అరణ్య కాండ
పదహారవ రోజు ప్రవచనము
నిన్నటిరోజు ఉపన్యాసంలో రామ చంద్ర మూర్తి సీతా లక్ష్మణ సహితుడై కొందరు కొందరు
ఋషులయొక్క ఆశ్రమాల్నిదాటారు శరభంగ మహర్షీ, సుతీష్ణుడు అందునా ఆయన ఆశ్రమాన్ని రెండుమాట్లు
దర్శనం చేసుకున్నాడు ఒకమారువెళ్ళి మళ్ళీ పదిసంవత్సరముల తరువాత మళ్ళీ సుతీష్ణునియొక్క
ఆశ్రమానికివెళ్ళారు. అలాగే అగస్త్యభ్రాత ఆయనా తక్కువ వారేంకాదు చాలా మంది
అగస్త్యభ్రాతా అంటే ఏదో తగినంత ప్రాముఖ్యతలేనివారు అనుకుంటూంటారు అలా రామాయణంలో
ఎక్కడా ఏమీలేదు ఆయనా మహానుభావుడు చాలా గొప్పతపస్వీ కానీ ఆయన ఇంట్లోనే అన్నగారు చాలా
గొప్పతేజస్సు కలిగినటువంటివాడు విశేషమైనటువంటి తపోబలమున్నవాడు కాబట్టి ఇక
అన్నగారికి తమ్ముడుగా ఉండిపోయాడు తప్పా ఇంక ఆయనకీ అంటే వేరేపేరు ప్రకాశించలేదు.
అది దోషంకాదు సాధారణంగా ఒక ఇంట్లో అన్నగారు చాలా గొప్పవాడు అయితే ఆ అన్నగారికి
తమ్ముడూ అని పిలవబడడం చాలా మర్యాదతో కూడుకున్నటువంటి విషయం. తండ్రిగారికి కొడుకు
అని చెప్పినా ఫలానా మామగారికి అల్లుడూ అని చెప్పినా ఫలానా అన్నగారికి కొడుకూ అని
చెప్పినా దోషం ఏమీ కాదు అదీ కీర్తికారకం తన వంశంలో అటువంటివారు ఉన్నారూ అనిచెప్పి
తమకి ఆత్మబంధువులలో అటువంటివారు ఉన్నారు అని చెప్పి చాలా సంతోషించదగిన విషయాలలో
అదొకటి అవుతుంది.
కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే అరణ్యకాండ ప్రారంభం దగ్గరినుంచి కూడా మీకు
ఇక రావణ సంహారం వైపుకు ఋషులు అడుగులు వేయించడం మొదలు పెడతారు రామున్ని అందుకే
ఒక్కొక్క ఋషి చెప్పేమాట రాబోయేటటువంటి కథకీ సంబంధించినదై ఉంటుంది. శరభంగుడు
దగ్గరికివెడితే ఇంద్రుడు కనపడుతాడు ఇంద్రుడు రాక్షససంహారం గురించే రామ చంద్ర
మూర్తికి కావలసినసమర్థత ఎలాప్రకాశించాలో శరభంగ మహర్షితో మాట్లాడుతుంటాడు, రామా నీ
దర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను నీ దర్శనం అయిపోయింది ఇంక బ్రహ్మలోకానికి
వెళ్ళిపోతున్నాను అని శరభంగ మహర్షి వెళ్ళిపోతారు. సుతీక్ష్ణుడు ఆయన ఒక
ఆశ్చర్యకరమైనమాట ఒకటి అంటాడు అన్నీచెప్పి ఆశ్రమం గురించి ఇక్కడికి అప్పుడప్పుడు
లోభపెట్టడానికి లేళ్ళ గుంపులు వస్తుంటాయి రామా! జింకలు వస్తుంటాయి అంటాడు. అంటే
రాముడు అంటాడు నాకేం వాటి గురించి పెద్ద చింతలేదు నా చేతిలో ధనుర్భాణాలు ఉన్నాయి
అంటాడు, నవ్వి ఊరుకుంటాడు సుదేక్ష్ణుడు కానీ రామాయణకథలో రాబోయే కాలంలో ఆ జింకయే
లోభపెట్టింది-పెట్టి రామాయణకథనీ ఒక గొప్ప గతికి తిప్పింది.

|
మాటలన్నీ కూడా రామ
చంద్ర మూర్తి యొక్క అవతార ప్రయోజనంవైపుకు అడుగులు వేయిస్తాయి. ఇవన్నీ ఒకెత్తూ అగస్త్య
మహర్షి ఇచ్చినటవంటి విష్ణుచాపం ఎక్కడ రామ చంద్ర మూర్తి ఆశ్రమాన్ని నిర్మాణం
చేసుకొని నివసిస్తే అవతార ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి ప్రదేశాన్ని ʻపంచవటినిʼ నిర్ణయం చేసి
చెప్పడం ఒకెత్తు. ఇప్పుడు ఆ పంచవటి ప్రదేశానికి సీతా లక్ష్మణ సహితుడై రాముడు
బయలుదేరి వెడుతున్నాడు వెడుతుంటే ఆయనకు చెట్టుమీద ఒక చాలా ఒక పెద్దశరీరం
కలిగినటువంటి పక్షికనపడింది. అది ఒకపక్షి అంటే పక్షులలో పెద్దదిగా
చెప్పబడేటటువంటిది సాధారణంగా గ్రద్ధ, గ్రద్ధ కాకపోతే ఒక డేగ రాబందు అవి తప్పా
అంతకన్నా పెద్ద పెద్ద పక్షులు లోకంలో ఎక్కువగా చెట్ల మీద కనపడేవి ఉండవు, కానీ
అసాధారణమైనటువంటి పరిమాణంతో ఉంది ఆ పక్షి. కాబట్టి రాక్షసుడూ అనుకున్నాడు ఆయన,
రాక్షసుడే పక్షి రూపంలో ఇక్కడ ఉన్నాడూ అని నీవు ఎవరూ ఎందుకి ఇక్కడ ఇలా చెట్టు మీద
పక్షి రూపంలో ఉన్నావు అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడూ స తం పితృ సఖం బుద్ధ్వా
పూజయా మాస రాఘవః ! స తస్య కులమ్ అవ్యగ్రమ్ అథ పప్రచ్ఛ నామ చ !! నేను జటాయువు
అన్న పేరున్నదానిని, నేను మీ తండ్రిగారైనటువంటి దశరథ మహారాజుగారికి స్నేహితుడను ఈ
మాట చెప్పగానేటా... రాముడు పూజించాడట పూజించి మైత్రిని కలుపుకున్నాడు అన్నాడు
మహర్షి.

|

ఇందులో దక్షప్రజాప్రతికి 60 మంది కుమార్తెలు, దక్షప్రజాపతియొక్క 60 మంది
కుమార్తెలలో 8 మంది కుమార్తెలను కశ్యపప్రజాప్రతినిధి వివాహం చేసుకున్నాడు ఆ
ఎనిమిది మందిపేర్లు అధితి, ధితి, ధనువు, కాళిక, తాంమ్ర, క్రోధవశ, మను, అనవ ఎనమండుగురు
భార్యలు ఈ ఎనమండుగురు భార్యలయందు కూడా కశ్యప ప్రజాపతినిధి ఏంచెప్పాడంటే మీరు
ఉత్తమమైన సంతానాన్ని వృద్ధిచెయ్యండీ అన్నాడు. కానీ అందులో ఆయన మాట విన్నవాళ్ళు
కొందరూ విననివాళ్ళు కొందరు. నేను ఇక్కడ ఒక్క ధర్మ సూక్ష్మాన్ని స్పష్టంగా
చెప్పకపోతే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. భార్యయందు సంతానం పొందడంకోసమే వివాహం
చేసుకుంటారు అసలు వివాహం చేసుకోవడానికి సంకల్పం ఏంచేప్తారంటే ప్రజాప్రత్యర్థం
అని చెప్తారు అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థమును పొందుటకొరకు, దేనివలనా కామమును
ధర్మబద్ధంచేసి అర్థాన్నిపొందుతారు. అర్థం అంటే డబ్బు కదాండీ సంతానం అర్థం ఎలా
అవుతుందీ అని మీరు నన్నో ప్రశ్నవేయవచ్చు కామము ధర్మబద్ధమై భార్యయందు ప్రసరిస్తే
అలా ప్రసరించినటువంటి ధర్మబద్ధమైన కామముచేత కలిగినటువంటి అర్థమునకే సంతానము కొడుకు
లెదా కూతురు ప్రత్యేకించి కొడుకుకి ఆ అర్థం బాగా అన్వయం అవుతుంది అంటారు.
ఎందుచేత అంటే తను సంధ్యావందనం చెయ్యలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కొడుకు
సంధ్యావందనం చేస్తాడు, తండ్రి పేరుమీద సంధ్యావందనం చేయడానికి అధికారం కొడుకుకి
ఒక్కడికే ఉంటుంది కాబట్టి కొడుకు ఆ సంధ్యావందనం చెయ్యొచ్చు. మంచానపడిపోయి ఉన్నా
సంధ్యావందనం మానడానికి వీలులేదు శాస్త్రంలో మృత్యు ముఖంలో ఉండి మంచంలో
ఉండిపోయాడనుకోండి ఏది మానకూడదూ అంటే సంధ్యావందనం మాత్రం మానకూడదు చెయ్యాలి అప్పుడు
కూడా చెయ్యాలి. అంటే చస్తుంటే సంధ్యావందనమండీ అని ఒకసామెత వచ్చింది. చచ్చిపోతున్నా
కూడా ఆ సూర్యోదయ సూర్యాస్థమయాలు ఆయా కాలములయందు సంధ్యావందనం చేయవలసిందే, మరి
అప్పుడు తండ్రిగారికి అసలు ప్రాణంతో ఉన్నాడు తప్పా సంధ్యావందనం చేసేస్థితి కాదు
మరి ఎవరు ఇప్పుడు గట్టు ఎక్కించాలి అంటే కొడుకు ఉండాలి అని కోరుకొనేది ఎందుకంటే
రెండు కారణాలకి కొడుకు ఉండాలని కోరుకుంటారు ఈ రెండు కారణాలకీ కొడుకు లేకపోతే అసలు
కొడుకన్నవాడు ఉండడం
|
వల్ల శాస్త్రీయమైన
ప్రయోజనమేమీ నెరవేరదు, వాడు నాన్నగారి డబ్బులు పుచ్చుకోవడానికి కొడుకైతే అంతకన్నా
అసహ్యకరమైన విషయం ఇంకోటిలేదులోకంలో రెండే ప్రధానప్రయోజనాలు ఉంటాయి లోకంలో మూడవ
ప్రయోజనం ఒకటి ఉంటుంది దాన్నికోరుకోకుండా ఉండడమే మంచిది ఎవడికివాడు తరించే
ప్రయత్నంచేయాలి, కొడుకు మీద ఆధారపడిపోవడం కన్నా మొదటి రెండు ప్రయోజనాలుగా ఏమి
చెప్పవలసి ఉంటుందంటే ఒకటి తను సంధ్యావందనం చెయ్యలేనటువంటి స్థితిలో అంటే
సంధ్యావందనం చేసేటటువంటి అధికారము ఉన్నవారై ఉన్నప్పుడు కొడుకు తండ్రి పేరుమీద
సంధ్యావందనం చెయ్యవలసి ఉంటుంది.

ఈశ్వరుని దగ్గరకి వెళ్ళి తనతప్పు చెప్పుకున్నాడు ఎంతగొప్పగా
చెప్పుకున్నాడంటే... వేశ్యలయొక్క సుఖాన్ని అనుభవించి అనుభవించి వాళ్ళుగీరితే ఈ
శరీరమంతా కాయలుకాచింది ఈశ్వరా! అయినా నాకు ఇంకా కామంతీరలేదు కామంతీరేటట్టుగా నీవునన్ను
అనుగ్రహించవా అన్నాడు తమకంబొప్ప బరాంగనాజన పరద్రవ్యంబులన్ మ్రుచ్చిలంగ మహోద్యోగము
సేయు నెమ్మనము దొంగంబట్టి వైరాగ్య పాశంబులం జుట్టిబిగించి నీదు చరణస్తంభంబునంగట్టి
వైచి ముదం బెప్పుడుగల్గ జేయగదవే! శ్రీ కాళహస్తీశ్వరా ! ఏమి పద్యాలో ఒక్కొక్క
పద్యం అంమృతభాండం నిజంగా అందులో నాకైతే చాలా గొప్పగా అనిపించేదేమంటే ఆయనకు ఎంత
తత్వం అర్థమయిందో కాని నిజంగా ఆలంచున్ మెడగట్టి, దానికి నపత్యశ్రేణి గలిపంచి, ద
ద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధము గావించి అంటాడు. ఈశ్వరా! నన్ను ఇలా
కట్టిపడవైచితివయ్యా నన్ను ఎంత చమత్కారంగా కట్టిపడవేసినావు అంటాడు, సరే! ఇప్పుడు
మళ్ళీ కాళహస్తీశ్వర శతకములోపలికి ఎందుకానీయండీ!
|
కాబట్టి ఇప్పుడూ
కొడుకులు ఉండాలి అని కోరుకోవలసిన అవసరం ఎందుకు కలుగుతుందీ అని నేను మీకు చెప్పాను
అయితే ప్రజాపధ్యర్థం అనికదా అడుగుతాము, బిడ్డలకొరకు కదా కామాన్ని ధర్మ
బద్ధంచేసి అర్థంగా సంతానాన్ని పొందుతాము కాబట్టి వాడు ఇదిగో ఈ ఉద్దరణ చేస్తాడూ అని
కాని వాడు అలాచేయకపోతే అది వేరువిషయం కాని సత్ పుత్రుడు అన్నది కలగడానికి శాస్త్రంలో
ఒకమర్యాదా ఉంది. ఎట్టి పరిస్థితితులలోనూ కూడా సాయంకాలము అసుర సంధ్యావేలలో భార్యా
సంగమం చేయకూడదు పరమనిషిద్దం. ఎందుచేతనంటే సాయంకాలము అసురసంధ్యావేలలో భార్యా సంఘమం
చేయడం వల్లకాని బిడ్డలుపుడితే వాడు ఆ వంశంలో పైన పరమపుణ్యాత్ములై అశ్వమేధాధి
యాగములు చేసినవారుకూడా
తలకిందులుగా నేల మీద పడిపోయేటట్టుగా పడేటటువంటి ధురాత్ముడు అవుతాడు వాడు
లోకకంటకుడు అవుతాడు, లోకాన్నంతటినీ బాధపెట్టేవాడు అవుతాడు. శాస్త్రం అలాగే మాట్లాడుతుంది
భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు పుట్టడానికి కారణం ఇదే చెప్తారు ʻకశ్యప ప్రజాపతీ-ధితిʼ విషయంలో
అసురసంధ్యవేళలో సంఘమించినటువంటి కారణంచేతనే ఆ విశ్వవసుబ్రహ్మకీ ఆ తరువాత కైకసికీ
వాళ్ళిద్దరికీ కలిపీ ధారుణమైన సంతానం కలిగారు, కైకసీ రాకూడని సమయంలో వచ్చింది
విశ్వావసుబ్రహ్మ దగ్గరికి బొటనవేలిని నేలమీద రాస్తూనిలబడింది నిలబడితే ఆయనా
మహానుభావుడు త్రికాలజ్ఞుడు విశ్వవసుబ్రహ్మ నీవు ఎందుకు వచ్చావు అని అడిగాడు, నేను
కొంత చెప్పగలను అంతకన్నా నేను ఆడదాని మనసు విప్పి అంతకన్నే ఏం చెప్పగలను, నీ వలన
కుబేరుడు జన్మించాడు అంతటి తేజో మూర్తులైన బిడ్డలకొరకు నీదగ్గరకు వచ్చాను నీ
తేజస్సువలన అటువంటి బిడ్డలుకావాలని అని అడిగాడు ఆయన అన్నాడు నీవు రాకూడని వేళలో
వచ్చావు అందుకే నీకు పుట్టేటటువంటి వాళ్ళు లోకకంటకులైన సంతానమే కలుగుతారు అందుకని
మొదట పుట్టినటువంటి రావణాసురుడు అటువంటివాడే రెండవ పర్యాయం పుట్టినటువంటి
కుంభకర్ణుడూ అటువంటివాడే మూడవిదిగా జన్మించిన శూర్పుణఖా అటువంటిదే అప్పటికీ వేళదాటి చీకటిపడింది కనుకా
నాల్గవవాడు మాత్రం విభీషనుడు ధర్మాత్ముడు జన్మించాడు.
కాబట్టి భార్య అన్నంత మాత్రంచేత ఉత్తమ సంతానం పొందుతుంది అనిచెప్పడం కుదరదు
ఎందుకని అంటే సంఘమ సమయం కూడాచాలా ముఖ్యమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది
శాస్త్రంలో భార్యయందు నిక్షేపించకూడనటువంటి సమయంలో తేజస్సును నిక్షేపిస్తే వాడు
లోకకంటకుటకులు అయిపోతారు ఎందుకంటే అది ఉగ్రవేళా అంటారు. అందులో ఆయన చెప్తాడు కూడా
కశ్యప ప్రజాపతి ఇది ఉగ్రవేళ రమించుట ఒప్పుకాదూ అంటాడు అయినా సరే ఆవిడవినదు అది
వేరే విషయం అనుకోండీ! బాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు మొదలైనవారి జనన
వృత్తాంతంలో చెప్తారు ఆ విషయాలన్నీ.

|
మొదటి భార్య అతిధి,
మొదటి భార్య అని ఎందుకు వాడాలి ఎనమండుగురిలో ఒకతి అధితికి పన్నెండుగురు ఆధిత్యులు
ద్వాదశాధిత్తులు ఆమెబిడ్డలు ఎనమండుగురు వసువులు ఆమె బిడ్డలు 11 మంది రుద్రులు
ఏకాదశ రుద్రులు ఆమె బిడ్డలు ఇద్దరు అశ్వణీ దేవతలు ఆవిడ బిడ్డలు మొత్తం 33 మంది
దేవతలు కూడా ఆమెకే కలిగారు. అంటే ఆమె కశ్యప ప్రజాపతి యొక్క మాటలను అవదలదాల్చింది
భర్తను అనుగమించింది భర్తని ఉపాసన చేసింది. ఆ కారణం చేత 33 మంది దేవతలు ఆమెకు కలిగారు.
ధితికీ ధైత్యులు జన్మించారు ధనువుకీ హయగ్రీవుడు జన్మించాడు కాళికకి నరకుడు
కాలకుడు అనేటటువంటి ఇద్దరు జన్మించారు. తామ్ర అనేటటువంటి ఆవిడకి ఐదుగురు ఆడ
పిల్లలు పుట్టారు క్రౌంచీ భాషీ శ్వేమీ ధృతరాష్ట్రి శుఖి క్రోధవశా ఈవిడికీ ఆ
క్రోధవశా అనబడేటటువంటి తల్లికి పదిమంది కూతుళ్ళు పుట్టారు మనువు అనబడేటటువంటి
ఆవిడకి మనుష్య జాతీ అంతా ఆవిడకే జన్మించారు. అందుకే మనందరం కూడా ఎవరికి సంతానం
అంటే మనందరం కూడా కశ్యప ప్రజాపతి సంతానంలోకి వస్తారు మనుష్యులు అందరూ కశ్యప
ప్రజాపతి భార్యయందు ఉత్పాదింపబడ్డారు. అనవా ఈవిడకీ ఫల వృక్షములన్నీ కూడా ఆవిడ
యొక్క సంతానంగానే జన్మించాయి, ఇందులో మళ్ళీ చిత్రమేమిటంటే తామ్రకు జన్మించినటువంటి
ఐదుగురులు ఆడపిల్లలకి క్రౌంచీ భాషీ శ్వేమీ ధృతరాష్టీ శుఖి అనబడే వాళ్ళల్లో
క్రౌంచికీ గుడ్లకూబలు పుట్టాయి భాషికీ భాష పక్షులు పుట్టాయి స్వేమికీ డేగలూ
గ్రద్దలూ పుట్టాయి, ధృతరాష్ట్రికి హంసలు పుట్టాయి శుఖికి నత అన్న కూతురు నతకి
వినతా అన్న కూతురు వినతకీ గరుడుడూ అరుణుడు అని ఇద్దరు కొడుకులు అరుణుడికి సంపాతి
జటాయువు ఇద్దరు బిడ్డలు అందులో నేను సంపాతి తమ్ముడు జటాయువుని.

కానీ చామరీ మృగం యొక్క వెంట్రుకకున్న గొప్పతనమేమిటంటే అది సేద తీరుస్తుంది
దానినుంచి వచ్చేటటువంటి గాలి అలసట తీరుస్తుంది, కాబట్టి ఈశ్వరుడికి చాలా పెద్ద సేవ
ఏదైనా చెయ్యాలి అని అంటే నిజానికి ఉన్న సేవలలోకెల్ల పెద్ద సేవ ఏమోతెలుసాండీ చామరం
వేయడం ఎందుకంటే చామరం వేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. చామరం నుంచి గాలి వచ్చేటట్టు
వేయకూడదు, ఓ ఇలా ఉస్సురుగా ఆయన బట్ట కదిలిపోయ్యేటట్టు వేయకూడదు, గాలి చామరం నుంచి
వెళ్ళి
|
ఆయనకు తగలాలి అంటే
అందుకే చామరంవస్తే ఇలా ఎత్తి ఇలా అంటారు. అంటే ఇలా కుచ్చులా ఇలా వెడుతుంది మళ్ళీ
ఇలా
అంటారు, అంటే ఇది విచ్చుకుని ఇలా ఇలా పడాలన్నమాట
చామరం పడితే దాని నుంచి గాలి ఈశ్వరునికి పడుతుంది ఈశ్వరుడికి ఆ గాలి తగిలితే ఆయన
సేదతీరుతాడు ఎందుకో తెలుసాండీ! మీరు ఆయనకి సేవలు ఒకదాని తరువాత ఒకటి చేసేస్తుంటే
ఆయనకి బడలిక కలుగుతుంది, పదార్థాలన్నీ మీద పోసుకొని ఆయన బడలుతాడు అందులో మంత్రం
క్రియా రెండుకానీ ఒకదాని పక్కన ఒకటి సరిగ్గా జరగకుండా వేగంగా
జరిగిపోతున్నాయనుకోండీ చాలా అహస్యంగా ఉంటుంది ఈశ్వరునికి కూడా మీరూ... ఆవాహయామి
పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్గ్యం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి...
అని నీళ్ళు చల్లేసేసి ఓ చకచకచకచక చేసేస్తుంటే ఆయన ఎంత తొందరతొందరగా చేయాలని
గుర్తుపెట్టుకుంటాడు మీరు చూడండీ!



|
ఎందుకని అంటే
మీరుచూడండీ ఎప్పుడైనా మీ బిడ్డలకు మంచి నీళ్ళు ఇచ్చిచూడండీ ఇలా నోట్లో పెట్టుకుని
తాగుతుంటే తలెత్తుతారు ఇలాగ తలెత్తినప్పుడు ఇలా కిందిపెదవి కనపడుతుంది తాగేటప్పుడు
ఎప్పుడూ కూడా కిందిపెదవి తడుస్తూ ఇక్కడ కదలిక కనిపిస్తుంది గుటకలు పడుతున్నప్పుడు
అది మిమ్మల్ని దర్శనం చేయమని ఆ మంత్రానికి అర్థం. ఉత్తరాపోషణం సమర్పయామి
ఇప్పుడు ఆయన గ్లాసు అక్కడ పెట్టేశారు, ఇప్పుడు హస్తౌ ప్రక్షళాయామి చెయ్యి
ఎంగిలైంది నీళ్ళుతాగితే నీళ్ళుపోయాలి పాదౌ ప్రక్షాళయామి కాళ్ళమీదపొయ్యాలి, శుద్ధ
ఆచమనీయం సమర్పయామి మళ్ళీ తాగమనాలి. ఇక్కడ చిత్రమేమిటో తెలుసాండీ! మీకు శ్రద్ధ
ఉందో లేదో మీరే మీరు మీకు తీర్పుచెప్పడం కోసమని ఒక మంత్రాన్ని వదిలేసింది
శాస్త్రం, ఏ మంత్రమో తెలుసా! మీరు చేతులు తుడవాలి కాళ్ళు తుడవాలి మీరు చేతులు
కడుక్కున్న తరువాత తుడుచుకొమ్మని తువ్వాలు ఇవ్వరూ మీరు దర్శనం చేసినవారైతే ఓసారి
ఉత్తరీయం తీసి ఇలా అంటారు అన్నాడూ అంటే పూజలో నిష్ఠతో చేస్తున్నాడూ అనిగుర్తు. మంత్రమూ
ఓ పరువూ ఇదో పరువుచేశాడు అంటే ఆయన విగ్రహం ఏదోపెడితే ఇది మళ్ళీ నేను తినేదే
ప్రసాదము అని అనుకుంటున్నాడూ అనిగుర్తు అంటే ఆ పూజ స్వీకరింపబడలేదూ అనిగుర్తు.
ఒక తంతు అంటారుదానిని ఒక తంతుచేశాడు తప్ప అది పూజకాదు ఎందుకంటే మూడు ఏకీకృతం
కాలేదుపూజలో నిజంగా ఏకీకృతం ఎక్కడ అవుతుందో అక్కడికే ఈశ్వరుడు వచ్చితీసుకుంటుంటాడు.
కాబట్టి ఈ స్థితి కల్పింపబడితే ఆరాధనయందు ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు
కలుగుతుంది. అందులో ఆయన బడలికపొందుతుంటాడు మనంచేసిన సేవకి ఆ బడలిక తీరడానికి
చామరము అనబడేటటువంటిదానితో ఒకసారి ఆ గాలి ఆయన మీదకువెళ్ళేటట్టు ఊపుతారు. అందుకనీ
చామరము, చామరీ మృగముల వెంట్రుకలకు మాత్రమే ఆశక్తి ఉంది. అందుకనీ ఆ చామరీ మృగంగా
పుట్టటం చాలా అదృష్టం అది ఈశ్వరుడి సేవకు వెళ్ళుతాయి దానివెంట్రుకలు ఇప్పుడు ఈ చామర
మృగములు ఎవరికి పుట్టాయటా... మృగమందా అనబడేటటువంటి కశ్యప ప్రజాప్రతియైన ఒక భార్య
క్రోధవశ అన్నఆవిడకు పుట్టిన పది మందీ కూతుళ్ళలోని రెండవ కూతురు బిడ్డలూ ఈ చామరీ
మృగములు. అంటే సృష్టిలో చాలా వరకు కష్యపప్రజాపతి యొక్క అనుగ్రహమే, హరి అన్న
అమ్మయికీ సింహములూ బలమైన కోతులు పుట్టాయి అందుకే “హరీశ్వరహాః” అంటూంటారు. భద్రమద
అనే ఈవిడకీ ఇరావతి అన్న కూతురు పుట్టింది, ఈ ఇరావతికి ఐరావతము అనబడేటటువంటి కొడుకు
పుట్టాడు. మాతంగి ఈవిడకి ఏనుగులు పుట్టాయి అందుకే మాతంగములు అంటూంటారు, శార్దూలీ
ఈవిడకి పెద్ద పులులూ కొండ ముచ్చులూ పుట్టాయి స్వేత ఈవిడకి దిగ్గజములు పుట్టాయి
అంటే భూమిని మోసేటటువంటి ఏనుగులు అన్ని దిక్కులలో ఉండేవి సురభి ఈవిడికి రోహిణీ
గంధర్వీ అని ఇద్దరు ఆడపిల్లలు ఈ రోహినికి గోవులు పుట్టాయి గంధర్వికి అశ్వములు
పుట్టాయి.
ఈ మాటలు చెప్తున్నప్పుడటండీ! గోశాలతోసహా అన్ని సంతోషిస్తాయి ఎందుకంటే అవి
సృష్టి ఎలా జరిగిందో చెప్తున్నారు, సురస అనేక శిరస్సులు కలిగినటువంటి నాగులు
జన్మించాయట ఈవిడకి అందుకే నాగమాత సురస వచ్చింది అంటూంటారు సుందర కాండలో వస్తుంది
ఆమాట కద్రువకు సాధారణ సర్పములు జన్మించాయి వాటితోపాటు వేయిపడగలు కలిగినటువంటి
ఆదిశేషుడు కూడా ఆమెకు జన్మించాడు ఆయన భూమిని మోస్తుంటాడు రామా! ఇది సృష్టిక్రమం
|


|
ఇప్పుడూ ఋతువు
మారింది అక్కడ పర్ణశాల నిర్మాణం చేసుకోవాలి ఆ పర్ణశాల నిర్మాణం చేసుకోవలసినటువంటి పంచవటీ
ప్రాంతాన్నిచేరి రాముడు అంటాడు ఒక ప్రాంతాన్ని చూడగానే అది అసలు
నివాసయోగ్యమైనటువంటిప్రదేశం ఎలా ఉండాలోచెప్తాడు రాముడు అసలు రామాయణంలో ఉండని ధర్మసూక్ష్మం
ఉండదండీ ఆయన అంటాడూ ఇక్కడ సర్పములు ఎక్కువగా తిరుగుతుంటాయి మృగములు ఎక్కువగా
తిరుగుతున్నాయి రెండూ ప్రమాదకరమే కాబట్టి ఇప్పుడు నలుచదరముగా ఉన్నటువంటి స్థలం
మనకికావాలి, నలుచదరంగా ఉన్నటువంటి స్థలంలో ఇప్పుడు నీవు కట్టేటటువంటి పర్ణశాల
లక్ష్మణా విశాలంగా ఉన్నది మనం కట్టుకోవాలి ఎందుకో తెలుసా? విశాలంగా ఉంటే తప్పా రమతే
యత్ర వైదేహీ త్వమ్ అహం చైవ లక్ష్మణ ! తాదృశో దృశ్యతాం దేశః సన్ని కృష్ట జలాఽశయః !! సీతమ్మ తల్లీ ఆ పర్ణశాలలోనే తిరగాలి ఆవిడ
తిరగడానికి సరిపోవాలి ఆ పర్ణశాల ఆవిడకు సౌకర్యంగా ఉండాలి నేను తిరగాలి నాకు సౌకర్యంగా
ఉండాలి నీవు తిరగాలి నీకు సౌకర్యంగా ఉండాలి వీటితోపాటు అగ్నిహోత్రం
చేసుకొనేటటువంటి అగ్ని శాలలు ఉండాలి, ʻవేదిʼ అంటే దేవతార్చన చేయడానికి పెట్టుకోవలసిన వేదికా
నిర్మాణము ఉండాలి. ఇల్లు కట్టుకోవడానికి స్థలంబాగుంది కదా అనుకుంటే నీళ్ళు
తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది కలిగేచోట ఇళ్ళుకట్టుకోకూడదు, ఎంత పెద్దమాట అన్నాడో
చూడండి! ఇల్లు కట్టుకుని మంచినీళ్ళకి మాత్రం రోజు ఎక్కడికో ఐదు కిలోమీటర్లు వెళ్ళి
ఓ డబ్బాతో నీళ్ళు తెచ్చుకోవలసినటువంటి స్థితి ఉందనుకోండీ ఆ ఇళ్ళు ఎంత బాగుండనీయండీ
ఆ ఇంట్లో సుఖం ఉండదు.
ఎందుకంటే తాగేనీళ్ళు దొరకకపోతే స్నానం చేయడానికి నీళ్ళు లేకపోతే ఇంక ధర్మమేం
నిలబడుతుందండీ సంధ్యావందనం ఎలాచేస్తారుమీరు ఆర్ఘ్యమెలా ఇస్తారు, నేనుమీతో ఓసారి
ప్రస్థావనచేశాను ఈ నీటియొక్క సౌకర్యము ఎందుకుండాలి అని అంటూంటారు అన్నదానిగురించి
ఆ తిరుకురల్ దాంట్లో తమిళ కవికూడా ఇదే ప్రతిపాదనచేస్తుంటాడు ఆ నీటి గురించి
కాబట్టి రమతే యత్ర వైదేహీ త్వమ్ అహం చైవ లక్ష్మణ ! తాదృశో దృశ్యతాం దేశః సన్ని
కృష్ట జలాఽశయః !! నీళ్ళు ఉండాలి,
ఇంటిముందు మామిడి చెట్టు పనస చెట్టు పున్నాగ చెట్టు ఇటువంటి దేవతా వృక్షములు
కొన్ని ఉండాలి, ఇంటిముందు ఉండవలసిన చెట్లు కొన్ని ఉంటాయి వాటిని దేవతా వృక్షములు
అంటారు వాటికి స్థలమేమీ లేదు అవి ఇక్కడ ఉండచ్చా ఉండకూడదా అని అవి దేవతా వృక్షములు
అవి ఎక్కడైనా ఉండచ్చు ఇంట్లో అటువంటి చెట్లు ఉండాలన్నాడు, ఎందుకనీ ఓ పుణ్యాహవాచనం
చేసుకోవాలనుకోండి మామిడి కొమ్మ కావాలి ఇంట్లో ఓ శుభ కార్యము అనుకోండి ఓ మామిడి మండ
పెట్టుకోవాలి పెట్టుకున్నారు, వరలక్ష్మీ వ్రతం అన్నారనుకోండి మామిడి తోరణం
కట్టుకోవాలి కట్టుకున్నారు, లేదనుకోండి మహా శివరాత్రి వచ్చిందనుకోండి గడపకు ఓ
మామిడి తోరణం కట్టుకోవాలి పై గడపని లక్ష్మీ కమ్మీ అంటారు. లక్ష్మీ కమ్మీ అంటే ఇంట్లో ఉండేటటువంటి యజమాని యొక్క
వైభవము ఎవరు నిర్ణయం చేస్తారంటే భార్య నిర్ణయం చేస్తుంది ఇంటి రాజ ద్వారపు పైకమ్మి
నిర్ణయం చేస్తుంది కింది కమ్మికి పసుపు రాస్తాం కానీ తోరణం దేనికి కడతాం
పైకమ్మికే ఇంట్లో శుభమని గుర్తేమిటంటే పైకమ్మికి కట్టేటటవంటి తోరణం అందుకే పైకమ్మి
అలంకృతమై ఉండాలి ఎప్పుడూ ఇంటికి అది ఎప్పుడూ తోరణంతోటో ఒక పూల దండతోటో ఒక భగవన్
మూర్తితోటో ఉండాలి రాజ ద్వారము ఎప్పుడూ దాని కింద నుంచి వెళ్ళేటట్టుగా ఉండాలి
ఎవరైనా లోపలికి వచ్చేవారు.
కాబట్టి లక్ష్మణా! మనకి ఈ సౌకర్యాలు అన్నీ ఉండేటట్టుగాచూడు అటువంటిచోట ఇళ్ళుకట్టు
అంటే లక్ష్మణుడు అన్నాడూ అయ్యబాబోయ్ ఇవ్వన్ని ఎక్కడ చూడనూ ఎక్కడకట్టను రామా..?
ఇదేమిటిది అనలేదు, అయన అన్నాడూ పరవాన్ అస్మి కాకుత్థ్స త్వయి వర్ష శతం స్థితే !
స్వయం తు రుచిరే దేశే క్రియతామ్ ఇతి మాం వద !! రామా! మీరు నూరు సంవత్సరములు
కూడా సంతోషంగా అలాగే ఉండి నాచేత సేవలు అందుకోవాలి, నేను నేనుగా ఇళ్ళు కట్టడం ఏమిటీ
నేను
|

అటువంటి పర్ణశాల మీకు తపస్సు చేసుకునేవాళ్ళు కూడా ఉంటున్నారా అంటే..? తపస్సు
చేసేటటువంటి అలా ఉండేటటువంటి ప్రదేశాలు కూడా కనపడటం తక్కువ శృంగేరీలో ఒకప్పుడు
మహానుభావులు తపస్సు చేసుకోవడమనీ తుంగానదినిదాటి అవతలి వైపుకి వెళ్ళి పర్ణశాలలు
కట్టుకుని అందులో తపస్సుచేశారు, కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర ఇంద్ర సరస్వతీస్వామీ
ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఇలాగే తాటాకులతోటి ఒక అచ్ఛాదనం వేయించుకుని మట్టితో ఉన్న
ప్రదేశంలోనే ఆయన ఉండి తపస్సు చేసేవారు మౌనంలోవుండి, మహాత్ములు ఉన్నారు లేరని నేను
అనడం లేదు ఇప్పటికీ ఉన్నారు పెద్దలూ మహానుభావులు అనుష్టించేటటువంటి వారు ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు ఆ పర్ణశాల నిర్మాణం పూర్తైయింది, పూర్తైన తరువాత ఆయన పరుగెత్తుకుంటూ
గబగబా గోదావరీ నది ఒడ్డుకువెళ్ళారు, వెళ్ళి అక్కడ నుంచి పూవ్వులూ మొదలైనటువంటివన్నీ
తీసుకొనివచ్చాడు సమీ కృత తలాం రమ్యాం చకార లఘు విక్రమః ! నివాసం రాఘవస్యాఽర్థే ప్రేక్షణీయం
అనుత్తమం !! రాఘవుని కొరకు
కట్టాడు ఆ ఇల్లు, తను రాఘవుడి
|
సేవ
కొరకు అక్కడ ఉన్నాడు ఆ ఇల్లు తనకొరకు కాదు.
పూర్తిచేసి స గత్వా లక్ష్మణః శ్రీమాన్ నదీం గోదావరీం తదా ! స్నాత్వా పద్మాని చ
ఆదాయ స ఫలః పునః ఆగతః !! గోదావరిలో స్నానంచేసి పువ్వులూ మొదలైనవన్నీ
పట్టుకొచ్చి వాస్తుపూజ చేస్తారు మొన్న అన్నాడుగా ఎవరైతే స్థిరకాలము
ఉండాలనుకుంటున్నారో ఆయురారోగ్యములు కలగాలని అనుకుంటున్నారో అటువంటివారు వాస్తుపూజ
చేయ్యకుండా గృహప్రవేశం చెయ్యకూడదు. కాబట్టి వాస్తుపూజ చేస్తాను అలాచేస్తే
చిరజీవినః అన్నాడు కదా అయోధ్య కాండలో చాలా కాలం బ్రతికి ఉంటారు ఆ ఇంట్లో అని కాబట్టి
తతః పుష్ప బలిం కృత్వా శాన్తిం చ స యథా విధి ! దర్శయా మాస రామాయ తత్ ఆశ్రమ పదం
కృతమ్ !! అక్కడా లక్ష్మణుడు తీసుకొచ్చినటువంటి ఆ గోదావరీ జలాలతోటీ పుష్పాలతోటి
ఫలాలతోటీ శాంతి కార్యాన్ని పూర్తిచేసి వాస్తుపూజ పూర్తిచేసి చక్కగా రాముడు సీతా
సహితుడై ఆ పర్ణశాలలో ప్రవేశించి సంతోషంగా ఉంటూ లోపలికి వెళ్ళగానే లక్ష్మణున్ని
పిలిచి ఒకమాట అన్నాడు భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ ! త్వయా పుత్రేణ
ధర్మాత్మా న సంవృత్తః పితా మమ !! లక్ష్మణా నాకు తండ్రి మరణించలేదోయ్ నీ రూపంలో
నాకు తండ్రి ఉన్నాడు అన్నాడు.


మాకు ఒక ఆఫీసరుగారు ఉండేవారు, ఆయన ఒక చమత్కారమైన మాట అనేవాడు you break the
rule and justify it అనేవాడు Whom say you committed this wrong, because you
have follow the rule. If necessary you break the rule and justify it I am here
to certify it అనేవాడు, ఎంత
పెద్దమాటో అనిపించేది నాకు. రామాయణ హృదయం అది, రూల్ ఎలా అలా ఉందికదాండీ అందుకనీ
నేను ఏం చేయ్యలేకపోయాను అని ఇలాగే చేశానని చెప్పకు, సంస్థకు లాభం కల్పించడం కోసం
రూల్ ని బద్దలు కొట్టి అవసరమైతే నీవు ఆ రూల్ ని అతిక్రమించి సంస్థకి నీవు
ఉపకారంచేయి నీవు చేసినపనిని ఆమోదించి వ్రాయడానికి నేను ఉన్నాను అని అనేవాడు. భావజ్ఞేన
కృతజ్ఞేన నా భావం తెలిసి చేయడం నేను ఇక్కడ పెట్టండి అని అన్నాననుకోండి ఏదో
ఇక్కడ పెడితే గురువుగారు ఇలా అన్నారు ఇక్కడ పెట్టు అన్నారు కానీ ఇక్కడ పెడితే
ఇబ్బంది వస్తుంది, కాబట్టి గురువుగారు ఇక్కడ పెట్టడం కన్నా ఇక్కడ పెడితే
బాగుంటుందేమో ఇలా పెడదామా గురువుగారూ మీరు ఆలోచించండీ! అనీ గురువుగారు
నొచ్చుకోకుండా అందంగా అడగకలిగినటువంటి ప్రజ్ఞ భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞే ఎందుకు
అలా చెయ్యాలి, అంటే ధర్మం ఆయన్ను అనువర్తించడం ఆయన చెప్పినపని తానుచేయడమే తను
తరించడానికి కారణం ధర్మజ్ఞేన చ లక్ష్మణ లక్ష్మణా నీవు ఇటువంటివాడివోయ్ ఎంత
అదృష్టం నీలాంటివాడు నాకు తమ్ముడు అవ్వడం త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః
పుతా మమ నాకు తండ్రి లేడని ఎవరు అన్నారు నాకు తండ్రి లేకపోవడం లేదు నీకు
లేడేమో తండ్రి నేను నీకు ఏమీ చేసి పెట్టట్లేదేమో.
|
కానీ తండ్రి ఉంటే
కొడుక్కు ఎలా చేస్తాడో అలా నీవు నాకు చేస్తున్నావు లక్ష్మణా! కాబట్టి ఎంత
గొప్పవాడవోయ్ ఈ మాట చాలదాండీ ఇది లక్ష్మణుడి యొక్క లక్ష్మి, ఒక గురువుని అనువర్తించేటటువంటి శిష్యుడు ఇవి
నేర్చుకోవాలి ఈ శ్లోకం ప్రాణప్రదమైన శ్లోకం అరణ్య కాండలో మనుష్యుడు చాలా గట్టిగా
పట్టుకుని తన జీవితాన్ని దిద్దుకోవడం ఎలాగా అన్నదానికి ఈ మూడు మాటలు
బాగానేర్చుకోవాలి భావజ్ఞేన కృతజ్ఞే ధర్మజ్ఞేన ఇవి చేస్తున్నాను కాబట్టి
నాకు ఈ కీర్తి రావాలి, గురువుగారు చెప్పినమాట ఆయన చేస్తుంటాడు లేకపోతే నేను ఇన్ని
చేశాను కాబట్టి నాకు ఇదేదో ఈ కీర్తి కారకం కావాలి నా మొఖం కనపడాలి నేను
పదిమందిలోకి వెళ్ళి తెలుస్తుండాలి అది కాదు ఎందుకు చేశావు గురువుగారు చెప్పారు
కాబట్టి చెయ్యకుండ ఉండలేక చేశావు అది నీకు, కాఫీ ఎందుకు తాగావు తాగకుండ ఉండలేక
తాగావు పేపరు ఎందుకు చదివావు చదవకుండ ఉండలేక చదివావు, పేపరంతా చదివి దిక్కుమాలిన
పేపరు ఏమీ న్యూసు లేదని అవతల పాడేశావు, మరి ఎందుకు చదివావు చదవకుండా ఉండలేక
చదివావు, కాఫీ తాగి ఎమిటోనండీ ఈ అలవాటు నుండి బయటపడలేక పోతున్నాను అంటున్నావు, మరి
కాఫీ ఎందుకు తాగావు తాగకుండా ఉండలేక తాగావు, మరి గురువుగారికి ఎందుకు సేవ
చేస్తున్నావు ఫోటోలో పడ్డానికి కాదు పేపర్లో పడ్డానికి కాదు గురువుగారిని
అనువర్తించకుండా ఉండలేక అనువర్తించాలి ఇదీ ఉండవలసిన ధర్మం.
ఇలా ఉండాలి భగవంతుడి దగ్గరా గురువు దగ్గరా ఇలా ఉన్నవాడు ఎవడో వాడిది ధర్మం
అంతే తప్పా దానికి టంకు వేసుకోవడానికి అని చెప్పీ ఎప్పుడూ కూడా అది పెద్ద విశేషం
కాదు అసలు అలాంటి దానికి సన్మానాలు సత్కారాలు చేయించుకోవడం అనేటటువంటిది చాలా
దారుణమైనటువంటి విషయం. ʻఈయన వాళ్ళమ్మగారిని బాగా చూస్తున్నారండీʼ అని సన్మానం
చేస్తున్నానండీ అని ఎవరైనా ఒప్పుకున్నాడనుకోండీ ఒక పూలదండ వేశారనుకోండీ ఇంక
అంతకన్నా ధారుణం ఇంకోటి ఉండదు, అమ్మగారిని బాగాచూస్తే సత్కారమేమిటండీ అది నా
ధర్మమండీ! దానికి నాకు సత్కారమేమిటండీ అని అనగలగాలి అంతేగాని అమ్మగారిని బాగా చూసినవారి
సత్కారాలు చేస్తామన్నారనుకోండీ మన పేరు ఇవ్వకూడదు గబుక్కుని అదీ... అది నేను ఒక
ఉదాహరణ చెప్తే పట్టుకోగలుగుతారని ఒక తేలిక ఉదాహరణ చెప్పాను, లోకంలో ఇలాంటివి కూడా
ఉన్నాయి మీరు ఎందుకు చెప్పారండీ అనుకుంటారేమో... నేను పేరు చెప్తే బాగుండదని
చెప్పట్లేదు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సమాజాలు కొన్ని ఉన్నాయి తెలుసాండీ! నాకు
ఫోన్లు వస్తూంటాయి నేను చాలా ఆశ్చర్యపోతుంటాను వీళ్ళు రామాయణం ఎప్పుడు చదువుతారురా
అని అనుకునేవాన్ని నేను.
|


|
వాళ్ళు ఏం చేసినా
ప్రసాదంగా తింటారు సనాతన ధర్మంలో కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చీ మొదట
వండి పితృదేవతారాధనం చేసిన తరువాత తినేటటువంటి అలవాటు ఉండడాన్ని నవాగ్రయణ పూజా
అంటారు. అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు అటువంటి పూజచేసి తరువాత విగత
కల్మషాః ఏ కల్మషమూ లేకుండగా ఏ దోషమూ లేకుండగా అప్పుడు ఆ వచ్చినటువంటి పంటనీ వాళ్ళు
తింటం మొదలు పెడతారట ప్రాజ్య కామా జన పదాః సంపన్నతర గో రసాః ! విచరన్తి మహీపాలా
యాత్రాఽర్థం విజిగీషవః !! జనపదాలు అంటే పల్లెటూళ్ళు పల్లెటూళ్ళన్నీ కోరికలు తీరి ఉన్నాయట ఎందకనీ
పంటచేతికి వస్తుంది ఆ కాలంలో. ఆ గడ్డింతా తీసుకొచ్చి చక్కగ పెద్ద పెద్దగా మేట్లు
వేస్తారు పశువులు సంతోషంగా అవన్నీ తింటూ ఉంటాయి, పెద్ద పెద్ద జనుమూ ఈ పచ్చి కట్ట
దొరుకుతుంది ఆ జనప కట్టలు తెచ్చి గడ్డివాము లోపల పెట్టి ఆ చేతులతో పట్టుకుని
లాగమని చెప్తుంటారు ఆ జనపకట్ట ఊడి వస్తుంది, వస్తే ఆ జనపకట్టా ఆవులకీ దూడలకీ అది
ఎంతో ప్రీతిగా పచ్చతనంతో ఉన్నటువంటి జనపకట్ట తింటుంది. అసలు ఈ తరంలో ఉన్న పిల్లలు
అసలు గడ్డివాముల లోపల ఉన్న జనపకట్టను లాగడమన్న ప్రక్రియ చూసి ఉండరేమో అని నేను
అనుకుంటున్నాను (నీవు ఎప్పుడైనా చూశావామ్మా...) అసలు అది ఎప్పుడైనా ఇప్పుడున్న
పిల్లలకి అది తెలియనే తెలియదు అనుకుంటున్నాను.

కాబట్టి ప్రాజ్య కామా జన పదాః పల్లెటూళ్లూ అంటే ఉట్టి ఊళ్ళూ అని కాదు
ఊరు అంటే శం చతుష్పదే శం విపదే అని సనాతన ధర్మం. ఎప్పుడూ మనుషులు
బాగుండాలని కోరుకోరు నాలుగు కాళ్ళు ఉన్నవి కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి ఆవులు
దూడలు పశువులు మనుష్యులు అందరూ సంతోషంగా ఉన్నారట, ఇంత పచ్చి గడ్డీ ఈ జనప కట్టలు
ఇవన్నీ బాగా దొరుకుతాయోమో ఆవులు ఇవన్నీ తినీ బాగా పాలు ఇస్తున్నాయట సంపన్నతర గో
రసాః ఆవుల పాల సంవృద్ధిగా దొరకు తున్నాయట, ఆవుల పాలు సంవృద్ధిగా దొరికితే
ఏమౌతుంది, అంటే నాతో ఒక వేదం చెప్పే గురువుగారు ఒకాయనా మహానుభావుడు ఆయనా చాలాబాగా
నేర్పారు శిష్యులకు వేదం ఆయన నాతో ఓసారి అన్నారు వీడికి ఇంత కష్టపడి ఎందుకు
నేర్పానో తెలుసా కోటేశ్వర రావుగారు వేదం వీన్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొనీ నేను
ఆయాస పడుతున్నప్పుడు నా ఊపిరి వాడికి తగిలేటట్టుగా తీసుకెళ్ళీ పచ్చి గంగ
ముట్టుకోకుండా వీడికి సూర్య నమస్కారాలు నేర్పాను ఎవరో కాదు మొన్న ఇక్కడ
|

కాబట్టి సంపన్నతర గో రసాః ఆ ఆవులు సంవృద్ధిగా పాలు పెరుగు అన్ని
దొరుగుతున్నాయి ఆవులవలన పాలు దొరికితే అన్ని దొరికినట్టే విచరన్తి మహీపాలా
యాత్రాఽర్థం విజిగీషవః జైత్ర యాత్ర చెయ్యడం కోసం రాజులు అందరూ కూడా ఆ ఋతువు చాలా అనుకూలంగా ఉంటూందీ
అని బయలుదేరుతున్నారు ప్రకృత్యా హిమ కోశాఢ్యో దూర సూర్య శ్చ సామ్రృతమ్ ! యథాఽర్థ నామా సువ్యక్తం
హిమవాన్ హిమవాన్ గిరిః !! సూర్యుడు బాగా దూరంగా జరిగి ఉంటాడు కాబట్టి హేమంత ఋతువులో హిమాయలయ పర్వతములు
కరిగి చుక్క నీటిని విడిచిపెట్టడం కూడా మానేసి గట్టిగా గడ్డకట్టాయట ఇప్పుడు వాటికి
హిమాలయములు అన్న పేరు సార్ధకమైంది ఆ ఋతువుకి. మిగిలిన ఋతువుల్లో ఉన్నా నీరు
కారిపోతూంటుంది కరిగిపోతూంటుంది. కానీ ఆ ఋతువులో మాత్రం హిమాలయాలు అంటే గడ్డకట్టి
ఉంటాయి కాబట్టి ఆ ఋతువులో ఆ పర్వతాలకే పర్వతాలని పేరు శోభనివ్వడానికి ఆ ఋతువు బాగాపనికి
వచ్చిందీ అన్నారు మహర్షి. అంటే ఎంత చలిగా ఉంటుంది మీరు ఆలోచించండి అత్యన్త సుఖ
సంచారా మధ్యాహ్నే స్పర్శతః సుఖాః ! దివసాః సుభగ ఆదిత్యాః ఛాయా సలిల దుర్భగాః !!
ఆయన అంటారూ అత్యన్త సుఖ సంచారా తిరగడం అంటే బయట తిరగడం అన్నటువంటిది చాలా
సంతోషంగా ఉందటా ఎప్పుడు ఉదయం వేళ సాయంకాలం వేళ కాదు.
ఇప్పుడు ఈ ఋతువు ఉందనుకోండి తెల్లవారుఝామున బయలుదేరేటటువంటి ట్రైన్సుకి టికెట్ల
దొరకవు గుంటూరులో తెల్లవారున 5 గంటలుకి ఎక్కితే కాకినాడకి 9 అయ్యేటప్పటికి
వెళ్ళిపోతామండీ అన్నారనుకోండీ ఆ ట్రైనుకి టికెట్లు దొరకవు ఎందుకంటే చల్లపాటికే
వెళ్ళిపోతామండీ ఎండ ఎక్కకుండా అంటారు. అదే హేమంత ఋతువు అనుకోండీ అమ్మో తెల్లవారున
రైలు ఎక్కలేమండోయ్ ఆ చల్లగాలికి బిర్ర బిగిసిపోతాము వద్దు సుమాండీ! మధ్యాహ్నం 12
గంటలకు బయలుదేరేటటువంటి ట్రైను ఏదైనా ఉంటే చూడండీ మళ్ళీ సాయంత్రం మళ్ళీ చంద్రోదయం
అవ్వకుండా మరీ మంకీ క్యాపు స్పెటర్లు ఇవన్నీ ఎక్కడ పెడతాము సాయంకాలం అయ్యేటప్పటికి
ఇంటికి బయలుదేరి పోతాము అంటారు అప్పుడు.
మహర్షీ ఎంతగొప్పగా మాట్లాడుతారో అత్యన్త సుఖ సంచారా మధ్యాహ్నే స్పర్శతః
సుఖాః ఆ సూర్య కిరణములు తనకి తగిలితే చాలు పొంగిపోతున్నారట మధ్యాహ్నం వేళ
ప్రజలందరూ దివసాః సుభగ ఆదిత్యాః ఛాయా సలిల దుర్భగాః లోకులందరికి రెండు
మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి ఏవి ఛాయా ఎక్కడైనా నీడగా ఉంటే అందులోకి
వెల్లటంలేదు ఇప్పుడు ఛాయ సలిల సలిల అంటే నీళ్ళు, నీళ్ళు కూడా వాళ్ళకు దుర్భగాః
చాలా కష్టంగా ఉన్నాయి ఎందుకనీ నీళ్ళు
అప్పుడు ఎవరు పోసుకుంటారండీ, నీళ్ళు ఎక్కువ పోసుకోనూ పోసుకోరు నీళ్ళు ఎక్కువ
తెచ్చుకోనూ తెచ్చుకోరూ నీళ్ళు ఎక్కువ వాడుకోనూ వాడుకోరు నీళ్ళు తెచ్చి స్నానం
చేయండీ అన్నారనుకోండీ అయ్యిబాబోయ్ ఇప్పుడుడేమిటి స్నానం, చల్లేసుకోవచ్చాండీ ఓ మూడు
మార్లు అంటారు. తెలిగ్గా స్నానం చేయడానికి ఫలితితం ఇవ్వడానికి మంత్రమేమైనా ఉందా
అడుగుతారు ప్రతివాడు హేమంత ఋతువులో ఎందుకంటే అప్పుడు స్నానం చేయలేడు.
|
ఇప్పుడు నదీ స్నానం
చేయమన్నారనుకోండీ నాలుగింటికి వెళ్ళదామాండీ అన్నారనుకోండీ ఎందుకండీ మూడున్నరకి
వెళ్ళిపోదాం అంటాడు. ఎందుకంటే చల్లగా ఉంటుంది అప్పుడు తెల్లవారిగట్ల స్నానం హాయిగా ఉంటుంది అప్పుడు ప్రతివాడూ బయలుదేరుతాడు
స్నానానికి హేమంత ఋతువులో ఎవ్వడూ వెళ్ళడు నివృత్త ఆకాశ శయనాః పుష్య నీతా హిమాఽరుణాః ! శీతా
వృద్ధతర ఆయామః త్రి యామా యాన్తి సామ్ర్పతమ్ !! ఎవ్వరు కూడా బయట పడుకోవడం మానేశారట, అదే వేశవి
కాలమైతే మేడమీద మంచం వేయవోయ్ అక్కడ పడుకుంటాను అంటాడు. ఆ జాజి పందిరి వాసన వస్తూంటూంది
ఎంత బాగుంటుంది. హాయిగా పైన మేడ మీద పడుకుంటాను అంటాడు. ఇప్పుడూ ఎవ్వడూ పిట్టకూడా
బయటపడుకున్నవాడు లేడు పుష్య నీతా హిమాఽరుణాః ! సీతా
వృద్ధతర ఆయామః త్రి యామా యాన్తి సామ్ర్పతమ్ !! మంచు విశేషంగా కురుస్తుందట, చలిగాలులు
విపరీతంగా ఒళ్ళు కొరికేస్తున్నాయా అన్నట్లుగా చలిగాలులు వేస్తున్నాయి రాత్రులు
దీర్ఘములైనాయి పగళ్ళు హశ్ర్వములైనాయి.
అంటే పగటి కాలము తక్కువ రాత్రి కాలము ఎక్కువ మంచు విపరీతంగా పడుతూందీ
వన్యప్రాణులు అంటే అరణ్యంలో ఉండేటటువంటి ప్రాణులు కూడా ఆ చలి దెబ్బకు తట్టుకోలేక
గుహల్లోంచి బయటికి రావట్లేదట ఖర్జూర పుష్ప ఆకృతిభిః శిరోభిః పూర్ణ తణ్డులైః !
శోభన్తే కించి దాఽఽలమ్బాః శాలయః కనక ప్రభాః !! బయటికి వచ్చి పంటలవంక చూస్తేనటా తల బరువు
అంటారు చూశారా అలా పచ్చటి కంకులు బాగా ధాన్యం పట్టి అలా బరువెక్కిపోతే మోయలేక వరి
కంకులు ఇలా
వంగిపోయాయట వంగిపోయి కంకులతో ఉన్నాయట. కర్జూరపు పుష్పాలు
ఏ రంగుతో ఉన్నాయో అలా పచ్చబంగారమా అన్నట్లుగా పొలాలన్నీ పసుపు రంగులోకి మారిపోయాయట
సస్యకేదారాలన్నీ ఆకుపచ్చగా ఉన్న పొలాలు పంట పండిన తరువాత పసుపు పచ్చగా అయిపోతాయి
కంకులతో ఉన్నటువంటి పొలాలు. మా తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడా ఉంటాయి పంటలూ ఎక్కడ
ఉన్నవాడికి ఆ ప్రాంతాలు జ్ఞాపకానికి వస్తాయిగదాండీ..! ఆ పచ్చటి పొలాలు రంగుమారిన
పొలాలు ధ్యాన్యలక్ష్మి ఇంటికి వస్తోందీ అని గుర్తు అవశ్యాయ నిపాతేన కించిత్
ప్రక్లిన్న శాద్వలా ! వనానాం శోభతే భూమిః నివిష్ట తరుణాఽఽతపా !! మంచు రాత్రంతా పడడం వల్లా పచ్చిక బయళ్ళలో పచ్చ
గడ్డి యొక్క చివర్ల భాగములో మంచుబిందువుపడీ దాన్ని పట్టుకుంటుంది, పట్టుకుంటే అది
ఏమౌతుందంటే ఆకు పచ్చ గడ్డిపరకా గడ్డిపరక చివర ఓ తెల్లటి మంచుబింధువు తెల తెల
వారుతుండగా సూర్య కిరణం దానిమీద పడుతుంది పడేటప్పటికి ముత్యం మీద కాంతి కిరణం
పడేటప్పటికి ఎలా మెరుస్తుందో అలా పచ్చగడ్డి నిండిన నీటి బింధువులతో ఉంటుంది.

అప్పుడు సూ వేసుకోకుండా మీరు మార్నింగ్ వాక్ కు వెళ్ళేవాళ్ళు ఎప్పుడైనా హేమంత
ఋతువులో బూట్లు విప్పేసి పచ్చిగడ్డిలో నడిస్తే కాళ్ళంతా తడిసిపోయి ఇక్కడి వరకు తడి
కొట్టేస్తుంది. అంటే మంచు రాత్రిపడి ఆకుపచ్చటి గడ్డిమీద మంచు నీటి బింధువులు
బింధువులుగా పేరుకుంటుంది. అది చూడడానికి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆకుపచ్చగడ్డి
చివర ముత్యాలు కాశాయా అన్నట్టుగా ఉంటుంది. ఒక కవి అన్నాడూ ప్రాతర్వేళల మంచు
చింకుగువి జొంపంబైనలేబచ్చికల్ శ్వేతశ్రీదులకించు టెంతయు రహించెన్ సర్వభూతంబులన్
శీతశ్రాంతి వడంకదానచలయై చెల్వొందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వ్రజముల రాశిం
బోలి నల్వంకలన్ అన్నాడు. శీతర్తు ప్రభుడు అంటే శీతాకాలంలో ఉన్నటువంటి
అధిపతి నా ప్రభావానికి వణకనివాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడట. అందురు గుహుహూయని
వడక లోక ఉర్వీనాథా అని మహాభారతంలో అన్నట్టుగా లోకమంతా ఉహు ఉహూ హుహూ యని
వణుకుతోంది. వనకనిదైన ఎవరైనా ఉన్నారా నా ధాటికీ అని అడిగాడట, ఉన్నది మహాప్రభో
ఒక్కావిడ మాత్రం వణకడంలేదని చెప్పారటా ఎవరు ఆవిడా ఆవిడ ఇంట్లో ఉండటంలేదు బయటే
ఉంటోంది ఆరుబయట పడుకోంటూంది. ఆవిడ బట్టకట్టుకోదు, బట్టకట్టుకోది అంటే నా
ఉద్ద్యేశ్యంలో దుప్పటి కప్పుకోదు కంబలీ కప్పుకోదు అలా హాయిగా ఆరు బయలు ఉంటూంది
కానీ ఆవిడ మీరు ఇంత ధాటిగా మంచు కురిపించినా ఆవిడ మాత్రం ఏమీ వణకట్లేదని అన్నారట,
ఎవర్రా ఆవిడా నిజంగా నా ధాటికి తట్టుకున్నదైతే నేను ముత్యాల రాసులు బహూకరిస్తాను
అన్నాడట శీతర్తు ప్రభుః ఎవరావిడా అంటే భూ కాంత భూమి వణకట్లేదుగా భూ కాంత
వణకలేదన్నారటా ఓ నిజమేరోయ్! ఇస్తున్నాను ముత్యాలు తీసుకెళ్ళి బహూకరించండీ అన్నాడట.
భూమి నలువంకలా భూ కాంతకి ముత్యాలు బహూకరించినట్టుగా పచ్చగడ్డి యొక్క చివరి భాగములో
మంచుబింధువులు మెరుస్తున్నాయట. కాబట్టి దానచలయై చెల్వొందు భూదేవికిన్ శీతర్తు
ప్రభుడిచ్చు వజ్రముల రాశిం బోలి నల్వంకలన్ అని ఒకకవి హేమంత ఋతువు యొక్క
గొప్పతనాన్ని వర్ణిస్తాడు.
|
కాబట్టి అటువంటి
మంచుతో ఉంది వాల్మీకి మహర్షి ఏమి దర్శనం చేశారండీ నిజంగా స్పృశం స్తు విపులం
శీతం ఉదకం ద్విరద స్సుఖం ! అత్యంత తృషితో వన్యం ప్రతిసంహరతే కరం !! ఒక ఏనుగు
కొంచెం నూనె పదార్థం ఎక్కువగా ఉన్నదాన్ని తినేసింది రాత్రి అంటే తొక్కలాంటిదేదో
తినేసింది అనుకోండీ దానికి దాహం వేసింది, మీరు రాత్రి నూనెపదార్థం ఎక్కువ తినేసి
పడుకున్నారనుకోండీ రాత్రి తెలివొస్తుంది దాహమేసి కాబట్టి బాగా దాహమేసింది ఇప్పుడు
నీళ్ళు తాగుదామని చెప్పి తెల్లవారున నాలుగు గంటలకి నది ఒడ్డుకు వచ్చింది, నది
ఒడ్డుకు వచ్చిందట నీళ్ళు తాగాలి నీళ్ళు తాగాలంటే ఏం చేయాలి నదీ ప్రవాహం తొండం
పెట్టి జుర్రుమని లాగితే చాలు లోపలికి వెళ్ళిపోతాయి అదటా వచ్చింది దాహమేస్తుందటా
నదిమీద ఇలా పెడుతుందటా తొండం నీటికి తగిలేసమయానికి మళ్ళీ ఇలా తీసేసీ ఇలా ఇలా
ఆడిస్తోందట, మళ్ళీ ఇలా తగులుతోంది అనే సమయానికి ఇలా తలాడిస్తూ ఊగుతుంది కానీ మళ్ళీ
ఇలా ఆడిస్తోందట ఎందుకనీ అంటే నీటిలో తొండం పెట్టలేక చలికీ దాహం తీర్చుకోవడానికి
నీళ్ళు తాగలేకా నీటిలో తొండం కూడా పెట్టకుండా బయటే నిలబడిందట ఏనుగు అంత చలిగా ఉంది
కాబట్టి ఎవ్వరూ అప్పుడు స్నానం చేస్తారని మీరు ఊహించడం కూడా కష్టం.

|
కాకినాడ
వెళ్ళిపోతుంటే రైల్లో రాజమండ్రీ కొవ్వూరూ పసివేదలా ఛాగల్లూ బ్రహ్మణగూడెం ఆ
ప్రాంతాల దగ్గర దొరికింది కదా బెర్తని చెప్పి ఊరికే ముసుగు పెట్టి పడుకోకుండా
కిటికీ దగ్గర కూర్చొని చూడగలిగితే ఆ సూర్యోదయ శోభని ఆ రైల్వేట్రాక్ పక్కన
ఉన్నటువంటి నీటి కయ్యలలో కాల్వలలో అరవిరసి ఉంటాయి తెల్ల తామరలు ఎర్ర తామరలు నల్ల
తామరలు పొలంగట్లునా ఎన్ని తామరలో వాటిని భృంగావళీ చ మకరంద రసాను విద్ద ఝంకారగీత
నినదైః సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలో దరేభ్యః శేషాద్రి శేఖర విభో తవ
సుప్రభాతమ్ అన్నట్టు గండు తుమ్మెదలు తామరల చుట్టూ ఎగురుతుంటాయి, ఎంత అందంగా
ఉంటుందో ఎంత శోభస్కరంగా ఉంటుందో చూడగలిగితే ఆ దృష్యం. ఏలా లేవటా సరోవరాలు ఎందుకు
లేవటా ఆ సరోవరాలు హేమంత ఋతువులో అంటే జరా జర్జరితైః పత్రైః శీర్ణ కేసర కర్ణికైః
! నాల శేషా హిమ ధ్వస్తా న భాంతి కమలాఽఽకరాః !! మంచుచేత కొట్టబడి ఆ తామర పువ్వులయొక్క
రేకులన్నీ మంచు బరువుకు ఊడిపోయి ఒరిగిపోయాయటా. తామర తూడ్లూ శుభ్రంగా మంచుచేత
కొట్టబడి అవన్నీకూడా నశించిపోయినట్లుగా శీర్ణములైపోయి అంటే జజ్జరములైపోయి అవి
ఒంగిపోయి ఉన్నాయట కాబట్టి సరోవరాల వంకచూస్తే అందంలేదట అరవిరిసినటువంటి పద్మాలు
ఎక్కడా లేవు, అలా ఉందటా ఆ హేమంత ఋతువు.
అటువంటి హేమంత ఋతువులో రామ చంద్ర మూర్తి సీతా లక్ష్మణ సహితుడై గోదావరి స్నానానికి
వెళ్ళాడు, మీరు భద్రాచలంలో గోదావరి స్నానంచేస్తే చీకటితో ఉండగా భద్రాచల క్షేత్రంలో
ఉన్న గొప్పతనం ఏమిటంటే సుప్రభాత సేవకు ఎవ్వరూ ఉండరు, ప్రత్యేకించి సీతాకాలంలో ఓ
ఐదుగురో ఆరుగురో ఉండి ఉంటారు, మీరు తెల్లవారుఝామున ఏ నాలుగు గంటలకో లేచీ గోదావరి
నదిలో స్నానానికి వెళ్ళుతూ చలిగాలిలో ఆ రామ చంద్ర మూర్తి యొక్క శిఖరం వంకచూస్తూ
నడుస్తూంటే చుట్టూ వన్యప్రాంతాలు కదాండీ భద్రాచలానికి ఆ రాముడు నడవడం సీతమ్మతో
లక్ష్మణుడితో గోదావరి స్నానం చేయడం ఆ హేమంత ఋతువు చల్లటి నీళ్ళు ఆ పెంపుడు పక్షులు
ఆ జల పక్షులు అవన్నీ అలానే ఒడ్డున కూర్చుని ఉంటాయి, ఆముక్త మాల్యదలో
శ్రీకృష్ణదేవరాయులు వారు వర్ణిస్తారు నీళ్ళల్లోకి వెల్లడానికి భయపడిన బాతులు ఇలా
కూర్చుని ఉంటాయి ఒడ్డున కూర్చుంటే కృష్ణదేవరాయులవారు అంటారు ఎలా ఉన్నాయంటేటా...
రాజ భటులు అనుకున్నారటా... బ్రాహ్మణులు స్నానం చేసిన తరువాత పంచతడిపి ముద్దకట్టి
అక్కడ ఒడ్డున పెడతారు. ఒడ్డున పెడితే వాళ్ళు స్నానం చేసి ఆ బట్ట పట్టుకెళ్ళడం
మరిచిపోయారు పాపం అయ్యో బ్రాహ్మణ సొత్తూ దాన్ని మనం తీసుకోకూడదని భటులు గబగబా
వెళ్ళి దాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకు ఇద్దామని పరుగెత్తుకెళ్ళి పట్టుకున్నారట
అది బాతు చలికి అక్కడ పడుకుంది గుడుగుడుగుడు మని చప్పుడు చేసి అది లేచింది అంటే
రాజ్యంలో ధర్మ నిష్ఠ చెప్పడానికి ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయులవారు వర్ణిస్తారు. ఆ
పడుకున్న బాతుని స్నానం చేసేసి విడిచిపెట్టిన పంచా అని పంచ ముద్ద అలా ఉంటుందీ అని.
|

కాబట్టి ఇప్పుడు రాముడు సీతా లక్ష్మణసహితుడై- లక్ష్మణుడు వస్తున్నాడూ అంటే
మామూలుగారాడు రామున్ని గురువుగా భావిస్తాడు అందుకని జలపాత్ర పట్టుకుని వచ్చాడు
వెనకాల సీతా రాములు స్నానం చేశారు లక్ష్మణ మూర్తి కూడా స్నానం చేశారు, ఆ స్నానం
చేసేముందు భరతుడు కూడా అవసరం లేకపోయినా అంతఃపురంలో ఉండగలిగినటువంటివాడైనా అలా
ఉండకుండా జటలు కట్టుకునీ నార చీరలు కట్టుకునీ అన్నయ్యా భూశయనంచేసి ఉంటాడు భరతుడు
కూడా ఇదే సమయానికి స్నానం చెయ్యడానికనీ సరయూనదికి వెళ్ళుతుంటాడు, రాజుగా
సంతోషపడతగినవాడు తనంత తానుగా నియమాన్ని విధించుకుని ఎంత కష్టపడుతున్నాడో అని
లక్ష్మణుడు అన్నాడూ భర్తా దశరథో యస్యాః సాధు శ్చ భరతః సుతః ! కథం ను సాఽమ్బా కైకేయీ తాదృశీ
క్రూర దర్శినీ !! దశరథ మహారాజుగారి భార్యయై అంత ఉత్తముడైన భరతుడికి తల్లియై ఆ కైకేయి అంత
క్రూరురాలు ఎలా అయ్యింది అన్నయ్యా..? అని అన్నాడట. అంటే రాముడు వెంటనే అన్నాడు వద్దు
ఆమాట కైకమ్మని దూషించినటువంటిమాట అనవసరం లక్ష్మణా భరతుడి యొక్క గొప్పతనానికి
సంభందించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పు ఇంకా వింటాను అన్నాడు.
తెల్లవారు ఝామున లేవగానే
పవిత్రమైనటువంటి ఈశ్వరకార్యంలో మగ్నమయ్యేటప్పుడు ఏ విరోధమున్నా తల్లిదండ్రుల వరుస
ఉన్నవాళ్ళూ అన్నావదినల వరుస ఉన్నవాళ్ళూ అక్క బావగారు మామగారు అత్తగారు గురువులు
పెద్దలూ అటువంటి వారిని నిందచేసేటటువంటి మాటలతో ప్రారంభం చేయ్యకూడదు రోజుని ఇది
చాలా ధారుణమైనటువంటి స్థితి అందుకే లోకంలో ఒక మర్యాదా చెప్తారు నిద్ర లేస్తూంటే నోటి వెంట రావలసిన మొట్ట
మొదటి ఉచ్ఛారణ ఏమిటో తెలుసాండీ? ప్రకటనంగా నీ నోటి వెంట ముందు రావలసిన మాట ఇంకోటి
ఉండకూడదు, ఒరేయ్ అని కానీ ఏమోయ్ కాఫి ఇచ్చేయ్ అని
|
కానీ లేకపోతే నేను
వాకింగ్ కి వెళ్ళాలి బూట్లు ఎక్కడున్నాయని కానీ అనకూడదు, మీరు నిద్ర మంచం నుంచి లేవగానే మీ నోటి వెంట రావలసిన
మొదటి మాట మూడు పర్యాయాలు “శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ” అని,
సంప్రదాయంలో ఎందులో ఉండండి మీరు శ్రీహరీ అంటూనే నిద్రలేవాలి, శ్రీహరీ అంటూ
నిద్రలేస్తే ఏమౌతుందో తెలుసాండీ! ఆయన స్థితికారుడు కాబట్టి మీరు ఆరోజు తెలివితో
ఉన్నంత సేపు చేసినటువంటి పనులనూ ఆయన రక్షిస్తాడు, మీకు ప్రయోజనాత్మకం చేస్తాడు,
లయకారుడు పరమేశ్వరుడు లయకారుడు అన్నమాటకు చంపేసేవాడు అన్న అర్థం చెప్పి అనవసరంగా
శివుడి విషయంలో అక్కరలేని కోణాలుతీసి పాపం మూట కట్టుకోకూడదు.


|
ఇది ఇవ్వగలిగినటువంటి
తల్లి కాబట్టి అటువంటి ఆనందంతో ఆ భగవత్ వాక్యం చెప్పినా విన్నా మొఖం ఎర్రబడిపోయి సంతోషం ప్రకటనమయ్యేటటువంటి
మహాపురుషుల యొక్క మాటలు నేను ఎప్పుడూ నా దగ్గర తెచ్చుకుని వింటూ ఉంటానని
చెప్పడానికి ఎర్రబడిన ముక్కుతో ఉన్న చిలుక ఆవిడ చేతుల మీద వాలి ఉంటుంది.
ఆవిడా కావ్యాలాప వినోదినీ ఆ భక్తితో చెప్పేటటువంటి వారియొక్క
కావ్యాలాపములను ఆతల్లి వింటూవుంటుందట. అందుకే ఎడం పక్కన ఎడం చేతిలో పైన అంమృత
పాత్రా దానిమీద చిలుకా ఉంటాయి. పుస్తకం చదువుకోవడానికి పనికి వస్తుంది, చదవడం కాదు
అనుష్టానంలోకి తెచ్చుకుని అనుష్టించడం ఆచరించడం ముఖ్యం, అందుకని అక్షమాల కుడి
చేతిలో ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. పట్టుకున్న తల్లి పద్మాసనం వేసుకుని
కూర్చుంటుంది. ఆవిడ శారద సారదా ఇప్పుడు మీరు ఈ కోణంలోకి వెళ్ళి దర్శనం చేయండి
అమ్మవారిని మీకు ఎంత సంతోషంగా ఉంటుందో అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి పీఠాలు
శారదా పీఠాలు అందుకే శంకరాచార్యులవారు వీటికి శారదా పీఠము అని పేరు పెట్టారు
మహానుభావుడు, శారదా పీఠంలో దక్షిణామూర్తి కూడా ఉండి దక్షిణామూర్తిని కాని మీరు
దర్శనం చేయగలిగితే శారదానుగ్రహం పరిపూర్ణమౌతుంది.

|
దక్షిణామూర్తి
స్తోత్రాన్ని రోజు ఎవరు తప్పులు లేకుండా చదువుతారో దక్షిణామూర్తిని మీరు
ఉపాసనచేస్తారో వాళ్ళకి గురు గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురు గ్రహం యొక్క
అనుగ్రహం కలిగితే అది విశేషంగా వికసనం పొందుతుంది, రెండు పాపపు గ్రహములు వాళ్ళనేమీ
చేయలేవు వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు జీవితంలో అటువంటి దక్షిణామూర్తి ఇక్కడ శారదా
పీఠంలో ఉన్నారు చక్కగా మీరు ఉపన్యాసానికి వచ్చే ముందు ఒక్క పావుగంట ముందు వచ్చి ఆ
దక్షిణామూర్తికి ఒక్కసారి నిలబడి నమస్కారంచేసి ఏమి స్తోత్రమండీ దక్షిణామూర్తి
స్తోత్రం దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం, బుదిం చ శూన్యంవిదుః, స్త్రీ
బాలాంధ జడోపమా స్త్వ హమితి, భ్రాంతా భ్రుశం వాదినః, మాయా శక్తి విలాస కల్పిత మహా,
వ్యామోహ సంహారిణే, తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం, శ్రీ దక్షిణామూర్తయే ఏమి
మాట్లాడుతారో ఆయన అందులో బీజస్యాంతరి వాంకురో జగదిదం, ప్రాజ్ఞిర్వికల్పం
పునర్మాయాకల్పిత దేశ కాలకలనా, వైచిత్ర్య చిత్రీకృతం, మాయావీవ విజ్రుంభయత్యపి మహా,
యోగీవ యః స్వేచ్ఛయా, తస్మై శ్రీ గుర మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
అంటారు ఏమి దక్షిణామూర్తి స్తోత్రమో శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి
అమూల్యమైన వజ్రాల్లో దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి. ప్రతి వారికి నోటికి వచ్చిండాలి దక్షిణామూర్తి
స్తోత్రం మౌన వ్యాఖ్యా ప్రకటిత ప్రబ్రహ్మ తత్వం యువానం వర్షిష్టాంతే వసద్రుషి
గణై రావ్రుతం బ్రహ్మనిష్టైః ఆచార్యేన్ద్రం కర కలిత చిన్ముద్రం ఆనంద మూర్తిం
స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజూ
అందరూ చదువుకుంటే గొప్ప అనుగ్రహాన్ని పొందగలుగుతారు శంకరులు ఇచ్చారు
అనుష్టించుకోవడం మనవంతు. ఇటువంటి పీఠంలో నేను అటువంటి మాట చెప్పకపోతే ఆ
ఉపన్యాసానికి అర్థం ఉండదు కాబట్టి దాన్ని కలపవలసి వచ్చింది.

|
రాజ పుత్ర్యా రుద్రః స నన్దీ భగవాన్ ఇవేశః !! తెల్లవారుఝామున హిమాలయా పర్వత ప్రాంతములలో
ఉండేటటువంటి మందాకినీ నదిలో స్నానంచేసి పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు
నందీశ్వరునితో కలిసి మందాకినీ నదిలోంచి హిమాలయా పర్వతాల మీద నడుస్తుంటే ఎలా ఉంటాడో
రామ చంద్ర మూర్తి సీతా లక్ష్మణ సహితుడై అలా ఉన్నాడట. సీతా రామ లక్ష్మణులయందు
పార్వతీ పరమేశ్వర నందీశ్వర దర్శనాన్ని వాల్మీకి మహర్షి చేయించారు. పిచ్చి వెర్రీ
పెట్టుకునీ శివుడు వేరు కేశవుడు వేరు అని దెబ్బలాడుకోకూడదు రామాయణం చదివితే ఇద్దరూ
ఒక్కటే ఆ దర్శనం ఎవరు చేశారో వారు కృతార్థులయ్యారు.

ఆయనకు అయింది ఆ దర్శనం తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱిభూతి పుతగాగ చిన్ని
కృష్ణుడు ఒంటి నిండా మట్టిపోసుకుంటే విభూతిరాసుకున్న పరమశివుడిలా ఉన్నాడట బాల
శంకరుడిలాగ నమః కపర్ధినేచ వ్యుప్త కేశాయచ అని రుద్రంలో ఓ మంత్రం కపర్ధినేచ
అంటే జటజూటం ఉన్నవాడు వ్యుప్త కేశాయచ అసలు జుట్టులేని బోడిగుండు
ఉన్నవాడు బోడుగుండు ఉన్న శివుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు శంకరాచార్యులవారే బోడిగుండు
ఉన్న శివుడు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా ఆ శంభుమూర్తే ఈ భూమి
మీద శంకరాచార్యులువారిగా తిరుగుతున్నారు. వచ్చేస్తుంది గదాండీ..! శంకరజయంతీ...
మనసు అటుపోతుంది అస్తమానం. కాబట్టి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా
అటువంటి మహానుభావుడుగాబట్టి ఒంటినిండా విభూతి పూసుకున్నటువంటి చిన్ని కృష్ణుడు
చిన్ని శివునిలా కనపడ్డాడట. అమ్మ ఇక్కడ ముత్యాల సరాలు పెడితే పోతనగారికి ఎలా
కనపడ్డాయట చంద్రవంక పెట్టుకున్నటువంటి శివుని
|
యొక్క జటజూటంగా కనపడుతోందట,
ఆయన కంఠం మీద నల్లటి మచ్చ ఉంటుంది హాలాహలాన్ని భక్షించాడు కదా ఆ నీలపు టాక వేసింది
అమ్మ మేటలో చిన్ని కృష్ణునికి దాని కాంతి కంఠం మీద కొడితే నీలకంఠుడైనటువంటి పరమశివుడు
కనపడుతున్నాడట నాకు శివుడికి కృష్ణుడికి తేడాలేదోయ్ పోతనా! చూశావా అని కృష్ణుని
యందు శివుని యొక్క దర్శనం చేయించినట్లుగా నాకు కృష్ణునిలో శివుడు కనపడ్డాడు
అభేదంగా అని పోతనగారి పద్యం రచనచేశారు భాగవతం దశమ స్కందంలో.

ఇదీ మనకు వేదం నేర్పినటువంటి రహస్యం అలా చూడడం నేర్చుకో అని అది వాల్మీకి
మహర్షి రామాయణంలో మనకు ఉద్భోధ చేస్తారు. చక్కగా స్నానంచేశారు అగ్నికార్యం చేశారు సంధ్యావందనం
చేశారు ప్రాతఃకాల పూజ పూర్తిచేసుకున్నారు, ఎప్పుడు రాముడు ఎక్కడ ఉంటే అక్కడ
మునులందరూ వస్తూవుంటారు. Tell me your friends I will tell you what you are అంటారు ఓ ప్రవర్బులో ఇంటికొచ్చేవాళ్ళు ఎవరై
ఉంటారో అలాంటి పరిస్థితే నీకు కూడా ఉంటుంది ఇంట్లో కదాండీ... ఎప్పుడూ సినిమాల
గురుంచి చెప్పేవాళ్ళున్నారంటే నీకు అదే పిచ్చి ఉందన్నమాట, నీ ఇంటికి ఎప్పుడూ
భగవంతుని గురించి మాట్లాడేవాళ్ళే వస్తూంటారూ అంటే నీవు భగవత్ భక్తుడవు అన్నమాట
నీవు ఎటువంటివాడో నీ ఇంటికి అటువంటి వాళ్ళే వస్తూంటారు. కాబట్టి రుక్మినీ
కళ్యానంలో అదేగా చెప్తారు ప్రతిరోజూ భీస్మకుడి ఇంటికి భగవత్ భక్తులు వచ్చి
మాట్లాడబట్టి అది విన్నటువంటి రుక్మిణీదేవికి కృష్ణునియందు ప్రీతి అంకురించింది
లేకపోతే ఎలా అంకురిస్తుంది. కాబట్టి ఇప్పుడు మునులందరూ వచ్చారు వాళ్ళతో భగవత్ కథా
ప్రసంగం చేస్తున్నారు రామ చంద్ర మూర్తి తదాఽఽసీన స్య రామ స్య
కథా సంసక్త చేతసః ! తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా !! ఆయన కూర్చుని ఆ మహర్షులందరితో మాట్లాడుతున్నాడు
మాట్లాడుతున్న సమయంలో యదృచ్ఛయా యదృచ్ఛయా అంటే దైవము యొక్క ఆజ్ఞచేత అంటే కథ
మలుపు తిరగబోతూందీ అనిగుర్తు, మందర వచ్చినప్పుడు అన్నారు యదృచ్ఛయా అన్నారు,
మళ్ళీ ఇప్పుడు వస్తూంది ఒకావిడా మళ్ళీ యదృచ్ఛయా అంటారు ఆవిడ వస్తూంటే
అన్నారు అంటే మళ్ళీ కథ పెద్దమలుపు వైపుకే అడుగువేస్తుందీ ఇప్పుడు మొదలు
పెట్టినటువంటి ఈ నిచ్చెన రామావతార ప్రయోజనం వైపుకు అడుగువేస్తుంది అందుకేగా
ఋషులందరు ముందు అలా మొదలుపెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆవిడా
|
సా తు శూర్పణఖా నామ దశగ్రీవ స్య రక్షసః ! భగినీ రామమ్ అసాద్య దదర్శ త్రిదశో
పమమ్ !!
సింహోరస్కం మహా బాహుం పద్మ పత్ర నిభేక్షణమ్ ! ఆజాను బాహుం దీప్తాఽఽస్యం అతీవ ప్రియ
దర్శనం !!
గజ విక్రాంత గమనం జటా మండల ధారిణం ! సుకుమారం మహా సత్త్వం పార్థివ వ్యంజనాఽన్వితమ్ !!
రామమ్ ఇన్దీవర
శ్యామం కందర్ప సదృశ ప్రభమ్ ! బభూ వేన్ద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామ మోహితా !!

అలా కూర్చున్నా ఆయన అందం ఎలా ఉందటో తెలుసా..? దేవేంద్రుడు వచ్చి సింహాసనం మీద
కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడట ఆ తేజస్సు అలా ఉంది ఆయనది, అది ఆకర్షించేస్తుంది
ఎవరినైనా సరే... దానికి రాక్షసులు లేరు బాలులు లేరు వృద్దులు లేరు కోతులు లేవు
కొండ ముచ్చులు లేవు భల్లూకాలు లేవు ఎవరైనా సరే ఆయన్ని ఇలా చూస్తే చాలు అబ్బాహ్..!
అనవలసిందే. ఋషులైనా సరే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ ఏమందంరా ఈ
అందం అనవలసిందే అలా ఉంటాడు నా తండ్రి కాబట్టీ సింహోరస్కం మహా బాహుం పద్మ పత్ర నిభేక్షణమ్
ప్రత్యేకించి రాముడి చూపులు అలా ఉంటాయట. ఆయనకాని ఇలా ఎవరైనా చూస్తే చాలట ఆయన్ను
చూసినా ఆయన చూసినా వ్యామోహితులైపోతారు అందరూను, అందుకే రామ చంద్ర మూర్తిని ఉపాసనచేస్తే
రామ చంద్ర మూర్తి కూడా వాళ్ళవంక చూస్తూనే ఉంటాడు, మీ అంత మీరు ఆ అనుగ్రహాన్ని
వదిలేసుకుంటేనే చెప్పలేను కానీ ఒక్కసారి రాముని వంకచూస్తే అదే ఆయన ప్రతిజ్ఞ కూడా
రామాయణంలో సహృదేవ ప్రసన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతేభ్యః తదాం ఏతత్
వ్రతం మమ ఎవడైనా ఒక్కడు నన్ను పట్టుకుంటే నేను వాళ్ళను పట్టుకుంటాను అన్నాడు
ఆయన భూతములలో ఎవరైనాసరే.
|
రామాయణం రామ నామం
అంత గొప్పది సింహోరస్కం మహా బాహుం విశాలమైన పెద్ద పెద్ద
భుజములున్నటువంటివాడు సింహమువంటి గొప్ప పరాక్రమము ఉన్నటువంటివాడు, కన్నులు పద్మ
పత్రమలు ఎలా ఉంటాయో అలా అటువంటి కళ్ళు ఉన్నటువంటివాడు, మీరు ఒకటి బాగాగుర్తుపెట్టుకోండి
ఈశ్వరుడి గురించి చెప్పేటప్పుడు ముఖారవిందం పాదారవిందం ఏది చెప్పినా అరవిందం
అంటారు కాళ్ళూ తామరపూలే కళ్ళూ తామరపూలే ఎలా కుదురుతుందండీ ఎలా ఉంటాయండీ ఏమైనా
అర్థం ఉందా పాదారవిందం ఏమిటండీ రామ చంద్ర మూర్తి పాదారవిందార్పణ మస్తూ అంటారు
పాదారవిందం ఏంటీ నా మొహం అసలు పాదాలు అరవిందాల్లా ఉంటాయా? అరవిందం అంటే తామర
పూవ్వుండీ తామర పూవ్వుకీ అరవిందానికి పోలికేమిటో నాకు చూపించిండీ ఏమైనా ఉందాసలు,
దానికి కాడ కిదనుంచి పైకి ఉండి దీనికి కాడ పైనుంచి కిందకుంది కాలు పై నుంచి
ఉంటుంది కింద నుంచి పాదము ఉంటుంది ఏమిటి తామర పువ్వు ఎలా పోల్చారు మీరు మరి
నేత్రములు అరవిందములే పాదములు అరవిందములే అన్నీ అరవిందములే అంటే కాదు ఎందుకు
అరవిందం అంటారో తెలుసాండీ..! ఎక్కడ పద్మము ఉంటుందో అక్కడికి బృంగము వెళ్ళుతుంది,
బృంగము అంటే సీతాకోక చిలుక, సీతాకోక చిలుకకీ తుమ్మెద అనండీ బాగుంటుంది, తుమ్మెదకీ షట్భుజి
లేకపోతే ఆ సంస్కృత భాషలోకి వచ్చేటప్పటికి దానికి షట్పది ఆరుకాళ్ళు ఉన్నదీ అని పేరు
షట్పది అంటే ఆరుకాళ్ళుఉన్నది అంటే మనము కూడా షట్పదులమే మనకు కూడా ఆరుకాళ్ళు ఉంటాయి
ఏమిటో తెలుసాండీ... పంచేద్రియములు మనస్సు ఈ ఆరింటితోటే మనం కూడా కదులుతాం పాదం
కదలికకు పనికి వస్తుంది, ఐదు ఇంద్రియములు మనసు కదలడానికి పనికివస్తాయి. షట్పది
అయినటువంటి తుమ్మెదా తామర పువ్వు కనపడితే మాత్రం దానిమీద వాలి రెక్కలు వంచేసీ ఆ
మకరందాన్ని తాగడంలో నిగ్మమైపోతుంది.

|
నీ మనసులో భక్తి
అన్న తేనె లేకపోతే ఆయనెందుకు ఎగురుతాడు ఆ తేనె నీవు తెచ్చుకోవాలి ఆ మకరందం ఉండాలి
కాబట్టీ సింహోరస్కం మహా బాహుం పద్మ పత్ర నిభేక్షణమ్! ఆజాను బాహుం దీప్తాస్యం
అతీవ ప్రియ దర్శనం !! ఎంత గొప్ప దర్శనమో అంటే అందరికీ ప్రియ దర్శనమే గజ
విక్రాంత గమనం ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి అందమైన నడకా జటా మండల ధారిణం పెద్ద
జటామండలంతో ఉన్నాడట జుట్టంతా మఱ్ఱిపాలు పోసుకొని సుకుమారం మహా సత్త్వం
అత్యంత సౌకుమార్యం కలిగినటువంటి, అత్యంత లావణ్యంతో ఉన్నాడు ఆయన చూడ్డానికి గొప్ప
బలశాలి పార్థివ వ్యంజనాన్వితం చూడగానే రాజ లక్ష్ణములన్నీ శోభిల్లుతున్నాయి రామమ్
ఇన్దీవర శ్యామం అసలు శూర్పణఖ కళ్ళుతో చూసిన వాల్మీకి మహర్షి నోటివెంట
వచ్చేస్తున్న రామ స్తోత్రం ఇది, కాబట్టి రామమ్ ఇన్దీవర శ్యామం నల్లకలవల
యొక్క కాంతితో ఉందట ఆయన శరీరం కందర్ప సదృశ ప్రభుమ్ మన్మథుడు ఎలా
ఆకర్షిస్తాడో అలా ఆకర్షిస్తున్నాడట బభూ వేన్ద్రోపమం దృష్వా ఆయన్ని చూడగానే
అటువంటి రామ చంద్ర మూర్తిని చూడగానే రాక్షసీ కామ మోహితా రాక్షసి కాబట్టి
కామ మోహిత అయ్యింది. ఆమె రాక్షసి కాబట్టి ఇప్పుడు రాముని యొక్క భౌతిక సంపర్కాన్ని
కోరుకుంది. రామున్ని భర్తగా నేను ఆడదానిగా భోగము అనుభవించాలి అనే కోర్కె శూర్పణఖ
యందు పుట్టింది.

సాధారణంగా ఇది అందరూ అనుభవించేది ఎక్కడ అనుభవిస్తుంటారో తెలుసాండీ ఈ రామ చంద్ర
మూర్తే ఇప్పటికీ మనకు ఇదే రూపంతో కనపడుతుంటాడు ఎక్కడ వేదోద్దారణ మందరాభరణ
పృథ్వీ ధరణనిర్మాణా ప్రహ్లాదత్రాణా భలిప్రతారణా నృపావనహంకారణా వైదేహీరమణా ధనుంజయ
జయ వ్యాపారపారీన ఛోనీద్వీవ్యత్ కరుణా తమోహరణా తండ్రీ వేంకటేశ ప్రభో
|
వేంకటేశ్వరుడిగా
అలా మనకు ఆకర్షణ శక్తితో ఇప్పటికీ కలియుగంలో కనపడుతుంటాడు అందుకే శనివారం కదా
మీరొక్కసారి
భావన చెయ్యండీ పిల్లలూ పెద్దలూ నెత్తిమీద పెట్లు పెట్టుకున్నవాళ్ళు బట్టల
మూటలు పెట్టుకున్నవాళ్ళు పేదవాళ్ళు కోటీశ్వరులు లక్ష్యాధికారులు ఆడవాళ్ళు
ముసలివాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఎవరు కానివ్వండి అసలు
ఆఁవేంకటేశ్వర స్వామివారి ఆనందనిలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ రాజ
ద్వారానికి ఎదురుగుండా ఉన్న గొట్టానికున్న కన్నాల్నుంచి నీళ్ళు వస్తుంటే మీ
ప్రమేయం లేకుండా అవి మీ పాదాలు కడిగేస్తే మీరు రాజద్వారపు గడపలోపలికి అడుగుపెడుతూ
గడపకు అటూ ఇటూచూస్తే లోపల ఉన్నటువంటివాడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు అనంతమైన
ఐశ్వర్యవంతుడు నీకు ఏదైనా ఇవ్వగలడూ అని చెప్పగలిగిన శంకనిధీ పద్మనిధీ ఒకేలా ఉన్న
మూర్తులు అటూ ఇటూ కనపడితే ఆ గడపకు అరిటిచెట్లు కట్టి ఉండి ఆకులు అటూ ఇటూ ఇలా
విచ్చుకుని ఉంటే...

మీరు గడపదాటి ఇలా లోపలికి వెళ్ళి తల పైకెత్తి చూస్తే మీ కుడివైపు గోడమీద ఒక
గుణపం వ్రేలాడుతూ కింద మట్టు కనపడితే ఒకప్పుడు అనంతాచార్యులవారు వేంకటేశ్వర స్వామివారి
మీదకు విసిరినగుణపము ఇదే కదా అందుకే కదా ఇప్పటికీ వేంకటేశ్వర స్వామివారు గడ్డంకింద
చందనపు ముద్ద జ్ఞాపకంగా పెట్టుకుంటారు ఆ మచ్చచూసి అనంతాచార్యులవారిని
గుర్తుతెచ్చుకుంటే వేంకటేశ్వరుడు ప్రీతిపొందుతాడని ఆ గుణపం వంకచూసి మీరు ఒక్క
అడుగు ముందుకేసీ ఇలా ఎడం పక్కకి తల తిప్పితే అచ్చుతరాయులవారు వరదరాజ అమ్మణ్ణీ ఆ
పక్కన వేంకటపతి రాయలవారు వాళ్ళు ముగ్గురు కూడా వేంకటేశ్వరుని సేవించి మా విగ్రహాలు
మా శరీరాలు పడిపోయినా ఇక్కడ ఉండాలని ఆ విగ్రహాలు పెట్టుకుంటే ఇలా కుడి పక్కకు
తిరిగితే టోపీలాంటి కిరీటం పెట్టుకుని రెండు చేతులతో ఇలా నమస్కారం చేస్తూ
శ్రీకృష్ణదేవరాయులవారు ఇటు తిరుమలాదేవి ఇటు చిన్నాదేవి వీళ్ళతో విగ్రహాలు ఆయన
బ్రతికుండా ఆయన వేంకటాచలంలో పెట్టుకుంటే మీరు కొద్దిగా అడుగుతీసి ఎడం పక్కకు
వేస్తే ఆ యడం పక్కన మీకూ ఆ రంగనాయకుల మంటపం ఆ పక్కన తిరుమల రాయమంటపం కనపడితే ఆ
ఎదురుగుండా స్వామివారికి దీపాలంకారసేవ చేసేటటువంటి మంటపం ఆ మంటం మెట్లమీద కూర్చుని
మీరు ఆ రెండు మంటపాల వంక చూస్తుంటే అక్కడ ఒక పెద్ద ఇత్తడి ప్లేటుపై బోర్డు దాని
మీద నల్ల క్షరాలు ఉంటాయి మాలికాపూర్ దక్షిణ భారతదేశ దండయాత్రకు వచ్చినప్పుడు
శ్రీరంగం క్షేత్రం మీదకు దండయాత్రకు వెడితే రంగనాథుని రక్షించడానికి ఈ
క్షేత్రానికి తీసుకొచ్చీ మంటపంలో ఉంచి చాలాకాలం పూజలు చేశారు.
కాబట్టి ఈ మంటపానికి రంగనాయకుల మంటపమూ అని పేరు వచ్చినదీ అని ఒక పెద్దబోర్డు
ఉంటే మీరు ఆ బోర్డు చదివీ కొంచెం ముందుకు వెళ్ళబోయి ఇలా రంగనాయకుల మంటపానికి ఎడమ
పక్కకి తిరిగి వెళ్ళుతూ ఇలా చూస్తే అక్కడే తులాభారం పసిపిల్లల్ని తీసుకొచ్చి ఓ పక్కకు
పడుకోబెట్టి పటికబెల్లం ఓ పక్కన పోస్తూ రెండు పెద్ద డప్పులుండి వాటిని
కొట్టేటటువంటి వాళ్ళు ఆ డప్పులు కొడుతుంటే మీరు అలా ఆ రంగనాయకుల మంటపానికి చుట్టూ
తిరిగి వస్తూంటే మీరు ఆ కుడిచేతి పక్కకు తిరిగేసరికి స్వామివారి కళ్యాణమంటపం
కళ్యాణమంటపంలోపల ఎత్తైన వేదికా పక్కన గోడకు ఉన్నటువంటి ఫ్యాన్లు ఆ వేసినటువంటి
ఎర్రటి తివాచీ కళ్యాణమంటపం పక్కన సన్నటి ఎత్తైన అరుగూ కళ్యాణమంటపం
టికెట్లతోవచ్చినవాళ్ళు కూర్చునేటటువంటి అరుగుచూసి మీరు ఆ పక్కనుంచి గోడపక్కనుంచి
నడుస్తుంటే అక్కడ ఎత్తూ ఉండి దాంట్లో ఉన్నటువంటి ఎర్రటి గొట్టం ఎప్పుడైనా ఏదైనా
అగ్నిని ఆర్పవలసివస్తే ఉపయోగించడానికి వెల్లవలసిన పదార్థానికి అందులోంచి
వెళ్ళడానికి ఉన్న ఎర్రగొట్టం అదిదాటి కొంచెం ముందుపక్కకి వెళ్ళితే అక్కడ మీరు ఇలా
కుడిపక్కకు చూస్తే అక్కడే ఆ వేంకటేశ్వరస్వామివారి యొక్క క్షేత్రాన్నంతటినీ కూడా
రక్షించినటువంటి మహానుభావుడు రాజాతోడర్మల్ ఆయన తల్లిగారు ఆయన భార్యగారు ఇత్యాది
వారి, ఇద్దరి విగ్రహాలతో పాటు ఇలా ఆయన నిలబడి ఉన్నట్టుగా వాళ్ళ ముగ్గురి మూర్తులూ
ఉంటే మీరు దాటి కొంచెం ముందుకు వెళ్ళితే అక్కడే పరిహరణ మంటపం పక్కన ఎత్తుగా
ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు అవి చూసి నమస్కరించి ఎడం పక్కకి తిరిగి పెద్ద
ఎత్తైన గడపదాటి లోపలికి వెడితే ఎదురుగుండా అద్దాలపేటికలో ఇలా పడుకున్నటువంటి
రంగరాజస్వామివారు కనపడితే ఆయనకు ఓ నమస్కారం చేసి...
|
ఇలా తలపైకెత్తి
చూస్తే ఆకాశం కనపడితే ఇక్కడికి ఈ ద్వారం అక్కడికి ఆనందనిలయం యొక్క ప్రాకారం రెండు విడిపోతే
మీరు ఎడం పక్కకి తిరిగిచూస్తే వరదరాజస్వామివారి దేవస్థానం ఆకు పచ్చటి పంచా జానెడు
ఎర్రటి అంచూ కట్టుకున్నటువంటి స్వామీ ఆయన పొట్టనుంచి అంచులు ఇలా ఇలా తిప్పితే కంచి
వరదరాజస్వామిని అక్కడ దర్శనం చేసుకొని కుడిపక్కకుతిరిగి మీరు ఆనందనిలయంలోకి వెడితే
ఆనందనిలయంలో ఓం నమో వేంకటేశాయ నమః వినపడుతూంటే మీరు ఇలా రెక్కలు
విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఎడం పక్కకి తిరిగి ఇలా గీతలు గీసినటువంటి ఉన్నటువంటి
ఒక కొయ్య సాధనం మీదకు మీరు ఇలా పైకెత్తితే ఇలా రెండు చేతులతోటి లోపల ఉన్నవాడికి
దగ్గరికి సౌచంతో వెళ్ళాలని ముద్రపట్టి జయ విజయులు చూపిస్తుంటే ఇలా
పట్టుకున్నటువంటి ప్రమిథలలో దీపాలు వెలుగుతుంటే మీరు ఆ ఎత్తైనటువంటి పీఠమీద ఎక్కి
చూసేటప్పటికీ ఎదురుగుండా లోపల ఆనంద నిలయంలో ఇంత ఊర్ధ్వ ఉండ్రాలు పెట్టుకుని పేద్ద
కిరీటము కిరీటము నుంచి ఇలా భుజముల మీదకు వేలాడుతున్న హోమాలతో కంఠం వరకు స్వామి
కనపడితే అప్రయత్నంగా రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవింద అంటూ మీరు
అడుగులు ముందుకేసి ఆనందనిలయంలోకి వెడుతుంటే...

|


|
తిరిగితే ఎడం
పక్కకు తిరిగితే పరకమణి డబ్బులు లెక్కపెట్టేవాళ్ళు వెండి బంగారం తెల్లటి లుంగీ
పంచల్లా కట్టుకుని ఐదు వందల కాగితాలు వెయ్యి కాగితాలు వివధ దేశాల యొక్క కరెన్సీలు
అన్నీ రాసులకింద పోసి ఉంటే ఎన్ని ఇస్తావో ఎన్ని పుచ్చుకుంటావో తండ్రీ ఎంత మంది
కోర్కెలు తీర్చావో ఉండిలో తెచ్చివేశారని ఆశ్చర్యపోయి ముందుకెళ్ళి మెట్లెక్కి
చూస్తే...
గంధం ఒలిచే మంటపంలో పెద్ద పెద్ద తుంగల మీద గంధం తీసేటటువంటివాళ్ళు అక్కడ
నిలబడి గంధం తీస్తుంటే స్వామికి ఒంటినిండా ఎన్ని మార్లు ఆ చందన అలంకారం చేస్తారో
అనుకుని మీరు కొంచెం ముందుకొచ్చి మెట్లెక్కి ఇలా ఆనంద నిలయం విమానం వంక చూస్తే
విమానంలో ʻవిమాన వేంకటేశ్వరుడుʼ ఆయనకు ఎడం చేతిపక్కన తోక ఇలా తలపైవరకూ ఎత్తి
ఉన్నటువంటి హనుమా ఆయన కుడిచేతి పక్కనేమో
ఆడుకుంటున్న బాల కృష్టుడు బాల కృష్టుణి పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుడు, బంగారు
మూర్తులుగా మీకు దర్శనం అయితే సంతోషించి నమస్కరించి కిందకి దిగి మీరు నాలుగు అడుగు
ముందుకేసి పైకి మెట్లెక్కితే ఎడం చేతి పక్కన యవ్వనంలో యువకుడుగా ఉన్నటువంటి
రామానుజాచార్యులవారి గుడికనపడితే అక్కడ ఒక నమస్కారంపెట్టి మూడు అడుగులు ముందుకు
వేస్తే “ఆరగించి కూర్చున్నాడల్లవాడే” అని కీర్తన చేసినటువంటి
నరసింహస్వామి పెద్ద పెద్ద ధంస్ట్రలతో మోకాళ్ళు ఇలా పైకెత్తీ ఇలా రెండు చేతులు పైకెత్తి
కూర్చుంటే ఈ పైన ఉపరితలాలు గోళ్ళు వేళ్ళు ఆ ముఖం అందం ఆ వూర్ధపుండ్రళ్ళు
కట్టుకున్న పంచా ఆయన్ను చూసి నమస్కారంచేసి ఆయనకు దక్షిణ పురస్కరంగా కిందకి
దిగుతుంటే మెట్లు కుడిచేతి పక్కన ఇచ్చట కూర్చుండరాదు అని రాసున్నటువంటి ఓ పళ్ళెం
అక్కడ స్వామివారికి అలంకారంచేసే ఊర్ధ్వపుండ్రాల కర్పూరం ఇక్కడేకదా
అరగదీస్తారనుకుంటే అక్కడ నుంచి కిందకి దిగుతూ ఎదురు చూస్తూ ఒక ఫిజ్ లాంటి బాగా
అద్దం పెట్టేసిన చోట వెంటిలేటర్ ట్రేలు పెట్టీ దానిమీద స్వామివారికి అలంకారం
చేసేటటువంటి పుష్పమాలలు వాడిపోకుండా అలాగని మంచుతగిలి చెదిరిపోకుండా ఉంచవలసిన
సమసీతల స్థితిలో ఉంచబడిన ఆ ఉన్నటువంటి గదీ అందులో పెట్టబడిన పుష్పమాలలూ అక్కడా
అంటుకున్నటువంటి మంచు బిందువులూ...

దిగి కొంచెం ముందుకు వెళ్ళితే స్వామివారి ఉండీ దానికీ నామాలు దానికి ఇలా
చిరిగినట్టుగా ఉన్నటువంటి విశేషం అక్కడ మీరు చెయ్యిపెట్టి స్వామివారి డబ్బువేసి
అక్కడ కొంతమంది హుండీకి కళ్ళకు అద్దుకుంటూంటే ఇక్కడ ఇత్తడి పలకలపలకలల్లా
ఉన్నవాటిల్లోంచి లోపలికి చూస్తే ఆనందనిలయంలోకి వెళ్ళుతున్నవాళ్ళు కనపడుతూంటే ఓ
నమస్కారం చేస్తూంటే ఓ సెక్యూరిటీ గార్డు అక్కడ తుపాకీ పట్టుకుని నిలబడి ఉంటే మీరు
ఆ హుండీ చుట్టూ తిరిగి ఎడంపక్కకు వెడితే గోడమీద ఇలా చెయ్యిపెట్టి డబ్బులు
కురిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి కనపడితే చేతులెత్తి పొడుగ్గా పుట్టినందుకు జన్మధన్యం
ఇవ్వాలా అని ఇలా రెండు చేతులు వేసి ఆవిడ పాదాలు పట్టుకుంటే చల్లగా కొంతమంది
గోకేసిన నాణ్యాలు తగిలితే ఓ నమస్కారం అమ్మవారికి పెట్టి ముందుకొచ్చి రంగనాయకులు
వారు ఉన్నటువంటి ఆ వేదిక దగ్గర ఒక్కసారి ఆ నేలమీద పడి నమస్కారం చేసి పైకి లేచి
బయటికి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే ధ్వజస్తంభం దగ్గర ఉచిత ప్రసాదం ఇస్తున్నదగ్గర
చెయ్యి పెడితే నీకో చిన్న లడ్డు చేతిలో పెడితే ఆ పూల బావి దగ్గర నిలబడి ఆ లడ్డూతినీ
యాలక్కాయ తొక్క యొక్క పీచు పంటిలో దూరితే నోట్లో వేలు పెట్టుకోబోతుంటే భార్య అదిగో
ఎంగిలి మళ్ళీ బయటికి వెళ్ళినంక తీద్దురుగాని ఎప్పుడు నోట్లో వేలుపెడతారు అని అవును
అవును అనీ...
|
ఆ లోపలనుంచి
వస్తున్నటువంటి సువాసనలతో వంటశాల దగ్గర అష్టతల పద్మరాధన ప్రసాదం కవర్లతో
పుచ్చుకుంటే అందరూ ఆ పెద్ద లడ్లవంక చూస్తే మీరు కోటీశ్వరులైనట్లు భావించి ఆ పంపుల
దగ్గర చెయ్యి కడుక్కుని అప్పటివరకూ పెద్ద పెద్ద అగ్ని చట్రాలూ అవి స్వామి వారికి
ముందు వెళ్ళినటువంటివి అక్కడ పెట్టి ఇంకా చిన్ని చిన్ని జ్వాలలతో వెలుగుతుంటే
నీళ్లుపోసి ఆర్పినచోట పొగలు వస్తూంటే ప్రసాదాలు చీట్లు కిందపడి కాళ్ళు జారకుండా
నీళ్ళు గొట్టాలతో కడుగుతుంటే పరిచారికలు ఆ తడికి మీ కాళ్ళు కడగబడితే మీరు అక్కడికి
వచ్చి ఎడం పక్కకి వచ్చి తివాచీమీద కాలు పెట్టి ఇలా పైకి చూస్తే మళ్ళీ గుణపం వంక చూసి
మళ్ళీ ఓసారి తల కుడిపక్కకు చూసి ధ్వజస్తంభం అడ్డువచ్చి ఇంకేమీ కనపడకపోతే ఈశ్వరా
నాకు పునఃదర్శనం ఇవ్వమని మెట్లుదాటి బయటికొచ్చి ఒక్కసారి ఆ స్వర్ణ తేరు పూర్వం
ఉండేదగ్గర నుంచి తెల్లటి గోపురం వంకచూసి ఆ మూల లోపల సెక్యూరిటీ పోస్టుమీద తుపాకీ
పట్టుకున్న గార్డులు కనపడితే ఈశ్వరా ఇటువంటి రక్షణ ఏమీ అవసరం లేకుండగా నీ
దేవాలయంలోకి ఏ చెక్కింగు అవసరం లేకుండా భక్తులు హాయిగా వెళ్ళగలిగినరోజు తొందరగా
వచ్చేటట్లు అనుగ్రహించు తండ్రీ అని ఒక మనస్కారంచేసి మీరు సంతోషంగావస్తే ఇప్పుడు
మీరు వాడు ఆకర్షించేశక్తి ఇచ్చాడాలేడా ఎన్నిగంటలు మీరు ఉన్నా క్యూలో ఆ
చూసేటప్పటికి మీరు ఎంతో ఆనందపడిపోయి అబ్బబ్బబ్భా ఏమి దర్శనం ఏమి దర్శనం అని ఆనందం
పొందితే అదే అతీవప్రియదర్శనం ఆ లాగేసిన ఆకర్శణ శక్తి ఉందే దానికి
అతీవప్రియదర్శనం దానికి వృద్ధుడు స్త్రీ పురుషు పండిత పామర కుల మత వర్ణ వర్గ
విచక్షణ లేకుండగా లాగ గలిగిన విచక్షణాశక్తి రాశీభూతమైన వేంకటేశ్వరుడైతే అదే రామ
చంద్ర మూర్తిగా కూడా కూర్చుంది.
అటువంటి స్వరూపాన్ని చూసినటువంటి శూర్పణఖ రాక్షసియై కామాన్నిపొందిందటా,
రాక్షసి కాబట్టి కామాన్ని పొందింది భక్తుడైతే పరవశాన్నిపొందివుండేవాడు. కాబట్టి
ఇవ్వాళ శూర్పణఖ పొందినటువంటి రామ దర్శనం అన్న మంగళ కరవాఖ్యం దగ్గర శనివారం
మానసికంగా టికెట్టులేకుండా వేంకటాచలం ఆనందనిలయం దర్శనం మీకు అయ్యిందని నేను
అనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసుకొని రేపు మళ్ళీ
పునఃప్రారంభం చేద్దాం.
మనం ప్రతిరోజూ చెప్పుకున్నట్లే చక్కగా రామ నామాలు ఒక్కసారి పదకొండు పర్యాయాలు
చెప్పుకుందాం. ఆ తరువాత చాలా ముఖ్యమైనటువంటి అనౌన్సుమెంటు ఉంటుంది, కాబట్టి మీరు
శద్ధాళువులై కూర్చొని ఉండెదురుగాకా!
శ్రీ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
దారినొంటిగ నడచువారికి తోడునీడే రామ నామము !! రా !!
నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీ రామ నామము !! రా !!
ఆలుబిడ్డల సౌఖ్యముకన్నను అధికమైనది రామ నామము !! రా !!
బ్రహ్మసత్యము జగ్నమిథ్యా భావమే శ్రీ రామ నామము !! రా !!
ఎందరో మహానుభావులడెందమాయెను రామ నామము !! రా !!
|
శివుడు గౌరికి బోధచేసిన
చిన్మయము శ్రీ రామ నామము !! రా !!
తత్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామ నామము !! రా !!
చిత్తశాంతిని కలుగజేసెడి చిత్ స్వరూపము రామ నామము !! రా !!
చూపుమానసమొక్కటై మది చూడవలయును రామ నామము !! రా !!
బ్రహ్మపుత్రకరాబ్జవీణా పక్షమైనది రామ నామము !! రా !!
శరణు శరణణు విభీషనునకు శరణమొసగిన రామ నామము !! రా !!
దాసులను రక్షించ దలయగల ధర్మనామము రామ నామము !! రా !!
రేపు ఒక పెద్ద పండగ ఒక అద్భుతమైన పండగ రేపు ఉదయం పెద్దలకి కూడా అవకాశం ఇవ్వాలి
అని నిర్ణయం చేశారు కాబట్టి పెద్దలూ పిల్లలూ అందరం ఒక్క నలభై అయిదు నిమిషాలసేపూ
మౌనమైనటువంటి రామలేఖన యజ్ఞాన్ని చేద్దాం. రామ చంద్ర మూర్తికి పూజలో చెప్తారు రామా!
నీ కింకరులు నీ భక్తులు చూడూ దేవాలయములో కూర్చుని రామ నామ లేఖనం మొదలుపెట్టారు నీ
నామం రాస్తున్నారు రామా నీవు చూసి కాపాడు అని చెప్తారు మొదలు పెడతారు అన్నిచోట్లా
బెల్స్ మోగుతాయి స్పీకర్స పెడతారు, ఆ బెల్స్ మోగగానే రాయడం మొదలు పెడతారు శ్రీ రామ
శ్రీ రామ శ్రీ రామ అంటూ దీనికి పేపరు లాగేసుకోవడం టైము అయిపోవడం అలాంటివేమీ ఉండవు
రాసేసిన తరువాత పట్టుకెళ్ళి రామాయలంలో ఇచ్చేయ్యడం రామ చంద్ర మూర్తి యొక్క మాడ నేను
మీరు రాసినదానికి సంతోషించి మిమ్మల్ని నేను కృతార్థున్ని చేస్తున్నాను మీ వెంట
నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను నమ్మినవాడికి అంతే “నను పాలింపగ నడిచి
వచ్చితివా” అంటారు త్యాగరాజ స్వామి ఆ రాముల వారి ఫోటో తీసుకొచ్చి ఇస్తే స్వామీ
ఇంతబడలికా నడిచివచ్చావా నాకోసం అన్నారు. రాముడే మీ వెంట నీ ఇంటికి వస్తున్నారు
బహుముఖాలతో సహస్త్రశీర్షా పురుషః ఆయనా అన్ని ముఖాలతో రాగలడు కాబట్టి
అనంతమైన రూపాలతో మీ ఇంటికి వస్తాడు మిగిలిన విషయాన్ని హరిప్రసాదుగారు చెప్తారు, కాబట్టి
మీ అందరు మీరు చక్కగా మీ పిల్లల్ని మీ పక్కింటి పిల్లన్ని అందర్నీ తీసుకురండీ ఏడు
గంటల ముఫై నిమిషాలకు మాత్రం తలుపులు వేసేస్తారు ఎందుకంటే దేనికైనా ఒక క్రమశిక్షణ
నియతీ ఉండాలి ఆ నియతీ కాల నియమం లేకపోతే దానికి అందం ఉండదు ఎప్పుడో తప్పా దానికి
అలా ఉండకూడదు బాగుండదు ఎందుకని చేస్తున్నామంటే చెయ్యవలసిన వేళలలో అంత చలిలో స్నానం
చేసిన మహాపురుషుడు ఆయన ఒక కాల నియమం ఉండాలి ఏడు ముప్ఫై తలుపులన్నీ వేసేస్తారు ఇక
అప్పుడు మాత్రం లోపలికి పంపీ రామ నామం రాసేటటువంటి అవకాశం కలుగదు కాబట్టి ఒక్క
నలభై ఐదు నిమిషాలు శ్రీరామాయణాంతర్గతంగా ఇక్కడ శారదా పీఠంలో కూర్చుని తవ
పూజాంతర్గతేన అంటే పూజ చేసేటప్పుడు రామ నామం రాసి రామ మాడ
పట్టుకెళ్ళేటటువంటి భాగ్యాన్ని పొందండి.
పిల్లలందరికి రామ నామం రాయడం కోసం కాగితంతో పాటు కలాన్ని కూడా ఉచితంగా అన్నమాట
నేను ఎప్పుడు వాడను ఉచితంగా ఇస్తున్నామంటే అహంకారముంది నాకుంది నీకు ఇస్తున్నాను
అన్నమాట అనకూడదు, లేకపోతే నాకు ఇవ్వాలనిపించింది నీకు ఇస్తున్నాను అనవద్దు కాదు
రామ నామం రాసేటటువంటి పసిచేతులలో ఆ కలాలు వెళ్ళేటటువంటి అదృష్టము తాము పొందడానికి ఆ
కలాలనిచ్చి వాళ్ళు కూడా అదృష్టాన్ని పొందుతున్నారు కాబట్టి రేపు చక్కగా రేపు ఒక
గొప్ప యజ్ఞం 45 నిమిషాలు ఇంత మంది మౌనంగా పిల్లలందరికీ దేవాలయ ప్రాంగణాలు ఇద్దాం,
ఎందుకంటే మనం పిల్లల్నీ ఎప్పుడూ వృద్ధిలోకి తీసుకురావాలి పిల్లలకి దేవాలయ ప్రాంగణం
ఇద్దాం మనందరం ఇక్కడ చక్కగా కూర్చొనీ రామ నామం రాసేయడం ఇచ్చేయడం రామ మాడ
పట్టుకోవడం వెళ్ళిపోవడం రేపు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు
సాయంకాలానికి అసలు ఉపన్యాసానికి ప్రారంభం ముందరే ఈ చారిత్రాత్మక ఘట్టం గురించి
హరిప్రసాద్ గారు మాట్లాడితే వినాలన్న నా కోరిక తీరేటట్లుగా రామ చంద్ర మూర్తి
అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ...
|
మంగళా శాసన...
No comments:
Post a Comment