Tuesday, 24 January 2017

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అయోధ్య కాండ 14వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Ayodhya Kanda 14th Day

అయోధ్య కాండ

పద్నాల్గవ రోజు ప్రవచనము




మూర్తీభవించిన ధర్మస్వరూపమైన రామ చంద్ర మూర్తి రాజ్యాన్ని పరిపాలనచేయ్యడం కోసమని తిరిగి అయోధ్యా పట్టణానికి 14 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయ్యేంతవరకు రాడూ అని నిశ్చయించుకున్నటువంటి భరతుడు, రాజ్యమును రామునియందే న్యాసముచేసి రామ చంద్ర మూర్తి ప్రతినిధిగా రాజ్యం చెయ్యడానికి అంగీకరించి రామ చంద్ర మూర్తియొక్క పాదుకలను వశిష్ఠ మహర్షి ప్రేరేపణచెయ్యగా శిరస్సునదాల్చి అయోధ్యా పట్టణానికివెళ్ళి నంది గ్రామాన్నిచేరి సింహాసనంలో పాదుకలనుంచి రాజ్య పరిపాలనకు సంబంధించిన ప్రతివిషయాన్ని పాదుకులకు నివేదిస్తూ, నేను పాదుకలకుకాదు నివేదిస్తున్నది రామ చంద్ర మూర్తికే నివేదించి ఆయన ఆజ్ఞప్రకారం పరిపాలన చేస్తున్నాను అనేటటువంటి భావనతో భరతుడు రామ రాజ్యాన్ని చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నిన్నటిరోజు ఉపన్యాసాన్ని పూర్తిచేసుకొని ఉన్నాము.
మీరు కొంచెం జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనిస్తే రామాయణాన్ని శాశించేటటువంటి వ్యక్తులు వెనకనుంచి శాశించినవారందరు కూడా ఋషులే యదార్థానికి, రామ చంద్ర మూర్తి జననాన్ని శాసనంచేసినటువంటివారు వశిష్ట ఋష్యశృంగాదులు, జన్మించిన తరువాత సీతా రాముల యొక్క కళ్యాణాన్ని శాశించినవారు విశ్వామిత్ర మహర్షి, తదనంతరము రాముడు ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయించివారు భారధ్వాజ మహర్షి అసలు భరతున్ని అక్కడికి పంపించచ్చా భరతుని యొక్క శీలవైభవము ఎటువంటిది అనేటటువంటిది లోకానికి ప్రకాశింపచేసినటువంటివారు భారధ్వాజ మహర్షి. ఆయన కదలికలన్నీ కూడా ఋషులతోటి ముడిపడి ఉంటాయి. ఎప్పుడు కూడా జీవితం మహాత్ములతోటి ముడిపడివుండడం వారికివిధేయుడై తానుప్రవర్తించడం అభ్యున్నతికి హేతువుగా ఉంటుంది. మీరు మిగిలినవారు ఎంతమందితో కలిసివుండండీ అది ఒకెత్తు, కలిసి ఉండవద్దూ అని ఎవరు సమాజములో చెప్పలేదు ఎందుచేతనంటే ఒక మనిషి సమాజంలో ఉన్నాడూ అంటే మంచీచెడు రెండిటికి మధ్యనా ఆయన ప్రతిరోజూ స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను కేవలం మంచి వాళ్ళతో ఉంటానన్నా కుదరదు కేవలం చెడ్డవాళ్ళతో ఉండడమూ కుదరదు, ఎవరితో నీవున్నా నీలోని మంచిని నిలబెట్టుకొనీ నీవు లోకానికి ఉపకారం చేసేటటువంటి గుణములతో ప్రకాశించి నీవలన ఇంకొకరికి ఇబ్బంది రానిపరిస్థితి ఉండాలి అంటే నీ లోపల కొంతమంది ఉంటారు, బయట నీవు ఎవరితో తిరుగు ఇబ్బందిలేదు నీ లోపల మాత్రం ఉండాలి నీ లోపల ఉండవలసినటువంటివారు ఋషులు లేదా ఋషితుల్యులు.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
download (18).jpgఋషితుల్యమైనటువంటి జీవితాన్ని సమాజంలో కొంతమంది పెద్దలు గడుపుతారు పైకివారు కూడా మనలా సంసారంలో ఉన్నట్లు కనపడుతుంటారు, అగస్త్యుడు సంసారంతోనే ఉన్నట్లువుంటాడు, భారధ్వాజుడు సంసారంతో ఉన్నట్లువుంటాడు, అత్రి మహర్షి సంసారంతోనే ఉన్నట్లువుంటారు కానీ వారే ఋషులు. వారే నిర్ణయంచేశారు రాముని కదలికలను మీరుకూడా అటువంటి ఋషిని మీ హృదయంలో ఉంచుకోవలసి ఉంటుంది. మీ యొక్క కదలికలు జీవితంలో ప్రస్తానమంతా కూడా ఆయనచేత నిర్ణయింపబడి ఉండాలి, యదార్థానికి గురువుగారి అనుగ్రహంపొందడం అన్నమాటకి అర్థమేమిటో తెలుసాండీ ఇందుకు మీరుసిద్ధపడి ఉన్నారా అని గురువుచూస్తాడు మీరు ఆ స్థితినిపొందారు, గురువుగారి మాటను వేదవాక్కుగా మీరు భావనచేస్తున్నారు అన్ననాడు గురువు మీ జీవితక్రమాన్ని నిర్ణయంచేస్తాడు అందుకే మీరు కొంచెంజాగ్రత్తగా గమనించగలిగితే సన్యాసులందరూ గురువులుకారు గురువులందరూ సన్యాసులుకారు మీరు కొంచెం జాగ్రత్తగాచూడండి నేను అన్నమాటని - సన్యాసులు అందరూ గురువులు కావలసిన అవసరంలేదు ఎందుకో తెలుసాండీ! సన్యాసి గురువు అయితే తనకు తాను బరువు, నేను ఎందుకు ఈమాట అంటున్నాను అంటే ʻసన్యాసిʼ అన్నమాటకు అర్థమేమిటంటే ʻసత్ʼ యందు న్యాసముచేశాడు ఆయన ఆయనకు తను చెయ్యవలసిన పని అన్నది ఆయనకేం లేదు.
ఏమీ లేనివానికి మళ్ళీ మీ గురించి యోగక్షేమాలు ఆయన విచారణచేయడం మొదలెట్టాడనుకోండీ ఆయన మీ యోగక్షేమాలు విచారణచేసి మీ అభ్యున్నతిగురించి ఆయనప్రయత్నం మొదలుపెట్టారనుకోండి మీకు ఆశీర్వచాలుచేయడం మీ ఇల్లుబాగుండాలని మీ వ్యాపారాలుబాగుండాలని మీ పిల్లల చదువులుబాగుండాలని మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలని ఆయన ఆశీర్వచనాలుచేస్తూ కూర్చున్నారనుకోండీ అప్పుడు ఆయన సన్యాసం ఏమైంది? కుదరదు ఆయనా లోకంవైపుకు కొంతదృష్టిని మరల్చవలసి వచ్చింది, అలా దృష్టిమరల్చితే ఎంతవరకు మన అభ్యున్నతి కొరకు దృష్టిమరల్చారో అంతవరకూ ఈశ్వరుడి వైపుకి తదేకదృష్టితో ఉండగలిగినస్థితిని కోల్పోయాడా లేదా కోల్పోయాడు. అందుకే సన్యాసులందరూ గురువులుకావాలి అని శాస్త్రంచెప్పదు, కాని కొంతమంది సన్యాసులుమాత్రం గురువులుగావుండాలి ఎందుకుండాలో తెలుసా శంకరాచార్యులవారు చేసిననిర్ణయంలో ఉన్న అద్భుతం అది, ఎవరుండాలంటే గురువులుగా పీఠాధిపతులు గురువులుగావుండాలి. శంకరభగవత్ పాదులు కొన్ని పీఠాలుపెట్టారు ఆ పీఠాధిపతులు సన్యసించి గురువుగావుంటారు, గురువుగా ఉన్నవారు ఏంచేస్తారంటే సనాతన ధర్మమును నిలబెట్టడానికి సమాజమును అటువైపు తిప్పేప్రయత్నం చేస్తారు.
మీరు గోశాలలు కట్టండీ అంటారు, అక్కడ గోశాలకు నీవు విరాళమివ్వూ అంటారు లేకపోతే ఫలానాచోట నీవు ఒక యజ్ఞంచెయ్యీ అంటారు. చేశారు, మీకోక కష్టం వచ్చింది ఎవరితో చెప్తారు మరి ఆయనతోగా చెప్తారు ఇప్పుడు మీ అభ్యున్నతికి పాటుపడాలావద్దా ఆశీర్వచనం చెయ్యాలావద్దా కాబట్టి సన్యాసి గురువుగా ఉండవలసిన ఆవశ్యకతా ఎవరిది అంటే ఒక్క పీఠాధిపతులదే. శంకరభగవత్ పాదులువంటి మహానుభావులు పెట్టినటువంటి పీఠాలకి ఆధిపత్యం వహించినటువంటివారు “సన్యాసమూ గురుత్వమూనూ రెండింటినీ రక్షించుకోగలిగిన దీక్షాదక్షులై” ఉంటారు. అది మరింతకష్టమైనటువంటి ప్రక్రియ తప్పా సన్యాసి అంటే గురువు అవ్వాలని ఏమీలేదు, గురువు అంటే సన్యాసి అవ్వాలని ఏమీలేదు మీరుబాగా గుర్తుపెట్టుకోండి. ఒక గురువుగారు సమాజంలో సంసారంతో ఉన్నాడు అనుకోండి ఆయన గురువుగారిగా ఉండడానికి అనర్హుడిగా మీరేమీతీర్పు చెప్పకూడదు ఆయన ఉండడానికి అర్హుడే. అగస్త్యుడు లేడా లోపాముద్రతో, అత్రి లేరా అనసూయమ్మతో, ఏం వాళ్ళ గురుత్వానికి ఏమైనా లోటువచ్చిందని మీరు అనుకుంటున్నారా! అలా ఏం ఉండదు. వారు సంసారమునందువుండి ఋషిగా జీవిస్తారు, ఒక ఋషి జీవనం ఎలా ఉంటుందో అలా ఆయన జీవనమూ ఉంటుంది.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఇలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞవున్న మహాపురుషులు ఉన్నారే వారు గురువులుగా ఉంటారు, రామ చంద్ర మూర్తిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆయన జీవితాన్ని శాసనం చేసినవాళ్ళందరు కూడా ఈ ఋషులే. అసలు రామాయణంలో ఎక్కడెక్కడి వెళ్ళితే ఏ ప్రయోజనం నెరవేరుతుందో ఎవరు ఎందుకు ఎక్కడికి వెళ్ళాలో రాముడికి ఏది ఇవ్వాలో సీతమ్మకి ఏమి ఇవ్వాలో లక్ష్మణునికి ఏమి ఇవ్వాలో అవి ఎప్పుడు పనికివస్తాయో ఏవి చెప్పాలో అన్ని ఋషులు నిర్ణయంచేసుక కూర్చున్నారు, ఎప్పుడు అవసరమో అప్పుడు రామునియందు ఆ అనుగ్రహాన్ని ప్రకాశింపజేశారు. అవసరమైంది యుద్ధ కాండలో ఆదిత్యహృదయాన్ని వెళ్ళి ఉపదేశంచేశారు అగస్త్య మహర్షి, అవసరమైందీ అగస్త్య మహర్షి ఆయనకు కావలసినటువంటి ఆయుధాల్ని ఇప్పించాడు, అవసరమైందీ భారధ్వాజ మహర్షీ చిత్రకూటంలో ఉండవలసిన అవసరాన్ని చెప్పాడు ఇలా మీరు కొంచెం  జాగ్రత్తగా గమనిస్తే ఋషులతో రామునికి ఉండేటటువంటి అనుబంధం మీకు బాగాజ్యోతకం అవుతుంది.
http://img.sakshi.net/images/cms/2014-08/51409424973_295x200.jpgనేను అందుకే మీతో తరచూ ప్రస్తావన చేస్తుంటాను శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథా అని మీరు చూడకండి, రాముడు ఎవరితో అనుబంధం పెట్టుకుంటూంటాడు ఎవరితో మాట్లాడుతుంటాడు ఎవరు లేకపోతే రాముడు ఉండలేడు ఎవరు లేకపోయినా రాముడు ఉండగలడు మీమ్మల్ని చూడమని చెప్తా... మీరు చాలాజాగ్రత్తగా పరిశీలించాలి రామాయణాన్ని. దశరథుడు వెంటపడ్డాడు నీవులేకపోతే నేను ఉండలేనని ఉన్నాడా అయోధ్యలో, నువ్వు లేకపోతే నేను ఉండలేనని అంది కౌసల్య వెంటపడింది ఉన్నాడా అయోధ్యలో మరి ఎవరు లేకపోతే రాముడు నేను ఇక్కడ ఉండలేనని వెళ్ళిపోయే ఘట్టమేమైనా ఉంటుందా రామాయణంలో ఎక్కడైనా... ఛ్ వీళ్ళులేరండీ అందుకని నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండీ ఇక్కడ నుండి వెళ్ళిపోతానండి అని రాముడు వెళ్ళిపోయినది ఏదైనా ఉందా..? అలా వెళ్ళిపోతే రాముడు ఎప్పుడు లక్ష్మణుడు రామున్ని ఎలా సేవిస్తాడో రాముడు కూడా ఎవర్ని చూడకుండా ఉండలేడో వాళ్ళ దగ్గర ఉంటాడనిగుర్తు. రాముడు ఎవర్ని సేవిస్తున్నాడని మీరు రామాయణంలో పట్టుకుంటారో మీరుకూడా మీ జీవితంలో అలా సేవిస్తూ ఉండాలి. సేవించడం అంటే ఒకమాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ శారీరకంగా దగ్గర ఉండడం కాదు, గురువుని మీ మనసులో పెట్టుకోవడం గురువాఖ్యాన్ని మీ మనసులో పెట్టుకొని ఉండడం మనం ఎప్పుడు ఏదిచేసినా త్రికరణశుద్ధిగా మనం గురువైభవానికి దోహదంచేస్తున్నామా..? ఆయన మాటని అనుష్టాన పర్యంతంలోకి తీసుకొస్తున్నామా..? ఇదీ మీకు మీరు పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం దానికి ఎవ్వరు న్యాయమూర్తులు ఉండరు ఉండే అవకాశం ఉండదు కూడా..!
ఒకవేళ అలా పరిశీలించి చూసి పట్టుకున్నా పట్టుకోవాలనుకుంటే అదిపెద్ద విశేషమేమీకాదు పట్టుకుంటారు పెద్దలు. పట్టుకున్నా వారు దానిమీద తీర్పుకు కూర్చోరు ఎందుకు కూర్చోరో తెలుసాండీ! వాళ్ళ పుణ్యంపోతుంది. ఆయనకు ఎందుకు నీవు అలా ఉన్నావా లేదా నీవంతు. ఆయన బాధ్యత ఏమిటీ ఒకమాట చెప్తాడు వినలేదు రెండోమాట చెప్తాడు రెండోమాట వినలేదు మూడోమాట చెప్తాడు మూడోమాట వినలేదు నాల్గోమాట చెప్తాడు నాల్గోమాట చెప్పాడు వినలేదు ఐదోమాట చెప్తాడు ఇన్నిమార్లు చెప్తున్నాడు ఆయన దూరంగా పోయాడనుకోండి ఆయన ఖర్మ. మీరిది బాగాపట్టుకోవాలండీ జీవితంలో, రామాయణ కథా ఐదునిమిషాల్లో చెప్పేస్తారు అది పెద్దవిశేషం కాదు, రామాయణాంతర్గతమై మన జీవిత అభ్యున్నతికి పనికొచ్చే విషయాన్ని పట్టుకునే విషయంలో మాత్రం ఏమరుపాటు చెందకండి. మీరు ఈ భూమి మీదకాదు ఎక్కడో సముద్ర మధ్యంలో ఉన్నా కూడా గురువుగారు మనసులో ఉన్నారనుకోండి అది నిజమైన శిష్యుడనిగుర్తు ఆయన శిష్యుడు. ఎందుచేతా అంటే గురువుగార్ని మనసులో పెట్టుకొని ఉన్నాడు ఆయనకు పక్కన ఉండక్కరలేదు గురువుగారు ఆయనలో ఉంటారు అంతే ఎప్పుడూ ఉంటారా? ఆయనా ఎప్పుడూ ఉంటారు.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఎప్పుడూ అంతేవాసిత్వంతో ఉంటాడు, అది చాలా మహోన్నతమైన స్థితి, రాముడు ఆ స్థితినిపొందాడు. అలా పొందకుండా తిరగడం గురువుగారితో జీవితం ఇంకొకలా ఉండకూడదు అది దోశభూయిష్టం దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటారు కానీ మీకొక సత్యం చెప్పవలసివస్తే మీకు పాపమే సంక్రమిస్తుంది. ఎందుకో తెలుసాండీ మీరు ఋణపడిపోతారు గురువుగారికి ఆయన చెప్తున్నది ఒకటి ఆయన ధార్మికదృష్టి ఒకటి మీ అనుష్టానంలో అదిలేదు అప్పుడు ఏమౌతుందంటే గురువాఖ్య ధిక్కార దోషం మీకుపడుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి అవునా కాదా! కాబట్టీ గురుభక్తీ అన్నమాటకు అర్థమేమిటంటే గురువుగారు మీకు ఏంచెప్పారో దాన్నిమీరు అనుష్టిస్తున్నారా లేదా! దీనికి మీకు మీరు సాక్షిగా కూర్చోవలసి ఉంటుంది. శ్రీరామాయణం ఇదొక అద్భుతమైనటువంటి స్థితిలోకి తిప్పుతూంది అయోధ్య కాండలో చిట్ట చివర తిప్పినటువంటి మలుపు అనణ్యసామాన్యమైన మలుపు ఇప్పటి వరకూ తపోనిష్టా గరిష్టులైనటువంటి ఋషులను దర్శింపజేస్తారు మహర్షి, ఇవ్వాళ శ్రీరామాయణ కావ్యంలోనే ఒక పెద్దమెరుపు అంతపెద్ద ఆకాశంలో ఒక తటిల్లత అంటే ఒక మెరుపు మెరిస్తే ఆ మెరుపుతో కూడినటువంటి నల్లమబ్బు ఎంత అందంగా ఉంటుందో నల్లమబ్బు అందంగా ఉంటుందా అని మీరు నన్ను అడిగారనుకోండి నల్ల మబ్బు అందంగా ఉంటుంది దేనివల్ల అందంగా ఉంటుందో తెలుసాండీ గుణముచేత అందంగా ఉంటుంది. నల్లమబ్బు నల్లమబ్బుగా కాదు నల్లమబ్బు యొక్క అందం ఏమిటంటే... దాని చల్లతనం నీరు పట్టుకొచ్చి మీ మీద వర్షించడం దానియొక్క లక్షణం దాని అందం ఇది ఆంతరమైనటువంటి అందం మబ్బుది.
https://c4.staticflickr.com/8/7321/28258730851_cd2f4d8c17_n.jpgఆంతరమైన అందం ఉన్నమబ్బూ బాహ్యమునందు కూడా శోభిల్లుతుంది ఎప్పుడు ఒక సౌధామిని ఒక మెరుపుతీగా ఒక నల్లమబ్బులో ఇలా ఏర్పడిందనుకోండి ఇలా తళుక్కున ఒక్కసారి కనపడిందనుకోండి ఇప్పుడు నల్ల మబ్బు అందంగా ఉంటుంది. నల్లమబ్బులో ఈ కంటికి కనపడని అందాన్ని అందంగా కనపడేటట్టు చేసింది ఎవరో తెలుసాండి మెరుపు తీగ అందుకే మంత్ర పుష్పంచేప్తే ఓ మాటచెప్తారు చివర నీలతో యద మధ్యస్థా ద్విద్యుల్లేఖే వ భాస్వరా ! (నీవార సూక వత్తన్వీ పీతా భాస్వత్యణూపమా !!) అదే కారణం. ఆ నల్లమబ్బు మీద మెరిసినటువంటి మెరుపు తీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో భగవంతుని యొక్క గుణములను అనుభవించీ అమ్మవారి అనుగ్రహంతో దానియొక్క వైభవాన్ని నీవు గుర్తుపెట్టుకుని దానిని సాకారముగా నిలబెట్టుకోగలిగినటువంటి స్థితిని నీవు పొందకపోతే నీవు తరించడానికి మార్గము ఏమైనా ఉందని అనుకుంటున్నావా..? నీవు ఇప్పటిదాకా వేసినపూలు ఇప్పటిదాకా చేసినపూజా ఇవికాదు నిజానికి నీవు తరించడానికి మార్గములు  నాన్యః పథా విద్యతేయనాయ (నాన్యః పన్థాయనాయ విద్యతే)  అని తెలుకో బాగా నాన్యః పన్థా ఇంకొక మార్గం

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
లేదు, ఇదొక్కటే మార్గం ఏదొక్కటే మార్గం ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు అని నీవు తెలుసుకోవడం ఒక్కటే నీకు మార్గం. ఇక్కడున్న ఈశ్వరుడి వైపకు అడుగులు వెయ్యాలి అంటే బయటి అడుగులు ఆగిపోవాలి, లోపలికి అడుగులు ప్రారంభం కావాలి, బయటి అడుగులు ఆసీ అడుగులు లోపలికి వెళ్ళేటట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞా లోకంలో ఉన్నవాడు ఒక్కడే గురువు.
http://expresstv.in/images/12186.jpgఅందుకే లలీతా సహస్రంలో ఒకనామం ఉంది అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ బయటతిరిగితే దొరుకుతుందా దొరకదు అంతర్ముఖమైతే దొరుకుతుంది. బహిర్ముఖం నీయంత నీవు అయిపోగలవు నీ ప్రజ్ఞ ఏమీ ఉండదు ఎవడైనా అయిపోతాడు బహిర్ముకుడు దానికి పెద్ద విశేషమేముందండీ, అంతర్మకుడివికా ఇంద్రియాలు పనిచేస్తున్నా చెయ్యని స్థితిలోకి తీసుకెళ్ళు చూస్తాను, నీవు ఇలా కళ్ళుమూసుకొని కూర్చుంటే కాలింగ్ బెల్ కొడితే నీకు వినపడకూడదు నీవు ఉండగలవా? అప్పుడు నీ చెవిలో వినికిడి శక్తి ఏమవ్వాలి నిద్రలో ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి మనసు తీసేసుకోవాలి అప్పుడు తీసుకున్న మనసు ఏం చెయ్యాలి ఈశ్వర పాదముల దగ్గరికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే చూడగలిగిన శక్తిని వెనక్కి తీసుకొని మనస్సు దేన్నిచూడాలి ఈ శక్తితో ఇంకోటిచూడాలి ఏది చూడాలి నీలతో యద మధ్యస్థా ద్విద్యుల్లేఖే వ భాస్వరా మెరుపు తీగతో కూడిన నల్లమబ్బు తళుక్కున ఒక్కసారి మెరుస్తుంది. చాలా సేపు చూడాలనిపిస్తుంది కాని చూడ్డం కుదరదు మెరుపు తీగ గంటల కొద్దిఏమీ ఉండదు ఒక్కసారే మెరుస్తుంది. గురువాఖ్య శ్రవణముచేత మీయందు కలిగినటువంటి నిరతిశయమైన భక్తిచేత నీలోపల మెరిసినటువంటి ఈశ్వరస్వరూపాన్ని ధ్యానమునందు తదేకంగా పట్టుకోవడానికి మీకు గురువాఖ్యము ఉపకరిస్తుంది, అంతర్ముఖమవ్వడానికి పనికివస్తుంది.
యదార్థానికి ఈఁవెనక్కి అడుగులు ఎవరు వేశారో వాడే తరిస్తున్నాడు, ముందుకు ఎవడు అడుగులు వేస్తున్నాడో అంటే బాహ్యంలో ఎంత పెరుగుతున్నా అది పెరుగుదలకాదు మీరు బాగాగుర్తుపెట్టుకోండి, అది ఏమిటో తెలుసాండీ! యదార్థంగా చెప్పాలంటే నేను పరమ సత్యాన్ని మాట్లాడాలి అంటే మీ “పుణ్య క్షయము” దానిపేరు, మీ పుణ్యము క్షయము అయిపోతుందని గుర్తు, పుణ్యం చేసుకున్నారు క్షయమైపోతుంది, బాహ్యంలో పెరుగుదల కనపడుతుంది, అది ఉపకరిస్తుందా అని నన్ను అడిగారనుకోండీ ఈ శరీరంతో ఉన్నంత కాలం పనికి వస్తుంది, వచ్చేజన్మలో కూడా  ఓ శరీరాన్ని పుచ్చుకుంటే సుఖాన్నిస్తుంది. కానీ అసలు ఈ సుఖమూ దుఃఖమూ కాదు నేను ఈశ్వరున్నేచేరాలని అన్నారనుకోండీ ఈఁబయిటి అడుగులు కాదు, లోపలి అడుగులు కావాలి. లోపలికి అడుగులు కావాలీ అంటే ప్రయత్న పూర్వకంగా మీరు బయటి అడుగలు ఆపేయవలసి వస్తుంది, అనవసరంగా ఎవ్వరితోటి సంఘాన్ని ఆపు చేయ్యాలి, ఆపు చేసి అంతర్ముఖత్వం నేర్చుకోవాలి, బాగా ధ్యానంచేసి పట్టుకోవాలి. రామ చంద్ర మూర్తి యొక్క అనుగ్రహమంతా అంతే, రామాయణ కాలంలో బాగాప్రకాశిస్తుంది. శ్రీరామాయణ శ్రవణం చేసేటప్పుడు శ్రీరామాయణ పఠణంచేసేటప్పుడు రామానుగ్రహంతో మీకు ఆఁశక్తి పరిఢవిల్లుతుంది, తొందరగా ఆఁధ్యాననిష్ట కుదురుతుంది అందుకని మీరా కోణంలో రామాయణంను పరిశీలనచేయండి.
ఆ మెరుపు తీగ ఎలా ఉంటుందో ఇవ్వాళ శ్రీరామాయణంలో అటువంటి మెరుపు తీగగా ఒకరు వస్తారు, ఆ మెరుపు తీగ ఎవరో పురుషులు తపస్సు చేయడం ఋషులు కావడం, భారధ్వాజుడు వంటివారు దేవతల్ని కూడా పిలిచి పనిచేయించుకోవడం మనం చూశాము, ఒక స్త్రీ ఎంత స్థితికి ఎదిగిందో త్రి మూర్తులను తన బిడ్డలుగా ఎలా చేయగలిగిందో ఇవ్వాళ మీరుచూస్తారు. అటువంటి మహోత్కృష్టమైన ఘట్టాన్ని అయోధ్య కాండ చివర తీసకొచ్చి అక్కడ చెప్పని రహస్యాన్ని సీతారామ కళ్యాణాన్ని సీతమ్మ నోటితో చేప్పించి పూర్తిచేస్తారు మహర్షి ఇవ్వాళ. అంటే నేను ఇవ్వాళ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కథనంతటినీ ఈ కోణంలో వినవలసి ఉంటుంది తప్పించి కేవలం జరిగిపోయిన కథా అని మాత్రంవినవద్దు.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఇప్పుడూ భరతుడు వెళ్ళిపోయాడు శత్రుఘ్నుడు వెళ్ళిపోయాడు సైన్యమంతా వెళ్ళిపోయింది వచ్చిన ఆ వశిష్టాది ఋషులు వెళ్ళిపోయారు తల్లులు వెళ్ళిపోయారు రాముడు సీతా లక్ష్మణ సహితుడై ఉండిపోయాడు. పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు అంటే ఇంతకు ముందు సీతా రామ లక్ష్మణులు ఉన్నారు, ఇప్పుడు సీతా రామ లక్ష్మణులు ఉన్నారు. సీతా రామ లక్ష్మణులు చిత్రకూటానికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నారు రాజ్యం పోయిందనిబాధలేదు, మధ్యలో వీళ్ళందరూ వచ్చి కనపడ్డారు వెళ్ళిపోయారు రాముడు సంతోషంగా ఉన్నాడు, వాళ్ళువచ్చి వెళ్ళారని రామునికేంబాధలేదు. రాజ్యమే వద్దన్నాడు ఆ బాధవుంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కానీ ఒక గమ్మత్తు జరిగింది అన్నాడు మహర్షి. ఏం జరిగింది అంటే? ఆ చిత్రకూట పర్వతం మీద ఉండేటటువంటి ఋషులు రామున్ని చూసినప్పుడల్లా నోటితో మాట్లాడుకోవడం మానేసి పదిహేను మంది ఇరవై మంది అలా గుంపులు గుంపులు కిందచేరి ఇలా కళ్ళతోటే చూపించేవారట, ఇలా చూపించి అని ఏదో మాట్లాడుకునేవారట ఎంత గమ్మత్తుగా మాట్లాడుతారంటే మహర్షి వాళ్ళ నోటితో మాట్లాడుకోలేదు కనుసైగలే చేశారు మాట మాట్లాడితే ఒక సావకాశం ఉంటుందండి ఏముంటుందంటే మీరు ఏమనుకుంటారో నాకు అర్థమౌతుందండి, మీరు నాకు ఎప్పుడు అర్ధమవుదంటే రెండు కోణాలలోనూ అనుమానం వస్తుంది ఎప్పుడూ...
నేను వచ్చి ఇక్కడ ఇలా నిల్చున్నాను అనుకోండి గురుప్రార్థనకి మీ అందరు ఇలా అన్నారనుకోండి, ఏంటీ అందరూ ఏమనుకుంటారేంటి ఏమయింది ఎందుకలా నన్ను చూపించి భ్రృకుటి ముడేస్తున్నారు అందరూ, నేనేమైనా దోషం చేశానా లేక ఈయనే కోటేశ్వరరావుగారు అని ఏమైనా చెప్తున్నారా..? అనుమానం వస్తుందా రాదా..? అనుమానం వచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నా అంత నేను నిర్ణయం తీసుకోవడం ఒక లక్షణం, నేను అడగడం ఒక లక్షణం. నేను రెండు మూడు పర్యాయాలుచూసి వీళ్ళునన్ను ఏదో వెటకారమాడుతున్నారు నన్ను చిన్నతంచేసి వీడేతగుదునమ్మా అని ఇక్కడ రామాయణం చెప్తున్నాడు ఎదో పెద్దతెలుసు అనుకుంటున్నాడూ అని నావంక ఇలా చూపిస్తున్నారు అని నేను అనుకున్నాను అనుకోండీ నాకు మీపట్ల భిన్నాభిప్రాయం ఏర్పడుతుంది. దానికి వ్యతిరేకంగా ఇయ్యనే రామాయణం చెప్తున్నాడూ ఎంతబాగా చెప్తున్నాడో అనుకుంటున్నారువాళ్ళు అనుకున్నాననుకోండి అహంకారం వస్తుంది కదా రెండూ ప్రమాదమే, ఇప్పుడు నేను ఏ ఇబ్బందీ లేకుండగా నేను మిమ్మల్ని అడిగాననుకోండి ఏమమ్మా ఎందుకిలా అంటున్నారు ఏదైనా ఇబ్బందికలిగిందా తల్లీ నావల్ల అని అడిగాననుకోండి అప్పుడు మీరు ఏదో ఒకవిషయాన్ని నాకు చెప్పారనుకోండి మన మధ్యన అవగాహన కుదురుతుంది. అంటే విషయాన్ని తెలుసుకోకుండా నిర్ణయానికి వద్దామనుకుంటే అడగక్కరలేదు, వాళ్ళని నేను అడగడమెందుకు అనుకోవాలి, అలాగకాదు వాళ్ళకు తెలియకపోవచ్చు మనం కనుకుందాం అన్న ఔదార్యం ఉంటే కనుకోవాలి అందుకే నేను మీతో మనవిచేసేది రామాయణం పైకి కనపడినట్టు ఉండదు. రాముని యొక్క శీలాన్ని చూపిస్తువుంటుంది నీవుకూడా ఇలా ఉండాలి జీవితంలో ఎందుకంటే ఏదో ఒకనాడు మిమ్మల్నిచూపించి అంటే మీరు ఖంగారుపడిపోకూడదు, మీకు అయోధ్య కాండ జ్ఞాపకానికి రావాలి.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి చూడండీ నయనై ర్భృకుటీభి శ్చ రామం నిర్దిశ్య శఙ్కితాః ! అన్యోన్యమ్ ఉపజల్పన్తః శనై శ్చక్రుః మిథః కథాః !! అక్కడ ఉన్న మునులందరూ రామున్ని కన్నులతోటీ ర్భృకుటీభి శ్చ కనుబోమలతోటి అంటే కనుబొమలు ఎత్తి చూపిస్తున్నారు కాని కళ్ళతో చూపిస్తున్నారు, రాముడు చూశాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు తను వెడుతున్నప్పుడు తను వస్తున్నప్పుడు గుంపులు గుంపులుగా ఇలాగే మాట్లాడుకుంటున్నారు, నోటితోకాదు కనుసైగలతో వీళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొళ్ళని అడగడంకన్నా వీళ్ళందరికి కులపతి ఒకడు ఉంటారు, కులపతి అన్నమాట రామాయణంలోదే కులపతి అంటే వెయ్యిమంది శిష్యులు ఉన్నవాడు, నూర్గురు శిష్యులున్నవాడు ఎక్కడకైనా వచ్చాడూ అంటే చాలా గొప్పవిషయము అది అటువంటి ఆయన్ని చాలా బహుదా జాగ్రత్తగా చూడాలి, అంటే జీవితంలో నూరుమంది తనని అనుగమించి అనువర్తించేట్టుగా వాళ్ళ మనస్సుమారేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాక్ వైభవము తపస్సుచేతా సంపాదించుకున్నవాడు వాక్ కి శక్తి మామూలుగా వస్తుందని మీరు అనుకోకండి, కేవలం తపస్సుచేతనే వాక్కు అగ్నిహోత్రం అవుతుంది. అటువంటివారి మాటలే ఎదుటివారి హృదయం మీద పనిచేస్తాయి.
కాబట్టి నూర్గురు శిష్యులు అనుగమిస్తే ఆయన ప్రత్యేకంగా ఆరాధింపబడుతాడు చాలా గొప్పవాడూ అని నిర్ణయము కులపతి అంటే వెయ్యిమంది శిష్యులు ఉన్నారని అర్థము. ఆ కులపతి దగ్గరికివెళ్ళి నమస్కరించి రాముడు అడిగాడు ఎందుకు ఈ మునులందరు నన్ను చూసి కనుబొమ్మలెత్తి మాట్లాడుతున్నారు ఏమైనా కారణం ఉందా..! తనవైపు నుంచి ముందుచెప్పాడు ఇది రాముని పెద్దమనసు అంటే, నాభార్య నన్ను అనుగమించివచ్చింది ఏమీ తెలియదు అమాయకురాలు ఒకవేళ ఆమెవలన మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బందికలిగిందా, నాతమ్ముడు ఇంకా చిన్నవాడు నాతోపాటువచ్చాడు నాతమ్ముడు ఏదైనా తెలియక అపరాధంచేశాడా..? ఒకవేళ అలా జరిగి ఉంటే క్షమించండి ఏమిజరిగిందో నన్నుచూసి మీరు ఎందుకలా అనుకుంటున్నారో దయచేసినాక్కొక్కసారి చెప్తారా..! అని అడిగాడు ఇది ఎంతవినయం చూడండీ, రామున్ని అనుసరించినవారియొక్క నడవడి అలా ఉంటుంది అంటే ఇంక వినయానికి హద్దువుండదు అంతగొప్పగా ఉంటుంది పెద్దల దగ్గరకి వచ్చేటప్పటికి. అంటే ఆయన అన్నారు, ఏమీలేదు నాయనా ధర్మాత్మురాలు సీతమ్మవలన మాకు అపచారమా? అసలు ఆఁమాట ఊహకే అందదు అన్నారు, లక్ష్మణస్వామి అటువంటివాడుకాడు మరి మేమెందుకు ఇలా అనుకుంటున్నారు అనుకుంటున్నావా నీకుచెప్తాను చూడు రావణావరజః కశ్చిత్ ఖరో నామేహ రాక్షసః ! ఉత్పాట్య తాపసా న్సర్వాన్ జనస్థాన నికేతనాన్ !! రావణాసురుని యొక్క సోదరునివరుస కలిగినటువంటి ఖరుడనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు, ఆయన ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, ఆయన తాపసులను వేధించడమే లక్షణంగా కలిగినవాడు ధృష్ట శ్చ జితకాశీ చ నృశంసః పురుషాదకః ! అవలిప్త శ్చ పాప శ్చ త్వాం చ తాత న మృష్యతే !! ఆయన ధృష్ట శ్చ పొగరుబోతువాడు చాలా విశేషమైనపొగరు కాబట్టి ఇవతలవాళ్ళని లక్ష్యపెడదామని ఉండదు.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
పొగరూ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే..? దానికొక ప్రయోజనం ఉండదు మీరు బాగాగుర్తుపెట్టుకోండి, పొగరు అనేటటువంటి ఏంటో తెలుసాండీ! ప్రతిచిన్న విషయంలో తను గొప్పవాన్ని అనుకుని సంతోషపడిపోతుంటాడు దానికిపొగరని పేరు. పొగరంటే నేను ఇంకాబాగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కారు ఇలా తిరగాలి సందులోకి అతను సైకిల్ అడ్డంగా పెట్టుకొని నిల్చున్నాడు కారు తిరుగుతోంది ఏంచేయాలి అతను సైకిల్ పక్కకితీసేయాలి, నేను తీయడమేమిటీ నేనెందుకు తీయాలి, ఎందుకు తీయాలేమిటీ తీయాలి కారు తిరుగుతోంది కాబట్టి నీవు తీయాలి లేకపోతే రెండు గుద్దుకుంటాయి కాబట్టి, కారు పెద్దది సైకిల్ చిన్నదీ కారు తిరగాలంటే సైకిల్ తీయ్యాలి ఇలా నీవు అనుకుంటే తీసేయ్యవచ్చు. నేను తీయడమేమిటీ? దానికి ఏమైనా అర్థముందా..? ఆ కారు ఎవరిదో ఆ కారులో ఉన్నవారు ఎవరో నీకేం తెలియదు నీవెవరో ఆయనకు తెలియదు, వెళ్ళవలసింది కారు తీయవలసింది సైకిలు, కారుని తీసేయడం కుదరదు ఎందుకంటే అది పెద్దది తిరుగుతుంది, తిరగాలంతే అదే ధర్మం నీవు నిల్చున్నావు ఇలా లాగితే చాలు వెళ్తాడు, ఒకవేళ మీరు ఏమయ్యా అలా నిల్చోకపోతే పక్కకి తీయచ్చుగదా అన్నావనుకోండి, నీవు వెళ్ళచ్చుగా అలా అంటాడు దానికిపొగరని పేరు. అంటే మీరు ఇక మాట్లాడకూడదు ఆ పోనిలేండి క్షమించండి అనాలి దాన్ని మీరు వాదించకూడదు అలాంటివారితో ఎందుకో తెలిసాండీ! ఎప్పుడూ మానసికంగా తను గొప్పవాడు అనుకోవాలనుకునే ప్రయత్నంతో ఉంటాడు అది తనంత తాను మార్చుకోవాలి రామాయణం నేర్పుతుంది మనకు.
వాడు రాక్షసుడు వానికి బాధపెట్టడమే, కాబట్టి ఇప్పుడు మీరు కారులోంచి దిగికాని అద్దం దింపిగాని మీరు ఏమయ్యా పక్కకి పెట్టచ్చుగదా సైకిలూ అని మీరు అన్నారనుకోండీ వాడు ఏమంటాడంటే..? ఏం అలా వెళ్ళలేవా? నీవు అంటున్నావేమిటీ మాటా మాటా పెరిగింది ఇంక మాటా మాటా పెరిగింది ఇంక దాని గురించి నేనెందుకు చెప్పడం కాబట్టి అది పొగరు అది ఉండకూడదు జీవితంలో చాలా దోషభూయిష్టమండి అదీ, దానికి అసలు అర్థమేమీ ఉండదికా పరిచయం లేకుండా కూడా ఎంతపొగరుగా ఉంటారో నేను చెప్పలేను మనం చాలామందిని చూస్తుంటాం అది దిద్దబడాలి అందుకే నేను చెప్తుంటాను రామాయణం పెద్దలతోపాటు పిల్లలుకూడా వినాలి అవగుణములుపోతాయి వాళ్లు సంతోషంగా ఉంటారు సమాజం సంతోషంగా ఉంటుంది. అంటే మునీ ఎలా చెప్తున్నారో చూడండీ! మునికి దోషం పట్టుకొనే లక్షణం ఉండదు, కాని అవతలవాని గురించి ఒక అవపాక్షికమైనమాట ధృష్ట శ్చ జితకాశీ చ వాడికి పనేమిటంటే పొగరు ఎక్కడుందో అక్కడ నిష్కారణ యుద్ధాలను ఆహ్వానిస్తాడు దానికేం కారణంలేకుండా వాడు గొడవకువస్తాడు, గొడవకొచ్చేది ఎప్పుడంటే ఎప్పుడూ వాడుగెలవాలని కాబట్టి మీరు ఏమాటంటే చిన్నబుచ్చుకుని మనకెందుకు విడితోటని వెళ్ళిపోతారో అలా వాడు మెట్లు ఎక్కేస్తాడు మీరు అలా ఎక్కలేరు కాబట్టి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతారు అదే వాడి గెలుపు. ఎన్నిమాట్లు గెలిచాడో అన్నిమాట్లు ఉండకూడని రీతిలో ప్రవర్తిస్తుంటాడు జితకాశీ చ నృశంసః క్రూరుడు, క్రూరుడు అంటే అవతలివారిబాధ తనకు సంతోషంగా బ్రతికేటటువంటివాడు, పురుషాదకః మనుష్యుల్ని తింటూవుంటాడు వాడికి అదొక లక్షణం. అవలిప్త శ్చ విపరీతమైనటువంటి గర్వం ఇవన్నీ మనసులో పెట్టుకొని నాఅంతవాన్ని లేడనుకుంటాడు ఎప్పుడూ పాప శ్చ పాప శ్చ అంటే వాడు ఈశ్వరుడివైపుకి అడుగులు వెయ్యకుండా వీడు చేసిన ఈ పనులే వాడికి ప్రతిబంధకంగా వస్తాయి.
ఇది ఎక్కువైతే ఏమౌతుందో తెలుసాండీ..! రామాయణంలో మీరు అది పట్టుకోవాలి పాపం పెరుగుతూంటే మీరు భగవంతునివైపు వెళ్ళి మీరు మనసుని మార్చుకున్నారా పాపం తరిగి ఈశ్వరుని వైపుకు వెళ్ళుతారు మీరు ఈశ్వరిడి వైపు అడుగులు వేయకుండా పాపాన్ని పెంచుకున్నారా ఈశ్వరుని చేతులో నిహతులైతారు, అప్పుడు ఏం చేస్తాడంటే ఈశ్వరునికి మార్గం ఉండదు కాబట్టి పడగొట్టేస్తాడు ఆయన, కాబట్టి మారట్లేదు నేను ఏం చేయను ఇంత ఉపాది ఇచ్చినందుకు చేస్తున్నాడు ఈ అల్లరి కాబట్టి ఉపాది తీసేస్తాడు, ఇప్పుడు మీరు పిల్లాన్ని ఆడుకోరా అని చెప్పీ ఎదో ఒక చిన్న ధనుస్సు ఇచ్చి ప్లాస్టిక్ ది

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఇచ్చారండీ వాడు దాన్నిపట్టి అందర్నీ కొడుతున్నాడు, ఇంటికీ ఎవరో పెద్దమనుషులు వచ్చారు మీరు సంతోషంగా అయ్యా మంచి నీళ్ళు తాగుతారా..? అని లోపలికి వెళ్ళారు, వచ్చినాయనా వేదం చదువుకున్న ఘనాపాటి ఇంటికొచ్చారు మీరు లోపలికి వెళ్ళారు ఆయనా ఏదో కళ్ళు మూసుకొని మంత్రం చేసుకుంటున్నారు వీడొచ్చి ఆ ధనస్సు తిరగేసి ఆ ప్లాస్టిక్ ధనస్సు పెట్టి ఆయన్ని కొట్టాడు తొడమీద ఆయనా ఘనాపాటి ఆయన వేదం చదువుకున్నాయన తెలుసు ఆయన నవ్వేసి తప్పు నాన్నా అలా కొట్టకూడదు అన్నాడు. మీరు చూశారు ఏం చేస్తారు ఇప్పుడూ కొట్టకని బోధచేస్తారా ముందు ఆ ధనుస్సు లాగేస్తారా..? చెప్పండి నాకు... తీసేస్తారు ముందు ఆ ధనస్సుని పిల్లాడి చేతిలోంచి. ఈశ్వరుడు కూడా అంతే ఇది వీడికి ఇచ్చాను కాబట్టి వీడు ఇలా బాధపెట్టేస్తున్నాడు కాబట్టి తీసేస్తాను ఇక తప్పదని తీసేస్తాడు. అదే పాపమును తీయడానికి ఈశ్వరుడు రావడము అన్న మాటకు అర్థం అది.
http://prabhanews.com/wp-content/uploads/2016/08/Guru-Sishya-300x175.pngనీవు పెంచుకుంటూపోతే నిన్ను తీసేయడం వినామార్గంలేనిస్థితి వస్తుంది, నీవు ఏదైనా అడ్డుపెట్టుకుని విపరీతంగా అహంకరిస్తే దాన్నితీసేయడంవినా ఈశ్వరుడికి ఇంకోమార్గం లేకుండాపోతుంది. ఇది ఎప్పుడూ చాలా జాగ్రత్తగా జ్ఞాపకంపెట్టుకోవాలి, ఇంకో పెద్ద ధనస్సు ఇంకో నాలుగు బాణాలు అవికూడా ఎప్పుడిస్తారు తండ్రిగారు తాతగారండీ తాతగారండీ ఇంటికి ఎవరో పెద్దలు వచ్చారూ బాణం అక్కడ పెట్టేసి ఆయన కాళ్ళకు దండంపెట్టాశాను తాతగారండీ అని అన్నారనుకోండి మనమడూ ఏదడిగానాకొనిస్తారు తాతగారు తూపాకీకూడా కొత్తదొకటి కొనిస్తారు ఎందుకనీ ఘనాపాటిగారు వస్తేకొట్టడువాడు నమస్కారంచేస్తాడు, వాడికి తెలుసు యుక్తాయుక్త విచక్షణ తెలుసు కాబట్టి ఎవరికి ఇస్తాడు ఈశ్వరుడు ఎవడి ఈశ్వరుడు చెప్పినట్టు వాడుతాడో విభూతిని వాడికి ఇస్తాడు. ఎవడు ఈశ్వరుడు ఇచ్చిన దానిని ఈశ్వరుడు చెప్పని దానికి వినియోగిస్తాడో వాడికి ఆ విభూతి తీసేస్తాడు దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడమే పాపమూ అని పేరు అవతల పెరుగుతుంది పెరగడం అది పడిపోడానికి.
రాముడితో చెప్తున్నాడు ఈ విషయాలు కాబట్టి ఖరుడు ఎవరి చేతిలోపడిపోతాడు రాముని చేతిలోనేపడిపోతాడు తరువాత, అరణ్య కాండ వచ్చేస్తుంది రేపటినుంచి పడిపోతాడు అంటే పధ్నాలుగు వేలమంది వచ్చినా ఒక్కడే పడగొట్టేస్తాడు, ఈశ్వరుడు ఒక్కడుచాలు పడగొట్టేయడానికి ఎంత మందినైనా పడగొట్టేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆయనదిచెయ్యగలడన్న భయంతోబ్రతకడం భక్తి అని పేరు. అది లేని విచ్చలవిడితనం ప్రమాదమునకు హేతువై ఉంటుంది. కాబట్టి అవలిప్త శ్చ పాప శ్చ త్వాం చ తాత న మృష్యతే నాయనా! ఈ కారణంచేతా మేమూ ఇక్కడ ఉండకుండా బయలుదేరాలి అనుకుంటున్నాం, తరువాత మీ ఉనికిని సహించలేకపోతున్నాడు ఎందుకో తెలుసా నీవు క్షత్రియుడవు నీవు కావాలి అని ఇంతమందివచ్చి రాజ్యపాలన చేయమని అడుగుతున్నారు, నీకు శస్త్ర అస్త్రములు తెలుసు, నీవు చేతిలో ఒకగొప్ప కోదండాన్ని అక్షయ బాణతునీరాల్నీ కవచాన్ని కట్టుకుని తిరుగుతున్నావు నీవు అతనితో యుద్ధం చేస్తావేమో మాతోకలిసి ఉంటున్నావు కాబట్టి మమ్మల్నిరక్షించి అతన్ని పడగొడతామేమోనని అతడు భయపడుతున్నాడు ఆ భయపడడంవల్ల ఏం చేస్తున్నాడో తెలుసా..? త్వం యదా ప్రభృతి హ్యస్మిన్ ఆశ్రమే తాత వర్తసే ! తదా ప్రభృతి రక్షాంసి విప్రకుర్వన్తి తాపసాన్ !! నీవు ఇక్కడకొచ్చి మేము నీతో అన్యోన్యంగావుండి నీవు మాతో అన్యోన్యంగా ఉంటే రేపు మనిద్దరికి శత్రువు అతను కాబట్టి మమ్మల్ని రక్షించిడానికి తనని వేదిస్తావనీ అనవసరంగా మమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్నాడు ఇప్పుడు విచిత్రమైనటువంటి వికృతమైన రూపాలు చూపిస్తున్నాడు మేంభయపడిపోతున్నాం.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
హోమం చేసుకుందాం అక్కడ స్రుక్కులు స్రువాలు పెట్టుకునివుంటే విసిరేస్తున్నాడు నెయ్యి పెట్టుకుంటే ఒంపేస్తున్నాడు అగ్నిహోత్రాన్ని వ్రేలిస్తే ఆర్పేస్తున్నాడు తాపసలు అలా వెళ్ళిపోతూవుంటే పట్టిచంపి తినేస్తున్నాడు, పూర్వం వీళ్ళు మనల్ననేం చేస్తారని ఊరుకునేవాడు ఇప్పుడు మాయందు క్రోధం అతిశయించింది, దీనికి కారణం నీవు ఇక్కడికి రావడమే అందునా ఇప్పుడు నీ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఉంటాడా..! అసలు ఊరుకోడు మమ్మల్నందర్నీ వరుసగాచంపేస్తాడు అందుకే నీవు ఇక్కడుండూ మేం ఇంకో చోటుకు వెళ్ళిపోతాం, నీవువెళ్ళు నీవువచ్చాక మాకు ఇబ్బందులు వస్తున్నాయని మేము అనము ఎందుకో తెలుసా ఇదిమర్యాదా అన్నమాట. మనమైతే కోర్టులో కేసులన్నివేసేసి ఇదినాది ముందు నేను వచ్చాననే గొడవలు మునుల గొప్పతనమేమిటంటే నీవువచ్చావు ఉండు మేమువెళ్ళిపోతాము ఇక్కడనుంచి. ఇతరుల ప్రశాంతత కోరుకుంటారు తప్పా తమ అధికారాన్ని వారుకోరుకోరు వారినిమునులు అంటారు, మౌనంగా ఉండి ఎప్పుడూ ఈశ్వరుని విషయాన్ని మననం చేస్తారు కాబట్టి వాళ్ళకు మునీ అని పేరు.
Image result for రాముడు అడవులలోకాబట్టి మేము వెళ్ళిపోతాం నాయనా ఇక్కడ నుంచి అని అన్నారు. వాళ్ళందరూ వేరేచోట కందమూలాలు దొరికేచోటకు వెళ్ళిపోతామూ అనిచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ రాముడటా... వారువెళ్ళిపోతే ఉండలేకపోయాడట, ఇది మీరుపట్టుకోవాలి. మీగిలినవి ఏవిపోయినా ఉంటాడు, ఋషులులేకపోతే ఉండలేకపోయాడట ఎందుకూ? అంటే అటా... తనన్నావాళ్ళ ఆశ్రమానికివెళ్ళి కూర్చునేవాడటా లేదా వాళ్ళన్నా రాముడిదగ్గరికి వచ్చేవారట ఎందుకండీ ఏముంటుంది వాళ్ళదగ్గర, వాళ్ళదగ్గరికి వెళ్ళి మంచివిషయాలు అడిగి తెలుసుకునేవాడు, లేదా వాళ్ళందర్నీపిలిచి కూర్చోబెట్టి కందమూలాలు పెట్టి వాళ్ళందర్ని నాలుగు మంత్రాలు చదవమనిచెప్పి నాలుగు మంచిమాటలు వాళ్ళదగ్గరవినేవాడు. అటువంటి వాళ్ళదగ్గర ఉండి వాళ్ళ మంచిమాటలు వినకపోతే నేనొక్కన్నే ఏదో పధ్నాలుగేళ్ళూ పూర్తిచేసేయ్యడానికి అడవిలో ఉన్నానంటే అడవిలో ఉండడానికా..? అటువంటి మహాత్ముల సంఘముచేత నా బుద్ధిని నేను బాగాపదును పెట్టుకోవాలి, అందుకనీ వాళ్ళు లేకుండా నేనుంటే ప్రయోజనమేముంటుంది. ఎవరుండకూడదో వాళ్ళున్నారు, వాడికి నాకు యుద్ధం తప్పా ఇక్కడ ఉండడంవలన ప్రయోజనమేమిటి కాబట్టి నేను కూడా వేరొక చోటకి వెళ్ళిపోతాను అని ఈ నిర్ణయం తీసుకున్నాడట.
కాబట్టి బాగాజ్ఞాపకంపెట్టుకోండీ! జీవితంలో మీకు అనుబంధమన్నది ఎప్పుడు ఎవరితో ఉండాలి మానసికంగా ఇలా సిద్ధపడి ఉండాలి, ఎప్పుడూ ఋషులతోటి సంఘముతో ఉండాలి మనిషి, ఋషులతోటి సంఘం అంటే ఎవడు వేదాన్నినమ్మాడో శాస్త్రాన్నినమ్మాడో ఎవడు నిజంగా ఈశ్వరున్ని చేరుకునేటటువంటి ప్రయత్నంలో జీవనాన్ని సాగిస్తున్నాడో అటువంటివాడితోటి సంఘము మీ జీవితాన్ని కూడా ఉద్దరిస్తుంది. తప్పా ఆయన్నివదిలేసి మిగిలినవన్నీ మీరు పక్కనపెట్టుకున్నా ప్రయోజనమేం ఉండదు, మిగిలినవన్నీవదిలేసి ఆయన్ను పట్టుకుంటే వద్దన్నవి కూడా మీకు మళ్ళీవచ్చేస్తుంటాయి, ఎందుకంటే మార్గం అదిగొప్పది కాబట్టి అదితీసుకొస్తుంది ఇవన్నీపట్టుకుని అదిదూరం చేసుకుంటే ఉంటాయని నమ్మకం ఏం లేదు నీవు

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
పట్టుకున్నా ఉంటాయని నమ్మకంలేదు, దశరథుడు పట్టాభిషేకం చేస్తానంటే అయిందా ఏమిటీ అవదు, కాబట్టి రామాయణం చిట్ట చివరలో తీర్పుచేప్తూంది రాముడి కదలికలకు, మీతో అన్నాను కదా ʻఆయనం అంటే కదలికాʼ రామాయనం అంటే రాముని కదలిక రాముడి కదలికలు ఎలా ఉంటాయో మీరు పరిశీలనం చేయడం రామాయణం చదువుకోవడం తప్పా రామాయణం చదవుకోవడం అంటే ఇటు పక్క శ్లోకాలు ఇటు పక్క తాత్పర్యాలు చదువుకోవడం కాదు, ధ్యాననిష్టతో రామాయణాన్ని పరిశీలనంచేయడం బాగాగమనించడం ఏ శ్లోకంలో ఏమాట ఎలా ఉందీ ఆ మాట మనజీవితంలో మనం ఎలా అన్వయం చేసుకొని దిద్దుకోవలసి ఉంటుందీ అన్నది మీరుపట్టుకుంటే రామాయణం మిమ్మల్నిచెక్కుతుంది, పట్టుకోకుండా రామాయణాన్ని రామాయణంగా ఓసారి ఇన్ని శ్లోకాలు ఇన్ని వినేటటువంటిదన్నది ఎలా ఉంటుందో తెలుసాండీ? నోటికి అలవాటుపడిపోయి ఏదోతిప్పేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానికి ఏమీ అర్థమేమీ ఉండదు, ప్రయోజనం ఉండదా అంటే ఉంటుంది, కాని అది నీ మనసు మీదప్రభావం ఏమైనా చూపిస్తుందా అంటే నేను ఆ హామీ ఇవ్వడం చాలాకష్టం. చెప్పడం కుదరదు అలా చదవగా చదవగా ఏమైనా మరిచూసే అదృష్టం ఏమైనా రామ చంద్ర మూర్తి ఏమైనా కల్పిస్తారేమో అని నేను అనవలసి ఉంటుంది అంతే.
Related imageకాబట్టి ఇప్పుడు రాముడు సీతా లక్ష్మణ సహితుడై ఇక్కడ ఋషులులేరు కాబట్టి ఇక్కడ మనం ఎందుకు అనవసరంగా ఉండడం కాబట్టి మనం వేరొకచోటుకి వెళ్ళిపోదాం ఋషులు అన్నారు నీవుకూడా మాతోవచ్చేస్తే వచ్చేయ్ అన్నారు కానీ ఆ ఋషులతో రాముడు వెళ్ళితే అదే ఇబ్బంది అవుతుంది మళ్ళీరాముడు అన్నాడు మీకు ఎందుకు మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు వాళ్ళు అన్నారు ఎందుకులే ఆ ఇబ్బంది అన్నారు, రక్షించడం అంటే ఏమిటండీ వాళ్ళతో యుద్ధం వాళ్ళతో యుద్ధంచేసిన తరువాత జయాప జయములు విధినిర్ణీతములు. అంతగొప్ప రామరాయలు ఆ తుంగభద్రా నది తీరంలో వెళ్ళినటువంటి ఎడ్లబల్లతో ఓడిపోయాడు ఏం చేస్తాం. ఎంత సైన్యం రామరాయులవారిది విజయనగరంలో అంత సైన్యమున్న రామరాయులు ఇటుపక్కనుంటే నదికి రాత్రికి రాత్రి అటుపక్క చాలా తక్కువ సైన్యమున్నటువంటి సుల్తాన్లు రామరాయుల్ని ఓడించడానికి ఎడ్లబండ్లు ఖాలీ బండ్లు కొన్ని వేలబండ్లు తీసుకొచ్చి బండికి పదేసి కాగడాలుకట్టి పైకితోలారు ఏగువకి ఇటునుంచి చూస్తే కాగడాలు పట్టుకుని సైన్యంవెళ్ళిపోతుందని అనుకున్నాడు రామరాయులవారు తనసైన్యాన్నంతటినీ ఆ కాగడాలు చూస్తూవెళ్ళిపోండి వాళ్ళు ఎక్కడ యుద్ధంచేస్తే అక్కడ యుద్ధంచేయ్యండి అని తనసైన్యాన్ని పంపించాడు. అవతలి సైన్యం అలాగే ఉంది, రామరాయుల సైన్యంవెళ్ళిపోయింది. తెలతెల వారుతుండగా వాళ్ళు ఇక్కడే వచ్చి ఫిరంగుల్లోకినీళ్ళుపోసి రామరాయులవారి భద్రగజం మీదపడి భద్రగజానికి నల్లమందుకలిపిపెట్టేశారు అది రామరాయులనే కిందకిపడేసింది విజయనగరం పథనమైపోయింది.
అంతే, ఆరు నెలలు దోచుకున్నారు విజయనగరాన్ని ఆరు నెలలు పట్టింది దోచుకోవడానికి అంటే అంత ఐశ్వర్యవంతమైన రాజ్యం ఇప్పటికీ హంపీ విజయనగరానికి వెళ్ళి బద్దలైపోయిన విగ్రహాల వంకచూస్తే ఒక్కొక్క విగ్రహాన్ని చెక్కడానికి గణపతి దేవాలయం ఉంటుంది, నరసింహ మూర్తి దేవాలయం కనుల నీరు చమరుస్తుంది, ఎంత గొప్ప నిర్మాణం రా..! ఇవన్నీ అనీ అంతంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఎవరికి తెలుసు యుద్ధంలో జయాప జయములు ఎటుంటాయో, జయాప జయములు విధి నిర్ణీతములు కాబట్టి ఇప్పుడు సరే నీవు యుద్ధం చేయి వాళ్ళు చనిపోతారు మనం కలిసుందామని మనకెందుకు మనం సర్వభూత హితే రతః అన్ని భూతముల యొక్క ప్రేమను కోరుకుందాము, నీవు మాతో వస్తావా..? మా ప్రారద్భం ఎలా ఉంటే అలా అవుతుంది, నీవు రావా? మేము బయలుదేరుతాము, నీవు ఇక్కడ ఉండడమా ఉండకపోవడమా నీ ఇష్టం. రాముడో ఉండలేడు వాళ్ళో చెప్పినా వినలేదు కానీ తనకు ఇప్పుడు మార్గమేమిటీ ఋషులున్న ఇంకో ప్రదేశానికి పోవాలి, కాబట్టి ఆయన కూడా విడిచి పెట్టేశాడు పర్ణశాల ఆయన విడిచి పెట్టేశాడు అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి సీతమ్మ ఏమనాలండీ, హా.. వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు మనంకెందుకండీ హాయిగా చక్కగా మంచిగా తేనె దొరుకుతుంది పళ్ళు దొరుకుతున్నాయి సుఖంగా ఉంది, ఏదో ఈ పక్కనే భరధ్వాజ ఆశ్రమం ఉంది కొద్ది క్రోసుల దూరంలో ఏదో అయిపోయింది అంతేగాని ఎందుకండీ మళ్ళీ ఇకడ్నుంచి ఇల్లు మారడం ఏం వద్దూ అనాలి కానీ ఆవిడ అలా అనలేదు, రామున్ని అనుగమించింది అనుగమించడం గొప్ప భర్తని. ఏ సేవకు వచ్చాడో ఆ సేవకు అలాగే ఉంటాడు లక్ష్మణుడు రాముడు చెప్తాడు వాళ్ళు వింటారు.
కాబట్టి ఇప్పుడు బయలుదేరాలి ఆయన ఇంకొకకారణం కూడాచెప్పాడు ఇక్కడికి కౌసల్యా సుమిత్రా కైకేయీ భరతుడూ శత్రుఘ్నుడు సైన్యం వశిష్టాది మహర్షులు అందరూవచ్చారు అందుకు ఇక్కడ ఉంటే వాళ్ళునాకు జ్ఞాపకానికి వస్తున్నారు ఎక్కువగా, రెండు ఇక్కడికి వచ్చినటువంటి సైన్యంలో ఉన్నజంతువులన్నీ మలమూత్రములను విసర్జించి ఈ ప్రదేశమంతా సౌచాన్నికోల్పోయింది, కాబట్టి వేరొకప్రదేశానికి వెళ్ళిపోదామన్నాడు. బయలుదేరారు బయలుదేరి వారు మార్గమద్యంలో వెడుతుండగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు, మీరు బాగాగుర్తుపెట్టుకోండి ప్రయత్నపూర్వకంగా మీరు మహానుభావులు ఉన్నప్రదేశాన్ని తొక్కడం మీ అభ్యున్నతికి హేతువు అవుతుంది తెలిసికాని తెలియకకానీ వేరే ఈశ్వరుడు ఎక్కడో ఉండడండీ..! గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట యదార్థమే కానీ నిజంగా ఈశ్వరుడు ఎక్కడుంటాడో తెలుసా..? మీరు బాగాగుర్తుపెట్టుకోండి ఇక్కడ నిరంతరము ప్రతి ఊపిరిలో ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో ఎక్కడ నిల్చుంటాడో ఎక్కడ తిరుగుతాడో ఆయనవెంటే తిరుగుతుంటాడు ఈశ్వరుడు ఎప్పుడూ, రాముడు ఎక్కడుంటాడో అనిచెప్తారో తెలుసాండి శాస్త్రంలో రామ చంద్ర మూర్తిని నమ్ముకుని ఎక్కడ బ్రతుకుతున్నాడో రాముడు అక్కడే ఉంటాడు, పక్కనే ఉంటాడట ధనుద్ధరుడై ఆయన కూర్చుంటే కూర్చుంటాడు ఆయన నిల్చుంటే నిల్చుంటాడు ఆయన వెడుతుంటే వెడుతాడు ఆయనవస్తే వస్తాడు అంతే ఆయన పడుకుంటే తను ఇలా కూర్చుంటాడట గుమ్మంముందు ఎందుకంటే ఆయనకు ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమోనని.
రామ చంద్ర మూర్తి తనని నమ్మినవాళ్ళని రక్షించడానికి గడపముందుకువచ్చి కూర్చునివుంటాడూ అని, అందుకే రామున్ని నమ్ముకున్న రామ భక్తులు ఎక్కడుంటారో అక్కడే సీతా రామ లక్ష్మణులు హనుమా కూడా ఉంటారు మీరు దీన్ని బాగాజ్ఞాపకంపెట్టుకోండి మీకు నేను సత్యం చెప్తున్నాను, ఇది తులసీదాసుగారి జీవితంలో నిజమైందండీ! తులసీ దాసుగారు రామదర్శనం అవ్వాలి రామదర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకున్నారు, పడుకుంటే దొంగవచ్చి కన్నంవేసి లోపకెళ్ళీ ఆచమనపాత్రా అవి ఇవి ఏదో దొరికాయి మూటకట్టుకుని బయటకువద్దామని అనుకున్నాడు తల బయటపెట్టాడు రామ లక్ష్మణులు ఇద్దరు కోదండాలు పట్టుకునినిల్చున్నారు. నన్ను నమ్ముకున్నవాడి సొత్త ఎత్తుకపోతావా నీవని, ఆయన వాళ్ళు

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
http://teluguone.com/tonecmsuserfiles/hanuman%20chalisa%20puttuka%20%20%20%204.pngవెళ్ళిపోతారుగదా అని వెనక్కివచ్చాడు, తెల్లవారేవరకు తల బయటపెడుతున్నాడు లోపలపెడుతున్నాడు బయటపెడుతున్నాడు లోపలపెడుతున్నాడు రామ లక్ష్మణులు ఇద్దరు బయట అలానే ఉన్నారు కన్నం బయట, తులసీదాసుగారు తెల్లవారింది నిద్రలేచి లోపలికి వచ్చారు, దొంగలు ఇద్దరు మూటలు కట్టుకకూర్చున్నారు మీరు ఎవరురా నాయనా ఇలా కూర్చున్నారు అన్నారాయన ఏం లేదు బుద్ధిగడ్డితిని వచ్చాములే ఏదో ఆచమన పాత్రమూటకట్టాము మరి పట్టుకపోలేకపోయారా అన్నాడాయన మహాత్ములైనవారి రక్షణ అలా ఉంటుంది వారుపోతాయనేమి బెంగపెట్టుకోరు పోతే  నమః చోరాయచ ఈశ్వరుడు తీసుకపోయాడండీ అంటారు.
ఎక్కడో ఇంకా అవసరం ఉందన్నమాటా స్వతంత్రంగాభావించాడు నా తండ్రి వీడిదైతే ఏమి అనుకోడు మనం పట్టుకెళ్ళచ్చనిచెప్పీ నా వస్తువు మీ వస్తువే అంటారు చూడండీ కొంతమంది మీదిగావాడుకోండి నాకు అస్తమానం చెప్పకండి అంటారు చూడండి తీసుకెళ్ళండి అని చెప్తారు. మన మోహన్ రావుగారు ఉన్నారు ఆయన అలా అంటూంటారు అలాగే మోహరావు గారు ఒసారి కారుపంపించండి అనకండి అలా అంటారేమిటి అది నీకారే నీకారుని నీవు వాడుకుంటున్నావు కారు పంపించండి అని శాశించండి అంతేకాని మీకారు అని అనకండి గురువుగారు అంటారు. అలా ఉంటారు కొంతమంది వాళ్ళప్రేమ అలా ఉంటుంది. అలా రాముడు తనవస్తువులాభావిస్తాడు అందుకనీ ప్రేమ ఉంది కాబట్టి నా వస్తువు అని పట్టుకపోయాడు అనుకుంటారువాళ్ళు అందుకని ఆయన అన్నారు ఎందుకురా నాన్నా కూర్చున్నవాళ్ళు ఎందుకురా నాయనా ఆయసం పట్టుకపోలేకపోయారా ఆచమనపాత్ర అన్నాడు. ఆపాటి బుద్ధిలేక కాదు మేమేం ఏదో ఏసి ఉందని కూర్చున్నామనుకుంటున్నారేమో బయటికి వెళ్తే ఎవరో ఇద్దరు ఉన్నారు ఒకాయన నల్లగా మేఘంలా ఉన్నాడూ ఒకాయన ఎర్రగా ఉన్నాడు కోదండాలు పట్టుకుని కూర్చున్నారు, హడలి లోపలికి వచ్చి కూర్చుంటున్నాం, బయటికి వెడదామంటే ఎన్నిమాట్లు వెడితే అన్నిమాట్లు మా వంక ఇలా చూస్తున్నారు అందుకని మళ్ళీ వెనక్కి వస్తున్నాం అన్నారు.
ఆయన బయటికి వెళ్ళిచూశారు ఎవ్వరులేరు అప్పుడు ఆయన ఏడ్చారు తులసీదాసుగారు ఒక వెండి ఆచమన పాత్ర ఉన్నందుకు పోతుందేమోనని నిద్రపోకుండా స్వామీ నా పర్ణశాలముందు కాపలా ఉన్నావా మీరు ఎంత ధన్యులురా మీరు ఎన్నిసార్లు దర్శనంపొందారు నాకు దర్శనం అవలేదని ఏడ్చారు. నేను అందుకే మనవిచేశాను ఎవరు రామున్ని నమ్మారో వాడు ఉన్నచోట రాముడు ఉంటాడు తప్పా ఇంకొకచోట రాముడు ఉంటాడని మీరు అనుకోకండి రామ భక్తులు ఎక్కడ ఉంటారో సీతా రాములు అక్కడే ఉంటారు, ఆయన రావడం కన్నాముందు వాళ్ళువస్తారు మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన వెళ్ళిన తరువాత బిక్కమొఖాలు వేసుకొని ఛ్.. ఛ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇక్కడ తిరిగేవారు ఇక్కడ తిరిగేవారు ఆయన వెంట వెళ్ళిపోతారు అంతప్రేమగా ఉంటారు వాళ్ళు. మీకు ఇది ప్రత్యేకించి రామావతారంలో మెండుగా కనపడుతుందండీ!
త్యాగరాజ స్వామి విషయంలో కనపడింది, రామ దాసుగారి విషయంలో కనపడలేదాండి భద్రాచలంలో గంజికుంటలో పడిపోయినటువంటి పిల్లవాని శవాన్ని ఉడికిపోయినదాన్ని తీసుకెళ్ళి రాముని దగ్గరపెట్టి నీవిచ్చిన కొడుకు ఇవ్వాలనుకుంటే ఇవ్వు లేకపోతే నీలోకలిపేసుకో అంతరాలయంలోపెట్టి తలుపులేసి రామనామ భజనచేశాడు ఆయన రఘురాముడు పిల్లవాడు పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒడిలోపడుకున్నాడు. ఏం ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి మీకు ఈ మధ్యవారేగా రామదాసుగారు ఆయన వాడినటువంటి మంగళ సూత్రంలో మూడో శతమానం కూడా మనం కళ్యాణంలో చూస్తున్నాముగా ఉన్నాడూ రాముడు మీరు నన్ను నమ్మండి రాముడు ఉన్నాడు. ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు మీరు నమ్మి

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
http://telugu.boldsky.com/img/2015/03/27-1427450952-ramnavmi.jpgఉన్నచోట మీవెంట రాముడు ఉన్నాడూ రాముడు లేకపోవడం లేదు మీరు పడుకుంటే ఆయన మీరు పడుకున్న చోట కుర్చీలో ఆయన కూర్చుని ఉంటాడు మీరు తింటూంటే అప్పుడు ఆయన కూడా పక్కన విస్తర వేసుకొని ఓ అరిటాకు పెట్టుకుని మీరు ఇంత అన్నం మహా నైవేద్యంపెడితే అదే సమస్త షడ్రసోపేత భోజనంగా భావించి తిని సంతోషిస్తాడు ఎక్కడ రామున్ని నమ్మినవాడు ఉన్నాడో అక్కడే సీతా రాములు కూడా ఉంటారు, అందుకే శాస్త్రంలో ఒకమాట ఉంది రామున్ని తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామ భధ్రుని తెలుసుకోవడమే, తెలుసాండీ రామ భక్తుడు వస్తే సీతారాములు వస్తారు.
కాబట్టి ఇప్పుడు రాముడు బయలుదేరి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు, ఆయన అన్నారూ సో అత్రేః ఆశ్రమమ్ ఆసాద్య తం వవన్దే మహా యశాః ! తం చాపి భగవాన్ అత్రిః పుత్రవత్ ప్రత్య పద్యత !! భగవాన్ అత్రి ఆయన బ్రహ్మమానస పుత్రుడు, అత్రి మహర్షి అంటే సామాన్యమైనటువంటి వాడుకాడు మహానుభావుడు అత్రి, అటువంటి అత్రి మహర్షీ నీకు నమస్కారము. మేము మీ ఆశ్రమానికి వచ్చాము అని సీతా రామ లక్ష్మణులు సాక్ష్యాత్ విష్ణువు లక్ష్మి అని అత్రికి తెలుసు. కానీ నరుడిగా ఉన్నాడు కనుకా ఋషులకుముందుగా ఆయనే నమస్కారంచేస్తాడు, భగవాన్ అత్రి అని ఆయనకునమస్కారం చేస్తే తనపుత్రుల్ని ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించాడట, ఒక గురువుకి ఒక ఋషుకి ఉండేటటువంటి లక్షణం అది. బిడ్డలు తప్పుచేసినా ఎలా మన్నించగలడో తండ్రి గురువు ఋషితుల్యుడు మన్నించిచేరదీస్తాడు, చేరదీసాడు కదా అనీ మీరు మీ నడవడి మార్చుకోకుండా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు అత్రి మహర్షి అనసూయమ్మను చూపించి ఆ సీతా రామ లక్ష్మణులతో చెప్తున్నాడు. మహోత్కృష్టమైన ఘట్టమండీ నాకు శ్రీరామాయణంలో అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఘట్టాలలో నాకు ఇదొకటి దశ వర్ణాణి అనావృష్ట్యా దగ్ధే లోకే నిరన్తరమ్ ! యయా మూల ఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తితా !! రామా! నా భార్య అనసూయమ్మ అని ఉంది ఆ అనసూయమ్మ ఎటువంటిదో తెలుసా రామా..! ఒక పది సంవత్సరాల పాటు అనావృష్టి వచ్చింది, ప్రజలకు తినడానికి ఏమీ లేక చచ్చిపోతున్నారు, అప్పుడు నాభార్య ఎండిపోయిన గంగానదిని ప్రవహించేటట్టుచేసింది తన తపః శక్తితో, నీటితో ప్రవహించేటట్టుచేసి ఎండిపోయినటువంటి భూమిలోంచి కందమూలములు వచ్చేటట్టుగా మొక్కలు ఆకుపచ్చ తనంతో పెరిగి కాయలూ పళ్ళు పండేటట్టుగాచేసింది, చేసి ఈ ప్రజలందరికి అన్నం పెట్టేటట్టుచేసింది నా భార్య అంత గొప్పతల్లి నాభార్య.
కడుపున పుట్టినవాళ్ళకి అన్నం పెడతారు ఈ ప్రాంతంలో ఉన్నవారందరికీ పదేళ్ళు పెట్టింది నాభార్య అంతటి విశాలమైనటువంటి మనసున్నది, లోకమంతటిచేత అమ్మా అని పిలిపించుకున్నటువంటి తల్లి ఉగ్రేణ తపసా యుక్తా నియమై శ్చాపి అలంకృతా ! దశ వర్ష సహస్రాణి యయా తప్తం మహత్ తపః !! దశ వర్ష సహస్రాణి ఆమె పదివేల సంవత్సరములపాటు చాలా కఠినమైన నియములతో తపస్సుచేసింది ఒక స్త్రీ నా యొక్క అనుమతితో, మీరు బాగాజ్ఞాపకం పెట్టుకోండీ ఆడది నోము చేస్తుంది, ఆడదివ్రతం చేస్తుంది, కానీ ఆడదిచేసే నోముకీ ఆడదిచేసే వ్రతానికీ సిద్ధినిదేవతలు ఎప్పుడిస్తారో తెలుసాండీ... ముందు భర్తపాదాలకు నమస్కరించి అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే యోమే భర్తా సమే గురుః అది వదిలేసి ఆయన్ని

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఆయనకేం తెలియదండీ ఆయన వెర్రాడండీ ఆయన పిచ్చాడండీ ఆయనేం చేసుకోడండీ అన్నీ నేనేచేస్తుంటానండీ మాఇంట్లో పూజలన్నీ అన్న ఇంట్లో ఈశ్వరుడు ఆదరించడు. నేను ఉన్నమాట మాట్లాడుతున్నాను అంతే నేనువేదాన్ని నమ్ముకున్నవాన్ని నేను శాస్త్రాన్నినమ్ముతున్నాను నేను రామాయణాన్ని నమ్ముకున్నాను, నేను ఏది నమ్ముకున్నానో నేను అదే మాట్లాడుతాను ఇంకోలా మాట్లాడటంనాచేత కాదు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEheL5Nplna8wgLbSuilscEw_NFbpmK-rRA7y6FalRFHuqK25WI4QiY36a3PoZZejB2hOVaYQPSe7Ul46MKc7f6npI811MqGZU2mY99beBBuloiVmnkJHLx-biqCYNpu9aAyEG4Qw28i_UDf/s1600/atri+maharshi.jpgకాబట్టి అత్రి అంటున్నారు అనసూయా వ్రతై స్నాతా ప్రత్యూహా శ్చ నివర్తితాః ! దేవ కార్య నిమిత్తం చ యయా సంత్వరమాణయా !! దశ రాత్రం కృతా రాత్రిః సేయం మాతే వ తేనఘ !!! తామ్ ఇమాం సర్వ భూతానాం నమః కార్యం యశస్వినీమ్ ! అభిగచ్ఛతు వైదేహీ వృద్ధామ్ అక్రోధనాం సదా !! అనసూయేతి యా లేకే కర్మభిః ఖ్యాతిం ఆగతా !!! ఆయన అంటున్నారూ ఈ అనసూయ ఎంత గొప్పదో తెలుసా రామా! ఈమే దేవతల కొరకు పది రాత్రులని ఒక రాత్రిగా మార్చింది, సుమతీ అనీ ఆవిడ కూడా చాలా పతివ్రతే కానీ మొన్నన మనవిచేశాను రెండు రకాలుగా అనుష్టానము ఉంటుంది, భర్త ఏంచెప్తే అదిచేసేవాళ్ళు కొందరు, భర్తతోపాటు శాస్త్రంబాగా తెలిసి ధర్మాధర్మములు ఆయనతో మాట్లాడుతూ కలిసి ఆయననీ దిద్దుతూ తననీ దిద్దుకుంటూ అనుభవించేవారు కొందరు, సీతా రాములు రెండవ కోవలోకి వస్తారు, సుమతి మొదటి కోవలోకి వస్తుంది, ఆవిడ భర్త ఏంచెప్తే అది. భర్త ఒకరోజు ఒక ధారుణమైన కోరికకోరాడు దానిగురించి నేను విశేషంగా ప్రస్తావన చెయ్యక్కరలేదు మీరుదాని గురించితెలియనివారు కాదు, ఆవిడ బుట్టలో పెట్టుకుని రాత్రివేళ తీసుకెళుతుంది, ఆయన కోరుకున్నటువంటి వెశ్యామందిరానికి.
అక్కడ మాండవ్య మహామునీ అని, మాండవ్య మునికి ఆయనకి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం అనుభవానికివచ్చి ఆయన్ని కొరత వేశారు, కొరతవేశారు అంటే శూలారోహణంచేశారు, ఆయన శూలంలోకి దిగుతున్నారు, దిగుతుండడంతో విశేషమైనబాధతో ఉన్నాడు చీకట్లో ఈవిడ బుట్టలో తీసుకెళ్తూ ఉండడంతో ఈ బుట్టలో కూర్చున్నటువంటి కౌశికుడు అంటారు ఆయన్ని, ఆయన యొక్క చెయ్యి ఆ మహర్షి యొక్క భుజానికి తగిలింది, చాలాబాధతో శూలం దిగుతూంది ఆయన శరీరంలోకి అదొక శిక్షవేసేవారు పూర్వం, శూలం మీద కూర్చోబెట్టి వదిలేస్తారు అది అలా దిగుతుంది లోపలికి లోపలనుంచి దిగుతూ వస్తూంటుంది ఎంతబాధ ఉంటుంది, అప్పుడు భుజానికి తగిలితే శరీరం కదిలితే ఎంతబాధ ఉంటుంది ఆయనకి కోపం వచ్చింది, నేను అసలే కొరత శిక్షతో బాధపడుతుంటే నన్ను ఇంకొంత బాధపెట్టావు కాబట్టి నీవు సూర్యోదయానికి మరణిస్తావు అన్నాడు. వెంటనే సుమతి అందీ సూర్యోదయం అయితే నా భర్తపోతాడు కనుకా సూర్యుడు ఉదయించుకుండుగాకా అన్నది, ఇప్పుడు ఒకరు తపస్సుచేత శపించాడు ఇంకొకరు పాతివ్రత్యంచేత సూర్యోదయాన్ని ఆపివేశారు ఇప్పుడు సూర్యోదయం ఆగిపోయింది ఇప్పుడు ఆవిడకి ఎవరెళ్ళి చెప్పినా ఆవిడ ఏమనేదంటే తెల్లవారితే నాకు వైధవ్యమొస్తుంది కాబట్టి నేను తెల్లవారనివ్వను.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
తెల్లవారడమన్నది ఆగిపోతే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోతే లోకంలో ఒక విచిత్రమైనస్థితి వస్తుంది మీరు గమనించాలి రాత్ర పగలు ఉన్నాయి కాబట్టి మనకు సంతోషంగా గడచిపోతుందండీ, ఎప్పుడూ పగలే ఉందనుకోండి అసలు బతకలేము ఎప్పుడూ రాత్రే ఉందనుకోండి అస్సలు బ్రతకలేము పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు ఉంటోంది కాబట్టీ మనం సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతున్నాం. ఇప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోయాయి, ఆగిపోతే ఇప్పుడు దేవతలందరు ఎవరిని ప్రార్థించాలి అంటే వెళ్ళి ఆ మహాతల్లి అనసూయమ్మని ప్రార్థనచేయండీ అన్నారు, ఆ తల్లి అనసూయా నీకేం ఫరవాలేదు సూర్యోదయం అవనీ నీ భర్త మరణిస్తాడు నా తపఃశక్తిచేత మళ్ళీ నేను బ్రతికిస్తాను అని సూర్యోదయం అయ్యేటట్టుచేసి ఆవిడ మళ్ళీ ఆమె భర్తను బ్రతికించి ఆవిడ ఐదోతనాన్ని నిలబెట్టింది అంతగొప్పది అటువంటి తల్లీ ఈమే తామ్ ఇమాం సర్వ భూతానాం నమః కార్యాం యశస్వినీమ్ ఈమె సర్వభూతములచేతా కూడా నమస్కరింపబడడానికి యోగ్యురాలు అందుకే ఎక్కడెక్కడ అనసూయా శ్వరూపంగా సుహాశినిని పూజచేస్తారో అక్కడ అక్కడ అది చూసినవారికి ఐదో తనం నిలబడుతుంది.
అది చూసిన వాళ్ళకి దేవతలయొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు సృష్టిలో అనసూయలా ప్రవర్తించినవాళ్ళు ఆ పాతివ్రత్యము అంతగొప్పది ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే పురుషుడికి తపస్సుగొప్పా ఆడదానికి పాతివ్రత్యంగొప్ప, ఆడది పురుషున్ని అనుగమించగలిగితేచాలు అలా అనుగమించగలిగితే ఆమెకు అంత తపఃశక్తి వస్తుంది అంతే ఆవిడ అటువంటిస్థితిని చేరుకుంటుంది ఆర్ష ధర్మం అంతే మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు అనుగమించింది నన్ను అలా అంతస్థితిని పొందింది ఇటువంటి తల్లీ సర్వభూతములచేత నమస్కరింపబడడానికి యోగ్యురాలైంది, మనుష్యులు కాదు సమస్తభూతములు అనసూయకి నమస్కారంచేస్తాయి ఈ ఆశ్రమంలో అటువంటి తల్లీ వృద్ధామ్ అక్రోధనాం సదా చాలా వృద్ధురాలైపోయింది అక్రోధనాం ఆమెకు క్రోధముండదు - కోపం ఉండదు, కోపం ఎందుకు ఉండదండీ కోపం ఉండకపోవడం ఏమిటీ కోపం ఉండక పోవడం అంటే కోపం ఎక్కడ నుంచోరాదు కదాండీ కాకినాడ నుంచి నేను వచ్చినట్టు కోపం ఎక్కడనుంచైనా వస్తుందేంటీ? కోపం ఎక్కడనుంచోరాదు కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త! అంటారు శంకరాచార్యులవారు. కోపము అన్నది ఇక్కడ నుంచే వస్తుంది, ఇక్కడ నుంచి పైకి లేవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది, అవకాశం చిక్కిందనుకోండీ పైకి వస్తుంది అంతే ఒక్కసారి. వచ్చేటప్పటికి మీ రూపం మారిపోతుంది మీ స్థితిని మీరు అప్పటివరకు ఎలా ఉంటారో దానినిచంపేసి మీలోంచి ఒక కొత్తవ్యక్తిని పుట్టించగలదు క్రోధం ఇది పుట్టదూ అంటే రెండే రేండు కారణములకు పుట్టదు ఒకటి ఏమిటో తెలుసాండీ? మీకన్న అధికుల్నిచూసి మీరు నమస్కరించినటువంటి లక్షణానికి కోపమెందుకు ఇంకా ఆయన మనకన్నా అధికుడూ ఆయన చెప్పినమాట మనం విందాం కోపం ఎందుకింకా..? మనకన్నా తక్కువవాడు ఆయన వృద్ధిలోకిరావాలని కోరుకుందాం కాబట్టి తెలియదు కదా పాపం దోశం చేస్తున్నాడు అంత క్రోధం దేనికండీ? ఇది ఆవిడ మాతృ హృదయం.
కాబట్టీ ఆవిడకి క్రోధమన్నది రాదయ్యా ఎప్పుడూ ఆవిడ వృద్ధురాలైపోయింది, ఎంత తపస్సుచేసిన పండో ఆవిడ అంతగొప్ప తల్లి అనసూయేతి యా లోకే కర్మభిః ఖ్యాతిం ఆగతా ఆవిడ ఎప్పుడూ కోపము ఎరుగని తల్లి కాబట్టి, ఎప్పుడూ శాంత మూర్తి కాబట్టీ పెద్ద ముత్తైదువ కాబట్టి ఆమెకు ʻఅనసూయʼ అని పేరువచ్చింది. ఆమె కద్ధమా ప్రజాపతి దేవభూతీల యొక్క పెద్ద కుమార్తె, ఆమెను ఒకానొకప్పుడు త్రి మూర్తులు వెళ్ళిపోతున్నారు అత్రిముని ఆశ్రమంనుంచి తమ దివ్య విమానాల్లో వెళ్ళిపోతూంటే విమానాలు ఆగిపోయాయి, ఆగిపోతే ఎందుకు వెళ్ళడంలేదు విమానాలు అని అడిగారు, కింద అత్రి మహర్షి ఆశ్రమం ఉంది అనసూయమ్మ ఉంది వారువున్న చోట పైన మీరైనా సరే మీరు త్రి మూర్తులైనా సరే మీ విమానాలు ఎగరవు

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
Related imageఅన్నారు త్రి మూర్తులకి ఆవిడ యొక్క కీర్తిని మరింత ప్రకాశింపజేయ్యాలనిపించింది మీ రెప్పుడూ గుర్తు పెట్టుకోండి అంతేగాని అర్థం పర్థం లేకుండా ఆవిడని పరిశీలనం చేయడానికి రావడం అలాంటిపిచ్చి పనులుచేయరు త్రి మూర్తులు మీరు జాగ్రత్తగా గమనించాలి శాస్త్రాన్ని, ఇంత గొప్ప తల్లీ అంటే లోకానికి తెలియాలి ఈవిడ ఖ్యాతి అంటే ఆవిడ ఖ్యాతి ఆవిడ లోకాని చెప్పుకునే ప్రయత్నంచేయదు అలాంటి పనులేమీ ఉండవు ఆవిడకి ఆవిడ తపస్సు ఆవిడది అంతే. కాని ఆవిడ గొప్పతనం లోకానికితెలియాలి లోకానికి తెలియడమెందుకు లోకానికి తెలిస్తే వీళ్ళకి ఏమొస్తుంది, ఆదర్శంగా తీసుకొని మిగిలిన వాళ్ళుబ్రతుకుతారు అందుకు చెప్పాలి దేవతలు.
కాబట్టి ఇప్పుడు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాల్లో భోజనానికి వచ్చారు, అత్రికి ధర్మం ఉంది ʻఅతిథి దోవోభవʼ అందుకని ఆయన వాళ్ళని నిమంత్రణంచేశాడు వచ్చికూర్చున్నారు భోజనంచేయడానికి, వాళ్ళన్నారు తీరాభోజనానికి కూర్చున్నాకా మేము ఒక వ్రతంలోవున్నాం ఆ వ్రతంలో మాకు నియమేమిటంటే యజమాని భార్య మాకు వడ్డనచేసేటప్పుడు యజమాని వడ్డనచేస్తాడు పరివేచనాన్ని యజమానివేస్తాడు, అది పెద్దలువస్తే భోజనంపెట్టేటప్పుడు తీరు అందుకే పెద్దలువస్తే భోజనంపెడుతున్నాం అనరు అదేం గుఱ్ఱంకాదు గాడిదకాదు అన్నంపెట్టడానికీను. ఆయనను దేవతార్చనకుపిలుస్తారు యజ్ఞం చేయడంతో సమానమది అంటే పరిచేచనానికి వేస్తారు ఐదుసార్లు నీళ్ళు. మీరు వేస్తారు స్వాహాకారంతో తీసుకుంటాడు ఐదు మార్లు ఆయన కాబట్టి ఇది శాస్త్రమర్యాద కనుకా ముగ్గురినీ పిలిచి భార్యనివడ్డించమన్నాడు. భార్యవడ్డించకుండా ఇంట్లో పనిపిల్ల వడ్డించకూడదు అది నీ పొగరుకి లక్షణము నీ భార్య ఉన్నది అందుకు పెద్దలువస్తే వడ్డించడానికి అంతేకాని తను ఎక్కడో కూర్చుని ఇంట్లో పనిపిల్ల వడ్డించడం మర్యాదకీ భంగపాటు అది. ఎక్కడ ఎవరున్నారో ఏ ఆశ్రమంలో ఎవరున్నారో అది తెలుసుకుని ప్రవర్తించాలి, అందుకని స్నాతకంచేసి గురువుగారు చెప్తాడు ఇప్పుడు ఎందుకున్నావో తెలుసా ఇప్పుడు గృహస్తాశ్రమంలోకి వెడుతున్నది, నేర్చుకో ʻఅతిథి దేవోభవాʼ అని అంటారు.
Related imageకనుకా... ఇప్పుడు అనసూయమ్మ వడ్డించాలి వాళ్ళు అన్నారు మా వ్రతం ఏమిటంటే..? ఇవ్వాళ మేము భోజనం చేసేటప్పుడు ఆ యజమాని భార్య మాకు నగ్నయైవడ్డించాలి అంటే ఒంటిమీద వస్త్రంలేకుండా వడ్డించాలి ఇప్పుడు ఇదీ ఆమెకు చెందిన విషయం అలా వడ్డిస్తుందా వడ్డించదా..! అత్రి ఏమీ అనలేదు, మీ అసాధ్యం కూలా అదేం వ్రతంరా మీకు అని ఆయన ఏమీ అనలేదు, ఎక్కడుందీ ఈ వ్రతం అనలేదు ఆయన వెళ్ళి భార్యని అడిగాడు వాళ్ళకది నియమమంటాని ఎందుకంటే అతిథి కూర్చున్న తరువాత నీవు ఏ కారణంచెప్పి లేపేయ్యకూడదు, ఇది మర్యాదండీ మనకు శాస్త్రంలో అంత

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఉదారంగా మాట్లాడాయి మన శాస్త్రాలు అంమృతాన్ని ఇచ్చేశాడు అంతే వారు రాక్షసులని కూడా తెలిసి పంక్తిలో కూర్చుంటే లేపకూడదనిచెప్పి, ఏం నేర్చుకుంటున్నాం మనం మనకు నేర్పాయి పురాణాలు కాబట్టి వాళ్ళకి నగ్నగా వడ్డించాలట, మరి వడ్డిస్తావా? అన్నాడు అత్రి. ఆవిడ అందీ అది పెద్ద విషయమా! అలాగే వడ్డిద్దాం అంది. ఆవిడముందు బట్ట కట్టుకుని వచ్చింది, వచ్చి మంత్రాక్షతలు తీసుకుని వచ్చింది. మంత్రాక్షతలు అంటే నడుము విరగనటువంటి బియ్యానికి అక్షతా అని పేరు అది తన చేతిలో పట్టుకుని మంత్రాన్ని ఉపాసనచేసి తన తపఃశక్తిని ప్రవేశపెడితే అవతలివారు దానికిలొంగవలసిందే, తనుకోరుకున్నట్లు తనుచేయగలదు, ఆవిడ ఆ మంత్రాక్షతలు చేతపట్టుకుని వచ్చి ముగ్గురి తలమీదావేసింది. వేసి పసిబిడ్డలగుదురుగాక అంది ముగ్గురూ ఆఁ వేసినటువంటి ఆసనాల మీద పసిపిల్లలైపడుకున్నారు. అమ్మ తన కొడుకు పసిపిల్లవాడు అక్కడే ఆడుకుంటుంటే అమ్మవాన్ని ముద్దులాడుతూ స్నానం చేసివచ్చి ఒళ్ళుంతుడుచుకుంటుంది బట్టలు కట్టుకుంటుంది.
వాడిలో మనోవికారం ఉంటుందా..! పసితనానికి ఉన్న గొప్పతనం అది అంటే పసిపిల్లలు ముగ్గురూ అలా కూర్చున్నారు, పడుకుని ఆడుకుంటున్నారు ఆవిడ వడ్డించేసింది, మళ్ళి బట్టలు కట్టుకుని వచ్చింది ముగ్గిరి మీద మంత్రాక్షతలు వేసింది తినండి అంది, ముగ్గురూ త్రి మూర్తులు ఏ రూపాల్లో వచ్చారో ఆ రూపాల్లో తిన్నారు, తినేసిన తరువాత ఆవిడ అందీ, పిల్లల విషయంలోగా తల్లి అలా ప్రవర్తిస్తుంది, అన్యుల విషయంలో కాంత అలా ప్రవర్తించదుగా నగ్నంగా వచ్చి ఎవరిముందూ నిలబడదు, నేను దానిగురించి పెద్ద వ్యాఖానాలేం చెయ్యక్కరలేదు, పసిపిల్లలైతే అమ్మ హృదయం వేరు ఆ పసిపిల్లాడి మనసువేరు పసిపిల్లాడు అక్కడ ఆడుకుంటుంటే అమ్మ స్నానాల గది తలుపు తెరిచి వాడు ఏ ప్రమాదాలు తెచ్చుకుంటాడో అని స్నానంచేసేస్తుంది, అమ్మ అలా ఉండబట్టి కదాండీ బతికి బట్టకట్టాం, అమ్మ ఆ ప్రేమ చూపించకపోతే మన బ్రతులుకు ఎక్కడున్నాయి, కాబట్టి అమ్మ తనం బిడ్డతనాన్నేచూస్తుంది, కాబట్టి మీరు తిన్న తరువాత కూడా నాకు అలాగే కనపడండి అంది ఆవిడ ఇంక వాళ్ళెవరు? కనపడకుండా ఉండడానికీ వాళ్ళ ప్రమేయం లేదు ఆవిడ తపఃశక్తి అంత గొప్పది, అన్నం తినేయడం అయిపోయిన తరువాత మళ్ళీ అక్షతలు తీసివేసింది, ముగ్గురూ పసిపిల్లలు అయిపోయారు, మూడు ఉయ్యాలలు కట్టి ఊపింది, మీకు అలా వడ్డించాను కాబట్టి నేను తల్లిని మీరు బిడ్డలు కాబట్టి పడుకోండి ముగ్గురూ అంది కాబట్టి ముగ్గురూ పడుకున్నారు అంతే..!
ఆవిడ ఊయల ఊపుతుంది ఇప్పుడు పరి ఎవరు తీశారు, కీర్తి ప్రకాశింపజేయడం మాట దేవుడెరుగు ముగ్గురు ఉయ్యాలలో పడుకున్నారని ముగ్గురూ వచ్చారు లక్ష్మీ సరస్వతీ పార్వతీ ముగ్గురూ వచ్చారు, ఎలా? పూజకోసం కాదు భర్తలని ఇమ్మని పరుగెత్తుకుంటూ వచ్చారు అమ్మా అమ్మా పసిబిడ్డల్ని చేశావు కదామ్మా మాకు మా భర్తల్ని ఇచ్చేయ్యమ్మా అని అడిగారు, అదెంతపని మళ్ళీ మంత్రాక్షతలు వేసింది ముగ్గురూ బిడ్డలయ్యారు ముగ్గురిని ముగ్గరి కోడళ్ళకూ ఇచ్చేసింది. ఇప్పుడు ముగ్గురూ కొడుకులు అయ్యారు, లలితా పరా భట్టారికా స్వరూపం శాస్త్రంలో ఏదో ఆ లలితా పరా భట్టారికా స్వరూప స్థాయికి చేరింది అనసూయమ్మ. ఇది ఆవిడ గొప్పతనం అటువంటి అనసూయా స్వరూపం గురించి చెప్పీ, ఆ స్వరపాన్ని తీసుకొచ్చి ఒక సుహాసినీ యందు ఆవాహన చేసి పూజ చేయకపోతే దోషమైపోతుందండీ, శాస్త్రాలు మీకు చూసే అవకాశం ఇచ్చాయి, ఒక సువాసీనిని కూర్చోబెట్టి మీరు స్త్రీ సూక్తంతో ఆవాహన చేసి పూజచేస్తే మీరు అనసూయమ్మకు జరుగుతున్న పూజ మీరు చూసినట్లే దానిచేత మీరు ధన్యులు అయిపోతారు చూపున శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురా లాపంబుల బొగడె నదితి లక్ష్మీనాథున్ అంటారు పోతనగారు. చూపులతో తాగి తాగి ఆనందము అనుభవించాలి ఒక్కొక్కసారి అందుకు కదా ఈ ఘట్టం తరువాత అనసూయా వస్తుంది, సువాసినీ పూజ జరుగుతూంది అనసూయా స్వరూపంగా ఇదయ్యా ఆవిడ గొప్పతనం.
కాబట్టి ఇప్పుడు రామా నీవు ఆ అనసూయమ్మ దగ్గరికి నీవు సీతమ్మని పంపించు సీతమ్మ లోపలికి వెళ్ళీ అనసూయమ్మతో మాట్లాడుతుంది అనీ అనసూయను పిలిచారు అత్రి మహర్షి, రామ లక్ష్మణులు సీతమ్మ నమస్కారం చేశారు. ఆయన అన్నారూ అనసూయా! సీతమ్మని లోపలికి తీసుకెళ్ళూ అన్నాడు, వాళ్ళిద్దరికి తెలుసు ఏమివ్వాలో ఎందుకివ్వాలో రామాయణాన్ని ఎలా తిప్పాలో ఋషులకు తెలుసు, కాబట్టి ఇప్పుడు అనసూయ్మ సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళుతుంది, వెళ్ళుతున్న అనసూయమ్మ ఎలా ఉందో మనకి నిజంగా వాల్మీకీ... అందుకు కదాండి ఋషి ఋణం వచ్చింది. అనసూయమ్మ ఎలా ఉండేదండీ అన్నారనుకోండీ! ఆవిడ వృద్ధురాలు అని మహర్షి చెప్పారు ఎలా ఉందో మనం చూడ్డానికి వీలుగా లైవ్ టెలిక్యాస్ట్ అంటారే శాక్తికమైన ప్రత్యక్ష ప్రసారం చేస్తారు దానిని మహర్షి. ఆయన అంటారూ శిథిలాం వలితాం వృద్ధాం జరా పాణ్డుర మూర్ధజామ్ ! సతతం వేపమానాంగీం ప్రవాతే కదళీ యథా !! ఆవిడ శిథిలాం శరీరమంతా శిథిలమైపోయింది వలితాం ఆ తల్లి ఒళ్ళంతా ముడతలు పడిపోయాయి వృద్ధాం వృద్ధురాలు అయిపోయింది జరా పాణ్డుర మూర్ధజామ్ వృద్ధాప్యం చేత ఆవిడ తలంతా వెరసి ముగ్గుబుట్ట అయిపోయింది పెద్దదైయింది, పెద్ద ముత్తైదువ సతతం వేపమానాంగీం ఆవిడ ఇలా వణికిపోతూంది చేతులు అవీ ప్రవాతే కదళీ యథా గాలి వేస్తే అరటి చెట్టు ఎలా కదలిపోతూందో అలా కదిలిపోతోంది, అటువంటి తల్లి బయటికి వచ్చీ సీతమ్మ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది.
Related imageలోపలికి వెళ్ళిన సీతమ్మ అనసూయమ్మ ఏం మాట్లాడుకున్నారో మనకు వెంటనే కెమోరా అటు తిప్పుతాడు మహర్షి, అదే రామాయణానికి గొప్పతనం అదే, నేను చెప్పానుగా ఏకాంతంగా చదవండీ రామాయణాన్ని మామూలుగా చదవకండీ అని నేను అంటుంటాను మీరు దాన్ని అలా చూస్తూంటేనే మీకు రామాయణం కదిలేటట్టుగా ఆయన రచన చేశారు, ఇప్పుడు మీ సంతోషం ఎవరి మీద ఉంటుంది ఇంత చెప్పాక సీతమ్మ అనసూయమ్మ ఏం మాట్లాడుకుంటున్నారో లోపలా అని ఉంటుంది. బయట అత్రి రామ లక్ష్మణులు ఏం మాట్లాడుకుంటున్నారో అని మీకు ఉండదు, వెంటనే కెమెరా అటు తిప్పుతాడు మహర్షి అంటే నా ఉద్దేశం ఆయన యొక్క ఘంటం అటుగా తిరుగుతుంది అని దానర్థం. మీరు ఆ శ్లోకంలో ఆ శబ్ధంలో దర్శనం చేయవచ్చు అభివాద్య చ వైదేహీ తాపసీం తామ్ అనిన్దితామ్ ! బద్ధాంజలి పుటా హృష్టా పర్యపృచ్ఛత్ అనామయమ్ !! లోపలికి వెళ్ళినటువంటి సీతమ్మ అంజలి ఘటించింది. ఇలా అంజలి ఘటించి రెండు చేతులతో శిరసు వంచి నమస్కరించింది, నమస్కరించి ఆతల్లిని తాపసీం తామ్ అనిన్దితామ్ అనిందిత అంటే స్వచ్ఛమైన మనసు కలిగిన అనసూయా దేవికి నమస్కారం చేసింది.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
వెంటనే అనసూయమ్మ అందీ ఇంక పెద్ద హడావిడేమీ లేదండీ, వెంటనే ఆవిడ ఓ మాట అంది తతః సీతాం మహా భాగం దృష్ట్వా తాం ధర్మ చారిణీమ్ ! సాన్త్వయ న్త్యబ్రవీత్ ధృష్టా దిష్ట్యా ధర్మమ్ అవేక్షసే !! చాలా సంతోషించినటువంటి మనస్సుతో అనసూయమ్మ ఇలా చూసిందట సీతమ్మవంక దేనికి సంతోషం నమస్కారం చేసిందనా కాదటా... మహర్షీ ఎందుకు అనసూయమ్మ సంతోషించిందో చెప్తున్నారు దిష్ట్యా ధర్మమ్ అవేక్షసే ధర్మాన్ని పట్టుకున్నావు కనుకా... అమ్మా! నీవు ధర్మాన్ని పట్టుకున్నావమ్మా సీతమ్మా..! నాకది సంతోషమేస్తుందమ్మా అదీ ఏమిటి సీతమ్మ పట్టుకున్న ధర్మం? వెంటనే చెప్తుంది ఆవిడా... త్యక్త్వా జ్ఞాతి జనం సీతే మానమ్ బుద్ధిం చ మానిని ! అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమ్ అనుగచ్ఛసి !! నీవు జ్ఞాతి జనాన్ని విడిచిపెట్టావు మీ మామగారు రెండు వరాలు ఇచ్చి కైకమ్మ రామున్ని అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పగానే నా భర్తకి ఇంత కష్టపెట్టినటువంటి ఈ మామగారి ఇంట్లో నేను ఉండి ఈయనకి నేనెందుకు సేవచేయాలి మీరు 14 యేళ్ళు అరణ్యవాసానికి వెళ్ళివచ్చి మీరు పట్టం కట్టుకున్న తరువాత నేను వస్తాను, అప్పటి వరకు నేను పుట్టింటిలో ఉంటానని జనక మహారాజు గారియొక్క కూతురు అయోనిజయైనటువంటి సీతమ్మ అనుకుంటే అలా పుట్టింటికి వెళ్ళవచ్చు. లేదా నేను అరణ్యవాసానికి ఎక్కడ వస్తానండీ ఇక్కడే ఉంటానులేండీ అని రాముడే ఉండమన్నాడు గనుక అక్కడ ఉండవచ్చు. జ్ఞాతి జనాన్ని విడిచిపెట్టీ అక్కడా ఉండకా ఇక్కడా ఉండకా మానమ్ బుద్ధిం చ మానిని ఐశ్వర్యాన్నంతటినీ కూడా విడిచి పెట్టేసి, అహంకారాన్ని విడిచిపెట్టేసి రాముడికన్నా ఒక విషయంలో సీతమ్మది ఒక మార్కు ఎక్కవ ఆవిడ అయోనిజ. ఐనా కూడా అవరుద్ధం వనే రామం రాముడి వెనకాల అడవికి వచ్చేశావు దిష్ట్యా త్వమ్ అనుగచ్ఛసి రామున్ని పట్టుకున్నావు నీవు ధర్మాన్ని పట్టుకున్నావు, భర్తని అనుగమించావు భర్తవెంట ఉండాలి ఆడది భర్తవెనక ఉండడం భర్తని అనుగమించడం కన్నా పూజ ఇంకొకటి లేదూ... ఎన్ని పూజలుచేసి ఇది వదిలినా అది సున్నా.
అన్నీ వదిలి ఇది ఉంటే..? పూర్ణం అన్న ధర్మాన్ని పట్టుకున్నావు సీతా..! అందుకు నేను సంతోషిస్తున్నాను సీతమ్మా నేను నీతో ఒక మాట చెప్పనా నగర స్థో వన స్థో వా పాపో వా యది వా శుభః ! యాసాం స్త్రీణాం ప్రియో భర్తా తాసాం లోకా మహోదయాః !! భర్త నగరంలో ఉండనీ అరణ్యంలో ఉండనీ పాపిష్టివాడు కానీ పుణ్యాత్ముడు కానీ ఆడదీ భర్తని ఉపాసనచేస్తే చాలు భర్తని అనుగమిస్తే చాలు ఆమే సమస్తమైనటువంటి శ్రేయస్సుని పొందుతుంది. భర్త ఎటువంటివాడు అన్నదాన్ని గురించి అనుగమించడం గొప్పతనం కాదు భర్తని అనుగమించడం గొప్పతనం. కాబట్టి నీవు అలా అనుగమించావు నీవు అరణ్యాలకు వచ్చి అనుగమించావు దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. సీతా! నీతో నేనొకమాట చెప్తాను బాగావిను ʻభర్తʼ అన్న మాటకీ ఒకగొప్ప నిర్వచనం చెప్పింది అనసూయమ్మ రామాయణంలో న అతో విశిష్టం పశ్యామి బాన్ధవం విమృశ న్త్యహామ్ ! సర్వత్ర యోగ్యం వైదేహి తపః కృతమ్ ఇవావ్యయమ్ !! ఒక వ్యక్తి గొప్ప తపస్సుచేశాడు ఇప్పుడు ఆయనా గొప్ప తపో నిష్టాగరిష్టుడైనటువంటివాడు అలా వెళ్ళిపోతున్నాడు, ఆయనకి ఆకలివేసింది అది ఎడారి ఏమీ దొరకలేదు ఇప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదు కాబట్టి ఆయనకి ఏమైనాబాధ ఉంటుందా..! ఆయన తన తపఃశక్తిచేత తలచుకుంటే ఒక నదిని తీసుకరాగలడు, ఆయనా సాక్ష్యాత్ అన్నపూర్ణన్నమ్మను పిలిచి అన్నం వడ్డించుకుని తినగలడు

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
నిన్ననా చూడలే భారధ్వాజ మహర్షి తపఃశక్తి ఏమిటో మీరు, తపఃశక్తి తన నుంచి వేరుపడకుండా తనలోనే ఉండి తనని రక్షిస్తున్నట్లూ భర్తా అనేటటువంటివాడు భార్యకీ సిద్ధమైన తపస్సులాంటివాడు, అలా రక్షిస్తుంటాడు ఎక్కడికివెళ్ళూ ఆయనయొక్క కీర్తి పొందుతుంటావు.
కాబట్టి అమ్మా భర్త అంటే అంత గొప్పవాడమ్మా! న తు ఏవమ్ అవగచ్ఛన్తి గుణ దోషమ్ అసత్ స్త్రియః ! కామ వక్తవ్య హృదయా భర్తృ నాథ శ్చరన్తి యాః !! కొంత కొంత మందీ ఈ లోకంలో కామమునకు లొంగినటువంటివారై భర్తమీద తాము అధికారమును చలాయించాలనీ భర్తని తమచెప్పుచేతలలో పెట్టుకోవాలనీ ఎప్పుడూ భర్తగురించినటువంటి విషయాలు తెలుసుకోవాలనేటటువంటి కుతూహలంతో ప్రవర్తిస్తూ తమ యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి తామేదో భర్తని చెప్పుచేతలలో పెట్టుకుని నడిపించగలిగినటువంటి ప్రజ్ఞవున్నవారము అని ప్రవర్తిస్తూంటారు, అది చాలా నింధ్యమైనటువంటిపని అలా ఉండకూడదమ్మా..! అని అనసూయమ్మ అంటూ... నీవు ఎప్పుడూ ఎలా ఉండాలని ఆశీర్వచనం చేస్తున్నానో తెలుసా  తదేవం ఏనం త్వం అనువ్రతా సతీ  పతివ్రతానాం సమయాను వర్తినీ భవస్వ భర్తుః సహ ధర్మ చారిణీ యశ శ్చ ధర్మం చ తతః సమాప్యసి !! నీకు ఎన్నడూ కూడా రామునినే అనుగమించేటటువంటి లక్షణము ప్రకాశించి ఉందువుగాక, ఎప్పుడూ నీవు ప్రతివతయై ఉందువుగాక, నీవు ఎప్పుడూ సహధర్మ చారిణివై ఉందువుగాక దానివలన మీకు లోకంలో విశేషమైనటువంటి ధర్మావలంబకురాలవన్న కీర్తి ప్రకాశించుగాక, లోకంలో దాంపత్యమూ అంటే ఇంక ఎవ్వర్నీ చెప్పరు వరున్నీ నారాయణుడిగా తీసుకొచ్చినా దాంపత్యం అంటే మాత్రం ఎలా బ్రతకండి అని చెప్తారంటే సీతా రాములులే, సీతా రాములుగా బ్రతకండి అని అంటారు. అంటే అంతగా ఒకరినొకటి అనుగమించినవారై ఒకరి మనుసులో ఒకరు ఉండీ ఆమెకు ఆయనకు అభేదమై ఇద్దరుగా తిరుగుతున్న ఒక్కరై బ్రతికినటువంటి స్థితికి సీతారాముల దాంపత్యం పరాకాష్టగా ప్రతీకగా నిలబడుతూంది.
కాబట్టి అనసూయమ్మ ఈమాటచెప్పీ సంతోషిస్తే సీతమ్మ అందీ అమ్మా! నైతత్ ఆశ్చర్యమ్ ఆర్యాయా యన్ మాం త్వమ్ అను భాషసే ! విదితం తు మమాపి ఏతత్ యథా నార్యాః పతి ర్గురుః !! తల్లీ నీవు ఇంత మహా ప్రతివ్రతవు కాబట్టి ఇటువంటి మాటలు చెప్పడం ఆశ్చర్యంలేదమ్మా... కానీ నాకుకూడా అమ్మా ఈ విషయంలో మంచిపూనిక ఉంది యథా నార్యాః పతి ర్గురుః పతి అనేటటువంటివాన్ని ఎప్పుడూ ఆడది అనుగమించాలి అనేటటువంటి విషయంలో నేను పూనిక ఉన్నదానను అమ్మా! లోకంలో గుణములు లేనటువంటి వానిని కూడా అనుభవించేవారున్నారు ప్రతివ్రతలై తన కళ్ళెదుట వేరోక స్త్రీతో క్రీడిస్తున్నటువంటివాన్ని కూడా క్షమించగలిగేటటువంటి భార్యలు ఉన్నారు, లేరా మీకు రామాయణంలో మండోధరి కనపడదా మండోధరి పతివ్రత కాదా..? మహాపతివ్రత, అమ్మా వాళ్ళుగొప్ప తప్పా..! నేను రామున్ని అనుగమించడం పెద్ద గొప్ప తనమేముందమ్మా..! రాముడు ఎటువంటి వాడో తెలుసా..? కిం పునర్ యో గుణ శ్లాఘ్యః సానుక్రోశో జితేన్ద్రియః ! స్థిరానురాగో ధర్మాత్మా మాతృవత్ పితృవత్ ప్రియః !! అమ్మా ఎన్ని గుణములు ఉన్నాయమ్మా మహానుభావుడికీ ఇంద్రియములను జయించినవాడమ్మా దయాళువమ్మా స్థిరమైన అనురాగమున్నవాడమ్మా, కొన్నాళ్ళు ఈ భార్యతో అనురాగంగా ఉండి ఇంకొనాళ్ళు ఇంకొ భార్యని స్వీకరించేటటువంటి లక్షణము ఉన్నవాడు కాదమ్మా ఆయనా..! స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా మాతృవత్ పితృవత్ ప్రియః ఆయన తల్లీ తండ్రియందు ప్రేమ ఎలా ఉంటుందో నాకు రామునియందు ప్రీతి అలా ఉంది, ప్రేమ అలా ఉంది. మీరు బాగాజ్ఞాపకం పెట్టుకోండీ ఈ మాటలకు అర్థం.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఇవ్వాళా the most distorted word ప్రేమ అంటే నేను ఆంగ్లభాష ఉపయోగించానని మన్నించండి అంతగా ఏ పదమూ కూడా లోకంలో తప్పుగా వాడబడనటువంటి మాట ఏదైనా ఉంటే ʻప్రేమʼ అన్నమాటే. ప్రేమ అన్నమాటనీ ఎవరు ఇష్టమొచ్చినట్లువారు వాడేస్తున్నారు, కామము అన్నమాటని అది చెప్పవలసిన చోటచెప్పకుండా ప్రేమ అన్నమాటతో దాన్ని పూరణచేస్తున్నారు మీరు మాటని కాని ఒకచోట చెప్పవలసినదానిని ఇంకొకచోట పెట్టేస్తే జీవితాలు పడిపోతాయి చూశారా, ఎందుకో తెలుసా ప్రేమ అన్నమాటకు అర్థమేమిటంటే ʻప్రతి ఫలాన్ని అపేక్షించకుండా అవతలి వ్యక్తి యొక్క అభ్యున్నతినీ చిట్టచివరి శ్వాస వరకూ కోరుతూ వారి అభ్యున్నతికొరకు తన జీవితాన్ని కూడా పరిత్యజించగలిగినటువంటి స్థితిని ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమ కలిగినవాడూʼ అని పిలుస్తారు. ఇది ఎవరికి చెల్లుతుందంటే తల్లికీ తండ్రికీ గురువుకీ భర్తకీ వీళ్ళకి చెందుతుంది, ఎందుకనీ అంటే ఒక తల్లిని బిడ్డ ఎందుకు ప్రేమిస్తుంది, కడుపులో ఎందుకు పెట్టుకుంది.
Related imageవైకుంటం క్యూ కాంప్లెక్స్ లో వెళ్ళిపోతున్నటువంటి చంటిపిల్లవాడు ఏడిస్తే నిన్నగాక మొన్న పెళ్ళైనటువంటి యవ్వనంలో ఉన్నతల్లీ పిల్లవాడు ఏడిస్తే ఏడ్చాడుకానీ ఇంతమంది మగవాళ్ళ మధ్యలో నేను నా స్థన్యం ఇవ్వనూ అనకుండా వాడి ప్రాణం ఎక్కడ పోతుందోనని అంతమంది మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా స్తన్యమిచ్చి పిల్లాన్ని ఎందుకు పోషిస్తోంది, పిల్లవాడి మల మూత్రాలు ఎందుకు ఎత్తుతూంది తన నెత్తుటిని పాలగామార్చి ఎందుకు పెడుతూంది, వాడు ఏడిస్తే చెవిలో చీమ దూరిందని ఏ భాషచేత తెలుసుకూంటుంది ఇది అమ్మ తనం ఈ అమ్మ తనం ఉందే ఈ అమ్మతనమే లోకంలో మొట్ట మొదటి దైవశ్వరూపంగా గుర్తింపబడి గౌరవింపబడింది, ఈ అమ్మ ప్రాణం పోయేటప్పుడు ఆఖర్నకూడా ఆ కొడుకుని ఓసారి చూసి చచ్చిపోవాలని అనుకుంటుంది, కొడుకు ఒడిలో తలపెట్టుకుని చచ్చిపోవాలనుకుంటుంది, కట్టుకున్నవాడు నా వాడు కొరివిపెడితే బాగుండు అనుకుటుంది, వాడు వైద్యం చేయించకపోయినా ఎందుకమ్మావాడు అన్నంపెట్టాడా వైద్యం చేయించాడా... ఆ పిల్లవాడు నాశనమైపోతాడమ్మా... అన్నారనుకోండి ఎవరైనా, వద్దమ్మా అంతమాట అనకమ్మా వాడు అలా పదికాలాలు బ్రతకనివ్వండి అంతేకానీ నాకు అన్నం పెట్టకపోతే ఏమిటీ పెద్దదాన్ని అయిపోయాను ఎన్నాళ్ళుంటాను ఇవ్వాళ ఉంటాను రేపు పోతాను వృద్ధిలోకి రావలసినవాడు వాడు అంటుంది. ఇది అమ్మ అంటుంది నాన్నగారు అంటారు గురువుగారు అంటారు దీనికి ప్రేమా అని పేరు.
అంతేకానీ ఓ తల్లీ తండ్రీ కష్టపడి తన కడుపున ఒక అందమైన పిల్లపుట్టింది దాన్ని కన్యాదానంచేసి దానిజీవితాన్ని అభ్యున్నతిలోకి తీసుకొద్దామని నిరంతరం కలలు వాళ్ళు కంటే... మీ సొత్తులా నీవు ఎక్కడో ఆ పిల్లనిచూసి అయితే నాకు కావాలి లేకపోతే ఎవడికోకాకూడదని నీవు ఆమె మీద ఆసిడ్ పోసి ప్రేమా అని పిలవడం నీ కామానికి పరాకాష్ట తప్పా ప్రేమ ఎలా అయ్యింది. ప్రేమా అన్నమాటను వక్రంగా వాడకూడని రీతిలో వాడబడుతూంది వాడి పాడుచేస్తున్నారు ఇవ్వాళ పిల్లలది కాదు తప్పు పెద్దలదేతప్పూ. ఇవ్వకూడనిమాట మీరు అందించేశారు పిల్లలకి వాడు ఆమాట వాడుతున్నాడు నేను కామించాను అని చెప్పమనండివాన్ని వాడుచెప్పలేడు సిగ్గుపడతాడు కామించడం అంటే ఏమిటో తెలుసాండీ..? కోరడం నాకే దక్కాలని అనుకోవడం దక్కకపోతే వ్యగ్రతకలగడే దానికి కామం అని పేరు. అందుకే కామం పక్కన చెల్లెలు క్రోధం ఉంటుంది ఎప్పుడూ తీరితే తృప్తి తీరకపోతే కోపం రెండు ఉంటాయి, ప్రేమ అలాగ కాదు వాడుచూశాడు సంతోషం చూడలేదు సంతోషం

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
రెండిటికీ ఆశీర్వచనమే ప్రేమను పట్టుకెళ్ళి కామం దగ్గర ప్రేమను వాడుతావా..? నీవు వాడు ఎన్ని లక్షల కుటుంబాలలో అగ్నిహోత్రం పోసేశావో..? అందుకే నేను గుర్తు చేస్తున్నాను రచయితలు తమ బాధ్యతలు గుర్తించవలసి ఉంటుంది చేతికి కలముందని ఇష్టము వచ్చినట్లు పదాలువాడి యువతరాన్ని పాడుచేసే అధికారం ఎవ్వరికీ లేదు. నేను ఈ మాట అంటే ఒక సినీ రచయిత ఫోనుచేశాను ఒకసారి, కోటేశ్వర రావుగారు మీరు అన్నమాటలు నాకు హృదయాన్ని తాకాయి, నేను కొన్ని చోట్ల అలా రాశా, మీరు నన్ను క్షమించండి అన్నాడు ఆయన, నేను ఎంత సంతోషించానో నిజంగా..! ఆయన ఉదారుడు సంస్కృతి ఉన్నవాడు నేను చాలా సంతోషించాను తప్పు చేయడం గొప్పకాదు తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నించడం గొప్ప.
https://encrypted-tbn3.gstatic.com/images?q=tbn:ANd9GcRWw4pMWJDBkDVVe801r2QCTES3_jCj2SyGdM3yZ9s_rwtRuAm7tgకాబట్టి ఆ తల్లి సీతమ్మ అంటూందీ అమ్మా! యాం వృత్తిం వర్తతే రామః కౌసల్యాయాం మహా బలః ! తామ్ ఏవ నృప నారీణామ్ అన్యాసామ్ అపి వర్తతే !! నా భర్త ఎంత గొప్పవాడో తెలుసామ్మా... ఎప్పుడైనా దశరథ మహారాజుగారు తన భార్యలైనటువంటి కౌసల్యా సుమిత్రా కైకేయినీ ఎంత ప్రేమగా చూసుకుని ఈ పిల్లలు పుట్టడానికి వాళ్ళని క్షేత్రములుగా స్వీకరించాడో ఆ కన్న తల్లి అయినటువంటి కౌసల్యాదేవిపట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తాడో ఆమెను క్షేత్రముగా రాముడు పుట్టాడు కానీ తను పుట్టకపోయినా వారి కడుపులయందు తండ్రిగారికి క్షేత్రములుగనుక తండ్రిగారికి భార్యలు కనుకా తండ్రిగారి భార్యలన్న కారణంచేత కౌసల్యను ఎలా గౌరవించాడో మిగిలిన రాణులను కూడా నాభర్త అంత తల్లి రూపంగా గౌరవించాడమ్మా..! అంత గొప్పవాడు నా భర్త సకృత్ దృష్టాసు అపి స్త్రీషు నృపేణ నృప వత్సలః ! మాతృవ ద్వర్తతే వీరో మానమ్ ఉత్సృజ్య ధర్మవిత్ !! శ్రీ రాముడు ఎంత ధర్మము కలిగినవాడంటే దశరథ మహారాజుగారు దక్షిణానాయకుడు 350 మంది భార్యలు ఉన్నారు ఆయనకు మామగారైనటువంటి దశరథుడు ఎవరెవరిని అనురాగపు చూపులతో చూసి భార్యా స్థానంలోన కూర్చోబెట్టాడో వాళ్ళ యొక్క అందాల్నీ మా రాముడు ఎప్పుడూ చూడలేదు. ఇంత అందగత్తె కాబట్టే మా నాన్నకి రాణి కాగలిగింది అన్నమాట అనలేదు. ఈమె నా తల్లిగారు కాబట్టి నా చేత నమస్కారం అన్నాడు ఇది రాముని యొక్క సౌశీల్యము.
నాకు తల్లీ, అరణ్యానికి బయలుదేరేటప్పుడు మా అత్తగారు కౌసల్య చెప్పింది ఆగచ్ఛన్త్యా శ్చ విజనం వనమ్ ఏవం భయాఽఽవహమ్ ! సమాహితం హి మే శ్వశ్రా హృదయే తత్ ధృతం మహత్ !! నేను అరణ్యానికి వచ్చేటప్పుడు మా అత్తగారు భర్తతో ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అవన్నీ నా మనసులో ఉన్నాయమ్మా..! ఒక అత్తగారిపట్ల కోడలు ఎంత గౌరవంగా మాట్లాడాలో రామాయణం మనకు నేర్పుతుంది అంతే, అందుకే నేను మీతో మనవిచేసింది. ధర్మ శాస్త్రాలు శ్మృతులు వేదం ఇవ్వాళ చదవగలమా..? అంటే పక్కన పెట్టండి రామాయణ కావ్యం చదవండి అది అన్నిటి సారాంశం, అది “వేదోప బృహ్మణము” మీకు నేర్పుతుంది ప్రవర్తన ఎక్కడ ఎలా ఉండాలో మనకు నేర్పుతుంది. అత్తగారుచెప్తే సరిపోయిందా..? ఆడ పిల్ల ఈడ పిల్ల కాదు ఇక్కడ పుట్టిన పిల్ల ఇంకో వంశాన్ని ఉద్ధరించడానికి వెళ్తుంది వాళ్ళింటికి ఆ పిల్ల అక్కడ ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడానికి ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి ఇక్కడ శిక్షణ ఇవ్వబడాలి తల్లి ఏం చెప్పింది సీతమ్మకి మరి పాణి ప్రదాన కాలే చ య త్పురా త్వగ్నిసన్నిధౌ ! అనుశిష్టా జనన్యాస్మి వాక్యం త దపి మే ధృతమ్ !! అమ్మా! మా అమ్మ ఉందే అమ్మా అంటే ఆవిడా అయోనిజ జనకుని భార్య జేష్ఠ పత్నీ మా అమ్మ నేను పుట్నింటిలో ఉన్నప్పుడు అత్తవారింట్లో ఎలా ఉండాలో నాకు నేర్పింది అది ఎక్కడ వరకు నేర్పిందో తెలుసామ్మా..? పెళ్ళి చేస్తున్నప్పుడు అగ్నిహోత్రం జరుగుతున్నప్పుడు కూడా నీవు నీ భర్తని అనుగమించాలి అత్తమామలని గౌరవించాలి చెప్తూనే ఉంది ఎక్కడి వరకూ త్పురా ద్వగ్ని సన్నిధౌ అగ్ని సన్నిధిలో కూడా పాణి ప్రదాన కాలే చ నా చెయ్యి రాముని చేతులో పెడుతున్న సుహ్మూర్త సమయంలో కూడా మీ ఇద్దరూ కలిసి బ్రతకాలి అతన్ని అనుగమించు. అతని మనసూ నీ మనసూ ఒకటి కావాలి తప్పా ఎన్నడూ మీ ఇద్దరూ రెండుగా ఉండ కూడదు. ఒకటిగా బ్రతకండి అని ఒకటికి పదిమాట్లు మా అమ్మ నాకు నేర్పిందమ్మా అటువంటి తల్లి దగ్గర శిక్షణ పొందానమ్మా నేను, తన కీర్తీ ఎక్కడనుంచి వచ్చిందో నేర్పుతోంది పరోక్షంగా అనసూయమ్మ సీతమ్మ ఈ జాతికి నేర్పుతున్నారు, ఒక ఆడ పిల్ల అత్తవారింట్లో ఎలా బతకాలో నేర్పవలసిన బాధ్యత తల్లి చెప్పింది.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
అయ్యిందానికీ కానిదానికీ జోక్యం చేసుకుని ప్రతిదానికీ అత్తవారింటి విషయాలు కనుకుని వాళ్ళనుంచి ఆడపిల్లని వేరుచేసే ప్రయత్నం పుట్టింటివారు చెయ్యకూడదు, అక్కడ అతికిపోయేటట్టుగా తల్లి తండ్రులు నేర్పాలి ఇది నాకు నా తల్లి నేర్పింది పాణి ప్రదాన కాలే చ య త్పురా త్వగ్నిసన్నిధౌ ! అనుశిష్టా జనన్యాస్మి వాక్యం త దపి మే ధృతమ్ !! నన్ను మీరు బాగాఅర్థంచేసుకోండి నేను ఎవరినీ తక్కువ చేయట్లేదు ఎవరినీ ఎక్కువ చేయట్లేదు పురుషుడు ఎక్కువ కాదు స్త్రీ తక్కువ కాదు అసలు నామాటకొస్తే మొదటి నమస్కారం ఆడదానికే ఎందుకంటే తల్లి జన్మ ఇచ్చింది కాబట్టి ఈ శరీరం ఉంది. నేను చెప్పడం ఏమిటండీ శాస్త్రాలు చెప్పాయి, పురుషుడు నేలమీద పడినమస్కారం చేయాలి, ఆడది అలా పడక్కరలేదు అని చెప్పారు. ఎందుకు పడక్కరలేదు అని చెప్పారు, ఏ స్థానంలోంచి నీవు జన్మపొందావో ఏ రెండు స్థానంలోంచి నీవు బ్రతికుండడానికి పాలు తాగావో ఆ రెండూ గౌరవింపబడాలి అవి నేలను తగలక్కరలేదు అన్నారు. అందుకే ఆడది నేల మీదపడి నమస్కారంచేయదు. ఆడదానికి అంతపెద్ద పీఠవేసి గౌరవించాయి, నేను గౌరవించడం ఏమిటీ శాస్త్రం నమ్మాను కాబట్టి నేను గౌరవిస్తున్నాను.
Image result for sita rama imagesకాబట్టి స్త్రీకి సనాతన ధర్మంలో స్మృతిలో శాస్త్రంలో వేసినంత పెద్దపీఠ బహుశహాః ఎవ్వరూ ఎక్కడా వేయరు. నీకు చేతకాకపోతే నీవు పురాణం చదవకపోతే నీవు కావ్యాలు చదవకపోతే నీకు ఇంకోలా కనపడవచ్చు, నీవు చదివితే ఆ మాట మాట్లాడవు. కాబట్టి సీతమ్మ అందీ అమ్మా నాకు నేర్పిందమ్మా... మా అమ్మా! నవీ కృతం తు తత్ సర్వం వాక్యై సై ధర్మ చారిణి ! పతి శుశ్రూషణాన్ నార్యా స్తపో నాన్య ద్విధీయతే !! అమ్మా నాకు ఒక విషయం బాగాతెలుసు ఎమిటో తెలుసా..? అసలు ఆడది ప్రత్యేకంగా తపస్సు అనేటటువంటిది వేరే చెయ్యక్కరలేదు ఎందుకో తెలుసా ఆయన గాయిత్రీ చేసుకోవాలి సంధ్యావందనం చేసుకోవాలి ఆయన సంధ్యావందనానికి స్నానం చేసుకోవడానికి అక్కడ నీళ్ళు పెట్టింది అయిపోయింది ఆవిడ పూజ. ఆయన చేసిన గాయిత్రిలో సగం వాటా ఈవిడకు వేసేశాడు, ఆయనా జపం చేసుకొనివచ్చి భోజనానికి కూర్చున్నాడు ఆయనకి అన్నం వండిపెట్టింది, ఆయన చేసినపూజలో సగం ఈవిడకి వేసేశాడు, ఆయనా ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇచ్చాడు, అందులో సగం ఆవిడకి వేసేశాడు,  అందుకే ధర్మ పత్ని సమేతస్యా అని అంటారు, అంటే చాలు పడిపోతుంది అనకపోయినా పడిపోతుంది ఎందుకో తెలుసాండీ! అలా ఓ దేవాలయం కట్టడానికి విరాళమివ్వడానికి కావలసిన రీతిలో ద్రవ్యాన్ని ఆర్జించడానికి పురుషుడు తిరగడానికి కావలసిన బలాన్ని సంతరింపజేయడానికి వంటచేసి పెట్టింది ప్రేమతో కాబట్టి సగం ఫలితం ఆమేకు వేశాడు. కాబట్టి అమ్మా తపస్సూ అంటే ఆడదానికి భర్తని సంతోషంగా ఉంచడమే ఇది లోకంలో ఎందుకు చెప్పారో తెలుసాండీ! ఇంత గొప్ప మాట “భర్తకి శాంతి స్థానం భార్య - భార్యకి శాంతి స్థానం భర్త.” బయట ఎన్ని ఇబ్బందులు కలగనివ్వండీ, భార్య సంతోషంగాపలకరిస్తే ఆయన సంతోషంగా పలుకుతాడు, ఆవిడా ఎంత దరిద్రంలో ఉండనివ్వండీ, ఎంతమంది ఏమననీవ్వండీ భర్త ఒక్కడు గుండెల్లో పెట్టుకున్నాడనుకోండీ చాలు సంతోషంగా జీవిస్తుంది.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
దీనికీ ఒకమాట చెప్తూంటారు పెద్దలు సముద్రంలోపలికి వెళ్ళి జాలరులూ ఆరు నెలలకోసారి ముత్యాలన్నీ ఏరి జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్యల మెడల్లో వేసేవారటా! ఒక జాలరి వెళ్ళేవాడు కాదటా, ఆ ఒడ్డున ఉన్నటువంటి నత్త గుల్లాల్లాంటివి ఏరీ శంఖాలు గుచ్చి దండలు చేసి భార్య మెడలో వేసేవాడట, ఇన్ని నగలు వేసినటువంటి వాళ్ళకన్నా నత్త గుల్లలూన్నూ శంఖాలు వేసుకున్నటువంటి ఈవిడలో ఎక్కువ తేజస్సు ఉండేదట, ఎందుకని అడిగారట, రోజూ మా ఆయనకి నేను ఎదురుగుండా ఉండి కనపడి నా మొఖం చూస్తే సంతోషిస్తారు ఇంత అంతకన్నా ఏం కావాలని  ఆరు నెలలు సముద్రంలోకి వెళ్ళి తెచ్చినటువంటి ముత్యాలు వేసుకుంటేనే తృప్తా..? అందుకనీ ఈవిడ మొఖం ఎక్కవ శోభించిందట. ఈవిడకి ఈయనా ఈయనకి ఆవిడా శాంతి స్థానాలు ఆ శాంతి పాడుకాకుండా చూడాలి, కొత్తదనం శాంతి పాడవడానికి కారణం. ఎంతోకలిసి ఉంటాయి కుటుంబాలు తెలిసీ తెలియని తనంతో గబుక్కునవచ్చి భార్య నేరం చెప్పిందనుకోండి ఎవరిమీదో, ఏమిటండీ మీ తమ్ముడు అలా మాట్లాడుతుంటాడు అస్తమానం నా మనసు చిన్నబుచ్చుకుంటుంది అంటే అతనికి అప్పటివరకూ తమ్మునితో కలిసి ఉన్నవానికి తమ్ముడి మీద కోపం వస్తుంది అందుకని సన్నికల్ని తొచ్చించి మంత్రం చెప్తారు పెళ్ళిల్లలో అమ్మా ఈ రాయి తొక్కినా గౌరవించినా పచ్చడి చేసినా పసుపు కుంకుమ పెట్టినా ఎంత స్థిరంగా ఉందో నీవు అత్తవారి ఇంట కూడా కొంచెం ఓర్చుకుని ఆ స్థిరభావంతో ఉండి లేకపోతే గడపలు చాలా అయిపోతాయమ్మా ఈ ఐక్య మత్యం విచ్ఛిన్నమైపోతుంది, నీవు కొంచెం గట్టిగా నిలబడితే కుటుంబాలు కలిసి ఉంటాయి అని ఉదార బుద్ధితో వేదం నేర్పుతుంది. ఆడపిల్లకి ఎంత నేర్పుతుందో మగపిల్లవానికి అంతా నేర్పుతుంది సుమాండీ..! అన్నీ మాకే అనకండి మళ్ళీ? అన్ని నేర్పుతుంది ఇప్పుడు నేను వివాహ మంత్ర ప్రాశస్థ్యము అన్న విషయం మీద మాట్లాడటం లేదు కాబట్టి నేను వాటి జోలికి ఎక్కువగా వెళ్ళటం లేదు.
కాబట్టి అమ్మా నీకీ విషయంతెలుసు ఇలా పతిని అనుగమించినటువంటి సావిత్రీ రోహిణీ మొదలైనటువంటి వాళ్ళు దేవలోకాల్ని చేరుకున్నారన్న విషయంకూడా నాకు తెలుసు అనీ, ఆతల్లి అందీ అమ్మా నేను చాలా సంతోషించానని అనసూయమ్మ అంది కిం తే కరవాణి బ్రవీహి మే నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో నీ మాటలకు సంతోషించాను సీతమ్మా అంది అంటే ఆవిడ అందీ కృతమ్ ఇతి అబ్రవీత్ సీతా తపో బల సమన్వితామ్ అమ్మా! నాకు ఇంక వేరే కోరికలు ఏమిటమ్మా..! నాకు ఇంకా వేరే కోరికలు ఏమీ అక్కరలేదు నీవు ఇంత మంచిమాటలు చెప్పావే అవే నా కోరికలు, ఇదీ- ఈ మంచిమాటలు వినాలని కోరుకోవాలి కాబట్టి అమ్మా ఇన్ని మంచిమాటలు చెప్పావు ఇంక ఇంతకన్నా వరమేమిటమ్మా నాకేమీ అక్కరలేదు అంది అంటే ఆవిడ అంది కాదు కాదు నేను ఏదో ఒకటి చేస్తే తప్పా నాకు తృప్తి లేదు
ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమ్ ఆభరణాని చ ! అంగ రాగం చ వైదేహి మహార్హమ్ చానులేపనమ్ !!
మయా దత్తమ్ ఇదం సీతే తవ గాత్రాణి శోభయేత్ ! అనురూపమ్ అసంక్లిష్టం నిత్యమ్ ఏవ భవిష్యతి !!
అంగ రాగేణ దివ్వేన లిప్తాంగీ జనకాఽఽత్మజే ! శోభయిష్యసి భర్తారం యథా శ్రీ ర్విష్ణుమ్ అవ్యమయ్ !!

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఎంత గొప్ప మాటలు వేసేస్తారండీ మహర్షి నిజంగా... సీతమ్మా! నీకు నేను బట్టలు ఇస్తున్నాను ఈ బట్టలు నలగవు, నీకు అంగ రాగములు ఇస్తున్నాను ఎప్పుడూ శోభ తరగవు ʻఅంగ రాగములుʼ అంటే శరీరము యొక్క అంగముల యొక్క కాంతిని ఉద్ధీపనం చేసేవి, ఇప్పుడూ ఒక నుదురుందనుకోండీ నుదురు నుదురుకన్నా నుదురు మధ్యలో భ్రూ మధ్యమునందు బొట్టు ఉంచుకోండి అందం ద్విగినీకృతం అవుతుంది ఎక్కడ ఏది పెట్టుకుంటే ఆ అంగములు శోభిస్తాయో దాన్ని అంగరాగం అంటారు, బొట్టూ చందనమూ ఇటువంటివి అనులేపనమూ అంటే ఒంటికి రాసుకోవడం వల్లా శోభస్కరంగా ఉంటుంది అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఓ పౌడరు ఫేరన్ లౌలీ అనచ్చేమో? కాబట్టీ అంగరాగములు అనులేపనములు ఇవి ఎప్పటికీ తరిగిపోయేవికావు ఓ గంట క్రితం రాసుకున్న పౌడరు ఓ గంటపోయిన తరువాత కుళ్ళుకంపు వస్తుంది, అలాగ కాదమ్మా..! ఇవి రాసుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది సువాసనా అలా ఎలా ఉంటుంది ఆవిడ తపఃశక్తి అటువంటిది కాబట్టి ఇటువంటివి నేను నీకు ఇస్తున్నాను ఇవి నీవు ధరించి రామునికి కనపడు, భార్య అందానికి సంతోషించవలసినటువంటి అధికారం లోకంలో భర్తది ఒక్కడిదే.
http://archive.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/my_files/January2014sri%20chekreswari.jpgఆమెయొక్క అదృష్టానికి సంతోషించవలసినటువంటి సుసంపన్నమైన హృదయం బిడ్డలందరిదీ అందుకే కదా అమ్మవారు రెండు రూపాల్లో ఉంటుంది శివకామసుందరీ లలితా త్రిపుర సుందరి, శివకామ సుందరిగా ఉంటే శివుని మనసులో కామం కలగించగలిగినటువంటి భార్య ఆయనకొక్కడికే అందం మనకో లలితా త్రిపుర సుందరి లోకానికంతటికీ జగత్ జననీ మనకీ అమ్మ ఆయనకీ భార్యగా అందగత్తె. ఇది ఈ హృదయం కనపడాలి ఇప్పుడు ఎవరికి కనపడాలి రామ లక్ష్మణుల దగ్గరికి వెళ్ళితే రాముడు ఆవిడనిచూస్తే నీలతో యద మధ్యస్థాద్ విధ్యుల్లేఖేవ భాస్వరా లక్ష్మితో కూడిన నారాయణుడిగా కనపడాలి ఇప్పుడు ఆ ఆనందంతో లక్ష్మణుడు అమ్మా మా వదిన ఎంత అదృష్టాన్ని పొందిందో మా వదినమ్మకు ఇంత అదృష్టం కలిగిందని వదిన పక్కన అమ్మచేర్చి వదినమ్మా ఇవన్ని రాసుకుని పదికాలాలపాటు సుఖంగా ఇలా ఉండాలని బిడ్డలు కోరుకున్నట్లుచూసి సంతోషించాలి సీతారా రాములనిచూసి. లక్ష్మీనారాయణులుగా లక్ష్మణునికి కనపడాలి సీతమ్మనిచూసి సంతోషించినటువంటి ఆ శోభనుచూసి సంతోసిచినటువంటి ఆ హృదయపుపొంగు రాముడి ముఖంలో కనపడాలి ఇవి అలాగ కనపడ్డాయంటా వాళ్ళ దగ్గరా, మనం ఎలా బ్రతకాలో నేర్పుతారు ఓ దంపతులు వస్తుంటే వాళ్ళిద్దరినీ చూసి అబ్బా లక్ష్మీ నారాయణులులాగా ఉన్నారని నీవు అనగలగాలి.
కాకి ముక్కుకి దొండపండు అన్నమాట నీవు అనకూడదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ అనకూడదు ఆవిడ చాలా బాగుంటుందండీ ఆవిడ బాగుండదనో, ఆయన చాలా బాగుంటాడండీ ఆవిడేం బాగుండదనో అంత మహానుభావుడికి ఆవిడ భార్యేమిటనో ఆవిడకి ఈయన భర్తేమిటనో ఎప్పుడూ అనకూడదు. ఎప్పుడూ దంపతుల మధ్యలో ఏమనాలంటే ఒకరికి ఒకరు తగినవారనే అనాలి నీవు. అందుకే శంకరభగవత్ పాదులు శివానందలిహరిచేస్తే పార్వతి గొప్పా పరమేశ్వరుడు గొప్పా అంటే కలాభ్యాం చూడాలంకృత - శశి కలాభ్యాం నిజ తపః – పలాభ్యాం భక్తేషు ప్రకటిత అంటారాయన, ఒకరికొకరు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనవారు అంటారు. రుక్మిణీ కళ్యాణంచేస్తే పోతనగారు తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్ దథ్యంబు వైదర్భియుం దగు నీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ యిద్దణిం దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహరాతి యై అంటారు, ఒకరి ఒకరు తగినవారు అంటారు. పెద్దలైనవారు అలా మాట్లాడుతారు, పెద్దరికంలేని చిన్న మనసులు లేకి మనసులు ఇంకోలా మాట్లాడుతాయి, మీ మనసును నీవు సుసంపన్నం చేసుకోవాలి ఈ విషయాన్ని మీకు నేర్పుతుంది రామాయణం, కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఎంతో సంతోషంతో ఆవిడ ఆ బట్టలు కట్టుకుని ఆ అంగరాగములు రాసుకుని ఆ అనసూయమ్మని సేవించింది.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
Related imageసేవించిన తరువాత అనసూయమ్మ అందీ కళ్యాణం గురించి ఏదో విన్నాను గొప్పగా చెప్తారు ఏదీ కళ్యాణ ఘట్టం చెప్పూ అందీ... అప్పుడు చెప్తుంది కొన్నిరహస్యాలని ఇది బాల కాండలో మహర్షి చెప్పలేదు. ఇక్కడ చెప్తున్నారు తస్య లాఙ్గల హస్త స్య కర్షతః క్షేత్ర మణ్డలమ్ ! అహం కిల ఉత్థితా భిత్త్వా జగతీం నృపతేః సుతా !! కొంత మంది ఏమంటారంటే ఎదో నాగటి చాలుకు దొరికింది మందసంలో దొరికింది పెట్టెలో దొరికింది అంటారు సీతమ్మ అలా చెప్పలేదు, ఆవిడ ఏం చెప్పిందంటే మా తండ్రిగారు యజ్ఞం చేద్దామని భూమిని నాగలిచేత్తో పట్టుకుని దున్నతూ విత్తనాలను చల్లుతున్నప్పుడు భూమిచీలుకున్న తరువాత అందులోంచి నేను ఉత్థితా పైకి ఇలా లేచాను అంది ఆవిడ భూమిలోంచి పైకి లేచింది, స మాం దృష్ట్వా నరపతి ర్ముష్టి విక్షేప తత్పరః ! పాంశు కుంఠిత సర్వాంగీం జనకో విస్మితోభవత్ !! చేతులో విత్తనాలుపట్టుకు చల్లుతున్న మా తండ్రీ నాగటిచాలు ఆఁగాడిలోంచి ఇలా పైకి లేచినటువంటి నా వొళ్ళంతా మట్టితోవుంటే గబగబావచ్చి బిడ్డలులేని జనకుడు నన్నుతీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, కూర్చోబెట్టుకొని మనసులో నన్ను కుమార్తెగా భావనచేసుకున్నాడు అనపత్యేన చ స్నేహాత్ అంకమ్ ఆరోప్య చ స్వయమ్ ! మమే యం తనయేతి ఉక్త్వా స్నేహో మయి నిపాతితః !! నన్ను స్నేహంతో సంతోషంగా నన్ను కుమార్తెగా చూసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, కూర్చెబెట్టుకోగానే ఈమె ఆయన కుమార్తేయేనా..? దొరికింది తప్పా ʻఅయోనిజʼ అయోనిజ నరకాంత కాదు కదాండీ! సీతమ్మ నరకాంత కాదు స్పష్టం, నరకాంత అయితే నరుడుకి జన్మించాలి మరి నరుడికి జన్మించలేదుగా! అయోనిజ కాబట్టి నరకాంత మాత్రం కాదు.
Related imageనరకాంత మాత్రం కాదు కాబట్టి యోని సంభవ కాదు కాబట్టి దేవతా అంటాం, ఇప్పుడు నేను ఈమె నా కూతురు అని ఎలా చెప్పాలి సమాజంలో అంటే అశరీరవాణి పలికిందట పైనుంచి అన్తరిక్షే చ వాక్ ఉక్తా ప్రతిమా మానుషీ కిల ! ఏవమ్ ఏత న్నరపతే ధర్మేణ తనయా తవ !! ఈమె నరకాంత కాదూ ఈమె అయోనిజా అయినా నీకే దొరకాలని నాగటి చాలుపెట్టి దున్నతున్నప్పుడు భూమిని చీల్చుకొని భిత్త్వా అన్నారు, భూమిని చీల్చుకొని ఉత్థితా పైకిలేచి నీకు కనపడి నీ ఒడిచేరింది కాబట్టి ఆమె నీకే దొరకాలని దొరికింది కాబట్టి ధర్మము వలన నీకే కుమార్తె. జనకునికి దొరికింది కాబట్టి “జానకీ” అని నీవు పిలవచ్చు అన్నారు. అందుకని అమ్మా నేను జనకుడికి కూతుర్ని అయ్యాను తప్పా ధర్మంలో నేను వీరికి కూతుర్ని అని చెప్పడం కుదరదు అంటే అన్యాపదేశంగా చెప్పేసింది, అసలు నేను నరకాంతను కాను నేనే శ్రీమహా లక్ష్మినీ తతః ప్రహృష్టో ధర్మాఽఽత్మా పితా మే మిథిలాధిపః ! అవాప్తో విపులామ్ బుద్ధిం మామ్ అవాప్య నరాధిపః !! మానాన్నగారు చాలా సంతోషంగా నన్ను తీసుకెళ్ళి పెంచి పెద్దచేశారు మా అమ్మగారు కూడా సంతోషించారు కానీ మా నాన్నగారు ఎక్కడ బెంగపెట్టుకున్నారో తెలుసామ్మా! అయోనిజాం హి మాం జ్ఞాత్వా న అధ్యగచ్ఛ ద్విచిన్తయన్ ! సదృశం చానురూపం చ మహీ పాలః పతి మమ !! అమోనిజయైనటువంటి ఈ పిల్లకి నేను భర్తని ఎక్కడనుంచి తీసుకురావాలి, ఎవ్వరికిచ్చి పెళ్ళిచేయాలి ఎలా తెలుస్తుంది, అని మా నాన్నగారు బెంగపెట్టుకున్నారు అందుకని శివ ధనుస్సుని అక్కడ పెట్టించాడమ్మా! ఎవడు శివ ధనుస్సును ఎత్తాడో వాడేశివుడు.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
శివుడు విష్ణు సహస్త్ర నామంలో విష్ణువుకి శివః అని నామం లేదూ, శివుడు అంటే మంగళకరుడు మంగళకరుడు అంటే ఎవరు మంగళములకు మంగళములు ఏమంటే ʻశివʼ అంటే బ్రతికుండడమే శివ. లోపల ప్రాణముంటే మంగళం ప్రాణంలేకపోతే అమంగళం కాబట్టి అంతటా వ్యాపించి లోపలికి కూడా వాయురూపంలో ఉండి అంతటా పరివ్యాప్తమైనటువంటి రూపం విష్ణువు. అంతటా ఉన్నది ఆత్మా ఆత్మగా ఉన్నది శివుడు శివుడూ విష్ణువుకు అభేదం కాబట్టి ధనుస్సు ఎవరు ఎక్కుపెడతారో వారే ఈ సీతమ్మని భరించగలగినభర్త. విష్ణువు ఈ లోకంలో నరుడిగా జన్మించాడని గుర్తుపట్టాలంటే శివధనస్సు ఎక్కుపెట్టాలని మిషపెట్టాలి అందుకని నన్ను వీర్య శుల్కనుచేశాడు మా నాన్న.
http://www.andhraportal.org/wp-content/uploads/2016/04/sitaramakalyanam.jpgస్వయం వరం ప్రకటించి ఎవరు శివ ధనుస్సు ఎక్కుపెడతారో వాళ్ళకి ఇస్తానూ అన్నాడు మహా యజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మనా ! దత్తం ధను ర్వరం ప్రీత్యా తూణీ చాక్షయ సాయకౌ !! వరుణుడు ఇచ్చినటువంటి ఆ అక్షయ బాణ తూనీరములు శివ ధనుస్సు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ధనుస్సు ఎక్కుపెట్టినవాడికి ఇస్తానూ అన్నాడు. కానీ అమ్మా! ఏమైందో తెలుసా..? రామ చంద్ర మూర్తి వచ్చారు ఒకప్పుడు, వచ్చీ ఈ శివ ధనుస్సుని ఎక్కుపెట్టాడు అప్పటికి లోకంలో కొన్నికోట్ల మంది నన్ను భార్యనుచేసుకోవడానికి చూస్తున్నారు. ఎవరూ శివ ధనస్సుని ఎక్కపెట్టలేదూ నేను ఎవరికీ భార్యను కాలేదు, ఇప్పుడు రాముడు శివ ధనస్సు ఎక్కుపెడితే నన్ను ఇస్తానని మా నాన్నగారు అన్నారు. కాబట్టి రాముడు ఎంత సంతోషించాలి యవ్వనంలో ఉన్న యువకుడైన రాముడూ అందులో సీతమ్మ స్వరూపమంటే మాటలా జగదేకసుందరి ఆ తల్లి అటువంటి తల్లినీ తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభి సంధినా ! ఉద్యతా దాతుమ్ ఉద్యమ్య జల భాజనమ్ ఉత్తమమ్ !! శివ ధనుర్భంగం జరుగగానే పిల్లని ఇచ్చేస్తానని మా నాన్నగారు ఒక స్వర్ణ కళసంలో నీళ్ళు పట్టుకుని గబగబా వచ్చారు నన్ను తీసుకొచ్చారు సీతా! నిన్ను కన్యాదానం చేసేస్తున్నాను రాముడికీ అన్నాడు, అప్పుడు రాముడు ఏమన్నోడో

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
తెలుసామ్మా..? ఇవ్వడానికి నీవెవరూ పుచ్చుకోవడానికి నేనెవరిని మా గురువుగారు విశ్వామిత్రుడు ధనుస్సు ఎక్కుపెట్టమన్నాడు ఎక్కుపెట్టాను, నీవు ఎవరైనా ఎక్కుపెడితే ఎక్కుపెట్టండి అన్నావు క్షత్రియున్ని కాబట్టి ఎక్కుపెట్టాను, ఇక పిల్లను ఇవ్వడమంటావా నీవు ఇస్తానన్నావు కాని పుచ్చుకోవడానికి నేను ఒప్పుకోవద్దూ అది పుచ్చుకోవడానికి వస్తువు కాదు పిల్లా, ఇప్పుడు నేను పుచ్చుకున్న తరువాత నా భార్య అవుతుంది, నా భార్య అయితే దశరథ మహారాజుగారికి కోడలు అవుతుంది, కోడలైతే ఆఁవంశగౌరవాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి వంశగౌరవాన్ని నిర్ణయించేటటువంటి కోడలు స్థానంలో కూర్చోవలసిన వ్యక్తిని నిర్ణయించే అధికారం మానాన్నగారిది అంతేగాని ఇవ్వడానికి నీవెవరవు పుచ్చుకోవడానికి నేనెవరిని మా నాన్నగారికి చెప్పండీ ఆయన వచ్చిచూసి రామా ఈ పిల్లమెడలో తాళికట్టూ అంటే అప్పుడు కడతా పుచ్చుకుంటా పాణీగ్రహణం అన్నాడు మా ఆయన.
http://www.cherloyadavalli.org/Images/Chaganti/ChagantiRamayanam-19.jpgదీయమానాం న తు తదా ప్రతిజగ్రాహ రాఘవః ! అవిజ్ఞాయ పితు శ్ఛన్దమ్ అయోధ్యాధిపతేః ప్రభోః !! మా తండ్రి అయోధ్యాదిపతి దశరథమహారాజుగారు ఉన్నారు ఆయనకు కబురుచేయండి ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను అన్నాడమ్మా మా ఆయన, ఇంకో ఆడదైతే ఇంత అందగత్తెను ధనుర్భంగమైంది అయినా కూడా మా ఆయన మీనమేషాలు లెక్కకట్టాడు అంటే వాళ్ళ నాన్నని అడుగుతానన్నాడూ ఈ పిచ్చి ప్రేమే కొంపముంచింది, వరాలు ఇచ్చానని అరణ్యానికి పంపించాడు మా ఆయనకి ఇంకా ఇప్పటికీ బుద్ధిరాలేదు ఇంకా నాన్న కూర్చెట్టెట్టుకు తిరుగుతున్నాడు, సీతమ్మ అంది ఇప్పుడు కాదు అప్పటినుంచి మా ఆయనకి తండ్రి అంటే అంతప్రేమ పితృ భక్తి పరాయణుడైనటువంటి భర్త నాకు దొరికినందుకు నేను గర్వపడిపోతున్నానమ్మా ఈ కథ నీకొక్కదానికే చెప్పానమ్మా అని అనేసింది సీతమ్మ. ఇది బాల కాండలో చెప్పలేదు మహర్షి ఎందుకు చెప్పించలేదంటే ఎక్కడ ఏ సమున్నత పాత్రలతో చెప్పించాలో ఆ పాత్రకి చెప్పించాడు సీతమ్మతో అనసూయమ్మ దొరికేవరకూ ఈ కళ్యాణ ఘట్ట రహస్యాన్ని సీతమ్మ నోటివెంట మహర్షి ఎవ్వరికీ చెప్పించలే, అనసూయమ్మ కనపడ్డాక అనసూయమ్మతో చెప్పించాడు. అంటే ఆవిడ వైభవము ఎంత గొప్పదో అటువంటి అత్రి అనసూయమ్మ సంతానంలో పుట్టేటట్టుగా ఆత్రేయస గోత్రంలో పుట్టేటటువంటివారు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించెదురుగాక.
కాబట్టి అలా మా అమ్మా మా వివాహమైంది అన్న తరువాత ఆ వస్త్రాలు కట్టుకుంది తల్లి ఎంతో సంతోషించింది ఆనాడు అందరూ ఆనందపడ్డారు అందరు ఆ రాత్రి అక్కడ నిద్రచేశారు. మరునాడు ఉదయం అత్రి మహర్షి యొక్క అనుమతి తీసుకొని సీతారాములు లక్ష్మణ సహితులై దట్టమైనటువంటి అడవులలోకి ప్రవేశించి తమప్రయాణాన్ని ప్రారంభించారు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారూ అన్న మంగళకర వాఖ్యం దగ్గర అయోధ్య కాండను పూర్తిచేసి రేపటి సాయంకాలం అరణ్య కాండ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తాను.

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
ఎంత గొప్ప గొప్ప మహర్షులో ఇంక అరణ్య కాండ అరణ్య కాండే మహర్షి అలా రచన చేశారు, ఇప్పుడూ అనసూయా స్వరూపంగా మీరు చక్కాగా గమనించండీ ఇప్పుడూ అనసుయా స్వరూపంగా ఆ తల్లిని తీసుకొచ్చీ ఆ కుర్చిలో కూర్చోబెట్టీ సువాసినీ పూజయందు ఒక నియమం ఉంది సువాసినీ పూజ ఎప్పుడు పూర్తవుతుందీ అని అడిగారు సువాసినీ పూజ పూర్తవ్వాలంటే జఠా బంధనం వేయాలి, జఠా బంధనమూ అంటే జుట్టూ ఇలా విడిపోయి ఉండకూడదు జఠగా ఉన్నటువంటి జుట్టుకీ ఇప్పటి రోజుల్లోనైతే దాన్ని ఏమిటీ అంటారు, రబ్బరు బ్యాండు అంటారే అలా ఒక్కదాంతో జుట్టుకట్టాలి ఆ జుట్టు కట్టడం గొప్ప పూజ శాస్త్రంలో కాబట్టి ఆతల్లీ అనసూయమ్మగా కూర్చోవడానికీ యోగ్యురాలైన తల్లి లేదా ఆమె అనసూయమ్మా ఒక ఘనాపాటీగారి యొక్క ధర్మపత్నీ ఆ తల్లి విచ్చేశారు ఆ తల్లినీ తీసుకొచ్చీ చక్కగా ఆవిడకి పూజచేస్తారు, ఆవిడకి అంగ రాగములు రాస్తారు అంటే ఆవిడకు కూడా పౌడరూ మొదలైనవి రాస్తారు. చక్కగా బొట్టు ఉంచుతారు కాటుక ఉంచుతారు, ప్రత్యక్ష నివేదన నివేదన మంత్రంతో ఆవిడ చేతులో పళ్ళుపెడతారు ఆవిడ తింటారు, ఆవిడకు తాంబూళ మిస్తారు, తాంబూళం చాలా గొప్ప సూచన ఐదోతనానికి, అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో తాంబూళం మీదా శ్లోకాలే చేసేశారు ఆయన రణే జిత్వా దైత్యాసపహృతశిరస్త్రైః కవచిభిర్ అని అందుకని ఆ తాంబూళం వేసుకుంటారు, ఆ జఠా బంధనం పెడతారు, పూవ్వులూ పెడతారు, ఆవిడ కాళ్ళు కడుగుతారు, కాళ్ళు తుడుస్తారు తరువాత చక్కగా ఆవిడకీ ఆ పాదములకు పారాణి పెడతారు అప్పుడూ ఆవిడకీ పూజచేస్తారు అవన్నీ మీ అందరూ చూసి ఆనాడు సీతమ్మ ఎంతటి అనుగ్రహాన్ని పొందిందో మీ అందరూ కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందండి.
మనకు శాస్త్రంలో నియమం ఏమిటో తెలుసాండీ! రెండు కారణములచేతా నాకు అక్కరలేని ఈ ఫలితాన్నీ అని విడిచిపెట్టేసుకుంటారు, నాకు అక్కరలేదండీ ఈ చూసిన ఫలితం దీన్ని నేను అంత చూడవలసిన విషయంగా భావించులేదూ ఆవిడ అంత పూజనీయురాలు కాదూ అనసూయమ్మను పూజించాలా మేము అవమానిస్తాము అనాలంటే రెండు పద్ధతులు చెప్తారు ఒకటి భక్తి ఉన్నా పూజ జరుగుతున్నప్పుడు పక్కవాళ్ళతో మాట్లాడితే మీరు ఎంత పుణ్యాన్ని చూసి పొందారో అది పక్కవాళ్ళకి వెళ్ళిపోతుంది, నేను ధర్మశాస్త్రం చెప్తున్నాను అందుకే పూజలో మాట్లాడరు కారణం అదే పక్కవాళ్ళకి వెళ్ళిపోతుంది. రెండు అటువంటి గొప్ప పూజ జరుగుతున్నప్పుడు నిలబడి ఉంటే అవమానించినట్లులెక్కా అందుకే సభలో నిలబడరు, మీరు చూడండీ ప్రభువు సభతీర్చి ఉంటే ఉచితమైన ఆసనములను అలంకరించిరీ అంటారు ఇక్కడ కూర్చోవడమా ఇక్కడ కూర్చోకపోవడమా అని ఉండదు కూర్చుండిపోతారు తప్పా నిలబడి ఉండకూడదు, ఇది విన్నాక కూడా నిలబడితే దాని అర్థమేమిటీ అనుకోవాలి నేను అంటే ఆ అనసూయమ్మ పూజపట్ల మాకు ఆ గౌరవం లేదయా మాకు నీవు చెప్తున్నావు కానీ అనివారు అంటున్నారని నేను గుర్తించవలసి ఉంటుంది. అలాంటివారు ఈ సభలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి చోటు లేకపోతే వాళ్ళు ముందుకొచ్చి కూర్చోవడానికి అవకాశం ఇస్తున్నాము. ఒకవేళ అక్కడ చోటులేకపోతే మీరు యధేచ్ఛగా ముందుకు వచ్చికూర్చోవచ్చు. తప్పా ఎవరూ నిలబడి మాత్రం ఉండకూడదు. ఇప్పుడు మనం పెట్టుకున్న నియమాన్ని అనుసరించి ఒక్క పదిమాట్లు రామ నామం చెప్పేద్దాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
కోరి కొలిచిన వారికెల్లను కొంగుబంగరు రామ నామము !! రా !!
వాదాభేదాతీతమగు వైరాగ్యమే శ్రీ రామ నామము !! రా !!

  అయోధ్య కాండ పద్నాల్గవ రోజు ప్రవచనము
 
అంజనేయుని వంటి భక్తుల ఆశ్రయము శ్రీ రామ నామము !! రా !!
నిలమేఘ శ్యామలము నిర్మలమూ శ్రీ రామ నామము !! రా !!
జానకీ హృత్ కమలమందున అలరుచున్నది రామ నామము !! రా !!
మూడు నదులను దాటువారికి యోక్ష లక్ష్మియే రామ నామము !! రా !!
భక్తితో ప్రహ్లాదుడడిగిన వరములొసగెను రామ నామము !! రా !!
ఎందరో మహానుభావుల డెందమాయెను రామ నామము !! రా !!
కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామ నామము !! రా !!
పాలు మీగడ పంచదారల తత్వమే శ్రీ రామ నామము !! రా !!
కుండలిని భేధించి చూచిన పండువెన్నెల రామ నామము !! రా !!
శ్వస్తి....


No comments: