కిష్కింధ కాండ
ఇరవై ఏడవ రోజు
ప్రవచనము
తారుని యొక్క ప్రబోధం మేరకీ మళ్ళీ తిరిగి కిష్కింధకి
వెళ్ళకుండా అక్కడే మళ్ళీ స్వయంప్రభా బిలంలోకి మళ్ళీ ప్రవేశించి అక్కడే కాలం
గడిపేద్దాం ఎందుకంటే తిరిగి వెళ్ళినట్లైతే వేళ దాటిపోయిందికనుకా సుగ్రీవుడు ఆ
వానరులందర్నీ కూడా సంహరిస్తాడన్న భయంతో వాళ్ళందరూ మళ్ళీ స్వయంప్రభా బిలంలోకి
ప్రవేశిద్దామని నిర్ణయం చేసుకునేటటువంటి సమయంలో స్వామి హనుమా జోక్యం చేసుకున్నారు.
హనుమా ఎక్కడ మాట్లాడినా అత్యద్భుతంగా ఉంటుంది, నేను మీతో మనవి చేశాను అనేకమార్లూ
హనుమ జోక్యం చేసుకుని మాట్లాడారూ అంటే అది కథని ఎప్పుడూ మలుపు తిప్పుతూంటుంది,
మలుపు తిప్పుతుంది సాధారణంగా చచ్చిపోయేవాన్ని కూడా మళ్ళీ బతికిస్తుంది. అంటే ఇంక లోకంలో అన్నిటికన్నా చాలా
ధారుణమైన కష్టమూ ఏమిటంటే చచ్చిపోవడమే, అసలు నేను ఇంక శరీరంతో ఉండను నేను
భరించలేను ఈ శోకాన్ని అన్ననిర్ణయం తీసుకున్నాడూ అంటే చాలా కష్టంలో ఉన్నాడూ అని
గుర్తు, అంత కష్టంలో
ఉన్నవాడు ఆత్మహత్యకు పూనుకుంటాడు అది మహాపాతకము అది ఎట్టిపరిస్థితుల్లోనూ
చేయకూడదు. కానీ శరీరంతో ఉండి ఇంక నేను ఈ శోకాన్ని భరించలేను అనుకున్నవాడు
ప్రాణాలనే విడిచిపెడదామని సంకల్పం చేసుకున్నవాడు కూడా హనుమ యొక్క అనుగ్రహాన్ని హనుమ యొక్క మాటల్నీ
విన్నట్లైతే వెంటనే అతడు మళ్ళీ జీవితం మీద ఆసక్తిని పొంది విజయాన్ని సాధిస్తాడు,
హనుమ యొక్క స్థితి హనుమ యొక్క అనుగ్రహము ఎప్పుడు అలాగే ఉంటుంది.
శ్రీరామాయణం ప్రారంభం నుంచి కూడా అంతే మీరు చూడండి ఆయన
కిష్కింధ కాండలో కలిశారు, కిష్కింధ కాండలో మొట్ట మొదట సుగ్రీవుడు భయపడినప్పుడు
కలిసినప్పుడు కనపడిన హనుమ వాలి సుగ్రీవుల యొక్క మైత్రికి కారణమయ్యాడు, మళ్ళీ
సుగ్రీవుడు రాజ్యాన్ని రుమనీ పొందడానికి హనుమ చేసినటువంటి రాయబారం మధ్యవర్తిత్వమే
కారణం అలా సుగ్రీవున్ని నిలబెట్టాడు. మళ్ళీ అంగదుడు పొరపాటు చేస్తుంటే మాట్లాడి
అంగదుని యొక్క జీవిత స్థితిని దిద్దుతాడు అవుతుంది నూరు యోజనములు దూరం ఎవ్వరమూ
ఎగరలేములే కాబట్టి మళ్ళీ ప్రాయోపవేశం చేద్దామనుకున్నప్పుడు మళ్ళీ నూరు యోజనములు
దూరాన్ని ఆయనే సముద్రాన్ని లంఘించీ సీతమ్మజాడ కనిపెట్టడానికి వెళ్ళి వానరులయందు
విశ్వాసం నిలబెడుతారు. అక్కడికి వెళ్ళిన తరువాత సీతమ్మ తల్లి ఉరిపోసుకుని
ప్రాణములనే విడిచిపెడదామనుకునే సందర్భంలో రామ కథని చెప్పీ ఆవిడని బ్రతికిస్తాడు.
అక్కడ నుంచి వెళ్ళి చనిపోకుండా ఆపుదామని రావణాసురిడికి ఉపదేశం చేశారు వినక
వాడునాశనమైపోతే ఆయనేం చేస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి దక్షిణ
సముద్రపు ఉత్తర
ఒడ్డుకు వచ్చిన ఆయనా సీతమ్మతల్లి దర్శనం అయ్యిందీ అన్న క్షేమవార్త వానరములకిచెప్పి
ఇప్పుడు మనం మళ్ళీ బ్రతుకుతాం ఇప్పుడు మనం ఈ శుభవార్తతో వెళ్ళుతున్నాం కాబట్టి
సుగ్రీవుడు మనల్నీ చంపడూ అన్న విశ్వాసాన్ని వానరులయందు నింపారు.
|
వెళ్ళీ సీతమ్మతల్లి జాడ
ఏదిక్కునా తెలియలేదని బెంగపెట్టుకున్న రామ చంద్ర మూర్తికి దక్షిణ దిక్కున కాంచన
లంకలో సీతమ్మ ఉందీ అన్న క్షేమ వార్తను చెప్పి మళ్ళీ రామ చంద్ర మూర్తి యొక్క
ప్రాణములను నిలబెట్టినవారు హనుమే. మళ్ళీ అక్కడ నుంచి సేతువు కట్టీ లంకాపట్టణానికి
యుద్ధానికి వెళ్ళిన తరువాత వాళ్ళు రామ లక్ష్మణులతో సహా అందరూ కూడా ఇంద్రజిత్ యొక్క
అస్త్రము చేత బంధింపబడి పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఇన్ని కోట్లమంది
వానరుల్ని బ్రతికింపజేసినవారు హనుమయే. చిట్ట చివరలో ఇంద్రజిత్ యొక్క ఉద్ధతీ ఎవరూ
తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది విభీషణుడంతటివాడు హోమాన్ని కాని ఇంద్రజిత్
పూర్తిచేస్తే ఇంక ఎవరూ నిగ్రహించలేడూ అన్నప్పుడు ఇంద్రజిత్ హోమం పూర్తిచేయకుండా
బయటికి వచ్చేటట్లుచేసి ఇంద్రజిత్ మరణానికి కారణమై రామునియొక్క సైన్యమంతా
రక్షించడానికి హేతువైనవారు హనుమే. 14 యేళ్ళు పూర్తైపోతే ప్రయోపవేశం చేసేస్తాడు భరతుడు
అందుకని నేను భరద్వాజాశ్రమంలో ఉండి వస్తాను నీవు వెళ్ళి క్షేమవార్త చెప్పూ అంటే 14
యేళ్ళు పూర్తైపోయిన కారణంచేత ప్రయోపవేశం చెయ్యడానికి సిద్ధపడుతున్నటువంటి భరతునికి
రామ చంద్ర మూర్తి యొక్క పునరాగమన వార్తనీ క్షేమ వార్తనీ చెప్పి భరతుని యొక్క
ప్రాణములు నిలబెట్టినటువంటివారూ స్వామి హనుమయే.
మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీనం చేస్తే హనుమ ఎక్కడ ఉన్నాడో అక్కడ
ప్రాణాలు ఉంటాయి అంటే చచ్చిపోయేవాళ్ళని ఒకళ్ళని కాదు వందలమందిని కాదు వేల మందిని
కాదు కోట్ల మందిని ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఎప్పుడూ ఆర్తత్రాణ పరాయణుడై రక్షించినటువంటి
మహానుభావుడు హనుమ ఆ హనుమ యొక్క వైభవానికి తెరతీస్తుంది కిష్కింధ కాండ యొక్క
చిట్ట చివరి భాగం ప్రత్యేకించి ఆయన వైభవం ఎంత గొప్పదో ఆవిష్కరిస్తుంది. కాబట్టి
ఇప్పుడు అంగదుడు స్వయంప్రభా బిలంలోకి మళ్ళీ ప్రవేసిద్దామని నిర్ణయం
చేసుకునేటటువంటి సమయంలో హనుమా మాట్లాడుతున్నారు హనుమ మాట్లాడటం అంటే ఏదో మాట్లాడటం
కింద ఉండదు. బాగా పూర్వాపర విచారణ చేసుకుని ముందు తన మనసులో ఒక స్థిరనిర్ణయం
ఉంటుంది ఇలా చేద్దామూ అని ఇలా చేద్దామూ అని ఆయన ఏమనుకున్నారో దాన్నే మాట్లాడుతాడు
ఆ మాట్లాడేటప్పుడు ఎంత అందంగా ఉంటుందో తెలుసాండి అవతలి వారికి ఆ వాదాన్ని ఖండించి
మాట్లాడటం కష్టం అలాగని కేవలం వాదనా పటిమ కొంతమందియందు ఉంటుంది జ్ఞాన ఖలునిలోని
శారదవోలె అంటారు పోతనగారు, ఒక పెంకివాదన ఏదో ఇక మొండితనంగా ఇక తను చెప్పిందే
జరగాలన్నట్లుగా మాట్లాడుతారు అలా ఉండదు బుద్ధిమతాం వరిష్ఠం ఆయన మాట్లాడితే
అవతలివారి ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి మాట్లాడుతారు.
కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచించారు సామముతో మాట్లాడడానికి
అంగదుడు యువరాజు కుదరదు ఇక్కడ, దానము చేయడానికి ఆయన యువరాజు దానంతో ఏం
మాట్లాడుతాడు దండోపాయం కుదరదు కాబట్టి ఇంకున్నది భేదం అంటే ఇప్పుడు అంగదుడుకానీ
ఇటువంటి నిర్ణయం తీసుకుని సుగ్రీవుని యొక్క కార్యం మీద రామ కార్యం మీద ముందుకువెళ్ళడం
మానేసి సుగ్రీవుడు చంపుతాడన్ని భయంతో స్వయంప్రభా బిలంలోకి వెళ్ళిపోతే దక్షిణ
దిక్కుకి సుగ్రీవుడు ఏ నమ్మకం పెట్టుకుని ఇంతమంది యోధుల్ని పంపాడో ఆ నమ్మకమంతా
ఒమ్మయైపోయి సీతమ్మతల్లిజాడ కనిపెట్టడమనేటటువంటి విషయంలో కృతకృత్యులయ్యే అవకాశం
ఉండదు. వీళ్ళు భయంతో చచ్చిపోతున్నారు మీరు చాలాజాగ్రత్తగా గమనించండి ఇంక
ఇక్కడ్నుంచి మీకేం కనపడుతుందంటే దక్షిణ దిక్కుకు వెళ్ళిన ఇన్నివేల మంది వానరులు
మరణిస్తున్నారు దేనివలన మరణిస్తున్నారు భయంచేత మరణిస్తున్నారు తప్పా వాళ్ళుకి ఇప్పుడు ఆరోగ్యంలేక
మరణిచడంలేదు భయానికి చచ్చిపోతున్నారు. దేనికి భయం వెనక్కి వెడితే
సుగ్రీవుడు చంపేస్తాడు ముందుకు వెడితే సీతమ్మ కనపడ్డంలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు
మానసికంగా చచ్చిపోయారు వాళ్ళయందు ఉత్సాహం చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ముందు
వెళ్ళి సీతమ్మజాడ కనిపెడదామన్ని ఆశలేదు వెనక్కి వెళ్ళి బ్రతుకుదామన్న ఆశలేదు.
|
మాట బాగున్నవానికి
లోకమంతా మిత్రులే మాట బాగుండనివానికి లోకమంతా శత్రువే వాడు ఎంత మంచివాడైనా
కానివ్వండి మాట బాగుండదనుకోండి ఎవరూ ఆయన్ని పలకరించడానికి పిలవడానికి పదిమందిలో
ఆయన్ని తీసుకురావడానికి ఆయనతో వచ్చికూడి ఉండడానికి ఇష్టపడరు. ఆయనా ఏమీ
చెయ్యకపోయినా మంచిమాట మాట్లాడడనుకోండి చాలు అందరూ హర్షిస్తారు, కాబట్టి ఇప్పుడు
ఆయన వాక్య సంపదతో భేదమును కల్పించి తద్వారా అటు రాచకార్యమూ ఇటు అంగదుడు చెయ్యవలసిన
కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయనా భోదచేసే ప్రయత్నం చేస్తున్నారు నిత్యమ్
అస్థిర చిత్తా హి కపయో హరి పుంగవ ! న ఆజ్ఞాప్యం విషహిష్యన్తి పుత్ర దారాన్ వినా
త్వయా !! ఎంత గొప్ప విషయాన్ని ఆయన ప్రస్థావనలోకి తీసుకొచ్చారో చూడండి నిత్యం
అస్థిర చిత్తా హి కపయో హరి పుంగవ ఓ అంగదా! నీవు వీళ్ళందర్నీ నమ్ముతున్నావు
స్వయం ప్రభా బిలంలోకి వస్తారని వీళ్ళు వానరులు కాబట్టి వీరు చపలచిత్తులు వీళ్ళు
ఒకలా ఉండరు వీళ్ళ మనస్సు చాలా దొందరగా కదిలిపోతుంది వీళ్ళు సహించలేనిది ఒకటి
వీళ్ళల్లో ఉన్నదీ అన్నది నీవు మరిచిపోతున్నావు. ఎంతసేపూ ఏం మాట్లాడుతున్నావంటే
సుగ్రీవుడు చంపేస్తాడన్న భయంతో ముందుకి వెళ్ళవద్దు అంటున్నావు కానీ నీతో నేనొక
సత్యం మనవి చేస్తున్నాను పుత్ర దారాన్ వినా త్వయా వీళ్ళు వీళ్ళ యొక్క
బిడ్డల్నీ భార్యల్నీ విడిచి ఉండలేరు. స్వయంప్రభా బిలంలోకి వెళ్ళితే ఏమౌతుంది బ్రతికే
ఉంటారు, బ్రతికి ఉండడం ప్రధానం కాదు వీళ్ళకి వీళ్ళు బ్రతికీ బరువౌతారు ఎందుకో
తెలుసా వీళ్ళు బ్రతికి ఉంటే వీళ్ళకేం గుర్తొస్తుందంటే వీళ్ళ భార్యలూ వీళ్ళ బిడ్డలూ
వీళ్ళకి గుర్తొస్తుంటారు.
|
నిజానికి ఇలా అంటున్నాడు కానీ లోపలికి వెళ్ళి
బ్రతకండనిచెప్పి మనకి అన్నంపెట్టి శుబ్రంగా స్వయంప్రభా బిలంలో తేనె దొరుకుతుంది
పళ్ళు దొరుకుతున్నాయి నీళ్ళు దొరుకుతున్నాయి తినండి తాగండి వ్యాయామం చెయ్యండీ అంటే
దేనికి మనం బ్రతికుండి భార్య పిల్లలు కనపడనప్పుడు నిజమే ఏమిటి అలా అంటాడేమిటని
వానరులకీ... నిజమే నేను వానరులని నమ్మడానికి వీలులేదని అంగదునికి ఇప్పుడు ఒకరి మీద
ఒకరికి అనుమానం వచ్చిందాలేదా. ఒక్కమాటతో భేదాన్ని ప్రయోగించారు ఆయన అంటే వీళ్ళందరూ
ఒక్కమాటమీద ఉండకుండా ఉండేటట్టు చెయ్యగలిగారు అంటే ఇప్పుడు ఇది కాదులెండి ఇంకో
ప్రతిపాదన ఏదైనా పరిశీలిద్దాం అనేటట్టు చేస్తున్నారన్నమాట ఇదీ ఆయన ప్రజ్ఞ. ఆంతరమునందు
ఏమిటీ? ఎందుకీ భేదమును కల్పించడము, వాళ్ళందరిచేతా ఒక మంచిపని చేయించడము, ఏమిటా
మంచిపని? రామ కార్యము మీద ముందుకు వెళ్ళగలిగిన ప్రజ్ఞ వాళ్ళయందు అంకురింపచేయడం అలా
జరుగుతుందా లేదా పక్కన పెట్టండి కానీ ఆయన హృదయం అది. కాబట్టి ఆయన ఇప్పుడు
అంటున్నారు విగృహ్యాఽఽసనమ్ అప్యాఽహుః దర్బలేన బలీయసః
! ఆత్మ రక్షా కర స్తస్మాన్ న విగృహ్ణీత దుర్బలః !! ఈ శ్లోకం నాకైతే
అనిపిస్తుంది ప్రత్యేకించి దీన్ని ఎవరు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుందంటే చదువుకునే
రోజుల వరకు బాగుంటుందికానీ చదువుకున్న తరువాత ఉద్యోగంలోకి వెళ్ళడమన్నది ఒకటి
ప్రారంభమౌతుంది.
నేను నా స్వానుభవంలో గమనించింది ఏమిటంటే ఉద్యోగంలో జాయిన్
అయ్యేటప్పటికీ చాలా ఉత్సాహంగానూ వేడినెత్తురు ఉరకలేస్తూ ఉంటుంది. మంచి
యౌవ్వనంలోగదాండి చేరుతారు అందులో ఎవరో ఉంటారు సాధారణంగా ఏం చేస్తారంటే మన అధికారి
ఎటువంటివారండీ ఈయ్యన ఎలాంటాయన ఫర్వాలేదా మంచాయనేనా ఇలాంటి ప్రశ్నవస్తుంది ఎక్కడో
ఒకచోట వెయ్యగానే ఏం ఫర్వాలేదండీ చాలా మంచాయనా అంటే మనమేం చేసినా చెల్లుతుందన్న
భావన వస్తుంది. అమ్మో అలాంటి ఇలాంటివాడు కాదండోయ్ ఒకగంట ఆలస్యంగా వస్తానన్నా
అనుమతించడు. ఒకవేళ నెత్తురు కక్కుతుంటే అలాగే వచ్చి అటెన్డెన్సులో సంతకం పెట్టాలి
తప్పా ఆయన మాత్రం ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఒప్పుకోడు అంత నియంత
అన్నారనుకోండి ఆయనమీద భేద భావము వస్తుంది.
ఇక అక్కడితో ఊరుకోడు ఇంకా ఉద్యోగంలో చేరి
రెండురోజులౌతుంది అధికారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడటం మొదలు పెడుతాడు, మీరు
చెప్పింది నిజమేనండీ నేను లోపలికెళ్ళానా ఏమన్నారో తెలుసా ఎంత చులకనగా మాట్లాడారో
తెలుసా అంటారు, వీడు లోపలికి చేరేస్తాడు నిన్నగాక మొన్న చేరాడాండి ఎలా మాట్లాడాడో
తెలుసా సార్ అంటాడు.
|
ఇది ఏమౌతుందో తెలుసాండీ నాకూ నా అదృష్టమో ఏమో తెలియదు కానీ
నేను ఉద్యోగంలో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది నాకో
మిత్రుడు నాకొక సలహా ఇచ్చాడు ఆయనా నా కన్నా చాలా సీనియర్ అప్పటికి ఇప్పుడు ఆయన
రిటైర్డ్ అయిపోయారు ఆయన అన్నారు ఏమయ్యా ఇవ్వాళ నీవు కొత్తగా ఉద్యోగంలో జాయిన్
అయ్యావు నేను నీకొక విషయం చెప్తాను నీవు చాలా జాగ్రత్తగా పదవీ విరమణ చేసేవరకు
గుర్తుపెట్టుకో అన్నారు, ఏమిటీ అన్నాను ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతను నీవు విచారణ చేయవద్దు.
నీ కన్నా నీ అధికారి తెలివి తక్కువాడే కావచ్చు కానీ ప్రభుత్వం అతన్ని అందులో కూర్చోబెట్టింది నీవు గౌరవం
ఇవ్వవలసి ఉంటుందీ అన్నది గుర్తుపెట్టుకో తప్పా నీ అధికారికి నీవు
వ్యతిరేకంగా ప్రవర్తించీ ఏదో సాధించుకోగలనని అనుకోవద్దూ నీవు మనశ్శాంతిని
కోల్పోతావు నీవు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనావస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో తోటివాళ్ళతో చెప్పొద్దు.
నీ అధికారితోనే నీవు వ్యతిరేకించి ఇంక ఆయన కింద పనిచేయకుండా వెళ్ళిపోయే ఏర్పాటు
చేసుకో వ్యతిరేకించి
అధికారుల దగ్గర ఉండవద్దు ఎందుకో తెలుసా ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు
చాలా అశాంతి కలుగుతుంది స్థాన బలిమీ అది చాలా గొప్ప విషయము.
కాబట్టి అధికారులయందు
ఎప్పుడూ సఖ్యంగా ఉండడానికి ఒక తండ్రి ఒక మాటంటే ఎంత గౌరవంగా తీసుకుంటావో ఒక
అధికారి ఏదైనా అన్నప్పుడే కానీ మందలించినప్పుడు కానీ సహృదయంతో ఉండడమే నేర్చుకో
ఇప్పుడు నీ సంస్థకి నీ అధికారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నీవు రేపొద్దున
అధికారివి కావచ్చు కానీ నీ పైన కూడా ఒక అధికారి ఉంటాడుగా.... అధికారి మీద అధికారి
ఉండకుండా సాధ్యంకాని వ్యవస్థ ఇది కాబట్టి దీనికి నీవు ఇమిడితే నీ మనస్సు
ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. నేను ఆ తరువాత అలా ఉండడం చేతకాక దెబ్బతిన్న కొన్ని
వందలమందిని చూశాను, ఏదో ఒక కారణానికి ఆ.. ఆయనా..! నా కన్నా ఏం మొనగాడండీ అని
దెబ్బతిన్నవాళ్ళని కొన్ని వందలమందిని చూశాను నేను. నేను అప్పుడు అనుకున్నానూ ఓరేయ్
నాకు అంమృతపు చుక్కనే పోశాడురా ఆయనా చాలా గొప్ప విషయమే చెప్పాడు. నిజమే జీవితంలో
కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి అనుకున్నాను. స్వామి హనుమా ఒక అత్యద్భుతమైన
విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే శ్రీరామాయణం అమృతమండి అందుకే ఎప్పటికీ కాలంతో సంబంధం లేదు
ఎప్పటికి అలాగే అమృతంగానే
పనికొస్తుంది, ఆయన అంటున్నారూ నాయనా! విగృహ్యాఽఽసనమ్ అప్యాఽహుః దుర్బలేన
బలీయసః ! ఆత్మ రక్షా కర స్తస్మాన్ న విగృహ్ణీత దుర్బలః !! ఎన్నడూ కూడా ఒకవిషయాన్ని
దృష్టిలో పెట్టుకో బలవంతుడైనటువంటివాడు
బలహీనుడైనటువంటివాన్ని వ్యతిరేకించి ఎక్కడైనా బ్రతుకగలడు. బలహీనుడైనటువంటివాడు
బలవంతుడైనవాన్ని ఎదిరించి ప్రశాంతంగా బ్రతుకలేడు బాగాగుర్తుపెట్టుకోండి ఎంత
గొప్పమాట ఎలా ప్రారంభం చేశాడో చూడండి.
నీవు ఏమనుకుని నిర్ణయం చేస్తున్నావు నేను యువ రాజుని నా
దగ్గర వీళ్ళందరున్నారు కాబట్టి నేను ఒక నిర్ణయం చేసి వీళ్ళని బ్రతికించగలనని నీవు
అనుకుంటున్నావు కానీ నీకన్నా బలవంతుడు ఇంకోడున్నాడు, నీవు వీళ్ళని రక్షిద్దాం
వాళ్ళనుంచి వీళ్ళని రక్షిద్దామనుకున్న నీ ప్రయత్నం వాళ్ళతో విభేదించడమే అవుతుంది.
సుగ్రీవుడితో విభేదించడం కాదా...
రామ లక్ష్మణులతో
విభేదించడం కాదా... రామ లక్ష్మణులతో విభేదించి నీవు ఈ మూడు లోకలములలో ఎక్కడ
దాక్కున్న ప్రశాంతగా ఉండగలవా నీకు చెప్పినపని చేయకుండా ఉండగలనని అనుకుంటున్నావా
నీవు దాక్కో స్వయంప్రభా బిలంలోకెళ్ళి ఆయనకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి
రాలేదు కొంత దూరం వెళ్ళి స్వయంప్రభ బిలంలోకి వెళ్ళిపోయి ఉండిపోయారని వెనక్కొస్తే
చంపేస్తానని ముందుకి వెళ్ళలేదు వెనక్కిరాలేదు వచ్చి కబురు చెప్పలేదు అంటే రాజదండన
తప్పుకునే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఒకటి సుగ్రీవుడికి కోపమొస్తుంది రెండు
దక్షిణ దిక్కున పూర్తిగా అన్వేషణ చెయ్యకుండానే స్వయంప్రభా బిలంలో జీవితంకోసం
దాక్కున్నాం కాబట్టి రాముడికి కాదు కోపమొచ్చేది రామ కార్యంలో వైక్లవ్యానికి లక్ష్మణ మూర్తికి కోపమొస్తుంది
రామునికి కోపమొస్తుందని ఆయన అనలేదు, రామునియందు దయపాళ్ళు చాలా ఎక్కువ కానీ
రామ కార్యానికి భంగం జరిగితే కోపమొచ్చేది ఎవరికంటే లక్ష్మణునికి. ఎంత
సునిషితప్రజ్ఞతో అన్నారో చూడండి ఆమాట తప్పా రాముడికి కోపం వస్తుందనలేదు
లక్ష్మణునికి కోపమొస్తుంది రాముడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే చంపేస్తాను సుగ్రీవున్ని
అన్నది ఎవరు లక్ష్మణుడు, చిట్టచివర ఏమన్నాడు మా అన్నయ్య కళ్ళనీళ్ళు చూడలేక నేను
ఇలా మాట్లాడాను క్షమించు అన్నారు.
|
కాబట్టి రామ కార్యాన్ని సగంలో వదిలేసి స్వయంప్రభా బిలంలో
దాక్కున్నావు అని తెలిస్తే లక్ష్మణుడు అక్కడనుంచి ఇక్కవచ్చి నిన్ను వెతకక్కరలేదు యాం
చ ఇమాం మన్యసే ధాత్రీమ్ ఏత ద్బిలమ్ ఇత శ్రుతమ్ ! ఏతత్ లక్ష్మణ బాణానామ్ ఈషత్కార్యం
విదారణే !! ఒక ఆకుల దొప్పనీ చీల్చేయడం ఎంత తేలికో ఈ స్వయంప్రభా బిలాన్ని అక్కడ
ఉండి సంకల్పం చేసి బాణంవేసి చీల్చేయడం అంత తేలికపని కష్టపడికాదు అక్కడ్నుంచి
చీల్చేస్తాడు ఈ బిలాన్ని నీవు ఎందుకు పైకిరావో చూస్తానని అంతటి మహాబలవంతుడితో
వైరంపెట్టుకుని బ్రతుకుదామనుకున్నావా... ఈశ్వరునితో వైరం పెట్టుకునీ ఎక్కడ
బ్రతుకుతారండీ! ఈశ్వరుడితో
వైరం పెట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. భగవంతున్ని నిందించి నీవేం
సాధిస్తాం భగవన్ మార్గమునందు ప్రయాణిస్తూ వైక్లవ్యమొచ్చినచోట ఆయనకు క్షమార్పచెప్పుతూ బ్రతకడం ఎప్పుడూ
మంచిది అందుకే ఎప్పుడైనా ఈశ్వరుని దగ్గరికి వెడితే ఒక విషయం అడుగుతుండాలి
దాన్నే మనం వేంకటేశ్వర సుప్రభాతంలో ప్రతిపాదన చేస్తుంటాం అహం దూరతస్తే
పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి, సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ ఈశ్వరా! ఇంతకానికి నేను నీ దర్శనానికి నిన్ను
సేవించడానికి నీ కొండమీదకి వచ్చాను ఇవ్వాళ నేను సద్బుద్ధితో వచ్చి నీ కొండ ఎక్కి నీకు
సేవ చెయ్యాలని వచ్చినటువంటి ఈ క్షణం విధిగా మిగిలిపోయింది. మళ్ళీ యేడాది తరువాత ఎప్పుడో
వేంకటాచలం రావడంకాదు ఇవ్వాళ
నేను చేసినటువంటి ఈ సేవ ప్రతినిత్యమూ నేచేయగలిగినటువంటి సేవగా మారుగాకా...
అని మీరు అడగవలసి ఉంటుంది.
నిన్న రాముడు ఇదే కదాండీ చెప్తాడు ధర్మార్థసమన్వయంలేని కామప్రవృత్తి చెట్టు కొమ్మ
యొక్క చివర పడుకున్నవాడితో సమానం కిందపడిపోతాడు. అర్థ కామములను ధర్మంతో
ముడివేసుకోవాలి లేకపోతే నీ జీవిత ప్రయోజనంను సాధించలేవు అది చెప్పడం వెనక రామ
చంద్ర మూర్తి వెనకాల ఉన్న ప్రయోజనం కూడా ఇదే ఎప్పుడూ కూడా మనిషిని మర్చిపోకుండా
అవి విభాగం చేస్తుండాలి అందుకే నేను నిన్నను మనవిచేశాను మనుష్య జీవితాన్ని అసలు
వేదం అంత గొప్పగా విభాగం చేసేసింది బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది జీవితాంతం పనికిరావాలి,
గృహస్తాశ్రమంలో ఉన్నది సుఖము శాంతి నిజమైన సుఖము కాదని తెలుసుకోవడానికి ఉండాలి
తప్పా అనుభవించేవన్నీ సుఖాలు అనుకోవడం గృహస్తాశ్రమం కాదు, ఒక సుఖం అనుభవించారు
చాలా సుఖంగా అనిపించింది నిజంగా చెప్పు ఇది సుఖమా ఏది మళ్ళీ అనుభవించు ఇంకోమారు
ఇంకోమారు అనుభవించు నాలుగోమారు ఏమంటుంది అబ్బాహ్... ఏమిటి మళ్ళీ ఏం చికాకు ఇదేం
సుఖం అనిపిస్తుంది మొహం వాచేస్తుంది. తినండి ఒక్కసారి చెక్కరపొంగలి మీకిష్టమని
మళ్ళీ మారు వేయుంచుకోండి మళ్ళీ మారు వేయించుకోండి నాలుగోమాటు తింటాడా ఇక తినలేరు కాంచిక
ధియా అంటారు శంకరాచార్యులవారు ఇంకో ముద్ద తినాలంటే నిమ్మకాయముక్క
నోట్లోపెట్టుకోవాలి లేకపోతే తినలేరు. తప్పు చెక్కరపొంగలిదా మనసుదా చెక్కరపొంగలిది
సుఖమైతే ఒకటో మాటిచ్చిన సుఖం నాల్గోమాట ఎందుకివ్వలేదు అంటే సుఖము వస్తువుయందులేదు మనసుయందు
ఉన్నది. ఏది సుఖమని కాసేపంటుందో దాన్ని దుఃఖమని తరువాత అంటుంది. సుఖము
దుఃఖము అని పేర్లు మారుస్తుంటుంది. ʻకʼ అలాగే ఉంటుంది
మీతో మనవి చేశా ʻసుʼ ʻదుʼ మారుతుంటాయి. అది
మనసుయొక్క ప్రజ్ఞ కాబట్టి సంసారమునందు ఉండేది ఎందుకంటే ఇవన్ని సుఖాలా అన్నది
గమనిస్తుండాలి ఇవి కావు సుఖాలు ఏది సుఖం రేపు చెప్తాడు ప్రహ్లాదుడు ఏది ఈశ్వర పాదారవింద సంసేవనముచేత
ఆనందం కలుగుతుందో అది సుఖం ఈశ్వర సేవవైపుకు వెళ్ళి అది శాశ్వతమైన ఆనందమూ
అని గుర్తెరుగడం దానికి ఇవి తాత్కాలిక సుఖములు నిజమైన సుఖములు కావు అని మీరు
తెలుసుకోవడానికి సుఖము అనుభవించి ఈ సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యం
పొందడానికి మీకు పనికొస్తుంది. నేను వైరాగ్యం అన్నమాట అన్నానని మళ్ళీ హా...
ఏముందండీ అన్నదల్లా వైరాగ్యమని మీరు అనుకోకండి ఎందుకో తెలుసా... మళ్ళీ వైరాగ్యం
రెండు రకాలుగా ఉంటుంది.
|
కాబట్టి అది మొదటేవస్తే బట్ట మార్చుకున్నవాడు అదృష్టవంతుడు సరే అది
వేరేవిషయం, కానీ నా మనవి ఏమిటంటే గృహస్తాశ్రమం దేనికీ అంటే దీన్ని తెలుసుకోవడానికి
ఇది తెలుసుకోవడానికి తప్పా ఇక వ్యామోహానికి అర్థంలేకుండా కొడుకైపోయింది కోడలు
వచ్చేసింది కూతురైపోయింది అల్లుడు వచ్చేసాడు మనమలు వచ్చేశారు ముని మనమలు
వచ్చేశారు.
ఇంకెంతమది ఎన్ని
చూస్తావు ఎన్నితరాలు చూస్తావు అలా వస్తారూ ప్రజోత్పత్తి ఇవ్వాళ నీవు కూర్చున్నావు
పెళ్ళిపీఠమీద రేపు నీ కొడుకు కూర్చుంటాడు ఆతరువాత నీ మనమడు కూర్చుంటాడు.
ఒక్కొక్కడొస్తాడు పదవీ విరణచేస్తాడు ఇంకోడు ఆ పదవిలోకి వస్తాడు కదా. అలా సీటు అదే
కానీ వ్యక్తులు మారిపోతంటారు, ఎన్ని చూస్తావ్ ఏం చేస్తావ్ చూసి ఇది ఇలా ఉంటుంది
లోకం యొక్క పరిణామం కాని మారుతున్నవి
ఇవన్నీ ఇది మారుతోంది ముడతలు పడుతుంది, కానీ మారనిది ఒకటుంది అదిలోపల అప్పుడూ
ఇప్పుడూ ఎప్పుడూ గమనిస్తూ అలాగే ఉంది అది మారట్లేదు బాల్యాదిష్వపి
జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపిః వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం
సదాః స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయాః భద్రయా తస్మై శ్రీగురమూర్తేయే నమ
ఇదం శ్రీదక్షిణామూర్తయే !! అంటారు శంకర భగవత్పాదులు. ఆ లోపలి వస్తువు నీవ్వూ
అన్న సత్యం అనుభవంలోకి వచ్చేప్రయత్నం చేయ్యాలి, దీనికి ఒక స్థితి వచ్చిన తరువాత సాక్షిమాత్రంగా ఉంటాడు.
భార్యతో కలిసి వానప్రస్తంలోకి వెళ్ళిపోతాడు.
|
ఇంక ఇవన్నీచాలు ఇచ్చేశాం తాళం చెవులు ఇంకా ఎన్నాళ్ళు ఎన్ ఎస్సీ సర్టిఫికెట్లూ,
ఫిక్సడ్ డిపాసిట్లూ, ఇంట్రెస్టు, పెన్షనూ ఈ దిక్కుమాలినగోల ఎన్నాళ్ళు, ఉండదు ఈ
శరీరం పడిపోతుంది, ఏదో కోడలు పెట్టింది తిను చాలు కడుపు నిండిందా లేదా చాలు కొడుకు
అయ్యింది ఈశ్వరుడి గురించి ఆలోచన చేస్తుంటాడు భార్యతో కలిసి ఉంటాడు ఆ తరువాత
ఇంకసలు అలా కూడా ఉండాలని లేదు ఇంక నాకు చాలా వైరాగ్యం వచ్చేసిందనుకోండి ఆ
వ్యక్తికి ఆయనేం చేస్తాడు బట్ట మార్చేస్తాడు అంటే ఇక దీనికి ఆకలేస్తే దగ్గొస్తే మందేసినట్లు,
దగ్గువస్తే మందువేసుకునేటప్పుడు మందు ఏ రుచుందని పెట్టండని అడగరుకదా ఏం హోటల్లో
ఆర్డర్ కాదుగా డాక్టరుగారు రాసిన మందు అలా దీనికి ఆకలేస్తే నాలగిళ్ళ ముందుకెళ్ళి
భవతి భిక్షాందేహి అంటాడు. దున్నపోతులా ఉన్నావ్ ఏం పనిచేసుకోలేవు అంటే ఓ నవ్వు
నవ్వుతాడు. ఏదో కబళం చేతిలో పడితే అన్నీ కలుపుకుని కడుపునిండేవరకు తింటాడు ఇంక
వదిలేస్తాడు. నేను ఒకప్పుడు ఒక మహానుభావుని చూశాను భీమిలీపట్నంలో ఆయనా కొండనుంచి
వస్తారండీ ఆయనకు ఆకలేస్తే అన్నారు, నేను ఆయన గురించి ఎదురుచూస్తున్నాను ఆయనా ఆవులు
తాగేసి విడిచిపెట్టేసేంతవరకు చూశారు కుడితి కుండలో వదిలిపెట్టేసిన తరువాత కింద
పిండి మిగిలింది ఆ పిండి ఆయన కొద్దిగా పుచ్చుకుని అక్కడ మంచినీళ్ళు ఉంటే ఆ నీళ్ళు
తాగి మళ్ళీ పైకి వెళ్ళిపోతూంటే అదృష్టవశాత్తూ ఆయనా నాతో మాట్లాడారు అది వేరేవిషయం
అనుకోండి.
కాబట్టి మహానుభావులు అంత సాక్షిగా ఉంటారు ఈ శరీరం గురించి ఏమీ పట్టింపులేని స్థితిలో ఉంటారు అలా ఉండి
ఉండి పడగొట్టేస్తారు అది పడిపోతుంది తాను లోపల ఉన్న వస్తువుగా మిగిలిపోతాడు అది
సన్యాసాశ్రమం ఆ చిట్టచివరి ఆశ్రమాన్ని పొందడానికి దీనిని గెలిచి
వెళ్ళమంటారు అందుకని బ్రహ్మచర్యంలో పొందినటువంటి జ్ఞానం చిట్టచివర పండించడానికి
పనికొస్తుంది అప్పుడా తపసా షడ్రిపూన్ జిత్వా భార్యాం పుత్రే నివేశ్య చ అంత
గొప్పదండి సనాతన ధర్మం. 85 యేళ్ళు రానియ్యండి 90 యేళ్ళు రానియ్యండి భార్యని మాత్రం
ఇంక నాకు వైరాగ్యం
వచ్చేసింది ఇంకనేను వెళ్ళిపోతాను అని వదిలిపెట్టే అధికారం పురుషుడికి లేదు భార్యాం
పుత్రే నివేశ్య చ కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి ఒరేయ్ నాకిక పూర్ణవైరాగ్యం
వచ్చింది నేను నీకు బరువౌతాను మీరు నన్ను భరించడం కష్టమౌతుంది నా ప్రవర్తన అదోలా
అనిపిస్తుంది మీకు కాబట్టి నేను ఎక్కడో ఏ గుహలోనో తొర్రలోనో శంకర భగవత్ పాదులంటారు
చెట్టుతొర్రలున్నాయి పర్వత గుహలున్నాయి ఇంకానీకు ఆవాసమేమిటీ
చేతికింద
చేయ్యిపెట్టుకుని కౌపీనం పెట్టుకుని పడుకున్నవాడు ఎవడో కరతల భిక్ష స్వీకరించినవాడు
ఎవడో వాడు కదా మహదైశ్వరూపుడంటారు.
|
కాబట్టి ఆ స్థితిని పొందేముంది భార్యాం
పుత్రే నివేశ్య చ భార్యను పుత్రుల దగ్గర విడిచిపెట్టి వానప్రస్తంలో తపసా
షడ్రిపూన్ జిత్వా తపస్సు చేత ఆరుగురి శత్రువుల్ని జయించి తరువాత తాను
సన్యాసాశ్రమం స్వీకరించాలి. అయితే కొంతమంది అసలు వివాహమే చేసుకోకుండ సన్యాసం
స్వీకరించినవారు ఉంటారు శంకర భగవత్ పాదాచార్యస్వామి ఆ కోవలోకి వచ్చినవారే చంద్రశేఖరేంద్ర
సరస్వతీ స్వామివారు ఆ కోవలోకి వచ్చినవారే మహానుభావుడు శతాధికవయస్సు ఆయన ఉపాది
ఉండింది కానీ వారు వివాహం చేసుకున్నవారు కాదు అందులో కంచి పీఠం నుంచి పీఠాధి
పత్యం, అలాగే ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామివారు మహానుభావుడు
ఆయనా బ్రహ్మచర్యంనుంచి సన్యశించినవాళ్లే వాళ్ళు కారణజన్ములు వాళ్ళతో మిగిలినవారు పోల్చుకుని
చేయడం కుదరదు కొంతమంది కారణజన్ములు ఎప్పుడూ ఉంటారు కాబట్టి నీవు ఈ విషయాన్ని
దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది నీవు ఎక్కడ దాక్కున్నా లక్ష్మణుడు చీల్చేస్తాడు ఆ
గుహని కాబట్టి బలవంతుడైనవాడితో వైరం పెట్టుకునీ బ్రతకగలనని నీవు అనుకోకు కానీ
బలహీనుడైనవాడితో వైరం పెట్టుకుని బలవంతుడైనవాడు ఎక్కడైనా ఉండగలడు.
ఎందుకనీ బలహీనుడేం చేస్తాడు అన్న ధైర్యంతో ఉంటాడు నీవు ఎంతసేపు ఏం
చేస్తున్నావంటే నీకన్నాబలహీనులైనవాళ్ళను దగ్గరపెట్టుకుని వీళ్ళ మాటలువిని క్షేమంగా
ఉంటానంటావు స్వయంప్రభా బిలంలో నీకన్నా బలవంతుడైనవానిపనిమీద బయలుదేరానని మరిచిపోతున్నావు.
ఆయనపని మధ్యలో వదిలేయడం ఆయన కోపానికి కారణం నీ బతుకేమౌతుందో తెలుసుకో ఎంతపెద్ద
మాటండీ... ఎంతగొప్ప విశ్లేషనండీ అసలు అందుకే శ్రీరామాయణం బాగాచదవడం అలవాటైతే
శ్రీరామాయణ శ్లోకాల్నీ బాగా అర్థం చేసుకోగలిగినవాళ్ళు నేను ఎందరో పెద్దల్నీ చూశాను
నేను అటువంటి ఐఎఎస్ అధికారి నాకొకరు తెలుసు పేర్లు చెప్పడం బాగుండదు వాళ్ళ
విశ్లేషణా చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు ఒక నోట్ ఫైల్ మీద వ్రాసే నోటింగు చాలా
ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవ్వరూ
ఊహించినటువంటి ఆలోచనా సరళివారికుంటుంది చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ బుద్ధికి
అటువంటి గాయిత్రీ ప్రచోదనం కూడా ఉంటుంది. ఎందుకంటే శ్రీరామాయణం మీరు
గుర్తుపెట్టుకోండి. గాయిత్రీ మంత్రం అందరూ చేయడానికి అర్హులు కాకపోవచ్చు గాయిత్రీ
మంత్రం 24 బీజాక్షరాలతో ఉంటుంది 24 బీజాక్షరాలే గాయిత్రకి 24 బీజాక్షరాలకీ
ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత మరి
24 బీజాక్షరాలతో ఉన్న గాయిత్రిని నియమంతో చేసినటువంటివాడికి బుద్ధివైభవం ఎందుకు
రాదు వచ్చి తీరుతుంది.
మరి గాయిత్రీ వైభవాన్ని పొందాలీ అంటే శ్రీరామాయణాన్ని చదివితేచాలు ఎందుకని
శ్రీరామాయణం ప్రతిఒక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలుగా వ్యాఖ్యానం 24 బీజాక్షరాలకి
వ్యాఖ్యానం 24 వేల శ్లోకాలు శ్రీరామాయణం. శ్రీరామాయణం చెప్పడమూ అంటే గాయిత్రీ
మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానము చేసినట్లే లెక్కండీ! రామాయణం చదువుకుంటున్నావూ అంటే గాయిత్రీ మహా మంత్ర
బీజాక్షరముల వ్యాఖ్యానమును నీవు చదువుకుంటున్నావు అని గుర్తు. కాబట్టి అదేం
చేస్తుంది బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది కాబట్టి రామాయణం పిల్లలు వినండీ పెద్దవాళ్ళు వినండీ ఎవరు వినండీ
వాళ్ళ బుద్ధికి ప్రచోదనమిస్తుంది. ఒకగొప్ప మార్పుని తీసుకొస్తుందది.
బుద్ధిమీద పనిచేసేటటువంటి ఒకగొప్ప శక్తికలిగినటువంటి మహామంత్రము శ్రీ
రామాయణం అనేటటువంటిది ఒక మాలా మంత్రమే అనుకోవలసి
ఉంటుంది అంత గొప్పదనం కలిగినది అందుకే అందులో శ్లోకాలు అంత శక్తి వంతంగా ఉంటాయి
ప్రత్యేకించి నేను మీతో మనవిచేశాను శ్రీరామాయణంలో కొందరు కొందరు వ్యక్తులు
మాట్లాడేటటువంటి మాటలు అత్యద్భుతంగా ఉంటాయి. విడిచిపెట్టకూడదు వారు
మాట్లాడుతున్నారంటే ప్రతి శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి ఎందుకంటే
అంత వైభవంతో ఉంటాయి. ఒక గురువుగారి మాటకు అంత గొప్పదనం ఎక్కడనుంచి వస్తుంది ఆయన
బుద్ధిప్రచోదనం ఆయన బుద్ధిప్రచోదన శక్తివల్ల కదాండి ఆ మాటకు అంత విలువ వచ్చింది.
అయినప్పుడు ఒక హనుమలాంటి మహానుభావుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ఎంత గొప్పదై
ఉంటుంది మీరు ఆలోచించండి.
|
దాన్ని మీరు కేవలం కాకతాలీయంగా ఏదో మత్తు సాహిత్యం చదివినట్లు ఇలా శ్లోకాన్ని
ఎలా తిప్పుతారు బాగా చదువాలి ఎవో కొన్ని కొన్ని పనికిమాలినమాటలు ఉండచ్చు
పనికిమాలినవి అంటే నా ఉద్దేశ్యంలో రామాయణంలో అలా ఉంటాయీ అనికాదు మీరు అంత శ్రద్ధగా
వాటిని విడిచిపెట్టి రావణుడి ప్రసంగం ఉందనుకోండి చాలా శ్రద్ధగా చదువుకోకపోతే పెద్ద
దానివల్ల మీకు ఏదో ప్రమాదం వచ్చేసిందనుకోవడం కానీ హనుమ వంటి మహాపురుషులు మాడ్లాడే
మాటల్నీ మీరు చాలా జాగ్రత్తగా చదుకోవలసి ఉంటుంది. మీరు చదువుకోవాలి మీరు చదువుకుని మీరు అనుభవించాలి మీరు
అనుభవిస్తే ఏమౌతుందంటే మీరు తరువాతి తరాల్ని ఉద్ధరించగలుగుతారు ఎందుచేతా
అంటే అసలు నిజానికి పిల్లలకి బాగా తలలోకి ఎక్కెది ఎప్పుడో తెలుసాండీ నేను మీతో
యదార్థం చెప్తున్నాను అక్రాస్ ది డైనింగ్ టేబుల్ నేను నిజం చెప్తున్నాను మీతో
అందుకే గృహస్తు ఎప్పుడూ
బిడ్డలతోటే భోజనం చేయాలి బిడ్డలతో భోజనం చేస్తూ మీరు అకస్మాత్తుగా ఏదో
సందర్భంలో మీ ప్రయత్నం అక్కరలేకుండా రామాయణం గుర్తొస్తూనే ఉంటుంది. మీరు రామాయణం గురించి చెప్తూ
భోజనం చేశారనుకోండి ఉపనిశత్ పారాయణం చేస్తూ భోజనం చేసినట్లే. అన్నం తింటూ అది విన్నవాడికి
ఆరోవంతు మనసదై కూర్చుంటుంది రామాయణం మీరు ఏది మాట్లాడుతున్నారో అది మీ బిడ్డలమీద
ప్రభావం చూపిస్తుంది మీరు ఏది చూస్తూ తింటున్నారో అది కూడా మీ బిడ్డలమీద ప్రభావం
చూపిస్తుంది. చంటి పిల్లవానికి చాలా క్రూరమైనటువంటి సన్నివేషాల్ని మీరుచూస్తూ పాలిచ్చారనుకోండి
వాడు ఒక ఘాతకుడుగా తయారౌతాడు.
కాబట్టి నేను అస్తస్తమానం ఏదో పేరెత్తుతూ దాన్ని చెప్పడమెందుకూ ఏదో క్రోధంలా
ఉంది వాటిమీద అనుకుంటారు, కాబట్టి నాకేం క్రోధమెందుకండీ నాకేం క్రోధం కాదు కాకపోతే
నేను ఎప్పుడూ చెప్తుంటాను వస్తువుది తప్పు ఎప్పుడూ ఉండదని చెప్తుంటాను నేను
వస్తువు వస్తువుగా తప్పేముందండీ తప్పేం లేదు ఒక యానిమల్ ప్లానెట్ లో మీరు
చూడలేనటువంటి అద్భుతవిషయాల్ని నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్లో మీరు చూడచ్చు ఎక్కడో
ఇప్పుడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని మీరు ఇవ్వాళ ఇప్పుడే చూడచ్చు
సింహాచలంలో జరిగినటువంటి చందనోత్సవాన్ని మీరు ఇప్పుడు చూడగలగడం అదృష్టం కదా ఆ
ప్రయోజనాన్ని మీరు పుచ్చుకోవచ్చు అది వస్తువు దోషమని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. వస్తువుని సక్రమంగా
వినియోగించకుండా దుర్వినియోగం చేసుకుని కొన్ని కోట్లమందిని పాడుచేసుకునే
స్వభావమున్నటువంటి కార్యక్రమాన్ని మీరు విమర్షించవలసి ఉంటుంది తప్పా మీ క్రోధము
వస్తువులపట్ల వెళ్ళిపోతే అది మీ పతనానికి దారి తీస్తుంది. యుక్తా యుక్త విచక్షణతో
అనాలి తప్పా ఆ విచక్షణ విడిచిపెట్టి అనకూడదు అందుకని నేను దేనికీ
వ్యతిరేకము కాదు. ఇప్పుడు టీవీకీ కోటేశ్వరావుగారు వ్యతిరేకము అని అనకండి నేను అలా
కాదు నేనూ చూస్తాను టీవీ కాకపోతే బీ సెలెక్టివ్ కదా అంతకన్నా అక్కరలేదు
దానిగురించి.
|
కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు వీళ్ళందర్నీ
నీవు రక్షించే మొనగాన్ని అంటావేమిటీ స్వయంప్రభా బిలంలోకి వెళ్ళిపోతే
బ్రతకగలననుకుంటున్నావా క్రైసిస్ హ్యండ్లింగ్ అంటారు చూశారా సమస్యని అంత
విశ్లేషనాత్మకంగా మాట్లాడగలరు, అది చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు ఒక్కడికే
బుద్ధి ప్రచోదనము మీగిలినవాళ్ళకి లేదు. ఆయన ఒక్కడే ఇలా మాట్లాడగలుగుతున్నాడు
చూడండి ఆయన బుద్ధివైభవము ఎంతగొప్పగా ఉంటుందో మహానుభావుడిదీ కాబట్టీ ఖేదితా దుఃఖ
శయ్యాభిః త్వాం కరిష్యన్తి పృష్ఠతః నీవు వీళ్ళని నమ్మీ ఎక్కడో మనం స్వయంప్రభా
బిలంలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటామన్నమాట నీవు అనవద్దూ స త్వం హీనః సుహృద్భి శ్చ
హిత కామై శ్చ బన్ధుభిః ! తృణాదఽపి భృశో ద్విగ్నః స్పన్దమానాత్ భవిష్యసి !! వీళ్ళందరూ నిన్ను వ్యతిరేకించేస్తారు కదూ
ఒకరోజునా, వీళ్ళందరూ ఏం మొదలెడుతారంటే పోల్లేరా ఏదో ఒకటి కిష్కింధకి వెళ్ళిపోదాం
వెళ్ళిపోయిన తరువాత ఏం చేస్తాం వెళ్ళిపోగానే సుగ్రీవుడు ఇలా పట్టేసుకోడు ముందు
కిష్కింధలోకి వెళ్ళగానే మనింటికెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఒకసారి భార్యా బిడ్డలన్నీ
చూసి ఎలా ఉన్నారో కనుక్కొని ప్రభూ! తప్పైపోయింది అంగదుడు ఇలా అన్నాడు ఆరోజున
బుద్ధిగడ్డితిని వెళ్ళిపోయాం ప్రభూ ఆజ్ఞ మేం ఏం చేయ్యం మాకు అప్పుడు ప్రభువు ఆయనే
అందుకని ఆ ఎదురుగుండా ఉన్నవాన్ని దిక్కరించలేము వెళ్ళాం క్షమించినా మీరే మమ్మల్ని
చంపేసినా మీరే మేము ఏం చేసినా సిద్ధమని కాళ్ళమీద పడిపోదాం ఇందమందిమి వెళ్ళి
కాళ్ళమీద పడిపోతే ఏమో రక్షిస్తే రక్షిస్తాడేమో మహాయితే ఖైదిలో పాడేస్తాడు
కనపడుతుంటారు కదా పెళ్ళాం పిల్లలూ అనీ వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలుపెడుతారు.
|
ఇదీ చాలా చమత్కారంగా ఉంటుంది కొంత కొంత మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే తమకి ఏం
చెప్పారో అదే అంతకన్నా ఇంక పెద్ద బుద్ధిపెట్టి ఆలోచించేటటువంటి స్వభావం ఉండదు.
నాతో ఒకసారి ఒకాయనన్నాడు ఇవన్నీనండీ శ్రీరామాయణం చదువుతుంటే మీకు పైకి ఇలా ఉంటాయి కానీ పరమసత్యాలు హనుమ
మాట్లాడుతున్నవి. ఆయన ఆన్నారు చూశారా తినేసి పడుకుంటారు ఇంక పనేం ఉండదూ ఉండకపోవడం
ఏమౌతుందంటే భయానికి కారణమై వీళ్ళు అలా కూర్చోలేని స్థితివస్తూంది తినీ పడుకునీ
ఉండిపోతే, బలముండి చెయ్యగలిగిన వయసులో చెయ్యకుండా ఉండిపోతే ప్రమాదమొస్తుంది బలముండి చెయ్యగలగిన వయసులోచేసి
వైరాగ్యాన్ని సంపాదించి వానప్రస్థానికి వెళ్ళాలి. మీరు విన్నారో లేదో
మరైయిన్ ఇంజనీర్స్ అని ఉంటారు సముద్రం మీద వాయెర్స్ కి వెళ్తుంటారు సముద్రంలోకి,
సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద పనిచేసేటటువంటివాడు అధికారిమీద తిరగబడితే
వాళ్ళు ఇచ్చేటటువంటి శిక్షేమిటో తెలుసాండీ మీరెప్పుడైనా మరైయిన్ ఇంజనీర్స్ ని
ఇక్కడ వస్తారు రెండు మూడు రోజుల్లో ఒకాయన సుబ్బారావనీ ఆయన్ని అడగండీ... వేసే
శిక్షేమిటో తెలుసా ఒక వారం రోజులూ ఎవ్వరూ మాట్లాడొద్దు ఆయనకి ఇష్టమైన పదార్థాలేవో
ఆయనకి వండిపెట్టండి అని చెప్తారు.
సముద్రం మీద ఇంకేమి పనుండదు ఆయన్ని ఎవ్వరూ పలకరించరు డ్యూటికీ వచ్చేసి ఆ సిఫ్టుకి
సంతకం పెట్టేయడం చక్కగా ఆయనకి ఆ రోజున మినపరొట్టె ఇష్టమైతే ఓరోజు మినపరొట్టెసి
పెడతారు ఓరోజున చక్కగా పూరివేసి పెడతారు తినేయడం ఏం చేయాలంటే ఎవ్వరూ మాట్లాడరు
ఆయనతో ఆ సముద్రంలో ఓడలు వెళ్ళిపోతుంటే అలా కూర్చోవడం. అలసటలేకపోతే ఏమౌతుందో
తెలుసాండి నిద్రపట్టదు. సముద్రఘోష వింటూ అందరూ కష్టపడుతుంటే తను తినేసి అలా
కూర్చోవాలంటే వారంలోజులు ఆ శిక్షవేస్తే మూడురోజులు అయ్యేటప్పటికి ఇంతకన్నా
సముద్రంలో దూకి చచ్చిపోవడం మంచిదనిపిస్తుంది వాడికి జీవితంలో ఎప్పుడూ ఏ
పనిచెప్పినా చేయననడు. మరైయిన్ ఇంజీనియర్స్ యూస్వల్గా షిప్ మీద వెళ్ళేటటువంటి
ట్రూప్ కి వేసేటటువంటి శిక్ష ఇదేవేస్తారు.
హనుమా ఆనాడు చెప్పినవే ఇప్పుడు వచ్చాయి ఆయనా ఎంత ఎదార్థదృష్టితో మాట్లాడారో చూడండి
ఏదో చెప్పారుగదాని చెప్పినట్లు చేయడం ఎప్పుడూ ప్రయోజనం కాదు ఏదో నాకు వెనకటికి
ఒకాయన చెప్పారు ఏమిటో ఇవ్వాళ రామాయణం గుర్తురాక... కానీ ఇలాంటివి
గుర్తొస్తున్నాయి. మిలట్రీలో పనిచేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే యుద్ధభూమిలో
పడిపోతారు చనిపోయి కొంతమంది ఉంటారూ ప్రాణాలతో కొంతమంది ఉంటారు చనిపోయినవాళ్ళ
గురించి పట్టించుకోవాలా కొంచెం ప్రాణంతో ఉన్నవాళ్ళగురించి పట్టించుకోవాలా అంటే
బ్రతికున్నవాడి గురించి ఎక్కువ పట్టించుకోవాలి ఎందుకంటే పిఓడబ్ల్యూ అంటారు
ఎందుకంటే ప్రెసరర్ ఆఫ్ వార్ అని ఈయ్యన కాని దొరికాడనుకోండి శత్రుదేశంవాళ్లు
తీసుకెళ్ళి వైద్యం చేయించి ఆ రహస్యాలు రాబట్టడానికి చిత్రక్షోభ పెట్టేస్తారు
అందుకనీ ముందుగా గబగబా కొన ప్రాణంతో ఉన్నా ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.
|
కాబట్టి ఆయన అంటారూ నీవు స్వయంప్రభా బిలంలోకి వెళ్ళి చిక్కుబడిపోయానన్నది
నాకనవసరం నెలలో రాలేదని ఎందుకు చంపేస్తాడు సుగ్రీవుడు కారణం తెలుసుకుంటాడు
తెలుసుకుని క్షమిస్తాడయా ప్రభువు అటువంటివాడని ఎందుకనుకుంటున్నావు నీవు
ప్రభవుయొక్క జ్ఞానము సంకుచితమనుకుంటున్నావు కాదు ఆయన విశాలహృదయుడు ఆయన పరిపాలనా
సమర్థత కలిగినవాడు ప్రభువుయందు ఈ భక్తి ఉన్నవాడు ఎవడో వాడే కార్యం చేయగలడు అసలు
ప్రభు భక్తిలేనివాడు ఏమీ చేయలేడు. కాబట్టి ధర్మ కామః పితృవ్య స్తే ప్రీతి కామో
దృఢ వ్రతః ! శుచిః సత్య ప్రతిజ్ఞ శ్చ న త్వాం జాతు జిఘాంసతి !! ఆయనా ధర్మం
తెలిసున్నవాడు నీకు తండ్రి ప్రీతి కలిగినటువంటివాడు దృఢమైనటువంటి వ్రతమున్నవాడు
చాలా నిర్మలమైనటువంటి మనస్సున్నవాడు సత్యమైన ప్రతిజ్ఞ ఉన్నటువంటివాడు అటువంటివాడు
నిన్ను ఎందుకు చంపుతాడు ఎందుకసలు సుగ్రీవుడు చంపుతాడని ఆలోచన చేస్తున్నావు ఆ ఆలోచన
విడిచిపెట్టేసై ప్రియ కామ శ్చ తే మాతుః తదఽర్థం చాఽస్య జీవితమ్ ! తస్య
అపత్యం చ నాఽస్త్యఽన్యత్ తస్మాత్ అంగద
గమ్యతామ్ !! నీవు ఒకటి
గుర్తించు అసలు నీ పిన తండ్రి సుగ్రీవునికి సంతానము లేదు కాబట్టి అన్నగారి
సంతానమైనటువంటి నువ్వే ఆయనకి కూడా సంతానం రెండు ఇప్పుడు తార ఆయన భార్య ఆయన ఎప్పుడు
తన భార్య కాబట్టి తారకి ప్రీతిచేద్దామని చూస్తుంటాడు రుమకి బిడ్డలు లేరు కాబట్టి
రాజ్యాధికారం నీకేవుంది, తారకి ప్రీతి చేయడమూ నిన్ను యౌవరాజ్యపట్టాభిషేకము
చెయ్యడమూ కొడుకులు లేనటువంటి తనకి ఒకే ఒక్క కొడుకువు కాబట్టి నీయందు పూర్ణమైన
ప్రేమతో ఉంటాడు తప్పా నిన్ను చంపేస్తే ఇప్పుడు అసలు సుగ్రీవునికి ఏమి వస్తుంది
ఒకటి తార ఖేద పడుతుంది తన భార్య బాధపడుతుంది యౌవరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి
ఇంకొక కొడుకులేడు అటువంటివాడు నిన్ను చంపుతాడని ఎలా అనుకుంటున్నావు.
సుగ్రీవుడు నిన్ను చంపితే ఎంతబాధపడవలసి వస్తుందో తన జీవితం తను
పాడుచేసుకుంటాడా ఇటు తార హృదయాన్ని భగ్నపరచి తనకి రాజ్యానికి ఉత్తరాధికారి లేకుండా
నీవు ఇంత ఖచ్చితంగా ప్రవర్తించినా వెనక మేము సాక్ష్యం చెప్పినా సుగ్రీవుడు నిన్ను
చంపుతాడని ఎందుకనుకుంటున్నావు.
నీవైపునుంచి నిన్ను రక్షించవలసిన అవసరం సుగ్రీవుడికి
ఎంతుందోని నీవెందుకు ఆలోచించడంలేదు కాబట్టి నీవు ఇలా చచ్చిపోతాను అనేటటువంటి
ప్రయత్నంచేయ్యకు నీవు ఇలా స్వయంప్రభా బిలంలోకి వెళ్ళిపోతాను ఇక్కడ పడుకుంటాను
అన్నమాట అనవద్దు. అక్కడ వరకే చెప్పారు అంటే హృదయమేమిటీ రాజకార్యమునందు మనం ఇకా
ముందుకువెళ్ళి సీతాన్వేషణం చేద్దాం కానీ... నేను మీతో మనవిచేశానుగదాండీ రామాయణం ఒక
మనస్తత్వశాస్త్రం. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే చిన్నవిషయం వచ్చిందనుకోండి ఇంకసలు ఆ
పొంగు మీరు పట్టుకోలేరు ఇంకసలు ఎన్నిమాట్లంటారంటే మీతోటీ ఇంకసలు విసుగొచ్చేస్తుంది
అయ్యబాబోయ్ నా ప్రారద్భం ఏమిట్రా బాబు ఇలా తినేస్తున్నాడు నన్నూ అని. ఏదో... ఎవరిదగ్గరికో
వెళ్తారుమీరు పెళ్ళినిశ్చయమైపోయిందనుకోండి ఆయనా మీరు ఏదో పెళ్ళిమాట్లకి వెళ్ళారు
పెళ్ళి నిశ్చయమైపోయింది, నేను బాగా మాట్లాడానే ఆఁవిషయంలో నేను బాగా మాట్లాడానే
అవుని మీరు బాగా మాట్లాడారు, అక్కడ నేను అలా మాట్లాడడం మంచిదైంది చూశారూ నేను బాగా
మాట్లాడనుకదూ అవును బాగ మాట్లాడావు, ఇది ఎన్నిమాట్లు ఇక మూడురోజులైనా నాలుగు
రోజులైనా వచ్చేవారం ముహూర్తాలు పెట్టుకుందాం మీరు వెళ్ళిపోకండి అన్నారు.
మూడురోజులయ్యాక మీ పరిస్థితి ఏమౌతుందో తెలుసా అయ్యబాబోయ్ నేను ఎందుకొచ్చాను
ఇక్కడికి నా ప్రారద్భం అనిపించింది ఇక అస్తమానం నేను బాగా మాట్లాడానే నేను బాగా
మాట్లాడానే ఇదే.
|
అన్నతరువాత వాళ్ళు మీరు ఆ మాట అనకుండా ఉండవలసిందండీ మీరూ... అదొక్కటే కాస్తా
మా వాళ్ళకి కొంచెం బాధకలిగింది కానీ నేను నచ్చ జప్పానులేండీ అన్నారనుకోండి నాలుగో
రోజున వచ్చీ నేను ఎందుకన్నానంటావ్ నేను ఎందుకన్నానంటావ్ అని మిగిలిన మూడురోజులు
తినేస్తాడు. రెండూ ఎక్సట్రీమ్సే మీరు దేన్నిపట్టుకోలేరు వాళ్ళతోటి మీరు
విసుక్కున్నారనుకోండి య్యాడింగ్ విల్ టు ది ఫైర్ అంటారు చూసారూ అలా ఉంటుంది
చూశావా... నిన్ను నమ్ముకుని ఇంతదాక తీసుకొచ్చాను నేను ఇంతకష్టమైపోయాను నేను నీకు బరువైపోయాను
అంటాడు. మీరు అనడానికి ఉండదు వినలేరు స్నానం చేసినా అదే పూజ చేసుకుంటున్నా అదే
అన్నం తింటున్నా అదే పడుకున్నా అదే ఏం చేస్తున్నా అదే చెప్తున్నారు వదల్డు ఏం
చేస్తున్నా కూడా అక్కడితో సరే దీన్ని ఇలా పరిష్కరిద్దాం ఆలోచించి వదలడు అదీ హైపర్
సెన్సిటివ్ అంటారు. ఏమో ఎందుకో నేను ఇవ్వాళ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను చాలా...
కొంత కొంత మంది మనస్తత్వం చాలా బలహీనంగా ఉంటుంది అది చిన్న విషయానికి విపరీతమైన పొంగు చిన్న విషయానికి
విపరీతమైన కుంగు ఆ కుంగులో అగాధాలు చూస్తాయి ఆ పొంగులో అంతరిక్షాన్ని చూస్తారు
రెండిటినీ భరించడం కష్టంగానే ఉంటుంది.
కాబట్టి ఆయన కుంగులో ఉన్నాడు కాబట్టి ఆయన పాతాళాన్నే చూస్తాడు, ఆయన ఎలా
మాట్లాడుతాడో చూడండి, హనుమ ఇంత ఆశాజనకంగా మాట్లాడితే ఆయన ఎంత నిరాశాజనకంగా
మాట్లాడుతాడో చూడండి. ఇద్దరు
వ్యక్తులు కిటికీలోంచి చూస్తే ఒకడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తాడు ఒకడు
కిందున్న బురద చూస్తాడు ఎవడి దృష్టికోణం వాడిది ఒకడు ఊర్ధ్వముక చలనం ఒకడు అధోముక పథనం
ఎవడ్ని ఎవడు రక్షిస్తాడు ఎవడికి వాడు రక్షకుడు ఉద్దరే దాత్మనా – త్మానం
నాత్మాన ఎవన్నివాడు ఉద్ధరించుకోవాలి ఎవనికి ఆకలేస్తే వాడు అన్నం తినాలి.
కాబట్టి అంగదు అంటాడు
స్థైర్యం అత్మ మన శ్శౌచమ్ ఆనృశంస్యమ్ అథాఽఽర్జవమ్ ! విక్రమ
శ్చైవ ధైర్యం చ సుగ్రీవే నోపపద్యతే !!
భ్రాతుర్ జ్యేష్ఠ స్య యో భార్యాం జీవితో మహిషీం ప్రియామ్ ! ధర్మేణ మాతరం యస్తు
స్వీకరోతి జుగుప్సితః !!
కథం స ధర్మం జానీతే యేన భ్రాత్రా దురాత్మనా !
లక్ష్మణ స్య భయాత్ యేన న అధర్మ భయ బీరుణా ! ఆదిష్టా మార్గితుం సీతాం ధర్మమ్
అస్మిన్ కథం భవేత్ !!
తస్మిన్ పాపే
కృతఘ్నే తు స్మృతి హీనే చల ఆత్మని ! ఆర్యః కో విశ్వసేత్ జాతు తత్ కులీనో జిజీవిషుః
!!
|
ఏదో లక్ష్మణునికి భయపడి వచ్చి టంకారం చేశాడని సీతమ్మని వెతకమని వానరుల్ని
పంపించాడు కానీ ఆయనకేం ధర్మం తెలిసి పంపించలేదు నిజంగా సీతాన్వేషణ చేద్దామని
పంపించినవాడు కాదు మనకు తెలియదా సుగ్రీవుడు అలా నిజంగా పంపించే హృదయం ఉన్నవాడో
కాడో సుహృత్తో కాదో మనకు తెలియదా ఆ విషయంలో ఏమీ సందేహం అక్కరలేదు మహానుభావుడు
సుగ్రీవుడు ఆ విషయంలో. కాబట్టి అటువంటి కృతఘ్నుడు పాపి స్మృతి హీనుడు చెంచలమైన
మనస్సున్నవాడు విశ్వాసఘాతకుడు అటువంటివాన్ని ఆర్యులు నమ్మరు పెద్దలు ఆయన వంశంలో
పుట్టినవాన్నే ఆయన కుటుంబంలో పుట్టినవాన్నే నేను ఎలా నమ్ముతాను కాబట్టి నేను
నమ్మను అని అన్నాడు కాని అప్పటికే అప్పగింతలు మొదలు పెట్టాడు కాబట్టి నేను
చచ్చిపోతాను. ఇప్పుడు ఆయన ఏమన్నారు హనుమా నీవు లోపలికెళ్ళినా నీవు బ్రతకవురా
అనికదా అన్నారు అందుకని లోపలికెళ్ళి బ్రతకను ఇక్కడే చచ్చిపోను అన్నారు. ఇంతా
చెప్పింది ఎందుకు పనికొచ్చిందంటే రాజ కార్యం మీద ముందుకెళ్ళదామంటాలేదు ఇక్కడే
చచ్చిపోతానన్నాడు అంటే ఇదే నేను మీతో మనవి చేసింది ఎక్సట్రీమ్స్ ఉంటాయి కొంమందిలో ఇదీ దిద్దుకోవలసి ఉంటుంది
ఎవరి మనసుని వాళ్ళు జాగ్రత్తగా దిద్దుకోవాలి, వాళ్ళుకి లేకపోతే చాలా
ప్రమాదం తెలుసాండి వాళ్ళు బరువైపోతారు కుటుంబానికి సమాజానికి కార్యాలయానికి
ఎక్కడుండనివ్వండీ ఇబ్బందే వాళ్ళతోటి కించిత్ మీరు పట్టించుకోలేదనుకోండి మీరు
చాశారా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు చూశారా నన్ను పట్టించుకోలేదు నన్ను
ప్టటించుకోలేదు అంటాడు. ఆ రండి హమయ్యా మీరు వచ్చారా ఇంక మాకు భయంలేదన్నారనుకోండి
ఇంక పట్టపగ్గాలుండవు అన్నీ ఇబ్బందే అలాంటివారితో అలాంటివారు వస్తున్నారంటే లోపల
భయంగా ఉంటుంది వీళ్ళని ఎలాగ అసలు వ్యవహారం నడపడం అనీ అలా ఉండకూడదు ఆ మనసు కొంచెం
దిద్దుకోవలసి ఉంటుంది కొంచెం.
గొప్ప మనస్తత్వశాస్రమండీ శ్రీరామాయణం, రామాయణం కన్నా మనస్తత్వశాస్రం
శంకరాచార్యులని మించిన మనస్తత్వశాస్రవేత్తా లేవు పుట్టలేవు పుట్టబోదు. శంకరభగవత్ పాదులంత
మనస్తత్వశాస్రవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు ఇక పుట్టడన్న మాట నేను
అనడం నాకు ఇష్టంలేదు పుట్టాలనే కోరుకుంటారు మళ్ళీ శంకరులు అవతారం స్వీకరించాలనే నా
కోరిక. కాబట్టి ఎంత గొప్పగా ఆయనా ఆలోచిస్తాడో చూడండీ నేను ఇక్కడే చచ్చిపోతాను మీరు
ఏం చేస్తారో తెలుసా వెళ్ళి సుగ్రీవుడి పాదాలుపట్టి నమస్కారం చేశాను అని చెప్పండి
అని అన్నాడు మళ్ళీ ఇదేమిటీ అంటే ధర్మమన్నమాట అంటే తన ధర్మం అన్నమాట తనుమంచివాడు
వాళ్ళు ఎలాగైనాపోనివ్వండీ నా మంచితనం నాదే అని ఓ చెప్పుకొస్తుంటాడు ఒక్కొక్కడు
సోధి అలా ఉంటుందన్నమాట చెప్పేవన్నీ నేరాలే కానీ ఏమండీ నా మంచితనం నాదే అంటుంటాడు
మళ్ళీ అర్థమవ్వదాండీ వినేవాడికి ఎదరుగుండా ఉన్నది అంత అమాయకుడా కాబట్టి
సుగ్రీవుడికి నా నమస్కారాలు చెప్పండి నేను చచ్చిపోయాక మా అమ్మ ఎలాగో బ్రతకదులేండీ
పాపం తార కూడా చచ్చిపోతుంది ఆవిడకి కూడా నమస్కారాలు అడిగానని చెప్పండి ఆవిడని
ఓదార్చే ప్రయత్నం చేయండి, ఇంకెందుకు ఓదార్పు చచ్చిపోయేదానికి అంటే అమ్మ చచ్చిపోతంది
మనం లేకపోతే అన్నవాడు అమ్మ బ్రతికే ప్రయత్నం చెయ్యాలిగదా... చచ్చిపోవడమేమిటీ తనూ అసలా
కోణంలో ఆలోచించడు కాబట్టి మా అమ్మని ఓదార్చండి, రుమకీ నేను నమస్కారం చేశానని
చెప్పండి రుమని ఓదార్చండి నా కడపటి నమస్కారాలు తెలియజేయండి ఇదిగో నేను
పడుకుంటున్నాను నేను ప్రయోపవేషం చేస్తాను చచ్చిపోతానన్నవాడు ఏం చేయాలండీ
చచ్చిపోవాలి, చచ్చిపోవడం పెద్ద విషేషమేముందండీ లోపలికెళ్ళిన ఊపిరి పైకి రాకపోతే
చచ్చిపోయినట్టూ పైకెళ్ళిన ఊరి లోపలికి రాకపోతే చచ్చిపోయినట్లు చావు లోపలకొచ్చే
ఊపిరికి పైకివచ్చే ఊపిరికి మధ్యలో ఉంది కాదా.
అంతేగా చావు అంటే లోపలకెళ్ళి పైకిరాలేదనుకోండి
చచ్చిపోతాడు పైకెళ్ళి లోపలికి రాలేదనుకోండి చచ్చిపోయాడు దీనికి పెద్ద అల్లరేమిటీ
మళ్ళీ దానికొక పెద్ద ప్రకటనా ఏదో ఆమరణ నిరాహారదీక్షాని బలవంతంగా అంబులెన్సు
పట్టుకొచ్చి పట్టుకెళ్ళిపోతారులే అని పడుకున్నట్లూ దానికో పెద్ద హడావిడీ ఇవన్నీ
ఎందుకూ కాబట్టి ఇప్పుడేమన్నాడంటే నిజంగా చచ్చిపోదామనిలేదు చచ్చిపోతానన్నంత
పిరికితనం పుట్టింది ఇది మనః స్థితిలో ఉన్న ప్రమాదం.
|
ఇప్పుడు ఇయ్యన ఏడుపు మొదలెట్టాడు నన్ను ఎలాగో చంపేస్తారు ఇక్కడే చచ్చిపోతాను
సుగ్రీవునికి నమస్కారం చెప్పండి తార ఏడుస్తుంది తారా చచ్చిపోతుంది తారకి నమస్కారం
చెప్పండి ఇలా చెప్తూంటే పాపం ఆ మిగిలిన కోతులేం చేస్తాయండీ అవి అసలే చపలచిత్తులూ
అవీ పాపం రాజూ ఎలా ఎడూస్తున్నాడో చచ్చిపోతున్నాడని అవికూడా ఏడుపు మొదలుపెట్టాయి.
కొంత కొంతమందికి ఇదో బలహీన మనస్తత్వం ఆ ఏడుపుని ఆపుచేయి ఆలోచించించు సరిగ్గా
అనగలిగినవాడు ఒక్కడుంటాడు హనుమ, ఆయన ఏడిస్తే వీళ్ళేడుస్తారు ఆయన స్వయంప్రభా
బిలంలోకి వెళ్ళిపోదామంటే ఆ వెళ్దామంటారు రెండు కారణాలు ఉంటాయి ఒకటి తెలిసీ మనం
చెప్తే ఏం బాగుంటుందండీ అనే మనస్తత్వం ఉంటుంది ఒక్కొక్కనికి వాడు చూడండి వాడికి
తెలుసు ఇది చెప్పిన తరువాత వాడు అంటాడు నేనూ ఇదే చెప్దామనుకుంటున్నానండీ అన్నాడు. మీరు
చూడండీ చాలా మంది దగ్గర ఉంటుంది ఈ బుద్ధి వాళ్ళు ఎప్పుడూ చెప్పరు కానీ నేనూ ఇదే
చెప్దామనుకున్నానండీ అంటారు.
సభల్లోకూడా కనపడుతారు ఇలాంటివాళ్ళు వాళ్ళు ఎంత చమత్కారంగా ఉంటుందంటే నేను
ఇవ్వాళ చాలా మాట్లాడుదామనుకున్నాను కానీ నేను మాట్లాడుదామనుకున్నవన్నీ నాకన్నా
ముందు చెప్పిన ఫలానాయనా చెప్పేశారు ఎంత చక్కగా మాట్లాడారూ వాళ్ళు అందులోంచే ఒక
విషయం చెప్పీ ఇంతకన్నా ఇంక మాట్లాడటానికి ఏముంటుంది ఇంక ఆయన మాట్లాడాక మాట్లాడటం
కష్టం అందుకు మాట్లాడటంలేదని కూర్చుంటాడు. అలాంటిదేమీ ఉండదు అదొక చమత్కారమన్నమాట
కాబట్టి ఓ చిన్న సహలహా ఒకటి ఇస్తారు ఇకముందు సభలలో ఈయన్ని చివరికి పెట్టండి ఈయన
ముందు మాట్లాడితే మాకు మాట్లాడటానికి ఉండట్లేదు అంటారు నిజంగా తను ఏదో
మాట్లాడేవాడిలా ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం మీరు నిజంగా రామాయణాన్ని గమనించి దృశ్యకావ్యంగా మీరు
చదువుతూ అనుభవిస్తేనండీ నవరసాలు పండుతాయి. మీరు అలా ఉండలేరు మీకు చికాకుగా
ఉంటుంది ఛీ ఛీ అలా ఉండకూడదు అదేంటదీ మీకు వెంటనే ఆ సర్గలు జ్ఞాపకానికి వస్తాయి ఇలా
ఉండకూడదు అలా మాట్లాడకూడదు మనం చక్కగా ఉండాలి ధీరోద్ధతులై ప్రవర్తించాలి తప్పా ఇలా
లేకిమాటలు ఉండకూడదూ అన్నస్థితీ కలుగుతుంది. మిమ్మల్నీ మీరు పరిశీలించుకోగలిగిన శక్తి ప్రజ్ఞ శ్రీరామాయణ
పఠనము శ్రీరామాయణ శ్రవణము వీటి రెండిటివల్ల కలుగుతుంది. బలమైన మనసే సమాజానికి
ఉపకారం చేస్తుంది ఆసలు మనసుకి బలం లేకపోతే శరీరమునకు బలమున్నా ఉపకారమును చెయ్యదు.
|
ఏం ఎందుకా వ్యవధి అంటే లోపలా ఓ చిన్న ఆశ ఈ లోపల ఏమైనా జరితే బ్రతికేస్తామేమో
అంటే తను పరిష్కారం సాధించలేకా తను ఉండడం ఇష్టంలేకా చావడం ఇష్టంలేకా చచ్చిపోదామన్నంత అగధంలోకి ఆలోచన
వెళ్ళిపోతే చేసేటటువంటి పిరికి చర్య ఆమరణ నిరాహారదీక్షలు. నేనేమీ
సందేహపడటంలేదు ఎందుకీమాట అనగలుగుతున్నానో తెలుసాండీ ఒకే ధైర్యంతో
చెప్పగలుగుతున్నాను నేను సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాన్ని. సనాతన ధర్మంలో ఆ
హక్కులేదు ప్రకృతి వికారమైన శరీరం
ఉండాలనుకున్నంతకాలం దీన్ని పోషించడం వినా దీన్ని పడగొట్టే అధికారం మనకులేదు
దాన్ని అలా పడగొట్టకూడదు ఆత్మహత్య నేరము అయినప్పుడు ఆమరణ నిరాహారదీక్ష ఆత్మహత్యా
ప్రయత్నం కాబట్టే కదూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నవాళ్ళను ఆత్మహత్యానేరంకింద
కేసులు రిజిష్టర్ చేయట్లా కాబట్టి దాన్ని చట్టవ్యతిరేకమన్నదాన్ని నేను కూడా దాన్ని
శాస్త్రరీత్యా చట్టరీత్యా కూడా నేరము తప్పైనదాన్నే నేను కూడా తప్పని చెప్తున్నాను.
కాబట్టి అది అనడానికి నేనేం భయపడటం లేదు కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పనిని
చెయ్యడానికి ఇప్పుడు అంగదుడు సిద్ధపడి ఉన్నాడు. ఆయన పడుకున్నాడు ఆయన పడుకుని ఉంటే
వీళ్ళందరు కూడా పడుకుని ఉన్నారు బాగుంటుందేమండీ! అంటే ఏమండీ మీ ప్రాణంపోతే పోయాక
ఏదో కాల్చేసి వెళ్ళిపోతాంలేండీ అంటారేమిటీ అలా అంటే బాగుండదుకదాండీ యువరాజుగారు
పడుకున్నాక అందరూ పడుకోవాలి.
వీళ్ళన్నారు వీళ్ళకీ మనసులో ఇదే ఒరేయ్ ఇప్పుడు వీడు చనిపోతానంటున్నాడు ఇప్పుడు
మనం వెళ్ళిపోతానంటే బాగుండదు పడుకోకపోతే బాగుండదు చూశారూ ఒకడు ఆమరణ నిరాహార దీక్షచేస్తే
పక్కన ఉన్న నలుగురు రిలే నిరాహర దీక్షలు చేస్తుంటారు అలాగన్నమాట. వీళ్ళూ ఏమైనా
అవుతుందేమో చూద్దాం ఇలోగా ఏమైనా అయితే అవుతుంది కాబట్టి ఈశ్వరకృపా కాబట్టి
ఏంచేద్దాం కాబట్టి మనమూ పడుకుందాం వాళ్ళు పడుకున్నారు ఇవన్నీ రామాయణ కాలంనుంచే
ఉన్నాయన్నమాట కాబట్టి పడుకున్నారు పడుకుంటే ఏంమాట్లాడుకోవాలి నిజంగా
చనిపోవాలనుకునేవాడు ఏం మాట్లాడుకోవాలి ఏం అదృష్టంరా ఇలా చచ్చిపోతున్నాం అని ఇక
మాట్లాడకండిరేయ్ అని అలాగే పడుకోవాలి. కానీ వాళ్ళు అయ్యెయ్యో మనం చచ్చిపోవలసి
వస్తుందీ అని మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందాండీ
చచ్చిపోదామని లేదు కానీ ఆ పరిస్థితుల్లో చచ్చిపోవడం తప్పా వినామార్గం లేదని వాళ్ళు
అనుకుంటున్నారు కాని ఉంది హనుమ చెప్పిన మార్గం ఉంది కానీ వాళ్ళ బుర్రకి ఎక్కలేదు
చచ్చిపోవడం తప్పా మార్గంలేదనుకు పడుకున్నటువంటి వాళ్ళందరూ తెలిసో తెలియకో
మాట్లాడుకున్న మాటలు మాత్రం రామ కథ.
|
కాబట్టి రామ కథనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రామ స్య వనవాసం చ క్షయం దశరథ
స్య చ ! జనస్థాన వధం చైవ వధం చైవ జటాయుషః !! హరణం చైవ వైదేహ్యా వాలిన శ్చ వధం రణే
! రామ కోపం చ వదతాం హరీణామ్ భయ మాఽఽగతం !! అనీ వాళ్ళు రామ కథనంతటినీ మాట్లాడుకున్నారు
మాట్లాడుకుని పడుకుంటున్నారు. తెలిసో
తెలియకో రామ కథ మాట్లాడుకున్నవాడు చచ్చిపోవడానికి వీల్లేదు చచ్చిపోవడానికో ఎంత
కష్టంలోంచైనా వాడుబయటికి వచ్చేస్తాడు అంతే రామ కథా బలమేమిటో చూపిస్తున్నారు
మహర్షి ఇది సుందర కాండకి పునాది. కిష్కింధ కాండలో రామ కథ యుగాలు మారిపోనివ్వండీ
రామకథకి రామ కథ చెప్పుకోవడమన్నదీ రామ కథ వినడమన్నదీ ఎంత శక్తివంతమైన విషయమో
చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళూ ఇప్పటికీ తెలిసో తెలియకో రామ కథని మాట్లాడారు
అందుకని అంతే అకస్మాత్తుగా వాళ్ళకీ ఈ కథ మాట్లాడుకుంటుంటే అక్కడికి ఒక పెద్ద పక్షి
ఒకటి వచ్చింది వచ్చి అది అందీ ఎవడురా ఇక్కడ నా తమ్ముడు జటాయువు పేరు ఎత్తినవారు
ఎవరు, ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని ఆ సంపాతి అనబడేటటువంటి పక్షి పర్వత శిఖరం
మీద కూర్చుని అంటూంది. ఈ అంగదుడు తన ధోరణిలోనే తాను ఉన్నాడు పడుకున్నాడు కదాండీ
పక్కవాళ్ళు పూర్తిగా కనపడరు ఇటుపక్కవాళ్ళకి పూర్తిగా కనపడరు కొంచెం దూరంగా
ఉన్నవాళ్ళు పడుకున్నవాళ్ళకి ఎలా కనపడుతారు కనపడరు. కాని ఆయన మాట్లాడుతున్నాడు
ఇంకానూ
వైదేహ్యాః ప్రియ కామేన కృతం కర్మ జటాయుషా ! గృధ్ర రాజేన యత్ తత్ర శ్రుతం వః
తత్ అశేషతః !!
తథా సర్వాణి భూతాని తిర్య గ్యోని గతాన్యఽపి ! ప్రియం
కుర్వన్తి రామ స్య త్యక్త్వా ప్రాణాన్ యథా వయమ్ !!
అన్యోన్యం అకుర్వంతి స్నేహ కారుణ్య యంత్రితాః !!!
తేన తస్య ఉపకారాఽర్థం త్యజత ఆత్మానం ఆత్మనా ! ప్రియం కృతం హి రామ
స్య ధర్మజ్ఞేన జటాయుషా !!
స సుఖీ గృధ్ర రాజ స్తు రావణేన హతో రణే ! ముక్త శ్చ సుగ్రీవ భయాత్ గత శ్చ పరమాం
గతిమ్ !!
జటాయుషో వినాశేన
రాజ్ఞో దశరథ స్య చ ! హరణేన చ వైదేహ్యాః సంశయం హరయో గతాః !!
|
అకస్మాత్తుగా పక్షి అందీ కో అయం గిరా ఘోషయతి
ప్రాణైః ప్రియతర స్య మే ! జటాయుషో వధం భ్రాతుః కమ్పయన్ ఇవ మే మనః !! కో అయం గిరా
ఘోషయతి ఎవరురా నా ప్రాణములతో సమానమైనటువంటి నా తమ్ముడైన జటాయువు యొక్క
పేరెత్తి మాట్లాడుతున్నవారు ఆ జటాయువు యొక్క వధగురించి విని నేను ఎంతో
ఖేదాన్నిపొందాను నా తమ్ముడు జటాయువు మరణించాడా ఏదీ నా దగ్గరకొచ్చి ఒక్కసారి ఆ
విషయాలు నాకు చెప్పండీ అన్నాడు అనేటప్పటికి వీళ్ళు అనుకున్నారు. ఓరేయ్ ఆ పక్షిచూడు
ఎంతపెద్ద పక్షుందో పర్వతమంత పక్షి వచ్చి కూర్చుంది దగ్గరకొచ్చి తింటంలేదు కాబట్టి
ఈ పక్షి నన్ను తినేస్తుందిరా అని మనం చచ్చిపోతాంరా... నిజంగా ఏమండీ
చనిపోదామనుకున్నవానికి తినేయడానికి పక్షి వస్తే సంతోషించదూ అమ్మయ్యా అయిపోయిందిరా
బాబు మనం సంకల్పం చేయగానే వచ్చేసింది ఓ పక్షి దిక్కుమాలిన గొడవ వదిలిపోయింది
చంపేస్తుంది అనుకోవాలిగదా! వాడు అయ్యబాబోయ్ వచ్చేసిందిరా పక్షి చంపేస్తుంది
ఇప్పుడు మనల్నీ, అది అనుకొంటొందా... నా అదృష్టం ఇన్నాళ్ళకు ఇంతమంది దొరికారు చక్కగా
హాయిగా వడ్డించినట్టుగా పడుకున్నారుగా ఒకళ్ళతరువాత ఒకళ్ళని తింటూ వెళ్ళచ్చునేను
అని అదనుకోంటుంది. అకస్మాత్తుగా జటాయువు పేరు వినపడింది రామ కథలో అదీ నా తమ్ముని
గురించి మాట్లాడినవాళ్ళు ఎవరు అని అడిగింది సరే, ఎలాగో చచ్చిపోదామనిగదా పడుకున్నాం
తినేస్తానంటే భయమేమిటీ దగ్గరికెళ్ళి తీసుకు రమ్మంటుందిగా వెళ్ళదాం ఇప్పుడు ఎవడు
ముందుకు వెళ్తాడో వాడు వెళ్ళాలిగదాండీ! అందుకనీ అంగదు లేచి వెళ్ళాడు.
వెళ్ళితే అది అడిగింది ఎవరు నువ్వు నీవు చెప్పిన రామ కథ ఏమిటీ? ఏమిటీ ఈ
జటాయువు మరణం గురించి చెప్తున్నావు నాకు రాముడు అంటే ఎంతో ప్రీతీ, దశరత మహారాజు నా
తమ్మునికి స్నేహితుడు అంటే ఆయన అన్నాడూ, ఇది రామాయణంలో గొప్పతనం ఏమిటంటే కథని
ఎప్పుడూ కూడా రామాయణంలో ఎవరైనా ఎటు మొదలు పెడతారంటే తనవైపునుంచి మొదలుపెడతారు
కదాండీ! ఏమండీ గుంటూరులో కార్యక్రమం బాగా జరిగిందా అన్నారనుకోండి, గుంటూరులో
కార్యక్రమం అనగా అని మొదలు పెట్టరు, కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళామండీ అబ్బో ఎంత
మర్యాదో పీఠంలో మంచి చక్కగా ఆవాసం ఇచ్చారు పొద్దున్నే మంచి చక్కటి ఫలహారం
మధ్యాహ్నం భోజనం అన్నీను బాబు ఎంత భక్తండి బాబూ ఎంతబాగుంటుందో పీఠం అనీ తరువాత
రామాయణం గురించి చెప్తారు. కదా ముందు తనవైపునుంచి మొదలౌతుంది ప్రయాణం ఏదైనా కూడా శ్రీరామాయణం
మనస్తత్వశాస్త్రం అని నేను అందుకే అన్నాను
కాబట్టి అలా మొదలు పెట్టాడు.
|
కానీ నేను వృద్ధుడనైపోయాను నాకు రెక్కలు లేవు
నేను ఎగరలేను అందుకని ప్రతీకారం తీర్చుకోలేను, ఎందుకు నీ రెక్కలు పోయాయి
అంటావేమో... ఒకానొకప్పుడు వృత్రాసుర వధ జరిగినటువంటి కాలంలో చూడండి ఆ చెప్పడంలో
కూడా ఒక చమత్కారం. మీ పెళ్ళెప్పుడైందండీ అన్నారనుకోండి వాడూ ఏదో సంవత్సరం చెప్పడు
మీకు గుర్తుందా ఈ దివి సీమంతా కొట్టుకపోయి పెనుతుఫానొచ్చింది ఆ యేడాదే నా పెళ్ళి
అంటాడు ఎందుకూ అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క బండగుర్తుతోటి చెప్తారు తప్పా వాడికి
సంవత్సరం గుర్తుందా అంటే అటూ ఇటూ చెప్తాడు కానీ దివి సీమ కొట్టుకపోయిన రోజునే నా
పెళ్ళండి అంటాడు అదెందుకు అలాగా..? అంటే ఓ బండ గుర్తుతో చెప్పడం అలవాటుగా
వచ్చేస్తుంటుంది కొంతమందికి అలా ఇయ్యన కూడా ఎంత గొప్పగా చెప్పాడంటే మృత్రాసుర వధ
జరిగినటువంటి కాలమది ఎప్పటి కాలం ఆ వృత్రాసుర వధ జరిగిన కాలంలో నాకూ నా తమ్మునికీ
ఒక కోరిక పుట్టింది ఆ సూర్య ప్రకాశము ప్రకాశించేటటువంటి మండలం ఏదుందో ఆ సూర్య
మండలం వరకు ఎగురుదాము కాబట్టి మేము ఇద్దరం కలిసి ఎగరడం ప్రారంభించాము మధ్యాహ్న
కాలమైంది సగం దూరం వెళ్ళాం సూర్యుని యొక్క వేడి చేత నా తమ్ముని యొక్క రెక్కలు
కాలిపోయే స్థితి వచ్చింది. ఇది భ్రాత్రు ధర్మమంటే మహానుభావుడు ఎంత ప్రేమ
కలిగినవాడో చూడండి మధ్యం ప్రాప్తే చ సూర్యే చ జటాయుః అవసీదతి ఆ సగందాకా
వెళ్ళిన తరువాత ఇంక జటాయువు ఎగరలేకపోయాడు ఖేదపడిపోయి చమటలు కారుస్తూ వగర్చాడు ఇక
అతని శరీరము కాలిపోయే స్థితి వచ్చేసింది అప్పుడు నేను పక్షాభ్యాం ఛాదయా మాస
స్నేహాత్ పరమ విహ్వలః ! స్నేహాత నా
తమ్మునియందు ఉన్న ప్రీతిచేత నా తమ్మునికి ఎక్కడ ఆపవస్తుందో అని చెదిరిపోయిన
మనస్సుతో మరి నీకు రాదా ఆపదా..? అంటే తన ఆపద పట్టించుకోలేదు తమ్ముడిమీద ప్రేమతో నా
రెక్కల్నీ నా తమ్ముడిమీద ఆచ్ఛాదించాను ఆచ్ఛాదించడంలో ఆ వేడికి నా రెక్కలు
కాలిపోయాయి. కాలిపోయిన తరువాత నేను నిర్దగ్ధ పక్షః పతితో విన్థ్యేఽహం వానరోత్తమాః ! నేను ఈ విధ్య పర్వత శిఖరాలమీద పడిపోయాను ఎగరలేక
నా తమ్ముడు ఎటు ఎగిరిపోయాడో నాకు తెలియదు ఇక ఆనాటి నుంచి నా తమ్ముని నేను చూడడం
కుదరలేదు కాబట్టి నేను ఇలా పడున్నాను.
|
అంటే ఆవిడ ఎక్కడికీ వెళ్ళదు కాబట్టి ఆవిడకి అన్నీ తెలుస్తాయి ఇంట్లో
జరిగినవన్నీ అలా రెక్కలు కాలిపోయిన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్నానన్నాడు కాబట్టి
సీతాపహరణం చూసి ఉండి ఉండాలి అందుకు వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు సంతోషంగా
అమ్మయ్యా ఇక్కడే ఉన్నవాడు ఒకడు దొరికాడురా కాబట్టి ఏమైనా చెప్తాడేమో ఆ చెప్పేవాడు
దొరకలేదు ఇన్నాళ్ళు కాబట్టీ సీతాపహరణం జరిగింది రావణాసురుడు ఎత్తుకుపోవడం మీరు
ఏమైనా చూశారా మీకేమైనా తెలుసా రావణుడు ఎక్కడుంటాడో అసలు అతని బలమేమిటో మీకేమైనా
తెలిస్తే పుణ్యం కట్టుకుందురు నాకోమాట చెప్పండీ అన్నాడు. చచ్చిపోదామనుకున్నవాడికి
ఇవన్నెందుకండీ ఇంకా అంటే చచ్చిపోయే ఉద్దేశ్యంలేదసలు అది మీరు పట్టుకోవాలి రామ కథని
మళ్ళీ ఊపిరిని ఊదింది బ్రతుక్కి. కాబట్టి ఇప్పుడు అంటే ఆయన అన్నాడూ నిర్దగ్ధ
పక్షో గృధ్రోఽహం గత వీర్యః ప్లవంగమాః ! వాఙ్మాత్రేణ తు రామ
స్య కరిష్యే సాహ్యమ్ ఉత్తమమ్ !! రెక్కలు కాలిపోయి ఈ కిందపడున్నవాన్ని నేనేం సాయం చేస్తాను మీకు రామ కార్యంలో
కానీ నేను మాట సాయం చేస్తాను అంది. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా
గమనించాలి. ఈయ్యన్నీ మీకెందుకులెండి నేను వచ్చి సాహాయం చేస్తాననటంలేదు ఓ మాట సాయం
చేస్తానన్నాడు ఈ మాట రామాయణంలోనిదేనండీ... చూడండి మీరు నాకు కొంచెం ఓ మాట సాయం
చేసిపెట్టాలి అంటారు ఏంటండీ అంటే రేపు నేను ఇంటర్యూకి వెళ్తాను కదా మీరు ఒక ఫోన్
చేసిపెట్టండి అంటారు మాటసాయం. అలా నేను మీకు ఓ మాటసాయం చేస్తాను అంటే చాలా తెలిక
సహాయమన్నమాట ఏదో కష్టపడిపోయి తన దగ్గర ఉన్నటువంటి యర్ర యాగాణి కూడా
తీసివ్వక్కరలేదు తనకు తెలిసున్నవిషయం ఒక్కసారి నోటితో చెప్తారంతే. ఇంతకన్నా తక్కువ
ఉపకారం బహుషా ఇంకేమీ ఉండదు లోకంలో అసలు చేద్దాము అనుకుంటే చేద్దామనుకున్నవాడు అది
కూడా చేయకపోతే మనమేం చేయలేమనుకోండి కాబట్టి మాటసాయం మాత్రం మీకు చేసిపెడతా అన్నాడు
పోని అదైనా చాలు కాబట్టి అదేమిటో చెప్పు అన్నాడు
|
క్రోశన్తీ రామ రామేతి లక్ష్మణేతి చ భామినీ ! భూషణాన్ అపవిధ్యన్తీ గాత్రాణి చ
విధూన్వతీ !!
పుత్రో విశ్రవసః సాక్షాత్ భ్రాతా వైశ్రవణ స్య చ ! అధ్యాస్తే నగరీం లంకామ్
రావణో నామ రాక్షసః !!
ఇతో ద్వీపే సముద్ర స్య సంపూర్ణే శత యోజనే ! తస్మిన్ లంకా పురీ రమ్యా నిర్మితా
విశ్వకర్మణా !!
జామ్భూనద మయై ర్ద్వారైః చిత్రైః కాంచన వేదికైః ! ప్రాకారేణ అర్క వర్ణేన మహతా
సుసమావృతా !!
తస్యాం వసతి వైదేహీ
దీనా కౌశేయ వాసినీ ! రావణాఽన్తఃపురే రుద్ధా రాక్షసీభిః సురక్షితా !!
నల్లటి మబ్బు ఎలా ఉంటుందో నీరు పట్టిన మబ్బు
అటువంటి రూపం కలిగినటువంటి రావణుడు మబ్బు మధ్యలో మెరిసినటువంటి మెరుపుతీగలా ఉన్న
సీతమ్మని తన తొడమీద కూర్చోబెట్టుకుని ఈ మార్గంలో తీసుకుని వెళ్ళాడు. ఆమే
రావణునిచేత అపహరింపబడుతున్నప్పుడు హా..రామా... హా.. లక్ష్మణా అని ఏడుస్తూ భయంతో
కదిలిపోతుండగా ఆ ఆభరణములన్నీ కూడా వ్రేడుతున్న స్థితిలో ఆమెను నేను చూశాను ఆ
రావణుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు అంటే కుబేరుని యొక్క తమ్ముడు
ఆయనా లంకానగరాన్ని పరిపాలిస్తూంటాడు. ఈ సముద్రం నూరు యోజనములు దూరాన్ని మీరు దాటి
వెళ్తే కాంచన లంక ఉంది నాకు ఇక్కడ నుంచి కనపడుతుంది అదిగో ఆ లంకాపట్టణంలో అంతఃపురం
ప్రక్కన ఉన్న ప్రవదావనంలో సీతమ్మతల్లి రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతూ ఉంది. ప్రమదావనము
అన్నమాట పూర్తిగా వాడి చూపించలేదు అంతఃపురంలో రక్షింపబడుతుంది లంకలో రాచగృహంలో
రాజు నివశించి రాణులు నివశించే గృహంలో అందులో ప్రవదావనం అంతర్భాగం అక్కడ
ఉన్నటువంటి సీతమ్మని చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ రక్షిస్తున్నారు,
రక్షించడమూ అంటే ఆవిడ
చచ్చిపోకుండా చూస్తున్నారు అది రక్షణంటే వాళ్ళ ఉద్దేశ్యం ఆవిడా ఏడుస్తూ
ఉంది.
ఇహస్థోఽహం ప్రపశ్యామి రావణం జానకీం తథా !
అస్మాకమ్ అపి సౌవర్ణం దివ్యం చక్షు ర్బలం తథా ! తస్మాత్ ఆహార వీర్యేణ నిసర్గేణ
చ వానరాః !!
ఆయోజన శతాత్ సాఽగ్రాత్ వయం పశ్యామి
నిత్యశః !!!
ఈ భూమికీ 7 అంతరములున్నాయి ఆకాశానికి మధ్యలో మొదటి అంతరంలో అసలు మొదటి అంతరం
వెళ్ళకుండా తమ కాళ్ళదగ్గర ఉన్న పదార్థమున్ని తాము చిమ్ముకు తినేటటువంటివి
రెక్కలున్నవి కొన్ని ఉంటాయి కోళ్ళు మొదలైనవి అవి ఎగరలేవు అవి తన కాళ్ళదగ్గర దొరికినదాన్ని
చిమ్ముకు తింటుంది. ఇంకొకటి పావురం లాంటిదీ మొదటి అంతరంలో ఎగురుతుంది ధాన్యపు
గింజలు ఏరుకుతింటుంది. కాకిలాంటిది పల్ళు కాయలు తింటూ రెండో అంతరంలో ఎగురుతుంది
మూడో అంతరంలో ఎగురేటటువంటి నీటి కాకులు క్రౌంఛ పక్షులు మొదలైనటువంటి మూడో అంతరంలో
లకముకి పిట్టలు నీటి కాకులు ఎగురుతాయి. నాలుగో అతరంలో డెగలు ఎగురుతాయి ఐదవ అంతరంలో
గద్ధలు ఎగురుతాయి ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి ఏడవ అంతరంలో చిట్ట చివరి అంతరంలో
ఆకాశానికి దగ్గరిగా ఒక్క వినత పుత్రులైనటువంటి వైనతేయులు మాత్రమే ఎగురుతారు.
వాళ్ళకు ఒక్కళ్ళకే అంత శక్తి. నేను వినత పుత్రులైనటువంటి అరుణుని యొక్క సంతానానికి
చెందినవాన్ని కాబట్టి నేను ఏడు అంతరములు పైకి ఎగిరి చూడగలను కానీ ఇప్పుడు ఎగరలేను.
కానీ మాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఉంది, ఏమిటా శక్తి అంటే ఇహస్థోఽహం ప్రపశ్యామి నేను ఇక్కడే కూర్చుని నా కన్ను ఇలా తిప్పి
చూస్తే నూరు యోజనముల దూరంలో ఉన్న అంతఃపుర ప్రాంగణంలో ఉన్న సీతమ్మ ఏడుపు వినపిస్తూ
నాకు కనపడుతూంది. ఎందుకలా కనపడుతూంది అస్మాకమ్ అపి సౌవర్ణం దివ్యం చక్షు ర్బలం
తథా మా కంటి చూపుకి ఈశ్వరుడు అంత
శక్తిని ఇచ్చాడు అందుకు కదాండి గ్రద్ధ అక్కడ ఎగురుతూ ఇక్కడ ఉన్న కోడిపిల్లల్ని
చూసొచ్చి తన్నేస్తుంది.
|
ఆయనా జలతర్పణ చేశారు జలతర్పణ చేసిన తరువాత మళ్ళీ
తీసుకొచ్చి కూర్చోబెట్టారు రెక్కలు లేవుగదా ఆయనకి కదలలేడు ఎగరలేడు అందుకని
కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వీళ్ళందరూ చుట్టూ చేరారు ఎందుకనీ ఇన్నాళ్ళకి
సీతమ్మజాడ చెప్పేవాడు ఒకడు దొరికాడు మంచి కథలు చెప్పే తాతగారి ముందు మనమలు
పక్కింటివాళ్ళు కూడా చేరుతుంటారు అలా అందరూ చేరారు తం మామ్ ఏవం గతం పుత్రః
సుపార్శ్వో నామ నామతః ! ఆహారేణ యథా కాలం బిభర్తి పతతాం వరః !! తీక్ష్ణ కామా స్తు
గన్ధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః ! మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా
వయమ్ !! ఎంత గొప్పగా మాట్లాడుతాడో ఆ సంపాతి అన్నాడు గంధర్వరులకి కామం ఎక్కువ
పాములకి కోపమెక్కువ మృగములకు భయమెక్కువ మాకు ఆకలెక్కువ మాకు అంటే పక్షులకు
పక్షులకు ఆకలెక్కువ కాబట్టి అసలే నేను పక్షిని అందులో పెద్ద పక్షిని నాకు చాలా
ఆకలి రెక్కలా లేవు కాబట్టి నేను ఆహారం తినడానికి ఎక్కడా కదలలేను కాబట్టి నా
కుమారుడైనడువంటి సుపాశ్వోరుడు ప్రతిరోజూ నాకు ఆహారం పట్టుకొచ్చి పెట్టేవాడు నేను
తింటుండేవాన్ని ఒక రోజున నా కుమారుడు నాకు ఆహారం తీసుకురాలేదు సాయంకాలం అయిపోయింది
నాకు
విపరీతమైన ఆకలి
పైగా నా కుమారుడు రిక్తహస్తములతో వచ్చాడు నేను చాలా కృద్ధుడనై మాట్లాడాను నీవు
ఎందుకు తేలేదు ఆహారం అన్నాను అంటే ఆయన నాతో ఒక మాట చెప్పాడు.
|
నాన్నగారు నేను మహేంద్రగిరి ద్వారం దగ్గరికి
వెళ్ళి రెక్కలు అల్లార్చుకుని కూర్చొని సముద్రంలోకి చూస్తున్నాను సముద్రంలో ఉండే
ప్రాణులను పట్టుకుని నీకు తీసుకొద్దామని ఈ లోగా ఒక మహాభూతమొకటి ఆకాశ మార్గంలో
వస్తూంది అది నీరు నిండిన మేఘంలా నల్లగా ఉంది దాని ఒడిలో ఒక మెరుపు తీగలాంటి ఒక
ఆడది చాలా తత్తరపడుతూ శోకిస్తూంది. ఈ సముద్ర ప్రాణులెందుకు ఆ నల్లమబ్బులాంటి శరీరం
ఉన్నవాన్ని పట్టుకొచ్చి నీకు ఆహారంగా సమర్పిద్దామని నేను నోరు తెరిచి కూర్చున్నాను
ఆ ప్రాణి నల్లటి ఆకారమున్న వ్యక్తి నా దగ్గరకొచ్చి ఒక మాట అన్నాడు అయ్యా నాకు
దయచేసి దారివిడవండి అని ఎంతో వినయంతో ప్రార్తించాడు శత్రువైనా వినయంతో ప్రార్థించినవాడిని విడిచిపెట్టాలిగదా అందుకని
నాన్నగారు నేను దారి విడిచిపెట్టేశాను ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఆవిడతో కలిసి ఆ
తరువాత సిద్ధులు చారుణులు మొదలైనవారు నా దగ్గరకి వచ్చారు నాయనా నీవు
అదృష్టవంతుడివిరా వాడు ఏ స్థితిలో ఉన్నాడో బ్రతిమాలి వినయంగా అడిగాడు వాడి
జీవితంలో వియంగా అడగడం అన్నది ఉండదు, వాడు రావణుడు సీతాపహరణం చేస్తున్నాడు. వాన్ని
చూసి సమస్త భూతములు భయపడి పక్కకు తప్పుకున్నాయి నీవు వాడికి ఎదురు పడినా వినయంగా
అడిగితే దారి ఇచ్చావు కాబట్టి బ్రతికిపోయావు నీవు ఆయుష్మంతుడవు అన్నారు.
కాబట్టి నాన్నగారు ఇవ్వాళ ఆలస్యమైపోయింది నేను ఈరోజు నీకు ఏమీ తేలేకపోయాను అని
చెప్పాడు. కాబట్టి నా కొడుకు కూడా చూశాడు సీతాపహరణం జరిగినప్పుడు రావణునితో నా
కొడుకు మాట్లాడాడు కూడా అని చెప్తూ నేను చాలా కాలం క్రితం రెక్కలు కాలిపోయి ఒక
పర్వత శిఖరం మీద పడిపోయానని మీతో చెప్పానుకదా మీతో అంటే సంపాతి వానరులతో చెప్పిన
కాడికి మీరు అనుసంధానం కండీ... పడిపోయానుగదా పడిపోయినప్పుడు నాకు తెలియలేదు అంటే
మళ్ళీ వెనక్కి వెళ్లాడు కథలో వెళ్ళి ఆరు రోజులపాటు స్పృహలేని స్థితిలో నేను ఆ
బండమీద పడిపోయి ఉండిపోయాను వింధ్య పర్వత శిఖరంమీద పడ్డాడు. ఎక్కడ పడిపోయాడో ఆయనకు
తెలియదు గాలి వాలుకొచ్చి పడిపోయినట్లు ఆరు రోజులు స్పృహలేదు నిజంగా చాలా
గొప్పవాడండీ అంత పైనుంచి కిందపడి ఆరురోజులు స్పృహలేకపోవడమేమిటీ అసలు మనిషి
ఉండకూడదుకదా... ఆరు రోజుల తరువాత నాకు స్పృహవచ్చింది అన్ని దిక్కుల వంకా చూశాను
నేను ఎక్కడున్నానూ అని ఆలోచించాను, నేను ఇప్పుడు వింధ్య పర్వతం యొక్క దక్షిణ
ప్రాంతంలో పడిపోయాను అని నాకు ఆ ప్రాంతాన్ని బట్టి నేను తెలుసుకున్నాను,
తెలుసుకుని మెల్లగా శరీరాన్ని ఈడ్చుకుంటూ అక్కడే ఉన్నటువంటి నిశాకర మహర్షి యొక్క
ఆశ్రమానికి వెళ్ళాను. నేను ఓపిక ఉన్న రోజులలో నేను నా తమ్ముడైన జటాయువు మనుష్య
రూపాలలో వెళ్ళి నిశాకర మహర్షికి నమస్కారం చేస్తుండేవాళ్ళుం.
ఆ మహర్షికి నేను తెలుసు అందుకనీ మనశ్శాంతి కలుగుతుంది సంతోషం కలుగుతుంది
అటువంటి మహర్షుల దర్శనం చేస్తే, మహాత్ముల దర్శనం ఎందుకు ఉత్తిగనే పోతుందండి అది
కాపాడి తీరుతుంది కాబట్టి నేను మహాత్ముల దర్శనం చేద్దామని మెల్లిగా శరీరాన్ని
ఈడుస్తూ ఆ ఆశ్రమానికి చేరుకున్నాను అది సురైరఽపి సుపూజితమ్ దేవతలు కూడా వచ్చి పూజిస్తారాయన్ని అంత
గొప్పవాడు ఋషి ర్ని శాకరో నామ యస్మిన్ ఉగ్ర తపాఽభవత్ ఆయనా మహానుభావుడు చాలా గొప్ప తపస్సు చేసినవాడు
ఎటువంటి తపస్సు సామాన్యమైన తపస్సుకాదు యస్మిన్ ఉగ్ర తపాఽభవత్ ఆయన
చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు అన్ని నియమాలు పాటించినటువంటివాడు అష్టౌ వర్ష
సహస్రాణి తేన అస్మిన్ ఋషిణా వినా ! వసతో మమ ధర్మజ్ఞాః స్వర్గతే తు నిశాకరే !! నేను
ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళిన తరువాత రెక్కలు కాలిపోయిన తరువాత 8 వేల సంవత్సరములు
ఆయన ఉన్నారు ఉండి అబ్బా ఇంకెళ్ళాలుంటానులేవోయ్ ఈ శరీరంతో అని ఆయన శరీరాన్ని
విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు. నేను ఆ ఋషి దర్శనం కోసం వెళ్ళాను ఆయన అప్పుడు
స్నానానికి వెళ్ళాడు నేను వెళ్ళలేనుగా అందుకని నేను అక్కడే కూర్చున్నాను ఆయన అటుగా
వస్తారుకదా చూద్దామని అథాఽపశ్యమ్ అదూరస్థమ్ ఋషిం జ్వలిత తేజసం ! కృతాఽభిషేకం దుర్ధర్షమ్
ఉపావృత్తమ్ ఉదఙ్మఖమ్ !! ఆయనా ఉత్తర దిక్కుకు తిరిగినటువంటివాడై స్నానం చేసి వస్తున్నటువంటి ఆ ఋషి
అగ్ని శిఖ ఎలా ఉంటుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు.
|
ఆయన అన్నారు ఆగండి ఆగండి ఎందుకలా పట్టుకుంటారుదాన్ని అదేమో చెప్తామనుకుంటుంది
ఆగండన్నారు. అది మహర్షి దగ్గరికొచ్చి మోరలెత్తీ ఏదో అలా అలా అని మాట్లాడింది ఆయన
అన్నారు దానికి పాకవేశారటా దాన్ని ఇవ్వాళ గృహప్రవేశం చేయిస్తున్నారటా దానికి
భయంవేసిందంటా దానికిముక్కుతాడు వేశారటా అది పట్టుకులాగారటా దానికి నెత్తురు
కారింది దానికి ఎంత బాధకలిగిందో నేను భగవాన్ కు చెప్పుకుంటానని నా దగ్గరికి
వచ్చింది పైగా దాన్ని లాగేస్తారా మీరు అమ్మా! మహాలక్ష్మీ ఏం చేయరు నాన్నా నీకు ఇల్లుకట్టారు వెళ్ళి అక్కడుండు నేను వస్తానే
అన్నారు. అంతే వెళ్ళిపోయింది తలాడిచ్చి, యదార్థంగా ఎప్పుడో కాదండి ఈ మధ్య కాలంలో
భగవాన్ రమణులంటే మహానుభావుడు మొన్న మొన్నటివరకూ ఉన్నవారే గా... నాలుగు ఐదు
దశాబ్దాల క్రిందటా వారి సమక్షంలో సమస్త ప్రాణులు అలాగే ఉంటాయి. అందుకే రమణ మహర్షీ
శరీరంతో ఉన్న కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు పుట్టాడు
ఒకాయనకి వాడు ఎంత ఉన్మాదిగా పుట్టాడంటే అసలు వాడు నిద్రకాని తెలివొస్తే ఇకవాన్ని
పట్టుకోలేరు ఇనుప గొలుసులతోటే కట్టాలి అలా ఊగిపోయేవాడు ఉన్మాదంతో.
|
ఒక మహాత్ముడు కించిత్ కర్మ మిగిలిపోయి ఆవు
రూపంలో వచ్చాడు కాబట్టి దీన్ని ఇలా విడిచిపెట్టవద్దూ అని ఒక సన్యాసిని ఏ క్రమంతో
భూస్థాపితం చేస్తారో అలా భూ స్థాపితం చేశారు ఇప్పటికీ మీరు భగవాన్ రమణుల
ఆశ్రమానికి వెడితే ఆశ్రమంలో ద్యానమందిరానికి వెనకాల అంటే భోజనశాలకు పక్కన మీరు
చూస్తే మహాలక్ష్మీ ది కౌ అని బోర్డు ఉండి ఒక సమాధి కనపడుతుంది. అందులో ఆయన చేతులతో
ఆవుని పెట్టీ ఉప్పు వేసి సమాధి చేశారు. అలాగే ఒక జింక ఆయన సమక్షంలో నెమలి
పడుకునేది కుక్క పడుకునేది పాము పడుకునేది పిల్లి పడుకునేది ఎలుక పడుకునేది చెవుల
పిల్లి పడుకునేది ఒక తెల్ల నెమలి పడుకునేది అన్ని ప్రాణులు అలా పడుకునేవి.
జీడిపప్పు పట్టుకుని ఆయన లా చేత్తో పట్టుకుంటే అన్ని ప్రాణులు చుట్టూ వచ్చి ఆయన
చేతిలో ఉన్న జీడి పప్పును అన్నీ తినేవి తొందరపడకండే నేను పెడతాను అని ఆయన దోసిడితో
పట్టుకుంటే అన్ని ప్రాణులు ఒకదానిపట్ల ఒకటి వైరంతో గుర్రుమంటాయి ఇటువంటివన్నీ
తింటుంటాయి. ఒకప్పుడు ఒక నెమలి మాత్రం ఏం చేసిందంటే ఆయన పట్టుకుంటే తొందరపడి
గట్టిగా కొట్టింది ఆయనకి రక్తం వచ్చింది. నీకు ఆర్తెక్కువైపోయింది ఇక పెట్టనుపో
అన్నాడు ఆయన.
|
నిషాకర మహర్షి వెంట ఈ ప్రాణులన్నీ బ్రహ్మగారివెనకాల ప్రాణులు వచ్చినట్టుగా
వచ్చి ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోయినాక అవి వెళ్ళిపోయాయీ అంటే మీరు ఎందుకు
ఆశ్చర్యపోవాలి. భూతముల పట్ల ఆ భావనతో ఉంటే అంతటా ఉండే ఆ పరబ్రహ్మమునే చూడగలిగిన
మహాపురుషుల పట్ల భూతములు కూడా అలాగే ప్రవర్తిస్తాయి అందుకే ప్లేగు వ్యాది వస్తే
అవి శవాలను ఈడ్చుకుపోయి తింటుంటే అవి తిరుమన్నామలైలో ఒకప్పుడు, భగవాన్ రమణులు ఒక
రాతిమీద కూర్చుని ఉండేవారు ఇలా కూర్చునుంటే ఆయన ముందే పులులొచ్చి శవాలను
ఈడ్చుకునిపోయి తిని ఆయన్ని చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాయి. ఆయన కూర్చుంటే
త్రాచుపాములు నమస్కారం చేసి వెళ్ళిపోయాయి తప్పా
పడగకూడా ఇలా ఎత్తేవి కావు. ఆయన కూడా భూతముల పట్ల అంత దయతో ఉండేవాడు
బ్రహ్మమును చూసేవాడు. ఆయన ఒకానొకప్పుడు అరుణాచలం కొండమీదకు వెళ్తుంటే ఒక పొదకి ఆయన
కాలు తగిలింది దానిలో తేనెపట్టు ఉంది తేనెటీగలు లేచాయి ఆయన వెంటనే అయ్యెయ్యో...
మీరు కష్టపడికట్టుకున్న ఇల్లు నా కాలు తగిలి మీ గూడు చెదిరింది మీకు బాధ కలిగింది మీరు పొందిన
బాధ నేను పొందితితే తప్ప నా పాపం పోదు మిమ్మల్ని నేను ఎంత ఖేదపెట్టానో
ఇక్కడకొచ్చి గూడుకట్టుకుని ఉన్నవాళ్ళని కాబట్టి మీరు కరవండీ అని ఆ కాలు ఎత్తి
రాయిమీద పెట్టి నిల్చున్నాడు. తేనెటీగలు అన్ని వచ్చి కాలు ఇక్కడ నుంచి అన్నీ
పాదంవరకు పట్టేశాయి, పట్టేసి శుభ్రంగా కరిచేసి వదిలిపెట్టేశాయి, ఆయన ఆ కాలు ఎర్రగా
అయిపోయి ఇంతలావు
వాచిపోయింది
వాచిపోయిన తరువాత వచ్చారు గుహలోకి, విరూపాక్ష గుహ అని ఇప్పటికీ ఉంది గుహ ఆ గుహ
దగ్గరికొస్తే ఆయన దగ్గర ఉండేవాడు కుందుస్వామి అని ఒక పరిచారికుడు ఆయన చూసి
అయ్యెయ్యో ఏమిటి స్వామి ఇది అని భగవన్ ఏమిటిదీ అన్నారు.
|
అంటే ఈ ʻకాలూʼ
అనేవారు ఆయన శరీరాన్ని వేరుగా చెప్పేవారు ఇదీ అంటుండేవారు ఆయన, ఇదీ... వాటి గూటిని పాడుచేసింది మరి ఇది శిక్ష
అనుభవించాలిగా అవి దీన్ని ఒక్కదన్నే కరిచాయి ఆయన్ని అవి మిగిలిన శరీరాన్ని కరవలేదు
అందుకనీ ఇది బాధపడుతూంది, దీన్నిండా తేనెటీగల ముళ్లు విరిగిపోయాయి ఎంతబాధ పడుతుందో
చూశావా..! మరి జాగ్రత్తగా ఉండద్దూ ఇంకోళ్ళనెందుకు బాధపెట్టడం అన్నాడు. అంటే
అప్పుడు ఆ కుందుస్వామి వెళ్ళి శ్రావణం తీసుకొచ్చీ డాక్టర్ దగ్గరికి కూడా
వెళ్ళలేదండీ ఆయనా... ముళ్ళు తీసేశారు ఒక్కొక్క ముల్లు అందుకే రమణులు శరీరం
విడిచిపెట్టేసేంతవరకు ఒకకాలు లావుగా ఉంటుంది ఫొటోస్ లో కూడ ఇప్పటికీ అంతటి
బ్రాహ్మీమయ మూర్తులు మహాపురుషులు ఈ దేశానికి ఖ్యాతి తెచ్చారు. వాళ్ళవల్ల కీర్తి
తప్పా నిజానికి ఈ దేశానికి కీర్తి కేవలం ఐశ్వర్యంవల్లకాదు అటువంటి మహాపురుషుల వలన
కీర్తి వచ్చింది. సరే నా ప్రసంగము భగవాన్ రమణుల వైభవమూ అన్నవైపుకు వెడితే నేను
ఆపుకోలేను నాకు ఆయనంటే అంత భక్తి మహానుభావుడు.
కనుక ఇప్పుడు ఆ ప్రాణులన్నీ వెడుతున్నాయి ఆ నిశాకర మహర్షి వెడుతున్నాడు నేను
అక్కడే కూర్చుని ఉన్నాను వారు నా వంక చూశారు చూసి వెంటనే అన్నారు ఓ... నీవు
సంపాతివి కదూ నీ తమ్ముడు జటాయువు ఉండేవాడు కదూ మీ ఇద్దరు పక్షులు మీరు పక్షి
రాజ్యానికి అధిపతులు విశేషమైన బలమున్నవారు మనుష్యరూపాల్లో వచ్చి నాకు నమస్కారం
చేస్తుండేవారు అటువంటివారు ఇవ్వాళ్టి రోజునా ఎందుకు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావు
అని అడిగారు అడిగితే అప్పుడు చెప్పడం మొదలు పెట్టింది, మేము ఇద్దరు కలిసి శరీరంలో
బలముందికదాని సూర్యమండలం వైపుకి ఎగిరాం మేం కొంతదూరం ఎగిరేటప్పటికీ రథ చక్ర
ప్రమాణాని నగరాణి పృథక్ పృథక్ రథ చక్రం ఎలా ఉంటుందో అలా కనపడ్డాయి నగరాలు
పట్టణాలు, ఇంకాపైకి ఎగిరాము ఆ పట్టణాల్లోంచి సంగీత ధ్వనులు కూడా వినపడ్డాయి ఇంకా
పైకి ఎగిరాము ఎగిరితే ఆవామ్ ఆలోకయావః తత్ వనం శాద్వల సంస్థితమ్ మాకు
వనములన్నీ కూడా పచ్చగడ్డి మైదానాల్లాగా కనపడ్డాయి, ఇంకాపైకి ఎగిరాం ఆపగాభి శ్చ
సంవీతా సూత్రైః ఇవ వసుంధరా నదులన్నీ కూడా భూదేవి మెడల్లో హారాలుగా కనపడ్డాయి
అంత పైకి వెళ్ళిపోయాము ఇంకాపైకి ఎగిరిపోయాము హిమావాన్ చైవ విన్ధ్య శ్చ మేరు శ్చ
సమహాన్ నగః ! భూతలే సంప్రకాశన్తే నాగా ఇవ జలాఽఽశయే !! నీటిలో ఆడుకుంటున్న ఏనుగులు ఎలా ఉంటాయో ఈ భూమి
మీద హిమాలయ పర్వతం వింధ్యపర్వతం మాకు అలా కనపడ్డాయి ఇంకాపైకి ఎగిరిపోయాం కానీ ఈ
లోగా మాకు ఇక దిక్కులు కానీ భూమీ కానీ ఏమీ కనపడలేదు అప్పుడు భయమేసింది అప్పుడు
ఒక్కసారి ఇలా తల తిప్పి పైకి చూశాం యత్నేన మహతా భూయో రవిః సమఽవలోకితః ! తుల్యః
పృథ్వీ ప్రమాణేన భాస్కరః ప్రతిభాతి నౌ ! భూమి ఎంత ఉంటుందో అంత సూర్యమండలం కనపడింది.
మేను సూర్య మండలానికి దగ్గరయ్యాం ఈలోగా ఆ వేడికి జటాయువు యొక్క రెక్కలు
కాలిపోబోతున్నాయి నేను నా రెక్కలు అచ్ఛాదించాను జటాయువు రక్షింపబడ్డాడు నా రెక్కలు
కాలిపోయి ఇదిగో ఇక్కడ పడిపోయాను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అంటే నిశాకర
మహర్షి అన్నారూ పక్షౌ చ తే ప్రపక్షౌ చ పున రఽన్యౌ భవిష్యతః !
చక్షుషీ చైవ ప్రామా శ్చ విక్రమ శ్చ బలం చ తే !! నీవేం బెంగపెట్టుకోకు నీ రెక్కలూ చిన్న రెక్కలూ
కూడా నీకు మళ్ళీ పుడతాయి ఎందుకంటే తెగిన
రెక్క మళ్ళీ ఏమైనా
కలపచ్చమోకాని కాలిపోయిన రెక్క మళ్ళీ పుట్టదు కదాండీ పైగా రెక్కలోపట చిన్న రెక్క
ఉంటుంది మళ్ళీ రెక్కా చిన్న రెక్కా కూడా పుడుతుంది నీ కంటి బలం అలాగే ఉంటుంది నీకు
యవ్వనంలో ఎంత బలముందో అంతబలమూ వస్తూంది ఎందుకు వస్తుందో తెలుసా అన్నాళ్ళు
ఉండగలిగినంత ఓపిక నాకు లేదుకాని నాకు ఈ శరీరంతో అన్నాళ్ళు ఉండే ఓపిక నాకులేదు
అబ్బాహ్ కొంతమంది వైరాగ్యసంపత్తి అలాగుంటుందండీ... చంద్రశేఖర భారతీ స్వామి
ఉండలేకపోయాడు శరీరంతో ఉండలేక మహానుభావుడు మహాలయ అమవాస్య ముందురోజు అదే పనిగా
అదిష్టానాలకి ప్రదక్షిణ చేసి చేసి కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళి పెద్దగా శ్లోకాలు
చదివీ అక్కడ ఉన్నటువంటి సహాయకున్ని పిలిచి అమూల్యమైన గ్రధాలు ఈ పుస్తకాలు మళ్ళీ
దొరకమంటే దొరికేవి కావు వీటిని చాలా జాగ్రత్తగా భధ్రంచేయి అని తెల్లవారుఝామున
మహాలయ అమవాస్యనాడు మాత్రమే సన్యాసి ఇంక పూర్తి వైరాగ్యమొస్తే ఇంక శరీరాన్ని
వదలచ్చు నీటిలో.
|
కాబట్టి ఆ ధర్మం కూడా సుందర కాండలో వస్తుంది, ఆ
మాట చెప్పకుండా బయట వానపడుతోంది వేడినీళ్ళు పెడతాను స్నానం చేయండి అన్నాడు
పరిచారకుడు కాదు కాదు చన్నీళ్ళే చేస్తాను ఈ శరీరం గురించి వెంపర్లాడడం సన్యశించిననాడే
మానేశాను ఇది ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ధర్మం వదలను అన్నాడు వెనక పరిచారికుడు వచ్చాడు
స్నానాకి వెళ్ళారు, తుంగానదిలో స్నానం చేసి బట్ట పిడుచుతున్నాడాయన ఇయ్యన బట్ట
మారుస్తున్నారు పరిచారకుడు అనుకున్నారు బట్ట మార్చాడు కదాని పైకి కొంచెం ముందు పైకి
రెండు మూడు అడుగులువేశాడు. అంతే ధబ్ మని శబ్దంవచ్చింది. మహానుభావుడు ఒక్కధూకు
నీకిలోకి ధూకేశాడు అంతే ఆ వేగానికి వెళ్ళిపోయింది శరీరం చిత్రమేమిటో తెలుసాండీ
నీరు మీంగి భయంతోటీ బలవన్ మరణంకాదు ఆయన ఎటువంటీ బలవన్ మరణము కాదు ఆయన ఊర్ధ్వముక
చలనం చేసి పంచభూతాల్లోకి తన ప్రాణాన్ని కలిపి మోక్షస్థితిని అనుభవించారో ఆ
శరీరాన్ని పట్టుకొని తీసుకొస్తే అభినవ భారతీ తీర్థస్వామివారు గురువుగారు
అప్పటికీ... అభినవ విద్యాతీర్థ స్వామివారు చంద్రశేఖర స్వామివాకి శిష్యుడు ఆయనా
అప్పటికి శారదా నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఎర్పాట్లు చూస్తున్నారు ఆయన శరదాదేవి
గురించి గబగబా తుంగానదిని దాటి ఇవతలకొచ్చీ ఆ శరీరాన్ని నీళ్ళు మింగారేమోనని
చూశారు, చుక్కనీరు మీంగలేదు ఆయనా పైగా చిన్ముద్రపట్టి ఉన్నారు. చిన్ముద్రపట్టి
తేజో మూర్తియై శరీరం వదిలిపెట్టారు, మహాత్ములు శరీరాన్ని అలా వదిలిపెట్టేస్తారు.
కాబట్టి నీకు యవ్వనంలో ఎంత బలం ఉందో అంత బలం వస్తుంది కానీ కొన్ని సంవత్సరముల
తరువాత ఇంచుమించు కొన్ని వందల సంవత్సరముల తరువాత దశరథ మహారాజుగారని అని ఒకాయన
పుడుతాడు ఆయన కడుపున శ్రీమహావిష్ణువు రావణ సంహారానికి రామావతారంగా వస్తాడు, ఒక
నరుడిగా వస్తాడు ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది, ఆయన భార్య సీతమ్మ
జాడ కనిపెట్టడానికి కొన్ని వానరములు ఇలా వెడుతాయి వెళ్ళినప్పుడు వాటికి నీవు
మాటసాయం చెయ్యాలి అందుకని నీవు ఇలాగే ఉండు. నీకు ఎలాగో రెక్కలు లేవుగా నీవు కూర్చో
వాళ్ళే వస్తారని చెప్పారు. నీవు వాళ్ళకి రామ కార్యం మీద వెళ్తున్నవాళ్ళకి మాట సాయం
చేసిన ఉత్తర క్షణంలో నీ రెక్కలు నీకు వస్తాయని నాకు వరమిచ్చారు. అప్పుడే నాకు
మహర్షి ఒక రహస్యాన్ని చెప్పారు ఆయన భార్యని సీతమ్మని రావణుడు అపహరించి
తీసుకవెడుతాడు ఆ తల్లి రావణుడి ఇంట వండిన అన్నపు ముద్ద కూడా తినదు. అప్పుడు
దేవేంద్రుడు పరమానాన్ని పట్టుకెళ్ళి తల్లికి ఇస్తాడు
|
యత్ అన్నమ్ అమృత ప్రఖ్యం సురాణామ్ అపి దుర్లభమ్ ! తత్ అన్నం మైథిలీ ప్రాప్య
విజ్ఞా యేన్ద్రాత్ ఇదం త్వితి !!
అగ్రమ్ ఉద్ధృత్య రామాయ భూతలే నిర్వపిష్యతి !!!
యది జీవతి మే భర్తా
లక్ష్మణేన సహ ప్రభుః ! దేవత్వం గచ్ఛతో ర్వాఽపి తయోః అన్నమ్ ఇదం
త్వితి !!
ఆ తల్లికి ఇంద్రుడు పట్టుకెళ్ళి ప్రతిరోజూ ఇచ్చినటువంటి దేవతలకు కూడా
లభించనటువంటి పాయసాన్నపాత్ర చేతపట్టుకుని ఈ భూమి మీద నా భర్త రాముడు లక్ష్మణుడు
ఎక్కడ ఉన్నాకూడా జీవించివుండుగాకా అని పై అన్నాన్ని తీసిపెట్టేది ఇది పెద్ద ధర్మం
తెలుసాండి. పై అన్నాన్ని
ఎప్పుడూ కూడా ఇంటి యజమానికి పెట్టాలి. సరె ఎందుకూ అన్నదాన్ని ఇప్పుడు
చెప్పడానికి ఓ ఇప్పుడు ప్రత్యుత్పత్తి క్రమానంతటినీ చెప్పడమంటే కష్టం. కాబట్టి
ఇప్పుడు విడిచిపెట్టండీ పై అన్నం యజమానికి పెడుతుంటారు అందుకే కాబట్టి పై
అన్నాన్ని రామ లక్ష్మణులకు పెట్టి, ఒక వేళ వారు శరీరములను విడిచిపెట్టి ఉంటే ఏ
లోకములలో ఉన్నా ఈ అన్నము దక్కుగాకా అని పెట్టి తినేది ఆవిడ ముద్దకట్టి కాదు. పై
అన్నం తీసి కిందపెట్టి ఆవిడతినేది. కాబట్టి ఇంద్రుడు ఇచ్చిన పాయసంతో బ్రతుకుతుంది
తప్పా ఆవిడ రావణుని యొక్క రాజ్యంలో వండిన అన్నం కూడా తినదు. అంతటి
మహాపతివ్రయైనటువంటి సీత్మని రావణుడు అపహరించి లంకాపట్టణంలో బంధిస్తే ఆమె జాడ
కనిపెట్టడానికి సుగ్రీవుడు పంపించిన వానరులు దక్షిణ దిక్కుగా వెడుతూ ఇటువస్తారు.
వాళ్ళకు నీవు మాటసాయం చెయ్యీ అని ఆయన నాతో చెప్పాడు కాబట్టి నేను మీకు మాటసాయం
చేశాను నాయనా! కాబట్టి ఆ నాటినుంచి ఎన్నివేల సంవత్సరములో ఇలా పడున్నాను మీరు
వస్తారు మాటసాయం చేద్దామని నా అదృష్టం ఇన్నాళ్ళకు వచ్చారు మీకు మాటసాయం చేశాను.
రామాలయంలో ఒక్కసారి నీరాజనం ఇమ్మని చెప్పండి తస్య తు ఏవం బ్రువాణ స్య సంపాతే వానరైః సహ ! ఉత్పేతతు స్తదా
పక్షౌ సమక్షం వన చారిణామ్ !! ఈ మాట చెప్పేటప్పటికీ సంపాతికి కొత్తరెక్కలు వచ్చేశాయి, ఒక్కసారి
యవ్వనమొచ్చేసింది. ఆనందపడిపోయి తన రెక్కలు చూసుకొని సంపాతి బయలుదేరి ఒక్కసారి
ఆకాశంలోకి వినువీధిన ఎగిరిపోతూ సర్వథా క్రియతాం యత్నః సీతామ్ అధిగమిష్యథ ! పక్ష
లాభో మమాఽయం వః సిద్ధి ప్రత్యయ కారకః !! మీకు తప్పకుండా సీతమ్మతల్లి దర్శనం అవుతుంది
ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఆ మహానుభావుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు రామ కథా బలం
ఎంతగొప్పదో ముందు చెప్పారు తెలిసో తెలియకో రామ కథ చెప్పుకుంటే రామ కథ వింటే
చచ్చిపోదామనుకున్నవాళ్ళు బ్రతకడానికి మార్గం దొరికింది. తెలిసో తెలియకో రామ
కార్యంమీద వెళ్ళిపోతున్నవాళ్ళకు మాటసాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, ఇది
రామ కథా బలం రామ కార్యం మీద ఉన్నవాళ్ళకీ రామ కార్యం చేసినవాళ్ళకి చిన్న సాయం
చేసినవాళ్ళకి రామ చంద్ర మూర్తి ఇచ్చేటటువంటి అత్యద్భుతమైన శక్తి అందుకే రామ
కార్యంలో ఎప్పుడూ కూడా మీరు ఈ సాయం చెయ్యద్దని అనకూడదు మీరిది చెయ్యదూ అని
ఎవ్వరినీ అనకూడదు. ఎందుకో తెలుసాండీ రామ కార్యంలో ప్రతివాళ్ళు ఉడత ఇసుకరేణువుని
వేసినట్లు ప్రవాళ్ళు ఏదో ఒక సాయం చెయ్యాలి పల్లకీ పట్టుకోవాలి శ్రీ రామా అందుకే
రామ కోటి రాయిస్తారు, కనీసంలో కనీసం రామ కోటి రాసి ఒక కాగితం ఇవ్వాలి, నీకు
ద్రవ్యముంది ఒక రూపాయిపావులాయైనా నీవు సమర్పించవలసి ఉంటుంది, రామాయణం వినవలసి
ఉంటుంది. రామ కథకీ రామ కార్యానికీ సాయం చెయ్యనూ అన్నమాట ఈ దేశంలో ఉండదూ ఎందుకో
తెలుసాండీ రామ కథా బలం రామ కార్యంలో వెడుతున్నటువంటివానికి చేసేటటువంటి మాటసాయం
కూడా అంత గొప్పవీ అని నిరూపించినటువంటివి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి
ఎగిరి సముద్రపుడొడ్డుకి వెళ్ళారు దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరంలో కూర్చున్నారు
|
సంకులం దానవేన్ద్రై శ్చ పాతాళ తల వాసిభిః ! రోమ హర్ష కరం దృష్ట్వా విషేదుః కపి
కుంజరాః !!
ఆకాశమ్ ఇవ దుష్పారం సాగరం ప్రేక్ష్య వానరాః ! విషేదుః సహసా సర్వే కథం కార్యమ్
ఇతి బ్రువన్ !!
విషణ్ణాం వాహినీం
దృష్ట్వా సాగర స్య నిరీక్షణాత్ ! ఆశ్వాసయా మాస హరీన్ భయాఽఽర్తాన్ హరి సత్తమః
!!
వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే సముద్రం
కొన్ని చోట్ల నిద్రపోతున్నట్లుంది కొన్ని చోట్లా మంచి సంతోషంగా
ఎగిరిపడిపోతూన్నట్లుగా పెద్ద పెద్ద కిరటాలతో ఉంది కొన్ని కొన్ని చోట్లా పర్వత
శిఖరాలంత కెరటాలు లేస్తున్నాయి కొన్ని కొన్ని చోట్లా ఏదో ఇంక ఉత్సాహంతో పెద్ద ఘోష
పెడుతున్నట్లుగా ఉంది దానవులు మొసళ్ళూ తిమింగళాలూ పాములూ వీళ్ళందరికీ ఆలవాలమై
ఉంది. నూరు యోజనములు సముద్రాన్ని దాటేస్తే సీతమ్మ కనపడుతుందని అక్కడికొచ్చి
సంతోషంతో గంతులేసి కిచకిచలాడి చపట్లుకొట్టి చూసినవాళ్ళకి ఆ సముద్రంవంక చూసి
ఒక్కసారి మ్రాన్ పడిపోయారు, మ్రాన్ పడిపోయి నూరు యోజనములు సముద్రాన్ని దాటాలంటే
అలా చతికల పడిపోయినవాళ్ళను చూసి అంగదుడన్నాడు న విషాదేన నః కార్యం విషాదో
దోషవత్తరః ! విషాదో హన్తి పురుషం బాలం క్రుద్ధ ఇవోరగః !! చిన్న పిల్లవాన్ని
పాము కాటువేసి చంపేసినట్లు ఎవడు శోకాన్ని పొందుతాడో వాడు ఆ విషాదాన్ని పొందినటువంటివాడు
కార్యాన్ని సాధించలేడు కాబట్టి మీరు ఉత్సాహాన్ని పుంజుకోండి రామునికి
ఇచ్చిన మాటను నిలబెట్టగలిగినవాడు ఎవడు వెనక్కి వెళ్ళి మేము సీతమ్మజాడ కనిపెట్టామని
మనం శుభవార్త పట్టుకెళ్ళేటట్టుగాచేసి వానరజ్యాతి ప్రతిష్టను నిలబెట్టగలిగినటువంటి
మహాపురుషుడు మన సమూహంలో ఎవరు, ఎవరి అనుగ్రహఫలితంగా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి
వానరులు కృతార్థులై రామ కార్యంలో సీతమ్మజాడ వానరులు కనిపెట్టారనేటటువంటి
ఖ్యాతిచేతా ఒక కోతి కనపడితే సమస్తప్రాణులు పొంగిపోయేటట్టుగా వానరజాతికి ప్రతిష్ట
తేగలిగిన మహాపురుషుడు ఎవరు.
ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకుని ఈ నూరు యోజనములు దాటుతారు ఎగురుతారు ఎవరెవరు
ఎంతెంత దాటగలరో మీ బలాలు నాకు చెప్పండి అన్నాడు. గజుడు లేచి పదియోజనాలు వెడతానన్నాడు, గవాక్షుడు
20, గవయుడు 30, శరభుడు 40, గంధమాదనుడు 50, మైన్దుడు 60, ద్వివిజుడు 70, సుషేణుడు
80, జాంబవంతుడు 90 అని ఆయన అన్నాడు నా బలం ఇంతే అన్నాడు. ఇప్పుడు పెద్దవాన్నైపోయను
మోకాళ్ళనొప్పులు, ఒకప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర రాజ్యానంతటినీ కూడా
తీసుకొని మూడడుగులు కొలవడానికి పెరిగిపోతే ఇంతింతై వటుడితై మరియు తానింతై
నభోవీధిపై నంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రునికమతయై
ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్దియై
రవిబింబం బుపమింప బాత్రమగు చత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభారణమై,
సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటియై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు
తాబ్రహ్మన్డమున్ నిండుచోన్ వామన మూర్తి పెరిగిపోతే ఆయనకు నేను చాలా తక్కువ
కాలంలో ప్రదక్షిణం చేసినటువంటి బలమున్నవాన్ని ఇప్పుడు పెద్దవాన్నైపోయాను తొంభై
యోజనాలు వెడుతాను అంటే అంగదుడన్నాడు నేను నూరు యోజనము ఎగురుతాను కానీ నూరు
యోజనములు ఎగిరి వెళ్ళి వెనక్కు రాగలనా అన్నది నాకు అనుమానం అన్నాడు. జాంబవంతుడు
అన్నాడూ
|
భవాన్ కళత్రమ్ అస్మాకం స్వామి భావే వ్యవస్థితః ! స్వామీ కళత్రం సైన్య స్య గతిః
ఏషా పరంతప !!
తస్మాత్ కళత్రవత్ తాత ప్రతిపాల్యః సదా భవాన్ !
మూలే హి సతి
సిధ్యన్తి గుణాః పుష్ప ఫలోదయః !
నాయనా! రాజనేటటువంటివాడు సైన్యాన్ని కార్యంమీద
పంపించి తాను నిర్వహించాలి తప్పా రాజు వెడితే మిగిలినవాళ్ళందరు ఇక్కడ కూర్చుంటే
అది అసహ్యంగా ఉంటుంది, అధికారి పనిచేసుకుంటూంటే గుమాస్తాలందరు కాఫి
తాగినట్లుంటుంది. కాబట్టి రాజు కూర్చోవాలి పర్వవేక్షించాలి భటుడు పనిమీద వెళ్ళాలి
అంతేగాని నీవు వెళ్ళితే మేము ఇక్కడ కూర్చోవడమేమిటీ నీవు అననూ కూడదు మేము నిన్ను
పంపించనూ కూడదు కాబట్టి అసలు మూలముంటే కదా ఫలాపుష్పాలు వచ్చేటటువంటిది కాబట్టి
నీవు మూలం వంటివాడివి నిన్ను మేము రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు వెడుతారు
మరి 10 వెళ్ళినా 20 వెళ్ళినా 30 వెళ్ళినా 40 వెళ్ళినా 50 వెళ్ళినా 60 వెళ్ళినా 70
వెళ్ళినా 80 వెళ్ళినా 90 వెళ్ళినా సముద్రంలోనే పడుతాడు కదాండి సముద్రం నూరు
యోజనాలు అయినప్పుడు నూరు యోజనాలు దాటి వెళ్ళినవాడే వెళ్తాడు, వెళ్ళి
తిరిగిరానివాడు ఉపయోగం లేనివాడు అంగదుడు వెళ్తాడు కాని వస్తానోరానో అనుమానం
అన్నాడు కాబట్టి నేను వెళ్ళగలిగినవాడన్నవాడు నేను వెళ్ళగలనన్నవాడు అందులో
చెయ్యేత్తినవాడు ఎవ్వరూ లేరు.
కాబట్టి అంగదుడు వెంటనే అన్నాడూ పునః ఖలు ఇదమ్ అస్మాభిః కార్యం
ప్రాయోపవేశనమ్ పట్రాండి దర్భలు దక్షిణ దిక్కుకి కొసలుపెట్టి వేసేద్దాం అన్నాడు,
నేను చెప్పాను కదాండీ మీతోటి ఎందుకనీ అంటే ఎవ్వడూ వెళ్ళేవాడు లేడు సముద్రాన్ని,
వెనక్కి వెళ్ళితే సుగ్రీవుడు చంపేస్తాడు, వెళ్ళే మార్గామా కనపడ్డంలేదు
ఎందుకువెళ్ళడం చచ్చిపోదాం. పరిచేయండి దర్భలు మళ్ళి పడుకుందాం అన్నాడు. మాట్లాడితే
చిన్నది దొరికింది పొంగిపోయాడు పరుగెత్తుకొచ్చాడు గంతులేచాడు ఆటలాడాడు పాటలుపాడాడు
ఇన్ని చేశాడు, సముద్రం చూసి వెళ్ళేవాడు కనపడలేదు పడుకున్నాడు ఇది కొంచెం
దిద్దుకోవలసిన మనస్తత్వమే మంచి బలవంతుడే అంగదుడు మంచి శౌర్యమున్నటువంటివాడే కానీ
మనసు ఇటువంటి స్థితిలో ఉంటుంది రామాయణం రామాయణమే అన్నిటినీ చూపిస్తుంది. ఇప్పుడు జాంబవంతు
అన్నాడు నాయనా ఇప్పుడు నీవు అలా ప్రాయోపవేశం చేస్తాను అన్నమాట అనకూడదు అస్య తే
వీర కార్య స్య న కించిత్ పరిహీయతే ! ఏష సంచోదయామి ఏనం యః కార్యం సాధయిష్యతి !!
మనలోనే ఒక మహానుభావుడు ఈ నూరు యోజనములు సముద్రాన్ని అవలీలగా గడచి వెళ్ళి సీతమ్మ
జాడ కనిపెట్టి రాగలిగినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు కానీ ఆయన ఏమీ తెలియని వానిలా
ఒక్కడే కూర్చుని ఉంటాడు. ఆయనేం మాట్లాడటంలేదు కారణమేమిటో తెలుసా... ఆయన బలం ఆయనకు
తెలియదు శాపముందు ఇప్పుడు నేను ఆయన్ని ప్రచోదనం చేస్తాను.
|
హనుకు శాపవిమోచనమై హనుమకి గొప్ప తేజస్సుతో కూడిన మహాద్భుత స్వరూపంతో రేపు
మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి సముద్రాన్ని దాటడానికి సిద్ధపడుతాడు. ఆ
ఘట్టాన్ని రేపు మహోత్కృష్టమైన తిథి నృసింహజయంతి గొప్ప నైమిక్తిక తిథి గనుక రేపటి
రోజు సాయంకాలం ఆ కార్యక్రమాన్ని అందునా గురువారం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం
ఆ ఘట్టాన్ని చెప్పుకుని సంతోషిద్దాం. దాన్ని చెప్పగలిగిన సమర్థత నాకు రామ చంద్ర
మూర్తి కృప కలుగజేయుగాకా అని ఆయనను ప్రార్థన చేస్తూ.... నేను మీకు మళ్ళీ జ్ఞాపకం
చెయ్యక్కరలేదు రేపు ఉదయం నృసింహజయంతి హరిప్రసాద్ గారు నాతో ఒక చిన్నవిషయాన్ని
ప్రస్థావన చేశారు ఇప్పుడు మీరు ఏడుగంటల నుంచి ఎనిమిది గంటలవరకే అన్నారు గదా చందనం
అలా కాకుండా వాల్ళు ఒకవేళ మేము ఉత్సాహంగా మేము ఎక్కువ చందనము తీస్తామూ అంటే మనం
ఎందుకు వాళ్ళని నియంత్రించడము ఏదో గంటసమయమని కొంచెం ముందు వచ్చి ఎక్కవ చందనం
తీస్తామంటే అనుమతించవచ్చా అని అడిగారు తప్పకుండా అనుమతించండీ అన్నాను. ఒకవేళ
ఏకారణం చేతనైనా రాలేకపోయినవాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిదన్నరవరకు ప్రహ్లాదోపాఖ్యానం
రేపు నరసింహస్వామి యొక్క ఆవిర్భావం ఆ వృత్తాంతం మీరు ఉపన్యాసం చెప్తున్నారు కదా
తొమ్మిదన్నరకు వాళ్ళు కూర్చుని తీసివెడితే వాళ్ళ అవకాశాన్ని మనం ఎదుకు
పాడుచెయ్యాలి అన్నారు.
పోనీ అలాగేకాని చెయ్యండీ అన్నాను కాబట్టి మీరు తెల్లవారుఝామున 5 గంటలకు వచ్చి
చందనం తీసినా అభ్యంతరం లేదు తొమ్మిదన్నరకి చందనం తీసి ఇచ్చినా అభ్యంతరంలేదు మీరు ఆ
వైభవం పొందాలి అని ఆయన అంత పెద్ద మనసుతో అడిగినప్పుడు దాన్నినేను కాదూ అనడం
అర్థరహితం కదా... కాబట్టి యదేశ్చగా మీకు ఇష్టం వచ్చినంత చదనం కావలసినంత సేపు
తీయండి కానీ ఉపన్యాసం జరుగుతున్నప్పుడు మాత్రం ఈ చందనం తీస్తానంటే చప్పుడు నాకు
ప్రతిబంధకమౌతుంది. కాబట్టి ఉపన్యాసం జరుగుతున్నప్పుడు మాత్రం ఎదురుగుండా కూర్చుని
చందనం తీయకండి. బయట ఎక్కడైనా మేం బయట స్పీకర్ దగ్గర చందనం తీసుకుంటాం బయట వింటూ
అంటే నేను దానికి అభ్యంతరపెట్టను. కాబట్టి రేపు ఉదయం కచ్చితంగా ఎనిమిది గంటలకి
ప్రహ్లాదోపాఖ్యానం ప్రారంభమౌతుంది. నృసింహజయంతి ఉదయం ప్రహ్లాదోపాఖ్యానం వినడమంటే
అదొక గొప్ప అదృష్టహేతువు కదాండీ రేపు చక్కగా ఆ ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్పుకుని
మనం చందనమిచ్చి వెళ్ళిపోతే సాయంకాలనికి ఆ చందనంతోటి రామ చంద్ర ప్రభువుని సీతమ్మని
లక్ష్మణ మూర్తిని హనుమని అలంకారం చేస్తారు. ఆ చందన చర్చితుడైనటువంటి స్వామిని
దర్శనం చేసుకుని మనందరం కృతార్థులమౌదాం.
|
ఇప్పుడు మనం ఒక్క పదకొండుమాట్లు రామ నానం చెప్పుకుందాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీ రామ నామము !!రా!!
గౌరికిది ఉపదేశ నామము కమలయుజుడు జపియించునామము !!రా!!
వాదాభేదాతీతమమగు వైరాగ్యమే శ్రీ రామ నామము !!రా!!
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !!రా!!
శిష్ఠజనములు దివ్యదృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము !!రా!!
రాకడయు పోకడయులేనిది రమ్యమైనది రామ నామము !!రా!!
వేదవాఖ్య ప్రమాణములచే అలరుచున్నది రామ నామము !!రా!!
రావణానుజ హృదయపంకజ రాజకీరము రామ నామము !!రా!!
ఎందుచూచినా ఏకమై తా వెలయుచున్నది రామ నామము !!రా!!
|
కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామ నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనుల ఎల్లకాలము రామ నామము !!రా!!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామ నామము !!రా!!
మంగళా శాసన పరైః ....
No comments:
Post a Comment