Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - కిష్కింధ కాండ 23వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Kishkinda Kanda 23rd Day


కిష్కింధ కాండ


ఇరవైమూడవ రోజు ప్రవచనము




రామ చంద్ర మూర్తి సుగ్రీవుడు ఇద్దరూ అగ్ని సాక్షిగా స్నేహం చేసుకుని పరస్పరం ప్రతిజ్ఞ చేసుకున్నారు, నేను వాలిని నిగ్రహించి నీకు రాజ్యం ఇస్తానూ అని రామ చంద్ర మూర్తి అన్నారు. నేను అన్నిదిక్కులకు వానరములను పంపి సీతమ్మజాడ కనిపెట్టి మళ్ళీ సీతమ్మని నీ పక్కకు చేరుస్తానూ అని సుగ్రీవుడు ఇద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు. తరువాత శోకాగ్నిపొందినటువంటి సుగ్రీవున్ని ఓదారుస్తూ రామ చంద్ర మూర్తి అంటారూ మీ ఇద్దరూ తోడపుట్టినవారు కదా ఏకోదరులు అటువంటివారికి మీ ఇద్దరి మధ్యా ఇంత వైరము ఎందుకు ప్రభలింది, నిన్ను రాజ్యభ్రష్టున్ని చేసి నీ భార్యను తన భార్యగా ఎలా చేసుకున్నాడు వాలి, నాకు ఈ విషయాన్ని వివరిస్తే మీ ఇద్దరి మధ్యా ఇంత వైరం రావడానికి కారణం నాకు బాగా అర్థమౌతుంది అన్నారు.
Image result for వాలిఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది పూర్వాపర విచారణ బాగాచేస్తారు రామ చంద్ర మూర్తి సుగ్రీవుడి విషయంలో స్నేహం చేశారూ అంటే... కబంధుడు చెప్పాడు కాబట్టి స్నేహం చేశాడు, ఋష్యమూక పర్వతం మీద ఎవరు ఉంటారో... అక్కడ ఉండాలీ అంటే పాపాచరణములేనివారైతేనే ఉంటారూ అని కబంధుడు చెప్పాడు కాబట్టి సుగ్రీవుని యందు పాపము లేదూ అని రామ చంద్ర మూర్తి యొక్క విశ్వాసము కాబట్టి స్నేహం చేశారు. కేవలం సీతమ్మజాడ కనిపెట్టడానికి ఒక మిత్రుడు కావాలి అని అనుకుంటే నిజానికి సుగ్రీవుడికన్నా వాలి గొప్పవాడు ఎందుకంటే వాలి ఒక్క కబురు చేస్తే రావణుడు చాలా భయపడుతాడు, వాలిచేత నిగ్రహింపబడినవాడు రావణుడు కాబట్టి ఆయన సహాయం అలా కావాలి అనుకుంటే వాలితోనే స్నేహం చెయ్యొచ్చు, రాముడికి తన కార్యం నడవడం ప్రధానం కాదు ధర్మం నిలబడి అనుషంగికంగా తన కార్యం నడవాలి తప్పా ధార్మికముకాని రీతిలో తన కార్యాన్ని చక్కబెట్టుకోవడం అనేటటువంటిది  రాముడికి సుతారము ఇష్టము ఉండదు. ఆయనకు ముందేదీ అంటే ధర్మము సత్య ధర్మములు రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడుస్తాడు కాబట్టే రాముని యొక్క నడక రాముని యొక్క ఆయనము రామాయణమైంది. కనుక ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసి అన్నదమ్ముల మధ్య వైరానికి కారణం అడుగుతున్నాడు, ఇదీ రామ చంద్ర మూర్తి

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
అడగడం ఆయనకి కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందుకనీ అంటే రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురూ కూడా అంత అన్యోన్యమైనటువంటి సోదర ప్రేమ కలిగినవాళ్ళు ఇంత సోదర ప్రేమ కలిగినటువంటి అనుభవమున్నవాడే కాని అన్నదమ్ముల్లో ఇంత ధారుణంగా తమ్ముడి భార్యని తన భార్యగా చేసుకొని తమ్మున్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టినటువంటి అన్నగారిని చూడ్డం అనేటటువంటిది రామ చంద్ర మూర్తికి కించిత్ కొత్త తనంగానే ఉంటుంది కాబట్టి ఆయన కారణం అడిగాడు ఏ కారణం చేత నీవు బయటికి పంపబడ్డావు.
Related imageఅంటే సుగ్రీవుడు చెప్తున్నాడు వాలీ నామ మమ భ్రాతా జ్యేష్ఠః శత్రు నిషూదనః ! పితు ర్బహుమతో నిత్యం మమ చాపి తథా పురా !! నేను వాలి అన్నదమ్ములం నా తండ్రిగారు వాలిని చాలా ప్రేమించారు పెద్ద కొడుకు కనుక, నేను కూడా వాలిని చాలా ప్రేమించాను వాలిని చాలా గౌరవించాను, మా తండ్రిగారు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత జేష్ఠ కుమారుడు కనుకా వాలికి పట్టాభిషేకం జరిగింది ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు రాజ్యం ప్రశాసత స్తస్య పితృ పైతామహం మహత్ ! అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవత్ స్థితః !! వాలి రాజ్యం చేసేటటువంటి సమయంలో తాతలు తండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి రాజ్యాన్ని వాలి పరిపాలన చేసినటువంటి సమయంలోకూడా అంటే రాజ్యమునందు వాలి ప్రతిష్టించకపూర్వము రాజ్యమునందు వాలి ప్రతిష్టింపబడిన తరువాతకూడా నేను ఆయన్ని ఒక సేవకుడు ఎలా గౌరవిస్తాడో అంత మర్యాదతో అంత గొప్పగా సేవించాను అంటే నేను ఒక తమ్మున్ని అన్న భావనతో ఎప్పుడు అహంకరించలేదు, నేను ఒక సేవకుడు అన్న భావనతోనే నేను వాలిని అనువర్తించాను అంత గౌరవంగానూ చూశాను.
ఒకానొకప్పుడు మాయావీ నామ తేజస్వీ పూర్వజో దున్దుభేః సుతః ! తేన తస్య మహ ద్వైరం స్త్రీ కృతం విశ్రుతం పురా !! ఒక స్త్రీ కారణంగా వాలికి మాయావీ అనబడేటటువంటి ఒక రాక్షసునికీ వైరమొచ్చింది, ఈ మాయావీ మయుని యొక్క కుమారులలో పెద్దవాడు అంటే మీకు వాలి యొక్క శీలం ఎటుంటిది సుగ్రీవుని యొక్క శీలం ఎటువంటిది ఒక గీత గీసి మహర్షి మాటల్లోనే చూపిస్తుంటాడు... ఒక స్త్రీ కారణంగా వైరం, అంటే ఒకే స్త్రీని ఇద్దరూ కాంక్షించి ఉన్నారు కాబట్టి వాలికి మయుడికి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఒకానొక రాత్రివేళ ఒక అర్ధరాత్రి సమయంలో ఆ మయుడు కిష్కింధా  నగరానికి చేరుకున్నాడు, అప్పటికి వాలి నిద్రపోతున్నాడు ఆయన వచ్చి ఒక పెద్ద సింహనాధం చేశాడు ఓ వాలీ! నీవు బయటికిరా... నిన్ను నేను నిర్జిస్తాను నేను అందుకే వచ్చాను అన్నాడు అంటే వేళాపాలా లేనటువంటి క్రౌర్యం వేళాపాలా లేనటువంటి ఆగ్రహం. అంటే అతను చేరిందే తడవు కిష్కింధకి వాలిని చంపేయాలన్న కృద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఒక పెద్ద కేక వేశాడు వేంటనే వాలి లేచి నేను ఏదో మధువు సేవించి ఉన్నాను రాత్రివేళ కనుక నిన్ను నిగ్రహించలేడు అనుకుంటున్నావేమో నీవు అక్కడే నిలబడు నేను వస్తున్నాను నీతో తలపడుతానని వాలి కూడా గబగబా యుద్ధాని బయలుదేరి వేళ్ళాడు, వాలిని అనుగమించి సుగ్రీవుడు కూడా వెళ్ళాడు ఎందుకని అంటే వాలి సుగ్రీవుల యొక్క ప్రేమ ఈ వైరం రానంతకాలం కూడా రామ లక్ష్మణుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందీ అని నేను ఒక మాటంటే... అంత పెద్ద దోష భూయిష్టమైనటువంటి మాటేంకాదు ఎందుకంటే ఇంచుమించు అంత ప్రేమతోనూ ఉంటారు ఇద్దరు, సుగ్రీవుడు అలా అనువర్తించాడు వాలిని, వాలి కూడా అంత ప్రేమించినట్లే కనపడుతుంది మనకి.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి స తు మే భ్రాతరం దృష్ట్వా మాం చ దూరాత్ అవస్థితం ! అసురో జాత సంత్రాసః ప్రదుద్రావ తతో భృశం !! చాల దూరం నుంచి వాలిని సుగ్రీవుని చూశాడు చూసి ఇంత యుద్ధానికి వచ్చి వాలిని మట్టుపెడతానని పెద్దపెద్ద కేకలువేసి సింహనాదం చేసినటువంటి మాయావీ... మయుని కుమారులలో పెద్దవాడైనటువంటి మాయావీ ఒక్కసారి పరుగు లంఘించుకున్నాడు, వెనక్కి తిరిగి ఆయన పరుగెత్తి వెళ్ళిపోతున్నాడు విడిచిపెట్టలేదు వాలి, వాలి ఆయన్ని తరిమాడు ఆయన వెళ్ళి వెళ్ళి వెళ్ళీ ఆ మాయావీ పచ్చగడ్డితో ఉన్నటువంటి ఒక పెద్ద బిలంలోకి భూ గృహంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి దానిలోకి వెళ్ళిపోయాడు అది చాలా చీకటిగా ఉంది ఆ బిలంలోపలికి వెడితే అతను ఎక్కడున్నాడో అతని పరివారం ఎవరైనా ఉన్నారో ఇంకా ఎవరైనా యుద్ధానికి తలపడుతారో తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పుడు వాలి అందులో ప్రవేశిస్తుంటే సుగ్రీవుడు నమస్కారం చేసి అన్నాడూ అన్నయ్యా నేను కూడా నీతోపాటు వస్తాను అన్నాడు అంటే మీరు ఇది చెప్పేటప్పుడు రాముడితో చెప్తున్నాడు సుగ్రీవుడు ఈ కథా..! సుగ్రీవుని యొక్క మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉందో అన్నపట్ల భిన్నాభిప్రాయం ఉన్నవాడు కాడు అన్న రాజ్యాన్ని కైవసం చేసుకుందామనేటటువంటి ఉద్ధేశ్యం ఉన్నవాడు కాడు.
Image result for సుగ్రీవుడు శిలనుకాబట్టి అన్నా నేను నిన్ను అనుగమించి ఈ భూ గృహంలోకి వస్తాను అన్నాడు శాపయిత్వా చ మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్ వాలి అన్నాడు నేను నా పాదముల మీద ఒట్టు పెడుతున్నాను నీవు నాతో రావద్దు, నేను లోపలికి వెళ్ళి ఆ రాక్షసులను మట్టుపెట్టి తిరిగివస్తాను నేను తిరిగొచ్చేవరకు నీవు ఈ బిల ద్వారము దగ్గర కాపుకాయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట ఇతః పూర్వం అరణ్యకాండలో రామ చంద్ర మూర్తి కూడా ఓసారి అన్నారు నా పాదములమీద ఒట్టు నీవు సీతమ్మని తీసుకుని గుహలోకివెళ్ళు నేను యుద్ధం చేస్తాను 14వేల మంది ఖర-దూషనాదులతో అని కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు బిల ద్వారము దగ్గర నిలబడ్డాడు, వాలి అత్యంత వేగంతో ఆ బిలంలోకి ప్రవేశించాడు తస్య ప్రవిష్ట స్య బిలం సాగ్రః సంవత్సరో గతః వాలి బిలంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు అక్కడ నిలబడ్డాడు ఒక సంవత్సరము అయిపోయింది ఆయన తిరిగి రాలేదు లోపల నుంచి ఏమీ చప్పుడు వినపడలేదు, ఒక సంవత్సరము ఎదురుచూశాడు తిరిగొస్తాడేమోనని రాలేదు కానీ ఒక సంవత్సరము అయిపోయిన తరువాత సఫేనం రుధిరం రక్తమ్ అహం దృష్ట్వా సుదుఃఖితః నురుగుతో కూడినటువంటి రక్త ప్రవాహము ఆ బిలములోంచి పైకిరావడం మొదలుపెట్టింది పైగా లోపల నుంచి వాలి చేసినటువంటి ఆర్తనాదములు అంటే కొంచెం భయంతో కూడినటువంటి కేకలులా వినపడ్డాయి సుగ్రీవుడికి అవి భయంతో వేశాడా వేయలేదా కసేపు పక్కన పెట్టండీ... ఆయనకి అలా వినపడ్డాయి అహం తు అవగతో బుద్ధ్యా చిహ్నై స్తై ర్భ్రాతరం హతమ్ ! పిధాయ చ బిల ద్వారం శిలయా గిరి మాత్రయా !! సోకార్త శ్చ ఉదకం కృత్వా కిష్కిన్ధామ్ ఆగతః సఖే !!! సఖే అంటే ఓ రామా! ఓ స్నేహితుడా! అనీ రామున్ని ఉద్ధేశించి మాట్లాడుతున్నాడు.
ఓ స్నేహితుడా! నాకు ఎప్పుడైతే వాలి యొక్క కేకలు వినపడ్డాయో ఆర్తనాదములు వినపడ్డాయో రాక్షసుల యొక్క హాహాకారములు కూడా నాకు వినపడ్డాయో... నేను, వాలి రాక్షసుల చేతిలో నిహతుడయ్యాడు అక్కడ ఒక్క మాయావీయే కాదు చాలా మంది రాక్షసులున్నారు అందరూ కలిసి వాలిని మట్టుపెట్టారూ అని నిర్ణయానికి వచ్చాను, వచ్చి వాళ్ళు పైకి వస్తారేమోనని ఎందుకంటే ఎప్పుడూ సుగ్రీవుడికి జీవితాంతం పోలికే ఏటువంటి పోలికా అంటే నా అన్నగారు చాలా గొప్పవాడు నా అన్నగారు చాలా పరాక్రమవంతుడు అన్న చెయ్యలేని పని నేను చెయ్యలేనేమో అని ఒక ఆలోచన ఎప్పుడూ సుగ్రీవుడికి. కాబట్టి నా అన్నగారే అంత పెద్ద ప్రమాదంలో ఉన్నాడంటే ఇప్పుడు నేను బిలంలోకి వెళ్ళికాని బిల ద్వారం దగ్గర నిలబడగానే

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
ఏం చేస్తాను కాబట్టి లోపల ఉన్న రాక్షసులను పైకి రాకుండా చెయ్యాలనుకున్నాడు అందుకని ఒక పేద్ద శిలను ఒకదానిని దొర్లించి తీసకొచ్చి దాన్ని ఆ బిల ద్వారానికి అడ్డంగా పెట్టేశాడు, ఇప్పుడు ఏమనుకున్నాడంటే... ఇక అందులోంచి రాక్షసులు పైకి రాలేరు అందులో ఉండిపోతారు అనుకున్నాడు. వాలి ఉన్నా సరే వాలి కూడా పోతాడు రాజ్యం తీసుకుందామని అనుకున్నవాడైతే సంవత్సరకాలం ఎదురుచూడడు కుట్ర చేయడానికి పైగా అతను వెళ్ళిపోయేటప్పుడు శోకార్త శ్చ ఉదకం కృత్వా అన్నాడు, నేను ఆయన గురించి శోకించి ఉదక క్రియ చేశాను అన్నాడు, ఉదక క్రియ చేయడం అంటే జలతర్ఫణం అంటే చనిపోయాడు అన్న భావనతో మనసులో అతనికేం అనుమానంలేదు.
Image result for రాముడు సుగ్రీవుడుబతికున్నాడో చచ్చిపోయాడో నేను గబుక్కున బిలానికి అడ్డంగా ఓ రాయిని పెట్టేశాను అలాంటి భావన ఏం లేదు ఖచ్చితంగా వాలి మరణించాడనే అనుకున్నాడు అందుకే అతను ఉదక క్రియ కూడా చేసేశాడు, చేసేసి తిరిగి వచ్చేశాడు నిజంగా సుగ్రీవుడికి రాజ్యం మీద వ్యామోహం ఉండి ఉంటే... వాలి చచ్చిపోయాడని మంత్రులకు చెప్పి ఉండేవాడు, నేను బిలానికి అడ్డంగా ఒక శిలను పెట్టాను ఉదక క్రియ చేసి వచ్చాను కాని అన్నయ్య చచ్చిపోయాడూ అని నేను ఎలా చెప్పడం అన్నయ్య ఏలినటువంటి రాజ్యాన్ని నేను ఏలగలనా? బహుశహ అది ఆయన శంక. వాలి సింహాసనం మీద కూర్చుంటే అమ్మబాబోయ్ వాలి పరిపాలిస్తున్నాడని ఎవరూ రాలేరు. వాలి అంత సామర్థ్యమున్నవాడు నేను వాలి కూర్చున్న సింహాసనం మీద కూర్చోవడానికి, యువరాజుగా వాలి పక్కన కూర్చోగలనేమో కానీ వాలి లేకుండా నేనే స్వతంత్రంగా పరిపాలన చేయ్యగలిగినటువంటివాన్ని కాను అందుకనీ ఆయన మంత్రులకు చెప్పలేదు. కానీ వాళ్ళేం చేశారంటే యత్నతో మన్త్రిభిః శ్రుతమ్ వాళ్ళు గుచ్చి గుచ్చి గుచ్చి ప్రశ్నించారు అనేక రకాలుగా నీవు ఎందుకు వచ్చేశావ్ వాలేదీ ఎందుకు రాలేదు ఎప్పుడు వస్తాడు అని, దుఃఖముతో కూడుకున్నటువంటి మనసుతో ఉన్నవాడు కాబట్టి ఒక రోజున పైకి చెప్పేశాడు “వాలి మరణించాడూ” అని చెప్పాడు. ఎందుకనీ అంటే తను అలాగే నమ్మాడు మంత్రులు అన్నారూ వాలి మరణించాడు నీవు యువరాజువి రాజు లేడు సింహాసనం మీద సింహాసనం ఖాలీగా ఉండకూడదు కాబట్టి ఉత్తరాధికారివి నీవే కనుకా... నీకు రాజ్యాభిషేకం చేస్తాము అన్నారు అభిషిక్తం తు మాం దృష్ట్వా క్రోధాత్ సంరక్త లోచనః ! మదీయాన్ మన్త్రిణో బద్ధ్వా పరుషం వాక్యమ్ అబ్రవీత్ !! ఈయనికి పట్టాభిషేకం చేశారూ సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నాడు, సుగ్రీవుడు రాజ్యం చెయ్యడం మొదలుపెట్టినటువంటి కొద్దికాలానికే వాలి వచ్చాడు వాలి వచ్చి చూశాడు, వాలి తిరిగి వచ్చి చూసీ సుగ్రీవుడు రాజుగా ఉండడం చూడగానే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి.
కుట్ర చేసి రాజ్యం పుచ్చుకున్నాడూ అన్న భావన ఏర్పడింది ఆయన సుగ్రీవున్ని అడగలేదు, అసలు సుగ్రీవుడు మాట్లాడటానికి కానీ సుగ్రీవుడు చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు సుగ్రీవుడు చెప్పింది నమ్మలేదు కూడా... కాబట్టి మదీయాన్ మన్త్రిణో బ్ధ్వా పరుషం వాక్యమ్ అబ్రవీత్ నా మంత్రులందర్నీ ఖైదు చేసేశాడు పైగా నన్ను చాలా పరుషంగా మాట్లాడాడు ఏం మాట్లాడాడు అన్నది సుగ్రీవుడు చెప్పలేదు, పరుషంగా మాట్లాడాడు అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవలసి ఉంటుందంటే... నీవు రాజ్య కాంక్షతో కావాలని నన్ను చంపడం కోసమే బిలానికి శిల అడ్డుపెట్టి నేను లోపలి వెళ్ళగానే అడ్డుపెట్టి వచ్చేశావు వచ్చి రాజువు అయ్యావు, సంవత్సరం ఎదురు చూశాడూ అన్నదాన్ని వాలి ఊహించలేదు, వెళ్ళగానే బిలానికి శిలను అడ్డుపెట్టాడూ అనుకున్నాడు. కాబట్టి నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ ! న ప్రావర్తత మే

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
బుద్ధిః భ్రాతృ గౌరవ యన్త్రితా !! నేను అప్పుడు రాజ్యాధికారమునందు ఉన్నాను, బలవంతుడా బలహీనుడా... కాసేపు పక్కన పెట్టండి, అధికారంలో ఉండడం చాలా గొప్ప బలం ఎందుచేత అంటే సైన్యం అంతా కూడా సహకరిస్తుంది, రాజ్యాధికారం అటువంటిది కాబట్టి నేను అధికారంలో ఉన్నాను నేనే తల్చుకుంటే వాలిని నిగ్రహించగలను కానీ నేను నిగ్రహించలేదు హత్వా శత్రుం స మే భ్రాతా ప్రవివేశ పురం తదా ! మానయం స్తం మహాత్మానం యథావ చ్ఛాభ్యవాదయమ్ !! నేను అభివాదం చేశాను, మొన్నటి రోజున మీకు నేను మనవి చేశాను అభివాదము అన్నమాటకు అర్థమేమిటో... అభివాదము అంటే నిలబడి చేసేది కాదు ఒంగి మోకాళ్ళమీద రెండు చెవులు పట్టుకునిచేస్తే అభివాదము కాబట్టి రెండు చెవులు పట్టుకుని నేను అభివాదము చేశాను. అలా అభివాదము చేస్తే గుర్తేమిటంటే... ఆశీర్వచనాన్ని అపేక్షించినట్లు, అభివాదం చేసినప్పుడు వేంటనే ఆశీర్వచనం చేస్తారు కాబట్టి నాకు ఆశీర్వచనం చెయ్యలేదు మా అన్నయ్య.
Image result for రాముడు సుగ్రీవుడు వాలినేను అభివాదం చేసి మా అన్న పక్కన నిలబడ్డాను ఉక్తా శ్చ నాఽఽశిష స్తేన సంతుష్టేన అన్తరాఽఽత్మనా ఆయనా మనసులో తృప్తిని పొందలేదు నేను అలా అభివాదం చేసినా కూడా... ఆయన నాకు ఆశీర్వచనం చెయ్యలేదు నత్వా పాదౌ హం తస్య మకుటే న అస్పృశం ప్రభో ! ఆపి వాలీ మమ క్రోధాత్ న ప్రసాదం చకార సః !! నేను నా కిరీటము ఆయన పాదాలకు తగిలేటట్టుగా వంగీ ఆయన పాదములకు నా కిరీటాన్ని తగల్చి నమస్కరించాను, నమస్కరించి నేను ఆయనతో ఒక మాట చెప్పాను అన్నయ్యా! నేను యదార్థంగా రాజ్యం కోరుకోలేదు నీవు మంత్రులను అడుగు నేను ఒక సంవత్సరం ఎదురు చూశాను నీవు వస్తావని నురుగుతో కూడిన రక్తపు వరద వచ్చింది నేను నీకే ప్రమాదం జరిగిందీ అనుకున్నాను అందుకని ఒక సంవత్సరం తరువాత ఒక బండ అడ్డంగా పెట్టి తిరిగి వచ్చేశాను నేను మంత్రులకు చెప్పలేదు వాళ్ళు నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు ప్రశ్నించి వాళ్ళు బలవంతంగా నాకు పట్టాభిషేకం చేశారు అభిషిక్తో న కామేన తన్మే త్వం క్షంతుం అర్హసి నేను కావాలని చేసుకున్న పట్టాభిషేకం కాదు కానీ నాకు పట్టాభిషేకం జరిగిందన్నమాట వాస్తవం. అన్నయ్యా! ఈ జరిగిన పట్టాభిషేకానికి నన్ను క్షమించు నాకు తెలియదు నీవు ఉన్నావని కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని నీకు అప్పజెప్పేస్తున్నాను నువ్వే సింహాసనం మీద కూర్చుని పరిపాలనచెయ్యి నీవంటి మహాత్ముడు పరిపాలన చేస్తుంటే నీకు తమ్ముడిగా సేవకుడిగా నేను పూర్వం యువరాజుగా ఎలా ఉన్నానో అలాగే యువరాజ పదవిని స్వీకరిస్తాను నాకు రాజరికము వద్దు నీవే సింహాసనం మీద కూర్చో.
కాబట్టి ఇప్పుడు సుగ్రీవుని యొక్క మనస్సులో పాప భావనలేదు ఆయనకీ రాజ్య కాంక్షాలేదు ఎందుకంటే కొన్నాళ్ళు సింహాసనం మీద ప్రభువుగా కూర్చున్నాడు, ప్రభువుగా కూర్చున్నవాడు అకస్మాత్తుగా మళ్ళీ యువరాజుగా రావడం అనేటటువంటిది ఎవ్వరికీ అంగీకార యోగ్యం కాదు యువరాజు రాజు తరవాత ఉండేటటువంటి రాజరికము ఒకసారి రాజరికం చేసి మళ్ళీ యువరాజుగా కూర్చోవటం అనేటటువంటిది ఒక వ్యక్తి అంగీకరించగలిగిన విషయం కాదు అంత తేలిక కాదు అది. కానీ సుగ్రీవుడు దానికి సిద్ధపడ్డాడు అన్నయ్యా! నీవే రాజ్యమేలు నేను నీకు తోడుగా ఉంటాను నేను పూర్వం ఎలా సేవించానో అలాగే ఒక సేవకుడిగా మసులుకుంటాను, నేను యువరాజుగానే ఉంటాను అని అభ్యర్తించాడు. కానీ వాలి సభను ఏర్పాటు చేసి మంత్రుల్ని పౌరుల్ని అందర్నీ పిలిచాడు పిలిచి ఒక మాట అన్నాడు జరిగిన కథంతా చెప్పాడు మాయావీ వెంట మేము పరుగెత్తడం తను బిలంలోకి వెళ్ళడం అన్నీ చెప్పీ ఆ సభలో ఉన్నవారితో ఏం చెప్పాడంటే... ఈ దుర్మార్గుడు రాజ్యాన్ని కాంక్షించి నేను బిలంలోకి వెళ్ళగానే శిల అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు. నేను తీరా మాయావీని వెతుక్కుంటూ లోపలికి

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
వెళ్ళినటువంటి ఒక సంవత్సరం తరువాత నాకు ఆ మాయావీ కనపడ్డాడు అంటే అది ఎంత పెద్ద బిలమో... ఆయనతో పాటు అక్కడ చాలా మంది రాక్షసులు ఉన్నారు నేను ఈ రాక్షసులనందరినీ పరిమార్చాను గుహ నెత్తుటితో నిండిపోయింది నెత్తుటితో నిండిపోతే నేను ఆ గుహనుండి బయటపడవలసి వచ్చింది తీరా నేను లోపల్నుంచి సుగ్రీవా సుగ్రీవా అని ఎంత అరచినా నాకు జవాబు రాలేదు నేను బయటికి వెడదామని వస్తే శిల అడ్డుపెట్టి ఉంది, నేను నా పాదములతో అనేక పర్యాయములు ఆ శిలను తన్నాను తంతే ఆ శిల బద్దలైపోయింది, బద్దలైన తరువాత నేను బయటికి రాగలిగాను. ఈ క్రూరాత్ముడు ఇంత దుఃశ్చర్య చేసి నీవు ఇక్కడ ఉండూ అని చెప్తే ఉండడం మానేసి శిలను అడ్డుపెట్టీ ఇక్కడకొచ్చీ రాజ్యాన్ని తీసుకున్నాడు కాబట్టి వీడు నా పట్ల క్రూరంగా ప్రవర్తించాడు కాబట్టి నేను వీన్ని చంపేస్తాను అన్నాడు అని నా భార్య రుమని తన భార్యగా స్వీకరించాడు.
మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది తారా అని ఒకావిడ ఉంది వాలి భార్య, వాలి భార్య తారా సుగ్రీవుడి భార్య రుమ. వాలి తారతో కలిసి రాజ్యమేలుతుండేవాడు వాలి మరణించాడూ అని తెలిసిన తరువాత అంటే వాలి మరణించాడు అనుకున్నతరువాత ఆమె సుగ్రీవుడికి భార్య అయ్యింది తార. వాలి వచ్చేంతవరకూ సుగ్రీవుడి భార్యగానే ఉంది తార. సుగ్రీవున్ని తరిమేశాడు తరిమేశాక ఆవిడ మళ్ళీ వాలికి భార్య అయ్యింది. మళ్ళీ సుగ్రీవుడు తరువాత వాలిని చంపేశాడు ఆమె మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయ్యింది. మరి అప్పుడు సుగ్రీవుడి యందు మాత్రం దోషంలేదా... మరి అప్పుడు రాముడు ఎలా ఊరుకున్నాడు, చంపిన తరువాత వాలిని, వాలి భార్యను తారను సుగ్రీవుడు చేపడితే అదికూడా దోషమేగా వదినెగారిని అనుభవించడం తల్లితో సమానం కదా... మరి అప్పుడు సుగ్రీవున్ని కూడా చంపేయాలిగా... మరి ఎందుకు చంపలేదు, మరి రుమని- సుగ్రీవుడి భార్య రుమని వాలి స్వీకరిస్తే వాలి మీద ధర్మం తప్పినవాడివనీ వాలినెందుకు సంహరించాడు రామ చంద్ర మూర్తి. కిష్కింధ కాండలో మీరుదీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది, వానర జాతులలో వానరములందు అనేక జాతులు ఉన్నాయి. ఇందులో కర్మాధికారమూ జ్ఞానాధికారము కలిగినటువంటి వానర జాతి ఒకటుంది అది చాలా శ్రేష్ఠమైనటువంటి వానర జాతి, వాళ్ళు సంధ్యావందనం చేస్తారు, మనుష్యులు ఎలా చేస్తారో వాళ్ళు అలా సంధ్యావందనం చేస్తారు వాళ్ళ అంతేష్టి సంస్కారాలు కూడా అలా ఉంటాయి. వాలి సుగ్రీవుడు సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతిలో వచ్చినటువంటి వారు సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవానరజాతిలో ఒక నియమం ఉంది. అన్నావదినా తమ్ముడూ మరదలు రెండు జంటలు ఉండగా ఏకారణం చేతనైనా అన్నగారుకాని తమ్ముడుకాని మరణిస్తే మరదలు కాని వదినగారు కానీ మిగిలినటువంటి  వారిని అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అన్నగారు మరణించారు అనుకోండి ఇప్పుడు ఆ వదినెగారు తనంత తాను కోరుకుంటే తమ్మునికి భార్య అవ్వచ్చు, అలాగే తమ్ముడు మరణించాడనుకోండి తమ్ముడి భార్య కోరుకుంటే అన్నకు భార్య కావచ్చు అది వాళ్ళ ధర్మం అది వాళ్ళ నియమం అది.
మీరు మన నియమాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి వాళ్ళ నియమం అలా ఉంది అది వాళ్ళకు ధర్మబద్ధం కాబట్టి వాలికి భార్యగా తార ఉన్నంతకాలం సుగ్రీవుడు ఎప్పుడూ స్వీకరించలేదు వాలి మరణించాడూ అని పరిపూర్ణంగా నమ్మాడూ అని గుర్తేమిటంటే పట్టాభిషేకం చేసుకొని తారను కూడా తీసుకున్నాడు, ఆవిడ అంగీకరించింది సుగ్రీవుడి భార్యగా ఉండడానికి కాబట్టి స్వీకరించాడు ఇప్పుడు తప్పులేదు. సుగ్రీవుడు కళ్ళముందు బతికున్నాడని వాలికి తెలుసు తెలిసి రుమను స్వీకరించాడు ధర్మం తప్పాడు అందుకని చంపాడు ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. తరువాత వాలి మరణించాడు, వాలి మరణించిన తరువాత వాలి భార్య తారా మరి ఇప్పుడు భర్త పోయాడు కాబట్టి కోరుకుంటే ఆయన తమ్ముడికి భార్యగా వెళ్ళవచ్చు, కాబట్టి తార తమ్ముడికి భార్యగా వెళ్ళింది రాముడు జ్యోక్యం చేసుకోలేదు. ఆ ధర్మ సూక్ష్మాన్ని మీరు పట్టుకోవాలి కిష్కింధ కాండలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏమౌతుందంటే రాముడు వాలినే ఎందుకు నిగ్రహించాడు సుగ్రీవున్ని ఎందుకు నిగ్రహించలేదు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా నిలబడిపోతుంది కాబట్టి నేను అనుకుంటున్నా మీకు ఇప్పుడు ఇది స్పష్టమైందీ అని నేను అనుకుంటున్నాను రాముడు ధర్మాత్ముడు ఆయన ధర్మాన్నే నిలబెడుతుంటాడు ఎప్పుడూ.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి రామా! నేను బ్రతికుండగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసి ఈ భూమండలమంతా తిరిగాను వాలి తరుముకొస్తే ఋష్యమూక పర్వతం మీదకొచ్చి కూర్చున్నాను కిష్కింధకి పక్కనే ఉంది ఋష్యమూక పర్వతం ఆఖరుకి నేను ఈ ఋష్యమూకం మీదే కూర్చున్నాను, ఒక కారణం వల్ల వాలి ఇక్కడికి రాడు అంతే అప్పటికి ఆమాటే చెప్పాడు. ఒకానొక కారణం చేత వాలి ఇక్కడికి రాలేడు వాలే కాదు వాలి అనుచరులుకూడా రాలేరు అందుకనీ నేను ఇక్కడ ఉన్నాను. కానీ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నాను, ఎందుకంటే నన్ను చంపాలీ అని కృతకృత్యుడై ఉన్నాడు ఎలాగైనా తమ్మున్ని చంపేస్తాను అంటున్నాడు అందుకనీ ఏ క్షణంలో ఎవర్నిపంపి నన్ను చంపుతాడోనని భయపడడం వల్లే... మీ ఇద్దరిని చూసినప్పుడు కూడా వాలే పంపాడూ అని నేను అంత భయపడ్డాను. నేను బ్రతికుండగా నా భార్య రుమని తన భార్యగా వాలి అనుభవిస్తున్నాడు ఇది వాలి చేసినటువంటి ద్రోహం అందుకని వాలిని సంహరించి నాకు రాజ్యాన్ని భార్యని ఇప్పించవలసినదిగా నిన్ను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు.
Image result for సుగ్రీవుడుఇప్పుడు వెంటనే రామ చంద్ర మూర్తి అన్నారూ యావ త్తం న హి పశ్యేయం తవ భార్యాపహారిణమ్ ! తావత్ స జీవేత్ పాపాత్మా వాలీ చారిత్ర దూషకః !! ఆయనా తీర్పు చెప్తారు చారిత్ర దూషకః నడవడిలేనివాడు, ధర్మం తెలియదా తెలుసు అలా చేపట్టకూడదు రుమని అని తెలుసు చేపట్టాడు ఎలా చేపట్టాడు తమ్ముడు బ్రతికుండగా చేపట్టాడు కాబట్టి ధర్మం తప్పాడు ధర్మం తప్పినటువంటి ఆ వాలిని ఇక నేను బతకనీయను నా కంటికి వాలి ఎంతకాలము కనపడడో అంతకాలమే బ్రతికుంటాడు. నా కంటికి వాలి కనపడిన ఉత్తర క్షణంలో వాలి మరణిస్తాడు కాబట్టి నువ్వు ఇవ్వాలే ఇప్పుడే బయలుదేరు కిష్కింధకి యుద్ధానికిపిలు బయటికొస్తాడు నేను వాలిని చంపేస్తాను. సరే బయలుదేరారు ఆ సుగ్రీవుడు రామ చంద్ర మూర్తితో మీ పరాక్రమం మీద నాకు ఎటువంటి అనుమానం లేదు ఇంద్రునితో తుల్యమైనవారు మీరు వాలిని నిగ్రహించగలరు వాలినేమి మూడు లోకములనే నిగ్రహించగలరు అంతటి పరాక్రమ సంపన్నులు అటువంటి మీతో నాకు మైత్ర ఏర్పడటం చాలా గొప్ప విషయం చాలా సంతోషించవలసిన విషయం రాజ్య భ్రష్టుడైన ఒక వానరున్ని నేను అటువంటి వానరునితో మీరు స్నేహం చేశారు.
పైకి అంటూంటాడు ఈ మాటలు కానీ! సుగ్రీవుడి మనసులో ఉన్న భావనలన్నీవేరు ఈ సందర్భంలో ఎందుకో తెలుసాండీ! ఆయన ఎప్పుడైనా సరే లక్ష్మణున్ని అసలు కూర్చోమని చెప్పడు ఆయన ఎప్పుడైనా కూర్చోమంటే రామున్నే కూర్చోమంటాడు, రామున్ని కూడా ఎలా కూర్చోమంటాడంటే ఒక కొమ్మవిరిచి వేసి రెండు పర్యాయాలు చేశాడు అలా... ఒక కొమ్మ విరిచి వేసి దానిమీద తను కూర్చుని రామున్ని కూర్చోమంటాడు ఒకసారైతే ఏమైందంటే రామ లక్ష్మణులిద్దరూ నిలబడ్డారు తను కూర్చుని మాట్లాడాడు ఆతరువాత ఏం చేశాడంటే చూసి రామా మీరూ కూర్చోండని లేచి ఒక మద్ది చెట్టు

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
కొమ్మ విరిచి ఆసనంగా వేసి కూర్చోండని తను కూర్చుని ఇలా కూర్చోమన్నాడు అంటే మహాత్ముల సరసన కూర్చోవడం మహాత్ములతో సమానంగా కూర్చోవడం వారిని అవమానించడమే అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవచ్చు అందులో అనుమానమేమీ లేదు దోషమేమీ లేదు. ఆలా ఉండకూడదు మనం గమనించగలిగినటువంటి స్థితిని చూడాలి ఇది సుగ్రీవుడికి తెలియదా..? రాముడు మహాత్ముడని తెలియదండీ! తెలియకపోవడం వల్ల అలా ప్రవర్తించాడూ అని మీరు అన్నారనుకోండి లేకపోతే మహాత్ములతో అలా ప్రవర్తించకూడదని సుగ్రీవుడికి తెలియదండీ అని మీరు అన్నారనుకోండి, మహాత్ములతో అలా ప్రవర్తించకూడదన్న విషయం సుగ్రీవుడికి తెలుసూ అన్నది మహర్షి ఒక సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు. నేను మీకు ఎదర వచ్చినప్పుడు చూపిస్తాను అంటే తెలిసి అలా ప్రవర్తించాడు, ప్రవర్తించి మీ అంతటివారు నాతో స్నేహం చేస్తున్నారు ఇంక అంతకన్నా నాకు ఏం కావాలి అంటుంటారు కానీ మనసులో అనుమాన పడుతుంటాడు.
Image result for రాక్షసులుఏమనుమాన పడ్డాడంటే... ఆగండి వెడుదాం పిలుస్తాను వాలినీ యుద్ధం చేస్తాను మీరు చంపుదురుకానీ... కానీ నేను ఒక్కమాట చెప్తాను మీరు కొంచెం వినండీ అన్నాడు. ఏం దేనిగురించి భయం సుగ్రీవుడికి అంటే... ఇప్పుడు బయటపడుతున్నాడు సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాత్ అపి చోత్తరమ్ ! క్రామతి అనుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమః !! వాలి ప్రతిరోజూ సూర్యోదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడు చాలా మంచి అలవాటు రావణుడు కూడా లేస్తాడు కానీ ఇద్దరికీ ఉన్న లక్షణమేమిటో తెలుసాండీ! ఆయనకి కామం ఈయనకీ అహంకారం నాకు బలముందీ అని సధ్యావందనం చెయ్యాలీ అనుకున్నవాడు ఒకచోట కూర్చుని చేసుకుంటే చాలు అంతేకానీ బలముందికదాని సంధ్యావందనం చేసేటటువంటివాడు ఏదో చెరవుదగ్గరికి వెడితే నాలుగు గట్లు మీద సంధ్యావందనం చెయ్యాలి నాలుగు చోట్లకెళ్ళి తర్పణము ఇవ్వాలి ఆర్ఘ్యమివ్వాలనేం లేదు. కానీ ఒంటిబలం అటువంటిది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే... నాలుగు సముద్రముల దగ్గరికి వెడుతాడు ఆర్ఘ్యమిచ్చేటప్పుడు అంటే దిగ్ దేవతా నమస్కారానికి తిరిగినట్టుగా నాలుగు సముద్రములకు వెడుతాడు. తూర్పు సముద్రం పశ్చిమ సముద్రం ఉత్తర సముద్రం దక్షిణ సముద్రం ఒక్కొక్క గంతులోనే వెళ్ళిపోతాడు. దక్షిణ సముద్రం దగ్గర కూర్చున్నవాడు ఒక్క గంతువేస్తే ఉత్తర సముద్రం దగ్గర ఉంటాడు ఉత్తర సముద్రం నుంచి ఒక్కసారి లంఘిస్తే మళ్ళీ తూర్పు సముద్రానికి వస్తాడు తూర్పు సముద్రం నుంచి బయలుదేరితే ఒక్క గంతులో పశ్చిమ సముద్రాన్ని చేరుకుంటాడు, మా అన్నయ్యా అంత వేగంగా సంధ్యావందనానికి వెళ్తాడు. సంధ్యావందనానికి వెళ్ళేటప్పుడు పెద్ద అలా వెళ్ళాలనేటటువంటి ఒక వ్యగ్రత ఏమీ ఉండదు. సంధ్యావందనం అనేటటువంటిది చాలా ప్రశాంతంగా చేసేటటువంటి స్థితి మీరు విన్నారో లేదో... రాముడు అరణ్యవాసానికి రాగానే గంగా తీరంలో గుహుడి దగ్గరికి వెళ్ళాడు నిర్మలమైన మనస్సుతో గాయిత్రి చేస్తాడు, గాయిత్రి ఎప్పుడు చేస్తున్నా సంధ్యావందనంలో మనస్సుని నిర్మలం చేసుకోవలి అందుకే అన్నిమాట్లు ఆచమనం చేస్తారు. స్థూల సూక్ష్మ కారణ శరీరములయందు ఉండేటటువంటి తాపములను నిగ్రహించి మనసుని నిలబెట్టి సంధ్యావందనం చెయ్యాలి, గాయిత్రిని చెయ్యాలి.
అది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది కాబట్టి రాముడు చేస్తే ప్రశాంత చిత్తుడై చేస్తాడు, వాలి చేస్తే తన బలాన్ని పైకి పెట్టుకునేటట్టు చేస్తాడు, సంధ్యావందనం సంధ్యావందనంలా చెయ్యాలి తప్పా సంధ్యావందనం ఆడంబరానికీ వెటకారాలకీ సంధ్యావందనం చేయకూడదు. అది చాలా ప్రమాదం కూడా అలాంటి పిచ్చిపన్లు ఎప్పుడూ చేయకూడదు దాన్ని చేసేటప్పుడు తదేక దృష్టితో జాగ్రత్తగా ఆ మర్యాదతో ఆ గౌరవంతో చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి నాలుగు సముద్రముల దగ్గరికీ వెళ్తాడు మా అన్నయ్య ఒక్కొక్క గంతులో వెళ్ళిపోతాడు అయిపోయిన తరువాత ఏం చేస్తాడో తెలుసా సంధ్యావందనం అయ్యాక అంటే సూర్యోదయం అయ్యేలోపలా ప్రయశ్చిత్తం లేకుండా కదా ఆర్ఘ్యమిచ్చేయ్యాలి కాబట్టి త్వరతో ముందు సంధ్యావందనం చేస్తాడు చేసిన వెంటనే ఏం చేస్తాడంటే అగ్రాణి ఆరుహ్య శైలానాం శిఖరాణి మహా న్యపి ! ఊర్ధ్వమ్ ఉత్ క్షిప్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్ !! ఆయనా పర్వతముల యొక్క శిఖరముల దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు నిల్చుని ఆ పర్వత శిఖరములను ఊపి చేత్తో బంతులను పట్టుకున్నట్లు పట్టుకుంటాడు పట్టుకుని పర్వతములను గాలిలో ఎగురవేస్తాడు ఎగరవేసి పట్టుకుంటుంటాడు కింద పడకండా... పర్వత శిఖరాలను పెరికి ఆడుకోవడం మా వాడికి పొద్దున్నే చేసేటటువంటి వ్యాయాంలాంటిది బంతాటకింద లెక్కది. శిఖరములతో ఆడుకుంటాడు అలాగ అంటే ఎంతటి బలవంతుడో ఎంతటి వేగమున్నవాడో గమనించు.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
బలం ఉండడం ఒకెత్తండి బలానికి పక్కన వేగం ఉండడం మరింత ద్విగుణీకృత బలం, బలం ఉన్నచోట వేగముండాలని లేదు వేగమున్నచోట బలం ఉండాలని లేదు బలమూ వేగమూ కూడా ఉన్నాయనుకోండి చాలా కష్టము ఇంక పట్టుకోవడం అంత వేగంగా వచ్చి మీద పడిపోతాడు అంత వేగమున్నవాడు అంత బలమున్నవాడు మా అన్నయ్య బహవః సారవన్త శ్చ వనేషు వివిధా ద్రుమాః ! వాలినా తరసా భగ్నా బలం ప్రథయతాఽఽత్మనః !! మా అన్నయ్య పచ్చగా ఉన్నటువంటి ఆకులతో ఉన్న సాల వృక్షముల దగ్గరికి వెడుతాడు వెళ్ళీ ఆకాశమంత ఎత్తున పెరిగిపోయి కొమ్మలతో రెమ్మలతో పచ్చి ఆకులతో ఉన్న సాల వృక్షం దగ్గరికి వెళ్ళి దాని మొదలు పట్టుకుని ఒసారి ఇలా ఊపుతాడు ఊపి పైకి చూస్తాడు చూస్తే అపర్ణః అంటే ఆకులు ఉండవు ఆ చెట్టుకి అన్ని ఆకులూ కిందపడిపోతాయి పచ్చి ఆకుపడ్డం చాలా కష్టం పచ్చి ఆకూ ఊడదు కానీ మా అన్నయ్య సాల వృక్షాన్ని కదిపితే ఆకులన్నీ ఊడి కిందపడిపోతాయి అంతటి మహాబలవంతుడు అంటే ఏమిటీ నిన్ను నమ్మి నేను వెళ్ళచ్చా నేను వెళ్ళి యుద్ధానికి పిలిచిన తరువాతా నీవు తట్టుకోలేకపోతే... ఏదో వాలి చంపేస్తానంటున్నావు మంచిమాటే ఏదో పాపం మిత్రత్వంతోటీ కానీ తీరా నీవు అక్కడికి వచ్చీ కాళ్ళుచాపావనుకో నా పరిస్థితి ఏమిటీ వదిలిపెట్టడు నన్ను ఇంకా కాబట్టీ మా అన్నయ్య బలమేమిటో ముందు తెలుసుకో అంటే రాముని మీద కించిత్ అనుమానం ఉందన్నమాట, రాముని యొక్క బలం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నవాడు కాదు.
ఈ మాట చెప్పిన తరువాత ఇంకొకటి చెప్తున్నాడు మహిషో దున్దుభి ర్నామ కైలాస శిఖర ప్రభః ! బలం నాగ సహస్ర స్య ధారయా మాస వీర్యవాన్ !! దున్దుభి అనీ ఆ మాయావీ యొక్క తమ్ముడు వాడికన్నా గొప్పవాడు వీడు, వీడికి వెయ్యి ఏనుగుల యొక్క బలం ఉన్నటువంటివాడు. వెయ్యి ఏనుగుల బలం ఉంటే వచ్చినటువంటి ఇబ్బందేముందండీ దానికి పెద్ద గొడవేముంది ఆయన బలం ఆయనది ఆయన తిండి ఆయనది కాని వచ్చిన బాధేమిటంటే బలంవుంది కాబట్టి రోజూ ఎవళ్ళో ఒకళ్ళతో యుద్ధానికి వెళ్తాడు, యుద్ధానికి వెళ్ళడానికి ఆయనకీ ఈయనకీ ఏం అభిప్రాయ భేదాలు ఉండక్కరలేదు బలవంతులెవరని అడుగుతాడు ఫలానా ఆయన బలవంతుడు అన్నాడనుకోండి రేపొద్దున్నే వెళ్ళి వాళ్ళ ఇంటిముందుకెళ్ళి జబ్బలు తరుస్తాడు వస్తావారావా యుద్ధానికి అంటాడు అంటే ఓడించేయాలి అంతే... నేను బలవంతుడనేటటువంటి ఒక కండకావరము అన్నమాట కాబట్టి దున్దుభి వేయి ఏనుగుల బలమున్నవాడు కాబట్టి ఒకసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు సముద్రుడు అనంతమైన గంభీరంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికెళ్ళి జబ్బలు చర్చి అన్నాడు నీవు ఇంతపెద్ద సముద్రుడుగావున్నావు ఇంత బలవంతుడవంటారు ఇవ్వాల్టితో నీ పొగరు అణిచేస్తాను రా యుద్ధానికి అన్నాడు. ఆయనేం చేశాడు అంటే ఆయనేం చేయక్కరలేదు బలముంది కాబట్టి గొడవ పెట్టుకుంటుంటాడు అదే రాక్షస ప్రవృత్తి అంటే అంతకన్నా ఇంకేం ఉండదు కాబట్టి ఎప్పుడైనా అటువంటివాడు మీకు కనపడితే మీరు ఏం చేయాలి అంటే సముద్రుడిలా హిమవంతుడిలా మాట్లాడాలి అని గుర్తుపెట్టుకోండి తప్ప మీరు యుద్ధానికి వెళ్ళిపోకూడదు వాడిలా మీరు కూడా రెచ్చిపోకూడదు. కాబట్టి సముద్రుడు ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆయనే గాంభీర్యం సముద్రమంటే... తతః సముద్రో ధర్మాత్మా సముత్థాయ మహా బలః ! అబ్రవీ ద్వచనం రాజన్ అసురం కాల చోదితమ్ !! కాలము చేత గ్రసించబడడానికి సిద్ధపడుచున్న ఆ దున్దుభికి కండకావరం పెరిగింది కాబట్టి సముద్రుడి దగ్గరి వెళ్ళి అడిగితే సముద్రుడు లేచి అన్నాడూ... నీతో నేనేం యుద్దం చేస్తానయ్యా!

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
సమర్థో నాస్మి తే దాతుం యుద్ధం యుద్ధ విశారద ! శ్రూయతామ్ చ అభిధాస్యామి యః తే యుద్ధం ప్రదాస్యతి !!
శైల రాజో మహారణ్యే తపస్వి శరణం పరమ్ ! శంకర శ్వశురో నామ్నా హిమవాన్ ఇతి విశ్రుతః !!
గుహా ప్రస్రవణోపేతో బహు కన్దర నిర్ఘరః ! స సమర్థః తవ ప్రీతిమ్ అతులాం కర్తుమ్ ఆహవే !!
ఉత్తర దిక్కున హిమవంతుడు ఉన్నాడు హిమవంతుడు చాలా పెద్ద పర్వతం ఋషులందరూ ఆయన్ని ఆశ్రయించి ఉంటారు తపస్సు చేసుకోవడానికి ఆ హిమవత్ పర్వతం మీద ఉంటారు. ఆయనయందు పెద్ద పెద్ద గుహలు ఉంటాయి అనేకమైన నదులు ఆయన మీద పుట్టి ప్రవహిస్తుంటాయి అంత బలవంతుడు పైగా శంకరుడికి మామగారు కాబట్టి ఆ హిమవంతుడి దగ్గరకి వెళ్ళి అడుగు ఆయన చేస్తాడు యుద్ధం అన్నాడు. నీలాంటివాడితో నేనెందుకు యుద్ధం చేస్తాను నాతో యుద్ధమక్కరలేదు నేనే చెప్తున్నానుగా యుద్ధం చేయలేననీ ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడు. వాడు వెంటనే అయితే నీవు చేయలేవు అన్నమాట కాబట్టి ఓడిపోయినట్టే వాడికి అక్కడితో ఆ కోరిక తీరిపోయింది, కానీ తీట వదిలిపోతుండాలి రోజూ ఎవరితోనో ఒకరితో యుద్ధం చేయ్యాలి వాడు కాబట్టి హిమవంతుని దగ్గరికి వెళ్ళాడు. పిలిచి నీవు నాతో యుద్దం చెయ్యాలి సముద్రుడు నీగురించి నాతో గొప్పగా చెప్పాడు నేను నీతో యుద్ధానికి వచ్చాను అన్నాడు అంటే ఆయన అన్నాడు దేనికి యుద్ధం మన ఇద్దరిమధ్యా వైరమేమీలేదు నిష్కారణంగా నాతో యుద్ధమెందుకు అన్నాడు లేదు నాకు బలముంది నీవు బలవంతుడవో నేను బలవంతుడనో తేలిపోవాలి అన్నాడు. నీయంత బలవంతుడిని నేనేమీకాను నేనేదో తాపసులకి ఆశ్రయం ఇస్తూ ఉంటాను వాళ్ళు తపస్సు చేసుకుంటుంటారు నా దగ్గర నేను అందుకు పనికివచ్చేవాన్నేకానీ ఇలా యుద్ధాలు అవీనేను చేయలేను అన్నాడు ఆయనా, నీవు యుద్ధమన్నా చేయి లెదా నాతో యుద్ధం చేసేవాడినైనా చూపించు అన్నాడు ఆయనతో అదో పెద్ద విచిత్రమైనటువంటి విషయం.
File:Indra and namuchi.jpgఒక్కొక్కడి స్థితీ రాక్షసత్వం అన్న తరువాత అంత ప్రభలంగా ఉంటుంది వాళ్ళల్లో ఉండేటటువంటి మనః ప్రవృత్తి. అంటే ఆయన అన్నాడు వాలీ నామ మహా ప్రాజ్ఞః శక్ర తుల్య పరాక్రమః ! అధ్యాస్తే వానరః శ్రీమాన్ కిష్కిన్ధామ్ అతుల ప్రభామ్ !! స సమర్థో మహా ప్రాజ్ఞ స్తవ యుద్ధ విశారదః ! ద్వన్ద్వ యుద్ధం మహత్ దాతుం నముచిః ఇవ వాసవః !! నముచికి ఇంద్రుడికి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నీవు వాలితో యుద్ధం చేస్తే అన్నాడు. కిష్కింధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు మహా బలవంతుడు నీకు తగినవాడు ఆయనతో యుద్ధం చేయి మీకు సరిపోతుంది బాగుంటుంది నాతో ఎందుకు అక్కడికి వెళ్ళు అన్నాడు. అంటే మళ్ళీ ఒక్క గంతులో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు కానీ పాపం అక్కన్నుంచి తిరిగాడు కదాండి పాపం ఒక్కసారి సముద్రుడి దగ్గరి వెళ్ళాడు ఓసారి హిమవంతుని దగ్గరకు వెళ్ళాడు దేనికి ఓ పుణ్యమా పురుషార్దమా... గొడవ తెచ్చుకోవడానికి వెళ్ళాడు గొడవ పెట్టుకోలేదు వాళ్ళు, వాళ్ళు గొడవ పెట్టుకోలేదన్న కక్ష కడుపులో ఉండిపోయింది. వాళ్ళు గొడవ పెట్టుకోలేదు ఇవ్వాళ నాకు యుద్ధం చేయడానికి ఒక్కడు దొరకలేదు సూర్యాస్థమయం

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
అయిపోయింది వాడికి ఎంతబాధో చూడండి. ఏదో నేను ఇవ్వాళ నేను ఒక్క గుడికి వెళ్ళలేదు ఒక్క గోపురానికి వెళ్ళలేదు రామాయణంలో ఒక్క శ్లోకం చదవలేదు ఒక్కసారి రామ నామం రాయలేదు రామ రామా అనలేదు ఇవ్వాల ఏమిటో అంతా ఇలా గడిచిపోయింది అని భక్తుడు విసుక్కున్నట్లూ... వాడికి చాలా కోపం వచ్చింది. సూర్యాస్తమయం అయిపోయింది ఒక్కడూ గొడవకు వచ్చినవాడు లేడు ఒక్కడితో యుద్దం జరుగలేదు చీకటి పడిపోయింది వీడు వస్తాడో రాడో పడుకున్నాడో ఏమో... కాబట్టి ఇప్పుడు రెచ్చగొట్టడానికి కిష్కింధకి వెళ్ళాడు.
అప్పటికే బాగా చీకటిపడిపోయింది ఊరుకోవచ్చు కానీ రేప్పొద్దున మళ్ళీ ఎక్కడికైనై వెళ్ళిపోతానంటాడేమో ఖంగారు యుద్ధానికి ముందే సిద్ధం చేసేసుకుంటే పోతుందని అంటే ఎంత వెర్రిగా ఉంటారో చూడండి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం మీరు రామాయణం చూసి అలా ఉంటారు అనుకోకండి నేను పేర్లు చెప్తే బాగుండదు పేపర్లల్లో చదవట్లామీరూ... ఎంతమందో ఇలాంటివారు కాబట్టి అయిందానికి కానిదానికీ జబ్బలు చెరగడమే రా నాతో అంటూండడం ఎంత రాక్షసత్వంతో ఉంటారో... కిమర్థం నగర ద్వారమ్ ఇదం రుద్ధ్వా వినర్దసి ! దున్దుభే విదితో మేసి రక్ష ప్రాణాన్ మహా బల !! వాలి ఈ దున్దుభి చేసినటువంటి హడావిడి విన్నాడు ఆయన వచ్చినవాడు ఊరుకున్నాడా... ఒక మహిష రూపంలో వచ్చాడు వచ్చి ఒక మహానాధమొకటి చేశాడు, ఆ కిష్కింధంతా చెట్లున్నాయి చెట్లన్నీ విరగొట్టేస్తున్నాడు గిట్టలతో భూమినంతటిని కూడా ఓ ఇలా దున్నేసి ఆ పైకి మట్టి రేపేసి భూమిని బద్ధలు చేసేస్తున్నాడు ఆ బలంతోటి ఆ నగర ద్వారాన్ని బేదించేస్తున్నాడు బద్ధలు కొడుతున్నాడు బద్దలు కొడుతుంటే వాలి నిద్రలేచి అన్నాడు ఎందుకురా..! ఎవడురా అల్లరి చేస్తున్నవాడూ... ఎమిట్రా? అంత ఖంగారువాడికీ ఎందుకలా నగర ద్వారాన్ని బద్ధలు కొడుతున్నాడూ అన్నాడు అంతే ఆయన అడిగింది. నాకు నీతో యుద్ధం కావాలి ఇప్పుడు చేస్తావా రేపు చేస్తావా..? అనడిగితే అయిపోతుంది పోనీ... కానీ వీడు అన్నాడూ..! కానీ రాక్షసత్వం అంటే మాటలు ఎలా ఉంటాయో చూడండి అకారణంగా న త్వం స్త్రీ సన్నిధౌ వీర వచనం వక్తుమ్ అర్హసి ! మమ యుద్ధం ప్రయచ్ఛ త్వం తతో జ్ఞాస్యామి తే బలమ్ !! ఆడాళ్ళ దగ్గర కూర్చొని అరవడం కాదు అంటే మరి రాత్రైపోయింది మరి అంతఃపుర వాసంలో రాణుల దగ్గరకదా ఉంటాడు ఆడవాళ్ళ దగ్గరుండి ఏదో పెద్ద వీరుడిలా ఎవడ్రా అని అడగడం కాదు రా యుద్ధానికి నీ బలమేమిటో తేల్చేస్తాను అన్నాడు.
ఎవరసలువాడు ఏమీచెప్పడు ఖంగారు అనుకొని మళ్ళీ ఏమనుకున్నాడో... వెంటనే అభయమిచ్చాడు పోల్లే చీకటి పడిపోయాక వచ్చానుకదా... అని అథ వా ధారయిష్యామి క్రోధమ్ అద్య నిశామ్ ఇమామ్ ! గృహ్యతామ్ ఉదయః స్వైరం కామ భోగేషు వానర !! పోనీలే ఎలాగో ఓలాగ కష్టపడి రేపు పొద్దునవరకు నేనీ కోపాన్ని ఇలాగే అట్టేపెట్టుకుంటాను రేపు పొద్దున్న యుద్ధానికి రా... ఇవాల్టి రాత్రి నీ రాణులతో హాయిగా కామోపభోగాన్ని అనుభవించు ఎందుకా కోపాన్ని నిలబెట్టుకోవటం ఎవడైనా కోపాన్ని వదిలేస్తాడని చూడాలి ఆయన అంటున్నాడు చాలా కష్టంగా రేపు పొద్దుటవరకు కోపాన్ని నిలబెట్టుకుంటాను అంటాడు అంటే... దుష్టుడి యొక్క మనః ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయం ! అధమే స్యాత్ అహో రాత్రం పాపిష్ఠే మరణాంతకం !! కష్టపడి కోపం నిలబెట్టుకోవడం ఎందుకండీ..! అది పోతుంటే హాయిగా వదిలిపెట్టేయాలి హమ్మయ్యా... ప్రయత్నంలేకుండా పోయిందిరా అనాలి, కాని వాడికి అలా చిత్తశాంతిలేదు అదిపోవాలని. కష్టపడి నిలబెట్టుకుంటున్నాడు గిట్టలతో గీరేస్తున్నాడు చెట్లకొమ్మలు విరిచేస్తున్నాడు అంటే అలా రాత్రల్లా చేస్తుంటాడు నీవేం చెయ్యాలి వాలి ఏం చెయ్యాలో చెప్తున్నాడు, ఇవ్వాళ రాత్రికి నీ రాణులతో భోగించు దీయతాం సంప్రదానం చ పరిష్వజ్య చ వానరాన్ ! సర్వ శాఖా మృగేంద్ర త్వం సంసాదయ సుహృజ్జనాన్ !! నీవు దానధర్మాలు ఏమైనా చెయ్యాలనుకుంటున్నావేమో ఇవ్వాళ రాత్రి చేసేసై ఎవరికి ఏమైనా ఇద్దామనుకుంటే ఇచ్చేసై పరిష్వజ్య చ వానరాన్ ఎవరైనా నీకు ముఖ్యమైనటువంటి వానరులను చూడాలనుకుంటే చూసేసై అంటే వాళ్ళని పిలిపించి కౌగలించేసుకో ఓసారి ఎందుకండీ ఇవన్నీ అంటే... కండకావరం నోటి తీట సర్వ శాఖా మృగేంద్ర త్వం సంసాదయ సుహృజ్జనాన్ ఒకసారి నీ సుహృజ్జనులు ఉంటారు మంచి స్నేహితులు ఇంక మళ్ళీ చూడ్డం ఉండదు మళ్ళీ ఇంకా రేపు ఉండవు నిన్ను చంపేస్తాను అందుకని వాళ్ళందరిని పిలిపించి ఓసారి చూసేసై.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
దేనికి చంపేస్తావు ఏమీ కారణంలేదు తను బలవంతుడని నిరూపించుకోవాలి కాబట్టి చంపేస్తాడు అంతే... సు దృష్టాం కురు కిష్కింధామ్ కురుష్వ ఆత్మ సమం పురే ! క్రీడయస్వ చ సహ స్త్రీభిః అహం తే దర్ప నాశనః !! రేపు ఎలాగో నిన్ను చంపేస్తాను ఉదయం ఇవ్వాళ ఏం చేస్తావో తెలుసా..? ఓసారి కిష్కింధా సామ్రాజ్యాన్నంతటినీ ఓసారి చూసేసుకో రాజువు కాబట్టి నీకామక్కువ ఉంటుంది ఓసారి ఆ రాజ్యం వంక చూడు నీకు ఇష్టం కాబట్టి ఆ రాజధానివంక కూడా చూసై ఇవ్వాళ రాత్రి నీకు ఇష్టమైనటువంటి స్త్రీలు ఎవరున్నారో వాళ్ళతో భోగించేసై రేపు పొద్దున నిన్ను చంపేస్తాను యో హి మత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశమ్ ! హన్యాత్ స భ్రూణహా లోకే త్వ ద్విధం మద మోహితమ్ !! అసలు ఇప్పుడే చంపేద్దును ఎందుకొదిలేస్తున్నానో తెలుసా... నీవు తాగి రాణులతో భోగము అనుభవిస్తూ ఉంటావు కాబట్టి నిద్రపోతున్నవాన్ని ఆయుధం లేనివాన్ని యుద్ధానికి సిద్ధంగా లేనివాన్ని ఏదో కామోప భోగంలో ఉన్నవాన్ని చంపడం అంటే పసిపిల్లవాన్ని భ్రూణహత్యతో సమానం కాబట్టి నేను అటువంటి పాపపు పనులు చేయను అన్నాడు. మళ్ళీ ఇందులో పాపపుణ్యాల విచారణ ఒకటి వాడికి రాక్షసత్వం అంటే అలాగే ఉంటుందండీ... చాలా గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ మాటలు కాబట్టి రేపు పొద్దున యుద్ధానికి రా అన్నాడు.
అంటే వాలికి వీడికన్నా సరదా వాడికి, వాలి అన్నాడు రేపు పొద్దునదాకా ఎందుకు నేను తాగినా అది వీర రసం నేను మధుపానం చేసినా అది నన్నేమీ అంటదు కాబట్టి నిన్ను ఇప్పుడే చంపేస్తా రేపొద్దుటిదాగా ఎందుకు అవన్నీ నాకు అవసరంలేదు అన్నాడు అని వేంటనే లోపలికెళ్ళి తమ్ ఏవమ్ ఉక్త్వా సంక్రుద్ధో మాలామ్ ఉత్ క్షిప్య కాంచనీమ్ ! పిత్రా దత్తాం మహేన్త్రేణ యుద్దాయ వ్యవతిష్ఠత !! తన తండ్రియైనటువంటి మహేంద్రుడిచ్చిన బంగారు మాల ఒకటి ఉంది. ఆ మాల తీసి మెడలో వేసుకున్నాడు మాలకి ఒక శక్తి ఉంది అది తనలోని తేజస్సుని తనలోని బలాన్ని క్షీణించిపోకుండా మాల స్వీకరించి కాపాడుతుంది. ఎదుటివాని బలాన్ని లాగేస్తుందీ అని చెప్పకూడదు మీరు ఇప్పుడు అదీ ఆయనలోని తేజస్సుని ఆయనలోని బలాన్ని క్షీణించిపోకుండా తనలోకి తీసుకొని కాపాడి మళ్ళీ ఇస్తూంటుంది. మహేంద్రుడిచ్చిన మాలకీ ఆ శక్తి ఉంది అందుకే అది మెడలో ఉన్నంతసేపు వాలి మరణించడు వాలి మరణించాలి అంటే అది మెడలోంచి తీసేయ్యాలి అది మెడలోంచి తీస్తేనే మరణమొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ హారాన్ని మెడలో వేసుకున్నాడు వేసుకుని వెళ్ళి ఆ రెండు కొమ్ములూ పట్టుకునీ ఎవడ్రా దున్దుభి నువ్వేనా అన్నాడు అవును నేనే అన్నాడు. రేపు పొద్దుటి దాకా ఎందుకులే ఇప్పుడు రా అని ఆ రెండు కొమ్మలు పట్టుకుని విరిచేశాడు.
ఇంత అల్లరి చేసినవాన్ని ఏంలేదు నాలుగు పిడిగుద్దులు గుద్దాడు ముక్కులోంచి చెవుల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుకుని ఢాం అని చచ్చిపోయాడు. ఎందుకింత అల్లరీ అంటే ఏం ఎక్కడో హాయిగా పడుకోక ఈశ్వరుడిచ్చిన బలంతోటీ ఎందుకొచ్చిన గొడవా ఎందుకు వెళ్ళినట్టూ ఎందుకు యుద్ధం చేసినట్టూ ఎందుకు చచ్చిపోయినట్టు అంటే ఒక్కటే చెప్పవలసి ఉంటుంది కండకావరము. కాబట్టి తం తోలయిత్వా బాహుభ్యాం గత సత్త్వమ్ అచేతనమ్ ! చిక్షేప వేగవాన్ వాలీ వేగే నైకేన

