Tuesday, 15 May 2018

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - కిష్కింధ కాండ 25వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Kishkinda Kanda 25th Day


కిష్కింధ కాండ

ఇరవైఐదవ రోజు ప్రవచనము





రాజ్యాభిషేకాన్నిపొంది రామ చంద్ర మూర్తిచేత అనుగ్రహింపబడి తాను జీవితంలో మళ్ళీపొందలేను అనుకున్న సుఖాల్నీ తిరిగిపొంది ఆ సంతోషంతో కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుడు రామ చంద్ర మూర్తికి మాట ఇచ్చినప్రకారంగా నాలుగు నెలలు గడిచిపోయిన తరువాత సీతమ్మ తల్లి అన్వేషణ కొరకు ప్రయత్నించవలసినవాడు దానియందు తదేక దృష్టితో ఆ కార్యంమీద ప్రణాళికారచన చెయ్యడంలో విఫలమయ్యాడు. ఈలోగా శరత్ ఋతువు వచ్చేసింది సమృద్ధార్థం చ సుగ్రీవం మన్ద ధర్మార్థ సంగ్రహమ్ ! అత్యర్థమ్ అసతాం మార్గమ్ ఏకాన్త గత మానసం !! శ్లోకాలు సుగ్రీవున్ని ఉద్ధేశించి చెప్తున్నట్లుగా ఉంటాయి కానీ యదార్థానికి సమస్తజీవకోటి యొక్క పరిణామ క్రమంలో జరిగేటటువంటి ఒక పెద్ద దోషాన్ని ఆవిష్కరిస్తూంటారు అది చిట్టచివర తీర్పు ఎక్కడుంటుంది అన్నదగ్గర నేను సృశించే ప్రయత్నం చేస్తాను. ప్రతిచోటా ఆ విషయాన్ని ప్రస్థావన చేయకుండా చిట్టచివర దీని ముగుంపులో దీని సందేశమేమిటీ అన్నది నేను మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.
మహర్షి అంటారు పొందవలసినటువంటి రాజ్యాన్ని పొందినటువంటివాడై ధర్మమూ అర్థమూ ఈ రెండింటినీ పట్టుకోవడంలో విఫలమై, ధర్మార్థములను పరిత్యజించినటువంటివాడై నిరంతరము ఏకాంతమైనటువంటి సుఖమును కోరుకుంటున్నటువంటివాడై అనగా స్త్రీ సంబంధమైన కామోప భోగమునందు అనురక్తిలో తలమునకలవుతూ అసతాం మార్గమ్ అంటే సత్పురుషులు అనుసరించనటువంటి మార్గమునందు సుగ్రీవుడు ఉన్నాడు. ఇప్పుడూ సత్పురుషులు అనుసరించని మార్గంలో సుగ్రీవుడు ఉన్నాడూ అంటే... ఆయన ధర్మమునందు వైక్లవ్యంలేదు ఆయన ఏదో వాలి చేసినటువంటి పొరపాట్లులాంటివి చేశాడూ అనికాదు కానీ... పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో పొరపాటుపడ్డాడు. సరే మీరు వింటారుకదా దాన్ని ఎందుకు మహర్షి అలా మాట్లాడుతారు అన్నదాన్ని మీరు గమనిద్దురుకానీ... నివృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ! ప్రాప్తవన్తమ్ అభిప్రేతాన్ సర్వాన్ ఏవ మనోరథాన్ !! ఆయన నిరంతరము కూడా భార్యయలయందు అనురక్తి కలిగినటువంటివాడై సిద్ధార్థం ఏది తానుపొందాలనుకున్నాడో దాన్నిపొందడంచేత కలిగినటువంటి అతిశయమువలన ఆ మీదుమిక్కిలిగా ఉన్నటువంటి సంతోషముచేతా అతను ఇతరవిషయములన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు స్వాం చ పత్నీమ్ అభిప్రేతాం తారాం చాపి సమీప్సితామ్ ! విహరన్తమ్ అహో రాత్రం కృతార్థం విగత జ్వరమ్ !! ఆయన తన భార్యయైనటువంటి రుమని పొందాలి అని చాలా కాలంగా అపేక్షిస్తున్నాడు, ఇవ్వాళ వాలి వధ తరువాత తన భార్యని తాను పొందగలిగాడు.

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు రుమతో పాటుగా వాలి భార్యయైనటువంటి తార కూడా సుగ్రీవున్నే ఆశ్రయించి సుగ్రీవుడి భార్యగా ఆమె మసలుతోంది, నేను మనవి చేశాను ఈవిషయం. భర్త మరణించిన తరువాత సంధ్యావందనంచేసే అలవాటు ఉన్నవానరజాతిలో ఉన్న స్త్రీ ఆమె కోరుకుంటే ఆయన అన్నదమ్ములలో ఎవరినైనా పతిగా స్వీకరించవచ్చు కాబట్టి ఇప్పుడు తారా మళ్ళీ సుగ్రీవున్ని భర్తగా స్వీకరించింది కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః ! కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః !! శంకరభగవత్ పాదులు అందుకే అంటారు ఎవరు భార్యా ఎవరు బిడ్డలు ఎవరు నువ్వు ఎవరికోసం ఏడవడం ఏదో కొద్దిరోజులు ఆ బాధ ఆ శోకం ఆ తరువాత ఎవరిగొడవ వారిదే పదకొండోరోజు వచ్చేటప్పటికి ఆస్తుల పంపకాలదగ్గర గొడవలు వెళ్ళిపోయినవాన్ని తిట్టటం అన్నిచోట్లా సామాన్యమైనటువంటి విషయమే, బీరువాలు తీయటం తీసినతరువాత ఇదా ఈయ్యన ఇచ్చింది అని దెబ్బలాడటం అది ఎనెన్ని చోట్లా చూట్టంలేదు. కాబట్టి ఆయనా తార కూడా తనతో కూడినటువంటి కారణం చేతా చాలా సంతోషంగా అసలు అహో రాత్రం అంటే రాత్రీ పగలూ కూడా వేరొక వ్యవహారమనేటటువంటిది ఏదీ లేకుండగా స్త్రీ సుఖమును అపేక్షిస్తూ స్త్రీ సుఖమును పొందుతూ ఆయన తన జీవితాన్ని తాను సంతోషమనుకొని గడిపేస్తున్నాడు క్రీడన్తమ్ ఇవ దేవేశం నన్దనే అప్సరసాం గణైః ! మన్త్రిషు న్యస్త కార్యం చ మన్త్రిణామ్ అనవేక్షరమ్ !! తాను రాజుగా నిర్వహించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి.
Image result for sugrivaఇప్పుడు తను రాజ్యాన్ని పొందడంతోపాటుగా భార్యను కూడా పొందాడు తారను కూడా పొందాడు, ఇప్పుడు ఆయనకు రెండూ వచ్చాయి రాజ్యమూ వచ్చింది భార్యలూ వచ్చారు కాని దేనితో అంటకాగాడూ అంటే ఒక్క భార్యలతోనే అంటకాగాడు అలాగని రాచరికం వదిలిపెట్టాడా అంటే రాజుగానే ఉన్నాడు మరి రాజ్యపాలనా... మంత్రులకు అప్పజెప్పాడు, సరే మంత్రులకు అప్పజెప్పడం తప్పుకాదు రాజు మంత్రులయందు న్యాసం చేస్తారు ఆ బుద్ధితో ఉంటాడు కానీ మంత్రులు తనకు ఏమైనా సమస్యలు చెప్పవలసివస్తే..? మంత్రులకు దర్శనం ఇవ్వడు ఇదీ ఇక్కడుంది అసలు సమస్యంతా... మహర్షి మాట్లాడేటటువంటి మాటలు చాలా గంభీరంగా ఉంటాయి ఆయనా అంత తేలికగా ఏం మాట్లాడరు ఇంకొకళ్ళ యొక్క ప్రవర్తనను పరిశీలనం చేసి ఆ శ్లోకాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి శ్లోకాల్ని జాగ్రత్తగా పరిశీనం చేసి పట్టుకుంటే మనం ఎలా ఉంటున్నామో అన్నది కూడా మనం పరిశీలనం చేసుకోవలసి ఉంటుంది. రెండూ పొందినటువంటివాడు రెండిటియందూ బుద్ధిపెట్టి ఉంటే రాజ్యపాలనా సక్రమంగా చేసి భార్యలతో అనురక్తితో ఉంటే ఏం అందులో మీరు నేను ఏమి పట్టించుకోవలసిన విషయం రామాయణంలో శ్లోకం రచన చేయవలసిన అవసరం వాల్మీకి మహర్షికేం లేదు, ఆయనా రాజుగా ఉండి ఆ రాజ్యమునకు సంబంధించిన వ్యవహారములను మంత్రులకు విడిచిపెట్టాడు, ఇప్పుడు మంత్రులు ఏదైనా సమస్యవస్తే రాజు నిర్ణయం చెయ్యాలి రాజు నిర్ణయం చెయ్యాలి అంటే మంత్రులు ఎవరిని కలవాలి రాజుని కలవాలి కానీ మంత్రులకి రాజ దర్శనంలేదు.
ఎందుకు లేదు అహోరాత్రము తారా రుమా ఇతర పత్నులతో తిరుగుతుంటాడు తిరుగుతూండడంవల్ల మంత్రులకు దర్శనం ఇవ్వడు, మంత్రులకే దర్శనం ఇవ్వనివాడు ప్రజలకేం దర్శనం ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు తమ కష్టం చెప్పుకోవాలి అంటే రాజు యొక్క దర్శనం లేదు. మంచివాళ్లై మంత్రులు మంచిగా పరిపాలిస్తే ఫర్వాలేదు లేకపోతే అసలు రాజుకీ ప్రజలకీ మధ్య ఏవిధమైనటువంటి సమన్వయం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో ఏమైపోతున్నారో ఆయనకనౌసరం

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
ఆయన రాజుగా సుఖములను అనుభవించడానికి మాత్రం రాజపదవిని వాడుకుంటున్నాడు తప్పా రాజపదవిని అనుభవిస్తున్నవాడు రాజుగా తన కర్తవ్యాన్ని చెయ్యడాన్ని విస్మరించాడు ఇది మహర్షి యొక్క తీర్పు. కాబట్టి క్రీడన్తమ్ ఇవ దేవేశం నన్దనే అప్సరసాం గణైః ! మన్త్రిషు న్యస్త కార్యం చ మన్త్రిణామ్ అనవేక్షరమ్ !! దేవేంద్రుడు నందనవనంలో విహరిస్తూ తన భార్యలతో ఎంత సంతోషంగా గడుపుతాడో అప్సరసలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో అలా ఆయన కూడా తన భార్యలతో నిరంతరము వనములయందు ఉపవనములయందు విహరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒకాయనున్నాడు ఆయన మహాప్రాజ్ఞుడు “బుద్ధిమతాం వరిష్టం” ఆయన గుర్తిస్తున్నాడు రెండిటినీ గుర్తిస్తున్నాడు ఏ రెండిటినీ గుర్తిస్తున్నాడు, రామ చంద్ర మూర్తి ఓర్పునీ గమనిస్తున్నాడు సుగ్రీవుడి యొక్క వైక్లవ్యాన్ని గుర్తిస్తున్నాడు do not stress the string beyond the last degree of its last city అని ఇంగ్లీషులో ఒక ప్రవర్బ్ అంటే తెలుగులో అయితే తెగేదాకా తాడు లాగకండీ! అని కానీ అది ఇంకొంచెం బాగుటుంది, స్థితిస్థాపక శక్తిని మించిపోయేంతవరకు మీరు లాగవద్దు అంటే అది కొంచెం సాగగలిగిన శక్తి అన్నది కొంత కాలం ఉంటుంది సాగగలిగిన శక్తినిదాటి మీరు లాగగలిగారనుకోండి మీరు తెగిపోతుంది. ఓర్పు అన్నదికూడా అంతే ఓర్పు పడుతున్నాడుకదాని మీరు లాగారనుకోండి ఆ ఓర్పు తెగిపోతుంది భగ్నమైపోతుంది అప్పుడు దాని స్థానంలో ఏమైపోతుందంటే సహనం ఎక్కడ నశిస్తుందో అక్కడ రావడానికి ఉండేటటువంటిది ఒక్కటే ఉంటుంది క్రోధం, విశేషమైనటువంటి క్రోధం ఒక్కసారి ఆవిర్భవిస్తుంది.
Image result for sugreevaకాబట్టి ఇప్పుడు హనుమ యొక్క బుద్ధి శక్తి ఎక్కడుందంటే రామ చంద్ర మూర్తి యొక్క ఓపికా రామ చంద్ర మూర్తి వేచి చూస్తున్న స్థితీ రామ చంద్ర మూర్తి యొక్క సహనమూ పరీక్షకు గురైపోతున్నటువంటి స్థితి వచ్చేస్తుంది, ఈయనా ఏ కబురూ చేయడు, ఇయ్యనా మంత్రుల మాట వినడు, ఈయనా మంత్రులకు దర్శనం ఇవ్వడు అహో రాత్రములు భార్యలతో గడుపుతున్నాడు. కాలము తనకు అనుకూలంగా ఉండాలి ముందు తన భార్యను కూడా తీసుకొస్తే తప్పా నీవు నీభార్యతో సుఖించకూడదని రాముడు అనలేదు, ఇప్పుడు వర్షాకాలం నీవు చాలా కష్టపడి ఉన్నావు పైగా సంతోషంగాగడుపు వర్షాకాలం అయిపోయిన తరువాత సీతాన్వేషణమునకు యత్నమునుచెయ్యి అన్నాడు. వర్షాకాలం అయిపోతుందనగానే జాగరూకుడు కావాలికదా ఆయనా ఇంక వర్షాకాలం అయిపో వచ్చిందనేటప్పటికి ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. ఎందుచేత అంటే కార్యము ముందా ప్రణాళిక ముందా అంటే శబ్దము వెలుతురులా ఉంటాయవి మీరు చూడండి ఎప్పుడైనా ఒక పిడుగుపడుతుందనుకోండి పిడుగు యొక్క ధ్వని ముందు రాదు పిడుగుపాటు ముందురాదు వెలుతురు ముందు వస్తుంది ముందు ఒక వెలుతురు కొడుతుంది, వెలుతురు కొట్టిందీ అంటే మీరు చెవులు మూసుకోవడమూ ఏదో చేస్తారు ఓ పిడుగు పడుతుందని తరువాత ధ్వని వస్తుంది ధ్వని తరువాత పిడుగు పడుతుంది మూడంచల కింద ఉంటుంది తప్పా పిడుగుపాటు అంటే ఒక్కసారి పిడుగుపడిపోవడం ఉండదు ముందు తెలుస్తుంది. ఒక కార్యం చెయ్యాలి అనేదాంట్లో దక్షతా అన్నమాటకు అర్థమేమిటంటే... పకట్బంధీగా దాన్ని ప్రణాళికా రచన చెయ్యవలసి ఉంటుంది ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని కార్యమునకు అనుకూలంగా కార్య సాఫల్యముకొరకు నీ ఆనుకూల్యత కొరకు కాదు కార్యం కార్యంగా ఫలితాన్ని ఇవ్వడానికి కర్మ.

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది ఈ విషయాన్ని కర్మ జడము కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదండీ అందుకే భగవాన్ రమణులు ఉపదేశసారం  చేస్తే “కర్మ తత్ జడం” అంటారు. కర్మ జడమైనటువంటి ఇది ఇప్పుడు ఎంత జడమో అంటే తనంత తానుగా దీనికేమీ నిర్వహణ శక్తి ఎలా ఉండదో ఒక విద్యుత్తు దీంట్లో ప్రసరిస్తే ఇది పనిచేస్తుంటుంది, అలా కర్మకు కూడా జడం. మీరు ఒక కర్మ చేశారనుకోండి దానివలన ఫలితం వస్తుందా అని నన్ను అడిగితే నేను ఏం చెప్పవలసి ఉంటుందంటే రాదు అని చెప్పడమే న్యాయమై ఉంటుంది అదే న్యాయమైనటువంటి జవాబు ఎందుకంటే నేను అభిషేకం చేశాను నాకు ఫలితం వస్తుందా అని మీరు అడిగారనుకోండి మీ మనసు అక్కడ పెట్టారా అని అడగవలసి ఉంటుంది. మీరు కేవలంగా ఓ నీళ్ళుపోయడమో పాలుపోయడమో చేసినంత మాత్రం చేత మీకు దానివలన ఫలితం ఏమీ వచ్చేయదు కానీ... ఏదో హీన పక్షంలో మీరు ఒక కార్యం చేశారూ అని ఏదో అభిషేకం చేశాననేటటువంటి నటనయందు కూర్చున్నాడు కాబట్టి ఏదో కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు కానీ అభిషేక ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుందంటే మీరు భక్తితో మీ మనసుని అక్కడ పెట్టినప్పుడు మీ మనసుని అక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమౌతుందంటే పదార్థములు అవసరం ఉండదు కర్మ అవసరం ఉండదు కర్మ మనసు చేసేస్తుంది మనస్సుకు ఆ శక్తి ఉంది అందుకే దానికి స్వప్నావస్థ ఉంది అందుకే మనసుకున్న బలం మనసుకున్న బలహీనత రెండూ ఒక్కటే, ఒక్కటే బలహీనతా అదే బలం. మనసుకు ఏది బలహీనతో దాన్ని మీరు బలంగా మార్చగలిగితే మీరు ధన్యులు మనసుకు ఏది బలమో దాన్ని మీరు బలహీనతగా మార్చుకుంటే మనం అధములం అంతే తేడా.
మీ మాట స్పష్టంగా లేదు అంటారు మీరు నాకు తెలుసు, మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి ఆ కర్మ చేసేముందు దానియందు శ్రద్ధ అంటే భక్తి అది ఎందుకు చేస్తున్నాం మనం అన్న విషయం మీద కొంత అవగాహన ఉండాలి అది దీనికొరకు ఉద్దేశింపబడింది అన్నప్పుడు ఆ కోణంలోనే మీరు దాన్ని చెయ్యవలసి ఉంటుంది. తప్పా ఏదో కర్మని కర్మగా చేశారనుకోండి అన్నవరపు సత్యనారాయణస్వామివారి వ్రతం నూటపదహారు గంటలు కూర్చుని చేశారనుకోండి మీరు నూటపదహారు మందిని త్రికరణ శుద్ధిగా చెప్పండి ఎందుకు చేశారు అని అడిగారనుకోండి, మేము అందరం మా అమ్మాయి పెళ్ళికోసం చేశాం అని అన్నారనుకోండి ఇప్పుడు చెయ్యకుండా చూస్తున్నాయన కూతురు పెళ్ళి సెటిలవ్వచ్చు అదేమిటండీ అని మీరు అడగవచ్చు. ఇయ్యనా నవగ్రహ మంటపాన్ని ఆవాహన చేస్తూ సెఫోన్ మాట్లాడుతాడు ఇంకేమి పూజదీ... వ్రతం కాదు అది వ్రత భంగం వ్రతముల్ జేయచు నొక్క మాటయిన నెవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షు లీక్షించియున్ గతచేలాప్లవనంబు నేడు వ్రతభంగంబంచు శంకించి ఫాలతట న్యస్త కరాబ్జలై సరసలీలన్ మొక్కి రట్లందఱున్ అంటారు పోతనగారు కాత్యాయినీ వ్రతం గురించి మాట్లాడుతూ ఎవరు మనసు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడో వాడికి పదార్థము యొక్క అవసరము లేకుండా వాడు సృజించగలడు స్వప్నం అందుకేగదాండి వచ్చింది.
స్వప్నంలో మీ శరీరమేమీ వెళ్ళదు మీ కళ్ళేమీ చూడదు మీరేం వెళ్ళరు కానీ... స్వప్నావస్థ మీరు జాగృతియందు ఎలా ఉన్నారు అన్నదానికి ఒక రుజువు మీరు నిజంగా జాగృతిలో అంటే మీరు నిజంగా ఇంద్రియములు తెలివిగా ఉండగా మీ ఇంద్రియములన్నీ ఆ వస్తువునే పట్టుకుని ఉంటే మనసు ఏం చేస్తుందో తెలుసాండి మీరు నిద్రపోయినప్పుడు మీ ఇంద్రియాలు ఏమి పట్టుకున్నాయో దాన్నే మీకు చూపిస్తుంది ఇంకొక దాన్ని చూపించదు. నేను రామాయణం మీద తదేకదృష్టితో ఉండి రామాయణం చెప్తున్నాననుకోండి నాకు రాత్రి కలేం రావాలంటే సీతారాములు యొక్క పాదార్చన నేను చేస్తున్నట్లు కల వస్తే... నేను చెప్పిన రామాయణానికి నేను సిద్ధి పొందుతున్నాను అని గుర్తు. ఎందుకనీ నాకు నిజంగా రామాయణం చెప్తుంటే ఆ సీతారాముల మీద అంత భక్తి విశ్వాసాలతో నా మనసు పొంగిపోయినది నిజమైతే నేను రామాయణం చదువుకునేటప్పుడు అంత భక్తితో అంత ప్రీతితో నేను చదువుకుని నాకు ఎప్పుడూ ఆ రాముడే సీతమ్మే జ్ఞాపకానికివస్తే... నా కలలో మనసు ఏం చేస్తుందంటే ఈ కన్ను చూడనిది ఈ చెవి విననిది ఈ చెయ్యి పట్టుకోవడానికి పక్కన లేని తులసీదళాన్ని తీసుకొచ్చి సీతారాములు పాదాలపై వేస్తున్నట్లు రాత్రి నా కన్నులముందు ఉంచుతుంది. కదలని ఈ చెయ్యి కదలి కదలనీ అంటే బాహ్యంలో కదలని చెయ్యి అంతరమున కదలి అక్కడలేచి తులసీదళములని ఆయన పాదములపై వేస్తుంది. అలా వేసిందీ అంటే ఖచ్చితంగా నీవు రామానుగ్రహాన్ని పొందుతున్నావు అని గుర్తు. ఎప్పుడు పొందింది అలాగ ఓ కలా నీవు రా... నాకు సీతారాములు కలలోకి రావాలీ నేను కలలో సీతారాములు పాదాలకు తులసీదళాలను వేయాలి అని మీరు సంకల్పం చేసి పడుకోండి వస్తుందేమో..? రాదు.
Related image

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
మీరు దేన్ని చూశారో ఎక్కువ మీ బుద్ధి దేనిమీద ఉందో దాన్ని పట్టుకుంటుంది మనసు పట్టుకుని దాన్ని సృష్టిస్తుంది కలలో సృష్టించి తీసుకొస్తుంది ఆ తీసుకురావడం కూడా ఎలా తీసుకొస్తుందో తెలుసాండీ! మనసుకున్న చాలా గొప్పబలం అదే, క్షేత్రాన్నే సృష్టించేస్తుంది మీరు క్షేత్రానికి వెళ్ళక్కరలేదు క్షేత్రాన్ని మీలోకి తెస్తుంది. జాగృత్తిలో మీరు క్షేత్రంలోకి వెళ్తారు మీరు బాగా పట్టుకోవాలీ అంటే... ఇప్పుడు నేను జాగృత్తిలో ఉన్నాననుకోండి నేను లేచి ఉన్నాను నేను లేచి ఉన్నాను అంటే నా ఇంద్రియములు లేచి ఉన్నాయి నా కళ్ళు చూస్తున్నాయి నా చెవులు వింటున్నాయి నా స్పర్శ తెలుస్తూంది దీన్ని జాగృత్తి అంటారు. జాగృత్తిలో నేను అంటే ఇంద్రియములతో శరీరముతో క్షేత్రంలోకి వెడుతాను మీకో ఉదాహరణ చెప్పాలీ అంటే ఇవ్వాల సోమవారం కదాండి ఇవ్వాల సోమవారం కాళహస్తి వెల్దామనుకున్నాననుకోండి, కాళహస్తీ క్షేత్రంలోకి నేను నా శరీరంతోటి ఇంద్రియములతోటి వెళ్తాను స్నానం చేసి ఏదో ఒక పంచకట్టుకుని గుడిలోకి వెళ్తాను మారేడుదళాలు పట్టుకుని వెళ్ళి నా మనసు మగ్నమైపోయిందనుకోండి మనస్సు యొక్క శక్తేమిటో తెలుసాండీ? శ్రీ కాళహస్తిని మీ మనసులోకి తీసుకొస్తుంది.
Image result for Markandeya lingam in kalahastiమీరు శ్రీ కాళహస్తిలోకివెళ్ళడం జాగృత్తిలో శ్రీ కాళహస్తి మీ కలలోకి రావడం స్వప్నంలో దేని శక్తిచేత మనస్సు యొక్క శక్తిచేత మీరు ఇలా దేవాలయంలోకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగి పెద్ద గణపతి మూర్తిని చూసి ఇలా రెండు శూలాలు పెట్టిన చెంగల్వరాయ సన్నిధి పట్టిని ఆ సుబ్రహ్మణ్యున్ని చూసి మెట్లుదిగి ఎడం చేతిపక్కనున్నటువంటి దేవతామూర్తులను చూస్తూ కుడివైపుకు తిరిగి లోపలికెళ్ళి నవగ్రహ కవచం కట్టుకున్నటువంటి చతురస్రాకారపు ఆ పొడుగ్గా ఉన్నటువంటి పెద్ద శివలింగం పక్కన ప్రమిదలో వెలుగుచున్నటువంటి దీపం గాలికి ఇలా కొట్టుకుంటుంటే అదే వాయులింగమనుకొని అంతరాలయంలోకెళ్ళి చూస్తే గోడలో మహానుభావుడు ఆ భక్త కన్నప్ప ఉంటే ఆహా కన్నప్పా నీ అదృష్టం కదయ్యా... నీ భక్తి ఇక్కడికి చేరావనుకుని మీరు మారేడుదళాలు పుచ్చుకుని దేవాలయం వెనక్కి తిరిగితే వెనక గోడమీద ఆవిర్భావలింగం ఉంటుంది అంటే శివలింగం ఉంటుంది శివలింగం ఉండి శివలింగం ఇలా కోసినట్టుగా ఉంటుంది అందులోంచి శివుడు కనపడుతాడు తల కనపడదు పాదాలు కనపడవు అంటే ఏ పరమాత్మ యొక్క కిందిభాగాన్ని పై భాగాన్ని నీవు తెలుసుకోలేవో అనంతమై ఉన్నాడో అనంతమైనటువంటి పరమాత్మచేత పరివ్యాపత్మమై ఉన్న లింగస్వరూపమై ఈ బ్రహ్మాండమంతా ఉంది అని తెలుసుకోదగినటువంటి ఆవిర్భావ లింగాన్ని దేవాలయం వెనకాల చూసి మీరు వెళ్ళేటప్పుడు ఆ కుడిచేతి పక్కన ప్రదక్షిణ మార్గంలోనే ఆ దుర్గమ్మతల్లిని చూసి వెనక ఆవిర్భావలింగం మళ్ళీ కుడిపక్కకు తిరిగితే మీ కుడిచేతివైపు కోష్టగణపతి మీరు అలా తిరిగితే మళ్ళీ శివలింగాన్ని చూసి అలా  బయటికెళ్ళి కుడిచేతి పక్కకు నడుస్తుంటే వేదిక మీద నల్లటి గుడ్డలు దీపాలు వెలిగించి అక్కడ పెట్టేటటువంటి శనేశ్వర మూర్తి దగ్గరనుంచి వేంకటేశ్వరుడు కనకదుర్గమ్మవారు మళ్ళీ మీరు కుడిపక్కకు తిరిగితే అరుగుమీద 63 మంది నాయనార్లు నాయనార్లను దాటిన తరువాత మార్కండేయ లింగం మార్కండేయ లింగం దాటి మీరు కొంచెం ముందుకెళ్ళి కొంచెం కుడిపక్కకు తిరిగితే ఓ చిన్న గుడిలా ఉండి అందులో ఒక శివలింగం మీకు అనురక్తి ఉంటే

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
కాసిన్ని తుమ్మిపూలో మారేడుదళాలో పట్టుకెళ్తే మీ చేత్తో మీరు మార్కండేయ లింగం మీద శివ లింగం మీద పూజ చేసుకోవచ్చు.
శ్రీ కాళహస్తిలో మీరు మెట్లు దిగి కిందకి ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ పెద్ద కిరీటము అమ్మవారి కిరీటములో ఉన్నటువంటి పెద్ద మణీ ఆతల్లి యొక్క స్వరూపం ఆవిడ కట్టుకున్న చీరా ఇంత పేద్ద కుంకం చారులు పెట్టుకున్నటువంటి వృద్ధ అర్చకుడు ఆన పట్టుకెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసి చేసి ఉండడం వల్లా ఆయన అరికాళ్ళు కూడా ఎర్రపడిపోయి అంచులు కూడా కుంకంతో ఎర్రపడి ఆయన కూర్చున్నప్పుడు పృష్టభాగం పంచె కూడా ఎర్రబడి కుంకుమ అంటుకుపోయి ఆయన అరచేతులన్నీ కూడా కుంకంతో కూడి ఆయన నీరాజనం తీసుకొచ్చి ఇస్తే మీరు నీరాజనం తీసుకొని పువ్వులు తీసుకుని అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణం చేసి బయటికొస్తుంటే అభిషేకం టికెట్టు ఉన్నవాళ్ళకి ఉత్తరీయం వేస్తున్నటువంటి ప్రదేశం ఆ ఎడం చేతి పక్క నున్నటువంటి స్వామివారి ఉంజల్ మంటపం అక్కడ ఉన్నటువంటి ఆ అద్దాల మంటపం అది చూసి మీరు మళ్ళీ బయటకొచ్చి కుడిచేతి వైపుకి తిరిగి కుడిపక్క మెట్లు ఎక్కితే ఒక చోట గీసిన వృత్తంలోంచి నిలబడి చూస్తే మీకు కాళహస్తీర్వరుని యొక్క శిఖర దర్శనం ఇంకొక వృత్తంలోంచి నిలబడి చూస్తే అమ్మవారి శిఖర దర్శనం ఇంకొక వృత్తంలో మీరు నిలబడి చూస్తే కొండమీద ఉన్నటువంటి కన్నప్ప గుడి దర్శనం యమధర్మరాజ ప్రతిష్టిత లింగం అది దాటి ఇటొస్తే ధర్మరాజు ప్రతిష్టిత లింగం ఆ పక్కన చండీశ్వరుడు ఆయన దగ్గరికెళ్ళి మీరు నమస్కారం చేసి దగ్గరికెళ్ళి మళ్ళీ కుడిపక్కకు తిరిగితే మీ ఎడం పక్క అరుగుమీద పెద్ద స్పటికలింగం పొడుగ్గా... దాని వెకాల ఓ చిన్న బల్బు ఆ లైటు వెలుగుచున్నప్పుడు కనపడుతున్నటువంటి ఆ జ్యోతి స్పాటిక లింగ మౌళి విలస త్పూర్ణేందు వాన్తామృతైః అన్నట్టుగా ఉన్నటువంటి ఆ స్పటిక స్వరూపం.
మీరు మళ్ళీ కుడిపక్కకు తిరిగితే కన్నప్పలింగం అరుగుమీద ఇలా కుడిపక్కకు తిరిగితే దక్షిణాభి ముఖంగా దక్షిణామూర్తి అద్భుతమైన అలంకారంతో ఉన్నస్వామీ మీరు అక్కడ కిందపడి నమస్కారం చేసి ఎడం పక్కకి తిరిగి రాజద్వారంలోంచి బయటికి వెల్తే ఎడం పక్కన ప్రసాదాల కౌంటరు ముందుకెల్తే నిత్యాన్నదానం మళ్ళీ కుడిపక్కకుతిరిగితే ఓ పెద్ద ఏనుగూ అక్కడ టికెట్లు అమ్మేటటువంటి ప్రదేశం సహస్రలింగార్చనా రాహుకేతువులు పూజా టికెట్లు అమ్మేటటువంటి స్థలం ఆ మంటపం బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో రకరకాల తైలాలు అమ్మేటటువంటి షాపులు విభూతి మారేడుదళాలు తుమ్మిపువ్వులు అమ్ముతున్నటువంటి కొట్లు ఆ బయటికి వస్తుంటే ఎడం పక్కన సుబ్రహ్మణ్యుడు ఎదురుగుండా కాశీవిశ్వేశ్వరుడు ఆ బయటికొచ్చి అరుగుమీద ఆ కొబ్బరికాయలు వరుగా అవన్నీ చూస్తూ మీరు అక్కడకొచ్చి మళ్ళీ మీ చెప్పులు మీరు తీసుకొని మీరు అలా బయటికి వెల్తే ఒక్కసారి ఇక్కడే కదా పుష్పగిరి మంటపం లోపలికెళ్ళి కాళ్ళుకడుక్కుని లోపలికి వెడుదామంటే లేదు లేండి పిల్లలు ఆకలేస్తుందంటున్నారు ఈ శరవణ భవన్ బాగుంటుందట ఇందులోనే టిఫిన్ తిందామని భార్య అంటే శరవణ భవన్లోకి వెళ్ళి కూర్చుంటే ఏం ఇమ్మంటారు అని సర్వర్ అడిగితే ఇప్పుడు మీకు తెలివొచ్చిందనుకోండి ఇప్పుడు మీరు కాళహస్తిలోనే కదా ఉన్నారు ఇప్పుడు కాళహస్తి మీలోన ఉన్నదా మీరు కాళహస్తిలో ఉన్నారా మీ యందు కాళహస్తి ఉంది మీలోకి కాళహస్తి చేరింది శ్రీ కాళహస్తి.
Image result for Markandeya lingam in kalahasti

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
ఇది మనసు యొక్క శక్తి మనస్సు జాగృతియందు బాగా దేన్ని పట్టుకుంటుందో దాన్ని సంకల్పంతో మీలోకి తీసుకొచ్చేయగలదు అది వచ్చిందీ అని కూడా ఎవ్వరికీ తెలియదు లోకంలో మీరు శ్రీకాళహస్తి వెల్తే తెలుస్తుంది మీలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకోగలిగిన శక్తి మీకు వచ్చేసిందనుకోండి ఆయనలోకి శ్రీ కాళహస్తిని తెచ్చేసుకుని ఆయన శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని అర్చిస్తున్నాడు కూర్చున్నట్టు ఉన్నాడు కానీ ఆయనలోకి శ్రీకాళహస్తి వచ్చి ఉంది అన్నవిషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనస్సుకి శక్తి ఉందాలేదా..? మనస్సు యొక్క బలమూ ఇదే బలహీనతా ఇదే మీరు దానికి బాగా శిక్షణ ఇస్తే దేన్నైనా మీలోకి తెస్తుంది మీరు ఏ శిక్షణ ఇవ్వకపోతే దాని ఇష్టమొచ్చినట్లు తిరిగి అవన్నీటినీ తీసుకొచ్చి మీలో పెడుతుంది అదే బలహీనత దాన్ని మీరు మార్చగలిగితే అదే దాని బలం ఇప్పుడు నేను అన్నమాట మీరు బాగా పట్టుకున్నారు అనుకుంటున్నాను మీరు వాడుకోవడంలో ఉంటుంది ఆ సాధనాన్ని ఈశ్వరుడు ఈ మనస్సుని అందరికి ఇచ్చాడు దీన్ని మీరు వాడారా దీంట్లోనే బ్రహ్మాండములన్నీ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళక్కరలేదు మార్నింగ్ వాక్ చేస్తూ మీరు అలా తిరుగుతూ ఇవ్వాళ నేను ఏడు నదులలో స్నానం చేస్తాను అంటే చేయవచ్చు, నేను ఇవ్వాళ ఏడు క్షేత్రాలను చూస్తాను అనుకుంటే చూడవచ్చు మార్నింగ్ వాక్ చేస్తూ మీరు ఏడు క్షేత్రాలను చూడవచ్చు. మీరు పైకి శరీరం తిరుగుతూ ఉంటుంది మీరు శృంగేరీ వెళ్ళిపోయి శృంగగిరిలో ఉన్నటువంటి శారదాంబ దేవాలయాన్ని ఆ విద్యాశంకరుల దేవాలయాన్ని తుంగానదినీ కప్పకి నీడపట్టిన పాము స్నానం చాపలు మరమరాలు వేసినట్టు మీరు స్నానం చేసి మీరు ఆ వారధి దాటి ఆ పాములుంటాయి జాగ్రత్త అన్న బోర్డు ఉన్న వనంలోంచివెళ్ళి ఎదురుగుండా చంద్రశేఖరభారతీ స్వామి మొదలైన మహాపురుషుల యొక్క సన్నిధానాలు చూస్తూ ఎడం పక్కకి తిరిగి పూర్వం ఉన్నటువంటి గురువులందరు కూడా అక్కడ ఉండే అభిషేకాలు కూడా చేస్తే ఇరుగ్గా ఉన్నటువంటి ప్రాంగనంతో కూడుకున్న గురునివాసిని ఆ పక్కన ఉన్న విశాలమైన భవంతిని అందులో ఉన్న పెద్దహాలునీ అక్కడ పెట్టినటువంటి శంకరాచార్యులవారిని స్వామివారికి బహూకరింపబడిన పెద్ద తంజావూరి వీణ కనపడుతుంది.
వాటినన్నింటినీ మీరు చూస్తూ శంకరభగవత్ పాదులు వారి శిష్యులు ఆ గోడలు వేధికా తెరా తీసేటప్పటికి వచ్చి కూర్చున్న భారతీ తీర్థస్వామి అయన ఇలా కూర్చుని ఇంక రుద్రం మొదలెట్టడానికి ఎవరితో మాట్లాడకుండా ఇటు తిరిగి కూర్చుని ఇటుపక్కకి తలొక్కటే తిప్పి ఇలా అందరినీ ఒక్కసారి పరికించి సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో నమో అన్నభావన లోపల అంతా శివస్వరూపంగా చూస్తూ పైకి మనల్నేచూస్తున్నారని మనం అనుకుంటే ఆయన ఒక్కసారి ఇటుపక్కనుంచి ఇలా చూసి ఇలా తలూపి ఆ శివలింగంమీదకి పెట్టినటువంటి ధారాపాత్రా అందులోకి ఆయన పాత్రతతో తీసి ఇలా పోస్తుంటే శివలింగం మీద పడుతున్నటువంటి శివలింగంమీద పువ్వులు ఆ ధారలు ఆఖర్న ఆయన వస్త్రం తీసి ఆ శివలింగాన్ని తుడిచి పైకిలేవకుండా అందంగా ఈ చెయ్యి ఇలా అంటే కిందపడకుండా ఆ శివలింగాన్ని అందంగాపెట్టి ఆ పువ్వులతో అలంకారం చేసి ఆయన చేసేటటువంటి అభిషేకం ఇవన్నీ మీరు చూస్తూండగా మీరు అనుభవిస్తూండగా మీ ఐదు రౌండ్లో ఆరు రౌండ్లో  మీ మార్నింగ్ వాక్ అయిపోతుంది. శరీరానికి వ్యాయామం అయ్యింది మనస్సుకి శృంగేరి దర్శనం అయింది. మనసుకి ఆశక్తి ఉంది శరీరం తిరుగుతుంటుంది మనస్సు విడిపోతుంది విడిపోయి

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది ఎటుకావాలంటే అటు వెళ్ళిపోతుంది. దాన్ని మీరు అలవాటు చేస్తే శృంగేరి వెళ్తుంది మీరు అలవాటుచేస్తే గంగానదికి వెళ్తుంది అలవాటు చేస్తే కాశీవెళ్తుంది మీరు అలవాటు చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది ఎప్పుడు మీరు జాగృత్తిలో మీ మనస్సును అక్కడపెడితే, మీరు శృంగేరీ వెళ్ళినప్పుడు మీ మనస్సు అక్కడ పెడితే మీ మనసు తరువాత శృంగేరి నుంచి వస్తుంది ఇప్పుడు మీరు శరీరంతో వెళ్ళి మీ మనస్సు కాకినాడలోనూ ఉందనుకోండి, శృంగేరీని మీ మనసులోకి తేవడం ఇక మనసుకు సాధ్యంకాదు అదే దాని బలహీనత అదే దాని బలం కూడా.
Image result for bandhanamఇప్పుడు మీరు దాని బలాన్ని బలంగా వాడుకోగలిగితే అది మీకు ప్రయోజకత్వాన్ని సాధించిపెడుతుంది అది మీకు చేతకాకపోతే ఆ మనసే బంధనానికి గురిచేస్తుంది అందుకే మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోః అంటాడు పరమాత్మ గీతాచార్యుడు కేవలం మనస్సే ఒకడు బంధింపబడుతున్నాడు ఒకడు మోక్షంవైపుకు వెడుతున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కట్టాలన్నా విప్పాలన్నా తాడే, తాడు తప్పా ఇంకోటి ఉండదు కట్టడానికి విప్పడానికి మీరు ముందు ఇటునుంచి తిప్పి చుట్టేస్తే కట్టు ఇటునుంచి తిప్పి కట్టి తిప్పేసినా కట్టే, ఇప్పుడూ నన్ను ఇలా కట్టేయండి అని అన్నాననుకోండి ఓ తాడు తీసుకొచ్చి ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్లే ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్లే కట్టినా తాడే విప్పాలంటే మీరు ఎటు కట్టారో దానికి వ్యతిరేకదశలో తిప్పేయడమే తాడు, ఇటునుంచి కట్టారనుకోండి ఇటునుంచి తిప్పేస్తే విప్పేశారు. వ్యతిరేకదిశలో తిప్పితే విప్పడం మీరు కట్టాలనుకున్నది ఏ దిశలో కావాలనుకుంటే అటు తిప్పితే అది కట్టడం, కట్టినా విప్పినా చెయ్యి తిప్పడంలో ఉంది ఒకలా తిప్పితే కట్టు ఒకలా తిప్పితే విప్పడం తాడుమాత్రం అదే కట్టుకోవడం విప్పుకోవడం మీ చేతులలో ఉంది కట్టుకున్నా విప్పుకున్నా మీ ఇష్టం ఈశ్వరుడు మనసుని ఇచ్చేశాడు అంతే తాడు మీకిచ్చేశాడు.
ఇదీ ఆశ్రమాన్ని ధన్యం చేసుకోవడం అంటారు ఎందుకెడుతున్నావు గృహస్తాశ్రమంలోకి ఆవిడా నీవు కలిసి తరించడానికి నీ చెయ్యి ఆవిడ ఎందుకుపట్టుకుందంటే 24 గంటలు నీకు కావల్సిన రుచులతోటి వండిపెట్టడానికినీ నీకు సంతానం కనడానికీనీ శరీరం జజ్జరీభూతం అయిపోయేంతవరకూనూ కామప్రచోదనంతో బ్రతకడానికి ఇవ్వలేదు ఆవిడని కన్యాదాత ఆవిడని నీ పక్కన ధర్మపత్నిగా పెట్టుకుని నీవు పుణ్యకర్మలు చేసి నీ పుణ్యంలో సగభాగం ఆవిడకిచ్చి ఆవిడని ఉద్దరిస్తావన్న ఉద్దేశ్యంతో ఆవిడని ఇచ్చాడు. నీవు స్వీకరించింది ధర్మ పత్నిగా కేవలం కామ పత్నిగా నీవు అనుభవిస్తానంటే నీఖర్మ అంతే ఎవ్వరూ జోక్యమేమీ చేసుకోరు అందులో కానీ పాడైపోవడమనేది మాత్రం జరిగిపోతూంటుంది అందులో కాలం ఆగదు కదాండీ వెళ్ళిపోతుంది కాలం ఆ కాలంలో నీవు ఏం పట్టుకున్నావు కామమొక్కటే పట్టుకున్నావు ఏది వదిలిపెట్టేశావు ధర్మముతో అర్థాన్ని ధర్మముతో కామాన్ని ముడిపెట్టేయడం మరిచిపోయావు, కామం ధర్మబద్ధమే కావచ్చు భార్యతోనే ఉన్నావు కానీ కాలమంతా దానికే ఉపయోగించావు ఇప్పుడు మరి మిగిలినవేమైపోయాయి పురుషార్థాలు మరి ధర్మమేదీ అర్థమేదీ అప్పుడు ఇంక ఒక్క పురుషార్థంతోనే పట్టుకు కూర్చుంటే జీవితమేదీ మితిమీరిన వ్యామోహమైంది తప్పా అది పురుషార్థ సమన్వయం ఎలా అయింది పాడౌతున్నట్లా సన్మార్గంలో ఉన్నట్టా..? అందుకని అన్నారు మహర్షి సత్పురుషుల

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
మార్గమును విడిచిపెట్టాడు. అంటే పురుషార్థములను సమన్వయం చేసుకోవడం రాలేదు రాజ్యాన్ని వదిలిపెట్టి కేవలం భార్యలయందు మనస్సుపెట్టి ఉన్నాడు.
Image result for sugrivaఇంకొకాయన మహాపురుషుడు ఆయనేం చూస్తున్నారు ఆయనా తిరిగారు ఇయ్యనతో పాటు హనుమా, అప్పుడూ ఆయనకు ఒక్కటే ఇప్పుడూ ఆయనకు ఒక్కటే ఇప్పుడు ఆయన ఏమి ఆలోచిస్తున్నారు మహానుభావుడు రామ చంద్ర మూర్తికి మాటిచ్చాడే ఆయన అలా అరణ్యంలో కూర్చున్నారే వారు ఆ గుహలో కూర్చున్నారే మరి శరత్ కాలం వచ్చేసింది ఇయ్యనేమో చేయవలసిన ప్రణాళికా రచన చేయట్లేదు ఇంతకీ ఎక్కడ బయలుదేరారు పిడుగు ధ్వని వెలుతురు ముందు ప్రణాళికా రచనా అన్నది ఒకటి ఉండాలిగా ఆయన కోప్పడ్డాక నీవు వానరాల్ని పిలవడం వేరు నీవు ముందు ప్రణాళిక ఏది నీకు రేపు రాముడొచ్చి అడిగితే ఏం చెప్తావ్ కనీసం అయ్యా నేను ఒక కబురుచేశానండీ అని చెప్పడానికి నీకు ఒకటుండాలిగా నీవు చేసినపని అసత్యం చెప్పలేవుగా రామునితో ఇప్పుడు ప్రభువుని రక్షించడం అంటే... అది మంత్రి అంటే, కనీసంలో కనీసం ఇయ్యనకి గుర్తుచేసి ఆ సైన్యాధిపతిని పిలిచి ఒరే సైన్యాలన్నిటిని సిద్ధం చెయ్యండిరా మనం ఎప్పుడో ఒకప్పుడు వెళ్దామంటే ఒకవేళ రాముడికి కోపం వచ్చినా అయ్యా నేను కబురు చేశానండీ అని చెప్పడానికైనా ఉంటుంది బ్రతుకుతాడు రాజు. రాజును రక్షించాలి సచివుడు కాబట్టి మహానుభావుడు అయ్యాడు హనుమా... అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు మనుష్యులు.
ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు కాబట్టే ఇప్పుడు ఆయన సాచిన్యం చేశారు కాబట్టి ఆయన ఆలోచించారు ఆలోచించి సుగ్రీవుడి దగ్గరికెళ్ళి ఆయన ఒక మాట చెప్తున్నారు తత్ ఇదం వీర కార్యం తే కాలాతీతమ్ అరిందమ ! క్రియతాం రాఘవ స్య ఏతత్ వైదేహ్యాః పరిమార్గణమ్ !! నీవు మిత్రకార్యమును చేయవలసినటువంటి అవసరముంది నీకు మిత్రులు ఉపకారం చేశారు తిరిగి నీవు ప్రత్యుపకారం చెయ్యాలి ప్రత్యుపకారం చెయ్యడమనేటటువంటిది నీ మనసులో అవకాశం సావకాశం అని అనిపించినప్పుడు చేయ్యడం కాదు ఏ కాలంలో చెయ్యాలో ఆ కాలంలో చెయ్యాలి ఏ కాలంలో చెయ్యాలని రాముడు చెప్పాడు, వర్షాకాలం అయ్యాకని రాముడు చెప్పాడు వర్షాకాలం అయిపోయింది నీవు మొదలు పెట్టాలి ఇప్పుడు రాముడివైపునుంచి కాదు ఇప్పుడు మొదలవ్వాల్సింది, రాముడు నీకిచ్చిన సమయం అయిపోయింది ఇప్పుడు ప్రత్యుపకారం నీవైపునుంచి మొదలవ్వాలి నీవూ దాన్ని విస్మరించావు, కాబట్టి ఎప్పుడైతే నీవు విస్మరించావో నీవు కృతాపరాధుడవయ్యావు అపరాదం చేసినవాడివయ్యావు ఆయనా... ఆయనా ఇంకా చాలా గొప్ప ధర్మంలో ఉన్నాడు ఏమిటి ఆయన పట్టుకున్న గొప్ప ధర్మం న చ కాలమ్ అతీతం తే నివేదయతి కాలవిత్ ! త్వరమాణోపి సన్ ప్రాజ్ఞ స్తవ రాజన్ వశానుగః !! ఇచ్చిన కాలం దాటిపోయింది సుగ్రీవుడు ఏ ప్రయత్నం చెయ్యట్లేదు అని తెలిసున్నా... ఆయన ఇంకా ఓపిక పడుతున్నాడు పోల్లేచూద్దాం చూద్దాం చూద్దాం అని ఆలోచిస్తున్నాడు నీయంత నీవు ముందుకొస్తే తను ఒక కఠినమైన మాట అన్నానన్న బాధ తనకు మీగిలినీయకూడదని నీవు ఇది గుర్తించట్లేదు గుర్తించకుండా కాలమును దుర్వినియోగం చేస్తున్నావు ఒకసారి దుర్వినియోగం కానీ అయ్యిందో ఆ తరువాత నీవు మనసులో ఉపకారం చేద్దామని అనుకున్నాసరే కాలమునందు చెయ్యవలసినది చెయ్యలేదు కనుకా నీవు ఏం చేయ్యవలసి ఉంటుందో తెలుసా..! తల వంచుకుని నిలబడి క్షమార్పణ చెప్పి ఆ పని చెయ్యవలసి ఉంటుంది.

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు ఆ పనిచేసినా చెయ్యవలసిన వేళకి చేసివున్నవాడన్న ఖ్యాతి ఉండదు మరిచిపోయి గుర్తుచేస్తే చేసినవాడన్న పేరువస్తుంది. చెయ్యలేదా చేశావు ఉపయోగముందా..? లేదు. మీకండీ..! రామాయణంలో, టైం మేనేజ్ మెంట్ అని ఇవ్వాళ అంటున్నారు ఈ టైం మేనేజ్ మెంట్ అన్న కోణంలో రామాయణాన్ని మాట్లాడితే శ్రీరామాయణము టైం మేనేజ్ మెంట్ అంటే కాలమును చక్కగా దక్షతతో వినియోగించుకోనుట అని నిజంగా మేనేజ్ మెంట్ సైన్ససెస్ చదువుకునేటటువంటి స్టూడెంట్సకీ శ్రీరామాయణంలోంచికానీ అన్వయంచేస్తే నేను మీకు నిజం చెప్తున్నాను ఎక్కడా దొరకనంత గొప్ప విషయాలన్ని శ్రీరామాయణంలో దొరుకుతాయి. ఎంత గొప్పగా మాట్లాడుతాడో ఎన్నిచోట్ల వస్తుందో చెయ్యవలసిన సమయమునందు చెయ్యవలసిన పని, సుందర కాండలో కూడా అత్యద్భుతంగా ప్రస్తావన చేస్తారు దీనిగురించి, కాబట్టి అందుకే నేను మీతో మనవి చేసింది శ్రీరామాయణం అనేక కోణములలో మనకి నేర్పుతుంది. వ్యామోహాలకి లొంగిపోకుండా చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసిన పనిని టక్ మని లేచిపోగలిగిన శక్తి ఎక్కడనుంచి వస్తుందంటే... రామాయణంలోంచే వస్తుంది కాబట్టి న చ కాలమ్ అతీతం తే నివేదయతి కాలవిత్ ! త్వరమాణోపి సన్ ప్రాజ్ఞ స్తవ రాజన్ వశానుగః !! అని అకర్తురపి కార్య స్య భవాన్ కర్తా హరీశ్వర ! కిం పునః ప్రతికర్తు స్తే రాజ్యేన చ ధనేన చ !! రాజా! నీవు ప్రత్యుపకారం చేసేటటువంటి స్వభావం లేనివాడవని నేను అనడంలేదు నీవు అటువంటివాడివని నేను అనను ఎందుకంటే ప్రత్యుపకారం చెయ్యడం కాదు నీకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా..! అసలు ఉపకారం చెయ్యనివాడికి ఉపకారం చేస్తావు అంత మంచివాడివి, చాలా మంచివాడివి అందులో ఇంక సందేహమేమీలేదు.
Image result for sugrivaభవాన్ కర్తా హరీశ్వర ఓ వానర రాజా! నీవు అటువంటి ఉపకార బుద్ధి కలిగినవాడివి కానీ కిం పునః ప్రతికర్తు స్తే రాజ్యేన చ వధనేన చ రెండు గొప్ప కార్యములను చేశాడు రాముడు ఒకటీ రాజ్యం ఇచ్చాడు రెండు రాజ్యం ఇవ్వడం కాదు ఎవరు బ్రతికుండగా నీకసలు రాజ్యము ప్రాణమూ భార్యా ఈ మూడు సంశయాత్మకమో... అటువంటివాన్ని తన ప్రాణాలు ఫనంగాపెట్టి చంపాడు. వాలి ఇలా చూశాడనుకోండి ఆయన వేగానికి హద్దుందాండి ఇంకా అంటే రాముడు నిగ్రహించలేడా అన్నది పక్కన పెట్టండి చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేస్తుందా వచ్చేయదా..? కాబట్టి తన ప్రాణములను ఫనంగాపెట్టి రాముడు వాలిని వధించాడు. నీవేం చేస్తున్నావు చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసినటువంటి పని చెయ్యాలి, ఏమండీ నేను ప్రత్యుపకారం చెయ్యనివాన్ని కాను ఎవరో నాకు ఉపకారం చెయ్యనివాళ్ళకు కూడా నేను ఉపకారం చేశాను నేను వాళ్ళకి చేశాను వీళ్ళకి చేశానంటే నీవు నోరు మూయవయ్యా... నీవు అసలు రాజ్యాన్ని చేయడానికి ఎవరిచ్చారు ఆయనకి చెయ్యనివాడివి మిగిలినవాళ్ళకు చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత అసల్దిచేశావా అని అడుగుతాడు ఏది ముఖ్యమో అది వదిలిపెట్టావు. ఏవి చిన్న చిన్నవి అవి చేసినా చెయ్యకపోయినా ఫర్వాలేదో అవి చేస్తున్నావు ఏమిటి ఉపయోగం కొన్ని వేళ పట్టున చెయ్యవలసినవి ఉంటాయి కొన్ని వేళ తప్పి చేసినా వచ్చే ప్రమాదమేమీ ఉండదు అవి వేళపట్టున చేయవలసినవి వేళ పట్టున చేయవలసిందే.
Image result for sandhya vandanaదానికి మీరు ఎంత ఖచ్చితంగా ఉండాలంటే అందులో ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి, ప్రత్యేకించి బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం వేళలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూజా మందిరంలోకి వెళ్ళిపోవాలి, పూజామందిరంలోకి

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
వెళ్ళడానికి తను దానికి సిద్ధపడడానికి మధ్యలోకి ఎంతో అవసరమైతే తప్పా అసలు తప్పించడానికి కుదరకపోతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్యాన్ని మీరు దాని మధ్యలోకి రావడాన్ని అనుమతించకూడదు. ఉదయం లేవడం అంటే దేని కొరకు పూజా మందిరంలోకి వెళ్ళిపోవడం కొరకే దానికీ దీనికి మధ్యలోకి ఏదీ రావడానికి వీళ్ళేదు. అది భక్తి రస సంబంధమైన టీవీలోని కార్యక్రమమే కావచ్చు రావడానికి వీళ్ళేదు. మీ కాయిక కైంకర్యం ఏమైపోయింది సింహాసనం దగ్గర మీరు మీ సింహాసనాన్ని అర్చించద్దూ మీరు వెళ్ళిపోవాలి అంతే పూజామందిరంలోకి. ఏవో కొన్ని కొన్ని ఉంటాయి శరీర మాధ్యం ఖలు ధర్మసాధనం అని, ఒక్కొక్కడికి వ్యాయామం చెయ్యకపోతే ఇబ్బంది తప్పదు వెళ్ళాలి వాడి ఖర్మా వాడికి భక్తున్నావెళ్ళాలి, నేను మీతో మనవి చేసేది అదే అప్పుడు కూడా మీరు మానసికం చేసేయ్యచ్చు. ఇతరుల దృష్టిలో మీరు వాకింగ్ కి వెళ్ళినట్లు ఉండచ్చు కానీ మీరు దాన్ని ఈశ్వరారాధనగా మార్చుకోవచ్చు మీరు బెంగపెట్టుకోవక్కరలేదు అయ్యో నేను చెయ్యలేదు అనుకోవక్కరలేదు ఆ ఆర్తిని ఈశ్వరపూజగా మల్చుకుని శరీరంతో వ్యాయామంచేసి రాగానే మీరు వెళ్ళిపోవాలి అంతే పూజామందిరంలోకి తప్పా ఇక దాని మధ్యలోకి ఇంకోటి వచ్చేసింది అంటే నీ శ్రద్ధ నశించిపోయింది అని గుర్తు.
ఇదే రావణాసురిడి విషయంలో సీతమ్మ అంటూంది సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితామ్ ! పూజామివ పరిక్షీణామాశాం ప్రతిహతామివ !! ఉపాసనా రహస్యాలు చెప్పింది కాబట్టి సుందర కాండ, సుందర కాండ సుందర కాండే... శ్రీరామాయణంలో అదొక జీవధార సుందర కాండ వచ్చేస్తుందా ఇంకెంత దూరం ఇంకో రెండు మూడు రోజులు కాబట్టి హనుమ మాట్లాడటమంటేనండీ శ్రీరామాయణంలో అలా ఉంటుంది ఆయనా మహానుభావుడు ఆయన ఎక్కడైనా మాట్లాడితే మీరు చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. చదివి ఇది నా జీవితంలో అన్వయం చేసుకునేటప్పుడు ఎక్కడ వస్తూంది పొరపాటు దీనిని నేను ఎక్కడ దిద్దుకోవలసి ఉంటుంది అని ఆలోచించుకుని మీరు వెంటనే మీ జీవితంలోకి సమన్వయం చేసుకోవడంలో కృతకృత్యులు కావాలి, అప్పుడు రామాయణం మీకు ఉపయుక్తమౌతుంది కాబట్టి రాజా నీవు తొందరపడవలసి ఉంటుంది వెంటనే రామునికి ప్రత్యుపకారం చెయ్యి. ఇప్పుడు హనుమ చెప్పిన మాటా అంటే వింటాడు వినడం సుగ్రీవుడి లక్షణం వినకపోవడం రావణాసురుని లక్షణం, తప్పు చేయడం తప్పుకాదు వినగలిగినటువంటి ప్రజ్ఞవుంటే బయటికొస్తారు ఫర్వాలేదు కాబట్టి ఆయన ఇప్పుడు వెంటనే నీలున్ని పిలిచాడు, పిలిచి స సందిదేశ అభిమతం నీలం నిత్యకృత ఉద్యమమ్ ! దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానామ్ ఉపసంగ్రహే !! అన్ని దిక్కుల నుండి వానరములన్నిటిని కూడా పిలుపించు, పిలిపించి సిద్ధంగా ఉంచు మనం రామ కార్యంమీద వెడదాం.
ఇదొక్కటే చెప్పి మళ్ళీ మరిచిపోయాడు అంతే మళ్ళీ మధుసేవనం మళ్ళీ భార్యలతో రమించడం అందులో పడిపోయాడు కానీ ఈ మాట సుగ్రీవున్ని బ్రతికించేసింది, అది ప్రభువుని బ్రతికించడం అంటే ఈ ఒక్కమాట చెప్పి ఉండి ఉండకపోతే నిజంగా సుగ్రీవుడు చెప్పుకోవడానికి ఏమీలేదు లక్ష్మణునితోటీ రామునితోటీ ఇది నీలునికి చెప్పాడు కాబట్టి బ్రతికిపోయాడు సుగ్రీవుడు. ప్రాణభిక్ష పెట్టారండీ హనుమా! సచివుడు మంత్రీ అంటే అర్థమేమిటంటే... నిర్మోహమాటంగా తనమీద పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క హితాన్ని ప్రజాహితాన్ని కోరి అందులో ఏ మోహమాటం లేకుండా సలహా

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
Image result for sugreevaచెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశించినవాన్ని మంత్రీ అని పిలుస్తారు. అలా ఉండాలి సచివుడంటే, కాబట్టి హనుమ వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడితో మాట్లాడాడు నీలున్ని పిలిచి ఆదేశమిచ్చాడు ఇచ్చిన తరువాత ఆ నీలుడు బయలుదేరాడు అని మనం అనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు హనుమ ఏది ఊహించారో అది నిజమౌతూంది, మహాత్ముల ఊహలు ఎందుకు పోతాయండీ ఉత్తిగనే పోవు శరత్ కాలం వచ్చేసింది శరత్ కాల చిహ్నములను వర్ణించాడు రామ చంద్ర మూర్తి లక్ష్మణుడితోటి వర్ణించి ఆ లక్ష్మణునితో ఒక మాట చెప్పాడు అన్యోన్య బద్ధ వైరాణాం జిగీషూణాం నృపాత్మజ ! ఉద్యోగ సమయః సౌమ్య పార్థివానామ్ ఉపస్థితః !! ఇయం సా ప్రథమా యాత్రా పార్థివానాం నృపాత్మజ ! న చ పశ్యామి సుగ్రీవమ్ ఉద్యోగం వా తథా విధమ్ !! ఇప్పుడూ శరత్ ఋతువు వచ్చింది కాబట్టి ఆకాశమంతా పిండారవేసినట్టుగా వెన్నెల ప్రకాశిస్తుంది కాబట్టి విశేషమైన చలిగాలులుకాని వర్షాలు కానీ ఉండవు వేడి ఉండదు కాబట్టి రాజులందరు కూడా జైత్ర యాత్రలు చేస్తూ వాళ్ళు మనసులో విజయం పొందాలన్న ఆకాంక్షతో నెరవేర్చుకునేటటువంటి సమయం ఆసన్నమైంది.
ఆ దిశగా ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు అంటే ప్రయత్నం. ఆ దిశగా రాజులందరూ ప్రయత్నం చేస్తున్నారు నేను కూడా సీతమ్మ యొక్క యడబాటువలన కలిగినటువంటి శోకమునుండి బయటికి రావడము కొరకు రావణాసురునిమీద యుద్ధానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఎవరు నాకు ఇందులో తోడ్పడాలో ఆ తోడ్పడవలసినటువంటి ప్రధాన వ్యక్తియైన సుగ్రీవుడు మాత్రం అసలు దీని గురించి పట్టించుకున్నట్లు లేదు విస్మరించాడు. అసలు ఇటువంట ప్రయత్నమొకటి చెయ్యాలి అన్న ఆలోచన ముందు ఎవరికి రావాలో ఇప్పుడు ఎవరికి వస్తే తప్ప కదలదో ఆయనకి రాలేదు. అంటే రాముడొక్కడు చెయ్యలేడాండీ... నరుడి కథగా మీరు వినండి, నేను మీతో తరచు మనవి చేస్తున్నాను ఇది ఇప్పుడు ఈ ఆక్రోశంలోంచి ఏ మాట వస్తూందో అదేవస్తుంది. మనల్నీ ఒకాయనపట్టించుకోలేదనుకోండి అస్సలు ఏ ప్రాధాన్యతా ఇవ్వకుండా ఏమీ పట్టించుకోకుండా నేను చేస్తానులేండి తప్పకుండాననీ అసలాయన దాన్నిచెయ్యడానికి ఆలోచనే చెయ్యలేదనుకోండి అప్పుడు మీరు ఏమంటారు, అవునూ... నా గురించి ఎందుకు పట్టించుకుంటారు ఇప్పుడు నా అవసరం ఏంలేదుగా, ఇప్పుడు నా పని ఆయనకేం లేదు నన్ను చేతకానివాడు అనుకుంటున్నాడు నేను చెయ్యలేననుకుంటున్నాడు, అందుకని ఇప్పుడు నా గురించి ఆలోచన ఎందుకు చేస్తాడు నేను వెళ్ళి ఆయన్ని అడిగితే చేసిపెడతానన్నాడు కానీ ఏమండీ నేను చేస్తాను చెయ్యట్లేదు అని కనీసం ఆ మాట జ్ఞాపకం ఉందని కూడా అనట్లేదు చూశావా? అంటాడా అనడా... నరుడన్నవాడి స్వభావం అలాగే ఉంటుంది తరువాతి మాట అదే రావాలి అలా రాకుండా ఏదో త్రికాలవేదిలా వశిష్ఠుడిలా విశ్వామిత్రుడిలా నాకు తెలుసు నీలున్ని పంపించాడు ఆ తరువాత వ్యామోహంలోంచి బయటికి వస్తాడు ఇలా మాట్లాడాడనుకోండి నరుడవడు.
నేను అందుకే తరచు మనవి చేస్తుంటాను శ్రీ రామ కథ నర కథా ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తాడూ అని చెప్తుంటాను, కాబట్టి ఆయన అన్నాడూ అనాథో హృత రాజ్యో అయం రావణేన చ ధర్షితః ! దీనో దూర గృహః కామీ మాం చైవ శరణం గతః !! లక్ష్మణా సుగ్రీవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా... అనాథో నేను అనాథున్ని నాకు ఎవ్వరూ లేరు నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు హృత రాజ్యో ఆయం నాకు రాజ్యం పోయింది రావణేన చ ధర్షితః నేను రావణుని చేత అవమానింపబడినవాడిని దీనో దీనున్ని, నా భార్యను నేను రక్షించుకునే స్థితిలో లేనివాణ్ణి దూర గృహః ఇంటినుంచి చాలా

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
Image result for sugrivaదూరంగా ఉన్నాను కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేనివాణ్ణి ఎవరూ లేరు కానీ భార్య గురించి పరితపిస్తున్నటువంటివాణ్ణి మాం చైవ శరణం గతః నేను ఆ సుగ్రీవున్ని శరణాగతి చేసి ఉన్నవాణ్ణి కాబట్టి ఇప్పుడు ఆయన అనుగ్రహాన్నిబట్టి నా జీవితంతప్పా నా గురించి ఆయన పట్టించకోవాలని ఎక్కడుంది లక్ష్మణా..! ఈ మాట లక్ష్మణునికి కోపం తెప్పిస్తుందా తెప్పించదా, అన్నయ్య ఏడిస్తే చూడలేని స్వభావమనుకోండి ఒకాయంది, కొంత మంది రక్తం చూస్తే కళ్ళుతిరిగిపడిపోతారు ఆయన్ని తీసుకెళ్ళి మీరు నా గోరుచుట్ట ఆపరేషం చేయండి అని ఆపరేషన్ చేసేటప్పుడు నీవు నా చెయ్యిపట్టుకో అంటే మీరు బాగానే ఉంటారు తరువాత సోడా క్యారేజు మీరు తేవాలి కదా... ఆయన రక్తం చూస్తే తట్టుకోలేడూ అన్నప్పుడు మీరు ఆయన్ని తీసుకెళ్ళకూడదు ఆయన గోరుచుట్ట ఆపరేషన్ చేయించుకోవడానికి అంతేకదాండి... మరి లక్ష్మణుడు రాముడి ఖేదాన్ని చూడలేడని రామునికి తెలుసు మరెందుకు మాట్లాడుతున్నాడు అంటే ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి శోకాన్ని ఆపడానికి నిగ్రహించడం ఎవ్వరికైనా సాధ్యంకాని స్థితి వస్తుంది. నరుడంతే అంతే... మనుష్యులు అన్నమాటకు అర్థమేమిటంటే నిగ్రహించలేనంత బాధ కలుగుతుంది అది తన భార్యవిషయంలో కలిగితే ధర్మబద్ధం.
అది పరకాంతయందు కలిగితే తప్పు తప్పా తనభార్యయందు కలిగితే వేళ దాటిపోతూంది శరత్ ఋతువు కూడా వచ్చేసింది మరి ఆయన బాధ పడ్డాడంటే అందులో తప్పేముంది అటువంటప్పుడు నన్నిలా పట్టించుకోలేదని మాట్లాడటం ఎంత సహజంగా పూర్ణమైన నరుడిగానే రాముడు మాట్లాడుతున్నాడు తప్పా ఒక ఈశ్వరుడిగా రాముడు ఎప్పుడూ మాట్లాడలేదు రామాయణంలో కాబట్టి ఇతి ఏతైః కారణైః సౌమ్య సుగ్రీవ స్య దురాత్మనః ! అహం వానర రాజ్య స్య పరిభూతః పరంతప !! అదిగో దురాత్ముడైనటువంటి సుగ్రీవుడున్నాడే నన్ను పట్టించుకోకుండా ఇలా అవమానిస్తున్నాడు నేను ఈ ఊరిబయట ఈ పర్వత గుహలో ఇలా పడున్నాను తం ప్రవిశ్య చ కిష్కిన్ధాం బ్రూహి వానర పుంగవమ్ ! మూర్ఖం గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్ మమ !! నీవు కిష్కింధా నగరంలోకి వెళ్ళు అంతఃపుర ప్రవేశం చెయ్యి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు గ్రామ్య సుఖం అంటే కేవలం కామోప భోగమే జీవితానికి ప్రయోజనంగా బ్రతుకుతున్న ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వచనాన్ మమ నా మాటగా చెప్పు అర్థినామ్ ఉపపన్నానాం పూర్వం చ అపి ఉపకారిణామ్ ! ఆశాం సంశ్రుత్య యో హన్తి స లోకే పురుషాధమః !! మిత్రులైనవారి దగ్గర ఉపకారాన్ని పొంది ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చీ చెయ్యవలసిన ప్రత్యుపకారాన్ని చెయ్యకుండా వేళదాటిపోయినా దానిగురించి పట్టించుకోనివాడు ఎవడున్నాడో వాడిని పురుషాధముడు అని లోకం పిలుస్తోంది శుభం వా యది పాపం యో హి వాక్యమ్ ఉదీరితమ్ ! సత్యేన పరిగృహ్ణాతి స వీరః పురుషోత్తమః !! ఆ చేసేటటువంటిది పాపమా పుణ్యమా అన్నది కూడా పక్కనపెట్టి మిత్రుడికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ కార్యం చెయ్యడానికి ప్రయత్నించేవాడెవడో వాణ్ణి పురోషోత్తముడూ అని పిలుస్తారు.
కృతార్థా హి అకృతార్థానాం మిత్రాణాం న భవన్తి యే ! తాన్ మృతాన్ అపి క్రవ్యాదః కృతఘ్నాన్ న ఉపభుంజతే !! ఎవడు మిత్రుడు చేసిన ఉపకారమువలన తానుగట్టెక్కి, మిత్రుణ్ణి గట్టెక్కించడానికి తాను ఉపకారం చెయ్యవలసిన సమయంలో చెయ్యకుండా ముఖం చాటేసి తిరిగి జీవితాన్ని వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం చేస్తాడో అటువంటివాడు మరణించిన తరువాత వాని శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు అని చెప్పు నూనం కాంచన పృష్ఠస్య వికృష్ట స్య మయా రణే ! ద్రష్టుమ్ ఇచ్ఛన్తి చాప స్య రూపం విద్యుత్ గణ ఉపమమ్ !! బంగారు మొనలతో ఉన్నటువంటి నా ధనస్సుని పట్టుకుని మళ్ళీ నేను యుద్ధభూమిలో నిలబడి వింటినారిని విప్పి ధనస్సుని సంధించి నా అక్షయ బాణతూణీరంలోంచి మెరిసిపోతున్న బంగారుబాణాన్ని వింటినారిని

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
టంకారం చేసి బాణమును తొడిగి ప్రయోగించడానికి సిద్ధపడినప్పుడు వచ్చేటటువంటి పిడుగుల ధ్వనిని వినడానికి సిద్ధంగా ఉన్నాడని సుగ్రీవుడు ఉన్నాడో కనుక్కో... అంటే విడిచిపెట్టడానికి సిద్ధంగాలేనని చెప్పు, ఎంత మర్యాదగా ఉంటుందో చూడండి ఆ మాట. నిన్ను చంపేస్తాను అనడు నా బాణపు అల్లెత్రాడు కట్టి బాణప్రయోగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి ధనస్సు టంకారమును యుద్ధభూమిలో వినాలనుకుంటున్నాడా... అడుగు. అంటే శత్రువుగా నిలబడిపోవలసి వస్తుందని గుర్తుపెట్టుకొమ్మను అని కఠినంగా మాట్లాడడు ఆ మాటలో కూడా ఎంతసౌమ్యంగా ఉంటుందో అప్పుడు కూడా మాటలో ఎక్కడ అశ్లీలతకానీ అసలు ఆ మాటలో వ్యగ్రతకానీ కనపడవు అంత అందంగా ఉంటుంది ఆయన మాట్లాడితే అందుకే శ్రీరామాయణాన్ని బాగాచదివి రామాయణం బాగాజీర్ణమైనటువంటివాళ్ళు కోపంతో మాట్లాడినా అందంగానే ఉంటుంది ఎందుకంటే ఆ భాష అంతటి సుసంపన్నమైన హృదయం అలవాటౌతాయి.
Image result for sugrivaకాబట్టి నచ సంకుచితః పన్థా యేన వాలీ హతో గతః ! సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథమ్ అన్వగాః !! వాలి వెళ్ళిపోయినటువంటి మార్గము ఇంకా మూసుకుపోలేదు ఇంకా తెరిచే ఉందని తెలియజేయి, అలా వెళ్ళకూడదూ అంటే తాను అన్నమాట నిలబెట్టుకోవాలి అని చెప్పు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు అంటే? అటుపంపిస్తానని చెప్పు వాలి ఎటు వెళ్ళాడు మృత్యువుని పొందాడు అదే పొందుతాడని చెప్పు ఆమాట నోటితో అనడు ఎందుకంటే మిత్రుడి విషయంలో అసలు ఆమాట నోటివెంట రాకూడదు, కాబట్టి ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి తన ధర్మం నుంచి తాను ఒక్క అడుగు తొట్రుపడకుండా నిలబడుతుంటాడు ఎప్పుడు ఆకోపంలో కూడా అందుకే మహానుభావుడు కోపం తెచ్చిపెట్టుకుంటాడు తప్పా కోపానికి వశుడు కాడు ఆయన ఒక్క అరణ్యకాండలోనే ఆయన వశుడైంది, లక్ష్మణుడు చెప్పగానే మళ్ళీ మాట విన్నాడు అంతే. కాబట్టి అంత అందంగా ఉంటుంది ఆ మాట, కోపానికి వశుడైపోయినవాడి మాటలు వాడి వెర్రికేకలు వాడి నోటిలోంచి వచ్చే ధూర్తప్రలాపనా ఇంకోలా ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుని తను ఎక్కడ మనసులో బాధపడుతున్నాడో దాన్ని అవతలవాడికి సందేశాత్మకంగా అందించాలని ఉన్నటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటివాని వాక్ ధోరణి అనన్యసామాన్యంగా ఉంటుంది. భావము యొక్క వ్యగ్రత ఉంటుంది తప్పా భాషయందు వ్యగ్రత ఉండదు భావము మాత్రము సుస్పష్టంగా ఉంటుంది అందులో సందేహమేమీ ఉండదు, కానీ భాష మాత్రం అమంగళ కరమైనదికానీ అశ్లీలమైనదికాని వినడానికి ఖేదంగా ఉండేటటువంటిది కానీ అటువంటి భాష వాడరు ఎందుకో తెలుసాండి అక్షరములన్నీ కూడా పరాశక్తి యొక్క స్వరూపము. అమ్మవారి స్వరూపము ఇదివేరు ఈ స్వరూపాన్ని స్థూలరూపం అంటారు ఇది కాకుండా అమ్మవారికి ఒక రూపం ఉంటుంది ఆ రూపం అక్షరాలన్నీ సంస్కృతంలో మాత్రుకలు అని పిలుస్తారు ఆ అక్షరాలన్నీ ఏవి ఉంటాయో... ఆ అక్షరాలన్నీ అమ్మవారి స్వరూపాలు.
శబ్దము మనము అక్షరాన్ని ఉపయోగించడానికి నాలుకని తిప్పినప్పుడు ఉపయోగించేటటువంటి మాట ఉందే అది ఆశక్తి అమ్మవారి అనుగ్రహంతో పలుకుతాము అక్షరాలు అందుకే అక్షరములే పదములౌతాయి, పదములు వాక్యములు అవుతాయి వాక్యములలో అర్థం ఉంటుంది. మీరు అక్షరాల్ని ఎన్నిమార్లు దుర్వినియోగం చేశారో అన్నిమాట్లూ పరాశక్తి లెక్కలోకి తీసుకుంటుంది. వీడు నా స్వరూపాన్ని ఖేదపరిచాడు అక్షరస్వరూపాన్ని దుర్వినియోగం చేశాడు అందుకే మాట బాగా పొందికగా ఉండాలి తప్పా మాటలో అసలు ఏమాటలు నోటివెంటరాకూడదో ఆమాటలు నోటివెంట తరచు ప్రయోగించడం కానీ ఏమాటలు నోటివెంట అస్తమానం మాట్లాడకూడదో ఆ మాటల్ని వాడడం కానీ చెయ్యకూడదు. మాటకున్నటువంటి బలహీనత ఏమిటో తెలుసాండీ..! మనసు పట్టుకుంటుంది దానికి అదొక పెద్ద ఇబ్బంది, నేను మీతో చెప్పానుగా బలహీనతా బలము అవే... మీరు చాలా సేపు మీకు రాకపోయినా మీరు అలా వినండి ఆ గురుప్రార్థన అదేపనిగా ఓ గంటసేపు విన్నారనుకోండి అంతవరకు ఎందుకండీ పోనీ గురు ప్రార్థన కాసేపు వదిలేయండి పోనీ ఏదో సంస్కృతంలో సంక్లిష్టపదజాలంతో ఉందండీ అంటారా పక్కన పెట్టేయండి. మీరు ఏదో రామదాసుగారి కీర్తన పెట్టుకుని ఒక గంటో గంటన్నరో అలా కీర్తనలు విన్నారనుకోండి అన్ని కీర్తనల మీద మీ మనసు నిలబడదు వచ్చినబాధ అది, మీకు ఏదో ఒక కీర్తనమీదకెళ్ళి మీ మనస్సు రంజిల్లుతుంది పొంగుతుంది అది మీరు ఏం చేస్తారంటే రిప్లైనొక్కి మళ్ళీ వింటారు అంతా అయిపోయిన తరువాత ఒరే మళ్ళీ అదొక్కసారిపెట్టు అని మళ్ళీ వింటారు.
Image result for రమణుల దగ్గర నెమలి

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
అయిపోయిన తరువాత మీరు తువ్వాలు ఆరేసుకోవడానికి వెళ్ళినప్పుడు వెళ్ళి “తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ” అంటారా అనరా..? మీకు సంగీతమొచ్చని అన్నారా... పట్టేసుకుంది నాలుక మీరు చూడండి నోట్లో ఆడుతుందిరా ఇవ్వాళ ఇది బాగాలేదురా ఇదేం బాగాలేదు అంటారు మీరు వినకూడనిదివిన్నా అంతే పట్టేసుకుంటుంది మీరు అదే పనిగా ఏవి వినకూడదో అది వింటున్నారనుకోండి అవే వస్తాయి ఇవ్వాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసాండి, నేను పదే పదే విమర్శించానని మీరు అనుకోవద్దు ఇలా నొక్కితే మారేటటువంటి వాటిలో మీ కళ్ళముందు మీ చెవులకీ ప్రధానమైనటువంటి ఇంద్రియాలన్నింటికీ కూడా మీరు అదేపనిగా పిల్లలకి విషాన్నే అందిస్తున్నారనుకోండి వాళ్ళ మనస్సు ఎక్కడికెళ్ళిపోయి కూర్చుంటుంది అక్కడే కూర్చుంటుంది. దానిమీదే ఇంక వ్యామోహం పెరిగిపోతుంది ఇంద్రియాలు ఎప్పుడూ దానిమీదే పనిచేస్తే మనసుదానితో తాదాత్మకత చెందిపోతుంది, వెంపర్లాడిపోతుంది దానికోసమే అదే చూడాలి అదే చూడాలి అదే చూడాలి అని తాపత్రయం ఏముంది చూడ్డానికి అందులో అని పడుకోలేడు మారి మారి మారి అదీ... రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు మెరిగిన నెమలీ అంటారు.
ఆయనా మనసు గురించి మాట్లాడుతూ ఓకసారీ ఎంత చెప్పినా శిష్యుడికి అర్థంకాలేదు, అర్థం కాకపోతే ఆయన అన్నారు నీకు చూపిస్తాను చూడు మనస్సు అంటే ఎలా ఉంటుందో ఇవ్వాళ మధ్యాహ్నం మూడైంది కదా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు లోపల నల్ల మందు ఉంది ఓ నల్ల పూసంత నల్లమందు పట్రా అన్నాడు. నెమలీ ఎప్పుడు తినలేదు ఎప్పుడూ ఏదో తింటూంది, తింటూన్న నెమలిని పిలిచి ఆయన నల్లమందు అక్కడ పెట్టి తినిపించారు ఆ చిన్న నల్లమందు గిళిక తింది అది, అది మర్నాడు మూడుగంటలకు వచ్చేసింది వచ్చి రెక్కలు అల్లారుస్తూ ఓ క్ర్యాంకణం చేస్తుంది. ఆయన మళ్ళీ ఓ పిసర నల్ల మందు పెట్టారు అది మళ్ళీ తినేసి వెళ్ళిపోయింది వెంటనే ఇక మూడయ్యేటప్పటికి మీరు ఎన్ని పెట్టండి ఆ నల్లమందు పెట్టకపోతే మాత్రం దానికి నిద్రపట్టదు అది ఇంకా ఏమీ తినదు మిగిలినవాటిని కూడా పొడిచేస్తుంది అంత గొప్ప నెమలీ ఒక్కసారి నల్లమందు రుచికి అలవాటు పడిపోయింది, ఇప్పుడు అది నల్లమందుకి బానిసైపోయింది. మీ మనసు నల్లమందు విషయమేకాదు మీ ఇంద్రియములనేటటువంటి ద్వారములు తెరచి దేన్ని లోపలికి పుచ్చుకోవడానికి అలవాటు చేశారో దాన్ని పుచ్చుకొమ్మనే అడుగుతుంది.

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
మీరు అదేపనిగా ఒకదానికి అలవాటుపడిపోయారనుకోండి ఇంక అదే పని ఇంక ఏముందండి ఇవ్వాళ లోకంలో నేను తరచు విమర్శించానని మీరు దయచేసి ఏమనుకోకండి, వేళలేదు పాళలేదు అసురసంధ్యావేళ దీపాలు పెట్టారు అంటే సనాతన ధర్మంలో ఈ దేశంలో ఒక గౌరవం ఉంది దీపం పెడితే ప్రతి ఇంటిలోనూ కూడా గృహలక్ష్మియైన ఆడది మంగళ సూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటుంది అవునాకాదా సంధ్యాదీపం వెలిగించారు అంటే మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుని ఓసారి ఆ గౌరమ్మకి నమస్కారం చేస్తారు. ఇవ్వాళ ఇలా సంధ్యాదీపం పెట్టి ఇలా టీవీ పెట్టగానే మెడలో మెగళ సూత్రాన్ని లాగేస్తుండడం లాగేసి విసిరేయడం శ్లోమోషన్ లో అది ఎంతదూరం వెళ్ళిపడిపోయిందో చూపిస్తుండడం లేకపోతే చచ్చిపోయినటువంటి శవాల్ని కాలుస్తున్నటువంటి దృశ్యాలు ఇంట్లో ఆ దిక్కున కనపడుతూ ఆ మంటలు యొక్క దృశ్యాలు ఆ గోడలమీద వాటిమీద పడుతూ ఉండడం భయానకంగా చూపిస్తుండడం కొట్టుకున్నవి పొడుచుకున్నవీ ఒకటికి నాలుగుమాట్లు రీప్లే చూపిస్తుండడం అర్ధరాత్రివేళ ఘోరమైనటువంటివాటిని సావధానంగా చూసే అలవాటు పిల్లలకు ఇవ్వడం ఇవన్నీ మీ పిల్లకిచ్చి మీ పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటే ఎలా కుదురుతుందండి వాళ్ళకి రోజూ విషం పెడితే విషకన్యా అవుతుంది తప్పా అది ఆవుదూడ ఎలా అవుతుంది. ఇవ్వాళ మన ధౌర్భాగ్యమంతా దీనిగురించే ఏడ్చారు మహానుభావులు శాసనసభల్లో సంస్కృతి నశించిపోతుందయ్యాని ఏడ్చారు సంస్కృతి నశించిపోయాక నీకు భౌతిక భోగము ఎంతున్నా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. Scientific advancement without an autonomy restraint totally dangerous to entire society మీరు ఆలోచించండి నేను అన్నమాట.
సెల్ ఫోన్ టూవీలర్ మీద వెళ్తూ మాట్లాడ కూడదన్నటువంటి నిగ్రహంలేనటువంటి వాడికి మీరు సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తే వాడికి వాడూను వాడితోపాటు ఇంకో కుటుంబమంతా ఆధారపడిన ఇంకోవ్యక్తి జీవితంకూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి. సైంటిఫిక్ అడ్వాన్సమెంట్ తప్పనాలా మనిషికి సెల్ఫ్ రెట్రెంట్ తనకు తాను నిగ్రహించుకోలేనటువంటి శక్తి లేకపోవడం తప్పనాలా నిగ్రహం లేకపోవడం తప్పు. నిగ్రహం అస్తమానం నీకు ఎవ్వడు నేర్పుతాడు అంగుళం అంగుళం కొలిచి ఇలా నేర్పుతారా మనిషివి కాబట్టి నీకుండాలి మనిషి మనిషిగా ఎలా బ్రతకాలే రామాయణం చదివితే వస్తుంది. ఆ రామాయణం అందుకే మనుషుల్ని మనుషులుగా ఇబ్బందిలేకుండా బ్రతకగలిగినటువంటి స్థితి కావాలీ అంటే మీరు ఏవి చూడచ్చో ఏవి చూడకూడదో మీ మనసు ఎందుకు పాడౌతుందో మీ మనసు ఎందుకు పవిత్రమౌతుందో మనోరంజకత్వం కోసం కావల్సి ఉంటుంది మనోరంజకత్వం అంటే నీవు కాసేపు ఉల్లాసంగా గడపాలి అంతే అంతవరకే. ఒక్కొక్కదాని ప్రయోజనం దేనికొరకూ అంటే దాని ప్రయోజనం అంతవరకే నీవు ఉల్లాసంగా కాసేపేదో బడలిపోయావు కాసేపు ఏదో ఉల్లాసంగా ఉండాలి కాబట్టి ప్రమాదకరము కాబట్టి ఉల్లాసభరితమైనటువంటిది చూడ్డానికి నీవు కొన్నింటిని వాడుకోవాలి, వినోదం వినోదం హద్దుల్లో ఉండాలి వినోదం వినోదపు హద్దులు దాటి వెళ్ళిపోయి నేను సమాజానికి బాగుచేయడానికి ఇవన్నీతీయలేదు అన్నమాట నీవు అనకూడదు తప్పది, దాని ప్రభావం సమాజంమీద ఉండి తీరుతుంది నీవు ఆమాటంటే ఎలా అవుతుంది. కుదరదది కాబట్టి ఇవ్వాళ ఈ హద్దులు ఎందుకు దాటిపోయాయంటే మనం రామాయణాన్ని మరిచిపోకుండా ఉండగలిగితే మనం ఖచ్చితంగా హాయిగా ఆనందంగా ఏవస్తువుని ఎక్కడివరకు వాడుకోవాలో అక్కడివరకు వాడుకోగలిగిన ప్రజ్ఞ బాషించి ఉంటాయి.

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
ఇది రామాయణం చెయ్యగలిగినటువంటి గొప్ప ప్రయోజనం ఇదీ మీరు పిల్లలు చూడండీ ఏదైనా కథ చెప్పు అమ్మమ్మా ఏదైనా కథచెప్పు తాతయ్యా అంటారు, ఏం కథ చెప్తాను రాత్రికి ఏడింటికి సీరియల్ వస్తుంది చూడండి అంటారు అంటే వాడు అదే చూసి మీరు అదే చూస్తే మీరు, మీరు కాదు మీరు చూడరు, నా గురించి నేను చెప్పుకునేదే కాబట్టి మీరు అసలు మనకు ఒకటి వస్తే... రా! నీకొక కథ చెప్తాను కూర్చో, ఏమైందో తెలుసా ఒకసారి సుగ్రీవుడు ఏం చేశాడో తెలుసా! ఏం చెప్పారో తెలుసా హనుమా! అదిగో నీవు దండం పెడతావే ఆ స్వామి బుద్ధిమతాం వరిష్ఠం ఏం చెప్పారో తెలుసా... కాలం దాటిపోతే ప్రమాదం వస్తుంది వేళ పట్టున చెయ్యవలసింది వెళపట్టున చెయ్యాలని చెప్పారు అని ఈ ఘట్టాన్ని చెప్పండి ఆ పసిపిల్ల మనస్సు మీద కాలము యొక్క విలువా చేయవలసిన పని చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమో నాటుకుంటుంది. పిల్లల హృదయాలు ఎటువంటివో తెలుసాండీ బాగా దుక్కి దున్ని నీరు పట్టీ ఇంక మీరు విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి క్షేత్రములవి అక్కడ మీరు తులసి గింజలను వేశారనుకోండి తులసి వనం అవుతుంది అక్కడ మీరు ఆకు మడి వేస్తే వరి చేను అవుతుంది మీరు అక్కడ చెరుకు వేస్తే చెరుకు తోట మీరు మారేడు చెట్లు వేస్తే మారేడు వనం మీరు గంజాయి మొక్కలు వేస్తే గంజాయి వనం. వేసేవాడిమీద ఉంటుంది తప్పా క్షేత్రంలో తప్పులేదు మీరు ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే అక్కడ లేస్తుంది, తప్పంటూ ఎక్కడైనా ఉంటే మనం పిల్లల మనసులో వెయ్యకూడనివి వేసిన పెద్దలది తప్పు తప్పా అది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న క్షేత్రంది ఎప్పుడూ తప్పుకాదు అందుకే పిల్లల మనసుల్లో వెయ్యవలసిన విత్తనం వెయ్యడం తన బాధ్యతగా గుర్తించకపోవడం కూడా దోషమే. తన కర్తవ్యం తను చెయ్యాలి పిల్లలకి చెప్పవలసింది తాను చెప్పాలి వాళ్ళు విన్నారా వినలేదా నీకు అనవసరం నీ కర్తవ్యం నీవు చేశావాలేదా ఒక్కడు బాగుపడ్డాడు చాలు మీ పిల్లలకి నీవు చెప్పాలి వాడు వినలేదా నీకనవసరం నీ కర్తవ్యం నీవు చేయ్ ఇది శ్రీరామాయణం మనకు నేర్పుతుంది.
కాబట్టి ఇప్పుడు ఆయన శరత్ కాలం వచ్చింది మాట్లాడుతూ ఆనాడు నేను వాలిని చంపితే ఒక్కన్నే చంపి వదిలిపెట్టేశాను ఆనాడు వాలి ధర్మం తప్పాడు చంపేశాను, తెలిసి తెలిసి ఇచ్చినమాట తప్పీ నేనేం చెయ్యగలనని సుగ్రీవుడు అనుకుంటే ఏం చెయ్యగలనో చెప్పు ఏక ఏవ రణే వాలీ శరేణ నిహతో మయా ! త్వాం తు సత్యాత్ అతిక్రాన్తం హనిష్యామి స బాన్ధవమ్ !! వాలిని ఒక్కన్నే చంపేశాను ఒక్క బాణంతో సుగ్రీవున్ని స బాన్ధవమ్ బంధువులందరితో చంపేస్తాను. ఇప్పుడు ఈ మాట లక్ష్మణుడు ఇది విన్నతరువాత అన్నయ్య అంత బాధపడుతున్నాడూ అంటే ఊరుకుంటాడాండీ! రెండిటికీ ఒక తేడా ఉంది. ఒకటి అంటిస్తే పేలిపోతుంది ఒకటి పేలద్దులే అనుకుంటే ఆరిపోతుంది దీనికి ఆ నిగ్రహశక్తి ఉంది దానికి ఆ నిగ్రహశక్తి Image result for sugreevaతక్కువ కాబట్టి ఇప్పుడు రాముడు అమ్మబాబోయ్ వీణ్ణి వెళ్ళమన్నాను నేను బాధపడ్డాను విన్నాడు ఇప్పుడు వెళ్ళి సుగ్రీవున్ని చంపినా చంపేస్తాడు బాణం పెట్టి, అక్కడ పరిస్థితి ఏమైనా కొంచెం తేడాపాడాగా ఉంటే పట్టించుకోనట్లు కనపడితే బాణమే వదిలిపెట్టేస్తాడు అంతే కాబట్టి వెంటనే పిలిచి అన్నాడూ... న హి వై త్వద్విధో లోకే పాపమ్ ఏవం సమాఽఽచరేత్ ! పాపమ్ ఆర్యేణ యో హన్తి స వీరః పురుషోత్తమః !! నాన్నా యుక్తా యుక్త విచ్ఛక్షణతో బాగా ఆలోచించి కేవలము పాపాత్ముడులే వాడు మారడానికి అవకాశంలేదన్నవాన్ని చంపాలి తప్పా మారడానికి అవకాశం ఉందీ వాడు ఒకమాటచెప్తే మారుతాడూ ఏదో తప్పు జరిగిపోయింది వాడు తనని తాను మరిచిపోయి ఏదో వ్యసనానికిలోనై కావాలని మరిచిపోయి కామమునకు వశుడై ఉన్నాడు తప్పా చెప్తే విని ఇప్పుడు మళ్ళీ బుద్ధిమార్చుకునేవాడు అనుకుంటే చంపకూడదు సుమా! అందుకని తొందరపడి సుగ్రీవున్ని చంపేసేవు.

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
అటువంటిపని చెయ్యకు న ఇదమ్ అద్య త్వయా గ్రాహ్యం సాధు వృత్తేన లక్ష్మణ ! తాం ప్రీతిమ్ అనువర్తస్వ పూర్వ వృత్తం చ సంగతమ్ !! నీవు వెళ్ళేటప్పుడు సుగ్రీవునితో పూర్వ స్నేహం ఎలా ఉండేదో మనం అందరం ఎంత ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళమో మనపట్ల సుగ్రీవుడు ఎంత ప్రీతిపాత్రుడో బాగా స్మరించుకుంటూ వెళ్ళు మీరు ఏది స్మరించుకుంటూ వెళ్తే మనసు అలా ఉంటుంది. మీరు వ్యగ్రతతో అన్నయ్యకోపమే తలచుకుంటూ వెళ్తుంటే కట్టలు తెరుచుకుంటుంది, మీరు ప్రీతిని స్మరించుకుంటూ వెళ్తే కొంచెం మంచిమాట చెప్పడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనసు మీ అదుపులో ఉంటుంది. లక్ష్మణుని మనసు లక్ష్మణుని అదుపులో ఉండేటట్లు చూస్తున్నాడు ఏ మనసు లక్ష్మణుని అదుపుతప్పుతోందని గుర్తించాడో దాన్ని మళ్ళీ లక్ష్మణున్ని అదుపులోకి తీసుకెళ్తున్నాడు అందుకని కదాండి గురవైయ్యారు ఆయనా... మహానుభావుడు అందుకే నేను గురువుగా వర్తిస్తున్నానన్నాడాయనా మాట ఎంత ప్రమాదమో... ఒక్కొక్కరు ఇంకొకరు ఖేదపడితే చూడలేరు అంత ప్రీతి ఉంటుంది ఆయన బాధపడ్డారనుకోండి అయ్యబాబోయ్ ఆయన అంతబాధపడ్డమా... అని నాకేమైనా ఫర్వాలేదని చెప్పి ఈయ్యనవెళ్ళిపోయి ఆయనతో కలియబడిపోతాడు కూడాని అంతే కాబట్టి మీరు గబుక్కున ఎక్కడపడితే అక్కడ మాట్లాడేయకూడదు.
Image result for angrily with lakshmanఅవతలివారికి మీ మీద ఉన్నటువంటి ప్రీతివలన వచ్చేటటువంటి పరిణామములను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది రాముని యొక్క పరిణితి కాబట్టి వెంటనే వెనక్కి పిలిచి సామోప హితయా వాచా రూక్షాణి పరివర్జయన్ ! వక్తుమ్ అర్హసి సుగ్రీవం వ్యతీతం కాలపర్యయే !! అందుకని నాయనా! పరుషమైన మాటలు మాట్లాడవద్దు ఆయన దగ్గర చాలా సున్నితమైన మాటలతో మిత్రుడికి చెప్పినట్లు చెప్పు కాలము దాటిపోయింది రాముడు బాధపడుతున్నాడూ అన్న సందేశాన్ని అందించు తప్పా ఆయన మనసు ఖేదపడేటట్టుగా తీవ్రమైనటువంటి మాటలను వాడవద్దు అని చెప్పాడు సరే అన్నయ్యా అన్నాడు బయలుదేరాడు కానీ లక్ష్మణుడు లక్ష్మణుడే కదాండీ చెప్తే వినేసి వెంటనే మనసు.., నేను మీతో మనవి చేసింది అదే... ʻనేను చెప్తున్నాను లోపలికెళ్ళుʼ అంటే వెళ్ళిపోయాడనుకోండి వెళ్ళినాయంది గొప్ప కదాండి, రాముడు చెప్పినా లక్ష్మణుడు కోపాన్ని అంతగా వెంటనేం నిగ్రహించేసుకోలేడు కారణమేమిటీ లక్ష్మణుడికి సుగ్రీవునిమీద కోపమేం లేదు లక్ష్మణుడి భార్యను ఎత్తుకుపోలేదు రావణాసురుడు, ʻʻరాముడు కష్టపడితే చూడలేడు రాముడి కళ్ళంబట నీళ్ళు కారకూడదు తన జీవిత ప్రయోజనం ఒకటే రాముడు సంతోషంగా ఉండాలి తప్పా ఆయనకు ఇంకేం అక్కరలేదుʼʼ జీవితంలో ఆయనకొక్క జీవిత లక్ష్యమేమిటంటే రాముడు సంతోషంగా ఉండాలి రాముడు సంతోషంగా లేడు రాముడు ఇవ్వాళ బాధపడ్డాడు ఎవరివల్ల బాధపడ్డాడు ఇదిగో ఆయనవల్ల బాధపడ్డాడు అంతే ఇంక ఇప్పుడు ఎంతకోపంగా ఉంటాడంటే... ఇంకా అదుపుచేసుకోలేకపోయాడు కోపాన్నీ అన్నది చెప్పడానికి మహర్షి ఎంత అందంగా చెప్తారో తెలుసాండీ!
ఆయన బయలుదేరాడంట కిష్కింధకి వెళ్ళడానికి ఎలా వెళ్తున్నాడంటే... సాల తాల అశ్వకర్ణాం శ్చ తరసా పాతయన్ బహూన్ ! పర్యస్యన్ గిరి కూటాని ద్రుమాన్ అన్యాం శ్చ వేగతః !! శిలా శ్చ శకలీ కుర్వన్ పద్భ్యాం గజ ఇవ ఆశుగః ! దూరమ్ ఏక

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
Image result for angrily with lakshmanపదం త్యక్త్వా యయౌ కార్య వశాత్ ద్రుతమ్ !! ఆయనా... కాలిబాటవెంట నడిచివెళ్ళడానికి వీలైనటువంటి చక్కని బాట ఒకటి ఉంది కిష్కింధకి కాని అది కొంచెం దూరం ఇప్పుడు అ బాట వెంట వెళ్ళటం లేదటా, కోపించినటువంటి ఏనుగు ఎంత వేగంగా వెళ్తుందో అలా బుసలు కొట్టుకుంటూ రుసరుసలాడిపోతూ పక్కన ఉన్నటువంటి అడ్డదారిలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నవాడు ఏం చేస్తున్నాడు సాల తాల అశ్వకర్ణాం శ్చ తరసా పాతయన్ బహూన్ అక్కడ కనపడినటువంటి అనేకమైన వృక్షములను కూకటి వేళ్ళతో పెకల్చేసి పైకి విసిరేస్తున్నాడటా... పర్వత శిఖరములు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిఖరములను ఊపేసి వాటిని చేత్తో పట్టుకుని ఆకాశంలోకి విసిరేసి ముక్కు ఇలా అనుకుంటూ బుసలు కొడుతూ ఆ వెళ్ళిపోతున్నప్పుడు శిలా శ్చ శకలీ కుర్వన్  అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూడండి ఒక్కరాయి కనపడితే దాన్ని ఒక్క తన్ను తన్ని బద్దలు గొట్టేస్తున్నాడటా ఎందుకూ... తనదారిన తానువెళ్ళాలిగాని ఒక్కొక్కడు చూడండి నడుస్తూ రాళ్ళు తంతుంటాడు అది ఎవరిమీదకో వెళ్ళి తగులుతుంది అలా శిలా శ్చ శకలీ కుర్వన్ రాళ్ళు బద్దలైపోయ్యెట్టుగా తంతున్నాడటా వాటిని తంతూ పద్భ్యాం గజ ఇవ ఆశుగః అత్యంత వేగంగా వెళ్ళిపోతున్న ఏనుగులా దూరమ్ ఏక పదం త్యక్త్వా సౌకర్యంగా వెళ్ళవలసిన మార్గాన్ని విడిచిపెట్టీసీ యయౌ కార్య వశాత్ ద్రుతమ్ పనిని సాధించుటకోసమని దగ్గరి త్రోవలో వెళ్ళిపోతున్నాడట.
అంటే తనంతతాను అదుపుచేసుకోలేని కోపాన్ని సుగ్రీవున్ని ఏమీ అనద్దు అన్నాడు సుగ్రీవున్ని చంపద్దు అన్నాడు ఇప్పుడు సుగ్రీవున్ని చంపకుండా సుగ్రీవున్ని ఏమీ అనకుండా నిగ్రహించుకోవాలంటే కోపాన్ని దేనిమీదో పెట్టాలి, అత్తమీద కోపం దుత్తమీద చూపించారు అంటారు. ఆఫీసులో బాస్ ని ఏమీ అనలేక ఇంట్లో భార్యని తిడుతుంటాడు ఒక్కొక్కడు అలా ఉంటుంది అందుకని చెప్పీ... ఇప్పుడు సుగ్రీవున్ని ఏమనకూడదు కాబట్టి పాపం చెట్లేమిచేశాయి వాటిని పీకేస్తున్నాడు పర్వత శిఖరాలు ఏం చేశాయి వాటిని పీకేసేసి ఆకాశంలోకి విసిరేస్తున్నాడు రాళ్ళేం చేశాయి వాటిని బద్దలుకొట్టేస్తున్నాడు అంటే కొంత కోపం తీరిపోతూందన్నమాట ఇంక తట్టుకోలేక అన్నయ్య చెప్పినమాటకి కట్టుబడాలి మరి అన్నయ్య యందు భక్తి అలా కట్టుబడాలి అంటే ఈ కోపం ఇకోళ్ళమీద చూపిస్తున్నాడు అంతే, అంటే కోపం పోయిందా పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకాను కానీ తొందరగావెళ్ళి ఆ సుగ్రీవున్ని అడగాలి అన్నయ్యని ఏడిపిస్తాడావీడు ఇది బాధ అందుకని అడ్డత్రోవలో వెళ్ళిపోతున్నాడు అయితే లక్ష్మణ భక్తిని ఆవిస్కరిస్తుంది ఇంక లక్ష్మణునికి జీవితంలో రాముడు సంతోషంగా ఉండడం కన్నా ఇంకో అన్యప్రయోజనం లేదు. దీనివల్ల మనకు ఏం అర్థమౌతూంది రాముడు సంతోషంగా ఉంటే లక్ష్మణుడు సంతోషంగా ఉంటాడు రాముడు ఏడిస్తే లక్ష్మణుడు ఎవడు ఏడిపించాడని అడుగుతాడు ఇకవాడు ఉండడు అంతేగదా దానర్థం అంతగా రామునితో మమేకమైపోయి రామునియందు అంత భక్తి ప్రపత్తులున్నవాడు లక్ష్మణుడు.
కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా బయలుదేరి ఆ కిష్కింధా సామ్రాజ్యందగ్గరికి వెళ్ళాడు బుసలుకొడుతూ ఊగిపోతూ ధనస్సుపట్టుకుని బాణాలుపట్టుకుని వస్తున్నటువంటి ఆ లక్ష్మణమూర్తి యొక్క స్వరూపాన్ని ఆ నగరాన్ని కాపు కాస్తున్నటువంటి కొన్నివేలమంది వానర యోధులు చూశారు చూసి వారు ఏమిటి అంత వేగంగా వచ్చేస్తున్నాడని ఆయన్ని చూసి భయపడి అటూ ఇటూ చెల్లా చెదురైపోయారు, కొంత మందీ ఏమిటీ యుద్ధానికి వస్తున్నట్టు వస్తున్నాడని ఒక

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
మహానాధం చేశారు, కానీ తేజోమూర్తియైన లక్ష్మణుడి యొక్క ఉద్ధతికి తట్టుకోలేకా వాళ్ళందరూ దూరంగా పరిగెత్తి పారిపోయారు. సుగ్రీవుడు మాత్రం లోపల అంతఃపురంలో తారతో రుమతో వానర కాంతలతో విశేషంగా మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా ఆ కామోప భోగమునందు రమిస్తున్నవాడై ఉన్నాడు. అందుకని పైన ఏం జరుగుతుందో అని గ్రహించగలిగినటువంటి మనసు ఆయనకు లేదు ఆయన మనసుని ఆయనే అటువంటి నిద్రావస్తలోకీ ఆయన కోరుకున్నదానిపట్ల ఉద్రేకం పొందేవిధంగాను ఆయనదాన్ని తయారు చేసుకున్నాడు.
Image result for angrily with lakshmanఈశ్వరుడు చక్కని మనస్సుని మీకిచ్చి స్పందించగలిగిన ఒక చక్కటిదాన్ని మీకిచ్చాడనుకోండి దాన్ని ఉత్పేరకములతో మీకు కావలసిన రీతిలో ఉద్రేకపడేటట్టు మీరు తయారు చేసి స్పందించగలిగిన శక్తిని దానికి చంపేస్తే ఈశ్వరుడిదా దోషం మందా... మనది అక్కడ అగ్నివేది ఉందనుకోండి ఒక యజ్ఞవేది వెలుగుతోంది హవిస్సులు ఇస్తున్నారు అందులోకి పట్టుకొచ్చి నేను సారా పోశాననుకోండి ఇప్పుడు వేదికిబ్బందా నాకు ఇబ్బందా వేదికేమండీ వేదికి ఏమీ అవదు అప్పటికి అపవిత్రం అవుతుంది మళ్ళీ ఏదో ప్రాయశ్చిత్తకర్మ చేసి యజ్ఞం చేస్తారు కాని పోసిన నేను నాకిక నిష్కృతి ఏముందీ, ఇక్కడ స్వయంగా పరమేశ్వరుడే కూర్చుని అగ్నిహోత్ర జ్వాలాగా వెలుగుతున్నాడు వెలిగి మనం వేసిన పదార్థాలన్నిటిని పచనం చేస్తున్నాడు పచనం చేసి నెత్తుటిగా మార్చి దీంట్లోకి ప్రవహింపజేసి తెల్లవారేటప్పటికి పిప్పిని విసరింజించటానికి వీలుగా సిద్ధం చేస్తున్నాడు, నేను నిద్రపోతానేమో కాని ఆయన నిద్రపోడు అహం వైశ్వనరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ! ప్రాణాపాన సమాయకః పచామ్యన్నం చతుర్విధం !! ఆ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. నేను నిద్రపోవచ్చు ఆయన రాత్రి నేను తిని నిద్రపోతున్నప్పుడు లోపల యజ్ఞాగ్నియందు పచనం చేసి దగ్ధం చేసి శక్తినిచ్చి పిప్పిని తెల్లవారేటప్పటికి సిద్ధం చేస్తాడు అటువంటి అగ్నిహోత్రంలో మీరు పొయ్యకూడనిది పోశారనుకోండి ఇప్పుడు లోపల అగ్నిహోత్రానికి ఇబ్బందా ఈశ్వరుడి ముఖం మీద పోసినందుకు నువ్వు పాపాన్ని మూటకట్టుకుంటున్నావా..! ఆ తత్వాన్ని పరిశీలనం చెయ్యగలిగితే మీరు చెయ్యలేరు.
బలహీనత నుంచి బయటపడడానికి ఒకేఒక్క ఆధారమేమంటే అది ఎటువంటి అపచారమో మీరు గుర్తించడమే అపచారము అని మీరు గుర్తించగలిగితే మీ మనసు పట్టుకోగలిగితే ఇక మీరు చెయ్యలేరు అదే మనసు తిరిగబడుతుంది వద్దు వద్దు తప్పది అలా ఎలా చేస్తావ్ అంటూంది. అలా ఎలా చేస్తావ్ అన్ననాడు మీరు ఇక చెయ్యలేరు. అలా ఎందుకు చేస్తావ్ అని అన్ననాడు మీరు ఎంతమంది చెప్పిన చెయ్యకుండా ఉండలేరు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో మీరు పట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను మరి మళ్ళీ అన్నీ ఎన్నిమాట్లు అని అక్కరలేదు మీరు ప్రాజ్ఞులు కనుకా ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళినటువంటి లక్ష్మణుడు అంగదున్ని చూశాడు అంతఃపురం బయట అంగదుడు ఉన్నాడు అంగదున్ని పిలిచి అన్నాడూ
సో అంగదం రోష తామ్రాక్షః సందిదేశ మహాయశాః ! సుగ్రీవః కథ్యతాం వత్స మమ ఆగమనమ్ ఇతి ఉత !!
ఏష రామానుజః ప్రాప్తః త్వ త్సకాశమ్ అరిందమః ! భ్రాతుః వ్యసన సంతప్తో ద్వారి తిష్ఠతి లక్ష్మణః !!
తస్య వాక్యే యది రుచిః క్రియతాం సాధు వానర ! ఇతి ఉక్త్వా శీఘ్రం ఆగచ్ఛ వత్స వాక్యం అరిందమ !!

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
నీవు లోపలికి వెళ్ళి నీ పినతండ్రియైనటువంటి సుగ్రీవుడితో ఒకమాట చెప్పు రామ చంద్ర మూర్తి శోకమునుపొంది ఉన్నాడని, రామ చంద్ర మూర్తి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణ మూర్తి వచ్చాడని, ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడని నీతో వచ్చి మాట్లాడలనుకుంటున్నాడని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి నీ పినతండ్రి ఏమనుకుంటున్నాడో వచ్చి నాతోచెప్పు అని ఆయన అక్కడ నిలబడ్డాడు. ఈ అంగదుడు లోపలికి వెళ్తున్నాడు అదీ మంత్రులంటే, సచివులంటే అది దూరదృష్టి అంటే అది ప్లక్షుడు ప్రభావుడనేటటువంటి ఇద్దరు ఆ మంత్రులు కూడా అంగదునితోపాటు లోపలికి వెళ్ళారు. మంత్రులు లోపలికి వెళ్తే దాన్ని ఎవ్వరు అభ్యంతరపెట్టడానికి వీలుండదు అంగదునితో పాటు వెళ్ళారు వాళ్ళకు తెలుసు ఇప్పుడు లక్ష్మణ మూర్తి ఒక పిల్లవానికి చెప్పాడు యువరాజుకి, యువరాజుకి కూడా భయమే లక్ష్మణుడంటే తీరా వెళ్ళిన తరువాత ఇప్పుడు అంగదుడు కర్తవ్యం చెయ్యడమా అంగదుడు చెప్పినదాన్ని బట్టి సుగ్రీవుని ప్రాణాలు నిలబడటమా అన్నది ఎవరిచేతిలో ఉంది అంగదుడి చేతిలో లేదు సుగ్రీవుడి చేతిలో ఉంది సుగ్రీవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడని మంత్రులకు తెలుసు అసలు విపరీతమైనటువంటి భావోద్రేకంతో మధుపానాశక్తుడై కామాతురతుడై ఉన్నాడు తప్పా అంగదుడు చెప్పింది చెవిలోకి వెళ్ళడం కాదు మనసులోకి వెల్తుందా అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు అంగదునితో లక్ష్మణుడు ఏమన్నాడు వెళ్ళి చెప్పి బయటికొచ్చి నాకేమైందో చెప్పు అన్నాడు నిల్చుని ఉన్నాడు వెళ్ళి లోపలుండిపోతే కోపగిస్తాడు ఇప్పుడు అంగదుడు కారణమౌతాడు.
Image result for కిష్కింధలో లక్ష్మణుడుఅంగదుడు వెళ్ళి చెప్పిన తరువాత చెప్పనేం చెప్తాడు అయ్యా! బయట లక్ష్మణ మూర్తి ఎదురుచూస్తున్నారు మీతో మాట్లాడుతారట తప్పతాగి తూలుతూ అంతమంది కాంతలతో రమిస్తున్నటువంటి సుగ్రీవుడు హా..! అని ఊరుకున్నాడనుకోండి, ఎన్నిమాట్లు చెప్తాడు రాజు కాబట్టి తిరిగొచ్చి ఆయన మధుపానం చేస్తున్నాడు భార్యలతో క్రీడిస్తున్నాడు నేను చెప్పాను కాని ఆయన చెవికి ఎక్కినట్లులేదు అన్ని అన్నాడనుకోండి ఇక సుగ్రీవున్ని వదులుతాడా... ఇక బతకడు ఈ దోషానికేగా కాలం దాటిపోయింది కాబట్టి ఇప్పుడు అంగదడు వచ్చి చెప్పడం కాదు అంగదడువచ్చి చెప్పేలోపల సుగ్రీవుడు ప్రాణములు నిలబడేటట్టు చెయ్యాలి ముందు. కాబట్టి వీళ్ళని వెళ్ళమన్నారా వెళ్ళమనలేదా ముందుకాదు ప్రభు ప్రాణములను కాపాడడమన్నది అంగదుడు వెళ్ళిరావడంలో ఉంది, కాబట్టి పిల్లాని మీద వదిలేసి పెద్దవాళ్ళు కూర్చోవడం కాదు చెప్పినా చెప్పకపోయినా పాపం వెళ్ళాలి, వెళ్ళి ప్రభువుని రక్షించుకోవాలి ఇప్పుడు ఇదొక క్లిష్టపరిస్థితి వచ్చింది కాబట్టి అందుకని వెళ్ళారు వాళ్ళిద్దరు లోపలికి అంటే మంత్రులు అన్నవారి యొక్క నడవడి ఎలా ఉండేదో ఎంత గొప్పగా ప్రవర్తించేవారో ఎంత దూరదృష్టితో వాళ్ళు ఉండేవారో ఒక సంఘటనని చూస్తే శ్రీరామాయణాన్ని పరిశీనం చేస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. పెద్దరికమూ అన్నమాట కర్తవ్యమేమిటో పెద్దరికం ఉన్నవాడు విషయాన్ని మనసులో పెట్టుకునీ అది పగలకుండా ఎలా రక్షించాలో ఎంత జాగ్రత్తగా తాను ప్రవర్తించవలసి ఉంటుందో రామాయణం చదివితే మీకు అటువంటి ఆలోచనా ధోరణి అలవాటౌతుంది.
పెద్దరికం అన్నమాట పెద్దరికం నిలబెట్టుకోవటం అలవాటౌతుంది కీర్తికోసం పెద్దరికం కాదు ఏరా ఇంతసేపైంది నీవు నమస్కారం పెడతావోలేదో అని చూస్తున్నాను నేనెందుకు కనపడుతానురా... అని అనడం కాదు పెద్దరికం అంటే..? వస్తున్న

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
Image result for తాత గారి ఆశీర్వచనంఇబ్బందులను కడుపులోపెట్టుకుని అవి పగలకుండా రక్షించగలిగినటువంటి నైపుణ్యంతో ప్రవర్తించగలగడం పెద్దరికం. అది నీకుండాలి అంతేకాని పెళ్ళిల్లో మనం చూస్తుంటాం కొంతమంది కాలుమీద కాలు వేసుకు కూర్చుంటారు ఏ మనవడి వరుసవాడో మునిమనవడి వరుసవాడో అలా వెల్తుంటాడు వీళ్ళు పలకరించరు అంటే వీళ్ళు పలకరిస్తే వీళ్ళ మర్యాదా పోయినట్టు పాపం ఆ పిల్లవాడు ఏదో అటూ ఇటూ అందర్నీ పలకరించి ఓ గంటపోయాక ఒరేయ్ మీ తాతగారు అదిగోరా అంటారు. అంటే వచ్చి హా తాతయ్యా ఇదిగో నేను ఇప్పుడేవచ్చాను బాగున్నావా అంటాడు ఆ..అ... చూస్తున్నానురా... పదకొండింటికొచ్చావు ఒంటిగంటైంది ఈ తాత ఇప్పుడు కనపడ్డాడు నీకు అంటాడు ఏం నీవు చూశావుగా నీవెందుకెళ్ళి పలకరించవు కాల్చనా నీ పెద్దరికం ఏం మనమన్ని చూసి నీవు లకరించలేవు ఏమిటి నీ పెద్దరికం నీకు నమస్కారం చెయ్యాలని నీవు అనుకుంటే రోడ్డుపక్కన పెరిగిన చింతచెట్టుకి నమస్కారం చెయ్యాలి నీకన్నా ముందుపుట్టింది అది వయస్సువల్లకాదు పరిణితి జ్ఞానమువలన పరిణితి నీ ప్రవర్తనవలన పరిణితి అన్నివేళలా వయస్సుతో పెద్దరికాన్ని గౌరవించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ పరిణితిని సంతరించుకోకపోతే ఆ పెద్దరికాన్ని భరించడం కష్టం. కాబట్టి వయస్సుతోపాటు అనుభవాన్ని పెంచుకోవాలంటే ఒక్కటే రామాయణం చదువుకోవటమే రామాయణం బాగా చదువుకుంటే ఓ ఇలా ఉండాలని బాగా అర్థమౌతుంది. ఎక్కడ ఏ పరిస్థితి ఉందో అక్కడ తాను చొరవతీసుకొని నాన్నా నీవు ఇలా చెయ్యి అని చక్కగా చెప్పి కార్యం బాగా జరిగెటట్టుచేసి నా పెద్దరికం నిలబడింది చక్కగా చేయించేశానుగదా అని పొగడ్తకోసం ఆశించకుండా నీవు వెళ్ళిపోతావు అంతే సంతోషంతో అది పెద్దరికం అన్నమాటకు అర్థం.
తప్పా నాకేమిస్తారు దీనివల్లా నాకేమొస్తుంది ప్రయోజనం దీనివల్లా ఇక్కడ నా పెద్దరికం గుర్తించారాలేదా... కొంతకొంతమంది చూడండీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మస్థానంలో ఒకాయన కూర్చుంటాడండీ ఆయనకి తెలియదా ఏమిటీవైదిక మార్గం ఆయన చేయిస్తాడు కాదు ఆవిడ ప్రత్యేకంగా ఓ చిన్న చాపముక్క వేసుకుని ఏదో అక్కడ వేసుకుని కూర్చుంటుంది కూర్చుని మా ఇంట్లో అది అలవాటులేదు అది వద్దంటుంది. అదేమిటమ్మా అది వేదప్రోక్తమమ్మా అది చెయ్యాలి, మాకలవాటులేదు వీళ్ళేదు అంటుంది. ఏం తెలుసు ఏం తెలియదు ఏమీ తెలియకపోయినా ఎందుకలా అనడం అంటే పెద్దరికం అలా చేయిస్తే తన పెద్దరికం నిలబడింది ఓ సంతోషం దాన్ని నిక్షేపించి అలా కుదరదులేమ్మా... నీవు ఊరుకోమ్మా చెయ్యనీ అన్నారనుకోండి ఇంక నేనెందుకని పెట్టె సర్దేసుకుంటుంది ఆవిడా అదేమిటీ అలా పెళ్ళింట్లో అలా చెయ్యొచ్చా అదేం పెద్దరికం అని ఉండదు మీరు జాగ్రత్తగా గమనించండి ఎవరిమీదో ఆక్రోషంతో మాట్లాడటంలేదు పెద్దరికం అన్నది దేనికి పనికిరావాలంటే తనకన్న వెనకపుట్టినవాళ్ళ సంతోషానికి పనికిరావాలి తనకన్నా వెనకపుట్టినవాళ్ళని ఏడిపించడానికి పనికివచ్చే పెద్దరికం కాల్చనా దేనికండీ అది అలా ఉండకూడదు తప్పు అది. నేను రామాయణం చెప్తూ అలానే చెప్పగలను ఇంకోలా చెప్పడం నా చేతకాదు చెప్పలేను ఒకవేళ నేను చెప్పింది అంతబాగాలేకపోతే నన్ను క్షమించండి.
కాబట్టి ఇప్పుడు అంగదుడు లోపలికెళ్ళాడు ఆయనతోపాటు మంత్రులుకూడా వెళ్ళారు ఇప్పుడు వెళ్ళినటువంటి అంగదుడు సుగ్రీవుని యొక్క కాళ్ళకు నమస్కారం చేశాడు తార కాళ్ళకీ నమస్కారం చేశాడు రుమ కాళ్ళకీ నమస్కారం చేశాడు అంటే ఇద్దరి భార్యలతోటీ శయనాగారంలో బాగా మధువు సేవించి తానుండడం కాదు ఆయన భార్యలు కూడా సేవించి ఉన్నారు ఆ స్థితిలో ఉన్నారు అటువంటి చోట ఒక కొడుకువెళ్ళి నమస్కారం పెట్టి మాట్లాడటానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆలోచించండి, నేను ఒక్కమాట చెప్తాను నేను అంతకన్నాదాటి చెప్పడం నా సంస్కారానికి కూడా ఇష్టముండదు. వాళ్ళు తల్లులు ఆయన తండ్రి వాళ్ళు అలా ఉండగా ఓ కొడుకు వెళ్ళి నమస్కరించడం ఆయనకు ఎంత బాధగా ఉంటుందో ఓసారి ఆలోచించండి ఇంకొకప్పుడు ఇలా ఉండకుండా ఉంటాడు అనుకుని చెప్పడానికి అలా ఉంటాడనే నమ్మకంలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఇప్పుడు లక్ష్మణునికి చెప్పుకోలేదు అంగదుడు ఇది చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే పెద్దరికంగా మారండమంటే, కాబట్టి ఇప్పుడు పాపం అలాగే వెళ్ళి నమస్కారం చేశాడూ నమస్కారం చేసి అంజలి ఘటించి చెప్పాడు, లక్ష్మణ మూర్తి కోపంగా ఉన్నాడు రాముడు శోకంతో ఉన్నాడటా ఆయన చెప్పమన్నది చెప్పడానికి వచ్చాడు ఎదురు చూస్తున్నాడు నిన్ను కలుస్తాను అంటున్నాడు నన్ను వచ్చి ఏమాటా చెప్పమన్నాడు కాబట్టి నేను ఏం చెప్పనూ అన్నాడు.
Image result for సుగ్రీవుడు భార్యలతో

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
ఈయన చెప్పిన మాట ఆయన మనసులోకి వెళ్ళలేదు ఆయన తలకు ఎక్కలేదు ఎందుకెక్కలేదు అంటే ఆయన మనసు ఇక్కడ లేదు ఇంకొకదానియందు అనురక్తమై ఉంది కాబట్టి ఆయన వినేస్థితిలో లేడు ఇప్పుడు మీరు కాసేపు ఆ పనులు ఆపుచేసి ఈ మాట వినండీ అనే స్థితిలో కొడుకులేడు చూడండి ఆ వ్యసనమూ ఏ స్థితిలో... హనుమ చెప్పింది ఇదే కదా! వచ్చేసిందా లేదా ఆ పరిస్థితి చూస్తూ చూస్తుండగానే వచ్చేసింది అంతే ప్రాణ సంకటంలోకి వెళ్ళిపోయాడు అంతే సుగ్రీవునికి ఇప్పుడు ఈశ్వరానుగ్రహం పనిచేసింది. కేవలం మిత్రుడు చంపకూడదు అనుకున్న రాముని యొక్క అనుగ్రహమే బహుశహ సుగ్రీవున్ని కాపాడింది. లక్ష్మణుని యొక్క కోపంతో లక్ష్మణుడు దగ్గరికొచ్చి అంగదుడు మాట చెప్పిన తరువాత లోపలికి వెడదామని వెనక నుంచి వస్తున్నటువంటి లక్ష్మణున్ని చూసీ భయపడిపోయినటువంటి కొన్ని వేల వానరములు ఏక కాలంలో ఒక పేద్దనాదం చేశాయి లోపలికి వెళ్ళిపోతున్నాడు ఇంత కోపంగా ఉన్నాడు లోపల అంగదడు బయటికి రాలేదు ప్రభువు మత్తిల్లి ఉన్నాడు ఏమౌతుందోనని వాళ్ళొక పెద్ద నాదం చేశారు వాళ్ళు అందరు, ఇన్నివేల వానరములు ఒక్కసారి నాదం చేస్తే సుగ్రీవుడు ఉలిక్కిపడ్డాడు అంటే ఆయన ఎంత తాగి ఉన్నాడో ఎంత మత్తులో ఉన్నాడో మీరు ఆలోచించండి.
Image result for స్నేహంఇప్పుడు ఆయన ఉలిక్కిపడి సచివుల్ని పిలిచాడు అందుకొచ్చారు ఆ ప్లక్షుడు ప్రభావుడు వెంటనే మంత్రులు దగ్గరికి వచ్చారు అన్నాడు ఎందుకలా అరుస్తున్నారు వానరులు అన్నాడు అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎందుకరుస్తున్నారేమిటీ లక్ష్మణమూర్తి వచ్చాడు రాముడు కోపంగా ఉన్నాడు రాముడు శోకిస్తున్నాడు సందేశం పట్టుకొచ్చాడు నీతో మాట్లాడుతాడట నీ దగ్గరికి వస్తాడట ఏం చెప్పమంటావు అని అడిగారు, అడిగితే ఇప్పుడు అన్నాడూ సర్వథా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనమ్ ! అనిత్యత్వాత్ తు చిత్తానాం ప్రీతిః అల్పే అపి భిద్యతే !! నేను రాముడి పట్ల ఏ అపచారమూ చేయలేదు రాముని పట్ల ఒక్కమాట తప్పుగా మాట్లాడలేదు బహుశహ రామునితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే గిట్టనివాళ్ళు ఎవరో నేను సుఖపడడం ఇష్టంలేక రామ లక్ష్మణులకి నా మీద ఏవో చాడీలు చెప్పి ఉంటారు, చెప్పినా రామ లక్ష్మణులు నమ్మకూడదే..? ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది అని ఇప్పుడు పెద్దల మాటలు జ్ఞాపకానికి వచ్చాయి ఇప్పుడు అన్నాడు సర్వథా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనమ్ స్నేహం చెయ్యడం మొదలు పెట్టడం తేలికా స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం అన్నాడు ఎంత పెద్ద మాటో చూడండి. ఈ ఏడాది మీకు ఒకళ్ళని పరిచయం చేస్తాడు పరిచయం చేసి ఈయ్యన నాకు ఆప్తమిత్రుడండీ ఈయన నా కుడిచేయ్యి అంటాడు ఓ రెండేళ్ళుపోయాక ఆయన మళ్ళీ వస్తాడు ఏమండీ ఆయన మీ పక్కన ఉండేవారు కదా అని కుడిచేయి అనేవారు కాదా ఆయనేదీ అంటాడు, అప్పుడు తెలుసుకోలేకపోయానండి వాడు దుర్మార్గుడు వాన్ని వదిలేశాను అంటారు.

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
వచ్చినాయనా ఏమనుకుంటాడు కుడిచెయ్యి అనేవాడు అంతగొప్పగా చెప్పేవాడు ఇదేమిటిర్రా మళ్ళీ రెండేళ్ళు పొయ్యాక వచ్చేటప్పటికీ అబ్బెబ్బే వాడు ద్రోహి అంటున్నాడేమిటీ అనుకుంటాడా అనుకోడా... తనంతతాను విడిచిపెట్టెయ్యలేనంత స్థితినివాడు అవతలి వాడు కల్పించుకుంటే తప్పా మీరు అందుకే స్నేహం మొదలు పెట్టేయడం చాలా తేలికా స్నేహాన్ని నిలబెట్టుకోవటం చాలా చాలా కష్టం. ఇప్పుడు అంటున్నాడు ఆమాట రామునితో స్నేహం మొదలు పెట్టుకోవడం చాలా తేలికైంది ఇప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టమైంది ఎందుకో తెలుసా... అనిత్యత్వాత్ తు చిత్తానాం మనసు ఉంది చూశారూ ఇది ఒకలా ఉండదు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది అప్పుడు మాటిచ్చాను ఇప్పుడేమో ఇలా ఉన్నాను ఛీ చూడు ఎంత ప్రమాదమొచ్చిందో ప్రీతిః అల్పే అపి భిద్యతే చిన్న విషయాలకి ఒక్కొక్కప్పుడు చాలా అభిప్రాయ బేధాలు వచ్చేస్తాయి కాబట్టి స్నేహాన్ని నిలబెట్టుకోవడంలో చాలా ఇబ్బంది వచ్చింది అన్నాడు. అని ఇప్పుడు రాముడు చేసేటటువంటి మేలు ఏదైతే ఉందో దానిని మాత్రం నేను ఎన్నడూ మరువను అంతటి మహానుభావుడు రామ చంద్ర మూర్తి నాకు అంతటి మహోపకారం చేశాడు ఆయనకి నేను ఏ చిన్న ప్రత్యుపకారం చెయ్యలేకపోతున్నాను అని నేను బాధపడుతున్నాను వాలిని వధించి నాకు రాజ్యమును ఇచ్చాడు ఇవ్వాళ నేను అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా రాముని భిక్షా.
అటువంటి రామునికి నేను ఉపకారము తొందరగా చేయయకపోవడం పొరపాటే అంటే హనుమ అన్నారు సుగ్రీవునితో సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో న అత్ర సంశయః ! భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మి వర్ధనమ్ !! సుగ్రీవా ఇంకా నీకు బాగా బోధపడలేదు కోపము రెండు రకాలుగా ఉంటుంది ఒకటీ ప్రతీకారెచ్చతో కూడుకున్న కోపము ఒకటి అవతలివాడు పాడైపోతున్నాడని ప్రేమతో సంస్కరించాలని పెట్టుకుని ఉన్న ప్రేమ ఒకటి రాముడిది ప్రతీకారేచ్చతో కూడుకున్న కోపం కాదు ప్రతీకారేచ్చతో కూడుకున్నదైతే ఇంకోలా ఉంటుంది ఇది ప్రణయాత్ క్రుద్ధో ప్రేమతో కూడిన కోపం, ప్రేమతో కూడిన కోపాన్ని ప్రేమతోటే అర్థం చేసకోవాలి తప్పా ప్రేమతో కూడిన కోపాన్ని ఇంకొకలా అర్థం చేసకోకూడదు కాబట్టి రాముడికి నీమీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో ఆయన అంత కోపంగా మాట్లాడినా ఇప్పుడు లక్ష్మణుడు వచ్చి ఆయన ఏదో కోపంగా ఉన్నాడని మాట్లాడుతాడు నీవు ఏం చెయ్యాలో తెలుసా ఎంత ప్రేమ లేకపోతే నామీద ఒక బాణం వేయగలిగినవాడు వెయ్యకుండా ఇలా కబురుచేశాడు అని అంజలి ఘటించి వినాలి తప్పా నీవు ఓ ఇలా అంటాడా అని అనకూడదు, ప్రేమ నిన్ను ఉద్దరించడానికేనయ్యా ఆకోపం ఈ శ్లోకం కానీయ్యండి ఇవ్వాళ సమాజంలో సరిగ్గా జీర్ణమైతే చాలా మంది  మధ్య విభేదాలు చాలా మంది మధ్య దెబ్బలాటలు చాలా చాలా ఆత్మహత్యలు ఆగిపోతాయి.
అమ్మ దెబ్బలాడితే ఆత్మహత్యతేమిటండీ నాన్నదెబ్బలాడితే ఆత్మహత్యేమిటీ భర్త దెబ్బలాడితే ఆత్మహత్యేమిటీ భార్యా పుట్టింటికెళ్ళి రావడం ఆలస్యమైతే భర్త ఆత్మహత్యచేసుకోవడం ఏమిటీ అంటే అవతలివాడు ఒకమాట అన్నప్పుడు ప్రేమతో అన్న మాటని ప్రేమతో స్వీకరించగలిగినప్పుడు స్వీకరించే లక్షణం కోల్పోయినప్పుడు ఏమౌతుందంటే అవి ఎప్పుడూ

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
పిటపిటలాడుతూంటాయి తప్పా సంబంధాలు వాటికి అనురక్తీ ఆర్ద్రతా అన్నది తడి అంటి ఉండవు ఆ సంబంధాలకి అవి ఎప్పుడు ఎండిపోయినటువంటి వేయించేసిన అప్పడంలా ఉంటాయి మీరు ఎక్కడ ముట్టుకున్నా పలుక్కున విరిగిపోతాయి. అలా ఉండకూడదు చక్కగా ముట్టుకుంటే తడితో ప్రేమా అన్న తడి తగలడం వల్లా మీరు ముట్టుకుంటే సాగేటటువంటి గుణం కలిగినటువంటిదై ఉండాలి మీరు ఎంత దాన్ని స్వీకరిస్తే అంతదాన్ని అంత మధురిమ దాంట్లోరావాలి. మీరు ఒక ద్రాక్షపండునీ మంచి ఎండాకాలంలో ఫ్రిజ్ లోంచి ద్రాక్షపళ్ళు గుత్తి ఒకటి తీసి తొక్కకూడా తీయ్యవలసిన అవసరంలేనటువంటి పండుకదా... దాన్ని తీసి ఇలా నోట్లోవేసుకుని పెదవులమధ్య పెట్టి నొక్కండీ పళ్ళమధ్యపెట్టి నొక్కండీ దవడల మధ్యపెట్టి నొక్కండి ఇలా వెళ్ళతో నొక్కండీ అది తీయ్యటి చల్లటి రసాన్ని చిమ్ముతుంది మీ మీద కొన్ని కొన్ని అనుబంధాలు అలా ఉండాలి. వాటిని అలా అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి దెబ్బలాడారనుకోండి ఓ ఎందుకు దెబ్బలాడి ఉంటారు ఎంత ప్రేమైకమూర్తి నాయందు ఇలా అన్నారంటే ఎంత ఆర్తితో అన్నారో అన్నవిషయాన్ని అర్థం చేసుకోవాలి.
Image result for భార్యా భర్తల గొడవఒక్కొక్కసారి ఆవిడ అంటుంది కోపంతో ఆవిడ కోపంతో అంటే ఓ నాయందు ఎంతప్రేమకలిగింది ఎంత పిచ్చిది నేనంటే ఆ ప్రేమతో అంటూంది అలా దాన్ని ప్రేమతో స్వీకరించాలి. అంతేగాని నన్ను ఇంతమాట అంటూందా 1947లో కొత్తలో పెళ్ళైన కొత్తలో ఇలా అంది 57 67 77 దిక్కుమాలినవన్నీ గుర్తు తెచ్చుకుని అక్కడ్నుంచి ఇక వారంరోజులు మాటలు మానేసి కంచాలు విసిరేసి నానా అల్లరి చేసేసుకుని ఇల్లు యమలోకంకింద చేసుకుని ఆ తరువాత ప్రారద్భం ఎవరు అనుభవించాలి వీళ్ళిద్దరే అనుభవించాలి. ఎందుకంత కోపం ప్రణయాత్ క్రుద్ధో ఆ ప్రేమతో కూడినటువంటి కోపాన్ని ప్రేమతోనే అర్థం చేసుకో వయ్యా... హనుమ మాట్లాడితే అలా ఉంటాయండీ అమ్మో ఏమి మాటలండీ మహానుభావుడివి కాబట్టి ఆర్త స్య హృత దార స్య పరుషం పురుష అన్తరాత్ ! వచనం మర్షణీయం తే రాఘవ స్య మహాత్మనః !! నీవు నీ భార్యలతో ఉన్నావు రాజ్యాన్ని పొందావు వేళ దాటిపోయినా సుఖాలను అనుభవిస్తున్నావు, భార్యలేదు రాజ్యంలేదు నీకు ఉపకారం చేశాడు నీకు సమయం ఇచ్చాడు తాను నగరంలోకి కూడా రాలేదు బయట పర్వత గుహలో ఉన్నాడు ఒక గుహలో పడుకుంటున్నాడు ఇన్నాళ్ళు ఎదురుచూశాడు ఎంతబాధ వస్తుందో ఇప్పుడు ఆ బాధలోంచి వచ్చేమాట కొంచెం కష్టంగానే ఉంటుంది వినడానికి కాని నీవు వినడానికి కష్టంగా ఉందని కాదు అవతలివాడికి ఎంత కష్టం ఉందో నీవు గమనించాలి ఈ కోణంలో వినాలి ఇప్పుడు లక్ష్మణుడు చెప్పేది తప్పా నీవు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇలా అంటాడని వినవద్దు సుమా! ఎంత సిద్ధం చేస్తున్నారో చూడండి.
ఇది హనుమ అంటే మహానుభావుడండి ఆయన పేరు చెప్తే చాలు మనిషి చక్కటి స్థితిని పొందుతాడు కృత అపరాధ స్య హి తే న అన్యత్ పశ్యామి అహం క్షమమ్ ! అన్తరేమ అంజలిం బద్ధ్వా లక్ష్మణ స్య ప్రసాదనాత్ !! ఓహో కిష్కింధ కాండ కిష్కింధ కాండే ఏం హరి ప్రసాద్ గారు చెప్దామా.. (వర్షం వచ్చింది) చూద్దాం చూద్దాం అదో సంతోషమే..! కాబట్టి ఇప్పుడు నీవు ఒక వేళ లక్ష్మణుడు వచ్చి క్రుద్ధుడై మాట్లాడినా అంజలి ఘటించి విను తప్పా ఇంకొకలా మాత్రం దాన్ని అర్థం చేసుకుని కోపగించవద్దు అన్న తరువాత ఆ లక్ష్మణుడు అక్కడ నిలబడి ఉన్నాడు నిలబడి ఉండగా
కూజితం నూపురాణాం చ కాంచనీనాం నినదం తథా ! సన్ని శమ్య తతః శ్రీమాన్ సౌమిత్రిః లజ్జితో అభవత్ !!
రోష వేగ ప్రకపితః శృత్వా చ ఆభరణం స్వనం ! చకార జ్యా స్వనం వీరో దిశః శబ్దేన పూర్యన్ !!
చారిత్రేణ మహా బాహుః అపకృష్టః స లక్ష్మణః ! తస్థౌ ఏకాంతం ఆశ్రిత్య రామ శోక సమన్వితః !!

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
ఆయన అక్కడ నిలబడి ఉండగా లక్ష్మణ మూర్తి లోపలా స్త్రీల ఆభరణములు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్డాణములు పెట్టుకున్నటువంటి కంకణముల యొక్క ధ్వనులు వినపడుతున్నాయి ఆయనా స్త్రీలు రాజుతో సంతోషంగా ఏకాంతంగా తిరుగుతూ ఉండగా నేను ఇక్కడ దగ్గరగా తిరగకూడదు అని సిగ్గుచెందినవాడై పక్కకి వెళ్ళాడు అది ఆయన చారిత్రము ఆయన నడవడి అటువంటిది, కానీ వెంటనే జ్ఞాపకాని వచ్చింది మా అన్నయ్య అంత బాధపడుతున్నాడూ ఈ సుగ్రీవుడు ఇక్కడ ఇలా సుఖిస్తున్నాడు ఆయనకి బాధకలిగి వెంటనే పిడుగు పడితే ఎటువంటి ధ్వని వస్తుందో వేఘం ఒక్కసారి గర్జిస్తే ఎటువంటి ధ్వని వస్తుందో అలా టంకారం చేశాడు. చేసేటప్పటికి లోపల ఉన్నటువంటి సుగ్రీవుడు అదిరిపోయాడు అదిరిపోయి ఆసనం మీద ఉన్నవాడు ఉన్నట్లుగా ఒక్కసారి లేచి నిలబడ్డాడు, నిలబడి తారని పిలిచి అన్నాడూ తారా! ఇంత ఆగ్రహంతో ఉన్నటువంటి లక్ష్మణునికి నేను ఎదురుపడి మాట్లాడటం కష్టం నేను ఉన్న పరిస్థితిలో లక్ష్మణునితో మాట్లాడలేను కానీ రామ లక్ష్మణునులు గొప్ప చారిత్రమున్నవారు నీవు వెళ్ళి ఎదురుగుండా నిలబడి మాట్లాడితే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ఆడదాన్ని చూసేటప్పటికి కోపాన్ని వదిలిపెట్టేస్తారు కాబట్టి నీవు వెళ్ళి మాట్లాడు నీవు మాట్లాడటంలో సమర్థురాలివి, నాతో మాట్లాడటానికి వీలైనంతరీతిలో లక్ష్మణుడి కోపం తగ్గిపోయిన తరువాత నేను వచ్చి మాట్లాడుతాను అన్నాడు.
ఇప్పుడు తారా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది ఎలా వెళ్ళింది అది తార గొప్పతనమండీ కిష్కింధ కాండలో ఒక మెరుపు తార సా ప్రస్ఖలంతీ మద విహ్వలాక్షీ ప్రలంబ కాంచీ గుణ హేమ సూత్రా స లక్షణా లక్ష్మణ సన్నిధానం జ గామ తారా నమిత అంగ యష్టిః ! ఆమె వడ్డాణం వ్రేలాడిపోతూంది అంటే పెట్టుకుని లేదు ఆమె మెడలో వేసుకున్న హారములన్నీ కూడా పెట్టుకున్న కొక్కెములు జారిపోయి ఊడిపోయి ఉన్నాయి ఆవిడ బాగా మధువు సేవించి ఉందీ కనుగుడ్లు తిరుగుడు పడి ఉన్నాయి అంటే ఆవిడ శరీరం మీద ఉండవలసినవి ఏవీ సరిగ్గాలేవు ఆమె అలాగే లేచి నిలబడి స్థిమితంగా నడవలేక తూలుతూ లక్ష్మణ మూర్తి దగ్గరికి వచ్చింది అలా వచ్చినటువంటి తన మిత్రుని యొక్క భార్యను చూసేశాడు, చూసేటప్పటికీ అంత లక్ష్మణ మూర్తికూడా నా మిత్రుడి భార్య ఆవిడని కళ్ళెత్తి అలా చూడకూడదు అని కోపాన్ని తగ్గించుకునీ కన్ను తల ఒక్కసారి వంచీ పరమ ప్రసన్నుడై తన మిత్రుడి భార్య ఎదురుగుండా వచ్చింది కాబట్టి ప్రశాంతుడై పక్కకి నిలబడ్డాడంటా ఇప్పుడు తార అందీ కిం కోప మూలం మనుజేంద్ర పుత్ర కః తేన సంతిష్ఠతి వాక్ నిదేశే కః శుష్క వృక్షం వనం ఆపతంతం దవాగ్నిం ఆసీదతి నిర్విశంకః ! లక్ష్మణా! ఏమి అక్కడ నిలబడిపోయావు ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనంలో దావాగ్ని ప్రవేశిస్తే అటువంటి దావాగ్నితో కూడుకున్నటువంటి పెద్ద అగ్నిహోత్రం ఎండిపోయిన చెట్లను కాల్చుకుంటూ వస్తూంటే ధైర్యంగా దానికి ఎదురువెళ్ళినవాడు ఎవడు ఎవరు నీకు అపకారం చేశారు కిం అయం కామ వృత్తః తే లుప్త ధర్మార్థ సంగ్రహః ! భర్తా భర్తృ హితే యుక్తే న చ ఏనం అవబుధ్యసే !! లక్ష్మణ మూర్తి అన్నారు నీ భర్తా ధర్మార్థ కామముల యొక్క సమన్వయాన్ని మర్చిపోయి కామోప భోగమునంద అనురక్తి కలిగి చెయ్యవలసిన కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నటువంటి విషయం నీకు తెలియదా తారా..! న చిన్తయతి రాజ్యార్థం న అస్మాన్ శోక పరాయణాన్ ! స అమాత్య పరిషత్ తారే పానం ఏవ ఉపసేవతే !! ఆయనా రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు మంత్రుల్నీ పట్టించుకోవట్లేదు మంత్రులకు దర్శనం ఇవ్వట్లేదు కేవలం కామాన్ని సేవిస్తున్నాడు అలా ఉండడం తప్పుకాదా...
స మాసం చతురః కృత్వా ప్రమాణం ప్లవగేశ్వరః ! వ్యతీతాన్ తాన్ మదవ్యగ్రో విహరన్ న అవబుధ్యతే !! ఆయనా ప్రత్యుపకారం చేస్తానూ అని రామ చంద్ర మూర్తికి మాట ఇచ్చి రాముడి వలన ఉపకారం పొంది స మాసం చతురః నాలుగు నెలలు అయిపోయినా కృత్వా ప్రమాణం ప్లవగేశ్వరః చేసినటువంటి మాట మరిచిపోయి వ్యతీతాన్ తాన్ మదవ్యగ్రో మదం చేత

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
తాను చెప్పినమాట తప్పిపోయి ఇలా తిరుగుతుండడం తప్పుకాదా..? అంటే తారందీ న కోప కాలః క్షితి పాల పుత్ర న చ అతి కోపం స్వ జనే విధేయః త్వత్ అర్థ కామస్య జనస్య తస్య ప్రమాదమ్ అపి అర్హసి వీర సోఢుం ! నాయనా లక్ష్మణా! నీవు కోపించవలసినటువంటి సమయం ఇది కాదు రెండు నీవారియందు నీవు కోపం పెట్టుకోవచ్చా నీ స్వజనుడయ్యా సుగ్రీవుడు తప్పు చేస్తే నీవు దిద్దాలి అంతేకాని నీవు ఆయనమీద కోపం పెట్టుకోవడం ఏమిటీ? కాబట్టి నీవు ఈ కోపాన్ని వెంటనే విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి పైగా సుగ్రీవుడు కామాన్ని అనుభవిస్తూనే మీ కార్యానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సైన్యాన్ని పిలిపించడానికి నీలునికి ఆదేశమిచ్చి ఉన్నాడు, ఈ మాట చెప్పారు కాబట్టి లక్ష్మణ మూర్తి ఆగి ఉన్నారు హనుమా ఆనాడు వచ్చి ఎంత రక్షించాడు చూడండీ కాబట్టి అధిక గుణములు కలిగినటువంటివాడు ఎప్పుడూ కూడా తక్కువ గుణములు కలిగినటువంటి వాణ్ణి క్షమించగలిగినటువంటివాడై ఉండాలి.
Image result for సుగ్రీవుడు తారతోఅంతేగాని అధిక గుణములు కలిగినటువంటివాడు నీచమైన గుణములు కలిగినవానితో క్రోధంతో ఉంటే దానివల్ల ఉపకారమేముంటుంది కాబట్టి నీ కోపాన్ని నిగ్రహించుకో జానామి రోషం హరి వీర బంధోః జానామి కార్యస్య చ కాల సంగం జానామి కార్యం త్వయి యత్ కృతం నః తత్ చ అపి జానామి యత్ అత్ర కార్యం ! చెయ్యవలసిన పనేమిటో నాకు తెలుసు చెయ్యనటువంటి పనేమిటో నాకు తెలుసు వేళ మించిపోయిందనీ నాకు తెలుసు ఇప్పుడు చెయ్యవలసి మహోపకారమేమిటో కూడా నాకు తెలుసు తం కామ మృత్తం మమ సన్నికృష్టం కామ అభియోగాత్ చ నివృత్త లజ్జం క్షమస్వ తావత్ పర వీర హంత త్వత్ భ్రాతరం వానర వంశ నాథం ! నాయనా! విశేషమైనటువంటి కామం చేత సిగ్గూ అనేంటటువంటి మాట విడిచిపెట్టి భోగమనుభవిస్తూ ఇప్పుడు సుగ్రీవుడు నా దగ్గరే ఉన్నాడు లోపల మందిరంలో అటువంటి సుగ్రీవున్ని నీ సోదరుడిగా భావించి నీవు క్షమించవలసింది మహర్షయో ధర్మ తపోభి కామాః కామ అనుకామాః ప్రతి బద్ధ మోహాః అయం ప్రకృత్యా చపలః కపి స్తు కథం న సజ్జేత సుఖేషు రాజా ! ఇంతకాలం ఎక్కడో పర్వత శిఖరముల మీద తిరిగాడు సుఖం అంటే ఏమిటో తెలియదు ఇంత కాలానికి రాజ్యమూ భార్యా దొరికింది. కాబట్టి కామంలో అన్నిటినీ మరిచిపోయాడు కాబట్టి నాయనా నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునీ సుగ్రీవుడు నీకు దాసాన దాసుడు ఆయన అవసరమైతే దేన్నైనా మీకోసం విడిచిపెట్టేస్తాడు తత్ ఆగచ్ఛ మహా బాహో చారిత్రం రక్షితమ్ త్వయా ! అచ్ఛలం మిత్ర భావేన సతాం దారా అవలోకనం !! లోపలకి వచ్చి సుగ్రీవున్ని చూడు, సుగ్రీవున్ని నీవు చూడడానికి అభ్యంతరమేమిటీ ఆయన భార్యలతో ఉంటే లోపలికి ఎలా వస్తానంటావా మిత్రుడైనటువంటివాడు మంచి నడవడికలిగినటువంటివాడు భార్యా సహితుడైన మిత్రున్ని చూడ్డానికి వచ్చినా ఏమీ దోషంలేదు లోపలికి రా అంది.
వెళ్ళాడు లక్ష్మణ మూర్తి రుమని ఒక తొడ మీద కూర్చోబెట్టుకుని చుట్టూ వానర కాంతలతో కామోపభోగాన్ని అనుభవిస్తూ కనుగుడ్లు తిరుగుడు పడుతూ బాగా మధుపానా సక్తుడై హారములు చెదరిపోయి ఉన్నాడు ఆ సుగ్రీవుడు లక్ష్మణ మూర్తిని చూడగానే ఒక్కసారి ఎగిరి ఆ పైనుంచి కిందకి దూకాడు ఆసనం నుంచి, నిలబడ్డాడు నిలబడితే లక్ష్మణ మూర్తి అంటారూ... లక్ష్మణ మూర్తి యొక్క ఆగ్రహం ఎలా ఉందో వాతావరణం కూడా అలాగే ఉంది యః తు రాజా స్థితో అధర్మే మిత్రాణామ్ ఉపకారిణామ్ ! మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృశంస తరః తతః !! మిత్రునికి ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ మాట మరిచిపోయినటువంటివాన్ని క్రూరుడూ అని పిలుస్తారు శతమ్ అశ్వ అనృతే హన్తి సహస్రం తు గవా అనృతే ! ఆత్మానం స్వ జనం హన్తి పురుషః పురుష అనృతే !! ఒక గోవుని ఇస్తానని ఇవ్వనివాడు ఒక గుఱ్ఱాన్ని ఇస్తానని ఇవ్వనివాడు నూరు

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
గుఱ్ఱాలను చంపేసినట్టు ఒక గోవుని ఇస్తానని ఇవ్వకపోతే వెయ్యి గోవులను చంపినవాడితో సమానం మనుష్యుడికి ఒక ఉపకారం చేస్తానని చెయ్యకపోతే వాడు తన బంధువుల్ని చంపి తనని తాను చంపుకున్నవాడు అవుతాడు. కాబట్టి మాట ఇచ్చి తప్పినవాడికి ఎప్పుడూ ప్రాయశ్చితంలేదు బ్రహ్మగారు చెప్పారు ఒకనాడు సుగ్రీవా బ్రహ్మాఘ్నే చ సురాపే చ చోరే భగ్న వ్రతే తథా ! నిష్కృతిః విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః !! బ్రహ్మ హత్య చేసినవాడికి సురాపానం చేసినవాడికి దొంగతనం చేసినవాడికి వ్రతం చేస్తానని చెయ్యనివాడికి నివృత్తి ఉంది కానీ కృతజ్ఞుడై చేసిన ఉపకారం మరిచిపోయినవాడికి మాత్రం ఒక్కనాటికి ప్రాయశ్చిత్తం లేదు.
Image result for సుగ్రీవుడు తారతోకాబట్టి ఈ గ్రామ్యభోగాన్ని అనుభవించడం మానేసి చెయ్యవలసిన ఉపకారాన్ని చెయ్యి లేకపోతే వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని గుర్తించుకో రాముడు చెప్పాడు ఈమాట అని చెప్తే... తారా మహాతల్లండీ ఆవిడ వెంటనే లేచి అందీ నాయనా నీవు అంత కోపంగా మాట్లాడకూడదు ఎందుకో తెలుసా ఒక్కటే కారణం రాముని వలననే ఈ రాజ్యం కలిగింది రాముని వలననే ఈ సుఖం కలిగింది సుగ్రీవుడికి ఆ విషయం తెలుసు కానీ ఎక్కడ మెలిక పెట్టిందో చూడండి అంత మధుపానాసక్తయై ఉన్నా అంత భర్తతో భోగింపబడుతూ కనుగుడ్లు తిరుగుతూ తను బయటికొచ్చినా లక్ష్మణుడు ఇంకా మళ్ళీ ఇంకొక్క మాట మాట్లాడకుండా ఉండడం కోసం ఎక్కడ బంధనం వెయ్యాలో అక్కడ వేసేసింది, వేసేసేటప్పటికి ఇంత లక్ష్మణ మూర్తి ఇక మాట్లాడటం కుదరలేదు. ఆవిడందీ నాయనా..! నీవు ఇవ్వాళ ఈ మాట అంటుంన్నావు కానీ ఒక్కమాట గుర్తుపెట్టుకో స హి ప్రాప్తం న జానీతే కాలం కాల విదాం వరః ! విశ్వామిత్రో మహాతేజాః కిం పునః యః పృథ గ్జనః !! విశ్వామిత్రుడంతటి మహర్షి మేనకతో రమిస్తూ కాలాన్ని మరిచిపోయాడు ఒక చపలచిత్తమైనటువంటివాడు వానరుడు కామోపభోగానికి లొంగిపోయాడు ఇన్నాళ్ళు సుఖమన్నమాట తెలియకుండా తిరిగినవాడు ఇవ్వాళ ఆయన కామోపభోగానికి లొంగిపోయి మాట మరిచిపోతే అది పెద్ద విశేషమా... కాబట్టి దానిగురించి నీవు అంత మనసులో పెట్టుకోకూడదు క్షమించు అంది.
ఇప్పుడు లక్ష్మణుడు ఇంకోమాట అన్నాడనుకోండి విశ్వామిత్రుడి మీద మాటా మాటా పెరుగుతుంది, తన గురువుని తాను అవమానింపజేసుకోవచ్చా... విశ్వామిత్రుడంతటివాడు లొంగిపోయాడు అంది, అందుకనీ ఏమీ బెంగపెట్టుకోవద్దు నాయనా కార్యం జరుగుతుంది విడిచిపెట్టు అప్పుడు లక్ష్మణుడు తార చెప్పిన మాటలకి లక్ష్మణుడు శాంతించాడు. సుగ్రీవుడు లేచి నిలబడి, నాది పొరపాటైపోయింది నా తప్పును మన్నించు నేను తప్పకుండా ఉపకారం చేస్తాను నా ఐశ్వర్యము ప్రణష్టా శ్రీ శ్చ కీర్తి శ్చ కపి రాజ్యం చ శాశ్వతమ్ ! రామ ప్రసాదాత్ సౌమిత్రే పునః ప్రాప్తమ్ ఇదం మయా !! ఇవన్నీ నాకు రాముడివల్ల వచ్చినవే కాబట్టి నేను ఆయనకు ఉపకారం చెయ్యడమా ఆయన వెనక వస్తే చాలు కార్యాలన్నీ నడిచిపోతాయి ఆయనే మూడు లోకములను శాశించగలడు ఒక బాణంతో ఏడు సాల వృక్షములను పర్వత శిఖరములను పాతాళాన్ని కొట్టినవాడు రావణున్ని కొట్టలేడా ఏదో నాకు కీర్తినివ్వడానికి వెంటరమ్మంటున్నాడు తప్పకుండా వస్తాను ఉపకారం చేస్తాను అన్నాడు, హనుమని పిలిచాడు దశ దిశలనుంచి వానరములను పిలవమన్నాడు అబ్బో ఎన్ని పర్వతములనుంచో మహేద్రగిరి హిమవత్ పర్వతము వింధ్యాచలము కైలాసము, సముద్రాల దగ్గరనుంచి తాపవనం దగ్గరనుంచి పద్మతాళవం నుంచి అంజనాద్రి నుంచి మనః శిల కుహ మేరుపర్వతము మహారుణ పర్వతం నుంచి అనేకమంది వానరులు కొన్ని కోట్ల కోట్ల మంది మూడు కోట్ల మంది అంజనాద్రి నుండి అలాగే అష్టాద్రి నుండి పది కోట్ల మంది వేయి కోట్ల మంది కైలాస శిఖం నుండి హిమవత్ పర్వతం

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
నుంచి కొన్నివేళ కోట్లు ఎర్రటి వర్ణం కలిగినటువంటి వాళ్ళు విధ్య పర్వతం నుండి కొన్ని కోట్లు ఇంత మంది వానరులు బయలుదేరి వచ్చేశారు వచ్చేస్తే రామ చంద్ర మూర్తి దగ్గరికి సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వెళ్ళాడు, వెళ్ళి పాదముల మీద పడి నమస్కరించాడు నాది పొరపాటైపోయింది మన్నించండి అన్నాడు.
Image result for sugreevaఒక్కసారి చుట్టూ చూశాడట చుట్టూ చూస్తే... యదార్థంగా కిష్కింధ కాండలో చెప్పిన వర్ణణతోటే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను ఆనాడటా భూమి అంతా కూడా ఒక్కసారి పరాగము పైకి లేచిందంటా... గాలికి చెట్లన్నీ అల్లాడిపోయాయటా ఆ పర్వతాలు నదులు శిఖరాలు ఎక్కడ చూసినా వానరాలే ఆకాశమంతా చీకటి కమ్మేసిందంటా కొన్ని కోట్ల కోట్ల వానరములు రేపు వివరంగా చెప్తాను అద్భుతములు శంఖములు లెక్కలు చెప్పడం కుదరదు కోటిని కోటి పెట్టి కోటి పెట్టి కోటి పెట్టి హెచ్చవేస్తే ఎన్ని సున్నాలొస్తాయో అన్ని కోట్లమంది వానరములు వచ్చేశాయి పది రోజులలో రాకపోతే చంపేస్తానన్నాడు సుగ్రీవుడు, కొండలు నిండిపోయాయి పర్వతాలు నిండిపోయాయి శిఖరాలు నిండిపోయాయి చెట్లు నిండిపోయాయి వాళ్ళు వస్తున్నటువంటి వేగానికి చెట్లు కదిలిపోయాయి భూమి మీద ఉన్న పరాగమంతా లేచిపోయింది ఎక్కడ చూసినా భల్లూకములూ లాంగూలములూ వానరములతో కిష్కింధ కిష్కింధ చుట్టుపక్కల అంతా నిండిపోయి వానరములనేటటువంటి వర్షం వచ్చిందా అన్నట్లుగా ఉందట. అంతా చీకటి కమ్ముకపోయింది అటువంటిచోట పరమ సంతోషంతో రామ చంద్ర మూర్తి మనసు చల్లబడింది అందరూ సంతోషించారు సుగ్రీవుడు లేచి రామ చంద్ర మూర్తికి నమస్కరించాడు రామ చంద్ర మూర్తి ఎంతో ప్రసన్నులయ్యారు ఒక్కసారి ఆ వానరులందరి వంకా చూశారు ఓహ్ వర్షం వచ్చే ముందు ఆకాశమంతా మేఘాలతో ఎలా నిండుతుందో అలా నిండిపోయింది ఆకాశన్ని సాక్ష్యాత్ వాల్మీకి మహర్షి వర్ణించాడు.
అందరి మనసులు చల్లబడ్డాయని వర్ణించాడు యదార్థంగా అదే స్థితిలో ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని నేను పూర్తి చేస్తున్నాను రేపటి రోజున దీని యొక్క వివరణ రేపు సాయంకాలపు ఉపన్యాసంలో చేస్తాను మనకేం భయం లేదు తక్కుమేమి మనకూ రాముండొక్కడుండు వరకు ఆయన అనుగ్రహం కిష్కింధ కాండలో ఇంక సీతాణ్వేషనానికి ఇంక హనుమ బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఇంక అన్నీ చల్లని వార్తలే చల్లబడిపోవాలి కిష్కింధ కాండ వచ్చేటప్పటికి మీకు యదార్థం చేప్తున్నాను ఎందుకంటే ఇంక మంగళవాక్యములు ప్రారంభమయ్యాయి అంతే లోకం కూడా చల్లబడింది ఇన్నివానరములు వచ్చేటప్పటికి మరి వాయు వేగం ఎలా ఉంటుందండీ ఒక్కొక్కడు ఎంతెంత వేగం అందుకే చూడండి వాతావరణం కూడా శ్రీరామాయణం ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడింది.
మనం రామ నామం చెప్పి మంగళం చెప్తాం.

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
కోరి కొలిచినవారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రా!!
అండ పిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామ నామము !!రా!!

  కిష్కింధ కాండ ఇరవై ఐదవ రోజు ప్రవచనము
 
వాదా భేదాతీతమగు వైరాగ్యమే శ్రీ రామ నామము !!రా!!
సకల జీవుల లోన వెలిగే సాక్షి భూతము రామ నామము !!రా!!
నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీ రామ నామము !!రా!!
శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీ రామ నామము !!రా!!
మరణ కాలమునందు ముక్తి మార్గమగు శ్రీ రామ నామము !!రా!!
పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామ నామము !!రా!!
దట్టమైన గాడాంధకారములు రూపుమాపును రామ నామము !!రా!!

మంగళా శాసన పరైః......

No comments: