Wednesday, 25 January 2017

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అరణ్య కాండ 17వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Aranya Kanda 17th Day

అరణ్య కాండ


పదహేడవ రోజు ప్రవచనము




నిన్నటి రోజు కార్యక్రమం పూర్తిచేసే సమయానికి శూర్ఫణఖ రామ చంద్ర మూర్తిని దర్శించినటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుచేసి ఉన్నాము. ప్రాతఃకాలంలో అంత హేమంత ఋతువులో కూడా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, సాధారణంగా లోకమంతా కూడా ఆ సమయంలో విశ్రాంతి తీసుకుందాం బయటికి వెళ్ళద్దూ చలికి వణికిపోతున్నామనేటటువంటి సమయంలో కూడా ఏనుగులు జలచరాలు కూడా నీటియందు ప్రవేశించడానికి భయపడేటంతటి చల్లటి వాతావరణంలో కూడా ధార్మికనిష్టా అంటే ధార్మికనిష్టే. ఏది ఏ సమయంలో చెయ్యాలో అది ఆ సమయంలో చెయ్యడంలో రామ చంద్ర మూర్తి సిద్ధహస్తుడు కనుకా ఆయన సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానంచేసి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తిచేసుకొని నిత్యాగ్నిహోత్రీకుడు కనకా అగ్నిహోత్రాన్ని పూర్తిచేసుకొని అక్కడ ఉండేటటువంటి మునులతో సత్ విషయముల మీద చర్చ చేస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి శూర్ఫణఖ అద్వితీయమైన సౌందర్యం కలిగినటువంటి రామ చంద్ర మూర్తిని దర్శనం చేసింది.
లోకంలో రెండు రకాలైనటువంటి పోకడలు ఉంటాయి ఒకటి ఒకచోట సౌందర్యము ఉంటే ఒకచోట అందం ఉంటే దాన్ని అభినందించగలగడం ఆ అందంలో ఈశ్వరుని యొక్క విభూతిని చూడగలగడం అది ఒక ఉత్తమ లక్షణం మమ తేజో  సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడైనా మీకు ఒక ఉత్కృష్టమైన విభూతి కనపడిందంటే అది ఈశ్వర సంబంధమైన విభూతి దాన్నిచూసి హర్షించగలగడం సత్పురుషుని యొక్క లక్షణం. ఏదైనా తన కంటికి ఆకర్షనీయంగా కనపడితే అది తనదికావాలి తానుపొందాలని కోరుకునేటటువంటి లక్షణం రాక్షస లక్షణం, తాను నిర్ణయం చేసుకోవడమే ఇది నాకు నచ్చింది కాబట్టి నేను దీన్నిపొందుతాను అవతల వస్తువు కూడా అవతల వ్యక్తి కూడా అలాగే తనపట్ల ఆకర్షితుడయ్యాడాలేడా, తనపట్లా అటువంటి భావనతోనే ఉన్నాడా లేడా అన్నదాంతో సంభందమేమీ ఉండదు.
శూర్ఫణఖ రామాయణం అప్పుడు ఎప్పుడో జరిగిందని అనుకోవడం ఎందుకండీ..! ఇప్పటికీ అవి జరుగుతున్నాయి కాదా, తన కంటికి కనపడితే తాను అనుభవించాలని కోరుకోవడమే రాక్షసత్వం అంతే అలాంటివాళ్ళు మీకు ఇప్పటికీ కనపడ్డం లేదా తెల్లవార్లచూస్తే పేపర్లనిండా అవే..? టీవీల్లో న్యూస్ నిండా అవే... కాబట్టి సింహోరస్కం మహా బాహుం పద్మ పత్ర నిభేక్షణమ్ ! ఆజాను బాహుం దీప్తాఽఽస్యం అతీవ ప్రియ దర్శనం !! గజ విక్రాంత గమనం జటా మండల ధారిణం ! సుకుమారం మహా సత్త్వం పార్థివ వ్యంజనాన్వితమ్ !! రామమ్ ఇన్దీవర శ్యామం కందర్ప సదృశ ప్రభమ్ ! బభూ వేన్ద్రోపమం దృష్ట్వా రాక్షసీ


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
కామ మోహితా !! రాక్షసి అయినటువంటి శూర్ఫణఖ కామ మోహిత అయ్యింది రామ చంద్ర మూర్తియందు, వాల్మీకి మహర్షి అంటారూ ఆమె కామ మోహిత అయ్యిందీ అన్న విషయం రాముడు ఇంకా పసికట్టాడా లేడా అన్న విషయాన్ని కసేపు పక్కనపెట్టండి, వెంటనే మహర్షి ఆయనకి వరముంది కదాండీ చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకు వరమిచ్చారు నీవు ఒక్కసారి ఆచమనంచేసి కూర్చుంటే రాక్షసులైనాసరే సీతమ్మ తల్లైయినాసరే శ్రీరామాయణంలో ఏయే వ్యక్తులున్నారో వారందరి మనోగతమైనటువంటి అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయీ అని వరం. కాబట్టి అసలు అలా కామించడానికి యోగ్యమైన స్థితిలో అక్కడ ఉందా పరిస్థితి, రామ చంద్ర మూర్తి నాచేత అనుభవింభ బడవలసినవాడు లేదా రామ చంద్ర మూర్తిచేత నేను అనుభవింపబడాలీ అనేటటువంటి కోరిక కలగడానికి యుక్తా యుక్త విచక్షణ ఏమైనా ఉందా శూర్పణఖ యందు, దాన్ని చాలా అందమైన మాటలతో మహర్షి ఆవిష్కరిస్తారు ఆయన అంటారు సుముఖం దుర్ముఖీ రామం వృత్త మధ్యం మహోదరీ ! విశాలాక్షం విరూపాక్షీ సుకేశం తామ్ర మూర్ధజా !! ఆయనో చాలా అందమైనటువంటి ముఖమున్నవాడు ఆయనది అందమైన ముఖము అంటే వాల్మీకి మహర్షిది అందమైన ముఖమని కాదు రామ చంద్ర మూర్తి యొక్క ముఖాన్ని చూసినటువంటివాడు లోకంలో అన్ని భూతములు ఆనందాన్ని పొందుతాయి.
Image result for వినాయకుని ముఖంచంద్రున్ని చూస్తే ఎలా సంతోషిస్తారో ఒక ఏనుగు ముఖాన్ని చూస్తే ఎలా సంతోషిస్తారో ఒక తామర పువ్వుని చూస్తే ఎలా సంతోషిస్తారో రామ చంద్ర మూర్తి ముఖమండలం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆయనది సుముఖం పైగా ఆ ముఖం నుంచీ వేరు మాట వేరు మాట వచ్చే అవకాశం ఉండదు అసలు మనం వినాయకుడి ప్రార్థన మొదలు పెడితే ఈ మాటతోటే ప్రారంభం చేస్తాము సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః అని సుముఖః అన్న మాటకు గొప్పతనమేమిటంటే ఏ ముఖాన్ని చూడడంవల్ల మీకు అభ్యుదయం కలుగుతుందో ఆ ముఖం సుముఖం అసలు అదీ మంచి ముఖం లక్ష్మీ స్థానాలు ఐదింటిలో ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలం కాబట్టి గజముఖాన్ని దర్శనం చేయడమే మీకు అభ్యున్నతిహేతువు కాబట్టి వినాయకుడి యొక్క ముఖం గజముఖంగా పరమేశ్వరుడు ఉంచడానికి కారణాల్లో అదొకటి, ఆయన యొక్క రూపాన్ని మీరు ఇలా చూడగానే ఆఁగజ ముఖాన్ని చూడగానే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అంతగొప్ప ముఖం కాదు కాదు సాధారణంగా మనం మన మనస్సును పెట్టవలసివుంటుంది. మీరు చేతులతోటీ కాళ్ళతోటీ చేసేటటువంటి క్రీయా కలాపమంతా దేనికొరకు అంటే దీన్ని అడ్డుపెట్టి నీ మనసుని ఈశ్వరుని దగ్గరకు తీసుకురావడం ప్రధానంగా ఉంటుంది శోఢశోప పూజా రహస్యం కూడా అంతే సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌనటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః నిరంతరం తిరుగుతూ ఉంటుంది మనస్సు తిరిగే మనసును ఉపచారములు మార్చి మార్చి భగవంతుని యొక్క పాదారవిందముల దగ్గరకి తీసుకురావడానికి ఉపకరణంగా మీరు ఈ ఉపచారములను వాడుకుంటారు.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
ప్రధాన ప్రయోజనం మనసుని తీసుకురావడం మనసుని తీసురాకుండా ఉపకరణాల్నే తీసుకొచ్చారనుకోండీ ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే దానికి ఉపయోగం ఉంటుందీ అని శాస్త్రాలు నిర్దేశించలేవు, శంకరులే శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర-విపినే సమర్ప్యైకం శైలే చ భ్రమతి కుసుమార్థం జడ-మతిః అన్నారు ఎందుకురా అనవసరంగా పూవ్వుల కోసం పత్రికోసం నీవు అన్ని చోట్లా తిరుగుతుంటావు తిరిగి తిరిగి తిరిగి నీవు ఏం సాధించావు సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమా-నాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో నీ మనస్సు అనేటటువంటిది తామర పువ్వు తీసుకెళ్ళి పరమేశ్వరుని పాదములదగ్గర పెడితే సంతోషించి వెంటపడునట్లుగా నీవు తెచ్చిన సంభారములకు ఆయన సంతోషపడిపోయేటటువంటివాడు కాదన్ని విషయాన్ని నీవు ఎందుకు తెలుసుకోవడంలేదు, ఆయనకు కావలసింది మనస్సు నీవు మనసు పెట్టి పూజ చేయగలిగితే ఉపచారములన్నీ ఉన్నాయా లేదా అన్నది కూడా ఈశ్వరుడు చూడడు, ఉపచారములన్నీ సమకూర్చకోవాలనుకోవడం భక్తి, నేను అలాగని ఎందుకండీ అన్ని మానేసేయండి అని చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఒక్కొక్కసారి ఉపచారమునందు లోపము వచ్చిందనుకోండీ అందుకే దాన్ని శాస్త్రంలో దానిని పూరణచేసేస్తారు అక్షంతలు సమర్పిస్తే చాలు నడుము విరగనటువంటి బియ్యం పసుపుతో కలిస్తే దాన్ని సమర్పిస్తే సింహాసనాన్ని సృష్టించచ్చు. మీ మనస్సు ఉండాలి అందుకే శంకరులు రత్నైః కల్పిత మానసం హిమజలైః స్నానం చ దివ్యామ్బరం నానారత్న విభూషితం మృగ మదామోదంకితం చందనం అంటూ మానసపూజలో అన్నీ కూడా నేను నా మనసుతో సృష్టించాను అంటాడు. ఆ మనస్సు అక్కడ పెట్టడం అన్నది మీకు ఆ మనసుతో దర్శనం చేయడం అనేటటువంటిది ఇంద్రియములలో ఉండే శక్తిని మనసు తీసుకొని మనసు అంతర్ముఖమై పరమేశ్వరున్ని అథాంగ పూజయందు దర్శనం చేయడం నేర్చుకోవాలి.
అందుకు పాదాల నుంచి తలవరకు పూజచేయడమనేటటువంటిది విగ్రహంలో కనపడతుందని కాదు ఇక్కడ కనపడాలి మీకు, కానీ వచ్చిన ఇబ్బందల్లా ఎక్కడ వస్తుందంటే అదొక్కటే జరగదు ఆఁమనసే నిలబడదు మిగిలినవన్నీ జరుగుతాయి, బిల్వాలను తీసుకొస్తాం తులసీ పత్రాల్ని తీసుకొస్తాం అక్షతలు తీసుకొస్తాం కొబ్బరికాయలు తీసుకొస్తాం పూవ్వులు తీసుకొస్తాం అన్నీ తీసుకొస్తాం, ఉపచారమా ఆ మంత్రానికి ఆ ఉపచారం యాంత్రికంగా జరిగిపోతుంటుంది, కానీ ఒక్కనాటికి మనసు మాత్రం అక్కడికి వెళ్ళి నిలబెట్టగలగడం అనేటటువంటిది కుదిరేటటువంటి విషయం అంత తేలికగా కాదు, అలాకాని మయ్యేవ మన అధత్స్వమయి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు, “నాయందు నీ మనసు పెట్టూ” అంటాడు అలాగే పెట్టేశానండీ అంటే చాలు జన్మ సార్ధకమైపోయినట్లే, అంత తేలికేమిటీ నాయందు మనసు పెట్టూ అంటే అంత తేలిగ్గా పట్టుకెళ్ళి ఈశ్వరుని దగ్గర మనసు పెట్టేస్తే ఇంకేమండీ మనందరం కృతార్థులమై ఉండిపోయిండేవాళ్ళం, అది చేతకాకే కదా ఈ అల్లరంతా వచ్చింది.
Image result for బిల్వార్చనఆ మనస్సుని పెట్టడం అన్నది చాలా చాలా కష్టం భగవాన్ రమణులు కూడా దీని గురించి ప్రస్తావనచేస్తూ ఒకచో అంటారు, నేను లక్ష బిల్వార్చన చేద్దామనుకుంటున్నాను కొన్ని బిల్వాలు తక్కువయ్యాయి ఏం చేయమంటారు అన్నారు ఒకావిడ వెళ్ళి భగవాన్ రమణులని, ఆయన అన్నారు ఎన్ని బిల్వాలు తక్కువయ్యాయి అన్నారు ఓ రెండు మూడు వేల బిల్వాలు తక్కువై ఉంటాయండీ అన్నారు, ఓ రెండు మూడు వేల పర్యాయాలు మీ ఒళ్ళు గిల్లుకో అన్నారాయన, అంటే ఆవిడంది అదేమిటి నా ఒళ్ళు గిల్లుకోవడమేమిటని అడిగింది ఆవిడా అడిగితే అయన అన్నారు ఏముంది నీకు లక్ష బిల్వార్చన అంటే చెట్టు దగ్గర


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
గిల్లుతావు బిల్వాలని అంతే అది తీసుకొచ్చి కనీసం ఒక చాప వేసో ఒక వస్త్రం వేసో దానిమీద బిల్వాలు పెడదామని కూడా ఉండదు శివాలయంలోకి తీసుకొచ్చి నేలమీద పాడేయ్యడమే అయిపోయింది పూజ నీవు చేసేది పునఃపూజ ఆయనే ప్రుధ్వీ స్వరూపంతో ఉన్నాడు శర్వుడై నేల మీద పాడేసిన తరువాత ఇంక మళ్ళీ శివుని మీద వేయడం ఏమిటండీ మంత్రంతోటి పునఃపూజ చేస్తున్నావు కాని నీవు పూజ చేయటం లేదు, నీ మనసు అక్కడ పెట్టాలనా ఏమన్నానా మూడు ఆకులతో ఉందో లేదో చూడాలా ఏమన్నానా... రొట్ట తీయ్య శివలింగం మీద పాడెయ్య ఆ పాటిదానికి చెట్టుని గిల్లితే ఏమిటీ నిన్నుగిల్లుకుంటే ఏమిటీ తక్కువైన బిల్వాలకి నిన్ను గిల్లేసుకో మూడు వేల పర్యాయాలు కానీ ఆవిడ సహృదయురాలు అర్థం చేసుకుంది, ఓ నన్ను మనసు పెట్టమంటున్నారు మహర్షి మనసులేని పూజ ఎన్ని బిల్వాలతోచేస్తే మాత్రం ఏమి సుఖమూ అంటున్నారూ అని ఆవిడ గ్రహించగలిగింది.
కాబట్టి చూశారూ మనసుని పెట్టడం చాలా కష్టం కానీ శాస్త్రంలో ఏమంటారంటే మూడిటియందు మీ ప్రమేయం లేకుండా మీ మనసు తొందరగా నిలబడీ అహ్లాదమును పొందుతారు, ఇంకా ఇంకా చూడాలనీ ఇంద్రియములకు నాయకత్వం వహించే కన్నూ చదరకుండా అక్కడే నిలబడి మనసును రంజిల్లింపగలిగేటటువంటి వస్తువులు లోకంలో మూడు ఉన్నాయట ఒకటీ సముద్రం, సముద్రం వంక మీరు ఎంత సేపూ చూస్తు కూర్చోండీ మీకు సంతోషంగా ఉంటుంది, అలా సముద్రాన్ని అసురసంధ్యవేళలో చూడ్డం మొదలుపెడితే, చీకటి పడిపోయిన తరువాత మీకు సముద్రం ఏమీ కనపడదు దూరంగా సముద్రంలో ఓడలు వెళ్ళిపోతూ దీపాలు కనపడూ సముద్ర ఘోష వినపడుతుంది లేకపోతే కెరటాలు లేచి పడుతూ కనిపిస్తాయి, ఆ పెద్ద ఆకాశము దానికింద సముద్రము అదో అందంగా ఉంటుంది, సముద్రం ఎంత అందంగా మీ మనసుని చూరగొంటుందో మీ ప్రయత్నం లేకుండగా మీ మనసు సముద్రవైపుకు వెళ్ళి నిలబడుతుంది, రెండు చంద్రుడు చంద్రున్ని ఎంత సేపు చూడండీ మనసు తొందరగా వెళ్ళి చంద్రుని మీద నిలబడుతుంది మహర్షి సుందర కాండలో వర్ణిస్తారు హంసో యథా రాజత పంజర స్థః ! సింహో యథా మన్దరకన్దర స్థః !! అంటూ ఆ చంద్ర బింగాన్ని వర్ణిస్తారు, చంద్ర బింబం మీద పసిపిల్లలు దగ్గర్నుంచి వృద్ధుల వరకూ అందరి మనసులు నిలబడుతాయి, పైగా నిలబడి రంజిల్లుతుంది, చాలా సంతోషిస్తారు ప్రసన్నులౌతారు ఆనందాన్ని పొందుతారు, అలాగే మూడవది ఏనుగు ముఖం ఏనుగు ముఖాన్ని పసిపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళవరకూ ఆనందిస్తారు, ఏనుగుని ఇలా చూసి అలా వెళ్ళిపోరు ఆలా చూస్తారు దేనిని చూసినప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనసుని మీరు పెట్టనవసరం లేకుండగా మీ మనసుని తానే లాక్కుని మీ మనసుని అక్కడ మీచేత పెట్టించి మీరు పెట్టడం వల్ల మీకు కొంత పుణ్యాన్ని ఇచ్చి ఆ పుణ్యము వల్ల అభ్యున్నతిని ఇవ్వగలదూ అటువంటి ముఖానికి సుముఖము అని పేరు.
కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః అంటూ కొన్ని నామాల్ని ఏరి కూర్చి ఎవరెవరైతే ఈ నామములను చేస్తున్నారో వారికి ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకాస్యేషు విఘ్నస్తస్యన జాయతే అని విఘ్నములు రావు అని విష్నేశ్వరుని మీద ఒక ప్రార్థన చేసి ప్రారంభం చేస్తుంటారు. రామ చంద్ర మూర్తి యొక్క ముఖము


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
కూడా సుముఖమే ఎందుకో తెలుసాండీ ఆయన యందు ఘోర అఘోర రూపములు రెండూ ఉంటాయి, మహర్షి ఈ విషయాన్నే శ్రీరామాయణంలో శివ కేశవ అభేదమైనటువంటి తత్వము అడుగడుగునా మీకు కనపడుతుంది, నేను నిన్ననే ఒక శ్లోకాన్ని ఉదాహరించి ఉన్నాను ఆ గోదావరి నదిలో స్నానంచేసి వస్తున్నటువంటి సీతా రామ లక్ష్మణులయందు వాల్మీకి మహర్షికి పార్వతీ పరమేశ్వర నందీశ్వర స్వరూపము దర్శనమైందీ. ఆయన ప్రతీచోటా శివుడికీ రాముడికీ ఉన్న అభేదాన్ని ఆవిష్కరిస్తూ ఉంటారు, మనం ఏ దృష్టికోణాన్ని అలువాటు చేసుకోవాలో చూపిస్తూ ఉంటారు, అంత గొప్ప ముఖం రామ చంద్ర మూర్తి యొక్క ముఖం, అదే రామ చంద్ర మూర్తి ముఖం రాక్షసులపాలిటా ఘోర రూపం, వాళ్ళకి అదీ రౌద్ర స్వరూపం దాన్ని చూస్తేనే హడలిపోతారు అలా ఉంటారు ఆయన, భక్తులైనవారికి ఆయన ప్రసన్నమౌతాడు ఆయన ఎప్పుడూ.
Image result for రాముడుమీరు చూడండీ రాముడు అసలు కోదండం పట్టుకోకుండా నిలబడినటువంటి మూర్తి మీరు ఎక్కడైనా చూశారా... చాలా ఎక్కడో అరదుగా ఉంటుందేమో, రాముడూ అంటే ధనస్సు పట్టుకునేవుంటాడు అసలు మనం రుద్రం మొదలు పెడితే ధనస్సు పట్టుకుంటే ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః ! నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః !! ఆ ధనస్సేమిటయ్యా స్వామి చేతిలో భయమేస్తోంది పిల్లలం ఎందుకు ధనస్సు పట్టుకున్నావు మామీద ఏమైనా కోపమొచ్చిందా మావేమైనా తప్పులుంటే క్షమించు అని ఉభయతర నమస్కారములు చేస్తూ ఆ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం చేస్తాం, అదే రామ చంద్ర మూర్తి అయితే చేతిలో ధనస్సు పట్టుకుని నిలబడినా సరే ఎవ్వరికీ ఏమి భయము ఉండదు, ఆయన ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి మేము అందరము సంతోషంగా ఉండగలుగుతున్నాము. మహానుభావుడు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక్కతోడుగ భగవంతుడు మన చక్రధారియై చెంతనే ఉండగా తక్కుమేమి మనకూ అంటాడు మహానుభావుడు రామదాసుగారు, ఆ రామ చంద్ర మూర్తి కోదండం పట్టుకొని నా పక్కన ఉండగా మనకు భయమేమిటీ ఇంద్రియముల భయము కూడా లేదు ఆయనే మనకు గురు స్వరూపమై మనని ఏ మార్గంలో ప్రయానించాలో అటువైపుకు పయనింపచేస్తాడూ అని లోకం నమ్ముతుంది.
కాబట్టి సుముఖం- ఆయనది సుముఖం, ఆవిడది దుర్మిఖీ ఆవిడది చాలా భయంకరమైనటువంటి దుష్టమైనటువంటి ముఖము ఇక దానిగురించి ఇంక పెద్ద వర్ణించక్కరలేదు, ప్రయోజనం లేని విషయానికి పెద్ద వర్ణనేమిటీ దీనికి వ్యతిరేకమైన ముఖం ఆ ముఖం ఆ ముఖం చూస్తే కొత్త పీడ అంటుకుంటుంది ఏదైనా  మృత్త మధ్యం మహోదరీ ఆయనో సన్నటి నడుము ఉన్నవాడు ఆవిడో మహోదరీ చాలా పెద్ద కడుపున్నది, ఆయనో విశాలాక్షం విశాలమైనటువంటి కన్నులు ఉన్నవాడు విరూపాక్షీ ఆవిడో వికృతమైన కన్నులు ఉన్నది సుకేశం ఆయనో అందమైనటువంటి కేశపాశమున్నవాడు జుట్టున్నవాడు ఆవిడో తావ్ర మూర్ధజా ఎర్రటి రాగి జుట్టు ఉంటుందే, ఆ రాగి జుట్టు ఎలా ఉంటుందో ఆలాంటి చిమ్ముకుపోయినటువంటి జుట్టు ఉన్నది, పూతనా సంహారంలో పోతనగారు వర్ణిస్తారు ఆ నేలబడిపోయిన పూతన యొక్క జుట్టు వర్ణిస్తూ ఆ పక్షులు దురేటటువంటి పొదలు ఎలా ఉంటాయో అలా ఉంటుందీ అంటాడు. కాబట్టి అటువంటి జుట్టు కలిగినది విశాలాక్షం అంటే విశాలమైన కన్నులు ఉన్నవాడూ అని అర్థం, కన్నులు పెద్దవైతే మనకేంటి ఉపయోగం అనిపించవచ్చు శంకరభగవత్ పాదులు సౌందర్యలహరిలో అంటారు దృశా ద్రాషీయస్యా దరదలితనీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా వనే వా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః అంటారు, ఆ కన్నులతో లలితా స్వరూపానికి రామ స్వరూపానికి అభేదం కదాండీ రెండూ ముగ్ధమోహనమైనటువంటి స్వరూపాలు ఆయనకూడా తనవారైనటువంటి వారిని తనవారూ పరాయివారని ఉంటారా ఈశ్వరుడికి అంటే ఎవరు ధర్మావలంభకులో వారు ఈశ్వరుడి వారు ఎవరు ధర్మమునందు ప్రవర్తించరో వారు కూడా ఈశ్వరునికి సంభందించినవారే.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
భారతీ తీర్థస్వామి వేంకటాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఒక అనుగ్రహ భాషణం చేశారు, అనుగ్రహ భాషణం చేస్తూ ఒక పీఠాధిపతులు ఒక జగత్ గురువులు ఏ స్థాయిలో చెప్తారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒకమాట అన్నారు అసలు మనం పూజచేసిన తరువాత కోరుకోవలసింది ఏమంటే ఎవరు ఈశ్వరుడినుంచి బాగా దూరమై వేదానికి దూరమై ధర్మమునకు దూరమై పాప జీవనం గడుపుతున్నారో వారు వేదము చేత నిర్దేశింపబడిన మార్గంలోకి ఈశ్వరానుగ్రహముతో రావాలీ అని మనం ప్రార్థనం చేయాలి అని చెప్పారాయన అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఈశ్వరునికి ఏమైనా కోపం ఉంటుందా అంటే ఆయన ద్వందాలకీ లోనైనవాడు అవుతాడు, మరి ఈశ్వరుడు చంపడం ఎందుకండీ..! నేను ఒకసారి మీతో మనవి చేశాను, డాక్టరుగారు సెగ్గడ కోసేయడమెందుకు సెగ్గడకీ ఆయనకీ వైరమేమీ లేదు సెగ్గడ మీ ఒంట్లోంచే పుట్టింది. పోతన గారు కుష్ఠ రోగం గురించి వర్ణణ చేస్తూ తన ఒంటిలోంచే పుట్టిందిగదాని చెప్పి కుష్ఠ రోగం అని చెప్పి దాన్ని ముద్దు చేస్తే ఉన్నవేళ్ళు కొరుక్కుతినేస్తుంది. అలా మన సెగ్గడ్డేగదాని చెప్పి దాన్ని చక్కగా పెంచి పోషిస్తే ఒంట్లో ఉన్న నెత్తురు కారిపోయేటట్లు చేస్తుందట. కాబట్టి సెగ్గడని డాక్టరు గారు కోసేశారు అంటే అర్థమేమిటీ ఎందకు కోసేస్తారు మీగిలిన శరీరాన్ని రక్షించాలి అది ఉండకూడదు ఇకవాడు ఆ శరీరంతో ఉంటే ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పనులు చేసి ఇంకా ఇంకా పాపం మూట కట్టుకుంటాడు అందుకనీ తీసేస్తాడు తప్పా అది కూడా అనుగ్రహమే నిజానికి అనుగ్రహంతో చేసేటటువంటిపనే తప్పా ఆగ్రహంతో చేసేటటువంటి పనికాదు.
Image result for శివుడు లయకారుడుఅందుకే పెద్దలు ఒకమాట చెప్తూంటారు చాలా మంది తెలిసీ తెలియని తత్వంతోటో ఒక మౌఢ్యంతోటో ఒకమాట మాట్లాడుతుంటారు శివుడు లయకారుడు అంటే చంపేస్తాడు ఆయన జోలికి వెళ్ళకండీ అంటారు, ఆయనకి పూజేంటీ రామాయణానికి వ్యాఖ్య చేసినటువంటివాళ్ళకి కూడా కొంత మందికి ఆ అలవాటు ఉంది, అలా వ్యాఖ్యలు చేసినవారు ఉన్నారు శివుడు లయకారకుడు అని చెప్పి అందుకని ఆయన జోలికి వెళ్ళకూడదు అని పూజ చేయకూడదు అని ఒక పక్షపాతంతో కూడినటువంటి మాట చెప్తూంటారు, శివుడు లయకారకుడూ అంటే ఆయన చేసే ప్రళయాలలో మూడవ ప్రళయం మహాప్రళయం మహాప్రళయం చేస్తాడు అంటే చంపేస్తాడు అని కాదు, ఎవరెవరు ఈశ్వరున్ని పొందలేకపోయారో వాళ్ళని ఈశ్వరుడు పొందుతాడు దానికి మహాప్రళయము అని పేరు. నల్ల పూసలు ఉన్నాయి మైనపు ముద్ద ఉంది నల్ల పూసలు మైనపు ముద్దను అంటుకోలేకపోయాయి మైనపు ముద్దవచ్చి నల్లపూసల మధ్యలో దొర్లింది ఇప్పుడు నల్ల పూసలన్నీ ఏమయ్యాయి, మైనపు ముద్దకు అంటుకున్నాయి, కాబట్టి ఈశ్వరుని యొక్క యనలేని కారుణ్యానికి ప్రతీక మహాప్రళయం, మహాప్రళయం చేసేటటువంటి శంకరులు పరమేశ్వరుడు అపారమైనటువంటి కారుణ్యమునకు ప్రతీక మీరు అలా చెప్పవలసి ఉంటుంది తప్పా ఆయన లయం చేసేస్తాడు అంటే ఆయన చంపేస్తాడు అని మీరు చెప్పకూడదు నిన్ననే నేను మీతో మనవి చేశాను.
ఆయన స్వల్పకాలిక లయం కూడా చేస్తాడు నిద్రాకాళిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు మళ్ళీ చైతన్యాన్ని శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడే ఆయన అనుగ్రహం లేకపోతే నిద్రపట్టలేదనుకోండి, నిద్రపట్టకపోతే అన్నం సహించదు అన్నం సహించకపోతే నిద్రపట్టదు, ఈ రెండూ లేవనుకోండి మూడు రోజులు పోయినతరువాత చూసుకోండి కళ్ళు ఎంతలోపలికి వెళ్ళిపోతాయో అయితే చిత్రమేమిటంటే..? ఎంత నిందచేస్తున్నా పోనిలేపిల్లాడు అని ఆయన అలా ఇస్తూంటాడు, అది గమనించినవాడు అన్నాడు జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు, ఆయన తల్లీ తండ్రీకదా క్షమించేస్తాడు ఉదారుడు అన్నాడు కాబట్టీ అటువంటి స్వభావమున్నవాడే రామ చంద్ర మూర్తి. పేరు మారుతుందేమోకాని పరమాత్మ యొక్క స్వరూపము యందు మాత్రము మార్పేమి ఉంటుందండీ అదేమి మార్పు ఉండదు. నరుడిగా ఉన్నా ఆయన తత్వము అలాగే ఉంటుంది కాబట్టి సుముఖం దుర్ముఖీ రామం వృత్త మధ్యం మహోదరీ ! విశాలాక్షం విరూపాక్షీ సుకేశం తామ్ర మూర్ధజా !! ప్రియ రూపం విరూపా ఆయన స్వరూపమో చాలా ప్రీతి కలిగేటట్టుగా ఉంటుంది. ఆవిడదో చాలా విరూపమైనటువంటి రూపం వికృతమైనటువంటి స్వరూపంగా ఉంటుంది సు స్వరం ఆయన మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది వినాలనిపిస్తుంది, వినాలనిపించి మాట్లాడం కూడా మంచి మాటా అని నేను చెప్పడం చాలా కష్టం నేనేమిటీ ఎవ్వరైనా అలా చెప్పలేరు వినాలనిపించేటట్టుగా మాట్లాడినమాటంతా మంచి మాటా అని మీరు అనుకోకండి శ్రీరామాయణం అసలు యదార్థానికి ʻవాక్ వైభవమే శ్రీరామాయణంʼ వాక్ మనుష్యునికి ఒక్కనికి ఉన్న అనుగ్రహం ఈశ్వరుడు ఒక్క మనుష్యునికి మాత్రమే ఇచ్చాడు.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
వాక్కు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మూడు మాట్లు శ్రీరామా శ్రీరామా శ్రీరామా అని వాడు విష్ణు సహస్త్రం చేసుకున్నటువంటి ఫలితాన్ని మనిషి పొందుతున్నాడు, ఏదీ సృష్టిలో ఇంకోప్రాణిని పొందమనండీ పొందలేదు భగవన్నామమును చెప్పగలిగిన భాగ్యమున్న ఏకైక ప్రాణి మనుష్యుడు కానీ ఆ వాక్కు లోపల మనస్సు పొందేటటువంటి వికారములకు అనుగుణంగా మార్చుకునీ ఎటువంటి కార్యాన్నీ ఎటువంటి ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చినవాళ్ళు కూడా ఉన్నారు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిద్రబాధవాః ! జిహ్వాగ్రే బంధనం ప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం !! శ్రీరామాయణంలోనే మీరు చూడండీ మంధర మాట్లాడిన మాట ఎంతదూరం వెళ్ళింది, నారదుడు వచ్చి చెప్పిన రామాయణం ఎంత రామాయణం అయ్యింది, రామ చంద్ర మూర్తి మాట్లాడేటటువంటి మాట ధర్మబద్ధమైంది, ఆయన ఒక్కమాటే మాట్లాడచ్చు, కాని ఆ ఒక్క మాట ఎలా ఉంటుందంటే మీరు కోరి కోరి ఏరుకోవలసిన సాలగ్రామంలా ఉంటుంది.
రమణ మహార్షీ ఒమాట అంటూండేవారు సాలగ్రామం ఎక్కడుంటుందండీ రాళ్ళల్లోనే ఉంటుంది, సాలగ్రామాన్ని ఎక్కడ ఏరుకోవాలి అంటే సాలగ్రామాలు దొరికే రేవి ఏమీ ఉండదు, సాలగ్రామం రాళ్ళల్లోనే దొరుకుతుంది రాళ్ళ మధ్యలో ఏరుకొని రాళ్ళని విడిచేసి సాలగ్రామం ఏరుకోవాలి, రాముని మాటలను మీరు ఏరుకోవాలి రాముడు మాట్లాడితే అలా ఉంటుంది. ఎక్కడ ఎంత సంక్షిప్తంగా మాట్లాడాలో అలా మాట్లాడుతాడు. రాముడు మాట్లాడితే పరమధార్మికంగా ఉంటుంది, నడిచే దేవుడని పేరుగాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్య తరచూ ఒకమాట చెప్తూండేవారు రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రం ఇలా అందీ అని మాట్లాడుతాడు ఋషులు ఇలా అన్నారు అని మాట్లాడుతాడు స్మృతి ఇలా అందీ అని మాట్లాడుతాడు తప్పా రాముడు నేను ఇలా అంటున్నాను అని మాట్లాడడు. అంటే తను ప్రమాణం చెప్పాలని రాముని ఉద్దేశ్యం కాదు ప్రమాణాన్ని వైదికంగా తీసుకొంటాడు వేదంలోంచి ప్రమాణాన్ని తీసుకొని తాను చెప్పి తాను ఆ ప్రమాణాన్ని అనుసరించేవాడు రాముడు. కాబట్టి ఎక్కడెక్కడ మీకు రాముని వాక్కులు వినపడ్డాయో అక్కడక్కడ మీకు స్మృతులు చదవవలసిన అవసరంలేకుండా మీరు అనుష్టించవలసినటువంటి ధర్మము మీకు ప్రభోదము చేయబడిందని గుర్తు. అందుకే శ్రీరామాయణం ఎందుకు చదవాలీ అంటే ధర్మం తెలుసుకోవాలి అంటే రామాయణం చదవాలి, ధర్మమెందుకు తెలుసుకోవాలీ అంటే అసలు నరుని ఉపాధి ధన్యతపొందాలీ అంటే జీవుడు ధన్యత పొందాలీ అంటే ధర్మం తెలుసుకోవడానికి రామాయణం చదవాలి.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
Image result for లక్ష్మణుడుకాబట్టి మాట అంటే అందంగా మాట్లాడడం కాదు రావణుడు కూడా మాట్లాడుతాడు, అబ్బో సుందర కాండలో ఎంత ప్రసంగం చేస్తాడు, సుందర కాండేమీ ఎక్కడైనా అలాగే మాట్లాడుతాడు ఆయన మాట్లాడితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది, విందురుకాని కొద్ది సేపటిలోనే వస్తాడు మారీచునితో మాట్లాడుతాడు ఎంత కర్కషంగా ఎంత ధారుణంగా ఉంటుందో ఎవరి గురించి ఏమాట మాట్లాడడానికి నాలుకకి ఏమీ నరం ఉండదు అంటే మనం అసలు ఇలా మాట్లాడడమా... అన్న వివేచనేమీ ఉండదు, తనకి ఎలా చిత్తమొస్తే అలా మాట్లాడేస్తాడు రాముడు అలాగ కాదు బాగా ఆలోచించకుండా మాట్లాడడు, ఒక్కమాట మాట్లాడాడు అంటే కట్టుబడిపోవడమే ఇంక మాటా అంటే తనను తాను కట్టుకోవడం తనను తాను కట్టుకోవడం రామునికివచ్చు ఎన్నిరకాలుగానైనా దాన్ని అవసరానికి వాడుకోవడం రావణునికి వచ్చు. వాక్కుని మేము బాగా ఉపయోగించుకున్నాం మా సుఖాలకి దాన్ని చాలా అందంగా మాట్లాడి మేము అందర్నీ వశం చేసుకున్నాం అనుకున్నవాళ్ళు వాక్కుని ఈశ్వరుడు ఇచ్చినదానిని దుర్వినియోగం చేసుకొని 10 తలలున్నా ఎలా తెగిపోతాయో వాక్కును సద్వినియోగం చేసుకున్నవాడు ఏ స్థితినిపొందుతాడో, ఒక్క తల ఉండి నరుడిగా పుట్టి ధర్మాన్ని అనుష్టించి ధర్మం మాట్లాడి యుగం మారిపోయినా ఒక నరుడిగా వచ్చినవాడు ఈశ్వరుడిగా లోకంచేత పూజింపబడి ఆఁపేరుచాలు తలుచుకోవడానికి ʻశ్రీరామʼ అన్న నామం కోసం వెంపర్లాడిపోతున్నాయి లోకాలు. అదే రావణాసురుడైతే పది తలకాయలుండి ఎన్నిమాటలు మాట్లాడినా అమ్మబాబోయ్ ఆయనమాటే అని జనం హడిలిపోయేటట్లుగా మాట్లాడుతాడు. మాట మాట్లాడటం గొప్పకాదు ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది అన్నదీ చాలా విశేషం కాబట్టి మీరు ఇక్కడ చాలా బాగా రాముడు మాట్లాడుతాడు అన్నదానికి ప్రసంగాలు బాగా చేస్తాడు అని మీరు ఆలోచన చేయకూడదు.
ఎందుకంటే రఘువంశం రచనచేస్తూ కాళిదాసుగారు ఒక మాట అంటారు త్యాగాయ సంభృతార్థానాం, సత్యాయ మితభాషిణాం అంటారు రఘుని గురించి, రఘు మహారాజుగారు తక్కువ మాట్లాడుతారు, ఎందుకు తక్కువ మాట్లాడటం ఆయనకేం మాట్లాడటం చేతకాక కాదు అనవసరంగా మాట్లాడితే గబుక్కున ఎక్కడైనా ఒక అసత్యము వచ్చేస్తుంది అంటే తను నిలబెట్టుకోలేని మాట ఏదైనా నోటివెంట వచ్చేస్తుందేమో అప్పుడు నిలబెట్టుకోలేకపోతే అసత్యమౌతుందేమో కాబట్టి అన్నిమాటలొద్దు ఆలోచించి మాట్లాడుదామని ఆయన మాట్లాడితే సత్యాయ మితభాషిణాం చాలా తక్కువగా మాట్లాడాడు అందుకే రఘు అంత గొప్పవాడయ్యాడూ అని కాళిదాసుగారు అంటారు, రామ చంద్ర మూర్తి కూడా మాట్లాడితే అంత అందమైన మాట మాట్లాడేవారు. మాటా అలా ఉంటుంది ఆయన కఠమూ అలాగే ఉంటుంది, కంఠము కూడా అంత అందంగా అబ్భాహ్ ఎంత చక్కగా ఉంది ఆ కంఠం అనేటటువంటి కంఠం. కంఠం కూడా ఈశ్వరదత్తం కంఠం బాగుంటే రంజకత్వంతో మాట్లాడటం తేలిక కంఠం బాగుండకపోతే తనకు పది విషయాలు తెలిసున్నా పది మందికి చెప్పడంలో కొంత వైక్లవ్యం వస్తుంది. నాకు ఒక మాహాపురుషుడు తెలుసు అటువంటి వారిని ఎంత మాత్రం తక్కువ చేయడం నా లక్ష్యం కాదు నాకు ఆయన పేరు చెప్పడం కూడా ఈ పరిస్థితిలో ఇష్టంలేదు. చాలా గొప్ప సంస్కృతాంధ్రములయందు మహాపండితుడు మాహానుభావుడు కానీ వారికి విపరీతమైన నత్తి ఉండేది. అస్సలు ఒక వాక్యాన్ని నిర్మించి పలకడం చాలా కష్టం దగ్గర దగ్గరగా 80 సంవత్సరాలు పైచిలుకు జీవించీ వారు రాజమండ్రిలో శరీరాన్ని విడిచిపెట్టారు. మహాపండితుడు అందులో ఇంక నిస్సందేహం అంతటి పరమభక్తుడు ఈ ప్రాంతం విజయవాడలోనూ అక్కడా చాలా కాలం ఉండీ తన కవితా సుగంధము చేతా తన భక్తిచేత శ్రీరామాయణ కల్పవృక్షమే ఇచ్చినటువంటి విశ్వనాథ సత్యనారాయణగారికి గొప్ప అంతేవాసిగా ఉండేవారు వారు.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
అటువంటి వ్యక్తి బాగా నత్తి ఉండడం వల్లా అస్సలు పాపం మాట్లాడలేకపోయేవారు, కాని ఆయన దగ్గర మీరు కూర్చుంటే అసలు ఆయన మాట్లాడేటటువంటి మాటలు అవి మాటలు కావు అదీ వివిక్తః శ్రుతిసాగరః అన్నట్టూ శ్రుతి అనేటటువంటి సముద్రంలోంచి వజ్రాలు పైకితీసి మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఆయన మాటలు అలా ఉండేవి అంత గొప్ప దార్శనికుడు కాని స్వరమునకు, స్వరమంటే ఆ కంఠ స్వరము అని మీరు అనుకోకపోతే నత్తి మాటలకు ప్రతిబంధకంగా వచ్చింది, కాబట్టి ఆ స్వరమన్నది కూడా చాలా అవసరము సు స్వరం రాముడికి అటువంటి ఇబ్బందులు ఉన్నవాడు కాడు చాలా చక్కని కంఠ స్వరం ఉన్నవాడు ఆయన, ఆ స్వరం అలా తెలిసున్నవాడు వేద మంత్రాన్ని కూడా బాగా చెప్పగలడు, దేవతల యొక్క అనుగ్రహాన్ని బాగా పొందగలడు ఎందుకంటే వేదము స్వరప్రధానమైనటువంటిది ఉదాత్త అనుదాత్త స్వరిత అనబడేటటువంటి స్థాయిభేదాన్ని వేద మంత్రంలో ఎవరు సుస్వరంతో పాటిస్తారో వాళ్ళకి దేవతలుకూడా వశులౌతారు అంటారు. లేకపోతే వేదమంత్రాన్ని ఏదో రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టూనూ పుస్తకం కొనుక్కొని వేదం నేర్చుకోవడానికి ఏమీ ఉండదు, గురుముఖంగా నేర్చుకోవలసి ఉంటుంది వేదాన్ని.
కాబట్టి ఆమెయో భైరవ స్వరా గాడిద అరిస్తే ఎలా ఉంటుందో అలాంటి స్వరం ఉన్నది ఆవిడా, ఆవిడా అంటే నా ఉద్ధేశ్యంలో శూర్పణఖ తరుణం దారుణా వృద్ధా ఆయనో యవ్వనంలో ఉన్నవాడు రామ చంద్ర మూర్తి, ఆవిడో పరమ వృద్ధురాలు దక్షిణం ఆయనో చాలా నేర్పరి అయినటువంటివాడు, ఆవిడో వామ భాషిణీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంది, ఆ మాటలకీ ఒక ఋజుత్వమేం ఉండదు, వక్రమైనటువంటి మాటలు తన కార్యం నెరవేర్చుకోవడానికి తాను ఇష్టపడింది సమకూర్చుకోవడానికి ఆవిడ ఎలాగైనా మాట్లాడుతుంది అటువంటిది న్యాయ వృత్తం ఈయ్యనది ఎప్పుడూ న్యాయమైనటువంటి మార్గం ధార్మికమైన మార్గం ఆవిడదో సుదుర్వృత్తా ఆవిడకి దురవృత్తం అంటే ఆవిడయొక్క నడవడికకి ప్రమాణం ఏమీ ఉండదు, దీన్నిబట్టి ఇలా ప్రవర్తించాలీ అని ఆవిడేం అనుకోదు ఆవిడ మనసులో పుట్టిన కోర్కెను బట్టి ఆవిడ ప్రవర్తిస్తుంది, ఒక గారెతినేద్దామనుకున్న కుక్క అది నైవేద్యం పెడతారనుకుని కూడా చూడకుండా కలియబడి ఎలా ఎత్తుకుపోతుందో ఆవిడ మాటకూడా అంతే అయ్యింది. ఎప్పటికి ఎక్కడికి తన మనసులో కోరిక తీరాలనుకుంటుందో అక్కడ అలా మాట్లాడగలదు అలా ప్రవర్తించగలదు ఏడవడం కూడా తన కోర్కె కోసం ఏడవగలదు నవ్వినా తన కోర్కెకోసం నవ్వగలదు లేని అందం ఉంది అని చెప్పగలదు ఉన్న అవగుణాలను లేవని కూడా చెప్పగలదు తప్పా అసలు తనమాటలకీ తన ప్రవర్తనలకీ ఒక ప్రమాణము బట్టి రూపం ఉన్నదీ కాదూ అటువంటి నడువడి ఉన్నదీ కాదు.
కాబట్టి న్యాయ వృత్తం సుదుర్ వృత్త ప్రియం అప్రియదర్శన ఆయన దర్శనమేమో ప్రియమైనటువంటి దర్శనం ఆవిడదేమో అప్రియమైనటువంటి దర్శనము అంటే ఆవిడని చూస్తేనే ఏదో ప్రమాదము వస్తుంది, లోకంలో కొన్ని కొన్నింటికి ఆ లక్షణం ఉంటుంది అంత రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి స్వరూపాన్ని మీరు చూచినంత మాత్రంచేత ఏదో అంత అమంగళం కలుగుతుంది. అందుకేగా ఇప్పటికీనీ లోకంలో కొన్ని కొన్నిటినీ అశుభ శకుణములుగా పరిగణించబడేటటువంటిది వచ్చింది. ఆయనో ప్రియదర్శనం ఆయన్ను చూడ్డమనేటటువంటిదే చాలా ఆనంద దాయకంగా ఉంటుంది శరీరజ సమావిష్టా రాక్షసీ వాక్యం అబ్రవీత్ అటువంటి శూర్పణఖ రామ చంద్ర మూర్తిని చూసి మన్మథునిచేత అవేశింపబడింది అంటే ఆమెకు కామము కలిగినది. ఇక్కడ మహర్షి ఒక చాలా గొప్పమాట చెప్తున్నారు ఇంత వృద్ధురాలైనటువంటిది రాక్షసియైనటువంటిది వికృతమైనటువంటిది అందమైన రామున్ని చూడగానే ఏమనుకుందంటే ఇంత అందమైనవాడు కాబట్టి ఈయన చేత నేను బోగింపబడాలి అనుకుంది అసలు అలా అనుకోవడం కూడా న్యాయమా కోరిక


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
పుట్టచ్చా ఆవిడకి అవేవి అక్కరలేదు అలా ఎందుకు అక్కరలేదు ఒక్కటే కారణం పైన చెప్పారుగా పైన చెప్పిన లక్షణాలు ఉన్నటువంటి ఆవిడకీ అటువంటి ఆలోచన ఎందుకొస్తుంది, కాబట్టి ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి వచ్చిందంటే ఒక వెయ్యి శతఘ్నులు తీసుకొచ్చి అక్కడ పెడితే రామ చంద్ర మూర్తి ఒక అస్త్రంతో కొట్టేస్తారు ఫరవాలేదు, ఒక లక్షమంది యోధులు వస్తే రామ చంద్ర మూర్తి కొట్టేస్తాడు ఫరవాలేదు ఒక్క శూర్పణఖ వస్తే ఆయన సీతమ్మనే పోగొట్టుకోవలసి వచ్చింది, ఇదే అప్రియ దర్శనం.
ఇదేమిటో తెలుసాండీ లోపల ఉన్నటువంటి ప్రవృత్తి అటువంటిది ఆఁమనస్సులోపల ఉండేటటువంటి స్థితి అటువంటిది, ఆవిడ ఇప్పుడూ ఎలా కావాలంటే అలా మాట్లాడుతుంది, ఆ మాటలచేత తన మనసులో ఉన్న కోర్కె యొక్క వ్యగ్రతచేత ఆవిడ ఎంత భయంకరమైన స్థితినైనా సరే కల్పించగలదు కాబట్టి ఆవిడ రావడమే పరమ ప్రమాదకరమైనటువంటి సన్నివేశం కాని అవతార ప్రయోజనం నెరవేరాలీ అంటే... శూర్పణఖ రావడం వినామార్గంలేదు. అందుకేగా అగస్త్య మహర్షి మహానుభావుడు త్రికాలవేది కనుక నీవు పంచవటిలోవుండు అనడానికి కారణం ఇదే. రాక్షసులు రావాలి శూర్పణఖ రావాలి ఆమె రావణుడి దగ్గరికి వెళ్ళాలి రావణుడు రావాలి సీతాపహరణం జరగాలి, అప్పుడు కాని రాముడు రావణ సంహారానికి అడుగులువేయడు. కాబట్టి ఇప్పుడు శూర్పణఖ రామున్ని చూసి రామున్ని ప్రశ్నవేస్తోంది, ఆవిడ ఆయనకు ప్రశ్నవేయగలిగన సత్తాఉన్నదా? అంటే యోగ్యతా యెగ్యతలు యొక్క విచారణ లేకుండా కామముమోహితయై మాట్లాడుతుంది జటీ తాపస రూపేణ స భార్యః శర చాప ధృత్ ! ఆగత స్త్వమ్ ఇమం దేశం కథం రాక్షస సేవితమ్ !! కిం ఆగమన కృత్యం తే తత్త్వం ఆఖ్యాతుం అర్హసి !! నీవు జటివై జటలు కట్టుకుని ఉన్నావు తాపసి ఎలా ఉంటాడో అలా ఉన్నావు పక్కన భార్య ఉంది ఇంతకన్నా దారుణం ఎమిటండీ పక్కనున్నావిడ భార్య అని ఆవిడకు తెలుసు ఆయన నరుడూ అని తెలుసు, భార్య పక్కన ఉండగా ఈమె ఆయనయందు కామమోహితయై శర చాప ధృత్ ధనుర్భాణాలు పట్టుకున్నావు, జటిగా ఉన్నావు కాబట్టి తాపసివనుకోవాలా ధనుర్భాణాలు పట్టుకున్నావు కాబట్టి నీవు రాజువి అనుకోవాలా పక్కన భార్య ఉందీ నాకు సందేహాస్పదంగా ఉంది ఈ విషయాలన్నీ.
ఇప్పుడు మీరు ఎవరూ ఎందుకు ఇక్కడ ఉన్నారూ ఇదికాదు ఆవిడ అడగడమే అసలు అవతలి వారిని శంకించేటటువంటి రీతిలో ఏమండీ ఆయన నేను ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఆయనకు 80 సంవత్సరాలు ఆయన ఇప్పుడు కులాసాగా ఉన్నారా వారు అని అడగడం ఒకెత్తూ, అప్పుడే 80 ఏళ్ళు ఆయన ఇంకా ఉన్నాడా చచ్చిపోయాడా? అని అడగడం ఒకెత్తు. అంటే మనసులో భావన పవిత్రమైతే వాక్కు పవిత్రమైతుంది, మనసులో భావన అపవిత్రమైతే వాక్కు కూడా అలాగే ఉంటుంది, అందుకే వాక్కు చాలా పదిలంగా ఉండాలి చాలా పవిత్రంగా ఉండాలి, కొంత మంది నోటితో ఆయన చచ్చిపోయారండీ అని కూడా అనరు ఆయన శరీరం విడిచిపెట్టారండీ అంటారు, ఇది ఎంత మంగళప్రదంగా ఉంటాయో ఆ వాక్కులు ఆసలు ఆ నోటివెంట మీరు చాలా పరుషమైనటువంటి మాట విందామూ అంటే మీకు వినడం కుదరదు, ఎందుకంటే ఆయన నోటివెంట రాదు ఆ వాక్కు. ఆయన ఎంత పరుషమైన సందర్భాన్ని కూడా అంత సరళంగా అంత పవిత్రంగా అంత మంగళ ప్రదంగా అంత అందంగా మాట్లాడగలడు ఎందుకంటే ఒక్కటే కారణం వాక్కు ఒక్కలా మనస్సు ఒక్కలా ఉండడం కాదు మనస్సలా ఉండడం వాక్కలా ఉండడానికి కారణం.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇక్కడికి ఎందుకొచ్చావ్? నాకు తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది ఏది చెప్పు ఎందుకు చెప్పాలి నీకు అని ఆయన అడిగితే? నీకెందుకు చెప్పాలి? అని ఆయన అడగచ్చు కానీ ఆయన అలా అడగడు, అంటే మహర్షీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఒకటి ముందు చెప్పారు రాముని గురించి, చెప్పీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో చెప్తున్నారు ఈ సంఘటన జరుగబోయే సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడు రామాయణాన్ని పరిశీలనం చేసినా నేను మీతో మనవి చేసేది ఏమిటంటే చిలవలు పలవలుగా చేసిన వ్యాఖానాలు చూడవద్దు ఓ దాంట్లోంచి ఇక విపరీతమైనటువంటి అర్థాలన్నింటినీ తీసుకొచ్చేసే ప్రయత్నం చేయవద్దు అందుకోసమే రామాయణం వచ్చిందని నేను నమ్మను రామాయణం మిమ్మల్ని మీరు ఒక ఉత్తమైనటువంటి మనుష్యుడిగా చక్కదిద్దుకోవడానికి వీలైనరీతిలో రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులను వ్యక్తిత్వములను మీరు పరిశీలనంచేసే ప్రయత్నంచేయండి రామావతార ప్రయోజనం కూడా అదే దశవర్ష సహస్రాణి దశవర్షశతానిచ 11 వేల యేళ్ళు నేను ఉంటాను అనడానికి కారణం ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పడం మీరు రామాయణాన్ని అలాగే చూడవలసి ఉంటుందండీ.
Related imageకాబట్టి అనృతం న హి రామ స్య కదాచిత్ అపి సమ్మతం ! విశేషేణాఽఽశ్రమ స్థస్య సమీపే స్త్రీ జన స్య చ !! ఎంత చమత్కారమో చూడండి ఆ శ్లోకం అనృతం న హి రామ స్య కదాచిత్ అపి సమ్మతం రాముడు ఎన్నడూ అనృతం అంటే అసత్యం మాట్లాడేదానికి ఇష్టపడేవాడు కాదు ఆయన ఎప్పుడూ అసత్యం మాట్లాడరు ఆయన సత్యమే మాట్లాడుతారు. సత్యమే మాట్లాడాలి అంటే మీరు చారిత్రమునకు ప్రాధాన్యము ఇచ్చినవారై ఉండాలి మీ గురించి మీరు చెప్పుకోడానికి మీరు భయపడని రీతిలో ఉంటే మీరు అసత్యం చెప్పవలసిన అవసరం ముందురాదు ఒకటి, రెండు మీరు పశ్చాత్తాపానికి లోనైవుంటే అసలు పూర్వము మీ గురించి ఏదైనా చెడువుంటే చెప్పుకోడానికి మీరు భయపడనూ లేరు ఈ రెండూ లేవనుకోండీ ఇంకా మీలో ఏదో రావలసిన మార్పు ఉందీ అని గుర్తు. మీరు అలా ఆలోచించండి ఓసారి, నేను గతంలో చెడ్డవాన్నండీ... చెడ్డవాన్నంటే ఓ ఉదాహరణకు చెప్తున్నాను, ఏదో ఓ పది సంవత్సరాల క్రితం ఏవో తప్పులు చేసున్నవాన్ని అనుకోండి, పదకొండో సంవత్సరంలో ఎవరో ఓ పెద్దాయన కనపడ్డారనుకోండీ ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుండేవారు మీరు అని అడిగారనుకోండీ, నేను కొంచెం నిన్ననూ నాదగ్గరికి ఎవరో వచ్చారు కారెక్కుతుంటే నేను సంధ్యావందనం సరిగ్గా చేయట్లేదండీ నేను మీ ఉపన్యాసాలు విని రేపటి నుంచి సంధ్యావందనం ఖచ్చితంగా చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాను కుర్రాడు అతడు యువకుడు నేను ఇక వేళ తప్పకుండా ప్రతిరోజు సంధ్యావందనంచేసి గాయిత్రి చేసుకుంటాను అని చెప్పాడు. నేను అన్నాను నాకు ఇంతకన్నా ప్రీతికరమైన విషయం ఇంకోటి లేదు చాలా సంతోషము అతను మార్పు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు మీరు అంతే చూడండి అన్నాను. మీరు ఒకటి ఆలోచించండీ లోకంలో అసలు పాపం చెయ్యడమనేటటువంటిది లేకపోతే ఈశ్వరుడు గురువు అక్కరలేదు. మీరు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా తప్పు చెయ్యకుండా ప్రతీవాడు ఉంటే గురువుగారు ఈశ్వరుడు అక్కరలేదు అది చేసే అలవాటు ఉంది కాబట్టే ఇంద్రియాలని మనస్సుని లొంగదీసుకోలేకపోయాడు కాబట్టే గురువుగారు ఈశ్వరుడు కావలసి వచ్చారు కాబట్టి గురువు ఆకోణంలో కూర్చోవాలి ఎప్పుడు కూర్చున్నా... ఛీ.. ఛీ.. ఛీ. ఛీ నీలాంటివాడు నాదగ్గరికొస్తే ఎలాగా అనకూడదు దగ్గరికివస్తే నీవు మార్చుకో అని చెప్పాలి, ఇది ఈశ్వరుడు ఎవరికోసమండీ పడిపోయినవాన్ని పైకెత్తడానికే ముందుంటాడు కాని ఒక్కటి మీరు పశ్చాతాపపడితే మీరు అరెరే నేను చేసినది తప్పే నేను ఇలా ఎందుకు చేసి ఉన్నాను నేను అలా చేయకూడదు అనుకున్న క్షణంలోనే మీరు కిందపడతారు, నేను మొన్న మీతో చెప్పింది అదే.
నేల మీద పడడం అంటే ఇంక అంతకన్నా పడడానికి ఏమీలేదు మీకు అంతకన్నా కిందపడడానికి అంత పడ్డవాన్ని అని చెప్పడానికి పడిపోతే పైకి ఎత్తుతారా వదిలేస్తారా? ఆయన ఒంగుతారు ఇప్పుడు గురువుగారు ఆఁ... ఆయుష్మాన్భవా


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
శంభోరక్షతు లేవండి లేవండి అంటారు. మిమ్మల్ని శివుడు రక్షిస్తాడు మీ పశ్చాతాపానికి మీరు రక్షింపబడుతారు ఇది చెప్పడానికి గురువుగారు ఉన్నారు గురువుగారు కూడా మీ తప్పులే చూడ్డానికి కూర్చుంటే ఆయన మీకు గురువుకాడు బరువు. ఆయన గురువు కాలేడు మీ తప్పులను చూసి మీరు ఇంకా తప్పులతోనే ఉంటాను మీరు ఆదరించాలంటే గురువుగారిని తప్పుపట్టకూడదు అప్పుడు మీరు పశ్చాత్తాపం పొందితే గురువుగారు మిమ్మల్ని పైకెత్తడానికే సిద్ధంగా ఉంటాడు ఎందుకో తెలుసాండీ.. నీలో వచ్చిన మార్పుకు గురువుగారికి సంతోషహేతువు నీలో వచ్చిన మార్పు ఈశ్వరునకు సంతోషహేతువు తప్పా... అది లేకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండీ ఈశ్వరునికి నమః శివాభ్యాం అసుపాభ్యాం అని అనవలసిన అవసరం లేదు ఆయన ఇంక ఎప్పుడూ కర్మాకర్మఫలప్రదాతగా ఏదో జడ్జిగారిలా కూర్చుని తప్పుచేశావు శిక్ష వేస్తాను పుణ్యం చేశావు ఫలితం ఇస్తాను అనడం తప్పా అసలు ఆయనకి క్షమించడం అన్న ఉదారగుణంలేదనుకోండీ అప్పుడు ఇంక ఈశ్వరుడు ఏమిచేస్తాడండీ మీరు చేసినదానికి మీరు ఫలితం పొందితే ఈశ్వరుడికన్న కర్మగొప్పదై కూర్చుంటుంది. కర్మగొప్పదా మనసు గొప్పదా అంటే కర్మకన్నా మనసే గొప్పదౌతుంది, మీరు చేసిన కర్మా మీరు చేసిన కర్మకు ఉపయోగించిన ఉపకరణములకన్నా మీయొక్క భక్తీ భక్తితో కూడిన మనస్సు గొప్పవౌతాయి మీరు ఒక్కసారి మారి ఈశ్వరుడిదగ్గర నిజాయితీగా కన్నుల నీరు పెట్టుకున్నారనుకోండీ చాలు ఈశ్వరుడు అక్కడికి ఎత్తి కూర్చోబెడుతాడు.
Image result for కాళహస్తీశ్వర శతకంఏం ఎంత స్తోత్రం చేశాడు ధూర్జటి కాళహస్తీశ్వర దేవాలయంలో ఇవ్వాళ ఆయన దేవాలయం చుట్టూ ధూర్జటి పద్యాలు ఉన్నాయా చెప్పండి నాకు, దూర్జటిది కన్ఫెషన్, కన్ఫెషన్ అంటే అరమరికలేకుండగా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిచెప్పాడు ఆయన రోసీరోయదు కామినీ జనుల తా రున్యోరు సౌఖ్యంబులన్, పాసీపాయదు పుత్ర మిత్ర దన సం పశ్బ్రాంతి, వాంఛాలతల్, కోసీకోయదు నమనంబకట ! నీ కున్ ప్రీతిగా సత్త్రియల్, చేసీచేయదు దీని త్రుళ్ళణచవే శ్రీకాళాహస్తీశ్వరా!! అని అడిగారు, ఉన్నది ఉన్నట్లుగా యదార్థాన్ని ఈశ్వరుని దగ్గర చెప్పాడు. చెప్పాడు కాబట్టే అష్టదిగ్గజాలలో మిగిలినటువంటి వాళ్ళ పద్యాలు ఎక్కడో ఏవో చెప్పుకుంటారు ఏదో సంతోషానికి పెద్దనగారు చాలా గొప్పవాడే కావచ్చు, మనుచరిత్ర చాలా గొప్పదే అవ్వచ్చు అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ (పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్) అనీ ఏదో ఎంత గొప్ప పద్యానైనా రచన చేయవచ్చు శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోపతాపస ప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లికాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవంబను మహా ప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము అని ఎంతైనా చెప్పిండచ్చు కానీ... ధూర్జటి కాళహస్తీశ్వర శతకంతో తుల్యంగా భక్తి విషయంలో మనుచరిత్ర నిలబడగలదా..? నిలబడదు దానికి అలా ప్రతివాళ్ళూ ధూర్జటి కాళహస్తీశ్వర శతకం అంటే తెలుగువాళ్ళ నోటిమీద ఒక్కపద్యమైనావచ్చి ఉంటుంది.
ఏదీ మనుచరిత్ర నుంచి ఒక్కపద్యమైనా వచ్చిన తెలుగు వాళ్ళు ఉంటారని మీరు చెప్పండీ..? పోతనగారి భాగవతంలోంచి ఒక్క పద్యమైనా వచ్చి ఉంటుందీ అని మనుచరిత్రలోంచి ఒకటి ఉంటుందని చెప్పండి ఉండదు ఎందుకంటే ఒక్కటే కారణం ఒక భక్తుడు ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు ధూర్జటి, నిలబడ్డాడు కాబట్టే కాళహస్తీశ్వర శతకాని ఆస్థాయి


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
వచ్చింది. కేవలము ఒక శతకము కాదు అది కేవలం రెండు ఒడ్లు ఉన్నది కాదు అది ఒకటో పద్యం ఓ ఒడ్డు రెండో పద్యం ఓ ఒడ్డు ఇటునుంచి తిరిగి అటునుంచు ఎక్కేది కాదు అది ప్రతి పద్యం కూడా మీ జీవితానికి సమన్వయం అయ్యేటటువంటి అత్యద్భుతమైనటువంటి వాజ్ఞ్మయశ్వరూపం. ఈశ్వరుని దగ్గర అటువంటి స్తోత్రం చేశాడు మహానుభావుడు కేవలము ఆయన్ను స్తుతిచేసినవాళ్ళు చాలా మంది ఉన్నారు శతకాల రూపంలో నీవు చంద్రుడివి నీవు ఇంద్రుడివి నీవు ఉపేంద్రుడివీ ఈశ్వరా ఇంతగొప్పవాడు అంతగొప్పవాడూ అని ఎంతమంది రాశారో... ఈశ్వరా నాయందు ఈ దోషాలు ఉన్నాయి నన్ను ఎలా ఉద్దరిస్తావు నేను చేసేదేం లేదు అని చెప్పినవాడు ఎవడైనా ఉంటే అంత నిజాయితిగా చెప్పుకున్నాడు శ్రీశైలేశు భజింతునో యభవు గాంచీ నాథు సేవింతునో కాశీ వల్లభు గొల్వబోదునో, మహిన్ కాళేశుబూజింతునో నాశీలంబణువైన మేరువనుచున్ రక్షింపవే ! నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వరా !! అని చెప్పుకున్నాడు, అంత మాత్రం చేత నేను అల్లసాని పెద్దనగారిని ఎంత మాత్రమూ తక్కువ చేయుటలేదు.
Image result for అల్లసాని పెద్దనమహానుభావుడు ఆయన స్థాయి ఆయనది ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి కే లూత యొసగి యెక్కించుకొనియె మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ బల్లకి తనకేల బట్టియెత్తె బిరుదైన కవిగండ పెండేరమున కీవె తగు దని తానె పాదమున దొడికె గోకటగ్రామా ద్యనే కాగ్రహారము లడిగినసీమలయందు నిచ్చె నాంధ్రకవితాపితామహ యల్లసాని పెద్దనకవీంద్ర యని నన్ను బిలుచునట్టి కృష్ణరాయలతో దివి కేగలేక బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు అని అత్యంత కృతజ్ఞతతో మహానుభావుడు చెప్పుకున్నాడు. నేను ఆకోణంలో ఆయన్నేం విమర్షచేయట్లేదు, అటువంటి మహానుభావుని విమర్షచేయడానికి నేనెంతటివాడిని, నేను అన్నది ఈశ్వరుడి ముందు ఒక భక్తుడు నిలబడడమూ అంటే కన్ఫెషన్ మీరు ఈశ్వరునితో మాట్లాడేటప్పుడు మీలోపాల్ని మీతప్పుని మీరు దేన్ని దాటలేకపోతున్నారో ఎందుకుని మీకు అనుగ్రహాన్ని కావాలో మీరు మనసువిప్పి సర్వేశ్వరుడితో చెప్పుకోలేకపోతే ఇంక మిమ్మల్ని ఉద్ధరించగలిగినవాడు ఎవడుంటారండీ అసలూ పదార్థం అక్కడుంది ఉపయోగించుకోనప్పుడు మీకు ఎలాగ మీకు ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
అమ్మ అన్నమంటే వండుతుందేమో కాని మీరు తినకపోతే ఆకలి ఎలా తీరుతుంది. ఈశ్వరుడు ఎదురుగుండా వచ్చి నిలబడడేమోకానీ మీరు ఆయన్ని నా దగ్గర ఈ దోషముంది ఈశ్వరా దీన్ని మీరు తీసై అని అడగకపోతే ఆయన ఎలా తీయగలడు మీకు కాబట్టి మీరు అదీ గమనించవలసి ఉంటుంది. అది భక్తికి సంబంధించినటువంటి ఒక గొప్ప విశేషము ఆ పశ్చాత్తాపం చాలా గొప్పది ఆ పశ్చాత్తాపం అనేటటువంటిది ఉన్నావాడు తన తప్పు చెప్పుకోవడానికి భయపడడు. ఒకప్పుడండీ ఎంత నేరం చేశాననుకుంటారు లేరనుకుంటారా మీరు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సామ్రాట్టులై కూర్చున్నటువంటివాళ్ళు ఒక్కొక్కప్పుడు పెద్ద పెద్ద విప్లవకారులై ప్రభుత్వాల మీద తిరగబడినవాళ్ళు ఉన్నారు. అరవిందో లేరా అరవిందో ఒకప్పుడు చాలా కాలం కారాగారంలో మగ్గిపోయినటువంటి మనిషి అరవిందో జీవిత చరిత్ర చదివితే మీరు ఆశ్చర్యపోతారు అటువంటి వ్యక్తి ఎటువంటి స్థాయికి చేరుకున్నారు ఆయనేం దాచుకోలేదే అదొక జీవితం అది గతం విజహాః ఇదొక పుట్టుక. పశ్చాత్తాపం కలిగితే ఈ జీవితంలో నిజం చెప్పడానికి భయపడవు, నీ చారిత్రం మంచిదైతే అసలు మీ గురించి చెప్పుకోవడం అవసరం ఉండదు నేను ఎంతటివాన్నండీ చెప్పుకోవడానికి అంటారు.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
ఈ రెండూ లేకపోతే ఇంకా రావలసిన మార్పు ఇంకా ఏదో ఉందండీ అంటారు రామ చంద్ర మూర్తి అనృతం న హి రామ స్య ఆయనెప్పుడూ అబద్ధము చెప్పుకోవలసిన అవసరము ఆయనకు లేదు అసలు ఆయనకు ఆ అలవాటూ లేదు ఆయన ఎప్పుడూ అబద్ధం మాట్లాడడు కదాచిత్ అపి సమ్మతం విశేషేణాఽఽశ్రమ స్థస్య ప్రత్యేకించి ఆశ్రమములయందు ఆయన అస్సలు అబద్దమాడరు, ఏమిటండీ ఆశ్రమములయందు అబద్ధమాడరూ అంటే? మరి ఎప్పుడైనా అంటారేమో అన్నట్టుగా ఉందిగదా దానర్థం అని అనుమానం రావచ్చు విశేషేణాఽఽశ్రమ స్థస్య అంటే ఆశ్రమంలో తాను ఉండి మాట్లాడుతున్నప్పుడు కించిత్ ఎక్కడైనా ఒక చిన్న అసత్యం లాంటిదాన్ని చెప్పి దాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి అవసరాన్నికూడా తన భుజాలమీదకు ఎత్తుకోడంట ఆయన ఎందుకంటే అందులో ఉన్నవాళ్ళకి ధర్మం తెలుసు తనుకొత్తగా ఏం ఎత్తుకోవలసింది లేదని గ్రహించి ఉంటాడూ అని గుర్తు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సుమంత్రుడు అరణ్యవాసానికి రథం మీద తీసుకెళ్ళిపోతున్నప్పుడు దశరథుడు ఆపమంటున్నాడూ నీవు తోలమంటున్నావు రేపు తిరిగొచ్చిన తరువాత దశరథుడు రథం ఆపమంటే ఆపలేదు ఎందుకూ అని అడిగితే ఏం చెప్పనూ అంటే రథచక్రముల సవ్వడిలో ఆపమని నూవ్వన్న ధ్వని నాకు వినపడలేదని చెప్పై అన్నాడు.
మరి అపద్దం చెప్పడం ఒకటి అపద్దం చెప్పించనూ ఒకటి కదా... అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి అంటే తాను తప్పదనిచెప్పి వెళ్ళిపోవాలి, ఒక పెద్ద సత్యం కోసం ఒక చిన్న అసత్యం దోషభూయిష్టమేం కాదు. ఒక్కక్కసారి దేవిభాగవతంలో దీనిగురించి ఒక వృత్తాతం ఉంది, ఎదో ఒకాయనా పోనీ దేవీభాగవతం అంతా ఇప్పుడు ఆ వ్యాఖ్యానాలజోలికి ఎందుక్కానీయండి ఒక తేలిక ఉదాహరణ చెప్పాలంటే ఒక అరుగుమీద ఒక బ్రాహ్మణుడు కూర్చున్నాడనుకోండి, ఇటో అరుగుంది ఆటో అరుగుందీ ఆవు పరుగెడుతోంది ఆవు వెనకాతల కసాయివాడు పరుగెడుతున్నాడు ఆవు పరుగెత్తింది కసాయివాన్ని అంత దూరంలో చూశాడు ఆయన ఈ అరుగుదిగి ఆ అరుగు ఎక్కి కూర్చున్నాడు. కసాయివాడు వచ్చి అడిగాడు ఆవు ఇటుపరిగెత్తిందా అన్నాడు, ఏమో నేను ఈ అరుగుమీద కూర్చున్నాక ఏమీ వెళ్ళలేదే అన్నాడు. ఆ అరుగుమీద ఉండగా వెళ్ళిందేమో కాని ఈ అరుగుమీద కూర్చున్నప్పుడు వెళ్ళలేదుగా మీకు తెలిస్తే ఆపాటి అబద్ధంతోనైనా ఒక ప్రాణిని రక్షించగలిగితే అప్పుడు మీకు అపద్దం కిందకి రాదు అది ధర్మాన్ని రక్షించడం కిందే వస్తుంది అది మీరు అన్వయం చేసుకొని అపద్ధాలు మాత్రం ఆడకూడదు. అది నిజంగా అంత ధార్మికమై ఉండాలి ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అపద్ధమాడడం ధర్మాన్ని రక్షించడమే అవుతుంది తప్పా అధర్మం కిందకి రాదు కాని అలా అని చిన్న చిన్న అపద్దమేదైనా చెప్పి ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యతను కూడా నెత్తికి ఎత్తుకోడు.
Image result for లక్ష్మణుడుఆశ్రమంలో ఉంటే అక్కడ నాకు ఆ అవసరం లేదు అక్కడ ఉండేవాళ్ళందరూ ధర్మావలంబుకులే నాకెందుకు ఆ మాట కాబట్టి విశేషేణాఽఽశ్రమ స్థస్య సమీపే స్త్రీ జన స్య చ ఇదీ పురుషుడియందు ఒక బలహీనత ఆడది కనపడితే ఉన్నదో లేనిదో అపద్దమో నిజమో ఏదో ఒకమాట మాట్లాడేసి అవతలివాడు అబ్బో ఈయన ఇంత గొప్పవాడా అనుకోవాలనుకొని ఒకమాట మాట్లాడేస్తే వాళ్ళంత వెర్రివాళ్ళు నమ్మేస్తుంటారు అనుకుంటుంటారు. రాముడు అటువంటివాడు కాదట సమీపే స్త్రీ జన స్య చ ప్రత్యేకించి పక్కన ఆడవాళ్ళున్నప్పుడే ఆయన అపద్దాలాడడానికి లేకపోతే ఇతరరకమైనటువంటి ప్రవర్తనకి ఆయన అసలు ఇష్టపడకుండా తనకుతానుగా బాగా కుదురుపరుచుకుని ఉంటాడట ఎందుకు ఈ శ్లోకం ఇక్కడ ఇప్పుడు అకస్మాత్తుగా రామ శీలావిష్కారకోసం నీవు ఎవరు తెలుకోవాలనుందని శూర్ఫణఖ అంటే రాముడు ఏమన్నోడో చెప్పాలా? వాల్మీకి రాముడు


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
ఎలాంటివాడో చెప్పాలా అంటే ఎదర మీరు చూడబోయేటటువంటి సంఘటనని రాముడు మాట్లాడబోయే మాటలని మీరు ఈ కళ్ళద్దాలు పెట్టుకుని చూడవలసి ఉంటుంది జాగ్రత్తగా తప్పదు మీరు న్యాయమూర్తిగా కూర్చుని మీకు ఎలా తోస్తే అలా తీర్పులు చెప్పొద్దు, ఈశ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగబోయే సంఘటన రాముడు మాట్లాడేమాట శూర్పణఖతో మాట్లాడేమాటలను జాగ్రత్తగా గమనించి ఆయన ఎందుకు మాట్లాడుతాడో అలా ఎదో ఆడది కనపడిందాని వెర్రెక్కిపోయి ఉన్న అపద్దం లేని అపద్దం మాట్లాడేసి హాస్యప్రసంగాలు చేసేసి అక్కడ నుంచి సంతోషం పొందేసేటటువంటి లేకిమనస్తత్వం ఉన్నవాడు కాడు సుమా! ఇప్పుడు ఆయన అన్నాడు ఏమిలేదమ్మా అదిగో అక్కడ ఉన్నాడే ఆశ్రమంలో ఏదో పాపం ఆయన కట్టెలు అవీ విరుస్తున్నాడు ఆయన లక్ష్మణమూర్తి నా సోదరుడు ఈమే విదేహవంశంలో జన్మించింది సీత ఇయం భార్యా చ వైదేహీ మమ సీతే తి విశ్రుతా ! నియోగా త్తు నరేన్ద్ర స్య పితుర్ మాతు శ్చ యన్త్రితః !! ఈమెకు సీతా అని పేరు మేము ముగ్గురము కలిసి నా తండ్రి దశరథ మహారాజు మాతల్లి కైకమ్మా మమ్మల్ని వనవాసదీక్ష తీసుకోవాలి అని ఆజ్ఞాపిస్తే మేము ఈ వనవాసానికి వచ్చాము ఇంతకన్నా ఇంక రాముడు ఏం చెప్పలేడు, మా అమ్మ వరాలడిగింది మా నాన్ని నన్ను అడవులకు పంపించాడు ఎవరు ఏస్థాయిలో అర్థం చేసుకుంటే సరిపోతుందో ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే చాలు అంతే తప్పా అందరి దగ్గరికి వచ్చి దాని గురించి పెద్ద విశేషంగా అదే మోసపోసినట్టుగా ఇంక అక్కడనుంచి మొదలుపెట్టి, ఒకానొకప్పుడు మా నాన్నగారు నాకు యౌవ్వరాజ్యపట్టాభిషేకం చేస్తున్నాననుకున్నారు అని ఆ కథంతా మొదలుపెట్టి చెప్పక్కరలేదు కాబట్టి అంతే మాట్లాడి వదిలేశాడు.
Image result for surpanakha animatedకాని ఆవిడ అందీ అహం అంటూ మొదలు పెట్టింది అహం శూర్పణఖా నామ రాక్షసీ కామ రూపిణీ ! అరణ్యం విచరా మీదమ్ ఏకా సర్వ భయంకరా !! నేను శూర్పణఖా అనేటటువంటి పేరు కలిగినదానను, నేను రాక్షసిని కామరూపిణిని ఏరూపం కావాలంటే నేను ఆరూపం పొందుతాను నేను ఈ భయంకరమైనటువంటి అరణ్యములో ఒక్కదాననే సంచరించగలను అంటే నాకు అంత బలపరాక్రమాలు ఉన్నాయి, నా అన్న రావణాసురుడు విశ్రవసు బ్రహ్మ యొక్క కుమారుడు నీవు వినేవుంటావు రావణుని గురించి అంది, ఇదొక చాలా అతిశయంతో కూడి ఉంటారు కొంత మంది, మీరు ఎవరండీ అని అడిగారనుకోండీ నేను ఫలానావారి అబ్బాయినండీ నాపేరు ఫలానా, మీరు ఏం చేస్తుంటారని ఆయన మీగురించి ఎక్కువ అడిగారనుకోండీ మీకు నా గురించి తెలిదా అంటారు, నా గురించి తెలిదా అంటే మీకు తెలిసివుండి ఉండాలని నేను అంతఖ్యాతి వహించినవాన్నని ఒక అతిశయమన్నమాట అంటె రావణుడి గురించి తెలియదా అంటే రావణునివల్ల నీవు ఇంకా ఎడవలేదా వాడుచేసే పనేముంది ఇంకోకళ్ళని ఏడిపించడమేగా... రావణుడు లోకరావణుడు ఆ రావణుని గురించి నీకు తెలియదా? అటువంటి రావణాసురుని యొక్క చెల్లెల్ని రావణో నామ మే భ్రాతా రాక్షసో రాక్షసేశ్వరః మహాబలవంతుడైనటువంటివాడు రావణో నామ మే భ్రాతా ఆ రావణాసురుడు నా యొక్క అగ్రజుడు ఆయన యొక్క చెల్లెల్ని, కుంభకర్నుడు ఎప్పుడూ నిద్రపోయేటటువంటి స్వభావమున్నవాడు మహాభలవంతుడు కుంభకర్నుడు నాయొక్క ఇంకొక అన్నగారు రెండవ అన్నగారు నేను శూర్పణఖా అనే పేరుగలిగినటువంటి చెల్లెల్ని.
Image result for surpanakha photoనా తరువాత ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ జనన క్రమంలో ముందు రావణుడు తరువాత కుంభకర్ణుడు తరువాత శూర్పణఖ తరువాత విభీషణుడు. విభీషణుడు ధర్మాత్ముడు ఆవిడ ఏమందో తెలుసాండీ విభీషణుని గురించి చెప్తూ విభీషణ స్తు ధర్మాత్మా న తు రాక్షస చేష్టితః అబ్బే..! వాడు ఉన్నాడే... ధర్మాత్ముడు వాడికి రాక్షస గుణాలు ఒక్కటీ లేవు ఇది ఎలా ఉంటుందంటే హిరణ్యకశపుడు ప్రహ్లాదునిచూసి గుండెలు బాధుకున్నట్లు ఉంటుంది. ఏమిటండీ ఏమిటీ ఒక్కటీ రాలేదు ఈ అల్లరేమిటీ ఈ విష్ణు భక్తి ఏమిటీ అని ఆయన ఏడ్చినట్టూ విభీషణ స్తు ధర్మాత్మా ఆమాట రాముడికి చాలా సంతోషం కానీ ఈవిడ అంటూంది న తు రాక్షస చేష్టితః ఒక్క రాక్షసగుణం లేదు వాడికి వాడు ఒక్కడే తప్పుపుట్టాడు వాడు పనికిమాలినోడు అని ఆవిడబాధ ఆవిడది, అంటే... అని ఆవిడందీ రామ చంద్ర మూర్తి వంక చూసి నాకు అపారమైన భలమున్నదాన్ని నేను ఈ అరణ్యంలో యదేచ్ఛగా విహరిస్తుంటాను కాబట్టి సముపేతాస్మి భావేనా భర్తారం పురుషోత్తమమ్ నన్ను నీవు భార్యగాపొందు పొంది సుఖము అనుభవించు ఏదో పెద్ద రామ చంద్ర మూర్తిని అనుగ్రహిస్తున్నట్లు మాట్లాడింది అహం ప్రభావ సంపన్నా స్వచ్ఛంద బల గామినీ ! చిరాయ భవ మే భర్తా సీతయా కిం కరిష్యసి !! నేను చాలా బలమున్నదాన్ని ప్రభావమున్నదాన్ని నన్ను భార్యగాపొందితే నీవు సంతోషం పొందుతావు కానీ ఈ సీతవల్ల ఏం పొందుతావు.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
అసలు సీతమ్మ అంటే ఏమిటో భార్యంటే ఏమిటో అనుగమించడం అంటే ఏమిటో మనసులు కలవడం ఏమిటో ఆవిడకి ఏమైనా తెలిస్తేగా... ఆవిడ అప్పటికప్పుడు న్యాయం చెప్పేసింది అంతే అంటే ఆవిడ మనసులో ఇప్పుడో కోరిక ఉంది ఆవిడ భార్యా స్థానంలో కూర్చోవాలి అనిపించింది కాబట్టి ఆ స్థానం ఖాలీ అయిపోవాలి, కాబట్టి ఆవిడ ఎవరు ఎటువంటిది, అడవికి ఎందుకు కలిసి వచ్చింది, నేను ఇలా అనచ్చా అనకూడదా ఏమీ ఉండదు, ఇదీ ఈ పోకడ మీకు బాగా కనపడుతూంటూంది చూడండి లోకంలో ఎంత ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుంటారంటే చాలా పరుషమైన వాక్కు ఒకటి వినపడుతుంటూంది లోకంలో ఒక పిల్లకి పెళ్ళైపోయిందనుకోండి ఒక పిల్లాడికి పెళ్ళైపోయిందనుకోండి ఒకమాట నోటివెంటరాకూడదు, అసలు నేను చేసుకుందామనుకున్నాను ఆయన్ను అది ఆమాటెందుకింక ఇప్పుడు ఇంక ఆ మాట అనకూడదు, లేకపోతే ఆ అమ్మాయిని నేను చేసుకుందామని అనుకున్నాను, కొంతమంది పెద్దవాళ్ళు కూడా నేను ఆ అమ్మాయిని కోడలుగా చేసుకుందామనుకున్నాను అని ఇంకెందుకామాటా..? చాలా లేకి మాట ఇంక ఆ మాట రాకూడదు అసలు అయిపోయిందంతే ఊరుకోవాలి ఆ అమ్మాయి నీ కూతురు నీ కోడలే ఆ అబ్బాయి నీ కొడుకనుకో అమ్మాయి నీ కోడలు కాకుంటుందా..? ఎప్పటికీ కోడలే నా కోడలిని చేసుకుంటుందామనుకుంటున్నానూ... అనేటప్పటికే మళ్ళీ అక్కడ వక్రమైనటువంటి దృష్టి ప్రసారమైపోయింది అంతే...
కొంత కొంత మంది మాటలలో నుండేటటువంటి లేకితనం మనసు ఎంత వెలితి మనసు అన్నదీ రాక్షస మనస్తత్వం అంటే ఇంతేనండీ ఇంకేం ఉండదు, రాక్షసులూ అంటే శూర్పణఖా అంటే ఏదో పెద్ద హావావిడీ ఏం ఉండదు మీలోకి శూర్పణఖ రాకుండా చూసుకోండి, మీలోకీ అంటే నీవు అంత పెరిగిపోయావా అనుకోకండీ మీలో అన్నమాట ఎందుకంటున్నానంటే మీరు తొలగించుకోగలిగినటువంటి స్థితిలోఉన్నటువంటి ఉదార్థులు నేను అంత తెలిగ్గా పోగొట్టుకోగలిగినంత సాధనలో ఉన్నవాన్ని కాను కాబట్టి మీతో నేను పోల్చుకోవడం ఇష్టంలేక నేను మీతో కలుపుకోలేదు అంతే ఆవిషయంలో నేను మీకన్నా తక్కువవాన్నేసుమాండీ! కాబట్టి వికృతా చ విరూపా చ న సేయం సదృశీ తవ ! అహమ్ ఏవాను రూపా తే భార్యా రూపేణ పశ్య మామ్ !! వికృతా చ విరూపా చ ఈ సీతమ్మ చాలా వికృతంగా ఉంది విరూపంగా ఉంది ఇదే సీతమ్మ గురించి రావణుడి దగ్గర చెప్తుంది, ఎంత గొప్పగా చెప్తుందో తెలుసాండీ అసలు ఆసీతమ్మ అందమేమిటీ అంటుంది అప్పుడెందుకూ అప్పుడు అందం ఎందుకు కనపడింది అంటే అప్పుడు కక్షేమిటంటే... ఆ సీతమ్మని రాముడు ఎత్తుకొచ్చేయ్యాలని ఆవిడ ఏడవాలి అందుకు సీతమ్మ అందం చెప్పింది, ఇక్కడ సీతమ్మ అందంగా కనపడకపోవడం ఏమిటీ అంటే ఇప్పుడు ఈవిడ మాట వినేసీ రాముడు అకస్మాత్తుగా ఛీ., ఛీ., నిజమే ఈవిడేంటీ బాగాలేదు అని అనేసుకోవాలి అనేసుకొని వదిలేయాలి వదిలేసి శూర్పణఖ చేయిపట్టేసుకోవాలి తనెంత లేకిమనసో రాముడు అంత లేకిమనసు అనుకోవడం.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
కొంత మందీ... మనం చేసే ప్రచారం కూడా అలాగే ఉంది మన ప్రసార సాధనాలు కానీయ్యండీ మన సినిమాలు కానియ్యండీ మన సాహిత్యం కానీయ్యండీ అంతే... లౌ అట్ ఫస్ట్ సైట్ అటా ఎమిటో దాని అర్థం నాకు ఎప్పటికీ అవగతం కాలేదు, అసలు ఏమీ యుక్తాయుక్త విఛక్షణ ఏమిటో వాడు ఎవడో ఏమిటో ఆవిడకేం తెలియదు ఆవిడేమిటో ఆయనకేం తెలియదు, వాళ్ళ శూభలేక కూడా అలాగే ఉంటుంది I soloist your graces presence ఎందుకంటే తల్లిలేదు తండ్రిలేడు బంధువులులేరు అన్నదమ్ములులేరు వాడొక్కడే వాడు అనాథ ఆవిడొ అనాథ ఇద్దరు అనాథలు పెళ్ళిచేసుకుంటున్నారు. శుభలేక వాళ్ళ పేరుమీదే ఉంటుందు అంత దరిద్రమైన సంస్కృతికి ఇవ్వాళ మనం దిగజారిపోయాము. కాబట్టి వికృతా చ విరూపా చ న సేయం సదృశీ తవ నీకీ ఆవిడకీ ఇద్దరికీ సరిపోలేదు కాబట్టి బాగలేదు మీరిద్దరూ అలా ఉండకూడదు, నేను మొన్నన మీతో మనవిచేశా అసలు భార్యా భర్తలైనవారు ఎప్పుడైనా కనపడితే దంపతులు కనపడితే పొరపాటున మనసులోకే ఒక మాట రాకూడదు ఆయనకు తగినట్టు ఆవిడలేదనో ఆవిడకు తగినట్లు ఆయనలేడనో ఒక్కనాటికి అనకూడదు, నేను మొన్నన మీకు ఉదాహరణలు కూడా చూపించాను కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం వొండొరులు తపస్సుకు ఫలమై ఉన్నారు తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్ దథ్యంబు వైదర్భియుం దగు నీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ యిద్దఱిం దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా కాబట్టి వొండొరులు తగి ఉన్నారనాలి ఆవిడ అంటోంది నీకు ఈవిడ తగినది కాదు మీ ఇద్దరికీ బాగలేదు ఆ దాంపత్యం చూడ్డానికి అందంగా లేదు ఈ సీత, కాబట్టి అహమ్ ఏవాను రూపా తే భార్యా నేనైతే నీ పక్కన బాగుంటాను భార్యా రూపేణ పశ్య మామ్ కాబట్టి నీవు నన్ను భార్యగా స్వీకరిస్తే చాలా అందంగా ఉంటుంది ఇమాం విరూపామ్ అసతీం కరాళాం నిర్ణతోదరీమ్ ! అనేన తే సహ భ్రత్రా భక్షయిష్యామి మానుషీమ్ !! ఈవిడకసలు సీతమ్మ గురించి ఏం తెలుసని ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసిందో మనకు అవగతం కాదు.
ఇదీ శూర్పణఖయందే అనుకోకండీ ఏమిటో తెలుసున్నట్లూ ప్రతివాడి గురించీ ఓ... అదే పనిగా అసలు ఎవర్నైనా మీరు పరిచయం చేయగలిగిన ప్రిజిడీస్ అని ఒకటి ఉంటుంది. రైల్లో ఎదురుగుండా వచ్చి ఎవరో ఒకాయన కూర్చోగానే పెట్టి జాగ్రత్త అంటాడు వీడు, అంటే ఎందుకు పెట్టె జాగ్రత్త అన్నారూ అన్నారనుకోండీ ఆ గడ్డమదీ ఆయన్ను చూస్తే అనుమానంగా ఉంది, ఆయనేదో రామాయణం చెప్పుకోవడానికి గడ్డం పెంచుకున్నాడేమో కాబట్టి ప్రిజ్జిడీస్ అంటే మనస్సులో ఉండేటటువంటి పక్షపాతము యొక్క ధోరణిచేతా నిర్ణయానికి వచ్చేయడమే ఆయన ఎవరూ ఏమీ? ఏమీ అక్కరలేదు ఓ మాట అనేయడమే ఇమాం విరపామ్ అసతీం చాలా చడ్డది వికృతమైన రూపంతో ఉంది సీత కరాళాం ఓయ్ ఎంత భయంకరంగా ఉందో శూర్పణఖ భయంకరమా సీతమ్మ భయంకరమా ఇంక ఇంతకన్నా హాస్యమేముంటుందండీ లోకంలో నిర్ణతోదరీమ్ ఆ కడుపు చూడు లోపలికి పోయి ఎలా ఉందో..? అనేన తే సహ భ్రాత్రా ఈవిడా ఆ లక్ష్మణుడు ఏమిటీ వీళ్ళిద్దరు నీతోటి ఇలాగా..? ఈవిడ పక్కనుంటే ఒప్పించీ ఇప్పుడు ఆవిడని దూరంగా పంపించీ నన్ను భార్యా స్థానంలో కూర్చోబెట్టుకోవడం అనేటటువంటిది నీకు కొంచెం సమయం పడుతుందేమో అంత సమయం నేను ఎదురు చూడడానికి సిద్దంగా లేను కాబట్టి ఏం చేస్తానంటే ఈ గొడవ వదిలిపోతే నన్ను స్వీకరిద్దామనుకుంటున్నావు రాముడి చూపులు ఆవిడకి అంతే అర్ధమయ్యాయనుకోవాలి, రాముడు ఆవిడ మాటలు చెప్పగానే అసలు ఇలా నోరు వెళ్ళబెట్టేసి నోటివెంట ఇలా సొంగకార్చుకుంటూ కొంత మంది రైల్లో వెళ్ళుతున్నటువంటి టికెట్టు తీసుకుంటున్నటువంటి ఆడపిల్లల దగ్గర కీచకులు ఎలా ఉంటారో అలా ఆవిడని ఆవిడ అనేసుకుని రాముడు నావంక పాపం ఎంతలా చూస్తున్నాడో నన్ను తొందరగా భార్యగా పొందుదామనుకుంటున్నాడు కాబట్టి ఈవిడని ఎలా


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
వదుల్చుకుందామనుకుంటున్నాడు ఈవిడని ఒదుల్చుకునేటటువంటి కష్టం పాపం రాముడికి ఎందుకు పెట్టాలి అదేదో నేనే తేల్చేస్తే నాతో సంతోషంగా తిరుగుతాడని ఇప్పుడే చెప్పేస్తుంది అంతే తీర్పు భక్షయిష్యామి మానుషీమ్ దానికెందుకు ఖంగారు పడక్కరలేదు నేను తినేస్తాను అంది వాళ్ళిద్దరిని, నేను తినేస్తాను అప్పుడు నీవు నాతో సంసారం చేద్దువుగాని ఆ తరువాత ఈయన్ను తినేస్తుందేమో కూడా అనుమానం.
Image result for surpanakha animatedకాబట్టి తతః పర్వత శృంగాణి వనాని వివిధాని చ ! పశ్యన్ సహ మయా కామీ దణ్డకాన్ విచరిష్యసి !! ఆతరువాత వీళ్ళిద్దరిని తినేయగానే మనిద్దరం ఏం చెయ్యాలో తెలుసా ఇంక హనీ మూన్ కి బయలుదేరడమే తతః పర్వత శృంగాణి పర్వతముల మీద మనిద్దరము కలిసి వనాని వివిధాని చ వివిధమైనటువంటి ననాలలో పశ్యన్ సహ మయా కామీ  నాతో కలసి దణ్డకాన్ విచరిష్యసి చక్కగా ఈ దండకారుణ్యమంతా మనం విహరిద్దాం. కాబట్టి నేను వీళ్ళిద్దరినీ తినేస్తాను. ఇప్పుడు మీరు ఈ మాటలచేత ఏమి తెలుసుకోవలసి ఉంటుందంటే... అసలు ఆవిడా, ఇప్పుడు రాముడు ఏం చెప్పినా వినడానికి సిద్దంగా లేదు విపరీతమైనటువంటి కామోద్రేకానికి లోనై భావనా వ్యగ్రతతో ఉంది.
లోకంలో ఆడదాని యొక్క మనస్సుని సముద్రంతో పోలుస్తారు పురుషుడి యొక్క మనస్సుని పర్వతంతో పోల్చుతారు ఎందుకంటే క్రూర మృగాలు కానీయ్యండీ ఎలుకలు కానీయ్యండీ పాములు కానీయ్యండి ఎన్ని ఆయనలో చేరినా స్థిరంగా ఆయన నిలబడవలసి ఉంటుంది, సముద్రం బడబాగ్నినీ కడుపులో పెట్టుకుంటుంది పైకి గంభీరంగా ఉంటుంది. ఆడది ఎంత కష్టం ఉండనీయ్యండి పైకి సంసారంలో భర్తని వీధిలో పడేయకుండా సంసారాన్ని లాక్కొస్తుంది, వజ్రాలు కూడా కడుపులోనే ఉంటాయి కానీ ఆవిడమాత్రం ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది. అలా ఇప్పుడు ఈ ఆడదానితో ఛీ.. నోర్మూయ్ ఏమిటి ఈ మాటలు అన్నాడనుకోండి అంతభావనా వ్యగ్రతా ఎటువైపుకు వెళ్ళుతుందో వెళ్ళి ఇది ఏ స్థితిని తీసుకొస్తుందో ఒక ఆడదానితో అంత పౌరుషంగా మాట్లాడడం ఎందుకు మహర్షి చెప్తున్నారుగా సమీపే స్త్రీ జనస్య చ ఆడది పక్కనున్నప్పుడు ఆడదానితో మాట్లాడేటప్పుడు రాముడు బహుదా జాగ్రత్తగా ఉంటాడు, ఇది ఆయన దృష్టికోణం కాబట్టి ఇప్పుడు ఈవిడని ఏమిటా తప్పుడు మాటలు అని ఒక మాట అంటే ఈవిడ మనసు ఎలా విరుగుతుందో దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయో భయానికి కాదు కోరికోరి ఎందుకు ఒక ఆడదానితో అంత కఠినంగా ప్రవర్తించాలి కాబట్టి కొంచెం హాస్యరసాన్ని వేళవించి ఛీ..ఛీ.. వీళ్ళు లొంగేమనుషులు కారు వీళ్ళుని వదిలేయ్ అనేటటువంటి భావన ఆమెయందే కల్పిస్తే బాగుంటుందీ అని రామ చంద్ర మూర్తి అనుకున్నాడు అందుకనీ ఆయన అన్నారూ స్వేచ్ఛయా శ్లక్ష్ణయా వాచా స్మితా పూర్వమ్ అథాబ్రవీత్  ఆయనా... మహర్షి చెప్పేటప్పుడే చెప్పాడు స్వేచ్ఛయా పరిశుద్ధమైన వాక్కు.
వాక్కులో అవతలివారిని ఖేదపెట్టాలన్న ఉద్దేశ్యంలేదు అవతలివాళ్ళతో విరసము ఎక్కువైన సరసమాడాలనేటటువంటి హృదయమున్నవాడు కాడు ఆయన హృదయమేమిటంటే ఆవిడమనసు గాయపడకుండా పంపించాలి, అందుకనీ ఇప్పుడు మృదువైన మాట స్వచ్ఛమైనటువంటిమాట స్మితా పూర్వమ్ అథాబ్రవీత్ ఒక చిన్న చిరునవ్వుతో ఆయన మాట్లాడారు ఆయన అన్నారు కృత దారోస్మి భవతి భార్యేయం దయితా మమ ! త్వ ద్విధానాం తు నారీణాం సుదుఃఖా స సపత్నతా !! స సపత్నతా అంటే పక్కన వేరొకరు


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
భార్యతో పురుషుడు ఉంటే ఆడది సంతోషించదు, ఒక్క భార్య ఉంటే ఆ భార్య పొందేటటువంటి ఆనందంతో పోల్చినప్పుడు వేరొక భార్యను కూడా పురుషుడుపొందితే ఆడదానికి ఎప్పుడూ మనఃశాంతి ఉండదు, నేను కృత దారోస్మి భవతి నేను భార్యను కలిగి ఉన్నవాన్ని ఈమెయందు మనసున్నవాన్ని ఈమెయందు నేను ప్రీతికలిగి ఉన్నవాన్ని కాబట్టి నేను నిన్ను ఇప్పుడు స్వీకరిస్తే నీవు నావలన పొందే సుఖం కన్నా దుఃఖం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పక్కన సపత్ని ఇంకొక భార్య ఉంటుంది ఆ భార్య ఉండగా మనసు కొంచెం ఖేదం పొందుతుంది సౌందర్యలహరిలో శంకరాచార్యులంతటివారు కూడా చమత్కారం చేశారు నవరసాలు చెప్తూ శివే శృంగారార్థ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం (గిరిశచరితే విస్మయవతీ) అన్నారు, గంగపట్ల రోషంతో ఉంది అమ్మవారు ఎందుకంటే సపత్నీ అన్న భావనచేత అందుకనీ నాకు భార్య ఉంది కాబట్టి నీవు అంత సంతోషాన్ని పొందవు.
నా భార్యగా నీవు ఉండాలి అన్న కోర్కె కన్నా అదిగో అక్కడ ఉన్నాడు చూశావా లక్ష్మణ స్వామి అపూర్వీ భార్యయా చార్థీ తరుణః ప్రియ దర్శనః ! అనుపూప శ్చ తే భర్తా రూప స్యాస్య భవిష్యతి !! అని ఆయన చెప్తూ ఒకమాట అన్నాడు ఆయన అ సపత్నా వరారోహే మేరుమ్ అర్క ప్రభా యథా ఆయన్ని నీవు ఎలా పొందుతావంటే మేరు పర్వతాన్ని సూర్యుని యొక్క తేజస్సు ఆయన యొక్క ప్రకాశాన్ని పొందినట్లు పొందు. ఏం సూర్య ప్రకాశం వెనకే వచ్చేస్తుంది మేరు పర్వతం మీదపడి ఆ లక్ష్మణుడు ఉన్నాడే భార్యలేనివాడు ఇత పూర్వం భార్యా సుఖాన్ని పొంది ఉన్నవాడు, కాబట్టి ఆయనా నిన్ను భార్యగా దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడడానికి బహుశా అభ్యంతరం ఉండదు, కాబట్టి నీవు అతన్ని ఆశ్రయిస్తే ఈ సపత్ని గొడవ నీకు ఉండదు పక్కన ఇంకో భార్య ఉండడమన్న గొడవ ఉండదు హాయిగా నీవొక్కతివే ఆయనకు భార్యగా ఉంటూ సంతోషంగా కాలం గడపచ్చు అందుకని నీవు ఆయన్ని ఆశ్రయిస్తే బాగుంటుంది.
అంటే ఆవిడకీ మీరొకటి ఆలోచించండీ ఆ మనసు ఎంతలేకిదో చూడండి... ఆయన్ని కాకపోతే ఆయన తమ్మున్ని అంటే ఇది ఎలా ఉంటుందంటే... కాస్త ఉప్మా చేసై గబగబా పోవాలంటుంటాం, గోధుమ రవ్వ లేదండీ అయ్యో మీరు ఇది అనలేదు ఇంట్లో బొంబాయి రవ లేదు అందనుకోండీ పోనీలే ఏదో ఆ మైదాపిండితో ఓ అట్టముక్కపోసై  అట్టుముక్క పోసేసినా ఫర్వాలేదు లేకపోతే ఉప్మా చేసి పెట్టేసినా ఫర్వాలేదు దానికి తప్పేమిలేదు ఏదో ఒకటి తిని వెళ్ళిపోదామనుకుంటున్నాడు రుచికి లొంగడం కాదు కార్యం మీద వెళ్ళడం ప్రధానం. దానికి పనికి వస్తుందేమో కాని కామం తీర్చుకోవడానికి అన్ననైనా ఫర్వాలేదు తమ్ముడైనా ఫర్వాలేదు అంటే ఎంత అసహ్యకరమైనటువంటి విషయం ఇంక అంతకన్నా వాఖ్యానం అనవసరం, ఇప్పుడు అవిడ వెంటనే లక్ష్మణుని దగ్గరకు వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే లక్ష్మణుడు చూసి అన్నాడూ ఇలా ఇద్దరు, ఛీ.. ఛీ... ఇద్దరు మూర్ఖులూ ఆడదాన్ని అంగీకరించడమే చేతకాదని నిందచేసుకొని వేళ్ళిపోతుందీ మనల్ని మనసులో నిందచేసుకొని వెళ్ళిపోయినా ఆడదాన్ని అంతకన్నా మనం బాధపెట్టకుండా పంపించేస్తే బాగుంటుంది మన ధర్మం చెడకుండా ఉంటుందన్నది రామునియొక్క హృదయం. కాబట్టి ఆయన లక్ష్మణుడి దగ్గరకు పంపించాడు ఆవిడా మళ్ళీ లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే అడిగింది నన్ను భార్యగా స్వీకరించూ అని.
అంటే ఆయన అన్నాడూ కథం దాస స్య మే దాసీ భార్యా భవితుమ్ ఇచ్ఛసి ! నేనే దాసున్ని ఆయనకు పూవ్వులు తేవడం దర్భలు తేవడం కర్రలు తేవడం పర్ణశాల కట్టడం స్నానానికి ఆయనతో కళస పట్టుకుని వెళ్ళడం ఆయన బట్టలుపిండి ఆరేస్తూవుండడం అవి నేను చేస్తుంటాను నేనే ఓ దాసున్ని. దాసున్ని పెళ్ళాడితే నీవు ఏమౌతావు తాసివి అవుతావు కాబట్టి


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
నీవు నేను కలిసి ఏం చెయ్యాలీ అంటే ఆయనకీ ఆవిడకీ దాస్యం చెయ్యాలి కాబట్టీ నన్ను పొంది సుఖమేముంటుంది ఆయనంటావా స్వతంత్రుడూ సేవలందుకునేవాడు కాబట్టి ఆయనకు భార్యవైతేనే బాగుంటుంది అని ఆయనో చిన్న పరిహాసమాడాడు ఆయనన్నాడూ నీలాంటి ఆర్య స్య త్వం విశాలాక్షి భార్యా భవ యవీయసీ నీలాంటి అందగత్తె భార్యగా వస్తానంటే నరకాంతను చూసి ఎవడు మాత్రం భార్యగా ఉంచుకుంటాననడు నీ మీద మోజుపడడూ ఏనాం విరూపామ్ అసతీం అదిగో ఆ సీతమ్మ ఉంది చూశావా విరూపంగా ఉంటుంది చెడ్డదీ కరాళాం ఆవిడ అన్నమాటలే భయంకరమైనటువంటిది నిర్ణతోదరీమ్ కడుపు లోపలికిపోయినది ఇవి శూర్పణఖ అన్న మాటలేగా... నీ దృష్టిలో అలా ఉందనీ లక్ష్మణ మూర్తి అంటారా ఆ సీతమ్మని భార్యాం వృద్ధాం పరిత్యజ్య ఆవిడ వృద్దురాలైపోయింది అందుకని వదిలిపెట్టేద్దాం, ఆవిడ వృద్దురాలు అయిపోయింది ఈవిడ వృద్దురాలా ఏమిటీ..? ముందే వృద్దుడవుతాడు.
అసలు లోకంలో అనకూడని మాట ఏమిటంటే తాతగారు మీరు పెళ్ళి చేసుకోండి అందనుకోండి మనమరాలు ఇప్పుడు నాకు పిల్లనిచ్చేవాడు ఎవడ్రా..? అంటే ఆ తాతగారి పళ్ళేమైనా మిగిలితే ఊడగొట్టేయ్యాలి, నోర్మూయ్ ఇప్పుడు నాకు పెళ్ళేమిటీ అనాలి అంతేగాని నాకింకా పిల్లనిచ్చేవాడు ఎవడ్రా అంటే ఏమిటి అంటే ఇంకా ఇస్తే చేసుకుంటావా ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు ఆయన లక్ష్మణ మూర్తి ఆవిడ కోణంలోనే చెప్తున్నారు నీవు ఇలా కదా అనుకుంటున్నావు అప్పుడు రాముడు నిన్నెందుకు స్వీకరించడనుకుంటున్నావు, కాబట్టి ఆవిడ వృద్దురాలైంది-ఆవిడ వృద్దురాలైతే రాముడు వృద్దుడవడేమిటీ ఆవిడకన్నా పెద్దవాడు ఆయన, ముందే వృద్దుడై కూర్చుంటాడు కాబట్టి భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామ్ ఏవైష భజిష్యతి నిన్ను స్వీకరిస్తాడు సంతోషంగా ఉండచ్చు. కాబట్టి  త్వమ్ ఏమైష భజిష్యతి కాబట్టి నిన్ను స్వీకరిస్తాడు సంతోషంగా నీవు రాముని దగ్గరకు వెళ్ళు.
అంటే ఆవిడకున్న పెద్ద లోపం ఏమిటీ అనేది దిద్దబడలేదు వీళ్ళ మాటలవల్లా, అంటే ఒకొక్కసారి In-curable disease అంటారు డాక్టర్ గారు, నా దగ్గర ఉన్న మందులన్నీ వాడేశానండీ ఇంజెక్షన్లన్నీ చేసేశామూ ఈ వ్యాధి లొంగట్లేదు ఈ వ్యాదే మందులను లొంగదీసుకుంటుంది, కాబట్టి ఇంక ఈయ్యన బతుకుతాడూ అని చెప్పడం కష్టం అంటారు, beyond our hands అంటూంటారు ఎందుకూ అంటే ఆయన దగ్గర ఉన్న మందులకే ఈజబ్బు లొంగలేదూ అని గుర్తు అలా వీళ్ళిద్దరూ ఈ పరిహాసాన్ని ప్రయోగిస్తే ఆవిడ వెళ్ళిపోతుందనేటటువంటి లక్ష్యం నెరవేరలేదు, ఎలా నెరవేరలేదు అంతర్లీనంగా వాళ్ళు ఏ పరిహాసాన్ని వాళ్ళు వాడుకున్నారో ఆ పరిహాసము దేనికొరకు వాడబడిందో దానికొరకు ఆవిడ స్వీకరించలేదు, ఆవిడ దానిని యధాతథంగానే తీసుకుంది. లక్ష్మణున్నిపొందు అంటున్నాడనీ లక్ష్మణుడు రామున్ని పొందమంటున్నాడనీ అంటే వీళ్ళిద్దరూ పొందడానికి సిద్దమే, ఆయనకంటే భార్యలేదు కానీ అక్కడ ఉండడానికి ఇష్టంలేదు అంటే దాసిగా ఉండడానికి ఇష్టంలేదు భోగమే కావాలి అందుకు రాముని దగ్గరికే వచ్చేసేయ్యాలి.
Image result for లక్ష్మణుడుఅంటే రాముడు కూడా ఇష్టపడుతున్నాడు ఈయ్యన చెప్తున్నాడూ ఈవిడే అడ్డొస్తుంది అని అర్థమైంది ఆవిడకు పరిహాసం అర్థంకాక మన్యతే తత్ వచః సత్యం పరిహాస అవిచక్షణా ఆవిడకి అసలా పరిహాసమూ అనేటటువంటిది ఎందుకు ప్రయోగించారన్నదాని తాత్పర్యము అర్థముకాలేదు. అర్థము కాలేదు కాబట్టి రాముడి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ సీతమ్మతో


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
కూర్చొని ఆయన పర్ణశాలలో మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆ వెళ్ళడం మహోల్కా రోహిణీమ్ ఇవ రోహిణీ నక్షత్రం మీద పడుతున్నటువంటి ఉల్క ఎలా పడిపోతుందో అలా పడిపోయింది, పడిపోయి రామా ఈమే నీ భార్యా స్థానంలో కుదరదు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఈవిడని నేను తినేస్తాను నేను నీకు భార్యనైపోతాను అని అమాంతం వెళ్ళి సీతమ్మ మీద పడబోయింది. పడిపోతే హడిలిపోయింది సీతమ్మ వెంటనే రాముడు ఒక్కసారి హుంకారం చేశాడు ఆ హూంకారానికి ఒక్క క్షణం ఆగింది వెంటనే రాముడు లక్ష్మణుని వంక తిరిగి అన్నాడూ క్రూరైః అనార్యైః సౌమిత్రే పరిహాసః కథం చ న ! ఈమె చాలా క్రూరురాలు అనార్యమైనటువంటి మనిషి ఇటువంటి ఆవిడతో పరిహాసం కుదిరేటట్టుగా లేదు ఇటువంటి ఆవిడతో ఎక్కువ పరిహాసం మంచిదికాదు కూడా న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీమ్ కొంచెం నేను కానీ జాగరూకుడనై ఉండిఉండకపోతే సీతమ్మ బ్రతికి ఉండేది కాదేమో... అమాంతం కొరికి తినేస్తుంది కూడా కాబట్టి ఇమాం విరూపామ్ అసతీమ్ ఈమెనీ ఇటువంటి చెడ్డ మనిషిని విరూపం చేసేసై ఎందుకంటే ఈమె నేను మంచి సురూపినీ అన్న భావనతో కామోద్రిక్తయై ప్రవర్తించ కూడని రీతిలో ప్రవర్తిస్తుంది, కాబట్టి విరూపం చేయ్యి అప్పుడు ఇటువంటి భావనలుపోతాయి చంపడం ఇష్టంలేక ఆడదాన్ని, సాధ్యమైనంత అవకాశం ఇచ్చే ప్రయత్నం రామ చంద్ర మూర్తి చేస్తున్నారు.
కాదు కాదూ ఒక నరుడిగా అలా ప్రవర్తించినట్లు కనపడుతూ అవతార ప్రయోజనాన్ని కూడా సిద్ధింపజేస్తుంటారు, లేకపోతే తాటకనీ సుబాహుని చంపినటువంటివారు మారీచున్ని విడిచిపట్టడం కూడా రామావతార ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవడానికి మార్గమే కాబట్టి ఇమాం విరూపమ్ అసతీమ్ అతి మత్తాం మహోదరీమ్ ! రాక్షసీం పురుష వ్యాఘ్ర విరూపయితుమ్ అర్హసి !! కాబట్టి ఈమెను వెంటనే విరూపని చెయ్యి అనేటప్పటికీ చిచ్ఛేద కర్ణ నాసం మహా బలః అక్కడే ఉన్న ఖడ్గాన్ని తీసి లక్ష్మణ మూర్తి ఆమె యొక్క ముక్కు చెవులు కోసేశాడు, ముక్కూ చెవులూ కోసేస్తే చాలా విరూపంగా ఉంటారు కదాండీ! చెవులనేటటువంటివి ఎదో కళ్ళజోడు పెట్టుకోవడానికి బాగుండేవిగా ఉంటాయి అని అనిపిస్తుందేమోనని... కానీ నేను ఒకసారి రైల్లో వెళ్తున్నప్పుడు నేను నిద్రపోతున్నాను నిద్రపోతుండగా లోయర్ బెర్త్ లోకి  ఉండగా పక్క బెర్తులోకి ఎవరో ఓ రాత్రివేళ ఎదో జాయినింగ్ స్టేషన్సులో ఉంటారుకదా... వచ్చి పడుకున్నారు అయితే దుప్పటీ కప్పారు పడుకోబెట్టారు అయితే ఆ మొర్నాడు నేను ఉదయం మొఖం కడుక్కొని కూర్చున్నాను సికింద్రాబాదులో దిగిపోవాలి, సికింద్రాబాదు అంటే ఎంతసేపు పడుతుంది గోదావరి ఎక్స్ పెస్సుకు ఆ రోజుల్లో గౌతమీలేదు, ఆయనా ఈ పడుకున్నాయన మొఖం మీద బట్టలేదు బట్ట కిందకి జారిపోయింది నాకూ రెండు రోజులు భోజనం సహించలేదు. కారణమేమిటంటే ఆయన ఏ అగ్ని ప్రమాదానికి లోనయ్యాడో నాకు తెలియదుకానీ ఆయన కనుగుడ్లు ముక్కు చెవులు అన్నీ కాలిపోయాయి కాలిపోవడంలో ఈ ముక్కుకు బదులు రెండు కన్నాలు మాత్రమే కనపడుతున్నాయి, ఈ చెవులు తీసేసి వీటికి బదులు రెండు కన్నాలు కనపడుతున్నాయి.
Image result for surpanakha animated


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
నాకు విరూపం పొందడం విరూపం చెయ్యడం అంటే ఎంత వికృతంగా ఉంటారో ఎంత ఇక వెళ్ళి ఎవరి దగ్గరా నేను అందగత్తెనూ అని చెప్పుకోకుండా ఉండడానికి లక్ష్మణుడు విరూపవతిని ఎందుకు చెయ్యవలసి వచ్చిందో ఎందుకు ముక్కు చెవులు కోశాడో అప్పుడు అర్థమయ్యింది. ఆ ముక్కు చెవులు పోతే అంత విరూపాన్ని పొందుతారు కానీ ప్రాణం మాత్రంపోదు, ఎదో వైటల్ ఆర్గాన్ని తీసేసినట్లు మాత్రంకాదు. ఎందుకంటే ముక్కు కోసేసినంత మాత్రం ఊపిరి ఆడటం ఆగిపోదు, చెవులు తీసేసినంత మాత్రం వినపడడం ఆగిపోదు ఇక నుంచి కనీసం ఆవిడ ఈ మాట అనకూడదు, జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా చూస్తుండాలి జాగ్రత్తగా వాసనలు గ్రహిస్తూ ఉండాలి తప్పా ఇష్టమొచ్చినట్లు ప్రధాన ప్రయోజనం ఒక్కటే స్పష్టంగా రాముడు చెప్తున్నాడు, విరూపము చెయ్యి చంపమని చెప్పలేదు ఇక ఎప్పుడూ కామోద్రేకం పొందకూడదు ఈవిడ ఎవర్నీ బాధపెట్టకూడదు. కాబట్టి వెంటనే లక్ష్మణ మూర్తి ముక్కూ చెవులు కోసేశాడు.
ఇప్పుడు ఆవిడా పెద్ద కేకవేసుకుంటూ గర్జన చేసుకుంటూ ఆ కారిపోతున్నటువంటి నెత్తురితోటి ఖరుడూ అనేటటువంటి ఆవిడ సోదరుడి దగ్గర వెళ్ళిపడిపోయిందట, అక్కడే జనస్థానంలో పద్నాలుగు వేలమంది రాక్షసులతోటి ఉంటున్నాడు. ఆ ఖరుడు ఆయన దగ్గర ఉండేటటువంటి సేనాధిపతులు త్రిశిరసుడు అనబడేటటువంటి ఆయన ఆయన మూడు తలకాయలతో ఉంటాడు, ధూశనుడు అనపడేటటువంటి ఒక సేనాధిపతి పద్నాలుగువేల సైన్యం వీళ్ళతో ఖరుడు ఆ జన స్థానంలో ఉంటున్నాడు. ఈ ఖరుడు విశ్రవసు బ్రహ్మయందు పాక అనబడేటటువంటి ఒక రాక్షసాంగనయందు జన్మించినవాడు అందుచేత శూర్పణఖకు సోదరుడయ్యాడూ అని మహాభారతంలో ఉంది, కాబట్టి తనకు సోదరుడు అవుతాడు ఖరుడు ఇప్పుడు ఆ ఖరుడి దగ్గరికి వెళ్ళిపడిపోయింది ఆవిడ పడిపోతే ఆయన అన్నాడూ ఏమీ ఎవరికీ అపకారం చేయకుండా పడుకున్నటువంటి నల్లత్రాచు యొక్క తోక ముట్టుకున్నవాడు ఎవడూ, కోరికోరి ప్రాణములమీదికి ఉపద్రవం తెచ్చుకున్నవాడు ఎవడూ జనస్థానంలో నేను ఇంత మంది రాక్షసులతో ఉండగా నీ ముక్కు చెవులు కోసి నిన్ను విరూపను చేసినవాడు ఎవరు నాకు చెప్పవలసింది అన్నాడు.
అంటే ఆమెకు ఇంకా ఎంత కామము ఉండిపోయిందంటే... రామ లక్ష్మణుల మీద ఆవిడందీ తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహా బలౌ ! పుణ్డరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినామ్బరౌ !! ఫల మూలాశనా దాంతౌ తాపసౌ ధర్మ చారిణా ! పుత్రౌ దశరథస్యా స్తాం భ్రాతరౌ రామ లక్ష్మణౌ !! నేను దండకారణంలో ఇద్దరని చూశాను తరుణౌ మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు రూపసంపత్తి కలిగినటువంటివాళ్ళు సుకుమారులు మహాబలవంతులు విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటివాళ్ళు నారచీరలు కట్టుకున్నవాళ్ళు జింక చర్మాన్ని కట్టుకున్నటువంటివాళ్ళు ఫలమూలములను తింటున్నవాళ్ళు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటివాళ్ళు తాపసులు ధర్మమును ఆచరించేటటువంటివాళ్ళు దశరథ మహారాజు యొక్క పుత్రులు అన్నదమ్ములు రామ లక్ష్మణులన్న పేరుకలిగినటువంటివాళ్ళు వాళ్ళ మధ్యలో ఒక ఆడది ఉంది జరిగిన వృత్తాంతాన్ని జరిగినట్లు చెప్పదు, ఇప్పుడు ఏది రాముడు జరగకూదు అనుకున్నాడో అదే జరిగింది. ఆడదాని పగకింద తిరిగింది రామాయణం. నేను మీతో మనవి చేసింది ఇదే... శ్రీరామాయణం ఎక్కడ మీరు అయిపోతుందనుకుంటారో అక్కడ ఒక ఆడదివచ్చి కొనసాగిస్తుంటూంది, ఎప్పుడో అయోధ్యకాండలో అయిపోవలసిన రామాయణాన్ని మంధర ప్రవేశంతో పెరిగింది, మళ్ళీ ఇక్కడ అయిపోతుందని అగస్త్యుడే ఒప్పుకున్నాడు అయిపోయిందయ్యా మీ నాన్నగారు అడిగిన వరం ప్రకారం పద్నాలుగేళ్ళు అయిపోవచ్చింది ఇంకో ఏడాది దగ్గరుంది, శూర్పణఖ వచ్చి కథను పొడిగిస్తూంది, ఎదరా సీతమ్మ తల్లి ఉరివేసుకుందామనుకుంటే త్రిజట పొడిగిస్తుంది రావణాసురుడు కత్తి ఎత్తితే ధాన్యమాలి పొడిగించింది, ఇలా రామాయణం ఎక్కడ అయిపోతుంది అనుకుంటే అక్కడ ఒక స్త్రీ పాత్రవచ్చి దాన్ని ఇంకా ముందుకి కొనసాగింపజేస్తుటుంది.
కాబట్టి ఆవిడా రామ లక్ష్మణుల గురించి చెప్పినది సత్యం నేను రామ లక్ష్మణులని కామించాను కాని రాముడు తన భార్యయైన సీతయందు అనురక్తి కలిగినవాడు, కాబట్టి నన్ను అంగీకరించలేదు కాబట్టి వాళ్ళిద్దరూ నన్ను అంగీకరించకపోతే నేను సీతమ్మను తినేయబోయాను అప్పుడు లక్ష్మణుని పిలిచి నన్ను విరూపని చేయమన్నాడని కొనసాగించాలి ఇప్పుడు కథాభాగాన్ని అలా కొనసాగిస్తే ఆవిడా హృదయము చాలా మంచిదైంది కదాండీ ఆవిడ సత్యం మాట్లాడుతుంది కానీ అలా ఎలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎక్కడ మెలికి తిప్పాలో అక్కడ తిప్పుతుంది కథని అంటే తనది తప్పులేదూ వాళ్ళదే తప్పు అన్నట్లు మాట్లాడుతుంది, ఖరుడన్నవాడి రాక్షసత్వం ఏమిటో తెలుసాండీ..? తన చెల్లెలు ఎంతగొప్పదో ఆయనకు తెలుసు కానీ పైన అలా మాట్లాడుతున్నావే తాపసౌ అంటున్నావే కందమూలములను తింటున్నవారంటున్నావే దాంతౌ జితేంద్రియులంటున్నావే అలాంటివాళ్ళు నీ ముక్కు చెవులు ఎందుకు కోశారు, ఏమో ఒక చిన్న కారణానికి కోసేస్తారా అని విచారణచేసే ప్రయత్నం ఆయన చేయలేదు.
Image result for khara in ramayanaతలచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటుంటారే అటువంటివాళ్ళు వాళ్ళు ఎందుకంటే అవకాశం దొరికేతే చాలు మీద పడిపోవడమే ఎవరిమీదకైనా సరే, ఇప్పుడు ఆవిడంది తరుణీ రూప సంపన్నా సర్వాఽఽభరణ భూషితా ! దృష్టా తత్ర మయా నారీ తయో ర్మధ్యే సుమధ్యమా !! తాభ్యామ్ ఉభాభ్యాం సంభూయ ప్రమదామ్ అధికృత్య తామ్ ! ఇమామ్ అవస్థాం నీతాహం యథానాథాసతీ తథా !! వాళ్ళ మధ్యలో ఒక కాంత ఉంది చాల అందగత్తె, ఇప్పుడు ఎలా అందగత్తెగా కనపడుతోంది అంటే... తనకు అనుకూలంగా కథను ఎప్పుడు మార్చుకుందామనుకుంటే అప్పుడు ఆవిడ ఎవర్ని ఫణంగా పెట్టిందంటే సీతమ్మని ఫణంగా పెట్టింది, పెట్టి మాట్లాడుతుంది. ఒక ఆడదాని కక్ష ఎవరిమీదికి తిరిగింది అంటే ఇంకొక ఆడదాని వైపుకే తిరిగింది ఎందుకనీ అంటే ఆ స్థానం భర్తీయై ఉండడంమే... తను ఆ స్థానాన్ని ఆక్రమించలేకపోవడమే కారణం. పగంతా సీతమ్మవైపుకి తిరిగింది అందుకేగా అగస్త్యుడు అన్నాడు ఇక సీతమ్మ నీవు తిరగకుండా కూర్చోవలసిన సమయం ఆసన్నమౌతూంది అని ఆవిడకి చేరాలి శిశుపా వృక్షం కిందకి, కాబట్టీ అనాధని ఎలా అవమానిస్తారో అలా నేను ఆమె జోలికి వెళ్ళితే మేము రాక్షసులం కాబట్టి అందంగా కనపడినటువంటిదానిని తినటం వాళ్ళకి ఇష్టం.
లోకంలో ఎలా ఉంటుందంటే..? అక్కడో యాపిల్ పండూ ఓ కమలా పండు ఓ బత్తాయి పండు ఓ ద్రాక్ష పళ్ళగుత్తి ఉన్నాయనుకోండి మీకు అవసరం ఉన్నాలేకపోయినా మంచి గులాబి రంగులో పొటమరించినట్టుగా ద్రాక్ష పళ్ళు ఇంతింత లావుగా కమలా పళ్ళు ఇంతింత మామిడి పళ్ళూ ఉన్నాయనుకోండి, మామిడి పండు అప్పటికప్పుడు తినడం కష్టం, దానికేదో పళ్ళెముండాలి పక్కకెళ్ళాలి తినాలి చేతులనిండా పడుతుంది కడుక్కోవాలి అదే ద్రాక్ష పండు అనుకోండీ ఇలా అని నోట్లో పాడేసుకోవడం తేలిక కాబట్టి ఆ ముగ్గురిలోని నీవు సీతనే ఎందుకు తిందామనుకున్నావు ముందు ఓ ద్రాక్ష పండంత అనుకూలంగా ఉంది కాబట్టి, కాబట్టీ నేను సీతమ్మని తినడం కోసమని వెళ్ళాను సీతమ్మ జోలికి వెళ్ళాను వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా..? ఆ పాటిదానికి ఇలా కోసేశారు ముక్కూ చెవులు విరూపని చేసేశారు మీదగ్గరికొచ్చి పడిపోయాను, అన్నయ్యా! నీవు నన్నూ సఫలీకృత మనోరథని చేయ్యాలి ఇప్పుడు నా కోరిక ఏమిటో తెలుసా..? స ఫేనం పాతుమ్ ఇచ్ఛామి రుధిరం రుణ మూర్ధని యుద్ధంలో నీవు వాళ్ళ ముగ్గురినీ చంపేస్తే వాళ్ళ శరీరములలో నుంచి పైకి ఉభికి వస్తున్నటువంటి నురగలతో కూడిన నెత్తుటితో నేను స్నానం చేయాలి అది నా కోరిక.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
కాబట్టి నీవు వెంటనే వాళ్ళ ముగ్గురిని చంపై, అదేమన్నా చిన్న పనాండీ... వెళ్ళి ఓసారి ఉత్తరీయం పట్రా అన్నంత తేలికేం కాదుకదా..? అంతే ఆయన ఉద్ధతికూడా అలానే ఉంటుంది రాక్షసుడంటే... వినదగు నెవ్వరు చెప్పిన అన్నట్లుగా వినదగు నెవ్వురు చెప్పన వినినంతనె వేగపడక వివరింపదగున్ గని కల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! ఆయనకు అదేం అక్కర్లేదు, విన్నాడంతే పగ ఎక్కడెక్కడ ఎవడిమీద తగువుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంటుందాని వాడు వెతుక్కుంటున్నాడు, వాడు వెంటనే ఏమన్నాడంటే చతుర్దశ మహా బలాన్  ఓ పద్నాలు మంది మహా బలవంతులైనవాళ్ళని పిలిచాడు, పిలిచి మీరు ఆ రామ చంద్ర మూర్తి మీదకి యుద్ధానికి వెళ్ళండి సీతా రామ లక్ష్మణుల్ని సంహరించి రండీ అని అన్నాడు. వాళ్ళనుకున్నారు సీతా రామ లక్ష్మణులు తాపసు నరులు పెద్ద చంపడమేమి విశేషమేమి పెద్ద వాళ్ళేం అని గండ్ర కత్తులు వేసుకొని పోయారు దీని గురించి పెద్ద వర్ణన చేయవలసిన అవసరం అందులో ఏమీ ఉండదు, వాళ్ళు వెళ్ళిపోయి ఆయన్ని యుద్ధానికి పిలిచారు ఆయన అన్నాడు మీరు ఎవరు ఎందుకొచ్చారు యుద్ధానికి అన్నాడు, విషయం కనుకోకుండా యుద్దం చేస్తే అప్పుడు వీళ్ళల్లా రాముడికి ఖరుడికీ తేడా ఏమీ ఉండదు.
అంటే వాళ్ళు ఇదిగో ఫలానా కారణానికి శూర్పణఖని అవమానం చేశావుగా అందుకని నిన్ను చంపేయడానికి వచ్చేశాము మేము, ఆయన అన్నాడు మీరు నన్ను చెంపేయడమేమిటి నేను ఒక ధార్మికమైన మార్గంలో ఉన్నవాన్ని ధార్మికమైన నిష్ఠకలిగినటువంటివాన్ని మీరు నా జోలికి వస్తేమాత్రం మీరు పద్నాలుగు మంది మిగలరని గుర్తించుకోండి, వాళ్ళు అలా ఏం మాటలకు వినేటటువంటివారుకారు కాబట్టి ఇప్పుడు పద్నాలుగు మంది ఆయనమీదకి యుద్ధానికి వెళ్ళారు అది పెద్ద విశేషమేముంటుందండీ రామ చంద్ర మూర్తికి పద్నాలుగు మంది యొక్క గుండెను చీల్చి అవతల పాడేశాడు, రామ చంద్ర మూర్తి ఒకేసారి పద్నాలు బాణములను ప్రయోగించాడు అది వాళ్ళ గుండెలను చీల్చి భూమిలో గుచ్చుకును వెనక్కి తిరిగి వచ్చేశాయి, పద్నాలు మంది తెగటారిపోయారు విచిత్రమేమిటంటే దీనికి ముక్కు చెవులు తెగిపోయి ఇంకా నెత్తురు కారుతున్నా ఈవిడ కూడా వచ్చింది వెనకాల శూర్పణఖ ఎందుకో తెలుసాండీ ఆవిడ కోరిక పగ కామము దేనికింద మారిందంటే పగగా మారింది ఇది కదూ లలితా సహస్త్రనామ స్తోత్రంలో అమ్మవారి చేతులలో ఒక చేతిలో ఐదు పుష్పబాణములు ఉంటాయి మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా ఆవిడా క్రోధాకారాంకుశోజ్వలా అమ్మవారి అనుగ్రహం ఉంటే, నాకీ దిక్కుమాలిన కోపం ఏమిటనీ కోపం మీద కోపం వస్తుంది, కోపం మీద కోపం వచ్చిందీ అంటే మీరు సాధకుడు అయ్యారు అని గుర్తు. అమ్మవారి అనుగ్రహం ఉంటే కోపం మీద కోపం అమ్మవారి అనుగ్రహం లేకపోతే కామం మీద కోపం, తీరితే తృప్తి తీరకపోతే కోపం, అక్కా చెల్లెళ్ళు రెండు పక్కపక్కనే ఉంటాయి.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇప్పుడు ఆవిడకు కోరిక తీరలేదు కాబట్టి ఏం పుట్టింది పక్కన పగ పుట్టింది ఇప్పుడు ఆ పగ చల్లారలంటే..? తన కళ్ళతో చూడాలి సీతా రామ లక్ష్మణులు తెగటారిపోవాలి ఆ నెత్తురు జుర్రుకోవాలి, అదేమిటీ అంత కామించిన స్త్రీ అలా చెయ్యెచ్చా అంటే ఇదే రాక్షసత్వము అన్నమాటకీ ప్రతీకా... నాకు దక్కకపోతే ఆసిడ్ పోసేస్తా అన్నాడనుకోండి ఎప్పుడో రామాయణం అని మీరు అనుకోవద్దూ ఇప్పటికీ శూర్పణఖ బ్రతికే ఉంది ఆయనయందు అని గుర్తు. తనకు దక్కకపోతే నెత్తురు తాగేస్తాడు అంతే చంపేస్తాడు అవతలివాళ్ళని అంటే ఎంత రాక్షసత్వమో చూడండి... తనకే దక్కాలి దక్కకపోతే నెత్తురే తాగుతాను అందుకు వచ్చింది ఆవిడ వెనకాల, కాని ఇప్పుడు ఆవిడ అనుకోని పరిణమేమిటంటే పద్నాలుగు మంది చచ్చిపోవడం, మళ్ళీ ఏం చేసింది మళ్ళీ ఖరుడు దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళింది పోయి ఆ ఖరుడితో మళ్ళీ మెరపెట్టుకుంది. పద్నాలుగ మందిని కనురెప్పపాటులో కొట్టేశాడు నీవు ఏమిటనుకుంటున్నావు మహావీరున్ని అనుకుంటున్నావా? దండకారణ్యములో ఋషులందర్నీ రక్షిస్తానంటున్నాడు ఉగ్రమూర్తి మహానుభావుడు తెగటార్చేస్తే పద్నాలుగుమంది పనికిరాకుండాపోయారు రాముడిముందు. ఈయన ఉద్ధతి ఎటువంటిదంటే ఈయన వెంటనే పద్నాలుగు వేలమంది రాక్షసుల్ని సిద్ధంచేయండి నా రథం సిద్ధం చేయ్యండి, దూశనున్ని పిలవండి త్రిశిరస్సుని పిలవండి ముగ్గురం కలిసి ఈ సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తాము అన్నాడు.
Image result for పుష్పక విమానంఅందరూ కలిసి బయలుదేరారు ఆ బయలుదేరుతున్నప్పుడు ఖరుడికి కొన్ని అపశకునములు కనపడ్డాయి, రామాయణం ఒక శకున శాస్త్రం కూడా అందులో శకునముల గురించి కూడా మాట్లాడుతారు. నిష్కారణంగా గాలిలేకుండా ధూళి పైకి రేగింది, ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఒక కొరివి పట్టుకుని ప్రత్యేకించి ఎప్పుడు కనపడుతుందంటే దీపావళి పండగరోజున కాకరపువ్వొత్తి చేత్తో పట్టుకుని పిల్లలు ఇలా తిప్పుతుంటారు ఇలా తిప్పుతుంటే ఒక జ్వాలా చక్రము ఏర్పడుతుంది ఎర్రటి కాంతి చక్రం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, అటువంటిది ఎలా ఉంటుందో అటువంటి పరివేశమొకటి సూర్యుని చుట్టూ పట్టుకుంది, నక్కలు ఎదురుగుండా వచ్చి నోళ్ళు తెరుచుకుని అరుస్తున్నాయి. కారణం లేకుండా గుఱ్ఱములు తొట్రుపడ్డాయి, ఒక్కసారి ఎక్కడి నుంచో ఒక గ్రద్ధవచ్చీ ఖరుడి యొక్క పథాకం మీద వాలి ఎగిరింది, చెట్ల నుంచి అకస్మాత్తుగా పువ్వులూ పండ్లు కింద పడ్డాయి, పట్టపగటివేళ ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి, ఉల్కలూ నేలమీద పడ్డాయి, సూర్యుడు అకస్మాత్తుగా మేఘాలలోకి వెళ్ళిపోయి బాగా చీకటి ఆవరించింది. ఇన్ని జరిగితే దుర్మిమిత్తములని తాను ససైన్యంగా మరణిస్తానని ఖరుడు తెలుసుకున్నాడు.
కాని మూర్ఖత్వం అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసాండీ..? శాస్త్ర ప్రమాణాన్ని వెంటనే తనయొక్క పౌరుషంతో నెగ్గగలమూ అనేటటువంటి అతిశయముచేత దిక్కరించడం, ఈ శకునాలన్ని కనపడితే మాత్రం నాకేంటి సీతా రామ లక్ష్మణుల్ని సంహరించకుండా నేను వెనక్కిరాను ఈ శకునాలు నన్నేం చేస్తాయి కాబట్టి బయలుదేరండి అన్నాడు. ఇప్పుడు పద్నాలుగు వేల మంది యద్ధానికి బయలుదేరుతుంటే ఎక్కడ లేనటువంటి పెద్ద కోలాహలం ధ్వని బయలుదేరింది, ఇంత పెద్ద ధ్వని బయలుదేరితే రామ చంద్ర మూర్తి కూడా తన పర్ణశాలలోంచి విన్నారు వినీ... చాలా పెద్ద సైన్యమే యుద్ధానికి వస్తూంది, శకునములను పట్టిచూస్తే మనకు అనుకూలముగా శకునములు


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
కనపడుతున్నాయి కాబట్టి లక్ష్మణా నేను ఇప్పుడు ఆ రాక్షసులను తెగటార్చుతాను అంటూ రాముడు మాట్లాడడం అంటే చాలా సొగసుగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది, లక్ష్మణుడి యొక్క కోర్కె ఎప్పుడు ఎలా ఉంటుందంటే అన్నగారికి కష్టం వచ్చిందీ అంటే అన్నగారు ఆ కష్టాన్ని పొందకూడదూ అన్నగారికన్నా తానే ఆ కష్టాన్ని పొందాలి అన్నాగారు సుఖపడాలనేటటువంటి మనస్థత్వం ఉన్నవాడు.
కాబట్టి లక్ష్మణుడు అన్నాయ్యా నీవు ఉండు నేను వెళ్తాను అంటాడేమోనని అని ఆయన అన్నాడూ ప్రతికూలితుమ్ ఇచ్ఛామి న హి వాక్యమ్ ఇదం త్వయా ! శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్స మా చిరమ్ !! నా పాదముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను లక్ష్మణా! ఇంక నీవు ఈ విషయంలో మాట్లాడద్దూ నీవు సీతమ్మని తీసుకొని ఏదైనా గుహలోకి వెళ్ళిపో ఎవ్వరికీ కనపడకుండా నేను వీళ్ళతో యుద్ధం చేస్తాను, అంటే ఇలా చెప్తే లక్ష్మణుడి మనసు ఖేదపడదు నేను యద్ధం చెయ్యలేనని యుద్ధం చేస్తున్నాడేమోనని అనుకుంటాడేమోనని ఇది ఎదుటివారి యొక్క హృదయమును గురించి తాపత్రయపడడం అన్నది ఎప్పుడుంటుందంటే ప్రేమ అన్న మాటకు అర్థం అది అవతల వాళ్ళను నొప్పించకుండా మాట్లాడగలగాలి అంత ఆత్రుతలో కూడా ఆయన మాట అలా ఉంటుంది అంత సోబబుగా ఉంటుంది. ఆయన అన్నాడు త్వం హి శూర శ్చ బలవాన్ హన్యా హ్యేతా న్న సంశయః !  నీవు చాలా బలవంతుడివి నీవే చేయగలవు ఆ సైన్యానంతటినీ లక్ష్మణా అందుకొరకు కాదు స్వయం తు హంతుం ఇచ్ఛామి నేనే చంపాలి అని అనుకుంటున్నాను ఇవ్వాళ అందుకని సర్వాన్ ఏవ నిశాచరాన్ వచ్చినటువంటి రాక్షసులనందరినీ నేను చంపుతాను, కాబట్టి వెంటనే వదిన్ని తీసుకొని గుహలోకి వెళ్ళిపో అంటే... ప్రవేశింపరానటువంటి ఒక గుహలోకి సీతమ్మని తీసుకొని లక్ష్మణ మూర్తి తీసుకొని వెళ్ళిపోయాడు.
ఇప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు దేవతలు ఋషులు సిద్దులూ అందరూ పరుగు పరుగన వచ్చారట ఎందుకని ఒక గొప్ప సన్నివేషం చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమ కర్మణామ్ ! ఏక శ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి !! పద్నాలుగు వేలమంది అధర్మాత్ములైనవాళ్ళు ఒకపక్కా, ధర్మాత్ముడైన రాముడు ఒకపక్కా యుద్ధంలో కూడా ధర్మం తప్పనివాడు ఆయన, యుద్ధంలో కూడా వక్రమార్గాలు పోయేవాళ్ళు వాళ్ళు పద్నాలు వేలమంది అటూ ఒక్కడు ఇటు, వాళ్ళు వేసే ఆయుధాలనుంచి తనను తాను రక్షించుకుంటాడా..? వాళ్ళని తాను నిగ్రహిస్తాడా..? ఆసలు వాళ్ళువచ్చి మీద పడకుండా ఉండాలంటే అసలు యుద్ధమెందుకండీ పద్నాలుగువేల మంది మీద పడిపోతే చాలు. పద్నాలుగు వేలమందిని ఒక్కడే నిగ్రహించాలి, నిగ్రహిస్తాడా..! ఇది చూడవలసిన విషయం నిగ్రహిస్తాడా... నిగ్రహించగలడు అది వాళ్ళకు తెలుసు. కానీ ఆ అందమేమిటో చూడాలి, ఆ యుద్ధమేమిటో చూడాలి ఇవ్వాళ అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. మహర్షి అంటారూ చాలా గొప్పమాట మహర్షి ఆయన రచనకి నేను కితాబులివ్వడమా..? అటువంటి రచన చేత మనం పవిత్రులం కావడమే తప్పా గంగా జలలవ కణికాపీతా అని శంకరాచార్యులవారు చెప్పినట్లూ వాల్మీకి రామాయణంలో ఒక్క శ్లోకమైనా చదువుకుని జీవితాన్ని తరింపజేసుకోవడమే బభూవ రూపం క్రుద్ధ స్య రుద్ర స్యేవ పినాకినః పినాకము అంటే పాతి జగతి పినాకం అది విపత్తి అది లోకాన్ని రక్షించేది కేవలం లయం చేసేది కాదు, నేను ఇందాక మనవి చేశాను కూడా ఆ పినాకం గురించి ఆయన లోకరక్షణకు కూడా దానిని పట్టుకుంటాడు.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
పినాకం అనేటటువంటి ధనస్సు పట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోకాల్ని లయం చేసినప్పుడు నిలబడిన ఘోరరూపంగా ఎలా ఉంటుందో అంటే ఆ రూపాన్ని చూడడం ఎవరికీ శక్యం కాదు అంత భీకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆ రూపం అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మంలో కష్టపెట్టేవాడు సుఖపెట్టేవాడు అని ఇద్దరు ఉండరు. ఒకడు


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
భయపెట్టేవాడు కాబట్టి ఇప్పుడు భయపెట్టేవాన్నుంచి పారిపోతే ఒకడు రక్షించేవాడు ఒకడు ఉంటాడు, వీడు భయపెట్టడానికే ఉంటాడు వాడు రక్షించడానికే ఉంటాడు అని ఇద్దరు ఉండరు భయకృద్-భయనాశనః వాడే భయపెడుతాడు వాడే భయాన్ని పోగొడుతాడు, ఎవడు కష్టాన్ని ఇస్తాడో వాడే కష్టాన్ని తొలగిస్తాడు. కష్టమివ్వడానికి సుఖమివ్వడానికి కష్టసుఖాతీతమైన జ్ఞానమివ్వడానికి జ్ఞానమిచ్చి మోక్షమివ్వడానికి ఒక్కడే ఉంటాడు. తప్పా ఇంకొకడు ఉండడు సనాతన ధర్మంలో ఆ ఒక్కడే ఉంటాడు ఆ ఒక్కడు అనేకంగా కనపడుతుంటాడు అంతే.
Image result for రాముడుకాబట్టి ఇప్పుడు అది ఎవరికి ఘోర రూపం, ఘోర రూపం ఎవరికంటే..? ఎదురుగుండా వచ్చేటటువంటి పద్నాలుగువేల మందికి ఆయన దుర్ణ్నీక్షుడు అది వాల్మీకి మహర్షి యొక్క హృదయము, అక్కడ అది రుద్రశ్వరూపం ఆ శ్వరూపం యొక్క తేజస్సు ముందు వాళ్ళు మడిసిపోవలసిందే అగ్నిహోత్రంలో పడేటటువంటి మిడతల దండు ఎలా పడిపోతుందో అలా పడిపోతారు తప్పా రుద్ర తేజస్సు ముందు నిలబడడం అనేటటువంటిది ఇక సాధ్యం కాదు అది లయం చేసేస్తుంది పడగొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు రుద్రుడు కృద్దుడై పినాకం పట్టుకుని నిలబడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడట, అప్పుడు అలా ఉన్నాడు కాబట్టీ అటువంటి స్వరూపమే మనం చూస్తే మనకు కూడా అలాగే భయమేస్తుందా..! రాముడు కోదండం పట్టుకుని ఇలా నిలబడినటువంటి రూపాన్నిచూస్తే భయపెడుతుందని మీరు అనుకోకూడదు ఎందుకో తెలుసాండీ నేను మీకొక ఉదాహరణ చూపిస్తాను.
అస్వత్థామ విడిచిపెట్టినటువంటి బాణం ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోయింది ఇక పిండాన్ని చెలకబోతోంది, లోపలా ఆ పరీక్షిత్తు ఉన్నాడు, ఇంకా శిశువు ఆయన ఆ లోపల ఉన్నటువంటి పసిపిల్లవాడి యొక్క ఆర్థనాదాన్ని తల్లివింది వినీ ఐదుగురు మామగార్లు ఉన్నారు కాదని వెళ్ళి కృష్ణపరమాత్మ యొక్క పాదముల మీదపడింది. అయ్యా నీవు నన్ను రక్షించాలీ అంది ఆవిడా ఇప్పుడు, రక్షించాలీ అంటే ఒకకాలు పైకెత్తి రథంలోకి ఎక్కడానికి సిద్ధంగా ఉండి ఒక కాలు కిందపెట్టి ఉన్నటువంటి కృష్ణపరమాత్మా ఆమె యొక్క ఆర్తిని ఆమె యొక్క శరణాగతిని లెక్కలోకి పెట్టుకున్నాడు అంతే... ఇక్కడే ఉన్న కృష్ణుడు ఒక్కసారి ఉత్తరా గర్భంలోకి ప్రవేశించాడు, ఎలా ప్రవేశించాడు సుదర్శషన చక్రం పట్టుకునీ లోపలికి ప్రవేశిస్తే... ఈ పిండం లోపల ఉన్న పిల్లవానికి కూడా బ్రహ్మాస్త్రపు తేజస్సును తనలోకి తీసుకోగలిగినటువంటి భయంకరమైన తేజస్సుతో  ఉన్న రూపంగా పరీక్షిత్తు చూశాడనుకోండీ కళ్ళు ఎగిరిపోతాయి పిండానికి కదాండీ..? అది మధ్యాంతరహిత మార్తాండ బింబంలాంటి స్వరూపమది సహస్ర సూర్యుల పగడి ప్రకాశిస్తుంది. దాన్ని పరీక్షిత్తు చూడలేడు. పరీక్షిత్తు చూసిన రూపం పరమ ప్రసన్నమైన రూపం అది సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ ! సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ !! అటువంటి స్వరూపం పరీక్షిత్తుకు కనపడింది, అబ్బా ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడో ఆ పీతాంబరమేమిటో ఎంతందమో... ఎంతదంమో అని పరీక్షిత్తు చూస్తున్నాడు. అటువైపుకున్న మూర్తి...


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
మాకు తూర్పుగోదావరి జిల్లాలో ర్యాగి అని ఒక క్షేత్రముంది ర్యాగిలో ఒక వైపు శివుడుంటాడు ఒకవైపు మోహినీ ఉంటుంది  వెనక్కి, అలా అటువైపుకు ఉన్న మూర్తి బ్రహ్మాస్త్రముల యొక్క తేజస్సుల్ని తనలోకి తీసేసుకో గలిగినటువంటి రుద్ర స్వరూపం ఉంది ఆ మూర్తి బ్రహ్మ తేజస్సును తీసుకుంది. వెనక మూర్తి కళ్యాణ మూర్తయై పరీక్షిత్తుకి అలా కనపడింది, అందుకే బయటికొచ్చినటువంటి పరీక్షిత్తు తాతగారైన ధర్మరాజుగారి తొడలో కూర్చుని సభలో చూస్తే అమ్మ కడుపులో ఉండిగా


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
నేను చూసిన ఆ మంగళ ప్రదమైనటువంటి మూర్తి ఎక్కడైనా కనపడుతాడా అని పరీక్షగా చూసిన కారణంచేత పరీక్షిత్ అని పిలిచారట. ఏక కాలములందు ఘోర అఘోర రూపములతో ఈశ్వరుడు ఉంటాడు అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యః అని మనం ఇదేంటీ పరమశివుడి దగ్గర పూజచేస్తే మంత్ర పుష్పం ఒకమాట చెప్తుంటాం ఆ పంచమంత్ర పఠనం చేసేటప్పుడు. కాబట్టీ ఆ ఘోర రూపము అఘోర రూపము ఏక కాలంలో ఉంటాయి.
Image result for అశ్వత్థామ విడిచిన బాణంఇప్పుడు పద్నాలుగు వేల మందికి ఘోర రూపం తప్పా రామ భక్తులకు రాముడు ఎప్పుడూ ఘోరరూపుడు కాడు ఎప్పుడూ కాడు ఘోరరూపుడు ఆరూపం మీకు మంగళ ప్రదంగా ఉంటుంది. ఇలా దాన్ని దర్శనం చేసినవారు ఒకరు ఉన్నారు ఎవరో తెలుసాండీ..! రామదాసుగారు దర్శనం చేసుకున్నాడు మహానుభావుడు ఆయన గుండెలు ఎంత పొంగిపోయాయో పొంగిపోతే ఆ పొంగిపోయిన ఆనందంలో లోపలపట్టక వాక్ రూపంగా ప్రవహిస్తే ఆయన నోటి వెంట ఒక పద్యం వచ్చింది భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజూండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ అని రచన చేశారు ఆయన. ఆయన భుజములు తాండవం చేస్తాయట, ఎప్పుడు బాణం తీస్తాడో ఎప్పుడు వింటినారిని తొడుగుతాడో ఎప్పుడు ప్రయోగిస్తాడో కనపడదు, మబ్బులలోంచి వర్షం వచ్చి పడిపోయినట్లుగా బాణ ప్రయోగం జరిగిపోతుంది అంతే... భండన భీముడార్తజన బాంధవుడు ఎవడు ఆశ్రయించాడో వాడికి ఆత్రజన బాంధవుడు భండన భీముడార్జన బాంధవుడు అటువంటివాడు అయన భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే శివ శ్వరూపం, తాండవమూ అన్నమాట శివునికి సంబంధించినది, లాస్యము అన్న మాట అమ్మవారికి సంబంధించినది భావము లాస్యము కదలికలు తాండవము ఆ శివుడు శివుడి యొక్క తాండవం ఎలా ఉంటుందో భుజములు అలా కదులుతాయట అటువంటి తాండవం చేస్తాయి.
అలా తాండవం చేసేటటువంటి నా స్వామి చేతిలోని బాణపరంపరవచ్చి శత్రువుల మీద పడుతుండగా అలా రక్షించగలిగినటువంటి ఈశ్వర స్వరూపము వేరొకటి లేదూ అనీ నేను ఎలా చెప్తానో తెలుసా..? భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజూండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ  మామూలుగా చెప్పను రామా..! పొంగిపోయిన మనస్సుతో నాలుగు వీధులా కూడలిలో ఒక పేద్ద పందిరికట్టీ పందిరిలో ఒక పెద్ద భేరీ కట్టీ నేను ఏనుగెక్కీ వచ్చీ నిలబడి ఢాం ఢాం ఢాం అని కొడతాను ఎందుకురా భేరీలు కొడుతున్నావు అని నన్ను అడుగుతారు అప్పుడు చెప్తాను రామ చంద్ర మూర్తి భుజతాండవం చేస్తూ బాణ ప్రయోగం చేస్తున్న రాక్షసులను మట్టు పెట్టుగలిగినటువంటి వేరొక దైవ శ్వరూపము లేదూ లేదూ లేదూ అని చాటిచెప్తాను రామా! అన్నాడు. అంటే శత్రువులను మట్టు పెట్టడంలో ఆ ఘోర రూపం అలా ఉంటుంది, అదే ఘోర రూపం ఆశ్రయించినటువంటి భక్తులైనటువంటి వారికి అంత మంగళప్రద స్వరూపంగా ఉంటుంది.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
అందుకు కదాండీ ఆ ధనుస్సు పట్టుకుని ఆ బాణాలు పట్టుకుని అలా ఉంటాడు ఎక్కడ తేడా ఉంది చెప్పండినాకు రామ శ్వరూపానికి శివ శ్వరూపానికి ఎక్కడైనా తేడా ఉందని మహర్షి మాట్లాడుతున్నారా స్పష్టంగా చెప్తున్నారు శివుడు కేశవుడు ఒక్కరే... ఆ పరమాత్మ ఆ తత్వాన్ని సమయానికి అలా ప్రవర్తిస్తుంటారు. కలెక్టరుగారే ఓ కోటేసుకుని డిస్టిక్ట్ర్ మేజిస్ట్రేటరుగా కూర్చుని ఫైర్ అంటారు, లేకపోతే ఒక తీర్పు ఇచ్చేస్తాడు, కలెక్టరుగారే మెజిస్ట్రేటుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ కలెక్టరుగారే మెజిస్ట్రేటరుగా కూర్చుంటే ఆ కలెక్టరుగారే కారుదిగి ఒక ఆఫీసులో కొన్ని ఫైల్సు సీల్ చేసకొని పట్టుకెళ్ళిపోయాడు అంతే, ఆఫీసుని సీల్ చేసిపాడేశారు ఆయన ఆయనకి అధికారముందు, మెజిస్ట్రేరియల్ పవర్సు అయన్ను వెన్నంటి ఉంటాయి ఆయనతోనే ఉంటాయి మెజిస్ట్రేరియల్ పవర్సు, కలెక్టర్ ఆఫీసులోనూ కలెక్టరుగారు కారులోనూ ఉండరు ఆయన్ని అంటే ఉంటాయి, ఆలాగే ఈశ్వరున్ని కూడా ఎప్పుడు ఘోర అఘోర రూపాలు వెన్నంటే ఉంటాయి. శత్రువులకి ఘోర రూపం ఆయన్ని ఆశ్రయించినవారి అఘోర రూపం మంగళప్రద స్వరూపం అదీ రుద్ర శ్వరూపమైనా అంతే కేశవ స్వరూపమైనా అంతే ఇద్దరి శ్వరూపం అలాగే ఉంటుంది తత్వం తెలిస్తే మాట అలా ఉంటుంది. తత్వం తెలియకపోతే బేధాలు కనపడుతాయి విష్ణువు వేరే ఉన్నాడు శివుడు వేరే ఉన్నాడూ ఈయనోకడు ఉన్నాడూ ఆయన ఒకడు ఉన్నాడూ అన్నీ మాటలు  వస్తాయి. అసలు తత్వం అర్థమైతే ఇన్నిమాటలు రావు కుర్తా లాల్చి వేసుకున్నా నాకొడుకే పంచ కట్టుకున్నా నాకొడుకే కావడీ కట్టుకున్నా నాకొడుకే తువ్వాలు కట్టుకున్నా నాకొడుకే. తువ్వాలు కట్టుకున్నావ్ ఫ్యాంటు చొక్క వేసుకోలేదని నేను కొట్టేసి కావడి కట్టుకున్నావు ఫ్యాంటు చొక్కా వేసుకోలేదని వాళ్ళమ్మ కొట్టేసి కుర్తా లాల్చి వేసుకోలేదు పంచ కట్టుకున్నావని తాతగారు కొట్టేస్తే దెబ్బలు తినేవాడు ఒకడే... ఏ రూపంలో ఓ రూపంలో పట్టుకుని ఓ రూపంలో నీవు తిట్టే తిట్లు ఆయనకే పూజలూ ఆయనకే పూజ చేశావని సంతోషించాలా ఇంకో రూపాన్ని తిడుతున్నావని ఆయన బాధ పడాలా నీకు ఇంకా తగినంత పరిణితి రాలేదని, ఈశ్వరుడు అనుగ్రహించి భారతీ తీర్థ చెప్పినట్లు పరిణితి కటాక్షించుగాక. కాబట్టి ఇదీ మహానుభావుడు వాల్మీకి మహర్షి యొక్క ప్రతిపాదన రామాయణంలో అభేద తత్వాన్ని చూపిస్తుంటారు.
కాబట్టి ఇప్పుడూ ఆ వచ్చిన సేనా నాయకులు పడిపోయారు. ఖరుడు మాత్రం పేద్ద శరీరంతో రామ చంద్ర మూర్తి మీదకి వచ్చి పడిపోతుంటే... ఆ రెండు చేతులు బాణముల యొక్క ప్రయోగం చేత తెగి కిందపడి పోయేటట్టుగా కొట్టేశారు. ఏర్లు ప్రవహించినట్లు నెత్తురు కారిపోతూ ఆయన ఇంకా ఏదో యుద్ధం చేయడానికిని వచ్చి రాముడి మీద పడిపోతుండగా... కొద్దిగా వ్యవధానం కోసం అంటే ఆ వింటినారిని సవరించుకోవడం వింటినారిని ఆకర్ణాంతం లాగడం కోసం బాణం ఎక్కు పెట్టడానికి చోటు కోసమని రెండు అడుగులు వెనక్కి వేశాడు రాముడు, దాన్ని అపసర్పణమూ అంటారు ధనుర్విద్యలో ఎందుకంటే ధనస్సు పట్టుకున్నవాడు వెనక్కి అడుగులు వేయకూడదు వీరోచితమైన తేజస్సున్నవాడు రాముడి మీద ఇదొక నిందమోపారు ఖరుడితో యుద్ధం చేసేటప్పడు రెండడుగులు వెనక్కి వేశాడు రాముడని ధర్మం తప్పాడని అలా ధర్మం తప్పాడో లేడో అని చెప్పడానికి ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యదిః ! పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్ !! అన్నాడు లక్ష్మణుడు పడిపోయాడంతే ఇంద్రజిత్తు. కాబట్టి ఆయన ధర్మం తప్పలేదు రెండడుగులు చోటు కోసం వెనక్కి వేశాడు చేసి ఆ ఖరున్ని కూడా సంహరించాడు. పద్నాలుగు వేలమంది రాక్షసులు తేగటారిపోయారు ఎంతసేపట్లోనో తెలుసాండీ!


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
ఏనుగుల యొక్క కుంభస్తలాలూ ఛీల్చి వేయబడినటువంటి గుఱ్ఱాల యొక్క శరీరాలు తెగిపోయినటువంటి తలకాయలు ఊడిపోయిన కాళ్ళు చేతులు గుండెల్లో గుచ్చుకున్న బాణాలతో నెత్తుటి ప్రవాహంలో పద్నాలుగు వేల మంది నేలబడి ఉన్నారు భగ్నమైన రథాలతో, ఎంత సేపట్లో కొట్టాడో తెలుసాండీ..! పద్నాలుగు వేల మందిని ఒక గంటా పన్నెండు నిమిషములలో కొట్టాడాయన ఇది రామ చంద్ర మూర్తి యొక్క వీరోచిత కార్యమంటే ఆయన బాహు బాలం అంటే అంత గొప్పది ఒక గంటా పన్నెండు నిమిషాలలో పద్నాలు వేల మందిని చంపితే పైన నిలబడిన వాళ్ళందరూ పొంగిపోయారు. మధ్యలో ఒక్కసారి ఖరుడు మాత్రం ఆయన ధనస్సు విరగొట్టగలిగాడు, వెంటనే విష్ణు చాపాన్ని తీసుకొని చేతబట్టి సంహారం చేశారు. అగస్త్యుడు కావలసినవన్నీ... గురువుల యొక్క అనుగ్రహం ఉంటే... గురువులు త్రికాల వేదులు ఎక్కడికి వెళ్ళినా వాటికి వచ్చే ఉపద్రవాన్నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సంబారములను గురువు సమకూర్చి పంపిస్తాడు. కాబట్టి అగస్త్యుడు అన్నీ సిద్ధం చేసి పంపించాడు.
కాబట్టి ఇప్పుడు అలా ఒంటికి దెబ్బలుతగిలి నెత్తురోడుతోందట రామ చంద్ర మూర్తి శరీరానికి మరి వాళ్ళుకూడా కొంత బాణ ప్రయోగం చేస్తారు కదాండీ... పద్నాలుగువేల మంది ప్రయోగించిన ఆయుధములను ఆకాశంలోనే విరగొట్టారాయన ఆసలు వచ్చి మీద పడకుండా అయినా కొన్ని బాణాలు వచ్చాయి ఆయనకు తగిలాయి ఆయన కవచాన్ని కూడా బద్దలు కొట్టాడు ఖరుడు కాబట్టి ఆయన ఒంట్లోంచి నెత్తురు కారుతోంది, వీర పత్నితికి అదొక సంతోషం భర్త అంత గొప్ప యుద్ధం చేసి ఇంత విజయాన్ని సాధిస్తే అటువంటి శరీరంతో ఉండగా వచ్చి భార్య ప్రియమార కౌగలించుకుంటుందటా... గుహలోంచి చూస్తుంది సీతమ్మ తల్లి పద్నాలుగు వేలమంది ఒకపక్కా తన భర్త ఒక్కడు ఒకపక్క, పద్నాలుగు వేల మంది మడిసిపోయిన తరువాత పరుగు పరుగున వచ్చిందట గుహలోంచి తత స్తు తం రాక్షస సంఘ మర్దనం సభాజ్యమానం ముదితైః మహర్షిభిః పునః పరిష్వజ్య శశి ప్రభాఽఽననా బభూవ హృష్టా జనకాఽఽత్మజా తదా !! ఆ జనకాత్మజయైనటువంటి సీతమ్మ ఎంతో సంతోషంతో పునః పునః మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ రామ చంద్ర మూర్తిని ప్రియమార కౌగలించుకుందట నా భర్త ఇంత కార్యాన్ని సాధించాడని, ఆ కౌగలించుకున్న భార్య చేత సంతోషాన్ని పొందినటువంటి రాముడు, రాముని యొక్క ఆ వీర్యాన్ని పరాక్రమం చేత సంతోషించిన సీతమ్మ వొండరులు ఆనందంగా ఉన్న ఈ సంఘటన తరువాత వచ్చేటటువంటి మండోదరి దగ్గరి రావణ ప్రసంగాన్ని ఇవ్వాళ చెయ్యకుండా వాళ్ళని అలా సంతోషంగా ఉంచుతూ ఇవ్వాల్టి ప్రసంగాన్ని పూర్తి చేస్తాను, రేపు మళ్ళీ ఆరు గంటలా ముప్ఫై నిమిషాలకు పునఃప్రారంభం చేస్తాను.


  అరణ్య కాండ పదిహేడవ రోజు ప్రవచనము
 
రోజూ మిమ్మల్ని లెటవర్స్ ఎందుకూ అప్పుడప్పుడూ తొందరగా వదిలిపెడతాను ఒక్క పదకొండు మాట్లు మనం రామ నామం చెప్పుకుని బయలుదేరుదాము. ఇవ్వాళ హరి ప్రసాద్ గారు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావన చెయ్యబోతున్నారు అందుకని మీరు కాసేపు కూర్చోవచ్చు ఎదో ఒక పేరుతో కూర్చోబెడుతుంటావు అనుకోకండి...

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
కోరికొలచిన వారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రా!!
నీవు నేనను బేధమేమియు లేకయున్నది రామ నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
భక్తితో భజియించువారికి ముక్తి నొసగును రామ నామము !!రా!!
సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామ నామము !!రా!!
యుద్ధమందు మహోగ్రరాక్షస యుగధ్వంసం రామ నామము !!రా!!
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామ నామము !!రా!!
మనసు స్థిరముగ నిలపగలిగెడి మంత్ర రాజము రామ నామము !!రా!!
పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
పాలు మీగడ పంచధారల తత్వమే శ్రీ రామ నామము !!రా!!
వెంటతిరిగెడు వారికెల్లను కంటిపాపే రామ నామము !!రా!!
బ్రహ్మపుత్ర కరాబ్జవీణా పక్షమైనది రామ నామము !!రా!!
జప తపంబుల కర్హమైనది జగతిలో శ్రీ రామ నామము !!రా!!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంభగు శ్రీ రామ నామము !!రా!!

మంగళా శాశన...