Tuesday, 24 January 2017

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అయోధ్య కాండ 12 దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Ayodha Kanda 12th Day



అయోధ్య కాండ


పన్నెండవ రోజు ప్రవచనము



వశిష్ట మహర్షి యొక్క మాటలచేత పెద్దల యొక్క ప్రభోదంచేత కొంత ఊరడిల్లిన మనస్సులు కలిగినటువంటివారై ఆ భరత శత్రుఘ్నులు అంతఃపురంలో ఉన్నటువంటి స్థితిని గూర్చి నిన్నటి రోజున మీతో వివరణచేస్తూ ఉపన్యాసాన్నిపూర్తి చేసివున్నాను. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు ఇద్దరూ అంతఃపురంలో మేడమీద కూర్చుని ఉన్నారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒకవిషయాన్ని గమనించవలసి ఉంటుంది ఎప్పుడు మాట్లాడుకున్నా భరతుడి పక్కన శత్రుఘ్నుడు వుంటాడు - రాముడి పక్కన లక్ష్మణుడు వుంటాడు వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ పక్క పక్కనే వుంటారు అలా ఉండడం వల్ల ఏ ప్రయోజనం సమకూరుతూంటూంది అన్న విషయాన్ని మీరు గమనించవలసినటువంటి రీతిలో కొన్ని సర్గలు నడుస్తాయి దాని ఆంతర్యమేమిటో మీరు పట్టుకోగలగాలి. ఇప్పుడు ఇద్దరి మనస్సులూ ఖేదపడే వున్నాయి, ఇద్దరికీ తండ్రే కదాండి దశరథుడు ఇద్దరూ కష్టంలోనే వున్నారు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉపశాంతి కలుగుతుంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే. మేడ మీద కూర్చొని వున్నారు శత్రుఘ్నుడు అన్నాడు భరతుడితోటి గతి ర్యః సర్వ భూతానాం దుఃఖే కిం పున రాఽఽత్మనః ! స రామః సత్త్వ సంపన్నః స్త్రియా ప్రవ్రాజితో వనమ్ !! సకల ప్రాణుల యొక్క కష్టములను తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటివాడు రాముడు, కేవలం ఒక్క మనుష్యులకేకాదు సకల భూతముల యొక్క కష్టాన్ని ఆయన తొలగించగలడు అటువంటిస్థితి ఉన్నవాడూ దుఃఖే కిం పున రాఽఽత్మనః స రామః సత్త్వ సంపన్నః చాలా సత్వగుణం కలిగినటువంటివాడు, ఆయన యందు దోషంపట్టడం కూడా ఎవరికి సాధ్యపడేటటువంటి విషయంకాదు అటువంటివాడు స రామః సత్త్వ సంపన్నః స్త్రియా ప్రవ్రాజితో వనమ్ ఒక ఆడదీ ఎలా వనానికి పంపించగలిగింది, ఒక ఆడది అలా వరాలుకోరి ఎలానిగ్రహించగలిగింది దశరథుడు అంతలొంగిపోయేటట్టు రాముడంతటివాడు అంత ధర్మాధర్మములు తెలిసున్నటువంటివాడు ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు కైకమ్మ కోరితేమాత్రం ఇది రాముడి విషయంలో శత్రుఘ్నుడికి వచ్చిన అనుమానం.
అంటే ఇది ధర్మం కాదు నేను పెద్దవాన్ని నేను ఎలా వెడతానూ అలా... ʻఅమ్మ అడగనూ కూడదు మీరు చెప్పనూ కూడదు నాన్నగారండీʼ అని ఒకమాట ఎందుకు అనలేదు రాముడు అన్నది మనసులో ఉన్నటువంటి పరివేదన అంటూ ఇంకొక మాట అన్నాడు పక్కనే బలవాన్ వీర్య సంపన్నో లక్ష్మణో నామ యోప్య సౌ ! కిం న మోచయతే రామం కృత్వా పి పితృ నిగ్రహమ్ !! రాముడి పక్కన ఎప్పుడూ లక్ష్మణుడు ఉంటాడు, ఆ లక్ష్మణుడు ఎటువంటివాడు బలవాన్ గొప్ప బలము కలిగినవాడు వీర్య సంపన్నో గొప్ప వీర్యము కలిగినటువంటివాడు నేనుమీతో మనవిచేశాను వీర్యము అన్నమాటకు అర్థము, లోపల తాను ఏవిధమైనటువంటి వికారమును పొందకుండా శత్రువులను నిగ్రహించగలిగినటువంటి పరాక్రమశక్తికి వీర్యము అని పేరు, కాబట్టి బలవాన్ వీర్య సంపన్నో లక్ష్మణో నామ యోప్య సౌ అటువంటి లక్ష్మణుడు... ఒకవేళ అదుపుతప్పి రామున్ని బయటికి పంపడమనేటటువంటిపనే జరుగుతుంటే కృత్వా పి పితృ నిగ్రహమ్ దశరథ మహారాజుగారిని ఎందుకు నిగ్రహించలేదు, దీనికి భరతుడు ఏమీ జవాబు చెప్పలేదు ఏమీ మాట్లాడలేదు ఇలా జరిగివుంటుందేమోనన్న ఊహ భరతుడేం చేయలేదు ఇలాగే శత్రుఘ్నుడు రోశంతో మాట్లాడుతున్నాడు, రామున్ని ఒక ఆడది పంపించడమా... అంత బలవంతుడైనటువంటి లక్ష్మణుడు రామునితో వెళ్ళిపోవడమే తప్పా దశరథున్ని నిగ్రహించకపోవడమా... ఇలా ఎందుకు జరిగింది అన్న కోణంలోనే మాట్లాడుతున్నాడు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
భరతుడు ఏమి జవాబు చెప్పలేదు ఈలోగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది, ద్వారపాలకులు పరుగు పరుగున వచ్చారు వచ్చి వాళ్ళన్నారూ యస్యాః కృతే వనే రామో న్యస్త దేహ శ్చ వః పితా ! సేయం పాప నృశంసా చ తస్యాః కురు యథా మతి !! ఏ గూని కలిగినటువంటి ఆడది, ఏ మంధరా కైకమ్మ యొక్క మనస్సుని తనమాటలచేత పాడుచేసిందో... ఏ స్త్రీ మొట్ట మొదట అసలు అసూయతో మాట్లాడంవల్లా ధర్మాత్ముడైనటువంటి రాముడు వనములకు వెళ్ళిపోయాడో, ఏ ఆడది మీ అమ్మని రెచ్చగొట్టినటువంటి కారణంగా మీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజుగారు ప్రాణాలు విడిచిపెట్టాడో..? ఆ గూనిదీ ఇదిగో ఇక్కడే తిరుగుతోంది, తూర్పుద్వారం దగ్గర తన గూనికంతటికీ బంగారు కవచంవేసుకుంది అంటే చేయించింది కైకమ్మ, దానికి కొన్ని బంగారుగొలుసులు అమర్చుకొని తాడుకట్టిన కోతి ఎలా ఉంటుందో అలా తిరుగుతోంది తస్యాః కురు యథా మతి మీరు ఏం చేద్దామనుకుంటున్నారో చెయ్యండి అన్నాడు, ఇప్పుడు భరతుడు ఏం చెయ్యలేదు భరతుడు అలాగే కూర్చున్నాడు, శత్రుఘ్నుడు వెంటనే పరుగు పరుగున వెళ్ళాడు వెళ్ళి ఆ ద్వారపాలకులు పట్టుకున్నటువంటి ఆ మంధరని పట్టుకుని భూమి మీదపడేటట్టుగా అంటే అంత ఆవేశంగా లాగాడు ఆడదాన్ని లాగితే ఆవిడ కిందపడిపోయింది, కిందపడిపోతే ఆవిడని బరబరబర ఈడ్చుకొస్తున్నాడు భరతుడి దగ్గరికి స చ రోషేణ తామ్రాక్షః శత్రుఘ్నః శత్రు తాపనః ! విచకర్ష తదా కుబ్జాం క్రోశన్తీం పృథివీ తలే !! నేలమీద పడిపోయినటువంటి ఆ మంధరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరకు తీసుకొచ్చినటువంటి ఆ శత్రుఘ్నుడి యొక్క కన్నులు ఎర్రబారిపోయి ఉన్నాయి.
శత్రువులను తపింపజేయగలిగినటువంటి పరాక్రమవంతుడైన శత్రుఘ్నుడు ఒక గూనికలిగిన ఆడదాన్ని ఇలా ఈడ్చుకుని తీసుకునివచ్చాడు, తీసుకొని వచ్చీ భరతుని దగ్గరకు తీసుకొని వచ్చీ ఈమెయే మన కష్టాలన్నిటికీ కారణం, ఇప్పుడు మనం ఈమెను శిక్షిద్దాం అంటే ఈలోగా అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఇవ్వాళ శత్రుఘ్నుడి యొక్క పరాక్రమం చూస్తే, శత్రుఘ్నుడి యొక్క రోషం చూస్తే మనల్ని ఎవ్వరినీ కూడా బ్రతకనిచ్చేటట్లుగాలేడని చల్లాచదురై పరుగు పరుగున కొంత మంది కౌసల్య దగ్గరకు పరుగెత్తుకెళ్ళారు, ఈ మంధర కైక కోసం కేకలు వేసింది కైకమ్మ పరుగు పరుగున వచ్చింది, ఉన్నది కైకా మందిరంకదా అందుకని ముందు ఆవిడ రాగలదు ఆవిడ గబగబా వచ్చింది, వచ్చి భరతున్ని ప్రార్థనచేసింది ఆ మంధరని ఏమి అనద్దూ అని తాం ప్రేక్ష్య భరతః క్రుద్ధం శత్రుఘ్నుమ్ ఇదమ్ అబ్రవీత్ ! అవధ్యాః సర్వ భూతానాం ప్రమదాః క్షమ్యతామ్ ఇతి !! ఆయన అన్నాడూ... కైకమ్మ తనని ప్రార్థన చేసినందుకు రక్షిస్తున్నట్లుగా భరతుడు మాట్లాడలేదు, ఒకసారి కైకమ్మ వంకచూశాడు పార్థనచేస్తే కైకమ్మకి జవాబు చెప్పలేదు, శత్రుఘ్నుడికి చెప్పాడు జవాబు ఏమనీ? అవధ్యాః సర్వ భూతానాం ప్రమదాః క్షమ్యతామ్ ఇతి సమస్త భూతములయందు చంపకూడనిది ఎవరైనా ఉంటే... ఆడదే..! ఆడదాన్ని చంపడానికి మనకి అధికారం లేదు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
కాబట్టి నీవు ఈమెను వెంటనే విడిచిపెట్టేయాలి హన్యామి అహ మిమాం పాపాం కైకేయీం దుష్ట  చారిణీమ్ ! యది మాం ధార్మికో రామో నాసూయే న్మాతృ ఘాతుకమ్ !! యది మాం ధార్మికో రామో నాసూయే న్మనాతృ ఘాతుకమ్ నీవు మంధరని చంపదామనుకుంటున్నావు, నేను కైకనే చంపివుండేవాన్ని కైకని నేను ఎందుకు చంపలేదో తెలుసా? ధర్మాత్ముడైన రాముడు వీడు మాతృహంతకుడు అంటాడు, మాతృహంతకుడు అని నన్ను గుర్తించగానే నాపట్ల ఆ అభిప్రాయం ఏర్పడగానే ఇక రాముడు నాతో మాట్లాడడు అందుకని ఈమెను వదిలేశాను అన్నాడు, ఇప్పుడు ఎవరు రక్షించడానికి వచ్చిందో ఆవిడ ఎందుకు రక్షింపబడిందో చెప్పాడు చెప్పీ... ఇమామ్ అపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః ! త్వాం చ మాం చ హి ధర్మాత్మా నాభిభాషిత్యతే ధ్రువమ్ !! మనం ఈ కుబ్జని చంపామూ అన్న విషయాన్ని కానీ రాముడికి తెలిస్తే... త్వాం చ మాం చ నీతోటీ నాతోటీ కూడా రాముడు మాట్లాడడు. ఎందుకో తెలుసా..? కుబ్జా ఎవరికి అపకారం చేసింది, రాముడికి అపకారం చేసింది, కుబ్జ రాముడికి అపకారం చేసిందీ అని రోషమున్న ఎవరికి తెలుసు లక్ష్మణుడికి తెలుసు, రాముడు చంపాడా కుబ్జనీ..? చంపలేదే, లక్ష్మణుడు చంపాడా..? కుబ్జని చంపలేదే..? మరి రాముడూ లక్ష్మణుడు చంపనిదాన్ని నీవు ఎలా చంపుతావు? ఒకవేళ నీవు చంపుతానంటే నేను పక్కనుండి అంగీకరిస్తే... రాముడు చెయ్యనిపని మనం చెయ్యడానికి సిద్ధపడినట్టా..!
రాముడు ఈపని చెయ్యకూడదూ అనుకుంటేగా వదిలేశాడూ... మరి రాముడు ఈపని చెయ్యకూడదూ అని వదిలేసినదానిని నీవ్వెలా చేస్తావు? నేనెలా చేస్తానూ? అప్పుడు రాముడి దగ్గరికివెడితే అంటే నేను చెయ్యలేక వదిలేశావనుకుంటున్నావా? నీవు ఎందుకుచేశావు అంటే ఏం చెప్తావు? వదిలేశాడంతే శత్రుఘ్నుడు ఈ సర్గ అంతే ఉంటుంది. కాని ఇందులో చాలాగొప్ప ధర్మసూక్ష్మం ఒకటి ఉంటుంది, మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే... రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు, భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు సాధారణంగా శత్రుఘ్నుడు ఎప్పుడైనా కొద్దిగా ఒడుదొడుకులకు లోనయ్యాడనుకోండీ ధర్మాన్ని అవలంభించడంలో తొట్రుపాటు వచ్చిందనుకోండీ భరతుడు దిద్దుతాడు, భరతుడు దిద్దడమన్నమాట మీరు ఎప్పుడూ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, భరతుడుదిద్దితే శత్రుఘ్నుడు దిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. దిద్దేవాడు ఉన్నా దిద్దుకోవడానికి సిద్దంగా అవతలవాడు లేడనుకోండీ, అవతలివాడు ఎలా దిద్దుతాడండీ..?
ధర్మమన్నదీ ఆచరణ ప్రధానము మీరు ఆచరించవలసినదానికి ధర్మమని పేరు, నీవు ఆచరించు అని అవతలవాడు చెప్పాడనుకోండీ..? ఇవతలవాడు ఆచరించలేదనుకోండీ ఇప్పుడూ ధర్మమన్నమాటకు  అర్థమేక్కడుందీ..? ఉపయోగం ఏముంటుంది, అవతలవాడు చెపుతూనే ఉంటాడు ఆచరించమని ఇవతలివాడు ఆచరించడు, అప్పుడు ఆచరించనప్పుడు మీరు ఎంత ధర్మాత్ముడితో కూడి ఉన్నప్పటికీ మీరు మాత్రం ధర్మాత్ములు కాలేరు మీకు ధర్మమేమీ ఉపయుక్తం కాలేదు, మిమ్మల్ని ధర్మం రక్షించలేదు, ఎందుకంటే మీరు ఆచరించరు. ధర్మము ఆచరిస్తున్నవాడి పక్కన ఉండడంవల్ల ఉపయోగం ఉండదు, ధర్మాచరణం చేసేవాడిపక్కన ఉండి ధర్మాచరణమును మీరు నేర్చుకోవాలి. ధర్మాచరణమునందు మీకు వచ్చే వైక్లవ్యాన్ని మీతో ఉన్నవాడు దిద్దగలిగినవాడై ఉంటాడు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
శత్రుఘ్నున్ని ఎప్పుడూ భరతుడు దిద్దుతాడా..! భరతుడూ తొట్రుపడుతాడు, భరతుడు కూడా తొట్రుపడుతాడు ధర్మంలో అప్పుడు ఎవరు దిద్దుతారు రాముడు దిద్దుతాడు. రాముడూ తొట్రుపడుతాడా... ధర్మంలో..? పడతాడు నరుడు కాబట్టి, రాముడు పడడు అని మీరంటే తప్పు. నేను చూపిస్తా కొన్ని సందర్భాలు, ఆయన కూడా తొట్రుపడుతాడు. అప్పుడెవరు దిద్దుతారు లక్ష్మణుడు దిద్దుతాడు, అలా ఎలా దిద్దుతాడండీ రాముడికి చెప్పగలిగిన మొనగాడా లక్ష్మణుడు అని మీరనుకోకండీ, ధర్మమంటే ఏమిటో తెలుసాండీ..? తను చెయ్యవలసినపని చెయ్యటంలేదని ఎంత చిన్నవాడు చెప్పినా ఒప్పుకోగలిగిన లక్షణమని నేను మీకు చెప్పినప్పుడు, చిన్నవాడు చెప్పడం పెద్దవాడు చెప్పడం ఉంటుందా..? ఉండదుగా! నేను చెయ్యవలసినపనిని నేను చెయ్యటం లేదు అని నాకన్నా చిన్నవాడు చెప్పాడనుకోండీ... నిజమే అది నేను చెయ్యటంలేదు అని నేను అనుకుంటే చెయ్యడానికి సిద్ధంగా ఉంటే అది ఎంత చిన్నవాడు చెప్పినా వింటేనే నేను ధర్మాత్మున్ని, బాగాధర్మాత్ముడు రాముడని గుర్తేమిటంటే..? తనకి చెప్పే అధికారం లేనివాడు తన దగ్గర నేర్చుకోవలసినవాడు తనకు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటాడు రామ చంద్ర మూర్తి.
ధర్మమునందు వైక్లవ్యం లేకుండా ఉండడం అన్నది అంత తేలికైన విషయం కాదూ... వస్తుంది తడబాటు కానీ, మీరు దిద్దుకోవలసి ఉంటుంది. ఇప్పుడూ ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారండీ... కాని ఒక దేవాలయంలో ప్రతిష్ఠచేసిన తరువాత మీరు దానికి నమస్కారంచేసి నా కోరిక తీర్చమని ప్రార్థన చేస్తారు, కానీ ఆ విగ్రహం రావడానికి అంత తేలికేం కాదు, ముందు చాలా కాలం నీటిలో కొన్ని వందల సంవత్సరముల నుంచి నానిపోయినటువంటి ఒక శిలని గుర్తించాలి, ఇప్పుడది గుర్తించడానికి స్తపతి చాలా గొప్పవాడై ఉండాలి, గొప్పవాడైన స్తపతి దానిని గుర్తిస్తాడు, ఈ శిలని బయటికి తీసుకురండీ అంటాడు, అది ఎప్పుడు అనగలడు స్తపతి, స్తపతి ఈతగాడు కాదు, నీటిలో శిల ఉండగా స్తపతి పట్టుకోడు, ఎప్పుడో నీరు తీస్తుంది నది, ఆ నదిలోంచి తీస్తే ఆ శిల బయటికొస్తుంది, ఆ... ఈ శిల చాలా గొప్పదండీ, దీంట్లో ఫలానా మూర్తిని చెక్కితే అత్యద్భుతంగా ఉంటుంది, ఇప్పుడు ఒక పోషకుడు కావాలి. అంటే దాన్ని బయటికి ఈడ్పించి తెచ్చి దాన్నివుంచి దాంట్లోంచి శిల్పాన్ని చెక్కించడానికి ధనాన్ని వ్యయంచేసేవాడు ఒకడు ఉండాలికదా..! తప్పా ఒక విషయాన్ని పట్టుకొచ్చీ ఎవరో నాబోటిగానికి చెప్పారనుకోండీ ఏమిటి దానివల్ల ఉపయోగం, ఉపయోగం ఏమీ ఉండదు. దానికి సమర్థుడైనవాడు ఆ శక్తి ఉన్నవాడూ ఉపయోగించగలిగిన నేర్పరికిచెప్పాలి.
ఇప్పుడు ఆయన ఏమంటాడు అయన సరే తీసుకురండీ అంటాడు, ఎక్కడికి తీసుకురావాలి దాన్ని శిల్పాన్ని చెక్కే ప్రదేశానికి ఈడ్చుకు వెళ్తారు దానికి స్తపతి ఏం చేయడు, బాహు బలం కలిగినవాళ్ళు దాన్ని తాళ్ళుకట్టి తప్పెట్లు కట్టీ ఏదో పెద్ద వాహనమెక్కించీ లెదా ఈడుస్తూనో లెదా ఇసుకపోస్తూనో ఎలానో ఈడ్చుక వెళ్తారు. తీసుకెళ్ళిన తరువాత ఏం చేస్తారు, స్తపతి చెక్కరు దాని మీద గీత గీసి ఇక్కడికి పాదాలు వస్తాయి, ఇక్కడికి మోకాళ్ళు వస్తాయి, ఇక్కడికి తొడలొస్తాయి, ఇక్కడికి కడుపు వస్తుంది, ఇక్కడికి వక్షస్థలం వస్తుంది ఇక్కడికి తల రావాలి ఇక్కడికి చెవులు రావాలి, ఈ పక్క ముక్క పగలగొట్టేయండి అంటాడు. ఏది మూర్తి చేయడానికి అవసరముందో మీగిలిన భాగాన్ని

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
తరిగేయడానికి కొంత ప్రావీణ్యం ఉన్నవాళ్ళు తరిగేస్తారు దాన్ని ఇప్పుడు తరువాత ఆ ఉన్నదాంట్లోంచి కడుపు చెక్కాలి, దీనికి ఇంకొక స్తాయి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు చెక్కేస్తారు, చిట్ట చివర కళ్ళు చెక్కాలి అప్పుడు స్తపతే కూర్చుంటాడు. అది అత్యంత కీలకం చాలా జాగ్రత్తగా చెక్కాలి, ఇలా చెక్కేటప్పుడు ఎటోచూసి దెబ్బ ఎక్కువగా కొట్టారనుకోండీ, పెచ్చెగిరిపోయిందనుకోండీ అయిపోయింది అంతే విగ్రహమంతాను, ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బే కొడుతూ ఎంత ముక్క తీయ్యాలో అంత ముక్కే తీస్తూ సౌందర్యాన్ని తీసుకరావాలి, ఇప్పుడు తీసుకొచ్చిన తరువాత ఎక్కడ కూర్చోని చెక్కాడు శిల్పీ దానికంఠం మీదో బుగ్గల మీదో కూర్చొని చెక్కుతాడు శిల్పి. తీసుకొచ్చి ప్రతిష్ఠచేశారు ప్రతిష్ఠచేసిన తరువాత అభిషేకం జరుగుతోంది, అభిషేకం జరిగిన తరువాత ఒకాయన అన్నాడు ఏమండీ కంటి చివర ఇలా చిన్న బొప్పిలా ఉండిపోయిందండి రాయీ ఒక్కసారి ఉళి తెచ్చి కొట్టేద్దురూ అన్నాడు కొడతాడా శిల్పి ఇక కొట్టడు అది ప్రతిష్ఠ అయిపోయింది అంటాడు.
ఇంత బాగా చెక్కితే తప్పా మూర్తి రాలేదు. ధర్మం కూడా అంతే అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చెక్కబడాలి చెక్కబడితే మీరు ఆరాధించవలసినమూర్తి ప్రతిష్ఠ అయినట్లే గురు వాఖ్యములచేత పెద్దల వాఖ్యములచేత ఆ కావ్య పఠనంచేత ఆ శాస్త్ర పఠనంచేత మీ మనసు చెక్కబడీ మీరు దానిని చదువుకున్నదానిని అనుష్టానంలోకి కూడా తెచ్చుకుంటూంటే... చదువుకున్నది చదువుకున్నట్లు వదిలేయడం కాదు, చదువుకున్నదాన్ని అనుష్టానంలోకి తీసుకొస్తే... అప్పుడు ధర్మాత్ముడు అనిపిలుస్తారు. లేకపోతే శుష్కపాండిత్యమూ అంటారు, అది ఎందుకుపనికి వస్తుందంటే ధారాళంగా ప్రసంగం చేయడానికీ, నాలుగు పద్యాలు చెప్పడానికి కవిత్వం చెప్పడానికి పనికివస్తుంది. ఆచరణ ఏమీ ఉండదు ఎప్పుడో ఈశ్వరుడిపట్ల ఏదో పూజచేశాడూ ఇప్పుడు వచ్చింది సరస్వతీకటాక్షం, చెప్తాడు అంతే ఆయనకుందా ఆచరణా ఆయనకేం లేదు ధర్మాత్ముడు కాదు ఉపన్యాసాలు ఏంచెప్పడు, ఎవ్వరితో ఏంచెప్పడు తానుచదువుకుంటాడు తాను ఆచరిస్తాడు ఎవరు గొప్పవాడు, తాను ఆచరించినవాడు గొప్పవాడు.
కాబట్టి బోధా గొప్పదే బోధతోపాటు ఆచరించగలిగినటువంటి స్థితికూడా ఉండాలి, ఆచరించగలిగినటువంటిస్థితి అనగానే వైక్లవ్యం ఉంటుందండీ, తొట్రుపాటు ఉంటుంది పరిస్థితుల ప్రభావంతో ఈతొట్రుపాటు దిద్దుకోవడానికి మీకు ఎప్పుడు కూడా పక్కన సత్పురుషుని యొక్క ఆసరా ఉండాలి. అందుకే ఓ పెద్దమాట ఏం చెప్తారంటే శాస్త్రంలో... మీరు కోటిరూపాయలు పోనివ్వండీ బెంగపెట్టుకోవద్దు, సత్పురుషుడితోటి సహవాసం మాత్రం పోనియకండీ అంటారు. ఎందుకో తెలుసా ఆయనే మీకు మహోపకారం చేసేవాడు ఆయనే మీ ఆచరణను దిద్దగలిగినవాడు, ఆయనే మీకు ఇహమునందూ పరమునందూ కాలసినటువంటి అద్భుతమైనస్థితిని ఆర్జించిపెడతాడు ఆయన పక్కన ఉంటే మీకు ఆ ఆర్జనవస్తుంది మీకు ఆయన పక్కన లేకపోతే మీరు అలా ఆర్జించలేరు, ఇంకోలాపోతుంది అది ఈ స్థితి మీకు ధర్మాన్ని పట్టుకున్నవాడితో కలిసి ఉంటేనే మీకు అది వస్తుంది. అందుకే రామాయణంలో శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుడి పక్కన ఉంటాడు, లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి పక్కన ఉంటాడు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
https://lh3.googleusercontent.com/-t-RHWf6ndIM/UI-F-ElhNfI/AAAAAAAATbE/Oy0K_4hYbNc/w506-h430/truth-kids-stories-647x450%255B1%255D.jpgఒకరి తొట్రుపాటుని ఒకరు దిద్దుతుంటారు, ఇదీ మనం కూడా ఉండవలసినటువంటి స్థితిని నేర్పుతుంది. దిద్దడం అన్నదానియందు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడూ..! ʻశ్రద్ధాʼ శ్రద్ధా అంటే భక్తి దేవతల యందు భక్తి మీరు శృతి చెప్పినటువంటి ప్రమాణాన్ని తీసుకొనీ దానివలన భక్తితో మీరు చేసేటటువంటి కార్యాచరణమునందు పరిస్థితుల ప్రభావముచేత ఎప్పుడైనా తొట్రుపాటు కలిగితే పెద్దలైనటువంటివారు అనునయ వాఖ్యములతో మీ తొట్రుపాటును దిద్దడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దిద్దుకునే పూనిక మీలోకూడా ఉంటే..? మీరు ధర్మాత్ములుగా నిలబడుతారు.
అందుకే రామకృష్ణ పరమహంస దీనికొక అద్భుతమైన ఉదాహరణ చెప్పేవారు, ఎనుగు ఎప్పుడూ తొండాన్ని సరిగ్గా ఉంచదు, అది ఇలా నడుస్తుంటుంది ఇలా ఎత్తి ఆ స్థంబాన్ని ముట్టుకుంటుంది, ఈ తాడు లాగుతుంది, ఎదో కొమ్మలాగుతుంది, శృంగేరిలో ఏనుగు ఆడవాళ్ళు తలలో పెట్టుకున్నటువంటి పువ్వులు లాగడం కూడా నేను చూశాను, అంటే శృంగేరిలో ఏనుగే అలా చేస్తుందని మీరు అనుకోకండీ, ఏనుగు యొక్క చిలిపితనం అటువంటిది దానితొండం ఉత్తిగనే ఉండదు ఏదో ఒకపని చేస్తుంటుంది, మావటి పక్కన ఉండి ఏంచేస్తాడు, అలా వెళ్ళిపోతుందనుకోండి మీరు కష్టపడి మారేడుచెట్టు పెంచారనుకోండీ అది తల ఇలా ఎత్తుతుంది మావటి ఇలా అంటాడు తొండం దింపేస్తుంది, మళ్ళీ నాలుగు అడుగులు వేస్తుంది, తోరణం పట్టుకుంటుంది మళ్ళీ ఇలా అంటాడు మళ్ళీ ఇలా దింపేస్తుంది, మావటి బలవంతుడా ఏనుగు బలమైనదా... ఏనుగే బలమైనది బలమైన ఏనుగు బలములేని మావటి మాటవినడానికి సిద్ధపడింది. కాబట్టి దానికి అందరూ నమస్కారం చేస్తున్నారు అది ఎవ్వరికీ అపకారం చెయ్యదు.
మీరు కూడా ఆయన బలవంతుడా శారీరకంగా కాడా, నా అంత ధనవంతుడా కాడా, నా అంత అధికారా కాడా, నా అంత అందగాడా కాడా ఇది కాదు మీరు చూడవలసింది, ఆయన అనుష్ఠానం ఎంత ఇదిచూసి మీరు ఆయనకిలొంగడం, మీరు లొంగాలి మీఅంత మీరుగా... లొంగదీయడం గురువు ఎప్పుడూ లొంగదీయడు ఆయనకు అవసరం లేదు, మీరు లొంగవలసి ఉంటుంది. లొంగితే మావటి తొండం మీద ఇలా అంటే ఏనుగు తప్పు చేయనట్టూ ఆయన పక్కన నడుస్తుంటే ఆయన మాటలచేత మీరుకూడ అభ్యున్నతిని పొందుతారు ఆ మాటకు మీరు కట్టుబడి, ఇదే రామకృష్ణ పరమహంస అంటాడు ఎక్కడెక్కడ అలా మీరు సత్పురుషులతోకూడి కలిసి ఉన్నారో సత్పురుషులతో కూడిక అంటే ఎప్పుడూ పక్కన కూర్చోవడం కాదూ అని మీరు బాగాజ్ఞాపకంపెట్టుకోవాలి. ఆయన మాటయందు మీకు ఆఁవిశ్వాసము కలిగి ఉండుటా అదిబాగా దగ్గరవడం, అంతేవాసి అంటారు అంతేవాసి అంటే తనలో ఉన్నవాడు ఇయ్యనలో ఆయనలో ఉన్నవాడూ ఈయ్యన అన్నీ ఆయన చెప్పారని చేస్తారు. కాబట్టి పక్కన ఉన్నా లేకపోయినా ఆయన ఈయ్యనకి అంతేవాసి ఈ అంతేవాసిత్వం మీకు రాముడిపట్ల భరతుడికి ఉంటుంది. మీరు బాగా గమనించండి, ఇది పాదుకా పట్టాభిషేకమునకు దారితీసింది.
రాముడు భరతునిలో ఉంటాడు, భరతుడు రామునిలో ఉంటాడు, శత్రుఘ్నుడు భరతునిలో ఉంటాడు, రామునిలో ఉంటాడు, శత్రుఘ్నుడు భరతునితో ఉన్నానని రామునితో దూరంగా ఉన్నాడని కాదు దానర్థం, శత్రుఘ్నుడు భరతుడితో కూడి రామునియందు ఉంటాడు. లక్ష్మణుడు రామునితో ఉండి, రామునిలో ఉంటాడు. ఒక్కొక్కసారి రాముని పక్కనే ఉండి లక్ష్మణుడు రామునికి దూరంగా ఉంటాడు, అప్పుడు మళ్ళీ రాముడు దూరంగా ఉన్న లక్ష్మణున్ని దగ్గరకు లాక్కుంటాడు ఇదీ ధర్మానుష్టానంలో వచ్చే వైక్లవ్యాలను దిద్దుకోవడం. ఈ దిద్దుకోవడం అన్నప్రజ్ఞా పక్కనలేదనుకోండీ, ఎప్పుడో ఒకప్పడు భయంకరమైన దోషంచేసి అసలు ఇక ఆ జన్మకు దిద్దుకోలేనంత పెద్ద గోతిలోపడిపోతాడు, ఇక ఆజన్మకు దిద్దుకోవడం కుదరదు

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
మీరేం చేయలేరన్నమాట. అది చాలా భయంకరమైనస్థితి మనవాళ్ళు చిన్నప్పుడు ఒక ఆట ఆడుకుంటుంటారు, ఇప్పుడంటే పోయాయికానీ ఆ ఆటలన్నినీ, మా చిన్న తనంలో అదేంటీ ఒక వ్యక్తీ ఏదో పరుగెత్తుకుంటూవెల్తే వాడు ముట్టుకుంటే వాడు అక్కడ కూర్చునేవాడు ఇక లేవకూడదు కాని ఇంకొకడు ఏం చేసేవాడంటే పరుగెత్తుకుంటూ వచ్చీ ఎవడింకా అలా దొంగచేత ముట్టుకోబడి పడిపోలేదో వాడొచ్చి వీన్ని ముట్టుకుని కరెంట్ అని అనేవాడు అంటే వాడు లేచేవాడు. అంటే దేనివలన తేజస్సుపోయిందో ఏది ముట్టుకోవడంవల్ల తేజస్సుపోయిందో దాన్ని తేజస్సు ఉన్నవాడు ప్రవేశపెట్టేవాడులేచి మళ్ళీ పరుగెత్తేవాడు. ఆటలలో ఒక అంతరార్థం ఉండేది, అందుకే వాళ్ళు ఆడుకునేటప్పు కరెంట్ బాక్స్ అనీ అదో ఆట, కానీ ఆటయందు ఒక ఆధ్యాత్మికరహస్యం నిక్షేపించబడి ఉండేది, జారిపోతుంటావు పట్టుదలతో పైకి ఎక్కుతుండాలి, పరమపద సోపానపఠము అని ఒకఆట ఆడించేవారు చిన్నప్పుడు, ఎదో ఒక పందెం వేయించడం నిచ్చన దొరుకుతుంది 73డో గళ్ళల్లోకి వెళ్ళిపోతాడు 86లోకి వెళ్ళుతుంటాడు అరుకోసుడు కరిచేస్తాడు, మళ్ళీ ఒకటో దగ్గరికి వచ్చేస్తాడు కోతి పిల్లలోకి, మళ్ళీ పందెం వేస్తాడు ఆఖరికి దేవతల్లోకి వెళ్ళతాడు ఇక పాములు కరవవు భయం లేదు, కానీ అది పూర్తైపోయినట్టా ఆట పూర్తైనట్టు కాదు పండిపోవాలి.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhBbBEbNXlvDrkRzvB0sMbv280H0ukMH7NMSS4X8eifCx67Kmpgx8eZx4YlaXl3yYFl2ixUKYvKH4bL9meZtnNdUElwcZRWULtP6lfNxDM1gcMrfjIVH69GkJQ_UoOoRf2UciD7ThoWH8yk/w1200-h630-p-nu/vaikuntapali2.jpeg పండిపోవడం అంటే దేన్ని నీవు పట్టుకున్నావో వగరుగా ఉన్నప్పుడు పట్టుకున్నావో, పుల్లగా ఉన్నప్పుడు పట్టుకున్నావో అది పచ్చగా అయిపోయి తీయ్యగా అయిపోయాక నీయంత నీవు పట్టుకోకుండా వదిలిపెట్టి కిందపడిపోవాలి, పండిపోవడమంటే అది పిందె పట్టుకుంటుంది వగరుగా కాయ పట్టుకుంటుంది పుల్లగా అదే మామిడి పండైపోయింది తీయ్యగా అయిపోయింది ఇప్పుడు ఆ పండిపోతే ఇంక చెట్టును పట్టుకోదు ఊడి కిందపడిపోతుంది. దీట్లోంచి విడివడిపోవడం నీకు రావాలి ʻఆత్మగాʼ విడవడాలి శరీరానికి సాక్షివికావాలి అదే ఉపాసన కాండ సుందర కాండ. ఈ సాక్షీత్వంవస్తే నీ వెవరవో నీకు తెలుస్తుంది, నీవెవరో నీకు తెలిసినటువంటి స్థితిలో నీవు పండిపోయావు. అది ఆ మధ్యలో ఉంటాడు విరాట్ పురుషుడు ఆయనలోకి వెళ్ళిపోతుంది ఆ చింతపిక్క వెళ్ళిపోయిన తరువాత అబ్బా ఇంక నేను పండిపోయాను నేను ఫస్ట్ పండిపోయాను ఫస్ట్ పండిపోయాను అంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమిట్రా ఫస్ట్ పండిపోయావ్ పండి పోవడం అంటే ఏమిట్రా అని ఎప్పుడో ఒకప్పుడు అడుగుతాడు తండ్రి, పండిపోవడం అంటే మధ్యలో ఉన్నారే ఆయనలోకి వెళ్ళిపోవడం అంటాడు. ఆయనలోకి వెళ్ళిపోతే ఏమైంది ఇంక పిక్క బయటికి రాలేదు, ఇక ఆట ఆడక్కరలేదు అయిపోయింది పండిపోయాడు అంటే ఇంక శరీరం పుచ్చుకోడు వెళ్ళిపోయాడు ఇంక ఈశ్వరుడిలో కలిసిపోయాడు తెలిసిపోయింది తాను తన యొక్క స్వస్వరూపము యదార్థముగా భాషించింది, ఇది తెలియడం పరమపద సోపాన పఠం, ఆ ఆట అందుకు ఆడడం.
సరే, అందుకనీ ఈ ధర్మమునందు వచ్చేటటువంటి వైక్లవ్యాలనీ దిద్దుకోవడానికి ఆధారమేమీ అంటే ముందు ఉండవలసినది విశ్వాసము, భక్తి అసలు ముందు ఇవి లేవనుకోండీ ఆయన చెప్తారు కానీయండీ, అవన్నీ ఎక్కడ చేస్తామండీ, అవన్నీ ఏమీ అక్కరలేదూ ఏదో వినడానికి అంతే అని అన్నారనుకోండీ..! దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీ అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది, మీరు అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలన్న పూనికా, వినడం ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి పూనిక ఉందే ఈ పూనికకు ధర్మము నందు ఆసక్తీ అని పేరు. వినేసి ఉత్తరీం దులుపుకుని వెళ్ళిపోయారనుకోండీ... ఏం ప్రయోజనం అంటే ఏమో విన్నారు కాబట్టి కొంత ప్రయోజనం అని నేను అనగలను, ఏదో కొద్దిగా విననివాడికన్నా విన్నవాడు మేలుకదా! ఎప్పుడో ఒకప్పుడు వచ్చేస్తుంది అంతే అంతవరకే.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
మేం ఇన్ని వింటున్నాం కదా! ఏం మనం చేద్దాం ఇదీ... అని మీరు అనుకున్నారనుకోండి ఇప్పుడు మీరు పూనిక అన్నదొకటి పుట్టిందన్నమాట, ఇప్పుడు ఇంకో మెట్టు పైకి ఎక్కారు, ఈ పూనికను మీరు చంపేయకూడదు, దీన్ని మీరు కాపాడాలి అంకురానికి చుట్టూ జాగ్రత్తగా పాదుకట్టి నీరు పెట్టినట్టూ అంకురం పుట్టగానే మీరు అలవాటుచేస్తే అది ఏం చేస్తుందో తెలుసాండీ, మీ మనసేం చేస్తుందంటే అదే అడుగుతుంది, మనం ఇదొటి చెయ్యాలిగదూ కష్టమో నిష్టూరమో ముందు అడుగుతుంది. నేను మీకో ఉదాహరణ చెప్తాను చూడండీ...
Image result for రామ నామం రాయడందేవాలయానికి నేను ప్రతిరోజూ వెళ్ళుతాను అని అంతవరకెందుకండీ ప్రతి రోజూ నేను 108 సార్లు శ్రీ రామ నామం రాస్తాను అని అన్నారనుకోండీ..! ముందు అంటుంది మనకు ఎక్కడ కుదురుతుందీ, ఎంతకష్టం ముందు అవతల టిఫిను తినాలి, కాఫీ తాగాలి, స్నానం చెయ్యాలి, పూజ చెయ్యాలి, ఆఫీసుకు వెళ్ళాలి, సాయంత్రం రావాలి వీడు రామాయణం సాయంత్ర వరకూ చెప్తున్నాడు ఎప్పుడు రాస్తాం, వద్దు ఇలాంటి సంకల్పాలు అంటుంది, ఏమీ? ఓ అరగంట ముందు లేస్తావూ, అరగంట ముందు లేస్తే మిగిలిన అరగంట రామ నామానికి వాడుతావ్ రామాయనం ఎన్నాళ్ళువింటావు? 42 రోజులు అయ్యిపోయింది 10 రోజులు ఇంకా మిగిలింది 32 రోజులు. 30 రోజులు 108 పర్యాయాలు నేను రామ నామం రాసితీరుతున్నాను రామాయణంవింటూ అని మీరు అన్నారనుకోండి, మూడు రోజులు రాయించండి మీ మనసునిపెట్టీ నాల్గో రోజు ఏమంటుందో తెలుసాండీ... అరగంట ముందు లేవకపోతే రామనామం రాయడం అవదు ఇది 108 మార్లు రాయాలి కదా అని మీకు అదే గుర్తు చేస్తుంది. ఏనుగుముందు లొంగదు మావటివాడు అంకుశం పెట్టి పొడిచీ పొడిచీ పొడిస్తే తనని కట్టవలసిన తాడుని తొండంతో తీసి తానే ఇస్తుంది. మీ మనసు కూడా అంతే..!, మీరు దాన్ని సంస్కరించుకోవడంలో ఉంటుంది అది మధ్యలో పుట్టే పూనికా, ఆ పూనికని మీరు పోషించాలి పోషిస్తే మీరు ధర్మావలంబకులు అవుతారు. దాన్ని చంపేశారనుకోండి మీరేమీ చేయలేరు. ఆరు ఇరవైకి స్నానం చేస్తానండీ అని మీరన్నారనుకోండీ మనసు తప్పు ఉండదు గుర్తుపెట్టుకోండి ఆరు ఇరవైకి జ్ఞాపకం చేస్తుంది, ఏదో తాదాత్మకతలో మరిచిపోతే నేను చెప్పలేను కానీ ఆరు ఇరవై అయిందనుకోండీ ఏం ఫరవాలేదు ఇంకో పది నిమిషాలు ఆగుదామనుకుంటే ఊరుకుంటుంది శరీరం. ఆరూ ఇరవై అయింది లే..? అన్నారనుకోండీ! లేచి వెళ్ళిపోతారు అంతే స్నానానికి, ఇది మీరు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది మనస్సుకి శిక్షణ చాలా అవసరం సరే ఇంతకీ ఈ ధర్మాన్ని అందుకోవడం అనేటటువంటిది విశ్వాసమన్న మాటతో ఇది నేను చేస్తే రాముడు దగ్గరకి రానివ్వడు.
కాబట్టి నిషిద్ధకర్మ పరిత్యాగమునకు సులువైన మార్గమేమిటో తెలుసాండీ..? రేపు ఈశ్వరుడి మొఖం ఎలా చూడను ఒక్కటే నిషిద్ధ కర్మ అది చేయకూడదు ఆడదాన్ని చంపకూడదు, ఎందుకు చంపకుండా ఉండగలిగారు, రేపు రాముడు మనతో మాట్లాడడు, మీ ఇంటి పూజామందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు మీరు తిరుపతిలోనూ కాశీలోనూ కొని తెచ్చుకున్నవే అని మీరు అనుకున్నంత కాలం మీరు మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కుదరదు గుర్తుపెట్టుకోండి. మీరు నిజాయితీగా ఈశ్వరుడు ఉన్నాడూ మందిరంలో సింహాసనంలో పెట్టిన పాదుకలు రాముడు ఉన్నాడు అని భరతుడు అలా పరిపాలించగలిగాడు, నా సింహాసనంలో ఉన్నవిగ్రహం విగ్రహం కాదు ఈశ్వరుడు ఆయన ఉన్నాడు అక్కడ నేనూ పాదయోః పాద్యం సమర్పయామీ అంటే ఆయన కాళ్ళు కడగబడుతాయి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామీ అంటే ఆయన చెయ్యి చాపుతారు, నేను నైవేద్యం పెడితే ఆయన తింటారు, నేను తప్పుచేస్తే రేపు పొద్దున నేను పూజా మందిరంలోకి వెళ్తే, వెళ్ళి కూర్చోగానే నా దగ్గరకొచ్చీ ఈవేశాలు ఏం చేశావు నిన్న అని అడుగుతాడు, నేను ఏం చెప్పను అని మీరు అనుకున్నారనుకోండీ మీరు చేయలేరు మీరు అలోచించండీ!

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
ఈశ్వరుడు ఉన్నాడూ అని మీరు అనుకున్నారనుకోండీ నికేతనే మాతా పితా అంటుంది ఆవిడా ఆ వరాహ పురాణంలో, ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడు, ఉండకపోవడం ఏమిటండీ పూజా మందిరంలో ఉన్నాడు కదా..! అని స్వామి ఉన్నారండీ రేప్పొద్దున నేను వెళ్ళి కూర్చోగానే హస్తయో ఆర్ఘ్య... ʻఛీʼ... నీ చేతి నీళ్ళు నాకెందుకూ పాపాత్ముడా... ఇవన్నీ చెప్తావు మళ్ళీ వెళ్ళి పాపలన్నీ చేస్తొస్తుంటావు బుద్ధి మార్చుకోవు ఎన్నాళ్ళకి ఏం మీ పిల్లల్ని మీరు దెబ్బలాడినప్పుడు ఈశ్వరుడు మీతో దెబ్బలాడాండీ..! దెబ్బలాడడని ఎందుకు అనుకుంటున్నారూ? కాబట్టి మీ పిల్లల్నిచూసి మీరు సంతోషంగా ఉండాలంటే మీ పిల్లలు తప్పు చేయకుండా ఉంటే కదా ఉంటున్నారు, మీ పిల్లలు మంచి మార్కులతో పాసైతే కదా! మీరు ధర్మం పట్టుకుంటే ఆయన అలాగే సంతోషిస్తాడు. హో... ... ఓరేయ్ కోటేశ్వరరావు ఎంతమంచి పనిచేశావురా... అని ఆయన అన్నాడనుకోండీ... మీ పిల్లలకు ఏంలోటు మీ ప్రేమ వాళ్ళకు దొరికినప్పుడు మీరు ఏమైనా వారికిచేయగలరు అలా మీరే చెయ్యగలిగింది అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆయన మీకు ఏంచేయలేరు అని మీరు అనుకుంటున్నారు, కోట్లకు పడుగులెత్తిన వానికి డబ్బులు కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలేమో..? ఈశ్వరున్ని నమ్ముకున్నవానికి అవసరానికి అది కురుస్తుంది, వస్తుంది అంతే... ఆయన నిజంగా త్రికరణశుద్ధిగా నాకీ అవసరం కలిగింది ఈశ్వరా అని పూజామందిరంలో చెప్పుకుంటే ఈశ్వరుడు అనుగ్రహించి ఇస్తాడూ నన్ను నమ్మండీ నాకు వేదిక మీదచెప్పడం ఇష్టంలేదు అనుభవాలు, ఇవ్వగలడు ఈశ్వరుడు. ఎప్పుడు డబ్బు అవసరమైనప్పుడు ఈశ్వరున్ని నమ్మడంకాదు రోజూ ఈశ్వరుడున్నాడని నమ్మి మిమ్మల్ని మీరు పట్టుకోండి అది ధర్మం.
రాముడు ఉన్నాడు అడవిలో ఉన్నాడు తెలుస్తుంది మంధరని చంపేస్తే ఎలా తెలుస్తుందిలే, ఇక్కడ చంపేస్తే అక్కడకెలా తెలుస్తుందిలే..? కొట్టి అవతల పారేయ్... ఆ.. మా పూజా మందిరంలో ఉన్నాయనకు నేను మా ఆఫీసులో ఏం చేసింది తెలిసిందేమిటీ? అని ఇలా అంటే ఆయన చూస్తున్నాడు, అన్ని భూతముల రూపంలో చూస్తున్నాడు ఇక్కడ అంతర్యామిగా చూస్తున్నాడు ఇక్కడ ఇలా పెట్టినచేత్తో నువ్వు అక్కడ దీపంపెడితే మండిపోతాడని గుర్తుపెట్టుకో, ఎలా చెయ్యిపెడతావు కింద పెట్టలేవు నీకు ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ప్రధానం రాముడు ఉన్నాడు త్వాం చ మాం చ హి ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువమ్ నీతో నాతో రాముడు మాట్లాడడు శత్రుఘ్నుడు చెయ్యలేదు భరతుడు చెయ్యలేదు అలా అయితే ఈవిడినే చంపేద్దును అన్నాడంతే... ఆవిడ చెప్పింది, చేసింది ఈవిడ ఈవిడని చంపెయ్యాలి, ఆవిడనెందుకు ముందు ఈవిడని చంపెయ్యాలి, చంపానా మాతృ హంతకుడు అంటాడు రామ చంద్ర మూర్తి అందుకు వదిలేశాను, ఆవిడనెందుకు చంపడమూ ఆవిడని వదిలేసెయ్యాలి.
ఇదీ సత్పురుషులతో కలిసి తిరగడంవల్ల వచ్చేటటువంటిపూనిక, ధర్మావలంబకం ఎలా వస్తూందీ అనేదాన్ని శ్రీరామాయణం మనకు చూపిస్తుంది ఆ ప్రక్రియని ఆలోతైనటువంటి విషయాన్ని మనం పట్టుకోగలగాలి పట్టుకొని అనుష్టానంలోకి తెచ్చుకుంటే ఉపకరణం సిద్ధిపొందుతుంది ఉపకరణము బాగా ఉపయుక్తమౌతుంది. అంటే మీకు దీన్ని నేను ఎలా చెప్పాలి అంటే..? మీ దగ్గరా కోటిరూపాయలు ఉన్నాయి సంతోషంగా కర్చుపెట్టుకొని ఆడుకుందామని ఒక నది ఒడ్డుకు వెళ్ళారు 3 రోజులు ఉందామని, ఈలోగా అన్నారూ నది ఎగువున వరదలు వస్తున్నాయి, కాబట్టి ఇంకొక్క రెండు గంటలు దాటితే ఇంక మీరెవ్వరూ దాటివెళ్ళలేరు ఆ వరద ఎటువస్తుందో తెలియదు కొట్టుకుపోతారు, కాబట్టి తెప్పలున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, తెప్ప ఎక్కి వెళ్ళిపోండి రెండు గంటల్లో, ఇది దాటడానికి గంటపడుతుంది వెళ్ళిపోండి అన్నారు. ఛ్.. అలాగే అంటారండీ ఎక్కడ ఓ వరదలు వస్తాయి ఉన్నాయా నీళ్ళు ఎగువున వరదలు రావడం ఏమిటి ఎవరు నమ్మారు రండి ఆడుకుందామని చెప్పి వెళ్ళారు, వరద వచ్చేసింది కొట్టుకుపోయారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా మిమ్మల్ని రక్షిస్తుందా..? తెప్ప రక్షిస్తుందా..? తెప్ప రక్షిస్తుంది మిమ్మల్ని దాటడానికి, ఇది కూడా తెప్ప ఈ సాధనం, దీన్ని పనిముట్టూ అంటారు, నాకిది ఎలా పనిముట్టో, ఈ కంటికి ఇదెలా పనిముట్టో నేను ఈశ్వరున్ని చేరడానికి ఇది పనిముట్టు, ఈ పనిముట్టుని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడానికి ధర్మమని పేరు, అలా వాడుకోకపోతే అధర్మమని పేరు, అందుకు కాకుండా ఇంకోదానికి వాడుకోవడం ఈశ్వరునికి చెప్పకుండా, అది బాగాజీవితంలో పట్టుకోవడానికి ఈ భరత శత్రుఘ్నుల మధ్య వచ్చినటువంటి ఈ సంభాషణని ప్రాతిపధికగా తీసుకోవలసి ఉంటుంది.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
అందుకని మహర్షి ప్రతిచిన్న విషయాన్ని రామాయణంలో ఎవరు ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారో అన్నది ఎందుకురాశారో తెలుసాండీ..? రామాయణం మొత్తం ధర్మ ప్రతిపాదకమూ, అసలు మనం ఉన్నదానికి సనాతన ధర్మం అని పేరు, దీనికి మతం అన్న పేరు లేదు, సనాతన ధర్మమూ పీఠాలన్ని ఉన్నది ఎందుకూ కేవలం ఈ ఒక్కపని కోసమే ఇంక వేరొక పనిలేదు, ఇంకొక పనివారుచేస్తే అక్కరలేని పనిచేసినట్లు అంతే నేను అలాగే మాట్లాడుతా నాకు అంతకన్నా మాట్లాడటం చేతకాదు. ధర్మమే అంతే ఇంకొక పనికి శంకరాచార్యులవారు పెట్టలేదు. ఎక్కడ పీఠమున్న ఎక్కడ దేవాలయం ఉన్నా ఎక్కడ పెద్దలున్నా ఎక్కడ గురువున్నా దేనికీ అంటే ధర్మప్రచారము కొరకూ అంతే ఇంకొకమాట లేనేలేదు. ఇదొక్కటి మీరు పట్టుకుంటే అన్నీ మీకు ఇస్తుంది మిగిలినవెందుకు ఇదొక్కటి నేర్పండి చాలు ధర్మమే, అందుకే శ్రీరామాయణంలో ప్రతీచిన్న విషయాన్ని మహర్షి ఎందుకు చెప్తారంటే..? ఇది అందించాలి లోకానికి అందుకని ఈ ధర్మ ప్రతిపాదన ఉంది కాబట్టి, ఇద్దరు మాట్లాడుకున్నా ఏమన్నా... మీకు చెప్తూనే ఉంటారు అందులో మీకు అయోధ్య కాండా గృహస్తాశ్రములకు సంబంధించిన ధర్మముల పుట్ట అందులోంచి మీరు అన్ని ధర్మాలు తీసుకోవచ్చు.
కాబట్టి ఇప్పుడు తరువాతి రోజు మంత్రులు అందరూ కలిసి పరిషత్ ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసి భరతున్ని ఆ పరిషత్తులో కూర్చోబెట్టి ఒకమాట చెప్పారు, నాయనా! దశరథ మహారాజుగారు నీకు రాజ్యం ఇచ్చారు, సింహాసనం దీర్ఘ కాలం పాటు అలా ఖాలీగా ఉండ కూడదు, అరాచకత్వం ప్రభలుతుంది కాబట్టి నీవు ఈ రాజ్యాన్ని స్వీకరించు, అంటే భరతుడు అన్నాడూ
అభిషేచనికం భాణ్డం కృత్వా సర్వం ప్రదక్షిణమ్ ! భరత స్తం జనం సర్వం ప్రత్యువాచ ధృత వ్రతః !!
జ్యేష్ఠ స్య రాజతా నిత్యమ్ ఉచితా హి కుల స్య నః ! నైవం భవన్తో మాం వక్తుమ్ అర్హన్తి కుశలా జనాః !!
రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీపతిః ! అహం త్వరణ్యే వత్స్యామి వర్ణాణి పఞ్చ చ !!
యుజ్యతా మహతీ సేనా చతురఙ్గ మహా బలా ! ఆనయిష్యా మ్యహం జ్యేష్ఠం భ్రాతరం రాఘవం వనాత్ !!
అభిషేకం చేసుకో అని మీరు ఏ సంభారములను తీసుకొచ్చి అక్కడ పెట్టారో... వాటికి నేను ప్రదక్షణము చేయుచున్నాను. మీకు అనేక పర్యాయాలు రామాయణంలో వస్తుంది ఈ ప్రదక్షిణం అన్నమాట నమస్కారం అన్నమాట అనేక పర్యాయాలు వస్తుంది, ఇది చాలా చాలా లోతైన విషయం ప్రదక్షిణమూ నమస్కారమూ ఈ రెండూ ఎందుకంటే అసలు

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
జీవితంలో నేర్చుకోవలసిన రెండు అత్యంత ప్రాధమిక విషయములు ఈ ప్రదక్షిణము నమస్కారమే, కాబట్టి నేను ఎప్పుడైనా దానికి తగినటువంటి అవకాశం ఉన్నటువంటి సమయంలో నేను ఈ ప్రదక్షిణం నమస్కారం గురించి మీతో మనవిచేసే

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmpl4guLX38re7FHL4YO4YHLk6JSfjL8CCqgvZ7b9cRVN6zpOBTWvFzslQfxcUFCUyn9JzNjKwAr4VxlM1Kghk2l9ulQpV1TBWVLJZjjC6tRPiAC4UWeIGVO6rOHeyvzfv8hpjjK4PLGg/s1600/ugadi_pachadi_andhra_traditional_sweet_bitter_chutney.JPGప్రయత్నంచేస్తాను దానియందు భక్తిని ఆవిష్కరించడం, నాకు ఇవేమి అక్కరలేదు అని తీసి అవతల పారేయండి అన్ని నేనేమి చేసుకోను అభిషేకం అనకూడదు. నీవు చేసుకోక పోతేపోయావు, చేసుకోవాలనుకుంటే అదేపదార్థం ఇంకోటి లేదు ఇవ్వాల నువ్వు చేసుకోను అంటున్నావు, ఎవరు చేసుకోవాలంటున్నావు రాముడు చేసుకోవాలంటున్నావు అప్పుడు దేంతోచేయాలి దాంతోనే చెయ్యాలి, నీవు దాన్నెందుకు నిందిస్తావు, మరి అంత పవిత్రత దానికుంటే మరి పదార్థాన్ని ఎందుకు వీసగించడం.
http://archive.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/my_files/August2013soubhagya%20siddirastu.jpgమీరు బాగాగమనించండి ఇవ్వాళ మనం అలక్ష్మి కలుగుతుందంటే చాలా చోట్ల ఉండే నిరసభావన ఇదే, ఏ వస్తువుని తృణీకరించ కూడదో దాన్ని... ఇప్పుడూ..! నీకు భోజనం తీనాలని లేదనుకోండి నీవేమనాలి, నాకు ఇవ్వాళ ఆకలిగా లేదు భోజనం వద్దులే అనాలి, వేరొక ప్రయోజనానికి వేరొకరికి వినిమయం చేయండి అని చెప్పాలి. దిక్కుమాలి భోజనం ఇప్పుడేమిటీ అనకూడదు, దిక్కుమాలి భోజం ఏమిటి? కసేపాగి నీకు ఆకలేస్తే..? అదే భోజనం. అది బ్రహ్మమది, ʻఅన్నం పర బ్రహ్మ స్వరూపంʼ దాన్ని ఎందుకు నీవు తిడతావు? దాన్ని తిట్టకూడదు ఎప్పుడూనూ... చూడండీ శనిగాడు అంటూంటారు, శనిగాడు ఏమిటి? ఆయన శనైహి శనైహి చరః ఆయన మెళ్ళిమెళ్ళిగా నడుస్తాడు, ఆయనకు ఈశ్వర శబ్దం ఉంది పక్కన అటువంటి మహానుభావుడు ఆయన నీకు జీవితంలో కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి గొప్ప ఓర్పుని ఇస్తాడు శనైశ్వరుడి కాబట్టి అలా నిందచేయకూడదు, శనిగాడులా వచ్చాడండీ దిక్కుమాల్నోడు తీసి అవతలపాడేయ్ అనడం, భోజనం పళ్ళాన్ని విసరడం, ఆ పువ్వులూ మొదలైనటువంటి కనపడితే తీసి పక్కన పెట్టకుండా తొక్కడం ఇవి పదార్థం పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోవడం, అలా ప్రవర్తించకపోతే ఎమౌతుందో తెలుసాండీ, దానివల్లే అలక్ష్మీ కలుగుతుంది, ఆ నిరసన భావం మంచిది కాదు.
ఇది చెప్పడం, ఇవ్వాళ నేను పుచ్చుకోకపోవచ్చు ఈ అభిషేకం కానీ రేపు రాముడికి జరిగినా ఇవే పవిత్రం, వాటి పవిత్రతకి నా నమస్కారం ఇది ప్రదక్షిణం కాబట్టి ప్రదక్షిణం చేశాడు ఆయన, ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చుని దేన్ని వద్దంటున్నాడూ, నాకు అభిషేకం వద్దూ అన్నాడు ఎందుకు వద్దనాలి కారణం చెప్తున్నాడు భరత స్తం జనం సర్వం ప్రత్యువాచ ధృత వ్రతః, ధృత వ్రతః అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసాండీ? మనసులో శాస్త్రాన్ని బాగాపరిశీలనచేసి ఒక నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉన్నవాడు తప్పా... అలా అంతగా వాళ్ళు ఒకవేళ పట్టుదల పట్టితే చూద్దాం అని అంటూంటారు కొంత మంది, అంతగా పట్టుదల పట్టితే ఏం చేస్తామండీ, కాదు నీ మాట మీద నీకు శాస్త్రవాక్కుమీద నీవు నిలబడి నీవు పది మందిని నడిపించ గలగాలి అంతేగానీ ఏం చేస్తామండీ ఇంక నలుగురూ అలా అంటే ఏం చేయలేక పోయానండీ అనీ ఏదో కొన్ని కొన్ని అక్కరలేని నీతి సూత్రాలు పదుగురాడు మాట పాడియై ధరజెల్లు నొక్కడాడుమాట యొక్కదెందు ! వూరకుండు వాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమ!! ఇలాంటివి తీసుకొచ్చి ఎక్కడలేనివి తీసుకొచ్చి సర్వనాశనం చేసైకూడదు, అయ్యో ఎన్నికలకీ వాటికీ పనికి వస్తుందోమోనని పదుగురాడు మాట పదుగురాడు మాట పాడియై ధరజెల్లు నొక్కడాడుమాట యొక్కదెందు అని, ధర్మానికి అలాంటివేం పనికిరావు, ధర్మానికి ఎవడు తెలుసున్నవాడో వాడొక్కడు చెప్పిందే ధర్మం, పది మంది చెప్పిందేం ధర్మం కాదు, ఒక్కడు చెప్పిందే ధర్మం అవుతుంది, అలా చెప్పమని ఎక్కడా శాస్త్రంలో లేదు కూడాను.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
కాబట్టి జ్యేష్ఠ స్య రాజతా నిత్యమ్ ఉచితా హి కుల స్య నః ! నైవం భవన్తో మాం వక్తుమ్ అర్హన్తి కుశలా జనాః !! మీరు బాగాతెలిసున్నవాళ్లు అనుభవజ్ఞులు పెద్దలు మీరు ఈ మాట చెప్పొచ్చా... ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడైనా పెద్దవాడు కాకుండా ఇంకోడు పట్టాభిషేకం చేసుకోవడం ఉందా లేదుగా, మరి నేను ఇవ్వాళ ఎలా చేసుకుంటాను ఈ మాట మీరు చెప్పొచ్చా పెద్దలు, మీకు శాస్త్రపరిజ్ఞానం ఉందిగా మా వంశాచారం ఉందిగా నన్ను చేసుకొమ్మని మీరు ఎలా అడుగుతున్నారు, మీ అమ్మ వరాలు అడిగింది కదా అని అంటారేమో, అసలు అలా ఆచారంలేని ఆచారాన్ని అడగడం మా అమ్మ ఎవరు? అడిగితే మాత్రం మీ నాన్నగారు ఇచ్చారు కదా అంటేరేమో నేను మా నాన్నగారిని తృణీకరించకూడదు మా నాన్నగారు ఇవ్వకూడదూ... మరి ఇచ్చేశారుగా మా నాన్నగారి తప్పు దిద్దుదాం, రామున్ని తీసుకొచ్చి ఇచ్చేదాం, నాకని కదా అడిగింది మా అమ్మా నాకొద్దూ కాబట్టి ఏం చేస్తాను అందరం వెళ్ళి తప్పుకు క్షమాపన చెప్పుదాం రామునికి, రామా! నీది అది ఎప్పటికీ నాదికాదు కాబట్టి వచ్చేసై నీది నీవు పుచ్చేసుకో, నాది అనుకొని కదా రాముడు వెళ్ళిపోయాడు, నాకు ఇచ్చేస్తాను అంటే కదా రాముడు వెళ్ళిపోయాడు నాది ఎలా అవుతుంది అన్నయ్యా! నాది ఎప్పటికీ కాదు, ఎప్పుడూ నాది కాంది ఎప్పుడూ నీదే.
Image result for భరతుడుఎలాగటా నైవం భవన్తో మాం వక్తుమ్ అర్హన్తి కుశలా జనాః ఆ అప్ప జెప్పడంలో కూడా రాముడికి అప్పజెప్పడానికి భరతుడు ఒక్కడే నిర్ణయం చేసుకున్నాడు తప్పా మిగిలిన వాళ్ళందరూ అదేమిటీ వాళ్ళ నాన్నగారు భరతుడికి ఇచ్చినప్పటికీ, భరతుడుండాలి భరతుడేమిటీ అరణ్యానికి వెళ్తున్నాడు, ఆయన వెళ్తే వెళ్ళాడులే కానీ అని మా అన్నయ్య అనుకోకూడదు, నేను చెప్పింది సత్యమూ అని మీరు అంగీకరిస్తే... నేను చేస్తున్నది ధర్మమూ అని మీకు అనిపిస్తే... ఒకరూ ఇద్దరూ కాదు మొత్తం అందరమూ వెళ్ళిపోదాం అడవికి, అందరం వెళ్ళిపోయి బ్రతిమాలుదాము, అందరం వెళ్ళిపోయి చెప్పుదాం ధర్మం, అందరం వెళ్ళి అడుగుదాం వస్తాడు రాముడు అప్పుడు రామునికి పట్టాభిషేకం చేద్దాం, వస్తాడారాడా తరువాత మాట. ఇప్పుడేగా నేను అన్నాను పదిమంది కలిసి చెప్తే ధర్మం అవుతుందా తెలిసున్న ఒకడు చెప్పితే ధర్మం అవుతుందా అన్నానా లేదా, తెలిసున్న రాముడు ఒక్కడే కాబట్టి రాముడు వచ్చేస్తే ఎలా ధర్మం అవుతుందండీ రాకుండా ఉంటేనే ధర్మం అవుతుంది, కాబట్టి రాకుండా తాను ఉండగలగాలి ఇంత మంది వచ్చారండీ తప్పలేదు వచ్చేశానండీ అంటే రామాయణం రాయనూ రాయరూ నేను చెప్పనూ అక్కరలేదు మీరు వినక్కర లేదు. రాలేదు కాబట్టే రామాయణం చెప్పుకుంటున్నాం మీరు వింటున్నారు, అంటే నిలబడగలగాలి అంతేగాని ఒత్తిడి చేశారండీ అంటే నేను లొంగిపోయానండీ అన్నమాట ధర్మంలో ఉండదు, నీవు లొంగిపోయావంటే నీ బలహీనతకు నీవు పాడైపోయావని గుర్తు అంతేగాని నేను లొంగిపోయానండీ అంటే నీకేం క్షమార్పణ ఉండదు అందులో.
కాబట్టి రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీపతిః నాకన్నా ముందు పుట్టాడు కాబట్టి భవిష్యత్తులో ఆయనే రాజు అవుతాడు అహం త్వరణ్యే వత్స్యామి వర్షాణి నవ పఙ్చ చ మరి అరణ్యవాసం ఎవరు చేస్తారు? ఈవిడ అడగకూడని కోరిక అడిగింది కాబట్టి ఆవిడకు బుద్ధి రావాలంటే నేను వెళ్ళిపోతాను 14 యేళ్ళు అడవులకు వెళ్ళిపోతాను, కొడుకన్న తరువాత నేనూ చేస్తాను అరణ్యవాసం అన్నయ్య రాజ్యానికి వస్తాడు ధర్మం, ఇప్పుడు ఈవిడ కాదు మా వంశంలో ఎవరూ ఇలాంటి మాట అడగరు అడిగితే ఇలా జరిగిందని అని నేను వెళ్ళిపోతాను 14 యేళ్ళు యుజ్యతా మహతీ సేనా చతురఙ్గ మహా బలా ! ఆనయిష్యా మ్యహం జ్యేష్ఠం భ్రాతరం రాఘవం వనాత్ !! వనము నుండి రాఘవున్ని తీసుకు రావడానికి చతురంగ బలాలతో కలిసి మొత్తం ప్రజలందరూ వెళ్ళాలి కాబట్టి బయలుదేరండీ, ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే ఇంత మంది వెళ్ళాలంటే రథాలు వెళ్ళాలి ఏనుగులు వెళ్ళాలి గుఱ్ఱాలు వెళ్ళాలి ఒంటెలు వెళ్ళాలి పల్లకీలు వెళ్ళాలి జనం నడవాలి ఇలా నడవడానికి వీలుగా చెట్లు కొట్టేవాళ్ళు గోతులు తవ్వేవాళ్ళు రాళ్ళు ఏరేవాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండడానికి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసేవాళ్ళు గుఱ్ఱాలు ఏనుగులు నీళ్ళు తాగడానికి పెద్ద పెద్ద సరోవరాలు ఏర్పాటు చేసేవాళ్ళు దారికి అడ్డంగా ఎక్కడైనా చెరువులూ అవీ నీరు అవి నిలబడిపోయి ఉంటే వాటికట్టలుతెంచేసి అక్కడ సమతలంచేసి వెళ్ళడానికి అనువుగా చెయ్యవలసినటువంటి వాళ్ళు మిట్టల్నీ నేలల్నీ సమానంగా చెయ్యగలిగినటువంటి వాళ్ళు శిల్పులు వడ్రంగులు యంత్రాలనీ నడపగలిగినటువంటివాళ్ళు పెద్ద పెద్ద చెట్లు నరకగలిగినటువంటివాళ్ళు ఇలాంటి వాళ్ళనందరినీ తీసుకెళ్ళి రాముడు ఎక్కడున్నాడో అక్కడ వరకు మన సైన్యమంతటితో, మన నగరంలో ఉన్న జనులందరూ వెళ్ళిపోవడానికి వీలుగా అడవి అంతా చెక్కేయ్యండీ వెళ్ళిపోదాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
అథ భూమి ప్రదేశజ్ఞాః సూత్ర కర్మ విశారదాః ! స్వ కర్మాభి రతాః శూరాః ఖనకా యన్త్రకా స్తథా !!
కర్మాన్తికాః స్థపతయః పురుషా యన్త్ర కోవిదాః ! తథా వర్ధకయ శ్చైవ మార్గిణో వృక్ష తక్షకాః !!
కూప కారాః సుధా కారా వంశ కర్మ కృత స్తథా ! సమర్ధా యే చ ద్రష్టారః పురత స్తే ప్రతస్థిరే !!
వీళ్ళందరూ వెళ్ళి అరణ్యంలో ఈ సైన్యమూ ప్రజలూ అందరూ నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి రీతిలో అక్కడ ఉండేటటువంటి ఆ ఎత్తుపల్లాల్ని సమంచేస్తూ ఆ ప్రదేశాన్నంతటిని సిద్ధం చేయడానికని బయలుదేరారు ఇంక తరువాత భరతుడు సైన్యమూ బయలుదేరాలి, ఈలోగా వశిష్ట మహర్షి సభను ఏర్పాటుచేసి నేను తొందరగా భరతున్ని ఒక్కసారి రమ్మంటున్నాని చెప్పండి అని చెప్పాడూ, భరతుడు పడుకుని ఉన్నాడు నిద్రపోతున్నాడు వంది మాగదులు వెళ్ళి ఆ స్తోత్రంచేసి శంఖాలు పూరించారు, మృదంగ ధ్వని చేశారు, వీణా నాదం చేశారు, పెద్ద స్తోత్రం చేస్తున్నారు. అంటే రాజుని ఏ మర్యాదలతో లేపుతారో అలా లేపారు భరతున్ని, అంటే నిద్రలో కూడా నాకు ఇష్టం లేనిదైతే నేను భరించలేను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాకు ఇష్టమైందనుకోండీ అది నాకు ఆమోదయోగ్యంమౌతుంది, నాకు ఇష్టం లేదనుకోండి అదీ నిద్రలో వినపడినా నాకు ఇష్టం ఉండదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే... వేదం నాకు ఇష్టం అనుకోండీ నేను నిద్రపోతూంటే ఏదో అలసిపోయి ఉంటే వేదం వినపడిందనుకోండీ, వేద పఠనం వినపడింది అబ్భాహ్... ఎక్కడో ఎంత అద్భుతంగా ఎంత స్వరంతో ఎంత బాగాచదువుతున్నారో అని ఓసారి అలా వినపడేటట్టుగా చెవ్వుపెట్టి వింటాను, నాకే వేదపఠనం అంటే ఇష్టం లేదనుకోండీ ఛ్..హ్ య్యా గోలంతానూ పొద్దున్నే ఆ వేదాలు అవి ఇవి అన్ని పెడతారు ఏంటి శుభ్రంగా మంచి పాటలుపెట్టండి ఏ పాటో అది పెట్టండి మంచి ఛానెల్ చూసి అంటాం కదా!
మనసుని బట్టి ఉంటుంది ప్రీతి అప్రీతి విషయంలో ఉండదు నీ మనసు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి తెలుస్తుంది, శంఖాలు అవి ఇవి ఊదితే ఎవరూ లేరు గదాండీ ప్రస్తుతానికి మరి నేనేగదా రాజు అనుకుంటున్నారు అందుకు అలా లేపుతారు అది సహజమనిచెప్పి లేపుతారని అనుకున్నారనుకోండి, రాజరికం మీద ఎక్కడో ఇష్టముందని గుర్తు, ఆ పదవి మీద కూర్చోవడానికి ఇష్టముందనిగుర్తు వశిష్టుడు ఏం తక్కువవాడు కాదు, బాగా పరీక్షించి చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నారు తతో ప్రబుద్ధో భరత స్తం ఘొషం సన్నివర్త్య చ ! నాహం రాజేతి చా ప్యుక్త్వా శత్రుఘ్నమ్ ఇదమ్ అబ్రవీత్ !! నేను రాజును కాను ఎవడురా శంఖనాదం చేస్తున్నవాడు, వంది మాగదులు స్తోత్రం చేస్తున్నవాళ్ళు, రాజునైతే అలా లేపాలి నేను రాజునా..! నన్నెందుకు లేపుతున్నారు అలాగా నేను సామాన్యున్ని రామభ్రుత్యున్ని కింకరున్ని నన్ను అలా లేపక్కరలేదు నేను మామూలుగా లేస్తాను అవన్నీ ఆపేసేయండి ముందు అన్నాడు, అంటే... అసలు రాజు ఏది చేయించుకుంటాడో అది రాముడు చేయించుకోవాలి తప్పా నేను చేయించుకోవడం ఏమిటీ నేను రాజును కాను అంటే ఆ భావం బాగా పట్టి ఉన్నవాడు, తప్పా ఎదో నాలుక మీద మాటగా అంటున్నవాడు కాడూ... లోపల లేకుండగా నాలుక మీద అంటున్నవాడితో రెండు ప్రమాదాలు ఉంటాయి ఎప్పడూ తెలుసాండీ! ఒకటి అలా అంటాడు, అలా అన్నారు కదా అని మీరు నిజమనుకుని ఇవ్వడం మానేశారు అనుకోండీ కక్ష పెట్టుకుంటాడు, వాడు నేను అంటే మాత్రమండీ..! కొంచెం అదేంటీ తీసుకోండీ అని అనద్దాండీ నేను అన్నానని వదిలేశాడు అని ఎలా ఎగొట్టేద్దామని చూస్తున్నాడన్నమాట, మీరు ఇచ్చారనుకోండీ ఏమంటాడో తెలుసా వద్దూ వద్దన్నా నాకు అంటగట్టాడు చూశారూ..? అని అపకీర్తి వస్తే మీ నెత్తిన పెడుతాడు కీర్తి వస్తే తను అనుభవిస్తాడు అసలు మనసులో ఉందా లేదా చుడాలి.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
మనసులో ఉందా లేదా ఆఁపూనికా అని చూడడం చాలా అవసరం, దానిని ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి వశిష్టుడు అందుకని కుల గురువు అయ్యాడు మహానుభావుడు, ఇదీ ఆయన కీర్తి ప్రజలకూ తెలియాలి భరతుడు అంటే ఇంత గొప్పవాడూ అని ఇప్పుడు శత్రుఘ్నుడితో అంటున్నాడూ భరతుడు పశ్య శత్రుఘ్న కైకేయ్యా లోక స్యాపకృతం మహత్ ! విసృజ్య మయి దుఃఖాని రాజా దశరథో గతః !! చూశావా! తమ్ముడా శత్రుఘ్నుడా ఎంతపని చేసిందో మా అమ్మ నాకేం అదే పనిగా అమ్మని తిట్టడం ఇష్టం కాదు మా అమ్మ చేసినపనికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నాన్నగారు దశరథుడు పరలోకగతుడు అయిపోయాడు, నాకు నింద అంటుకుంది రాజ పదవి కోరుకునేవాన్నీ అని ఇదిగో వీళ్ళేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు చూశావా నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో అమ్మ అడిగిన వరాలకి ఎవరు ఇచ్చారో ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళిద్దరూ హాయిగానే ఉన్నారు నేనే పాడైపోతున్నాను, వద్దన్నదానిని నాకు అంటకట్టింది భరించలేక పోతున్నాను నాకు ఎంత కష్టంగా ఉందో చూశావా శత్రుఘ్నాడా ఆవేదన పడుతున్నాడు ఇదీ భరతుని యొక్క గొప్పతనం రామాయణంలో.
నిజంగా పూనిక ఉన్నవాడు ఎలా ఉంటాడు అన్నదాని మీద మీరు చూడాలి మాకు కృష్ణావధానులుగారనీ హరిప్రసాద్ గారికి బాగాతెలుసు ఒక మహానుభావుడు ఉన్నాడు కాకినాడలో, కాకినాడ పక్కన ఆయనకి శిష్యులందరూ కలిసి ఎదో పెద్దసత్కారం చేద్దామనుకున్నారు ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఆయన వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినంత సేపు విన్నారు ఖచ్చితంగా  ఆయన పుట్టిన రోజు రావడానికి ఒక వారం రోజులు ముందు చెప్పాచెయ్యకుండా అమాంతంగా భార్యని తీసుకొనీ కాశీ వెళ్ళిపోయారు, ఏదీ గురువుగారు అన్నారు కాశీ వెళ్ళిపోయారు అన్నారు అంతే ఇక్కడ ఉంటే ఆచరణలో నిజంగా ఉంటుంది, ఇక్కడ లేనిది కృతకంగా ఉంటుంది ఇదీ కీర్తి కారకం.
ఇది ప్రకాశింప చేస్తున్నాడు వశిష్టుడు ఆయన అన్నాడూ స రాజ పుత్రం శత్రుఘ్నం భరతం చ యశస్వినం ! యుధాజితం సుమంత్రం చ యే తత్ర హితా జనాః !! నేను ఇక్కడ సభలో కూర్చున్నాను అందరూ కూర్చున్నారు, ఓ భృత్యులారా మీరు వెళ్ళి భరతున్ని తీసుకురండీ, తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారో తెలుసా..? ధశరథ మహారాజుగారు మరణించారన్న మాటవిని యుధాజిత్తు వచ్చాడు, ఆయన మేన మామగారు భరతుని మేనమామగారు - భరతుడి మేనమామయైన యుధాజిత్తుతో కలిపి సభలోకి తీసుకురండి. ఎందుకన్నాడో తెలుసాండీ ఈ మాట పిల్లాడు తొందర పడుతున్నాడు, రాముడి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని యుధాజిత్తుకు ఇష్టం లేదనుకోండీ దశరథుడు మరణించకముందే వరమిచ్చాడు భరతునికి రాజ్యమిస్తాననీ, ఇప్పుడు ఈ వెర్రివాడు రాముడి దగ్గరకి వెళ్తానని తీరా అన్ని ఏర్పాట్లు చేసి వశిష్టుడి వంటి బ్రహ్మర్షులు కూడా బయలుదేరిన తరువాత యుధాజిత్తు పిలిచి నీవు అలా చేయడానికి వీల్లేదని రాముడు వస్తే నా చతురంగ బలాలతో అండగ నిలబడుతానని చెప్పి కైకకి మళ్ళీ దుర్భోధ చేసి రెండు పక్షాలు చేశారనుకోండీ, అప్పుడు వశిష్టాదుల మొఖం ఏమౌతుంది భయలుదేరినందుకు, పెద్దలైనవారు ఒకసారి బయలుదేరుతున్నారు అంటే పరిశీలనం చేస్తారు పైగా భరతం చ యశస్వినం భరతుడు కీర్తివంతుడు కీర్తికి కారణం ధర్మాన్ని పట్టుకోవడం, ఎంత ధర్మాన్ని పట్టుకుంటాడో చూపించాలి యుధాజిత్తుకు అర్థం కావాలి నా మేనల్లుడు అలా కోరుకునేవాడుకాడు. నిజానికి పాపం యుధాజిత్తు కూడా ఒక్క మాట అనలేదు నా మేనల్లుడికి రాజ్యం ఇమ్మని, ఆయన కూడా రాముడికి ఇవ్వడాన్నే అంగీకరించాడు.
కాబట్టి వాళ్ళ యొక్క గొప్ప తనాన్ని ప్రకాశింపచేయాలి వశిష్టుడు ఇప్పుడు, కాబట్టి వాళ్ళని పిలిచారు పిలిచిన తరువాత వచ్చాడు వచ్చిన తరువాత కూర్చోబెట్టారు, కూర్చోబెట్టి వశిష్టుడు అన్నాడు పిత్రా భ్రాత్రా చ తే దత్తం రాజ్యం నిహత కంటకం ! తత్ భఙ్క్ష్వ ముదితామాత్యః క్షిప్రమ్ ఏవాభిషేచయ !! నాయనా! తండ్రీ రాజ్యమిచ్చాడు అన్న వెళ్ళిపోయాడు, కాబట్టి ఇప్పుడు అకంటకం రాజ్యం అంతే నీవ్వేం ప్రయత్నాలు చేయక్కరలేదు అది వచ్చేసింది మీకు ఇంక చెయ్యవలసింది ఒక్కటే, ఒక్కసారి నిన్ను కూర్చోబెట్టి అభిషేకం చేసేస్తే పట్టాభిషేకం అయిపోతుంది. నీయంత నీవు రాజ్యం కోసం ఏమీ చూసుకోవలసిన అవసరం లేదు ముందు పుట్టాలి పుట్టకపోయినా వచ్చేసింది ఎందుకంటే ముందు పుట్టినవాడు వెళ్ళిపోయాడు, తండ్రి ఉంటే రాదు యౌవ్వరాజ్య పట్టాభిషేకమే వచ్చి ఉండేది. ఇప్పుడు నీకు పట్టాభిషేకం జరుగుతుంది తండ్రి వెళ్ళిపోయాడు, తప్పదు నీకు చేసేయ్యాలి కాబట్టి నీవు కూర్చో అభిషేకం చేయిస్తాను అన్నాడు. అంటే భరతుడు అన్నాడూ కన్నులు నీరు కారుస్తూ ఏడుస్తూ నిలబడి నమస్కారం చేస్తూ
కథం దశరథా జ్జాతో భవేత్ రాజ్యాపహారకః ! రాజ్యం చాహం చ రామ స్య ధర్మం వక్తుమ్ ఇహార్హసి !!
జ్యేష్ఠః శ్రేష్ఠ శ్చ ధర్మాత్మా దిలీప నహుషోపమః ! లబ్ధుమ్ అర్హతి కాకుత్స్థో రాజ్యం దశరథో యథా !!
అనార్య జుష్టమ్ అస్వర్గ్యం కుర్యాం పాపమ్ అహం యది ! ఇక్ష్వాకూణామ్ అహం లోకే భవేయం కుల పాంసనః !!
య ద్ధి మాత్రా కృతం పాపం నాహం తత్ అభిరోచయే ! ఇహ స్థో వన దుర్గ స్థం నమస్యామి కృతాఞ్ఙలిః !!
నేను నమస్కారం చేసి మీతో చెప్తున్నాను వశిష్ట మహర్షీ! ఈ రాజ్యాన్ని అపహరించగలిగినంత శక్తి ఉన్నవాడు ఎవడూ అన్నాడు. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి భవేత్ రాజ్యాపహారకః అపహరించగలిగినవాడు ఎవరు, అపహరించడమూ అన్నమాట ఎప్పుడు వస్తుందండీ..! దొంగతనమూ అన్నమాట ఎప్పుడు వస్తుంది. ఇప్పుడూ నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పుస్తకాన్ని రోజూతీసి కవర్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను, అన్నన్నా కోటేశ్వరరావుగారు రామాయణం ఎత్తుకుపోతున్నారండీ అంటున్నారా మీరు, ఇది నాకు ఇచ్చారు కాబట్టి నేను పట్టుకెళ్ళుతున్నాను ఇది నాది, నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ మైకు పట్టుకుపోయాననుకోండి సంకలో పెట్టుకొని అన్నన్నా వీడు మైకు ఎత్తుకుపోతున్నాడు అంటారు. ఈ మైకు నాదికాదు హరిప్రసాద్ గారిది లేదా శృంగేరి పీఠం వారిది కదా..! తప్పా నాది కాదు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
నాదికాంది నేను తీసుకుంటే దొంగతనం భరతుడు అంటున్నాడు నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చిన ఈ రాజ్యాన్ని ఎలా దొంగతనం చేయను వశిష్ట మహర్షీ అని అడిగాడు. అంటే మీరు ఏం చేసినా అది నాది కాదు, అది ఎప్పటికీ నాది అవ్వడమన్న సమస్య ఉత్పన్నమవడమే కాదు ఎందుకో తెలుసా ముందు పుట్టినవాడికి వెళ్ళిపోయింది అది, వెళ్ళిపోయింది నాకిస్తే దొంగతనం అవుతుంది తప్పా అదేమీ నాదయ్యే అవకాశం ఏమీ లేదు ఇంక, కాబట్టి దొంగతనం ఎలా చెయ్యమంటారూ అని అడిగాడు కుల గురువుని, ఏగురువుగారైతే మాత్రం అబ్బే అది దొంగతనంలోకి రాలేదులేవోయ్ పుచ్చేసుకో అంటారా ఏమిటి ఇదీ భరతుడంటే, రాజ్యం చాహం చ రామ స్య ధర్మం వక్తుమ్ ఇహార్హసి మీరు ధర్మమునకు భంగము వాటిల్లకుండా మాట్లాడి చెప్పండి ఇదీ రామాయణం, ఎప్పుడూ ధర్మమమే ధర్మాన్ని పట్టుకుంటాయి పాత్రలన్నీ రాజ్యం చాహంచ రామ స్య రాముడుదండీ రాజ్యం రాముడిది రాజ్యం కాదు, రాముడిది రాజ్యం కాదు వశిష్ట మహర్షీ రాముడిది రాజ్యం అనుకుంటున్నారేమో రాజ్యం చాహం చా నేను కూడా రామునివాడినే రాజ్యం రాముడిది నేను వేరు కాదు, రాజ్యము నేనూ ఇద్దరమూ రామునికి చెందినవారము ఒకదానికి చైతన్యములేదూ నాకు చైతన్యము ఉంది అంతే తేడా తప్పా నాదీ అని నేను ఎలా అనగలనూ మీకూ ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ జేబులో పది రూపాయలు పెట్టుకున్నాననుకోండి, పెట్టుకుని ఈ లాల్చీ వేసుకొని ఏదో గుడిలోకి వచ్చాను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయిన తరువాతా నాలోకొచ్చిన తరువాత ఈ పది రూపాయలు నావీ అన్నదనుకోండి ఈ లాల్చీ ఇంతకన్నా అన్యాయం ఉంటుందా..! నేను ఏమనుకున్నానంటే ఈ లాల్చీ కూడా నాదీ అని ఈ లాల్చీ జేబులో పెట్టాను, లాల్చీ నాదంటే లాల్చీ ఏ భావనతో ఉంటుంది ఏ జేబులో పదిరూపాయలూ నేనూ కూడా కోటేశ్వరావే..! అంటుంది కదా... అందుకనీ దాని జేబులో పెట్టాను అంతే కాని అది  పట్టుకెళ్ళిపోతుందనా, అది నాదంటే ఎవరూ పెట్టుకోరికా అలా నేనూ... రాజ్యమూ... రెండూ రాముడివి ఇంకా లాల్చీ పది రూపాయలు నావంటే ఎలా ఉంటుందో నాది ఈ రాజ్యం అంటే అలా ఉంటుంది వశిష్ట మహర్షీ! మీరు ఎలా అంటారు నేను ఎలా పుచ్చుకుంటాను, అసలు నాకంటూ వేరే పుచ్చుకోవడానికి అవకాశంలేదు నేను రామునివాన్ని నాకు రాజ్యం ఇవ్వడం ఏమిటీ అది కుదిరేమాట కాదు అన్నాడు అంతే.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
ఎంత పెద్దమాటండీ నిజంగా..! ఇదీ... భక్తి అన్న మాటకు పరాకాష్ఠ, ఎన్ని ఉండనివ్వండీ మిమ్మల్నేమీ పాడు చెయ్యవు ఐశ్వర్యం ఎప్పుడూ పాడుచేయదు మీరు బాగాగుర్తుపెట్టుకోండి, ఐశ్వర్యము మిమ్మల్ని పాడుచెయ్యదూ ఎప్పుడు పాడు చెయ్యదో తెలుసా..? నేనూ ఇదీ కూడా ఆయనకు చెందినవారమూ అని మీరన్నంతకాలం మీమ్మల్ని ఏమీ పాడుచేయదు మీరు విద్వాంసుడైనా పండితుడైనా పామరుడైనా విద్యావంతుడైనా అందగాడైనా ఇదీ అదీ రెండూ ఈశ్వరుడివి అని మీరు అన్నంతకాలం ప్రసాదబుద్ధితో బ్రతికినట్లు ఎప్పుడైనా నాది అంటేనే ప్రమాదం వస్తుంది.
రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తూండేవారు వెనకటికి ఒక పెద్దాయనా ఒక పెద్ద భవంతి కట్టీ పెద్ద తోటవేసి అందులో పూవ్వులు పళ్ళు పెంచీ ఓ తోట మాలిని పెట్టి ఓరేయ్ నేను ఆరు నేలలు విదేశాలకు వెళ్ళిపోతున్నానూ ఇంటి వెనక భాగంలో రెండు గధులలో నీవు ఉండీ ఈ పూవ్వులు పళ్ళు అన్ని జాగ్రత్తగా చూస్తువుండి ఇల్లు జాగ్రత్తగా చూస్తువుండు అన్నాడు. ఈయన అందులో ఉండేవాడు ఆ పూవ్వులు పళ్ళు ఎవరైనా వస్తే ఇదిగో తీసుకెళ్ళు పూవ్వులు పూజకని కాసిన్ని పూవ్వులు ఇచ్చేవాడు, కోసుకుపోండమ్మా నాలుగు మామిడి కాయలు అని ఇచ్చేవాడు, ఓ పది సపోటా పళ్ళు ఇస్తుండేవాడు, ఎవరూ యజమాని ఉండేవారు కాదు ఈయనే ఉండేవారు. రెండునెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలల అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది ఓ రోజున చుట్టు పక్కల వాళ్ళు అన్నారు ఇల్లేవరిదండీ అన్నారు, ఛ.. నాది కాదు ఎవరిదో అని చెప్పడం ఎందుకూ వస్తున్నాడా ఏమన్నా విదేశాలనుంచి అనీ నాదేనండీ అన్నాడు ఎవరికి తెలుసు ఆయనదే అనుకున్నారు, కానీ అకస్మాత్తుగా ఓ రోజున ఆయన వచ్చారు, ఆయన వచ్చి తలుపు తీస్తుంటే పక్కింటి వాళ్ళు వచ్చి అన్నారు ఎవరికోసం వెళ్తున్నారు అన్నారు, నాయింట్లోకి వెళ్తున్నాను అన్నారాయన, నీ ఇంట్లోకి వెళ్ళడమేమిటీ ఇంటాయన లోపల ఉన్నాడు అలా అనడం తప్పూ అన్నారు. ఆయన వెంటనే వెళ్ళి లోపలకెళ్ళి ఏం చేశారంటే వాడి పెట్టే బెడ్డింగూ అవతల పారేశాడు, నువ్వు అలా చెప్పకపోతే వాళ్ళు అలా ఎందుకు అన్నారు నీదా ఇల్లు ఫో... అవతలకి అన్నాడు ఇప్పుడు తెలిసిపోయింది యదార్థ పరిస్థితి. ఎప్పుడు బయటికిపోయాడు నాది అంటే పోయాడు, నాది కాదండీ ఆయనదండీ అని పూవ్వులిస్తే ఈశ్వరుడు వద్దన్నాడా పళ్ళు ఇస్తే ఆయన వద్దన్నాడా, ఓరేయ్ పెంచరా ఇవ్వరా అన్నాడు, నాది అన్నమాట అనకుండా ఇచ్చినన్ని నాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాడు హాయిగా నాదన్నప్పుడు బయటికిపోయాడు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
నీవు ఎప్పుడు బయటికిపోతావు ఈశ్వరుడు ఇచ్చినదాంట్లోంచి నాదంటే పోతావు నాదనకుండా ఆయనదండీ అంటూ ఉండు, కోట్లకి కోట్లుండనీ నీకేమీ బాదుండదు నీవు అభ్యున్యతిలోకి వెళ్తావు ఇంకానూ, విపరీతమైన పాండిత్యముంది నాదేముందండీ ఈశ్వరుడిచ్చిన వాక్కు అను ఏమీ పాడవ్వవు, గొప్ప అందగాడివి నా అందమేమిటండీ ఈశ్వరుడిచ్చిన అందమండీ అను ఏమీ పాడవ్వవు గొప్ప అధికారివి నాదేముందండీ ఈశ్వరుడిచ్చిన అధికారం నాదా గొప్పతనం అనండీ మీరేం పాడవరు ఏదైనా నాదనండీ బయటికి తోసేస్తాడు. ఇదీ భరతుడి శ్లోకంలోంచి మీరు పట్టుకోవలసిన విషయం, ఇది వచ్చిందనుకోండీ మీ జీవితం నైవేద్యం పెట్టిన ప్రసాదం, ప్రసాదం మీరు తినడం కాదు మీ జీవితమే ప్రసాదం. పూజ అంటే ఎంత సేపు చేస్తారండీ నాకు తెలియక అడుగుతాను, ఎంత సేపు పూజ గదిలో కూర్చుంటారు మీరు, అది కాదు పూజంటే పూజంటే..? ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నంత కాలమూ కూడా ఈశ్వరుని యందు కృతజ్ఞతా భావ బుద్ధితో జీవించుటా. అది ప్రసాదము ఆయనే పెద్ద ప్రసాదము అందుకే మనవాళ్ళు పేరు పెట్టేటప్పుడు ఈశ్వర ప్రసాద్ సూర్య ప్రసాద్ ప్రసాద్ బాబూ ఇలా పెడుతుంటారు, ప్రసాద్ అంటే ఏమిటంటే జీవితము ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తాడు అని వాళ్ళు కోరుకున్నారు, నీవు అలా బ్రతకాలి అని దాని అర్థం, ఆయనే ప్రసాద స్వరూపుడు ఈశ్వరునిచేత నిర్ణయింపబడ్డాడూ ఈశ్వరున్నే అలా అనుభవిస్తూ ఈశ్వర ప్రసాదంగా ఇతడు బ్రతుకుతాడు అని వాళ్ళు కోరుకున్నారు అందుకని ప్రసాదమే ప్రసాద్ గా తిరుగుతుంటారు ఈ లోకంలో, అందులో తెలుగు దేశంలో- తెలుగు దేశంలో అంటే నా ఉద్యేశ్యం ఆంధ్ర దేశంలో ఇక్కడా ఎక్కువ ఈ ప్రసాద్ అనబడేటటువంటి పేరు.
కాబట్టి ఈవిషయాన్ని భరతుడు చాలా అందంగా మాట్లాడుతాడు ఎక్కువ సేపు నాలా గంటల్లో ఏమీ ప్రసంగాలేమీ చేయడు, శ్లోకాలు చెప్తాడు నాలా వెనక్కి ముందుకీ లాగడు కానీ రెండు మాటలు చెప్తాడు, చక్కగా అర్థం చేసుకుంటాడు, అలా అర్థం చేసుకోవడానికి ఎదురుగుండా ఉన్నవాడు బ్రహ్మర్షిండీ..! మహానుభావుడు ఆయనకి తెలియదేమిటీ ఆయనకి అన్నీ తెలుసు కానీ, యుధాజిత్తుకీ అర్థం కావాలి భరతుడి గొప్పతనమేమిటో లోకానికి అర్థం కావాలి భరతుడు ఎవరో కాబట్టి ఇప్పుడు ఈ మాటలు అన్నారు అన్ని సిద్ధంగా ఉన్నాయి అన్నారు. వెంటనే భరతుడు అన్నాడు నాకు తగిన రథాన్ని తీసుకురండి అన్నాడు, వశిష్టాదులను కూడా బయలుదేరండని అన్నాడు, కౌసల్యా సుమిత్రా కైకేయీ కూడా బయలుదేరారు అయోధ్యలో ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోతేనటా తతః సముత్థా కులే కులే తే ! రాజన్య వైశ్యా వృషలా శ్చ విప్రాః !! అయూయుజన్ ఉష్ట్ర రథాన్ ఖరాం శ్చ ! నాగాన్ హయాం శ్చైవ కుల ప్రసూతాన్ !! ప్రతి ఇంటిలో వీళ్ళు వాళ్ళు అని చెప్పడానికి వీలులేకుండా నాలుగు వర్ణాముల వాళ్ళు ప్రతి ఇంట్లోంచి ఏనుగులు గుఱ్ఱాలు ఒంటెలు అన్నిటినీ తీసుకొనీ మొత్తం అందరూ కలిసి రామ చంద్ర మూర్తి దర్శనం కోసం రామ చంద్ర మూర్తిని వెనక్కు తీసుకురావడం కోసమని బయలుదేరి వెళ్ళిపోతున్నారట, ఇందులో మంత్రులు పురోహితులు ముందు కూర్చున్నారు, ముందు కూర్చోబెట్టారు మీరు ఎప్పుడు రామాయణం చదువుకోవడం బాగా అర్థమైతే ఎప్పుడూ ఒక విషయం బాగాజ్ఞాపకం ఉండాలి.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
మీరు ఏ మంగళకార్యం మీద వెడుతున్నా మీ ముందు మీ పురోహితులు నడుస్తూవుండాలి. మీకన్నా ముందు మీకు ఆలోచన చెప్పేటటువంటి పెద్దలు ముందుండాలి అంతే కాని వాళ్ళని వెనక పెట్టి మీరు ముందు నడవకూడదు మీ ముందు వారుండాలి, కాబట్టి మంత్రి పురోహితులు ముందునడిచారు, నడుస్తుంటే ఆ పైన మేలుజాతి గుఱ్ఱాలు వాటిని అధిరోహించి దగ్గర దగ్గరిగా చాలా మంది కొన్ని వేల మంది వీరులు అనుగమిస్తున్నారు, తొమ్మిది వేల ఏనుగలమీద వీరులు వస్తున్నారు, 60 వేల రథాలతో కొంత సైన్యం బయలుదేరింది, లక్ష మంది ఆశ్వికులు బయలుదేరారు అంటే గుఱ్ఱాల మీద అంటే గుఱ్ఱం మీద ప్రయాణం చేసేటటువంటివారు లక్షమంది వస్తున్నారు, ఇది కాకుండా అసలు లెక్క పెట్టడానికి వీలులేనంత రీతిలో ఆకాశమంతా ఆ డెక్కల నుంచీ పాదముల నుంచి రేగిన ధూలితో నిండిపోయిందట. అంత పెద్ద పరివారము అయోధ్య అయోధ్యంతా ఖాళీ చేసేసి మొత్తం బయలుదేరి మేము వనాన్ని అయోధ్య చేస్తామని ఎలా అన్నారో అలా బయలుదేరి వెళ్ళిపోయారు, అది పూనిక భక్తి అన్నమాటకు అది అర్థం. వెళ్ళిపోవాలనుకున్నారు అంతే వెళ్ళిపోయారు, అందరూ కలిసి బయలుదేరారు.
అందరు వెళ్ళిపోతూ అనుకుంటున్నారట వాళ్ళందరూ దేనిగురించి మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోతూ, పోల్నేరా ఏదో సరదాగా బాగానే దొరికింది భరతుడు అన్నం పెడతాడు నాలుగు రోజులు అలా తిరిగేసి వద్దామూ అని చెప్పినటువంటి జనంకారు వాళ్ళందరూ వాళ్ళు వెల్తూతూ వాళ్ళు మాట్లాడుకున్నదేమిటో తెలుసా? ప్రయాతా శ్చ ఆర్య సంఘాతా రామం ద్రష్టుం స లక్ష్మణమ్ ! తస్యైవ చ కథా శ్చిత్రాః కుర్వాణా హృష్ట మానసాః !! మేఘ శ్యామం మహా బాహుం స్థిర సత్త్వం దృఢ వ్రతమ్ ! కదా ద్రక్ష్యామహే రామం జగతః శోక నాశనమ్ !! ఏమి ఆశ్చర్యం రా... లోకంలో అన్నని తమ్ముడు చంపేస్తాడు రాజ్యం కోసం, తమ్మున్ని అన్నచంపేస్తాడు నిష్కంటకంగా రాజ్యం ఉంచుకోవడం కోసం, రాముడేమో తండ్రిని సత్యంలో నిలబెట్టడంకోసమని తమ్మునికి రాజ్యంవదిలి అడవులకు వెళ్ళాడు, ఈ తమ్ముడేమో నాకు రాజ్యంవద్దూ అన్నయ్యను తీసుకొస్తా, నేను అడవిలో ఉంటానని మనందర్నీ తీసుకొని బయలుదేరుతున్నాడు, వీళ్ళుగదరా అన్నదమ్ములంటే... ఇలా బ్రతకాలికదరా ఇది కథా. వాటాల కోసం దెబ్బలాడుకున్న అన్నదమ్ములను చూశాము కానీ నీకు ఇస్తానంటే వద్దు నీది రాజ్యమంటే నీది రాజ్యమని దెబ్బలాడుకోవడానికి వెళ్ళుతున్న అన్నదమ్ముల్ని మనమే చూస్తున్నాం. ఇలాంటివారి రాజ్యంలో ఉన్న మన బ్రతుకే బ్రతుకు, ఇటువంటి ధర్మాత్ముడైన రామున్ని చూడడానికి వెళ్ళుతున్న భరతుతో వెళ్ళడం మన అదృష్టం కాబట్టి పదండి వెళ్ళుదాం అన్నారు. అని వాళ్ళు సంతోషంగా ఆ మాటలు చెప్పుకుంటూ వని ప్రముఖులతో సహా అందరూ ఎంతమందో తెలుసాండీ ముత్యాలకు కన్నాలు పెట్టేటటువంటివారి దగ్గరనుంచి నెమలి ఈకలతో గొడుగులూ విసనకర్రలూ చేసుకునేవాళ్ళు చందనపు చెక్కలు కోసేవాళ్ళు వేదికలని అలంకరించేటటువంటివాళ్ళు ఏనుగు దంతాలతో వస్తువులు చేసేవాళ్ళు కంబళ్ళు శుబ్రపరిచేవాళ్ళు వైద్యులు చాకళ్ళు కుట్టుపని చేసేవాళ్ళు గోశాలలను రక్షించేవాళ్ళు నటీ నటులూ జాలరులూ వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు అందరూ బయలుదేరిపోయి అయోధ్యానగరం నుంచి వెళ్ళిపోతున్నారు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
ఈంతమంది కలిసి ఆ అయోధ్యానగరం నుండి బయలుదేరి గంగానదిని చేరుకున్నారు, చేరుకున్న తరువాత భరతుడు అన్నాడూ మహోత్కృష్టమైనటువంటి నది పరమ పవిత్రమైన గంగా ఈ గంగలో నా తండ్రికి జలతర్పణ చేస్తాను అని అన్నాడు, జలతర్పణ చేస్తాను అని జలతర్పణచేశాడు. నేను ఇక్కడ ఒక్కమాట చెప్పకపోతే అయోధ్య కాండగురించి ఒకమంచి విషయాన్ని ప్రస్తావనచేయడం లోపంచేసినట్లు అవుతుంది. మీరు ఎప్పుడూ కూడా రెండు విషయాలని జీవితంలో బాగాజ్ఞాపకం ఉంచుకోవాలి మనిషి రెండు కార్యములు తప్పకుండా చేస్తూవుండాలి, ఒకటి పితృకార్యం రెండు దైవకార్యం, దైవకార్యమూ చేస్తాడు పితృకార్యమూ చేస్తాడు. ఈ దైవ కార్యం చేసేటప్పుడు భక్తితోచేయాలి బాగాగుర్తుపెట్టుకోండి దైవకార్యాన్ని భక్తితో చేస్తాడు, పితృకార్యాన్ని విశ్వాసంతో చేయాలి బాగాజ్ఞాపకం పెట్టుకోండి ఎందుకో తెలుసాండీ భక్తి అన్నమాటకీ మీకు లోపల కించిత్ ప్రమాణము అందుతూ ఉంటుంది, ఇప్పుడూ భక్తి అంటే ఏమిటండీ, ఇప్పుడు నేను లేచి ఒక దీపం పెడుతాను, ఎప్పుడైనా పూజ దాని అంతరార్థం గురించి ఉపన్యాసం వేరేచెప్పినప్పుడు చెప్పుతాను, ఇప్పుడు అందులో కలిపి చెప్పితే రామాయణం ఎప్పుడు చెప్పను నేను ఇంకా... ఒక్కటి ఉదాహరణ చెప్పి వదిలేస్తాను.
దీపం పెడతాం ఎందుకండీ దీపం నతత్ర సూర్యో భాంతి, న చంద్రతారకం, నేమా విద్యుతో భాంతి, కుతో యమగ్నిః ! తమేవ భాంతమనుభాతి, సర్వం తస్యభాసా, సర్వమిదం విభాతి !! అంటాం, కాని అది అలా విడిచిపెట్టండి, దీపాన్ని పరబ్రహ్మంగా ఎక్కడా ఏ వెలుగులేని చోట వెలుతురై భాషిస్తోంది వెలుతురుకు వెలుతురు అని ఆ మాట అనడం వేరేవిషయం. గజేంద్ర మోక్షంలో పోతనగారు అన్నట్లుగా లోకంబులు లోకేశులు లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం జీకఁటి కవ్వల నెవ్వఁడు – నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్ అంటారు అది అసలు దీపం, ఆ దీపం మాట అలా ఉంచండి. ఏ వెలుతురు లేదని దీపం పెట్టారు ఇప్పుడు, 10 గంటలకు సత్యనారాయణ వ్రతం చేస్తే దీపమెందుకండీ, అది కాదు దీపం పెట్టడంలో అంతరార్థం ఏమిటో తెలుసాండి ప్రతి రోజు ఉదయం దీపం ఎందుకు పెడతామంటే ఈశ్వరుడు ఈ కన్ను ఇచ్చాడు ఈ కంటికి చూడగలిగినటువంటి శక్తి ఇచ్చాడు ఈశ్వరుడు ఈ కంటికి చూడగలిగిన శక్తినీ, నాలుకకి రుచి చెప్పగలిగిన శక్తినీ చెవికి వినగలిగిన శక్తినీ చర్మానికి ముట్టుకుంటే తెలిసేటటువంటి శక్తినీ ఈ నాలుగిటితో పాటుగా ముక్కుకి వాసన చూసేటటువంటి శక్తిని చాలా జాగ్రత్తగా వినండి ఈమాట నేను చెప్పింది, శబ్ద స్పర్శ రస రూప గంధములు అంటారు ఐదు తన్మాత్రలు, ఈ ఐదింటినీ తీసేసి మిగిలినవి ఉంచేశాడనుకోండి శరీరాన్ని ఉంచేశాడు అనుకోండి, శరీరాన్ని ఉంచేశాడు ఒక సారి ఊహ చేయండి. ఇవే లేవు అంతే.
కళ్ళున్నాయి చూడవు, చెవులున్నాయి ఏం వినపడదు, ముక్కుంది వాసనేం తెలియదు, చర్మం ఉంది ముట్టుకుంటే ఏం తెలియదు, నాలుకుంది రుచి తెలియదు ఈ ఐదు తీసేశాడండీ, నాలుకుంచాడు చెవి ఉంచాడు ముక్కుంచాడు నోరుంచాడు అన్నీ ఉంచాడు ఇప్పుడు మీకు లోకంలో జలపాతాల తోటి పెద్ద పెద్ద పర్వత శిఖరాల తోటి సూర్య బింబం ఉదయించడం తోటి చంద్ర బింబం ప్రకాశించడం తోటి ఈశ్వర మూర్తిని చూడడం తోటి లోకంలో ఉన్న ప్రకృతిలో ఉన్న అందంతో మీకేమైనా అనుబంధం ఉందా, మీరు అనుభవించేది ఏమైనా ఉందా? ఏం లేదు అంటే మీరు చూసేది ఏం లేదు. ఇక మీకు రామాయణాది కావ్యములతో కానీ భారతంవంటి హితిహాసములతో కానీ మీకేమైనా అవసరం ఉందా..! మీరు వినేదేం లేదు నిప్పు కణిక తీసుకొచ్చి నాలుక మీద పెట్టినా మైసూరుపాకు తీసుకొచ్చి నాలుక మీద పెట్టినా రెండూ ఒక్కటే ఎందుకని అంటే మీ నాలుకకు రుచి తెలియదు, ఏది తిన్నా ఒకటే, పెంట కుప్ప దగ్గరి పేడ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే మల్లె పూవ్వు ముక్కు దగ్గర పెట్టినా అంతే కాబట్టి దేని సౌరభమూ మీకు తెలియదు, నిప్పు కణకణలాడుతున్న నిప్పు తెచ్చి చర్మం మీద పెట్టినా అంతే మంచు గడ్డ తెచ్చి పెట్టినా అంతే.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు లోకంలో ఈశ్వరుడు ఎన్ని అందాలు సృష్టించాడో ఎన్ని రకాలుగా మీరు అనుభవిస్తారో మీరు మార్చి గుర్తు పెట్టుకోండి దీన్నే మీరు హెచ్చవేస్తారు లోకంలో భోగముల కింద, భోగములన్నీ ఇందులోకి వచ్చేస్తాయి ఈ ఐదింటిలోకే మీరు ఎన్ని చూసినా, బెంగుళూరు వెళ్ళానండీ అంటాడు ఏం చూశావు ఏదో చూసొచ్చానండీ అంటాడు, అమెరికా వెళ్ళానండీ అంటాడు ఏం చూశావు నయాగరా జలపాతం చూశానండీ, ఎన్ని నీవు మార్చి మార్చి చూసినా సుఖాలను అన్నీ దీంతోనే, ఎన్ని రుచులు మార్చి మార్చి తిన్నా దీనితోనే, ఎన్నిటిని మార్చి మార్చి ముట్టుకున్నా దీనితోటే ఎన్నిటిని మార్చి మార్చి విన్నా దీనితోటే సమస్త భోగములూ ఈ ఐదింటిలోకి తీసుకొచ్చాడు ఈశ్వరుడు అనుభవించడానికి. ఇప్పుడు ఈ ఐదూ ఈశ్వరుడు తీసేశాడు అనుకోండి అసలు భోగమన్నది జీవితంలో లేదు ఇంక శాపగ్రస్తం ఈ ఐదు మీరు తెచ్చుకున్నవి కావు, మీ తల్లి తండ్రులు ఇచ్చినవి కావు ఈశ్వరుడే ఇచ్చాడు, ఈశ్వరుడే ఇచ్చి ఇవి బడలిపోతున్నాయి రాత్రయ్యేటప్పటికి ఇది చూసి చూసి బడలిపోతుంది, విని విని ఇది బడలిపోతుంది, తిని తిని ఇది బడలిపోతుంది, ముట్టుకు ముట్టుకుని ఇది బడలిపోతుంది మళ్ళీ వీటికి విశ్రాంతినిచ్చి శక్తిని ఇచ్చినవాడు ఎవరు. ఛార్జింగ్ అంటారే బాటరీ డౌన్ అయితే అలా రాత్రి అయితే శక్తిని ఇచ్చిన వాడు ఈశ్వరుడు. మళ్ళీ పొద్దున్నే వాటిని ఉపయోగించడం మొదలు పెడితే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలా ఇచ్చాడు కాబట్టి నీవు ఈ భోగాలను అనుభవిస్తున్నావు, ఒక్కటే చెప్పి వదిలేస్తాను అన్నీ చెప్పను.
చూసే శక్తిని కన్నుకి ఇచ్చావు కాబట్టి కన్నుకి నయనం అని పేరు అదే నాయక దీని వలన మిగిలినవన్నీ అనుభవిస్తారు మీరు అదేదో చూస్తారు చాలా బాగుందండీ అంటారు, అంటే కసేపు ఆగుతుంది మనసు ముందు కన్ను ఇచ్చాడు కాబట్టి చూసే శక్తి వెలుతురుకి సంబంధించింది కాబట్టి దానికి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడతారు, తప్పా... దీపం ఉత్తిగనే ఒంటి వత్తి దీపమా రెండు వత్తుల దీపమా ఆ దిక్కుమాలిన గొడవంతా కాదు దీపం ఇక్కడ కృతజ్ఞతావిష్కారమునకు దీపం, దీపమన్నది కృతజ్ఞత అదీ దీపమంటే అది తెలియకుండా పూజచేస్తే మీకసలు ఎప్పుడూ పూజ కాదు గుర్తు పెట్టుకోండి, అసలు మీరు బ్రతికున్నంత కాలం మీరు పూజ చేయలేరు, మీ పూజ ఏమౌతుందంటే దీపం పెట్టడం పూజ అనుకుంటున్నారు మీరు దీపం పెట్టడం పూజ కాదు, ఆయన లోకాలకి దీపం ఆయన ఉన్నాడండీ ఇంక మీరు దీపం పెడితే ఆయనకు పూజ ఎలా అయిందండీ, ఈశ్వరా! ఈ కన్ను నీవు ఇచ్చి రాత్రి దీనికి శక్తి ఇచ్చి ఉండకపోతే లేచి నేను ఏమి చూడనూ, నేను లేవగానే నాకు కనపడుతున్నాయి కాబట్టి ఇలా బయటికి వచ్చాను, సర్వేశ్వరా! ఈ కంటికి ఇంత శక్తిని ఇచ్చిన నీకు నేను ఏమని కృతజ్ఞత చెప్పగలను చెప్పడానికి నాకు ఇంకో అవకాశం లేక ఇక్కడ దీపం పెడుతున్నాను, ఒక్క నమస్కారం చేసి ఆనందంతో చూశారనుకోండి ఆ ఈశ్వర మూర్తి వంక అది పూజా! భక్తి అన్న మాట కృతజ్ఞతతో అనుబంధముతో ముడిపడుతుంది. నేను పూజ అంతా చెప్పడం కుదరదు ఇప్పుడు చెప్పలేను ఎప్పుడైనా వేరే ఉపన్యాసంలో చెప్పే అవకాశం వస్తే చెప్తాను.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
కాబట్టి అది ఇప్పుడేమౌతుంది కృతజ్ఞతా భక్తి కలిస్తే పూజవుతుంది, చచ్చిపోయిన నాన్నగారికి నీళ్ళు విడిచిపెడితే ఆయనకు దాహం తీరింది ఎలా తెలుస్తుంది, తెలుస్తుందా విశ్వాసమూ... వేదం చెప్పింది వెడుతుందని, విశ్వాసము ఈ విశ్వాసమునకు గుర్తేమిటో తెలుసాండీ..! సమాజంలో ముందు ఎవరుండి చెయ్యాలో వాళ్ళు చెయ్యాలి అది, ఎవరుండి చెయ్యాలని చెప్తుంది వేదం, ఎవడు యజ్ఞోప వీతంతో ఉన్నాడో ఎవడు జంధ్యంతో ఉన్నాడో వాడు చెయ్యాలి, అందుకే ఈ విశ్వాసమన్న మాటకి గుర్తేమిటో తెలుసా ఎప్పుడూ తూర్పుకే కూర్చుంటారు, పూజ చేసినా తూర్పుకే, తద్దినం పెట్టినా తూర్పుకే, కానీ యజ్ఞోప వీతం మాత్రం భుజాన్ని మారుతుంది. యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉందనుకోండి పూజ చేస్తున్నాడని గుర్తు, ఉత్తరీయం ఎడం భుజం మీద ఉందనుకోండి మంగళ కార్యం మీద ఉన్నాడని గుర్తు, ఎడం భుజం మీద ఎందుకు ఉంటుంది, అంటే నేను తూర్పుకి తిరిగి ఇలా కూర్చున్నానుకోండీ నా ఎడం చేతి పక్కకి ఏదుంటుంది ఉత్తర దిక్కు ఉంటుంది ఉత్తర దిక్కున ఎవరున్నారు దేవతలు ఉన్నారు ఉత్తర దిక్కున ఉన్న దేవతలన్ని ఆరాధించడానికి కూర్చున్న కాబట్టి యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉంటుంది. నేను పితృ దేవతలన్ని ఆరాధిస్తున్నాననుకోండి, పితృ దేవతలు ఎటు ఉంటారు దక్షిణ దిక్కున ఉంటారు, దక్షిణ దిక్కున కుడి చేతి పక్కన ఉంటుంది, అందుకని యజ్ఞోపవీతం కుడి భుజం మీదకు వెడుతుంది. యజ్ఞోపవీతాన్ని అపసవ్యం అందుకు చేస్తారు. పితృకార్యం చేస్తే కుడిభుజం మీదకు వెళ్ళిపోతుంది యజ్ఞోపవీతం ఇటువైపుకు తిప్పి వేసుకుంటారు, వేసుకుని తద్దినం పెడతాడు.
Image result for జల తర్పణంపితృ కార్యమూ చెయ్యట్లేదు దైవ కార్యమూ చెయ్యట్లేదు ఇప్పుడేమి చేయాలి నీవు యజ్ఞోపవీతం కుడి భుజం మీద ఉంచ కూడదు ఎడం భుజం మీద ఉంచ కూడదు పూల దండలా వేసుకోవాలి మెడలో. ఆఫీసుకి వెడుతున్నామనుకోండీ నేను ఏం చేయాలి అంటే బనీను వేసుకోవడం చొచ్చా వేసుకోవడం కాదు యజ్ఞోపవీతాన్ని మెడలో దండగా వేసుకోవాలి. ఒక రోజు మొత్తం మీద నా యజ్ఞోపవీతం నా ఒంటి మీద పూల దండలాగే ఎక్కువగా ఉందనుకోండి గుర్తేమిటంటే నేను ఆ రోజుని నేను దేవతార్చన యందు పితృ దేవతార్చన యందు కాకుండా అన్యమునందు ఎక్కువ గడిపానని గుర్తూ. కాబట్టి నన్ను నేను వెంటనే సంస్కరించుకోవాలి, ఏదో కడుపుకోసం ఆరు గంటలు వెళ్ళితే వెళ్ళాను ఇంకో గంట జపం చేయ్యాలి ఇవ్వాళ ఎందుకంటే ఎడం భుజం మీద లేదు ఉత్తరీయం ఎక్కువ సేపు. అసలు ఇవ్వాళ ఆ అనుష్టానమే లుప్తం. లుప్తమైపోయింది యజ్ఞోపవీతం తిప్పడమన్నది లేదు అసలు మెడలో ఎవరు వేసుకోవడం లేదు. ఉంటే ఎడమ భుజం మీద వేసుకుంటారు, ఎడం భుజం మీదే ఉండిపోతుంది అంతే... దాని వల్ల మీకు పరిశీలించుకునే శక్తి ఉండాలి.
కాబట్టి విశ్వాసమునకు ప్రాతిపదిక పితృకార్యము, జల తర్పణం చేశాడు అంటే భరతుడు వేదాన్ని నమ్మాడూ శాస్త్రాన్ని నమ్మాడు నమ్మినదానిని చేసినవాడు ధర్మాత్ముడు, ఆ ధర్మమే ఆ ధర్మమునకు పితృకార్యము విశ్వాస ప్రాతిపదికా దేవకార్యమునకు భక్తి ప్రాతిదికా ఇది రామాయణం నేర్పుతుందండీ..! పైకి చాలా తేలికగా ఉన్నట్లు ఉంటుంది శ్లోకం కాని మనం ఎలా ఉండాలి అన్నది మనకు నేర్పుతుంది. ముందు సమాజంలో పెద్దలైనవారు ఎలా ఉంటున్నారో చూస్తారు, దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందు పెద్దవాడు అన్నవాడు సరిగ్గా ఉండాలి ఉంటేనే మిగిలింది బాగుంటుంది. కాబట్టి చూడండి ఎంత అందమైన స్థితిలో ఉంటుందో ఆ కావ్యం ఇప్పుడు ఆయన ఆ గంగానది ఒడ్డున- నాన్నగారు శరీరం విడిచి పెట్టారు కాబట్టి జల తర్పణ చేస్తాను అని వెంటనే ఇంకా ఏడాది అవలేదు కాబట్టి ఏటి సూతకంలో ఉన్నాడు కాబట్టి ఆయన శత్రుఘ్నునితో కలిసి జల తర్పణచేశాడు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
జలతర్పణ చేసి వచ్చికూర్చున్నాడు, గుహుడికి తెలిసింది భరతుడు వచ్చాడని, రాముడు వచ్చాడనీ తెలిసింది పరుగెత్తుకు వచ్చాడు భరతుడు వచ్చాడని తెలిసింది వెంటనే అన్నాడూ ఎలా వచ్చాడు ఎందుకొచ్చాడు అన్నాడు. అనుమానము రామున్ని చంపడానికి వెడుతున్నాడా..! ఇంత సైన్యంతో ఎందుకు వచ్చాడూ..? అని తన ఆంతరంగికుల్ని పిలిచాడు పిలిచి అన్నాడు మహతీ ఇయమ్ ఇతః సేనా సాగరాఽఽభా ప్రదృశ్యతే ! న అస్య అన్తమ్ అవగచ్ఛామి మనసాపి విచిన్తయన్ !! అసలు నా జీవితంలో నేను మనసుతో కూడా ఊహించలేదు ఇంత సైన్యం ఉంటుందని, ఇంత సైన్యంతో వచ్చాడేమిటి యథా తు ఖలు దుర్భుద్ధిః భరతః స్వయమాఽఽగతః ! స ఏవ హి మహా కాయః కోవిదార ధ్వజో రథే !! కోవిదార వృక్షం కనపడుతోంది ఎర్ర కాంచన వృక్షం అది ఇక్ష్వాక వంశీయుల గుర్తు. ఆ పతాకం మీద ఆ గుర్తు కనపడుతూంది, కాబట్టి అది ఇక్ష్వాకు వంశమునకు సంబంధించిన భరతుడే సేన నడిపించుకుని వస్తున్నాడు బన్ధయిష్యతి వా దాశాన్ అథ వా అస్మాన్ వధిష్యతి ! అథ దాశరథిం రామం పిత్రా రాజ్యాత్ వివాసితమ్ !! తప్పకుండా ఈ కైకేయీ సుతుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని అకంటకం చేయ్యడం కోసం రామున్ని చంపడానికే బయలుదేరాడు, లేదా రామున్ని బంధించడానికని బయలుదేరాడు అందుకే ఇంత సైన్యంతో వెళ్తున్నాడు సంపన్నాం శ్రియం అన్విచ్ఛం స్తస్య రాజ్ఞ స్సుదుర్లభాః ! భరతః కైకేయీ పుత్రో హన్తుం సమధి గచ్ఛతి !! ఈయన ఎలాగైనా తన కోర్కె తీర్చుకోవడం కోసమని రాజ్యాన్ని సుస్తిరం చేసుకోవాలనే పూనికతో ఉన్నాడు.
అందుకని రామున్ని చంపడమే లక్ష్యంగా ఈ సైన్యాంతో వెళ్ళుతున్నాడు భర్తా చైవ సఖా చైవ రామో దాశరథి ర్మమ ! తస్య అర్థ కామాః సన్నద్ధా గఙ్గా అనూపే అత్ర తిష్ఠత !! నాకో భరతుడు ఎవర్ని చంపుదామనుకుంటున్నాడో ఆ రాముడే నాకు భర్త ʻభర్త అంటే నన్ను భరించేటటువంటి వాడుʼ నాకు ప్రభువు ఆయన యందు నాకు ఆ భక్తి ఉంది, సఖా చైవ ఆయనే నా మిత్రుడు రామో దాశరథి ర్మమ ఆ రాముడు దాశరథి భరతుడు దాశరథి కాడా..! రాముడే దాశరథి అంటే నిజంగా ఒక తండ్రికి కొడుకు అన్న మాటకి అర్థం ఆయనది ఎందుకంటే అడవులకి వెళ్ళిపోయాడు రాజ్యం వదిలి, ఇయ్యనో ఇచ్చిన రాజ్యం సుసంపన్నం చేసుకోవడానికి రామున్ని చంపడానికి వెళ్ళుతున్నాడు ఇది మనసులో భావన కాబట్టి తస్య అర్థ కామాః సన్నద్ధా గఙ్గా అనూపే అత్ర తిష్ఠత ఇయ్యనా గంగానదిని దాటడం కోసమని గంగానది తీరంలో విడిది చేసి ఉన్నాడు, మీ అందరు నా దగ్గర ఉన్నటువంటి యోధులు విలుకాండ్రు ఐదు వందల మంది ఉన్నారు మీరు ఏం చేస్తారంటే మన దగ్గర వంద పడవలు ఉన్నాయి మీ అందరూ కూడా ఆ పడవల మీద నిల్చోండి ఆ పడవల మీద, వంద నావలు ఉన్నాయి వంద నావల మీద ఒక్కొక్క నావ మీద వంద వంద మంది చొప్పన నిల్చోండి గంగా తీరంలో కనపడకుండా పడవలలో నిలబడి ఉండండి నిజంగా కాని ఒక వేళ రామున్ని చంపడానికే భరతుడు బయలుదేరుతుంటే నేను మీకు సంకేతమిస్తాను వీళ్ళు గంగ దాటి వెళ్ళడానికి వీళ్ళేదు. మనం వీళ్ళని ముంచేయడమో యుద్ధం చెయ్యడమో చంపేయడమో ఏదో ఒకటి చెయ్యాలి. అంటే రాముని మీద భక్తి అటువంటిది నేను అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటో కనుకొని వస్తాను కాబట్టి ఈలోగా మీరు మాత్రం సన్నద్ధంగా మాటు వేసి ఉండండి అన్నాడు అంటే తనకు తెలియకుండానే శత్రు సైన్యం చుట్టు ముట్టింది భరతున్ని.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
అంటే తనని శత్రువుగా భావించినవాడు చుట్టు ముట్టాడు, ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా కండచెక్కరా పళ్ళ రసాలు మధువు పట్టు బట్టలు ఇవన్నీ పట్టుకుని భరతుని దగ్గరికి వెళ్ళాడు. సుమంత్రుడు భరతుని దగ్గరికి ప్రవేశపెట్టాలంటే ముందు చూస్తారు కదాండీ! సుమంత్రుడు భరతుని దగ్గరికి వెళ్ళి అన్నాడు ఈ గుహుడు రాముడికి గొప్ప స్నేహితుడు ఈయ్యన రాముడు ఇక్కడ పడుకున్నప్పుడు చాలా ఆథిథ్యము ఇచ్చాడు, ఈయ్యనే గంగ దాటించాడు పైగా ఈయ్యన బోయవాడు, ఈయన దగ్గర ఉన్నవాళ్లందరూ బోయవాళ్ళు అరణ్యంలో తిరగడంలో సిద్ధహస్తులు కాబట్టి రాముడు ఎక్కడ ఉన్నాడో ఈయ్యనకి తెలుస్తుంది. మనం ఇతని సహకారం తీసుకోవడం మంచిది కాబట్టి భరతా! నీవు ఆయనతో మాట్లాడు అన్నాడు. అంటే గుహున్ని లోపలికి ప్రవేశపెట్టారు. వచ్చాడు గుహుడు కూర్చున్నాడు, మీరు వస్తున్నాను అని ముందు కబురుచేస్తే నేను సైన్యానికి అంతటికీ ఆథిధ్యం ఏర్పాటుచేసి ఉండేవాడిని మీరు అకస్మాత్తుగా వచ్చారు, నేను చెయ్యగలిగింది మాత్రమే చెయ్యగలుగుతున్నాను.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
కాబట్టి మీరు దేనికొరకు వచ్చారో చెప్పవలసింది నేను చెయ్యగలిగిన ఉపకారం చేస్తాను అంటే ఆ భరతుడు అన్నాడూ క తరేణ గమిష్యామి భరద్వాజాఽఽశ్రమం గుహ ! గహనోఽఽయం భృశం దేశో గంగా అనూపో దురత్యయః !! ఏమీ లేదు నాయనా! మేము ఈ గంగా నదినిదాటి భరద్వాజుని యొక్క ఆశ్రమాన్ని చేరుకోవాలి, కాబట్టి నీవు మమ్మల్ని జాగ్రత్తగా గంగ దాటించు అంటే గుహుడు అన్నాడూ తస్య త ద్వచనం శ్రుత్వా రాజ పుత్ర స్య ధీమతః ! అబ్రవీత్ ప్రాఞ్ఙలి ర్వాక్యం గుహో గహన గోచరః !! అరణ్యాలలో తిరగడానికి అలవాటుపడినటువంటి గుహుడు నమస్కారంచేసి అన్నాడూ నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు, నాకు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం మాకు అలవాటు లేదు మేము ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాం అంటే ఎవరిని భరతుడు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా వచ్చాడేమోనని అందుకని నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి దశాః తు అనుగమిష్యన్తి ధన్వినః సుహమాహితాః ! అహం చానుగమిష్యామి రాజ పుత్ర మహాయశః !! నిన్ను ఈ పల్లెటూరిలో ఉండేటటువంటి బోయవాళ్ళు అందరూ కూడా అనుసరిస్తారు మీకు మార్గం చూపిస్తారు, కాని నాకు ఒక అనుమానం పీడిస్తూంది అందుకనీ నేను నీకు సహాయం చేయడంలో కొంచెం వెనుకంజ వేస్తున్నాను కచ్చి న్న దుష్టో వ్రజసి రామ స్య అక్లిష్ట కర్మణః ! ఇయం తే మహతీ సేనా శఙ్కాం జనయతీవ మే !! రామున్ని చూడ్డానికి నీవు నిజంగా గంగా నదిని దాటి వెళ్ళుతున్నది నిజమైతే ఇంత సైన్యం ఎందుకు వెనకాల ఇంత సైన్యం అక్కర లేదుగా... మరి ఇంత చతురంగ బలాలతో రాముని దగ్గరకు ఎందుకు వెళ్ళుతున్నావ్? రామున్ని చంపడానికి వెళ్తున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది నిజంగా చెప్పు ఎందుకు వెళ్ళుతున్నావ్?
అంటే మహర్షి అన్నారు ఆకాశ ఇవ నిర్మలః ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనసున్న భరతుడు జవాబు చెప్తున్నాడు. ఇక్కడ వెంటనే ఒక ఆలోచన వస్తుంది మనకు ఏమండీ అంత ప్రత్యక్షంగా మొహం మీద గుహుడు అడిగేస్తే భరతుడు జవాబు చెప్పేటప్పుడు కొంచెం కష్టపడలేదా..? ఇదెక్కడ ప్రారబ్ధంరా ప్రతివాడూ ఇలా చూసి అడుగుతాడు నన్నూ అందులో గుహుడు బోయవాడు కూడా నన్ను ఇలా అడిగేవాడే? అని ఆయనకు కోపం రాలేదా అని మనకు అనిపిస్తుంది ఆకాశ ఇవ నిర్మలః అంటే అర్థమేమిటో తెలుసాండీ! ఆకాశంలోకి మబ్బులు వస్తాయి పోతాయి ఆకాశం అలాగే ఉంటుంది, అలా భరతుడు ఎందుకు కదలిక లేకుండగా ఉండగలిగాడో తెలుసా గుహున్ని అర్థం చేసుకున్నాడు ఎలా అర్థం చేసుకున్నాడో తెలుసా..? రాముడి పట్ల ఒకబోయవాడికి ఇంత ప్రేమ ఉందంటే... నా అన్నగారికి నేనే కాదు ఎంతమంది ప్రేమిస్తారో మా అన్నగారిని నిజంగా ఇంత మంది ప్రేమను పొందిన నా అన్న ధన్యాత్ముడుకదా అని సంతోషించినటువంటి భరతుని మనసు కుంగదూ! ఇది భరతుని హృదయం. అంతబాగా అర్థం చేసుకుంటాడు అందుకని ఆకాశ ఇవ నిర్మలః దాని మీదకి మబ్బులోచ్చి అది కదిలిపోయే అవకాశం లేదు. అలా అర్థం చేసుకున్నాడు ఆయన యొక్క విషయాన్ని తెలియనివాడు కాబట్టి ఇలా అడిగాడు దానికి మనం బాధపడక్కర లేదు ఎంత ప్రేమో రాముడి మీద ఎంత ప్రేమో తెలియనితనం పాపం నేనేదో చంపడానికి వచ్చాననుకుంటున్నాడు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
అందుకు ఇలా అన్నాడని అన్నాడు మా భూత్ స కాలో యత్ కష్టం న మాం శఙ్కితుమ్ అర్హసి ! రాఘవః స హి మే భ్రాతా జ్యేష్ఠః పితృ సమో మమ !! నీవు అన్న మాట నా జీవితములో ఏ కాలమందు రాకుండుగాకా..! రామున్ని చంపడమన్న మాటే... అసలు రాకుండు గాకా! నాకు తండ్రియైనా అన్నయైనా అన్నీ నా రామ చంద్ర మూర్తియే అటువంటివాన్ని వెనక్కి తీసుకోరావడానికని వెడుతున్నాను తం నివర్తయితుం యామి కాకుత్స్థం వన వాసినమ్ ! బుద్ధిః అన్యా న తే కార్యా గుహ సత్యం బ్రవీమి తే !! గుహా! నేను సత్యం చెప్తున్నాను నన్ను నమ్ము మేము అందరం కలిసి వెళ్ళి అడిగితే వెనక్కు వస్తాడూ అని నేనే వీళ్ళందర్నీ ఆజ్ఞాపించి తీసుకువెళ్తున్నాను, నన్ను నమ్మూ గంగ దాటించు మేము భరద్వాజా ఆశ్రమానికి వెళ్తాము అన్నాడు. అంటే గుహుడు అన్నాడూ ధన్య స్త్వం న త్వయా తుల్యం పశ్యామి జగతీ తలే ! అయత్నాత్ ఆగతం రాజ్యం య స్త్వం త్యక్తుమ్ ఇహేచ్ఛసి !! ప్రయత్నం చెయ్యకుండా వచ్చినటువంటి ఇంత పెద్ద రాజ్యాన్ని అన్నగారి మీద భక్తితో విడిచిపెట్టినటువంటి ధర్మాత్మున్ని నిన్నే చూస్తున్నాను భరతా! నీ వంటి మహాత్ముడు ఉండడు.
Dhavanalam.jpgఅరమరిక లేకపోవడం అంటే అనుమానం ఎలా వస్తుందో అభినందనా అలా వస్తుంది కాబట్టి వెంటనే గుహుడు అభినందించాడు, నిద్రపట్టకా భరతుడు ఆ రాముడు పాపం ఎంత కష్టపడుతున్నాడో, మా అమ్మ సీతమ్మ ఎంత కష్టపడుతూందో, లక్ష్మణుడు ఎంత కష్టపడుతున్నాడో అంటున్నాడట పైకి ఎలా ఉన్నాడు చక్కగా ఆభరణములు ధరించాడు పట్టుపుట్టం కట్టుకున్నాడు చక్కగా కూర్చున్నాడు అందరూ తన మాట వింటున్నారు లోపల మాత్రం ఎలా ఉన్నాడు, మహర్షి అంటారు అన్త ర్దాహేన దహనః సంతాపయతి రాఘవమ్ ! వన దాహాభి సంతప్తం గూఢోగ్ని రివ పాదపమ్ !! అరణ్యంలో దావాగ్ని అంటుకుంది ఒక చెట్టు కాలిపోయింది కాని చెట్టు ఇంకా నిలబడి ఉంది అలాగే అది కిందపడిపోలేదు పూర్తిగా కాలిపోలేదు, ఆ మంటల తాపమునకు ఆ వేడికి దాని ఆకులు అన్నీ కాలిపోయి కొమ్మలతో అలా ఉండిపోయింది, ఇప్పుడు ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందంటే మనకీ ఈ చెట్టు పూర్తిగా కాలిపోలేదు ఈ చెట్టు బ్రతికే ఉంది అంటాం, కానీ ఏమైందంటే ఆ చెట్టుకు ఒక తొర్రుంది ఈ మంట దావాగ్ని మండుతున్నప్పుడు ఒక పెద్ద నిప్పు కణం ఒకటి వెళ్ళి ఆ తొర్రలో పడింది, అది లోపల ఉన్నటువంటి ఎండిపోయిన చితికులతో రగులుకూంటూంది రగులుకుని అది మంటవుతుంది లోపల, లోపలా ఆ తొర్రలో మంట పుడుతున్నప్పుడు ఆ చెట్టు ఎంత బాధతో ఉంటుందో, ఒక్క కొమ్మ కాలితే ఫరవాలేదు చెట్టు కాలిపోతూ ఉంటే..? ఆ చెట్టు ఎలా ఉంటుందో భరతుడు అలా ఉన్నాడట!

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
అందుకనీ లోపల బాధ ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత అపనింద నేను అడగనిది ఎందుకు కోరింది మా అమ్మ, అందుకని నిద్రపట్టకా ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఆ గుహున్ని పిలిచి, ఇక్కడకి వచ్చాడు కదా రామ చంద్ర మూర్తి వచ్చాడు కదా, లక్ష్మణుడు వచ్చాడు కదా, మా అమ్మ సీతమ్మ వచ్చారు కదా! వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తావా..? అన్నాడట, ఉపశాంతి రాముడి గురించి వింటే అంటే మహర్షి అంటారు ఆచచక్షేథ సద్భావం లక్ష్మణ స్య మహాత్మనః ! భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచరః !! అడవులలో తిరిగేటటువంటి గుహుడూ, లక్ష్మణుడి గురించి భరతునికి చెప్తున్నాడు, రాముడికి తరువాత పుట్టినవాడు లక్ష్మణుడు, లక్ష్మణుడు భరతునికి తోడబుట్టినవాడు, తోడబుట్టిన లక్ష్మణుని గురించి భరతునికి ఎక్కువ తెలుస్తుందా గుహుడికి ఎక్కువ తెలుస్తుందా..? కానీ గుహుడు రామ కథ చెప్తూంటే లక్ష్మణుడి గురించి చెప్తూంటే, సీతమ్మ గురించి చెప్తూంటే ఎంతో ఉపశాంతితో వింటున్నాడు, ఎందుకు వింటున్నాడు అంటే రామ కథ ఎటువంటి తాపాన్నైనా తీర్చగలదూ! ఆ రామ సంకీర్తనకీ రామ నామానికి రామ కథకీ ఉన్న శక్తి అటువంటిది, అది తెలుసున్నవాడు చెప్పాడా తెలియని వాడు చెప్పాడా కాదు..! అసలు చెప్తేనే చాలు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
మీకు నాలుక పెడతిరిగిపోతూందండీ, పిచ్చి దాహం వేసేస్తుంది ఆ దాహంలో మీరు వెళ్ళిపోతూంటే మీ ఎదురుగుండానే చాలా పరుషమైనటువంటి వృత్తి చేత జీవనం చేసేటటువంటి ఒక వ్యక్తి అరే! దాహంతో ఉన్నారా అని తన కుండ తిప్పి నీళ్ళుపోశాడు, ఇప్పుడు మీరు ఆ కుండలో నీళ్ళు తాగుతున్నారు, ఇప్పుడు మీకు ఆ వ్యక్తి యోగ్యతా యోగ్యతలు కావాలా నీళ్ళు కావాలా..! రామ కథ అంతే... దాహం మీకు ఉంటే నీళ్ళు ఎలా కావాలో ఆకలి మీకుంటే అన్నం ఎలా కావాలో ప్రాణం కావాలంటే ఊపిరి ఎలా కావాలో బ్రతుకు బాగుండాలనుకున్నవానికి రామ కథ కావాలి రామ నామం కావాలి ఎవడు చెప్పాడు అన్నది అక్కరలేదు.
కాబట్టి ఆచచక్షేథ సద్భావం లక్ష్మణ స్య మహాత్మనః ! భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచరః !! ఆ గుహుడు చెప్తూంటే వింటున్నాడట, ఆయన చెప్తున్నాడు ఏమి చెప్పనయ్యా! రామ చంద్ర మూర్తి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇంగుదీ వృక్షం కింద ఎన్నో పదార్థాలు ఉన్నాయి రామా తినండీ అన్నాను, నాయనా! మేము క్షత్రియులం మహారాజులం ఒకరికి పెట్టాలి తప్పా ఇలా ఒకరి దగ్గర తినేసి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు, నాకు దోషడు నీళ్ళు చాలు మా నాన్నగారి గుఱ్ఱాలకి గడ్డి పెట్టవయ్యా అన్నాడు, ఇక్కడే పడుకున్నాడు తల్పము ఇస్తానంటే వద్దన్నాడు, నేను తృణములు అంటే గడ్డి తీసుకొచ్చి దాని మీద ఆకులు వేశాను ఆకులు వేస్తే ఆ శయనం మీద రాముడు పడుకున్నాడు, పక్కనా నా తల్లి సీతమ్మ పడుకుంది. నేను లక్ష్మణుని దగ్గరకి వెళ్ళి అన్నానూ లక్ష్మణా నీవు పడుకో పక్కవేస్తానూ అన్నాను అంటే ఆయన అన్నాడు ఏమయ్యా లేక లేక పుట్టినటువంటి రామ చంద్ర మూర్తి ఇలా సీతమ్మతో కలిసి పడుకుంటే నాకు జీవితంలో నిద్రపడుతుందా..? నాకు సుఖం కలుగుతుందా అన్నాడయ్యా..! అంటే ఒక తమ్ముడు అటువంటివాడు ఇంకా నీవు మనసులో ఏమైనా ఉందేమోనని మనసులో అనుమానం గుహుడికి, అందుకనీ అటువంటి తమ్ముడయ్యా మహానుభావుడూ..! నా దగ్గర ఏమీ పుచ్చుకోలేదూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పడవ ఎక్కీ గంగ దాటీ తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యానికి వెళ్ళిపోయాడయ్యా మహా తేజోమూర్తి రామ చంద్ర మూర్తి అంతటి ధర్మ తత్పరుడయ్యా అంటే...
భరతుడు అన్నాడూ ఏదీ మా అన్నయ్యా వదినా పడుకున్న పక్కా అన్నాడు ఇది ఎవరు వేయగలిగిన ప్రశ్నో తెలుసాండీ! మా ఇంట్లోనండీ మీరు కొంతమంది యొక్క మనస్సు ఎలా ఉంటుందో చూడండీ... ఏదో ఒంట్లో బాగులేదనుకోండీ ఏమండీ శృంగేరీ పీఠంలో శారదా దేవి అర్చన చేసిన కుంకుమ తీసుకొచ్చాము, మీరు పెట్టుకోండీ అన్నాము అనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మా...హ.. నిజంగా ఇవ్వాళ అమ్మవారి అనుగ్రహమండీ నాకేమీ అవదు ఫరవాలేదు ధైర్యం వచ్చేసిందని చెప్పి ఆ బొట్టు తీసి కళ్ళకు అద్దుకుని పెట్టుకుంటారు. బొట్టు బొట్టుగా రక్షిస్తుందా బొట్టు శారదాదేవి పాదములకు అర్చన చేయబడిన ప్రసాదము మీకు లలాటములో అలంకరిస్తుందన్న బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుందా... మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. కుంకంగా కుంకుమ రక్షించదు. మీ బుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది, ప్రసాదము అన్నబుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. రాముడు పడుకున్న పక్క చూస్తే భరతుడికి ఏమి వస్తుందండీ..? అంటే మహానుభావుడు నేల మీద పడుకున్నాడా..! దాన్నిచూసినా రాముని చూసినంత తృప్తి అంత ఆనందం. వేంకటేశ్వర స్వామివి తిరుమల నుంచి ఉత్సవ మూర్తులు మా ఊరు వచ్చాయీ అంటారు, ఏదో ఇక్కడ కళ్యాణం చేస్తామన్నారు వేంకటాచలం నుంచి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చీ అంటే మొత్తం ఊళ్ళో ఉన్న లక్షలాది మంది వెళ్ళిపోయి అక్కడి ఆ గ్రౌండులో కూర్చుంటారు. ఏం ఊళ్ళో వేంకటేశ్వర స్వామి గుళ్ళులేవా? వేంకటేశ్వర స్వామికి ఉత్సవ మూర్తులులేవా మీరు ఎప్పుడు కళ్యాణం చూడలేదా..? అంటే తిరుమల వేంకటేశ్వరుడు నడిచి మా ఊరు వచ్చాడయ్యా అలా అంటావేమిటీ, అవి ఉత్సవ మూర్తులు అంటావేమిటీ అవి మూర్తులు కాదు స్వామి వచ్చాడు మా ఊరుకి ఇక్కడ కళ్యానంచేసి మమ్మల్నందర్నీ అనుగ్రహించడానికి ఈ పూనికతో కాదూ మీ అందురూ వెళ్ళి గ్రౌండులో కూర్చుంటున్నారు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
అలా... ఆ పడక చూడ్డంలో కూడా అబ్బా..హ్.. మా అన్నయ్య పడుకున్న పడకా..? మా వదినమ్మ పడుకున్న పడకా..? పరిగెత్తాడు భరతుడు. తప్పా అది చూస్తే ఏమొస్తుందని అనకూడదు, వెళ్ళిచూసి అన్నాడూ న నూనం దైవతం కించిత్ కాలేన బల వత్తరమ్ ! యత్ర దాశరథీ రామో భూమౌ ఏవం శయీత సః !! ఇక్కడా మా అన్నయ్య పడుకోవడం, రాజాధి రాజు మహానుభావుడు, మెత్తని అస్తరణం మీద పడుకోవలసినవాడు అటువంటివాడు ఇటువంటి తృణముల మీదా ఆకుల మీద పడుకున్నాడంటే..? కాలము ఎంత గొప్పదో కాలము ఎవర్నైనా ఎలా వశము చేసుకుంటుందో అర్థమవుతుంది విదేహ రాజ స్య సుతా సీతా చ ప్రియ దర్శనా ! దయితా శయితా భూమౌ స్నుషా దశరథ స్య చ !! దశరథ మహారాజుగారి పెద్ద కోడలు, జనక మహారాజుగారి కూతురు రామ చంద్ర మూర్తి పత్ని అటువంటి మా వదినా లోకమాత మా తల్లి సీతమ్మ ఇక్కడ పడుకుందా..? ఇయం శయ్యా మమ భ్రాతుః ఇదం హి పరివర్తితమ్ ! స్థణ్డిలే కఠినే సర్వం గాత్రై ర్విమృదితం తృణమ్ !! ఇదిగో మా అన్నయ్య ఇటు పక్కకి వంగి పడుకోవడం వల్ల అటువైపుకు ఉన్నటువంటి పరకలూ ఆకులూ బాగా వత్తుకున్నాయి, మా అన్నయ్య వీటి మీదా ఇలా వత్తుకు పడుకున్నాడు, ఎంత నొక్కుకుందో మా అన్నయ్య శరీరం.
ఎంతబాధో ఎంతప్రీతో అన్నయ్య అంటే, ఈ చూసే దృష్టి కోణంలో ఉంది, అందరూ వేంకటాచలం వెళ్ళి రెండు నిమిషాలలో తోసేశారు, మూడు నిమిషాలలో తోసేశారు పది సెకండ్లలలో తోసేశారు అంటే, ఒకాయన వచ్చి అన్నాడూ... ఏమండీ ఎప్పుడో రాత్రి రెండు గంటలకి లేచినవాడు రాత్రి పదకొండు అవుతోంది అలాగే నిల్చున్నాడు నా స్వామికి కాళ్ళెంత నొప్పి పెడుతున్నాయో ఒక్కసారి పట్టనిస్తే బాగుండండీ అన్నాడు. అది అన్నవాడు భక్తుడు తోసేశాడు అన్నవాడు భక్తుడు ఎలా అవుతాడండీ నా బుర్రా..! నీ దృష్టి కోణంలో ఉంటుంది భక్తి అన్నది, కాబట్టి ఇక్కడా మా అన్నయ్య పడుకున్నాడు మన్యే సాఽఽభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా ! తత్ర తత్ర హి దృశ్యన్తే సక్తాః కనక బిన్దవః !! ఇదిగో మా తల్లి వదినమ్మ సీతమ్మ ఇక్కడ పడుకుంది, మా వదినమ్మ బంగారు ఆభరణములు పెట్టుకుని పడుకున్నటువంటి కారణంచేత ఇవి కఠినంగా ఉండడం వల్ల ఆ ఆభరణము వత్తుకుని అందులో ఉన్న బంగారు ఆభరణములు తునకలు కిందపడి ఈ గడ్డి పరకల్ని పట్టుకున్నాయి తృణాలని ఇదిగో మెరుస్తున్నాయి ఉత్తరీయమ్ ఇహ ఆసక్తం సువ్యక్తం సీతయా తదా ! తథా హ్యేతే ప్రకాశన్తే సక్తాః కౌశేయ తంతవః !! ఇక్కడా మా వదిన కట్టుకున్నటువంటి పట్టుబట్ట యొక్క దారములు ఈ గడ్డికీ, ఇక్కడ ఉన్నటువంటి పుల్లల ముక్కలకీ చుట్టుకున్నాయి అంటే మా వదినా ఇలాంటి గడ్డి మీదా ఆకుల మీదా పుల్లల మీదా పడుకుని నిద్రపోయింది అన్నమాట మన్యే భర్తుః సుఖా శయ్యా యేన బాలా తపస్వినీ ! సుకుమారీ సతీ దుఃఖం న విజానాతి మైథిలీ !! అవును అవునులే... మా వదిన ఎందుకు పడుకోదు మా వదినకు పరుపులు అక్కర లేదు, మా వదినకీ హంసతూలికా తల్పాలు అక్కర లేదు మా వదినకీ మా అన్నయ్య పక్కన ఉంటే చాలు అంత గొప్ప తల్లి తపశ్వినీ మా తల్లి మా వదిన అంతటి మహా పతీవ్రతా... అందుకే ఇటువంటి కఠినమైన దానిమీద కూడా మా వదిన పడుకోగలిగింది. అటువంటి తల్లిని పడుకోబెట్టిన పాపం నాది, నన్ను కన్న నా తల్లిది మేం ఇద్దరం చేసినటువంటి దుశ్కృత్యమిది అని గుండెలు బాదుకొని ఏడ్చి మూర్చ పోయాడట మహానుభావుడు. పోతే ఆయనని కౌసల్యాదులు లేచి వచ్చి అయ్యొయ్యో నాయనా! నీవు ఏమిటి ఇలా పడిపోయావు అనారోగ్యం రాలేదుగా అని వారు భీతిల్లారు, లోపలికి తీసుకెళ్ళారు కూర్చోబెట్టారు. ఆయన అంటాడు ఇవ్వాళ అమ్మా రాముడంటే ఏమిటో తెలుసా? మా అమ్మకు అర్థం కాలేదు కానీ రాముడు అంటే ఏమిటో చెప్తాను చూడమ్మా

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
న చ ప్రార్థయతే కశ్చిన్ మనసాపి వసుంధరామ్ ! వనేపి వసత స్తస్య బాహు వీర్యాభిరక్షితామ్ !!
శూన్య సంవరణా రక్షామ్ అయన్త్రిత హయ ద్విపామ్ ! అపావృత పుర ద్వారాం రాజధానీమ్ అరక్షితామ్ !!
అప్రహృష్ట బలాం న్యూనాం విషమస్థామ్ అనావృతామ్ ! శత్రవో న అభిమన్యన్తే భక్ష్యాన్ విషకృతాన్ ఇవ !!
అద్య ప్రభృతి భూమౌ తు శయిష్యేహం తృణేషు వా ! ఫల మూల అశనో నిత్యం జటా చీరాణి ధారయన్ !! అంటూ..!
త స్యార్థమ్ ఉత్తరం కాలం నివత్స్యామి సుఖం వనే ! తం ప్రతిశ్రవమ్ ఆముచ్య న అస్య మిథ్యా భవిష్యతి !!
అమ్మా! రాముడు అంటే ఏమిటో చెప్తాను చూడమ్మా... శత్రువులు ఎప్పుడూ అదునుకోసం చూస్తుంటారు, రాముడూ అరణ్యానికి వెళ్ళిపోయాడు, లక్ష్మణుడూ రాముడితో వెళ్ళిపోయాడు, నేనూ శత్రుఘ్నుడు ఏడు రోజులు ప్రయాణం చేస్తే తప్ప రాలేనటువంటి రీతిలో గిరివ్రజ పురంలో ఉండిపోయాను దశరథుడు మరణించాడు.
ఒక్క శత్రువూ అయోధ్య మీదకు యుద్ధానికి రాలేదు, ఎందుకో తెలుసా అమ్మా... ఎక్కడ అడవిలో ఉన్నా నా అన్న బాహు బలం రక్షిస్తుంది, ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే, ఇది చాలా పెద్ద మాట మీరు బాగాగుర్తు పెట్టుకోండి జీవితంలో, నేను ఒకానొకప్పుడు వ్యక్తి గతంగా నా జీవితంలో ఆపద వచ్చీ అన్నవరం పాదయాత్ర చేశాను, ఈశ్వరుడిచేత రక్షింపబడి, ఆ ఆపదనుంచి గట్టెక్కి పాదయాత్ర చేశాను, చాలా కష్టపడి పాదయాత్రచేసి కాళ్ళు నొప్పి పెడతాయి 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పై చిలుకు ఒక్కరోజులో నడిచీ తెల్లవారిగట్ల బయలుదేరితే రాత్రికి కొండమీదకి వెళ్ళీ స్వామి దర్శనం చేసుకొని ఇంక కాళ్ళు సహకరించకా అక్కడ కూర్చుంటే అక్కడ ఎవ్వరో ఒకాయన వచ్చాడు, ఏమయ్యా అలా కూర్చున్నావు అన్నాడు ఏమీ లేదండీ ఏదో పాదయాత్రచేసి వచ్చాను కాళ్ళు సహకరించలేక లేవలేకపోతున్నాయండీ నడవలేకపోతున్నాను అందుకు కూర్చున్నాను అన్నాను అంటే ఆయన బాగాబడలిపోయావేమో కాఫీ తెస్తాను ఉండండి అన్నాడు నేను వద్దులేండి అంటున్నాను లేవడానికి ఓపికలేదు ఆయన గబగబా వెళ్ళి ఒక కాఫీ తెచ్చాడు, నేను కాఫీ తాగాను ఆ ఎంగిలి కప్పు ఆయన చేత్తో తీసుకున్నాడు తీసుకొని దూరంగా వెళ్ళి ఓ డబ్బాలో పారేసి ప్రసాదం పొట్లాలు పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు.
అయ్యో ఇంకా నేను వెళ్ళి కొనుక్కుందామనుకుంటున్నానండీ ఉండండి డబ్బులు ఇస్తానండీ అన్నాను, ఆయన అన్నాడూ నాకు అక్కరలేదు, నీకో మాట చెప్పనా నీకు ఆపద వచ్చింది అన్నవరంలో కాదు నీకు ఆపద ఎక్కడో వచ్చింది, ఎక్కడో ఆపదవస్తే ఎక్కడో ఉన్నస్వామిని తలచుకున్నావు అది పైకి తలచుకోలా ఇక్కడ తలచుకున్నావు, ఇక్కడ తలచుకున్నది ఇక్కడ ఎలా వినపడిందో తెలుసా..? వినపడుతుంది యంత్రాలయం అటువంటిది స్వామి దగ్గర ఉన్న ఈ

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
యంత్రం వల్ల ఈ భూమండలంలో ఎక్కడ నిలబడి ఎవడు ఆర్తితో ఉన్నాడని నమ్మికోరినా నాతండ్రి వింటాడు కోరిక తీరుతుంది, కాబట్టి నీ ఆపదనుంచి గట్టేక్కావు నీ విశ్వాసం నుండి నీవు రాగలిగావు నీకు ఈ మాట చెప్పుదామని వచ్చాను, నీవు నాకు ఇంక ఏమీ చేయక్కరలేదులే డబ్బు ఇవ్వక్కర లేదులే అని వెళ్ళిపోయాడు ఆయన ఆ సత్యనారాయణ స్వామే అలా వచ్చి చెప్పాడు అని నేను ఆశ్చర్యపోయాను.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
http://teluguglobal.com/wp-content/uploads/2015/03/sri-rama.jpgకాబట్టి భరతుడు అంటున్నాడు, ఎక్కడో రాముడు ఉన్నాడు కాని అమ్మా రాముని భుజ బలం రక్షిస్తుందమ్మా ఇవ్వాళ అయోధ్య ద్వారాలు తెరచి ఉన్నాయి, అయోధ్య ద్వారాలు మూయలేదు, అయోధ్యా నగరంలో ఒక్క పౌరుడు లేడు అందరూ అడవులకి వచ్చేశారు, రక్షించడానికి ఎవరికీ ఉత్సాహం లేదు యుద్ధం చేద్దామంటే ఏనుగులు కాని గుఱ్ఱాలు కాని ఏవీ యుద్ధానికి సిద్ధంగా లేవు ఇటువంటప్పుడు ఎవడైనా వచ్చి పడిపోతే కోసల రాజ్యాన్ని ఒక్క నిమిషంలో స్వాధీనం చేసుకోవచ్చు, ఎవ్వడూ ఒక శత్రువు కన్నెత్తి చూడ్డంలేదు రాజ్యం వైపుకు ఎందుకనీ ఎక్కడున్నా రాముడు కాపాడుతాడు, అమ్మా..! నేను ఎక్కడున్నా నా అన్న నన్ను కాపాడుతుంటాడమ్మా... నాకు భయం లేదు అన్నాడు భరతుడు. ఇదీ పూనిక అంటే ఇదీ భక్తి అంటే, కాబట్టి కానీ అమ్మా ఇటువంటి రాముడు ఇటువంటి సీతమ్మ మా అమ్మ మాట వల్ల నా వల్ల భూమి మీద పడుకుని ఇన్ని కష్టాలు పడుతున్నారు కాబట్టి ఈ క్షణం నుంచి కూడా అద్య ప్రభృతి భూమౌ తు శయిష్యేహం తృణేషు వా ! ఫల మూల అశనో నిత్యం జటా చీరాణి ధారయన్ !! రాముడికి ఏ కష్టం కలిగిందో ఆ కష్టం నేను అనుభవిస్తాను నేను కూడా నార చీరలు కట్టుకుంటాను నేను కూడా మఱ్ఱిపాలు పోసుకుంటాను జటలు కట్టేసుకుంటాను నేను కూడా భూమి మీదే పడుకుంటాను నేను కూడా రాముడు ఎలా ఫల మూలములను తింటాడో నేను కూడా తింటాను, తప్పా అమ్మా ఇక నుంచీ రాముడు అనుభవించనిది ఏదీ నేను అనుభవించను నేను రాముని తరఫుని 14 యేళ్ళు అరణ్యంలో ఉండడానికి ఇలా సిద్ధపడి వెళ్తానమ్మా అని అన్నాడు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjsnA8IELN4YIX4vtlwYDw_k9D-o-C6ZWV1w2_szjJJIHksnTbtdoPNwvoTQ9La3GUp0CVkQoscgUaHeJBmS0CXBFM4vJvvFQpQEnk3di27MQhjEmPgCQ5NnHr42P2qcAjokpkD_zU9-zc/w1200-h630-p-nu/Bharatha-Going-Forest.jpgఅన్నాడు మహానుభవుడు బయలుదేరాడు గుహుడు సహకరించాడు, గంగానదిని దాటారు వెళ్ళి భారద్వాజాశ్రమంలోకి వెళ్ళారు భారద్వాజ మహర్షి కనపడ్డాడు దగ్గరికి పిలిచారు పిలిచి అన్నారు కిమ్ ఇహ ఆగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసతః ! ఏతత్ ఆచక్ష్వ మే సర్వం న హి మే శుధ్యతే మనః !! సైన్యానంతటినీ ఎక్కడో విడిచిపెట్టి భరద్వాజ మహర్షి మీద ఉన్న గౌరవంతో కాలినడకన కేవలం శత్రుఘ్నున్ని తీసుకొని వెళ్ళి నమస్కరించినటువంటి భరతున్ని చూసి భారద్వాజుడు అన్నాడు ఏమయ్యా..! ఇంత సైన్యాన్ని తీసుకొని వచ్చావు, రాముడు రాజ్యం విడిచిపెట్టీ అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు కదా..! నీకు రాజ్యం ఇచ్చేశాడు కదా, మీ అమ్మ నీకు రాజ్యం ఇప్పించిది కదా నాకు తెలియదనుకుంటున్నావా నాకు అన్నీ తెలుసూ కచ్చిన్ న తస్య అపాప స్య పాపం కర్తుమ్ ఇహ ఇచ్ఛసి ! అకంటకం భోక్తు మనా రాజ్యం తస్య అనుజ స్య చ !! అకంటకం చేసుకోవడానికి అన్నయ్యకి ఏమైనా ఆపద చేద్దామని వచ్చావా ఇంత సైన్యంతో అన్నాడు, భరతుడు వల వల ఏడ్చి నేల మీద పడిపోయాడు, పడిపోయి అన్నాడూ హతోస్మి యది మామ్ ఏవం భగవాన్ అపి మన్యతే ! మత్తో న దోషమ్ ఆశంకే నైవం మామ్ అనుశాధి హి !! భరద్వాజ మహర్షీ! నేను ఇవ్వాళ చనిపోయానూ అన్నాడు. గుహుడు లాంటి వాడు అడిగితే నేను ఏమీ అనుకోను, కానీ మీరు త్రికాల వేది నా మనసు తెలిసున్నవాడు మీరు నీవు అన్నయ్యని చంపడానికి వచ్చావా..? అని అడిగితే మీ వంటివారికి నేను ఏమని జవాబు చెప్పి నమ్మించను కాబట్టి నేను మరణించినవాడితో సమానం అన్నాడు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
ఏం పరవాలేదు బెంగపెట్టుకోకు లోపలికి రా! అన్నారు తీసుకెళ్ళారు కూర్చోబెట్టారు, చాలా సంతోషం నీవు నిజంగా రాముడు ఎక్కడున్నాడో తెలుసుకొని రామున్ని వెనక్కి తిరిగి రమ్మని తీసుకురావడానికే నీవు వచ్చావని నాకు తెలుసు నేను చెప్తాను జానే చ రామం ధర్మజ్ఞం స సీతం సహ లక్ష్మణం ! అసౌ వసతి తే భ్రాతా చిత్రకూటే మహా గిరౌ !! చిత్ర కూట పర్వతం మీద ఉన్నాడు, అక్కడికి వెళ్ళి రామ లక్ష్మణులని తీసుకువెళ్దామని నీ సంకల్పం కాబట్టి వెల్దువుకానీ, కానీ ఇవ్వాళ నేను ఆతిధ్యమిస్తాను మీ సైన్యానికికంతటికి కూడా వచ్చి నీవు ఆతిధ్యము స్వీకరించు అన్నాడు, మీరు నాకు ఆర్ఘ్యమిచ్చారు పాద్యమిచ్చారు, కందమూలాలు ఇచ్చారు రాముడు ఎక్కడున్నాడో చెప్పారు చాలు ఇంక నాకు అంత కన్నా ఇంకేమీ అక్కర లేదు నేను బయలుదేరుతాను అన్నాడు అలాగా కాదు నీవు నా దగ్గర తీసుకోవలసిందే అని సైన్యానికి అంతటికీ కూడా ఆతిధ్యం ఇస్తాను అన్నాడు, వశిష్ట విశ్వామిత్రులు గుర్తు వస్తారు మనకు ఇన్ని లక్షల సైన్యాన్ని ఆశ్రమంలోపలికి తెప్పించాడు కాదు కాదు నీ గుఱ్ఱాలు ఏనుగులు ఒంటెలు అన్ని కూడా తీసుకరా అన్నాడు అన్నీ తీసుకు వచ్చాడు.
Image result for bharadwaja rishiఆయన మహానుభావుడు ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళాడు, ఆయన అగ్నిహోత్రం చేసేటటువంటి శాలలోకి ప్రవేశించి అగ్ని శాలాం ప్రవిశ్యాథ పీత్వా ఆపః పరిమృజ్య చ ! ఆతిథ్య స్య క్రియా హేతో ర్విశ్వకర్మాణమ్ ఆహ్వయత్ !! ఆచమనంచేసి ఆ నీళ్ళు కళ్ళూ అవీ తుడిచుకుని ఒక్కసారి విశ్వకర్మను ఆహ్వానం చేశాడు, ఎందరో వచ్చారు మన ఆథిధ్యానికి వాళ్ళందరికి కూడా అథితి భవనాలు సృష్టించు అన్నాడు ఆహ్వయే లోకపాలాం స్త్రీన్ దేవాన్ శక్ర ముఖాం స్తథా ! ఆతిథ్యం కర్తుమ్ ఇచ్ఛామి తత్ర మే సంవిధీయతామ్ !! ఇంద్రుడితో సహా లోకపాలకుల్ని పిలిచి ముగ్గుర్ని నేను వీళ్ళకి ఆతిథ్యం ఇద్దామనుకుంటున్నాను మీ అందరూ కూడా ఏర్పాట్లు చేయండి అన్నాడు ఘృతాచీమ్ అథ విశ్వాచీం మిశ్రకేశీం అలంబుసాం ! నాగదంతాం చ హేమాం చ సోమాం అద్రి కృత స్థలాం !! అప్సరసలందరినీ పిలిచాడు ఘృతాచీ అథా విశ్వాచీ మిశ్రకేశీ అలంబుసాం నాగదంతా హేమ వీళ్ళందరినీ పిలిచీ మీరందరూ కూడా స్వర్గలోకములో ఉండేటటువంటి అప్సరో గణములతో కలసి అందరూ కూడా వచ్చీ ఇక్కడ నాట్యం చేయండి అన్నాడు ఇహ మే భగవాన్ సోమో విధత్తామ్ అన్నమ్ ఉత్తమమ్ ! భక్ష్యం భోజ్యం చ చోష్యం చ లేహ్యం చ వివిధం బహు !! ఓ సోముడా... ఓ చంద్రుడా! నీవు ఇక్కడికి వచ్చి భక్ష భోజ్య లేహ్య చోష్యములతో అన్నపు రాశుల్ని తినేవి తాగేవి నాకేవి వీటన్నిటినీ కూడా సృష్టించు అన్నాడు విచిత్రాణి చ మాల్యాని పాదప ప్రచ్యుతాని చ ! సురాఽఽదీని చ పేయాని మాంసాని వివిధాని చ !! వివిధ రకాలైనటువంటి మాంసాన్నములను వివిధరకములైనటువంటి సురలను చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణములను, వాటితో పాటుగా అనేకముమైనటువంటి వృక్షములను, పుష్పములను సృష్టించమని అడిగారు వాయువు మలయం దర్దురం చైవ తతః స్వేద నుదోనిలః ! ఉపస్పృశ్య వవౌ యుక్త్యా సుప్రియాఽఽత్మా సుఖః శివః !! ఆ మలయ పర్వతము దద్దుర పర్వతము నుంచి వాయువు సుఖ స్పర్ష కలిగేటట్టుగా చక్కగా మందంగా చల్లటిగాలి వీచేటట్టుగా వాయువు బయలుదేరి వచ్చాడు తతోభ్య వర్షన్త ఘనా దివ్యాః కుసుమ వృష్టయః ! దివ్య దున్దుభి ఘెష శ్చ దిక్షు సర్వాసు శుశ్రువే !! ఆ చుట్టు పక్కల ఉండేటటువంటి చెట్లన్ని కూడా పుష్ప వృష్టిని కురిపించాయి, దేవ దుందుభిలన్నీ కూడా మోగాయి.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
ఆయన అనేకములైనటువంటి ఫలములు కాచేటటువంటి చెట్లను అన్ని లోకాల నుంచి రమ్మన్నాడు తస్మిన్ బిల్వాః కపిత్థా శ్చ పనసా బీజ పూరకాః ! ఆమలక్యో బభూవు శ్చ చూతా శ్చ ఫల భూషణాః !! ఉత్తరేభ్యః కురుభ్య శ్చ వనం దివ్యోప

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
భోగవత్ ! ఆజగామ నదీ దివ్యా తీరజై ర్బహుభి ర్వృతా !! ఈ నదులన్నింటినీ కూడా పిలిచాడు దానితో పాటుగా కురు భూములలో ఉండేటటువంటి చైత్ర రథమనేటటువంటి వనాన్ని పిలిచాడు కుభేరుని యొక్క వనాన్ని బిల్వ వృక్షాలు ఆ తరువాత కపిద్దం అంటే వెలగ పళ్ళు కాసేటటువంటి చెట్లు పనస చెట్లు అనేకమైనటువంటి బీజములతో కూడినటువంటి ఫలములు కలిగినటువంటి మాది ఫల వృక్షములు ఉసిరిక చెట్లు ఇలాంటి చెట్లన్నింటినీ కూడా అక్కడికి రమ్మన్నాడు చెట్లన్నీ వచ్చేశాయి చెట్లన్నీ పళ్ళతో నిండిపోయాయి సురతో కూడిన నదులు పాలతో కూడిన నదులు పెరుగుతో కూడిన నదులు నేతితో కూడిన నదులు గాజులు వేసుకున్న కాంతలు ఆభరణాలు పెట్టుకున్న కాంతలు ఎందరో వచ్చేశారు ఒక్కొక్క భటున్ని ఇరవైయేసి కాంతలు తీసుకెళ్ళి నదుల ఒడ్డున కూర్చొబెట్టి నలుగు పెట్టి స్నానాలు చేయించారు. ఎవరు విస్తర దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఏవి కావాలో అవి వచ్చేశాయి, నారదుడు తుంబురుడు వచ్చి గానం చేస్తున్నారు, అప్సరసలు అందరూ వచ్చి నాట్యం చేస్తున్నారు.
Image result for రాముని సింహాసనంఅక్కడొక పెద్ద ప్రాసాదాన్ని సృష్టించాడు అందులో ఒక పెద్ద సభా మంటపం సభా మంటపంలో వేధిక వేధిక మీద కనక సింహాసనం సింహాసనం దగ్గర పాద పీఠం దానికి కుడిచేతి పక్కా ఏడమ చేతిపక్కా కూర్చోవడానికి మంత్రులకు సచివులకు సేనాధి పతులకు ముఖ్యులకు అందరికీ కూడా అనేకములైనటువంటి స్థానములు ఇన్నింటిని కల్పించి ఒక పెద్ద మందిరాన్ని సృష్టించాడు ఇన్నిటినీ సృష్టించి భరతా నీవు అందులో వెళ్ళి కూర్చో అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు అన్నాడు. భరతుడు లోపలికి వెళ్ళాడు నేను రాజును అన్న భావన ఏదైనా ఉంటే సింహాసనం మీద కూర్చుంటాడు, నేను కాదు రాజుని అని మనసులో నిజంగా అనుకుని ఉంటే అలా కూర్చోడు ఈ పరీక్ష కోసం ఇన్ని సృష్టించాడు. భరతుడు ఆ భవంతిలోకి వెళ్ళాడు చూశాడు ఆ సింహాసనం వంక తత్ర రాజాఽఽసనం దివ్యం వ్యజనం ఛత్రమ్ ఏవ చ ! భరతో మన్త్రిభిః సార్థమ్ అభ్యవర్తత రాజవత్ !! ఆసనం పూజయా మాస రామాయాభిప్రణమ్య చ ! వాల వ్యజనమ్ ఆదాయ న్యషీద త్సచివాఽఽసనే !! ఆయన దగ్గరికి వెళ్ళి ఇక అలా మెట్లెక్కి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు కూర్చుంటాడేమోనని చూస్తున్నాడు భారద్వాజుడు కూర్చోలేదు, రామ చంద్ర మూర్తి ఒక కాలు మడిచి ఒక కాలు పాదపీఠం మీద పెట్టి ఆ సింహాసనం మీద కూర్చున్నట్లు భావించాడు, కూర్చుని వెంటనేవంగి ఆ పాదపీఠానికి తలతాకించి నా అన్నగారు రాజారాముడికి నమస్కరిస్తున్నాను అన్నాడు, అక్కడ ఉన్న ఛత్రం తీసుకుని ఒక్కసారి ఛత్రం వేసాడు ఇలా చామరంవేశాడు నా అన్నకు చామరం వేస్తున్నాను, తెల్లటి గొడుగుతీసి పట్టాడు మా అన్నగారు చక్రవర్తి ఆయనకు గొడుగుపట్టానని అన్నాడు అన్నకు నమస్కారంచేసి ఒక మంత్రి కూర్చునేటటువంటి స్థానంలో వెళ్ళి కూర్చుని నాట్యం చూస్తున్నాడు.
పరమానందాన్ని పొందాడు భారద్వాజుడు ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడివయ్యా మహానుభావా! నీ గురించి నాకు తెలుసు కానీ నీ యొక్క గొప్పతనాన్ని లోకానికి ప్రకాశింపజేయాలి అనుకున్నాను అని అన్నాడు. అయిపోయింది మరునాడు సూర్యోదయం అయిపోయింది అందరూ బయలుదేరుతున్నారు భరతుడువచ్చి అనుమతి కోరుతున్నాడు, తప్పకుండా వెళ్ళిరా అన్నాడు దారిచెప్పాడు చెప్తే ముగ్గురు తల్లులూ వచ్చి నమస్కారం చేశారు, ఏమీ తెలియని వాడిలా భరద్వాజుడు అన్నాడు ఈ

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
Image result for భరతుడుముగ్గురు ఎవరెవరు ఏ పేరుతో ఉన్న తల్లులో ఒక్కసారి చెప్తావా అన్నాడు. అంటే భరతుడు కౌసల్యని చూపించి అన్నాడూ... యామ్ ఇమాం భగవన్ దీనాం శోకాన్ అశన కర్శితామ్ ! పితు ర్హి మహిషీం దేవీం దేవతామ్ ఇవ పశ్యసి !! ఏషా తం పురుష వ్యాఘ్రం సింహ విక్రాన్త గామినమ్ ! కౌసల్యా సుషువే రామం ధాతారమ్ అదితి ర్యథా !! అదితి ఇంద్రున్ని ఎలా కందో అలా సింహ విక్రముడైనటువంటి రామ చంద్రుని కన్న తల్లి సుశ్కించి పోయినది శోకించి శోకించి బడలిపోయినది రామ మాత అయినటువంటి కౌసల్య ఈవిడే అని సుమిత్ర వంకచూపించి అస్యా వామ భుజం శ్లిష్టా యా ఏషా తిష్ఠతి దుర్మనాః ! కర్ణికార స్య శాఖా ఇవ శీర్ణ పుష్పా వనాన్తరే !! ఏతస్యాః తౌ సుతౌ దేవ్యాః కుమారౌ దేవ వర్ణినౌ ! ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్య పరాక్రమౌ !! పుష్పాలు రాలిపోయినటువంటి గన్నేరుచెట్టు యొక్క కొమ్మ వడిలిపోయి ఎలా ఉంటుందో అలా ఉండి ఏడ్చి ఏడ్చి మలినమైన మనస్సుతో ఉండి కౌసల్య యొక్క భుజం మీద ఆనుకొని నిలబడినటువంటి ఈ తల్లీ లక్ష్మణ శత్రుఘ్నులనేటటువంటి ఉత్తమైన కుమారులను కన్న సుమిత్ర ఈమేయే ఆతల్లీ అన్నాడు తరువాత కైకమ్మని చూపించి
యస్యాః కృతే నర వ్యాఘ్రౌ జీవ నాశమ్ ఇతో గతౌ ! రాజా పుత్ర విహీన శ్చ స్వర్గం దశరథో గతః !!
క్రోధనామ్ అకృత ప్రజ్ఞాం దృప్తాం సుభమ మానినీం ! ఐశ్వర్య కామాం కైకేయీమ్ అనాఽఽర్యామ్ ఆర్య రూపిణీమ్ !!
మమ ఏతాం మాతరం విద్ధి నృశంసాం పాప నిశ్చయామ్ ! యతో మూలం హి పశ్యామి వ్యసనం మహత్ ఆత్మనః !!
ఇత్యు క్త్వా నర శార్దూలో బాష్ప గద్గదయా గిరా ! స నిశశ్వాస తామ్రాక్షో క్రుద్ధో నాగ ఇవ శ్వసన్ !!
ఎర్రబడినటువంటి కన్నులతో కోపంతో ఊగుతూ కైకమ్మ వంకచూపించి ఈవిడే నేను అందగత్తెను అనుకుంటుంది, ఐశ్వర్యం కావాలనుకుంటుంది, నా అంత బుద్ధిమంతురాలు లేదనుకుంటుంది, అక్కరలేని కోరికలు కోరి నాకు మచ్చతెచ్చి నా తండ్రిని కోరికలుకోరి నా తండ్రి పరలోకాన్ని పొందేటట్లు, రాముడూ సీతా లక్ష్మణుడూ అరణ్యవాసానికి వెళ్ళేటట్టుచేసిన బుద్ధిహీనురాలైన నా తల్లి కైకమ్మ ఈమె అన్నాడు. అంటే భరద్వాజుడు అన్నాడు నిన్ను అందుకే అడిగాను భరతా... నీ తల్లిని నీవు అలా నిందించకూడదు, కైకమ్మ గురించి నీకు అంతే తెలుసు కైకమ్మ గురించి నేను చెప్తాను నీవు జాగ్రత్తగావిను. యుక్తమైన మాట ఒకటి చెప్తాను విను కైక గురించి న దోషేణావగన్తవ్యా కైకేయీ భరత త్వయా ! రామ ప్రవ్రాజనం హ్యేతత్ సుఖోదర్కం భవిష్యతి !! దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనాం ! హిత మేవ భవిష్య ద్ధి రామ ప్రవ్రాజినా దిహ !! ఈమే పట్టినటువంటి పట్టుదలవలన రాబోయేటటువంటి కాలంలో రామ లక్ష్మణులు సీతమ్మా అడవులలో అరణ్యవాసం చేయడంచేత దేవతలకు ఋషులకు ఎంత ప్రయోజనం కలగబోతూంది అన్న విషయం బయటికి వస్తుందీ, కాబట్టి కైకమ్మ అంత పట్టుపడ్డం వెనక పెద్దప్రయోజనం ఉందని భరతా తెలుసుకో..? తప్పా నీ తల్లిని అంత నిందించవలసిన అవసరం లేదన్న తరువాత చాలా సంతోషించాడు అందరూ బయలుదేరారు ఆయన ఎటువైపు చెప్పారో అటుగా బయలుదేరారు.
అటుగా బయలుదేరి వెడుతున్నారు పాపం వెతకడం అంటె అంత తేలికాండీ చిత్రకూట పర్వతం శిఖరానికీ మందాకినీ నది యొక్క మధ్యలో ఉంటుంది రాముని యొక్క పర్ణశాలా అని చెప్పారు. ఆ పర్ణశాలని వెతుకుతున్నారు. వెతుకుతుంటే దూరంగా పెద్ద సైన్యం యొక్క కోలాహలం ధూమం అన్నీ కనపడ్డాయి, దూరంగా ఏమో చప్పుడూ అవీ వినపడ్డాయి ఏమిటదీ చూస్తానని చెప్పి లక్ష్మణుడు రాముడు చూడమంటే అక్కడ ఉన్నటువంటి మద్ధి చెట్టు పైకి ఎక్కి చూశాడు, చూసి అగ్నిం సంశమయత్ ఆర్యః సీతా చ భజతాం గుహామ్ ! సజ్యం కురుష్వ చాపం చ శరాం శ్చ కవచం తథా !! అన్నయ్యా అన్నయ్యా..! తొందరగా ధనుస్సు తీసుకో అన్నయ్యా అక్షయబాణ తూనీరాలు తీసుకో కవచం కూడా పట్టుకురా సీతమ్మని గుహలోకి తీసుకునివెళ్ళి అగ్నిని చల్లార్చు ఎందుకో తెలుసా అన్నయ్యా ప్రమాదం వచ్చేస్తుంది అన్నయ్యా అన్నాడు. రాముడు అన్నాడు తం రామః పురుష వ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ హ ! అఙ్గావేక్షస్వ సౌమిత్రే క స్యేమాం మన్యసే చమూమ్ !! ఏమయిందయ్యా ఎందుకలా అరుస్తున్నావ్? ఏం చూస్తున్నావు నీవు అన్నాడు, అంటే ఆయన అన్నాడు ఇచ్చినటువంటి రాజ్యం సరిపోకా కైకేయీ సుతుడైనటువంటి భరతుడు ఏనుగులతో గుఱ్ఱాలతో బయలుదేరి వచ్చాడు

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
పూర్వాపకారీ భరత స్త్యక్త ధర్మ శ్చ రాఘవ ! ఏతస్మి న్నిహతే కృత్స్నామ్ అనుశాధి వసుంధరామ్ !!
కైకేయీం చ వధిష్యామి సానుబన్ధాం సబాన్ధవామ్ ! కలుషేణాద్య మహతా మేదినీ పరిముచ్యతామ్ !!
అద్యేమం సంయతం క్రోధమ్ అసత్కారం చ మానద ! మోక్ష్యామి నైన్యేషు కక్షే ష్వివ హుతాశనమ్ !!
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEguyngTPnptuH6U02atJCcuYAc3bQerYbqG1pvoM7H1aPkyUE4bX8fF7vRADiQccWiuux9qlAeaSDX5BrFAiLtZVPWUEpzPbx28H3uJ1jBpOAwsOU6S65CbED84WcMWFR5-OP6qztoUnq8/s1600/Bharatha-Going-Forest-NearRama.jpgఅని, అన్నయ్యా! ఇచ్చినటువంటి రాజ్యం పుచ్చుకుని తృప్తి పడకుండా నిన్నూ నన్నూ చంపడం కోసమని చెప్పి అరణ్యానికి వచ్చిన ఈ భరతుడి యొక్క సేనను చూస్తుంటే నాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటూంది, అన్నయ్యా నా ధనుర్భాణాలు నాకు ఇవ్వు, ఇవ్వాళ నా శక్తి ఏమిటో చూపిస్తాను భరతున్ని చంపేస్తాను అరణ్యవాసాన్ని నీకు కల్పించి రాజ్యన్ని భరతునికి ఇప్పించాలని కోరినటువంటి కైకమ్మని చంపేస్తాను ఈ ఏనుగులన్నింటినీ చంపేస్తాను క్రూర మృగాలువచ్చి వీటియొక్క పీనుగులన్నిటినీ ఈడ్చుకు పోతుండగా సంతోషిస్తాను అన్నయ్యా ఇన్నాళ్ళు నా క్రోధాన్ని అనుచుకున్నాను ఇక అనుచుకోమని చెప్పవద్దూ అని, నేను ఇప్పుడు భరతున్ని తెగతార్చడానికి సిద్ధపడుతున్నాను ఈ సైన్యానంతటినీ నశింపచేస్తాను, వృద్ధుడైన దశరథుడు ఎదురొస్తే దశరథున్ని కూడా చంపేస్తాను అన్నాడు.
అంటే రాముడు అన్నాడూ... పితు స్సత్యం ప్రతి శ్రుత్య హత్వా భరత మాగతం ! కిం కరిష్యామి రాజ్యేన సాపవాదేన లక్ష్మణ !! ఏమన్నావూ? భరతున్ని చంపేస్తావ్ దశరథున్ని చంపేస్తావా..? అందుకని చెట్టు ఎక్కి చెప్తున్నావా నాకు, భరతున్ని చంపేసి రాజ్యం తీసుకుని నన్ను పరిపాలించమంటావా..? అలాంటి రాజ్యం కావాలని నేను కోరుకున్నానా..! ఏం చేప్తున్నావు పైన కూర్చొని నీవు ధర్మం అర్థం చ కామం చ పృథివీ చాపి లక్ష్మణ ! ఇచ్ఛామి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమి తే !! ధర్మమైనా కామమైనా అర్థమైనా నా తమ్ముళ్ళతో కలిసి అనుభవిస్తాను తప్పా నేను ఒక్కన్ని భోగము అనుభవించి నాతమ్ముళ్ళని పాడుచేయడమన్నది నా జీవితంలో ఉండదని గుర్తెరుగు రాజ్య మప్యహ మిచ్ఛామి సత్యేనాఽఽయుధ మాలభే నేను సత్యం చెప్తున్నాను నేనంటూ ఏది సంపాదించినా నేను రాజ్యం చేస్తే నా తమ్ముళ్ళ యొక్క సుఖం కొరకే, వాళ్ళ సుఖం తరువాతే నా సుఖం. తప్పా నా తమ్ముళ్ళని చంపి నేను అనుభవించడం ఎన్నడూ ఉండదు నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగారామ్బరా ! నహీ చ్ఛేయమధర్మేణ శక్రత్వ మపి లక్ష్మణ !! అధర్మం వల్ల నాకు ఇంద్ర పదవి వస్తుంది అని ఒక్క అధర్మాన్ని చెయ్యమంటే ఇంద్రపదవిని వదిలేస్తాను తప్పా అధర్మంతో ఇంద్రపదవిని కూడా పుచ్చుకోను.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
నాన్నగారికి మాటిచ్చి ఇప్పుడు నాన్నగారిని సత్యభ్రష్టుడినిచేసి రాజ్యం తీసుకోనా..? నాకే రాజ్యం కావాలంటే లక్ష్మణా! ఒక్క బాణాన్ని ప్రయోగించి ఈ సప్త సముద్రాల మధ్యలోవున్న పృధ్వి నంతటినీ పరిపాలించగలను కానీ నాకు ధర్మం కావాలి తప్ప ఇవి నాకు అక్కరలేదు, నీకు ఇంకొక మాట చెప్తున్నాను నీకు రాజ్యం కావాలా ఒక్కమాట చెప్పు, నీకు రాజ్యం కావాలంటే భరతుడురాగానే భరతా రాజ్యం ఇచ్చేయ్ లక్ష్మణునికి అంటాను ఇచ్చేయమని భరతునికి అంటాను, భరతుడు ఎలాంటివాడో చూద్దువుగానీ..! లక్ష్మణునికి ఇవ్వడమేమిటి అన్నయ్యా అని అనికూడా అడగడు నీకు రాజ్యం ఇచ్చేస్తాడు ఏలుకో రాజ్యం కావాలంటే... భరతుడు నా ప్రాణసమానుడు ఇవ్వాళ అంటే అన్నావు ఇంక ఎప్పుడూ ఈమాట అనకు అన్నాడు. అనేటప్పటికి చెట్టు పై నుంచి గబగాబా కిందకి దిగిపోయి, చేతులు కట్టుకుని నిలబడి తల వంచుకుని అన్నయ్యా పొరపాటుపడ్డాను అన్నయ్యా నన్ను క్షమించు అన్నాడు. ఎందుకొచ్చాడో తెలుసా భరతుడు అటునుంచి భరతుడు తిరిగి వచ్చిన తరువాత బహుఃశహః తండ్రి మరణించి ఉండవచ్చును, లేదా దశరథుడు నేను రామున్ని చూడకుండా ఉండలేనంటే నాకు రాజ్యం అక్కరలేదు రామ చంద్ర మూర్తికి రాజ్యం ఇచ్చేస్తానని దశరథుడు మరణించాడు కాబట్టి తల్లుల్ని వశిష్టున్ని పౌరుల్ని జానపదుల్ని అందర్నీ తీసుకొని నన్ను బతిమాలడానికి వస్తున్నాడు నా తమ్ముడు అటువంటి తమ్ముడి మీద నిందవేస్తావా లక్ష్మణా! చూడు భరతుడు వచ్చిన తరువాత చూడు భరతుడు ఎటువంటివాడో...! నేను అపద్ధం చెప్పానని అనుకుంటున్నావేమో... మనకు ఏ బాణమూ అక్కరలేదు మనకు మన సోదరుల ప్రేమ చాలు మనకు ఇంకేమీ అక్కర లేదు కిందకు దిగు అన్నాడు.
వచ్చి పాపం చేతులు కట్టుకుని ఇంత లక్ష్మణ మూర్తి తల వంచుకుని అలా నిలబడ్డాడు, ఇలోగా భరతుడు వెతకుతూ సైన్యాన్ని దూరంగా ఉంచి అన్నయ్యకు ఇబ్బంది కలుగుతుందని పరుగెడుతున్నాడు ఆ పొదల్లో
యావ న్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహా బలమ్ ! వైదేహీం వా మహా భాగాం న మే శాన్తి ర్భవిష్యతి !!
యావ న్న చన్ద్ర సంకాశం ద్రక్ష్యామి శుభమ్ ఆననమ్ ! భ్రాతుః పద్మ పలాశాక్షం న మే శాన్తి ర్భవిష్యతి !!
యావ న్న చరణౌ భ్రాతుః పార్థివ వ్యంజనాన్వితౌ ! శిరసా ధారయిష్యామి న మే శాన్తి ర్భవిష్యతి !!
యావ న్న రాజ్యే రాజ్యార్హః పితృ పైతామహే స్థితః ! అభిషేక జల క్లిన్నో న మే శాన్తి ర్భవిష్యతి !!
http://divyaprabandham.koyil.org/wp-content/uploads/2015/07/rama-and-bharatha.jpgఅంటున్నాడు. నాకు శాంతి కలుగదు, ఏనాడు రామ చంద్ర మూర్తి పాదములుచూసి నమస్కరిస్తానో ఆనాడే నాకు శాంతి, ఏనాడు లక్ష్మణుని చూస్తానో ఆనాడే నాకు శాంతి ఏనాడు సీతమ్మ పాదాలకు నమస్కారంచేస్తానో అప్పుడే శాంతి. పరుగెడతున్నాడు గబగబా పరుగెత్తాడు పరుగెత్తాడు కనపడ్డాడు రామ చంద్ర మూర్తి పొగ కనపడుతూంది చెట్ల మీద కట్టిన నార చీరలు కనపడుతున్నాయి, నీళ్ళు తెచ్చుకోవడానికి గుర్తులు కట్టారు అనుకున్నారు, పర్ణశాలలో ఎదురుగుండా రాముడు కనపడ్డాడు, ఆంత దూరంలో రామున్ని చూశాడు పరుగు పరుగున వెళ్ళాడు వెళ్ళి దూరంగా  ఇంకా అన్నయ్యని చూసి చేరుకోక ముందే... దుఃఖంతో నేల మీద పడిపోయి అన్నా... అన్నాడంతే కిందపడిపోయాడు, భరతా..! అని పరుగు పరుగున వచ్చి రామ చంద్ర మూర్తి రెండు భుజాలు పట్టి పైకెత్తీ నాయనా! ఏమిటీ...

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
జటిలం చీర వసనం ప్రాంజలిం పతితం భువి ! దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా !!
కథంచిత్ అభివిజ్ఞాయ వివర్ణ వదనం కృశం ! భ్రాతరం భరతం రామః పరిజగ్రాహ బాహునా !!
ఆఘ్రాయ రామ స్తం మూర్ధ్ని పరిష్వజ్య చ రాఘవః ! అంకే భరతమ్ ఆరోప్య పర్యపృచ్ఛత్ సమాహితః !!
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4APj3LQrSpd_RjIQ53F5MfIyATNodNkK9t3qJnnA3jiMdtU222Cek8hO0gw6trxR4a4BWrAHHwbXucc_LJ_nCmnOfHFVD0lvLQKpnjwRqqFIWdJzQU8094wjPAP3zdOarbnWvnOmAppo/s1600/10178065_771597332889667_3978690518356579260_n.jpgఏమిటీ చిక్కిపోవటం ఏమిటీ ఈ ఏడుపేమిటీ ఈ మనిషేమిటీ ఈ జఠలు కట్టుకోవడమేమిటీ ఎందుకు ఇలా ఉన్నావు రా నాన్నా అని గబగబా తన తొడల మీద కూర్చోపెట్టుకొని మూర్ధన్యస్థానమందు ఆగ్రాణించి ముద్దు పెట్టుకొని నాన్నా భరతా ఎందుకిలా ఉన్నావు నాన్నగారు కుశలంగా ఉన్నారా..? ఎందుకింత తాపత్రయంగా ఇంత సైన్యాన్ని తీసుకొని వచ్చావు అని అడిగి రాజ్య పాలన ఎలా చెయ్యాలో ఆ విషయాలన్నిటినీ కూడా అడుగుతూ రాజ ధర్మాలను బోధిస్తూ ఉదయాన్నే లేస్తున్నావా..? పురోహితులకు నమస్కరిస్తున్నావా..? బ్రహ్మర్షులకు నమస్కరిస్తున్నావా, పెద్దలు చెప్పిన మాటను వింటున్నావా..? మంత్రులను సంప్రదిస్తున్నవా, అనేక మందిని సంప్రదించకుండా ముఖ్య కార్యాలకు పెద్దలైన ఒక్కరినే సంప్రదిస్తున్నవా..! చేసే వరకు పనేమిటో తెలియకుండా సామంతులకి రహస్యంగా అట్టే పెడుతున్నావా శత్రువులకి నీ ఊహలేమిటో తెలియకుండా జాగ్రత్త పడుతున్నావా నమ్మకస్తులైన మంత్రుల్ని నీ దగ్గర పెట్టుకున్నావా పరిపాలన జాగ్రత్తగా చేస్తున్నవా పన్ను కట్టించుకున్నందు ప్రజలను జాగ్రత్తగా చూస్తున్నావా పరిపాలన చేసేటప్పుడు న్యాయం చెప్పేటప్పుడు నేను రాజును కదా ఏం చెప్తే ఏం పోతుందిలే అని అన్యాయం చెయ్యని వానికి కఠినమైన శిక్షవేస్తే వాడు కన్నుల నీరు కారుస్తూ వెళ్ళిపోతే వంశం నశించిపోతుంది.
భరతా! కాబట్టి సర్వకాలములయందు చాలా జాగ్రత్తగా నీవు పరిపాలనచేస్తున్నావా నీయందు భక్తితో ప్రేమతో ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులందరికీ సకాలములలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతాలు వాళ్ళకి ఇస్తున్నవా పండితులైన వాళ్ళతో మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నావా ఉన్నతమైనటువంటి వాళ్ళకి పెద్దపదవులిచ్చి మధ్యతరగతి తెలివితెటలున్నవారికి మధ్యపదవులిచ్చి శరీరంతో సేవించగలిగినటువంటివాళ్ళకు కింద పదవులిచ్చి అందర్నీ ఆదరించడానికి రాచకార్యంలో నీవైపుకు తిప్పుకుని నడపగలుగుతున్నావా..! ఎక్కడపడితే అక్కడ చలివేంద్రాలు పెడుతున్నావా ప్రజలయొక్క బాగోగులు చూస్తున్నావా దేవాలయాలు నిర్మించావా యజ్ఞ యాగాదులు చేయిస్తున్నవా దేవతలయొక్క అభ్యున్నతిని అనుగ్రహాన్ని పొందుతున్నావా దాని వలన నీ అభ్యున్యతిని చూసుకుంటున్నావా గుక్కతిప్పకుండా పరిపాలనకు సంబంధించిన అనేక ప్రశ్నలువేసి రామ చంద్ర మూర్తి భరతున్ని అడిగేశాడు.
అడిగేస్తే అన్నీవిని ఆయన అన్నాడూ అసలు ఇవన్నీ ఉండడానికి అన్నయ్యా! నేను రాజ్యం చేస్తేకదా నేను పట్టాభిషేకం చేసుకుంటే గదా, నేను రాజ్యమే చేయట్లేదన్నయ్యా..! మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజుగారు శరీరం విడిచిపెట్టారు అన్నయ్యా అన్నాడు. ఈ మాట వినగానే మొదలు నరికేసిన చెట్టు పెళపెళపెళమనే శబ్దంతో కిందపడిపోయినట్లుగా రాముడు నేల మీద పడి దొర్లి ఏడ్చేశాడట, ఏడ్చీ ముఖాన నీరు చిలికితే పైకి లేచాడట, లేచి గబగబా పర్ణశాలలోకి వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతా సీతే మృత స్తే శ్వశురః పిత్రా హీనోసి లక్ష్మణ అన్నాడు, సీతా నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణా నీకు తండ్రిగారు చచ్చిపోయారు, అదేంటి నాకు నాన్నగారు పోయారంటే సరిపోదా..? మామగారిలా

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
కోడల్ని చూడగలిగిన వ్యక్తి జీవితంలో ఇంకొకడు ఉండడూ అని శాస్త్రంలోవాక్కు నాకోసమని చెప్పి ఇంటిపేరు వదిలేసింది వంశం వదిలేసింది తనవారిని వదిలేసింది ఇక్కడకికొచ్చి  నాకొడుకు వలన బిడ్డల్నికనీ నాకోసం వంశాన్ని పెంచింది ఆచంద్ర తారార్కం నా వంశంపెరగడం కోసమనీ ఇక్కడికి వచ్చింది తన ఇంటిపేరు మార్చుకుంది ఇది తన ఇల్లూ అని బతుకుతుందనీ మామగారు కోడలు అంటే అంతప్రీతితో ఉంటాడట.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWXgqFX8sx-u5mbXrtWj2F07ub8R28wdusOtcalKJ_nAuaZIEeseKHWMWXI1LW8SYAapR2mgI7SdjHuwzk9SkxbaiC7Bx0xjZ1JzkqSB8J1_QFI6D2zeoLf42kbiUvbioSMOttPj21GMM/s1600/ramudu+taking+bath+in+river.jpgఅటువంటి మామగారు వెళ్ళిపోయిన తరువాత నిన్ను అంత ప్రీతిగాచూసేవారు లేరుసీతా! కాబట్టి నీకు మామగారు పోయాడు, నాకో తండ్రి ఉన్నాడు లక్ష్మణుడికి తండ్రిపోయాడు, తండ్రిపోతే తండ్రి ఎవరూ పెద్దన్నగారు కాబట్టి నేను తండ్రిలా ఉండాలి కానీ నేను తండ్రిలా అతన్ని రక్షించకుండా నాతో పాటు అరణ్యవాసానికి తీసుకొచ్చాను నాకు ఆయన సేవలు చేస్తున్నాడు కాబట్టి నాకు తండ్రి ఉన్నాడు ఆయన లక్ష్మణుడి రూపంలో. లక్ష్మణుడికి తండ్రి లేకపోయాడు నేను తండ్రిలా నిలబడలేక పోతున్నాను ఇది చెప్పడం కోసమనీ సీతే మృత స్తే శ్వశురః పిత్రా హీనోసి లక్ష్మణ లక్ష్మణా నీకు తండ్రి పోయాడు, సీతా నీకు మామగారుపోయాడు అన్నారు. అన్న తరువాత గారపిండి ముద్దలు నువ్వుల పప్పుతో కలిపి తీసుకురావయ్యా అన్నారు ఆ ముద్దలు పట్టుకుని ఒక బట్టా యజ్ఞోపవీతంగా వేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతూ నీవు సీతా మృత స్తే శ్వశురః కాబట్టి నీవు ఇవ్వాళ ముందునడు గతిః హ్యేషా సుదారుణా ధర్మోదకాలు పిండ ప్రదానం తద్దినం పెట్టడం శ్రార్ధం పెట్టడం ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు భార్యముందు నడవాలి భర్తవెనక నడవాలి.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiTC_IL2ulJOsMDC_csmr7HrdKHtmYZbDiEHHBpYCpmlRSj9-0QAHdPEGzHwaWYOMOcigZFpqwC3r7uIt60NfXGZ30LVkb1kL3MfXCEslOvzU1zIL6F670y94ZKXhGr6cNP4pKPpNfziCnr/s1600/Photo-0010+%2528Small%2529.jpgకాబట్టి సీతా ఇది ధారుణమైనటువంటినడక కాబట్టి సీతా పురస్తా ద్వ్రజతు నీవు ముందునడు నేను వెనక నడుస్తాను ఇది గతిః హ్యేషా సుదారుణా ధారుమమైననడక అని ముందు సీతమ్మని నడిపించి వెనక తాను నడిచాడు అన్నీ ధర్మమే రామ చంద్ర మూర్తికి, తాను గారపిండి ముద్దలతో దర్భల మీదా పిండ ప్రధానంచేశాడు కొడుకు తాను ఏమి తింటున్నాడో దానితోటే తద్దినంపెట్టాలి తండ్రికి పెట్టేటప్పుడు తప్పా పితృదేవతలకు తద్దినం పెట్టేటప్పుడు తను రోజూ చెక్కరకేళి అరటిపండుతినీ గుళ్ళ ముందు అమ్ముతుంటారు ప్రత్యేకంగా దేవుని కోసమని అరటిపళ్ళు అవి ఉంటాయి, దేవుని అరటిపళ్ళని పావులాకారు ఇంతింతే ఉంటాయవి దొప్పెలో ఇంతే ఉంటాయి అవి దేవుడికోసమే, మనకు చెక్కరకేళీలు ఉంటాయి ఆ దేవుడి అరటిపళ్ళు తీసుకొచ్చీ పితృ దేవతలకు పెట్టకూడదు, తాను చెక్కరకేళి తింటే చెక్కరకేళీ పెట్టాలి, ఏది తానుతింటాడో అది పితృదేవతలకు పెట్టాలి, కాబట్టి తాను గారపిండి ముద్దతిని బ్రతుకుతున్నాడు అందుకని రామ చంద్ర మూర్తి ఆ గారపిండి ముద్దలే దర్భల మీద పెట్టి స్నానంచేసి పిండ ప్రదానంచేసి తిరిగివచ్చికూర్చున్నాడు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
అటుగా ఆ కౌసల్యాదులు ఆ మందాకినీ నదినిచూస్తూ రామ చంద్ర మూర్తి దగ్గరికి వస్తూంటే దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి, కౌసల్య చూసింది ఏడ్చింది చూశారా చెల్లల్లారా! దర్భల మీద గారపిండి ముద్దలు ఉన్నాయి, అంటే దశరథ మహారాజుగారికి గారపిండితో తద్దినం పెట్టాడు నా కొడుకు, సమస్త భూ మండలాన్ని పరిపాలించి కొన్ని వేలమందికి బంగారుపాత్రలలో పంచభక్ష పరమాన్నాలతో అన్నంపెట్టిన నా భర్తా ఇవ్వాల పెద్ద కొడుకు చేత్తో పుచ్చుకున్న భోజనం గారపిండి ముద్ద, ఇంత కష్టం కల్పింపబడింది, నా కొడుకు ఏది తింటున్నాడో దానితో తద్దినం పెట్టాలి గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడంటే రాముడు కూడా గారపిండి ముద్దలు తినిబ్రతుకుతున్నాడన్నమాట, ఎటువంటి భోజనం చేయ్యవలసిన నా కొడుకు రాజ్యాలు పరిపాలించ వలసినవాడు చేతకానివాడిలా అరణ్యంలో పర్ణశాలలో భూ శయనంచేస్తూ గారపిండి ముద్దలుతింటూ ధర్మాన్ని పట్టుకుని బతుకుతున్నాడు అని ఏడ్చి అందరూవెళ్ళారు రామ చంద్ర మూర్తి పరుగు పరుగున వచ్చారు రామ లక్ష్మణులు సీత్మ ముగ్గురు తల్లులకీ ఆతరువాత వశిష్టాది మహార్షులకు అందరికీ నమస్కారం చేశారు కూర్చున్నారు, భరతుడూ శత్రుఘ్నుడూ కూర్చున్నారు. పౌరులందరూ కూడా గబగబా తమ వాహనములు దిగి అదిగో రామ చంద్ర మూర్తి ధర్మాత్ముడు మహానుభావుడు కనపడ్డాడు తీసుకెళ్ళాలి మనందరం అనిచెప్పి సంతోషంగా వచ్చి అందరూ ఒకళ్ళు మించి ఒకళ్ళు ముందు పొడుగు వాళ్ళు ఉంటే పొట్టివాళ్ళకు ఇబ్బంది కదాండీ అని ఇలా పాదాలెత్తి అందరూ రాముని వంక చూస్తున్నారు ఎక్కడా శబ్ధంలేదు.
ఆశ్చరమేమిటో తెలుసా..! వచ్చిన గుఱ్ఱాలకీ ఏనుగలకీ కూడా కోరికేనట రాముని చూద్దామని అవి కూడా మెల్ల మెల్లగా పైకెత్తి తలలెత్తి రామున్ని చూస్తున్నాయట, ఇంత మంది రామ చంద్ర మూర్తిని చూస్తుంటే వాళ్ళందరూ సంతోషిస్తూ భరతున్ని తొడమీద కూర్చో పెట్టుకుని శత్రుఘ్నున్ని కూర్చో పెట్టుకుని అందరూ కలిసి కూర్చుని ఉండగా సంతోషంగా కూర్చుని ఉన్నారు అన్న మంగళకర వాఖ్యం దగ్గర ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను.
Rama padukalu.jpgఅయితే ఇవ్వాళ రెండు విషయాలను మీతో మనవి చేయవలసి ఉంటుంది, రేపు రామ చంద్ర మూర్తి యొక్క పాదుకా పట్టాభిషేకం పాదుకా పట్టాభిషేకం ఏ కావ్యంలోనూ లేదు. ఒక్క రామాయణంలోనే పాదుకా పట్టాభిషేకం అత్యద్భుతమైనటువంటి ఘట్టం అంత అత్యద్భుతమైనటువంటి ఘట్టంలో రేపటి రోజునా ఆ పాదుకా పట్టాభిషేకాన్ని ఇక్కడ చేస్తున్నారు రేపు పాదుకా పట్టాభిషేకం ఒక్కటే కాబట్టీ ఒక గంటా గంటన్నరలో నా ఉపన్యాసాన్ని పూర్తిచేస్తాను, అనేక విధాల ప్రయత్నించి పూర్తిచేస్తాను, పూర్తి చేసేస్తే ఇక్కడ పాదుకా పట్టాభిషేకం జరుగుతుంది. ఆ రామ చంద్ర మూర్తియొక్క పాదుకలని శృంగగిరిలో హేమమయం ఆయన ఆరోజున తీసుకొచ్చినప్పుడు తతః శిరసి కృత్వా తు పాదుకే భరత స్తదా ! ఆరురోహ రథం హృష్టః శత్రుఘ్నేన సమన్వితః !! అని రాశారు వాల్మీకి మహర్షి, బంగారు పాదుకలను ఎక్కి తొక్కి విడిచి పెట్టాడు రాముడు, అలాంటి బంగారు పాదుకలే చేయించి శృంగేరిలో శృంగేరి పీఠాధి పతులైనటువంటి మహానుభావుడు జగద్గురువు భారతీ తీర్థ స్వామి తనపూజా మంటపంలో ఉంచి వాటిని అర్చనచేసి ఇక్కడి పంపించారు పాదుకా పట్టాభిషేకానికి నిజంగా వశిష్ట మహర్షి తీసుకొచ్చారు వాటిని అలాగే వచ్చాయి ఆ పాదుకలు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
ఏమి నేను చేసుకున్నటువంటి పుణ్యమో మా తల్లీ తండ్రీగారు ఏనాడు చేసినటువంటి పూజాబలమో అర్హత నాకు లేకపోయినా ఆ పాదుకలు నేను ఉన్న విడిదికిచేరాయి, ప్రతినిత్యం నేను వాటిని ఆరాధనచేస్తున్నాను ఇప్పుడు. ఆ పాదుకలు రేపు ఈ పీఠానికివస్తాయి, ఈ పీఠ ప్రాంగణానికివస్తాయి. ఆ పాదుకలకి రేపు సాంయంకాలం పాదుకా పట్టాభిషేకం చెప్పిన తరువాత ఇక్కడ పాదుకా పట్టాభిషేకంచేస్తారు సింహాసనం మీద కుర్చోబెట్టి. ఆ పాదుకలు తలకు తగిలిస్తారు, అందరికీ తాకిస్తారు ఆ పాదుకలు తలకి తగిలించుకోవడం రామ పాదుకలంటే రాముడే. రామ చంద్ర మూర్తి  పాదములు తలకి తగిలితే మన జీవితాలకి ఎంత అభ్యున్నతో రేపటి రోజున పాదుకలను తలకు తగల్చుకోవడం కూడా అంతటి అభ్యున్నతి నేను ప్రత్యేకంగా మనవిచేసేది ఏమిటంటే..? మీరు అందరూ రండి తప్పకుండా అందరితో పాటూ మీ బిడ్డల్ని కూడా తీసుకురండి తప్పకుండా నేను ఎందుకు ఆ మాట అంటూంటానంటేవారు వృద్ధిలోకిరావాలి, వాళ్ళు వృద్ధిలోకివస్తే కదా మనం సంతోషించడం, ఒక స్తాయిలో నా సంతోషం ఏమిటీ అంటే..? నేను తినడం నేన పడుకోవడం నేన బట్టకట్టుకోవడం కాదు నా బిడ్డలు వృద్ధిలోకి రావడం నా సంతోషానికి కారణమై ఉంటుంది ఎప్పుడూ. అదీ రామానుగ్రహంతో మన పిల్లలందరు చిరాయువులై చక్కగా వాళ్ళు ధార్మికమైన మార్గంలో వృద్ధిలోకి రావాలి సనాతన ధర్మానికి వాళ్ళే పట్టుకొమ్మలు కాబట్టి పిల్లలందర్నీ బొట్టి పెట్టి చక్కగా తీసుకురండి, రేపు పాదుకా పట్టాభిషేకం అయిపోయిన తరువాత ప్రతి ఒక్కరి తలమీదా పాదుకలు పెట్టీ అందరికీ ప్రసాదమిచ్చి పంపిస్తారు కాబట్టి రేపు అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
రెండవ విషయం ఈ వచ్చే ఆదివారం నాడు అంటే 26వ తేది అవుతుందా గోపాల కృష్ణగారూ..? 26వ తేదీ ఉదయం కచ్చితంగా 7గంటల ముప్ఫై నిమిషాలకి రామ నామ లేఖనం ఉంటుంది, అదీ మామూలుగా ఇంట్లో కూర్చుని శ్రీ రామ నామం రాయడం కూడా గొప్పే కానీ ఈసారి మనంచేసేది ఒక వినూత్నమైనటువంటిస్థితి మనం ఏం చేస్తామంటే రామ చంద్ర మూర్తిని ప్రధాన అర్చకస్వామి పూజచేసి కచ్ఛితంగా 7 గంటల 25 నిమిషాలకి ఆయన రామ చంద్ర మూర్తి పాదల దగ్గర కూర్చుని సంకల్పం చేస్తారు అస్మిన్ గ్రామే స్థితానాం చతుర్వర్ణే నాలుగు వర్ణములవాళ్ళు, ఈ ఉన్నవాళ్ళు రామ భక్తులు అందరూ తరలి వచ్చారు పూజాంతర్భాగంగా పిల్లలందరూ రామ నామ లేఖనం చేస్తున్నారూ 7 గంటల 29 నిమిషముల తరువాత ఇంక ఎవ్వరినీ లోపలకు పంపించరు ఎందుకంటే అది జీవితంలో ఒక మహత్ భాగ్యం కింద ఉండాలి 7 గంటల 20 నిమిషాలకే పిల్లలందరూ వచ్చేయడం పూర్తైపోవాలి వచ్చేస్తే పిల్లలకి ఆస్నర్ సీటు ఇచ్చినట్టు అందరికీ రాజ ద్వారే రాజ గృహే శివాలయంలో ఉన్న రాజద్వారం లోపలేవేశాం, రాజ ద్వారం దగ్గర నిలబడీ పిల్లలందరికీ కూడా రాయవలసిన పత్రాలు ఇచ్చేస్తారు 300 వందలసార్లు శ్రీ రామ నామం రాసే పేపరు ఇస్తారు ఇచ్చిన తరువాత పిల్లలందరూ వ్రాయడం మొదలు పెట్టాలి, అని గుర్తేమిటో తెలుసాండీ స్వామివారి అర్చనలో స్వామీ నీ నామ లేఖం ప్రారంభమౌతూంది ఇది శృంగగిరి పీఠం నీవు రామ చంద్ర మూర్తివి రామాయణం వింటున్నారు నీవు వెయ్యి కన్నులతో నిశబ్దంగా జరుగుతున్నటువంటి శ్రీ రామ లేఖనాన్ని ఈ పిల్లలందర్నీ చూసి నీ అమృత ధృక్కులతోవారిని అనుగ్రహించూ అని ప్రార్థనచేస్తారు. ప్రార్థనచేసి నీరాజనం ఇచ్చీ ఎలక్ట్రికల్ డ్రమ్స్ ఉన్నాయి మేళం ఆ మేళం మైక్ సెట్ లోంచి వినపడుతుంది.
మొట మొదట వచ్చిన పిల్లల్నీ రామాయలయంలో కూర్చోబెడతారు ఆ తరువాత వచ్చిన పిల్లల్నీ శారాదా దేవి గుళ్లో ఆతరువాత వచ్చిన పిల్లల్నీ శివాలయంలో మొట్ట మొదట పిల్లలందర్నీ వరుసగా దేవాలయాల్లో కూర్చో బెడుతారు దేవాలయాల్లో కూర్చుని పూజాంతర్భాగంగా రామాయణ ప్రవచనాంతర్భాగంగా పిల్లలందరితో రామ నామం రాయించి వారి అభ్యున్యతికి ఈ పీఠం కారకంకావాలి. కాబట్టి చక్కగా పిల్లలందరూ రామ నామం రాసేస్తారు, అవకాశం ఉంటే ఖాళీ ఉంటే చోటు పెద్దలకు కూడా ఇస్తారు 300 నామాల కాగితాలు చోటుంటే మేము కూర్చుంటామండీ ఎక్కడైనా అంటే పీఠం బయటమాత్రం వద్దు ఎందుకంటే పూజ ఆరోజు రామ నామం అన్నది నిశబ్దం మాటవినపడకూడదు ఎక్కడ కూడా... ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రాంగణమంతా కూర్చుండిపోవచ్చు ఏడున్నరకు కాబట్టి ఎవరు నామాలు పూర్తిచేసేస్తే వాళ్ళుమౌనంగా ఆ నామాలు కలిగినటువంటి కాగితాన్ని పట్టుకుని రామాలయానికి వెళ్ళిపోతారు, అక్కడ రామ చంద్ర మూర్తి దగ్గర ఒక పెద్ద తొట్టె పెడుతారు, అందులోకి తీసుకెళ్ళి ఆ పూజాంతర్భాగంగా సంపూర్ణ ప్రవచన అంతర్భాగంగా రామా ఈ నామములను రాశాను అని పిల్లలు అందులో వేస్తారు. రామ చంద్ర మూర్తి ఎదురుగుండా పాదాల మీద వేస్తారు ఆ కాగితాలను ఆయన చూసి సంతోషిస్తారు.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
నన్ను నమ్మండీ..! రామానుగ్రహం బిడ్డలకు కలిగితీరుతుంది, రామ నామం అంత శక్తివంతమైనది, వెంటనే పిల్లలకీ రామ పాదాల దగ్గరపెట్టి పూజచేసి సిద్ధంగా ఉంచినటువంటి మాడ కాగితం తొట్టిలో వేసేయగానే పిల్లవాడికి ప్రసాదాన్ని మాడని ఇచ్చేస్తారు అది పట్టుకుని మళ్ళీ ఏ రాజ ద్వారంలోంచి వచ్చారో ఆ రాజ ద్వారంలోంచే బయటికి వెళ్ళిపోతారు. పెద్ద వాళ్ళు ఉంటే అక్కడే కలుసుకుంటారు. వాళ్ళు కూడా రామ నామం రాస్తే నాన్నా ఇక్కడుండు మేము కలుసుకుంటామని చెప్తారు అందరూ రామ నామం అయిపోయింతరువాత అందులో వేసేయడం బయటికి వెళ్ళిపోవడం మాడ తీసుకోవడం బయటికి వెళ్ళిపోవడం ఆఖర్ణ రాసేటటువంటి వ్యక్తి కూడా ఇచ్చేసింతర్వాత ఒకసారి ప్రాంగణమంతా చూసి ఇచ్చేశారన్న తరువాత ఘనంగా స్వామి వారికి మేళం చేస్తూ, నాకు తెలిసి ఇప్పటి వరకు భారత దేశంలో స్వామివారి పూజాంతర్గతంగా పిల్లలతో రామ నామం రామాయణ ప్రవచనాంతర్గతంగా రామ చంద్ర మూర్తి సన్నిధానంలో పీఠంలో కూర్చుని పిల్లలతో రామ నామం రాయడానికి అవకాశం ఇస్తున్న కార్యక్రమంగా ఏకైక కార్యక్రమం భారత దేశం మొత్తం మీద ఇదే... నాకు తెలిసి ఇప్పటి వరకు వినలేదూ చూడలేదు అంత గొప్ప కార్యక్రమం చేద్దాం.
మన పిల్లల భవిష్యత్తుకి మనం బాధ్యులం మీ పిల్లలతో మీరు సరిపెట్టుకోవద్దు ఏ పిల్లలు రాసినావారి ఆనందం మన ఆనందమే... అదీ రామ చంద్ర మూర్తి ఎంతో ప్రీతి చెందుతారు మీ పక్కింటి వాళ్ళకి మీ పక్కింటి వాళ్ళకీ చెప్పి తీసుకురండీ ఎన్ని వేల కాగితాలైనా ఇద్దాం, ఒక వేళ 300 పేర్ల కాపీలు అయిపోతే వేయి రెండు వేలు ఉన్న వాటిలోంచి చింపి పిన్ను కొట్టి ఇచ్చేద్దాం తప్పా ఏ పిల్లవాన్ని ఆరోజున నిరుత్సాహ పరచేటటువంటి స్థితి ఉండనే ఉండదు. కానీ ఎక్కడా మాట వినపడ కూడదు పూజ అంటే మౌనం కదాండీ..! ఒక్కసారి నీరాజనం ఇచ్చి బెల్స్ మోగిన తరువాత అంతే రామ నామాలన్ని వేసి అందరు వెళ్ళిపోయారని గుర్తేమిటంటే... ఘనంగా గంటలు మోగుతాయి అన్ని దేవాలయాలలో అన్ని దేవాలయాలలో గంటలు మోగి అన్ని దేవాలయాలలో నీరాజనాలు ఎత్తుతారు అంటే రామ నామ లేఖనం పూర్తి అయిపోయిందని గుర్తు.
నేను అనుకోవడం 300 నామాలు రాయాలి అంటే కొంచెం వేగంగా రాయగలిగిన పిల్లలైతే... ఒక్క నలభై నిమిషాలు చాలు నిజానికి ఎంతో కష్టపడి రాస్తే. మాములుగా గబగబా రాయగలిగిన పిల్లలైతే 300 నామాలు 10 నుంచి 15 నిమిషాలలో రాసేస్తారు. కాబట్టి ఒక గంటలో ప్రాంగణమంతా నా ఉద్దేశ్యంలో మళ్ళీ ఇచ్చేసి అందరూ ప్రసాదాన్ని రామ మాడని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి జీవితంలో ఒక తృప్తిగా ఉంటుంది. పిల్లలు చదువుకునేటటువంటి గూట్లో ఆ రామ మాడ పెట్టమని చెప్పాలి. వాళ్ళందర్నీ రోజూ రాముడికి ఒక్క నమస్కారం చేసుకోమని చెప్పండి చక్కగా ప్రసాదం ఇచ్చి పంపిద్దాం. మన భావి తరాలకి మనం చెయ్యగలిగిన ఉద్దరణ మనం చేద్దాం కాబట్టి ఆదివారం ఉదయం 7 గంటలకే మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చేయాలి ఎందుకు నేను ఏడు గంటలకే అంటున్నానంటే వాళ్ళు ఎండకి సొక్కకుండ ఉండడం కోసం కాబట్టి ఎండ ఎక్కువైపోతే వాళ్ళు తాపానికి గురైపోతారు వాళ్ళు బాధపడుతారు అందుకని మన సౌఖ్యం కోసం తొమ్మిదీ పదీ అలా పెట్టకూడదు. ఏడు గంటలకు తీసుకొచ్చేయండి ఏడు గంటల 15 నిమిషాలు ఏడు గంటల 20 నిమిషాల వరకు మాక్సిమమ్ అలవ్ చేస్తారు ఆ తరువాత ఇంక లోపలకి పంపరు ఎందుకంటే ఇంక చప్పుళ్ళు ఇంక అదే పనిగా రావడం అవి ఉండకూడదు, తలుపులు వేసేస్తారు వేసేసి బెల్ మోగుతుంది మోగగానే అందరూ శ్రీ రామ శ్రీ రామ అని రాస్తారు దానికేం టైమూ ఖంగారు లేదు. రాసేయడం పట్టుకొచ్చి వేసేయడం ప్రసాదం మాడ తీసుకొని వెళ్ళిపోవడం పిల్లలందకీ మేము ఇలా శారదా పీఠంలో రామ నామం రాసి తెచ్చుకున్నాం మాడ అని వాళ్ళకి ఒక గొప్ప ధైర్యం వాళ్ళు రాసిన రమ నామం వాళ్ళను కాపాడి తీరాలి మనం మన పిల్లలకి ఇవ్వగలిగిన గొప్ప కానుక అదే.

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
కాబట్టి మీ అందరూ కూడా ఇందులో సహకరించి చక్కగా మీ పిల్లలందరినీ తీసుకొచ్చి నిజంగా ఈ ప్రాంగణమంతా నిండిపోయి ఆ ఆడిటోరియం అంతా కూర్చొని పెట్టేద్దాము, ఎక్కడ చూసినా కిస్కింద కాండలోలా మేడల మీద వేదికల మీద నేల మీద గుళ్ళల్లో గోపురాల్లో రామ నామమే... నిశబ్దంగా కొన్ని లక్షల రామ నామం ఉత్పన్నమౌతుంది. తొట్టెలు నిండిపోయి మాడలు పుచ్చుకొని పిల్లలు వెళ్ళిపోతుంటే ఇదంతా వీడియో తీసి భారతీ తీర్థ స్వామి వారికి పంపిస్తే ఓహ్... గుంటూరులో శృంగేరీ పీఠం ఇంత గొప్పగా చేసిందని స్వామి సంతోషించాలి, ఆయన సంతోషించి పొంగిపోయి వెంటనే ఆశీర్వచన పూర్వకంగా మాట్లాడి క్యాసెట్ పంపిస్తే మీ అందరికీ ఆ క్యాసెట్లో స్వామివారు చేసిన అనుగ్రహ భాషణాన్ని వినిపించి శ్రీరామాయణం విషయంలో గుంటూరు పట్టణంలో ఒక కొత్త చరిత్ర సృష్టిద్దాం. దానికి మీ అందరూ సహకరించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఒక్క పదకొండు మార్లు రామ నామం చెప్పి ఇవ్వాల్టి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం.

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును రామ నామము !! రా !!
నిల్మలంబగు భోధచేసిన నేర్పదగు శ్రీ రామ నామము !! రా !!
బ్రహ్మ సత్యము జగన్మిధ్యాభావమే శ్రీ రామ నామము !! రా !!
నీవు నేనను బేధమేమియు లేకయున్నది రామ నామము !! రా !!
పాహి కృష్ణాయనుచు ద్రౌపతి పలికినది శ్రీరామ నామము !! రా !!
పాలు మీగడ పంచదారల తత్వమే శ్రీరామ నామము !! రా !!
అల కుచేలుని చేతి అటుకులనారగించిన రామ నామము !! రా !!
తత్వ శిఖరము నందు వేలిగే నిత్య సత్యము రామ నామము !! రా !!
జపతపంబులకర్హమైనది జగతిలో శ్రీ రామ నామము !! రా !!
బ్రహ్మపుత్ర కరాబ్జవీణా పక్షమైనది రామ నామము !! రా !!

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
భక్తితో ప్రహ్లాదుడడిగిన వరములిచ్చెను రామ నామము !! రా !!

  అయోధ్య కాండ పన్నెండవ రోజు ప్రవచనము
 
సోమ సూర్యాదులను మించిన స్వ ప్రకాశము శ్రీ రామ నామము !! రా !!
జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీ రామ నామము !! రా !!
శరణు శరణను విభీషనునకు శరణ మొసగిన రామ నామము !! రా !!
మంగళా శాసన...



No comments: