Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అరణ్య కాండ 18వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Aranya Kanda 18th Day

అరణ్య కాండ

పద్దెనిమిదవ రోజు ప్రవచనము





నిన్నా ఖర-దూషనాదులను స్త్రిసిరుడూ అనబడేటటువంటి ఆ ఖరుని దగ్గర ఉన్న సైన్యాధిపతిని రామ చంద్ర మూర్తి ఒక్కరే 14 వేల మంది సైన్యాన్ని తెగటార్చినటువంటి విధానాన్ని నిరుపమానమైనటువంటి ఆయన పరాక్రమాన్ని ఆ రాక్షస వధ జరిగిన తరువాత సీతాదేవిచేత కౌగలింపబడినటువంటి ఆ రామ చంద్ర మూర్తి యొక్క స్వరూపం దగ్గర మనం ఆగి ఉన్నాం. శ్రీరామాయణ ప్రవచనాంతర్భాగంగా గొప్ప గొప్ప థితులు చాలా చక్కటి నైమిక్తిక థితులు రావటం ఒక అదృష్ట హేతువు, నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేయవలసి ఉంటుంది ఈసందర్భోచితంగా ఈనాడు “అక్షయ తృతీయ” అంటే ఇవ్వాళ చేసేటటువంటి ఏపుణ్య కార్యమైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుందీ అని శాస్త్రవాక్కు మనకీ శాస్త్రమే ప్రమాణము తప్పా ఇంకోకటి ప్రమాణము కాదు.
కాబట్టి ఇవ్వాళ ఏమైపోయిందంటే విచిత్రం అక్షయ తృతీయా అంటే బంగారం కొనుక్కోవడం ప్రధానం అన్నస్థితి వచ్చేసింది, అది ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ... బంగారం కొనుక్కుంటే పుణ్యం ఎలా అవుతుంది? బంగారం వృద్ది అవ్వచ్చేమోకానీ బంగారముతో పాటు ప్రమాదమూ హెచ్చవ్వచ్చు లేదా ఏ ప్రమాదము లేదనుకుంటే ఐశ్వర్యము పెరగచ్చేమో..? తప్పించి అది పుణ్యానికి కారకం ఏమీ మాత్రం కాదుగా..! మీరు కొనుక్కుని దాచుకున్నది మీకు పుణ్యహేతువు కాదు, మీరు చేసిన పుణ్యము ఏదైనా ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈశ్వరానుగ్రహము ఏమంటే దేశమునందు కాలమునందు నైమిక్తిక థితిలో మీరు ఒక్కొక్క రోజు చేసినటువంటి పుణ్యము అక్షయమైన ఫలితాన్నిచ్చి మిమ్ములను కాపాడుతుంది. వర్షము ఒక్కటే కానీ ఆ ఒక్క వర్షమే దాహార్తిని తీరుస్తుంది, ఆ ఒక్క వర్షమే ఎండిపోయినటువంటి చెట్టు చిగర్చేటట్టు చేస్తుంది, ఒక్క వర్షమే విత్తనం మెలకెత్తేటట్టు చేస్తుంది. అలాగే చేసుకున్న పుణ్యమేదైతే ఉందో ఆ పుణ్యమే మనల్ని కాలంలో కాపాడుతుంది, కాల రూపంలో ఈశ్వరుడు ఎప్పుడైనా ఏదైనా ఆపద నుంచి గట్టెక్కించాలీ అనేటప్పుడు ఆయన చూసేదేమిటంటే ఏదైనా పుణ్యం చేసింది ఉందా అని కనకధారా స్తవం వెనక ఉన్న రహస్యం కూడా అదే గా... ఈవిడ చేసింది ఏముందని నేను ఇవ్వనూ అని అడిగింది శంకరాచార్యులవారిని లక్ష్మీదేవి, కాబట్టి ఇవ్వాళ చేసుకున్నది ఏమిటంటే అనుభవం చేత ఆ పుణ్యం తరిగిపోయేది కాదు అక్షయమౌతుంది. అయితే ఏ పుణ్యం చేయాలీ అన్న అనుమానం కూడా లేకుండా మనకు ఇవ్వాళ చెయ్యవలసినటువంటి సత్కర్మను కూడా పెద్దలు చెప్తారు.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
జల పూరితమైనటువంటి కుంభాన్ని ఎవరికైనా ఇస్తే మంచిది అని చెప్తారు అంటే ఇది వైశాఖ మాసం ప్రారంభం కాబట్టీ సహజంగా దాహార్తి ఎక్కువగా ఉండేటటువంటి సమయం కాబట్టీ చక్కగా నీళ్ళు పోసి ఓ కూజాయో ఓ కుండో ఎవరికైనా బహుకరించామనుకోండి వాళ్ళు ఆ నీళ్ళు త్రాగి జీవమే నిలబడుతుంది, ప్రాణమే నిలబడుతుంది. లింగ పురాణంలో ఒకమాట ఉంది సంజీవనం సమస్తస్య జగత్సలిలాత్మక్, ఇత్యుచతే రూపం భవస్య పరమాత్మనః నీటి రూపంలో ఉండి సమస్త భూతముల యొక్క ప్రాణములను నిలబెడుతాడు కాబట్టి పరమ శివుడికి భవా అని పేరు. కాబట్టి నీరు ప్రాణములను నిలబెడుతుంది ప్రాణములను నిలబెట్టేటటువంటి నీరు త్రాగవలసినటువంటి అవసరము ఎక్కువగా ఉండేటటువంటి సమయం వైశాఖ మాసం. కాబట్టి ఇటువంటి వైశాఖ మాసంలో నీరు నిండినటువంటి ఒక జల పాత్రని దానం చేసుకోవడం అనేటటువంటిది మంచిది అది చెయ్యమని ఇవ్వాళ అక్షయ తృతీయనాడు అది నిన్ను కాపాడుతుంది ఉత్తరోత్తరాలవరకు, సరే ఇప్పుడు జరుగుతున్నదేదీ పక్కన పెట్టండీ... మనం పెద్దలు చెప్పినటువంటి అటువంటి మంచి పనుల్ని అమలు చేయడం ప్రారంభం చేస్తే అది మన అభ్యున్నతికి హేతువు అవుతుంది.
నిన్నా రామ చంద్ర మూర్తి 14 వేల మంది రాక్షసులను సంహారం చేశారు, నిన్నా అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే నిన్న చేసిన ప్రసంగంలో అని... రామాయణంలో నిన్న చేశారు అన్నది నా ఉద్దేశ్యం కాదు అది కూడా మీరు గ్రహించగలరు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఖర దూషనాదుల వైపునుంచి సైన్యం వెళ్ళినా వాళ్ళ వెంట వెళ్ళుతున్నటువంటి వ్యక్తి ఒకతే ఉంది, యుద్ధంలో ఆవిడ ప్రత్యక్షంగా కనపడదు ఆవిడేమీ యుద్ధం చేసేటప్పుడు రాముడి మీద బాణాలు వేయదు కానీ... పగ అంతా ఆవిడది ఆవిడే ఈ యుద్ధానికంతటికీ కారకురాలు ఆవిడే శూర్పణఖ. ఆవిడ కోరిక ఏమిటంటే రాముడు మరణించాలి, లక్ష్మణుడు మరణించాలి, సీతమ్మ మరణించాలి, ఎందుకు మరణించాలి..? మీరు కొంచెం జాగ్రత్తగా రామాయణాన్ని గమనిస్తే ఇప్పుడు సీతమ్మ తల్లి వైపుకు ఆపద వెడుతుంది తరువాత, ఎందుకు వెళ్ళాలీ అంటే అసలు ఆవిడ వ్యామోహం రాముడి మీద- రాముడి అందం సీతమ్మ తల్లికి మొదటి అనర్ధం తీసుకొచ్చింది, రాముడి అందాన్ని చూసి ఆకర్షితురాలైనటువంటి శూర్పణఖా రాముని పక్కన ఉన్నటువంటి భార్యా స్థానం ఖాలీ అయితే ఆ స్థానంలోకి తను వెళ్ళచ్చూ అనుకుంది అందుకనికదా చంపబోయింది, అంతకు మించి అవగాహనేమీ లేదు ఆవిడకి అందుకే రాక్షసి. ఇప్పుడు తన కోర్కె తీరలేదు కాబట్టి ఆ కోరిక తీరకపోయినటువంటిస్థితి పగగా మారింది. ఈ పగగా మారకుండా దాన్ని అవతల వారిలో ఉన్నటువంటి ధార్మిక ప్రవృత్తిని అభినందించగలిగినటువంటి మనస్థస్త్వాన్ని ఆవిడ తనలోతాను వృద్ది చేసుకోలేకపోయింది.
మీకు ఎక్కడైనా రాక్షసత్వం ఉందీ అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండీ ఎందుకుంటుందీ రాక్షసత్వం అంటే దానికి విరుగుడిని ఆయన పోషించుకోలేదు, రోగముందీ అంటే కారణమేమిటీ- రోగం పోయేటటువంటి పరిస్థితిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కాబట్టి రోగం పెరుగుతూ ఉంటుంది అలాగే ఆవిడ ఎన్నడూ ప్రయత్నం చెయ్యదు మీరు ఎప్పుడూ శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథలో శూర్పణఖ అని ఆలోచనచేస్తే శ్రీరామాయణం మీకొక ప్రయోజనం ఇవ్వడం సాధ్యం కాదు. అలా అనుకున్ననాడు రావణ వధ ఒక్కటే ప్రధానం రామాయణంలో అనుకుంటే అసలు రాముడు నరుడిగా పుట్టి అరణ్యవాసమంతా చేసి ఈ వ్యక్తుల అందరితోటీ ఆయన సమన్వయం అవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇవన్నీ జరగడం వల్లా ఇవన్నీ చదవడం వల్లా మనమేం చెయ్యీలీ అన్నది ఆలోచన చేసి ఎక్కడ దోషముందో ఆ దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం మీరు చేస్తేనే మీకు రామాయణం ఉపయోగపడుతుంది. లేకపోతే రామాయణం ఒక జరిగిపోయిన కథా శూర్పణఖ చెడ్డదీ అని మనం అన్నామనుకోండీ... ఇప్పుడు మనం కొత్తగా అనక్కరలేదు ఆ మాట, చాలా మంది అన్నారు ఆమాట నిన్నన వాల్మీకి మహర్షే చెప్పారు కదా ఇంక కొత్తగా మనం అనడం ఎందుకు.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
కోర్కె తీరకపోతే పగగా మారేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో దాన్ని మీరు సాక్షీమాత్రంగా గమనించవలసి ఉంటుంది. ఈ కోపం తమాషా చూశావా ఎలా వచ్చిందో... ఈ కోపం వచ్చిన కారణంచేత నాలో ఆలోచనా సరళి ఎలా మారిపోతూందో చూశావా..? నాలో పగ ఎలా పెరుగుతుందో చూశావా..? కాబట్టి ఇప్పుడు నేను అవతలి వారిని ప్రేమించడానికి ధార్మికమైన గుణం ఏదైనా ఉందా..! ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా లేకపోయినా రాముని గుణములను శ్లాగించి రాముని తప్పేమిటయ్యా అని అడిగినవాడు ఒకడు ఉన్నాడు రాక్షసుడు మారీచుడు. మరి మారీచుడు కూడా ఒకప్పుడు దోషం చేసినవాడే, రెండు పర్యాయాలు రాముని మీదకి యుద్ధానికి వెళ్ళాడు కానీ మారాడు మారీచుడు. ఎన్నిమార్లు రామ చంద్ర మూర్తి రాక్షస సంహారం చేస్తే అన్ని మార్లు పగ పెరగడమే తప్పా అసలు తన మనఃప్రవృత్తిని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎన్నడూ చెయ్యనిది శూర్పణఖ.
కాబట్టి ఆ పగా నెయ్యి పోసినకొద్దీ అగ్నిహోత్రం ఎలా పెరుగుతుందో... అలా రామ చంద్ర మూర్తి ఎంత మందిని తెగటారిస్తే ఆవిడయందు పగ అంత పెరుగుతుంది, కానీ ఇది అవతార ప్రయోజనానికి మాత్రం అవసరమే. ఇప్పుడు ఆవిడ తీసుకొస్తుంది శలభాలన్నింటిని, ఇప్పుడు రాముడేవెళ్ళి ఎవరినో చంపవలసిన అవసరం లేకుండా అందరినీ ఎక్కడెక్కడివారిని తీసుకొచ్చి రాముడి మీదకి ప్రవేశపెడుతోంది, ఇప్పుడు రాముడు వాళ్ళందరిని చంపడానికి అవకాశం వస్తుంది. అవతార ప్రయోజనంరీత్యా చూసినప్పుడు మాత్రం శూర్పణఖ ఉపకారం చేసిందనే చెప్పవలసి ఉంటుంది. కాని అలా అని అభినందించినప్పుడు మనం ఏం చూసి మార్పు చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మనకు జ్యోతకం కాదు. కాబట్టి మొదటి కోణాన్ని స్వీకరించడమే మన అభ్యున్నతికి హేతువు. ఇప్పుడు ఆవిడ పద్నాలు వేల మంది రాక్షసులను రాముడు సంహరించినటువంటి విధి విధానానికి ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ సమయంలో ఇంత మంది రాక్షసులను పడగొట్టడమా అక్కడితో ఆవిడ బుద్ధేంమారలేదు ఇప్పుడు ఆవిడ వేంటనే ఖర-దూషనాదులు మరణించారు కాబట్టి తిన్నగా వెళ్ళి లంకలో ఉన్నటువంటి రావణుని యొక్క సభలో రావణాసురుని ముందు పడింది.
Image result for శూర్పణఖఅయితే నిన్నటిరోజున మీతో మనవిచేసి ఉన్నాను వాక్కుకు వైభవముంది దాన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, ఆ వాక్కుతో అభ్యున్నతిని పొందచ్చు ఆవాక్కుతోటే పథనమైపోవచ్చు కూడా... ఎక్కడ ఎలా మాట్లాడాలో తన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవడానికి అలా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు రావణుని యొక్క దృష్టి బాగా తనవైపుకి ప్రసరించడం కోసం రావణునికి పెద్ద ప్రమాదం వస్తూందీ అని మాట్లాడటం ప్రారంభం చేసింది, అప్పుడు కదా రావణుడు దృష్టిపెడతాడు, నాకు ప్రమాదం వచ్చింది నేను ఇలా చేశాను ఎదో వెళ్ళాను చంపారని అనిందనుకోండి ఆయన ఇంకొకళ్ళ గురించి ఆలోచించే గొప్ప స్వభావమున్నవాడేం కాడు కాబట్టి ఊరుకోవచ్చు. ఇప్పుడు తన పగ తీరాలంటే రావణని యొక్క దృష్టి అటువైపుకు తిప్పాలి, అటు తిప్పడానికి అనుకూలమైనటువంటి మాట ప్రారంభంచేసింది. వెళ్ళి అక్కడ పడ్డప్పుడు రావణుడు ఎలా ఉన్నాడూ అన్నదాన్ని మహర్షి వర్ణన చేస్తారు సా దదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ! ఉపోపవిష్టం సచివైః మరుద్భి ఇవ వాసవమ్ !!

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
పుష్పక విమానంలో ఆ దేవతల మధ్యలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తూ ఆయన కూర్చుని ఉన్నాడు, అది ఆ విమానంలో ఆయన కూర్చున్నటువంటి స్థితీ అంటే... వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనమంతా ఎక్కడుంటుందీ అంటే రావణాసురినియందు ఒక దీప్తి ఉంటే ఒక తేజస్సు ఉంటే ఆయన దాన్నేమీ సమర్థించకుండా దాన్నిపక్కన పెట్టేసి ఆయనేమీ మాట్లాడరు, తపస్సుచేసి సంపాదించినటువంటి తేజస్సేదుందో ఆ తేజస్సు గురించి మాట్లాడుతారు, అధర్మమేదుందో అధర్మం గురించి మాట్లాడుతారు మీరు ఇంతగొప్ప తేజస్సు దేనివల్ల హరించుకుపోతోందో మీరు చూసుకోవలసి ఉంటుంది.
Image result for శూర్పణఖఅది మీరు గమనించినప్పుడు అది మీలో పెరగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునే అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి ఉపోపవిష్టం సచివైః మరుద్భిఃవ వాసవమ్ ! ఆసీనం సూర్య సంకాశే కాంచనే వరమాఽఽసనే ! రుక్మ వేది గతం ప్రాజ్యం జ్వలన్తమ్ ఇవ పావకమ్ !! ఆయన కూర్చున్నటువంటి బంగారు సింహాసనం సూర్యకాంతి ఎలా ఉంటుందో అలా ఉంది, బంగారు ఇటుకలతో చేసినటువంటి హోమవేది యందు ప్రజ్వలింపబడినటువంటి అగ్నిహోత్రము యొక్క దీప్తి ఎలా ఉంటుందో ఆయనలోంచి వస్తున్నటువంటి కాంతి అలా ఉంది దేవ గన్ధర్వ భూతానామ్ ఋషీణాం చ మహాత్మనామ్ ! అజేయం సమరే శూరం వ్యాత్తాఽఽననమ్ ఇవాన్తకమ్ !! ఆయనా దేవతలయందు గంధర్వులయందు సమస్త భూతములయందు ఋషులయందు మహాత్ములయందు వైరము కలిగి ఉండి వారినందరినీ కూడా ఓడించి వారిచేత అజేయుడైనవాడు, బ్రహ్మగారి యొక్క వరముంది కాబట్టి వాళ్ళెవ్వరూ ఈయన్ని సంహరించలేరు అజేయం సమరే శూరం ఏ యుద్ధమునందు వారిచే ఓడింపబడనటువంటి పరాక్రమమున్నవాడు వ్యాత్తాఽఽననమ్ ఇవాన్తకమ్ ఆయన వ్యాత్తాననవివాంతకమ్ నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఎలా ఉంటుందో అలా ఉన్నాడు, తేజస్సు ఎంత గొప్పదైనా కావచ్చు కానీ ఆ తేజస్సు ఎందుకు పనికివచ్చిందంటే ఒక మృత్యుదేవత యొక్క తేజస్సు ఎలా ఉంటుందో, నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఏం చేస్తుంది కబళించేస్తుంది- తినేస్తుంది, ఈయన పరిస్థితికూడా ఏమిటంటే... ఎవరు కనపడితే వాళ్ళని తినేస్తాడు అంటే తన తపస్సు దేనికి వినియోగిస్తున్నవాడూ అంటే ఇతరులను ఖేద పెట్టడానికి తను అనుభవించాలనుకున్నదాన్ని అనుభవించడానికి తప్పా అది ఒక ధార్మిక మార్గంలో ఉపయోగపడేటటువంటి తపస్సు కాదు.
కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలోకాని ఎవరైనా నేను దీన్ని అనుభవించాలి అన్నకోర్కె ఆయనకు పుట్టిందనుకోండి అది ఏవస్తువుపట్లైనా సరే అది అన్నగారవ్వచ్చు కుబేరుడు ఆయనేం ఊరుకోడు ఓడించి తెచ్చుకుంటాడు, అది పరకాంతకావచ్చు ఆయనేం ఊరుకోడు తెచ్చుకుంటాడు. కాబట్టి ఆయన తేజస్సు ఆయన తపస్సు దేని దేనికి పనికి వచ్చాయి అన్నది మీరు చూడవలసి ఉంటుంది. మీరు శ్రీరామాయణంలో అనసూయమ్మను చూశారు, ఆనసూయమ్మా తపస్సు చేసింది ఆవిడ తపస్సు దేనికి పనికివచ్చింది అంటే క్షామమం వచ్చినప్పుడు గంగను ప్రవహింపజేసి చెట్లను చిగుర్చేటట్లుచేసి కొన్నివేల మందికి భోజనం పెట్టి బ్రతికించడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. ఒక పతివ్రత యొక్క భర్త మరణిస్తే ఆభర్తను మళ్ళీ ప్రాణం పొయ్యడానికి ఆయన్ని పునరుజ్జీవితున్ని చేయడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. రావణుడి తపస్సు దేనికి పనికొస్తుంది తను కోరుకున్న వస్తువుని తాను అనుభవించడానికి పనికి వస్తుంది ఇదే రాక్షసత్వం అంటే. ఇంక ఇంతకన్నా వేరే ఏమీ ఉండదు, మీరు పుణ్యం చేశారా ధార్మికంగా ఉండడం అంటే మీరు ఏదో పూజ చేశారా ఇదీ పెద్ద లెక్కలోకి వచ్చేటటువంటి విషయంకాదు మీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతిని పుణ్యఫలితంగా మీరు పొందినటువంటి అనుగ్రహం ఏ రూపంలో మీయందు ప్రసరించిందో దాన్ని మీరు సమాజపరం చేస్తారా... మీరు సమాజ అభ్యున్నతి కొరకు విశ్వమునందు విశ్వనాథున్ని దర్శనంచేసి విశ్వముయొక్క అభ్యున్నతి కొరకు ఈశ్వరుడు మీకిచ్చినటువంటి విభూతిని మీరు ఉపయోగించగలరా..!

