Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - కిష్కింధ కాండ 24వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Kishkinda Kanda 24th Day


కిష్కింధ కాండ


ఇరవైనాల్గవ రోజు ప్రవచనము




ఈనాడు శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం వాలి వధ. వాలి వధా శ్రీరామాయణంలో రాముని చేతిలో నిహతులైనటువంటి అనేకమందిలో ఒకటిగా చెప్పబడినటువంటి ఇతివృత్తమైనప్పటికీ, రామ చంద్ర మూర్తి విషయంలో ఎప్పుడూ సాధారణంగా వినపడేటటువంటి విమర్శ ఏమిటంటే చెట్టుచాటునుంచి కొట్టాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ అదేమాట ఆయనమీద, చెట్టుచాటునుంచి కొట్టాడు రాముడు బాణంవేసి వాలిని చంపాడు. అసలు నిజంగా వాలి వధలో ఏమి జరిగిందో వాలి వధ ఏ ప్రకారం రామ చంద్ర మూర్తి చేశారో దానికి వాలి యొక్క ప్రతిస్పందన ఏమిటో అందులో ఎన్ని రహస్యాలు దాగున్నాయో అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఉందో మీరు తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ వాలి వధ, వాల్మీకి మహర్షి అత్యద్భుతమైనటువంటి రచనా వైశిష్ఠ్యంతో ఆవిష్కరించినటువంటి గాధ. నిన్నటిరోజు నేను మీకు మనవి చేశాను యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి వాలిని తార అనేక విధములుగా బోధచేసి ఇప్పుడు నీవు యుద్ధమునకు వెళ్ళవద్దూ అని ఉపదేశించింది. ఎంత సలహా చేప్పినా ఆయనా తార చెప్పినటువంటి మాటలో ఉన్న సారాన్ని గ్రహించడం కన్నా తానుచేసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడుతాడు, నిన్నటిరోజున నేను మీకు రామాయణంలో కనపడే దాంపత్యాల గురించి కూడా కించిత్ స్పృశించి చూపించాను.
కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు నా మీద యుద్ధం చేయడం కోసమని నా తోడబుట్టినటువంటివాడు నాకు తమ్ముడైనటువంటివాడు సుగ్రీవుడు కిష్కింధా నగర ప్రవేశంచేసి అంత మహానాధంచేసి నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు, నేను చేతకానివాడిలా ఉండిపోవడం నాకు ఇష్టంలేదు ఇప్పుడే నేను వాన్ని అంత శిక్షించి పంపించాను ఐనా తెంపరితనంతో మళ్ళీవచ్చి మహానాదంచేసి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. నీవు రాముని యొక్క ఔనత్యాన్ని నాతో చెప్పావు చెప్పి అంత గొప్పవాడైనటువంటి రామునితో సుగ్రీవునికి స్నేహమేర్పడింది గనుకా నేను యుద్ధానికి వెళ్ళడం మంచిదికాదూ అని చెప్తున్నావు నేను కూడా నీతో ఒకమాట చెప్తాను విను న చ కార్యో విషాద స్తే రాఘవం ప్రతి మత్కృతే ! ధర్మజ్ఞ శ్చ కృతజ్ఞ శ్చ కథం పాపం కరిష్యతి !! అంత ధర్మజ్ఞుడైనటువంటివాడు అంత కృతజ్ఞుడైనటువంటివాడు అటువంటి సత్ శీలము కలిగినటువంటివాడు నాయందు ఏ పాపముందని నన్ను చంపుతాడు రాముడు నాజోలికి ఎందుకువస్తాడు కాబట్టి ఇప్పుడు రాముడు సుగ్రీవుడితో కలిస్తే రాముడు నన్నేదో చేస్తాడనే భయం నీకెందుకు రాముడు నన్నేమైనా చేయాలి అంటే

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
నాయందేమైనా అధర్మముండాలి నాయందేం అధర్మంలేదు. ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆత్మవంచనా లోకంలో ఇంకోటుండదు ఎందుకంటే తను తప్పుచేశాను అని అంగీకరించగలిగితే కనీసంలో కనీసం నిజమే నేను అలా చేయకుండా ఉండాల్సింది నేను ఒక తప్పు చేశాను అని అన్న ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మన్నిస్తాడు కొంత క్షమార్పణ ఉంటుంది అంగీకరిస్తే, అసలు నాయందే తప్పుందీ అంటే? ఇంక అతను తప్పు చేస్తూకూడా తన దగ్గర ఏ తప్పూ లేదంటున్నాడు ఇంక అంతకన్నా బుకాయించడం ఇంకోటి ఉండదు మీరు ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాలి ఎక్కువ మాట్లాడే అవకాశం రామాయణంలో కలగలేదుకాని... వాలి మాట్లాడటానికి రావణుడు మాట్లాడటానికి పెద్దతేడా ఏమీ ఉండదు ఒక్కలాగే మాట్లాడుతారు ఇద్దరూ కాబట్టి న చ కార్యో విషాద స్తే రాఘవం ప్రతి మత్కృతే ! ధర్మజ్ఞ శ్చ కృతజ్ఞ శ్చ కథం పాపం కరిష్యతి !! ఆయనేందుకు పాపం చేస్తాడు ఆయన నన్నెందుకు మధ్యలో చంపుతాడు నీవు పిరికిదానివి కాబట్టి నీవు అనవసరంగా భయపడవలసినటువంటి అవసరం లేదు నిరపరాధిని నన్నేంచేయడు అని తారకి ఒక అభయమిచ్చాడు.
Image result for రాముడు సుగ్రీవుడు వాలిసుగ్రీవుడు తమ్ముడు అతనిని మించిన బంధువులేడు అతనికి యౌవరాజ్య పట్టాభిషేకంచేసి మేము ఇద్దరము సంతోషంగా ఉంటే బాగుంటుందని కదా నీవు అంటున్నావు ప్రతియోత్స్యామి ఆహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమమ్ ! దర్పం మాత్రం వినేష్యామి న చ ప్రాణైః విమోక్ష్యతే !! నేను ఆ వచ్చినటువంటి సుగ్రీవుని యొక్క దర్పమును అణిచేటటువంటి ప్రయత్నమును చేస్తాను కేవలం మళ్ళీ మళ్ళీ నన్ను ఇలా యుద్ధానికి పిలవకుండా అతనియందు అతిశయించినటువంటి గర్వాన్ని రూపుమాపేటట్టుగా చేస్తాను అలా యుద్ధం చేసి అతన్ని తరిమి కొడతాను తప్పా అతని ప్రాణం తీసేయను ఇలా రెండో మాటు వచ్చినా కూడా నేను చంపను వదిలిపెట్టేస్తాను అంటే రాముడు నన్నేం చేయడు సుగ్రీవున్ని మాత్రం నేను నిగ్రహిస్తాను నీవు ఇంత చెప్పావు కాబట్టి నేను చేసేదేమిటంటే సుగ్రీవున్ని చంపనులే విడిచిపెట్టేస్తాను. ఈ మాట చెప్పి ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు వద్దూ వద్దూ అని తార వెంబడిస్తూంది సరే ఆయన అన్నాడు ఇంక నేను యుద్ధభూమికి బయలుదేరుతున్నాను అంతఃపుర ప్రాంగణాన్ని దాటేస్తున్నాను కాబట్టి ఇంక నీవు నన్ను అనుగమించడానికి వీల్లేదు నీవు నీ చెలికత్తెలతో కలిసి వెనక్కి వెళ్ళిపో అన్నాడు, ఇక్కడ తారా... తం తు తారా పరిష్వజ్య వాలినం ప్రియ వాదినీ ! చకార రుదతీ మన్దం దక్షిణా సా ప్రదక్షిణమ్ !! కొన్ని కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి.
అవి ఏం చేస్తాయంటే ప్రత్యేకించి ʻభార్యʼ మిగిలినవాళ్ళనుంచి వచ్చేటటువంటి ఫలితం అంత ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం కానీ భార్య చేసేటటువంటి పనులు మాత్రం భర్తమీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి అందుకే భర్త యశస్సుకీ భర్త యొక్క తేజస్సుకీ భర్త యొక్క తపస్సుకీ భర్త యొక్క ఐశ్వర్యానికి ఆయన వైభవానికి ఆయన అధికారానికి అన్నిటికీ కూడా కారణం ఎవరౌతారంటే భార్యే అవుతుంది. ఆ ఇంటి లక్ష్మీ ఆవిడ, ఆవిడ చెయ్యనిది ఆయన యందు పూర్ణంగా ప్రకాశించదు ఆయన ఎంతో పొందవలసినవాడు కొంతే పొందుతాడు ఎందుకంటే ఆవిడవైపునుంచి ఉపాసనలేదు అందుకే మీరు లలితా నామ సహస్రంలో ఒక నామం విని ఉంటారు పులోమజార్చితా అని అమ్మవారి నామాల్లో ఒక నామం పులోమజార్చితా అంటే సచీదేవి, సచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజిస్తుంటూంది శచీదేవి అమ్మవారిని పూజించింది కాబట్టి ఫలితమేమిటీ... ఇంద్రుడు స్వర్గలోకాదిపత్యాన్నిపొంది ఉంటాడు భర్త ఐశ్వర్యం భర్త విజయం భర్త యొక్క గౌరవం భర్త యొక్క కీర్తి దేనిమీద ఆధారపడి ఉంటాయీ అంటే భార్య ఉపాసనమీద ఆధారపడి ఉంటాయి రెండు భార్య చెయ్యకూడని పనికాని భార్య ప్రవర్తించని విధంగాకాని ప్రవర్తన చేస్తే అది కూడా ఫలితాన్ని ఇస్తుంది.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
కళ్ళనీళ్ళు పెట్టుకోకూడనటువంటి సందర్భంలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూండడం అస్తమానం ఏడుస్తుండడం అయినదానికి కానిదానికి అసంతృప్తితో రగులుతూ ఉండడం ఇవి భర్త యొక్క ఉన్నతికి హేతువులు కావు ప్రమాదకరమైనటువంటి చేష్టితములు ఆమె అందరియందు ప్రేమకలిగినది తార, ఎందుచేతనంటే మహర్షే ఆ విషయాన్ని ఈ సర్గలో “దక్షిణా” అంటారు. దక్షిణా అంటే అందరియందు ప్రేమకలిగింది అందుకే ఆమె ఒక్కవాలి గురించి ఆలోచించలేదు సుగ్రీవుడి గురించి కూడా ఆలోచించింది రాముడి గురించి కూడా ఆలోచించింది అంగదుని గురించి కూడా ఆలోచించింది. ఇన్ని ఆలోచించినటువంటి తారా చెయ్యకూడనటువంటి ఒకపని ఉద్వేగంతో చేసింది ఏం చేసిందీ అంటే... మహర్షి యొక్క గొప్పతనం అదే రామాయణ రచనలో తం తు తారా పరిష్వజ్య వాలినం ప్రియ వాదినీ ఆ వాలిని గట్టిగా కౌగలించుకుంది ఎలా కౌగలించుకుంది, ఏదో ప్రియమార భార్య కౌగలించుకోవడం శాస్త్రంలో అభ్యంతరకమేమీ కాదు కానీ... చకార రుదతీ మన్దం ఆమె ఏడుస్తూ కౌగలించుకుంది, ఏడుస్తూ కౌగలించుకునీ ఏడుస్తూ ప్రదక్షిణ చేసింది. ఇదీ అత్యంత దుశ్శకునం, అలా భార్య ఏడుస్తూ భర్తకు ప్రదక్షిణం చేసి బయటికి పంపిస్తే ఇంకా మళ్ళీ ప్రదక్షిణం ఇంకొక్కసారి ఏడుస్తూ కదలనివాడికే ఎందుకంటే చిట్టచివరి ప్రదక్షిణం అదే కదా చేస్తారు ఆ స్నానం చేయించేసిన తరువాత.
Image result for vali sugrivaకాబట్టి మహర్షి లోకానికి సూచన చేస్తూంటారు శ్రీరామాయణంలో అన్నీ ఉంటాయి కాబట్టి లోకంలో ఏవి ప్రమాదకరమైన విషయాలో వాటిని పరిహరించవలసి ఉంటుంది వాటిని చేయకూడదు ఎంత కోపంగానైన ఉండండీ ఇద్దరి మధ్యా ఎంత తగువైనా రానీయ్యండీ భర్త భయటికి వెడుతున్నప్పుడు ఆడది ఏడుస్తు బయటికి వచ్చి ముక్కు ఛీదుతూ బయటికి పంపిస్తే... ఆయన తిరిగి రావచ్చూ రాకపోవచ్చు ఎందుకంటే అది అంత ప్రమాదకరమైనటువంటి విషయం అలా చేయకూడదు కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పనే చేసింది తార తం తు తారా పరిష్వజ్య వాలినం ప్రియ వాదినీ ! చకార రుదతీ మన్దం దక్షిణా సా ప్రదక్షిణమ్ !! ప్రదక్షిణం చేసి ఏదో స్వస్తి మంత్రాలు చెప్పింది, భార్యకి ఆ హక్కు ఉంటుంది, వీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకీ ఆశిస్సుపురస్కరంగా మాట్లాడుతారు నీకు ʻమంగళము కలుగుగాకాʼ అని అమె ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఇది వాలి కొంప ముంచేసింది. కాబట్టి ఇప్పుడు వాలి యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరి వెళ్ళాడు ఆ సుగ్రీవుడిమీద పడ్డాడు ఇద్దరూ కలిసి గొప్ప యుద్ధం చేస్తున్నారు పిడికిటిపోట్లు పొడుచుకుంటున్నారు వాలి కొట్టినటువంటి దెబ్బలకు సుగ్రీవుని యొక్క నోటివెంట నెత్తురు నురగలు నురగలుగా కక్కాడూ, సుగ్రీవుడు కూడా చెట్లు పెరికి వాలిని కొట్టాడూ రాళ్ళతో కొట్టాడూ, వాలి కూడా చాలా ఖేదాన్ని పొందాడు యుద్ధంలో అయినా యుద్ధంలో విజయం దేనివలనా అంటే యుద్ధం నడుస్తుండగా ఎవరిబలం క్షీణిస్తుంది ఎవరిబలం పెరుగుతుంది ఇదీ యుద్ధంలో విజయాన్ని నిర్ణయం చేస్తుంది.
మహాభారతంలో ఎప్పుడు యుద్ధం చేసినా భీమసేనుడి బలం పెరుగుతూ ఉంటుంది రెండోవాడి బలం తరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా సుగ్రీవుని యొక్క బలం తరిగిపోతూంది వాలి యొక్క బలం పెరిగిపోతూంది వాలి బలం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆయనని ప్రతిఘటించగలిగినటువంటి శక్తి ఇప్పుడు సుగ్రీవుడికి లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి వాలి కొట్టిన దెబ్బలు తింటుండాలి ఆయన ఆ దెబ్బలను పుచ్చుకుంటూ ఏదో సాధ్యమైన ప్రయత్నం

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
వాలి మీద చేస్తున్నాడు కానీ... ఆయన దేని కొరకు చూస్తున్నాడంటే రాముని కొరకు చూస్తున్నాడు ఏదీ వెయ్యాలే బాణం నాకోసం వచ్చాడు కదాని రాముడు ఆక్షణం వరకు ఆయన కూడా ఎదురు చూశాడు ఎందుకనీ అంటే ఒక యుద్ధమంటూ

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ప్రారంభమైతే ఏమో జయాపజయములు విధినిర్ణీతములు ఎవరు చెప్పగలరు అందుకనీ చూద్దాం అని ఆయనా ఆగాడు హీయమానం అథ అపశ్యత్ సుగ్రీవం వానరేశ్వరం ! వీక్షమాణం దిశః చ ఏవం రాఘవః స ముహు ర్ముహుః !! ఆయన యొక్క శక్తి క్షీణించినవాడై సుగ్రీవుడు మళ్ళీ మళ్ళీ రాముడికోసం తలతిప్పి అన్నివైపులకి చూస్తున్నాడు ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఇప్పుడు రాముడు జోక్యం చేసుకున్నాడు అంటే వాలిని సంహరించాలి అని నిర్ణయం చేసుకున్నాడు తతో ధనుషి సంధాయ శరమ్ ఆశీ విషోపమమ్ ! పూరయా మాస తత్ చాపం కాల చక్రం ఇవ అంతకః !! ఆయన తన ధనస్సుకి కట్టినటువంటి వింటినారికి యమధర్మరాజుగారు ఒకరి ప్రాణం తీసేసే ముందు ప్రయోగించేటటువంటి అస్త్రం లేదా బాణము లేదా పాశము ఆ కాల చక్రము ఎలా ఉంటుందో అలా అంటే ఇంక తిరుగులేదు అవతలివాడి ప్రాణం తీసేస్తుంది అటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి వింటినారికి సంధించడం కోసమని తూణీరంలోంచి తీసి దాన్ని వింటినారికి తొడగబోతున్నాడు కాబట్టి ఇప్పుడు టంకారమూ అని ఒకటి ఉంటుంది అంటే ఆ వింటినారికి తొడిగే ముందు ఆ వింటినారి యొక్క స్థితి స్థాపక శక్తినీ ఒకసారి ఆ బాణాన్ని ఆ వేగంతో వెళ్ళడానికి వీలుగా ఉందాలేదా... చూడండీ ఈ తోలుతో చేసిన వాటికన్నింటికీ ఆ పరీక్ష ఉంటుంది. ఎప్పుడైనా కచేరి చేసేటప్పుడు మృదంగాన్ని వాయించి చూసి అవసరమైతే రాయి ఒకదాన్ని తీసుకొని కొట్టి కావలసినటువంటి స్థితిలో చర్మం ఉందా ఆ అమరికతోటి అని చూస్తారు శబ్దము రావడానికి అందులోంచి.
అలా ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి ఆ ధనస్సు యొక్క వింటినారిని టంకారము చేశాడు అంటే మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు ముందు ధ్వని ఒకటి బయలుదేరింది అది కేవలం రాముడికే వినపడేటటువంటి ధ్వని కాదు ఆ వింటినారి యొక్క ధ్వని కేవలం రామునికే వినపడిందండీ వాలికి వినపడలేదు అనడానికి వీలులేదు అది తస్య జ్యా తల ఘోషేణ త్రస్తాః పత్రరథేశ్వరాః ! ప్రదుద్రువుర్ మృగాః చ ఏవ యుగాంత ఇవ మోహితాః !! మహర్షి అంటున్నారూ తస్య జ్యా తల ఘోషేణ అ వింటినారికి టంకారము చేసి ఆ బాణమును తొడిగినప్పుడు వచ్చినటువంటి ధ్వని ఏదైతే ఉందో అది యుగాంతమునందు ప్రలయం చేసేటప్పుడు హరుడు-రుద్రుడు చేసేటటువంటి శబ్దము ఎలా ఉంటుందో అటువంటి శబ్దము ఇప్పుడా శబ్దమునకు ఏవి భయపడిపోయాయి అంటే పత్రరథేశ్వరాః పక్షులన్నీ భయపడిపోయాయి వాటితోపాటు ప్రదుద్రువుర్ మృగాః చ ఏవ అక్కడ ఉండేటటువంటి మృగములన్నీ కూడా భయపడిపోయాయట అరణ్యంలోకి ఇవన్నీ కూడా... ఆ ధ్వని విని భయపడ్డాయి. మీరు చూడండి ధ్వని రకరకాలుగా ఉంటుంది తెలిసో తెలియకో గంటమోగిందనుకోండి దేవతలొస్తున్నారని గుర్తు వాలి సంహారం చెప్పేటప్పుడు అనుకోకుండా గంటానాదం వినపడిందంటే ప్రధాన ఘట్టం కాబట్టి రామ చంద్ర మూర్తిలో రామ చంద్ర మూర్తి వచ్చి నిలబడ్డారూ అని గుర్తు అన్నమాట అది కాకతాళీయంగా అనుకోకుండగా అలాంటివి జరుగుతాయి. ఆ గంటానాదం వినపడిందీ అంటే దేవతలొచ్చారూ అని గుర్తు అందుకే కురు గంటానాదం గంటానాదం చేస్తే తప్పా దేవతలు రారు. శంఖాన్ని మ్రోగిస్తే విజయం వస్తుంది బిందెలు మ్రోగిస్తే పితృదేవతలు వస్తారు కంచాలు కొడితే పితృదేవతలు వస్తారు పళ్ళాన్ని కొట్టినా కూడా... బిందెలో గ్లాసునిపెట్టి అదే పనిగా చప్పుడు చేస్తే దెయ్యాలు కూడా వస్తాయి అందుకే ఆ చప్పుడు చెయ్యకురా అంటారు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇప్పుడు ఆ ధ్వని పక్షులకు వినపడింది జంతువులకు వినపడింది అది ఏదో ధ్వని అని ఇలా ఇలా చూడలేదు ఏమిటీధ్వనీ అని ఓసారి తలెత్తి చూస్తాయవి అలా చూడలేదు ఎక్కడివక్కడ పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి ఎటు ఎగిరిపోయాయో వాటికే తెలియదు ఎగిరిపోయాయి, జంతువులన్నీ వాటి కంటికెదురుగా ఏదిక్కుంటే ఆ దిక్కుకు పారిపోయాయి అంటే అది భయజనకమే అది ఎవ్వరికీ కూడా సంతోషదాయకమైన ధ్వని కాదు ఏదో ప్రమాదమును స్పురింపజేసేటటువంటి ధ్వని ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండీ మరి మృగములు పారిపోయి పక్షులు ఎగిరిపోయేటంతటి ధ్వని వస్తే..? ఎంతో దూరంలో లేరుకదాండీ వాలి సుగ్రీవులు మరి వాలికీ సుగ్రీవునికి కూడా ఇది వినపడాలి సుగ్రీవునికి వినపడితే ఆయన ఆశ్చర్యపోడు ఎందుకాశ్చర్యపోడు ఓ... రాముడు బాణాన్ని సంధిస్తున్నాడు అన్నమాట అని అనుకుంటాడు. ఆయన ఎలాగో అనుకుంటున్నాడు ఓహోహో అని బాణం వచ్చేస్తుందా ఎటునుంచైనా అని ఇప్పుడు చూడవలసినవాడు ఎవరు ఇప్పుడు ఈ ధ్వనిని బట్టి ఎవరో వింటినారిని సంధించారు ఎవరో బాణప్రయోగం చేస్తారేమోనని చూడవలసినటువంటివాడు వాలి. వాలి గురించి మీరు ఒక విషయాన్ని విన్నారు ఆయన వేగం ఆ కాలంలో ఎవరికీ లేదు ఒక్క గరుత్మంతునికి మనసుకి వాయుదేవునికి వాలికి నలుగురికి అంతటి వేగం ఆయనది అంత వేగంగా వెడుతాడు ఆయన అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాలి బలము క్షీణించిలేడు బలము పెరిగి ఉన్నాడు యుద్ధంలో కాబట్టి ఆయనా వింటినారి టంకారము ఎటునుంటి వినపడిందో అటువైపుకి ఒక్క క్షణంలో వెళ్ళిపోగలడు ఇంకా క్షణం అన్నమాట కూడా ఎక్కువ ఆయనకి అంత తక్కువ దూరాన్ని ఆయన ఎగిరివెళ్ళి పట్టుకోవడానికి ఎంతోసేపు పట్టదు అసలు విడిచిపెడుతున్న బాణాన్ని కూడా పట్టేసుకోగలడు వేగంతో అంత వేగమున్నవాడు వాలి కానీ తతః తేన మహా తేజా వీర్య ఉత్సిక్తః కపీశ్వరః ! వేగేన అభిహత్ వాలీ నిపపాత మహీ తలే !! ముక్త స్తు వజ్ర నిర్ఘోషో ప్రదీప్త అగ్ని సన్నిభః ! రాఘవేణ మహా బాణో వాలి వక్షసి పాతితః !! అది ఒక పెద్ద మెరుపొచ్చినట్టుగా ఒక కాంతి వచ్చింది ఆ కాంతి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిని చేస్తూ ప్రదీప్త అగ్ని సన్నిభః ఒక జాజ్వల్యమానమైనటువంటి కాంతితో రాఘవేణ మహా బాణో రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతితః వాలి యొక్క వక్షస్తలం మీద వచ్చి పడిపోయింది.
Handler.jpgగుచ్చుకుపోయింది అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు, వెనకనుంచి వేశాడు ముందు నుంచి వేశాడా వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది. అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి వేగేన అభిహత్ వాలీ నిపపాత మహీ తలే ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతితః వక్షస్థలంలో గుచ్చుకుంది వక్షస్థలంలో గుచ్చుకుందీ అంటే రాముడు బాణ ప్రయోగం చేసే సమయానికి వాలికి వెనకకి లేడు వాలికి ముందుకే ఉన్నాడు కానీ ధ్వని మృగములకు వినపడింది పక్షులకు వినపడింది పారిపోయాయి కూడా వజ్రము యొక్క శబ్దము వచ్చింది. వజ్రాయుధము యొక్క శబ్దము కానీ ఇలా చూసి ఎగిరివెళ్ళి పట్టుకోవడమనేటటువంటిది వాలికి ఎంతతేలికా అని మనం చెప్పగలమో... అంతకన్నా వేగంగా మరుక్షణం, క్షణం అన్నమాట చాలా తక్కువ ఈ రెండు వేగాలగురించి చెప్పడానికి బాష ఉండదు అది మీరు గుర్తించాలి మీరు భావనతో అనుభవించాలి తప్పా ఇప్పుడు వాలి ఏ వేగంతో వెడుతాడు దాన్ని అతిక్రమించినటువంటి వేగంతో రాముడు ఎంత వేగంతో బాణం వేశాడో చెప్పమంటే..? భాష సరిపోదు ఆ వేగాలకి.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఈ వేగం ఉందాలేదా ఇది సుగ్రీవుడు చూసింది ఇంత వేగంగా వేయగలడా..? లేకపోతే వచ్చి మీదపడిపోతాడు వాలి కాబట్టి ఇప్పుడు ఆ బాణం వచ్చి పడిపోయింది అంతే... పడడమేమిటీ వాలి పడిపోయాడు. అంటే రామ బాణప్రయోగం అంటే అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే కిందపడిపోయాడు. ఒక మహాపర్వతం కిందపడితే ఎలా ఉంటుందో అలా పడిపోయాడు రామ బాణం తగిలిన తరువాత ఇంక పైకి లేవడమన్న ప్రసక్తివుండదు కాబట్టి ఆ వక్షస్థలంలోంచి నెత్తురు కాలవలకింద ప్రవహిస్తూంది. ఇప్పుడు రామ లక్ష్మణులే ఆయన దగ్గరికి వెళ్ళారు కిందపడిపోయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదాండి యుద్ధం చేస్తూనూ కాబట్టి భూమౌ నిపతితస్యాపి తస్య దేహం మహాత్మనః ! న శ్రీర్ జహాతి న ప్రాణా న తేజో న పరాక్రమః !! శక్ర దత్తా వరా మాలా కాంచనీ రత్న భూషితా ! దధార హరి ముఖ్య స్య ప్రాణాం స్తేజః శ్రియం చ సా !! వాలి గుండెల్లో రామ బాణం గుచ్చుకున్నప్పటికీ వాలి పరాక్రమం ఇంత తగ్గలేదు వాలి తేజస్సూ ఇంత తగ్గలేదు వాలి యొక్క కాంతి ఇంత తగ్గలేదు అలాగే ఉన్నాడు రామ బాణం తగిలాక అలా ఉండడమే..? ఎందుకున్నాడూ అంటే శక్ర దత్తా వరా మాలా కాంచనీ రత్న భూషితా ఇంద్రుడి చేత ఇవ్వబడినటువంటి హారము ఆయన మెడలో ఉన్నంతవరకూ ఆయన పరాక్రమాన్ని ఆయన తేజస్సునీ ఆ మాల తీసుకుని రక్షిస్తుంటూంది ఆయన్ని కాబట్టి ఇప్పుడు వాలి ప్రాణం పోవడం మాత్రం ఉండదు, ఆ హారం ఎంత సేపు మెడలో ఉంటుందో అది కాపాడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు వాలి ఉండి మరణించినవాడే... ఎందుకో తెలుసాండి బాణంతో లేవలేడు బాణం తీస్తే బతకడు కాబట్టి అలా కొట్టారు రామ చంద్ర మూర్తి యొక్క బాణమంటే... మహానుభావుడిది అలా ఉంటుంది అందుకే రామున్ని నమ్ముకున్నవాడికి భయమన్నది ఉండదు ఎందుకో తెలుసాండి రామున్ని నమ్ముకున్నవాని జోలికి వెళ్ళడమే ఎక్కడ దాక్కుంటారు మీరు ఎక్కడ దాక్కున్నా వచ్చి పడిపోతుంది అంతే రామ చంద్ర మూర్తిని నమ్మినవాడికి ప్రతి క్షణం రక్షణ కలుగుతూనే ఉంటుంది అందుకే.
Image result for vali wife taraకాబట్టి ఇప్పుడు ఆయనా భూమి మీద పడున్నాడు దగ్గరకొచ్చారు రామ లక్ష్మణులు వాళ్ళిద్దరివంకా చూశాడు చూసి అన్నాడూ త్వం నరాధిపతేః పుత్ర ప్రథితః ప్రియ దర్శనః ! కులీనః సత్త్వ సంపన్నః తేజస్వీ చరిత వ్రతః !! మీరు ప్రియమైనటువంటి దర్శనం కలిగినటువంటివారు దశరథ మహారాజుగారి యొక్క పుత్రులు కాబట్టి మీరు రాజులు అటువంటివారు సత్వసంపన్నులు మంచి నడవడి కలిగినటువంటివారు తేజస్సు కలిగినటువంటివారు అటువంటివారు నన్నెందుకు ఇలా కొట్టారు అని అడిగాడు రామున్ని. ఒక పెద్ద చార్జిషీట్ పెట్టాడండీ రాముని మీద ఆయన పడిపోయి మీరు నేను అనుమాన పడక్కరలేదు వాలే అడిగాడు మనకు ఎన్ని అనుమానాలుంటాయో అంతకన్నా ఎక్కువ అనుమానాలు అడిగాడు రామ చంద్ర మూర్తిని పరాఙ్మఖ వధం కృత్వా కో ను ప్రాప్త స్త్వయా గుణః ! యత్ అహం యుద్ధ సంరబ్ధః శరేణ ఉరసి తాడితః !! నేను నీతో యుద్ధం చెయ్యట్లేదు ఇంకొకరితో యుద్ధం చేస్తున్నాను ఇంకొకరితో యుద్ధం చేస్తున్నప్పుడు నా దృష్టి నీవైపు లేనప్పుడు నీవు ఎందుకు నా మీద బాణప్రయోగం చేశావు నా ఎదురుగుండా కనపడకుండా, నీవు నా కంటికి కనపడడం వేరు నా కంటికి నీవు కనపడలేదు కనపడకుండా నేను పరాకుగా వేరొకరితో యుద్ధం చేస్తుండగా నీవు నా మీద బాణం వేశావు ఇప్పుడు నీ గుణములన్నీ నీవు చేసిన పనిచేత కొట్టుకుపోలేదా..! ఇంత చారిత్రమున్నవాడివీ ఇంత గొప్పవాడివని పేరున్నవాడివి పరాకుగా ఉన్నవాలిని కంటిముందు కనపడకుండా బాణమేసి కొట్టి రాముడు చంపాడన్న ఈ ఒక్క అపకీర్తి చేతా నీవు సంపాదించుకున్న కీర్తి అంతా మట్టిలో కలిసిపోలేదా..?

