నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తిచేసే సమయానికి అహల్యా
శాపవిమోచనానికి సంబంధించినటువంటి ఘట్టంతో... పూర్తిచేసి ఉన్నాము. తరువాత రామ చంద్ర
సహితుడై, లక్ష్మణ సహితడైనటువంటి విశ్వామిత్రుడు మిథిలా నగరాన్ని చేరుకున్నాడు.
మిథిలా నగానికి చేరుకోవడానికి వెనకాల ఉన్నటువంటి పరమ ప్రయోజనం రామ లక్ష్మణుల్ని
తనతో తీసుకెళ్ళడం వెనకాల ఉన్నటువంటి ప్రయోజనం, మీకు నేను సూచనగా చెప్పి ఉన్నాను.
ఋషులు ప్రత్యేకించి వశిష్ట మహర్షి “నామకరణం, విద్యాభ్యాసం” చేయించారు, విశ్వామిత్ర
మహర్షి గొప్ప లోకోపకారమొకటి చేశారు. వశిష్టిడు ఏవింధంగానైతే “రామ నామం” ఉంచి
లోకోపకారం చేశాడో... అలా విశ్వామిత్ర మహర్షి చేస్తున్నటువంటి పతాకస్థాయి లోకోపకారం
ఇవ్వాళ ఆయన రామున్ని శ్రీరామున్ని చేస్తారు అంటే ఇవ్వాళ సీతాసహితున్ని
చేస్తున్నారు, కాదు కాదు రాముడెవరో తెలుసుకోవాలనుకున్నవాళ్ళకి తెలియజెప్పారు, కాదు
కాదు సీతమ్మ ఎవరో లోకానికి తెలియజెప్పారు, ఇంకా కాదు జనక మహారాజుగారు
కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో... దాన్ని విశ్వామిత్రుడు తీర్చాడు ఇన్నీ
జరిగినటువంటి ఘట్టాలు ఇవ్వాళ ప్రస్తావన చేయ్యబోతున్నాను.
నేను ఎందుకు ఈ మాట
అంటున్నానంటే రాముడు అవతరించినటువంటి కారణం ఆయనే స్పష్టంగా దశరథ మహారాజుగారి యొక్క
సభలో చెప్పాడు హత్వా క్రూరం దురాత్మానందేవర్షీణాం భయావహమ్ ! దశవర్షసహస్రాణి
దశవర్షశతానిచ నరుడిగా అవతరించి రావణ సంహారం చెయ్యడం, నరుడి యొక్క
ఖ్యాతిని నరుడి యొక్క వైశిష్ట్యాన్ని లోకానికి తెలియజెప్పడంకోసం పదకొండువేల
సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండడం, ఇప్పుడు రామావతారానికి కావలసినటువంటి ప్రజ్ఞా
ధనుర్వేద రూపంలో, అస్త్ర రూపాంలో, శస్త్ర రూపంలో విశ్వామిత్రుడు కటాక్షించాడు.
అలాగే ఒక నరుడికి ఉండవలసినటువంటి ఉత్తమమైన లక్షణాలు ఏవి ఉంటాయో అటువంటి లక్షణాల్ని
తాను తీసుకెళ్ళినటువంటి ప్రదేశాలలో ఉన్నటువంటివి కథల రూపంలో... గొప్ప గొప్ప
గుణములు రాముడికి కలిగేటట్టుగా... ఆయనకి నిగ్రహానుగ్రహ శక్తిని ఆయన యందు
పెంపొందింపజేశాడు. ఇప్పుడు రామున్ని “లోక కళ్యాణం” కోసం లోకానికి అందించేయ్యాలి,
వచ్చిన అవతారం యొక్క ప్రయోజనం అది.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఇప్పుడు లోకానికి
రామున్ని అందించాలి అంటే... రామున్ని శ్రీ రామున్ని చేయాలి అంటే సీతమ్మ తల్లితో
కలపాలి, శంకరభగవత్ పాదులు ఒక మాట అంటారు సౌందర్యలహరిలో శివః శక్త్యాయుక్తో భవతి
శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ! అతస్త్వామ్ ఆరాధ్యాం
హరి-హర-విరిన్చాదిభి రపి ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి ! అంటారు.
ఏ శక్తితో పరంధాముడు
కలవాలో... ఆ శక్తితో కలిసిననాడు శక్తిసమన్వితుడైన పరమాత్మా... అవతార ప్రయోజనాన్ని
సాధిస్తాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి ఏ స్వరూపంతో ఎందుకు వచ్చిందీ అన్నది
లోకానికి తెలియాలి, అది తెలుసున్నవారు యదార్థానికి, ఇప్పుడు తనకి కుమార్తెగా
లభించినటువంటి సీతమ్మకీ వరున్ని తీసుకురావాడానికి జనక మహారాజుగారి ముందరున్నటువంటి
అత్యంత క్లిష్టమైన సమస్య అది తాను ఎంత కష్టపడ్డాడో జనక మహారాజుగారే చెప్తారు.
వాళ్ళు మాట్లాడుకోవడం పైకి ఒకలా ఉంటుంది లోపల వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటిగా
ఉంటుంది. దానిసారాంశం పట్టుకుని ఆ కథా భాగాన్ని కావ్యాన్ని మీరు పరిశీలనం చేస్తే..?
అత్యద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఆవిష్కరింపబడుతాయి.
ఇప్పుడు మిథిలా
నగరానికి రామ సహితుడై-లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు చేరుకున్నాడు, చేరుకున్న
తరువాత ఆ మిథిలా నగరంలో ఉన్నపరిస్థితిని చూశారు. అప్పటికే అనేక మంది బ్రాహ్మణులు,
వేదపండితులు, ఋషులు, మునులూ అందరూ అక్కడికి చేరుకున్నారు, ఎందుకంటే సన్నివేశం
పతాకస్థాయికి చేరుకుంది యజ్ఞం పూర్తవబోతుంది, జనకుడే చెప్తాడు 12 రోజులు ఉంది
ఇంకా, దేవతలు హావిర్భాగం తీసుకోవడం కోసం వస్తారు, కాబట్టి ఎక్కడెక్కడివాళ్ళూ
అక్కడికి వచ్చేశారు. ఎక్కడ చూసినా జనసమస్థంగా ఉంది, రాముడు అన్నాడు ఋషివాటాశ్చ
దృశ్యన్తే శకటీశతసఙ్కాలాః ! దేశో విధీయతాం బ్రహ్మన్! యత్ర వత్స్యామహే వయమ్ !!
మనం ఇక్కడ చూస్తే బోలెడన్ని ʻశకటములుʼ అంటే అనేకములైనటువంటి బండ్లు తిరుగుతున్నాయి, అనేక
రకములైనటువంటి బ్రహ్మణులు, వేదపండితులు వచ్చివుండడంచేత రహదారులన్నీ క్రికిరిసి
ఉన్నాయి, ఇలా ఉన్న ప్రదేశంలో మనం ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అడిగాడు.
ఇంత చిన్న విషయం శ్రీ రామాయణంలో పెద్దగా రాయవలసిన విషయమాండీ
అదీ...! అది కూడా వాల్మీకి మహర్షి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నదాంట్లో ఇది కూడా
చెప్పాలా? అంటే చెప్పాలి, ఎందుకో తెలుసా? ఇప్పుడే హరిప్రసాద్ గారు ప్రస్థావన
చేశారే... అలాగా గురువుగారి హృదయాన్ని తెలుసుకోవాలి. అన్ని వేళలా గురువుగారు
ఒక్కలా ఉండలేక పోవచ్చు అని అనుకోవచ్చు, అనేకములందు ఏకాంతమును అనుభవించవలెనని
కోరుకోవచ్చు, ఒక్కొక్కసారి అందరితో మమేకమై ఉండాలని కోరుకోవచ్చు. ఆయన సంకల్పం
ఏమిటీ? ఆయన సంకల్పాన్నిబట్టి విడిది ఏర్పాటు చేయవలసి ఉంటుంది, అంతేగానీ ఆయన
సంకల్పం ఒకటైతే నీవొక విడిది ఇస్తే...? ఎలా కుదురుతుంది. ఆయన ఏకాంతంగా తపస్సులో
ఉందామని అనుకొన్నారనుకోండీ... మీరు ఆయన్ని తీసికొచ్చి జనసమర్థంలో పారేశారనుకోండీ
ఏం? విశ్వామిత్రుడు వచ్చాడంటే... ఊరుకుంటారా...! ఎక్కడెక్కడి మునులు, ఎక్కడెక్కడి
ఋరుషులు, ఎక్కడెక్కడి రాజులు అందరూ ఆయన దర్శనానికి వెళ్తారు. విశ్వామిత్ర
దర్శనానికి వెళ్ళనివాళ్ళు ఎవరుంటారు ఇంక అక్కడికి వెళ్ళి ఆయన చేయ్యవలసినపని అన్నది
ఏం చేద్దామనుకుని వచ్చారో...? ఎందుకొచ్చారో? ఏమైనా చెప్పారా! యజ్ఞం చూడడానికి
వెడదాం, నీవు శివ ధనస్సును చూద్దువు అన్నారు. ఈ రెండు ప్రయోజనాలు సాధించుకోవడానికి
విశ్వామిత్రుడు ఎక్కడడుండాలనుకుంటాడు అక్కడ, అది రాముడు నిర్ణయం చేయకూడదు
గురువుగారిని అడగాలి, గురువుగారు ఎక్కడుందామని అనుకుంటున్నారు పరిస్థితి ఇలా ఉంది.
అంటే ఎంత అందంగా మాట్లాడుతారో చూడండీ...! మాట్లాడడం అంటే ఇదీ... ఒక శిష్యుడు
గురువుని అనువర్తించడం అంటే...? అందుకే నేను తరచూ అంటూ ఉంటాను, ఆ విశ్వామిత్రుడూ
రాముడూ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అంత అందంగా ఉంటాయి ఎప్పుడూ గురువుగారి
హృదయాన్ని అర్థం చేసుకొని గురువుగారికి మనసులో పెద్దపీఠ వేయాలని ఆలోచించే స్థితి.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఇది ఎలా
ఉంటుందంటే... మీరు ఓ ఇద్దరికి అరటి పళ్ళు ఇచ్చి నైవేద్యం పెట్టండీ అని
అన్నారనుకోండీ...! ఒకాయన అరటి పండు యొక్క చివరి భాగాన్ని ఇలా ఒలిచి నైవేద్యం
పెడుతాడు. ఒకాయన డజను అరటి పళ్ళు అక్కడ పెడితే, అవి పక్కన పెట్టేసి రెండు ఆరటి
పళ్ళు ఆ పైన ఉన్నటువంటి తొక్క తీసేసి నైవేద్యం పెడతాడు. ఏమయ్యా నీవు మొత్తం పైన
అంతా తీసేసి నైవేద్యం పెట్టావు గిల్లకుండా? అని అన్నారనుకోండీ... ఏమండీ మా ఆవిడ
అరటి పండు పెట్టమని అడిగితే... తొక్క తీసి కదా ఇస్తాను ప్రేమతో, మా నాన్నగారు
అడిగితే తొక్క తీసి గదా ఇస్తాను ప్రేమతో... ఈశ్వరుడు కూడా తినాలి అని
కోరుకున్నప్పుడు గిల్లి అక్కడ పెడితే, ఒకటీ ʻరాత్రి నేను తినాలి ఇప్పుడే
తొక్క తీసేస్తే... పండు మాగిపోతుంది కాబట్టి అందులో ఈశ్వరుడికి ఇవ్వాలన్ని
త్రికరణశుద్ధి లేనే లేదు.ʼ ఒక వేళ నిజంగా నీవు ఈశ్వరుడికి ఇవ్వాలనుకుంటే... నీ
ఎదురుగుండా రామ చంద్ర మూర్తి వచ్చి కూర్చొని, ఏదీ నాన్నా! ఏం పెడతావో పెట్టు తింటాను
అని, నాకూ ఆకలిగా ఉంది అన్నాడనుకోండీ...! ఓ అరటి పండు గిల్లి ఆయన చేతిలోపెట్టి
తొక్క తీసుకుతిను అని అంటారా...? మీరు తొక్క తీసి పెడతారు. కాబట్టి ఈశ్వరుడికి
కదాండీ పెడుతున్నాను ఆయన తినాలని కదా పెడుతున్నాను, లెదా ʻతొక్క తీసి పెట్టానండీ
మహానుభావుడు ఆయన అల్పసంతోషి అన్నితింటాడా... అందుకని రెండు పళ్ళు తొక్క తీసి
పెట్టాను.ʼ అందుకే లలితా అష్టోత్తరి
శతనామావలిలో ఒక నామం ఉంది భావనామాత్ర సంతుష్టహృదయాయై నమః మీరు ఇవ్వడానికి
మీదేమి ఉండదు లోకంలో, ఇదే మంది కాదు.
ఈ సప్తధాతు నిర్మాణమైనటువంటి
ఈ శరీరాన్ని మనం నిర్మించుకున్నామేమిటీ? ఇందులో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు,
అస్తీ, శుక్లా, మేధా అన్నిటిని ఇలా ఇంత జాగ్రత్తగా ఎవడు కప్పి పెట్టాడు. భాగవతంలో
అంటారు, ఒక ప్రాణము సుఖ-దుఃఖములనేటటువంటి రెండు పళ్ళు. సత్వ రజస్త
మోగుణములనేటటువంటి మూడు గుణములు. ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి నాలుగు
పురుషార్ధముల కోసం, శబ్ద, స్పర్శ, రస, రూప గంధముల బడేటటువంటి ఐదు తన్మాత్రలతో పంచ
జ్ఞానేంద్రియములు ఒక మనస్సనబడేటటువంటి ఆరింటి సంఘాతములుగా... చర్మము, రక్తము,
మాంసము, కొవ్వు, అస్తీ, శుక్లా, మేధా అనబడేటటువంటి ఏడు పదార్థముల చేత... రెండు
కాళ్ళూ, రెండు చేతులు నాలుగు, ఐదు శిరస్సు, ఆరు కంఠము, ఏడు హృదయము ఇలా కాళ్ళు
చేతులతోటి ఏనిమిది ఉదరము అవయవముతోటి, రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు
రంద్రాలు ఆరు, ఏడవది నోరు, మల ద్వారము ఏనిమిది, మూత్ర ద్వారము తొమ్మిది. తొమ్మిది రంద్రములతో
ఈశ్వర శాసనం అయిపోయ్యేంత వరకూ బయటికి వెళ్ళడానికి వీలు లేని రీతిలో... చర్మపు
తిత్తి. తోలు తిత్తి అయినటువంటి ఇది తొమ్మిది కన్నాలతో ఉంటే ఇందులో ప్రాణ, అపాన,
వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకుర, ధనుంజయ, దేవదత్తములనేటటువంటి పది వాయువులు
ఆయన శాసనానికి నిలబడి ఉన్నాయి.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఆయన శాసనం
అయిపోయిందనుకోండీ... తొమ్మిది రంద్రాలలో ఏటునుంచైనా బయటికి వెళ్ళిపోతుంది
అందులోంచి. ఒక్కసారిగాని వెళ్ళిపోయిందా... యావత్ పవనో నివసతి దేహే, తావత్
పృచ్చతి కుశలం గేహే ! గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ! అంతటి
ఉదారుడు పరమేశ్వరుడు ఆయన సృష్టించాడు దీన్ని అంతటినీ, మనం సృష్టించుకున్నదిగానీ,
మనదీ అన్నదికానీ ఏమీ లేదు, నాలుక మీద రుచికి పప్పు, కూరా, పులుసు, చారూ, పెరుగూ
కలిపి నీవు తినేస్తే... నీ కడుపులోది మళ్లీ బయటికివస్తే నీవే తినవు, అలాంటిది
కడుపులోకి వెళ్ళి పడిపోయినటువంటి పదార్థాన్ని అమాశయ పాకంగా మార్చి జీర్ణంచేసి
అందులో ఉండే శేషాన్ని తెల్లవారేటప్పటికి పిప్పిగా విసర్జించడానికి వీలుగా
సిద్ధంచేసి మిగిలిన శేషభాగాన్ని, రక్తంగా శరీరంలో మార్చి శక్తికి వినియోగం
చేసేటటువంటి ఈశ్వర కృపచేత ఈ రథం నడుస్తోంది. ఆయనదీ అన్నీ, ఆయనదైనది ఆయనకి
ఇస్తున్నానన్న భావనకి నివేదనం అని పేరు. తప్పా, నేను ఆయనకి ఇస్తున్నానన్న భావనతో
మీరు ఎంత చేస్తున్నారో అది అంత అహంకారపురాశి అవుతుంది. శంకరభగవత్ పాదులు అందుకే
దానిని ఖండించారు శివానందల హరిలో గభీరే కాసారే విశతి విజనే ఘోర-విపినే విశాలే
శైలే చ భ్రమతి కుసుమార్థం జడ-మతిః ఎందుకు తిరుగుతావు? ఇది తెస్తాను, అది
తెస్తాను అంటావేమిటీ...? సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమా-నాథ భవతే సుఖేనావస్థాతుం
జన ఇహ న జానాతి కిమహో అంటారు. నీ హృదయమనేటటువంటి పుష్పాన్ని సమర్పించడం నీకు చేత కావాలి, ఏ విభూతి
ప్రకాశించినా అది ఈశ్వరానుగ్రహము, నేను ఇది చేస్తున్నాను ఈశ్వరా! నేనా అది
చేసేవాన్నీ... నీవు చేయిస్తున్నావు తండ్రీ... నన్ను ఉపకరణంగా స్వీకరించి,
నాచేత నీవు చేయించుకుని, వీడు చేశాడన్ని ఖ్యాతి నాకిచ్చి, నాకా కీర్తివస్తే, ఆ
కీర్తి వంతుడనై అందరూ నన్ను గౌరవిస్తే... నేను పొందిన గౌరవాన్నిచూసి నీవు
సంతోషించావు, పితృ హృదయంతో... తండ్రివి కనుక అనీ... మనసులో పొంగినవాడెవడో...? వాడు
భక్తుడు. వాడు ఎప్పుడూ కూడా విగ్రహాన్ని చూడడడు, సాకారమైనటువంటి ఈశ్వర స్వరూపాంతో
తదేక భావనతో ఉంటాడు. దానికి నిజమైన పూజ అని పేరు. అది ఎప్పుడు కూడా అవతలివారి
హృదయాన్ని అనువర్తిస్తుంది. ఈశ్వర భక్తియందు ఎలా ఉంటుందో... గురు భక్తియందు కూడా
అలానే ఉంటుంది. గురువుగారి హృదయాన్ని తెలుసుకొనే ప్రయత్నం తప్పా నీ ఆలోచనని
గురువుగారి మీద రుద్దేప్రయత్న మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఈశ్వరుడి మీద నీవు ఎలా
రుద్దలేవో, గురువు మీద కూడా అలాగే రుద్దకూడదు, నీ అభిప్రాయం నీవు చెప్పడం కాదు,
ఆయన అభిప్రాయం నీవు అడిగి చేయాలి.
కాబట్టి ఇది రాముడి యొక్క పరిపక్వత అంటే...! దీనికి
విశ్వామిత్రుడు సంతోషించేది, గురువు దేనికి సంతోషిస్తాడంటే... దీనికి గురువు
సంతోషించేది. ఆయన ఇప్పుడు చూడండి ఎంత అందంగా మాట్లాడుతాడో... ఎక్కడుందాం అని
అడిగాడు, ఎక్కడుందాం అంటే, ఎలా మాట్లాడాలి? ఎక్కడుందాం అని చెప్పాలి, మీరు తరువాతి
శ్లోకాన్ని మూసేసి, ఏం చెప్పిండాలి విశ్వామిత్రుడు అని ఆలోచించండి, మనమైతే
రకరకాలుగా ఆలోచన వస్తుంది ఏదో కాస్త శుభ్రంగా ఏమీ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా
అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని చూడండీ! అని ఇలాంటి ఆలోచనలు ఏవో రావాలి, కాని
విశ్వామిత్రుడు
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
చాలా అందమైన మాట
ఒకటి అంటాడు. ఆయన అంటాడు రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః !
నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే !! నివేశమకరోద్దేశే నాయనా రామా! మనం
ఉండేటటువంటి ప్రదేశం ఏకాంతమునకు అనువైనదై ఉండాలి, రెండవది నీటి సంవృద్ది ఉండాలి
నీరు బాగా దొరకాలి. ఏమి నీరు సంవృద్ధిగా దొరకడం ఎందుకూ... ఎకాంతంగా ఉండడం ఎందుకు?
ఎందుకీ రెండు అడగాలి విశ్వామిత్రుడు అంటే ఆయన హృదయము దానిచేత ఆవిష్కరించబడింది
ఎప్పుడూ కూడా... నీరు అనేటటువంటిది చాలా ప్రధానం.
ఒక
ధార్మికమైనటువంటి కార్యానికి కానీ లేకపోతే శౌచసిద్ధికి కానీ దేనికైనా నీరు అవసరం.
ఆ శివ మహాపురాణంలో స్తోత్రం చేస్తాడు మహానుభావుడు ఆయన శుక్రాచార్యులవారిని పరమ
శివుడు మింగేస్తాడు. మింగేస్తే ఆయన కడుపులోకి వెళ్ళి నీటి గురించి ఒక స్తోత్రం
చేస్తారు. అందులో ఆయన పరమ శివా! అని, నువ్వే నీటి స్వరూపంలో ఉన్నావు, అందుకనీ నీకు
ʻభవాʼ అని పేరు. భవా అని పేరు
ఎందుకు వచ్చిందీ అంటే, నీటి స్వరూపంలో ఉండి లోకాన్నంతటినీ బ్రతికిస్తూంటావు
కాబట్టి నీకు “భవుడూ” అని పేరు భవ ఇత్యుచ్యతే రూపం భవస్య పరమాత్మనః అని సంజీవనం
సమస్తస్య జగత్సలిలాత్మక్, ఇత్యుచ్యతే రూపం భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి
లోకాన్ని బ్రతికిస్తున్నాడు. ఆ నీరు అశౌచం కలిగితే స్నానం చేస్తే... ఆ అశౌచాన్ని
తొలగిస్తుంది. ఆ నీరు దాహాన్ని తీరుస్తుంది. ఆ నీరు ధర్మాన్ని నిలబెడుతుంది.
అన్నిటికన్నా గొప్పది, ఆ తమిళ కవి మహానుభావుడు అదే అంటాడు నీరన్నది లేకపోతే లోకంలో
ధర్మం అన్నది లుప్తమైపోతుంది.
ఎందుచేత అంటారేమో? మీరు యజ్ఞమూ, యాగమూ అన్న పెద్ద మాటలు
కాసేపు పక్కన పెట్టండి, అసలు ముందు ధర్మము అన్నది నిలబడాలి అంటే...? మొదలెక్కడా
అంటే... సంధ్యావందనం దగ్గర, సంధ్యావందనం మానేయడం కూడా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి
లేదు. ఎవరు సంధ్యా వందనం చేయడానికి అధికారం కలిగి ఉన్నారో...? వాళ్ళు సంధ్యా
వందనము చేసితీరాలి అది నిత్యకర్మ అది మారడానికి వీళ్లేదు. సంధ్యావందనం చెయ్యాలి
అంటే ఏముండాలి? సంధ్యావందనం చెయ్యాలి అంటే పూవ్వులుండాలి, అక్షంతులుండాలి, కర్పూరం
ఉండాలి అని లేదు. సంధ్యావందనం చెయ్యాలి అంటే నీళ్ళు ఉండాలి? ఆచంయా ఓం కేశవాయ
స్వాహాః ! అని పుచ్చుకోవడానికి ఉండాలా...! అర్ఘ్యయత్రయ ప్రధానం చెయ్యాలి
అంటే... నీళ్లు కావాలా? ఇది ఉంటే కదా, అసులు నీవు సంధ్యావందనం చేస్తే కదా సంధ్యా
హీనః అసుచిః స్వకర్మసు నిత్యకర్మసు వాడు సంధ్యావందనం చెయ్యనివాడు, ఏపనిని చెయ్యడానికి అర్హత కలిగి ఉండడు. మరి
అసలు సంధ్యావందనం చెయ్యాలంటే ఉండవలసినది నీకు పూవ్వులు అక్కర లేదు ఏమీ అక్కర లేదు
కసిన్ని నీళ్ళు ఉండాలి.
పడుకొని లేచావు అశౌచము కలిగింది. పడుకొని లేవగానే శరీరంలో
ఉండేటటువంటి రోమ కూపంలోంచి, నవ రంధ్రములలోంచి శరీరము మలమును విసర్జిస్తుందని
భాగవతంలో చెప్పబడింది. ఈ మలం ఎప్పుడైతే విసర్జించిందో అప్పుడు స్నానం చేయాలి,
చేయకుండా మీరు పుణ్యకార్యాన్ని చేయడానికి, ఒక యోగ్యమైన కార్యయాన్ని చేయడానికి నీకు
అర్హత ఉండదు. ఒక గుడిలోకి వెళ్ళాలి అంటే... పడుకొని లేచివెళ్తానంటే... కుదరదు
స్నానంచేసి వెళ్ళాలి, కాబట్టి ఇప్పుడు స్నానం చెయ్యాలి, దేనితో చేస్తావు నీళ్ళు
ఉండాలి. అన్ని ఉన్నాయండీ నీళ్ళోక్కటే లేవు, అంటే ఇబ్బందే... ఎందుకనీ అంటే ఓ రెండు
మూడు మాట్లు స్నానం చేయాలంటే నీళ్ళు కావాలి, త్రికాల సంధ్యా వందనం చేయాలంటే నీళ్ళు
కావాలి, నీకింక ఏమీ అక్కర లేదు, ఓ సాల
గ్రామం అక్కడ పెట్టీ నమః సోమాయచ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయచ నమశ్శంగాయ చ
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
పశుపతయే చ నమ
ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ అంటూ నీవు అభిషేకం చేయాలంటే
నీళ్ళుండాలి, ఏ పదార్థమున్నా పదార్థం చేస్తే శుద్ధ జలం ఉండాలి, నీరు లేకుండా
ధర్మమే లేదు. బ్రతకటం మాట ఆలా ఉంచండి, కాబట్టి నీరు లేకుండా... ఉండడం కుదరదు
మిగిలినవి అంటారా... ఉన్నా లేకలోపోయినా పర్వాలేదు.
వేయి సంవత్సరాలు
కుంభంకంలో ఊపిరే తీయనీవ్వండీ, నాకు అన్నం గురించి గొడవ లేదయ్యా... నీరు కావాలి
అంటే ధర్మాచరణమునందు ఎటువంటి అనురక్తి ఉన్నవాడో... విశ్వామిత్రుడు. నిజానికి ఆయన
చెయ్యాలా... సంధ్యావందనం విశ్వామిత్రుడు చెయ్యలేదనుకోండీ! ఆయన బ్రహ్మర్షిత్వానికి
ఏమైనా లోపం వస్తుందా...? అని మీరు అనుకుంటున్నారా? ఏమీరాదు ఆయనకి కానీ ఆయన
రాముడితో మాత్రం అలాగే మాట్లాడుతాడు. ఎందుకు మాట్లాడుతాడో తెలుసా... రామున్ని
ధర్మమునందు నిలబెట్టాలి రామో విగ్రహవాన్ ధర్మః తనంతతాను రాముడు కాదు
రామాయణంలో... అలా మీరనుకుంటే విశ్వామిత్ర పాత్రకీ, వశిష్ట పాత్రకీ ఏవిధమైన పూజార్హత
లేదు. నరుడు కాబట్టి పుట్టుకచేత ఆయనకు అన్నీ తెలిసివున్నాయని మీరు భావించరాదు.
అంతే రామాయణంలో తీర్పు. రామునికి అన్ని తెలిసిపోయాయి అని మీరు భావనచేసి రామాయణం
చదివితే, అప్పుడు రామాయణంలో రాముడు ఇమౌ స్మ మునిశార్దూల కిఙ్కరౌ సమపస్థితౌ !
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిమ్ !! అనవలసిన అవసరం లేదు కౌసల్యా
సుప్రజా రామ! పూర్వా సన్థ్యా ప్రవర్తతే ! ఉతిష్ఠ నరశార్దూల! కర్తవ్యం
దైవమాహ్నికమ్!! అని విశ్వామిత్రుడు చెప్పవలసిన పని లేదు.
గురువు చేత చెక్కబడ్డాడూ అంటే, ఎవరి అజ్ఞానం పోవడానికైనా
గురువు ఉండాలి గుకార శ్చాన్ధకార స్తు రుకారస్తన్నిరోధకః ! అన్ధకార వినాశిత్వాత్
గురు రిత్యభిధీయతే !! ఆ గురువు ఉంటే తప్ప చీకటి పోదు ఆ చీకటి పోగొట్టినవాడు
ధర్మమునకు ఎంత పెద్దపీఠ వెయ్యాలో... రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా !
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా !! అని రామ చంద్ర మూర్తిని
కీర్తించారంటే స్వధర్మమునందు అంత గొప్ప పూనిక ఎలా కలిగిందంటే, కేవలం వశిష్ట,
విశ్వామిత్రలదే అని వారివలననే కలిగిందని మీరు చెప్పవలసి ఉంటుంది. ఎందుకలా
చెప్పాలంటే ఇలా చెప్పినప్పుడే మీరు ఒక గురువు వెనకాల శిష్యుడు తిరగాలి, గురువుచేత
శిష్యుడు ఎలా చెక్క బడతాడు అన్నది మీకు అవగతము అవుతున్నది. లేనినాడు
ఏమైపోతుందంటే... రాముడు తనంతతాను అన్ని తెలిసియున్నవాడే అని మీరు ప్రతిపాదన
చేశారనుకోండి, ఒక పరంధాముడిగా దానియందు దోషం ఉండకపోవచ్చు, కాని రామాయణ హృదయమునకు
మాత్రం అది భంగపాటు అలా మాట్లాడ కూడదు అందుకే రాముడు విశ్వామిత్రున్ని అడిగితే,
విశ్వామిత్రుడు ఈమాట చెప్పాడు.
స్నానం చేసేసింతర్వాత ఇంక ఎవరొస్తారండని విధిలో కూర్చోకూడదు
విశ్వామిత్రుడు. వచ్చినవాళ్ళతో ఎంత సంక్షిప్తంగా మాట్లాడి పంపించెయ్యాలని ఆలోచనలో
ఉండాలి తప్పా, విశ్వామిత్రుడి వంటివాడు కూడా... చాలా కాలానికి మిథిలానగరానికి వచ్చాంగదాండీ!
బాగ సెంట్రల్ పాయింట్ ఎక్కడుందో చూడండీ అక్కడ ఉందాం. అందరికి ముందే తెలియజేయండీ
ముందే వచ్చేవాళ్ళకి అందరూ నాకోసం వస్తారు, విజిటింగ్ అవర్సపెట్టేస్తాను అనకూడదు.
బ్రహ్మమునందు రమించేటటువంటివారికి అత్యంత ప్రయోజనం బ్రహ్మమునందు రమించడమే...,
దానినుంచి విడివడడం విడివడి లౌకికమైనటువంటి విషయంతో సంఘంకలిగి ఉండడం, తను పొందవలసిన
ఆనందానికి భంగపాటు అది. భగవాన్
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
రమణులు ఎప్పుడూ అదే
అంటూండేవారు. “బహిర్ముకుడై లోకముతో తాదాత్మిక చెందడమూ తన యొక్క సహజస్థితికి
భంగపాటు.” మనకి ఎప్పుడూ లోకంతో సంఘమంచెంది ఉండడం మనకి సహజస్థితి. కాబట్టి మనకి
ఎప్పుడైనా అలాగా ఉండేవారి గురించి వింటే... వాళ్ళు పిచ్చివాళ్ళకింద మనకి
కనబడుతుంది. రామకృష్ణ పరమహంస ప్రతిరోజూ నిద్రలేవగానే నేల మీదపడి తల
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
కొట్టుకుని
ఏడ్చేవారట. మేనల్లుడు వచ్చి ఎందుకు మామయ్యా ఆలా ఏడుస్తున్నావు అంటే... నా
ఆయుర్ధాయంలో ఇంకో రోజు వెళ్ళిపోయింది నేను పరాశక్తి దర్శనాన్ని పొందలేదు.
అయిపోతుంది ఆయుర్ధాయం ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః ! లక్ష్మీస్తోయతరంగభంగచపలా
విద్యుచ్ఛలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా ! అంటారు
శంకరభగవత్ పాదులు. సూర్యోదయ, సూర్యాస్తమాయాల్లో
కాలాన్ని ఈశ్వరుడు
గ్రహించేస్తున్నాడు. నీకు ఉన్న కాలాన్ని నీవు ఏకాంతంలో ఈశ్వర సేవయందు వినియోగించి,
బ్రహ్మముతో రమించడం ఆయన ప్రయోజనము తప్పా...! అదే పనిగా వచ్చిన వాళ్ళందరితోనూ
కూర్చుని మాట్లాడటం విశ్వామిత్రుడు ప్రయోజనం కాదు.
కాబట్టి శరీర శౌచము కొరకు రాముడు చూస్తూండగా, రాముడికి
ధర్మావలంభనయందు పూనికికలుగుట కొరకు, ఒక సంధ్యావందనం చేయాలన్నా, ఒక యజ్ఞం
చేయాలన్నా, ఒక యాగం చేయాలన్నా, బాహ్య శౌచం, అంతః శౌచం నిలబడ్డానికి, స్నానానికి,
ఆచమనానికి, అభిషేకానికి నీళ్ళు అవసరం నీళ్ళు పుష్కలంగా ఉండే చోటు చూడు. ఏకాంతంగా
ఉండే చోటు చూడు అలాంటి చోట మనం ఉందాం ఇదీ గురువుగారియొక్క హృదయాన్ని
ఆవిష్కరిస్తుంది. మాట చాలా సామాన్యంగా ఉంటుంది అందుకే మీతో మనవి చేస్తుంటాను,
రామాయణాన్ని బాగా తరచి తరచి చూడండీ అని చెప్తుంటాను. ఒక విశ్వామిత్రుడు
మాట్లాడాడంటే, ఒక వశిష్టుడు మాట్లాడాడంటే, జనక మహారాజుగారు మాట్లాడితే అంత తేలికగా
ఏమీ ఉండదు. బాహ్యంలో కనపడినటువంటి కథలా అందులో శ్లోకానికి యదార్థమైన తాత్పర్యాన్ని
నీకు ఏలా కావాలో అలా అన్వయం చేసుకొని నీవు చెప్పకూడదు దానిహృదయాన్ని పట్టుకొని
నీవు చెప్పవలసి ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఆయన ఒక విడిదిలోకి ప్రవేశించారు,
ప్రవేశించి దానియందు ఉన్నారు. విశ్వామిత్ర మహర్షి వచ్చారు అని జనక మహారాజుగారికి
తెలిసింది. ఇప్పుడు జనక మహారాజుగారు విశ్వామిత్ర దర్శనంకోసం తానుబయలుదేరి వచ్చారు.
ఏలా వచ్చారు, అది మర్యాద అంటే...? ఎంత మర్యాదగా వచ్చారు, సేనాపతినీ, మంత్రినీ
వెంటపెట్టుకునిరాలేదు. ఆయన దగ్గరికివస్తే విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా స
నృపతిస్తదా ! శతానన్దం పురస్కృత్య పురోహితమనిన్దితమ్ ! ప్రత్యుజ్ఙగామ సహసా వినయేన
సమన్వితః !! అత్యంత వినయంతో, ఎందుకని? వెడుతున్నది ఎవరి దగ్గరికి విశ్వామిత్ర
మహర్షి దగ్గరికి, బహ్మర్షి కేవలం సంకల్ప మాత్రంచేత అవసరమైతే నక్షత్ర మండలాన్ని
సృజించ గలిగినటువంటివాడు. ఆయన ఏవిధమైనటువంటి భావనను నీయందుచేస్తాడో దానినిబట్టి మీ
అభ్యున్నతి, ఆయనకి కించిత్ కోపకారణమైందనుకోండి, ఆయన ఖేదపడ్డాడనుకోండి చాలు
ఈశ్వరానుగ్రహం తప్పిపోతుంది. కాబట్టి ఆయన తృప్తిపడాలి అంటే... మీరాయనకి
ఇవ్వడానికేం లేదు ఇంకా, ఎందుకంటే ఆయనకి ఇంక ఏమైనా తక్కువైతే గదా ఇవ్వడమన్నది,
బ్రహ్మమునందురమించి, తానుబ్రహ్మముగా అనుభవంలో ఉండేడటువంటివాడికి నాకిదిలేదన్నభావన
ఆయనకేం ఉండదు. ఆయనే వేయిసంవత్సరాలు కంభకంలో ఉండి ఊపిరే తీసుకోకుండా కాష్ఠంలా
నిలబడే ఉండిపోయినటువంటి వ్యక్తి, అటువంటి మహాపురుషుడు ఏం కోరుకుంటాడు, వినయాన్ని
కోరుకుంటాడు. కాబట్టి అత్యంత వినయంతో వెళ్లేటప్పుడు ఎవరితో కలిసివెళ్ళాడు,
శతానందునితో కలిసివెళ్ళాడట, పురోహితుడు గౌతమ మహర్షియొక్క కుమారుడు ఆయన కూడా
ఎటువంటివాడట ఆ శతానందుడు కూడానూ పురోహితమనిన్దితమ్ ఏవిధమైనటువంటి
మచ్చలేనివాడు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటివాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
నీతోవచ్చేవాడి
ప్రభావం మీ మీదకూడా ఉంటుందని జ్ఞాపకం పెట్టుకోండి. అంటే పెద్దల దగ్గరికి
వెళ్ళేటప్పుడు ఎవర్నిపడితే వాళ్ళని మీరు తీసుకొని వెళ్ళారనుకోండీ, మీరు మర్యాదగా
ప్రవర్తించచ్చు, వాడు అమర్యాదగా ప్రవర్తించడమో, లేకపోతే అడక్కూడనిమాట ఒకటి అడగడమో,
అడక్కూడని ప్రశ్న ఒకటి అడగడమో, లేకపోతే ఏదో అక్కడా మర్యాదకి కొంచెం అతిక్రమణం
జరిగేట్టుగా ప్రవర్తించడమో జరిగిందనుకోండి, అప్పుడు ఆయన్ను అనరు, ఇలాంటివాడ్ని
వెంటబెట్టుకొని ఎందుకువచ్చాడు అంటారు కదా! సంఘము చాలా ప్రధానమైనదై ఉంటుంది. ఒక
ఇనుప ఊచే అయి ఉండంచ్చండీ!, నీటితో సంపర్కం చెందితే తుప్పుపట్టి విరిగిపోతుంది. అదే
ఇనుప ఊచ అగ్నిహోత్రంతో సంపర్కంచెందితే మీకు ఎలా కావాలో అలా వంగి ఉపయోగపడుతుంది. సత్సంగత్యే
నిస్సంగత్వం, నిస్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే, నిర్మలతత్వం, నిర్మలతత్వే
నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః మీరు పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు
కూడా మీరు పవిత్రమైన హృదయంతోవెడితే సరిపోదు, ఎవరో లిస్టు ఇచ్చారుగదా, ఎవరో
మంత్రివస్తారు కదాని ఎవరితోపడితే వాళ్ళతో వెళ్ళకూడదు. ఆ మర్యాద తెలిసున్నటువంటి
వారితోటే వెళ్ళవలసి ఉంటుంది. లేకపోతే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలా ఎదార్థంగా
జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. దానివల్ల ఏమౌతుందంటే..? సాధారణంగా మీతో
వచ్చినటువంటివాళ్ళని Tell me your
friends I will tell you what you are అని ఇంగ్లీషులో ఒక ప్రవర్బ్
ఉంది. ఈయన నా మిత్రుడు అని పరిచయం చేసిన తరువాత ఆయన ఇంకొకలా ప్రవర్తిస్తే మీరు
కూడా అటువంటివారే అని అనుకుంటారు.
కాబట్టి
వెళ్ళేటప్పుడు మర్యాదతో వెళ్ళవలసి ఉంటుంది. ఆయన ఎవరిని చూస్తే సంతోషిస్తాడో,
అటువంటివాడితో వెళ్ళవలసి ఉంటుంది. కాదు జనకుడూ విశ్వామిత్రుడు వశిష్ట మహర్షి
ఇలాంటివాళ్ళు చేసేటటువంటి ప్రతిపనివెనకా భవిష్యత్ దర్శనం ఉంటుంది. వాళ్ళంతటవాళ్ళు
దర్శనం చేస్తారా... లేకపోతే వాళ్ళకువచ్చే ఆలోచనయందు ఈశ్వరుడి యొక్క కృప తోడవుతుందా
ఈ రెండు ప్రశ్నలు వేసి నిర్ణయించడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే జనకుడు
సామాన్యుడుకాడు, జనకుడు ఏదోచేసేద్దామని చేసేసే మనిషికాడు. జనకుడు ఏదైనాచేస్తే చాలా
దూరదృష్టితో ఉంటుంది. ఎందుకంటే ఆయన అంతటి బ్రహ్మజ్ఞాని, కాబట్టి జనకుడు ఏదైనా అంత ఆలోచనలేకుండా
ఒకవేళ చేసినాసరే, ఈశ్వరుడు చేయించినదై ఉండి ఉండాలి ఆపని, లేదా జనకుడు తీసుకెళ్ళాడు
అని అంటే... దానివెనక పరమార్థం ఉండాలి, శతానందున్ని తనతో తీసుకొని విశ్వామిత్రుని
దర్శనం చేశాడు. మహాపురుష దర్శనం మీకు ఫలితమిచ్చి తీరుతుంది. “ఈశ్వర దర్శనం ఎంత గొప్పదో... మహా
పురుష దర్శనం దానికి కోటిరెట్లు గొప్పది.” నాకు ఏమీ అందులో అనుమానం ఏమీ
లేదు. నేను ఈశ్వరుడి కన్నా అని, అనికూడా చెప్పుతాను. “ఈశ్వర దర్శనం కన్నా మహాపురుష
దర్శనమే గొప్పదీ.” శివ మహా పురాణంలో ఒకమాట ఉంది, అభిషేకం చేసుకొని
బయటికివస్తున్నటువంటి పరమ శివభక్తుడైనటువంటివాన్ని చూసినంత మాత్రంచేత త్రివేణీ
సంఘమ స్నానఫలితం వాడిఖాతాలో వేస్తారు అని ఉంది. నిన్న మీరు విన్నారుగా పరమ
శివున్ని సేవించినటువంటి వాళ్ళల్లో ఇప్పటికి ఎన్నోతరం వాళ్ళైనా సరే, ఆ శిష్యులకి
పాపం అంటలేదు రామా! అని విశ్వామిత్రుడు నిర్ధారించి చెప్పాడు మహాపురుష దర్శనం
అంతే.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
శతానందుడు, జనకుడు
ఇద్దరూ కలిసి విశ్వామిత్రుడు దర్శనంచేశారు, ఏం వచ్చింది ఇద్దరికి ఫలితం.
శతానందుడికి శుభవార్త వినపడింది, ఏమని వాళ్ళ అమ్మగారికి శాపవిమోచనం అయిందని
జనకుడికి ఏం ఫలితంవచ్చింది అల్లుడు వచ్చాడు. ఏం ఇంతకన్నా నీకు నిరుపణం కావాలా...?
కాబట్టి రామాయణం అన్నీ నీకు వివరించి మాట్లాడుతుందని మీరు అనుకోకండీ! రామాయణంలో
మీరు ఒక్క శ్లోకాన్ని చదివితే... ఇలా ఎందుకువెళ్ళి ఉంటారూ అని ప్రతి సందర్భం మీద
మీరు ధ్యానం చేయగలిగితే... రామాయణం మీకు ఎన్నో రహస్యాలని, రామాయణం మీ జీవితాన్ని
దిద్దుకోవలసినటువంటి అత్యద్భుతమైన అవకాశాన్ని మీకు కృపచేస్తుంది. దానికి ఆ శక్తి
ఉంది రామాయణానికి, అందుకే భాగవతం దశమ స్కందంలో ఆంధ్రీకరిస్తూ... పోతనగారు ఓ మాట
అంటారు గతజన్మంబుల నేమి చేసితిమో, యాగశ్రేణిలనేమేమి చేసినితిమో, ఎవ్వరికి ఏమి
పెట్టితిమో ఏ సిద్ధాశ్రమములన్ త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమి ఇచ్చటన్
కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది యశోద. ఏ సిద్ధాశ్రమములన్ త్రొక్కితిమో మహాపురుషులైనటువంటి
వారు చరించినటువంటి ఆ భూమిని తొక్కడం అంటే, ఆ కాలుతో తొక్కడం అని కాదు
భూమిని, తొక్కడం అంటే ఏమిటండీ, మీకాలు
అక్కడి వెళ్ళింది అంటే మీరు వెళ్ళారని, దర్శనం చేశారని.
మీరు మహాపురుషులు
తిరిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళడం, అక్కడ నిలబడడం కూడా మీకు అభ్యున్నతి హేతువు,
ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామివారు తిరిగినటువంటి కంచి కామకోటి పీఠానికి కాంచీ
పట్టణానికి వెళ్ళడం, అభ్యున్నతికి హేతువు, ఒక చంద్రశేఖర భారతీ స్వామివారు
కూర్చున్నటువంటి ప్రదేశం, ఒక నరసింహభారతీ స్వామివారు తిరిగిన ప్రదేశం, మహాపురుషులు
తిరిగినటువంటి శృంగగిరి పీఠాన్ని తొక్కడం నీ అభ్యున్నతికి హేతువు. ఒక రామకృష్ణ
పరమహంస కూర్చున్నటువంటి ప్రదేశానికివెళ్ళి మీరక్కడ కూర్చోవడం అభ్యున్నతికి హేతువు,
ఒక భగవాన్ రమణులు కూర్చున్నటువంటి ప్రదేశానికి వెళ్ళడం మీ అభ్యున్నతికి హేతువు
అక్కడ మీరు చేయవలసిందేమి ఉండదు వాళ్ళు కూర్చున్న చోటికి మీరు వెళ్ళితే మీ మనసు
తనంతతాను ప్రచోదనం అవుతుంది.
నేను ఈ మాట యథాలాపంగా అంటున్నానని అనుకుంటున్నారేమో కాదు,
“పాల్ బ్రాంటన్” అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన విదేశాల నుంచి ఆత్మ తత్వాన్ని
తెలుసుకోడానికి ఈ దేశానికి వచ్చాడు. వచ్చి పరమాచార్యవారి దర్శనం కూడా చేశాడు ఆయన,
ఆ పాల్ బ్రాంటన్ ఇక్కడ ఎందరినో కలుసుకున్నాడు, కలుసుకుని నాకు తృప్తి కలగలేదు
ఇక్కడ ఎవరూ నాకు సరైన సమాధానం చెప్పలేదు అని వెళ్ళిపోబోతున్నాడు ఈ దేశం నుంచి,
వెళ్ళిపోబోతుంటే ఎవరో చెప్పారు ఒక్కసారి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళండీ, అరుణాచలంలో
ఉన్నారూ అని, ఆయన భగవాన్ రమణుల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు, వెళ్ళితే కొన్నాళ్ళు
ఉన్నారు, ఉంటే ఆయనకేం తోచలేదు, ఆయన సోఫాలో పడుకునే వారు, ఈయన
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
అక్కడ కూర్చొని
ధ్యానం చేసేవాడు. ఈయన మనసు నిలబడేదికాదు, ఒక రోజు ఇక నేను వెళ్ళిపోతున్నాను స్వామి
అని చెప్పదామని అనుకుని వెళ్ళారు, వెళ్ళి కూర్చున్నారు, ʻరమణులు తీక్షమైన దృష్టితో
దృష్టిపాతం చేశారు,ʼ అలాగే ఆయన
కళ్ళల్లోకి చూశారు అంతే, స్తంభీభూతుడు అయ్యపోయాడు, ఆయనకి ఆత్మ అనుభవంలోకి
వచ్చింది. ఆయన వ్రాసినటువంటి పుస్తకాలచేత, ఇవ్వాళ ప్రపంచంలో అనేక దేశాలలో భగవాన్
రమణుల గురించిన విషయం తెలిసి మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడుండి మనం వెళ్ళడానికి వెనకాముందు
ఆలోచిస్తాం, ఇవ్వాళ రమణాశ్రమంలో విదేశాలనుంచి వచ్చిన అనేక మంది ఇతర మతస్తులు, నార
చీరలు కట్టుకుని అక్కడ భోజనంచేసినవాళ్ళ విస్తర్లు తీస్తారు.
నేను అరుణాచల పర్వత
శిఖరం మీద తిరుగుతూ ఉంటే..., ఒక రోజు ఒక ఫారినర్ ఒకావిడ కనపడింది, ఆవిడ ఒక చిన్న
బొట్టు పెట్టుకొని ఆ కొండ శిఖరాల మీద తిరుగుతుంది. నాతో మా పినమామ కూడా ఉన్నారు,
ఆయన I am very Glad to
you meet you, from which country you have come అన్నాడు, అని
షేకహ్యాండ్ ఇవ్వబోతే, ఆవిడ రెండు చేతులతో నమస్కారం చేసి ఆవిడ అంది. I
salute to you for only one reason that you have born in a country like India.
In which Bhagvan Ramana has also taken birth. You’re so lucky that you under
taking a journey by one night come to Arnachala, but where are you are saying
back faros country which we can come over here taking visa and passport and
spending thousands of thousands rupees. This is the grace which we have been
benefited that అంటే ఆయన ఆశ్చర్యపోయి నమస్కారం చేశాడు. మీరు
అదృష్టవంతులు మేము ఎక్కడో విదేశాలలో ఉన్నాం, పాస్ పోర్టులు వీసాలు కొన్ని వేల
రూపాయలు తీసుకున్న తరువాతకానీ మేము ఈ దేశానికివచ్చి ఇక్కడ తిరగలేము, మీరు
ఒక్కరాత్రి ప్రయాణంచేస్తే ఇటువంటి సిద్ధపురుషుని యొక్క ఆశ్రమానికివచ్చి ఉండగలరు,
మీరు అదృష్టవంతులు ఈ దేశంలోపుట్టి, మీవంటి వారితో నేను కరచాలం చెయ్యలేను, మీకు
రెండు చేతులతో శిరస్సువంచి నమస్కారం చేస్తున్నాను అందావిడ.
నేను నిజంగా ఆశ్చర్యపోయాను, మనం ఎంత అదృష్టవంతులమో మనకి
దానివల్ల తెలుస్తుంది అందుకే జటావల్లభుల పురోషోత్తంగారు ఒకమాట అంటూండేవారు, “ఈ దేశ
వైభవమంతా సిద్ధ పురుషులదే” అంటుండేవారు మహాపురుషుల వలనే ఈ దేశానికి ఈకీర్తి వచ్చింది.
ఒక శంకర భగవత్ పాదులు ఈ దేశంలో పుట్టి, నాలుగు చెరగుల ఆశేతుహిమాచల పర్యంతం
తిరిగారు కాబట్టి, అవైధికములైనటువంటి వాదములు ఖండింపబడి సనాతన ధర్మం నిలబడింది.
మహానుభావుడు శంకవిజయాలలో అంటారు, ఒక లేగదూడని వేటకుక్కలు తరిమితే, లేగదూడ
పరిస్థితి ఏలా ఉండేదో సనాతన ధర్మము యొక్క పరిస్థితి శంకరభగవత్ పాదుల అవతార
శ్వీకారంనాటికి అలా ఉండేది. అందుకే శంకరభగవత్ పాదులు అవతరించిన తరువాత
సత్యదండాన్ని చేతపట్టి అవైదిక వాదనలు ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహా
పురుషుడు ఆయన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక
శంకరం అటువంటి వారివల్ల ఈ జాతికిఖ్యాతి వచ్చింది తప్పా, సంపత్తితో కూడినటువంటి
విధానంచేత, భోగాన్ని అనుభవించేటటువంటి అనురక్తిచేత ఈ దేశానికిపేరు రాలేదు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
కాబట్టి శతానన్దం
పురస్కృత్య పురోహితమనిన్దితమ్ శతానందునితో కలిసి జనక మహారాజుగారు విశ్వామిత్ర
మహర్షి దర్శనానికని బయలుదేరారు. వెళ్ళిన తరువాత ఆయనకు ఆర్ఘ్య పాదాదులను ఇచ్చి
అయ్యా మీరు ఆసనం మీద కూర్చోండి అని ఆయన కూర్చున్న తరువాత వీరు కూర్చున్నారు.
అంటే... విశ్వామిత్ర మహర్షి కూడా ఎంతో గౌరవించి వచ్చిన వారిని వెంటనేలేచి సాదర
స్వాగతం పలికారు, వారిని కూర్చోమని విశ్వామిత్రుడు కూర్చున్న తరువాత జనక మహారాజు
శతానందులవారు కూడా కూర్చునారు. మీకు వాల్మీకి రామాయణంలోని గమ్మత్తేమిటంటే... అసలు
ఆయన ఏదీ విడిచిపెట్టరు, ఆయన తాపత్రయం ఏమిటంటే, లోకం దీనిని చదువుకొని అనువర్తించి
నేర్చుకోవాలి అని ఆయన భాద. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నిల్చోవాలి,
ముందు ఏం మాట్లాడాలి, ముందు మనం కూర్చోవడమా ఆయన కూర్చున్నాక మనం కూర్చోవడమా ప్రతి
చిన్న విషయాన్ని వాల్మీకి స్పృశిస్తారు. అందుకే మనిషిని మనిషిగా తయారు చేయడానికి, మనిషిని మనిషిగా
బ్రతికించడానికి రామాయణం కన్నా ఔషధం ఉందీ అని నేను అనుకోను. శ్రీ రామాయణం
అద్విదీయమైనటువంటి కావ్యం, అమృత ఫలమది. కాబట్టి జనక మహారాజుగారు విశ్వామిత్రునితో
అన్నారు, ఎక్కువ సేపు కూర్చోవడం కానీ, ఎక్కవ సేపు మాట్లాడటం కానీ ఉండదు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
అప్పటికి ఎన్నో
సంవత్సరాల నుంచి జరుగుతోంది యజ్ఞం, యజ్ఞం ఇంత గొప్పగా జరిగింది అంత గొప్పగా
జరిగింది, వాళ్ళొచ్చారు వీళ్ళొచ్చారు అని ఇంత డబ్బులు కర్చుపెట్టాం ఇంత ఇది చేశాం
అంత అది చేశాం ఇంత మందికి అన్నం పెట్టాం ఈ లొల్లిమాటలంటారే... అవి కనపడవు మీకు.
మాట్లాడుతున్నది ఎవరితోటండీ! బహ్మర్షి విశ్వామిత్రుడితోటి, నువ్వేం చేయగలవు అన్నం
పెట్టగలవు, ఆయనేం చేయగలడు నక్షత్ర మండలాన్ని సృష్టించగలడు. ఆయన దగ్గరికెళ్ళా నీవు
అన్నం పెట్టానని చెప్తావ్?, ఆయన దగ్గరికెళ్ళా కందిపప్పు తెచ్చాను మూడు కేజీలు
మినపప్పు తెచ్చానని చెప్తావ్? ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, ఎంత అందంగా
మాట్లాడుతాడో చూడండి! అందుకే నేను తల కొట్టుకు చెప్తున్నది. రామాయణం చెక్కుతుంది,
చెక్కుతుంది అని ఒకటికి పదిమార్లు చెప్తున్నది. అందునా బాల కాండ ప్రశస్తమండీ...?
అసలు బాల కాండ విద్యార్థులు చదవాలి తప్పకుండా... చిన్న వయసులో ఉన్న పిల్లలు చదవాలి
బాల కాండ. తప్పకుండా చదవాలి, ప్రత్యేకించి విశ్వామిత్రుడు రామ చంద్ర మూర్తి
ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారో, ఎందుకంటే బాల కాండలో రాముడూ వశిష్టిడూ మాట్లాడుకున్న
భాగం చాలా తక్కువ, రాముడూ విశ్వామిత్రుడు మాట్లాడుకున్నది చాలా ఎక్కువ. కాబట్టి
మీరు ఆ భాగాన్ని పిల్లలతో చదివిస్తే... వాళ్ళకి గొప్ప ప్రవర్తన అలవాటు అవుతుంది
చాలా గొప్ప నడవడి వస్తుంది.
ఆయన అంటాడు అద్య
యజ్ఞసమృద్దిర్మే సఫలా దైవతైః కృతా ! అద్య యజ్ఞఫలం పాప్తం భగవద్ధర్శనాన్మయా !!
ద్వాదశాఽహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః ! తతో భాగాఽర్థినో దేవాన్
ద్రష్టుమర్హసి కౌశిక !! ఇది ఆయన చెప్పిన మాటలు. విశ్వామిత్ర మహర్షీ ఈ యజ్ఞం ఇంకొక
పన్నెండు రోజులలో పూర్తైపోతుంది అని పెద్దలైనవారు అంటున్నారు, మీరామాట చాలా
జాగ్రత్తగా పట్టుకోవాలి, 12 రోజులలో అయిపోతుందని నేను అంటం లేదు, పెద్దలు
అంటున్నారు, మన సనాతన ధర్మంలో, మన సాంప్రదాయంలో గొప్ప తనమేమిటో తెలుసాండీ? ఏది
మాట్లాడినా, పెద్దలు అన్నారన్న మాట మనం మాట్లాడాలి తప్పా, నేనంటున్నానని మాట్లాడ
కూడదు దానికి ప్రమాణం ఉండదు. అందుకే మనపిల్ల పెళ్ళే మనమే చేసినా, మేమే చూసుకున్నాం
అల్లున్ని అని అనకూడదు. నేను మా అల్లున్ని నిర్ణయించుకున్నానుగానా అనం, పెద్దలు
నిర్ణయించినారుగానా అంటాం. అది మంగళహేతువు, నాకు పెద్దల యందు ఆ గౌరవము ఉందీ అనీ,
ఇది నేను చేసుకున్న నిర్ణయంకాదు పెద్దలు చేసిననిర్ణయం అని గుర్తు. కాబట్టి పెద్దలు
అంటున్నారు, 12 రోజులలో పూర్తవుతుందీ అని, పూర్తైతే ఏమి జరగాలి, యజ్ఞం
బాగాజరిగింది అని గుర్తేమిటీ? పూర్తైతే చిట్ట చివరలో దేవతలందరూ వస్తారు, హవ్యములను
స్వీకరిస్తారు, వాళ్ళు ఇప్పుడూ స్వీకరిస్తారు, ఇందులో మీకు ఏమీ అనుమానం లేదు,
ఇప్పుడు శ్వీకరిస్తున్నారా...?... అని మీరు అన్నారనుకోండీ! అప్పుడు వెంటనే
ఏమౌతుందంటే మీకు సనాతన ధర్మమునకు ఆది మూలకందమైనటువంటి వేద ప్రమాణము మీద మీకు
అనుమానం ఉందని గుర్తు. మీరు ఏమనాలి అంటే ఇప్పుడూ స్వీకరిస్తున్నారు, మీరేమనాలి
అంటే ఏమిటండి అదే అనాలి ఎప్పుడూ స్వీకరిస్తారు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
యజ్ఞం మీరు చేస్తే తీసుకుంటారు
దేవతలు, కాకపోతే అప్పుడు కనపడ్డారు ఇప్పుడు కనబడలేదు. ఎందుకు కనపడలేదు అంటే,
అప్పుడు కనపడతే చూడగలిగినటువంటి ఉపాసనా బలం ఆ శరీరాలకు ఉంది, ఇప్పుడు కనపడితే
చూడగలిగిన బలం నీ శరీరానికి లేదు, ఎందుకంటే మనం కలిపురుషుడికి చిక్కి ఉన్నాం. పరమాచార్య
స్వామి అంటుండేవారు కలియుగంలో 18 సెకండ్లు ఒక్క విషయం మీద నీవు మనస్సు ధ్యానంలో
నిలబెట్ట గలిగితే... ముముక్షువు, అంటే 18 సెకండ్లు నిలబెట్టడం కష్టంమండి మనస్సుని
ఈశ్వరుడి మీదా నిలబెట్టలేరు కదిలి పోతుంది. ఎందుకు కదిలి పోతుంది అంటే, ఒక్కటే
కారణం కలిపురుషుని యొక్క ప్రభావం అంతగా ఉంటుంది. ఎంతగా ఉంటుందంటే ఎప్పుడూ
తిరగాలన్నా పోనీ అదేమి శివ పూజ చేస్తుంటే, అభిషేకం చేస్తుంటే భద్రాచలం వెళ్తే
మంచిదే..., అలా ఏం వేళ్తుందని మీరు అనుకోకండీ, అది వెళ్ళేది కూడా రోసీ రోయదు
కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీ పాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి, వాంఛా
లతల్ కోసి కోయదు నా మనంబకట, నీకున్ బ్రీతి సత్ర్కియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళణచవే
! శ్రీ కాళహస్తీశ్వరా ! అంటాడు దూర్జటి, ఎక్కడెక్కడ వద్దంటుందో అక్కడ అది
విసుక్కున్నట్టు ఉంటుంది, మళ్ళీ అక్కడే తిరుగుతున్నట్లుంటుంది, శరీరాన్ని ఇక్కడ
బెడుతుంది. దానికున్న లక్షణం అదే...! కాబట్టి మనసుని నిలబెట్టటం అనేటటువంటిది చాలా
కష్టం మనం అది చెయ్యలేం కాబట్టీ, మన ఉపాదికి ఆ తేజస్సు లేదు కాబట్టీ, శౌచ శుద్ధి
మనకు తీసుకోవడంలోనూ లేదు, ఓ కార్యా చరణయందు లేదు.
కాబట్టి మనం
చూడలేం, కానీ దేవతలు మాత్రం వస్తారు ఇప్పటికీ వస్తారు... ఎందుకొస్తారు అంటే ఒక్కటే
కారణంతో వస్తారు, ఇప్పటికీ స్వరంతో వేదం చెప్పేటటువంటివారు ఉన్నారు కనుక వస్తున్నారు,
ఈ కారణానికి వేదపండితులు కనపడితే నమస్కారం చేయాలి మనం. వాళ్ళు లేకపోతే దేవతలను
తీసుకొచ్చేవారు లేరు, వాళ్ళు స్వరంతో వేదం చెప్తున్నారు కాబట్టీ దేవతలు
వస్తున్నారు, దేవతలు వస్తున్నారు కాబట్టి మీరు హవిస్సు ఇస్తున్నారు. మీరు
చూడనివన్నీ, మీ కంటికి కనపడనవన్నీ అబద్దాలంటే కుదరదు. భూమి తిరగడం మీరు చూశారా...?
భూమి తిరగడం మీరు చూడలేదుగా...? మరి భూమి తిరుగుతూందని సోషల్ పేపర్లో ఆన్సర్
రాస్తున్నారుగా, భూమి తిరిగితేనేగా రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి అంటున్నారు. మీ
కంటికి సూర్యాస్తమయం అయినట్లు కనబడుతుంది. నిజంగా సూర్యాస్తమయం అయిపోతుందా...
సూర్యునికి అభిముకంగా ఉండకుండా చాటుకు మీరు వేడుతున్నారు, భూమి తన చుట్టూ తాను
తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడంలో అంతే గాని, సూర్యోదయ సూర్యాస్తమయాలు యదార్థమునకు
సత్యములు కావు, భూమి స్థిరంగా ఉన్నట్లు కనబడుతూంది సత్యంకాదు, మీ కంటికి
కనపడేవన్నీ సత్యాలు అయ్యి ఉండాలంటే మీరు ఇవ్వాళ పెద్ద పెద్ద పదవిలలో ఉన్నవాళ్ళు ఈ
పదవిలో ఉండడానికి ఎన్నుకోబడ్డారనడానికి ఓట్లు మీరేమి లెక్కపెట్టలేదుగా, మరి అది
నమ్మి మీరు
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
గౌరవించినప్పుడు,
వేదాన్ని నమ్మి ఎందుకు గౌరవించరూ, నమ్మకం ప్రధానం, మీరు ఆ స్వరంతో మంత్రం చెప్తే,
దేవతలు వస్తారు వచ్చి యజ్ఞంలో హవిస్సుని స్వీకరిస్తారు.
కాబట్టి దేవతలు వస్తారు దేవతలు వచ్చి స్వీకరిస్తారు ఎందుకనీ
అంటే యజ్ఞం అలా జరిగింది విశ్వామిత్ర మహర్షీ నీవాదేవతలను చూడగలవు. విశ్వామిత్రుడు
కూడా అక్కడి వస్తే దేవతలు మరింత ప్రసన్నులౌతారు మరింత సంతోషిస్తారు. అంటె ఈ
వాక్యంలో ఉన్న అర్థం ఏమిటంటే యజ్ఞం ఎలా జరగాలో అలాగే జరిగేటట్టుగా నేను
సర్వప్రయత్నములనుచేసి యున్నాను. ఎలా శాస్త్రం చెప్పిందో అలానే నేను చేశానండీ!
అన్నారనుకోండీ, అదా నీవు విశ్వామిత్రుడి ముందు చెప్పవలసింది, అహా అన్నాడనుకోండి
ఆయన ఒకటి అడిగితే లేనిపోని ఇబ్బంది, అందుకని చిట్ట చివర దేవతలు వస్తారు వారిని మీరు
చూడగలరు మహర్షి. ఆ... తప్పకుండా అలా జరగాలయా అంటారాయన, ఇప్పుడు ఆయన నోటివెంట
వచ్చినమాట నీకు ఆశీర్వచనమౌతుంది. కాబట్టి ఈమాటచెప్తే ఆయన సంతోషించారు
విశ్వామిత్రుడు. ఇంతే ఇంతకన్నా ఏం మాట్లాడడు జనకుడు. ఇంతకన్నా ఏం వర్ణించడు. హనుమా
సీతా దర్శనం చేసి రామ చంద్ర మూర్తితో మాట్లాడితే, చాలా లఘవుగా మాట్లాడుతారు, తన
పరాక్రం ఏమీ వర్ణించరు, మాట్లాడేటప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో
చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడ వలసి ఉంటుంది. ఎక్కువగా మాట్లాడారనుకోండి రెండో
మాట రానివ్వరు ఎందుకో తెలుసాండీ! ఏమండీ ఒక్కసారి మీ దర్శనానికి వస్తాను
అన్నారనుకోండీ, ఇప్పుడు కుదరదండీ నేను పనిలో ఉన్నాను అంటారు. కారణం ఒకటే,
అతిప్రసంగం చేస్తాడు సమయం వృధా అవుతుంది. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో పెద్దల
దగ్గర అది మాత్రమే మాట్లాడాలి, సమయా సమయములను గమనించి మాట్లాడాలి, నీకు
యాభైరూపాయలు అప్పుంటే రైతుబజారులో అడిగినట్లు, అనుమానం వచ్చింది గదాని ఎక్కడ
కనపడితే అక్కడ అడక్కూడదు. ఆయన చెప్పడానికి అనువైన రీతిలో సావకాశంగా ఉన్నాడా...
అంతే కానీ ఇక కనపడ్డ చోటల్లా, ఎక్కడ పడితే అక్కడ ఏమండీ రామాయణంలో.....?....?? అని
పీక్కు తినేయకూడదు. అది ఎక్కడ అడగాలో అక్కడ అడగాలి పరిప్రశ్నేన సేవయా! కాబట్టీ
ఇంత మాత్రమేచెప్పి జనకుడు విడిచిపెట్టేశాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
రామాయణాన్ని జనకుడు
చెప్పాడు విశ్వామిత్రుడు విన్నాడు అని చదువుకోవడానికి నేను చెప్పక్కర లేదు, మీరు
వినక్కర లేదు. రామాయణం అలా చదువుకొని మనం నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే నేను
చెప్పాలి మీరు వినాలి అదొకటి వదిలిలేసి మిగిలింది నేను చెపితే రామాయణం చెప్పడానికి
నేను రావక్కరలేదు. కాబట్టి మీకు కొంచెం కష్టంగా అని పించినా నేను అన్నమాట ఈ మాట
చెప్పవలసి ఉంటుంది. రోగికి ఇచ్చిన ఔషధం కొంచెం చేదుగా ఉన్నా, దగ్గు తగ్గుతుందిగా
మరి వైద్యుడిచ్చింది అప్పుడప్పుడు అలా మాట్లాడవలసి ఉంటుంది.
ఇమౌ కుమారౌ భద్రం తే తేవతుల్యపరాక్రమౌ ! గజసింహగతీ వీరౌ
శార్దూలవృషభోపమౌ !!
పద్మపత్రవిశాలాఽక్షౌ
ఖడ్గతూణీధనుర్ధరౌ ! అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ !!
యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ ! కథం పద్భ్యామిహ
ప్రాప్తౌ కిమఽర్థం కస్య వా మునే !!
వరాయుధధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే ! భూషయన్తావిమం దేశం
చన్ద్రసూర్యావివామ్భరమ్ !!
పరస్పరస్య
సదృశౌ ప్రమాణ ఇఙ్గిత చేష్టితైః ! కాక పక్షధరౌ వీరౌ శ్రోతుమ్ ఇచ్ఛామి తత్త్వతః !!
ఇన్ని శ్లోకాలు
మాత్రం ఎవరి గురించి మాట్లాడాడో తెలుసాండీ! జనకుడు, అప్పటి వరకు విశ్వామిత్రుడితో
మాట్లాడుతున్నాడు. అయిపోయిందిగా మాట్లాడడటం ఇలా బయలు దేరుతూ చూశాడు ఇద్దరు పిల్లలు
కనపడ్డారు పక్కన అంతే..! ఇక నోటి వెంట ఆగలేదు స్తోత్రం. అది విష్ణు దర్శనం. అది
భగవత్ దర్శనం. అది ఎవరిని పొంగిస్తుందంటే... పొంగగలిగిన పదార్థాన్ని పొంగిస్తుంది.
ఆవిరయ్యే పదార్థాన్ని ఎలా పొంగిస్తుందండి, అగ్నిహోత్రం మీద నీళ్ళు పెట్టారనుకోండీ
నీరు ఉడికి ఉడికి ఆవిరి అవుతాయి అంతే...? తప్పా అవి ఎప్పుడు పొంగవు నీళ్ళు, నీళ్లు
పొంగుతాయాండీ...? నీళ్ళు పొంగే అవకాశం ఉండదు. పాలు తీసుకెళ్ళి పెట్టండీ పొంగుతాయి.
కాబట్టి మహానుభావుడు ఆ రామ లక్ష్మణులని చూడగానే పొంగింది మనసు, పొంగితే ఆగకుండా
నోటివెంట వచ్చేస్తుంది మనసులోకి స్తోత్రం. ఇదీ మీరు గమనించండి. పిల్లలెవరండీ అలా
ఉన్నారూ అని ఒక్క మాట కాదు ఎంత వర్ణణ వచ్చేస్తుందో చూడండి ఇమౌ కుమారౌ భద్రం తే అసలు
చూడగానే అబ్బబా...! నా కనువాపు తగిలేస్తుందేమో అనిపిస్తుంది తేవతుల్యపరాక్రమౌ దేవతల
యొక్క పరాక్రమము ఎలా ఉంటుందో అలా పరాక్రమ వంతుల్లా కనపడుతున్నారు గజసింహగతీ
వీరౌ ఏం వాళ్ళేమైనా నడిచారా అక్కడా ఏం నడవట్లేదుగా అసలు వాళ్ళని చూస్తే
తెలుస్తోంది ఏనుగు నడిచినట్లు సింహం నడిచినట్లు నడిచేవాళ్ళలా ఉన్నారు ఏమిటీ మాటలు
అ మాటలు ఎందుకొస్తాయి నోటికి వెంట ఇంకోమాట అనకూడదా...! ఏమి రామాయణమండీ అనుభవించి
రచించారండీ వాల్మీకి మహర్షి, దర్శనం చేసిరాశారు. గజసింహగతీ వీరౌ ఆ నడక
ఏనుగు నడక సింహం నడక అంటుంన్నారు.
కారణం ఒక్కటే ఏనుగు నడిచింది అంటే మార్గం వచ్చేస్తుంది
అంతే... పెద్ద పెద్ద తుప్పలూ దంపలూ తీగలూ పెరిగి పోయాయనుకోండి వానాకాలంలో మిగిలిన
జంతువులు పడుకుంటాయి, ఏందుకంటే వెళ్ళడానికి త్రోవవుండదు తీగలు అడ్డుగా వస్తాయి.
అప్పుడు అన్ని ఏం చూస్తాయంటే ఏనుగు ముందునడిస్తే బాగుండు అని చూస్తాయి ఏనుగు
నడిస్తే దానిశరీరం చాలు త్రోవచేసేస్తుంది, విజ్ఞములన్నీ తొలగిపోతాయి, అది
వెళ్ళిందనుకోండీ అది వెళ్ళిన త్రోవలో మిగిలినవన్నీ వెళ్ళిపోతాయి అంతే... ఏనుగు
వెళ్ళిపోతే, ఏనుగు నడిస్తే దారివచ్చింది అదేం చేయవలసిన పనిలేదు అదేం చేయ్యక్కర
లేదు ఇంక అది నడిస్తే చాలు ఈయన నడిస్తే చాలు త్రోవవచ్చేస్తుంది. అన్ని ఇబ్బందులు
తొలగిపోతాయి అలా గజ సింహ సింహం నడుస్తున్నట్లు నడుస్తున్నాడే... నడిచారండీ రామ
లక్ష్మణులు ఏమైనా నడిస్తే చూశాడా జనకుడు ఇలా చూసి అక్కడ నిలబడితే మాట్లాడుతున్నాడు
మరి సింహనడకలా ఉంది వీళ్ళనడక అని ఎలా అన్నాడేంటండీ అంటే నడిస్తే నడకకాదు ఆ నడకయందు
ఉండేటటువంటి స్వభావము వారియొక్క ముఖమునందు ప్రకాశిస్తుంది. అది మీరు
పట్టుకోవలసింది అక్కడ అంతేగాని శ్లోకానికి ఉన్నటువంటి అర్థాన్ని యధాతధంగా తీసుకొనీ
ఏనుగులా నడుస్తారు సింహలా నడుస్తారూ ఏమండీ నడవడం చూడలేదు కదాండీ అన్నారనుకోండీ అంటే
నోరు మూయ్ అది కాదు దాని అర్థం. మీరుదాని లోపల ఉన్న అర్థాన్ని పట్టుకోవాలి, మహర్షి
యొక్క హృదయాన్ని పట్టుకోవాలి.
సింహం కూడా నడుస్తుంది, సింహం నడకకున్న అందం ఏమిటో
తెలుసాండీ? సింహానికి ఉన్న అందం “సింహావలోకనమే”, సింహంనడిస్తే మిగిలిన జంతువులు
పారిపోతాయి, సింహం నడుస్తుంటే ఓసారి చూసొద్దామని ఏమీ రావు, కానీ సింహమేం
చేస్తుందంటే ఇంత పౌరుష పరాక్రమములు ఉన్నదాన్నికదా నేను వెళ్తుంటే అన్ని పారిపోతాయి
గదా
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
నా దగ్గరికే
వస్తాయి అని నడవదు పదడుగులు వేస్తుంది, ఆగుతుంది ఓసారి ఆగి మామూలుగా తల తిప్పదు,
ఆగి బాగా తల తిప్పుతుంది ఆగి ఇలా రెండు పక్కలా వెనక్కి తిరిగి చూసి తేరిపారి కళ్ళు
విప్పి చూసీ ఏవి నా వెనకాల వస్తున్నాయని గమనించీ అప్పుడు మళ్ళీ పదడుగులు వేస్తుంది
దీన్ని సింహావలోకనమూ అంటారు. తాను ఎంత పౌరుష పరాక్రమములు ఉన్నదైనా నా వెనక ఏం
ఉంటాయిలే అని వెళ్ళదు, ఆగి వెనక్కి చూసుకుంటుంటుంది. వీళ్ళల్లో మా అంత వాళ్ళు మేం,
మేం నడుస్తున్నదారి ధర్మ మార్గమని కాదు, ఆగి గురువుగారు చెప్పినట్టే మనం
ప్రవర్తిస్తున్నామా అని చూసుకునేటటువంటి లక్షణం వీళ్ళల్లో కనపడుతుంది, ధర్మమునందు
పూనిక
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
కనపడుతుంది, ఆ
నిష్ట కనపడుతూంది, తన పరాక్రమమునందు అతి శయం
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
కాకుండా విమర్ష
చేసుకునేటటువంటి లక్షణం కనబడుతుంది. అత్యుత్యమమైనటువంటి స్వభావం వీళ్ళయందు
కనబడుతుంది. అటువంటివాళ్ళు శార్దూలవృషభోపమౌ ఒక పెద్ద పులి, ఒక ఆంబోతు
ఇవి ఎలా ఉంటాయో అటువంటి పరాక్రమంతో ఉన్నారు. ఏమి పరాక్రమండీ ఇదంతానూ, ఆయన లోపల
హృదయంలో అనుభవించి చెప్తున్నాడు, నేను ఒకటి అందిస్తే మిగిలినవి మీరు పట్టుకోగలరు,
కాబట్టి వీళ్ళని చూస్తుంటే సామాన్యంగా లేరు, దేవలోకం నుంచి వచ్చినటువంటి పిల్లలా
అన్నట్లుగా ఉన్నారు. మహర్షీ వీళ్ళు పాద చారులై మీ వెంట ఎందుకు వస్తున్నారు? ఇదో
ప్రశ్న, అరే! వీళ్ళని చూస్తే అలా రావలసినవారిలా లేరే...? వీళ్ళు రథాల మీద రావలసిన
వాళ్ళు అటువంటి వాళ్ళు పాదచారులై నడిచి వస్తున్నారు. మీ వెంట వస్తున్నారు ఏమి
కారణం మహర్షీ? మీ వెంట పాదచారులై వచ్చారంటే మిమ్మల్ని అనువర్తించి వచ్చినవాళ్ళు,
మిమ్మల్ని అనువర్తించి వచ్చినవాళ్ళు ఇక్కడ వేద మంత్రం చెప్పడానికి
వచ్చినవాళ్ళుకాదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మీరు కాలినడకన తీసుకొచ్చారంటే వీళ్ళని
మీరు ఏదో అనుగ్రహించి ఉండాలి, వీళ్ళని
ఇంకా అనుగ్రహించడానికే తీసుకొచ్చి ఉండాలి? వీళ్ళకిచ్చే అనుగ్రహంలో నాకూ అనుగ్రహం
ఉండి ఉండాలి? రామున్ని శ్రీరామున్ని చేస్తే నన్ను మామను చేస్తావు కదా? ఇదీ లోపలి
హృదయం.
ఇదీ పైకి అందంగా ఆ
పిల్లల్నీ చూడగానే సంతోషం ఇంకోక రకంగా విష్ణు భగవానిని యొక్క స్వరూపాన్ని చూడగానే,
ఆ ఆనందం పట్టలేదు ఇంకా ఆ మంగళ స్వరూపాన్ని చూడగానే చూపుల శ్రీపతి రూపము నాపోవక
త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురా లాపంబుల బొగడె నదితి లక్ష్మీనాథున్ అంటారు
పోతన గారు. చూపులతో తాగేసిందయ్యా అదితి విష్ణు స్వరూపాన్ని అన్నారు. చూపులతో
తాగుతారా నోటితో తాగుతారా? తాగితే నోటితో తాగుతారు మరి చూపులతో తాగడమేమిటి అంటే
నోరు చెయ్యవలసిన పని కన్ను చేసింది. ఎందుకనీ ఆ స్వరూపం అటువంటిది జలధరదేహు
నాజానుచతుర్భాహు సరసీరుహాక్షు విసాలవక్షు జారుగదాశంఖచక్రపద్మవిలాసు
గంఠకౌస్తుభమణికాంతి భాసు గమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచినత విహారు నురుకుండల
ప్రభాయుత కుంతలలలాటు వైదూర్యమణిగణ వరకిరీటు అనీ అటువంటి పిల్లాన్ని చూడగానే
వసుదేవుడంతటి వాడు పొంగిపోయాడు, వాలు రుచిచాలు సర్వలోకపాలు జూచి తిలకించి
పులకించిచోద్య మంది, యుబ్భి చెలరేగి వసుదేవు డుత్సహించె అన్నారు పోతనగారు. పొంగిపోయాడు
వసుదేవుడు, ఆ పొంగు భక్తుల హృదయాలలో ఉంటుంది. అది తెలియక్కర లేదు విష్ణువా అన్నది
తెలియక్కర లేదు. కానీ ఆ స్వరూపాన్ని చూడగానే ఆ ఆనందం ఉంటుంది అంతే...? దేని
స్వభావం దాందీ.. వడుగా యెవ్వరివాడ? వెవ్వడవు? సంవాసస్థలంబెయ్య? ది య్యెడకున్ నీ
వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం, గడు ధన్యాత్ముడనైతి, నీ మఖము
యోగ్యంబయ్యె, నా కోరికల్ గడతేఱెన్, సుహుతంబులయ్యె శిఖులుం, గల్యాణ మిక్కాలమున్ అంటాడు
బలి చక్రవర్తి. ఏమి సంతోషమయ్యా! వడుగా... ఎక్కడ నుంచి వచ్చావ్? నీ దర్శనంతో
ధన్యాత్మున్ని అయ్యాను అన్నాడు జనకుడు అదే అంటాడు. నీ దర్శనం చేత నా యజ్ఞం దేవతల
చేత అనుగ్రహింపబడింది నీ దర్శనమే యజ్ఞానికి పరిసమాప్తి అన్నాడు. అంటే ఎంత అందమైన
భాష వాడుతారో చూడండీ నిజంగా పెద్దల దగ్గర, కాబట్టి ఇప్పుడు ఆ రామ లక్ష్మణులని
చూడగానే, అంత ఆనంద పడిపోయాడు. సూర్య, చంద్రులు ఇద్దరు నడిచొచ్చినట్లుంది
పిల్లలిద్దరూ ఒకరికొకరు పోటీపడిపోతున్నారు. అందంలో పరాక్రమంలో ఇద్దరూ అశ్వినీ
దేవతలా అనిపిస్తోంది ఇంత వర్ణణ చేసేసి, వీళ్ళిద్దరు ఎవరూ అని ఇప్పుడు అడిగాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
అడిగితే
విశ్వామిత్రుడు అన్నాడూ అంత తేలిగ్గా బయటపడుతాడా...! మాట కదాండీ బయటపడిపోవడానికైనా,
లేకితనానికైనా పరాకాష్ట. ఒక్కసారి నీ పిల్లల్ని వెళ్ళి నాతో పంపించవయ్యా అంటే నాతో
ప్రతిజ్ఞచేసి ఎన్ని మాటలన్నాడూ? నేను పంపించలేనని నావల్ల కుదరదూ అని ఇన్ని అన్న
తరువాత కదా...! ఆఖరుకి విసుగెత్తి, మాట తప్పిన వాడా ʻదీర్ఘ కాలపు సబంధువులతో
జీవించెదవు గాక నీవుʼ అనవలసి వచ్చింది.
అంత తొందరగా బయటపడిపోతాడా పిల్లల్ని పెళ్లికే తీసుకొచ్చాను అని అంటాడా...!
నీకెందుకండీ అది మా నాన్నగారి పని అంటే రాముడు. కొట్టవయ్యా తాటకని అంటనే పితుర్వచన
నిర్దేశాత్పితుర్యచనగౌరవాత్ ! వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశఙ్కయా !! అన్నాడు.
అలాంటిది మా నాన్నగారు చూడాలి సంబంధం మీ కెందుకండీ! ఆ విషయాలన్నీ అంటే
ఏమైపోతాడు విశ్వామిత్రుడు, అందుకని అలా ఏమీ అనడు లేకిమాట. చాలా గుంబనంగా ఉంటాడు
అందుకని ఆయన అన్నాడూ, అబ్బే.... ఏం లేదు సిద్ధాశ్రమంలో యజ్ఞం చేశాను, రాక్షసులు
కొంచెం విజ్ఞం కల్పించారు, ఈ పిల్లలిద్దర్నీ తీసుకెళ్ళి విజ్ఞాల్ని తొలగించుకొని
యజ్ఞం పూర్తిచేశాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటావా ధనస్సు చూడాలనిపిస్తూంది
పిల్లలకి ఓసారి శివధనుస్సు చూపిద్దామని తీసుకొచ్చా! అంతే అంతకన్నా ఏం కారణం లేదు
అని, ఇంకొక్క మాట అన్నాడు.
అక్కడ
సిద్ధాశ్రమంలో పని పూర్తిచేసుకొని గంగానదినిదాటి అహల్యా, గౌతముల యొక్క ఆశ్రమం
మీదుగా మేము ఇటువచ్చాము ఈ పిల్లవాడి ప్రవేశంచేత అహల్యకి శాపం పోయిందీ అన్నాడు.
ఇప్పుడు వెంట వచ్చిన పిల్లాడు ఎంత పొంగి పోవాలండీ! శతానందుడు. అమ్మా మా అమ్మకి
శాపవిమోచనం అయింది మా అమ్మ కనపడిందీ అని. ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండీ!
పుత్రుడి యొక్క స్థితీ, మా అమ్మ అంత తప్పు చేసిందీ, అంత తప్పుచేసి తపస్సు చేసిందీ,
ఈ విషయం రాముడికి తెలిసిపోయిందన్నమాటా, లక్ష్మణునికీ తెలిసిపోయిందన్నమాటా,
విశ్వామిత్రుడు ఏం చెప్పాడో? మా అమ్మ గురించీ అని వక్రమైన ఆలోచన చేసినవాడైతే...!
అలాంటి శంకుచితమైన భావనతో శతానందుడు మాట్లాడితే ఇంకసలు అనిందతహా అన్న మాటకు
అర్థమే లేదు. అటువంటి ఆలోచనలు శతానందాదులకేం ఉండవు? ఆయనా పొంగిపోయింది
ఎక్కడంటే...? మా అమ్మకు శాప విమోచనం అయింది, మా అమ్మ మహాతల్లి. ఈ భావనండీ ఒక
పుత్రుడికి
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
తల్లిపట్ల ఉండవలసిన
భావన అది. ఇదికదా చంద్రశేఖర భారతీ అంటారు నీ తల్లి తండ్రుల యందు లోపాలను
చూసేటటువంటి స్థితి నీకు ఉండరాదు. నీకు ఆ అధికారం లేదు మా అమ్మ ఆ తప్పు చేయకుండా
ఉండాల్సిందీ, ఎంత ఇబ్బంది పడిందో చూశారా? అని అనలేదు శతానందుడు, ఏమన్నాడో
తెలుసాండీ? హృష్టరోమా మహాతేజాశ్శతానన్దో మహాతపాః ఆనంద పడిపోయాడట.
అబ్బా..హ్! మా అమ్మకి శాపవిమోచనం అయిందని గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా
ద్యోతితప్రభః ! రామసన్దనాదేవ పరం విస్మయమాగతః !! రామ సందర్శనంచేతా అహల్యా
శాపవిమోచనం గురించి విన్నటువంటి గౌతముడు, ఆమె యొక్క జేష్ఠ కుమారుడు, విశేషమైన
ఆనందాన్నిపొంది ఒకమాట అన్నాడు అపి రామాయ కథితం యథావృత్తం పురాతనమ్ ! మమ
మాతుర్మహాతేజో దైవేన దురనుష్టితమ్ !! మా అమ్మా గొప్ప తేజశ్వని మహాతల్లి. ఇది
ఆయన తల్లిని గురించిన మాట్లాడిన మాట ఎంతటి మహా తల్లి మా అమ్మ, సమస్త భూతములచేత
గౌరవింపబడవలసినటువంటిది మా అమ్మ గురించి యదార్థమైన విషయాన్ని విశ్వామిత్రుడు
చెప్పి ఉంటాడు.
అక్కడ ఉన్నటువంటి
విషయాన్ని మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది విశ్వామిత్రుడు యదార్థమైన విషయాన్ని
చెప్పి ఉంటాడు అన్న దాంట్లో ఉన్న మర్మమేమిటో తెలుసాండీ! అహల్యా కేవలం
వ్యభిచారానికి సిద్ధపడిపోయి ఉన్న మనిషికాదు. గౌతముని యొక్క తపస్సు పెరిగిపోతే,
దేవతలకి ఇంద్రునికి ఇబ్బంది వస్తుందని, గౌతమ మహర్షిని తపస్సుని ఏవిధంగా పాడుచేయాలంటే,
ʻఆయనని కామానికన్నా వశం
చేయాలి, క్రోధానికైనా వశం చేయాలి,ʼ ఆయన్ని కామానికి వశున్ని చేయడానికి సాధ్యంకాదు. ఆయన్ని
క్రోధానికి వశున్ని చేయడమూ సాధ్యంకాదు. ఆయనేం అంత అమాయకుడు కాదు. అనేం అంత తపస్సు
భగ్నం చేసుకొనేవాడుకాదు. వినామార్గం లేని స్థితిని కల్పించాలి, దానికి యదార్థానికి
చతుర్ముఖ బ్రహ్మగారు అహల్యా హృదయం తెలుసుకోకుండా చేసిన కన్యాదానాన్ని ఇంద్రుడు
ఆయుధంగా తీసుకున్నాడు నాయందు మక్కువుంది ఎందుకనీ అంటే బ్రహ్మగారు అహల్యని
ఇచ్చినప్పుడు ఒకమాట అన్నాడు, నేను గౌతమునికి ఇచ్చేస్తాను అనలేదు మీరు
చాలాజాగ్రత్తగా మహర్షి చరిత్ర చదివితే నేను అహల్యని గౌతమునికి ఇచ్చేస్తున్నాను అని
అనలేదు ఎవరు భూ ప్రదక్షణంచేసి ముందుగా వస్తారో వాళ్ళకి ఇస్తాను అన్నాడు.
అహల్య కోసం దేవేంద్రాదులు ఉన్నారు సభలో... వాళ్ళందరూ ఆ మాట
వినగానే... అందరూ తమ తమ వాహనాలెక్కి భూ ప్రదక్షణానికి వెళ్ళిపోయారు. గౌతముడు
ఒక్కడు ఏం చేశాడంటే, పిల్లమీద వ్యామోహం ఉంటే పిల్లని తీసుకొచ్చి
అప్పజెప్పక్కరలేదు. అక్కడే పుస్తికట్టి తీసుకొచ్చేయ్యొచ్చి నేను
పెళ్ళిచేసుకున్నానని. ఆయనేం చేశాడంటే లోకానికి ధర్మాన్ని నేర్పాలి, బ్రహ్మగారి
ఎదురుగుండా ఓ ఆవు ఉంది. ఆ ఆవు చుట్టు ప్రదక్షణంచేసి వచ్చి భూ ప్రదక్షణం పూర్తైంది
అన్నాడు. ఆవు చుట్టూ భూ ప్రదక్షణంచేస్తే ఎవరొస్తారండీ ముందు, గౌతముడు వస్తాడు.
తరువాత వాళ్ళందరు వచ్చారు వచ్చిన తరువాత బ్రహ్మగారు వెంటనే ఏం చెప్పేయరుగా...
అయ్యా అయిపోయింది భూ ప్రదక్షణం, నేను ముందొచ్చాను, నే ముందొచ్చాను, నేను
వెనకొచ్చాను... నేను సెకండ్, నేను థర్డ్, నేను ఫోర్త అని వచ్చి నిల్చున్నారు,
బ్రహ్మగారు అన్నారు మొదట గౌతముడు వచ్చాడు అన్నారు. అది ఎలా గోవుకు ప్రదక్షణం
చేశాడయ్యా! భూమికి ప్రదక్షణం చేసినట్లే...? గౌతముడు శాస్త్రము యొక్క ప్రమాణాన్ని
నిలబెట్టడం కోసం చేశాడు వ్యామోహంకోసం చేయలేదు. కానీ
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఇంద్రుడికి
అహల్యయందు వ్యామోహం ఉందీ, అహల్యకి ఇంద్రునియందు వ్యామోహం కోరిక ఉంది తను అన్న
ప్రమాణాన్ని నిలబెట్టినవాడు తపస్వీగాబట్టి గౌతమునికిచ్చి వివాహం చేశాడు.
ఇది పట్టుకున్నాడు ఇంద్రుడు, పట్టుకుని ఇప్పుడు గౌతమున్ని
పాడుచేయడానికి వచ్చాడు. అహల్యని మధ్యలో ఉపకరణంగా వాడారు, కాని అసలు ప్రయోజనం
ఏమిటంటే? గౌతముని తపస్సు పాడుచేయడం. అందుకే దేవతలకి వెళ్ళి చెప్పాడు నేను
పాడుచేశానయ్యా గౌతముడి తపస్సు, అలా చేస్తే తప్ప కోపం రాదు కాబట్టి కోపం వచ్చింది.
కోపమొచ్చిందనడానికి కూడా లేదండీ? క్రోధంతో శపించినవాడైతే, లక్ష సంవత్సరములు శిలవై
పోదువుగాక అనాలి, అలా అనలేదు తప్పుదిద్దాడు. పశ్చాత్తాపం వచ్చే మార్గం చూశాడు,
మనసు మీద ప్రభావం చూపించాడు గౌతముడు. ఏ పుంస్తవం ఉందో దానివల్ల కదా తప్పు చేశావు పేతతుర్వృషణై
భూమౌ సహస్రాక్షస్య తత్క్షణాత్ నీ వృషణములు పడిపోతాయని ఆయనని అన్నాడూ, నీవు రజో
గుణ, తమో గుణ మనసుకి అంటివుండడంచేత ఈ దోషం చేశావు, అవి పోవాలంటే వాయుభక్షా నిరాహారా తప్యన్తీ
భస్మశాయినీ అని ఆవిడ్ని
అన్నాడు. నీవు ఆహారం తీసుకోకుండా తపస్సుచేయి, నీ మనసు పరిశుద్ధమౌతుంది
పరిశుద్ధమైందని గుర్తు రాముడు వస్తాడు, రాముడు వచ్చిననాడు మళ్లీ నీవు యథారూపాన్ని
పొందుతావు, పొందిననాడు నేను వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తాను అని అన్నాడు. కానీ ఈ
పాటిమాట అన్నందుకు ఆయన తపస్సుకు పోయాడు కాబట్టి యదార్థ హృదయమే చెప్పి ఉంటాడు
విశ్వామిత్రుడు, ఇది చెప్పాడా లేదా విశ్వామిత్రుడు నిన్నటి కథలో... చెప్పాడు.
అంతేకానీ అవకాశం దొరికిందికదా గౌతమ మహర్షి భార్య ఇలా
తప్పుచేసింది కదాని దాన్ని చిలువలు పలువలుచేసి చెప్పడం దేనికి అలా చెప్పబడే
నీచుడేం కాదు విశ్వామిత్రుడు ఉదారుడు మహానుభావుడు ఆయన ఎందుకు మాట్లాడుతాడు అలాగా!
ఆయనేం మాట్లాడడు అలాగ, ఇయ్యన ఇలా మాట్లాడుతాడేమోనని శతానందుడు అనుకోడు. కాబట్టి మా
అమ్మ విషయాన్ని మీకు యదార్థంగా చెప్పివుంటాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అపి
కౌశిక భద్రం తే గురుణా మమ సఙ్గతా ! మమ మాతా మునిశ్రేష్ఠ రామసన్దర్శనాదితః !! ఇప్పుడు
మా అమ్మ సమస్త భూతములచేత గౌరవింపబడినదై, అపారమైన తేజోమూర్తియై నా తండ్రితో కలిసి
ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది అనీ తన తల్లి శాప విమోచనానికి కారణం రామ చంద్ర
మూర్తి అని తెలుసుకోగానే... స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ!
విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితమ్ !! ఈ విశ్వామిత్ర మహర్షితో కలిసి
వచ్చినటువంటి ఓ రామా! నీకు స్వాగతం. ఎందుకు తను ఇప్పుడు స్వాగతం చెప్పాలి, తనకి
ఉపకారం జరిగింది తనతల్లి శరీరురాలు అయ్యింది తపస్సులోంచి బయటికి వచ్చిందనీ ఈ
విశ్వామిత్రుడు మహానుభావుడు అత్యద్భుతమైన వ్యక్తి ఈయ్యన ఇవ్వాళ ఈ స్థితిని
చేరుకున్నాడూ అంటే...? బ్రహ్మర్షిత్వాన్ని పొందాడూ అంటే... ఇంతగొప్ప స్థితిని
పొందాడూ అంటే... అకస్మాత్తుగా వచ్చినది కాదు. ఈయన ఎంత కష్టపడ్డాడో ఎన్నిటికి
ఎదురీదాడో ఎన్నిసార్లు కామం క్రోధం క్రోధం కామం కామం క్రోధం ఎన్నిమాట్లో వశులైపోయి
భంగపాటుచెంది తపస్సు పోగొట్టుకొని చివరికి బ్రహ్మర్షిత్వాన్ని ఎలా పొందాడో...?
నీకు చెప్తాను నాయనా విను.
అని ఎందుకు చెప్పాలి ఇప్పుడు విశ్వామిత్ర చరిత్రా, అంటే
మీరు చూడండీ లోకంలో ఒక పోకడ ఉంటుంది, నాకు మా గోపాల కృష్ణగారు అంటే చాలాప్రీతి
అనుకోండీ, నేను చాలాప్రీతి అయితే ఏం చేస్తాను, ఏదో గోపాల కృష్ణగారు నాకూ
కావలసినటువంటి ఉపకారం ఒకటి చేశారు అనగానే గోపాల కృష్ణగారి గురించి తెలియదూ... ఆయన
ఎటువంటివారో తెలుసాండీ! మహానుభావుడు ఇంతకు పూర్వం ఏమైందంటే అని ఆయన చరిత్ర
చెప్పేస్తాను మీకు. ఎందుకు చెప్పాస్తాను అంటే... సంతోషమన్నమాట నా సంతోషంతోటి ఆయన
గురించి మాట్లాడుతాను, నా సంతోషం పట్టకపోతే... అవతలివారియందు గౌరవాన్ని
ఆవిష్కరించడానికి వారియొక్క గౌరవం ఈ స్థితికి ఎలా వచ్చారో...? ఉన్నది ఉన్నట్లు
మాట్లాడు ఇవ్వాళ ఈ స్థితినిపొందారు అంటాం. ఆ చరిత్ర కీర్తనం ఎక్కడికి
తీసుకొచ్చారంటే... శ్రీరామాయణంలో బాల కాండలో విశ్వామిత్ర మహర్షి లోకానికి రామున్ని
అప్పజెప్పేయడానికి ముందు శతానందునిచేత కీర్తింపజేశాడు. అంటే విశ్వామిత్ర మహర్షి
చరిత్రా, విశ్వామిత్రుడు చెప్పలేదు ఇప్పటిదాకా...! సోత్కర్ష అవుతుంది ఎలా
చెప్తారండీ! ఆయన చెప్పింది తనవంశంలో పెద్దల గురించి చెప్పారు, గాధి గురించి
చెప్పాడు, తను ఎలా కౌశికుడైనానని చెప్పాడు తప్పా, తనెంత గొప్పవాడయ్యాడో ఎలా
అయ్యాడో ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు శతానందుడు మాట్లాడుతున్నాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఆయన అన్నాడూ రాజాభూదేష
ధర్మాత్మా దీర్ఘకాలమరిన్దమః ! ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః !! ఈయనా
ఈ విశ్వామిత్రుడు చాలాకాలం రాజుగా ఈ భూమండలాన్ని పరిపాలించాడు, ధర్మహితంగా
ప్రజారంజకంగా... ఎన్నో సంవత్సరములపాటు రాజ్యాన్నంతటిని పరిపాలించి, ఒకానొక సమయంలో
అక్షౌహినీ సైన్యంతో భూమండలమంతా తిరిగి రాజ్యానికి వస్తూ వశిష్ట మహర్షి యొక్క
ఆశ్రమానికి వెళ్ళారు, వెళ్ళి వశిష్ట మహర్షి సాదరంగా స్వాగతం చెప్పారు ఇరువురూ
కూర్చున్నారు, ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు కుశల ప్రశ్నలు అయిపోవడానికి
ముందే... వశిష్ట మహర్షి అతిథి సత్కారం చేశారు ఇది బాగాజ్ఞాపకం పెట్టుకోవాలి
రామాయణంలో. శ్రీరామాయణంలో “అథితిని గౌరవించడం” “కృతజ్ఞత” ఈ రెండు మాటలూ ఎక్కడెక్కడ
కనపడ్డాయో వాళ్ళు ఉదార్థులూ అని గుర్తు. కృతజ్ఞతా అన్నమాటగురించి, “ఆతిథ్యము” అన్న
మాటగురించి శ్రీరామాయణంలో అనేకచోట్ల ప్రస్తావనవస్తుంది, ఎన్నిచోట్లో వస్తుంది. ఇది
ఎక్కడెక్కడ హృదయము విశాలమై
ఉంటుందో...? సంస్కారవంతమై ఉంటుందో, అక్కడక ఈ అథితి పూజ గురించి, సత్కారం గురించి
మాట్లాడుతుంటారు. కాబట్టి వశిష్టుడు విశ్వామిత్రునకు పాద్యము, ఆర్ఘ్యము
ఇచ్చి ఆసనము ఇచ్చి గౌరవంచాడు ఇతః పూర్వమే ఆయన కాసేపు మాట్లాడిన తరువాత నేను
బయలుదేరివెళ్ళిపోతాను నా సైన్యం ఎదురు చూస్తుంది అని అన్నాడు. సైన్యాన్ని
ఆశ్రమంలోకి తీసుకురారు బయట విడిదిచేస్తారు. నేను బయలుదేరుతాను అన్నాడు అంటే ఆయన
అన్నాడు వశిష్టుడు అతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాస్య మహాబల ! తవ చైవాప్రమేయస్య
యథాఽర్హం సమ్ప్రతీచ్ఛ మే !! ఇంత దూరం వచ్చారు నా
ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి, నేను ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి
అంటే విశ్వామిత్రుడు అన్నాడు
ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః ! కృతఽమిత్యబ్రవీద్రాజా
ప్రియవాక్యేన మే త్వయా !!
ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాఽఽశ్రమే !
పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ !!
సర్వథా చ
మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః ! గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా !!
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
నువ్వు నాకు
పాద్యమిచ్చావు, ఆర్ఘ్యమిచ్చావు, ఆసనమిచ్చావు, ఫలమూలాదులను ఇచ్చావు, ఇంత గౌరవించావు
ప్రేమతో మాట్లాడావు ఇంత ఇంతకన్నా ఆతిథ్యమేమిటీ, నేను బయలుదేరి వెళ్ళిపోతాను నీవు
నన్ను ఎప్పుడూ ఇలానే ప్రమతో చూస్తూ ఉండూ చాలు నాకు అంత కన్నా ఏమీ అక్కర లేదు, నేను
బయలు దేరుతానన్నాడు విశ్వామిత్రుడు. ఎప్పుడూ ఇలాగే ఉంటే మనసు ఇంకోలా ఉంటుంది ఏదో
దేవకీ వసుదేవులని రథమెక్కించినప్పుడు ఓలాగా, అశరీరవాణి పలికినప్పుడు ఓలాగా
ఉన్నట్టుండకూడదు కదా... విశ్వామిత్రునితో సమస్య ఎక్కడ వస్తుందంటే...? ఆయన మనసులోకి
ఇంకో కోరిక రానంత వరకూ బాగానేవుంటుంది. అంటే ఇంకా మనసు సంస్కారమును పొందలేదు బాగా,
కాబట్టి ఇక్కడి వరకూ చాలా బాగానే మాట్లాడాడాయన, ʻరాముడితో చెప్పేది ఇప్పటి
విశ్వామిత్ర గురించికాదు ప్రారంభంలోని విశ్వామిత్రుడు.ʼ పదే పదే పట్టుపట్టాడు వశిష్టుడు
కాదు కాదు మీరు ఇక్కడ నుండి ఏదైనా ప్రసాదము తీసుకొని వెళ్ళవలసిందే అని ఆతిథ్యము
స్వీకరించడని ఎందుకలా పట్టుపట్టాలి? అలా పట్టుపట్టకపోతే గొడవ వదిలి పోతుందిగదాండీ!
వెళ్ళిపోతాడుగదా ఆయన అంటే ఎవరి ధర్మం వాళ్ళది. భోజనం సమయానికి ఒక అథితి
వచ్చారనుకోండి, మీరు భోజనం చేసేస్తున్నారు అప్పటికే, అతిథి వచ్చారు కనీస మర్యాద
ఏమిటంటే మీ అబ్బాయినిపిలిచి ఆయనకు ఓ పండు ఇవ్వరా కాసేపు తింటూవుండమను వస్తాను
అంటారు. అంతేకాని నేను భోజనం చేస్తుంటే వచ్చారనితిట్టకూడదు. మీరు భోజనంచేసే
సమయంలోవస్తే రండీ మీరూ ఫలాహారం చేయండి మాతో అనాలి, రండి భోజనం చేయండి అనాలి, ఈశ్వరుడు ఇంకోలా రాడు అలాగే
వస్తాడు. నీవు ఎలావస్తే పెట్టవో అలా వస్తాడు. ఎందుకో తెలుసా నీ ప్రజ్ఞా, నీ
సంస్కారం చూడడానికి వస్తాడు, శంకరభగవత్ పాదులంతటివానికి తప్పలేదు నన్ను
తప్పుకోమంటావా నాలోని ఆత్మని తప్పుకోమంటావా అంటే మనీషా పంచకం చేయవలసి వచ్చింది.
కాబట్టీ ఇలా వెడితే పెట్టడూ, పెట్టే అవకాశం ఉండదూ అని ఎలా
ఉంటుందో అలా వస్తాడు, పెడతాడా పెట్టడా చూస్తాడు, నీవు ఆయనయందు ఈశ్వరున్నిచూసీ,
కలిసి తిన్నావనుకో, లేదా ఆయనకి పెట్టడానికి ఉద్యుక్తుడవయ్యావనుకో చాలు ఆయన
సంప్రీతి చెందుతాడు ఇది ధర్మం. వేళ తప్పి పోతుంది, సైన్యం ఆకలితో ఉంది సరే వెళ్ళిరండి
అని ఓ మాట వెళ్ళిరండి అని ఓ మాట అన్నారనుకోండీ వశిష్టుడు తినచ్చు అన్నం, మరి
వాళ్ళో సైన్యం అన్నవాళ్ళు కాయకష్టం చేసేవాళ్ళండీ వాళ్ళు, వాళ్ళకు వేలపట్టున భోజనం
దొరికితేనే తృప్తి చెందుతారండీ! అందుకని ఆయన అన్నారు పదిమాట్లు పట్టుపట్టాడు ధర్మం
కోసం. మీరు బాగాగుర్తుపెట్టుకోవాలి, రామాయణం “వేదోప బృహ్మణము” ధర్మాన్ని
పట్టుకుంటుంది అందుకే శతానందుడు మాట్లాడినా అలానే ఉంటుంది ఋషులు ఎవరు మాట్లాడినా
అలానే ఉంటుంది.
కాబట్టి తిని
వెళ్ళండి, తిని వెళ్ళండి, తిని వెళ్ళండని పట్టుపట్టాడు ఆయన అన్నాడు చూసి చూసీ సరే
అలాగే పెట్టండి అన్నారు. ఏం ఒక్కరా ఇద్దరా అక్షౌహిణీ సైన్యం దానికంతటికీ పెట్టాలి,
పెట్టండన్నాను కదా ఇప్పుడు విశ్వామిత్రుడి దృష్టికోణం ఏలా ఉంటుంది, ఇప్పుడు
వంటవాళ్ళని ఎవరినో పిలుస్తారు వండడర్రా అంటాడు పోనిలేండి చాలా వేళైపోయింది కదా అని
పప్పు పుసుసో ఏదో పెట్టండి ఏదో ఊరగాయ వేసుకొని తినేస్తారు అని అంటారనుకుంటాడు.
ఇయ్యనేం చేశాడు అలా అనలేదు అనకుండా తనదగ్గర ఉన్న “శబళ” కామధేనువు యొక్క బిడ్డ,
దాన్ని పిలిచాడు. పిలిచి ఆ కామధేవుతో ఒకమాట అన్నాడు నీవు వెంటేనే వీళ్ళందరికీ
కావలసినటువంటి పదార్థలన్నిటినీ సృజించు, వండడం కాదు సృజించు, ఈయన మాటవిని ఆవిడ
సంకల్పం చేస్తుంది అంటే కామ దేనువు, కల్పవృక్షం ఈ రెండూ అటువంటివే... అది పువ్వుల
రూపంలో పండ్ల రూపంలో ఇస్తుంది. ఈమె ఒక్కసారి ఆయన కోరగానే అలా జరగాలని అనుకొంది
అంతే...? ఆయన మర్యాద ఏం చేస్తే నిలబడుతుందో? అలా జరగాలి అంతే వచ్చేసాయి ఆ
పదార్థాలు అక్కడికి, వచ్చి కూర్చుంటాయి అంతే. కాబట్టి ఇప్పుడు కామధేవుని ఈ మాట
అడగగానే వచ్చేశాయి అంతే ఇంకా ఆయన ఏం వెళ్ళి పిలవలేదు భోజనానికి, ఏం వచ్చేశాయ్?
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఇక్షూన్మధూం స్తథా
లాజాన్మైరేయాంశ్చ వరాసనాన్ ! పానాని చ మహాఽర్హాణి
భక్ష్యాంశ్చోచ్చావచాం స్తథా !!
ఉష్ణోఢ్యస్యోదనస్యాద్ర రాశయః పర్వతోపమాః ! మృష్టాఽన్నాని చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ
చ !!
నానాస్వాదురసానాం చ
షాడబానాం తథైవ చ ! భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః !!
కొన్ని కొన్ని మీరు దాచలేరు, పనసపండ్లు తొనలు ఇంట్లో పెట్టీ
మీరు దాచడం కుదరదది దానివాసన వచ్చేస్తుంది. మల్లెపూల దండ ఇంట్లో పెట్టీ దాచడం
కుదరదు దానివాసన చెప్పేస్తుంది. అలాగే ఇంకా వండుతున్నారో వండట్లేదో అని అనుమానం
రావడానికి కాశీ కండంలో వ్యాసుడుకాదు ఆతిథ్యానికి వచ్చింది, వెంటనే కామ దేనువు
సృజిస్తే వేడి అన్నపు రాశులు పర్వతాల్లా వచ్చేశాయి. తాగేవి, నాకేవి, తినేవి,
కొరికేవి భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములు అన్నీ కూడా అక్కడ సిద్దమైపోయాయి. వీటితో
పాటుగా అనేకములైనటువంటివి కూరలు, పాయసాలు, చెరుకు గడలు, తేనెలు, మధుర పానీయాలు,
ఫేలాలు నంచుకునేవి ఇన్ని పదార్థాలు సిద్ధమైపోయాయి.
ఇప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడా పోడా! ఇప్పటివరకు ఎదో
పెడతాడు అనుకున్నాడు, ఇప్పుడు సైన్యం అంతా వచ్చి తింటుంది ఎలా తింటుంది అసలు ఆకలి
మీద ఉంది, ఉత్తర క్షణంలో పెట్టాడు ఎలా పెట్టాడు? కామధేనువు పెట్టడం అంటే... మీకు ఏ కోరిక ఉందో ఆకోరిక
పెడుతుంది. మీకు కాకరకాయ వేపుడు తినాలని ఎప్పటినుంచో ఉందనుకోండీ? మీ
విస్తట్లో అది ఉంటుంది ఒక ఉదాహరణలో చెప్పాలంటే, వంకాయ కూరే ఉందండనదు కామధేనువు, మీ
మనసులో కోరికను బట్టి మీకు పెడుతుంది వచ్చిన అతిథి తృప్తి పడాలని వశిష్టుడి సంకల్పం
కాబట్టి ఇప్పుడు విస్తర ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో తను ఏం తిందామనుకొంటున్నాడో అవి
కనబడుతాయి. ఎలా కనబడుతాయి సంవృద్ధిగా కనబడుతాయి. తిన్నవాడు ఏమంటాడు ప్రతివాడునూ
అబ్బబ్బా..హ్, ఏమీ భోజనమండీ...!, ఏమి భోజనమండీ, ఎలా పెట్టాడండీ....? మహానుభావుడు అంటారు. ఏమి కామధేనువండీ! ఆ దూడ ఇన్ని
సృజించేసిందటా...! ఈ మాటలనగానే ఇంక మోహమాటానికేం పోలేదు. ఎవరు? విశ్వామిత్రుడి
మనసులో ఒక కోరిక కలిగింది. ఇది మనకుండవలసింది మనం లోకమంతా తిరిగొస్తున్నాం, భూ
మండలమంతా, దీని కోసం అసలైనది వదిలేశాం, ఇక్కడ దొరికింది దీన్ని
పట్టుకెళ్ళాలనుకున్నాడు.
వెంటనే ఒక లిస్టు ఒకటి చదవడం మొదలు పెట్టాడు గవాం
శతసహస్రేణ దీయతాం శబలా మమ ! రత్నం హి భగవన్నేతద్రత్నహారీ చ ప్రార్థివః !!
తస్మాన్నే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ ! ఇందులో అర్థించడమూ ఉంది, హెచ్చరికా
ఉంది. రెండిటినీ కలిపాడు అంటే మనసుయందు పుట్టిన వ్యగ్రత గవాం శతసహస్రేణ లక్ష
గోవులు ఇస్తాను నీకు, నాకు ఆ ఆవుని ఇచ్చేసేయ్. నీవు ఇవ్వనంటామేమో, రాజుకు సహజంగా
లోకంలో ఉన్నటువంటి రత్నాలు రాజు సొమ్ము, రత్నం అంటే విలువైనది. విలువైనవి అన్నీ
రాజువి, ఆవు విలువైనది కాబట్టి అది రాజు సొత్తు. కాబట్టి నిన్ను అడిగి
తీసుకెళ్ళక్కర లేదు ఒక
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
మర్యాదకు
అడుగుతున్నాను లక్ష గోవులు ఇస్తానని ఇస్తే ఇవ్వు ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతాను, నీవు
అడ్డుకోవడానికి ఉండదు ఎందుకంటే నేను రాజును, నాదైనది నీ దగ్గర ఉన్నది తప్పా నీ
దగ్గర ఉన్నది నేను తీసుకెళ్ళలేదని గుర్తు పెట్టుకో. అంటే ధర్మాన్ని తిరగేశాడు,
చూశారా ఎలా ఉంటుందో? ఇందువల్ల వశిష్టుడు జోక్యంచేసుకొని కామధేనువుని, సైన్యాన్ని
సృజించమన్నాడు ధర్మము అక్కడ లేకపోతే వశిష్టుడు సృజించడు. కాబట్టి రత్నం హి
భగవన్నేతద్రత్నహారీ చ ప్రార్థివః ! తస్మాన్నే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ !! ధర్మంగా
నాకు చెందుతుంది ఈ శబల కాబట్టి నాకు ఇచ్చేసై ఈ ఆవుని. ఇచ్చేస్తే లక్ష గోవులు
ఇస్తా, ఇవ్వకోపోతే తీసుకెళ్ళిపోతా...! హెచ్చరిక కూడా ఉంది అంటే ఆయన అన్నాడు వశిష్ట
మహర్షీ అస్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ ! ఆయత్తమగ్నిహోత్రం
బలిర్హోమస్తథైవ చ !! స్వాహాకారవషట్కారౌ విద్యాశ్య వివిధా స్తథా ! ఆయత్తమత్ర
రాజర్షే సర్వమేతన్న సంశయః !! స్వాహాకారవషట్కారములు అంటే నేను ఇక్కడ
చేయ్యవలసినటువంటి హోమములు, యజ్ఞములు, యాగములు, పూజా, కత్రువు, నా ప్రాణయాత్ర కూడా
దీని మీదే ఆధారపడి ఉంది. ఇది ఒకటీ నేను ఒకటి అని అనుకోవట్లేదు, నేనే నాకీర్తి
ఎటువంటివో, నేనూ ఈ ధేనువూ అటుంవంటివి, కాబట్టి నీవు లక్ష గోవులు కాదు కోటి గోవులు
ఇచ్చినా నేను ఇవ్వను అన్నాడు. ఆయన చెప్పింది ధర్మం చెప్పాడు, తనకీ దానికి ఉన్న
అనుబంధం అది ఇవ్వబడేది కాదూ, నేను నా కీర్తిని ఇచ్చేయ్యడం కుదురుతుందా? అంటే
కుదరదుగా... అలాగే నేను ధేనువుని ఇచ్చేయడం కుదరదు ఎందుకంటే నా ప్రాణ యాత్ర దీని
మీద ఆధారపడి ఉంది. దీన్ని ఇచ్చేయ్యగానే నా ప్రాణయాత్ర ఆగిపోతుంది.
ఇప్పుడు ఆమాట
అనగానే బ్రహ్మర్షి మరణానికి తానుకారణమైనవాడు తానైతే ఏం చేయ్యాలి, వెళ్ళిపోవాలి
నమస్కారం చేసి, పోల్లేండయ్యా మీ దగ్గర ఉంటే లెక్కా, మీరు మా రాజ్యంలో ఉన్నారు, మా
రాజ క్షేమాన్ని కాంక్షిస్తారు, ఆ ప్రేమతో చూడండి చాలని వెళ్ళిపోతారు. లేక పోతే
ఇంకోలా ఉండి ఉండిండేది కథా. అలా అనలేక పోయాడు, ఆయన అన్నారూ 14 వేల ఏనుగులు, బంగారు
గొలుసులతో బంగారు అంకుశాలతో ఇస్తాను, 8 వందల బంగారు రథాలు ఇస్తాను, 11 వేల అశ్వాలు
ఇస్తాను, కోటి గుర్రాలు ఇస్తాను, ఎన్ని కావాలో చెప్పు రత్నాలు ఇస్తాను, ఎంత కావాలో
చెప్పి బంగారం ఇస్తాను, ఎంత కావాలో చెప్పు వెండి ఇస్తాను. తప్పా గొవుని మాత్రం
ఇవ్వనని చెప్పకు తీసుకెళ్ళతాను అన్నాడు. అంటే వశిష్ట మహర్షి మరోసారి తల అడ్డంగా
ఊపారు కుదరదు ఇవ్వను. ప్రాణానికి తుల్యమేముంటుందండీ! తీసుకుపోతే ఇస్తాననడానికి,
ఏమి ఉండదు కదా, కాబట్టీ నేను ఇవ్వను అన్నాడాయన, తీసుకుపోతున్నాడు విశ్వామిత్రుడు,
ఆయన రాజూ చతురంగ బలాలు ఉన్నాయి, తీసికెళ్ళిపోతుంటే అది తప్పించుకుంది ఆ
సైన్యంలోంచి, తప్పించుకుని వశిష్టుని దగ్గరకు వచ్చి ధర్మ ప్రశ్నచేసింది.
తనంత తాను తప్పించుకుని వశిష్టుడి దగ్గరకు రాలేదు, వశిష్టుడి
దగ్గరకు వచ్చి అడిగింది. నీవు నన్ను వదిలిపెట్టావా? అని అడిగింది. ఒకవేళ వదిలిపెడితే
నేనేమైనా దోషం చేశానా?, అని అడిగింది, ఆయన అన్నాడు న త్వాం త్యజామి శబలే! నాఽపి మేపకృతం త్వయా నీవు నాకు ఏ అపచారము
చేయలేదు, నిన్ను నేను విడిచి పెట్టలేదు, ఆయన రాజు ఏష త్వాం నయతే రాజా బలోన్మత్తో మహాబలః బలముచేత
మత్తుడై ఉన్నాడు, గర్వంతో అహంకరించి ఉన్నాడు, చతురంగ బలాలతో ఉన్నాడు. కాబట్టి నేను
తీసుకుపోతానని తీసుకెళ్ళుతున్నాడు తప్పా నేను నిన్ను వదలలేదు. నన్ను నీవు వదల
లేదుగా మరి నన్ను నీదానిగా ఎందుకు ఉంచుకోలేదు? నిన్ను నా దానిగా ఉంచుకోడానికి,
నీవు నాదానవు అవడానికి నీ అంత నీకు శక్తి లేకపోతే నిన్ను నేను నాదాన్ని
చేసుకోవాలి. నీవే, నీవు నాదానిగా ఉండగలదానవు, ఇంత మందికి అన్నం పెట్టినదానివి,
ఇంతమందిని చంపే సైన్యం కూడా సృజించగలదానివి కాబట్టి సృజించూ...? నేను ఇప్పుడు ఈ
మాట అన్నాను కాబట్టి నీవు అది చెయ్యొచ్చు, అయ్యబోబోయ్ ఎలా మాట్లాడుతారండీ వశిష్టాదులు,
మాట్లాడటం అంటే అలా ఉంటుంది ఆవిడ వెటనే ఒక పెద్ద అరుపు అరచింది.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
తస్యా
హుమ్భారవోత్సృష్టాః పప్లవాశ్శతశో నృప ! నాశయన్తి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః
!!
తస్యాహుమ్భారవాజ్జాతాః
కామ్భోజా రవిసన్నిభాః ! ఊధసస్త్వథ సఞ్ఙాతాః పప్లవాశ్శస్త్రపాణయః !!
యోనిదేశాచ్చ యవనాశ్శకృద్దేశాచ్ఛకా స్తథా ! రోమకూషేషు చ
మ్లేచ్ఛా హారీతాస్సకిరాతకాః !!
ఆమె ఒక పెద్ద
హుంభానాధం చేసిందట ధేనువు, ఆ హుంభానాదంలోంచి కాంభోజులు, పొదుగు నుండి పప్లవులు,
యోని ప్రదేశము నుండి యవనులు, పురీష ప్రదేశము నుండి శకులు, రోమ కూపము నుండి మ్లేచ్ఛులు,
హారీత్సులు, కిరాతులూ ఉద్భవించారు. వీళ్ళందరూ విశ్వామిత్ర సైన్యం మీదపడి ఆ
సైన్యాన్ని నశింపజేశారు,
కొంతసేపు యుద్ధం జరిగింది. విశ్వామిత్ర సైన్యం నశిస్తోంది,
ఇదిచూసి విశ్వామిత్ర కుమారులు నూర్గురు కోపంతో వచ్చి వశిష్ట మహర్షి మీద వచ్చి
పడ్డారు. ఆయన నిన్న కపిల మహర్షి ఎలా హుంకారం చేశారో హుఙ్కారేణైవ తాన్ సర్వాన్
దదాహ భగవాన్ ఋషిః ఒక్క హుంకారం చేశారు కూర్చుని, నూర్గురు విశ్వామిత్ర
పుత్రులు దగ్ధమైపోయి భస్మరాశులు కిందపడిపోయారు. పడిపోగానే ఆయనకు చాలా కోపం
వచ్చేసింది విశ్వామిత్రుడికి, కోపం అన్నదాంట్లో మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఆయన
ఆలోచించాడు నేను ప్రభువుని ఈయన ఋషి నేను అడిగాను ఇవ్వలేదు ఇవ్వలేదని తీసుకుపోయాను
ఆయన ధేనువుని సృజించమన్నాడు ఆ సైన్యం వస్తే నా సైన్యం నిలబడలేక పోయింది నా
కుమారులు కూడా మరణించారు.
బ్రహ్మశక్తి ముందు
క్షత్రియ శక్తి నిలబడలేకపోయింది కాబట్టి పగపుట్టింది నేను ఈ బ్రహ్మశక్తిని
గెలవాలి, బ్రహ్మశక్తిని గెలవాలని కాదు, నేనూ ఈ బ్రహ్మశక్తిని కావాలనాలి కదా!
సరిగ్గా ఇంకా వివేచన బాగా ఉంటే...? నేనూ బ్రహ్మశక్తిని కావాలని, నేనూ
బ్రహ్మశక్తిని అయిపోతే... అదీ బ్రహ్మశక్తే, ఇదీ బ్రహ్మశక్తే అయిపోతే రెండింటి మధ్య
గొడవ ఉండదిక, ఎందుకో తెలుసాండీ! రెండుగా ఉన్నా ఒకటై ఉంటుంది. ఇప్పుడు నాకో
కుడిచేయి ఉంది ఎడంచేయి ఉంది, ఈ రెండు చేతులు ఎప్పుడైనా కొట్టుకుంటాయేమిటి? ఏం
కొట్టుకోవు ఎందుకనీ? రెండూ నావీ అన్న భావనతో ఉంటాయి. ఈ చేతి మీద దోమ వాలితే ఈ చేయి
కొడుతుంది తప్పా, చేతులు కొట్టుకోవడం ఉండదు. ఈచేతి మీద కురుపు వస్తే ఈ చేయి అన్నం
పెడుతుంది. రెండుగా ఉన్నా ఒకటైతాయి ఎప్పుడూ నేనూ బ్రహ్మశక్తిని అవుతానంటే...? ఆయన
ఏమన్నాడంటే? నేను బ్రహ్మశక్తిని నశింపజెయ్యాలన్నాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
అక్కడొచ్చింది
మనస్సు తొట్రుపాటు, మనస్సునందు ఇంకా రజోగుణ తమోగుణ ప్రభావములచేత అసలు ఏదీ
నశింపజెయ్యడం కుదరదో దానిని నశింపచెయ్యగలను ప్రజ్ఞచేత అనుకొన్నాడు. ఇకదాన్ని కదపడం
దాన్ని తీయడం ఎవరికీ సాధ్యంకాదు అదే తుట్ట తుద స్థితి ʻబ్రాహ్మీʼ స్థితి. దానిని నేను
పాడుచేయగలనూ అనుకొన్నాడు. అనుకొని ఈయన తపస్సుచేసి ఇంత శక్తి సంపాదించాడు కాబట్టి
నేను తపస్సుచేసి సాధిస్తాను అనుకొన్నాడు. ఇక్కడొచ్చింది? కానీ, ఎలా వచ్చినా మంచి
వైపుకు మాత్రం అడుగుపడింది.
ఈ పడడం స గత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగసేవితమ్ !
మహాదేవప్రసాదాఽర్థం తపస్తేపే మహాతపాః !! ఉత్తర దిక్కుకు వెళ్ళి
హిమాలయ పర్వత పాదముల దగ్గర కూర్చొని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు పరమ శివుడి
గురించి. ఆయన ప్రత్యక్షమయ్యాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
అవగానే ఎంత
చమత్కారంగా అడిగాడో చూడండి, బహుశా ఇలా ఎవ్వరూ అడగరు. ఆయన ఏమని అడిగాడంటే? నాకు
ధనుర్వేదాన్ని ఉపదేశం చెయ్యండీ అని అడగలేదు, ఉపదేశం చెయ్యాలంటే ఈయ్యన ఆచమనం
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
చెయ్యాలి, ఆయన
కూర్చోవాలి, ఒక్కొక్క మంత్రం చెప్పాలి, ఈయ్యనవిని ధారణచెయ్యాలి, అప్పుడు అవన్నీ
వశవర్తులు కావాలి, వచ్చినిలబడాలి, విశ్వామిత్రుడు రామ చంద్ర మూర్తికి చేసినట్టు,
అంత సమయం లేదు. శివుడు కనబడగానే శివుని దగ్గర పుచ్చుకొని వశిష్ట మహర్షిని చంపేయాలి
వ్యగ్రత అంతుంది కడుపులో కోరిక ఏమని అడిగాడో తెలుసాండీ! యది తుష్టో మహాదేవ
ధనుర్వేదో మమానుఘ ! సాఙ్గోపాఙ్గోపనిషదస్సరహస్యః ప్రదీయతామ్ !! నిజంగా నీవు నా తపస్సు చేత ప్రీతి
పొందినవాడవైతే...? యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ ! నాకు ధనుర్వేదం
అంతా కూడా సాఙ్గోపాఙ్గోపనిషదః సాంగో పాంగంగా, అంగ ఉపాంగములతో సహా ధనుర్వేదం
అంతా నాకు వచ్చేయాలి అంతే...? ఇంత ఉపదేశం అవి ఏం చెయ్యొద్దు, నువ్వు తథాస్తు అను
అవి నాకు వచ్చేయాలి, నేను బయలుదేరిపోతాను ఏమిటా తొందరా... కొట్టేయ్యాలి వశిష్టున్ని
కడుపుమండిపోందినాకు. తపస్సు చేశారుగా ఆ తరువాత తెలుస్తుంది ఆ విషయమేమిటో నాయనా,
కాబట్టి ఆయన అన్నాడు తథాస్తు. ప్రకాశించింది నీయందు అంతే... గబగబా వెళ్ళిపోయాడు
కనపడిందంతే వశిష్ట మహర్షి ఆశ్రమం అంతే పిలవలేదు కోప్పడలేదు కేకవేయలేదు.
ఒక్కొక్కటీ వదిలేస్తున్నాడు మంత్ర పూరితమైన శక్తులు ఆ లోపల
ఉన్న ఉద్యానవనాలు ధ్వంసమైపోతున్నాయి, లేళ్ళు పారిపోతున్నాయి జింకలు పారిపోతున్నాయి,
ఆవులు కట్లు తప్పుక పరుగెడుతున్నాయి, ఆ వనమంతా కూడా ధ్వంసమైపోయింది. అందరూ వశిష్ట
మహర్షి బ్రహ్మన్ రక్షించూ రక్షించూ అంటూ పరుగెడుతున్నారు వశిష్టుడు బయటికొచ్చాడు
ఏమీ అల్లరి? విశ్వామిత్రా నీకున్నటువంటి ధనుర్వేదంతో నీవు నేర్చుకున్న అస్త్రాలతో
నన్ను పాడుచెయ్యగలవు అనుకుంటున్నావేమో ధూర్తుడా నిన్ను నిగ్రహిస్తాను అన్నాడు.
బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకున్నాడు ఆయన రోమ కూపాల్లోంచి వస్తుంది
బ్రహ్మతేజస్సు. అలా నిలబడినటువంటి స్వరూపం అత్యద్భుతమండీ దాన్ని గీయడం కూడా ఏ
చిత్ర కారుడికి సాధ్యంకాదు. ఆ తేజస్సు అలా నిలబడి ఉంది అంతే, ఆయన ధనస్సు
పట్టుకోలేదు, బాణం పట్టుకోలేదు, ప్రయోగించట్లేదు ఆయన కృద్ధుడై అంటే కోపించినవాడైతే
విశ్వామిత్రున్ని చంపుతాడు అప్పుడు. విశ్వామిత్రుడికి వశిష్టిడుకి తేడా లేదూ...
విశ్వామిత్రుని యొక్క ఉద్ధతిని నిగ్రహించి పాఠం చెప్పడమే, అంతే అంతవరకే అంటే స్వ
స్వరూపం ఎటువంటిదంటే దాన్నితనలోనికి ఐక్యం చేసేసుకుంటుంది అన్నీ పుచ్చేసుకున్నాక
ఇంక ఇవ్వడానికి ఏమీ లేక తెల్లబోయి అవతలివాడు వెళ్ళిపోవాలి, తప్పా వాన్నిమాత్రం
పడగొట్టడు ఎందుకు పడగొట్టడు అంటే... దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తి కస్రజో,
ర్గరిష్ఠరత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః, తృణారవింద చక్షుషోః ప్రజా మహీ
మహేంద్రయో, స్సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహమ్ వాళ్ళకి ద్వందాలు ఉండవు, తుల్యనిందాస్తుతిర్మౌని
సంతుష్టో ఏన కేనచిత్ ! అనికేతహ స్థిరమాతిహి భక్తిమాన్నే ప్రియో నరః !! బ్రహ్మర్షీ
అంటే అంతటా అదే చూస్తాడు ఆయన తప్పా, ఆయనకి భేదంలేదు విశ్వామిత్రుడికి భేదబుద్ధి
ఉంది, భేదబుద్ధి ఆయనకు పోవలసింది ఈయనకి కాదు. అలా నిల్చున్నాడు అంతే బ్రహ్మదండం
పట్టుకుని ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, ఆయన్ని పడగొట్టగలను అనుకున్నాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
వారుణం చైవ రౌద్రం
చ ఐన్ద్రం పాశుపతం తథా ! ఐషీకం చాఽపి చిక్షేప కుపితో
గాధినన్దనః !!
మానవం మోహనం చైవ గాన్ధర్వం
స్వాపనం తథా ! జృమ్భణం మాదనం చైవ సంతాపనవిలాపనే !!
శోషణం దారణం చైవ
వజ్రమస్త్రం సుదుర్జయమ్ ! బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమే చ !!
పైనకాఽస్త్రం చ దయితం
శుష్కార్ద్రే అశనీ ఉభే ! దణ్డాస్త్రమథ పైశాచం క్రౌఙ్చమస్త్రం తథైవ చ !!
ధర్మచక్రం కాలచక్రం
విష్ణుచక్రం తథైవ చ ! వాయవ్యం మథనం చైవ అస్త్రం హయశిరస్తథా !!
శక్తిద్వయం చిక్షేప కఙ్కాలం
ముసలం తథా ! వైద్యాథరం మహాస్త్రం చ కాలాస్త్రమథ దారుణమ్ !!
త్రిశూలమస్త్రం ఘోరం చ
కాపాలమథ కఙ్కణమ్ ! ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునన్దన !!
వసిస్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుతమివాభవత్ !
ఒకటేమిటీ
ధనుర్వేధంలో ఎన్ని అస్త్రాలు పరమశివుడి అనుగ్రహం చేత తనకి భాషించాయో అన్నిటిని
విడిచి పెడుతున్నాడు. అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇలా బ్రహ్మదండం పట్టుకుని నిల్చున్నాడు
అన్నీ బ్రహ్మదండంలోకి వెళ్ళి కలిసిపోతున్నాయి. పుచ్చేసుకుంటోంది బ్రహ్మదండం అందరూ
చక్కగా చూస్తున్నారు ఆహ్..హ్ఆ!... విచిత్రమైన సన్నివేషంరా ఇదీ అని. అన్నీ
విడిచిపెట్టేశాడు, ఏమీలేవు ఆయనెలాగున్నాడు అలాగే ఉన్నాడు నిల్చొని. చక్కగా బిందెలో
నీళ్ళు పడుతుంటే నీళ్ళు పట్టుకుపోయేవాడిలా నిల్చున్నాడు. ఆయనేమీ అనలేదు వశిష్ట
మహర్షి, ఈయనే అన్నాడు విశ్వామిత్ర మహర్షి దిగ్భలం క్షత్రియబలం బ్రహ్మతేజో బలం
బలమ్ ! ఏకేన బ్రహ్మదణ్డేన సర్వాఽస్త్రాణి హతాని మే !! ఇది ఆ స్థితికి వెళ్ళని
వానిస్థితి, అది వళ్ళినవాడి స్థితి ఏమందమండీ! మహానుభావుడు శతానందులవారు మాటలు దిగ్భలం
క్షత్రియబలం క్షత్రియ బలం ఎందుకు పనికొచ్చింది ఈ అస్త్రాలు బ్రహ్మతేజో బలం
బలమ్ బ్రహ్మతేజస్సు ఆ బలం బలం ఏకేన బ్రహ్మదణ్డేన ఒక్క బ్రహ్మదండము ఇలా
పట్టుకున్నాడు సర్వాఽస్త్రాణి హతాని మే వేసిన అస్త్రాలన్నీ పోయాయి.
ఛస్! మళ్ళీ చేస్తా తపస్సు, ఇప్పుడేమనుకున్నాడు ఎలాగైనా వశిష్టుడిని కొట్టాలి, ఇదే
ప్రయత్నం. ఏమైతే అవుతాడు తాను బ్రహ్మర్షీ అవ్వాలి, నిజంగా బ్రహ్మర్షి అయ్యాక
కౌగిలించుకొని నమస్కారం
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
చేస్తాడు వశిష్టుడికి.
అది సనాతన ధర్మపు ఆయువు పట్లండీ... ఇవన్నీ, అమ్మో ఎటువంటి విషయాలని ఋషులు
మాట్లాడారూ, కాబట్టి ఇప్పుడూ కోపం వచ్చింది పనిజరగలేదు. కాబట్టి దక్షణ దిక్కుకి
వెళ్ళాడు తతస్సన్తప్తహృదయః స్మరన్నిగ్రహమాత్మనః ! వినిశ్శ్వస్య వినిశ్శ్వస్య
కృతవైరో మహత్మనా !! ఆలోచించి ఆలోచించి ఇంకా అదే పట్టుదలతో స దక్షిణాం దిశం
గత్వా మహిష్యా సహ రాఘవ! ! తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః !! ఫలమూలాశనో
దాన్తశ్చకార సుమహత్తపః ! భార్యతో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళి, ఆ దక్షిణ
దిక్కులో అంటే ఉత్తర దిక్కులో తపస్సు చేశాడు. ఇప్పుడు ఉత్తరం నుండి దక్షిణంవైపుకు
వెళ్ళాడు, అక్కడ భార్యతో కలిసి ఘోరమైన తపస్సు ఇంద్రియ నిగ్రహంతో కందమూలాలు తింటూ
తపస్సు చేశాడు ఎన్నాళ్ళు?
పూర్ణే వర్షసహస్రే తు బ్రహ్మా లోకపితామహః ! అబ్రవీన్మధురం
వాక్యం విశ్వామిత్రం తపోధనమ్ !! వేయి సంవత్సరాలు అంత ఘోరమైన తపస్సు చేస్తే... చతుర్ముఖ
బ్రహ్మగారు వచ్చారు దేవతలతో కలిసి చితా రాజర్షిలోకాస్తే తపసా కుశికాఽఽత్మజ !
అనేన తపసా త్వాం తు
రాజర్షిరితి విద్మహే !! నీవు రాజర్షివయ్యావయ్యా అన్నారు. రాజర్షినా అయ్యాను
ఇంకానూ, అంటే పొందవలసిన దానికోసం పెట్టిన పరుగుకి పొందేస్తాననుకున్నవాడు పొందకపోతే
ఉండే అసంతృప్తి తప్పా నిజంగా అది పొందవలసినవాడు ఎలా వస్తుంది అనుకుంటాడు ఆత్రుత
అటువంటిది, ఎలా సంతృప్తి పడ్డాడంటే తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః !
దేవాస్సర్షిగణాస్సర్వే నాస్తి మన్యే తపః ఫలమ్ !! నేను చాలా కష్టపడి తపస్సు
చేశాను, ఈ దేవతలు బ్రహ్మగారు నాకు ఇవ్వలసిన ఫలితం ఇవ్వలేదు అన్నారు.
చూశారా ఎలా ఉంటుందో... ఇంత తపస్సు చేసినా ఇంకా మనస్సు
పొందవలసినటువంటి స్థితిని పొందలేదు ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేన్ద్రియః
! త్రిశఙ్కరితి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధనః !! ఆ కాలంలోనే ఇక్ష్వాకు వంశంలోనే
త్రిశంకు అనుబడేటటువంటి మహారాజుగారు ఉండేవాడు స వసిష్ఠం సమాహూయ కథయామాస
చిన్తితమ్ ! అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా !! ఆయన తన
కులగురువైనటువంటి వశిష్ట మహర్షి దగ్గరికి వెళ్ళి సశరీరంగా స్వర్గానికి పంపమని
అడిగాడు, వశిష్టుడు కుదరదు అన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి,
కుదరదంటే మీరు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏమండీ వశిష్టుడికి చేతకాదా
పంపడానికి అవకాశం లేదా... వెళ్ళినవాళ్ళులేరాండి స్వర్గానికీ... అర్జునుడు
వెళ్ళలేదా..? బోలెడంత మంది వెళ్ళారు స్వర్గానికి మరి ఈయన్నెందుకు వెళ్ళడు? అంటే...
వెళ్ళడానికి యోగ్యమైనస్థితి ఆయనకులేదు. ఆయనకు లేదన్న విషయం ఎవరికి తెలుసు
ధర్మామిటరుకి జర్వం తెలిసినట్లు ఈ శరీరానికి ఆ యోగ్యతలేదని ఆయన కులగురువు కాబట్టి
వశిష్టుడికి తెలుసు. ఉందని ఎవరనుకుంటున్నారు లేదంటే ఒప్పుకోనివారు అనుకొంటారు.
మీరు కనిపెట్టాలి లోకంలో లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం అని రెండు ఉంటాయి.
“లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరర్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు.” మీరు బాగా
ఐశ్వర్యవంతుని దగ్గరికి వెళ్ళి అయ్యా మీ దగ్గర చాలా డబ్బుందని అన్నారనుకోండీ, ఆ
ఏముందండీ పూర్వం లా లేదండీ వ్యాపారం ఏదో ఆ వడ్డీలకి ఆ అద్దెలకి సరిపోతుంది అంటాడు.
అతేగాని బాగా సంపాదించానండోయ్, బ్రహ్మాండంగా కోట్లు కోట్లు ఉన్నాయి నా దగ్గర ఫలానా
దగ్గర పెట్టాను పాదు అంటారేంటీ? ఏం అనరు అలాగా అలా అడగనూ కూడదూ, అలా చెప్పించనూ
కూడదూ అదో అధర్మం. ఒకాయన దగ్గరకెళ్ళి నీకేం తెలియదయ్యా నీవు అన్నివిషయాలు
తెలుసుకోలేదు అన్నారనుకోండి నోర్మూసుకో నీకేం తెలుసు నాకే తెలుసు అంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే
ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. ఇది లోకంలో ఒక గొప్ప చిత్రమైన విషయం.
ఎప్పుడూ ఇదీ మనస్సుకు సంస్కారం అంటనంత వరకు, అంటిన తరువాత నాకు లేనిది ఏమిటంటాడు,
నాకు వచ్చింది ఏమిటంటాడు ఈ రెండూ వస్తాయి.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
కాబట్టీ వశిష్టుడు
నీవు వెళ్ళడం కుదరదయ్యా స్వర్గానికీ అన్నాడు, నేను ఎందుకు వెళ్ళకూడదు అంటాడు ఈయన.
ఎందుకెళ్ళకూడదోచెప్తే అర్థమయ్యేవాడైతే గురువుగారు మాటచెప్పగానే ఇంటికి
వెళ్ళిపోవాలి? కాబట్టి ఆయనేం చేశాడంటే వశిష్ట పుత్రుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా
నేను కులగురువు వశిష్టుడిని నమ్ముకున్నాను ఆయన దగ్గరికి వెళ్ళాను యజ్ఞం చేశాను,
ఎన్నో చేశాను ఈసారి మళ్ళీ చేస్తాను నన్ను స శరీరంగా స్వర్గాని పంపించమన్నాను
కుదరదు పంపించనన్నాడు. ఆయన్ను నమ్ముకున్నాను ఆయన చెయ్యలేదు, ఏం చేస్తాను మరి ఆయన
పుత్రులు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. మీరు తప్పా నాకు దిక్కెవరూ లేరు కాబట్టి
మీరు పంపించండి అన్నాడు. పైకి వినయం అసలు గురువుగారి దగ్గర నమ్మకం అంటే ఏమిటీ?
గురువుగారు నాన్నా! నీకు ఇంకా ఆశక్తి రాలేదురా... అన్నారనుకోండీ? గురువుగారు నాకు
ఆ శక్తి వచ్చేంత వరకు పరిశ్రమ చేస్తాను ఏం చేయమంటారు అని అడగాలి, అంతేగాని మీరు
కాకపోతే మీ అబ్బయిదగ్గరికి వెళ్ళత్తాను అంటే, గురువుగారి మీద నమ్మకం ఏమిటండీ
బూడిదా...! కాబట్టి ఇప్పుడు గురువుగారి పిల్లల దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి మీ
నాన్నగారు పంపించనంటున్నాడండీ మీరు పంపించండి నన్ను అన్నాడు.
అంటే వాళ్ళన్నారూ మా తండ్రి మహానుభావుడు మూడు లోకములలో
ఏదైనా సాధిస్తాడు యజ్ఞంతో. అలాంటివాడు సాధించనన్నాడు అంటే మేం ఎలా చేస్తాం? మేం
ఏమీ చేయలేం. ఇదీ... అంటే తండ్రిగా కాదు గురువుగా... కొడుకులు అర్థం చేసుకున్నారు
తండ్రిని. కాబట్టి మేమెలా చేస్తాం కుదరదు ఇంటికి వెళ్ళిపో అన్నారు. అంటే ఆయన
అన్నాడు, నేను అలా వెళ్ళను. మీరు నాకు ఎలాగైనా ఉపకారం చెయ్యాలి, మీరు ఉపకారం
చెయ్యకపోతే... నాకు తప్పదు కాబట్టి ఇంకో గురువుని వెతుక్కుంటాను అన్నాడు. ఇంకో
గురువుని వెతుక్కుంటే వీళ్ళకేంబాదండీ అని మీరు అడగవచ్చు, మా గురవు చేతకానివాడు
అయిపోయాడనే కదా దానర్థం. వశిష్ట మహర్షిని అంతమాట అన్న తరువాతా ఇంకా గురువుగారి
శిష్యులుగా ఉన్నారు వాళ్ళు, వశిష్టుడి యొక్క కొడుకులుగా కాదు. ఇప్పుడు వాళ్ళు
ఊరుకుంటారా...? కాబట్టి వాళ్ళన్నారు నీవు ఇవ్వాల్టి రాత్రి తరువాత ఛండాలుడవు
అగువుదువు గాక! ఎందుకని నీ బుద్ధి అలా ఉంది కాబట్టి నీకు అలాంటి శాపం ఇచ్చాం అని
అన్నారు. రాత్రై తెల్లవారింది. రుద్ర భూమిలో ఉన్నటువంటి బూది నంతటిని ఒంటికి
రాసుకొని, నల్లటి బట్టలు కట్టుకొని, విక్రుతమైన రూపం వచ్చేసి, ఇనుప కడియాలు
వేసుకొని, ఇనుప ఆభరణములను పెట్టుకొని, భయంకరమైనటువంటి స్వరూపాన్ని పొందాడు పొంది
ఇప్పుడు మనసులో మాత్రం ఇంకా స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక వదలలేదు అంటే ఇప్పటికీ ఆ
మౌఢ్యంపోలేదు. అందుకే “మూఢా” అంటారు శంకరాచార్యుల వారు.
కాబట్టి ఇప్పుడేం
చేశాడు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి విశ్వామిత్రస్తు తం
దృష్ట్వా రాజానం విఫలీకృతమ్ ! చణ్డాలరూపిణం రామ మునిఃకారుణ్యమాగతః !! ఆయనకు
ఈయన్ని చూస్తే జాలేసిందట ఎందుకు జాలేయ్యాలి ఒక్కటే కారణం అయ్యో పాపం ఇంత బాధకు
గురైపోయాడే... బ్రహ్మణ శాపానికి గురైపోయాడే... ఇప్పుడు తన కోరుకున్న కోరిక
తీరనటువంటి ఒక క్షత్రియుడు బ్రాహ్మణుని చేత ఎలా బాధపడుతున్నాడో నేనూ అలానే బాధపడుతున్నాను
నా కోరికా తీరక... ఇది సమాన ధర్మం చూడండీ అందుకు కారుణ్యం. ఇంకో కారణం లేదు అక్కడ
కారుణ్యానికి, అప్పటికి విశ్వామిత్రుని మనః స్థితి అంతే... కాబట్టి ఇలా అనుకొని
నీకెందుకయ్యా నేను పంపిస్తాను అన్నాడు. ఎందుకు ఆ మాట అనడం ఇప్పటికి
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
అయ్యిందే తక్కువ
అవ్వలసింది బ్రహ్మర్షిత్వం మళ్ళీ ఉన్న తపస్సు దీనికెందుకు అంటే ఎదో రకంగా ముందు వశిష్టున్ని
అవమానం చేస్తే తప్పా తన కడుపు బాధతీరిపోతుంది కొంత. వశిష్టుడి పంపనన్నాడు తను
పంపించేయాలి కాబట్టి ఇప్పుడేమన్నాడంటే... యజ్ఞం చేసేద్దాం అనలేదు, ఇప్పుడు యజ్ఞం
చెయ్యడానికి శిష్యుల్ని పిలిచి దేశంలో ఉన్న వేదం చదువుకున్న వాళ్ళందర్నీ
తీసుకురండీ, ఎవరైనా ఒక వేళ రానూ అంటే...? ఎవరు రానన్నారో ఎందుకు
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
రానన్నారో నాకు
చెప్పండి అన్నారు ఇది చిత్రమైనటువంటి పరిస్థితి. ఈ మాట చెప్తే ఆయన కూడా సరే
అన్నాడు ఈలోగా త్రిశంకు మనః స్థితి ఏమిటో వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా
చెప్తారండీ! నేను ఇదే మీతో మనవి చేసింది. సర్టిఫికెట్లు ఇవ్వరు మాటలు చెప్తారు
దీనివల్ల సంస్కారం పట్టుకోవాలి దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్థకమ్ !
దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమా గతిః !! త్రిశంకు విశ్వామిత్రుడితో
అన్నాడు. నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, ధర్మంగా పరిపాలన చేశాను,
గురువుల్ని కొలిచాను ఇన్ని చేశాను చిట్ట చివరికి శాపమొచ్చించి స్వర్గం రాలేదు.
నాకేమర్థమవుతుందంటే,
పురుష ప్రయత్నం కూడా దైవమే గొప్పదీ అన్నది నాకు అర్థమైందీ అన్నాడు అన్న తరువాత
ఏమనాలండీ ఇంక ఊరుకోవాలి, వెంటనే అన్నాడు నాన్యం గతిం గమిష్యామి నాన్యశ్శరణమస్తి
మే ! దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి !! నీవు తప్పా నాకు దిక్కులేదు
దైవాన్ని నీ పురుషకారంతో తిప్పికొట్టూ అన్నాడు, పురుష కారం కన్నా దైవం
గొప్పదన్నవాడూ, ఇప్పుడు దైవాన్ని పురుష కారంతో కొట్టమంటాడేమిటీ? ఇయ్యనకి ఇయ్యన
కోరిక తీరితే చాలు, ఆయనకు ఆయన కోరిక తీరితే చాలు, అలాంటి వాళ్ళు ఇద్దరూ
కలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అందరికీ కబురు చేశారు అందరూ వచ్చారు. ఎందుకొచ్చారు
యజ్ఞం చేస్తున్నాడటా, వెళ్ళకపోతే శాపమిస్తాడేమో ఏమో ఎందుకొచ్చిన గోల అని అందరూ
యజ్ఞానికి వచ్చారు. వశిష్ట పుత్రుల్ని వెళ్ళి పిలిచారు మీరూ రండి అన్నారు అంటే
వాళ్ళన్నారూ క్షత్రియో యాజకో యస్య చణ్డాలస్య విశేషతః ! కథం సదసి భోక్తారో
హవిస్తస్య సురర్షయః !! యజ్ఞం చేయిస్తున్న యాజకుడు క్షత్రియుడు, యజ్ఞం
చేయబడుతున్నది చండాలునికోసం అక్కడికి దేవతలు ఎలా వస్తారు అదెలా యజ్ఞం అవుతుంది మేం
రాము అన్నారు వాళ్ళు. దీనికి జవాబు చెప్పలేదు వశిష్టిడు, తిరిగొచ్చిన శిష్యులన్నారూ
ఒక్క వశిష్ట పుత్రులు మాత్రం ఈ మాట అన్నారు అన్నారు. అనగానే ఆయనకు వచ్చింది కోపం
ఇంత కష్టపడి తపస్సు చేస్తే నన్ను ఇలా అంటారా అని, వశిష్ట పుత్రు అది ఆయన కోపం నోటి
వెంట ఎంత కోపంతో కూడిన మాట వచ్చేసిందో తెలుసాండీ! చిన్న విషయానికి ఎంత
కోప్పడ్డాడంటే...?
భస్మీభూతా దురాత్మానో
భవిష్యన్తి న సంశయః
అద్యతే కాలపాశేన నీతా
వైవస్వతక్షయమ్ ! సప్తజాతిశతాన్యేవ మృతపస్సన్తు సర్వశః !!
శ్వమాంసనియతాహారా ముష్టికా
నామ నిర్ఘృణాః ! వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరన్త్విమాన్ !!
మహోదయస్తు దుర్బద్ధిర్మామదూష్యం హ్యదూషయత్ ! దూషిత
స్సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి !!
అయన అన్నాడూ, ఇంత మాట అంటారా నన్ను వశిష్ట పుత్రులు
నూర్గురు కాబట్టి శపిస్తున్నాను, వాళ్ళు ఇప్పుడే మరణించి యమలోకములకు పాశములచేత
ఈడ్చుకొని పోబడుతారు, ఆ తరువాత ఏడువందల జన్మలు వాళ్ళు ముష్టికులు అనబడేటటువంటి
జాతిలో పుడుతారు. ఏడు వందల సంవత్సరాలు విక్రుతమైనటువంటి రూపాలతో కుక్క మాంసం తింటూ
బ్రతుకుతారు, నన్ను కాదన్న వాడు ఎవడున్నాడో... ఆ మహోదయుడు నిషాదుడై పుట్టి ఎవ్వరి
చేతా ఆదరింబడకుండా బ్రతుకుతాడు ఇది నా శాప వాక్కు అన్నాడు అంటే అంత కక్ష
పెట్టేసుకున్నాడు. వశిష్టుడన్నా, వశిష్ట సంబంధీ అన్నా, ఇప్పుడంత కక్ష. ఆ తపస్సు
ఎందుకు పనికొస్తుందండీ, ఈ ద్వందాల్లో ఉండిపోయినవాడికీ ఏది చేస్తే పనికొస్తుంది,
ఇదేమైపోతుంది అంతే శాప వాక్కుకు మళ్ళీ పోయింది. యజ్ఞం మొదలు పెట్టాడు, పైకి
పంపిస్తున్నాడు చాలా గొప్ప యజ్ఞం జరిగింది, త్రిశంకుని పంపిస్తాను, దేవతల్ని
పిలవండీ, హవిస్సులిస్తాను అన్నాడు, పిలిచారు ఋరుషులందరూనూ, మునులు పిలిచారు, వేద
పండితులు పిలిచారు వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోతే కోపం వచ్చింది నేను పిలిస్తే
హవిస్సు పుచ్చుకోవడానికి రావట్లేదు ఇదే గదా అడిగాడు వశిష్ట పుత్రుడు, ఆయన
ఒప్పుకోలేదు ఆ మాట, వాళ్ళు రాకపోవటమేమిటీ
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
పశ్య మే తపసో
వీర్యం స్వాఽఽర్జితస్య సరేశ్వర! ! ఏష
త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజపా !!
దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్ఛ నరాధిప ! స్వాఽఽర్జితం
కిఞ్చిదప్యస్తి మయా హి తపసఃఫలమ్ !!
రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ !
మహోదయస్తు దుర్భుద్ధిర్మామదూష్యం
హ్యదూషయత్ ! దూషిత స్సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి !!
నేను చేసేన తపస్సు
ఏమైనా మిగిలి ఉంటే... దేవతలు హవిస్సులు పుచ్చుకోవడానికి రాకపోయినా, త్రిశంకూ నీవు
వెళ్ళిపో స్వర్గానికి సశరీరంగా, అనగానే ఆయన కూర్చున్నటువంటి స్థానం నుంచి లేచి
వెళ్ళిపోయాడు స్వర్గలోకానికి ఇంద్రుడు సభతీర్చి ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు,
వెళ్ళేటప్పటికి చూశాడు ఇంద్రుడు చూసి వీడెవడు సశరీరంగా వచ్చేస్తున్నాడు సభలోకి
అన్నాడు. త్రిశంకు వస్తున్నాడు అన్నారు వాళ్ళు గురువుగారు చెప్పారు వీడు
వెళ్ళడానికి వీళ్ళేదని, యోగ్యతలేదని చెప్పారు ఎలా వచ్చాడు అని అన్నారు,
విశ్వామిత్రుడు పంపారు అన్నారు. ఇంద్రుడు అన్నాడు త్రిశఙ్కో గచ్ఛ భూయస్త్వం
నాసి స్వర్గకృతాఽఽలయః ! గురుశాపహతో మూఢ! పత
భూమిమవాక్ఛిరాః !! గురువొకడు గురు పుత్రుడొకడునా ఆత్మావైపుత్రనామాసి గురువు
యొక్క శాపమును పొందినవాడా అర్హత లేదని చెప్పబడినవాడా నీవు ఎలా వస్తున్నావు పో
కిందకి అన్నాడు. అనేటప్పటికి తల కిందకి పెట్టి కాళ్ళు పైనికి పెట్టి కిందకి
పడిపోతున్నాడు, పడుపోతూ... విశ్వామిత్ర మహర్షీ పడిపోతున్నాను పడిపోతున్నాను
పడిపోతున్నాను రక్షించు రక్షించు రక్షించు అని స్వర్గంలో స్థానం లేదన్నారు తోసేశారు
అన్నాడు ఆయనకు కోపం వచ్చింది.
ఋషిమధ్యే స తేజస్స్వీ ప్రజాపతిరివాఽపరః !
సృజన్ దక్షిణమార్గస్థాన్ సప్తర్షీనపరాన్ పునః !
నక్షత్రమాలామపరామసృజత్త్రోధమూర్చ్ఛితః !!
దక్షిణాం దిశమాస్థాయ మునిమధ్యే మహాయశాః ! సృష్ట్వా
నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః !!
అన్యమిన్ద్రం కరిష్యామి
లోకో వా స్యాదనిన్ద్రకః ! దైవతాన్యపి స క్రోధా త్స్రష్టుం సముపచక్రమే !!
దేవతలు అంగీకరించిక త్రిశంకువుకి స్వర్గలోకంలో స్థానం
ఇవ్వనన్నారు కాబట్టి, నేను వేరే నక్షత్ర మండలాన్ని సృజిస్తున్నాను ఇంకొక
ఇంద్రున్ని సృజిస్తాను, దేవతల్ని సృజిస్తాను ఉంటే ఇంద్రుడు ఒకడుండాలి నేను
సృజించినవాడు
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
లేకపోతే
ఇంద్రుడన్నవాడు లేకుండా పోవాలి అని సంకల్పం చేసేసి నక్షత్ర మండలాన్ని సృజింప
చేసేశాడు, దేవతలందరూ పరుగెత్తుకొచ్చారు అయ్యో...అయ్యయ్యో ఇది ఎక్కడైనా ఉందా..! ఇలా
సృజించేయడమే స్వామీ, ఆయన గురు శాపము కలిగినటువంటివాడు, స్వర్గానికి రావడానికి
వీలులేదు. సరే మీరు నిర్మించినటువంటి నక్షత్ర మండలం ఏదైతే ఉందో... గగనే
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
తాన్యనేకాని
వైశ్వానరపథాద్భహిః ! నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిష్షు జాజ్వలన్ !! ఈ నక్షత్ర మండలం ఆ
జోత్యుష్యచక్రానికి బయట ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ త్రిశంకు తల కిందకి పెట్టి కాళ్ళు
పైకి పెట్టి ఆ బయట ఉన్న, అంటే ఆ నక్షత్ర మండలంలో ఎప్పుడూ సేవింపబడుతుంటాడు,
అంతవరకూ అధికారం ఇస్తాను అన్నాడు. సరే అన్నాడు అంగీకరించాడు, అక్కడితో తన తపః
శక్తి చాలా పోగొట్టేసుకున్నాడు. వశిష్ట పుత్రుల్ని శపించాడు, మహోదయున్ని శపించాడు,
అర్హత లేనటువంటి త్రిశంకువుని స్వర్గలోకానికి పంపించాడు ఇవన్నీ పూర్తైయ్యాయి,
అయ్యో నా తపస్సంతా పోయింది అన్నాడు, మళ్ళీ పశ్చిమ దిక్కుకు బయలు దేరాడు, పశ్చిమ
దిక్కున పుష్కర క్షేత్రంలో కూర్చొని మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు, చాలా
ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు.
ఆ తపస్సు
చేసేటటువంటి సమయంలో అయోధ్యానగరాన్ని అంబరీషుడూ అనబడేటటువంటి రాజు పరిపాలన
చేస్తున్నాడు, ఆయన యజ్ఞంలో అగ్నిహోత్రానికి ఇయ్యబడవలసినటువంటి పశువు కనబడకుండా
పోయింది. ఇంద్రుడు ఎత్తుకుపోయాడు, ఆయన పశువుకోసమనిచెప్పి కనీసం ఒక మనిషిని పశువుగా
తెద్దామనిచెప్పి వెతుక్కుంటూ బయలుదేరాడు, ఆయన కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక కొండ
శిఖరం మీద రుచీకుడు కూర్చొని ఉన్నాడు. ఆ రుచీకుడు భార్యా సహితుడై బిడ్డలతోసహా
కలిసికూర్చున్నాడు. ఈయన వెళ్ళి అడిగాడు అంబరీషుడు, నీకు చాలా మంది కొడుకులు
ఉన్నారు కదా ఒక కొడుకుని యజ్ఞ పశువుగా ఇచ్చేసేయ్యీ, లక్ష గోవులు ఇస్తాను అన్నాడు,
ఆ తల్లీ తండ్రీ చాలా చిత్రమైన మాటలు మాట్లాడారు, ఆయన అన్నాడూ నాహం జ్యేష్ఠం
నరశ్రేష్ఠ విక్రీణీయాం కథఞ్చన నా పెద్ద కొడుకుని మాత్రం నేను ఇవ్వను అన్నాడు
తండ్రి, తల్లి అంది తస్మాత్కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ నేను చిన్న
కొడుకుని ఇవ్వను నాకు చిన్న కొడుకు అంటే ప్రేమా అని తల్లి అంది. మధ్యలో
ఉన్నటువంటివాడు శునశ్శేపుడు ఆయనలేచి అన్నాడు పితా జ్యేష్ఠమవిక్రేయం మాతా చాహ
కనీయసమ్ ! విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వ మామ్ !! తండ్రేమో పెద్ద
కొడుకుని ఇవ్వనంటున్నాడు, తల్లేమో చిన్న కొడుకుని ఇవ్వనంటుంది, అంటే మధ్యలో
పుట్టిన వానిని నన్ను ఇచ్చేస్తాననే కదా...? లక్ష గోవులు ఇచ్చి నన్ను తీసుకెళ్ళిపో
అన్నాడు. లక్ష గోవులు అక్కడ పెట్టి ఈ పిల్లాన్ని తీసుకొని రథం మీద ఎక్కించుకొని
పోతున్నాడు. రథం ఎక్కించుకు పోతున్నప్పుడు విశ్వామిత్రుడి ఆశ్రమం దగ్గర అంబరీషుడు
ఎందుకో ఆగాడు విశ్రాంతికి, ఈ పిల్లవాడు పరుగెత్తుకుంటూ విశ్వామిత్రుడి దగ్గరికి
వెళ్ళాడు మేనమామ అవుతాడు విశ్వామిత్రుడు. దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీదపడి ప్రార్థన
చేసి ఎలాగైనా నీవు నన్ను రక్షించు అన్నాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
దయకలిగినటువంటి
విశ్వామిత్రుడు అన్నాడు కోడుకులను పిలిచి ఓరేయ్ మీరు చాలామంది ఉన్నారు, పాపాం ఆ
పిల్లవాడు బతుకుతానంటున్నాడురా దీర్ఘయుష్మంతుడు అవుతానని అంటుంన్నాడు, మీలో ఎవరైనా
ఒకరువెళ్ళి యజ్ఞ
పశువుగా శరీరత్యాగం
చెయ్యండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు కథమాత్మసుతాన్ హిత్వా త్రాయసేఽన్యసుతం విభో !!
అకార్యమివ పశ్యామి శ్శ్వమాంస ఇవ భోజనే !! ఎవడైనా ఇతరుల పిల్లల్ని
రక్షించడానికి తన పిల్లల్ని చంపేస్తాడయ్యా తండ్రీ, మమ్మల్ని వెల్లమంటావేమిటి? మెం
వెళ్ళం అన్నారు. అంటే ఆయనకు కోపం వచ్చింది, నేను చెపితే వెళ్ళనన్నారు నా కడుపున
పుట్టి శ్వమాంసభోజినస్సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు ! పూర్ణం వర్షసహస్రం తు
పృథివ్యామనువత్స్యథ !! వాసిష్టా ఇవ జాతిషు ఇది చిత్రమైన మాట, వశిష్టిడి
కొడుకులు ఉన్నజాతిలో వెళ్ళిపుట్టండిరా మీరు అన్నాడు. వశిష్టిడి కొడుకులకు జాతి
ఏమిటండీ! అంటే కడుపుమంట వశిష్టుడి పేరెత్తితే, వాళ్ళని ఏడువందల జన్మలు ముష్టిక
జాతిలోపుట్టి కుక్కమాంసం తినమన్నాడుగా మీరు కూడా అలా వెళ్ళండి వెళ్ళి మీరుకూడా అలా
పడుండండీ అన్నాడు. వాళ్ళందరూ ఆ శాపంచేత వెళ్ళిపోయి ఆ కుక్కమాంసంతింటూ ముష్టికులు అయిపోయారు.
ఇప్పుడు మళ్ళీకొంత తపస్సు పోయింది ఇప్పుడు ఆ పిల్లాన్ని పిలిచాడు పవిత్రపాశైరాసక్తో
రక్తమాల్యానులేపనః ! వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్నిముదాహర !! నిన్నూ ఎర్రటి
మాలలువేసి చందనంరాసి యూపస్తంభానికి కడతారు, కట్టినప్పుడు నీవు ఒకపనిచేయి నేను నీకు
రెండు మంత్రాలును నేర్పుతాను ఆ మంత్రాలతో ఇంద్రున్ని కీర్తించు ఇంద్రుడు సంతోషించి
నిన్ను విడిచిపెడతాడు అన్నాడు. ఆ రెండు మంత్రాలు ఉపదేశం పొందాడు, శునశ్శేపున్ని
తీసుకెళ్ళారు యూపస్తంభానికికట్టారు, ఆయనా ఆ రెండు మంత్రాలని స్తోత్రంచేస్తే ఆ
మంత్రమును పఠనం చేస్తుంటే విని ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు ఆ యజ్ఞంలోకి వచ్చి,
ఒక యజ్ఞము చేయడంవల్ల ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ద్విగుణీకృత ఫలితాన్ని నీకు
ఇస్తున్నాను అంబరీషా అని ఈ పిల్లవాన్ని విడిచిపెట్టాడు ఈ పిల్లవాడు సంతోషించి
విశ్వామిత్రుడికి కృతజ్ఞతచెప్పి వెళ్ళిపోయాడు.
ఈయన మళ్ళీ పుష్కర
క్షేత్రంలోనే కూర్చుని మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలు పెట్టాడు. మళ్ళీ
తపస్సు చేస్తున్నటువంటి సమయంలో... అక్కడికి తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః !
పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే !! అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చెయ్యడంకోసమని
మేఘ మండలంలో విద్యుత్ తీగలా ఉండేటటువంటి మేనక వచ్చింది. ఆ మేనకనిచూసి కామమోహితుడు
అయ్యాడు, పదిసంవత్సరములు ఆవిడతో కలిసి సంసారంచేశాడు, పదేళ్ళయిన తరువాత
గుర్తొచ్చింది అరే తపస్సు చేద్దామని అనుకున్నాను వశిష్ట మహర్షి మీద కోపంతో, ఈ
మేనకతో ఉండిపోయాను కామానికి లొంగిపోయాను అనుకున్నాడు. మేనకవంక కోపంగా చూశాడు,
అయ్యో! నా తప్పు ఏముంది నువ్వు మోహించావు నేను వచ్చాను అంది ఆవిడ, సరే తప్పు
నాదైంది వదిలిపెట్టాస్తున్నాన్నాడు. మళ్ళీ నేను వెళ్ళి చాలా కష్టపడి బుద్ధిర్మునేస్సముత్పన్నా
సామర్షా రఘునన్దన! ! సర్వం సురాణాం కర్మైతత్తపోపహరణం మహత్ !! నేను కష్టపడి
తపస్సుచేసి వృద్ధిలోకివస్తానని కోపం పెట్టుకున్న దేవతలే ఈ మేనకని పంపించి నన్ను
పాడుచేశారు, కాబట్టి నేను ఈసారి గట్టిగా తపస్సు చేస్తాను అని ఆన్నాడు ఉత్తరం
పర్వతం రామ! విశ్వామిత్రో జగామ హ మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళి
ఉత్తర దిక్కున ఘోరమైనటువంటి తపస్సు మళ్ళీ ప్రారంభం చేశాడు. అద్భుతమైన తపస్సు
చేస్తే బ్రహ్మగారు సంప్రీతి చెందారు మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః
నీ తపస్సుకు మెచ్చాను నీవు ఇప్పుడు మహర్షివి అయ్యావు అన్నాడు ఆయన. అంటే ఈయన అన్నాడూ
బ్రహ్మణస్స వచశ్శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ ! న విషణ్ణో న సన్తుష్టో
విశ్వామిత్రస్తపోధనః !! సంతోషించ లేదు బాధ పడలేదు. ఇంత తపస్సు చేస్తే నేను
మహర్షినా అయ్యాను మహర్షిశబ్దమతులం స్వార్జితైః కర్మభిశ్శుభైః ! యది మే భగవానాహ
తతోఽహం విజితేన్ద్రియః !! నేను ఇంద్రియాల్ని గెలిచానా
అని అడిగాడు అడిగితే బ్రహ్మగారు అన్నారు నీవు ఇంకా అయ్యింది మహర్షే నీవు ఇంకా
ఇంద్రియాల్ని గెలవలేదు ప్రయత్నంచేయి అన్నాడు.
మాటలాండీ! మళ్ళీ
తపస్సు మొదలు పెట్టాడు, అక్కడే విశేషమైనటువంటి తపస్సు చేస్తున్నాడు ఎటువంటి తపస్సు
చేశాడంటే... సామాన్యమైనటువంటి తపస్సు కాదు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు, రెండు
తేతులు పైకెత్తి పంచాగ్నిహోత్రముల మధ్యలో నిరాహారుడై చేశాడు. ఇంద్రుడు భయపడి
రంభనిపిలిచి నేను కోకిల రూపంతో వస్తాను అది వసంత ఋతువు ఏర్పాటు చేస్తాను, నీవు
వెళ్ళి ఎలాగైనా విశ్వామిత్రుడి మనసు కదుపూ అన్నాడు. నాకు భయంగా ఉంది ఆయన తేజస్సు
ముందు నిలబడలేను నేను వెళ్ళనంది ఆవిడ నీకు ఏం భయం లేదు ఇది నా ఆజ్ఞ బయలుదేరు
అన్నాడు. రంభ వెళ్ళింది ఇంద్రుడూ వచ్చాడు ఆయన కోకిల పక్షి రూపంలో కూర్చున్నాడు
ఈవిడేమో విశ్వామిత్రుడి కంటపడేటట్టుగా ప్రవర్తించింది. ఆయన వసంత ఋతువు వచ్చిందని
కించిత్ మనసు కదిపి కన్నులు తెరచి చూశాడు, రంభ కనపడింది. ఓహో నా తపస్సు
పాడుచేయడానికి రంభా నీవు వచ్చావా అన్నాడు యన్మాం లోభయసే రమ్భే కామక్రోధజయైషణమ్
! దశవర్షసహస్రాణి శైలీ స్థాన్యఽసి దుర్భేగే !! నా తపస్సు పాడుచేయడానికి
వచ్చావా? ఇలా వచ్చావు కాబట్టి నీవు దశవర్షసహస్రాణి పదివేల సంవత్సరాలు శిలవైపడిపో అన్నాడు. మళ్ళీ
కోపంతో తపస్సు పోయింది బ్రహ్మణ స్సుమహాతేజా స్తపోబలసమన్వితః ! ఉద్ధరిష్యతి
రమ్భే త్వాం మత్త్రోధకలుషీకృతామ్ !! ఒక బ్రహ్మణుడువచ్చి మళ్ళీ నిన్ను శాపం
నుంచి ఉద్దరిస్తాడులే పో అన్నాడు ఆవిడ శిలై పోయింది తన తపస్సు పోయింది.
ఇప్పుడు ఇలా కాదన్నాడు, తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు
వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఘోరమైన తపస్సు పూర్ణే వర్షసహస్రే తు
కాష్ఠభూతం మహామునిమ్ కాష్ఠం ఎలా ఉంటుందో అలా అయిపోయాడు. ఊపిరి తీయడం కూడా
మానేశాడు కుంభంకం చేసేశాడు. ఆహారం తినడం మానేశాడు, కూర్చొని ఘోరాతి ఘోరమైన తపస్సు
చేశాడు. వేయి సంవత్సరముల తరువాత అన్నం తిందామని అన్నం వండుకుని తినబోతున్నాడు.
ఇంద్రుడు బ్రాహ్మహణ రూపంలో వచ్చి నాకు అన్నం పెడతారా ఆకలితో ఉన్నాను అన్నాడు.
వచ్చినవాడు ఇంద్రుడని తెలిసికూడా కోపం లేకుండా ఆ అన్నం పెట్టేశాడు, మళ్ళీ వెళ్ళి
కుంభకంలో కూర్చున్నాడు. కొన్ని వేల సంవత్సరముల పాటు కుంభకంలో కూర్చుని ఊపిరి
బిగపట్టేసి శరీరమంతా కాష్ఠంలా, కొయ్య అయిపోగా... అలాగే ఆయన తపస్సు చేస్తే ఆయన
శిరస్సు నుంచి ధూమం పుట్టింది. అది లోకాలని ఆక్రమిస్తుంది ఇంక తట్టుకోలేక దేవతలు, ఋషులువెళ్ళి
బ్రహ్మగారిని పార్థన చేశారు, ఆయనకి బ్రహ్మర్షిత్వం ఇచ్చేయమన్నారు. అప్పుడు
బ్రహ్మగారు గబగబా హంసవాహనం మీద వచ్చి బ్రహ్మర్షే స్వాగతం తేఽస్తు తపసా స్మ
సుతోషితాః ! బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక !! దీర్ఘమాయుశ్చ తే
బ్రహ్మన్ దదామి సమరుద్గణః ! స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్ఛ సౌమ్య యథాసుఖమ్ !! బ్రహ్మర్షీ! అని పిలిచాడు
పిలుస్తూనే...బ్రహ్మర్షే స్వాగతం తేస్తు స్మ నీవు బ్రహ్మర్షివయ్యా!
అన్నాడు. ఆయన అన్నాడూ నీవు బ్రహ్మర్షీ అని పిలిస్తే నాకు సరిపోదు బ్రహ్మణ్యం
యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవ చ ! ఓఙ్కారశ్చ వషట్కారో వేదాశ్చ వరయస్తు మామ్ !!
క్షత్రవేదవిదాం శ్రేష్ఠో బ్రహ్మవేదవిదామపి ! బ్రహ్మపుత్రో వసిష్ఠో మామేవం వదతు
దేవతాః !! నిజంగా నేను బ్రహ్మర్షినైతే నాకు వేదములన్నీ ప్రకాశించాలి, నాకు
యజ్ఞం చేయించేటటువంట అధికారం కావాలి, దీర్ఘాయుర్ధాయం కావాలి, వాటితో పాటు నన్ను
బ్రహ్మర్షీ అని పిలుస్తాడా..! అన్నాడు. దేవతలు వెళ్ళి వశిష్టున్ని పిలిచారు. ఆయన ఆ
స్థితిని పొందిన తరువాత వేయ్యేళ్ళ తరువాత ఒక కబళం తినబోతుంటే ఇంద్రుడువస్తే
పెట్టేశాడు. ఇంద్రియాలనిగెలిచి బ్రహ్మర్షి అయిన తరువాత నాకా కోపం, బ్రహ్మర్షీ అని
పిలిచాడు. వశిష్ట మహర్షీ ఇప్పుడు తెలిసింది నాకు బ్రహ్మర్షిత్వమంటే, నీకు మా
గౌరవమంటే మా గౌరవం అని ఇద్దరూ కౌగలించుకున్నారు నమస్కరించుకున్నారు.
బ్రహ్మర్షిత్వాన్ని గెలుద్దామనుకున్నవాడు బ్రహ్మర్షియై దానిలో కలిసిపోయాడు ఇది
పతాక స్థాయి, ఇదే అద్వైత సిద్ధాంతంలో చరమస్థాయి, తాను బ్రహ్మముగా అహం బ్రహ్మాస్మీ
స్థాయిలో నిలబడిపోయి ఉండేటటువంటి స్థితి. ఈ స్థితిని పొందాడయ్యా అంతటి మహాత్ముడు,
విశ్వామిత్రుడంటే సామాన్యుడనుకొంటున్నావా...? అని శతానందులు ఆ రోజు ఆ కథ ఆ రోజు
చెప్పిన తరువాత ఆ రాత్రి మహర్షులందరూ కలిసి ఒక కుటీరంలోకి వెళ్ళిపోయారట.
ఎంత సంతోషంగా గడిపింటారో చూడండీ! విశ్వామిత్రాదులు అందరూ
అక్కడ ఉండడం అంటే... ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు విశ్వామిత్రున్నిచూస్తూ ఎంత
పొంగిపోతారు. దీని తరువాత ఇంకా అద్భుతమైన ఘట్టం మిగిలిన మహర్షులు కూడా వస్తారు
తరువాతటి రోజు తెల్లవారింది జనక మహారాజుగారు సభకు పిలిపించారు, స్వాగంత
చెప్పారు వెళ్ళారు కూర్చున్నారు. ఇక్కడ కూడా ఎంత అందం శీతా రామ కళ్యాణం ఏతద్దర్శయ
భద్రం తే కృతకామౌ నృపాఽఽత్మజౌ ! దర్శనాదస్య ధనుషో
యథేష్టం ప్రతియాస్యతః !! ఓ జనక మహారాజా! ఈ పిల్లలిద్దరు ఎందుకొచ్చారో తెలుసా? శివ
ధనుస్సు చూడ్డానికి వచ్చారయ్యా! ఏదీ శివ ధనస్సు చూపించు చూసి పిల్లలు
వెళ్ళిపోతారు, అందుకాండీ తీసుకొచ్చాడూ..? చూపించి వెళ్ళిపోవడానికా... కాదు సీతా
కళ్యాణానికే తీసుకొచ్చాడు. మరి ఆ మాట అనడే...? అలా తను ముందు బయటపడిపోతే... పరమ
ధర్మాత్ముడైన రామ చంద్ర మూర్తి ఏమంటాడో...? అందుకనీ తను అలా అనకుండా శివ ధనుస్సు
చూపించమన్నాడు. శివ ధనస్సు చూపించమంటే శివ ధనస్సొక్కటే చూపించి జనకుడు
ఊరుకుంటాడా..! జనకుడు శివ ధనుస్సుకు కథ చెప్పాడు.
మా పూర్వీకులలో దేవరాతడికి పరమ శివుడు అనుగ్రహించాడు ఈ
ధనుస్సుని, ఈ ధనుస్సుకు నా కూతురికి ఓ ముడి ఉంది అన్నాడు అత మే కృషతః క్షేత్రం
లాజ్గాలాదుత్థితా మయా ! క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా !! భూతలాదుత్థితా
సా తు వ్యవర్థత మమాత్మజా ! వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా !! నేను
ఒకానొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు ఉదుత్థితా
తనంత తాను పైకి లేచింది, దొరకడం కాదు ఉదుత్థితా లేచింది
ఆవిడ పైకి. లెచీ,
ఇక్కడ చెప్పలేదు అయోధ్య కాండ చివరలో చెప్పారు ఆ రహస్యం. తనకు తాను సీతా అని
పేరుపెట్టుకుంది ఆవిడ. ఆ పిల్లని నేను తెచ్చిపెంచాను ఆమె అయోనిజ, కాబట్టి ఆమె
నరకాంత కాదు, నరకాంత అయితే నరుడికి పుట్టాలి, నరుడికి పుట్టినపిల్ల కాదు.
అయోనిజయైనటువంటి పిల్ల, నరకాంతకాని పిల్లకి నేను భర్తను ఎలా తీసుకొస్తాను, ఇది జనక
హృదయం. ఇప్పుడు పుట్టినపిల్ల సామాన్యమైన పిల్లకాదు తన దగ్గర పెరిగింది ఇప్పుడు ఈ
పిల్లకి ఎవరు భర్తో తెలియాలి అంటే...? అయోనిజయై పుట్టింది కాబట్టి,
ఆయోనిజయైనపిల్లని భార్యగా స్వీకరించగలిగినటువంటివాడు నరుడిగా కనపడుతున్నా నరుడిగా
వచ్చిన, నరుడిగా పుట్టవలసినటువంటి అవసరంతో చేసుకున్న కర్మచేత నరుడైన వాడుకానివాడైన
వాడుగాఉండాలి, వాడు ఎవడో తను ఎలా పట్టుకుంటాడు, కాబట్టి నేను వీర్య శుల్కని చేశాను
ఈవిడ్ని, అంటే పరాక్రమాన్ని అడ్డుపెట్టాడు ఎవరు శివ ధనుస్సును ఎత్తుతారో వాళ్ళకి
ఇస్తాను అన్నాడు.
శివ ధనుస్సుని
ఎత్తడం, నిలబెట్టడం ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపి వా వంచడం వింటినారి
కట్టడం అంటే...? పుట్టిన పిల్ల “మాయామాన స్వరూపిణి” సౌందల్యరహరిలో శంకరభగవత్
పాదులు అంటారు “మహామాయా విశ్వబ్రహ్మమహిషి” అంటారాయన. ఆవిడ మహిషి, ఆమె
మహామాయా శ్వరూపిణి, లోకాన్ని తిప్పుతోంది. ఎవర్ని అనుగ్రహించాలనుకొంటుందో వాళ్ళని
మాయ అన్న తెరనితీసేస్తుంది. హనుమని అనుగ్రహించింది, రాముడు అర్థమయ్యాడు. ఆమె
అనుగ్రహించదు రావణుడికి అర్థం కాదు, తలలు తెగిపోతాయి పదైనా... అటువంటివి.
మాయామానుష శ్వరూపం ఆవిడది. ఈ మాయా స్వరూపాన్ని వహించి ధరించి
తరించగలిగినవాడెవడో...? వాడు శివ ధనుస్సును ఎక్కుపెట్టి వంచి అల్లెడ్రాడుని
కట్టగలిగినవాడు. వాడు పరమాత్ముడు వాడు ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు. వాడు నరుడిని
తీసుకొచ్చి భర్తగా పెడుతామంటే... వాడు చేసుకున్న కర్మకు పుట్టిననరుడు భర్త కాలేడు.
సీతమ్మ రాముడు ఎవరో చెప్పగలదు, విష్ణువు నర రూపంలో ఎక్కడున్నాడో చెప్పగలిగినటువంటి
తల్లి భూ మండలం మొత్తం మీద మైథిలి ఒక్కతే. సీతయే రామున్ని చెప్పాలి ఇది అసలు హృదయం
జనకునిది. నేను కాదయ్యా చెప్పవలసిందీ, సీతని అడ్డుపెడుతున్నా... శివ ధనుస్సును
ఎత్తినవాడు శివుడే... శివుడికి కేశవుడికి అభేదం ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం.
కాబట్టి ఈ ధనస్సు ఎవడు ఎక్కుపెడతాడో వాడికి ఇస్తాను పిల్లని
అన్నాడు. అంటే చాలా మంది వచ్చారు ఒకరు ఇద్దరూ కాదు ఎందరో వచ్చారు వచ్చి వీళ్ళందరూ
శివ ధనస్సును ఎక్కుపెట్ట లేకపోయారు, మాయా శ్వరూపాన్ని వహించగలిగిన పరంధాములు
కారువాళ్ళు, కాబట్టి వాళ్ళు ఎక్కుపెట్టలేక పోయినా కక్ష మాత్రం పెట్టుకున్నారు.
పెట్టుకుని వీళ్ళందరు కలిసి ఒక సంఘం అయ్యారు, మనకు పిల్లని ఇవ్వకుండా అందర్నీ ఎలా
ఇబ్బంది పెడుతున్నాడు ఎత్తట్లేదు శివ ధనస్సుని ఏం చేసుకుంటారు ఆ పిల్లని ఇంట్లో
పెట్టుకుని అంత అందగత్తెని మనకు పిల్లని ఇవ్వట్లేదు కాబట్టి జనకుడి మీద యుద్ధం
చేద్ధామనుకుని అందరూ జనకుని మీదకు యుద్ధానికి వచ్చారు. అంటే నేనేం చేశాను, నేను
అంటే జనకుడు. ఆయన తలుపులు వేసుకొని
లోపల కూర్చొని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తతస్సంవత్సరే పూర్ణే క్షయం యతాని
సర్వశః ! సాధనాని మునిశ్రేష్ఠ తతోఽహం భృశదుఃఖితః !! బయట యుద్ధం జరుగుతోంది
లోపల దేవతలను ఆరాధన చేశాడు, సంవత్సరానికి లోపల ఉన్న ఆహార పదార్థాలు కూడా
తరిగిపోయాయి, తినడానికి లేదు చాలా ఇబ్బంది వచ్చేసింది కోట లోపల ఉన్నవాళ్ళకి.
అలాంటప్పుడు నేను చేసిన ఉపాసనకీ తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయమ్ !
దదుశ్చ పరమప్రీతా శ్చతురఙ్గబలం సురాః !! నేను చేసిన తపస్సుకు మెచ్చి దేవతలు తమ
చతురంగ బలాలని ఇచ్చారు. ఆ చతురంగ బలాలు పట్టుకొని నేను ఈ వచ్చిన రాజులందరినీ
ఓడించాను, వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తరువాత
అప్పట్నించీ నేను ఈ శివ ధనుస్సు ఎక్కు పెట్టేటటువంటివాడు ఎవడైనా దొరుకుతాడా...!
దొరికితే పిల్లని ఇద్దామని ఎదురుచూస్తున్నాను.
కాబట్టీ విశ్వామిత్ర మహర్షీ! ఈ శివ ధనస్సు అంటే...? చూసి
వెళ్ళిపోయేది కాదు, ఒక్క వేళ ఎక్కపెడితే క్షత్రియుడన్నవాడు పట్టుకుంటాను అంటాడు పట్టుకుంటే
ఎక్కుపెడతాను అంటాడు ఒక వేళ ఎక్కుపెడితే శభాష్ అని సర్టిఫికెట్ ఇచ్చి పంపము
సీతమ్మను ఇచ్చేస్తాము యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే! ! సుతామయోనిజాం
సీతాం దద్యాం దాశరథేరహమ్ !! ఒక వేళ రామ చంద్ర మూర్తిగాని నిజంగా శివ ధనుస్సుని
చూసిన తరువాత ముట్టుకుంటానని ఎక్కు పెడతానని చెప్పి శివ ధనుస్సును ఎక్కుపెట్టగలిగితే...?
సీతమ్మని ఎటువంటి సీతమ్మని అయోనిజ నా కూతురుగా వచ్చింది, గర్వం సుతామయోనిజాం అయోనిజ
సీతాం సీత దద్యాం నేను ఇచ్చేస్తాను దాశరథేరహమ్ దాశరథరామునికి
ఇస్తాను. అంటే నేను ఇంతటి స్థిని పొందానని నన్ను అనుగ్రహించింది పరాశక్తి ఇది
జనకుడి యొక్క పొంగు జనకస్య వచశ్శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః ! ధనుర్దర్శయ
రామాయ ఇతి హోవాచ పార్థివమ్ !! తీసుకొచ్చి ఆ శివ ధనుస్సుని చూపించండి అన్నాడు.
అంటే అటా ఐదు వేల మంది పొడగరులై భలాఢ్యులైనటువంటి వ్యక్తులు చక్రములు కలిగినటువంటి
ఒక మంజూష పెట్టేలో ఉన్నటువంటి శివ
ధనస్సుని అతి కష్టం మీద తోసి తీసుకొచ్చి అక్కడ పెట్టారట.
అంటే అది ఎంత శక్తి
వంతమైనటువంటి ధనస్సో మీరు ఆలోచించవచ్చు. ఇంత శక్తివంతమైన ధనస్సుని తీసుకొచ్చి
అక్కడ పెడుతుంటే, తీసుకొచ్చిపెట్టిన తరువాత జనకుడు ఆ ధనస్సును చూపించి రామున్ని
పిలిచి అన్నాడూ నైతుత్సురగణాస్సర్వే నాసురా న చ రాక్షసా ! గన్ధర్వయక్షప్రవరాః
సకిన్నరమహోరగాః !! నాయనా రామా! ఈ ధనస్సు ఇదే శివ ధనస్సు చూశావుగా అసలు ఆ బండి
వస్తుంటేనే మీరు ఆలోచించండి, ఐవేలమంది దూర దూరంగా నిలబడి ఈడ్చుకొస్తున్నారంటే...
శివ ధనస్సు ఉన్నటువంటి మంజూష ఎంత ఉండి ఉంటుంది. ఎంత పెద్దది ఉండి ఉంటుంది? ఇప్పుడు
ఆ మంజూషలో ఉన్న ధనస్సు ఎంత ఉండి ఉంటుంది. అసలు దానిని ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం
చేస్తారా...? ఇప్పుడు ఇంకో పిరికి మాట ఒకటి వేస్తున్నాడు
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
జనకుడు. ఆయన
ఏమంటున్నాడంటే... దీన్ని ఎత్తుదామని దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు,
కింపురుషులు ఇంత మంది ప్రయత్నం చేశారు ఎత్తినవాడే కనబడలేదు. రామా! నీవు ప్రయత్నం
చేయ్ అనలేదు ఎమన్నాడో తెలుసాండీ! క్వ గతిర్మానుషాణాం ధనుషోఽస్య ప్రపూరణే !
ఆరోపణే సమాయోగే వేపనే తోలనేఽపి వా !! ఇంతమంది ఎత్తలేకపోయారు,
పాపం మనుష్యుడివి నువ్వేం ఎత్తుతావులే...? నీవు ఎత్తుతావా? ఎత్తి దాన్ని
నిలబెడుతావా? వింటినారి విప్పుతావా కడతావా? ఒక మనుష్యుడు వేరొక మనుష్యుడి గురించి
మాట్లాడినమాట. మనుష్య జాతి అంటే ఎంత నీచస్థితిలో ఆలోచించబడిందో మీరు చూడండి!
రావణుడూ ఇదేమాట, మనుషులు నన్నేం చేస్తారు అన్నాడు, జనకుడు ఇదేమాట క్వ
గతిర్మానుషాణాం ధనుషోఽస్య ప్రపూరణే మనిషి శివధనుస్సు ఎక్కడ
ఎక్కుపెడతాడయ్యా! శివ ధనుస్సుని, జనకుడూ అదేమాట. అందరూ మనిషి పనికిమాలినవాడు అంటే,
మనిషి గౌరవమేమిటో చూపిస్తానని దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ పదుకొండువేల
సంవత్సరములు మనిషి భూమి మీద ఉండి మనషి గౌరవాన్ని నిరూపిస్తానని ఈ భూమండలం మీద
తిరుగాడాడు నా తండ్రి రామ చంద్ర మూర్తి అందుకే మనుష్య జాతి ఋణపడింది రామ చంద్ర
మూర్తికి.
ఇప్పుడు చూపించాడు,
చూపించిన తరువాత విశ్వామిత్రుడు అన్నాడు... ఆయన త్రికాల వేది, ఆయనకి తెలుసు ఆ
పిల్లాడు ఎక్కుపెట్టడో ఎక్కుపెడతాడో తెలుసు విశ్వామిత్రస్తు ధర్మాత్మా మహర్షి
మాటలు చూడండీ! ఆయన ధర్మం తెలిసున్న వాడు, కాబట్టి ధర్మం తెలిసున్నవాడు కాబట్టి,
నోరు మూయుము జనకా! అనకూడదు ఎందుకంటే తండ్రి కాబట్టి పాత అనుభవముతో అలాగే
మాట్లాడుతాడు. ఇన్ని మాట్లాడుతున్నాడని ఉద్రేకపడితే రామా ఎక్కుపెట్టేయ్ అనకూడదు
మనవల్ల అవుతుందాండీ! అంటే...?. అందుకనీ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు విశ్వామిత్రాస్తు
ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్ ! వత్సా రామ ఏమి ప్రీతండీ! శిష్యున్ని
పిలిచేటప్పుడు గురువు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండీ! తతో యుద్ధపరిశ్రాంతం సమరే
చింతయా స్థితమ్ ! రావణం చాగ్రతో దృష్ట్వా ఆ వచ్చినటువంటి అగస్త్యుడు వత్సా!
అని రామ! రామ! మహాబాహో! శృణ గుహ్యం సనాతనం, రామా! రామా! అని రెండు మాట్లు పిలుస్తాడు. ఎంతో
సంతోషంగా వత్సా! ఓ నా కొడుకుతో సమానమైనవాడా! అత్యంత ప్రీతి పాత్రుడా! నా
శిష్యసమానుడా! శిష్యుడా రామా! రాముడా ధనుః పశ్చ చూడు ఆ ధనస్సుని
శివధనుస్సు, అంతే చెప్పాడు ఇతి రాఘవమబ్రవీత్ రాఘవుడితో అంతే చెప్పాడు.
అంతకన్నా ఎక్కువ చెప్పలేదు ఇదీ ధర్మాత్మ. ఏమి శ్రీరామాయణ రచనండీ వాల్మీకి
మహర్షిదీ! ఇప్పుడు ఆయనేం చేశాడటవెళ్ళి ఆ పెట్టెమూత తీసిచూశాడు, ఇప్పుడు ఆయన ఎలా
ఎక్కుపెట్టగలనని ఆయన నమ్మకం, గురువుగారు రామా! శుభం భూయాత్ అని అంటే
అయిపోతుంది. ఇది ఆయనకి గురువు మీదవున్న నమ్మకం. గురువుగారు రామా! నీవు ఎక్కుపెట్టు
అన్నాడో...? ఎక్కుపెట్టేస్తాడు, కానీ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు ధనుః పశ్చ చూడు
అంటున్నాడు అంతే...? ఎక్కుపెట్టు అంటాడా లేదు విశ్వామిత్రుడు, ఇప్పుడు శుభం
భూయాత్ ఎక్కుపెట్టు అని అనుపించాలి విశ్వామిత్రుడితోటి, గురువుకాని ఆ మాట
అన్నారా... మిగిలింది నిమిత్తం. అన్నాడుగా అశ్వమేధంలో దశరథ మహారాజుగారు,
గురువుగారు ఆమాట అనేశారు, ఋష్యశృంగుడు, వశిష్టుడు ఇంకేం నిమిత్తం అంతే యాగం
అయిపోతుంది పిల్లలు పుట్టేస్తారు. గురువుగారి నోటి వెంటరావాలి ఆమాట అంటే మంగళం
మహత్ అనాలి ఆయన.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
కాబట్టి రాముడు ఎంత
తెలివిగా మాట్లాడాడో చూడండి, వాక్ అండీ అందుకే నేను అంటాను రామాయణం అంటే వాక్
వైభవమే... ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశమీహ పాణినా ! యత్నవాంశ్చ భవిష్యామి
తోలనే పూరణేఽపి వా !! గురువుగారూ ఈ ధనుస్సు
చూశాను, ముట్టుకోవాలనుకుంటున్నాను గురువుగారు, ముట్టుకొని పైకెత్తి ఎక్కు
పెట్టాలని అనుకుంటున్నాను వద్దు అని క్షత్రియున్ని అంటాడా! ఆయన అన్నారు బాఢమిత్యేవ
తం రాజా మునిశ్చ సమభాషత అలాగే చేయ్యి. విశ్వామిత్రుడు అలాగే అన్న తరువాత
ధనుస్సు లేస్తుందా లెవ్వదా...? ఇది గురుభక్తి అంటే...? ఎవరైనా ఒకళ్ళతో ఒకళ్ళు అసలు
సీతా కళ్యాణాం గురించి మాట్లాడుకుంటున్నారా వాళ్ళల్లో...? జనకుడు ఒక్కడే చెప్పాడు
అంతే...? తప్ప నాకు ఎక్కుపెడతానండీ సీతమ్మను పెళ్ళిచేసుకుందామని ఉందండీ గురువుగారూ
అని రాముడు లేకిమాటలు మాట్లాడలేదు. ఎక్కుపెట్టేశెయ్ సీతాకళ్యాణం చేసేసుకో అని
విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారూ ధనస్సు ఎక్కిపెట్టేయగలనండీ! రాముడు అనలేదు.
ఎక్కపెట్టేయ్ విశ్వామిత్రుడు అనలేదు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ బ్రహ్మన్ అంటే
సాక్ష్యాత్తు ఈశ్వరుడే, బ్రహ్మైవభవతి నీవే ఈశ్వరుడవు, నోటి మాట ఈశ్వర మాట ఇదం
ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశమీహ పాణినా చేత్తో ముట్టుకోవాలని అనుకుంటున్నాను యత్నవాంశ్చ
భవిష్యామి తోలనే పూరణేఽపి వా తరువత ఎక్కుపెడతాను, చేయనా
ఆఁ.. అన్నాడు అంతే విశ్వామిత్రుడు చేయ్ అయిపోయిందండీ అంతే... గురువాక్యం ఎక్కడా
ఎవరూ బయటపడకుండా సీతాకళ్యాణం జరుగుతోంది ఇది గమ్మత్తు.
లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ
వచనాన్మునేః !
పశ్యతాం నృపసహస్రాణాం
బహూనాం రఘునన్దనః ! ఆరోపయత్స ధర్మాత్మా సలీలమిత తద్ధనుః !!
ఆరోపయిత్వా ధర్మాత్మా
పూరయామాస తద్ధనుః ! తద్బవఞ్ఙ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశః !!
తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిస్వనః !
ఆయన వెంటనే ఆ
ధనస్సు యొక్క మధ్య భాగాన్ని పట్టుకొని హేలగా ఇలా పైకెత్తాడూ, తాడు విప్పాడూ,
కిందకు వంచడం కట్టేయడం జరిగి పోతూందీ ఫెలఫెలమని ధ్వనులతో శివ ధనుస్సు విరిగి
కిందపడింది. అంతే ఆ శబ్ధం వినపడగానే
విశ్వామిత్రుడు, రామ చంద్రుడూ, లక్ష్మణ మూర్తీ జనక మహారాజుగారు నలుగురు తప్పా...
విగిలినవాళ్ళు శబ్ధానికి సృహతప్పి కుర్చిల్లోంచి కిందపడి మూర్ఛపోయారు. అందరూ
ఆశ్చర్యపోయారన్నమాట, స్టన్ అంటారే ఇంగ్లీషులో అలాగన్నమాట. అంటే ఎవ్వరూ ఎత్తుతాడని
ఊహచేయలేదు. ఒక్కసారి ఇలా పైకెత్తితే అప్పటి వరకు ఇలా నిలబడి కనపడని శివధనస్సు
పడుకునే కనపడింది. ఒక్కసారి పైకెత్తడం, వింటినారిని ఇలా సంధించడం ఆజానుభాహుం
అరవింద ధళాయతాక్షం ఇలా విప్పి దాన్నివంచికడుతుంటే పెద్ద ధ్వనితో విరిగి
పడిపోవడం, ఆశ్చర్యపోయారు ఒక్కసారి లేచిపోయాడు జనకుడు సింహాసనం మీద నుంచి.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
భగవన్ దృష్టవీర్యో
మే రామో దశరథాఽఽత్మజః ! అత్యద్భుతమచిన్త్యం
చ న తర్కితమిదం మయా !!
జనకానాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా ! సీతా
భర్తారమాసాద్య రామం దశరథాఽఽత్మజమ్ !!
మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక ! సీతా
ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా !!
మహానుభావా! భగవన్
దృష్టవీర్యో మే విశ్వామిత్ర మహర్షీ చూడండీ ఈ అద్భూతం అన్నాడు. ఇప్పుడు
అర్థమైంది విశ్వామిత్రుడు ఎందుకు చూడమన్నాడో, ఎందుకు తీసుకొచ్చాడో? ధర్మం అర్థం
అయింది. భగవాన్ గురువుగారూ నా కోరికతీర్చేశారు, ఏమిటి ఇప్పుడు సంతోషం జనకుడికి
పరబ్రహ్మం యొక్క దర్శనం అయ్యింది. సీతమ్మ తల్లిని వహించగలిగినవాడే...? పరబ్రహ్మ.
పరబ్రహ్మ నరుడిగా లోకంలో ఎక్కడ తిరుగుతున్నాడో... చూసేశాను కళ్ళతో... ఈయనే
పరబ్రహ్మ. తరవాత అన్నది త్రిజట ఈ మాట అన్నది పరం బ్రహ్మ పరం సత్యం అని ఆవిడ
చెప్తుంది. అలా నేను ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను, పిల్లాడి రూపంలో ఉన్నాడు.
అత్యద్భుతం, ఇది అద్భుతం న తర్కితమిదం మాయా ఇంక దీనిమీద వాదనలేదు అన్న
మాటప్రకారం సీతమ్మని ఇచ్చేస్తున్నాను.
ఇక్కడ మాత్రం ఒక చిన్న విషయం జరిగింది, దాన్ని దాచారు
మహర్షి చెప్పలేదు. రామాయణంలో అదో గమ్మత్తు, ఆయన అభిజ్ఞానమని చెప్పి కాకాసుర
వృత్తాంతాన్ని అరణ్య కాండలో చెప్పకనే సుందర కాండలో చెప్పారు. బాల కాండలో సీతారామ
కళ్యాణంలో ఒక పెద్ద రహస్యాన్నిదాచి అయోధ్య కాండ చివర సీతమ్మతో అనసూయమ్మకు
చెప్పించారు. అది అక్కడ విందురుకాని మీరు, కాని ఇప్పుడు చాలాసంతోషించారు జనక
మహారాజుగారుకి కబురుచేశాడు, దశరథ మహారాజుగారి దగ్గరికి నాలుగు రోజులపాటు శ్రమపడి
దూతలు వెళ్ళారు, దశరథ మహారాజుగారు చాలాసంతోషించారు. తనయొక్క ఋషులందర్నీ,
మంత్రుల్ని పిలిచారు మీ అందరికీ కూడా నచ్చితే... ఆయన ఆచారం నచ్చితే మనంవెళ్ళి ఆయన
యొక్క కుమార్తెయైన సీతమ్మని నాపెద్ద కోడలుగా చేసుకుందాం, మనందరం వెడదామా! ఇప్పుడు
ప్రస్తుతం నా కుమారులులైనటువంటి రామ లక్ష్మణులు విదేహ దేశంలో గుప్తః
కుశికపుత్రేణ కౌసల్యానన్దనవర్ధనః ! లక్ష్మణేన సహ బ్రాత్రా విదేహేషు వసత్యాసౌ !! చక్కగా
విశ్వామిత్రుడిచేత రక్షింపబడి ఉన్నారు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి దశరథ
మహారాజుగారు. కట్నం ఎంతిస్తాడు, రాజ్యం ఎంతుంది, కోశాగారమెంత, ఏనుగులు ఎన్నున్నాయి
అని అడగలేదు. ఋషుల్నిపిలిచి అందర్నీ మంత్రుల్ని కూర్చోబెట్టుకొని వచ్చినటువంటి
ధూతలవాక్కు విన్నాడు. నీ కుమారుడు శివ ధనుర్భంగా చేశాడు సీతమ్మనిచ్చి
పెళ్ళిచేద్దామనుకుంటున్నాడు జనక మహారాజుగారు, నిన్ను తీసుకు రమ్మన్నాడు తొందరగా...
అక్కడ వరకే చెప్పి ఊరుకున్నారు.
మంత్రులతో ఒకమాట అడిగాడు ఆయన, ఇదీ మనం నేర్చుకోవలి
రామాయణంలోంచి ఒక పెళ్ళిసంబంధం చూసేటప్పుడు ఏంమాట ముందడిగాడో చూడండీ యది వో
రోజతే వృత్తం జనకస్య మహాత్మనః ! పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః !!
జనక మహారాజుగారి యొక్క ఆచారము, ప్రవర్తన, నడవడిక నీకు నచ్చితే మనం వెళ్ళి సీతమ్మను
తెచ్చుకుందాం. ఎందుకంటే పుట్టింటిలో ఆచారం పట్టుకుని ఆడపిల్ల అత్తవారింటికి
వస్తుంది. ఏ ఆడపిల్ల యొక్క
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఆచారమే ఆ
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ʻఅత్తవారింటి ఐశ్వర్యాన్ని
నిర్ణయం చేస్తుంది.ʼ మీరు బాగాజ్ఞాపకం
పట్టుకోండీ! ఎందుకో తెలుసా ఇంటికొచ్చిన కోడలు దీపం పెట్టీ, రేప్పొద్దున్నా కోడల్ని
తెచ్చుకున్న మామగారు శరీరం వదిలిపెట్టేస్తారు. తప్పదు ఎవ్వరైనా
వదిలిపెట్టేయవలసిందే...? ఈ మామగారికి కొడుకు ఎంత ప్రీతితో తద్దినంపెట్టనీయండీ ఆయన
వచ్చి పుచ్చుకోవడానికి లేదు కోడలు దీపం పెట్టాలి. ఆవిడ నేను పెట్టనంటే...? ఆ ఇంటి
గౌరవం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే కోడలి మీద ఆధారపడి వుంటుంది. కోడలి యొక్క మర్యాద
ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే... పుట్టింట్లో తల్లీ దండ్రులు నేర్పిన ఆచారం మీద
ఆధారపడి వుంటుంది. తల్లి తండ్రులు అలా నేర్పారా అందుకేనండీ మనసాంప్రదాయం అంత
గొప్పదీ. ఆడపిల్ల ఈపిల్ల ఈడపిల్లా అని మేము నమ్మీ చూడటం లేదు, ఈడ పుట్టింది ఎందుకు
పుట్టిందో తెలుసా, ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకెళ్ళి పోతుందో తెలుసా...?
అక్కడికెళ్ళి ఆ వంశాన్ని ఉద్దరిస్తుంది. అక్కడ ఉండి నన్ను ఉద్దరిస్తుంది. తన
సదాచారంతో, తాను అత్తింటివారినీ పుట్టింటి వారినీ కూడా ఆడపిల్ల ఉద్దరిస్తుంది.
కడుపున పుట్టిన కొడుకు కన్నా వాళ్ళని మాత్రమే ఉద్దరిస్తాడు ఇద్దరిని ఉద్దరించలేడు.
ఆడపిల్ల రెండు వంశాలని ఉద్దరిస్తుంది. సీతమ్మ తల్లి ఉద్దరించింది కాబట్టి ఆడపిల్ల
ఆడపిల్లకి ఆచారం ఉండాలి, ప్రవర్తన తెలిసుండాలి కోడలికి, కోడలికి ప్రవర్తన తెలిసో
తెలియదో తెలుసుకోవాలంటే తల్లి తండ్రులకు ఆచారముందో లేదో తెలియాలి, ఆచారం వాళ్ళకు
ఉందో లేదో తెలియాలంటే ఋషులకు మీకు తెలియాలి మీకు నచ్చితే నేను వస్తాను పిల్లను
తీసుకోవడానికి నీకు నచ్చకపోతే కబురు చేసేద్దాం ఏది ముందు చూశాడు. ఆచంద్రతారార్కం
వంశవృద్ధి, ఐశ్వర్యాభివృద్ధికి ఆచారం కలిగినటువంటి పిల్లని చూసుకున్నాడు దశరథడు
రామాయణం మనకు నేర్పింది ఎలా బ్రతకాలో...
ఓ సంబంధం చూసుకుంటే
ముందు ఏది అడగాలో ముందు నేర్పింది. ఋషులందరూ ముక్తకంఠంతో అన్నారు జనకుడు అంటే
సామాన్యుడు కాడు మహానుభావా! మనం బయలుదేరుదాం అన్నారు వసిష్ఠో వామదేవశ్చ
జాబాలిరథ కాశ్యపః ! మార్కణ్డేయశ్చ దీర్ఘాఽఽయుఃఋషిః
కాత్యాయనస్తథా !! ఈ ఋషులందర్నీ పిలిచాడు, బయలుదేరండన్నాడు తనరథాన్ని సిద్ధం
చేసుకున్నాడు, అందరూ బయలుదేరారు, వాళ్ళు రావడానికి మూడు రోజులు పట్టింది. దశరథుడు
వెళ్ళడానికి నాలుగు రోజులు పట్టింది. అంటే దూతలు అంత తొందరగా వచ్చారు. విశ్రాంతి
తీసుకోకుండా, నాలుగు రోజుల ప్రయాణంచేసి మిథిలా నగరాన్ని చేరుకున్నారు సంతోషంగా జనక
మహారాజుగారు స్వాగతం చెప్పారు, చెప్పిన తరువాత కూర్చోబెట్టారు, నా తమ్ముడైనటువంటి
కుశధ్వజుడు ఉన్నాడు ఆయన్ని కూడా పిలిపిస్తాను అంటే చాలా ప్రీతికలిగినవాడు నా
తమ్ముడు కూడా పక్కనుండగా మాట్లాడుకుంటే మనకు సంతోషంగా ఉంటుందన్నాడు. అన్నదమ్ముల
యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో? మర్యాదా అంటే ఎలా ఉంటుందో చూపించారు. అన్నయ్యా నాకు
ఇప్పుడు ఎక్కడ కుదురుతుందిలే సెట్లైతే అప్పుడు వస్తానుల్లే అని అనలేదు కుశధ్వజుడు
పరుగు పరుగన వచ్చాడు, ఒక కడుపున పుట్టిన అన్న దమ్ములంటే...? ఆయన కూతురూ నా కూతురూ
కాదు, నా కూతురే నా తమ్ముని కూతురుని నా కూతురే అంటాను.
నా కూతురు గురించి చెప్పేటప్పుడు నా అన్నయ్య కూతురు అనడు నా
కూతురే అంటాడు నా కూతురనే అంటాను. నా కూతురే అని నోటితో అనడం కాదు ఆ పరుగు ఆ ఆర్థి
అలా ఉండాలి? అలా ఉన్నవాడు నా తమ్ముడు పరుగెత్తుకొచ్చాడు.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
పరుగెత్తుకుంటూ
వచ్చాడు అందరూ కూర్చున్నారు. మా వంశం ఇంత గొప్పదని దశరథునికి చెప్పుకోవడం కాదు,
పరాకు లేకుండా పెంచకుండా త్రుంచకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడలంటే పురోహితులు
మాట్లాడాలి, పెళ్ళి చేసేటప్పుడు నిశ్చితార్థం చేసేటప్పుడు, ఇవ్వాలంటే మన ధౌర్భాగ్య
స్థితి అలా వచ్చేసింది, పెళ్ళవకుండానే పెళ్ళి కొడుకూ పెళ్ళి కూతురూ పక్క పక్కన
కూర్చోవడం దండలేసేసుకోవడం, ముట్టేసుకోవడం, ఉంగరాలు మార్చుకోవడం, వాళ్ళది కాదు
తప్పు పెద్ద వాళ్ళది తప్పు. వాళ్ళు చెప్పాలి నువ్వెందుకమ్మా, నీవు కాదు
నిశ్చితార్థానికి రావలసింది. నేను వెళ్ళవలసినవాన్ని మాట ఇచ్చి పుచ్చుకుని
తాంబూళాలు పుచ్చుకునేందుకు నేను వెళతాను అని చెప్పాలి, వెళ్ళి ఆయన నిశ్చితార్థం
చేసుకోవాలి, ఆడపిల్లని తీసుకెళ్ళమని ఎవడు చెప్పాడు, పక్కన కూర్చోమని ఎవడు
చెప్పాడూ, దండలు మార్చుకోండీ, ఉంగరాలు పెట్టుకోండీ అని ఎవడు చెప్పాడూ, వెడ్డింగ్
రింగు అన్న పాశ్చాత్య సంస్కృతి ఇక్కడికి దిగుమతి చేయమని ఎవడు చెప్పాడూ,
పిల్లల్నిపాడు చేయమని ఎవడు చెప్పాడు బాధ్యత ఉంటే తల్లి తండ్రులది పిల్లలది కాదు.
కాబట్టీ ఇప్పుడు
మహానుభావుడు తన భార్యలని కూడా తీసుకెళ్ళలేదు. గమ్మత్తేమిటో తెలుసాండీ, దశరథ
మహారాజుగారి తొందర అలా ఉంటుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే... అంతే వెళ్ళిపోతాడు
అంతే... ఈ తొందరలో గమ్మత్తు మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసాండీ! చెప్పకుండా చెప్తారు
మహర్షి, భరతుడి మేనమామ యుధాజిత్తు వచ్చి అన్నాడూ మా మేనళ్ళును చూద్దామని అయోధ్య
వచ్చానూ మీరు ఏదో పెళ్ళి ఏర్పాట్లు కోసం ఇక్కడికి వచ్చారని తెలిసింది చూద్దామని
పరుగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చానులేండీ అన్నాడు. అంటే పిల్లల మేనమామలకు కూడా
చెప్పడు. సీతా రామ కళ్యాణానికి నిజానికి ఎవ్వరినీ పిలవలేదు, పెద్దగా బంధువులని
పిలిచినట్లు సీతారామ కళ్యాణంలో కనపడదు. ఎందుకంటే చాలా ఆకస్మికంగా వెళ్ళిపోయాడు
అంతే దశరథుడు. ఇక్ష్వాకు వంశంలో పతుల్ని తీసుకెళ్ళరు పెళ్ళికి, అందుకనీ కౌసల్యా,
సుమిత్రా, కైకేయీ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అందరూ వెళ్ళారు కూర్చున్నారు,
పురోహితుడైనటువంటి వశిష్టుడు, ఇక్ష్వాకు వంశం గురించి చెప్తున్నాడు.
తాంబూళాలు ఇచ్చుకునేటప్పుడు ఒక సాంప్రదాయం ఒకసారి ఆ వంశం
గురించి చెప్పుకోవాలి, ఆడపిల్లలు మగ పిల్లలు, ఆయన తాతగారి గురించి తెలియదు, ఆయన
ముత్తాత గురించి తెలియదు ఆయనేం చెప్తారింకా... అసులు నీకు తెలిస్తేగదూ నీ
పెద్దలగురించి చెప్పేది. ఏమీ తెలియదు, ఏం తెలుసంటే ఉంగరాలు మార్చుకోవడం మాత్రం
తెలుసు. తొలం ఉంగరం పెట్టమా, తులంనర ఉంగరం పెట్టమా...? పిల్ల పేరు మీద ఫిక్సిడ్
డిపాజిట్ వేయమా? పిల్లాడి పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ వేయమా అపనమ్మకం ఎంత
అపనమ్మకమో చెప్పలేం. నీ కూతురే ఆయింటిదైనప్పుడు ఆ దిక్కుమాలిన డిపాజిట్లు, పేరు
మార్పిడీలు పనికి వచ్చాయా అంటే అక్కడ కూడా అమంగళం, శంఖ, అనుమానం ఇలా ఉంటాయి మనం
చేసేకార్యాలు నేను క్షమింపబడెదును గాక.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
కాబట్టి వసిష్ట
మహర్షి అంటున్నారు, అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి
శాశ్వతుడు శాశ్వతునికి మరీచుడు, అతనికి కాష్యపుడు, విశ్వంతుడు, వైశ్వశత మనువు,
ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బానుడు, బానుడికి అనరణ్యుడు,
అనరణ్యుడికి ప్రుధువు, ప్రుధువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు,
దుందుమారుడికి యువనాశుడు, యువనాశుడికి సుసంధి, సుసంధికి ధృవసంధి, ధృవసంధికి
ప్రసేనజిత్తు, ప్రసేసజిత్తుకి భరతుడు, భరతునికి అసితుడు, అసితుడు ఇద్దరు
భార్యలతోనూ, మంత్రులతోనూ కూడా అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన శరీరం విడిచి
పెట్టేస్తే ఆయన భార్యలలో ఒక భార్య, రెండవ భార్యకి సంతానం కలగకూడదు తన కడుపే
నిలబడాలని రెండవ భార్యకి విషం పెట్టిస్తే చమన మహర్షి ఆ విషంతో పిల్లవాడు
పుట్టగలిగినటువంటి ప్రజ్ఞనని కడుపులో ఉన్న బిడ్డకి ప్రకాశింపజేసి పుట్టేటట్టు
అనుగ్రహించాడు. కడుపులో విషంతో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి సగరుడు అని పేరు
వచ్చింది. ఎక్కడ మహర్షి అనుగ్రహం ఉందో దాన్ని ప్రత్యేకం చెప్తారు వసిష్ట మహర్షి,
కాబట్టి సగరుడు జన్మించాడు. అలా పుట్టినటువంటి సగరుడు, ఆ గరుడికి అసమంజసుడు,
అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరతుడు, భగీరథుకి
కాకుత్సుడు, కాకుత్సునికి రఘుమహారాజు, రఘుమహారాజుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి
కల్మశపాదుడు, ఈ కల్మశపాదుడనేటటువంటి రాజు వశిష్ట మహర్షినే శపించబోయి చేతిలోకి
నీళ్ళు తీసుకున్నాడు, భార్య తప్పయ్యా కులగురువుని శపించడమేమిటని చేతులు పట్టుకుంటే
ఆ నీళ్ళు ఆయన పాదముల మీద పడి కల్మశమయ్యాయి కాబట్టి, కల్మశపాదుడని పేరు. కాబట్టి
కల్మశపాదుడు అతని కుమారుడు శంఖనుడు, శంఖనుడికి సుదర్శనడు, సుదర్శనునికి
అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రకుడు, శీఘ్రకుడికి మరువు, మరువుకి
ప్రశిష్ర్యుకుడు, ప్రశిష్ర్యుకిడికి అంబరీషుడు, అందరీషునికి నహుషుడు, నహుషునకి
యయాతి, యయాతికి నాభాహుడు, నాభాహునికి అజుడు, అజుడుకి దశరథుడు, దశరథుడికి రామ,
లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు ఇది వాళ్ళ వంశం ఇంత గొప్పవాళ్ళు.
అంటే ఆయన అన్నారూ మా వంశం కూడా చెప్తారు మా పురోహితుడు అని
శతానందులవారు చెప్తారు వినండి అని అన్నారు. అది ఇవతలి వంశం గురించి ఎంత ధారణలో
వున్నారో చూడండి, వారికేమి రాగద్వేషాలు ఉండవు, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం,
ఉన్నవి దాచడం ఉండదు కాబట్టి ఆయన శంతానందుడు అన్నాడు. ఈ వంశానికి మూల పురుషుడు మిని
మహారాజు, ఆయనకి ఉదావసువు, ఉదావసునికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు,
సుకేతునికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రుదుడు, బృహద్రుదుడికి మహావీరుడు,
మహావీరుడికి సుద్రుతి, సుద్రుతికి దుష్టకేతువు, దుష్టకేతువుకి ఆయనకి హరియశ్వుడు,
హరియశ్వునికి మరువు, మరువుకి ప్రతింధకుడు, ప్రతింధకునికి కీర్తి రథుడు, ఆయనకి
దేవమీధుడు, ఆయనకి విభుదుడు, ఆయనకి మహీంద్రకుడు, ఆయనకి స్వర్ణరోముడు,
స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు, జనకుని కూతురు సీత.
రేప్పొద్దున ప్రవర చెప్తారు కళ్యాణంలో, ఈ వరుస క్రమంలోనే
చెప్తారు రేపొద్దున కళ్యాణంలో చెప్పేటప్పుడు, కాబట్టీ ఆ సీతమ్మ తల్లినే జనక
మహారాజుగారు రామ చంద్ర మూర్తికి ఇవ్వబోతున్నారు అంటే జనకుడు అన్నారు, నా కుమార్తె
ఇంకొకతి ఉంది ఊర్మిళ, ఆమెని లక్ష్మణునికి ఇస్తాను అని అన్నాడు. ఈలోగ విశ్వామిత్ర
మహర్షి జోక్యం చేసుకుని ఇక్కడవరకూ వచ్చింది కాబట్టి నేను ఒకమాట చెప్తాను, ఈ జనక
మహారాజుగారి యొక్క తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, ఈ కుశధ్వజుడికి ఇద్దరు
బిడ్డలున్నారు మాండవి, శృతకీర్తి. మాండవి శృతకీర్తిని భరతునికి, శత్రుజ్ఞునికి
ఇచ్చి వివాహంచేద్దాం
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
అన్నారు, సరే అంగీకరించారు.
నాందీ దేవతా ఆహ్వానం సమావర్తన కార్యక్రమం, ఒక లక్ష గోవులని సమర్పించి, దానంచేసి
దశరథ మహారాజుగారు అత్యద్భుతంగా స్నాతక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. స్నాతకము అన్నమాట
వైధిక సంసృతిలోనిది అది బాగాగుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయాలో స్నాతకోత్సవాలు
వస్తున్నాయి అంటూంటారు. స్నాతకం అంటే ఏమిటో తెలుసాండీ! గురువుగారు నిర్ణయించాలి స్నాతకంలో వీడు
గృహస్తాశ్రమానికి పనికి వస్తాడా పనికిరాడాని అందుకని చెప్తారు ఓరేయ్ నాయనా
నీవు ఆశ్రమంమారి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? “సత్యం బ్రుయాత్, ప్రియం
బ్రుయాత్, నబ్రుయాత్ సత్య మప్రియం” నీవు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా మాట్లాడు
సత్యమే మాట్లాడు శ్రద్ధయా దేనం నీవు ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వు,
అస్రద్ధగా ఇవ్వకు తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, అథితుల్ని గౌరవించు
ఇన్నిమాటలు గురువుగారుచెప్తే అన్నిటికీ అంగీకరించిన తరువాత ఇతనికి నీవు పిల్లని
ఇవ్వచ్చని చెప్తారు గురువుగారు అది స్నాతకోత్సవం. పట్టభద్రుడైనట్లే స్నాతకోత్సవంలో
గృహస్తాశ్రమంలోకి వెళ్లడానికి యోగ్యత గురువుగారిచేత ప్రకటింపబడుతుంది.
ఇప్పుడు ఈ
స్నాతకోత్సవమంతా పూర్తైంది, కళ్యాణోత్సవానికి వివాహనికి రమ్మని జనక మహారాజుగారు
రమ్మని కబురుచేశారు, దశరథ మహారాజుగారు తన కుమారులను తీసుకొని వివాహ మండపంలోకి
ప్రవేశించారు, వేదిక మీద చక్కగా బంగారు కళశలు పెట్టారు, పాలికలు పెట్టారు, వాటిలో
లాజలు, పేలాలు పోశారు, అందులో అంక్షతాపరోహణం చేశారు మొలకలన్నీ కూడా చక్కగా అందులో
ఆ మట్టిపోసి ఆ మట్టిలో నవధాన్యాలువేసి అన్ని పూజాద్రవ్యాలని కూడా
మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలు అవన్నీ పేలాలు మొదలైనటువంటి పరమమంగళద్రవ్యాలు. మేము
ఏదైనా పెద్ద ఉత్సవంచేస్తే కాకినాడ పట్టణంలో ఊరేగింపులో ముందుగా కన్యలందరూ కూడా
పేలాలు చల్లుతూ వెల్తారు, పేలాలు చల్లితే దేవతలు వస్తారు, మరమరాలు చల్లితే
ప్రేతాలు వస్తాయి, అందుకే శవాన్ని తీసుకెళ్ళితే మరమరాలు చల్లుతారు. ఇంట్లో మరమరాలు
పెట్టరు పిల్లలకి అందుకే ఎందుకురా కిందా మీద పోస్తావ్ పేలాలు తిను అని అంటారు. పేలాలు ఎప్పుడు యజ్ఞ యాగాది
క్రతువులలో దేవతల యొక్క అనుగ్రహానికి వాడబడుతాయి. అవి మంగళ ద్రవ్యాలు అవి
వేదిక మీదకి ఎప్పుడు ముందే పెళ్ళికి సిద్ధంగాపెట్టి ఉంచాలి, అవి ఉంటే చాలు
మంగళప్రదం కొన్ని ద్రవ్యాలకి ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సిద్ధంగా
ఉన్నారు. సీతమ్మ తల్లి అగ్నిహోత్రానికి అటుకూర్చుంది, రామ చంద్ర మూర్తి ఇటు
కూర్చున్నారు, జనక మహారాజుగారు వచ్చారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకున్నారు.
తతస్సీతాం సమానీయ
సర్వాభరణభూషితామ్ !
సమక్షమగ్నే స్సంస్థాప్య
రాఘవాభిముఖే తదా ! అబ్రవీజ్జనకో రాజా కౌలస్యానన్దవర్ధనమ్ !! రామున్ని చూసి అన్నారు
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ
తవ ! ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా !!
పతివ్రతా మహాభాగా
ఛాయేవానుగతా సదా ! ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మన్త్రపూతం జలం తదా !!
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
సాధు సాధ్వితి
దేవానా మృషీణాం వదతాం తదా ! దేవదున్దుభిర్నిర్ఘోషః పుష్పవర్ణో మహానభూత్ !!
ఏవం దత్త్వా తదా సీతాం మన్త్రోదకపురస్కృతామ్ ! అబ్రవీజ్జనకో
రాజా హర్షేణాభిపరిప్లుతః !!
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఆయన ఆ సీతమ్మ
తల్లిచెయ్యి పట్టుకుని ఇయం సీతా ఈమే సీతా మమ సుతా ఎంత సంతోషమో... నా
కూతురు మమ సుతా సహధర్మచరీ తవ ఎందుకిస్తున్నానో తెలుసా? ధర్మంలో నిన్ను
అనుసరించి ఉంటుంది పతివ్రతా పతివ్రతా ఈమే వివాహమునకు పూర్వము చేసిన నోములన్నీ మంచి భర్త కోసం, వివాహం
తరువాత చేసేవన్నీ నీ యొక్క అభ్యున్నతి కోసం పతివ్రతా మహాభాగా
ఛాయేవానుగతా సదా నీడ అనుసరించినట్లు నిన్ను అనుసరిస్తుంది. అటువింటి పిల్లని
నీకు ఇస్తున్నానని చెప్పి రామ చంద్ర మూర్తి చేతిలో సీతమ్మచెయ్యి పెట్టి పాణిగ్రహణం
వాళ్ళకి సుమూహూర్తం. కాబట్టి ఆ సుమూహూర్తసమయానికి పాణీగ్రహణం చేయించారు. దేవ
దుందుభులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది.
ఆతరువాత లక్ష్మణాగచ్ఛ
భద్రం తే ఊర్మిలాముద్యతాం మయా ! ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః !! లక్ష్మణా
రా రా! అని చెప్పి లక్ష్మణున్ని కూడా ఆ లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని ఊర్మిళ
యొక్క చేయి లక్ష్మణుని చేతిలో పెట్టారు. తరువాత తమేవముక్త్వా జనకో భరతం
చాభ్యభాషత ! గృహాణ పాణిం మాణ్డవ్యాః పాణినా రఘునన్దన !! మాండవి యొక్క చేతిని
భరతుడి యొక్క చేతిలో పెట్టారు శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః
శ్రుతకీర్త్యా మహాబాహో! పాణిం గృహ్ణీష్వ పాణినా !! శత్రుఘ్నుడి యొక్క చేతిలో
శ్రుతకీర్తి యొక్క చెయ్యిపెట్టారు. నలుగురు అన్నదమ్ములకీ వివాహాలు పూర్తైయ్యాయి
చాలా సంతోషంగా ఆరోజు రాత్రి సీతా రామ కళ్యాణం పూర్తైపోయింది. మరునాటి ఉదయం
విశ్వామిత్ర మహర్షివచ్చి వాళ్ళకి అంక్షంతలువేసి ఆశీర్వచనంచేసి వాళ్ళకు నేను ఉత్తర
దిక్కుగా కౌశికి నది దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని బయలుదేరిపోయాడు. బయలుదేరి
మహానుభావుడైనటువంటి దశరథ మహారాజు కుమారులతోటి కోడళ్ళతోటీ వశిష్టాది మహర్షులతోటీ
సంతోషంగా బయలుదేరితే దుశ్శకునాలు కనపడ్డాయి, పెద్దగాలి లేచింది, చెట్లు
పడిపోతున్నాయి, పక్షులు కోలాహలం చెందుతున్నాయి, ఎందుకిలా జరుగుతుందంటే వశిష్ట
మహర్షి అన్నారు భయం లేదు దుర్నిమిత్తములని బట్టి గమనిస్తే ఏదో పెద్ద ఉపద్రవం
వచ్చినట్టుగా వస్తుంది కానీ, వచ్చి తప్పిపోతుంది సంతోషంగా ఉంటాం అన్నాడు. ఇంతలోకే
రుద్రతేజస్సుతో సమానమైన తేజస్సుతో పరశురాముడు కనపడ్డాడు.
దదర్శ భీమసఙ్కాశం
జటామణ్డలధారిణమ్ ! భార్గవం జామదగ్న్యం తం రాజరాజవిమర్దినమ్ !!
కైలాసమివ దుర్ధర్షం
కాలాగ్నిమివ దుస్సహమ్ ! జ్వలంతమివ తేజోభిర్దుర్నిరీక్షం పృథగ్జనైః !!
స్కన్ధే చాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమమ్ ! ప్రగృహ్య
శరముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్ !!
త్రిపురములను కాల్చినటువంటి పరమ శివుడు ఎటువంటి తేజస్సుతో
ఉంటాడో అటువంటి తోజస్సుతో ఆ గండ్ర గొడ్డలిని చేత్తో పట్టుకుని విష్ణుచాపాన్ని ఒక
చేత్తో పట్టుకుని పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమై లోకంలో రెండే శివ
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ధనుస్సులున్నాయి,
శివ ధనుస్సు విష్ణు ధనుస్సు మహానుభావుడైనటువంటి విశ్వకర్మ నిర్మించి శివకేశవులకి
ఇచ్చాడు, అన్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండీ! అది లోకరక్షణ కొరకు రెండు
రూపములుగా ఈశ్వర స్వరూపము ప్రకాశించి
ఇవ్వబడుతుంది. తప్ప
నిజంగా బేధాలుంటాయని మీరు అనుకోకండీ ఎప్పుడూ హృదయంలో పెట్టుకోకూడదు కాబట్టి
దేవతలకి ఒకనాడు ఒక ముచ్చట వచ్చింది. శివ కేశవుల మధ్యలో యుద్ధం జరిగితే ఎవరు
గెలుస్తారని, శివ కేశవుల మధ్య యుద్ధం జరుగడానికి నారెండు చేతులా మధ్య కొట్టుకోవడం
ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది. కాబట్టి ముచ్చట తీర్చాలి అంటే ఏం చేస్తారు,
నాన్నగారు బాబయ్య కాసేపు పిల్లవాన్ని సంతోషింపజేయడానికి కుస్తీపట్లుపడితే ఎలా
ఉంటుందో అలా కుస్తీపట్లుపట్టారు. కాని భవిష్యత్ దర్శనం కలిగినవాడు కాబట్టి ఈ
ధనుస్సుతో ఒక పనుంది కాబట్టి విష్ణు ధనుస్సుని రుచీకుడి దగ్గర పెట్టరూ, శివ
ధనుస్సుని జనక మహారాజుగారి దగ్గరికి వచ్చేట్టు చేశారు. దానివల్ల సీతారామ కళ్యాణం
జరుగుతుంది. విష్ణు ధనుస్సువల్ల రావణ సంహారం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విష్ణు
ధనుస్సుని తీసుకొచ్చి ఇచ్చేయాలి, ఎందుకంటే రామావతారం వచ్చేసింది. ఇప్పుడు ప్రయోజనం
నెరవేరిపోవాలి, పరశురాముడు వచ్చాడు, ఇప్పుడు నీవు శివ ధనుస్సుని భిన్నం చేశావని
తెలిసింది, ఏదీ ఈ విష్ణు ధనుస్సుని స్వీకరించు చూద్దాం, దీన్ని కూడా తీసుకొని
బాణాన్ని ఎక్కుపెట్టగలవా? ఎక్కుపెడితే నీతో ద్వంద యుద్ధం చేస్తాను అన్నాడు.
అంటే రాముడికి కోపం
వచ్చిందట, ఎందుకో తెలుసా? నీవు చెప్పినటువంటి మాటలు ఆధరింపబడవలసినవిగా ఉన్నాయి
పరశురామా నీవు ఒకమాట చెప్పావు, నీ తండ్రి జమదగ్ని మహర్షిని కార్తవీరార్జునుడు
సంహరించినప్పుడు, కార్తవీరార్జునున్ని నీవు సంహరించి తండ్రి యొక్క ఋణాన్ని
తీర్చుకున్నాను, క్షత్రియుల్ని 21 సార్లు భూమండలమంతా పర్యటించి సంహరించావని
అంటున్నావు, ఓడించాను అని అంటున్నావు, ఆ తరువాత భూమి నంతటిని కశ్యప ప్రజాపతినిధికి
దానం చేసేశావు? దానంచేసి నీవు ఉండటానికి చోటులేదు కాబట్టి మహేంద్రగిరి మీద
నివసిస్తున్నావు, నీవు సంపాదించిన అక్షయమైన పుణ్యలోకాలు ఉన్నాయి కానీ నేను చేతకాని
వాడినన్నట్లు మాట్లాడుతున్నావు, నేను విష్ణు ధనుస్సుని స్వీకరిస్తున్నానని
స్వీకరించి బాణాన్ని ఎక్కుపెట్టాడు, కోపమెందుకో తెలుసాండీ! ఎక్కుపెడితే ఇంక ఆ
బాణంపోదు, రామ చంద్ర మూర్తి ఎక్కుపెడితే వేయాల్సిందే ఎవరి మీద వేయాలి ఇప్పుడు ఆ
బాణం చెప్పు. తెలుసుకున్నాడు మహానుభావుడు ఓ అవతార పరిసమాప్తి చేయవలసిన, అంటే
అవతారము తిరగవలసిన పనిలేదు ఇంకా వచ్చేసింది రామావతారం, వైష్ణవీ శక్తి విష్ణువులోకి
వెళ్ళిపోవాలి, రాముడిలోకి వెళ్ళిపోవాలి, విష్ణు చాపం రాముడిలోకి వెళ్ళిపోవాలి, శివధనుస్సు
మిశగా సీతమ్మ రాముడి పక్కకు వచ్చేసింది మాయా స్వరూపం పరబ్రహ్మమును ఆవహించింది. ఆయన
చెప్పు చేతల్లోకి వచ్చేసింది ఇప్పుడు మాయా స్వరూపం వచ్చేసింది, వైష్ణవీ శక్తి
ఆవాహనం పూర్తవ్వాలి, కాబట్టి విష్ణు ధనస్సు
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
వెళ్లిపోవాలి,
కాబట్టి నేను ఆర్జించిన పుణ్యలోకములను కొట్టేయ్, గమనశక్తి లేకపోతే నేను వెళ్ళలేను
మహేంద్ర గిరికి కాబట్టి లోకాల్ని కొట్టేయమన్నాడు, ఆ బాణంతో అక్షయ పుణ్యలోకాల్ని
కొట్టేశాడు. పరశురాముడు సంపాదించినవి రామ చంద్ర మూర్తి ఆయన ఒక్క అడుగులో మహేంద్ర
గిరి పర్వతానికి వెళ్ళిపోయాడు రామా! ఇక నీవు ఎవరో నాకు అర్థమయ్యింది అన్నాడు అది
అసలు రామ పరశురాములు కలుసుకోవడంలో వాల్మీకి హృదయం అది.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
అందుకోసం
తీసుకొచ్చారు ఆ ఘట్టాన్ని, ఇప్పుడు విష్ణుచాపం కూడా ఆయనకు అందింది, అంటే
విశ్వామిత్రుడి యొక్క హృదయం పూర్తైపోయింది. లోకానికి రాముడు ఎలా అందాలనుకున్నాడో
అలా అందించేశాడు విశ్వామిత్రుడు. అందుకే ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు, నీవు నాకు
విశ్వామిత్రుడి వైపు సంబంధీకుడివి ఆయన చెల్లెలైనటువంటి సత్యవతీ దేవీ కూమారుడివి
కాబట్టి నీ జోలికి, నీ మీద బాణం వేయటం లేదు,
అయిపోయింది వెళ్ళిపోయారు, దశరథ మహారాజుగారు సంతోషించారు, ససైన్యంగా అయోధ్యా
పట్టాణాన్ని చేరుకున్నారు. భరత, శతుఘ్నుల్ని తీసుకొని మేనమామ అయినటువంటి
యుధాజిత్తు తనరాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు, ఉన్నటువంటి రామ లక్ష్మణులు, సీతమ్మా,
ఊర్మిళ గురువుల్నీ, మామగార్ని అత్తగార్నీ ఎలా సేవించాలో అలా సేవిస్తూ చక్కగా
సంతోషంగా ఉన్నారు. రామ చంద్ర మూర్తి తనకిచ్చినటువంటి పరశురాముడు తనకిచ్చినటువంటి
విష్ణు ధనుస్సుని వరునిని దగ్గర న్యాసంగా ఉంచాడు. అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానని
ఆయన దగ్గర ఉంచాడు శుశ్రూషమాణాః పితరం వర్తయన్తి నరర్షభాః ! కాలే కాలే తు
నీతిజ్ఞాః తోషయంతోగురం గుణైః !! గురవుల్ని పెద్దల్నీ ఎలా సేవించాలో చక్కగా అలా
సేవిస్తున్నారు.
వచ్చిన కోడళ్ళు
ప్రతిరోజూ పూజా మందిరంలో గంధ పుష్ప అక్షతులతో ఆరాధన చేస్తున్నారు. బ్రహ్మణులకు
చేయవలసినటువంటి దానాలుచేస్తున్నారు, అందరూ ఎంతోసంతోషంగా ఉన్నారు. ప్రియా తు
సీతా రామస్య దారాః పితృకృతా ఇతి ! గుణాద్రూపగుణాచ్చాఽపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత !! నాకు మా తండ్రిగారు
నిర్ణయించి తీసుకొచ్చిన సంబందం నాకు ఎటువంటి పిల్ల భార్యగా ఉండాలో మా తండ్రి
గారికి తెలుసుగాబట్టి నాకు సీతమ్మ తగినది
అన్న భావనతో రాముడు సీతమ్మయందు ప్రీతితో జీవనము మొదలు పెడితే... సీతమ్మ తల్లి తన
గుణములచేత రామ చంద్ర మూర్తికి తన యందున్న అనురక్తిని ద్విగుణీకృతం చేసుకుందట,
ఇద్దరి యొక్క స్థితి ఎలా ఉందంటే...? తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే !
అన్తర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా !! తస్య భూయో విశేషేణ మైథిలీ జనకా త్మజా !
దేవతాభిః సమా రూపే సీతా శ్రీః ఇవ రూపిణీ !! ఎంత అద్భుతమైన మాటో చూడండి! సీతమ్మ
తల్లి రాముడికి తగినది, అని దశరథుడు తీసుకొచ్చాడు కాబట్టి రామునికి ప్రీతి, మరి
సీతమ్మకి రాముని ప్రీతి ఎందుకు? రాముడు నా భర్త అందుకే ప్రీతి. ఇది సనాతన ధర్మంలో
ఉన్న గొప్పతనం.
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
ఇవ్వాల తాలి కడితే
రేపు అమెరికా వెళ్ళిపోతుంది ఆయనతో... ఏం తెలుసని వెళ్ళిపోయింది? ఎవరున్నారు
రక్షకులని వెళ్ళిపోయింది? అక్కడ ఎవరున్నారని అతన్ని నమ్మి వెళ్ళిపోయింది? అంటే ఈ
దేశంలో జీవనాడి ఎక్కడుందంటే...? భర్తయే సమస్తమని నమ్ముతారు, కోటిమంది గౌరవమున్నా
భర్త ఆధరణలేకపోతే... రాత్రింబవళ్ళు ఏడుస్తుంది ఆడది. లోకమంతా తనని నిందించినా...
భర్త ఆదరణలభిస్తే చాలు, ఆనందాన్ని పొందుతుంది. సీతా రాములంటే ఎలా బతికారంటే...?
సీతమ్మ హృదయాన్ని రాముడు తెలుసుకున్నాడట, రాముడి హృదయాన్ని సీతమ్మ తెలుసుకుందట,
రాముడు నోరు విప్పి చెప్పక్కరలేదు, వారి వైవాహిక జీవితం ఎలా గడిచిందంటే...? రాను
రాను ఒకరి హృదయం మీద ఒకరు ఎంత అధికారం సంపాదించుకున్నారంటే... సీతా అనేటప్పటికి
తెస్తున్నాను ఉత్తరీయం అనాలావిడ అంటే, ఆయన ఉత్తరీయం మరిచిపోయి బయలుదేరుతాడు, అని
ఆవిడకు తెలిసుండాలి, నాథా అని ఆవిడ అంటే... తప్పకుండా ఇవ్వాళ ఉపవాసం చేద్దాం మనం,
అని రాముడు అంటాడు అంటే నోరు విప్పి చెప్పక్కర లేదు. హృదయములు మాట్లాడుకుంటాయి,
అంతగా అనుగమించారు ఒకరినొకరు ఇద్దరి హృదయములు మార్పిడి జరిగాయి, ఈవిడ మనసు ఆయన
దగ్గిరా, ఆయన మనసు ఈవిడి దగ్గర ఒకరి మనసు ఒకరి దగ్గర లేవు ఇది సనాతన ధర్మంలో వివాహమునకు
పరాకాష్ఠ. అందుకని సుముహూర్తము అంటే...? “దృష్టియే”, “చూడ్డమే”, ముహూర్తం జీలకర్రా
బెల్లం కాదు మీరు బాగాగుర్తుపెట్టుకోండి, జీలకర్ర బెల్లం సుమూర్తం అని వేద మంత్రం
చెప్పట్లేదు. చూడడమే సుమూహూర్తం. ఏం శర్మగారూ చూడడమే, నేను ఏ సమయంలో ఈ
శుభముహూర్తంలో చూశానో ఆ శుభముహూర్తం అగుగాక అని అడుగుతాడు పెళ్ళికొడుకు అడిగితే ఇతిః
శుభమూర్తోస్తు అని ఇదే శుభముహూర్తమని సభలో ఉన్నవాళ్ళందరూ అక్షంతలు వేస్తారు.
ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం, ఈమెను నేను చూసిన ఈ క్షణం
నాకు ఐశ్వర్య ప్రదమై నా ఇంటివారిని, నా పశువుల్ని రక్షించుగాకా! అని వరుడు
అడుగుతాడు. ఏదీ ఆ మంత్రము ఒక్కసారి చెప్పండీ...! ద్విపదే రెండు కాళ్ళున్నవి,
నాలుగు కాళ్ళున్నవి ఈమేను నేను చూసిన సుముహూర్తము నందు సుముహూర్తమై వర్ధిల్లు
గాకా! ఒకరి నొకరు చూసుకోవడం సుమూహూర్తము, అందుకని తెర అడ్డు పెడతాం. అందుకే దాని
మీద స్వస్తిక్ తప్పా ఏవీ వేయకూడదు అని శాస్త్రం. అంతేకాని తొంగి తొంగి చూడమాకు
చందమామా! పిచ్ఛరాతలు అవి రాయకూడదు. శచీ పూజ చేస్తారు పెద్దలు అక్కడ. తెర ఒక్కటే
పెట్టి స్వస్తిక్ మార్కు ఒక్కటే పెట్టాలి అక్కడ తెర దించి చూస్తారు, తెర ఎత్తి
చూడరాదు, నేత్ర దృష్టి ప్రసారం తరువాత ఒకరి మనుషులు ఒకరితో కలవాలని జీలకర్ర బెల్లం
పెట్టుకుంటారు ఊర్ధన్య స్థానంలో జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లానికి నిలవ దోషం లేదు,
రెండు కలిపి నూరితే...? ధనాత్మక విధ్యుత్తు పుడుతుంది, ఒకరి మూర్ధన్య స్థానం నందు
ఒకరు పెట్టుకుంటే ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతారు.
ఇవ్వాల్టి వరకూ ఆ పిల్లకీ పచ్చిపులుసులో
వెల్లిల్లుపాయవేస్తే ఇష్టం. వారం పోగానే అన్నో తమ్ముడో వంటింట్లోకొచ్చి అదేమిటే?
వంకాయ పచ్చిపులుసు చేశావ్, వెల్లిల్లుపాయలు వేసుకోలేదేమిటీ అంటే...? మీ బావగారు
తినర్రా అంటుంది. కలిసి తిరగగిలిగినటువంటి ఆయన కోసం ఆమె, ఆమె కోసం ఆయన ఇది రావడానికి
జీలకర్ర బెల్లం. ఇద్దరూ విడివిడిగా ఉండడం కుదరదు. అందుకే మనం దంపతుల మధ్యలోంచి మనం
నడవడం కూడా నడవ కూడదు. ఇది ఆర్ష ధర్మం యొక్క మూలాలు అక్కడ ఉన్నాయి. శ్రీ రామాయణంలో
రామ చంద్ర మూర్తి నరుడుగా వచ్చాడు, అందుకే సీతా రామ కళ్యాణం తరువాత వాళ్ళిద్దరి
యొక్క మనస్సులు ఏకీకృతమయ్యాయి, అంత గొప్పగా సీతా రాములు సంతోషంగా హాయిగా జీవిస్తూ,
ఎన్నో ఋతువులలో ఆనందమును అనుభవించి ఉన్నారు అన్న మంగళకరమైనటువంటి వాక్కు దగ్గర
అబ్బో దగ్గర దగ్గరిగా మూడు గంటలు మాట్లాడినాము కాబట్టి నేటి ప్రసంగాన్ని ఇక్కడితో
పూర్తిచేస్తాను.
బాల కాండ ఏడవ రోజు
ప్రవచనము
|
నేను ఒక్కమాట
చెప్పి పూర్తి చేసేస్తాను రేపు ఉదయం పదిగంటలకి సీతారామ కళ్యాణం ఆ సీతారామ
కళ్యాణానికి ముందు త్యాగరాజుస్వామి కీర్తనలనీ రామదాసుగారి కీర్తనలనీ అత్యంత
భక్తితో పాట పాడటంకాదు ఉపాసనే మా అక్కగారిది, నేను ఆవిడనీ అక్కగారే అని
పిలుస్తుంటాను, అంతప్రీతి ఆవిడకి అంత భక్తితత్పరురాలు అటువంటి అంతగంధర్వ విధుషీమణి
మహాతల్లి ఆవిడ కాకినాడ పట్టణం నుంచి బహుషా వచ్చి ఉండి ఉంటారు, పెద్దావిడ
సూర్యకుమారిగారని ఆవిడ రేపు ఒక గంటసేపు కీర్తనలు చేస్తారు. సీతమ్మ తల్లిని
కూర్చోబెట్టిన తరువాతా సభామంటపంలోకి వరుడు ప్రవేసిస్తుంటే... ఏ దుశ్శకునములుకాని
దగ్గుకానీ తుమ్ముకాని వినపడకుండా వేదమంత్రాలువుంటాయి, ఆ మంత్రాలను చక్కగా
పటిస్తూండగా పల్లకిలో రామ చంద్ర మూర్తి వేదికమీదికి వస్తారు. సీతారాముల కళ్యాణం
జరుగుతున్నప్పుడు మధుపర్కము అంటే బట్టకాదు, మధుపర్కము అంటే పాలూ తేనే కలిపి అల్లునికి
ఇస్తారు దానికి మధుపర్కము అని పేరు. ఇప్పుడు మనం మధుపర్కము అంటే ఝరి అంచు పంచె
అనుకుంటున్నాము. వచ్చినవాళ్ళకు కూడా గౌరవానికి మధుపర్కము ఇస్తారు, కాబట్టి మీకు
అందరికీ తాగడానికి నిమ్మకాయనీళ్ళు ఇస్తారు, సౌభాగ్యవతులందరికీ కూడా కళ్యాణం
పూర్తైపోయిన తరువాత సౌభాగ్యవస్తువులు ప్రధానంచేసి వాళ్ళందర్నీ ఆనందింపజేస్తారు,
అత్యద్భుతమైనటువంటి సీతారామ కళ్యాణం చాలా అద్భుతంగా ఆనాడు ఎంతగొప్పగా జరిగిందో
అందగొప్పగానూ వాళ్ళ అనుగ్రహంతో రేపటిరోజున జరుగుతుంది. ఇవ్వాళ పెళ్ళి కుమార్తెను
పెళ్ళుకుమారుని చేశారు అదిగో రామయ్య పెళ్ళి కొడుకుగా పూల మాల వేసుకుని బుగ్గన
చుక్కపెట్టుకుని వాళ్ళపెళ్ళికథవింటూ మురిసిపోతూ వాళ్ళలలా చూస్తూన్నారు.
కాబట్టి రేపు మీ అందరూ కూడా తప్పకుండా 9 గంటలకే కార్యక్రమం
ప్రారంభం కాబట్టి ఏనిమిదిన్నరా పావుతక్కువ తొమ్మిదికే వచ్చేస్తే చక్కగా హాయిగా
సంతోషంగా సావకాశంగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం
చేసుకోవలసిందిగా కార్యనిర్వాహక వర్గంవారితరుఫున మిమ్మల్నందర్నీ ఆహ్వానంచేస్తూ ఒక్క
పదకొండుమాట్లు సీతారామ కళ్యాణం చెప్పుకున్నాం కాబట్టి రామ నామం చెప్పి
పూర్తిచేద్దాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
భక్తితో భజియించువారిక ముక్తియొసగును రామ నామము !!రా!!
సకలజీవులలలోనవెలిగే సాక్షిభూతము రామ నామము !!రా!!
శాంతిగా ప్రార్తించువారికి సౌఖ్యమైనది రామ నామము !!రా!!
రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీ రామ నామము !!రా!!
రావణానుజహృదయపంకజరాజకీరము రామ నామము !!రా!!
బాల కాండ ఏడవ
రోజు ప్రవచనము
|
తల్లివలెరక్షించు
సుజనులనెల్లకాలము రామ నామము !!రా!!
శరణుశరణను విభీషణునకు శరణమొసగిన రామ నామము !!రా!!
పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
జీవితంబున నిత్యజపముగ చేయవలె శ్రీ రామ నామము !!రా!!
ఆత్మసంయమయోగ సిద్ధికి ఆయుధము శ్రీ రామ నామము !!రా!!
బ్రహ్మసత్యము జగన్మిథ్యాభావమే శ్రీ రామ నామము !!రా!!
నీవు నేనను భేదమేమియు లేకయుదన్నది రామ నామము !!రా!!
మంగళా శాసన....
No comments:
Post a Comment