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
సనాతన ధర్మంలో ఒక్కటే సిద్ధాంతం మీకు ఏది కలిగినా అది కష్టంకానివ్వండీ సుఖంకానివ్వండి పుణ్యంకానివ్వండీ పాపంకానివ్వండీ లేకపోతే ఇవ్వాళకలిగినటువంటి సంతోషంకానివ్వండీ దుఃఖంకానివ్వండీ వీటికి కారణం మీరు చేసుకున్న కర్మయే. ఆ కర్మలో అంతర్భాగమే తపస్సైనా యజ్ఞమైనా యాగమైనా చేసింది యాగం చేసింది యజ్ఞం చేసింది తపస్సు దానివల్ల వచ్చింది కొంత ఫలితం కాని ఆ ఫలితాన్ని నీవు ఎలా వాడుతున్నావు దాన్నిబట్టి నీవు రాక్షసుడివా మనిషివా నిర్ణయించవలసి ఉంటుంది. నీవు లోకానికి పనికొచ్చేవాడివా పనికిరానివాడివా అనేది ఈశ్వరుడు అక్కడ నిర్ణయం చేస్తాడు ఇవ్వడం ఇస్తాడు ఉపయోగించుకోవడమన్నదాన్నిబట్టి ఈశ్వరుడు మీ అభ్యున్నతిని నిర్ణయం చేస్తాడు, ఇచ్చినదాన్ని దుర్వినియోగంచేస్తే ఇక ఈ వస్తువు ఉండడం ప్రమాదం అనుకున్నప్పుడు ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు, ఎలా తీసేస్తాడూ అంటే దేనిలోంచి ఆ విభూతి ప్రసరిస్తోందో అసలు ఆ మూలమే పడిపోతుంది చిట్టచివర సుందర కాండలో తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మ నాశనః ! ప్రాప్తం ధర్మ ఫలం తావద్భవతా నాత్ర సంశయః అంటూ ఇది ఉంటే తప్పా అనుభవించడం కుదరదు దీంతోనే అనుభవించాలి ఏదైనా... చేసినా దీంతోటే అనుభవించినా దీంతోటే కాబట్టి దీన్నేతీసేస్తాడు ఈశ్వరుడు. ఈ స్థితి రాకుండా ఉండాలీ అంటే జాగ్రత్త ఎక్కడ వహించవలసి ఉంటుందీ అంటే నేను పుణ్యకరణాచరణం చేస్తున్నాను నేను సంపాయించాను కాబట్టి నేను ఎలాగైనా అనుభవిస్తాను నన్నుకాదనేవాడు ఎవడూ అనేది కాదు, దీన్ని చూసేవాడు ఒకడు ఉనాడు అన్నది నిశ్చయాత్మకమైన బుద్ధి మీయందు ఉండాలి.
Image result for శూర్పణఖరాముడైతే దీనికి భిన్నంగా ఉంటాడు, ఎవరు చూసొచ్చారు తెల్లవారిగట్లా వెళ్ళి స్నానం చేసివచ్చి ఉంటాడు అని అది హేమంత ఋతువులో కాని ఎవరు చూసొచ్చారని రాముడు చూడడు ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తున్నాడని ఆయన నమ్ముతాడు ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నడవడి అలా ఉంటుంది అందుకని ఆయన ధర్మాత్ముడు కాగలిగాడు ఆ ధర్మం ఆయన్ని రక్షించింది. అది విడిచిపెడతాడు తను తెలుసుకున్న శాస్త్రాన్ని తనకి ప్రకాశించిన విభూతిని తాను ఎలా ఉందామనుకుంటున్నాడో  దానికి అనుగుణంగా సమర్థించుకునే రీతిలోకి మారుస్తాడు ఇది చాలా ప్రమాదకరమైన ప్రజ్ఞా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి పోతనగారి మాటల్లో చెప్పాలి అంటే జ్ఞాన ఖలునిలోని శారదవోలె అంటే ఋషి హృదయము అని ఒకటి ఉంటుంది, ఋషి ఒక విషయాన్ని ఈ ప్రయోజనం కోసం చెప్తున్నాను అనుకునే చెప్తారాయన, కానీ తనకు ప్రజ్ఞ ఉందికదాని ఒక శ్లోకాన్ని ఎలాగైనా అన్వయం చేయగలిగిన శక్తి తనకు ఉందికదాని మీరు అన్వయం చేయడం కానీ లేదా మీరు ఒక తప్పు చేసి ఆ తప్పుని సమర్థించుకోవడానికి శాస్త్రవాక్కుని మీకున్నటువంటి పాండిత్యాన్ని సాధనంగా తీసుకొని మీరు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం కానీ ప్రమాదహేతువే.
అప్పటికి బాగున్నట్లు ఉంటుందేమో కానీ అది మాత్రం మీకు అభ్యున్నతి హేతువుకాదు, రావణుడి జీవితమంతా అంతే ఆయన చదువుకోలేదని మీరు అనుకోకూడదు ఆయన చదువుకున్నవాడే ఆయన తపస్సు చేసినవాడే కాని ఆయన చదువుకున్న శాస్త్రం ఆయనకు ఎందుకు పనికి వస్తుందంటే తను చేసిన తప్పుని శాస్త్రం సమర్థిస్తోందన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, ఇదే ఆయన కొంపముంచేసింది ఆఖరికి. రాముడైతే అలాగకాదు శాస్త్రం ఏం చెప్పిందో అది నేను

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
చెప్తున్నాను అని చెప్తాడు అంతే శాస్త్రానికి రాముడు కట్టుబడుతాడు, వేదానికి రాముడు కట్టుబడుతాడు వేదాన్ని తనకు అనుగుణంగా శాస్త్రాన్ని తనకు అనుగుణంగా మార్చి మాట్లాడి తన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకునే ప్రయత్నం రావణుడు చేస్తాడు, వేదం ఏం చేయగలదు మనల్ని అన్న తృణీకార భావం అసలా ప్రవర్తనలో ఉంది. ఏం చెయ్యగలదో రాముడి రూపంలో వచ్చి చేసి చూపించింది, ఎందుకు చేసి చూపించింది అనవలసి ఉంటుందంటే వేదము ఒకటి ఈశ్వరుడొకటీ కాదు మీరు ఎప్పుడూ ఈవిషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వేదము వేరండీ ఈశ్వరుడు వేరండీ అని మీరు అనకూడదు ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదము.
Image result for వేదముఈశ్వరుని యొక్క ఊపిరియే వేదము అని నేను అనినప్పుడు నేను ముందా ఆ ఊపిరి ముందా “భవతి” అని సంస్కృతంలో ఒకమాట అంటే ఉన్నాడు... ఉన్నాడూ అన్నమాట ఎప్పుడు వాడుతారు ఆయన ఊపిరితీస్తే నేను మొట్ట మొదట ఊపిరి ఎప్పుడుతీశానో అప్పుడు నేను ఉన్నాను నా యొక్క అస్థిత్వము ప్రకటింపబడింది, నా ఊపిరి ఇప్పుడే ఆగిపోతే అప్పుడు ఇకలేరు కోటేశ్వరరావుగారు శరీరం పోయిందని గుర్తు ఊపిరిని బట్టి ఉన్నాడు ఇప్పుడు ఊపిరికి ఆయనకి ఏమైనా భేదముందా... ఊపిరే ఆయన ఆయనే ఊపిరి భవతీ అనబడాలీ అంటే ఆయన ఊపిరే హేతువై ఉంటుంది యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే ! గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్కాయే ! అయినప్పుడు ఈశ్వరుడూ ఈశ్వరుని యొక్క ఊపిరీ ఎలా తేడా అవుతుంది కాదు, వేదమూ అంటే వేదాన్ని నమ్మడమూ అంటే ఈశ్వరున్ని నమ్మడమే వేదాన్ని గౌరవించడమూ అంటే ఈశ్వరున్ని గౌరవించడమే, శంకర భగవత్ పాదులకు వేదము అంటే అంత గౌరవము అంటే వేదాన్ని గౌరవించినప్పుడు ఒకటి ఈశ్వరున్ని గౌరవించినప్పుడు ఒకటీ అని మీరు అర్థం చేసుకోకూడదు వేదమే ఈశ్వరుడు, కాబట్టి మీరు ఇప్పుడు వేదాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తే వేదం చెప్పిన విషయాన్ని మీరు చేస్తున్న పనులను సమర్థించడానికి మీ పాండిత్యాన్ని వాడితే ఈశ్వరుడి పట్ల దోషంకిందే అది లెక్కలోకి వస్తుంది.
కాబట్టి ఇప్పుడు మీ శత్రుత్వము ఎవరితో వెళ్ళిపడుతుంది ఈశ్వరునితోటే పడుతుంది అందుకే శాస్త్ర ప్రమాణమునకు వేద ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి అందుకే శంకరభగవత్పాదులు అవతారపరిసమాప్తియందు వేదోనిద్యమదీయతాం సదువితం స్వకర్మ స్వనీష్ఠీయతాం అంటూ దుష్టకాష్టువిర్ యంతాం అంటూ దుష్టర్కము చేయవద్దు, మీకున్నవాక్కు ఏదుందోదాని శృతి ప్రమాణమును నిలబెట్టడానికి ఉపయోగించాలి తప్పా నీ పాండిత్యం నీ తెలివితేటలు వక్రంగా వాడవద్దు, వక్రంగా అంటే నీ హృదయానికి అనుగుణంగా వేదం చెప్పవద్దు. వేదం యొక్క హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పు అనుష్టించు. ఇక్కడే తేడావస్తుంది ఆయనకి కాబట్టి ఇప్పుడు దేవ గన్ధర్వ భూతానామ్ ఋషీణాం చ మహాత్మనామ్ ! అజేయం సమరే శూరం వ్యాత్తాఽఽననమ్ ఇవాన్తకమ్ !! ఈయనా స్నిగ్ధ వైడూర్య సంకాశం తప్త కాంచన కుణ్డలమ్ ! సుభుజం శుక్ల దశనం మహాఽఽస్యం పర్వతోపమమ్ !! మహర్షి ఆయన యొక్క భౌతికమైన ఆకృతివైభవాన్ని వర్ణణ చేస్తున్నారు స్నిగ్ధ వైడూర్య సంకాశం వైడూర్య మాణిక్యం ఎలా ఉంటుందో అటువంటి నల్లని కాంతి కలిగినవాడు తప్త కాంచన కుణ్డలమ్ చెవులకు

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
పెట్టుకున్నటువంటి కుండలములు బాగా కాల్చినటువంటి బంగారముతో చేయబడినటువంటివి ధరించి ఉన్నాడు, సుభుజం మంచి గుండ్రంగా ఉన్నటువంటి భుజములు కలిగినవాడు శుక్ల దశనం అంటె తెల్లని పళ్ళున్నవాడు మహాఽఽస్యం పెద్ద ముఖమున్నవాడు పర్వతోపమమ్ ఒక పర్వతమొచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అంత గంభీరమైన ఆకృతికలిగినవాడు.
Related imageవిష్ణు చక్ర నిపాతైశ్చ శతశో దేవ సంయుగే ! అన్యై శ్శస్త్ర ప్రహారై శ్చ మహా యుద్ధేషు తాడితం !! ఆయన శరీరం మీద ఆ భూజముల మీదా చేతుల మీదా విష్ణు చక్రం చేత కొట్టబడినటువంటి దెబ్బలున్నాయి, ఇది బాహ్యంలో ఆయన అంత గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు విష్ణు చక్రం ఆయన్ని ఏం చేయగలిగిందీ అంటే ఓసారి ఆయనకు వచ్చి తగిలితే ఓ గాయమైంది తప్ప విష్ణు చక్రం ఆయన్ను పరిమార్చలేకపోయింది- చంపలేకపోయింది అంతవరకు బాగానే ఉంటుంది గొప్పతనంగా చెప్పడానికి బాగుంటుందీ... కాని విష్ణువు స్థితికారుడు ఆయన ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూంటాడు, ఆయనతో యుద్ధమొచ్చి ఆయన చేతిలోంచి చక్రాన్ని నీమీద ప్రయోగించ వలసివచ్చిందంటే నీవు ఎంత దుర్మార్గుడవై ఉండాలి, ఇదీ ఋషి హృదయం, ఇది చూడమనీ తప్పా... విష్ణు చక్రం పెట్టి కొడితే విష్ణు చక్రం దెబ్బలున్నాయండీ అంత పరాక్రమవంతుడండీ అని చెప్పమని కాదు ఆయన ఉద్దేశ్యం, ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విష్ణువు చక్రంపెట్టి కొట్టవలసి వచ్చిందీ అంటే వీడు ఎంత అధర్మంలో ఉండేటటువంటివాడో అన్నది మీరు అర్థం చేసుకోవాలి.
పోనీ ఒక్క విష్ణువా... సమస్తదేవతల యొక్క ఆయుధముల దెబ్బలూ ఆయన ఒంటినిండా ఉన్నాయి అయినా చావలేదు, అంటే అంత పెద్ద తపస్సు చేశాడు పదివేల సంవత్సరములు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు కాల్చనా... దేనికది, పది తలకాయలు కోసుకున్నాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు మీ పాదములయందు చెక్కుచెదరని భక్తిప్రవృత్తులు కావాలని ఒక్క మాట అని అడిగి ఉంటే... రావణుడు ఏ స్థితిని పొంది ఉండేవాడో..? కానీ అలా అనలేకపోయాడు. ఈ దెబ్బలన్నీ ఎందుకొచ్చాయంటే ఆ తపస్సువలన నేను అజేయుడననేటటువంటి అహంకారములోంచి పుట్టుకొచ్చాయి, కాబట్టి ఆయన తపస్సు ఆయన తేజస్సు ధర్మాన్ని రక్షించడానికి పనికొచ్చింది కాదు, ఆయన ఏం చేస్తుంటాడు ఆహతాంగం సమస్తై శ్చ దేవ ప్రహరణై స్తథా ! అక్షోభ్యాణాం సముద్రాణాం క్షోభణం క్షిప్ర కారిణమ్ !! ఎప్పుడు కూడా దేవతలతో యుద్ధం చేస్తూ, సముద్రములను కూడా క్షోభింపచేస్తూ ఆయన ఉంటాడు, క్షేప్తారం పర్వతాగ్రాణాం సురాణాం చ ప్రమర్దనమ్ ! పెద్ద పెద్ద పర్వతాలని కూడా గాలిలోకి బంతులు విసిరినట్టు విసరగలడు అంటే అంతటి భుజ పరాక్రమము అంతటి బలమున్నవాడు సురాణాంచ ప్రమర్దనమ్ ఎప్పుడూ కూడా దేవతలన్ని ఇబ్బంది పెట్టి దేవతలను మర్దిస్తూంటాడు ఉచ్ఛేత్తారం చ ధర్మాణాం ధర్మం ఎక్కడుందో అక్కడ దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు ధర్మమునకు హాని కల్పిస్తాడు పర దారాభిమర్శనమ్ ఇతరుల యొక్క భార్యలను తన భార్యగా చేసుకొని అనుభవించాలనేటటువంటి మిక్కుటమైన కోర్కె కలిగినవాడు, ఇంతకన్నా ధారుణమైనటువంటి లక్షణం ఇంకొకటి ఉండక్కరలేదు.
కాబట్టి ఇటువంటివాడు ఈయన దేవతల్ని ఎంతగా మర్ధించాడంటే ఉత్తర కాండలో రావణాసురిని గురించి ఒక విషయం చెప్తూంటారు, ఆయన ఒకప్పుడు మరుత్తు అనబడేటటువంటి రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు వెళ్ళితే అక్కడే ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు మొదలైనటువంటి దేవతలు ఉన్నారు, రావణాసురిని చూడగానే అక్కడ ఉంటే ఎక్కడ మర్దిస్తాడో  అన్న భయంచేత వాళ్ళు జంతువులనాశ్రయించి వాటిలోకి వెళ్ళిపోయారు ఇంద్రుడు ఒక నెమలిలోకి ప్రవేశించాడు, వరుణుడు ఒక హంసలోకి వెళ్ళిపోయాడు, కుబేరుడు ఒక తొండలోకి వెళ్ళిపోయాడు, యముడు ఒక కాకిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వచ్చాడు ఆ మరుత్తుతోటి యుద్ధం చేశాడు వెళ్ళిపోయాడు ఆ గొడవ అయిపోయింది అయిపోయిన తరువాత వీళ్ళు నలుగురూ బయటికి వచ్చారు సమయానికి రావణుడి కంటపడకుండా మీ శరీరంలో మమ్ములను దాక్కునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వరాలు ఇస్తున్నామని అప్పుడు ఈ నాలుగు ప్రాణులకు వాళ్ళు వరాలు ఇచ్చారు, ఇంద్రుడు నెమలికి అప్పుడే ఇచ్చాడు  వరం నాకు ఉన్న వేయ్యి కన్నులు నీ యొక్క పింఛంలో నెమలి కన్ను అన్ని కన్నులుగా కనపడుతాయి అందంగా పింఛం అలా ఉంటుంది. వరుణుడు హంసకి వరమిచ్చాడు వరుణుడు జలాధి దేవత కనుకా నీవెప్పుడూ నా నీటి మీద తెలుతూ ఉంటావు చంద్ర ప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి స్థితిలో నీవు ఉంటావు, కుబేరుడు తొండకు వరమిచ్చాడు నీ తలా పెద్దదిగా ఉండి ఆహారమును నిలువచేసుకునే స్థితిని కలిగి ఉండి బంగారు రంగులో ఉంటావని, యముడు కాకికి వరమిచ్చాడు నీవు దీర్ఘాష్యుమంతురాలివి అవుతావు ఏ రోగమూ నిన్ను బాధించదు బలవన్మరణం తప్పా నీయంతకు నీవు చచ్చిపోయేదన్నది ఎక్కడా ఉండదు సరికదా నా చేత నీవు అనుగ్రహింపబడినావు కనుక నీవు తింటే పితృదేవతలు సంతోషిస్తాడు కాబట్టి నీవు తినాలని  పితృకార్యం చేసినప్పుడు కోరుకుంటారు జనం అని కాకికి యమధర్మరాజు గారు వరమిచ్చారు.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
ఈ నాలుగు ప్రాణులూ వరం పొందేటట్టుగా దేవతలంతవారు కనపడ్డదాంట్లో కనపడ్డట్టు దూరిపోయేటట్టుగా మర్ధించగలిగాడంటే రావణుడంటే దేవతలు కూడా ఎంత భయపడ్డారో ఆయన ఎంత ఉద్ధతితో ప్రవర్థించినటువంటివారో ఇంక ఇంత కన్నా సాక్షం ఉండదు కాని ఇది ఉత్తర కాండలో చెప్పబడిన అంశం. కాని ఈ శ్లోకానికి ఓసారి  అన్వయం చేయ్యచూ అని నేను అన్వయం చేసి మీకు ఆ ఘట్టాన్ని చెప్పాను అంతే... కాబట్టి ఉచ్ఛేత్తారం చ ధర్మాణాం పర దారాభిమర్శనమ్! సర్వ దివ్యాస్త్ర యోక్తారం యజ్ఞ విఘ్న కరం సదా ! పురీం భోగవతీం గత్వా పరాజిత్య చ వాసుకిమ్ !! ఈయనా పాతాళ లోకానికి వెళ్ళి ఒకానొకప్పుడు వాసుకిని ఓడించాడు. ఎందుకు ఓడించడమంటే మీకు రామాయణంలో రెండు పాత్రలు కనపడుతాయి, ఒకడు వాలి ఒకడు రావణుడు వీళ్ళిద్దరికి పనేమిటంటే... ఇద్దరూ కూడా ప్రతిరోజూ ఇవ్వాళ మనం ఎవ్వరిమీద యుద్ధానికి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు, వెళ్ళి అవతలివాన్ని ఓడించడం ఓడిపోతే సంధి చేసుకోవడం ఇంకా సిగ్గులేకుండా ప్రవర్తిస్తే ఏ పెద్దాయనో వచ్చి వీళ్ళని రక్షిస్తూ ఉండడం. మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ అంతే ఢాంభికంగా తిరగడం తప్పా మార్పన్నది లేకుండా ఇలా తిరిగే లక్షణం ఉన్నటువంటి రెండు పాత్రలు రామాయణంలో ఒకటి రావణుడు రెండు వాలి అందుకే వాళ్ళిద్దరిమధ్య అంతగొప్ప సంధికూడా ఉంది.
Image result for కుబేరుడుకాబట్టి పురీం భోగవతీం ప్రాప్యా పరాజిత్య చ వాసుకిమ్ ! తక్షక స్య ప్రియాం భార్యాం పరాజిత్య జహార యః ! ఈయన తక్షకుని ఓడించి ఆయనకి ప్రియమైన భార్యని అపహరించి తీసుకొచ్చాడు కైలాసం పర్వతం గత్వా విజిత్య నర వాహనమ్ !! కైలాస పర్వతానికెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కుభేరున్ని ఓడించాడు, కుబేరుడు అన్నగారు అసలు ఉత్తర కాండలో ఆ అన్నగారు పరిపాలించినటువంటి సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. రావణుడు వెళ్ళితే కుబేరుడు అడిగాడు తమ్ముడా రా ఇద్దరం కలిసి పరిపాలిద్దాం అన్నాడు. నాకు అలా వీల్లేదు నీవు వెళ్ళిపోతావా నేన ఉండనా అంటే విశ్వవషు బ్రహ్మను అడిగాడు వాడికి అహంకారంతో

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
పోయేకాలం దాపురించింది నీవు ఉత్తర దిక్కుకు వెళ్ళిపో, అప్పుడు అలకాపురి నిర్మించుకుని కైలాస పర్వతం పక్కకి వెళ్ళిపోయాడు. రావణుడు లంకా రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు, మొట్ట మొదట కుబేరుడు పరిపాలించినదాన్ని తను పుచ్చుకున్నాడు, అన్నగారైనటువంటి కుబేరుని దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానాన్ని నళినీ అనేటటువంటి సరస్సుని చైత్రరథ అనబడేటటువంటి ఒక గొప్ప వనాన్ని కూడా ఆయనని ఓడించే తెచ్చుకున్నాడు విమానం పుష్పకం తస్య కామగం వై జహార యః ! వనం చైత్రరథం దివ్యం నళినీం నన్దనం వనమ్ !! నందన వనాన్నీ చైత్రరథాన్ని వీటన్నిటినీ కూడా ఆయన అలాగే తీసుకొచ్చుకున్నాడు.
Image result for rama lakshmana bharata and shatrughnaమీరు ఒకటి చూడండీ రామాయణంలో రాముడు అంటాడు ధర్మమర్ధం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణ ! ఇచ్ఛామి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమి తే !! అంటాడు, నేను ధర్మం కాని అర్థం కాని కామం కాని ఏదైనా అనుభవిస్తే లక్ష్మణా నేను నా సోదరులతో కలసి అనుభవిస్తాను, తప్పా నా సోదరులు అనుభవించనిది నాకు అక్కరలేదు అన్నాడు. త్యాగేనైకే అమ్రుతత్వమనసుహ్ అని రాముడు తనదైన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేయడానికి సిద్ధపడుతాడు, కాని రావణుడు ఇతరులది ఏవున్నాయో అవి తనదిగా చేసుకున్నాడు, వ్యతిరేక పదాలని చెప్పి ఉంటాయి చూశారా..! ఎత్తు – పల్లం, పొడుగు – పొట్టి, చీకటి – వెలుగు, ఈ రెండు వ్యతిరేక పదాలు ఎలాగుంటాయో రామాయణంలో రాముడు రావణుడు అలా ఉంటారు. మీకు రాముడు నచ్చితే ధర్మపథలో వెళ్ళొచ్చు మీకు రావణుడు  నచ్చితే పది తలకాయలు ఉన్నా వాడికి పడిపోయాయి, కాబట్టి అదే జరుగుతుంది అనికూడా గుర్తుపెట్టుకుని రావణున్ని అనుకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన కుబేరున్ని ఓడించి ఇవన్నీ తెచ్చుకున్నటువంటివాడు, ఇంతటి బలపరాక్రములున్నటువంటి ఆ రావణాసురుడు పుష్పక విమానంలో కూర్చుని ఉండగా శూర్పణఖ మాట్లాడుతుంది.
ఇక్కడ శూర్పణఖ మాట్లాడడం అనేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది ఒక రకంగా ఎందుకంటే తన కోర్కె నెరవేరడానికి అనువుగా... రావణాసురిని యొక్క దృష్టిని తనవైపుకు బాగా తిప్పుకోవడానికి వీలుగా మాట్లాడుతుంది, మాట్లాడటం ఎలా ఉంటుందంటే... హఠాత్తుగా నీకు ఉపద్రవం వచ్చిందీ అని మొదలు పెడుతుంది, నీకు ఉపద్రవం వచ్చిందీ అంటే ఎవడైనా ముందు అటువైపుకి దృష్టి తిప్పుతాడు తతః శూర్పణఖా దీనా రావణం లోక రావణమ్ ! అమాత్య మధ్యే సంక్రుద్ధా పరుషం వాక్యమ్ అబ్రవీత్ !! అమాత్య మధ్యే మంత్రుల మధ్యలో కూర్చున్నటువంటి రావణుని దగ్గరికి వచ్చి ఆమె పరుషమైనటువంటి మాటతో ప్రారంభం చేసింది ప్రమత్తః కామ భోగేషు స్వైర వృత్తో నిరంకుశః ! సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే !! నీవు నిరంతరము కామభోగాలని అనుభవిస్తూ నిరంకుశుడవై మత్తెక్కి ఉన్నావు, నీకు ఎంత ఘోరమైనటువంటి ఆపదవచ్చి నీ మీద పడిపోతోందో నీవు తెలుసుకోవట్లేదు, దీంతో మొదలు పెట్టింది అంటే ఈ మాట అనేటప్పటికీ ఎవరి దృష్టైనా అటువైపుకి వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా, ఏదో కూర్చుని మాట్లాడుకుంటున్నారనుకోండి ఏంటో మీరు ఇలా కూర్చుని సంతోషంగా హాయిగా గడిపేస్తున్నారు మీకు తెలియట్లేదు ఎంత ఘోరమైన ఆపద వచ్చేస్తుందో మీకు తెలియట్లేదు అన్నారనుకోండి! తరువాత మాట్లాడుదాం లేండి అంటారా లెదా ముందు అదేంటిరా బాబూ ఆ ప్రమాదమేంటండీ అంటారా... your kind attention please అంటారు, అంటే మీ దృష్టిని దయచేసి మాయందుపెట్టండీ అని అడుగుతూ ఉంటారు

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
మీ దృష్టిని మా నుంచి మరల్చకండీ అని కూడా అడుగుతుంటారు. Do not you allow your attention to be diverted by something else transacting in the banker అని కూడా ఒక బోర్డు ఉంటుంది, దృష్టిని ఆకర్షించి మాట్లాడుతుంటారు ఎందుకంటే ఎక్కడ బుద్ధి పెట్టాలి అని కోరినప్పుడు.
Image result for ramayanaరావణుని యొక్క మనస్సుని ఎలా లాగిందో చూడండి శూర్పణఖ అంటే తన ప్రయోజనం కొరకు తన పగని సిద్ధింప చేసుకోవడానికి ఆవిడ మనసులో ఎంతగా సిద్ధపడి వచ్చి మాట్లాడుతుందో చూడండి, అంటూందీ సక్తం గ్రామ్యేషు భోగేషు కామ వృత్తం మహీపతిమ్ ! లుబ్ధం న బహు మన్యన్తే శ్మశానాగ్నిమ్ ఇవ ప్రజాః !! ఎప్పుడూ క్షణికములైనటువంటి భోగములను అనుభవిస్తూ ఇంద్రియములకు వశపడిపోయినటువంటి రాజు ప్రజల గురించి పట్టించుకోకుండా కేవలం భోగలాలసుడై ఉండిపోతే అటువంటి రాజుని ఎవ్వరూ గౌరవంగా చూడరు, శ్మశానములో ఉన్న శవాన్ని కాల్చేటటువంటి అగ్నిహోత్రం కూడా అగ్నిహోత్రమే అదేం అగ్నిహోత్రం కాకపోదు శవాన్ని కాల్చిందికదాని, కాని శవాన్ని కాల్చుతున్నటువంటి అగ్నిహోత్రం పవిత్రంగా మనం చూడడం కుదరదు కదా! ఎందుకని అంటే అగ్నిహోత్రం పవిత్రం కాదు అని అనడం మాత్రం కుదరదు కాని శవాన్ని కాల్చుతున్నటువంటి అగ్ని ఎలా మంగళకరంగా చూడబడదో అలా కేవలము గ్రామ్యమైనటువంటి భోగములయందు లాలస కలిగి వానియందే నిరంతరం తిరిగేటటువంటి రాజుని ప్రజలు ఆదరించరు ఇష్టపడరు స్వయం కార్యాణి యః కాలే నానుతిష్ఠతి పార్థివః ! స తు వై సహ రాజ్యేన తై శ్చ కార్యై ర్వినశ్యతి !! ఏ రాజు తాను స్వయంగా కొన్ని కొన్ని పనులను చూసుకోవలసి ఉంటుందో ఏ రాజు తప్పకుండా తాను ఆ కార్యముల మీద వ్యక్తిగతంగా తన దృష్టి పెట్టవలసి ఉంటుందో అలా పెట్టకుండా పరిపాలన జరిగిపోతుందిలే అని విడిచిపెట్టేస్తాడో అటువంటి రాజు యొక్క కార్యములు నశించిపోతాయట.
అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారని ఆవిడ ఉద్దేశ్యం రావణుడు చేస్తున్నాడని ఏం జరిగింది ఏ ఆపద వచ్చింది ఇలా అని అలా నీవు ఉన్నావని నిరూపించి మాట్లాడుతుంది ఆవిడ, చిట్ట చివరికి రావణుడిదే దోషం ఇది ఎంత దూరం వెళ్ళుతుంది అన్నది చూపిస్తుంది రావణుని దృష్టి ఆకర్షించడానికి త్వం తు బాల స్వభావ శ్చ బుద్ధి హీన శ్చ రాక్షస ! జ్ఞాతవ్యం తు న జానీషే కథం రాజా భవిష్యసి !! నీవు బాలుడిలా వివేక శూన్యుడివి నీకు యుక్తా యుక్త విఛక్షణ లేదు బుద్ధిహీనుడవు ఇలాంటి నీవు ఎలా రాజుగా ఉండగలనని అనుకుంటున్నావు అయుక్త చారం మన్యే త్వాం ప్రాకృతైః సచివై ర్వృతమ్ ! స్వజనం చ జనస్థానం హతం యో నావబుధ్యసే !! 14 వేల మంది నీ స్వజనులు జన స్థానంలో మరణించారు, నీకు తెలుసా ఆ విషయం నీకు తెలియదు నీ గూఢచారులు అంత గొప్పవారు, భటులు అంతగొప్పవారు నీకు కనీసం నీ స్వజనం ఇంత మంది చచ్చిపోయారనికూడా నీకు తెలుసుకోనెంతటి ఆలోచనలేదు, నీవు దానిగురించి పట్టించుకోవట్లేదు ఇంక ఇంతకన్నా దారుణమేముంటుంది చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమ కర్మణామ్ ! హతాని ఏకేన రామేణ ఖర శ్చ సహ దూషణః !! 14 వేల మంది రాక్షసులు ఖర దూషణలతో సహా... ఒక్క రాముడి చేతిలో తెగటారిపోయారు.
ఇప్పుడు ఆయన దృష్టి బాగా అటువైపుకు వెళ్ళేటట్టు మాట్లాడుతుంది ఋషీణామ్ అభయం దత్తం కృత క్షేమా శ్చ దణ్డకాః ! ధర్షితం చ జనస్థానం రామేణాక్లిష్ణ కర్మణా !! అక్కడితో అయిపోయిందనుకుంటున్నావేమో రాముడు ప్రతిజ్ఞ చేశాడు ఋషుల దగ్గర ప్రతిజ్ఞ చేశాడు దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు, కాబట్టి ఇప్పుడు మాట నిలబెట్టుకోవడానికి ఋషులు హాయిగా తపస్సు చేసుకొనేటట్టుగా పరిస్థితిని ఏర్పాటు చేయడానికి రాముడు రాక్షసుల్ని

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
విడిచిపెట్టడు ఋషులు అంటే రావణాసురిడికి పడదు ఆ ఋషులని ఎవడు రక్షిస్తానన్నాడో ఆయన రావణుడికి శత్రువే కాబట్టి ఇప్పుడు ఆవిడ రామ-రావణుల మధ్య శత్రుత్వాన్ని ఏ కారణం పెట్టి కల్పించవచ్చో ఆ కారణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది, పెట్టి నానుతిష్ఠతి కార్యాణి భయేషు న బిభేతి చ ! క్షిప్రం రాజ్యా చ్చ్యుతో దీన  స్తృణైస్తుల్యో భవిష్యతి !! ఏరాజు కార్యములను బాగా పట్టించుకోకుండా తిరుగుతుంటాడో ఏ రాజు వస్తున్నటువంటి భయానకమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా నాకేమిలే అని ప్రవర్తిస్తుంటాడో అటువంటివాడు చాలా త్వరగా రాజ పదవి నుంచి తొలగింపబడి భయమును పొందుతాడు అందరికీ చులకనైపోతాడు రావణా నీకొక మాట చెప్తున్నాను ఇవ్వాళ నిన్ను ఇంత గౌరవిస్తున్నారు కానీ రాముడు నిన్ను రాచరికం నుంచి తొలగిస్తే నిన్ను పడగొట్టేస్తే నీ సింహాసనం పోతే శుష్కైః కాష్ఠై ర్భవేత్ కార్యం లోష్టైర్ అపి చ పాంసుభిః ! న తు స్థానాత్ పరిభ్రష్టైః కార్యం స్యా ద్వసుధాధిపైః !! ఎక్కడైనా లోకంలో ఎండిపోయినటువంటి పుల్లలు మట్టి గడ్డలు ధూళి వీటికి కూడా విలువ ఉండచ్చు ఉండచ్చేమి ఉంటుంది కూడా... కానీ ఒక్కసారి పదవిని కోల్పోయినటువంటి రాజుకి మాత్రం ఇక గౌరవం ఉండదు, వాడు అన్నిటినీ కోల్పోతాడు అంత చులకనైపోతాడు అందరి దృష్టిలో నీవు దీన్ని తెలుసుకోలేకపోతున్నావు.
Image result for రాముడు ఋషులనీకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నావు వచ్చేస్తున్నాడు రాముడు కాబట్టి త్వరలోనే నిన్ను పదవి నుంచి తీసేస్తాడు ఎందుకు తీసేస్తాడు అని అడుగుతావేమో... ఒక్కటే కారణం నీకు రామునికి ప్రత్యక్షవైరం అక్కరలేదు ఋషుల్ని రక్షిస్తానని రాముడు అన్నాడు ఋషుల్ని పాడుచేసి నీవు ఉంటావు, కాబట్టి ధర్మాన్ని నీవు పాడుచేస్తావు - ధర్మాన్ని ఆయన రక్షిస్తాడు కాబట్టి మీ ఇద్దరి శత్రుత్వానికి కారణం ఇది చాలు. నీవు ఉంటే ధర్మం ఉండదు కాబట్టి నీవు ఉంటే ఋషులు తపస్సు చేయలేరు కాబట్టి నీవు ఉండడాన్ని రాముడు ఇష్టపడడు. అసలు రాముడు అలా ఆలోచించాడా..? అన్నది మనం చెప్పడం కష్టం, రాముడు అసలు రావణుడి విషయంలో ఇప్పటి వరకూ అలా ఆలోచించినట్టూ రావణున్ని చంపేద్దామని రాముడు ఆలోచించినట్టూ మనకు ఎక్కడా లేదు, ఋషులు అడిగారు ఆయన ప్రతిజ్ఞ చేశారు అంతే. కాని ఆవిడా దీన్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే- దీర్ఘ కాలంలో జరగవలసిన మాట మాత్రం అదే కాని ఇప్పుడే రావణుడికి ప్రమాదం వచ్చేసింది అన్నట్టుగా రాముడి వైపుకి వైరాన్ని ప్రచోదనం చేసింది.
అంటే రావణుడు అన్నాడు వెంటనే ఏప్రశ్న రావణున్నుంచి కోరుకుందో ఆ ప్రశ్నే రావణుడు వేశాడు, లోకంలో ప్రజ్ఞ ఒకటి ఉంటుంది ఆయన ఇలా అడగాలి అనుకునివెళ్ళీ ఆయన అలా అడిగేటట్టుగా మాట్లాడుతారు కొంతమంది ఆ ప్రశ్నవేసేటట్టుగా మాట్లాడుతారు అప్పుడు తను అడగడం కాదు ఆయన తనని అడిగి తాను ఆయనకి చేస్తానని చెప్పినట్టుగా స్థితిని కల్పిస్తారు ఇది చాలా చమత్కారంగా ఉంటుంది అదొక ప్రజ్ఞ. అది గొప్ప స్వార్ధం శూర్పణఖ దానిని సాధించుకోగలిగింది కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు క శ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః ! కిమర్థం దణ్డకారణ్యం ప్రవిష్ట శ్చ సుదుశ్చరమ్ !! అసలు ఎవరా రాముడు ఆయన పరాక్రమమేమిటి ఆయన వీర్యమేమిటి ఆయనా దండకారణ్యంలోకి ఎందుకొచ్చాడు ఎప్పుడొచ్చాడు దేనికొరకు దండకారణ్యంలో ప్రవేశించాడు ఆయుధం కిం చ రామ స్య నిహతా యేన రాక్షసాః ! ఖర శ్చ నిహతం సంఖ్యే దూషణ స్త్రిశిరా స్తథా !! అసలు ఆ రాముడు ఏ ఆయుధాలు చేత్తో పట్టుకుంటాడు రాముని వెనకాతల ఎవరుంటారు ఆ రాముడు ఏ పనిమీద ఏ వైరము వలన ఖర దూషనాదులను స్త్రిసురున్ని వాళ్ళని సంహరించాడు నీ ముక్కు చెవులు ఎందుకు కోశాడు అని అడిగాడు, ఇప్పటివరకు ఆవిడ ఖర దూషనాదుల గురించి మాట్లాడుతుంది తప్పా తన ముక్కు చెవులు ఎందుకు కోశారో చెప్పలేదు.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
Image result for రాముడు ఋషులఅది దాద్దాం అంటే దాచేదా..! దాద్దాం అంటే దాగేది కాదు ముక్కు చెవులు కోస్తే కాబట్టి ఆయన ఈ ప్రశ్న అడిగేదాకా మాత్రం తన ముక్కూ చెవులు ఎందుకు తెగిపోయాయో మాత్రం శూర్పణఖ చెప్పలేదు, ఇప్పుడు ఎంత అందంగా చెప్తుందో ఆ ప్రశ్నవేస్తే ముక్కు చెవుల ఘట్టాన్ని ఇంకొక రకంగా తిప్పుకుంటుంది, ఈ ప్రజ్ఞ ఈవిడిదేకాదు ఈ విడకి ముందుపుట్టినవాడు ఆయన- ఆయన ఇంతకన్నా గొప్ప ప్రజ్ఞ సత్యాన్నికి మసిపూసి అసత్యాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టడంలో శూర్పణఖా రావణుడు ఖచ్చితంగా అన్నాచెల్లెల్లే అలాగే ఉంటారు వాళ్ళిద్దరు కాబట్టి ఆవిడ ఇప్పడు అందీ దీర్ఘ బాహు ర్విశాలాక్ష మనసులో కామం ఎక్కడికి పోతుందండీ! కాబట్టి రాముడి గురించి ఎప్పుడు చెప్పినా అలాగే వర్ణిస్తుంది దీర్ఘ బాహు ర్విశాలాక్షః శ్చీర కృష్ణాజినామ్బరః ! కన్దర్ప సమ రూప శ్చ రామో దశరథాఽఽత్మజః !! రాముడు దీర్ఘమైనటువంటి బాహువులు ఉన్నవాడు ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అని కదా... ఆయన శ్చీర కృష్ణాజినాఽఽమ్బరః నారు చీర కట్టుకుని కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు కన్దర్ప సమ రూప శ్చ మన్మథునితో సమానమైనటువంటి అందము కలిగినటువంటి వాడు రామో దశరథాఽఽత్మజః దశరథుని యొక్క కుమారుడు రాముడు శక్ర చాప నిభం చాపం వికృష్య కనకాంగదమ్ ! దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పాన్ ఇవ మహా విషాన్ !! ఆయనా ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని చేత్తోపట్టుకుంటాడు, విషసర్పములతో సమానమైన నారాచ బాణములను వింటినారికి తగల్చి ప్రయోగిస్తూ ఉంటాడు.
నాఽఽదదానం శరాన్ ఘోరాన్ న ముంచంతం మహా బలమ్ ! న కార్ముకం వికర్షన్తం రామం పశ్యామి సంయుగే !! ఈ మాటే రావణుడికి బాగా తలకెక్కి రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలి అనే నిర్ణయానికి కారణమయింది, ఆవిడందీ 14 వేల మందిని చాలా తక్కువ సమయంలో రాముడు సంహరించాడు, కాని సంహరించడం అనేటటువంటిది చచ్చిపోనవాళ్ళవల్ల తెలిసిందితప్పా అసలు రాముడు 14 వేల మంది వెళ్ళితే చచ్చిపోవడానికనివెళ్ళి నిల్చున్నవాళ్ళు కారువాళ్ళు, వాళ్ళు యుద్ధానికి వెళ్ళినవాళ్ళు కాబట్టి వాళ్ళూ ప్రయోగించారు బాణాలు అస్త్రాలు శస్త్రాలు ఆయుధాలు అన్నివేశారు ఇన్నిటిని వేసినప్పుడు ఇన్నిటినీ ఎప్పుడు నిగ్రహించాడో, నిగ్రహిస్తూ ఇంతమందిని ఎప్పుడు చంపారో చంపడానికి బాణం ఎప్పుడు తీశాడో తీసిన బాణాన్ని ధనస్సుకు ఉన్నటువంటి వింటినారికి ఎప్పుడు తొడిగాడో తొడిగినదానిని వెనక్కి ఎపుడు లాగాడో లాగినదాన్ని ఎప్పుడు వదిలాడో వదిలినప్పుడు గురి ఎవరి వంక చూశాడో ఎప్పుడు వెళ్ళి ఆ బాణం పడిదో నాకు కనపడలేదు, వడగళ్ళవాన పడితే ఏవిధంగానైతే పైరు పంటలన్ని ధ్వంశమైపోతాయో అలా ఆయన ధనస్సులోంచి బాణములు పైకి రావడమన్నది బాణం తీయ్యడమన్నది బాణం సంధించడం అన్నది అసలు కనపడదు, అంత వేగమన్నమాట అసలు ఆ బాణాలు తీస్తున్నాడా అన్నది కూడా కనపడదు సంధిస్తున్నాడా కనపడదు.
ఇదిఎలా ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆగిపోతే లెక్కపెట్టగలిగిన ఫ్యాన్ రెక్కలు ఫిఫ్త్ గేర్లో ఉంటే లెక్కపెట్టలేని ఫ్యాన్ రెక్కలలా ఉంటుందన్నమాట అంతవేగం అది చాలా హీనోపమానమేమో..? అంతకన్నా నేను ఇంక ప్రవేశ పెట్టడానికి అవకాశంలేదని చెప్తున్నాను ప్రత్యక్షంగా వెంటనే మనసు ఎక్కడానికి అంత వేగంగా ఉంటుంది రామ బాణముల యొక్క వేగాన్ని దేనివల్ల చూడవలసి ఉంటుంది అంటే ఫలితాన్ని బట్టి చూడవలసి ఉంటుంది. 14 వేల మంది చచ్చిపోయారు కాబట్టి బాణాలు వేశారనుకోవాలి తప్పా బాణాలు వేయడం చూడ్డం మాత్రం కుదరదు ఎందుకంటే ఆ వేగం అలా ఉంటుంది అంత వేగంగా వేస్తాడు ఆ బాణాలని ఇప్పుడు రావణుడికి ఈ మాట విన్నాకే భయంవేసింది, మనం మాత్రం వెళ్ళి ఎదురుగుండా ఎలా నిలబడుతాం అనుకున్నాడు అనుకుని రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలన్న నిశ్చయం చేసుకోవడానికి కారణం కూడా శూర్పణఖ యొక్క మాటలే.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
అంటూ ఆవిడ అందీ ఋషీణామ్ అయం దత్తం కృత క్షేమా శ్చ దణ్డకాః ఋషులకందరికీ కూడా అభయమిచ్చాడు దండకారణ్యంలో రాక్షసులనందర్ని ఇలాగే చంపేస్తానన్నాడు, ఆయనతో ఎవరుంటారని కదా నీవు అడిగావు భ్రాతా చాస్య మహా తేజా గుణత స్తుల్య విక్రమః ! అనురక్త శ్చ భక్త శ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ !! అమర్షీ దుర్జయో జేతా విక్రాన్తో బుద్ధిమాన్ బలీ ! రామ స్య దక్షిణో బాహుః నిత్యం ప్రాణో బహి శ్చరః !! ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు అపారమైనటువంటి గుణ సంపత్తి కలిగినటువంటివాడు అన్నగారంటే భక్తి కలిగినటువంటివాడు లక్ష్మణుడని పేరు కలిగినటువంటివాడు విపరీతమైన కోపమున్నవాడు, ముక్కు చెవులు కోసేశాడు కదాండీ అందుకని, ఒకరిని జయించడమే తప్ప తాను జయింపబడడమన్నది తెలియనటువంటివాడు గొప్ప పరాక్రమున్నవాడు చాలా బుద్ధిబలమున్నవాడు రామ చంద్ర మూర్తి యొక్క కుడి భుజం వంటివాడు బయట తిరిగేటటువంటి రాముని యొక్క ప్రాణంవంటివాడు లక్ష్మణుడన్నవాడు ఒకడు ఉన్నాడు, రాముడు ఎంతటివాడో ఇంచుమించు అంతటివాడు.
ఇప్పుడు ఆయన భయానికి ఇదొక కారణం కానీ ఆవిడ పగ ఎటుతిరిగిందో చూడండి... రాముడు తనని భార్యగా అంగీకరించకపోవడానికి కారణం సీతమ్మ ఉండడమే... ఇప్పుడు సీతమ్మయందు అనురక్తి రావణునికి కలగాలి ఆ సీతమ్మని అపహరించాలి అపహరించి రావణుడు తీసుకొస్తే సీతమ్మ బాధపడాలి, రాముడు రక్షించలేని స్థితి కల్పించాలంటే రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలి, రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలంటే రాముడి ముందు మనం నిలబడీ లేనిపోనీ ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకన్న భావన రావణునియందు కలగాలి సీతమ్మని అపహరించి తెచ్చెయ్యాలి భార్య లేక రాముడు ఏడవాలి ఆ భార్య రామ భార్య అయ్యుండి కూడా రావణుడు చేసేటటువంటి ఉద్ధతితో కూడినటువంటి క్రియల వలన ఆమే ఏడవాలి తనో ఆమె ఉండడంవల్ల రామున్ని పొందలేకపోయింది కాబట్టి రాముని భార్యయైనందుకు రామున్ని పొందలేకా పరపురుషుడు ఆమెను పొందడానికి ప్రయత్నిస్తుంటే ఆవిడ ఏడవాలి ఆవిడ ఏడుపు చూసి తాను ఆనందించాలి.
Image result for రాముడు ఋషులఅంటే ఆ పగకి ఇంక హద్దులేదూ ఇంగ్లీషులో శాడిష్ట్ అని ఒకమాట వాడుతుంటారు మీరు పగ అనేటటువంటిదానిని అదుపు చేయకపోతే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది, దానికింక హద్దూ ఆపూ ఏమీ ఉండవు ఎక్కడికైనా వెళ్ళుతుంది. శూర్పణఖా ఈ ప్రణాళికను అమలు చేయడానికి నిశ్చయించుకుంది కాబట్టి ఇప్పటి వరకు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది ఇప్పుడు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది, రావణుని యొక్క మనసు సీతమ్మయందు లగ్నంకావాలి అందుకని అందీ రామ స్య తు విశాలాక్షీ పూర్ణేందు సదృశాఽఽననా ! ధర్మ పత్నీ ప్రియా భర్తుః నిత్యం ప్రియ హితే రతా !! రామ చంద్ర మూర్తి యొక్క భార్య విశాలాక్షీ పెద్ద కన్నులు కలిగినది పూర్ణేందు సదృశాఽఽననా పౌర్ణమినాటి చంద్ర బింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినది, ఖచ్చితంగా పరుల భార్యయలయందు మనసు పెట్టుకునే అలవాటు ఉన్న రావణుడికి ఈ మాటలు చాలు. ఇప్పుడు సీతని అపహరించాలి అన్నకోర్కె బలపడడానికి రెండోపాదం వేసింది, ధర్మ పత్నీ ప్రియా భర్తుః ఆమె ధర్మపత్ని రామునికి ఆవిడ పక్కన లేకపోతే రాముడు విలవిలలాడిపోతాడు ఎందుచేతనంటే రాముడు ఆమే అంటే అంతప్రీతి నిత్యం ప్రియ హితే రతా ఆమె రామున్ని కూడా అలా అనువర్తిస్తుంది, కాబట్టి ఇప్పుడు రెండు ప్రయోజనాలు రావణుని దృష్టిలోకి వెళ్తాయి సీతని అపహరిస్తే నేను పదిమాట్లు నా నోటితో అనడం కష్టం, ఆమె తనదౌతుందన్న కోరిక రెండు ఆమె లేక రాముడు చాలా క్షోభపడిపోతాడు తను ఎదురుగుండా నిలబడి యుద్ధంచేసి బాధపెట్టలేకపోయినా ఏక కాలమునందు అందగత్తెయైన సీతను తాను తెచ్చుకోవడం తనకు శత్రువైనటువంటి రామ చంద్ర మూర్తికి మనఃస్థిమితం లేకుండాచేసి ఆయనా నీరస పడిపోయేటట్టుగా చెయ్యగలగడం.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
అంత ప్రియమైన భార్య కనపడకపోతే నా భార్య రాక్షసుడిచేత అపహరించబడితే ఆయనకి వెంటనే అశాంతి కలుగుతుందికదా! అశాంతి చేత ఏమౌతుంది చెయ్యవలసినటువంటి ధర్మబద్ధమైన అనుష్టానము నశించిపోతుంది, అనుష్టానము నశిస్తే తేజస్సు నశిస్తుంది తేజస్సు నశిస్తే తాను అవతలవాడిని పడగొట్టడానికి అవకాశం కలుగుతుంది, కాబట్టి ఇప్పుడు రావణుడి మనస్సులో తీసుకునేటటువంటి నిర్ణయం ఎటువంటిదైవుండాలో అటువంటి నిర్ణయం రావణుడి నోటివెంట పైకి వచ్చేటట్టు  శూర్పణఖ వృత్తాంతాన్ని మార్చి అక్కడ ప్రకటిస్తోంది రావణుడి దగ్గర అంటే తన పగకి అనుగుణంగా అవతలవాన్ని పనిముట్టుగా వాడుకోవడానికి ఎంత బాగా మాట్లాడగలదో శూర్పణఖని మీరు గమనించవచ్చు. ఇది బాగా అన్నమాట పనికొచ్చే బాగా పనికిరాని బాగా అన్నది కూడా మీరు చూసుకోవలసి ఉంటుంది మాట విషయంలో కాబట్టి సా సుకేశీ సు నాసోరూ స్సురూపా చ యశస్వినీ ! దేవ తేవ వన స్యాస్య రాజతే శ్రీ రివాపరా !! ఆమె చాలా అందగత్తె చాలా విశేషమైనటువంటి నల్లని కురులు కలిగినటువంటిది అందమైనటువంటి రూపమున్నది కీర్తి కలిగినటువంటిది ఆమె వనములో తిరుగుతుంటే వనదేవతా అన్నట్లుగా అనిపిస్తుంది సాక్ష్యాత్ శ్రీ మహా లక్ష్మలా ఉంటుంది తప్త కాంచన వర్ణాభా రక్త తుంగ నఖీ శుభా ! సీతా నామ వరారోహా వైదేహీ తను మధ్యమా !! కాల్చిన బంగారు కాంతితో ఉంటుంది తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టా”మ్ అన్నట్టూ రక్త తుంగ నఖీ శుభా ఎర్రని ఎత్తుకలిగినటువంటి ఎత్తైన గోళ్ళుతో ఉంటుంది సీతా నామ వరారోహా వైదేహీ తను మధ్యమా సన్నని నడుము కలిగినటువంటి విదేహరాజ పుత్రియైనటువంటి ఆమె పేరు అందమైన ముఖమున్న ఆ తల్లి పేరు సీత.
Image result for రాముడు ఋషులనైవ దేవీ న గన్ధర్వీ న యక్షీ న చ కిన్నరీ ! తథా రూపా మయా నారీ దృష్ట పూర్వా మహీ తలే !! అటువంటి అందగత్తెని నేను ఇంతకు పూర్వం గంధర్వులలోకాని యక్షులలోకాని కిన్నెరులలోకాని ఎక్కడా భూలోకంలో ఉన్నటువంటి నరకాంతలనుకాని నేను చూసి ఎరగను, ఈ మాట అన్నతరువాత రావణబుద్ధి ఇంకోలా ఉండే అవకాశం ఉండి ఉంటుందా..? అంటే ఇంత స్తోత్రం దేనికంటే సీతమ్మతల్లి మీద ఉన్న ప్రేమతో కాదు, సీతమ్మతల్లిని ఖేద పెట్టడానికి ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగడుతూంది ఇంతవరకూ ఏమంది కరాళా అసతీ అంది, ఇప్పుడూ ఆవిడ అందాన్ని పొగడుతుంది అంటే తనకు ఎప్పుడు అనుకూలమో అప్పుడు తను మాట్లాడుతుంది య స్య సీతా భవేత్ భార్యా యం చ హృష్టా పరిష్వజేత్ ! అతి జీవేత్ స సర్వేషు లోకేష్వపి పురందరాత్ !! సీతమ్మ ఎవరిని ప్రియమార కౌగలించుకుంటుందో వాడు ఇంద్రుడికన్నా గొప్పవాడు అటువంటివాడు అటువంటి పురుషుడు ఎంత అదృష్టవంతుడో ఊహించడానికి శక్యం కాదు.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
అంటే ఈయన మనసుని ఆవిడవైపుకు ప్రవేశపెడుతుంది సా సుశీలా వపు శ్శ్లాఘ్యా రూపైణాప్రతిమా భువి ! తవాను రూపా భార్యా సా త్వం చ తస్యా స్తథా పతిః !! ఆమె చక్కని శీలవతి సౌందర్యము కలిగినది ఆమె రూపము సాటిలేనిది నీకు భార్య కాదగినది ఆమెకు నీవే భర్త కాదగినవాడవు. ఇదీ ఇంతకన్నా అర్థరహితమైన మాట ఇంకోటి ఉంటుందాండీ! ఆవిడ వివాహిత ఆవిడకి భర్త ఉన్నాడు ఆమెకు నీవే భర్త కాదగినవాడివి అన్నదంటే అసలు నీ పక్కన కూర్చోవలసినావిడని రామ చంద్ర మూర్తి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు ఇది అతని అసూయకి ఇంకొక కారణము. ఇంకొంచెం ఆజ్యం పోసి వెళ్ళి ఓడించి తీసుకురాలేడు చేతకాని తనం కూడా తొందరపడి రాముడు ఇబ్బంది పెడుతాడేమోనని ఆవిడకి అనుమానం ఉంది ఎందుకంటే పద్నాలు మంది 14 వేల మంది చనిపోవడం చూసింది, గబ్బుక్కున రావణుడు ఏమైనా అయిపోతే..? ఆవిడ పగ తీరేదెలాగా ఇంకా... పగ తీరాలంటే ఇప్పుడు ఆవిడ ఇక ప్రణాళిక మార్చింది, రాముడి మీదకి యుద్ధానికి పంపితే ఇక నా పగతీరదు ఆవిడకి అనుమానం వచ్చింది రాముడి చేతిలో నిలబడ్డం కష్టమని.
కాబట్టి సీతమ్మని అపహరిస్తేపోతుంది కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా అలా జరిగేటట్టుగా మాట్లాడుతుంది కురు ప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర ! వధాత్తస్య నృశంస స్య రామ స్యాఽఽశ్రమ వాసినః !! నీవు సీతాపహరణం చేసి రాక్షసులందరికీ కూడా ఉపకారం చెయ్యాలి ఎందుకని అంటే చనిపోయినటువంటి రాక్షసులందరు కూడా శాంతి పొందాలీ అంటే రాముడు అశాంతి పొందేటట్టు చెయ్యాలి, రాముడు అశాంతి పొందాలీ అంటే రాముని యొక్క ప్రియభార్యయైనటువంటి సీతని నీవు అపహరించాలి, ఈ మాటలు చెప్పిన తరువాత మంత్రులెంత గొప్పవాళ్ళో ఆయన మంత్రులందరితోటి ఒకసారి సమావేశం పెట్టాడట, పెట్టి ఆవిడా ఒక చాలా చమత్కారమైనటువంటి మాట ఒకటి చెప్పింది, అసలు ఆ సీతని నీకు భార్యని చేద్దామనే తీసుకువద్దామనే ప్రయత్నం చేశాను ఆ లక్ష్మణుడున్నాడే..? నేను సీతమ్మని నీకు భార్యను చేద్దాం నీకు తగిందికదాని రాముడికి ఎందుకని తీసుకొస్తుంటే నా ముక్కు చెవులు కోసేశాడు అదా యదార్థం..? కాదు అంటే... తన ముక్కు చెవులు కొయ్యడమన్న విషయాన్ని రావణుడు అడిగేంతవరకు దాచినా దాగనిదాన్ని ప్రస్తావించకుండా అడిగిన తరువాత సానుభూతి రావణుడికి కలిగేటట్టుగా ఆ జరిగిన కథని తిప్పింది.
Image result for ramayanaచూశావా పాపం ఎంత ప్రీతో మా చెల్లెలకీ... ఎంత ప్రీతో అనుకోవడానికి కారణం ఒకటుందండీ ఎందుకంటే శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు అనేటాయన్ని శత్రుసైన్యం అనుకుని గబ్బుక్కున రావణాసురుడు చంపేశాడు ఆవిడ భర్తని, ఆవిడకి లోటేముంది చూశాంగా ఎవడైనా అందంగా కనపడితే నాతో బోగించు అంటుంది, కాబట్టీ నేను ఈవిడ భర్తను చంపేసినా ఈవిడ మాత్రం నాకు అనురూపవతియైనటువంటి భార్యని తీసుకురావడానికి పయత్నిస్తూ పాపం ముక్కూ చెవులూ కూడా కోయించుకోయింది అన్న సానుభూతి తనయందు కలిగితే తను చెప్పిన మాటలలో ఉన్నటువంటి డొల్లతనమేమైనా ఉంటే ఇంక దాని వైపుకు రావణ దృష్టి వెళ్ళకూడదు, పైగా ఆయన దృష్టి ఇంక ఎక్కడికీ ఎందుకు వెళ్ళదంటే ఆయన దృష్టి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఓ ఆడది అందంగా ఉందని చెప్తేచాలు అటుపోతుంది ఆయన దృష్టి అంత ధర్మాత్ముడు అంత గొప్ప మనసున్నవాడు చలితమైనటువంటి మనసున్నవాడు కదిలిపోతుంది ఆ  మనసు తొందరగా కాబట్టి అటువంటి వాడు కాబట్టి ఆమె ఇటువంటి బోధ చేసింది.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు ఆయన మంత్రులతో మాట్లాడాడు ఒక్కడూ కూడా ఆలోచనాపరుడులేడు ఎటువంటి ఉపాయమును నేను తీసుకోవలసి ఉంటుంది, ఆయన దృష్టికి బాగా తోచినటువంటి ఉపాయము ఏమిటంటే..? నేను సైన్యంతో వెళ్ళి రాముడితో లక్ష్మణుడితో యుద్ధం చేయడం కన్నా రామ లక్ష్మణులని దూరం చేసేసి సీతమ్మని అపహరించడమే మంచిది. ఈ నిర్ణయానికి రావడానికి కారణం నేను ఆకోణంలో ముందునుంచీ చెప్పుకొస్తున్నాను శూర్పణఖ యొక్క ప్రసంగము తాత్పర్యమది అలా రావణుడు చెయ్యాలన్నదే ఆవిడ కోరిక కాబట్టి ఇప్పుడు రావణుడు వెళ్ళడం వల్లా శూర్పణఖ యొక్క ప్రతిజ్ఞా శూర్పణఖ యొక్క మనస్సు నిర్ణయం అది కాంచనం రథమ్ ఆస్థాయ కామగం రత్నభూషితమ్ ! పిశాచ వదనై ర్యుక్తం ఖరైః కనక భూషణైః !! మేఘ ప్రతిమ నాదేన స తేన ధనదానుజః ! రాక్షసాధిపతిః శ్రీమాన్ యయౌ నద నదీ పతిమ్ !! ఆయన వెంటనే వాహన శాలలోకి వెళ్ళాడు అక్కడ ఉండేటటువంటి ఆ సారథిని పిలిచి నాకు ఒక ఉత్తమైన రథాన్ని కూర్చు అన్నాడు. అగ్నిహోత్రపు తేజస్సు ఎలా ఉంటుందో చంద్ర మండల సన్నిభవపు గొడుగు ఎలా ఉంటుందో అటువంటి గొడుగుతో ఉండి అలంకరింపబడి రత్నములు పొదగబడిన ఒక రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, దానికి గాడిదలు కట్టబడి ఉన్నాయి ఆ గాడిదలు ముఖాలు మళ్ళీ పిశాచపు ముఖాలతో ఉన్నాయట అటువంటి రథాన్ని అధిరోహించాడు.
నదీ నదముల యొక్క భర్తను చూస్తూ వెళ్తున్నాడట, నదీ నదముల భర్తా అంటే సముద్రుడు. నదీ తూర్పు ముఖంగా ప్రవహిస్తుంది, నదము పశ్చిమ ముఖంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ సముద్రాన్ని చూస్తూ ఆ రథం మీద వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ ఆ కింద ఉన్నటువంటి ఆశ్రమాల్ని వాటి అన్నిటిని చూస్తూన్నాడు ఆయన అలా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళుతున్నప్పుడు అందులో కింద చూడవలసిన ఆశ్రమాలు వనాలు మృగాలు మొదలైనవి కనపడుతూంటాయి సంతోషిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు. మహర్షి అక్కడ ప్రతిపాదించి చూడదగినదిగా చెప్పబడిన చాలా గొప్ప విషయం ఒకటి ఉంది అది ఒకానొకప్పుడు గరుత్మంతుడు గజకచ్ఛపములు అని ఒక ఏనుగు ఒక తాబేలు అవి నిరంతరము పోరాటము చేసుకునేవి మహాభారతములో దానిగురించి విశేషంగా ప్రస్తావన ఉంది. ఆ గజకచ్ఛపములను తినేయమన్నారు గరుత్మంతుని ఆకలి తీరాలంటే ఈయన వెళ్ళి వారిని రెండింటినీ కూడా తన కాళ్ళతో పట్టుకొచ్చి ఒక పెద్ద చెట్టు నూరుయోజనములు వరకు పెరిగిన శాఖలు కలిగినటువంటి మఱ్ఱిచెట్టు కొమ్మమీద పెట్టుకున్నాడు, పెట్టుకుంటే ఆ కొమ్మ ఫెళఫెళమని ఇరిగిపోయింది వాళ్ళ బరువుకి ఆ కింద మునులు తపస్సు చేసుకుంటున్నారు ఆకొమ్మ వాళ్ళమీద పడిపోతుందేమోనని ఆయన ఏం చేశారంటే ఒక కాలితో గజకచ్ఛపాలను పట్టుకుని ఒక కాలితో ఈ కొమ్మని పట్టుకుని సముద్రం మీద ఎగిరిపోయాడు అలా ఎగిరిపోతూ ఆయన ఆ గజకచ్ఛపాలను తినేశాడు ఏనుగునీ తాబేలుని తినేసి  ఇప్పుడు ఈ కొమ్మతో ఆయన ఒక పని చేశాడట ఒక కిరాత గ్రామంలో మునులను వేధించేటటువంటువాళ్ళు కొంతమంది ఉన్నారట ప్రహర్షమ్ అతులం లేభే మోక్షయిత్వా మహా మునీన్ వాళ్ళనీ ఆ చెట్టు కొమ్మతో బాధి సంహరించి ఈ మునులను కాపాడాట.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
Image result for తిమ్మమ్మ మర్రిమానుఆ చెట్టు ఎక్కడుందో ఆ చెట్టు కొమ్మ విరిగిపోగా మిగిలినటువంటి చెట్టు నూరు యోజనములు విస్తీర్ణము కలిగినటువంటి ఒక పెద్ద మఱ్ఱిచెట్టు దాని కిందా మునిగణములన్నీ కూడా కూర్చుని తపస్సు చేస్తుంటారు. ఆంద్ర దేశంలో ఇలాంటి చెట్టొకటి కర్నూలు జిల్లాలో అనుకుంటా చాలా పెద్దది ఉందీ అనీ ఆ చెట్టును చూడ్డానికి వెల్తుంటారు నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాంపతయే నమః అని కదా చాలా కొన్ని కిలోమీటర్ల వరకు దానికి కొమ్మలు వ్యాపించి ఉంటాయీ అని అంటారు. అటువంటి వృక్షరాజములు ఇప్పుడే ఉన్నాయీ అంటే అకాలంలో ఇంకా పెద్దవి ఉండేవి అన్నమాట తం మహర్షి గణై ర్జుష్టం సుపర్ణ కృత లక్షణమ్ ! నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజః !! సుభద్రం అనేటటువంటి పేరుకలిగిన ఆ మఱ్ఱి చెట్టుని ఈ రావణాసురుడు చూశాడు అంత పెద్ద మఱ్ఱిచెట్టుని ఆయన మెల్లగా ఆ ఉత్తర తీర ప్రాంతం  సముద్రం దగ్గరికి వెళ్ళిన తరువాత మారీచుని యొక్క ఆశ్రమాన్ని చూశాడు, అంటే అక్కడ తన కార్యమును సాధించుకోవడానికి ఇప్పుడు ఏమిటి నిర్ణయానికి వచ్చాడు రామ లక్ష్మణులను దూరంచేసి సీతమ్మను అపహరించాలి, కాబట్టి ఇప్పుడు రామ లక్ష్మణులను దూరం చెయ్యడమూ అంటే అది అంత తేలికైన విషయం కాదు సీతమ్మ దగ్గర ఎప్పుడూ రాముడో లక్ష్మణుడో ఉంటారు, రామ లక్ష్మణులు ఇద్దరూ వెళ్ళిపోవాలంటే అంటే చాలా పెద్ద ప్రణాళికే వెయ్యాలి లేకుంటే సామాన్యమైన విషయమేం కాదు అది కాబట్టి అంత గొప్ప ప్రణాళికను అమలు చెయ్యడంలో రావణాసురిడికి సహకరించ గలిగినటువంటి సమర్థత కలిగినటువంటి మిత్రున్ని వెత్తుక్కోవాలి, కాబట్టి ఇప్పుడు ఆయన మారీచుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు.
Image result for రావణుడు మారీచుడువెళ్ళి ఆ మారీచుడి దగ్గరికి వెళ్ళి ఒకమాట చెప్తున్నాడు 14 వేల మంది ఖర-దూషనాదులను నేను జనస్థానములో ఉంచాను నీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తుంటారు ఏదో పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూంటారు, ఏమిటి వాళ్ళపని బాధమానా మహారణ్యే మునీన్ వై ధర్మ చారిణః ధర్మమును అనుష్టించేటటువంటి మునులను బాధిస్తుంటారు కాబట్టి వాళ్ళపని వాళ్ళు చేసుకుంటున్నారు కాని నానా ప్రహరణోపేతాః ఖర ప్రముఖ రాక్షసాః ! తేన సాంత రోషేణ రామేణ రణ మూర్థని ! అనుక్త్వా పరుషం కించి చ్ఛరైః వ్యాపారితం ధనుః !! అటువంటి ఖర దూషనాదులను వాళ్ళ పని వాళ్ళు చేసుకొంటున్నవాళ్ళని మునులను బాధపెడుతున్నవాళ్ళనీ రాముడు ఒక్క మాట వ్యగ్రతతో ఏమీ అనకుండా యుద్ధానికి వెళ్ళిన 14 వేల మందిని చంపేశాడు ధనస్సు బాణాలను సంధించి అంత కోపమా అదా ప్రవర్తించవలసిన పని అంటూ పిత్రా నిరస్తః క్రుద్ధేన స భార్యః క్షీణ జీవితః ! స హన్తా తస్య సైన్య స్య రామః క్షత్రియ పాంసనః !! తండ్రి చేత వెళ్ళగొట్టబడ్డాడు ఆ రాముడు ఇంత దురాత్ముడు కాబట్టే క్రుద్ధేన విపరీతమైన కోపమున్నవాడు స భార్యః  భార్యతో ఉన్నవాడు క్షీణ జీవితః ఇలాంటి వాడు కాబట్టే వాళ్ళ జోలికి వెళ్ళాడు కాబట్టే అయిపోయింది ఇంక ఆయన జీవితం స హన్తా తస్య సైన్య స్య రామః క్షత్రియ పాంసనః క్షత్రియులలో అధముడైనటువంటి రాముడు 14 వేల మంది ఖర-దూషనాదులను సంహరించాడు దుశ్శీలః కర్కశ స్తీక్ష్ణో మూర్ఖో లుబ్ధో అజితేన్ద్రియః ! త్యక్త ధర్మస్తు అధర్మాత్మా భూతానామ్ అహితే రతః !! ఆయనకి అంతే అర్థమయ్యాడు రాముడు అసలు ఆయన దగ్గరకి రావణుడు వెళ్ళిందిలేదు రాముడి గురించి ఆయన తెలుసుకున్నది లేదు.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
కానీ ఎన్ని కితాబులిచ్చేస్తున్నాడో చూడండి దుశ్శీలః  మంచి శీలము లేనివాడు కర్కశ చాలా తీవ్రమైనటువంటి స్వభావమున్నవాడు మూర్ఖో అన్నిటినీ కోరుకునేటటువంటివాడు ఇంద్రియములను గెలవలేకపోయినవాడు ధర్మమును విడిచిపెట్టినవాడు అధర్మాన్ని అనుష్టించేవాడు సమస్తభూతములకు కూడా అపకారం చేసేవాడు అటువంటి రాముడు కాబట్టి అటువంటి రామున్ని నేను సంహరించాలి యేన వైరం వినారణ్యే సత్త్వమ్ ఆశ్రిత్య కేవలమ్ ! కర్ణ నాసాపహారేణ భగినీ మే విరూపితా !! అసలు ఏ కారణం లేకుండా ఆవిడ చేసింది- నాకోసం సీతమ్మని ఎత్తుకొచ్చేద్దామనుకుందటా... అంటే మళ్ళీ మారీచుడు అలాంటిపనులు ఏమిటయ్యా అంటాడేమోనని ఆవిడే ఓ అబద్ధం ఈయనా ఆ అబద్ధాన్ని ఇంకోపెద్ద అబద్ధం చేస్తున్నాడు ఈయన అంటున్నాడు అసలు యేన వైరం వినారణ్యే అరణ్యంలో అసలు ఈ శూర్పణఖకి రామునికి వైరమేలేదు పాపం ఆవిడ మానాన ఆవిడ వెళ్ళిపోతుంది చూశాడంతే రాముడు గబగబా వచ్చి ముక్కు చెవులు కోసేశాడు అంతే..? ఎందుకు కోసేశాడు తెలిదు? విరూపని చేశాడు నా చెల్లెల్లని. కాబట్టి తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సుర సుతోపమామ్ ! ఆనయిష్యామి విక్రమ్య సహాయః తత్ర మే భవ !! కాబట్టి నేను ఇప్పుడు జనస్థానంలో ఉన్నటువంటి రాముని భార్యయైన సీతమ్మని అపహరించి తేవాలీ అనుకున్నాను, సీతమ్మని అపహరించడము ఎందుకు అని అనుకుంటున్నావా..? సీతని అపహరించి తీసుకొస్తే ఆయన ప్రియ భార్య కనుక రాముడు శుష్కించిపోతాడు శుష్కించిపోయిన రాముని మీద నేను ప్రతీకారం తీర్చుకోవడం తేలికవుతుంది. అంటే In other words అంటారు చూశారా అలా... ఒక మాటగా చెప్పాలీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితితుల్లో నేను రామున్ని ఎదుర్కోలేను తన పిరికితనాన్ని కూడా బయటపెట్టుకున్నాడనే చెప్పవచ్చు.
Related imageకాబట్టి నీవు ఏం చెయ్యాలి, నీవు తప్ప నాకు ఉపకారం చెయ్యగలిగినటువంటి మిత్రుడు కనపడ్డంలేదు సౌవర్ణ స్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిన్దుభిః ! ఆశ్రమే తస్య రామ స్య సీతాయాః ప్రముఖే చర !! త్వాం తు నిస్సంశయం సీతా దృష్ట్వా తు మృగ రూపిణమ్ ! గృహ్యతామ్ ఇతి భర్తారం లక్ష్మణం చాభిధాస్యతి !! నీవు బంగారు చుక్కలు కలిగినటువంటి ఒక జింక వేషంలో అక్కడ తిరగాలి అపురూపమైనటువంటి నీ రూపాన్ని చూసి ఆశ్రమంలో విహరిస్తున్నటువంటి నీ రూపాన్ని చూసి ఆకర్షితురాలైన సీత నీవు కావాలీ అని కోరుకుంటుంది నిన్ను వేటాడ్డం కోసం రాముడు దూరంగా వెళుతాడు, రాముడు దూరంగా వెళ్ళినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని ఇంకా ఇక్కడ చెప్పలేదు మారీచుడు ఏమనాలో అప్పుడు నేను సీతను అపహరించ గలుగుతాను అపహరించి నేను సీతను తీసుకొస్తాను త్వాం తు నిస్సంశయం సీతా దృష్ట్వా తు మృగ రూపిణమ్ ! గృహ్యతామ్ ఇతి భర్తారం లక్ష్మణం చాభిధాస్యతి !! అలా నేను సీతమ్మని అపహరించేటప్పుడు నిరాబాధో హరిష్యామి రాహు శ్చన్ద్ర ప్రభామ్ ఇవ !! నేను ఏమీ ఇబ్బంది లేకుండా సీతమ్మను అపహరించి సీతమ్మను తీసుకొస్తాను, ఎందుకంటే ఇబ్బందిలేకుండా అంటే రామ లక్ష్మణులు అక్కడ ఉండరు కాబట్టి అది ఎలా తీసుకొస్తానని నోటివెంట పడిపోయిందంటే మాట రాహువు చంద్రున్ని కభలించినట్లు, చంద్ర గ్రహణంలో రాహువు చంద్రున్ని కభళిస్తాడు కాని చంద్ర గ్రహణం ఉంటుందా..? చంద్రుడు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు రాహువు పోతాడు రాహువు ఎప్పుడు పాపగ్రహం కిందేకదా..!

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టీ సీతమ్మని నేను తీసుకెళ్ళినా మళ్ళీ సీతమ్మ రామున్ని చేరిపోతుందీ అన్న మాట రావణుని నోటివెంట చెప్పకనే చెప్పేశాడు ఆరోజు, కాబట్టి రాహువు చంద్రున్ని గ్రసించినట్లు నేను గ్రసిస్తాను అన్నాడు. అంటే ఈ మాట విన్నాడట మారీచుడు తస్య రామ కథాం శ్రుత్వా మారీచ స్య మహాత్మనః ! శుష్కం సమభవ ద్వక్త్రం పరిత్రస్తో బభూవ హ !! ఇక్కడ మహర్షీ చాలా అందమైన మాట ఒకటి ప్రయోగంచేశాడు తస్య రామ కథాం శ్రుత్వా రాముడి గురించి ఈ రావణుడు చెప్పినటువంటి మాటలు విన్నారట ఎవరు? మారీచ స్య మహాత్మనః మహాత్ముడైనటువంటి మారీచుడు విన్నాడు. ఆయన రాక్షసుడు అని కాని లేకపోతే అల్పమైన బుద్ధున్నవాడనికాని మహర్షి అనలేదు, అనలేదూ అంటే మారీచుడు మహాత్ముడూ అని మహర్షి అంతటివారు సంభోదించారూ అంటే మారీచుని యొక్క ప్రసంగము మారీచుని యొక్క హృదయమూ మారీచుని యొక్క స్థితీ ఎలా ఉంటాయో మీరు ఊహించవచ్చు.
Image result for king ravana with marichaగతంలో అయితే రామునికి అపకారం చెయ్యబోయినవాడు విశ్వామిత్రునికి అపకారం చెయ్యబోయినవాడు యజ్ఞ ధ్వశమునకు పాల్పడినవాడు అధర్మమునందు ప్రవర్తించినవాడు అయివుండి ఉండవచ్చుగాక, కాని ఇప్పుడున్న మారీచుని పరిస్థితివేరు కాబట్టి మారీచ స్య మహాత్మనః, కాబట్టి ఇప్పుడు మారీచుడు రామునికి అపకారం చెయ్యాలన్నమాట వినగానే ఓష్ఠా పరి లిహన్ శుష్కౌ నేత్రైః అనిమిషై రివ ! మృత భూత ఇవాఽఽర్తస్తు రావణం సముదైక్షత !! పెదవులు ఎండిపోయి గబగబా నాలుకతో పెదవులతో నాక్కున్నాడట. అసలు ఆ మాట వినగానే ఆయనకు పెదవులు ఎండిపోయాయి నోటమాట రాలేదు, ముఖం పాలిపోయింది శుష్కించిపోయింది, రావణుడివెంట కనురెప్పవేయకుండా స్తంభీబూతుడైపోయినవాడిలా ఒక్కసారి ఉండిపోయాడట, రాముడికి అపకారమా..? సీతాపహరణమా..? అంటే రాముడు ఎవరో అర్థమయ్యింటుంది మారీచుడికి. కాబట్టి ప్రారంభమేనండి అసలు అద్భుతంగా మాట్లాడాడు ఎందుకంటే రాముడంటే ఎవరో అర్థమయ్యింది, రాముడంటే ఎవరో చెప్పితే కూడా అర్థమవదు రావణాసురిడికి ఇందులో ప్రమాదమొకటి చూపిస్తున్నారు మహర్షి తనకి తెలియకపోవడం ఎప్పుడూ తప్పుకాదు ఎందుకంటే మీరొకటి గమనించండి ఎవ్వరూ ఎప్పుడూ అన్నితెలుసున్నవాడు ఎన్నటికీ ఉండడు, అలా ఎవరైనా అనుకుంటే వాడికన్నా అవివేకి లోకంలో లేడు.
ఎందుకంటే శంకరాచార్యులంతటివారు పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృతయా పాలయవిభో అన్నారు, ఇక నాకు అన్నీ తెలుసు అని ఎవడైనా అంటే ఇంకా వాడికన్నా అవివేకి ఇంకోడులేడని గుర్తు, అన్నీనాకు తెలుసని అనగానే వాడి అహంకారం బయటపడిపోయింది, నాకేం తెలుసండీ అని చెప్పి మత్ విశిష్టాహ్ చ తుల్యాహ్ చ సంతి తత్ర వన ఒకసహ్ ! మత్తహ్ ప్రత్యవరహ్ కశ్చిన్ న అస్తి సుగ్రీవ సన్నిధౌ !! అన్నవాడెవడో వాడు గొప్పవాడు మహానుభావుడు వాడు వినయమున్నవాడు తప్పా అలా అనలేక అన్నీనాకు తెలుసంటే ప్రమాదం కదాండీ! తెలియకపోవడం ఎప్పుడూ తప్పుకాదు, తెలియకపోవడం తప్పుకాదు కానీ తెలియజెప్తే వినకపోవడం మాత్రం మాహాతప్పు. తనకు తెలియదు ఒకరు చెప్పారు ఏం చెయ్యాలి వినాలి అసలు వినకపోతే ఇక వాడు బాగుపడడు అని గుర్తు, కాబట్టి తన బుద్ధికి తోచిందే చేస్తాడు కాబట్టి ఆ బుద్దిలోనికి ప్రమాదపు ఆలోచన ఎప్పుడొస్తుందో అప్పుడు పడిపోతాడు, ఆ ఆలోచన ఎంతకాలంరాదో అంతకాలం ఓ వెలుగు వెలుగుతాడు.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
ఇది ఈ రెండు కోణాలు తెలుసున్నవాడు మారీచుడు ఒకడు మహాత్ముడు, మహాత్ముడు మహాత్ముడిగా మారీచుడికి అర్థమయ్యాడు, ఒకడు దురాత్ముడు దురాత్ముడు దురాత్ముడిగా అర్థమయ్యాడు, దురాత్ముడూ అని ఇప్పుడు విడిచిపెట్టడానికి మారీచుడు సిద్ధంగాలేడు, ఎందుకు సిద్ధంగాలేడు అంటే ఆయనలో ఇంకా ఒక ప్రభుభక్తీ అన్నది ఉండిపోయింది కాబట్టి కనీసం ఒకమాట చెప్పిచూద్దాం అని మారుతాడేమో..? కానీ వీడికి చెప్పినా మారుతాడన్న నమ్మకం మాత్రంలేదు, కాబట్టి ఆయన ప్రారంభమే ఎలా చేశాడంటే... ఇదండీ... ఈ పద్యం ఈ శ్లోకమేదైతే ఉందో శ్లోకాన్ని మన జీవితంలో మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒకరిమాటి వినడానికి సిద్ధంగా లేకపోతే ఎంతటి ప్రమాదపుటంచుకు చేరుతామో..? మారీచుడి యొక్క ఉపన్యాసంలో మొదటి శ్లోకంతోనే అంత గంభీరంగా ప్రారంభమౌతుంది సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః ! అప్రియ స్య చ పథ్య స్య వక్తా శ్రోతా చ దుర్లభః !! సులభాః పురుషా రాజన్ ఓ రాజా! నీ మనసుకు ఏది ప్రియమో ఏది చెప్తే నీవు సంతోషిస్తావో అది నీకు చెప్పేవాడు లోకంలో ఎక్కడికివెళ్ళినా దొరుకుతాడు, నీ మనసుకు నచ్చదని తెలిసికూడా నీ హితమును కోరి చెప్పేవాడు ఉండడు ఒకవేళ అలా చెప్పేవాడు ఉన్నా వినేవాడు ఉండడు. ఎంత పెద్దమాటండీ..! నిజమే మనకెందుకొచ్చిందండీ ఆయనతో గొడవా అంటూంటారు చూడండీ..? అంటే లోకంలో ఓమాట ఉంటుంది ఛ్... మనకెందుకొచ్చిందంటారు అంటారు.
ఎవరికర్మవాడిది పోని దురద మనకు తెలియనట్లు ఉంటే పోయే... తప్పు తప్పండదీ పాడైపోకుండా ఆయనకు మంచిమాట చెప్పాలి మనం అనేవాడు ఉండడు, ఒకవేళ ఆయన అలా అని తప్పు అబ్బాయి నీవు అలా ఉండకూడదు నీవు మారవలసి ఉంటుంది సుమా! అని అన్నారనుకోండి వినేవాడు ఉండడు అంటే సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః ! అప్రియ స్య చ పథ్య స్య వక్తా శ్రోతా చ దుర్లభః !! అటువంటి వక్తా అటువంటి శ్రోతా లోకంలో లేరు అవతలపో అన్నారాయన, ఒకవేళ ఉంటే..? అద్భుతమది మారిపోతారు అంతే... రావలసినటువంటి అకాల మృత్యువు తొలగిపోతుంది, అవ్వవలసిన రాక్షసుడు సత్పురుషుడు అయిపోతాడు, మారుతాడు మారే అవకాశం ఉందన్నమాట అసలు నేను విననంటే..? అన్నీ విన్నా ఆఁ.. చెప్పొచ్చావులేవోయ్... అని అన్నాడనుకోండి ఇంకెందుకు పనికొచ్చినట్లు.
Image result for మారీచుడుఇదీ మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నాడు, ఈ శ్లోకం నేను ఇంక ఎంత నెత్తికొట్టుక చెప్పాలో నాకు అర్థం కాదు కానీ ఈ శ్లోకం జీర్ణమైతే... మన పరిస్థితివేరు ఈ శ్లోకం జీర్ణం కాకపోతే నా దృష్టిలోనైతే రామాయణంలో ఉన్న అత్యద్భుతమైన శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి ఎందుకో తెలుసా మనుష్యడన్నవాడు పాడైపోవడానికి ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే..? చెప్పేవాడు లేకకాదు చెప్పేవాడు ఉన్నా వినేటటువంటి బుద్ధిలేక పాడైపోతాడు, మనం వినడమేమిటీ ఇంకావస్తే చెప్పినవాడిలో ఇంకా మనం ఏం వెతకచ్చు అన్న దృష్టికోణం ఆ చెప్పొచ్చాడులే..? ఆయనేంటో మీకు తెలుసాండీ..! ఆయన చెప్పినదాంట్లో సారముందాలేదా వాఖ్యంలో అదికాదు కావలసింది, తండ్రి నీకు మంచి చెప్పడానికి తండ్రి ఎంత పండితుడై ఉండాలండీ..! నీకు మంచి చెప్పడానికి నీ తల్లి ఎంత సంస్కృతం చదువుకొని ఉండాలి చెప్పండీ..? మీ తల్లిగారు సంస్కృతం చదువుకుంటేనే మీరు మీ తల్లిగారి మాట వింటారా..? మీ తండ్రిగారు వేద వేదాంగములు చదువుకుంటేనే మీ తండ్రిగారి మాట వింటారా..? తండ్రితనం చాలు మీకు మంచి చెప్పడానికి తల్లి తనం చాలు మీకు మంచి చెప్పడానికి కదా ఎప్పుడూ... వీళ్ళు మన తల్లితండ్రులు వీళ్ళు మన అభ్యున్యతికొరకు మాట్లాడుతున్నారన్న భావన నీకుంటే... ఆ మంచి నీకు పనికొస్తుంది. వాళ్ళకేం తెలుసని నీవు అనగలిగితే నీ జీవితంలో నీ తల్లిదండ్రులు నీకు ఎప్పటికీ ఏమీ చెప్పలేరు, చెప్పలేరంటే నిన్ను అనుష్టాన పర్యంతంలోకి తీసుకురాలేరు అది వాళ్ళ దోషంకాదు నీయందు దోషం.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే... ఒక మేకు ఒక సుత్తి పట్టుకొచ్చి కొట్టగలనేమోకానీ అసలు అది బీమ్ అయి ఉంటే..? అది దూలం సిమెంటు ఇనుము కలిపిన దూలంమండి అదీ అందులోకి మేకు పట్టుకొచ్చి కొడితే మేకు వంగిపోతుంది తప్పా మేకు దిగదు ఇంత పొడికూడా రాలదు, గోడకు కొంత గుల్లతనం ఉంటే సుత్తితో కొడితే మేకు దిగుతుంది. అసలు నీ మనసుకు ఆర్ధ్రత ఉంటే చెప్పినమాట చెవికెక్కుతుంది. అసలు ఆర్ధ్రతేలేకపోతే చెప్పడం ఒక సుష్కప్రసంగం అంతే... కాకపోతే తన కర్తవ్యం. నేను మీతో ఓ మనవి చేశానుగదా రామాయణంలో ఈ కర్తవ్యం అన్నమాట చాలా ఎక్కువ బాధ్యత అన్నమాట ఉండదు. కర్తవ్యం తను చెయ్యవలసింది తను చేస్తున్నాడా లేదా... దాని మెప్పు గొప్ప దానికోసం పాకులాడుకుండా నేను చెప్పవలసినటువంటిది చెప్తున్నానా లేదా అంతవరకే అది. నేను చెప్పవలసింది చెప్పేశాను, నేను తీసుకొచ్చిన నీళ్ళు పోసేశానాలేదా అన్న మేఘం ఎలాంటిదో అన్నట్లుగా చెప్పాలనింది చెప్పేసినవాడు అటువంటివాడు లోకము యొక్క హితము కొరకు. కాబట్టి సులభాః పురుషా రాజన్ నీవు సీతమ్మని ఎత్తుకొస్తాను అంటే, బహుశః నీ మంత్రులేమి మాట్లాడిండరు అలాగే అని ఉంటారు ఇది దాని ఉద్దేశ్యం ఇంతకు ముందు మాట్లాడాడుగా కానీ నీ హితమును కోరి కష్టమైనా మాటలు చెప్పి అనేవాడు ఒకడుంటాడు వినేవాడు మాత్రం దొరుకుతాడనే నమ్మకంలేదు, సాహసించి చెప్పేవాడు కూడా ఉండడు మనకెందుకులే వచ్చినగొడవా అని తప్పుకుంటారు.
అసలు ఈ మొట్ట మొదటి శ్లోకమంతా అర్థమైతేనండీ ఇక రామాయణం లేదు అయిపోయింది రామాయణం ఇంతటితో ఎందుకో తెలుసాండీ... వెంటనే లంకకు వెళ్ళి శూర్పణఖను లాగి లెంపకాయి కొట్టేసి తీసుకెళ్ళి రాముని కాళ్ళమీద పాడేసి తాను కాళ్ళమీదపడి బుద్ధి గడ్డితిని సీతమ్మని ఎత్తుకు వెళ్దామని అనుకున్నానండీ నాది తప్పైపోయింది, నా బుద్ధి మారింది మీరు ఎవరో తెలుసుకున్నాను నేను కూడా తపస్సుని ఇంక ధర్మం కోసమే ఉపయోగిస్తానని రావణుడు అని ఉండి ఉంటే..? అసలు ఇంక మిగిలిన కాండలు లేవు రేపే మంగళం చెప్పేయడమే... వినకపోవడం వల్లనే కదాండి కథంతా నడిచింది, వినకపోతే ఎంతమంది పాడౌతారో కూడా చెప్తాడు మారీచుడు, ఒక్క స్థానంలో ఉన్నవాడు వాడు కూర్చున్న స్థానాన్ని బట్టి వినకపోవడమన్న ఫలితం ఉంటుంది. వాడు ఒక సామాన్య వ్యక్తి అనుకోండి వాడు అక్కడివరకే పోతుంది, ఇంటి యజమాని అనుకోండి ఇల్లు మాత్రమేపోతుంది, ఆయన ఒక కార్యాలయంలో అధికారి అనుకోండి ఆఫీసు పోతుంది, ఆయన ఒక దేశాధినేత అనుకోండి దేశమేపోతుంది పుత్ర మిత్ర కళత్రాదులతో ససైన్యంగా.
నీవు మాట బాగా వినాలి ఎందుకంటే నీవు చాలా పెద్ద స్థానంలో ఉన్నావు నీవు వినకపోవడం నీతోపోదు, నీతో ఉన్నవాళ్ళతోసహా పోతుంది అంటాడు మారీచుడు. అభాహ్... అసలు నిజంగా వినడం వినకపోవడం అన్నది ఎంత ప్రమాదమో అసలు ఉపన్యాసమును ఇలా ప్రారంభించడమనేటటువంటిది అందుకు కదాండీ మారీచ స్య మహాత్మనః అన్నాడు

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
మహానుభావుడు వాల్మీకి మహర్షి. కాబట్టి న నూనం బుధ్యసే రామం మహా వీర్యం గుణోన్నతమ్ ! అయుక్త చార శ్చపలో మహేన్ద్ర వరుణోపమమ్ !! అసలు ప్రారంభమే రావణాసురిన్ని ఆయన సంభోదించిన తీరుచూడండి ఎలా మొదలు పెట్టాడో... ఒక్కొక్కసారి మర్యాదగా మాట్లాడి బాగుచేద్దామంటే కుదరదు అత్యంత ప్రమాదకమైన రీతిలో ఉన్నాడంటే... ఏదో కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉందనుకోండి పోల్లే రేపువెళ్దాము హాస్పెటాలుకి అన్నా ఫర్వాలేదు, వాంతులు విరోచనాలు కూడా అవుతున్నాయనుకోండి అవికూడా ఓ గంటాగి వెడితే ఫర్వాలేదు, ఊపిరే అందకపోతే వెళ్ళిపోవాలంతే వెంటనే అప్పుడు ఇంక కారుంటే కారు బండుండే బండీ మోటరు సైకలుంటే ఉంటే మోటరు సైకిలు ఏమీ లేకపోతే భుజంమీద వేసుకపట్టుకపోవాలి అంతే తప్పా కరెంటులేదండీ లిఫ్టులేదండీ ఇప్పుడు ఎలా తిరుగుతామండీ చూద్దామండీ అరగంటైపోయాకా కరెంటు వస్తుంది అంటారా... ఈడ్చేయాలి కిందకి అవసరమైతే పట్టుకుపోవాలి అంతే అప్పుడు ఇంక గౌరవాం అన్నమాటతో సంబంధంలేదు.
Image result for రావణుడు మారీచుడుమనిషి చాలా ప్రమాదపుటాలోచనతో ఉన్నాడు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు శంకర భగవత్పాదులు, అవసరాన్ని బట్టి సంబోధన అలా ఉంటుంది, పరిస్థితిని బట్టి అలా మాట్లాడవలసి ఉంటుంది, ఏం మనం మాట్లాడటంలే పిల్లల విషయంలో పరిస్థి యొక్క వ్యగ్రతను బట్టి సంభోదన ఉంటుంది. ఇది తెలిసున్నవాడు మహానుభావుడు అందుకని ఎలా సంభోదించాడు చూడండి అయుక్త చార శ్చపలో ఒరేయ్ నీకు చారులు లేరు, “చారులు” అంటే గూఢ చారులు అసలు విషయమేమీటీ అని చెప్పేవారు నీకు లేరు అసలు ఉన్నవిషయాన్ని ఉన్నట్లు చెప్తే వినగలిగినటువంటి ఓపికనీకు లేదు నీవు ఏడుస్తావు నీకు ఎవడైనా బలవంతుడు ఉన్నాడు మంచివాడు ఉన్నాడూ అంటే నీవు వినవు శ్చపలో నీ బుద్ధి ఎప్పుడూ కదిలిపోతుంది నీ మనస్సు, నీ మనస్సు స్థిరమైంది కాదు ఈ రెండిటితోటి సంబోదించాడు. రాజుగా అలా విఫలం వ్యక్తిగా ఇలా విఫలం కాబట్టి నీవు ఇప్పుడు రెండూ దిద్దుకోవాలి వ్యక్తిగా దిద్దుకోవాలి రాజుగా దిద్దుకోవాలి, నీవు అసలు రెండిటికీ పనికిమాలినవాడివి. అసలు ఒక వ్యక్తిగా ఉండడానికి నీకు అర్హతలేని తనంతో ఉన్నావు నీవు చాలా చపలంగా ఉంది నీ మనసు, అసలు నీ మనసుకి ఒక నిలకడన్నది లేదు. ఇలాంటిదాన్ని ఎలా నిలబెట్టావురా తపస్సన్నమాటతో ఈ మాటకి తీర్పు ఎక్కడుందో తెలుసాండీ!
అయుక్త చార శ్చపలో ఈ శ్చపలో అన్నమాట రావణుడిపట్ల పదేపదే పదేపదే వాడారు, ప్రయత్నంచేసి మారుతాడేమోన్నవాళ్ళందరు సీతమ్మ ఇదే అంది, హనుమా ఇదే అన్నారు ఆఖరికి మండోధరి అందీ చచ్చిపోయిన తరువాత రాముడు ఎక్కడ చంపేశాడయ్యా... చలితం చలితేంద్రియం నీ ఇంద్రియాలు కదిలిన నీ మనస్సు నిన్ను చంపేశాయ్ అన్నారు. దీన్నే disaster అంటారే దీని ప్రమాదం ఎక్కడొస్తుందో ఆ ప్రమాదాన్ని అక్కడివరకు లెక్కకట్టి దాంతో సంభోదించి మాట్లాడాడు, లెక్కకట్టి ʻమహాత్మనఃʼ కాకపోతే ఎవరండాయనా! అందుకని మారీచుడు రాక్షసుడు కావచ్చు ఒకప్పుడు ఇప్పుడు మహాత్ముడే... కాబట్టీ రాముడిగురించి ఏమిటిరా నీవు మాట్లాడుతావ్? ఎన్ని కితాబులిచ్చి మాట్లాడావు, అధర్మాత్ముడు అన్నావు ఇంద్రియములను జయించనివాడు అన్నావు తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేశాడు అన్నావు కారణం లేకుండా విరూపని చేశాడు అన్నావు ఇన్నిమాటలు అన్నావుగా ఇప్పుడు నేను చెప్తాను విను న నూనం బుధ్యసే రామం మహా వీర్యం గుణోన్నతమ్ ! ఆయన చాలా గొప్ప వీర్యమున్నవాడు ఎంతమందినైనా తానులోపల కదలకుండా కదల్చగలడు పడగొట్టగలడు తను లోపల కదిలిపోడు ఆయన అంత అచలమైనవాడు, నీవో చెంచలమైనవాడివి ఆయనవి సముధికమైన గుణాలు ఇన్ని గుణములయొక్క రాశి రామ చంద్ర మూర్తి నీవో నిర్గుణడవు అసలు గుణం ఉండడానికి మనసు నిలబడితేగా నీకు అసలు నీకు మనసు లేకపోవడమే నీకున్న ఓ పెద్ద గుణం.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
నువ్వు ఆయన గురించి మాట్లాడడం ఏమిటీ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండీ రావణుడితోటి, రావణుడితో ఇంత ధైర్యంగా మాట్లాడటం ఇంత నిలదీసి మాట్లాడటం మీకు రామాయణంలో ఎక్కడా కనపడదు, అలా మాట్లాడేవాడు ఉంటే బహుః కిష్కింద కాండలో సుగ్రీవున్ని అహనుమ మాట్లాడుతాడు, ఇంత కదిలిపోయేవాడివి నీవేం పనికొస్తావురా రాజు కింద అని అన్నాడు ఆయన అడిగితే విన్నాడు కాబట్టి సుగ్రీవుడు బాగుపడ్డాడు, వినలేదు కాబట్టి రావణుడు నశించిపోయాడు. రామాయణంలో మీరు అది పట్టుకోవాలి వినడం వినడం వినడం మీరు వినాలి రాముడు విన్నాడు రాముడంతటివాడు కూడా కోపానికి లోనయ్యాడు, లక్ష్మణుడు చెప్తే విన్నాడు కాబట్టి రాముడు ఇవ్వాళ పూజింపబడ్డాడు, ఆ వినడం అన్నది లేకపోతే ఎవ్వడూ బాగుపడే అవకాశం ఉండదు చాలా ప్రమాదం వినాలి, కాని మన దురదృష్టం ఏమైపోయిందంటే ఎంతసేపు కూడా ఇవ్వాళ లోకంలో చాలా గొప్ప విషయం ఏమిటంటే come what may ఇది ఎక్కడనుంచి వచ్చిందో నాకు తెలియదు కాని ఏదైనా జరగని నేను అనుకున్నది చేస్తాను, నేను అన్నదే అంటాను అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంలో ఇవ్వాళ సమాజంలో వెళ్ళిపోతుంది రోజు రోజుకీ కాబట్టి అపి స్వస్తి భవేత్ తాత సర్వేషాం భువి రక్షసామ్ ! అపి రామో న సంక్రుద్ధః కుర్యా ల్లోకమ్ అరాక్షసం !! నీవు ఏమనుకుంటున్నావో రావణా నాకు తెలిదు కానీ రాముడియొక్క భార్యయైన సీతమ్మని అపహరిస్తానని నీవు అంటున్నావు కదా... అసలు నీవు నిజంగా సీతమ్మని అపహరించడం మాట పక్కన పెట్టూ రాముడికి రాక్షసుల మీద కోపమంటూ వస్తే ఈ లోకంలో ఇంక రాక్షసుడన్నవాడు బ్రతకడు.
Image result for తాటకికాబట్టి ఇప్పుడు నీవు ఏం చేస్తున్నావో తెలుసా..? సీతమ్మని అపహరించడం మాట పక్కన పెట్టు ఈ ఆలోచన చేస్తున్నావని రామునికి తెలిస్తేచాలు రాక్షస జాతి మీద కోపం వస్తుంది. అసలు ఇక రాక్షస జాతి ఉండదు అంత ప్రమాదపు ఆలోచన చేశావు అపి తే జీవితాన్తాయ నోత్పన్నా జనకాఽఽత్మజా ! అపి సీతా నిమిత్తం చ న భవే ద్వ్యసనం మమ !! ఇదీ అసలు నిన్ను చంపడానికే సీతమ్మ పుట్టిందా అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు ఆయన, అయ్య బాబోయ్.. ఎలా... అనేశాడో ఆశ్చర్యంగా ఉంటుందండీ... అందుకే కదాండీ ఆవిడ “ఉద్ధితా” అయోనిజగా పుట్టిందికదాండి భూమిని చీల్చుకుని అవతార ప్రయోజనం అదే కదా... కాబట్టి అసలు నిన్ను చంపడానికే పుట్టిందా... నీతో పోతుందా లంకంతా పోతుందేమో నేనూ పోతానేమో నిన్ను ఆశ్రయించినందుకు నీవెనక ఉన్నందుకు నేనూ పోతానేమో అసలు ఎవరో నీదగ్గర చాలా స్నేహంగా ఉన్నట్లు ఉంటూ నిన్ను నాశంనం చేసేవాళ్ళే నీకు ఎవరో ఈ మాటలు చెప్పి ఉండాలి సీతాపహరణం చేయమని న చ పిత్రా పరిత్యక్తో నామర్యాదః కథంచన ! న లుబ్ధో న చ దుశ్శీలో న చ క్షత్రియ పాంసనః !! చూడండీ ఒక్కొక్కచోట పాయింట్ టు పాయింట్ ఖండించారంటారే మారీచ ప్రసంగం అలా ఉంటుంది.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
రావణడు ఎమన్నాడో వాటన్నిటిని ఏకసంతాగ్రాహియై అన్న ప్రతిమాటనూ ఖండిస్తాడు, నీవు ఏమన్నావు రామున్ని తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడూ అన్నావు తప్పు ఆయన అలా వెళ్ళగొట్టబడలేదు ఆయన మర్యాదా తెలియనివాడు కాదు ఆయన లుబ్ధుడుకాడు ఆయన అన్నిటినీ కోరేవాడు కాడు ఆయన దుశ్శీలుడు కాడు క్షత్రియుల యందు అధముడైనవాడు అసలేకాడు ఆయన న చ ధర్మ గుణై ర్హీనః కౌసల్యాఽఽనన్ద వర్ధనః ! న చ తీక్ష్ణో న చ భూతానాం సర్వేషాం చ హితే రతః !! భూతములకు అహితము చేసేటటువంటివాడు అపకారం చేసేటటువంటివాడు అసలుకాడు క్రోధమున్నవాడు కాడు ధర్మగుణములు లేనివాడు కాడు ఆయనా అన్నివిధములుగానూ యోగ్యుడు వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సత్య వాదినమ్ ! కరిష్యా మీతి ధర్మాత్మా తతః ప్రవ్రజితో వనమ్ !! కైకేయ్యాః ప్రియ కామార్థం పితు ర్దశరథ స్య చ ! హిత్వా రాజ్యం చ భోగాం శ్చ ప్రవిష్టో దణ్డకా వనమ్ !! రాముని తండ్రియైన దశరథ మహారాజుగారిని కైకమ్మ వరములనేటటువంటి మిషని అడ్డుపెట్టి వంచించి ఆయన దగ్గర రెండు వరములను పుచ్చుకుంటే ఇచ్చినటువంటి దశరథ మహారాజుగారు సత్యమునందు నిలబడితే తప్పా ఊర్ధ్వలోకములను పొందలేడని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం తనంత తానుగా పితృ వాక్య పరిపాలకుడై 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి వచ్చినటువంటి మహాత్ముడు రాముడు.
నీవు దాన్ని మార్చి చెప్తున్నావు తండ్రి వెళ్ళగొట్టాడని తండ్రి వెళ్ళగొట్టలేదు అసలు ఇన్ని తెలిసి అలా మాట్లాడుతుంటే మారాలి కచ్చితంగా మారే గుణం ఆయనకు లేదు రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ! రాజా సర్వ స్య లోక స్య దేవానామ్ ఇవ వాసవః !! రాముడు రామో విగ్రహవాన్ ధర్మః ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట రాశీ భూతంగా నిలబెట్టి ప్రాణం పోస్తే ఆ ధర్మం కదిలి వెడుతుంటే చూడాలి అనుకుంటే అదే రాముడు రాముడు కదిలివెడుతున్న ధర్మం. ధర్మానికి హానిచేద్దామనుకున్నవాడు బ్రతికి బట్టకట్టడు సాధువు ఆయన సత్పురుషుడు సత్య పరాక్రమః ఆయన నిరంతరం సత్యమునే అనుష్టిస్తాడు కాబట్టి అదే ఆయన పరాక్రం కాబట్టి చెక్కు చెదరదది రాజా సర్వ స్య లోకస్య రాముడు ఇక్కడ కాదు ఈ లోకం కాదు సమస్త లోకములకు రాజు అంటే ఆయన ఎవరో రాముడు ఎవరు అన్న సత్యాన్ని మారీచుడు గ్రహించగలిగాడు దేవానామ్ ఇవ వాసవః దేవతలకు ఇంద్రుడు ఎటువంటివాడో రాముడు అటువంటివాడు, నీవు సీతమ్మని అపహరిస్తానన్నావుగా... కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా ! ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామ్ ఇవ వివస్వతః !! ఆ సీతమ్మ రాముని చేతనే రక్షింపబడుతుంది రామ లక్ష్మణులనే దూరంగా పంపితే నీవు అపహరించగలననుకుంటున్నావు పిచ్చాడా! సితమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంది ఆవిడ తేజస్సేమిటో తెలుసా ఆవిడ పాతివ్రత్యమే, పాతివ్రత్యమున్న సీతమ్మని నీవు అపహరించలేవు అంటే మీరు ఒక విషయాన్ని ఖడితంగా తెలుసుకోవలసి ఉంటుంది.
Image result for బంగారు జింకబంగారు చుక్కలున్న మృగంగా మారీచుడు వెళ్ళినా... ఆయనకు ఒక విషయం తెలుసు నేను హా.. సీతా... హా... లక్ష్మణా అంటూ పడిపోయినా సీతాపహరణం రావణుడు చెయ్యలేడు, సీతాపహరణం అంటూ జరిగితే సీతమ్మ వెళ్ళింది తప్పా సీతను రావణుడు అపహరించలేదు, సీతమ్మే వెళ్ళడమంటూ జరిగితే అది రావణ సంహారానికే వచ్చింది తప్పా ఇంకో ప్రయోజనానికి కాదు. కాబట్టి నేను నిమిత్తము వాడు అనుకుంటున్నాడు నేను వెళ్ళితే వాడు ఎత్తుకరాగలనని ఊరికే వట్టిమాట లేకపోతే ఎలా చెప్పగలడండి “మహాత్మనః” కాబట్టి కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా తన తేజస్సుతో తనను తాను రక్షించుకుంటుంది ఆవిడా ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామ్ ఇవ వివస్వతః ఏమిట్రా బలవంతంగా పట్టుకొస్తానంటావేమిట్రా ఎంత బలముంటే మాత్రం సూర్యుని కాంతిని పట్టుకురా చూస్తాను, నీకు బల ముండచ్చు బలముంటే సూర్యుని కాంతి పట్టుకెళ్ళగలవా ఇప్పుడూ మీకు బలముందండీ బాగా ఉదాహరణ చెప్పాలంటే... కోటేశ్వర రావు మెడలో రుద్రాక్ష మాల లాగేసేయచ్చు కోటేశ్వరరావుగారి ఉత్తరీయం లాగేయచ్చు కోటేశ్వర రావుగారి మాట్లాడేటటువంటి విధానాన్ని మీరు లాగేయలేరుగా... అది కోటేశ్వరావుగారిలో అంతర్గతమైన శక్తి అంటే ఇదేదో  గొప్ప విషయం నేనేమో గొప్ప వ్యక్త అని నేను మాట్లాడటం లేదు ఒక ఉదాహరణకి చెప్పానంతే...

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
నేనూ నా విభూతీ రెండు విడదీయబడవు రాముని విభూతి రామ శక్తి సీతమ్మ రామున్నుంచి రామ శక్తి ఎందుకు విడబడుతుంది విడబడదు, విడబడితే దాని అర్థమేమిటో తెలుసా..? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ నీ కొంప ముంచడానికి రావాలావిడంతే తప్పా ఇంకోటికాదు, నీకు అర్థం కావడంలేదు చెప్పినా వినవు అయినా చెప్తాను విను చెప్పడం నా కర్తవ్యం. కాబట్టి బలాత్కారంగా తీసుకెళ్ళడమన్నది కుదిరేపని కాదు నీకు చెప్తున్నాను సూర్యకాంతిని తీసుకెళ్ళలేవు అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాఽఽత్మజా ! న త్వం సమర్థ స్తాం హర్తుం రామ చాపాఽఽశ్రయాం వనే !! నీవు ఆ సీతమ్మని తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్లిపోతున్నాను అంటున్నావు కదా అప్రమేయం హీతత్తేజో అసలు ఆవిడ యొక్క తేజస్సు ఆవిడని రక్షించుకోవలసిన సమర్థతే కాకుండా ఆవిడ తేజస్సుతో ఆవిడ ఏఏ పనులు చెయ్యగలదూ అన్నదాన్ని ఊహించడం సాధ్యంకాదు, ఇప్పుడు నీవు ఆవిడ జోలికి వెళ్ళితే ఆవిడ తేజస్సు ఆవిడని రక్షించుకోవడానికి పనికిరావడమే కాదు నిన్నూ లంకనూ నాశనం చేయడానికి పనికివస్తుంది ఆ తేజస్సు ఏమనుకుంటున్నావో...
ఇదేగా చిట్ట చివర భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు నీకంఠార్పిత కాలపాశము శిరోనిర్ఘాంత పాతంబు లం కోకస్సంచయ కాళరాత్రి గళ బద్ధోదగ్ర కాలాహి క న్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి అంటాడు పిచ్చాడా... ఆలా అనుకుంటున్నావు సీతంటే నీకు కనపడినటువంటి అనుభవ యోగ్యమైన స్త్రీ కాదు అంటాడు. అది ఆయనకు అర్థం కాకుండా ఉంచడం అర్థమయ్యేటట్టు ఒకన్ని అనుగ్రహించడం మాయ యొక్క స్వభావము. “పరబ్రహ్మ మహిషీ” అందుకు కదాండీ శివ ధనుస్సు ఎక్కుపెట్టినవాడు తుంచినవాడు ఎవడు మాయనని హరించగలడో వరించగలడో మధ్ధించగలడో నీయమించగలడో వాడు పురుషోత్తముడు వాడు పరబ్రహ్మము పరబ్రహ్మము యొక్క శక్తి యొక్క మాయ. కాబట్టి నీకు ఏం తేలుసు ఆవిడవల్ల పాడైపోతావు నశించిపోతావు ఇది అందుకని “మహాత్మనః”. అసలు నరుడిగా ఉన్న రాముడు ఎవరో కూడా చెప్పగలుగుతున్నాడు మారీచుడు, ఇవ్వాళ ఆయన తపస్సు ఎలా చేశాడన్నది పక్కన పెట్టండి ఆయనకు ఒక సత్యం జ్యోతకం అయ్యింది ఒక గొప్ప సత్యం జ్యోతకం అయ్యింది మారీచునికి, కాబట్టి అటువంటి సీతమ్మని నీవు అపహరించి తీసుకురావడమన్నది కుదరదు తస్య సా నరసింహ స్య సింహోర్క స్య భామినీ ! ప్రాణేభ్యోపి ప్రియతరా భార్యా నిత్యమ్ అనువ్రతా !! ఆవిడ పాతివ్రత్యమేమిటో తెలుసా? నరులయందు సింహమువంటివాడు రాముడు సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో అలాంటి వక్షస్థలమున్నవాడు రాముడు అటువంటి రాముని యొక్క ప్రాణము లాంటిది సీతమ్మ, ప్రాణం ఎక్కడుంటుందండీ! గుండెల్ని కదా ఆధారం చేసి చెప్తున్నాము అంటే ఆయన గుండెల్లో ఆవిడ ఉంది ప్రాణంతో సమానమైనటువంటిది ఆయనను నిత్యమూ అనువర్తిస్తుంది, నాకూ ప్రాణం సీతమ్మ అంటే అంటావేమో..? ఆమె ఆయన్ని అనువర్తిస్తుంది నీవు తీసుకొచ్చినా నీ ప్రాణం పోవడానికి పనికివస్తుంది.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి పిచ్చాడా! ఆవిడని తీసుకొస్తానంటావేమిటీ జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభమ్ ! య దిచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం !! నీ జీవితం బాగుండాలనుకుంటున్నావా..? సుఖంగా ఉండాలనుకుంటున్నావా..? రాజ్యం బాగుండాలనుకుంటున్నావా..? చాలా కాలం సుఖాలు అనుభవిద్దామనుకుంటున్నావా..? మా కృథా రామ విప్రియం రామ చంద్ర మూర్తికి అపకారం చేద్దామన్ని ఆలోచన అసలు చెయ్యకూ... అసలు ఆలోచనే చెయ్యకూ. నేను చేయనన్నాడని ఇంకోళ్ళ దగ్గరకు వెళ్ళకు అసలు ఆ ఆలోచన వదలిపెట్టేసై అంటూ నేను ఒకానొకప్పుడు పూర్వ కాలంలో యజ్ఞం ధ్వంసం చేస్తుండేవాన్ని Image result for రాముడు తాటకివిశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుగారి దగ్గరికెళ్ళీ రామ లక్ష్మణులని ఇద్దరినీ కూడా యజ్ఞ రక్షణ కొరకు తీసుకొచ్చారు అప్పటికి ఆయన చాలా చిన్నపిల్లవాడు, నేను విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే ఆ యాగంలో తీసుకెళ్ళి యాగ భంగం చేయడానికి వెయ్యకూడని పదార్థములు వెయ్యడానికి వెళ్ళాను పిల్లవాడే కదా ఇతనేం చేస్తాడనుకున్నాను, అప్పటికి రాముడు ఎంత వయసువాడో తెలుసా రావణా! అజాత వ్యంజనః శ్రీమాన్ బాలః శ్యామః శుభేక్షణః ! ఏక వస్త్ర ధరో ధన్వీ శిఖీ కనక మాలయా !! అజాత వ్యంజనః శ్రీమాన్ ఇంకా పురుష లక్షణములు పుట్టనివాడు అంటే ఇంకా మీసాలు కూడా రాలేదు ఆయనకి పద్మపత్ర నిభేక్షణః చక్కటి కనుదోయ కలిగినటువంటివాడు పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి నేత్రములు కలిగినటువంటివాడు ఏక వస్త్ర ధరో ధన్వీ బ్రహ్మచర్యమునకు అనుగుణంగా ఏక వస్త్రము కట్టుకున్నటువంటివాడు శిఖీ పిలక పెట్టుకుని ఉంటాడు కనక మాలయా అటువంటి రామ చంద్ర మూర్తి బాల చంద్రుడు వస్తే ఎలా ప్రకాశిస్తుందో దండకారణ్యం ఆయన వస్తే అలా ప్రకాశించింది చిన్న పిల్లవాడువస్తే శోభయన్ దణ్డకారణ్యం దీప్తేన స్వేన తేజసా ! అదృశ్యత తదా రామో బాల చన్ద్ర ఇవోదితః !! బాల చంద్రుడిచేత ఆకాశము ప్రకాశించినట్లు దండకారణ్యమునకు వచ్చినటువంటి చిన్ని రామునివలన అలా ప్రకాశించింది.
నేను ఆ చిన్ని రాముడు నన్నేం చేస్తాడని యజ్ఞ భంగం చెయ్యబొయ్యాను ఆయన మానవాస్త్రం పెట్టి కొట్టాడు నన్ను కొడితే నూరు యోజనములు సముద్ర ఇవతలకొచ్చి నేను సముద్రంలో పడిపోయాను, నా అదృష్టం కొద్ది ప్రాణాలు పోలేదు బ్రతికాను అప్పటి నుంచి రాముడు అంటే నాకు చాలా భయం అంత చిన్న పిల్లాడు కొట్టాడునన్ను మానవాస్త్రం పెట్టి నూరు యోజనములు దూరం వెళ్ళిపడేటట్టు, ఆయన తరువాత ఆయన యవ్వనంలోకి వచ్చాడు పెళ్ళిచేసుకున్నాడు, ఆయన చాలా మంది ఋషులను సేవించాడు అగస్త్యాది మహర్షుల్ని సేవించాడు ఇప్పటికే ఆయన దగ్గర ఎంత శస్త్ర-అస్త్ర సంపద ఉందో... అప్పుడే అలా ఉన్నాడంటే ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడు వెళ్తాడురా..! ఆయన జోలికి ఎందుకు వెళ్ళడంరా అనేశాడు అంతే. ఎంత సత్యం మాట్లాడుతున్నాడండీ... రాముని యొక్క ఎదుగుదలను బాగా తెలుసుకున్నవాడు మారీచుడు, రాముని గురించి ఏమీ తెలయకుండా ఆయన ఎంతవాడు అంటున్నవాడు రావణాసురుడు.
అంటూ ఆయన అన్నాడూ హర్మ్య ప్రాసాద సంబాధాం నానా రత్న విభూషితామ్ ! ద్రక్ష్యసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీ కృతే !! నువ్వేకాని సీతమ్మను తీసుకొచ్చే ప్రయత్నం చేశావో అనేకమైనటువంటి ప్రాసాదములతో ఇరుకు ఇరుకుగా ఉండేటటువంటి లంక అంటే ఐశ్వర్యంతో అంత శోభిల్లుతున్న లంకా అంత సంతోషంగా భోగము అనుభవిస్తున్నా లంకా రాజ్య Image result for లంకా నగరమువాసులు అందరూ నశించిపోతారు రావణా పర దార అభిమర్షాత్ తు న అన్యత్ పాపతరం మహత్ ! ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహః !! అన్య స్త్రీని కోరుకున్నటువంటివాడు పరుల భార్యలను కోరుకున్నటువంటివాడు జీవితంలో వృద్ధిలోకి వచ్చి బ్రతికి బట్టకట్టినట్టు లోకంలో ఇప్పటివరకూ లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి లోకంలో అన్నిటికన్నా కష్టమేమిటో తెలుసాండీ... చాలా చాలా కష్టమేమిటో తెలుసా... చచ్చిపోవడమే అందుకే మనం పూజ చేస్తే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని అడుగుతారు, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అందుకు కదాండీ సనాతన ధర్మంలో మృత్యువు దేవత అయ్యింది, “మృత్యుదేవత” అంటారు, ఆవిడ తీసుకోలేదు అనుకోండి నేను పట్టుకెళ్ళనండీ అప్పుడే అనుకోండి అయిపోయిందావాడి పని...

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
నేను ఒకానొకప్పుడు కాకినాడలో ఒసారి ఉపణ్యాసం చెప్తుంటే పేరెందు చెప్పాలి ఒకప్పుడు మంచి భలాడ్యుడు అయుండేటటువంటి వ్యక్తి నేను ఇంకొక కోణం మాట్లాడకూడదు ఆయన ఇక్కడదాకా వచ్చాని తెలిసింది ఒక్కసారి మిమ్మల్ని చూస్తానంటున్నారూ కోటేశ్వరరావుగారూ ఒక్కసారి మా ఇంటికి రండీ... అని అడిగింది వాళ్ళావిడా... అడిగితే నేను అన్నాను ఎందుకమ్మా నేను రావడం ఎందుకు వారం రోజుల నుంచి చెప్తున్నాను కదా ఆయన్ని రమ్మనండీ ఓసారీ... ఇక్కడికొచ్చి వింటారు కదా కసేపు... వింటారుకదా అన్నాను, అంటే ఆవిడందీ ఆయన రాగలిగిన స్థితిలో లేరు అసలు ఆయన ఇప్పుడు మంచం మీద ఉన్నారంది అంటే నాకు జాలేసింది అయ్యెయ్యో అటువంటప్పుడు మనం వెళ్ళడం భేషజంమేమిటీ ఎదో ఇక్కడికీ రావచ్చుగదా అని అన్నానుగదాని నన్ను చూడాలి పాపం మంచంమీద ఉన్నాడు వెళ్ళాలి గదాని రేపొచ్చి తొందరగా వచ్చి మీ ఇంటికి వస్తాను అన్నాను.
తొందరగా వచ్చి వాళ్ళింటికి వెళ్ళాను, వెల్తుంటే ఆవిడంది మేడమీదకు తీసుకెళ్తున్నారు నన్ను ఆయనున్న గదిలోకి తీసుకెళ్తున్నారు అయ్యా! ఏమనుకోకండీ నీ ఉత్తరీయం తీసి కొంచెం ముక్కుకు అడ్డంగా కట్టుకోండీ అన్నారావిడ అంటే నేను తెల్లబోయాను, ఎందుకమ్మా నేను కట్టుకోవడం అన్నాను, మీరు లోపలిదాకా రాలేరు అన్నారావిడ ఏమిటి అల ఎందుకుంటుందాని నేను ముక్కుకు ఉత్తరీయం అడ్డుపెట్టుకుని ఆ గదిలోకెళితే ఆయనకీ రెండు కాళ్ళు చెయ్యి నోరు కూడా పడిపోయింది దొల్లలేడు మల మూత్రములు తనవి తాను విసర్జించలేడు తీయ్యలేడు ఏదీ పడదు ఎప్పుడూ అతిసారమే ప్రాణం పోదు అసలు నేను గుర్తుపట్టలేకపోయాను నేను అస్తిపంజరంలా ఉన్నాడు మల మూత్రములు వెళ్ళి వెళ్ళి మొత్తము ఆ గది అంతా వాసన పట్టేసింది. పదివేలు ఇస్తామన్నా ఎవ్వరూ మేము పని చేయము అన్నారు, అన్నం లేకపోతే ఎక్కడైనా సత్రంలో తింటాంకానీయ్యండీ మేం చేయము అన్నారు కాబట్టి ఇప్పుడు భార్య కూడా వెళ్ళి చేసే పరిస్థితి కాదు, కాబట్టి ఆయన నా వంక ఇలా తలతిప్పి చూసి కనుల కొలకులలోంచి ఇలా నీరు కారితే నమస్కారం చేద్దామని ఉంది పాపం ఆయనకు నామీద ఎక్కడో ప్రేమ మిగిలిపోయింది చేతులు లేవవు నమస్కారం చేయలేడు కను కొలుకుల నుంచి ఇలా నీరు కారిపోతుంటే... ప్రయత్నపూర్వకంగా నేను అయ్యోయ్యే ఏం ఫర్వాలేదు అందామని ఒక్క రెండు మూడు అడుగులు వేయబోయి ఆగిపోయాను హటాత్తుగా ఎందుకో తెలుసాండీ..? పురుగులు పట్టాయి అప్పటికే శవం చాలా సేపు ఒక చోట ఉంటే చలికంపులా వస్తుంది. అటువంటి చలి కంపు గది అంతా...
రెండడుగులే వేయగలిగాను ఇంకా వెళ్ళలేకపోయాను నేను ఏం ఫర్వాలేదు లెండి ఏం ఫర్వాలేదు అందామంటే మరి ఉత్తరీయం కిందికి జారాలి నేను ఇంక ఉండలేకపోయాను వెళ్ళిపోయాను ఆ తరువాత ఆరు నెలలు ఉన్నాడు ఆయన అలాగ దేనికి ఉన్నట్టు అంటే..? బాధ అనుభవించడానికి ఉన్నాడు అందుకే మనవాళ్ళు మృత్యువుని దేవత అని ఎందుకంటో తెలుసాండీ... ఈ శరీరం ఝజ్జరీ భూతమైపోతే దీట్లోంచి సునాయాసంగా ఆవిడ విడిపించేసిందనుకోండీ అమ్మయ్యా అంటారు లేకపోతే ఇప్పటికే చాలా కర్చైపోయిందండీ ఇప్పుడు మాతో ఉండిమాత్రం ఏం చేస్తాడూ అని ఇంటికీ తీసుకెళ్ళరు ఇప్పుడు ఆయన్ని ఎక్కడపెడతాం అంటారు అన్నదమ్ములు వాటాలువేసుకుంటారు వీధి అరుగుమీద పెడతారు ఆ గదిలో పెడతారు

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
పలకరించేవాడు ఉండడు చూసేవాడు ఉండడు, తను అలా పడుండాలి అలా తీసుకెళుతుంది కాబట్టే సనాతన ధర్మంలో మృత్యువుకి కూడా దేవతాస్థానమిచ్చి గౌరవించారు. కాబట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది అంత తేలికకాదు రావణా ఏదో అనుకుంటున్నావు, నీవు ఒక్కడివే వెళ్ళిపోతాననుకుంటున్నావా సీతమ్మ జోలికి వెళ్తే ఇంత భోగమనుభవిస్తున్న లంక లంకంతా పోతుంది, నిజంగా ఆ ఒక్క మాట కొంచెం జీర్ణమయ్యింటేనండీ రావణునికి అఁ... అది లా అన్నాడు అంతే ఒకవేళ అదికూడా అయితే అని ఆలోచించి ఉంటే నా కళ్ళ ముందు ఇంతమంది వెళ్ళిపోయి నేను ఒక్కన్నే మిగిలిపోతే ఉన్నట్టా ఊడిపోయినట్టా అని ఒక ఆలోచన చేసి ఉంటే బహుషః మార్పు వచ్చి ఉండేదేమో అసలు వినడమన్న గుణం లేదు కదాండి వద్దూ అందుకు కదాండీ మహానుభావుడు సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః ! అప్రియ స్య చ పథ్య స్య వక్తా శ్రోతా చ దుర్లభః !! అంటూ మొదలెట్టాడు ఏమి మారీచుడండీ మహానుభావుడు.
Image result for స్త్రీ వ్యామోహంకాబట్టి నాశనమైపోతుందిరా లంకా నామాట విను నీవు సీతమ్మ జోలికి వెళ్ళకు, పరదార జోలికెళ్ళి బాగుపడినవాడు లేడు అంటే పరదార జోలికి వెళ్ళావో అంత తొందరగా మృత్యువు రాదు అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తీర్పు స్తానంలో కూర్చుంటాడు, తీయ్యడు ఉండి ఉపయోగముండదు అప్పుడు అనుభవంలోకి వస్తుంది పాపం ఎవరు చూసేవాళ్ళు, అమ్మో... సీతమ్మ సుందర కాండలో మాట్లాడుతుంది ఇంకా వాతలు పెట్టేస్తుంది ఆవిడ పెడితే మాత్రం ఆయనకు అంటిందా కాబట్టి భవ స్వ దార నిరతః కులం రక్ష రాక్షస ! మానం వృద్ధిం చ రాజ్యం చ జీవితం చేష్టమ్ ఆత్మనః !! కళత్రాణి సౌమ్యాని మిత్ర వర్గం తథైవ చ ! యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియమ్ !! నీ ధారయందు నీ భార్యయలయందు నీవు తృప్తిపొందు నీ కులాన్ని నీవు రక్షించు నీ యొక్క గౌరవాన్ని నీవు కాపాడుకో నీ బుద్ధిని సక్రమంగా ఉంచు నీ రాజ్యాన్ని కాపాడుకో నీ జీవితాన్ని కాపాడుకో కళత్రాణి సౌమ్యాని నీ యొక్క భార్యలతో నీవు సంతోషంగా ఉండాలని నీవు కోరుకుంటే మిత్ర వర్గం తథైవ చ నీ మిత్రుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటే యదీచ్ఛసి చిరం భోక్తుం నీవు చాలా కాలం ఇలా సుఖాలను అనుభవించాలనుకుంటే మా కృథా రామ విప్రియమ్ రామునికి మాత్రం అపకారం చేద్దామూ అని ఎప్పుడూ అనుకోవద్దు.
నేను ఒకప్పుడు మృగరూపాన్ని దాల్చి ఇంకొక ఇద్దరు మిత్రులతో కలసి రాముడు అరణ్యవాసం చేస్తుండగా వెళ్ళాను, రాముడు కూర్చుని ఉన్నాడు అప్పుడు నేను అనుకున్నాను ఇప్పుడు తాపసి కందమూలాలు తింటున్నాడూ చాలా కాలం అయ్యింది కదా అప్పుడు మానవాస్త్రం పెట్టి కొట్టాడు కదాని గుర్తు తెచ్చుకునీ ఒక క్రూరమృగం రూపంలో ఉన్నానుకదాని ఇప్పుడు నన్నేం చెయ్యగలడు అని రాముడి మీదకు పరిగెత్తాను తాపసం నియతాఽఽహారం సర్వ భూత హితే రతమ్ ! సోహం వనగతం రామం పరిభూయ మహా బలమ్ !! ఆయన బలాన్ని తిరస్కరించి ఆయనమీదకి మృగరూపంలో పరుగెత్తాను తాపసోయమ్ ఇతి జ్ఞాత్వా పూర్వ వైరమ్ అనుస్మరన్ ! అప్పుడు నన్ను అస్త్రం పెట్టి కొట్టినటువంటి విషయం నాకు జ్ఞాపకంలో ఉంది ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుందామని వెళ్ళాను అభ్యధావం హి సుసంక్రుద్ధ స్తీక్ష్ణ శృఙ్గో మృగాఽఽకృతిః !! నేను వాడియైన కొమ్ములతో మృగరూపంలో ఉన్నాను అప్పుడు జిఘాంసుః అకృత ప్రజ్ఞ స్తం ప్రహారమ్ అనుస్మరన్ పూర్వపు దెబ్బ స్మరించి ఇప్పుడు రామున్ని చంపుదామనే వెళ్ళాను ఆయనేం చేశాడంటే..? వాడియైన బాణములను ఎక్కుపెట్టి ప్రయోగించాడు నాతో వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఆ దెబ్బ గుండెల్ని చీల్చి చంపేసింది, నేను అటుఇటూ తిరిగి ఆ బాణపు దెబ్బ తప్పుకుని పారిపోయి వచ్చాను, బాణం నాకు తగలలేదు కానీ ఇహ ప్రవ్రాజితో యుక్త స్తాపసోహం సమాహితః ఆరోజు

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
పారిపోయి వచ్చినవాన్ని అపడ్నుంచి ఒక పర్ణశాల కట్టుకుని తపస్సు చెయ్యడం మొదలు పెట్టాను, ఇహ బయటికి వెళ్ళటం లేదు.
Image result for అడవిలో రాముడుఎందుకెళ్ళటం లేదు అంటావేమో..? వృక్షే వృక్షే హి పశ్యామి చీర కృష్ణాజినామ్బరమ్ ! గృహీత ధనుషం రామం పాశ హస్తమ్ ఇవాన్తకమ్ !! నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాననుకో వృక్షే వృక్షే హి పశ్యామి చీర కృష్ణాజినామ్బర తలెత్తి చూస్తే ఏ చెట్టు మీద ఏ కొమ్మ మీద చూసినా సరే నార చీర కట్టుకుని చేతిలో ధనస్సు పట్టుకుని రాముడు కనపడుతుంటాడు ఎన్ని చోట్లని పరుగెత్తను ఎక్కడికి పరగెత్తినా రాముడే కనిపిస్తాడు, అంటే ఆయన భయంతో ఈ స్థితిని పొందినా... ఆయనకు మాత్రం రామ దర్శనం అవుతుంది, ప్రతి చోట ఆయనకు రాముడే కనపడుతున్నాడు వనం కనపడుటలేదు రాముడే కనపడుతున్నాడు విశ్వం కనపడుటలేదు విశ్వనాథుడు కనపడినట్లు లోకం స్థానంలో లోకేశ్వరుడు కనపడినట్లు ఆయనకి రాముడే కనపడుతున్నాడు కానీ భక్తితో మాత్రం కాదు నాకు వృక్షే వృక్షే హి పశ్యామి చీర కృష్ణాజినామ్బర ! మృహీత ధనుషం రామం పాశ హస్తమ్ ఇవాన్తకమ్ !! పైగా ఎలా కనపడుతున్నాడో తెలుసా? చేతిలో యమపాశం పట్టుకున్నటువంటి యమధర్మరాజు గారు ఎలా కనిపిస్తాడో అలా కనిపిస్తున్నాడు అంటే ఎప్పుడు కనపడినా రాముడు ప్రసన్నమూర్తిగా మాత్రం కనపడలేదు కృద్ధుడై కనపడ్డాడు ఆయనకి కోపంతో కనపడ్డాడు రౌద్రంగా కనపడ్డాడు అంటే ఈయ్యన చాలా భయంతో కూడినటువంటి స్థితిలో ఉన్నాడు తప్పా తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అన్న స్థాయిని మాత్రం పొందలేకపోయాడు.
అంటే గతం యొక్క అనుభవాలు ఇంకా ఇయ్యన్ని వెంటాడాయి అపి రామ సహస్రాణి భీతః పశ్యామి రావణ ! రామ భూతమ్ ఇదం సర్వమ్ అరణ్యం ప్రతిభాతి మే !! అవినాకు రామ సహస్రాణి అంటే వెయ్యి అనికాదు అనంతం ఎక్కడ చూసినా రాముడే భీతః పశ్యామి రావణ నాకు భయమేసేస్తుంది రామ భూతమ్ ఇదం సర్వమ్ అరణ్యం ప్రతిభాతి మే అరణ్యమంతా రాముడే కొమ్మలు రాముడు సర్వం రామయం అంటారు చూశారా అలా కనపడింది మారీచుడికి ఒక్కడికే రామ భూతమ్ ఇదం సర్వమ్ అరణ్యం ప్రతిభాతి మే అరణ్యమంతా రాముడై ప్రకాశిస్తుంది, నాకు ఇక చెట్లు గుట్టలు ఏర్లు సెలయేర్లు, నదులు నదములు ఇవేం నాకు కనపడవు అన్నీ నాకు రాముడే కాబట్టి నాకు భయం ఇది ఎక్కడ వరకు పోయిందో తెలుసా..? పడుకుందామంటే దృష్ట్వా స్వప్నగతం రామమ్ కలొస్తే రాముడొస్తాడు కల దాటితేగతా సుసుప్తి, జాగ్రత్త నుంచి స్వప్నావస్త స్వప్తనావస్త నుంచి సుసుప్తి, అసలు నిద్రపోదామంటే రాముడే అందుకే నేను నిద్రపోయి చాలా కాలం అయిపోయింది, పోనీ జాగృతిలో ఉంటే రాముడే.
కాబట్టి ఇప్పుడు నేను రాముడి నుంచి తప్పించుకోగలిగిన స్థితిలో లేను నన్ను ఎప్పుడూ రాముడు అలా చూస్తుంటాడు నాకు అటువంటి రాముడు అలా కనపడుతూ ఉంటాడు నేను అలాగే భయం భయంగా భయం భయంగా భయం భయంగా ఒకచోట నక్కి ఉంటాను, నాకు ఎంత భయం పట్టేసిందో తెలుసా రాముడంటే రావణా రకారాఽఽదీని నామాని రామ త్రస్త స్య రావణ ! రత్నాని చ రథా శ్చైవ త్రాసం సంజనయన్తి మే !! నా దగ్గరికి ఎవరైనా వచ్చి రాతో మొదలెట్టినటువంటి అక్షరంతో ప్రారంభమైన పదాన్ని పలకపోయి రత్నం అందామని రా అన్నా నేను పారిపోతాను రామ అంటారేమో తరువాత అని రత్నాని చ రథా శ్చైవ రథం అన్నాడనుకోండి నేను పారిపోతాను తరువాత మ అంటాడేమోనని ర అని వినపడగానే పారిపోతాను, నాకు అసలు భయం పట్టేసిందియ్యా నాకు “రామ” అంటే భయం రాముడే కనపడుతుంటాడు నాకు ఇంకేం కనపడుట లేదు వచ్చిన బాధ. నాకు చెట్లూ పుట్టలూ ఏం లేవు అన్నీ రాముడే కనపడుతున్నాడు అది ఎలా పాశ హస్తమ్ ఇవాన్తకమ్ చంపేసేటటువంటి యమునిలా కనపడుతుంటాడు అన్నాడు.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి అయినా నేను తెలియక అడుగుతాను రావణా! మీ చెల్లెలు ముక్కూ చెవులూ కోసేశారు ఖర-దూషనాదులను చంపేశాడు ఉత్తిగనే చంపేశాడని చెప్పావు కదా..! ఏపని లేకుండా చంపేశాడన్నావు, నేను చెప్పనా యదార్థమేమిటో యది శూర్పణఖా హేతోః జనస్థాన గతః ఖరః ! అతివృత్తో హతః పూర్వం రామేణాక్లిష్ట కర్మణా !! అత్ర బ్రూహి యథా తత్వం కో రామ స్య వ్యతిక్రమః ! ఈ ఖర-దూషనాదులు అనేటటువంటివాళ్ళు మర్యాదని మరిచిపోయి రామ చంద్ర మూర్తి మీద ఇంత మంది కలిసి యుద్ధానికి వెళ్ళితే రాముడు 14 వేల మందిని యుద్ధంలో తెగటార్చాడు శూర్పణఖా యుక్తా యుక్త విచక్షణ మరిచిపోయి రాముని దగ్గరకి వెళ్ళితే ముక్కు చెవులు కోశారు తప్పా అసలు విషయం తెలుసుకోకుండా... నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతావేమిటీ..? తప్పది రాముని దోషం ఏముందని ఇవ్వాళ రాముని భార్యను అపహరిస్తానంటున్నావు? నీవు అలా మాట్లాడకూడదు అన్నాడు. అసలు నిజంగానండీ..! కుండబద్ధలు కొట్టినట్లు అంటారు చూశారా... అంత స్పష్టంగా మాట్లాడేశాడు, ముందే చెప్తాడుగా వక్తా శ్రోతా చ దుర్లభః వినకపోవడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో మీరు రావణునివైపు చూడాలి, రావణుడు చూడండి ఎలా మాట్లాడుతాడో తం పథ్య హిత వక్తారం మారీచం రాక్షసాధిపః ! అబ్రవీత్ పరుషం వాక్యమ్ అయుక్తం కాల చోదితః !! కాలుని చేత చోదితమైనవాడు అంటే యమధర్మరాజు చేత గ్రసింపబడడానికి సిద్ధంగా ఉన్నవాడికి మంచిమాట తలకెందుకెక్కుతుందా?.
Image result for మారీచుడుకాబట్టి ఎక్కలేదు వాక్యం నిష్ఫలమ్ అత్యర్థం ఉప్తమ్ బీజమ్ ఇవౌషరే ఊష నక్షత్రంలో పడిన బీజం విత్తనం ఎలా మొలకెత్తదో అలా మారీచుడు ఇంత కష్టపడి చెప్పినా రావణాసురిడి తలకు ఎక్కలేదు స్త్రీ వాక్యం ప్రాకృతం శ్రుత్వా వనమ్ ఏక పదే గతః రాముడి గురించి అంత గొప్పగా చెప్తావేమిటి ఆడదాని మాటవిని వెంటనే హఠాత్తుగా లేచి అయోధ్యవిడిచి అరణ్యవాసానికిపోయినటువంటి ఉద్రేకమున్నవాడు రాముడంటే అవశ్యం త మయా తస్య సంయుగే ఖర ఘాతినః ! ప్రాణైః ప్రియతరా సీతా హర్తవ్యా తవ సన్నిధౌ !! ఖర-దూషనాదులను సంహరించినటువంటి ఆ రాముడికి సరైనటువంటి శిక్ష ఆయన ప్రాణ సమానమైనటువంటి సీతను అపహరించడమే అది కూడా నీ సమక్షంలోనే జరగాలి అంటే నీవు నాకు ఉపకారం చేసి తీరాలి చుక్కల జింకగా రావాలి, నా మాట వినద్దనుకుంటున్నవేమో..? పంచ రూపాణి రాజానో ధారయన్తి అమితౌజసః ! అగ్నే రిన్ద్ర స్య సోమ స్య యమ స్య వరుణ స్య చ !! ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దణ్డం ప్రసన్నతామ్ ! రాజు అంటే రాజు ఒక్కడే అనుకుంటున్నావేమో..? రాజు ఐదు రూపాల్లో ఉంటాడు ఆయన అగ్నే రిన్ద్ర స్య సోమ స్య యమ స్య వరుణ స్య చ అగ్ని స్వరూపం ఆయనే ఇంద్ర స్వరూపం ఆయనే వరుణ స్వరూపం ఆయనే సోమ స్వరూపం ఆయనే యమ స్వరూపం ఆయనే ఐదు రూపాలలో ఉండి అగ్నిలా తీక్షణమైనటువంటి స్వభావాన్ని ఇంద్రుడిలా పరాక్రమాన్ని చంద్రుడిలా ఆహ్లాదకరత్వాన్ని వరునిలా దుష్టకర లక్షణాన్ని యముడిలా ప్రసన్నతను సంతరించుకుని రాజు ఉంటాడు.
కాబట్టి రాజుతో మాట్లాడేటప్పుడు ప్రసన్నుడవై అంజలి ఘటించి వినయంతో మాట్లాడటం నేర్చుకోవాలి, నేను అడగని విషయాలు నేను చెయ్యమనని బోధ నాకు ఎవడు చెయ్యమన్నాడు నిన్నూ ఇది ధూర్తలక్షణం కాదా... కాబట్టి నేను అడగందీ నీవెందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడేటప్పుడు భక్తీ శ్రద్ధా అవసరం కాదా..? నేను పోతాను నా రాజ్యం పోతుంది నా లంక

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
పోతుంది ఇదానీవు ప్రభువుతో మాట్లాడవలసిన మాటలు నేను ఏది చెప్పానో అది నీవు చేయి చాలు సౌవర్ణ స్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిన్దుభిః ! ఆశ్రమే తస్య రామ స్య సీతాయాః ప్రముఖే చర !! ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గన్తుమ్ అర్హసి ! నీవు నేను చెప్పనట్టుగా బంగారు చుక్కలు కలిగినటువంటి మృగంగా వేళ్ళి సీతమ్మ తల్లి యొక్క సమీపంలో కదలాడు రామ Image result for మారీచుడుచంద్ర మూర్తి నిన్ను వేటాడం కోసం వస్తాడు ఆ తరువాత నేను సీతాపహరణం చేస్తాను బ్రతికితే నీ ఇష్టం ఎక్కడికైనాపో... అపక్రాన్తే తు కాకుత్స్థే దూరం యాత్వా హి ఉదాహర ! హా సీతే లక్ష్మణే త్యేవం రామ వాక్యాను రూపకం !! రామ చంద్ర మూర్తి యొక్క కంఠం ఎలా ఉంటుందో అలాంటి కంఠాన్నే నీవు అనుకరిస్తూ హా సీతా హా లక్ష్మణా అని దూరంగా వెళ్ళిన తరువాత అరవాలి అరిస్తే రాముడికి అపకారం జరిగిందనుకొని లక్ష్మణుడు వెళ్ళిపోతాడు లక్ష్మణుడు వెళ్ళిపోతే నేను సీతను అపహరిస్తాను అపక్రాన్తే తు కాకుస్థే లక్ష్మణే చ యథా సుఖం ! ఆనయిష్యామి వైదేహీం సహస్రాక్షః శచీమ్ ఇవ !! ఇంద్రుడు శచీదేవిని ఎలా తీసుకెళ్ళుతాడో అలా నేను లక్ష్మణుడు దూరంగా వెళ్ళిన తరువాత సీతమ్మని తీసుకెళ్ళుతాను, రాజ్యస్య అర్థం ప్రదాస్యామి మారీచ తవ సువ్రత నీవు ఈ పని కాని చేసి పెడితే నేను రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను అని రావణుడు మాట్లాడటం అంటే ఎలా ఉంటుందో చూడండి.
మాట విననివాడు మాట్లాడటం అంటే ఎలా ఉంటుందో అద్భుతం రావణుడు నోటి వెంట వచ్చినటువంటి ఈ మాటని వాల్మీకి మహర్షి మనకు అందించడం ఆసాద్య తం జీవితం సంశయ స్తే మృత్యు ర్ధ్రువో హ్యద్య మయా విరుధ్య ఏత ద్యథావత్ ప్రతిగృహ్య బుద్ధ్యా య దత్ర పథ్యం కురు తథ్ తథా త్వమ్ !! నేను చెప్పినటువంటి పని చేసి నీవు మృగం రూపంలో వెళ్ళావా బ్రతకచ్చూ... చనిపోవచ్చు సంశయము చనిపోగలనని ఎందుకనీ... ఏమో రాముడు నీ మీద బాణం వేయకపోవచ్చు బతికేయచ్చు నీవు దూరంగా రామున్ని తీసుకెళ్ళిపోయి రామున్ని కంఠాన్ని అనుసరించి హా సీతా హా లక్ష్మణా అన్నాక లక్ష్మణుడు వెళ్ళిపోయాడనుకో నీవు చచ్చిపోవాలని నేనెందుకు కోరుకుంటాను నేను సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతాను పైగా బ్రతికున్న నీకు అర్ధరాజ్యం ఇస్తాను. నీవు నేను చెప్పిన పని చేయనన్నావనుకో ఇప్పుడే చంపేస్తాను కాబట్టి చచ్చిపోవడం ఖాయం నీకు రెండు రకాలుగా... ఒకటి నా చేతిలోనైనా చచ్చిపోవాలి రెండు రాముడి చేతిలోనైనా చచ్చిపోవాలి రాముడి చేతిలో చచ్చిపోతావా నా చేతిలో చచ్చిపోతావా..! రెండు రాముడి దగ్గరికి వెళ్ళితే బ్రతకచ్చేమో ఇంతకన్నా ఇంకోమాట ఉండదు ఎందుకో తెలుసా రాముడి దగ్గరికి వెళ్ళితే ఇంకా జింక వేషంలో సీతమ్మ తల్లిని లోభ పెట్టడానికి వచ్చిన మృగమూ అని ఆయన కంఠాన్ని అనుకరించి పలికిన తరువాత ఆయన బాణమేస్తే ఇక బ్రతికుంటాడా..?.
కాబట్టి ఇవ్వబడినటువంటి అవకాశం ఏమిటంటే నా చేతిలో చస్తావా రాముడి చేతిలో చస్తావా..? మారీచస్య మహాత్మనః ఏం కోరుకుంటాడు రాముడి చేతిలో చచ్చిపోవడాన్నే కోరుకుంటాడు చచ్చిపోవడం అన్నది ఎలాగో తథ్యం ఈ రావణుడి చేతిలో ఎందుకు చావు, కాబట్టి ఆఖరి అవకాశంగా ఇంకొక్క మాట చెప్పి చూస్తాను ఏమంటాడో..? కాబట్టి పాపం మారీచుడు మళ్ళీ నాలుగు మంచి మాటలు మాట్లాడటం ప్రారంభం చేశాడు ఆ మంచి మాటలో ఏమిటో ఏదో గబగబా చెప్పేయడం నాకు ఇష్టంలేదు ఎందు చేతనంటే మారీచుడి మాటలంటే అత్యద్భుతం అన్నమాట, కాబట్టి రేపటి రోజున ఆ మిగిలినటువంటి మాటలు చెప్పి మిగిలినటువంటి కథా క్రమాన్ని రామ చంద్ర మూర్తి ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలికేటటువంటి ప్రయత్నం చేస్తాను.

  అరణ్య కాండ పద్దెనిమిదవ రోజు ప్రవచనము
 
మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక్క 11 మాట్లు రామ చంద్ర మూర్తి యొక్క నామాన్ని పలుకుదాం.

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రామ!!
పాహి కృష్ణా యనచు ద్రౌపతి పలికినది శ్రీ రామ నామము !!రామ!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రామ!!
బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీ రామ నామము !!రామ!!
భక్తితో భజియించువారికి ముక్తి నొసగును రామ నామము !!రామ!!
భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రామ!!
సకల జీవులలోన వేలిగే సాక్షి భూతము రామ నామము !!రామ!!
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !!రామ!!
రాకడయు పోకడయులేనిది రమ్యమైనది రామ నామము !!రామ!!
సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామ నామము !!రామ!!
 దాసులను రక్షించ దయగల ధర్మ నామము రామ నామము !!రామ!!
పరమ పదమును చేరుటకు దారి చూపునది ఈ రామ నామము !!రామ!!
తల్లివలె రక్షించుసుజనుల నెల్లకాలము రామ నామము !!రామ!!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !!రామ!!

మంగళా శాసన...

No comments: