Monday, 22 February 2016

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అయోధ్య కాండ 8 దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Ayodhya Kanda 8th Day


అయోధ్య కాండ


ఎనిమిదవ రోజు ప్రవచనము




నిన్నటి రోజుతో మనం బాల కాండ పూర్తిచేసుకోగలిగాం, శ్రీరామాయణాంతర్గతమైనటువంటి బాల కాండ పూర్తిచేసి ఈనాడు అయోధ్య కాండలోకి ప్రవేశిస్తున్నాము. వాల్మీకి మహర్షీ ఆ కాండలకి ఆ పేర్లు ఉంచడం వెనకా శ్రీరామాయణానికి సంబంధించినటువంటి కథా విశేషాలన్ని వివరణచేస్తున్నటువంటి పరిస్థితినిబట్టి ఆ కాండలకి ఆ పేర్లు ఉంచారు, అయోధ్య కాండా అంటే ప్రధానంగా అయోధ్యా నగరంలో జరిగినటువంటి ఇతివృత్తం. అదేమిటీ శ్రీరామాయణం రామ చంద్ర ప్రభువు అయోధ్యలోనేగావుండాలి, మిథిలా నగరంలో సీతారములకీ వివాహమైతే వాళ్ళు తరువాత ఎక్కడుండాలని మనంకోరుకోవాలి అయోధ్యలోనేవుండాలాయన, అయోధ్యలోనే పరిపాలనచేయాలి. ఆయన అయోధ్యనే పరిపాలిస్తే ఇంక ఆయన నరుడిగా రావడం అనవసరం, ఎందుకనీ అంటే ఆయన వచ్చిన అవతార ప్రయోజనాలు రెండు, ఒకటి రావణ వధ, రెండు మనుష్యుని యొక్క గొప్పదనాన్ని నిరూపించడం. ఇందులో మనుష్యుని యొక్క గొప్పదనాన్ని నిరూపించడంలో కొంత భాగం జరిగింది ఇప్పటికి, మిగిలినటువంటిది రావణ సంహారం తరువాత మళ్ళీ జరగాలి, ఎందుకంటే ఆయన మళ్ళీ రాజారాముడు కావాలి, కాబట్టి అయోధ్యలోనే ఆయన ఉండడూ అన్నది సుస్ఫష్టం అయోధ్యను విడిచిపెట్టవలసి ఉంటుంది కొంతకాలం, కాబట్టి అయోధ్యను విడిచి పెట్టవలసి ఉంటుంది.
కాబట్టి అయోధ్యను విడిచిపెట్టడానికి కావలసిన కారణం ఒకటి అయోధ్య కాండలోనే పుడుతుంది. కాబట్టి ఆయన అయోధ్య కాండ అని ఆయన పేరుపెట్టడంలో ఉన్నటువంటి రహస్యమది, కేవలం అయోధ్యలో జరిగిన వృత్తాంతముతో ఉన్నదీ అయితే రామ చంద్ర మూర్తి రావణవధ అనంతరం తిరిగి వచ్చిన తరువాత కూడా అయోధ్య కాండే అనాలి కానీ అల అనలేదు రామాయణంలో బాల కాండ తరువాతది అయోధ్య కాండ అనడం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే సీతా రాముల వివాహము అవ్వటమనేటటువంటిది శ్రీరాముడిగా రామ చంద్ర మూర్తిని లోకానికి పనికొచ్చేటటువంటి వ్యక్తిగా విశ్వామిత్రుడు అందించీ తాను ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. బాల కాండ అన్న పేరు అంటారా బాల కాండ అనడానికి కారణం రాముని బాల్యం వర్ణించిందీ అని కాదు, ప్రధానంగా బాలుడు అంటే...? అందుకే గణపతిని ఎప్పుడూ బాలుడిగా చెప్తారు. తప్ప గణపతికి, సుబ్రహ్మణ్యుడికి వీళ్ళకి యవ్వనంలో ఉన్నవాళ్ళు వృధ్యాప్యంలో ఉన్నవాళ్ళకింద అనిచెప్పరు అసలు ఎప్పుడు బాలుడికిందే చెప్తారు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
Image result for బాల గణపతిబాలుడికింద ఎందుకు చెప్తారో తెలుసాండీ? బాలుడికింద చెప్పడానికి ఒక లక్షణం చెప్తారు పెద్దలు, ఇప్పుడు కోపం వస్తుంది పిల్లాడికి ఎదో నాన్నగారు కాజా ఇవ్వలేదు కోపం వస్తుంది ఆ కోపం ఎంత సేపు ఉంటుంది అంటే మనం చెప్పలేము రెండు నిమిషాలో మూడు నిమిషాలో ఉంటుంది పోతుంది. పోయి మళ్ళీ నాన్నగారండీ నాన్నగారండీ అనివాడే వచ్చేస్తాడు ఇందాక కోప్పడవుకదారా అంటే అసలు ఆ కోపపు ఛాయలు కూడా వాడి మనసులో ఉండదు వాడు అసలు నవ్వుతూ ఉంటాడు. వాడికి అసలు జ్ఞాపకం కూడా ఉండదు నిన్న నాన్నగారు కాజాతే లేదు నేను నాన్నగారి మీద కోపం పెట్టుకున్నాను అన్నవిషయం కూడా వాడి స్మృతిలో ఉండదు. అంతగా బాలురు ఎలా ప్రవర్తిస్తారో అలా మనం చేసేటటువంటి తప్పిదములును మన్నించి మనకార్యములకు విజ్ఞములను తీసేస్తారు కాబట్టీ విజ్ఞేశ్వరుడు బాలుడు, విశ్వామిత్రుడు బాలుడు, విశ్వామిత్రుడు బాలుడూ అంటే అంత స్వచ్ఛమైనటువంటి హృదయము కలిగినటువంటివాడు. బ్రహ్మర్షిత్వమును పొందినవాడు, బ్రహ్మర్షిత్వమును పొందినటువంటి విశ్వామిత్రుడు రామ చంద్ర మూర్తిని బాల కాండలో ఉత్తరోత్తరలోకాలకు పనికి వచ్చేటటువంటి ʻలోకాభి రాముడుగాʼ ఎలా తయారు చేశాడో చెప్పిన కాండ, విశ్వామిత్రుడి యొక్క జీవితాన్ని వర్ణణ చేసిన కాండ కాబట్టి దానికి బాల కాండ అని పేరు.
ఇప్పుడు మనం అయోధ్య కాండలోకి ప్రవేసిస్తున్నాం అయోధ్య కాండ తిక్కనగారి మాటలలో చెప్పాలంటే ఊర్జిత కథోపేతంబు” అంటారు. తిక్కనగారు మహా భారతంలో విరాట పర్వాన్ని ఆంధ్రీకరిస్తూ దాన్ని ఊర్జిత కథోపేతంబుఅన్నారు. ఊర్జిత కథోపేతము అంటే ఏమిటో తెలుసాండీ? మాంచి భిగితో కూడి ఉంటుందన్నమాట, అంటే నేను తేలిగ్గా మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలంటే సస్పెన్స్ (suspense) అంటే బాగా తెలిసిపోతుంది, ఊర్జితము అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఉత్కంఠ అన్నీ బాగున్నట్టు ఉంటాయి కానీ ఎక్కడో ఏమో జరిగిపోతుందన్న అనుమానం, ఇది ఎటువైపునుంచి వస్తుంది అన్నది తెలియదు, సాఫీగా నడిచిపోతున్నటువంటి కథా ముడిపడడం మొదలౌతుంది ముడిపడి ఇది ఎలా ఎక్కడ తేలుతుంది ఎలా తేలుతుందనీ శ్రోతయందు ఒక ఉత్కంఠను సృష్టిస్తుంది అలా సృష్టించడం ఎక్కడ మొదలైందో...? దాన్ని ఊర్జిత కథా అని పిలుస్తారు. బాల కాండ ఊర్జిత కథ కాదు యదార్థానికి ఎందుకంటే అసలు కొడుకులు లేరు అశ్వమేధం చేస్తానంటే, కొడుకులు పుడతారా పుట్టరా అనేటటువంటి అనుమానమేమీ లేదు, ఎందుకు లేదంటే వెంటనే సుమంత్రుడు చెప్పేశాడు నేను విన్నానయ్యా ఇంతకు ముందే బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు దగ్గర నీకు కొడుకు పుడుతాడని చెప్పాశాడు, ఋష్యశృంగుడు ఆశీర్వచనం చేసేశాడు, వశిష్టుడు ఆశీర్వచనం చేసేశాడు కాబట్టి కొడుకులు పుట్టేస్తారు కాబట్టి ఊర్జిత కథా అనడానికి ఏముంటుంది బాల కాండలో ఏమి ఉండదు.
అయోధ్య కాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఊర్జిత కథ, అయోధ్య కాండ ఊర్జిత కథగా మనకి ప్రయోజనం ఏమిటో తెలుసాండీ...? మనం గృహస్తాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళం గృహస్తాశ్రమం అనేటటువంటిది బ్రహ్మచర్యము తరువాత స్వీకరింపబడేటటువంటి ఆశ్రమము, గృహస్తాశ్రమంలో ప్రధానంగా పురుషుడు లేదా యజమాని లెదా జీవుడు ఏం చేయాలి అంటే అర్థ కామములను ధర్మ బద్ధం చేసుకొని వైరాగ్యాన్ని సంతరించుకునే ప్రయత్నం చెయ్యాలి కాబట్టి ధర్మమంతా గృహస్తాశ్రమంలోనే ఉంటుంది. పట్టుకోవలసింది అనుష్టించవలసింది అంతా ఇక్కడే, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏమిటంటే గురువుగారి దగ్గర నేర్చుకోవటం ఒక్కటే ధర్మం అంతకు మించి ఇంక బ్రహ్మచారికి ఏముంటుంది ఇంకేమీ ఉండదు ఆయనకి,


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కానీ గృహస్తాశ్రమంలోకి వచ్చేటప్పటికీ చాలా జఠిలంగా ఉంటుంది ఆ స్థితి, చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది గృహస్తాశ్రమంలో కాబట్టి రాముడు ఇప్పుడు గృహస్తాశ్రమ ప్రవేశం చేశాడు సీతా దేవిని చేపట్టాడు.
Image result for ధర్మం మార్పుకాబట్టి ఇప్పుడు రాముడు ఒక గృహస్తుగా ఎలా ప్రవర్తించి చూపిస్తాడు, ఇప్పటి వరకు ఒక బ్రహ్మచారిగా ఆయన తల్లితో తండ్రితో గురువుతో, తల్లితో తండ్రితో ఆయన ఎంత వరకు సమన్వయం చెందాడు ఏం మాట్లాడాడూ అన్నది మనకు అంత పెద్ద అవకాశంలేదు తెలుసుకోవడానికి, అంతఃపురంలో ఏదో పిల్లలతో మాట్లాడుకుంటారు అది పెద్ద విశేషమేమీ కాదు. కానీ గురువుగారి దగ్గర ఉండి నేర్చుకున్నది ఏదైతే ఉందో అది ప్రధానం, అదీ ఒక్కటే ఉంటుంది బ్రహ్మచర్యంలో గురువుగారు చెప్పింది వింటూవుండడం, గురువుగారి దగ్గర నేర్చుకుంటూవుండడం అది జరిగిందా లేదా...? జరిగింది బ్రహ్మచారిగా రామ చంద్ర మూర్తికి. గృహస్తాశ్రమంలోకి వచ్చేటప్పటికీ అనేక విధములైనటువంటి సమస్యలు తలెత్తుతాయి, ధర్మం పాత్ర మారిపోతుంది. భార్య దగ్గరికి వెళ్ళితే భర్త ధర్మం, తమ్ముడి దగ్గర నిలబడితే అన్న ధర్మం, గురువు దగ్గరికి వెళ్ళితే శిష్య ధర్మం, తండ్రి దగ్గరికి వెళ్ళితే కొడుకు ధర్మం ఏ ధర్మానికి ఆ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ అన్నిటికన్నా సమున్నతమైనటువంటి ధర్మం ఏదుందో..? అంటే వేదప్రోక్తమైనటువంటి ధర్మం ఏదుందో..? ఆధర్మంతో మీగిలినటువంటివి సమన్వయం చేసుకుంటూ వెడుతూ ఉండాలి, ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ, ఇందులో మనకు పెద్దలు ఏం చెప్తారు అంటే...
ఈ ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఒక్క వేదంలోంచే తెలుసుకోవాలి, ఎందుకంటే ధర్మం చెప్పడానికి ఇంకెవరికీ అధికారం లేదు, నేను ధర్మం చెప్తానండీ అంటే ఇంకెవరికీ అధికారం లేదు ధర్మం చెప్పడానికి నేను చెప్తానండీ ధర్మం అంటే లేదు వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. వేదం చెప్పింది ధర్మం అయితే వేదం చదివి తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఇవ్వాళ ఎంతమందికి ఉంటుంది. వేదంలో ధర్మం ఇలా ఉంది అని మనం ఎలా చెప్పగలం చెప్పలేం కాబట్టి ఋషులేం చేశారంటే స్మృతులు కింద తీసుకొచ్చారు. గౌతముడు ఒక స్మృతి రచన చేశాడు దానిని గౌతమ స్మృతి అంటారు. యజ్ఞవల్కడు ఒక స్మృతి చేశాడు ʻయాజ్ఞవల్క స్మృతిʼ, అత్రి ఒక స్మృతి చేశాడు ʻఅత్రి స్మృతిʼ స్మృతులొచ్చాయి, స్మృతులేం చేస్తాయంటే వేదంలో ఉన్నటువంటి ధర్మ సూత్రములను క్రోడీకరించి వాటిని అందంగా ఒక పొందికతో తీసుకొస్తారు దానికి ʻస్మృతిʼ అని పేరు ʻశృతిʼ ʻస్మృతిʼ రెండు విరుద్ధంగా ఉండవు, శృతిని స్మృతి అనుసరిస్తుంది. శృతిని స్మృతి ఎక్కడైనా తిరస్కరిస్తే దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అది ధర్మ విరుద్ధం అవుతుంది. అసలు ధర్మ విరుద్ధమైన విషయాన్ని ఋషి ప్రతిపాదించడు కాబట్టి శృతికీ స్మృతికీ మధ్యలో ఏదైనా భేదం ఉందా అంటే...? అది ఉన్నట్లు నీకు కనపడుతుందేమో కానీ పెద్దల దగ్గర నీవు ఆశ్రయించి తెలుసుకుంటే... ఆ భేదం ఉండే అవకాశం పెద్దగా ఏమీ ఉండదు ఋషి ఎప్పుడూ మన ప్రయోజనం కొరకే మాట్లాడుతారు.
కాబట్టే రఘువంశ కావ్యంలో కాళిదాసుగారు ఒకమాట అంటారు, “వేదాన్ని స్మృతి ఎలా అనుసరించిందో అలా నందినీ ధేనువుని దీలీప మహారాజు అనుసరించాడుఅన్నాడు శ్రుతేరి వార్థం స్మృతి రన్వగచ్చత్ అన్నాడు. శ్రుతి యొక్క అర్థం వేదం ఏం చెప్పిందో దాన్ని స్మృతి అనుసరించినట్లు దిలీపుడు ఆ గోవుని నందినీ ధేనువుని అనుసరించాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని పాటించాలి స్మృతులన్నా తెలుసుండాలి, వేదమన్నా తెలుసుండాలి, నాకు వేదమూ తెలియదు స్మృతులూ


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
Image result for రాముని ధర్మముతెలియవు మరి ఏం తెలుసుకుంటే ధర్మం తెలుస్తుంది వేదోప బృహ్మణమైనటువంటిరామాయణంలో రాముడు ధర్మ మూర్తి అయ్యాడు ఎలా అయ్యాడు, పుట్టుక చేత ధర్మ మూర్తి కాలేదు ఎలా అయ్యాడు ధర్మాన్ని అనుష్టించి ధర్మ మూర్తి అయ్యాడు. కాబట్టి శ్రీరామాయణం అయోధ్య కాండలో ప్రత్యేకించి బాగ అర్థమైతే మీకు అనేకమైనటువంటి ధార్మిక విషయముల మీద అనుమానాలు తీరిపోతాయి. కానీ మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అర్థం చేసుకుంటే మాత్రం అసలు గృహస్తాశ్రమంలో ఎలా బ్రతకాలీ, ఎలా ఉంటాయి విషయాలు అన్నదాన్ని అసలు అయోధ్య కాండ ఆవిష్కరించినట్లుగా శ్రీ రామాయణంలో మిగిలిన కాండలు చూపించలేవు ఎందుకంటే సుందర కాండ ఉపాసన కాండ. అయోధ్య కాండ గృహస్తాశ్రమ ధర్మములను వివరించేటటువంటి కాండ అందుకే అయోధ్య కాండ ప్రధానముగా ఎవరు వినితీరాలీ అంటే గృహస్తాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వినాలి గృహస్తాశ్రమంలోకి వెళ్ళేవాళ్ళందరూ వినాలి అంటే మినహాయింపు ఎవరికి ఉంటుంది బహుశహాః ఉంటే శ్రీరామాయణాన్ని ఆదరణతో వినేటటువంటి సన్యాసికి తప్పా మిగిలిన వాళ్లందరూ వినవలసిందే అంత గొప్ప కాండ అయోధ్య కాండ. కాబట్టి ʻఊర్జిత కథోపేతంబుʼ, ఇక్కడే రసకందాయకంగా ఉంటుంది అంటే కథా ఒక కొత్త పుంత తొక్కీ అవతార ప్రయోజనంవైపుకు నడుస్తుంది అది ఎలా నడుస్తుందో ఎంత గమ్మత్తుగా నడుస్తుందో మీరు ఇప్పుడు అవధరించేటటువంటి ప్రయత్నం చేద్దురుగానీ.
నిన్నటి రోజున నేను ఒక మాట అని పూర్తి చేశాను, అన్ని ఋతువులయందు సుఖములను అనుభవించారు సీతారాములు అంటూ నేను బాల కాండను పూర్తిచేశాను. అన్ని ఋతువులయందు సుఖమును అనుభవించుట ఈ మాట కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి మీకు సుఖంగా ఉందాండీ అంటూంటారు. ఈ ఫ్యాను పెట్టి మీకు సుఖంగా ఉందాండీ అంటారు అంటే మీరు బాగాగుర్తుపెట్టుకోండీ అది ద్వందమూ అని గుర్తు ʻʼ అంటే ఆకాశం సంస్కృతంలో ʻʼ అంటే ఆకాశం ఆకాశానికి మార్పేమి ఉండదసలు అది ఎప్పుడు అలాగే ఉంటుంది దాన్లో మబ్బులు వచ్చాయి అనుకోండీ... మీకు ఇప్పుడు ఆకాశము మేఘవృతమైంది, ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి అనుకోండీ ఆకాశము నిర్మలంగా ఉంది. ఆకాశం ఏమైనా మారిందా ఆకాశం ఏం మారలేదు మబ్బులు కమ్మాయి మబ్బులు పోయాయి ʻʼ అంటే ఆకాశం ʻసుʼ ʻʼ అంటే మనసు ʻʼ అంటే ఆకాశం ʻసుఖʼ అంటే బాగున్నట్టు నీకుంటే ʻసుఖʼ  ʻసుʼ కాసేపటికి బాగుండదనిపిస్తే ʻదుఖʼ ఖ అలాగే ఉంది. ముందున్న సు మారింది దు మారింది అంతే. ఇది పట్టుకోవడానికే వైరాగ్యం వైపుకు వెళ్ళడానికి మొదటి మెట్టు. ఎందుకంటే సు ఎప్పుడూ సు గా ఉండి పోయిందనుకోండీ ʻసత్యమైʼ కూర్చుంటుంది అంటే నేను ఉదాహరణ చెప్పాలి అంటే నేను అయోధ్య కాండ రాత్రి పదుకొండైనా చెప్తున్నానుకోండీ! మీకు సు - దు అవుతుంది ఎందుకంటే ఆరున్నరకి మొదలు పెట్టింది బాగుంటుంది ఎనిమిదన్నర తరువాత కొంచెం సు చెరగడం మొదలౌతుంది. కానీ మీ విషయంలో అలా అనిపించటంలే నేను ఎంత చెప్పినా వింటున్నారు రాత్రి పన్నెండుకు కూడా నేను చెప్పడం మొదలు పెట్టాననుకోండీ ఏమో దు అవుతుందేమో, ఇదేంటీ వదిలిపెట్టడా మమ్మల్నీ అని. కాబట్టి అప్పటి వరకు బాగున్నది ఇప్పుడెందుకు బాగుండదు అంటే అప్పటికి కావలసినటువంటి ఒకటి ఆవశ్యకమైపోయి దానికిది ప్రతి బంధకమైపోయింది అప్పుడు సు - దు అవుతుంది ఈ సు దు రెండు తీసేసి ʻʼ గా ఉండిపోయాడు అనుకోండి వాడే ʻజ్ఞానిʼ అంతే ఇది మీరు పట్టుకోవడంలోనే ఉంటుంది.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టీ అన్ని ఋతువులలోనూ సుఖము అనుభవించిరి అంటే ఆయా ఋతువులలో ఏది తీసుకొని ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళు ఉన్నారు. శీతా కాలంలో ఎ.సి వేసుకు పడుకున్నాడనుకోండీ పిచ్చోడు అనుకొంటారు, వేసవి కాలంలో ఎ.సి వేసుకు పడుకుంటే సుఖంగా ఉందంటాడు. అంటే ఏ ఋతువులో దేన్నివాడుకుంటే మనసుకి సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళు గడిపారు. అంటే సీతా రాములు సంతోషంగా ఉన్నారా, మీకు అనుమానమా... అన్ని ఋతువులలలోనూ సంతోషంగా ఉన్నారంటే... 365 రోజులూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సంతోషానికి అడ్డు ఏదైనా వచ్చింది అనుకోండీ, బాగాగమనించండి నేను చెప్పే మాటని, ఇప్పుడు నేను చెప్పే మాటని అన్ని ఋతువులలో సీతా రాములు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సీతా రాములు అడవికి వెళ్ళిపోతారు పెద్ద విచిత్రమేముందండీ మీకు తెలియదా నాకు తెలియదా? దాచిపెట్టవలసిన అవసరం ఏముంది అందులో దాచిపెడితే మాత్రం మీకు తెలియదా... అడవికి వెళ్ళిపోయారు. అడవికి వెళ్ళిపోతే మీరు నేను ఏం చేస్తామంటే... ఇలా వేళ్ళు విరచీ అయ్యయ్యో ʻఅయ్యో ఎంత పనిచేసిందండి మందరా అని ఎంతపని చేసిందండి కైకమ్మాʼ రాముడు అడవికి వెళ్ళిపోయారు, పాపం ఎంత కష్టపడుతున్నాడో అంటాం.
Image result for సీతారాములుఆయనకి అది సు కాదు దు కాదు. ఆయన ʻʼ. అందుకనే నవమినాడు పుట్టాడు. ఆయనేమంటాడు అంటే... మా నాన్న గారిని సత్యంలో నిలబెట్టి నేను నా ధర్మాన్ని పాటించాను కాబట్టి నాకు సంతోషం అంటాడు. మీకు దుఃఖంలా కనపడుతున్నది రాముడికి దుఃఖం కాదు. అది రాముడికి దుఃఖమైతే నేను రామాయణం చెప్పక్కర్లేదు మీరు వినక్కర్లేదు. ఆయనకు ధర్మం కావాలి అంతే... ధర్మం పట్టుకుని ఉంటే ఆయనకు సంతోషం ధర్మం వదిలేశాడో రాముడు అది ఆయనకు ఇబ్బంది. అందుకే అసలు వదలడు. ఎప్పుడైనా వదిలిపెడుతాడేమో అన్నట్లనిపిస్తుంది ఒక్కొక్కసారి కానివదలడు దాన్నేపట్టుకుంటాడు ఇది మీరు రామపాత్ర వైపునుంచి పట్టుకోవాలి. కదలని రాముడు కదలకుండా ఉన్నా కదిలిపోతున్న పాత్రలు ఎన్నెన్నో పట్టుకోవడం రామాయణం. కదలని రాముడు కదలకుండా ఉన్నాడు కదులు తున్నవన్నీ కదలని దానిని ఆశ్రయించి కదులుతున్నాయి.
మీరు గమనించండీ! బండి కదులుతుంది, బండి కదలాలంటే దేన్ని ఆధారం చేసుకొని కదులుతుంది, చక్రాలని ఆధారం చేసుకొని కదులుతుంది. చక్రాలు దేనికి బిగింపబడి ఉంటాయి ఒక ఇరుసుకి ఉంటాయి, ఇరుసు అలా ఉండి చక్రాలు తిరుగుతుంటాయి ఒక తిరగనిది తిరుగుతున్న దాని మీద ఉంటుంది కదలని బండి కదులుతున్న చక్రాల మీద ఉంటుంది. కదులుతున్న చక్రాల వల్ల బండి కదులుతుంది తప్పా అసలు అది కదలలేదు, కదలనిదాన్ని ఆధారం చేసుకొని కదులుతూ ఉంటాయి చక్రాలు అప్పుడు మీరు ఇరుసు కదలటం లేదు చక్రాలు బిగింపబడి ఉందనుకోండీ అలా లోపల కదలని రామున్ని ఆధారం చేసుకొని కదిలిపోతున్న పాత్రలు కదిలిపోవడం మొదలవుతాయి, అయోధ్య కాండ నుంచి రామాయణాన్ని ఇంకా....  మీరు ఆ ఒక దృక్కోణం నుంచి చూడవలసి ఉంటుంది. అందుకనీ ఈ కదలికని చూపించడం ʻగచ్ఛతాʼ కదులుతున్నాయి, ఇకనుంచి నీవు జాగ్రత్తగా కదులుతున్నాయంటే కదలనిదేది కదులుచున్నదేది ఇది చూడడం నేర్చుకో... ఇది వాల్మీకి హృదయం గచ్ఛతా అని మొదలుపెట్టారు ఆయన గచ్ఛతా అంటే వెళ్ళిపోయేను. వెడలిపోయెను అన్న మాటతో మొదలు పెట్టారు అంటే అది కదలిక, వెళ్ళడం అంటే కదలిక కదాండీ ఈ కదలిక ఏ కదలని దాన్ని ఆధారం చేసుకొని కదలడం మొదలు పెట్టాయి అన్నీ... ఇది నీవు పట్టుకోగలిగితే కదలనివాడు ఎవ్వడున్నాడో దేనివలన కదలడో నువ్వు పట్టుకోగలవు. ఇది నీవు అయోధ్య కాండలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, అలా కదలక పోవడానికి కారణం ఏమిటంటే ఆయన పట్టుకున్న ʻధర్మంʼ రాముడిది.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు గచ్ఛతా మాతుల కులం భరతే న తదానఘః ! శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః !! గచ్ఛతా మాతుల కులం మాతుల కులం అంటే మేనమామగారి ఇల్లు, భరతుని యొక్క మేనమామ యుధాజిత్తు కేకయ రాజు యొక్క కుమారుడు. యుధాజిత్తు పెళ్ళికే వచ్చాడు జనక మహారాజుగారి యొక్క నగరానికి మిథిలా నగరానికి వచ్చాడు, వచ్చి పెళ్ళైపోగానే భరతున్ని శత్రుజ్ఞున్ని నేను తీసుకెళ్తానని అడిగాడు లేదా భరతున్ని అడుగుతాడు కదాండీ! శత్రుజ్ఞున్ని అడగడు ఎందుకంటే భరతుడు కదా మేనల్లుడు, కాబట్టి భరతున్ని అడుగుతాడు ఓరేయ్ నిన్ను తీసుకెళ్ళదామని వచ్చానురా, నీ పెళ్ళన్నారు అక్కడికి వచ్చాను పెళ్ళైపోయిందిగదా ఏదో నిన్ను తీసుకెళ్దామని సరదాగా నీతో గడపాలని ఉంది నాకు కొన్నాళ్ళు అందుకు వచ్చాను. కాబట్టి నిన్ను తీసుకెళ్దామనుకున్నాను అంటే భరతుడు తప్పకుండా వస్తాను మామయ్యా! అంటే గదా దశరథున్ని అడగడం తీసుకెళ్తానని మీరు బాగా ఆలోచించండి, ముందసలు భరతుడు ఒప్పుకుంటే గదాండీ దశరథ మహారాజుగార్ని అడగడం. దశరథ మహారాజుగారు భరతున్ని పిలిచి నీవు నీ మేనమాన  ఇంటికి వెళ్ళిపో అని అనరు, ఎందుకనరు ఒక్కటే కారణం కొత్తగా పెళ్ళైంది, తన భార్యతో కలిసి వచ్చాడు అయోధ్యకి మాండవితోటి, శత్రుజ్ఞుడికి శృతకీర్తితో వచ్చాడు. పిలచి ఓరేయ్ నీవు నీ మేనమామ ఇంటికి వెళ్లండ్రా అని ఎందుకంటాడు మధ్యలో... అనడు కాబట్టీ యుధాజిత్తు భరతున్ని అడిగాడు భరతుడు దశరథున్ని అడిగాడు దశరథుడు వెళ్ళు అన్నాడు. ఇది ʻఊర్జిత కథోపేతంబుʼ అలా అంటాడా ఏ తండ్రైనా? ఇప్పుడేమిట్రా మేనమామ ఇంటికీ మొన్ననే కదా పెళ్ళైందీ, కొత్తగా నలుగురూ వచ్చారూ కోడళ్ళూ ఏదో సంతోషంగా ఉన్నాం కదా... ఇప్పుడు నీవు వెళ్ళిపోతానంటావేమిటీ...? పైగా మీరు ఆలోచించండీ... భరతుడు దశరథున్ని పంపించేశాడు అనుకోండీ బాగా ఆలోచించండి మీరు భరతున్ని సరే వెళ్ళు మేనమామ ఇంటికీ అన్నాడు.
Image result for భరత శత్రుజ్ఞులురాముడు సీతమ్మతో, లక్ష్మణుడు ఊర్మిళతో, శత్రుజ్ఞుడు శృత కీర్తితో అక్కడే ఉంటారు. కొడుకూ కోడలూ కూడ ఉండి లేకుండా పోయింది ఎవరై ఉంటారు కైకమ్మై ఉంటుందా? కైకమ్మంటే దశరథ మహారాజుగారికి మహా ఇష్టం ముగ్గురు భార్యలలోకి ప్రియపత్ని ఆయనకి. ఇప్పుడు ప్రియపత్ని దగ్గరికి రోజూ రాత్రి ఆమె దగ్గరికే వెళ్తాడు, పెద్దభార్య దగ్గరికి కూడా వెళ్ళడు, కౌశల్యే చెప్పింది ఆమాట, కైకమ్మ దగ్గరికి వెళ్ళితే కైకమ్మ ఏమంటుంది. ఏమండీ వాన్నేమో మీరు పంపించేశారు ఇల్లు చిన్నబోయింది, కొడకు లేడు కోడలూ లేరు, వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు నేను చూడండీ ఎలా ఉన్నాను? అని అంటుందా అందా... కాబట్టి కైకమ్మని అడక్కుండా వెళ్ళిపో అంటాడా...? అన్నాడు. భరతుడేం చేశాడు, సరే మామయ్యా నీతో వచ్చేస్తాను అని తను వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతూ ఏం చేశాడు శత్రుజ్ఞున్ని తీసుకెళ్ళిపోయాడు. అసలు మొదటి శ్లోకంలో ఉందండీ పట్టంతాను అయోధ్య కాండలో గచ్ఛతా మాతుల కులం భరతే న తదానఘః ! శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః !! తీసికెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళాడు శత్రుజ్ఞున్ని అత్యంత ప్రీతితో తీసుకెళ్ళాడు, అత్యంత ప్రీతితో తీసుకెళ్ళడం దోషం కాదు కానీ శ్రీరామాయణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనంచేస్తే మాండవీ శృత కీర్తీ కూడా భరత శత్రుఘ్నల్తో యుధాజిత్తు ఇంటికి వెళ్ళినట్లు కనబడదు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
భరతుడు తన మేనమాట ఇంటికి వెళుతున్నాడు శత్రుజ్ఞుడికి యుధాజిత్తు మేనమామ కాడు, కానప్పుడు భరతుడు శత్రుజ్ఞున్ని ఎలా పిలిచాడు రమ్మని పిలిచాడు పో, శత్రుజ్ఞుడు ఎలా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయేవాడు హూ...హ్ ఇప్పుడు రమ్మంటున్నాడేమిట్రా మమ్మల్నీ బాగుంటుందాని ఏమాత్రం అనుకోకుండా ప్రీతితో వెళ్ళిపోయాడు, ప్రీతితో తీసుకెళ్ళిపోయాడు. అంటే భరత శత్రుజ్ఞుల మధ్య ఉన్న అన్యోన్యత ఎంత గొప్పదంటే... భరతుడు ఎక్కడుంటే శత్రుజ్ఞుడు అక్కడ ఉంటాడు. కథని కథగా వినండి అంతే అదే మీకు మనవిచేసింది మీరు శ్రీరామాయణాన్ని పెద్ద చివలవలు పలవలు చేయక్కర లేదు. కథని కథగా వినండి అంతే అది అమృత ఫలం. ఎందుకంటే అది జరిగిన కథ వాల్మీకి మహర్షి ఆచనమంచేసి దర్శనంచేసి రాశారు మళ్లీ మీరెందుకు దాన్నికి కొత్తగా వన్నెలు అద్దడం ఏమి అక్కరలేదు. ఉన్నవి వినండి చాలు ఉన్నది వింటే మీకు అంమృతం లభిస్తుంది. అవతార ప్రయోజనం నేరవేరడానికి కథ ఎలా బిగుస్తుందో చూడండీ, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంది, మిగిలిపోయిన వాళ్ళు ఇద్దరు ఎవరూ రామ లక్ష్మణులు మిగిలిపోయారు, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు అయోధ్యలో ఉన్నారు వాళ్ళిద్దరి భార్యలు ఎక్కడున్నారు అయోధ్యలోనే ఉన్నారు. భరత శత్రుజ్ఞుల భార్యలు ఎక్కడున్నారు అయోధ్యలోనే ఉన్నారు. పంపించిన దశరథుడు ఏదైనా మనసులో వాళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టం లేక పంపాడా...? వెళ్ళిపోయినవాళ్ళు పెళ్ళవగానే ఏదైనా మనసు మారి మనం ఇక్కడ ఎందుకు మేనమామగారి ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారా ఇప్పటి వరకు ఇలాంటి అనుమాలేమీ లేవు రామాయణంలో... కదాండీ!
రామాయణం జరుగుతున్నప్పుడు దశరథుని అంతఃపురం పక్కింట్లో మీరు ఉన్నారని ఊహిస్తే... లోకం విషయాలు మనకు ఎక్కువ కావాలి కాబట్టి మనం ఆ కోణంలో ఆలోచించినప్పుడు దశరథుడు వెళ్ళమన్నాడా పెళ్ళవగానే ఏమైనా మార్పువచ్చి ఎవరి గొడవవాళ్ళు చూసుకుంటే భరత శత్రుజ్ఞులు ఇద్దరు వేరే వెళ్ళారా ఇందులో కొత్త గొడవ ఏమిటంటే... భరత శత్రుజ్ఞులు అన్నదమ్ములుకారు ఒక తల్లి బిడ్డలుకారు నలుగురూ ఒక తండ్రి బిడ్డలు కానీ నలుగురూ ముగ్గురు తల్లుల బిడ్డలు. ఇందులో రామ లక్ష్మణులు ఓ తల్లి బిడ్డలు మిగిలిపోయి, భరత శత్రుజ్ఞులు ఓ తల్లి బిడ్డలు వెళ్ళిపోతే ఏదో ప్రమాదాన్ని మీరు శంకించచ్చు, రాముడు దగ్గర సుమిత్ర కొడుకు ఉన్నాడు, భరతుడు దగ్గరా సుమిత్ర కొడుకే ఉన్నాడు. సుమిత్రకి ఇద్దరు బిడ్డలు లక్ష్మణుడు శత్రుజ్ఞుడు. ఒకడు రాముడితో ఉన్నాడు ఒకడు భరతునితో ఉన్నాడు ఒక తల్లి బిడ్డలే అయినా కూడా ఏమండీ రాజ్యం కదా అధికారం కదా వాళ్ళిద్దరి మధ్య మళ్ళి పొసగలేదు అందువల్ల ఒకాయన అటు చేరాడు, ఒకాయన ఇటు చేరాడు అని అనుకుందామా అలా ఆ అనుమానం ఏమైనా ఉందా మీకు ఊర్జిత కథోపేతంబు ఆ కదలికలోనే ఎన్ని కదలికలు వచ్చాయో చూడండీ, ఎన్ని ఆలోచనలు భరతుడు ఒక్కడు కదిలితే శత్రుజ్ఞున్ని తీసుకొని వెళ్ళిపోతే ఎంత కదిలిందో చూడండీ కథ ఎన్ని ఆలోచనలు కదిలాయో చూడండీ ఇప్పటివరకు అలా అవకాశం ఉందా ఎక్కడైనా లేదు ఇంక ఇక్కన్నుంచి అన్ని కదులుతుంటాయి లోపల.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
Related imageకాబట్టి ఇప్పుడు వెంటనే మహర్షి అంటారు స తత్ర న్యవసత్ భ్రాత్రా సహ సత్కార సత్కృతః ! మాతులే నాశ్వపతినా పుత్ర స్నేహేన లాలితః !! మేనమామచేత భరత శత్రుజ్ఞున్ని కూడా తీసుకొని వెళ్ళినా, భరతుడు మేనమామయైన యుధాజిత్తు వీడుకూడా ఎందుకు వీడితోటి అన్న భావన ఏమీలేదు ఈ ఇద్దరి పిల్లలకి యుధాజిత్తు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నేను అన్నయ్యతో వెళ్ళడమెందుకని శత్రుజ్ఞుడికి లేదు, ఇప్పుడు తమ్మున్ని తీసుకెళ్ళడం ఎందుకని భరతునికి లేదు అంటే అందరి మనసులు నిర్మలంగానే ఉన్నాయా? మరి ఎందుకు తీసుకెళ్ళినట్టు యుధాజిత్తు ఒక్కకారణంచేత మాత్రమే తీసుకెళ్ళాడు మేనమామగా తన ముద్దు చెల్లించుకోవడానికి అంతకన్నా నీవు అనుమాలేమీ పెట్టుకోవద్దు మహర్షి వేసినటువంటి సంకేతం, నీవు అంతకన్నా ఏమైనా అనుమానాలు పెట్టేసుకుంటామేమో...? అక్కర్లేదు ఎందుకని పుత్ర స్నేహేన లాలితః !! మాతులే నాశ్వపతినా అశ్వపతి యుధాజిత్తుకున్న మారు పేరు కేవలం మేన మామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయీ అని జానపదం. మేనమామల ముద్దు మేలైన ముద్దు అందుకని మేనమామ తీసుకెళ్ళాడు వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన వాళ్లు అక్కడికి వెళ్ళిపోయారు కదా పెళ్ళవగానే మరి భార్యల మీద కానీ తండ్రి మీద కానీ వాళ్ళు అంత ప్రేమ లేని వాళ్ళా మరి రామ లక్ష్మణులు ఉన్నారే... వాళ్లిద్దరు వెళ్ళిపోయారు. తల్లి తండ్రుల మీద ఏమండీ మీరు ఏమైనా చెప్పండి కానీ తల్లి తండ్రుల మీద ప్రీతి ఎక్కువ అందుకే వీరు ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళలేదు, వాళ్ళిద్దరు మాత్రం చూడండీ తగుదునమ్మా అని మేనమామ ఇంటికి వెళ్ళిపోయారని మీరు అంటారేమో....?
వెంటనే మహర్షి అంటారు సర్వ ఏవ తు తస్య ఇష్టాః చత్వారః పురుషర్షభాః ! స్వ శరీరాత్ వినిర్వృత్తాః చత్వార ఇవ బాహవః !! దశరథ మహారాజు గారికి రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురియందున్నటువంటి ప్రీతి ఎటువంటిదంటే..? తన శరీరంలోనే ఉన్నటువంటి ఉత్పన్నమైన నాలుగు బాహువులయందు తనకి ఎలా సమానమైన ప్రేమ ఉంటుందో... దశరథుడుకి కూడా అలాగే ఉందట. నలుగురు కొడుకులు మీద సమానమైన ప్రేమ ఉన్నది. అంతే తప్పా భరత శత్రుఘ్నల మీద తక్కువ ఉన్నది ప్రేమా రామ లక్ష్మణుల మీద తక్కువ ఉన్నది ప్రేమా అని అలా ఏమీ ఆయనకు లేదు ఆయనా మేనమామ పిలిచాడు పంపించాడు. రామ లక్ష్మణులు ఉన్నారూ ఇప్పుడు శత్రుఘ్నడు ఎప్పుడు భరతున్ని విడిచిపెట్టి ఉండడు వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు రామున్ని ఎప్పుడు విడిచిపెట్టి ఉండడు ఉండిపోయారు, రామునితోపాటు అంతఃపురంలో ఉండిపోయారు అంత వరకే కాబట్టీ భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపమ్ వెళ్ళిన భరత శత్రుజ్ఞులు ఎప్పుడూ దశరథ మహారాజుగారిని తలచుకుంటూ ఉంటారు, ఎందుకు తలచుకుంటూ ఉంటారు. అంటే నాన్నగారు పెద్దవారైపోయారు అది కారణం వృద్ధం అరే నాన్నగారు పెద్దవారైపోయారే... మనం మామయ్య ఇంటికి వచ్చాం సంతోషంగా గడుపుతున్నాం కానీ పెద్దాయన పాపం నాన్నగారి దగ్గర మనం ఉంటే మనం సంతోషించి ఉండేవారు నాన్నగారికి మనం శుశ్రూషచేసి ఉండేవాళ్ళం మనం ఇటోచ్చాం పెద్దవారు నాన్నగారు ఎలా ఉన్నారో అని వాళ్ళు నాన్నగారిని తలచుకొంటున్నారు తప్పా వాళ్ళకి ఇంక ఏవిధమైనటువంటి అన్యమైన ఆలోచన వాళ్ళకి లేదు.
దశరథుడికి ఉన్నట్టు కనపడదు యుధాజిత్తుకి లేదు రామ లక్ష్మణులకి లేదు కాని కదిలారు కదలిక మాత్రం సంభవించింది తేషామ్ అపి మహా తేజా రామో రతికరః పితుః ! స్వయమ్భూః ఇవ భూతానాం బభూవ గుణవత్తరః ఈ అంతఃపురంలో రామ లక్ష్మణులు ఉన్నప్పుడు దశరథ మహారాజుగారు పరిపూర్ణమైనటువంటి తృప్తినే పొందుతున్నాడు


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఎందుకు పొందుతున్నాడు. నలుగురు కొడుకులైనా అందులో పెద్దవాడైనటువంటి రామ చంద్ర మూర్తి యొక్క గుణముల శోభ అటువంటిది మహా తేజా గొప్ప తేజో వంతుడు రామో రతికరః పితుః తండ్రికి సర్వకాలములయందు తృప్తిని కలిగించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు స్వయమ్భూః ఇవ భూతానాం బభూవ గుణవత్తరః ఆయన పరాక్రమశాలి పైగా అందరిచేతా కూడా అన్నిభూతములచేతా కూడా ప్రీతిపాత్రుడు. అటువంటి రాముడు అంతఃపురంలో ఉన్నాడు స హి రూపోపపన్న శ్చ వీర్యవాన్ అనసూయకః ! భూమౌ అనుపమః సూనః గుణైః దశరథోపమః !! ఆయన గొప్ప రూపవంతుడు రామ చంద్ర మూర్తి, వీర్యవంతుడు, వీర్యవంతుడు అన్నమాటనీ మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది వీర్యవాన్ వీర్యవాన్ అని సంస్కృతంలో ఎందుకంటారు అంటే వీర్యవాన్ అర్థమేమిటంటే, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు తాను లోపల ఏవిధంగానూ నీరసపడకుండా అంటే వెయ్యి మంది వచ్చి తారస పడ్డారనుకోండి కొట్టేస్తే మళ్ళీ వేయ్యిమంది వచ్చారనుకోండీ ఇలా ఎంత సేపు యుద్ధం చేయను ఇలా వచ్చి పడుతూనే ఉన్నారని లోపలతాను కుంగకుండా ఎంతో ప్రీతితో రెట్టించిన ఉత్సాహంతో లోపల తననితాను నిలబెట్టుకుంటూ ఎదుటివారితో పోరాటం చేయ్యగలిగినటువంటి వీరున్ని ʻవీర్యవాన్ʼ అని పిలుస్తారు. కాబట్టి అటువంటి వీర్యవంతుడు ఆయన అనుసూయకః ఇతరులతో అసుయపడేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడుకాడు భూమౌ అనుపమః సూనుః ఈయన పోల్చిచెప్పడానికి వీలులేనటువంటి కుమారుడు గుణైః దశరథోపమః దశరథుని కుమారుడైనటువంటి రామ చంద్ర మూర్తి అన్ని గుణములచేత శోభించి అందరిచేత అందరి యొక్క మన్నలను పొందియున్నాడు.
అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాముడు పుట్టినప్పుడు చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ అయోధ్య కాండలో ఇదీ... మహర్షీ ఊరకనే చెప్తున్న మాటలు కావు, ఇప్పుడు రాముడు పెద్దవాడయ్యాడు, ఇప్పుడు రాముడు యవ్వనంలో ఉన్నాడు, ఇప్పుడు రాముడు గృహస్తాశ్రమంలో ఉన్నాడు, ఇప్పుడు రాముడు భార్యాయుతుడై ఉన్నాడు, ఇప్పుడు రాముడు పెద్దవాడైయ్యాడు పెద్దవాడైనటువంటి రాముడు తన గుణములచేత ప్రజలతోటి ఏమనిపించుకుంటున్నాడు, పెద్దవాడైన రాముడు గురువుల హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు బ్రాహ్మణుల యొక్క హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు విద్వాంసుల హృదయంలో ఎలా ఉన్నాడు, పెద్దవాడైన రాముడు ఏమీ తెలియనటువంటి ఆడవాళ్ళ యొక్క మనసులలో ఎలా ఉన్నాడు, ఆడవాళ్ళ మనసులలో అని నేను ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే వాళ్ళు కేవలం ఇంటికి పరిమిమై కేవలము భర్తని అనుగమించేటటువంటి పాతివ్రత్యము కలిగినటువంటి స్త్రీలు కాబట్టి అసలు పరపురుషుల గురించి ఆలోచనే ఉండదు. అటువంటి వాళ్ళు తన భర్తా తన బిడ్డలు గురించి మాత్రమే ఆలోచించే లక్షణం ఉండేటంతగా శుద్ధమైనటువంటి మనసుతో ఉండేటటువంటి తరుణవయస్సులో ఉండేటటువంటి స్త్రీలు, యవ్వనంలో ఉన్నవారూ వృద్ధులైన వారు కూడా రాముని గురించి ఏమనుకుంటుంటారు ఇది రాముడు యవ్వనంలోకి వచ్చేలోపల మనసులు గెలుచుకున్న యొక్క స్థితి. ఎంత మందితో ఆయన సమన్వయం అయ్యేడో... ఎంత మంది మనసు చూరగొన్నాడో, ఎంత మంది మనసు చూరగొనలేకపోయాడో మీరు చూడాలి.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఎందుకంటే మీరు ఒకటి చూడండీ లోకంలో ఏ ఒక్కరూ అందరి మనసులు చూరగొనడమనేటటువంటిది సంభవమయ్యే విషయం ఎప్పుడూ కాదు. ఎప్పుడూ కాదు, రాముడికి కూడా కాదు. మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి ఆమాట ఎందుకో తెలుసా? మహర్షి ఈ సర్గలో ఏం చెప్తారంటే...? రామున్ని మెచ్చుకోనివాడు లేడు అని చెప్తారు, కొన్ని సర్గలు దాటగానే, ఎవ్వరికీ కనపడనన్ని అవగుణములు మంధరకి కనపడ్డాయి, అంటే ఉన్నదా లేదా ఒక్కతైనా... ఆతరువాత ఆయనకు భయపడవలసిన స్థితిగా కైకమ్మకి కనపడింది. ఒకరు ఇద్దరయ్యారా లేదా... కాబట్టి మీ ప్రయత్నంతో మీరు గెలుచుకోవడం సాధ్యం కాదు మీ మంచితనాన్ని అర్థం చేసుకునే స్థితి కూడా లోకానికి ఉండాలి, అప్పుడు మీ అందరూ మంచివారనుకుంటారు కానీ నేను ఏ తప్పు చేశానని నన్ను ఒకడు తప్పుచేశావని చెడ్డవాడన్నాడండీ అని మీరు బాధపడకూడదు ఎందుకంటే అది వాళ్ళ సంస్కారమంతే అది మీరేం చేస్తారుదానికి.
రాముడు అంత జాగ్రత్త తీసుకున్నాడు దానికి ఊరుకున్నాడా రజకుడు, ఎక్కడో ఎడాది పాటు సీతమ్మ తల్లిని రావణాసురుడు కొలువు కూటంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఏలుకున్నటువంటి వెర్రిరాముడా నేను అటువంటి వాన్నికాను అన్నాడు, అన్నాడా లేదా... అగ్ని పరీక్ష చేస్తే మాత్రం ఊరుకున్నాడా... అనేవాడు అంటూనే ఉంటాడు ఆ అనేవాడు ఎన్నాళ్ళుంటాడని అడిగారు, పుర్రె మారి పోయిందేమో గాని వాడికి ఆ వాచాలత్వం అలా ఉండిపోయి, ఆయన ద్వాపర యుగం వరకూ అంటూనే ఉన్నాడు ఆఖరికి కృష్ణుడు కనపడితే కూడా అన్నాడు. అంటే అప్పుడు పక్కనున్న బలరాముడు అన్నాడు ఈ అలవాటు ఇవ్వాల్టిది కాదు అన్నయ్యా నీవు రాముడిగా ఉన్నప్పటి నుంచీ ఉందిరా తమ్ముడూ, అప్పుడూ ఇలాగే వాగాడు వదినెమీద ఇక ఈ పుర్రె తనంతతాను మారదు ఈ పుర్రె నీవు పగలగొట్టేయ్ అన్నాడు. అంటే అప్పుడు ఆ కృష్ణుడు పగలగొట్టేశాడు ఆ పుర్రెను, అంత మౌఢ్యంతో ఉంటారు ఒక్కక్కళ్ళు. కాబట్టీ వాళ్ళకి మీరు మంచి అవ్వాలి అని కోరుకోకూడదు కూడా మీరు ధర్మ పదంలో ఉన్నారా లేదా చూసుకోవాలి. అంతే కానీ నాకు నూటికి 98 మందే మంచి వారన్నారని, రెండు ఓట్లు రాలేదని ఓ దాని గురించి బాధపడిపోకూడదు. అలా ఉండదు మీకు లోకంలో ధర్మాన్ని మీరు పట్టుకున్నారా లేదా అన్నదే ముఖ్యం స చ నిత్యం ప్రశాన్తాఽఽత్మా మృదుపూర్వం తు భాషతే ! ఉచ్యమానోపి పరుషం న ఉత్తరం ప్రతిపద్యతే !! రాముడి గురించి వినడమంటే గృహస్తాశ్రమంలో ఉండేటటువంటివాడు నేర్చుకోవలసిన విషయాన్ని మీరు పట్టుకోవలసి ఉంటుంది స చ నిత్యం ప్రశాన్తాఽఽత్మా ఆయన ఎప్పడూ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటాడు.
Image result for ప్రశాంతాత్మాఇది కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి... నేను ప్రశాంతంగా ఉన్నానండీ మీరొచ్చి నన్ను తిట్టారు, నా మనసు పాడైపోయింది, ఇప్పుడు బాగాగుర్తుపట్టండి... నేను మీ తిట్లు పుచ్చుకోలేదు, ఏమైందీ... మీరు పాడయ్యారు కదా...! ఇన్ని తిట్టినావాడు చూడరా హాయిగా వెళ్ళిపోతున్నాడు అని ఇంకా బిపి మీకే వస్తుంది కదా... అంటే ఏది పుచ్చుకోవచ్చో ఏది పుచ్చుకో కూడదో, దాన్ని పుచ్చుకోవలసినదాన్ని పుచ్చుకొని, పుచ్చుకోవక్కరలేదన్నదాన్ని పుచ్చుకోక్కర్లేకుండా పక్కకి వదిలేయగలిగిన ప్రజ్ఞ అంటే అది సద్విమర్శయై మంచిదైతే పుచ్చుకోవాలి. అప్పుడు అది మీరు తీసుకొని మార్చుకోవలసిందీ అనుకుంటే పుచ్చుకొని మార్చుకుంటారు, బాధ పడవలసిన అవసరమేముంది. ఇది మనం పుచ్చుకోవలసిన అవసరం కాదు అనుకుంటే మీరుదాన్ని వదిలేపెట్టాయాలి, ఇప్పుడు బాధపడవలసిన అవసరం దేనికండీ..? మీరు పట్టుకున్నారో లేదో...? అలా ఉంటే మీరు ప్రశాంతాత్మా...! అలా కాకుండా మీకు పనికొచ్చేదే చెప్పాడు ఒకాయన ఏమండీ అలా ఉండకండీ కొంచెం మీరు అనుకుంటున్నారు కానీ, కాస్త మీరు అలా ఉండడం వల్ల ఇబ్బంది


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
వస్తుంది, కొంచెం మీరు ఆ పద్ధతి మార్చుకొని ఇలా ఉండండి అన్నాడు. మీరు కొంచెం పరిశీలనం చెస్తే నిజమే, నేను అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపించింది, అప్పుడు మీరు అలా చేయండీ ప్రశాంతాత్మా. మీరు నాకాయన చెప్పడేమిటీ, నన్నాయన అనడమేమిటీ అని పీక్కున్నారనుకోండీ... అశాంతాత్మా- అశాంతి. ఇప్పుడూ అది మనం పుచ్చుకోవలసిన అవసరం లేదు ఈయనికి తెలియదు పాపం ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ఏదో మాట్లాడాలని మాట్లాడేశాడంతే, కాబట్టి దానిగురించి పెద్దగా చింతలేదు వదిలిపెట్టేసై అంతటితో. ఇప్పుడు ప్రశాంతాత్మా కదా..! ఇదీ మిమ్మల్ని బట్టి ప్రశాంతాత్మా కాని పక్కవాన్ని బట్టి ప్రశాంతాత్మ ఎప్పుడూ అవదు. అలా అయితే నేనేం చేయాలో తెలుసాండీ, అసలు మనిషన్నవాడు కనపడని చోటుకి పారిపోవాలి, నేను ప్రశాంతంగా ఉండాలంటే... అది సంభవమాండీ గృహస్తాశ్రమంలో.
Image result for మానసిక ఆందోళనతెల్లారి లేస్తే భార్యరుంటారు, కొడుకుంటారు, బిడ్డలుంటారు, పాలవాడు ఉంటాడు, పూలవాడు ఉంటాడు, ఉద్యోగానికి వెడతాం అధికారులు ఉంటారు అందరూ ఉంటారు అందరితోటీ సమన్వయం అవ్వాలి, అందరితోనూ సమన్వయం అవుతూ మీరు ప్రశాంతాత్మా... అలా ఉండాలంటే...? ఇది మీకు రావాలి, ఇది మీకువస్తే మీరు ప్రశాంతాత్మా ʻరాముడు ప్రశాంతాత్మాʼ ఇది పట్టుకోండిబాగా ఇప్పుడు రాముడు ఏది పుచ్చుకోవాలో అది పుచ్చుకుంటాడు, ఇది అక్కరలేదంటే అది వదిలేస్తాడు అంతే, ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఉండనివాళ్ళు ఎవరంటే... ఇన్ని అన్నా అలా బాధపడేవాడు, ఇంత చెప్పినా మార్చుకోలేదని బాధపడేవాడు, లేదా నే చెప్తే మార్చుకున్నాడని పొంగిపోయేవాడు. మీరు పట్టుకున్నారో లేదో... ఆయన మార్చుకున్నారండీ, ఆయనండీ నేను చెప్తేనే మార్చుకున్నారండీ అని వీడు పొంగిపోయాడు, పొంగు వీడిది ఆయనేం వినలేదు ఆయన ప్రశాంతాత్మ. నేను చెప్పానాండీ వీడు వినలేదు కుంగిపోయాడు, కుంగిపోయింది ఈయన ఆయనకేం లేదు ప్రశాంతంగా ఉన్నాడు ప్రశాంతాత్మ. పొంగు కుంగు నీకు వస్తున్నాయి ఆయనకేం లేదు.
రామాయణంలో కదలికలు ఇలా ఉంటాయి, కదలనివాడు ఎవరూ..? ఇది ఎంత గుంభనంగా చెప్తాయో చూడండి శ్లోకాలు. ఇది రాముడికా మీక్కూడానా... మీకు కూడా రక్తపోటు ఎందుకొచ్చిందీ అంటే ఆందోళన వలన, ఆందోళన ఎందుకు వచ్చింది అంటే ప్రతి చిన్న విషయానికి కదిలిపోతాడు అలా కదిలిపోకుండా ఉండాలి అంటే ఏమిటి మార్గం, అంటే శ్రీరామాయణం ఒక పెద్ద మనస్తత్వ శాస్త్రము, మీకు ప్రశాంతంగా జీవితం చేసుకునేటటువంటి మార్గాన్ని శ్రీరామాయణం ఉపదేశం చేస్తుంది అలా ఉండడానికి ఏం చేస్తుంటాడండీ ప్రశాంతాత్మ మృదుపూర్వం తు భాషతే చాలా మృదువుగా మాట్లాడుతాడు అదేమి కఠినంగా ఉండదు ఆయన మాట్లాడితే... కానీ ఏమండీ చాలా వ్యగ్రతతో లోపల కడుపులో మండిపోయి చెప్పవలసిన మాట చెప్పవలసి వస్తే ఎలా చెప్తాడో.. ఏం క్యాకలేం వేయడు ఆయన చక్కగా చెప్తాడు న స సఙ్కచితః పన్థా యేన వాలీ హతో గతః అంటాడు అంతే... వాలి వెళ్ళిపోయిన మార్గం ఇంకా మూసుకుపోలేదని సుగ్రీవునికి చెప్పు. అంటే మాట వినకపోతే వాళ్ళన్నయ్య ఎటువెళ్ళిపోయాడో అటు వెళ్ళిపోతాడనిచెప్పు అంటే చచ్చిపోతాడని చెప్పు చక్కగా మాడ్లాడుతాడు ఎంత అందంగా మాట్లాడుతాడో... కాబట్టి మృదుపూర్వం తు భాషతే మృదువుగా మాట్లాడుతాడు కాబట్టి ఆయన లోపలకదలడు. ఒక వేళ నిష్కారనంగా ఎవడో కఠువుగా మాట్లాడితే మరి అప్పుడేం చేస్తాడండీ... ఉచ్యమానోపి పరుషం న ఉత్తరం


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ప్రతిపద్యతే అవతలివాడు చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కానీ తాను మళ్ళీ మాట్లాడితే... ఖచ్చితంగా ఉద్రేకానికే వెళ్ళుతుంది, అప్పుడాయన మాట్లాడడు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన మౌనంగా ఉండి అవతలవాన్ని బాగామాట్లాడనేయనిస్తాడు ఎంత ఉద్రేక పడగలడో అంత ఉద్రేకపడనిస్తాడు ఆయన నిశ్శబ్ధంగా అవేం పుచ్చుకోడు, పుచ్చుకుంటే గదాండీ వచ్చిన బాధ.
ఇప్పుడూ నన్ను తిట్టాలని మీరు అనుకున్నారనుకోండీ, అనుకుని నన్ను తిట్టేశారు కానీ నేను అప్పుడు నిద్రపోతున్నాను ఏమైనా ప్రయోజనం ఉందా, మీరు నన్ను తిట్టారని కూడా నాకు తెలియదు, లేసుండి నేను పుచ్చుకోకపోయినా అంతే... మీరు ఓ వెయ్యిరూపాయలిస్తే నేను పుచ్చుకోలేదనుకోండీ... నేను వెయ్యి రూపాయలు ఇచ్చానండీ అని మీరు అనగలరా...? నేను పుచ్చుకుంటేగదూ నేను మీరు నాకు ఇచ్చినట్టూ, మీరు తిట్టారు మీరు తిట్టారని మీరనుకోవడమే మీరు ఉద్రేక పడాలంతే నేను పుచ్చుకుంటేగదూ ఇది రాముని యొక్క స్వభావం. ఇది యదార్థానికి ఏమిటంటే... రాముడు అలా ఉన్నాడంటే ప్రశాంతాత్మ నీకు కూడా అలా ఉండాలని ఉందా...? రాముడు ఇలా ఉన్నాడు నీవ్వు అలా ఉండు, మార్గాన్ని చెప్తున్నాడు మహర్షి. ఎందుకంటే గృహస్తాశ్రమంలో మనం వివిధమైనటువంటి వ్యక్తులతోటి సందర్భంలోకి వస్తాము.
నాకు ఒక మిత్రుడుండేవాడు ఎప్పుడూ ఎవల్లనో ఒకళ్ళని తిట్టేవాడు రోజూ ఒకళ్ళని తిట్టేవాడు ఇంచుమించు ఆఫీసులో రోజూ దెబ్బలాడేవాడు మొన్న మా అమ్మయి పెళ్ళి భోజనానికివస్తే నేను అన్నాను నీ గురించి ఉపన్యాసంలో కూడా చెప్తున్నానయ్యా అని నేను ఈ మధ్య అని, అంటే నేను అన్నాను ఏమయ్యా నీవు రోజూ ఎవళ్ళతోనో ఒకళ్ళతో దెబ్బలాడుతావు కదా... అసలు ఎవ్వరూ దెబ్బలాడకుండా నివ్వు దెబ్బలాడినా మౌనంగా ఉన్నారనుకోండి ఏం చేస్తావయ్యా ఎలా దెబ్బలాడుతావు అన్నాను దెబ్బలాడకపోతే నాకు నిద్రపట్టదండీ కోటేశ్వరరావుగారూ అన్నాడు ఆయన. మరి దెబ్బలాడకపోతే ఎవ్వరూ దెబ్బలాడకుండా అందరూ మౌనంగా ఉన్నారు నీవు ఏమన్నా ఊరుకున్నారు నీవు ఏం చేస్తావు అన్నాను మా ఆవిడతో దెబ్బలాడుతాను అన్నాడు మీ ఆవిడా దెబ్బలాడకపోతే... మా ఆవిడతో ఎలా దెబ్బలాడాలో నాకు తెలుసు అన్నాడు, నేను తెల్లబోయాను ఎలా దెబ్బలాడుతావు అన్నాను ఆవిడతో నీవు ఎలా దెబ్బలాడగలవు అన్నాను. ఏముంది ఇంటికెళ్ళి అడుగుతాను ఉత్తరాలు ఏమైనా వచ్చాయాని అడుగుతాను వచ్చాయి అంది అనుకోండీ. కన్యాదానం ఎందుకు చేశాడు మీ నాన్న కన్యాదానం చేసినాతో పంపడం ఎందుకూ రోజుకో ఉత్తరం రాయడం రాయడం ఎందుకూ నీకేమో పుట్టింటి మీద వ్యామోహం కల్పించడం ఎందుకూ నిమిషానికి ఓసారి నీవు పుట్టింటికి వెళ్ళడం ఎందుకూ, పుట్టింటికి వెళ్ళతాను అనిపించేటట్టుగా చెయ్యడం ఎందుకూ ఎందుకాపాటిదానికి ఆ పుట్టింటిలోనే ఉంచుకుంటే పోలా ఎందుకిచ్చినట్టు పిల్లని అని అయ్యిందానికి కాందానికి అలా చెలరేగిపోతాను తిట్లమీద ఆవిడకు కోపమొచ్చి ఏదో ఒకటి అంటుంది. నేను అన్నాను మరి ఉత్తరం రాయపోతే, కన్యాదానం చేసేశాడుగా... ఇంక ఏమైపోతే ఆయనకు ఎందుకూ ఓ క్షేమంగా ఉన్నావా ఏమిటని కూడా ఉత్తరం రాయడు ఎంత గొప్ప నాన్నే మీ నాన్న అంటాను అయ్యబోబోయ్ నాయనా నీతో చాలా కష్టంరా నాన్నా అన్నాను.
కాబట్టీ అలా ఉన్నారనుకోండీ మీరేం చేస్తారు దానికి అప్పుడు రాముడు ఏం చేస్తాడు అంటే మౌనంగా ఉంటాడు అన్నారు మహర్షి న ఉత్తరం ప్రతిపద్యతే ఏమీ మాట్లాడడు నిశ్శబ్దంగా ఉంటాడు. ఆయన నిశ్శబ్దంగా ఉంటాడు నేను మాట్లాడను నిశ్శబ్దంగా ఉంటాను బదులు చెప్పును ఇప్పుడు అంతే అలా ఉంటాడు కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి ! న స్మరతి అపకారాణాం శతమపి ఆత్మవత్ తయా !! కథంచిత్ ఉపకారేణ ʻకథంచిʼ అంటే కావాలని చేసింది కాదు అనుకోకుండా చేసిన ఉపకారం, అనుకోకుండా ఆయన వల్ల ఒక ఉపకారం జరిగింది కావాలని చేద్దామని చేసిన ఉపకారం ఏం కాదది కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి అలాంటి ఉపకారం ఒక్కటైనా సరే... ఎంతోసంతోషపడిపోతాడట. గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని ఆయనండీ నాకు ఈ ఉపకారం చేశారు ఆయనండీ నాకీ ఉపకారం చేశారంటారట, నిజంగా ఆయన కావాలని ఏం చేయలేదు ఏదో రాముడు నేను ఓ దగ్గర కూర్చొని ఉన్నామనుకోండీ రాముడు టికెట్టుకొనుకుందామని అనుకున్నాడు రాముడి పెట్టె నా పెట్టె పక్కన పెట్టాడు పెట్టి వెళ్ళిపోయాడు, ఈలోగా ఓ దొంగ అటుగావచ్చాడు ఆ పెట్టె పట్టుకెళ్ళదామనుకొని నా పెట్టే అనుకొని పట్టుకెళ్ళలేదు పక్కవాళ్ళ పెట్టెపట్టుకో వెళ్ళపోయాడు పట్టుకున్నారు కొట్టారు. కొడుతుంటే అసలు నేను ఆ పెట్టె జోలికి వెళ్దామని అనుకున్నాను ఆ పెట్టెపట్టుకుపోతే ఆయన టికెట్టుకోసం వెళ్ళాడు ఆయన పెట్టె అనుకొని నేను ఎత్తుకపోలేదు అన్నాడు. ఇప్పుడు రాముడు అనుకుంటాడటా, నేను ఆయనకు అప్పజెప్పకపోయినా ఆ పెట్టె పెట్టె పక్కన పెట్టడంవల్ల నా పెట్టె దొంగతనం కాకుండా రక్షింపబడింది. ఇప్పుడు నేనేమైనా రక్షించాలా ఆయన పెట్టెని నాకు అప్పజెప్పాడా నేను రక్షించానా రక్షించలేదు ఆయన పెట్టె నా పెట్టె పక్కన పెట్టాడు. దొంగాడు అనుకున్నాడు ఆ రెండు పెట్టెలు నావనుకుని, నేను చెయ్యాలని చెయ్యకపోయినా ఉపకారం నావలన అనుకోకుండా ఒక ఉపకారం జరిగినంత మాత్రంచేత దాన్ని తలుచుకు తలుచుకు మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడో, ఎంత ఉపకారం చేశాడో కృతజ్ఞతతో పొంగిపోతుంటాడట రాముడు.
కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి ! న స్మరతి అపకారాణాం శతమపి ఆత్మవత్ తయా !! కావాలని వంద అపకారాలు చేశాడు ఒకడు చిరునవ్వు నవ్వుతాడట అది గుర్తొచ్చినప్పుడు పోల్లేద్దురూ తెలియని తనం ఏం చేస్తాం అమాయకత్వం అంటాడు అంతే, అంతేకానీ అది తలచుకొని వ్యగ్రతపడిపోడట ఎంత పనిచేసేశాడు ఎంత పనిచేశాడని ఓ దాని మీద పికేసుకొని ఆందోళనపడిపోడట. మీరు చూడండీ రామాయణం విన్నంత తేలిక కాదు, కొందరి కొందరి ఇళ్ళల్లో ఒకసారీ దయానంద సరస్వతీ మహరాజ్ దగ్గరికి ఒకావిడవెళ్ళి ఒకమాట అడిగారు మీరు భగవత్ భక్తి కలిగినటువంటి వాళ్ళవల్ల ప్రశాంతత ఉంటుందంటారూ, మా అత్తగారు ప్రతిరోజూ రెండు గంటలు పూజచేస్తుంది మీగిలిన ఇరవై రెండు గంటలూ తిడుతుంది మరి రెండు గంటల పూజవల్ల ఉపయోగం ఏమిటని అడిగింది ఆవిడ. అంటే దయానంద సరస్వతీ అన్నారూ ఆ పూజవల్ల నీవు రెండు గంటలు ప్రశాంతంగా ఉండడమే అన్నారు. కాబట్టీ శతమపి ఆత్మవత్ తయా వంద తప్పులైనాసరే రాముడు పట్టించుకోడట ఆత్మవత్ తయా తాను ఆ స్థితిలో ఉంటాడు కాబట్టి అవతలివాళ్ళ అమాయకత్వాన్ని క్షమించేస్తాడు. మా అబ్బాయండీ నేను తొడమీద కూర్చోబెట్టుకున్నాను కూర్చోబెట్టుకుంటే... వాడు లాగి నన్నో లెంపకాయకొట్టాడు చిన్న పిల్లాడు వానికేం తెలుసు వాడు నాన్నగారి గడ్డం చూశాడు, ఇదేమిటి కొత్తగా నాన్నగారు గడ్డం పెంచారనుకున్నాడు నాన్నగారి గడ్డం పట్టకోబోయి ఓ లెంపకాయ కొట్టాడు. సుర్రుమంది నాకు నేనూ లాగి లెంపకాయ కొడుతానా, ఆ చేయితీసి అమాయకత్వం తెలియదు పిల్లాడికి ఇలా అన్నాడు ఎంత దెబ్బతగిలిందిరా అని ముద్దు పెట్టుకొని నాన్నా కొట్టకు అని రెండు చేతులూ నా చేత్తో పట్టుకుంటాను కాసేపు, అలా కొట్టకూడదు చూశావా నొప్పి పెట్టిందాలేదా ఎందుకు మన్నించగలిగాను. నా బిడ్డ అమాయకుడు వాడికేం తెలుసు వాడికేం తెలుసు పాపం పోల్లేండీ వాడికేం తెలుసు వాడు అలా చేశాడు అన్నారనుకోండీ మీరు ప్రశాంతంగా ఉంటారు అవతలివారి యొక్క అజ్ఞానం మన్నింపబడింది.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అందుకే పెద్దలేం చెప్తారంటే... మూడు నీకు తెలిసి ఉంటే... నీకు ఇబ్బంది ఉండదు అంటారు. లోకంలో నీతో సమానులు కనపడుతారు, నీ కన్నా అధికులు కనపడుతారు, నీ కన్నా తక్కువ వాళ్ళు కనపడుతారు. ఈ మూడు లేకుండా అసలు నీవు సమాజంలో తిరగడం కుదరదు, అసలు ఈ మూడింటి విషయంలో మీరు లోపలా ఏదైనా దీన్ని బయాస్ అంటారు ఇంగ్లీషులో అన్యథా మనసులో ఏదో ఉందనుకోండీ మీరు ఇమడలేరు ఇబ్బంది పడిపోతారు. మీరు ఒక చోటుకు వెళ్ళారంటే మీతో సమానులు ఉంటారు మీ కన్నా కిందవాళ్ళు ఉంటారు మీ కన్నా పై వాళ్ళు ఉంటారు ఎప్పుడూ ఉంటారు. మీరు చదువుకుంటుంటే మీకన్నా బాగా చదివే వాళ్ళు ఉంటారు, మీతో సమానులు ఉంటారు, మీ అంత చదవలేని వాళ్ళు ఉంటారు. శాస్త్రం ఎప్పుడూ ఏం చెప్తుందంటే ఈ ముగ్గురిపట్ల నిశ్చితాభిప్రాయం ఉండాలి నీకు, నీతో సమానులకు గౌరవరవము ఇవ్వాలి, నీతో సమానమైనటువంటి వారియందు ఆదరముండాలి, ప్రేమ కలిసి తిరిగేటటువంటి సుహృత్ సంబందం ఉండాలి, నీ కన్నా ఉన్నతులపై గౌరవముండాలి, మహానుభావుడు ఎంత సాధనచేశాడో మా కన్నా అంత పైమెట్టుమీద ఉన్నాడు ఆయన్ని చూసి మనం నమస్కారంచేసి ఆయనలా మనం కూడా అవ్వాలని నీవు గౌరవించగలగాలి. నీకన్నా తక్కువవాడు ఈశ్వరానుగ్రహంతో ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి, పాపం అంతగా తెలిసున్నవాడు కాడు ఆయన వృద్ధిలోకి రావాలి అనాలి. ఇప్పుడూ బాగాగుర్తుపెట్టుకోండీ, మీరూ ఎవరితో సమన్వయం అవుతున్నారో మూడు మెట్ల మీద ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారు. మీకన్నా పై మెట్టుమీద ఉన్నవాన్నిచూసి మీరు భరించలేక పోయారు అనుకోండీ... ఎంత మంచిలోనూ అవగుణాన్ని తీస్తారు ఇది లోకం యొక్క పోకడ అక్కడే వస్తూంది, ఆయన యందు ఉండదు నీలో ఉంది ఆ భావన ఆయన ఉన్నతిని నీవు తట్టుకోలేవు అందుకని మాట్లాడుతారు తప్పుగా. నీతో సమానుడు ఏమిటి నాకన్నా గొప్పా అంటాడు నీకన్నా తక్కువ నీచ భావన ఆ...హ్ వాడికేం తెలుసండీ... అంటారు ఇప్పుడు వాళ్ళకేమీ అవదు వాళ్ళు అలాగే ఉంటారు పాడైపోయేది ఎవరంటే నీవు, ఇది తెలుసుకొని ప్రవర్తించడం ఆత్మవత్ తయా ఇలా నీవు ఉండగలిగితే... సమాజము నీవలన ఆనందము పొందుతుంది నీవు కూడా సమాజంలో ఎవరితో తిరుగుతున్నా సంతోషంగా ఉండగలవు.
Image result for పిల్లలు నిజం చెప్తారుఇప్పుడు మీరు చెప్పండీ రాముడు సమాజంలో ఈ మూడు రకాలుగా ఉన్నవాళ్ళతోటీ తిరుగాడాడని గుర్తు. అందరితోటీ ఆయన సమన్వయం అయ్యాడు కానీ అందరూ రామునితో సంతోషంగా ఉన్నారు. ఎందుకనీ ఇలా ఉండబట్టీ, పెద్ద దోషం ఎక్కడొస్తుందంటే ఇది నేర్చుకోవాలి, మీరు నేర్చుకోకుండా వచ్చేది ఏదంటే ఆ మూడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో ఒక సంఘటనా నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేసేరోజులలో మా పక్కవాటాలో ఒక ఐదేళ్ళ పిల్ల ఉండేది జోత్స్నా అని. అది పాలు తాగుతోంది, పాలు తాగుతూ వేడిగా ఉన్నాయని అక్కడ పెట్టీ ఏదో అటూ ఇటూ తిరగబోయిందీ, దాని కాలుతగిలి ఆ గ్లాసు కిందపడిపోయింది ఆ పాలు ఒలికిపోయాయి నేను అక్కడే ఉన్నాను వాళ్ళమ్మగారు వచ్చారు వచ్చి అదేంటే పాలు అలా ఒంపేశావ్ అన్నారు అంటే నేను అన్నాను లేదండీ పాపం చూసుకోలేదు పాలు పడిపోయాయి అన్నాను. కాదు ఆ పిల్లంది వెంటనే కాదు నేనే తంతే పడిపోయాయి. నేను అలా ఉండిపోయాను అంతే... అబద్దానికి అలవాటుపడిపోయింది నా సంస్కారం పాలు పడిపోతాయా? పాలు ఎందుకు పడిపోతాయి, నేను పాలు పడిపోయాయమ్మ అన్నాను అమ్మాయి అందీ, పాలు పడిపోలేదు నేను తంతే పడిపోయాయి, అంటే పసిపిల్ల కదాండీ, ఎందుకు విజ్ఞేశ్వరుడు పసివాడో చెప్పారో చూశారూ, పిల్లకి అలా చెప్పడం ఇష్టం లేదు, అది అబద్ధం కదా పాలు పడిపోవడం దేనికి నేను తంతే పడిపోయాయి, పాలు పడిపోయాయి అంటాడేమిటి ఆయన, పాలు పడిపోలేదు నేను తంతే పడిపోయాయమ్మా అంది. నేను నిజంగా మీరు చెప్తే నమ్మరూ ఆశ్చర్యపోయాను, చదువుకున్నాం చదువుకున్నాం సంస్కారవంతులమయ్యాం సంస్కారవంతులమయ్యాం మనకు జీర్ణమైంది ఇదీ, ఒక పసిపిల్లకి ఇంకా సంస్కార సత్య గుణం అది ఎంత తేడా ఉందిరా అని అనిపించింది నాకు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కాబట్టి కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి ! న స్మరతి అపకారాణాం శతమపి ఆత్మవత్ తయా !! బుద్ధిమాన్ మధురా భాషీ పూర్వ భాషీ ప్రియం వదః ! వీర్యవాన్ న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః !! ఆయన బుద్ధిమాన్ చాలా బుద్ధి కలిగినటువంటి వాడుమధురా భాషీ మాట్లాడేటప్పుడు చాలా మధుర మధురంగా మాట్లాడుతాడు. అందుకని వినబుద్దేస్తుంది రాముడు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. మాటలు అంత తీయ్యగా ఉంటాయి పూర్వ భాషీ ఇదీ మీరు గమనించారో లేదో లోకంలో ఇదో పెద్ద సమస్య నన్ను ఆయన ఏరా నేను నీకెందుకు కనపడుతాను అంటాడు, తాత గారు కదాండీ, ఏం ఓరేయ్ ఎలా ఉన్నావ్ అనచ్చుగదా అనడు, ఇందాకట్నుంచి చూస్తున్నానురా...? నీవు నన్ను పలకరిస్తావేమోననీ నేనెందుకు కనపడుతాను నీకు అంటాడు. అదేంటి తాతగారు నేను చూడలేదు అంటాడు, అదేలే, అంటాడు. ఎందుకామాటా? ఎరా మనమడా ఎలా ఉన్నావ్? అని ఈయన అనకూడదా ముందూ... అంటే నేను తాతని నేను పెద్దవాన్ని, ఈ మధ్యనే వీడికి ఉద్యోగం వచ్చింది, వీడు నన్ను పలకరించట్లేదు, వీడికి అతిశయం ఎక్కువైపోయింది, మీ మనసులో భావన. పాపం ఆ పిల్లాడు చూడలేదు. రాముడటా అది కాదటా... పూర్వ భాషీ ముందు రాముడు మాట్లాడుతాడట. రామున్ని ఎవరైనా పలకరించారనుకోండి చిన్నబుచ్చుకుంటాడట. అయ్యయ్యో అదేంటి నేను మాట్లాడలేదు, వాళ్ళేవచ్చి పలకరించారని, అందర్నీ రాముడే ఏమ్మా బాగున్నారా..., ఏమండీ అయ్యా బాగున్నారా... అని రాముడే పలకరిస్తాడట పూర్వ భాషీ అంటే ఇంకోళ్ళు నన్ను పలకరించడమేమిటీ వాళ్ళు నన్ను పలకరించాలిగదా ప్రేమగాని చిరునవ్వుతో పలకరిస్తాడట హృదయ సంస్కారం అది.
Image result for sree ramaకాబట్టీ పూర్వ భాషీ అటువంటి రాముడు ప్రియం వదః వీర్యవాన్ న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః ఆయన అంత పరాక్రమం ఉండీ కూడా అటువంటి వీర్యవాన్ అయివుండీ కూడా నేను వీర్యవంతున్ని అని ఎన్నడూ కూడా అతిశయంతో అహంకారంతో ఉన్నవాడు కాడు న చాఽఽనృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః ! అనువక్తః ప్రజాభిశ్చ ప్రజా శ్చాప్యనురంజతే !! ఆయన ఇదొకటి చాలా గొప్ప విషయాన్ని మీరు వినాలి, ఇది ఇవ్వాల్టి రోజున చాలా మందిని పాడుచేసేటటువంటి పెద్ద సమస్య ఇది న చాఽఽనృత కథో ఆయనా ఎన్నడూ కూడా... అసత్యమాడేటటువంటి వాడకాడు, ఆయన విద్వాన్ అన్ని తెలుసున్నటువంటివాడు వృద్ధానాం ప్రతిపూజకః ఆయన వృద్ధులైనటువంటివారినీ జ్ఞానమున్నవాళ్ళనీ పూజించేటటువంటి లక్షణమున్నవాడు అనురక్తః ప్రజాభి శ్చ ప్రజలయందు అనురాగమున్నవాడు, ప్రజలచేత ప్రేమింపబడినవాడు, అన్నిటికన్నా గొప్పవిషయం ఏమిటో తెలుసాండీ... నా అశ్రేయసి రతో విద్వాన్ న విరుద్ధ కథా రుచిః ఆయనా ఎప్పుడూ కూడా నా అశ్రేయసి రతో విద్వాన్ న విరుద్ధ కథా రుచిః ఏది శ్రేయస్సుని ఇవ్వదో...? అటువంటిదాన్ని చదవడంపట్ల ఆయనకి అనురక్తి లేదు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఇవ్వాళ నాకు తెలిసి, ఏమంటే ఏదో ఓ రామాయణం చెప్పాం, భారతం చెప్పాం అని చాలా మంది మాట్లాడుతుంటారు వచ్చి లేకపోతే ఫోన్ చేస్తుంటారు. నాకు రామాయణంలో ఈ మాట ఎంత గొప్ప రచన చేశారురా వాల్మీకి మహర్షి అనిపిస్తుంది. ప్రింటింగ్ ప్రెస్సులు వచ్చేశాయ్, తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక పుస్తకం రాసేయడం, రచన చేసేయ్యడం, దాన్నివిడిచి పెట్టేయ్యడం, ఆ పుస్తకం ఏం చేసేస్తుందంటే... తెలిసీ తెలియనితనంతో రాసినటువంటి పుస్తకం చాలామంది జీవితాలనే పాడుచేసేస్తుంది, తెలిసీ తెలియనటువంటి విషయంతో ఉన్నటువంటి పుస్తకాలు, కల్పిత కథలు, కల్పిత కథలన్నీ కూడా ఏం చేస్తాయంటే...? మనసుకు ఉద్రేకాన్ని కల్పించేవై ఉంటాయి, అవి యదార్థములు కావు, కాని ఉద్రేకాన్ని కల్పిస్తాయి, లేకపోతే అప్రసన్నత్వాన్ని కల్పిస్తాయి, అది ఏమైపోతుందంటే మనసు మెళ్ళిమెళ్ళిగా, మెళ్ళిమెళ్ళిగా దానికి అలవాటు పడిపోతుంది, ఆ కల్పిత కథల్నీ చదువుకుంటూ ఉండడం, నీవు చదువుకున్నటువంటి చదువు దేనికి పనికొస్తుందంటే..? సత్యముకాని ఒక విషయాన్ని నీవు అదే పనిగా చదువుకుంటూ నీవు ఆ బ్రాంతిలో గడిపేయడానికే పనికొస్తుంది. ఏది సత్యమైన విషయమో, అది చదువుకోవడానికి నీ చదువు పనికిరావాలి, రాముడు ఎప్పుడూ చదివేవాడు కాదట, అసత్యమైన విషయము అది నాకు శ్రేయస్సును ఇవ్వదు, అది పనికొచ్చేది కాదు, నాకు నా ఉద్దరణకు పనికి రాదు, రాముడు చదివేవాడు కాదు. పిల్లలకీ పుస్తకాలు అలవాటు చేసేటప్పుడు ఏ పుస్తకాలు చదవాలో అలవాటు చేయాలి చాలా అవసరం, ఏదో బుక్ రీడింగ్ అని చెప్పి పనికిమాలిన పుస్తకాలన్నీ చదవడం అలవాటు చేశారనుకోండీ..? ఉపయోగం ఏం ఉంటుంది.
నేను ఒక్క మాట అంటాను మీరు నిజాయితీగా ఆలోచించండీ... నేను ఎవ్వరినీ మనసు ఖేదపరచాలని నేను అనడంలేదు. మీరు ఇవ్వాళ ఒక ఐదు రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొంటే... ఒక రోజంతా చదవచ్చు, అంత మెటీరియల్ ఉంటుంది అందులో... అందులో ఎవరో ఒకళ్ళు ఎంతో మంది మాట్లాడినవి ఉంటాయి, ఆ మాట్లాడిన మాటల్లో పనికొచ్చేదీ మీ జీవితానికి ఆదర్శంగా తీసుకోవడానికి వచ్చే మాటలు ఎన్ని కనపడుతాయి, ఎంత పొల్లుంటుంది ఎంత పనికొచ్చే మాటలు అందులో ఉంటాయి, కాని మనం న్యూస్ పేపర్ చదవద్దని నేను అనను న్యూస్ పేపరే జీవితంగా బ్రతుకుతాం. సంధ్యావందనం చేయడం ముఖ్యమా న్యూస్ పేపర్ చదవడం ముఖ్యమా..? అంటే ఒక్కసారి పేపర్ చూస్తానంటాడు, ఒక్కసారి పేపర్ చూస్తానని ఇలా పట్టుకున్నవాడు, పేపరంతా అయ్యాక దొమ్మిదింటికి సధ్యావందనానికి వెళ్తాడు, తొమ్మిదింటికి సంధ్యావందనానికి వెళ్తే నీ మనసు ఏమౌతుందంటే, ఇందులో ఉన్న విషయాలు చదివి నీ పక్షపాతాలకు అనుగుణంగా అది ఉద్వేగం చెందుతుంది, ఆ ఉద్వేగములో నీ మనసు ధ్యానమునందు కుదురుకోదు నీవు చేసింది ఏముందీ...? అంటే ఏది ముందు చెయ్యాలో ఏది వెనకాల చెయ్యడమో తెలియక పోవడం, ఏది శ్రేయస్సును ఇస్తుందో అది ఎక్కువ చదవకపోవడం, ఏది శ్రేయస్సును ఇవ్వదో దానిని చాలా శ్రద్ధగా ఎక్కువగా చదవడం. ఏమిటీ దానివలన నీవు పొందుతున్నది ఏమిటీ? అని అన్నామనుకోండీ మీకు ఉపకారమేమీ ఉండదు దానివల్ల ఏమీ ఉండదు ఉపకారం. వాడు వీన్నన్నాడు, వీడు వాన్నాడు. వాడు నీన్ననాడనీ, వీడు వాన్ననాడనీ మళ్ళీ కఫీతాగి చెప్పుకోవాలి అంతే... ఏమిటి ప్రయోజనం ఏమీ ఉండదు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
రామాయణంలో రాముడు ఏమన్నాడో చదివావా? ఎప్పుడూ చదవడు, టైమేదండీ అంటాడు, రామాయణం అయోధ్య కాండ చదివారేంటండీ ఎప్పుడైనా రెండు మూడు సర్గలు అన్నారనుకోండీ, అబ్బే అంత టైము ఎక్కడుంటుందండీ నాకూ అంటాడు. న్యూస్ పేపర్ చదివావా అన్నారనుకోండీ, అసలు న్యూస్ పేపర్ చదవకపోతే ఆరోజు రోజులా ఉండదండీ అంటాడు. అనురక్తి దానిమీద పెంచుకోవద్దూ, శ్రేయస్సునిచ్చేవాటి మీద నీవు ఎక్కువగా సమయాన్ని వెచ్చించడం నేర్చుకో... ఇది మనకు తెలిస్తే...? యదార్థంగా 42 రోజులు అయ్యేటప్పటికీ... ఇది అనుష్ఠానంలోకి వచ్చిందని గుర్తేమిటంటే... రామ కోటి రాసేటటువంటి పుస్తకాలు హరిప్రసాద్ గారు ముద్రణచేసినవి సరిపోకుండా ఉండాలి కదా... సమయం సద్వినియోగం అవుతోంది నిజంగా రామాయణంవిని మార్పు వచ్చిందని గుర్తేమిటంటే...? న్యూస్ పేపర్ గంట చదివేది 20 నిమిషాలికి తగ్గించి 40 నిమిషాలు రామకోటికి ఇచ్చేస్తున్నాని మొదలు పెట్టారనుకోండీ... 40 నిమిషాలు రామకోటి రాసేయడం మొదలు పెడితే... హరి ప్రసాద్ గారు మళ్ళీ రెండో ముద్రణకి వెళ్ళాలి, మళ్ళీ ద్వీతీయ ముద్రణకి వెళ్ళాలి పుస్తకాల కోసం కదా... రామకోటికి పుస్తకాలు రాయబడలేదండీ... పుస్తకాలు ఉండిపోయాయి అన్నారనుకోండీ, హరిప్రసాద్ గారు కాదు బాధపడవలసింది సనాతన ధర్మం యొక్కస్థితి ఇలా ఉందన్నమాట. ఇంకా రామాయణం లోకంలోకి జీర్ణమవట్లేదన్నమాట, ఇంకా ఎక్కడో లోపముంది కలిపురుష లక్షణం ఉందని మనం బాధపడవలసి ఉంటుంది అవునా నన్ను సహృదయంతో అర్థం చేసుకోండీ.
Image result for మనిషిలో మనిషికాబట్టి ఇదీ రామ చంద్ర మూర్తి యొక్క స్థితి, కాబట్టి ఇటువంటి మహానుభావుడు అన్నిటికన్నా అద్భుతమైన విషమండీ రామాయణంలో! అందుకే నేను మీతో మనవిచేసేది. అయోధ్య కాండలో ప్రతి శ్లోకం మన జీవితానికి అన్వయం అవుతుంది గృహస్తాశ్రమానికి అన్వయం అవుతుంది, మనల్ని దిద్దుబాటు చేస్తుంది ఇలా దిద్దుకో దిద్దుకో అని నేర్పుతుంది. రాముడట ధర్మార్థ కామ తత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ ! లౌకికే సమయాఽఽచారే కృత కల్పో విశారదః !! ఆయనకీ ధర్మము గురించీ, కామము గురించీ, అర్థము గురించీ బాగా తెలుసు. అసలు పెళ్ళి చేస్తేధర్మేచా, అర్థేచా, నాతి చరమామి అంటాడు ఈమేను నేను అతిక్రమించను, ధర్మము నందు, అర్థము నందు, కామము నందు. మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను చెప్పండీ... ఈ మూడు ఈశలు నిజానికి, ఎందుకంటే మోక్షం పక్కన పెట్టేయ్యండి చతుర్థ పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం, అందులో ధర్మం సరే పక్కన పెట్టేయ్యండి, అర్థం అంటే డబ్బేకదాండీ, అంతేకదా అందాక అనుకోండీ పోనీ, ధనేశ అదీ మూడు ఈశలలో ఒక ఈశ అది, అంటే మనిషిని పాడుచేసేది. అది జన్మ జన్మాంతరం వాసన కింది తరుముతుంది మనిషిని, అటువంటిది ధనేశ, దారేశ, పుత్రేశ ఈ మూడూనూ, ఇవి మనసుని వదలవు జాగ్రత్తా...! అంటే ఏమిటో తెలుసాండీ మనసుని వదలవు అన్నమాట ఎందుకంటారో తెలుసా... ఇదేం చేస్తుందంటే మీ మనసుని దేనియందు పెట్టారో దాన్నేస్మరిస్తూందది అంత్యకాలమునందు, శరీరంలోంచి మనసు వెళ్ళిపోయేటప్పుడు ప్రాణోత్కక్రమణం అంటారు. ప్రాణోత్కక్రమణం అంటే ఏమిటో భాగవతంలో చెప్తారు మనసేం చేస్తుందంటే ఆఖర్నా ఇంద్రియాల్లో ఉన్న శక్తినంతటినీ సర్దేస్తుంది తీసుకుంటుంది గబగబా అంటే కంట్లో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని లాగేసి తనతో అంటించుకుంటుంది. చెవికి వినగలిగిన శక్తిని తనతోపటు తీసేసుకుంటుంది, స్పర్శేంద్రియానికి చర్మానికి ముట్టుకుంటే తెలిసే శక్తిని వెనక్కి లాగేసి పట్టుకుంటుంది. పట్టుకుని ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే... ప్రాణోత్కక్రమణంతో అంటే ప్రాణం ఆఖరి శ్వాస ఎట్నుంచి నిర్గమించిందో... ఏ కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయిందో... అట్నుంచి బయటికి పారిపోతుంది.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అది కూడా వెళ్ళిపోయీ, ఇదే మనసు మీరు చిట్టచివర దేన్నిస్మరించారో, ఇది తీర్పు. పరమేశ్వరుడికి పునర్జన్మయందు అధికారము లేదు, బాగాగుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, బాగా బాగాజ్ఞాపకంచేసుకోండి. మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవలసింది పునర్జన్మయందు ఈశ్వరునకు అధికారం లేదు. ఈశ్వరుడివ్వలేదు. మళ్ళీ నన్ను మనిషిగా పుట్టించు ఈశ్వరుడు పుట్టించలేడు ఇవ్వలేడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసాండీ అది మీకు వదిలిపెట్టేసాడు మనిషికి, నీ పునర్జన్మ నీ చేతిలోనే ఉంచాను, మళ్ళీ పుడతావో మళ్ళీ పుట్టవో ఎటుపోతావో నీఇష్టం నీకు వదిలేశాను అంతే... ఎలా వదిలాడో తెలుసా... మనసుకి స్మరణ ఉంటుంది. అందుకే ʻస్మరణఃʼ అంటారు అందుకే ఎప్పుడూ తలుచుకుంటుందీ దేన్నితలుచుకోవడానికి అది అలవాటు పడిపోయిందో అది ఊపిరిమీద ఆధారపడుతుంది, ఆఖర్న అది దేన్నిస్మరించిందో, దాన్నిబట్టి పునర్జన్మ ఇస్తాడాయన, నా మనస్సు ఎప్పుడూ డబ్బుని స్మరించిందనుకోండీ... అర్థేశా హీనోపాదుల్లోకి వెళ్ళిపోతాడు, తెళ్ళు జర్రులు పాములు ఇలాంటివాటిల్లోకి వెళ్ళిపోతాడు, దారేశా భార్యయందు ఉండిపోయిందనుకోండీ అప్పుడూ మళ్ళీ ఆ కాముకత్వం చేతనో, ఆమో యందు ప్రీతి చేతనో జారిపోవడం జరిగిందనుకోండీ, భార్య అదే పనిగా స్మరణకు వచ్చేసి అదేపనిగా ప్రాణం విడిచి పెట్టాడనుకోండీ, ఎక్కడో మళ్ళీ హీనోపాదుల్లోకి వెళ్ళిపోతాడు, ఎదో కుక్కో, పిల్లో వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి జంతువుల్లోకి, అటువంటి జన్మలలోకి వెళ్ళిపోతాడు. నిలువుగా తిరిగదిక మనిషికే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. మిగిలిన వాటికి అడ్డంగానే పుట్టి అడ్డంగానే ఉంటాయి అలాగే వెడతాడు.
ఇప్పుడు స్మరణము ఈశ్వరుడు చూస్తాడు ఆఖరున ఆఖరి స్మరణ ఏదిచేశాడు చూస్తాడాయన, ఈశ్వరుని స్మరించింది మనస్సు మోక్షం ఇచ్చేస్తాడు. ఈశ్వరున్ని స్మరించడం అంటే ఆఖర్నున స్మరిస్తానండీ...? ఇప్పుడెందుకివన్నీ అన్నారనుకోండీ, అలవాటు చేసిందేదో అది స్మరిస్తుంది. అంతేగాని అప్పుడు స్మరించడానికి ఇంక ఓపిక ఏమీ ఉండదిక. అప్పుడు మనసేం చేస్తుందంటే... నిర్గమిస్తుంది నిర్గమించడం అంటే గుర్తుపెట్టుకోండి, కళ్ళలోంచి, ముక్కు కన్నాలోంచీ, చెవులోంచి, నోట్లోంచి, రోమ కూపములు కొన్ని లక్షలనుంచి నిర్గమిస్తుంది. వెంట్రుకలు పుట్టిన కన్నాలు ఉంటాయి అవి కన్నాలే లేక పోతే చమట బయటికి ఎలా వస్తుంది లోపల్లోంచీ, రోమకూపాల్లోంచో అంటే అధోముకంగా... ఊర్ధ్వముకంగా వెళ్ళదు ఇక్కడ కపాలం పగిలి వెళ్ళాలి వెళ్ళిందీ అంటే వాడికి పునర్జన్మ లేదనిగుర్తు. అలా వెళ్ళలేదు అంటే ఏటో కిందకి కన్నాలలోంచి వెళ్ళాడు అంటే వీడికిచ్చిన ఉపాదిని వీడు వాడుకోలేదు. దీంతో ఏది చేరాలో అది ఉపయోగించలేదు, ఉపయోగించలేదు కాబట్టీ అయినవాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసాండీ... దిక్కుమాల్నోడూ వీడిబతుకేంటో తెలుసా..? అన్నీ తెలుసన్నవాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వానికి ఏకాదశి మరణం అన్నది అందుకే వచ్చింది సామెత. వీడి పుర్రె పగల్లే ప్రాణం పోయినప్పుడు, కాబట్టీ వీడి పుర్రె పగిలిపోయ్యే వరకు కాల్చేస్తాం. టప్ అని శబ్దం వస్తుంది. కపాల మోక్షం అయిందని వెళ్తారు. నీవు ఎలాగో పగలగొట్టుకోలేదు. మేమే పగుల గొట్టాం పో. ఈస్థిని నీవు పొందకుండా ఉండాలంటే నీమనసుని సాధనచేత తిప్పాలి. సమస్త కర్మల యొక్క అంతిమ ప్రయోజనం మనసుని శుద్ధిచెయ్యడమే... మనసు సంస్కరించబడకపోతే...? అర్థేశా కామేశా పుత్రేశా భార్యేశా ఇలా ఉండిపోయిందనుకోండీ ఈ ఈశలు పునర్జన్మకి కారణం అవుతాయి.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
Image result for బొట్టు పెట్టుకోవడంఇది మనం ఒప్పుకుంటాము కాబట్టే మనం బొట్టు పెట్టుకుంటాము. సనాతన ధర్మం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు, సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవడం. బొట్టు పెట్టుకున్నాడంటే గుర్తేమిటంటే పునర్జన్మను ఒప్పుకున్నాడని గుర్తు. బొట్టు పెట్టుకోలేదంటే వాడికి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదని గుర్తు. వాడు వేద ప్రమాణాన్ని ఒప్పుకోలేదని వాడు బొట్టు పెట్టుకోలేదు. మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటామంటే మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని మేం అంగీకరిస్తున్నాం. ఇదీ బొట్టు పెట్టుకోవడంలో సూచిస్తుంది. అందుకని బొట్టుపెట్టుకుంటారు సనాతన ధర్మంలో, సనాతన ధర్మంలో బొట్టు లేకుండా బయటికిరారు ఎవ్వరూ, కనుకా రాముడి విషయంలో ఏమైందంటే, మూడు బాగా అర్థం చేసుకున్నాడు అంటున్నారు మహర్షి. బాగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటండీ? అంటే ఏమీ లేదు మీరు బాగా అర్థం చేసుకోవడం అంటే...? ఈ కామాన్ని పట్టుకెళ్ళి ధర్మంతో ముడేసెయ్యి, అర్థాన్ని తీసుకెళ్ళి ధర్మంతో ముడేసెయ్యి. అర్థము కామము అనే రెండు పరుగెత్తిపోయి పక్కన ఉన్నటువంటి నీవికాని పొలాల్లో పడి మేసే అలావాటున్నటువంటి ఆ ఏవి దున్నపోతులంటారే... అటువంటి స్థితి కలిగినటువంటివి, ఎందుకంటే తమకొం బొప్ప బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై చి ముదం బెప్పుడు గల్గజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా! అంటాడు దూర్జటి. అర్థము కామము అనేటటువంటి రెండింటికీ ధర్మమనేటటువంటి ఇనుప స్తంభానికి కట్టినట్లు కట్టుబడాలి. అలా కట్టుబడకపోతే ఇబ్బందే, ధర్మ బద్దముకాని కోర్కె పుట్టేటట్టు, నీవు చెయ్యగలిగినవి నీవు చూడ్డం మొదలు పెట్టావా ప్రమాదమే. నీకు శ్రేయస్సునివ్వనివి చదువుతున్నావు, నీకు శ్రేయస్సునివ్వనివి నీవు చూస్తున్నావు ఇప్పుడు అటువంటివి చూసి అటువంటి విని నీవు ప్రమాదంలో పడిపోతున్నావు.
Image result for ధర్మము కామము అర్థమునీకు ఎనిమిది అడుగుల కర్రని ఇచ్చి దీనిని నాలుగు ముక్కలు జేయాలంటేనేను ఎన్ని ముక్కలు చేయాలి. ఎన్నమ్మా నాలుగు ముక్కలు. ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి రెండడుగులు నాలుగు రెండ్ల ఏనిమిది కదా... ఇప్పుడు ఎనిమిది అడుగుల కర్ర నాకిచ్చారు మీరు ఆకర్ర తీసుకొచ్చి అక్కడ పెట్టీ రెండడుగులు చూసి అక్కడకి కత్తి పెట్టి నరికాను ఓ ముక్క వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ ఆరడుగుల ముక్కుందిగా, ఇప్పుడు మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకో రెండడుగుల ముక్కను నరికాను, ఇంకో రెండడుగుల ముక్క వచ్చింది, ఇంకెంత ముక్క మిగిలింది నాలుగు అడుగుల ముక్క మిగిలింది. ఇప్పుడు నాలుగు అడుగుల ముక్క అక్కడ పెట్టీ, రెండడుగుల దగ్గర మళ్ళీ అక్కడ నరికాను ఎన్ని ముక్కలొచ్చాయి రెండడుగులవి రెండొచ్చాయి ఎనిమిది అడుగుల ముక్కని రెండడుగుల సమాన భాగములు నాలుగు చేయడానికి ఎన్ని మాట్లు నరికాను మూడు మాట్లే, మూడు మాట్లు నరికితే నాలుగో ముక్క వచ్చేసిందా లేదా... రెండడుగుల ముక్కా... ధర్మబద్దమైన అర్థము, ధర్మబద్దమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తాయి, తప్పా మోక్షమును సాధించడము అని ఇంక వేరే ఏమీ ఉండదు. మోక్షము అంటే ధర్మబద్దమైన అర్థ, కామములను తెలిసి ఉండుటా అలా జీవించుటా అదియో మోక్షమునకు హేతువు ఇదీ రాముడికి తెలుసు. కాబట్టి ఏది ప్రధానంగా తెలిసుండాలంటే ధర్మం ప్రధానంగా తెలిసుండాలి, తెలిసుంటే ధర్మానికి అర్థ, కామములను ముడివేయాలి, రాముడు ఎలా వేస్తే నువ్వు అలా వేయాలి, కాబట్టి అయోధ్య కాండ అంత గొప్పది. అయోధ్య కాండ అంటే గృహస్తాశ్రమానికి పనికి వచ్చేటటువంటి ఎన్ని విషయాల్లో ఆవిష్కరిస్తుందండీ... అలా మీరు ఏ శ్లోకం పట్టుకున్నా అంతే... అందులోంచి ఎన్ని రహస్యాలను చెప్తుందో, “వేదోపబృహ్మాణంఅది. ఏ శ్లోకం మీరు చదవండీ అందులోంచి మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటుంటారు. ఓ ఇదన్నమాట విషయం, దీన్ని దిద్దుకోవాలన్నమాట అని తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి రాముడు, ఇటువంటి గుణములు కలిగినవాడు, పైకి ఎలా కనబడుతుంది రాముడు ఇన్ని గుణములు కలిగినవాడని ప్రజలు కీర్తిస్తున్నారు.
ఇప్పుడు దశరథ మహారాజుగారు అనుకున్నారటా... అధ రాజ్ఞో బభూవ ఏవం వృద్ధ స్య చిర జీవినః ! ప్రీతిః ఏషా కథం రామో రాజా స్యాత్ మమ జీవతి !! నేను చాలా కాలం బ్రతికాను పెద్దవానైపోయాను, వృద్ధున్నైపోయాను 60 వేల సంవత్సరములు వయస్సు వచ్చింది. ఇంతకాలం బిడ్డలు లేరనిబాధ, ఇప్పుడు బిడ్డలు పుట్టిన తరువాత గుణవంతులయ్యారని సంతోషం, ఇప్పుడేం కోరిక వచ్చింది కొత్తగా నేను బ్రతికుండగా రాముడు రాజైతే చూస్తేబాగున్ను, తరువాత కోరిక ఏమిటి వచ్చింది దశరథ మహారాజుగారికి రాముడు రాజై పరిపాలన చెయ్యడంచూసి స్వర్గానికి వెళ్ళిపోతే బాగున్ను ఇప్పుడు ఈ కోరిక పుట్టింది అని ఆయన అనుకుంటున్నాడూ... వృద్ధి కామో హి లోక స్య సర్వ భూతాను కమ్పనః ! మత్తః ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్ !! దశరథుడి దృష్టిలో రాముడు ఎటువంటి వాడు, ఆయన లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు. ఎలా అనుగ్రహిస్తాడు అంటే ఒక ఊళ్ళోవాళ్ళందరూ దాహంతో ఆర్థితో ఉన్నారు, కేవలం పంపుల్లో నీళ్ళు బాగావదిలిపెడతామండీ అంటే సరిపోతుందా, ఆ చెరువు ఎండిపోతుంది, బాగా నిండినటువంటి మేఘముల గుంపు వచ్చి వర్షించిందా... చెరువులు, తటాకములు అన్నీ నిండిపోతాయి, మంచి జల సంవృద్ధి కలుగుతుంది. జనుల యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి సమర్థతలో నీరు నిండిన మేఘం లాంటివాడు నా కొడుకు. అంతటి సమర్థుడు కాబట్టి ఆ రాముడు రాజైతే బాగుండు, అయితే యథా స్వర్గమ్ అవాప్నుయామ్ అప్పుడు నేను రాజరికం ఆయన చేస్తుండగా చూసి, ప్రాణం విడిచిపెట్టి నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అని అనుకొని కబురు చేశాడు పౌరులకూ, జానపదులకూ, సేనానాయకులకూ, మంత్రులకూ, సామంతులకూ, ఇతర ప్రముఖులకూ అందరికీ విడివిడిగా కబులు పంప్పేటట్లు ఏర్పాటు చేశాడు, అందరికీ కలిపి ఒకేసారి కాదు. విడివిడిగా ఒకరికి తెలిసినట్లు ఒకరికి తెలియదు, వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకునే అవకాశం ఇవ్వలేదు దశరథుడు. ఎందుకనీ ఇది ʻఊర్జిత కథోపేతంబుʼ ఏం అశ్వమేధ యాగం చేసినప్పుడు చెప్పినట్లు చెప్పచ్చుగా... అలా చెప్పలేదు.
అందరూ రావాలి ఎలా కబురుచేశాడో తెలుసాండీ... సామంతులందరి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పి పదకొండు అయ్యేటప్పటికి వచ్చేయండి. సామంతులందరూ ఎందుకు రమ్మన్నాడు చక్రవర్తీ మాట్లాడుకునే అవకాశం లేదు, అలాగే జానపదుల్లో ప్రముఖుల్నీ వచ్చేసైమను. ఒకళ్ళనొకళ్ళుకి కబురు చేశాడు వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు వచ్చేసైయ్యడమే... ఒకరితో ఒకరు ఎందుకు పిలిసుంటారు అన్న విషయం మీద చర్చించుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు. ఎందుకు చేసుండాలి? ఏం వాళ్ళు చర్చించుకుంటే ఏం? వాళ్లల్లోవాళ్ళు చర్చించుకుంటే... ఏది చర్చించుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, రాజు వృద్దుడు అయిపోయాడు, యౌవ్వరాజ్య పట్టాభిషేకం ఏమైనా చేద్దామనుకుంటున్నాడా ఏమైనా... ఇంతమందిని పిలిచాడంటే బహుశః అదే అయి ఉంటుంది. కాబట్టీ యౌవ్వరాజ్య పట్టాభిషేకం అంటే ఎవ్వరికి చేయాలి దశరథ మహారాజుగారు రాముడికే చెయ్యాలి, మరి రాముడికే చేస్తాడని వాళ్ళు అనుకుంటే...? రాముడు మంచివాడు కాకపోతే... భయపడాలి, రాముడు మంచివాడని తానే అనుకుంటున్నాడుగా. రాముడు మంచివాడని నేను అనుకుంటున్నా, ప్రజలు అనుకోవట్లేదు అని అనుకుంటే తను భయపడాలి, ప్రజలు అనుకుంటున్నారని తనకి తెలుసుగా... కాబట్టి ప్రజలూ ఆయన రాజవ్వడము కాదనరు. తనకీ రాముడు రాజవ్వడము ఏమీ వ్యతిరేకం కాదు, మరీ తనూ కోరుకొని ప్రజలూ కోరుకున్నా రాముడు రాజు అవడేమో అని ఎందుకు భయపడుతున్నాడు? అంటే దశరథుడు భయపడవలసిన కారణము ఏదో ఉందన్నమాట కదాʻఇది ఊర్జిత కథోపేతంబుʼ ఇదీ మీరు పట్టుకోవలసింది.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అంటే ఏదోదాచాడు దశరథ మహారాజుగారు అది మనకు తెలియదు ఏం తెలుస్తుంది ఎక్కడో ఏదోదాచాడు భయపడుతున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకునే భరతుడు మేనమామగారి ఇంటికి వెళ్ళడాన్ని కూడా దూర దృష్టితో అంగీకరించాడు, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్లందర్నీ కూర్చోబెట్టాడు, కూర్చోబెట్టి వేరొకవైపు నుంచి నరుక్కోచ్చి మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో, తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు దశరథుడు, తను నిర్ణయానికి రావడానికి కారణం, ఆ నిర్ణయం చెయ్యవలసిన పరిస్థితి కాదు, ఆ నిర్ణయం తను బ్రతికుండగాచేసి అమలు చేయ్యగలనో చెయ్యలేనో అన్న భయంచేత చేస్తున్నాడు. ఇదీ భయమన్నది ఉన్నదీ అంటే...? దాని వెనక ఎదో చెయ్యకూడనిది ఒకటి చేసినటువంటి విషయం ఉంది? చెయ్యకూడనిది ఏదో ఒకటి ఇంతకు ముందు చేసినదీ ఇప్పుడు చెయ్యవలసినటువంటి ధర్మానికి అడ్డుగా వస్తోంది, ఇప్పుడు ఈ అడ్డుగా వస్తున్నది పది మందికి చెప్పలేనిది, పది మందికి చెప్పలేని దానిని తప్పించుకుని చెయ్యవలసింది చేసెయ్యాలనుకుంటే తాను భయపడుతున్నాడు. ఏమిటా విషయం అది బయట తనెలా పడుతాడు? పడడు అందుకని పడకుండా మాట్లాడాలి ఇప్పుడు సభలో.
ఎంతందంగా మాట్లాడుతున్నాడో చూడండీ దివి అన్తరిక్షే భూమౌ చ ఘోరమ్ ఉత్పాతజం భయం ! సంచచక్షే మేధావీ శరీరే చాఽఽత్మనో జరాం !! ఈ మధ్య కాలంలో భూమి మీద అక్కడా నాకూ ఓ ఉత్పాతములు కనపడుతున్నాయ్, అందుకని నేను తొందరగా యౌవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దాము అని అనుకొంటున్నానున తు కేకయ రాజానం జనకం వా నరాధిపః ! త్వరయా చ ఆనయా మాస పశ్చాత్ తౌ శ్రోష్యతః ప్రియం !! ఈ యౌవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని నేను అనుకుంటున్న విషయాన్ని, మీరు జనక మహారాజుగారికి గాని, కేకయ రాజు గారికి కానీ తెలియనివ్వకండీ... తెలియనివ్వకండీ అని అనగానే అనుమానం వస్తుందా రాదాండీ...? జనకుడికి ఎందుకు చెప్పకూడదు, వియ్యంకుడు, ఎట్లాంటి వియ్యంకుడు కుషధ్వజుడు తమ్ముడు, ఆ తమ్ముని యొక్క ఇద్దరు కూతుర్లు ఇద్దరు కోడళ్ళు, జనకుడి యొక్క ఇద్దరు కూతుళ్ళు తన యొక్క ఇద్దరు కోడళ్ళు కాబట్టి ఇప్పుడు జనకుడి కూతుళ్ళు కిందే వస్తారు ఆ నలుగురు కోడళ్ళు. కాబట్టి వియ్యంకుడు కదా జనకున్ని పిలవాలి పట్టాభిషేకం చేసేటప్పుడు, పిలవద్దు అంటున్నాడు. అదేమిటండీ వియ్యంకుడికి చెప్పద్దంటాడేమిటీ? యౌవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తూ... అని ఎవరైనా అనుకుంటారేమోనని అనుకోకుండా ఉండవలసిన రీతిలో ఓ మాట చెప్తున్నాడు, జనక మహారాజు గారికి చెప్పకండీ, కేకయ రాజు గారికి చెప్పకండీ, వాళ్ళిద్దరికి తెలియక్కర లేదు అన్నాడు. అంటే ఈ ఇద్దరే వద్దంటానికి ఏదో కారణం ఉందన్నమాట, ఈ ఇద్దరిని ఎందుకు వద్దంటున్నాడు అన్నదానిని తరువాత తెలుస్తుంది ʻఊర్జిత కథోపేతంబు కదాండీ!ʼ తెలిసినా నేను చెప్పేయకూడదు.
అలా చెప్పకుండా ఉండాలి కసేపు గుంబనంగా... కాబట్టీ వీళ్ళిద్దరికీ తెలియనివ్వకండి, అంటే మిగిలినవాళ్ళు తెలివి తక్కువవాళ్ళా ఏమిటీ? ఏండీ వాళ్ళిద్దరికి ఎందుకండీ చెప్పొద్దన్నాడూ... అంటారు. కార్యం తొందరగా పూర్తిచెయ్యాలి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు వెళ్ళి చెప్పి తీసుకొచ్చేంత సమయం లేదు అందుకనీ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళి చెప్పాలని అనుకోకండీ...! చేసేది మంచిపని కాబట్టి వాళ్ళు తెలుసుకొని సంతోషిస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించే అవకాశం లేకుండా ఆపాడు, అంటే దశరథుడు అమాయకుడేం కాదు చాలా తెలివైనవాడు కదాండీ... చాలా ఆలోచించాడన్నమాట ఎన్నో రాత్రులు ఆలోచించాడు, ఆలోచించి మిగిలిన వాళ్ళతో పాటుగా నేను ఈ విషయం మాట్లాడాలి అన్నాడు, అని పౌరులనీ, జాన పదులనీ, సామంతులన్నీ అందర్నీ కూర్చోబెట్టి అన్నాడూ ఇదం శరీరం కృత్స్న స్య లోక స్య చరతా హితమ్ ! పాండుర స్య ఆతపత్ర స్య చ్ఛాయాయాం జరితం మయా !! చాలా గొప్ప మాటండీ నాకు రామాయణం ఆయోధ్య కాండలో చాలా ఇష్టమైన శ్లోకాలలో ఇదొకటి, ఎంత అందంగా మాట్లాడాడంటే... సభ యొక్క సానుభూతిని పొందేరీతిలో మాట్లాడాడు. ఈ తెల్ల గొడుగుకింద కూర్చొని నేను చాలా కాలంగా పరిపాలన చేస్తున్నాను. రాజు రంగుల గొడుగుల కింద కూర్చోకూడదు, తెల్ల గొడుగు కిందే కూర్చోవాలి. ఇప్పుడు రేపు పాదుకా పట్టాభిషేకం చేశారనుకోండీ, రంగు గొడుగు పెట్టకూడదు తెల్ల గొడుగే పెట్టాలి, తెల్లగొడుగు లేదనుకోండి చేయించేయాలి ఈలోగా... కాబట్టీ తెల్లటి గొడుగుకింద కూర్చున్నాను నేను ఎన్నేళ్ళు, కొన్ని వేల ఏళ్ళు కూర్చున్నాను, కొన్ని వేల ఏళ్ళు కూర్చోవడంలో నాకు తెలియలేదు సుమా... అన్నాడు అంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనందంలో, ఈ భోగాల్లో ఈ శరీరం ముసలిదై పోయింది. తెల్ల గొడుగు కింద ఈ శరీరం జజ్జరీ భూతం అయ్యిపోయింది అంటే తెలియకుండా భోగాల్లో జజ్జరీ భూతం అయిపోయింది.
Image result for దశరథుడుఅది ముసలి తనానికి వెళ్ళిపోతే... ప్రాప్య వర్ష సహస్రాణి బహూని ఆయూంషి జీవతః ! జీర్ణ స్య అస్య శరీర స్య విశ్రాన్తిమ్ అభిరోచయే !! ఈ జీర్ణమైపోయిన శరీరం ఇంకా పరిపాలన చెయ్యమంటే చెయ్యలేకపోతోంది? అందుకని ఇది కొంత విశ్రాంతిని కోరుకుంటుంది, నేను నా పూర్వీకులు కూడా ధర్మాన్ని పట్టుకుని కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్ష్వాకు వంశాన్ని, ఈ ప్రజలను రాజ్యాన్ని కన్నబిడ్డలుగా పరిపాలిస్తున్నాము. నా పూర్వీకులు ఏ ధర్మాన్ని పట్టుకున్నారో నేను కూడా అదే ధర్మాన్ని పట్టుకున్నాను మిమ్మల్ని కన్న బిడ్డల్లా పరిపాలించాను, నా ఓపిక ఉన్నన్నాళ్ళు పరిపాలించాను ఇక నాకు పరిపాలించడానికి ఓపిక లేదు విశ్రాంతిని పొందాలి అనురూపః స వై నాథో లక్ష్మీవాన్ లక్ష్మణాఽఽగ్రజః ! త్రైలోక్యమ్ అపి నాథేన యేన స్యాత్ నాథవత్తరమ్ !! మూడు లోకాలను పరిపాలించగల దక్షుడైనటువంటి రాముడు నా కుమారుడు, కాబట్టి ప్రజలకు హితకరమైనటువంటి రీతిలో పరిపాలన చెయ్యగలిగినవాడు కాబట్టి రాముడికి యౌవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాను, ఎవరో ఒక్కరే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అంత గొప్పగా ఉండదు. తటస్తులై అంటే అటూ ఇటూ చెందనివారైనటువంటివారు నిర్ణయించి చెప్పినటువంటి నిర్ణయంలో పక్షపాతము ఉండదు. కాబట్టి మీరు బాగా ఆలోచించి చెప్పండీ... మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను ఇవ్వనా రాముడికి రాజ్యాన్ని అని అన్నాడు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అంటే సభంతా ఒక్కసారి అందీ అనేక వర్ష సాహస్రో వృద్ధః త్వం అపి పార్థివ ­! స రామం యువ రాజానమ్ అభిషిఙ్చస్వ పార్థివమ్ !! ఇచ్ఛామో హి మహాబాహుం రఘు వీరం మహా బలం ! గజేన మహతాయాంతం రామం ఛత్రా వృతాఽఽననం !! రాజా! నీవు కొన్ని వేల సంవత్సరములు పాలించావు బడలిపోయావు, మాకు కోరికగా ఉంది ఎప్పుడెప్పుడు రాముడు రాజౌతాడాయని, ఎప్పుడెప్పుడు అంబారీ ఏనుగు మీద వెడతాడాయని, ఎప్పుడెప్పుడు తెల్లగొడుగుకింద కూర్చొని యువ రాజుగా వెడతాడా... ఎప్పుడు చూస్తామా వీళ్ళిప్పుడు కలల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయారు, మాకలా ఉందని చూడాలని ఉందీ అన్నారు. దశరథుని ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసాండీ! ఇప్పుడు సభచేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు ప్రజలందరూ కోరుకున్నారయా రాముడు రాజు కావాలనీ అన్న విషయాన్ని తీసుకొస్తున్నాడన్నమాట ప్రస్థావనలోకి నా నిర్ణయం కాదు ప్రజలందరూ కోరుకున్నారనుకుంటున్నాడు, అంటే ఎదో భయముంది, తనే నిర్ణయం చేశాడని చెప్పడానికి భయపడుతున్నాడు. అధికారం తనకున్నా, రామున్ని రాజు చేయడానికి తనకు అధికారం తనకుంది. పెద్ద కొడుకుని చేసేయవచ్చు.
కానీ నేనే చేశానండీ పెద్ద కొడుకుకి రాజునీ అంటే ఎలా చేస్తావయ్యా అనేవాడు ఎవడో ఉన్నాడన్నమాట, ఎలా చెస్తావయ్యా అనేవాడు ఉన్నాడంటే... అలా అనడానికి అవకాశం తనిచ్చాడన్నమాట ఎవరికో... అలా అనేవాడు ఎవడైనా ఉన్నవాడు వచ్చి అంటాడేమోనన్న భయంతో, రాజన్నవాడు ప్రజలు మెచ్చుకున్నవాడై ఉండాలి, ప్రజలందరూ కోరుకున్నారు రాముడికి రాజ్యం ఇచ్చేశాను అనిపించడానికి సభచేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఎంత తెలివిగావేయించాడో తెలుసాండీ! శృత్వైవ వచనం యన్మే రాఘవం పతి మిచ్ఛథ ! రాజానః సంశయోయం మే కిమిదం బృత తత్త్వతః !! కథం ను మయి ధర్మేణ పృథివీమ్ అనుశాసతి ! భవన్తో ద్రష్టుమ్ ఇచ్ఛన్తి యువ రాజం మమాఽఽత్మజమ్ !! మీరు నిజంగా చెప్పండీ, నేను ఇన్నివేల సంవత్సరములు ధర్మంగా పరిపాలించాను గదా... రాజా! మీరు ఇప్పుడు ముసిలివారైపోయారా ఏమిటి చక్కగా ఓపిగ్గా ఉన్నారు గదా పరిపాలిస్తున్నారు గదా మీరే ఉండండి ఇప్పుడు ఎందుకు అమంగళకరంగా ఎమిటా కొత్తగా ఆ యౌవ్వరాజ్య పట్టాభిషేకం ఏమిటీ? అలా ఉండండీ హాయిగా ఉండండి అనడం మానేసి, రామున్నే తీసుకొచ్చి పెట్టేయండీ అంటున్నారు కదా, కాదు ఓరేయ్ మీకు నా పాలనలో లోపం కనపడిందా... రాముడిలో నా కన్నా గుణాలు కనపడ్డాయా...? ఏవి చెప్పండి అన్నాడు.
అంటే ప్రజలు ఎంతగా కోరుకున్నారో చెప్పించాలనుకొన్నాడు, వాళ్ళన్నారు బహవో నృప కల్యాణ గుణాః పుత్ర స్య సన్తి తే నాయనా మహానుభావా ఏమిటి, ఏం చెప్పమంటావు నీ కొడుకుకి ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో...ధర్మజ్ఞః సత్య సంధ శ్చ శీలవాన్ అనుసూయకః ! క్షాన్తః సాన్త్వయితా శ్లక్ష్ణః కృతజ్ఞో విజితేన్ద్రియః !! రాజైనటువంటివాడు మృదుస్వభావియై ఉండాలి, తీవ్రమైన శిక్షలు వ్యగ్రతతో కూడిన బుద్ధి ఉన్నవాడు కాకూడదు, ప్రజలు ఎలా కోరుకుంటున్నారో ఆ మాటను అన్నారు. రాముడు అలాంటివాడు కాబట్టి ప్రజలు అంటారు ధర్మజ్ఞః ఆయనకు ధర్మం తెలుసు సత్య సంధ శ్చ మాట తప్పడు అబద్ధమాడడు శీలవాన్ అనుసూయకః మంచి స్వభావం ఉన్నవాడు, ఎవ్వరియందు అసూయలేని వాడు క్షాన్తః ఓర్పు ఉన్నవాడు సాన్త్వయితా ఆయనా మాట్లాడేటప్పుడు కుపితులనూ చాలా బాధతో ఉన్న వాళ్ళనీ ఇబ్బందులలో ఉన్నవాళ్ళని ఓదార్పుగా మాట్లాడుతాడు తప్పా... అవతలివాడు కష్టంలో ఉన్నాడు కదాని మరింత ఎడ్చేలా మాట్లాడటం ఆయనకీ రాదు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
Image result for శ్రీ రామ చంద్రుడుకాబట్టి సాన్త్వయితా శ్లక్ష్ణః అత్యంత వృధువైనటువంటి స్వభావం ఉన్నవాడు కృతజ్ఞో చేసిన ఉపకారమును మరువని వాడు విజితేన్ద్రియః ఇంద్రియములను గెలిచినవాడు ప్రియవాదీ చ భూతానాం సత్య వాదీ చ రాఘవః ! బహు శ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానామ్ ఉపాసితా !! బాగా చదువుకున్నటువంటి వృద్ధుల్ని, బ్రాహ్మణుల్ని, ఉపాసించేటటువంటి లక్షణముగలిగినటువంటివాళ్ళని ప్రియవాదీ చాలా ప్రియముగా మాట్లాడేవాడు, అన్ని భూతముల పట్లా గౌరవం కలిగినటువంటివాడు, సత్యవాది అయినటువంటివాడు అటువంటివాడు రాజు కావాలని మేం కోరుకోమా... వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః ! ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి !! చాలా చమత్కారమైనటువంటి మాట అన్నారు వాళ్ళు వ్యసనేషుమనుష్యాణాం భృశం ధుఃఖితః ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు తెలుసుకుని వాళ్ళు కష్టపడ్డారని బాధపడుతూనే ఉంటాడు రాముడు. ప్రజల్ని సుఖపెట్టడంలో తండ్రిలా సుఖపెడతాడు. ఏమిటీ మాట అంటే రాముడు పరిపాలన చేయ్యడం అంటే ఎలా ఉంటుందటా, ప్రజలకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టం తీరిపోయింది తరువాత ప్రజలు ఆ కష్టం మరిచిపోయారు, రాముడు మరిచిపోడట, నేను రాజునై ఉండగా ఒకానొకప్పుడు ప్రజలంత కష్టపడ్డారు, నేను అప్పుడు వాళ్ళని సుఖపెట్టలేక పోయాననీ ఇప్పటీ తలుచుక తలుచుక ఎడుస్తాడట అదే అమ్మ లక్షణం అన్నాడు. దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఇచ్చారు పెద్దలైనవారు ఒక వాఖ్యానంలో...
ఒక తల్లీ ఒక పసిపిల్లవాన్ని తీసుకొని అక్కడ కూర్చోబెట్టుకుందీ బియ్యం ఏరుకుంటూందీ... ఇంతలో ఎవరో ఇంకో అమ్మలక్క వచ్చింది ఆవిడతో ఈవిడా మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లవాడు తెలిసీ తెలియనివాడు పాకుతూ పాకుదూ వెళ్ళి పక్కనున్న పాడుబడ్డ బావిలోపడిపోయాడు, అమ్మా అని ఏడ్చాడు, చీకటిగా ఉంది నుయ్యి అందులో పడిపోయాడు, అయ్యో పిల్లాడుపడిపోయాడ, పిల్లాడుపడిపోయాడు అని గుండెలు బాదుకుంది ఆవిడ, బాదుకుంటే చుట్టుపక్కలవాళ్ళు వచ్చారు నిచ్చనేసుకున్నారు లోపలికి దిగారు అదృష్టవశాత్తు ఇసుక కయ్యవుంది అక్కడ పిల్లవాడికి ఏమీ అవ్వలేదు, వాడు చిరునవ్వు నవ్వుతున్నాడు వాడిని పైకి తీసుకొచ్చారు, ఒళ్ళేం దెబ్బలు తలగల్లేదు రక్షపెట్టారు, వాడు పెరిగాడు పెద్దవాడైయ్యాడు ఆ తరువాత ఇరవైఏళ్ళ తరువాత గుంటూరులో రామాయణం జరుగుతోంది, ఈవిడా అక్కడకొచ్చింది, అక్కడికొచ్చి రామాయణం అప్పుడు బియ్యం ఏరుకుంటూంటే వచ్చినావిడా రామాయణానికి వచ్చింది, అయిపోయి ప్రసాదం దగ్గర కలుసుకున్నారు. ఈవిడని తీసుకెళ్ళడానికి ఈవిడ కొడుకు కారువేసుకొచ్చాడు, అమ్మా వచ్చేస్తావా తీసుకెళ్ళిపోతాను అన్నాడు, ఈ రెండో ఆవిడా ఈవిడా ఇంతక ముందు మీరు ఒంగోలులో గదా ఉండేవారు అన్నారు, మీ రెవరూ అంటే నేను ఇంతక ముందు సత్యవతినీ నీవు రుక్మిణీవి కదూ అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరూ మాట్లాడుకున్న తరువాత ఈ పిల్లవాడు అమ్మా వచ్చేస్తావా అన్నాడు, మనిద్దరం మాట్లాడుకుంటూంటే నూతిలో పడిపోయినవాడేనా వీడా..? అందావిడా... అంటే అవునమ్మా అప్పుడు నాపిల్లాడు అదృష్టం కొద్దీ బ్రతికాడుకానీ బియ్యమేరుకుంటూ నీతో మాట్లాడుతు ఉండిపోయాను, పిల్లాడు నిజంగా నా అదృష్టం కొద్దీ దక్కాడు ఏమైపోనో అని ఆవిడ ఇప్పుడు కళ్ళొత్తుకుందట, అప్పుడు పడిపోతే ఇప్పుడు కళ్ళొత్తుకోవడం ఎందుకు అంటే పిల్లాడి కష్టం తీరిపోయినా తల్లి మాత్రం మరిచిపోదు, తల్లి గుర్తుతెచ్చుకు గుర్తుతెచ్చుకు బాధపడతుంది అది తల్లి మనసు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
భృశం భవతి దుఃఖితః రాముడు ఎప్పుడు ప్రజలకు కష్టమొచ్చినా తలుచుక తలుచుక బాధపడుతాడు ఆ కష్టంపోయినా సరే ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి తండ్రి వాలంట్రీ రిటైర్మెంటు పెట్టేశాడు, ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు, అన్ని కలిపి కొడుకుక్కి ఇచ్చేశాడు, కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి అక్కడేదో చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం వచ్చింది, పెద్దవాడైపోయాడు నాన్నగారండీ ఆరు కార్లు కొన్నానండీ అన్నాడు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టానండీ అన్నాడు, తండ్రి అన్ని ఇచ్చేశాడుగా ఓ పెంకుటిట్లో ఉన్నాడు, రోహిణీ కార్తి ఈ రోహిణీ కార్తిలో నాన్నగారూ ఈ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చిందీ కాబట్టి నాకు ఇంకో లక్షరూపాయలు జీతం పెరిగిందండీ అని ఉత్తర రాశాడు, ఈ పిచ్చాయనా టైఫాయిడ్ వస్తే ఓరేయ్ ఒక్కసారి రారా అంటే... నాన్న గారండీ ఇప్పుడే ప్రమోషన్ వచ్చిందండీ నేను ఇప్పుడే రాకూడదూ, ఒక్క నాలుగైదు రోజులు చూసి తగ్గకుంటే ఫోన్ చేయండీ అన్నాడువాడు, ఏదో తగ్గిపోయింది ముసలాయన ఇంటికి వచ్చేశాడు, ఇప్పుడు ఈ ఉత్తరం వస్తే ఈయన తలమీద బట్టేసుకుని ఎదురింటికి పరుగెత్తుకెళ్ళి మా అబ్బాయికి లక్ష రూపాయలు జీతం పెరిగిందట ప్రమోషన్ వచ్చిందట అని చెప్పాడు, ఈయనా ఆ పిల్లాడికి డబ్బిచ్చి పెంకుటింట్లో ఉన్నాడు, వాడికి లక్ష రూపాయలు పెరిగితే ఇయ్యనకేంవచ్చింది, ఈయనకి టైఫాయిడ్ వస్తే వాడు చూడడానికి కూడా రాలేదు, అయినా ఇయ్యనకెందుకు సంతోషం అంటే పితేవ పరితుష్టతి తండ్రి, తండ్రి తనదంతా కొడుక్కిచ్చేసి కొడుకు సంతోషంగా ఉంటే తను సంతోషిస్తాడు, తప్పా తను సంతోషంగా ఉండి కొడుక్కు ఏమీ ఇవ్వలేకపోయినా నేను సంతోషంగా ఉన్నాను కదా వాడు ఎలా పోతే నాకేంటీ అని తండ్రి అనలేడు, కాబట్టి తనకి లేకపోయినా తన ప్రజలు సంతోషంగా ఉంటే చాలని సంతోషంగా ఉంటాడు రాముడు. మాకు కష్టంవస్తే కష్టం తీరిపోయి మేము సంతోషంతో ఉన్నా, మాకు ఎప్పుడో కష్టమొచ్చిందని ఎప్పుడూ బాధపడతాడు రాముడు ఇంక ఇంతకన్నా రాజు కావడానికి అర్హత ఏమిటయ్యా అని నీవు ఇచ్చేసై రాజ్యాన్ని చేసేయై యౌవ్వరాజ పట్టాభిషేకం మేం సంతోషిస్తాము అన్నారు ప్రజలు.
చాలా బాగుంది అన్నాడు పొంగిపోయాడు, ఇటువంటి రాముడికి ఎందుకు పట్టాభిషేకం చెయ్యాలని మేము అంటున్నామో తెలుసా, వాళ్ళు ఇంకొక బలమైన కారణం చూపించారు స్త్రియో వృద్ధాః తరుణ్య శ్చ సాయం పాత్రః సమాహితాః ! సర్వాన్ దేవాన్ నమస్యన్తి రామస్యార్థే యశస్వినః !! ఏమీ తెలియనటువంటివాళ్ళు వృద్ధులైపోయిన స్త్రీలు, యవ్వనంలో ఉన్న స్త్రీలు ఉదయమూ సాయంత్రమూ వాళ్ళు ప్రార్థనచేసేటప్పుడు కూడా పెళ్ళికాని పిల్ల ప్రార్థనచేస్తే మంచిభర్త కోసంచేయాలి, వృద్ధులైన వాళ్ళుచేస్తే తన కుటుంబంకోసం చేస్తారు, వాళ్ళటా పొద్దున్నా సాయంకాలం కూడా పూజచేసేటప్పుడటా.. మా రాముడు బాగుండాలని పూజచేస్తున్నారట, అంటే మా రాముడు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యంబాగుంటే మేము అందరం బాగుంటాము ఇంకవేరే ఏమీ అక్కరలేదు. ఎప్పుడూ రాముడు బాగుండాలి స్వామీ అని ప్రార్థనచేస్తున్నారు. ఇంక ఇంతకన్నా ఏం చెప్పమయ్యా...? రాజవకుండా అని అడిగారు, రాజైతే ఇంకా ఎంత ప్రార్థనచేస్తారో...? అంత ప్రజా హృదయమును చూరగొన్నవాడు రాముడు, కాబట్టి ఇచ్చేసై యౌవ్వరాజ్య పట్టాభిషేకం చేసేసై రామమ్ ఇన్దీవర శ్యామం సర్వ శత్రు నిబర్హణమ్ ! పశ్యాయో యౌవ రాజ్య స్థం తవ రాజోత్తమ ఆత్మజమ్ !! నీ కొడుకికీ నీవు రాజ్యమిచ్చి ఇన్దీవర శ్యాముడైనటువంటి రాముడు యువరాజయై తిరుగుతుంటే చూడాలని ఉందయ్యా! తొందరగా పట్టాభిషేకం చెయ్యమన్నారు. వెంటనే దశరథుడు బాగాగుర్తుపెట్టుకోండీ, వశిష్టుడ్ని అడగలేదు, జాబాలిని అడగలేదు, కాత్యాయనున్ని అడగలేదు, ఏ పురోహితున్నీ అడగలేదు. ఒకవేళ అడిగితే ఇప్పుడుకన్నా బలమైన ముహూర్తం తరువాత ఉందండీ అన్నారనుకోండీ, వశిష్టుడి మాట కాదనడం అంతతేలిక విషయంకాదు, అలాగ కాదులేండీ గురువుగారు ఈ ముహూర్తానికి చేసేద్దామని అనుకోండీ, వశిష్టుడన్న ముహూర్తం కాదని తను పెట్టుకున్న ముహూర్తానికి నిర్ణయం చేయగలడా కులగురువుని కాదనీ, అడక్కుండా ఉంటే గొడవవదిలిపోతుంది.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అడక్కుండా ఉంటే గొడవదిలిపోతుంది అంటే ఎప్పుడు పెట్టాలి ముహూర్తం, ఓ ఆర్నెల్లు పోయాక చేద్దామండీ యౌవరాజ పట్టాభిషేకం అన్నారనుకోండి తొందరేమీ లేదు దశరథునికి, చాలా తొందరగా చేసేద్దామనుకుంటున్నాను ఇదే మంచి ముహూర్తమండీ అన్నారనుకోండీ పక్కన వశిష్టుడునిపిలిచి అదేమిటీ అంటే... తొందరగా పట్టాభిషేకం అయిపోవాలని ఎందుకో తొందర పడుతున్నాడు, ఎందుకు తొందర పడుతున్నాడు అది ఇంకొకటి ఇంకొకటి చెప్తాడు తప్పా అసలు కారణం చెప్పడు, కాబట్టి ఇప్పుడన్నాడు మీరు తొందరగా వెళ్ళి వశిష్టాది మహర్షుల్ని తీసుకురండీ అన్నాడు చైత్రః శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పిత కాననః ! యౌవ రాజ్యాయ రామ స్య సర్వ మేవ ఉప కల్ప్యతామ్ !! చైత్ర మాసానికి ʻమధుʼ మాసమని పేరు, వైషాఖ మాసానికి ʻమాధవʼ మాసమని పేరు, ఈ రెండు మాసములు నరుడు ఎలా బ్రతకాలో నేర్పినటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు, చైత్ర మాసంలో మల్లెపువ్వు, వైశాఖ మాసంలో మామిడి పండు, చైత్ర మాసంలో వచ్చేటటువంటి మల్లెపువ్వు యొక్క సౌరభం ఎటువంటిదో... తన జీవితం అటువంటి సౌరభం కలిగి అటువంటి ధర్మాత్ముడైన రాముడు పుట్టాడు, వైశాఖ మాసంలో మామిడి పండు మామిడి చెట్టుకు కదాండీ కాస్తుందీ, మిగిలినటువంటి చెట్లకు సంస్కృతంలో రకరకాల పేర్లున్నాయి, ఒక్క మామిడి చెట్టుకు మాత్రం రసాలం అని పేరు రసోవైసహః అని ఈశ్వరుడికి పేరు. అసలు ఆ మామిడి చెట్టు పేరే ఈశ్వరుడి పేరు, ఈశ్వరుడన్న పేరున్న చెట్టుకు కాసినకాయ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు, వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి. మనం మనుషులుగా ఎలా బ్రతకాలో వేదాన్ని ఎలా నేర్చుకోవాలో, ఎలా అనుష్టించాలో శంకరభగవత్ పాదులు చెప్పారు. మామిడి పండు వచ్చిన మాధవ మాసంలో పండులాంటి శంకరాచ్యార్యులవారు, మల్లెపువ్వు విరివిగా దొరికెటటువంటి మధు మాసంలో చైత్ర మాసంలో రామ చంద్ర మూర్తి ఇద్దరూ ఉద్భవించి, ఇది తన సువాసన చేత అది తన తీపి చేత తాపాన్ని తీర్చినట్టు సంసారబ్రమణ పరితాపోపశమణాన్ని కల్పించారు ఇద్దరు. ఒకరు ధర్మాన్ని అనుష్టించి చూపించారు, ఒకొకరు ధర్మాన్ని బోధచేసి చూపించారు, కాబట్టి చైత్రః శ్రీమాన్ ఆయం మాసః పుణ్యః పుష్పిత కాననః ! యౌవ రాజ్యాయ రామ స్య సర్వ మేవ ఉప కల్ప్యతామ్ !! ఈ చైత్ర మాసం చాలా గొప్పదయ్యా, అడివిలో పువ్వులన్నీ పూస్తాయి పుష్పిత కాననః చెట్లన్నీ విరబూసి ఉంటాయి, కాబట్టి ఇది గొప్ప నెల కాబట్టీ ఇప్పుడు నేను పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను.
కాబట్టి వెంటనే వశిష్టున్ని పిలిపించాడు, జాబాలిని పిలిచాడు, కాత్యాయున్ని పిలిచాడు, వశిష్టా మీరు వెంటనే ఏర్పాటు చేసేయండీ, ఎప్పుడో ముహూర్తం తెలుసా రేపే... పుష్యమీ నక్షత్రం ఉండగా రేపు పట్టాభిషేకం చేసేస్తున్నాను రామునికి. యౌవరాజ్య పట్టాభిషేకం అయిపోవాలి, మీరు ఏర్పాట్లు చేసేయ్యండి అన్నాడు. ఎమిటంత హడావిడీ... అంత అకస్మాత్తుగా రేపే పట్టాభిషేకం పెట్టేయడం ఎందుకూ... అంటే వశిష్టుడు అడగడు, ఎందుకడగడో తెలుసా... అడిగితే చెప్తాడు తన గౌరవం పోగొట్టుకోడు. తనని అడగలేదు అంటే అది జరుగుతుందో జరుగలేదో జరగదో వశిష్టుడికి తెలుసు. ఇంత తొందపడి ఏదో కప్పడానికి పెట్టిన ముహూర్తం నిలబడుతుందా... ఇది నిలబడదని వశిష్టుడికి తెలుసు, నిలబడని దానిని గురించి గౌరవం పోగొట్టుకోవడం దేనికిని ఊరుకున్నాడు. పెద్దలు పెద్దలే... తమని అడిగితే చెప్తాడు, అడగకపోతే ఎందుకూ ఊరుకున్నాడు, కాబట్టి ఊరుకున్నాడు ఏర్పాట్లు చేయమన్నాడు కదూ... కాబట్టి ఆయన పిలిచి అన్నాడు


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషదీ రపి ! శుక్ల మాల్యాం శ్చ లాజాం శ్చ పృధ క్చ మధు సర్పిషీ !!
అహతాని చ వాసాంసి రథం సర్వాయుధా న్యపి ! చతురంగ బలం చైవ గజం చ శుభ లక్షణం !!
చామర వ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురం ! శతం చ శాత కుమ్భానాం కుమ్భానా మగ్ని వర్చసాం !!
హిరణ్య శృంగం వృషభం సమగ్రం వ్యాఘ్ర చర్మ చ ! ఉప స్థాపయత ప్రాతః అగ్న్యగారం మహీపతేః !!
ఆ సేవకుల్ని మంత్రుల్ని పిలిచి అన్నాడు, మీరు బంగారాన్ని, రత్నాల్ని, ఓషధుల్ని, పేలాల్ని, బంగారు పాత్రల్ని, చతురంగ బలాల్ని, శుభ లక్షణములు కలిగినటువంటి భద్ర గజాన్ని, తెల్లటి గొడుగుని, మూడు పాత్రల్ని, బంగారు తొడుగులు ఉన్నటువంటి ఒక ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి ఒక పులి చర్మాన్ని వీటన్నిటినీ కూడా రాజుగారి యొక్క అగ్ని కార్యం చేసుకొనేటటువంటి గదిలో పెట్టండీ అన్నాడు. నిత్యాగ్నిహోత్రీకుడు ఆయన దశరథ మహారాజుగారు కాబట్టి ఆయన గదిలో పెట్టండీ అన్నాడు. తెల్లవారేటప్పటికి రేపుసూర్యోదయం అయ్యేటప్పటికి రేపు స్వస్తి వాచకం చెయ్యాలి మనం అందరం కూడాను. కాబట్టి ఈ స్వస్తివాచానికి అందరూ సిద్దం కండనీ, ఋషుల్నీ పురోహితుల్ని అందర్ని పురమాయించాడు, అందరూ చాలా సంతోష పడిపోయారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పనుల మీద బయలుదేరారు, సుమంత్రున్ని పిలిచాడు, తొందరగా వెళ్ళి రామున్ని తీసుకురా అన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టు సుమంత్రుడు వెళ్ళాడు రాముడు రామున్ని రథమెక్కించుకున్నాడు తీసుకొస్తున్నాడు. ఆ గవాక్షంలో నిలబడి చూశాడు రాముడు వస్తుంటే... అబ్బా ఎంత అందగాడు నా కొడుకు అనుకున్నాడు ఎంత విఖ్యాతమైన పౌరుషమున్నవాడు
దీర్ఘ బాహుం మహా సత్త్వం మత్త మాతఙ్గ గామినమ్ ! చన్ద్రకాన్తాఽఽననం రామమ్ అతీవ ప్రియ దర్శనమ్ !!
రూపౌదార్య గుణైః పుంసాం దృష్టి చిత్తాపహారిణమ్ ! ఘర్మాభితప్తాః పర్జన్యం హ్లాదయన్తమ్ ఇవ ప్రజాః !!
న తతర్ప సమాయాన్తం పశ్యమానో నరాధిపః !
అటువంటి రాముడు రథంలో వస్తూ ఉండగా... సింహవిక్రమం ఉన్నవాన్ని, చంద్రుడు ఎలాంటి కాంతితో ఉంటాడో అలాంటి కాంతితో ఉన్నవాన్ని, దీర్ఘములైనటువంటి బాహువులు ఉన్నటువంటివాన్ని, ఏనుగువంటి నడకున్నవాన్ని ఆ రామున్ని చూసుకొని పొంగిపోయాడు. అలా నిలబడి అక్కడే ఆ సంతోషంతో రాముడు దిగి పైకి వస్తున్నాడు, తనలా వస్తున్నాడు, రాముడు దగ్గరికి వస్తున్నాడు, పక్కకి వచ్చి స ప్రాఞ్ఙలి రభిప్రేత్య ప్రణతః పితురన్తికే ! నామ స్వం శ్రావయన్ రామో వవన్దే చరణౌ పితుః !! ఆయనా దగ్గరకొచ్చీ రామ వర్మం అహంబో అభివాదయే అని తండ్రిగారి దగ్గకొచ్చి తండ్రిగారి పాదాలు ముట్టుకుని తన పేరు చెప్పుకొని నమస్కారం చేశాడు. చాలా సంతోషించాడు దగ్గర కూర్చోబెట్టుకున్నాడు నాయనా నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అందుకని నిన్ను పిలిచాను రా అన్నాడు కూర్చొబెట్టి, కూర్చోబెట్టాడు - కూర్చోబెట్టి అన్నాడు తం


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
పశ్యమానో నృపతి స్తుతోష ప్రియమ్ ఆత్మజమ్ ! అలంకృతమ్ ఇవాఽఽత్మానమ్ ఆదర్శ తల సంస్థితమ్ !! రాముడికి ఎదురుగుండా దశరథుడు కూర్చున్నాడట మాట్లాడుదామని ఇలా చూశాడట రామున్ని చూస్తే ఎలా అనిపించిందటా... తను యవ్వనంలో ఉన్నప్పుడు బాగా ముస్తాభై అద్దం ముందుకెళ్ళి నిలబడితే తన ప్రతిభింబం ఎలా కనపడుతుందో... అలా అన్ని విధాలా తనపోలికలతో తన యవ్వనంలో ఎలా ఉండేవారో అలా కనపడ్డారట రాముడు. ఎంత ప్రీతి చెందాడట నా కొడుకు అచ్చం నాలాగే ఉన్నాడని అని పొంగిపోయాడట పిచ్చి దశరథుడు. ఎంత బాధ పడుతాడో నిజంగా దశరథ పరితాపం పాపం చదవడమే కష్టమౌతుంది. కాబట్టీ ఇప్పుడు ఆ కొడుకుని చూసుకొని అన్నాడూ... నాయనా నిన్ను పుష్యమీ నక్షత్రం ఉండగా... నీకు యౌవరాజ్య పట్టాభిషేకం చేస్తాను అన్నాడట, రామాయణ కాలంలో వారాలు లేవు, అదివారం సోమవారం మంగ్లవారం లా వారాలు లేవు, అవి ఇప్పుడొచ్చాయి, అప్పుడు నక్షత్రాలు బట్టే చెప్పేవారు.
కాబట్టి పుష్యమీ నక్షత్రంలో నీకు యౌవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, నీవు మంచివాడివి, కానీ నీయందున్న ప్రీతిచేత నేను నీకు కొన్ని మంచి మాటలు చెప్తాను, నీవు భూయో వినయమ్ ఆస్థాయ ఇంకా బాగా వినయంగా ఉండడం నేర్చుకో భవ నిత్యంజితేన్ద్రియః బాగా జితేంద్రియుడివి కావాలికామ క్రోధ సముత్థాని త్యజేథా వ్యసనానిచ నాయనా కామ క్రోధములను అనిచిపెట్టు, అణచి పెట్టి కామ క్రోధములను వ్యసనములను విడిచి పెట్టీ నీవు చాలా మంచి వాడవన్న పేరు తెచ్చుకోవాలి, సరే వెళ్ళిరా రేపు ఉదయం నీకు పట్టాభిషేకం. ఒక్క మాటంటే ఒక్క మాట అబ్బా నాన్నగారండీ ఎంత మంచి మాట చెప్పారండీ మాఫ్రెండ్స్కి వెళ్ళి పార్టి ఇవ్వాలని ఏమీ అనలేదు. నీవు ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి, ఏమీ అనలేదు. వచ్చాడు నమస్కారం పెట్టాడు, నాన్నగారు చెప్పాడు విన్నాడు వెళ్ళిపోయాడు అంతే అది రాముడంటే... కదలనివాడు ఆయన కదులుతున్నవి వీళ్ళంతానూ, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత వశిష్టాదులను పిలిచాడు, పిలిచి ఓ మాట చెప్పాడు నీవు వెళ్ళి ఉపవాస వ్రతం చేయించు సీతా రాములతో... అన్నాడు. అనీ మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు, మళ్ళీ సుమంత్రున్ని పిలిచాడు, మళ్ళీ వెళ్ళి రామున్ని అకస్మాత్తుగా తీసుకరా అన్నాడు. అంటే మీకొక విషయం బాగాగమనించాలి ఇప్పుడు, దశరథుని మనస్సు స్థిరంగా లేదు, ఏదో భయపడుతున్నాడు, ఆ పని అవుతుందా చాలా ఉద్వేగంగా ఉన్నాడు, రాముడికి పట్టాభిషేకం చేసేస్తానా అయిపోతుందా... అయిపోతే బాగుండు, ఏదో కంగారుపడిపోతున్నాడు. మళ్ళీ పిలవమన్నాడు మళ్ళీ వెళ్ళాడు సుమంత్రుడు ఆశ్చర్యపోయాడు రాముడు, ఏంటీ ఇప్పుడే గదా రమ్మన్నాడు మళ్ళీ అంతలో వచ్చావు అన్నాడు, దశరథుడు మళ్ళీ పిలుస్తున్నాడు వస్తావో రావో నీఇష్టం తప్పకుండా వస్తాను కానీ నాన్నగారు మళ్ళీ వెంటనే ఎందుకు పిలిచారు, మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి అంతః పురంలో ఎదురుగుండా వెళ్ళి నమస్కారంచేసి నిల్చున్నాడు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కూర్చో... కూర్చున్నాడు అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి ! దేవర్షి పితృ విప్రాణామ్ అనృణోస్మి తథాఽఽత్మనః !! నాయనా రామా! నేను చాలా పెద్దవాన్ని అయిపోయాను, నేను ఎన్ని భోగాలను అనుభవించాలో అన్ని నేను అనుభవించేశాను దేవర్షి పితృ విప్రాణామ్ దేవతల యొక్క పితృ అంటే తండ్రి యొక్క విప్రాణామ్ బ్రాహ్మణుల యొక్క మధ్యలో దేవర్షి ఋషుల యొక్క ఋణాన్ని నేను తీర్చేసుకున్నాను కాబట్టి నా ప్రయోజనం పూర్తైపోయింది. అనేక యజ్ఞ యాగాలు చేశాను దేవతల ఋణం తీర్చుకున్నాను, ఋషులు ఇచ్చినటువంటివి చదువుకున్నానూ ఋషి ఋణం తీర్చుకున్నాను, పితృ దేవతలు నన్ను ఎలా కన్నారో నేను నిన్ను అలా కన్నాను వాళ్ళ ఋణం తీర్చుకున్నాను, బ్రాహ్మణులకి విశేషమైన దానాలు చేశాను దానివల్ల వాళ్ళ ఋణం తీర్చుకున్నాను, నాకు అన్ని ఋణాలు తీరిపోయాయి, కానీ రామా! ఈ మధ్య నాకు దుశ్శకునములు కనబడుతున్నాయి, పగటిపూట కనపడుతున్నాయి, స్వప్నంలో కనపడుతున్నాయి, అకస్మాత్తుగా ఉల్కలు నేలమీద పడుతున్నాయి, నా జాతకంలోకి సూర్యాంఙ్గారక రాహుభిః సూర్య, అంగరాక, రాహువు ముగ్గురూ కూడా నా జన్మ నక్షత్రాన్నంతటిని కూడా ఆక్రమించి ఉన్నారు, కాబట్టి నేను ఉంటానా ఉండనా అన్నది అనుమానాస్పదం, నేను ఎంత కాలం ఉంటానో తెలియదు, దానితో పాటు నేను నీతో ఒక మాట చెప్తానూ తత్ యావత్ ఏవ మే చేతో న విముంచంతి రాఘవ ! తావత్ ఏవాభిపిఞ్చస్వ చలా హి ప్రాణినాం మతిః !! రామా! నిన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తానన్నాను కదూ రేపు పొద్దున అలా చెయ్యాలనే అనుకుంటున్నాను, కానీ మనుష్యుల యొక్క మనసులు ఉన్నాయి చూశావూ... ఇవి మారిపోతుంటాయి, కాబట్టి నా మనసు మారక ముందే ఈ యౌవ్వరాజ్య పట్టాభిషేకం అయిపోనీ, అలా ఎందుకు మారుతుంది నాన్నగారు నీ మనసు అడగలేదు, అడగడు రాముడు “మారితే ఏమౌతుంది ఇవ్వడు ఇవ్వకపోతే ఏమౌతుంది నేను ఆయనకు కొడుకుని ఆయన నాకు తండ్రి అంతే...” కాబట్టి ఇంకెందుకూ... నాకు ధర్మం ఏమిటీ నాన్నగారు చెప్పారు ఇస్తే పుచ్చుకోవడం వద్దంటే మానేయడం కాబట్టి నాకా అల్లరి ఏమిటీ ఊరుకుంటాడు ఆయన, ఎవరు ఓ... తొట్రు పడిపోతున్నాడు దశరథుడు తొట్రు పడిపోతున్నాడు ఇంకొక మాట అన్నాడు దాంతో పాటుగా నాయనా!
విప్రోషిత శ్చ భరతో యావత్ ఏవ పురాత్ ఇతః ! తావత్ ఏవ అభిషేక స్తే ప్రాప్త కాలో మతో మమ !!
కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతః స్థితః ! జ్యేష్ఠానువర్తీ ధర్మాఽఽత్మా సానుక్రోశో జితేన్ద్రియః !!
కిం తు చిత్తం మనుష్యాణామ్ అనిత్యమ్ ఇతి మే మతిః ! సతాం చ ధర్మ నిత్యానాం కృత శోభి చ రాఘవ !!
Related imageభరతుడు ఇప్పుడు చాలా దూర దేశంలో ఉన్నాడు, వాళ్ళ తాతగారి దగ్గర ఉన్నాడు ప్రస్తుతం, భరతుడు వాళ్ళ మేనమామగారి ఇంటి నుంచి అయోధ్యకు వచ్చేలోపలే... నీ పట్టాభిషేకం అయిపోవాలి, అంటే చిన్న విషయాన్ని బయట పెట్టాడు ఇక్కడ, భరతుడు వచ్చేలోపల ఎందుకైపోవాలి, రాముడి తరువాత వాడుభరతుడు కాని భరతునికి రాజ్యం ఇవ్వవలసిన అవసరం ఉందన్నమాట ఏమో... రాముడు ఉండగా భరతునికి ఎందుకు ఇవ్వాలి, అంటే భరతునికి రాజ్యం ఇస్తానని దశథుడు ఏదో మాట ఇచ్చి ఉండాలి, భరతునికి ఆ మాట ఇచ్చినట్లు రామాయణంలో లేదు కాబట్టి, భరతున్ని కన్న తల్లికి ఆ మాట ఇచ్చివుండి ఉండాలి, లేకపోతే ఆ పిల్లని తనకి ఇచ్చినవాళ్ళకు ఇచ్చివుండి ఉండాలి, అది వాళ్ళకు తెలియకుండా ఈ పట్టాభిషేకం అయిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టాక రాముడి మీద వ్యామోహం పెరిగింది. పెద్దవాడు ధర్మాత్ముడు


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఏది చూసి రాముడికి ఇవ్వకుండా ఉండను, అందుకని ఇప్పుడు రాముడికి ఇచ్చేయడానికి భరతుడికి ఇవ్వకుండా ఉండడానికి భరతుడు రాకుండా చేసేస్తాను అంటూ నాయనా అతడు చాలా మంచివాడు, నిన్ను అనువర్తిస్తాడు జేష్టుడంటే ప్రేమ ఉన్నవాడు గౌరవం ఉన్నవాడు భరతుడు తక్కువవాడు అని నేను అనను చాలా మంచివాడు, కానీ రామా! ఎప్పుడు ఎవరు ఏం చెప్పగలం ఎవరి మనసులు ఎలా ఉంటాయో, అంటే లోపల ఏం అంటే ఒకవేళ భరతునికి రాజ్యమిమ్మని ఎవరైనా అడిగినా... నీవు మాటిచ్చావు గదా ఇవ్వు అన్నా, అలా నాకు అక్కర లేదు రాముడికే ఇవ్వండని భరతుడు అంటాడని ఒకనమ్మకం ఏమో రాజ్యం కదా... మీరు మాటిచ్చారు గదా నాన్నగారు మీరు నాకే ఇచ్చేయండి అని అంటాడేమోనని భయం. అందుకని ఎవరి మనుసులు ఎలా ఉంటాయో...? అన్నాడు. అని మళ్ళీ అన్నాడూ... బయలుదేరు వెళ్ళు వెళ్లి ఉపవాసంచేయి పొద్దున ఇచ్చేస్తాను పట్టాభిషేకం చేసేస్తాను.
అంటే ఎంత కదిలిపోతున్నాడో దశరథుడు ఆ రాత్రి దశరథుని జీవితంలో ఎంత భయం తొట్రుపాటు ఉన్న రాత్రో మీరు గమనించండి, కానీ మళ్ళీ వశిష్ట మహర్షిని పిలిచాడు, సీతా రాములకి ఉపవాసం చెయ్యమని చెప్పావా? వెళ్ళు చెప్పి రా అన్నాడు. ఆయన ప్రత్యేక రథం వేసుకొని రాముడి అంతఃపురానికి వెళ్ళాడు, వశిష్ట మహర్షే వచ్చాడని తెలుసుకొని రామ చంద్ర మూర్తి గబగబా బయటికి వెళ్ళి వశిష్ట మహర్షికి నమస్కారంచేసి చెయ్యిచ్చి రథం మీద నుంచి కిందకి దింపాడు గౌరవానికి, దింపి లోపలికి తీసుకెళ్ళారు కూర్చోబెట్టారు, ఆయన అన్నారు ఇత్యుక్త్వా స తదా రామమ్ ఉపవాసం యత వ్రతమ్ ! మన్త్రవత్ కారయా మాస వైదేహ్యా సహితం మునిః !! నాయనా నీకో మంత్రం ఇస్తున్నాను నీవు ఉపవాసం చేయి అన్నాడు, మనకి ఇవ్వాళ రేపు ఉపవాసం అంటే... ఆ ఏంటి అంత అల్లరి ఉంటుందా అనిపిస్తుంది మనకు కానీ చిత్రమేమిటో తెలుసాండీ అసలు ఉపవాసం అన్నమాట ఎందుకొచ్చిందో మనం తెలుసుకోవలసి ఉంటుంది. ʻఉపʼ అంటే ʻవాసʼ అంటే సమీపమునందు నివసించుట. ఉపవాసం అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు ఉండమని శాస్త్రం నిర్ణయం కాదు ఇది మీరు బాగాగమనించాలి మొదట, ఉపవాసము అన్నది ఎందుకొచ్చిందో తెలుసాండీ... బాధను గుర్తెరుగుట కొరకు, ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు, మీరు తినగలరు ఆకలుంది కానీ తినరు, ఇప్పుడు బాధేస్తుందా వేయదా వేస్తుంది. వేసేస్తుంది ఆ టైంకీ, కానీ తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా.. ఉంటుంది. జాగరణ ఎందుకు చేయాలి, నిద్రొస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి, చక్కగా పడకుందీ అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు, పడుకోకపోతే ఉండే బాధేమిటో అనుభవిస్తారు, అన్నం తినకపోతే ఉండే బాధేమిటో అనుభవిస్తారు.
ఈ రెండు ఎందుకు అనుభవిస్తారో ఉపవాసంలో అని చెప్పారో తెలుసాండీ, శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకరోజున వెళ్ళాలి తప్పదు, ఏదో ఒకరోజు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళ్ళుతాడు తప్పా... సంతోషంతోవెళ్ళడు, వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దూ, చాలా బాధగానే ఉంటుంది వినుర్ముక్తమయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్ళు కుట్టినంత బాధ ఉంటుందని చెప్పారు, ఆ వినుర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడెలా గుర్తొస్తాడు మీకు ప్రయత్న పూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణం మీరు అలవాటు చేసుకోవాలి, కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణా... పడుకొని పడుకోకుండా ఈశ్వర స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకొచ్చింది. అది మీ ఇష్టమొచ్చినట్లు చేశారనుకోండీ... ఈ శరీరాన్ని బాధపెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తాడు, మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి, మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయం చేసింది ఎప్పుడు చెయ్యాలో... ఒక్క ఏకాదశినాడు మాత్రమే ఉపవాసం చెయ్యాలి, ఎకాదశి తిథి ఉపవాసం, ద్వాదశి పారాయణం. సూర్యోదయం అవగానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా భోజనం చేసెయ్యాలి. యంత్రాలని కూడా ఏం చేస్తారంటే శడ్టౌన్ అని అపు చేస్తారు కొన్నాళ్ళు ఓ రెండు రోజులు విశ్రాంతినిస్తారు ఘర్ణపుట్టేస్తుందని, మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం తరం కాదు ఆపకూడదు కూడా... గుండె ఆపుతానండీ రెండు రోజులు రెస్టు ఇస్తానంటే కుదరదు, ఊపిరి తిత్తులు ఆపుతానంటే కుదరదు, కాని అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేసేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చేయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది, నిరంతరం పనిచేసే ఈ వ్యవస్తకి విశ్రాంతి నిస్తే, అది మరింత సంతోషంగా పనిచేస్తుంది.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవత్ కీర్తనాంబృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసంనాడు, భజనాంమృతం భజనచేత అమృతము, స్తోత్రాంబృతము, స్తోత్రములతో అమృతము, ధ్యానాంమృతము ధ్యానముచేత అమృతము. తప్పా ఉపవాసముండి ఆఫీసుకు వచ్చేశానని వెళ్ళిపోకూడదు అది ఉపవాసం కాదు అది ఏమిటౌతుందో తెలుసాండీ... తినగలిగి తినకుండా ఉండి కిందటి జన్మలో కర్మచేత ఉపవాసం ఉండలేకపోతే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండగలిగాలి. ఎదో ఒకాయన ఉన్నాడు ఆయన ఆరు గంటలకన్నా ఎక్కువ సేపు తినకుండా ఉండకూడదు, కాబట్టి ఆరు గంటలు మాత్రమే ఉండి, శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి, ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో.. అంత తినకుండా ఎంత తింటే కడుపునింపిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరాన్ని నిలబెడుతుందో ఈశ్వరారాధనకు యోగ్యతో ఉంటుందో... అంత మాత్రమే పెట్టాలి, ఒక యాపిల్ పండు తిను ఒక గ్లాసు పాలు తాగు తప్పులేదు, అసలండీ నేను ఉపవాసం నేను స్పృహతప్పిపోయినా తిననూ... నా సుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినను అని అన్నారనుకోండీ, అది ఉపవాసము కాదు మీరు అది గుర్తు పెట్టుకోండి, అది శరీరమును శోషింపజేయుట అలాగనీ నేను ఉండలేననీ ఎప్పుడూ తినేయకూడదు, ఎప్పుడో ఒకప్పుడు ఉపవాసం ఉండాలి, మూడు గంటలు ఉండగలవా ఉండు, నాలుగు గంటలు ఉండగలవా ఉండు, అరగంట ఉంటానండీ అని ఇడ్లీ 8 దింటికి తినేది 8 న్నరకు తినకూడదు. ఏదో ఒక రోజున నీవు ఉండగలిగిన వ్యవధి చూసుకొని ఉపవాసం చెయ్యాలి, ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే... మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండీ, రోజంతా ఉపవాసం అంటే ఏమిటో తెలుసాండీ మీరు ధ్యానమునందు ఉండాలి, మార్చి మార్చి ఉపవాసం చెయ్యాలి.
Related imageమేము ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేశాం. తాపవరంలో చేశాం కదా శర్మగారు పగలల్లా ఉపవాసం ఉండమంటుంది ʻఇతి స్కాంద పురాణే రేవాఖండే ʼఅంటాం. అది చెప్పేదొకటి మనం చేసేదొకటి అనుకోండి సత్యనారాయణ వ్రతం పొద్దున చేసేస్తాడు, అందులో ఎక్కడా పొద్దున చేయమని ఉండదు. ఉపవాసం చేసి సాయంకాలంచేయి గోమయంతో అలికి అని అక్కడ ఉంటుంది. ఎవ్వడూ ఆవు పేడతో అలికేవాడు ఉండడు, ఆ మంటపాన్ని దానం చేసేయ్ అంటాడు, నిన్ను ఎవ్వడు పెట్టమన్నాడు అష్టలక్ష్మీవెండిచెంబు, మంటపం దానంచేసి చెంబువీడు దాచేసుకుంటాడు ఇంక మంటపదానం ఏమిటీ? వ్రతమా వ్రత భంగమా, నువ్వు ఇవ్వగలిగిన రాగిచెంబేపెట్టు నిన్ను ఎవ్వడు పెట్టామన్నాడు నీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మిచెంబని. అష్టలక్ష్మిచెంబుని పెట్టడం ఎందుకు, మంటపం దానంచేసి చెంబుదాచుకోవడం ఎందుకు, చెంబెట్టి మంటపందానం ఇచ్చేస్తే


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
కూడాపోయింది అంతే ఇచ్చేసై. సంతోషంగా ఇచ్చేసై, ఎడుస్తూ ఇవ్వకు మళ్ళీ అదోటి, కాబట్టీ చేసేటప్పుడూ పురాణం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి, కల్పం అంటారు అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు చెయ్యకూడదు. పగలంతా ఉపవాసం ఉండుటా అంటే, మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ... ఆయనకు దగ్గరగా ఉండాలి, తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి, ఆయనకు పెట్టగా మిగిలినది తినాలి, అంతేకాని మనకని వండుకుని తినేసింది కాకూడదు ఆరోజున, ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటీ? నాలుగు సమోసాలు నైవేధ్యం పెట్టానండీ తిన్నానండీ అనకూడదు, ఈశ్వరుడికి పెట్టగా మిగిలింది అంటే ఏమిటో తెలుసాండీ, చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం కాదాండీ! అవిష్యం యజ్ఞం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు, కొంచెం ఎక్కువ ఉండాలి, అవిష్య పాత్రలో అవిష్యం మిగలాలి ఎప్పుడూ కూడా... అది వేస్తారు మీగిలిన అవిస్సు ఉంటుంది దానికి రుచేమీ ఉండదు, అదేం దాంట్లో మిర్యాలూ, ఉప్పు, కారం వేసుకొని ఏం తయారు చేసి ఉండరు, ఎదో కమ్మగా ఉంటుంది అంతే... పచనం చేసి ఉంటుంది అంతే, దాన్ని ఇంట్లో హోమం చేసి, హోమం చేసేసింతర్వాత పాత్రలో మిగిలినపోయిన హవిష్యు ఏదైతే ఉంటుందో... దాన్ని తినాలి ఆరోజున, అందుకే ఓ మాట అంటారు స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాద సేవనం, ఏకాదశీ వ్రతం చాపి త్రయ మత్యంత దుర్లభం ఏకాదశి వ్రతం ఎవ్వరూ చెయ్యారు రా అంటారు ఇదే కారణం. ఇలా చేస్తే ఒక్క ఏకాదశీ వాడి జీవితం సంస్కరింపబడుతుంది అంటారు, ఈశ్వరానుగ్రహం కలుగుతుందని.
Image result for ఉపవాస దీక్షకాబట్టి ఉపవాసం ఏమిటో చెప్పిరా కొడుక్కి కోడలికి అన్నాడు, ఎందుకు చెప్పాలి మా అబ్బాయికి తెలుసు మా కోడలుకి తెలియదు, మా అబ్బాయి చేత మాకోడలుకి చెప్పిస్తే... అమ్మబాబోయ్ ఇవ్వాళ ఉపవాసమా...? అంటే మావాడు చిన్నబుచ్చుకుంటాడు, కుల గురువువు కదా కాబట్టి ఇద్దరినీ కూర్చోబెట్టి చెప్పాలి ఇలా చెయ్యండని, ఏమో తెలుసో తెలిసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో... ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి ఉపవాసం చెయ్యాలి, అందుకని వెళ్ళు, ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి, కానీ మనసు కదలకూడదు, మనసు కదలకుండా పడుకోవాలంటే పూజా మందిరంలో పడుకోవాలి, పూజా మందిరంలో ధర్భాసనం వేసుకొని పడుకోవాలి భార్యతో కలిసి, తప్పా ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాడైపోతుందండీ అని ఇద్దరూ చెరో గదిలో పడుకోకూడదు, ఇంక నీవు ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు, దర్భాసనం వేసుకొని ఇద్దరూ పూజా మందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు ఈశ్వర పాదముల దగ్గరే నేను పడుకున్నాను, ఉపవశించి ఉన్నానని పడుకోవాలి, ఇది ఉపవాసమని చెప్పిరా వశిష్టా... అలా మావాడు చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, నెరవేరితే రేపు వాడికి పట్టాభిషేకం అయిపోతుంది.
అయిపోతే అమ్మయ్యా! నాకు ఒక పెద్ద బరువు తీరిపోతుంది, రామునివైపు నుంచి ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేస్తున్నాడు దశరథుడు, చేస్తున్నాడా మనకు నేర్పుతున్నాడా ఉపవాసం అంటే ఏమిటో...? అంటే మీరు నేర్చుకోక్కర్లేదని మీరు పెద్దలు మీకు అన్ని తెలుసు నాబోటిగాడి గురించి నేను మాట్లాడేది, కాబట్టి ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే? మనం రామాయణం అయోధ్యకాండ చదవాలి? మీరు ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా రామాయణాంలోకే చూడాలి, రామాయణంలో ఉండని ధర్మం మీకేం ఉండదు. కాబట్టి ఉపవాసం అంటే ఇదీ అని తెలుసుకొని చేస్తే అది ఉపవాసం అది తెలుసుకోకుండా చేస్తే... ఇంకోలా ఉంటాయి ఆ ఉపవాసాలు, కాబట్టీ వెళ్ళవయ్యా వెళ్ళి అలా చేయించు, ఇప్పుడు రాముడు ఏం చేశాడూ అన్నాడు, అంటే మహానుభావుడు ఆయన శేషం చ హవిష స్తస్య ప్రాశ్యా ఆశాస్య ఆత్మనః ప్రియమ్ ఆయనా రాత్రి పడుకున్నప్పుడు దర్భాసనం వేసుకొని భార్యతో కలిసి దేవాలయంలో పడుకున్నాడు విష్ణు భగవానుడి దేవాలయంలో ఉదయం వేళ స్నానం చేసి, సంధ్యావందనం చేసి, గాయిత్రి చేసుకొని రాత్రి కదాండి చేప్పింది ఉపవాసం చేయమని అందుకనీ ఆ రాత్రి ఉపవాసం చెయ్యాలంటే పదార్థం తినాలి కాబట్టీ హోమం చేసి శ్రీమన్నాయణుని పేరుమీద యాగం చేసి ఆ యాగానికి వండినటువంటి హవిష్య పాత్రలో మిగిలినటువంటి హవిష్య ప్రసాదాన్ని రాముడు తిన్నాడు. రాముడు తిన్నాడు అని చెప్తే సీతమ్మ కూడా తింది అని అర్థం, వాళ్ళిద్దరూ ఆ హవిష్యాన్ని తిన్నారు.


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ అసలు సిద్దాంతం తెలుసుకోరు, దీపంలో రెండొత్తులు వేయాలా మూడు వొత్తులు వేయాలా బ్రతికున్ననాళ్ళు అదే అనుమానం. లేకపోతే ఉపవాసం అంటే ఆపిల్ పండుతినొచ్చా లేక సమోసా తినొచ్చా, ఒకసారి వెంకటాచలం వెళ్తే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చేదగ్గర ఒకావిడా తీసుకుని నాకు ఇచ్చేసింది, ఇచ్చేస్తే నేను అనుకున్నాను, ఏమమ్మా మీరు పులిహోర తినరా ఏమి అన్నాను, అంటే కాదండీ నేను ఈ రోజు ఉపవాసం అంది. ఆవిడ ఉపవాసమంటా వెంకటేశ్వర స్వామి ప్రసాదమే... తినదటా...! ఏం ఉపవాసం దేనికి చేస్తున్నట్లు ఆ ఉపవాసం, ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం, ఈశ్వరానుగ్రహమే ప్రసాదం. ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహమును ప్రసాద రూపంలో ఇస్తారు మీకు, అది తింటే అదే మీ మనసు అవుతుంది, మనసుకి బుద్దొస్తుంది, బుద్దివలన ఆలోచన వస్తుంది, ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన నీ ఆపదకి పరిష్కారం దొరుకుంది, పరిష్కారం వల్ల మీరు గట్టేక్కుతారు. కాబట్టి ప్రసాదం తినండి అంటారు, ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వ్రత కథలో అల్లుడిగారి పడవా మామ గారిపడవా మునిగిపోయాయి, అంటే శాడిష్టా సత్యనారాయణ స్వామి ఏమైనా... ప్రసాదం తిననివాడివి పడవలు ముంచేద్దాం అని చూస్తాడా... అది కాదు దాని అర్థం. అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది. పుచ్చుకుంది కాబట్టి లేచింది, ప్రసాదమనగా ఈశ్వరానుగ్రహము అని అది నీవు తెలుసుకో...
Image result for ప్రసాదంకాబట్టి ఇప్పుడు ప్రసాదము అనగా నిబద్ధతా, ప్రసాదం తినాలి కాబట్టి హోమం చేసిన తరువాత మిగిలిన హవిష్యాన్ని ఉపవాసం ఉన్నామని ఇంత వండుక తినకూడదు, ఏమో ఇంతవండి మిగిలినదానిని చెరోయింత పుచ్చుకోవాలి, పుచ్చుకొని ఏమి చేయాలి, చక్కగా వాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియత మానసః ! శ్రీమత్యాఽఽయతనే విష్ణోః శిశ్యే నర వరాఽఽత్మజః !! శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయంలో స్వామి పాదాల దగ్గర దర్భాసనం వేసుకొని సీతా రాములు ఇద్దరు పడుకున్నారు ఆరాత్రి. మరునాడు ఉదయం ఒక జాము ఉందనగానే లేచాడు స్నానం చేశాడు, సంధ్యావందనం చేశాడు, మనసు నిలబెట్టాడు, గాయిత్రీ జపం చేశాడు ఇంకా... ఆ రాత్రి పూర్తైయింది, పట్టాభిషేకం కోసం నాన్నగారి దగ్గరికి అంతఃపురానికి వెడతాడు, ఇది సీతా రామునికి గడిచిన రాత్రి, అదే రాత్రి పౌరులకు ఎలా గడిచింది.
వశిష్ట మహర్షి రాత్రి ఉపవాసం గురించి చెప్పి వెళ్ళిపోతున్నాడు, రోడ్లు వచ్చేటప్పుడు విశాలంగా ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఇరుగ్గా ఉన్నాయట, ఎందుకని ఇళ్ళల్లో వాళ్ళందరూ వీధిలోకి వచ్చారు, ఎందుకొచ్చారు ఓరేయ్ మీరు విన్నారా! పట్టాభిషేకం ప్రకటించేశారట, రామ చంద్ర మూర్తికి పట్టాభిషేకమంటా తెల్లవారితే పట్టాభిషేకమట, అందరూ బయటకి వచ్చేశారు,


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
ముగ్గులు పెట్టేశారు, దీప వృక్షాలు పెట్టేశారు రేపు అంతా అవుతుందేమోనని  బాగాకనపడాలి కదా అని దీపాలతో వృక్షాలు పెట్టేశారు ఇంటింటికీ, పతాకాలు ఎత్తేశారు, ముగ్గులు వేసేశారు, పండుగచేసేశారు, రాత్రికి రాత్రి నటులందరూ నాటకాలు వేసేశారు, గాయకులు పాటలు పాడేశారు, నృత్యం చేసేవారు నృత్యం చేసేస్తున్నారు, పిల్లలు కేరింతలు కొట్టేస్తున్నారు నలుగురు కలిస్తే, రామో రామో రామః ఏమి రాముడు ఏమి రాముడు రాముడి పట్టాభిషేకం రేపే యౌవ్వరాజ్య పట్టాభిషేకం రామ చంద్ర మూర్తి పట్టాభిషేకం అవుతుంది, భద్రగజం మీద తెల్ల గొడుగు కింద ఇదిగో ఇలానే వెళ్తాడు, మనమందరం వెళ్తాము అహా! ఏమి భాగ్యం, ఏమి భాగ్యం ఎక్కడ చూసినా జనం దాని మధ్యలో నదిని మధ్యలోంచి చీల్చినట్లు వశిష్టుడి రథం మధ్యలోంచి వెళ్తే జనం అటూ ఇటూ తప్పుకున్నారటా... అంటే అకస్మాత్తుగా విన్నా... అంటే రేపే కళ్యాణం అంటే... పరమ ప్రీతితో మీ అందరూ ఇవ్వాళ వచ్చేసినట్టు. రేపే పట్టాభిషేకం అంటే ఇంట్లో ఉన్నవాళ్ళందరూ వీధుల్లోకి వచ్చేసి, ఎవరూ చెప్పకుండా పతాకాలు ఎగుర వేశారు, ముగ్గులు పెట్టేశారు, దీప వృక్షాలు పెట్టాశారు, అందరూ పాడేసుకున్నారు, ఆడేసుకున్నారు, సంతోషపడిపోయారు రేపు బాగా చీకటి పడిపోతుందేమోనని బాగా స్థంభాలు పెట్టేశారు. ఇంత ఆనంద పడిపోతున్నారంటే రాముడిపట్ల ప్రజలకు ఉన్న సంతోషం ఇంత గొప్పదీ ఇలా ప్రజలకు తెల్లవారింది. ప్రజలకు ఇలా తెల్లవారింది, రాముడికీ సీతకీ అలా తెల్లవారింది, వశిష్టుడికి అలా తెల్లవారింది, దశరథుడికి ఎలా తెల్లవారింది, ఇవ్వాల ఎందుకులేండీ బుగ్గనచుక్క పెట్టుకొని సీతారాములు సంతోషంగా ఉన్నారు కళ్యాణ రాముడై, ఇక్కడ వరకే విందాం.
కాబట్టి ఏమౌతుందో ఆయనకేం ఉండదు ఆయన ధర్మాత్ముడు కాబట్టి ఇప్పుడే చెప్పినా ఆయన ఏమీ అనుకోడు, ఆయనకి అన్నీ తెలుసు, కాని మనమే ఇంకా ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళం కాదు. అలా బుగ్గన చుక్క పెట్టుకుని జిల్లకర్రా బెల్లం పెట్టి ఉండగా... మంధర మాట్లాడటం చెప్పడం నావల్ల కాదు. అందుకనీ రేపు ఎంత గొప్పగా కథ తిరుగుతుందో ఆ రాత్రి కథని రేపు వివరిస్తా... ఇప్పుడు మనం ఒక్క పదకొండు మాట్లు రామ నామ సంకీర్తనం చేద్దాం. తదనంతరం ఏదో ముఖ్య విషయాన్ని హరిప్రసాద్ గారు మాట్లాడలనుకుంటున్నారు. అందుకని మీరు దయచేసి మీరు అలాగే కూర్చుని ఉండండి. అందులో ఏదో ఇవ్వాళ మంధర పుణ్యమాని ముందుగానే వదిలేశావు మమ్మల్ని కాబట్టీ ...
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
ఆత్మలో జీవాత్మతానే అలరుచున్నది రామ నామం !! రా !!
కర్మనేత్ర ద్వయము చేతను కాన రానిది రామ నామము !! రా !!
మూడు నదులను దాటువారికి మోక్షలక్ష్మియే రామ నామము !! రా !!
త్రిపుటము మధ్యము నందు వెలిగే జ్ఞాన జ్యోతియే రామ నామము !! రా !!
దూర దృష్టియు లేని వారికి దుర్లభము శ్రీ రామ నామము !! రా !!
బ్రహ్మపుత్రకరాబ్జవీణ పక్షమైనది రామ నామము !! రా !!


  అయోధ్య కాండ ఎనిమిదవ రోజు ప్రవచనము
 
పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీ రామ నామము !! రా !!
మరణకాలమందు ముక్తికి నొసగును శ్రీ రామ నామము !! రా !!
ప్రణవమను ఓంకార నాదము బ్రహ్మమే శ్రీ రామ నామము !! రా !!
కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామ నామము !! రా !!
జన్మ మృత్యు జరాధి వ్యాధుల చక్కబరుచుని రామ నామము !! రా !!
శిష్టజనుల దివ్వ దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము !! రా !!
గోచరంబగు జగతి లోపల గోప్యమైనది రామ నామము !! రా !!
రజత గిరికి నెప్పుడు రమ్యమైనది శ్రీ రామ నామము !! రా !!