Friday, 1 January 2016

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - బాల కాండ 4 Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Bala Kanda 4th Day


బాల కాండ


నాల్గవ రోజు ప్రవచనము






నిన్నటిరోజు ఉపన్యాసం పూర్తిచేసేసమయానికీ... రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు ఆవిర్భవించినటువంటి సందర్భంగురించి నేను మీతో వివరణచేసి ఉన్నాను. జాతాసౌచము పూర్తైనపిదప, వశిష్ట మహర్షి వాళ్ళకి నామకరణంచేశారు. పెద్దవాడికి రాముడని, తరువాత జన్మించినవాడికి భరతుడని, ఆ వెనుక జన్మించినవాడికి లక్ష్మణుడని, ఆ వెనుక జన్మించినవాడికి శత్రుజ్ఞుడని పేర్లుపెట్టాడు. ఒకపేరు పెట్టడము అనేటటువంటిదీ సాధారణంగా లోకంలో జరిగేటటువంటి విశేషమే, ఎందుకంటే లౌకికంగా ఒకపేరు ఉండాలి కాబట్టి పిలవడానికి ఒకపేరు ఉంచుతారు, కానీ ఆపేరు కొన్నిగుణములను కలిగి ఉంటుంది ఈపేరు అంటే ఇలా ఉంటారు అనిమనం ఊహచేస్తాం. కాని పెద్దలు ఊహించి పెట్టినటువంటి పేరుకీ... ఆ వ్యక్తి జీవితానికి సమన్వయం ఉండాలనికానీ... పెద్దలు ఎలా ఊహచేశారో అలా అతను ప్రకాశిస్తాడనీ మనం నమ్మడానికి అవకాశం ఏమీ ఉండదు. ఎందుకంటే దేవీభాగవతంలో వ్యాసభగవానుడు ఒకమాట అంటాడు విద్యాధరో యధా మూర్ఖో జన్మందస్తూ దివాకరహ లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాం నిర్థకం ఆంటారు. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆయనకీ పెద్దలూ ఓ పేరు పెట్టారు, దివాకరుడూ అని పేరుపెట్టారు దివాకరుడూ అంటే సూర్యభగవానుడు, స్వయంగాప్రభని విరజిమ్మగలిగినటువంటివాడు దివాకరుడూ అని పేరుపెడితే ఆయన పుడుతూనే అంధుడై పుట్టాడు. అంధుడై పుట్టినవానికి దివాకరుడు అని పేరుపెడితే ఏమైనా సరిపోతుందా... విద్యాధరో యధా మూర్ఖో ఒక మూర్ఖుడు ʻవాడుమూర్ఖుడు అవుతాడని ఏమితెలుసుʼ వాడికి విద్యాధరుడూ అని పేరుపెట్టారు వాడుమూర్ఖుడు అయ్యాడు లక్ష్మీధరో ఒకాయనకి లక్ష్మీధరుడని పేరుపెట్టారు వాడు పరమదరిద్రుడయ్యాడు లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాం నిర్థకం పేర్లు ఏమయ్యాయి పనికిరానివయ్యాయి.
వశిష్ట మహర్షి ఇంత కాలం నుంచి కష్టపడి ఆ ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసినటువంటికార్యం, అసలు ఈ ఆవిర్భవించినటువంటి విష్ణుస్వరూపాలకి నామకరణంచెయ్యడమే... ఆయనయొక్క ప్రయోజనము. ఎందుకు నామకరణం చెయ్యడము, నామకరణంచెస్తే ఏమొస్తుంది మంచి పేరుపెట్టాడని దశరథుడు కట్నమిస్తాడా... అలా కట్నంకోసం ఆశపడేటటువంటి వ్యక్తా వశిష్ట మహర్షి, మహానుభావుడు బ్రహ్మవేత్త ఆయన పేరు తలచుకుంటేచాలు పాపరాశి దగ్ధమౌతుంది, అంతటి మహా పురుషుడు దేనికొరకు పేర్లు ఉంచడం అంటే... శ్రీరామాయణంలో మీకు అనేకమంది ఋషులు కనబడుతారు

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ప్రధానంగా శ్రీ రామాయణ రచనచేసి తరించినవారు వాల్మీకి మహర్షి, రామ చంద్ర మూర్తికి ఆయన సోదరులకి పేర్లుంచి మనని తరింపజేసినటువంటివాడు వశిష్ట మహర్షి, సీతా రామ కళ్యాణంచేసి తరించినటువంటి మహాపురుషుడు ఒకరకంగా చెప్పాలంటే రామ చంద్ర మూర్తికి స్నాతకమే చేసినటువంటి గురువు విశ్వామిత్రుడు, ఈ ముగ్గురిది శ్రీ రామాయణంలో చాలాగొప్ప పాత్రకనబడుతుంది, తరువాతి కాలంలో అగస్థ్య మహర్షి మొదలైనటువంటివారి ప్రభావం కూడా చాలామిక్కుటంగా ఉంటుంది.
Related imageకాని ప్రధానంగా రాముడు బాలుడుగా ఉన్నప్పుడు, లేదా రామాయణ రచనాకాలమునందు ఈ ముగ్గురియొక్క ప్రభావము చాలా అధికంగా మనకి కనబడుతుంది. ʻరామʼ అని పేరు పెట్టారు అంటే... అది అంతతేలికగా పెట్టినటువంటి పేరుకాదు రమయతీతి రామః అందర్నీ సంతోషింపజేసేటటువంటి వాడెవడో... ఆయనకి రాముడునిపేరు. అందుకే రామ చంద్ర మూర్తి పేరుతలుచుకున్నా... రామ చంద్ర మూర్తి యొక్క కథ చెప్పుకున్నా... రామనామం చెప్పుకున్నా... రామనామం వ్రాసినా... అంతశక్తివంతం. అది సుఖసంతోషములకు హేతువై ఉంటుంది ఆనందమును ఆవిర్భవింపజేస్తుంది. సహజంగా రామకథకి ఒకలక్షణముంది లోకంలో... రామకథ తెలియనటువంటివాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే మీరు అందరూ ఈసభకు వచ్చి ఇలా కూర్చున్నారు మీ అందరికి తెలుసు ఒక విషయం, శ్రీరామాయణంలో వశిష్ట మహర్షి పేరు ఏమనిపెడతారో మీకుతెలిదా... లేకపోతే శ్రీరామాయణంలో కథ ఎలానడుస్తుందో మీకుతెలియదా... మీకందరికీ తెలుసు, తెలిసి మీ అందరు ఎందుకు వచ్చికూర్చున్నారు అంటే దీని వెనుక మనసంస్కృతిలో ఒక అంతర్లీనమైన జీవధార ఒకటుంది ʻరామ కథ తనంత తానుగా అమృత స్వరూపం.ʼ రామకథ విన్నంత మాత్రంచేత అపమృత్యువునుంచి కూడా గట్టెక్కిస్తుంది.
నేను స్వానుభవంలో రామకథ ఎంతగొప్పదో, రామనామం ఎంతగొప్పదో, నేను అనుభవించినటువంటివాన్ని నేను వ్యక్తిగత అనుభవాలు వేదికలమీద చెప్పడానికి కించిత్ విముకుడను అందుకని నేనదిచెప్పడం ఇష్టంలేదు, కానీ నేను సుందర కాండ మొదలైనవి ప్రవచనం చేసేటప్పుడు రామకథ గొప్పతనమేమిటో, రామనామం గొప్పతనం ఏమిటో... స్వయంగా అనేక పర్యాయాలు అనుభవించి ఉన్నాను. అందుకే రామకథ సాక్ష్యాత్తు సంజీవని అది మృత సంజీవని, చనిపోయేటటువంటి వాళ్ళని కూడా బ్రతికేటట్లు చేస్తుంది ఎంతటి కష్టంలోంచైనాసరే అది గట్టెక్కించేస్తుంది. (దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం) ధంష్ట్రా మురిపు వరాహస్య భవతి అంటారు శంకరభగవత్ పాదులు సౌందర్యలహరి చేస్తూ... అలా జననమరణ దుఃఖంలో పడికొట్టుకున్నటువంటి జీవున్ని పైకెత్తి జ్ఞానంవైపుకు నడిపిస్తుంది ధర్మాన్ని నేర్పుతుంది. అసలు మనిషి జీవితానికి క్రొత్త కోణాన్ని తొడుగుతుంది. రామకథ భహుభంగిమల మనిషికి అంమృత్వాన్ని, ఒక నిశ్చితమైనటువంటి బుద్ధిని, సమగ్రమైనటువంటి నడవడినీ అందజేస్తుంది అంతగొప్పకథ రామకథ. అటువంటి రామకథలో రామ చంద్ర మూర్తికి ఆనామం ఉంచినటువంటివారు వశిష్ట మహర్షి.
పేరుపెట్టుకొని రాముడు గొప్పవాడయ్యైడా,.? ఆపేరు తలుచుకొని మనంతరించామా..? మీరు కొంచెంజాగ్రత్తగా ఆలోచించండీ...! “రామ” అన్ననామం ఎవ్వరైనా పలకడానికి వీలైనటువంటినామం. ఎందుకంటే నేనుమీతో ఒకరోజు ప్రస్థావనచేసి ఉన్నాను. వాక్ అనేటటువంటిది కేవలం మనుష్యునికి మాత్రమే ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్పవరం ఒక్కమనమే మాటమాట్లాడగలం మాటమాట్లాడగలంగనుక బోధ అన్నదివచ్చింది బోధ అన్నదివచ్చింది కాబట్టి వినడమన్నదివచ్చింది బోధ, వినడం వచ్చాయి కాబట్టీ పుస్తకాలన్నవి వచ్చాయి పుస్తకాలన్నవి వచ్చాయి కాబట్టి

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ముద్రణాలయాలు వచ్చాయి. ఇవన్నీ ఎవరికీ మనకే... మీరు గ్రథలయాలు పెద్దపులులకు ఉండడం ఎక్కడైనా చూశారా... లేకపోతే పిల్లులకీ, కుక్కలకీ పాఠశాలలు ఉండడం మీరు ఎక్కడైనా చూశారా... అవి ఎక్కడైన ప్రవచనం చెయ్యడం, మిగిలినవి వినడం, వాళ్ళ జీవితాల్ని దిద్దుకోవడం మీరు చూశారా... అవి కూర్చొని రామకోటి రాయడం, రామనామం చెప్పడం మీరు ఎక్కడైనాచూశారా... ఉండదు. ఒక్క మనుష్యజాతికి ఈశ్వరుడిచేత బహూకరించబడినటువంటి గొప్పవరం వాక్కు. ఆ వాక్కుచేత తరిస్తాడు, ఆ వాక్కుచేత పథనమౌతాడుకూడా ఎందుకంటే అది రెండంచులు కలిగినటువంటి కత్తి. కేవలం వాక్కుచేత నశించిపోయాడు రావణాసురుడు, చాలామంది ఏమంటారంటే... రావణుడు రామునిచేతిలో నిహతుడైయ్యాడు అంటారు కాని హనుమా సుందర కాండ అయిపోయింతరువాత ఒక రహస్యం చెప్పాడు, రావణుడు సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడి తనమరణాన్ని తాను కొనితెచ్చుకున్నాడు మరణించడానికి పక్వమయ్యాడు వండుకున్నాడు పాపాన్ని, ఇప్పుడు నిమిత్తంగా రాముడువెళ్ళి బాణంవేస్తే పడిపోయేటటువంటిస్థితికి చేరిపోయాడు రావణుడు దేనిచేత, ప్రతిరోజు అమ్మవారితో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు అంతే ఆమాటలకి మరణించాడు.
Image result for rama birthఎప్పుడు మాట్లాడినా ఋషులు ఇలా అన్నారూ... వేదం ఇలా అందీ... పెద్దలు ఇలా అన్నారూ... అనడం తప్పా, నేను ఇలా అంటున్నాను అని అనడం తెలియనివాడు రామ చంద్ర మూర్తి. తను ఒక పనిచేస్తే, తను ఎందుకుచేస్తున్నానో చెప్పవలసివస్తే... ఇది నేను ఇందుకుచేస్తున్నాను, అని చెప్పినప్పుడు, నా బుద్ధికి ఇలాతోచింది అని రాముడు ఎక్కడా అనడు రామాయణంలో... ఎప్పుడు చెప్పినా మీరుచూడండీ... మా నాన్నగారు ఇలాచెప్పారు. మా గురువుగారు ఇలాచెప్పారు. ఋషులు ఇలాచెప్పారు, వేదం ఇలాచెప్పింది అందుకనే నేను ఇలాచేస్తాను అంటాడు శాస్త్రాన్ని అనుసరిస్తాడు. అటువంటి రామనామం యుగాలు మారిపోయినాసరే, అది తారకనామమైపోయీ... మనందర్నీ కూడా ఉత్తమగతులవైపు తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తితోనిండింది. ఇంతగొప్ప నామాన్ని అగ్నిబీజమైనటువంటి ʻʼ కారాన్ని, అమృత బీజమైనటువంటి ʻʼ కారాన్ని కలిపి ʻరామాʼ అనేటటువంటి నామాన్ని మనకి వశిష్ట మహర్షి అందించాడు.
ఆ తరువాత భరతుడు విభక్తాః భరతః భరించినటువంటివాడు దేన్నిభరించాడు అంటే... రాజ్యాన్ని భరించాడు ఎలా భరించాడు అంటే... కేవలము నాదికాదన్న భావనతోభరించాడు. ఎందుకంటే లోకంలో ఒకస్థితి ఒకటి ఉంటుంది ఒక సమున్నతమైనటువంటి అధికార పదివిలోకూర్చొని, ఆ పదవిని నిర్వహణ చేసిన తరువాత, వెరొకరి తరుపున తానునిర్వహించినాసరే... ఇంగ్లీసులో అయితే ఇన్జార్జి అనొచ్చేమో... అలా నిర్వహించినాసరే... దానిమీద ఒక అభిలాశ అనురక్తి ఏర్పడుతాయి, ఈ పదవిని మనం అంత తొందరగా వదిలిపెట్టేయ్యడమా, మళ్ళీ మనగౌరవం మనకుంటుందా... అని పిస్తుంది. ఒకచోట అధికారిగా పనిచేసినటువంటివ్యక్తి, అదే ప్రదేశంలో వేరొక అధికారికింద అంతపెద్ద అధికారాలు లేనటువంటివాడిగా బ్రతకం చాలాచాలా కష్టం, లోకంలో మనుష్యులయందు అది పొసగనిపోకడ మీరుచూడండీ... మీకు తేలిగ్గా ఒక ఉదాహరణ చెప్పాలి అంటే... మీరు పట్టుకోగలుగుతారు ఒకాయన ఆఫీసరుగా ప్రయోట్ అయ్యారనుకోండీ... ఆ ఆఫీస్ అంతటికీ కూడా

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ఆయన బాస్, ఒక యేడాది ఆయన అలాపనిచేశాడు పనిచేసిన తరువాత ఆయనకు రివర్శన్ వచ్చింది. ఆయన దగ్గర పనిచేసేటటువంటివాడు, లేదా ఇంతకాలం ఆయనతో ఉన్నవాడు ఆఫీసరయ్యాడు. ఇప్పుడు తాను ఆఫీసరు కాకుండా గదిలోంచి బైటికొచ్చేసి, ఓ టేబులూ కుర్చిదగ్గర కూర్చుని ఈయ్యన పనిచేస్తున్నాడు, అంతతేలికగా మనసు అంగీకరిస్తుందా... వెంటనే ఆతను చేసేపని ఏమిటంటే... ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాస్సఫర్ చేయించుకొని వెళ్ళిపోతాడు, లేకపోతే దీర్ఘకాలిక సేలవుమీద వెళ్ళిపోతాడు దానికి ఒకసామెత చెపుతారు “పూలమ్మిన చోట కట్టెలమ్మలేమండీ అని, ఇక్కడే అధికారిగాచేసి మళ్ళీ ఇక్కడే నేను ఇలా పని చేయడం కుదరదు అంటారు.
కాని మీరు చూడండీ 14 సంవత్సరములు రాజ్యం చేశాడు భరతడు, 14 సంవత్సరములు రాజ్యం ఎలా చేశాడంటే... ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా ఎప్పుడెప్పుడు రాముడి రాజ్యం రాముడికి ఇచ్చేద్దామాని కాబట్టి ఆయనకు రాజ్యం మీద అనురక్తి లేదు. కానీ రాజ్యం ఎలా పోతే అలా పోనీ మనకెందుకని పరిపాలించాడా అని మీరు అనుకుంటుంన్నారా... ఇది రామ రాజ్యం రాముడి రాజ్యం 14 సంవత్సరములు రాముడు వచ్చిన తరువాత, దీన్ని నేను పరమపదిలంగా నేను రాముడికి అప్పజెప్పాలి వ్యవస్థ పాడవుకూడదు, రాముడే కూర్చొని పరిపాలిస్తే ఎంత ధర్మంగా ఉంటుందో... అంత ధర్మంగానూపరిపాలన నడవాలి, కానీ నేను కాదు నా కొరకు కాదు ఈ పరిపాలన ఎవరి కొరకు మళ్ళీ తిరిగి ఈ రాజ్యం రామునికి ఇచ్చేయ్యాలి, ఈ భావనతో భరించాడు భరతుడు. ఇదీ అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ అటువంటి భక్తి లోకంలో ఎవరికీ ఉండదు అందుకే పాదుకలు తీసుకొచ్చి సంహాసనంమీదపెట్టి తాను క్రిందకూర్చొని పరిపాలనచేశారు. ఏమైనా కించిత్ రాగము అంటుకుందేమోనని చూద్దామని భారద్వాజ మహర్షి పరీక్షపెట్టారు ఆ పరీక్షలో నెగ్గాడాయన అంతటి గొప్పవాడు భరతుడు అటువంటిస్థితిని పొందగలడు ఊహించి పెట్టారు పేరు ఆయన నిజంగా భరతుడయ్యైడు.
లక్ష్మణుడు, లక్ష్మణుడంటే... లక్ష్మీసహితుడు, ఏమిటాయనలక్ష్మీ... శ్రీరామాయణంలో మనకు ఇద్దరు కనబడుతారు అటువంటి లక్ష్మి కలిగినటువంటివాళ్ళు... ఒకరు స్వామి హనుమా, ఇంకొకరు లక్ష్మణ మూర్తి. స్వామి హనుమని ఒకటికి పది మార్లు శ్రీమాన్ శ్రీమాన్ శ్రీమాన్ అంటూ ఉంటారు మహర్షి సుందర కాండలో... ఏమిటి ఆయన శ్రీమాన్ ఆయన ఏమైనా చెక్కుబుక్కు పట్టుకెళ్ళారా, ట్రావెలర్స్ చెక్కు పట్టుకెళ్ళారా ఏమిటి, ఏటియం కార్డు పట్టుకెళ్ళారా, ఎక్కడైనా కాఫీతాగారా ఏమిటి? రావణాసురిడి అంతఃపురంలో కనీసంలో కనీసం ఒక్క అరటిపండు ఒలిసి నోట్లో వేసుకున్నారా... ఆయన తిన్నదేంలేదు రామార్ధం వానరార్ధం చ చికీర్షన్ దుష్కరమ్ సముద్రస్య పరం పాదం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు విద్యాధరలో, కేవలం రాముడికోసం తాను జన్మించినటువంటివాడు వానరజాతి ప్రతిష్టకోసం అంతటి త్యాగమూర్తియై మహానుభావుడు తన ప్రాణాలకుతెగించి రామ కార్యంమీద వెళ్ళారు అటువంటివారు హనుమా. లక్ష్మణ స్వామి తనజీవితంలో భోగమనుభవించిందీ అన్నది మనకేంకనబడదు, యవ్వరాజ్యమిస్తే నాకక్కరలేదు అన్నాడాయన పెద్దవాడు భరతుడున్నాడు ఇచ్చేయమన్నాడు, తండ్రి దశరథ మహారాజుగారు వెళ్ళమనలేదు లక్ష్మణున్ని అరణ్యవాసానికి, రామున్ని వెళ్ళమన్నారు, సీతమ్మ ధర్మపత్ని కాబట్టి వెళ్ళింది. తమ్ముడు లక్ష్మణునికి ఏమి అవసరం భార్యను విడిచిపెట్టి... నేను రామ చంద్ర మూర్తిని విడిచిపెట్టి శరీరముతో సేవించకుండావుండలేను అన్నాడు. ఈ శ్లోకాన్ని ఎదర చెప్తారు మహర్షి ఇది చిన్నతనం నుంచీ లక్ష్మణుని అలవాటు నేను శరీరంతో సేవించకుండా ఉండలేనూ అన్నాడు, కొంతమందీ మనుసుతో సేవిస్తారు, భరతున్నాడు రాజ్యమిచ్చి, పాదుకలిచ్చీ... పాదుకల్ని సింహాసనం మీదపెట్టి పరిపాలనచేశాడు పద్నాలుగేళ్ళు. లక్ష్మణుడు అలాకాదు చెప్పుకున్నాడు మీకు ఎదర రామాయణంలో వస్తుంది అందుకనీ మీకు అవన్నీ శ్లోకాలు ఎందుకు చెప్పాలి, అందుకని నేనుచెప్పట్లేదు. రాముడు పక్కన ఉండాలి, రామున్ని చూస్తూవుండాలి, రాముడి కాళ్ళుపట్టాలి, రాముడికి అన్నంపెట్టాలి, రాముడికి పర్ణశాలకట్టాలి, రాముడి వెనకనడవాలి, రాముడు అలసిపోతే నీళ్ళుతెచ్చి ఇవ్వాలి, అన్నయ్య వదినెకి సేవ చేసుకోవాలి, ఈ శరీరం ప్రతిరోజూ అన్నయ్య వదినె సేవలో తరించాలి ఇది లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు ఇది ఆయన లక్ష్మి.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
Related imageఈశ్వరుని యొక్క సేవలో నిరంతరము ఎవరి శరీరము డస్సిపోతుందో... అంత డస్సిపోతున్నా ఎవడు అత్యంత ఉత్సాహంతో నాజన్మ ధన్యమైపోతూందో... అని సేవచెయ్యగలుగుతుంటాడో... అటువంటివాడు నిజమైన లక్ష్మీసంపన్నుడు. కనుకా లక్ష్మణుడూ... లక్ష్మీ సంపన్నుడు. శత్రుఘ్నడు ఇంద్రియములను జయించినటువంటివాడు శత్రువులను గెలిచినటువంటివాడు. మీకు శ్రీ రామాయణంలో ఎక్కడో ఉత్తర కాండలో లవణ సంహారంలో తప్ప అస్సలు శత్రుఘ్నడు చేసినటువంటి యుద్ధాలు పెద్ద విశేషంగా ఏమీ కనపడవు మరి శత్రుఘ్నడు అన్నపేరు ఎందుకొచ్చింది. అంటే బాహ్యంలో ఉన్నశత్రువుల్ని గెలవడం ఎవరికైనా తెలికే పరాక్రమం ఉంటే... లోకము లన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా నీకము జిత్తముం గెలువ నేరవు నిబద్ధు జేయు నీ భీకర శత్రు లార్వుర బ్రభిన్నుల జేసిన బ్రాణికోటిలో నీకు విరోధి లే డొకడు నేర్పున జూడుము దానవేశ్వరా! అంటాడు ప్రహ్లదుడు హిరణ్య కశ్యపునితో, బయటి శత్రువులని జయించచ్చు, అంతః శత్రువుల్ని జయించడం చాలాకష్టం కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః ఇక్కడే ఉన్నారు జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత అంటారు శంకరభగవత్ పాదులు. వాళ్ళని గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు, ఇంద్రియములను గెలవడం అంత తేలిక కాదు ఇంద్రియాణి బలిష్ఠాని నని యుక్తాని మానద ! అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్తాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపుః నిర్మలం న మనోయావత్ తావత్సర్వం నిరర్ధకమ్ అంటాడు వ్యాసుడు దేవీభాగవతంలో... ఎన్ని క్షేత్రాలు తిరిగితే ఎవరిక్కావాలి, ఎన్ని యాత్రలు చేస్తే ఎవరికికావాలి, అంటే చెయ్యొద్దనికాదు నాఉద్ధేశ్యం, ఎన్ని నదీస్నానాలు చేసినా మనసుకి పరిపక్వతా మనసుయందు మార్పురాకుండా... దాన్ని అంటుకున్నటువంటి రజోగుణం అలాగే అంటుకుని ఉండిపోయిననాడు ఏమిటి ప్రయోజనము దానివల్ల రాగద్వేశాలతోనే ఉండిపోతారు.
శత్రుఘ్నడు అంటే తన ఇంద్రియములను గెలిచినటువంటివాడు, అంతఃశత్రువులను గెలిచినటువంటివాడు, నిరంతరమూ భగవత్ భక్తితో, భాగవత భక్తితో తరించినవాడు, అటువంటి వాడౌతాడని, ఆఖరివాడికి శత్రుఘ్నడు అని పేరుపెట్టారు. నిజంగా ఆనాడు వశిష్ట మహర్షి నోటివెంట వచ్చినటువంటి పేర్ల బలంవలన అలా తయారుచేసిందో... వాళ్ళు అలా అవుతారని ఊహించి వశిష్ట మహర్షి వంటిమహానుభావుడు పెట్టినపేర్లు ఎప్పటికీ అబద్దంకాకూడదు కాబట్టి అలాజరిగిందో, ఈ రెండింటికన్నా బలీయమైనకారణం యుగాలుమారిపోయినా రామకథ చెప్పుకొని మనందరం తరించడంకోసమని రామనామం చెప్పుకోవడంకోసం ఆనామం ఆనలుగురూ అన్నదమ్ములు అంతగొప్పవారుగా తయ్యారయ్యారో మనభాగ్యవిశేషం, నిజంగా... అంత గొప్పపేర్లు మహానుభావుడువుంచాడు.
వాల్మీకి మహర్షి అంటారు తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరః పితుః ! బభూవ భూయో భూతానాం స్వయమ్భూరివ సమ్మతః !! అంటారు ఒక ధ్వజం ప్రస్ఫుటంగా కనబడుతోంది, మీరొక దేవాలయంలోకి వెళ్ళారనుకోండీ, ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభం కనబడింది అంటే... అది దేవాలయం ఉన్నప్రాంగనము అనిగుర్తు. దేవాలయం ఉన్నప్రాంగణము అనిగుర్తూ దేనికొరకు అంటే... ధ్వజం ఎత్తుగా ఎందుకు ఎగురుతుందంటే... ఇక దానిసమీపంలో ఏ విధమైనటువంటి ఊరేగింపులుకానీ, ఇతర మేళతాళములుకాని వెళ్ళకూడదు. ఎవరో ఊరేగింపుగా మేళతాళాలతో వెళ్ళిపోతున్నారనుకోండీ... ఎంతటి మహాపురుషుడైనా పల్లకీదిగిపోవాలి. ఇంక అక్కడ మేళతాళాలు చెయ్యకూడదు ఆలయప్రాంగణం దాటినతరువాత మేళంచెయ్యాలి. అక్కడ మేళంచేస్తే ఒక్క ఈశ్వరసేవ కొరకు, ఏదైనా రాజలాంఛనాలతో వెడుతున్నవాళ్ళు వాటిని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే, ఈశ్వరుడు ఆయన మహానుభావుడు ఆయన అఖిలాండకోటి బ్రంహాండనాయకుడు ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల-భూతములలోన దా బొదలువాడితడు అని అంటారు అన్నమాచార్యస్వామి. అలా అఖిలాండకోటిబ్రంహాండ నాయకుడైనటువంటివాడు లోపలున్నాడన్నదానికి గుర్తుగా... పథాకం ఎగురుతూ ఉంటుంది.
ఆ వంశం అంతగొప్పది అన్నదమ్ములు అంతగొప్పవాళ్ళూ, ఆ ఇల్లు అంతశోభతో ఉంది, అక్కడ వాళ్ళంత సంతోషంగా ఉన్నారూ అనడానికిగుర్తా అన్నట్టుగా... ధ్వజమా, పతాకమా అన్నట్టుగా సుస్పష్టంగా, ఎత్తుగా, ప్రకాశవంతంగా, నలుగురూ గుణవంతులైన ప్రస్ఫుటంగా తనగుణములచేత సర్వభూతములను సంతోషింపజేస్తూ... తేషాం కెతురివ జ్యేష్టో రామో రతికరః పితుః ఆయన భభూవ భూయో భూతానాం సమస్త భూతములు రామ చంద్ర మూర్తిని చూస్తే సంతోషించేవి, అలా ఉంటుందా సంతోషము అని మీకు అనుమానం ఉండచ్చు ఖచ్చితంగా ఉంటుంది.
మీరు చూడండీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో నా స్నేహితుడొకడు ఈ మధ్య కాలంలో వెళ్ళి బాగ చీకటిపడిన తరువాత ఒక చెట్టుకింద నిల్చున్నాడు ఏదో కారణానికి, నిల్చుంటే... ఒక పెద్ద నాగుపాము ఒకటి అతని పాదలనుంచి పాకుతూవెళ్ళింది. కడుపుచల్లగా ఉంటుందంటారుపాముది చాలా మంచుముద్దలా ఉంది ఏమిటని చూద్దామని అతను చూస్తున్నాడు, చూస్తూంటే.. కాళ్ళనుంచి పాకుతూవెళ్ళిపోయింది. తల ఎత్తలేదు అతన్ని ఏమీ చేయలేదు కింద పాములు పాకుతుంటాయి, పైన నెమళ్ళు తిరుగుతుంటాయి రమణ మహర్షి ఆశ్రమంలో, ఋష్యశృంగుడు తపస్సు చేసిన చోటా కప్పకి పాము పడగ పట్టిందీ అంటే... నిజమా? అంటాం మనం. మీరు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చూడండీ... ఆయన తపో బలం అంతటి మహాపురుషుడు తిరుగాడిన స్థలం అటువంటి ఆ ప్రదేశానికి ఉన్నటువంటి శక్తీ, అది ఇప్పటికీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావములు కలిగినటువంటి ప్రాణుల మధ్య సయోధ్యను చేకూర్చుతుంటుంది. ఆ ప్రాణులు తమమధ్య ఉన్నటువంటివైరాన్ని మరచిపోతాయి, కారణమేమిటంటే... అన్ని భూతములయందు బ్రహ్మమునుచూసి తానలా రమించినటువంటి వ్యక్తి తిరుగాడినటువంటి భూమి ఆ ప్రదేశానికి అటువంటి ప్రకంపన వైశిష్టము ఏర్పడుతుంది.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి రామ చంద్ర మూర్తిని చూస్తే కూడా... సమస్త ప్రాణులు సంతోషాన్ని పొందేవట, విశ్వామిత్రుడు ఆశ్రమంలోంచి వెళ్ళిపోతూంటే, పక్షులు, జంతువులూ కూడా ఆయన వెంటవెళ్ళాయి. ఆయన వాటితో చెప్పాడు, వెళ్ళిపోండివెనక్కీ మీరు ఆశ్రమంలో ఉండండీ, నేను వెళ్ళిపోతున్నాను హిమాలయాపర్వతాలకీ మీరు ఇక్కడ సుఖంగా ఉండండీ అనిచెప్పాక అవివెళ్ళాయి. పక్షిభాషలో మాట్లాడాడా జంతుభాషలో మాట్లాడాడ అక్కరలేదు వాళ్ళుహృదయములతో మాట్లాడుకుంటారు బ్రహ్మన్ అంటే వాళ్ళు సర్వభూతములయందు ఈశ్వరున్నిచూస్తారు. మనమూ అభిషేకంచేస్తాము, ఒక బ్రహ్మర్షీ అభిషేకంచేస్తాడు, తేడా ఎక్కడొస్తుందోతెలుసాండీ... మనం అభిషేకంచేస్తే మంత్రం-పదార్థం ఈ రెండేమనకుండాలి, మనం అభిషేకమంత్రం అయిపోతూ ఉంటుంది నమః చోరాయచ న్మశ్శష్ఫ్యాయచ ఫేన్యాయచ నమస్సికత్యాయచ  ప్రవాహ్యాయచ వృక్షాయచ హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః అంటాం మనపుష్టభాగాన్ని తీసుకెళ్ళి అదేచెట్టుకు మనం ఆనించినిలబడుతాం. ఒక నిజమైనటువంటి బ్రహ్మవేత్తదృష్టిలో ఆచెట్టు ఈశ్వరుడు దాని ఆకులలోని ఆకు పచ్చతనం ఈశ్వరుడి యొక్క వెంట్రుకలు, కాబట్టి ఆయన చెట్టుకు కాలుతాకించి నిలబడలేడు ఆయన నిజమైన అభిశేకంచేసినవాడు. కేవలం పదార్థాలుపోసి మంత్రం చెప్పినవాడిదికాదు అభిషేకం అంటే... ఎవరిది అభిషేకమంటే పైనుండి ఎలా ధారాపాతంగా పడుతోందో, అలా బ్రహ్మభావన నిరంతరమూ ఇక్కడ పడుతున్నటువంటివాడు ఎవడున్నాడో వాడుబ్రహ్మముతో సమన్వయం అవుతుంటాడు వాడికి ఏంచేస్తున్నా ఈశ్వరుడు కదులుతూ ఉంటాడు  పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీ లా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత ! శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాదనం ధానుండై మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భువరా !! అంటారు పోతనగారు ప్రహ్లాదునిగురించి. ఏదిచేస్తున్నా ఈశ్వరున్ని సమన్వయం చేసుకొనేశక్తి ఉంటుంది జపో జల్పః శిల్పం సకల మపి ముద్రావిరచనా గతిః ప్రాదక్షిణ్యక్రమణ మశనాద్యహుతి విధిః ! ప్రణామ స్సంవేశ సుఖ అఖిల మాత్మార్పనప్రదుశా !!  అంటారు శంకర భగవత్ పాదులు సౌందర్యలహరి చేస్తూ... ఆయన మాట మాట్లాడితే మంత్రం, ఆయన నడిస్తే ప్రదక్షిణం, ఆయన చెయ్యి కదిపితే అది ముద్ర ఎందుకవుతుంది అంటే అలా ఆయనలో ఉన్నటువంటి బ్రహ్మీస్థితి అది. బ్రహ్మీ మయ మూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు.
అటువంటి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరున్నారో... అటువంటి వారియొక్క భావమును భూతములు కూడా అర్థం చేసుకొంటాయి భూతములు అంటే... నా వుద్దేశ్యం ప్రాణులు. అవి కూడా వారి పట్ల అటువంటి ప్రేమ పెంచుకుంటాయి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉంటే... ఒక కోతి చిన్న చిన్న పిల్లలతో వచ్చి చెట్టు మీద కూర్చుని కిచ కిచ లాడుతూ ఏడుస్తోంది, దాన్ని కొట్టబోయారు, ఈయన వెళ్ళి ఆ కోతి కిచ కిచ మంటూ చెట్టు కొమ్మనుంచి ఆయన వంక చూస్తూ... కిచ కిచ లాడుతోంది. ఆహాఁ... ఆహాఁ... అంటూ ఆయన ఏడుస్తున్నాడు అంతా అయిపోయింది ఆ కోతి వెళ్ళిపోయింది పిల్లల్ని పట్టుకొని. అడిగారు ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, కోతి ఏం కిచ కిచ లాడింది మీ రెందుకు ఏడ్చారని, దానికి ఒక కూతురట , ఈ మధ్యనే.. అల్లుడు కూతురూ కలసి సంతోషంగా ఉండి పిల్లలు పుట్టాయట, అనుకోకుండా హఠాత్తుగా ప్రమాదం జరిగి అల్లుడూ, కూతురూ కూడా మరణించారట, ఈ చంటి పిల్లల్నీ నేను పోషించవలసి వచ్చింది వృద్ధాప్యంలో భగవన్ నాకు ఎంత కష్టము వచ్చిందో చూడండని ఇది నాకు చెప్పుకోడానికి వచ్చింది దాని కష్టం విని నేను విచలితుడైయ్యాను అన్నారు ఆయన.  వారు బ్రహ్మీమయ మూర్తులు అంటే... వారిని చూసి భూతములు సంతోషిస్తాయి అంటే కావ్యం, మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ ఉండదు అది చేరవలసిన స్థితి. మనుష్యుడుగా పుట్టినటువంటివాడు చేరవలసినస్థితి రాగద్వేశాలు నేర్చుకొనడానికి మీకు పాఠశాలలు ఉండవు, అవి జన్మంతర సంస్కారంగా వచ్చేస్తాయి రాగద్వేశములు తొలగించుకొనుటకు గురుబోధ వినాలి రాగద్వేశములు తొలగించుకోడానికి మీరు కావ్య పఠనంచెయ్యాలి.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
Related imageరామాయణం ఎందుకు చదవాలీ అంటే... రాముడు ఎలా ప్రవర్తించగలిగాడో, అలా నేనేమైనా కొంతవరకు ప్రవర్తించగలనా, నేను అలా కొంతలో కొంతైనా ఈశ్వరదర్శనం చేయడం అలవాటు చేసుకోగలనా దానికొరకు తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరఃపితుః ఎంత పెద్దమాటో చూడండీ,  తండ్రికి కొడుకుపుట్టడం గొప్పవిషయంకాదు కానీ తండ్రిగారి పరువుప్రతిష్టలు నిర్ణయింపబడేది కుమారుడి వలననే... మీరు జ్ఞాపకంపెట్టుకోండి. ఎందుకో తెలుసా? తండ్రి శ్రీ రామ నవమి ఉత్సవాలు అవుతున్నాయంటే... ఓ పందిట్లోకి వెళ్ళాడు, అయ్యా! మీరొచ్చారు ఏమైనా విరాళం ఇవ్వండి అన్నాదానంచేస్తాం నవరాత్రులు అయిపోయాక అన్నారు. ఓ వందరూపాయలు రాసి మా అబ్బాయిదగ్గర అడిగి పుచ్చుకోండి రేపటి రోజున అన్నాడు. మరునాడు ఆయన సంధ్యా వందనం చేసుకొంటున్నాడు, వీళ్ళు ఆ రసీదు పట్టుకెళ్ళి వాళ్ళబ్బాయికిచ్చి నాన్నగారు వందరూపాయలు రాశారండీ ఇస్తారా అన్నారు. ఆయనకేం పనా పడా రిటైరై పదేళ్ళయింది, కనబడ్డచోటల్లా రాస్తాడు, రాస్తే మీరు రశీదు ఇచ్చేయడమేనా... ఇచ్చేవాన్ని నేను నన్నడిగి రాయాలా ఆయన మాటిస్తే రాయాలా... ఆయన్నే అడిగిపుచ్చుకోండి, ఏమిస్తాడో చూద్దురుగానీ అన్నాడనుకోండీ... ఆ తండ్రి గతంలో ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నవాడైనా సరే... ఆయనంటూ బాధపడి ఆరోజు మరణించినంత ఖేదంపొందేది ఎప్పుడంటే... కొడుకు మాటలవల్ల కొడకు రతికఃపితుః తండ్రిని సంతోషింపజేశాడు రాముడు. దేనిచేత ఒక్కటే... రామా ఇలా రా! ఏం నాన్నగారండీ ఎందుకిప్పుడూ, కాదు పరుగెత్తుకుంటూ వెళ్ళినిలబడ్డమే. ఇది ఎంతదూరం వెళ్ళిందంటే... ʻరామా నీకురాజ్యం ఇస్తున్నాను రేపుʼ ఎందుకు నాన్నగారండీ అడగలేదు. ʻరామా నీకు రాజ్యం ఇవ్వట్లేదుʼ ఎందుకు ఇవ్వరు నాన్నగారండీ అడగలేదు ఇస్తానన్నది నాన్నగారే, ఇవ్వనన్నదీ నాన్నగారే, నాన్నగారికి ఆ హక్కుంది ఇది రాముడంటే.
ఇదీ... రతికరఃపితుః తండ్రికి సంతోషం అప్పుడు, నాన్నా నాన్నా అని మీరు బుజ్జగించి కొడుకు ఏది అడిగితే... అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండీ, నాన్నగారండీ అంటే కొడుకు గొప్పవాడు కాడు. కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా, తండ్రి పిలిచి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తే... మా నాన్నగారు మహాత్ముడు పెద్దవాడు, నన్ను కన్నవాడు, నా విద్యా బుద్దులు నేర్పినవాడు, నా యోగ్యత చూసినవాడు ఆయన “ఎందుకు వద్దన్నాడో నేను చేయ్యను”. ఏమండీ కనుక్కోండీ ఎందుకొద్దన్నానో నేను అడగాలా..? అడగక్కర్లేదు మా నాన్నగారు వద్దన్నారంతే, అన్నాడనుకోండి ఆ తండ్రికి గజారోహణం చేయించినట్లవుతుంది. చాలు నా కటువంటి కొడుకని రతికరఃపితుః ఇది. రాముడనుకుంటున్నాడా నేను తండ్రిగారి మాటవింటున్నాననీ, రాముడి వలన నా తండ్రితనం శోభించిందని దశరథడనుకుంటున్నాడా... దశరథుడు అనుకోవాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టండి, మనం చాలా మందిమి ఏమంటాం అంటే.. నేను చేయ్యగలిగిందంతా చేస్తున్నానండీ, నా లోటేం లేదు, ఇంక నేనేం చెయ్యగలను చెప్పండీ అంటాం. నువ్వు అనుకోవడం కాదు, మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకొంటున్నారా అది ప్రధానం. మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకోవాలి, అలా అనుకొంటే... కొడుకుగా నీ కర్తవ్యం పూర్తైనట్లు, నీ బాధ్యత అన్న మాట వాడకండీ, బాధ్యతా వేరు, బాధ్యత అన్న మాట వాడకూడదు. బాధ్యత అన్న మాట ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండీ మిమ్మల్నీ పథనం వైపుకు తీసుకెళ్ళుతుంది. బాధ్యత హెచ్చవేత అర్థం పర్థంలేకుండా తీసుకెళ్ళి పాడుచేసేమాట బాధ్యతే... బాధ్యతా నెత్తికి ఎత్తుకుంటే... ఏడు తరలాకుదాచినా మీకుచాలదు, కర్తవ్యం మీరు జీవితంలో అలవాటు చేసుకుంటే... మీరు చెయ్యవలసినపని మీరుచేశారు, వాడి యోగ్యతా యోగ్యతలు వాడిఇష్టం.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
నాకొడుక్కి ఇంజినీరింగ్ ఫీజుకట్టాను, ఇంజినీరింగ్ కాలేజిలో జాయించేశానూ, ఒక హాస్టల్ చూశాను, వాడడగిన రూంలోపెట్టానూ, పుస్తకాలిచ్చాను వాడుఇంజినీరింగ్ చదువుకుని పేరుపక్కన “బీ టెక్” అనే పేరుతెచ్చుకుంటే, వాడుకనబడినప్పుడల్లా వాడికి మంచిమాటలే చెప్పాను, వాడు చెడిపోతే నీఅనుష్టానమును నీవు పాడుచేసుకోకు, నీ కర్తవ్యం పూర్తైంది నువ్వు చెయ్యవలసింది చెయ్యడం కర్తవ్యం అంతకు మించి నువ్వు అనుకున్నట్లు అవ్వట్లేదని బాధపడటం బాధ్యత, నీవ్యక్తిత్వాన్ని పాడుచేస్తుంది బాధ్యత, నీవ్యక్తిత్వాన్ని నిలబెడతుంది కర్తవ్యం అందుకే మనిషి ఎప్పుడూ కర్తవ్యనిష్టతో నిలబడాలి, మీరుచూడండీ... ఎప్పుడు మాట్లాడినా మనశాస్త్రాలు కర్తవ్యం అన్నమాటే మాట్లాడుతాయి కర్తవ్యం దైవమాల్మికం లే సంధ్యావందనంచెయ్యి, చెయ్యకపోతే ఖర్మ శిష్యునిది. ఎంతవరకు విశ్వామిత్రుడు, చెప్పుతాడు అంతే... వినకపోతే విశ్వామిత్రుడు ఇలా వేళ్ళువిరవకూడదు. ఇది చూశావండీ, చెప్పానండీ, ఇప్పుడు రాముడు లేవలేదండీ, నీపని నీవుచేసుకో... (బస్) అంతే, ఒక్కనాడు వృద్ధిలోకివస్తాడు, ఒకనాడు చేస్తాడు, నా వెంట వచ్చాడుగా, అదే గుర్తు మార్పుకి, ఒకనాడు చక్కటి స్థితినిపొందుతాడు, లోపలమాత్రం మంచి ఆచీర్వచనంచెయ్యి, నువ్వు కదిలిపోకు ఇది కర్తవ్యనిష్ట.
కాబట్టీ తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరఃపితుః ! బభూవ భూయో భూతానాం స్వయమ్భూరివ సమ్మతః !! సర్వే వేదవిదశ్శూరాస్సర్వే లోకహితే రతాః ! సర్వే జ్ఞానోపసమ్పన్నాస్సర్వే సముదితా గుణైః !! చాలా పెద్ద శ్లోకం నిజానికి. చాలా గొప్ప శ్లోకం, ఇదీ నాకైతే అనిపిస్తుంది, ఈ శ్లోకం నేను అనేకపర్యాయాలూ కళాశాలలయందు ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను ఈశ్లోకాన్ని ఎక్కువగా ఉదాహరిస్తుంటాను, సర్వే వేదవిదః శ్శూరాః ఒక అధ్యాపకుడు, ఆచార్యుడూ, గురువూ మీరు ఏ పేరుతో పిలవండీ కించిత్ భేదం, ఒక బోధ చేసేటప్పుడు ఆయన ఉద్ధేశ్యం ఏమిటీ అంటే... అంది అందుకోవాలి ఎదురుగుండా ఉన్నవాళ్ళు తప్పా, ఇప్పుడు నేనే శ్రీరామాయణంమీద నాలుగుమాటలు చెప్పడానికివచ్చాను నా ఉద్ధేశ్యం ఏమిటీ, నాకు తెలిసున్నదీ అన్నది ఏదైనా ఉంటే, మీ అందరితో దాన్నిపంచుకోవాలి అన్నది నా ఉద్దేశ్యం, నాకు తెలుసుననికాని, మీకు తెలిదనికాని నేను కూర్చున్నవానినికాను, నేను మిమ్మల్ని అడ్డుపెట్టి చెప్పుకుని ధన్యున్ని అవుదామని, ఒక గురువు బోధచేస్తే, వాడు ఆవలించి కునుకుతున్నప్పుడు ముఖ్యవిషయాలు చెబుదాం, వినకుండా మిగిలినవాళ్లు వింటారని చెప్పడు అందరూ వినాలనే చెబుతారు. మరి అందరూ ఎందుకు సమానస్తాయిలో అందుకోలేక పోతున్నారు... మీరు గమనించండి... అంటే గురువు యొక్క హృదయాన్ని దానికే ఈ రెండికీ మధ్యలో వచ్చేమాటనీ శాస్త్రం ఏమందంటే శ్రద్ధా అని పిలిచింది. మా గురువుగారు మాట్లాడుతున్నప్పుడు నేను వినకపోతే, నా దృష్టి ఇతర విషయములవైపు వెళ్ళిపోతే, నేను నాజీవితంలో అత్యంత ప్రయోజన కరములైనటువంటి విషయాన్ని పోగొట్టేసుకుంటానూ,

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి వినడం తప్పా శృణ్వన్ తపః భధ్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటాం మా చెవులు భద్రముగా ఉండుగాక ఎప్పుడూ ఈ మాటలను వినుగాక, అలా వినడంలో మనసు వైక్లైవ్యాన్ని పొందింది అనుకోండి, ఉచ్, ఇక్కడితో చాలు, ఇంకా ఆయన చెబితే మాత్రం మనకెందుకు అనిపించిందనుకోండీ, మీ స్థాయి శ్రద్ధ ఉన్న వాడిస్థాయిని పొందదు గురువుగారి దగ్గర మీరు కూర్చుంటారేమో కానీ, గురువుగారి హృదయాన్ని మాత్రం మీరు పుచ్చుకోలేరు.
అందుకే శృంగగిరి పీఠాన్ని అధిరోహించినటువంటి చంద్ర శేఖర భారతీ స్వామి వారు ఒక మాట చెప్తూ ఉండేవారు, మమ్మల్నీ ʻజగత్ గురువూʼ అని ఎందుకు పిలుస్తారో తెలుసా... మేము ఈ జగత్తంతా వెళ్ళి అందరికి బోధ చేస్తామనికాదు, నేను ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే, నా మాటని పట్టుకునీ, తన అనుష్టానాన్ని దిద్దుకునీ, నా మీద నమ్మకంతో, నా మాట మీద నమ్మకంతో, తనను తాను దిద్దుకుని, నేను చెప్పిన మాటలోని ఆ బాటలో నడిచినవాడెడో వాడు నాకు శిష్యుడు. ఎప్పుడూ నాపక్కనే ఉన్నా... నామాట మీద లక్ష్యం లేనివాడు, నేను చెప్పిన దానిమీద నమ్మకం లేనివాడు, నా పక్కనే ఉన్నా వాడు నాశిష్యుడు కాలేడు. వాడుకాకూడదని నేను అనలేదు వాడుకాలేకపోయాడు. ఎందుకంటే మధ్యలో శ్రద్ధ అడ్డు వచ్చింది. ఇంకోడు ఇక్కడ లేడు, చంద్ర శేఖర భారతి స్వామిని నేను ఆయన శరీరంతో ఉండగా దర్శించలేదు అనేక పర్యాయాలు చంద్ర శేఖర భారతి స్వామివారు చెప్పిన మాటలు నేను వాడుతూ ఉంటాను రామ కృష్ణ పరమ హంస మాటలు వాడుతుంటాను, శంకర భగవత్ పాదుల మాటలు వాడుతాను, వాడుతున్నాను అంటే నేను శంకరులని చూశానా, రామ కృష్ణ పరమ హంసను చూశానా, చంద్ర శేఖర భారతి స్వాములని చూశానా, నేను చూడలేదు మాంస నేత్రంతో, చూడకపోయినా వారిమాట నాకు స్పురణకు వచ్చిందీ అంటే... ఆ స్థాయిలో నాకు వారిమాట మీద నాకు ఒక గురి ఉంది, విశ్వాసముంది అందుకే పుస్తకంలో ఉన్నది విద్యకాదు, మీ గుండెలలోకొచ్చింది అనుష్ఠానం. పుస్తకం, గురువుగారు చెప్పిన పుస్తకం మీరు ఇంట్లో పెట్టుకుంటే... మీకు ఎంత వరకు  పనికొస్తుంది, పుస్తకం గభాలున గూట్లోంచి లేచి అడ్డంగా వచ్చి నీవీపని చెయ్యెద్దు అని అడ్డు పడలేదు.
శ్రీరామాయణ పుస్తకం అక్కడ పెట్టి మీరు తాగిన ఎంగిలి కాఫీ కప్పు కూడా రామాయణం పక్కన పెడితే రామాయణం గభాలున ఎగిరి పక్కబల్ల మీదకి వెళ్ళదు కానీ మీ సంస్కారం బయటికొస్తుంది. ఎంగిలి కాఫీ కప్పు పెట్టవలసిన ప్రదేశానికీ, శ్రీ రామాయణం పక్కన ఎంగిలి కాఫీ కప్పు ఉంచడానికీ రెండుటికీ మధ్యలో భేదమేమీ లేదు, అంత పవిత్రమైన వస్తువు అన్న భావన మీకు ఉంటే... అసలు మీ చెయ్యి ఎంగిలి కప్పు అక్కడ పెట్టడాన్ని మీ మనస్సు అంగీకరించదు. ఇంకొక విషయం మీకు చెప్తాను, కాఫీ తాగిన చేత్తో మీరు రామాయణాన్ని ముట్టుకోరు చేతులు కడుక్కుని రామాయణం ముట్టుకుంటారు కారణమేమిటంటే మీకు దాని మీద ఉన్న విశ్వాసము. నేను ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చూశా, చంద్ర శేఖర పరమాచార్య వారి అనుగ్రహ భాషణాలు చదువుకొంటున్నాడు నా మిత్రుడు నేను ఒసారి వారి ఇంటికి వెళితే... మడి కట్టుకునీ ఇలాంటి బల్ల మీద పెట్టుకునీ, చదువుకుంటున్నాడు. దర్భాసనం వేసుకొని, నేను అనుకున్నాను ఏదో పారాయణ చేస్తున్నాడనుకున్నాను. అయిపోయింతర్వాత అడిగా ఏం చదువుతున్నావు మిత్రమా అని, అంటే పరమాచార్య వారి అనుగ్రహ భాషణాల్నీ చదువుతున్నాను అన్నాడు. దానికి మడి బట్ట కట్టుకు చదువుకుంటున్నావేమిటీ అన్నాను, అంటే ఆయన నాతో

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
అన్న మాటకు నేను తెల్లబోయాను, పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నేను చదివితే... పరమాచార్య స్వామివారు నా ఎదురుగుండా వచ్చి కూర్చొని మాట్లాడినట్లే గదా కోటేశ్వరావుగారూ, అది నేను చదువుతూంటే... అదేగా నా మనసులోకి వెడుతూందీ... పరమాచార్యులవంటి మహానుభావుల ముందు నేను కూర్చొనివింటే... పైన చొక్కాతో బనీయనుతో కూర్చోనుగా... అందుకని బట్ట విప్పేసి మడి బట్ట కట్టుకునీ, పరమాచార్యయే చెప్తున్నారు అని వింటున్నానండీ-చదువుతున్నానండీ అన్నాడు.
సా శ్రద్ధా కవితా సిద్దిహి యయావ స్థూప లభ్యతే వారికి లభిస్తాయి, గురుబోధ తలకెక్కుతుంది సర్వే వేదవిదశ్శూరాః ఎక్కడొచ్చింది ఈ ప్రజ్ఞ వశిష్టుడి దగ్గర రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నలు నలుగురు విన్నారు. రాముడు నేర్చుకున్నంత లక్ష్మణునికి రాలేదు, లక్ష్మణుడు నేర్చుకున్నంత భరతుడికి రాలేదు, భరతుడు నేర్చుకున్నంత శత్రుఘ్నడికి రాలేదు అనీఁ.... చెప్పే అవకాశం మీకు రామాయణంలో ఉందా... లేదు. గురువుగారు ఏం చెప్పారో అది నలుగురికీ సమానంగా వచ్చింది. అంటే... ఇప్పుడు శ్రద్ధ నలుగురిది ఎటువంటిది ఒక్కలాంటిది ఇది ఎవరి అదృష్టం, తండ్రి అదృష్టం. ఎంత సంతోషపడిపోతాడా తండ్రి, ఏమి పిల్లల్ని కన్నావయ్యా దశరథా... ఏది చెప్తే అది నలుగురూ పట్టుకుంటారు, నలుగురూ అనుష్టిస్తారు. ఇంక భేదంలేదు నలుగురి మధ్యలో... ఒక్కలా పట్టుకుంటారు. గురువుగారు చెప్పాక పరీక్ష రాస్తే నలుగురి ఆన్సర్ పేపర్ ఒక్కలా ఉంటుంది అన్నమాట. అంత బాగా అర్థం చేసుకున్నారంటే గురు హృదయాన్ని పట్టుకోగలిగినటువంటి శ్రద్ధ కలిగినటువంటివారు. శ్రద్ధ కలిగి ఉండడం ఒకెత్తూ సర్వే వేదవిదశ్శూరాః గురువు దగ్గరవిన్నారు వేదాలన్నింటినీ బాగాతెలుసుకున్నారు సర్వే లోకహితే రతాః లోకుల యొక్క హితమునందు కోరిక ఉన్నవాళ్ళు.
ఇది చాలా చాలా అవసరమండీ... ఒకరికి గొప్ప అందముంటుంది, అది ఎందుకు పనికొస్తుందంటే, అమాయకుల్ని పాడుచేయడానికి పనికొస్తుంది. ఒకడికి విద్య ఉంటుంది, ఎందుకు పనికొస్తుందంటే, అహంకరించడానికి పనికొస్తుంది జ్ఞాన ఖలుని లోని శారద వోలె అని అంటారు పోతన గారు. అది దేనికి పనికొస్తుంది ఆయన అహంకారం పొందడానికి పనికొస్తుంది ఆ విద్య ఒకడికి ధనం ఉంటుంది దేనికి పనికొచ్చింది అంటే, దాచి దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో లేకపోతే దానిమీద భ్రాంతి పెంచుకొని పెంచుకొని పెంచుకొని మార్కండేయ పురాణంలో చెప్పినట్లు, అదే తలచుకుంటూ శరీరం విడిచిపెట్టి, ఎక్కడ ఏ భోషానంలో పెట్టి డబ్బూ ధనమూ దాచిపెట్టాడో దానిమీద భ్రాంతిపోక చీకటిగావున్న ఆ భోషానంకిందకి ఎవరైనావచ్చి ధనం తీసేస్తారేమోనని తన కొడుక్కీ తన బిడ్డలకే దక్కాలన్న భ్రాంతితో దానికింద విషం తోకలోపెట్టుకుని లెదా నోట్లో పెట్టుకొని పాము పిల్లో తేలో లెదా జ్రెర్రో అయి కింద పడుకుని ఉంటాడు చీకట్లో చమాయింపులో ఎందుకంటే ఎవరొస్తారో కరిచేద్దామని, తీరావచ్చి కొడుకు తీస్తుంటాడు ఎవరో తీసేస్తున్నారు అమ్మో కర్చుపెట్టేస్తున్నాడు పాడుచేస్తేస్తున్నాడు వెళ్ళికుట్టబోతాడు దేన్నిపెట్టికొడతాడు చెప్పుతీసుకొనికొడతాడు కొడితే చచ్చిపోతూ అనుకుంటాడడట ఇంత సంపాయించాను ఇక్కడ కాపుకాశాను చెప్పెట్టిపెట్టి కొట్టిచంపేస్తున్నాడు తీరింది భ్రాంతి అంది మార్కెండేయ పురాణం.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
దేనిమీద పెట్టుకున్నావో అది నీవు ఉద్దరించేదికాదు, సర్వే లోకహితే రతాః రాముడూ, భరతుడూ, లక్ష్మణుడూ, శత్రుఘ్నడూ నేర్చుకున్న విద్యలు వాళ్ళని పాడుచేసుకోవడానికి పనికిరాలేదు. నాకింత ధనుర్వేదం వచ్చుకదాండీ... అయిందానికి కాందానికీ బాణాలు వేసేస్తాం, అస్త్రాలు వేసేస్తాం అనలేదు. మాకింత విద్య వచ్చుకదాండీ మేము అహంకరిస్తాంమనలేదు, మేం ఇంత అందగాళ్ళం కదా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ నా తండ్రి, మగవాళ్ళు మోహించారు నా స్వామిని చూసి రామ చంద్ర ప్రభువుని చూసి. ఐనా తనంత తానుగా విధించుకున్నటువంటి శరతు నేను ఏకపత్నీవ్రతున్ని. అన్ని చదువుకున్నాడు ఆయనకు మాట్లాడటం చేతకాదా రామో ద్వుర్నాభి భాషతే అమ్మా నేను రెండుమాటలు మాట్లాడను, ఒకమాటన్నానా అది జరగవలసిందే, అదుకే తక్కువమాట్లాడుతాను, ఎక్కువమాట్లాడడు రామ చంద్ర మూర్తి ఇది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణవల్ల ఎవరు సుఖాన్ని పొందారు, లోకం సుఖాన్ని పొందింది సర్వే లోకహితే రతాః ఇది పండినప్పుడు లోపల ఆ విద్యా పనికిమాలిందిగా లేదు, ఆ విద్యా అడ్డు పెట్టుకుని సమాజాన్ని ఎలా పాడుచెయ్యెచ్చో నేర్చుకోలేదు.
మీరు అందుకే చూడండీ మీ కొకమాట చెపుతాను దీనికి పరాకాష్ట ఎక్కడుంటుందో తెలుసాండీ, భయమూ అని ఒక మాట ఉంటుంది, ఈ భయము అన్న కోణంలోంచి మీరు ఆ కళ్ళజోడు పెట్టుకుని చూడండీ... అసలు మీకు ఈ ప్రపంచంలో దీనిని మించి దాటగలగినటువంటి వాడెవ్వడూ కనబడడు భయము సింహం ఉందనుకోండి భయమే, పెద్ద పులి ఉందనుకోండి భయమే, పాముకి భయమే, కుక్కకి భయమే, పిల్లికి భయమే, నాకు భయమే, నీకు భయమే, అందరికీ భయమే ఎందుకు భయం, ఏమో ఎవరేం చేస్తారో భయం. ఏదీ కాకపోతే అమ్మో నేను చచ్చిపోతానేమోనని  భయం ఈ భయం నుంచి విడుదల కాగలిగిన స్థితికలిగిన ప్రాణీ అంటూవుంటే లోకంలో ఒక్కటే ఉంది, ఒక్క మనుష్యుడే... ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను తొందరపడి నేను దాని మీద పెద్ద వేదాంతం చెప్పక్కర్లేదు, మీరు బాగా ఆలోచించండి తరువాత, ఒక పులి అలా ఏం భయపడినా అది ఆలోచించడానికి ఏమీ మేధస్సులేదు దానికి, ఒక్క మనిషి మాత్రం, ఈ భయమన్న మాటేమిటీ, అసలు పడిపోయేది ఏది, ఏది మృత్యువు, దీనికా మృత్యువు నాకా మృత్యువు, అని ఆలోచిస్తే ఇది మారుతోందీ... మారుతున్నది పడిపోతోంది, మారుతోందని తెలుసుకుంటున్నది మారలేదు బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ! స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం మో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమర్తమే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తమే !!  అంటారు శంకర భగవత్ పాదులు. మారి పోతున్నటువంటి శరీరాన్ని మారుతున్న అవస్తల్నీ మారకుండా చూస్తున్నది ఒకటుంది, ఇది పడుకుంది, ఇది లేచింది, ఇది చేస్తోంది, ఇది చూస్తోంది, ఇది ఒకప్పుడు పటుత్వంగా ఉండేది, దీని జుట్టు ఇప్పుడు తెల్లబడిపోతోంది, దీని గడ్డము ఇప్పుడు తెల్లబడిపోతోంది, దీనికి ఇప్పుడు ఒక పన్ను ఊడిపోయింది చూస్తున్నదోటుంది, దానికి మాత్రం వృధ్యాప్యం లేదు, యవ్వనం లేదు, దానికి బాల్యం లేదు కాబట్టి దానికి మరణం లేదు. ఇది నేను నేను మారనిదాన్ని అని తెలుసుకున్ననాడు, ఈ శరీరం పడిపోవడం ఆఖరుది, ఇక మళ్ళీ పుట్టడం అన్నది లేదు.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
చమత్కారంగా ఒక కవి అన్నాడు, ఈశ్వరా! నీకు నేను చేసే ఆఖరి నమస్కారం ఇదే అన్నాడు. ఏమంటామేమో, గత జన్మలలో నమస్కారం చెయ్యలేదు కాబట్టి పుట్టాను ఇప్పుడు చేశాను కాబట్టి పుట్టను ఇదే ఆఖరి నమస్కారం. కాబట్టి ఆ ప్రజ్ఞ భాషించడం స్సర్వే లోకహితే రతాః తాను భయమునుంచి తప్పుకోవాలీ, ఇతర ప్రాణులను నిష్కారణముగా భయమునకు గురిచెయ్యరాదు. మీరు బాగా జ్ఞాపకంపెట్టుకోండి ఒక విషయాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళి ఎన్ని సుఖకరములైన వస్తువుల మధ్యన కూర్చోపెట్టినా శాంతి అన్న మాట మీ మనసులో లేకపోతే... మీకు అవి సుఖమును అవి ఇవ్వజాలవు. బాగా విచారణ చేయండీ నేను అన్నమాట. నన్ను తీసుకెళ్ళి ఏసి హాల్లో కూర్చోపెట్టీ, హోం థియేటర్ అయ్యా ఎవ్వరు లేరు, నీకు ఇష్టంగా నర్తనశాలలో పధ్యాలు, కాబట్టి అదిగో నీకు చూపిస్తున్నాను చూడు, ఇదిగో ఆ పద్యాలు విను ఒక సారి, మహాభారతంలో విరాట పర్వంలో ఆ పధ్యాలు అంటే... చాలా ఇష్టం కదా చూడు అదిగో... ఆ ఘట్టం చూపిస్తారన్నరనుకోండీ, నామనసులో ఏదో అశాంతికారకమైనటువంటి విషయం ఒకటి దొర్లుతుందనుకోండీ, ఇప్పుడు నాకు ఆ నర్తనశాల చూస్తున్నా, ఏసి థియేటర్లో కూర్చున్నా, చమటే పడుతుంది, నేను మధ్య మధ్యలో ఇలా తల తిప్పుతూ ఆలోచిస్తూ, గోళ్ళు గిల్లుతూ ఉంటే, నా మిత్రుడంటాడూ, ఏం అలా ఉన్నావ్ నర్తనశాల చూపిస్తున్నా చమటలు పడుతున్నయ్ ఏమిటి అంటే... కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వ విభ్రమమువాడు కలశజుండు అని వినపడచ్చు కానీ మనసేదీ... లేదు శాంతి. ఇక్కడ శాంతి ఉంటే... బాహ్యంలో మీరు ఎక్కడ ఉండండీ, మీరు సంతోషంగా ఉంటారు సంతోషమునకు హేతువు మీలోని శాంతి మీకు శాంతి సంతోషమునకు కారకము అయినట్టే ఎవరి సంతోషమునకైనా వారి మనస్సు యొక్క సంతోషమునకు కారణం శాంతే దాన్ని భగ్నం చెయ్యడం మీ హక్కు కాదు ఇది సర్వే లోకహితే రతాః ఇదొక్కటి మీరు తెలుసుకుంటే చాలు.
వ్యాసుడు సమస్త వాఙ్మయాన్ని నిర్మించాడు, శిష్యులన్నారూ, అష్టాదశ పురాణాలు, ఇన్ని గ్రంధాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, బ్రహ్మ సూత్రాలు, భాగవతం ఏం చదవం. వీటన్నింటిసారాన్ని ఓ రెండు శ్లోకాల్లో చెప్తారా అని అడిగారు. వ్యాసుడన్నాడు, దానికి రెండు శ్లోకములెందుకు మళ్ళీ సారాంశం చెప్పాడానికి, ఒక్క పాదంలో చెప్తాను బాగావినండి అన్నాడు. ఏమిటో తెలుసా సారాంశం సమస్త వాజ్ఞ్మయానికంతటికీనూ పరులకు ఉపకారము చెయ్యడమే ధర్మము పరులను పీడించడమే అధర్మము అదే సమస్త వాజ్ఞ్మయానికి కూడా సారాంశము అదొక్కటి తెలుసుకోండి చాలు అన్నాడు. అదే వేద ధర్మం కూడా, అయినప్పుడు మీరు ఇతరుల శాంతికి భంగము కాని రీతిలో ప్రవర్తించడం అలవాటైతే, అది ఎక్కడ్నుంచిరావాలి గురుబోధ జీర్ణమవ్వాలిలోపల, ఎప్పుడూ పక్కనుండరు గురువుగారు, ఎది పక్కనుంటుంది లోపలకి వెళ్ళినటువంటి గురువాక్యం మీకు తోడుగా ఉంటుంది. మా గురువుగారు ఇలాచెప్పారు నేను అలానే ప్రవర్తిస్తాను, మీ గురువాక్యం మిమ్మల్ని ఎప్పుడూ నిలబెడుతూ ఉండాలి, అందుకే తల్లిదండ్రులు గొప్పవారా, గురువుగొప్పవారా అంటే, గురువువే గొప్పవాడు, తల్లిదండ్రులు ఉపాదినిచ్చారు, మళ్ళీ ఇంకో ఉపాదిలోకి వెళ్ళనివ్వనివాడు గురువు, కాబట్టి తల్లిదండ్రుకన్నా గురువే గొప్పవాడు. గురువాక్యం ఇక్కడుండాలి, అస్తమానం వశిష్టుడు పక్కనున్నాడండీ రాముడికీ, అస్తమానం విశ్వామిత్రుడు పక్కనున్నాడా, ఎవరు పక్కనున్నాడని ధర్మం పాటించాడు, ఎవరు పక్కనున్నారని రాముడయ్యాడు అందరికీ సంతోషం కలిగించాడు, అంటే, గురువాక్యాన్ని లోపల పెట్టుకున్నాడు, అందరి శాంతికి తాను కారకమై అందరు సంతోషించడానికి తాను హేతువయ్యాడు.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
http://guruvakya.com/wp-content/uploads/2016/04/narada-dhruva.jpgఇది నువ్వు కావాలని చెప్పడం రామాయణం తప్పా, రాముడికి సర్టిఫికెట్టు ఇవ్వడానికి నీవు రామాయణం చదవరాదు, నీ సర్టిఫికెట్టు రామునికి అక్కర్లేదు నీవు కొత్తగా ఇవ్వాళ ఓ సర్టిఫికెట్టురాసి రామునికి ఇవ్వక్కరలేదు. ఇప్పుడు మీరు కొత్తగా రామాయణంలో రాముడు గొప్పవాడని తెలుసుకోవలసిన అవసరమూ మీకు లేదు. రామాయణం దేనికి చదువుతాం దేనికి వింటామంటే, రాముడు సర్వే లోకహితే రతాః ఎలాగా? అన్నది అర్థమైతే, నువ్వు నీ గురువు దగ్గర అలా ఉండాలి, నువ్వు సమాజంలో అలా నడవడి, అటువంటి నడువడితో నువ్వుండాలి, ఇది నీకు రావడానికి రామాయణం అందుకని పర్వతాలు ఉన్నంత వరకూ, నదులు ప్రవహించినంత వరకూ రామాయణం చెప్పబడుతూనే ఉంటుంది రామాయణం చెప్పబడుతూ ఉన్నంతకాలం మానవత్వం బ్రతికే ఉంటుంది అన్నాడు, కాబట్టి సర్వే వేదవిదశ్శూరాస్సర్వే లోకహితే రతాః ! సర్వే జ్ఞానోపసమ్పన్నాః అందరూ జ్ఞానాన్నిపొందారు అలా ఎలా పొందారు అంటే నేను చెప్పాను అందరిదీ ఒకటే శ్రద్ధా.
ఒకానొకప్పుడు ప్రజాపతి ఇద్దరు శిష్యులను కూర్చోబెట్టుకున్నాడు విరోచనుడు, ఇంద్రుడు. కూర్చోబెట్టుకొని పాఠం చెప్పాడాయన కొంత వరకు విన్నాడు విరోచనుడు, చాలు శరీరంతో మనము పొందవలసినటువంటి సుఖ శాంతులూ, భోగ భాగ్యాలూ వీటి గురించి విన్నాను. ఇంక ఆత్మ గొడవ మనకు ఎందుకని చెప్పేసేసి ఇంక అక్కడనుంచి వినడం మానేశాడు అశ్రద్ధతో ఆయన ఏ స్థాయిని పొందాడు అన్నీవిన్న దేవేంద్రుడు ఏ స్థాయిని పొందాడు. వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో లవకుశులకు సంగీత విద్య నేర్పినప్పుడు, పాఠం  నేర్పుతున్నప్పుడూ ఆత్రేయి అనే ఒక ఆడపిల్లకు కూడా నేర్పారు. ముగ్గురికి పాఠాలు నేర్పిన తరువాత వారికి పరీక్షపెడితే... ఆత్రేయికి ఏమీ రాలేదు కొంతే వచ్చింది. లవకుశులు ఇద్దరూ సర్వోత్కృష్టమైన స్థితిని పొందారు, ఆత్రేయి లవకుశుల దగ్గరి వచ్చి ఒక గొప్ప మాట అన్నది, నాకు శ్రద్ధా లోపం జరిగింది, ఏ గురువు మీకు చెప్పారో ఆ గురువు వలన మీరు ఇంత స్థితికి ఎదిగారు, నాకు ఆ గురువే చెప్పారు, నాకు ఇందులో ఏమీరాలేదు అంటే నాకు శ్రద్ధ లేదు నాకు లేని శ్రద్ధకీ నేను వెళ్ళి మళ్ళీ గురువు గారి యొక్క శ్వాసని క్షోభలెట్టలేనంది.
గురువు మాట్లాడితే గురువు శ్వాస క్షోభించిందండీ... ఘర్షణ పొందింది ఆయన శ్వాస. అందుకే సరియైన శిష్యుడు దొరికితే గురువు ఏమంటారో తెలుసాండీ, నా శ్వాస ధన్యతపొందిండంటాడు. నా శ్వాస ధన్యత పొందిందంటే, నా ఊపిరికి వాక్కైంది వాక్కైనప్పుడు నా ఉర్పంజరమూ సంకోచించినప్పుడు మాట్లాడి, మాట్లాడి చమట పట్టీ అంత నెప్పి చేసింది. నెప్పి చేస్తే చేసిందిగానీ, నా ఊపిరి కష్టపడితే పడిందిగానీ, ఒక్క శిష్యుడి నా హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు వాడు జీవితం మార్చుకున్నాడు చాలు నా శ్వాస ధన్యత పొందిందంటాడు. చాలా పెద్దమాటలండీ గురు శిష్యుల మధ్యా... ఆత్రేయి అంది, నేను అగస్త్యమునిని ఆశ్రయించి ఈసారి జాగ్రత్తగా నేర్చుకుంటాను అంది శ్రద్ధ మధ్యలో, నాకు అందుకే  తరచూ అనిపిస్తుంది, పిల్లలు వినవలసినటువంటిది శ్రీరామాయణం, ఎక్కడ చదువులో తేడా వస్తుందో, అందరూ చదువుకున్నా ఒకడు ఐఏఎస్ ఎందుకు అవుతున్నాడో... ఇంకొకడు ఎందుకు ఫ్యూన్ అవుతున్నాడో, రామాయణం చెప్తుంది ఆ రహస్యాన్ని అని చెప్పకుండా పాఠం చెప్పడానికి మీరు స్కూలుకు పంపించి ఉపయోగమేముంది సర్వే వేదవిదశ్శూరాస్సర్వే లోకహితే రతాః ! సర్వే

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
జ్ఞానోపసమ్పన్నాస్సర్వే సముదితా గుణైః !! గుణములుగా ప్రకాశించాయి, ఎంత గొప్ప మాటండీ! గురువుగారి మాట నిరంతరము జ్ఞాపకంలోకి వస్తూందీ, జ్ఞాపకంలోకి రావడంవల్ల ఆ పనిచేసేటప్పు మా గురువుగారు ఇలాచెప్పారు కాబట్టి నేను ఇలాగే చెయ్యాలని అంత జాగ్రత్తగానూ చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ సంతోషిస్తున్నారు, అబ్బబ్భా ఎంత మంచి వాడండీ, ఎంత మంచి వాడండీ... అంటున్నారు. ఇప్పుడు ఆ గుణం ప్రకాశించడానికి కారణం ఏమిటి నేర్చుకున్నది అనుష్టానంలో, నిత్య జీవితంలో, ప్రవర్తనలో, నడవడిలో ప్రకాశిస్తోంది అదీ కనబడుతోంది, తెలుస్తోంది.
Image result for రంతి దేవుడురంతిదేవుడికి నేర్పారు, రంతిదేవుడు ధర్మం గురించి నేర్చుకున్నాడు పరోపకారం గురించి నేర్చుకున్నాడు, చిట్ట చివర ఆయన చేసిన ఉపకారం గురించి, ఇప్పుడు నేను రంతిదేవో పాఖ్యాణం అంతా నేనెక్కడ చెప్తానూ... ఈశ్వరుడే ప్రత్యక్షమై నీకు ఏంకావాలి అని అడిగాడు. ఆయన ఏ వరమడిగాడో తెలుసాండీ... ఈ చరాచర జగత్తులో ఉండేటటువంటి సర్వభూతముల యొక్క కష్టాన్ని నేను భరించగలిగినటువంటి అదృష్టాన్ని నాకు కలిగించమని అడిగాడు ఇది పరోపకారము ఆయనకు జీర్ణమైంది. ఒకరికి ఉపకారంచేసి ఒకడి కష్టాన్ని తానుపుచ్చుకుంటే వాడుపొందే తృప్తి తనకి అర్థమైంది. ఇది మనం అనుకరిస్తామంటే ఎలా కుదురుతుందండీ... కదరదు జీర్ణంకావాలి, ఇది ఈ జీర్ణమయ్యేటటువంటి స్థితీ, గుణములుగా ప్రకాశించగలిగినటువంటి స్థితీ, ఇది సర్వే సముదితా గుణైః. శరణాగతి అంటే ఏమిటో ఆర్థితో వచ్చి నిన్ను నేను చేరాను రక్షించూ అని అడిగితే... ఒక క్షత్రియుడు ఎలా ప్రవర్తించాలో నేర్పాడు వశిష్టుడు, నేర్పాడు విశ్వామిత్రుడు. చిట్టచివర విభీషణుడే వచ్చాడు, తన భార్యను ఎత్తుకు పోయినవాడి తమ్ముడు, ఆకాశంలో నిల్చున్నాడు ఎవ్వరూ వద్దన్నారు. రాముడన్నాడూ, ఒక బోయవాడికి ఒకపక్షి ఆశ్రమిచ్చింది, క్షత్రియున్ని నేనెంతటివాన్ని చేసితీరాలి, విభీషణునికి ఆశ్రయమిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు రామ చంద్ర మూర్తి యొక్క గుణము ప్రకాశించింది ప్రకాశించిందంటే కారణం వెనకాల గురువుగారి యొక్క బోధ జీర్ణమై లోపలవుండిపోయింది అలాగ. అది లోపల ఉండిపోయింది కాబట్టి గుణములుగా ప్రకాశించింది. అలా కాకుండా ʻసుచీంద్రంలో ధర్మరాజు గారుʼ అంటారు.
మీరు సుచీంద్రం క్షేత్రానికి వెళితే ధర్మరాజుగారి విగ్రహముంటుంది ఒక చీపురు పుల్లను ఆయన చెవిలో పెట్టండని అంటారు. ఎందుకండి బాబు ధర్మరాజుగారి చెవిలో చీపురు పుల్ల పెట్టడమెందుకు అని మీరంటే, మీరు పెట్టండి ఫరవాలేదు అంటారు. మీరు ఆ చీపురు పుల్ల ఇట్నుంచి పెడితే ఇటుపక్కనుంచి బయటకి వచ్చేస్తుంది. సుచీంద్రంలో ధర్మరాజు గారండీ అంటారు. అంటే ఏమిటంటే ఆయన కూర్చుంటాడు, వింటూ ఉంటాడు. ఇందులో పొల్లు అక్కర్లేనిది ఉంది కదా అని ఆయనకు అనిపించిందని అనుకోండీ... ఆయనేం చేస్తాడంటే శ్రీవిద్యే శివ వామభాగ నిలయే శ్రీరాజరాజార్చితే అని లోపలస్తోత్రం చేస్తుంటాడు. పైకి ఆఁ... ఊఁ... ఆఁ... అంటుంటాడు కసేపాగి చెప్తున్నావాడు ఎదో అడుగుతాడు, ఎమన్నారూ అంటాడు. రెండు మూడు మాట్లన్నాకు ఆయనకు అర్థమవుతుంది ఆయన పరధ్యాన్యంలో ఉన్నాడని వింటంలేదని లేచివెళ్ళిపోతాడు. సుచీంద్రంలో ధర్మరాజు అంటే పొల్లువినడు పనికొచ్చేదైతే వింటాడు అట్నుంచి విని ఇట్నుంచి వదిలేస్తాడు కాబట్టి అలా వదిలేసేది కాదు గురు బోధ అంటే గురు బోధ అంటే పట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
Related imageనేను మీతో అందుకే విజ్ఞాపన చేశాను, రామాయణం చెప్పడమంటే, ఏంటండీ రామాయణం చెప్పడం అదొక్కక్క శ్లోకం అంత గంభీరంగా ఉంటుంది. భగవాన్ రమణులు ఒక మాట అంటూండేవారు మీగిలినవారి అన్నిమాటలు కూడా జంతువుల యొక్క, పక్షుల యొక్క కూతలు గురువుగారి వాక్కు సింహ గర్జనా అని అనేవారు ఆయన. ఎంత పెద్ద మాటో చూడండీ... పక్షులు బోలెడు అరుస్తుంటాయి, పట్టించుకుంటారేమిటి మీరు తెల్లవారిగట్లా, మీ పని మీది, ఏదో జంతువులు అరుస్తున్నాయి, ఏదో కుక్క అరుస్తుంది అంటారు మీ పని మీరు చేసుకుంటారు. అదే ఒక సింహం ఒక కొండ కొన మీద కూర్చొని ఒక్కసారి ఇలా కలయతిరిగి చూసి ఒక పేద్ద గర్జన చేసిందనుకోండీ... ఇక మళ్ళీ ఎక్కడా జంతువు ఉండదు అన్ని పారిపోతాయి గుహల్లోకి. ఒక్కసారి గురువాక్యం కాని శ్రద్ధతో లోపలికి వెళ్ళిందనుకోండీ, కోట్ల కోట్ల జన్మల నుంచి లోపల తిష్ఠవేసినటువంటి సమస్తమైనటువంటి దురలవాట్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎగిరిపోతాయి అంతే... గురు వాక్యం తిరుగుతూ ఉంటుంది లోపల. అందుకే గురు  వాక్యం సింహ గర్జనా అనే వారు భగవాన్ రమణులు.
సర్వే వేదవిదశ్శూరాః వదిలి పెట్టేస్తాను ఆ శ్లోకం అక్కడితో... స్సర్వే లోకహితే రతాః ! సర్వే జ్ఞానోపసమ్పన్నాస్సర్వే సముదితా గుణైః !! అలా మహానుభావులు పేరిగి పెద్దవాళ్ళవుతున్నారు గజస్కన్దేశ్వపృష్ఠే చ రథచర్యాసు సమ్మతః ! ధనుర్వేదే చ నిరతః పితృశుశ్రూషణే రతః !! వాళ్ళు ప్రత్యేకించి రామ చంద్ర మూర్తి గజస్కన్దే ఏనుగు యొక్క కుంభ స్థలం మీద కూర్చుని యుద్ధం చెయ్యడంలో, అశ్వపృష్ఠే చ గుఱ్ఱము యొక్క వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యడంలో, ఆయన అలాగే రథం మీద కూర్చొని యుద్ధం చెయ్యడంలో, ధనుర్వేదంలో ఎంతటి ప్రజ్ఞను పొందిన వాడంటే, పితృశుశ్రూష చెయ్యడంలో అంటే తండ్రి గారి యొక్క సేవ చెయ్యడంలో, ఆయనకు ఆయనే సాటి. అంతటి మహా వీరుడుగా రూపు దిద్దుకున్నాడు సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః ! లక్ష్మణో లక్ష్మిసమ్పన్నో బహిఃప్రాణ ఇవాపరః !! ఈ శ్లోకం గురించే నేను మీకు విజ్ఞాపన చేశాను, ఆ వశిష్ట మహర్షి పేరు పెట్టడానికి కారణం ఇది సర్వప్రియకరస్తస్య రామ చంద్ర మూర్తి ఎప్పుడూ అందరికీ రమ్యమైనటువంటి మూర్తిగానే కనబడేవాడు. కానీ లక్ష్మణ మూర్తి మాత్రం రామస్యాపి శరీరతః ఎప్పుడూ రాముడుకి తన శరీరంతో కూడా సేవ చేస్తుండాలి లక్ష్మణో లక్ష్మిసమ్పన్నో లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు, దేనిచేత ఎప్పుడూ ఆయన రామ చంద్ర మూర్తి కాళ్ళు పట్టకపోతే, రాముడితో కలిసి అన్నం తినకపోతే ఆయనకది భోజనం కాదు.
వెనుకటికి ఒక కవి అంటూండేవాడట, మా ఊళ్ళో చూడాలి పౌర్ణమి చంద్రున్ని అని వాళ్ళ ఊళ్ళో పౌర్ణమి చంద్రున్ని చూడడం ఏమిటి?, పౌర్ణమి చంద్రుడు ఎక్కడైనా పౌర్ణమి చంద్రుడు కాడా... అంటే, కాదు మా ఊళ్ళో పౌర్ణమి చంద్రుడే పౌర్ణమి చంద్రుడు అనేవాడు ఎందుకంటే తనుచదువుకున్న ఊరు, తను చదువుకున్న ఇల్లు, ఆ ఇంటి అరుగు మీద కూర్చొని చూస్తే ఆయనకు పౌర్ణమి చంద్రున్ని చూసినట్లు ఉండేది. చూడండీ, కొంత మంది అంటూంటారు మా ఆవిడ లేదు అస్సలు రెండు రోజుల నుంచి అన్నం తిన్నట్లులేదండి అంటాడు అన్నం తిన్నట్లు లేదేంటండీ అన్నం తిన్నావుగా, అంటే ఆవిడ పక్కనలేదు, అందుకని భోజనం భోజనంగాలేదు అంటే బలం ఇవ్వలేదు, ప్రీతి ఆవిడ మీద ఉంది కాబట్టి ఆవిడచేత్తో చారు అన్నం పెట్టినా ఐదు బి కాంప్లెక్స్ ఇంజక్సెన్లు చేయించుకున్నట్లుంటుంది.


  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
Image result for rama lakshmanaఅలా రామస్యాపి శరీరతః రాముడి పక్కన ఉండాలి లక్ష్మణునికి ఎప్పుడూ అంతగా సేవించాడు, ఏదో పక్కన కూర్చోవడం అంటే... ఉత్తిగనే పక్కన కూర్చోవడం కాదు ఆయనకు ఎప్పుడూ సేవ చేస్తూండాలి లక్ష్మణో లక్ష్మిసమ్పన్నో బహిఃప్రాణ ఇవాపరః లోపలి రాముడి ప్రాణం మనకు దర్శనీయం కాదు కనుక కనపడదు లోపల రాముని ప్రాణాన్ని బయట చూడాలంటే లక్ష్మణున్ని చూడాలన్నారు. ఇది చాలా పెద్ద మాట తెలుసాండీ... లోపలి ప్రాణంపోతే ఏమౌతుందండీ, శివమునకు శి కి కొమ్ము పైకి లేస్తుంది కదా, లక్ష్మణుడు వెళిపోతే ఏమవ్వలి అప్పుడు రాముడు బయటి ప్రాణమైతే, రాముడి యొక్క శరీరమే పడిపోవాలి కదా. ఆయన పెట్టిన పేరు వృధా కాకూడదుగా, వాల్మీకి మహర్షి చెప్పాడంటే నువ్వు చెప్పింది సత్యమని చెప్పారుగా బ్రహ్మగారు. రామావతార పరిసమాప్తి చేయించవలసి వస్తే ఉత్తర కాండలో మొదట లక్ష్మణున్ని తీసుకుపోయారు అందుకే, లక్ష్మణున్ని దూరంగా తీసుకెళ్ళిపోతే, లక్ష్మణుడు రామున్ని విడిచిపెట్టి ఉండలేక సరయూనది ప్రవేశం చేసేస్తే రాముడు కూడ ఉండలేక అవతార పరి సమాప్తి చేసేశాడు సరయూ నదిలోకెళ్ళి. అందుకని ఆయన లక్ష్మణో లక్ష్మిసమ్పన్నో బహిఃప్రాణ ఇవాపరః !! న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః ! మృష్టమన్నముపానీతమశ్నాతి న హి తం వినా !! రాముడు ఎటువంటి వాడు.
ఇదీ మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి, లోకంలో ప్రేమ అన్నది ఒకవైపునుంచి ప్రవహిస్తే దానికి అర్థం ఉండదు ఆ నిర్భంధ ప్రణయము అని నేను అన్నాననుకోండీ హస్యాస్పదమైన మాట కిందకి వస్తుంది అంటే బలవంతంగా నేను మిమ్మల్ని ప్రేమించమని అడగడం అదేమిటి మీరు నన్ను ప్రేమించారన్నిది మీరు చెయ్యాలి అంతేగాని, మీరు నమస్కారం చెయ్యాలన్నది మీరు చెయ్యాలి అంతేగానీ, మీరు నన్ను ప్రేమించండి అని నేను శాశించానుకోండి అది ప్రేమెలా అవుతుందండీ వీడి ధూర్తతనం మండిపోనూ అని నేను ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెయ్యాలి అంతే. నిర్భంధ ప్రణయం ఎటువంటిదో ఒకడే రెండవవాడిని ప్రేమించడం అటువంటిది దానికి అర్థం ఏమీ ఉండదిక. ఇవతలి వాడు తొలగ తోస్తున్నా వీడు వెంటపడి తిరుగుతూంటే కొంచెం లేకితనం కిందా, ఏమిటో  పాపం ఆయన ప్రార్భధం ఆయన అలా తిరుగుతూ కసురు కుంటుంటాడు అంటారు.
లక్ష్మణుడు రామున్ని శరీరంతో సేవించకుండా ఉండలేడు అంత ప్రేమ మరి రాముడో, రాముడట... న చ తేన వినా నిద్రాం పక్కన లక్ష్మణుడు లేకపోతే రామునికి నిద్రపట్టదట. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి నిద్రపట్టడం అన్నమాట మహర్షి వేశాడంటే, ఆయనేం అమాయకుడై వేయలేదు లోకంలో మీ అంత మీరుతెచ్చుకోలేనిది ప్రధానమైనవాటిల్లో నిద్రయే ఎందుకో తెలుసాండీ, అన్నం తినాలంటే నేను ఏదో చేత్తో ఇష్టమున్నా లేకపోయినా ఏం చేస్తాం ప్రార్భధం ఇదే దొరికింది ఇవాళ అని చెప్పి ఇష్టమున్నా లేకున్నా తినేసి మంచి నీళ్ళు తాగేస్తే కడుపు నిండుతుంది. నిద్ర పోతాను పది గంటల పది నిముషములకు నేను నిద్రించుచున్నాను అని పడుకున్నారనుకోండి, నిద్ర పట్టద్దూ అది రావాలనేమిటి, మీరు పడుకోవడం కాదు అది మిమ్మల్ని ఆవహించాలి కదా పడుకోవడం అంటే మీరేం చేస్తారండీ నిద్రపోవడం అంటే... మిమ్మల్ని అది ఆవహించడానికి ప్రతి బంధకములు ఏమి ఉంటాయో, ఆ ప్రతి బంధకములను తొలగించి ఏర్పాటు చేసుకుంటారు. దోమ కుట్టితే నిద్రపట్టదు, దోమలు కుట్టకుండా ఆల్ అవుట్ పెట్టుకుంటారు. గాలి లేకపోతే నిద్రపట్టదు, ఏసి వేసుకుంటారు. మెత్తగా ఉండకపోతే నిద్రపట్టదు పరుపువేసుకుంటారు. ఆ తరువాత చలివేస్తే నిద్రపట్టదు, ఓ దుప్పటి కప్పుకుంటారు. తలగడ వాసనవస్తే నిద్రపట్టదు, తలగడా మార్చుకుంటారు. చమట కంపుకొడితే నిద్రపట్టదు, ఓ శుబ్రమైన చొక్క వేసుకొని పడుకుంటారు. నిద్రరాలేదు మీకు అప్పుడు ఇవన్నీ ఏమానట్టూ, పరుపు నిద్ర ఇవ్వలేదాండీ అని నేను అడిగాను అనుకోండి నేను, పరుపు నిద్ర ఇవ్వడమేంటి అని అడగరూ, నిద్రెందుకు రాదు, అంటే భౌతిక ఉపకరణముల వలనకాదు నిద్రవచ్చేది, మనస్సు ప్రశాంతంగా ఉంటే నిద్రవస్తుంది.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
మీరు బాగా గుర్తు పెట్టుకోండి అన్నీ ఉన్నా ఏదో మనస్సు అశ్శాంతిగా ఉండీ, ఎలా ఉన్నారో ఏమిటో అది ఇది అని బెంగగా ఉందనుకోండీ రాత్రి పదిగంటలకీ ఏదో వెయిటింగ్ లిస్ట్ నం. 1, సీటు కచ్చితంగా కన్ఫర్ము అయిపోతుందండీ అన్నారు. తీరా మీ అబ్బాయిని తీసుకెళ్ళి, నాన్న గారండీ ఎలాగో రిజర్వేషన్ కదాని వాడుఎండనపడి వాడుపనులన్నీ చేసుకొచ్చీ అబ్బా తలపగిలిపోతోందండి నాన్నగారండీ రేపు పొద్దున్నే ఆఫీసుకెళ్ళి బోలెడంత పనిచెయ్యాలి, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎక్కిపడుకుంటాను అనివెళ్ళాడు కన్ఫర్ము అవ్వలేదు జర్నల్ కంపార్ట్ మెంటు ఎక్కించారు వాడు డోర్ దగ్గర నిల్చున్నాడు. పొద్దున్న ఆఫీసుకి  వెళ్ళిపోవాలి, ఒంటి కాలు మీద నిల్చున్నాడు మీరు ఇంటికొచ్చారు మీరు నిద్రపోండి నేను చూస్తాను. ఏం మీరెందుకు పడుకోరు వాడుపడుకోకపోతే, మీ మనసు వానియందు ఉంది, వాడునిద్రపోలేదు. వాడుఒంటికాలుమీద నిల్చున్నాడు తలపోటుతో, ఎలా నిద్రపడుతుంది. లేస్తారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, పిల్లాడు ఎలా ఉన్నాడో ఏమిటో సెల్ కి ఫోన్ చేస్తే అదేమో కవర్డ ఏరియాలో లేదు అంటూంది. ఏమిటో పిల్లాడు ఎలా ఉన్నాడో ఏమిటో పొద్దున్న తలపోటు అన్నాడు ఎండలో తిరిగాడు, పాపం ఏమిటో నిద్రపోతానన్నాడు, రేపు ఆఫీసుకి వెళ్ళాలి అదేఁ... ధ్యాస తప్పా, అటుదొల్లుతారు ఇటుదొల్లుతారు, పక్కనున్నావిడి ఏమిటండీ అలాదొల్లుతారు ఏమిటీ... పడుకోరేంటంటే, ఏం పడుకుంటే నిద్రపట్టడం లేదులేవే అంటారు, విసుక్కుంటారు, తెల్లవారుతుంది ఏ మూడింటికో అప్పుడు నిద్రపడుతుంది. తెల్లారి వాడుఫోన్ చేసి అంటాడు, నాన్నగారండీ నాన్నగారండీ మీకు తెలుసున్న టీటీఈ గారు ఒకాయన కనపడీ ఏసి లో ఆయన బర్తిచ్చారండీ, దానిమీద పడుకొని నిద్రపోయానండీ అంటాడు మీ కళ్ళు ఎర్రబడుతాయి అంతే... మీకు ఎందుకు నిద్రపట్లేదు, మీ మనసుకి శాంతిలేదు.
రాముడికి ఎందుకు నిద్రపట్టదు లక్ష్మణుడు లేకపోతే, లక్ష్మణుడు పక్కన లేకపోతే శాంతిలేదు. ఎంత గొప్ప శ్లోకాలండీ నిజంగా... అంటే ఇప్పుడు రాముడి మనసులో లక్ష్మణుడు ఉన్నాడు లక్ష్మణుడికి రాముడున్నాడు లక్ష్మణుడు సేవించకుండా ఉండలేడు. లక్ష్మణుని సేవలు అందుకోకుండా రాముడు ఉండలేడు. ఇది, ఇదీ వాళ్ళిద్దరిది. అందుకే రామ లక్ష్మణులంటాం కానీ, రాముని వెనక భరతుడు పుట్టినా రామ భరతులనం. ఎప్పుడూ పక్కనే ఉంటాడు. భరత శత్రుఘ్నల మూర్తులు కనపడరు, కాని లక్ష్మణుడో... లక్ష్మణుడు మాత్రం ఎప్పుడూ కనపడుతూనే ఉంటాడు. ఆఖరుకి కృష్ణ కర్ణామృతంలో లీలాశికుడు ఒక ఆశ్చర్యమైనటువంటి.... సరే... ఇప్పుడు అవన్నీ పట్టుకుంటే ఏమయ్యేను. కాబట్టి సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః ! లక్ష్మణో లక్ష్మిసమ్పన్నో బహిఃప్రాణ ఇవాపరః !! న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః ! మృష్టమన్నముపానీతమశ్నాతి న హి తం వినా !! అన్నం అక్కడ మధుర పదార్థాలతో ఉన్నప్పటికీ రాముడికి సహించదట, ఎందుకు సహించదు లక్ష్మణుడు పక్కనలేడు. లక్ష్మణుడూ ఉంటే, సంతోషంగా తినేస్తాడు ఏదైనాసరే, పరుపున్నా నిద్రపోడు ఎందుకని లక్ష్మణుడు పక్కనలేడు. ఇది రాముడి మనసులో లక్ష్మణుడి స్థానం. లక్ష్మణుడి మనసులో రాముడి

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
స్థానం, అన్నయ్యతో కలిసి తినేయడం కాదు, అన్నయ్య తింటుంటే చూసి తను తినడం. అన్నయ్యకి పెట్టి తాను తినడం. అన్నయ్య పడుకోవడానికి పడకేసి, దుప్పటేసి, అన్నయ్య పడుకొని సంతోషంగా పడుకుంటుంటే... మెల్లి మెల్లిగా ఇలా రెప్పలు పడిపోతున్న అన్నయ్య కంటి సౌందర్యాన్ని చూసి, కాళ్ళు పడుతూ అన్నయ్య కళ్ళు రెప్పలు ఇలా పడి మెల్లగా నిద్రలోకి ఇలా జారుకున్న తరువాత అమ్మయ్యా అన్నయ్య నిద్రపోయే వరకు కాళ్ళు పట్టాను అన్న తృప్తితో నిద్రపోవడం. ఇది వాళ్ళిద్దరు ఎవరు? ఒక తల్లి బిడ్డలు కారు. వాళ్ళ మధ్య ఏర్పడిన అనుభందం అది. అంటే.. ఇద్దరి యొక్క ప్రేమ ఎంత గొప్పదో... అన్నదమ్ములంటే... చూపిస్తున్నారు.
మనం రామాయణం చూస్తే రామాయణ శ్లోకం చెప్పుకోవడంకాదు, పెంచి, కష్టపడి పెద్దచేసి, ఉద్యోగం వేయించీ, వృద్ధిలోకి తెచ్చీ, స్నాతకంచేసీ పెంచీ, పెళ్ళిచేసినటువంటి అన్నగారు, ఊళ్లోకొచ్చి ఉన్నాడూ అని తెలిసినా... తమ్ముడు ఆయనకు అన్నం పెట్టేవాళ్ళు లేకకాదు, పిలిచేవాళ్ళు లేకకాదు, అన్నగారు ఊళ్ళోకి వచ్చారని తెలిసి, అన్నాగారివల్ల నేను ఇవ్వాళ ఇంత వృద్ధిలోకి వచ్చాననితెలిసి, అన్న పేరుచెప్పుకొని నేను కొన్నిపన్లు చేయించుకుంటున్నానని తెలిసి, అన్నని ఇంటికి భోజనానికి కూడా రమ్మనిపిలవని ద్రోహులైన తమ్ముళ్ళున్నారు. అన్నగారు పెద్దవాడైపోతే... కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి పల్లెటూరి నుండి పట్నం వచ్చీ, కంటాపరేషన్ చేయించుకుంటానురా... పొద్దున్నే వస్తాను, ఒకసారి ఆపరేషన్ చేయించుకున్న తరువాత ఒక్క రెండు గంటలు ఉండాలటా... నీ ఇంటికొచ్చి ఉండి ఒంటి గంటకు వెళ్ళిపోతాను అంటే అన్నయ్యా నేను ఆరోజు ఇంట్లో ఉండను అనిచెప్పే తమ్ముళ్ళున్నారు సిగ్గుపడమని వచ్చింది రామాయణం. ఒక జన్మకి ఒకతల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలూ అన్నదమ్ములూ అక్కా చెల్లెల్లూ అన్న ప్రేమ ఆ జన్మకి వాళ్ళే..., రాముడు అంటాడు దేశే దేశే కళత్రాని, దేశే దేశే చ బాంధవాః (తంతు దేశం నాపశ్యామి యత్ర భ్రాత సహోదరః) భార్య, బంధువులు, స్నేహితులు ఎక్కడైనా దొరుకుతారు ఒక కడుపున పుట్టడం అన్నది ఆ జన్మకి అదే...
నాకు ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఒకటి జ్ఞాపకానికి వస్తూ ఉంటూంది, ఒసారి నేను ఉపన్యాసం చెప్తూ ఎందుకో కాకతాళీయంగా అన్నాను 50 ఏళ్ళు వచ్చింతర్వాత అన్నదమ్ములిద్దరూ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడంమంటే, ఓ 60 యేళ్లో 70 యేళ్ళో వచ్చేంత వరకూ వెళ్ళగలరు. యేడాదికి మహా వెళితే ఓ పది రోజులు వెళుతాడు ఇంకో యాభై యేళ్ళ తరువాత 70 యేళ్ళ వరకు బ్రతుకుతాడనుకుంటే ఇవ్వాళ ఉన్న రోజుల్లో 70 యేళ్ళల్లో 20 X 10 =200 రోజులు వెళ్తాడు, 200 రోజుల్లో వెళ్ళినా అక్కడ రాత్రి నిద్రపోతాడు కాబట్టి అతనూ ఇతనూ కలుసుకుని ఉండేది పగలే కాబట్టి 100 రోజులు ఇక ఈ 100 రోజులలో ఆయన ఆఫీకి ఆయన, ఈయన పన్లుమీద ఈయనా, వాళ్ళ  పిల్లల్తో ఆయనా, ఈయన గొడవల్లో ఈయనా, పోనూ ఇద్దరూ కలిసికూర్చొని అన్నంతినడం ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అందులో ఏ పదో వంతో ఉంటుంది అంటే ఇక నీ జీవితంలో 50 ఏళ్ళ తరువాత నీ అన్న దమ్ములన్న వాళ్ళతో నీవు గడిపేటటువంటి సమయాన్ని యదార్థంగా లెక్క వేస్తే ఉండేది 10 రోజులు. దానికి ఎందుకురా అంత మొహం చాటేసుకుంటావు అన్నదమ్ములు కనబడితే అన్నాను పాపం మర్నాడు ఒకాయన మా ఇంటికి పళ్ళబుట్ట పట్టుకొనివచ్చాడు. నాకాళ్ళ మీదపడి అన్నాడు మీరన్నమాట నన్ను కదిపేసింది, నేను ఉపన్యాసం నుంచే కారువేసుకొని మా అన్నగారినితీసుకొచ్చి కంటాపరేషన్ చేయించాను ఆ పేరు అక్కర లేదు నాలో మార్పు వచ్చింది మన్నించండి అన్నాడు అయ్యా! ఈ ప్రజ్ఞ నాది కాదు శ్రీరామాయణంది అందుకు ఇచ్చారు వాల్మీకి మహర్షి, అన్నదమ్ములు ఇలా బ్రతకాలని ఇచ్చారు మీరు చేసిన పనికి నేను మీకు నమస్కారం చేయాలి అన్నాను రామాయణం మనకి నేర్పుతుంది ఎలా బ్రతకాలో.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టీ న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః ! మృష్టమన్నముపానీతమశ్నాతి న హి తం వినా !! రామ చంద్ర మూర్తి లక్ష్మణ మూర్తిని అంతప్రేమించేవారు తే యదా జ్ఞానసమ్పన్నాస్సర్వైస్సముదితా గుణైః ! హ్రీమన్త కీర్తిమన్తశ్చ సర్వజ్ఞాః దీర్ఘదర్శినః !! సకల గుణసంపన్నులై, చక్కగా పాపపు పని ఏదైనా చెయ్యకూడని పని చెయ్యాలి అంటే ముందు సిగ్గు కలిగేదట, ఆ సిగ్గు కలగడమన్నది మంచి లక్షణమట, ఛీ ఛీ అటువంటి తప్పుడు పని చెయ్యడమా... అని లజ్జకలగడం, చక్కటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు, అన్నీ తెలిసున్నవాళ్ళు, దూర దృష్టి కలిగినటువంటివాళ్ళు తస్య చిన్తయమానస్య మన్త్రిమధ్యే మహాత్మనః ! అభ్యాఽఽగచ్ఛన్మహాతేజా విశ్వామిత్రో మహామునిః !! ఇక్కడ మీరు రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం, రామాయణాన్ని మీరు ఏ కళ్ళజోడు పెట్టుకుని చూస్తే అలా కనబడుతుంది. చిన్నప్పుడు మాకు రామకోటి పందిట్లో ఏదో ఎర్ర కాగితాలున్న కళ్ళజోళ్ళు అమ్మేవారు ఓ రబ్బరు తాడు చుట్టి, అది పెట్టుకుంటే లోకమంతా మండిపోతున్నట్లు కనపడేది అదో సంతోషం. ఆకు పచ్చ కాగితం పెట్టుకుంటే ఆకు పచ్చగా కనపడేది సష్యకేదారాల్లాగ అవన్ని కళ్ళజోళ్ళు మార్చి మార్చి పెట్టుకుంటూ అదంతా మా ఐశ్వర్యం అని పొంగి పోతుండేవాళ్ళం. అలా మీరు రామాయణాన్ని ఏ కళ్ళజోడు పెట్టుకుచూస్తే అలా కనబడుతుంది అది మనస్తత్వ శాస్త్రం.
లేక లేక లేక లేక లేక పుట్టారండీ రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులూ అందునా ఇంతటి గుణములు కలిగినటువంటి పిల్లలు. మరి తండ్రికి వాళ్ళమీద అపారమైనటువంటి ప్రేమ ఉండదా అంటే, ఉండదాండీ... తండ్రికి ఇప్పుడు మనసులో ఉండేటటువంటి పెద్ద వ్యధ ఏమిటో తెలుసా... ఇంత మంచి పిల్లలే, వీళ్ళకు తగిన కోడళ్ళను తీసుకు రావాలి. వీళ్ళు ఎంత మంచి వాళ్ళో ఈ మంచి తనాన్ని కోడలు నిలబెట్టాలి. నిలబెట్టకపోతే... ఈ పిల్లల మంచి తనం రేపొద్దున పాడవుతుంది అంతకన్నా నేను ఎందుకు చెప్పాలి, మీరందరున్న సభలో... కాబట్టీ మంచి కోడల్ని తీసుకొద్దాం, అని తాపత్రయం ఉంటుందిగా... అందుకని సభ తీర్చారట. సభ తీర్చి తస్య చిన్తయమానస్య మన్త్రిమధ్యే మహాత్మనః మంత్రులందరి మధ్యలో కూర్చొని, మా రాముడికి తగిన పిల్లని వెతకండి, మా లక్ష్మణునికి తగిన పిల్లని వెతకండి, మిగిలిన బిడ్డలిద్దరికీ తగిన పిల్లల్ని వెతకండి అని మంత్రులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో వచ్చాడట ఎవరు? అభ్యాఽఽగచ్ఛన్మహాతేజా విశ్వామిత్రో మహామునిః మామూలుగా చెప్పలేదు మహర్షి అభ్యగచ్ఛన్ వచ్చారు ఎవరు? మహాతేజా ముందు పేరు చెప్పలేదు. అపారమైనటువంటి తేజోరాశి విశ్వామిత్రో మహామునిః మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు వచ్చాడు.
నేను మీతో మనవి చేశాను ఇంతకు ముందే... నామకరణం రామ చంద్ర మూర్తికి వశిష్ట మహర్షి చేస్తే, అన్ని వశిష్టుడుకేనా నేనూ చెయ్యాలనిచెప్పి గబగబా పరుగెత్తుకువచ్చి తనుచెయ్యవలసినవి చేసేసినవాడు విశ్వామిత్రుడు. సీతారామ కళ్యాణం కోసం వచ్చాడు ఆయన రాముడికి స్నాతకం చేయడానికి వచ్చాడు ఆయన గురువుగారు చేస్తారు స్నాతకం. స్నాతకం అంటే, ధర్మమంతా నేర్పుతాడు, అందుకే ఇక ఇక్కనుంచి రామాయణాన్ని మీరు వేరు కోణం నుంచి

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
చూడండి రాముడు మాట్లాడుతాడు విశ్వామిత్రుడు మాట్లాడుతాడు. విశ్వామిత్రుడు రామున్ని వెంటతిప్పుకుని మాట్లాడి చెప్పిన విషయాలు ఏవి ఉన్నాయో... అవే భావి రామున్ని తీర్చిదిద్దాయి. అవే రామ జీవితం మీద అంతా ప్రభావం చూపాయి. అంత గొప్పగా మాట్లాడాడు, అంత గొప్పగా తీసికెళ్ళి  నేర్పాడు అన్నీ. విశ్వామిత్రుడు కలవకముందు రాముడు ఒకటి, విశ్వామిత్రుడు కలిశాక రాముడు ఒకటి. ఆయన వచ్చారు. వచ్చారు అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు చూశారు. ఆయనన్నారు వచ్చీ నేను గాధి సుతున్ని, కుషిక పుత్రున్ని, కౌషికుడంటారు నేను విశ్వామిత్రున్ని. నేను అంతఃపురంలో రాజదర్శనం చెయ్యాలనుకుంటున్నాను. వెళ్ళి ప్రభువుకి చెప్పు అన్నాడు. వాళ్ళకి కూడా విశ్వామిత్రుడు అన్న పేరు వింటే, కించిత్ ఉలికి పాటు ఎందుకంటే ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందకముందు అదే పనిగా శాపాలనువిడిచిపెట్టాడు. వాళ్ళు పరుగెత్తుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళారు. వెళ్ళి దశరథ మహారాజుకి చెప్పారు. అయ్యా విశ్వామిత్ర మహర్షివచ్చారు. రాజ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. లోపలికి వస్తానంటున్నాడు, సరే రమ్మను అనవలసిన వ్యక్తికాదు అందర్నీ అలా రమ్మనకూడదు, తాను పరుగెత్తాలి సింహాసనం మీద ఉన్న ప్రభువైనా సరే... ఆయన తేజస్సు అటువంటిది మహాతేజాః సంకల్పం చేసి ఇంకో లోకాన్నే సృష్టించాడు దశరథున్ని పడగొట్టటం పెద్ద లెక్కేం కాదు కాబట్టి ఇప్పుడు పరుగెడుతున్నాడు ప్రభువంతటివాడు కూడా... పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు.
వాల్మీకి మహర్షి గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే... చూసినవాడి కళ్ళల్లోంచి మీకుచూపిస్తాడు. ఎవరు చూశారు అక్కడ విశ్వామిత్రున్ని ఆ గుమ్మం ముందు నిలబడి ఉన్నవిశ్వామిత్రున్ని చూసినవారెవరు దశరథ మహారాజు గారు చూస్తున్నారు, దశరథ మహా రాజుగారి కళ్ళల్లోంచి మీకు విశ్వామిత్రున్ని చూపిస్తున్నారు. మీరు పరకాయ ప్రవేశంచేసి నుంచోవాలి. పరుగెత్తుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ నిలబడి ఉన్నాడట, ఎలా ఉన్నాడట ఆయన చూస్తే... తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంశితవ్రతమ్ ! ప్రహృష్టవదనో రాజా తతోర్ఘ్యముపహారయత్ !! ఆయన జలిస్తున్నటువంటి అగ్నిశిఖ ఎలా ఉంటుందో... ఒక హోమగుండంలో నేతితో తడిపినటువంటి ఆ సమిధని తీసుకెళ్ళి వేసినప్పుడు, ఒక జ్వాల, ఒక అగ్నిశిఖ ఎలా పైకి లేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడట తెజస్సుతో ఆయన. ఆయన్ని చూడగానే ప్రహృష్ట వదనం అబ్బాఁ... ఎంతటి మహానుభావుడు, ఇంటువంటి మహాపురుషుడు రావడమేచాలు ఈ భావన కలిగింది దశరథ మహారాజుకు. అంతవరకూ నిజంగా ధన్యుడు అంత గొప్పవాడు దశరథుడు ఆ విషయం వరకు మనం తప్పు పట్టడంలేదు. కానీ ఏ సామాన్యమైన తండ్రి హృదయంలో ఉండేటటువంటి పితృప్రేమైనా ఎలా మాట్లాడిస్తుందో అలా మాట్లాడాడు అంతే... కాబట్టి ఇప్పుడు చాలా సంతోషపడిపోయి ఇదం ఆర్ఘ్యం అని గబగబా ఆర్ఘ్యమిచ్చాడు, పాద్యమిచ్చాడు, పలకరించాడు మీరు క్షేమంగా ఉన్నారా మీరు రాజర్షి ఎంత తపస్సు చేశారు బ్రహ్మర్షి అయ్యారు మహానుభావా మీ అంతటి తేజో మూర్తి ఎక్కడున్నారు ఇవ్వాళ మీరు నా రాజ్యానికి రావడం నా జన్మ ధన్యమైంది రండి స్వాగతం చెప్తున్నాను లోపలికి రండి అన్నాడు.
ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి వశిష్టాది మహర్షిలకు కూడా కుశలము అడిగాడు, దశరథున్ని కుశలము అడిగాడు, నీవు కుశలమా రాజ్యం కుశలమా సామంతులు కుశలమా కోశాగారం చక్కగా సంవృద్ధిగా ఉన్నదా... నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా వర్షాలు పడుతున్నాయా అన్ని విషయాలు అడిగాడు. లోకము యొక్క క్షేమము, దశరథుని యొక్క క్షేమము రెండూ అడిగాడు. అడిగి లోపలికి వచ్చాడు ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు కూర్చున్న తరువాత దశరథ మహా రాజు గారు ఇక్కడే... కొద్దిగా తొందరపాటు ప్రదర్శించాడు. ఎందుచేత ఈ తొందరపాటు అంటే... లోపల

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
కించిత్ భయం ఉంది పైకి చాలాభక్తివుంది వచ్చినవాడు బ్రహ్మర్షి తెలుసు కాని ఇతః పూర్వం అనేక పర్యాయములు శాపవాక్కు విడిచినవాడు. ప్రత్యేకించి అసలు విశ్వామిత్రుడు జీవితంలో కోపమంతా వశిష్టుడి మీదే... తనకు వశిష్టుడు కులగురువు యాగం చేయిస్తే బిడ్డలుపుట్టారు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చారు ఏమంటాడో అని భయం కాబట్టీ... లేదా ఆయనయందు ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి ఆ స్వరూపాన్ని చూడగానే. ఆయన అడిగిన తరువాత మనం చేస్తామనడమా మనమే చేస్తే గొడవవదిలిపోతుందిగా... మీకు ఏం కావాలి అది చేసేస్తాను అనే ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి అలా అన్న తరువాత వాళ్ళు అడిగింది మనం చెయ్యలేకపోతే... వాళ్ళు ఏమంటారు అన్నది ఆలోచించుకుని ఉండి ఉంటే... మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతారు.
Image result for vishwamitra maharshiఇదీ చాలా గమ్మత్తుగా ఉంటుంది, మాట అన్నది చాలా విచిత్రంగా ఉంటుంది. నాతో కొంతమంది అప్పుడప్పుడు ఓ మాట అంటూంటారు కోటేశ్వర రావుగారు నీ ఉపన్యాసానికి రాలేకపోయాను ఏం అనుకోకండీ అంటుంటారు, మా అమ్మాయి పెళ్ళా అదేమైనా నా ఉపన్యాసానికి రాకపోతే నేనెందుకు అనుకోవడం నేనేమనుకోను మీ పనిమీది. మీరువస్తే సంతోషించను మీరు రాకపోతే విచారపడను. రావాలంటే రామానుగ్రహం ఉండాలి, మానెయ్యాలంటే... రావణానుగ్రహం ఉండాలి కదా దానికి నేనెందు బాధపడ్డం మాటలు గమ్మత్తుగా ఉంటాయి. మనం ఏదో ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పేస్తుంటాము తొట్రుపడిపోతాయి కానీ మాట ఎంతదూరం వెళ్ళిపోతుందో... అది ఎంతప్రమాదం తెచ్చేస్తుందో... మనకి శ్రీ రామాయణం చూపిస్తుంది. కాబట్టి చూడండీ, ఇప్పుడు ఆయన అన్నారూ... కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః ! పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోసి కౌశిక ఇక్కడ అన్న మాట గొప్పది కానీ, ఆ మాటే వచ్చి చుట్టుకుంది దశరథ మహారాజుగారికి, పాత్రత ఉన్నవాడివి నా ఇంటికొచ్చావు, ఇప్పుడు నీకు నేను ఏమైనా ఇస్తే నేను ధన్యున్ని, ఎంత అదృష్టమయ్యా ఇవ్వాళ నాదీ... నువ్వు వచ్చావు నీకు ఏం కావాలి చెప్పూ నేను ఇచ్చేస్తాను. అంటే... పుచ్చుకునే వాడు ఉంటాడు, పుచ్చుకోని వాడు ఉంటాడు, పుచ్చుకోని వాడు ఒకటి మీ దగ్గర పుచ్చుకున్నాడనుకోండీ, ఇప్పుడు మీ జన్మ ధన్యమైందని గుర్తు.
శంకరభగవత్ పాదులువెళ్ళి ఒక ఎండు ఉశిరిక పుచ్చుకున్నాడు ఎవరు ధన్యులయ్యారు ఆయన ధన్యులయ్యారా... లేకపోతే బ్రాహ్మణికి ఐశ్వర్యం వచ్చిందా... ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్లకడకువచ్చుటలెల్లల్ గారణము మంగళములకు నీరాక శుభంబుమాకు నిజము మహాత్మా అంటారు భాగవతంలో. ఈశ్వరుడెప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండీ, అనుగ్రహించాలనుకునే ముందు చాలాగొప్ప కోర్కె ఏదైనా వాళ్ళకితీర్చాలి అనుకుంటే... తన యందు విపరీతమైన భక్తి ప్రవత్తులున్నవాడు, అనవసరంగా ఎప్పుడూ ఎవరిదగ్గరికీ వెళ్ళి ఏదీ చెయ్యిచాచి యాచించనివాన్ని, మీ దగ్గరకొచ్చి మీరు పెట్టిందితిని, మీ దగ్గర మంచి నీళ్ళు తాగి, మీ దగ్గర ఏదో ఉపకారాన్ని పొందక తప్పనిసరి పరిస్థితుల్లో పొందేటట్లుగా చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసాండీ... అనుకోకుండా వస్తాడాయన, వచ్చి చాలాదాహంగా ఉందయ్యా కాసిన్ని మంచినీళ్ళివ్వు అంటాడు. మీరు ఆయనకు మంచినీళ్ళు ఇచ్చిందానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. నన్ను నమ్ముకున్నవాడికి ఈ ఇంట మంచినీళ్ళు దొరికాయి, అంతే ఏడుతరాల ఐశ్వర్యం ఇస్తాడు. ఏదో ఇవ్వాలంటే ఈశ్వరుడు తానుపుచ్చుకోవడం కాదు, తన్ను నమ్ముకున్న మహా భక్తున్ని పంపిస్తాడు, అది పాత్రతా. ఆ చేతిలో పడిందనుకోండి మీ ద్రవ్యము. నీ సంపత్తి ఏదో ఆయన ఉపయోగానికి పనికి వచ్చింది, ఓ గ్లాసుడు మంచి నీళ్ళు ఆయన మీ ఇంట్లో తాగారు, ఓ రోజు వచ్చి ఆయన మీ ఇంటి అరుగు మీద కూర్చున్నారు, ఆయన మీ ఇంట్లో ఉండి అబ్బాఁ... చాలా సంతోషంగా ఉందండీ... అని అన్నారు అంతే. ఇప్పుడు ఎవరు సంతోషిస్తారో తెలుసాండీ... మీరు యజ్ఞంచేస్తే సంతోసిస్తాడో లేదో తెలియదు కానీ, దీనికిమాత్రం ఈశ్వరుడు పరమప్రీతి చెందేస్తాడు ఇది పాత్రత.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ఇదీ అక్కడ పెట్టిందీ వెయ్యి రూపాయలే, ఇక్కడ పెట్టిందీ వెయి రూపాయలే. అక్కడ పెట్టింది అంటే నా ఉద్దేశ్యం ఎవరినో ఉద్దేశించి నేను ఈ మాట అనటం లేదు, కాని ఒక్క శంకరభగవత్ పాదుల చేతిలో ఒక్క ఎండు ఉసిరి కాయ పడ్డానికి, ఇక్కొక్కడికి పదివేల రూపాయలు ఇవ్వడానికి తేడా లేదాండీ... చాలా తేడా ఉంటుంది రెండింటికి పాత్రత చెయ్యనటువంటిది. ఎప్పుడు ఇలా చాపి ఎరుగని చెయ్యి అటువంటిది. పుచ్చుకోదు అలాగ దానికి అలవాటు లేదు. చాపదు అడగదు ఏదీ అటువంటి చెయ్యి, పుచ్చుకోవలసి వచ్చింది ఈశ్వరుడు ఆపరిస్థితి సృష్టించాడు పుచ్చుకుంటే తప్పా నడవని పరిస్థితి ఆయనకి, అందుకని పుచ్చుకున్నాడు. గ్లాసుడు మంచి నీళ్ళు పుచ్చుకొని వాడు పుచ్చుకోక పోతే ప్రాణం పోతుంది. తాగాడు మంచినీళ్ళు మీ ఇంట్లో తాగాడు, ఈశ్వరుడు మీకు ఏడు తరాలకు సరిపోయే ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. మీరు ఆయననే తిరస్కరించారు, మంచినీళ్ళా, మజ్జిగా... వెళ్ళమని అన్నారు. ఉత్తర క్షణంలో ఐశ్వర్యం బ్రష్టమైపోతుంది జ్ఞాపకం పెట్టుకోండి. వితిరిక్త ఫలితం కూడా అలాగే ఉంటుంది. మహాత్ములు మనస్సు సంతోషపడినా అంతే... మహాత్ముల మనసు ఖేదపడినా అంతే...
Image result for dasharatha vishwamitraకాబట్టి ఇప్పుడు అంటున్నాడూ... ఈ ఖేదపడుతుందేమో అన్నకోణాన్ని విస్మరించాడు నీ వంటి పాత్రత కలిగినవాడు నా ఇంటికి వచ్చాడు. నా భాగ్యం కదూ, ఏం ఇమ్మంటాం చెప్పూ ఇచ్చేస్తానంటున్నాడు పాత్రభూతోసి మే బ్రహ్మన్  దిష్ట్యా ప్రాప్తోసి కౌశికా!! (తతస్తే బ్రాహ్మణా స్సర్వే ప్రత్యూచః పవనాత్మజం !) అథనా సఫలం జన్మ జీవితంచ సుజీవితం !! చాలా పెద్ద మాటండీ రామాయణంలో... అథనా సఫలం జన్మ నా జన్మ సఫలం అయిపోయింది. ఈ శరీరంతో ఉన్నందుకు ఇవ్వాళ నేను ఒక భాగ్యం పొందాను. నిన్ను చూశాను నేను నీవు మా ఇంటికి వచ్చావు. ఇప్పుడు నీవు ఏదో అడుగుతావు, నేను ఇచ్చేస్తాను చాలు. ఈ శరీరంతో ఉన్నందుకు ఈ చేత్తో నేను ఇస్తున్నానూ అని ఇవ్వగలుగుతున్నాను. ఇంక ఇంతకన్నా నాకు ఏం కావాలి, నా జన్మ సఫలమై పోయింది. నేను ఇప్పుడు ఇంట్లో లేను, క్షేత్రంలో ఉన్నాను, ఎందుకో తెలుసా, నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడికి అది నీ తపఃశ్శక్తి వల్ల అది క్షేత్రమవుతుంది. కాబట్టి నా ఇల్లు క్షేత్రమయింది నీ వల్ల. మహానుభావా నా అదృష్టం నీకు ఏం కావాలి చెప్పు నీకు అది ఇచ్చేస్తాను.
ఏమైనా మాట్లాడుతున్నాడా విశ్వామిత్రుడూ, ఇది ఇద్దరికి తేడా. చెప్పనీ చెప్పనీ అని వింటున్నాడు బాగా అననిచ్చాడు, అననిచ్చాడు, అననిచ్చాడు అన్నీవిని అన్నాడూ... అవున్లే, ఇక్ష్వాకు వంశంలోపుట్టావు, సత్యధర్మములను అనుష్టించావు, ధర్మాత్ముడవని మూడు లోకములలో ఖ్యాతి గడించావు, వశిష్టుడికి శిష్యుడివి, వశిష్టుడి దగ్గర పాఠాలు నేర్చుకున్నావు. ఇప్పుడు గురువుగారికి కూడా పడింది, కాదన్నాడన్నడనుకో ఆ గురువుగారి పేరుపోతుంది. ఇదా నువ్వు నేర్పింది, ఇస్తాను అని అడక్కుండా ఇస్తాననీ, అడిగినంతర్వాత నేను ఇవ్వనూ అంటే, చెప్పిన గురువుగారు ఏమైపోతారు. ఇవ్వనూ అని దశరథుడు అంటే గురువుగారు జోక్యం చేసుకోవాలి వశిష్టుడు. ఇది గురువుగారు విశ్వామిత్రుడు మాట్లాడితే అలా ఉంటుంది. ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండీ అదే నేను మీతో మనవి చేసేది, వాక్ అంటే ఎలా ఉంటుందో రామాయణం చెప్తుంది.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
Image result for రామదాసు భద్రాచలంఅందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్ర బాంధవాః జిహ్వాగ్రే బంధనప్రాప్తిః జిహ్వాగ్రే మరణంధృవమ్ అనకూడని మాట ఒక్కటి అనేసి గభాలున కరాగారాలకు పోతుంటారు. అనకూడని మాట ఒక్కటి అనేసి మరణం తెచ్చేసుకుంటారు. అనుకూడని మాట ఒక్కటి అనేసి ఐశ్వర్యాన్ని పోగొట్టేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటి అనేసి ఎంతో ఉపద్రము తెచ్చుకుంటారు. అనవలసిన మాట ఒక్కటనీ మిత్రులందర్నీ సంపాదించుకుంటారు. నాలుక అంత గొప్పదండీ... అందుకేగా శ్రీ రామ నీ నామమెంత రుచిరా, ఎంత రుచీ ఎంత రుచీ ఎంత రుచీ రా, పాలు పంచదారులకన్నా, పెరుగు తేనెల కన్నా శ్రీ రామ నీ నామమెంత రుచిరా అంటాం. ఏమిటండి ఆ మాటకు అర్థం. ఏమైనా అర్థముందా పాలు నాలుక మీద వేసుకుంటే రుచి తెలుస్తుంది, పెరుగు తెలుస్తుంది, తేనె తెలుస్తుంది, మజ్జిగ తెలుస్తుంది, పంచదార తెలుసుస్తుంది. రామ నామం కాగితం మీద రాసి నాలుక మీద వేయండీ... రుచేమిటి దానికీ... కాదు రుచి అంటే ఏమిటో తెలుసాండీ... నాలుకతో చూసేటటుంటి అనుభవ జ్ఞానం కాదు. రామా ఈ నాలుకతో తిన్నపాలు, నాలుకతో తిన్నపెరుగు, నాలుకతో తిన్నపళ్ళు, ఈ శరీరంలో సప్తధాతువులు అయ్యాయి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్తి, శుక్ల, మేధ ఈ నాలుకతో అన్న రామ, మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా చేసింది, ఇది దీని శక్తి, కాబట్టి రామా... శ్రీ రామ నీ నామమెంత రుచి రా దీని శక్తి తెలుసుకున్నాను రా రామా... అని చెప్పడం దాని భావం. తప్పా అరిటి పళ్ళులా తియ్యగా ఉంటుందాండీ, పాలల్లా కమ్మగా ఉంటుందాండీ ఇది ఇలా ఎందుకు రాశారండీ అని అడక్కూడదు, అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. రసేంద్రియములు అంటే మీకు పదార్థముల రుచి చెప్పడం కాదు, రసోవైశ్రాః ఈశ్వరనామం పలకడంలో ఉన్న ఆనందాన్ని కూడా చెప్పాలి. అమ్మయ్యా ఈవ్వాళ ఎంత సంతోషంగా చెప్పుకున్నానండీ శ్రీ రామ అష్టోత్తరం అని చెప్పుకున్నది అష్టోత్తరం. అంతే గాని విశ్వం విష్ణుః ఒక్కటే వినబడుతుంది విష్ణు సహస్త్రంలో ఆ తరువాత వనమాలీ గధీశాంగీ ఎవరికోసం ఆ చదువు, ఎందుకది, ఎవడు అడిగాడు నిన్నుచదవమని మానేయ్., శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే ! (సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!) అను నీకు టైం లేక పోతే... అంతేకాని ఎందుకొచ్చిన దిక్కుమాలిన పరుగెత్తడాలు కాబట్టీ అది నాలుకకు రుచి, నాలుక అన్ని ఇబ్బందులూ తెస్తుంది, అంత ఉద్దరిస్తుంది.
కాబట్టి విశ్వామిత్రుడు అన్నాడూ, వశిష్ట మహర్షి లాంటి ఉత్తమ గురువుచేత సంస్కరింపబడిన బుద్ధికలిగిన నీవు ఇంత గొప్పగా మాట్లాడడం ఆశ్చమేముందీ అన్నాడట. ఇప్పుడు ఎవరు ఉలిక్కిపడాలి వశిష్టుడు, ఎందుకో తెలుసాండీ... ఇప్పుడు ఆయనగాని అడిగాక ఈయ్యన అయ్య బాబోయ్... అని వేళ్ళువిరిచారనుకోండీ, ఆయన ఈయనవంక చూస్తాడు వశిష్టుడివంక ఇదా నేర్పావు అని, అప్పుడు ఆయనేం అనాలి, నోర్మూయ్ నీకేం తెలుసు ఆయన అడిగింది ఇవ్వు అనాలి. అనాలా వద్దా... వశిష్టుడు అలా జోక్యం చేసుకొనేటట్టు విశ్వామిత్రుడు చేయగలిగాడు ఇది ఆయన ప్రజ్ఞ. పాపం అమయాకుడు ఎవరు పుత్రవ్యామోహంతో తొందరపడిపోయి ఓ మాట్లాడేస్తున్నాను, మాట్లాడేస్తున్నా మహా అడిగితే ఏమి అడుగుతాడు, ఏదో గుడి కడుతానంటాడు, గోపురం కడుతానంటాడు అంతేగదా... అనుకున్నాడు దశరథ మహారాజు గారు. ఆయన అన్నాడు ఏమీ లేదయ్యా, నీదగ్గర రావడానికి ఓ చిన్న కారణం ఉంది, దాని కోసం వచ్చాను అహంనియమమాతిష్టే సిధ్యర్థం పురుషర్షభ ! తస్య విఘ్నకరౌ ద్వౌ తు రాక్షసౌ కామరూపిణౌ !! నేను సిద్ధి కొరకు ఒక యాగం చేస్తున్నాను, ఆ సిద్ధి కొరకు యాగం చేస్తున్నప్పుడు ఇద్దరు రాక్షసులు కామం రూపంలో వస్తున్నారు, వాళ్ళు రూపం మార్చుకొని వస్తున్నారు, విఘ్నం కల్పిస్తున్నారు, దానివల్ల యజ్ఞం పూర్తవ్వట్లేదు, ఎన్నిమాట్లు యజ్ఞం చేసినా విఘ్నం వస్తూంది, అందుకని నేను మళ్ళీ లేచిపోవలసి వస్తూందీ... అయితే అలా ఎందుకు లేచిపోతావు నీవ్వు బ్రహ్మర్షివి కదా!, సంకల్పంచేసి శాపం విడిచిపెడితే చచ్చిపోతారుగా... నూవ్వు పూర్తి చేసుకోగలవుగా యాగం, అంటే... నేను ఏమైనా కోపడుతాను శాపాలు పెడుతానూ అనుకుంటున్నావేమో, ఇప్పుడది నేను మానేశాను, ఇప్పుడు నేను బ్రహ్మర్షిని, నాకు అంతటా ఈశ్వరుడు కనబడుతున్నాడు.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
అందుకే ఆయన అన్నాడు న చ మే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ ! తథా భూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే !! నేను కోపంతో శాపం విడిచిపెట్టకూడదు ఆ యజ్ఞంలో, అందుకే నేను శపించుట్లేదు, అందుకని వాళ్ళేం చేస్తున్నారంటే యజ్ఞ భంగం చేసేస్తున్నారు, అందుకనీ ఇప్పుడూ ఆ వచ్చినటువంటి వాళ్ళు యజ్ఞ భంగం చేసే సమయంలో ఆ ఇద్దర్నీ చంపడానికీ... మీ అబ్బాయిని నాతో పంపించూ అన్నాడు స్వపుత్రం రాజశార్దూల  రామం సత్యపరాక్రమ్ ! నీ కొడుకున్నాడే రాముడు, సత్య పరాక్రముడు, చాలా తేజోవంతుడు కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి !! అదిగో ఆ జులపాల జుట్టుతో ఉన్న రాముడు ఉన్నాడే, గొప్ప అందగాడు వాన్ని నాతోపంపించు, వాన్ని తీసుకెళ్తాను, వాడు చంపుతాడు ఆ ఇద్దరు రాక్షసులని అని రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః ! నచ పుత్రకృతస్నేహం కర్తుమర్హసి పార్థివ !! ఇప్పుడు దశరథుడు ఏమి ఆలోచిస్తున్నాడో కూడా పరకాయ ప్రవేశంచేసి విశ్వామిత్రుడు  చెప్పేస్తున్నాడు.
అమ్మో, మా అబ్బాయిని పంపించడామండీ! అనకు, ఎందుకనద్దంటున్నానో తెలుసా, నీకేం తెలుసో తెలుసా... నీ కొడుకన్న విషయం ఒకటే తెలుసు, తప్పా ఆయనెవరో నాకు తెలుసు, నేను పంపించమంటున్నాను, నీవు పంపించేసెయ్, నీవు ఏమి అడిగితే అది ఇస్తానన్నావు నేను అడిగాను ఇచ్చేసెయ్, తప్పా పుత్రుడి మీద స్నేహంతో, ఆయన మీది ప్రీతితో, అయ్యోఁ... బాబోయ్ ఇస్తే ఏమౌతుందోనని ఇవ్వడం మాత్రం మానకు, అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసా నీకు నేను ప్రతిజ్ఞచేసి చెప్తున్నాను, రామున్ని నాతో పంపు రాక్షసులు మరనించునట్టు అనిచెప్పాడు. అంటే ఏమిటి? రాముడు క్షేమంగా ఉంటాడనేకదా, నీవు దేనికిభయపడాలి, రాముడికి ఏమైనా అవుతుందోనని, రాక్షసులు మరణిస్తారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు బ్రహ్మర్షి. విశ్వాసమంటే, శ్రద్ధంటే, భక్తి అంటే ఏమిటండీ? ఎదురుగుండా వచ్చి ఆర్ఘ్యమివ్వడం, పాద్యమివ్వడం కాదు, ఆయన చెప్పిందాని మీద నమ్మకం ఉంచడం కదా, ఇప్పుడు చెప్పాడుగా, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడుగా, పైగా ఇంకొక మాట చెప్పాడు, నీవు ఇంకా అనుమానపడుతున్నావేమో రామున్ని పంపడానికి అహ వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ ! వసిష్టోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః !! రాముడు ఎవరో నీకు తెలియదు? తెలియక నీవు ఏమనుకుంటున్నావంటే రాముడు పిల్లాడు, నాకొడుకు, వాడేమిటి రాక్షసులను చెంపడమేమిటీ? పంపడమేమిటీ బాబోయ్, అటుది ఇటైతే... అని అమంగళాన్ని ఆలోచిస్తుంది. ఇది ఎందుకు ఆలోచిస్తుందో అని విశ్వామిత్రుడు చెప్పగలిగాడో తెలుసాండీ! అందుకే నేను మీతో మనవి చేశా రామాయణం మనస్థత్వ శాస్త్రము అని, మీకు ప్రీతి ఎక్కువైపోతే అమంగళానికి అది భయపడుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము

 
నా కొడుకు మీద నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, ఎనిమిదింటికి రావలసినవాడు ఎనిమిదీ నలభై ఐదు నిమిషాల వరకు రాలేదనుకొండీ, వీన్ని సైకిల్ స్పీడుగా తొక్కద్దురా ఆ బ్రేకులు సరిచేసుకోరా అంటే ఆ బ్రేకులు సరిచేయించుకోడు, స్పీడుగా తొక్కుకొచ్చేస్తాడు, ఈ మధ్యనే అక్కడేమో పెద్ద గొయ్యి తవ్వారూ అది కప్పట్లేదు, వాడు అటువైపునుంచే వస్తాడూ, ఏమైందో ఏమో అంటాడు. ఆ గోతిలో పడిపోయాడో, కాళ్ళు విరిగిపోయాయో, చేతులు విరిగిపోయాయో హాస్పెటల్ లోకి తీసుకెళ్ళారా అనలేడు. మనసు అంగీకరించక ఏమైందో ఏమో అంటాడు. అంతేగానీ మాస్టారు బహుషహా 9 దింటి వరకు కూడా లెక్కలు నేర్పుతున్నాడు, ఉత్సాహంగా నా కొడుకు వింటుంటాడు అంటాడా ఏమిటీ? అతి ప్రీతి అమంగళాన్ని ఊహించి భయపెడుతుంది.
కాబట్టి ఇది కనిపెట్టాడు, లేక లేక పుట్టిన పిల్లలు కదాండీ, బెంగపెట్టుకుని పంపిస్తే ఏమైనా అయిపోతాడు, ఏమైనా అయిపోతాడు అనుకుంటున్నామేమో, అలా బెంగ పెట్టుకోకు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ రాముడు సత్య పరాక్రముడయ్యా రాముడు ఎవరో నాకు తెలుసు, ఆఁ.. నీవు అలా అంటున్నావు కానీ, నీవు అనేది నిజమని నేనెలా అనుకుంటాను అని అనుకుంటావేమో వసిష్ఠోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః నాకు ఎంత తెలుసో, వశిష్టుడుకీ అంత తెలుసు, కావలిస్తే అడుగు నీ కొడుకేనో ఇంకేమైనా అని అడుగు చెప్పేస్తాడు వసిష్టుడు. ఆయన విష్ణువు అన్న విషయం మాకు తెలుసు నీకు తెలియదు అది గొడవ, అది వశిష్టిడుకి తెలుసు, నేను చెప్తేనమ్మవు వశిష్టుడు చెప్తే నమ్ముతావా? ఇక్కడున్న తాపసులు చెప్తారు నమ్ముతావా? మేము అందరం చెప్తున్నాం. నీ కొడుకు కేవలం నీ కొడుకు కొడుకులా కనబడుతున్నాడు, నీ కొడుకు కొడుకు కాకుండా ఇంకోటి ఆయన సత్యపరాక్రమం. ఆయన పరాక్రమానికి అడ్డులేదు, పంపవయ్యా! యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భూవి ! స్థితమిచ్ఛసి రాజేన్ద్ర రామం మే దాతుమర్హసి!!  నువ్వు రామున్ని నాతో పంపావా భూమి మీద ధర్మం నిలబడుతుంది, ఆయనకి అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది, రాముడు ఎన్నిటిని పొందుతాడో నాతో వచ్చిన తరువాత నీవు చూద్దువు కానీ, పంపించు యదిహ్యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మన్త్రిణః ! వశిష్టప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ!! నే చెప్పానని పంపించద్దు, వసిష్టున్ని అడుగు నాతో పంపించచ్చో పంపించ కూడదో, విశ్వామిత్రుడితో పంపించడానికి నీకు అడ్డేమిటండీ అని నీకు అనిపిస్తే అప్పుడు నీవు పంపించు, నీ మంత్రుల్ని కూడా అడుగు, వాళ్ళు కూడా పంపమంటేనే పంపించు, పోనీ నా ఎదురుగుండా మాట్లాడటానికి భయమా పక్కకి తీసికెళ్ళి అడుగూ... కుల గురువుని పంపించమంటే పంపించు లేకపోతే వద్దూ ఇన్ని చెప్తున్నాడు ఎవరు? ఎవరు అడగకుండా ఇచ్చేస్తానన్నాడో... వాడు ఇచ్చేస్థితిలో లేడు తిరిగి అడిగాకా అని విశ్వామిత్రుడు కనిపెట్టాడు.
ఇన్ని చెప్తున్నాడు పంపించమని ఇప్పుడు నిలబడగలడా మాట మీద, సరే రామా! వెళ్ళిపో అని అనలేడు ఎందుకు అనలేడో చెప్తాడు తప్పా! నేను పంపుతానని మాత్రం అనలేడు. ఇది పుత్ర వ్యామోహం అంటే... ఇది పుత్రేషా. దశరథుడు మాత్రం ఏలా అతీతుడండీ పాపం లేక లేక బిడ్డల్ని కన్నవాడు, అందునా ధర్మాత్ముడు, సుగునాభి రాముడూ ఏమని పంపిస్తాడు పిల్లాడిని, ఆయన బాధ ఆయంది. దశరథున్ని చూస్తే జాలే వేస్తుంది పాపం ఒక్కొక్కసారీ! కాబట్టీ ఈ మాటలు చెప్తే, దశరథుడు అన్నాడూ, ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః ! న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః !! రామ చంద్ర మూర్తికి ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదు, పిల్లవాడు రామో రాజీవలోచనః పద్మముల యొక్క రేకుల వంటి కను రెప్పలున్నవాడు, రాత్రైతే పిల్లాడు ఇట్టే నిద్రలోకి వెళుతాడు, రాక్షసులో రాత్రి యుద్ధం చేస్తారు. ఇంత చిన్న పిల్లాడు రాక్షసులతో యుద్ధం ఎక్కడ చేస్తాడండీ... పైగా ఆయనకి ఇంకా అస్త్రాలు, శస్త్రాలు  అవి ఏమీ రావు, వాళ్ళో టక్కులు టమారాలు, గారడీ విధ్యలు, మాయావి యుధ్దాలు, రాత్రిళ్ళు యుద్ధాలు అన్నీ వచ్చిన వాళ్లు, కామ రూపులు వాళ్ళతోనా పిల్లాడు యుద్ధం చేస్తాడు, చెయ్యలేడు నా మాట వినండీ!

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్!
న చాస్త్రబలసంయుక్తో న చ యుద్ధవిశారదః ! న చాసౌ రక్షసాం యోగ్య కూటయుద్ధా హి తే ధ్రవమ్ !!
విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే ! జీవితుం మునిశార్దూల న రామం నేతుమర్హసి!!
షప్టిర్వర్షసహస్రాణి జాతస్య మమ కౌశిక ! ధఃఖేనోత్సాదితశ్చాయం న రామం నేతుమర్హసిః !!
ఎందుకు కొడుకుని పంపించ్చచ్చో విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఎందుకు పంపలేడో దశరథుడు చెప్తున్నాడు ఇప్పుడు. ఎవరు ఏదైనా ఇచ్చేస్తాను అన్నవాడు, ఆయన అంటున్నాడూ! మీరు దయ తలచండి, పిల్లాడు ఏమీ తెలియదు, యుద్ధానికి వస్తే ఏమైనా అయిపోతాడు, రాక్షసులతో యుద్ధం వాడి వల్ల కాదు, బొత్తిగా 16 ఏళ్ళు కూడా లేవు, ఇంకొకటి చెప్పనా నాకు 60 వేల సంవత్సరముల వయస్సు, అక్కడ చెప్పుకుంటున్నాడు షష్టిర్వర్షసహస్రాణి 60 వేల సంవత్సరాల వయస్సు వచ్చాకా ఇక పిల్లలు పుట్టరూ, పుట్టరూ, పుట్టరూ అనుకుంటున్నప్పుడు పుట్టాడు, సుగుణాభి రాముడూఁ... అటువంటి కొడుకుని విడిచి పెట్టి ముహూర్త కాలం కూడా నేను బ్రతుకలేను, వాన్ని చూడ కుండా ఉండలేను, అందుకని వాన్ని నా దగ్గర్నుండి తీసికెళ్ళి పోకండీ అన్నాడు.
అంటే ఏ అనుమానం వచ్చి ఉంటుందో కొంత మందికి నాకు తెలుసు? 60 వేల సంవత్సరాలు బ్రతకడమేమిటండీ అని అనుకోవచ్చు. యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఆయుః ప్రమాణం ఒక్కొకలా ఉంటుంది, త్రేతా యుగంలో ఆయుః ప్రమాణం వేల సంవత్సరముల మీదె... అందుకని 60 వేల సంవత్సరములూ దశరథుడు ఉన్నాడు తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత ! పౌలస్త్యవంశప్రభవో రావణో నామ రాక్షసః !! అడిగాడు పైగా ఏవరితో యుద్ధం చెయ్యాలి, చిన్న పిల్లాడు వాన్ని పంపమని అడుగుతున్నావు, ఎవరితో యుద్ధం చెయ్యాలో అసలు నాకుచెప్పు అన్నాడు,
పౌలస్త్యవంశప్రభవో రావణో నామ రాక్షసః ! స బ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశమ్ !!
మహాబలో మహావీర్యో రాక్షసైర్బహుభిర్వృతః ! శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిపః !!
సాక్షాద్వైశ్రవణభ్రాతా పుత్రో విశ్రవసో మునేః ! యదా స్వయం న యజ్ఞస్య విఘ్న కర్తా మహాబలః !!
తేన సఞ్చోదితౌ ద్వౌ తు రాక్షసౌ వై మహాబలౌ ! మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞవిఘ్నం కరిష్యతః !!

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
రావణాశురుడు అనేటటువంటి 10 తలలు కలిగినటువంటి ఒక రాక్షసుడు, చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సుచేసి యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుషాది అనేక జాతులచేత మరణం పొందకుండా వరాన్ని పొంది, ఆ వరముల చేత విశేషణమైనటువంటి పరాక్రమం, వీర్యం, బలం, ఉద్ధతీ కలిగినటువంటివాడై, లోకాన్నిబాధిస్తూ మహర్షులు యజ్ఞాలు చేసుకోకుండా ఇబ్బందిపెడుతున్నాడు. అటువంటివాడు తానే ఇవ్వాల స్వయంగావచ్చి నా యజ్ఞాన్ని విధ్వంసం చెయ్యకపోయినా మారీచుడూ, సుభాహుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులను తనవంతునపంపి నా యజ్ఞాన్ని భంగంచేస్తున్నాడు వాళ్ళని చంపడంకోసం రామున్ని తీసుకెళుతున్నాను అన్నాడు.
ఉన్నవాడు ఉన్నట్టు ఇంకా కిందపడిపోయాడు దశరథుడు. అసలు నేనొస్తానన్నాను ఇప్పడిదాక, నా సైన్యంతో వస్తానన్నాను, నేను యుద్ధం చేస్తానన్నాను, నేను కూడా రానన్నాడు నా వల్లకాదు. రావణాసురుడు తరపున వచ్చినటువంటి రాక్షసులతో యుద్ధమాఁ... నావల్ల అవుతుందా... ఈ సైన్యం నిలబడుతుందా... నేనూ నా సైన్యమే నిలబడదు, ఇక రాముడు నిలబడుతాడా... ఇక మీరు అడగవద్దూ నేను ఇవ్వను, నేను పంపను అన్నాడు. అన్న తరువాత చూశాడు విశ్వామిత్రుడు, ఆయన ఎక్కువ మాట్లాడడుగా, ఆయన అన్నాడూ యదీదం తే క్షమం రాజన్ గమిష్యామి యథాగతమ్ ! మిథ్యాప్రతిజ్ఞః కాకుత్స్థ సుఖీభవ సబాన్ధవః !! హోఁ...! ఇన్ని చెప్పినా నీ కొడుకుని పంపించవు, నేను అడగకుండనే నేను అడిగింది ఇస్తాను, ఇస్తాను అని నాకుమాటిచ్చి నేను నోరు విప్పి అడిగిన తరువాత నేను “అడిగింది ఇవ్వలేనని మాట తప్పిన సత్యమునందూ, ధర్మమునందూ నిలబడలేనటువంటి రాజైన ఓ దశరథా నీవు నీ బాంధవులతో పదికాలములు క్షేమముగా ఉందువు గాక!” అన్నాడు.
ఇప్పుడు శపించలేదు ఆశీర్వచనం చేశాడు, ఎందుకు అంత గొప్పవాడివి కాబట్టి అని. మాటమీద నిలబడలేనివాడివి ఇంక ఇంతకన్నాబాధ ఇంకోటి ఉంటుందాండీ... అని తిరిగివెళిపోతూ వశిష్టుడి వంకచూశాడు. చెప్పానుగా విశ్వామిత్రునిమాట అంటే ఎలా ఉంటుందో? ఇప్పుడు వశిష్టుడు అన్నాడూ... ఆయనకు కోపంవస్తే, విశ్వామిత్రుడు అంటే సామాన్యుడేం కాదు, మహానుభావుడాయన “గాయిత్రీ మంత్ర ద్రష్ఠా”. భూమి అంతా కదిలి పోయిందట, 33 కోట్ల మంది దేవతలు భయపడ్డారు. ఆయన ఏ వాక్కు విడిచిపెడుతాడోనని, అప్పుడు వశిష్టుడు అన్నాడూ... ఇక్ష్వాకూణాం కులే జాతస్సాక్షాద్ధర్మ ఇవాపరః ! ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్నధర్మం హాతుమర్హసి !! ఏమనుకుంటున్నావయ్యా దశరథ మహారాజా! విశ్వామిత్రుడు అంటే? ఈయన సామాన్యమైనటువంటి వాడుకాడు, స్సాక్షాద్ధర్మ ఇవాపరః ఆయన రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటివాడు. చాలాగొప్ప వ్రతములను అనుష్టించినటువంటివాడు. ఈయన త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ ! స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోడువర్హసి !! నువ్వు ఇంతకాలం ఇక్ష్వాకు కులంలో ధర్మాన్ని అనుష్టించినవాడివీ అని పేరుపొందినవాడివి, ఇప్పుడు ఇచ్చినమాటను ఇవ్వనూ అనిచెప్పి తప్పి నీ ధర్మం పాడుచేసుకోకు, పైగా నీవుకాని అటువంటి పనిచేశావో (సంశ్రుత్యైవం కరిష్యామీత్యకుర్వాణస్య రాఘవ !) ఇష్టాపూర్తవధో భూయాత్తస్మాద్రామ విసర్జయ !! నీ ఇష్టాపూర్తములు నశించిపోతాయి అనిచెప్పాడు.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ఇష్టా పూర్తములు అంటే... పూర్తములు అంటే ప్రజలకు పనికివచ్చేవి బావులు తవ్వటం, తోటలు వేయటం, అన్నదానానికి పెద్ద పెద్ద మంటపాలు కట్టిచడం, బాటసారులకి శరణార్థులైనటువంటివారికి విశ్రాంతి తీసుకోవడానికి మంటపాలు కట్టించడం వీటిని పూర్తములు అంటారు. ఇష్టములు అంటే యజ్ఞ, యాగాది క్రతువు చేయడం, విశ్వామిత్రుడంతటి మహర్షికి నీవు మాటి ఇచ్చి తప్పితే నీవు చేసిన పుణ్యమంతా నశించిపోతుంది ఏమనుకున్నావో తెలుసా? పుణ్యంనశించి పోయింతర్వాత ఇబ్బంది పడిపోతావు, కాబట్టీ విడిచి పెట్టేసేయ్, రామున్ని పంపించు. ఏమనుకుంటున్నావో ఆయన అంటే... కృతాస్త్రమకృతాస్త్రం వా నైనం శక్ష్యన్తి రాక్షసాః ! గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా !! విశ్వామిత్రునితో నీవు రామున్ని పంపించావా! రామునికి అస్త్ర, శస్త్రములు తెలిసి ఉండనీ, తెలియక పోనీ... ఫరవాలేదు, అమృత భాండాన్ని అగ్నిహోత్రం కాపాడితే ఎలా ఉంటుందో...? అలా రాముడికి ఏ ఆపదా రాదు ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవాతాం వరః ! ఏష బుధ్యాధికో లోకే తపసశ్చ పరాయణమ్ !! విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నావ్? రాశీ భూతమైనటువంటి తపస్సు, రాశీ భూతమైన ధర్మము, రాశీ భూతమైన పరాక్రమము. లోకంలో ఇంక ఆయన కన్నా బుద్ధిమంతుడు లేడు. అంతటి మహానుభావుడు ఆయనకి హృశాశ్వుడు అన బడేటటువంటి ఒక రాజుకు, దక్ష ప్రజాపతి కుమార్తెలతో కలసి జన్మించినటువంటి అనేక అస్త్ర, శస్త్రములు ఈయన రాజుగా ఉండగా ధారపోసేశాడు, ఈయనకి తెలిసున్నన్ని అస్త్ర, శస్త్రములు లోకంలో ఎవ్వరికీ తెలిసి ఉండవు, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా...? ఆయన యజ్ఞాన్ని ఆయన రక్షించుకోలేక కాదు. ఈ విషపెట్టి నీ కొడుకుని తీసుకెళ్ళీ, తన దగ్గర ఉన్నటువంటి ధనుర్వేదాన్ని రామునికి ఇచ్చీ, లోకంలో రామునితో సమానమైన వీరుడులేడు అన్నరీతిలో తయారుచేయడానికి వచ్చాడు మహానుభావుడు. ఇంటికి వచ్చినశిరుని వదులుకుంటున్నావు, పంపవయ్యా విశ్వామిత్రుడితో తేషాం నిగ్రహణే శక్తస్స్వయం చ కుశికాఽఽత్మజః ! తవ పుత్రహితార్థాయ త్వాముపేత్యాభియాచతే !! అడిగినట్టు అడిగినవాన్ని రామ చంద్ర మూర్తిని ఆయనతో పాటు పంపించు అన్నాడు.
ఇప్పుడు వశిష్టుడి యొక్క మాట వినగానే, హమ్మో...! ఇంత ఉపకారం చేయడానికి వచ్చాడా... అనుకున్నాడు. కొడుకుని పిలవండి అనలేదట ఇప్పుడు గబగబా లేచాడట తథా వసిష్టేభవతి రాజా దశరశ్స్తుతం ! ప్రహృష్టవదనో రామమాజుహావ సలక్ష్మణమ్ !! లక్ష్మణ సహితుడైన రామున్ని తీసుకురావడానికి దశరథ మహారాజుగారు స్వయంగా తానే అంతఃపురంలోకి వెళ్ళాడు, కౌశల్యతో చెప్పాడు, ఇద్దరూ కలిసి ఆశీర్వచనం చేశారు, కొడుకుని తీసుకొచ్చాడు స పుత్రం మూర్ధ్న్యుపాఘ్రాయ రాజ దశరథః ప్రియమ్ ! దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాన్తరాత్మనా !! ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనసులో ఏమీ వ్యగ్రత లేదు, చాలా సంతోషంగా స పుత్రం మూర్ధ్న్యుపాఘ్రాయ పిల్లవాడికీ, పిల్లకీ ఒక వయసు వచ్చిన తరువాత శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టకూడదు. ఆశీర్వచనం తండ్రిది ఏమిటంటే, రెండు చెంపలూ పట్టుకొని శిరస్సువంచి మూర్ధ్యన్య స్థానమునందు ముద్దు పెట్టుకోవాలి. రామాయణం ధర్మ శాస్త్రం కాబట్టి, రామున్ని దశరథుడు మూర్ద్యన్య స్థానమునందు ముద్దు పెట్టి పంపించాడు. పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవ దున్దుభినిస్వనైః ! (శఞ్ఖదున్దుభినిర్ఘోషః ప్రయాతే తు మహాత్మన !!) విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడం అన్న ఘట్టం శ్రీ రామాయణంలో ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి సాక్షమిదే... రామ చంద్ర మూర్తి విశ్వామిత్రుడితో కలిసి రాముడి వెనక లక్ష్మణుడు, ఎందుకంటే రామున్ని విడిచి ఉండడు కదా... ఇద్దరూ విశ్వామిత్రుడితో కలిసి బయలు దేరితే... దేవ దుందుభిలు మోగాయట, దేవతలందరూ హర్షంతో

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
సంతోషించారట, అప్సరసలు నాట్యం చేశారట, పుష్పవృష్టి కురిసిందట, అంతఃపురంలో శంఖ భేరి నాధములు వెన్నుముట్టాయట మహానుభావుడు విశ్వామిత్రునివెంట ఇద్దరూ రాముడూ, లక్ష్మణుడూ వెల్తున్నారు.
Related imageవాల్మీకి మహర్షి ఎంత పొంగిపోయారంటే... అటొక తూనీరం, ఇటొక తీనీరం రెండు బాణ తీనీరాలని కట్టుకొన్నారట రామ లక్ష్మణులు, మధ్యలో తలకాయి, అటొక తూనీరం, ఇటొక తీనీరం ముందు విశ్వామిత్రుడు నడిచి వెడుతున్నాడు, ఈ చేత్తో కమండలం ఈ చేత్తో బ్రహ్మదండం, పుచ్చుకొని ఆయన నడుస్తున్నాడూ, వెనక రామ లక్ష్మణులు నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి అన్నారూ ఈ రెండు తూనీరాల మధ్యలో తలకాయతో మూడు తలల పాములు రెండు విశ్వామిత్రుడి వెంట వెళితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట ఆ సన్నివేశం. కాదు, కాదట చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం, దండం పట్టుకుని ముందు వెళుతుంటే, వెనక ఇద్దరు అశ్వనీ దేవతలు రూపలావన్యమున్నవాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందట ఆ సన్ని వేషం. కాదు, కాదట పరమ శివుడు తపో దురంధరుడు మహానుభావుడు ఆయన దర్శనమే మంగళకరము అటువంటి పరమ శివుడు బ్రహ్మ దండాన్ని, కమండలాన్నీ పట్టుకుని హిమవత్ పర్వతం మీద నడుస్తూంటే కుమార స్వామి రెండు రూపాలు ధరించీ ఆయన వెనకాల నడుస్తుంటే ఎలా ఉంటుందో... అలా ఉందట ఆ సన్నివేషం అలా నడిచి వెళుతున్నారట. ఎక్కడికి వెళుతున్నాము గురువుగారు మనం, ఎంత దూరం నడవాలి గురువుగారు అని అడగలేదు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామ లక్ష్మణులు నడుస్తున్నారు ఇది గురు శుశ్రూష అంటే.
గురువుగారు వెడుతున్నారు మనం వెడుతున్నాం అంతే, గురువు గారికి తెలుసు మనల్ని ఎక్కడ ఆపాలో, గురువు గారికి తెలుసు మనకేం పెట్టాలో, వెళ్ళిపోతున్నారు... వెళ్ళారు, వెళ్ళారు, వెళ్ళారు, వెళ్ళారూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు పిల్లలిద్దరి వంక, ఇద్దరు పిల్లలు ఇలా నవ్వుతూ చూశారు. అప్పటి వరకు ఇలా ముట్టుకుని గురువు గారు, గురువు గారు ఎక్కడికి వెళ్ళుతున్నాం గురువు గారు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి గురువు గారు అని ఏమీ అడగలేదు. చిన్న పిల్లలు ఇతః పూర్వము ఎప్పుడూ అలా నడిచినవారు కారు. అంత కష్టపడినవారు కాదు. ఎంత గురు భక్తిరా వీళ్ళకీ, నా వెంట ఎలా నడిచి వచ్చేస్తున్నారా, రథాల్లో వెళ్ళవలసిన వాళ్లు, గుఱ్ఱాల మీద వెళ్ళవలసిన వాళ్ళు, ఏనుగల మీద అంబరీలో తిరగవలసిన వాళ్ళు నా వెంట నడిచి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాడట, ఇది గురువు అంటే. కడుపు నిండిపోయింది. అబ్బాఁ...! ఏమి శిష్యులురా నా శిష్యులు అనుకున్నాడట. తనవెంట నడిచివచ్చినందుకు, ఎక్కడికీ అని అడగనందుకు గురువుగా విశ్వామిత్రుడు రామ చంద్రునికి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసాండీ! ఇలా తిరిగి చూసి నవ్వాడు, నవ్వి రామున్ని పిలిచి అన్నాడూ గృహాణ వత్సఃసలిలం మా భూత్కాలస్య పర్యయ ! మన్త్రగ్రామం గృహాణ త్వం బలామతిబలాం తథా !! రామా కమండలంలో ఆ నీళ్ళు తెచ్చుకొని కూర్చో ఆచమనం చేయి, నీకు బల అతిబలా అనే రెండు మంత్రాలు ఉపదేశం చేస్తున్నాను అన్నాడు ఏం చేస్తాయి అవి?

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
న శ్రమో న జ్వరో వా తే న రూపస్య విపర్యయః ! న చ సుప్తం ప్రమత్తం వా ధర్షయిష్యన్తి నైరతాః !!
న బాహ్వోస్సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన ! త్రిషు కోకేషు వై రామ న భవేత్సతృశస్తవ !!
న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధినిశ్చయే ! నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ !!
Image result for రామునికి విశ్వామిత్రుడు మంత్రోపదేశంనీకూ రామా! ఈ బలా అతి బలా అన్న రెండు విద్యలూ స్వీకరించు ఈ మంత్రాలు, “మంత్రముల యొక్క సమూహమైతే... మంత్ర గ్రామం” అంటారు, అనేక మంత్రములను నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. ఇవి నీవు తీసుకుంటే న శ్రమో ఎంత దూరం నడిచినా, ఎన్ని రాత్రిళ్ళు, పగలు నిద్రలేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు శ్రమ ఉండదు న జ్వరో నీకు జ్వరం రాదు  వా తే న రూపస్య విపర్యయః వాతాది ప్రకోపములు కలిగి రూపం చెక్కు చెదరదు న చ సుప్తం ప్రవత్తం వా నీవు నిద్రపోతున్నప్పుటికీ రాక్షసాదులు నిన్ను ఏమీ చేయలేరు. నీతో సదృషమైనటువంటి బాహుబలం కలిగినటువంటివాడికి, ఈ లోకంలో ఎవ్వడూ ఉండడు. మీతో సమానమైనటువంటి బుద్ధి కలిగినవాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంకొక్కడు ఉండడానికి వీల్లేదు, అంత గొప్ప మంత్రములను ఇటువంటి మంత్ర గ్రామాన్ని నీకు ధారపోస్తున్నాను తీసుకోమన్నాడు, ఆ మంత్ర గ్రామాన్ని తీసుకున్నారు.
ముందుకు వెళ్ళారు సాయంకాలం అయింది, ఆయన నదిలో స్నానం చేసి సంధ్యా వందనం చేస్తున్నాడు, గురువుగారు సంధ్యా వందనం చేసుకున్నారు పిల్లలు ఇద్దరూ స్నానం చేసి సంధ్యా వందనం చేసుకున్నారు. ముగ్గురూ కలిసి తృణములతో అంటే గడ్డి పొరకలతో చేయబడినటువంటి పక్క ఒకటి అక్కడ వేశాడు, అంటే నాలుగు గడ్డి పొరకలు అక్కడవీ, ఇక్కడవీ అక్కడ తీసుకొచ్చి అక్కడ వేశాడు, పడుకోండి అన్నాడు తను పడుకున్నాడు. పడుతుందా నిద్రా, హంసతూలికా తలపాలమీద పడుకునేటటువంటి పిల్లలు, ఇప్పుడూ ఎక్కడ పడుకున్నారట తృణశయనేనుచితే సహోషితాభ్యామ్ ! (కుశికసుతవచోనులాలితాభ్యాం సుఖమివ సా విబభౌ విభావరీ చ !!) అంటారు మహర్షి తృణ శయనము అంటే గడ్డిపొరకల మీద పడుకోమన్నాడు వాళ్ళకి నిద్ర ఎందుకుపట్టిందట తెలుసాండీ, గురువు గారిలా మాట్లాడలేదట, తాతగారు ఇద్దర్నీ మనమల్నీ చరో పక్కన పడుకోబెట్టుకుని, వారిని లాలించి, వారికి మంచి కథలు చెప్పి, వారికి అన్నీ వర్ణించిచెప్తుంటే... వాళ్ళు తాతగారి పక్కన ఇరుక్కుపోయి, తాతగారు పడుకున్నదే సింగిల్ కాట్ బెడ్డైనా, తాతగారు పడిపోతారని ఇద్దర్నీ మనుమల్నీ నడుముల మీద చెయ్యేసి దగ్గరిగా పడుకోబెట్టుకొనీ, ఇలా చూస్తూ కథచెప్పలేదు.
వీధిలో పడుకున్నారు, వేసవి కాలం ఆకాశం వంకచూసి, ఆ ఆకాశం చూశారా! ఆ నక్షత్రాలు చూశారా! ఆ సప్తర్షి మండలం చూశారా! అందులో వశిష్టుడు అని ఉంటారు, మహానుభావుడు ఎంత గొప్పవాడో తెలుసా వశిష్టుడు, ఆయనే రామ చంద్ర మూర్తికి కుల గురువు, అని చెప్తుంటే... తాతగారి చెవిదగ్గరా ఇద్దరూ మనమలూ, అలా ముఖాలు పెట్టీ, తాతగారు కదులుతున్న నోరువంకచూస్తూ, ఆ మాటలువింటూ, అందులో లయమైపోయి, మనం ఇరుక్కు పడుకున్నాం కదిలితే పడిపోతామన్నది కూడా మరిచిపోయీ, తాతగారు మాట్లాడుతుంటే నిద్రపోతే ఊఁ.. ఊఁ... అనడం మానేస్తే, తాతగారు అటూ ఇటూ చూసి, ఇద్దరూ నిద్ర పోయారనీ, లేచీ పక్కమీద సర్దీ, తాను దుప్పటి దులుపుకొని క్రిందపడుకున్నట్లూ, ఇంత అలువాటు పడినటువంటి హంసతూలికా తల్పాలకీ, అలవాటుపడి నిద్రపోయేటటువంటి రామ లక్ష్మణులు, అత్యంత ఆదరంతో, ప్రేమతో ఆ విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతున్న మాటలు, కథలు వింటూ... ఆదమరచి నిద్రపోయారట ఇద్దరూ, నిద్రపోతే విశ్వామిత్ర మహర్షి కూడా నిద్రపోయారట.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ఏమి రామాయణమండీ...! కళ్ళకి కట్టిస్తారు మహర్షి, గురువు యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు అది గురువు అంటే... ఆదరంతో దిగవలసిన చోట దిగిపోతాడు, ఎక్కవలసిన చోట పైకి ఎక్కుతాడు ఆ ఆరోహణ అవరోహణలలో శిష్యున్ని పైకి ఎక్కిస్తాడు జారిపోకుండా తనతో తిప్పుకుంటాడు. సామాన్యుల్లా ఉంటాడు, ఎక్కవలసినచోట తనేమిటో ఎక్కి నిలబడిచూపిస్తాడు, పైకిలాగుతాడు. తెల్లవారిపోయింది పిల్లలుకదూ, బడలిపోయారు ఇద్దరూ  నిద్రపోయారు ఆయనో బ్రాహ్మీ ముహుర్తానికి లేచిపోయాడు. ఆయన అలవాటు ఆయందీ... వెళ్ళాడు స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అనుష్టానం పూర్తైపోయింది, వచ్చాడు చూశాడు సూర్యోదయం అవుతోంది, ఎర్రటి కాంతి వస్తూందీ, పిల్లలు ఇద్దరూ ఇంకా పడుకునే ఉన్నారు. చూశాడు, నిద్రపోతున్నటువంటి రామ లక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని వాళ్ళు పుట్టిన తరువాత బయట ఉన్న వ్యక్తి అనుభవించడంలో మొట్ట మొదట అనుభవించిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. ఎందుకంటే అప్పటి వరకు కౌశల్య చూసింది ఆ అందం. సుమిత్ర కైకేయి చూసింది, దశరథుడు చూశారు, బయటివాళ్ళు చూడలేదు. విశ్వామిత్రుడు తృణ శయనం మీద పడుకోబెట్టాడు ఇద్దర్నీ, అయినా వాళ్ళనీ నిద్ర లేపేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు, ఆ నిద్రా కాళిక సౌందర్యాన్ని చూశాడు.
చూసి అంటాడూ... కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సన్థ్యా ప్రవర్తతే ! ఉతిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికమ్!! “కర్తవ్యం” మీతో నేను మనవి చేశాను, ఆయన అంటాడు కౌసల్యా సుప్రజా రామ కౌసల్య యొక్క మంచి సంతానమైన రామా! నిద్ర లే... ఇక్కడ బహు భంగిమల అనుభవించారు పెద్దలు. ఎం “దశరథా సుప్రజా రామా” అనకూడదేమిటీ? సాధరణంగా మనం అప్లికేషన్ లో ఐ సి హెచ్ ఆర్ బి కోటేశ్వరరావ్ సన్ ఆఫ్ అంటే... తండ్రి గారి పేరు రాస్తాం తప్పా, అమ్మగారి పేరు రాయం. నాయనగారి పేరు రాస్తాం. ఈయన తండ్రిగారి పేరుపెట్టి పిలువలేదు కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఎన్ని భావాలో తెలుసాండి మనసులో...? మీ నాన్నని వివాహం చేసుకున్న తరువాత పట్టమహీసి అయినా ఆవిడకు పిల్లలు పుట్టకపోతే సుమిత్రని చేసుకున్నాడు, బాధ పడలేదు, నాకు పుట్ట లేదు, వాళ్ళకు పుడితేచాలనీ దశరథుడు తండ్రి కావాలని వ్రతాలుచేసింది మీ అమ్మ, సుమిత్రకీ పుట్టకపోతే యవ్వనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు, అసలు కౌసల్య ఇంటికి రాకుండా కౌకమ్మ ఇంటియందు గడిపాడు, ఆవిడకి బిడ్డలు పుట్టకపోయినా, ఆవిడమాటే వినడం మొదలెట్టాడు, అయినా మీ అమ్మా నొచ్చుకోలేదు, మహా ప్రతివతయై, ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి, ఎప్పుడూ భగవంతున్ని నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను నా కడుపు పండలేదని అనలేదు, ఈశ్వరున్ని సేవిస్తూనే ఉంది ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మగారికి.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి కౌసల్యా సుప్రజా రామా కాదు, నేను మీ నాన్నను వెళ్ళి పంపించవయ్యా నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే... ఇలా ఇలా అన్నాడు, వశిష్టుడు జోక్యం చేసుకున్న తరువాత తనేవచ్చాడు, మీ అమ్మ మాత్రం అసలు ఎవరనాలి పంపననీ లేక లేక పుట్టినవాడూ, తీసుకెళ్ళి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా... అనాలి, అలా అన్నట్టు రామాయణంలో రాయలేదు. వెంటనే ఆశీర్వచనం చేసేసింది. నా మీద నమ్మకం మీ అమ్మది మీ నాన్నది కాదు, ఓ కౌశల్య కొడకా... కౌసల్యా సుప్రజా రామ కడుపులో అదొక  ఆనందం, మీ అమ్మకి నా మీద నమ్మకం అయ్యా!, కాదు, రామా నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధ యాగం చేస్తే ఆయన పాపం పోయింది, అశ్వమేధ యాగం చెయ్యాలంటే మీ అమ్మ మూడు కత్తులతో నవ్వుతూ గుఱ్ఱాన్ని చంపీ, ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ. పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వఫని తీసి అగ్నిహోత్రంలో వ్రేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది. మీ అమ్మ ఎంత కష్టపడిందయ్యా! నీవు పుట్టడం కోసం. కాబట్టి కౌసల్యా సుప్రజా రామా మనిషిగా ఈ లోకంలో పుడతానని ప్రతిజ్ఞ చేసిన విష్ణువు భగవన్ నీవు ఈ లోకంలోకి వచ్చావు, మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి, అమ్మ కడుపులో పెరగాలి, ఏమి గర్భవాసమయ్యా అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి, అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తనకడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌలస్య... కడుపారా మోసింది నిన్నుపన్నెండు నెలలుమెసి కౌసల్యా నందనుడు అని పేరుతెచ్చుకున్నావు, మీ అమ్మ మొట్ట మొదట ప్రసవించినప్పుడు నిన్ను చూసుకుని ఎంత మురిసి పోయిందో... ఇంత ప్రసవేదనపడి కన్నాను, సుగునాభి రాముడు నా తండ్రి, ఎంత ముద్దులొలుకుతున్నాడో... (శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం) ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నీశాచరవినాశకరం నమామి అని కన్నకడుపు ఎంత పొంగిపోయిందో... కాబట్టి కౌసల్యా సుప్రజా రామ మామూలుగా రామా అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు, ఆయన పరుశురాముడు వస్తాడేమో, అందుకని కౌసల్యా సుప్రజా రామ దశరథుడు పేరెత్తితే ఆయన క్షత్రియుల్ని చంపుతుంటాడు కోపం, కౌసల్య పేరెత్తితే ఆయనతో గొడవ ఉండదు, ఆడదాని పేరెత్తాడులే, పోనిలే అని ఊరుకుంటాడు ఉంటే వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడో ఏమో? నీకు మంగళౌగాక, నీకు భద్రమగు గాక. కాబట్టి కౌసల్యా సుప్రజా రామా ఎన్ని భావాలండీ విశ్వామిత్రుడివీ, అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhhikEaCgv7FWBIFuVq5nnBk4g62y8DIUoetFPTi9eSNd451pETiqI7HENVK8hnSMDzy4HLtr6Kz1qSPN0O3UpUleJTzcYDr2uJ6RFYrvu7GdjCaZbcFLq0tsDPpYHEkJFF5K3apiEIvkWA/s1600/Bapu+like+(10).jpgమనందరం ఊహచేసి ఈశ్వరుడు నిద్రపోయాడనుకొని లేపుతున్నాం, విశ్వామిత్రుడు నిజంగా తనకన్నుల ముందు నిజంగా నిద్రపోయాడు మనుష్యుడుగా రాముడు. నిద్రపోయిన రామున్ని నిద్రలేపాడు ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది. కాబట్టి మొట్ట మొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగాలు మారిపోయినా నాకే దక్కుతుంది. అది వేంకటేశుని సుప్రభాతమవనీ, సింహాచలం నృసింహ సుప్రభాతమవనీ ముందు మాత్రం కౌసల్యా సుప్రజా రామా పూర్వా సన్ధ్యా ప్రవర్తతే నే చెప్పిన శ్లోకమే చెప్పాలి అంతే... ఏ దేవాలయంలో ఈశ్వరున్నిలేపినా నేనన్న మాటతోనేలేవాలి, ఆ అదృష్టాన్ని నేను నా స్వంతం చేసుకుంటున్నాను ఇలా స్వంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్నుకని నాకిచ్చింది లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది? కాబట్టి కౌసల్యా సుప్రజా రామా ఇన్ని భావాలట కడుపులో... ఎంత

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
సంతోషమో ఆయనకీ కౌసల్యా సుప్రజా రామా పూర్వా సన్ధ్యా ప్రవర్తతే మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు, క్షత్రియుడివి, యజ్ఞోపవీతముంది, నీవ్వు ధర్మం పాటించాలి, ధర్మం అంటే ఏమిటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటివాడివి, ధర్మం అంటే తెలుసుకోవడంగా అనుష్టించడంగా, సంధ్యావందనం చెయ్యాలిగా, దానియందు త్వర ఉండాలిగా, మరి సూర్యోదయం అయిందనుకో ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలిగా, ఆర్ఘమివ్వాలిగా అందుకని నీవు తొందరగా లెవ్వద్దూ, నీవు చెయ్యవలసినపని తొందరగాచెయ్యద్దూ కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతుంది, నిద్రపోతున్నవాన్ని కారణంచెప్పకుండా లేపకూడదు, అందకని కారణంచెప్తున్నాను రామా పూర్వా సన్ధ్యా ప్రవర్తతే ఉత్తష్ఠ నరశార్దూల నీవ్వేం సామాన్యుడవుకావు నరులలో శ్రేష్ఠుడివి.
రేపు పొద్దున యుగాలు మారిపోయినా... మనుష్యుడు అన్నవాడు ఏం చెయ్యాలీ అన్నది ఆలోచిస్తే... నువ్వు చెప్పినటువంటిదీ నీవ్వు చేసినటువంటిదే, దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కాబట్టి రామా నీవు నిద్రపోవచ్చా? లెవద్దూ నీవు, కాబట్టి ఉత్తిష్ఠ నరశార్దూలకర్తవ్యం దైవమాహ్నికమ్ దైవానికి సంబంధించినటువంటి ఆహ్నికం సంధ్యావందనం చెయ్యాలి నాయనా? లే... అన్నాడు అనేటప్పటికి మహానుభావుడు నిద్రలేచాడు లేచాడు, స్నానం చేశాడు, లక్ష్మణ సహితుడై చిన్ని రాముడు, చక్కగా కూర్చున్నాడు, సంధ్యావందనం చేశాడు, మురిసిపోయాడు. మారీచుడు ఆయన్ని చూసి ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయా చిన్ని పిల్లాడయ్యా, పిలక పెట్టుకొనీ, ఎకవస్త్రం కట్టుకునీ, మెల్లో ఓ ముత్యాల హారం వేసుకొనీ, ఏం అందమయ్యా రావణా, రాముడంటే... అప్పుడు చూశాను నేను రాముడి అందం అని చెప్పాడు మారీచుడు అరణ్య కాండలో.
http://e3.eenadu.net/Editorial/210316anta1a.jpgకాబట్టీ సరే కలిశారు బయలుదేరారు, ఏం రామాయణం...? హరి ప్రసాద్ గారూ ఏం నడవట్లేదండీ ఇదీ... కాబట్టీ రామ లక్ష్మణులూ, విశ్వామిత్రుడూ అందరూ కలిసి ముందుకు వెళ్ళుతున్నారు వెళుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. ఆశ్రమంలో కొన్ని వేల మంది తాపసులు కనపడ్డారు అడిగారు, అడిగే వాడికి శ్రద్ధ ఉండాలి? శ్రద్ధ అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసాండీ! ఈయన జారిపోయాడో, ఈయనకాని వెళ్ళిపోయాడో, మనకి ఇంతలోతుగా చెప్పేవాడు లేడు. కాబట్టి ఇయ్యనతో నేనుండడమా, నేను ఆయనతో ఉండడమా... ఏమో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో... కాబట్టి ఆయన ఉన్నసమయం వినియోగించేసుకోవాలి, అలాగని ఆయన్ని విసిగించేయకూడదు, కాబట్టీ ఇప్పుడు శ్రద్ధగా అడిగితే చెప్తాడు. కాబట్టీ కస్యాయమాశ్రమః పుణ్యః కోన్వస్మిన్వసతే పుమాన్ ! భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హి నౌ !! భగవన్ ఇది ఎవరి ఆశ్రమము? ఇక్కడ ఎందుకీ తాపసులు ఉన్నారు? నాకు వినాలని చాలా కుతూహలంగా ఉంది? మీ దగ్గర బాగా వివరంగా తెలుసుకోవాలని ఉంది? ఏదో కట్టె కొట్టె తెచ్చె అని చెప్పకుండా బాగా వివరంగా చెప్పరూ... చిన్ని రాముడూ అంత సంతోషంగా అడిగితే కాదనలేక పోయాడు విశ్వామిత్రుడు చదవండి రామాయణం. చదివితే మీరు బాగా వివరంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన రీతికి మురిసి పోతారు నిజంగా... ఆయన అన్నాడూ, పరమ శివుడు ఇక్కడ ఒకానొకప్పుడు తపస్సు చేశాడు, తపస్సుచేసి ఉన్నసమయంలో మన్మథుడు ఆయన మీద బాణప్రయోగంచేసి ఉన్నాడు. బాణంవేస్తే కోపమెచ్చినటువంటి పరమ శివుడు మూడవకన్ను తెరిచాడు ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మన్మథుని శరీర అంగములన్నీ భస్మమై జారిక్రిందపడ్డాయి. మన్మథుడు అనంగుడు అయ్యాడు పరమశివుడు ఎక్కడ కన్నుతెరిచిచూశాడో, ఎక్కడ మన్మథుని యొక్క అవయములు జారి క్రిందపడ్డాయో దాన్ని “అంగ” దేశమూ అని పిలిచారు.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
కాబట్టి అనఙ్గ ఇతి విఖ్యాతస్తదాప్రభృతి రాఘవ ! స చాఙ్గవిషయశ్శ్రీమాన్యత్రాఙ్గం ప్రముమోచ హ !! ఇదీ ఈ అంగ దేశంలోవున్న పరమశివుని యొక్క ఆశ్రమము. అప్పటి నుంచీ పరమశివుడు తపస్సు చేసుకున్న ఆయనను సేవించినటువంటి భక్తులు, ఋషుల దగ్గర్నుంచీ... ఆ ఋషుల్ని సేవించినటువంటి కొన్ని వేల వేల మందీ... ఇప్పటికీ ఆ అనుక్రమంలో... ఆ వరుసక్రమంలో... ఇప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు ఇవిగో చూశావా... ఎంతమంది తాపసులో వీరందరూ... వీరు పరమశివుని సేవించినవాళ్ళని సేవించినవారు. అందుకే తస్యాయమాశ్రమః పుణ్యస్తస్యేమే మునయః పురా ! శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే !! ఇక్కడ కస్యాయమాశ్రమపుణ్యః ఇంత పుణ్యప్రదమై పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు సేవించుకొంటున్నవంటి ఋషుల యొక్క వరుస క్రమంతో ఉన్న ఆశ్రమం కనుకా, ఈ మహాపురుషులకి ఎవ్వరికీ కూడ పాపం ఉండదు. వీళ్ళు పరమశివునికి సేవచేసినవాళ్ళకి సేవచేస్తున్నవారు. అది శివానుగ్రహం అంటే... అంత గొప్ప ఆశ్రమం రామా! ఈ ఆశ్రమం అనిచెప్పారు చాలాసంతోషించారు, సంతోషించి ముందుకు బయలుదేరారు.
మీరు నన్ను కొద్దిగా సహకరిస్తే ఏమి చెయ్యడం, కాబట్టీ, ఒక్కసారి తాటకా సంహారం వరకు చెప్తే... విశ్వామిత్ర మహర్షికి రేపు ఒక గొప్ప పూజ జరుగపోతూంది గనుక, గొప్ప ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది కాబట్టి తాటకా సంహారం చెప్పి పూర్తి చేస్తాను.
ముగ్గురూ కలిసి ముందుకు వెళ్ళుతున్నారు వెళుతున్న తరువాత అక్కడ కనబడినటువంటి ఒక ప్రదేశాన్నిచూసి రాముడు పరిప్రశ్న చేశాడనుకోండీ! మిశ్వామిత్రున్ని, అప్పుడు ఆయన అంటాడు విశ్వామిత్రుడు కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః ! బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరః !! వాళ్ళు గంగా నదిని దాటివెళ్ళాలి, ఆ గంగా నదిని రామాయణమండీ....! గొప్ప ధర్మ శాస్త్రం. రామాయణం చదివేటప్పుడు మీకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కనబడుతాయి మీరు ఆ ధర్మ సూక్ష్మాలనుచూస్తే మీరుబాగా అలవాటుపడితే... అసలు మీరు అనుభవించేస్థితీ, మీరు చూసేటటువంటి దృష్టికోణం మారిపోతాయి. చాలాగొప్పగా ఉంటుంది ఎందుకంటే... రామ లక్ష్మణుల్ని తీసుకొని, ఆ ఋరుషులందరూ సాగనంపితే... ఒక పడవ ఎక్కాడు విశ్వామిత్రుడు, గంగానదిని దాటివెళ్ళాలి, తను యజ్ఞం చేస్తున్న సిద్దాశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే, అందుకని ఇప్పుడు గంగా దాటుతున్నారు. ఎక్కడో ఒకచోట గంగా బద్ధలైపోతుంటే ఎటువంటి చప్పుడు వస్తూందో... బుగ్గ అంటారు చూడండీ, ఆ లోపల్నుంచి పుడుతున్నప్పుడు వస్తుంది అంత పెద్దఘోష, అంత పెద్దచప్పుడు వినపడింది. ఏమిటది? అడగాలంటే ఎవరిని అడాలి? నాకేం తెలుస్తుందయ్యా? ఎక్కడపడితే అక్కడ నీళ్ళమధ్యలో చప్పుడువస్తుందీ అంటే నేనేం చెప్తానూ... అనలేదు. సర్వజ్ఞుడు

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
మహానుభావుడు, ఆయన్నే అడగాలి అడిగితే... ఆయన్ని అడిగితే కేవలం అది చెప్పడం కాదు అక్కడ ఏం చెయ్యాలో చెప్తాడు ఆయన, అది విశ్వామిత్రుడంటే... చెక్కాడండీ రామున్నీ,  విశ్వామిత్రుడు ఏ బోధ చేసి ఎలా శిల్పాన్ని తయారు చేశాడో ఆ రాముడే లోకాభి రాముడయ్యాడు తరువాత.
Image result for ganga river sarayu riverకాబట్టీ వారు గంగానది మీద పడవలో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినటువంటి పెద్ద శబ్దాన్నివిని రాముడు అడిగాడు ఏమిటీ శబ్దం నీటిలో ఇక్కడ ఒక్కచోట ఇంతశబ్దం ఎందుకువస్తూందీ ఇలాగని అడిగాడు, అడిగితే ఆయన అన్నాడు విశ్వామిత్రుడూ... కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః ! బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరః !! ఒకానొకప్పుడు కైలాస పర్వతం మీద చతుర్ముఖ బ్రహ్మగారు తన మనసుతో సరోవరాన్ని ఒకదానిని సృష్టించాడు, బ్రహ్మగారి యొక్క మనస్సుతో సృష్టించబడిన సరోవరంకనుక దానికి “మానస సరోవరము” అని పేరువచ్చింది. అది పరమ పవిత్రమైనటువంటిది. చతుర్ముఖ బ్రహ్మగారిచేత సృష్టించబడినది, అది పాపరాశినిదగ్ధము చేయగలిగనటువంటిది. ఇంద్రుడంతటి బ్రహ్మహత్యా పాతపకంపోవాలి అంటే... ఆ మానస సరోవరంలోనే... లోపలికివెళ్ళి తామరతుండులో దాక్కున్నాడు, కాబట్టి ఆ సరోవరం ఏదుందో... అందులోంచి మళ్ళీ ఒక నది పుట్టింది, ఆనది ఈ అయోధ్యా పట్టణానికి చుట్టూతిరుగుతూ ఉంటూంది చూట్టూ ఉంటుంది. అలా చుట్టూ ఉన్న నదీ, ఆ సరస్సులోంచి పుట్టింది కాబట్టీ, దీనికి “సరయూ” అని పేరు. బ్రహ్మ మనసులోంచి పుట్టినది మానస సరోవరం అయితే, అందులోంచి పుట్టింది సరయూ, సరయూ అందువల్ల చాలా పవిత్రమైన నది. ఆ నది అయోధ్య చుట్టూ తిరిగి, రామా! మనం ఇప్పుడు గంగలో ప్రయాణం చేస్తున్నాము కదా... ఇక్కడ గంగలో కలిసింది. ఇప్పుడు గంగా, సరయూ నదీ సంగమం జరిగింది. రెండు పరమ పవిత్రమైనటువంటి నదులు కలుసుకున్నటువంటి ప్రదేశం, అత్యంత శక్తివంతమై పరమ పవిత్రమై ఉంటుంది. రామా! దానిని యథాలాపంగా దాటివెళ్ళిపోకూడదు, అది పరమపవిత్ర ప్రదేశంకనుక మనం అక్కడ ఒకనమస్కారం చెయ్యాలి. కాబట్టి మీరు తస్యాయమతులశ్శబ్దో జాహ్నవీమభివర్తతే ! వారిసజోక్షభజో రామ ప్రణామం నియతకురుః !! ఇక్కడ నీవు ఒక నమస్కారం చేయి అన్నాడు, నమస్కారం చేశారు.
గంగానదిని దాటారు కిందికి దిగారు ముందుకు వెడుతున్నారు అక్కడొక పేద్ద అరణ్యంలా ఉంది, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. నాకు శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యాలు చూస్తే... ఈ శ్రీరామాయణంలోని వర్ణనలే నాకు జ్ఞాపకానికివచ్చాయి, అది చాలా చీకటి చీకటిగా ఉంది వనమంతా... రాముడు ప్రశ్నవేస్తే ఎంతగొప్పగా ఉంటుందో తెలుసాండీ? అవతలివాడు జవాబు చెప్పకుండా ఉండలేడు, ఎందుకంటే అంత పరిశీలనాత్మకంగా చూసి వేస్తాడు ప్రశ్న, హా! పిల్లాడు ఎంతగొప్పగా చూశాడురా! ఎంతగొప్పగా చూసి అడుగుతున్నాడురా ప్రశ్నా! అని యదాలాపంగా అడిగిన ప్రశ్న కాదు, ఉత్సుకతతో, సంతోషంతో, కృతనిశ్చయంతో, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాడు చెప్పకుండా ఉండలేడు గురువు, అలా అడుగుతాడు. అందుకనీ ఎలా అడిగాడో చూడండీ... ? అహో వనమిదం దుర్గం ఝిల్లికాగణనాదితమ్ ! భైరవైశృపదైః పూర్ణం శకున్తైర్ధారుణారుతైః !! భగవన్ ఏమిటీ అరణ్యమంతా ఇలా ఉందీ...? ఇక్కడ ఈల పురుగుల గోల వినబడుతుంది అన్నాడు ఏదో చమత్కారమైన మాట మనమైతే వృష కీచురాళ్ళరొధా అని అంటూంటాం. కీచురాళ్ళు అదే పనిగా అరుస్తున్నాయి అంటే, అక్కడ మనుష్య సంచారము అది ఏమీలేదూ అనిగుర్తు. కీచురాళ్ళు అరుస్తూంటాయి. ఈల పురుగుల యొక్కరథ వినబడుతోంది భాష పక్షులు చేసేటటువంటి ధ్వనులు వినబడుతున్నాయి.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
శ్రీ రామాయణంలో ఇదొక చమత్కారమండీ! అనేకమైన చెట్ల పేర్లు, అనేకములైన పక్షుల పేర్లు, అనేకమైన శకునాల పేర్లు మీకుకనబడుతాయి. కొన్ని కొన్ని పక్షులు అరుస్తున్నాయంటే...? అక్కడ మనుష్యుల్నితినేసే అలవాటువున్న రాక్షసులు ఉన్నారనిగుర్తు. అక్కడ మనుష్యులు తిరగరన్న మాట అక్కడే ఆ పక్షులు ఎగురుతూ ఉంటాయి కాబట్టీ భైరవైశ్శపదైః పూర్ణం శకున్తైర్ధారుణారుతైః భాస పక్షుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఈల పురుగులయొక్క రొదలు వినపడుతున్నాయి, క్రూరమృగములు ఒక్కటే ఇక్కడ తిరుగుతున్నాయి, ఇక్కడ ఉండేటటువంటి చెట్లు చూస్తే చండ్ర, నల్లమద్దీ, తుమ్మి కలిగొట్టూ, మారేడు మొదలైనటువంటి పేద్ద పేద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. ఎక్కడా మనుష్యుసంచారం కనబడ్డంలేదు, ఒక్క మనిషిలేడు ఇలా ఎందుకు జరిగింది? దీనికి ఇలా జరగడానికి కారణమేమిటీ? ఎందుకిలా ఉంది ఈవనం? అంటే ప్రమాదాన్ని శంకించాడు రాముడు. ఇది మనుషులు తిరగట్లేదు, ఇక్కడ ఎవరో మనుష్యులనితినే వారుండాలి. ఇలా ఎందుకుంది అని అడిగాడు. ఆయన దీర్ఘ దర్శనానికి సంతోషించాడు విశ్వామిత్రుడు సంతోషించి ఆయన అన్నాడు నాయనా ఇక్కడ ఇది ఎందుకుందో ఈ వనం చెప్తానూ జాగ్రత్తగా విను.
ఒకా నొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడనబడేటటువంటి ఒక బ్రహ్మణవధ చేశాడు, ఆయనని ఆ బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది. పట్టుకుంటే ఆయనకి మలదమూ, కరూషమూ అని రెండు ప్రభలాయి, అంటే విపరీతమైన ఆకలీ, శరీరమునందు అశుచి ఈ రెండు వచ్చాయి, అవి ఆయన్ని వదిలి పెట్టలేదు, ఎక్కడికెళ్ళినా వెంటపడ్డాయి. అప్పుడు ఇంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. మహర్షులందరూ ఏం చేశారంటే, ఆయన ఒంటికి పట్టిన ఆశుచిని తొలగించడానికీ, ఆయనకి పట్టుకున్న ఆకలిని తొలగించడానికీ, అభిమంత్రించినటువంటి మంత్రపూతములైన నదీ జలములను తీసుకొచ్చీ, ఆ ఆయనని ఇక్కడ స్నానం చేయించారు. ఆ జలములచేత ఆయన పాపములు వదిలి పెట్టీ ఈ భూమి మీదపడ్డాయి భూమి స్వీకరించింది. ఇంద్రుడి యొక్క మలాన్ని, కరూషము అంటే ఆకలినీ భుమి స్వీకరించింది. భూమి పుచ్చుకుంది కాబట్టీ ఈ రెండు పట్టణాలకి మలదమూ, కరూషము అని పేర్లు వచ్చాయి. అలా పేర్లొచ్చిన ఈ రెండు పట్టణాలను చూసి ఇంద్రుడు సంతోషించాడు మీరు నా కున్నటువంటి ఇబ్బందులను పుచ్చుకున్నారు గనుకా, మీరు సౌభాగ్యవంతములై, జనవంతములై, ఐశ్వర్యవంతులై పరిఢవిల్లెదురుగాక అని వరమిచ్చాడు. జనంతో నిండిపోయి ఈ పట్టణాలన్నీ చాలా సంతోషంగా ఉండేవి, కాని ఇక్కడ తాటక అనేటటువంటి ఒక రాక్షసి బయలుదేరింది, ఆవిడ ఈ ప్రాంతాన్నంతటినీ కూడా తన ఆధీనం చేసుకుంది. ఆధీనం చేసుకుని, మనుష్యులని తినేయడం మొదలు పెట్టింది ఆ కారణంచేత జనులందరూ వెళ్ళిపోయారు నిర్మానుశ్యములై శోభతరిగిపోయి ప్రాంతమంతా అరణ్యమైపోయింది అని అన్నాడు.
Image result for tatakaవదిలి పెడతాడా రామ చంద్రమూర్తి కస్యచిత్త్వథ కాలస్య యక్షీ వై కామరూపిణీ ! బలం నాగసహస్తస్య ధారయన్తీ తదా హ్యభూత్ !! తాటకా నామ భద్రం తే భార్యా సున్దస్య ధీమతః ! మారీచో రాక్షసః పుత్రో యస్యాశ్శక్రపరాక్రమః !! గురువుగారి ప్రేమంటే ఏమిటో మీరు చూడండీ? రామా! వేయి ఏనుగుల బలం కలిగినటువంటి ఒక యక్షిణి ఒక రాక్షసి ఇక్కడ తిరుగుతుంది, మనుష్యులని తింటుంది అని ఊరుకోవాలి కదా! విశ్వామిత్రుడు అన్నాడు వెంటనే... తాటకా నామ భద్రం తే ఆవిడ పేరు తాటక. “రామా! నీకు భద్రమవుగాక!” అంటే ప్రేమ. అయ్యో...? పిల్లల్ని తీసుకొచ్చాను ప్రతిజ్ఞచేసి తాటక ఎక్కన్నుంచొచ్చి మీద పడుతుందో ఈ పిల్లల మీద ఈ పిల్లలకి ఏమీ జరుగకుండుగాకా! రామా నీకు భద్రంతే, భ్రద్రంతే...! తాటకా అన్న రాక్షసి ఇక్కడ తిరుగుతోంది, దానికి వెయ్యి ఏనుగల బలం, సున్దుడు అనే ఆయన ఆమెకు భర్త, మారీచుడు అన్నవాడు కొడుకు, వాళ్ళ వల్ల ఈ ప్రాంతం ఇలా అయిపోయిందీ అన్నాడు. ఊరుకుంటాడా రామ చంద్ర మూర్తి, అలా ఊరుకుంటే ఇంకేమండీ... ఆయన అన్నాడూ అలాగ కాదు మహానుభావా అసలు తాటకకు శాపమెందుకు వచ్చింది? అడిగే ప్రశ్న ఎలా ఉంటుందో తెలుసాండీ? విసుగిస్తున్నట్లు ఉండదు, దానికి జవాబు చెప్పకుండ ఉండలేని స్థితిలో ఉంటుంది, అంత ఉత్సాహవంతంగా ఉంటుంది ఆ ప్రశ్నా. వెంటనే రాముడు అన్నాడూ, అదేమీటీ? అల్పవీర్యా యదా యక్షా శ్శ్రూయన్తే మునిపుఙ్గవ ! కథన్నాగసహస్రస్య ధారయత్యబలా బలమ్ !! యక్షులు చాలా అల్ప వీరులు, వాళ్ళకేం పెద్ద బలముండదు, యక్షిణీ అంటున్నారు గదా ఆడది గదా తాటక, అటువంటిదానికి అంతబలం ఎక్కడ్నుంచి వచ్చింది, అది ఆడది కదా, వెయ్యి ఏనుగుల బలం ఏలా వచ్చింది, ఆవిడ అయినా వేయి ఏనుగుల బలం వస్తేమాత్రం ఈ ప్రాంతాన్ని ఇలా ఎందుకు చేసింది? బ్రహ్మన్ నాకు చెప్పరా! పిల్లాడివంక చూశాడు, ఏమి ప్రేమ, ఏమి ప్రశ్నా వేస్తాడూ, ఏం ఉత్సాహం తెలుసుకోవాలనీ, నాన్నా తప్పకుండా చెప్తాను అని మళ్ళీ మొదటి నుంచి చెప్పడం మొదలు పెట్టాడు.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
పూర్వమాసీన్మహాయక్షస్సుకేతుర్నామ వీర్యవాన్ ! అనపత్యశ్శుభాఽఽచారస్స చ తేపే మహత్తపః !! పూర్వ కాలంలో సుకేతుడు అని పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన చాలాగొప్ప ఆచరణ కలిగినవాడు, చక్కటి ప్రవర్తన ఉన్నవాడు, ఆయన తపస్సుచేశాడు ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం బ్రహ్మగారు ప్రత్యేక్షమయ్యారు. ఎవరు తపస్సు చేసినా ఆయన ప్రత్యక్షమవుతారు తపస్సు చెయ్యాలిగానీ... చేస్తేప్రత్యక్షమయ్యాడు, ఏంకావాలి అన్నాడు? నాకొకగొప్ప కొడుకుకావాలి అన్నాడు, ఆయనేమి శంకించాడో? ఆయనన్నాడూ... కొడుకు కుదరుదుకానీ నీకు వేయి ఏనుగుల బలమున్నటువంటి ఒక ఆడపిల్లని ఇస్తున్నాను అన్నాడు, ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింది. పుట్టినటువంటి ఆడపిల్ల వేయి ఏనుగుల బలంతో పుట్టింది పుడుతూనే, ఆవిడనీ సున్దుడూ అనుబడేటటువంటి పేరు ఉన్న వానికిచ్చి వివాహముచేశాడు, ఏదో ఇద్దరూ సంతోషంగా ఉన్నారు కస్యచిత్త్వథ కాలస్య యక్షీ పుత్రమజాయత ! మారీచం నామ దుర్థర్షం యశ్శాపాద్రాక్షసోభవత్ !! ఈ యక్షులిద్దరికీ కలిపీ ఒక పిల్లాడుపుట్టాడు వానిపేరు మారీచుడు కానీ వాడు “యక్షులకు పుట్టినవాడు యక్షుడే అవుతాడు కదండీ!”, కాని వాడికి శాపమొచ్చి రాక్షసుడయ్యాడు. శాపమొచ్చి యక్షుడు రాక్షసుడయ్యాడా! అలా ఎందుకు వచ్చిందీ? మళ్ళీ అడిగాడు. చెప్పాలి గదా మరి, అందుకని ఆయన అన్నాడూ... రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః ! అలా ఎందుకు అయ్యాడంటే నాయనా...?
ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే... ఈ తాటక యొక్క భర్తయైన సున్దుడూ అనబడేటటువంటి యక్షుడూ ఆయన మీదపడ్డాడు, ఎందుకు ఆయన మీద పతుంటారంటే... ఆయన పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. ఆయన శక్తి తెలుసుకోలేక ఆయన్నిచూస్తే ఏదోపరిహాసమాడచ్చని వీళ్ళువెళ్ళి ఆయన మీదపడుతుంటారు, ఆయన మీదపడ్డారు ఆయన మహానుభావుడు! ఆయన గురించి బ్రహ్మవైవత్త పురాణంలో ఎంతగొప్పగా చెప్తారో...? ఆ సముద్రం అడుగున ద్వారం ఉంది, రాక్షసులందరూ కిందపడుకునేవారు, వాళ్ళ రాకపోకలు తెలిసేవికావు, వాళ్ళనిచంపడం కోసమనిచెప్పి దేవతలందరూ అన్నారూ, ఈ సముద్రం నీరు కసేపు తీసేస్తే... మనం వెళ్ళిచంపేయ్యేచ్చు తరువాత మళ్ళీ నీళ్ళు నిప్పేద్దామనీ, అగస్త్యుడి దగ్గరికివెళ్ళి అడిగారు, అయ్యా! కాసేపు మీరు ఆ నీళ్ళు నీలోకి పుచ్చేసుకోండీ, మేము వెళ్ళి రాక్షసుల్నిచంపేసి వచ్చేస్తాం అన్నారు. వాళ్ళు ఏం చెప్పడం మర్చిపోయారంటే... మళ్ళీ నీళ్ళు వదిలేయండీ అని చెప్పడం మర్చిపోయారు, ఆయనేం చేశాడంటే, అదెంతపనీ అని, సముద్రంలోని నీళ్ళు తీసేయాలి అంతేనా...? అని సముద్రం ఒడ్డుకెళ్ళి ఒసారి ఆచమనం చేసేశారు. అంతే? అవన్నీ పుచ్చేసుకున్నాడు లోపలికి ఓం కేశవాయ స్వాహాః అన్నాడు అంతే వెళ్ళిపోయాయి సముద్రంలోని నీళ్ళన్నీ. దేవతలందరూ లోపలికెళ్ళి రాక్షసుల్ని చంపిబయటికి వచ్చేసి అన్నారూ... ఎలా ఉన్నది అలా ఉండాలి కదా మళ్ళీ నీళ్ళు వదిలేయండీ అన్నాడు. ఈ మాట నాకు మీరు ముందు చెప్పలేదు గదా అన్నాడు ఆయన? ఆ నీళ్ళన్నీ జీర్ణమైపోయాయి, ఏవో శేషం కొద్దిగా మిగిలాయి అవి మూత్రం రూపంలో వదిలేస్తాను కిందనుంచీ అని వదిలేశాడు. కాబట్టి నీళ్ళు ఉప్పగా ఉంటాయి సముద్రపు నీళ్ళు అందుకే... అందుకే ఒక్క పర్వదినాల్లో తప్ప సముద్రస్నానం లేదు. అంతటి మహానుభావుడు అగస్త్యుడు అంటే. ఆ అగస్త్యుడే కదాండీ ఆదిత్యహృదయం ఉపదేశం చేశాడూ?.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ఆయన ఆ మీద పడినటువంటి ఆ సున్దున్ని చూసి తన వాక్భలంతో చంపేశాడు. ఎంత సేపండీ! హతోభవా అంతే అయిపోతుందీ అంతే నీవు మరణించెదవు అంతే చచ్చిపోయాడు వాడు. వాడు చచ్చిపోతే పోనీ వీళ్ళు తెలుసుకున్నారా! నాకు వెయ్యేనుగుల బలముందని ఈవిడా, కొడుకూ కలిసి ఈయన మీదపడ్డారు. పడితే ఆయనకు కోపం వచ్చీ... నీవు నా మీదపడుతున్నావు కాబట్టీ, విరూపమైనటువంటి వికృతమైనటువంటి రూపం పొందుతావు, అని చెప్పీ ఆయన ఆవిడకి శాపమిచ్చాడు. కాబట్టి వికృతమైన రూపాన్నిపొందీ... రాక్షస స్త్రీగా నరభక్షకురాలు అయ్యింది మనుష్యుల్ని తినేస్తుంటుంది. రామా! ఆమె కుమారుడు కూడా అగస్త్యుడి మీదపడబోతుంటే... అగస్త్యుడు ఆయన్ని కూడా రాక్షసుడుగా మార్చాడు. మారీచుడు కూడా రాక్షసుడై పోయాడు అగస్త్యః పరమక్రుద్ధస్తాటకామపి శప్తవాన్ ! పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతాననా ! ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తు తే !! విరుకృతమైన విరూప రూపముతో ఆ తాటక తిరుగుతూంటూంది ఆమె మనుష్యుల వాసనవస్తే వచ్చిభక్షిస్తుంది, రామా ఆడదికదాని ఆలోచించద్దు, “లోకాన్ని రక్షించడం కోసం దారితప్పిపోయి, అధర్మంలో ఉన్న ఆడదైనా సరేచంపవచ్చు” నేను చెప్తున్నాను కాబట్టి తాటక ఇప్పుడు వస్తూంది నీవు వెంటనే చంపేయ్, నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్ ! పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా !! రాజ్యభరనియుక్తానామేష ధర్మస్సనాతనః ! (అథర్మ్యాం జహి కాకుత్స్థ ధర్మోహ్యస్యా న విద్యతే !!) నృశంసమనృశంసం అది చెయ్యలసిన పనైనా, చెయ్యకూడని పనైనా చేసితీరవలసిందే... ఏష ధ్రమస్సనాతనః రాముడికి ఎప్పుడూ ధర్మమే చెప్తాడు విశ్వామిత్రుడు, అది ధర్మం ఎవరికి ధర్మమో తెలుసా... పాతకం వా సదోషం వా అది పాతకమే కానీ, దోషమే కానీ కర్తవ్యం రక్షతా సతా లోకాన్ని రక్షించడం కోసం, లోకాన్ని పాడుచేసేవాళ్ళని చంపాలి. కాబట్టి రాజ్యభరనియుక్తానామేష ధర్మస్సనాతనః ఇది సనాతనమైన ధర్మం ఏవడు రాజ్య భారమును వహించినటువంటి రాజు ఉన్నాడో... ఆయన అటువంటి వారిని చంపాలి కాబట్టి నీవు ఉత్తరక్షణం ఆ తాటకని చంపవలసిందీ అన్నాడు.
అనీ...! రాముడి వంక చూశాడు ఏం చెప్తాడోననీ? ఆయన ఏం చెప్పాడో తెలుసాండీ? రామ చంద్ర మూర్తి ఇది మనం ఎందుకు రామాయణం చెప్పుకుంటామో? మనం ఎందుకు రామాయణానికి వారసులమయ్యాయో? రామాయణంలో విశ్వామిత్రుడు ఇన్నిచెప్పిన తరువాత రాముడు ఏం మాట్లాడుతాడో మీరు చూడాలి. ఏమండీ మీరుచెప్తే మాత్రం నేను ఇంతవరకూ ఎవ్వర్నీ చంపలేదూ... ఇదే బోనీ, మొదలు పెడ్తూనే ఆడదానిని చంపడమేమిటీ? నేను ఇంకా మా నాన్న గారికీ వాళ్ళకీ ఒసారి సెల్ పోన్లో మాట్లాడితేగానీ చంపడం కుదరదూ, మీరు చెప్పారని చంపేయ్ లేనూ, ఏమో మీరు చెప్పింది నిజమో కాదో? అన్నాడనుకోండి ఇంకెందుకు ఆ గురుత్వం బలాం అతిబలాం తథా మంత్ర గ్రామం గృహాణ త్వం  అంటూ ఆ మంత్రాలన్నీ ఇవ్వడం ఎందుకూ? కాబట్టి ఇప్పుడు రాముడు ఏమంటాడు ఎందుకు చంపుతానంటాడు? మీరు చెప్పారు కాబట్టి చంపేస్తానంటాడా! లేక ఇంకేమైనా కారణం చెప్తాడా! ఎంత గొప్పగా మాట్లాడుతాడో చూడండీ!

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
పితుర్వచననిర్దేశాత్పితుర్యచనగౌరవాత్ ! వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశఙ్కయా !!
అనుశిష్టోస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా ! పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం హి తత్వచః !!
గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ ! తవ చైవప్రమేయస్య వచనం కర్తుముద్యతః !!
అయోధ్యా పట్టణంలో సభలో అంతమంది ఎదురు గుండా ఉండగా, మా నాన్నగారు నన్ను అంతఃపురంలోంచి తీసుకొచ్చి నా మూర్ధన్య స్థానమందు ముద్దుపెట్టుకొనీ, మిమ్మల్ని చూపించి మీతోపంపించేటప్పుడు నాతో ఒకమాట చెప్పారు, ఈయన మహానుభావుడు ఈయనమాట అనుజ్ఞున్నుల్లంగనీయము, ఈయన చెప్పినమాట అతిక్రమించకూడదు రామా! ఈయన వెంటవెళ్ళు అనిచెప్పారు. నేను మనుష్యుడను, నా మొదటి ధర్మము పుత్రధర్మము, మా నాన్నగారు నన్ను పంపించినప్పుడు మీరు ఏం చెప్తే అదిచెయ్యమని నన్నుపంపించారు. కాబట్టి పితుర్వచననిర్దేశాత్ పితుర్వచనకారణాత్ మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తాను అన్నాడు ఇదీ తండ్రికిచ్చిన గౌరవం. దీనికి మనం వారసులం, అటువంటి వారసత్వ మున్నటువంటి జాతిలో, నాన్నగారూ మీరు నాకు పిల్లనిచూడం ఏమిటీ అని అడిగినటువంటి డైలాగు రాయడం ఎంత ధారుణమో మీరు ఆలోచించండీ? మన పిల్లలకి అటువంటివి తీసుకొచ్చి కెబుల్ టీవీకి 200 రూపాయలు కట్టి చూపించి పాడుచేసి విషవృక్షాల్ని తయారు చేస్తున్న సంస్కృతికి దిగజారిపోయి మనం ఇవ్వాళ ఎంత ఘోరాపచారం చేస్తున్నామో విజ్ఞులు మీరు బాగాఆలోచించండి? పితుర్వచననిర్దేశాత్పితుర్యచనగౌరవాత్ ! వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశఙ్కయా !! కాబట్టి గోబ్రాహ్మణహితార్థాయ గో, బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, నిష్కారణముగా గో, బ్రాహ్మణులను చంపింది కాబట్టి, గోవులోంచి పంచ గవ్యాలు వస్తాయి, ఆ పంచ గవ్యాలనీ చేతపట్టుకుని బ్రాహ్మణుడు మంత్రాలను అనుసంధించీ లోకరక్షణ కొరకు యజ్ఞ యాగాదులు చేస్తాడు. వీళ్ళిద్దరు బాగుంటే లోకం బాగుంటుంది, కాబట్టి గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ ! దేశం యొక్క సుఖంకొరకు తవ చైవప్రమేయస్య వచనం కర్తుముద్యతః !! కౌశికుడవు నాకు గురువువి మహానుభావుడివి, నాకు ఇంత అస్త్రసంపద ఇచ్చినవాడివి, ధర్మా ధర్మములు తెలిసున్నవాడివి, బ్రహ్మర్షివి నీవ్వు నాకు ఇది ధర్మము అని చెప్పిన తరువాత ఇక నేను అతిక్రమించడం అన్నది ఉండదు. నా బుద్ధితో ఆలోచించవలసిన పనిలేదు, తండ్రి చెప్పాడు మీరుచెప్పారు. నేను తాటకా సంహారం చేస్తున్నాను అన్నాడు.
Image result for విశ్వామిత్రుని యాగంఈలోగా తాటక చూసింది, పరుగెత్తుకొచ్చింది, మీద పడింది, రాళ్ళ వర్షం కురిపించింది, మాయని పొందింది, అంతర్ధానమైంది, విచిత్ర రూపాలు పొందింది, కామరూపాలుతో ప్రవర్తించింది, అనేక విధాలుగా ఆయనతో యుద్ధాలు చేసింది, కానీ విశ్వామిత్రుడు అన్నాడు? నాయనా అసురసంధ్య వేల అవుతోంది, చీకటి పడిపోతోంది, ఇటువంటి సమయంలో నీవు ఇంకా ఉపేక్షిస్తే, రాక్షసుల యొక్క బలం పెరిగిపోతుంది? కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక బాణప్రయోగం చేసిసంహరించూ అన్నాడు. ఆమె గబగబా పరుగెత్తుకొస్తుంటే... ఏమైనా మారుతుందోమో చూస్తాను, ఆమె యొక్క గమన శక్తిని నిరోధిస్తాను అనీ కాళ్ళు, చేతులు తెగ్గొట్టాడు. అయినా సరే మీద వచ్చిపడిపోతూంటే... లక్ష్మణ స్వామి

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ముక్కు చెవులు కోసేశాడు. అయినా ఆమెలో మార్పురాకుండా వచ్చి మీదపడిపోతూంటే... పిడుగులాంటి బాణాన్ని వక్షస్థలం మీద ప్రయోగించారు ప్రయోగిస్తే తాటక గిలగిల తన్నుకొని ఆ అరణ్యంలో ప్రాణం విడిచి పెట్టింది.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
Image result for tatakaహమ్మయ్యా! తాటక ఇక మరణించిందన్న శుభవార్తనటా... ఈలోకంలో ఉన్నవాళ్ళుకాదు, ఇంద్రుడితోసహా దేవతలందరూ లేచినిలబడిపోయి ఎంత శుభవార్త తాటక మరణించింది ఇంతకన్నా శుభవార్త ఏమిటి? మహానుభావుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి రామ లక్ష్మణుల్ని తీసుకెళ్ళి లోకరక్షణార్థం తాటకాసంహారం చేయించి ఇంతటి మహోపకారం చేశాడని తాం హతా భీమసఙ్కాశాం దృష్ట్వా సురపతిస్తదా ! సాధు సాధ్వితి కాకుత్స్థం సురాశ్చ సమపూజయన్ !! గొప్పపనీ గొప్పపనీ అంటూ ఇంద్రుడు కూడా పరుగు పరుగునావచ్చి రామ చంద్ర మూర్తికి స్తోత్రం చేశారట. విశ్వామిత్రుడు ప్రవృష్టవదనః ఎంతో ఆనందించారట, వా...హ్ ఏం శిష్యుడు దొరికాడురా! నేను ఒకమాటచెపితే అతిక్రమించకుండా తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః మీ మాటకి చంపేస్తానని చంపాడు ఇదీ నాశిష్యుడని పొంగిపోయాడు. కానీ శిష్యున్ని పొగడకూడదు, ఎంతో సంతోషించి నాయనా రండి మనం ఇక్కడ తాటకా సంహారం అయిపోయింది, మనం అందరం బయలుదేరుదామని చెప్పి, చీకటిపడిన తర్వాత నిర్భయంగా మళ్ళీ ఇద్దరి పిల్లల్నీ పెట్టుకుని చక్కగా వనంలోనే పడుకొని మంచి మంచి కథలతోటీ, చక్క చక్కటి విషయాలతోటీ, మళ్ళీ మనమలిద్దరీ తాతగారు పట్టుకున్నట్టుగా పడుకోబెట్టుకుని, ఎంతో మంచి కబుర్లు చెప్తూ, ఆశ్రమంలో అక్కడ చుట్టు పక్కలవాళ్ళు కూడావస్తే, ఎంతో ఆనందంగా ఆరోజు రాత్రి విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతోకలిసి పడుకుని నిద్రపోతున్నాడు.
ఇంకా ఇంతకన్నా చెప్పి వాళ్ళకు నిద్రాభంగం చెయ్యడం ఎందుకూ? రేపు సాయంత్రం మళ్ళీ ప్రారంభం చేద్దాం. ఇవ్వాళ విశ్వామిత్రుడు వచ్చినటువంటి ఘట్టం రామాయణంలో చాలా గొప్పది, ఈ ఘట్టం ఎంత గొప్పదో, రేపటి రోజు నేను ఒళ్ళు మరిచిపోయి చెప్పకుండా ఉంటే... షణ్ముకోత్పత్తి వస్తుంది, గంగావతరణం వస్తుంది, వాల్మీకి మహర్షి ఫలసృతి చెప్పరు ఎక్కడా! ఇదివింటే ఇదివస్తుందని వాల్మీకి చెప్పరు, అటువంటిది షణ్ముకోత్పత్తికీ, గంగావతరణానికీ కూడా చెప్పారు, ప్రత్యేకించి గర్భినీ స్త్రీలు వినితీరాలి షణ్ముకోత్పత్తి గంగావతరణం ఎవరు వింటారో... వాళ్ళకి ఆ క్షణంలోనే పాపరాశి ధ్వంశం అవుతుందని చెప్పారు మహర్షి, అంతగొప్ప గంగావతరణం రేపటి రోజున విశ్వామిత్రుడి వంశవృత్తాంతం, మారీచ సుభాహుల మరణం, ఈ ఘట్టాలన్నీ బహుశహా రామ చంద్ర మూర్తి నాతో పలికించి ఎక్కడో ఉండిపోకుండా నన్నుకాపాడు గాక!
అయితే రామ చంద్ర మూర్తి విశ్వామిత్రున్ని కలుసుకున్నటువంటి శుభతరుణం, లేదా విశ్వామిత్రుడు రామ చంద్ర మూర్తిని తీసుకెళ్ళినటువంటి ఈ శుభ తరుణంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతూండగా... దేవాలయంలో రామ చంద్ర మూర్తి పొంగిపరవశించిపోయి ఉంటారు. ఇవ్వాళ ఈ విశ్వామిత్రుడి పేరు వినగానే... ఆ వశిష్టుడి పేరువినగానే... తను ఆనాడు తండ్రి పేరుచెప్పీ ఎంతపొంగిపోయాడో, ఆ ధర్మంవినీ ఇవ్వాళ ఆ రాముడు పొంగిపోతాడు. ఒక చేతకానివాన్ని నేను చెప్తేనే అంతసంతోషిస్తాడు ఆయన, రేపటి రోజున సప్తఋషులకు పూజచేస్తారు, అంటే వేదంచదువుకున్నటువంటి బ్రాహ్మణులు, విశ్వామిత్రుడి గోత్రంలో ఋషిగా ఉండి, ఋషి సంతానం నుండి వచ్చినటువంటివారినీ ధర్మపత్నీ సమేతంగా పిలిచి, అలాగే సప్తర్షిమండలంలో ఉండే ఏడుగురు ఋషుల్ని ఏడుగురు భార్యల్నీ అంటే ఏడుగురు ఋషులు భార్యాసమేతులైవచ్చి ఉదయం రామాలయంలో కూర్చుంటారు, కూర్చున్న తరువాత వాళ్ళని ఈ మేళతాళాలతో ఈ మంటపంలోకి తీసుకొస్తారు, ఋషులు కూర్చోవడానికి ఉపయోగించిన ఆసనాల మీద ఏడుగురు ఋషుల్నీ బ్రహ్మస్థానంలో కూర్చున్న వ్యక్తీ శ్లోకంతో ఆవాహనచేస్తారు. అయ్యా! మీరు మీ ధర్మపత్నితో కలిసిరండీ అనీ... పిలుస్తారు హరిప్రసాదుగారు వెళ్ళి చక్కగావారి అబ్బాయి చక్కగా నిల్చోబెట్టుకోవాలి, ధర్మానికి కొడుకు కోడలూవెళ్ళి ఆ ఋషుల్నీ వేదిక మీదికి తీసుకొస్తారు, ధర్మపత్ని సహితులై ఆ ఋషులందరూ కూర్చుంటారు ఏడుగురు ఋషుల్నీ అర్చిస్తారు.

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
మీరు చూసితీరాలి, ఋషికి ఇచ్చేటప్పుడు మామూలుగా ఇవ్వరు, ఒక రుద్రాక్ష తావడం, పెట్టుకోవడానికి ఒక విభూతి, ఆయన పెట్టుకోవడానికి బొట్టూ, వేసుకోవడానికి ఓ యజ్ఞోపవీతం ఇవ్వన్నీ కూడా ఆయనకీ రేపటిరోజున బహూకరిస్తారు, ఈ బహూకరించేటటువంటి ప్రయత్నం చాలా గొప్పగా ఉంటుంది. ఈ కార్యక్రం రేపు ఉదయం ఖచ్చితంగా 10 గంటలకు ప్రారంభమవుతుంది. రాముడు కాలనియమం పాటించేవ్యక్తి, విలంబనం మంచిదికాదు, అందుకనీ మనం తొందరగావస్తే... లోపల చక్కగా మనం కూర్చొనిచూడ్డానికి అవకాశం ఉంటుంది, పైగా రేపటిరోజున ఈ ఋషులందరినీ పిలుస్తూంటే... వాళ్ళు వేదికమీద పూజ అందుకుంటూంటే... రామ చంద్ర ప్రభువు పరవశించిపోతాడు.
Image result for సప్తఋషులుఆ సప్తఋషుల యొక్క కాళ్ళు కడిగినటువంటి జలాలు అన్నీ కూడా మనందరి మీద సంప్రోక్షిస్తారు, ఇది మహదవకాశం, సంపూర్ణ రామాయణాంతర్గతంగా జరుగుతున్నటువంటి విశేషకార్యక్రమం. కాబట్టి రేపు ఉదయం 9 గంటలకే మీ అందరూ... చక్కగా మీ కుటుంబాలతో వచ్చి, ఆకార్యక్రమాన్ని చూసి సప్తఋషుల యొక్క పాదములను ప్రక్ష్యాలన చేసినటువంటి జలాలను శిరస్సుమీద చల్లించుకుని కృతార్థులగుదురు గాక! అని ఆహ్వాన కమిటీ వారితరుపున నేను, నేనే మీ అందరి తరఫున ఆహ్వానం పలికేస్తూ... ఇక పిల్లలతో శ్రీ రామ నామం రాయించాలని మనం నిన్నటి రోజున సంకల్పం చేసి ఉన్నాము. ఇప్పుడు వాళ్ళకి పరీక్షలు అవుతున్నాయట, అందుకనీ ఎదో 23వ తారీఖునో ఎప్పుడో దాటితే... వాళ్ళు చాలా శ్వేశ్చగా చాలా స్వతంత్రంగా రాయగలరన్నారు, ఇప్పుడైతే కొంచెం బెరుకుగా అయ్యో మనం చదువు వదిలామనే భయంతో ఉంటుందేమోనని, వాళ్ళ కర్త్యం మనం పాడుచేయకూడదు కనుక 23వ తారీఖున వారి పరీక్షలు అయిపోతాయి కాబట్టి మీరు బహుశా 24,25 తేదీలలో ఉంటుందదీ, ఆ డేటు అనౌంసు చేస్తాం. చక్కగా మనం అందరం మన పిల్లల్నీ పక్క పిల్లల్నీ తీసుకొద్దాం. ఒక అర గంటో ఒక 45 నిమిషాలో వాళ్ళు శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ అని రామ నామం రాస్తారు. అది వాళ్ళని కాపాడితీరుతుంది. దానిమీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. వాళ్ళందరికీ రామ మాడలు బహూకరించి పంపించేద్దాం.
కాబట్టి రేపు ఉదయం విశేషకార్యక్రమం తిలకించడానికి ఉదయం 9 గుంటలకీ 10 గంటలకీ మధ్యలోనే వచ్చేసేయండీ! రేపు సాయంత్రం 6గంటల 30 నిమిషాలకి యథాతథంగా శ్రీ రామాయణ ప్రవచనం కూడా ప్రారంభమవుతుంది.

మంగళా.....

  బాల కాండ నాల్గవ రోజు ప్రవచనము
 
ఇంత పవిత్రమైన ఘట్టాన్ని విన్న రోజునా... రామ నామం చెప్తే రాముడు ఇంకా పొంగి పోతాడు కదాండీ! రోజు తిన్న అన్నం తింటున్నామన్నారు విశ్వనాథ వారు 11 సార్లు రామ నామం చెప్పుకొనిపోతే కదా వాక్కున్నందుకు అదృష్టం. కాబట్టి నేచెప్పక్కర్లేదు మీ అందరూ తెలిసిన వాళ్ళూ... మీరు చెప్పాలా మేం చెప్తాం అంటారు. కాబట్టి చక్కగా కూర్చొని చెప్పండి శ్రద్ధాళువులై... వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మాట్లాడితే చిన్న బుచ్చుకోడూ రాముడూ... కూర్చొని చెప్పండి సంతోషిస్తాడు, నా కథ వినడానికైతే కూర్చున్నారు, నా పేరు చెప్పడానికైతే లేచినిలబడి పోతున్నారు అనుకోడూ, చూశావా సీతా అంటాడు. చిన్న బుచ్చుకుంటాడు కాబట్టీ కూర్చోండి!

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
భక్తితో భజియించు వారికి ముక్తి నొసగును రామ నామము
శిష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము !! రా !!
యుద్ధమందు మహోగ్రరాక్షస యాగ ధ్వంశము రామ నామము !! రా !!
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామ నామము !! రా !!
పాలు మీగడ పంచధారల తత్వమే శ్రీ రామ నామము !! రా !!
విఘ్నుడగు గురు నాశ్రయించిన విషదమగు శ్రీ రామ నామము !! రా !!
తత్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామ నామము !! రా !!
జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీ రామ నామము !! రా !!
అంబరీసుని పూజలకు కైల్యమెసగిన రామ నామము !! రా !!
అల కుచేలుని చేత అటుకులు ఆరగించిన రామ నామము !! రా !!
జానకీ హృత్ కమలమందున అలరుచున్నది రామ నామము !! రా !!
మూడు నదుల దాటిన వారికి మోక్ష లక్ష్మియే రామ నామము !! రా !!
రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీ రామ నామము !! రా !!
మంగళంబగు భక్తితో పాడిన శుభకంబగు శ్రీ రామ నామము !! రా !!



No comments: