తతో మయా వాగ్భః అదీన భాషిణా శివాభి రిష్టాభి రఽభిప్రసాదితా జగామ
శాన్తిం మమ మైథిలాఽఽత్మజా త వాఽపి శోకేన తథాఽభిపీడితా ! అంటూ నేను నా వాక్కులచేత సీతమ్మతల్లికి మనఃశాంతిని చేకూర్చుయున్నాను,
ఇప్పుడాతల్లి నీవు శోకిస్తున్నావని శోకిస్తూంది తప్పా వేరొక కారణము ఆవిడ శోకమునకులేదు,
అటువంటిశాంతిని నేను నా వాక్కులచేత కల్పించి ఇక్కడికి వచ్చానూ అని హనుమ చెప్పినటువంటి
మాటవిన్న రామ చంద్ర మూర్తి ఎంతో సంతోషించారు. శ్రీరామాయణంలో రాముడు మాట్లాడటం అంటే
ఒకత్రాసు పట్టుకుని కొలిస్తే ఎంతఖచ్చితంగా ఉంటుందో ఆయన మాటలుకూడా అంతపొందిగ్గా అంత
లెక్కపెట్టినట్లుగా ఉంటాయి, ఒకమాట ఎక్కువ ఉండదు ఒకమాట తక్కువ ఉండదు అంత అందంగా
మాట్లాడుతాడు నిష్కారణంగా పొగడరు అకారణంగా తిట్టరు, అటువంటాయన హనుమనిచూసి ఒక మాట
అంటూన్నారు. ఈయన చేసినటువంటిపని సామాన్యమైనటువంటిదికాదు దుర్లభం చాలా దుర్లభమై
అనితరసాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించాడు, నూరు యోజనముల సముద్రాన్నిదాటి ఆవలి
వొడ్డుకువెళ్ళి సీతామాతని అన్వేషించి, కేవలము సీతమ్మతల్లి జాడ తెలుసుకోవడమే
కాకుండా అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని సంహరించి తిరిగివచ్చి నాకు సీతమ్మతల్లి
యొక్క క్షేమవార్తని నివేదించాడు.
కాబట్టి నేను హనుమ చేసిన కృత్యానికి
ఎంతో సంతోషిస్తున్నాను ఏవం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ ! యో హి భృత్యో
నియుక్త స్సన్ భర్త్రా కర్మణి దుష్కరే !! కుర్యా త్త దఽనురాగేణ తమాఽఽహుః
పురుషోత్తమమ్ ! భృత్యులైనటువంటి
వాళ్ళు ప్రభువుచేత ఒక కార్యమునందు నియోగింపబడినప్పుడు ఆ ప్రభువు ఏ కార్యాన్ని
ఇచ్చాడో ఆ కార్యాన్ని మాత్రమే చేయడం కాకుండా ఆ కార్యమునకు అనుషంగికంగా ప్రయోజనకరమూ
అని భావించినటువంటి ఇతర కార్యాల్ని కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థతని చూపించినవాడెవడుంటాడో
అటువంటివాడు చాలా ఉత్తమమైనటువంటి భృత్యుడు. కేవలము సీతమ్మతల్లి
జాడకనిపెట్టి రావడమేకాకుండా అనుషంగికంగా రాక్షససంహారం కూడాచేసి రావణాసురినికి
సందేశాన్ని వినిపించివచ్చినటువంటి హనుమ ఉత్తమమైనటువంటి భృత్యుడు సుగ్రీవునికి.
అంటే ʻఒకరాజు-భృత్యుడుʼ అన్నకోణంలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి అటువంటి ఉత్తమ భృత్యుడుగా హనుమ
తననితాను నిరూపించుకున్నారు. తను అనుషంగిక కార్యాన్ని కూడా చెయ్యగలిగి ఉండి అంటే
రాజు అప్పజెప్పిన ప్రధానమైనపనితోపాటు ఇతర పనికూడా చెయ్యగలిగిన సమర్థత ఉండికూడా
చెయ్యకుండా వచ్చేసినటువంటివాడు మధ్యమ భృత్యుడు, చెప్పిన కార్యమొకటే
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
చేసొచ్చేవాడు సమర్థత ఉండి ఏ కార్యాన్ని ప్రభువు
అప్పజెప్పాడో ఆ కార్యాన్ని చెయ్యకుండా తిరిగి వచ్చేసేటటువంటివాడు లేదా ఆ కార్యమును
సావధానంగా పూర్తిచెయ్యకుండా ఉండేవాడెవరో వాడు అధముడైనటువంటి భృత్యుడు. నేను హనుమ
యొక్క పౌరుషపరాక్రమాలకి ఎంతో సంతోషిస్తున్నాను ఇంత అనితరసాధ్యమైనటువంటి
కార్యాన్నిసాధించి సీతమ్మతల్లి క్షేమవార్త నాకు నివేదించినటువంటి హనుమకి
యదార్థమునకు నేను ఇవ్వగలిగినటువంటి బహుమానమేమీలేదు ఎందుచేతనంటే రాముడు ఒకమాట
అంటాడు నేను దీనః చాలా దీనున్ని అంటారు కారణమేంటంటే రామ చంద్ర మూర్తి యొక్క
కృతజ్ఞతా భావమటువంటిది, ఒక్కసారి మీరు కొన్ని కొన్ని పన్లుకి కృతజ్ఞత చెప్పడం కూడా
చాలా అహస్యంగా ఉంటుంది అసలు కొన్నింటికి కృతజ్ఞత చెప్పలేరు.
నాకు ఒక విషయం జ్ఞాపకానికి
వస్తూంటూంది, దిక్సూచీ అని వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు గొప్ప రచయితా...
చాలా చక్కటి దృష్టికోణమున్నటువంటి వ్యక్తి, వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు నేను
వారి డిప్యుటీడైరెక్టర్ పబ్లిక్ రిలేషన్సు విశాపట్నం కోర్ ట్రస్టుగా ఉండగా నేను
వారి దగ్గర కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసస్ విన్నాను, నేను పోస్ట్
గ్రాడ్యూయేషన్ డిప్లమో పర్సనల్ మేనేజ్ మెంట్ కోర్స చేసే రోజులలో... ఆయన ʻదిక్సూచీʼ అని వ్యాసాలు రాసేవారు, ఆ వ్యాసాలలో ఒకచోట ఒకమాట రాశారు ఆయన నాకు ఇప్పటికీ
అది జ్ఞాపకానికి వస్తూంటుంది హి హూ సేస్ థ్యాంక్స్ టు హిజ్ వైఫ్ అండ్ మందర్ ఈజ్ ది
బిగ్గేస్ట్ ఫూల్ ఇన్ ద వర్లడ్ అన్నారు. అదీ నా హృదయాన్నితాకింది నిజమే
ఎంతపెద్దమాటా అనుకున్నాను, భార్యకి
థ్యాంక్స్ చెప్పేవాడు తల్లికి థ్యాంక్స్ చెప్పేవాడు ప్రపంచంలో అంతకన్నా
మూర్ఖుడులేడూ అనిరాశారు. నిజమే భార్యకి ధ్యాంక్స్ చెప్పడానికి ఏమి చెప్పి
కృతజ్ఞత తీర్చుకుంటావు? ఎక్కడో పుట్టినపిల్లా కేవలం తనని నమ్ముకునివచ్చి
అందర్నీవదులుకుని వచ్చేసీ ఆఖరికి ఆడది కోరుకునేటటువంటి చాలా గొప్ప కోరిక ఏమిటంటే
ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలంటూంది తప్పా ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలనుకుండా
సృష్టిలో నేను ఉండగా ఆయన
వెళ్ళిపోవాలనే ఆడవాళ్ళు ఉండరు.
కాని ఒకసారి పరమాచార్యస్వామివారు మెచ్చుకున్నారు అలా అన్న ఒక ఆడదాన్ని అలాంటి
అసాధారణమైన సంఘటన ఒక్కసారి జరిగింది, కంచి కామకోటి పీఠంలో బాగా వృద్ధులైపోయారు
అప్పట్టికి పరమాచార్యస్వామి వారు కూర్చుని ఉండగా ఒక తల్లి వచ్చీ నేను జీవించి
ఉండగా నా భర్త వెళ్ళిపోవాలని నన్ను ఆశీర్వచనం చేయండి అని అడిగింది. అలా చెయ్యను
అన్నాడు ఆయన అలా చెయ్యకూడదు తప్పు అన్నాడు ఏ ఆడదీ కోరకూడదు ఎందుకు కోరావని అడిగాడు
అడిగితే ఆవిడందీ పరమ మూర్ఖత్వంతో ఉంటారు, పిల్లల్లో ఒక్క బిడ్డతో తనకు సరిగ్గాపడదు
అందరితోనూ దెబ్బలాడటమే అనారోగ్యం నేను వెళ్ళిపోతే ఆయన జీవితం ఏమైపోతుందోనని బెంగ
అందుకని ఆయన ముందువెళ్ళిపోయి వెంటనే నేను వెళ్ళిపోవాలని నన్ను అనుగ్రహించండి అని
అడిగిందావిడా... ఆయన ఆసీర్వదించలేదు ఆయన తథాస్థు అనలేదు కానీ ఆవిడ వెళ్ళిపోయాక
అన్నారు ఆయన చూశారా సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఎంత ప్రేమిస్తారో భర్తని అందుకు కదా ఆ
ఆడదానివల్ల నెలకు కురిసే
మూడు వానలూ ఒక వాన పాతివ్రత్యము కలిగిన స్త్రీవల్లా అని సనాతన ధర్మంలో నిర్ణయించారు
అన్నారు. కాబట్టి కృతజ్ఞత చెప్పడమనేటటువంటిది ఒక్కొక్కసారి ఏదో బహుమానరూపంలో
ఉంటుంది ఒక్కొక్కసారి నోటితో ఉంటుంది ఒక్కొక్కసారి మీరు అసలు కృతజ్ఞతని
ఆవిష్కరించడమనేటటువంటిది మీకు చెయ్యగలము అన్న ఆలోచనే రాకూడదు. కొందరి కొందరి
విషయంలో మీరు చేయలేరు అది సాధ్యమయ్యేపనికాదు తల్లికీ తండ్రికీ భార్యకీ గురువుగారికి వీళ్ళకి కృజ్ఞత ఏం
చేస్తారు అది కృతజ్ఞత చెప్పలేరు.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి రామ చంద్ర మూర్తికి కృతజ్ఞః అని ఒక బిరుదు
నామము, బిరుదునామము అంటే ఆయన యొక్క గౌనము అంటే గుణముగా చెప్తారు. అటువంటి
కృతజ్ఞడైన రామ చంద్ర మూర్తి ఇంత మహత్కార్యాన్ని చేసివచ్చినటువంటి హనుమకి ఎలా
కృతజ్ఞత చెప్పాలి, ఏమిస్తే కృతజ్ఞత చెప్పినట్లు ఇప్పుడు కాదులేవయ్యా ఇంకో
కొద్దిరోజుల్లో పట్టాభిషేకం అయిపోతుంది వెళ్ళిపోతాను కోసల రాజ్యానికి అప్పుడు నీకు
ఏమివ్వాలన్నా నీకిస్తాననాలి? నీకు అర్థ రాజ్యం ఇస్తాను అనాలి, లేకపోతే నీకు
మణులిస్తాను మాణిక్యాలిస్తాననాలి ఆయన ఇవేమీ అనలేదు నీకు నేను ఇదిస్తానని
ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాడను కాను దీనున్ని కాబట్టి నేను నీకు ఏమిస్తానో
తెలుసా..! కృతజ్ఞతా అన్నదీ
వెల్లువెత్తిన భావము అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నోటితో ఏదో యాంత్రికంగా
చాలా థాక్స్ అని అనడంవేరు, మీరు అరెరే వారు నాకింత మహోపకారంచేశారు అన్నభావనచేత మీలో ఒకసంతోషము పెల్లుభికితే
పాలుపొంగినట్లు పొంగితే మీరు ఆవిష్కరించేటటువంటి భావజాలమునకు అప్పుడు మీరు
మాట్లాడేటటువంటి మాటకు కృతజ్ఞత అని పేరు అసలా భావన లేకుండా మీరు ఏదో ఒకటి
చేసి నేను కృతజ్ఞతను ఆవిష్కరించాను అన్నాడనుకోండి అది ఏదో చెల్లింపుచేసినట్లు
ఉంటుంది. కొంత మంది రాసుకుంటారు పెళ్ళిల్లకి ఎవరేమిచ్చారని ఎందుకు అలా రాసుకోవడమూ
అని అడిగాను నేను ఓసారి, మా అమ్మాయిపెళ్ళికి ఇదిచ్చారండీ మా అబ్బాయి పెళ్ళికి
ఇదిచ్చారండీ అని ఎవరేమిచ్చారో రాస్తారు నేను నా మిత్రుడు ఒకడు అలా రాస్తే అడిగా ఎందుకయ్యా
ఇవన్నీ నీకు ఎందుకు ఇలా రాసి ఎందుకు పెట్టావు అన్నాను. అంటే మళ్ళీ వాళ్ళింట్లో
పెళ్ళైనప్పుడు నేను ఇవ్వాలి కదాండి తత్యులంగా అన్నాడు నీ మొహం వాళ్ళు ఇస్తే తత్యులంగా
ఇవ్వడమేమిటీ అది వాళ్ళ యొక్క ప్రేమ అలా తుల్యంగా చెల్లింపులు చేసేటట్లు ఉండకూడదు ప్రేమ
పెరగాలి హృదయాలలో అది చాలా గొప్పవిషయము.
కాబట్టి కృతజ్ఞతా అన్నది మీ మనసులోవచ్చినటువంటి పొంగును ఆవిష్కరించడానికి
ఒకమార్గము ఏమిస్తే సంతోషిస్తారు అని మీరు ఆలోచిస్తే హనుమకి అసలు ప్రత్యుపకారంకానీ
కృతజ్ఞతకానీ చెప్పడమే కదరదు ఎటువంటి దుష్కరమైన కార్యంచేశారండీ ఆయనా...
అటువంటివారికి కృతజ్ఞత ఎలా చెప్తారు రామ చంద్ర మూర్తి కాబట్టి ఒక అత్యద్భతమైన
కృతజ్ఞతావిష్కారం చేశారు. ఆయన అన్నారు ఇ త్యుక్త్వా ప్రీతిహృష్టాంఽగో రామ స్తం
పరిషస్వజే ! హనుమంతం మహత్మానం కృత కార్య ముపాగతం !! ఇంతగొప్పకార్యాన్నిచేసి వచ్చినటువంటి
హనుమా నీకు నేనొక గొప్ప ఉపకారము ప్రత్యుపకారము లేదా కృతజ్ఞతని ఆవిష్కరించుచున్నాను
అనీ “ఒక్కసారి ఆయన్ని దగ్గరికి పిలిచి గాఢంగా కౌగలించుకున్నాడు”. అదే ఆయన ఇచ్చినటువంటి
బహుమానము. కానీ శ్రీరామాయణంలో రామ చంద్ర మూర్తిచేత ఇలా కౌగలింపబడినవారు ఎందరూ అని
మీరు లెక్క తీశారనుకోండి హనుమకే దక్కుతుంది ఆ భాగ్యం. అందుకే అసలు రామ చంద్ర
మూర్తి హనుమల యొక్క ఆలింగన స్వరూపం చాలా గొప్ప స్వరూపం. నాకిది చెప్తుంటే నాకొక
విషయం జ్ఞాపకానికి వస్తూంది మావాళ్ళకి తెలుసు నేను శ్రీరామాయణం కాకినాడలో చెప్పిన
రోజులలో ఆ రామాయణాన్ని విన్నటువంటి ఓ పిల్లాడు చాలా సంతోషించి రామాయణమంతా వినేసిన
తరువాత ఏమొస్తే అది వస్తూంది ఏమొస్తే అదిస్తాను గురువుగారికి అనిచెప్పి ఓ పెద్ద
అట్టొకటి తీసుకుని అతనికి బొమ్మలు గీయడం వచ్చు బొమ్మగీయడం మొదలెట్టాడు ఇది గీస్తాను
అని అతను అనుకోలేదు ఏదొస్తే అదివస్తూంది
అని రామాయణం పెట్టుకుని వింటూగీశాడు, ఆశ్చర్యకరంగా అది రామ చంద్ర మూర్తి
కౌగలింపబడిన హనుమ యొక్క స్వరూపము వచ్చేసింది. అది ఏకంగా ఇంత పెద్ద స్వరూపము
వచ్చేసింది వస్తే ఆయన నాకు అది ఫ్రేమ్ కట్టిచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. నేను అంత
గొప్పగా కృతజ్ఞతా ఆవిష్కరించినవానికి ఏమని కృతజ్ఞత చెప్పను ఇప్పుడు నాకు అనుమానం
వచ్చింది నేను దాన్ని పూజామందిరంలో పెట్టుకున్నాను అంతే నేను ఇవ్వగలిగిన కృతజ్ఞత.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇ త్యుక్త్వా ప్రీతిహృష్టాంఽగో రామ స్తం
పరిషస్వజే ! హనుమంతం మహత్మానం కృత కార్య ముపాగతం !! నేను వీరిని
కౌగలించుకుంటున్నాను అని చెప్పి హనుమను ప్రియమార కౌగలించుకున్నారు. సాక్ష్యాత్
శ్రీమహా విష్ణువుకదాండీ నరుడిగా ప్రవర్తిస్తున్నా ఆయనా సాక్ష్యాత్ పరమేశ్వరుడు
పరమేశ్వరుని యొక్క ఆలింగన సౌభాగ్యాన్ని పొందిన మహాపురుషులలో హనుమ ఒకరు అంతటి
మహోపకారం చేసినటువంటివారు అందుకే హనుమ యొక్క నామము ఎక్కడ స్మరింపబడుతూందో ఎక్కడ
హనుమద్వైభవమును మనము జ్ఞాపకమునకు తెచ్చుకుంటామో అటువంటివారందరికీ కూడా హనుమకి
ఎటువంటి బుద్ధి ఉందో ఎటువంటి వినయముందో అటువంటి లక్షణములు ఈశ్వరుడిచేత ఆయన ఏ
సన్మానమును పొందారో అటువంటి సన్మానమును పొందగలిగినటువంటి భాగ్యము కలుగుతుంది
సందేహములేదు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి సీతమ్మతల్లిని రక్షించి తీసుకురావాలి
హనుమ చెప్పిన దానినిబట్టి నూరు యోజనములు సముద్రాన్ని గడచి వెళ్ళగలగాలి, నూరు
యోజనముల సముద్రాన్ని దాటివెళ్ళాలీ అంటే వెళ్ళగలిగినవాళ్ళెవరు ఇంత పెద్ద
సముద్రాన్ని ఎవరు దాటుతారు ఎలా దాటుతారు ఈ ప్రతిబంధకం మనసులో శోకమునకు కారణమైంది.
ఇది మీకు అందుకే మనవిచేసేది తరుచుగా రామ కథని నరుడికథగానే మీరు వినండి తప్పా రామ
కథని ఈశ్వరుడి యొక్క కృత్యముగా వినకండీ అని నేను చెప్తుంటాను.
ఎప్పుడైనా అంతే ఏదైనా ఒక
పనిచెయ్యాలీ అంటే అయ్యబాబోయ్ అది ఎలా అవుతుందండీ..? అన్నమాట ముందురాగానే ఆ
ప్రతిబంధకము మనసులోకిరాగానే విచారము వెల్లువెత్తుతుంది అందులో రామ చంద్ర మూర్తికి
కలిగినటువంటి విచారము సామాన్యమైందికాదు పోల్లే ఇప్పుడు మనం వెళ్ళలేకపోతే ఏమిటీ
అంటే మీరు అందులో ఉన్నది కేవలంగా ఆయనకి భార్య దొరకదు అన్న ఒక్కకోణాన్ని
ఆలోచించకండి ఇక్ష్వాకు వంశ ప్రతిష్టంతా అందులో ఇమిడి ఉంది, ఇదే యుద్ధకాండ చివర్లో
రామ చంద్ర మూర్తి చెప్తారు, ఇక్ష్వాకు వంశం అంటే సామాన్యమైనవంశంకాదు అటువంటి
వంశంలో జన్మించినటువంటి ఒక గొప్పవ్యక్తి తన భార్యని తాను రక్షించుకోలేకపోయాడూ అంటే
అంతకన్నా అప్రతిష్టా ఆ వంశానికేవుంటుంది. కాబట్టి ఇప్పుడు కేవలం భార్యని
తీసుకురావడంకాదు అందులో తన క్షాత్రధర్మము తనయొక్క పరాక్రమము తనవంశ ప్రతిష్ట ఇన్ని
ఇమిడి ఉన్నాయి కాబట్టి ఎలా నూరు యోజనముల సముద్రాన్ని దాటడము అయనా నూరు యోజనముల
సముద్రాన్నిదాటి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం, ఇంతపెద్ద ప్రతిబంధకాన్ని
దాటివెళ్ళితేతప్పా సీతమ్మతల్లి దర్శనం కాదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావణాసురునితో
యుద్ధం చేసి సీతమ్మని తీసుకురావాలి ఇదంతా ఎలా జరుగుతుంది, హనుమ కాబట్టి వెళ్ళారు
మనం ఎలా వెళ్తాం ఇంతమందివానరులు తాను లక్ష్మణ మూర్తి ఇంతమంది ఎలాదాటుతారు మళ్ళీ
ఒక్కసారి ఆయనలో ఆ ప్రతిబంధకాన్ని ఆలోచన చేసినప్పుడు మనసులోంచి విచారము
పెల్లుభికింది.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
ఆయనా వెంటనే అంటారు అప్పుడు సుగ్రీవుడు, సుగ్రీవుడు మంచి
మిత్రుడు అయితే జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు. మిత్రుడు
వేరు స్నేహితుడు వేరు మీరు ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి, స్నేహితులు ఎంతమందైనా
ఉండవచ్చు మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నామిత్రుడని
పరిచయం చేయాలి ఎవర్నిపడితేవార్ని తీసుకెళ్ళి వీడు నా మిత్రుడండీ అని చెప్పకూడదు, మితము నుంచి ఋతములోకి
తీసుకెళ్ళగలిగినవాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడము కనపడితే
సంతోషంగా పలకరించుకుంటారు మంచిదే దాన్నినేనేమీ తప్పు పట్టడంలేదు కానీ అక్కడివరకే
స్నేహం దానివలన మీరు కొత్తగా ఏదో ఎదుగుదల సాధించడమనేటటువంటిది కుదరదు. ఇద్దరూ
కలిసి ఓ రైతుబజారుకువెళ్ళచ్చూ లేకపోతే ఏమోయ్ నాకు ఇవ్వాళ ఆఫీసులో పనుంది ఓ రిజర్వేషన్
తెచ్చుపెట్టు అని అడగచ్చు అని చెప్పచ్చు అక్కడివరకే కానీ మిత్రుడు వేరు మిత్రుడేం
చేస్తాడంటే మితం అంటే మీకు
లేనిది మీరు పొందడం సాధ్యంకానిది మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర
ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని
దిద్దేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞకలిగినవానిని మిత్రుడు అంటారు. మితము
నుండి ఋతమునకు తీసుకెళ్తాడు అందుకే మనము ఎప్పుడూ ఒకమాట అంటాము నివేదన చేసిన మనం
భోజనం చేస్తున్నా “సత్యం త్వర్తేన పరి షించామి” సత్యము ఋతమగు గాక అని
రాత్రైతే “ఋతంత్వా సత్యేత పరి షించామి” ఋతము సత్యమగుగాక పగటిపూటైతే సత్యం
త్వర్తేన పరి షించామి అంటాము రాత్రైతే ఋతంత్వా సత్యేత పరి షించామి
అనాలి ఋతముచేత సత్యమును తెలుసుకోవాలి. అంటే ఇందులో ఉండి దీనివలన దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఉపకరణంగా
ధర్మాన్ని పట్టుకుని మారుతున్న ధర్మంలో బాగా ఊంచుకుని మారని సత్యములోకి
ప్రవేశించాలి. ఇదీ ఈ ఋతము అంటే ఏది తెలుసుకోవాలో ఏ ధర్మం పట్టుకోవాలో ఏలా
ప్రవర్తించాలో మనకి నేర్పి తాను అలా ప్రవర్తిస్తూ ఆయనతో ఉన్న కారణంచేత మనం కూడా
ఇలా ఉండవలసి ఉంటూందీ అని ఆయన ప్రభావం మీ మీద పడ్డం వల్లా మీతో అటువంటి మంచిపని
చేయించి ఇహమునందు పరమునందు
మీకు ఈశ్వర సంబంధమువలన అభ్యున్నతిని కల్పించబడినటువంటి ప్రజ్ఞ నడవడిచేతా మాట చేతా
ప్రకాశించినటువంటివాడితో కలిగినటువంటి అనుబంధమునకు మిత్రత్వమని పేరు.
కాబట్టి ఎప్పుడూ ఒక మిత్రుడు ఉండాలి మిత్రుడు స్నేహితుడు ఇవి మంచి ఉపశమన
వాఖ్యములుగా పలుకుతారు, నిరుత్సాహపరిచేవాడు
పక్కన ఉంటే చాలాప్రమాదము ఎందుకంటే ఉత్సాహవంతుడు కూడా పాడైపోతాడు. మాట చాలా
గొప్పది కదాండీ కింద పడినవాన్ని లేవదీయాలిగానీ నిల్చున్నవాన్ని లేవదీయడానికేం
ఉండదు ఇది మీరు గుర్తెరుగవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా. మీరు ఎప్పుడూ ఎవరితో
ఓదార్పువచనం పలకాలంటే కష్టంతో ఉన్నవానితోటే ఓదార్పు వచనం పలకాలి సుఖంగా ఉన్నవానితో
మీ ఓదార్పువచనమేమీ అవసరమేమీ ఉండదు. కాబట్టి వాక్కునకు పరిణితీ అంటే మనస్సు యొక్క సంస్కారము అది
ఎక్కడ్నుంచి వస్తూందీ అంటే మీరు మాట్లాడేటప్పుడు మీకు మీమాట యొక్క వైభవం మీకు
తెలిసుంటే మీరొక ఓదార్పువాఖ్యం పలికితే అతను మళ్ళీ ఉత్సాహం పుంజుకుంటాడు.
ఒక్కొక్కసారి వెళ్ళకూడనివైపుకు వెళ్ళుతుంటే దాన్ని తప్పించగలిగినటువంటి రీతిలో
ఉదారంగా మాట్లాడగలిగి ఉండాలి. అందుకేమనకి మాటని కూడా మూడు రకాలుగా విభాగం
చేస్తూంది శాస్త్రం అన్నిటికన్నా
గొప్పవాక్కేదో తెలుసాండీ భార్యలా మాట్లాడటం. ఎందుకంటే మిగిలినవి పైవి
రెండున్నాయి తను ఆ రెండు వినచ్చు వినకపోవచ్చు కానీ భార్యలా మాట్లాడగలిగితే వింటాడు,
అది కూడా వినలేదనుకోండి ఇక వాడు బాగుపడడు. ఎందుకంటే వేదము రాజ శాశనంలా మాట్లాడుతుంది “సత్యం వదా
ధర్మం చరా” ఇంకేం మొహమాటముండదు, సత్యమునే పలుకు ధర్మమునందు నిలబడు అంటూంది.
పురాణముందనుకోండి మిత్రవాఖ్యము సత్యము పలికితే హరిచంద్రుడు ఏం పొందాడో తెలుసా..?
సత్యమును పట్టుకుంటే అదిగో మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఏ స్థితులు పొందారో
తెలుసా..? సత్యాన్ని విడిచిపెడితే ఏ పరిస్థితిలో పడిపోయాడో తెలుసా... ఒక
మిత్రుడిలా మాట్లాడుతుంది.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
కావ్యము భార్యలా మాట్లాడుతుంది కావ్యమంటే రామాయణాదులు భార్య
సందర్భాన్ని చూస్తుంది ఇప్పుడు చెప్పొచ్చాయనకి వింటాడనీ చాలా అనునయంగా మాట్లాడి
అలా చేయకుండా ఉండకూడదు మనం ఇబ్బందిపడిపోతాం కదా ఎందుకు చెప్పండని బ్రతిమాలిన
ధోరణిలో చెప్తూంది దాన్నికావ్యభాషా అంటారు, కావ్యభాష భార్య చెప్పే భాషలా ఉంటుంది.
అందుకే చాలా అనునయంగా మాట్లాడుతాయి కావ్యాలు, కావ్యాలలో చాలా పరుషమైన భాష ఉండదు
ఎక్కడో తప్పా అసలు అటువంటి పదప్రయోగం చెయ్యవు ఇప్పుడు అలా అనునయంగా చెప్తే
వినగలిగినటువంటి స్థితీ ఎవరికైనా ఉంటుంది, అటువంటి మిత్రుడు ఒక స్నేహితుడు పక్కన
ఉన్నాడనుకోండి చక్కగా విచారము పెల్లుభికినప్పుడే మంచిమాట చెప్పగలిగినటువంటి
ప్రజ్ఞాతులీనుడై ఉంటే ఇవతలివాడిలో ఉండే ఉత్సాహం మళ్ళీ పెల్లుభికుతుంది. నాకు
అందుకే తరచూ ఒక మాట వినిపిస్తూంటుంది ఇవి ఎవరికితెలియాలి అంటే ప్రధానంగా పిల్లలకు
తెలియవలసి ఉంటుంది వాళ్ళూ ఇప్పుడూ కార్యసాధకులు వాళ్ళేకదాండీ... జీవితంలో యుద్ధం
చేయవలసినవాళ్ళు యుద్ధం చేయడమంటే నా ఉద్ధేశ్యం కత్తిపట్టుకోవడమనికాదు జీవితంలో
ఎదురొడ్డి నిలబడవలసినవాళ్ళు కష్టమూ సుఖమూ అన్న ఈ రెండింటిలో బాగా అటూ ఇటూ
ఊగిసలాడవలసినటువంటివాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళకి ఇవి తెలిశాయనుకోండి వాళ్ళు
జీవితాన్ని పండించుకోవడం అలవాటౌతుంది పరిణితి ఏర్పడుతుంది. “పరిణితి” మీరు ఒక్కటే
జ్ఞాపకం పెట్టుకోండి తన
కష్టాన్ని తాను ఓర్చగలిగితే తన సుఖానికి తాను హద్దులు మరిచిపోయి పొంగకుండా ఉంటే
అంతే పరిణితి అది చాలు ఇంక అంతకన్నా ఏమీ అక్కరలేదు. చిన్న కష్టమొస్తే
కుంగిపోవడం అలవాటుచేసుకున్నాడనుకోండి ఇంక ఆలోచన సరిగ్గా ఉండదు ఎంతకైనా
వెళ్ళిపోతాడు పాతాళాం వైపేవెళ్ళుతాడు, చిన్న సుఖానికి పొంగిపోవడం
అలవాటైపోయిందనుకోండి మీరు పట్టుకోలేరు. ఈ రెండు కాకుండా ఉండడం పరిణితి అన్నమాట. కష్టమునందు ఓర్పుకోవడం సుఖమునందు
విర్రవీగకుండా ఉండడం రెండిటియందు సమతూల్యముతో నిలబడగలగడం హర్షమును పొందడం తప్పా
అతిశయమువైపుకు వెళ్ళకుండా ఉండడం. ఇది పరిణితి తెలియాలీ అంటే మీరు
శ్రీరామాయణంవంటి కావ్యములు చదవాలి ఎంత గొప్పగా ఉంటాయో చూడండి.
ఎక్కడ చాలామంచి విషయాన్ని
ప్రతిపాదించాలో ఎక్కడ కీలకమైన విషయం మాట్లాడాలో అటువంటి కీలకాన్ని ఉపదేశం చేస్తారు
మీరు అందుకే వాల్మీకి రామాయణంలో ఇక యుద్ధకాండలో ప్రత్యేకించి మీకు ఒక గమ్మత్తు
కనపడుతూంది, రాముడూ మాట్లాడుతుంటాడు సచివులతో రావణుడు మాట్లాడుతుంటాడు సచివులతో
రాముడు మాట్లాడుతాడు స్నేహితులతో మిత్రులతో రావణుడు మాట్లాడుతాడు స్నేహితులతో మిత్రులతో
రాముడు ఎలా మాట్లాడుతాడు రావణుడెలా మాట్లాడుతాడు రామునితో ఎలా మాట్లాడుతాడు
రావణునితో ఎలా మాట్లాడుతాడు రావణుడు సలహాలడిగితే ఎలా అడుగుతాడు రాముడు సలహాలడిగితే
ఎలా అడుగుతాడు మీరు ఈ రెండిటిని బాగా తరచి తరచి తరచి తరచి చూశారనుకోండి అసలు అది
ఒకపెద్ద సైకలాజికల్ సింథసిస్ దాన్ని ఇంక విశేష విశ్లేషణ అన్నమాట అంత గొప్పగా
ఉంటుంది వాళ్ళిద్దరివి పక్కపక్కగా చూపిస్తారు సర్గల్లో మహర్షి చూస్తే ఓ... ఇలా
ఉండకూడదన్నమాట అని మీకు అర్థమైపోతుంది మీకు అంత గమ్మత్తుగా ఉంటుంది, కావ్యభాష
కావ్యభాషే కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
సేతు మఽత్ర యథా బద్ధ్వా యథా పశ్యేమ
తాం పురీమ్ ! తస్య రాక్షస రాజ స్య తథా త్వం కురు రాఘవ !!
దృష్ట్వా తాం తు పురీం
లంకాం త్రికూట శిఖరే స్థితామ్ ! హతం చ రావణం యుద్ధే దర్శనా దుపధారయ !!
అబద్ధ్వా సాగరే సేతుం ఘోరే తు వరుణాఽఽలయే ! లంకాం న
మర్థితుం శక్యా సేంద్రై రఽపి సురాఽసురైః !!
రామ చంద్రా మీరు ఇలా విచారమును పొందడం కాదు ఏది ప్రధానమైనదో దానిమీద ఇప్పుడు
దృష్టిపెట్టి నీ బుద్ధిని అటువైపుకి నిలబెట్టండి దానిగురించి మీరు బాగాయోచన
చెయ్యండి మీరు చెయ్యవలసిన యోచన సేతుబంధనం గురించి ఈ సముద్రాన్ని మనం ఎలా
దాటివెళ్తాం నూరు యోజనములు సముద్రాన్ని దాటడమన్నది మనం చెయ్యగలిగితే ఇంద్రుడితో
కలసి దేవతలే వచ్చినా త్రికూట శిఖరం మీద లంకాపట్టణాన్ని మనం దగ్గరికివెళ్ళిచూడడం
జరిగితే ఇక లంకాపట్టణం నశించిపోయినట్లే రావణుడు నిహతుడైనట్లే ఇప్పుడు
లంకాపట్టణంలోకి మనం వెళ్ళాలి, లంకాపట్టణంలోకి వెళ్ళాలంటే నూరు యోజనముల
సముద్రాన్నిదాటాలి పెద్దప్రతిబంధకమెక్కడుందంటే ఈ సముద్రాన్ని దాటడంలో ఉంది ఎలా
దాటాలన్నదానిమీద దృష్టిపెట్టాలి తప్పా అసలు దానిగురించి మానేసి విచారమొక్కటి
పొందితే ఉపయోగమేముంటుంది కాబట్టి మీరుదాన్ని ఆలోచించండి మీరు మాకు సలహాచెప్పండి
మేము ఇన్నికోట్లమంది వానరలం మీవెనకాల ఉన్నాం జయం సాధించితీరుతాం జయం తథ్యం, కానీ
జయమనేటటువంటిది తథ్యమే తథ్యమైన జయమును మనం పొందాలి ఈ తథ్యమైన జయమును పొందడానికి ఒక
ప్రణాళికారచన ఉంటుంది, ఈ ప్రణాళికారచన జ్యోతకమవడమన్నది బుద్ధిసంబంధమై ఉంటుంది
బుద్ధిపనిచేయడమన్నది దానిమీద దృష్టి ఉండాలి తప్ప ఇంకొక విచారణలో పెట్టి మనసు
లగ్నమైతే దీనిమీద బుద్ధినిలబడదు, కాబట్టి మీరు మీ బుద్ధిమరల్చాలి అనవసరమైన శోకానికా
ఇన్నికోట్ల వానరములొచ్చేశాయి..? ఇప్పుడు మనం నడిపించాలి కాబట్టి ఎలా ఏం చెద్దాం
దీనిమీద దృష్టిపెట్టండి, మీరే విచారిస్తూ కూర్చుంటే? ఎలా నడుస్తూంది? చాలా అందంగా
మాట్లాడుతాడండీ రామాయణంలో నిజంగా కీలకమైనటువంటి మాటలు మెచ్చుకోవలసిందే.
ఆయన చాలా సంతోషించాడు తప్పకుండా మనం
అలా చేద్దాం నూరు యోజనముల సముద్రాన్నిదాటి లంకకి వెళ్దాం నూరు యోజనములు
సముద్రాన్నిదాటి లంకకుపోవడమనేది కేవలం ఏదో ఒకభోజనానికి వెళ్ళిపోతున్నట్లో పెళ్ళికి
వెళ్ళిపోతున్నట్లో ఉండదు. ఎందుకంటే మీరు చాలాబడలిపోయి ఓ పెళ్ళికి వెళ్ళారనుకోండీ...
ఇబ్బందేమిలేదు ఎందుకంటే వెళ్తూనే ఏగదిలోనో కళ్యాణ మండపంలోనే ఏమూలనో ఆ పెట్టిపాడేసి
స్నానంచేసొచ్చి అక్షంతలేసొచ్చి అక్కడే రాత్రంతా నిద్రలేదర్రాని చెప్పి ఓ
తువ్వాలేసుకుని పడుకున్నా ఎవ్వరేమనరు. కానీ యుద్ధాభూమికి వెళ్ళేవాళ్ళు చాలా
జాగ్రత్తగా ఉండాలి
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
అసలు మీరు దగ్గరవుతున్నకొద్దీ... దగ్గర చేరకుండా
చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు శత్రువులు అందులో ఉన్నది సముద్రం, సముద్రం కాబట్టి
దాటుతుండగా ఇంతమందీ సముద్రంలో పడ్డారనుకోండి ఎంత ప్రమాదమొస్తూంది కాబట్టి
లంకాపట్టణంలోకి వెళ్ళడమూ అంటే లంకాపట్టణం యొక్క శక్తితెలియాలి లంకలో ఎలా ఉంటుంది
అక్కడ ఉన్న రక్షణవ్యవస్థ అది ముందుతెలిస్తే దాన్నిదాటి మనం ఎలా వెళ్ళగలమన్నది
నిర్ణయించగలరు. లంకాపట్టణంలో రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలిసినవారెవరున్నారక్కడ
ఒక్క హనుమ ఉన్నారు కాబట్టి వెంటనే రామ చంద్ర మూర్తి అన్నారు హనుమా నీవు
ప్రాజ్ఞుడవు కేవలము సీతాన్వేషణమే కాకుండగా సీతా దర్శనమే కాకుండగా రాక్షసభంజనం
చేశావు లంకా పట్టణాన్నంతటిని పగటివేళా రాత్రివేళా కూడా చూశావు కాబట్టి నాకు లంకా
పట్టణం యొక్క రక్షణ వ్యవస్థ గురించి తెలియజేయుము.
హనుమా... ʻరాముడు ఎంత గొప్పగా మాట్లాడుతాడో... హనుమా అంతగొప్పగానూ
మాట్లాడుతాడుʼ ఎంత చక్కగా విషయాన్ని
విశ్లేషించి మాట్లాడుతారంటే అందులో ఒక్క అనృతము ఉండదు అందులో ఎక్కడా తను చూసొచ్చానని
గొప్పగా అటువంటిదాన్ని తను దాటివెళ్ళడం ఎంతగొప్పా అన్నకోణంలోకి తీసుకురారు, ఇది
ఎందుకంటే మీకు లోకంలో ఒక విషయముంటుంది ఇది ఎలా చేద్దామండీ అని మీరు అడిగారనుకోండి
ఇదెలా చేద్దామో మాట్లాడడు తాను ఇంతకు ముందు ఎలా చేశాడో మాట్లాడుతాడు ఇది
ఎందుకొస్తుందో తెలుసాండీ శోత్కర్షతలోని క్రియన ఇక్కడ కలుస్తూంది ప్రతీ
చిన్నవిషయానికి ఇంతకు ముందు మేం ఏం చేసేవారమో తెలుసాండీ ఆ దానిమీద ఉపన్యాసం
మొదలెడుతాడు ఇప్పుడెందుకొచ్చావు ఇదెలా చేద్దామనివచ్చావ్ దీనిమీద దృష్టిపెట్టీ ఇది
ఎలా చెయ్యాలి అన్నదానిమీద ప్రణాళికా నిర్మాణం చెయ్యాలి, హనుమని అడిగితే హనుమేం
చెప్పాలి లంక ఎలా ఉంటుందో చెప్పాలి తప్పా నేను వెళ్ళినప్పుడు ఆ లంకలో బాబోయ్ నేను
కాబట్టి వెళ్ళానుకానీ..? అని మొదలెట్టారనుకోండి మిగిలినవాళ్ళు ఏమైపోతారు అంటే కష్టమెలా
అవుతుంది అని అనుకుంటారా అనుకోరా... అందుకని మీరు ప్రశ్న అడిగేటప్పుడు కూడా
ఎవర్నడగాలంటే మీ ప్రజ్ఞను ప్రచోదనం చేసి కార్యనిర్వహణని చేయించగలిగినటువంటి సమర్థుడనడగాలి
తప్పా మీకున్న సమర్థతను కూడా చంపేసేవాన్ని అడగకూడదు ఎప్పుడూ.
ఎవర్ని పడితే వాళ్ళని అడగకూదు
ఎవర్ని పడితే వాళ్ళని సంప్రదించకూడదు ఎందుకో తెలుసాండీ లోకంలో అత్యంత తేలికైన
విషయమేమిటంటే సలహ చెప్పడమే దానికేమైనా కష్టమా దానికేమైనా డబ్బా... ఏదోసలహా
ప్రవాడూచెప్తూంటాడు ఏదోసలహా ప్రతివాడూచెప్తే ఇబ్బంది, అందుకే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని
రచన చేసేటప్పుడు ప్రణాళికా నిర్మాణం చేసేటప్పుడు ముందు మీరు సావధానచిత్తులై ఉండాలి
మీరు సావధానచిత్తులై ఉన్నారు అని మీరు అనుకుంటే అవతలివాళ్ళని కూడా బాగా
నీకున్నటువంటి అనుమానాలేవో పట్టుకుని నాదగ్గరికిరా నేను సావధానంగా ఉన్నప్పుడు
అప్పుడు మనమిద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాలి అంతేగాని సరే నేను
వెళ్ళిపోయేటప్పుడు కలవండి మాట్లాడేస్తాను కారుదగ్గర అనకూడదు విలువైన
కార్యమున్నప్పుడు నీవు కూడా అంత ప్రాముఖ్యతదానికి ఇవ్వలసి ఉంటుంది హనుమ మాట్లాడితే
అలా ఉంటుంది. ఆయన ఒక జవాబు చెప్తే రాముడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి అడిగారో హనుమ జవాబు
చెప్పడం కూడా అంత అందంగానూ చెప్తారు నాకు ఇదే అనిపిస్తూంటుంది తరచుగా అసలు నిజంగా
ఆఫీస్ మేనేజ్ మెంట్లో ముఖ్యమైన స్ట్రాటజీ ఒక హ్యూహ రచన చేసేటప్పుడు ఒక బాస్ అండ్
ఆన్ అసిస్టెంట్ ఒక అధికారి ఆయన కింద ఉండేటటువంటి సహాయకుడు ఎంత చక్కగా
మాట్లాడుకోవలసి ఉంటుంది సమయం వృథాకాకుండా అన్నది, రాముడు హనుమా మాట్లాడుకోవడం
చూస్తే యుద్ధకాండలో చాలా గొప్పగా కనపడుతుంది.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
ఆయన అంటారూ లంకా పురీ నిరాఽఽలమ్బా దేవదుర్గా భయావహా ! నాఽదేయం
పార్వతం వన్యం కృత్రిమం చ చతుర్విధమ్ !! రామా! నాలుగు విధములైనటువంటి
దుర్గములు లంకలో ఉన్నాయి అటువంటిది అనితర సాధ్యముగా ఉంటుంది అది శత్రుభయానకమై
ఉంటుంది నాఽదేయం నది చేత రక్షింపబడుతూంటుంది పార్వతం పర్వతములచేత
రక్షింపబడుతూంటుంది ఎందుకంటే నదీ దుర్గము గిరి దుర్గము కృత్రిమ దుర్గము వన దుర్గము
అని నాలుగు రకాలుగా ఉంటాయి దుర్గాలు ఇవి సహజ రక్షణనిస్తూంటాయి. మీరు ఎప్పుడైనా
హంపి విజయనగరం వెళ్ళిచూస్తే మీకు కనపడుతూంది కొండలచేత రక్షింపబడుతూంటుంది తుంగభద్రానది
పక్కన ప్రవహిస్తూంటుంది అప్పడు ఏమౌతుందంటే హటత్ తరువుని నిర్మిస్తారు కోటకి కోటకి ʻఅకర్తాʼ అంటే మీరు కోటలోకి ప్రవేశించడం సాధ్యంకాదు అటువంటప్పుడు గుఱ్ఱాలు మనుష్యులు
ఏనుగులు లోపలికి వెళ్ళిపోవడం కోసమనీ ఇక్కడ్నుంచి దగ్గరదగ్గరగా అవతలి రోడ్డువైపు
వరకు అనుకోండి మీకు తెలియనిదిగాకాదు నేనేదో చాపల్యంకొద్దీ చెప్పడం ఇక్కడ నుంచి
అక్కడ వరకూ ఎత్తేస్తే ఎత్తేయబడేటటువంటి చెక్కలులాంటివాటితోటి నిర్మాణం చేస్తారు,
శత్రువులు యుద్ధానికి వస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తాళ్ళతో ఇలా
పైకి తీసేస్తారు తీసేసి పక్కన నదీ ప్రవాహం ఉంటుంది ఎప్పటికప్పుడు నీళ్ళు
పెడదామనుకోండి వాళ్ళు వేసవికాలంలో యుద్ధానికొచ్చారనుకోండి బకెట్లలలో నీళ్ళు మీకే
లేకపోతే అకర్తలో ఏం పోస్తారు అకర్త అంతా అగర్తంటే ఆక్కడ వరకు ఒక నుయ్యంతలోతుగా
లోతుగా ఉంటుంది దీనిమీద చెక్కవేసి తిరుగుతారు చెక్క పైకెత్తేస్తారు ఎత్తీ ఆ నదీ
జలాల్నీ వదిలిపెట్టేస్తారు.
వదిలిపెట్టి ఇప్పుడు వాటిల్లోకి మొసళ్ళని విడిచిపెడతారు విడిచిపెడితే
అవతలివాడు ఎక్కడవరకు వస్తాడంటే అక్కడ వరకే వస్తాడు పొరపాట్నా ఎవరైనా దాటేప్రయత్నం
చేసి నీటిలో దిగాడనుకోండి మొసళ్ళు సిద్ధంగా ఉంటాయి తినడానికి కోట పైన అవతలవాని
బాణానికందనంత ఎత్తులో ఉంటారు రక్షకులు అసలు దాటే ప్రయత్నం చేస్తే బాణాలేసి
చంపేస్తారు కోటలోకి వెళ్ళడం కష్టం అది నీరు దగ్గరిగా ఉంటే ఆ నీటితో అగర్త
నింపుతారు నదీ తిరగడమో సముద్రము తిరగడమో చేసిందనుకోండి మరీ కష్టం అందుకని లంక జల
దుర్గము లంకా వన దుర్గము చుట్టూ అరణ్యాలే దుర్భేద్యమైనటువంటి అరణ్యం మీరు వెడుతూండగా
ఎవరు ఎక్కడ కాపుకాసి ఉన్నారో తెలియదు ఎవరు ఎటునుంచి మట్టుపెడతారో తెలియదు గిరి
దుర్గము పర్వతములచేత రక్షింపబడి ఉంటుంది కాబట్టి ఎక్కడం దిగడంలో అక్కడ ఉన్నవాడికి
తెలిసున్నట్లు ఆనుంపానం మీకు తెలియదు పైగా పర్వతములు సహజ రక్షణగా నిలబడుతాయి ఏ
పర్వతం చాటున ఎవరున్నారో ఎట్నుంచొస్తారో తెలియదు. కృత్రిమం చ తాను
నిర్మించుకున్నది కృత్రిమం విశ్వకర్మచేత నిర్మింపబడింది అందుకని నాలుగు రకాలైనటువంటి
దుర్గములుగా లంకాపట్టణం ఉన్నది స్థితా పారే సముద్రస్య దూర పారస్య రాఘవ ! నౌ పథో
శ్చాఽపి నాఽస్త్యఽత్ర నిరాఽఽదేశ శ్చ సర్వతః !! శైలాఽగ్ర రచితా దుర్గా సా పూ ర్దేవ
పురోపమా ! వాజి వారణ సంపూర్ణా లంకా పరమ దుర్జయా !! ఆయనా అంటున్నారు అసలు
సముద్రానికి నూరు యోజనములకు పూర్ణంగా అవతలి ఒడ్డున దక్షిణ దిక్కున దక్షిణ తీరంలో
బయలుదేరితే ఉత్తర తీరానికి చేరితే తప్ప లంక కనపడదు ఆ లంకా పట్టణం దగ్గరికి
సముద్రాన్నిదాటివెళ్ళాలీ అంటే ఒకే ఒక్కసాధనం ఒక్క సాధనం నౌక, పడవమీద
వెళ్ళలేరుకదాండి సముద్రంలో నౌకలో వెళ్ళాలి నౌకలో వెళ్ళడానికి వీలైన మార్గము కాదు ఆ
సముద్రము ఎందుకంటే అటువంటి మార్గమది తిమింగళాలతో రాక్షసులతో భయంకరమైనటువంటి
మొసళ్ళతో నిండి ఉంటుంది కాబట్టి నౌకా మార్గము కుదరదు.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇప్పుడు వెళ్ళాలీ అంటే లంకకి ఒక్కటే మార్గము ఎగిరి
ఆకాశంలో వెళ్ళవలసి ఉంటుంది అలా వెళ్ళలేని వాళ్ళల్లో రామ లక్ష్మణులే ఉన్నారు
నరులుగా ఎలా వెళ్తారు అది తీరా అక్కడికి వెళ్ళితే అంత దూరం కదా... వెళ్ళిపోతే చాలు
అక్కడ ఇంక ఏమీ ఉండవు అనుకోవడానికి లేదు కోట్ల కోట్ల రాక్షస బలంతో ఏనుగులతో
గుఱ్ఱాలతో విచ్చుకత్తులు పట్టుకుని రక్షకులతో లంక నిండిపోయి ఉంటుంది, వాళ్ళెప్పుడూ
యుద్ధోన్మాధులై ఉంటారు అక్కడికి మనంవెళ్ళి వాళ్ళతో యుద్దం చెయ్యాలి వాళ్ళు
మనదగ్గరికి రావడంవేరు మనం వాళ్ళదగ్గరికి వెళ్ళడంవేరు అసలు వెళ్ళడమే ఇంతకష్టం.
వెళ్ళి యుద్ధంచేసి మట్టుపెట్టి వెనక్కిరావాలి కాబట్టి రామా! లంకా పట్టణానికి
చేరడమన్నది మాత్రం చాలా కష్టమైనవిషయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే ఉన్నది
ఉన్నట్లుగా తెలిసున్నవారు తానొక్కరేగనుక ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే దానికితగిన
ప్రణాళికారచన చేయడం సాధ్యంకాదు ఇప్పుడు దానినాలుగు ద్వారములు చెప్పారు, నాలుగు
ద్వారముల దగ్గర కోట్ల కోట్ల మంది రాక్షసులు
ఎప్పుడూ విచ్చుకత్తుపు పట్టుకుని ఉంటారు శతఘ్నులు లోహనిర్మితములైనటువంటి
తలుపులు బంగారు వజ్రములు వైఢూర్యములు ముత్యములు పగడములు మాణిక్యములు పొదగబడినటువంటి
లంక అనేకమైనటువంటి యంత్రములు పెట్టబడి ఉంటాయి పట్టణమంతా అంత శత్రుదుర్భేద్యంగా
తయారుచేయబడి ఉంది.
కాబట్టి నేను చూసినటువంటి లంకాపట్టణం గురించి మీకు వివరణచేశాను కాబట్టి మీరు ఒక
సుముహూర్తాన్ని నిర్ణయం చేసి మన బలగాలు ఎలా కదలాలో మీరు నిర్ణయం చేయండి అన్నారు ఇది
ఆయన యొక్క వినయం. మీరు ఒకవిషయాన్ని ఇందులో జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది ఒక
సుముహూర్త నిర్ణయం కార్యసాధనకి ఎంత అవసరమోకూడా రామాయణం చెప్పకనే చెప్తూంది అందుకే
జోతిష్య శాస్త్రం గురించి ఒకటికి పదిమాట్లు రామాయణంలో ప్రస్తావన వస్తూంది. ఇప్పుడు
రామ చంద్ర మూర్తి అన్నారు అస్మి న్ముహూర్తే విజయే పాప్తే మద్యం దివాకరే ! సీతాం
హృత్వా తు మే జాతు క్వాఽసౌ యాస్యతి యాస్యతః !! ఉత్తరా ఫల్గునీ హ్యఽద్య శ్వ స్తు
హస్తేన యోక్ష్యతే ! అభిప్రయామ సుగ్రీవ సర్వాఽనీక సమావృతాః !! ఇప్పుడు హనుమ
నాతో మాట్లాడినటువంటి ఈ సమయమేదుందో అది మధ్యాహ్నసమయము సూర్యుడు మధ్యహ్నకాలమందు
చేరవలసినటువంటి ప్రదేశానికి ఆకాశంలో చేరి ఉన్నాడు ఈ ముహూర్తం ఈ ఉన్న సమయం విజయము
అని గుర్తుపట్టారు కాబట్టి ఇప్పుడు బయలుదేరితే విజయము కలుగుతుంది పైగా ఇప్పుడు
ఉత్తర ఫల్గునీ నక్షత్రముంది తరువాత హస్తా నక్షత్రమొస్తూంది ప్రయాణానికి అనుకూలమైన
నక్షత్రాలు ఈ క్షణంలో ముహూర్తం మంచిది ప్రయాణం మొదలు పెడదాం అంత గొప్ప కార్యంమీద
అని అనుకోగానే నాకు కొన్ని నిమిత్తములు కనపడుతున్నాయి ఈ నిమిత్తములచేత నాకు కొంత
శుభం కలుగుతుందనీ విజయం సాధించగలననీ నాకు అనిపిస్తూంది కాబట్టి మనం వెంటనే
బయలుదేరుదాం.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
ఇప్పుడు హ్యూహరచన ఎవరు చెయ్యాలి రామ చంద్ర మూర్తి చెయ్యాలి
కాబట్టి ఆయన అన్నారు అగ్రే యాతు బలస్యాఽస్య నీలో మార్గ మఽవేక్షితుమ్ ! వృతః శత
సహస్రేణ వానరాణాం తరస్వినామ్ !! ఈ వానర సేన్యానికంతటికి కూడా ఒక లక్షమంది వానరులతో
నీలుడు వెడుతూంటాడు, నీలుడు వెడుతున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా
గమనిస్తూంటాడు ఆయన ముందువెడుతూ ఎక్కడ ఆగాలో ఆయనేచెప్పాలి ఆయన ఎక్కడ ఆగమనిచెప్పితే
అక్కడ సైన్యమంతా ఆగిపోవాలి ఎక్కడ సైన్యం ఆగమనిచెప్తాడో అక్కడ కేవలం ఆగడంకాదు అక్కడ
భోజనం చేయడమో పళ్ళుతినడమో కాయలుతినడమో తేనెతాగడమో నీళ్ళుతాగడమో చేయవలసి ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఎంతసేపు కదలవలసి ఉంటుంది ఈ కదిలేటప్పుడు ఎంతసేపు కదిలితే బడలిక
కలుగుతుంది బడలిక కలిగిన తరువాత శరీరానికి ఒక ధర్మముంది కాబట్టి దీనికి
ఆకలికలిగితే దాహంవేస్తే అప్పుడు ఆ ఆగిన ప్రదేశంలో ఉత్తినే కూర్చుని
వెళ్ళిపోవడంకాదు సమయహరణం కావడంకాదు ఎదో ఇన్నిగంటలు ప్రయాణం చేసి ఆగితే అక్కడ
సమృద్ధిగా ఇన్ని కోట్ల కోట్ల వానరములకు పళ్ళు తొరుకుతాయా? కందమూలములు దొరుకుతాయా?
తేనె దొరుకుతుందా? నీళ్ళు ఉన్నాయా? ఇవన్నీ చూడాలి, ఇవన్నీ చూడడం కాదు నీలుడా...
మనం ఒకసారి కదిలామూ అనగానే గూఢచారి అన్నవాడి లక్షణమేమిటంటే మన కంటికి కనపడకుండా
వాడు మన కదలికలు కనిపెడతాడు. వాడు ఇక్కడ చెరువు బాగుంది ఇక్కడ పళ్ళు బాగున్నాయి
అని ఒక నిర్ణయంచేసి సైన్యాన్ని ఆపితే, సైన్యమంతా ఆ నీళ్ళుతాగి పళ్ళుతింటే మొత్తం
సైన్యం ఒక్క మూహూర్తంలో మరణిస్తాయి, కాబట్టి నీవు ఎక్కడ ఆగుతావు అన్నది ఎవ్వరికీ
తెలియకూడదు అంతజాగ్రత్తగా నడిపించాలి.
నీవు ఇక్కడ ఆగుతాను అనుకుంటే ముందుగా నీవు వెళ్ళిపోవలసి ఉంటుంది, వెళ్ళిపోయి
ఇక్కడ సైన్యం కదిలేటప్పుడు సముద్రందాకా వెళ్ళడానికి ఇన్నిరోజులు పడుతుంది ఇన్ని
గంటల తరువాత ఇక్కడ ఆగుతుంది ఇక్కడ ఆగితే నీళ్ళు తాగుతుంది ఇక్కడ పళ్ళుతింటుంది
అంటే నీకు లక్షమంది సైనికులు అందుకిచ్చాం వెంటనే ఆ జలాశయానికి కాపు పెట్టాలి ఆ
పర్వతంమీద చెట్లమీదకి ఎవరైనా గూఢచారులెవరైనా వస్తున్నారా పరిశీలనకు కొంతమందిని
ఉంచాలి అడుగడుగున కదిలి వెనకవస్తున్నటువంటి సైన్యం తనభద్రత తానుచూసుకోదు నీవు
ఎక్కడ ఆగమనిచెప్తావో అక్కడ ఆగి తింటుంది తాగుతుంది అక్కడ భద్రంగా ఉండేటటువంటి పరిస్థితినీది.
కాబట్టి సుశిక్షుతుడువు కనుక బుద్ధికలిగినవాడివి కనుక వెనక ఉన్న సైన్యాన్ని
రక్షించగలిగినవాడివి కనుకా నిన్ను సేనాగ్రభాగములో పెడుతున్నాను, నీవు ముందువెడుతుండు
లక్షమంది సైనికులతో వానరులతో వెళ్ళు, రామ చంద్ర మూర్తి వ్యూహరచనా అంటే అలా
ఉంటుంది. ఒక ఊరెరిగింపు వెళ్ళడమంటే అలా వెళ్ళాలి, యథాలాపంగా వెళ్ళకూడదు ఊరెరిగింపు
ఎప్పుడు ఊరెరిగింపుకి ఫార్మేషన్ ఉంటుంది, ఎలాపడితే అలావెళ్ళినవి ఉత్సవాలకు
ఊరెరిగింపు కాదు అలా వెళ్ళకూడదు. ఎనిమిది గంటలకు ఊరెరిగింపు వెడుతుందండీ
అన్నారనుకోండి ఎక్కడ్నుంచి వెడుతుందండీ అన్నారనుకోండి రామ నామ క్షేత్రంలో
బయలుదేరుతుంది అన్నారనుకోండి మీ అందర్నీ వెళ్ళి అక్కడ నిల్చోమంటే మీ అందరూ ఏం
చేస్తారు ఏదో పెద్ద గుంపుకింద నిలబడుతారు అక్కడ్నుంచి నేనో కారువేసుకొచ్చి
కారులోకూర్చుని వచ్చేయండి అనిచెప్పి నేనో పెళ్ళికొడుకులా కారులో మెల్లిగా
మంగళవాయిద్యాలు పెట్టుకొని వెళ్తున్నాననుకోండి మీ అందరూ వెనకాతల వస్తున్నారనుకోండి
నాకేం? అందులో ఓ వాటర్ బాటిల్ పెడతారు వాటరు తాగేసి ఇంకక్కడ్నుంచి నేనేమో అందులో
రెండు ఆపిల్ పండ్లుతినేసి మీ ప్రారబ్దానికి మీరురండని ఎండుందో కొండుందో నాకు
తెలియదు లోపల ఏసి వేసుకొని నేను ముందు వెడుతున్నాననుకోండి ఓ గంట నడిచాక
మీరేమంటారు..? వీడురా... రామాయణం చెప్పింది, వీడికి మనం నీళ్ళు తాగామో పళ్ళు
తిన్నామో మనం ఏం తిన్నామా ఏమోమిటో తెలియదు వాడు ఏసి వేసుకుని కారెక్కాడు కాబట్టి
ఇలాతిప్పుతున్నాడు మనల్ని తప్పా... మనం నీళ్ళు తాగామో మనం తిన్నామో పడిపోతామో
కళ్ళుతిరుగుతాయో ఎన్నింటికి బయలుదేరుమో ఎమి అక్కరలేదంటారు.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
ఊరెరిగింపు అంటే దానికో లక్షణముంటుంది, ముందు ఊరిపెద్దలు నడవాలి ఊరిపెద్దలు
లేకుండా ఊరెరిగింపు వెళ్ళకూడదు, పెద్దలెవరుంటారో వాళ్ళు ముందునడవాలి. మేము
కాకినాడలో చేస్తే ఇలాగే విభాగంచేసి ప్రణాళికారచన చేస్తాముముందు, ముందు కొంతమంది
పెద్దలు వెడుతుంటారు ఆ వెనకాల మంగళవాయిద్యాలు వెడుతాయి మంగళవాయిద్యాలు వెనక
వేదపండితులు వెడతారు వేదపండితుల వెనక కన్యపిల్లలు వెడుతారు, కన్యపిల్లలు ఫేలాలు
చల్లుతూ వెళ్తారు దేవతలకు ఆహ్వానముచేసి వెనక సువాసునిలు ఫేలాలు చల్లుతారు,
కన్యపిల్లలు పిండివంటలు పట్టుకుంటారు పిండివంటలు పట్టుకుని ముందు నడుస్తుంటారు
ఆవెనక పురుషులు వెడుతారు. మధ్యలో ఎప్పుడూ కూడా ఊరెరిగింపునకు కేంద్రం స్థానంలో ఆ
ఉత్సవం దేనికి సంభందమో ఆ మూర్తి మధ్యలో వెళ్ళాలి. శ్రీ రామ పట్టాభిషేకానికి
ఊరేరిగింపు చేస్తున్నామనుకోండి రథం మధ్యలో ఉండాలి, మళ్ళీ వెనకాల కొన్ని విభాగాలు
చేస్తాం చిట్ట చివర మళ్ళీ ఒకాయన ఉంటాడు, ఈ ఊరెరిగింపునంతటిని నిర్వహించేందుకు
ఒకాయనకు బాధ్యతనిస్తాం నీలుడిలాగ ఆయనా మొట్ట మొదటలో ఉండి ఒక పెద్ద పథాకాన్ని
పట్టుకుని ఆయన కారెక్కకూడదు టూవీలర్ మీద వెళ్తూంటాడాయన ఆయనో పెద్ద పథాకం పట్టుకుని
ఈల వేస్తాడు ఆయన ఈల వేస్తే ఈరెరిగింపు అంతా కదులుతుంది ఒక పాము కదిలినట్లు అది
కదిలితే వెనకంతా కదులుతుంది ఆయన ఆగాడనుకోండి మొత్తం ఊరెరిగింపు ఆగుతుంది. దేనికైనా
ఒక ప్రణాళికారచన ఉంటుంది మీరు రామాయణంలోనే విందురుగానీ ఆ ఊరెరిగింపు అంటే ఎలా
వెళ్తూందో ఎలా పడితే అలా వెళ్ళడంలేదు ప్రతిదానికి శాస్త్రవాక్కు ఉంటుంది దాని
ప్రకారం మీరు వెడితేనే మంగళం. ఇప్పుడు మనం పట్టాభిషేకం చేస్తాం వచ్చే వారం ఈపాటికి
పట్టాభిషేకమేమి నేను కాకినాడే వెళ్ళిపోతాను.
కాబట్టి ఆ పట్టాభిషేకానికి
ఊరెరిగింపు వెడుతుంది, ఊరెరిగింపు వెళ్ళేటప్పుడు ఎంత అందంగా వెడుతామో మనందంరం
ఊరెరిగింపులో నడిచామూ అంటే ఈశ్వరానుగ్రహం పొందాలి అందుకునడుస్తాము అంతేగాని ఏదో
సరదాకి నడిచినట్లు నడవరు మీరు ఊరెరిగింపులో నడిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అది
ఎలా కదులుతుందో చెప్పి నడిపించాలి కాబట్టి దానికొక పెద్ద మళ్ళీ అనౌన్సుమెంట వ్యవహారం
ఇవన్నీ ఉంటాయి అప్పుడు మీరు విందురుకాని చక్కగానూ చాలా సంతోషిద్దురుకాని. కాబట్టి
మహానుభావుడు రామ చంద్ర మూర్తి అంటే నరులకు ఆదర్శంగా వచ్చినవాడండీ ఆయనా... ప్రతి
చిన్న విషయాన్ని అంత అందంగా చూపిస్తారు కాబట్టి అగ్రే యాతు బలస్యాఽస్య నీలో
మార్గ మఽవేక్షితుమ్ ! వృతః శత సహస్రేణ వానరాణాం తరస్వినామ్ !! లక్షమంది
వానరులతో నీలుడా..! నీవు ముందునడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు చాలా మంది కావాలని
అక్కడ కోట్ల కోట్ల మంది ఉన్నారుకదాని ఎవరినిపడితేవాళ్ళని తీసుకురావద్దు,
బాలురుకాని వృద్ధులుకాని, అనారోగ్యంతో ఉన్నవాళ్ళుకాని వీళ్ళ ముగ్గురిని
తీసుకురావద్దు ఎందుకంటే వీళ్ళు తొందరపాటుగా ఉంటారు వృద్ధులు మార్గాయాసం
తట్టుకోలేరు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండలేరు, మనం
తీరాబయలుదేరి వెళ్ళిన తరువాత అనారోగ్యంతో ఉన్నవాడికి ఏదో అనారోగ్యం
పెరిగిపోయిందనుకోండి ఇప్పుడు ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేవాడు ఎవడు లేకపోతే ఆయన్ని ఓ
చెట్టుకింద పడుకోబెట్టి ఏం చెయ్యాలి ఈ గొడవలతో సరిపోతుంది.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
సాధారణంగా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళందరూ పప్పులోకాలేసి
అక్కడే తీర్థయాత్రవేళ్ళేవాళ్ళకు రెండు బస్సులేశామని పేర్లు తీసుకుంటారు అందులో
సీనియర్ సిటిజన్ టికెట్లు 85 93 ఇచ్చేస్తారు. మీ మందులు మీరు తెచ్చుకోండంటారు మీ మందులు
మీరు తెచ్చుకోండన్నతరువాతా ఓ ఇద్దరు అకస్మాత్తుగా పడిపోయారనుకోండి నీరసమొచ్చి మీరు
వెళ్ళిపోతారా..? బస్సెక్కీ మీరాగాలా ఎవరాగాలి? అక్కడొస్తాయిగొడవలు ఓం అని రెండు
స్టేషన్లుదాటరు నీన్నెవరు తీసుకురమ్మన్నారండీ ఆవిడెలా వచ్చేసిందండీ అంతపెద్దావిడా
ఆయనెలా వచ్చేశాడండీ వచ్చేస్తే మాత్రం మీరెలా తీసుకొచ్చారండీ పెట్టెవరు
పట్టుకుంటారండీ ఇప్పుడు ఆయన పెట్టె పోయిందంటారు గొడవలన్నీ దీనికే కారణం. ఒక
తీర్థయాత్రా అంటే ఆ తీర్థయాత్రకి అనుకూలంగా శరీరం ఉంటుందా అక్కడ పరిస్థితేమిటి
అక్కడ గదులేమిటి సరే అవన్నీ వేరే విషయాలు కాబట్టి అది దూరదృష్టి అది
ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంటేనే నడిపించగలరు దక్షతా అంటారు లేకపోతే ఏమౌతుందో
తెలుసాండీ నాయకున్నిబట్టి కదులుతారు మిగిలినవాళ్ళు. మీరు రామాయణంలోనే
చూద్దురుగానీ... యుద్ధం జరిగింది రాక్షసులందరూ చచ్చిపోయారు వానరుల్లో ఒక్కళ్ళు చచ్చిపోలేదు
అందరూ బ్రతికే ఉన్నారు అది ఎలా కుదురుతుందండీ యుద్ధ కాండలో వానరులు కూడా
చచ్చిపోయారు మరి వీళ్ళందరు ఎలా బ్రతికారండీ అంటే ఎందుకు బ్రతికారో విందురుకాని
మీరు యుద్ధకాండే వింటారుగా వస్తూంది అక్కడ విందురుకాని. నాయకున్ని బట్టి
వెనకనున్నవాళ్ళ రక్షణ ఉంటుంది కాబట్టి అటువంటివారిని తీసుకురాకండి. కుశభుడు వానర
సైన్యానికంతటికి కూడా కుడిపక్కన ఉంటాడు కుడి పార్వశ్వానంతటికి కూడా రక్షకుడు ఆయన ఈ
పార్వవులు శత్రువులచేత దెబ్బతినకుండా కేవలం ఆపదొచ్చాక వీళ్ళు యుద్ధం చేయడం కాదు
ముందు చాలా జాగ్రత్తగా అటువైపు ఎవ్వరు రావట్లేదుకదా అని చూసుకోవాలి సైన్యం ఇలా
నడుస్తూంటే ఇక్కడ్నుంచి కొన్ని మైళ్ళ దూరం వరకు శత్రుసైన్యం ఏదీ అట్నుంచి రావట్లేదని
కుడివైపు కదులుతూ చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఆ కుడివైపు రక్షించడానికి కుశభున్ని
నియమిస్తున్నాను.
అలాగే ఎడమవైపు సైన్యాన్ని రక్షించడానికి గంధమాధనున్ని నియమిస్తున్నాను, ఐరావతం
మీద కూర్చుని ఇంద్రుడు ఎలా వెడుతాడో అలా సైన్యం మధ్యలో హనుమ యొక్క భుజముల మీద
కూర్చుని నేను నడుస్తాను. యువ రాజైన అంగదుని యొక్క భుజంమీద కూర్చుని మహానుభావుడు
లక్ష్మణ మూర్తి వెడుతాడు పల్లకిలో రాజైనటువంటి సుగ్రీవుడు వస్తాడు. రాజు రాజే ఆయన మర్యాద
చూశారా... సుగ్రీవుడు పల్లకిలో వస్తాడు నేను హనుమ భుజాలమీద కూర్చుని వెడుతాను నేను
అంటే రాముడు. కాబట్టి ఇలా విభాగం చేసి వేగదర్శి సుషేణుడు వీళ్ళిద్దరూ కూడా
సైన్యానికి వెనక భాగంలో ఉంటారు అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటిది అదే
వెనకనుంచేవస్తాయి ఉపద్రవాలన్నీ కాబట్టి ఇద్దర్నీ నియమించారు అక్కడ అందునా బాగా
సుశిక్షుతులు వృద్ధులు అనుభవం కలిగినటువంటివారు యుద్ధంలో దొంగదెబ్బా అంటే ఎలా
ఉంటుందో తెలిసినటువంటివారు అందునా వెడుతున్నది రావణాసురిడితో యుద్ధానికి ఎదర ఎన్ని
మాయలు చేస్తాడో మీరు చూద్దురుకాని అప్పుడు యుద్ధం మొదలవుదు మాయ మొదలౌతుంది.
రావణాసురుడు అంటేనే అంత, రాముడు అంటే ఇంత ఆయనది ధర్మ యుద్ధం ఆసలు ఆయనదంతా అధర్మయుద్ధం
రావణాసురున్నుంది కాబట్టి వెనక భాగం నుంచి జాంబవంతుడు సుసేనుడు వేగదర్శి ఈ
ముగ్గురూ వస్తారు.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
జాంబవంతుడు అంటే ఎప్పటివాడండీ నేను మీకు చెప్పానుగదా ఎన్ని యుగాలున్నాడు
బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు అటువంటి మహావృద్ధుడు శక్తివంతుడు బాగా
పట్టుకోగలిగినవాడు ప్రజ్ఞావంతుడు అనుభవశాలి కనుక ఈయ్యన సుసేనుడు మొదలైనవాళ్ళు
వెనకనుంటారు అని ముగ్గురిని సైన్యానికి వెనక భాగంలో నియమించారు. నియమించి మనందరం
కూడా బయలుదేరుదాము ఇదే ముహూర్థం బయలుదేరండి అన్నాడు అంతే నీలుడు వెళ్ళిపోయాడు
సైన్యం ఎక్కడ ఆగాలో చూస్తున్నాడు. ఎప్పుడైనాసరే అన్నివిధములుగా కట్టుదిట్టమైన
ఏర్పాటు చేసి ఉన్నారూ అనేటప్పటికి ఉండే ఉత్సాహంవేరు ఏమీ లేకుండా బయలుదేరిపోడం వేరు
ఇప్పుడు ముహూర్తం లేచిపోండి అనలేదు రాముడు ఇప్పుడు మహూర్తం పదాండీ కానీ ఎంత
జాగ్రత్తగా పకట్బంధీగా ప్రణాళికారచనచేశాడో చూడండి. ఇప్పుడు వాళ్ళందరు పరమసంతోషంతో
జై శ్రీ రామ చంద్ర మూర్తికీ జై అంటూ బయలుదేరారు, ఎవరికోసం అందరూ బయలుదేరారో ఆయన
కనపడుతుండాలి ఎప్పుడూ మీరు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒక ఊరెరిగింపు
వెడుతుందనుకోండి పెళ్ళికొడకైతే కారులోవెళ్ళవచ్చు, ఊరెరిగింపుని ఎవడు నిర్వహణ
చేస్తున్నాడో వారు కారెక్కి వెళ్ళిపోకూడదు ఆయన అందరికి కనపడేటట్టుగా అందరితోకలిసి
నడవాలి ఆయన కూడా, ఆయన కూడానడిస్తే ఏమౌతుందో తెలుసాండి ఉత్సాహం కలుగుతుంది, మీరు
ఇన్నాళ్ళు ఎవరికి దగ్గరగా వెళ్ళడం కుదరలేదో ఆయనకి దగ్గరగా వెళ్ళడం జరిగిందనుకోండి
ఆయన రామ నామం చెప్తూంటే ఆయనతో కలిసి మీకు రామ నామం చెప్పడం సంతోషమనిపించిందనుకోండి
మీకు సంతోషంగా ఉంటుంది. పెద్దలైనటువంటివారు భక్తులైనటువంటివారు ఒక ఊరెరిగింపులో
పదిమందిలో అలా నడుస్తున్నారనుకోండి అందరూ వాళ్ళను చూస్తూ నడుస్తారు
ఉత్సాహమొస్తుంది.
అసలు పెద్దలైనవాళ్ళందరు కార్లెక్కేశారనుకోండి అంటే పనికిమాలినవాళ్ళం
మనమేమిగిలాం చెప్పేడానికేవాళ్ళు తప్పా వాళ్ళు మాత్రం కార్లెక్కి పోయారు మనం ఏదో నడుస్తూ
పోతున్నాం అని ఉత్సాహం పోతుంది వాళ్ళేం చేస్తారో తెలుసాండీ ఊరెరిగింపులో బయలుదేరి
కనపడి ఊళ్ళోకి వెళ్ళిపోతారు అందుకే మీరు చూడండి చాలా ఊరెరిగింపులు ఎలా ఉంటాయంటే
బహుష ఇదే కారణం బయలుదేరేటప్పుడు చాలా మంది ఉంటారు తిరిగి వచ్చేటప్పుడు పదోవంతు
ఉంటారు కారణమేమిటంటే అహస్యం పుట్టేస్తుంది చెప్పినవాడికి బాధ్యతతో ఉండరక్కడ
కర్తవ్యనిష్ట ఉండదు. అది చూసుకోవాలి ఎందుకు బయలుదేరుతున్నారు ఆనందంగా నిజానికి
వాళ్ళ ఆపదకాదది, వాళ్ళు రామ చంద్ర మూర్తిమీద భక్తితో బయలుదేరారు ఆ రాముడు
కనపడుతున్నాడనుకోండి వాళ్ళకి ఉత్సాహముంటుంది. అందుకే రాముడు పల్లకీ ఎక్కలేదు,
ఎక్కలేకా ఆయనా సుగ్రీవా నీవు నేను కూర్చుందామంటే పల్లకీలో పరమ సంతోషంతో కూర్చోమంటాడు.
సుగ్రీవుడు మోస్తాడుకూడా కావాలంటే నేను హనుమ యొక్క భుజముల మీద కూర్చుంటాను ఎందుకనీ
ఆయనకి సైన్యమంతా బాగా వెడుతుందాలేదా కనపడాలంటే ఓసారి అనుకున్నారనుకోండి హనుమా!
అన్నారనుకోండి అంతే మేరు మన్దర సంకాశో బభౌ దీప్తాఽనల ప్రభః ! అంతెత్తు
పెరుగుతారు ఒక్కసారి అందరికి కనపడి ఉత్సాహపర్చచ్చు ఎగురుతారు తీసుకెడుతారు ఎటుకావాలంటే
అటువెళ్ళడానికి వీలుగా ఉంటుంది ఎప్పుడూ కనపడుతూనే ఉంటారు.
యుద్ధ కాండ ముప్పయ్
ఆరవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి వాతావరణం ఎలా ఉంది ఎట్నుంచి ఎవరొస్తారు ఏమిటి
ఎప్పటికప్పుడు ప్రతిక్షణం హ్యూహాన్ని నిర్ణయించుకోవడానికి అవకాశముంటుంది కాబట్టి
తాను హనుమ భుజముల మీద కూర్చునివెళ్ళాడు. మోసేవానికి నీకేం భుజాలేం కావద్దూ అనేవాని
భుజాలమీద ఎక్కకూడదు నిత్తోత్సాహి పరమభక్తుడు దాన్నిసంతోషంగా స్వీకరించేవాడై ఉండాలి
కాబట్టి హనుమ భుజముల మీద కూర్చున్నారు. రాముడంటే రాముడేనండీ రాముడు ఏం చేసినా అలా
ఉంటుంది శ్రీరామాయణంలో
రాముడు ఏది చేసినా దాన్ని మీరు ఆదర్శంగా స్వీకరిస్తే మీరు చేసే ఏ పనైనా ఆదర్శంగా
ఉంటుంది ఇంక అదోక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చేసేపని ఆదర్శంగా
ఎందుకుంటుందో తెలుసా ఒక్కటే కారణం అది మీరు చేస్తున్న పనికాదు రామున్ని ఆదర్శంగా
తీసుకొని చేస్తున్నపని మీరు చేస్తున్న పని అని మీరుచేశారనుకోండి బుద్ధివైక్లవ్యం
అందులోకొస్తుంది. కాబట్టి ఇప్పుడు చక్కగా బయలుదేరారు పరమ సంతోషంగా ఎంత సంతోషంగా
బయలుదేరారంటే వాళ్ళట ఉత్సాహంలో ఒకళ్ళనొకళ్ళు ఎత్తి కిందపడేసుకున్నారట. ఎందుకురా మీ
అందరసలు నేను ఒక్కన్ని చాలురా రావణున్ని చంపడానికి ఎందుకొస్తున్నారు మీ అందరూ అని
ఉత్సాహపడిపోయి చెట్లు పీకేసి కొమ్మలు పీకేసి రావణుడు కనపడని కోసేస్తాము అని
ఆనందంతో కేకలు వేసుకుంటూ అందరూ బయలుదేరి వెడుతున్నారు.
వెడుతుంటే... అక్కడా రావణాసురుడు కూడా సభతీర్చాడు రామ చంద్ర మూర్తి బయలుదేరారు
అన్నవార్త తెలుసుకోలేనంత అమయాకుడేం కాదుకదా... ప్రమాదమొచ్చింది అన్నప్పుడు ఇన్ని
కోట్ల సైన్యం బయలుదేరితే రావణుడికి వార్త చేరకుండా ఎలా ఉంటుంది గూఢచారులు చేరవేయనే
చేరవేస్తారు. కాబట్టి ఆయన అకస్మాత్తుగా సభనితీర్చాడు సభనితీర్చి ఆయన ఒకమాట
అన్నాడు, నిర్వేదంతో ప్రారంభంచేశాడు దుర్భేజ్యమైన లంకాపట్టణం దీనిలోకి
ప్రవేశించగలిగినవాడులేడు దీనిలోకి వచ్చి యుద్ధం చెయ్యగలిగిన మొనగాడులేడు నేను దేవ
దానవ యక్ష గధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ కూడా జయించినటువంటివాన్ని అటువంటి నేను
ఇంత గొప్పవాన్నైనా ఒక సలహా తీసుకోవాలి ఉత్తములు మధ్యములు అధములూ అని ఉంటారు అందరి
సలహా తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి నేను మీ యొక్క హితమును కోరేవాన్ని మీ నుంచి
సలహాకోరేవాన్ని కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉందంటే ఇంత దుర్భేజ్యమైన
లంకాపట్టణంలోకి ఒక వానరం వచ్చేసింది, ఒక వానరమొచ్చి లంక లంకనంతటినీ కాల్చేసింది
కాల్చేయడం కాదు ఎదురుగుండావచ్చి నన్ను అధిక్షేపించి మాట్లాడింది మాడ్లాడి మన
సైన్యంలో పావువంతు సైన్యాన్ని నశింపజేసింది నశింపజేసి వెళ్ళిపోయింది. అగర్తలు
పాడుచేసింది వంతెనలు పాడుచేసింది ఒక వానరమే ఇంతచెయ్యగలిగింది ఇప్పుడు రాముడు ఎంత
శక్తివంతుడో తెలుసా..? తనవారైనవారిదగ్గిరా అంతరంగంలో ఉన్న తన పిరికితనాన్ని
బయటపెడుతాడు వానరాణాం హి వీరాణాం సహస్త్రైః పరివారితః ! రామోఽభ్యేతి పురీం
లంకామ్ అస్మాక ముపరోధకః !! తరిష్యతి చ సువ్యక్తం రాఘవః సాగరం సుఖమ్ ! తరసా యుక్త
రూపేణ సాఽనుజః సబలాఽనుగః !! సముద్ర ముచ్ఛోషయతి వీర్యేణాఽన్య త్కరోతి వా !!! రాముడి
వెనకా కొన్నికోట్ల వానర సైన్యం ఉంది ఈ సైన్యంతో కలిసి బయలుదేరినటువంటి రాముడు ఏదో
ఒక ఉపాయముచేత నూరు యోజనముల సముద్రాన్ని దాటేస్తాడు ఖాయంగా దాటుతాడు అంటే ఇంకా
రాముడి శిభిరంలో అవగాహనలేదు ఎలాదాటాలో సముద్రాన్నని రాముడు సముద్రాన్నిదాటుతాడని
బాగాతెలిసున్నవాడు ఎవరు రావణుడికి తెలుసు అంటే రామ చంద్ర మూర్తి యొక్క పరాక్రమం గురించినటువంటి
పిరికితనం మనసులో ఉంది.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
కానీ తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడు డాంభికంగా
మాట్లాడుతాడు ఎలాగో రాముడు వచ్చేస్తాడు రాముడితో వానరసైన్యం వచ్చేస్తుంది మనం ఎలా
యుద్ధం చెయ్యవలసి ఉంటుంది కాబట్టి మీరు మీ సలహాలను ఇవ్వండి అన్నారు. ఈ
రాక్షసులందరూ కూడా ప్రభువు యొక్క మనః ప్రవృత్తికి అనుగుణంగా మాట్లాడటానికి
అలువాటుపడినవారు. ఎందుకంటే వాళ్ళకి ఒకమాట తెలుసు అలా అడుగుతాడుకానీ నిజంగా మనం
ఏమైనా సలహాచెప్తే ఆయనకి ఏది నచ్చుతుందో అదేచేస్తాడు నిజంగా మనం ఏమైనా చెప్తే
వినేవాడేంకాదాయన మరి మనమెందుకు పదవుల్లో ఉంటే చాలు అన్ని ఆయన చేసుకుంటాడుకానీ ఓ
మంచి అనిపించుకోవడం సరదా... అందుకని మంత్రిపదవులు వాళ్ళకి తప్పా ఆయనేం వినడు, మరి
ఎందుకు పిలిచినట్లు వీళ్ళందర్నీ అంటే ఇప్పుడు తన కామానికి వీళ్ళని బలిచేస్తాడు,
ధర్మముండదు అధర్మానికి బలిచేస్తాడు అందుకని పిలిచాడు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత
బుద్ధిహీనులంటే ఇవతలవైపు చెప్పలేకపోవడం తప్పుకాదు అవతలవైపు బలాన్ని కూడా వాళ్ళు
చెప్పరు ఎందుకు చెప్పరు అంటే ఏమో చెప్తే మనమీద విరోధం పెట్టుకుంటాడేమోనని వాళ్ళకు
భయం అందుకే మహర్షి ప్రారంభంలోనే ఒకమాట అంటారు ఇత్యుక్తా రాక్షసేన్త్రేణ రాక్షసా
స్తే మహా బలాః ! ఊచుః ప్రాంజలయః సర్వే రావణం రాక్షసేశ్వరమ్ !! ద్విషత్ పక్ష మఽవిజ్ఞాయ
నీత బాహ్యా స్త్వఽబుద్దయః !!! వాళ్ళూ నీతిలేనటువంటివాళ్ళు
బుద్దిలేనటువంటివాళ్ళు కాబట్టి వాళ్ళు శత్రువు యొక్క బలాబలములను తగినటువంటిరీతిలో
విచారణచెయ్యరూ లెక్కకట్టరు ప్రభువు యొక్క మనస్సేమిటో వాళ్ళకి తెలుసు కాబట్టి
ఎంతసేపు మాట్లాడినా ప్రభువు యొక్క హృదయానికి అనుగుణంగా మాట్లాడేటటువంటి ప్రయత్నమే
చేస్తారు.
కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే అసలు యుద్ధం రావడమేమిటీ మహాప్రభో రాముడు కేవలము
నరుడు లక్ష్మణుడు నరుడు రాజ్యబ్రష్టుడు అరణ్యాలలో తిరుగుతున్నవాడు భూశయనం
చేస్తున్నవాడు వానరులా అవేం చేస్తాయి ఈ వానరములూ ఈ రాముడూ ఈ లక్ష్మణుడు
సముద్రాన్ని దాటుతారా వచ్చి సముద్రం అవతలి ఒడ్డులో నిలబడుతారు నీవు అనుజ్ఞనీ నేను
ఒక్కన్ని చాలు అని ప్రహస్తుడంటున్నాడు వెళ్ళీ... ఏదో ఆరోజున నేను ఏమరపాటుగా
ఉన్నాను కాబట్టి హనుమ వచ్చి ఇవన్నీ పాడుచేయగలిగాడు ఇప్పుడు నీవు ఊఁ.. అను వెళ్ళి
హనుమతో సహా వానర సైన్యాన్ని రామ లక్ష్మణుల్ని సంహరించి వచ్చేస్తాను అయినా మాదాకా
ఎందుకు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను జయించినవాడివి యమధర్మరాజుని దిక్పాలకుల్ని
ఇంతమందిని జయించినవాడివి నాగుల్ని జయించినవాడివి నీవు తలచుకుంటే రామ లక్ష్మణులు
నీకోలెక్కా... మహాప్రభో దీనిగురించి సభా పెద్దవిచారణ అవసరమా..? నిమిషమాత్రంలో మనం
వాళ్ళని సంహరించగలం ఇదే ఆయనకి కావాలి ఆయన చాలాసంతోషపడిపోయాడు. ప్రహస్తుడన్నవాడు
నేను వంచించి దెబ్బతీయ్యగలను ఒక్క అవకాశమీయ్ నేను వాళ్ళనుచంపుతాను అన్నాడు.
దుర్ముఖుడు అని ఒక రాక్షసుడు ఆయన ఇంతకన్నా రెండాకులు ఎక్కువ చదువుకున్నవాడు ఆయన
అన్నాడు అనుమతిలేకుండా అసలు అంతఃపురంలో ప్రవేశించడం లంకాపట్టణాన్ని దహించడం
మనందర్నీ దెబ్బతీయ్యడం క్షమించరాని నేరములు అవమానకరములు కాబట్టి నీవునాకు
అనుమతిస్తే ఇప్పుడే నేను నూరుయోజనములుదాటి ఆవలివొడ్డుకువెళ్ళి హనుమని సైన్యాన్ని
కూడా సంహరించివచ్చేస్తాను శుభవార్త నీకు చెప్పేస్తాను అన్నాడు అంటే వీళ్ళకి ఎలా
ఉంటుందంటే అంతతేలికగా ఉంటుంది.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
అయితే హనుమైతే అలా మాట్లాడరు తాను పావువంతు సైన్యాన్ని
నశింపజేసివచ్చారు తానొక్కడే లంకాపట్టణాన్ని తిరిగేయగలరు కానీ ఆయన అలామాట్లాడరు
శత్రుదుర్భేజ్యమైనటువంటి లంక చాలాజాగ్రత్తగా వెళ్ళాలని చెప్తారు,
శత్రుపరాక్రమాన్ని చాలాజాగ్రత్తగా లెక్కకట్టుకోవాలి ఎప్పుడూనూ లేకపోతేనే యుద్ధంలో
ప్రమాదం వస్తూంది. హనుమ అలా మాట్లాడుతారు వీళ్ళు ఇలా మాట్లాడుతారు ఎవరు
మాట్లాడినమాటకి ఇంకొకరు మాట్లాడిన మాటకి పొంతన ఉండదు ఒకరు ఒకలా మాట్లాడుతారు
ఇంకొకరు ఇంకొకలా మాట్లాడుతారు ఇన్నివిన్నవాడు సమన్వయంచేయడు, ఏ ప్రభువు
సమన్వయంచేయాలో ఆయన సమన్వయంచేయడు అన్నీవింటాడు లేచివెళ్ళిపోతాడు అతిశయమాయనకి.
వజ్రద్రంష్టుడు అన్న రాక్షసుడు అన్నాడూ నరులు వానరులతో కలిసివస్తున్నారు ఇన్నికోట్లమందివచ్చి
లంకాపట్టణంమీద యుద్ధం మొదలుపెడితే మనం యుద్ధం చెయ్యడం కష్టంకావచ్చు కాబట్టి ఇతనికి
కొంచెంపిరికితనం ఉంది వాళ్ళలా మాట్లాడలేదు కాబట్టి మహాప్రభో మీరు అనుమతిస్తే మనం
కామరూపులం రాక్షసులందరం వానరరూపాలు పొందుతాము పొంది వానర సైన్యంలో కలసిపోతాం కోట్ల
వానరసైన్యం ఉందికాబట్టి గుర్తుపట్టరు వెనకాతల కలసిపోతాము కలసిపోయి వాళ్ళు
సముద్రాన్ని దాటడానికి ఏదైనా ఉపాయాన్నిపన్నితే వాళ్ళు సముద్ర మధ్యలోదాకా
వచ్చినతరువాత వాళ్ళు దాటడానికి ఏ ఉపకరణ ఎంచుకున్నారో దానిని సముద్రంలో ముంచేస్తాము
సైన్యమంతా సముద్రంలో పడిపోతుంది అథవా వాళ్ళు దాటివచ్చినా అకస్మాత్తుగా మేము
రాక్షసరూపాలు పొంది సైన్యంలో కలసిపోయి ఉన్నాం కాబట్టి వాళ్ళను సంహరిస్తాం ఇది
తేలికా కాబట్టి నీవు అనుజ్ఞ ఇవ్వు వెళ్ళి అలా సంహరిస్తాము అన్నారు.
కుంభకర్ణుని యొక్క కుమారుడు నికుంభుడు వజ్రధరూ వాళ్ళందరూ వెంటనే కోపంతో అసలు
ఊగిపోయారు వాళ్ళొక పెద్దలెక్కా నీవు
అనుమతీయ్ వెళ్ళి చంపేస్తాం వాళ్ళని, ʻవాళ్ళకి అంత తేలికన్నట్టు రామ లక్ష్మణుల్ని చంపడంʼ, వాళ్ళ దృష్టిలో అంతతేలికా అంటే శత్రుబలాన్ని అసలు
అంచనావేసేటటువంటి లక్షణములేని గర్వోద్గతులు అంతటి అతిశయమున్నవాళ్ళు అందుకు కదాండి
రాక్షసత్వం వీళ్ళందరూ ఊగిపోతుంటే చూశాడు ఎంతమంది మాట్లాడారో తెలుసాండీ ఎంతమంది
మాట్లాడినా ఒక్కటేమాట అదొక పెద్దలెక్కా వెళ్ళిసంహరిస్తాము, సూర్యశత్రు సుప్తఘ్నుడు
మహాపార్షుడు మహోదరుడు అగ్నికేతువు అశ్వికేతువు ఇంద్రజిత్ ప్రహస్తుడు విరూపాక్షుడు
వజ్రద్రంష్ఠుడు ధ్రూంక్షుడు అతికాయుడు దుర్ముకుడు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే
విభీషణుడు లేచి మీ అందరూ కూర్చోండి అన్నాడు, అందరూ కూర్చున్న తరువాత విభీషణుడు
మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన ధర్మాత్ముడు విభీషణుడు. విభీషణునికి రాక్షసకులంలో
పుట్టినా అంత ధర్మం ఎందుకొచ్చిందీ అంటే రెండుకారణాలవల్ల వచ్చింది. విశ్రవసో
బ్రహ్మదగ్గరికి రావణాసురుడు విభీషణుడు కుంభకర్ణుడు శూర్పణఖా యొక్క తల్లి వెళ్ళి
సమాగమాన్ని అపేక్షించినప్పుడు అసుర సంధ్యవేళలో వెళ్ళింది కాబట్టి ముందు
పుట్టినవాళ్ళందరూ అధర్మాత్ములు పుట్టారు బాగా చీకటిపడిన తరువాత సమాగం ఫలితంగా
పుట్టినవాడు ధర్మాత్ముడయ్యాడు కాబట్టి అదొక ధర్మాన్ని రామాయణం ఆవిష్కరిస్తుంది.
రెండవది వీళ్ళు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సుచేశారు ముగ్గురూ వెళ్ళి
తపస్సుచేశారు మొదట రావణునికి ప్రత్యక్షమయ్యారు బ్రహ్మగారు నాకు చావు లేకుండా వరం
కావాలన్నాడు ఆయన ఇవ్వలేదు తరువాత ఏవో కొన్నిపేర్లు చెప్పాడు వీళ్ళవల్ల నాకు
చావుండకూడదు అన్నాడు నర-వానరములను నేను అడగనే అడగను అన్నాడు.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
కుంభకర్ణుడి విషయం నేను మీకు తరువాత మనవిచేస్తాను ఎలాగో పెద్ద అల్లరే వస్తుంది
ఆ కుంభకర్ణుడితోటి విభీషణుడి దగ్గరకొచ్చి బ్రహ్మగారు అడిగినప్పుడు విభీషణుడు రెండు
విషయాలు అడిగాడు మహాగొప్ప
ఆపద సంభవించినప్పుడుకూడా నాబుద్ధి ధర్మమును విడిచిపెట్టుకుండుగాకా...
నాకావరం ఇమ్మని అడిగాడు. బ్రహ్మాస్త్రము ఉపదేశము లేకుండా నాకు భాషించుగాకా
ఉత్తరకాండలో చెప్పారు ఈ రహస్యం. కాబట్టి నాకీ రెండూ ఇవ్వమని అడిగాడు వెంటనే
బ్రహ్మగారు అన్నారు నాయనా నీవు చిరంజీవివి నీకు మరణంలేదు అన్నాడు. ఎవరు నేను
మరణించకూడదని అడిగాడో వాడికి ఇవ్వలేదు ఎందుకంటే వాడు అధర్మాత్ముడుగనుక, ఎవరు
అడగలేదో ధర్మం నాకు కావాలన్నాడో ఆయన్ను బతికుంటావు అన్నాడు అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ
బ్రతికుండడం ఉంటుంది అన్ని శుభవార్తలుంటాయి ఎక్కడ అధర్మముంటుందో అక్కడ మంగళముండే
అవకాశం ఉండదు. ధర్మమే ఆలంబనము కాబట్టి ఇప్పుడు ఆయనలేచి అంటున్నాడు ప్రమత్తే
ష్వఽభియుక్తేషు దైవేన ప్రహతేషు చ ! విక్రమా స్తాత సిధ్యన్తి పరీక్ష్య విధినా కృతాః
!! ఆయనా ప్రమత్తే ష్వఽభియుక్తేషు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు
కొన్ని కొన్ని విషయాలని చూడాలి అవతలివాడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు
దెబ్బతీయ్యడానికి వీలుగా బాగా ఎరుకలో లేడుకదా... కొంచం ప్రమత్తుడై ఉండాలి ఎందుకంటే
ఉదాసీనుడై ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదమేమిటీ అని ఏమరపాటుతో ఉన్నవానిమీదకి యుద్ధానికెళ్ళికొట్టాలి.
యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం కాకుండా ఇంకోడు కూడా యుద్ధానికి వెళ్ళటంలేదూ
అన్నవిషయాన్ని చూసుకోవాలి లేకపోతే ఒకరిమీద ఇద్దరు కలసి యుద్ధం చేస్తే మళ్ళీ
వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకోవలసి వస్తుంది. లేదా వచ్చిన ఇద్దరిలో ఒకరితో అవతలాయన సంధిచేసుకుంటే
అవతలాయన బలం ద్విగుణీకృతమౌతుంది కాబట్టి ఇంకొకడు కూడా యుద్ధానికి వెళ్ళటంలేదూ
అన్నది నిర్ధారించుకోవాలి.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
ఆయనా ఇంద్రియ సుఖములలో మునిగి జాగరూకుడుగా లేకుండా ఉన్నాడూ
ఆయనపట్ల విధిబలంగాలేదూ ఈశ్వరానుగ్రహంలేక అన్నిటినీ కోల్పోయి ఉన్నాడూ అన్నవిషయాన్ని
నిర్ధారణ చేసుకోవాలి అప్పుడు యుద్ధానికివెళ్ళాలి. మీరు రాముని మీదకు యుద్ధానికి
వెళ్తున్నారు రాముడు అప్రమత్తం కథం తం తు విజిగీషుం బలే స్థితమ్ ! జిత రోషం
దురాధర్షం ప్రధర్షయితు మిచ్ఛథ !! రాముడు అప్రమత్తుడై ఉన్నాడు శత్రు సైన్యం
ఎటువైపునుంచి వస్తుందోనని వేయికళ్ళతో చూస్తున్నాడు యుద్ధానికి తానుసిద్దంగా
ఉన్నాడు ఏమీ తనపక్కన లేకపోయినా ఇవ్వాళ పరోపకారంచేసి కొన్ని కోట్ల కోట్ల యొక్క
వానరముల బలాన్ని సమీకరించుకున్నాడు విజిగీషుం జయాన్ని సాధించి తీరాలన్న పట్టుదలతో
ఉన్నాడు ఎందుకనీ పోల్లే యుద్ధంలో ఓడిపోతే ఏమైంది ఇప్పుడు ఆ రాజ్యం మనకు రాకపోతే ఏం
వచ్చిందని వెనక్కి వెళ్ళిపోయి ఇంకోమారు వచ్చే పరిస్థితికాదు. తన భార్య ఇక్కడుంది
కాబట్టి గెలిచి తీరాలన్న పట్టుదలతో రాముడు ఉన్నాడు జిత రోషం దురాధర్షం ఆయన
కోపాన్ని గెలిచినవాడు, ఎవడు
కోపాన్ని గెలిచాడో వాడి ఆలోచన గొప్పగా ఉంటుంది. గెలిచినవాడవుకావని
రావణాసురునికి హెచ్చరికి, కాబట్టి నీ బుద్ధిసరిగ్గా ఉండదు దురాధర్షం ఆయన
ఎదురుగుండా నిలబడి యుద్ధంచేయడం అంతతేలికేంకాదు. వాలినంతటివాన్ని ఒక్కబాణంతో
కొట్టాడు దుష్కరం తర్కయేత వా అటువంటివాన్ని ప్రధర్షయితు మిచ్ఛథ ఎలా
యుద్ధం చేద్దామనుకుంటున్నారు. అంత తేలిగ్గా ఏమిటీ ఒక్కడు వెళ్ళి చంపేస్తాను నేను
విరిచేస్తాను నేను చంపేస్తాను అంటున్నారే హనుమవచ్చి లంకనంతట్నీ కాల్చేస్తే
ఏంచేశారు మీ అందరూ పావువంతు సైన్యాన్ని చంపి ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క సంఘాన్ని
పంపుతుంటే వెళ్ళినవాళ్ళని వెళ్ళినట్లే చంపేస్తుంటే ఎవరంవెళ్ళి ఆపగలిగాం.
ఆయన రావణున్ని అధిక్షేపించి మాట్లాడుతుంటే ఎవరం నిగ్రహించగలిగాం ఇప్పుడు
కొత్తగా మేంవెళ్ళి చేసేస్తాం మేంవెళ్ళి చేసేస్తాం అనడం శత్రువు యొక్క బలాన్ని
తక్కువగా అంచనావేయడంకాదా అలా మీరు మాట్లాడచ్చా సముద్రం లంఘయిత్వా తు ఘోరం నద
నదీపతిమ్ ! కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేత వా !! నదీ నదములకు సమాగమ
స్థానమైనటువంటి సముద్రాన్ని నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఒక వానరుడు లంకాపట్టణంలోకివచ్చి
ఒక రాత్రంతా అణ్వేషించి లంకంతాచూసి సీతమ్మ ఎక్కడుందో పట్టుకుని ఆవిడతో మాట్లాడి
శత్రుసైన్యాన్నిచంపి రావణ దర్శనాన్నిపొంది మాట్లాడి నేను ఎలా వచ్చానో అలా
వెడుతాననిచెప్పి వెళ్ళిపోతే పట్టుకోలేకపోయారు. మీరు అక్కడికెళ్ళి హనుమను
చంపుతానంటున్నారు కొన్ని కోట్ల వానరముల మధ్యలో ఉన్నవాన్ని రామ లక్ష్మణులచేత రక్షింపబడుతున్నవాన్ని
ఇది ఏదో ప్రతాపం కింద ఉంది కానీ శత్రుబలం అంచనా వేయడం కింద ఉందా? బలాన్యఽపరిమేయాని
వీర్యాణి చ నిశాచరాః ! పరేషాం సాహసాఽవజ్ఞా న కర్తవ్యా కథం చన !! ఎప్పుడైనా ఆలోచన చేసేముందు
ఎదుటిబలం యొక్క శక్తిని సరిగ్గా అంచనా వేయకుండా యుద్దానికి వెళ్ళేటటువంటివాడు
గెలుస్తాడన్న నమ్మకం ఎప్పుడూ ఉండదు. ఇన్ని బలాలతో ఉన్నటువంటి రాముని మీద
మీరు యుద్ధానికి ఎలా వెడుతారు కిం చ రాక్షస రాజస్య రామేణాఽపకృతం పురా ! ఆజహార
జనస్థానా ద్యస్య భార్యాం యశస్వినః !! అసలు ఈ యుద్ధానికంతటికీ కారణమేమిటీ
అవతలాయన కోరి మనమీదికి యుద్ధానికి రావడం లేదు, మనం ఆయన మీదికి యుద్ధానికి
వెళ్ళలేదు కాని యుద్ధమెందుకొచ్చింది.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
జనస్థానంలో తనపని తానుచేసుకుంటూ మునివృత్తిలో ఉండి
తండ్రిమాట ప్రకారం అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి రామ చంద్ర మూర్తి యొక్క భార్యని
అపహరించి రావణుడు ఎందుకుతేవాలి? తెచ్చి ఎందుకు లంకాపట్టణంలో ఉంచాలి? ఉంచబట్టి కదా
రాముడు సుగ్రీవుడికి పట్టాభిషేకంచేసి ఇన్నికోట్ల వానరాలతో వస్తున్నాడు.
యుద్ధమన్నదాన్ని ఎప్పుడూ కూడా నాలుగు రకాలుగా ఎదుర్కోవాలి సామ దాన భేద
దండోపాయములచేత ఇప్పుడసలు యుద్ధం చేసి ఇంత మంది రాక్షసులు ఈ కాంచనలంకా నశించవలసిన
అవసరమేముందీ? ఏ సీతమ్మని మనం తెచ్చామో తప్పు గనుకా ఆ సీతమ్మని పట్టుకెళ్ళి
ఇచ్చేస్తే శరణాగతవత్సలుడు రాముడు ఏమనడు. అయిపోయిందిగా అసలు మనం చంపుదామన్నమాట
ఎందుకంటున్నారు తప్పువాళ్ళదగ్గరుందా మనదగ్గరుందా..? తప్పు మనంచేశాం తప్పుమనం చేసి
అవతలివారు తప్పుచేశారన్నట్లు మాట్లడటం వాళ్ళని చంపేస్తామనటం మనదితప్పుకాదా..?
మనతప్పు పెరుగుతూంది తప్పా మన ఒప్పు చేయబడుతుందా, తప్పు దిద్దపడుతూందా తప్పు
మనదగ్గరుండి పెరగడం ఒప్పు వాళ్ళదగ్గరుండడం ఒప్పు తప్పుని కప్పేస్తుంది ఎప్పటికైనా ఒప్పూ
తప్పున్నవాన్ని భక్షించేస్తుంది కాబట్టి మనం నిహతులం అవుతాం. కాబట్టి
వెంటనే తీసుకెళ్ళి మనం ఇచ్చేయ్యద్దా ఖరో యద్యఽతివృత్త స్తు రామేణ నిహతో రణే !
అవశ్యం ప్రాణినాం ప్రాణా రక్షితవ్యా యథా బలమ్ !! కాదు కాదు ఖరదూషణాదుల్ని
రాముడు చంపాడూ అందుకని మనం యుద్ధానికి వెడుతున్నామంటారా ఖరదూషణాదుల్ని రామునిమీదకి
యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు. రాముడు యుద్ధానికి పిలిచాడా ఖరదూషనాదుల్ని
ఆయనేం పిలవలేదే శూర్పణఖని వెళ్ళమని ఎవడు చెప్పాడూ శూర్పణఖ మాటపట్టుకుని యుక్తా
యుక్త విఛక్షణలేకుండా రామునిమీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారూ వెళ్ళి
బాణప్రయోగం చేసినతరువాత ఏ ప్రాణియైనా తనను తాను రక్షించుకునే ప్రయత్నంచేయదా
పరాక్రమవంతుడైన రాముడు తననిరక్షించుకునే ప్రయత్నంలో విడిచిపెట్టబడినటువంటి బాణ
పరంపరలకు పధ్నాలుగువేలమంది ఖరధూషణాదులు తెగటారిపోతే రాముడిది తప్పా యుక్తా యుక్త
విఛక్షణ లేకుండావెళ్ళిన ఖరధూషణాదులది తప్పా.
రాముడు తప్పుచేశాడూ అందుకని ఆయన
యుద్ధానికి రావడంతప్పూ అని అనడానికి మనదగ్గర ఏముంది ఆస్కారం తప్పంతా మనదగ్గరుంది
కాబట్టి అ యశస్య మఽనాయుష్యం పర దారాఽభిమర్శనం ! అర్థ క్షయ కరం ఘోరం పాపస్య చ
పునర్భవం !! పరధారని
కోరినటువంటివాడు ఎవడుంటాడో వేరొకరి ఇల్లాల్నీ ఊహించినవాడు ఎవడుంటాడో పరస్త్రీని
కామంతో ముట్టుకున్నవాడు ఎవడుంటాడో వాడియొక్క ఐశ్వర్యము నశించిపోతుంది అటువంటివాడి
యొక్క ఆయుర్ధాయము క్షయమైపోతుంది, అటువంటివాడు పాపాత్ముడై నీచమైనటువంటి
జన్మల్ని పొందుతాడు అటువంటివాన్ని నమ్మి వెనకనున్నవాళ్ళందరుకూడా నశించిపోతారు ఇది
మహాపరాధమని తెలిసి ఇంతటి పాపంచేసి సీతమ్మని అశోకవనంలో ఉంచి మనం యుద్ధానికి
దిగుతున్నామని తెలిసికూడా... మనం ఎందుకు ఈ యుద్ధం చెయ్యాలి సీతమ్మని తీసుకెళ్ళి
అర్పణ చేసేస్తే సంతోషంగా హాయిగా మనం జీవించచ్చు. కాబట్టి త న్నిమిత్తం వైదేహీ
భయం నః సుమహ ద్భవేత్ ! ఆహృతా సా పరిత్యాజ్యా కలహాఽర్థే కృతే న కిమ్ !! అసలు
కలహానికి కారణమేదో మీరు విచారణచేయండి సీతమ్మని తేవడమే కలహానికి కారణం సీతమ్మని
తేవడం కలహానికి కారణం కనుక సీతమ్మని ఇచ్చేస్తే అయిపోయింది అంతే కలహంలేదు, మీరు
కలహమెలాచేద్దామని ఆలోచిస్తున్నారు కానీ కలహనికి కారణాన్ని ఎలా తీసేయొచ్చని ఎందుకు
ఆలోచించరు కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి న నః క్షమం వీర్యవతా తేన ధర్మాఽనువర్తినా
! వైరం నిరఽర్థకం కర్తుం దీయతామ్ అస్య మైథిలీ !! అనర్థదాయకమైనటువంటి ఈ
యుద్ధాన్ని చేయడం మానేసి చక్కగా ఏనుగులతో గుఱ్ఱాలతో కాంచనలంకయై ఇంతవైభవంగా
ఉన్నటువంటి ఈ లంకాపట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్ళి రామ చంద్ర మూర్తికి
సమర్పించి మనం కృతకృత్యులమౌదాం అన్నాడు. ఏ ఒక్కడూ మాట్లాడినవాడులేడు రావణుడు కనీసం
స్పందించలేదు ఇదీ రావణ సభ అదీ రామ సభ ఇదీ తేడా.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
కాబట్టీ విజయాన్ని కోరుకొనేటటువంటివాడు నలుగుర్నీ కలుపుకోవాలి
మేమేబాగా నిర్ణయం చేయగలమన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు అవతలవారు ఒకమాట
చెప్పారనుకోండి హా... నా ఆలోచనకన్నా ఇది బాగుందీ అనిపించిందనుకోండి కార్యంలో
జయంరావడం ప్రధానమా నీ ఆలోచన నెగ్గడం ప్రధానమా ఇదీ పరీక్షేం కాదు ఎవరు తెలివైనవారని
పరీక్షకాదు అందరూకలసి కార్యాన్ని నడిపించడం ప్రధానం. నీ ఆలోచనకన్నా అవతలివారి ఆలోచనబాగుందనుకోండి చాలా
బాగుందండీ ఇలా చేద్దాం అయితే అని నీవు అనగలిగితే నీవు ఉదారుడవు అది నీ సౌశీల్యత
చాలా గొప్పవాడివి నీవుకాదు నేను అన్నాను కాబట్టి ఇలాగే జరగాలంటే అప్పుడూ
కార్యమేమైపోయినా ఫర్వాలేదు నీవు అనుకున్నట్లు కార్యం జరగాలన్న ఒకమూర్ఖత్వం నీయందు
ఉన్నట్లులెక్కా. అందుకే రావణుడు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పినదానిలో ఉన్నసారాన్నిపట్టుకోడు రాముడు అలాగకాదు తను ఏదైనా చేయాలనుకుంటే
ఎందుకు అలా చేస్తున్నాడో ఇతరులు చెప్పింది ఎందుకు వింటంలేదో చెప్పి చేస్తాడు,
రావణుడు చెయ్యాలనుకున్నాడనుకోండి నేను ఇందుకు చేస్తాను నీవు చెప్పింది ఇందుకు
తప్పు అనడు ఎందుకంటే తనది తప్పని తెలుసు ఇతరులది ఒప్పని తెలుసు అసలు ఒప్పన్నది
చెప్పనీయకుండా కొంతమందిని తొక్కేస్తాడు ఒప్పన్నది చెప్పినవాళ్ళమాటని వినకుండా
మౌనంపాటిస్తాడు. తాను మాట్లాడవలసివస్తే ఒప్పు చెప్తున్నవాన్ని బయటికి తరిమేస్తాడు
కాబట్టి చెప్పేసాహసం ఎవరు చేయకుండా చేస్తాడు. ఇది ఎక్కడికెళ్తూంది తన వినాశనానికి
వెళ్తూంది కాబట్టి కార్యజయం
కోరుకున్నవాడు జీవితంలో తన అభ్యున్నతిని కోరుకున్నవాడు సలహా అడగడమంటే సలహా
అడగడంకిందే అడగాలి సలహా అడిగేటప్పుడు ఆయన ప్రాజ్ఞుడు మనం అడుగుతున్నాం అనుకుంటేనే
అడగాలి. ఒక కార్యానికి ఒక పెద్దరికం ఒకరికి ఇస్తే ఆయన కార్యానికి పెద్దరికం
తగినవాడే అని నిర్ణయించుకుంటే ఇవ్వాలి, ఒకసారి ఇస్తే ఆయన పెద్దరికాన్ని
ఇకపాడుచేయకూడదు నీవు ఎంత నిర్భయంగా ఉండాలంటే త్రికరణశుద్ధిగానమ్మాలి ఆయన
పెద్దరికమున్నవాడు ఆయన నిర్వహణాసమర్థుడు ఆయనచేస్తాడని నీవునమ్మి ఉండాలి.
ప్రతిదాంట్లోనూ మళ్ళీవేలుపెట్టకూడదు స్వేచ్ఛ ఇచ్చేయ్యాలి ఆ నడిపించండి అనగలిగి
ఉండాలి ఇదీ నిర్వాహకత్వంలో ఉండవలసిన లక్షణాలు.
మీరు రాముడ్నిచూడండీ ఇవి మీకు
కనపడుతాయి నీలున్ని పంపించి మళ్ళీ నీలుని వెనక ఒక గూఢచారిని పంపించాడు అదే
రావణుడైతే ఎవ్వర్నీనమ్మడు, ఎవ్వర్నీనమ్మడు ఎందుకు నమ్మడంటే వాడుచెయ్యడూ అని ఒక
అపనమ్మకం చేస్తాడు అని నమ్మడు. నిజంగా చేసేవాళ్ళు ఉంటారు చెయ్యనివాళ్ళు ఉంటారు
చేసేవాన్నీ నమ్మకపోతే ప్రమాదంకదా అసలు చెప్పినవాడిమాట వినడు మంచి చెప్పినవాన్ని మీరు తరిమేశారనుకోండి ఇక
మంచిచెప్పే ప్రయత్నం ఎవరుచేస్తారండీ మీ దగ్గర ఉండాలనుకునేవాళ్ళు ఎవరుంటారంటే
మీరుచెప్పిందే నిజమనేవాళ్ళే మీదగ్గర ఉంటారు కదా... అందర్నీ వీడు
అడుగుతున్నట్లే ఉంటుంది కానీ మీరు అందర్నీ అడిగినట్లు సభపెడుతారుకానీ మీరనుకున్నదే
నిజమౌతూంటుంది. ఇలాంటివి మీరు చూడ్డంలేదా ఇప్పటికీ... ఇప్పటికీ ఉంటాయి ఇలాంటివి అవి
రావణ సభలూ అనిగుర్తు, రామ సభలు వేరుగా ఉంటాయి. కాబట్టి వినలేదు రావణుడు ఏమీ
మాట్లాడలేదు ఇప్పుడు విభీషణుడులేచి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసాండీ
ఒక్కటే కారణం తాను
త్రికణశుద్ధిగా నమ్మ యదార్థమిది అనుకుని తానుచెప్తే దానికి స్పందనలేనప్పుడు ఎవ్వరూ
దానిమీద మాట్లాడనప్పుడు ఆ సభలో వినేవాడులేడు ఆ సభలో తన మాటను పట్టుకుని
నచ్చచెప్పేవాడులేడు, అంటే మిగిలినవాళ్ళకి ఏం కావాలంటే రావణుడి ప్రాపకంకావాలి ఆయన
తప్పుచేస్తున్నాడు అనితెలిసినా తప్పనిచెప్పేవాళ్ళుకారు.
పోనీ ఒకడు చెప్పినా ఏమండీ ఆయన చెప్పినదాంట్లోకూడా
ఆలోచించవలసిన విషయం ఉందండనేపాటి ధైర్యంచేసినవాడులేడు కాబట్టి ఇప్పుడు సభలో
చెప్పడంకన్నా రావణుడు ఒక్కడే ఉన్నప్పుడు చెప్పడమే మంచిది ఎందుకనీ తాను సోదరుడు
వెళ్ళగలడు మాట్లాడగలడు వీళ్ళందరిమధ్యలో మాట్లాడిప్రయోజనమేమిటీ వాళ్ళెవ్వరూ ఇక
మాట్లాడరనితెలుసు తన సోదరున్ని రక్షించుకోవాలంటే సోదరుడు కాబట్టి
అంతఃపురానికివెళ్ళి మాట్లాడ్డం మంచిది కాబట్టి ఇంకెందుకు ఆ సభలో లేచిపోయాడు ఇది
ఆయన ప్రాజ్ఞత. ఒక్కక్కడి ప్రవర్తన ధర్మాన్ని నమ్మినవాడు ధార్మిక కోణంలోనే చూస్తారు
విభీషణుడి యొక్క ఔదార్యము, విభీషణుడి యొక్క మంచితనము మాట్లాడివెళ్ళిపోవడంలో కూడా
మనకి కనపడుతుంది. మరునాటి ప్రాతఃకాలంలో రావణాసురిడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు
అబ్బో..! ఏనుగులు గుఱ్ఱాలు రథాలు బ్రాహ్మణులు మంత్రాలు ఆశ్వీర్వచనాలు యజ్ఞయాగాది
క్రతువులు మంచి యవ్వనంలో ఉన్నటువంటి అందగత్తెలు అందరూ తిరుగుతున్నారు కోలాహలం ఆ
ముందంతాకూడా రథాలు బంట్లూ విచ్చుకత్తులూ ప్రహరాలూ ఎలా ఉండాలో అలా ఉంది మేఘములతో
కూడిన సముదాయమా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి విభీషణుడు ప్రవేశించాడు.
ప్రవేశించిన తరువాత కనుసన్నచేశాడు రావణాసురుడు కూర్చో అని చూపించాడు ఒక ఆసనాన్ని
ఎందుకనీ..? లేచివచ్చి తమ్ముడా..! ఎమిరా ఇలా వచ్చావు ఇంతతెల్లవారిగట్లా అని
కౌగలించుకోడు ఆయన తెల్లవారిగట్ల ఎందుకురావాలి, అంటే అదీ బ్రాహ్మీముహూర్తము అది ప్రసన్నమైనకాలము కేవలము
ఈశ్వరానుగ్రహమునకు యోగ్యమైనటువంటికాలము అందుకే మనకి పెద్దలు ఎప్పుడూకూడా ఏం
చెప్తారంటే ఒక సంవత్సరాన్నంతట్నీ
ఒక రోజుగా మీరు భావన చేస్తే ప్రాతః కాలం కిందకి వచ్చేదేమిటో తెలుసాండి శారదా
నవరాత్రులు, శారదా నవరాత్రులు ప్రాతఃకాలం కిందకొస్తాయి అందుకే శారదా నవరాత్రుల
ఉపాసన చేయకుండా ఎవరు ఉండరు శారదా నవరాత్రులు చెయ్యాలి.
అసలు మన ఋషుల ప్రజ్ఞంతా ఎక్కడుందో
తెలుసాండీ ఆ పెట్టడంలో ఉంది. మీరు చూడండీ నక్షత్రాలెన్ని మనకి 27 నక్షత్రాలు, 27
నక్షత్రాలలో మొదటి నక్షత్రమేదీ అశ్వినీ నక్షత్రం చిత్తా నక్షత్రం ఎప్పుడొస్తుంది
పదమూడు ముందు పదమూడు వెనక తోసి మధ్యలో నక్షత్రం చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రం
చంద్రుడితో కూడితే వచ్చేటటువంటి మొదటిమాసం చైత్రమాసం అదేమిటీ అశ్వినీ నక్షత్రంతో
కూడిన ఆశ్వీజ మాసం కదా మొదటిరావాలి రాదు చైత్రమాసం ముందు వస్తుంది, ఆశ్వీజమాసం
మధ్యలోకి వెళ్తూంది చైత్రము వైశాఖము జ్యేష్టము ఆశాఢము శ్రావవణము భాద్రపదము తరువాత
ఆశ్వీజము వస్తూంది. ఉపాసన ఎక్కడ మొదలౌతుంది చైత్రంలో మొదలౌవ్వాలి కానీ ఆశ్వీజంలో
మొదలౌతుంది శారదా నవరాత్రులు అప్పుడు మొదలౌతాయి. అసలు ముందు అమ్మవారి అనుగ్రహంతో
నీవు ముందు ప్రకృతిని దాటగలిగితే తమోగుణ రజోగుణాల్ని దాటగలిగితే ఆ తరువాత నీవు
ఈశ్వరున్నిచేరడం శారదానవరాత్రులు బాగాపడించినవానికి వసంతనవరాత్రులు పండిస్తాయి ఇదీ
శారదానవరాత్రులు ముందు వసంతనవరాత్రులు వెనక్కీ వస్తాయి చైత్రమాసంలో జరిగే
వసంతనవరాత్రులు. ఉపాసన ఎలా ఉండాలో అలా సంవత్సరాలు తీసుకొచ్చారు పెద్దలు.
దక్షిణాయణం ఉత్తరాయణం విభాగం కింద అందుకని విభాగం చేశారు ఉపాసనని, సరే అది కాలము
శారదా నవరాత్రులు హడావిడి అనుకోండీ... కాబట్టి శారదా నవరాత్రులు సంవత్సరాన్నంతటినీ
ఒక రోజుగా భావన చేసినప్పుడు అవి బ్రహ్మీ ముహూర్తంలోకి వస్తాయి అది తెల్లవారిఝాము
సమయము, తెల్లవారుఝాము సమయం ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటుంది. ఆ సమయంలో మీరు లేచి
ఈశ్వరోపాసన చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కారణమేమిటంటే మనసు ప్రసన్నంగా
ఉంటుంది ఆసమయంలో కాబట్టి అప్పడైతే వింటాడేమో వింటే ఏమౌతుంది తనకేమీ
సన్మానమక్కరలేదు ఆయన బాగుపడుతాడు సోదరప్రేమ కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడుదామని
వెళ్ళాడు.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
నిన్ననూ మాట్లాడాడుకదాండీ..! నీన్న మాట్లాడింది తనకొరకు మాట్లాడాడు అని
అర్థమైందనుకోండి తన అభ్యున్నతికొరకు మాట్లాడింది అని నమ్మాడనుకోండి ఇప్పుడు
చక్రవర్తిగా కూర్చోలేదుగా రాజసభ కాదుగా అన్నగారి ఇల్లు తమ్ముడు వెళ్ళాడు,
అన్నగారిని తమ్ముడు కౌగలించుకోవడానికి మర్యాదలెందుకూ లేచి తమ్ముడా ఏమిరా
ఇంతపొద్దున్నే నాకోసంవచ్చావు రా కూర్చో ఏమిటి విశేషం అని అడగాలిగా... ఆయనేం
మాట్లాడలేదు (ఇలా తలతో ఆసనం చూపించాడు) ఓ ఆసనం చూపించాడు కూర్చో అంటే మళ్ళీ
పొద్దున్నేవచ్చావు ఏదైనా మొదలెడుతావేమిటీ అన్నట్లు విముఖంగా ఉన్నాడు అంటే ఎప్పుడూ మంచి వినడానికి సిద్ధంగా ఉండడూ
మనుష్య జీవితంలో పెద్దలమాట వినడం అన్నది ఎంత ముఖ్యమో మీరు బాగా అర్థం చేసుకోవలసి
ఉంటుంది రామాయణాన్ని అంతేకానీ ఏదో కథాపరంగా ఆ శ్లోకం చదివేసి విభీషణుడు
వెళ్ళాడు ఆయన ఇలా అన్నాడు కూర్చున్నాడు అని చెప్పడానికి నేనెందుకూ అక్కరలేదు, మనమేం అన్వయం చేసుకోవాలో తెలుసుకోవలసి
ఉంటుంది రామాయణం చదివి కాబట్టి యదా ప్రభృతి వైదేహి సంప్రా ప్తేమాం పురీ
మిమాం ! తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తా నిమిత్తా న్య శుభాని నః !! అన్నయ్యా!
నీవు ఏనాడు సీతమ్మతల్లిని అపహరించి తీసుకొచ్చి అశోకవనంలో శింశుపా వృక్షంకింద
కూర్చోబెట్టావో ఆ నాటినుంచి లంకాపట్టణంలో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి అంటే లంక
పథనమైపోవడానికి సీతమ్మని నీవు తేవడమే కారణము అన్నది స్పష్టంగా తెలుస్తూంది
దానిపథాకస్థాయి ఇప్పుడు జరుగబోయే యుద్ధము ఏమి కనపడ్డాయిరా అని అడుగుతావేమో..? స
స్ఫలింగ స్సధూమాఽర్చ స్సధూమ కలుషోదయః ! మంత్ర సంధుక్షితోఽప్యఽగ్ని ర్న సమ్యగఽభి
వర్ధతే !! ఎప్పుడైనా హోమం చేద్దామూ అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చితే నీవు
సీతమ్మని తీసుకొచ్చిన రోజునుంచి చిటపట శబ్దాలతో విస్ఫులింగాలు వస్తున్నాయి
అగ్నిహోత్రంలోంచి ప్రసన్నంగా జ్వాల పైకిలేవట్లేదు నాలుక (నాలుకతో లాక్కున్నట్లు)
ఎలా పుచ్చుకుంటుందో అగ్నిజ్వాలా అలా పుచ్చుకోవాలి, పుచ్చుకుంటే దేవతలందరూ
తృప్తిపొందుతున్నారని గుర్తు. అగ్నిజ్వాల లేవట్లేదు అగ్నిజ్వాల దగ్గర మీరు
ఎందుకుండలేరంటే ఇలా ఇలా వెనక్కి తప్పుకోవలసిన పరిస్థితి ఎప్పుడొస్తుందో తెలుసాండీ
చిటపటలతో విస్ఫులింగాలంటారు రవ్వలులేచి మీద పడుతున్నాయనుకోండి పెటిల్లు
పెటిల్లుమని పేల్తూ మీరు వాడవలసినటువంటి సమిధ జాగ్రత్తగా వేయలేదనీ దేవతలు అప్రీతి
చెందారు పుచ్చుకోవట్లేదని గుర్తు.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి జ్వాల బాగాలేచి నాలుకలుచాపి ఉండాలి హవిస్సు
ఇచ్చేటప్పుడు అన్నయ్యా ఆరోజునుంచి ఎక్కడా లంకలో హోమంచేసినా
విస్ఫులింగాలొస్తున్నాయి తప్పా నాలుక చాపి హవ్యవాహనుడు పుచ్చుకోవట్లేదు, ఎప్పుడూ
పొగేవస్తూంది పొగొస్తూంది కానీ వెంటనే మంత్రభాగాన్ని ఆపుచేసి పొగొస్తే మంట బాగా
రగిలేటట్టుగా చేస్తారు ఆ రగిలేటట్టుగా చేస్తే మళ్ళీ జ్వాల లేచిన తరువాత మంత్రభాగం
మొదలుపెడతారు ఓసారి కుడిచేవిమీద చేయివేసుకుని మళ్ళీ మొదలు పెడతారు, మొదలుపెట్టి
హవిస్సు ఇస్తారు కానీ అసలు జ్వాల లేవట్లేదు ఎప్పుడూ ఎప్పుడూ పొగేవస్తూంది అగ్నిహోత్రంలోంచి
అదొక పెద్ద దోషం కాబట్టి దుర్నిమిత్తంకింద వస్తూంది మన ప్రయత్నానికి కూడా జ్వాలా
పైకిలేవట్లేదు, దానితోపాటుగా అగ్నిష్ఠే ష్వఽగ్ని శాలాసు తథా బ్రహ్మ స్థలీషు చ !
సరీ సృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః !! ఎప్పుడైనా వంట చేసేటటువంటి ఇంట్లోకి పామురాకూడదు పామువస్తే
యజమానివెళ్ళిపోతాడని గుర్తు. వంట ఇళ్ళల్లో లంకాపట్టణంలో ఉన్న వంట ఇళ్ళల్లోకి
పాములొచ్చి కనపడుతున్నాయి వేదాధ్యయనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి పాము
ప్రవేశించదసలు అక్కడికి పాము రాదు. సాధారణంగా రాదు అందుకే రావి చెట్టుకింద ఎక్కవ
కూర్చుంటుంటారు పాములు తిరగవని, వేదాధ్యనం జరిగిగేటటువంటి ప్రదేశాల్లోకి
పాములొచ్చి కనపడుతున్నాయి అక్కడ తిరుగుతున్నాయి పైగా హోమం చేయడానికి సిద్ధంచేసినటువంటి
చెరువులో అంటే ఆ పదార్థంలో హవ్యంలో ఎప్పుడూ కూడా చీమలు చచ్చిపోవడంకానీ ఈగలు
చచ్చిపోవడంకానీ అలాంటివి ఉండకూడదు నెయ్యి పాలు పెరుగు పాయసము మొదలైనటువంటివాట్నీ
సిద్ధం చేసి ఇలా పట్టుకొచ్చి అక్కడ పెట్టీ హవ్యం సమర్పిద్దాం అగ్నిహోత్రానికనీ ఇలా తీసేటప్పటికీ చనిపోయిన చీమలు అందులో
ఉంటున్నాయి అంటే ధూశ్యమైపోతుంది హవ్యము అది ఇవ్వడానికి వీల్లేదు ఇంక.
కాబట్టి అటు అగ్నిహోత్రమూ
పుచ్చుకోవట్లా ఇక్కడ హవ్యమూ ఇవ్వడానికి యోగ్యంగాలేదు అంటే దేవతల యొక్క అప్రీతి
ఉంది, దేవతలు సిద్ధంగాలేరు అనుగ్రహించడానికి దేవతానుగ్రహము దేనివలన కలగట్లేదని
గుర్తు ఏది ఉందో అది స్పష్టంగా కనపడుతూంది అన్నయ్యా... కాబట్టి నీవు ఈ విషయంలో
జాగ్రత్తపడవలసి ఉంటుంది ఇప్పుడే ప్రతి ఇంటి యజమాని చనిపోతాడుయుద్ధంలో ప్రతి ఇంటా
యజమానులుపోతారు అందుకే ఒక్క అంతఃపురంలోకాదు అన్ని వంటిళ్ళల్లో పాములు
కనపడుతున్నాయి. అంటే లంకలో ఉన్న రాక్షసులందరూ వానర రామ-రావణ యుద్ధంలో
నశించిపోతారని గుర్తు నీతోపోదు అన్నయ్యా అందరూ పోతారనిచెప్తున్నాడు. కాబట్టి గవాం
పయాంసి స్కన్నాని విమదా వీర కుంజరాః ! దీన మఽశ్వాః ప్రహేషంతే న చ గ్రాసాఽభి నందినః
!! అన్నయ్యా! ఎక్కడ చూసినాకూడా పాడి ఆవులు ఐశ్వర్యానికిగుర్తు ఆవు బలిష్ఠంగా
తెల్లగా హిమవత్ పర్వతంలా ఇంటిముందు ఉండడమో గోశాలలో ఉండడమో గుళ్ళో ఉండడమో
జరిగిందనుకోండి ఎన్ని దోషాలనో అది కాజేసుకుంటుంది, ఎన్ని దోషాలు కలగనివ్వండి ఆవు
కాజేసుకుంటుంది దానికి ఆ శక్తి ఉంది. అందుకే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠచేసి మీరు
నేత్రాభినయనం చేశారనుకోండి ఎదురుగుండా నిలబడద్దని చెప్తారు పక్కకెళ్ళిపోండి
పక్కకెళ్ళిపోండి అని చెప్తారు రెండే పుచ్చుకోగలవు లోకంలో ఒకటీ కుంభం మోస్తారు
అన్నరాశి మీద మొదటి దృష్టిపడాలి లేకపోతే పుచ్చుకోగలిగింది గోవు ఒక్కటే
పుచ్చుకుంటుంది. అందుకే అసలు పూజ కూడా అభిముఖ పూజ లేదు మనకి శాస్త్రంలో మీరు ఈశ్వరుడి యొక్క మూర్తికి ఎదురుగుండా
కూర్చుని పూజ ఎప్పుడూ చేయకూడదు, మీరు అలా చేస్తే మీ తేజస్సు క్షీణిస్తుంది.
అందుకే పెద్దలైనవాళ్ళ ఇళ్ళల్లో పూజా
మందిరాలు మీరు చూడండీ మీరు ఎప్పుడూ అభిముక పూజ ఉండదు. మీ తేజస్సు ఈశ్వరుడివల్ల పెరగాలి అని కోరుకుంటే మీరు
తూర్పుకు తిరగాలి ఈశ్వరుడు ఉత్తరానికి తిరగాలి సింహారనం ఉత్తరాన్ని చూస్తుంది మీరు
తూర్పుకి తిరిగి ఉంటారు. మీరు ఎప్పుడైనా శంకరాచార్యులవారు పూజ
చేస్తున్నటువంటిగానీ పెద్దలు చేస్తున్నటువంటి పూజకానీ మీరు చూడండి. అంతవరకెందుకు
భారతీ తీర్థస్వామి అభిషేకం చేస్తున్నది అక్కడున్నది మీరు చూడండీ ఆయన ఎదురుగుండా
కూర్చుని అభిషేకం చేస్తున్నారా ఎప్పుడూ చేయరు పెద్దలు అలాగా ఒక పక్కకి కూర్చుని అభిషేకం
చేస్తారు, ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. నేను ఇలా తూర్పుకు ఉన్నాననుకోండి నా
స్వామి ఉత్తరానికి ఉన్నాడనుకోండి నేను ఇలా పువ్వు వేస్తుంటే ఆయన పాదాలుమీద పడుతుంటాయి,
నేను ఆయన పాదాలు ఒత్తితే నా ఉత్తరీయంతో పాదాలు ఒత్తుతాను. ఆయన నన్నుచూశారనుకోండి
ఆయన తేజస్సుని తట్టుకోడానికి నా ఉపాసనాబలం సరిపోదు నా తేజస్సు క్షీణిస్తుంది
ఎదురుగుండా కూర్చుంటే అందుకనీ అభిముక పూజలేదు లోకంలో. ఎప్పుడూ కూడా తూర్పు ముఖంగా
దేవతానుగ్రహం కావాలంటే కూర్చోవాలి, దక్షిణాభి ముఖంగా తిప్పకూడదు కాబట్టి
ఈశ్వరున్ని తదనుగుణంగా ఐశ్వర్య వృద్ధి గృహస్తుకోరుతాడు కాబట్టి సాధారణంగా ఉత్తరాది
ముఖంగా సింహానాన్ని ఉంచి కూర్చుని తను పూజ చేస్తాడు, అది శాస్త్రీయమైన పూజ ఆ పూజ
దేవతల యొక్క అనుగ్రహాన్ని నీకు పరిపుష్ఠం చేస్తూంది. మీరు చేసిన పూజ ఫలీస్తూంది.
సరే ఇది అయిపోయాక నన్ను చాలా అనుమానాలు అడక్కండి, ఎందుకంటే ఇది తేనె
తుట్టేలాంటిది, దీంట్లో పట్టుకోగలిగితే మర్మం తేలిగ్గా పట్టుకోవచ్చు అది పెద్ద
విశేషమేం కాదు. అది పట్టుకోకుండా దాన్నిచిలవలు పలవలు చేసుకుంటారు. ఎందుకంటే నాకు
భయం మా ఇంటికొచ్చి ఓసారి చూడండీ అంటారు అన్నీ నేనెక్కడ చెప్పగలను.
కాబట్టి ఆవులు నిష్కారణంగా
చచ్చిపోతున్నాయి, ఆవు చచ్చిపోతూందంటే ఆవు జరుగుతున్నటువంటి దోషములను
విరగగొట్టగలిగినటువంటి శక్తిని ఆవులుకూడా కోల్పోతున్నాయి ఇక ఇంతకన్నా అన్యాయం
ఏముందన్నయ్యా..? ఎన్నిదోషాలనైనా ఆవు ఒక్కటి రక్షిస్తుంది అది బలవర్ధకంగా ఇంటిముందు
నిల్చొనో గుళ్ళో నిల్చొనో ఉంటే మీరు అరటిపండు పెట్టారనుకోండి చాలు ఆ ఆవు
కాపాడేస్తుంది. ఆవుకి ఆ శక్తుంది గోవుకి. కానీ గోవులన్నీ సుష్కించిపోతున్నాయి
లంకాపట్టణంలో విమదా వీర కుంజరాః ఏనుగులని భద్రగజములని ఉంటాయి, భద్రగజములు
అంటే పర్వతాల్లాగే ఉంటాయి మీరు గురువాయ్యురులో చూడాలివాటిని అవి తొండం
కిందకివదిలితే నేలని ఈడుస్తాయి అందుకనీ అది తొండాన్ని వదిలేసిందనుకోండి ఇలాగా
నేలకు తగలడం కాదు నేలకు తగిలిన తరువాత మళ్ళీ ఒక మూడు నాలుగు అడుగుల తొండం నేలమీద
పడుకుంటుంది అంతేగాని కురచ తొండంతో ఉండదు నేలమీద మూడు నాలుగు అడుగుల తొండం
పడుతుంది కాబట్టి అది ఏం చేస్తూందంటే ఇలా చుట్టుతుంది ఇలా చుడితే ఒక మూడు నాలుగు
చుట్టలు చుట్టుకుని ఇలా పట్టుకుని ఉంటుంది వదిలిందనుకోండి నేలమీదకి అంతెత్తున
కుంభస్థలముంటే ఇంత కిందకి తొండం తగులుతూ నేలమీద మళ్ళీ మూడు నాలుగు అడుగులు ఉంటుంది
మళ్ళీ తొండం అంతంత పెద్ద ఏనుగుల్నైతే భద్రగజాలంటారు అటువంటి భద్రగజాలు మదజలాల్నీ
శ్రవించాలి ఒక్క భద్రగజం మదజలాన్ని శ్రవించట్లేదు. కాబట్టి దీన మఽశ్వాః
ప్రహేషంతే గుఱ్ఱాలు చాలా దీనంగా షకిలిస్తున్నాయి అంటే నశించిపోయే కాలం
చాలాదగ్గరకొచ్చేసింది న చ గ్రాసాఽభి నందినః గడ్డివేస్తే సంతోషంగా
గడ్డిపరకలు పైకితీసి నోరు అల్లార్చితినాలి, ఎందుకంటే గుఱ్ఱం నోట్లో కళ్ళెం ఉంటుంది
ఎప్పుడూ అది నోరుతెరిచి తినేటప్పుడు మీరు ఎప్పుడైనా చూశారోలేదో ఆ కళ్ళెం అవి
తీసేసిన తరువాతా గుఱ్ఱానికి కళ్ళకు కట్టిన గంతులు అవీ విప్పేస్తే తరువాతా గుఱ్ఱం
గడ్డి తినడంలో ఒక గొప్ప ఉత్సాహం ఉంటుంది. పెద్ద నోరు తెరిచి దవడలు వ్రేలాడుతూ
పచ్చిగడ్డి తింటుందది అలా తింటంలేదు పచ్చిగడ్డిని చూసి అలా విముఖంగా
పక్కకెళ్ళిపోతూంది.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
అంటే దుర్నిమిత్తం కనపడుతూంది అన్నయ్యా ఖరో ష్ట్రాఽశ్వతరా
రాజన్ భిన్న రోమాః స్రవంతి నః ! గాడిదలు ఒంటెలు కంచరగాడిదలు వాటికి
నిష్కారణంగా అన్నిటికీ వెంట్రుకలు ఊడిపోతున్నాయి న స్వభావేఽవ తిష్ఠన్తే విధానై
రఽపి చిన్తితాః !! ఏది ఎలా ఉండాలో అలాగ ఉండడంలేదు వాయసా సంఘశః క్రూరా
వ్యాహరంతి సమంతతః గుంపులు గుంపులుగా కాకులు ప్రాతః కాలవేళలోనూ అప్పుడూ వచ్చి
ఇళ్ళల్లలో కూర్చుని పెద్దగా అరుస్తున్నాయి దూరంగా సమవేతా శ్చ దృశ్యంతే విమానాఽగ్రేషు
సంఘశః !! ఇళ్ళ యొక్క ప్రాకారముల మీద కూర్చుని అరుస్తున్నాయి గృధ్రా శ్చ
పరిలీయంత పురీ ముపరి పిండితాః ! ఉపపన్నా శ్చ సంధ్యే ద్వే వ్యాహరంత్యఽశివం శివాః !!
గ్రద్ధలూ గుంపులు గుంపులుగా ఆకాశంలో లంకాపట్టణం మీద అలా తిరుగుతూనే ఉంటున్నాయి ఉభయ
సంధ్యలలో ప్రాతఃకాల సంధ్యయందు సాయంకాల సంధ్యయందు నక్కలు పట్టణంలోకివచ్చి పెద్దగా
ఊళ వేస్తున్నాయి త దేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్త మిదం క్షమం ! రోచతే యది
వైదేహి రాఘవాయ ప్రతీయతాం !! అన్నయ్యా! నేనే ఇవన్నీ చెప్తున్నావనుకుంటున్నావేమో
లంకలో అందరూ చూస్తున్నారు అందరూ బెంగపెట్టుకుంటున్నారు ప్రహస్తుడికి కూడా ఈ
విషయాలు తెలుసు కానీ అతను నీ ముందు మాట్లాడడు నీ ముందు ఎలా మాట్లాడుతాడంటే నీవేది
చెప్తే అదే మంచిదని మాట్లాడుతాడు కానీ యదార్థమేమిటో ప్రహస్తుడికి తెలుసు ప్రధానమంత్రికి,
తెలిసి మాట్లాడడు అన్నయ్యా నీ క్షేమం కోరుకున్నవాన్ని కాబట్టి నీకు చెప్పడానికి
వచ్చాను నామాట నమ్ము నీవు కూడా చూడవచ్చు ఈ దుర్నిమిత్తములు.
కాబట్టి సీతమ్మని తీసుకెళ్ళి రామ చంద్ర మూర్తికి అప్పజెప్పేసై మనం సంతోషంగా
హాయిగా బ్రతకవచ్చు అంటే రావణుడు అన్నాడూ భయం న పశ్యామి కుత శ్చ దఽప్యఽహం న
రాఘవః ప్రాప్స్యతి మైథిలీం సురై స్సహేన్ద్రై రఽపి సంగతః కథం మమాఽగ్రతః స్థాస్యతి
లక్ష్మణాఽగ్రజః ! సీతమ్మని మళ్ళీ రాముడు పొందడమనేటటువంటిది ఒక్కనాటికీ జరగదు
నేను ఇవ్వను ఇంద్రుడితో కలిసి దేవతలతో కలసి లక్ష్మణాగ్రజుడైన రాముడు వచ్చినా నా
ముందు నిలబడలేడు, నీకు కనపడుతున్నవేమీ నాకు కనపడటంలేదు కాబట్టి నీవు బయలుదేరవచ్చు
అన్నాడు, ఇది కదాండి మూర్ఖత్వమంటే ఆయన చెప్పిన దుర్నిమిత్తాలు చూడ్డానికి రాత్రి
ఎప్పుడో చూడాలన్నయ్యాని ఒంటిగంటకు అలారం పెట్టుకుని కాదు లేచి పైకొచ్చి అలా నిలబడి
చూస్తే నిజంగా వెంట్రుకలు ఊడిపోతున్నాయోలేదో ఒంటెలకీ కంచరగాడిదలకీ గుఱ్ఱాలు గడ్డి తినకుండా
ఏడుస్తున్నాయో లేదో మదగజాలకు మదజలం శ్రవించట్లేదనీ ఇన్నీ తెలుస్తాయి, ఆయన వినడూ
నాకేమీ కనపట్టేలేదని చెప్పాడు, నీవు అనుకున్నంత కష్టమేమీ నాకు కనిపించడంలేదు
ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు నీవు బయలుదేరు అన్నాడు ఇంక ఆయన ఎందుకుంటాడు. మహాత్ముడైనవాడి పనేమిటంటే తన
కర్తవ్యం తానుచేయడం ఆయన కర్తవ్యమేమిటీ మంచిమాట చెప్పడం అంతవరకే పుచ్చుకుంటే అభ్యున్నతి
పుచ్చుకోకపోతే ఆయనేం చేస్తాడు తనకర్తవ్యం అయిపోయింది అయినా ఏం చేశారు
నిన్నా అంతే కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే
అకస్మాత్తుగా వానరసైన్యమంతా బయలుదేరిపోయి సముద్రం దగ్గరకి వచ్చేసిందన్న విషయం
తెలుసుకున్నాడు, వాళ్ళు బయలుదేరి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరానికి వచ్చేశారు.
ఇప్పుడు తాను రథం పూంచి సభామండపానికి వెళ్ళి లంకా పట్టణంలో ఉన్నటువంటి
రాక్షసులందర్నీ చాలా వేగంగా సభకు రమ్మంటున్నానని చెప్పండి అని అందర్నీ పిలిచాడు
అందరూ వచ్చారు వీరాధి వీరులందరూ కూర్చున్నారు ఎవరు మాట్లాడుతారు ఆయన్తో ఆయనా ఒక
విచిత్రమైన విషయాన్ని ప్రతిపాధన చేశాడు నేను వర్ణించలేను కానీ ఒక్కమాట చెప్తాను
ఆయన సీతమ్మతల్లి యొక్క అంగంగాములను వర్ణించి ఆమెను చూసినప్పట్నుంచి నాకు విశేషమైన
కామ ప్రచోదనం కలిగింది ఆమెను పొందితే తప్పా నేను సంతోషంగా ఉండలేను.
కాబట్టి నేను ఆమెను తీసుకొచ్చి
లంకాపట్టణంలో ఆశోకవనంలో శింశిపా వృక్షం కింద కూర్చోబెట్టినమాట సత్యమే నేనే
అపహరించి తీసుకొచ్చాను అని అన్నారూ సా తు సంవత్సరం కాలం మా మఽయాచత భామినీ !
ప్రతీక్షమాణా భర్తారం రామ మాఽఽయత లోచనా !! ఇంతకన్నా ధారుణమైన అపద్ధం ఇంకోటి
ఉండదు నేను సీతమ్మతల్లి తెచ్చీ సీతమ్మ తల్లి అని వాడు ఎందుకంటాడండీ కానీ ఆయన
అన్నట్టు నేను అనను అందుకనీ నేను అలా అనలేను ఎందుకంటే నీవు ఇలా చెప్పావని అలా
అన్నాడని అనకండి, కాబట్టి ఆవిడ్నీ తీసుకొచ్చి నేను శింశుపా వృక్షం కింద
కూర్చోబెట్టాను ఆవిడ నన్నూ సంవత్సరం రాముని గురించి చూస్తానూ అంది అన్నాడు. అలా
అడిగిందా సీతమ్మతల్లి? ఒక సంవత్సరం రాముని గురించి చూస్తానని చెప్పిందా? ఒక
సంవత్సరం రాముని గురించి చూస్తానంటే ఏమిటిదానర్థం? సంవత్సరంలో రాముడు రాకపోతే
ఎంతపెద్ద అబద్ధమాడాడో చూడండి అంటే ఈ అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనమేమిటీ ఇలా
చెప్పకపోతే వచ్చేటటువంటి లాభమేమిటీ అన్నది ఆయనకి అనౌసరం
అవతలవాళ్ళ యొక్క శీలానికి ఎంత పెద్ద మచ్చ వస్తూంది మనం అలా మాట్లాడితే అనుకున్నా
తాను అలా మాట్లాడుతాడు అంటే ఇంచుమించు ఆమె తనకు వశురాలైనట్లుగా మాట్లాడాడు.
కాబట్టి పదినెలలు గడిచిపోయాయి ఇంకొక్క రెండునెలలు రాముడు రాకపోతే సీత నాదౌతుంది
అది ఆయన ప్రతిపాదన. ఒక సంవత్సరం సమయం అడిగింది ప్రతీక్షమాణా భర్తారం రామ మాఽఽయత
లోచనా నేను ఇతః పూర్వం దేవతల మీదకు యుద్ధాలకు వెళ్ళాను ఎంతమందిమీదో యుద్ధం
చేశాను అప్పుడు మీ అందరూ నన్ను అనుగమించారు నా పక్కన సహాయంగా నిలబడ్డారు నా విజయం
మీ విజయం ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో మీ అందరూ పాలుపంచుకుని విజయాన్ని
సాధించిపెట్టవలసిందీ అని అడిగాడు.
అప్పుడు వెళ్ళామంటే దానికో అర్థముంది
ఇప్పుడెందుకు యుద్ధమసలు ఒకవేళ నీవు చెప్పిందే నిజమైనా యేడాదిలోపల రాముడొస్తే అని
ఆవిడ అననేలేదు నాతల్లి ఎన్నటికీ ఆమాట అనదు అమ్మా. రాముడు వచ్చేస్తున్నాడా నీవు
ఇచ్చేయాలిగా సీతమ్మని అంటే రావణుడంత అపద్దాలకోరు నిర్మొహమాటంగా సభలో పెద్దల దగ్గరా
తను కామించిన ఒక మహాపతివ్రత గురించి అంతనిస్సిగ్గుగా చెప్పుకోగలిగినటువంటి
ధారుణమైన శీలమున్నటువంటివాడు. ఈ మాటలు చెప్తే ఇతః పూర్వం సభ నిర్వహించినప్పుడు
కుంభకర్ణుడు లేడు ఆయన ఆరోజే లేచాడు ఆయన ఆర్నెల్లు పడుకుంటాడు ఆర్నెల్లు
లేస్తుంటాడు ఆయనకి అదో ఖర్మ బ్రహ్మగారి దగ్గర వరమడుగుదామనుకుంటే అది అలా అయ్యింది
ఆయనకి. అది కుంభకర్ణుడి వధ గురించి యుద్ధమొచ్చినప్పుడు ఆయన వధ గురించి వర్ణన
చేస్తాను యదా తు రామస్య సలక్ష్మణస్య ప్రహస్య సీతా ఖలు సా ఇహాఽఽహృతా సకృత్
సమీక్ష్యైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యము నేవ యామునం ! సర్వ మేత న్మహా రాజ కృత మఽప్రతిమం
తవ ! విధీయేత సహాఽస్మాభిః ఆదావే వాఽస్య కర్మణః !! ఆయన అన్నాడూ యమునా తన
ప్రవాహాన్ని ప్రారంభించే ముందు యమునోత్రి దగ్గర ఉండేటటువంటి గుండాన్ని నింపి ఎలా
ప్రవహిస్తూందో అలా యదా తు రామస్య
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
సలక్ష్మణస్య ప్రహస్య సీతా ఖలు సా
ఇహాఽఽహృతా నీవ్వు సీతమ్మతల్లిని అపహరించి తీసుకొని రావడానికి ముందరే
మమ్మల్ని సంప్రదించి ఉండి ఉండవలసింది, కానీ నీవు ఏది చెయ్యాలనుకున్నావో అది
చేసేశావు చేసేసిన తరువాత ఇప్పుడు మమ్మల్నీ సంప్రదిస్తున్నావు దీనివల్ల ఉపయోగమేమిటీ
ఇప్పుడు మేము వద్దన్నాము ఒప్పుకోలేదు సీతమ్మని తీసుకురావద్దూ అన్నాము ఆగుతుందా...
చేయవలసినపని చేసేశావుగా ఇప్పుడు ఇంక ప్రయోజనమేమిటీ. నీవు ఇలా చెయకుండా ఉండి
ఉండవలసిందీ అని అనడం ఇప్పుడు దానివల్ల ప్రయోజనమేమిటీ, నీవు చెయ్యాలన్నది చేసేసి సభ
పెట్టడమెందుకూ మమ్మల్ని అడగడమెందుకూ దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనమేముంది.
చేసేముందే యుక్తా యుక్త విఛక్షణ ఎరిగి మంత్రులను సంప్రదించి చెయ్యాలి చేసేపని
అన్నాక... ఆయన అన్నాడు సరే చెయ్యవలసిందేదో చేసేశావు ఇక బెంగ పెట్టుకోకు నేను
ఉన్నాను కదా నేను కార్యాన్ని దిద్దుతాను, నేను రామ లక్ష్మణుల్ని సంహరించేటటువంటి
బాధ్యతను స్వీకరిస్తాను పున ర్మాం స ద్వితీయేన శరేణ నిహనిష్యతి ! తతోఽహం తస్య
పాస్యామి రుధిరం కామ మాఽఽశ్వస !! రాముడు నా గుండెలమీదకి ఒక బాణం ప్రయోగించి
రెండవ బాణాన్ని ప్రయోగించడం కోసమనీ బాణం తీస్తాడు ఎందుకంటే నేను పర్వతాకార
సన్నిభున్నికదా నా మీద రెండో బాణం ప్రయోగిద్దామని రాముడు బాణం తీసేలోపలే నేను
వెళ్ళి రామ లక్ష్మణుల మీద పడి వారి శరీరంలో ఉన్న నెత్తురంతా తాగేస్తాను, రామ
లక్ష్మణులు పడిపోయిన తరువాత మిగిలినటువంటి వానరములన్నింటినీ కూడా నేను
భక్షించేస్తాను కాబట్టి నీకింకేంకావాలి ఇంక నీకేం భయంలేదు నేను నీకు
మాటిస్తున్నాను నా సాధ్యమైనంత యుద్ధముచేసి నీకు విజయాన్ని సాధించిబెడుతాను రమస్య
కామం పిబ చాఽగ్ర్య వారుణీం కురుష్వ కార్యాణి హితాని విజ్వరః మయా తు రామే గమితే
యమక్షయం చిరాయ సీతా వశగా భవిష్యతి ! అందులో యథారాజా తథాప్రజా అందరి బుద్ధులూ
అలాగే ఉంటాయి, కాబట్టి నీవు ఇంక ఈ విషయాలన్నీమరిచిపో హాయిగావెళ్ళి మద్యాన్నితాగు
నీవు ఏం చెయ్యాలనుకుంటున్నావో అవన్నీచేసేసై సంతోషంగా హాయిగా గడుపు ఈ యుద్ధమైపోయిన
తరువాత సీతమ్మ నీకింక శాశ్వతంగా వశురాలైపోతుంది అన్నాడు, అన్న తరువాత అక్కడ
జరిగినటువంటి సభలో ఇంద్రజిత్తు మిగిలిన ప్రహస్తుడూ మొదలైనటువంటి రాక్షసులు చాలా
తక్కువచేసి రామ లక్ష్మణుల గురించి మాట్లడి అదిపెద్ద విషయమేమిటీ మేమువెళ్ళి వారినిసంహరిస్తాము
అని అన్నట్లుగా ఒకటికి పదిమార్లు మాట్లాడుతుంటే విభీషణుడుచూస్తూ ఉండలేకపోయాడు.
ఉండలేకా ఆయన అన్నాడూ మీరు
అనుకున్నంత తేలికకాదూ రావణా! నీకు శత్రువు ఎక్కడోలేడు నీ శత్రువు నీ కొడుకురూపంలో
ఉన్నాడు, అసలు లోకంలో ధారుణాతి ధారుణమైన విషయమమేమిటో తెలుసాండీ... ఇదీ విభీషణుడు
నొచ్చుకున్నది ఈ సభకు ఇంద్రజిత్తుని పిలవడం మొదటితప్పు వచ్చి బాలుడైన ఇంద్రజిత్తు
మాట్లాడటం రెండోతప్పు మాట్లాడినందుకు వాన్నిశిక్షించవలసివున్నా శిక్షించకపోవడం
మూడోతప్పు ఈ సభకు పిలిచి ఇంద్రజిత్తు మాట్లాడుతుంటే విన్నందుకు నిన్నుదండించాలి
అన్నాడు. ఏ తండ్రీ తాను ఒకకాంతను ఎత్తుకొచ్చాననీ ఆమెమీద తనకు కామముందనీ ఆమె భర్త
వచ్చేస్తున్నాడని యుద్ధం చేయమనీ తనకొడుకుని అడిగితే ఆ కొడుకులేచి నిలబడీ
నాన్నగారండీ నీకేం ఫర్వాలేదు ఆవిడ్ని అనుభవించండీ నేను యుద్ధం చేస్తాననీ ఓకొడుకు
అనచ్చా..? అసలు అది సభా..? అది తండ్రీ కొడుకా..? అక్కడ
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
నేను పినతండ్రిని కూర్చుని విననా... ఎంత అసహ్యంగా ఉంది, ఒక
కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాడుకొడుకుకాడు కొడుకురూపంలో ఉన్న శత్రువు - బాలుడు
వీడు సభకెందుకసలు వీన్నిరమ్మన్నదెవరు వీన్ని ఇలా మాట్లాడమన్నది ఎవరు వీడి
అహంకారమేమిటీ ఏమనుకుంటున్నాడు వీడు రామ లక్ష్మణులంటే... రావణా! పిలిచినందుకు
నిన్నూ వచ్చిందుకు వాన్నీ ఇద్దర్నీదండించాలి ఈ సభలో, అని ఆయన అన్నారూ ధనాని
రత్నాని విభూషణాని వాసాంసి దివ్యాని మణిం శ్చ చిత్రాన్ తాం చ రామాయ నివేద్య దేవీం
వసేమ రాజ న్నిహ వీత శోకాః ! ఇప్పటికైనా నామాటవిను రామ చంద్ర మూర్తి కోదండాన్ని
చేతపట్టుకుని బంగారు బాణములు విడుదల చేస్తే ఈ లంకాపట్టణము ఆయనముందు నిలబడదు ఇవ్వాల
నీతో కలసి వీళ్ళందరూ ఎవరు రామ లక్ష్మణులను నిగ్రహించగలరని ఢాంబికాలు పలుకుచున్నారో
వీళ్ళల్లో ఒకళ్ళు రామ లక్ష్మణుల ముందు నిలబడగలిగినవాడులేడు నీవుకూడా నిలబడవు
కాబట్టి నామాటవిని మంచి మంచి బహుమానములతో మణిమానిక్యములతో ఛీనీ చీనాంబరములతో ఆ
తల్లిని తీసుకెళ్ళి రామ చంద్ర మూర్తికి సమర్పించి నీవు కృతకృత్యువుడవుకా...
అన్నాడు.
అంటే రావణుడు ఇంతమంది ఎదురుగుండా ఉండగా తన తరఫున యుద్ధం చేస్తానని ఇంద్రజిత్తూ
ప్రహస్తుడూ కుంభకర్ణుడూ ఇంతమంది మాట్లాడుతున్నారు ఆయన కోరుకున్నట్లుగదాండి ఉండాలి
ధర్మం చెప్తే ఆయన వినడు, ధర్మం చెప్పేవాడు ఒకడు ఇలా మాట్లాడటం మొదలుపెడితే
వినేవాళ్ళుకూడా అటువైపుకి మెల్లిగా చేరడం మొదలుపెడితే అందుకని ఉండడానికి
వీళ్ళేదునీవు విభీషణుడు. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడూ ఇదీ రామునికి రావణునికి
ఉండేటటువంటి తేడా రాముడు వింటాడు ఒకవేళ తానువిన్నమాట ప్రకారం చెయ్యకూడదనుకుంటే
ఎందుకుతాను చెయ్యట్లేదో చెప్పించేస్తాడు. రావణుడు అలా ఉండడు తను అనుకున్నట్లు
ఉండనివానిని పంపించేయడానికి ప్రయత్నిస్తాడు, అవతలివారు మాట్లాడిన మాటల్లో
సారములేదన్నదాన్ని ఖండించి చూపించలేడు ఎందుకంటే తప్పు తనదగ్గర ఉంటుందికాబట్టి సునివిష్టం
హితం వాక్యమ్ ఉక్తవన్తం విభీషణమ్ ! అబ్రవీత్ పరుషం వాక్యం రావణః కాల చోదితః !!
ఒక శ్రేష్టమైనవాక్కును విభీషణుడుచెప్తే ఆదరించలేక కాలచోదితుడై అంటే మృత్యువుని పొందవల సినటువంటి విధానానికి ఈశ్వరునిచేత నిర్ణయింపబడిన కారణముచేతా రావణుడు ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు వసేత్ సహ సపత్నేన క్రుద్ధేనాఽఽశీ
విషేణ వా ! న తు మిత్ర ప్రవాదేన సంవసే చ్ఛత్రు సేవినా !! శత్రువు సర్పంకన్నా
భయంకరమైనటువంటివాడు వసేత్ సహ సపత్నేన ఒక పాము ఇంట్లో ఉందనుకోండి పాము
ఇంట్లో తిరుగుతోంది అని తెలుసున్నా ఏమో నిర్భయంగా పడుకోవచ్చేమో... నిర్భయంగా
ఉండచ్చేమో, కానీ క్రుద్ధేనాఽఽశీ విషేణ వా చాలా క్రోధాన్ని మనసులోపెంచుకుని పైకిమంచి
వాడిలానటిస్తూ ఉన్నటువంటివాళ్ళు అంతఃపురంలో తిరుగుతూ ఉంటేమాత్రం న తు మిత్ర
ప్రవాదేన అటువంటివాడు ఉండగా వాడితోకలిసి ఉండడమనేటటువంటిది మాత్రం ఎవరికీ
సాధ్యంకాదు.
అంటే ఇప్పుడు ఎవరు మిత్రుడిలా ఉండి
శత్రువుగా ఉన్నాడని ఆయన ఉద్ధేశ్యం విభీషణుడు జానామి శీలం జ్ఞాతీనాం సర్వ లోకేషు
రాక్షస ! హృష్యన్తి వ్యసనే ష్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయః సదా !! నేను ఎంతోమంది
జ్ఞాతులను చూశాను వాళ్ళందరికీ ఉండేటటువంటి లక్షణమేమిటంటే ఎప్పుడెప్పుడు జ్ఞాతికి
ఆపదవస్తే అప్పుడప్పుడు వాళ్ళు సంతోషించడానికి సిద్ధంగా ఉంటారుతప్పా నిజంగా ఆపదలో
ఉన్నజ్ఞాతిని ఆదుకునేటటువంటివాడు లోకంలో ఉండడు ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
చ రాక్షస ! జ్ఞాతయో హ్యఽవమన్యన్తే
శూరం పరిభవన్తి చ !! నేను ఇంతటి గొప్ప కార్యదక్షున్ని
ఇంతటి వింద్వాసున్ని ఇంతటి ధర్మస్వభావమున్నవాన్ని నన్నుపట్టుకుని
అంతనిందచేస్తున్నావే ఆధారంలేకుండా అలా
మాట్లాడుతున్నావే దీన్నిబట్టి ఏమనుకోవాలి ఉన్నతస్థితికి చేరినటువంటివాన్నిచూసి ఓర్చుకోలేనిగుణంతో
మాట్లాడుతున్నావనుకోవాలి. తాను వింద్వాంసుడట తాను ధర్మతత్పరుడటా కాబట్టి అటువంటివాన్నిచూసి
కార్యశూరున్నిచూసి విభీషణునికి కడుపులో మండిపోతుందటా అందుకని ఆయన ఉన్నతినిచూడలేక
ఇలామాట్లాడుతున్నాడటా... అని ఆయన అన్నాడూ గతంలో అరణ్యంలో కొన్ని ఏనుగులు
మాట్లాడుకున్నాయీ అని పెద్దలు చెప్తుంటారు ఆ ఏనుగులు మాట్లాడుకున్నమాటలు నీకు
చెప్తాను విభీషణా! నాఽగ్ని ర్నాఽన్యాని శస్త్రాణి న నః పాశా భయావహాః ! ఘోరాః
స్వార్థ ప్రయుక్తా స్తు జ్ఞాతయో నో భయావహాః !! మనకు అగ్నివలన భయంలేదు
శస్త్రంవలన భయంలేదు కానీ సాటి ఏనుగులవలననే మనకు భయమని ఏనుగుల్ని పట్టుకోవడానికి
వచ్చినవాళ్ళను చూసి ఆ ఏనుగులు మాట్లాడుకున్నాయి ఉపాయమ్ ఏతే వక్ష్యన్తి గ్రహణే
నాఽత్ర సంశయః ! కృత్స్నా ద్భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం చ నః !! మనకీ అంటూ
భయముంటే కేవలం జ్ఞాతివలననేతప్పా ఇతరులవలన భయంలేదు విద్యతే గోషు సంపన్నం విద్యతే
బ్రాహ్మణే దమః ! విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయమ్ !!
రావణాసురుడు చెప్పిన నీతి సుమండీ... ఆయన అన్నాడు ఏనుగులు అన్నాయి విద్యతే గోషు
సంపన్నం ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది విద్యతే బ్రహ్మణే దమః
ఎక్కడ బ్రాహ్మణుడు ఉంటాడో అక్కడ ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి మనకు ఆయనవలన కలుగుతుంది విద్యతే స్త్రీషు చాపల్యం స్త్రీలు ఉన్నచోట చాపల్యం
కలుగుతుంది అని రావణుడు అంటున్నాడు విద్యతే జ్ఞాతితో భయమ్ జ్ఞాతి ఎక్కడ
ఉంటాడో అక్కడ భయం కలుగుతుంది తతో నేష్టమ్ ఇదం సౌమ్య య దఽహం లోక సత్కృతః !
ఐశ్వర్యే ణాఽభిజాత శ్చ రిపూణాం మూర్ద్న్యఽవ స్థితః !! ఎప్పుడూ కూడా జ్ఞాతి
అనేటటువంటివాడు ఐశ్వర్యవంతుడూ ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినవాన్నిచూసి అసూయ
పెంచుకుని మాట్లాడుతుంటాడు తప్పా ఆదరంతో ఆయనతోకలిసి ఉంటాడనేటటువంటిది ఎప్పుడూ
కుదరదు.
శరత్ కాలంలో ఉన్న మేఘం వస్తేమాత్రం
అది ఎప్పుడైనా వర్షబిందువుల్ని విడిచిపెడుతుందా భూమికి ఉపకారం చేస్తుందా
జ్ఞాతికూడా అంతే కృతఘ్నుడు ఎప్పుడూ ఉపకారం చెయ్యడు అని యథా పుష్కర పర్ణేషు
పతితా స్తోయ బిందవః ! న శ్లేష ముపగచ్ఛన్తి తథాఽనార్యేషు సంగతం !! జ్ఞాతులు ఎలా
ఉంటారో తెలుసా తుమ్మెద తేనె ఉన్నప్పుడు పువ్వుమీద వాలి తేనె తాగేసీ ఆ పువ్వులో
తేనె అయిపోయిందంటే పక్కపువ్వు మీదికి వెళ్ళిపోయినట్లు ఈయన దగ్గర సుఖాలన్నిపొందేసి
ఈయనకాపదవచ్చినప్పుడు వదిలేసి ఎవరిదగ్గర సమర్థత ఉందనివాళ్ళు అనుకుంటున్నారో
వాళ్ళదగ్గరకి వెళ్ళిపోతారు అంటే ధర్మం రాముడిదగ్గర ఉంది కాబట్టి ధర్మమున్న
రాముడిదగ్గరికి నీవు వెడతావు అన్నవిషయాన్ని ఎత్తిపొడిచీ నీవు సుఖాలకోసం సంతోషాలకోసం
సంపదలకోసం రాముడిదగ్గకి వెడుతున్నావు అని నిర్ధారిస్తున్నాడు అంటూ ఇ త్యుక్తః
పరుషం వాక్యం న్యాయవాదీ విభీషణః ! ఉత్పపాత గదాపాణి శ్చతుర్భిః సహ రాక్షసైః !! ఈ
మాటలు విన్నటువంటి విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలసి ఒక్కసారి ఆకాశానికి
ఎగిరిపోయాడు ఎగిపోయి అన్నాడూ జ్యేష్ఠో మాన్యః పితృ సమో న చ ధర్మ పథే స్థితః !
ఇదం తు పరుషం వాక్యం న క్షమా మ్యఽనృతం తవ !! తండ్రిలేనటువంటివాడికి అన్నగారు
తండ్రితో సమానం
యుద్ధ కాండ ముప్పయ్
ఆరవ రోజు ప్రవచనము
|
|
పెద్దన్నగారు కాబట్టి ఆయన మంచిమాట్లాడనీ చెడుమాట్లాడనీ
తమ్ముడు మాట్లాడకూడదు కాబట్టే నేను ఇన్నాళ్ళు భరించాను, కానీ అన్నయ్యా నీవు ఇవ్వాళ
మాట్లాడిన మాటలు మాత్రం క్షమతవ్యంకావు నేను ఇందులో ఒక్క ఆరోపణకి తగినవాన్నికాను సులభాః
పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః ! అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః !!
ఔన్లే మంచిమాటలు చెప్పకుండా
నీకునచ్చేమాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు మంచిమాట చెప్పేవాడు దొరకడు
చెప్పినా వినేవాడు అసలు దొరకడు ఆత్మానం సర్వథా రక్ష పురీం చేమాం
సరాక్షసామ్ అన్నయ్యా! నిన్నూ లంకాపట్టణాన్ని జాగ్రత్తగా రక్షించుకో
నాకుకావలసింది నీవు క్షేమంగా ఉండడం నీవు కోరుకున్నట్లు నేను వెళ్ళిపోతున్నాను
అన్నయ్యా అన్నాడు నివార్యమాణస్య మయా హితైషిణా న రోచతే తే వచనం నిశాచర పరీతకాలా
హి గతాఽఽయుషో నరా హితం న గృహ్ణన్తి సుహృద్భి రీరితమ్ ! ఆయుర్ధాయం
నశించిపోయేవాడు మంచిమాటలు వినడు కాబట్టి నేను చెప్పేటటువంటిమాటలు నీ దృష్టిలోకి
వెళ్ళలేదు అన్నయ్యా నీవు క్షేమంగా ఉండు నాకు అదేకావాలి అని చెప్పి ఆయన నలుగురు
సచివులతో కలసి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి నూరు యోజనములు సముద్రాన్నిదాటి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ
నిలబడ్డాడు అకాశంలో నలువురి సచివులతో అక్కడే అదేమైనా అంతఃపురమా అదేమన్నా పెద్ద
ప్రాంగణమా... వాళ్ళందరూ బయటే ఆరుబయటే ఉన్నారు ఈయనా ఆకాశంలో పైన నిలబడ్డాడు, నిలబడి
అన్నాడు రావణో నామ దర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వరః ! తస్యాఽహమ్ అనుజో భ్రాతా
విభీషణ ఇతి శ్రుతః !! తేన సీతా జనస్తానా ద్ధృతా హత్వా జటాయుషమ్ ! రుద్ధా చ వివశా
దీనా రాక్షసిభిః సురక్షితా !! నేను రావణాసురుడు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి
స్వభావమున్న అన్నగారి యొక్క తమ్మున్ని ఆయన జనస్థానంలో ఉన్న సీతమ్మతల్లిని ʻజటాయువుని సంహరించి మరీ తీసుకొనివచ్చిʼ లంకాపట్టణంలో అశోకవనంలో శింశుపా వృక్షం కింద రాక్షస
స్త్రీల మధ్యలో కూర్చోబెట్టి ఉంచాడు. నేను ఇప్పుడు అధర్మ మార్గంలో ఉన్నటువంటి
అన్నగారైన రావణాసురున్ని విడిచిపెట్టి ధర్మమార్గంలో ఉన్నవాడు కాబట్టి రామ చంద్ర
మూర్తిని శరణాగతి చెయ్యడంకోసం వచ్చాను సోఽహం పరుషిత స్తేన దాస వచ్ఛాఽవమానితః !
త్యక్త్వా పుత్రాం శ్చ దారాం శ్చ రాఘవం శరణం గతః !! నేను నా భార్యా బిడ్డల్ని
విడిచిపెట్టి రామ చంద్ర మూర్తిని శరణాగతి చెయ్యడం కోసం వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాను
సర్వ లోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే ! నివేదయత మాం క్షిప్రం విభీషణమ్ ఉపస్థితమ్
!! వెంటనే నేను వచ్చానని శరణాగతి చేస్తున్నానని రామ చంద్ర మూర్తికి
తెలియజేయండీ అన్నాడు.
సుగ్రీవుడు చూశాడు రావణుని తమ్ముడు
కపటోపాయంతో వచ్చాడు మనని మట్టుపెట్టడానికి భేదాలను కల్పించడానికి వచ్చాడు కాబట్టి
వెంటనే ఆ నలుగురితో కూడినటువంటి విభీషణున్ని సంహరిద్దామనుకున్నాడు, అయినా రామ
చంద్ర మూర్తికి నివేదించాలి కాబట్టి రామ చంద్ర మూర్తి దగ్గరికి వెళ్ళి
చెప్తున్నాడు ప్రవిష్ట శ్శత్రు సైన్యం హి ప్రాజ్ఞ శ్శత్రు రఽతర్కిత ! నిహన్యా
దంతరం లబ్ధ్వా ఊలూక ఇవ వాయసాన్ !! ఒక గుడ్లగూబ కాకి గూటిలోచేరి మెల్లగా మాటలు
కలిపి కాకిని సంహరించినట్లు మన మధ్యకిచేరి విభీషణుడు మనమధ్య భేదభావములు కలిపించి
నిన్నూ నన్నూ విడదీసి రామ లక్ష్మణులను సంహరించడమో నన్ను సంహరించడమో చెయ్యడంకోసమో
వచ్చాడు వధ్యతామ్ ఏష తీవ్రేణ దణ్డేన సచివైః సహ ! రావణస్య నృశంసస్య భ్రాతా హ్యేష
విభీషణః !! అటువంటి దుర్మార్గుడైన రావణుని తమ్ముడైన విభీషణున్ని మనం
ఆదరించకూడదు కాబట్టి నలుగురు సచివులతో కూడినటువంటి విభీషణున్ని సంహరిస్తాను నాకు
అనుజ్ఞనీయమని చెప్పి
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
అన్నాడు. అంటే రాముడు అన్నాడూ శత్రువైనా రావణాసురుని
తమ్ముడు నలుగురు సచివులతో కలసి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు శరణాగతి చేస్తున్నాడు
నేను ఇప్పుడు విభీషణున్ని మనలో చేర్చుకోవాలా చేర్చుకోకూడదా మీ అందరూ
పెద్దలైనవారున్నారు ప్రాజ్ఞులైనవారున్నారు తెలివైనవారున్నారు కాబట్టి మీకు ఏది
తోస్తుందో అది చెప్పండి. మీకు ఏది తోచిందో అది చెప్పండి తప్పా ఇది మనం చెప్తే
ఏమైనా అనుకుంటారానికాని ఈయన చెప్పినదానికి విభేదంగా మనం చెప్పినదానికి ఏమైనా
అనుకుంటారనికానీ మీరు ఆలోచించవద్దు ఎవరి బుద్ధికి ఏదితోచిందో అదిచెప్పండి అన్నాడు.
చూశారా! ఎలా ఉంటుందో రాముడి మాటంటే... అప్పుడు అంగదుడు లేచి అన్నాడు అర్థాఽనర్థౌ
వినిశ్చిత్య వ్యవసాయం భజేత హ ! గుణతః సంగ్రహం కుర్యా ద్ధోషత స్తు విసర్జయేత్ !!
మనం గుణ దోషములను విచారణ చేద్దాం మంచిగుణములు ఉన్నవాడూ అన్నది నిర్ధారణ
అయ్యిందనుకోండి విభీషణున్ని స్వీకరిద్ధాం గుణములు లేనివాడు దోషములున్నవాడు అని
తేలిందనుకోండి అప్పుడు విభీషణున్ని విడిచిపెడదాం. శరభుడు అన్న వానరుడులేచాడు ప్రణిదాయ
హి చారేణ యథావత్ సూక్ష్మ బుద్ధినా !
పరీక్ష్య చ తతః కార్యో యథా న్యాయ్యం పరిగ్రహః !! మనం గూఢచారుల్ని
పంపిద్దాం గూఢచారులు వెళ్ళి బాగావిచారణ చేస్తారు గూఢచారులు ఇతన్ని స్వీకరించచ్చూ
అని చెప్తే స్వీకరిద్దాం వద్దూ అనిచెప్తే విడిచిపెట్టేద్దాం. జాంబవంతుడు లేచాడు
చాలా పెద్దవాడుకదాండి ఆయనా... ఆయన అన్నాడు బద్ధ వైరా చ్చ పాపా చ్ఛ
రాక్షసేన్ద్రా ద్విభీషణః ! అదేశ కాలే సంప్రాప్తః సర్వథా శంక్యతా మఽయమ్ !! ఇతను
రాకూడని కాలంలో రాకూడని దేశంలో ఇప్పుడువచ్చి మనతోకలుస్తాను అంటున్నాడు పైగా
పాపనిశ్చయము కలిగినటువంటి రావణాసురుని యొక్క సోదరుడు కాబట్టి అటువంటివాన్ని
స్వీకరించవచ్చా అన్నది నాకు అనుమానమే అన్నాడు. మైందుడులేచి అన్నాడు భావమఽస్య తు
విజ్ఞాయ తత స్త్వం కరిష్యసి ! యది దృష్టో న దుష్టో వా బుద్ధి పూర్వం నరర్షభ !!
మనం ప్రశ్నలువేసి చూద్దాం విభీషణున్ని జవాబులు చెప్పేటప్పుడు అతని ముఖములో
ఉన్నభావములను గమనిద్దాం ఆ భావములనుబట్టి అతను సక్రమంగా ఉన్నాడని మనకనిపిస్తే
స్వీకరిద్దాం లేకపోతే విడిచిపెట్టేద్దాం అన్నాడు. రామ చంద్ర మూర్తి హనుమను పిలిచి
అన్నాడు నీ అభిప్రాయమేమిటీ అన్నాడు, హనుమలేచీ అన్నాడూ నా ముందు మాట్లాడినవాళ్ళు
మాట్లాడారు గూఢచారిని పంపిద్దామని ఒకాయనన్నాడు ఎక్కడో దూరంగా ఉన్నవాడికైతే
గూఢచారిని పంపుతాము మన పైనే నిలబడినవానిమీదికి గూఢచారిని ఏం పంపించి గూఢచర్యం మీరు
చేస్తారు, ఇంకోకాయన మాట్లాడించి గుణదోషములను విచారణ చేద్దామన్నాడు ఆయన
మాట్లాడిందానినిబట్టి గుణదోషములను చూడాలికానీ మనం ఇప్పుడు కొత్తగా గుణదోషాలు
ఏమివెతికి చూస్తాము, ఇంకొకాయన మాట్లాడుతున్నప్పుడు భావాన్నిగమనించి మనంచూడాలి
అన్నాడు ఇప్పటికే ఆయనభావము ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది నిలబడి అర్థించడంలో
ఇప్పుడు మనంకొత్తగా ఏంచూస్తాం.
పైగా ఇలా మిత్రుత్వం కోసంవచ్చినవాడైతే
త్రికరణశుద్ధిగా మనం అలా అడక్కూడని ప్రశ్నలువేస్తే ఆయనమనసు ఖేదపడి వెళ్ళిపోవచ్చు అప్పుడు
పొందవలసిన ఒకమంచి మిత్రున్ని మనం పోగొట్టుకున్నవాళ్ళమౌతాం కాబట్టి పురుషాత్
పురుషం ప్రాప్య తథా దోష గుణావఽపి ! దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి
!! యుక్త మాఽఽగమనం తస్య సదృశం తస్య బుద్ధితః !!! రావణునిలో ఉండేటటువంటి
దోషణులను ఇతను గుర్తించాడు అటువంటి దోషములు ఉన్నవానితో
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
మనం ఉండకూడదూ అనుకున్నాడు రామునిలో ఉన్నగుణములను
గుర్తించాడు రామునితోకలసి ఉందామనుకున్నాడు న త్వఽస్య బ్రువతో జాతు లక్ష్యతే
దుష్ట భావతా ! ప్రసన్నం వదనం చాఽపి తస్మా న్మే నాఽస్తి సంశయః !! అశంకిత మతిః
స్వస్థో న శఠః పరిసర్పతి ! న చాఽస్య దుష్టా వాక్చాఽపి తస్మా న్నాఽస్తీ హ సంశయః !!
అతను శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నాడోలేడో మనం మాట్లాడితేమాత్రం
ఎలాతెలుస్తూంది. నాకు తెలిసున్నంతవరకూ ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యా వృత్తం చ
రావణమ్ ! వాలిన శ్చ వధం శ్రుత్వా సుగ్రీవం చాఽభిషేచితమ్ !! రాజ్యం ప్రార్థయమాన శ్చ
బుద్ధి పూర్వమ్ ఇహాఽగతః !!! రామ చంద్ర మూర్తిలో ఉన్నటువంటి సుగుణములను
బాగావిన్నాడు ధర్మంలో ఉన్న సుగ్రీవున్ని కాపాడాడని అధర్మంలో ఉన్నవాలిని చంపాడని
సుగ్రీవుడికి రాజ్యమిచ్చాడని బలపరాక్రములు ఉన్నవాడని పద్నాలుగువేలమంది
ఖరదూషణాదులను ఒక్కడేచంపాడనీ ఇన్నితెలుసుకుని ధర్మమున్న రామున్ని ఆశ్రయిద్దామని
అధర్మంలో ఉన్న రావణున్ని విడిచిపెడదామని నిర్ణయించుకునివచ్చాడూ అని అతని
ముఖంచూస్తే అర్థమౌతూంది.
అతను అతని భావాన్ని స్పష్టంగాచెప్పాడు కాబట్టి మనం అతన్ని స్వీకరించచ్చూ
అనినేను అనుకుంటున్నాను కాబట్టి విభీషణున్ని స్వీకరిస్తే తప్పులేదు అన్నాడు. రామ
చంద్ర మూర్తి అన్నాడు మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథం చన ! దోషో యద్యఽపి
తస్య స్యాత్ సతామ్ ఏత దఽగర్హితమ్ !! నా దగ్గరికి ఒక్కసారి వచ్చి నిలబడి శరణాగతి చేసి నన్ను
స్వీకరించూ అని అడిగినవాడిలో నిజముగా దోషములున్నప్పటికీ కూడా నేను స్వీకరించకుండా
విడిచిపెట్టను కాబట్టి నేను ఈయన్ని స్వీకరించవలసిందే అనీ అంటూ లోకంలో
రాజులకు రాజు యొక్క జ్ఞాతులకు ఎప్పుడూ విభేదాలుంటాయి, సమయా సమయాలను
చూసుకోవడమనేటటువంటిది కూడా హ్యూహంలో అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పుడు దేశకాలాదులు
కలిసొచ్చాయి అందుకనివచ్చి ఇక్కడనిలబడ్డాడు మనల్నిశరణాగతి చేశాడు న సర్వే భ్రాతర
స్తాత భవంతి భరతోపమాః ! మద్విదా వా పితుః పుత్రా స్సుహృదో వా భవద్విధాః !! సుగ్రీవుని
వంకచూసి అన్నాడు, సుగ్రీవా నీవు విభీషణుడికి ఆశ్రయమివ్వద్దూ అనిచెప్పావు కానీనేను
ఒకటి చెప్తానుచూడూ లోకంలో ఉండే తమ్ముళ్ళందరూ భరతులుకారు, రాజ్యం నాకొద్దన్నయ్యా
నీవేపుచ్చేసుకో అనేతమ్ముళ్ళుండరు భవంతి భరతోపమాః మద్విదా వా పితుః పుత్రా
స్సుహృదో వా భవద్విధాః నాలాంటి తండ్రి-కొడుకులు ఉండరు. కొడుకు
అరణ్యవాసానికివెడితే మళ్ళీతిరిగి పద్నాలుగేళ్ళు తరువాత వస్తాడంటే పద్నాలుగేళ్ళు
ప్రాణములను నిలబెట్టుకోలేక కొడుకుని చూడకుండా ఉండలేక ప్రాణములను విడిచిపెట్టేటంత
పుత్రవ్యామోం కలిగిన తండ్రి ఉండడు. నాలా తండ్రిమాటకోసం అర్యవాసానికొచ్చేటటువంటి
కొడుకూ ఉండకపోవచ్చు స్సుహృదో వా భవద్విధాః నీలా స్నేహితుడికోసం ఇంత
ఆలోచించేటటువంటి స్నేహితుడుకూడా లోకంలోదొరకడు అందరికీ అన్ని దొరుకుతాయాయ్యా
సుదుష్టో వాఽప్యఽదుష్టో
వా కిమేష రజనీ చరః ! సూక్ష్మ మఽప్యఽహితం కర్తుం మమాఽశక్తః కథంచన !!
పిశాచాన్ దానవాన్ యక్షాన్
పృథివ్యాం చైవ రాక్షసాన్ ! అంగుళ్యఽగ్రేణ తాన్ హన్యా మిచ్ఛన్ హరి గణేశ్వర !!
శ్రూయతే హి కపోతేన
శత్రుః శరణ మాఽఽగతః ! అర్చిత శ్చ యథా న్యాయం స్త్వై శ్చ మాంసై ర్నిమంత్రితః !!
సకృదేవ ప్రపన్నాయ తవాఽస్మీతి చ యాచతే ! అభయం సర్వ భూతేభ్యో
దదా మ్యేత ద్వ్రతం మమ !!
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
నేను నా దగ్గరికి
వచ్చినటువంటివాడు మంచివాడా చెడ్డవాడా అనిచూడను నా దగ్గరికొచ్చి శరణాగతి చేస్తేచాలు
ఎంత పాపాత్ముడైనా వచ్చి నా కాళ్ళదగ్గరపడ్డాడు కాబట్టి స్వీకరించేస్తాను కాబట్టి గతంలో ఒకానొక పక్షి ఒక పావురం తన భార్యని చంపినవాడు చెట్టుకిందకొస్తే
రక్షించిందయ్యా అని ఆయన ఒక కథ చెప్పారు. వెనకటికి ఒక పావురం తన భార్యయైన
ఆడపావురంతోకలిసి గూట్లోకాపురం చేస్తోంది అటుగా ఒకబోయవాడు వచ్చాడు వచ్చి సంతోషంగా
ఉన్నటువంటి ఆ మగపావురం ఆడపావురం చూసి ఆడపావురంమీదకు బాణం విడిచిపెట్టాడు బాణపు
దెబ్బకి గిరగిరాతిరిగి కిందపడి పావురం మరణించింది మగపావురం చూస్తుండగా ఆడపావురం
యొక్క రెక్కలు పీకేసి కంఠం నులిమేసి కాల్చి దానిమాంసం తిని బోయవాడు వెళ్ళిపోయాడు,
కొంతకాలం అయిపోయిన తరువాత అదే బోయవాడు ఒకరోజు రాత్రివరకు బోరునవానపడుతుంటే ఆహారం
దొరక్కా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒకనాడు తను ఆడపావురాన్ని చంపినటువంటి
చెట్టుదగ్గరికి వచ్చాడు, వచ్చి ఇక నడవలేక ఆ చెట్టుకింద కూలబడిపోయాడు పైన ఉన్న
మగపక్షి చూసింది చూసి ఎక్కడికో వెళ్ళి రెండు ఎండు చితుకులుతెచ్చి అగ్నిహోత్రం రగల్చి
వాడికి వేడి కల్పించింది ఆయన స్పృహనుపొందిలేచాడు లేచిన తరువాత ఆకలితో ఉన్నాడు
అన్నం పెట్టడానికి ఆయనకి ఏమైనా తేవడానికి పక్షికి అవకాశంలేదు అందుకనీ ఆ పక్షి తానే
అగ్నిహోత్రంలో పడిపోయింది పడిపోతే ఆ మాంసాన్ని బోయవాడుతిని బ్రతికాడు తాను ఉన్న
చెట్టుకిందకివచ్చి పడిపోయినంతమాత్రంచేత ఒక నోరులేనిపక్షి అంత ఉపకారంచేసింది
క్షాత్రం కలిగినటువంటి క్షత్రియవంశంలోపుట్టి దశరథమహారాజుగారి కొడుకునై ఇంతచదువు
చదువుకుని ఇంత అస్త్ర శస్త్రములు తెలుసుకుని నన్ను శరణాగతిచేసి ఒక రాక్షసుడువచ్చి
పైన నిలబడితే యుక్తా యుక్త విచారణచేసి నేను స్వీకరించకపోతే అంతకన్నా దోషముంటుందా
లోకంలో.
వెనకటికి మహర్షి మనుష్యుడే కావక్కరలేదు నేనే తలచుకుంటే నా కాలి బొటనవేలితో
చంపేస్తాను ఈ లోకంలో ఉండే రాక్షసుల్నీ పిశాచాలని అని విభీషణుడు ఒక్కపెద్ద
లెక్కకాదు రావణుడు ఒక్కపెద్దలెక్కకాదు, ఎంతపాపము చేసినవాడైనా ఒక్కసారి త్రికరణశుద్ధిగా నాదగ్గరకొచ్చి
కాళ్ళమీదపడి రామా నేనునీవాడనూ అని అన్నాడా ఇకనేనువాడి చెయ్యి విడిచిపెట్టను
కాపాడితీరుతాను ఇదినా ప్రతిజ్ఞా అన్నాడు సకృదేవ ప్రపన్నాయ తవాఽస్మీతి చ
యాచతే ! అభయం సర్వ భూతేభ్యో దదా మ్యేత ద్వ్రతం మమ !! అన్నారు. ఆ తరువాత
విభీషణుడు వచ్చాడు సుగ్రీవుడు రెండుమూడు పర్యాయములు వాదించాడు తరువాత అన్నాడు
మహానుభావా నీ ధార్మికనిష్టను చూడ్డానికి వాదించానుతప్పా... ఇప్పుడే మనమిత్రుడిగా
విభీషణున్ని స్వీకరిద్దాం తాను ఒకపనిచేసేముందు ఎందుకు చేస్తున్నానోచెప్పి ఇతరుల
అభిప్రాయాన్నితాను ఎందుకు తీసుకోలేదోచెప్పి అందర్నీ ఒక అభిప్రాయంమీద నిలబెట్టి
అందరినీ కలుపుకునివెడుతాడు రామ చంద్ర మూర్తి ఇదిలోపిస్తుంది రావణునిదగ్గర అనీ
ఇప్పుడు విభీషణున్ని తీసుకురమ్మన్నారు ఆకాశంలోంచి నలుగురు సచివులతో కిందకిదిగి
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
రాఘవేణాఽభయే దత్తే సన్నతో రావణాఽనుజః
! విభీషణో మహా ప్రాజ్ఞో భూమిం సమఽవలోకయన్ !!
ఖా త్పపాతాఽవనిం హృష్టో
భక్తై రఽనుచరైః సహ ! పాదయోః శరణాఽన్వేషీ చతుర్భి స్సహ రాక్షసైః !!
అనుజో రావణస్యాఽహం తేన
చాఽప్యఽవమానితః ! భవన్తం సర్వ భూతానాం శరణ్యం శరణాఽఽగతః !!
పరిత్యక్తా మయా లంకా మిత్రాణి చ ధనాని చ ! భవ ద్గతం మే
రాజ్యం చ జీవితం చ సుఖాని చ !!
నేను నా అన్నగారైనటువంటి రావణున్ని
విడిచిపెట్టి భార్యాపుత్రుల్ని కూడా విడిచిపెట్టి నీదగ్గరికొచ్చి శరణాగతిచేశాను ఇక
నా జీవితము సుఖముకానీ దుఃఖముకానీ ఏదైనా నీతోనే రామా! నేను మిమ్మలనే అనుసరించి
ఉంటానూ అన్నాడు. వెంటనే సౌమిత్రిని పిలిచి లక్ష్మణున్ని పిలిచి ఇప్పుడేవెళ్ళి
సముద్రజలాలు పట్టుకురా ఇతన్ని లంకా మహాసామ్రాజ్యానికి మహారాజుగా అభిషేకం చేస్తున్నాను అన్నాడు. అని ఆ సముద్రజలాలుపోసి ఏవ ముక్త స్తు
సౌమిత్రి రఽభ్యషించ ద్విభీషణమ్ ! మధ్యే వానర ముఖ్యానాం రాజానం రామ శాసనాత్ !!
ఆ విభీషణునికి లంకాసామ్రాజ్యపు పట్టాభిషేకం చేసేశారు. రావణాసురుడు బ్రతికున్నాడుగా
అంటే నిహతుడైపోవడం అంతఖాయమన్నమాట కాబట్టి విభీషణునికి పట్టాభిషేకం చేసేశాడు
ఇకనిన్ను అనుగమించి ఉంటాను అన్నాడుకదా విభీషణున్ని అడిగారు ఇప్పుడు ఈ నూరు
యోజనములు సముద్రాన్నిదాటాలి ఏం చెయ్యమంటావని అడిగారు సముద్రం రాఘవో రాజా శరణం
గన్తు మఽర్హతి నేను ఎలా శరణాగతి చేశానో అలా నీవుకూడా ఇంతగంభీరమైన సముద్రాన్ని
శరణాగతిచేసి ప్రార్థనచేస్తే ఆసముద్రం నీమాటవింటూంది అప్పుడు మనం
సముద్రాన్నిదాటవచ్చు.
ఈలోగా రావణాసురునికి తెలిసింది ఈ
విషయం తెలిసి శార్దూలుడు అనేటటువంటి గూఢచారిని పంపాడు సైన్యం చూడమని ఆయన ఈ సైన్యం
యొక్క ప్రభావాన్ని దానియొక్క గొప్పశక్తిని వెళ్ళిరావణుడికి చెప్పాడు, రావణుడు
వెంటనే కుఠిలయత్నం చేయడానికి సుకుడన్న రాక్షసున్ని పిలిచి చిలకరూపంలో వెళ్ళి
సుగ్రీవుడిదగ్గరికి వెళ్ళి నీవు వానరుడివి నేను రాక్షసున్ని నేను నీజోలికిరాలేదు
నీ అన్న వాలి నాతో స్నేహమున్నవాడు కాబట్టి నీవునాకు తమ్ముడువౌతావు, నేను తెచ్చింది
నరుడిభార్యని మధ్యలో నీవెందుకు యుద్ధం చేయడం ఎందుకు నిష్కారణంగా వానరులు మరణించడం
నీవు కిష్కింధకి వెళ్ళిపో నేనూ రాముడు చూసుకుంటామనిచెప్పు అంటే సుకుడొచ్చి
సుగ్రీవునికి చెప్పాడు సుగ్రీవునికి ఆగ్రహమొచ్చింది వెంటనే ఆ
రాక్షసుల్నివెళ్ళిపట్టుకుని వెళ్ళిదాని రెక్కలు విరిచేస్తున్నారు అది రామా రామా
కౌసల్యనందనా అని అరూస్తూంది రాముడు వచ్చి ధూతగా వచ్చినవాన్ని సంహరించకూడదు
విడిచిపెట్టేయమన్నాడు అది చెప్పవలసిన మాటలుచెప్పింది, సుగ్రీవుడు అన్నాడు నాకు
రాముడు దైవం రాముడు ప్రాణం రాముడు నా సచివుడు రాముడు నా స్నేహితుడు రాముడు నాకు
సమస్తం అటువంటి రామునికి శత్రువెవరో నాకుకూడా శత్రువే కాబట్టి రావణున్ని
వధించితీరుతాననిచెప్పు అని మళ్ళీ సందేశమిచ్చి ఆ సుకున్ని పంపించేశారు. పంపించిన
తరువాత రామ చంద్ర మూర్తి మూడు రాత్రులపాటు సముద్రపుటొడ్డున దర్భాసనం
వేసుకునిపడుకున్నాడు, పడుకుని ఎంత ప్రార్థన చేసినా మూడు రాత్రులు గడిచిపోయినా
సముద్రుడులేచిరాలేదు ఆగ్రహమొచ్చింది రామ చంద్ర మూర్తికి
అవలేప స్సముద్రస్య న
దర్శయతి య త్స్వయమ్ !
పశ్య తావ దఽనార్యస్య
పూజ్యమానస్య లక్ష్మణ ! అసామర్థ్యం ఫలన్త్యేతే నిర్గుణేషు సతాం గుణాః !!
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
అద్య మ ద్బాణ నిర్భిన్నై ర్మకరై
ర్మకరాఽఽలయమ్ ! నిరుద్ధ తోయం సౌమిత్రే ప్లవద్భిః పశ్య సర్వతః !!
మహాభోగాని మత్స్యానాం
కరిణాం చ కరాన్ ఇహ ! భోగినాం పశ్యనాగానాం మయా చిన్నాని లక్ష్మణ !!
స శంఖు శుక్తికా జాలం స
మీన మకరం శరైః ! అద్య యుద్ధేన మహతా సముద్రం పరిశోషయే !!
చాపమ్ ఆనయ సౌమిత్రే శరాం శ్చాఽఽశీ విషోపమాన్ ! సాగరం
శోషయిష్యామి పద్భ్యాం యంతు ప్లవంగమాః !!
నేను మంచితనానికిపోయి మూడు రాత్రులు
మూడు పగళ్ళూ ఈ సముద్రపు ఒడ్డున ఈ దర్భాసనం వేసుకుని తూర్పుదిశగా దర్భల యొక్క
అగ్రములు ఉండేటట్టుచూసుకుని తూర్పుదిక్కుకు తిరిగిపడుకున్నాకూడా ఈ సముద్రుడు
కరుణించలేదు లేచివచ్చి కనపడలేదు లోకంలో మంచితనాన్నిపాటించినవాన్ని చేతకానివాడు
అనుకుంటుంటారు కాబట్టి నేను ఇప్పుడే ఈ సముద్రజలాలన్నింటినీ ఇంకింపజేస్తాను
సముద్రమన్నది లేకుండా చేసేస్తాను, సముద్రంలో ఉన్న ప్రాణులన్నింటినీ సంహరిస్తాను నా
బాణముల యొక్క తాకిడికి సముద్రంలో ఉన్న రాక్షసులు పాములు మొసళ్ళు తాబేళ్ళు
తిమింగళాలు మరణించి సముద్రంమీద తేలిపోతాయి నేను ఇప్పుడు ఎంత గోరమైనరూపం పొందానో
చూడమని ప్రళయాగ్ని ఎలా ఉంటుందో అటువంటి స్వరూపాన్నిపొంది ఏవ ముక్త్వా
ధనుష్పాణిః క్రోధ విస్ఫారితేక్షణః ! మహోక్రోధంతో పెద్దపెద్ద కన్నులు చేసుకొని
బభూవ రామో దుర్ధర్షో యుగాఽన్తాఽగ్నిరివ జ్వలన్ !! ప్రళయకాలంలో ఉండేటటువంటి
అగ్ని ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో తేరిపారి చూడరానివారై ఒక్కసారి బాణములనుతీసి
సముద్రలోకి ప్రయోగించారు. ఆ సముద్రంలో ప్రయోగించిన బాణములచేత పంచభూతములు
కదిలిపోయాయి సముద్రం అతలాకుతలమైపోయింది దానిలో ఉండేటటువంటి ప్రాణులన్నీ
క్షోభించిపోయాయి అటువంటి పరిస్థితిలో ఇకనేను ఆగను ఈ సముద్రాన్నంతటినీ
ఇంకింపజేస్తాను అన్నాడు. హడిలిపోయి లక్ష్మణుడొచ్చి తత స్తు తం రాఘవ ముగ్ర వేగం
ప్రకర్షమాణం ధనురఽప్రమేయం సౌమిత్రి రుత్పత్య ముచ్ఛ్వసంతం మా మేతి చోక్త్వా ధనురాఽఽలలమ్భే
! వచ్చి ఆ ధనస్సు పట్టుకుని అన్నయ్యా అంతపనిచేయకు సముద్రాన్ని యింకిపజేయకూ
అంటున్నాడు కానీ వినకుండా రామ చంద్ర మూర్తి బ్రహ్మాస్త్రప్రయోగం వేయడానికి
సిద్ధంచేసి అభిమంత్రించి బాణాన్ని సిద్ధంచేశారు హడలిపోయినటువంటి సముద్రుడు
పదియోజనముల దూరం ముందుకు పారిపోయాడు అంటే చెలిమిలి కట్టని దాటిపోయాడు అప్పుడు ఆ
సముద్ర మధ్యంలోంచి అధిదేవతయైనటువంటి సముద్రడు పైకిలేచాడు.
రక్త మాల్యాఽమ్బర ధరః పద్మ పత్ర నిభేక్షణః ! సర్వ పుష్ప మయీం దివ్యాం శిరసా
ధారయన్ స్రజం !! జాతరూప మయైశ్చైవ తపనీయ విభూషితైః ! ఆత్మజానాం చ రత్నానాం భూషితో
భూషణోత్తమై !! తనలోంచిపుట్టిన రత్నాలతో హారాలువేసుకు తలనిండా రత్నాలను
పొదిగినటువంటి కిరీఠాన్ని ధరించినవాడై అనేకమైనటువంటి పుష్పములతోకూడిన హరములను
ధరించి భూషణములతో కూడినటువంటివాడై ఎర్రని వస్త్రములుధరించి ఆ సముద్రుడు పైకిలేచాడు
లేచి అన్నాడు నాయనా రామ చంద్రా నీకుతెలియనిదికాదు లోకంలో పంచభూతములకు కూడా వాటివాటి
లక్షణములు వాటికున్నాయి నీరు ప్రవహిస్తూంది గాలివీస్తూంది ఇలా అగ్ని
తపింపజేస్తూంది నీరు తడుపుతూంది చల్లగా ఉండేటట్టుచేస్తూంది ఒక్కొక్క భూతమునకు
ఒక్కొక్క లక్షణము అలాగే నాకు కూడా ఒక లక్షణము ఉంది రెండుగుణములతో ఉంటాను నేను ఒకటి
అగాధం అంటే బాగాలోతుగా ఉండడం ఎవ్వరూ నన్నుదాటడానికి వీలులేనిరీతిలో ఉండడం ఈ రెండూ
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
నాయొక్క లక్షణాలు కాబట్టి య దఽగాధోఽహ మప్లవః అగాధంగా
ఉండడం దాటడానికి వీలులేనిరీతిలో ఉండడం నా లక్షణాలు అటువంటి నన్ను దాటి వెడతానని
నీవు ఇక్కడ ఉండడం నేను నిన్ను అలా అవకాశం కల్పించలేదూ అని నామీద అగ్రహించడం
తగినటువంటి విధానంకాదు. కానీ రామా నేను నీతో ఒక మనవి చేస్తాను, వానరసైన్యమంతా
వెళ్ళిపోవడానికి కావలసిన రీతిలో నేనుదారి ఇస్తాను దారి ఇవ్వడమంటే ఎలా ఇస్తాను మీరు
చెట్లు రాళ్లు అన్ని తెచ్చి నూరుయోజనములు దూరం నామీదవేయండి నేను వాటినన్నింటినీ
వహిస్తాను, వహించి సేతువుగా విడిచిపెడుతాను నేను వానర సైన్యమంతా లంకాపట్టణంలోకి
వెళ్లిపోయేంతవరకూ ఆ సేతువు కదలదు అలాగే ఉంటుంది. కాబట్టి మీ సైన్యంలోనే నళుడనేటటువంటి
ఒకగొప్ప వానర వీరుడున్నాడు ఆయన విశ్వకర్మ యొక్క తేజస్సుతో విశ్వకర్మకి కుమారుడుగా
జన్మించినటువంటివాడు అహం సేతుం కరిష్యామి విస్తీర్ణే వరుణాఽఽలయే అయన
నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు అయం సౌమ్య నళో నామ తనుజో విశ్వకర్మణః !
పిత్రా దత్త వరః శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణః !! ఏష సేతుం మహోత్సాహః కరోతు మయి
వానరః ! తమఽహం ధారయిష్యామి తథా హ్యేష యథా పితా !! ఆ తండ్రి ఎంత గొప్పవాడో
అంతగొప్పవాడైనటువంటి నీళుడు నిర్మించినటువంటి సేతువుని నేను వహిస్తాను
పట్టుకుంటాను అప్పుడు ఈ వానర సైన్యమంతా వెళ్ళిపోవచ్చు.
అని చెప్తే వెంటనే ఆ నీళుడు లేచి అన్నాడూ నాకు అటువంటి శక్తి ఉంది మా
నాన్నగారి అనుగ్రహంవల్ల కానీ, నీవు అడగకుండా నేనులేచి అలాకడతాను అనడం
అహంకారమౌతుందని నేను అనలేదు రామా! మీరు అనుగ్రహిస్తే నేను నూరు యోజనముల సేతువుని
నిర్మిస్తాను అన్నాడు చాలా సంతోషించారు. కానీ నేను ఎక్కుపెట్టిన బాణాన్ని
తీయ్యడమన్నది కుదరదు కాబట్టి ఎక్కడ విడిచిపెట్టను చెప్పూ అని అడిగాడు అడిగితే
సముద్రుడు అన్నాడు ఇక్కడికి దగ్గరల్లోనే ఉత్తర తీరంలో సముద్రానికి అవతలి ఉత్తర
తీరంలో నా సముద్ర జలాల్నంతటినీ కూడా తాగుతున్నవారు కొంతమంది ఉన్నారు వాళ్ళు మహా
పాపాత్ములు అటువంటి పాపాత్ములైనవాళ్ళు నా జలాల్నీ తాగడంచేతా కలుషితమై నేను
బాధపడుతున్నాను కాబట్టి నీవు నాకు ఒక ఉపకారం చెయ్యవలసి ఉంటుంది నీవు
సంధించినటువంటి బాణాన్ని అక్కడికి విడిచిపెట్టు విడిచిపెట్టినట్లైతే దానిని ʻవరుకాంతారముʼ అని పిలుస్తారు ఇప్పుడు అది రాముడు ఎక్కడ ఉందో తెలియకపోయినా ఒక్కసారి సంకల్పం
చేసి బాణాన్ని విడిచిపెట్టాడు దక్షిణతీరంలో నిలబడి విడిచిపెట్టినటువంటి బాణం
ఉత్తరతీరంలో ఉన్నటువంటి వరుకాంతారమనేటటువంటి ప్రదేశంలోపడి అక్కడా ఆధీరులు
అనబడేటటువంటివాళ్ళు డస్సివులు అనేవాళ్ళు పాపభూయిష్టమైన జీవనంతో ఉండి సముద్రజలాల్నీ
పాడుచేస్తున్నారు వాళ్ళందరూ మరణించేటట్టుగా వాళ్ళు తాగుతున్నటువంటి నీటినంతట్నీ ఆ
బాణము యింకిపజేసింది. లేకపోతే అది సముద్రజలాల్నీ యింకింపజేస్తుంది. ఎక్కడుందో
కంటితో చూడకపోయినా దక్షిణతీరంలో నిల్చుని ఉత్తరతీరంలో ఉన్న ఆప్రాంతం మీదకి బాణం
విడిచిపెట్టాడు రామ చంద్ర మూర్తి అది ఆయన గొప్పతనం.
అది నీటిని ఇంకిపజేసి
భూమిలోకివెళ్ళి లోపలికి గుచ్చుకుంటే ఆ గుచ్చుకున్న ప్రాంతానికి “ప్రణమూ” అని
పేరువచ్చింది అక్కడ్నుంచి ఒక పెద్ద నీటిబుగ్గ ఒకటి పుట్టింది అదంతా ఉన్న నీరు
త్రాగకుండా శోషింపజేశారు కాబట్టి ఆ నీరు లేకుండా చేసి ఇంకింపజేశారు కాబట్టి మొదట ఆ
ప్రాంతం ఎడారైపోయింది కాబట్టి మొదట రామ చంద్ర మూర్తి బాణ ప్రయోగం
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
చెయ్యడానికి అవకాశం ఇచ్చిన ప్రాంతం కాబట్టి దానికి
వరమిచ్చారు నేను వేసిన బాణం చేత నీటి బుగ్గగా వచ్చిన ఆ నీటితోటి ఆ ప్రాంతమంతా కూడా
పచ్చగడ్డి మైదానంగా మారుతుంది అక్కడా చక్కాగా పశువులన్నీ తిరిగి పాలు వెన్నా
అన్నిటినీ సమృద్ధిగా కురిపిస్తాయి ఆ ప్రాంతం ఐశ్వర్యవంతమౌతుంది అక్కడ ఏ రోగాలూ
లేకుండా ఆ ప్రాంతముంటుందీ అని వరమిచ్చారు. ఆ తరువాత మహానుభావుడైనటువంటి నీళుడు
సేతువు కట్టడంకోసమనీ వానరములన్నింటినీ పురమాయించారు మీ అందరూ వెళ్ళి దొరికినటువంటి
శిలలూ చెట్లూ అన్నీ పట్టుకురండీ అంతే ఇన్నికోట్ల వానరములు పర్వతాలు ఎక్కేశారు
అరణ్యంలోకి వెళ్ళిపోయారు పుష్పించినటువంటి చెట్లు తీసుకొచ్చారు ఒకటీ రెండు
చెట్లుకావటా దవళ వృక్షములు ఎదురుజలలూ అవిసి చెట్లు తెల్ల మద్దిచెట్లు తాళ వృక్షములు
మద్దుగ చెట్లు ద్విజ వృక్షములు మారేడు చెట్లు ఏడాకుల చెట్లు పొన్నచెట్లు గన్నేరు
చెట్లు మామిడి చెట్లు అశోక వృక్షాలు శిలలు పర్వతాలు కొండలు ఇన్నింటినీ పెకలించి
తీసుకొచ్చీ సముద్రంలో పడేస్తున్నారు
మొదటి రోజున పదునాలు యోజనములకు సేతువు కట్టారు రెండవ రోజున ఇరవై యోజనాలు
సేతువు కట్టారు మూడవ రోజున 21 యేజనాలు కట్టారు నాల్గవ రోజున 22 యేజనాలు కట్టారు
ఐదవ రోజున మిగిలి ఉన్న 23 యోజనాలు కట్టారు. నూరు యోజనముల మేర సముద్రం మీద సేతువు
ఐదు రోజులలో నిర్మాణం అయిపోయింది. ఐదు రోజులలో నిర్మాణం అయిపోగానే ఇన్నికోట్ల మంది
వానరలూకూడా సంతోషంగా ఆ సేతువుమీద పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ జై శ్రీ రామం జై జై
శ్రీ రాం అని నినాదాలుచేస్తూ ఆ సేతువు మీద దాటి దక్షిణతీరానికి చేరిపోయారు.
సైన్యమంతా లంకాపట్టణాన్ని చేరిపోయింది మహోత్సాహంగా సేతువుని దాటుతుంటే కొంతమంది
సముద్రంలోకి దూకుతున్నారు సముద్రంలో ఈదుతున్నారు మళ్ళీ ఎక్కుతున్నారు వానర
చేష్టితములు కదాండీ... ఇంత సంతోషంగా కొంతమంది పెద్ద పెద్ద పుష్పించినటువంటి చెట్లు
గదల్లా భుజాలమీద వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇంతమంది నూరు యోజనములు సముద్రమీద
సేతువుకట్టి ఇన్నికోట్ల వానరములు భల్లూకములూ కొండముచ్చులూ వెళ్ళిపోతుంటేనటా
అపురూపమైన ఈ సన్నివేషాన్ని చూడ్డానికి దేవతలూ ఋషులు యక్షులు గంధర్వులూ ఆకాశంలో
నిలబడి కింద సముద్రంమీద సేతువుమీద వెళ్ళిపోతున్నవాళ్ళను చూసి పొంగిపోయారటా. రామ
చంద్ర మూర్తి ఇంత సైన్యంతోటి దక్షిణతీరానికి చేరిపోయి లంకాపట్టణంమీదికి యుద్ధానికి
ఇంకా సిద్ధంగా ఉన్నారు అన్న శుభవార్తదగ్గర ఇవ్వాళ్టి ఉపన్యాసాన్ని పూర్తి
చేస్తున్నాను.
రేపటి రోజు చాలా అద్భుతమైన ఘట్టాలు
కొన్నివస్తాయి కాబట్టి రేపటి రోజునుంచి మనం ఒక పని చేద్దాం రామ నామం చెప్పీ శారదా
పీఠం కనుకా ముద్రణవేసి మీకు ఇచ్చారు కనుకా “విధితాఖిల శాస్త్ర సుధాజలదే” అనివేసినటువంటి
ఆ కాగితాలు మీరు తెచ్చుకుంటే ప్రతిరోజు మనం చక్కగా శంకరాచ్యార్యులవారికి
తోటకాష్టకంతో నమస్కారం చేసి బయలుదేరుదాం.
యుద్ధ కాండ
ముప్పయ్ ఆరవ రోజు ప్రవచనము
|
|
ఇప్పుడొక్క పదకొండుమాట్లు రామ నామం చెప్పుకుందాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ
నామము !!రా!!
ఇడాపింగళమధ్యమందున ఇమిడియున్నది రామ
నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది
రామనామము !!రా!!
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ
రామ నామము !!రా!!
జన్మమృత్యుజరాధి వ్యాధుల
చక్కబరుచును రామ నామము !!రా!!
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ
రామ నామము !!రా!!
సాంఖ్యమెరిగెడి తత్వవిధులకు సాధనము
శ్రీ రామ నామము !!రా!!
రాకడయు పోకడయులేనిది రమ్యమైనది రామ
నామము !!రా!!
నిర్వికారము నిర్వకల్పము నిర్గుణము
శ్రీ రామ నామము !!రా!!
పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీ
రామ నామము !!రా!!
విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు
శ్రీ రామ నామము !!రా!!
అల కుచేలుని చేతి అటుకులనారగించిన
రామ నామము !!రా!!
మంగళా శాసన....
No comments:
Post a Comment