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
దీని వలన నీవు ఏం సాధించావు? నేను చచ్చిపోవడం మాట అలా ఉంచు నీకు కళంకమొచ్చిందే నీకు నీ కీర్తి మాసిపోయిందే ఇవ్వాల్టితో దేనికి చేశావు ఈ పని అంటూ... ఏం తక్కువ మాట్లాడలేదండీ ఆయనా రామః కరుణ వేదీ చ ప్రజానాం చ హితే రతః ! సానుక్రోశో మహోత్సాహః సమయజ్ఞో దృఢ వ్రతః !! ఇతి తే సర్వ భూతాని కథయన్తి యశో భువి !!! దెప్పి పొడుచాడు రామున్ని ఓ సర్వభూతములు ఏమని చెప్తాయో తెలుసా..! రామః కరుణ వేదీచ రాముడు చాలా కారుణ్యమూర్తి ప్రజానాం చ హితే రతః అందరి యొక్క బాగోగులు చూసేవాడు సానుక్రోశో మహోత్సాహః గొప్ప ఉత్సాహమున్నటువంటివాడు దయామయుడు సదాచార సంపన్నుడు సమయజ్ఞో దృఢ వ్రతః ఒక పని చేస్తాను అంటే విడిచిపెట్టనివాడు ఇతి తే సర్వ భూతాని కథయన్తి యశో భువి నీ గురించి సర్వభూతములు ఇలా చెప్పుకుంటాయి దాని వలన ఇలా చెప్పుకోవాలీ అంటే నీవు ఇంత మంచి పనులు చేసుంటే కదా చెప్తారు. నీకు ఇంత కీర్తుంది ఇంత కీర్తిన్నవాడివి మరి ఇలాంటిపని ఎందుకు చేశావు దమః శమః క్షమా ధర్మో ధృతిః సత్యం పరాక్రమః ! పార్థివానాం గుణా రాజన్ దండః చ అపి అపరాధిషు !! రాజు అనేటటువంటివాడు ఇంద్రియ నిగ్రహం ఉండాలి మనో నిగ్రహం ఉండాలి ఓర్పు ఉండాలి ధర్మముండాలి పట్టుదల ఉండాలి సత్యముండాలి పరాక్రమముండాలి అపరాధం చేసినటువంటివాళ్ళని శిక్షించేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి.
Related imageకాని నువ్వేం చేశావు అపరాధం చేసినవాళ్ళను శిక్షిస్తాడయా సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడయా అని నా భార్య చెప్పింది నేనేం అన్నానో తెలుసా యుద్ధానికి బయలుదేరే ముందు నేనేం తప్ప చేశాడని నన్ను శిక్షిస్తాడు అని నేను ధైర్యంతో వచ్చాను నీవు నన్ను శిక్షించవని, నీవేం చేశావు నా ఎదురుగుండా నిలబడకుండా బాణం వేసి కొట్టావు మరి నీవు తప్పు చేయలేదా..! తార చెప్పిన మాట నేను వినకుండా వచ్చినందుకు నేను నీమీద పెట్టుకున్న నమ్మకం ఒమ్మైపోయింది నా ప్రాణం తీశావేమో కానీ నీ కీర్తికి కళంకం రాలేదా..! తాను ఎన్ని తప్పులు చేసినా రామ చంద్ర మూర్తి వంటి ధర్మ మూర్తితో మాట్లాడటం నాకు అసలు అర్హత ఉందా అని కూడా చూసుకోకుండా పోయినా అధిక్షేపించి మాట్లాడటం మాత్రం బాగావస్తుంది అహంకారం. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు న త్వాం వినిహత ఆత్మానం ధర్మ ధ్వజమ్ అధార్మికమ్ ! జానే పాప సమాచారం తృణైః కూపమ్ ఇవ ఆవృతమ్ !! నీవు ధర్మాత్ముడు అని పేరు పెట్టుకున్నటువంటి పరమ అధర్మాత్ముడివి, పచ్చగడ్డి చేత కప్పబడినటువంటి లోతైన నుయ్యివి తెలియక ఎవరైనా అటొస్తే పచ్చగడ్డి అని లోపలికి పడిపోతారు, నీవు పాపముతో కూడినటువంటి నడవడితో ఉన్నవాడివి నశించిపోయినటువంటి బుద్ధి కలిగినటువంటివాడివి ఇవ్వాల నీకు సరియైనటువంటి బుద్ధిలేదు సతాం వేష ధరం పాపం ప్రచ్ఛన్నమ్ ఇవ పావకమ్ ! నీవు ధర్మాత్ముడివి అని లోకం ఎందుకనుకుంటూందంటే ధర్మాత్ముడిలా వేషం కట్టావు ధర్మాత్ముడు అనుకునేటట్టు నటిస్తుంటావు నీవు ధర్మాత్ముడివి కావు, నీవు బూది కప్పిన నిప్పువు తెలియక నిన్ను ముట్టుకున్నవాళ్ళు కాలిపోతారు నీవు ధర్మాత్ముడనుకున్నవాడు నశించిపోతాడు తప్పా నీవు నిజానికి ధర్మాత్ముడివి కావు.
అంటూ నన్నేందు చంపావు పరాన్ముకుడైన నా మీద బాణం వేశావు విషయే వా పురే వా తే యదా న అపకరోమి అహమ్ ! న చ త్వాం అవజానేహం కస్మాత్ త్వం హంసి అకిల్బిషమ్ !! నేను నీ ఊరికి రాలేదు నేను నీ పురంలో లేను నేను ఏ పాపమూ చేయలేదు నేను నిన్ను అవమానించలేదు నేను నీ గురించి ఒక్కమాట మాట్లాడలేదు ఏ కారణానికి మనిద్దరిమధ్య శత్రుత్వం ఉంది ఈ కారణానికి నీకు నాకు శత్రుత్వం ఉంది బాణంవేసి చంపానంటావా? నేను ఎప్పుడు మీ ఊరు రాలేదే? అసలు నేను ఏ పాపమూ చేయలేదే? నిన్ను నేను ఎప్పుడూ అవమానించలేదే? మరి ఏ కారణానికి వేశావు బాణాన్ని ఫల మూలాశనం నిత్యం వానరం వన గోచరమ్ ! మామ్ ఇహ అప్రతియుధ్యన్తమ్ అన్యేన చ సమాగతమ్ !! నేను అరణ్యాలలో తిరుగుతుంటాను నేను పళ్ళు తింటాను దుంపలు తింటాను నేను వానరున్ని కాబట్టి వన గోచరమ్ అడవిలో చెట్లమీద తిరుగుతుంటాను భూమి మీద తిరుగుతుంటాను కాబట్టి నాకూ నీకూ యుద్ధం రావలసినటువంటి అవసరం అసలు లేదు పైగా నేను యుద్ధం చేస్తున్నది నా తమ్ముడితో చేస్తున్నాను ఇంకొక వానరంతో చేస్తున్నాను అప్పుడు నరుడవైన నీవెందుకు జోక్యం చేసుకున్నావ్ దేనికి బాణం వేశావు నామీద సామ దానం క్షమా ధర్మః సత్యం ధృతి పరాక్రమౌ ! పార్థివానాం గుణా రాజన్ దణ్డ శ్చ అపి అపకారిషు !! ఒక రాజన్నవాడికి కొన్ని లక్షణాలుంటేనే వాడు రాజనుకుంటాడు తప్పా నీలా చేతిలో ధనస్సున్నవాడల్లా బాణాలువేసేవాడల్లా రాజనకూడదు సామము దానము ఓర్పు ధర్మము సత్యము పట్టుదల పరాక్రమము ఇవి ఎవరికుంటాయో ఎవడు యుక్తా యుక్త విచక్షణతో అపరాధికి దండన విధిస్తాడో అటువంటివాడు రాజు అనిపించుకుంటాడు.
Image result for vali ramayana

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
సాధారణంగా లోకంలో ఇద్దరి మధ్యా శత్రుత్వం రావాలి అంటే ఒకడు ఇంకొకడిని నిగ్రహించాలి అనుకోవాలి అంటే కొన్ని కారణాలు ఉంటాయి వాటివల్ల మాత్రమే ఇద్దరి మధ్యా పగలు ఏర్పడుతాయి భూమి ర్హిరణ్యం రూప్యం చ నిగ్రహే కారణాని చ ! తత్ర కః తే వనే లోభో మదీయేషు ఫలేషు వా !! ఒకటి భూమి వలన తగువు రావాలి ఈ భూమి నాదని ఒకడు అనాలి కాదు నాదని ఒకడు అనాలి అందుకు గొడవ రావాలి, హిరణ్యం బంగారం వల్ల గొడవ రావాలి రూప్యం చ వెండి వలన తగువు రావాలి కానీ ఈ మూడిటివలన కాకుండా నీవు దేని కొరకు ఇక్కడికి యుద్ధానికి వచ్చినట్టు. ఇక్కడున్న చెట్లు పళ్ళూ కాయలు వీటి కోసం నాతో నన్ను చంపడానికి వచ్చావా? అడవికి ఇక్కడకొచ్చి నామీద బాణం వేయవలసిన అవసరం ఏముంది? భూమి విషయంలోకాని బంగారు విషయంలోకాని వెండి విషయంలోకాని నీకూనాకూ ఏవిధమైనటువంటి పగలు ప్రతీకారాలు లేవు త్వం తు కామ ప్రధానః చ కోపనః చ అనవస్థితః ! రాజవృత్తై శ్చ సంకీర్ణః శరాఽఽసన పరాయణః !! రామా! నీవు కామ ప్రధానః చ  నీవు కామ ప్రధానమైన జీవితం గడిపేవాడివి చాలా విశేషమైనటువంటి కోప స్వభావుడవు నీ కోపాన్ని నీవు అనుచుకోలేవు ఒక రాజు ధర్మార్థకామములను ఎలా సమన్వయం చేసుకోవాలో ఏది ఎక్కడ ఎలా ఎంత మోతాదులో వాడుకోవాలో తెలిసినటువంటివాడై ఉండాలి కానీ నీకది తెలియదు కాబట్టి నీవు ఒకదాన్ని ఒకదానితో అశాస్త్రీయంగా మేళవించి ప్రవర్తిస్తుంటావు శరాఽఽసన పరాయణః నీవు చేతిలో ధనస్సు ఒకటి పట్టుకుని ఎవ్వనిమీద ఎలా బాణం వేద్దామాని చూస్తుంటావు అందుకని నీకు ధర్మాధర్మాలు లేవు.
ఎదురుగుండా ఉండి కొట్టానా ఇంకోడితో యుద్ధం చేస్తుంటే కొట్టానా ఇవన్నీ అక్కర్లేదు బాణం వేయడమే నీ పని అంతే కాబట్టి అలా బాణం వేసేటటువంటి లక్షణం ఉన్నటువంటివాడివి కాబట్టి మీరు ఒకటి గుర్తించండి మనం కొత్తగా వాలిని రాముడు చెట్టు చాటునుంచి కొట్టాడు అని అడగక్కరలేదు వాలి మనకన్నా ఎక్కువ ప్రశ్నలు ఆయనే వేశాడు కదాండీ! ఇప్పుడు వాలి తృప్తి పడితే రాముడి జవాబుకీ ఇంక మీరు నేను ఆ ప్రసక్తి జోలికి వెళ్ళక్కరలేదు రామాయణం విన్నాక కదా! అ ధార్యం చర్మ మే సద్భీ రోమాణి చ అస్థి చ వర్జితమ్ ! అభ్యక్ష్యాణి చ మాంసాని త్వ ద్విధై ర్థర్మ చారిభిః !! రామా! నా యొక్క చర్మము ఎవ్వరికీ పనికిరావు ఎందుచేతా అంటే జంతువులని వేటాడుతారు నరులు దేనికి వేటాడుతారు ఒకటి చర్మం కోసం వేటాడుతారు కొన్ని కొన్ని జంతువుల యొక్క చర్మం ఒలిచి తెచ్చుకుంటే దానిమీద కూర్చుని ధ్యానం చేస్తే కొన్ని శక్తులు కలుగుతాయి అని కొన్ని కొన్ని చర్మాలు తెచ్చుకుని వాటిమీద వేసుకు కూర్చునే అలవాటు ఉంది లోకంలో కాబట్టి చర్మాలకోసం జంతువుని చంపుతారు నాచర్మం పనికిరాదు కోతిచర్మం వాడరు రెండు సద్భీ అంటే సత్పురుషులైనటువంటివారు ఏదో సద్భీ అనేమాట ఎందుకేశాడో తెలుసాడీ... అంటే రామ చంద్ర మూర్తి ఆయన ఉద్ధేశ్యంలో దుర్మార్గుడు కాబట్టి నీలాంటివాడి గురించి మాట్లాడటంలేదు.
Related imageసత్పురుషులైతే రోమాణి చ అస్థి చ వర్జితమ్ నా వెంట్రుకలు పనికిరావు ఎందుకంటే ఛామరీ మృగముందనుకోండి దాన్ని చంపీ దాని వెంట్రుకలు తీసి లేదా దాని వెంట్రుకలను ఎలాగోలాగ సేకరించి ఛామరంలోవేసి ఈశ్వరుడి సేవలో ఉపయోగిస్తారు కాబట్టి నా వెంట్రుకలు పనికిరావు కోతి వెంట్రుకలు ఎవ్వరూ దేనికీ వాడరు అలాగే అస్థి ఎముకలు కూడా దేనికి పనికిరావు కొన్ని కొన్ని జంతువులకు సంబంధించినటువంటి ఎముకలు ఉన్నాయంటే వాటికి ఏదో ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి కొన్నింటి ఎముకలు కొన్ని కొన్నింటికి వాడుతారు ఎముకలు అన్న శబ్దాన్ని ఎముకలుగానే స్వీకరించక్కరలేదు శరీరంలోంచి పుట్టినదై కూడా ఉండవచ్చు ఓ పులి గోరు ఏనుగు తంతము ఇలాంటివాటిని వాడుకుంటుంటారు లేదా కొన్ని కొన్ని జంతువుల ఎముకలు కూడా చాలా లేతగా ఉన్నటువంటి ఎముకల్ని కూడా వండుక తినేవాళ్ళు ఉంటారు కానీ నా ఎముకలు పనికిరావు నా చర్మం పనికి రాదు నా మాంసం పనికిరాదు నా వెంట్రుకలు పనికిరావు అభక్ష్యాణి చ మాంసాని కోతి మాంసాన్ని ఎవ్వరూ తినరు కాబట్టి నరుడు మరణిస్తే ఎలా భూ స్థాపితం చేస్తారో నరుడు మరణిస్తే ఎలా దహించేస్తారో అలా మా శరీరములు భూ స్థాపితము చేయబడాలి దహింపబడాలి నీకు నన్ను చంపడం వల్ల ఈ ఉపయోగం ఉందీ అని చెప్పడమా ఏదో వేటాడాడు ఒకరాజుగా ఒకనరుడిగా ఒక జంతువుని వేటాడాడు అందామంటే ఏ ప్రయోజనానికి వేటాడాడు కాబట్టి ఇప్పుడు చేతిలో ధనస్సుందని బాణముందని వేసేశావు అంతే తప్పా ఎందుకూ నేను నీకు పనికిరాను.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
మరి ఎందుకు బాణం వేసి కొట్టినట్లు అనీ శఠో నైకృతికః క్షుద్రో మిథ్యా ప్రశ్రిత మానసః ! కథం దశరథేన త్వం జాతః పాపో మహాత్మనా !! పైకి ఒకలా కనపడుతూ లోపల దుష్టమైనటువంటి చారిత్రమున్నటువంటి నీ వంటి క్షుద్రుడు మిథ్యావాదమున్నటువంటివాడు దశరథ మహారాజు వంటి మహాపురుషునికి అశ్వమేధ యాగం చేసి పుత్రకామేష్టి చేస్తే ఎలా పుట్టాడు అంటే ఇవ్వాళ దశరథ మహారాజుగారు వరకూ వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి అన్నాడూ త్వయా అదృశ్యేన తు రణే నిహతో అహం దురాసదః ! ప్రసుప్తః పన్నగే నేవ నరః పాన వశం గతః !! నీవు నామీద బాణం వేసి చంపడమనేటటువంటిది నీకు కీర్తికారకం అని నీవు అనుకుంటున్నావేమో... వాలిని చంపానని కాని ఇది ఎటువంటిదో తెలుసా? ఒక వ్యక్తి విపరీతంగా తప్పతాగాడు దానివల్ల అతనికి ఒంటిమీద స్పృహలేదు నేలమీదపడిపోయి ఉన్నాడు ఇప్పుడు ఒంటిమీద స్పృహలేకుండా నేలమీద పడిపోయినటువంటి ఒక వ్యక్తిని ఒక క్రూరమైన సర్పమువచ్చి కాటువేసి చంపితే ఎలా ఉంటుందో నీవు నామీద బాణం వేయడం అలా ఉంటుంది అని ఒకమాట అన్నాడు నీవు మొనగాడివైతే నా ఎదురుగుండా వచ్చి నిలబడవలసిందీ నీవు ఉండకుండా ఉండేవాడివి నాచేతిలో అది చేతకాక నా ఎదురుగుండా నిలబడలేక నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే నా మీద బాణ ప్రయోగం చేశావు. సరే నన్ను చంపేయండని సుగ్రీవుడు అడిగాడు ఎందుకని సుగ్రీవుడితో స్నేహం చేశావని నాకు తార చెప్పింది, తారే నాతో ఏమని చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య సంధి కుదిరిందని చెప్పింది కాబట్టి సుగ్రీవుడు ఏమని అడిగి ఉండాలి నన్ను చంపమని చెప్పి ఉండాలి నన్ను చంపితే సుగ్రీవుడికేమొస్తుంది రాజ్యమొస్తుంది సుగ్రీవుడికి రాజ్యమొస్తే నీకేమొస్తుంది నీ భార్య వస్తుంది నీ భార్యని సుగ్రీవుడు వెతుకుతాడు కానీ అక్కడే నీవు తప్పుపని చేశావు రామా! మాం ఏవ యది పూర్వం త్వం ఏతత్ అర్థం అచోదయః ! మైథిలీం అహం ఏక ఆహ్మా తవ చ ఆనీతవాన్ భవేత్ !! సుగ్రీవ ప్రియ కామేన యత్ అహం నిహతః త్వయా ! కణ్ఠే బద్ధ్వా ప్రదద్యాం తే అ నిహతం రావణం రణే !! నీవు సుగ్రీవుడితో సంధి చేసుకోకుండా నా దగ్గరకొచ్చీ నీవు సీతమ్మ జాడ కనిపెట్టమనీ నీవు అడిగి ఉంటే రావణునితో నేను యుద్ధం చెయ్యక్కరలేదు.
Image result for vali in ramayanaపశువుని లాగినట్లు కంఠానికి తాడేసి ఈడుస్తాను ఈడ్చి ఎక్కడ వాడు సీతమ్మని దాచినా నీకు సీతమ్మని గూర్చి వివరాలు తెలియజెప్పేవాడిని నీవు నాతో సంధి చేసుకోవడం స్నేహం చేసుకోవడం మానేసి నీ భార్య యొక్క జాడ కనిపెట్టబడడం కోసమనీ సుగ్రీవుడితో స్నేహంచేసి సుగ్రీవునికి రాజ్యమిప్పిస్తే నీ భార్య జాడకనిపెట్టడానికని వానరుల్ని పంపిస్తాడని నీవు నన్ను చంపావు కానీ నాతో స్నేహంచేస్తే నీ పని ఇప్పటికే అయిపోయేది. నేను వెంటనే రావణున్ని పిలిచి నీ భార్యను ఇప్పింతును వానరులు వెళ్ళడం వెతకడం ఇవన్నీ అక్కరలేదు రావణుడు నా కింకరుడు కానీ ఇక్కడ నీవు తప్పు చేశావు నాకీ ప్రశ్నలకి జవాబులు కావాలి ఇలా నీవు ఎందుకు ప్రవర్తించావో నాకు చెప్పవలసిందీ అని అడిగాడు. సరే రాముడు జవాబు చెప్తాడు అదేం పెద్ద విషయం కాదు కానీ మీతో నేను ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. కిష్కింధ కాండలో చెప్పని ఒక రహస్యాన్ని వాల్మీకి మహర్షి ఉత్తర కాండలో చెప్పారు ఉత్తర కాండలో ఉన్న కొన్ని విషయాల్ని మీరు తీసుకుని రామాయణంలో అక్కడక్కడా అనుసంధానం చేసుకోకపోతే ఒక పరిపూర్ణత రాదు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఒకానొకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకోవడం కోసమని దక్షిణ సముద్రానికి వెళ్ళాడు ఆయన దక్షిణ సముద్రం నుంచి ఇతర సముద్రాలకి ఎగురుతాడు అదే సమయంలో రావణాసురుడికి ప్రతిరోజూ ఎవరో ఒకరితో యుద్ధం కావాలి అందుకనీ రావణాసురుడు కిష్కింధానగరానికి వచ్చాడు, తార తండ్రి అంతఃపురంలో ఉన్నాడు. ఆయన వచ్చి ఎరా వాలీ ఎక్కడున్నావ్ బయటికిరా అని నిన్నటిరోజున దున్దుభిని చూశారుగా... వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది నీవు బయటికిరా యుద్ధం చేస్తాను అన్నాడు ఎప్పుడు ప్రాతఃకాలంలో ఏం చెయ్యాలప్పుడు బ్రహ్మవంశ సంజాతుడు రావణుడు అంటే ఏం తక్కువవాడు కాడు విశ్వవశో బ్రహ్మ యొక్క కుమారుడు కాని ఆయన చేసినపనేమిటంటే యుద్ధాలకోసం తిరిగాడు ఆ సమయంలో అంతటి పాపపు నడవడి కలిగినటువంటివాడు. వాలిని యుద్ధానికి పిలిస్తే తార తండ్రి బయటికొచ్చి అన్నాడూ ఎలాగోవాడొస్తే బతకవుగదా వచ్చేస్తాడు సంధ్యావందనం చేసుకుని ఈలోగా చూడు ఈ జగత్తుని మళ్ళీ వాడొస్తే చూడ్డానికి ఉండదు చంపేస్తాడు నిన్ను అని అక్కడ ఎముకలు కుప్పలు చూశావా నీలా వచ్చి పిలిచినవాళ్ళవే అవన్నీ ఇప్పుడు నీవీ చేరుతాయి అందులోకి అన్నాడు. వీడు అలాగకాదు నేను ఇప్పుడు చెయ్యాలి యుద్ధము అన్నాడు ఓహ్... నీకు చచ్చిపోవడానికి అంత తొందరగా ఉందా అన్నాడు ఆయన అంతతొందరగా చచ్చిపోతానంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు సంధ్యావందనం చేస్తున్నాడు అక్కడ చంపేస్తాడు నిన్ను అన్నాడు. అంటే ఎంత ధైర్యమో చూడండి అసలు వాలీ తన జీవితంలో ఓడిపోయిందిలేదు వాలి జీవితంలో ఓటమీ మరణం ఒకసారే... రాముడి చేతిలోనే అప్పటివరకు వాలికి ఓటమి తెలియదు. రాత్రీ పగళ్ళూ ఆయన విరాం లేకుండా గోలభుడు అన్న రాక్షసునితో పదిహేను సంవత్సరములనుకుంటాను యుద్ధం చేసింది. అసలు రాత్రింబవళ్ళు యుద్ధం చేసి చంపాడు అంతటి పరాక్రమవంతుడు వాలంటే, కాబట్టి దక్షిణ సముద్రానికెళ్ళు నీ తీట తీరుపోతుంది అన్నాడు. దక్షిణ సముద్రంలో ఈయ్యన ఆర్ఘ్యమివ్వడానికి నిలబడి ఉన్నాడు వెనకనుంచి, రావణుడు వెనకనుంచి వెళ్ళి పట్టేసుకుందాం వాలినని పిల్లిలా అడుగులో అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు.
download.jpgఆయన చూడనే చూశాడు ఆయన ఇంతకన్నా పరాక్కుగా ఉంటాడు ఎందుకంటే ఓ పదిమందిని చంపినవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదాండి ఎలా పడుకుంటాడు అందరిలా పడుకోవడానికి ఉండదు. వందమంది కాపలా ఉంటే ఆయన పడుకోవాలి కదా! కాబట్టి ఇప్పుడు ఎవరొస్తారోని వాలికి ఆయనదీ అనుమానమే ఆయనదీ ఇదే జాతకం కదా మరి కాని ఆయన చూసుకుంటున్నాడు వెనక్కి ఈయన వస్తున్నాడు చేతులు చాపి ఓహో వస్తున్నాడురోయ్ అని చూడనట్లు ఊరుకున్నాడు ఈయన దగ్గరికి వచ్చిన తరువాత ధ్వనిని బట్టి పసిగట్టాడు వచ్చాడని అమాంతం చెయ్యివెనక్కివేసి ఆ భుజంకిందనుంచి చెయ్యి పైకి పెట్టి చంకలో పట్టుకున్నాడు పట్టుకుంటే రావణుడి వెంట రావణుని మంత్రులు ఉన్నారు వాళ్ళు ఆకాశగమనం తెలుసు వాళ్ళు ఆకాశంలో ఎగురుతుంటారు. ఈ వాలి ఏం చేశాడంటే ఇక్కడ ఆర్ఘ్యమిచ్చేసి అంటే సంకలో పెట్టుకుని ఏ పంచాంగమో అప్పుడే తెరిచి చూసుకున్న వాళ్ళు దాంతోటే ఇలా గబుక్కున కిందపెట్టడమో గూట్లో పెట్టటమో మరిచిపోయి ఆర్ఘ్యం చేసినాక మరిచిపోయి లేకపోతే శ్రీ కృష్ణ పరమాత్మ గొల్లలతో సందులు ముడిచినప్పుడు జారిరా నికడా చంకవిడిచి అంటారు పోతనగారు ఆ వేణువు చంకలోపెట్టుకునీ ఇలా పెట్టుకుని ఇలా ఇలా అన్నం తిన్నట్టూ ఆ రావణాసురున్ని ఇలాగే పెట్టుకుని ఎగిరిపోయాడు ఆకాశంలోకి వాలి. ఎగిరిపోతే రావణుని మంత్రులు కూడా ఎగిరారు వాళ్ళేం తక్కువారు కాదు కానీ ఆయన వేగాన్ని వీళ్ళు అనుసరించలేకపోయారు కనపడలేదు వెళ్ళిపోయారు అమ్మబాబోయ్ ఇంతవేగమా అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అక్కడే నిల్చున్నారు వీడు వస్తే చూద్దామని ఎదుగుండాని.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
తీసుకపోయాడు తీసుకపోయి దక్షిణం నుంచి ఎగిరినవాడు ఉత్తరంలో దిగుతాడు మళ్ళీ అక్కడ ఆర్ఘ్యమిచ్చాడు ఈయన గింజుకుంటున్నాడు ఆయన ఆభరణాలన్నీ జారిపోయాయి పంచ జారిపోయింది వడ్డాణం జారిపోయింది. ఈయన్ని తీసుకుని నాలుగు సముద్రాల్లోనూ ఆ ఆర్ఘ్యమిచ్చేసి అలాగే సంకలో పెట్టుకుని అంతఃపురానికెళ్ళి అక్కడ కింద పారేశాడు ఎందుకురా పది తలకాయలు పురుగా ఎందుకొచ్చావు అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన లేచి నిలబడి అన్నాడు అయ్య బాబోయ్ ఇంతవేగమే... అన్నాడు. వాలి జీవితంలోనండీ శ్రీరామాయణంలో వేగం గురించి వాలి విషయంలో చెప్పినట్టు ఇంకెక్కడా కనపడదు మళ్ళీ ఎదర వస్తాడు మహానుభావుడు ఒకరి వేగం ఎందుకు పనికివస్తే ఇంకొకరి వేగం లోకాన్ని ఉద్ధరించడానికి పనికి వస్తుంది మా స్వామి హనుమ వస్తారు. మా స్వామి ఏమి మన స్వామి హనుమ వస్తారు ఆయన వస్తే మళ్ళీ ఆయన వేగం గురించి మహర్షి చెప్తూనే ఉంటారు అంతే మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్దిమతా వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి వచ్చేస్తుందిగా సుందరకాండా! కాబట్టి ఇప్పుడు ఆయనా ఇయ్యన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇంతవేగమే? ఇంతబలమే? అని ఆశ్చర్యపోయి నేనూ నీలాంటివాన్నే కాబట్టి మనిద్దరం ఒక అంగీకారం చేసుకుందాం ఏమిటో తెలుసాండీ వాళ్ళిద్దరికీ జరిగినటువంటి అంగీకారం లోకంలో ఇదివినీ లోకాలు సిగ్గుపడి తలవంచుకోవాలి అంత గొప్ప సంధి చేసుకున్నారు వాళ్ళిద్దరు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
Image result for vali in ramayanaతారాః పుత్రాః పురం రాష్ట్రం భోగచ్ఛాదన భోజనం ! సర్వమేవా విభక్తానౌ భవిష్యతి హరీశ్వరా!! అది వాళ్ళిద్దరి సంధి ఉత్తరకాండలో నేను కిష్కింధ కాండలోంచి చెప్పడంలేది ఈ విషయం భార్యా నీకూ నాకు ఒకరే భార్య నాకు నచ్చితే ఆవిడయందు నేను ఎక్కువ సంతృప్తిని పొందితే నీవు కూడా అనుభవిద్దువుగాని ఇంతకన్నా నేను ఆ విషయం గురించి మాట్లాడను పుత్రాః బిడ్డలు కూడా నీకూ నాకూ బిడ్డలై ఉండవచ్చు ఎంతగొప్ప మనస్తత్వాలు ఉన్నవాళ్ళో చూడండి పురం అంటే పురములు భూములు ఎక్కడ కబ్జాచేసినా మనిద్దరివి రాష్ట్రం భోగః  ఏ భోగం మనిద్దరం అనుభవించినా సరే నేననుభవించినవి నీవు అనుభవించవచ్చు నీవు అనుభవించినవి నేను అనుభవిస్తాను. మనిద్దరి మధ్యా ఎంగిలి ప్రసక్తిలేదు. అచ్ఛాదన అచ్ఛాదన అంటే నీడ మనం అనుభవించేటటువంటి అంతఃపురాదులు భోజనం మనం తినేటటువంటి భోజనం వీటి విషయంలో ఒకరు అనుభవించినటువంటివి రెండవవారు కూడా అనుభవించవచ్చు కాబట్టి ఈమె నా భార్యయే అన్న ప్రసక్తేమి ఉండడు మనిద్దరికీ భార్యయే ఇకనుంచి కాబట్టి అలా మనం అనుభవిద్దాం ఇంతకన్నా నేను దీనిమీద పెద్దా ప్రత్యేకంగా వివరణ చేయవలసిన అవసరంలేదు మీ అందరు ప్రాజ్ఞులు అయితే మీరొకటి ఆలోచించండి ఇది ఎంత గొప్ప మనస్తత్వం అంటే గొప్ప మనస్తత్వం అంటే నా ఉద్ధేశ్యంలో ఉత్కృష్టమైనా అని కాదు ఎంత నీచ ప్రవృత్తి ఉన్నటువంటి ఇద్దరు పురుషులు కలిసి చేసుకునేటటువంటి సంధ్యో మీరు ఆలోచించండి అంటే వాళ్ళ దృష్టిలో ఒక స్త్రీకి ఉండే గౌరవం అంతే.
ఒక రామ చంద్ర మూర్తి దృష్టిలో స్త్రీ అంటే ఒక కన్నతల్లి ఆయన దృష్టిలో స్త్రీ అంటే పరాశక్తి రావణుడి దృష్టిలో వాలి దృష్టిలో ఒక స్త్రీ అంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుభవించడమే ప్రధానంగా ఉన్నవాళ్ళు ఇంతటి పరమ నీచుడు రావణునితో ఇటువంటి సంధి ఉన్నవాడు ఎన్ని పాప కర్మలు చేసి ఉంటాడో ఎంతమంది ఆడవాళ్ళను చెరపట్టి ఉంటాడో లేకపోతే మాయవితో ఒక స్త్రీ విషయంగా గొడవ పడ్డారు అని మహర్షి ఎందుకు చెప్తారండీ! అంటే అతని దృష్టిలోపడి భోగించాలని కోరుకోవడమే తరువాయి అంతే అతని బలం ఎందుకు పనికివస్తుందంటే అతను దాన్ని అనుభవిస్తాడు అంతే. అది ఏదైనా కావచ్చు అది స్త్రీ కావచ్చు భూమి కావచ్చు అంతఃపురం కావచ్చు ఇతరుల సొత్తు కావచ్చు ఏదైనా కావచ్చు తను అనుభవిస్తాడు అంతటి నీచాతి నీచమైన మనః ప్రవృత్తి విశేషమైనటువంటి బలము ఇవ్వాళ బాణపు దెబ్బతగిలిపడిపోయింది కాబట్టి ఊరుకున్నాడు కానీ లేకపోతే నా నోటితో అనడం కూడా నాకు ఇష్టంలేదు సీతమ్మని రావణుడు తీసుకొచ్చాడని తెలిస్తే దానికోసం మళ్ళీ వాలి కూడా వెళ్ళుతాడు, అందుకే కృష్ణావతారంలో కురుక్షేత్రంవరకు రావడానికి ముందే పూతనాది రాక్షసులను ముందే తుంచేసి కురుక్షేత్రంలో యుద్ధాన్ని తగ్గించుకున్నట్లు అసలు వాలీ రావణులు కలవకుండానే ముందు వాలి వధని చేయించేశారు దేవతలు లేకపోతే ఈ వాలి రావణుడి పక్కన చేరితే రామ రావణ యుద్ధం కాదది వాలీ రావణులతో కూడినటువంటి రామ యుద్ధమది యుద్ధం చేయడమంటే పక్కన వానరులంతా ఉండరు ఇంక ఎందుకంటే వానరులందరూ వాలికి వశవర్తులై ఉంటారు. ఎంత క్లేషభూయిష్టమౌతుందో అందుకనీ అసలు ఈ పని జరగకముందే వాలి పడిపోవాలి ఇంతటి అధర్మాత్ములు ఇంతటి పాపపు నడవడి కలిగినటువంటివాడు కిష్కింధ కాండలో లేదుకదా మనకు తెలియదనుకుంటారు మనం ఉత్తర కాండ చదివి తెలుసుకోలేదా మనకు తెలియదా ఆపాటిది.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇంతటి దిక్కుమాలిన జీవితమున్నవాడు స్వామి రామ చంద్ర మూర్తిని అడగటమా..? ధర్మం కోసం సత్యం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటివాడు మాటకు కట్టుబడడం కోసమని చెప్పి ఏదైనా విడిచిపెట్టేటటువంటి స్వభావమున్నవాడు అంతటి పరమ ధర్మాత్ముడైన రామ చంద్ర మూర్తిని మాట్లాడటమే ఆయనతోటి అసలు మాట్లాడటానికి వాడికి అర్హతలేదు. అదృష్టమేమిటో చచ్చిపోయే ముందు రాముడు కనపడితే వాలి పొందిన ఏకైక అదృష్టం రావణుడు పొందని అదృష్టం ఒక్కటే వాలి బహుశహా ఎక్కడో కనీసం భార్య చెప్పిన మాటను గుర్తు తెచ్చుకునే స్వభావం ఒకటి ఉండిపోయింది ఆ కారణం చేతా ఉత్తప్పుడు ఎలా బ్రతికినా చచ్చిపోయే ముందు తప్పొప్పుకుని రాముని వంక చూసి నమస్కారం చేసి చచ్చిపోయాడు. రావణుడు ఇదే అవకాశాన్ని పొందాడు మీరు వింటారుగా యుద్ధకాండలో గుఱ్ఱాలు పడిపోయాయి సారథి పడిపోయాడు రథం పడిపోయింది ఒక్కడే కింద నిలబడిపోయాడు ధనస్సు విరిగిపోయింది, రాముడు అన్నాడూ పో ఇంటికి చంపను ఇలా ఉంటే నీ చేతిలో ధనస్సులేదు నీకు సారథి లేడు రథంలేదు ఇంటికివెళ్ళి విశ్రాంతి తీసుకొని రా అన్నాడు. పది అడుగు ముందుకేసి రాముడి పాదాలమీద పడుంటే రామాయణం ఇంకోలా ఉండేది వేయ్యి అడుగులు వెనక్కేసి అంతఃపురానికి వెళ్ళాడు కాని పది అడుగులు రాముడి వైపు వేయ్యలేకపోయాడు రావణుడే అని మీరు అనుకోకండి, బాణం పడిపోయిన తరువాత ఏడ్చేకన్నా బాణం పడకముందే పశ్చాత్తాపంతో రామ పాదం పట్టుకోవడం ఎవరి జీవితానికైనా శ్రేయష్కరం.
ఇదీ కిష్కింధ కాండ యొక్క సందేశం కాబట్టి ఇంతటి దురాత్ముడు ఇంతటి పాపపు నడవడి కలిగినటువంటివాడు అడిగినా... రాముని యొక్క ఔదార్యము ఆయనా సమాధానం చెప్తున్నారు ఆయన అన్నారు ధర్మమ్ అర్థం చ కామం చ సమయం చాపి లౌకికమ్ ! అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామ్ ఇహ అత్య విగర్హసే !! అసలు నీకు పురుషార్థములు అని నాలుగు ఉన్నాయని ధర్మము అర్థము కామము మోక్షము అని నాలుగు ఉంటాయని అందులో మిగిలినటువంటి మోక్షమును పొందడానికి సాధనములైనటువంటి ధర్మాన్ని అర్థ కామమనేటటువంటి వాటిల్లో అర్థ కామములను ధర్మంతోటే సమన్వయం చెయ్యాలని నీకసలు తెలియదు. నీకు అసలు ఎప్పుడూ చతుర్విద పురుషార్థములందు వాటి గురించి నీవు మాట కూడా ప్రయత్నపూర్వకంగా సావధాన దృష్టితో తెలుసుకునే ప్రయత్నంతో విన్నవాడివీ కావు ఆలోచించినవాడివీ కావు అనుష్టాన బలం ఉన్నవాడివీ కావు నీకు ధర్మం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నీవు ధర్మం గురించి ప్రశ్నలు వేస్తున్నావు  అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్ ! సౌమ్య వానర చాపల్యాత్ త్వం మాం వక్తుమ్ ఇహ ఇచ్ఛసి !! అసలు ఆ ధర్మమంటే ఏమిటో తెలుసుకోవాలీ అంటే ఆ ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో తెలియాలీ అంటే ధార్మికంగా బతకడం అంటే ఏవిధంగా తెలుసుకోవాలి అంటే మహాత్ములను ఒంట్లో ఓపికుండగా ఆశ్రయించాలి ఆశ్రయించి వారిదగ్గర వినీ జీవితంలో అనుష్టానంలోకి తెచ్చుకోవాలి విని వదలకూడదు ఆచరించాలి నీవు ఎవరిని ఆశ్రయించావు ఛపల చిత్తులైనటువంటి నీవంటి అమాత్యులైన వానరులతో తిరిగావు వాళ్ళతో మాట్లాడుతావు నీవు ఎప్పుడైనా బుద్ధిమంతులు ఆచార్యసంపన్నులు పెద్దలు ధార్మికులు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళని ఎవరినైనా సేవించి వారి దగ్గర నాలుగు మంచిమాటలు వినేప్రయత్నం ఎప్పుడైనా చేశావా? నీవు ఎన్నడూ చేయలేదు నీకు తెలిసినది శాస్త్రం అని నీవు అనుకుంటుంటావు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఇంతపాటి అల్పబుద్ధి ఉన్నవాడివి నీవు నన్ను ఎలాగ ఇన్ని ప్రశ్నలు వేసి నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ నీవు నన్ను నిందచేసి మాట్లాడుతున్నావు ఇక్ష్వాకూణామ్ ఇయం భూమిః స శైల వన కాననా ! మృగ పక్షి మనుష్యాణాం నిగ్రహ అనుగ్రహావపి !! నీతో నేనొక సత్యం చెప్తున్నాను ఈ కొండలతో పర్వతములతో నదులతో నదములతో అరణ్యములతో భాషిల్లుతున్నటువంటి ఈ భూ మండలమంతా కూడా ఇక్ష్వాకు కుల సంజాతులైనవారివల్ల పరిపాలింపబడుచున్నది. పరమ ధర్మాత్ముడైనటువంటి భరతుడు రాజరికం చేస్తున్నాడు ఇప్పుడు భరతుడు ధర్మాత్ముడు ఆయన ధర్మాన్ని పట్టుకుని ధర్మాన్ని అనుష్టిస్తున్నాడు ఆయన తన రాజ్యంలో ఉన్నవాళ్ళు కూడా ధార్మికులై ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు తస్య ధర్మ కృత ఆదేశా వయమ్ అన్యే చ పార్థివః ! చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమ్ ఇచ్ఛవః !! నేను ఈ అరణ్యంలో తిరుగుతున్నది భరతుడు ఏం కోరుకుంటున్నాడో ధర్మము ఎక్కడా మధ్యలో తెగిపోకుండా ప్రవహించాలి ధర్మము అనుష్టించబడాలి అని రాజైన భరతుడు ఏది కోరుకుంటున్నాడో అది అందరిచేతా అనుష్టింపచేయడం ప్రయోజనంగా కూడా పెట్టుకుని తిరుగుతున్నవాన్ని తప్పా ఏదో ఉబ్బుసపోక అడవిలో పట్టి తిరుగుతున్నవాణ్ణి కాను అందుకే ఋషులకి అభయమిచ్చాడూ అంటే ధర్మం కోసమే ఛాత్ర ధర్మం ఆయనది, ధర్మం యొక్క కొనసాగింపుయందు నేను అనురక్తి ఉన్నవాడను ప్రభువు ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు ఆయనదీ ఈ భూమి ఇక్కడ ఉన్న మృగ పక్షి సమస్త జాతులు ధర్మమును అవలంభించేలా చూడడం మా హక్కు మా అధికారం.
Related imageనీవు నీది ధర్మమా నీది ధర్మమా నీది ధర్మమా అని నన్ను ఎన్నో ప్రశ్నలు వేశావు జ్యోష్ఠో భ్రాతా పితా చైవ య శ్చ విద్యాం ప్రయచ్ఛతి ! త్రయః తే పితరో జ్ఞేయా ధర్మే చ పథి వర్తినః !! ధర్మాలకన్నింటికీ ఆలవాలమైనటువంటి ధర్మం లోకంలో తన కన్నా ముందు పుట్టినటువంటి అన్నగారు ఎవడుంటాడో ఆయన తనకి జన్మ నిచ్చినటువంటి తండ్రిగారు ఎవరు ఉంటారో ఆ తండ్రి విద్య చెప్పినటువంటి గురువుగారు ఎవరుంటారో విద్య చెప్పిన గురువు కన్నా ఉపదేశం చేసిన గురువు ఇంకా ఎక్కువ ఎందుకో తెలుసాండీ! వాచక గురువు సూచక గురువు బోధక గురువు పరమ గురువు నిషిద్ధ గురువు అని గురువులు ఐదు రకాలుగా ఉంటారు ఇందులో నిషిద్ధ గురువుని పక్కన పెట్టేయండి, ఎందుకంటే నిషిద్ధ గురువు చెయ్యకూడని పనులు నేర్పుతాడు ఉగ్రమైన ఉపాసనలు అవన్నీను కాబట్టి అది పక్కన పెట్టండి నాలుగురు, నలుగురిలో మళ్ళీ చాలా పెద్ద స్థాయి ఎవరిదంటే పరమ గురువుది పరమ గురువు అంటే మన ఎదురుగుండా ఉన్నారాలేదా అని మనం చూడం ఆయన పాదుకలు చాలని ఆయన ఉన్నారు ఆయన పాదుకలే మన అహంకారాన్ని అణచి మంచి పనులు చేయిస్తున్నాయని ఆయనకి స్తోత్రం చేసి ఏదైనా మొదలు పెడుతాం వారిని పరమ గురువులు అంటారు.
భారతీ తీర్థ మహాస్వామివారికి ప్రతిరోజు మనం ఇక్కడ ప్రార్థనచేసి మీ అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అని మొట్టమొదట గురు పాదులకల మీద పుష్పములు సమర్పించి న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకేన అమృతత్వ మానశు అంటూ ఆయన వైభవాన్ని స్తోత్రం చేసి గురు పరంపర యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకునీ ఆ పరంపరలో వచ్చినటువంటివారు మీరు శంకరాచార్య స్వరూపులు అభినవ విద్యాస్వామి తీర్థులు మీరు వారి కర కమల సంజాతులు వారి చేతుల మీదుగా వారి చేతులనబడేటటువంటి కమలంలోంచి ఉద్భవించినవారు అంటే వారి చేత ఎన్నోమార్లు మీరు భుజము తట్టబడి సుశిక్షితములైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు గురువుల యొక్క అనుగ్రహమును పొందినటువంటి వారు వారి చేయి మీ తలమీద పెడితే హస్త మస్తక సంయోగం చేత గురువుల యొక్క పరిపూర్ణమైన తేజస్సుని మీలోకి ప్రవహింపజేసుకున్నవారు లోకమునకు ఆచార్య స్థానములో కూర్చుని మర్యాద నేర్పిన వారు మీ పాదుకలు పై శరీరాన్ని ఎలా తొక్కి ఉంచుతాయో అలా మాలోని అహంకారము ప్రభలకుండా మేము ఈశ్వరునకు గురువునకు విధేయులమై ఉండి మా జన్మ సార్థకత పొందడానికి మీ ఉపదేశము మీ పాదుకా మాకు శిరోధార్యమై మమ్మల్ని నడిపిస్తూందీ అని పూనికతో వెళ్ళి పాదుకల మీద ఆ పుష్పాలను వేసి మనం కార్యాన్ని మొదలు పెడుతాం.
కాబట్టి అటువంటి గురువు ఎవరున్నారో ఆయన కూడా తండ్రియే... తండ్రి స్థాయి గురువుది పరమ గురువు అంటే ఆయన బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినవాడు సూచక గురువు అంటే చిన్నతనంలో విద్య నేర్పినవాడు, వాచక గురువు అంటే ఒక ఆశ్రమాన్ని పెట్టి ఆశ్రమంలో నియమాలు ఇలా ఉంటాయని మీరు ఇలా ఇలా ఉండవలసి ఉంటుందని నియమం చెప్తారు ఆశ్రమంలో ఉంటే మీ ఇష్టమొచ్చినట్లు మీరు ఉండకూడదు ఆశ్రమ నియమావళి కనుక్కోవాలి కనుక్కొని దాని ప్రకారం అక్కడ మీరు ప్రవర్తించవలసి ఉంటుంది ఇది చెప్పేవారిది సూచక గురువు అంటారు. కాబట్టి ఈ గురువులలో మళ్ళీ పరమ గురువు వచ్చినప్పుడు బోధక గురువు కూడా మనస్కారం చేస్తాడు బోధక గురువు సూచక గురువు వాచక గురువుల్లో విద్య  నేర్పినవాడు మంత్రోప దేశం చేసినవాడు కూడా తండ్రి స్థాయి పొందుతారు అందుకే మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఉపదేశం పొందినవాడిది కొడుకు స్థానమే వారు వెళ్ళి గయలో శ్రార్దం పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొడుకు ఎలా చేస్తాడో శిష్యులు అలా చేస్తారు గురువుకి కాబట్టి అందుకే శిష్యులు మాత్రమే గురువుగారికి  గండపెండేరం వేస్తారు ఇంకొకళ్ళు వేయకూడదు ఎందుకు వేయకూడదూ అంటే గండపెండేరము దేనికి వేస్తారండీ ఎడం పాదానికి వేస్తారు ఎందుకు వేస్తారో తెలుసా? ఈ పాదం ఎంతకాలం తిరుగుతుందో ఈ భూమి మీద ఆ పాదం ఆయన ఆయుర్ధాయానికి సూచన ఎడమవైపుకి గుండెకాయ ఉంటుంది ఆయన గుండె ఎంతకాలం కొట్టుకుంటుందో ఆ గుండె కొట్టుకోవడానికి ఆయన ఊపిరి ఎంతకాలం తీస్తారో అంతకాలం ఆయన మాట్లాడుతారు ఆయన ఎంత కాలం మాట్లాడుతారో అంత కాలం ఆయన మా అభ్యున్నతికి సంబంధించిన భగవత్ సంబంధాన్నే చెప్తుంటారు.
ఆ గుండె ఆగిపోతే ఆ ఊపిరి ఆగిపోతే ఆయనకొచ్చిన అభ్యంతరం లేదు ఆయన ఈశ్వరుడు ఈశ్వరునిలో కలిసిపోతాడు కానీ మాకు దిక్కుండదు మాకు మంచిమాట చెప్పేవాడుండడు కాబట్టి గురువుగారికి గండకాలం ప్రవేశిస్తుందేమోనని అనుమానమొస్తే సాధారణంగా షష్టిపూర్తిలో వేస్తారు అదే కారణం. గురువుగారు ఇంకా బతికుండాలని శిష్యులు కోరుకుంటే ఎందుకంటే గురువేకదా శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఆయనకేం ఖేదముండదు శరీరం నేను కాదని తెలుసుకుని ఉంటాడు గురువు. గురువుగారు ఉండాలని శిష్యులు కోరుకోవాలి కాబట్టి గురువుగారి పాదానికి గండపెండేరము వేస్తారు వేస్తే ఆయన పది కాలాలు బ్రతికుండీ ఆ పాదాలు మాకు కనపడాలి మేము నమస్కారం చేసుకుని ఆ పాదములు మా అహంకారమును తొక్కి మంచి మాటలు చెప్పి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటారు కాబట్టి గురువు తండ్రితో సమానం. అసలు మీరు నిజంగా ఎప్పుడైనా గురు వైభవము అని వింటే సరే అది వేరే విషయమనుకోండి.
కాబట్టి జ్యోష్ఠో భ్రాతా పితా చైవ య శ్చ విద్యాం ప్రయచ్ఛతి ! త్రయః తే పితరో జ్ఞేయా ధర్మే చ పథి వర్తినః !! ధర్మం తెలిసున్నవాడైతే... వీళ్ళందరిదీ ఒకస్థాయి తండ్రిగారు, తండ్రిగారి తరువాత పెద్దన్నగారు తండ్రిగారు ఉన్నకూడా పెద్దన్నగారు అంతగౌరవమూ పొందుతాడు, తండ్రిగారు శరీరం వదిలేస్తే పెద్దన్నగారిదే అందుకే చూడండి ఇప్పటికీ మనం సనాతన ధర్మంలో తల్లీ తండ్రీ ఉన్నాకూడా అన్నగారు కానీ బ్రతికి ఉంటే అన్నగారి పేరుమీదే శుభలేకవేస్తాము తండ్రి నిధనమైపోయారనుకోండి అన్నగారు ఉన్నా తన పేరు శుభలేకమీద వేసుకోరు తమ్ముళ్ళు ఆయన పేరుమీద శుభలేకవేసి ఆయన ఆహ్వానిస్తారు అది పెద్దరికం ఆయనా నా తమ్ముని కుమారుడైనా లేకపోతే  నా తమ్ముని కుమార్తె అసలు అలాకూడా అక్కరలేదు నా కుమార్తె అని అనడానికి ఆయనకు అధికారం ఉంటుంది నా కుమారుడు అనడానికి అధికారముంటుంది. కాకపోతే అదేమిటీ గురువుగారికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారా ముగ్గురు కూతుళ్ళు ఉన్నారా అనుకోకుండా ఉండడానికి నా సోదరుడు ఫలానావాడి కుమార్తె అని బ్రాకెట్లో వేస్తారు తప్పా నా కుమార్తె అంటాడు అన్నగారు అనడేమిటండీ మా అమ్మాయి అనడేమిటి తమ్ముని కుతుర్ను కాబట్టి పెద్దన్నగారు ముందుపుట్టినవాడు పెద్దన్నగారు అంటే పైవాడని కాదు నా ఉద్దేశ్యం ప్రత్యేకించి పెద్దవాడు. పెద్దవాడు తండ్రి విద్యనేర్పినటువంటి గురువు ఈ ముగ్గురూ తండ్రితో సమానమైన స్తాయిలోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు నీవు సుగ్రీవుడికి ఎవరు తండ్రి, తండ్రి కొడుకుని ఎలా చూడాలి ఎంత ప్రేమగా చూడాలి కొడుకు భార్య నీకు ఏమౌతుంది కోడలవుతుంది నీవేం చేశావు నీవు ధర్మం గురించి నన్ను అడుగుతున్నావు ఇంక ఇంతకన్నా వాలి నోర్మూయడానికి ఏం కావాలండి జవాబు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఆయన అన్నారు యవీయాన్ ఆత్మనః పుత్రః శిష్య శ్చాపి గుణోదితః ! పుత్రవత్ తే త్రయ శ్చిన్త్యా ధర్మః చ ఏవ అత్ర కారణమ్ !! ధర్మము కారణముగా ధార్మికమైన దృష్టితో చూసినప్పుడూ తమ్ముడు అన్నగారివైపునుంచి మాట్లాడినప్పుడు ఒక అన్నగారికి తన తమ్ముడు తన కడుపున పుట్టిన కొడుకు తనని అనువర్తించేటటువంటి శిష్యుడు ఈ ముగ్గురు యందు భేదముండదు ముగ్గురుని ఒక్కలాగే చూస్తారు తన కొడుకెంతో శిష్యుడంతే శిష్యుడెంతో తన తమ్ముడంతే తమ్ముడు శిష్యుడు కొడుకు ముగ్గురు సమానమే. ముగ్గుర్ని సమానంగా అన్నగారు చూడాలి తండ్రి లేనప్పుడు పెద్దన్నగారిని తండ్రిలా తమ్ముడు చూడాలి సుగ్రీవుడు చూశాడాలేదా చూశాడూ నీవు దున్దుభిని చంపడానికి వెడితే చచ్చిపోయాడనుకున్నాడు అందుకే ఉదక క్రియ చేశాడు. ఉదక క్రియ చేశాడూ అంటే నమ్మాడు చచ్చిపోయావని చెప్పలేదు మంత్రులతో చచ్చిపోయావని కూడా చెప్పలేదు బాధ తన కడుపులో పెట్టుకున్నాడు, వాళ్ళు గుచ్చి గుచ్చి ప్రశ్నవేసి రాజ్యమిచ్చారు తన భార్య రుమతో నీవు చచ్చిపోయావు అనుకుంది కాబట్టి చనిపోయాడూ అనుకుంటే అన్నభార్య తమ్మున్ని స్వీకరించవచ్చు సంధ్యావందనం చేసే వానరజాతిలో నీ భార్య తార నీతో కూడింది కాబట్టి సుగ్రీవునియందు దోషంలేదు నీ భార్య అతనితో కూడినా ఆయన భార్య రుమతో ఆయనా రాజ్యాన్ని స్వీకరించి పాలనచేశాడు నీవు బతికున్నాను అని తిరిగొచ్చావు అన్నయ్యా పట్టాభిషేకం అయిపోయిందని ఖైదు చేశాడా..! కిరీటం ఒంగి పాదాలకు తగిలేటట్టు నమస్కారం చేసి అన్నయ్యా రాజ్యం తీసేసుకో నేను యువరాజుని మన్నించు నాకు తెలియదు అన్నయ్యా నీవు బతికున్నట్లు అని చెప్పాడు.
తండ్రిగా ఉండవలసిన నీవు జరిగిన పరిస్థితిని తెలుసుకునీ నీవు పట్టాభిషేకం చేసుకుని నీవు తారతో ఎందుకంటే నీవు బ్రతికొచ్చావు అని తెలిసిన తరువాత తార నీ పక్కకు వచ్చేయచ్చు అది మీ జాతిలో దోషం కాదు. తార నీ పక్కకు వెళ్ళిపోయి రుమ సుగ్రీవుడి పక్కకి వెళ్ళిపోతే ధర్మం నిలబడి ఉండి ఉండేది సుగ్రీవుడి వైపునుంచి దోషంలేదు సుగ్రీవుడు నిన్ను ప్రార్థన చేశాడు నీవేం చేశావు తత్ ఏతత్ కారణం పశ్య యదర్థం త్వం మయా హతః ! భ్రాతుర్ వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనమ్ !! అస్య త్వం ధరమాణ స్య సుగ్రీవ స్య మహాత్మనః ! రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాప కర్మ కృత్ !! నీవు సుగ్రీవున్ని రాజ్యంలోంచి వెళ్ళగొట్టడం మొదటి తప్పు అతను రాజ్యం ఇచ్చేస్తాను యౌవ రాజ్యం ఇవ్వమన్నాడు నీవు యౌవ రాజ్యం ఇవ్వకపోగా కన్న కొడుకుని ఇంట్లోంచి తప్పులేకపోయినా పంపించడం ఎంత తప్పో అలా పంపించావు పంపించి ఊరుకున్నావా చంపేస్తానని వెంటపడితే భూమండలమంతా తిరిగాడు ఋష్యమూక పర్వతం మీద బ్రతుకుతున్నాడు బతికున్నాడు తమ్ముడని తెలిసీ తమ్ముడు మరణిస్తే అతడి భార్య రుమని ఆమె స్వీకరిస్తే నీవు అనుభవించవచ్చు. తమ్ముడు బతికున్నాడు నాకు భయపడి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడని తెలిసి బలవంతంగా రుమని కామంతో నీవు అనుభవిస్తున్నావు ప్రతిరోజు స్నుషా అంటే ఆమె నీకు కొడలు తన కోడలిని ఆ దృష్టితో కూడా చూడకూడదు మామగారు.
Image result for kishkindha kand

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఎందుకంటే తన కూతురెంతో కోడలు అంతకన్నా ఎక్కువ స్థానం తెలుసాండి శాస్త్రంలో అందుకే రాముడైతే శాస్త్రం అలా ఉంటుంది నీకు మామగారు చచ్చిపోయాడు అన్నాడు తప్పా నాకు తండ్రిగారు చచ్చిపోయాడు అనలేదు సీతే మృత స్తే శ్వశురః పిత్రా హీనోసి లక్ష్మణ అని అన్నాడు ఆయన అయోధ్య కాండలో అది వివరించాను కూడా... మామ గారిలాంటి వ్యక్తి ఆడదాని జీవితంలో ఇంక ఎవ్వరూ ఉండరు. ధర్మం తెలిసున్నవాడైతే ఆడపిల్ల తండ్రి ఎప్పుడు ఒకమాట చెప్పాలి అందరూ తనకు నమస్కరించినా పెళ్ళైపోయాక తన కూతురు మాత్రం మామగారు ఎదురుగుండా ఉండగా తనకు నమస్కారం చేయకూడదు ముందు, మామగారికే ముందు నమస్కారం నేర్పుకోవాలి అమ్మా నీ మొదటి నమస్కారం నీ మామగారికే మామ గారిలాంటి బంధువు ఉండడు ఉండడు ఉండడూ అని చెప్తూంది శాస్త్రం అంత ప్రేమగా ఉంటాడు మామగారు. ఇది చెప్పేటప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది నా కోడలు ఎప్పుడొస్తుందా అనిపిస్తుంది కాబట్టి అలాగని నీవు ఇప్పుడేం దాని గురించి ప్రత్యేకించి ప్రయత్నం అక్కరలేదు ఆరోజు వచ్చినప్పుడు నేను చూస్తాను కాబట్టి స్నుషా కోడలివంటి మరదలితో నీవు సంగమించావు బలవంతంగా అనుభవించావు తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి ఇప్పుడు చెప్పు ఎవరిది ధర్మం.
నీవు ధర్మాత్ముడివా? నీకు పాపం లేదా... ఇప్పుడు ఇక్ష్వాకువంశీకులదైన ఈ రాజ్యంలో ధర్మం తప్పి ఇలా తిరుగుతున్నవాన్ని దండించే అధికారం నాకు ఉందాలేదా..? రాజు దండన విధించాలి, ధర్మం తప్పిపోయినవాడు పరిపాలన చేస్తే ఇదే రేపు అందరు ధర్మంగా స్వీకరిస్తారు కాబట్టి నీవు దండార్హుడవు త ద్వ్యతీతస్య తే ధర్మాత్ కామ వృత్త స్య వానర ! భ్రాతృ భార్యా అభిమర్శే అస్నిన్ దణ్డో అయం ప్రతిపాదితః !! తమ్ముడి భార్యను అనుభవించినటువంటి నిన్నూ వధించడం మినహా ఇంకోక శిక్ష శాస్త్రంలో లేదు. పోల్లే ఏదో చేసి విడిచిపెడదాం అంగవైకల్యం చేద్దాం ఓ కాలు తీసేద్దాం ఓ చెయ్యి తీసేద్దాం అంటే కుదరదు శాస్త్రంలో ఇటువంటి తప్పు చేసినవాడు ఇక శరీరంతో ఉండకూడదు కాబట్టి అతన్ని మృత్యువు మార్గమునకు పంపించవలసి ఉంటుంది. మృత్యువునకు ఎరగా పంపించవలసి ఉంటుంది కాబట్టి నేను నిన్ను చంపేశాను బాణం వేసి సుగ్రీవేణ చ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా సుగ్రీవుడితో స్నేహం చేశావు సుగ్రీవుడితో స్నేహం చేశావు అంటున్నావు సుగ్రీవుడితో నా స్నేహం లక్ష్మణుడితో స్నేహం ఎటువంటిదో అటువంటిది. లక్ష్మణుడు ధర్మాత్ముడు అందుకని నా వెంట ఉంటాడు సుగ్రీవుడు ధర్మాత్ముడు నా వెంట ఉండడానికి అంగీకరించాను. ఇప్పుడు సుగ్రీవుడు నా తమ్ముడి స్థానం పొందాడు నీ తమ్ముడైనా సుగ్రీవుని తమ్ముని స్థానంలో ఉంచుకుని నేనిచ్చిన మర్యాదను నీవు ఇవ్వలేకపోయావు కాబట్టి అన్నగా చచ్చిపోయావు అన్నాడు.
Image result for వాలి సుగ్రీవులుఈ మాట విని ఎంత ఏడవాలండి వాలి ఆయన మాట్లాడితే రామ చంద్ర మూర్తి మాట్లాడడమంటే అంత స్పష్టంగా ఉంటుంది కాబట్టి దార రాజ్య నిమిత్తం చ నిశ్శ్రేయసి రత స్స మే నేను ప్రతిజ్ఞ చేశాను, ఆయన రాజ్యాన్ని ఆయన భార్యనీ ఆయనకి ఇప్పిస్తాను అని, నేను ప్రతిజ్ఞచేశాను కాబట్టి ఇప్పుడు నీవు మరణిస్తే సుగ్రీవుడి భార్య సుగ్రీవుడికి దక్కుతుంది ధార్మికమౌతుంది. నీవు మరణించిన తరువాత రాజ్యము కూడా సుగ్రీవుడికి వెళ్ళిపోతుంది నీవు బ్రతికుండగా సుగ్రీవుడు నీ పాదముల మీదపడి ప్రార్థన చేసినప్పుడు నీవు సరిగా ప్రవర్తించివుండి ఉంటే... నేను జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండి ఉండేది కాదు. నేను నిన్ను చంపడం నీవు తెచ్చుకున్నటువంటి పరిస్థితి తప్పా నేను నిన్ను వెతికి చంపవలసిన అవసరం నాకు లేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి నిన్ను చంపడం వినా మార్గం లేని స్థితిని నీవు కల్పించుకున్నావ్ వాలి పరిస్థితిని ఎవరూ కల్పించుకోకూడదు కాబట్టి రాముడు ఎప్పుడూ ఇచ్చే అవకాశం ఏమిటో తెలుసాండీ తెలిసో తెలియకో చేసేసిన తప్పులకి రాముడు ఏమనడు రామా ఎన్ని తప్పులు చేశానో తండ్రీ నాది తప్పైపోయింది అని నన్ను మన్నించు అని త్రికరణశుద్ధిగా రామ పాదముల మీద పడిపోతే ఆ పాపములన్నింటిని మన్నించేస్తాడు రామ చంద్ర మూర్తి.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఆయన దయాగుణం కలిగినటువంటివాడు రాముడు కాబట్టి నీవు అలా ప్రవర్తించలేదు అందుకని నిన్ను చంపవలసినటువంటి పరిస్థితి వచ్చింది ప్రతిజ్ఞా చ మయా దత్తా తదా వానర సన్నిధౌ ! ప్రతిజ్ఞా చ కథం శక్యా మత్ విధేన అనవేక్షితుమ్ !! నేను ఒకసారి ఆ వానరుల ముందు ప్రతిజ్ఞ చేశాను సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నప్పుడు వాలిని వధిస్తాను అన్నాను రామో ద్విర్నాభి భాషతే నాకు రెండుమాటలు తెలియవు కాబట్టి ప్రతిజ్ఞా చ మయా దత్తా తదా వానర సన్నిధౌ నేను వానరుల సన్నిధిలో ఏ ప్రతిజ్ఞ చేశానో అది నెరవేర్చుకోవాలి కాబట్టి నిన్ను చంపడం వినా నాకు మార్గంలేదు అందుకని నేను నీమీద బాణం వేశాను వేసి నిన్ను చంపాను. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటీ అని అడుగుతావేమో... రాజభిః ధృత దణ్డా స్తు కృత్వా పాపాని మానవాః ! నిర్మలాః స్వర్గమ్ ఆయన్తి సన్తః సుకృతినో యథా !! సత్పురుషుడైనటువంటివాడు జీవితంలో ఏ పాపం చెయ్యనటువంటివాడు స్వర్గాన్ని ఎలా పొందుతాడో నీవు చేసిన మహాపాపానికి నాచేత దండనము పొందేశావు కాబట్టి రాజ దండనము పొందావు కాబట్టి నీ పాపం అక్కడితో పోయింది, పోయింది కాబట్టి ఇప్పుడు నీవు స్వర్గానికి వెళ్లిపోతావు. ఇప్పుడు నేను నీకు ఉపకారం చేశానా అపకారం చేశానా లేకపోతే ఎన్ని కోట్ల జన్మలు నువ్వు ఈ పాప ఫలితాన్ని అనుభవించి ఉండేవాడివో నేను తీసేశాను ఆ పాపాలన్ని రాజదండంతోటి నా బాణం వల్ల నీకు ఆ పాపం పోయింది కాబట్టి ఇప్పుడు నీవు స్వర్గానికి వెడుతున్నావు, ఎలా వెడుతావో తెలుసా పరమ సాధు పురుషుడు పరమ భక్తిపరుడు ఎలా వెడుతాడో అలా వెడుతావు.
Image result for వాలి సుగ్రీవులునీవు ఏమన్నావు నీవు పరాన్ముఖిడిగా ఉండగా ఎవరితోనే యుద్ధం చేస్తున్నప్పుడు నేను చాటుగా ఉండి నీ మీద బాణం వేశాను అది తప్పని నీవు అన్నావు ఇప్పుడు నీకు ఆ ధర్మం చెప్తాను విను న మే తత్ర మనః తాపః న మన్యుః హరి యూధప ! వాగురాభి శ్చ పాశై శ్చ కూటై శ్చ వివిధైః నరాః !! మనుష్యులు వేరు జంతువులు వేరు మనుష్యులు మనుష్యుడితో యుద్ధం చేసేటప్పుడు ఉండే ధర్మం వేరు మనుష్యుడు జంతువుని వేటాడేటప్పుడు ఉండే ధర్మం వేరు జంతువుతో చేసేది యుద్ధమనరు వేట అంటారు. జంతువుని వేటాడుతారు మనుష్యుని వేటాడరు మనిషితో యుద్ధం చేస్తారు అందుకే మనుష్యుని వేటాడరు కనుకా మనుష్యుడు వెన్ను చూపిస్తే మిన్నకుంటారు, మనుష్యుని ఆయుధం కిందపడిపోతే చంపరు మనుష్యుడు నిద్రపోతుంటే చంపరు మనిషి పరాకుగా ఉంటే చంపరు మనిషి అన్నం తింటూంటే చంపరు మనిషి భార్యతో కలిసి సుఖ భోగంలో ఉంటే చంపరు. అదే జంతువు నిద్రపోతున్నా చంపేస్తారు జంతువు పరాకుగా ఉన్నా చంపేస్తారు జంతువు పరుగెడుతున్నా బాణమేసి చంపుతారు ఎందుకంటే జంతువుని చంపేటప్పుడు వేట మనిషిని చంపేటప్పుడు యుద్ధం. యుద్ధానికి ధర్మం వేరు వేటకి ధర్మం వేరు అందుకే మనిషిని పట్టి చంపేటప్పుడు వలను వేసి పట్టుకోరు పాశం వేసి లాగి చంపకూడదు కపటంతో చంపకూడదు జంతువుని చంపేటప్పుడు వలవేసి పట్టుకోవచ్చును పాశంవేసి పట్టుకోవచ్చును కపటంతో పట్టుకోవచ్చు నిద్రపోతున్నప్పుడు పట్టుకోవచ్చు నిద్రలేస్తుండగా పట్టుకోవచ్చు మేత మేస్తుండగా కొట్టచ్చు పారిపోతున్నప్పుడు కొట్టచ్చు నిలబడినప్పుడు కొట్టచ్చు పడుకున్నప్పుడు కొట్టచ్చు. ఏం చేస్తున్నా సరే వేటాడాలనుకున్న రాజు జంతువుని కొట్టేటప్పుడు ఇలాగే కొట్టాలన్న నియమం ఏమీ లేదు కాబట్టి చాటున మాటున ఉండి బాణం వేస్తారు దశరథ మహారాజుగారు వేయలే శబ్దభేధి విద్యతో తెల్లవారిగట్ల నీరు తాగుతుంటే ఏనుగు వచ్చిందని బాణం వేయలే మరి చాటునుంచి బాణం వేయలేదా...

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
వేటాడేవాడు ఎప్పుడు సింహానికి ఎదురుగుండావెళ్ళి కూర్చొనేం వేటాడడు ఏ పొదలమాటునో కూర్చుని సింహం వచ్చిందీ అనుకుంటే వెంటనే సింహం మీద బాణప్రయోగం చేస్తారు అంతేగాని ఆ సింహానికి ఎదురుగుండా వచ్చి యుద్ధం చెయ్యాలని నియమం ఏమీలేదు వేట అన్న పదానికి అర్థమేమిటంటే జంతువుని మనిషి కొట్టేటప్పుడు అది వేట మనిషి మనిషిని కొట్టేటప్పుడు యుద్ధ ధర్మం. నీవు ఎవరు వానరుడివి నేను ఎవరిని నరున్ని నీవు జంతువు నేను నరుడను జంతువును కొట్టేటప్పుడు మనుష్య ధర్మం పాటించమని నీవేరు నాకు చెప్పడానికి ధర్మం, జంతువుని కొట్టేటప్పుడు వేట ధర్మం నా ఇష్టం ఎదురుగుండా నిలబడి కొడతా పక్కనుంచి కొడతా వెనకనుంచి కొడతా పారిపోతుంటే కొడతా వలేసి కొడతా పాశం వేసి కొడతా నిద్రపోతున్నా కొట్టేస్తా ఎందుకు కొట్టేస్తానంటే నీవు జంతు శరీరంలో ఉన్నావు నేను మనుష్య శరీరంలో ఉన్నాను ఇక్కడ యుద్ధ ధర్మం వర్తించదు నీకు ధర్మా ధర్మములు తెలియవు, అసలు నీకు ధర్మా ధర్మాలు తెలిస్తే కోడలి వంటి నీ మరదలితో అసలు సంగమించేవాడివే కావు అసలు ఏ ధర్మమూ నీకు తెలియదు ఏ ధర్మమమూ తెలుసుకుందానుకని నీవు ప్రయత్నించలేదు నీకు తెలిసున్న ధర్మం ఒక్కటే నీకు పశుధర్మమొక్కటే తెలుసు నీకు ఒంట్లో కండ కావరముంది కాబట్టి నీవు దాంతోటి వెళ్ళి నీకు ఏం కావలంటే అది అనుభవించావు ఆ పాపం నిన్ను అనుభవించవలసిన రోజు వచ్చింది నా చేతి బాణంతో తెగటారిపోయావు కాబట్టి చాటునుంచి కొట్టావు పరోణ్ముకుడవై కొట్టావు నేను ఎవరితోనో యుద్ధం చేస్తుంటే కొట్టానంటేవేమిటీ నేను పాటించవలసిన ధర్మాన్ని నేను ఎవరిపట్ల పాటించాలో అది మానేసి నీపట్ల నేను పాటించాలి ధర్మాన్ని అనిచెప్పడానికి నీవేవరు.
శాస్త్రం ఏం చెప్పిందో అది ధర్మం నీవు చెప్పింది ధర్మం కాదుగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రం ప్రమాణం ఇదే నేను మీతో తరచుగా మనవి చేసేది, రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రమే మాట్లాడుతాడు తన స్వంత నిర్ణయాలు చెప్పడు రాముడు ధర్మాన్ని నిర్ణయించినది శాస్త్రాలు నిర్ణయిస్తాయి స్మృతులు నిర్ణయించాయి ఆ స్మృతులు నిర్ణయించినప్పుడు క్షత్రియులకు వేట ధర్మాన్ని నిర్ణయించాయి యుద్ధ ధర్మాన్ని నిర్ణయించాయి, వేట ధర్మం జంతువుల పట్ల యుద్ధ ధర్మం సాటి మనుష్యుల పట్ల ఇప్పుడు నేను ఒక జంతువుని వేటాడేటప్పుడు పరాన్ముఖంగా ఉన్నా కొట్టానా ఎదురుగుండా కొట్టానా పారిపోతూ కొట్టానా ఇవేవీ నాకు అధర్మాన్ని తీసుకురావు కాబట్టి నీవు నన్ను ఇలా కొట్టావేమని అడిగేటటువంటి అధికారమే లేదు అసలు ధర్మం అన్నమాట ఎత్తే అధికారం నీకు లేదు. నీవు చాలా ధర్మాత్ముడవైనట్లు మాట్లాడుతున్నావు కారణమేమిటో తెలుసా నీకేమీ తెలియకపోవడమే కారణం ఏవమ్ ఉక్త స్తు రామేణ వాలీ ప్రవ్యథితో భృశమ్ ! న దోషం రాఘవే దధ్యౌ ధర్మే అధిగత నిశ్చయః ! ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిః వానరేశ్వరః !! ఈ మాటలు విన్నాడట వాలి రెండు చేతులు ఎత్తి కన్నీటితో నమస్కారం చేశాడట అయ్యా! నేను ఎంత తప్పు మాట్లాడానో నాకు అర్థమయ్యింది రామా! మీరు ధర్మ మూర్తులు రాశీభూతమైనటువంటి ధర్మము ఇది తెలియక నేను ధర్మాత్ముడననుకొని మీరు తప్పు చేశారనుకుని నా నోటికొచ్చినట్లు వదరాను.
Image result for vali in ramayanaఅయినా మీరు మహానుభావులు కాబట్టే మీరు ఒకమాట అన్నారు నీ మీద నాకే కోపమూ లేదు నీవు చచ్చిపోయావని నాకు బాధాలేదు నా కర్తవ్యం పూర్తైందీ అన్నారు నేను ఇన్ని మాటలన్నా మీరు నామీద ఎందుకు ఖేద పడలేదంటే అజ్ఞాని ఏమీ తెలియనివాణ్ని వాడికి ఏ ధర్మం తెలుసని వాడు సరిగ్గా మాట్లాడుతాడు వాడికేం తెలియదు ఏమీ తెలియనివాడు మాట్లాడితే దానికి నేను చింతిస్తే నా స్థాయి తగ్గతుంది కాబట్టి తెలియనివాడు మాట్లాడితే దానికి బాధేమిటీ అందుకని మీరు బాధపడలేదని కూడా చెప్పారు మీరు ఎంతటి ధర్మాత్ములో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. కాబట్టి అంజలి ఘటించి నీకు నమస్కరిస్తున్నాను అని ఒక్కసారి రామ చంద్ర మూర్తికి సాంజలి బంధకంగా నమస్కరించి ఆయన ధర్మాన్నంతటినీ శ్లాగించారు అది రామానుగ్రహమంటే. కాబట్టీ ఇప్పుడు ఎంతోసంతోషించారు అని తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ ! రాఘవా! నన్ను క్షమించండి నేను ఇలా పరిది దాటి మాట్లాడినందుకు మీరు నన్ను క్షమిస్తే నా పాపాలన్ని ఇక్కడితో సమసిపోతాయి నేను సంతోషంగా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను అన్నాడు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
అని న తు ఆత్మానమ్ అహం శోచే న తారాం నాపి బాన్ధవాన్ ! యథా పుత్రం గుణ శ్రేష్ఠమ్ అంగదం కనక అంగదమ్ !! ఇంకా ధనేశ దారేశ పుత్రేశ ఉంటుంది కదాండీ ధనేశ దారేశ గెలిచాడు రామ దర్శనంతో పుత్రేశ ఉండిపోయింది నాకు ఇప్పుడు తార గురించి బెంగలేదు భూమి గురించి బెంగలేదు రాజ్యం గురించి అంగదం కనక అంగదమ్ బంగారు కేయూరములు పెట్టుకుని తిరగడం అంటే ఇష్టమైనవాడు నా కొడుకు చిన్నవాడు ఉన్నాడే వాడికేమీ తెలియదు ఇంకా ప్రవర్తన రేపు సుగ్రీవుడు రాజౌతాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియకా ఆ సుగ్రీవుడి యొక్క శత్రువులతో కలిసి తిరిగితే కోపమొస్తుంది కాబట్టి మీరు నా తమ్ముడైనటువంటి సుగ్రీవున్ని ఎలా రక్షించి కాపాడి హత్తుకుని మీ పక్కన పెట్టుకున్నారో అలాగే నా కొడుకైనటువంటి అంగదున్ని నీ ఛత్ర ఛాయలో నీ నీడలో వాణ్ని కాపాడి పెద్ద చేయండి రామా..! ఇంక నాకు అంతకన్నా ఏమీ అక్కరలేదు అన్నాడు. తప్పకుండా నేను నీ కొడుకుని అలాగే కాపాడుతానని మాటిచ్చారు మాటిచ్చిన తరువాత మళ్ళీ ఇంకొక్కమారు క్షమార్పణ చెప్పాడు శరాభితప్తేన విచేతసా మయా ప్రదూషిత స్త్వం యత్ అజానతా ప్రభో ! ఇదం మహేన్ద్రోపమ భీమ విక్రమ ప్రసాదిత స్త్వం క్షమ మే మహీశ్వర !! ఇక్కడితో ఇది మూడోమాట సత్యము ఆయన అన్నాడూ మహానుభావా! నీవు ఇంద్రుని కూడా నిగ్రహించగలిగినటువంటి గొప్ప బలశాలివి మహేంద్రునివంటి శక్తి సంపన్నుడవు అటువంటి నీవు నా ఎదురుగుండా ధనుర్భాణములతో నిలబడితే తెలియక నేను మాట్లాడిన మాటలు నేను తెలియక చేసినటువంటి అపరాదములు నా పాప కర్మలు అన్ని కూడా క్షమించి నన్ను కాపాడు నా అనాచారమును మన్నించు అని నమస్కారం చేశాడు.
నమస్కారం చేసి నేల పడిపోయాడు నేల పడిపోయిన తరువాత ఆ తారా పరుగుపరుగున పరుగుపరుగున అంతఃపురంలోంచి వస్తూంది, వస్తూంటే ఈ వానరులందరూ ఆవిడకి ఎదురెళ్ళారు ఏం జరిగిందీ అని అడిగింది ఆవిడ, పెద్ద కోలాహలం కదాండి మరి వాలి మరణించాడు అంటే ప్రభువు మరణించాడు అప్పటివరకు ఓటమిని ఎరుగనివాడు, వస్తుంటే... వానరులు, అంటే ఒక సంఘటనా ఒకవ్యక్తి నాలుక నుంచి ఇంకొక వ్యక్తి నాలుక మీదకి వెళ్ళేటప్పటికి ఎన్నిరకాలుగా మారిపోతుందో చూపిస్తారు మహర్షి వానరులు ఏం చెప్పారంటే తారతోటీ క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులా శ్చ శిలా స్తథా ! వాలీ వజ్ర సమై ర్బాణైః వజ్రే ణేవ నిపాతితః !! వాలికి ఎదురుగుండా రాముడొచ్చాడు యుద్ధం చేయడానికి వాలి చెట్లు పీకి రాముడి మీదకి వేశాడు చెట్లేశాడు రాముడు బాణాలకి చెట్లన్ని తెగిపోయాయి ఎదో ఇద్దరూ చాలాసేపు దెబ్బలాడుకున్నారు దెబ్బలాడుకున్న తరువాత వాలిమీద బాణం వేశాడూ బాణం వేసిన తరువాత వాలి కిందపడిపోయి చచ్చిపోయాడు నెత్తుటి మడుగులో ఉన్నాడు ఇప్పటిదాకా వాలి రాజ్యంలోంచి దూరంగా పంపించివాళ్ళు ఇక్కడికి వద్దామనుకుంటున్నవాళ్ళు ఇక్కడ ఉండి వాలి విరోధులైనవాళ్ళు అందరు ఒకటైపోయారు ఇప్పుడు సుగ్రీవుడు వాళ్ళకు నాయకత్వం వహిస్తున్నాడు వాలికి అనుచర గణంగా ఉన్నవాళ్ళందరి మీద పగ తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి నీవు అక్కడికి వెళ్ళకు అంగదున్ని తీసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది విప్లవం జరిగిపోతూంది సింహాసనం కోసం కుట్రజరిగిపోతూంది ఇన్ని చెప్పారు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
Image result for vali wife taraఅవన్నీ జరిగాయా అక్కడ అంగదున్ని నేను రక్షిస్తానని రామ చంద్ర మూర్తి అన్నారు అంటే... లోకం పోకడ ఎలా ఉంటుందో చూపిస్తారు వానరులు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడారంటే అర్థముంది, పుకార్లమీద ఉన్నంత వ్యామోహం ఇంక దేనిమీద ఉండదు దానికి తగ్గట్లే ఇప్పుడు ఒక కొత్త ప్రక్రియ కూడా బయలుదేరింది ఎక్కడ ఏదైనాసరే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చెప్పండి అనేటటువంటి సాధనా సంపత్తులు కూడా వచ్చేశాయి. కాబట్టి ఇంక అదేపని ఇక ఏ ఇంద్రియములకు పనిలేదు ఇలా ఉండడమే నిశ్చేష్టులైపోయి తెలుసుకుంటూండడము ఏమిటి దానివల్ల ఉపయోగం అది వేరే విషయం వదిలిపెట్టేసేయండి. కాబట్టి వానరులు ఈ మాట చెప్తే తార అందీ నా భర్త మరణించిన తరువాత ఈ రాజ్యం ఉంటే ఎవరికి కావాలి ఊడిపోతే ఎవరికి కావాలి నాకు వాలి ప్రధానమని ఆవిడా యుద్ధ భూమిలోకి వెళ్ళింది వాలి మీద పడింది చాలా ఘోరమైనటువంటి స్థితిలో శోకించి ఆవిడా కానీ తార ఎక్కడ మాట్లాడినా అలానే ఉంటుంది. ఒక మెరుపు ఆవిడ అలా మాట్లాడితే ఆ శ్లోకాలు అంత దీనంగా విలపిస్తూ కూడా ఆవిడ చాలా చమత్కారంగా కూడా చాలా అందంగా మాట్లాడుతుంది. నన్ను కూడ చంపి వాలి దగ్గరికి పంపేయి అంది ఎందుకంటే వాలి స్వర్గానికి వెళ్ళిన తరువాత అంతటి తేజోవంతుడు అంతటి కీర్తివంతుడు స్వర్గానికి వచ్చాడని మురిసి అప్సరసలు వచ్చి కౌగలించుకుంటారు, ఆయన ʻనాకు మీ కౌగిలింత అక్కరలేదు నా భార్య తార కావాలంటాడుʼ నేను పక్కన లేకపోతే దిగులు చెందుతాడు స్వర్గం రుచించదు అందుకే నన్ను కూడా పంపేయమంది.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఏ బాణంతో వాలిని చంపావో ఆ బాణంతోనే నన్ను చంపేయ్ ఎందుకంటే ఆడదాన్ని చంపడమా అని ఆలోచిస్తున్నావేమో... భార్యా భర్తల శరీరములు వేరేమో కానీ వాళ్ళు శాస్త్రంలో ఒకటే, నీకు ధర్మం మీద నమ్మకంకదా ఆ బాణంతోనే నన్ను చంపేస్తే భార్యా భర్తలను కలిపి చంపేస్తే ఒకళ్ళనే చంపేసినట్లు అవుతుంది పైగా దానాలన్నింటిలోకి శ్రేష్ఠమైన దానం ఏమిటో తెలుసా... భార్యా దానమే అంటే కన్యాదానం, కన్యాదానం అందుకదాండి గొప్పదైంది ధర్మం చేసుకోవడం అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓ యజ్ఞం యాగం ఏది చెయ్యాలన్నా ధర్మపత్ని పక్కనుండాలి కదా అందుకని కన్యాదానం గొప్పది కాబట్టి భార్యాదానం గొప్పది అందుకని నన్ను నీవు ఇప్పుడు చంపేస్తే వాలికి భార్యాదానం చేసినవాడివౌతావు కాబట్టి నన్ను చంపేయమంది అని నీకు ఎప్పుడు ఈ భూమి మీద వ్యామోహం రాజ్య కాంక్ష అందుకని వాలీ నేనొచ్చినా భూమినే కౌగలించుకుని పడుకున్నావా..? అంటుంది ఆ ఏడుపులో కూడా ఎంత చమత్కారంగా మాట్లాడుతుందో కాని అలా అనకూడదు, అది సంస్కృతి పాత్రం కాదు అలా మాట్లాడటం అంటే అలా ఏడవడం అభినందించి ఏడవడమన్నది మంచిది కాదు కానీ ఆవిడ అలా శోకించిది భర్త యొక్క మరణానికి కానీ ఆవిడ వాలితో ఒక మాట అంటుంది ఇవీ అనగలిగిన ప్రజ్ఞ లోకంలో చాలా తక్కువ మందికే ఉంటుంది మండోధరి అంటుంది రావణుడి విషయంలో తార అంటుంది వాలి విషయంలో యుద్ధ భూమిలో.
Related imageఆవిడ అంటూందీ సుగ్రీవ స్య త్వయా భార్యా హృతా స చ వివాసితః ! య త్తు తస్య త్వయా వ్యుష్టిః ప్రాప్తా ఇయం ప్లవగాధిప !! నీవు నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడి భార్యనీ నీ భార్యగా అనుభవించడం వల్లనే ఈ ప్రమాదాన్ని తెచ్చుకోవడం అయ్యింది, సుగ్రీవున్ని రాజ్యంలోంచి పంపకుండా సుగ్రీవుడికి యౌవ రాజ్యమిచ్చి ఆయన భార్యతో ఆయన్ని ఉండే అవకాశం ఇచ్చి ఉండి ఉంటే..? ఎలా ఉండేదో పరిస్థితి నీ చావుకి కారణం రాముడని నీవు అనుకుంటున్నావు నీ పాపమే కారణం అది ఆవిడ. కాబట్టి ఆ తల్లి మహాతల్లి చాలా గొప్పగా అని ఆవిడ ఒకమాట అంది నీవు మరణించావు సరే నీవు నీ పాపం చేశావు నీవు చనిపోయావు కాని ఇప్పుడు నా పరిస్థితి ఏమిటీ వాలి భార్యా అంటారు రాజ్యం ఉంటుంది కొడుకు అంగదుడు ఉన్నాడు రేపు పొద్దున సుగ్రీవుడు రాజైతే అంగదుడు యువరాజైతాడు, యువరాజు యొక్క తల్లిని నేను అన్నీ ఉన్నా శాస్త్ర పరిజ్ఞానమున్న పండితులు నన్ను ఏమని పిలుస్తారో తెలుసా పతి హీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ ! ధన ధాన్యైః సుపూర్ణాపి విధవా ఇత ఉచ్యతే జనైః !! శాస్త్రమెరిగినటువంటి పండితులు పతి హీనా తు యా నారీ భర్త లేనటువంటి ఆడదాన్ని ఎంత గొప్ప కొడుకున్నా ఎంతమంది కొడుకులున్నా ఎంత ధనమున్నా ఎంత ధాన్యమున్నా విధవా అంటారు తప్పా ఇంకొక మాట అనరు నన్ను కాబట్టి నువ్వు పాపపు నడవడితో ఉన్నావు ఫలితం విధవగా నేను బతకవలసినటువంటి స్థితిని నాకు కల్పించావు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
అని రాముడి వంక తిరిగింది, రాముని వంక తిరిగి రామునిలో ఉన్న తేజస్సును గుర్తించింది అప్పుడు కూడా అవిడ భహుశహా పూర్వ పుణ్యం యొక్క బలం చేత తార అలా చెప్పగలిగింది తప్పా అన్యులకది సాధ్యం కాదు అలా పసికట్టినా అలా వాక్కులలో ఆవిష్కరించలేరు అటువంటి దీన స్థితిలో ఆవిడ అంత గొప్పగా మాట్లాడింది త్వం అప్రమేయ శ్చ దురాసదస్య జితేన్ద్రియ శ్చోత్తమ ధార్మికస్య అక్షయ్య కీర్తి శ్చ విచక్షణ శ్చ క్షితి క్షమావాన్ క్షతజో పమాక్షః నీవు రామా! త్వ అప్రమేయ శ్చ దురాసదస్య నీ యొక్క శక్తిని ఊహించడం ఎవ్వరికీ సాధ్యం కాదు భగవంతుడి యొక్క శక్తిని ఎవరు ఊహిస్తారండీ..! జితేన్ద్రియ శ్చోత్తమ ధార్మికస్య నీవు ఇంద్రియములను జయించినటువంటి వాడివి ఉత్తమ ధార్మికస్య నీవు చాలా ఉత్తమమైనటువంటి ధార్మికుడవు ఇంద్రియములను గెలవడం వేరు ఇంద్రియములను అణచడం వేరు ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. ఇంద్రియములను అణచినటువంటి వాళ్ళూ రామాయణంలో ఉంటారు ఇంద్రియములను గెలిచిన వాళ్ళూ రామాయణంలో ఉంటారు. ఇంద్రియములను అణచినవాడు రావణాసురుడు ఇంద్రియాల్ని అణచడం అంటే ఏమిటో తెలుసాండి! త్రాచు పాము యొక్క తలమీద పాదాన్ని పెట్టి నిల్చోవడం కానీ లేచాడనుకోండి పాము కరిచేస్తుంది. ఇంద్రియాలు కొంత సేపు బయట వ్యామోహంతో తిరగకుండా తిప్పి అట్టే పెడతాడు దాని వల్ల బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొందాడు వరాలు పొందాడు లేచాడు ఇంద్రియాలన్నీ విజృంభిస్తాయి కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని వదిలేస్తాడు. ఇంద్రియాలు ఎటు తిరుగుతున్నాయో అటు తిరగడం మొదలు పెడతాడు అధార్మికమైన ప్రవర్తనవైపుకి వెడుతాడు.
Related imageఇంద్రియాల్ని గెలవడం అంటే ఏమిటో తెలుసాండీ! తాను అధార్మికంగా అనుభవించకూడదూ అన్న సుఖం తన కన్నుల ముందు కనపడి తనని కోరుకున్నా తాను ఆ సుఖాన్ని అనుభవించడు ఎందుకంటే శాస్త్రం అంగీకరించదు కనుకా... ఆయన ఇంద్రియముల యందు కానీ మనస్సుయందు కానీ వికారము కలగదు అలాంటివాడు ఇంద్రియములను గెలిచినవాడు. కాబట్టి  జితేన్ద్రియ శ్చోత్తమ ధార్మికస్య నీవు ఇంద్రియములను గెలిచినటువంటివాడివి ఉత్తమమైనటువంటి ధార్మికుడివి అక్షయ్య కీర్తి శ్చ విచక్షణ శ్చ నీ కీర్తి క్షీణించదు తెలియక వాలి ఏదో అన్నాడని కీర్తి మాసిపోయింది ఇవ్వాల్టితోనని అక్షయ్య కీర్తి శ్చ విచక్షణ శ్చ నీవు యుక్తా యుక్త విచక్షణ బాగా ఉన్నవాడివి క్షితి క్షమావాన్ భుమికి ఎంత ఓర్పుందో అంత ఓర్పున్నవాడివి క్షతజో పమాక్షః ఎరుపు జీరలుచేరి రక్తము ఎలా ఉంటుందో అలాంటి కన్నులు ఉన్నవాడివి అంత అందగాడివి త్వమాత్త బాణాసన బాణ పాణి మహా బల స్సంహన నోపపన్నః మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్తః నీవు ఆ ధనస్సు పట్టుకుని బాణాలు తూణీరం కట్టుకుని ఇలా నిలబడితే తార వచ్చేటప్పటికి ఆయన దానిమీద వాలి ఉన్నాడు ఇలాగ ధనస్సుమీద నీవు నిలబడితే నీ అవయవ సంఘాతముందే నీ శరీరంలో అవయవాల యొక్క పొందిక దాన్ని చూస్తుంటే అది ఒక మనుష్య శరీరానికి ఉండేటటువంటి అవయవముల యొక్క పొందిక కాదు అది

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
దేవతల యొక్క శరీరపు కాంతులలో నీ శరీరపు కాంతులు కనపడుతున్నాయి కాబట్టి నీవు సాక్ష్యాత్ ఈశ్వరుడవని ఆవిడ రామ చంద్ర మూర్తి యొక్క వైభవాన్ని కీర్తించింది.
కీర్తించి ఆవిడా తాను కూడా సహగమనం చేస్తానంది లోకంలో ఒక పోకడ ఒకటి ఉంటుంది ఇంతా చంపేపించినటువంటి సుగ్రీవుడు అన్నాడూ... పాపం నేను ఎప్పుడు కనపడినా మా అన్నయ్య చెట్టు కొమ్మలతో తరిమి ఇంకెప్పుడు రాకని చెప్పి తరిమేసేవాడు తప్పా చంపలేదూ నేను మాత్రం మా అన్నయ్యను చంపించేశాను నా లాంటి

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
తమ్ముడు లోకంలో ఉండడూ ఇప్పుడు చనిపోతున్నటువంటి అన్నయ్యని చూసిన తరువాత నాకు ఎంత మాత్రము కూడా ఈ రాజ్యాన్ని తీసుకోవాలని లేదు అందుకని ఋష్యమూక పర్వతము మీదకు వెళ్ళిపోయి కందమూలాలను తింటూ ఉంటాను అక్కడే ఉంటాను అంగదునికి రాజ్యమిచ్చేయడి అన్నయ్యని చంపి పాపం మూట కట్టుకున్నాను తారా విలాపం చూస్తే నా హృదయం కదిలిపోతుంది అన్నాడు. చిత్రమేమిటో తెలుసాండీ రాముడూ ఏడ్చాడు ఇదీ రాముని హృదయమంటే అందుకే శ్రీ రఘురామ, చారు తులసీదళ దామ, శమక్షమాది శృం గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్యరమాలలామ, దు ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో త్తారక నామ, భద్రగిరి దాశరధీ, కరుణా పయోనిధీ ! అంటారు రామదాసుగారు. ఆయనా మహానుభావుడు ఎదుటివారి కల్మశాన్ని కడుగుతాడు తన స్నేహితుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నటువంటి ఆ సుగ్రీవుడు అన్నగారు చచ్చిపోయాడని ఏడిస్తే ఆ ఏడుపుకి తాను ఏడ్చాడు, ఏడ్చి ఇంకా ఆయన మరణించలేదు అంగదున్ని సుగ్రీవునకు అప్పజెప్పాడు. అప్పజెప్పి వీడు తెలిసీ తెలియని చిన్నతనంతో తప్పు చేస్తే వీణ్ని రక్షించు కాపాడు అని యౌవరాజ్య పట్టాభిషేకం చెయ్యమనికోరి సుగ్రీవుడితో ఒక మాట అన్నాడు ఈ మాల నా మెడలో ఉన్నంతకాలం నా ప్రాణంపోదు ఈ మాల వహిస్తుంది నా యొక్క పరాక్రమాన్ని తెజస్సుని ప్రాణాల్ని కాబట్టి ఈ మాల తీసి నీ మెడలో వేసేస్తాను దగ్గరికిరా అన్నాడు.
Related imageసుగ్రీవుడు వచ్చిన తరువాత మెడలో ఉన్నటువంటి మాల తీసి సుగ్రీవుడి మెడలో వేసి భయంకరంగా పళ్ళు బయటపెట్టి కనురెప్పలు పెద్దవిచేసి గుడ్లుపైకి పెట్టి మరణించాడు అని రాశాడు వాల్మికి మహర్షి. అంత ఘోరమైనటువంటి చావు చచ్చిపోయాడు రామ బాణపు దెబ్బ అప్పుడు తెలిసింది ఆ మాల తీసేయగానే అప్పటి వరకు అది ఓర్చేటట్టు చేసింది. మరణించాడు ఏడ్చారు లక్ష్మణ మూర్తి ఆదేశించాడు వెళ్ళారు ఒక పెద్ద శిభికం ఒకటి తీసుకొచ్చారు అందులోకి ఈ పార్థివ శరీరాన్ని ఎక్కించారు తారాదులు కూడా వెనకాతల వెళ్ళారు వాళ్ళ ఆచారం ప్రకారం రుద్రభూమిలో దాన్ని కట్టెలమీద పడుకోబెట్టి చందన కాష్టములయందు పడుకోబెట్టి నెయ్యిపోసి సమత్రకంగా అంగదుడు అగ్నికి ఆహుతిచేసేశాడు వాలి శరీరాన్ని అక్కడితో వాలి నిహతుడైపోయాడు కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను బహుశహ వాలిని వధించడంలో రామ చంద్ర మూర్తి ధర్మం యొక్క విషయంలో మీకు ఎవ్వరికి అనుమానం లేనిరీతిలోనే రామ చంద్ర మూర్తి చెప్పిన జవాబులు నేను మీకు కొంత చెప్పగలిగానేమోనని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా తెలియక వాలిని రాముడు చాటునుంచి కొట్టాడనంటే రాముడి జవాబును మీరు నేను కూడా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే రాముడి యొక్క కీర్తిని కాపాడటం ధర్మం యొక్క కీర్తిని కాపాడటం. ఇప్పుడు ఇది పూర్తైపోయిన తరువాత దానికి సంబంధించిన అంతేష్టి సంస్కారమంతయు పూర్తైపోయింది శ్రీరామాయణంలో తప్పకుండా గమనించవలసిన విషయం ఇది ఎప్పుడైనా సరే ఎంత నీచుడైనా సరే ఒకసారి చచ్చిపోతే మాత్రం ఆ శరీరాన్ని అలా వదిలేసి రాకూడదు. నిజంగా రాముడు ఇంత పాపపు నడవడి కలిగినవాడు అవతలపారేయండనచ్చు అలా అనడు అంతేష్టి చేయిస్తాడు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఒక మనిషి చనిపోతే అంతేష్టి సంస్కారం చెయ్యడం ఎంత అవసరమో ఎవరూ లేనటువంటి అనాధగా ఎవరైనా మరణిస్తే అటువంటి శరీరానికి అంతేష్టి సంస్కారం చేయడం ఎంతగొప్పదో కలియుగంలో అశ్వమేధయాగం లేదు అనాథప్రేత సంస్కారమే అశ్వమేధ యాగము కాబట్టి దాని గొప్పతనమేమిటో రామచంద్ర మూర్తి ఒకటికి పదిమార్లు రామాయణంలో నిరూపిస్తుంటారు అందుకే ఆ వాలి యొక్క శరీరానికి కూడా అంతేష్టి సంస్కారం చేయించి మళ్ళీ ఆ ప్రశ్రవణ గుహయందు కూర్చున్నాడు. హనుమదాదులు సుగ్రీవుడు వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు
భవత్ ప్రసాదాత్ సుగ్రీవః పితృ పైతామహం మహత్ ! వానరాణాం సుదంష్ట్రాణామ్ సంపన్న బలశాలినాం !!
వానరాణాం సుదుష్ప్రాపం ప్రాప్తో రాజ్యమ్ ఇదం ప్రభో !!!
భవతా సమనుజ్ఞాతః ప్రవిశ్య నగరం శుభమ్ ! సంవిధాస్యతి కార్యాణి సర్వాణి ససుహృ జ్జనః !!
స్నాతోయం వివిధైః గన్ధైః ఔషధై శ్చ యథా విధి ! అర్చయిష్యతి రత్నై శ్చ మాల్యై శ్చ త్వాం విశేషతః !!
ఇమాం గిరి గుహాం రమ్యామ్ అభిగన్తుమ్ ఇతోర్హసి ! కురుష్వ స్వామి సంబన్ధం వానరాన్ సంప్రహర్షయన్ !!
హనుమ సుగ్రీవుడు ఇతర వానర ప్రముఖుల్ని తీసుకెళ్ళి ఆయన కూర్చున్న పర్వత గుహదగ్గరికెళ్ళి రాముడితో అన్నారు వాలి వధ పూర్తైపోయింది ఇది తాత ముత్తాతల నుంచి సంక్రమిస్తున్నటువంటి వానర రాజ్యపు సింహాసనం కనుకా ఇప్పుడు సుగ్రీవున్ని పట్టాభిశక్తున్ని చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాలి అంగదునికి యౌవ రాజ్యం ఇవ్వాలి. రామ చంద్ర ప్రభో మీరుకూడా బయలుదేరి కిష్కింధా నగరానికి వచ్చి అంతఃపురంలో ఈ పట్టాభిషేకాన్ని వైభవంగా కన్నుల పండుగగా జరిపించవలసింది అన్నారు అంటే రామ చంద్ర మూర్తి అన్నారు చతుర్దశ సమాః సౌమ్య గ్రామం వా యది వా పురమ్ ! న ప్రవేక్ష్యామి హనుమన్ పితు ర్నిర్దేశ పాలకః !! అది పట్టాభిషేకమే కావచ్చు కాని మా నాన్నగారు నన్ను పధ్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమన్నారు అందుకని అది నగరమా జనపదమా! నేను దాని లోపలికి మాత్రం రాను నేను ఊరిబయటే ఉంటాను అరణ్యంలో నాకీ పర్వత గుహ చాలు నేను ఈ గుహలో ఉంటాను కాబట్టి చక్కగా సంతోషంగా మీరు పట్టాభిషేకాన్ని పూర్తి చేసుకోండి అంటే సుగ్రీవుడు అయితే మరి మనం వెంటనే సీతాన్వేషనం చేద్దాం అన్నాడు కాదు ఇది వర్షాకాలం కాబట్టి వర్షములు పడుతుంటాయి ఇప్పుడు అన్వేషణం కూడా చాలా కష్టం దారులు సరిగా ఉండవు పైగా నీవు ఎంతో కాలంగా భార్యని విడిచిపెట్టి రాజ్యంలేకా దీనుడవై తిరిగావు ఇప్పుడే నీకు రాజ్యం వచ్చింది భార్యా సుఖం కలిగింది కాబట్టి నీవు సంతోషంగా ఈ వర్షాకాలం అయిపోయేంతవరకు భోగాన్ని అనుభవించు తదనంతరం శరత్ కాలం వచ్చిన తరువాత నీవు సీతాన్వేషణం చేద్దువుగాని.
ఇతరుల యొక్క సుఖాన్ని ఇతరుల యొక్క సౌకర్యాన్ని ముందు ఆలోచిస్తాడు రామ చంద్ర మూర్తి ఆ వానలు పడితే పడతాయికాని ఎవరికి అవతల సీతమ్మ ఏమైపోయిందో ఈయన పని అయిపోయింది కదాని అలాగ కాదులే వెల్దాంపదాని అని బయల్దేరు పదా ఏం హనుమ వెళ్ళలేరా నీవు వెళ్ళలేవా అనరు సంతోషంగా కొంతకాలం గడుపు తరువాత మనం బయలుదేరుదాము అంటాడు. ఇతరుల యొక్క సౌఖ్యాన్ని ఇతరల యొక్క సుఖం గురించి ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ మనం ఆలోచించినట్లే జరగాలనే మౌఢ్యం వదలిపోవాలంటే రామాయణం చదవాలి. ఎవరో మహానుభావుడు ఎక్కడన్నాడో కాని ఎక్కడున్నా ఏం మంచి మాట మంచిమాటేగా “తనకు తాను సుఖపడితే తప్పుకాకున్నా పదిమందిని సుఖపెడితే ధన్యతవోనాన్న” కదా! కాబట్టి కార్తికే సమనుప్రాప్తే త్వం రావణ వధే యత! ఏష నః సమయః సౌమ్య ప్రవిశ త్వం స్వమ్ ఆలయమ్ ! ఈ వర్షాకాలం అయిపోయే వరకు నీవు హాయిగా అంతఃపురంలో సంతోషంగా భోగమనుభవించు అని చెప్పి పంపించేశారు, పంపించి రామ చంద్ర మూర్తి ఒక పర్వత గుహలో ఉంటుంన్నారు, ఆ పర్వత గుహలో ఉంటున్నప్పుడు బయట వర్షాకాలం ఆ వర్షాకాలంలో వర్ష ఋతువుని వాల్మీకి మహర్షి వర్ణణచేశారూ అనితర సాధ్యం.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
అసలు వాల్మీకి మహర్షి ఆ ఋతువులను చూసి నటువంటి తీరు ఆ  ప్రకృతి వైభవాన్ని వర్ణించినటువంటి తీరు అనన్యసామాన్యమైన ప్రజ్ఞ. ఉత్తరోత్తర అన్యకువులందరికి కూడా ఇదే మార్గదర్శకమైంది. ఎదో కథాపరంగా చెప్పి కథ వెళ్ళిపోవడమే కాదు ఒక్కొక్కసారి కావ్యపరంగా ఋతువర్ణలలో ఉండేటటువంటి అందాన్ని కూడా ఆశ్వాదించవలసి ఉంటుంది. వర్ష ఋతువు గురించి వాల్మీకి మహర్షి చేసిన వర్ణన చూడండీ పర్వత గుహలలో ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడుకి చెప్తున్నాడు వర్షఋతువు యొక్క అందాన్ని తాను స్వయంగా చెప్పడం కాదు మహర్షి రామ చంద్ర మూర్తి కళ్ళలోంచి చూస్తారు చూసి చెప్తారు శక్యమ్ అమ్బరమ్ ఆరుహ్య మేఘ సోపాన పంక్తిభిః ! కుటజ అర్జున మాలాభిః అలంకర్తుం దివాకరమ్ !! లక్ష్మణా ఈ మేఘాలున్నాయే ఇవి బాగ కిందకి దిగిపోయాయి, నేను ఒకసారి వేంకటాచలం వెళ్ళాను ఏదో సేవచేయడానికి శ్రావనమాసంలో వెళ్ళితే ఆరోజు ఆనందనిలయంలోంచి బయటికి వచ్చేసరికి ఎవరికి ఎవరూ కనపడలేదు ఇంకా ఎందుచేతా అంటే మేఘాలన్నీ దిగిపోయాయి కొండమీదకి ఒక్కొక్కసారి అసాధారంగా అలా జరుగుతుంటుందట, మేఘాలన్నీ దిగిపోతే నేను యదార్థం చెప్తున్నాను నేను నా భార్య చెయ్యి పట్టుకుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ కళ్ళు చిట్లించి దట్టమైన పొగమంచులోనడుచుకుంటూ వెళ్ళినట్లుగా కాటేజికి వెళ్ళగలిగాము. బస్సలు కార్లు వాహనాలు అన్నీ ఎక్కడవి అక్కడే ఆగిపోయాయి కొండదిగడానికి తిరగట్లేదండీ కార్లు అవి ఏమీ అలవ్ చేయట్లేదని అన్నారు. మా అదృష్టం కొద్దీ ఏదో ఇవ్వాల్టికి ఈశ్వరుడు కొండమీద ఉంచేసినట్టే అనుకున్నాము. ఏదో రెండు మూడు గంటలు పోయిన తరువాత మబ్బులన్నీ మళ్ళీ పైకెళ్ళిపోయాయి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ అప్పుడు కొండ దిగగలిగాము.
కాబట్టి ఇక్కడ ఇలాంటి ఊళ్ళల్లో ఇటువంటివి జరగడం కష్టం బయట అరణ్యప్రాంతాల్లోను కొండల్లోను ప్రకృతి యొక్క వైభవము అలా ఉంటుంది. ఆమేఘాలన్నీ ఇలా కిందకి దిగాయి దిగితే గుహలోంచి చూసి రాముడు అంటున్నాడూ లక్ష్మణా మన కులదైవం సూర్యుడు కదా... మన వంశం సూర్యవంశం కదా సూర్యభగవానుడి దగ్గరకు వెళ్ళి మనమెప్పుడు కూడ కొండమల్లెలుతో కూడుకున్నటువంటి తెల్లటి పుష్పమాల ఎర్ర గన్నేరుమాల తెల్లపూలు ఎర్రపూలు కదా సూర్యభగవానిడికి అర్చన ఈ రెండు పుష్పహరములను అసలు  మన వంశానికంతటికిని కులదైవమైన సూర్యభగవానినుకి మనం ఎప్పుడూ వేయలేదు మనం సూర్యవంశ ప్రభువులం ఎప్పుడూ ఏదో మూర్తికి వేయడమే ఇవ్వాళ మేఘములనేటటువంటి మెట్లుకట్టి ఈ మెట్లేక్కి సూర్యనారాయణ మెడలో కొండమల్లెల దండ గన్నేరు దండా వేయడానికి వీలుగా సూర్యమండలానికి మేఘాలనే మెట్లు నిర్మించి ఈశ్వరుడు తన సేవ చేసుకోమన్నట్లు లేదా..! అని అడిగాడు. ఆ మేఘ పంక్తుల్నీ సూర్యమండలం వరకు ఉన్నవాటిని ఆయన అలా అభివర్ణించారు సంధ్యా రాగ ఉత్థితైః తామ్రైః అన్తేషు అధిక పాణ్డురైః ! స్నిగ్ధైః అభ్ర పట చ్ఛదైః బద్ధ వ్రణమ్ ఇవామ్బరమ్ !! ఆకాశంలో సూర్యబింబం ఉంది, సూర్యాస్తమయం అవుతుంది ఇంకా ఎర్రగా ఉంటుంది కదాండి... సాయంకాలం సంధ్యలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు. వాల్మీకి మహర్షి ఇలా వర్ణిస్తే... తిక్కనగారు ఒకలా వర్ణించారు ఆ అస్తమిస్తున్న సూర్యున్ని పగలు భర్త ఆఫీసుకు వెళ్ళిపోతాడు సాయంకాలం భర్త ఇంటికి వస్తుంటే అత్యంత ప్రీతి కలిగినటువంటి భార్యా ఆయన వచ్చేస్తారు వచ్చేస్తారని పని చేసుకుంటుంటుందీ కిటికిలోంచి చూస్తుంటుంది. అకస్మాత్తుగా ఆయన వస్తారు కిటికీలోంచి కనపడుతారు అనుకుని ఆవిడేదో చేసుకుంటుంటే ఆయన మెట్లెక్కి పైకి వచ్చేశాడు వచ్చేసి తలుపు తీసుకొని లోపలికొచ్చి ఏమోయ్ అన్నాడు అకస్మాత్తుగా భర్తను చూసేసరికి ఆవిడా లజ్జపొంది బుగ్గలు ఎర్రబడితే ఆవిడ ముఖం ఎంత ఎర్రగా ఉంటుందో అలా... సూర్యనారాయణ మూర్తి సాయంకాలం ఇంటికి తిరిగివచ్చేస్తే ఆయన్ని చూసినటువంటి పడమట కాంత బుగ్గలలోంచి ఎరుపు ఆకాశంలో అరుణా అరుణ వర్ణంగా పడిందని తిక్కనగారు వర్ణించారు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
వాల్మీకి మహర్షి అంటారు ఆ మబ్బు సూర్యాస్తమయమౌతున్నటువంటి ఎర్రటి సూర్యుడికి అడ్డంగా వెళ్ళింది ఆ తెల్లమబ్బ వెడితే ఆ తెల్లమబ్బు మధ్యలో ఎర్రగా ఉంది అటూ ఇటూ అన్తేషు అధిక పాణ్డురైః అటు ఇటు తెల్లగా ఉంది ఇది ఎలా ఉందటా ఆకాశం అనేటటువంటి పురుషుడికి ఒక పుండు పుడితే తెల్లటి గాజు గుడ్డకట్టు కడితే ఎర్రటి పుండు కనపడితే తెల్లటి గుడ్డతో కట్టున్నటుగా ఉందట సూర్యబింబానికి అడ్డొచ్చిన మబ్బు. ఆరోజుల్లోనే వ్రణములకు కట్టుకట్టడమన్నది ఉండేదన్నమాట గుడ్డతోటి అబ్బో... ఏమి శ్లోకాలండి నిజంగా ప్రతి శ్లోకం మీరు చదవడం కళ్ళు మూసుకుని కాసేపు దాన్ని ఆనందించడం ఆనందంలో గుహలో రాముడు లక్ష్మణునికి చెప్తుంటే మీరు కూడా ఆయన పక్కన నిల్చుని రాముడు ఒక్కొకటి చెప్తుంటే మీరు కూడా అటుచూసి ఆనందించి రామా! బాగా చెప్పారని ఇప్పుడు చెప్పండి అంటూంటే రాముడు చెప్తున్నట్లు మీరు భావించి ఆనందించడమే అలా ఉంటాయి ఆ శ్లోకాలు, మహర్షి అలా చెప్పాడు మహానుభావుడు కళాభిః ఇవ హైమీభిః విద్యుద్భిః ఇవ తాడితమ్ ! అన్తః స్తనిత నిర్గోషం సవేదనమ్ ఇవ అమ్బరమ్ !! ఆకాశంలో నల్లటి మబ్బులు తళుక్కని మెరుపులు పెద్ద పెద్ద పిడుగులు ఇది ఎలా ఉందటటా ఆకాశమనేటటువంటి పురుషున్ని ఎవరో మెరుపుల కొరడాలు పట్టుకుని కొడుతుంటే అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ అని అరుస్తుంటే ఆ అరుపులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట ఆ పెద్ద పెద్ద పిడుగుల ధ్వనులు కడుపులో ఎంత బాదుందో అన్నట్లుగా ఉన్నాయట మబ్బలు చాటున ఆకాశం పైకి వ్యక్తం కాని కడుపులోని బాధలా మబ్బుచాటు ఆకాశం కొడుతున్న కొరడాల తీగలులాగా అరుస్తున్న అరుపులులా పిడుగులు ఉన్నాయి అని మహర్షి అంటారు.
Image result for నల్లని మేఘాలువర్షాకాలంలో అలా లేదు లక్ష్మణా పిడుగులు పడుతుంటే మెరుపులు మెరుస్తుంటే ఎవ్వరైనా ఇలా అనగలిగినవాళ్ళు ఉన్నారాండి ఏమి దర్శనమండీ నిజంగా ఆ వర్ష ఋతువుని నీల మేఘ ఆశ్రితా విద్యుత్ స్ఫురన్తీ ప్రతిభాతి మే ! స్ఫురన్తీ రావణస్య అంకే వైదేహీవ తపస్వినీ !! ఆ నల్లటి మబ్బు మధ్యలో తళుక్కున మెరుపు మెరిస్తే లక్ష్మణా! నల్లటి మినుములా పోగులాంటి రావణాసురుడు తన తొడమీద మీ వదిన్ని కూర్చోబెట్టుకుని వెడుతుంటే ఏడుస్తూ కదిలిపోతున్న మీ వదినెలాలేదూ తళుక్కుమన్న ఆ మెరుపు నల్లమబ్బుమీదా... అంటాడు. వర్ష ఋతువులో తన భార్యను చూసుకున్నాడు. అక్కడనుంచే కదాండి మేఘ సందేశం వచ్చింది. ఇటువంటి శ్లోకాలలోంచి కాళిదాస మహాకవిలోంచి మేఘ సందేశం పుట్టింది కాబట్టి రస ఆకులం షట్పద సన్నికాశం ప్రభుజ్యతే జమ్బు ఫలం ప్రకామమ్ అనేక వర్ణం పవన అవధూతం భూమౌ పతత ఆమ్ర ఫలం విపక్వమ్ !! నేరేడు చెట్లు ఎక్కడ చూసినా నల్లగా రసం కారిపోతున్నాయా అన్నట్టుగా నల్లటి నేరేటి పళ్ళు గుత్తులు గుత్తులుగా కాసేశాయట వాటి నిండా గండు తుమ్మెదలు నల్ల తుమ్మెదలు తిరుగుతున్నాయట మామిడికాయని అప్పటి వరకు గట్టిగా పట్టుకున్న చెట్టుమీదే బాగా ముగ్గిపోయి పండైపోయి తొక్కకూడా ఇంక వృద్ధుడైపోయినటువంటివాడు చర్మం ఎలా ఉంటుందో మామిడి పండు మీద ఉన్న తొక్క అలా ముడతలు పడిపోయి లోపల ఉన్నటువంటి పండు రసం ఎలా ఎర్రగా ఉన్నది కనపడేటట్టుగా ఉంటుంది మామిడి పండు బాగా మగ్గింది మీరు చూడండి అటువంటి దానిని శివలింగం మీద అభిషేకం చేయడానికి ఇలా అని ఇలా అంటే గుట్టిక్కున ఆ గుజ్జంతా శివలింగం మీద పడిపోతుంది. అలా అభిషేకం మీదకి వెళ్ళిపోతుంది దృష్టి, ఆ మామిడి పండు బాగా మగ్గిపోయి మామిడి చెట్టునుంచి విడివడి కిందపడిపోతే దాన్ని తీసుకుని తినడం ఎంత సంతోషంగా ఉంటుందో అబ్బాహ్.. చెట్టున మగ్గిన పండు అంటారు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
అందునా మామిడిపండు చెట్టున మగ్గిపోతే అసలు ఇంక దాని రుచి భాషతో చెప్పడం కష్టం అంత రుచికరంగా ఉంటుంది. కాబట్టి అలా ముగ్గిపోయిన మామిడిపండు అందులో ప్రత్యేకించి మా జిల్లాలో కొత్తపల్లి కొబ్బరి అలా ముగ్గిపోతే అబ్బో దాని అసాధ్యం కూలా ఎంత రుచో... దాని తొక్క అలా ఉంటుంది కొత్తపల్లి కొబ్బరి తొక్క పల్చనైపోతుంది ఏమిటో మరి ఈశ్వర సృష్టి దానియందు కాబట్టి ఆ నేరేడు పళ్ళు అలా ఉన్నాయి ఆ కిందపడిన మామిడి పళ్ళు అలా ఉన్నాయి ఈ గుత్తుల గుత్తుల నేరేడిపళ్ళ కోసం ఆ మామిడి పళ్ళ కోసం ప్రజలు తిరుగుతుండడం నీకు కనపడ్డంలే వర్షాకాలంలో లక్ష్మణా అంటారు విద్యు త్పతాకాః స బలాక మాలాః శైలేన్ద్ర కూట ఆకృతి సన్నికాశాః గర్జన్తి మేఘాః సముదీర్ణ నాదా మత్త గజేన్ద్రా ఇవ సంయుగ స్థాః ! యుద్ధంలో ఏనుగులు ప్రముఖంగా పాల్గొంటాయి భద్రగజాలు అవి పాల్గొనేటప్పుడు వాటినేమి మామూలుగా యుద్ధానికి పంపించరు గుఱ్ఱాన్నినీ ఇంకోదాన్ని పంపించినట్లు పంపించరు ఏనుగులు పంపించాలంటే దానికొక పెద్ద గురువాయూరు ఏనుగులకు కడుతుంటారే అలా దాని కంభస్థలమంతా పెద్ద అలాంకారం ఉంటుంది దాని మీద ఒక పెద్ద ఆసనము ఆసనం మీద ఓ గొడుగు దానిమీద మళ్ళీ ఓ పతాకం ఉంటుంది.
ఒక గజాన్ని అధిరోహించాడూ అంటే మహావీరుడని గుర్తు కాబట్టి ఆ ఏనుగు మీద కూర్చున్నటువంటివాడు ఎవరో ఆ మహానుభావునికి సంబంధించినటువంటి పతాకం ఎగురుతుంటుంది కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు అంటారు తిక్కనగారు విరాటపర్వతములో అలా ఒక్కొక్క పతాకము చూస్తే ఒక్కొక్క మహావీరుడు స్పురిస్తాడు. రామ చంద్ర మూర్తి అంటున్నారూ మేఘాన్ని చూపించి లక్ష్మణా విద్యు త్పతాకాః చూశావా ఆ మేఘం మెరుపుతీగతో ఉంది మెరుపుతీగతో ఉన్నటువంటి మేఘం పథాకం పెట్టుకున్న ఏనుగులా మెరుపుతీగ పతాకంలా ఆ నల్లటి మబ్బుమీద కొంగలు ఎగరడంలో ఒక చిత్రముంటుంది మిగిలిన పక్షులు ఏదో గుంపుకిందో లేదా అలా ఇలా ఎగురుతాయి కొంగ అలా ఎగరదు ఎందుకో కానీ కొంగలు బారులు బారులు అని బారులుకుంద ఎగురుతాయి అవి అది అనుభవించినవాడికి ఆంమ్రేడితమౌతుంది. అవి మామూలుగా వెళ్ళవు బారులు బాలుగా వెళ్తాయవి కాబట్టి అవి వెళ్ళేటప్పుడు కూడా చాలా చమత్కారంగా వెళ్తాయవి, మీరు ఎప్పుడైనా మీరు చూసింటారు నేనే వెర్రివాణ్ణి మీరు చూడలేదనుకొని అలా చెప్తుంటాను కానీ మీరు కొంగలు బారుగా వెడుతున్నప్పుడు దాని అందం చూడాలి ఒకసారి ఇలా నిటారుగా వెడుతాయి ఒక సారి అర్ధచంద్రాకారమైపోతాయి ఒకసారి ఒక మణితో కూడిన హారంలా ఇలా అవుతాయి.
అన్ని ఒక్కలా కదిలేటటువంటి ప్రేడ్ చేస్తున్నటువంటి సైనికులు కదిలినట్లు ఒకహారం వెడుతున్నట్లు వెడుతుంటాయి. లక్ష్మణా నల్లమబ్బు మీద ఇవన్నీ అలా వెళ్తూంటే శైలేన్ద్ర కూట ఆకృతి సన్నికాశాః బలాక మాలాః ఇవీ ఈ కొంగల బారులు ఏనుగు మెడలో వేసినటువంటి పూలదండల్లా నల్లమబ్బు ఏనుగులా మెరుపు తీగ దాని మీదపెట్టినటువంటి పతాకంలా ఆ మేఘంలోంచి వచ్చేటటువంటి ఉరుము యుద్ధానికి వెడుతున్నటువంటి ఏనుగు చేసిన ఘీంకారంలా యుద్ధభూమిలో ఏనుగులా కనపడ్డంలేదా నీకూ... ఆ మబ్బూ... ఒక క్షత్రియుడికి ఎలా కనపడాలో అలా కనపడింది ఆయనకు. లక్ష్మణుడు హా... అవుననన్నయా! అవునూ అన్నాడు అని ఎంతో సంతోషంగా ఆ మబ్బుల వంక చూస్తున్నాడు. అబ్బో ఏమి వర్ణణ చేశాడంటీ మహానుభావుడు బాలేంద్ర గోప్తాంఽతర చిత్రితేన విభాతి భూమిః నవ శాద్వలేన గాత్రాఽనపృక్తేన శుక ప్రభేణ నారీవ లాక్షోక్షిత కంబళేన వర్షాలు పడ్డంవల్ల ఆకుపచ్చని గడ్డిపెరిగింది బాగ ఎక్కడ పెరుగుతుంది గడ్డి భూ కాంత భూమి మీద పెరుగుతుంది. ఈ బాగ పెరిగినటువంటి పచ్చగడ్డిమీద ఆర్ద్రపురుగులని ఎర్రగా ఉంటాయి, ఎర్రగా ఉన్న ఆర్ద్రపురుగులు అక్కడ డక్కడక్కడా పాకుతున్నాయి వర్షాలు పడేటప్పటికి ఈ పురుగులు పుట్టేస్తాయి పాకుతున్నాయి ఆ గహలోంచి పర్వత శిఖరపు గుహలోంచి కిందకి చూశారు రాముడు చూసి, చూశావా ఎలా ఉందో  చిలక పచ్చ చీరమీద ఎర్ర ఎర్ర చుక్కలు ఉన్నట్లు ఒక ఆడది చలికి కప్పుకు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా భూకాంత పచ్చటి గడ్డిమీదా ఆర్ద్రపురుగులతో కూడినటువంటి ఈ స్థితిలో ఆకుపచ్చ చీర ఎర్ర చుక్కల్ని కప్పుకుని కూర్చున్నట్టులేదూ ఈ భూ కాంత అంటారు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
చూశావా వర్షాకాలంలో భూమి ఎలా ఉందో రెక్కలన్నీ తడిసిపోయి టపటప శబ్దాలు చేస్తూ కడుపునిండా నీళ్ళు తాగి ఆ పక్షుల అందం చూశావా లక్ష్మణా ఎంత అందంగా ఉన్నాయో అనీ ఆయన అంటారు నిద్రా శనైః కేశవమ్ అభ్యుపైతి ద్రుతం నదీ సాగరమ్ అభ్యుపైతి హృష్టా బలాకా ఘనమ్ అభ్యుపైతి కాన్తా సకామా ప్రియమ్ అభ్యుపైతి ! మళ్ళీ అత్యానుప్రాస అదో అందం రామాయణంలో మళ్ళీ కావ్యపరమైన అందాలు నిద్రా శనైః కేశవమ్ అభ్యుపైతి కేశవున్ని నిద్ర సమీపిస్తూంటే ఎలా ఉందో అలా ఉందట, అదేమిటండీ అని మీరు అడగవచ్చు చెప్తాను మీకూ... అది చెప్పకపోతే అసంపూర్ణమౌతుంది ద్రుతం నదీ సాగరమ్ అభ్యుపైతి నదీ సాగరం దగ్గరికి వెళ్ళిపోతుంటే ఎలా ఉందో అలా ఉందట నేను ఎన్ని శ్లోకాలు చెప్తానండి వదిలాను కాని ఒక శ్లోకంలో మహర్షి అంటారూ ప్రియసమాగమానికి భర్త దగ్గరికి సంతోషంగా వెళ్ళేటటువంటి భార్య చక్కటి విశాల హృదయంతో సంస్కారవంతమైన హృదయంతో అనుభవించాలి తప్పా లేకి మనస్తత్వంతో కావ్యాలను వినకూడదు మీరుదాన్ని సుసంపన్నమైన మనస్సుతో వినండి భార్య ఎప్పటికప్పుడు తాను చక్కగా అలంకరించుకుని ప్రియమార భర్త కౌగిలిలోకి చేరినట్లు ఆ నది వర్షాకాలంలో మంచి వేగంతో ఒడ్లనన్నింటినీ కూడా ఒరుసుకుంటూ సాగర సంగమానికి వెళ్ళిపోయేటప్పుడటా తన మీద వాలినటువంటి చక్రవాక పక్షులను తీసుకొచ్చేస్తుంది ఇది ఎలా ఉందటటా... భర్తకు కొత్త కొత్త భహుమానాలు పట్టుకుని భర్త కౌగిలిలోకి చేరిపోతున్నటువంటి కాంతలా ఉందటా సముద్రంలో చేరుతున్న నది.
మహర్షి వర్షాకాలపు నదిని వర్ణిస్తాడు అలాగే నిద్రా శనైః కేశవమ్ అభ్యుపైతి ద్రుతం నదీ సాగరమ్ అభ్యుపైతి నదీ సముద్రం వైపుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే బాగ వేగంగా వెళ్ళిపోతుంది ఆ కాలంలో హృష్టా బలాకా ఘనమ్ అభ్యుపైతి కొంగ మేఘం వైపుకి వెళ్ళిపోతుంది కాన్తా సకామా ప్రియమ్ అభ్యుపైతి కాంతలు వర్షం పడుతుంది కాబట్టి ఆ వాతావరణంలో సంతోషంగా తమ ప్రియుల యొక్క కౌగిలిలోకి చేరిపోతారు నిద్రా శనైః కేశవమ్ అభ్యుపైతి వర్షాకాలపు అందాన్ని వర్ణించారు అందులో నిద్రా శనైః కేశవమ్ అభ్యుపైతి అంటే మనకీ శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం శ్రావణమాసానికి కొద్దిగ ముందర ఆశాడమాసానికి చివర్లో శయన ఏకాదశి అని ఒకటి వస్తుంది ఆ శయన ఏకాదశి శ్రీ మహావిష్ణువు శేషతల్పంమీద పడుకుంటారు అని అంటారు ఆయన నిద్రపోతున్నారండీ అంటారు. మీరు ఒకటి ఆలోచించండీ ఈశ్వరుడు నిద్రపోతే సత్పురుష్నుల్ని కాపాడేవాడెవడండి ఇంకా ఆయనా నిద్రపోతే ఆయనా తమోగుణానికి లొంగిపోయినట్లేగదాండి మరి ఇక శయన ఏకాదాశి విష్ణువు పడుకోవడం విష్ణువు లేవడం అన్నది ఉంటే లోకంలో ఆయన కూడా మనలాగే అలసటకీ వికారానికి లొంగిపోయినవాడే అప్పుడు ఈశ్వరుడెలా అవుతాడు మరి శయన ఏకాదాశి ఉద్ధాన ఏకాదశి ఎలా అయ్యాయి అంటే శయన ఏకాదశి అన్నది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఆయన నిద్ర మనలాంటి నిద్రకాదు తామసిక నిద్రకాదు ఆ నిద్రేమిటో తెలుసాండీ నిద్రాముద్రాం నిఖిలజగనీ రక్షణే జాగరూకామ్ దక్షిణాయణం ప్రారంభమౌతుంది ఆశాడమాసంలో, ఆశాడమాసంలో దక్షిణాయనం ప్రారంభమైతే దక్షిణాయనం అంతా ఉపాసన కావాలి.
ఉపాసనా పైన శరీరంతోటీ లోపల మనస్సుని ద్విగుణీకృతంగాను చెయ్యాలి ఆయన కన్నులు మూసుకుని మీ మనస్సు ఎలా ఉపాసన చేస్తుందో బాగా చూస్తాడట దక్షిణాయనంలో అందుకని నిద్రపోయినట్లుగా నిద్రాముద్రాం నిఖిలజగనీ రక్షణే జాగరూకామ్ ఇంకాబాగా గమనించడానికి కళ్ళు మూసుకొని పడుకోవడం పైకి చూడ్డం కాదు మీ లోమనుసుని చూడ్డానికి పడుకోవడం శయన ఏకాదశి తప్ప ఆయన నిద్రపోయాడనుకోకూడదు శయన ఏకాదశిరోజు ఆయన ఇంకాబాగా చూస్తాడు కాబట్టి ఇంకాబాగా ఉపాసన చెయ్యాలని మీరు అనుకోవాలి. కాబట్టి నిద్రా శనైః కేశవమ్ అభ్యుపైతి రాముడు అంటాడు లక్ష్మణునితో జాతా వనాన్తాః శిఖి సుప్రనృత్తా జాతాః కదమ్భాః సకదమ్బ శాఖాః జాతా వృషా గోషు సమాన కామా జాతా మహీ సస్య వనాభి రామా లక్ష్మణా చూశావా..? ఈ వర్షాలు పడుతుంటే నెమళ్ళు ఎక్కడ చూసినా పింఛాలు విప్పి నృత్యాలు చేస్తున్నాయి కదమ్బ వృక్షాలు వర్షాలు పడితే సంతోషించి గుత్తులు గుత్తులు పువ్వులు పూస్తాయి ఆ పువ్వులన్ని వాలిపోయాయి నేల రాలిపోయాయి ఆవులకి ఎద్దులకి కూడా వర్షాలు పడితే సమాన కామం కలుగుతుంది. అలా సమాన కామం పురుషుడికి స్త్రీకి ఉన్నప్పుడే ఉత్తమ సంతానం అంటే గో జాతి యొక్క అభివృద్ధి అలాగే భూమి ఎక్కడ చూసినా పైరు పంటలతో అందంగా విలసిల్లి ఉంది వహన్తి వర్షన్తి నదన్తి భాన్తి ధ్యాయన్తి నృత్యన్తి సమాశ్వసన్తి నద్యో ఘనా మత్త గజా వనాన్తాః ప్రియా విహీనాః సిఖినః ప్లవంగాః ! ఏమి అను ప్రాసలు చూపించారో శ్లోకంలో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి మేఘాలు అలా వర్షిస్తున్నాయి మదపుటేనుగులు ఘీంకరిస్తున్నాయి వనములు ఎక్కడ చూసినా కళకళలాడుతున్నాయి యడబాటుకులోనైన యువతీ యువకుల యొక్క మనస్సులలో మాత్రం ఖేదంగా ఉంది.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
ఎందుకంటే ఆషాడమాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదంటారుగా... కాబట్టి ఎడబాటు ఉంటుంది యువతీ యువకులకు అందుకనీ ఆ ఎడబాటుకు వాళ్ళు చింతిస్తున్నారు. ఆషాడమాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదూ అంటే ఎటువంటి అత్తగారింటికి వెళ్ళకూడదో తెలుసాండీ అది వ్యవసాయ ప్రధానమైన కుటుంబమైతే అటువంటి అత్తగారింటికి పిల్లను పంపించకూడదు ఎందుకో తెలుసా..? ఆ పిల్లాడు కూడా వ్యవసాయం చేస్తుంటేనే ఆషాడమాసంలో వర్షం పడుతుంది ఎప్పుడు ప్రారంభమౌతుందో తెలియదు ఎప్పుడు పడుతుందో తెలియదు ఆషాడమాసం చివర్లో వానపడేటప్పటికీ గబగబా రైతు నాగలి పట్టుకుని పరుగెత్తుకుంటూ వెళ్ళి భూమి దున్నుడం మొదలెట్టాలి మొదలెట్టి విత్తులు వేసుకోవాలి వానపడినప్పుడే విత్తువెయ్యాలి వేస్తేనే పంట బాగావస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులనుకోండి బయట వర్షం మొదలైతే వీళ్ళు మరింత సంతోషంగా లోపలే ఉండిపోయారనుకోండి ఇంటియజమాని ఏం చేస్తాడు వాడంటే లేవలేదుగదాని నాకు తప్పదు కదాని నాగలి పట్టుకుని భుజానవేసుకుని ఆయన వెడుతాడు పొలానికి ఆయనేమో పెద్దవారైపోతున్నారూ ఆయనేమో భుజాన నాగలేసుకొని వెళ్ళిపోయారు వీడేమో పడుకున్నాడు అమ్మాయికైనా బుద్ధుండక్కరలేదా మీరు వెళ్ళండి వర్షం వస్తుందని పంపించక్కరలేదా చక్కగా పడుకుందని అత్తగారు కొప్పడుతుంది. అత్తగారికి కోడలుకి బేదాభిప్రాయాలు వస్తాయని ఆషాడమాసంలో వాళ్ళిద్దరు కలకాలం కలిసుండవలసినవారు కాబట్టి పుట్టింట్లో పెట్టుకుంటారు ఆడపిల్లని.
తప్పా అల్లుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేస్తుంటే పంపించడానికి ఏం దోషంలేదు తెలిసిందాండీ కాబట్టీ వహన్తి వర్షన్తి నదన్తి భాన్తి ధ్యాయన్తి నృత్యన్తి సమాశ్వసన్తి నద్యో ఘనా మత్త గజా వనాన్తాః ప్రియా విహీనాః సిఖినః ప్లవంగాః ! అనీ అంగార చూర్ణోత్కర సన్నికాశైః ఫలైః సుపర్యాప్త రసైః సమృద్ధైః జమ్బూ ద్రుమాణాం ప్రవిభాన్తి శాఖా నిలీయమానా ఇవ షట్పద ఓఘైః ! బొగ్గులు తీసుకొచ్చి గుండకొట్టేసి ఆ బొగ్గుల గుండలో కసిన్ని నీళ్ళుపోసి ఆ బొగ్గుల గుండల చిన్న చిన్న ముద్దలు చేసి ఎవరో ప్రయత్న పూర్వకంగా పట్టుకెళ్ళీ ఓ చెట్టెక్కి ఆ చెట్టుకొమ్మల చివర్లో ఆ బొగ్గుల గుండల ముద్దలన్నీ అలా గుత్తుల గుత్తుల కింద పేర్చి అవి కిందపడిపోకుండా అలా ఎండిపోయేదాకా ఉండి కిందకి దిగి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట నేరేడిపళ్ళతో ఉన్నచెట్లు వానాకాలంలో. అయ్యబాబోయ్... ఆ నేరేడిపళ్ళు నిజంగా బొగ్గుముద్దల్లాగానే ఉంటాయి కదాండీ... బొగ్గుగుండ ముద్దల్ని తీసుకెళ్ళి అంగార చూర్ణైః అంటారు మహర్షి అలా ఉన్నాయట నేరేడి చెట్లన్నీ బాగా పండి, ఆ నేరేడి పళ్ళ రసాలకోసం నేరేడు పండు మంచి సువాసన కాదాండి అందుకే నేరేడు చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి జమ్బూ ద్వీపమని పేరు. కాబట్టి నల్ల తుమ్మెదలన్నీ నల్లగా ఉన్నటువంటి నేరేడు పళ్ళమీద తిరుగుతున్నాయట గుంపులు గుంపుగాను అది చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూడు లక్ష్మణా... అంటారు మహర్షి. మనకీ రామాయణం చదివితే వర్షాకాలం వస్తే ఓసారి తొందరగా ఎక్కడికైనా ఏదైనా అడవికో కొండమీదకో వెళ్ళి మనం కూడా అలా నిలబడి చూస్తే బాగుంటుందనిపిస్తుంది. నేను మీకొక యదార్థం చెప్తున్నానండీ రామాయణాన్ని మీరు బాగా చదివితే మీకు పరిశీలనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది తెలుసాండీ మీరు అన్నిటిని పట్టిపట్టి చూడ్డం మీకు అలవాటౌతుంది అందులో ఉన్నటువంటి అందాన్ని ఆ సంతోషాన్ని మీరు జుర్రుకుంటారు, కానీ అది వికారంగాను అసహ్యంగాను ఉండకూడదు చక్కటి సుసంపన్నమైన హృదయంతో ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని అందంగా అభినందించి పరాశక్తి కృపగా మీరు చూడ్డం మీకు అలవాటౌతుంది అంతేకాని రావణ దృష్టితో కాదు పరాశక్తి కృపగా పరాశక్తి ప్రసాదంగా లోకాన్ని చూడ్డం మీకు అలవాటౌతుంది.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి మార్గానుగః శైల వనానుసారీ సంప్రస్థితో మేఘ రవం నిశమ్య యుద్ధాభికామః ప్రతినాద శంకీ మత్తో గజేన్ద్రః ప్రతిసన్నివృత్తః ఏమి ఊహ చేశారో ఆయనా... యుద్ధానికి వెళ్ళడం కోసమనీ ఒక రాజుగారు ఒక ఏనుక్కి అంబారీ వేసి ముఖానికి ఓ పెద్ద అభరణాలు పెట్టి అన్ని పెట్టి సిద్ధంగా పెట్టాడట ఇప్పుడు అవన్నీ చేసేటప్పటికి ఆ ఏనుక్కీ ఎప్పుడెప్పుడు యుద్ధానికి వెడుదామాని సంతోషంగా ఉంది వర్షమొస్తే యుద్ధానికి వెళ్ళరు పెద్ద వర్షం వచ్చింది వర్షం వచ్చి దూరంగా ఎక్కడో గర్జన వినపడింది మేఘ గర్జన ఈ ఏనుగటా అంబారీ ఊగిపోయేటట్టుగా పరుగెత్తుకుంటూ తాను ఘీంకరిస్తూ వెళ్ళిందట అంటే ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి యోధులకు సంబంధించిన ఏనుగు ఒకటి యుద్ధానికి వచ్చేస్తుందీ నేను వెళ్ళకుంటే ఎలాగ అని అది కూడా వెళ్ళిపోయిందట వెళ్ళిపోతే అది మేఘం గర్జించింది ఏనుగు కాదు కాబట్టి ఇది చాలా దూరం వెళ్ళి చూసిందట ఏనుగు కనపడలేదట ఓహో నా చిత్త భ్రాంతి నేను యుద్దం కోసం తయారై ఉన్నాను కదా నా శత్రు సైన్యంలో ఏనుగు గర్జించినట్లు అనిపించింది అనిపించి ఇంత గబగబా వెళ్ళిన ఏనుగు మెల్లగా తొండం ఊపుకుంటూ తిరిగి వస్తూందట. మేఘ గర్జన విన్న యుద్ధపుటేనుగు అలా వెళ్ళి తిరిగివచ్చేస్తుంది లక్ష్మణా! చూశావా దాని పౌరుషం అని అంటారు రామ చంద్ర మూర్తి.
క్వచిత్ ప్రగీతా ఇవ షట్పద ఓఘైః క్వచిత్ ప్రవృత్తా ఇవ నీలకంఠైః క్వచిత్ ప్రమత్తా ఇవ వారణేంద్రైః విభాంతి అనేక ఆశ్రయిణో వనాంతాః ! చూశావా ఇక్కడా తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తూ సంగీత కచేరి చేస్తున్నాయి, మీరు కొన్ని కొన్ని క్షేత్రాలకు వెల్తే ఆశ్చర్యంగా ఉంటుంది మీరు ఇలా వెళ్ళారనుకోండి ఏదో సంగీతం జరుగుతూంటుంది మీరు అక్కడ్నుంచి వచ్చేసి ఇలా వెళ్ళారనుకోండి ఏదో నాట్యం జరుగుతుంటుంది గురువాయుర్లో దేవాలయం బయట ఎప్పుడూ ఏదో నాటకమో నాట్యమో నృత్యమో గానమో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూంటారు. వేంకటాచలంలో ఆస్థాన మండపంలో ఏదో ఒకటి జరుగుతుంటాయి ఎప్పుడూ అలా కాకుండా కొన్ని కొన్ని తీర్థాలు జరుగుతుంటాయి అంటూంటారు అమ్మవారి సంబరాలు అవుతుంటాయి అంటూంటారు అలాంటి చోటకి వెళ్తే ఇక్కడ ఒక కళా పరిశత్ లోనేమో నృత్యం జరుగుతుంటుంది ఇంకొక చోట సంగీతం జరుగుతుంటుంది ఇంకొక చోటేమో పురాణం జరుగుతుంటుంది అలాగటా వానాకాలంలో అరణ్యమంతా కూడా కచేరీలు జరుగుతున్నాయటా ఏం కచేరీలు అంటే ప్రత్యేకంగా క్వచిత్ ప్రగీతా ఇవ షట్పద ఓఘైః ఈ భ్రమరాలన్నీ తుమ్మెదలన్నీ ఘింకారం చేస్తూ తిరుగుతున్నాయట అదే పాట కచేరియట హ్... అబ్బా! చాలా సేపు పాటలువిన్నాం ఇప్పుడు డాన్సు ప్రోగ్రాం ఇలా చూద్దామని వస్తే... ఇంకొక చోటకి వేల్తే క్వచిత్ ప్రవృత్తా ఇవ నీలకంఠైః అక్కడ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట కాసేపు మీరు ఆ డాన్సు చూడచ్చు. అయిపోయిన తరువాత అబ్బా ఇది కాదు కాసేపు ఏదైనా య్యూజియం లాంటివి చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు చాలాసేపు చూడాలనిపించే వాటిని చూడాలనిపించిందనుకోండి క్వచిత్ ప్రమత్తా ఇవ వారణేంద్రైః మధించిన ఏనుగులు ఆ వర్షంలో తడిచి నిలబడి ఉన్నాయట గుంపులు గుంపులుగా వాటిని చూడవచ్చటా ఇలా అరణ్యమంతా రకరకాల కచేరీలు వినోదాలు జరుగుతున్నట్లు ప్రకాశించడం లేదూ ఈ పర్వత శిఖరం నుంచి చూస్తుంటే లక్ష్మణా! అంటారు ఇలా ఆ వర్ష ఋతువుని గురించి వర్ణించి వర్ణించి సూర్యాస్తమయం అయింది సధ్యావందనం చెయ్యాలిగా సూర్యాస్తమయం అయ్యిందని ఎలా తెలుస్తుంది. చీకటిగా ఉంటుంది ఎందుకనీ బయట నల్లని మబ్బు కమ్మేసింది ఇంట్లో వెలుతురుండదు అందుకే లైటేయవే బయట మబ్బూ ఏం కనపడదూ అంటాడు ఆయన అలా... కటిక చీకటిగా ఉంది మబ్బుల వలన సూర్యాస్తమయం అయిందని ఎలా తెలిసింది.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
అంటే రామ చంద్ర మూర్తి అంటారు నిలీయమానైః విహగైః నిమీలద్భి శ్చ పంకజైః ! వికసంత్యా చ మాలత్యా గతో అస్తం జ్ఞాయతే రవిః !! అక్కడా పక్షులన్నీ కూడా గూటికి వెళ్ళిపోతున్నాయి అలాగే ఆ పద్మములన్నీ కూడా ముడుచుకుపోతున్నాయి అలాగే సన్నజాజి పూలన్నీ కూడా సాయంకాలం వేళ విచ్చుకుంటున్నాయి దీన్ని బట్టి సూర్యాస్తమయం అయ్యిందీ అని తెలుస్తూందీ లక్ష్మణా! లేకపోతే అసలు తెలియదు అని ఆయన అంటారు చూశావా వర్షాకాల వైభవము ఏంత అందంగా ఉందో మనమైతే ఎప్పుడు ఒకటే అనుభవిస్తాం ఏమిటి అనుభవిస్తామంటే వానొచ్చేస్తుంది ఆఫీసుకెలా వెళ్ళాలి రైన్ కోటు ఎక్కడుంది అది ఎక్కడో మడతపెట్టి పెట్టేశాను ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తే వాటర్ సర్వీసింగ్ కు మళ్ళీ ఇవ్వాలేమో... బురదా రోడ్లు చూస్తే గోతులుంటాయి టైంకి వెళ్ళాలి ఎలా ఫైలు ఉండిపోయింది అసలు మనం ఆ ఋతువుని అనుభవించడం ఆ ఋతువు ప్రకృతి వర్ణనలను అనుభవించడం ఆ అందాలు అనుభవించడం అన్ని మానేసి కృతకజీవితమే కనీసం కావ్యపఠనంలో పరకాయ ప్రవేశం చేసి అనుభవించినా అదొక గొప్ప ఆనందం. కొన్నిటిని పరిశీలించడం గొప్ప విద్యండీ రవీంద్రనాథ ఠాగూరు గారి తండ్రి దేవేంద్రనాథ టాగూర్ గారు రవీంద్రనాథ టాగూర్ ప్రకృతిని పరిశీలనం చేసి చిన్న చిన్న కవితలు రాస్తుంటే నీవు ఇలాగే పరిశీలనం చేసి చక్కటి కవిత అల్లూ నీవు ఇంతకన్నా వేరే ఏమీ చేయక్కరలేదని విడిచిపెట్టారు కాబట్టి స్వేచ్చనిచ్చారు కాబట్టీ ఆయన విశ్వకవియై మహానుభావుడు దేశానికి సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ తీసుకొచ్చాడు.
ప్రకృతి పరిశీలనమన్నది అంతగొప్పది ఆ ప్రకృతి పరిశీలనంలోంచే వ్యక్తులు ఋషి అవుతాడు ఋషి అంటే ఎవరో తెలుసాండి ప్రకృతిని పరిశీలించి పరాశక్తి యొక్క అనుగ్రహంగా చూసేటటువంటి అనుగ్రహం ఎవరికొస్తుందో వాడే ఋషి. నేను మీతో ఒక మాట చెప్తాను చూడండీ బకించంద్ర చటర్జీ అని ఉన్నారు ఆయన మనం పాడేది నిజానికి ఒక్కటే అందులో “వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం” అంటారు. నీటి గలగలలతో ఎక్కడ చూసినా చెట్లతో పళ్ళతో నిండివున్నటువంటి ఈ భరత భూమి, భూమి కాదు మాకు అన్నం పెట్టీ నీళ్ళు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్న మా అమ్మ కాబట్టి వందే మాతరం కాబట్టి ఓ భరత మాతా! నీకు నమస్కారము. ఆయన ఋషి ఆయనకి భరత భూమి కనపడలేదు భరత భూమిలో భరత మాత కనపడింది అలా తల్లి తనాన్ని పరాశక్తిని చూడగలిగినటువంటి హృదయం నీకుంటే ప్రకృతిలో నీ చూపు తప్పు కాదు అప్పుడు అది ఋషి యొక్క చూపు అలా చూడకుండా ఎక్కడైనా ఏదైనా సబబుగా కనపడితే తాను అనుభవించాలని కోరుకున్నాడని అనుకోండి అది రావణ దృష్టి దాన్ని మనసు నియంత్రించుకోవాలి అది తప్పు నీవు అలా ఉండకూడదు అందాన్ని అందంగా సౌందర్యాన్ని సౌందర్యంగా అభినందించాలి అది పరాశక్తి విభూతి ఎక్కడెక్కడ ఏది అందమైందున్నా... ఏది ప్రకాశవంతమైంది ఉన్నా మమ తేజోత్స సంభవం అంటాడు గీతాచార్యుడు ఇది నా తేజస్సు అంటాడు ఓ ఈశ్వరా నీ తేజస్సు అది అభినందించి ఆనందించగలగాలి కాబట్టి రామ చంద్ర మూర్తి అంటారు ఉపకారేణ వీరో హి ప్రతికారేణ యుజ్యతే ! అ కృతజ్ఞో అ ప్రతకృతో హన్తి సత్త్వవతాం వనః !! సుగ్రీవుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు నిజమే పాపం ఎంత కష్టపడ్డాడో సుఖంగా సంతోషంగా గడపనీ ఇతరుల కష్టాన్ని తాను అర్థం చేసుకుంటాడు రాముడు వర్షాకాలం అయిపోయిన తరువాత కూడా ఇలాగే భోగాల్లో మునిగిపోతే కృతజ్ఞతా అన్నది మరిచిపోయినవాడు అవుతాడు కృతజ్ఞుడు అవుతాడు ఉపకారాన్ని మరిచిపోయినవాడు ప్రత్యుపకారానికి అవుతాడు అప్పుడు పెద్దలచేత శ్లాగించబడడు పెద్దల యొక్క నిందకు గురౌతాడు అది ఇంక తరువాత ప్రారంభమౌతుంది.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి మనం ఇప్పుడు సుగ్రీవున్ని విశ్రాంతి తీసుకోనిద్దాం తొందరగా ఈ వర్షాకాలం వెళ్ళిపోతే శరత్ కాలం ప్రారంభమైన తరువాత మనం వెడుదాం అంటే ఓర్పు వహించడమన్నది రాముడికి తెలుసు ఇది తార చెప్పింది ఊరికే తొందరపడిపోవడం వర్షాకాలం అయితేనేం ఇంకోటేంటి ఎదో లెచిందే లేడికి ప్రయాణం అన్నటు మనం రావణాసురుని మీద యుద్ధం చేయడం అలా అనడు ఇప్పుడు బయలుదేరితే ఎంత మందికి ఇబ్బంది కాబట్టి తన ఇబ్బందిని ఓర్చుకుంటాడు ఈ ఓర్చుకునే గుణం రాముడిలోంచి తీసుకోవలసి ఉంటుంది జ్యాతి ప్రత్యేకించి యువకులు దీన్ని తీసుకోవాలి యువతీ యువకులు రామ చంద్ర మూర్తి ఇతరుల గురించి ఆలోచించే ధోరణి ఇతరులు సుఖపడాలని కోరుకునే విధానం తను కష్టంలో ఉన్నా ఇతరులు సుఖంగా ఉండాలని కోరుకునే హృదయం ఓర్పుతో తాను వేచి ఉండగలిగేటటువంటి లక్షణం ఇది నేర్చుకుంటే మీకూ జాతి సుసంపన్నమౌతుంది. ఆ సుసంపన్నం కావాలీ అంటే ఆబాల గోపాలమూ రామాయణం చదువుకోవాలి రామాయణాన్ని వినాలి.
కాబట్టి ఇప్పుడు నేను ఒక శుభవార్త చెప్పవలసి ఉంటుంది ఏమిటా శుభవార్తా అంటే ఒక శుభవార్తేమిటీ రెండు శుభవార్తలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి 16 సంవత్సరములుదాటి 15-16 సంవత్సరములుదాటి 20 యేళ్ళు లోపు ఉన్నవాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించాలీ అనీ హరిప్రసాద్ గారి యొక్క ఆజ్ఞమేరకు నిర్ణయించాము. ఎందుచేతా అంటే ఈ భవిష్యత్తు వాళ్ళదే ఇంక వాళ్ళకీ ఇవ్వాళ అయోమయ స్థితి ఎలా ఉందంటే పాపం చాలా మంది పిల్లలు ఎదో ప్రశ్నవేస్తుంటారు నాదగ్గర కొచ్చి వాళ్ళకు పూజంటే ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకసలు ఈశ్వరున్ని ఆరాధించి ఈశ్వరానుగ్రహము పొందడము అంటే ఎలా పొందాలో వాళ్ళకు తెలియదు సరిగ్గా చెప్పేటటువంటి పెద్దవాళ్ళూ ఇళ్ళల్లో ఉండటంలేదు ఎందుకంటే వాళ్ళేటీవీలు చూడ్డానికి సరిపోయేటైము ఇంక పిల్లలకి ఏం చెప్తారు కాబట్టి ఇప్పుడు పిల్లలకీ నేర్పవలసినటువంటి అవసరం ఒకటి ఉంది అదీ నా ఉద్దేశ్యంలో పూజ చేసుకోవడమూ అంటే ఇంక ఉద్యోగం మానేసి చదువుమానేసి పూజ చేసుకోవడం కాదు ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వాళ్ళపని ఏదీ వాళ్ళు మానకుండా వాళ్ళు ఎలా దృష్టికోణాన్ని మార్చుకుని ఎలా ఈశ్వరానుగ్రహాన్ని పొందవచ్చు అసలు పూజా అంటే ఎలా చెయ్యాలో ఎంత సేపు పూజ చెయ్యాలన్ని నిర్ధారణ ఉందా... ఈశ్వరుడు సంతోషించేటట్లు ఈశ్వరుడు సంతోషించడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఒకరోజు కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా చెయ్యవలసి ఉంటుంది.
నిద్రలేచింది మొదలు నిద్రపోయేవరకూ వాళ్ళ పనికి వాళ్ళు ఏమీ మార్చుకోక్కరలేదు స్కూలుకెళ్ళడం మానక్కరలే ఆఫీసుకెల్ళడం మానక్కరలే ఉద్యోగాలు మానక్కరలే చదవులు మానక్కరలే సంసారాలు మానక్కరలే ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉంటూ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చు అది కేవలం ఉపన్యాసంగా కాకుండా ఒక బ్ల్యాక్ బోర్డు ఒక చాక్ పీసు కూడా తీసుకుని వాళ్ళకు బాగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి చెప్పి ఇప్పుడూ పంట వేయగానే పంట రాదుకదాండి విత్తనాలు వేస్తే తరువాత పంట వస్తుంది వాళ్ళు అది నేర్చుకుని అనుష్టానం మొదలు పెడితే వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కాబట్టి 16 యేళ్ళ నుంచి 20 యేళ్ళు లోపువారికి 20 యేళ్ళు దాటితే ఆ క్లాసులోకి తీసువట్లేదు అనుకోవట్లేదు అది పిల్లల భవిష్యత్తు కొరకు పిల్లలకొరకే నిర్దేశింపబడినది అంతే... కాబట్టి 16 నుంచి 20 యేళ్ళు ఉన్నటువంటి పిల్లలకీ యం సెట్ మే 14వ తేదీన ఉందట అందుకని మే 14 వెళ్ళిపోయిన తరువాత డేట్ అనౌన్సు చేస్తాం అది ఆడ పిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు దోషంలేదు కాని ఏజ్ లిమిట్ మాత్రం ఇన్ బిట్వీన్ 16 అండ్ 20. అది ఒక్క ఆడిటోరియం కెపాసిటి ప్రీగా కూర్చునేటట్టు ఇరుక్కుని కూర్చునేటట్టు మాత్రం టోకెన్ ఇవ్వరు దానికి కాదు అది టోకెన్ తోటే అడ్మిషన్ ముందు ఎవరు టోకెన్ తీసుకుంటారో లిమిటెడ్ గానే ఇస్తారు టోకెన్ అది రికార్డింగ్ కాని షూటింగ్ ఏదీ అలవ్ చేయరు అది పిల్లలకి అర్థమయ్యేటట్టు వాళ్ళ జీవితాలు సుసంపన్నమయ్యేటట్టు నేను వాళ్ళకి ఒక ఉపకారం చెయ్యగలిగితే ఈశ్వరుడు నాకు శ్వాస నిచ్చినందు నా జన్మధన్యత.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి నేను ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి ఇంక ఏమీ దానికి రికార్డింగ్ కాని తరువాత వినే ప్రయత్నం కానీ షూటింగ్ కానీ ఇవేమీ అలవ్ చేయను అది కేవలం నేను ఆ పిల్లలు అంతే అది ఆ క్లాసు ఒకటి కండెక్ట్ చేస్తాము దానికి మీరొకటి గుర్తుపెట్టుకోండి ఏదోలా టొకెన్ తీసేసుకుందాం వెడితే వెడతారు లేకపోతే లేదు అని ఇంకొక పిల్లవాడి జీవితానికి సంబంధించినవిషయం ఈశ్వరానుగ్రహం పరిపుష్టమైతే వాడి జీవితం సుసంపన్నమౌతుంది వాడు జీవితాన్ని ససంపన్నంగా మలుచుకుంటాడు కాబట్టి మనం ఏదో టోకెన్ తీసుకుని నిరుపయోగం చెయ్యెద్దు.
వస్తారనుకుంటేనే తీసుకోండి దానికి మంగళవారం నాడు ఏకాదశి మనకి తెలియకుండా రెండో శుభవార్తని అందులోకి కలుపుతున్నాను చిత్రమేమిటంటే హరిప్రసాదుగారు కూడా మరిచిపోయారు ఇక్కడ ఉన్నటువంటి రామ చంద్ర మూర్తి దేవాలయాన్ని స్థాపించి 35 సంవత్సరములు పూర్తైపోతుంది ఆ రోజుతోటి విచిత్రమేమిటంటే సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతుండగా మంగళవారం ఏకాదశి తిథితో ఆ రామాయలయం స్థాపించిన రోజు కలుస్తోంది ఈ మంగళ వారమే ఇవ్వాళ ఆదివారం సోమవారంలేదు మంగళవారమే అంత మహత్తరమైన మంగళవారం కనుకా ఆ రోజున రామ చంద్ర మూర్తి యొక్క అనుగ్రహం మనందరం పరిపూర్ణంగా పొందడం కోసం దీనికి ప్రత్యేకంగా క్లాసు అని ఏమీ పెట్టుకోకండి రామ నామాన్ని మించింది లేదు పెద్దలు పిల్లలూ అందరూ కూడా దానికి ఇక్కడికి వచ్చి రాయాలని అనుకోవద్దు ఆ ఒక్క రోజు కోసమే సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారు కాబట్టి మీ అందరు శ్రద్ధతో ఏకాదశి ధన్యం చేసుకోవడానికి అందరూ కూడా ఒక నూట పదకొండు నామాలో 300 నామాలో అంతకన్నా వద్దు అవి రాయండి చాలు అది అందరం తలో కాగితం తీసుకుందాం నేను కూడా తీసుకుంటాను తీసుకుని ఆ మంగళవారం నాడు మాత్రం ఏకాదశి తిథి ఉండగా రాసి రామ చంద్ర మూర్తి ఆలయం 35 యేళ్ళు అయిన సందర్భంగా మనందరం రామ చంద్ర మూర్తికి ఇచ్చుకునేటటువంటి గొప్ప కైంకర్యం ఆ రామ నామాలు రాసినటువంటి కాగితాల్ని అక్కడ ఉన్నటువంటి పాత్రలోకి సమర్పిద్దాం అది లేకపోతే ఇక్కడే పెట్టచ్చు ఆరోజు ఏకాదశి అందరూతెచ్చి ఆ రామనామాల్ని సమర్పిస్తారు. కాబట్టి ఆరోజు అంత గొప్పరోజు కాబట్టి ఎలాగో విశేష ప్రసాదాన్ని హరిప్రసాద్ గారు మనం అడకపోయినా చేయిస్తారు.
పూజంటరా పూజ చేయిస్తారు పూజెక్కడ చేయిస్తారు కాదు మనమేదో చెయ్యాలి కదా..? వాచిక కాయిక మానసిక కౌంకర్యములు నడుస్తాయి చెయ్యి కదులుతుంది శ్రీ రామ శరీరకైంకర్యం శ్రీ రామ ఆ నోటితో అంటాం కాబట్టి వాచిక కైంకర్యం శ్రీ రామ అన్నప్పుడు శ్రీ కారం చుట్టడంలో మనసు నిలబెట్టారు కాబట్టి మానసిక కైంకర్యం మూడూ నిలబెట్టారు కాబట్టి ఏకాదశినాడు రామానుగ్రహం కలగడానికి పనికొస్తుంది. అందుకని రామ నామం రాయమన్నాను తప్పా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అదేపనిగా ఏదో చెప్తూండడం నా ఉద్దేశ్యం కాదు అందుకే తక్కువే తీసుకోండి అని చెప్పాను చక్కగా రేపు ఉపన్యాసం అయిపోయిన తరువాత అందరికి ఆ కాగితాలు అందేటట్టుగా మీరు ఏర్పాటు చేయండి మనం అందరం ఏకాదశినాడు రాయండి ముందు రాయద్దు ఏకాదశినాడు మీ ఇళ్ళల్లో కూర్చుని రాసి తెచ్చి రామ కైంకర్యంగా ఇక్కడ సమర్పిద్దాం. కాబట్టి ఈ మంగళవారం రామ చంద్ర మూర్తి బహుశహ నేను అనుకుంటున్నాను మొన్నను ఇక్కడ పిల్లలు పెద్దలు అందురు రామ నామం రాయడం చూసి మురిసిపోయి అయిపోతుంది ఇంక సుందరకాండ యుద్ధకాండ అయిపోతే రామాయణం అయిపోతుంది కదా..! అంటే ఆయనకి బెంగా..? ఆయన నిరంతరం చెప్పిచ్చుకోగలడు కానీ మల్ళీ ఒసారి రామ నామం రాసిస్తే చూడలాని ఉందని సీతమ్మ అడిగుంటుంది అందుకే ఇప్పుడు జ్ఞాపకం చేసి నా పుర్రెకి ఈ బుద్ధి పుట్టించాడు ఆయనా కాబట్టి మనందరం ఇప్పుడు రామ నామం రాసి ఇక్కడ సమర్పిద్దాం. మంగళవారం ఏకాదశినాడే ఆరోజు రాత్రి ఉపన్యాసం అయిపోయిన తరువాత ఈఫీసు రూంలో టొకెన్సు ఇస్తారు ఇప్పుడే కదా చెప్పాను ఓర్పు అన్నమాట క్యూలైను పార్మ్ అయ్యేటప్పటికి ఈ ఓర్పు కనపడాలి పెద్దవాళ్ళు తీసుకున్నా ఫర్వాలేదు పిల్లలు తీసుకున్న ఫర్వాలేదు.

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
వాళ్ళు నోట్స్ రాసుకోవడానికి అవసరమైతే వాళ్ళకి స్క్రిబ్లింగ్ ప్యాడ్ సప్లై చేద్దామండి మనం చేస్తే మనం నేను బ్ల్యాక్ బోర్డుమీద చెప్తుంటే వాళ్ళకి ఏది ఎందుకు ఎలా చెయ్యాలో వాళ్ళ పని మానుకోవడం అవసరం లేకుండా వాళ్ళు ఈశ్వరానుగ్రహాన్ని ఎలా పొంది జీవితాన్ని భగదర్పితంగా ఎలా బతకచ్చో వాళ్ళు కూడా పాయింట్స్ నోట్ చేసుకుని నోట్సు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అది అయిపోయిన తరువాత వాళ్ళకి నేనో అవకాశం ఇస్తాను వాళ్ళకేమైనా అనుమానం ఉంటే ఆ వచ్చిన విద్యార్థులందరూ నన్ను నేను ఇచ్చినటువంటి క్లాస్ కి సంబంధించి నన్ను ప్రశ్నవేయవచ్చు నేను వాళ్ళకి ఎలా దాన్ని సమకూర్చుకోవచ్చో నేను ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను నా వాణివల్ల ఒక్క పిల్లవాడో ఒక్క పిల్లో భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారనుకోండి మా అమ్మ అంత కష్టపడి ప్రసవవేదన పడి కన్నందుకు ఆవిడ ప్రసవవేదన ధన్యత పొందుతుంది అంతకు మించి నాకేస్వార్థములేదు. కాబట్టి దీనికి టోకెన్లు మంగళవారంనాడు ఇవ్వండి చక్కగా తయారు చేసేసి ఇవ్వండి చాలా లిమిటెడ్ గా ఇవ్వండి ఇరుక్కు పోయేటట్టు ఇవ్వద్దు ఫ్రీగా కూర్చుని వాళ్ళు వినాలి మంగళవారం నాడు సాయంకాలం టోకెన్సు ఇస్తారు ఎక్సాట్ డేట్ ఆఫ్ క్లాస్ ఎప్పుడు ఏరోజు జరుగుతుంది అన్న విషయాన్ని మీకు తొందరలోనే మళ్ళీ ప్రకటన చేయడం జరుగుతుంది.

కాబట్టి ఇప్పుడు మనందరం చక్కగా రామ నామాన్ని పలుకుదాం.

శ్రీ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
దారినొంటిగ నడచువారికి తోడునీడే రామ నామము !!రా!!
కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రా!!
ఆలుబిడ్డల సౌఖ్యముకన్నను అధికమైనది రామ నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
భగదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
సకలజీవుల లోనవెలిగే సాక్షి భూతము రామ నామము !!రా!!
సృష్టిస్థితిలయ కారణంబగు సూక్ష్మరూపము రామ నామము !!రా!!

  కిష్కింధ కాండ ఇరవై నాల్గవ రోజు ప్రవచనము
 
జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీ రామ నామము !!రా!!
ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే శ్రీ రామ నామము !!రా!!
వెంటతిరిగెడు వారికెల్లను కంటిపాపే రామ నామము !!రా!!
జపతపంబుల కర్హమైనది జగములో శ్రీ రామ నామము !!రా!!
పండువెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామ నామము !!రా!!
చిత్తశాంతిని కలుగజేసెడి చిన్మయస్వరూపము రామ నామము !!రా!!
దూర దృష్టియు లేనివారికి దుర్లభము శ్రీ రామ నామము !!రా!!
రామ నామ స్మరణ చేసిన క్షేమమొసగును రామ నామము !!రా!!

మంగళా శాసన పరైః....

No comments: