మనం నిన్నా భారద్వాజ మహర్షి యొక్క తపః శక్తిని చూసివున్నాము, మహానుభావుడు ఆయన
యొక్క తపఃశక్తిచేత స్మరించినంత మాత్రంచేత దేవతలందరియొక్క అనుగ్రహాన్నిపొందీ అన్ని
లక్షలమంది పౌరులకూ జానపదులకూ సైన్యానికి ఆ వచ్చినటువంటి వాహనాలకీ అన్నింటికీ ఆయన
ఆహారాన్ని సమకూర్చినటువంటి విధానాన్ని విన్నాము. ఈ దేశంలో ఆ తపఃశక్తి కలిగినటువంటివారియొక్క
వైభవమే నిజానికి ఇంతగొప్ప పేరుప్రఖ్యాతులు ఈ దేశానికి తీసుకొచ్చింది. మీరు రోజూ
చేసేటటువంటి గురుప్రార్థనలలో వింటూంటారు ʻతపః చక్రవర్తీʼ అనీ ఆ తపస్సు
ఈశ్వరుడి గురించి చేసినటువంటి తపస్సు వారితోపోదు. దానికొచ్చిన గొప్పతనం ఏమిటంటే ఒక పుణ్యకార్యాన్ని చేశాడనుకోండీ,
ఆ పుణ్యకార్యం చేసినవాడి పుణ్యం ఆయనదాన్ని అనుభవించడంతోపోతుంది కానీ తపస్సు చేసినటువంటి
వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేసినా ఆయన చేసినటువంటి తపస్సుకి సంబంధించినటువంటి ప్రకంపనలు
ఆయన ఎక్కడ శరీరంతో కొంతకాలం ఉన్నారో..? ఆప్రాంతాన్నంతటినీ పట్టీవుంటాయి,
అది ఆ వ్యక్తి చేసినటువంటి తపస్సుయొక్క స్థాయినిబట్టి ఒక్కొక్కసారీ యుగాలు మారిపోయినా
కూడా ఆ ప్రదేశం అంత శక్తిని పొందివుంటుంది.
శృంగేరి పీఠం రావడానికి కారణం అటువంటి
మహానుభావుడైన ఋష్యశృంగుడివల్లే, ఋష్యశృంగుడు అక్కడ తపస్సు చెయ్యబట్టే యుగం
మారిపోయినా కూడా అక్కడ ఒక పాము కప్పకి పడగపడితే శంకరభగవత్ పాదాచార్య స్వామివారు
అక్కడ ఋష్యశృంగుడు యొక్క తపోవైభవాన్ని గమనించీ సమస్త ప్రాణులూ ఒకదానిపట్ల ఒకటి
సహజంగా ఉండవలసిన వైరాన్ని మరమచిపోయినటువంటి పవిత్ర భూమి కనుక నేను ఇక్కడ పీఠాన్ని
పెడతాను అని శృంగేరీ పీఠాన్నిపెట్టారు, అంత గొప్పస్థితి ఆ తపస్సుది. భారద్వాజ
మహర్షి యొక్క తపస్సంటే ఎలా ఉంటుందో... నిన్నటిరోజున మనం ఆవైభవాన్ని తిలకించి
ఉన్నాము.
వచ్చినటువంటి భరతున్ని ప్రశ్నవేశాడు నీవు ఎందుకు ఇలాగ నారచీర కట్టుకున్నావు,
ఎందుకిలా జటజూటం కట్టుకున్నావు, దేనికొరకు నీవు ఈ అరణ్యాన్నికి బయలుదేరి వచ్చావు,
ఎందుకు నీవింత చిక్కిపోయి ఉన్నావు, నాకు కారణం చెప్పవలసిందీ అనీ, అంటే భరతుడియొక్క
ప్రధానప్రయోజనం రామున్ని అరణ్యంనుంచి అయోధ్యకు తీసుకువెళ్ళడం,
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
రామున్ని అయోధ్యకు తీసుకు వెళ్ళడమూ అంటే..? అది అంత తేలికైన విషయమేమీ కాదు
చాలా చాలా కష్టం. అందుకే తనొక్కడే రాకుండా అన్ని లక్షల మందితో వచ్చాడు, ఒకటీ ఇంత
మందిని చూస్తే ఇంత మంది కోరితే నేను పట్టు పట్టడం అంటే బాగుండదేమోనన్న భావన
కలుగుతుందీ అని ఒకటి, రెండూ తను చెప్పినప్పుడు ఎక్కడెక్కడ ఒక మంచివిషమున్నా దాన్నిసమర్థించేటటువంటి
పెద్దలు ఉంటారూ అన్నది రెండు, ఏ తల్లి వరమడిగిందో ఆ తల్లే మళ్ళీ భరతుడు రామున్ని
వెనక్కి రమ్మని అడుగుతున్నప్పుడు అంగీకరించి కూర్చుంటే రాముడు మెత్తబడతాడు
అన్నకారణం మూడు, వశిష్టాది మహర్షిలే వచ్చి మాట్లాడితే రాముడు తిరస్కరించడం
అంతతేలిక కాదు అన్నది నాల్గవది ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని ఇంత మందితో కలిసి
వెళ్లాడు కానీ రామున్ని వెనక్కి తీసుకెళ్ళడమనేటటువంటిది అంతతేలికైన విషయం కాదు.
కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే..? చాలా జఠిలమైనటువంటి ఒక వ్యాజ్యంలో
ఇద్దరు తలపండిపోయినటువంటి న్యాయవాదులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో న్యాయస్థానంలో
అలా ఉంటుంది, చాలా ఒకదాన్ని మించి ఒకటి శక్తి వంతములైన ప్రతిపాదనలు
తీసుకొస్తుంటాడు భరతుడు. ఇది ఎంత దూరం వెడిపోతుంది అంటే... మనం ఊహించడానికి
వీలులేనిరీతిలో ఒకదాని తరువాత ఒకటి ఆ ప్రతిపాదనలు తీసుకొస్తాడు. కానీ మనకి
అనిపిస్తుంది రాముడు చేసేటటువంటి ప్రసంగాన్ని వినకపూర్వం అమ్మో చాలా శక్తి వంతంగా
మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎలాగా కాదనడం అనిపిస్తుంది. కాని రాముడు ధర్మాన్ని ఎంత
పట్టుకున్నాడో చూసినటువంటి స్థితీ ఇవ్వాళ ఉండేటటువంటి ఘట్టం రామ చంద్ర మూర్తి
యొక్క ధార్మికస్థితిని చూపిస్తుంది మహోత్కృష్టమైన ఘట్టంగా రామాయణంలో దీన్ని
పెద్దలు భావన చేస్తారు కాబట్టి ఇప్పుడు భరతుడు రామ చంద్ర మూర్తి ప్రశ్న వేస్తే
అన్నాడూ...
ఆర్యం తాతః పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరమ్ ! గతః స్వర్గం మహా బాహుః పుత్ర
శోకాఽభి పీడితః !!
స్త్రియా నియుక్తః కైకేయ్యా మమ మాత్రా పరంతప ! చకార సుమహత్ పాపమ్ ఇదమ్ ఆత్మయశో
హరమ్ !!
సా రాజ్య ఫలమ్
అప్రాప్య విధవా శోక కర్శితా ! పతిష్యతి మహా ఘోరే నిరయే జననీ మమ !!
ఆయన అన్నాడూ... మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజుగారు చాలా పుణ్యాత్ముడు ఆయన
నీకు యౌవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పంచేశాడు, కాని మా అమ్మ కైకేయి నా
హృదయం తెలుసుకోకుండా ఆయన్ని నిగ్రహించింది రెండు వరాలు అడిగింది, ఈవిడ పట్టిన
పట్టుదలను కాదనలేక రెండు వరాలూ ఆ కైకమ్మకిచ్చి, కైకమ్మ పట్టుదలవల్ల నాకు
రాజ్యాన్ని సంక్రమింపజేసి నిన్ను విడిచి ఉండలేక రాజు స్వర్గస్తుడయ్యాడు, ఇప్పుడు
స్వర్గస్తుడైనటువంటి రాజు తనకార్యాన్ని పూర్తిచేసుకొని తను చెయ్యవలసినటువంటిపని తానుచేసివెళ్ళిపోయాడు,
మా అమ్మ విధవైపోయింది, నాకు జేష్ఠునకు చెందవలసినటువంటి రాజ్యాన్ని తీసుకోవడం
అటువంటి పాపపుపని చెయ్యడం నాకు ఇష్టంలేదు, కాబట్టి ఈ మాట కేవలం నేను చెప్తున్నది
కాదు ఈ ప్రజలు జానపదులు పౌరులు ఈ దేశవాసులు మంత్రులు వశిష్టాది మహర్షులు
పురోహితులు అందరి కోరికా, నేను కేవలం నీకు తమ్మున్నికాను నేను నీకు శిష్యున్ని
కూడా..! నేను నీ దగ్గర ఎన్నో ధార్మిక విషయాలు నేర్చుకున్నవాన్ని కాబట్టి శిష్యుడు
పుత్రుడితో సమానుడు పైగా నేను నీకు తమ్మున్ని.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
తండ్రిలేని కారణంచేత
జేష్ఠుడవైనటువంటి నీవే నాకు తండ్రి వంటివాడవు కాబట్టి నీ పాదములుపట్టి ప్రార్థన
చేస్తున్నాను నీవు తిరిగి వచ్చేయవలసిందీ అనీ మంత్రుల వంక చూపించాడు, చూపించి
అన్నాడూ తత్ ఇదం శాశ్వతం పిత్ర్యం సర్వం ప్రకృతి మణ్డలమ్ ! పూజితం పురుష
వ్యాఘ్ర నాఽతిక్రమితుమ్ అర్హసి !! ఈ మంత్రులు ఇవ్వాల్టివాళ్ళుకారు అనేక వేల సంవత్సరములుగా మన వంశాన్నంతటినీ
కూడా వాళ్లు కాపాడుతూ మనకి మంత్రాంగంచేస్తూ వస్తున్నవాళ్ళు, వాళ్ళు కేవలం నేను ఏదో
చెప్పానని నాకు సమర్థించడానికి వచ్చేటటువంటి స్వభావమున్నవారు కారు ఇంతమందీ
మంత్రులు కదిలి వచ్చి ఇవ్వాళ నేను చెప్పిన మాటను సమర్థించి నిన్ను వేడుకుంటున్నారూ
అంటే నీవు రాజ్యానికి తిరిగి రావలసినటువంటి అవసరం ఎంతటి బలమైనదో నీవు
గమనించవలసింది, కాబట్టి నేను చేతులు జోడీంచీ కన్నీరు కారుస్తూ దుఃఖంతో నాకు
అక్కరలేని రాజ్యాన్ని అమ్మ నా నెత్తిన రుద్దిందనీ పరమబాధతో అడుగుతున్నాను ఈ రాజ్యాన్ని
నువ్వు తప్పా వేరొకడు వహించగలిగిన వాడులేడు, కాబట్టి నీవు తిరిగి వచ్చేసి
ఈరాజ్యాన్ని స్వీకరించు, అంటే రాముడు అన్నాడు కులీనః సత్త్వ సంపన్నః తేజస్వీ
చరిత వ్రతః ! నీవు మంచి వంశంలో పుట్టినటువంటివాడివి సత్వగుణ సంపన్నుడవు
బలశాలివి సత్ ప్రవర్తన కలిగినటువంటి వాడివి ఇటువంటి మంచి గుణములు కలిగినటువంటి
నీవు ఇలా మాట్లాడడంలో ఏమీ ఆశ్చర్యం లేదు, కనుకనే రాజ్యాన్ని నీకు తండ్రి ఇచ్చినా
కూడా నాకు వద్దూ నీవే రాజ్యం పుచ్చుకో అంటున్నావు.
అంతవరకు సరే, కానీ నేనొక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను న దేషం త్వయి
పశ్యామి సూక్ష్మమ్ అప్యఽరి సూదన ! న చాఽపి జననీం బాల్యా
త్త్వం విగర్హితుమ్ అర్హసి !! నీ అమ్మని నీవు పదే పదే విమర్శిస్తున్నావ్, మీ అమ్మని నిందచేస్తున్నావు మా
అమ్మ రాజ్యం పుచ్చుకుందీ మా అమ్మ రాజ్యం పుచ్చుకుందీ అని, నేను నీతో ఒకమాట
చెపుతాను బాగాగమనించూ అసలు మీ అమ్మ చేసినదాంట్లో లేదా మన అమ్మ చేసినదాంట్లో నాకు
లేశమాత్రం కించిత్ దోషం కూడా నాకు ఎక్కడా కనపడడంలేదు ఎందుకు కనపడడంలేదు అంటావేమిటో
నువ్వు రాజ్యానికి తిరిగిరావడం ఇష్టం లేక కైకమ్మ చేసినటువంటి పనిసమర్థిస్తున్నాను
అని అనుకుంటున్నావేమో, నేను నీతో ఒక ధర్మసూక్ష్మం చెప్తానూ నీవు బాగా ఆలోచించు కామకారో
మహా ప్రాజ్ఞ గురూణాం సర్వదాఽనఘ ! ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే !! తల్లీ తండ్రీ గురువు ఈ ముగ్గురు అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తులు వీళ్లు
వాళ్ళ బిడ్డల విషయంలో బృత్యులుగా కింకరులుగా భావనచేసి వారి అభ్యున్నతికొరకు వారిని
ఎక్కడ ఉంచాలని వాళ్ళు అనుకుంటారో అక్కడ ఉంచేటటువంటి అధికారం వాళ్ళకు ఉందీ,
మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అక్కడ వాళ్ళు ఉంచాలని మనం కోరకూడదు వాళ్ళు మననెక్కడ
ఉంచుదామనుకున్నారో అక్కడ మనం ఉండడం మనకు శ్రేయస్కరం అది ధర్మ సూక్ష్మం వాళ్ళు
చెప్పినది మనం వినాలి, కాబట్టి ఇప్పుడు నీ తల్లి కైకమ్మకి కానీ నా తండ్రి దశరథ
మహారాజుకిగాని స్వతహాగా ఒక అధికారము ఉంది మీ అమ్మ నీవు ఎక్కడ ఉండాలో ఏం చెయ్యాలో
ఎలా ఉండాలో కోరుకొనేటటువంటి అధికారం శాశించే అధికారం మీ తల్లిగారికి ఉంది.
ఆలాగే నేనెక్కడుండాలో ఏంచెయ్యాలో చెప్పేటటువంటి అధికారం మన తండ్రిగారికి ఉంది
తప్పా ఇవ్వాళ నీకు రాజ్యం ఇష్టం లేదు నీకు రాజ్యం ఇష్టం లేదుకాబట్టి నన్ను రమ్మని
ప్రార్థనచేస్తున్నావు, నీకు రాజ్యం ఇష్టంలేదు అన్నది ప్రధానమా నిన్ను రాజ్యంలో
తండ్రి కూర్చోబెట్టాడన్నది ప్రధానమా నీకు రాజ్యం ఇచ్చింది ఎవరూ నువ్వుకాదు నువ్వు
పుచ్చుకోలేదు తండ్రి ఇచ్చాడు ఇప్పుడు నీవు పుచ్చుకోను అంటే ఏకొడుకును ఎక్కడ ఎలా
నియోగించాలో అలా నియోగించగలిగినటువంటి సహజమైన అధికారమున్న తండ్రి యొక్క ఆ స్థితిని
మనము ప్రశ్నించినట్లు అవుతుంది. తండ్రి నన్ను ఇలాపెట్టాడు నిన్ను అలాపెట్టాడు.
నిన్ను అలాపెట్టడంలో కష్టంవచ్చిందీ అని నీవు అనకూడదు ఎందుకో తెలుసా వనే వా చీర
వసనం సౌమ్య క్రిష్ణాఽజినాంబరం ! రాజ్యే వాఽపి మహారాజో మాం
వాసయితు మీశ్వరః !! ఆయన నన్ను కృష్ణాజినం కట్టుకుని అరణ్యంలో
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ఉండమనిచెప్పినా ఆయన
నాకుతండ్రే, కాదూ నాన్నా రామా! నీవు రాజ్యంచేయీ అనిచెప్పినా నాకుతండ్రే, తండ్రీ
అంటే నన్ను ఎక్కడ ఎందుకు ఎలా నియోగించాలో అలా నియోగించడానికి పూర్తి స్వాత్యంత్రమూ
అధికారమూ కలిగినటువంటివాడు అంతేకానీ నీకు రాజ్యం ఇష్టంలేదు కాబట్టి నీకు రాజ్యం
ఇవ్వడం నాన్న చేసినది తప్పని నన్ను అరణ్యానికి పంపాడు కాబట్టి నన్ను అరణ్యానికి
పంపడం నాన్న చేసిన తప్పని, మీ అమ్మ వరాలడిగి నీకు రాజ్యం ఇప్పించింది కాబట్టి అలా
అడగడం మీ అమ్మ తప్పనీ అమ్మా నాన్నల తప్పులు విచారణ చేయడానికి పిల్లలు కూర్చుంటే,
వాళ్ళ తప్పుల మీద మీరు తీర్పుచెప్తే..? అప్పుడు వాళ్ళదికాదు పోయినది ధర్మం మనది
పోయిన ధర్మం.
కాబట్టి నీవు ధర్మాన్ని కోరుకున్నవాడివైతే నీవు
నన్ను రమ్మని అడగకూడదు, రాజ్యం నాకు ఇస్తానని అడగకూడదు, నాన్నగారు ఏది చెప్పారో అది
నీవు చెయ్యాలి, నాన్నగారు నన్ను ఏది చెయ్యమన్నారో అది నన్ను చేసుకోనివ్వాలి
అప్పుడు నీవు ధర్మంలో నిలబడినవాడివి నన్ను ధర్మం చేయనిచ్చినవాడివి అలా నన్ను నా
ధర్మంలో నిలబెట్టి నీ ధర్మంలో నీవు నిలబెట్టిననాడు నీవు సుపుత్రడవు నేను సుపున్ని.
నన్ను అలా మర్యాదగా బ్రతకనిచ్చి పుత్ర ధర్మాన్ని నిలబెట్టుకోనిచ్చావు కాబట్టి నాకు
నిజమైన తమ్ముడవు నాకు శిష్యుడవు తప్పా, కేవలం ప్రేమచేత నేను మీకు శిష్యున్ని నేను
మీ తమ్మున్ని మీరు రాజ్యానికి వచ్చేయండీ అంటే నీకు సంతోషంగా ఉంటుందేమో... కానీ అది
ధర్మమా... అలా చెయ్యచ్చా మనం అలాచేస్తే ఊర్ధ్వలోకాల్లో ఉన్న తండ్రిగారు
సంతోషిస్తారా, ఇక్కడ మీ అమ్మకది గౌరవమా..? నీకు ఇష్టం లేదుకాదు కాబట్టి మీ అమ్మని
ఎందుకు నిందిస్తావు, మీ అమ్మకి ఇష్టమైనపని నీవు చేయాలని కోరుకో అలా మార్చిచూడూ
అప్పుడు నీవు సుపుత్రుడవు అయ్యావు మీ అమ్మ అడిగినదాంట్లో జోక్యం చేసుకొనే అధికారం నీకు
లేదు అనుకో ఇప్పుడేమయ్యింది నేను అందుకేగా వచ్చేశాను నాన్నగారికి నన్ను పంపే
అధికారం ఉందని వచ్చేశాను నిన్ను రాజ్యంలో పెట్టే అధికారం మీ అమ్మకు ఉందని నీవెందుకు
అనలేకపోతున్నావ్? అది అనలేకపోతున్నావు కాబట్టీ ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి
ఒక్కడివే రాకుండా ఇంత మందీ ఇలా చెప్తే నేను వస్తాననుకుని వచ్చావ్? కానీ ఇంతమంది
చెప్పారని నేను చేసినా నాన్నగారు చెప్పిన పనిని చేసివాడిని అవుతానా చేయనివాడిని
అవుతానా... ఆలోచించు? ఇది రాముడంటే.
ఎంత జఠిలంగా ఉంటాయో చూడండి ఆ వాద ప్రతివాదాలు ఎదో తలలు పండిపోయిన
న్యాయమూర్తులు ఎలా మాట్లాడుతారో అలా ఉంటుంది, ఎప్పటికప్పుడు ఎవరు మాట్లాడింది
వాళ్ళదే చాలా గొప్పగా ఉంది అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి
అన్నదానికి ఒక ప్రమాణం ఉంది. ప్రమాణమూ అంటే సిద్ధాంతం అది దాన్ని మనం ఆదర్శంగా
స్వీకరించవలసి ఉంటుంది, గౌరవ వాఖ్యంగా స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి అది ఎవరి
మాటని మనం ప్రమాణంగా తీసుకొని పాటించాలి, ఎవరి మాటని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇంక
దాన్నేం మనమేం విమర్శించక్కరలేదు మనం బుద్ది పెట్టక్కరలేదు మనమేమీ ఆలోచన
చెయ్యక్కరలేదు అన్న విషయాన్ని ఎవరి మాట విషయంలో మనం అలా పట్టించుకోవలసి ఉంటుంది స
చ ప్రమాణం ధర్మాఽఽత్మా రాజా లోక గురు స్తవ ! పిత్రా దత్తం యథా
భాగమ్ ఉపభోక్తుం త్వమ్ అర్హసి !! నీకు చెప్పడానికైనా అధికారం ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు ఇలా చెయ్యి అంటే అది
మనకు ఉపయుక్తమా, ఉపయుక్తం కాదా అని మనవైపు నుంచి ఆలోచన చెయ్యడం కాకుండా ఎవరుచెప్తే
నువ్వుచేస్తే ధర్మం అవుతుందో, ఎవరుచెప్తే
నేనుచేస్తే ధర్మం అవుతుందో వాడు తండ్రి ఒక్కడే... తండ్రి చెప్పినదే ధర్మం.
తండ్రిగారు ఏం చెయ్యమంటే అది చెయ్యడమే పుత్రుడి ధర్మం, తండ్రిగారు చెప్పింది నాకేం
పనికిరాదండి అని చెప్పడం పుత్ర ధర్మం కాదు, తండ్రికి తెలుసని భావించడం పుత్ర ధర్మం.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇప్పుడు
తండ్రి ఏం చేశాడూ... నిన్ను రాజ్యమునందు నియుక్తున్ని చేశాడూ... నన్ను పద్నాలుగు
సంవత్సరములు అరణ్యవాసం చెయ్యవలసిందని అదేశించాడు. ఇప్పుడు ధర్మం అన్నమాటకు
అర్థమేమిటీ నేను అరణ్యవాసం చెయ్యడం నీవు రాజ్యాన్ని పాలించడం ఇప్పుడు మన ఇద్దరికీ
ప్రమాణం ఏమిటీ? మీరు ఎలా చేశారూ అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి మా తండ్రిగారు
చెప్పారు మేం చేశాము అని చెప్పాలి, తప్పా ఇంతకు ముందెప్పుడో ఏదో జరిగింది మా
నాన్నగారు చేయలేదు అందుకని మా నాన్నగారిది తప్పు అని మార్చేసుకుంటున్నామని మనం
అనచ్చా..! అప్పుడు మనది తప్పు నాన్నగారిది కాదు, అంటే మనకు పనికివచ్చేటట్టుగా మనకు
ఏవి ఇష్టమో అవి ఆయన నోటివెంటవస్తే ఆయన ధర్మాత్ముడు మనకు ఇష్టం లేకపోయినా ఇది
పిల్లలుచేస్తే మంచిదీ అనుకొని తండ్రి చెప్పిననాడు ఆయన అధర్మాత్ముడు. అప్పుడు ఆయన
చేప్పిన పని మీద నీవు తీర్పుచెప్పావా? ఆయన చెప్పిన పని నీవుచేశావా? ఏమి
మాట్లాడుతున్నావు నీవు? అలా అడగచ్చా? అలా చెయ్యచ్చా? కాబట్టి తండ్రిగారి
మనిద్దరికి ఏమి చెప్పారో అదేచేద్దాం అదే ధర్మం అప్పుడు తండ్రిగారు సంతోషిస్తారు.
విన్నాడు భరతుడు ఏమంటాడూ... కాబట్టి అన్నాడు ఇప్పుడూ అప్పటికి ఆరోజు సభ
పూర్తైయింది, బాగా చీకటి పడిపోయింది మరునాడు మళ్ళీ కూర్చున్నారు. వచ్చిన ప్రయోజనం
ఇదేనని రాముడికి తెలుసు, వచ్చిన ప్రయోజనం ఇదేనని భరతుడికి తెలుసు ఇన్ని లక్షల
మందికీ తెలుసు, మళ్ళీ ఇంత మందీ కూర్చున్నారు సాంత్వితా మామికా మాతా దత్తం
రాజ్యమ్ ఇదం మమ ! త ద్దదామి తవై వాఽహం భుంక్ష్వ రాజ్యమ్ అకణ్టకమ్ !! మళ్ళీ మొదలు పెట్టాడు భరతుడు, నీవు మా
తల్లిగారిని తృప్తి పరచడం కోసమని మా తండ్రిగారు లేదా మన తండ్రిగారు రాజ్యాన్ని
కైకమ్మ ద్వారా నాకు సంక్రమింపజేశారు, ఇప్పుడు నాన్నగారు చెప్పింది నీవు చెయ్యాలని
గదా నీవు అన్నావు, కాబట్టి నాన్నగారు చెప్పిన ప్రకారం రాజ్యం అమ్మ వలన నాకు
వచ్చింది నేను అడగలేదు అన్నయ్యా! ఆ మాట మీరు పట్టుకోవాలి ఎంత చెప్పినా అది వదలడు
భరతుడు సాంత్వితా మామికా మాతా దత్తం రాజ్యమ్ ఇదం మమ కాబట్టి ఇప్పుడు రాజ్యం
నాదే నాకు వచ్చింది, నేనేంచేస్తున్నానో తెలుసా? నీకిచ్చిన రాజ్యం నీవు తీసుకో అని
కదా అన్నావు, నాన్నగారి మాట గౌరవించాను నేను తీసుకున్నాను నాదే రాజ్యం త
ద్దదామి తవై వాఽహం నీకు ఇచ్చేస్తున్నాను భుంక్ష్వ రాజ్యమ్
అకణ్టకమ్ ఇప్పుడు అకంటకం కదా, ఇప్పుడేమిటి నీకు బాధ, ఇప్పుడు తీసుకో? నాన్నగారి
మాట నేనేం కాదనలేదే నామాట నీవు కాదనుకూడదు కదా తమ్మున్ని శిష్యున్ని
ప్రార్థిస్తున్నానుగా! ఇంతమంది ప్రార్థిస్తున్నారుగా మరి ఇంతమంది ప్రార్థనను
అంగీకరించడం నీకూ ధర్మమేగా, నేనూ అంగీకరించానుగా నీవు చెప్పినమాట నాన్నగారు
ఇచ్చారు తీసుకున్నాను నీకు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు భుంక్ష్వ రాజ్యమ్ అకణ్టకమ్ అలా
కాదూ నీవే ఉంచుకో అదేంటీ నాకెందుకూ ఇచ్చేయడం ఏదో నేను లేనివాడననో లేకపోతే పాపం ఏదో
ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతాడులే అని ఇస్తున్నానని అనుకుంటున్నావేమో...? అందుకు
ఇవ్వట్లేదు.
నేను ఇది పుచ్చుకునీ ఆలోచించాను, ఇది నేను పుచ్చుకుని రాజుగా కూర్చుంటాను అని
ఆలోచన వచ్చింది వస్తే నాకేమనిపించిందో తెలుసా? గతిం ఖర ఇవాఽశ్వ స్య తార్క్ష్య
స్యేవ పతప్రిణః ! అనుగన్తుం న శక్తి ర్మే గతిం తవ మహీపతే !! ఒక గుఱ్ఱము ఒక గాడిదా రెండూ చూడ్డానికి ఒక్కలా
ఉంటాయి, ఉన్నాయి కదా అని గతిం ఖర ఇవాఽశ్వ స్య గుఱ్ఱము ఎలా పరుగెడుతుందో అలా గాడిద పరుగెడుదామని
అనుకుందనుకో పరుగెడుతుందా..? అది అందంగా ఉంటుందా అసహ్యంగా ఉంటుంది. అలాగే తార్క్ష్య
స్యేవ పతప్రిణః పతప్రిణః అంటే పక్షి, పక్షీ గరుత్మంతుని వంక చూసి –
గరుత్మంతుడు పక్షే నేను పక్షే అని గరుత్మంతుడు ఎలా ఎగురుతున్నాడో నేను అలా ఎగురుతానని
ఒక పక్షి అనుకుందనుకో ఎగరగలదా ఆయనలా ఎగరగల ప్రయత్నంచేస్తే ఏమౌతుంది కిందపడుతుంది,
గాడిద గుఱ్ఱములా పరుగెత్తకపోతే ఏమౌతుంది అలా ఉన్నానని కింద పడుతుంది పక్షి
గరుత్మంతున్ని చూసి నేనూ పక్షినే అని ఎగురితే ఏమౌతుంది కిందపడుతుంది, నేనూ దశరథ
మహారాజుగారి కొడుకునే రాజ్యం నేనెందుకు తీసుకోకూడదు అని తీసుకుంటే ఇదిగో గాడిద
కిందపడినట్లు పక్షి కిందపడినట్లు పడుతాను, ఇది పరిపాలించడానికి నా సమర్థతచాలదూ అని
నాకు అర్థమయ్యింది, నీకేదోలేదని నీకు ఇవ్వట్లేదు, నీవుతప్పా పాలించేవాడు లేడూ అని నిన్ను
బ్రతిమాలుతున్నాను తీసుకోమని ఇప్పుడేమి నీకు అభ్యంతరము.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
అమ్మో ఎలా
మాట్లాడుకుంటారండీ న్యాయస్థానాలలో కూడా ఉండదు ఈ వాదన అంత గొప్పగా మాట్లాడుతాడు
భరతుడు. అంటూ అన్నాడూ ఎప్పుడూ కూడా అన్నయ్యా..! ప్రపంచంలో పుట్టుకచేత కొంత మందికి
కొన్ని లక్షణాలు ఉంటాయి, కొందరు పుట్టుకచేత ఉత్తములై ఉంటారు, కొందరు పుట్టుకచేత
మధ్యములై ఉంటారు కొందరు పుట్టుకచేత అంతకన్నా కిందిస్థాయిలో ఉంటారు దాన్ని ఏమీచేసి
కూడా నీవు మార్చేయడమన్నది కుదరదు అది సంభవమయ్యేటటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే
ఒక ఉత్తముడైనటువంటివాడు ఉన్నాడనుకోండి ఆయన ప్రజ్ఞవేరు ఆయన ప్రజ్ఞావిశేషంవేరు ఆయన
ప్రజ్ఞావిశేషం నీకురావాలి అంటే నీవు ఆయనలా నిర్ణయంచేయడం నీవు ఆయనలా ఆ
కార్యక్రమాన్ని చేయగలిగినటువంటి దక్షతా నీకు ఎప్పుడూరాదు ఎందుకంటే ప్రచోదయాత్ ఆయన
బుద్ధియందు గాయిత్రికున్నటువంటి అనుగ్రహం అటువంటిది. అందుకని ఆయన వాక్కుకు ఉన్న
సమర్థత అటువంటిది. అందుకనీ అలా నడుస్తుంది ఉత్తములైనవాడికి అన్నయ్యా నీవు
ఉత్తముడివి ఉత్తముడు - ఉత్తముడు చేయవలసినపని చేయకుండా చాలా కింది స్థాయివాడు
చేయవలసినవాడు పనిచేస్తే అసహ్యంగా ఉంటుంది అలా చేయకూడదు, ఉత్తముడు నడిపించాలి
కాబట్టీ చాలా మందికి శ్రేయస్సుని ఉత్తముడు కల్పించాలి, ఎందుకంటే ఆ సమర్థత ఆయనయందు
ప్రకాశించింది.
కాబట్టి. ప్రకాశించనివాడు ఏంచేయాలి తనంతతాను ప్రకాశించలేడు కనుకా
ఉత్తముడైనవాన్ని అనుగమించాలి అనుగమిస్తే ఏమౌతుంది ఆయన ఫలితాల్నికట్టబెడతాడు
ఇయ్యనకు తీసుకొచ్చి కాబట్టి అన్నయ్యా పుట్టుకతో ఆ స్థితి ఉంది, ఇవ్వాళ నీకు
రాజ్యమిస్తాను నేను వెళ్ళి అడుగుతాను అంటే ఇన్ని లక్షల మంది ఎందుకొచ్చారు? నీవు
ఉత్తముడవు కనుకా? కాబట్టి నీకు రాజ్యంవెళ్ళాలి అన్నయ్యా! ఇప్పుడు నేను ఇవ్వడం నీవు
పరిపాలించడం నీవు నమ్మకపోయినా, పోనీ నీవు అలా అంటున్నావు నీవు రాజ్యం ఇచ్చేయడానికి
అని అంటావేమో నీవు ఉత్తముడవు అని అనడానికి ఇంక ఇంతకన్నా సాక్షాధారమేమిటీ, కాబట్టి
నీవు రాజ్యం తీసుకోవాలి అంతేకానీ నేను తీసుకోను అంటావేమిటి అన్నయ్యా..? అలా
అనకూడదు తప్పది, ఉత్తముడు తనప్రజ్ఞనను దాచుకున్నట్లు అవుతుంది అది,
నడిపించవలసినవాడు నడిపించకుండా కూర్చున్నాడనుకోండి పాడైపోయినవారు పాడైపోయారనుకోండి
పాడైపోవడానికి ఉత్తముడే కారణమౌతాడు ఎందుకనీ? ఆయన నడిపించివుండి ఉంటే ఆ
ప్రయోజనాన్ని పొందివుండేవాళ్ళు, నీవు నడిపించద్దు మమ్మల్నీ అన్నారనుకోండీ ఆయన ఓ
మూలకెళ్ళి కూర్చున్నారనుకోండి నాకెందుకండీ? వాళ్ళడగనప్పుడు అని కూర్చున్నాడనుకోండి
తప్పులేదు. ఏమయ్యా నీవు మమ్మల్ని నడిపించవయ్యా అని బ్రతిమాలి బామాలి ఏడ్చి
తలకొట్టుకుని కాళ్ళమీదపడినా భీష్మించుకుపోతే వీళ్ళందరు పాడైపోతే ఎవరిది ఆ పాపం
ఉత్తముడిదే, ఉత్తముడైనవాడు ఎప్పుడైనా అలా చేస్తాడా..! చెయ్యడుగా మరి నీవు
ఉండిపోతాడంటావేమిటీ?
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
నీకు జటలేమిటీ నీకు
నారచీరలేమిటీ నీవు అరణ్యవాసమేమిటీ నీవు తపస్సు చేయడమేమిటీ? ఇంద్రుడు దేవతలని
పరిపాలించినట్లు నీవు ఈ భూమండలాన్ని పరిపాలించాలి నీవు పుట్టిందే అందుకు నీవు
అదిమానేసి ఇక్కడ కూర్చుంటావంటావేమి అన్నయ్యా..? నీ స్థితికి అది తగదు నీవు అలా
ఉండకూడదు, లోకము యొక్క ప్రయోజనాన్ని నీవు చూడవలసి ఉంటుంది అంటూ ఆయన అన్నాడు.
దశరథుడు రాజ్యమిచ్చాడూ, రాజ్యం ఇచ్చాడు కాబట్టి నీవు అనుభవించాలికదా అంటున్నావు?
కానీ నేను నీకొక మాట చెప్పనా ఇవ్వడమూ అన్నదాంట్లో త్రికరణశుద్ధి ఉండాలి, ఇద్దాము
భరతుడికి అన్నలక్షణం దశరథుడికి మొదటి నుంచివుంటే నేను పుచ్చుకునేవాన్ని, నాన్నగారు
ఎప్పటినుంచో పాపం రాముడు ఇంతచేయలేడు భరతుడికే రాజ్యం ఇచ్చేద్దామని అంటే నేను
పుచ్చుకునేవాన్ని నీకు తెలుసు నాకు తెలుసు మా అమ్మలకు తెలుసు ప్రజలకు తెలుసు నిజం
చెప్పూ... నీకొద్దు నాకిద్దామని మొదటి నుంచి నాన్నగారు అనుకున్నారా..! అనుకోలేదు
నీవు పెరుగుతుంటే నాన్నగారు ఎలా చూసేవారో తెలుసా నీ వంకా..? స దా పుష్పితో
భూత్వా ఫలాని న విదర్శయేత ! స తాం నాఽనుభవేత్ ప్రీతిం
యస్య హేతోః ప్రరోపితః !! ఏషోపమా మహాబాహో త్వమ్ అర్థం వేత్తుమ్ అర్హసి ! యది త్వమ్
అస్మాన్ ఋషభో భర్తా భృత్యాన్ న శాధి హి !! ఒకడు ఒక గొప్ప చెట్టును ఒకదాన్ని తీసుకొచ్చాడు,
చెట్టును తీసుకు రావడం అంటే ముందు కాయలు పళ్ళు ఉన్న చెట్టును తెచ్చి ఎవడూ పెరట్లో
పాతుకోడు కదాండీ!
ఒక మంచి కొత్త పల్లి కొబ్బరీ అని వస్తుంది మాకు తూర్పు గోదావరి జిల్లాలో చాలా
గొప్పగా ఉంటుంది ఆ పండు మామిడి పండు ఆ కొత్త పల్లి మామిడి కొబ్బరి మనం
పండించుకుందాం అని అనుకున్నాడనుకోండి ఒకాయన, కొత్త పల్లి కొబ్బరి మామిడితో
చెట్టును పెరికి తెచ్చి వేసుకోడు ఆ మొక్క తెచ్చి పొలంలో వేస్తాడు, ఆ మొక్క తెచ్చి
పొలంలో వేసి రోజు దాని వంకచూసి ఒరేయ్ దీని చుట్టూ ఏదైనా కట్టండిరా కంచె కట్టండిరా
ఏవైనా పశువులు తినేస్తాయోమో అంటాడు, ఒరేయ్ రోజూ నీళ్ళు పోస్తున్నారా అంటాడు అది
రోజు రోజుకూ పెద్దది అవుతుంటే ఇది పండుతుంది పండి ఇస్తుంది పండి ఇస్తుంది అంటాడు,
ఆశపెట్టుకుంటాడు ఆ చెట్టు పండిస్తుందీ ఆ పండు తిందామని ఆశిస్తాడు, ఇప్పుడు ఆ
చెట్టు చాలా పెద్దదై పళ్ళు ఇవ్వడం మానేసిందనుకో..? ఆ మొక్క వేసినవాడి పరిస్థితి
ఏమిటీ చెట్టు పెద్దదయ్యింది పళ్ళు ఇవ్వలేదు, చెట్టు పెద్దదవ్వడం కావాలా చెట్టు
పళ్ళు ఇవ్వడం కావాలా? పళ్ళు ఇవ్వడం కోసం పెద్దదవ్వాలి కానీ పెద్దదవ్వడం కోసం
పెద్దదవ్వాలని కోరుకోలేదు ఆ వ్యక్తి వేసినవాడు, అన్నయ్యా! నీవు పెరిగి పెద్దవాడివై
రాజ్యాన్ని సుసంపన్నంగా పరిపాలిస్తావనేటటువంటి పళ్ళు ఇస్తావని పెరుగుతున్న మొక్కను
చూసినట్లు చూశాడు తండ్రి దశరథుడు. నీవు తీరా పెరిగి పెద్దవాడివై పరిపాలన చేయడమనే
పండు ఇవ్వకుండా నేను వెళ్ళి అరణ్యంలో కూర్చుంటానూ అనడం చెట్టు పళ్ళు ఇవ్వకపోవడం లాంటిది
ఇది ఎలా కుదురుతుంది అన్నయ్యా..? దశరథ మహారాజుగారు నాకు రాజ్యం ఇద్దామని
మొదట్నుంచీ అనుకోలేదు నిన్ను పెరుగుతుంటే రోజూ చూసి ఈ రాముడే యువరాజు అవుతాడు, ఈ
రాముడు రాజా రాముడు అవుతాడు, ఈ రాముడు నా తరువాత పరిపాలన చేస్తాడు లోకమంతా ఎంత సుఖిస్తుందో
అని ఎదురుచూశాడు ఎదురుచూశాడు ఎదురుచూశాడు, ఇప్పుడు చెప్పు నాకు ఇద్దామనుకున్నాడా
నాన్నగారు, అనుకోలేదు మరి ఎందుకిచ్చాడు మా అమ్మ నిగ్రహించింది కాబట్టి ఇచ్చాడు.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ఇప్పుడు ఇచ్చాడు ఇచ్చాడు
అని నీవు అంటున్నావే అది ఇవ్వాలని ఇచ్చింది కాదు అన్నయ్యా..! ఇవ్వకుండా ఉండడం
తప్పా మార్గంలేక ఇచ్చింది, కాబట్టి ఇప్పుడు నిజంగా ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు,
ఇవ్వకుండా ఉండడం తప్పా మార్గంలేని రీతిలో ఆయనని బలవంతంచేసి ఏ తల్లి నాకు ఈ
రాజ్యాన్ని ఇప్పించిందో ఆ తల్లే వచ్చింది కాబట్టి, దాన్ని నీకు ఇచ్చేస్తే, నీవు
దానిని ఉంచుకుని పరిపాలిస్తే ఆయన ఇక్కడ లేకపోకయినా ఎక్కడో ఉన్నా... అమ్మయ్యా... నా
రాముడు రాజు అయ్యాడని సంతోషిస్తాడు, వీళ్ళందరూ సంతోషిస్తారు అంతేకానీ నేను రానయ్యా
నేను అడవిలోనే కూర్చుంటాను ఇదే ధర్మం నాన్నగారు
చెప్పారంటావేమిటి అన్నయ్యా! నాన్నగారు చెప్పింది త్రికరణ శుద్ధిగా అలాగా చెప్పింది
అలా అనలేదుగా కాబట్టి రాజ్యం తీసుకోవాలి.
ఇప్పుడు ఎలా వచ్చాడో చూడండి భరతుడు, అంటే రాముడు అన్నాడూ నాయనా నేను నీకొక మాట
చెప్తాను చూడూ..! ఇప్పుడూ ఈ లోకంలో అన్నీ కూడా నశించి పోయేటటువంటివే, ఈ లోకంలో
ఉన్నది ఏదీ కూడా నశించకుండా శాశ్వతంగా ఉండిపోయేది అన్నది ఏదీ ఉండదు. ఒక భర్త యొక్క
భార్య కాని, భార్య యొక్క భర్త కాని, భార్యా భర్తల యొక్క బిడ్డలుకాని, వారి తల్లి
తండ్రులు కాని, వారు కట్టుకున్న ఇళ్ళు కాని, వారికున్న పొలాలు కాని ఏవైనా
కానివ్వండి ఈ లోకంలో ఏవైనా ఏదో ఒక నాటికి నశించిపోతాయి, నశించకపోవడమన్నది ఏదీ
ఉండదు ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతివ్యక్తి మరణించక తప్పదు మరణిస్తాడు కాబట్టి
ప్రతిశరీరమూ వెళ్ళిపోతుంది. ధృడమైన స్థంభములతో ఒకాయన ఇళ్ళుకట్టాడు ఇళ్ళు కడితే అది
అలా ఉండిపోతుందా ఉండదు అది కూడా పడిపోతుంది. లోకంలో పోకడ ఏమిటంటే... తథైవ
సీదన్తి నరా జరా మృత్యు వశం గతాః జరా అంటే వృద్ధాప్యముచేతా మృత్యువుచేతా
గ్రసింపబడుతాడు ప్రతివాడు కూడా ఈ రెండిటిచేత పట్టుకోబడుతాడు పారిపోలేడు కాబట్టి
అందరూ పడిపోతారు అలాగే నాన్నగారు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశారు నాన్నగారి శరీరం
కూడా పడిపోయింది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడో చూడండి
ఎక్కడికెళ్ళి చెప్తున్నాడో చూడండి ఆత్మానమ్ అనుశోచ త్వం కిమ్ అన్యమ్ అనుశోచసి !
ఆయు స్తే హీయతే యస్య స్థిత స్య చ గత స్య చ !! మీరు ఏమీ చేయకుండా అలా
నిలబడ్డారనుకోండీ, ఏ పనులూ జరగవేమో కానీ మీరు అన్నం తినడం జరగలేదేమో మీరు నీరు
త్రాగడం జరుగలేదేమో మీరు స్నానం చేయడం జరుగలేదేమో లేకపోతే మీ వలన ఎవరికీ ఏమీ
ఉపకారం జరకుండా ఉండిపోయిందేమో కానీ మీ ఆయుర్ధాయం తరిగిపోకుండా ఉండడం మాత్రం లేదు.
అమ్మో...?... ఎలా మాట్లాడుతాడండీ! రాముడు మాట్లాడడమంటే స్థిత స్య చ గత స్య
చ స్థిత స్య చ అంటే నిలబడిన గత స్య చ కదిలినా ఏం చేస్తున్నా
అయిపోతూంటూంది ఆయూర్ధాయం ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః ! లక్ష్మీస్తోయతరంగభంగచపలా
విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా !! అంటారు
శంకరభగవత్ పాదులు, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్ధాయాన్ని గ్రశించేస్తున్నాడు
ఈశ్వరుడు అయిపోతూంది ఆయుర్ధాయం రోజు రోజుకీ కాబట్టి గాత్రేషు వలయః ప్రాప్తాః
శ్వేతా శ్చైవ శిరోరుహాః ! జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేత్ !!
ఒకనాడు పటుత్వంగా ఉన్నటువంటి అవయవములను కప్పి ఉన్నటువంటి చర్మం క్రమ క్రమంగా క్రమ
క్రమంగా ముడతలు పడిపోతుంది, దగ్గరి దగ్గరిగా అయిపోయి ముడతలు పడిపోతుంది, శ్వేతాశ్చైవ
శిరోరుహాః తల మీద ఉన్న వెంట్రుకలన్నీ తెల్లబడిపోతాయి జరయా పురుషో జీర్ణః
వృద్ధాప్యంచేత వ్యక్తి యొక్క శరీరం శిథిలమైపోతుంది. ఇది లోకము యొక్క ధర్మం
దీన్నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు నందంతి ఉదిత ఆదిత్యే నందంతి అస్తమ్ ఇతే రవౌ
! ఆత్మనో నాఽవబుధ్యన్తే మనుష్యా జీవిత క్షయమ్ !! కాని మనిషి యొక్క పోకడ ఎలా ఉంటుందంటే భరతా!
సూర్యోదయమైతే ఇవ్వాళ ఏవో డబ్బులు వస్తాయని సంతోషిస్తాడు, సూర్యాస్తమయం అయితే చీకటి
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
పడింది కాబట్టి మనం
కామ సంబంధమైనటువంటి భోగాన్ని పొందవచ్చూ అని సంతోషిస్తారు, సూర్యోదయానికీ సంతోషమే
సూర్యాస్తమయానికీ సంతోషమే, అసలు సూర్యాస్తమయమూ సూర్యోదయమూ పోయిందని మాత్రం ఎవరూ
గమనించరు, యథా కాష్ఠం చ కాష్ఠం చ సమేయాతాం మహాఽఽర్ణవే ! సమేత్య చ
వ్యపేయాతాం కాలమ్ ఆసాద్య కంచన !! ఒక సముద్రంలో రెండు కట్టెపుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఒకదానితో ఒకటి
ఇలాచేరి కొంత దూరం వెళ్ళిపోయిన తరువాత ప్రవాహ వేగానికి రెండు కట్టెపుల్లలూ
విడిపోయి రెండూ ఒకదానికి ఒకటి ఇటు ఒకటి అటూ వెళ్ళిపోయాయి అలా ఎక్కడో ఆమె పుడుతుంది
ఎక్కడో ఆయన పుడతాడు కాల ప్రవాహంలో ఎక్కడో కాలప్రవాహంలో భార్యా భర్తలని కలుస్తారు
కలిసి వెళ్తుంది ఆ జీవితం కొంత కాలం తరువాత ఆయనన్నా ముందు ఆమెన్నా ముందు పడిపోతారు
ఆ తరువాత రెండో వాళ్ళూ పడిపోతారు.
ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడం అనేటటుంటిది తథ్యం కానీ
నీవు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, దీన్ని అతిక్రమించలేమూ అని తెలిసున్నటువంటి దశరథుడు
తను యజ్ఞములు చేశాడు యాగాలు చేశాడు ఎన్నో చేశాడు ఎన్ని చేస్తున్నా తనకు లోపల ఏ
కోరికలున్నా అన్నిటి కన్నా ప్రధానం లోపల ఉన్న కోర్కెలు ఏవి ఉన్నాయో ఆ కోర్కెల
నుంచి మనస్సూ ఆ శరీరమూ ఆ జన్మకు పడిపోతే ఆ తరువాత జరిగేదాంతో సంబంధము లేదూ, కానీ
ఇది ఉండగా మాత్రం ధార్మికంగా ఉండకపోతే మాత్రం పరలోకాలు పోతాయని నమ్మాడు ఎక్కడ
పెట్టాడో చూడండి తీసుకొచ్చి. అంటే మీరు దీన్ని మీరు బాగాపట్టుకున్నారో లేదో..?
నేను ఒక మాట చెప్తే బాగాపట్టుకుంటారు, దశరథుడి కోణంలోంచే చెప్తాను మీకు ఉదాహరణ
తేలిగ్గా ఉంటుంది. దశరథుడు శరీరంతో ఉన్నాడు దశరథుడు శరీరంతో ఉన్నప్పుడు ఏం
కోరుకున్నాడు రాముడికి రాజ్యం ఇద్దామని కోరుకున్నాడు, భరతునికి రాజ్యం ఇవ్వు అంది
కైకమ్మ, నోర్ముయ్ అని ఖైదుచేసి రామునికే ఇప్పించగలడు రాజ్యం తల్చుకుంటే లేదా ఆ
రాత్రి భార్యకు కుత్తుక కోసేసి విషాన్నం
పెట్టీ నాకు తెలియదు భార్య చచ్చిపోయిందని చెప్పీ రాముడికి పట్టాభిషేకం చేసేస్తాడు ఎందుకు
చేయలేదు దశరథుడు, దీంతో అనుభవించేటటువంటి సుఖాలు కొంతకాలమే ఇది పడిపోవడం సత్యం ఇది
ఉండదు, ఇది పడిపోయిన తరువాత నీ జీవుడు మాత్రం పోడువాడు ఉంటాడు ఎవడు సుఖ దుఃఖాలన్ని
దీన్ని అడ్డుపెట్టుకుని అనుభవిస్తున్నాడు, దీన్ని ఈశ్వరుడు ఎందుకిచ్చాడో
తెలుసాండీ! లోపల జీవుడు పాప పుష్య ఫలితములను అనుభవించడానికి ఒక ఉపకరణము ఉంటే తప్పా
అనుభవించలేడు అందుకిచ్చాడు.
ఇప్పుడూ ఏసి లో నేను కూర్చుంటే హాయిగా ఉంది ఏదుంటే ఆ హాయి తెలుస్తుంది, ఇదుంటే
కదాండీ తెలుస్తుంది, శరీరం ఉంటే కదా..? కరెంటు పోయింది ఏసి ఆగిపోయింది, బాల్కనిలో
కూర్చుంటే వడగాల్పు కొట్టింది, దుఃఖంగా ఉంది ఏదుంటే తెలిసింది ఇది ఉంటే తెలిసింది.
ఈశ్వరుడు దీన్ని సుఖ దుఃఖములు అనుభవించడానికి ఇచ్చినటువంటి పనిముట్టు కాబట్టి ఇది
దీనిలో ఉన్న జీవుడు ఏది కోరుకున్నా ఆ కోరికను తీర్చే ప్రయత్నంచేసి దానివల్ల సుఖం
సత్యమనుకుంటే పడిపోయిన తరువాత తీర్పు చెప్పేవాడు ఒకడు ఉంటాడు, దాంతో నీవు ధర్మం
చేయలేదుగా అంటాడు అని ఊర్ధ్వలోకాలు ఇవ్వడు నరకంలోకి తోసేస్తాడు, అప్పుడు చాలా
బాధగా ఉంటుంది. అందుకని నాన్నగారు ఏం చేశారో తెలుసా... తెలివైనవాడు తనలోపల కోర్కెలు
ఏమున్నా ఆ కోర్కెలు తీర్చుకునే ప్రయత్నంచేయలేదు ధర్మం ఏదో అదేచేసే ప్రయత్నంచేశాడు.
నాన్నగారు చేసిన గొప్పపని ఇది నాన్నగారు పట్టుకున్నారు ఈ శరీరం ఉండదూ అని
తెలుసుకున్నారు, అందుకని శరీరంతో ఉన్నప్పుడు
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ధర్మమే చేశాడు
తప్పా తనులోపల కోరుకున్నది చేయలేదు. సాధారణంగా వ్యక్తి ఏం చేస్తాడంటే తనకు లోపల ఏ
కోరిక పుట్టిందో ఆ కోరిక తీర్చుకోవడానికే దీన్నివాడుకుంటాడు, దశరథుడు ఏం చేశాడంటే
ఏదో రకంగా ఆ కోరిక తీర్చుకుంటే ఆ సుఖాన్ని అనుభవించడానికి ఈ శరీరం ఉండదు లోపల ఈ
జీవుడు ఎక్కువ కాలం వేదన పొందుతాడు పైన.
కాబట్టీ లోపల నా కోరికే ఎలావున్నా ధర్మమేదో నేనునదే చేస్తానని, అందుకే మీ అమ్మ
వరమడిగితే ఇచ్చేశాడు సత్యంలో నిలబడ్డాడు కాబట్టే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు, మరి
నాన్నగారు శరీరంతోవుండి అంత ధర్మంపాటించారు స జీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితా హి నః ! దైవీమ్ బుద్ధిమ్ అనుప్రాప్తో
బ్రహ్మలోక విహారిణీమ్ !! అంత ధర్మాన్ని పట్టుకున్నాడు, అందుకే రెండు వరాలు అడిగితే తను ఏదైనాచేసి
రాజ్యం ఇవ్వగలిగినవాడు నేను చెయ్యడం కాదు ఏమి చేస్తున్నానుకాదు నేనుచేస్తే
చూసేవాడు ఒకడు ఉన్నాడని కంటికి కనపడని వాడికిలొంగాడు, లొంగి తనకు ఇష్టంలేకపోయినా
సత్య ధర్మములకు కట్టుబడీ రాజ్యాన్ని నీకు వనవాసమును నాకు ఇచ్చి తను శరీరాన్ని
విడిచిపెట్టీ ఏడుస్తూవదిలిపెట్టేసినా... వదిలిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు,
ఈ శరీరంతో ఉన్నది ధర్మం చేయడానికే అని నాన్నగారు నమ్మాడు కాబట్టి బ్రహ్మలోకానికి
వెళ్ళాడు, నాన్నగారు అలా చేసినవాడూ అని తెలిసుండీ, నాన్నగారు ఏం చెప్పారో ఆ ధర్మం
మనంచెయ్యాలి ఈ శరీరంతో అన్నది గుర్తెరిగితే... నాన్నగారు ʻలోపల కోరుకున్నది
చెయ్యాలా అని చేస్తారా, నాన్నగారు చెప్పంది చేస్తారాʼ ధర్మం. లోపలేదో
నాన్నగారు కోరుకున్నారు చెట్టేశాడు పళ్ళేశాడు పళ్ళు నీకిద్దామనుకున్నాడు తరువాత
నాకు ఇచ్చాడంటావా..? నాన్నగారు ఎలా సత్యధర్మములను పట్టుకున్నారో మనం కూడా అలా
పట్టుకోవాలంటావా అంతేకాని నాకు ఇవ్వలేదు అన్నయ్యా నాకు ఇచ్చింది నీకు
ఇస్తానంటావేమిటీ? నీవేవరు ఇవ్వడానికి నాన్నగారు నీకిస్తానన్నారు నీవు తీసుకోవాలి
అంతేకాని నాన్నగారు నీకిచ్చింది నాకిచ్చేస్తే నేను పుచ్చేసుకుంటే ఏమౌతుంది అప్పుడు
ఏమౌతుంది అపద్ధం అవుతుంది, నాన్నగారి తీర్పుని తిరగరాసినట్లు అవుతుంది.
కాబట్టి ఎలా చెల్లుతుంది అనుకుంటున్నావ్? ఎలా మాట్లాడుతున్నావు ఇలా నీవు,
అమ్మో ఏమి మేధాశక్తండీ..! ఒక్కొక్కళ్ళదీ... ఎవరిది వింటే వాళ్ళదే ఇది ప్రశ్నకు
జవాబు చెప్పడమనిపిస్తుంది, కాని భరతుడు రామున్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు
రాముడు ధర్మాన్నిపట్టుకుని మాట్లాడుతాడు. కాబట్టి నేను రాకూడదు అలాగ అంటూ ఆత్మానం
అనుతిష్ఠ త్వం స్వభావేన నరర్షభ ! నిశామ్య తు శుభం వృత్తం పితుః దశరథ స్య నః !!
నీవు బాగాగుర్తుపెట్టుకో ఏ విధంగా దశరథ మహారాజుగారు ధార్మికమైన ప్రవర్తనతోవుండి
అభ్యున్నతినిపొంది బ్రహ్మలోకాన్ని పొందారో..? మనం కూడా తండ్రి కొడుకులుగా అలాగే
ధర్మాన్ని పట్టుకోవాలి, అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి అంటే నాన్నగారు ఏం చెప్పారో
అది చెయ్యడమే పుత్రధర్మం. నాన్నగారు నన్ను వనవాసం చెయ్యమన్నారు నిన్ను రాజ్యం
పరిపాలించమన్నారు కాబట్టి నీవు రాజ్యాన్నిపరిపాలించు నేను వనవాసం చేస్తాను అంతే
ధర్మము తప్పా... నీవు నన్ను రమ్మనుకూడదు నేను రాకూడదు.
అయిపోయిందా అక్కడికి ఆ వాదన అక్కడితో అలా పూర్తి అయింది. ఇప్పుడు భరతుడు మళ్ళీ
ఇంకొకవాదన తీసుకున్నాడు తీసుకుని ఆయన అన్నాడూ అన్నయ్యా! ప్రోషితే మయి యత్ పాపం
మాత్రా మత్కారణాత్ కృతమ్ ! క్షుత్రయా తదఽనిష్టం మే ప్రసీదతు
భవాన్ మమ !! ధర్మ బన్థేన బద్ధోఽస్మి తేనేమాం నేహ మాతరమ్ ! హన్ని తీవ్రేణ దణ్డేన
దణ్డాఽర్హాం పాప కారిణీమ్ !! రాజ్యాన్ని దశరథ మహారాజుగారు నాకు ఇచ్చారు అన్నమాట పరమ సత్యమే అన్నయ్యా..!
నాన్నగారు తనంత తాను ఇచ్చారా లేకపోతే నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వడంలో మధ్యలో
ఎవరైనా ఉన్నారా..? ఉన్నారు ఎవరున్నారు ఒక పాపచారిణి ఉంది, పాపంచేసినావిడ ఉంది
ఎందుకు పాపచారిణి అంటున్నానో తెలుసా... ఇచ్చేవాడు ఇద్దామనుకున్నా పుచ్చుకునేవాడికి
పుచ్చుకునే కోరిక ఉండాలా..? అప్పుడే కదా పుచ్చుకోవడం పూర్తవుతుంది. మీరునాకు వందరూపాయలు
ఇద్దామనుకున్నారండీ నేను పుచ్చుకుంటేగా మీరు నాకు ఇవ్వడానికి, నేను పుచ్చుకోను
అంటే మీరెలా పుచ్చుకుంటారు, నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా నేను
ఇస్తానులేండి అని పుచ్చుకున్నారనుకోండి ఇంకో ఆయన, ఇప్పుడు ఆయన పాపంచేసిన వాడాకాదా..?
ఇప్పుడు నేను వద్దన్నానుకోండి నేను ఆయనకది ఇచ్చేశాను తీసుకుంటానుకోండి మరి అది
మధ్యలో తీసుకున్న వందరూపాయలు ఏమౌతుంది దానికి ఎవడు బాధ్యత.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
నేను ఎప్పుడైనా
రాజ్యం అడిగానా..? నీకు రాజ్యం ఇవ్వద్దని నాన్నగారితో చెప్పానా..? రాజ్యం కావాలి
అన్నట్టుగా సూచన ప్రాయంగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా..? నన్ను అడక్కుండా మా
అమ్మ ఎందుకు అడిగింది రాజ్యం, మా అమ్మ అడిగిందని దశరథుడు ఇచ్చేయడమేమిటీ అప్పుడు
అసలు నా మనసెరగకుండా నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా ఇచ్చింది నాకు
ఇవ్వడం ఎలా అయింది అన్నయ్యా..? నా కిచ్చింది నీవు తీసుకొని పరిపాలించమంటావేమిటీ,
నేను అసలు అడగలేదుగా... ఈవిడ ఏం చేసింది ధర్మ బన్ధేన బద్ధోఽస్మి పోని ఇచ్చే ఆయనకు ఇద్దామని ఉందా..! ఇద్దామని
లేదు. ధర్మం అనేటటువంటి బంధం వేసి కట్టింది నీవు నాకు రెండు వరాలు ఇచ్చావు వరాలు
తీర్చమని తేనేమాం నేహ మాతరమ్ మా అమ్మ అలా గట్టిగా బంధించింది హన్మి
తీవ్రేణ దణ్డేన దణ్డాఽర్హం పాప కారిణీమ్ అలాంటి తప్పు పనిచేసిన మా అమ్మ శిక్షార్హురాలు,
నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో రాజ్యము మీద అనురక్తి ఉందో లేదో నన్ను ఒకమాట
అడగకుండా భరతునికి రాజ్యం ఇయ్యమని అడగడానికి ఆవిడ ఎవరు? అదేం రూపాయి కాసు కాదు లేకపోతే
మీఠాయి అంటే కాదూ పోనిలే ఇయ్యన పుచ్చుకోక పోతే ఇంకొకరికి ఇవ్వడానికి, రాజ్యం
అన్నయ్యా..! ఆవిడ ఎలా అడిగింది అసలు అడిగితే మాత్రం అన్నయ్యా నేను ఇలా అన్నానని
అనుకోవద్దూ నేను ఏమైనా అంటే నీవు కోప్పడుతావు, సభాముఖంగా అసలు అననూ తాతం న
పరిగర్హేయం దైవతం చేతి సంసది నాన్నగారు దేవుడు నేను కాదనను మహానుభావుడు,
బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు చనిపోయినవాని గురించి తప్పు అసలు మాట్లాడకూడదు,
తండ్రిని అసలు మాట్లాడ కూడదు.
కాబట్టి నాన్నగారు మహాత్ముడు ఇంక అంతకన్నా నేను ఏమీ మాట్లాడను కానీ అన్నయ్యా ఓ
దోషం ఉందికదూ మంత్రులను అడగలేదు నన్ను అడగలేదు ఏరా! మీ అమ్మ నీకిమ్మంటుంది రాజ్యం
పుచ్చుకుంటావా..? అని నన్ను ఒకమాట అడిగి ఉంటే ఎలా ఉండేదో..? ఏమయ్యా ఈవిడ రాజ్యం
భరతుడికి ఇచ్చేయమంటుంది నేను అలా ఇవ్వచ్చా..! అని మంత్రుల్ని అడిగి ఉంటే ఎలా
ఉండేదో..? సభను అడితే ఎలా ఉండేదో, అసలు ఆయన్ని అడగండని అడిగితే ఎలా ఉండేదో... నాకు
వద్దని నేను అప్పుడే చెప్పేద్దును, నన్ను అడిగినవాళ్ళు ఎవరు అన్నయ్యా..? కాబట్టి
ఇప్పుడు ఏమైందంటే... నాకు అక్కర లేనిదాన్ని నేను లేనప్పుడు, నేను మేనమామ ఇంట్లో
ఉన్నప్పుడూ ఆయన నాకిమ్మని ఈవిడకు ఇచ్చేశాడట, నాకు అక్కరలేని దానిని ఈవిడ నీవు
పుచ్చేసుకో అంటుంది. నీవేమో నన్ను అరణ్యవాసానికి వెళ్ళిమ్మన్నారని నీవు
వెళ్ళిపోయావు నాకు వద్దు మహాప్రభో అంటే ఆవిడ పుచ్చుకుందని మీరు అంటున్నారు ఆవిడ
ఎవరు అన్నయ్యా పుచ్చుకోవడానికీ ఇందులో ఎలా పూర్తైయిందికార్యం ఎలా పూర్తయ్యింది
నాకు చెప్పూ, ఇప్పుడు కార్యం అవ్వలేదు తప్పైంది, ఎక్కడ తప్పైందని అంటేమేమో
అన్నయ్యా..? నీవు జాగ్రత్తగా ఆలోచించు తండ్రిగారివల్ల తప్పుజరిగిపోయింది.
తండ్రిగారు అడిగి ఉండి ఉండవలసింది నన్ను అడగలేదు అడగకుండా నాకు రాజ్యం ఇచ్చేశాడు,
నాకిచ్చాడా అమ్మకు చెప్పాడా రాజ్యం ఇచ్చేశానని అమ్మకు చెప్పాడు నేను పుచ్చుకోను.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ఇప్పుడు ఏమైపోతుంది
రాజ్యం మరి నేనే పుచ్చుకోంది లక్ష్మణుడు పుచ్చుకోడు శత్రుఘ్నుడు పుచ్చుకోడు నీవు
నాకు నాన్నగారు చెప్పిన ధర్మమని అడవిలో కూర్చున్నావు మరి ఇప్పుడేమిటీ ఈ రాజ్యం
పరిస్థితి, ఏం చెయ్యాలి కోసల రాజ్యాన్ని ఎవరికి ఇద్దాం నలుగురు కొడుకులుండి
రాజ్యాన్ని వదిలేద్దామా..? లేకపోతే నా అనుమతి లేకుండా నాకు ఇచ్చిందాన్ని నేను
పరిపాలించనా తరువాత నా వంశం వాళ్ళు నా కొడుకులంతా వస్తారు రాజ్యానికి పెద్ద
పొరపాటు దొర్లిపోలేదు ఇక్ష్వాకు వంశంలో మరి ఇప్పుడు ఎవరో ఒక్కరు దిద్దాలా వద్దా
అన్నయ్యీ ఇది దీనిని ఎవరు దిద్దాలి తండ్రి తెలిసో తెలియకో తప్పుచేస్తే కొడుకుదిద్దాలి
అన్నయ్యాదాన్ని కాబట్టి నీవుదిద్దూ నాన్నగారు సంతోషిస్తారు అలా వచ్చాడు భరతుడు.
అయ్యో బాబోయ్ ఏమి వాదనలండీ నిజంగా... శ్రీ రామాయణం అయోధ్య కాండ అద్భుతం. అద్భుతం
అంతే అంతకన్నా నా దగ్గర ఇంకోమాట లేదు. కాబట్టి సాధు అర్థమ్ అభిసంధాయ క్రోధాన్
మోహా చ్చ సాహసాత్ ! తాత స్య యత్ అతిక్రాన్తం ప్రత్యాహరతు తత్ భవాన్ !! పితుర్ హి
సమఽతిక్రాన్తం పుత్రో యః సాధు మన్యతే ! తత్ అపత్యం మతం లోకే విపరీతమ్ అతోఽన్యథా !! తండ్రి తప్పును దిద్దడానికి అర్హతవున్నవాడు
కొడుకు ఒక్కడే, తండ్రికి ఆ గౌరవం తేవాలి కాబట్టి కొడుకు ఒక్కడే దిద్దేయచ్చు దానిని
కాబట్టి అన్నయ్యా కొడుకులం కాబట్టిదిద్దేద్దాం, దిద్దడమన్నది ఎక్కడ మొదలవ్వాలో
తెలుసా..! జేష్ఠుడివి నీ దగ్గరే మొదలవ్వాలి నీవు రావాలి రాజ్యానికి అసలు నేను
ఎప్పుడూ పుచ్చుకోలేదుగా... మా అమ్మ ఇచ్చినా నేను ఓసారి పుచ్చుకుంటే నాకు వద్దని
నేను మొదటి నుంచి గొడవపెడుతున్నాను, పుచ్చుకోవలసినవాడు పుచ్చుకోకపోవడం దగ్గర తప్పు
అలా ఉండిపోతుంది నీవు పుచ్చేసుకుంటె తప్పు దిద్దుకుంటుంది. అందుకని అన్నయ్యా! నీవు
తప్పా ఈ తప్పు దిద్దేవాడు లేడు అందుకని లేకపోతే ఇది ఇలా ఉండిపోతుంది కాబట్టి నీవువచ్చి
ఈ తప్పు దిద్దు అన్నయ్యా అన్నాడు. అంటే రాముడు మరి ఇప్పుడు దిద్దుతాను అనాలా
దిద్దను అనాలా అన్నీ నేను చెప్పడమెందుకు మీరు చెప్పండి ఏమనాలి రాముడు.
ఇప్పుడు ఇది నేను చెయ్యాలనిగాని చెయ్యననిగాని చెప్పడానికి రామునికి
ప్రమాణమేమిటీ, అమ్మో ఒకర్ని మించి ఒకరు మాట్లాడుతారు అందుకే దేవతలు ముప్పై మూడుకోట్ల
మంది దేవతలూ మహర్షులూ ఋషులూ అందరూ ఆకాశంలో నిలబడ్డారు, ఇంత గొప్పచర్చ ఇప్పటివరకూ
జరగలేదులోకంలో ఇంత సుసంపన్నమైన ఇంత విశాలరాజ్యాన్ని నిష్కంటకంగావస్తే ఒకాయనేమో
నీవు పుచ్చుకో అని తమ్ముడూ, నేను పుచ్చుకోను నాన్నగారుచెప్పారు అడవిలో ఉండమని నేను
తీసుకోనని అన్నయ్యా..? రాజ్యం వద్దని దెబ్బలాడుకున్నవారిని నాన్నగారి గౌరవం కోసం
దెబ్బలాడుకుంటున్నవారినీ వీరినే చూస్తున్నాం కొడుకుల్ని ఇలాంటి దెబ్బలాట వినడమనేది
ఎప్పుడైనా సంభవిస్తుందా అని పనులుమానేసి పైకివచ్చి కూర్చున్నారట, ఇంతమంది పైన
ఇన్నిలక్షల మందిఎదురుగుండా... వీళ్ళిద్దరూ చర్చా వశిష్టుడు చూస్తున్నాడు ఏం
మాట్లాడడు పెద్దాయన పెద్దాయనే ఎప్పుడూ అవసరం వచ్చినప్పుడు జోక్యంచేసుకుంటాడాయన.
కాబట్టి ఇప్పుడు రాముడు అన్నాడూ చిన్నవాడివి నీకు ఏం తెలుసూ నీకు తెలియదు, ఆయన
సుమంత్రుడి ద్వారా తెలుసుకున్నాడు పురా భ్రాతః పితా నః స మాతరం తే సముద్వహన్ !
మాతామహే సమాశ్రౌషీత్ రాజ్య శుల్కమ్ అనుత్తమమ్ !! దేవాఽసురే చ సంగ్రామే
జనన్యై తవ పార్థివః ! సంప్రహృష్టో దదౌ రాజా వరమ్ ఆరాధితః ప్రభుః !! నీవు ఏమంటున్నావు భరతా! నీకు ఇష్టంలేదూ
రాజ్యాన్నిరుద్దాడూ వరాలు అడిగింది మా అమ్మా ధర్మపాశంతో బంధించింది కదా
అంటున్నావు, అసలు మీ అమ్మ దోషం ఏమీ లేదనీ మీ అమ్మ వరాలు అడగడంవల్ల నీకు రాజ్యం రాలేదనీ
నేను నిరూపిస్తాను, మన నాన్నగారు యవ్వనంలో ఉన్నప్పుడూ మీ తాతగారి దగ్గరికి
వెళ్ళాడు కేకయరాజు దగ్గరికి వెళ్ళి కైకమ్మని వివాహం చేసుకుంటానని అడిగాడు, నువ్వో
కొన్ని వేలసంవత్సరాల వయసున్న వృద్ధుడివి, నా కూతురో అనేక కళలు నేర్చిన యవ్వనవతి,
ఇంత యవ్వనంలో ఉన్నపిల్లని ఇంత వృద్ధుడివైన నీకు ఎందుకు ఇస్తాను ఒక్క ఒట్టువేస్తే
ఇస్తానన్నాడు, ఏమిటన్నాడు దశరథుడు
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ఈ అమ్మాయికిపుట్టే కొడుక్కి
రాజ్యం ఇస్తావా అన్నాడు ఇస్తానన్నాడు ఎందుకన్నాడు? కౌసల్యకి సుమిత్రకి ఎలాగో
కొడుకులు లేరుకదా అని అన్నాడు. నీకివ్వలేదు మీ అమ్మ కడుపున పుట్టిన ఎవడికైనా
రాజ్యం వచ్చేదే, కాబట్టి నీవు పుట్టకముందే వచ్చింది నీకు రాజ్యం, నేను పుట్టకముందే
నీకు ఇచ్చేశాడు రాజ్యం ఇప్పుడు ముందుపుడితే ఎంత వెనకపుడితే ఎంత ఇప్పుడు నేను ముందుపుడితే
ఏంటీ..? పుట్టకముందే రాజ్యం ఇచ్చేశారుగా... కాబట్టి ఇప్పుడు ఏదో పెద్దవాడికి నీకు
వెళ్ళాలి అంటావేమిటి ఇది మనం పుట్టకముందే జరిగిపోయింది ఇప్పుడు అమల్లోకివచ్చింది
అంతే.
కాబట్టి పుట్టకముందు నాన్నగారు ఇచ్చినమాటని మనం
నిలబెట్టాలి అంతేకానీ ఏదో మీ అమ్మ అడిగితే కొత్తగా ఇచ్చింది అనుకోకు పిచ్చితల్లి
తెలియదు కాబట్టీ మనతండ్రిగారు అడిగినమాటనే వరాలరూపంలో అడిగేసింది ఒకరకంగా
నాన్నగారి ఇచ్చినమాటను నిలబెట్టుకునే అవకాశాన్ని అమ్మకల్పించింది, కాబట్టి ఇప్పుడు
నాదికాదు నాకడగడం అంటావేమిటి నీ కోసం మీ అమ్మ అడగలేదు నీవు పుట్టకముందే మీ
తాతగారికి నాన్నగారు మాట ఇచ్చేశారు, కాబట్టి నీవుకాదు భరతుని బదులు ఇంకొకడు
పుట్టినా ఇంకొక పేరుతోపుట్టినా వాడు ఎటువంటివాడైనా వాడు ఎంతటి నీరసంకలిగిన వాడైనా
వాడు ఎంత శక్తివిహీనుడైనా వాడికేవెళ్తుంది రాజ్యం, ఎందుకంటే నాన్నగారు వరం ఇచ్చేశారు
కాబట్టి, కాబట్టి నీకు అన్నమాట వదిలేయ్ కైక కడుపున ఎవరుపుడతారో వాళ్ళది రాజ్యం
ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వరకూ పెద్దవాడు, ఇక్కడ మాత్రం కైక కడుపున పుట్టినవానికి
రాజ్యం ఎందుకంటే నాన్నగారు నేను పుట్టకముందు ఇచ్చిన వరం, నేను కౌసల్య కడుపున ముందుపుట్టటం
యాద్రుశ్ఛికం, కానీ పుట్టినప్పుడే లేదు నాకు రాజ్యం, పెద్దవాడిగా పుట్టినా నాకు
లేదు రాజ్యం ఎందుకంటే మాట ఇచ్చేసి ఉన్నాడు నాన్నగారు కాబట్టి ఇప్పుడు నాకు
ఇష్టంలేనిది అమ్మ పుచ్చుకున్నదీ నాకు ఇష్టం లేకుండా అమ్మ పుచ్చుకున్నది కాబట్టి
అసలు నాన్నగారు తప్పుచేసినట్లైంది దాన్నిదిద్దమని నీవు అంటావేమిటి? దిద్దడానికి
నేనెవరిని? పుచ్చుకోను అనడానికి నీవు ఎవరు, పుట్టకముందే వచ్చేసింది కాబట్టి
ఇప్పుడు పుట్టి దిద్దాలని ఏమీలేదు మనం పుట్టకముందే జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు
దిద్దడమన్నదేంలేదు ఇప్పుడు జరిగిందేదిద్దడం, ఆవిడ వరాలు అడిగింది కాట్టి దిద్దబడింది
లేకపోతే నాన్నగారు మాటతప్పి చేసినవారైపోదురు కాబట్టి నీవు మాట్లాడటానికి ఇంక ఏమీలేదు
ఇందులో నీవు చక్కగా బయలుదేరివెళ్ళి రాజ్యంచేసుకోవడమే.
నీకు ఇంకొక మాట చెప్పనా తండ్రీ అనేకమంది కొడుకులు పుట్టాలని కోరుకుంటాడు చాలా
గుణవంతులు అనేకమంది కలగాలని కోరుకుంటాడు ఎందుకు కోరుకుంటాడో తెలుసా..? ఒక్కటే ఒక్క
కారణానికి కోరుకుంటాడు, పుత్రుడు అని ఎవరిని పిలుస్తారంటే, కడుపున పుట్టినా
అందర్నీ కొడుకులు అని పిలవరు ఇంత మంది కొడుకులు ఆయనకు ఉన్నారని పిలవరు పుత్రుడు
అన్నమాట సార్ధకత ఎప్పుడు చెందుతుందో తెలుసాండీ..? ఇంత మంది పుత్రులు ఆయనకు ఉన్నారన్నమాట
ఎప్పుడు అనాలంటే ఆయన చనిపోయిన తరువాత అనాలి ఎందుకో తెలుసా..? రాముడు
చూపిస్తున్నాడు ప్రమాణాన్ని పుం నామ్నా నరకాత్ యస్మాత్ పితరం త్రాయతే సుతః !
తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితృన్ యత్ పాతి వా సుతః !! ఏష్టవ్యా బహవః పుత్రా
గుణవన్తో బహు శ్రుతాః ! తేషాం వై సమవేతానామ్ అపి కశ్చిత్ గయాం వ్రజేత్ !! కడుపున
పుట్టినటువంటివాళ్ళు కొడుకులు నాన్నగారి శరీరం పడిపోయిన తరువాతా వెళ్ళి తల్లి
తండ్రుల్ని ఉద్దరించడంకోసమని ʻగయాశ్రాద్ధం ఎవరు పెట్టారోʼ గయలో ఎవరు
శ్రాద్ధంపెట్టాడో వాడు ఒక్కడే పుత్రుడు ఉద్దరించాడు కాబట్టి, ఈ మాట నేను చెప్పడం
లేదు భరతా గయా పట్టణంలో గయాసురుడు యజ్ఞం చేసినప్పుడు చెప్పాడు ఈ మాట, ʻవాడినే పుత్రుడు
అని పిలుస్తారుʼ అని చెప్పాడు. కాబట్టి ఉద్దరించినవాడు పుత్రుడయ్యా ఉద్దరించడం అంటే
అర్థమేమిటీ నాన్నగారు చెప్పినమాట ఏదుందో దాన్ని సత్యంచేయడం అది సత్యం ఎప్పుడు
అవుతుంది నాన్నగారు అన్నమాట మనం పాటిస్తే సత్యమవుతుంది, నాన్నగారు అన్నమాట
పాటించకపోతే సత్యమెందుకు అవుతుంది ఆయన చెప్పింది అసత్యమౌతుంది, ఆయన చెప్పింది
అసత్యమైతే ఆ ఫలితం వెళ్తుంది అటువంటి
కొడుకుల్ని కన్నావు కాబట్టి పదా అని ఈడ్చుకుపోతారు నరకంలోకి.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
అందుకా నీవు నేను
పుట్టింది ఆయన్ని బ్రహ్మలోకంలోకి పంపించాలి మనం కాబట్టి అరణ్యవాసం నాది రాజ్యం నీది
కాబట్టి నీవువెళ్ళి రాజ్యంచేయి అంటూ ఆయన అన్నాడు త్వం రాజా భవ భరత స్వయం నరాణాం
! వన్యానామ్ అహమ్ అపి రాజరాణ్ మృగాణామ్ !! నీవు నగరంలో ఉండేటటువంటి రాజ్యంలో
ఉండేటటువంటి ప్రజలందరికీ నీవు రాజువి ʻవనములలో ఉండేటటువంటి వృగములకు నేను రాజునిʼ ఇది బాగాజ్ఞాపకంపెట్టుకోండి
మీరు ఈ వాఖ్యాన్ని రాముడు ఏదైనా అంటే ఉత్తిగనేపోదు, వనములలో ఉండేటటువంటి మృగములకు
నేను రాజుని. రాజ్యంలో ఉన్న నరులకు నీవు రాజువు ఇక నుంచి అన్నాడు ఇది ఎందుకు
అన్నాడో మృగములకు రాజుగా తాను ఏం చేస్తాడో మీయెదర కనపడుతుంది అనవసరంగా రాముడి నోటివెంట
ఏ మాటారాదు. ఆయన అన్నాడూ అంటే ఏదో ఉంది అందులో అవతార ప్రయోజనమే ఉంది ఆ మాటలో చాలా
పెద్ద మాట ఆ మాట ఎందుకన్నాడూ అన్నది ఇక్కడ బయలుదేరినమాట కిస్కింద కాండలో మళ్ళీ ఇది
బయటికి వస్తుంది కిస్కింద కాండలో బయటికి వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను అయోధ్య
కాండలో ఎందుకు వచ్చిందో ఎందుకు మృగములపట్ల రాజుగా నిలబడి ధర్మాన్ని నిలబెట్టాడో
నేను మీకు చెప్తాను అక్కడ నేను చూపిస్తాను. ఏమంటాడు పాపం భరతుడు ఆయన అన్నాడు
శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు లక్ష్మణుడు నాకు తోడుగా ఉంటాడు, మేము ఇద్దరం
అరణ్యవాసంలో ఉంటాం, మీ ఇద్దరూ రాజ్యపాలనలో ఉండండి నాన్నగారు పరమసంతోషాన్ని
పొందుతారు అది బిడ్డలుగా మనధర్మం కాబట్టి నీవు అలా పరిపాలనచెయ్యి.
ఇంకా ఇప్పుడు భరతుడికి నోటమాట రాలేదు ఎన్నిరకాలుగావాదిస్తాడండి పాపం ఏది
వాదించినా దానికన్నా గొప్పగా వాదిస్తున్నాడు రాముడు ఊరుకున్నాడు, జాబాలి అన్న
మంత్రిలేచాడు అంటే ఒక్కసారి మంత్రుల వంకచూశాడు నేనేనా మాట్లాడేది మీరు ఎందుకువచ్చినట్లు
మీరు ఎవరూ మాట్లాడరాని, జాబాలి అన్నమంత్రి లేచి అన్నాడూ కః కస్య పురోషో బన్ధుః
కిమ్ ఆప్యం కస్య కేనచిత్ ! యదేకో జాయతే జన్తుః ఏక ఏవ వినశ్యతి !! ఏంటయ్యా
రామా! దశథుని కొడుకుని అంటావ్? దశరథుడు చెప్పినమాట వినాలంటావ్ అది ధర్మం అంటావ్ ఆ
ధర్మం పట్టుకుంటే ఏమిటో ఊర్ధ్వలోకాలు వస్తాయంటావ్ నాన్నగారాధర్మంలో నిలబడితే
బ్రహ్మలోకం వస్తుందంటావ్ ఏమిటీ మాటలన్నీ పుట్టేవాడు ఎవడైనా ఒక్కడే పుడతాడు వాడుకితోడు
ఎవ్వడూ ఉండడు పుట్టేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు ఒక్కడే వెళ్ళిపోతాడు ఇక తల్లి
తండ్రీ అంటావా ఒకనాటి రాత్రికి తండ్రికి కామం కలిగింది, తన తేజస్సుని తన భార్యయందునిక్షేపించాడు,
శుక్రశోనితములు కలిసాయి ఒక పిల్లవాడుపుట్టాడు దానికి ఓ పెద్ద మా నాన్నగారు మా
అమ్మగారు అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు ఎవరి త్రోవ
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
వాళ్ళది, మీ
నాన్నకి కామం కలిగింది మీ అమ్మయందు తన వీర్యాన్ని నిక్షేపించాడు నీవు పుట్టావు ఏడి
మీ నాన్న వెళ్ళిపోయాడు మీ అమ్మా వెళ్ళిపోతుంది, ఎవరి త్రోవవాళ్ళది సుసంపన్నమైన
రాజ్యంవస్తే హాయిగా ఏలుకొని భోగమనుగమించక ఏమిటీపిచ్చి ఎవడు చెప్పాడు, మా నాన్నగారు
ఏమిటీ మా అమ్మగారు ఏమిటీ ధర్మమేమిటీ సత్యమేమిటీ ఏమిటీ పిచ్చిమాటలు అన్నీనూ
ఎందుకొచ్చింది ఇవన్నీ చూడొచ్చావా? దశరథుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడో లేదో ఆయన్ని
నీవు సత్యంలో నిలబెట్టడానికి నీవు అరణ్యంలో ఉండిపోతే నీకు పుణ్యం వచ్చిందో లేదో
నీవు చూడొచ్చావా? మనకి బాగా నచ్చుతుంది ఈ వాదనా..! మనకంటే మీ వంటి ప్రాజ్ఞులకు
కాదు నావంటి అల్పుడికి.
కాబట్టీ అని ఆయన అన్నాడూ న తే కశ్చి ద్దశరథ
స్త్వం చ తస్య న కశ్చన ! అన్యో రాజా త్వమ్ అన్య శ్చ తస్మాత్ కురు యత్ ఉచ్యతే !! కాబట్టి
నేను నీకోమాట చెప్తున్నాను చూడూ దశరథుడూ అని పేరు పెట్టుకొని కొన్నాళ్ళు ఓ శరీరం
తిరిగింది, ఆ శరీరం కొన్నాళ్ళు మీ నాన్నా అన్నారు, ఆ శరీరం వెళ్ళిపోయింది ఏ
శరీరమైనా అంతే... ఎదో ఉన్నప్పుడు అవకాశం వచ్చిందనుకో భోగము అనుభవించాలి సంతోషంగా ఈ
పిచ్చంతావదిలేయ్ నీకు నీవే, అందుకని అన్నీ మరిచిపో నీకు నీవే ఈ గొడవలన్నీ
వదిలిపెట్టేసై, కొంత మంది ఏం చేస్తారో తెలుసా రామా! ధర్మాచరణము అని ఒకమాట ఒకటి
మొదలుపెడతారు మొదలు పెట్టి ఇంక శరీరాన్ని శుష్కింపచేస్తారు, అన్నీ ఉన్నా తమంతతాము
బాధలు కొనితెచ్చేసుకుంటారు ఎందుకండీ అవన్నీ అని అడిగారనుకోండి అమ్మో ధర్మం
పట్టుకోవాలండీ అంటారు. అన్నీ ఉన్నా అనుభవించరు ఎందుకని అంటే అమ్మో నేను ధార్మికంగా
ఉండాలండి అంటాడు, ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ ధార్మికంగా ఉన్నవాడు చనిపోయిన తరువాత
వాడు ఎక్కడికి వెళ్ళాడు అనిచూసి వచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా..? ఎందుకొచ్చింది
ఇవన్నీ ఎవడు చెప్పిన మాటలు ఇవన్నీ రామా! ఇవన్నీ నీవు పట్టించుకోకు హాయిగా సంతోషంగావుండు.
నేను నిన్నటి నుంచి చూస్తున్నాను యది భుక్తమ్ ఇహ అన్యేన దేహమ్ అన్య స్య
గచ్ఛతి ! దద్యాత్ ప్రవసతః శ్రాద్ధం న తత్ పథ్యఽశనం భవేత్ !! నీన్ను నిన్నటి నుంచి చూస్తున్నాను ఏమిటో
అక్కడికి పరుగెత్తుకెళ్ళి ఆ దర్భల మీద గారపిండి ముద్దలు పెట్టావు, ఎవో మంత్రాలు
చదివావు ఇదంతా మా నాన్నకి వెళ్ళిపోయాయి అన్నావు మా నాన్న తిన్నాడు అన్నావు పిండం
పెట్టానన్నావు ఆ పిండం అక్కడే ఉంది నిన్న మీ అమ్మలు రాత్రివస్తూ ఎవడైనా
తిన్నాడా..? విస్తరేసి బ్రతికున్నవాడికిపెట్టు తింటాడు, అరటి పండుపెట్టు తినమను
వాడు తినేస్తాడు అరటి పండు కనపడదు, ఏదీ నీవు పెట్టిన పిండం ముద్ద గారపిండి ముద్ద
మీ నాన్న తింటే అక్కడేలా ఉంది దర్భల మీద అక్కడే ఉంది మరి మీ నాన్న తిన్నాడా అది
మంత్రాలతో గారపిండి ముద్దలతో తద్దినం పెడితే అన్నావు నీవు, తింటే ముద్దుండకూడదు
తినకపోతే ముంద్దుండిపోవాలి, నీవు మంత్రం చదివి తిన్నాడంటున్నావు తిన్నాడని నీవు
అంటే ముద్ద ఉండ కూడదు కానీ అక్కడ ముద్దుంది.
కాబట్టి మీ నాన్న తినలేదు మంత్రానికి ప్రభావమేముంది ఇంకా ఎవడు చెప్పినవి ఈ
మాటలు తద్దినమేమిటీ శ్రార్ధ మేమిటీ దర్భలేమిటీ పిండాలేమిటీ ఈ జల తర్పణాలేమిటీ
ఇవన్నీ నిజమా..? ఇక్కడే కంటికి కనపడిపోతూంది ఎదురుగుండా ఆ అలా పెట్టినవి ఎవడూ
తినడూ పిత్రులోకంలో వాళ్ళందరూ ఎప్పుడో పుట్టేస్తున్నారు మళ్ళీ, మళ్ళీ పుట్టేసి
వచ్చేస్తున్నారు ఈ లోకంలోకి నీవు పెట్టిన తద్ధినం పిండం ఎక్కడికి వెళ్తున్నట్టూ
ఎవడి దగ్గరికి వెడుతుందది ఎవడు తింటాడది వాడికి పునర్జన్మ ఎత్తేసి ఆవుగానో దూడగానో
వచ్చేశాడు మరి నీవేమో ఇంకా తాతగారు నాన్నగారుకని పిండం పెట్టావు, ఇప్పుడా పిండం
ఎవడు తింటాడు, తాతగారు ఆవు దూడగా ఉంటాడు గోశాలలో మరి ఎవడు తింటాడది ఏమిటయ్యా ఈ
పన్లూ అని, ఆయన అన్నాడూ దాన సంవననా హేత్యే గ్రన్థా మేధావిభిః కృతాః ! యజస్వ
దేహి దీక్షస్వ తప స్తప్యస్వ సంత్యజ !! ఈ లోకంలో కొంత మంది మేధావులున్నారు
వాళ్ళు ఏం చేశారంటే... చాలా తేలిగ్గా డబ్బులు సంపాదించేయడం కోసమని ఇలాంటి
పన్లుచేస్తే పెద్దవాళ్ళు సంతోషిస్తారని దేవతలు సంతోషిస్తారని వాళ్ళు కొన్నిమాటలు
చెప్పీ ఏమో కొన్ని మంత్రాలు తయారుచేశారు ఈ పిచ్చోళ్ళందరూ నీలాంటి వాళ్ళు అందరూ ఏం
చేస్తున్నారంటే దానాలు ధర్మాలు దానం చేయండి ధర్మం చేయండి తపస్సు చెయ్యండీ అంటారు.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
అంటే నీవేమో
తపస్సని చెప్పీ ధర్మం అని చెప్పీ ఉన్న భోగము వదిలేసుకు కూర్చుంటున్నావు
కనపడ్డవాళ్ళకంతా తాంబూలలని చెప్పి డబ్బిచ్చేస్తున్నావు దానాలు చేసేస్తున్నావు వాడు
ఏం చేశాడంటే నీ లాంటి వెర్రివాళ్ళ కోసమే ఈ పుస్తకాలు రాశారు. రాసీ వాడు చక్కగా ఏమీ
చేయకుండా ఇదొక్కటే చదివి డబ్బు పట్టుకుపోతున్నాడు, పోయి హాయిగా సుఖంగా వాడు
బ్రతుకుతున్నాడు. నీవు కష్టపడి సంపాదించుకున్నది ధర్మం దానమని నీవు
ఇచ్చేస్తున్నావు, వాడు నీతో తద్దినం పెట్టించి మీ నాన్నగారు ఇవ్వాళసంతోషించాడని
వెళ్ళిపోయాడు, ఏదీ నిజంగా మీ తండ్రిగారు ఆ గారపిండి ముద్దతింటే అక్కడ ఎలా ఉందయ్యా
మరీ తినద్దూ ఎదురుగుండా పెడితేతినాలి, రామా నేను తెలియక అడుగుతాను ఈ లోకం నుంచి ఆ
లోకం వెళ్ళినవాడికి నీవు పెట్టిన తద్దినం ముద్ద వాడుతిని వాడికడుపు నిండితే ఏదీ ఈ
ఊరు నుంచి ఇంకో ఊరుకి వెళ్ళిన వానికి కూడా శ్రార్ధంలాగే ఇక్కడ పెట్టీ, శ్రార్ధం
పెట్టు వాడికికడుపు నిండుతుందేమో పెట్టూ అడిగాడండి జాబాలి, ఇవ్వాళ లోకంలో
ఉండేటటువంటి వాదములన్నీ ఆనాడు జాబాలి వినిపించాడు.
కాబట్టి ఈ పిచ్చి మాటలన్నీ చెప్పకు ప్రత్యక్షం యత్ తత్ ఆతిష్ఠ పరోక్షం
పృష్ఠతః కురు ఈ కంటికి ఏం కనపడుతోందో అది నమ్ము ఈ కంటికి కనపడకుండా ఉందీ అని
చెప్పినమాటలు ఉన్నాయే అవి నీవునమ్మకు అంటే రాముడు అన్నాడూ అప్పటి వరకు మామూలుగా
ఉన్నాడు రాముడు కన్నులు ఎరుపు చీరలు ఎక్కాయట ఎక్కి పరమ కోపంతో చూశాడట చూసి
నిర్మర్యాద స్తు పురుషః పాపాఽచార సమన్వితః ! మానం న లభతే సత్పు భిన్న చారిత్ర
దర్శనః !! నీవు చూశావా చూడలేదా
అని అడుగుతున్నావు శృతీ అని ఒకటుంది వేదమూ అని ఒకటి ఉంది శాస్త్రమూ అని ఒకటి ఉంది
అవి ప్రమాణ వాఖ్యములు అది ఏం చెప్పిందో అది నిజం నీ కంటికి కనపడలేదు కాబట్టీ
నిజాన్ని నీవు కాదంటున్నావు, నేను నిన్ను ఒకమాట అడుగుతాను నీవు అంటే ఇది తరువాతి
కాలంలో రామాయణం మీద వ్యాఖానం చేస్తు ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి చెప్పినమాట
నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక తండ్రి కొడుక్కి మనియార్డరు చేశాడు డబ్బు పోస్టాఫీసుకి
పట్టుకెళ్ళి మనియార్డరు ఫారం నింపి ఓ ఐదు వందల రూపాయలు ఆ పోస్టు మాస్టరుకి ఇచ్చాడు
ఆయన పాపం చాలా అమాయకుడు తండ్రి ఆయన ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఈ డబ్బు పట్టుకుని
పరుగెత్తుకుంటూ వెళ్ళి కొడుక్కి ఇచ్చి వస్తాడనుకున్నాడు తండ్రి ఆయనేం చేశాడంటే ఈ
డబ్బు తీసుకొని టేబుల్ సొరుగులో వేసుకొని పూర్వం టెలిగ్రాఫిక్ మిషీన్ ఉండేది,
దాన్ని ఇలా టిక్ టిక్ టిక్ టిక్ కొట్టాడు, ఇయ్యన అలా నిల్చున్నాడు.
అయిపోయిందండి మీరు వెళ్ళండీ అన్నాడు, ఏమైపోయింది నేను ఇచ్చిన డబ్బులు నీ
టెబుల్ సొరుగులో వేసుకున్నావు అన్నాడు అంటే మీరు ఇచ్చిన డబ్బులు ఇక్కడే
కనపడుతుంటాయి కానీ మీ అబ్బాయికి అందేస్తాయి అన్నాడు, ఆయనకు అనుమానం వచ్చింది వీడు
దొంగా ఇలా చెప్పి డబ్బు పుచ్చేసుకుంటున్నాడని, పుచ్చేసుకొని ఇయ్యనే బయలుదేరాడు
వెళ్ళి నాన్నా ఐదు వందలు నీకు అందాయా అన్నాడు అదేమిటి నాన్నగారు నిన్న మధ్యాహ్నమే
ఇచ్చారు తీసుకొచ్చీ అన్నాడు, హన్నన్నా నా ఎదురుగుండా టేబుల్లో వేసుకున్నాడూ అతను
రాలేదూ నీకు ఎలా వచ్చిందిరా ఐదు వందలూ అన్నాడు. ఐదు వందలు ఇక్కడివి ఇక్కడే
కనపడుతున్నా ఇలా ఇలా అంటే అక్కడికి ఐదు వందలు వెళ్ళిపోతే నీ కంటికి
నమ్ముతున్నావే..? వేద ప్రమాణము చేసిన మంత్రముల వలన గారపిండి అక్కడే ఉన్నా తండ్రికి
దక్కిందని ఎందుకు నమ్మలేక పోతున్నావ్? శ్రార్ధమునకు వేదము ప్రమాణము, నీవు చూడలేదని
అపద్దాలు అనకు నీవు చూడలేదని వేదం చెప్పినటువంటి ప్రమాణాలని తప్పించి ప్రవర్తిస్తే
వేదానికి వచ్చేటటువంటి లోటేమీ ఉండదు పాడైపోయ్యేది ఎవడైనా ఉంటే నీవే పాడైపోతావు,
తప్పుడు మాటలు నీవు ప్రచారంచేసి పాటించకుండాపోయినందుకు నీవు పాడవుతావు నిన్ను
కన్నవాళ్ళు పాడౌతారు, నిర్మర్యాద స్తు పురుషః మర్యాద తప్పినవాడు వీడికి
కట్టుబాటు లేదంటారు నీవు ఇలాంటివే ఒప్పుకోనప్పుడు నీకు వేదంలో చెప్పిన ఏ కట్టుబాటూ
నీకు అక్కరలేదు అప్పుడు పశువుకీ మనిషికీ తేడాలేకుండా బ్రతుకుతావు పాపాచార
సమన్వితః పాపముతో కూడిన ఆచారమును అవలంభిస్తావు మానం న లభతే సత్సు
పెద్దలైనటువంటివారు ఎవ్వరూ గౌరవించనటువంటి ప్రవర్తన కలుగుతుంది భిన్న చారిత్ర
దర్శనః ప్రవర్తనా అనుమానాస్పదంగా ఉంటుంది.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
కామ వృత్త స్త్వయం లోకః కృత్స్నః సముప వర్తతే ! యద్వృత్తాః సన్తి రాజాన స్త
త్వృత్తాః సన్తి హి ప్రజాః !! రాజైనటువంటివాడే శాస్త్రాన్ని నమ్మకుండా వేదాన్ని నమ్మకుండా
తనిష్టమొచ్చినట్లు ఈ కంటికి కనపడేదే సత్యమని భోగాల్ని అనుభవించమని ఇష్టమొచ్చిన
ప్రచారాలుచేసి రాజ్యపరిపాలనచేస్తే ఆ ప్రభువు ఎటువంటివాడో ప్రజలు కూడా అటువంటివారే
తయారౌతారు ఇంక లోకంలో వ్యవస్థా అన్నమాట ఎక్కడ ఉంటుంది, ధర్మం అన్నది
కట్లుతప్పిపోతుంది లోకంలో శాంతి ఉండదు సత్యమ్ ఏవ ఈశ్వరో లోకే సత్యం పద్మాఽఽశ్రితా సదా ! సత్య
మూలాని సర్వాణి సత్యాన్ నాస్తి పరం పదమ్ !! సత్యమే ఈ లోకంలో సత్యమే ఈశ్వరుడు అన్న మాటకు
కట్టుబడటం చెయ్యవలసిన పనినిచెయ్యడం, చెయ్యవలసినపని అంటే వేదం ఏది చెయ్యమందో అది
చేయడం వేదం ఏది చెయ్యద్దు అందో అది చేయకుండా ఉండడం అదే సత్యం సత్యమ్ ఏవ ఈశ్వరో
లోకే సత్యం పద్మాఽఽశ్రితా సదా ! సత్య మూలాని సర్వాణి సత్యాన్ నాస్తి
పరం పదమ్ !! అటువంటి సత్యం
కన్నా పరంపర ఇంకొకటి లేదు అదియే లక్ష్మి అదియే సమస్తం కాబట్టి నేను అలాగే చేస్తాను
అసత్యసంధ స్య సతః చలస్య అస్థిర చేతసః ! నైవ దేవా న పితరః ప్రతీచ్ఛన్తీతి నః
శ్రుతమ్ !! ప్రతిజ్ఞకు కట్టుబడకా కదిలిపోయే మనస్సుతో వేదము చెప్పిన మాటను
నమ్మకుండా ప్రవర్తించేటటువంటివాడు పెట్టినటువంటి తద్దినంలో అన్నాన్నికూడా
పితృదేవతలు తినరని గుర్తుపెట్టుకో, లోపల నమ్మకం లేకుండా నీవు ఒక పూజచేస్తే నీవు
చేసిన పూజాపదార్థాన్ని దేవతలు కూడా స్వీకరించరు అని గుర్తుపెట్టుకో. నాకు తెలియక
అడుగుతున్నానూ... ఈ భూమి కర్మభూమి కర్మ భూమిమ్ ఇమాం ప్రాప్య కర్తవ్యం కర్మ య
చ్ఛుభమ్ ! అగ్నిర్ వాయు శ్చ సోమ శ్చ కర్మణాం ఫల భాగినః !! ఇక్కడ కర్మచేసే
దేవతలు కూడా పదవులను పొందారు, ఋషులు కర్మలుచేసి అంతటి సమ్మున్నతమైన స్థితినిపొందారు
నిందామ్యఽహం కర్మ పితుః కృతం తు ఇంత తప్పు మాటలు మాట్లాడుతున్నావే వేద
వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావే, శాస్త్రాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నావే,
ఇప్పటి వరకు నేను మా నాన్నగారు అన్ని మంచి పనులు చేశారని నమ్మి ఉండేవాన్ని నీలా
శాస్త్రాన్ని నమ్మనివాన్ని చేరదీసి మంత్రిగా ఎలా పెట్టుకున్నారో మా నాన్నగారు అని
అడిగాడు.
అడిగితే వశిష్టుడు గబగబా లేచాడు, లేచి అన్నాడు ఇలా చెప్తే నీవు లొంగుతావేమోనని
చెప్పాడు తప్పా జాబాలి అటువంటి వాడుకాడు, వేదాన్ని శాస్త్రాన్ని త్రికరణ శుద్ధిగా
నమ్మి ఆచరించినవాడు అందుకే మీ నాన్నపక్కన ఆ స్థితిలోన చేరగలిగాడు నాయనా! నీవు ఈ
మాటలు చెప్తే నమ్మి వస్తావేమోనని ఈ ప్రయోగం కూడా చేశాడు. అంటే నమ్మకం అన్నది
కదిలిపోకూడదు ఎవడు ఏది చెప్తే దానిని నమ్మకూడదు స్థిరంగా నిలబడి ఉండగలగాలి.
కాబట్టి నేను ఒక ధర్మం చెప్తాను వశిష్టుడు చెప్పన మాటలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి వశిష్టుడుచెప్తే రాముడు
కాదనకూడదు, ఎందుకంటే కులగురువు విద్యనేర్పినవాడు ఒక గురువు మాట్లాడారూ అంటే ఏదో
అనేయచ్చుగాబట్టి అందామని అనరు ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఈ సృష్టి
ఆవిర్భావం దగ్గర నుంచి నీ వరకు ఎందుకు రాజ్యం తీసుకోవలసి వచ్చిందో నీకు చెప్తాను తరువాత
నీవు మాట్లాడవచ్చు, నీవు రాజ్యం తీసుకోవు అని ఆయన ఏమీ అనరు ఆయన ఏమన్నారంటే ఈ
లోకమంతా జలమయమై ఉండేది, ఈశ్వరుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు జలములలోంచి భూమి పైకి
వచ్చింది ఆ భూమిని, పైకి వచ్చినప్పుడు మొట్ట మొదట బ్రహ్మదేవుడు ఉన్నాడట, ఆ బ్రహ్మ
దేవునికి మరీచుడు, మరీచునకు కష్యపుడు, కష్యపునకు సూర్య భగవానుడు, సూర్య భగవానుకి
వైవస్మవ మనువు, వైవస్మవ మనువుకి ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి
వికుక్షి, వికుక్షికి భానుడు, భానుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి ప్రుధువు,
ప్రుధువుకి త్రిశంకుడు శ్రిశంకుడికి దుంధి మారుడు దుంధి మారుడు, ఆయనకి
యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, ఆయనకి సుసంతి, ఆయనకి ధ్రువసంధి, ఆయనకి భరతుడు, ఆయనకి
అసితుడు, ఆయనకి సగరుడు, ఆయనకి అసమంజసుడు, ఆయనకి అంశుమంతుడు, ఆయనకి భగీరతుడు, ఆయనకి
కాకుత్సుడు, ఆయనకి రఘుమహారాజు, ఆయనకి కల్మషపాదుడు, ఆయనకి శంఖనుడు, ఆయనకి
సుదర్శణుడు, ఆయనకి ఆగ్నివర్ణుడు, ఆయనకి సీఘ్రకుడు, ఆయనకి మరువు, ఆయనకి
ప్రషిశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, ఆయనకి నహుషుడు, ఆయనకి నాభాగుడు, ఆయనకి అజుడు,
ఆయనకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకు నలుగురు.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ఇందులో ఇద్దరూ
ముగ్గురున్నవాళ్ళల్లో కూడా పెద్దవాడే పట్టం కట్టుకున్నాడు మీ వంశంలో ఆచారంగా
వస్తున్నదేదీ అంటే ఈ సృష్టి మొదలు నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆచారమేమిటంటే...
ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు రాజ్యపాలనచేస్తాడు, ఇంత గొప్పగా సృష్టి మొదట్నుంచి వస్తున్నటువంటి
ఆచారాన్ని ఒక వ్యక్తి వరంతో తిప్పడానికి అధికారం ఉంటుందా..? ఇంత పెద్ద ఆచారాన్ని
నీవు ఆలోచించి రాజ్యం విషయంలో ఒక నిర్ణయానికి రావలసింది. అంటే రాముడు అన్నాడు
ఎప్పుడైనా మనుష్యుడు శిరోధ్యార్యంగా ఆలోచించవలసినటువంటి విషయం ఆచార్యుడు తండ్రి
తల్లీ ఇందులో మీరు కుల గురువులు మాకు బుద్ధి నేర్పినవారు నాకు మీరు మొదటినుంచి
నేర్పిన బుద్ధి ధర్మాన్నిపట్టుకో కాబట్టి నేను నా పుత్ర ధర్మాన్ని పట్టుకున్నాను,
రెండు నేను అతిక్రమించనిది నా తల్లి నా కౌసల్య నీవు ధర్మమునందే ఉన్నావు నీవు
అడవులకు వెళ్ళమంది, నా ఇంకొక తల్లి కైకమ్మ వనవాసం చెయ్యమని ఆజ్ఞాపించింది, సుమిత్ర
వనవాసం చెయ్యమని లక్ష్మణున్ని పంపింది, నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని నియోగించాడు,
కాబట్టి నాకు ఎవరి మాట శిరోధార్యమో వారి ముగ్గురి మాట మేరకే ఈ అరణ్యవాసం
ప్రారంభమైంది కాబట్టి నేను వెనక్కు రావలసిన అవసరం నాకు కనపడ్డంలేదు, నేను వనవాసమే
చెయ్యవలసి ఉంది అదే సరియైన ధర్మం.
వశిష్టుడు మాత్రం ఏమంటాడండీ..! ఇప్పుడు ఇంక భరతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది,
పైగా అక్కడున్న పౌరుల్ని జానపదుల్ని అడిగాడు మీరేమీ అడగరేమని అంటే వాళ్ళన్నారు
మాకు రాముడు చెప్పింది సత్యంగా కనపడుతోంది, మేము ఏమీ అనమూ అన్నారు, ఆయనకి
కోపమొచ్చి ఆయన ఏమన్నారంటే..? ఇహ మే స్థండిలే శీఘ్రం కుశాన్ ఆస్తర సారథే ! ఆర్యం
ప్రత్యుషవేక్ష్యామి యావన్ మే న ప్రసీదతి !! అనాఽఽహారో నిరాఽఽలోకో ధన హీనో యథా
ద్విజః ! శేష్యే పురస్తా చ్ఛాలాయా యావన్ న ప్రతియాస్యతి !! నేను ఇక్కడే రాముడు ఇలా కూర్చుని ఉండగా ఈయన ముందు
దర్భలు పర్చుకుంటాను సూతుడా! అంటే సుమంత్రున్ని పిలిచి దర్భలు తెచ్చి పరు నేను ఈ
ఎదురుగుండా పడుకుంటాను నా ముఖం మీద గుడ్డ కప్పేసుకుంటాను నిరాహారున్ని నేను ఇంక
అన్నం తినను అంటే ఆమరణ నిరాహారదీక్ష మొదట మొదలు పెట్టినవాడు బహుషహా భరతుడేనేమో..?
కాబట్టి ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను తీనితోపాటుగా రాముడు పర్ణశాలలోంచి బయటికి
వెళ్ళడానికి అనుమతించను కాబట్టి నేను అడ్డంగా పడుకుంటాను, నా నుంచి దాటివెళ్ళాలి
పిల్లలనుంచి దాటివెళ్ళకూడదు కదా, చిన్న వయసున్నవాళ్ళ నుంచి పెద్దవయసున్నవాళ్ళు
ఎవ్వరూదాటరు. కాబట్టి
దాటివెళ్ళాలంటే ఘొరావు చేసినవాడు కూడా బహషహ మొదట భరతుడేమో. ఘొరావ్, fast and to death రెండూ భరతుడే ప్రారంభించినట్లు నాకు
తెలుస్తుంది. కాబట్టి నేను ఇలా పడుకుంటాను రాముడు రాజ్యం పుచ్చుకుంటాడో నా
మరణాన్ని కాంక్షిస్తాడో ఆయన ఇష్టం అన్నాడు.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
అంటే రాముడు
అన్నాడు నవ్వి ఉత్తిష్ఠ త్వం మహా బాహో మాం చ స్పృశ తథో దకమ్ నాయనా! నీవు
చాలా తప్పు మాట మాట్లాడుతున్నావు, తనని తాను రక్షించుకోవడానికి తన భుజబలాన్ని ప్రదర్శించకూడని
రీతిలో జన్మించిన బ్రాహ్మణుడువంటివాడు బలవంతుడు తన ఐశ్వర్యాన్ని లాగేసుకొని తిరిగి
ఇవ్వకపోతే అలా అడ్డంగా పడుకోవచ్చు. తప్పా నీవు క్షత్రియుడవు నేను ధర్మం మాట్లాడితే
నీవు అఁధర్మంగా పుచ్చుకోకపోతే అడ్డం పడుకుంటాను నేను నిరాహారదీక్ష చేస్తాను అని
అనచ్చా..! శరీరాన్ని శోషింపజేయకూడదు ప్రకృతికి విరుద్ధంగా చచ్చిపోయేవరకు అన్నం
తినను అనడం చాలా తప్పు కాబట్టి ఇప్పుడు నీవు తప్పు చేశావు, తప్పు చేశావు కాబట్టి ఆ
తప్పు నీయందు ఉండ కూడదు అంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ప్రాయశ్చితం అంటే ఆ
తప్పు పోవడానికి ఇంకో కర్మచేయాలి ఏ కర్మచేస్తే పాపమొచ్చిందో ఆ కర్మ యొక్క పాపం
పోవడానికి ఇంకోకర్మ చేయాలి, ఆ కర్మ ఒక్కసారి లేచికూర్చొని ఆచమనంచేయి నన్ను
ఒక్కసారిముట్టుకో అన్నాడు. అంటే ధార్మికున్ని ముట్టుకోవాలి, దేవతలు ఋషులు అందరూ
కూడా ఏమన్నారంటే రాముడు చెప్పిందే ధర్మం మేము ఇటువంటి సభ ఇప్పటివరకూ చూడలేదు,
ఇటువంటి కొడుకుల్ని చూడలేదు కానీ భరతా నీవు ఆయన చెప్పినట్టే నీరు ముట్టుకుని ఆచనమంచేసి
రామున్ని ముట్టుకో అన్నారు.
అనేసరికి భరతుడు లేచాడు ఆచమనంచేశాడు రాముడు అన్నాడూ విక్రీతమ్ ఆహితం క్రీతం
యత్ పిత్రా జీవతా మమ ! న తల్లోపయితుం శక్యం మయా వా భరతేన వా !! మా తండ్రిగారు
ఒక్కసారి అమ్మేసిందికాని మా నాన్నగారు కొన్నదికాని మా నాన్నగారు ఇచ్చేసిందికాని
మార్చే అధికారం మాకులేదు కాబట్టి నేను రాను అరణ్యవాసం చేస్తాను అనేన ధర్మ శీలేన
వనాత్ ప్రత్యాఽఽగతః పునః ! భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యాః పతి
రుత్తమః !! నేను
పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేస్తావంటావేమిటి అలా చెయ్యడానికి కుదిరేటటువంటి విషయం
కాదు, నేను మళ్ళీ 14 సంవత్సరములు పూర్తై వనము నుంచి తిరిగి వచ్చిన తరువాత మాత్రం ఈ
సోదరులతో కలిసి రాజ్యమేలుతాను అప్పటివరకు మాత్రం నేను రాను అన్నాడు. అంటూ భరతుడితో
ఒకమాట చెప్పాడు కామాత్ వా తాత లోభాత్ వా మాత్రా తుభ్యమ్ ఇదం కృతమ్ ! న తన్ మనసి
కర్తవ్యం వర్తితవ్యం చ మాతృవత్ !! అమ్మ ఏపని చేసిందో ఆ పనిలో దోషంచూసి దోషంచేసిందిని
అదేపనిగా కైకమ్మని నిందించడం మాత్రం నీవు చేయవద్దు అమ్మని గౌరవంగాచూస్తు అయోధ్యకువెళ్ళి
రాజ్యంచేసుకో ఈ మాటలన్నాక భారద్వాజ మహర్షి దగ్గర చెప్పాడు ఈ సర్గలో చెప్పరు కానీ వశిష్టుడు
త్రికాలవేది రాముడు రాడన్న విషయం వశిష్టుడికి తెలుసు అందుకు అతడు ఏం చేశాడంటే
భరతుడి బుద్ధి తెలుసు రాముడు బుద్ధి తెలుసు, మీరు ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి
ఇదే పాదుకా పట్టాభిషేకానికి పునాది. త్రికాలవేది అయినటువంటి వశిష్టుడికి రాముడి
యొక్క బుద్ధి తెలుసు భరతుడి యొక్క బుద్ధి తెలుసు.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
మీరు ఇది బాగాపట్టుకోవాలి
రాముని యొక్క బుద్ధి ధర్మము, భరతుని యొక్క బుద్ధి ధర్మము. రాముని ధర్మం
అరణ్యవాసంలో ఉంటాడు, భరతుడి ధర్మం రాముడికి సంబంధించిన రాజ్యం తను చేయడం కాబట్టి
ఇప్పుడు పరిష్కారమేమిటీ ʻన్యాసంʼ న్యాసమంటే ఏమిటీ? రాజ్యం రాముడిదే ఆయన
రాజ్యన్ని కొన్నాళ్ళు భరతుడు పరిపాలిస్తాడు, తనదనికాదు రాముని రాజ్యం 14 యేళ్ళు
చూస్తూవుండు నేను వస్తాను అన్నాడు, ఆయన వచ్చేదాక ఇయ్యన చూస్తూవుంటాడు. ఎంత
జాగ్రత్తగా చూస్తాడు ఆయన వచ్చిన తరువాత ఆయన రాజ్యాన్ని ఆయనకు బుద్ధితో
అప్పజెప్పేయాలి తప్పా నాది మాత్రం కాదు నాది కానిదాన్ని ఆయనదైనదాన్ని ఆయన కోసమని
ఆయనకు పరిపాలించి పెడుతున్నాను నేను ఆయన కింకరున్ని కాబట్టి ఇది ʻన్యాస బుద్ధీʼ అంటారు. ఇది
ఒక్కటే పరిస్కారం న్యాసం చేయించాలి అంటే రాజ్యం నీదే రామా... భరతుడు అందాకా 14
యేళ్ళు పరిపాలిస్తూ ఉంటాడు, సూన్యం కాకూడదు కదా మరి అందాక పరిపాలిస్తూ ఉంటాడు 14
యేళ్ళు నీదైన రాజ్యాన్నే పరిపాలిస్తాడు, నీదైన రాజ్యాన్నే పరిపాలిస్తాడు అంటే మరి
సంహాసనం కాబట్టి ఆయనేం చేశాడంటే ఆయనకు ముందే తెలుసు బంగారు పాదుకలు తీసుకొచ్చాడు,
తీసుకొచ్చి అక్కడ పెట్టి అన్నాడూ అధిరోహ ఆర్య పాదాభ్యాం పాదుకే హేమ భూషితే !
ఏతే హి సర్వ లోక స్య యోగక్షేమం విధాస్యతః !! అన్నయ్యా నీవు అక్కర లేదు
అన్నయ్యా నీ పాదుకలు చాలు. పాదుకా ʻగురు పాదుకాʼ అంటూంటాం. పాదుకా
తొక్కుతుంది నీ శరీరంతో తొక్కబడేది ఏదీ అంటే పాదమొక్కటే, మీగిలినవేవీ తొక్కబడవు
ఆయన పై బరువంతా పాదం మీదే ఉంటుంది పాదములతో తొక్కబడుతాయి, గురువుగారి యొక్క
శాశనమంతా లోపల ఉంటే గురు పాదుకలు తలమీద పెట్టుకోవడం గురుపాదుకలను పూజచేయడం అంటే
ఏమిటో తెలుసాండీ! తాను కింకరుడై గురువుగారి ఆజ్ఞనలని పాటించడమే తప్పా తనదైన మాట
ఒక్కటి కూడా తానుచెయ్యడు గురువుగారు చెప్పిన మాటేచేస్తాడు అందుకనీ ఇప్పుడు
అంటున్నాడూ అదిరోహ ఆర్య పాదాభ్యాం పాదుకే హేమ భూషితే నీవు అన్నయ్యా! బంగారు
పాదుకలు పెట్టాను ఒక్కసారి నీవు ఆ పాదుకల మీద ఎక్కి దిగిపో నీవు ఎక్కి దిగిపోయిన
పాదుకలు నాకు తలమీద పెట్టుకోవలసినవి తలా అత్యంత పూజనీయము పాదములు అత్యంత అశుద్ధతతో
ఉంటాయి, అసుచితో ఉంటాయి అందుకే కదాండి ఎక్కడికైనా వెళ్ళితే కాళ్ళు కడుక్కుంటాం.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ఇది తల ఒక ఎక్ట్రీమ్
పైకి ఉంటుంది పాదములు అతి కిందకి ఉంటాయి, పెద్దలైనవారు కనపడినప్పడు ఇక్కడ ఉన్న తలా
వారి పాదములకు తగిలేటట్టుగా నమస్కారంచేస్తారు ఎందుకని ఈ తలకి అభ్యున్నతి ఆ
పాదములయందు ఉంది ఆయన తపః శక్తిలో ఉంది, ఆ తపః శక్తితో కూడినటువంటి పాదములకు తల
తాకిస్తే..? వికారమైన ఆలోచనలు విరిగిపోతాయి, పాలకు ఉప్పురాయి తగిలితే విరిగినట్లు
విరుగుతాయి విరిగి మంచి ఆలోచనలు కలిగి సక్రమంగా ప్రవర్తిస్తాడు అందుకని తలకు
పాదములను తాకిస్తాడు, కాబట్టి నీ పాదములే ఎప్పటికి కావాలి వాటికి తల తాకించి నేను
పాలించాలి, నీదైన రాజ్యాన్ని నమస్కారంచేసి నీ పాదములు వేరుగా రావు ఇప్పుడు
ఎందుకంటె పాదములు అరణ్యంలో తిరిగుతున్నాయి, నీ పాదములకు నీ పాదుకలకు అభేదం. కాబట్టి
నీ పాదములకు బదులు నీ పాదుకలు తీసుకెడుతాను ఎక్కి దిగిపో నీ పాదములే నాకు రక్ష.
గురు పాదుకలు ఎలాగో అలాగా నీవు కూర్చున్నావంటే రాముడు కూర్చున్నాడు అంటే ఏం
చెప్పినా ఎలాచెప్తారు, రామా ఎం చేస్తున్నావు అనరుగా... ఆయన పాదాలకు నమస్కారంచేసి
పూజనీయుడని మాట్లాడుతారు, ఈ పాదుకలు సింహాసనంలో పెడుతాను రామా! మీరు ఉన్నట్లే
సింహాసనంలో పాదుకలు సింహాసనంలో ఉంటాయి నేనో పక్కన కింద కూర్చుంటాను, ఏం చేసినా ఎం
చెప్తాను ఈ పాదుకలకు చెప్తాను రామా ఇలా అంటున్నారు ఇలా చేస్తా అయితేనూ అంటాను నాకు
అప్పటికి చెయ్యి అని అనిపిస్తే నాకు నీవు చెయ్యిమని చెప్పినట్లు అది చెయ్యమని
చెప్తాను వద్దూ అనిపిస్తే రాముడు చెయ్యొద్దుని చెప్తాను.
కాబట్టి చెయ్యొద్దని చెప్తాను నా బుద్ధితో నేను ఏమీ చెయ్యను, మీ పాదుకలకు
చెప్తాను మీ పాదుకలకు చెప్పడం మీకు చెప్పడమే అలా చేస్తాను రామా! ఒక్కసారి ఎక్కి
దిగండీ! ఎవరు తెచ్చారు ఈ పాదుకలు వశిష్టుడు తెచ్చాడు కుల గురువు తెచ్చాడు, వశిష్టుడు
తెచ్చాడు ఇప్పుడు రాముడు ఆ పాదుకల మీద పాదములు పెట్టి కిందకి దిగిపోయాడు. ఎక్కి
దిగిపోతే భరతుడు ప్రతిజ్ఞ చేశాడట అక్కడే
స పాదుకే సంప్రణమ్య రామం వచన మబ్రవీత్ ! చతుర్దశ హి వర్షాణి జటా చీర ధరో హ్యఽహం !!
ఫల మూలాఽశనో వీర భవేయం రఘు నందన ! తవాఽఽగమన మాఽఽకాంక్షన్ వస న్వై
నగరా ద్భహిః !!
తవ పాదుకయో ర్న్యస్త రాజ్య తంత్రః పరంతప ! చతుర్దశే హి సంపూర్ణే వర్షేఽహని రఘూత్తమ !!
న ద్రక్ష్యామి యది
త్వం తు ప్రవేక్ష్యామి హుతాశనం !
14 సంవత్సరముల పాటు నేను అయోధ్యలో రాజ్యం చెయ్యను అయోధ్యలో ఉంటే సింహాసనం
ఉంది, ఇప్పుడు సింహాసనం ఖాలీగా ఉంది అక్కడ కూర్చుంటే రాముడు లేడు రాముడు లేడు అన్న
భావనే వస్తుంది, అందుకని నేను ఏం చేస్తాను నేను అక్కడ ఉండను నేను వస న్వై నగరా
ద్భహిః నగరమునకు బయట ఉంటాను, అయోధ్యకు బయట నంది గ్రామంలో ఉంటాను అక్కడా ఒక
సింహాసనాన్ని పెడతాను అందులో ఈ పాదుకలు పెడతాను నాదీ అని నేను పాలించను భరతుడికి
రాజ్యం ఇచ్చేశాను భరతుడు రాజ్యం చేస్తున్నాడని నీవు అనకూడదు, నీ రాజ్యానికి నీవు
వచ్చేవరకు నేను చూస్తూ ఉంటాను అంతే. నీది నీదైనదాన్ని నాదిగా చూస్తుంటాను, నీవు
రాగానే నీది నీకు ఇచ్చేస్తాను ఎన్నేళ్ళు చూస్తాను పధ్నాలుగేళ్ళూ చూస్తాను 14
సంవత్సరములు పూర్తైన మరునాటి సూర్యోదయానికి నీవు కనపడకపోతే అగ్నిహోత్రంలో
దూకేస్తాను.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
కాబట్టి అన్నయ్యా!
ఇది మనిద్దరి మధ్య ఒడంబడిక అని అవితీసుకెళ్ళి మొట్ట మొదట ఏనుగు యొక్క కుంభస్థలం
మీదపెట్టాడు, అంటే మహారాజు పట్టాభిషేకం అవగానే ఏనుగు మీద కూర్చోవాలి కాబట్టి
ఏనుగుమీద పెట్టాడు తరువాత తీసి రథంలో తానుకూర్చున్నా రథంలో పెట్టలేదు ఆ పాదుకల్ని
తలమీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు తతః శిరసి కృత్వా తు పాదుకే భరత స్తదా !
ఆరురోహ రథం హృష్టః శత్రుఘ్నేన సమన్వితః !! శత్రుఘ్నునితో కలిసి శత్రుఘ్నున్ని
పక్కన కూర్చో పెట్టుకుని పాదుకల్ని తల మీద పెట్టుకుని రథం మీద కూర్చున్నాడు
ఎందుకని ప్రభువుతో సమానంగా తను కూర్చోకూడదు, రథంలో పెట్టినప్పుడు ఎక్కడ కూర్చున్నా
ప్రభువుతో సమానం అవుతుంది. అందుకని రథంలో పక్కన పెట్టుకోలేదు పాదుకల్ని రథంలో
కూర్చుని తలమీద పెట్టుకున్నాడు అంటే ఆయన ఉన్నతంగా కూర్చున్నాను నేను కింద
కూర్చున్నాను, నేను కింకరున్ని ఇప్పుడు ఆ పాదుకలు పట్టుకుని ఇంటికి వెళ్ళాడు వసిష్ఠో
వామదేవ శ్చ జాబాలి శ్చ దృఢ వ్రతః ! అగ్రతః ప్రయయుః సర్వే మన్త్రిణో మన్త పూజితాః
!! ఇటువంటి ఋషులందర్నీ పిలిపించారు, నేను ఇంక ఈ అయోధ్యా నగరంలో ఉండలేను బయట
ఉన్నటువంటి నంది గ్రామంలో నేను రాజ్యం చేస్తాను నా తమ్మునితో కలిసి అక్కడికి
వెళ్ళిపోతాను, నేను కూడా జటలు కట్టుకుని సింహాసనం మీద ఈ పాదుకలు పెడతాను వీటికి
తెల్లటి గొడుగుని అలంకారం చేస్తాను తెల్ల గొడుగుకింద ఈ పాదుకలు ఉంటాయి అంటే రాముడు
సింహాసనం మీద తెల్లగొడుగుకింద రాజా రాముడై కూర్చున్నాడని గుర్తు, నేను రామ
పాదములకే నమస్కరిస్తున్నానని పాదుకలకు నమస్కరిస్తాను, దీనికే ఛామరం వేస్తాను
దీనికే ఛత్రం పడతాను ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్తాను ప్రతి విషయాన్ని పాదుకలకే
చెప్పి రాజ్యం చేస్తాను ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి పాదుకా పట్టాభిషేకం
అన్న మాటలో ఉన్న గొప్పతనం మీకు అర్థమైతే మీకు కాదు మీ వంశం ఆఁచంద్ర తార్కము
శ్రీరామ రక్ష.
మనం ఒకమాట అంటూంటాం “శ్రీరామ రక్ష” “నూరేళ్ళు ఆయుస్సు” అంటూంటాం. శ్రీరామ రక్ష
అన్నమాట ఎక్కడనుంచి వస్తుందో తెలుసాండీ, పాదుకా పట్టాభిషేకంలో ఉంది ఆ మాట ఎలా
వస్తుందో మీరు బాగాపట్టుకోండి అప్పుడు మీరు పాదుకలు తలమీద పెట్టుకుంటే మీకానుగ్రహం
కలుగుతుంది. ఇప్పుడు పరిపాలిస్తున్నవేవి పాదుకలు ఆ పాదుకలు ఎవరివి రాముడివి,
రాముడు రాజ్యం చేస్తున్నాడు రాముడు తిన్నగా శాసనం చేస్తున్నాడా... రాముడు కూర్చుని
అధికార పత్రాల మీద సంతకాలు పెడుతున్నాడా... రాముడు మాట్లాడుతున్నాడా ఇది చాలా
కీలకమైన ఘట్టం మీరు నేను చెప్పేదానిమీద శ్రద్ధపెట్టండి రాముడు మాట్లాడుతున్నాడా..!
రాముడు మాట్లాడడు రాముడు శాసనాల మీద సంతకాలు పెడుతున్నాడా పెట్టడు, రాముడు తీర్పు
చెప్తాడా చెప్పడు మరి ఎవరు చేస్తారు ఈ పనులన్నీ భరతుడుచేస్తాడు, కాని భరతుడు ఎలా
చేస్తాడు నాది రాజ్యమని చేయడు ఎవరిది రాజ్యమని చేస్తాడు రాముడిది రాజ్యమని
చేస్తాడు రాముడిది రాజ్యమైతే మరి రాముడేడి సింహాసనంలో రామ పాదుకలే రాముడు కాబట్టి
రామ పాదుకలు అక్కడ పెట్టి రామ పాదుకలకి చెప్తాడు అన్నీ, రామా! ఇదిగో ఇలా
చేస్తున్నాను అన్నీనూ, రామా! ఇవ్వాళ ఇలా శాసనం చేస్తున్నాను రామా! ఇవ్వాళ ఇలా ఆజ్ఞ
ఇస్తున్నాను అని అన్నిటినీ కూడా... రామ చంద్ర మూర్తికే చెప్తున్నానన్న భావనతో ఆ
సింహాసనంలో పాదుకలు పెట్టి రామునికి చెప్తున్నానని చెప్తాడు. ఇప్పుడు రాజ్యము
రామునియందు న్యాసమైనది అంటారు, న్యాసమైనదీ అంటే? తనదేగా అందరికి కనపడుతున్నది
తనదిగా వాడుకోడు, రామునిది అంటాడు మరి నీవెందుకు పరిపాలిస్తున్నావు రాముడు నన్ను
పరిపాలించమన్నాడు కాబట్టి పరిపాలిస్తున్నాను.
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ఇది ఎక్కడుండాలో
తెలుసాండి ఈ పాదుకా పట్టాభిషేకం ప్రతివ్యక్తి యొక్క హృదయంలో ఉండాలి. ఇప్పుడూ నేను
ఉన్నాననుకోండీ నేను రామాయణం ఉపన్యాసం చెప్తున్నాను, ఇప్పుడు ఏదో ఓ 42 రోజులు ఈ
ఉపన్యాసాలుచెప్పి నేను వెళ్ళిపోతాను ఈ ఊరినుంచి నేను ఈ ఊరి నుంచి
వెళ్ళిపోయేటప్పుడు ఎవరో వేదిక మీదకి ఆకరి రోజున వచ్చి కోటేశ్వరావు గారు 42 రోజులు
సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేశారు అన్నారనుకోండీ చేశానా లేదా చేశాను 42 రోజుల
సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేశాను అవును నేనే చేశాను అని అనుకోకూడదు నేను లోపల
ఏమనుకోవాలో తెలుసా? ఈశ్వరా నాలోపల వాయువు నీవై నా నాలుక మీద సరస్వతివి నీవై నా
కంటిచేత శ్లోకాన్ని చూడగలిగిన శక్తివి నీవై నా నాభి నుంచి లాగినటువంటి ఊపిరి
వాక్కుగా మార్చి 500 సర్గలలో నిక్షిప్తమైనటువంటి రామాయణ కథనంతటిని రెండున్నర గంటలు
మాట్లాడినా నా డొప్పలు నొప్పెట్టకుండా నన్నుకాపాడి నా చేతపలికించి కోటేశ్వరరావు
రామాయణం చెప్పారన్న కీర్తిని నాకు కట్టబెట్టీ నాలోనుండి పలికిన రామా నీవు రామాయణం
పలికినవాడివి అని నేను అనాలి, అని ఇలా నేను అంటే పలికెడిది భాగవతమట పలికించు
విభుండు రామ భద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాద పలుగనేలా? నేను
రామాయణం చెప్పాను అనకూడదు, రామాయణం నాచేత నా స్వామి చెప్పించి నన్ను ధన్యున్ని
చేశాడు. అలా అనకండి అలా అనకుండి అలా అన్నివ్వని వాళ్ళు అంటారు 42 రోజులు కోటేశ్వర రావుగారు
రామాయణం చెప్పారంటారు ఓ నవ్వు నవ్వాలి, రేపు ఉదయం సంధ్యావందనం చేసుకునేటప్పుడు
రామా! నిన్నటిరోజున నాతో పట్టాభిషేకం చెప్పించారు, స్వామీ ఇవ్వాళ అనుసూయా ఘట్టం
కూడా చెప్పించి నన్ను ధన్యున్ని చేయండి స్వామీ అని అడగాలి.
అంతేకాని నిన్న నేను ఎంతబాగా చెప్పానో చూశావా నీ
కథా అనకూడదు ఇది న్యాసం అంటారు న్యాసం అంటే నిక్షేపించుట బుద్ధిని నిక్షేపించాలి
నాది అనకూడదు వాడిది అనాలి వాడిదైనది నాచేత చెప్పబడుతూంది, వాడిదైనది నాచేత
అనుభవించబడుతుంది వాడిదైనది నాచేత పరిపాలింపబడుతూంది ఓ వెయ్యి రూపాయలు ఇచ్చాననుకోండి
నేనిచ్చానని అనకూదు పైకి, పైకి నేను ఇచ్చాను అనాలి, కోటేశ్వర రావుగారు వెయ్యి
రూపాయలు ఇచ్చారటా! ఆ.. అనాలి అంతే, లోపల ఈశ్వరుడు నాకు వెయ్యిరూపాయలు ఇచ్చీ నాచేత
వెయ్యిరూపాయలు అయనచేత నాకు ఇప్పించి నాకు ఇచ్చాడన్న పుణ్యాన్ని నాకు కల్పించాడు
ఈశ్వరుడు ఇప్పిచ్చాడు నేను ఇవ్వడమేమిటండీ..? అనుకోవాలి. అన్నీ న్యాసంచేస్తారు
ఎదురుగుండా కనపడుతున్నాడా రాముడు వచ్చి కూర్చొని రామాయణం చెప్తూ కనపడ్డాడా! కనపడడు
లోపల ఉన్నాడు న్యాసంచేయబడి పాదుకగా ఆయన కాలి చెప్పుగా నేను ఉన్నాను, కాలి చెప్పుగా
నేను ఉండడం నా బుద్ధిని నేను న్యాసంచేస్తే ఆ చెప్పుకు చెప్పగలినటువంటి అదృష్టం
నాకు కలుగుతుంది ఇది పాదుకా పట్టాభిషేకం అంటే, తాను పరిపాలిస్తున్నా తనదికాదని
పరిపాలిస్తాడు మీరు ఏది చేసినా అలాగే చెయ్యాలి, ఇంట్లో మీరో ఇల్లు కట్టుకున్నారు
ఈశ్వరుడు ఇచ్చాడండీ అనాలి ఇంట్లో ఓ పరమాన్నం తిన్నారు ఈశ్వరుడు ఇవ్వాల
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
పరమాన్నం తినేభాగ్యం
కల్పించాడండీ అనాలి పైకి అనక్కర లేదు అంటే పిచ్చాడు అనుకుంటారు లోపల అనుకుంటూండాలి
ఏది చేసినా బాగా నిద్రపట్టింది ఈశ్వరుడు ఎంత గొప్ప నిద్రపట్టించాడయ్యా రాత్రీ
అనుకోవాలి లేచారు ఈశ్వరుడు ఇవ్వాళ ఓపికిచ్చి సకాలంలో కూర్చుని సంధ్యావందనంచేసుకునే
భాగ్యమిచ్చాడు కదా, ఇవ్వాళ నేను ప్రాయశ్చిత్తంతో కాకుండా వేళపట్టున ఆర్ఘ్యప్రధానం
చేశాను నాలుగుమాట్లు ఆర్ఘ్య ప్రధానం చేయకుండా ఉండే భాగ్యం నాకు కల్పించాడు
అనుకోగలగాలి. ఏది చేస్తున్నా బుద్ధిని ఆయనయంది న్యాసం చెయ్యాలి ఈ న్యాసం
చెయ్యడానికి ఏమని పిలుస్తారంటే ʻశ్రీ రామ పాదుకా పట్టాభిషేకంʼ అని పిలుస్తారు.
యదార్థంగా పట్టాభిషేకంచేస్తే బుద్ధితో పనేముందండీ... ఎదురుగుండా రామున్ని
కూర్చోబెట్టి నీళ్ళుపోస్తారు ఆ నదీ జలాలు ఆఖరి రోజున సంపూర్ణ రామాయణం ప్రవచనం
పూర్తైపోయిన తర్వాత అభిషేకం జరుగుతుంది. అప్పుడు జరిగేటప్పుడు నదీ జలాలతో రాముడికి
నిజంగా అభిషేకం జరుగుతుంది. ఇప్పుడో రాముడు ఉండడు రామ పాదుకలు ఉంటాయి, రాముడు
ఉండడా రాముడే రామ పాదుకలుగా ఉన్నాడా, రాముడే రామ పాదుకలుగా ఉన్నాడు, అవన్నీ
పాదుకలవి పాదుకలని నీవని నీవు అనుకుంటున్నావు నావికావు ఇవన్నీ నీవేతండ్రీ నీ
చెప్పు నా తలమీదకు వస్తే నా బుద్ధిలో మార్పువస్తుంది, నాదన్న అహంకారం
విరిగిపోతుంది నీదన్నభావన బయలుదేరుతుంది ఈ భావన బయలుదేరగానే నేను పుణ్యాత్ముడను అవుతాను
నా బుద్ధిలో పరిశుద్ధి కలుగుతుంది ఇది కోరడము పాదుకా పట్టాభిషేకం. అందుకే అష్టాదశ
పురాణాలలో ఏ కావ్యంలో రామ భరతులలాగా ఇంత ప్రేమతో పాదుకా పట్టాభిషేకంచేసి 14
సంవత్సరములు రాజ్యపాలన చేసినా నాదన్న భావనలేకుండా రాజ్యాన్ని పరిపాలించి
రాజ్యాన్ని తరించిన మహాపురుషుడు భరతుడు. అందుకే శ్రీరామాయణంలో అత్యద్భుతమైన ఘట్టం
శ్రీ రామ పాదుకా పట్టాభిషేకం ఆ పాదుకా పట్టాభిషేకమే ఇప్పుడు జరుగబోతోంది.
ఇప్పుడు ఆ పాదుకలని తలమీద పెట్టుకొని మేళతాలాలతో తీసుకొని వస్తారు ఆవాహన
చేసినటువంటి నదీ జలాలతో నిండినటువంటి పూర్ణ కుంభాన్ని బ్రహ్మస్థానంలో
ఉండేటటువంటి వ్యక్తి ఆ కుంభాన్నిపట్టుకుని
వస్తారు ఆ వెనకాల బ్రాహ్మణులు స్వస్తిచెప్తూ వస్తారు ఎందుకంటే ప్రభువు
పట్టాభిషేకానికి వస్తున్నట్లు ఆ వెనక తలమీద పెట్టుకుని యజమానులు ʻయజమానిʼ అన్నమాట మీరు
జాగ్రత్తగా పట్టుకోవాలి. యజ్ఞముచేసే స్వభావమున్నవాడైతే యజమాని అని పిలుస్తారు. ఆయన
తలమీద పెట్టుకుని ఆ పాదుకల్ని తీసుకొని వస్తారు తీసుకొని దేవాలయానికి ప్రదర్శన
పురస్కరంగా వస్తారు వచ్చి ఈ సింహాసనంలో ఆ పాదుకల్ని చక్కగాపెడతారు. పెట్టిన తరువాత
రామ చంద్ర మూర్తికే పూజజరిగితే ఎలా ఉంటుందో ఆ పాదుకలకిపూజ కాని అది రామ చంద్ర
మూర్తికేపూజ. రామ చంద్ర మూర్తికే పూజ జరిగిందనుకోండీ ఆయన పాదాలు మీ తల మీద
పెట్టుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే మీరు ఆయన పాదాలు ఎత్తితే మీరు ఆ పాదల కింద తల
దూర్చాలి పాదుకా పట్టాభిషేకంలో ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసాండీ? పాదుకలను తీసుకొచ్చి
అక్కడ పెట్టిపూజచేస్తారు పూజచేస్తే మీరు హాయిగా సంతోషంగా ఇవ్వాళ సభకు వచ్చినటువంటి
ప్రతి ఒక్కరి తల మీదా కూడా ఆ పాదుకలనుపెట్టి పంపిస్తారు. దానివల్ల ఏమౌతుందంటే
కొన్ని కోట్లజన్మల నుంచి నేను నేను అన్న అహంకారంతో మనం ప్రవర్తించడంవల్ల
కలిగినటువంటి పాపం ఏదుందో... ఆ పాపం విరిగిపోయి రామ చంద్ర మూర్తి యొక్క
పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. ఇప్పుడు తెల్లగొడుగు కింద రామ పాదుకలు
కూర్చుంటున్నాయి అంటే రామ చంద్ర మూర్తియే రాజై కూర్చుంటున్నారు అనిగుర్తు.
కాబట్టి భరతుడు ఈ మాటచెప్పి భరతః శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్
అన్ని శాసనములు భరతుడే చేశాడు 14 యేళ్ళు ఎలా చేశాడు పాదుకాభ్యాం న్యవేదయత్
పాదుకలకి ఆ విషయాలను చెప్తూచేశాడు. కాబట్టి సవాలభ్య జనం క్షత్రం ధారయా మాస స
స్వయం భరతః శాసనం సర్వం ఆయనే క్షత్రంపట్టాడు గొడుగుపట్టాడు తెల్లగొడుగు,
ఆయనే క్షామరం వేశాడు ఇప్పుడు మీరు చూద్దురుగాని ఎంత శోభస్కరంగా వస్తాయో పాదుకలు
వచ్చేటప్పుడు మీరు దర్శనంచేయండి. ఒకరు తలమీద పెట్టుకుంటారు వేరొకరు తెల్లటిగొడుగుపడతారు
ఆ పాదుకలకి వేరొకరు ఛామరంవేస్తారు ఛామరంవేస్తూ ఆ పాదుకలని తీసుకుని వస్తారు
ఆపాదుకలన్ని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెడుతారు, కూర్చోబెట్టి వాటిని ఆవాహన
అభిషేకం, అభిషేకం లఘువుగా ఆ నదీ జలాలని ప్రోక్షించి చేస్తారు చేసిన తరువాత నామమలుచెప్తూ
ఆ పాదుకలకిపూజ జరుగుతుంది పూజ జరుగుతున్నంత సేపు కేవలం చూస్తూ కర్చోవడంకాదు మనందరు
కూడా పరమ సంతోషంతో ఎన్ని కోట్ల సంవత్సరముల తర్వాత శ్రీ రామ పాదుకా పట్టాభిషేకం
చూసి ఆ పాదుకలు తల మీద పెట్టుకునేటటువంటి భాగ్యం మనకు కలిగిందో కాబట్టి మనందరం
కూడా శ్రీ రామాయ నమహాః అంటాం. రేపటి రోజున సతీ అనసూయ సీతమ్మ కలుసుకుంటారు,
అనసూయమ్మ అంటే ఏమిటో మీరు విందురుకాని అనసూయమ్మను ఆవాహనచేసి రేపు కూడా సీతా రామ
కళ్యాణాన్ని మళ్ళీ చెప్తుంది సీతమ్మ మళ్ళీ అక్కడ కొత్త రహస్యాలను చెప్తుంది.
చెప్పిన తరువాత ఇక్కడ ఒక సహాసినిని తల నిటారుగా ఉన్న ఒక సతి అనుసూయగా తీసుకొచ్చి
కూర్చోబెట్టి పూజచేస్తారు ఇప్పుడు మనందరం కూడా చక్కగా రామ నామం చెప్పుకుందాం ఆ
పాదుకలు వస్తాయి. మీకు నోటికి వచ్చిందే కాబట్టి చెప్తూ ఆ కన్నులు మాత్రం ఆ
వస్తున్నటువంటి పాదుకల వైభవాన్ని చూడండి, చూస్తుంటే ఆ పాదుకలు పట్టుకొని వస్తారు
మనందరం రామ నామం చెప్పుదాం. ఇక ఇవ్వాళ్టికి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేసినట్లే.
మంగళం మహత్ శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మణమస్తు...
శ్రీ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
శ్రీ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
దారినొంటిగ నడుచు వారికి తోడునీడే రామ నామము !! రా !!
అమ్మా గుర్తుపెట్టుకోండి ఎవరూ లేచినిలబడి ఉండకూడదు ఈశ్వరుడు వచ్చేటప్పుడు
కూర్చుని ఉండాలి, ఆ పాదుకలు ఇక్కడికి వచ్చిన తరువాత అందరూ ఒక్కసారి లేచినిలబడండి ఆ
తరువాత సింహాసనంలో కూర్చోబెట్టిన తరువాత ప్రభువు కూర్చుని ఉండగా ఎవ్వరూ సభలోనిలబడి ఉంటే
మహాపాపము సంక్రమిస్తుంది. ప్రభువుముందు నిలబడి ఉండకూడదు కూర్చుని ఉండాలి ఆసనాల్లో
కాబట్టి ఆయన పాదుకలను సింహాసనంలో పెట్టగానే ఎక్కడవాళ్ళు అక్కడే కూర్చోండి చోటులేకపోతే
నేల మీదైనా కూర్చోండి తప్పా నిలబడివుండకండి అందుకని ఆ పాదుకా పట్టాభిషేకం సమయంలో
లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు అందుకని ఎక్కడివాళ్ళు అక్కడే నిలబడండి నేను
నిలబడుతాను మీరు నిలబడుదురుకాని
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
పసితనంబున అభ్యసించిన
పట్టుబడు శ్రీ రామ నామము !! రా !!
పంచభూతాతిపరమగు పరమాత్మ తత్వము శ్రీ రామ నామము !! రా !!
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
శ్రీ రామ అష్టోత్తరాలు పలకండి :
ఓం
కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని మూడు సార్లు జలం తాగాలి).
ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్టవేనమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అనుకుని కాసిన్ని నీళ్ళు తలపై
చల్లుకోవాలి)
ఓం శ్రీరామాయ
నమః ఓం రామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం రాజీవలోచనాయ నమః ఓం
శ్రీమతే నమః ఓం రాజేంద్రాయ నమః ఓం రఘుపుంగవాయ నమః ఓం జానకివల్లభాయ నమః ఓం జైత్రాయ
నమః (10) ఓం జితామిత్రాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం విశ్వామిత్రప్రియాయ
నమః ఓం దాంతయ నమః ఓం శరనత్రాణ తత్సరాయ నమః ఓం
వాలిప్రమదనాయ నమః ఓం వంగ్మినే నమః ఓం సత్యవాచే నమః ఓం సత్యవిక్రమాయ నమః(20) ఓం సత్యవ్రతాయ నమః ఓం
వ్రతధరాయ నమః ఓం సదాహనుమదాశ్రితాయ నమః ఓం కోసలేయాయ నమః ఓం ఖరధ్వసినే నమః ఓం
విరాధవధపందితాయ నమః ఓం విభి ష ణపరిత్రాణాయ నమః ఓం హరకోదండ ఖండ నాయ నమః ఓం సప్తతాళ
ప్రభేత్యై నమః ఓం దశగ్రీవశిరోహరాయ నమః ఓం
జామదగ్న్యమహాధర్పదళనాయ నమః(30) ఓం
తాతకాంతకాయ నమః ఓం వేదాంత సారాయ నమః ఓం వేదాత్మనే నమః ఓం భవరోగాస్యభే షజాయ నమః ఓం
త్రిమూర్త యే నమః ఓం త్రిగుణాత్మకాయ నమః ఓం త్రిలోకాత్మనే నమః || 40
|| ఓం
త్రిలోకరక్షకాయ నమః ఓం ధన్వినే నమః ఓం దండ కారణ్యవర్తనాయ నమః ఓం అహల్యాశాపశమనాయ
నమః ఓం పితృ భక్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం జితేఒద్రి యాయ నమః ఓం జితక్రోథాయ నమః ఓం
జిత మిత్రాయ నమః ఓం జగద్గురవే నమః || 50|| ఓం
వృక్షవానరసంఘాతే నమః ఓం చిత్రకుటసమాశ్రయే నమః ఓం జయంత త్రాణవర దాయ నమః ఓం
సుమిత్రాపుత్ర సేవితాయ నమః ఓం సర్వదేవాద్ దేవాయ నమః ఓం మృత వానరజీవనాయ నమః ఓం
మాయామారీ చహంత్రే నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాభుజాయ నమః ఓం సర్వదే వస్తుతాయ నమః || 60
|| ఓం
సౌమ్యాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం మునిసంస్తుతాయ నమః ఓం మహాయోగినే నమః ఓం మహొదరాయ
నమః ఓం సుగ్రీవే ప్సిత రాజ్యదాయ నమః ఓం సర్వ పుణ్యాదేక ఫలినే నమః ఓం స్మ్రుత
స్సర్వోఘనాశనాయ నమః ఓం ఆది పురుషాయ నమః ఓం పరమపురుషాయ నమః ఓం మహా పురుషాయ నమః || 70
|| ఓం
పుణ్యోద యాయ నమః ఓం దయాసారాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం స్మితవక్త్త్రాయ నమః ఓం
అమిత భాషిణే నమః ఓం పూర్వభాషిణే నమః ఓం రాఘవాయ నమః ఓం అనంత గుణ గంభీరాయ
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
నమః ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః || 80
|| ఓం
మాయామానుషచారిత్రాయ నమః ఓం మహాదేవాది పూజితాయ నమః
అయోధ్య కాండ పదమూడవ
రోజు ప్రవచనము
|
|
ఓం సేతుకృతే నమః ఓం జితవారాశియే నమః ఓం సర్వ తీర్ద మయాయ నమః
ఓం హరయే నమః ఓం శ్యామాంగాయ నమః ఓం సుంద రాయ నమః ఓం శూరాయ నమః ఓం పీత వాసనే నమః || 90
|| ఓం ధనుర్ధ
రాయ నమః ఓం సర్వయఙ్ఞాధీపాయ నమః ఓం యజ్వినే నమః ఓం జరామరణ వర్ణ తాయ నమః ఓం విభేషణప్రతిష్టాత్రే
నమః ఓం
సర్వావగునవర్ణ తాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం పరస్మై బ్రహ్మణే నమః ఓం సచిదానందాయ నమః
ఓం పరస్మైజ్యోతి షే నమః || 100 || ఓం పరస్మై ధామ్నే నమః ఓం పరాకాశాయ నమః ఓం
పరాత్సరాయ నమః ఓం పరేశాయ నమః ఓం పారాయ నమః ఓం సర్వదే వత్మకాయ నమః ఓం పరస్మై నమః || 108
||
No comments:
Post a Comment