన్యమున్న పువ్వుల్ని ఇష్టపడుతానూ అని చెప్పింది ఆవిడ ఈ బంగారం పూలు వెండిపూలు తెచ్చివ్వమని ఎవడూ చెప్పలేదు. ఎవడో వెర్రెక్కినవాడు మొదలెట్టాడు ఇవన్నీ, కాబట్టి అలాంటి పిచ్చిపన్లు అనవసరం చైతన్య కుసుమాలు ప్రకృతిలో వచ్చాయి వాటితో చేస్తే చాలు అందుకే ఏ ఋతు పుష్పములను ఆ ఋతువులందు పూజచేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అసాధారణమైనవి తెచ్చేప్రయత్నం చేయకూడదు అక్కడ నీకు లభ్యమయ్యేవాటితో చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు ఎప్పుడూను.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
శ్రద్ధ కాబట్టి శబరి వాటినన్నింటిని అక్కడ పెట్టింది ఇహ తే భావిత ఆత్మానో గురవో మే మహా ద్యుతే ! జుహవాన్ శ్చక్రిరే తీర్థం మన్త్రవన్ మన్త్ర పూజితమ్ !! నాయనా ఇదిగో మా గురువుగారి యొక్క గొప్పతనమేమిటో చూపిస్తానురా! ఆశ్రమం చూపిస్తానని తీసుకెళ్ళి గురవో మే మహా వనే మా గురువుగారు ఈ అరణ్యంలోనే తిరిగారు ఆశ్రమంలో ఆయన ఒకానొకప్పుడు తన మంత్రశక్తితో గంగానదిని ఆవాహన చేశారు ఇదిగో ఇక్కడ ఆ తీర్థము ఇప్పటికీ ప్రవహిస్తూంది అదిగో ఆ ఆశ్రమంలో చూడు ఇయం ప్రత్యక్ స్థలీ వేదీ యత్ర తే మే సుసత్కృతాః ! పుష్పోపహారం కుర్వన్తి శ్రమాత్ ఉద్వేపిభిః కరైః !! చాలా బడలిపోయినటువంటిది నీరసంతో ఉన్న శరీరంతో ఉపవాసములు చేసి చేసి ఉన్నటువంటి శరీరం కాబట్టి భగవంతునియందు ధ్యానంలో ఒళ్ళు మరిచిపోయినవారు కనుకా లేచి పుష్పమాల ఇలా వణికిపోతున్న చేత్తో ఇలా స్వామికి సమర్పించారు ఇక్కడ, ఇక్కడే ఆయన అగ్నికార్యం చేసుకునేవారు వాళ్ళు వెళ్ళి పోయిచాలా కాలమైంది నీవు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు దివ్యవిమానాలెక్కి వెళ్ళిపోయారు, రామా! ఇప్పటికీ వేదులు ఎలా ప్రకాశిస్తుంటాయో చూడు దీశలన్నీ ప్రకాశిస్తాయి ఈ వేదుల వలన వాళ్ళు చేసినటువంటి అగ్ని కార్యం ఇప్పటికీ అంత తేజస్సుతో ఉంది తేషాం తపః ప్రభావేన పశ్య అద్యాపి రఘూత్తమ ! ద్యోతయన్తి దిశః సర్వాః శ్రియా వేద్యః అతుల ప్రభాః !! అశక్నువద్భిః తైః గన్తుమ్ ఉపవాస శ్రమ ఆలసైః ! చిన్తితే అభ్యాగతాన్ పశ్య సమేతాన్ సప్త సాగరాన్ !! చిన్తితే అభ్యాగతాన్ పశ్చ ఎంత గొప్పమాటటండి... ఆయనటా అక్కడ కూర్చుని తపస్సు చేసి చేసి చేసీ హొమం చేసి చేసి చేసీ సాయంకాలం సంధ్యావందనం వేళవుతోంది లేచివెళ్ళాలీ అనుకున్నారట కాని అశక్నువద్భిః తైః గన్తుమ్ లేచి వెళ్ళడానికి ఓపికలేదు ఇంక నీరసంగా ఉంది శరీరం ఎలా అనుకుని సప్త సాగరములారా ఇలా రండి స్నానం చేస్తాను అన్నాడట, ఏడు సముద్రాలు ఇక్కడ వచ్చి ప్రవహించాయి మా గురువుగారు ఇందులో స్నానం చేశారు రామా చూడు అంది ఆవిడ.
అంటే ఈ జాతియందు ఋషుల యొక్క శక్తేమిటో చూపిస్తున్నారు రామ చంద్ర మూర్తి అద్యాపి న అవశుష్యన్తి ప్రదేశే రఘు నన్దన మా గురువుగారు శిష్యులు ఇక్కడే నార చీరలు ఒంటిమీద బట్టతో స్నానం చెయ్యాలి, చేసి ఆ బట్ట పిండి ఆరేశారు, వారి శరీరమునకు తగిలిన కారణము చేత ఆ చీరలు ఆరలేదు అది వాళ్ళ తపః శక్తి దైవ కార్యాణి కుర్వద్భిః యాని ఇమాని కృతాని వై ! పుష్పైః కువలయైః సార్థం మ్లానత్వం న ఉపయాంతి వై !! వాళ్ళు చేతులతో ముట్టుకుని ఇక్కడ దేవతలకి పుష్పాలు సమర్పించారు ఆ పువ్వులు ఎన్ని సంవత్సరములైన వాడవు అలాగే ఉన్నాయి చూడు ఇది మా గురువుగారి యొక్క గొప్పతనం. కాబట్టి రామా! నేను నీ గురించే ఎదురు చూస్తున్నాను నీకు ఆతిథ్యమిమ్మని నా గురువుగారు చెప్పారు మీకు దర్శనం చేసుకొని ఆతిథ్యమిచ్చి రమ్మన్నారు ఇటుగా రాముడు వస్తాడు ఆతిథ్యమివ్వడానికి ఉండాలన్నారు అంటే రామ చంద్ర మూర్తి యొక్క ఆగమనానికి ఎలా ఎదురు చూశారో చూడండి, మీకు నేను స్వాగతం నెరపాను కాబట్టి ఇక నేను ఊర్ధ్వరోకాలకు వెళ్ళిపోతాను, ఎంత తేలిగ్గా చెప్పేసిందో ఆవిడ వెళ్ళిపోతానని అంటే రాముడు లక్ష్మణుని వంక చూసి శరభంగ ఆశ్రమంలో చూశాడు ఈ శక్తి ఒక ఆడది తాపసి సన్యాసి ఆవిడ చెప్తూంది వెళ్ళిపోతానని ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా అంత తపః శక్తి సంపన్నులూ, అనసూయను చూశాము శబరిని చూస్తున్నాము. కాబట్టి
ఇతి ఉక్తా జటిలా వృద్ధా చీర కృష్ణాజినాంబరా ! తస్మిన్ ముహూర్తే శబరీ దేహం జీర్ణం జిహాసతీ !!
అనుజ్ఞాతా తు రామేణ హుత్వాఽఽత్మానం హుతాశనే ! జ్వలత్ పావక సంకాశా స్వర్గమ్ ఏవ జగామ సా !!
దివ్వ ఆభరణ సంయుక్తా దివ్య మాల్య అనులేపనా ! దివ్య అంబర ధరా తత్ర బభూవ ప్రియ దర్శనా !!
విరాజయంతీ తం దేశం విద్యుత్ సౌదామినీ యథా !!!
యత్ర తే సుకృతాఽఽత్మానో విహరన్తి మహర్షయః ! తత్ పుణ్యం శబరీ స్థానం జగామాఽఽత్మ సమాధినా !!

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
ఆవిడ కట్టుకున్నటువంటి నారచీర ఆవిడ కట్టుకున్నటువంటి కష్ణాజినాంబరం మొదలైనవాటిని విడిచిపెట్టేసేసి ఆవిడ ఏవి కట్టుకుందో వాటితోటే అక్కడ అగ్నిహోత్రాన్ని రగల్చి అగ్నిహోత్రంలోకి ప్రవేశించింది, తన శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో వ్రేల్చింది, ఆ శరీరము అగ్నిహోత్రమునందు తత్కమైపోతూండగా మెరుపుతీగ ఎలా ఉంటుందో అటువంటి శరీరంకింద మారిపోయింది, మారిపోయి దివ్యమైనటువంటి ఆభరణములు దివ్యమైనటువంటి వస్త్రములు ధరించినదై వీళ్ళు చూస్తుండగానే నమస్కారం చేస్తూ స్వర్గలోకానికి చేరిపోయి ఇతః పూర్వం ఆమె సేవించిన గురువులు ఎక్కడ ఉన్నారో ఆ గురువులు శిష్యులు ఎక్కడున్నారో అక్కడికి ఈవిడ కూడా వెళ్ళిపోయింది. గురు సేవ ఎంత గొప్పదో నిరూపిస్తుంది శబరి వృత్తాంతం, గురువుగారిని సేవించినందుకు శబరి ఆ స్థితిని పొందింది రామాయణంలో అందుకే రామునికి అన్నిటికన్నా ఇష్టం గురుసేవ, కాబట్టి తత్ పుణ్యం శబరీ స్థానం జగామాఽఽత్మ సమాధినా ఆవిడ వెళ్ళిపోయిన తరువాత రాముడు లక్ష్మణుడితో కలిసి
సప్తానాం చ సముద్రాణామ్ ఏషు తీర్థేషు లక్ష్మణ ! ఉపస్పృష్టం చ విధివత్ పితర శ్చాపి తర్పితాః !!
ప్రణష్టమ్ అశుభం త త్తత్ కల్యాణం సముపస్థితమ్ ! తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి !!
హృదయే హి నర వ్యాఘ్ర శుభమ్ ఆవిర్భవిష్యతి !
Image result for రాముడు స్నానంఇది ఎందుకు మనం స్నానం చెయ్యాలో తెలుసుకోవాలి, రాముడు వెంటనేటా అక్కడ సప్త సాగరములను ఋషులు తీసుకొచ్చారు గదాండీ అందులో స్నానం చేసి పితృతర్పణం చేశారట, చెయ్యగానే అన్నాడటా... హా మన దుర్దశపోయింది లక్ష్మణా ఇప్పుడు నా మనసు ఉల్లాసాన్ని పొందుతోంది నాకు మంగళములు కనపడుతున్నాయి, నా మనసు ప్రసన్నమై ఏదో మంచి జరగపోతోందన్నదీ అని తెలుస్తోంది, ఇంత గొప్ప తీర్థంలో స్నానం చెయ్యడంవల్ల మన పాపం నశించింది అన్నాడు.
మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఒకానొకప్పుడు ఒకాయ చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు ఆయన వెళ్ళి స్నానం చేసే స్థితిలో లేడు ఎందుకంటే ఆయనకు ఒక ఆక్సిడెంట్ అయ్యి  కట్టు కట్టారు ఆయన చాలా కష్టాల్లో ఉంటే మహాత్ముడు ఒకాయనాతో కలసి నేను వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏమండీ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానూ సాధారణంగా ఏమో ఇయ్యన చెప్పగలడనుకుంటారు, రామాయణం చెప్పగలను కాని అవి చెప్పగలనా..? ఏదో వాళ్ళ సంతోషం అడుగుతూంటారు. ఏం చెయ్యమంటారు అని అడిగారు, అంటే నేను ఆలోచిస్తున్నాను ఏం చెయ్యమని చెప్దాం ఆక్సిడెంట్ అయ్యింది కాళ్ళు విరిగిపోయాయి, కట్లు కట్టేశారు ఏం చెయ్యమని చెప్తే వీళ్ళు చెయ్యగలరూ అని ఆలోచిస్తుంటే... నాతో తోవచ్చిన మహాత్ముడు పక్కున నవ్వి అన్నారూ ఎందుకండీ దానికి అంతబాధపడుతారూ... ఇక మీకు ఏమీ అవదు పుష్కరం నుంచి సీసాతో నీళ్ళు తెచ్చి చల్లుకోకండి కారు చేయించుకుని మీ ఊళ్ళో పుష్కరాలు అవుతున్నాయిగదా... గోదావరి పుష్కరాలు ఒక్కసారి నదీపాయ ఎక్కడ దగ్గరగా ఉందో అక్కడికెళ్ళీ ఆ ఒడ్డున కూర్చునీ ఇలా ఒంగండి కింద కట్లు తడవ కూడదు కానీ తల తడవచ్చుగా గోదావరిలో నీళ్ళు తీసుకొచ్చి సంకల్పంతో మీ తల నుంచి కంఠం తడిచేవరకు పోసుకోండి తడిబట్టతో ఒళ్ళు తుడుచుకుని ఇంటికిరండి మీ దరిద్రం అక్కడితో పోతుంది అన్నాడు. మీరు నమ్ముతారా నేను యదార్థం

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
చెప్తున్నాను రామాయణం చెప్తూ ఆయన నిజంగా వెళ్ళి ఆ పుష్కర స్నానం చేశాడు అంతే Image result for నదీ స్నానంఇవ్వాళ ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో ఇంక మళ్ళీ ఆయన్ని ఏవీ పట్టుకోలేదు.
తీర్థ స్నానం అంటే ఉత్తిగనే రాలేదండీ..! మహాత్ముల యొక్క సంకల్ప శక్తితో వచ్చాయి అన్నీను ఒక గోదావరి ఉత్తిగనే రాలేదు గౌతమ మహర్షి యొక్క తపః ఫలం. అందుకే నదులు ఎక్కడెక్కడ ఈశ్వరుడుంటే అక్కడక్కడకి వెళ్ళి చుట్టుకుంటాయి ఎవరు దారి నేర్పారు కృష్ణమ్మ ఉంది విజయవాడ కనకదుర్గమ్మని సేవిస్తుంది, మంగళగిరి వెడుతుంది అమరేశ్వరున్ని సేవిస్తుంది అక్కడ్నుంచి ఎవరు చెప్పారని శ్రీశైలం వెళ్ళిపోతుంది లోయల్లో అక్కడికి వెళ్ళి పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః ! గాయంతి దేవమునిభక్తజనా భవంతం శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ !! అన్ని వదిలిపెట్టేసి శ్రీగిరిని చుట్టుకుంటుంది, దానికి ప్రదిక్షిణం చేసి వెళ్ళిపోతుంది, ఎవరు నేర్పారు నదికి అవి నదుల గొప్పతనం అదే ఈశ్వరుని సేవిస్తాయి ఋషులు తీసుకొచ్చారువాటిని మాకు దక్షారామంలో సప్తగోదావరి అని ఉంది, ఋషులు తీసుకొచ్చారు దాని స్నానం స్నానమే... దాని ఫలితం ఫలితమే... కాబట్టి రాముడు స్నానం చెయ్యగానే ప్రసన్నుడయ్యాడు.
స్నానం శక్తి ఇస్తుందాండీ అంటే..? నీవు ఆ నమ్మకంతో చేసి చూడూ నీకు ట్యాబెల్టెలో ఏ కంపోజిషన్ ఉందో ఏముందో నీకు విరేచనాలు అవుతుంటే ఏ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చాయో ఇది వేసుకుంటే నీ రక్తంలో ఎలా కలుస్తుందో ఆ బ్యాక్టీరియా ఎలా చచ్చిపోతుందో మీకు తెలిస్తే చచ్చిపోయాయా..! డాక్టరుగారు మూడు పూటలా వేసుకోమన్నాడు వేసుకున్నాను చచ్చిపోయాయాలేదా విరోచనాలు తగ్గిపోయాయా లేదా..? డాక్టరు గారు చెప్తే మాత్రం నేను ఎలా వేసుకుంటానండీ ఇందులో ఏముందో నాకు తెలియాలండీ తెలిస్తేనే నేను వేసుకుంటానండీ అంటే ఒక్కనాటికీ తగ్గదు. నీ నమ్మకం ప్రధానం మణి మంత్రము ఔషధము ఈ మూడింటికీ నమ్మకం. కాబట్టి ఇప్పుడు నమ్మాడు నమ్మి స్నానం చేశాడు ఫలితం వస్తుంది, విశ్వాసమే ఈశ్వరుడు, మనం ఎక్కడికైనా పవిత్రమైనచోటుకి వెడితే తీర్థ స్నానం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి రాముడు ఆ స్నానం చేసి ఉల్లాసాన్ని పొందాడు. పొంది సంతోషించి లక్ష్మణుడితో కలిసి నీవు వెళ్ళి ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవున్ని కలుసుకో అని చెప్పి ఆనందంగా ఇద్దరూ కలిసి ఆ పంపాసరోవరంలో తిరుగుతూ ఇంకా సుగ్రీవుని యొక్క దర్శనం కోసమని ఎదురు చూస్తున్నారు, రేపటి రోజున మహానుభావుడు హనుమ సుగ్రీవుడు ఆ వానరుల యొక్క దర్శనము సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడం వైపుకు కథ తిరుగుతుంది ఇక్కడితో అరణ్య కాండ పూర్తైంది
 కాబట్టి మనం ఒక్కసారి రామ నామం చెప్పుకుని 11 పర్యాయాలు సంతోషంగా తరువాత మంగళహారతి ఇచ్చిన తరువాత ప్రసాదము స్వీకరించి బయలుదేరుదాము.

  అరణ్య కాండ ఇరవై ఒకటవ రోజు ప్రవచనము
 
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
నారదాది మహా మునీంద్రుల నమ్మినది శ్రీ రామ నామము !!రా!!
నీవు నేనను బేధమేమియు లేకయున్నది రామ నామము !!రా!!
గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీ రామ నామము !!రా!!
సకల జీవుల లోన వెలిగే సాక్షి భూతము రామ నామము !!రా!!
శిష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము !!రా!!
పాల మీగడ పంచదారల తత్వమే శ్రీ రామ నామము !!రా!!
సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీ రామ నామము !!రా!!
చిత్త శాంతిని కలుగుజేసేడి చిత్ స్వరూపము రామ నామము !!రా!!
జానకీ హృత్ కమలమందున అలరుచున్నది రామ నామము !!రా!!
అల కుచేలుని చేతి అటుకులు ఆరగించిన రామ నామము !!రా!!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !!రా!!
మంగళా...

No comments: