కిష్కింధ కాండ
ఇరవై ఆరవ
రోజు ప్రవచనము
ఈనాడు చాలా గొప్ప తిథి వైశాఖ శుక్లపక్షంలో వచ్చేటటువంటి
ఏకాదశినాడు భగవంతుని యొక్క సేవ కించిత్ చేసినా సరే అది ఐశ్వర్యకారకం అవుతుందీ అని,
అందుకనీ ఈ ఏకాదశి తిథికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఒకటి ఉంది కాబట్టి ఇవ్వాళ
తప్పకుండా ఏదో ఒకటి ఈశ్వరసేవ చెయ్యవలసివుంది ఎందుకంటే గృహస్తాశ్రమంలో ఉన్నవాళ్ళు
నాకు ఐశ్వర్యం వద్దూ అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి ఆ లక్ష్మీ కటాక్షం కొరకు
అందరూ కూడా ఇవ్వాళ ఈశ్వరున్ని సేవించాలి తప్పకుండా. నేను నిన్నటిరోజు ఉపన్యాసం చేసినప్పుడు
కొంతమందికి వాతావరణం రీత్యా శ్రద్ధగా వినడంలో కొంచెం అసౌకర్యం కలిగిందేమోనని నాకు
అనుమానం వచ్చింది ఎందుకంటే ప్రత్యేకించి పాపం ఆ వెనకాల కూర్చున్నటువంటివాళ్ళు
వాళ్ళు లేచి ముందుకు రావడం అక్కడక్కడా సర్దుకోవడం వాతావరణం యొక్క తీవ్రతచేతా అంత
శ్రద్ధగా వినగలిగారో వినలేకపోయారో ఏదో సిలబస్ పూర్తి చేసినట్లు నా మానాన నేను చెప్పేశాను
చేశాను అయిపోయింది అనడం కన్నా, ఏ ప్రధాన ఘట్టం దగ్గర మీరు కొంచెం వినడంలో అసౌకర్యాన్ని
పొంది ఉంటారని నాకు అనుమానముందో నేను అక్కడ్నుంచి మళ్ళీ తిరిగి చెప్పడానికి
ప్రయత్నం చేస్తాను, దానివలన నాకొక తృప్తి ఉంటుంది. నేను ఏదో చెప్పేయడం కాదు నేను
వాళ్ళు ఏది వినడంలో అసౌకర్యం కలిగిందో అది మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాను అన్న ఒక
తృప్తి నాకు కలుగుతుంది.

|
ఆ మిగిలినటువంటి వానర కాంతలందరూ కూడా లక్ష్మణ మూర్తి యొక్క
వ్యగ్రతతో కూడిన స్వరూపాన్ని చూడగానే భీతి చెందినవారై వారందరూ కూడా చుట్టూ
నిలబడ్డారు ఆ నిలబడిన సందర్భంలో సుగ్రీవున్ని అలా చూసినటువంటి లక్ష్మణ మూర్తికి
కోపం ఆగలేదు, కోపం ఆగకా ఆయన అన్నారు యః తు రాజా స్థితో అధర్మే మిత్రాణామ్
ఉపకారిణామ్ ! మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృశంస తరః తతః !!
మిత్రులైనటువంటివాళ్ళకి ఉపకారం చేస్తానూ అని మాట ఇచ్చి ఆ చేస్తానన్న మాటను
నిలబెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నము ఎంత మాత్రమూ చేయకుండా దాన్ని మరిచిపోయి
తిరిగేటటువంటి వ్యక్తిని క్రూరుడూ అని పిలుస్తుంది లోకం శతమ్ అశ్వ అనృతే హన్తి
సహస్రం తు గవా అనృతే ! ఆత్మానం స్వ జనం హన్తి పురుషః పురుష అనృతే !! ఒక్కొక్క
విషయానికి చాలా భయంకరమైనటువంటి పాపం సంక్రమిస్తుంది మనం అనుకుంటాం అదిపెద్ద విషయమేముందీ
అనుకుంటాం కానీ మనకు తెలియకుండా పాపమైనా అలాగే పడిపోతుంది ఖాతాలోకి పుణ్యమైనా
అలాగే పడిపోతుంది ఖాతాలోకి మీరు ప్రసంగవశాత్ ఎప్పుడూ భగవంతుడి గురించి క్షేత్రముల
గురించి మాట్లాడేటటువంటి ఒక వ్యక్తితో మీకు స్నేహమేర్పడిందనుకోండి ఆయన దగ్గరికి
వెళ్ళినప్పుడల్లా వేంకటాచలం భద్రాచలం కాళహస్తీ అంటున్నాడనుకోండి, కేవలం అది
విన్నందుకు మీకు పుణ్యం ఉంటుంది. ప్రసంగవశాత్ మీరు కూడా తిరుపతి శ్రీ కాళహస్తీ అని
అన్నారనుకోండి కాశీ గంగా
ఇలాంటి మాటల్ని మీరు ఉచ్చరిస్తే ప్రాసంగిక పుణ్యమూ అని ఈశ్వరుడు ఆ పుణ్యాన్ని మీ
ఖాతాలోకి వేస్తాడు.

అంటే సర్వభూతములు కోరుకుంటాయంటే దానికి అర్థమేమిటంటే
కృతఘ్నుడైనటువంటివాడికి విధించవలసినటువంటి దండన ఇంకొకటిలేదు కేవలము వధ మాత్రమే
అంటే వాడు చంపబడవలసి ఉంటుంది. పూర్వం చతుర్ముఖ బ్రహ్మగారు ఒకానొకప్పుడు అందరినీ
ఉద్దేశించి ఒకమాట చెప్పారు ఆ మాట లోకానికంతటికీ శాశనంగా
ఉండిపోయింది, కిష్కింధ
కాండలో అత్యంత సారభూతమైనటువంటి శ్లోకములలో ఇదొకటి మనుష్య జన్మ
స్వీకరించినటువంటివారు స్వీకరించడమేమిటీ... మనుష్య జన్మ పొందినవారు అందరూ కూడా ఈ
శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది బ్రహ్మఘ్నే చ సురాపే చ
చోరే భగ్న వ్రతే తథా ! నిష్కృతిః విహితా సద్భిః కృతఘ్నే నాఽస్తి నిష్కృతిః !!
బ్రహ్మఘ్నే చ బ్రహ్మహత్య
చేసినటువంటివాడికి అంటే చేసి ప్రాయశ్చిత్తం చేసుకొమ్మనికాదు తెలిసో తెలియకో
బ్రహ్మహత్య చేస్తే సురాపే చ కల్లుతాగినటువంటివాడికి ఎందుకంటే మహాపాతకాల్లో
అదొకటి సురాపానం చేయకూడదు, కాబట్టి సురాపే చ చోరే దొంగతనం
చేసినవాడికి భగ్న వ్రతే తథా నేను ఒక వ్రతం చేస్తానూ అని సంకల్పం చేసి ఆ
వ్రతం చెయ్యకుండా విడిచిపెట్టినవాడికి నిష్కృతిః విహితా సద్భిః అటువంటివారి
అందరికి కూడా ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అంటే అది చేస్తానూ అని
చెయ్యనందుకు లేదా ఈ తప్పుపని చేసినందుకు తత్ పాపమును పోగొట్టుకోవడానికి ఒక క్రియా
కలాపం ఉంటుంది ఆ క్రియా కలాపంతో దానిని పోగొట్టుకోవచ్చు. అంటే నేను ఈ మాట
చెప్పినప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కృతఘ్నే నాఽస్తి నిష్కృతిః కానీ ఒక మాట ఇచ్చీ నేను
నిలబెట్టుకోనటువంటివాడనైతే అంటే నేను ఒక ఉపకారం చేస్తానూ అనిచెప్పి ఆ ఉపకారం
చెయ్యకపోతే కేవలం ఉపకారం చేస్తానని చెప్పడం కాదు మీలన నేనొక ఉపకారమును పొంది ఆ
ఉపకారమును మరిచిపోయి మీకు ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చికూడా తప్పితే
అటువంటివాడికి మాత్రం ఇక లోకంలో నిష్కృతిలేదు వాడికేప్రాయశ్చిత్తంలేదు ఆ
పాపం పాపంగా ఉండిపోతుంది.
|

ఇంట్లో తనయందు ఆభిముఖ్యముకలిగి తనయందు పూర్ణముగా హృదయము
పెట్టుకున్నటువంటిదై తనని పరిపూర్ణముగా ప్రేమిస్తున్నదై అన్నివిధములుగా ఆరోగ్యముతో
ఉన్నదై ఆరోగ్యముంటే కదాండీ మరి శారీరకంగా దంపతులు కలవడానికి ఆరోగ్యం కూడా అవసరమై
ఉంటుంది అన్నివిధములగానూ ఆవిడ శరీర ఆరోగ్యం మానిసిక ఆరోగ్యం కూడా సహకరించినదై
ఉండగా పురుషుడు ఆమెను విడిచిపెట్టి ఇంకొకరివలన సంతానమును పొందినా ఇంకొక భార్యను
స్వీకరించినా ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసాండీ? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే వెళ్ళిన
వీధికి వెళ్ళకుండా తల పూర్ణ ముండనము చేసుకుని శిఖలేకుండా పూర్ణ ముండనము
చేసుకోకూడదు శిఖ ఉండాలి, శిఖలేకపోతే కర్మాధికారం పోతుంది. ఆరు నెలలపాటు వెళ్ళిన
వీధికి వెళ్ళకుండా ప్రతిరోజూ చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని ఇళ్ళముందుకువెళ్ళి
అమ్మా నేను నాయందు అనురక్తయైనటువంటి ఆరోగ్యవంతమైన భార్య ఉండగా ఆమెను కాదని వేరొక
స్త్రీయందు కామక్రుత్యమును పొంది ఆమెను అనుభవించినవాడను
కాబట్టి ఈ పాప
ప్రాయశ్చిత్తమునకు మీరు నా శరీరం నిలబడడానికి నాకు కొంచెం భిక్షవేయవలసిందీ అని
అడిగితే... ఏ ఆడదైనా భిక్షవేసేముందు ఛీ... అంటూ వేస్తుంది. ఆ అన్నం వెళ్ళిన వీధికి
వెళ్ళకుండా ఆరు నెలలు తింటే ఆ పాపం పోతుంది అంటారు, అంటే మీరు ఆలోచించండి అవి అంత
తేలిక ప్రాయశ్చిత్తాలేమీ కావని మీరు గుర్తెరగవలసి ఉంటుంది.
|

అంతే దాని ప్రయోజనం శరీరానికి ఇంతకన్నా ప్రయోజనం ఉండదు
కాబట్టి ఇప్పుడు కృతఘ్నతా
దోషమునకు వెయ్యవలసినటువంటి దండనవేసి ఈశ్వరుడు శరీరాన్ని ఇచ్చాడనుకోండి
అప్పుడేమౌతుంది అది అనుభవించడంలో చాలా కష్టమొస్తుంది అది ఎవ్వరూ అనుభవించరు ఎంత
బాధపడిపోతాడో... ఒక పుట్టుకతో అంధుడయ్యాడనుకోండి పుట్టుకతో అంధుడై ఓ
తొబ్భైయేళ్ళు బ్రతికాడు ఏమిటి, ఆయన జీవితం మీద మీరు ఆలోచించండి ఎంత కష్టంగా
ఉంటుందో మీరు ఆలోచించండి. పాపం చేయడం చాలా తేలికగా ఉంటుంది కానీ దాని ఫలితాన్ని
అనుభవించేటప్పుడు వచ్చిన పెద్ద సమస్యేమిటమటే దాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు, దానివలన
వచ్చేటటువంటి ద్రవ్యమేదైతే ఉంటుందో ద్రవ్యాన్ని పంచేసుకుంటారు తప్పా ఈ జీవున్ని
ఉద్ధరించేవాడు ఉండడు అందుకే కొడుకుని ఒక్కన్నీ నమ్మవద్దూ అని చెప్పింది శాస్త్రం, కొడుకుని ఒక్కన్ని నమ్మి వాడు ఏదో
చేస్తాడనుకొనడం పొరపాటు వాడితోపాటు కొంతమంది కొడుకలను ఉంచుకో అని
చెప్పింది. కొంతమంది కొడుకుల్ని ఉంచుకో అంటే... ఓ నుయ్యి తవ్వించవచ్చు జీవుడు
శరీరాన్ని వదిలేయవచ్చు అలా వెళ్ళిపోతూ ఓ మహానుభావుడికి దాహంవేసి ఆయన అందులో నీళ్ళు
తోడుకుని కసేపాగి నీళ్ళు తాగుతాడు. ఒక పరమ భక్తుడు
నీళ్ళుతాగినటువంటి
పుణ్యం ఈ జీవుడు వెళ్ళిపోయినా ఈయన ఖాతాలో వేస్తారు. అంటే శరీరాన్ని
విడిచిపెట్టేసిన తరువాత కూడా ఈ జీవుడి ఖాతాలో పడేటటువంటి పుణ్యాలు కొన్ని ఉన్నాయి.
ఈ శరీరంతో ఉన్నప్పుడు చేస్తే పడేవి కొన్ని ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత కూడా
కొన్ని జీవుడి ఖాతాలో పడుతుంటాయి అలాగ.
|

కాబట్టి ప్రాయశ్చిత్తం అన్నమాటను మీరు తేలిగ్గా తీసుకోవద్దు
అని నా మనవి, నేను
ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అన్నవాటిజోలికి అసలు వెళ్ళకుండా ఉండడమే శ్రేయస్కరం
అటువంటివాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఎందుకు భయపడి నేను వివరణ
చేస్తున్నానంటే శ్లోకం అలా ఉంది కదాని మీరు అలా చూడకూడదు దానియదార్థ దృష్టితో
దాన్ని చూడవలసి ఉంటుంది బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్న వ్రతే తథా ! నిష్కృతిః
విహితా సద్భిః కృతఘ్నే నాఽస్తి నిష్కృతిః !! అనాఽఽర్యః త్వం కృతఘ్న
శ్చ మిథ్యా వాదీ చ వానర ! పూర్వం కృతాఽర్థో రామ స్య న తత్
ప్రతికరోషి యత్ !! నీవు అనాఽఽర్యః త్వం నీవు ఋజువర్తనము
కలిగినటువంటివాడవు కావు నీచుడవు కృతఘ్నడవు అసత్యమును పలికేటటువంటివాడివి, పూర్వము
రామునివలన ఉపకారమునుపొంది ఇప్పుడు ఆయనకి ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధంగా
లేనటువంటివాడివి స త్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవః ! న త్వాం
రామో విజానీతే సర్పం మణ్డూక రావిణమ్ !! ఒక పాము కప్పలా అరుస్తూందనుకోండి అది
కప్పేకదా అనుకొని వెళ్ళినటువంటివాడు ఏ ఉపద్రవమును పొందుతాడో నీవు మంచివాడవనుకొని
వాలిని వధించి నిన్ను ప్రతిష్టచేసినటువంటి రాముడు ఇవ్వాళ అదే ఇబ్బందిని
ఎదుర్కొంటున్నాడు.
ఎందుకంటే నీవు
అసత్యవాదివి అని లక్ష్మణుడు ప్రతిపాదించి స త్వం గ్రామ్యేషు భోగేషు సక్తో
మిథ్యా ప్రతిశ్రవః నీవు గ్రామ్యమైనటువంటి బోగములను అనుభవిస్తూ జీవితాన్ని
గడిపేస్తున్నావ్.
|

ఈశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క శక్తిని ఇస్తాడు
అందుకే కిష్కింధ కాండలో తార ఒకపెద్ద మెరుపూ అన్నాను నేను మీతో, ఆవిడ అందీ న ఏవం
లక్ష్మణ వక్తవ్యో న అయం పరుషమ్ అర్హతి ! హరీణామ్ ఈశ్వరః శ్రోతుం తవ వక్త్రాత్
విశేషతః !! నాయనా లక్ష్మణా! నీవు అలా మాట్లాడకూడదు అంతంత మాటలు
అనిపించుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నవాడు సుగ్రీవుడుకాడు ఎందుకంటే రెండు
కారణములు ఉన్నాయి ఒకటి హరీణామ్ ఈశ్వరః ఆయనా వానరములకన్నిటికీ ప్రభువు, ఒక
ప్రభువుని అంత నిందించి మాట్లాడటమన్నది మంచిపద్ధతికాదు తరువాత తవ వక్త్రాత్
విశేషతః నీనోటివెంట అస్సలు రాకూడదు ఎందుకో తెలుసాండీ? ఇది తార ప్రజ్ఞ అంటే అవతలవాళ్ళ యొక్క బలహీనత ఏమిటో ఏ
కారణం వల్ల ఈ తప్పుచేశాడో ఏ కారణం వల్ల కాలాన్ని లెక్కలోకి తీసుకోలేకపోతున్నాడో
ఇంతకుముందు ఎంత కష్టపడి ఇప్పడు భోగము అనుభవించాడో ఈ రెండిటియొక్క తేడా రామునికి
ఇచ్చినటువంటి మాట మరిచిపోయేటట్టు చేసింది దీన్ని నీవు దృష్టిలో
పెట్టుకోగలిగినటువంటి సమర్థుడవు అటువంటివాడివి ఆ పరిస్థితిని లెక్కలోకి
తీసుకోకుండా అంతంత పెద్ద పెద్ద మాటలు నీ నోటివెంట అనకూడదు ఎందుకంటే నీకు
సుగ్రీవుడు రాముడెంతో అటువంటివాడు కాబట్టి ఒక అన్నగారు తప్పుచేస్తే తమ్ముడికి అంత
అధిక్షేపించే అధికారములేదు కాబట్టి నీవు అంతంత మాటలు అనకూడదు న ఏవ అకృతజ్ఞః
సుగ్రీవో న శఠో న అపి దారుణః ! న ఏవ అనృత కథో వీర న జిహ్మః చ కపీశ్వరః !! ఆయనా
న జిహ్మః చ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాడు శఠుడు అంటే ʻలోపల ఒకటి
పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడేవాడుʼ, అటువంటివాడు కాడు
దారుణమైన మనస్సున్నవాడు కాడు పైగా
అనృథ కథో అంటే అపద్ధాలు
చెప్పేటటువంటి స్థితి ఉన్నవాడు కాడు జిహ్మః చ కుటిలిడైనటువంటివాడు కాడు
ఇవన్నీ కాకపోయినా అతని మనసు అటువంటిది కాకపోయినా అతని చేతులలో లేని స్థితిలో ఒక
పొరపాటు జరిగిపోయింది.
|

ఇప్పుడు ఎలా వాదిస్తాడండి లక్ష్మణుడు ఇప్పుడు వాదన
పెంచాడనుకోండి విశ్వామిత్రున్ని తీసుకొచ్చింది ఇప్పుడు గురువుగారిని నిందజేయడానికి
అవకాశం వచ్చేసింది ఏదో విశ్వామిత్రుడు అన్నాడనుకోండి విశ్వామిత్రుడు
తపస్సుకెళ్ళాడు మేనకను చూసి మరిచిపోలేదా అని కొనసాగించిందనుకోండి గురునిందను
విన్నట్లుంటుంది గురునింద
వినకూడదు. కాబట్టి లక్ష్మణుడు ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి లక్ష్మణుడు
మాట్లాడకుండా చేయడానికి లక్ష్మణున్ని అలా ఆపుచేయడానికి ఆవిడ ఏ ఆయుధాన్ని
ప్రయోగించిందో చూడండి. అది తార యొక్క విజ్ఞతా అంటే... అని ఆవిడ అందీ స హి
ప్రాప్తం న జానీతే కాలం కాల విదాం వరః ! విశ్వామిత్రో మహాతేజాః కిం పునః యః పృథ
గ్జనః !! ఎంత పెద్ద విశేషణం వేసిందో చూడండి విశ్వామిత్రుడికి ఆవిడిచ్చిన
బిరుదేమిటంటే కాలం కాల విదాం వరః అందావిడా కాల విదాం అంటే కాలమును
గూర్చి తెలిసున్నవాడు, కాలమును గూర్చి పరిపూర్ణంగా తెలిసున్నటువంటి విశ్వామిత్రుడు
తపస్సుచెయ్యడానికి వెళ్ళిన విశ్వామిత్రుడు కాలాన్ని మరిచిపోయి మేనకతో కామం
అనుభవించాడు పృథ గ్జనః ఏమీ తెలియనటువంటి ఒక వానరుడు చంచలచిత్తుడు ఇన్ని
కష్టాలు పడ్డవాడు ఈయ్యన కాలం మర్చిపోవడం పెద్దవిశేషమేముందయ్యా దానంత సాగదీస్తావ్
అంది అంతే ఇంకేం మాట్లాడుతాడండీ ఎంత లక్ష్మణుడైతే మాత్రం దేహ ధర్మ గతస్య అస్య
పరిశ్రాన్త స్య లక్ష్మణ ! అవితృప్త స్య కామేషు రామః క్షన్తుమ్ ఇహ అర్హసి !!
ఇతను దేహ ధర్మమైన కామమునకు
లొంగినవాడు అమ్మో... ఎంత పెద్ద మాటలు వేసేసిందో తెలుసాండీ..! దేహ ధర్మమైన
కామమునకు బాగా వశుడై పరిశ్రాన్త స్య అలసిపోయినవాడు, అలసిపోయినవాడికి అవితృప్త
స్య కమేషు ఆ కామమునందు కోర్కె తీరనివాడు తృప్తి చెందనివాడు కామం క్షన్తుమ్
ఇహ అర్హసి కాబట్టి ఇతని పరిస్థితి అది నీవు క్షమించేయవచ్చు ఏమిటి ఈ శ్లోకానికి
అర్థము.
|

|

తప్పా ఇంక మిగిలినవాళ్ళ యొక్క అవసరం ఆయనకులేదు ఆయనకి
లేకపోయినా ప్రతికర్తుమ్ అరిందమ నేను కేవలంగా ఏమిటంటే ఆయన వెంట ఉండడమే కానీ
నిజంగా ఆయనకి ప్రత్యుపకారం చెయ్యగలిగినవాన్యా నాకు రాజ్యమిచ్చాడని నిజంగా సీతమ్మని
తీసుకురావడానికి రావణ వధా రాక్షస వధా నేనా చేసేది రాముడే చేస్తాడు కానీ నేను
ప్రత్యుపకారం చేయగలడన్న అతిశయం నాయందులేదు రాముడే సర్వం ఆయనే చేస్తాడు. నా అదృష్టం ఏమిటంటే రాముడికి
సుగ్రీవుడు సాయం చేశాడన్న కీర్తిని నాకివ్వడానికి నన్ను తీసుకెళ్ళడానికి
నాసాయం ఏదో అవసరమైనదన్నట్లు మాట్లాడుతున్నాడు కానీ... నిజానికి నా సహాయం రామ చంద్ర
మూర్తికి అవసరమా..? అక్కరలేదు అన్నాడు. ఎంతపెద్దమాటండి అది నిజంగా సీతాం
ప్రాప్స్యతి ధర్మాత్మా వధిష్యతి చ రావణమ్ ! సహాయ మాత్రేణ మయా రాఘవః స్వేన తేజసా !!
రావణున్ని వధించడం కానీ సీతమ్మని తిరిగి పొందడం కానీ ఆ రామ చంద్ర మూర్తి తన యొక్క
తేజస్సుచేతనే చేస్తారు, తన పరాక్రమంతోనే చేస్తారు నేను ఆయనకు చేసే ఉపకారం ఏమీ ఉండదు యదార్థానికి కేవలం ఆయన్ని
నేను అనుగమిస్తాను అంతే ఆయనతో పాటు వెళ్తాను వెళ్ళినందుకు నాకు ఇంతకీర్తిని
ఆయన కట్టబెడతారు తప్పా నిజంగా రాముడికి నేను ఉపకారం చేయడం ఏమిటీ నేను చేసేది ఏమీ
లేదు.
అని యది కించిత్ అతిక్రాన్తం విశ్వాసాత్ ప్రణయేన వా !
ప్రేష్యస్య క్షమితవ్యం మే న కశ్చిన్ న అపరాధ్యత !! ఇది చాలా అందమైనటువంటి
శ్లోకం ఆయన అన్నాడూ నాయనా లక్ష్మణా! నేను కొంచెం ఆలస్యం చేసినమాట పరమ యదార్థమే
కానీ రాముడు ఉపకారం చేశాడు ఇప్పుడు మనం చేయకపోతే ఎలాగేమిట్లే పెద్ద మనల్నేం
చేయగలడు అన్నబుద్ధితో మాత్రం కాదు రెండు కారణముల వలన నేను చేశాను ఒకటి విశ్వాసాత్
నేను కొంచెం ఆలస్యం చేసినా రాముడు నన్నేం చేయడూ నా మిత్రుడూ అనేటటువంటి నమ్మకం,
రెండు ప్రణయేన వా ఆయనయందు నాకున్నప్రేమ చనువు ఆ ప్రేమవల్లా మనల్ని ఏమీ
అనరండీ ఫర్వాలేదూ మనం చెప్పుకోగలంలే అని ఒక చొరవ ఈ రెండిటివల్ల తప్పు చేశాను తప్పా
కావాలని రాముడికి ఉపకారం చెయ్యకుండా తప్పించుకుందామని భావన మాత్రం నాయందులేదు
ఒకవేళ ఈ లోకంలో నాకు కశ్చిన్ న అపరాధ్యతి ఇది రామాయణంలో జీవం మీరు
పట్టుకోవలసింది. ఇప్పుడూ పాపం జరిగిపోయిందండీ ఏదో తప్పు చేసేశారు ఇప్పుడు దానికి
ప్రాయశ్చిత్తంలేదు ఇక మీరు దాన్ని అనుభవించడం తప్పా మీరు చెయ్యగలిగిందిలేదు అని
నేను ఒక తీర్పు చెప్పాననుకోండి అప్పుడు మిమ్మల్ని ఇక ఆదుకునేవాడు ఎవ్వడూలేడూ
అనినేను చెప్పినట్టు, తప్పు చెయ్యనివాడు ఎవడూ అని అడుగుతున్నాడు సుగ్రీవుడు
యదార్థంకదాండీ! తప్పు చెయ్యనివాడు ఎవడు ప్రతివాడూ తప్పు చేసినవాడే కానీ నేను తప్పు జేశాను అని
రాముడుదగ్గర చెప్తే క్షమించడానికి రాముడు సిద్ధంగా ఉంటాడు ఇది మీరు పట్టుకోగలిగి
ఉండాలి.

|
కాబట్టి నీవే కిష్కింధా రాజ్యమును అనుభవించడానికి యోగ్యుడైనటువంటివాడివి
కాబట్టి కిం తు శీఘ్రమ్ ఇతో వీర నిష్క్రామ త్వం మయా సహ ! సాన్త్వయస్వ వయస్యం చ
భార్యా హరణ దుఃఖితమ్ !! నీ స్నేహితుడు నా అన్నగారు రాముడూ ʻభార్య రావణుని చేత
అపహరింపబడిందన్న శోకంతోʼ ప్రశ్రవన గిరి గుహలో
ఉన్నాడు, చాలా కాలం అయిపోయింది నీవు స్నేహితున్నిచూసి స్నేహితుడన్నవాడు కనపడీ ఒక
ఓదార్పుమాట మాట్లాడితే సంతోషంగా ఉంటుందికదా... అందుకని నీవు బయలుదేరివచ్చి
ఒక్కసారి నీవు రామునితో అంత దుఃఖం పొందవద్దూ అని చెప్తే రాముడు ఓదార్పుని
పొందుతాడు అని యత్ చ శోక అభిభూత స్య శ్రుత్వా రామ స్య భాషితమ్ ! మయా త్వం
పరుషాణి ఉక్తః తత్ చ త్వం క్షన్తుమ్ అర్హసి !! రాముడు కన్నులవెంట నీరు
పెట్టుకున్నటువంటి స్థితిని చూడలేక రాముడు కఠినంగా మాట్లాడితే ఆయన బాధని జీర్ణం
చేసుకోలేక నేను నీతో కఠినంగా మాట్లాడాను నేను నీతో కఠినంగా మాట్లాడినందుకు నీవు
నన్ను
క్షమించు అని
లక్ష్మణ మూర్తి అడిగాడు అది వాళ్ళ సంస్కారం. నిజంగా మహోత్కృష్టమైన సంస్కారమండీ
కడుపులో తప్పు అన్న భావన కలగగానే పరిపూర్ణ హృదయంతో చెప్పగలగాలి అయ్యా నన్ను
మన్నించండి పొరపాటైంది నేను క్షమింపబడెదనుగాక అనాలి అలా అనడం గొప్ప హృదయ సంస్కారం
ఇది చాలా సుసంపన్నమైన హృదయం అని కూడా చెప్పవచ్చును. నన్ను క్షమించండి అన్న మాట అనలేకా ఎన్ని భూకరింపులకైనా
దిగడం ఎంతగానైనా వాదించడం రావణుని యొక్క లక్షణం. చిన్న తప్పు నావల్ల ఏమైనా
జరిగిందేమో అని అనుకోగానే అయ్యా నన్ను క్షమించండి అని అనగలగడం మహోత్తమమైనటువంటి
సంస్కారం అందుకే సుగ్రీవుడు అనగలిగాడు లక్ష్మణ మూర్తి అనగలిగాడు ఈ సర్గలో.
|

ఇక్కడ మీరు ఒక చిన్న ధర్మ సూక్ష్మంను ఒకదాన్ని గమనించవలసి
ఉంటుంది ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ చేశారు, ప్రతిజ్ఞ చేసిన తరువాత ప్రతిజ్ఞ చేయడమంటే
వీళ్ళందర్నీ పిలిపించమని ఆదేశం ఇచ్చారు ఆదేశం ఇచ్చిన తరువాత వానరులందరూ రావడం
మొదలు పెట్టారు అప్పటికే నీలుడితో కబురుచేశారు కదాండీ... వస్తున్నటువంటివాళ్ళు
నల్లగా కాటుకలా ఉన్నవాళ్ళు మూడు కోట్ల మంది వానరులు అంజనాద్రినుండి
బయలుదేరివచ్చారట, అలాగే అష్టాద్రియందుండేటటువంటివారు మేలిమిబంగారముతో
ఉండేటటువంటివారు పదికోట్ల మంది వచ్చారట, వేయి కోట్ల మంది వానరులు కైలాస
శిఖరమునుండి బయలుదేరి వచ్చారు హిమవత్ పర్వతమును ఆశ్రయించి ఉన్న వానరములు కొన్ని
వేల వేల కోట్ల వానరములు వచ్చాయి కుజునివలె ఎర్రటి రంగులో ఉండేటటువంటి వానరులు
కొన్ని కోట్లమంది లెక్కపెట్టడానికి వీలులేనంతమంది వింధ్య పర్వతంనుంచి బయలుదేరి
వచ్చారు, ఇన్నికోట్ల వానరములన్ని బయలుదేరి వచ్చేశాయి, మిగిలిన వానరములు కూడా ఒకటి
రెండు రోజులలో బయలుదేరి వస్తాయి. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు రామ చంద్ర మూర్తి
దగ్గరకు వెళ్ళాడు ఈ వచ్చినటువంటివాళ్ళు అప్పటికే కొన్నివేల వేల కోట్లు అందరు పర్వత
శిఖరముల మీద కూర్చుని ఉన్నారు కూర్చుని ఉంటే సుగ్రీవుడు రాముని దగ్గరకు వెళ్ళాడు
ప్రశ్రవణ పర్వత గుహలో ఎక్కడ కూర్చుంటాడండి ఆయన ఒక రాతి బండమీద కూర్చోవాలి, ఆ
కూర్చుని ఉన్నటువంటి రామునిదగ్గరకి వెళ్ళి
|
పరిష్వజ్య చ ధర్మాత్మా నిషీదేతి తతోఽబ్రవీత్ ! తం
నిషణ్ణం తతో దృష్ట్వా క్షితౌ రామోఽబ్రవీత్ వచః !!
ధర్మమ్ అర్థం చ కామం చ కాలే యః తు నిషేవతే ! విభజ్య సతతం
వీర స రాజా హరి సత్తమ !!
హిత్వా ధర్మం తథా అర్థం చ కామం యస్తు నిషేవతే ! స వృక్షాఽగ్రే యథా సుప్తః
పతితః ప్రతిబుధ్యతే !!
అమిత్రాణాం వధే
యుక్తో మిత్రాణాం సంగ్రహే రతః ! త్రివర్గ ఫల భోక్తా తు రాజా ధర్మేణ యుజ్యతే !!

అసలు మీకు నేను ఒక సంగ్రహమైన మాట చెప్పాలీ అంటే వేదం మనిషి
యొక్క జీవితం ఎలా విభాగం చేసిందంటే అంతా ఈ పట్టూ విడుపుతోటే పెట్టింది ఎలా
పెట్టిందీ అంటే మొట్ట మొదట తల్లిదండ్రులకు జన్మిస్తాడు, జన్మించినటువంటివాడు
తల్లిదండ్రుల యొక్క ప్రేమనీ చూరగొని సంతోషంగా వాళ్ళదగ్గర పెరుగుతాడు
దర్భాష్టవమునందు ఉపనయనం చేస్తారు ఉపనయనం చేసి గురువుగారితో పంపిస్తారు పంపించేస్తే
గురుపత్ని పెట్టినటువంటి అన్నం తింటాడు. అహంకారం పోగొట్టడం కోసమనీ ఇళ్ళముందుకు వెళ్ళి
భిక్షాటనముచేసి తీసుకురమ్మని అంటారు గురువుగారు. ఇళ్ళ ముందుకు వెళ్ళి భవతి
భిక్షాందేహి అని అన్నం పట్టుకొస్తాడు, పట్టుకొచ్చిన అన్నం గురుపత్ని ఏదిపెట్టిందో
గురువు గురుపత్ని గురుపుత్రులు ఈ ముగ్గురిది సమానస్తాయి ఎప్పుడూ కూడా. కాబట్టి
ఇప్పుడు గురుపత్ని పెట్టినటువంటి అన్నాన్ని తాను తింటాడు తాను తిని బ్రహ్మచర్యంలో మిగిలిన జీవితమంతా
దిద్దుకోవడానికి కావలసినటువంటి సమగ్రమైన జ్ఞానాన్ని గురుముకతః వింటాడు.
అందుకే ఆకాలంలో భోగమేమీ ఉండదిక జుత్తు దువ్వుకోడు తాంబూళం వేసుకోడు అన్నానికి రుచి
అడగడు శయనం
నిద్రపోవడం
అనేటటువంటిది తల్పం మీద ఎన్నడూ పడుకోడు, ఎప్పుడూ బ్రహ్మవిద్యను నేర్చుకుంటూ
గురువుగారి దగ్గర అనేకమైనటువంటి విద్యలను పొందుతాడు గురు దక్షిణ ఇచ్చి సమావర్తనము
అంటారు.
|

మీరు బయటచేసిన
ఫలితం ఎంతవుందో... దానికి కోటిరెట్ల ఫలితం ఈశ్వరుడు దానికి వేస్తాడు ఎందుకో తెలుసా ఊ రక
రారు మహాత్ములు వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం గా రణము మంగళములకు నీ రాక
శుభంబు మాకు నిజము మహాత్మా అంటాడు దశమ స్కంధములో గర్గుడు వస్తే వసుదేవుడు,
మీరు ఒకరికి ఒకటి ఇచ్చారనుకోండి పరమేశ్వరుడు ఆ రూపంలోవచ్చి పుచ్చుకుంటాడు,
పుచ్చుకున్నవాడు తక్కువా ఇచ్చినవాడు తక్కువా అంటే పశ్చిమదేశాల సంస్కృతి ఏమిటంటే
ఇచ్చినవాడు ఎక్కువా పుచ్చుకున్నవాడు తక్కువ అందుకే వాళ్ళు ఇవ్వడం అనేదాని గురించి
సంఘాలు పెట్టుకుంటుంటారు. మేమందరము ఇచ్చేవాళ్ళమండీ మేమందరము డొనేషన్లువేసుకుని కలెక్ట్
చేశాము మేమందరము ఇవిగో బిందెలిస్తున్నాము ఇవిగో ఫోటో మేమందరము ఏదో వీళ్ళకి
బట్టలిచ్చాము ఓ ఫోటో మేమందరము ఏవో కంటాపరేషన్లు చేయించాము ఓ ఫోటో ఆర్ష ధర్మంలో
సనాతన ధర్మంలో గుప్తం, మూడవ
కంటికి తెలియదు మూడవ కంటి వాడికి కాదు సుమా! మూడవకంటివాడికి తెలియకుండా ఏదీ ఉండదు
మూడవ కంటికి అంటే ఈ రెండు కళ్ళకు తప్పా మూడో కంటికి తెలియదు చేసిన దానము, భార్యకీ
భార్య నీకన్నావేరు కాదు నీవేభార్య అని గుర్తుపెట్టుకోవాలి ఏమండీ భార్యా అంటే తనే
ఇప్పుడు భార్యకు కూడా చెప్పకూడదాండీ అనకూడదు. కాబట్టి ఇప్పుడు ఎంత గుప్తంగా
ఇస్తాడో అది ఏమైకూర్చుంటుందంటే ఇయ్యన విడిచిపెట్టి అవతలివాడి చేతిలోకి నీటిధారతో పడగానే ఇదీ కన్వర్ట్
అవుతుంది అంటే మార్పుచెందుతుంది దేనికింద మార్పు చెందుతుంది అంటే ద్రవ్యము పుణ్యము
కింద మారుతుంది.
|

ఏం తెలుగులో మాట్లాడితే నీకొచ్చిన నష్టమేమిటీ నా దగ్గరికీ
అంటే నేను గొప్పగా చెప్పానని మీరు అనుకోవద్దు అనేక దేశాలనుంచి నా దగ్గరకు
వస్తుంటారు మా గోపాల కృష్ణగారికి తెలుసు ఎన్ని దేశాలనుంచి వస్తారో వచ్చినవాళ్ళు నా
దగ్గరకొచ్చి తెలుగు మాట్లాడుతుంటే నేను ఎప్పుడూ ఓ మాట అంటూంటాను మీరు మాట్లాడటం
లాంటి తెలుగు నేను ఇక్కడ వినడం చాలా తక్కువగా ఉందమ్మా... ఎంతగొప్ప తెలుగు
మాట్లాడుతున్నారు తల్లీ అంటూంటాను. సౌందర్యలహరి శ్లోకాలు అంతబాగా చెప్పుతుంటారు
అంత చక్కటి తెలుగు మాట్లాడుతుంటారు. మనకి ఇక్కడుండి తెలుగు మాట్లాడటమంటే చిన్నతనం.
తెలుగు అమ్మ ఇంగ్లీషు భార్య ఎవరిస్తాయి వాళ్ళకి ఎవరి స్థానం వాళ్ళకి అంతే. భార్య వస్తే అమ్మను వదలాలనిలేదు
అమ్మకి నమస్కరిస్తే భార్య ఉండకూడదనిలేదు ఎవరి స్థానంవాళ్ళదే అమ్మ భార్యా
ఇద్దరితో కలిసి సంతోషంగా నీవు ఓ ఇంట్లో ఉండట్లా..? ఇంగ్లీషులో చదువుకో తెలుగులో
మాట్లాడు, తెలుగులో పోతనగారి పద్యాలుకూడా నేర్చుకో ఏమి దోషము ఇదీ సంస్కృతి తెలిసి
ఉండాలి తెలిసి ఉంటే ఇక్కడ మనం ఇవ్వడం అంటే కేవలం ఇవ్వడం కాదు ఇచ్చి పుణ్యాన్ని
సంపాయించుకుంటాం.
ఇక్కడ సంపాయించిన
ద్రవ్యం ఆ పై లోకాలలో వచ్చే జన్మలలో ఒకడికి పెట్టాలి ఈ జన్మలో నీవు ఇలా
పెట్టవలసిన అవసరంలేకపోయింది, నీవే ఇలా పెడుతూ బ్రతుకుతున్నావ్ మరి వచ్చేజన్మలో ఈ
జన్మలో వచ్చిందండీ ఓ విపరీతమైన ఐశ్వర్యం వచ్చింది అంటే దానర్థమేమిటీ మీరు
చేసుకున్న పుణ్యం వ్యయమైపోయిందాలేదా అయిపోయిందికదా వ్యయం, కానీ మీ శరీరం మాత్రం
ఇంకా జీవుడు వేరే శరీరంలో తీసుకోడని నమ్మకముందా తీసుకుంటాడు అప్పుడూ భార్యా
బిడ్డలు ఉంటారు
పోషించగలిగిన సత్తా
పెట్టగలిగిన సత్తా ఎక్కడనుంచి వస్తుంది ఇప్పుడున్నదాంట్లోంచి కొంత పెడితేనే పెడితే
మళ్ళీ పుణ్యం పుణ్యం
జీవుడికి ఐశ్వర్యం యద్భ్రూ భజ్ఞాః ప్రమాణం స్థిర చరరచనా తారతమ్యేమురారేః
వేదాన్తా న్తత్వచిన్తాం మురభిదురసియ త్పాదచిహ్నైన్తర న్తి భోగోపోద్ఘాత కేళీ చుళకిత
భగవ ద్వైశ్వరూప్యానుభావాసానః శ్శ్రీరా స్తృణీతా మమృతల హరిధీల ఞ్ఘనీయైరపాజ్గైః అంటారు
పరరాశర బట్టర్లు శ్రీ గుణ రత్నకోషం చేస్తూ అమ్మా మమృతల హరిధీల ఞ్ఘనీయైరపాజ్గైః
ఎప్పుడైనా పునః సృష్టి చేసేటప్పుడు పుర్రె
మీద లలాటలపం చేసేటప్పుడు బ్రహ్మగారు ఐశ్వర్యము అని రాసి తను రాయరట,
బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి ఒకసారి లక్ష్మీదేవి వంక చూసి అమ్మా ఇప్పుడు
వెడుతున్న ఈ పుర్రె కిందటి జన్మలో ఫలానా పేరున్న పుర్రె ఈ పేరుతో తిరిగింది
భూలోకంలో దీనికి ఇప్పుడు ఐశ్వర్యం ఎంతరాయమంటావ్ అని అడుగుతారట హాః ఇయ్యనా ఎంత
చేశాడో తెలుసా... అని అమ్మవారు అంటూందటా పేరు వినపడగానే హా... అంటూందటా యద్భ్రూ
భజ్ఞాః ప్రమాణం లక్ష్మీదేవి ఆపేరు వినపడగానే ఎంత చేశాడురా మహానుభావుడు అని ఇలా
కనుబొమ ఎత్తిందా మళ్ళీ విశేషమైన ఐశ్వర్యంతో వస్తాడు. వాడా... ఇచ్చింది
దాచుకున్నాడురా అని ఇలాగే అందనుకోండి దరిద్రుడు అని రాస్తారు బ్రహ్మగారు ఒకడికి పట్టింది బంగారు ఒకడికి
పట్టింది మట్టీ ఇక్కడ వచ్చిందమ్మా తేడా అన్నారు పరాశర బట్టర్లు స్థిర
చరరచనా తారతమ్యేమురారేః ఇక్కడొచ్చింది తల్లీ అన్నారు.
|
కాబట్టి ఇవ్వడం అనేటటువంటిది అంత తేలికా అని మీరు అనుకోకండి
ఇవ్వడం మిమ్మల్ని ఉద్ధరిస్తుందది అది ఉత్తిగానేంపోదు కాపాడి తీరుతుంది ఇవ్వడమన్నది
అందుకే ఒక్క దానం
చెయ్యడానికి మాత్రం సంఘాలు పెట్టుకోవడమన్నది ఈదేశంలోలేదు, దానం చేయడం నీ ధర్మం
గహస్తాశ్రమానికి దానికి సంఘమెందుకు ఒకరికి అన్నం పెట్టాలి నీవు చెయ్యాలి ఒకరికి
నీళ్ళివ్వాలి నీవు చెయ్యాలి ఇప్పుడు నేను మొన్నటి రోజున మీతో మనవి చేశాను వైశాఖ మాసం రాగానే మనం చెయ్యవలసినటువంటి
అతి గొప్పపని ఏమిటంటే చలివేంద్రం పెట్టాలి ఆరోజున మొన్న నేను మీతో మనవి
చేశాను ఇవాల్టిరోజున తప్పకుండా కూజాలో నీళ్ళుపోసి ఎవరికైనా ఇవ్వాలండీ
మనుష్యుజన్మలో ఉన్నందుకూ అని, ఎందుకనీ ఆయన ఆ కూజాలో నీళ్ళుతాగుతుంటాడు ఇదే ఆ
జీవుడివెంట వచ్చేటటువంటి ఫలితం కాబట్టి చలివేంద్రపెట్టు చలివేంద్ర పెట్టడానికి
మీకు కోటిరూపాయలు ఎందుకండీ చలివేంద్రం అక్కరలేదండీ మీకు నేను మా కాకినాడ పట్టణంలో
రోజు చూస్తుంటాను అక్కడక్కడ కొన్నిళ్ళముందు మూగజీవుల కొరకు నీరు అని ఎక్కువగా
పశువులూ పక్షులు తిరిగేటటువంటి చోటా ఒక చిన్న కుండీ పెట్టీ నీళ్ళు అందులో పోసి
వదిలేస్తారు వేసవికాలం కాదు 365 రోజులు అవి ఎవ్వరూ ముట్టుకోరు అవి ఏం చేస్తాయంటే
పశువులు అటూ ఇటూ గడ్డిమేసి దాహమేస్తుంది వాటికి కొన్నాళ్ళకు తెలిసిపోతుంది అక్కడ
నీళ్ళుంటాయని అన్ని కూడా జలాశయానికి వచ్చినట్టు వచ్చి కడుపునిండా నీళ్ళుతాగి ఎదురుగుండా
ఉన్న ఓ చెట్టునీడలో పడుకుంటాయి ఆయనేం చేస్తాడు పొద్దున్నే రెండు బకెట్ల నీళ్ళు
అందులో పోస్తాడు తనపని తాను చేసుకుంటాడు కానీ ఒక ఆవు ఆనీళ్ళు తాగింది దాహంతో ఉన్న
ఒక పక్షి ఆ నీళ్ళు తాగింది ఈయ్యన పని చేసుకుంటున్నాడు ఎంత గొప్ప ఫలితం పట్టుకెళ్ళి
జీవుడికి వేసేస్తుంటాడో తెలుసాండీ మీకు తెలియకుండా నడిచిపోతుంటుంది. కాబట్టి
అన్నిటికి డబ్బే ఉండాలని మీకు అనుకోకండి ఈశ్వరుడు పల్లకీ వెళ్తూంది మీరు వెళ్ళి
పట్టారు గొప్ప పుణ్యం చాలా చాలా గొప్ప పుణ్యం వంశాన్ని పుత్రుల్ని రక్షించేది
ఏమిటో తెలుసాండీ గంధం తీయడం కాయిక కైంకర్యం మీరు భగవన్ నామం చెప్తూ గంధం
తీశారనుకోండి ఈశ్వరుడికి ఆ గంధం ఈశ్వరుడికి పెడితే పుత్రాభివృద్ధి అందుకే
శివాభిషేకంలో గంధంతో అభిషేకం అంత గొప్పది అందుకే గంధోధకంతో అభిషేకం చేయడం.
|

ఏమిటి దీని రహస్యం అంటే కోర్కె తీర్చుకుంటూండడం వాసనా
బలాన్ని పెంచుకుంటూండడం అది మళ్ళీ రెండు మూడు రోజులు పోయిన తరవాత మళ్ళీ మార్చి
మార్చి మార్చి గుర్తుపెట్టుకుని అడుగుతుంటుంది అది పట్టుకురా ఆరోజు అది చేశావు అది
పట్టుకరా ఇది చేశావు ఇది పట్టుకురా ఆయనెవరో బందరు వెడుతున్నాడు బందరులో మిఠాయి
ఉంటుంది తెచ్చిపెడుదురు, ఆయనెవరో తిరుపతి వెడుతున్నాడు ఏమండీ వెంకటాచలం
వెడుతున్నారు నా నమస్కారం స్వామికి
చెప్పండి అనడు ఐదు
రూపాయలిచ్చి నాకో లడ్డు తెచ్చిపెడుదురు అంటున్నాడు అది విచిత్రం. లడ్డు తెచ్చాక
అప్పుడు పూర్వమండీ జీడిపప్పండీ... అంటాడు, నీ మొఖం జీడిపప్పుకోసమా నీకు తిరుపతి
ప్రసాదం అది ఈశ్వరానుగ్రహము దాంట్లో జీడిపప్పు నీకెందుకూ కాబట్టి ఏమైపోతుందంటే కామమునందు నిలబడిపోతే వాసనకింద
మారిపోతుంది మళ్ళీ తే మళ్ళీ తే మళ్ళీ తే మళ్ళీ తే మీరు తీర్చలేదనుకోండి కోపంకింద
మారుతుంది రెండిటివల్లా బ్రష్టుడే అయిపోతుంటాడు మరి ఎలా తప్పిచ్చుకోవాలి.
ఇక్కడే ధర్మమూ అర్థమూ పక్కన చేరుతాయి అందుకే కామము నుండి తప్పుకుందామని మీరు
శరీరమునుండి కదలికను ఆపారనుకోండి మనసు..? దాని గొప్పతనమేమిటో తెలుసాండీ మీరు
దీనితో అనుభవించలేదండీ అది లోపలనుంచి అనుభవిస్తుంది మనసుతో చేసిన పాపమైనా శరీరంతో చేసిన పాపమైనా ఒక్కటే
తనూ ఏకాదశినాడు ఉపవాసమున్నాడు ఏకాదశినాడు సాయంకాలం నుంచే రేపేమి వండుకుందామే రేపు
ఎలాగో కొబ్బరికాయ కొడుతాముకదా కొబ్బరిచారు శెనగపట్టు వేసుకుందామా కొబ్బరికాయ
మామిడికాయ పచ్చడి చేసుకుందామా అన్నాడనుకోండి ఇంకేమి ఉపవాసము కదా...
|
కాబట్టీ మీరు శరీరాన్ని కదపకపోయినా మనసుని కదిలిపోయి
అనుభవించేస్తుంటుంది అది ఎప్పుడూ తిరుగుతుంటుంది చంచల చిత్తం, ఇప్పుడేం చేయమందో
తెలుసాండి శాస్త్రం నీవు
దాన్ని అలా ఉంచకూ ఉంచితేగదా నీకు ఇబ్బందీ ఈశ్వరుడివైపుకు చెయ్యగలిగినటువంటి
పుణ్యకార్యములవైపుకి దాన్ని అలవాటుగా తిప్పూ అంటే ఇప్పుడు లేవగానే పొద్దున
సంధ్యావందనం చెయ్యి మీరు దానికి అలవాటు చేశారనుకోండి కొన్నాళ్ళుపోయాక ఏం చేస్తుందో
తెలుసా... మీరు సంధ్యావందనం చేయకుండా టీవీ చూస్తున్నారనుకోండి... సంధ్యావందనం
చేయాలికదా సంధ్యావందనం చేయాలి కదా అని సంధ్యావందనం చేయాలి కదా సంధ్యావందనం చేయాలి
కదా వాడు అలా నోరేసుకుని అరిచాడు కదా 42 రోజులు అని అదే జ్ఞాపకం చేస్తుంది. ఏనుగూ అంతగొప్పదై తనని కట్టేటటువంటి
ఇనుపగొసులు తానే అందించినట్లు తనే జ్ఞాపకం చేస్తుంది ఒరేయ్ సంధ్యావందనం
చేయాలిగదా మళ్ళీ ఈ టీవీ అవీ చూస్తూ అలవాటైపోయిందనుకో ఒక్క ఇరవై నిమిషాలు
సంధ్యావందనం చేసొచ్చివిందువుకాని ఏం ఫర్వాలేదు వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు
చూపిస్తూనే ఉంటారు అదేం పెద్ద ఒకసారి చూపించి అయిపోయిందనేవాళ్ళు కాదు వారు మళ్ళీ
మళ్ళీ చూపిస్తారు మళ్ళీ వద్దువుగా రా అని అదే మనల్ని నచ్చజెప్పి పూజా గృహంలోకి
తీసుకెళ్తుంది. ఒకసారి అలావాటు చేస్తే అటే వెళ్తుంది. సమాజ ప్రయోజనంవైపుకి మీరు తిప్పారనుకోండి పునః పునః పూనిక
దానిమీదకి వెళ్తుంది అందువల్ల ధన్యాత్ముడౌతాడండీ... ఒక మనిషి మహామనిషియై
యశోశరీరుడై అంతగొప్పగా తరవాత కొన్ని తరాలకి కావలసినంత పుణ్యాన్ని తీసుకొచ్చి
తెచ్చి వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్కడు. అంత ఐశ్వర్యాన్ని తెచ్చి వెళ్ళిపోతుంటాడు ఈశ్వర కైంకర్యం చేసేసి ఎక్కడిదో
తెలుసాండీ ఇదీ కామమును ధర్మబద్ధం చేసి అర్థాన్ని ధర్మబద్ధం చేసి ఇటువైపు
ఉత్సాహాన్ని అటువైపుకి తిప్పుతాడు ఈశ్వరుడి పూనికవైపుకి తిప్పుతాడు.
సరే ఇప్పుడు తిప్పావు ఏదో సంధ్యావందనం చేసుకోవడం రోజు
గజేంద్ర మోక్షణం పారాయణం చేసుకోవడం లేకపోతే ఖాలీ... ఏమండీ మరి ఇవన్నీ చేసుకుంటుంటే
మా ఉద్యోగాలూ...? మిమ్మల్ని ఉద్యోగం మానేయమని ఎవ్వరూ చెప్పలేదు మీకు ఆఫీసులో కొద్దిగా
గ్యాప్ వచ్చింది ఏదో వాన్నీ వీన్నీ పిలవకుండా సర్కులోంచి తీసి పదుకొండుమాట్లు శ్రీ
రామ శ్రీ రామ శ్రీ రామ రాసై ఆఫీసుకు వెళ్ళిపోతున్నావు అలవాటు చేయి నాలుక్కి శ్రీ
రామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్ర
నామతత్యుల్యం రామనామ వరాననే !! నిద్రలేచావు ప్రాతఃస్మరామి
లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశమ్ ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ !! అని అమ్మవారిని స్తుతించడం అలవాటుచేయి,
స్మరణా అందుకే దీనికి ʻస్మరుడుʼ అనిపేరు మన్మథస్మరణములకు లొంగితే పథనం
ఈశ్వరస్మరణములకు లొంగితే ఉన్నతి. కాబట్టి ఇప్పుడు మనసు తిప్పాలి తిప్పడం
అన్నది ఒక్కటి అలవాటైతే నీవు ఏం చేస్తున్నా దోషంరాదు ఇదీ ఇప్పుడు చేసేసిన పాపం
ఏమైపోయింది నీవు చేసేసిన పాపాన్ని తీయడానికివాడు వాడికోపేరుంది కాబట్టి వాడు ʻపతితపావనడుʼ అని లేకపోతే ఆ
బిరుదు ఎక్కడిది. ఇప్పుడూ తప్పుచేసినవాళ్ళని ఉద్దరించాడు కాబట్టేకదాండి ఆయనకి
పతితపావనడనిపేరు ఉద్దరించనివాడైతే ఆ పేరెందుకూ దాశరథి రంగాచార్యగారు
దెప్పిపొడిచారు ʻకలవారినేకాని కాపాడలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా నిరుపేద మొరలేవి కనలేనినాడు స్వామి దీన రక్షకుడన్న
బిరుదేలయమ్మ అడగవే మాయమ్మ అనురాగవల్లిʼ ఎప్పుడు నడిరేయి ఏజాములో
స్వామి నినుజేర దిగివచ్చునో అని అంటాడాయన నేను అడగనమ్మా నీవు అడుగు రాత్రి
వస్తాడుగా వచ్చినప్పుడు అడుగు.
|

ఎక్కడాగిపోతారంటే రామ భక్తుడనీ అన్నచోటా రామా రామా శ్రీ
రామా జయరామా రాం రాం రాం సీతారాం అంటూ అక్కడికి తీసుకొచ్చి రామ నామాన్ని
పెంచేస్తారు కీర్తనలో అంటే ఆయనకి కీర్తన అనుభవంలోకి వచ్చింది బాగా అని గుర్తు.
మొన్న సీతా రామ కళ్యాణానికి వచ్చారు పెద్దావిడ సూర్యకుమారిగారు ఆ తల్లి కీర్తన
చేసేటప్పుడు ఎంత పరవశించిపాడారో ఎంతసేపు పాడారో చూడండి అది అనుభవించి కీర్తన
చేయడమంటే బంటు రీతి కొలువీయ వయ్య రామ తుంట వింటి వాని మొదలైన మదాదుల బట్టి నేల
కూలజేయ మన్మథ బాణములకు గురై కామమ చేత కామమునకు నేను వశుడైపోకుండా నిజ
రోమాంచమనే, ఘన కంచుకము ఆ రామ నామము వినేటప్పటికి రామ కథ వినేటప్పటికి రామ
కార్యమనేటప్పటికి నా వెంట్రుకలు నిక్కబొడుచుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వవా
రామా! నా జన్మలో ఎప్పుడూ నీ పేరు చెప్తే వెంట్రుకలు
నిక్కబొడుచుకునే
ఆనందించినటువంటి క్షణమన్నది ఇన్నేళ్ళు బ్రతికాను ఒక్కసారి నేను అలా
పరవశించిందిలేదు ఎందుకు నా జన్మమింకా ఎప్పుడు పరవశించాను ఈశ్వరున్ని గురించి
ఆలోచించినప్పుడు అబ్భాహ్.. అబ్బాహ్ హ్ అని ఫటిక బెల్లం తిన్న నా నోటివెంట వచ్చిన
తీపిలా ఈశ్వరుడి గురించి స్మరించేటప్పటికి ఒంటిమీద నాకు పులకరింతలొచ్చాయా
ఎప్పుడైనా ఈశ్వరా నాకు రోమాంచమనేటటువంటి కవచాన్ని ఇవ్వు తండ్రీ రామ భక్తుడనే
ముద్రబిళ్ళయు మీరు చూస్తూంటారు రాష్ట్ర ప్రభుత్వోగులు పెద్ద పెద్ద అధికారుల
దగ్గర ఉంటూంటారు కొంతమంది సేవకులు వారు ఇలా ఒక చిహ్నమేసుకుని ఒక పెద్ద భిళ్ళ ఒకటి
ఉంటుంది చూడగానే ఆయన ఎవర్ని అనుసరిస్తున్నారో ఆయన పెద్దాధికారని గుర్తు ఇయ్యన్ని
బట్టి ఆయన అధికారం తెలుస్తుంది రామా! నాకు ఏం కావాలో తెలుసా రామ భక్తుడనే బిళ్ళ
కావాలి నేను నీకు సేవకున్ని కాబట్టి నాకు ఆ రామ భక్తుడనేటటువంటి ముద్ర భిళ్ళ చాలు
నాకు ఇంకేం వద్దు ఈయ్యన ఇంతటివాడు ఆయన అంతటివాడు లేనిపోని బిరుదునామాలూ
అలాంటివన్నీ నాకు ఎప్పుడు వద్దు రామా...
|

నా స్కూటరూ శుభ్రంగా మట్టిపట్టేసిందనుకోండి ఓ దిక్కిమాలిన
స్కూటరా రామాయణకథ మాకు చెప్పిన కోటేశ్వరావుగారు ఎక్కుతారు అదేంటీ అలా ఉన్నావ్
శుభ్రంగా స్నానం చెయ్యద్దా అని స్కూటర్ని అంటారా... అదేటండీ కోటేశ్వరావుగారూ స్కూటర్ శుభ్రంగా ఉంచుకోకపోయారా అని నన్ను
అంటారా..? నన్ను అంటారు, నేను రామ భక్తున్ని అయిపోతే నన్ను జాగ్రత్తగా ఉంచుకోవడం
ఆయన కర్తవ్యం ఇక నా ప్రమోయం ఏమీ ఉండదు రామా రామా అంటూ రామ భక్తున్నై రామ భక్తుడనే
ముద్రబిళ్ళ ఒక్కటి కోరుకుని ఆయన అనుగ్రహించాడా ఇక నాకు ఏం కావాలో నా స్వామి
చూసుకుంటాడు నాకిది కావాలని అడుగక్కరలేదు నాకిది ఉంటే బాగుండని ఆలోచించక్కరలేదు
నాకేమేం కావాలో నా స్వామి నాకు సమకూర్చిపెడతారు ఈ ధైర్యం నీకు వచ్చేస్తుంది. ఇది
రావడం చాలా గొప్పవిషయం కీర్తన చెయ్యడం కాదు జీర్ణం కావాలి అందుకే త్యాగరాజ స్వామి
దక్షిణదేశం వెళ్ళి ఒకసారి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతుంటే ఏమైనా ఇస్తే ఆయన
పుచ్చుకోరు, పుచ్చుకోరు అన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు ఏది లేదన్నభావన
ఆయనది, కాబట్టి ఆయన ఏం పుచ్చుకోరండీ మరి ఏం చేస్తారు సీతారామ కళ్యాణం చేస్తారు
యేడాదికొకసారి చాలా వైభవంగా పోనిలేండి సీతారామ కళ్యాణానికి ఉపయోగించమని
త్యాగరాజ స్వామికి
ఇవ్వకుండా త్యాగరాజ స్వామికి శిష్యుడికి ఇచ్చారు ఓ జమీందారుగారు బంగారు నాణ్యాలు
అవి ఆయనేం చేశారంటే గురువుగారికి చెప్తే ఏమైనా అంటారేమో పాపం సీతారామ కళ్యాణానికి
అంత కష్టపడుతున్నారు గురువుగారని ఓ బొంతకింద పెట్టారు స్వామివారు ఉండే బొంతకింద.
|

అంటే త్యాగరాజ స్వామి అన్నారు మీరు భాగ్య వంతులురా! మీరు
భాగ్యం చేసుకున్నారు మీకు అయ్యింది దర్శనం నాకు అవలేదురా అన్నాడు అని విలపించాడాయన
అంటే రామ భక్తుడని ముద్రబిళ్ళయూ త్రికరణశుద్ధిగా రామున్ని నమ్మితే మీకు ఏం
కావాలో రామ చంద్ర మూర్తి చూస్తుంటారు ఇది నాకు ఇవ్వవా రామా అని అడిగారు రామ చంద్ర
మూర్తి కాబట్టి పతితపావనుడు అన్నమాటను మీరు సంక్రమంగా అర్థం చేసుకుంటే అదే పనిగా
మీరు పాపం చేయడం ఆయన కాల్చడం అనకూడదు మీరు మారితే మీ పాపాన్ని ఆయన కాల్చుతాడు లేకపోతే
ఈశ్వరుడన్నవాడు ఉండి ప్రయోజనమేమైపోతుందండీ ఇంక సమాజంలో మార్పు చెందినవాడికి పాపం
వెంటొస్తుందీ అంటే వాడు ఎందుకుమారుతాడు చెప్పండి అసలు నాకు లేదు మీరు ఎంత పాపం
చేసినా ఈశ్వరుడు క్షమిస్తూనే ఉంటాడు అని నేను అన్నాననుకోండి అప్పుడు క్రమశిక్షణ
ఎక్కడుంటుంది. అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం నీవు ఎంత పాపమైనా చేయి స్వామి
క్షమిస్తాడు అన్నావు నీవు ఎంత పాపమైనా చేయి మార్చకుండా ఈశ్వరుడు క్షమించకుండా
ఉంటారనరు నీవు మారూ క్షమిస్తాడు నీవు మారకుండా ఉంటే మాత్రం నిన్ను క్షమించడూ నీవు
అనుభవించవలసి ఉంటుందంటారు కాబట్టి మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసిన రాచ మార్గం
చెప్పగలిగినటువంటి
ఋషిప్రోక్తమైన చాలాగొప్పది ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి అత్యద్భుతమైన ధర్మమంటూ
ఏదైనా ఉంటే లోకంలో సనాతన ధర్మం ఒక్కటే అటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు ఆ ధర్మాన్ని ఆవిష్కరించిన
రామ చంద్ర మూర్తి కథ రామాయణాన్ని చెప్పుకున్నందుకు విన్నందుకు మనం
పొంగిపోవాలి.
|

అక్కడ తప్పా నేను ఆపకూడదు ఉపన్యాసాన్ని కాబట్టి లక్ష్మణ
కోపాన్ని ఉపశాంతి పొంది ఆయన సుగ్రీవుడు రామునిచేత మన్నింపబడ్డాడు పతితపావనుడై
ఆనందించాడు నిన్న ఆ కీలక ఘట్టానికి చేరుకునేటప్పటికీ నిన్న ఆ వాతావరణంలోనే
రామాయణాన్ని చెప్పుకున్నాం కానీ మీరు సరిగ్గా వినగలిగారో వినలేదో అని చెప్పి ఏదో
చెప్పిశానో వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పానో లేదో అన్న బాధతో మళ్ళీ ఇవ్వాళ మీకు
చెప్పాను తప్పా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశ్యంకాదు. ఒకవేళ మళ్ళీ
చెప్పడంవల్ల ఇబ్బంది కలిగితే నేను క్షమింపబడెదనుగాక. కాబట్టి ఇప్పుడు ఆ
వచ్చినటువంటి వాళ్ళు శతవలి పదివేల మంది వానరుల్ని తీసుకొచ్చాడు సుసేనుడు పెక్కువేల
కోట్లతో వచ్చాడు రుమ తండ్రి వేయి కోట్ల మందితో వచ్చాడు కేసరి వేల కోలది వానరసైనికులతో
వచ్చాడు ధూంర్రుడనే భల్లూక నాయకుడు రెండువేళ కోట్ల భల్లూకములను తీసుకొచ్చాడు
పనసుడూ అనేటటువంటి వానరయోధుడు భయంకారాకురులైన మూడు కోట్ల వానరములను తీసుకొచ్చాడు
నీలుడు పదికోట్ల మంది వానరములతో వచ్చాడు గవయుడు ఐదుకోట్ల మంది వానరులతో వచ్చాడు
దదీముఖుడు వెయ్యికోట్లమందితో వచ్చాడు
మైందుడూ ద్వివిదూ
అనేటటువంటి బలాఢ్యులు ఒక్కొక్కరు వెయ్యికోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చారు కజుడు
మూడు కోట్లమందితో వచ్చాడు జాంబవంతుడు మిక్కిలి తేజస్వీ మహానుభావుడు బ్రహ్మగారు
ఆవలిస్తే పుట్టినటువంటివాడు పది కోట్ల మంది భల్లూకములను తీసుకొచ్చాడు రుమణ్వంతుడు
వందకోట్ల మంది వానరులతో వచ్చాడు గంధమాదనుడు కోటాను కోట్ల వీరుల్ని తీసుకొచ్చాడు.
|

ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు పెద్దలు
చెప్పిన మాటని యథాతథంగా గుర్తుపెట్టుకుంటారు కొంతమంది సరిగ్గా వినకుండా హడావిడిలో
ఉంటారు కొంతమంది ఈ మాట గుర్తుపెట్టుకున్నది హనుమ ఒక్కరే మిగిలినవాళ్ళు
గుర్తుపెట్టుకోలేదు దానివల్ల ఏం జరిగింది అన్నది మీకు సుందరకాండ చివరలో తెలుస్తుంది
అక్కడకి ఈ మాట గుర్తుపెట్టుకోండి అక్కడ వస్తుంది ఈ మాట మళ్ళీ కాబట్టి నేను
సుగ్రీవుడితో కలిసి నిర్ణయం చేస్తాను కాబట్టి మీ పని మాత్రం ఒక్కటే సీతమ్మని
అన్వేషించి ఆమె జాడ కనిపెట్టడం రావణాసురుడు ఎక్కడ ఉంటాడో అతని యొక్క నివాస స్థానాన్ని
ఆయన యొక్క బలాన్ని కనిపెట్టడం ఈ మాట చెప్పిన తరువాత సుగ్రీవుడు తూర్పు
దిక్కుకువెళ్ళి అన్వేషించవలసిన కొన్ని వేల వానరములకు వినతుడు అనేటటువంటి గొప్ప
వానరాన్ని నాయకున్నిచేసి ఆయన్ని పిలిచి చెప్తున్నాడు తూర్పుదిక్కున ఎక్కడెక్కడ
వెతకాలో చెప్తున్నాడు రామాయణం ఒక గొప్ప భౌగోళిక శాస్త్రం దీని మీద ఇంచుమించు
పరిశోధనలే చేశారండీ చాలా మంది రామాయణంలో ఈ దిక్కుల్ని చెప్పిన ప్రదేశాలన్నీ
ఇప్పుడు ఏయే పేర్లతో ఉన్నాయి చిత్రమేమిటంటే ఆంధ్రదేశం గోదావరి నదితో సహా చెప్పాడు
సుగ్రీవుడు ఆరోజున.
|
అది దాటితే శిశిరం అనేటటువంటి ప్రదేశం కనపడుతుంది ఆ పర్వతం
అంతా కూడా మీరు వెతకాలి అది దాటిన తరువాత శోణానది కనపడుతుంది, శోణానది చాలా లోతుగా
ఉంటుంది ఎర్రటి నీటితో ఉంటుంది ఆ ప్రదేశమున సిద్ధులూ చారుణులు విహరిస్తూంటారు మీరు
అక్కడ ఉండేటటువంటి రమ్యమైన తటములలో ఉండేటటువంటి ఆశ్రమములలో తపోవనాలలో సీతమ్మని
ఎక్కడైనా ఉంచాడా వెతకాలి అది కూడా దాటితే ఇచ్చు సముద్రం వస్తుంది అక్కడ
పెనుగాలులకు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి తరంగాలు ఆ ఇచ్చు సముద్రంలో
మహాకాయులైనటువంటి అసురులుంటారు వాళ్ళు ఆకలిని తీర్చుకోవడానికి ప్రాణుల నీడబట్టి
భక్షిస్తుంటారు మీరు చాలా జాగ్రత్తగా ఆ ప్రదేశమంతటా వెతకాలి అది దాటిన తరువాత
లోహితమూ అనబడేటటువంటి మధు సముద్రము యొక్క తీరాన్ని చేరుకుంటారు అక్కడ బూరుగు
వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి అందుకని శాల్మలీ ద్వీపమూ అంటారు మీరు ఆ
శాల్మలీ ద్వీపంలో ఉన్న బూరుగు చెట్లతో కూడిన ప్రదేశమంతా వెతకాలి అది దాటిన తరువాత
అక్కడ ఆ శాల్మలీ ద్వీపంలో అనేకమైనటువంటి గిరి శిఖరములు ఉంటాయి ఆ గిరి శిఖరములకు
మందేహులూ అనబడేటటువంటి రాక్షసులు తలక్రిందులుగా వ్రేలాడుతుంటారు వాళ్ళు ప్రతిరోజూ
ఉదయంవేళలో సూర్యభగవానుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యున్ని ఉదయించకుండా ఆయన్ని
గ్రసించడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు ద్విజులైనటువంటివారు సంధ్యావందనం చేసి
ఆర్ఘ్యం విడిచిపెడితే ఆ విడిచిపెట్టబడినటువంటి ఆర్ఘ్య జలముల యొక్క శక్తిచేతా
సూర్యభగవానుని యొక్క శక్తి చేతా అక్కడ ఉండేటటువంటి మందేహులనబడేటటువంటి రాక్షసులు ఆ
సముద్రంలో పడిపోతుంటారు. మళ్ళీ వాళ్ళు బ్రతికిలేచి మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకుని
తలక్రిందులుగా వ్రేలాడుతుంటారు మీరు ఆ ప్రాంతమంతా వెతకవలసి ఉంటుంది ఆ సముద్ర
మధ్యంలో వృశభమూ అనేటటువంటి పర్వతమొకటి ఉంటుంది తెల్లటి పర్వతం పెక్కు వృక్షములతో
శోభిల్లుతుంటుంది ఆ వృశభ గిరిమీద సుదర్శనము అనబడేటటువంటి ఒక గొప్ప సరోవరము ఉంటుంది
ఆ సరోవరం వెండివలె తెల్లని కాంతులతో అన్నిదిక్కులా విరాజిల్లుతుంటుంది దాన్ని
దాటితే క్షీర సముద్రము వస్తుంది దాన్ని కూడా దాటి కొంచెం దూరం వెడితే మధుర జలములు
కలిగిన మహా సముద్రము వస్తుంది అందులో ఔర్హుడు అనబడేటటువంటి మహాముని యొక్క కోపం
బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది దానికి హయముఖము అని పేరు అక్కడ
జలచరములను ఆ బడబాగ్ని తింటుంది అక్కడే దాన్ని దాటి వెడితే పర్వత శిఖరము మీద
అత్యద్భుతమైనటువంటి దశ్యము కనబడుతుంది
|
ఆసీనం పర్వత స్య అగ్రే సర్వ భూత నమస్కృతమ్ ! సహస్ర శిరసం
దేవమ్ అనన్తం నీల వాసనం !!
త్రిశిరాః కాంచనః
కేతుః తాలః తస్య మహాత్మనః ! స్థాపితః పర్వతస్యాఽగ్రే విరాజతి స
వేదికః !!
ఆ మధుర జలధికి ఉత్తర భాగమందు పదమూడు యోజనములు దూరంలో ఒక
బంగారు పర్వతము ఉంటుంది ఆ పర్వత శిఖరమునకు జాతరూప శిలమూ అని పేరు దాని మీద
సర్పాకృతి కలిగినటువంటి అనంతుడు మహానుభావుడు ఆయన నల్లటి బట్టలు ధరించినటువంటివాడై
కూర్చుంటాడు. పద్మపత్రముల వలె విశాలమైనటువంటి నయనములు కలిగినటువంటివాడై ఉంటాడు
ఆయనే ఆదిశేషుడు ఆదిసేషుడే వేయి పడగలతో ఈ భూమి యొక్కభారాన్ని వహీస్తుంటాడు ఆయన
పక్కనే తాటి చెట్టు ఆకారంలో ఆయన యొక్క ధ్వజం పెట్టబడి ఉంటుంది దాని పక్కన ఈ బాల
ధ్వజం పక్కన వేదిక ఉంటుంది తూర్పు దిశలో ఆ వేదికని దేవతలు నిర్మించారు మీరు ఆ
అనంతుడు ఆదిశేషున్ని దర్శనం చేయండి అక్కడ నుండి ముందుకువెళ్ళితే బంగారు
పర్వతమైనటువంటి ఉదయాద్రి పర్వతం కనపడుతుంది ఆ ఉదయాద్రి నూరు యోజనముల వరకు
విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటూంది బంగారు కాంతులతో ఉంటుంది దాన్ని కూడా దాటి
వెళ్ళితే సౌమనసమూ అనబడేటటువంటి ఒక ధృడమైన బంగారు శిఖరము విరాజిల్లూ కనబడుతుంది ఆ
సౌమానసి శిఖరము మీద వానఖిల్లులూ వైఖానసులు తపస్సు చేసుకుంటూ కనపడుతారు దాన్ని
దాటితే సుదర్శన ద్వీపం కనపడుతుంది, ఉదయగిరి నుంచి సౌమనస శిఖరము మీదికి చేరినంతనే ఆ
సూర్యభగవానుడు ఆ ద్వీపవాసులందరిలోనూ చైతన్యాన్ని కల్పిస్తాడు కాబట్టి దానికి
సుదర్శన ద్వీపమూ అని పేరు అక్కడే బ్రహ్మగారు మొట్ట మొదట ఒక ద్వారాన్ని ఏర్పాటు
చేశారు భూమండలానికి ʻప్రాగ్ʼ అన్న పేరు అందుకు
వచ్చింది. తూర్పు అన్న పేరు రావడానికి కారణం ఏమిటంటే అక్కడ నుంచే భూమికీ జగత్తున
ఉండేటటువంటి ద్వారము అక్కడుంది. మొట్ట మొదటి ద్వారాన్ని బ్రహ్మగారు అక్కడ పెట్టారు
అందుకే ఇప్పటికీ ఏ పూజ చేసినా తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే మనం పూజ చేస్తాము.
దేవతలందరూ అటునుంచే వస్తారు కాబట్టి ఆ ప్రాతిక్ అక్కడ
ప్రారంభమౌతుంది అక్కడ సూర్యభగవానుడి యొక్క మొట్టమొదట ఉదయించడం కిరణ ప్రసారం
ప్రారంభమౌతుంది అది దాటి వెళ్ళితే కటిక చీకటి ఇంక అక్కడేం ఉండదు సూర్యభగవానుడు
ఉదయించేటటువంటి ప్రాక్ ద్వారము వరకు మాత్రమే నాకు తెలుసు అక్కడి వరకే వెళ్ళాను అది
దాటి మీరు వెళ్ళలేరు మనకు కదరదు కాబట్టి ఇక్కడివరకు సీతమ్మ జాడ అంగుళం
విడిచిపెట్టకుండా వెతికిరండి ముప్ఫై రోజులలోపల తిరిగి రావాలి రాకపోతే
వధార్హుడౌతాడు కాబట్టి తూర్పు దిక్కుకు వెళ్ళే వానరాలు సిద్ధం కండీ అన్నాడు.
మహానుభావునికి ఎంత భౌగోళిక జ్ఞానమో... ఎన్ని చెప్పాడో చెప్పి తూర్పు దిక్కుకు
వెళ్ళే వానరములను సిద్ధం చేశాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరములను పిలిచి
మీరు వింధ్య పర్వతము దగ్గర నుంచి ప్రారంభం చెయ్యండీ అన్నాడు దానికి అంగదున్ని
నాయకుడిగా పెట్టాడు అందులో వెళ్ళవలసినవాళ్ళని చాలా గొప్ప గొప్ప యోధుల్ని పిలిచాడు
దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళని
నీలమ్ అగ్ని సుతం చైవ హనుమన్తం చ వానరమ్ ! హితామహ సుతం చైవ
జామ్బవన్తం మహా బలం !!
సుహోత్రం చ శరారిం చ శరగుల్మం తథైవ చ ! గజం గవాక్షం గవయం
సుషేణమ్ ఋషభం తథా !!
|
అంగద ప్రముఖాన్ వీరాన్ వీరః కపి గణేశ్వరః ! వేగ విక్రమ
సంపన్నాన్ సందిదేశ విశేషవిత్ !!
తేషామ్ అగ్రేసరం
చైవ మహత్ బలమ్ అసంగగమ్ ! విధాయ హరి వీరాణామ్ ఆదిశత్ దక్షిణాం దిశమ్ !!
|
ఆ తరువాత పాండ్యరాజుల నగరం వస్తుంది దాన్ని చూడాలి
సముద్రాన్ని లంఘించి దక్షిణ దిక్కున వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి
ఎందుకంటే అందులో నీడపట్టి లాగేటటువంటి సింధికా అన్న రాక్షసి ఉంది ఆ సముద్ర ఒడ్డున
మహేంద్రగిరి అనబడేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖరము ఉంది దానినుంచే స్వామి హనుమ
బయలుదేరుతారు. నూరు యోజనములు దూరంలో ఒక మహా ద్వీపం ఉంది ఆ మహాద్వీపాన్ని మానవ
మాత్రుడు చేరలేడు లంకా అన్న పేరు వాడలేదు వాడకుండా అక్కడ మాత్రం మీరు ప్రతి
అంగుళము అంగుళము పట్టి పట్టి శోధించండి అన్నాడు తెలుసు అది లంకా అని అది
రాక్షసరాజైన రావణుని ఆధీనములో ఉన్నటువంటి ప్రధాన భూమి కనుక మీరు అక్కడ చాలా బాగా
వెతకండి. వెళ్లేటప్పుడు మాత్రం సముద్ర మార్గంలో ఉండేటటువంటి సింహిక విషయంలో
జాగ్రత్త తీసుకోండి ఆ సముద్రమునందు పుష్పితకము అనబడేటటువంటి ఒక పర్వతము ఉంటుంది
అది చాలా శోభాయమాంగా ఉంటుంది. బంగారు శిఖరము ఒకటి సూర్యుడు తన కిరణములతో
ప్రకాశింపజేస్తూ ఉంటాడు. పక్కన వెండి శిఖరము ఉంటుంది దానిమీద చంద్రుడు తన కాంతులను
ప్రసరిస్తాడు పగటివేళ సూర్యకాంతిపడి బంగారు శిఖరము రాత్రి చంద్ర కాంతి పడి వెండి
శిఖరముగా ప్రకాశిస్తూంటుంది ఆ పర్వతము. ఆ పర్వతము మీదికి కృతఘ్నులు క్రూరులు
నాస్తికులు వెళ్ళడం కుదరదు అంత శక్తివంతమైన పర్వతం అది దాటాక సూర్యవంతమూ అన్న
పర్వతము అది దాటితే వైజితము అన్న పర్వతము కుంజరము ఆ తరువాత ఆ కుంజరమన్న కొండమీద
విశ్వకర్మ అగస్త్య మహర్షి వచ్చి నివశించడం కోసమనీ ఆశ్రమాన్ని నిర్మాణం చేశాడు అది
కూడా దాటిపోతే భోగవతీ అనే నది కనపడుతుంది అందులో మహాసర్పములన్నీ ఉంటాయి అందులో మహా
ప్రాజ్ఞుడైనటువంటివాడు సర్పములకు రాజైనటువంటి వాసుకి నివశిస్తుంటాడు అది దాటితే
ఋషభ పర్వతం వస్తుంది ఋషభ పర్వతము చందనములకు ఉత్పత్తి స్థానం ఆ చందన వృక్షములు
అగ్నివలే విరాజిల్లుతుంటాయి అక్కడ రోహితులనబడే గధర్వులుంటారు వాళ్ళు ఆ చందన
వృక్షాల్ని రక్షిస్తుంటారు మీరు ఎప్పుడూ కూడా ఆ చందన వృక్షాలను మాత్రం
ముట్టుకోకండి.
|
మీరు సౌరాష్ట్ర దేశము బాహ్లీక దేశము శూర భీమ ప్రదేశములు
విశాలములై గొప్పగా ఉండేటటువంటి జనపదములు మహా నగరములు పట్టణములు గ్రామములు అన్నీ
చూడాలి ఆ దిశగా ముందుకెళ్ళిన తరువాత సముద్ర తీరం కనపడుతుంది మొగలిపొదలు కానుగతోటలు
కొబ్బరితోటలు అన్నీ కూడా ఆ సముద్రపు ఒడ్డున ఉంటాయి. అవంతి అంగలోకాపురి అలక్షితవనము
మొదలైనటువంటి ప్రదేశాలు వెతకాలి, హేమమయిమైనటువంటి హేమగిరి అన్న పర్వతం కనపడుతుంది
నూరు శిఖరములతో ఉంటుంది ఎత్తైన వృక్షములతో ఉంటుంది అక్కడ వెతకాలి అక్కడ కొన్ని
కొన్ని విచిత్రమైన పక్షులు ఉంటాయి అవి సింహాలని ఏనుగులనీ తింటాయి ఆ పక్షులు తన
కాళ్ళకున్నటువంటి గోళ్ళతో ఎత్తి ఎనుగుల్ని తన్నుకపోయి గూట్లో పెట్టుకుని
తింటూంటాయి ఆ పక్షుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు అక్కడ
ఉండేటటువంటి ఏనుగులు మేఘములు ఎలా గర్జిస్తాయో అలా ఘీంకరిస్తుంటాయి మీరు ఆ
ప్రదేశములను వెతకాలి వానరముల జోలికి అవి రావు కాబట్టి మీరు అక్కడ చాలా జాగ్రత్తగా
వెతకాలి. పారియాత్రము అనబడేటటువంటి ఒక పర్వతము సముద్ర మధ్యంలో కనపడుతుంది ఆ పర్వతం
మీద ఉన్నటువంటి గ్రామాలు అవీ అన్నీ కూడా మీరు వెతకి రండి అది దాటిన తరువాత
వజ్రగిరి అనబడేటటువంటి ఒక ఉన్నతమైన పర్వతం సముద్ర గర్భంలో ఉంటుంది ఆ పర్వత
శిఖరమంతా వెతికిరండి అది దాటిన తరువాత చక్రవంతము అనబడేటటువంటి మహాశైలము దానిపైన
విశ్వకర్మ వేయి అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని అక్కడే తయారు చేశారు.
హయగ్రీవుడు తరువాత కొంతమంది పంచజనులు అనబడేటటువంటి
రాక్షసుల్ని శ్రీమహావిష్ణువు అక్కడే చంపాడు, హయగ్రీవుడు అన్న పేరుకూడా ఉన్న
రాక్షసుడున్నాడు సంహారించి ఆ పాంచజన్యుని దగ్గర పుచ్చుకున్నటువంటి శంఖమునకీ పాంచజన్యమూ
అని పేరు. అక్కడే విశ్వకర్మ తయారు చేసినటువంటి వేయి అంచులుకలిగిన సహస్రాకార చక్రాన్ని
ఆ సుదర్శన చక్రాన్ని శ్రీమహావిష్ణువుకి విశ్వకర్మ బహూకరించాడు. అది దాటితే
వరాహగిరి బంగారు శిఖరములతో విలసిల్లుతూంటుంది అక్కడ ప్రాగ్జ్యోతిష పురం
అనపడేటటువంటి పురం ఉంది దాన్ని నరకాసురుడు పరిపాలిస్తూంటాడు పరమ దుష్టాత్ముడు చాలా
జాగ్రత్తగా ఉండండి, అన్ని దాటితే సర్వసవ్వర్ణ పర్వతం వస్తుంది ఆ గుహలలో
అనేకమైనటువంటి విశాలమైనటువంటి ప్రాంతములు అందులో అనేకమంది ఉంటారు అక్కడ ఏనుగులు
వరాహములు అన్నీ ఘీంకరించి గర్జిస్తుంటాయి మీరు ఆ ప్రాంతములన్నీ వేతకండి వేఘవంతమూ
అనేటటువంటి పర్వతము ఉంటుంది ఆ గిరిపైన మహేంద్రున్ని కూర్చోబెట్టి సురరాజుగా దేవతలు
పట్టాభిషేకం చేశారు, పచ్చని గుఱ్ఱములు కలిగిన దేవేంద్రు అక్కడే పదవినిపొందాడు మీరు
ఆ ప్రాంతాన్ని కూడా వెతకండి అది కూడా దాటితే వేఘవంతమూ అనబడేటటువంటి పర్వతాన్ని దాటివెళ్తే
బంగారుకొండలు మీకు కొన్ని కనపడుతాయి ఆ బంగారు కొండల మధ్యలో మేరుగిరి మీకు దర్శనం
ఇస్తుంది ఆ మేరుగిరి దగ్గర విశ్వీదేవతలు మరుత్గణములు అష్టవషువులు ఇతర దేవతలూ సాయం
సమయంలో ఆ మేరు పర్వతం మీద నిలబడి దగ్గరికి వచ్చి అస్తమిస్తున్నటువంటి
సూర్యభగవానుని ఉపాసన చేస్తుంటారు మీరు ఆ అష్టాద్రిని చేరుకొని పశ్చిమ దిక్కున
సూర్య భగవానినికి నమస్కారం చేయండి అక్కడ విశ్వకర్మ నిర్మించినటువంటి ఒక గొప్ప భవనం
ఉంది అది అనేక మేడలతో వరుసలతో తాంతులతో విరాజిల్లుతూంటుంది అక్కడే వరుణుడూ
అనబడేటటువంటి మహానుభావుడు పాశహస్తుడు పశ్చిమ దిక్కుకి అధిపతియైనటువంటివాడు
ఉన్నాడు.
|
పిలుస్తూనే అన్నాడు ఉత్తర దిక్కున అసలు లోకములకన్నిటికి
భూమండలానికంతటికీ కూడా ఆభరణముగా భాషిల్లేటటువంటి హిమాలయా పర్వత శిఖరములు ఉన్నాయి,
తాపసులందరు హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు గొప్ప పుణ్యభూమి మీరు చాలా జాగ్రత్తగా
బయలుదేరండి ఆ హివత్ పర్వతం అనేటటువంటిది ఈ లోకానికి ఒక దివ్యాభరణం మీరు ఉత్తర
దిక్కుకు వెళ్ళేటప్పుడు మ్లేచ్ఛా దేశము పుళింద, శూరసేన రాజ్యము ఇంద్రప్రస్థము,
ఇంద్రప్రస్థము అంటే ఢిల్లీ దక్షిణ కురు భూములు కురుక్షేత్రాది ప్రాంతములు మద్రకే
దేశములు కాంభోజ రాజ్యములు యవనలు భూములు శకలు దేశములు ఆరట్టకా దేశములు బాహ్లీక
రాజ్యములు ఋషికా ప్రదేశములు కురాజభూములు దేశములు టంకణా దేశములు చీనా పరమ చీనా
భూములు కురు కోసల కాశీ వంచి మల్లా అంగ మగధా మచ్చా దేశీ అవంతి గాంధారా కాంభోజా
సౌరాష్ట్రా ఆశ్మకా మొదలైన రాజ్యాలు హిమవత్ పర్వత ప్రాంతాలు అనేకములైనటువంటి పద్మక
వృక్షాలు దేవదారు వృక్షాలు వనాలు సోమాశ్రమం కాళ పర్వతము హేమాంతము
సుదర్శనమనేటటువంటి పెద్ద కొండ భీమశకము అనేటటువంటి ఒక పెద్ద పర్వతము అది దాటిన
తరువాత వంద యోజనములు వెళ్ళిపోతే ఇంక అంతా
ఒక సూన్యక ప్రదేశం కనపడుతుంది అక్కడ ఇంక జీవులు ఎవ్వరూ తిరుగుతుండరు ఎడారి ప్రాంతం
అటువంటి ప్రాంతం కనపడుతుంది మీరు అది కూడా దాటి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి తరువాత ఒక
దుర్గమమైన అరణ్యం కనపడుతుంది ఆ అరణ్యంలో తెల్లని కాంతులతో విలసిల్లేటటువంటి కైలాస
శిఖరముల యొక్క కాంతి మీకు కనపడుతూంటుంది దాంట్లో బాగా ముందుకు వెళ్ళితే విశాలమైన
సరస్సు ఉంటుంది.
|
అది దాటితే అవృక్షం అనబడేటటువంటి ఒక పెద్ద పేరు
కలిగినటువంటి కామ శైలం అన్న మారు పేరు ఉన్న పెద్ద మానస పర్వతం కనపడుతుంది అక్కడంతా
వెతకాలి, అది దాటితే మైనాకమనే పర్వతం కనపడుతుంది మయుడు అనేటటువంటి దానవుడు దాన్ని
నిర్మించుకున్న భవనం కనపడుతుంది అది దాటి వెళ్ళిపోతే మైనాక పర్వతం మీద మీకు ఒక
గొప్ప ప్రవిత్రమైన ఆశ్రమం కనపడుతుంది అక్కడ ఎందరో తపస్సులు చేస్తుంటారు వైఖానసమనేటటువంటి
సరస్సు అందులో బంగారు కలువలు ప్రకాశిస్తుంటాయి అది కూడా దాటి వెళ్ళిపోతే కుభేరుని
యొక్క గజ వాహనము సార్వభౌమము అనబడేటటువంటి ఏనుగు అక్కడ ఆ ప్రదేశంలో మీకు తిరుగుతూ
కనపడుతూంది అది కూడా దాటి మీరు వెళ్ళిపోతే శైలోదము అనబడేటటువంటి నది వస్తుంది ఆ
నది ఒడ్డున కీచకములు అనబడేటటువంటి వెదుళ్ళు ఉంటాయి ఆ వెదుళ్ళు వంగి పరస్పరము
ఒకదాని ఒకటి ఇలా ఆనుకొని వంతెనా ఉంటాయి.
మీరు ఆ వంతెనల మీద జాగ్రత్తగా నడవాలి నడిచి ఆవలి ఒడ్డుకు
చేరాలి అక్కడ ఉత్తర కురు దేశములు ఉంటాయి ఆ కురు దేశముల నదులూ అన్నీ వెతకాలి అది
దాటిన తరువాత నదులలోకి చొచ్చుకుని ఉన్నటువంటి అగ్నిశిఖలులాంటి పర్వతాలు రక్తమయమై
కనపడుతాయి వీరు ఆ పర్వతాలన్నీ వెతకాలి అక్కడ ఉండేటటువంటి వృక్షములన్నీ పక్షుల
గుంపులకి ఆవాసములు మీరు ఆ ప్రదేశాలన్నీ వెతకాలి అక్కడ ఉండేటటువంటి కొన్ని వృక్షాలు
మనుష్యులకు కావలసినటువంటి వస్త్రాల్నీ ఆభరణాల్నీ కూడా ఇస్తూంటాయి మీరు ఆ వృక్షముల
యొక్క అనుగ్రహంతో అవన్నీ పుచ్చుకుని చక్కగా ధరించండి.
అది దాటిన తరువాత గంధర్వులు కిన్నెరులు నాగులు కింపురుషులు స్త్రీలతో
ఆనందిస్తున్నటువంటి తేజస్సంపన్నమైన వ్యక్తులు మీకు అక్కడ కనపడుతారు అవన్నీ చూడండి
అది దాటిన తరువాత ఎంతో పుణ్యం చేసినటువంటివాళ్ళు అక్కడ భోగాన్ని అనుభవిస్తూ
కనపడుతారు అది దాటితే ఉత్తర దిక్కున లవణ సముద్రము వస్తుంది ఆ సముద్రం మధ్యలో
సోమగిరీ అనేటటువంటి ఒక పర్వతం ఉంటుంది అది సువర్ణమయం ఆ ఇంద్రలోకం బ్రహ్మలోకంలో
ఉండేటటువంటి దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఆ పర్వతాన్ని చూస్తుంటారు అంత అందంగా
ఉంటుంది అక్కడే విశ్వాత్ముకుడైనటువంటి విష్ణుభగవానుడు ఏకాదశ రుద్ర స్వరూపం
కలిగినటువంటి శంకరభగవానుడు సృష్టికర్తయైన బ్రహ్మ ముగ్గురూ అక్కడ నివశిస్తుంటారు
అందుకే ఉత్తర దిక్కుకి చేసేటటువంటి నమస్కారం అంత గొప్ప నమస్కారమయ్యింది.
|
అప్పటినుంచి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాను అందుకని నాకు ఈ
భూమండలం గురించి జ్ఞానం కలిగింది అని చెప్పారు తరువాత హనుమని పిలిచారు విశేషేణ
తు సుగ్రీవో హనూమతి అర్థమ్ ఉక్తవాన్ ! స హి తస్మిన్ హరి శ్రేష్ఠే నిశ్చితాఽర్థోఽర్థ సాధనే !! ఇన్ని కోట్ల మంది
వానరములను నాలుగు దిక్కులకూ పంపించినప్పటికీ అర్థసాధకుడైనవాడు సీతమ్మజాడ
కనిపెట్టగలిగినవాడు హనుమ ఒక్కరే అని సుగ్రీవుని యొక్క నమ్మకం న భూమౌ న అన్తరిక్షే
వా న అమ్బరే న అమరాలయే ! న అప్పు వా గతి సంగం తే పశ్యామి హరి పుంగవ !! దేవ
లోకాలలోకాని ఈ లోకాలలోకాని గంధర్వలోకాలలోకాని నీకు తెలియని ప్రాంతం నీకు
తెలియనివారు ఎవ్వరూ లేరు కాబట్టి
సః అసురాః సహ గన్ధర్వాః సనాగ నర దేవతాః ! విదితాః సర్వ లోకా
స్తే ససాగర ధరా ధరాః !!
గతి ర్వేగ శ్చ తేజ శ్చ లాఘవం చ మహా కపే ! పితు స్తే సదృశం
వీర మారుత స్య మహౌజసః !!
త్వయి ఏవ హనుమన్
అస్తి బలం బుద్ధిః పరాక్రమః ! దేశ కాలాఽను వృత్తి శ్చ నయ
శ్చ నయ పణ్డిత !!
ఇది హనుమ యొక్క గొప్పతనం అందుకే కిష్కింధ కాండలో ఉన్నటువంటి
హనుమ యొక్క వైభవాన్ని విన్నంత మాత్రం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇందులో
ఆయన ఒక మాట అంటున్నారు గతి ర్వేగ శ్చ తేజ శ్చ లాఘవం చ మహా కపే నీకు
విశేషమైనటువంటి వేగం ఉంది, గొప్ప గతి తెలిసున్నటువంటివాడివి లాఘవం చ మహా కపే ధూకడం
కూడా తెలిసున్నవాడివి పితు స్తే సదృశం వీర మారుత స్య మహౌజసః నీకు నీ
తండ్రియైన వాయువుకి ఎంత గమన శక్తి ఉందో ఎంత వేగముందో అంత వేగమున్నవాడివినీవు దేశ
కాలములను త్వయి ఏవ హనుమన్ అస్తి బలం బుద్ధిః పరాక్రమః
! దేశ కాలాఽను వృత్తి శ్చ నయ శ్చ నయ
పణ్డిత !! నీవు దేశ కాలములను
బాగా తెలిసున్నవాడివి ఎక్కడ ఏది చెయ్యాలో ఏ సమయంలో ఏది చెయ్యాలో బుద్ధి
పరాక్రమమున్నవాడివి ఇది లేనివాడు బుద్ధి ఉంటే సరిపోదు పరాక్రమం ఉండాలి పరాక్రమం
ఉంటే సరిపోదు బుద్ధి ఉండాలి బుద్ధి పరాక్రమం ఉంటే ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి
అందుకే శ్రీరామాయణంలో గొప్పతనమేమిటో తెలుసాండీ ఇంత బలమున్న హనుమా పిల్లి పిల్లాగా
లంకలో తిరిగాడు ఆయన పిల్లి పిల్లంతవారై తిరిగారు లంకలో పృషదంశక మాత్రః సన్
బభూవాఽద్భుత దర్శనః అంటారు, పిల్లి పిల్లంత రూపంతో తిరిగారు కారణం
ఏమిటో తెలుసా... అది నిశ్శబ్ధంగా తిరగగలదు అంత చిన్న రూపంతో తిరగగలదు దేశ కాలాఽను వృత్తి శ్చ నయ
శ్చ నయ పణ్డిత అంతే తప్పా
ఎప్పుడూ తన వైభవమే ప్రకటింపబడాలంటే పేద్ద పర్వతాకారంతో తిరిగితే దొరికిపోతారు
కాబట్టి నీకూ ఈ జ్ఞానము ఈ బుద్ధి
కలిగినవాడివి కాబట్టి హనుమా నీ వలలనే ఈ కార్యము సాధింపబడాలి.
|

అంగుళీయమ్ అభిజ్ఞానం రాజ పుత్ర్యాః పరంతపః !
అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాఽఽత్మజా ! మ
త్సకాశాత్ అనుప్రాప్తమ్ అనుద్విగ్నా అనుపశ్యతి !!
వ్యవసాయ శ్చ తే వీర సత్త్వయుక్త శ్చ విక్రమః ! సుగ్రీవ స్య
చ సందేశః సిద్ధిం కథయతీవ మే !!
స తత్ గృహ్య హరి
శ్రేష్ఠః స్థాప్య మూర్ధ్ని కృతాఽజలిః ! వన్దిత్వా చరణౌ చైవ
ప్రస్థితః ప్లవగోత్తమః !!
ఓ వీరుడా! నీ కార్యోత్సాహము సాహసము పరాక్రమము నేను ఇప్పుడు
సుగ్రీవుడు నీమీద పెట్టుకున్న నమ్మకం వల్ల తెలుసుకున్నాను నీవే ఈ కార్యమును
సాధించగలవు సీతమ్మ జాడ కనిపెట్టగలవు, సీతమ్మజాడ కనిపెట్టిన తరువాత సీతమ్మ నీతో
మాట్లాడటానికి ఈ ఆభరణం పనికొస్తుంది ఇది చూపిస్తే సీతమ్మ నీతో అరమరిక లేకుండా
మాట్లాడుతుంది కాబట్టి ఈ ఉంగరాన్ని గ్రహించు అని స్వామి తన చేతి ఉంగరాన్ని తీసి
స్వామి హనుమ చేతిలో ఉంచారు. వెంటనే ఆయన ఉంగరాన్ని
కళ్ళకు అద్దుకుని
తన శిరస్సులో పెద్దగా పెరిగిన జుట్టు ముడిలోకి తలలోకి దోపుకుని ఆ ఉంగరాన్ని తలలోకి
పెట్టుకుని శిరసా రామ చంద్ర మూర్తికి నమస్కరించారు. తప్పా ఇంత గొప్పవాన్ని రాముడు నమ్మాడు సుగ్రీవుడు
నమ్మాడని అహంకరించలేదు అంత వినయశీలి హనుమ అందుకే ఈ ఘట్టం రామ చంద్ర మూర్తి
సీతమ్మకి అందరికి ఈఘట్టం మంగళం వైపుకి తిరుగుతున్నటువంటి ఘట్టం అందరికీ కాబట్టి
ఇప్పుడు పట్టుకుని బయలుదేరారు, అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు నెల రోజుల
తరువాత తిరిగి వచ్చేశాయి వచ్చేసి అందరూ చెప్పారు వేము వెళ్ళాము కానీ ఎక్కడా
సీతమ్మజాడ కనపడలేదు అన్నారు. ఒక్క దక్షిణ దిక్కునకు వెళ్ళినటువంటి వానరముల యొక్క
సమూహం మాత్రం తిరిగి రాలేదు వాళ్ళు అలా వెళ్ళుతూ ఉండగా ఒక నిర్జనమైన ప్రదేశం
కనపడింది దక్షిణ దిక్కున ఖండువు అన్న మహర్షి పదహారు సంవత్సరముల కుమారుడు ఒక వనంలో
మరణించాడు ఆయనకు కోపమొచ్చి నాకుమారుడు ఇక్కడ మరణించాడు కనుక ఇక్కడ జనవాసము
ఉండకుండుగాక అని శపించారు అందుకని అక్కడ ఏవీ ప్రాణులు లేవు వాళ్ళు ఆ వనంలో
తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మిక్కిలిగా
దాహం కలిగింది వాళ్ళకి ఒక రాక్షసుడు కనపడితే రావనుడనుకొని అంగదుడు మర్థించాడు ఆయన
నెత్తురు కక్కుకుని చచ్చాడు.
|

తరుణాఽఽదిత్య సంకాశాన్ వైడూర్య మయ
వేదికాన్ ! విభ్రాజ మానాన్ వపుషా పాదపాం శ్చ హిరణ్మయాన్ !!
నీల వైడూర్య వర్ణా శ్చ పద్మినీః పతగైః అవృతాః ! మహద్భిః
కాంచనైః వృక్షైః వృతం బాలాఽర్క సన్నిభైః !!
జాతరూప మయైః మత్త్స్యెః మహద్భి శ్చ సకచ్ఛపైః ! నళినీ స్తత్ర
దదృశుః ప్రసన్న సలితా వృతాః !!
కాఙ్చంచనాని విమానాని రాజతాని తథైవ చ ! తపనీయ గవాక్షాణి
ముక్తా జాలా వృతాని చ !!
హైమరాజత భౌమాని వైడూర్య మణిమన్తి చ ! దదృశు స్తత్ర హరయో గృహ
ముఖ్యాని సర్వశః !!
పుప్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళ మణి సన్నిభాన్ ! కాంచన
భ్రమరాం శ్చైవ మధూని చ సమన్తతః !!
మణి కాంచన చిత్రాణి
శయనా న్యాఽఽసనాని చ ! మహాఽర్హాణి చ యానాని
దదృశు స్తే సమన్తతః !!
వాళ్ళు ఆ వనంలో చూసేటప్పటికి ఒక గొప్ప సరోవరం అందులో చాపలు
తాబేళ్ళు పెద్ద పేద్ద చెట్లు పళ్ళు వాటికి తేనె పట్లు అక్కడే బంగారముతో
అమర్చబడినటువంటి గొప్ప గొప్ప ఆ ఆసనములు తల్పములు ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు
ఆశ్చర్యపోయి నీళ్ళు తాగుదామని పోయినవాళ్ళు కూడా నీళ్ళు తాగకుండా తిందామని
వెళ్ళినవాళ్ళు తినకుండా ఆశ్చర్య చకితులై ఇంకసలు ఈ మాయా స్వరూపమైన వనమేమిటీ ఈ
బిలమేమిటీ అని అలా చూస్తూ ఉండిపోయారు ఇంతలో వాళ్ళకి తాం దృష్ట్వా భృశ
సంత్రస్తాః చీర కృష్ణాఽజినాఽమ్బరామ్ ! తాపసీం
నియతాఽఽహారం జ్వలన్తీమ్ ఇవ తేజసా !! చీర కృష్ణాజినాంబరమ్
కట్టుకున్ని ఉన్నటువంటి ఒక తాపసి మెరుపు తీగ ఎలా ఉంటుందో అగ్ని యొక్క శిఖ ఎలా
ఉంటుందో అటువంటి తల్లి ఒకావిడ దర్శనమైంది. వాళ్ళు అభివాదం చేసి ఆవిడని అమ్మా మేము
ఆకలి దప్పులతో ఉన్నాము అంటే మీరు ఎవరు ఎందుకొచ్చారు అని అడిగింది హనుమ ఎక్కడెక్కడ
రామ కథ ఎంత చెప్పాలో అంత చెప్తూంటాడు ఆ తల్లితో తాము ఏ కార్యంమీద బయలుదేరారో దశరథ
మహారాజుగారి పుత్రులైనటువంటి రామ లక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చి సీతమ్మజాడ
తెలియకుండా రాక్షసుడు అపహరిస్తే ఆ జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుని తరుపున అన్ని
దిక్కులకూ పంపబడిన వానరులలో దక్షిణ దిక్కుకు పంపబడిన అంగదుని నాయకత్వంలో వచ్చిన
మేము సీతమ్మ తల్లి జాడ వెతుకుతూ ఆకలి దప్పులకు లోనైనవాళ్ళమై తడి రెక్కలతో కూడిన
పక్షులు బిలంలోంచి బయటికి వస్తూంటే ఇక్కడ లోపల నీళ్ళు దొరుకుతాయని లోపలికి
ప్రవేశించామమ్మా మాకు ఆకలిగా ఉంది తల్లీ ఈ బిలమేమీ అని అడిగారు. అడిగితే ఆ తల్లి
చెప్పింది అప్పుడు
|
పురా దానవ ముఖ్యానాం విశ్వకర్మా బభూవ హ ! యేన ఇదం కాంచనం
దివ్యం నిర్మితం భవనోత్తమమ్ !! ఆయనా
సతు వర్ష సహస్రాణి తప స్తప్త్వా మహావనే ! పితామహాత్ వరం
లేభే సర్వమ్ ఔశసనం ధనమ్ !!
దుహితా మేరుసావర్ణేః అహం తస్యాః స్వయంప్రభా ! ఇదం రక్షామి
భవనం హేమాయా వానరోత్తమ !!
మమ ప్రియ సఖీ హేమా
నృత్త గీత విశారదా ! తయా దత్త వరా చాఽస్మి రక్షామి
భవనోత్తమమ్ !!
అని ఆతల్లి బిలం యొక్క రహస్యాన్ని చెప్పింది. ఇక్కడ పూర్వం
ఒక దానవ రాజైనటువంటి మయుడు అనేటటువంటివాడు ఉండేవాడు ఆయనా బ్రహ్మగారి గురించి గొప్ప
తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని అడిగాడు ఆయనా నాకు గొప్ప
శిల్పశాస్త్రం రావాలి అన్నాడు ఆయనా ఆ శిల్పశాస్త్రాన్ని శుక్రాచార్యుల నుండి
పొందారు పొంది ఆయన అప్పటి నుంచి దానవులందరికీ భవనములను నిర్మాణము చేశాడు అంత గొప్ప
మయుడు ఇంతగొప్ప ప్రాంగణాన్ని ఇక్కడ నిర్మించాడు. నిర్మించి హేమ అనబడేటటువంటి ఒక
అప్సరసతో ఆయన ఇక్కడ గడుపుతూండేవాడు ఆయన ఆ అప్సరసయందు అనురక్తి కలిగి ఉండడాన్ని
సహించనటువంటి ఇంద్రుడు ఆ మయున్ని సంహరించాడు ఆ మయుడు ఈ భవన ప్రాంగణాన్నంతటికినీ
హేమకి ఇచ్చాడు. హేమ స్వర్గలోకానికి వెళ్తూ దీనికి కాపుగా నన్ను ఉంచింది. నా పేరు
స్వయం ప్రభ అనే పేరు కలిగినటువంటి నేను ఈ ప్రాంగణాన్ని భవనాన్ని రక్షణ చేస్తూంటూను
నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని అని చెప్పి ఇమాన్ అభ్యవహార్యాణి మూలాని చ
ఫలాని చ ! భుక్త్వా పీత్వా చ పానీయం సర్వం మే వక్తుమ్ అర్హథ !! మీరు ఇక్కడ
ఉన్నటువంటి ఈ కంధమూలాల్నీ తిని నీరు తాగండీ అని ఆ వచ్చినటువంటి వానరములకు
పెట్టింది ఆయనా ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ పళ్ళు కందమూలములు తిని నీళ్ళు తాగి
ఉపశాంతి పొందారు.
అమ్మా మేము ఇప్పుడు బయటికి వెళ్ళిపోతామమ్మా సీతాన్వేషణం
చెయ్యాలి అన్నారు అంటే ఆ తల్లి అందీ ఈ బిలంలోకి రావడమే కానీ మళ్ళీ వెళ్ళడం అంటూ
ఉండదు అంది. ఇంక మళ్ళీ వెళ్ళడమంటే ప్రాణాలుపోవడమే కాబట్టి ఇక వెళ్ళడమంటూ ఉండదు
ఇక్కడ ఉండడమే. అమ్మా మేము సీతమ్మతల్లి జాడ అన్వేషించడానికి వచ్చిన వానరులమమ్మా రామ
కార్యం మీద వచ్చాము తల్లీ అనుగ్రహించూ అన్నారు రామ కార్యము అంటే అలా ఉపకారం
చేస్తారు, రామ కార్యంలో ఉపకారం చెయ్యనన్నవాడు మీకు ఎవరూ కనపడరు కాబట్టి ఏవమ్
ఉక్తా హనుమతా తాపసీ వాక్యమ్ అబ్రవీత్ ! జీవతా దుష్కరం మన్యే ప్రవిష్టేన
నివర్తితుమ్ !! తపస స్తు ప్రభావేన నియమోపార్జితేన చ ! సర్వాన్ ఏవ బిలాత్ అస్మాత్
ఉద్ధరిష్యామి వానరాన్ !! నేను అనేకమైన నియముములను పాటించి చేసిన తపస్సుని
ఫణంగా పెట్టి ఇందులోకి వస్తే ఇంక బయటికి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి మీరు రామ
కార్యం మీద సీతాన్వేషణానికి వచ్చిన వానరులు కాబట్టి మిమ్మల్ని అందర్నీనేను పైకి
దింపేస్తాను మీ అందరు కన్నులు మూసుకోండి అంది వాళ్ళందరూ కన్నులు మూసుకున్నారు,
మూసుకున్న తరువాత ఆ తల్లి తన తపః శక్తితో వాళ్ళందర్నీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా
చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి వానరాలు అన్నీ కలిసి కూర్చుని చూశాయి వసంత
ఋతువు వచ్చినటువంటి చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి, కనపడితే నెల దాటిన తరువాత
తిరిగివస్తే చంపేస్తానని అన్నాడు.
|
అందరం విడిచిపెట్టేద్దాం దానికి తొందరేముంది అందర్నీ
చంపేస్తాడుగా కాబట్టి వెళ్ళద్దు ఇక సుగ్రీవుని దగ్గరికి అన్నారు, తారుడన్న వానరుడు
లేచి అన్నాడు నిజమే అంగదుడు చెప్పింది మనం వెనక్కి వెళ్ళేకన్నా ఈ బిలంలోకి ఎవ్వరూ
ప్రవేశించలేరు కాబట్టి మనం హాయిగా మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి అక్కడ ఆ స్వయం
ప్రభా బిలంలోకి చక్కగా అన్ని కందమూలాలు దొరుకుతున్నాయి తేనె దొరుకుతుంది నీళ్ళు
దొరుకుతున్నాయి సుఖంగా అక్కడే ఉందాం అక్కడే తిందాం అక్కడే తాగుదాం ఎప్పుడు చావొస్తే
అప్పుడు పోదాం తప్పా వెనక్కెళ్ళి చావమని ఎవడు చెప్పాడు కాబట్టి అందరం ఇందులోకి
వెళ్ళిపోదాం అన్నారు. వానరులు కదాండి చపలచిత్తులు అందరూ నిజమే అంటే నిజమే అన్నారు
రండి మళ్ళీ వెళ్దాం స్వయం ప్రభా బిలంలోకి సంతోషంగా ఉందామూ అన్నారు. అలా వాళ్ళు
అందరూ సంతోషంగా ఉన్నారన్న సంతోష కరమైన ఘట్టం దగ్గర ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని పూర్తి
చేస్తాను, ఇక రేపటి నుంచి వచ్చే ఘట్టాలన్నీ కూడా చాలా చాలా శక్తివంతములైన
ఘట్టములు.
ఇక్కడ నేను చెప్పేటటువంటి మాట ఒకదాన్ని మీరు కొంచెం
శ్రద్ధాళువులై ఆసక్తితో వినేటటువంటి ప్రయత్నం చెయ్యండి ఇక దీని తరువాత స్వామి
హనుమకి శాప విమోచనం కలుగుతుంది పైగా చాలా కీలకమైనటువంటి ఘట్టాలు నడుస్తాయి రాబోయే
రెండు రోజులు తదనంతరము సుందర కాండ ప్రారంభమౌతుంది. సుందర కాండ ప్రారంభమౌతుంది
కాబట్టి సుందర కాండ ఏడురోజుల పాటు జరుగుతుంది అన్ని కాండలు నేను ఒక్కొక్క కాండ ఏడు
రోజులకు సర్దుకుంటూ వస్తున్నాను సుందర కాండ కూడా ఏడు రోజులు చెప్తాను నేను మీతో ఓ
చిన్న సూచన చేస్తాను సుందర కాండ జరిగేటటువంటి రోజులలో మీలో ఎవరైనా దాని యొక్క
ఫలితాన్ని ద్విగుణీకృతంగా పొందుదాము అన్నుకున్నవాళ్ళుంటే ఎందుకంటే సుందర కాండ
సామాన్యమైన కాండ కాదు మీరు ఎప్పుడూ వినే ఉంటారు నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు
ఎలాగో సుందర కాండలో చెప్తాము. అత్యంత శక్తివంతమైన కాండ లోకంలో ఎటువంటి సమస్యకైనా
పరిష్కారం ఇవ్వగలిగినవి రెండు అని చెప్తారు పెద్దలు ఒకటి సుందర కాండ రెండు
సౌందర్యలహరి ఇంక మూడోది లేదు అంత శక్తివంతము సుందర కాండ. కాబట్టి ఏడు రోజుల పాటు
సుందర కాండ నడుస్తుంది ఆ సుందర కాండ నడిచే రోజుల్లో చాలా చాలా విశేషమైనటువంటి
కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆలయంలో ప్రత్యేకించి హా... నేను అది ఎలా పూర్తి
చేద్దామనుకున్నానంటే... ఆ ఏడు రోజులు అయ్యో ఇయ్యన మనకి దొరకలేదు ఈయ్యన్ని మనం
అడగడానికి కుదరలేదు అని అనుకోవద్దు.
|
నేను ఇదీ ఏదో నేను చెప్తున్నట్లు నేను చెప్తున్నాను మీరు
వింటున్నారని చెప్పట్లేదు నేను సుందర కాండ చెప్పడమూ అంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను
సుందర కాండ ఎవ్వరూ లేకుండా కేవలం ఒక్క వ్యక్తికో ఇద్దరు వ్యక్తులనో
కూర్చోబెట్టుకుని నేను సుందర కాండ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకనీ అంటే
వాళ్ళకోసం కాదు నాకోసం నేను ఎప్పుడు చెప్పుకున్నా ఒకడిని ఉద్దరిస్తానని చెప్పుకోను
నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానని చెప్పుకుంటాను అంతే. కాబట్టి ఎంతమంది ఉండాలి
అన్నది నాకు ఎప్పుడు నియమం లేదు పరీక్షిత్తుకి మహానుభావుడు శుకుడు ఎంతమంది ఉన్నారు
ఒక్కడే ఉన్నారు ఆదిత్యహృదయం అగస్త్యమర్షి చెప్పడానికి ఎవరున్నారు రాముడొక్కడికే
చెప్పారు అలాగే భగవద్గీత అన్ని లక్షల మంది యోధులుంటే ఎంత మందికి చెప్పారు ఒక్కరికే
చెప్పారు నీకెందుకు సభలో కొన్నివేలమంది ఉండాలన్ని కోరిక, ఎవరు అర్హులో ఎవరు
పాత్రులో రామ చంద్ర మూర్తి నిర్ణయం చేస్తారు. కాబట్టి ఏడు రోజులు సుందర కాండని
దీక్షగా విందామనుకున్నవాళ్ళు చక్కగా నియమాన్ని పాటించండి బ్రహ్మచర్యాన్ని
పాటించండి పాటించి ఆ ఏడు రోజులు పూర్తైపోయిన తరువాత మీరు ఒక్కసారి రామ చంద్ర
మూర్తి పట్టాభిషేక సర్గ ఉంటుంది చిన్న సర్గ, సుందర కాండ తరువాత అది ఒక సారి
చదువుకోవడం చేసేసి లేకపోతే సింహాసనం మీద సీతా రాములు కూర్చున్నారు పట్టాభిషేకం
అయిపోయింది అని స్మరణ చేసి అప్పాలు నైవేధ్యం పెట్టి పులిహారా అప్పాలు ఈశ్వరుడికి
నైవేధ్యం చేసి మీరు దీక్షా విరమణ చేయవచ్చు.
నేను మీతో మనవి చేసే విషయమేమిటంటే రేపటి నుంచి జరగబోయే
ఘట్టాలన్ని కూడా ఇంక చాలా ఉత్కృష్ఠమైనటువంటి స్థితిలో ఉంటాయి ఇక సామాన్యమైనవికావు
అందులో చాలా శ్లోకాలు మంత్రము యొక్క స్థితిని పొందేస్తాయి. ప్రత్యేకించి సుందర
కాండ నుంచి అందులో ఆ ఘట్టాలు విన్నంత మాత్రం చేత శక్తినిస్తాయి నేను నా జీవితములో
అనేక పర్యాయములు వాటిని అనుభవించి ఉన్నాను నాకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళకు కూడా
వాటి వైభవమేమిటో తెలుసు మా గోపాల కృష్ణగారు అనేక పర్యాయాలు వాటి శక్తేమిటో
చూసినవారు కానీ నాకు వ్యక్తిగతమైన అనుభవాలు వేదికలమీద చెప్పడమన్నది సుతారము దూరంగా
ఉంటాను. కాబట్టి మీరు నన్ను నమ్మండీ చాలా గొప్ప ఘట్టం. నేను ఎందుకీమాట
చెప్తున్నానంటే అయ్యోమాకు తెలియలేదండీ ఇంతగొప్పదనీ చెప్పేటప్పుడు చెప్పావు,
చెప్పేముందు చెప్పుంటే మేము ఏవైనా ఇతర పనులు సర్దుకుని వినుండేవాళ్ళం అని మీరు
అంటారేమో ఆ దోషం నాకు రాకూడదూ అని మీకు చెప్పానంతే కాని మిమ్మల్ని నిగ్రహించడమో
ఇంకొకటి చేయడమో నా ప్రయోజనం కాదు. కాబట్టి ఇంక రేపటి నుంచి శ్రీరామాయణం
పూర్తైపోయేవరకూ చాలా విశేషమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవ్వాళ అభయ కోదండరామ
స్వామి దేవస్థానం 21-05-1975వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేయబడింది వైశాఖశుద్ధ
ఏకాదాశినాడు పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి మహానుభావులు పరమహంసపరివ్రాజకాచార్యు
శ్రీ శ్రీ శ్రీ మధవినోధ్యండ నృసింహభారతి స్వామివారిచే ప్రతిష్ఠ చేయబడింది. దేవాలయ నిర్మాణము మరియు
ప్రతిష్ఠా శ్రీ నంబూరి కాశీవిశ్వనాథం గారి ఆధ్వర్యంలో జరిగిందట. ఇవ్వాళ ఉన్న
ఏకాదశికి చాలా శక్తి కలిగిన ఏకాదశిని మోహనైక ఏకాదశి అని పిలుస్తారు ఎందుచేతా అంటే
ఇవ్వాళ మీరు ఏదైనా సరే ఈశ్వర కార్యాన్ని చేశారనుకోండి ఏ చిన్న పని భగవత్ సంబంధంగా
చేసినా వెళ్ళి భగవంతున్ని దర్శనం చేసుకున్నా ప్రసాదం నోట్లోవేసుకున్నా శ్రీ రామా
అని మీరు రాసినా అందుకే నేను ఇవ్వాళ రామ నామం రాయండి అని అనడానికి కారణం అదే.

|
రెండవ విషయం ఎల్లుండీ శ్రీ నృసింహ జయంతి ఇంక అంతా ఇంతా
గొప్పరోజు కాదు అంత గొప్ప రోజు నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏదో ఇయ్యన ఒత్తి
అనాలని అంటున్నాడని మీరు అనుకోకండి నేను అన్నానంటే ఒక ప్రమాణంతో అంటున్నాను లోకంలో
అసుర సంధ్యవేళలో ఏ ఇతర
దేవాలయాన్ని దర్శనం చేయరాదు అని శాస్త్ర ప్రమాణం నేను ఏదేవతా స్వరూపానికి
వ్యతిరేకం కాదు సనాతన ధర్మంలో అన్నీ ఈశ్వర రూపాలే అని నేను నమ్ముతున్నవాన్ని అని
పరిపూర్ణంగా నమ్మినవాన్ని. కానీ
ఒక నియమం ఉంది అసుర సంధ్యవేళలో ప్రదూశ వేళలో శివాలయంలోకే వెళ్ళాలి ఎందుకంటే
అందరు దేవతలు శివాలయంలోకే
వెళ్తారు శివ సన్నిధిలో ఉంటారు, శివాలయంలోకి వెళ్ళితే ప్రదూష వేళలో అందరి
దేవతల దర్శనం అయిపోతుంది. శివాలయాన్ని వదిలేసి వెళ్ళకూడదు ప్రదూష వేళలో కానీ
ప్రదూష వేళలో శివాలయంతో పాటుగా సమాన స్థాయిపొందినటువంటి ఇంకొక స్వరూపమున్న దేవాలయం
ఏమిటో తెలుసాండీ ఒక్క నరసింహ స్వామి దేవాలయం. నృసింహ స్వరూపానికి అంత శక్తి ఉంది
శత్ కాల పూజ పరమ శివుడికి ఒక్కడికే ఉంది శత్కాల పూజ ఉన్నవాడు మళ్ళీ నృసింహ స్వామి
ఇంక అంతా ఇంత తేజో మూర్తికాదు మహానుభావుడు. అందునా ప్రత్యేకించి శృంగగిరి పీఠంలో
నరసింహోపాసనం ఉంది అందుకే నృసింహోపాస నిత్యం శ్రీ నృసింహ గురుం భజేత్
అని గురువందనంలో చెప్తూంటారు.
ఇక్కడ పీఠంలో నరసింహ స్వామివారిని గురించి చెప్పుకుంటే చాలా
గొప్ప అనుగ్రహం కలుగుతుంది ఎల్లుండి నృసింహ జయంతి నృశింహ జయంతినాడు మనం
నిష్కారణంగా కాలాన్ని వెళ్ళబుచ్చడం కన్నా నేను ఒక కార్యాన్ని సంకల్పం చేశాను ఆరోజు
ఉదయం 8 గంటలకీ నేను నరసింహ అవతార వైభవం గురించి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్తాను.
శ్రీ నృసింహ జయంతి నాడు ఆ నృసింహ ప్రహ్లాదోపాఖ్యానం వింటే ఆయన ఎంతో సంతోషిస్తారు
రాముడొకడు నరసింహుడొకడూ కాడు ఇద్దరూ ఒక్కటే 8 గంటల నుంచి నేను నృసింహావతార వైభవాన్ని
చెప్తాను. శంకర భగవత్ పాదులని రెండు పర్యాయాలు రక్షించారు నరసింహస్వామి కాబట్టి
మీరు 8 గంటలకొస్తే ఇక్కడ ఉండదు ప్రసంగం ఎందుకంటే మీకు ఎండ ఇబ్బంది లేకుండా లోపల
ఉంటుంది లోపల చెప్తాను ఎంత మంది ఉంటే చెప్తాననే నియమేమీ లేదు హరిప్రసాద్ గారు
గోపాల కృష్ణగారు ఎదురుగుండా కూర్చుంటే చెప్పేస్తాను. ఎవ్వరూ లేకపోతే నా ఎదురుగుండా
ఒక స్రోత కూర్చుని ఉన్నాడూ అని ఊహచేసి చెప్పేసుకుంటాను ఎందుకంటే నేను ఉద్దరింపబడడం
ప్రధానం కదా..! కాబట్టి చెప్పేస్తాను 8 తరువాత నేను వైట్ చేయడమన్నది ఉండదు.
|
అందుకే నేను మీతో ఏం మనవి చేస్తానంటే 7 గంటలకి పీఠ ప్రాంగణం
ఎవరైనా దూరంగా నిలబడితే ఏమిటో చప్పుడు వినపడాలి ఏమిటా పీఠంలో చప్పుడు... వినపడాలి
ఏమిటా చప్పుడు అని అందరు సాన మీద గంధపు చెక్కలు పెట్టి గంధంని అరగతీస్తున్న
చప్పుడు ప్రాంగణమంతా కూర్చుని చందనం తీస్తుంటే ఈ చందనం మంతా ఓ బక్కెట్లోకో
పాత్రల్లోకో తీసుకుంటారు తీసుకుని అర్చకస్వామివారు దగ్గర పెట్టుకుంటారు దాన్ని
మధ్యాహ్నవేళలో వచ్చిన చందనమెంతుందో చూసి ఇంత చందనమూ రాయచ్చూ అంత చందనమూ రాయచ్చు. భక్తుల
యొక్క స్థితి ఎంత అన్నది ఆయన యొక్క అలంకారం బట్టి తెలుస్తుంది వచ్చిన చందనాన్ని
బట్టి రామ చంద్ర మూర్తినంతటినీ చందన చర్చితున్ని చేస్తారు ఇంకా ఎక్కువగా మీ అందరు
తీస్తే గంధము పౌడరు మాత్రము ఇవ్వకండి గంధపు పౌడర్లు గంధము కాదు. చందనం కాదది మనం
అరగదీయ్యాలి చందనాన్ని సీతమ్మ తల్లిని కూడా చందన చర్చిత ఇంకా మిగిపోతే లక్ష్మణ
స్వామి చందన చర్చిత ఇంకా మిగిలిపోతే హనుమ కూడా చందన చర్చితుడైపోతాడు. ఆరోజు
సాయంకాయం దర్శనం ఇవ్వరు చందనమంతా అలది అత్యద్భుతమైన అలంకారం చేస్తారు మీరు
ఎప్పుడైనా చూశారోలేదో నాకు తెలియదు నిజంగానండీ మనం తీసిన చందనంతో ఆయన ఒంటినిండా
అలదుకొని ఆయన కూర్చుంటే అసలు మీరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళండీ ఘుమ ఘుమ ఘుమలాడిపోతుంటారు
మూర్తి ఆ రాత్రంతా మనం రెక్కల కష్టంతో తీసిన చందనాన్ని ఈశ్వరుడు ఒంటినిండా
రాసుకుని మర్నాడు పొద్దున్నా తెర వెనక అభిషకం చేసి చందనం తీసేస్తారు ఒలిచేస్తారు
చందనమంతా ఒలిచి అది మనకే ప్రసాదం కింద ఇచ్చేస్తారు.
అందునా నృసింహ జయంతి మామూలుగా ఏదో చేద్దాం సేవ అని చేయడం
కాదు అంతగొప్ప తిథి వచ్చింది ఏడు గంటల నుంచి ఏనిమిది గంటల వరకు ఎనిమిది తరువాత ఇంక
చందనం చేసినా తీసుకోరు ఎందుకంటే ప్రతిదానికి ఒక నియమం ఉండాలి. 7 నుంచి 8 వరకు మీరు
చక్కగా ఉదయం మగవాళ్ళు ఆడవాళ్ళు అన్న నియమేం లేదు దీనికి ఏవిధమైనటువంటి అర్హతా
అనర్హతలు లేవు వీళ్ళే పాల్గొనాలి వీళ్ళు పాల్గొనరాదనిలేదు కాని ఈశ్వర కైంకర్యానికి
వస్తున్నారు కాబట్టి తల స్నానం చేసి చెయ్యలేకపోతే అంటే పసుపునీళ్ళు చల్లుకునీ అంటే
ఏదైనా అనారోగ్యం చేత మీ శరీరం సహకరించలేనప్పుడు చక్కగా బయలుదేరి ఉతికిన బట్టలు
కట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చోవాలి వీలైనంతవరకు మగవారు కట్టుకోగలిగితే పంచా
లేకపోతే ఓ లుంగీలాగైనా కట్టుకుని పైన వస్త్రం లేకుండా తీస్తే చాలా మంచిది ఓ
ఉత్తరీయం వేసుకుని చందనం తీయవచ్చు. ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అమ్మవారి స్వరూపాలే
వాళ్ళు ఇలా ఉండాలని నేను చెప్పక్కరలేదు ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ పరాశక్తి
స్వరూపాలు మమ్మల్ని కన్న తల్లులు కాబట్టి మీరు చక్కగా కూర్చుని వచ్చి చందనం తీస్తే
సరిపోతుంది చాలు. ఇంటి దగ్గర తీసి ఇక్కడ వద్దండి ఇక్కడికొచ్చే తీయ్యండి ఇంటిదగ్గర
తీసి ఇక్కడికి తీసుకురాకండి ఇక్కడే తీయండి ఎందుకంటే పాత్ర వాడడం మళ్ళీ అవన్నీ
మారిపోతుంది ఎందుకంటే మీరు ఇక్కడికి రండీ నీరు సిద్ధంగా ఉంచుతారు ఆరున్నరకే సిద్దం
చేస్తారు మీరు ఎక్కడ కూర్చున్నా మీకేం అభ్యంతరం చెప్పరు. మీరు ఎక్కడ మీకు తెలిగ్గా
ఉంటే మీరు అక్కడ కూర్చోండి.
|
|
కాబట్టి మర్చిపోకండి ఎల్లుండి ఉదయం 7 గంటలకి మళ్ళీ రేపు
కూడా ఒక్కసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం ఒక్క పదుకొండుమార్లు రామ
నామం చెప్పుకుందాం.
మే 14 తరువాత ఏదో ఒక రోజున పిల్లలకీ జీవితాన్ని భగవదనుగ్రహం
కలగడానికి జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలీ అన్న విషయం మీదా నేర్పడానికి
ఇచ్చేటటువంటి ప్రత్యేక శిక్షణా తరగతిలో పాల్గొనడానికి విద్యార్థులకి
ఇవ్వబడేటటువంటి అనుమతి పత్రాలు ఇవ్వాళ ఇస్తారు ఉపన్యాసం అయిపోయినాక మీరు
పెద్దవాళ్ళు తీసుకోవచ్చు కానీ పిల్లల్ని పంపుతామన్నవాళ్లే తీసుకోండి ఎందుకంటే
ఇంకోక పిల్లాడి అవకాశం మనం పాడు చేయకూడదు. అది కొంచెం పరిమితంగా ఉంటుంది, ఎందుకంటే
వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు ఒక బ్లాక్ బోర్డు కూడా పెట్టుకుని
చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు జీవితాంతం చక్కగా వాళ్ళకి ఏ అనుమానం లేకుండా అసలు
ఎందుకు ఎలా చేసుకోవాలో వాళ్ళకు బాగా అర్థమయ్యేటట్టు ఆ పిల్లలందరికీ స్క్రిబ్లింగ్
ప్యాడ్స్ కూడా ఇద్దాం వాళ్ళందరు నోట్సు కూడా రాసుకోవడానికి వీలుగా చెప్పి వాళ్ల
డౌట్స్ క్లారిఫై చేస్తాను. అందుకనీ దానికి కావలసిన టోకెన్సు
తీసుకోవాలనుకున్నవాళ్ళు ఉపన్యాసం అయిపోయాక అనంతరం ఆఫీసులో తీసుకోండి.
ఇప్పుడు మనం రామ నామం చెప్పుకుందం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
నారదాది మహామునీద్రులు నమ్మినది శ్రీ రామ నామము !!రా!!
కోరికొలచినవారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రా!!
నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామ నామము !!రా!!
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
|
వెంటతిరుగెడి వారికెల్లను కంటిపాపే రామ నామము !!రా!!
కుండలిని భేదించి చూసిన పండువెన్నెల రామ నామము !!రా!!
ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే శ్రీ రామ నామము !!రా!!
అచలమై ఆనందమై పరమాణువైనది రామ నామము !!రా!!
తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామ నామము !!రా!!
అల కుచేలుని చేతి అటుకులనారగించిన రామ నామము !!రా!!
చిత్త శాంతిని కలుగజేసేడి చిత్ స్వరూపము రామ నామము !!రా!!
బ్రహ్మ పుత్ర కరాబ్జవీణా పక్షమైనది రామ నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనులనెల్లకాలము రామ నామము !!రా!!
మంగళా శాసన పరైః.....
No comments:
Post a Comment