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
యోజనమ్ !! అదిగో అప్పుడు మా అన్నవాలీ ఏం చేశాడో తెలుసా..? ఆ చనిపోయినటువంటి దున్దుభిని కోపంతో వాడు కొన ప్రాణంతో ఉండగా రెండు చేతులతో పైకెత్తి గిరగిర తిప్పి విసిరేశాడు, పర్వతమంత శరీరం ఉన్నవాడు దున్దుభి, ఆ శరీరాన్ని విసిరితే అది యోజనం దూరం వెళ్ళిపడింది రామా! ఇదిగో ఆ పడిపోయిన శరీరమే ఇప్పుడు అస్తిపంజరమైపోయింది ఎండిపోయి అది ఇలా అయిపోయింది ఆ విసిరినప్పుడు నవరంధ్రములలోంచి రక్తము కారుతున్నప్పుడు దున్దుభి శరీరంలోంచి తస్య వేగ ప్రవిద్ధ స్య వక్త్రాత్ క్షతజ బిన్దవః ! ప్రపేతుః మారుతోత్ క్షిప్తా మతంగ స్య ఆశ్రమం ప్రతి !! ఆ గాలిలో వచ్చేస్తున్నటువంటి దున్దుభి యొక్క శరీరంలోంచి కారుతున్న నెత్తురు మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో పడింది. ఆశ్రమ ప్రాంగణంలో పడింది ఆయన అప్పుడు బయటికొచ్చారు, ఏమిట్రా ఏదో పెద్ద చప్పుడైంది ఏదో పడిపోయినట్లు అనుకుని బయటికి వచ్చారు బయటికి వస్తే నెత్తురు పడిపోయింది అదంతాకూడా ఆయన వెంటనే అంతర్ముకులై చూశారు ఎందుకుపడింది ఇంత రక్తము అని దున్దుభి శరీరాన్ని వాలి విసిరాడూ అని గ్రహించాడు.
Image result for మతంగ మహర్షిఆయన అన్నారూ వనం మత్ సంశ్రయం యేన దూషితం రుధిర స్రవైః ! సంభగ్నాః పాదపాః చ ఇమే క్షిపతే ఇహ అసురీమ్ తనుం !! నేను ప్రాణప్రదంగా పెంచుకున్నటువంటి చెట్లతో కూడినటువంటి ఈ ఆశ్రమం నేను నివసించేటటువంటి ప్రదేశం దీన్ని కలుషితం చేశాడు వాలి ఆ నెత్తుటి ధారలు ఇక్కడ పడేటట్టుగా విసిరాడు దున్దుభి కళేబరాన్ని కాబట్టి ఎవడైతే ఈ శరీరాన్ని ఇక్కడ విసిరాడో... వాడు ఈ ఆశ్రమంలోకి అడుగుపెడితే వెంటనే మరణిస్తాడు అని ఊరుకోలేదు ఆయనా సమంతాత్ యోజనం పూర్ణం ఆశ్రమం మామకం యది ! ఆగమిష్యతి దుర్బుద్ధిః వ్యక్తం స న భవిష్యతి !! నేను ఎంతో కష్టపడి ఈ వనాన్నంతటిని పెంచి పెద్దచేసి కందమూలములు తింటూంటాను నా బిడ్డల్లాంటివి ఈ చెట్లన్నీ ఇటువంటి చెట్లన్నీ పాడైపోయేటట్టుగా విసిరేశాడు ఆ దున్దుభి శరీరాన్ని అంత పెద్ద శరీరం పడిపోతే చెట్లు పడవాండీ..? కాబట్టి ఈ ఆశ్రమంలోకే కాదు ఆశ్రమానికి ఒక యోజనం దూరంలో ఎప్పుడైనా వాలి లోపలికి వస్తే... వెంటనే వాలి మరణిస్తాడు అని ఆయన అన్నాడు వాలి ఈ కోపన్ని పెట్టుకుని తనవాళ్ళని పంపించి పాడు చేస్తుంటాడేమో... అని దివస శ్చ అద్య మర్యాదా యం ద్రష్టా శ్వః అస్మి వానరం ! బహు వర్షే సహస్రాణి స వై శైలో భవిష్యతి !! వాలికి సంబంధించినటువంటివాళ్ళు వాలి సైన్యంలో ఉన్నవాళ్ళుకాని వాలి పరివారంలో ఉన్నవాళ్ళుకాని ఎవరైనా ఒక్కరోజు సమయం ఇస్తున్నాను, ఇప్పటికిప్పుడు సమయం ఇస్తే వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోరు కాబట్టి ఇరవైనాలు గంటలలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమూక పర్వత శిఖరములన్నింటి మీదా ఉన్నటువంటి వాళ్ళు ఖాలీ చేసి వెళ్ళిపోవాలి ఆలా కాని వెళ్ళకపోతే వాళ్ళు ఈ ఋష్యమూక పర్వతాల మీద ఉంటే నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళు నా కంటపడగానే వాళ్ళు కొన్ని సంవత్సరముల పాటు శిలలైపోతారు అన్నారు.
అనేటప్పటికీ వాలికి సంబంధించినటువంటి వానరులు పర్వతమంతా ఖాలీచేసి కిష్కింధకి వెళ్ళిపోయారు అంతమంది వానరులు ఋష్యమూక పర్వతం నుంచి వస్తే చూసి వాలి అన్నాడు మీ అందరు ఎందుకొచ్చారు అన్నాడు మహర్షి శపించాడు అన్నారు ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి కాళ్ళమీద పడ్డాడు పడితే మతంగ మహర్షి క్షమించలేదు అలా కుదరదూ నీకు ఈ శాపం ఉంటుందీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి మా అన్నకు భయం. కాబట్టి మా అన్న ఎప్పుడూ ఈ దరిదాపులకు రాడు అందుకని నేను ఈ ఋష్యమూక పర్వతం మీద మతంగ మహర్షి యొక్క ఆశ్రమం చుట్టూ

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ బ్రతుకుతున్నాను అంటే రామా! ప్రాణములు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాను ఇదీ దున్దుభి యొక్క కళేబరం అని ఇప్పుడు రామున్ని ఇంకొంచెం దూరం తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఇమే చ విపులాః సాలాః సప్త శాఖావలమ్బినః ! యత్ర ఏకం ఘటతే వాలీ నిష్పత్రయితుమ్ ఓజసా !! ఇవిగో ఇవే ఏడు సాల వృక్షాలు వరుసగా ఉన్నాయి చూశావా..? ఇవి ఏడు, ఇవే ఉదయం సంధ్యావందనం చేసుకున్న తరువాత మా అన్నయ్య వచ్చీ దీన్ని కదిపేవాడు దీన్ని ఊపితేనే ఆకులన్నీ రాలిపోతాయి రామా! మా అన్నయ్య ఇంత బలవంతుడు ఇంత వేగమున్నవాడు నేను చెప్పవలసింది చెప్పాను నీకు నమ్మకం ఉందా వాలిని చంపగలననీ..? అని అడిగాడు. అంటే ఇంత చెప్పినా బలవంతుడ్ని అనుకుంటున్నావా..? నిజంగా అంతబలముందా..? అంటే రాముడు ఏమనలేదు లక్ష్మణుడు నవ్వాడు ఆయన అన్నాడూ తథా బృవాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణోబ్రవీత్ ! కస్మిన్ కర్మణి నిర్వృత్తే శ్రద్ధద్యా వాలినో వధం !! ఏమి నీకు అనుమానమా..? మా అన్నయ్య చంపగలడు వాలిని. వాలికి ఎంత వేగముందో అంత కన్నా వేగం ఉంది మా అన్నయ్య బాణానికి నీకు అనుమానమా..? నేను చెప్తున్నాను మా అన్నయ్య చంపగలడని అనుమానం ఉంటే ఏం చేస్తే నమ్ముతావు చెప్పూ... అన్నాడు, ఇప్పుడేమనాలి నిజంగా నమ్మకం ఉంటే లక్ష్మణుడు ఈ మాట అన్నతరువాత సరే రామా అయితే నేను యుద్ధానికి వెళ్తాను అనాలి.
కానీ ఆయన అలా అనలేదు సుగ్రీవుడు అన్నాడూ నీవు ఒక్కబాణంతో ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను ఒక్కబాణంతోనే కొట్టాలి ఒక్కసారే విడిచిపెట్టాలి ఆ బాణం ఒక సాల వృక్షాన్నికాని కొట్టగలిగితే నువ్వు మా అన్నయ్యను కొట్టగలవూ అని నేను నమ్ముతాను ఎందుకంటే ఒక సాల వృక్షాన్ని కదిపితే ఆకులు రాలాయి కాబట్టి రెండు ఈ దున్దుభి అస్తి పంజరముంది చూశావా దాన్ని మా అన్నయ్య ఎత్తి రెండు చేతులతో యోజనం దూరం విసిరాడు నీవు నీ కాలి బొటనవేలితో దీన్ని ఎత్తి రెండువందల ధనస్సుల దూరం విసురు చూస్తాను అంటే నాలుగువందల గజాలు విసిరితే నేను నమ్ముతాను అన్నాడు. అంటే సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి ఆయన ఖర్మాండి రామ చంద్ర మూర్తికి ప్రయోజనం సుగ్రీవుడిది పరీక్ష రామ చంద్ర మూర్తికి అంత బలం ఉందాలేదా ముందునాకు చూపించు అంటే డ్రౌవింగ్ లైసెన్సుకి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారిదగ్గర ఒక్కసారి స్కూటర్ నడిపినట్లూ సుగ్రీవుడి ముందు రామ చంద్ర మూర్తి తన విలువిద్యను ప్రదర్శిస్తున్నారు, ఎటువంటి మహానుభావుడు ఎటువంటి స్థితీ కాబట్టీ ఇప్పుడు ఆయన అన్నాడు సరే! నీకు నా బలం తెలియాలి అంతేకదా..! వెంటనే సుగ్రీవుడు అంటాడూ... అయ్యెయ్యో మీ బలం నాకు తెలియక కాదు దేవేంద్రుడు ఎంతటి బలవంతులో మీరు అంతటి బలవంతులు దేవేంద్రుడేమిటి మీరు మూడు లోకములను నిగ్రహిస్తారు అంతటి బలపరాక్రమములు ఉన్నవారు.
దశరథ మహారాజు గారి కొడుకు మహానుభావుడివి అస్రశస్రములు ఎరిగినవాడివి కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మా అన్నయ్య బలం నాకు ప్రత్యక్షంగా తెలుసు నీ బలం విన్నానంతే... నాకు ప్రత్యక్షంగా తెలియదు కిం తు తస్య బలజ్ఞః అహం దుర్భ్రాతుః బల శాలినః ! అప్రత్యక్షం తు మే వీర్యం సమరే తవ రాఘవ !! మా అన్నయ్య యుద్ధాలు చేయడం నేను చూశాను మా అన్నయ్య ఓడిపోవడం అన్నది నేను చూడలేదు వాలి ఎప్పుడు ఓడిపోలేదు జీవితంలో కాబట్టి వాలి ఓడిపోవడమన్నది నేను చూడలేదు ఫలానాదానికి ఓడిపోతాడని చెప్పడం చూడలేదు అంతవేగం అంత బలం నీకూ ఉందీ అని నేను విన్నాను కానీ నేను ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ప్రత్యక్షంగా చూస్తే... భయం, మీరు ఓసారి ఈ రెండు చేసి చూపిస్తే నమ్ముతాను పైకి నమ్మినట్టే ఉంటాడు కానీ ఓసారి ఈ కంటితో చూస్తేకాని నమ్మను అంటూంటాడు. సుగ్రీవున్ని అనక్కరలేదండీ మనందరం అలాగేకదూ... మీరు కాదు మీరు పెద్దలు నేను మిమ్మల్ని అనటంలేదు నాలాంటివాడు ఈశ్వరుడు ఉన్నాడూ అంటూంటాను కానీ ఏమో ఎందుకైనా మంచిది మనగొడవ మనం చూసుకుంటుంటే అని అంటూంటాం అంటే అప్పుడు నమ్మినట్టు ఉంటాం కానీ అవును ప్రహ్లదున్ని రక్షించాడు అవును రామ చంద్ర మూర్తి వానరులందరినీ రక్షించాడు అంటాం రామాయణమంతా చెప్తాం కానీ మన అపనమ్మకం మనదే.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
సుగ్రీవుడూ అంతే... కాబట్టీ ఇప్పుడు ఆయన నీకు నమ్మకం కలగడం కోసం నేను ఈ దున్దుభి కళేబరాన్ని ఎత్తి విసరాలి అంతేకదా..? అని యది న ప్రత్యయోస్మాసు విక్రమే తవ వానర ! ప్రత్యయం సమరే శ్లాఘ్యం అహం ఉత్పాదయామి తే !! రాఘవో దున్దుభేః కాయం పాదాగుష్ఠేన లీలయా ! తోలయిత్వా మహాబాహు శ్చిక్షేప దశ యోజనమ్ !! వాలి రెండు చేతులతో ఎత్తి గిరగిరాతిప్పి ఒక యోజనం విసిరినటువంటి దున్దుభి యొక్క కళేబరాన్ని రామ చంద్ర మూర్తి తన కాలి బొటనవేలితో పైకెత్తి శ్చిక్షేప దశ యోజనమ్ పది యోజనములు దూరం విసిరేశారు కాలి బొటనవేలితో నమ్ముతావా? అంటే ఆయన అన్నాడూ... అప్పుడు మా అన్నయ్య చంపినప్పుడు అది పచ్చిగా ఉంది మాంసంతో ఉంది నెత్తుటితో ఉంది బరువుగా ఉంది ఎత్తి యోజనం దూరం విసిరాడు ఇప్పుడు చాలా కాలమైపోయింది ఎండిపోయింది అస్తిపంజరమైపోయింది దాన్ని నీవు ఓ బొటనవేలితో విసిరావు పది యోజనాల దూరం, ఒక్క సాల వృక్షాన్ని కూడా కొట్టు ఒక బాణంతో కొడితే నమ్ముతాను అంటే ఇంకా ఇప్పటికి కూడా పూర్తిగా నమ్మకం కలగలేదు వెంటనే రాముడు
స గృహీత్వా ధను ర్ఘోరం శరమ్ ఏకం చ మానదః ! సాలన్ ఉద్దిశ్య చిక్షేప జ్యా స్వనైః పూరయన్ దిశః !!
స విసృష్టో బలవతా బాణః స్వర్ణ పరిష్కృతః ! భిత్త్వా సాలాన్ గిరి ప్రస్థే సప్త భూమిం వివేశ హ !!
ప్రవిష్ట శ్చ ముహూర్తేన రసాం భిత్త్వా మహా జవః ! నిష్పత్య చ పునః తూర్ణం స్వ తూణీం ప్రవివేశ హ !!
తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానర పుంగవః ! రామ స్య శర వేగేన విస్మయం పరమం గతః !!
నీకు నమ్మకం కల్పించడానికి ఒక ఒక సాల వృక్షం కొట్టాలి ఒక బాణంతో అంతేకదా అని ఒక ఘోరమైన బాణాన్ని తన అమ్ములపొదలోంచి తీసి వింటినారికి సంధించి ఆకర్నాంతము లాగి ఆ బాణాన్ని సాల వృక్షముల మీదకి ప్రయోగించాడు రాముడు అది ఒక ముహూర్తకాలంలో (చిటికలో) ఇలా అనేలోపలా ఏడు సాల వృక్షములను కొట్టి ఎదురుగుండా ఉన్న పర్వతముల యొక్క శిఖరములను కొట్టి పాతాళ లోకంలోకి వెళ్ళి పాతాళలోకంలో లోకాన్ని దర్శించి మళ్ళీ పైకొచ్చి రామ చంద్ర మూర్తి యొక్క అమ్ములపొదలోకి చేరిపోయింది ఒక ముహూర్తంలో ఇది చూశాడట చూసి ఒక్కసారి విస్మయం పరమం గతః అబ్బాహ్... ఇంతవేగమా..? రాముడి బాణానికి, మా అన్నయ్యదే వేగం అనుకున్నాను అమ్మో... ఇలా అనేటప్పటికి రామ బాణం ఏడు సాల వృక్షములను కొట్టి పర్వతాన్ని కొట్టి ఛేదించి భూమిలోకి పాతాళంలోకి వెళ్ళి పాతాళ వివరాన్ని చూసి మళ్ళీ పైకొచ్చి అక్షయ బాణతూణీరంలోకి వెళ్ళి వెళ్ళిపోయింది చేరిపోయిందటా.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు ఇక నిలబడలేదట ఇప్పటిదాకా... ఆయన్ని నిలబెట్టి తను కూర్చుంటాడు ఇప్పటిదాగా కొమ్మకొట్టీ ఆయన్నీ ఇలా కూర్చో అని తను కూర్చుని కూర్చోబెడుతాడు ఇప్పుడు చూశాడు రాముడు అంటే ఏమిటో ఇప్పుడేమి చేశాడట స మూర్ధ్నా న్యపత ద్భూమౌ ప్రలమ్బీ కృత భూషణః ! సుగ్రీవః పరమ ప్రీతో రాఘవాయ కృతాంజలిః !! ఇప్పుడూ ఆయన ముందు ఇలా ఒంగిపోయాడట ఒంగిపోయి రెండు చేతులతో అంజలిఘటిస్తే... ఆభరణములు వ్రేలాడే అన్నారు మహర్షి. ఎంత పెద్దమాటో చూడండి. ఇప్పుడూ నేను నా మెడలో ఉన్న రుద్రాక్ష హారం నా మెడలోనే నా గుండెల మీద ఇలాగే ఉందనుకోండి నేను బాగా ఒంగలేదూ అని గుర్తు, అదే నేను ఒకరియందు భక్తితో బాగవంగిపోయి నమస్కరించాననుకోండి ఇలా నా గుండెల మీద ఉన్న నా హారము ఏమౌతుంది ఇలా గాలిలోకి వచ్చి వ్రేలాడుతుంది. అంత ఒంగిపోయాను అంటే గుర్తేమిటీ, అవతలివారియందు అంత భక్తి చూపించాను అని గుర్తు. ఇన్నాళ్ళేమయ్యింది ఈ భక్తి అంటే ఇన్నాళ్ళు రామున్ని అలా చూడలేదు ఇప్పుడు రాముడు ఏమిటో తెలిసింది, తెలియగానే ఏం చేశాడంటే ఒంగిపోయాడు ఒంగిపోయి అన్నాడు ఇక వెళ్ళిపోదాం పదా..! పిలుస్తానువాన్ని అన్నాడు. ఇప్పుడు ఎంత నమ్మకం వచ్చేసిందో చూడండి కానీ దీని ఫలితం దీనికి ఉంటుంది ఇదీ మీరు కిష్కింధ కాండలో పట్టుకోవలసినటువంటి ఒక అద్భుత రహస్యం. రాముడు అన్నాడూ పదా... తప్పకుండా యుద్ధం చేస్తాను. నీవు పిలూ మీ అన్నయ్యని మీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే నేను వాలిని సంహరిస్తాను వెళ్ళాడు పెద్ద సింహనాదం చేశాడు ఎవడుర్రావాడు అన్నాడు నీ తమ్ముడే వచ్చాడు అన్నారు. వీడికెంత అహంకారం వచ్చిందిరా ఋష్యమూకం మీది నుంచి దిగి నా ముందుకు వస్తాడా యుద్ధానికి అని వాలి గబగబా బయలుదేరి వచ్చాడు.
ఇద్దరూ పెనుగులాడుతున్నారు ఇద్దరూ పిడికిటిపోట్లతో పొడుచుకుంటున్నారు కలియబడుతున్నారు గుద్దుకుంటున్నారు తన్నుకుంటున్నారు ఒకరిమీద ఒకరు కలియబడుతున్నారు నెత్తురు కక్కుతున్నారు ఇన్ని చేస్తుంటే రాముడు బాణం వేయ్యలేదు తతో రామో ధనుష్పాణిః తౌ ఉభౌ సముదీక్ష్యత ! అన్యోన్య సదృశౌ వీరౌ ఉభౌ దేవౌ ఇవ అశ్వినౌ !! అశ్వినీదేవతలు ఇద్దరూ ఒకేలా ఎలా ఉంటారో... వాలి సుగ్రీవులు ఇద్దరూ పూర్తిగా ఇద్దరు ఒక్కలా ఉన్నారు అంటే ఏమండీ దెబ్బలు కొడుతున్నవాడు వాలి తింటున్నవాడు సుగ్రీవుడు కాడా అంటే మల్లయుద్ధంలో అలా ఉండదు, ఇద్దరూ కొట్టుకుంటుంటారు ఇద్దరూ గుద్దుకుంటున్నారని మహర్షే చెప్పారు. కాబట్టి అంత మెరుపు వేగం కలిగినటువంటి బాణాన్ని రాముడు ఇతనే అనుకొని వేసేస్తే సుగ్రీవుడి మీద పడిపోతే..? ఇప్పుడు రాముడు పట్ల ఎంత అధర్మమైపోతుంది మిత్రఘాతకుడు అయిపోతాడు కాబట్టి తతో న కృతవాన్ బుద్ధిం మోక్తుమ్ అన్తకరం శరమ్ అది వేస్తే దెబ్బతగలడం కాదు అది చంపేస్తుంది మనిషిని కాబట్టి బాణాన్ని వేయలేదు ఆగిపోయాడు రాముడు. ఇప్పుడు తినవలసినన్ని దెబ్బలు తినేసి పారిపోయాడు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయి కూర్చున్నాడు తలవంచుకుని, మళ్ళీ రామ లక్ష్మణులు వీళ్ళు మంత్రులు వెళ్ళారు, వెళ్తే తలవంచుకుని కూర్చున్నవాడు రామునివంక చూశాడు రాముడు ఏమీ అనలేదు సుగ్రీవుడే అన్నాడు నా మానాన నేను ఉన్నాను అగ్నిసాక్షిగా మిత్రుత్వం చేసుకున్నావు సాల వృక్షాలు కొట్టావు మా అన్నయ్యని కొట్టేస్తానని యుద్ధానికి పిలవమన్నావు నీ మాట నమ్మి యుద్ధానికి వెళ్ళాను నన్ను చితకపొడిచేశాడూ నీవు బాణం వేయలేదు నేను వాలిని చంపనని ఒకమాట ముందు చెప్పితే ఏమైఉండేది ఎందుకు పంపావునన్ను అని అడిగాడు.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
అడిగితే ఆయన అన్నాడూ నిన్ను రక్షించడానికి వాలిని సంహరించడానికి నేను బాణప్రయోగం చెయ్యాలిగా... మీ ఇద్దరు ఒక్కలా ఉన్నారు నేను నిన్ను చూశాను కాని వాలిని చూడలేదు ఇతః పూర్వం నీవు వాలిని పిలిచినవెంటనే యుద్ధానికి వచ్చేశాడు ఇద్దరూ కలియబడిపోయారు, ఇద్దరూకలిబడిపోయి తరువాత ఎంత పరికించి చూసినా ఇద్దరూ ఒక్కలాగనే కనపడుతున్నారు ఎవరు వాలో ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. నిజం కూడా అంతేనండీ ఇద్దరూ అలానే ఉంటారు వాలి సుగ్రీవుడు, ఇద్దరూ అలా ఉన్నారు కాబట్టి ఎవరో తెలియలేదు పైగా మల్లయుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే... ధనుర్వేధంలో బాణప్రయోగం చేసుకునేటప్పుడు ఒకరి ముందు ఒకరు నిలబడి ఉంటారు, ఇటు పక్క ఒకరు నిల్చుంటే అటుపక్క ఒకరు నిల్చుంటారు ఆయన రథం నుంచి ఈయ్యనమీదికి బాణాలు వేస్తుంటారు ఏదో కొంత పరికించే అవకాశం ఉంటుంది మల్లయుద్దంలో అలా ఉండదు కిందపడుతుంటారు మీద పడుతుంటారు దొర్లుతుంటారు గుద్దుకుంటుంటారు కొట్టుకుంటుంటారు పొడుచుకుంటుంటారు కరుచుకుంటుంటారు అటుతిరుగుతుంటారు ఇటుతిరుగుతుంటారు ఎవడు ఎవడని తెలుస్తుంది తెలియకుండా ఇతనే వాలి అని వేసాక అది సుగ్రీవుడైతే..? అందుకు నేను వేయలేదు అన్నాడు ఆయనా.
అంగీకరించాడు సుగ్రీవుడు, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళు మీ అన్నయ్యదగ్గరికి అన్నాడు అయ్యబాబోయ్ అని భయంవేయదూ..! కాబట్టి నీవు బెంగపెట్టుకోకు, లక్ష్మణా! అదిగో ఆ పర్వత జరియలకిందా గజ పుష్పీమ్ ఇమాం ఫుల్లామ్ ఉత్పాట్య శుభ లక్షణామ్ ! కురు లక్ష్మణ కణ్ఠే అస్య సుగ్రీవ స్య మహాత్మనః !! అదిగో అక్కడే నాగ కేసరపు లత ఒకటి పుష్పించినటువంటిది పెరిగి ఉంది ఆ లతని పీకి పట్టుకురా లక్ష్మణా... పట్టుకొచ్చి పువ్వులతో ఉన్నటువంటి ఆ తీగను మెడలో మాలగా వేయ్యి సుగ్రీవుడికి, ఇప్పుడు ఈ గజ పుష్ప లత ఉన్నటువంటివాడు సుగ్రీవుడు అదిలేనివాడు వాలి నాకు గుర్తు తెలుస్తుంది ఇప్పుడు వాలిని సంహరిస్తాను. కాబట్టి ఇప్పుడు నీవు మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు పిలు మీ అన్నయ్యని యుద్ధానికి నీకేమీ ప్రమాదంరాదు అన్నాడు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి ఇది యదార్థమేనా రాముడు నిజంగా బాణం వేయకపోవడానికి కారణం అంతేనా అంతే.., మీరు అందులో ఏమాత్రమైనా సందేహాన్ని మనుసులో పెట్టుకుని మాట్లాడితే రాముడు కొమ్మవేశాడూ సుగ్రీవుడు కూర్చోబెట్లేదు లక్ష్మణున్ని కూర్చోబెట్లేదు మనసులో పెట్టుకుని బాణం వేయలేదండీ అన్నారనుకోండి రాముని యొక్క త్రికరణ శుద్ధిని మీరు శంకించినట్లు అవుతుంది. మరి రాముడు బాణం వెయ్యడానికి వీలులేనంతగా వాలి సుగ్రీవులు ఒక్కలా కనపడి రాముడు బాణం వెయ్యలేని స్థితి ఎందుకొచ్చింది... సుగ్రీవుడి పాపమే అలా చేసింది. ఏమిటా పాపం మహాత్ములపట్లా అమర్యాదతో ప్రవర్తించడం మహాత్ముల పట్ల మర్యాదతో ప్రవర్తించడం ఈ రెండు సత్య ఫలితాలను ఇస్తాయి. మీరు ఒక పాప కర్మ చేసి ఉన్నారనుకోండి మీరు అంటే మనం ఒక పాప కర్మ చేసి ఉన్నామనుకోండి అది ఎప్పుడో ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని కొన్ని అవి ఏం చేస్తాయంటే వెంటనే ఏం ఫలితాన్ని ఇవ్వవు ఇస్తాయి తరువాత ఎప్పుడో ఇస్తాయి. కొన్ని కొన్ని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తరువాత వరకు కూడా ఉంచడు కొన్ని కొన్ని చాలా భయంకరమైనటువంటివి ఉంటాయి అందులో అత్యంత ప్రమాదకరమైనటువంటి దోషం మహాత్ములజోలికి వెళ్ళడం.
ఈశ్వరున్ని బాగా గుండెలలో నమ్మి ఆరాధించేటటువంటివాడుకాని బాధపడేటట్టు మీరు ప్రవర్తిస్తే... ఆయన బాధపడ్డాడా పడలేదా పక్కకి వదిలేయ్యండి ఆయన పడకపోవచ్చు, ఆయన బాధపడకపోయినా ప్రవర్తించినందుకు మీరు ఫలితమును అనుభవించవలసింది. ఆయన బాధపడలేదు కదాండీ ఫలితం ఆయనేం బాధపడితే గదా నాకు ఫలితమిమ్మవాడానికి అది వేరు నీవు ప్రవర్తించావాలేదా ఈశ్వరుడు ఫలితమిచ్చేస్తాడు అంతే... నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ దేశంలో సనాతన ధర్మంలో కర్మమార్గాన్ని ముందు శంకరాచార్యులవారు జ్ఞానమార్గాన్ని నిలబెట్టడానికి వచ్చేటప్పటికి శంకరాచార్యులవారు అద్వైయిత స్థాపకుడు అంటారు అంతకన్నా తప్పుడుమాట

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
ఇంకోటిలేదు శంకరులు అద్వైత స్థాపకులు కారు ఎలా వచ్చేసిందో నాకు తెలియదు, ఆఖరికి ఆయన నామావళిలోకూడా అధ్వైత ʻస్థాపకాయనమఃʼ అని రాసేస్తుంటారు. ఆయన అద్వైత స్థాపకులేమిటీ అద్వైత స్థాపకులు శంకరాచార్యులైతే... అంతకు ముందులేనిదాన్ని ఆయన కొత్తగా తీసుకొచ్చి పెట్టినవాడు ఆ అవతారము వచ్చిందే వేదాన్ని ప్రచారం చేయడానికి అద్వైతము వేంతర్గతమైన సిద్ధాంతము వేందాంతర్గతము వేదమే అద్వైతము వేదసారమైన అద్వైతాన్ని ఆయన ప్రచారము చేశారు. అద్వైత ప్రచారకులే తప్పా అద్వైత స్థాపకులు శంకరులు కారు. అద్వైత స్థాపకులు అంటే అంతకుముందులేనిదీ ఇప్పుడు కొత్తగా తెచ్చినదీ అవుతుంది. ఆయన ఏదీ కొత్తగా పెట్టలేదు ఉన్నదాన్ని ఉన్నదాన్నిగా ఆయన ప్రచారం చేశారు అంతే.
Image result for కాలడి శంకరుడుఅప్పుడే శంకరాచార్యులవారు అవతారం గురించి మీకు అర్థమయ్యిందని గుర్తు ఒక లేకి ప్రశ్నఒకటి వేస్తుంటారు ఆయన జగత్ గురువులు ఎప్పుడయ్యారని జగత్ గురువులు అవ్వడం ఏమిటాయనా..? ఆయన పుట్టడం జగత్ గురువుగా పుట్టారు అసలు ఆయన జగత్ గురువు అవ్వడమన్నమాటలేదు ఆయన పుట్టడమే జగత్ గురుత్వంతో పుట్టాడు అంతే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా రావాలి అనుకున్నప్పుడు జగత్ గురువుగా వచ్చారాయన తప్పించి అందుకే అసలు ఆయన వస్తూనే సన్యాసాశ్రమం తీసుకోవడానికే సిద్ధపడి ఉన్నారు, వివాహం చేసుకోలేదు ఆతృత సన్యాసం స్వీకరించి లోకమంతా తిరిగారు నాకు భవతి భిక్షాందేహి అంటే చేతిలో ఏ తల్లి కబళం వేస్తుందో వాళ్ళందరూ నాతల్లులే అన్నారు ఆయనా... అమ్మా నేను నీ దగ్గర ఉంటే నీ ఒక్కతివే తల్లివి నేను దేశమంతా తిరిగితే నాకు ఆకలేసి ఏ ఇంటిముందుకెళ్ళి అన్నమడిగితే నా చేతిలో అన్నం పెట్టిన తల్లులందరూ నాకు తల్లులే కాబట్టి నేను సన్యాసం స్వీకరిస్తా అన్నారు. ఆయన ఎప్పుడో జగత్ గురువు పుట్టుకతోనే జగత్ గురువు, ఆయన ఒకప్పుడు జగత్ గురువు అవ్వడం జగత్ గురువు అవ్వకపూర్వం అలా ఏం ఉండవు శంకరాచార్యులవారి అవతారంలో అది తెలుసుకుని మాట్లాడాలి చెప్పేటప్పుడు. కాబట్టి ఇక్కడా... శంకరాచార్యులవారు జ్ఞానమార్గం ప్రచారంచేసి అద్వైత సిద్ధాంతం ప్రచారం ప్రారంభం చెయ్యడానికి ముందు... ముందు సనాతన ధర్మాన్ని పటిష్టం చెయ్యడం కోసం కర్మ మార్గాన్ని పటిష్టం చెయ్యడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమరీలభట్టూ అన్నరూపంలో వచ్చారు, వచ్చీ ఆయన బౌద్ధమతం ఈ దేశం నుంచి కదిలిపోయేటట్టుగా చేశారు. అసలు కుమారీల భట్టు ముందు కదిపినవారు కాబట్టి శంకరాచార్యులవారు బౌద్ధమతానికి వ్యతిరేకంగా ఉన్నారంటారు తప్పు అది, శంకరులని బౌద్ధం తట్టుకోలేకపోయింది కాబట్టి శంకరులు ఎప్పుడు ఎవ్వర్నీ వెళ్ళదోసే ప్రయత్నం చేయలే... ఏం ఎందులో మంచి ఉంటే దాన్ని ఆయన గ్రహించారు అంతే... శంకరుల గురించి మీకు సరిగా అర్థమైతే మీరు శంకరుల గురించి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి.
శంకరులు ఎప్పుడూ ఎవరినీ ఓడించి తరిమేయడం ఆయన యొక్క సిద్ధాంతం కానేకాదు ఆయన ఆశయమూ కాదు ఆయనా... ప్రతిదాంట్లోంచి సారమున్న ప్రతిదాన్నీ ఆయన తీసుకున్నారు ఆయన ఎంతవరకు పనికొస్తుందో అంతవరకు చూపించారు. ఏది అనుష్టాన యోగ్యము కాదో అది అందుకు పనికిరాదు అని చెప్పారు అంతే తప్పా నేను పట్టుకున్నదే సత్యము అని మిగిలినవన్నీ అసత్యాలని శంకరాచార్యులవారు  ఆసలు ఎప్పుడూ మాట్లాడలేదు అలా మాట్లాడితే అటువంటి సంకుచితత్వంతో ప్రవర్తిస్తే శంకర భగవత్ పాదులు శణ్ముఖస్థాపకులు కానేకాలేరు. కాబట్టి చాలా మందికి ఒక అపోహ శంకరాచార్యులవారు విభూతి రేకలు పెట్టుకుంటారు కాబట్టి ఆయన శైవుడు ఆయనా పరమ శివున్ని ప్రధాన దైవంగా ఆరాధించినవారు అనుకుంటారు. నేను మీకొక యదార్థం చెప్పనా... శంకరాచార్యులంత గొప్ప వైష్ణవుడు ఎక్కడా... శంకరాచార్యులవారు చాలా గొప్ప వైష్ణవుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసాండీ! శంకరాచార్యులవారి ఆరాధ్య దైవం కృష్ణ పరమాత్మ. మీరు ఇప్పటికి కాలడి వెల్తే కాలడిలో ఆయన ఆరాధించినటువంటి కృష్ణపరమాత్మ యొక్క స్వరూపాన్ని శృంగగిరి పీఠం వారే అక్కడ ఉంచారు సచ్చిదానందశివాభినవనరసింహభారతీ స్వామివారు కదాండీ! మహానుభావుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడ శంకరులు ఎక్కడ స్నానం చేశారో ఎక్కడ మొసలి ఆయన కాలు పట్టుకుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి శంకర భగవత్ పాదులు తన తల్లిగారిని సమాధి చేసినటువంటి ప్రదేశాన్ని కూడా గుర్తించి అక్కడ శంకరాచార్యులవారు పుట్టినటువంటి గదిని గుర్తించి ఆయన జ్ఞాన శక్తి చేత అక్కడ శంకరాచార్యులవారి గుడిని కట్టించి ఎక్కడ రోజూ ఆయన వెళ్ళి స్నానం చేసేవారో తల్లిగారు స్నానం చేసేవారో పూర్ణానదిని తీసుకొచ్చినప్పుడు కృష్ణాలయం అందులో మునిగిపోతుంటే కృష్ణుడు శంకరానేను ఇప్పుడు ఎక్కడుండాలని అని అంటే ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో అవన్నిటినీ పరిరక్షించారు శృంగగిరి పీఠంవారు.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
సచ్చిదానందశివాభినవనరసింహభారతీ స్వామివారు ఈ జాతికి అందించినటువంటి గొప్ప ఉపకారం అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించిన మహాపురుషులందరు ఏదో ఒక గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి ఈ దేశానికి అందించివెళ్ళారు అవతార పరిసమాప్తి చేసేలోపల శంకరాచార్యులవారి జీవితమంతా కూడా ఎక్కడ మంచి ఉంటే దాన్ని గ్రహించడం, అసలు ఆయన బ్రహ్మచర్యంలో ఉండగా... ఆయన నోటివెంట వచ్చిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం. విభూతి పెట్టుకోవడం అంటారా విభూతి పెట్టుకోవడం అన్నది వైదిక ప్రక్రియ వేదాంతర్గతము విభూతి ఎడమ చేతిలో వేసుకుని కుడిచేతితో మూసి చెప్పవలసిన మంత్రం చెప్పి స్నానమైన తరువాత వేస్తే సజల భస్మ స్నానం చెయ్యకపోతే పొడి భస్మం పెట్టుకోవాలని, ఆ సజలభస్మాన్ని కుడిచేత్తో మూసి మంత్రం చెప్తారు. నేను కాకినాడలో శివమహాపురాణం చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని బోర్డులమీద రాసి అందరికి ప్రచారం కూడా చేశాం కూడా... ప్రింటు వేసిచ్చి ఇలా పెట్టుకోండి విభూతిని అని, ఆ సజలభస్మని పెట్టుకుంటుంటాడు అది వేదోత్తం పురానోక్తము అది. అందుచేత శంకరాచార్యులవారు విభూతి పెట్టుకుంటే ఆయన శైవుడనికాదు దానర్థం ఆయనా చాలా గొప్ప వైష్ణవుడు. ఆయనా సౌరోపాసన గానాపత్యము శాక్తేయం వారు సౌందర్యలహరి చేశారు శంకర భగవత్ పాదులవంటి వ్యక్తి శంకర భగవత్ పాదుల వంటి అవతారం శంకరాచార్యుల తరువాత ఇప్పటివరకు రాలేదు న భూతో న భవిష్యతి అని నేను అనను ఎందుకో తెలుసా అలాంటి అవతారము మళ్ళీ రావాలని కోరుకోవాలి మనందరము కాబట్టి నభవిష్యతి అన్నమాట నేను అనను కాబట్టి అంతటి మహానుభావుడు శంకరాభగవత్ పాదులంటే.
సరే నేను, ఇప్పుడు ఎందుకు మీతో... నేను మనవి చేయవలసి వచ్చిందంటే- ఒకదాంట్లోంచి ఒకదాంట్లోంచి వెళ్ళడం జరిగింది, శంకరులకు ముందు సుబ్రహ్మణ్యేశ్వస్వామి వచ్చారు ఈలోకానికి నాన్నగారు వచ్చేలోపల ముందు కొడుకొచ్చారు. కర్మమార్గాన్ని నేను పరిపుష్టం చేస్తే జనం సనాతన ధర్మం వైపుకి తిరుగుతారు తిరిగిన తరువాత నాన్నగారు వచ్చి జ్ఞానమార్గాన్ని నిలబెడుతారని ఆయన కర్మమార్గాన్ని పరిపుష్టం చేశారు. చేసినప్పుడు ఆయనకి బౌద్దులతో ఒకవాదన జరిగింది అంటే బౌద్ధుల రహస్యాలు తెలుసుకున్నారు శఠబుద్ధితో ఒకప్పుడు అలా తెలుసుకుంటే తప్పా ఖండించడం కుదరదని, తదనంతర కాలంలో ఆయన బౌద్ధుడు కాడూ అని తెలిసి సంహరించే ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేశారంటే ఆయన ఒక భవనం యొక్క పై అంతస్తులోంచి కిందకి ధూకేస్తూ “వేదమే ప్రమాణమైతే నాకు దెబ్బ తగలకుండుగాకా” అని దూకేశారు పైనుంచి. దూకేస్తే కుమారిలబట్టు కిందపడిపోయాడు కిందపడిపోతే ఆయనకు ఏమీ అవ్వలేదు కానీ ఒక్క కన్ను మాత్రం దెబ్బతింది ఆయన వెంటనే వేదమాత గాయిత్రీని ప్రశ్నించాడు నేను వేదాన్ని నమ్మాను నేను ప్రమాణమైతే అని చెప్పి

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
దూకితే... నాకు ఏమీ అవ్వలేదు కానీ నా కన్ను ఎందుకు దెబ్బతిందని అడిగాడు, వెంటనే అశరీరవాణిగా వేదం అందీ “వేదమే ప్రమాణము కనుక నాకు దెబ్బతగలకూడదని నీవు అని ఉండి ఉంటే” నీకు దెబ్బ తగిలి ఉండేది కాదు. వేదమే ప్రమాణమైతే అంటే చిన్న అనుమానం ఉంది నీలో కాబట్టి కన్ను దెబ్బతింది అంది.
Image result for వాలి సుగ్రీవసంశయం ఒకటి చిన్నది పెట్టుకున్నావు కాబట్టి ఆపాటి దెబ్బ నీవు తినవలసి ఉంటింది ఎందుకంటే మహాత్ములపట్లా దేవతా స్వరూపాలపట్లా ఆస్తిక్యబుద్ధీ అంటే చేసేటప్పుడు నమ్మి చెయ్యాలి తప్పా ఉందో లేదో అన్న అనుమానంతో చెయ్యకూడదు. సుగ్రీవుడు రాముడు చేస్తాను అంటున్నాడు కానీ పరీక్షలు పెడుతున్నాడు దీని ఫలితం ఎక్కడికి పోతుంది కాబట్టి ఇప్పుడు రామ చంద్ర మూర్తి మీదకు తోయకండి రామునికి తెలిసీ రాముడు కావాలని బాణాలు వేయలేదూ ఓ కొమ్మమీద ఇతన్ని కూర్చెబెట్టాడనీ లక్ష్మణునికి కొమ్మవేయలేదనీ అందుకనీ రాముడు బాణం వేయకుండా బాగ దెబ్బలు తినన్నాక వెనక్కి తీసుకొచ్చి బుద్దొచ్చిందా అని చెప్పేసి దండేశాడనుకోకండి అంటే అప్పుడు తప్పు. అప్పుడు వాలినే చంపడు అప్పుడు మీరు రాముని యొక్క శీలాన్ని అవమానించినట్లు అవుతుంది మీకు. రాముడు అలా ఉండడు ఆయన త్రికరణ శుద్ది. రామో ద్విర్నాభి భాషతే అమ్మా నాకు రెండు మాటలు మాట్లాడటం చేతకాదమ్మా... అన్నాడు ఆయన కాబట్టి చంపుతాను అని మాట ఇచ్చినటువంటి రాముడు చంపకుండా ఉండి మీ ఇద్దరూ ఓలా ఉన్నారు అని రాముడు చెప్తే రాముడు అబద్ధమాడినట్లు అవుతుంది. అప్పుడు మీరు రామాయణాన్ని సరిగ్గా పరిశీలనం చెయ్యలేదు రామాయణం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చెయ్యలేదు అని గుర్తు. సుగ్రీవుడు రామున్ని నమ్మాడు కానీ... కానీ but ʻbut is bit of poisonʼ కానీ అనేటప్పటికి ఓ చిన్న అనుమానం ఉంది. అనుమానం ఉండి ఆయన యందు నమ్మకం కలగడానికి ఆయనకే పరీక్షలు పెట్టి క్లేశాన్ని కల్పించినందుకు మహాత్ముడైన రాముడు ఇబ్బంది పడ్డాడా...
ఈశ్వరునికి అనవసరం రాముడు ఈశ్వరుడని మాట్లాడకండి ఇప్పుడు రాముడు ఈశ్వరుడని మాట్లాడేశారనుకోండి ఇప్పుడు మీరు మళ్ళీ కథ ఇంకొక కొత్తపుంత తొక్కేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పటివరకు నరుడనేగా మనం మాట్లాడుకుంటున్నాం, అయితే అలాగే మాట్లాడుకుందాం కాబట్టి నరుడిగా అలాయితే వెంటనే శంఖుచక్రాలూ గదాపద్మం చూపించేసేసి నీ మొఖం ఏడ్చా... నేను విష్ణువునిరా! అని చెప్పొచ్చు అలా చెప్పలేదుగా... అస్తిపంజరాన్ని ఎత్తి అవతల పారేయమంటే ఎత్తి అవతల పారేశాడు నరుడిగానే చూపిస్తున్నాడు తనకీ ఉపకారం కావాలన్నట్లు చూపిస్తున్నాడు ఆయనా... సీతమ్మను నీవు వెతికిపెట్టాలి అన్నట్లు, కాబట్టి ఇప్పుడు మీరు మహాత్ముడి జోలికివెళ్లాడూ అని మీరు చెప్పవలసి ఉంటుంది. ధర్మాన్ని అనుష్టించేటటువంటివాడూ సత్యాన్ని పట్టుకున్నవాడూ మిత్ర ధర్మానికి కట్టుబడ్డవాడూ శక్తి ఉండి ప్రతిజ్ఞచేసినటువంటివాడైనా... అలా కుదరదయ్యా నీవు చేసినా నేను నమ్మను నీవు ఇవి చేస్తేనే నేను నమ్ముతాను అనేసుంటే కథ ఇంకోలా ఉండేది. నీవు ఇంద్రుడంతటివాడివి ఇంద్రున్ని గెలుస్తావు కానీ అంటూ ఉండడం మాట ఒకలా లోపల ఒకలా సుగ్రీవుడికుంది. కాబట్టి ఇప్పుడు రాముడు బాధపడ్డాడాలేదా పక్కనుంచండి, కుమారిలబట్టు అనే అంతటివారూ సాక్ష్యాత్ సుబ్రహ్మణ్య అవతారమైనాకూడా... అనుమానం వ్యక్తం చేసినందుకు దెబ్బతిన్నారే..? మరి అది సుగ్రీవుడికి మాత్రం ఎందుకు వర్తించదని మీరు అనుకుంటున్నారు అంతపెద్ద రక్షణ ఉంటుంది.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
కానీ ఆ రక్షణ పొందడానికిముందు చేసినపాపం కడిగేసుకోవాలి ఇది పోవాలి, ఇది కడగడానికి ఈశ్వరుడు రామునికి ఇద్దరు ఒక్కలా ఉండి బాణం వెయ్యలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమౌతుంది కాసేపు బాణం వెయ్యకుండా ఉండడమే మంచిదన్న బుద్ధిని ప్రచోదనం చేశాడు. అప్పుడు మీరు రామాయణాన్ని రామాయణంగా అర్థం చేసుకున్నట్లు అవుతుంది. Image result for vali sugrivaఇప్పుడు రాముడిదోషం ఏముందీ ఆయన అదే చెప్పాడు మీ ఇద్దరూ అశ్వణీ దేవతల్లా ఉన్నారు, సరే  ఒక్కబాణం వేసేద్దాం ఏమైతే అయ్యిందీ అని వేసేయడానికి అది మామూలుబాణం కాదు ప్రాణాలు ఉగ్గడించేస్తుంది నీవు చచ్చిపోతే ఇక నా జీవితం వ్యర్థం ఎందుకంటే నేను ధర్మం తప్పలేదు అన్నాడు ఆయనా. నేను ఎప్పుడూ ధర్మం తప్పలేదు అన్నాడాయన, మిత్రున్ని చంపేసి మాట ఇచ్చి కాపాడుతాననీ... అని నేను అగ్నిసాక్షిగా నేను నీతో స్నేహం చేసి ఎవరెవరో గుర్తుపట్టలేక పోతున్నాను అని తెలిసికూడా బాణం వేసేయనా... వాలి చచ్చిపోతే ఫరవాలేదు రెండో కోణం కూడా ఉంటుంది అప్పుడు తెలియకుండా వేసినప్పుడు నీమీద పడుంటే ఎలా వేయమంటావు అందుకు వేయలేదు అన్నాడు ఇప్పుడు ఎక్కడ రాముడి దోషం ఉంది నాకు చెప్పండీ, ఎందుకు రాముడి మీదకి పెట్టి చూస్తారు మీరు ఇంకొకలా చూడండి.
కిష్కింధ కాండదగ్గరికి వచ్చేటప్పటికి మీకు వస్తున్న ఇబ్బంది ఏమిటంటే... కిష్కింధ కాండలో రామున్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నంలేకా రాముని యందు దోషం ఆరోపించి చెట్టుచాటునుంచి కొట్టాడూ వాలితో ఇలా అన్నాడూ బాణం వేయకుండా వచ్చేశాడూ సుగ్రీవుడు రెండుమాట్లు దెబ్బలు తిన్నాడూ ఇవన్నీ ఏవో తెలివితక్కువమాట్లంటాం మనం కానీ సక్రమంగా మీరు అర్థం చేసుకుంటే రామ చంద్ర మూర్తి యొక్క శీల వైభవం మీకు అర్థమౌతుంది. మీకు ఒక యదార్థం చెప్పనా మీరు ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అర్థం అవడం కూడా రామానుగ్రహంగానే అర్థమౌతుంది. ఆ రామానుగ్రహంతో అర్థమై మీకు మనసులో ఆనందించగానే రామా! ఎంత ధర్మాత్ముడవు అని ఆలోచించగానే నీయందు ఒక మార్పువస్తుంది ఏమిటో తెలుసాండి మీరు మహాత్ముల జోలికివెళ్ళరు, తప్పూ వాళ్ళజోలికి మనం వెళ్ళకూడదు అన్న నిశ్చయాత్మకబుద్ధితో ఉంటారు కాబట్టి మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సరికదా... మహాత్ములయందు అలా ప్రవర్తించకపోవడం మీకు సత్యఫలితాన్ని ఇస్తుంది ఈ సత్యఫలితం విజయాన్ని మీకు ఇస్తుంది. అది మీకు వెంటనే చూపిస్తారు మహర్షి ఎంత గమ్మత్తుగా ఉంటుందో అందుకే రామాయణం.
కాబట్టి ఇప్పుడు చూడండీ... మెడలో పుష్పమాల వేసి గజ పుష్పీమ్ ఇమాం ఫుల్లామ్ ఉత్పాట్య శుభ లక్షణామ్ ! కురు లక్ష్మణ కణ్ఠే అస్య సుగ్రీవ స్య మహాత్మనః !! ఇప్పుడు ఆ పాపము కడగబడినటువంటి మహాత్ముడు కాబట్టి ఈ గజపుష్పమాలతో నీవు యుద్ధానికి వెళ్ళు అంటే ఆయన మళ్ళీ బయలుదేరాడూ... బయలుదేరి నడుస్తున్నారు అగ్రత స్తు యయౌ తస్య రాఘవ స్య మహాత్మనః ! సుగ్రీవః సంహత గ్రీవో లక్ష్మణ శ్చ మహా బలః !! పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీల శ్చ వానరః ! తార శ్చైవ మహా తేజా హరి యూథప యూథపాః !! ముందు లక్ష్మణుడు సుగ్రీవుడు నడుస్తున్నారు వారివెనక రాముడు నడుస్తున్నాడు రాముని వెనక హనుమ తారుడు ఆ తరువాత నలుడు నీలుడు వీళ్ళు ఆయనవెనక నడుస్తున్నారు అందరూ కలిసి వెడుతున్నారు. ఆకాశమంత ఎత్తు పెరిగినయినటువంటి చెట్లూ లతలు అవన్నీ కనపడి ఏదో పెద్ద నృత్యాలు పాటలూ అవి వినపడుతున్నట్లు మధుర మధురమైనటువంటి ఫలములతో పుష్పములతో నిండిపోయి ఉన్నాయి కానీ ఆ వనంలోకి ఒక పక్షికూడా వెళ్ళకుండా కనపడింది రామునికి ఆశ్చర్యమేసింది. ఇన్ని ఫలములు ఇన్ని పుష్పములు ఇన్ని చెట్లు ఉంటే ఒక పక్షైనా ఉండాలి కదా ఏదీ లేదేమిటీ ఆశ్చర్యపోయి ఆయన సుగ్రీవున్ని అడిగాడు, ఏమిటి ఇలా ఉంది ఈ వనం రాముడు చాలా గొప్పగా అడుగుతాడండీ ఒక ప్రశ్నవేయడం అంటే ఆయంది అలా ఉంటుంది. ఇన్ని చెట్లు ఉంటే పక్షులు ఉండాలి చెట్లున్నాయి పళ్ళున్నాయి తేనపట్లున్నాయి పువ్వులున్నాయి పక్షిలేదు మృగాలులేవు మనిషిలేడు ఎందుకులేదు అలాగా..? ఏమిటి దీని విశేషం సుగ్రీవా నీకేమైనా తెలుసా కిష్కింధని పరిపాలించావుగా కొంతకాలం చెప్పూ అన్నాడు.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
అంటే ఆయన అన్నాడూ అత్ర సప్త జనా నామ మునయః సంశిత వ్రతాః ! సప్త ఏవ ఆసన్ అధశ్శీర్షా నియతం జల శాయినః !! ఇక్కడా సప్తజనులూ అనపడేటటువంటి మునులుండేవారు ఏడుగురు, వారూ చెట్టుకొమ్మలకి కాళ్ళు పైకిపెట్టి తల కిందపెట్టి తపస్సు చేసేవారు. వాళ్ళు ఏడురోజులకు ఒక్కసారి బయటికి వచ్చి వాయువును భక్షించేవారు, వాళ్ళు నీటిలో పడుకునేవారు అంత ఘోరమైనటువంటి తపస్సు చేశారు సప్త రాత్ర కృత ఆహారా వాయునా వన వాసినః ! దివం వర్ష శతైః యాతాః సప్తభిః సకలే వరాః !! ఏడువందల సంవత్సరములు అలా తపస్సు చేశారు, తపస్సు చేశాక వాళ్ళు సశరీరంగా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇప్పటికీ అప్సరసలతో కలిసి ఈ వనంలోకి వచ్చి క్రీడిస్తుంటారు అప్పుడు ఇక్కడ గొప్ప గొప్ప నాట్యములు కాలి అందెల రవళులు సంగీత ధ్వనులు వినపడుతుంటాయి, ఆ మహాత్ములు సంచరించిన ప్రాంతం కనుక ఇందులోకి పక్షులు మృగములు ఏవీకూడా ఆఖరికి ఇందులోకి ఇంద్రాది దేవతలుకూడా... ప్రవేశించలేరు, ఒకవేళ ఎవరైనా అంత తపః శక్తి కలిగినటువంటివారు ఆ ప్రాంతంలోకి వెడితే అంత తేజోవంతమైన భూమి మీదకు అడుగు పెడితే ఆ తేజస్సును తట్టుకోలేవు కాబట్టి ఇవతలి ప్రాణులు వెంటనే చనిపోతాయి. కాబట్టి రామా! పక్షులు కానీ మృగములు కానీ ఏవీ ఆవనంలోకి వెళ్ళవు అంతగొప్పది రామా! ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను అని కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ ! లక్ష్మణేన సహ భ్రాత్రా ప్రయతః సంయతాంజలిః !! రామా! ఒక్కసారి ఇక్కడ ఆగి ఆవనం వంక తిరిగి లక్ష్మణ సహితుడవై ఒక్క నమస్కారం చెయ్యి, ఎందుకు చెయ్యాలి ప్రణమన్తి హి యే తేషామ్ ఋషీణాం భావితాత్మనామ్ ! న తేషామ్ అశుభం కించిత్ శరీరే రామ దృశ్యతే !! ఈ సప్త జనులు అనబడేటటువంటివాళ్ళు తపస్సు చేసినటువంటి వనం వంక తిరిగి ఎవరు నమస్కారం చేస్తారో... వాళ్ళకి రోగాలు రావు వాళ్ళు అనుగ్రహిస్తారు పైగా వారికి ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది.
ఎవరు చెప్తున్నారు ఈ మాట సుగ్రీవుడు చెప్తున్నాడు అంటే... ఒక కార్యంమీద వెళ్ళేటప్పుడు మహాత్ములు ఉండివెళ్ళిన భూమినికి నమస్కారం చేసినాసరే వాళ్ళను తలుచుకుంటే విజయం కలుగుతుంది శరీరానికి అనారోగ్యం కూడా రాదూ, మహాత్ములకు నమస్కారం చేస్తే ఈ సత్యఫలితం ఉంటే... మహాత్ముల పట్ల ఇంకొకలా ప్రవర్తిస్తే దానికి కూడా ఫలితం ఉంటుందా ఉండదా సత్యం ఫలితం? వెనకదాఫలితం ఇప్పుడు ఈ ఫలితం అంటే వాలి మరణిస్తాడని గుర్తు సుగ్రీవుడి మనోరథం ఈడేరుతుందని గుర్తు. మీరు అందుకే కిష్కింధ కాండ చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది కిష్కింధ కాండా ధర్మ సూక్ష్మములతో ఉంటుంది ఎక్కడికక్కడ మహర్షి మనకు ఈ విషయాలను చెప్తుంటారు. అందుకే మహాత్ములైనటువంటివారు కనపడ్డప్పుడు మీరు ఒక్క నమస్కారం చేసి పరమ గౌరవంతో నిలబడితే చాలు మీకు ఈశ్వరానుగ్రహం వస్తుంది. మహాత్ముల పట్ల మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు వ్యతిరేక ఫలితం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక్క నమస్కారం చెయ్యి అంటే తతో రామః సహ భ్రాత్రా లక్ష్మణేన కృతాంజలిః ! నమస్కారం చేసి అభివాద్య తు ధర్మాత్మా రామో భ్రాతా చ లక్ష్మణః ! సుగ్రీవో వానరా శ్చైవ జగ్ముః సంహృష్ట మానసాః !! సంతోషంగా వాళ్ళందరూ కలిసి ఆ కిష్కింధా నగరంవైపుకు వెళ్ళారు, వెళ్ళిన తరువాత సుగ్రీవుడు ఒక మహానాదం ఒకటి చేశాడు. ఆ మహానాదానికి అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ కూడా తోకలెత్తి పారిపోయాయి ఆకాశంలోను చెట్లమీద ఉన్నటువంటి పక్షులన్నీ గుండెలు బద్ధలై నేలమీద పడి మరణించాయి, అంతపెద్ద మహానాదం చేశాడు.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
అప్పుడే సుగ్రీవున్ని తరిమేశానూ అన్న ఆనందంతో అంతఃపురంలోకి వెళ్ళి తారతో క్రీడిస్తూ మధుపానా సక్తుడై ఉన్నాడు వాలి శ్రుత్వా తు తస్య నినదం సర్వ భూత ప్రకమ్పనమ్ ! మద శ్చైక పదే నష్టః క్రోధ శ్చ ఆపతితో మహాన్ !! వేంటనే ఇప్పుడు ఇప్పుడిప్పుడే వీడ్ని నేను ఇంత యుద్ధం చేసి నెత్తురు కారేటట్టు కొట్టి తరిమేశాను మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడా యుద్ధానికి అని విపరీతమైన క్రోధంవచ్చి లేచినిలబడ్డాడు వాలి స తు రోష పరీతాంగో వాలీ సంధ్యాఽఽతప ప్రభః ! ఉపరక్త ఇవ ఆదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః !! గ్రహణంనాడు ఎలా సూర్యుడు కాంతిని కోల్పోతాడో నిలబడిన వాలి కోల్పోబడుతున్నటువంటి కాంతి కనపడింది లేదా కాంతి క్షీణించిన వాలిగా నిలబడ్డాడు అంటే మృత్యువు ఆసన్నమౌతుందీ అని గుర్తు, ఆయన గబగబా అడుగులు వేసి బయటికి వెడుతున్నాడు తారా ఆయన భార్య, శ్రీరామాయణంలో తార ఒక మెరుపు అద్భుతం అసలు కిష్కింధ కాండలో తార పాత్రా అనుపమానము అలా మాట్లాడుతుంది రెండు పర్యాయాలు మాట్లాడుతుంది కిష్కింధ కాండలో రెండుసార్లూ అంతే, మీరు చెవులొగ్గి వినాలి అంతే తార మాట్లాడుతుంటే అలా మాట్లాడుతుంది, బృహస్పతి యొక్క కుమారుడు తారుడు తారునియొక్క కూతురు తార.
అందుకనీ తాతగారి తెలివితెటలన్నీ వచ్చాయి ఆవిడకి మీకు శ్రీరామాయణంలో ఇంకో గమ్మత్తుంది రామాయణంలో కొన్ని జంటలు కనపడుతాయి మీకు దశరథుడు-ముగ్గురు భార్యలు, సీతా-రాములు, అహల్యా-గౌతములు, తారా-వాలి, రావణుడు-మండోధరి ఇలా ఒక్కొక్క జంటలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దశరథుడు కౌసల్యా సుమిత్రా కైకేయీ... కౌసల్య యందు ఉదాసీనుడు అసలు పట్టించుకోడు సుమిత్రయందు తతస్థుడు పట్టించుకున్నాడో పట్టించుకోలేదో విన్నాడో వినలేదో తెలియదు కైకయందు ప్రేమాస్పదుడు కొంప ముంచేసింది. అహల్యా గౌతములు చెయ్యరానంత అపరాదము చేసింది అయినా తన భార్యని ఉద్ధరించుకుని పక్కకి తెచ్చుకోవడమే తప్పా భార్యని విడిచిపెట్టడమన్నది సనాతన ధర్మంలో లేదని నిరూపించినవాడు గౌతముడు, తారా వాలి తార ఏది చెప్పినా వింటాడు నోర్ముయ్ అని ఎప్పుడు అనడు చక్కగా వింటాడు తను చేసేదే చేస్తాడు తప్పా తార చెప్పిన మాట పాటించడు వాలి. రావణుడు మండోధరి అసలు భార్యగా చూసినట్లుగా కూడా మీకు కనపడదు. అంత మహా పతివ్రత మహర్షి స్పష్టంగా చెప్పారు రామాయణంలో సీతమ్మ ఎంత సౌంధర్యవతో మండోధరి అంతే సౌంధర్యవతి నాయందు కనపడని ఏ అందం సీతమ్మయందు కనపడిందిరా నీకు మృత్యువుకోసం వెళ్ళావుతప్పా... అంది మండోధరి కాబట్టి రావణాసురుడు అనబడేటటువంటివాడు ఎంతగొప్పదైనా మండోధరిని అసలు ఎప్పుడూ భార్యాస్థానంలో ఇవ్వవలసిన కనీస గౌరవం కూడా ఇవ్వనివాడు కాబట్టి ఆవిడ చెప్పడం ఈయన వినడం అన్నది అసలు ఉండనే ఉండదు ఆ దాంపత్యం అలాంటిది అయినా ఆవిడా ఆయన్ను అనుగమిస్తునే ఉంటుంది మహా పతివ్రత.
సీతా రాములు దాంపత్యమంటే వీళ్ళిద్దరిదే రామాయణంలో ఎందుకో తెలుసాండీ! రాముడు ఏదైనా సీతమ్మతో మాట్లాడుతాడు సీతమ్మ ఏదైనా రామునితో మాట్లాడుతుంది సీతమ్మ చెప్పినదాంట్లోది నేను తీసుకోవలసి ఉందీ అని అనుకుంటే రాముడు ఆవిడ చెప్తేనే నేను వినడమేమి అనుకోడు చాలా మంచిమాట చెప్పావోయ్ అలాగే చేద్దాం అంటాడు. ఒకవేళ సీతమ్మ చెప్పింది చెయ్యకూడదూ అనుకుంటే ఇది ఒక్కనాటికీ చేసేవిషయం కాదూ నేను ఎవరో నీకు బాగా తెలుసు అయినా నీవు ప్రేమతో చెప్పావు నీవు కాకపోతే ఎవరు చెప్తారు ఫలానా కారణానికి ఇది చెయ్యడం కుదరదూ అని వివరిస్తాడు. రాముడు ఏదైనా సీమ్మకి చెప్తే... రాముడు చెప్పిందే సీతమ్మ చేస్తుంది, కానీ రాముడు ఇది చేస్తే బాగుంటుందీ అనుకుంటే ఆయనకి నేను చెప్పడం బాగుంటుందా అని ఊరుకోదు చెప్పితీరుతుంది. ఇదీ సీతారాములది ఇద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం దశరథ మహారాజు జనకుడు కుదిర్చిన వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం ఏదో అది రామాయణంలో టోటల్ సక్సెస్ వాళ్ళిద్దరూ అంత ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు కాబట్టి మనం బతికితే సీతారాముల్లా బ్రతకాలి దాంపత్యంలో భార్యా భర్త ఎలా బ్రతకాలన్నది రామాయణంలో మీరు శ్రీరామాయణము దాంపత్యము అని మీరు చదివారనుకోండి, నేను మీతో అన్నానుగా రామాయణాన్ని ఒక్కసారి చదవకండీ రామాయణాన్ని అనేక కళ్ళజోళ్ళు పెట్టుకుని చదవండి అంటుంటాను. అనేక కళ్ళజోళ్ళు అంటే నా ఉద్దేశ్యం రామాయణం ధర్మ శాస్త్రం రామాయణం జోతిష్య శాస్త్రం రామాయణం శకున శాస్త్రం రామాయణం పరిపాలనా శాస్త్రం రామాయణం బంధుప్రీతి రామాయణం ధర్మ శాస్త్రం రామాయణం ఇదిగో తాంపత్య జీవనము ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా రామాయణం చూడచ్చు వెంటనే మీకు రామాయణంలోంచి వచ్చేస్తుందంతే సారం మీరు ఎలా ఉండాలో రామాయణం చెప్పేస్తుంది.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
అందుకే రామాయణం వేదోప బృంహణము అందుకే రామాయణం చెప్పంది లోకంలో ఏదీ ఉండదు అంతే... అన్నీ చెప్తుంది రామాయణం కానీ రామాయణాన్ని మీరు చెప్పాలి రామాయణాన్నే మీరు చదవాలి రామాయణాలు చెప్పకూడదు వాల్మీకి రామాయణాన్నే చదువుకోండి అంటే మిగిలినవి చదవద్దనికాదు చదివి సంతోషించండి, వాల్మీకి మహర్షికి పత్యక్ష్యంగా ఆచమనం చేస్తే ఏది కనపడి సత్యమై రచింపబడిందో అది వాల్మీకి రామాణం అవుతుంది మీగిలినవి అనుభవింపబడి రాయబడినటువంటి రామాయణాలు. కాబట్టి లోకంలో అందుకే ఒకమాటొచ్చింది ఆ... ఏదో రామాయణం చెప్పాడులేరా అంటారు అంటే ఏది చెప్పినా రామాయణంలోంచి చెప్పడం తప్పా ఇంకోదగ్గర్నుంచి ఉండదు. కాబట్టీ ఇప్పుడు ఆ తార వెడుతున్నటువంటి ఆ వాలిని ఆపి అంది వాలీ దంష్ట్రా కరాళ స్తు క్రోధాత్ దీప్త అగ్నిసన్నిభః ! భాతి ఉత్పతిత పద్మాభః సమృణాళ ఇవ హ్రదః !! ఆ వెడుతున్నటువంటి వాలిని ఆపి తార అంటూంది నీవు తొందరపడి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏ సుగ్రీవున్ని పిడికిటి పోట్లు పొడిచి నెత్తురు కారేటట్టుకొట్టావో..? ఆ సుగ్రీవుడి మీదకి మళ్ళీ నీవు యుద్ధానికి వెడుతున్నావు కానీ సాధు క్రోధమ్ ఇమం వీర నదీ వేగమ్ ఇవ ఆగతమ్ ! శయనాత్ ఉత్థితః కాల్యం త్యజ భూక్తామ్ ఇవ స్రజమ్ !! ఒక పురుషుడు రాత్రిపడుకోబోయే ముందు రాత్రి నిద్రలోకి వెళ్ళడానికిముందు మెడలో ఒక పుష్పహారం వేసుకుని పడుకుంటాడు అంటే అదేంటండీ అలా కూడా వేసుకుంటారా..? అంటే అలా వేసుకుంటారు అదో అందానికి... ఇప్పుడు మనమైతే అంతంత డబ్బులు అంతంత పూలదండలు అవన్నీ ఏమి అని అదోలా చూస్తారు ఇప్పుడైతే కానీ అలా వేసుకుని పడుకునేవారు పూర్వం కాబట్టి పూలహారం వేసుకుని నిద్రించినటువంటి పురుషుడు మరునాడు నిద్రలేవగానే నదికిపోయిన తరువాత ఎలా పుష్పమాలను తీసి బయటికి వేస్తాడో అలా నీలోజనించినటువంటి కోపాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేసై.
Image result for రాముడు సుగ్రీవుడు వాలినదీ ప్రవాహంలా వస్తూంది నీకు కోపం ముచ్చెత్తుతుంది నిన్ను ఆ ముంచెత్తుతున్న ప్రవాహాన్ని ʻపురుషుడు దండవేసుకుని రాత్రి పడుకున్నవాడు ఉదయం విడిచిపెట్టినట్టుʼ ఆ క్రోధాన్ని నీవు విడిచిపెట్టు నేను చెప్పినమాట విను సహసా తవ నిష్క్రామో మమ తావన్ న రోచతే ! శ్రూయతామ్ చ అభిధాస్యామి య న్నిమిత్తం నివార్యసే !! ఇప్పుడొద్దు యుద్ధానికి వెడుదువుకాని యుద్ధానికి నీవు వెళ్ళద్దూ యుద్ధం చెయ్యొద్దు ఇంట్లోనే ఉండు నీవు వెన్ను చూపించూ అని నేను అనను కానీ నీ తమ్ముడు వచ్చి ఇప్పుడు మళ్ళీ సింహనాదం చేస్తున్నాడు కానీ వెళ్ళవద్దు ఇప్పుడు యుద్ధానికి ఎందుకు వెళ్ళవద్దంటున్నానో నీవు విను జాగ్రత్తగా తప్పా క్రోధంతో గబగబా తొందరపడి వెళ్ళిపోవద్దు త్వయా తస్య నిరస్త స్య పీడిత స్య విశేషతః ! ఇహ ఏత్య పునః ఆహ్వానం శంకాం జనయతీవ మే !! ఇప్పుడిప్పుడు నీవు పిడిగుద్దులు గుద్దావు నెత్తురు నవరంధ్రములలోంచి కారిపోతూ ఏడుస్తూ ఋష్యమూక పర్వతంమీదకి పారిపోయాడు ప్రాణాలకోసం, వెళ్ళి కొంచెంసేపు అవ్వలేదు నీవు ఇంట్లోకొచ్చావు మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు ఇతః పూర్వం ఎప్పుడు ఇలా చేయలేదు సుగ్రీవుడు ఏ ధైర్యంతో మళ్ళీ వచ్చి సింహనాదం చేశాడో..? కాబట్టి ఇందులో ఏదో అనుమానంచివలసింది ఉంది తొందరపడి వెళ్ళకు దర్ప శ్చ వ్యవసాయ శ్చ యాదృశః తస్య నర్దతః ! నినాద స్య చ సంరమ్భో న ఏతత్ అల్పం హి కారణమ్ !! నీవు జాగ్రత్తగా అతడు చేస్తున్నటువంటి సింహనాదాన్ని విను అతనిలో ఒక ఉద్యమం కనబడుతూంది ఏదో చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఆ ధ్వనీ పూర్వంలా లేదు ఇప్పుడు ఏదో ధైర్యంతో అరుస్తున్నాడు అతనిలో ఒక తొందర ఉంది.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
రా బయటికి అని నిన్ను బయటికి రప్పించడమే పూనికతో ఉన్నాడు ఈ మూడు కనపడుతున్నాయి ఆ నాదంలో అంటే ఏదో తేడా ఉంది ఇవ్వాల సుగ్రీవుడిలో న అసహాయమ్ అహం మన్యే సుగ్రీవం తమ్ ఇహ ఆగతమ్ ! అవష్టబ్ధ సహాయః చ యమ్ ఆశ్రిత్య ఏష గర్జతి !! సుగ్రీవుడి వెనక ఎవరో ఉన్నారు ఎవరో సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చారు కాబట్టే సుగ్రీవుడికి అంత ధైర్యం వచ్చింది లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ అరవగలిగినటువంటి ప్రజ్ఞ సుగ్రీవుడికిలేదు ప్రకృత్యా నిపుణ శ్చైవ బుద్ధిమాన్ చైవ వానరః ! అపరీక్షిత వీర్యేణ సుగ్రీవః సహ న ఏష్యతి !! అ..ఆ... ఎవర్నో తీసుకొచ్చాడు ఎవడైతేనాకేంటి ఇప్పటివరకు నాకు ఓటమితెలియదు అంటావేమో సుగ్రీవుడు ఎటువంటివాడో తెలుసా..? నాకు బాగా తెలుసు, నీ తమ్ముడు ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఎవరినైనా నమ్మేముందు నీదగ్గరికి వచ్చేముందు నిన్ను యుద్ధానికి పిలిచే ముందు అవతలివారు నీతో యుద్ధం చెయ్యగలిగినవారేనా అన్నది వాళ్ళు మాటచెప్పితే నమ్మడు పరీక్షించి చూసి వచ్చి ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడి శీలం అటువంటిది పరీక్షించి చూశాడు నీ తమ్ముడు నిర్ధారించుకున్నాడు తనతో వచ్చిన స్నేహితుడెవరో నిన్ను మట్టుపెట్టగలిగినవాడూ అని నమ్మకం ఏర్పడ్డాకే వచ్చాడు కాబట్టి తొందరపడి వెళ్ళకు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తుందండీ ఈ మహాతల్లి నిజంగా..! పూర్వమ్ ఏవ మయా వీర శ్రుతం కథయతో వచః ! అంగద స్య కుమార స్య వక్ష్యామి త్వా హితం వచః !! ఇతః పూర్వం యువరాజైనటువంటి అంగదుడు నాతో ఒక విషయం చెప్పాడు నేను ఇప్పుడు ఆ మాట నీతో చెప్తాను శ్రద్ధగా విను అంగద స్తు కుమారో అయం వనాంతం అపనిర్గతః ! ప్రవృత్తిః తేన కథితా చారైః ఆప్తైః నివేదితా !! ఒకనాడు అంగదుడు ఈ రాజ్యం యొక్క సరిహద్దులవరకు వెళ్ళాడు దాటి ఋష్యమూక పర్వతం వరకు వెళ్ళడుగా..? గూఢచారులు ఎప్పుడు అవతలి దేశాల్లో జరుగుచున్న విషయాలు ఆ దేశ సరిహద్దులు దాటి వచ్చి చెప్తుంటారు గూఢచారులు ఒక విషయాన్ని చెప్పారు అంగదునితోటి.
ఆ అంగదుడు నాతో చెప్పాడు అయోధ్యాధిపతేః పుత్రౌ శూరౌ సమర దుర్జయౌ ! ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామ లక్ష్మణౌ !! సుగ్రీవ ప్రియ కామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ !!! తవ భ్రాతుర్ హి విఖ్యాతః సహాయో రణ కర్కశః ! రామః పర బలామర్దీ యుగాన్త అగ్నిః ఇవ ఉత్థితః !! అయోధ్యాదిపతియైనటువంటి దశరథ మహారాజుగారి పెద్ద కుమారుడైనటువంటి రామ చంద్ర మూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణునితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు, రాముడు సామాన్యమైనటువంటి వీరుడు కాడు చాలా గొప్ప శౌర్య పరాక్రమములున్నవాడు అటువంటి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడూ అని గూఢచారులు మనకు వర్తమానం చెప్పారు నివాస వృక్షః సాధూనామ్ ఆపన్నానాం పరా గతిః ! ఆర్తానాం సంశ్రయ శ్చైవ యశస శ్చ ఏక భాజనమ్ !! మిగిలిన విషయాలు చెప్పడంలో తార ప్రజ్ఞ గురించి మీరు ఆలోచించక్కరలేదు, ఇది చెప్పడానికి తార ప్రజ్ఞావంతురాలు అని మీరు చెప్పవలసి ఉంటుంది మిగిలినవి ఒక రాజు భార్యగా ఆమె తన అనుభవంతో పసిగట్టగలిగిందీ అని మీరు అనుకోవచ్చు కాని ఇది చెప్పాలంటే పూర్వపుణ్యం ఉంటే తప్పా చెప్పలేరు, గత జన్మలలో చాలా పుణ్యంచేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందినవాళ్ళకే ఈశ్వరుడి యొక్క స్వరూపం గురించినటువంటి జ్ఞానం భాషిస్తుంది, ఆవిడ రాముడు ఎవరో పసిగట్టేసింది అందుకే కిష్కింధ కాండలో ʻతార మెరుపుʼ అన్నాను నేను. ఈ శ్లోకాన్ని తార చెప్పకపోతే తార ఉపన్యాసమంతా ఒకెత్తు, గొప్పది, కానీ ఈ శ్లోకంవల్లా తారా జాజ్వల్యమానమైనటువంటి స్థానాన్ని పొందేసింది కిష్కింధ కాండలో నివాస వృక్షః సాధూనామ్ ఆపన్నానాం పరా గతిః ! ఆర్తానాం సంశ్రయ శ్చైవ యశస శ్చ ఏక భాజనమ్ !! రాముడు ఒక చెట్టు రాముడు ఎటువంటి చెట్టు అంటే అది పూలతో పళ్ళతో నిండినటువంటి ఒక పేద్ద మహా వృక్షం, రాముడూ అనబడేటటువంటి చెట్టు యొక్క పాదములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకంతా నీడనిస్తుంది మీరు ఒకటి గమనించండి... మీకు నీడకావాలి చెట్టు అక్కడుంది మీరు చెట్టుకిందకెళ్ళాలా చెట్టు మీ దగ్గరికి వస్తుందా..? మీరు చెట్టుకిందకి వెళ్ళాలి చెట్టుకిందకి మీరు వెళ్ళాలేతప్పా మీరు ఇక్కడ కూర్చుని ఓ అరుస్తూ చెట్టా నీడనివ్వు అంటే నీడనివ్వదు, మీరు చెట్టు యొక్క మూలమును పాదములను ఆశ్రయించారనుకోండి చెట్టు నీడనిస్తుంది.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
మీరు దాని పాదాలు పట్టుకుంటే నీడనిస్తుంది పాదాలు పట్టుకుని మీరు నిల్చున్నప్పుడు మీకు నీడ నిచ్చేటప్పుడు నీవు స్త్రీవా పురుషుడవా..? చదువుకున్నవాడివా చదువులేనివాడివా, ధనవంతుడివా పేదవాడివా, ఆచరణ ఉన్నవాడివా లేనివాడివా ఇవన్నీ ఏమీ చూడదు నీడ నివ్వడం ఆ చెట్టు యొక్క ప్రయోజనం ఆ చెట్టు యొక్క లక్షణం అంతే... నీకన్నా ముందు సుగ్రీవుడు చేరిపోయాడు ఆ చెట్టుకిందకి రాముడు అనేటటువంటి చెట్టు నీడలో సుగ్రీవుడు ఉన్నాడు చెట్టు బయట ఎండలో నీవు ఉన్నావు రామున్ని ఆశ్రయించి సుగ్రీవుడు ఉంటే నాకేంటీ అని నీవు నాకు బలముందని అంటావేమో... అలాంటి చెట్టు లోకంలో ఇంకొకటి లేదు అదొక్కటే చెట్టు. రామున్ని ఆశ్రయించినవాన్ని నిగ్రహించడం ఇంకొకరికి చేతకాదు నీ బలం పనికిరాదు నీ మొదటి ఓటమి చిట్టచివరి ఓటమి ఇదే అవుతుంది ఎందుకంటే ఇంకొకసారి యుద్ధం చేసే అవకాశం నీకు ఉండదు సుగ్రీవుని మీదకు యుద్ధానికి వెళ్ళడమంటే రాముని మీదకు వెళ్ళడమే..? ఎందుకంటే సుగ్రీవుడికి రామునికి మైత్రి కుదిరింది సుగ్రీవుడి ప్రాణం రాముడు పోనివ్వడు ఆ ధైర్యమే ఆయన సింహనాదంలో వినపడుతోంది నీవు ఇప్పుడు సుగ్రీవుడిమీదకి యుద్ధానికి వెళ్ళడం రాముడి మీదకు యుద్ధానికి వెళ్ళడం రామున్ని నిగ్రహించగలిగిన శక్తి నీకు కాదు మూడు లోకములలో ఎవరికీ లేదు కాబట్టి నా మాట విను నివాస వృక్షః సాధూనామ్ ఆపన్నానాం పరా గతిః ! ఆర్తానాం సంశ్రయ శ్చైవ యశస శ్చ ఏక భాజనమ్ !! అదొక్కటే చెట్టు.
ఆర్తి కలిగినవారు శరణాగతి చేసినవారు అందరూ ఆ చెట్టునే ఆశ్రయించవలసి ఉంటుంది అది ముందు నీడనిస్తుంది తరువాత పూవ్వులిస్తుంది పళ్ళుస్తుంది అన్నీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు నీడనిచ్చింది, రేపు పూలు పళ్ళు అనబడేటటువంటి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది నిన్ను పడగొట్టేస్తుంది. కాబట్టి నీవు నా మాట విను నీవు యుద్ధానికి వెళ్ళవద్దు జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశో నిరతః పితుః ! ధాతూనామ్ ఇవ శైలేన్ద్రో గుణానామ్ ఆకరో మహాన్ !! ఆయనా హిమవత్ పర్వతము ధాతువులన్నింటికి ఎలా ఒక స్థావరమో రాముడు అనబడేటటువంటివాడు గుణములన్నింటికి నిధి త త్క్షమం న విరోధ స్తే సహ తేన మహాత్మనా ! దుర్జయేన అప్రమేయేణ రామేణ రణ కర్మసు !! అటువంటి రాముడితో విరోదం పెట్టుకోకు సుగ్రీవుడితో విరోదం అని నీవు అనుకుంటున్నావు ఇప్పుడున్నపరిస్థితుల్లో సుగ్రీవుడితో విరోదమే రామునితో విరోదం కాబట్టి రామునితో విరోదం వద్దూ శూర వక్ష్యామి తే కించిన్ న చ ఇచ్ఛామి అభ్యసూయితుమ్ ! శ్రూయతాం క్రియతాం చైవ తవ వక్ష్యామి యత్ హితమ్ !! నాకు తెలుసు ఇప్పటివరకు ఓటమిని ఎరుగనివాడివి కాబట్టి రాముడు అంత గొప్పవాడూ అంటే నీకు కోపం వస్తుంది, ఇంకోళ్ళని పొగడడం నీకు ఇష్టం ఉండదు కానీ నా మీద కోపగించకుండా నేను చెప్పింది విను నేను మీతో మనవి చేసింది ఇదే అన్నీ వింటాడు చక్కగా వింటాడు భార్య చెప్తే వద్దనడు అన్నీవింటాడు తను చేసేదే చేస్తాడు అందుకే చచ్చిపోయాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసాండీ! భార్య మంత్రిని ఆవిడకన్నా నీ ఆనందాన్ని నీ అభ్యున్నతిని కోరుకునేవారు ఉండరు కాబట్టి ఆవిడ మాట వినవలసి ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కానీ ఆవిడ తప్పు చెప్తూందన్నప్పుడు దిద్దే అధికారం పురుషుడి ఎప్పుడూ ఉంటుంది. దిద్దాలి అప్పుడు ఆ భర్త కేవలం అనుసరించకూడదు, మంచిని స్వీకరించాలి చెడుని వద్దు మనం అలా చేయకూడదు అలా వద్దని చెప్పగలగాలి అది అనడు ఇదీ అనడు అన్నీ వింటాడు యుద్ధానికి వెళ్తాడు అదీ వాలితో వచ్చిన పెద్ద చిక్కు.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇప్పుడు ఆవిడ అందీ యౌవ రాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధు అభిషేచయ ! విగ్రహం మా కృథా వీర భ్రాత్రా రాజన్ బలీయసా !! ఎందుకయ్యా నీకు సుగ్రీవుడితో వైరం నీ తోడబుట్టినవాడయ్యా! ఒక ప్రమిథలో వెలుగుచున్నటువంటి రెండు జ్యోతులు మీ ఇద్దరు ఆయన ఏం తప్పు చేశాడని నీవు అసలు రాజ్యం నుంచి వెళ్ళగొట్టావ్? ఇప్పటికీ నీవంటే ఎంతప్రేమో తెలుసా... నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతాడో తెలుసా..? హాయిగా సుగ్రీవున్ని పిలు లోపలికి పిలిచి యౌవ రాజ్య పట్టాభిషేకంచేయి నీవు రాజుగా ఉండు సుగ్రీవున్ని యువరాజునిచెయ్యి మీ వైపుకు కన్నెత్తి చూడగలిగినవాడెరో నేను చూస్తాను అహం హి తే క్షమం మన్యే తవ రామేణ సౌహృదమ్ ! సుగ్రీవేణ చ సంప్రీతిం వైరమ్ ఉత్సృజ్య దూరతః !! నీవు చక్కగా సుగ్రీవుడితో స్నేహం చేసి రాముడితో స్నేహం చేసి వాళ్ళిద్దరితో ప్రీతి పాత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టూ నీవు మరింత బలపడిపోతావు లాలనీయో హి తే భ్రాతా యవీయాన్ ఏష వానరః ! తత్ర వా సన్ ఇహస్థో వా సర్వథా బన్ధుః ఏవ తే !! నీతమ్ముడయ్యా అతనూ నీ చేత లాలింపబడడానికి యోగ్యుడు అతని మీద కోపం పెట్టుకుంటానంటావేమిటీ..? కోపం పెట్టుకోకు ఇక్కడ ఉండనీ అరణ్యంలో ఉండనీ సుగ్రీవుడు నీకు తమ్ముడు అంతే ఈ జన్మకు అంతే మీ బంధం అటువంటి తమ్మున్ని ఎందుకు దూరం చేసుకుంటావ్? పిలు పిలిచి యౌవ రాజ్య పట్టాభిషేకంచెయ్యి న హి తేన సమం బంధుం భువి పశ్యామి కంచన ! దాన మానాఽఽది సత్కారైః కురుష్వ ప్రత్యనంతరం !! నాకు తెలిసున్నంతవరకు వాలీ! సుగ్రీవుడి వంటి బంధువు నీకు ఈ లోకంలో లేడు తమ్ముడు నీయందు అంత ప్రీతున్నవాడు నీ సేవకుడుగా బ్రతికేటటువంటివాడు ఎందుకు దూరం చేసుకుని అతన్ని చంపుతానంటున్నావు అతని మీద యుద్ధానికి వెడతానంటున్నావు వెళ్ళకు హాయిగా పిలిచి అంతఃపురంలో కూర్చోబెట్టి అతనికి కావలసినటువంటివన్నీ సమకూర్చూ సంతోషపడిపోయి నీదగ్గర చేతులు కట్టుకుని ఒంగి నమస్కరిస్తూ నీ వెంట ఉంటాడు.
వైరం ఏతత్ సముత్సృజ్య తవ పార్శ్వే స తిష్ఠతు ! సుగ్రీవో విపుల గ్రీవః తవ బంధుః సదా మతః !! నీకు కుడిభుజం ఎలా ఉంటుందో బలంలో సుగ్రీవుడు నీకు పక్కన ఉంటే అంత బలంగా ఉంటుంది. అందుకనీ ఆయన్ని మించినవాడు లేడు కాబట్టి సుగ్రీవుడితో స్నేహంచేయ్యి అంది భ్రాత్రు సౌహృదం ఆలంబ న అన్య గతిః ఇహ అస్తి తే నీవు సుహృత్ భావాన్ని నీ తమ్మునియందు చూపించు... చూపించావా! నామాట విను సాధు వాక్యం కురుష్వ మే నేను చెప్పినటువంటి మంచిమాట నీవు చేయ్యి నేను చెప్పినటువంటి హితవచనములను కానీ నీవు తప్పకుండా ఆచరిస్తే యుద్ధం చెయ్యకుండా రాముడితో సుగ్రీవుడితో స్నేహం చేస్తే పది కాలాలు సంతోషంగా మనం జీవించగలం ప్రసీద పథ్యం శృణు జల్పితం హి మే ! న రోషం ఏవ అనువిధాతుం అర్హసి !! క్షమో హి తే కోసల రాజ సూనునా ! న విగ్రహః శక్ర సమాన తేజసా !! ఇంద్రునితో సమానమైనటువంటి రాముని యొక్క తేజస్సును నిగ్రహించడానికి నీవు సరిపోవు ఆ రాముడు సుగ్రీవుడి వెనక ఉన్నాడు స్పష్టంగా చెప్తున్నాను నా మాట నమ్ము యుద్ధానికి వెళ్ళకు సుగ్రీవున్నే లోపలికి పిలిచి యౌవ రాజ్యం ఇవ్వు పరమసంతోషంగా మీ అందరూ హాయిగా ఉంటారు నా మాట విని నేను చెప్పిన మాటను ఆచరిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని తార వాలితో చెప్పింది.
వాలి ఏం చేస్తాడో రేపు చూద్దాం ఎందుకంటే వాలి ఏం చేస్తాడో అని మొదలు పెట్టామనుకోండి అమంగళం వైపుకు వెడుతుంది మరణంవైపుకు తీసుకెళ్ళవలసి ఉంటుంది అందుకనీ ఇవ్వాల భార్య ప్రీతిగా చెప్పింది రేపు ఏం చేస్తాడో చూద్దామన్న మంగళకర ఘట్టం దగ్గర ఆపే ప్రయత్నం చేస్తాను. ఇవ్వాళ రోజూ మనం రామ నామం కదా చెప్తున్నాం ఇవ్వాళ రామ నామ

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
స్థానంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటీ మీరు కొద్దిసేపు అవధరించండి లోకంలో ఒక మర్యాదా ఒకటి ఉంది ఏంటదీ అంటే మర్యాదా అంటే ఏదైనా చేస్తున్నటువంటి క్రతువుకానీ చేస్తున్నటువంటి జరుగుతున్న సభకానీ పూర్ణంగా పవిత్రం అయిపోయిందీ భగవంతుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడూ చాలా సంతోషించాడు అన్నగుర్తేమిటో తెలుసాండీ! పంచ శిఖలు పెట్టుకుని దీక్షా వస్త్రంతో ఉన్నటువంటి ఒక వటువు సభా ప్రవేశం చేయడం అందుకే బలి చక్రవర్తి అంతటివాడు వటువు సభలోకి వస్తూంటే వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం, గడు ధన్యాత్ముఁడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె, నా కోరికల్ గడ తేఱెన్, సుహుతంబులయ్యె శిఖులుం, గల్యాణ మిక్కాలమున్ ఒక కార్యం భగవదనుగ్రహాన్ని పొందింది అని గుర్తేమిటో తెలుసాండీ! సభలోకి వటువువచ్చి కూర్చుంటాడు నేను మీకు ప్రమాణం చూపిస్తున్నాను నేను స్వంతంగా చెప్పేశాడనుకుంటున్నారేమో..?
Related imageవడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? ఆ ప్రశ్న మనం అడగక్కరలేదు మనందరికి తెలుసు, సంవాసస్థలంబెయ్య? ది య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం సఫలమైపోయింది మన జన్మాను ఆయన రావడం వల్లా ఆయన వటువు అంతగొప్పవాడు ఉపనయనం చేసుకున్నవాడు గడు ధన్యాత్ముఁడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె, నా కోరికల్ గడ తేఱెన్, సుహుతంబులయ్యె శిఖులుం, గల్యాణ మిక్కాలమున్ పట్టాభిషేకం రాబోతుందిగదా..! కాబట్టి వటువా నీవు ఒక్కసారి చక్కగా లేచివచ్చి వేదిక మీద కూర్చో దా... మొన్ననే ఉపనయనం చేసుకుని గుంటూరులో సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయని అంత రామాయణం ప్రవచనం జరుగుచున్నటువంటి శృంగేరీ శారదాదేవి పీఠ ప్రాణంగణంలో వెళ్ళి కూర్చుని నేను ఒక్కసారి రామాయణం ఒక ఉపన్యాసం వినివస్తానూ అని వాడు నిన్నగాక మొన్న రెండు రోజులైంది సంధ్యావందనం చేసుకుని కూర్చో... వీడు నాకు శిష్యసమానుడే అందుకని నేను ఏక వచన ప్రయోగం చెయ్యొచ్చు. వీడు ఎంత ధారణ చేశాడంటే ఎంత చక్కగా సంధ్యావందనం గాయిత్రీ చేసుకుంటున్నాడంటే ఏదో పేరుకు ఉపనయనం చేసుకుని ఒంటిమీద యజ్ఞోపవీతం వేసుకొని ఇరవైఏళ్ళైనా కూడా ఇంకా సంధ్యావందనం కనీసం గాయిత్రీ ధ్యాన శ్లోకం కూడా రానివాళ్ళు వీన్ని చూసి సిగ్గుపడాలి అని చెప్పడానికి నేనేమీ మొహమాట పడటంలేదు.
వాడు రెండు రోజులైందేమో సంధ్యావందనం చేసి వాడూ... ఎంత చక్కగా గాయిత్రీ చేస్తున్నాడంటే... వాడు నాదగ్గరికొచ్చి కూర్చుని ఇవ్వాళ వాడు గాయిత్రీ మంత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఇవ్వాళ ప్రత్యేకంగా హైద్రాబాదునుంచి వచ్చీ వాడు ఇవ్వాళ ఇక్కడ రామాయణం వింటానూ అని ఇంత వైధికంగా వచ్చి కూర్చుని రామాయణ ప్రసంగం విన్నాడు. నీ రాక చేత నాన్నా! రామ చంద్ర మూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించినట్లు వటువు వస్తే గౌరవించాలి మనం కాబట్టి శృంగగిరి పీఠం కాబట్టి అందునా ఒక వటువు ఒక సన్యాసిని తప్పకుండా గౌరవించవలసిన బాధ్యతా పీఠంవారిమీద ఉంటుంది. వటువుకి ఏది పడితే అది ఇవ్వకూడదు వటువుకిస్తే గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో, వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁడడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ కాబట్టి నీకో యజ్ఞోపవీతము

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
మొదలైనవి బ్రహ్మచారికి ఏమివ్వాలో అవి శృంగగిరి పీఠం తరపున ఇస్తారు, ఏం నాన్నా..! ఆచమనం చేయడానికి ఆర్ఘ్యమివ్వడానికి పాత్రా అవి ఏదీ పీఠం తరపున బహూకరించండి చక్కగా ఎంత గొప్ప సన్నివేషమండీ ఇవ్వాళ మీ అందరూ చూసి సంతోషించాలి.
ఇవ్వండి ఒక్కొక్కటీ తీసి ఇవ్వండి వాడికి ధర్బాసనం పరమ పవిత్రం అది వేసుకొని చక్కగా సంధ్యావందనం చేసుకోండి, ఏదీ నీవు లే ఒక్కసారి (గురువుగారు దర్భాసనం వేశారు) కూర్చో ఆ... నరుణాంశుకోత్తరీయంబు తోడ సరిలేని రాకట్టు జాళువా మొలకట్టు బెడఁగారు నీర్కావి పింజె తోడ, ధవళ ధవళము లగు జన్నిదముల తోడఁ గాశికాముద్ర యిడిన యుంగము తోడ శాంతరస మొల్కు బ్రహ్మతేజంబు తోడఁ బ్రవరుఁదయ్యె వియచ్చర ప్రవరుఁడపుడు అంటాడు అల్లసాని పెద్దనగారు కాబట్టి నీవు బ్రహ్మచారివి కాబట్టి చక్కగా ఈ వస్త్రాలు కట్టుకుని సంధ్యావందనం చేసుకో ఏం నాన్నా... వీడికీ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయా ఉత్తరీయం ఇయ్యక్కరలేదు, యజ్ఞోపవీతం ఎప్పుడైనా నీ ఒంటిమీద ఉన్నది జీర్ణమైతే ఇది వేసుకుందువుగాని వాడికి ఆచమన పాత్రా చక్కగా ఆచమన పాత్రా ఆర్ఘ్యపాత్రా నీ అదృష్టమే అదృష్టం అదిగో ఆచమనం చేయడానికి అది ఆర్ఘ్యమివ్వడానికి ఇది అక్కడ పెట్టుకో. ఒక విభూతి ఉండ నీవు విభూతి ధారణ చేయడానికి పళ్ళెంలో పెట్టుకో ఆ మాల కళ్ళకద్దుకుని మెడలో వేసుకో లేకపోతే ఇలా ఇవ్వు నేను వేసేస్తాను. విసరండి ఓసారి వటువు కదా విసరండి ఇప్పుడు వాడికి ఇవ్వండి అది నీ దగ్గర పెట్టుకో వాడికి ఓసారి గొడుగు పట్టండి నీవు వేదిక దిగిపోయేటప్పుడు ఈ గొడుగు పట్టుకుని వెళ్ళు ఏమ్మా... ఛత్రము ఇలా పట్టండి ఇప్పుడు అక్కడ పెట్టేసేయండి.
ఒక వటువు వచ్చాడుకదా..! పీఠం తరపున సత్కరింపబడ్డాడు ఉత్తిగనే వెళ్ళిపోకూడదు వటువు ఆశీర్వచనం చెయ్యాలి వటువుకి ఆ అధికారం ఉంటుంది అందుకే కదా స్వస్తి జగత్త్రయీభువనశాసనకర్తకు హాసమాత్ర వి ద్వస్త నిలింపభర్తకునుదారపద వ్యవహర్తకున్ మునీం ద్రస్తుతమంగళాధ్వర విధానవిహర్తకు నిర్జరీగళ న్యస్తసువర్ణసూత్రపరిహర్తకు దానవలోకభర్తకున్ అని వామనమూర్తి బలి చక్రవర్తికి ఆశీర్వచనం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ వటువు కూడా మనందరిని ఆశీర్వచనం చేస్తాడు. ఎలా ఆశీర్వచనం చేస్తాడు ఇతనెలా చేస్తాడంటే గోవింద నామాలు చెప్తాడు మనందరికి ఆ గోవింద నామం చేత సభకు అంతటికి ఆశీర్వచనాన్ని కృప చేస్తాడు వీడికి సహకరించడానికి వాళ్ళ బాల కూడా వచ్చింది. శారదా పీఠం కదా బాల వస్తే అమ్మవారు కూడా వచ్చినట్లు కాబట్టి ఆ బాలా స్వరూపం కూడా వచ్చి కూర్చుని గోవిందనామాలు చెప్తుంది.

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
Image result for గోవిందా

పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

  కిష్కింధ కాండ ఇరవై మూడవ రోజు ప్రవచనము
 
తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

గాయత్రీ మహామంత్రానికి ధ్యాన శ్లోకం

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయై ముఖైస్త్రీ క్షణైః యుకామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ గాయత్రీం వరదాభయాంకుశకశ్శుభ్రం కలపాలం గదాం శంఖం చక్రమధార వింద యుగళం హసైస్వహం తీం భజే.

మంగళా శాసన పరై....


No comments: