అరణ్య కాండ
పదిహేనవ రోజు ప్రవచనము
పాతివ్రత్యము యొక్క ప్రభావము ఎంతగొప్పదో పతిని అనుగమించడంచేత ఎంతగొప్ప శక్తిని
ఒక స్త్రీ సంతరించుకోగలదో సనాతనధర్మంలో దానికి ఎంత పెద్దపీఠ వేయబడిందో అది స్త్రీ యొక్క పరమధర్మంగా ఎలా
చెప్పబడిందో నిన్నటి రోజు అనసూయా వృత్తాంతంలో మనంచూసి ఉన్నాము. మహర్షి శ్రీరామాయణాన్ని
ప్రతిపాదన చేసేటప్పుడు ఒకచోట జరిగిన సందర్భానికి తరువాత జరుగబోయేటటువంటి ఘట్టానికి
ఎక్కడో ఒక సంబంధం ఉంటుంది, మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి రామాయణంలో
అనసూయమ్మ మహాపతీవ్రత, మహాపతీవ్రయైనటువంటి అనసూయమ్మ ఎవరిని మెచ్చుకునీ
ప్రత్యేకమైనటువంటి కానుకలనిచ్చింది, సీతమ్మని మెచ్చుకుని కానుకలిచ్చింది, దేనికిచ్చింది
కానుకలు అంటే సీతమ్మ తల్లికూడా మహాపతివ్రత కనుకా... సీతమ్మ తల్లి మహాపతివ్రతా అని
అనడమేనా దానికేమైనా కారణం చూపించిందా..! చూపించింది ఏమిటి చూపించింది, ఇంత సంపదనీ
ఇంతమంది పరిజనాన్నీ జ్ఞాతులనూ ఇందరినీ విడిచిపెట్టీ నీవు నీ భర్తను అనుగమించి
అరణ్యానికి వచ్చావు..? ఇంతకన్నా గొప్ప ధర్మం ఏముంటుందీ అందుచేత నీ పాతివ్రత్యానికి
నేను మెచ్చుకున్నాను నీవు వరం కోరుకో అంది.
కనుకా సీతమ్మ తల్లికూడా మహాపతివ్రత మహాపతివ్రతా అయినటువంటి సీతమ్మతల్లి అరణ్యానికి
రావడం అనేటటువంటిసందర్భం కేవలం రామున్నిసేవించి మళ్ళీతిరిగి వెళ్ళిపోవడానికి
మాత్రమే ఉపకరిస్తుందీ అని మనం అనుకుంటే శ్రీరామాయణంలో అది ప్రయోజనమూ అని మీరు చెప్పడంకుదరదు
ఎందుకంటే అయోనిజగా ఆమె ఆవిర్భవించింది, ఆమె అలా ఆవిర్భవించడం వెనక కారణం ఏమిటో
ఆవిడకీ తెలుసు నేను ఇలావస్తే తప్పా... అవతారప్రయోజనం నెరవేరదు కాబట్టి నేను
ఇలారావాలి అందుకేవచ్చింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ అరణ్యానికి వెళ్ళితే అవతారప్రయోజనం
నెరవేరడానికి ప్రధానకారణం ఏమైవుండాలి సీతమ్మ తల్లియొక్క పాతివ్రత్యమే కారణమైవుండాలి
ఇంక సీతమ్మ తల్లికి వేరుతపస్సు ఉండదు. రామున్ని అనుగమించి రామున్ని ప్రేమించి
రామున్ని సంతోషపెట్టి రామునితోకలిసి జీవితాన్ని పంచుకుని త్రికరణశుద్ధిగా
రామునియందు హృదయముంచుకున్నటువంటి సీతమ్మ తల్లియొక్క పాతివ్రత్యప్రభావమే అవతారప్రయోజనమైన
రావణ సంహారమునకు ప్రాతిపదికకాబోతూందీ ఇదీ చెప్పకుండాచెప్పడం అయోధ్య కాండ చివరా
సీతమ్మ తల్లి అనసూయమ్మ చేత సత్కరింపబడడం.
|
ఒక బ్రహ్మచారి ఏలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది, ఒక గృహస్తు ఏలా ఉండాలో
అలా ఉంటేనే అందంగా ఉంటుంది, ఒక సన్యాసి ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది.
అంతేకానీ సన్యాసి గృహస్తులా ఉన్నా గృహస్తు సన్యాసిలా ఉన్నా గృహస్తు బ్రహ్మచారిలా
ఉన్నా బ్రహ్మచారి సన్యాసిలా ఉన్నా అదిబాగుండదు ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి ఆ ఉండడం
అన్నదానికే నిష్ఠా అని పేరు అలా ఉండడమే నిష్ఠ అలా ఉండడమే శ్రద్ధ. అది
శాస్త్రమునందు తాను ఆశ్రమంలో ఉండడానికి ఉన్నటువంటి ప్రయోజనాన్ని
సిద్ధింపజేసుకొనేటటువంటి ప్రయత్నం, మనకీ ఈ సనాతన ధర్మంలో ఈ ఆశ్రమప్రవేశమూ
అనేటటువంటిది ఉత్తిగనే పెట్టలేదు, ఈ ఆశ్రమప్రవేశాన్ని ఎందుకు మారుస్తుంటారంటే
ఇంద్రియాల్ని జయించాలి అంటే ఇంద్రియాలకి మేతవేసేయ్యాలి ధర్మబద్ధంగా వేయాలి మేతవేసి
నీవు నిజంగాచెప్పూ ఏమి సుఖాన్ని అందులో చూస్తున్నావు నీవు అని అడగాలి అలా ప్రశ్న వేయగా
వేయగా వేయగా కొన్నాళ్ళకి పరిశీలనము అలువాటు చేసుకొని మనసు అంటుంది నిజమే ఏముంటుంది
ఇందులో సుఖము అంటుంది.
నేను చెప్తున్నమాటని ఏదో ఒక్క విషయానికి అన్వయంచేయకండి నేను చెప్పేది ఏవిషయమైనా
అంతే ఒక మధుర పదార్థాన్ని భుజించడం లేకపోతే ఇప్పుడు ఏదో విహారంచేస్తూ ఉండాలనేటటువంటి
కోరికా, లేకపోతే భార్యా సంతానమునందు వ్యామోహమునందు ఉండడం బాగాపరిశీలనం చేసి చేసి
చేస్తుంటే ఇవన్నీ ఏముందండీ ఇవన్నీ ఏమి విశేషమేముంది ఇవాళ సుఖం రేపటి దుఃఖంలా
ఉంటుంది అనిపిస్తుంది, అలా అనిపిస్తే ఏమౌతుందంటే మీకు దానియందు వ్యామోహం తెగుతుంది
ఇదే అన్నమాచార్యులవారు అంటారు ʻనేను కోసుకుందామంటే తెగవు ఈ కట్లు నీవు కోయాలి ఈ
కట్లుʼ అంటారు ఈశ్వరానుగ్రహముచేత ఆ వైరాగ్య సంపత్తిరావాలి, ఆ వైరాగ్యసంపత్తివచ్చీ
ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ధర్మాన్ని తీసుకొంటూ తాను పండుతాడు పండి చిట్టచివరకి
మనుష్య జన్మలో ఈశ్వరున్ని చేరుకునేటటువంటి ప్రయత్నంలో కృతకృత్యుడు కావాలి. ఒకవేళ
అలా కాలేకపోయినా కనీసంలో కనీసం ఏమిటంటే ఇంతకన్నా ఉత్తమైనస్థితిలో వచ్చేజన్మలో
పుట్టగలగాలి, అంటే ప్రయత్నము ఎలా ఉండాలి అంటే ఈ జన్మలో అనుష్టానమునకు ఏ ఆలంబనం
మీకు దొరకలేదో ఆ ఆలంబనం పుట్టుకచేత మీకులభించాలి. అంటే ఏ వేద వేదాంగములు
చదువుకున్నటువంటి ఒక పరమ భక్తుడైనటువంటి మహారుషుడు కడుపున పుట్టీ చిన్నతనంలోనే ఆయన
ఇంట్లో ఆయన కొడుకుగా పెరుగుతూ ఆయన ఒళ్ళోకూర్చుని వేద వేదాంగములు నేర్చుకుని
ఈశ్వరున్ని
అనుష్టించి చక్కగా ఆ ధర్మబద్ధమైనటువంటి జీవితంచేత జీవితాన్ని పండించుకునేటటువంటి
అదృష్టం వచ్చేజన్మకు కలిగేటట్లుగా ఉపాసన ఈ జన్మలోనడవవలసి ఉంటుంది. లేకపోతే తిర్యక్తుల్లోకి
వెల్లిపోతాడు పెద్ద సమస్య అక్కడ వస్తుంది ʻతిర్యక్ʼ అంటే మీరు ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి
వేన్నుపాము పైకిలేచే అవకాశములేనిదానికి తిర్యక్ అనిపేరు అడ్డంగానే ఉంటుంది
పుట్టినది మొదలు చనిపోయే వరకు దానిపెరుగుదల భూమికి అడ్డంగా ఉంటే తిర్యక్ అంటారు
అటువంటి తిర్యక్తుల్లోకి వెళ్ళిపోతాడు.
|
కాబట్టి ఇప్పుడు దండకారణ్యములో తాపసుల యొక్క
ఆశ్రమములనుచూస్తూ వెళ్ళుతున్నారు రామ చంద్ర మూర్తి ప్రవిశ్యతు మహాఽరణ్యం దణ్డకాఽరణ్యమ్ ఆత్మవాన్ !
దదర్శ రామో దుర్ధర్ష స్తాపసాఽఽశ్రమ మణ్డలమ్ !! దండకారణ్యమునందు ప్రవేశించినటువంటి రాముడు
తిరుగులేని మహావీరుడు ధైర్యశాలి అటువంటివాడు ఆ తాపసుల యొక్క ఆశ్రమాలన్నిటినికూడ చూస్తున్నాడు
కుశ చీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతమ్ ! యథా ప్రదీప్తం దుర్దర్శం
గగనే సూర్యా మణ్డలమ్ !! అక్కడ ఉన్నటువంటివి కుశ చీర పరిక్షిప్తం ఎక్కడ
చూసినా దర్భలు కనపడుతున్నాయి, దర్భలు కనపడుతున్నాయీ అంటే అర్థమేమిటంటే
కర్మానుష్టానం బాగా జరుగుతుందీ అని గుర్తు. పరమ భక్తితో కూడినటువంటి కర్మాచరణమే చిట్ట చివరికి జ్ఞానంగా
మారిపోతుంది. అయితే భక్తితో కూడిన కర్మాచరణము ఎప్పుడు జ్ఞానమౌతుందీ అని
మీరు నన్ను అడిగారనుకోండీ ఆ ప్రశ్నకు జవాబు మాత్రం ఉండదు. అది నేనుకాదు
సశాస్త్రీయంగా చెప్పడం చాలాకష్టం. భక్తితో కర్మాచరణము మీరు చేసుకుంటూ వెళ్ళడమే
అందుకే మీరు ఏది చేస్తున్నా మీరు ఎందుకు చేస్తున్నారో అది మీకు తెలిసుండాలి,
భక్తితో కూడిన కర్మాచరణము అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసాండీ సంస్కరణ ఎవరికీ అవయములకు ఉండదు
మీరు బాగాగుర్తుపెట్టుకోండి వాటికి సౌచము ఉంటుంది అంతే, ఇప్పుడూ నా
శరీరమునకు ఏముంటుంది ఆ సౌచము ఉంటుంది. సౌచమును సిద్ధింపజేయాలి దీనికి సౌచం
కలగాలంటే ఏం చేయాలి స్నానం చేయాలి అంతే, స్నానం చేస్తే దీనికి సౌచంకలుగుతుంది.
మనసుకి మనసుకి స్నానం చేయిస్తారా! కుదరదు, మరి మనసుకి ఎలా వస్తుంది సౌచము సంస్కారముచేత వస్తుంది,
సంస్కారము దేనిచేత వస్తుంది శిక్షింపబడిన బుద్ధిచేత వస్తుంది బుద్ధికి శిక్షణ
ఎక్కడ నుంచి వస్తుంది గురువు యొక్క ప్రవచనముచేత గురువుగారియొక్క వాక్కలచేత
వాటియందు తదేకదృష్టితోవిని వాటిని మనసులో నిలబెట్టుకోవడంచేత బుద్ధికిశిక్షణ
వస్తుంది.
అందుకని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందనిగుర్తు దర్భలు ఉన్నాయి అంటే కర్మాచరణము
జరుగుతుందని గుర్తు ఎటువంటి కర్మాచరణము భక్తితో కూడినటువంటి కర్మాచరణము
జరుగుతూంది. వేదమును ప్రమాణంగా తీసుకొని శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని దర్భా
అనేటటువంటిది వాడకుండా ఏదీ సాధ్యం కాదు, చక్కగా ఆసనసిద్ధి కలగాలంటే ఓ దర్భాసనంవేసి
కూర్చుంటారు, కూర్చోవడం దగ్గర నుంచే దర్భాసనం. కాబట్టి ఆ దర్భాసనం ఆ దర్భని ఆ దర్భని
వేలికి ఉంగరం పెట్టుకోవడం ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళేం బంగారు ఉంగరాలు అవేం
పెట్టుకునే అవకాశాలు ఏమీ ఉండవు. కాబట్టి ఓ
పవిత్రము ఓ దర్భని ముడేసుకుని వేలికి పెట్టుకుంటారు. ఏది చేసినా దర్భలతో
కూడినటువంటి కూర్చ పట్టుకుంటారు కూర్చ పట్టుకుంటే అది పరమ పవిత్రం కూర్చతో
పట్టుకుని ఆ కూర్చతో ఏపనైనా చేస్తారు, కాబట్టీ అక్కడ అన్నీ దర్భలు ఉన్నాయి బ్రాహ్మ్యా
లక్ష్మ్యా సమావృతమ్ అక్కడా ఉండేటటువంటి మనుష్యులు బ్రహ్మతేజస్సుచేత
విరాజిల్లుచున్నారు. ఇదీ చాలాగొప్ప మాటండీ నిజంగా
అది మీరు లోపల
అనుభవించాలి రామాయణంలో బాహ్యమునందు శోభవేరు బ్రహ్మతేజస్సువేరు ఈ రెండిటికీ ఓ భేదము
ఉంటుంది, ఏంటంటే శోభ ఒక అందం కాల గతియందు తరిగిపోతుంది, లేకపోతే వికారమును
పొందుతుంది, ఏమిటీ ఆయనే అలా ఉన్నారూ! అంటారు. ఏదో... శరీరంలోతేడా వచ్చిందనుకోండి
ఒళ్ళంతా మచ్చలు వచ్చాయి అనుకోండి వస్తే ఓ సంవత్సరం క్రితం స్ర్పుద్రూపిగా
మెరిసిపోయినవాడు ఈ సంవత్సరం మీరు చూసేటప్పటికీ మచ్చలు మచ్చలుతో చూడ్డానికి పిల్లలు
బయపడేటట్టుగా అయిపోతాడు ఆ అందం శాశ్వతం అని మీరు చెప్పడం చాలా కష్టం.
|
“జరా” అని ఒకటి ఉంటుంది వృద్ధాప్యంలో వృద్ధాప్యం
వచ్చేటప్పటికి ఎవరి అందం నిలబడడం కూడా కష్టం, బ్రహ్మతేజస్సు అలాగ కాదు ఈశ్వరున్ని
మీరు ఆరాధించగా ఆరాధించగా శరీరము జఝరీభూతము అయిపోతుంది. అంటే ముడతలు పడిపోతుంది,
కానీ ఆయన నడిచి వస్తున్నాడు అనుకోండి ఆనడకలో ఏమీ వేగమేమీ ఉండదు వృద్ధాప్యంలో
ఉన్నవాడు ఎలా నడుస్తాడో అలానే నడుస్తుంటాడు. బాగా వృద్ధ్యాప్యం వచ్చినవాడు నోరు
తెరుచుకుని అలా ఎలా నిలబడుతాడో అలాగే నిలబడుతాడు, కానీ అలాంటి వారిని ఎవరినైనా
చూసి ఉంటారు జీవితంలో అనుష్టాన బలంచేత వారు ఏమైపోతారంటే ముఖము దీప్తితో
ప్రకాశిస్తుంటూంది, ముఖము నందు ఆ వర్ఛస్సు వస్తుంది. నేను కాశీ పట్టణంలో చూశాను
కొంతమంది అటువంటి పెద్దమనుష్యుల్ని ప్రయత్నపూర్వకంగా వారి చిరునామాలు తీసుకొని
వారి దర్శనంకోసం నేను కొన్ని గంటలు ఎదురుచూసి అటువంటి మహాత్ముల దర్శనంచేసి నేను
బ్రహ్మవర్ఛస్సు అంటే ఏమిటో చూశాను. అందులో ఒకాయన నన్నుపిలిచి ఇన్నిగంటలు దేనికోరకు
ఎదరుచూశావు నా దర్శనానికి అని అడిగారు. అంటే నేను మీ బ్రహ్మవర్ఛస్సును చూడడానికే
కూర్చున్నాను అని అన్నాను. అంటే ఆయన చాలా సంతోషించి ఆయన నాకు చెయ్యిచూపించారు నేను
ఆశ్చర్యపోయాను ఆయన చేయ్యిలోకి త్రిశూలం వచ్చేసింది గీతా త్రిశూలం కింద
మారిపోయింది. మారిపోయి నేను కొద్ది రోజులల్లో ఈశ్వరున్ని చేరిపోతున్నానయ్యా నీవు
మళ్ళీ వచ్చేటప్పటికీ నీకు నా దర్శనం ఉండదు ఇదే నా చిట్ట చివరి దర్శనం. నీవు ఇంత
ఆర్థిపొందావు కాబట్టి నీకు ఒకసారి నేను కనపడాలని ఆయన నాకు ఆ సమయంలో రుద్రాక్ష మాలకూడా
ఒకటి నాకు బహూకరించాడు.
తరువాత ఒక నెలకే హైదరాబాదులో మిత్రుడైనటువంటి ఒక డాక్టరుగారు నాకు ఫోన్ చేసి
చెప్పారు మీరు ఏవరి దర్శనంకోసం కొన్నిగంటలు ఎదురుచూసి దర్శనం చేసుకున్నారో ఆయన
కాశీ విశ్వనాథ దేవాలయంలో పరమ శివుడి ముందు నిలబడీ కూర్చుని అభిషేకం చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా
ఏమైందో తెలియదు నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
(సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః !!) ఆగిపోయింది శ్వాస మృత్యుంజయాయ
అని అభిషేకం చేస్తున్నాయన చెంబు అలాగే ఆగిపోయింది అంతే పడిపోయింది కిందకి వెళ్ళి
చూశారు కూర్చున్నవాడు కూర్చున్నట్లే అలాగే నోరు తెరిచి బ్రాహ్మీభూతులైపోయారు,
శరీరం వదిలి విడిచిపెట్టేశారు. అలా అది
వయసుతో పోయేటటువంటి శోభకాదు నిరంతరం ఈశ్వరున్నే ఈశ్వరున్నే ఈశ్వరున్నే తిప్పి
మనసులో ఎప్పుడూ ఈశ్వరుని గురించి తపించినటువంటి వాళ్ళయొక్క
ముఖమునందు ఆ బ్రహ్మతేజస్సు
వస్తుంది. అది ఒక్కొక్కచోట వయసుతో కూడా సంబంధం ఉండదు వాళ్ళ యొక్క స్థితి సుఖబ్రహ్మ
పొందలేదా! కాబట్టి ఒక్కొక్కరికి చిన్నవయసులోనే వచ్చేస్తుంది, ప్రహ్లాదాదులకు
పసితనం నుంచీ భక్తి అలవడడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం.
|
కాబట్టి అటువంటి స్థితిని పొందినటువంటి
బ్రహ్మతేజస్సు కలిగినవారు ఉన్నారు అది ఎలా ఉందటా తాపసాశ్రమ మండలం మధ్యాహ్నకాలమునందు
ఆకాశం ఎలా ఉంటుందో దుర్నీరీక్షంగా వాళ్ళని ఇలా పట్టి పట్టి చూడ్డం కూడా కష్టంగా ఉందటా అంత బ్రహ్మ తేజస్సుతో
వెలుగొందుతున్నారు. అలా ఉంటే ఆ అందం ఉంటే అవీ తాపసుల యొక్క ఆశ్రమాలు అలా ఉండాలి
ఆశ్రమాలంటే కాబట్టి శరణ్యం సర్వ భూతానాం సుసమృష్ట అజిరం సదా ! మృగైః బహుభిః
ఆకీర్ణం పక్షి సంఘైః సమాఽఽవృతం !! వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆశ్రమమంతా
కూడా చక్కగా శుభ్రంచేయబడి ఉంది అంటే శిష్యులు వివిధ స్థాయిలలో ఉంటారు కొంతమంది
శిష్యులు ప్రారంభంలో ఏమిటంటే ముందు ఆశ్రమాన్నంతటినీ తుడవడం గురువుగారికి శుశ్రూష
చేయడం గురువుగారికి కావలసినటువంటి పదార్థాలన్నీ అక్కడ పెట్టడం ఏ పదార్థం ఎంత
తీసుకొచ్చి అక్కడ పెట్టాలో ఇవి ముందు నేర్చుకుంటారు అసలు అన్నిటికన్నా ముందు ఏం
నేర్పుతారంటే దర్భకోయడం నేర్పుతారు, ఎంతవరకు కోయాలి ఏదికోయాలి, మనకు పనికిరానిదాన్ని
కోయకుండా ఉండాలి పనికొచ్చేదేకోయాలి కౌశలం ప్రకృతిలో మనకు అక్కరలేదు ఇది అన్నదానిజోలికి
మనం వెళ్ళకూడదు, ఈశ్వరుడిది ఈశ్వరునికి వదిలిపెట్టేయ్యాలి పరిగ్రహమూ అంటారు. తనకు
ఎంత కావాలో అంతే తీసుకుంటారు తప్పా తనకు అవసరం లేకపోయినా ఈశ్వరుడి సొత్తుగా
భావించి అందులోంచి తానుపుచ్చుకోడు. దీన్ని అపరిగ్రహము అంటారు అపరిగ్రహముచేతనే ఈ
దేశం సుసంపన్నమై ఉండేది ఒకప్పుడు ఎందుకంటే తనకు అక్కరలేదు ఇంక తను తీసుకొని
దాసేవాడు కాడు. తనకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకునేవాడు ప్రకృతి వనరుల్ని.
కాబట్టీ అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరు కూడా శరణ్యం సర్వ భూతానాం సర్వభూతములకు
కూడా సురక్షితమైనటువంటి నివాసభూమి అంటే వాళ్ళు జీవహింసచేయరు దేనిజోలికీవెళ్ళరు
దేన్నిహింసచేయరు కాబట్టి అన్నీ అక్కడికి చేరిపోతాయి, వాళ్ళు కృష్ణాజినాన్ని చక్కగా
జింకల యొక్క చర్మాన్ని ధరించినవారై ఆశ్రమమంతా చక్కగా తుడవబడీ మృగైః బహుభిః
ఆకీర్ణం అనేకములైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి అంటే మృగమూ
అనేటప్పటికి ఏంటంటే ఒకదాన్ని ఒకటి చెలకడం జాతివైరం ఉంటుంది. ఇది మనకేమైనా చేసిందా
అని ఏం ఉండదు. ఒక చూలుతో ఉన్నటువంటి ఆవుని ఒక పెద్దపులి తరుముతుంది, తరిమి
చంపేస్తుంది అప్పుడు పెద్ద పులికి పాపం వచ్చిందా అని మీరు అడిగితే అలా ఏమీ ఉండదది,
అది మృగములకు సహజమైనటువంటి వైరము ఒకదాన్నిచూస్తే ఒకటి కన్నెర్ర చేస్తాయి,
అటువంటిదేం లేదు లేకుండా మృగైః బహుభిః ఆకీర్ణం అనేకములైనటువంటి మృగములు
అక్కడ సంచరిస్తున్నాయి పక్షి సంఘైః సమాఽఽవృతం అనేకములైనటువంటి పక్షులు ఆ చెట్లనిండా గుంపులు గుంపుగాచేరీ
అరుస్తూ గూళ్ళు కట్టుకుని ఉన్నాయి.
కాబట్టి అది చూస్తేనే అసలూ వాళ్ళ జీవనవిధానం ఎటువంటిదో వాళ్ళు ఎంతగా ఎవరి
జోలికి వెళ్ళకుండా బ్రతుకుతుంటారో మీకు అర్థమవుతుంది. వాళ్ళవల్ల ఎవరికీ ఉపద్రవం
ఉండదు వాళ్ళకి ఎవరివల్లనైనా ఉపద్రవం ఉంటే వాడేరాక్షసుడని చెప్పాలి మీరు అంతే..?
ఎవడికీ అపకారం చేయనివాడి జోలికి మీకెందుకండీ అంటే రాక్షసుడూ అని గుర్తు
అన్నమాట. కాబట్టి
వాళ్ళజోలికి వెళ్ళినవాళ్ళందరినీ రాక్షసుడు అంటాడు రాముడు, అదే గుర్తు మీకు కాబట్టి
ఫల మూలాఽశనైర్దాన్తైః చీర కృష్ణాజినాఽమ్బరైః ! సూర్య వైశ్వానరాభై శ్చ పురాణై ర్మునిభి
ర్వృతమ్ !! వాళ్ళందరూ కూడా ఫల
మూలములను మాత్రమే గ్రహిస్తూ దాంతి అంటే ఇంద్రియ నిగ్రహముకలవారై, చీర
కృష్ణాజినాఽమ్బరైః నార చీరలు జింక
చర్మములను ధరించినటువంటి వాళ్ళై, సూర్య భగవానుడు అగ్నిదేవుడు వైశ్వానరుడు అంటే
అగ్ని సూర్యుడు సూర్య భగవానుడు, సూర్యుడు అగ్ని ఎటువంటి తేజస్సు కలిగివుంటారో
అటువంటి తేజస్సుతో కూడినటువంటివారై ఉన్నారు, ఇప్పుడు వారు వారి వ్యవహారంలో ఉన్నారు
సీతా రాములు లక్ష్మణులు అటుగా వెళ్ళిపోతున్నారు.
|
ముందు సీతా రామ లక్ష్మణులను చూశారట వెళ్ళుతున్నారు
కాబట్టి వాళ్ళు వాళ్ళపనిలో ఉన్నవారు అలా చూస్తారు కదాండి పనిలో ఉంటే... మామూలుగా
ఎవరో వెళ్ళిపోతున్నారని చూడ్డం వేరూ ఒకవేళ వాళ్ళు ఆశ్చర్యపోయిచూస్తే ఇవతలివారి
తేజస్సువేరు అంత తేజస్సు ఉన్నవారు కూడా వీళ్ళను చూసి అయ్యబాబోయ్..! అన్నారనుకోండి,
ఇప్పుడు మీరు ఏమని అనవలసి ఉంటుందంటే..? ఆ మునులయొక్క తేజస్సును మించిపోయిన తేజస్సు
సీతారామ లక్ష్మణులయందు ఉంది అని మీరు అనవలసి ఉంటుంది కదా! ఇది చెప్పడం మహర్షి
యొక్క గొప్పతనం కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు త ద్దృష్ట్వా రాఘవః శ్రీమాన్
తాపసాఽఽశ్రమ మణ్డలమ్ ! అభ్యగచ్ఛన్ మహాతేజా విజ్యం కృత్వా మహద్ధనుః !! కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ రామ చంద్ర
మూర్తి సీతా లక్ష్మణులతో కలసి తాపసాశ్రమ మండలం మీదుగా వస్తూంటే అక్కడ ఉన్నవారు
అందరు కూడా ఆ ముగ్గురిని చూశారు రూప సంహనం లక్ష్మీం సౌకుమార్యం సువేషతామ్ !
దదృశుర్ విస్మితాఽఽకారా రామ స్య వన వాసినః !! అదటా రూప సంహనం ఆ రూపము రాముడిదీ
అవయవముల యొక్క పొందికను చూశారట.
అవయవములయొక్క పొందికాన్నది నేను మీకు చెప్పాలీ అంటే ఒకాయనికి కాళ్ళు పొడుగ్గా
ఉంటాయి కానీ దానికి తగినటువంటి రీతిలో వక్షస్థలం తలకాయ ఉండవు, లేకపోతే కొంత మందికి
పొడుగ్గా వక్షస్థలం ఉంటుంది దానికి తగినట్టుగా కాళ్ళు ఉండవు, కాళ్ళు పొడుగ్గా ఉంటే
దానికి తగినట్లుగా చేతులు పొడుగ్గా ఉండవు ఇవన్నీ బాగానే ఉంటే ఏదో
కుండబోర్లించినట్లు తలకాయ ఉంటుంది. ఆలాగ కాదు ఏ అవయవాన్ని మీరుచూస్తే ఒక అవయవానికి
తగినట్లుగా మిగిలిన వాటికి కూర్చబడి ఉన్నాయి. అంటే బాగా నేను మీకు ఉపమానం
చెప్పాలంటే వేంకటేశ్వర స్వామివారి యొక్క మలయప్ప స్వామివారికి కట్టేటటువంటి పూలదండ
ఎంత పొందిగ్గా కొలతలకు సరిపోయేటట్టు రంగు రంగులుగా ఉంటుందో తెల్ల పూలు ఎర్ర పూలు
ఆకుపచ్చ పూలు ఖచ్చితంగా మూర్తికి సరిపడేటట్టుగా ఎలా అక్కడ తయారు చేస్తారో ఆ మాల ఎంత
అందంగా ఉంటుందో రాముని అవయవముల యొక్క పొందిక అంత అందంగా ఉందట వాళ్ళకి అది లక్ష్మీం
ఆ పొందికకి వాళ్ళు తెల్లబోయారట ఏంటి అసలు ఆ కాళ్ళేమిటీ? ఆ చేతులేమిటీ?
కళ్ళేమిటీ? ఏది చూసినవాడు దానికేమురిసిపోతున్నారు. ఆజానుబాహుం అని ఒకరు అరవింద
దళాయతాక్షం అని ఒకరు ఏమి అందం ఏమి శోభ అని అందరూ ఆ అవయవముల యొక్క పొందికను
చూసి సువేషతామ్ ఎంత అందమైన రూపమో అంటున్నారటా..! దదృశుర్ విస్మితాఽఽకారా అంటే విశ్మయాన్ని ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి
ఆ ఆకారాన్ని రామ స్య వన వాసినః ధనస్సు పట్టుకుని వనములో తిరుగుతున్నాడే ఇంత
అందంగా ఉన్నాడేమిటీ అని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంతో రాముడి వంకచూస్తు
ఉండిపోయారు అంతే. అంటే ఇంక వాళ్ళ పనులలోకి వాళ్ళు వెళ్ళలేనంతగా ఆ రామ చంద్ర మూర్తి
యొక్క అందం వైపుకు వాళ్ళు ఆకర్షింపబడ్డారు.
|
మునులు మాట్లాడడం అంటే లేకి మాటల్లా ఉండవు అవి, మీరు వచ్చారు మమ్మల్ని
తప్పకుండా రక్షించాలి రాక్షసులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పేసి బొత్తిగా
ఏదో అయిందానికీ కాందానికీ అప్లికేషన్లు పెట్టుకునేవారిలా ఉండరు వాళ్ళు కాబట్టి ధర్మ
పాలో జనస్యా స్య శరణ్య శ్చ మహా యశః ! పూజనీయ శ్చ మాన్య శ్చ రాజా దణ్డ ధరో గురుః !!
నీవు రామా! మా వర్ణాశ్రమములైనటువంటి ధర్మములను కాపాడగలిగినటువంటి సహజమైన
క్షత్రియ లక్షణము ఉన్నటువంటి వాడివి, పుట్టుకతో క్షత్రియుడివి కాబట్టి ఇప్పుడు
నీవు వర్ణాశ్రమ ధర్మమును నీవు కాపాడాలి, మా ధర్మం ఏమిటీ తపస్సు చేసుకోవాలి మా
ధర్మంలో మేము ఉన్నాము మా ధర్మం మమ్మల్ని చేసుకోనివ్వకుండా అడ్డువస్తున్నది ఏదో
దాన్ని నీవు తొలగించవలసి ఉంటుంది దానికి నిన్ను శరణాగతి చేస్తున్నాము. శరణాగతి
అనేటటువంటిది మీరు ఒకమాట బాగాగుర్తుపెట్టుకోవాలి, నోటితో శరణాగతిచేయడం చాలాతేలిక.
శరణాగతి నోటితోచేయడమంత తేలిక లోకంలో ఇంకేమీ ఉండదు. ఎందుకో తెలుసాండీ శ్రీ
వేంటకటేశ శరణౌ శరణం ప్రపద్ధే అని ఓ పదిమాట్లు అనడం చాలాతేలిక, శరణాగతి
చేసినట్లు ఉండడం చాలాతేలిక, నిజంగా శరణాగతి చేయడం చాలాకష్టం. ఎందుకో తెలుసా అసలు
నిజంగా శరణాగతిచేస్తే వెంటనే వచ్చేస్తుంది ఫలితం ఉత్తర క్షణం వస్తుంది. శరణాగతి
అంటే ఏమిటో తెలుసాండీ అసలు మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగిన ప్రయత్నం నుంచి
పూర్తిగా విరమించేసుకోవలి అంతా ఈశ్వరుడియందు న్యాసం చెయ్యాలి ఆయనే రక్షిస్తాడని
వదిలేయాలి అలా వదిలేస్తే శరణాగతి అంటారు.
రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు
వెనకటికి నారాయణుడు గబగబా బయలుదేరాడటా, బయలుదేరితే లక్ష్మీదేవి గబగబా వచ్చి అందటా
ఎందుకు అలా పరుగెడుతున్నారని ఏమీలేదు నా పరమ భక్తుడైనటువంటి ఓ చాకలిని రాళ్ళుపెట్టి
కొడుతున్నారు పిల్లలూ అందుకని చెప్పి పరుగెడుతున్నాను అన్నాడు. ఆయనేదో పాపం చాకలాయన
బట్టలారేసుకుంటున్నాడు ఆయనేదో జుట్టూ అదీ పెరిగిపోయి పిచ్చాడులా ఉంటాడు అనిచెప్పి
అ ఏటి ఒడ్డున పిల్లలు రాళ్ళు విసురుతున్నారు. అతడు నారాయణా నారాయణా అంటున్నాడు
నేను అతన్ని రక్షించాలి, తనను తాను రక్షించుకోకుండా తనరక్షణ భారము నాయందు న్యాసం
చేశాడు అందుకు పరుగెడుతున్నాను అన్నాడు అని అక్కడిదాకాపరుగెత్తి వెనక్కు
వచ్చేశాడు, ఏం వచ్చేశారు అంది లక్ష్మీదేవి అతనూ ఓ రాయి వేశాడూ అన్నాడు. అంటే తనను
తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన ఉత్తర క్షణం ఈశ్వరుడు తన రక్షణ ప్రయత్నాన్ని
ఆపేస్తాడు. అంటే అన్నివేళలా అలా ఉండచ్చాండీ అంటే అలా ఉండడం కూడా మంచిది కాదు
శరణాగతి చేయగలిగినటువంటి ధృడ దీక్షా మనసులో బాగా రాకుండా దానియందు ప్రయత్నం
మొదలుపెట్టీ అలా మొదలు పెడతామండీ అన్నీ ఈశ్వరునికి వదిలేస్తాను అని అనకూడదు.
|
నీవు మమ్మల్ని రక్షణ చేయాలి కాబట్టి రామా! నీవు
మమ్మల్ని కాపాడవలసింది అంటూ వాళ్ళు అన్నారూ ఇన్ద్ర స్యేన చతు ర్భాగః ప్రజా
రక్షతి రాఘవ ! రాజా తస్మా ద్వరాన్ భోగాన్ భుంజ్తే లోక నమస్కృతః ఇంద్రుడి యొక్క
అంశ నాల్గవ భాగము రాజు యందు ప్రకాశిస్తుంది నీవు క్షత్రియుడవు కోసల దేశపు రాజువి
14 యేళ్ళు అంటే ఇక్కడుంటావు కానీ మళ్ళీ వెళ్ళిపోతావుగా..! పైగా నేను వనములకు
రాజును అని చెప్పాడు గుర్తుపెట్టుకోండిబాగా ఈ విషయం, అని కూడా చెప్పాను వనములకు
రాజునూ అన్నాడు కాబట్టి వనములలో ధర్మాన్ని, ఆయన ఇప్పుడు స్థాపించాలి ఎక్కెక్కడ
అవసరమో ఎక్కడెక్కడ ఆర్థికలుగుతూందో వాళ్ళకి అక్కడ తాను రక్షించవలసిన అవసరం ఉంది
కోదండాన్ని చెతపట్టుకుని, కాబట్టి ఇంద్రుడు ఇంద్రుని యొక్క నాల్గవవంతు రాజు రూపంలో
ప్రకాశిస్తుంది. కాబట్టి సామాన్యమైనటువంటి మనుష్యులు అనుభవించేటటువంటి భోగములకన్నా
రాజు ఉత్తమమైనటువంటి భోగాలను అనుభవిస్తాడు ఇంద్రుని యొక్క అంశ ఉంది కాబట్టి అది
భోగం అనుభవించడానికికాదు ధర్మాన్ని కూడా రక్షించాలి, కాబట్టి రామా! నీకు ఆ అవసరము
ఉంది నీవు ఇన్నాళ్ళు కోసల దేశంలో భోగాలు అనుభవించి వచ్చావు ఇప్పుడు మా కష్టం చూస్తున్నావు
కాబట్టి ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి.
వాళ్ళూ ఈ మాటలు అంటే ఆయన చాలా సంతోషించాడు మేము కోపాయుధాన్ని పక్కన పెట్టేశాము
మమ్మల్ని మేము రక్షించుకోం తాపసులం కాబట్టి నీవే మమ్మల్ని రక్షించాలి. వాళ్ళు
ఇచ్చినటువంటి ఫల మూలములను గ్రహించి ఆయన అన్నాడు నేను లక్ష్మణ సహితుడనై
రాక్షసుల్నినిర్జించి మీరు హాయిగా తపస్సు చేసుకునేటట్టుగా మీ ధర్మానికి ఎవరూ
అడ్డు రాకుండా నేను
తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాను అనిచెప్పి వాళ్ళకి వరమిచ్చి లెదా మాట ఇచ్చి
ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు, ఆ ముందుకు నడిచి వెళ్ళిపోతుంటే చాలా
భయంకరమైనటువంటి అరణ్యం అందునా అరణ్యంలో వాల్మీకి మహర్షీ ఎంత గొప్ప వర్ణణ
చేస్తారంటే మళ్ళీ అరణ్యంలో కూడా నరభక్షకులైన రాక్షసులు ఉన్నారు అని చెప్పి
అర్థమైపోతూంటుంది ఎలా అర్థమైపోతుంది అంటే రాముడు ఘోరమైన అరణ్యంలో వెడుతూ లక్ష్మణుడితో
అంటాడు. లక్ష్మణా ఇక్కడ ఎక్కడా జలాశయాలులేవు ఇక్కడ ఎక్కడా అసలు మనుష్యులు
తిరుగుతున్నటువంటి ఆనవాళ్ళు కనపడ్డంలేదు ఇక్కడ ఎక్కడ చూసిన క్రూరమైనటువంటి మృగములు
మాత్రమే కనపడుతున్నాయి, సరికదా ఏదో పరిస్థితినిగమనిస్తే ఈ పెరిగినటువంటిచెట్లూ ఈ
వాతావరణం గమనిస్తూంటే ఇటువైపుకి అసలు ఎవరూ రారూ అని అనిపిస్తూంది. కాబట్టి మనం
చాలా జాగ్రత్తగా ఉండాలి కోదండాన్ని గట్టిగా పట్టుకుని అడుగులు వేయాలి అటువంటి
పరిస్థితి కనపడుతుందీ అంటాడు రాముడు.
|
ఇప్పుడూ అక్కడ అకస్మాత్తుగా ఒక రాక్షసుడు
వాళ్ళకి కనపడ్డాడు ఆయన అవయవముల యొక్క పొందికలేనివాడు కడుపు ఎత్తు పల్లాలుగా ఉంది
భయంకరమైనటువంటి ముఖం చాలా పెద్ద పెద్ద కళ్ళూ పెద్ద ఒక నుయ్యి దిగుడుభావి ఎలా
ఉంటుందో అటువంటి నోరు ఒంటి మీద చంపేసినటువంటి పులి యొక్క చర్మాన్ని బలవంతంగా
పీకేసి దాని ఒంటిమీద అచ్చాదనగా పడేసుకున్నాడు మీద, పడేసుకుంటే దాంట్లోంచి నెత్తురు
కారి శరీరం మీద నుంచి కిందకి వొలుకుతోంది మాంసపు ముక్కలు ఒంటినిండా ఉన్నాయి, అతడు
ఒక పెద్ద ఇనుప శూలాన్ని చేత్తోపట్టుకుని ఉన్నాడు అంటే అతని రూపమే అంత ఘొరంగా ఉంది.
అంటే ఒక మోస్తరు వాళ్ళైతే చచ్చేపోతారు ఆయన్నిచూస్తే, ఆ శూలానికి కుచ్చుకున్నాడు
సిద్ధంగా తినడం కోసం అంటే ఏవో బిస్కెట్ల ప్యాకెట్టు బ్యాగులో పడేసుకున్నట్లు
రైల్లో వెల్తున్నప్పుడు అంటే అతడు ఆహారం కోసం బయలుదేరే లోపలా ఆహారాన్ని వెతుక్కుని
అతనికి కావలసినవి సంబారములను సమకూర్చుకుని తినడం కోసం తినేలోపల ఈలోగా తినవలసివస్తే
బొత్తిగా ఏమీ లేకుండా కాలక్షేప బఠాణీ అని రైల్లో అమ్ముతారు చూడండి ఏదో ఇన్ని
బఠాణీలు ఉంటే ఆ తుక్కంతా అక్కడ పోసేసి తినడం, వేరు సెనక్కాయ తొక్కలన్నీ అక్కడ
వేసేయడం నాలుగు గింజలు తినడం రైలు ఎక్కడం వేరే స్టేషంలో దిగిపోవడం ఆ తరువాత వేరే
ఎవరో వచ్చి తుడుస్తుంటాడు లేకపోత లాంగ్ జర్నీ చేసి అందులో ఉన్నవాడెవడో
వాడిప్రారబ్దం.
అలా వాడు ఏమిటంటే శూలానికి గుచ్చుకుని బయలుదేరాడు త్రీన్ సింహాన్ చతురో
వ్యాఘ్రాన్ ద్వౌ వృకౌ పృషతాన్ దశ ! సవిషాణం వసాదిగ్ధం గజ స్య చ శిరో మహత్ !! అవస్య
ఆయసే శూలే వినదన్తం మహా స్వనమ్ !!! పేద్ద కేకలు వేస్తున్నాడు, అరచుకుంటూ
వీళ్ళని చూడగానే లేచి నిలబడ్డాడు. ఆ శూలానికి ఏం కుచ్చుకున్నాడటా..? పెద్ద
ఎక్కువేం కాదు త్రీన్ సింహాన్ ఒక మూడు సింహాలను గుచ్చాడు దానికి చతురో
వ్యాఘ్రాన్ నాలుగు పెద్ద పులులు గుచ్చుకున్నాడు ద్వౌ వృకౌ రెండు
తోడేళ్ళు గుచ్చాడు పృషతాన్ దశ చుక్కల లేళ్ళు ఒక పదింటిని గుచ్చుకున్నాడు సవిషాణం
వసాదిగ్ధం గజ స్య చ శిరో మహత్ దంతములు విరిగిపోయినటువంటి ఒక ఏనుగు యొక్క
తలకాయతో సహా దానికి గుచ్చుకున్నాడు ఇప్పుడు పెద్ద కేకలు వేస్తూ ఆ శూలం పట్టుకుని
వస్తున్నాడు. అంటే దీంట్లో ఉన్నవి ఏదో మొక్కజొన్న పొత్తు తిన్నట్టు గింజలు ఇలా ఇలా
అంటూనూ ఒక్కొటీ
తీసి నోట్లో పడేసుకుంటూ తింటూ తిరుగుతుంటాడన్నమాట అక్కడ, అంటే మా చిన్న తనంలో
ఒకాయన ఉండేవాడు
పొద్దున్నే ఎండుటాకులు ఎరడానికి ఒక చిత్రమైన పని ఉండేది పెద్ద శూలం లాంటిది ఉండేది
ఆయనకు దాన్నిపట్టుకుని ఇలా గుచ్చుకుంటూ తిరుగుతుండేవాడు ఆయన ఇంట్లో అదే పని ఆయనకు
వాకింగు ఎండుటాకులు గుచ్చుకుని తీసేస్తుండడం అదే పని ఆయనకి వీడేమిటంటే ఆయన కనపడ్డవాటిని
అలా కుచ్చేసుకొని తిరిగేవాడిలా ఉంది ఆ సంహాలని వాటిని అంటే అంత బలాఢ్యుడు ఆ
రాక్షసుడు. ఆయన కనపడ్డాడు కనపడుతూనే ఆకలి ఎక్కువ ఆహారం తినడం ఎక్కువ వికృతమైన రూపం
వాడికి సీతమ్మ కావలసి వచ్చింది. వాడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని వదిలేసి సీతమ్మని పట్టుకుని
అమాంతంగా తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కూర్చో బెట్టుకొని ఆ వచ్చినటువంటి
రామ లక్ష్మణుల వంక చూసి అన్నాడు అధర్మ చారిణౌ పాపౌ కౌ మీరు అధర్మం
కలిగినటువంటి వాళ్ళు పాపమైనటువంటి జీవితం ఉన్నవాళ్ళు మునివేషాలు కట్టుకుని భార్యతో
ఎందుకు తిరుగుతున్నారు అందుకే మీ భార్యను నేను తీసేసుకున్నాను, ఈమెను నేను భార్యగా
ఉంచుకుంటాను ఇకనుంచి కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అహం
వనమ్ ఇదం దుర్గం విరాధో నామ రాక్షసః ! చరామి సాయుధో నిత్యమ్ ఋషి మాంసాని భక్షయన్
!! నన్ను విరాధుడు అంటారు, నేను ఈ దుర్గమమైన అరణ్యంలో తిరుగుతుంటాను, నేను
ఋషుల మాంసం తినడం అనేటటువంటిది నాకి చాలా ఇష్టమైన పని.
ఋషులేం చేశారు- లోకంలోనండీ! ఇదొక చాలా గమ్మత్తైన విషయం మీరు చూడండీ! మీరు
కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండీ శాకాహారమూ మాంసాహారము అని రెండు ఉంటాయిగా దానిగురించి
నేను పెద్ద వర్ణన ఏం చేయక్కరలేదు, కాయకూరలూ పళ్ళు ఆకులు తింటే శాకాహారము సరే మాంసాహారము
దాని గురించి పెద్ద ఉపన్యాసాలు ఏమీ చెప్పక్కరలేదు. మాంసాహారం తినేటటువంటివి కూడా
ఎప్పుడూ శాకాహారం తిననవి కూడా అలాంటి మాంసాహారులు ఎక్కువ శాకాహారులనే తింటూ
మాంసాహారాన్ని తినని మాంసం ఇష్టపడుతాయి. మీరు చూడండి అదో విచిత్రం లోకంలో, ఒక
మాంసాహారి ఉంది అది మాంసం తప్పా ఎప్పుడూ శాకాహారం తినదు. ఒక పెద్ద పులి ఉందనుకోండి
పెద్ద పులి ఎప్పుడైనా వంకాయలు వేస్తే తింటుందేమిటీ లేకపోతే నాలుగు తోటకూర ఆకులు
వేస్తే తింటుందా... అది ఎప్పుడూ తినదు. ఆపిల్ పళ్ళూ బత్తాయి పళ్ళూ అలాంటివి
దానికేమి అక్కరలేదు, దానికి ఎప్పుడూ మాంసమే కావాలి మళ్ళీ మాంసం తినడంలో కూడా
గమ్మత్తు ఏమిటో తెలుసాండీ సింహం కానీ పులి కానీ ఇవి ఎప్పుడూ ఏ మాంసాన్ని తినడానికి
ఇష్టపడుతాయో తెలుసా? లేళ్ళు జింకలు దుప్పిలు ఏనుగు వీటి మాంసం తింటాయి. అసలు మాంసం
ఎప్పుడూ తినని శాకాహారులు ఉంటాయి చూశావు వాటి మాంసం, మాంసం ఒక్కటే తినేవాటికి
రుచిగా ఉంటుంది. అసలు ఆ శాకాహారానికి ఉన్న గమ్మత్తు అది లోకంలో అందుకనీ ఆ శాకాహరం
తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో మాంసాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో మీరు లెక్కవేసి
చూస్తే శాకాహారం వల్ల బలం పొందినంత ఒళ్ళు పొందినంత మాంసాహారం వల్ల ప్రాణులు
పొందవు.
సింహం ఉందండీ మాంసమే తింటుంది పుట్టినప్పటినుంచి చచ్చిపోయే వరకూ ఏనుగంత ఎప్పుడైనా
అవుతుందా..? ఎప్పుడూ అవదు. ఏనుగంత ఉన్నాడు అంటారు ఏనుగు జీవితంలో ఓ గుడ్డు కూడా
తినదు, కాని ఏనుగు ఏనుగే అంత ఎత్తు ఉంటుంది. శాకాహారం తిన్నప్రాణి అంతెత్తు
ఉంటుంది శాకాహారులు బుద్ధి బలంతో ఉంటాయి మీకు అదో గమ్మత్తు విచిత్రం, ఒక
కుందేలు కానీ ఒక
ఏనుగు కానీ ఒక లేడీ కానీ వీటికి లలిత కళల మీద కూడా వ్యామోహం ఉంటుంది. అవి పాటలు
వింటాయి బాగనూ అందుకే వేటగాడు పాట పాడితే జింక వస్తుంది, అది శాకాహారంలో ఈశ్వరుడు
ఎక్కడో ఆ లక్షణాన్ని నిక్షేపించాడు. అంటే నేను మాంసాహారాన్ని నిరుస్తాహ పరుస్తూ
నేను ఏదో పక్షపాతంతో మాట్లాడటం నా ఉద్దేశ్యం కాదు, ఒక సత్యాన్ని ఆవిష్కరించడం వరకు
మాత్రమే నా ప్రయోజనం.
|
కాబట్టి ఇప్పుడు విరాధుడు అన్నాడు నేను ఋషుల
మాంసం తింటానూ అన్నాడు, ఋషుల మాంసం తినడం ఎందుకు అవేమిటి పులులూ సింహాలు అన్ని
శూలానికి గుచ్చుకుని పెట్టుకున్నాడుగా అంటే వాడు ప్రత్యేకంగా వేటికోసం వెడుతాడంటే
ఇవన్నీ ఏముంది ఇవి ఇలా తిరుగుతుంటాయి ఇలా గుచ్చి ఎత్తుకుని తింటూ ఉంటాను,
అక్కడికెళ్ళి మరీ తింటాను వాళ్ళని ఎందుకో తెలుసా వాళ్ళు కందమూలాలేతింటారు, అందుకని
ఏనుగు మాంసం సింహానికి ఇష్టమైనట్లు జింక మాంసం పెద్ద పులికి ఇష్టమైనట్లు ఋషుల
మాంసం నాకు ఇష్టం. ఇదీ లోకంలో ఒక విచిత్రమైన పోకడ మీరు సృష్టిని కొద్దిగా గమనిస్తే
ఇలాంటి చమత్కారాలు మీకు చాలా కనపడుతాయండీ! చాలా కనపడుతాయి. వీటన్నింటికన్నా
చమత్కారం ఎక్కడ పెట్టాడో తెలుసాండి ఈశ్వరుడు, వీటన్నిటికి కొన్ని కొన్ని శక్తులు
ఇచ్చాడు అన్ని శక్తుల్ని మనిషి ఒక్కడే వాడుకుంటాడు. ఒక గొర్రె ఉందనుకోండి మీరు ఎంత
చలిలోకి తీసుకెళ్ళి వదిలేయండి దానికేం రజాయి మీరు ఇవ్వక్కర లేదు దాని ఒంటికే రజాయి
ఉంటుంది పెద్ద ఉన్నితో ఉంటుంది. మనిషి ఏం చేస్తాడో తెలుసా! ఆ గొర్రె మాంసం తినేసి
దాని చర్మం వొలిసేసి ఓ కోటు కుటించుకుని చలిలో తిరిగేస్తాడు, ఓ యజ్ఞమో యాగమో
చేస్తున్నాడనుకోండి ఓ లేడి చర్మం విప్పేసి దాని నడుముకు కట్టుకుని యజ్ఞమో యాగమో
చేస్తాడు, ఓ ఏనుగు దంతము ఉందనుకోండి ఓ బొమ్మ చేసుకొని గూట్లో పెట్టుకుంటాడు, ఓ
సింహం తాలూకా గోరు ఉందనుకోండి దిష్టి
తగలకుండా దానిని తీసుకొచ్చి మెడలో వేసుకుంటాడు.
సృష్టిలో దేని దేనికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని శక్తుల్ని మనిషి తెచ్చి
వాడుకుంటున్నాడు, అన్ని ప్రాణుల మీద బుద్దితో గెలుగుచుకుని తెచ్చుకుంటాడు, ఆ
సౌకర్యాలన్నీ మనిషి ఒక్కడే వాడుకుంటుంటాడు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క శక్తిని ఇస్తే
అన్ని శక్తుల్ని వాడుకునేవాడు మనిషి ఒక్కడే ఈ సృష్టిలో మీరు చూడండీ! ఎలా వాడు
కుంటాడంటే వాడి బుద్ధిబలం అటువంటిది. ఓ సముద్రం ఉందండి అందులో ఉంది ఓ చేప ఓ పేద్దచేప
సముద్ర మధ్యలో పడుకుంది, దాని జన్మాంతరంలో అది అందులోనే చచ్చిపోతుంది తప్పా అది
ఎప్పుడూ ఒడ్డుకు రాదు. మీరు మనిషిని తీసుకెళ్ళి సముద్రం మధ్యలో పారేయండీ చచ్చి
ఊరుకుంటాడు. కానీ వాడు ఓ ఓడ తయారు చేసుకొనీ చేపని చంపే కత్తి ఓడ కింద పెట్టీ చేపను
కోసుకుంటూ ఓడలో హాయిగా నిద్రపోతూ వాడు తన గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు
సముద్రంలోంచి, భూమి మీద సముద్రంలో ఆకాశంలో అన్ని చోట్లా తిరుగుతూ అన్నిటికీ
ఈశ్వరుడు ఇచ్చిన సుఖాల్ని మనిషే అనుభవిస్తూ ఉంటాడు. ఇన్ని అనుభవించగలగడానికి
ఉపయోగించుకునే మనిషి ప్రజ్ఞా ఈశ్వరున్ని చేరడానికి కూడా ఉపయోగించుకోవాలి నీకు
అక్కడ మాత్రం చిత్త శుద్ధి ఉండదు, అదే మనిషి యొక్క బుద్ధి ఎక్కడ వైక్లవ్యం చెందుతుందీ
అంటే అక్కడే వైక్లవ్యం చెందుతుంది. మిగిలినవన్ని అడుగుతాడు ఇదొక్కటే, కూర్చోవయ్యా
అన్నారనుకోండి నాకు మోకాళ్ళ నొప్పులు అంటాడు, పూజ చేయవయ్యా అంటే పూజచేయడు, చొక్కా
విప్పవయ్యా అంటే చొక్కావిప్పడు వాడికి ఈశ్వరుడికి సంబంధించిన విషయాలు తప్పా
మిగిలినవన్నీ కావాలి, చొక్కావిప్పి నాయనా ఉత్తరీయం వేసుకొని కూర్చో పూజకీ
అన్నారనుకోండి, సహజంగా బనీనుతో పుట్టిన వాడిలా బనీనుతో కూర్చుంటాను అంటాడు పూజలో.
సంకలో సెగ్గడ్డ వస్తే తగ్గే వరకూ విప్పుకు తిరుగుతాడు, సెగ్గడ్డ అబ్బా ఈశ్వరుడికి
చేయలే పూజా... ఆ బుద్దేదో ముందుగా ఉంటే సెగ్గడ్డే రాదుగా నీకూ..? అలా ఉంటుంది
మనుష్యుని యొక్క సరే... అది అంతా వేరొక పరిశీలనం అనుకోండి? దాన్నలా ఉంచండి మీరు...
ఋషుల మాంసం తింటాను నేను అంటే అందులో అంత లోతులో ఉంది సృష్టిలోనే ఉంది అసలు ఆ విచిత్రమైనపోకడ.
|
ఇప్పుడు ఆయన అన్నాడూ పర స్పర్శాత్ తు వైదేహ్యా న దుఃఖతరమ్ అస్తి మే ! పితు
ర్వియోగాత్ సౌమిత్రే స్వ రాజ్య హరణాత్ తథా !! ఎంత కష్టమొచ్చిందో చూశావా
అకస్మాత్తుగా లక్ష్మణా నాకు పర స్పర్శాత్ త వైదేహ్య నా కంటి ముందు
పరుడైనటువంటివాడు నా భార్యని చేతులతో తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నాడు న
దుఃఖతరమ్ అస్తిమే నేను ఎంత దుఃఖంలో ఉన్నాను పితు ర్వియోగాత్ సౌమిత్రే తండ్రిగారా
మరణించారు స్వ రాజ్య హరణాత్ తథా రాజ్యమును పరిపాలించవలసిన నేను రాజ్యమును
పోగొట్టుకున్నాను ఇంత కష్టంలో ఉన్నాను అని ఆయన అన్న తరువాత, అసలు ఆ విరాధున్ని
నీవు మమ్మల్ని ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి నీ భార్యను నా భార్యగా స్వీకరిస్తాను
అంటున్నావు కదా మమ్మల్ని మీరు ఎవరూ అని అడుగుతున్నావు కదా మునుల వేషాల్లో తిరుగుతూ
కోదండం ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నావు కదా మేము దశరథ మహారాజుగారి
పుత్రులం రామ లక్ష్మణులం మేము తండ్రియొక్క మాటప్రకారం అరణ్యంలో సంచరిస్తున్నాము
నీవు ఎవరు అని అడిగారు అదొకటి మాత్రం బాగానే చెప్పాడండోయ్? ఆయన అన్నాడు పుత్రః
కిల జయస్యాఽహం మాతా మమ శతహ్రదా ! విరాధి ఇతి మామ్ ఆహుః పృథివ్యాం సర్వ రాక్షసాః !! నేను జవుడు అనబడేటటువంటివాడి యొక్క కుమారుడను మా
తల్లి శతహ్రదా నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూంటాను నన్ను విరాధుడు అని
వీళ్ళందరూ పిలుస్తుంటారు. అంటే ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడో ఏమో? మిగిలిన వాళ్ళు
మాత్రం ఆయన్ని విరాధుడు విరాధుడూ అని పిలుస్తుంటారు అని చెప్పుకున్నాడు.
చెప్పుకుని ఆయన సీతమ్మని తీసుకొని వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నంలో ఉండగా రామ
లక్ష్మణులు ఓర్చకూడదని అగ్ని శిఖలు వంటి బాణములను ప్రయోగంచేస్తే ఆయనొక పెద్ద
ఆవులింత ఆవులించాడట, ఆవలించేటప్పటికి ఆ ఒంట్లోకి వెళ్ళిన బాణాలన్నీ కిందపడిపోయాయీ
అన్నారు అంటే అంత బలాఢ్యుడు.
సరే అయితే మాత్రం విడిచిపెడతారా! అనేకములైనటువంటి బాణములను ప్రయోగంచేసి అతన్ని
దుఃఖపెట్టారు, దుఃఖపెట్టి ఆ కష్టపెడుతున్నటువంటి రామున్ని ప్రత్యేకంగా సంహరించాలని
తనచేతిలో ఉన్న శూలాన్ని పట్టుకుని పరుగు పరుగున ఆ శూలం పెట్టి కొట్టబోయాడు
రామున్ని, రాముడు వెంటనే తీవ్రమైనటువంటి బాణములను ప్రయోగించి గాలిలోనే ఆ శూలాన్ని
ముక్కల ముక్కల కిందవిరిచేశాడు, విరిచేస్తే ఆ విరాధుడికి కోపమొచ్చి సీతమ్మని
విడిచిపెట్టీ రామ లక్ష్మణులను ఇద్దరినీ కూడా రెండు చేతులతోటి పైకెత్తి తన భుజాల మీద
కూర్చో బెట్టుకుని అరణ్యంలోకి వెళ్తున్నాడు సీతమ్మ ఉండిపోయిందీ రామ లక్ష్మణుల్ని
తీసుకెళ్ళిపోతున్నాడు, సహజంగా సీతమ్మ ఆక్రందనంచేసింది, తన భర్తని మరిదిని
తీసుకెళ్ళిపోతున్నాడని అప్పుడు రాముడు ఒక చేతిని తన యొక్క బలాన్ని ఉపయోగించి
విరిచేశాడు ఆ విరాధునికి లక్ష్మణుడు ఒక బాహువుని ఖండించాడు ఆయన కిందపడిపోయాడు వాళ్ళ
ఖడ్గముల యొక్క ప్రహారములచేత అతని శరీరాన్నంతటినీ కూడా ఖేదపడేటట్టు చేశారు. అప్పుడు
అతను ఒకమాట అన్నాడు నేను బ్రహ్మగారి యొక్కవరాన్ని పొందాను తపస్సుచేత కాబట్టి నన్ను
అస్త్రశస్త్రములు ఏవీ కూడా నన్ను మరణం పొందేటట్లుగా చేయ్యలేవు నేను దేనికీ మరణంపొందను
కౌసల్యా సుప్రజా రామ తాత త్వం విదితో మయా ! వైదేహీ చ మహాభాగా లక్ష్మణ శ్చ మహా
యశాః !! నాకు ఇప్పుడు అర్థమయ్యింది, నీవు కౌసల్య యొక్క కుమారుడువైన రామ చంద్ర
మూర్తివి నీ భార్య వైదేహీ ఆమె సీతమ్మ నీ తమ్ముడు లక్ష్మణ మూర్తి నేను నీ చేతిలోనే
మరణించి శాపాన్ని పోగొట్టుకోవలసి ఉంది, ఏమిటి నాకు శాపము అంటారేమో? అభి శాపాత్
అహం ఘోరం ప్రవిష్టో రాక్షసీం తనుమ్ ! తుమ్బురు ర్నామ గన్ధర్వః శప్తో వైశ్రవణేన హ
!! నేను ఒకానొకప్పుడు తుంబురుడూ అనబడేటటువంటి పేరు కలిగినటువంటి గంధర్వున్ని
కాని నేను రంభా అనేటటువంటి అప్సరసయందు కామోద్రిక్తుడనై వైశ్రవణుడు అంటే కుబేరుని
యొక్క సభకు వెళ్ళనటువంటి కారణంచేత ఆగ్రహించినటువంటి కుబేరుడు నన్ను శపించాడు నీవు భయంకరుడైన రాక్షసుడుగా జన్మించూ
అని అప్పుడు నేను ఆయన్ని అడిగాను నాకు మళ్ళీ ఎలా శాపవిమోచనం కలుగుతుందీ అని
అడిగాను యదా దాశరథీ రామ స్త్వాం వధిష్యతి సంయుగే ! తదా ప్రకృతిమ్ ఆపన్నో భవాన్
స్వర్గం గమిష్యతి !! నీవు ఏనాడు దశరథ
పుత్రుడైనటువంటి రామ చంద్ర మూర్తి చేతిలో నిహతుడువవు అవుతావో ఆనాడు నీ యొక్క శాపంపోయి
మళ్ళీ నీవు స్వర్గలోకానికి వస్తావు అని నాకు ఆనాడు శాపవిమోచనాన్ని అనుగ్రహించాడు
కుబేరుడు కాబట్టి నేను నీ చేతిలో మరణిస్తే నేను మళ్ళీ తిరిగి ఊర్ధ్వలోకానికి అంటే
నేను ఆ గంధర్వుడనై తిరిగి కుభేరున్ని చేరుకుంటాను కాబట్టి నన్ను సంహరించండి
అన్నాడు.
ఇప్పుడు ఎలా సంహరించడం అస్త్ర శస్త్రములచేత సంహరింపబడడుగా వెంటనే రాముడు
అన్నాడూ లక్ష్మణా నేను వీన్ని కిందపడదోస్తాను వీన్ని వదిలేస్తే వీడు అలా అరుస్తూనే
ఉంటాడు మహాస్వనం అదేం మామూలు అరుపు కాదు, భయపడిపోతాయి అన్నీనూ కాబట్టి వీని కంఠం
మీద నా పాదం తొక్కి అట్టే పెడతాను అరవకుండా ఈలోగా నీవు ఒక గుణపం
తీసుకొని ఏనుగులు పడదోయడానికి పట్టుకోవడానికీ
తవ్వేటటువంటి గొయ్యి ఎలా ఉంటుందో అలా ఈ రాక్షసున్నిపడేసి కప్పిపెట్టడానికి ఒక
పెద్దగొయ్యి తీయ్యి అన్నాడు అంటే గబగబా లక్ష్మణుడు ఒక పెద్దగొయ్యి తీస్తున్నాడు అస్త్రంతో
శస్త్రంతో కాదుగా గోతిలోపడేసి రాతితో కప్పెట్టేస్తారు, కప్పెట్టేస్తే ఊపిరి ఆడక
చనిపోతాడు అందులో ఆయనకి కూడా అది కావాలి ఎందుకంటే శాపవిమోచనం అయిపోవాలి కాబట్టి
ఇప్పుడు ఆయన అన్నాడూ అవటే చాఽపి మాం రామ నిక్షిప్య కుశలీ వ్రజ ! రక్షసాం గత
సత్త్వానామ్ ఏష ధర్మః సనాతనాః !! అవటే యే నిధీయన్తే తేషాం లోకాః సనాతనాః ! రామా! నీవు నాకు మహోపకారం చేస్తున్నావు మా వంటి
రాక్షసులు మరణించినప్పుడు గొయ్యితీసి గోతిలోకాని పాతిపెట్టేస్తే మేము మళ్ళీ తిరిగి
ఇతరమైనటువంటి లోకాలకి వెళ్ళము కాబట్టి ఇతరమైనటువంటి లోకాలు పొందకుండా ఉండాలీ అంటే
గోతిలోనే పాతిపెట్టాలి కాబట్టి నన్ను గోతిలోనే పాతిపెట్టేసై అన్నాడు. నిజంగా
గొయ్యి తీసి శరీరాన్ని అందులో పడేసి కప్పెట్టేస్తుంటే ఎంత శాప విమోచనమైనా ఏ
శరీరానికైనా శరీరం విడిచిపెట్టేయడం అన్నది ఖేదంతో కూడుకున్న విషయం కదాండీ! వాడు
పేద్ద పేద్ద కేకలు వేయడం మొదలు
పెట్టాడు మొత్తానికి దొర్లించి ఆ గోతిలో పడేసి రాళ్ళు పోసి మట్టి పోసి కప్పి
పెట్టేశారు కప్పి పెట్టేసిన తరువాత విరాధుడు అక్కడితో శరీరం విడిచి పెడుతూ విడిచి
పెడతూ ఆయన ఒక మాట చెప్పాడు.
|
రామా! నీకు మహోపకారం జరుగుతుంది ఇక్కడికి దగ్గరలో శరభంగుడూ అనేటటువంటి ఒక
మహర్షి ఉన్నారు నీవు ఆయన యొక్క దర్శనంచెయ్యి. రామాయణంలో ఇదో గమ్మత్తు రాక్షసులు
శాపవిమోచనం అయిపోయిన తరువాత రాముడికి ఉపకారం చేస్తుంటారు ఎందుకంటే రాముడు
ఎందుకొచ్చాడో నరుడిగా ఎందుకున్నాడో ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో వాళ్ళకు తెలుసు
కాబట్టి వాళ్ళు ఉపకారం చేస్తుంటారు. చిన్నప్పుడు ఏదో చాకలిబండా ఏదో ఆట ఉండేది బట్టపట్టుకుని
పరుగెడుతుంటే వాళ్ళని ఒకళ్ళుముట్టుకొని ఇంకొకళ్ళని ఇలాగా అలా రాముడి చేయ్యి
తీసికెళ్ళి ఒకరి చేతిలో పెడితే వాళ్ళు ఇంకొకళ్ళ చేతిలో పెడుతుంటారు. అలా ఋషుల
యొక్క చేతులు మారుతూ వెళ్ళుతుంటాడు రాముడు ఇప్పుడు రాముడు సీతమ్మా లక్ష్మణ మూర్తి
కలిసి శరభంగుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఋషుల యొక్క తేజస్సు వాళ్ళ యొక్క
గొప్పతనం అటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఆశ్రమం శరభంగ స్య రాఘవోభిజగామ హ !
తస్య దేవ ప్రభావ స్య తపసా భావితాఽఽత్మనః !! ఆ శరభంగ మహర్షి దైవము యొక్క సాక్షాత్కారమును
పొందినటువంటివాడు దివ్యమైనటువంటి శక్తి సంపన్నుడు ఆయనా ఒక్కసారి పిలిస్తే దేవతలే
వచ్చి ఆయన ముందు నిలబడుతారు, దేవతలు కార్యార్థులై ఆయన దగ్గరకు వస్తారు, ఆయన అన్ని
లోకములలో ఉండేటటువంటి సుఖములను కూడా తన తపఃశక్తి చేత జయించుకున్నవాడు అంతటి
మహానుభావుడు శరభంగుడు అంటే ఆయన ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం లోపలకి వెళ్ళదాం
అనుకునీ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ ముగ్గురికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి
కనపడింది.
ముగ్గురూ చూస్తున్నారు సీతా రామ లక్ష్మణులు సమీపే శరభంగ స్య దదర్శ మహదఽద్భుతమ్ !
విభ్రాజమానం వపుషా సూర్య వైశ్వానరోపమమ్ !! శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి సమీపంలో
అగ్నిహోత్రుడూ సూర్యుడూ వాళ్ళ యొక్క తేజస్సా అన్నట్టుగా ఒక గొప్ప తేజఃపుంజమొకటి
కనపడింది అవరుహ్య రథోత్సంగాత్ సకాశే విభుధానుగం ! అ సంస్పృశన్తం
వసుధాం దదర్శ విభుధేశ్వరమ్ !! రథం ఒకటి భూమికి పైన నిలబడివుంది శరభంగుని యొక్క ఆశ్రమంలో శరభంగుడు కూర్చుని
ఉన్నాడు ఆయనతో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ రథం మాత్రం భూమి మీదకు దిగలేదు
దిగకుండా భూమి మీదకు నిలబడి ఉంది అది ఆ నిలబడినటువంటి ఆ రథం ఎంత గొప్పగా ఉందంటే సుప్రభాఽఽభరణం దేవం
విరజోమ్బర ధారిణమ్ ! త ద్విధైః ఏవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః !! హరిభి ర్వాజిభి
ర్యుక్తమ్ అన్తరిక్ష గతం రథమ్ ! దదర్శాఽదూరత స్తస్య తరుణాఽఽదిత్య సన్నిభమ్ !! అది ఆకుపచ్చని గుఱ్ఱములు కట్టబడి ఉంది, చంద్ర
మండలం ఎలా ఉందో అలాంటి గుండ్రటి గొడుగు ఒకటి ఉంది, తెల్లటి గొడుగు అందులో
కూర్చున్నటువంటి వ్యక్తి కోటి సూర్యుల పవిటి ప్రకాశిస్తున్నాడు గొప్ప కాంతితో
ఉన్నాడు ఇద్దరు దివ్యమైన కాంతలు ఆయనకు ఇటూ అటూ నిలబడి ఆయనకు ఛామరం వేస్తున్నారు ఆ
రథానికి నాల్గుదిక్కులా ఒక్కొక్క దిక్కునా నూర్గురు యోధులు, ఆ యోధుల వంకచూస్తేనే
ఆశ్చర్యంగా ఉంటుంది అందరూ 25 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి యోధులు చెవులకు
కుండలములు పెట్టుకుని మెడలకు హారములు వేసుకున్నవాళ్ళు నిత్యయవ్వనంతో ఉండేవాళ్ళు,
రథానికి నాలుగు దిక్కులా నాలుగు వంద వంద మంది చొప్పునా నాలుగు వందల మంది కాపు
కాస్తున్నారు ఆ రథంలో ఉన్నటువంటి వ్యక్తి గొప్ప కిరీఠాన్ని ధరించివున్నాడు.
|
రాముడు ఆ రథం కిందకి తాకకపోవడం అందులో కూర్చున్న
వ్యక్తి శరభంగుడితో మాట్లాడుతుండడం చూసి ఆశ్చర్యపోయి నేను దగ్గరగాపోయి ఆయన ఎవరో
చూసొస్తానని రాముడు లక్ష్మణా నీవు సీతమ్మను కాపాడుతూ ఉండూ నేను వెళతానని
వెళుతుంటాడు, ఇదీ రాముడియొక్క ప్రజ్ఞ మీరుగమనించాలి, ఎప్పుడూ రాముడు ఏదో
ఆశ్చర్యకరమైనటువంటిది కనిపించిందికదా అని వెళ్ళిపోవడం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ
సీతమ్మని కాపాడుతూవుంటాడు, లక్ష్మణా నీవు సీతమ్మని చూస్తూవుండు నేను వెడతాను
అంటాడు. అని దగ్గరగా వెళ్ళుతున్నాడు అందులో కూర్చున్నటువంటివ్యక్తి ఇంద్రుడు ఆయన
శరభంగుడితోటి ఒక కార్యార్థియైవచ్చాడు అంటే ఇంద్రుడు శరభంగున్ని పిలిపించడంకాదు
శరభంగుడితో పనివుంటే ఇంద్రుడేవస్తాడు అంటే అది ఆయన తపఃశక్తి. ఎటువంటి మహర్షుల
యొక్క దర్శనంచేశారో చూడండి రామాయణంలో రామ చంద్ర మూర్తి ఇహోపయాతి అసౌ రామో యావ
న్మాం నాఽభి భాషతే ! నిష్ఠాం నయతు తావ త్తు తతో మాం ద్రష్టుమ్ అర్హతి !! జితవన్తం కృతాఽర్థం చ ద్రష్టాఽహమ్ అచిరాత్ ఇమమ్ !
కర్మ హి అనేన కర్తవ్యం మహత్ అన్యైః సుదుష్కరమ్ !! నేను కొద్ది కాలం పోయిన తరువాత రాముడితో
మాట్లాడుతాను, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు ఆ రథంలో కూర్చున్నటువంటి ఇంద్రుడు
శరభంగుడితో మాట్లాడుతున్నాడు.
ఎప్పుడు మాట్లాడుతాడట జితవన్తం కృతాఽర్థం చ ద్రష్టాహమ్
అచిరాత్ ఇమమ్ కొద్ది కాలంలోనే
నేను ఈ రామున్ని ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తిచేసుకున్న రామునితో
మాట్లాడుతాను, ఆయన పెట్టుకున్నటువంటిపని అంత తేలికైనటువంటి పనేంకాదు ఆయన
కృతార్థుడు అవడంకోసం ఓ శరభంగ మహర్షీ! నీవు ఆయనకు ఎటువంటి సమర్థతను
ప్రకాశింపజేయవలసివుంటుందో దాన్ని ఆయనకు నీవు కల్పించు ఆ వస్తున్నటువంటి రాముడు
నన్నుకానిచూస్తే నేను రామున్నిచూస్తే మాట్లాడకుండా ఉండడంబాగుండదు కాబట్టి రాముడు
దగ్గరికి వచ్చేటప్పటికే యావ న్మాం నాభి భాషతే నేను ఇప్పుడు మాట్లాడ కూడదు
కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎప్పుడు మాట్లాడుతాను నిష్ఠాం నయతు తావ
త్తు ఆయన కార్యం ఒకటి పెట్టుకుని ఉన్నాడు దాన్ని జితవన్తం కృతాఽర్థం చ ఆయన కృతార్థుడై ఆ కార్యం నిరవేర్చుకున్న తరువాత తతో
మాం ద్రష్టుమ్ అర్హతి అప్పుడు నేను ఆయన్ని చూస్తాను.
|
నేను ఇక్కడ మీతో ఒక విషయాన్ని ప్రస్థావన చేయవలసి
ఉంటుంది, అరణ్య కాండలోనే కాదు మీకు శ్రీరామాయణంలో ఎక్కడ చూసినా అనేక పర్యాయాలు ఏమి
వస్తుందంటే? ప్రదక్షిణం చేశాడు నమస్కారం చేశాడు ఈ రెండు మాటలూ అస్తమానం వస్తాయి,
మీరు కిస్కింద కాండకి వెళ్ళండీ మిమ్మల్ని వదిలిపెట్టవు అరణ్యకాండలో మిమ్మల్ని
వదలవు అయోధ్య కాండలో వదలవు సుందర కాండలో వదలవు యుద్ధ కాండలో వదలవు ఎప్పుడూ
కనపడుతూంటాయి ఆ మాటలు “ప్రదక్షిణం-నమస్కారం” ఈ రెండూ కనపడుతాయి అయితే నేను మీతో ఒక
విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళితే బాగుంటుంది. మనం నమస్కారం ఒకటి చేస్తూవుంటాము
లోకంలో ఈ నమస్కారం చెయ్యడం మంచిదే నేను ఎప్పుడూ కాదనను నమస్కారం చేయ్యడం దోషం
అన్నమాట నేనుకాదు ఎవ్వరూ అనలేరు, కానీ నమస్కారం చెయ్యడం మంచిదేనా అంటే నమస్కారం
చెయ్యడం మంచిదే కానీ నమస్కారం చెయ్యడంవల్ల మీరు ప్రయోజనంపొందాలీ అంటే అసలు మీరు
నమస్కారం ఎందుకుచేస్తున్నారో మీకు తెలిసుండాలి. అలా తెలియని నమస్కారంచేస్తే మీకు
ఏమౌతుందో తెలుసాండీ? ఆయన ఎవరోచేశారని నేను చేయడం అవుతుంది, ఎందుకిలా అన్నావు
నమస్కారానికీ (రెండు చేతులు జోడించి) ఇలా అనకుండా (అరచేయి వేళ్ళు ముడుచుకొని) ఇలా
అనకూడదా... అని నేను అడిగాను అనుకోండీ ఇలా
పెట్టకూడదా (అర
చేతి వేళ్ళు వేనక్కి తిప్పి ముందకు చాపి) నమస్కారం ఈ రెండు కరములే ఎందుకు కలవాలి
ఏం ఇలా కలవ కూడదా..! ఇలా కలిపి పెట్టకూడదా అని నేను అడిగాననుకోండి, మీకు ఆ
నమస్కారం యొక్క మైశిష్ట్యమేమిటో ప్రయోజనమేమిటో అది తెలిస్తే ఎందుకు రాముడు అంత
నమస్కారం చేస్తుంటాడో తెలుస్తుంది. అక్కడే రాముడు పెద్దల యొక్క అనుగ్రహాన్ని
సంపాదిస్తూవుంటాడు. నమస్కారం అన్నది అనేక రకాలుగా ఉంటుంది. అంజలీ అంటారు అంజలీ
అంటే దోషిలి ఒగ్గీ ఇలా ఉండడం లేకపోతే ఇలా (రెండు చేతులు కలిపి తల కూడా ఆనించి) ఉండడం
ఇలా పెడితే (రెండు అరచేతులు తిప్పి) ఈ రెండు తలములూ ఇలా పూర్తిగా కలిపి పెట్టడమూ వికృతంగా
ఉంటుంది.
|
ఇలా కలిపి ఈ రెండు బొటనవేళ్ళు మీరు ఇలా
కలిపిపెడితే నమస్కారం అన్నమాట ఎందుకు వాడుతారంటే? ఇవి ఐదు కర్మేంద్రియాలకు గుర్తు
(కుడి చేతి ఐదు వేళ్ళు) ఇవి ఐదూ జ్ఞానేంద్రియములకు గుర్తు (ఎడమ చేతి ఐదు వేళ్ళు) ఈ
ఐదు జ్ఞానేంద్రియాలని ఐదు కర్మేంద్రియాలని కలిపి బుద్ధి స్థానమైనటువంటి శిరస్సుని
కలిపి పదకొండింటినీ నీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను, నేను మీ దగ్గర ఒంగాను
మీరు మహాత్ములు మీరు నన్ను అనుగ్రహించండీ అని అడగడం నమస్కారానికి గుర్తు. అప్పుడు
ఏమౌతుందంటే మీరు అనుగ్రహాన్ని పొందడానికి మీ మనసు సిద్ధంగా ఉంటుంది లేకుండా మీరు
కేవలం ఆ భంగిమ ఒకటేపెట్టారు అనుకోండీ, నేను మీతో అన్నమాట అదే..? భంగిమ
పెట్టగలరేమోకాని మనసు సంస్కారాన్నిపొందదు, లేకపోతే ఏమైకూర్చుంటుందో తెలుసాండీ ఇలా
అంటారు (ఒక చేతిని ఎత్తి నాలుగు వేళ్ళు పైకి చూపడం) ఇలా అంటే ఏమౌతుందో తెలుసాండీ ఒక్కచేత్తో నమస్కారం చేశారనుకోండీ
తెలిసో తెలియకో పూర్వపుణ్యాన్ని నశింపజేస్తారు దేవతలు. ఒక్కచేత్తో మీరు
కాని నమస్కారంచేస్తే పూర్వపుణ్యం నశిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక్కచేత్తో
నమస్కారం ఎన్నడూచేయకూడదు.
అయితే మీరు నన్ను ఒకమాట అడగవచ్చు ఏమండీ! మరి ఒంటిచేత్తోగదా శాల్యూట్ చేస్తారు మిలట్రీలోనూ
అక్కడానూ మరి అది తప్పేనా అని నన్ను అడగవచ్చు, ఒంటిచేత్తో వాళ్ళుచేసేటటువంటిదీ
నమస్కారం ఆధ్యాత్మికంగా అనడానికి ఆధారంలేదు నమస్కారంచేసే ముందు ఏం చేస్తారంటే..?
అటేక్షన్ అని రెండుకాళ్ళు దగ్గరిగాపెట్టి లెదా నిటారుగా పెట్టి తల ఇలాపెట్టి ఈ తలని
ఒక భంగిమలో ఇలా ఉంటారు అది నమస్కారంకాదు మేము ఉద్యోగంలో మా శరీర బలాన్నంతటినీ
ఒడ్డి మేము మాకిచ్చినటువంటి కార్యంలో సఫలీకృతులమై ఈ దేశాన్ని మేము
రక్షిస్తున్నామని ప్రమాణం చేస్తున్నాం అని అనడానికి అది గుర్తు. అందుకని
శౌర్యాన్ని నిలువరిస్తుంది ఆ భంగిమ తప్పా మీ అనుగ్రహం నాకు కలగాలీ అని కోరుకుంటారా
అందులో అలా కోరితే తప్పుకాదు కానీ అది అలా కోరుకున్నది కాదు ఆ చేసేటటువంటి విధానం.
మనం చేసే నమస్కారం శ్యాల్యూట్ కాకూడదు, మీరు పరాక్రమాన్ని ఆవిష్కరించడానికి
కాదు నమస్కారం అవతలవారి అనుగ్రహాన్ని అపేక్షించడానికి కాబట్టి ఎప్పుడూ ఇలాగేచెయ్యాలి.
ఈ నమస్కారం చేసేటప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండీ నమస్కారం ఒంగిచేయడం ఒకెత్తు
నిలబడి నమస్కారం ఎప్పుడూచేయకూడదు. అలాగే నిలబడి ఇలా అనకూడదు, ఇలా ఒంగి నమస్కారంచేయాలి.
నమస్కారం ఒంగిచేయడం ఒకెత్తూ నేల మీదపడి చేయడం ఒకెత్తు ఎక్కువ నేల మీదపడి
నమస్కారం
చేస్తుంటారు. ఆ హరిప్రాసద్ గారికి ఎక్కువ చాలా అలవాటు. నేల మీదపడి ఎక్కువ నమస్కారంచేస్తారు.
నేల
మీదపడి ఎక్కవ
నమస్కారంగా ఎందుకు పడతారో తెలుసాండీ? నమస్కారం ఇలా అంటే చాలు అంటూందిగా శాస్త్రం, ఇలా
అనమంటూందిగా మరి ఇంక నేల మీదపడ్డం ఎందుకసలు ఏమైనా ప్రయోజనం ఉందా దానికి అలా పడడానికి
అంటే నమస్కారం కన్నా అది ఏమైనా గొప్పదై ఉంటుందా..? అంటే ఇలా అంటే నమస్కారం నేల మీద
పడితే ఏమిటో తెలుసాండీ? దండం అంటారు, దండం అంటే ఏమిటో తెలుసా కర్ర. కర్రని మీరు
చేత్తో ఇలా పట్టుకున్నారనుకోండీ నిలబడుతుంది. ఇలా వదిలేస్తే కిందపడిపోతుంది నేల
మీద మీలో అహంకారం పట్టుకుని ఉన్నంత సేపూ ఇలా నిలబడుతారు, నాదేముందండీ ఇదంతా నీ
అనుగ్రహం అని చెప్పడం అహంకారం వదిలితే కర్ర పడ్డట్టు పడతారు అదీ పడ్డాడూ అంటే
పడ్డవాడుచెడ్డవాడు కాదు కింద పడ్డవాడు.
|
|
అహంకార పరిత్యాగంచేసి ఇది నా గొప్పకాదు నీగొప్పే
చెప్తున్నాడని గుర్తు, అందుకని పడతారు నేలమీద, కాదు? ఎందుకు పడతారో తెలుసాండీ? అది
దండమెప్పుడైందీ కర్ర ఎప్పుడైందీ చెట్టు నుంచి విరిచేసి తీసుకొచ్చి దాని తొక్క
తీసేసి మీరు ఎండలో పడేస్తే అది కర్ర అవుతుంది. పచ్చిగా ఉంటే కొమ్మ అవుతుంది కదా!
అది పచ్చిగా ఉంటే కొమ్మ చెట్టుకుంటే విరిచేసి తెచ్చి ఎండేస్తేనే కర్ర. నేను ఒక
చెట్టులో ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు నాకు ఆకులు పువ్వులు కాయలు పళ్ళు
వచ్చేటట్టు నాలో ఆకు పచ్చని ప్రవాహంగా ఉన్నవాడు ఎవడో వాడు నాలో లేకపోతే నేను ఒక
కర్రనై ఉన్నాను నేను ఇప్పుడు ఏమీ ఇప్పుడు ఆకుపచ్చతనం రాదు ఆకులు రావు కాయలుండవు
పళ్ళుండవు పువ్వులుండవు ఆ ఆకుపచ్చ తనం ఇచ్చినవాడు ఎవడో వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరశక్తి
కూడా మీలో ఇంకా బాగాప్రకాశిస్తోంది అది మీరు నమ్మి సేవిస్తున్నారు కాబట్టి అది
లోపల ఉంటే నేను చెట్టు కొమ్మని అది లేకపోతే కర్రని అది మీ అందు ఉంది అటువంటి
ప్రవాహాన్ని నాయందు పరిపుష్టం చేసి నేను ఇలానే పది కార్యాలు చేసేటట్టు
అనుగ్రహించండి అని అడగడం కర్రలా కిందపడడం.
ఈ భావన తెలిసివుండడం అందుకని పడతారు కర్రలా, కాదు ఇంకెందుకు పడతారో తెలుసాండీ?
నిల్చున్నవాడు పడిపోతాడు కూర్చున్నవాడు పడిపోతాడు భూమి మీద పడిపోయినవాడు ఇంకా
పడ్డానికి ఏమీ ఉండదు కాబట్టి అయ్యా! నేను ఇంకా పడిపోవడానికి రక్షించండి నేను
ఇన్నాళ్ళు బాగావున్నవాన్ని అనుకోవట్లేదు పడిపోయినవాన్ని ఇంకా పడిపోకుండా మీరు
నన్ను కాపాడండి, పైకి ఎత్తండని అడగడం పడిపోయానని చెప్పడానికి పడిపోయినవాడు కాబట్టి
ఇంక పడను ఇది తెలిస్తే వినయంతో పడిపోతాడు, కాదు ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసాండీ?
పడిపోతే ప్రుష్ట భాగం కనపడుతుంది, పడకపోతే ప్రుష్ఠ భాగం కనపడదు ఇలా నిలబడి
నమస్కారం చేశామనుకోండీ? ముందు భాగం కనపడుతుంది పడిపోతే ప్రుష్ఠ భాగం కనపడుతుంది.
ప్రుష్ఠ భాగం పెద్దలకు చూపించకూడదు. సభ ఉందనుకోండి సభకు ప్రుష్ఠ భాగం పెట్టి కూర్చో కూడదు. దేవాలయంలో
ఈశ్వరుడికి ప్రుష్ఠ భాగం చూపిస్తూ బయటికి వెళ్ళ కూడదు. ప్రుష్ఠ భాగం
దర్శనీయం కాదు అలా చూపించ కూడదు. మరి పడిపోయి ప్రుష్ఠ భాగం ఎలా చూపిస్తున్నావు
అంటే అయ్యా! నా మనసు ఇన్నాళ్ళు ఈ శరీరాన్ని భోగాలు భోగాలు అన్న పేరుచెప్పి
ఇంద్రియాలకి మేత వేసింది తిప్పి తిప్పి తిప్పి పాడుచేసింది ఆ మనసు ఇప్పుడు మారి ఈ
శరీరాన్ని ఇంక అలా తిరగకా పెద్దల పాదాల దగ్గర వెళ్ళిపడిపో అని నన్ను తీసుకొచ్చి
తిప్పడం మానేసి తిరిగి తిరిగి ఎంత పడిపోయావో ఇక్కడ పడిపోతే పడ్డం మానేసి పైకి
లేవడం ప్రారంభమౌతుందని నన్ను కిందపడేసింది అందుకనీ ఇప్పుడు నేను నా ఇంద్రియాలకీ నా
భోగాలకీ నాప్రుష్ఠ భాగం చూపిస్తున్నాను, మీ పాదాలకి నా కళ్ళు చూపిస్తున్నాను
కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని చెప్పడానికి కిందపడుతారు.
|
కాదు ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసాండీ? ఈ తలనిండా అహంకారం ఉంది అక్కరలేనివన్నీ
ఉన్నాయి వాటికోసం పరుగులు తీశాను ఇలా ఎత్తులో పెట్టినంత కాలం ఇందులోకీ అనుగ్రహం
ఎక్కదు ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది ఎత్తులో ఉన్నదాంట్లోకి ఏమి కనపడుతాయి కిందకి
కారిపోతాయి అందుకని నిలబడటం లేదు ఇప్పుడు బాగా ఎంత పల్లం ఉండాలో అంత పల్లంలోకి
కింద పడిపోతున్నాను ఇంక నా దగ్గర ఇంతకన్నా పళ్ళం లేదు ఆ నేలే పళ్ళం అంత పళ్ళంలో
పడ్డాను ఇంక ఇంత కన్నా నన్ను అనుగ్రహించమని ఏమి అడగను కాబట్టి మీరు ఇప్పుడు మీ చూపులతో
ఆ అమృతాన్ని నా మీద ప్రసరించండి ప్రసరించి ఈ శిరస్సులో ఉన్న బుద్ధులు మార్చి మంచి
బుద్దులు పెట్టి నా జన్మకి సార్థకతను ఇవ్వండి అని అడగడానికి పడిపోతాడు కాదు,..
అబ్బో... వదిలేశాను... కాబట్టి దండం ఆ మాట నేల మీద పడడానికీ ఎన్ని అర్థాలు
ఉన్నాయో తెలుసాండీ! ఒకటీ రెండు కాదు ఎన్ని అర్థాలతోటో పడతాడు. కాబట్టి తెలిసి
పడ్డారనుకోండీ ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. తెలియక పడ్డారు అనుకోండి పడ్డం
అంటే గుర్తుపెట్టుకోండి దేవాలయంలో మాత్రం మీరు ఎలా పడితే అలా మీరు పడకూడదు చాలా
దోషం వస్తుంది ఎందుకనీ అంటే బాగాజ్ఞాపకంపెట్టుకోండి ఈ మాట అంటే మీకు తెలియదని కాదు
మీకు అన్నీ తెలుసూ కానీ నేనే ఎదో ఆర్థితో చెప్తుంటాను తూర్పు పశ్చిమాలను కానీ ఈశ్వరుడి యొక్క మూర్తులు
చూస్తూ ఉంటే ఎప్పుడూ మీరు ఉత్తరాధి ముఖంగానేపడి నమస్కారంచేయాలి, మీరు ఇంక ఏ
దిక్కుకీ నేలమీద పడి నమస్కారం చేయరాదు. ఇప్పుడు అక్కడ శంకరాచార్యులవారు తూర్పును
చూస్తున్నారు అమ్మవారు పశ్చిమాన్ని చూస్తూంది, మీరు నేల మీదపడి నమస్కారం చెయ్యాలని
అనుకున్నారనుకోండీ మీరు ఇటునుంచిపడి నమస్కారం ఎప్పుడూ చేయకూడదండీ! దక్షిణ దిక్కుకు
వెళ్ళిపోతుంది, మీరు ఎప్పుడైనా
తూర్పు పశ్చిమాలుగా ఉన్న మూర్తులకి నమస్కారం చేయాలన్నా ఉత్తరాభి ముఖంగా నమస్కారం చేయాలి. ఉత్తర
దక్షిణాల్ని గాని మూర్తులు చూస్తూ ఉంటే మీరు నేల మీదపడి నమస్కారం చేయాలి అంటే
తూర్పు ముఖంగా నమస్కారం చేయాలి తప్పా ఇంకొక మార్గం ఉండదు.
|
దక్షిణం అంటే ʻకుడిʼ సంస్కృతంలో దక్షిణభాగే
అంటే కుడి వామభాగే అంటే ఎడం, దక్షిణం ప్రదక్షిణం మీ కుడిభుజం వైపుకు
ఈశ్వరుడు ఉంటే ప్రదక్షిణం అంటారు. అంటే శివాలం వైపుకు అటునుంచి వచ్చామనుకోండీ
ధ్వజస్తంభానికి ఎడమ పక్కనా అలా తిరుగుతున్నాను అనుకోండీ నా కుడి చేతివైపే ఉంటాడు
ఈశ్వరుడు అలా తిరుగుతు మళ్ళీ ధ్వజస్థంభం వైపుకు వచ్చాననుకోండీ నేను చుట్టూ
తిరిగినా నా కుడిభుజం
వైపుకే ఈశ్వరుడు ఉంటాడు లోపల అలా ఉండడాన్ని ప్రదక్షిణ పూర్వక నమస్కారం అంటారు.
కానీ ఎప్పుడు అలా ఉన్నాడాలేడా చూసుకోవాలి ప్రదక్షిణం చేసేటప్పుడు అది ప్రదక్షిణం
అనిపేరు, తప్పా మీ ఎడంభుజం వైపుకు వెళ్ళకూడదు దేవాలయంలో వెళ్ళకుండా తిరగాలి
దేవాలయంలో. ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు ఎదురుగుండా
నిలబడి ఎప్పుడూ నమస్కారం చేయకూడదు ఒక పక్కకి తిరిగి నమస్కారం చెయ్యాలి తప్పా
మూర్తికి అభిముఖంగా నిలబడి ఇలా నమస్కారం ఎప్పుడూ పెట్టకూడదు, ఆయన తేజస్సు
మీరు భరించలేరు పక్కకి ఉండాలి కాబట్టి ఇవి నమస్కారంలోనూ ప్రదక్షిణంలోనూ నేల మీద
పడ్డంలోనూ మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు.
|
పరిచయంతో కూడిన నమస్కారం అయితే అభివాదము. ప్రణిపాతము అని ఒకటి ఉంది, పాతము
అంటే పడిపోవడం ఉపాతము అంటే అకస్మాత్తుగా పడిపోవడము ఒక స్తంభం పడిపోతే ఎలా
పడిపోతాడో మెల్ల మెల్లగా మోకాళ్ళు అవి పెట్టి పడిపోవడం కాదు ధబేల్ అని ఒక స్వర్ణదండము
ఎలా పడిపోతుందో అలా పడిపోతాడు అది కూడా ʻప్ర ణి పత్ʼ పాతము సుందర
కాండలో వస్తుంది ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా ! (అలమేషా పరిత్రాతుం
రాక్షస్యో మహతో భయాత్ !!) అలా పడిపోవడం అంటే ఎందుకు పడిపోవాలో తెలుసాండీ! పరమ
విగ్నుడైనటువంటి గురువు అకస్మాత్తుగా అనుకోకుండగా గురువుగారు కనపడితే స్వర్ణదండం
నేలమీద పడినట్టు పడిపోవాలి అంటే ఆ స్థాయి ఎవరికి ఉంటుందంటే, ఒక భారతీ తీర్థ
మహాస్వాములవంటి స్వాములు కనపడితే ప్రణిపాతంచేశారు అంటారు. ప్రణిపాతం అంటే
స్వర్ణదండం నేలమీద పడిపోతే దెబ్బతగులుతుందేమోనని కూడా చూడకుండాపడితే
దానినిప్రణిపాతము అంటారు దానికిప్రణిపాతము అని పేరు. దీనికి అభివాదమని పేరు దానికి
నమస్కారమని పేరు ఇంకొకటి అంజలీ అని పేరు దీనికి దండం అని పేరు ఇన్ని రకాలుగా ఉంటుంది
కాబట్టి దానికి ప్రదక్షిణం అని పేరు మీరు ఎలా వస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు
అన్నదాన్ని బట్టి పెద్దలు మీ సంస్కారాన్ని గ్రహిస్తారు గ్రహించి అనుగ్రహిస్తారు అనుగ్రహించడానికి
వీలుగా మీరు లోపల మనసులో పరిపుష్టం చేసుకున్నారనుకోండి, పరిపుష్టం చేసుకుంటే
అప్పుడు ఏమౌతందంటే నేను దానిని పొందడానికి బాగా యోగ్యతను పొందుతాను కాబట్టి ఇది
చెప్పకుండా నేను అనేక మాట్లు రాముడు నమస్కారం చేశాడు రాముడు నమస్కారం చేశాడు
అన్నాననుకోండి రాముడు నమస్కారం చేశాడు సీతమ్మ నమస్కారం చేసింది అని చెప్తే దానికి
అందం ఉండదు.
మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీ ఇంటికి పెద్దలు ఎవరైనా వచ్చారనుకోండి, మీరు
మీ ఇంటికి పెద్దలను పిలిచారు అనుకోండి మీ ఇంటికి పెద్దలు వచ్చారనుకోండి మీరు ఓసారి
నమస్కారంచేసి మీ ఆవిడని ఓసారి నమస్కారం చేయమని మీ అబ్బాయిని ఓసారి నమస్కారం చేయమని
మీ కోడలును ఓసారి నమస్కారం చేయమని మీ మనమన్ని ఓసారి నమస్కారం
చేయమని మనమరాలిని
ఓసారి నమస్కారం చేయమని అలా చేయకూడదు, అలా చేస్తే అది దోషభూయిష్టమైన నమస్కారం.
కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటే మనం ఇవ్వాళ ఒక మహాత్మున్ని ఆహ్వానించాం వారు మనింటికి
వస్తున్నారు అని తెలిస్తే కుటుంబ సభ్యులు అందరూ సిద్ధంగా ఉండాలి, ఆయన్ని ముందు
ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఏక కాలమునందు కుటుంబ సభ్యులందరూ కలిసి నమస్కారంచేయాలి. ఆడదానియొక్క కడుపు వక్షస్థలం భూమికి తగలకూడదు అవి ఈ
లోకం పరిఢవిల్లడానికి స్థానములు కనుకా మాతృత్వం ఎప్పుడూ కూడా అగౌరవ పడకూడదు,
అందుకని వాళ్ళకి పంచాంగ నమస్కారం అందుకని వాళ్లు మోకాళ్ళవరకు మోచేతులు తల తాకించి
నమస్కరించవచ్చును. కుటుంబ సభ్యులు అందరు కలిసి ఒకేసారి నమస్కరించారనుకోండి
నేను మీకు నిజం చెప్తున్నాను వచ్చిన మహాత్ముడు పరమ సంతోషాన్నిపొంది ఆచంద్ర
తారార్కం అన్నమాట కలిపి ఆశీర్వచనం చేసేస్తాడు. పొంగిపోతారు చాలా గొప్ప సంస్కారం
తెలిసిన కుటుంబం అనిగుర్తు. విడివిడిగా నమస్కారంచేస్తే వాళ్ళకు తెలియదు శాస్త్ర
ప్రవేశం ఇంకా అవి ఏమీ లేదు అని గుర్తు.
|
కాబట్టి నమస్కారంలో చెప్పేస్తారు అవతలివాళ్ళ సంస్కార బలాన్ని చెప్తారు. రాముడు
అనుగ్రహాన్ని పొందాడూ అంటే నేను మీకు చెప్పింది చాలా తక్కువ ఇంకా నమస్కారం గురించి
ఇంకా అసలు నమస్కారము ప్రదక్షిణము దండము ప్రణిపాతము అభివాదము వీటి మీద మీరు ఒక
ఉపన్యాసాన్ని పెట్టుకోమని కాదు సుమాండీ బాబూ... నా ఉద్దేశ్యం వింటే బాగుంటుంది.
వినే అక్కరలేదు పెద్దలు ఎవరైనా దాని గురుంచి చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడు
వెళ్ళిపోయిన తరువాత శరభంగ మహర్షికి నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే ఆయన ఎంతో
సంతోషించారు సంతోషించి నేను నా తపస్సుతో సాధించినటువంటి అక్షయములైన లోకములలో ఉన్న
సుఖములన్నింటినీ రామా! నీకు ధారపోసేస్తున్నాను అన్నాడు. అంటే రాముడు అన్నాడు అహమ్
ఏవ ఆహరిష్యామి సర్వ లోకాన్ మహా మునే ! ఆవాసం తు అహమ్ ఇచ్ఛామి ప్రదిష్టమ్ ఇహ కాననే !!
మీరు ఇచ్చినవి స్వీకరిస్తాను ఆ ఫలములు కానీ నేను ఎక్కడ ఉండి తపస్సు చేయడానికి
అనువుగా ఉంటుందో నాకు అటువంటి ప్రాంతాన్ని చూపించవలసి ఉంటుంది. నేను ఎక్కడ ఉండి ఈ
14 సంవత్సరములు ఈ ఆశ్రమ వాసాన్ని లేదా అరణ్యవాసాన్ని పూర్తి చేసుకోవచ్చో నాకు
అటువంటి ప్రదేశాన్ని చూపించండి. అంటే ఆయన అన్నాడూ నీకు అటువంటి ప్రదేశాన్ని సుతీక్ష్ణుడు
అనబడేటటువంటి మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు గంగ మీద గుత్తులు గుత్తులుగా
పువ్వులు వెళ్ళిపోతుంటాయి, ఆ మార్గాన్ని పట్టివెళ్ళు, చాలా విచిత్రంగా ఉంటుందండీ!
రామాయణంలోని వర్ణనలన్నియూ ఆ మార్గాన్ని పట్టివెళ్ళు వెళ్ళితే నీకొక గొప్ప ఆశ్రమం
కనపడుతుంది ఆ సుతీక్ష్ణుడు అన్న మహర్షి చెప్తారు అన్నాడు.
అని రామా! నేను నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను ఇంత కాలం నుంచి ఈ
శరీరాన్ని ఎప్పుడో వదిలిపెట్టి ఉండేవాన్ని ఇది వాళ్ళకు ఎలా ఉంటుందో తెలుసాండీ! శరీరం వదిలి పెట్టడం అన్నది రమణ
మహర్షి మాటల్లో చెప్పాలంటే కూలికి బియ్యం మోసేవాడిలా ఉంటుంది. కూలికి నేను
ఒక బియ్యం బస్తా కొనుకొని 50 కేజీలది ఓ కూలివాన్ని పిలిచి ఏమయ్యా ఈ మూటతెచ్చి మా
ఇంట్లో పాడేయ్ అన్నానుకోండీ ఆయన దాన్ని తల మీదో భుజం మీదో పెట్టుకుంటాడనుకోండి
పాపం అవిచేసి జీవనం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే ఏమండీ మీదేనా
ఈ సందేనా మూడో ఇళ్ళు అన్నారు ఈ ఇల్లేనా అంటాడు ఎందుకనీ ఎంత తొందరగా ఈ మూటని కింద
పాడేద్దామాని ఆయనకు ఉంటుంది. కూలికొచ్చినవాడు ఎత్తుకున్న బియ్యం మూట ఎలా ఉంటుందో
జ్ఞానికి తన శరీరం అలా ఉంటుంది. దీన్ని ఎలా వదిలి పారేద్దామాని చూస్తుంటాడు.
అలాగని చంపేయకూడదు తనంత తాను పడిపోయే వరకు చూడాలి అలా పడకుండా మహాత్ముల దర్శనం
కోసం అట్టే పెట్టుకుంటారు వాళ్ళు, వాళ్ళకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి నీ దర్శనం కోసం
దీన్ని అట్టే పెట్టాను లేకపోతే ఈపాటికి ఇంద్రుడు నన్ను బ్రహ్మలోకానికి తీసుకు
వెళ్ళడానికి వచ్చాడు రథం పట్టుకుని నీవు వెళ్ళు నేను వస్తానులే అన్నాను. అంటే
మళ్ళీ ఇంద్రుడు వస్తాడా! అక్కరలేదు మళ్ళీ ఆయన రావడం ఎందుకు నేనే వెళ్తాను అంటే ఎంత
తపఃశక్తి సంపన్నులో చూడండి ఈ దేశంలో.
|
ఏష పన్థా నర వ్యాఘ్ర ముహూర్తం పశ్య తాత మామ్ ! యావ జ్జహామి గాత్రాణి జీర్ణం
త్వచమ్ ఇవోరగః !!
తతోఽగ్నిం స సమాధాయ హుత్వా చాఽఽజ్యేన మన్త్రివిత్ ! శరభంగో మహా తేజాః ప్రవివేశ
హుతాఽశనమ్ !!
తస్య రోమాణి కేశాం శ్చ దదాహాఽగ్ని ర్మహాత్మనః ! జీర్ణాం త్వచం తథాఽస్థీని య చ్చ మాంసం
చ శోణితమ్ !!
రామ స్తు విస్మితో భ్రాత్రా భార్యయా చ సహ ఆత్మవాన్ !!!
స చ పావక సంకాశః కుమారః సమపద్యత ! ఉత్థాయ అగ్నిచయాత్ తస్మా చ్ఛరభంగో వ్యరోచత
!!
స లోకాన్ ఆహితాగ్నీనామ్ ఋషీణాం చ మహాత్మనామ్ ! దేవానాం చ వ్యతిక్రమ్య బ్రహ్మ
లోకం వ్యరోహత !!
స పుణ్య కర్మా భువనే ద్విజర్షభః పితామహం సానుచరం దదర్శ హ
పితామహ శ్చాపి
సమీక్ష్య తం ద్విజం ననన్ద సుస్వాగతమ్ ఇత్యువా హ !!
శరభంగ మహర్షి రామా! చూడూ నేను బ్రహ్మలోకానికి
వెళ్ళిపోతున్నాను అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చాడు, వ్రేల్చి అందులో నెయ్యిపోసి
అందులో ఒక్కసారి హోమాన్ని చేసి ఆ హోమంలో అగ్నిబాగా ప్రజ్వరిల్లిన తరువాత అందులోకి
ప్రవేశించాడు. ప్రవేశిస్తే సీతా రామ లక్ష్మణులు చూస్తున్నారు, చూస్తుంటేనే తస్య
రోమాణి కేశాం శ్చ ఆయన వెంట్రుకలు ఆ శరీరం మీద ఉన్న చిన్న చిన్న రోమాలు
దగ్గర్నుంచీ ఎముకల దగర్నుంచీ అన్నీ కాలి బూది అయిపోయి అగ్నిహోత్రంలో పడిపోయాయి ఆ
బూది కుప్పకిందకి ఆయన అగ్నిహోత్రంలోకి పడిపోగానే అగ్నిహోత్రుని యొక్క కాంతితో
సమానంగా కౌమార వయస్సుతో ఉన్న పిల్లవాడిగా పదిహేనేళ్ళ పిల్లవానిగా అగ్నిహోత్రంలోంచి
పైకి వచ్చి ఆశరీరంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతే చతుర్ముఖ బ్రహ్మగారు
సభా భవనంలోకి వస్తున్నటువంటి శరభంగున్ని చూసి స్వాగతం మహర్షీ రండీ అన్నాడు అంటే
వెళ్ళి ఆయన ఉచితాసనం మీద కూర్చున్నాడట శరభంగుడు.
|
అంటే రాముడు అన్నాడూ నైవమ్ అర్హథ మాం వక్తుమ్
ఆజ్ఞాప్యోఽహం తపస్వినామ్ !! మీరు నన్ను అర్థించ కూడదు మీరు నన్ను ఆజ్ఞాపించాలి, కాబట్టి తప్పకుండా నేను
కాపాడి తీరుతాను బహుశః దశరథ మహారాజుగారు నన్ను అరణ్యవాసానికి పంపించడం
అనేటటువంటిది ఈ కోరిక యాధృశ్చికంగా అంటే దైవము ఒక్క అనుగ్రహంగా ఈ రాక్షససంహారానికి
మిమ్మల్ని రక్షించడానికి వచ్చిందేమో... కాబట్టి మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాను
అని ఆ తాపసులందరినీ తీసుకొని సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం
దాని శోభచూసి ఎంతో సంతోషించారు ఆయనకు నమస్కరించారు కూర్చోబెట్టారు కందమూలాలు
ఇచ్చారు అక్కడే స్నానాలు చేశారు ఆ రాత్రి అక్కడే వసించారు, ఆ సుతీక్ష్ణుని యొక్క
వైభవాన్ని చూశారు, ఇక్కడికి గుంపులు గుంపులుగా మృగాలు వస్తూంటాయి అవి వచ్చి
వెళ్ళిపోతుంటాయి అన్నారు. రామా! నీవు ఇక్కడే ఉండు పద్నాలుగేళ్ళు అన్నారు నేను
ఇక్కడ ఉంటే అప్పుడుప్పుడు మీమ్మల్ని ఇబ్బంది పెడుతాయోమోనని నేను మృగములను నా బంగారు
పొందులున్న బాణాలతో సంహారంచేస్తే మీ మనసుకు ఖేదం కలగచ్చు కాబట్టి నేను వేరొక
ప్రాంతంలో ఉంటాను అన్నాడు, ఆయన దగ్గర శెలవు పుచ్చుకున్నాడు ఆ మహర్షిలందరితోటి
కలిసి రాముడి వెనక ఈ ఋషులందరూ బయలుదేరారు అందరూ కలిసి దండకారణ్యంలో వెడుతున్నారు.
వెడుతుంటే సీతమ్మ అంది రాముడితోటి ఈ సంభాషణ చాలా గొప్ప సంభాషణ ఆవిడ అందీ అయం
ధర్మః సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్ ! నివృత్తేన చ శక్యోయం వ్యసనాత్ కామజాత్
ఇహ !! చాలా సూక్ష్మ బుద్ధితో చూస్తే కామజములైనటువంటి వ్యసనములనుండి మనిషి
బయటపడడమన్నది చాలా కష్టం, మూడు వ్యసనములు మనుష్యుని బాధిస్తుంటాయి
|
పర దారాఽభి గమనం వినా వైరం చ రౌద్రతా !!!
మిథ్యా వాక్యం న తే భూతం న భవిష్యతి రాఘవ ! కుతోఽభిలాషణం స్త్రీణాం
పరేషాం ధర్మ నాశనమ్ !!
స్వ దార నిరత స్త్వం చ నిత్య మేవ నృపాత్మజ ! ధర్మిష్టః సత్య సంధ శ్చ పితు
ర్నిర్దేశ కారకః !!
సత్య సంధ మహా భాగ
శ్రీమన్ లక్ష్మణ పూర్వజ ! త్వయి సత్యం చ ధర్మ శ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం !!
రామా! మూడు వ్యసనములు మనిషిని బాధ
పెట్టేటటువంటివి మొట్ట మొదటిది అన్నింటికన్నా భయంకరమైనది అసత్యాన్ని మాట్లాడటం
రెండోది పర స్త్రీ యందు వ్యామోహాన్ని కలిగి ఉండడం మూడవది ఏ క్రోధమూ పొందడానికి
అవకాశం లేకుండా కారణం లేకుండా తగినంత కారణం లేకుండా అవతలి వాళ్ళ మీద తన పగను
పెంచుకోవడం రామా! నీవు అసత్యమాడరూ అన్నది లోక విధితం ఎన్నడూ అసత్యమాడరు నీకు
పరదారులయందు అనురక్తి కూడా లేదు నీకంటూ అనురక్తి ఉంటే ఒక్క స్వ భార్య యందు ఒక్క
నాయందు మాత్రమే ఉంది, మీరు ఏకపత్నీ వ్రతులు నాకు తెలుసు కానీ! నాకు ఒక విషయం
అనిపిస్తూందీ ఇవ్వాళ మీలో నిష్కారణంగా మీతో వైరం పెట్టుకోవడానికి, లేదా మీరు వైరం
పెట్టుకుని రౌద్ర ప్రవృత్తి చూపించడానికి తగిన కారణం లేని వారియందు మీరు కోపంతో
ఉన్నారేమో అని మీరు తప్పు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది, ఎందు చేతనంటే
రాక్షసులు మీకు ఏమి అపకారం చేశారు మీ జోలికి ఏమైనా వచ్చారా? వాళ్ళేం రాలేదు, మీరు
ఇప్పుడు అరణ్యానికి ఎందుకు వచ్చారు 14 సంవత్సరాలు వనవాసానికి వచ్చారు, వనవాసానికి
వచ్చినవారు ఏం చెయ్యాలి తపస్సు చేస్తూ గడపాలి మీరేంచేస్తానంటున్నారు ధనస్సు బాణాలు
పట్టుకొచ్చారు, పట్టుకొచ్చినవారు ఏం చేస్తున్నారు రాక్షస సంహారం చేస్తానని మునులకు
మాట ఇచ్చారు, ఇప్పుడు మునులకు మాట ఇచ్చానని చెప్పి మీరు క్రూర మృగాలను చంపి
రాక్షసులను చంపితే వాళ్ళు మీ మీద కక్ష పెట్టుకుంటారు కక్ష పెట్టుకున్న తరువాత ఈ
పరిణామాలు ఎక్కడికి వెళ్ళుతాయో మనకు తెలియదు. మీరు అసలు ఈ ధనస్సూ బాణాలు ఎందుకు
పట్టుకురావాలి? ఇవి పట్టుకు రావడం వల్లే మీరు మీకు నేను అభయమిస్తున్నాను
కాపాడుతాను ఆ రాక్షసుల్ని చంపుతాను, మీకు అపకారం చేయని రాక్షసుల ఎడల మీరు రౌద్ర
ప్రవృత్తిని పెంచుకుంటున్నారు.
కాబట్టి ఈ ధనుర్భాణాలను పక్కన పెట్టేసి మీరు తాపసిగా జీవితాన్ని గడిపితే
బాగుంటుంది, రాక్షస సంహారం మీకెందు రామా ఎందుకు మాటిచ్చినట్లు అని అడిగింది,
అడుగుతూ ఆవిడ అందీ నేను మీతో ఒక మాట చెప్తాను ఈ 14 యేళ్ళు పూర్తైపోయి మళ్ళీ
అయోధ్యకు వెళ్ళిన తరువాత ధనుర్భాణాలను పట్టుకోండి పురా కిల మహా బాహో తపస్వీ
సత్యవాక్
శుచిః ! (కస్మింశ్చిత్ అభవత్ పుణ్యే వనే రత మృగ ద్విజే !!) పూర్వ కాలంలో ఒకాయన మహానుభావుడు సత్యసంధుడు
తపస్సు చేసుకొనేవాడు, ఆయన తపస్సును భగ్నం చెయ్యాలీ అని ఇంద్రుడు అనుకున్నాడు త
స్యైవ తపసో విఘ్నం కర్తుమ్ ఇన్ద్రః శచీ పతిః ! ఖడ్గ పాణిః అథాఽఽగచ్ఛత్ ఆశ్రమం భట
రూప ధృత్ !! ఒకనాడు ఒక రథంలో
ఒక భటుడి రూపంలో వచ్చి గబగబా ఆశ్రమంలోకి వెళ్ళీ ఒక కత్తొకటి పట్టుకెళ్ళి తపస్సు
చేసుకుంటున్నటువంటి వ్యక్తికి ఇచ్చాడు ఏమీ లేదండీ నాకు కొద్దిగా ఆపద వచ్చింది
కడ్గం నా దగ్గర ఉండకూడదు మీ దగ్గర కొన్నాళ్ళు ఉంచండి మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని
జాగ్రత్త సుమా! అని దాన్ని అక్కడ న్యాసంగా పెట్టాడు, పెట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు
అక్కడ నుంచి, ఈయనేం చేశాడంటే మళ్లీ వచ్చీ కత్తి ఎప్పుడు అడుగుతాడోననీ తపస్సు
చేసుకుంటా ఆ కత్తి ఎవరైనా పట్టుకుపోతారేమోనని దాన్నిమీద చెయ్యివేసి తపస్సు చేయడం
మొదలు పెట్టాడు. ఆ కత్తికి ఒక ప్రవృత్తి ఉంది అది రౌద్ర ప్రవృత్తితో కూడుకుని
ఉంటుంది కత్తి అంటే ఆ గుణం ఈయ్యనలోకి వచ్చింది.
|
ఈయన మెల్లిగా దర్భలకు వెళ్ళినా కందమూలాలకు వెళ్ళినా
కత్తి పెట్టుక తిరగడం మొదలుపెట్టాడు. ఈ కత్తి చేతిలో ఉంది కాబట్టీ అక్కరలేనివన్నీ
కోయడం తరగడం నరకడం చంపడం ఇది చిట్ట చివరకి ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే అతను
అందరినీ బాధ పెట్టి హత్యలు చేసి దొంగతనాలు చేసి పనికొచ్చే స్థితిలో అలాంటి
స్థితిలో అంటే దొంగతనాలు చేసి బ్రతికే స్థితిలోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని
పాడుచేసుకొని తపస్సుని భగ్నం చేసుకున్నాడు. అక్కరలేనటువంటి ఒక ఆయుధాన్ని దగ్గర
ఉంచుకున్నంత మాత్రం చేత ఒక వ్యక్తి తపో బ్రష్టుడు అయ్యాడు. రామా! నీకు ఎందుకీ
ధనస్సు కాబట్టి ఈ ధనుర్భాణములను మీరు దగ్గర ఉంచుకోకండి, ఒక్కొక్క వస్తువు దగ్గర
ఉంటే ఆ వస్తువు యొక్క ప్రభావం ఆయన మనస్సు మీద పడి మనిషి యొక్క మనస్సు మారుతుందీ
అని సీతమ్మ అంది.
ఇది హితబోధ కాదు స్నేహా చ్చ బహుమానా చ్చ స్మారయే త్వాం న శిక్షయే నేను
మీయందున్న ప్రీతితో నేను ఈ మాట చెప్పాను మీరు ఆలోచించి ఎలా చెయ్యాలనుకుంటే అలా
చెయ్యండి. అంటే రాముడు నవ్వి అన్నాడూ! క్వ చ శస్త్రం క్వ చ వనం క్వ చ క్షాత్రం
తపః క్వ చ ! (వ్యావిద్ధమ్ ఇదమ్ అస్మాభిః దేశ ధర్మ స్తు పూజ్యతామ్ !!) ఎందుకండీ
ఈ ధనస్సు, ఎందుకండీ ఈ వనం ఎందుకండీ ఈ నార చీర కట్టుకోవడం పరస్పర విరుద్ధమైన వాటితో
తిరగడం ఎందుకూ అని కదా సీతమ్మ రామునితో అంది ఆయన అన్నాడూ చూసి కిం తు వక్ష్యా
మ్యఽహం దేవి త్వయై వోక్తమ్ ఇదం వచః ! క్షత్రియైః ధార్యతే చాపో న ఆర్త శబ్దో భవేత్
ఇతి !! నీవు ఇతః పూర్వం
నాతో ఒక మాట అన్నావు సీతా గుర్తుపెట్టుకో కిం తు వక్ష్యా మ్యఽహం దేవి త్వయై
వోక్తమ్ ఇదం వచః ఏ మాట అన్నావు ఏ క్షత్రియుడి చేతిలో ధనుర్భాణములను పట్టుకుంటాడో అక్కడ
ఆర్థనాధము వినపడదు అన్నావు నీవు, క్షత్రియుడిగా పుట్టినవాడికి ఒక ధర్మం ఉంది
ధనస్సు బాణములుచేతపట్టి ఇతరులను రక్షించాలి నేను పుట్టిందే క్షత్రుయుడిగా కాబట్టి
నాకు క్షాత్రధర్మం ఉంది నేను ధనుర్భాణములను చేతపట్టుకోవాలి క్షత్రియైః ధర్యతే
చాపో క్షత్రియుడు పట్టుకోవలసినటువంటి ధనుర్భాణాలను పక్కన పెట్టేసి వాళ్ళందరూ
ఆర్థనాధాలతో ఉంటే నేను తపస్సు చేసుకుంటూ కూర్చుని వనవాసం చేసుకుంటూ ఎలా ఉంటాను? నా
ధర్మం నేను నిరవేర్చద్దూ నేను ధర్మంకోసమే పుట్టాను సీతా...
|
మీరు ఈ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి సీతమ్మ అమాయకురాలై ఈ మాట అనలేదు,
అన్నమాటకు కట్టుబడి ఉంటాననేటటువంటి లక్షణాన్ని బాగప్రజ్వలింపజేసింది రామ చంద్ర
మూర్తి యందు ఈ మాటే రేపు రావణ సంహారం చేయిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న నిప్పు రవ్వ
ఉందనుకోండి ఊది ఊది ఊది ఊది దాని మీద పోకవేసి దూదిపెట్టి రాజేస్తే జ్వాల రేగుతుంది
అలా రాముడు అన్నమాట కాకతాళీయం కాదు బాగాగుర్తుపెట్టుకున్నవాడు తన ధర్మము నందు
నిలబడేటట్లు చేసింది సీతమ్మ అది ఆవిడ యొక్క పాతివ్రత్య మహత్యము అగ్రతః ప్రయయౌ
రామః సీతా మధ్యే సుమధ్యమా ! పృష్ఠత స్తు ధను ష్పాణిః లక్ష్మణోఽనుజగామ హ !! ముందు రాముడు నడుస్తున్నాడు మధ్యలో సీతమ్మ
నడుస్తూందీ వెనక లక్ష్మణ మూర్తి నడుస్తున్నారు వాళ్ళు ఆ దండకారణ్యంలో
తిరుగుతున్నారు. ఒక చోటకి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద సరస్సు కనపడింది. ఆ సరస్సు లోపల
వీణా నాదం వినపడుతోంది మృదంగ ధ్వని వినపడుతోంది నాట్యం చేస్తున్నటువంటి శబ్దాలు
వినపడుతున్నాయి, ఆయన తనతో వచ్చినటువంటి ధర్మబృత్ అనబడేటటువంటి ఒక ఋషిని అడిగాడు,
ఏమిటి సరోవరంలోంచి ఇవన్నీ వినపడుతున్నాయే ఏమిటీ అని అడిగాడు.
అడిగితే ఆయన అన్నారూ తతః ప్రవ్యథితాః సర్వే దేవాః సాఽగ్నిపురోగమాః !
అబ్రువన్ వచనం సర్వే పరస్పర సమాగతాః !! ఇక్కడా పూర్వ కాలంలో మాండకర్ణి అనే గొప్ప
మహర్షి తపస్సు చేశాడు ఆయన అంత తపస్సు చేస్తే అగ్నితో కలిసి కొంత మంది దేవతలకు
భయంవేసింది ఎందుకు భయంవేసిందీ అంటే ఈయన ఇలానే తపస్సు చేస్తే దిక్పాలకుల పదవిలోకి
ఆయన వస్తాడని కాబట్టి ఆయన తపస్సు ఎలా పాడుచెయ్యాలి అని ఆలోచించారు, ఆలోచించి
వాళ్ళందరూ కలిసి ప్రధానాఽప్సరసః పంచ విద్యు చ్చలిత వర్చసః మెరుపు తీగలు ఎలా ఉంటాయో అలాంటి ఐదుగురు
అప్సరసలని పంపించారు,
వారియందు కామ
మోహితుడు అయ్యాడు ఋషి అయి తను తన తపఃశక్తితో యవ్వనాన్ని తెచ్చుకున్నాడు,
తెచ్చుకుని పైకి కనపడకుండా ఈ సరోవరంలోపల ఒక గొప్ప సౌధాన్ని నిర్మించాడు లోపల
తపఃశక్తితోటి ఆ ఐదుగురితోటీ ఎప్పుడూ భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ శబ్దములే
వినపడుతుంటాయి ఇది మాండకర్ణిని యొక్క వృత్తాంతము అని చెప్పారు.
|
ఇదీ కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఇది ఎందుకు చెప్పవలసి
వచ్చిందో తెలుసాండీ! తన తపస్సుని బ్రహ్మలోకం వరకూ వెళ్ళడానికి వీలుగా
ఉపయోగించుకుని జితేంద్రియులైనటువంటి మహాపురుషులు కొందరు, తన తపస్సుని మళ్ళీ యవ్వనం
తెచ్చుకోవడానికి ఉపయోగించుకుని మళ్ళీ అటువంటి అప్సరసలతో భోగము అనుభవించడానికి నీటికింద
సౌధము కట్టుకుని తపస్సు పాడుచేసుకున్నవాడు మాండకర్ణి. తపస్సు చెయ్యడం ప్రధానం కాదు
తపస్సు చెయ్యడానికి ఏ లక్ష్యంతో బయలుదేరావో ఆ లక్ష్యాన్ని నీవు చిత్త శుద్ధితో
పొందవలసినదానికి కావలసినటువంటి ధృతితో నీవు నిలబడ గలగడం కూడా ప్రధానం కావాలి ఇదీ
ఎంత మందిలో ఎలా ఉంటుందో ఎలాఎలా కదిలిపోతుంటారో చూపిస్తుంది రామాయణం. కాబట్టి రామ
చంద్ర మూర్తి ఇలా తిరుగుతున్నారట తిరుగుతూ ఉండగా తిరుగుతూ ఉండగా పది సంవత్సరాలు
పూర్తైపోయాయి అరణ్యవాసానికి. ఆయనా మళ్ళీ సుదేక్ష్ణుని ఆశ్రమానికి వెళ్ళాడు
ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ కొంత కాలము ఉన్నారు మాకు అగస్త్యాశ్రమాన్ని దర్శించాలని
ఉంది, కాబట్టి దాని దారి చెప్పండీ అన్నాడు. నాయనా! ఇదుగో ఫలానా విధంగా వెళ్ళినట్లైతే
ముందు అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం కనపడుతుంది, అగస్త్యుని యొక్క సోదరునికి పేరు
ఏమిటో లేదు రామాయణంలో అగస్త్య భ్రాత అంటే లోకంలో అపారమైనటువంటి కీర్తి
గడించినవాడికి తమ్ముడిగా ఉంటే ఇంక ఆయన పేరు లోకంలో ప్రకాశించదు ఫలానా ఆయన
తమ్ముడండీ అంటారు అంతే, అగస్త్య భ్రాత అన్న పేరుతో ఆశ్రమం ఉందంటే అగస్త్యుడు ఎంత
గొప్పవాడో మీరు ఊహించండి అని దానికి అర్థం.
కాబట్టి ఇప్పుడు ఆ అగస్త్య భ్రాత ఉన్న ఆశ్రమం వైపుకు వెళ్తున్నారు రామ
లక్ష్మణులు సీతమ్మతో కలిసి వెడుతూ రాముడు అంటాడు అగస్త్యుడి యొక్క గొప్పతనాన్ని
గురించి చెప్తూ తస్యేదమ్ ఆశ్రమ పదం ప్రభావా ద్యస్య రాక్షసైః ! దిగియం దక్షిణా
త్రాసాత్ దృశ్యతే నోపభుజ్యతే !! దక్షిణ దిక్కుకు వచ్చి అగస్త్యుడు ఉన్న
కారణంగా రాక్షసులు అసలు ఇటువైపుకు రావడానికి భయపడిపోతున్నారు, అంతటి గొప్ప
తేజోవంతుడు అగస్త్యుడంటే మహానుభావుడు ఈ అగస్త్యుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే నేను
మిగిలిన కాలాన్నంతటిని గడిపేద్దామనుకుంటున్నాను. వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు
రాక్షసులు ఉండేవారు ఒకానొకప్పుడు ఈ మార్గంలో ఆ వాతాపి ఇల్వలుడులో వాతాపిని ఒక మేక
కింద మారుస్తుండేవాడు ఇల్వలుడు ఆకాలంలో ఆ యుగంలో లక్షణం ఏమిటంటే పితృ కార్యంచేస్తే
శ్రార్ధం పెడితే మాంసం పెట్టాలి, ఇప్పుడు కలియుగంలో లేదు అది. రామాయణంలో
చెప్పారండీ అని తేకూడదు, దానికి బదులు గారె మినుము కాబట్టి అప్పుడు శ్రార్ధం
పెట్టేటప్పుడు మాంసం వాడవలసి ఉంటుంది కాబట్టి ఇల్వలుడు ఏమనేవాడంటే బ్రాహ్మణులను
పిలిచి మా నాన్నగారి పితృ కార్యం ఉందీ మీరు బ్రహ్మణులు కాబట్టి వచ్చి ఆ
పితృస్థానంలో మిమ్మల్ని నిమంత్రణ చేస్తున్నాం మీరు భోజనం చేయవలసింది అనేవాడు పాపం
ఆ వెర్రి బ్రహ్మాణుడు ఎవరో వచ్చేవారు కూర్చోనేవాడు.
|
వింధ్య పర్వతం పెరిగిపోతూంటే ఆ వింధ్య పర్వతాన్ని అంతటినీ కూడా మళ్ళీ తలవంచి
ఉండేటట్టుగాచేసి మహానుభావుడు అగస్త్యుడు అనేటటువంటి పేరు పొందాడు. అటువంటి
మహానుభావుడు ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి మనం వెళ్ళి దర్శనంచెయ్యాలి అని
అనుకున్నారు. అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ
దారికనుకొని అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళుతున్నారు వెళ్ళుతూ ఒకమాట
చెప్తాడు రాముడు, లక్ష్మణా అగస్త్యుని యొక్క ఆశ్రమం అంటే ఎటువంటిదో తెలుసా? నాఽత్ర జీవేన్ మృషా
వాదీ క్రూరో వా యది వా శఠః ! నృశంసః కామ వృత్తో వా మునిః ఏష తథా విధః !! ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అసత్యం పలికేటటువంటి
వాళ్ళు కానీ, వంచకులు కానీ పీడించేవాడు కానీ స్వేచ్చగా ఏ నియమాలూ పాటించకుండగ
జీవించేవాడుకాని అగస్త్యుని ఆశ్రమంలో ఉండరు. ఇక్కడ ఉండేవాళ్ళు అత్ర దేవా శ్చ
యక్షా శ్చ నాగా శ్చ పతగైః సహ ! వసన్తి నియత ఆహారా ధర్మమ్ ఆరాధయిష్ణవః !! ఇక్కడ
ఉండేటటువంటి వాళ్ళు దేవతలు యక్షులు నాగులు వీళ్ళందరు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో
ఉంటారు అత్ర సిద్ధా మహాత్మానో విమానైః సూర్య సన్నిభైః ! త్యక్త్వా దేహాన్ నవై
ర్దేహైః స్వర్యాతాః పరమర్షయః !! అగస్త్యుని ఆశ్రమంలో తపస్సుచేసి శరీరాన్ని
పడగొట్టేసి దివ్యమైన విమానాలెక్కి ఊర్థ్వలోకాలకు వెళ్ళిపోతుంటారు సూర్యుని వంటి
తేజస్సుతో అంతగొప్ప ఆశ్రమం లక్ష్మణా మనం ఇప్పుడు ఆ ఆశ్రమానికి వెడుతున్నాం
అన్నారు. అన్న తరువాత వాళ్ళు అగస్త్యుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళారూ సీతా రాములు బయట
నిలబడి లక్ష్మణున్ని పంపించారు మేము వచ్చామని చెప్పు నీవు అని, లక్ష్మణుడు లోపలికి
వెళ్ళి రాముడు సీతా సహితుడై వచ్చాడు అగస్త్య మహర్షిని చూడగోరుతున్నాడు కాబట్టి
ప్రవేశాన్ని అపేక్షిస్తున్నాడు అన్నారు.
|
స తత్ర బ్రహ్మణః స్థానమ్ అగ్నేః స్థానం తథైవ చ ! విష్ణోః స్థానం మహేన్ద్ర స్య
స్థానం చైవ వివస్వతః !!
సోమ స్థానం భగ స్థానం స్థానం కౌబేరమ్ ఏవ చ ! ధాతు ర్విధాతుః స్థానం చ వాయోః
స్థానం తథైవ చ !!
నాగ రాజ స్య చ స్థానం అనంత స్య మహాత్మనః ! స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్తాన
మేవ చ !!
స్థానం చ పాశ హస్త
స్య వరుణ స్య మహాత్మనః ! కార్తికేయ స్య చ స్థానం ధర్మ స్థానం చ పశ్యతి !!
అక్కడా కార్తికేయుడు బ్రహ్మ అగ్ని విష్ణువు
మహేంద్రుడు సూర్యుడు సోముడు కుబేరుడు భగుడు ధాత వాయువు నాగరాజు అనంతుడు గాయిత్రి
ఇటువంటి దేవతలందరికీ వారి వారి స్థానములు ఉన్నాయట, ఆ దేవతలు వచ్చి అక్కడ కూర్చుని
అగస్త్య మహర్షిని ఉపాసన చేస్తారూ అని అప్పయ్య దీక్షితులవారు రాశారు. అక్కడ వచ్చి
అగస్త్యున్ని దేవతలు ఉపాసన చేస్తారు అంతటి మహానుభావుడు అగస్త్య మహర్షి అంటే,
కాబట్టి ఆ స్థానాలన్నిటినీ చూస్తూ రామ చంద్ర మూర్తి అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి
వెళ్ళారు తతః శిష్యైః పరివృతో మునిః అపి అభినిష్పతత్ ! తం దదర్శాఽగ్రతో రామో మనీనాం
దీప్త తేజసాం !! శిష్యులతో కలసి ఆ అగస్త్య మహర్షి బయటికి వచ్చారు వచ్చి రామా! నిన్ను చూడాలనే
ఉన్నానయా! అని అగ్ని తేజస్సుతో అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా ఉన్నారటా! ఏవమ్
ఉక్త్వా మహా బాహుః అగస్త్యం సూర్య వర్చసం ! జగ్రాహ పరమ ప్రీత స్తస్య పాదౌ పరంతపః
!! ఆ అగస్త్య మహర్షి పాదముల దగ్గర రాముడు సీతా లక్ష్మణ సహితుడై నమస్కారం
చేశాడట.
అప్పుడు ఆయన అడుగుతారు అగస్త్య మహర్షి నాయనా! ఇంతకాలానికి నీవు వచ్చావు చాలా
సంతోషం అని కూర్చోబెట్టి ఆర్ఘ్య పాదాదులు ఇచ్చి నేను అగ్ని కార్యం పూర్తిచేసి
వస్తానూ అని అగ్ని కార్యం పూర్తిచేసి వచ్చి కూర్చోబెట్టి ఒక ధర్మం సూక్ష్మం
చెప్తారు అగ్నిం హుత్వా ప్రదాయ అర్ఘ్యమ్ అతిథీన్ ప్రతిపూజ్య చ ! వానప్రస్థేన
ధర్మేణ స తేషాం భోజనం దదౌ !! మొట్ట మొదట అగ్ని కార్యాన్ని పూర్తిచేసి అతిథి
పూజచేసి అన్నంపెట్టి ఆదరించాలి, ఇలాంటి ధర్మాన్ని ఆశ్రమంలో పాటించనటువంటివాడు పై
లోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు అటువంటి స్థితిని పొందుతాడు, కాబట్టి నాయనా రాజా
సర్వ స్య లోక స్య ధర్మచారీ మహా రథః ! పూజనీయ శ్చ మాన్య శ్చ భవాన్ ప్రాప్తిః ప్రియాఽతిథిః !! నీవు ప్రియమైనటువంటి అథితివి నాకు ఇవ్వాళ
దొరికావు కూర్చోమని ఏవమ్ ఉక్త్వా ఫలైః మూలైః పుష్పై శ్చాఽన్యై శ్చ రాఘవమ్ !
పూజయిత్వా యథా కామం పునః ఏవ తతోఽబ్రవీత్ !! ఆయనా ఆ పువ్వులతోటీ వాటితోటి రామ చంద్ర
మూర్తిని అథితి పూజచేసి రాముడిగా పూజచేస్తే నరుడు ఒప్పుకోడు అగస్త్యుడిచేత పూజ
అందడానికి నీవు నాకు ప్రీతి పాత్రమైన అథితివి కాబట్టి అతిథిపూజ చేస్తున్నాను అన్న
పేరుతో రామున్ని అర్చించి సంతోషించి ఆయనతోటి ఆయనకు ఒక విచిత్రమైన బహుమానం చేశారు.
|
ఏమిటో తెలుసాదానర్థం ఇక సీతాపహరణం జరుగుతుందని, సీతమ్మ ఒక్కచోటే ఉంటుంది అంటే
అవతార ప్రయోజనం నెరవేరాలి చాలా కాలం అయిపోయింది రామా! 14 ఏళ్ళల్లో ఇంక ఎక్కువ కాలం
మిగలలేదు అంటాడు. అంటే రావణసంహారం అయిపోవాలి 14 ఏళ్ళు అయిన తరువాత వెనక్కి
వెళ్ళిపోతే... వనానికి రావు, వనానికి రాకపోతే రావణ సంహారం జరుగదు. చాలా సమయం
అయిపోయింది ఏషా హి సుకుమారీ చ దుఃఖై శ్చ న విమానితా ! ప్రాజ్య దోషం వనం ప్రప్తా
భర్తృ స్నేహ ప్రచోదితా !! ఇంత క్లిష్టమైన వనంలోకి ఈ సీతమ్మ నీకోసం నీతో
అనుగమించి వచ్చిందే ఈవిడని అభినందించాలి సుమా! ఇన్ని కష్టాలు ఉన్నాయని కూడా తెలిసి
నీకోసం వచ్చింది అంటే ఈ పతివ్రతా ధర్మమే సీతమ్మ యొక్క ఈ పాతివ్రత్యమే రావణున్ని
చంపబోతుంది సుమా..! అందుకు వచ్చింది ఈవిడా నాకు తెలుసు ఇది లోపలి మాట పైకీ ఒకమాట. యథా
ఏషా రమతే రామ ఇహ సీతా తథా కురు ! దుష్కరం కృతవతౌ ఏషా వనే త్వామ్ అనుగచ్ఛతీ !! రామా!
ఇక ముందు ఈవిడ ఏం చెప్తుతుందో అది నీవు చేయాలి సుమా! నిన్ను అనుగమించి వచ్చింది,
బంగారు జింకని తే అంటూంది తీసుకురా! లోపలి మాటలవి అలా నీవు వెళ్ళితేనే రావణుడు
ఈమెను అపహరిస్తాడు కాబట్టి బంగారు జింకేమిటి సీతా నీవు అడగడమేమిటీ నేను
తీసుకురావడమేమిటీ అనద్దూ ఆవిడ ఏమి ఏడిగితే అది చేయ్యాలి యథా ఏషా రమతే రామ ఇహ
సీతా తథా కురు ఆవిడ ఏం చెప్పితే అది చేయాలి భర్తకు అలా చెప్తారండీ!
ఆవిడ అడిగినదాంట్లో నీవు ధర్మాన్ని చూడాలి రామా! అనాలి, ఆయనేమంటున్నాడో
తెలుసా! నిన్ను అనుగమించి వచ్చిందయ్యా ఆమె ఏమి అడిగితే అది నీవు తెచ్చిపెట్టు పైకి
భార్యను సుఖపెట్టమన్నట్టు ఉంది, ఇక తిరుగద్దులేండి ఒకచోట ఉందురుకానీ సీతమ్మ
బాగాబడలిపోయావమ్మా ఖేదం పొందావు తిరిగి ఇక తిరగద్దు ఒక చోట ఉందువు కానీ అంటే
సీతాపహరణం జరిగి శింశుపా వృక్షం కింద ఉంటావు, సీతమ్మ ఏమి చెప్పితే అది చేయి రామా!
సుఖపెట్టు పైకి భార్యను సుఖ పెట్టమని లోపలా అడుగుతుంది ఎదర బంగారు జింకని బంగారు
జింకకోసం వెడితే ఇబ్బంది వస్తుందేమో రాక్షసుడు అని
చెప్పారు లక్ష్మణ
మూర్తి అయినా వెళ్ళాడు రాముడు అగస్త్యుడు రాబోయే సన్నివేశాన్ని దృష్టిలో
పెట్టుకుని మాట్లాడుతున్నాడు, సమయం అయిపోతుంది రావణవధ
అయిపోవాలి అందుకోసం పైకి ఒకలా లోపల ఒకలా మాట్లాడుతున్నాడు తపస్సుతో చూసి అలంకృతోఽయం దేశ శ్చ యత్ర
సౌమిత్రిణా సహ ! వైదేహ్యా చ అనయా రామ వత్స్యసి త్వమ్ అరిందమ !! ఓ రామా! నీవు లక్ష్మణుడు సీతమ్మా ఎక్కడ ఉంటే ఆ
ప్రదేశం శోభిస్తుంది ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండచ్చు అన్నాడు ముందు, అని రాముడు
అన్నాడూ మమ్మల్ని ఎక్కడ ఉండమంటరో మిగిలిన కాలాన్ని నిర్దేశించండి అని అన్నాడు అంటే
ధ్యాత్వా ముహూర్తం ధర్మాఽఽత్మా ధీరో ధీరతరం వచః కాసేపట వెంటనే చెప్పలేదట ఇక్కడ ఉండమన్నాడుగా..!
అన్నవాడు ఇక్కడ ఉండిపో అనచ్చుగా అనలేదట కళ్ళు మూసుకొని బాగాధ్యానం చేశాడట ధీరో
ధీరతరం వచః బాగా తెలివైన మాటచెప్పాడట అగస్త్యుడు అంటే బాగా ఆలోచించాడు దేనిగురించి
ఆలోచించాడు, సమయం అయిపోతుంది 14 యేళ్ళు ఇంక మిగిలినటువంటి కాలం మహా అయితే ఒక్క
సంవత్సరం మిగిలింది 13 యేళ్ళు పూర్తైపోతున్నాయి.
|
వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాడో ఇక వనానికి రాడు వనానికి రాడో రాక్షస సంహారం జరుగదు
కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటే సీతాపహరణం జరుగుతుందో ఎక్కడ ఉంటే రామావతార ప్రయోజనం
పూర్తవుతుందో ఆ ప్రదేశం చెప్పాలి అందుకని అన్నాడు కాలోఽయం గత భూయిష్తో యః
కాల స్తవ రాఘవ ! సమయో యో నరేంద్రేణ కృతో దశరథేన తే !! దశరథుడు నిన్ను 14 యేళ్ళుగా అరణ్యవాసం
చేయమన్నాడు అబ్బో చాలా కాలం అయిపోయింది ఇక వెళ్ళిపోతావు పైకి ఒకటి లోపల ఒకటి, తీర్ణ
ప్రతిజ్ఞః కాకుస్థ సుఖం రాజ్యే నివత్స్యసి ! ధన్య స్తే జనకో రామ స రాజా రఘు నందన
!! య స్త్వయా జ్యేష్ట పుత్రేణ యయాతి రివ తారితః !!! నీవు యయాతి యొక్క జేష్ఠపుత్రుడవు
యయాతిని తరింపజేసినట్లు దశరథున్ని తరింపజేయడానికి పుట్టినటువంటి వాడివయ్యా! 14
సంవత్సరాలు తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వచ్చావు విదితో
హి ఏష వృత్తాన్తో మమ సర్వ స్తవానఘ ! తపస శ్చ ప్రభావేన స్నేహ ద్దశరథ స్య చ !!
నేను నా తపః శక్తితో దశరథుని యందున్న స్నేహంతో నీవు నీ మనసులో ఏం కోరుకుంటున్నావో
దానిని నేను అర్థం చేసుకుంటున్నానయ్యా రామా! అన్నాడు ఎంత పెద్ద మాటో చూడండీ.
దశరథునియందు స్నేహంతో రాముడి యొక్క మనసులో ఉన్న విషయాన్ని తపస్సుతో ఆ శక్తితో
నేను పట్టుకున్నాను అన్నాడు, ఏమండీ! రావణున్ని చంపుదామని రాముడు అనుకుంటున్నాడూ
అని అన్నారనుకోండీ ఇప్పటిదాకా అసలు రాముడు రావణుడు కలుసుకోలేదుగా రావణుని జోలికి
రాముడు వెల్దామనివస్తే అప్పుడు నరుడిగా కాదు విష్ణువుగా తిరుగుతున్నట్లు గుర్తు
అప్పుడు మరి నరుడు కాదుగా! మరి అగస్త్యుడు నీ మనసులో మాట నాకు తెలుసులే అంటే ఏమిటి
దానర్థం మునులకు మాటిచ్చాడుగా రాక్షస సంహారం చేస్తానని ఆ రాక్షసుల యొక్క మూల స్థానాన్నికొట్టేస్తే
అసలు రాక్షసులందరూ పోయినట్లేగా..! కాబట్టి నీ మనసులో మాట నాకు తెలుసు మునులు తమ
ధర్మం తాము నెరవేర్చుకోవడానికి వీలుగా రాక్షస సంహారం చేయ్యాలని చూస్తున్నావు
అందుకు తగినప్రదేశం చూపిస్తా, ఒకడూ ఇద్దరూ కాదు పుంకాను పుంకలంగా వేలకు వేల మంది
నీ బాణాలకు తెగతార్చబడిపోవాలి ఇంక సమయం తక్కువుంది, అంత మంది నీమీద వచ్చి పడిపోయే
ప్రదేశం ఎక్కడుందో అక్కడికి పంపిస్తాను రామా నిన్ను లక్ష్మణున్ని సీతమ్మనీ ఎక్కడ
కూర్చుంటే ఈ పగలు పెరిగి సీతాపహరణం జరిగి ఈ మూల స్థానంలో రావణుడు ఎగిరిపోతాడో ఆ
ప్రదేశం చూపిస్తాను తపస్సుతో తెలుసుకున్నాను ఇది లోపలి మాట.
|
అగస్త్యుడు కూడా మీరువున్న ప్రదేశం శోభిల్లుతుంది మీరు ఇక్కడ ఉండండీ అని కదా
అన్నాడు ఇప్పుడు అంటున్నాడు ఇంతకు ముందు ఇక్కడ ఉండండీ అని కదా అన్నాను మీతోటీ
కాదులే... ఇంతకన్నా మంచి ప్రదేశం ఒకటి నాకు దృష్టిలో ఉంది, నేను దాన్నిబాగా నా తపఃశక్తితో
ధ్యానంచేసి గుర్తెరిగి చెప్తున్నాను రామా! అక్కడే నీవు సీతా లక్ష్మణుడు ఉండాలి, అక్కడ
సీతమ్మ బాగా సుఖపడుతుంది అన్నాడు. సుఖపడుతుంది అంటే ఏ అవతార ప్రయోజనం కోసమని తల్లి
వచ్చిందో అందరి జనుల్ని ఉద్దరించి తల్లి తనంతో నా బిడ్డలు ఏడుస్తున్నారు వీళ్ళని
రక్షించడానికి రావణ సంహారానికి నేను వెళ్ళి అక్కడ ఉండి వాడు నన్ను అనరాని మాటలు
అంటే ఆ మాటలు అనడం వల్లా వాడి తపఃశక్తి నశించిపోతే వాడు మరణానికి సిద్ధమైతే రాముడు
వచ్చి వాన్ని చంపాలి అందుకని నేను ఈ కష్టాల కోసం 11 యేళ్ళు అక్కడుండి వాళ్ళ సుఖం
నా సుఖం అని తల్లి తనంతో అవతారానికి వచ్చావు తల్లీ అందుకనీ అయోనిజగా వచ్చావు ఏది
నీకు సుఖమో ఆ సుఖం నీకు దక్కాలంటే నీవు అక్కడ ఉండాలి ఇది లోపలి మాట అగస్త్యునిది.
పైకి అక్కడ బాగా గోదావరి ప్రవహిస్తుంటుంది
లేళ్ళు ఉంటాయి దుప్పిలు ఉంటాయి జింకలుంటాయి ఫలాలు ఉంటాయి తేనెలుంటాయి తేనెపట్లు
ఉంటాయి పళ్ళుంటాయి అక్కడ చాలా బాగుంటుంది అక్కడ ఉండండి పై మాట. అందుకని రామా ఇక్కడ
ఉండద్దు ఆక్కడ ఉండండి ఆ ప్రదేశం పేరేమిటో తెలుసా! “పంచవటి” ఆ పంచవటి ప్రదేశానికి
అనేకమైన పక్షులతో కూడి ఉంటుంది జన సంచారం ఉండదు. ఏమని చెప్పాలండీ ఒక మనిషి అక్కడ
ఉండాలంటే ఏమని చెప్పాలి ఇప్పటిదాకా చెప్పినవాళ్ళు ఏం చెప్పారు అక్కడ తాపసాశ్రమాలు
ఉంటాయి ఋషులు ఉంటారు రామా! సంతోషంగా అక్కడ గడుపూ అన్నారు, ఈయనేం చెప్తున్నారు
అక్కడ నిర్జనం మనుష్యులు అన్నవారు ఉండరు ప్రశాంతంగా ఉంటుందిగా అక్కడ ఉండు అన్నారు
ఎందుకని జనులన్నవాళ్ళు ఉండకూడదు సీతాపహరణం జరగాలంటే ముగ్గురే ఉండాలి ఇద్దరు
వెళ్ళిపోవాలి ఇద్దరు వెళ్ళిపోవాలంటే
రాముడి మాట సీతమ్మ
మాట కోసం బంగారు జింక వెంట వెళ్ళిపోవాలి, సీతమ్మ మాటలకి లక్ష్మణుడు వెళ్ళిపోవాలి
ఆవిడ ఎంత కేకలు వేసినా పలికే మనిషి ఉండకూడదు, రావణుడు సీతమ్మని అపహరించాలి
అపహరిస్తే ఆ తల్లి ఎవరిని సుఖపెట్టడానికి వచ్చిందో ఎవరి సుఖం తన సుఖం అనుకుందో ఆ
సుఖాన్ని ఆవిడ పొందాలి అంటే రావణ సంహారానికి తాను పనిముట్టుగా ఆవిడ బయలుదేరవలసి
ఉంటుంది.
|
ఇది జరగాలంటే పంచవటికి వెళ్ళాలి తప్పా రామా
ఇక్కడ ఉంటే జరగదు రాక్షసులు కన్నెత్తి చూడలేరు, నీవు అరిందవాడవు అరిందమహా
నీవు శత్రు సంహారకుడవు విశేషించి ఇది నా ఆశ్రమం ఇటు ఎవరు వస్తారు ఇంకా అవతార
ప్రయోజనం నెరవేరదు కాబట్టి ఇందాక అన్నాను కానీ ఇప్పుడు నా తపః శక్తితో
అంతర్ముఖుడనై ఆలోచించాను ఇక్కడ నీవు ఉండకూడదు రామా! ఎంత త్రికాలజ్ఞుడై ఎలా
చెప్తున్నాడో చూడండీ అది అగస్త్యుడు అంటే... అది అగస్త్య మహర్షి అంటే అందుకే ఇప్పుడు
అక్కడికి వెళ్ళి రాక్షస సంహారం మొదలు పెట్టాలి ఇక 14 వేల మంది రాక్షసులు వస్తారు
ఒకేసారి పడగొట్టడానికి కావలసిన ధనస్సు అక్షయ బాణ తూనీరాలు అటువంటి ఖడ్గం అన్నిటినీ
ఇచ్చేశారు ఎక్కడుంటే ఇవన్నీ జరుగుతాయో ఆ ప్రదేశం చెప్పేశాడు ఇప్పుడు అక్కడికి
బయలుదేరండీ అంటాడు అంటే ఉన్న తక్కువ కాలంలో రామావతార ప్రయోజన సిద్ధిని
శాశించినవాడు అగస్త్య మహర్షి. రామాయణంలో ఇన్ని చేతులు ఒక్కొక్క చెయ్యి పట్టుకుంటూ
చిట్ట చివరికీ అందరూ అగస్త్యుడి దగ్గరికి ఎందుకు పంపించారంటే ఆ మహర్షే అవతార
ప్రయోజనానికి కావలసినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించేశారు. ఆ శ్లోకాలు మీరు చదివి
అనుభవించాలి పైకి ఒకలా ఉంటుంది లోపలి అర్థం ఒకలా ఉంటుంది. అలా మాట్లాడుతాడు
మహానుభావుడు, ఇటు నరుడిగా స్థితి చెడకూడదు లోపల తను దర్శనం చెయ్యాలనుకుంటున్న ఆ
రామ దర్శనం ఇదవకూడదు. వచ్చినటువంటి రామున్ని పూజ చేయకుండా ఉండకూడదు అలాగని
రామునికి అగస్త్యుడు పూజ చేసినట్లు కనపడకూడదు అందుకని విశేషమైనటువంటి అథితివి
కాబట్టి అతిథి పూజా చేశాను అంటాడు ఇంత గొప్పగా అగస్త్యుడు నిర్వహించినటువంటి ఈ
వాక్ యజ్ఞంతో అటువంటి అందమైన మాటలతో ఇవాల్టి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం.
రేపటి రోజున సీతా రామ లక్ష్మణులు పంచవటికి బయలుదేరుతారు అది ఎలా ఉంటుందో
మధ్యలో జటాయువు ఎలా వస్తాడో ఎలా కలుస్తాడో అక్కడ పర్ణ శాల ఎలా కడుతాడో ఇక రామ కథా
ఎలా ఊర్జితము పట్టు బిగుస్తుందో మీరు చక్కగా విని మనందరం సంతోషిద్దాం.
మనం ఒక్క పదకొండు మార్లు పెట్టుకున్న సాంప్రదాయాన్ని అనుసరించి రామ నామాన్ని
చెప్పుకుందాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
నీవు నేనను భేదమేమియ లేక యున్నది రామ నామము !!రా!!
ఇడా పింగళ మధ్యమందున ఇమిడి యున్నది రామ నామము !!రా!!
|
వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీ రామ నామము !!రా!!
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !!రా!!
నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీ రామ నామము !!రా!!
ఎందుచూచిన ఏకమై తా వెలయుచున్నది రామ నామము !!రా!!
శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీ రామ నామము !!రా!!
కర్మ నేత్ర ద్వయముచేతను కానరానిది రామ నామము !!రా!!
త్రికుట మధ్యమునందువెలిగే జ్ఞాన జ్యోతియే రామ నామము !!రా!!
ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే శ్రీ రామ నామము !!రా!!
విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీ రామ నామము !!రా!!
అమ్మా అందరూ జ్ఞాపకం పెట్టుకోండీ! రేపు స్థిర వారము ఎల్లుండీ ఆది వారము ఆది
వారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి లోపలికి పంపిస్తారు పిల్లల్ని శివాలయం ఎదురు గుండా
ఉన్నటువంటి రాజ ద్వారంలోపల్నించి పంపిస్తారు, ʻరాజద్వారే రాజగృహేʼ అని కదా!
అందులోంచి అక్కడే పిల్లలకి హాల్ టికెట్టు తీసుకొని ఆన్సర్ సీటు ఇచ్చినట్లు రామ నామ
పత్రాలు ఇస్తారు మొదట వచ్చిన పిల్లలూ రామాలయంలో కూర్చుంటారు తరువాత వచ్చిన పిల్లలు
శారదాదేవి గుళ్ళో తరువాత శివాలయంలో ముందు దేవాలయాల్లో పిల్లలకి ప్రాంగణాలు ఇచ్చేసి
ఇంకా ప్రాంగణం చాలా ప్రాంగణం ఉంది కాబట్టి ఆ రోజు పెద్దలకు కూడా అవకాశం ఇద్దాం
చోటు మిగిలిపోతే పెద్దలకు కూడా అవకాశం ఇస్తారు చక్కగా పూజాంతర్గతంగా ఖచ్చితంగా ఏడు
గంటల ముప్ఫై నిమిషాలు అయ్యేటప్పటికీ కాసేపు మౌనంగా రామ నామ లేఖన యజ్ఞం జరుగుతుంది
కాబట్టీ దేవాలయం బయట ఉన్న తలుపులన్నీ మూసేస్తారు ఇంక ఎవ్వరూ దర్శనానికి లోపలికి
రావడానికి వీలు ఉండదు. అంత గొప్ప యజ్ఞం జరుగుతుంది లోపల. తలుపులు వేసేస్తారు అందరు
పెద్దా పిల్లలూ కూర్చొని రామ నామం రాసేయడం 330 రామ నామాలు ఉన్నటువంటి కాగితా
ఇస్తారు ఆ శ్రీ రామ నామం రాసేసి రామ చంద్ర మూర్తి ఎదురుగుండా ఉన్నటువంటి
సన్నిధానంలో దాన్ని వేసేసి రామ చంద్ర మూర్తికి ఇన్నాళ్ళు ఆయన పాదల దగ్గర అర్చన చేసినటువంటి
ఆ రామ చంద్ర మూర్తి మాడ పుచ్చుకొని మనం చక్కగా ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి
వెళ్ళిపోవచ్చు.
ఎండ ఎక్కువగా ఎక్కకున్నప్పుడు ప్రారంభం చేసేస్తే ఏడు ముప్ఫైకి ప్రారంభం చేస్తే
ఒక వేళ చాలా మంది ఉన్నా ఇదంతా కూర్చుని అది ఆడిటోరియం ఎక్కడ చూసినా కూర్చుని రామ
నామం రాయచ్చు ఇదొక మహత్తరమైనటువంటి అవకాశం కాబట్టీ అందునా బహుశః ఆదివారం నాడూ అంటే
రాముని యొక్క గొప్పతనమేమిటో రామ నామము యొక్క గొప్పతనమేమిటో బహుశహా మారీచుడు చెప్పే
ఘట్టం దగ్గరికి వస్తామేమో..! రాముడు అంత గొప్పగా కల్పించాడు ఆ అవకాశాన్ని అటువంటి
స్థితిని ఆయన నిర్ణయం చేశాడు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించకోండి మీ
పిల్లల్లేకాకుండా అందరి పిల్లల్నీ పిల్లలు వృద్ధిలోకి రావడమే ఈ జ్యాతి యొక్క
నిర్మాణంలో ప్రధాన పాత్ర. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము. కాబట్టి మీ పక్క
పిల్లల్నీ అందర్నీ తీసుకురండి అందరితోటి మనం చక్కగా రామ నామం రాయించీ మాడ
పుచ్చుకున్నటువంటి పిల్లలూ ఒక వేళ పెద్దవాళ్ళు వచ్చి కలిసేంతవరకు వెళ్ళడానికి
వీలులేని చిన్న వయసున్న వాళ్ళైతే వాళ్ళందర్నీ కూడా తీసుకొచ్చి మనం చక్కగా
కూర్చోబెడుదాం రామ నామం రాసేసి తల్లి దండ్రులు పిల్లల్ని తీసుకొని మళ్ళీ
వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి రేపటి రోజున ఇంకా దాని గురించి
పూర్తిస్థాయిలో అనౌన్స్ మెంట్ ఉంటుంది ఆదివారం నాడు మనందరం కలిసి రామ నామాన్ని
రాసి మన జీవితాల్ని ధన్యం చేసుకుందాం.
|
No comments:
Post a Comment