Friday, 11 December 2015

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ రామాయణం - బాల కాండ 3 Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Bala Kanda 3rd Day


బాల కాండ


మూడవ రోజు ప్రవచనము





శ్రీరామాయణం ఆదికావ్యంశ్రీరామాయణ కథకీ ఒకగమ్మత్తుంది మీరు దానిగురించి విశేషణమైనటువంటి వ్యాఖ్యానమేదో తెలుసుకోవలనే ప్రయత్నంచెయ్యడం మంచిదేకానీ అలాతెలుసుకొనేటటువంటి ప్రయత్నంచెయ్యక పోయినప్పటికీకేవలం రామ కథని రామ కథగా యథాతధంగా మూలంలో వాల్మీకి మహర్షి ఏలా చెప్పారో అలా రామ కథని చదువుకోవడ మనేటటువంటిదానికన్నా ప్రశస్తమైన విధానం ఇంకోటి ఉందీ అని నేను అనుకోవటంలేదు. పెద్దలైనవారందరూ కూడా ఈ మాటే చెప్తారుదానికింకా మీరు పక్కన ఏమీచెర్చక్కర్లేదు రామ కథని రామ కథగా చదువుకుంటే చాలు. వాల్మీకిప్రమీతమైనటువంటి రామకథ ఏదుందో... శ్రీ రామాయణం ఏది ఉందో... ఆ రామాయణాన్ని అలా ఆ మూలాన్నిఆ తాత్పర్యాన్నిఆ కథనీఆ ఘట్టాల్నీ మీరు స్మరించిమీరు దాన్నిపఠించి, మీరు కృతకృత్యులు కాగలిగితే అది ʻవేదోప బృంహ్మణముʼ కనుకా శ్రీ రామాయణం మీకుకటాక్షించవలసిన అభ్యున్నతిని అదికృపచేస్తుంది అంతశక్తివంతమైనటువంటి కావ్యం. అటువంటి కావ్యంలో ఏ మహాపురుషుల పేర్లు స్మరించినంత మాత్రంచేతఉచ్చరించినంత మాత్రంచేత అసలు జీవునికి ఉన్నటువంటి పాపరాశి దగ్ధమౌతుందో... అటువంటి మహాపురుషుల యొక్క పేర్లు ఉచ్చరించపడుతాయి.
http://rcmysore-portal.kar.nic.in/temples/shreerishyashringeshwaraswamytemple/images/KiggaGOD1.pngబాల కాండలో మొట్ట మొదటే శ్రీ రామ చంద్ర మూర్తి యొక్క అవతార ఆవిర్భావమునకు విశేషమైనటువంటి కృషిసల్పినటువంటి వ్యక్తి, గొప్ప తపోధనుడూ ఋష్యశృంగుడు. అటువంటి ఋష్యశృంగుడు శాంతా సహితుడై అయోధ్యానగరానికి చేరుకున్నటువంటి ఘట్టాన్ని మీకు నేను నిన్న విన్నపం చేసి ఉన్నాను. మీరొకటి గమనించండీ! ఆయన సాక్ష్యాత్తుగా పరమశివ స్వరూపమునందు లీనమైనటువంటి వాడు. అందుకే... ఇప్పటికీ కూడా మీరు శృంగగిరి క్షేత్రానికి వెళితేఆ శృంగేరిలో "కిగ్గా" అనబడేటటువంటి ఒక శిఖరం మీద ఋష్యశృంగునికి దేవాలయం ఉంది. ఋష్యశృంగ దేవాలయంలో శివలింగం ఉంటుంది ఆయన శివ స్వరూపంగాశాశ్వత స్వరూపంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నవాడు. అందుకే శృంగేరీ ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటాయి. గొప్ప తపో భూమీ అందుకే శృంగేరీ పీఠాన్ని అధిష్టించినటువంటి ప్రతి పీఠాధిపతికూడా తనదైన ముద్రవేశారు. ఆశేతుహిమాచల పర్యంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న భక్తులకే కాకుండాప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటిఈ సనాతన ధర్మంలోని

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
భక్తులకైనా సరే... వారు ఎన్నో విషయాలను అందించీ మన జీవితాన్ని సార్దకతచేసిన మహాపురుషులు ఎవరికి వారే అంతంత గొప్ప స్థితిని పొందారు. ఇప్పుడు మీరు వారి ఔన్యత్యం గురించి చేసినటువంటి స్తోత్రాన్ని మీరు వింటూంటారు గురువుగారి గురించి విజయనగర సింహాసనా ప్రతిష్టపనాచార్యాసకల నిగమాయసాయ హృదయాతపశ్చక్రవర్తీకర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యావ్యాక్యాన సంహానాదీశనా అంటూనూ ప్రతివారూ. ఒకాయన కాకరకాయలుతిని అష్ఠసిద్దులు సాధించారు. చంద్ర శేఖర భారతీ నిరంతరమూ బ్రాహ్మీభూత స్థితియందు ఉండేవారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొ శైలిఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైనటువంటు పద్దతి కానీ అందరూ మహానుభావులూ ఈ జాతిని ప్రచోదనం చేసినవారే. దానికంతటికి కారణం ఎక్కటుందంటే మూలకందం ఎక్కడుందంటే... ఋష్యశృంగమహర్షి తిరుగాడిన ప్రదేశం అది కావడం. అందుకే శృంగగిరి పీఠం అంత గొప్ప పీఠం అవడానికి కారణం, యదార్థంగా చెప్పాలంటే అది ఋష్యశృంగుడు తిరిగినటువంటి భూమి కావడం. ఇప్పటికీ తపస్సుకి అనువైనటువంటి ప్రదేశంగా... ఆ ప్రదేశం ఉందీ అంటే... ఆ యుగంలో ఆ మహానుభావుడు తిరిగినంత మాత్రంచేత ఆయన తపఃశ్శక్తికి వచ్చినటువంటి ప్రకంపనలు అటువంటివి అవి ఇప్పటికి మనుష్యులని తరింపజేస్తాయి.
శృంగేరి మీలో అందరూ వేళ్ళి వచ్చినవారే అనుకుంటున్నానునేనే ఆలస్యంగా వెళ్లానేమో శృంగేరి. అసలు శృంగేరి వేడితేనే మనోలయం అవుతుంది. శంకర భగవత్ పాదులు యోగ రత్నావళి స్తోత్రం చేస్తూ… “శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్సయేఅంటారు నాకు ఎప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గహలో కూర్చొంటే నా మనోలయం అవుతుందో అని ఆయన స్తోత్రం చేశాడు. ఆలా శృంగగిరి మీరు ధ్యానం చేయడానికి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశము. ఇంతటి యోగ్యతా సిద్దికి కారణమైనటువంటి ఋష్యశృంగమహర్షిఆయన బయలుదేరి వచ్చేటప్పటికీ అంగ రాజ్యంలో వర్షాలు పడ్డాయి. అందుకే మీతో ఆ మాట ప్రస్తావన చేశానూ... ఆయనా వర్షమూ ఒక్కేసారి వచ్చాయి అంతటి తపశ్శక్తి సంపన్నుడు, అంతటి క్షామమూ కూడా కేవలము ఆయన అడుగు పెట్టినంత మాత్రం చేత పోయింది. దశరథ మహారాజు గారికి ఉన్నటువంటి లోటుపూడ్చి ఆయన ఆధ్వర్యం వహించిచేయించినటువంటి యజ్ఞం సఫలీకృతమై రామ చంద్ర మూర్తి యొక్క ఆవిర్భావానికి కారణమైంది.
అంతటి మహా పురుషుడైనటువంటి ఋష్యశృంగుడు అయోధ్యా పట్టణానికి వెళ్ళడానికి ఉన్నటువంటి కారణాన్ని మీరు నిన్నటిరోజున విన్నారు. ఏ కారణానికి ఆయన వెళ్ళారుఏమయ్యా ఇంత గోప్పపని చెయ్యాలని అంటున్నావ్అశ్వమేధ యాగం చేయ్యాలంటున్నావ్ఒక ఇష్టి జరగాలంటున్నావ్, అప్పటికి ఆ ఇష్టి ఏదో నిర్ణయింబడలేదు కూడా... అశ్వమేధం అయ్యాక అడిగాడు దశరథ మహారాజు గారు, ఇప్పుడు నీవు ఏ ఇష్టి చేస్తే బాగుంటుందనుకుంటున్నావో అది నాతో చేయించు అన్నాడు. ఇంత పెద్ద కార్యం చెయ్యాలిఅశ్వమేధమంటే ఏం సామాన్యమైనటువంటి ప్రక్రియ కాదు ఇంత గొప్ప ప్రక్రియ చేయించాలినేను బయలుదేరి రావడమూ అంటే... నాకేం లభిస్తుంది అని అడిగినవాడు కాడు ఆయననిత్యతృప్తుడు ఎంత సంతోషమంటే ఎప్పుడూ బ్రాంహీమయ స్థితిలో ఉండే మహానుభావుడు అటువంటి మహాపురుషుడు దేనికివశుడై వచ్చాడంటే రెండే రెండు కారణాలు ఒకటి మామగారి ఆజ్ఞ, నాయనా! నీవు వెళ్ళు అయోధ్యా పట్టణానికి అన్నాడు. ఇవ్వాళ నేను ఎక్కడ బాధ పడుతున్నానంటే... మన సంస్కృతి బీటలు బారిపోయేటటువంటి రచనలుమన సంస్కృతికి ఛిద్రం చేసేటటువంటి లఘు నాటికలు ప్రసారమౌతున్నాయి. మామగారు అంటే కేవలంగా అల్లునిచేత పీడింపబడవలసినటువంటి వ్యక్తికాడు తండ్రిగారు

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఎంతగా గౌరవింపబడుతారో... మామగారు అంతగా గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి, పితృపంచకంలో ఒకరు. మామగారికి అల్లుని నీవు వెళ్ళు అని శాశించే అధికారం ఉంది కాబట్టి అల్లుని పంపగలిగారాయనమామగారి మాటని అంతగొప్ప ఋష్యశృంగుడు అవదలదాల్చాడు. రెండూ ఆయన రావడానికి ఒక్కటే కారణం – మీరు జాగ్రత్తగా శ్రీ రామాయణాన్ని గమనించండీ... రెండు చేతులూ కలిపి దోసిలొగ్గి ప్రణిపాతం చేసిపాదాలమీద తలపెట్టి నమస్కరించి ఇలా రెండు చేతులుపెట్టి అర్థించాడునాకు స్వర్గం కావాలినాకు పుత్ర సంతానం కావాలి, అవి కలగాలంటే మీరు రావాలి వచ్చి నీ ఆధ్వరంలో ఆ యజ్ఞం జరుగాలి అంతే... ఇంకాయనేమీ అడగలేదు వస్తున్నాను అన్నారు. వస్తున్నాను శాంతా సహితుడై నేను బయలుదేరి వస్తున్నాను అంత గొప్పగా యాగం జరిగిందీ అంటేఋష్యశృంగ మహర్షియొక్క రాకకారణం.
Image result for గురువులుఈ దేశం యొక్క పేరుప్రఖ్యాతులు దేనివల్ల వచ్చాయంటే... భౌతికమైనటువంటి సంపదవలనకానీలేకపోతే ఇక్కడ ఉండేటటువంటి విలాసవంతమైన జీవితాన్ని దృష్టిలో పేట్టుకొని చూడడానికి అసలు అటువంటి స్థితి ఇక్కడ లేదు. మరి దేనివల్ల వచ్చిందంటే కేవలం ఆశ్రమ ధర్మంపట్లసనాతన ధర్మంపట్ల అనురక్తి కలిగినటువంటి మహాపురుషులు ఇది సత్యమే... సత్యమే... సత్యమే... అని ఒకటికి పదిమార్లు తమ ఉపాసనలచేత నిరూపించారు. శంకరభగవత్ పాదాచార్య స్వామి సాక్ష్యాత్ కైలాస శంకరుడేకాలడి శంకరుడిగా అవతరించి భూమి నాలుగు చెరువులా పర్యటించి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి అద్వైతాన్ని ఆవిష్కరించారు. శంకరులు అధ్వైత స్థాపకులు అంటుంటారు తప్పు, ఆయన స్థాపించ లేదు ʻఅద్వైతం వేదాంతర్గతంʼ వేదాంతర్గతమైన ఒక సత్యానికి శంకరులు ప్రచారకులంతే. ఆయనేం కొత్తగా స్థాపించినదేం లేదు అందులో, ఆయన అందుకే ఒకటికి పదిమార్లు చెప్పుకున్నారు అద్వైతమని. అటువంటి శంకరాచార్యుల వారివల్లఒక చంద్రశేఖర పరమాచార్య స్వామివారివల్లఒక చంద్రశేఖర భారతీ స్వామి వారివల్లఒక నృసింహభారతీ స్వామి వారివల్లఅటువంటి మహా పురుషులవల్ల రామకృష్ణ పరమ హంసవల్లభగవాన్ రమణులవల్ల ఈజాతికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి తప్పా. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇతరమైనటువంటి భౌతిక సంపత్తివల్ల ఈ దేశానికి ఆ పేరు రాలేదు. అటువంటి జీవనాడి ఎక్కడుందోఈ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో శ్రీ రామాయణం చెపుతుంది మనం ఎలా బ్రతకాలో రామాయణం నేర్పుతుంది.  రామాయణం చదువుకుంటేరామాయణం వింటే... మనం ఏది దిద్దుకోవాలో ఒక మనిషి పరిపూర్ణత్వం సాధించడానికి ఏది అవసరమో మనకు జ్యోతకం అవుతుంది. కాబట్టి ఋష్యశృంగ మహర్షి బయలుదేరి అయోధ్యా నగరానికి వచ్చారు వచ్చి అయోధ్యానగరంలో అంతఃపురంలో ఆయన వేంచేసి ఉన్నారూ... దశరథ మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు.
ఒకానొకనాడు రావలసినటువంటి నైమిక్తిక తిథి వచ్చింది అంటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి యోగ్యమైన కాలం ఒకటి ఉంటుంది కదా అటువంటి కాలం వచ్చింది, ఆకాలంలో తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినమ్ ! యజ్ఞాయ వరయామాస సన్తానార్థం కులస్య వై !!  దశరథ మహా రాజుగారు వెళ్ళి ఋష్యశృంగ మహర్షి యొక్క పాదములకు తన తల తాకించి ప్రణమిల్లి అడిగాడు. అయ్యా! నేను సంతానార్థినై యజ్ఞమును చెయ్యాలని నిర్ణయం చేసుకున్నాను మీరు దానికి మిమ్మల్ని ఋత్విక్కుగా వరిస్తున్నాను మీరు ఋత్విక్కుగా నిలబడి ఈ కార్యానంతట్నినీ చేయించవలసింది. వెంటనే ఋష్యశృంగ మహర్షి

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
http://3.bp.blogspot.com/--SrC0JC1Qig/VAw-Z_B7XrI/AAAAAAAAvkk/tWWgLImdAlE/s1600/scaion0031.jpgఅన్నారు (తథేతి చ స రాజానమువాచ చ సుసత్కృతః !) సమ్బారా సమ్భ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్ నాయనా! ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములనన్నింటినీ తెప్పించువాటన్నిటినీ సిద్ధం చేయిసిద్ధం చేసి నువ్వు ఆ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు, విడిచి పెట్టినట్టైతే మనం అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చెయ్యేచ్చూ అన్నారు. ఋష్యశృంగ మహర్షి అనుమతి ఇచ్చారు కనుక అశ్వమేధ యాగం ప్రారంభయౌతూంది. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రుల్ని పిలిచి ఇతర పురోహితుల్నిఇతర ఋషుల్ని కూడా తీసుకురమ్మని సుమంత్రున్ని ఆజ్ఞాపించారు సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ ! పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః !! సుయజ్ఞడు  వామదేవుడుజాబాలికాశ్యపుడుపురోహితుడైనటువంటి వశిష్టుడు వీళ్ళందర్నినీ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తరువాత వారికి తాను చెయ్యాలనుకొంటున్నవంటి సంకల్పాన్ని ఒక్కసారి చెప్పాడు, నేను అశ్వాన్ని విడిచి పెడుతున్నాను అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చేస్తున్నాను అని ఎంతో సంతోషించారు.
http://epuja.co.in/upload/12.pngఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించ వలసి ఉంటుంది కథ కథగా వెళ్ళిపోతూంటుంది. ఈ యజ్ఞము అనేటటువంటి మాట సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సొత్తు. ఈ యజ్ఞము అన్న మాట మీకు ఏ ఇతరములైనటువంటి ఏ విశ్వాసమునందు కనబడదు. అగ్నిహోత్రాన్ని జయిల్చీఅగ్నిహోత్రంలో దేవతలకు అవిష్యులిచ్చిఆ అవిష్యులు దేవతలకు అందడం వల్ల వాళ్ళు తృప్తిపొంది. వాళ్ళు మనకు కావలసినటువంటి సమస్త శ్రేయస్సు కొరకు సాధనములను బహూకరించ గలిగినటువంటి స్థితినీ కల్పించగలిగినటువంటి ఆ స్థితినీ... ఒక్క సనాతన ధర్మంలో యజ్ఞమూయాగమూహోమమూ అన్న క్రతువుల ద్వారా తీసుకొచ్చారు. తప్ప ఈ మంత్ర భాగం కానీదేవతల్ని మంత్రంతో పిలవడం కానీఅగ్నిహోత్రంలోకి హవిస్సు నివ్వడం కానీఆ హవిస్సును హవ్యవాహనుడై తీసుకొని దేవతలకు అందించడం కానీ మీకు ఇతరమైన చోట్ల కనబడదు. మీరు ఒక విషయాన్ని బాగా గమనించండీ... ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు ఒక నిర్ణయం చేశాడు ఈ లోకంలో మనకు సుఖసాధనములైనవి ఏవి ఉంటాయో వాటిని దేవతలు మనకు అనుగ్రహించవలసి ఉంటుంది. ఆ దేవతలు మనకు అనుగ్రహించడానికి వాళ్ళపట్ల మనము మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది.
మీరు చూడండీఐహికంగా ఆలోచించినప్పటికీ లోకంలో చూస్తే... ప్రభుత్వము అని ఒకటి ఉంటుంది. ప్రభుత్వము ఎక్కడ్నుంచి వస్తుందీమనం ఎన్నుకున్నదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కొన్ని కార్యాలు చెయ్యాలి దానికి డబ్బు ఎక్కడ్నుంచి వస్తూందీమీరు కట్టిన పన్నులే... మనం కట్టిన పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. మనం కట్టిన పన్నులతో ప్రభుత్వం మనకి సంక్షేమ కార్యక్రమాలు చూసినట్లే... మీరిచ్చిన హవిస్సుచేత తృప్తిపొందిన దేవతలు మీకు కాలసినటువంటి ఉపకారం చేస్తారు. ఏమి ఇక్కడ మీరుపెట్టుకున్న వ్యవస్థమీద మీకున్ననమ్మకం సనాతన ధర్మంలో చెప్పిన దేవతలమీద యజ్ఞ యాగాది క్రతువుల మీదా మీకు ఎందుకుండకూడదూ... విశ్వాసము ప్రధానము. విశ్వాసమే ఈశ్వరుడు గురు వాక్యమునందుశాస్త్ర వాక్యమునందూ ఆ విశ్వాసము ఉండాలి, యజ్ఞము మీకు మూడు రకములైనటువంటి ప్రయోజనమును అందిస్తుంది యజ్ఞము

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
వలనవచ్చే ఉపయోగమేమిటంటే దేవతలు తృప్తిపొందుతారు. ఆయన వర్షం కురిపించాడు ఒక దేవత దానివలన పంటలు పండాయి. మీరు ఆ పంటను మీరు తినడం కాదు కొంత పంటని అందులో వచ్చినటువంటి పంటలో కొంత భాగాన్ని పచనం చేసిఆ తయారు చేసినటువంటి హవిస్సుని అగ్ని ముఖంగా మళ్ళీ దేవతలకు ఇస్తాం దేవతలు సంతోషిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే... మనమే పన్నులు కట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపించి దానిచేత మనం పరిపాలన పొందుతున్నట్లే... మనమిచ్చిన హవిస్సులతో దేవతలు ఆకలి తీరుతుంది. దేవతలు అనుగ్రహించినటువంటి వర్షంతో మన ఆకలి తీరుతుంది. ఇది ఈశ్వరుడు చేసినటువంటి నియమం దీన్ని అతిక్రమించ కూడదు, యజ్ఞం ఎవరు చేస్తారో వారికి మూడు Image result for rishyasringaప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి యజ్ఞనం జరిగినచోట దేవతలు తృప్తి పొందినీకు కావలసినటువంటి కోర్కెని తీరుస్తారు. నాకొక కోరిక ఉండిపోయింది, "కోరికా" అన్నప్పుడు మీరొకటి జ్ఞాపకం పెట్టుకోవాలికోరికా అంటే అర్థం పర్థం లేని కోరిక కాదు. ఏ కోరిక కోరకుండా మీరు ఉండకూడదో మనుష్య జన్మలో ఏ కోరిక మీకు తీరక పోతే మీ మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుందో... అటువంటి కోరిక కొరకు మీరు యజ్ఞం చేయడం ఎప్పుడూ దోషం కాదు.
మనిషికి జన్మతః మూడు ఋణాలు ఉంటాయి పితృ ఋణముదేవ ఋణముఋషి ఋణము. పితృ ఋణం ఏలా తీరుతుందితండ్రిగారు నాకు జన్మనిచ్చినట్లే నేను వివాహం చేసుకొనినేను కూడా జన్మ నివ్వాలి బిడ్డలకి. నేను ఓ కొడుకుని కని సచేల స్నానంచేస్తేనేను తండ్రి గారికి పడినటివంటి ఋణం తీరుతుంది కాబట్టి నాకు ఇప్పుడు ఋణం తీరాలి. అంటే నేనొక కొడుకుని కనాలి సంతానం కావాలి నాకు సంతానం కలగకపోతే, నేను ఏవర్నడగవలసి ఉంటుంది, ఏదో ప్రతిబంధకం ఉంది సంతానం కలగట్లేదు ఇప్పుడు ఆ ప్రతిబంధకాన్ని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి నాకు సంతానం ఇవ్వండీ అని నేను ఎవ్వర్ని అడగాలి దేవతల్నే అడగాలి మీకు ప్రభుత్వం రెండుపన్లు చేస్తుంది, మీరు చూడండీ... ప్రభుత్వం సంక్షేమం చూడడం ఒకటే కాదు ప్రభుత్వం శిక్ష కూడా వేస్తుంది. ప్రభుత్వమే గ్రంథాలయం కడుతుంది, ప్రభుత్వమే పాఠశాల కడుతుంది, ప్రభుత్వమే కారాగారాన్ని కూడా నిర్మిస్తుంది, కారాగాలు బయటివాళ్లెవరూ నిర్వహించరు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఎందుకండీ ఆ కారాగారాలన్నీ దానిబదులు ఇంకో పాఠశాలపెట్టండని మీరు అనకూడదు. కారాగారం ఉంది కాబట్టి రక్షభట వ్యవస్థ ఉంది కాబట్టినేరప్రవృత్తి కలిగినవారివలన ఆపదపొందకుండా, మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగన స్థితి సమాజంలో ఉంది. శిక్షించడానికి వ్యయం చేస్తుంది. రక్షించి మిమ్మల్ని వృద్దిలోనికి తేవడానికీ వ్యయం చేస్తుంది ఎవరిని శిక్షిస్తుందో అది దారితప్పిన వాళ్ళని సన్మార్గంలోకి తేవడం ఒకెత్తుఆ శిక్ష వేయడం ద్వారా ఆ మార్గంలోకి వెళ్ళకుండా క్రమశిక్షణతో ఉన్నవాళ్ళని రక్షించడం ఒకెత్తు, కాబట్టి ఏమండీ మీరు పాఠశాలలే పెట్టండీగ్రంథాలయాలే పెట్టండీమీరు జైళ్ళు కట్టకండీ అని మనం అడక్కూడదు.
ఈశ్వరుడు కూడా అంతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, గత జన్మలలో మనం చేసినటువంటి పాప పుణ్యములు మనకు తెలియకపోవచ్చు. కాని జీవుడు చేసిన పాపాన్ని చూసేవాడు ఒకడున్నాడు వాడు ఇక్కడే కూర్చుంటాడు, చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు రాస్తాడు వాడే చిత్రగుప్తుడంటే... వాడన్నీ రాసుకుంటూ ఉంటాడు. వాడికి తెలియందేముందీ... వాడు దానికి ఫలితమిస్తాడు కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖదుఃఖాయోః నరాణాం పరతంత్రాణం పుణ్యపాపాను యోగతః అంటాడు వ్యాసుడు దేవీభాగవతంలో. కాల రూపంలో కాలః కలయతాం మహం అంటాడు గీతలో గీతాచార్యుడు, ఆయనే కూడికలు తీసివేతలు చేస్తుంటాడు ఇదిగో వీడికి గత జన్మలలో చేసుకొన్న పాప నివృత్తి కొరకు ఇప్పుడీ కష్టాన్ని ఇస్తున్నానంటాడు. అప్పుడు మీరు ఆ కష్టాన్ని అనుభవించవలసిందేఅందుకే మీరు జాగ్రత్తగా గమనించండీసనాతన ధర్మంలో మీ పాపానికి ఫలితమివ్వడానికి మిమ్మల్ని ఏడిపించడానికి ఒకడుమిమ్మల్ని సుఖపెట్టడానికి ఒకడుమిమ్మల్ని వాడు పట్టుకొని ఏడిపిస్తుంటే... వాన్నుంచి విముక్తి పొందడానికి మళ్ళీ భగవతున్ని ప్రార్థించడం ఇలా ఏం ఉండవ్ భయకృత్ భయనాశనః మిమ్మల్ని ఏవడు భయపెడుతాడో వాడే భయం పోగొడుతాడు మిమ్మల్ని ఏవడు ఏడిపిస్తాడోవాడే మిమ్మల్ని సంతోషింపజేస్తాడు రెండిటికి ఒకడే మీ కష్టమొచ్చినా ఈశ్వరుడేసుఖమిచ్చినా ఈశ్వరుడే.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
Related imageసనాతన ధర్మం మీద విశ్వాసమంటే ఏమిటో తెలుసాండీ! నాకు ఒక ఆపద వస్తే ఈశ్వరున్ని నిందించడం కాదు. నాకు ఒక ఆపద వస్తే నేను ఏ జన్మలలోనో ఏదో ఒక పాపం చేసివున్న కారణంచేత ఆ పాపము ఈనాడు అనుభవైదిక యోగమై నాకు ఈ కష్టం రూపంలో వచ్చింది కాబట్టి ఈశ్వరా! ఈ కష్టమును నేను భరించగలిగిన శక్తిని కృపజేయి. లేదా వేరొకసారి ఇటువంటి తప్పు చెయ్యకుండా నన్నునేను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని నాకు కృపజేయి. ఈ రెండుగా ప్రార్థన చేయడంలేదా నేనునూవ్వు నాకు కష్టమే ఇవ్వు నకేం బెంగలేదుకాని నాకు కావలసింది ఒక్కటే అది అనుభవించడంలో నీ పాదములయందు విస్మృతి కలగకుండా మాత్రం చూడు నిను సేవింపగ నాపదల్పొడమనీనిత్యోత్సవంబబ్బనీ నీ జనమాత్రుండననీ మహాత్ముండననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీమేలు వచ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా! అంటాడు ధూర్జటి. కాబట్టీ దేవతలని ప్రార్థన చేసి హవిస్సునిస్తేదేవతలు అనుగ్రహించి మీకు ఏది మనుష్య జన్మకు అత్యంత అవసరమైన కోరికోఏ పాపము అడ్డు వచ్చి మీ కోరిక తీరట్లేదో ఆ పాపాన్ని వారు క్షమిస్తారు. ఏమండీ మీరెన్నుకున్న రాష్ట్రపతి ఉరిశిక్ష పడినవాడికి క్షమాభిక్షపెడితే మనం అంగీకరిస్తున్నాముఅధికారమంటున్నాము. మీరు రాసుకున్న, మనం రాసుకున్న రాజ్యాంగాన్ని బట్టి అధికారమిచ్చిన రాష్ట్రపతి క్షమాభిక్షపెడితే ఒప్పుకుంటే... ఈ బ్రహాండములను సృష్టించినటువంటి సకల బ్రహాండములకు అధినాతుడైన ఈశ్వరుడు మీ పాపాన్ని క్షమించి మీ కోరిక తీరిస్తే అడుగగలిగిన మొనగాడెవడున్నాడు, వాడు సర్వతంత్ర స్వతంత్రుడు. కాబట్టి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆయన అనుగ్రహించగలడు దాన్ని నమ్ముతుంది వేదం, దాన్ని నమ్ముతుంది సనాతన ధర్మం అందుకు చేస్తాం యజ్ఞం అందుకు చేస్తాం యాగం.
కాబట్టి నీ వ్యక్తిగతమైన కోరవలసిన కోరిక తీరడానికి మీరు యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞయాగాదులు చేయడం వల్ల ఇక్కడ నీ కోరికలు తీరడం ఒకటిరెండూ పై లోకములలో స్వర్గలోక ప్రాప్తి దీని వలనే ఆధారపడి ఉంటుంది. కానీ స్వర్గలోక ప్రాప్తి అన్నది పుణ్యం ఉన్నన్నాళ్ళు ఉంటుంది. పుణ్యం అయిపోయిందా క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతీ మళ్ళీ కిందబడిపోతాడు. మూడవ ప్రయోజనం ఒకటుంటుంది అది ఏమిటంటే ʻఇష్టాపూర్తములుʼ అంటారు అంటే తనకు లోపలేం కోరికలేదుఅత్యుత్తమ మార్గమన్నమాట అది, లోపల ఏకోరికా లేదు ఎందుకు చేస్తున్నావ్ఏమీ కోరిక లేదుమరెందు చేస్తున్నావ్... ఈశ్వరుడు నాకు ఇవి ఇచ్చాడు కాబట్టి నేను ఇది చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను. అలా చెయ్యడం ఏదైతే ఉందో అటువంటి దానివలన చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధితో కూడినటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత జ్ఞానము ఆవిర్భవిస్తుంది ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మూడు ప్రయోజనములను సాధించుకొనుటకు యజ్ఞముయాగమూ లేదా ఈ ప్రక్రియ మీకు ఆధారభూతమై ఉంది సనాతన ధర్మంలో. ఇది మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఈ యజ్ఞ యాగాది క్రతువులన్నవి కనపడవు, ఇది సనాతన ధర్మము యొక్క సొత్తు. అలా హవిస్సును ఇవ్వడానికి కావలసినటువంటి మంత్రభాగాన్ని రూపకల్పనచేసి మనకు అందించినటువంటి ఋషులకు మనం ఋణపడిపోయాము. వాళ్ళా మంత్రము ఇచ్చి ఉండకపోతేయజ్ఞం చేయ్యడానికి మనకి అవకాశం లేకపోతే ఇవ్వాళ మనం ఈ సుఖాన్ని పొందలేము. కాబట్టి నేనెప్పుడు ఋషికి అప్పుపడ్డానండీ అని అడగడానికేంలేదు ఇక్కడ పుట్టుకతో నీకు ఋషి ఋణం ఉంది. అది తీరాలంటే ఏం చేయాలిఋషి రచించినది నీవు చదువుకోవాలి. నీకు నాలుగు మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం ఈశ్వరుడు ఇచ్చి ఉంటే, నాలుగు మాటలు చెప్పాలి. నేను మీ దగ్గర వంద రూపాయలు తీసుకొని తిరిగి వందరూపాయలు ఇచ్చేస్తేఎవ్వరూ దానికేం సత్కారమూ ఏం చెయ్యరుగాకోటేశ్వరరావు గారు పుచ్చుకున్న బాకీ వందరూపాయలు తిరిగి ఇచ్చారని సత్కారం చేస్తారా...

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
Related imageనేను వాల్మీకి మహర్షికి ఋణపడ్డాను పుట్టుకచేత, ఆ ఋణం ఇచ్చుకోవడానికి నేను రామాయణం చెప్పుకుంటున్నాను. నేను నా ఋణం నేను తీర్చుకొంటుంటే మీరు నాకు సత్కారం చేయడం దేనికీ... ఏం రామాయణం చెప్తే మీరు సత్కారం చేయాలా... నేను అప్పు తీరిస్తే మీరు సత్కారం చేస్తారా? చెయ్యరు. కాబట్టి ఎందుకు చెప్పుకోవాలి ఋషిప్రోక్తమైన విషయాలు అంటే, నేను నా అప్పు తీర్చుకోవడానికి చెప్పాలి మీరెందుకు వినాలి అంటేవిని మీ అప్పు మీరు తీర్చుకోవాలి. మన జీవితాలు దిద్దుకోవాలి అందుకొచ్చాయి ఇవన్నీ... కాబట్టి సనాతన ధర్మంనందున్న అచంచల విశ్వాసమునకు పరాకాష్ట యజ్ఞ సంకల్పము. ఆ యజ్ఞము జరగాలి అంటే నేను సంకల్పము చేస్తే... నేను చక్రవర్తిని గనుకానేను మహారాజును గనుకా, నాకు ఐశ్వర్యముంది కనుకాజరిగిపోతుందనుకోవడం అవివేకం. అంతటి క్రతువుజరగాలి అంటే పైన ఒక మహారుపుషుడు ఒకడు ఉండాలి ఆయన సంకల్పము ఉండాలి ఆయన ఆశీర్వచనం ఉండాలి ఆయన వచ్చి అక్కడ కూర్చొని ఉండాలి. ఆయన తపస్సు చేతఆయన అక్కడ తిరుగుతున్న కారణం చేతసమస్త ప్రతిబంధకములు తొలగిపోతాయి తొలగిపోయి కార్యం నిర్విఘ్నంగా జరిగిపోతుంది ఇది జరగడానికి అంతటి మహా పురుషుడు రావడం ఏదీ కోరిరాడు. మీరు చెయ్యడానికి ద్రవ్యముంటుందేమోచెయ్యడానికి సంబారాలుంటాయోమోఆయన రావడానికి మీరు ఇచ్చేది ఏమీ ఉండదు ఎందుకంటేఆయన మీ దగ్గర కోరి పుచ్చుకునేది ఏమీ ఉండదు. కాబట్టి ఎందుకొస్తాడు ఋష్యశృంగుడు ఒక్కదానికే వస్తాడు, ʻవినయంʼ చేత వస్తాడు మీరు చేసే ఘటించే అంజలి చేత వస్తాడు ఇది చూపిస్తోంది శ్రీ రామాయణం. రామాయణం కేవలం దశరథుడు చేసిన యజ్ఞం అని వినకండీ... అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని మనం గ్రహించగలిగిన నాడుపెద్దల పట్ల మనం ఎందుకు వినయంతో ఉండాలిదేనివలన మనం ఉపకారం పొందుతున్నాం అని తెలుసుకొన్ననాడుమనం వాళ్ళకి ఎంత ఋణ పడ్డామో మనం ఎంత జాగ్రత్తగా పెద్దల పట్ల మసలవలసి ఉంటుందో మనకు అవగతం అవుతుంది.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఆ వశిష్టాది మహర్షుల్ని పిలిచాడు, పిలిచి యజ్ఞోమే క్రియతాం బ్రహ్మన్యథోక్తం మునిపుఙ్గవ ! యథా న విఘ్యః క్రియతే యజ్ఞాఙ్గేషు విధీయతామ్ !! ఇది సనాతన ధర్మము యొక్క అంతర్భాగము ఇదీ... రామాయణం అంటే, మనింట్లో పెళ్ళి జరుగుతుంది, పెళ్ళికి బ్రహ్మస్థానంలో ఒకాయన్ను కూర్చోబెడుతాం. ఊళ్ళోవున్న వాళ్ళందర్నీ ఇంటింటికి వెళ్ళి బొట్టెట్టి పిలుస్తాం. బ్రహ్మ స్థానంలో ఎవరు కూర్చొంటున్నారో ఆయన ఇంటికి వెళ్ళి పంచల చాప ఇచ్చి అయ్యా! మీరు నా కూమార్తె వివాహానికి బ్రహ్మస్థానంలో కూర్చొని నాచేత కన్యాదానం చేయించి దశ పూర్వేషాం దశాపరేశాం నా ముందు పది తరాలు నా వెనక పది తరాలు తరించి పోయేటట్టుగా నిర్విగ్నంగా సంకల్పిక కార్యం వైదికంగా పూర్తయ్యేటట్టు నన్ను అనుగ్రహించి మీరు గురుముకతహా నేర్చుకున్న మంత్ర భాగం చేత నన్ను తరింపజేయ్యండి, అని ఇంటికి వెళ్ళి నమస్కరించి బట్టలు పెట్టి నువ్వు ఆహ్వానించావా... అదీ ముందు చెయ్యవలసిన పని ఏమైనా ఉంటే... పెద్దలను ముందు ఆశ్రయించి వాళ్ళని ఆహ్వానించాలి. దశరథుడు ఇది అడుగుతున్నాడుసంకల్పం నాది విజ్ఞము ఇవ్వగలిగిన శక్తి ఈశ్వరునిది. సంతానం కలగకుండా వచ్చిన విజ్ఞం యజ్ఞం జరుగకుండా రాదేంటండీ. ఎందుకు రాదుఎవరివలన రాదు అంటే... ఏ మహా పురుషుడు వచ్చి అక్కడ కూర్చుంటే రాదో ఆయన వచ్చికూర్చోవాలి ఇప్పుడు. ఆయన వచ్చి కూర్చోవాలంటే... వినయంతో నమస్కారం చేసి అడగాలి మీరెందుకు కూర్చోవాలో తెలుసా... మంత్రాలు నేర్చుకున్నారు కాబట్టి కూర్చోడం కాదు, కూర్చుంటే చాలు విజ్ఞం లేకుండా నడుస్తుంది ఇది మీరు అడగవలసింది నేర్పుతోంది మనకు శ్రీ రామాయణం. ఎంత గౌరవంగా మాట్లాడాలో ఆ వైదిక నిష్ట ఉన్న వారిపట్ల, ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో... మనకి శ్రీ రామాయణం నేర్పుతుంది.
Image result for king dasharathaకాబట్టి యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ బ్రహ్మన్- ఓ బ్రహ్మమును తెలిసినవాడా... మహానుభావా వశిష్ట మహర్షీ, మీరు ఈ యజ్ఞ కార్యాన్ని నిర్వహింపజేయండి యథోక్తం మునిపుఙ్గవ ఉప్తం ఎలా చెప్పబడిందోఎలా చెయ్యాలని చెప్పబడిందో అలాగే నిర్వహించండి. అలాగే నిర్వహించండి అంటే... నేనండీ అది తెప్పించేశానునేనండీ ఇది తెప్పించేశాను అని నువ్వు ముందు చెప్పడం కాదు ఎలా జరగాలో అలా జరిపించండి అని అడగండి. అప్పుడు ఆయనా ఇవన్నీ తెప్పించాలి అప్పుడు మీరు పిలిచీమీ సేవకులనోమంత్రులనో ఇవన్నీ తెప్పించండి అనాలి. నేను ఇవన్నీ తెప్పించాను అని మీరెల్లి చెప్పారనుకోండిఅప్పుడు ఆయన ఎందుకింకా... అంటే మాటలో గౌరవం ఒక స్థానం దగ్గరికెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో శ్రీ రామాయణం బాగా చదువుకొంటే... మీరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా తప్పా, మీరు ఇంకోలా మాట్లాడలేరు. కాబట్టి చూడండీ యథోక్తం మునిపుఙ్గవ యథా న విఘ్నః క్రియతే యజ్ఞాఙ్గేషు విధీయతామ్  యజ్ఞమునందు అంగములు ఉంటాయ్ఈ అంగములన్నీ ఏ విజ్ఞమూ రాకుండా జరిపించి నన్ను కృతార్తుడని చెయ్యవలసింది.
ఏమి? నేనెందుకు చేయించాలి?... నేను తపస్సు చేసుకొంటున్నానునేనేదో ప్రశాంతంగా కూర్చుందామనుకుంటున్నాను. నాకెందుకయ్యా ఇవన్నీనీకు బిడ్డలు లేకపోతే ఒక ఆశీర్వచనం చేయించుకో అనచ్చుగా వశిష్టుడు. అలా వశిష్టుడు అనకుండా ఎందుకురావాలో చెబుతున్నాడు దశరథ మాహారాజుగారు భవాన్ స్నిగ్ధస్సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్ ! ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండీభగవాన్ స్నిగ్ధః స్నిగ్ధః అంటే ఆ ఇంగ్లీషులో అయితే... bein sticky అంటుకొని ఉంటుందంటారు చూడండి. అంటుకొని ఉండడం అంటే ఎమిటండి? మనసులో జ్ఞాపకంలో ఉండడం మహాత్ముల యొక్క మనస్సులోమహాత్ముల యొక్క స్మృతిలో మీరు ఉండడం, మీ అదృష్టమనుకు హేతువు. ఎందుకో తెలుసాండీ... వాళ్ళు పరిచయాలు కోరుకోడానికి దూరంగా ఉంటారు. ఏదో పెద్ద ఊరికే చాలా మందితో పరిచయాలు పెట్టేసుకొని చాలా మందితో మాట్లాడేసి చాలా మందితో ఇన్ఫ్లూయన్స అనే దిక్కుమాలిన మాట ఉంటుంది. అలాంటి వాటి కోసం వెంపర్లాట ఉండదు. సర్వతంత్ర స్వతంత్ర అభిరాజధానీ విధ్యనగర రాజధానీ మీరు విన్నారు ఇప్పుడు గురు స్తోత్రంలో. సర్వతంత్ర స్వతంత్ర అంటే ఏమిటో తెలుసాండీ... గురువుకు చెల్లుతుంది ఆ మాట. గురువుకి కూడా అందురు ఒక్క స్థాయిలో ఉండరు సర్వతంత్ర స్వతంత్ర అంటే... మీకు ఒక ఉపకారం చెయ్యాలి అని అనుకొంటే... మళ్ళీ ఇంకోళ్ళని పిలిచీ ఏమోయ్ ఆయనకి ఓ యాభై రూపాయలు ఇద్దామనుకుంటున్నాను యాభై అడిగి పుచ్చుకోవడం సర్వత్యంత్ర స్వాత్యంత్రతా కాదు. సర్వత్యంత్ర స్వాత్యంత్రతా అంటే తను సంకల్పం చేస్తే తనకు తాను సమకూరాలిఈశ్వరానుగ్రహముతో ఆయన ఇలా చెయ్యి చాపడు ఆయన ఇలా అసలు ముట్టుకోడు ఆయన సంకల్పం చేస్తాడు అది వస్తుంది.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
కంచి కామకోటి పీఠాధిపతులు మహానుభావుడు చంద్ర శేఖర పరమాచార్య నడిచే దేవుడని పేరు, ఆయన దగ్గరకొచ్చి ఓ పేద కుటుంబం అడిగింది మాకు బంగారు కాసులు ఇన్ని కావాలి వివాహం చేసుకోడానికని ఆయనేం అనలేదు అలాగే కూర్చున్నారు. ఓ పద్దెనిమిది బంగారు కాసులు కావాలి నాకు జ్ఞాపకమున్న లెక్కలో అయితే... ఆయన అలా విన్నారు ఏమి అనలేదు. అలాగే కూర్చున్నారు వాళ్ళు, కాసేపయ్యింది, భగవన్ మేము వెళ్ళిపోతున్నాము మీ దర్శనం కోసం వచ్చాము ఈ 18 బంగారు కాసులు మీరు స్వీకరించవలసింది ఐశ్వర్యవంతుడు వచ్చి ఆ బట్టమీద వేశాడు. ఆయన సత్య దండంతో ఇలా తోశారు అడిగినవాడికి తీసుకో అన్నారు. ఆయనా వారు అడుగగానే ఆయన కామాక్షి అమ్మవారిని అడిగాడు కామాక్షి అమ్మవారు ఆయన్ని పంపించారు అది సర్వతంత్ర స్వతంత్ర. శంకర భగవత్ పాదులు ఒక వృద్ధ బ్రాహ్మణికీ... ఐశ్వర్యమివ్వాలనుకున్నారు ఆయన మళ్ళీ ఎవరిదగ్గరికో వెళ్ళి మళ్ళీ డొనేషన్లు అడగలేదు. ఆయనా...
ముగ్దా మహుర్విదధతీ వదనే మురారేః - ప్రేమ త్రపాప్రణిహితాని గతాగతాని !
మాలా ధృశోర్మధుకరీవ మహూత్పలే యా-సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః !!
దిగ్ఘస్తిభిః కనకకుంభముభావనృష్ఠ స్వర్వాహనీవిమలచారుజలప్లుతాంగీమ్ !
ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ !!
Related imageఒక్క స్తోత్రం చేశారంతే... బంగారు ఉశిరికలు కురిశాయి వారికి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. అలా ఈశ్వరుడు పాదములుపట్టి ఏదైనా సంకల్పం చెయ్యగలిగిన సమర్థతకి సర్వతంత్ర స్వతంత్ర. వశిష్టుడు అటువంటివాడు అటువంటి వశిష్టుడు దేనికొరకువచ్చి, మీ కొరకువచ్చి కూర్చుంటాడు. ఇప్పుడాయన వచ్చి కూర్చున్నాడనుకోండీ...  లోపలోటి బయటోటి ఉండదు త్రికరణ శుద్దిఅది జరగాలనే వస్తాడు ఆయన. ఆయన వచ్చాడంటే అయిపోయిందంతే... ఆ పనైపోయింది కొడుకులు పుట్టేస్తారు ఏమిచ్చి ఋణం తీర్చుకుంటావు గురువుకి. కాబట్టి ఆయన అంటున్నాడు ఎందుకురావాలో తెలుసా భగవన్ మీరూ... ఒక్కటే కారణం భవాన్ స్నిగ్ధః మీకు మాకు ఒక అనుబంధముంది మీ మనసులో మమ్మల్ని స్మరిస్తూ ఉంటారు పురోహితులుగామా హితం కోరుతారు మా వంశం బాగుండాలని కోరుతారు మా పేరు మీకు జ్ఞాపకంలో ఉంటుంది ఎప్పుడూ మమ్మల్ని తలుచుకుంటుంటారు అలా మీ మనసులో మేముండడం మా అదృష్టహేతువు ఇంకా అంతకన్నా ఏం కావాలి అందుకు అడుగుతున్నాను ఆ చెలిమి చేతఆ చనువుతో అడుగుతున్నాను భవాన్ స్నిగ్ధస్సుహృన్మహ్యం మీరు గొప్ప సృహత్  మా యందు అపారమైన కృపకలిగినవారు మాకు చాలా దగ్గరైనటువంటివారు గురుశ్చ పరమో మహాన్ మహాన్ బ్రహ్మమును తెలుసుకొన్నటువంటి అద్భుతమైన వ్యక్తిత్వమున్నవాడివి. మాకు గురువులు మహానుభావిడివి ఓడవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య జోద్యతః ఈ యజ్ఞ భారాన్ని స్వీకరించి మీరు ఈ యజ్ఞాన్ని జరిపించాలి కూర్చొని.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
పొంగిపోయాడంతే... ఆయన అన్నాడూ తథేతి  చ స రాజానమబ్రవీద్ద్విజసత్తమః ! కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితమ్ !! నాయనా నువ్వు ఏలాగ కోరుకొన్నావో అలా ఈ కార్యాలన్నింటినీ నెరవేరుస్తాఅలా ఈ యజ్ఞం జరుగుతుంది నీ కోరిక సఫలం అవుతుంది. అయిపోయింది అంతేనండీ ఇంకా...  ఇంకేమిటి జరగాలంటే... అశ్వమేధ యాగం జరిగిందనేటటువంటి కర్మ కాలంలోభూత కాలంలో ఎప్పుడో భవిష్యత్తులో జరుగవలసినది వర్తమానంలోకి వచ్చి భూతకాలంలోకి జరిగిపోయినదిగా మారాలంతే... ఒక సంఘటనగా... ఇక దశరథ మహారాజుగారికి కుమారులు పుట్టడం అనేటటువంటిది తథ్యం. ఎందువల్లా అంటే ఒక్కటే కారణం గురువుగారి యొక్క సంకల్పం. గురు సంకల్పం ఎంత గొప్పదో నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన దగ్గరనుంచీ గురువైభవాన్ని శ్రీ రామాయణం కీర్తిస్తోంది, ఇది మీరు గుర్తు పట్టండి. ఎందువల్ల గురువు గొప్పవాడోగురు వైభవమేమిటో ఈ దేశంలో గురువుకి ఎందుకంత గౌరవమో గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుద్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ఆ గురువుకి నమస్కరించకుండా ఏదీ ఎందుకు చెయ్యమో మనకు చూపిస్తోంది శ్రీ రామాయణం కాబట్టీ నేను అలాగే నిర్వహిస్తాను అయ్యా అన్నాడు.
http://1.bp.blogspot.com/-HgyQ7pndfog/VAw9isQDuCI/AAAAAAAAvkE/RLl99Ir-3Ak/s1600/downloffead.jpgఇప్పుడు గుఱ్ఱాన్ని విడిచి పెట్టారు ఇది ఒక సంవత్సరం పాటు దేశమంతటా తిరుగుతోంది. ఈ గుఱ్ఱం తిరిగినప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపకూడదు ఎవరైనా ఆపారనుకోండి అప్పుడు వారు యుద్ధానికి పిలిచినట్లు అప్పుడు దశరథ మహారాజు గారు వారిని ఓడించి,  గుఱ్ఱాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అప్పటి వరకు గుఱ్ఱం తిరిగి వచ్చేవరకు యాగశాలా ప్రవేశం చెయ్యరు దంపతులు. కానీ ఈ లోపల సంవత్సరం పాటు కొన్ని కార్యాలు జరుగుతుంటాయి. ఈ దీక్ష జరిగిన దగ్గర్నుంచీ సాంగ్రహ నేష్టీ,  ఆ మరునాడు బ్రహ్మవుదనమేధాశ్వ బంధనా  స్నాపనా  ప్రోశ్చణా  విమోచనాది కృత్యములూ ప్రతిరోజూ సావిత్రాది కర్మలూఇవన్నీ కూడా యజ్ఞంలో అంతర్భాగంగా ఋత్విక్కుల చేత అనుష్టించబడుతుంటాయి. ఒక సంవత్సరం గడిచిన తరువాత అప్పుడూ యజ్ఞ శాలలోకి దంపతులు ప్రవేశిస్తారు ఆ గుఱ్ఱం తిరిగి వచ్చేసిన తరువాత. ఈ లోగా యజ్ఞం జరుగుతున్నంత కాలమూ అన్నదానం జరుగుతుంటుంది. యజ్ఞం జరుగుతున్నంతకాలమూ అన్ని దేశాలనుంచీ అందరూ వస్తూ ఉంటారు. ఒక యేడాది కాలంపాటు అన్నం పెట్టాడు వచ్చిన వాళ్ళందరికి తతోబ్రవీ ద్విజాన్వృద్ధాన్యజ్ఞకర్మసు నిష్ఠితాన్ ! స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్పరమధార్మికాన్ !!  చెప్తున్నాడు మత్రుల్ని పిలిచి ఆ వశిష్టుడి సమక్షంలోనే చెప్తున్నాడు. 

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి మనం, కాబట్టి ముందు ఎవరెవర్ని తీసుకొస్తారో తెలుసా... ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యం మీద శ్రద్ధా అంటేఆ కార్యం గురించి సమర్థవంతమైన ప్రణాళిక ఒకటి ఉండాలి. దేనికి ఏది అవసరమో దాన్ని సిద్దం చేసుకోవాలి. అసలు అది సిద్దం చెయ్యకుండాఉట్టి పటాటోపం ఎక్కువానూకార్యం తక్కువా ఉంటేదానియందు శ్రద్ధ ఉన్నదీ అని చెప్పడం కష్టం. ఆయన అన్నాడు వృద్దులైనవారు ఇతఃపూర్వము యజ్ఞ కర్మలు చేసినటువంటివారు వాస్తు బాగాతెలిసున్నటువంటివారు పరమ ధార్మికులైనటువంటివారు ఎక్కడున్నారో వారందర్నీ తీసుకురండి కర్మాన్తికాన్ శిల్పకరాన్వర్ధకీన్ ఖనకానపి ! గణకాన్శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్ !!  మీరు కార్మాన్తికాన్ కార్యాన్ని నిర్వర్థించ గలిగినటువంటి సమర్థులుంటారు. ఇప్పుడూ బోలెడంత మంది పనిచేస్తూండవచ్చు కానీ దీన్ని సమన్వయం చేసేవాడు ఒకడు ఉండాలి ఈ సమన్వయం చేయ్యగలిగినటువంటి వారిని తీసుకురండి శిల్పకరాన్ బోలెడన్ని ఇళ్ళుకట్టాలి వచ్చినవారందరికినీ... తాత్కాలిక ప్రాతిపథిక మీద అతిథి గృహనిర్మాణం చేపట్టాలి. కాబట్టి ఇటుకలను తయారు చేసేవారిని తీసుకురండి వర్థకీన్ వడ్రంగులని తీసుకురండి ఖనకానపీ భూమిని తవ్వేటటువంటి శక్తి ఉన్నటువంటి సమూహాలని తీసుకురండి గణకాన్ లెక్కలను రాసేవాళ్ళని తీసుకురండి శిల్పినచ్చైవ శిల్పాలను చెక్కెవారిని తీసుకురండి తథైవ నటనర్తకాన్ నటులను నటీమనులను తీసుకురండి. 
ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలండోయ్! నటీ నటులు అన్నమాట వాడారుగదా రామాయణంలోననీ నటులూనటీమనులూ వేర్వేరు కాదు, అంటే నటుడు భర్త అనుకోండి నటి భార్యయై ఉంటుంది తప్పా, భార్యా స్థానంలో వేరొక ఆడది వచ్చి నటించడమన్నది ధర్మ విరుద్ధం దాన్ని శాస్త్రం అంగీకరించదు అంతకన్నా ధూశ్యం ఇంకోటి లేదు. కాబట్టి అసలు వేరొకరి భార్యా స్థానంలోకి వచ్చి నటన చేయడాన్ని అంగీకరించరు, పురుషుడు స్త్రీ పాత్ర వేయడాన్ని ధర్మశాస్త్రం అంగీకరించరు పురుషుడు స్త్రీ పాత్ర వేయ్యడు. స్త్రీ పాత్రలోకి పర స్త్రీ వచ్చి నటించదు కాబట్టి భార్యా భర్తలుగా నటించవలసి వస్తే... దంపతులే నటిస్తారు తప్పాఅన్యులు నటించడాన్ని ఒప్పుకోరు కాబట్టి నటసంఘములనేవి ఉండేవి అందులో దంపతులే ఉండేవారు వేరే వాళ్ళు ఉండేవారు కాదు ఎప్పుడైనా దంపతుల పాత్ర పోషించవలసివస్తే అటువంటి సంఘములను తీసుకొని రండి తథా శుచీన్శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్ ! యజ్ఞకర్మ సమీహన్తాం భవన్తో రాజశాసనాత్ !! శుచీన్శాస్త్రవిదః శాస్త్రము తెలిసున్నవాడుతెలిసున్న శాస్త్రమును అనుష్టించేటటువంటి వాడు పురుషాన్ సుబహుశ్రుతాన్ అనేక విషయాలు పెద్దలు దగ్గర విన్నవాళ్ళు, వీళ్ళందర్ని తీసుకురండీ ʻస్రుక్కులు స్రువాలుʼ అని ఉంటాయ్యజ్ఞంలో నెయ్యి మొదలగు ఆజ్యధార పోయడానికి ఉపయోగించే పరికరాలు ఈ పరికరాలన్ని తయారుచేసే వారందర్నీ తీసుకురండి.
వీళ్లందరితోపాటుగా ప్రతీ రోజూ సంవృద్ధిగా అన్నదానం చెయ్యాలి ఎంత అన్నదాం చెయ్యాలో తెలుసా! వచ్చిన వాళ్ళందరూ అన్నం తినాలి. వచ్చిన వాళ్ళందరూ అన్నం తినడమూ అంటే... పౌరులొస్తారుజానపదులొస్తారు. పౌరులూ అంటే నగరాలలోనూ పట్టణాలలోనూ ఉండేవారు కొంచెం డాంభికంగా ఉంటారు. జానపదులు పల్లెటూళ్ళ నుంచి వస్తారు. జానపదులు అమాయకంగా ఉంటారుకొంచెం భయం భయంగా ఉంటారుఅమ్మో వాళ్ళు అలా ఉన్నారువాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమే... వాళ్ళతో మనం కూర్చోవడమే... వాళ్ళతో మనం మాట్లాడడటమే... అని వాళ్ళని చూసి కొంచెం చిన్న బుచ్చుకొని భయ భక్తులతో పక్కకి పక్కకి జరుగుతూ ఉంటారు. పౌరులూ వస్తారు జానపదులూ వస్తారు యజ్ఞం చూడడానికి ముందెవరి

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
వియషయం జాగ్రత్త తీసుకోవాలో తెలుసా... ఇది ప్రేమంటేఆలోచనా అంటే ఇది. ఎంత పెద్దమాట చెప్పాడో చూడండి దశరథ మహా రాజు గారు తథా జానపదస్యాపి జనస్య బహుశోభనమ్ ! దాతవ్యమన్నం

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
విధివత్సత్కృత్య నతు లీలయా !! మనం జానపదులేగా... అన్నం తింటున్నారుగావాళ్ళు చూడడండీ మనలో కొంతమంది ఒక మాట మాట్లాడుతుంటారు వాళ్ళ భోజనానికి అవన్నీ అక్కర్లేదండీఒక కూరా, పులుసు, పచ్చడీ చాలూ... వాళ్ళు ఏంటంటే ఎక్కువ అన్నం పులుసువేసుకు తినేస్తారు అంటారు న తు లీలయా దశరథుడు అన్నాడూ... చాలా తేలికగా మాట్లాడకండీ.
Related imageఅన్నం పెట్టడం ఎంత అవసరమోఅన్నం ఆదరంగా పెట్టడం అంత అవసరం ఆదరంగా పెట్టండి పెట్టిన అన్నం, పలకరిస్తూ పెట్టండిసంవృద్ధిగా పెట్టండికడుపునిండా పెట్టండిప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాంవాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్న బుచ్చుకొనేటట్లు అన్నం వడ్డించకండి. అలాగే సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువన్తి సుసత్కృతాః ! న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి !! అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనం చేస్తుంటారు. కామమునకు క్రోధమునకు వశపడీప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి సన్నివేశములు లేకుండా జాగ్రత్తపడండి కోప్పడ్డంకేకలేయడందెబ్బలాడ్డం ఇలాంటివేవీ జరక్కూడదు. నాకైతే అనిపిస్తుందీ... శ్రీ రామాయణంలో బాల కాండలో అన్నదానం ఎలా చెయ్యాలో దశరథ మహా రాజు గారు చెప్పినటువంటి ఈ అంశాల్నీ... పెద్ద పెద్ద దేవస్థానంలో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళను పిలిచీ... వాళ్ళకి ఈ పాఠాల్ని చెపితే బాగుండననిపిస్తుంది. టోకెన్లు ఇస్తూ విసుగుకోవడంవచ్చిన భక్తుల మీద విసుక్కోవడంఇంకొంచెం అన్నం పెట్టండంటే విసుక్కోవడం.
నేను అన్ని దేవస్థానంల గురించి మాట్లాడటం లేదు ఎవరు ఈ లోపంతో ఉన్నారో వాళ్ళు దిద్దుకోవాలి మేము పెడుతున్నాం వాడుతింటున్నాడు కాదు. వాడికిపెట్టే అదృష్టం మనకుకలిగిందని పెట్టేవాళ్ళని అక్కడపెట్టాలి ఎవడో ఒకన్ని అక్కడ పెట్టామని పెట్టకూడదు సమర్థతని గుర్తెరిగి పెట్టాలి కాబట్టీ సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువన్తి సుసత్కృతాః ! న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి !! దీంతో పాటుగా మీరు అనేక మంది రాజులని ఆహ్వానించాలి ఆహ్వానించేటప్పుడు కొంతమందికి శుభలేఖ పంపించాలి కొంత మందిదగ్గరికి మీరు వ్యక్తిగతంగా వెళ్ళాలి వెళ్ళి ఆహ్వానించి తీసుకురావాలి. ఎవరిదగ్గరికి సుమంత్రుడానీవు వ్యక్తిగతంగా వెళ్ళి తీసుకురావాలో తెలుసా... మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్ ! నిష్ఠితం సర్వాశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితమ్ !! కొంత కొంత మందిని మహానుభావుల దగ్గరికి ఇంటికివెళ్ళి ఆహ్వానించి వెళ్ళాలి అలా ఎందుకు పిలవాలో చెపుతున్నాడు. ఆయనకు డబ్బులున్నాయి గదా కాబట్టి ఇంటికెళ్ళండని చెప్పడం లేదు మిథిలాధిపతి శూరం మిథిలాధి పతియైనటువంటి జనక చక్రవర్తి ఇంటికి వెళ్ళి పిలవండి జనకం సత్యవిక్రమమ్ ఆయన రాజ్యానికి వెళ్ళి ఆహ్వానించి రథమెక్కించుకుని తీసుకురండి నిష్ఠితం సర్వాశాస్త్రేషు అన్ని శాస్త్రములు తెలిసున్నవాడు తథా వేదేషు నిష్ఠితమ్ వేదములయందు నిష్ఠ కలిగినటువంటివాడు తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినమ్ ! వయస్యం రాజసింహస్య స్వయమేవాఽఽనయస్వ హ !! మహానుభావుడైనటువంటివాడు కాశీరాజు ఉన్నాడు స్నిగ్ధం మాకు బాగా స్నేహితుడు కాబట్టి వెళ్ళి ఆయన్ను దగ్గరుండి తీసుకురండి తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్ ! శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహాఽఽనయ !! అలాగే కేకయ రాజు వృద్ధుడు మాకు మామ గారు ఆ వృద్ధుడైనటువంటి కేకయ రాజు గారిని పుత్రులతో కలిసి తీసుకురండి రథమెక్కించి.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
అఙ్గేశ్వరమ్ మహాభాగం రోమపాదం సుసత్కృతమ్ ! వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినమ్ !! అంగ రాజ్యమునకు అధిపతి అయినటువంటి రోమపాదుడు పరమప్రీతితో దశరథ మహారాజు గారికి సంతానం లేదని యజ్ఞం చేయిస్తుంటే, తన అల్లుడైన ఋష్యశృంగున్నికూతురైన శాంతని పంపించాడు. కాబట్టి వెళ్ళి ఆయనను కూడ సుహృత్ మంచి

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
స్నేహితుడు దగ్గరుండి తీసుకురండి ప్రాచీనాన్సిన్ధు సౌవీరాన్సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్ ! దాక్షిణాత్యాన్నరేన్ద్రాంశ్చ సమస్తానానయస్వ హ !! ప్రాచీనమైనటువంటి సింధు, సౌవీర రాజ్యములను పరిపాలించేటటువంటి వాళ్ళనిసౌరాష్ట్రమును పరిపాలించే వారినిదక్షిణ దేశంలో ఉండేటటువంటి రాజుల్ని వీళ్లందర్నీ కూడా దగ్గరుండి ఆహ్వానించి తీసుకొనిరండి అని మిగిలిన వాళ్ళకి ఎవరెవరికి ఆహ్వానాలు పంపాలో ఎంతమంది రాజులు రావాలో అన్ని విషయాలూ చెప్పాడు.
ఈలోగా అందరూ వస్తున్నారుసంభారాలన్నీ వచ్చేశాయ్యజ్ఞం జరుగుతోందిసంవత్సరమంతా జరుగవలసిన కార్యక్రమమంతా జరుగుతోంది. ఒక సంవత్సరం పూర్తైపోయింది యజ్ఞాశ్వం తిరిగి వచ్చేసింది అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ప్రాప్తే తురఙ్గమే ! సరయ్వాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత !! సరయూ నదికి ఉత్తర దిక్కున కట్టినటువంటి యజ్ఞశాలలో ఈ అశ్వమేధ యాగం ప్రారంభమౌతోందివిడిచి పెట్టినటువంటి గుఱ్ఱం తిరిగి వచ్చింది న చాహుతమభూత్తత్ర స్ఖలితం వాపి కిఞ్చన ! దృశ్యతే బ్రహ్మవత్సర్వం క్షేమయుక్తం హి చక్రిరే !! అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలోఈ కార్యక్రమం చెయ్యడానికి మనదగ్గర సంభారాలు లేవనికానిఈ కార్యక్రమానికి చెయ్యడానికి తగిన సమర్థులు మన దగ్గర లేరనికానిలేకపోతే ఈ కార్యక్రమం చెయ్యకుండా దానికి బదులుగా ఈ కార్యక్రమం చేద్దామనికాని చెయ్యకుండాఅన్ని కార్యాలూ యధోక్తంగా యధా శాస్త్రంగా ఏ సంభారాలతో ఎలా నిర్వహించాలో అలాగే ఆ క్రతువంతటినీ నిర్వర్తించారు. అలా జరిగేటట్టుగా వసిష్టాది మహర్షులు ఆయా స్థానములందు కూర్చొని కార్యక్రమాన్నంతటినీ నడిపిస్తున్నారు. వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా శాస్త్రములు చదువుకొన్నవారు అందరూ కూడా గొప్ప ప్రావీణ్యము కలిగినటువంటివాళ్ళు, కొద్దిగా అవకాశం దొరికితేచాలు శాస్త్రచర్చ చేసుకొంటూ తమ యొక్క అభివృద్ధికి తమకితాము పాటుపడేటటువంటి ఉత్సాహమున్నటువంటివారు ఇటువంటి వారందరూ వచ్చారు.
ఆ సోమ లతనీ బాగా అరగదీశారు దాట్లోంచి ఆ వచ్చినటువంటి ద్రవాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చారు. ఇంద్రుడు ప్రీతి పొందేటట్టుగా చక్కగా ఆ కార్యానంతటిని, యజ్ఞాన్నంతటినీ నిర్వహించారు బ్రాహ్మణా భుఞ్ఙతే నిత్యం నాథవన్తశ్చ భుఞ్ఙతే ! తాపసా భుఞ్ఙతే చాపి శ్రమణా భుఞ్ఙతేతథా !! శ్లోకాలు మీరు గమనించాలి ఎంతందమో చూడండి బ్రాహ్మణా భుఞ్ఙతే నిత్యం బ్రాహ్మణులు భోజనం చేశారట, ఎంత మంది కొన్ని లక్షల మంది నాథవన్తశ్చ భుఞ్ఙతే అంటే నాధులున్న వాళ్ళు భోంచేశారటనాధులున్న వాళ్ళు భోజనం చేయడమంటే... దాసులు ఒకరి దగ్గర పని చేసేటటువంటి సేవకులు కూడా కొన్ని వేలమంది భోజనం చేస్తున్నారు తాపసా భుఞ్ఙతే చాపి తాపసులు కూడా అక్కడి వచ్చి భోజనం చేస్తున్నారు శ్రమణా భుఞ్ఙతేతథా సన్యాసులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. ఎందుకు ఈ శ్లోకం ఇలా అంటే... ఒకరికి పెట్టేది భిక్ష, సన్యాసులు చేసేటటువంటిదీ ఒకలా ఉంటుందిబ్రాహ్మణులు చేసేది ఒకలా ఉంటుంది, నాగరికులందరూ చేసేది ఒకలా ఉంటుంది, అందర్నీ ఒకచోట కూర్చో పెట్టి వడ్డించడం కుదరదు. ఎందుకంటే ఒక సన్యాసి తీసుకునేటప్పుడు రుచి గురించి ఆయనకు ప్రమేయం ఉండదు ఆయనకు ఏది పెడితే అది కేవలం ఆ కడుపునిండడానికి యజ్ఞ ప్రసాదంగా తినివెళ్ళిపోతారాయన.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఎవరికి ఏ మర్యాదతో ఏలా వడ్డించాలో అలా వడ్డించడం చేత ఆ కార్యమునందు శ్రద్ధకలిగి వడ్డించడమునందు నేర్పరులైన పెద్దల యొక్క గౌరవానికీ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి వారి మర్యాద నిలబెట్టడానికి వాళ్ళు చేసే భోజనంపట్ల కూడా అంతశ్రద్ధ వహించిన ధశరథుని యొక్క ధర్మ నిరతికి, ప్రీతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేశారు. శభాశ్ఎంత గొప్ప అన్నం పెట్టాడురా... అన్నారు. కడుపుకి అన్నం పెట్టలేదుమనసు సంతోషించేటట్లు అన్నం పెట్టాడు. మాకు ఎలా పెట్టాలో అలా పెట్టాడు అది నియమం. ఆ ఏర్పాటు చెయ్యడంలో కృతకృత్యుడయ్యాడు దశరథ మహా రాజు గారు వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ ! అనిశం భుఞ్ఙమానానాం తృప్తిరుపలభ్యతే !! వృద్ధులైనటువంటివారూ అక్కడికి వచ్చి తిన్నారు, స్త్రీలు తిన్నారు, బాలురు తిన్నారు ఎంత మంది తిన్నారో లక్షల మంది తిన్నారు. ఇంత మంది అన్నం తింటూంటే... కుండలములు పెట్టుకున్నటువంటి వాళ్ళ, మంచి బట్టలు కట్టుకున్నటువంటి వాళ్ళు, సహాయం చేస్తూండగా ఇంకా తినండీఇంకా తినండీ, కొంచెం పెరుగు పోసుకోండీఇంకో అప్పడం వేసుకోండీఈ బూరె వేసుకోండిఈ గారె వేసుకోండి, ఈ అన్నం తినండీ ఏమీ ఈ ఇది ఇంకా బాగుంది, కొంచెం రుచి చూడండీ... ఈ మాటలే తప్పా అమ్మో ఇంక చాలు ఇంక వద్దూ... ఇదేం కూర ఇదేం పచ్చడిఇదేం రుచిఏమి ప్రేమ ఏమి వడ్డనాఎక్కడ చూసినా లక్షల మంది భోజనం చేస్తూ... ఇదే సంతోషం అందర్నీ కూర్చోబెట్టి అంత మర్యాదతో కూడినటువంటి వడ్డణా చేస్తూంటే అక్కడ మాటలు వినబడుతున్నాయట యజ్ఞ శాలలోంచి ఏమని గట్టిగా  వినబడుతున్నాయి ఎక్కడ చూసినా దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ ! ఇతి సఞ్చోదితాస్తత్ర తథా చక్రురనేకశః !! ఇవ్వండి ఇవ్వండి ఇంకా అన్నం పెట్టండిఅన్నం ఇంకా పెట్టండి కడుపునిండా పెట్టండి ఇంకా నెయ్యి వేయండి ఇంకా బూరెలు పెట్టండి వడియాలు వేయండి, ఇవ్వండి ఇవ్వండి వారికి వస్త్ర ధ్వజమివ్వండివీళ్ళకి వస్త్రాలు పెట్టారావాళ్ళకు బట్టలు పెట్టారా.. వీళ్ళకీ పట్టు బట్టలు ఇచ్చారాఇవే అరుపులు ఇవ్వండీ ఇవ్వండీపెట్టండీ పెట్టండీ తప్పా... తొందరగా తిని లేవోయ్ అన్నవాడు ఒక్కడు కూడా లేడు అది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhBhiRGxaKmYhGyhAUkBxsuviYtRtMOGTU0nXy8h_k1R7G2XItJz10lBclKcwRbfJ5a71JmnXMrYvCLYF_NiGOJdaTbXezWO5wp3QFm6ByFvrGdnfDzxKEOoDWaFGC9Lqj4ij0yldkZEHw/s400/bhojanam.jpgఇదీ ప్రేమకి పరాకాష్ఠఇలా పెడుతూ ఉంటే ఈ అన్నం తిన్న వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయన గారు ఎంత దర్శనం చేశారో గానీ... మహానుభావుడు బాల కాండ రచన చేస్తూ... ఒక మాటన్నారు ఆయన చెయ్యి అడ్డు పెడితే ఆపేవాడు లేడు వడ్డణ అయ్యా ఇంకొద్దండీ బూరె అంటే ఈ పక్కనుచి వేసేస్తున్నాడు. చెయ్యి అడ్డుపెడితే ఆపరు వాళ్ళుకి ఏమనిపించిందట అంటే... చెయ్యి అడ్డుపెడితే ఆపరుకానీఉన్న పదార్థాలు తినెయ్యాలంటే మన వీపు అడ్డు పెడితే ఉపయోగమౌతుందని చెప్పిఒంగి వీపు అడ్డు పెట్టి ఉన్నది తినెయ్యాలనుకున్నారట. వీపు అడ్డు పెడదామంటేఆ పదార్థాల రుచికి కడుపు నిండిపోయికడుపు వీపు వంగట్లేదట. కాబట్టి వాళ్ళు పెట్టడం వీళ్ళు తినటం వినామార్గంలేదన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్ప పద్య రచన చేశారో తెలుసాండి ఆయన ఏమి అనుభవించారండీ మహానుభావుడు ఇపుడె గుండిగ దింపి యిగురబెట్టితి బొడి బొడి పొళ్ళాడు నీ యన్నము దినుండు తెలుగులో ఉన్నటువంటి ఈ చక్కటి మాట పొడి పొడిలాడుతున్న అన్నం తినండి ఎంత బాగుందో... ముద్దైపోయింది అన్నం అంటారు. మనవాళ్ళు చూడడండీ ఒక మాట అంటూంటారు తెలుగులో కందిగుండా వేశారు గానియండీ ఎంతబాగుండేదో అన్నం ముద్దైపోయింది సుమా! దాని రుచు తెలియలేదూ అంటారు ఇప్పుడే గుండిగ తింపాం పొడపొడలాడుతుంది అన్నం ఎంత బాగుందో వేడుంది తినండి తినండీ... అని పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు పూర్ణమ్ము లేకుండఁ బునుకులుగా వేసితిమి కరకరలాడు తినుఁడు విశ్వనాథ గారి కల్పవృక్షమండీ. బూరె పూర్ణం పెడితే ఒక లక్షణం ఉంటుంది. మూడు బూర్లులు తిన్నారనుకోండీ ఇంకా దాంట్లోకి నెయ్యి వేసుకు తినాలి, తింటే దాహం వేసేస్తుంది దాహమేస్తే రెండు గ్లాసులు మంచి నీరు తాగేస్తాం కడుపు నిండిపోతుంది. తినాలని ఉంటుంది కాని పొట్టకు ఒక పరిమితి ఒకటి ఉంటుందిగా... అందుకని తినలేరు అందుకని వారు అంటున్నారంటా... ఆ బాధ లేదు పూర్ణం లేకుండా కరకరలాడేటట్లుగా వేశాము ఇవిగో.
ఇది తెలుగు మాట స్వచ్ఛమైన తెలుగు మాట వేపుడు కరకరలాడుతోంది అంటాము జంతికలు కరకలాడుతున్నాయంటాము ఆమాటే వేశారాయన పుర్ణం లేని బూరెలు వేశాం చిల్లెలు అంటారు మనవాళ్ళు ఆయన అదే మాట వాడారు, బునుకులు బునుకులని పూర్ణమ్ము లేకుండఁ బునుకులుగా వేసితిమి కరకరలాడు తినుఁడు కరకరలాడుతున్నాయి తిన్నండర్రా... మళ్ళీ కాసేపాగితే ఆ కరకర పోతుంది. చల్లబడి మెత్తబడి పోతాయి తినండి అని వేసేస్తున్నారట విస్తట్లో వాని గాలుచు నున్నది కాఁబోలు క్షీరాన్నమిదె దొన్నెలను దెచ్చియిత్తు నుండుఁడి క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతొందేమో ఇదిగో దొన్నెలలో పెట్టి పట్టుకొస్తున్నాను తినండి జలువ చేయునుగండి బతిమాలి బతిమాలి యవనినాథ సుదకులు కొల్లలుగఁ దెచ్చి చూఱయూయ ఇది గడ్డపెరుఁగు మీ రింక గొంచెము వేసికొనవలె  గడ్డ పెరుగు ఈ మాట చాలా గట్టి మాట. మనం పెరుగు వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడం చాలా సంతోషం నాతో ఓ స్నేహితుడు కాశీ వచ్చాడు. అందరూ విశ్వనాథుడు దేవాలయానికి ఎప్పుడు వెళదామంటే... ఆవులది గడ్డ పెరుగు దొరుగుతుందట ఎక్కడ ఎక్కడ అని తిరిగాడాయన. అలా గడ్డ పెరుగు బాగా గడ్డ గట్టి ఉంటే మనకు చాలా సంతోషం. ఇది గడ్డ పెరుగు తినండి వేడి చేస్తుందేమో... చలవ చేస్తుంది ఇదిగో ఈ చారు పోసుకోండి. ఇదిగో వేడి చేస్తుంది. ఈ మజ్జిగ పులుసు పోసుకోండి. అని తీసుకొచ్చి విస్తట్లో వేసేస్తున్నారన్నీను.
ఆయనేదో దోసావకాయ బాగుందని ఇంత తిన్నారనుకోండి ఏమండోయ్ దోసావకాయ తిన్నారు వేడి చేస్తుంది పోసుకోండి కాస్త పులుసు పోసేస్తున్నారు. వాళ్ళే వేడిచేసేవి వాళ్ళే చలవచేసేవి వాళ్ళే వైద్యంచేసేవి కూడా పోసేస్తున్నారు విస్తట్లో, ఆ ప్రేమకి వాళ్ళు తినేసేసి అన్నమున నాదరంబునఁ దిన్న కడుపు లెన్న నెడఁదలు నుబ్బిపోయెదరు జనులు కడుపుకి అన్నం తిన్నారటాగుండెలకు ఆదరనా తిన్నారటా... గుండెలు ఆదరణతో నిండిపోయాయి కడుపులు అన్నంతో నిండిపోయాయి ఈ రెండు నిండిపోతే వాళ్ళు లేచినిలబడీ పొంగిపోయీ... ఎంత ప్రేమతో పెట్టావయ్యా ఆయుశ్మాన్ భవా అని నీ కోరిక తీరుతుంది అన్నారు ఇంత మంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు చిన్న బుచ్చుకున్నారట. ఏమిటో ఇన్ని లక్షల మందే తిన్నారు ఇంకా చాలా మంది రావాలి, రాలేదండీ.... అన్నాడట ఆయన ఆయనకి తృప్తి లేదట. అంతేగాని ఎన్ని బియ్యము అయిపోయాయిమళ్ళీ ఎసరెట్టాలా... ఏంటి ఇంత మంది వచ్చేశారు పిలవకుండా... అనలేదు అంత మంది తింటే ఎంత ఆనందించాలో ఎంత మంది తిన్నా... తృప్తిలేని తనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకు నేర్పుతుంది అన్న కూటాశ్చ బహవో దృశ్యన్తే పర్వతోపమాః ! దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా !! అన్నం వండి పోసినటువంటివీ అన్న పర్వతాల్లా ఉన్నాయట, ఆతంతంత అన్నపు రాశులు పోసేశారట. ఆ రాశుల్లోకి తీసుకెళ్ళి గబగబా బుట్టలు నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. మా అనుమత్ శాస్త్రిగారికి సంతోషము అలా వడ్డణ చేసేయ్ మంటే... అన్నం హి విధివత్సాధు ప్రశంసన్తి ద్విజర్షభాః ! అహో తృప్తాః స్మ భద్రం ఇతి శుశ్రావ రాఘవః !! ఆ భోజనం చేసి బయటికి వచ్చినటువంటి వృద్ధులు, బ్రహ్మణులు, దాసులూ, సర్వ వర్ణముల వాళ్ళూ, స్త్రీలు, వ్యాధి గ్రస్తులు, పిల్లలూ అందరూ కూడా అంటున్నారటా... అబ్బబ్బభ్భా... ఏమి భోజనం పెట్టారండీ ఎంత గొప్ప భోజనమండీ పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి ఎంత దోశం చేసేశారండీ... ఎంత గొప్పగా ఉందండీ భోజనము... అని నాయనా ఇంత గొప్ప భోజనం పెట్టావురా... ఆయుశ్మాన్ భవ నీ కోరిక తీరాలి సంకల్పసిద్ధిరస్తూ అంటున్నారట ఇంత మంది ఇంత పొంగి పోయ్యేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఇవ్వాల మనకు పిలవడమూ రాదు, పెట్టడమూ రాదు. శుభ లేఖ వేస్తే సైడు హెడ్డింగులు, సుముహూర్తం ఇన్ని గంటలకు వరుడు ఫలనాదీ, వధువు ఫలనాదీ, వేదిక ఫలనాది విందు రాత్ర ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నరకి ముందొస్తే పెట్టం తరవాతొస్తే ఉండదు ఏం చెయ్యాలంటే.. నీవు వచ్చి తినివెళ్ళిపో... ఎందుకంటే కడుపుకు అన్నం లేక ఏడుస్తున్నావు గనక, తప్పా అక్కడ పెళ్ళి కొడుకూ ఉండడూ, పెళ్ళి కూతురూ ఉండదు. ఒక వేళ ఉన్నా వాళ్ళకింక పెళ్ళి అవలే... తెల్లవారగట్ల ముహూర్తం. ఇవ్వాల రోజు సాయంత్రమే వాళ్ళు రెండు సింహాసనాలు మీద వాడు కర్ణుడు సహచ కుండలాతో పుట్టినట్లుగా బూట్లేసుకు కూర్చుంటాడు. మీ రెళ్ళి వాళ్ళు పొరపాట్న అక్షంతలు వేశారో వాడు బూట్లతోటే అలాగే కూర్చొని ఒక చేత్తో ఇలా అంటాడు వాడికి ఆశీర్వచనం చెయ్యాలి మీరు వాళ్ళిద్దరూ ఇంకా దంపతులు కారు కన్యాదానం జరుగలేదు. ముందే ఇద్దరూ కుర్చీల్లో కూర్చొంటే... వైదిక నిష్టున్నవాళ్ళు వెళ్ళి ఆశీర్వచనం చెయ్యాలి వాళ్ళకి. అసలు పెళ్ళవలేదు వీడు అన్నం పెడతాడు ఎందుకు పెడుతున్నాడో తెలియదు. పెళ్ళాయ్యాక అన్నం పెడుతారా, పెళ్ళికి ముందు అన్నం పెడుతారా... పెళ్ళికి ముందు అన్నం బంధువులకు పెడతారు పెళ్ళయ్యాక అన్నం అందరికీ పెడతారు కన్యాదానం చేశారు కాబట్టి.
ఏమిటి అన్నం పెట్టడం అంటే ఎవడి పళ్ళెం వాడు పట్టుకొని భవతి భిక్షాందేహి అని ఒక టేబుల్ దగ్గరకి వెళితే ఆ టెబుల్ దగ్గర బూట్లేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు, వాడు సవ్యసాచిలా రెండు చెతులతోటీ, ఒక చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పూ, పచ్చి ఉల్లిపాయలతో కాస్త పెరుగూ, ఓ ఇంత కూర మీరు వెళ్ళి అడుక్కోవాలి. అయ్యా నాకింత ఆ అప్పడం వేయ్యండీ అనీ... ఆ తరువాత మీరు ఇలా నిలబడితే... బిక్కు బిక్కుమంటూ నిలుచోవాలి ఎందుకంటే. ఎవడు ఇటునుంచి వచ్చి మీ చేతినికొడతాడో తెలియదు. మళ్ళీ దాహమేసిందనుకోండి, ఉల్లిపొరకల్లాంటి గ్లాస్సుల్లో నీళ్ళు ఉంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నీళ్ళు కిందపడిపోతాయ్... మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడపెట్టాలో తెలియదు. వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు. మళ్ళీ మీకు వెక్కిల్లోస్తే... ఎవర్నడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా... ఇది బాగుందా అని ఎవ్వరూ అడగరు. అనాధశరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు పెడితున్నారనేటప్పటికి వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు పట్టం గట్టినప్పుడు వెళ్ళి రసీదులు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే... మీ పేరు రాసుకొని మీ రిచ్చిన కవరు తీసుకుంటారు. ఎంతిచ్చారని అడుగుతారు మూడొందల యాభై ఇచ్చానండీ అంటే కవరు తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు ఎందుకంటే మీరు 350 అని 116లు పెడితే... ఆ ఇచ్చినాయన కట్టుకోవాలి. ఆయన తినేశాడనుకుంటారు అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు 350ని 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు రశీదు ఇవ్వట్లేదు అదో అదృష్టం. ఇది ఇవ్వాళ మనం చేసేటటువంటి వివాహం ఇది ఇవ్వాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో... ఎటువంటి రామాయణానికి మనం వారసులమో... గుండెలు మీద చెయ్యేసుకు చెప్పండీ... వచ్చిన వాళ్ళని క్రింద కూర్చోబెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా, లేము. మనం పెట్టగలం. మనం ఆ పెట్టడానికి ఆ సంకల్పం లేదు అంతే... శుభ లేక మీరు యధావిధిగా ఎలా వేశారో అలాగే మదర్పిత చందన తాబూలాది అన్నప్పుడు ఒక నలుగురుని పెట్టి శుమూర్తమునకు ముందు చేతికి గంధం రాయించడం కష్టమా, మనం చెయ్యం అంతే కార్డులో ఉంటుంది. మనం చెయ్యం అంటే... నిష్ఠ లేదు, శ్రద్ధ లేదు శ్రద్ధకి పరాకాష్ట శ్రీ రామాయణం, రామాయణానికి వారసులం అన్నవాళ్ళం, ఏ కార్యక్రం చేసినా ఎంత శ్రద్ధగా చెయ్యవలసి ఉంటుందో మనం చూసుకోవాలి.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇంత గొప్ప యజ్ఞాన్ని ఆయన నిర్వహణ చేస్తున్నాడు అక్కడ యూప స్థంభములను కొన్నింటిని ఏర్పాటు చేశారు అంటే వాటికి పశువులను తీసుకొచ్చి కడతారు. పశువుల విషశనము కొరకు, యజ్ఞములో అది అంతర్భాగమది సనాతన ధర్మములో, అందుకనీ ఆరు మారేడు యూప స్థంభములు, ఆరు చండ్ర స్థంభములు, ఆరు మోదుగ స్థంభములు ఆ తరువాత విరుగు చెట్టూ అని అంటారు, శ్లేష్మాత్మక వృక్షం స్థంభం ఒకటి, దేవదారు వృక్షం స్థంభాలు రెండూ ఇటువంటి యూప స్థంభాలను అక్కడ పెట్టీ, వాటికి తీసుకొచ్చి అనేక రకములైనటువంటి పశువుల్ని అంటే జలచరాల్నీ, పాముల్నీ, అరణ్యాలలో తిరిగే జంతువుల్నీ, నగరాలలో తిరిగే జంతువుల్నీ వాటిని తీసుకొచ్చి బంధిస్తారు. అందులో కొన్ని జంతువులని విడిచి పెడుతారు, కొన్ని జంతువులని పశు విషశనం చేస్తారు. అది సనాతన ధర్మంలో అంతర్భాగంగా చేస్తారు అశ్వమేధ యాగంలో... ఇప్పుడు అశ్వమేధ యాగం కలియుగంలో లేదు. అశ్వమేధ యాగం కలియుగంలో నిజానికి ఏ రూపంలో ఉందంటే... కలియుగంలో అశ్వమేధ యాగం చెయ్యాలి అంటే ఒక్కటే చెయ్యమని ఉంది. అనాధ ప్రేత సంస్కారము ఎవడు చేస్తాడో వాళ్ళు అశ్వమేధ యాగం చేసినట్టే... అని నడిచే దేవుడు చంద్ర శేఖర పరమాచార్య స్వామి ఎక్కడికి వెళ్ళినా చెప్తూండేవారు. అనాధ ప్రేత సంస్కారము ఎవరైనా చేస్తే... వాడికి అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని వేస్తాడు తప్పా... కలియుగంలో అశ్వమేధ యాగం లేదు కాబట్టీ
ఇష్టకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణతః ! చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైశ్శుల్బకర్మణి !!
సచిత్యో రాజసింహస్య సఞ్చితః కుశలైర్ద్విజైః ! గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మకః !!
నియుక్తాస్తత్ర పశవస్తత్తదుద్దిశ్య దైవతమ్ ! ఉరగాః పక్షిణశ్చైవ యథాశాస్త్రం ప్రజోదితాః !!
అక్కడా దశరథ మహారాజు గారు ఆరాధన చేసేటటువంటి అగ్ని గుండం పెట్టడం కోసమని ఒక వేదిని నిర్మాణం చేశారు. అది గరుత్మంతుడూ భూమి మీదకి దిగుతున్నప్పుడు శిరస్సు కిందకి వంచి రెక్కలు ఇలా పైకెత్తి తోక నిఠారుగా పెడితే ఎలా ఉంటుందో అలా అటువంటి ఆకృతి వచ్చేటట్టుగా బంగారు ఇటుకలతో నిర్మాణం చేశారు. దాని మీద దశరథ మహారాజు గారి  యొక్క అగ్ని గుండాన్ని ఉంచారు. శుక్లయజుర్వైదానికి చెందినటువంటి వాడు కనుక, అటువంటి వేదికని నిర్మాణం చేసి అటువంటి అగ్ని గుండాన్ని ఉంచారు.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఇప్పుడూ ఈ భూ మండలమంతా తిరిగి వచ్చినటువంటి ఆ గుఱ్ఱాన్ని తీసుకొచ్చి అక్కడ కడతారు ఆ యూప స్థంభానికి. దాన్ని పట్ట మహిశీ, మహిశీ అంటే పట్టాభిషేకం జరిగినప్పుడు ప్రభువుతో సింహాసనం మీద కూర్చొని పట్టాభిషేకమందుకొన్న భార్యని ʻమహిశీʼ అంటారు. మహిశీ కౌశల్య. కౌశల్య ఈ గుఱ్ఱాన్ని మూడు కత్తులతో చంపవలసి ఉంటుంది కాబట్టి కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమస్తతః ! కృపాణైర్విశశాసైనం త్రిభిః పరమయా ముదా !! చంపేటప్పుడు భీతితో, లేకపోతే గుఱ్ఱాన్ని నేను చంపుతున్నాన్న భావన లేకుండా పరమ సంతోషంతో ప్రవృష్ఠ వదనంతో మూడు కత్తులను చేతపట్టి కౌశల్యా దేవి ఆ గుఱ్ఱాన్ని సంహరించింది. అది యజ్ఞంలో అంతర్భాగం కాబట్టి ఆ మరణించినటువంటి గుఱ్ఱాన్ని తీసుకెళ్ళి ఈ ఋత్విక్కులు యాగశాలలో ఒక దగ్గర పడుకో పెడుతారు ఆ కళేబరాన్ని. దాని పక్కన ఆ రోజు రాత్రి కౌశల్యా దేవి ఆ గుఱ్ఱం పక్కనే పడుకోవలసి ఉంటుంది ఒక వస్త్రంతో ఆఛ్ఛాదిస్తారు అది ఆరోజు రాత్రంతా కూడా మనసులో ఏవిధమైనటువంటి చికాకు, నేను ఒక సంహరింపబడిన గుఱ్ఱం పక్కన పడుకున్నాన్న భావన లేకుండా, తన భర్త పక్కన తాను పడుకుంటే ఎంత ప్రసన్నంగా పడుకుంటుందో అలా పడుకోవాలి. మరునాడు ఉదయం ఆ గుఱ్ఱం యొక్క మేధనీ తీసి ఆ ఫవనీ ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరిస్తారు ఒక్క అశ్వమేధంలోనైతేనే ప్రబ్బలి తీగలు మీద ఇతర యాగాలలోనైతే జూవి కొమ్మల మీద పెట్టి సంస్కరిస్తారు. ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరించినటువంటి ఈ ఫవా, మేధా పైకి తీస్తారు గుఱ్ఱంలోంచీ... దాన్ని మంత్ర భాగాన్ని అన్వయం చేస్తూ అగ్ని హోత్రంలో కాలుస్తారు. కాల్చినప్పుడు దాంట్లోంచి పొగ వస్తుంది ఆ పొగ వచ్చినప్పుడు మహారాజు అక్కడ నిలబడి ఆ వాసన చూడాలి ఆ వాసన పీలిస్తే మహారాజు కోరిక తీరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపం ఏదుందో అది అప్పుడు నిర్మూలమౌతుంది.
http://www.indianetzone.com/photos_gallery/4/Asvamedha_15442.jpgఅప్పుడు మహారాజు ఏం చేయాలి అంటే తన భార్యలని దానం చేసేయ్యాలి ఋత్వికులకి వారు రాజు భార్యల్ని స్వీకరించరు కనుక దానమిచ్చి మళ్ళీ తతుల్యమైన ధనం కొంత ఇచ్చి తన భార్యల్ని తను మళ్ళీ పుచ్చేసుకుంటాడు. కాబట్టీ ఈ కార్యక్రమాన్ని అంతటనీ కూడా దశరథ మహారాజుగారు పూర్తిచేశారు ఇలా అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు. ఇంత గొప్ప హోమాన్ని, ఇంత గొప్ప యజ్ఞాన్ని, ఇంత గొప్ప మంత్ర భాగాన్ని అనుషంగికమైన క్రతువుల్నీ ఇన్నిటినీ యథా శాస్త్రంగా నిర్వహించినందుకు సంతోషించి ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః అధ్వర్యవే ప్రతీచీం తు బ్రహ్మణే దక్షిణాం దిశమ్ ! ! ఉద్గాత్రే చ తథోదీచీం దక్షిణైషా వినిర్మితా ! అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూవిహితే పురా !! అంతయజ్ఞమూ పూర్తై పోయింతర్వాత తన వంశాభి వృద్ధి కొరకు ఇంత గొప్ప యజ్ఞం చేశాడు గనుక, ఇంత గొప్ప యజ్ఞం చేసినటువంటి "హోతా" అనే బడేటటువంటి ఋత్విక్కుకి తన సామ్రాజ్యాం తూర్పు దిక్కు నంతటిని ధార పోసేశాడు. అలాగే "ఆధర్వవూ" అనే బడేటటువంటి ఋత్విక్కుకి పడమర ఉన్న రాజ్యాన్నంతటినీ ధార పోసేశాడు. బ్రహ్మ స్థానంలో కూర్చున్నటువంటి ఋత్విక్కికి దక్షిణాన్న ఉన్న భూమినినంతటినీ దానం చేశాడు. "ఉద్గాత" అనే ఋత్విక్కికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూమి నంతటినీ దానం చేశాడు. ఇంత గొప్ప దానం చెయ్యగలిగితేనే అశ్వమేధ యాగం చెయ్యాలని స్వయంగా సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మగారు నియమనం చేశారు.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇప్పుడు రాజ్యం అంతటినీ నాలుగు దిక్కులూ ధారపోసేశాడు. ఆ దానం పుచ్చుకున్నటువంటి వసిష్టాదులు అన్నారు, మహానుభావా ఇంత పెద్ద భూ మండలాన్ని వహించగలిగినటువంటివాడు, భరించగలిగినటువంటివాడు, పరిపాలించగలిగినటువంటివాడు నీవు, మా కెందుకీ రాజ్యం. కాబట్టి తిరిగి మేము తిరిగి మీకు ఇచ్చేస్తున్నాం మీరు తిరిగి తీసేసుకోమ్మని దశరథునికి ఇచ్చేశారు గవాం శతసహస్రాణి దశ తేభ్యో దదౌ నృపః ! శతకోటీస్సువర్ణస్య రచతస్య చతుర్గుణమ్ ! ! తతః ప్రసర్పకైభ్యస్తు హిరణ్యం సుసమాహితః ! జామ్బూనదం కోటిసంఖ్యం బ్రహ్మణేభ్యో దదౌ తదా !!  అలా తిరిగి రాజ్యన్ని తనకు ఇచ్చేసినటువంటి ఆ ఋత్విక్కులందరికీ పది లక్షల గోవులు, దానితో పాటుగా పదికోట్ల బంగారు నాణ్యెములు, నలభై కోట్ల వెండి నాణ్యెములు ఆ ఋత్విక్కులకి దానంచేశాడు. కేవలం ఆ యాగం చూడడం కోసం వచ్చినటువంటి బ్రహ్మణులకి, ఒక కోటి మేలు బంగారు నాణ్యెములను దానంచేసాడు.
దానం చేసి దరిద్రాయ ద్విజాయాథ హస్తాఽఽభరణముత్తమమ్ ! కస్మైచిద్యాచమానాయ దదౌ రాఘవనన్దనః !! ఆ దానమంతా చేసేశాడూ... దగ్గరవున్న బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, గోవులు అన్నీ ఇచ్చేశాడు. అప్పుడు ఒక దరిద్ర బ్రహ్మణుడు వచ్చాడు వచ్చి మహారాజా నాకేమైనా దానం ఇప్పించండీ అన్నాడు చూశాడు పళ్ళాల వంక, అప్పటికే అన్ని దానమిచ్చేశాడు వెంటనే పరమ ప్రీతితో నా అదృష్టం కొద్దీ వచ్చారని తన చేతికున్న కడియాన్ని దానంచేసేశాడు. అంతటి భక్తి కలిగినవాడు అంతటి బ్రాహ్మణ భక్తి, అంతటి వైదిక నిష్టా, అంతటి వేదమునందు నమ్మకమూ కలిగినటువంటి మహానుభావుడు దశరథ మహారాజంటే.
Image result for యాగముఅప్పుడు ఋష్యశృంగుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు తతోబ్రవీదృశ్యశృఙ్గం రాజా దశరథస్తదా ! కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత !! నాతో మీరు ఇప్పటిదాకా అశ్వమేధ యాగాన్ని చేయించి పూర్తి చేయించారు ఇప్పుడు నాకు సంతానం కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము నశించినది ఇప్పుడు సంతానం కలగడం కొరకు మీరు ఏ ఇష్టి చేయిస్తే బాగుంటుందో ఆ ఇస్టిని నాచేతచేయించవలసిందీ అని అడిగాడు తథేతి చ స రాజానమువాచ ద్విజసత్తమః ! భవిష్యన్తి సుతా రాజంశ్చత్వారస్తే కులోద్వహాః !! ఋష్యశృంగ మహర్షి అన్నారూ... అశ్వమేధం చేశావు. ఇష్టి చేస్తానంటున్నావు, తప్పకుండా నీ చేత ఇష్టి చేయిస్తాను. కాని దశరథా నీకు ఇదే చెప్తున్నాను నీకు తప్పకుండా పరమ ధర్మాతులైనటువంటి వారు, నీ వంశ కీర్తిని ఇనుమడింపజేసేటటువంటి వాళ్ళు, మహా పురుషులైనటువంటి వాళ్ళు నలుగురు కుమారులు నీకు జన్మిస్తారు అన్నాడట. ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం అంటే ఉత్తిగనే పోతుందాండీ... ఇప్పుడు నీవు ఏ ఇష్టి చెయ్యాలో నేను ఆలోచించి నిర్ణయం చేశాను, ఈ ఇష్టి నీవు చేయవలసిందీ అని చెప్పి, ఆ ఇష్టిని సంకల్పం చేయించి, దాన్ని చేయిస్తున్నారు. అందులో ఆయన అంటారూ... ఇష్టిం తేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ ! అథర్వశిరసి ప్రోక్తైర్మన్త్రైస్పిద్ధాం విధానతః !! అధర్వ శిరస్సు అనబడేదాంట్లో చెప్పబడినటువంటి ఇష్టిని  నేను నీతో చేయిస్తాను ఆ ఇష్టిని చేయవలసింది. ఇష్టి అంటే అది కూడ ఒక హోమం లాంటి కార్యక్రమం అది కూడ ఒక యాగంలో అంతర్భాగం, ఒక యాగం.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఈ హవిస్సు ఇచ్చినప్పుడు పుచ్చుకోవడానికి దేవతలకి అక్కడ కూడా, ఆ హవిస్సులు కేటాయించబడుతాయి హవిస్సులిస్తారు తతో దేవాస్సగన్ధర్వాస్సిద్ధాశ్చ పరమర్షయః ! భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి !! ఆ హవిస్సులు ఇచ్చినప్పుడూ... ఈ రోజులలో అయితే మన మాంస నేత్రానికి దేవతలు కనపడరు. అయితే మనమేం అంటామంటే... మనకి

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
కనపడ్డం లేదు కదండీ అగ్ని హోత్రంలో వేసేసాం కదా అదంతా కాలి బుడిదైపోతూందేమో అంటాము, కాదు. చాలా మంది ఒక మాట మాట్లాడుతుంటారు, అదేమిటంటే ఉగ్ర తేజస్సు అని ఒక మాట అంటూ ఉంటారు, అమ్మవారి ఉగ్ర తేజస్సు భరించలేక పోయారండీ అందుకనిచెప్పి శంకరాచార్యుల వారు స్త్రీ చక్రాలు వేశారు అంటారు, అది తప్పు మాట. శంకరాచార్యుల వారు ఉగ్ర తేజస్సు తీయలేదు. మీరు బాగాగమనించవలసి ఉంటుంది. నేను ఉన్నాను, నేను పూజ చేసేటప్పుడు వేలిగించినటువంటి దీపం వంక అలా చూడగలను, నేను ఉన్నాను, ఇప్పుడు ఆ దీపం వంక అదే పనిగా చూశాననుకోండి, చూసి ఇలా చూస్తే పుస్తకంలో అక్షరాలు నాకు సరిగా కనపడవు. ఎందుకంటే ఆ దీపం యొక్క వెలుతురిని తట్టుకో గలిగినటువంటి సమర్థత నా కంటికి లేదు. కలియుగంలో ఏమై పోయిందంటే... దేవత శక్తితో వచ్చి అక్కడ నిలబడితే... ఆమే శక్తితో తుల్యంగా అటువంటి సౌచంతో ఆమే ఎదురుగుండా నిలబడగలిగినటువంటి తేజస్సు మనం ఉంచుకోలేదు. అది క్షీణించి పోయింది. ఎందుకంటే బాహ్య శౌచం లేదు, అంతః శౌచం లేదు. రెండూ లేవు, రెండూ లేకపోతే ఏమవుతుంది, మీరు వెళ్ళి నిలబడగలిగినటువంటి శక్తి మీకు ఉండదు. శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన మహోపకారమేమిటో తెలుసాండీ... ఏ ఇంజనీరు కట్టలేనటువంటి లెక్క, ఇవ్వాల్టి రోజు సమాజంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క పరిస్థితి ఏలా ఉందీ... వాళ్ళు ఆ దేవతా స్వరూపం ఎదురుగుండా వెళ్ళి నిలబడలేరు గనుక, ఆమేలో ఉండిపోయినటువంటి తేజస్సు ముందు వీరు నిలబడడానికి సమర్థులు కారు కానుకా, ఎక్కువగా ఉండిపోయిన తేజస్సుకి కొంత భాగాన్ని తీసేశారు ఆయన. తీసేసి ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి, తీసేసి ఆయన దాన్ని ఎక్కడో విడిచి పెట్టేయడమో, పంపించేయడమో ఆయన చేయలేదు. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే క్షేమ ప్రదమైనటువంటి మార్గంలోకి మళ్ళీ మళ్ళించేశారు.
అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది జంబుకేశ్వరంలో, అమ్మగారి వారియొక్క స్వరూపంలో ఉన్న తేజస్సు ముందు నిలబడలేకపోయాడు. ఇప్పటికీ అర్చకులు అక్కడ మధ్యాహ్నం అమ్మవారికి నివేదన చెయ్యాలంటే చీరలుకట్టుకొని వెళ్ళాలి, ఆడవారిగా అలంకారం చేసుకొని లోపలికెల్లి నైవేద్యం పెడుతారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిలో ఉన్న అదనపు తేజస్సుని, అదనపు తేజస్సు అంటే మనం భరించలేని తేజస్సునీ, శంకరులు తీసేశారు. తీసేసి అమ్మవారి వజ్ర తాటంకంలోకి పెట్టి ఆ తాటంకములను పొదిగారు అమ్మవారికి. అలాగే కంచిలో కామాక్షి అమ్మవారి తేజస్సునితీసి పృథ్విలో శ్రీచక్రం వేసి, శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు.  అందుకే శంకరభగవత్ పాదులు ఈ జాతికి చేసినటువంటి ఉపకారం న భూతో న భవిష్యతే... ఇక ఎవ్వరూ చెయ్యలేరు అంతటి మహాత్ముడు శంకరభగవత్ పాదులంటే, ఆయన పేరుస్మరిస్తేచాలు పాపరాశి దగ్ధమౌతుంది, అంతటి మహానుభావుడు. కాబట్టీ... ఈ రోజులలోవచ్చి హవిస్సు స్వీకరిస్తున్నటువంటి దేవతలూ నీకంటికి కనపడరు ఎందుకు కనపడరు అంటే... నీ కంటికి వారుకనపడితే నీకు తట్టుకోగలిగినశక్తి నీకులేదు. మీరు చూడగలిగినటువంటి ఉపాసన బలం మీకుంటే... మీకు ఆ దేవతలు కనబడుతారు అలాచూసిన మహాపురుషులు ఉన్నారు. అలాచూసి ఫలానా ఫలానా దేవతలు వచ్చారు, వారువచ్చీ తిరుగుతున్నారు అని దర్శనం చేసినటువంటివారు ఉన్నారు. కనుకా... తతో దేవాస్సగన్ధర్వాస్సిద్ధాశ్చ పరమర్షయః ! భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి !! ఆనాడు దశరథుడు ఇష్టి చేస్తుంటే... పుత్రకామేష్టి దానిపేరు. కొడుకుల కొరకు చేసిన ఇష్టి కాబట్టి, ఆ యజ్ఞంలో అవిస్సును పుచ్చుకోవడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా, ఇప్పుడు మీరు ఉపన్యాసం వినడానికివచ్చి ఎలాకూర్చున్నారో... అలా వాళ్ళందరూ నన్ను పిలిచినప్పుడు వెళ్ళి హవిస్సును పుచ్చుకుందామని వాళ్ళందరు అక్కడ సభలో కూర్చున్నారు.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఇంక ఈయన మొదలెట్టాలి, మొదలు పెట్టి హవిస్సు ఇస్తే... ఓం నమో నారాయణాయ స్వాహాః అని అన్నారనుకోండి నారాయణుడు వచ్చి ఆ హవిస్సు పుచ్చుకుంటాడు. ఒక్కొక్క దేవతని పిలిచి ఓం నమో పర్జన్యయ స్వాహాః అని అన్నారనుకోండి... పర్జన్య దేవత వచ్చి ఆ హవిస్సు పుచ్చుకుంటాడు. కాబట్టీ ఇప్పుడు దేవతలందరూ కూర్చున్నారు దేవతలందరూ వచ్చారు, దేవతలతో పాటు ఎవరొచ్చారు... చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు ఆయనది అగ్రస్థానం. ఆయన మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారంటే, అందుకనీ ఆయన్ని అగ్రాసనం వేసి కూర్చో బెట్టారు. దేవతలందరూ కూర్చున్నారు ఎప్పుడూ కామన్ టాప్పిక్కు అనేది ఒకటి ఉంటుంది లోకంలో అంటే "అందరూ మాట్లాడుకోవడానికి ఒకటి యోగ్యమైనటువంటి విషయం". ఇప్పుడు ఈ ఉపన్యాసమై మీరు వెళ్ళిపోతున్నారనుకోండీ... ఈవ్వాళ ఉండేటటువంటి సామాన్యమైన విషమేమిటి... నాకు దానిజోలికి అంత ఆసక్తి లేదుకానీ.. ఏదో ఎన్నికల గురుంచి మాట్లాడు కోవడం, అలా ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటారు, పిలిచేంత వరకు హవిస్సులకి, అందరూ మాట్లాడు కోవడానికి మిగిలినటువంటి విషయం ఒక్కటే ఉంది ఏమిటదీ... రావలసిన పెద్దాయన వచ్చాడు, ఇప్పుడే అడగాలి అది, ఏమిటడగాలి అంటే, అయ్యా రావణాసురుడు మమ్మల్ని చీల్చి చెండాడెస్తున్నాడు, ఎలా చచ్చిపోతాడండీ ఆయనా... అని అడగాలి, ఎందుకడగాలీ, బ్రహ్మగారే వరాలిచ్చారు అందుకని ఆయన్ని అడగాలి, కాబట్టి వీళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి ఉత్తిత్తుగానే కూర్చోవడం ఎందుకనీ, ఎలాగో వచ్చారుకదాని చతుర్ముఖ బ్రహ్మగారితో చెపుతున్నారు.
http://s4.hubimg.com/u/7042215_f1024.jpgఅయ్యా!భగవస్త్వత్ప్రసాదేన రావణో నామ రాక్షసః ! సర్వాన్నో బాధతే వీర్యాచ్ఛాసితుం తం న శక్నుమః !! మీరు వరాలిచ్చేశారు రావణాసురుడికి, ఇప్పుడాయనకి అద్దూ అదుపూ లేదు, అందర్నీ బాధపెట్టేస్తున్నాడు. ఎంత బాధపెడుతున్నాడో తెలుసా... ఒకరో ఇద్దరో కాదు, అందరూ ఒక్కొక్కరూ లేచి ఆ బాధలన్నీ చెప్తున్నారు ఋషీన్యక్షాన్సగన్ధర్వా నసురాన్బ్రాహ్మణాంస్తథా ! అతిక్రామతి దుర్థర్షో వరదానేన మోహితః !! ఋషుల్నీ, యక్షుల్ని, గధర్వుల్ని, అసురుల్నీ, బ్రాహ్మణుల్ని అందర్నీ బాధ పెట్టేస్తున్నాడు. ఎందుకు బాధపెట్టేస్తున్నాడూ అంటే ఒక్కటే కారణం వరదానేన మోహితః మీరు వరమిచ్చారు. నీకు వాడివల్ల చావులేదు వీడివల్ల చావులేదు, వాడివల్ల చావులేదని వరమిచ్చేశారూ, వాళ్ళెవ్వరూ చంపలేరూ... చంపలేరు కాబట్టి ఆయనకు అహంకారమొచ్చేసింది. అహంకారమొచ్చేసింది కాబట్టి అందర్నీ బాధించేస్తున్నాడు నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః ! చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కమ్పతే !! మా సంగతి అలా వదిలి పెట్టండి...  చాలా ధారుణమైన విషయం ఏమిటో తెలుసా... సృష్టిని తారుమారు చేస్తున్నాడు, సృష్టిని తల క్రిందుల చేశాడు. ఏది జరగ కూడదో అది జరుగుతోంది ఈశ్వరుడు తప్పా ఇతరులు ఎవరిని శాసించకూడదో, ఆ శాశనము ఇవ్వాల రావణునుడు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు నైనం సూర్యః సూర్యుడు ప్రకాశించకూడదు.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఆయన పుష్పక విమానంలో బయటకి వెడుతున్నారనుకోండీ... ఇలా ఓసారి చూస్తాడంతే... అది రోహినీ కార్తైనా సరే అది చల్లగా అయిపోవాలి, గబగబా మేఘాల చాటుకు వెళ్ళిపోవడమో లేక తన తేజస్సుని సంహారం చెయ్యడమో చెయ్యాలి. రావణాసురిడి ఇంట్లో అప్పడాలు ఎండలేదనుకోండీ... కాస్త బాగా కాయమనువోయ్ అంటాడు, బాగా ప్రకాశించాలి. మీరు ఉత్తర కాండ చదివితే ఆశ్చర్యపోతారండీ... దేవతలు పారిపోయారు వాహనాలు ఎక్కి, అప్పుడు నెమళ్ళకి వాటికి స్తోత్రం చేశారు వారు. కాబట్టీ... నైనం సూర్యః   సూర్యుడు ప్రకాశించకూడదు ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః గాలి గట్టిగా వీయకూడదు మెల్లిగా వీయకూడదు ఆయనకు అనుకూలంగా, ఆయనకు సంతోషించేటట్టుగా, ఆయన ఎలాచెపితే అలాగే వీయాలి గాలి. పంచ భూతములను శాసిస్తున్నాడు చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కమ్పతే ఆయన ఇలా చూశారనుకోండీ... ఎమిటి ఎప్పుడూ ఈ తరంగాలు, తరంగాలు లేకుండా ఉండలేవా? అన్నాడనుకోండి సముద్రంలో తరంగాలన్నీ ఆగిపోతాయి, తరంగాలు లేని సముద్రాన్ని మీరు చూశారా... రావణాసురుడు వచ్చినిలబడితే అలా ఉంటుంది ఎందుకంటే ఆయన చూస్తారు. ఎవ్వరూ చూడందేదో తానుచూడాలనుకుంటాడు. తరంగాలేమిటి ఆ లేవడమేమిటిఆ కిందపడ్డం ఏమిటి? మీదపడ్డం ఏమిటి? నా దగ్గరికి రావడమేమిటి ఏమిటి ఆ అల్లరి? అలా ఉండు అంటాడంతే, సముద్రం తరంగాలన్నిటినీ ఆపుచేసేసి, ఓ చిన్నచెరువులా ఉంటుంది మళ్ళీ ఆయన వెళ్ళిపోయింతర్వాత రావాలి తరంగాలు. కాబట్టి సముద్రోపి న కమ్పతే సముద్రంలో కెరటాలు రావట్లేదు ఇది మీరు చేసినటువంటి ఉపకారమా... ఇంత గొప్ప వరాలు ఇచ్చేశారు ఇన్ని బాధలు పడిపోతున్నాం మహానుభావా ఏం చెప్పమంటారు? కాబట్టి తేన గన్ధర్వయక్షాణాం దేవదానవరక్షసామ్ అవధ్యోస్మీతి వాగుక్తా తథేత్యుక్తం చ తన్మయా !! అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారూ...
Image result for చతుర్ముఖ బ్రహ్మ దేవతలతోఅవ్రురా నాయనా నిజమే, వరాలు ఇచ్చేశాను మీరందరూ చాలా బాధపడిపోతున్నారు, నేనూ వింటున్నాను ఆ విషయం, చాలా బాధపెట్టేస్తున్నాడు గంధర్వుల్ని, యక్షుల్ని, ఋషుల్ని, కిన్నెర్లుల్నీ, కింపురుషుల్ని, నాగులుల్నీ వాడు విడిచిపెట్టింది ఎవ్వర్నీలేదు అందర్నీ బాధపెడుతున్నాడు. నిజమే ఎవ్వరిచేత మరణం ఉండకూడదని అడిగాడు, మరీ తపస్సుచేసేశాడు వరమిచ్చేశాను ఆరోజున. ఆ నాకొక విషయం జ్ఞాపం వచ్చేసిందిరా... అబ్బాయ్ అన్నాడు అకస్మాత్తుగా... అనగానే హమ్మయ్యా, ఏదో ఇప్పుడు చెప్తాడన్నమాట ఏదో చచ్చిపోయ్యే మార్గం ఆయన చచ్చిపోయ్యే మార్గం ఈయన చెప్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి పురాణాలలో ఉన్న పాత్ర ఏమిటో తెలుసాండీ... ఆయన ఎప్పుడూ కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటివాడు. ఒక ఫ్యామస్ ఫిజిషియన్ ఉన్నాడనుకోండీ... ముందసలు రోగం ఏమిటో తెలియకపోతే ఆయన దగ్గరకు వెళతాము ఆయనేం చేస్తారంటే సర్జన్ కో, ఆర్థి పిడిషియన్ కో ఆయన రిఫర్ చేస్తారు. అలా ముందందరూ ఎవరి దగ్గరి వెళుతారంటే బ్రహ్మగారి దగ్గరికి వెళుతారు ఆయన మార్గం చెప్పాక ఆయన దగ్గరి వెడుతుంటారు అందుకనీ బ్రహ్మగారిని స్తోత్రం చేశారు చేసి ఆయనన్నారు నిజమే, నిజమే, ఆఁ... నాకో విషయం గుర్తొంచిందిరా అబ్బాయ్, వాడు అడగని వాళ్ళలలో ఒకరున్నారు వాళ్ళువస్తే మాత్రం ఆయన చచ్చిపోతాడన్నారు. ఎక్కడంటున్నారు ఈ మాటలు దశరథ మహారాజు గారు యజ్ఞం జరుగుతున్నటువంటి సభలో కూర్చున్నారు వీళ్ళందరూ, ఇప్పుడు అక్కడ ఎవరుంటారు వీళ్ళంటే దేవతలు కానీ, మిగిలిన వారందరు ఎవరుమనుష్యులు, మనుష్యులున్నారక్కడ. అక్కడ ఆయన అన్నారూ... నకీర్తయదవజ్ఞానాత్తద్రక్షో మానుషాన్ ప్రతి తస్మాత్స మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే !! అనాదరముచేత మనుష్యులను ఎందుకు అడగలేదంటే మరిచిపోయికాదు యక్ష, గధర్వ, కిన్నెర, కింపురుషాది అందర్నీ అడిగాడు. ఆరోజున నేను వారి చేతులో చచ్చిపోనని, కాని మనుష్యులపేరు మాత్రం ఆయన ఎత్తలేదు ఎందుకో తెలుసా మనుష్యుల విషయం మరిచిపోయికాదు అనాదరముచేత ఇంతమంది చేయలేనిది దిక్కుమాల్నోళ్ళు మనుషులేం చేస్తారండీ... అని అది.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
నిజంగా మీరు ఉత్తర కాండ చదివితే... రావణాసురుడు మనని అవమానించినందుకూ... రాముడు పుట్టినందుకూ మనం రామ నామం చెప్పకపోతే రామ నామం రాయక పోతే ఎంత కృతఘ్నులమో అర్థమౌతుంది. ప్రత్యక్షమైతే చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు అడిగితే పోనీ వానిగొడవ వాడిది అడుగుతాడు, కాని అలా అడిగి ఊరుకోలేదండీ... అందరి పేర్లూ చెప్పాడు, వీరెవ్వరి చేతిలో నేను చచ్చిపోకూడదూ అన్నాడు తథాస్తూ అన్నాడు ఆయన. ఊరుకోవచ్చుగా ఊరుకోకుండా ఓ మాట అన్నాడు తృణ భూతా హితా మన్యా ప్రాణి నామ మానుషాదయః అన్నాడు తృణంలాంటి వాళ్ళండి మనుషులు వాళ్ళు నన్నేం చేస్తారు. వాళ్ళ పేరెత్తను వాళ్ళగురించి వరమివ్వక్కర లేదన్నాడు అంతే... ఇంతకన్నా అవమానముంటుందాండీ, మనుష్య జాతికి, ఇంత అవమానకరంగా మాట్లాడి, ఆ రోజున విడిచిపెట్టేశాడు మనుష్యులని, కాబట్టి మనుష్యులు మాత్రం చంపేయగలరు రావణాసురున్ని అన్నాడు. ఇప్పుడు మీరు చూడండీ అక్కడ ఉన్నవాళ్ళందరూ ఎవరూ... యాగంలో మనుష్యులేగా, కాబట్టి ఎవడో ఒకడు ఏం చేస్తారంటే... ఏమండోయ్ మనిషినైతే నేను వెళిపోతాను రావణాసురుని మీదకు అంటాడు గదా... అలా మనుష్యుడైనంతమాత్రాన చంపేసేతంత తేలికమనిసేమిటి రావణాసురుడంటే... ఎవరైనా తొందరపడి గభాలున వెళ్ళిపోతారేమోననీ ఏతస్మిన్నన్తరే విష్ణురుపయాతో మహాద్యుతిః ! శఙ్ఖచక్రగదాపాణిః పీతవాసా జగత్పతిః !! అకస్మాత్తుగా అనుకోకుండా ఆ మధ్యలోకి ఒక్కసారిగా హఠాత్తుగా క్రిందికిదిగి ప్రత్యక్షమయ్యారు పోతనగారంటారే జలదర దేహు నాజాను చతుర్భాహు అనీ ఆ నాలుగు భూజములతో శంఖు చక్ర గధా పద్మములతో పట్టు పీతాంబురములతో వనమాల వేసుకొని కోటిసూర్యులుపగిడి ప్రకాశిస్తూ శ్రీమహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు ఒక్కసారి ఆయన్నిచూడగానే అందరూలేచి నమస్కారం చేశారు. చేసి స్తోత్రం చేసి
బ్రాహ్మణా చ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః తమబ్రువస్సురాస్సర్వే సమభిష్టూయ సన్నతాః !!
త్వాన్నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా ! రాఙ్ఞో దశరథస్య త్వమయోధ్యాధిపతేః ప్రభోః !!
ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షిసమతేజసః ! తస్య భార్యాసు తిసృషు హ్రీశ్రీకీర్త్యుపమాసు చ !!
విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాఽఽత్మానం చతుర్విధమ్ !

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకణ్టకమ్ ! అవధ్యం దైవతైర్విష్ణో ! సమరే జహి రావణమ్ !!
స హి దేవాంశ్చ గన్ధర్వాన్సిద్ధాంశ్చ మునిసత్తమాన్ ! రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే !!
ఋషయశ్చ తతస్తేన గన్ధర్వాప్సరసస్తథా ! క్రీడన్తో నన్దనవనే క్రూరేణ కిల హింసితాః !!
వధార్థం వయమాఽఽయాతాస్తస్య వై మునిభిస్సహ ! సిద్ధగన్ధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః !!
అక్కడ ఉన్నటువంటి దేవతలూ, ఋషులూ అందరూకూడా ఆయనకి సాష్టాంగ నమస్కారంచేసి, శరణాగతిచేస్తూ ఒకమాట చెప్పారు, మహానుభావా నీవు లోకరక్షకుడవు మాకు ఎప్పుడెప్పుడు ఆపదకలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు. నీవు మనుష్యుడుగా ఈలోకంలో అవతరించాలి, మహానుభావుడు రాజర్షీ, వేదమును నమ్మినటువంటివాడు, తేజస్సు కలిగినటువంటివాడు, అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజుగారు కొడుకులుపుట్టాలన్న కోరికతో పుత్రకామేష్టి చేయ్యబోతున్నాడు. ఆయన కడుపున అక్కడ ఉన్నటువంటి ఆయన ముగ్గురు భార్యలున్నరే హ్రీ శ్రీ కీర్తి ఎలాంటివారో దక్షప్రజాపతియొక్క కుమార్తెలు అటువంటివాళ్ళు కౌశల్యా, సుమిత్రా, కైకెయి వాళ్ళ ముగ్గురికడుపునా నీవు మనుష్యులుగా జన్మించాలి, జన్మించి రావణాసురున్ని సంహరించాలి. అప్సరసలూ దేవతలూ ఎవ్వరూ ఇవ్వాళ నందనవనంలో స్వేచ్ఛగా విహరించడానికికూడా స్వాత్యంత్రం లేనటువంటిస్థితి ఈ కష్టంనుంచి మమ్మల్ని ఉద్ధరించాలి కాబట్టి మీరు అవతారాన్ని స్వీకరించవలసిందీ అని ప్రార్థనచేశారు.
మీరు ఒకటి బాగా జ్ఞాపకంపెట్టుకోండీ... అవతారం స్వీకరించి చంపేయ్యండీ అని అడిగితే ఈశ్వరుడేమి అలావచ్చేయడు, ఆయన కొన్నికారణాలు చెప్తాడు ఈ కారణాలు ఉంటేమాత్రం నేనుచంపుతాను అని చెప్తాడు. ఎందుకో తెలుసాండీ...? ఇలా చంపడంకూడా ధర్మమునందు అంతర్భాగము. ఒక వైద్యుడున్నాడనుకోండీ ఒక వ్రణంపుట్టింది, ఒక పుండు. ఇప్పుడు ఆపుండుని వైద్యుడు కోసేస్తాడు వైద్యుడు పుండు కోసేశాడుకదానిచెప్పి, ఇప్పుడాయన మిమ్మల్ని చాలా బాధపెట్టాడు, చాలా నెప్పిపుట్టింది, చాలా రక్తంపోయింది కట్టు కట్టాడు వారంరోజులు ఆఫీసుకి శెలవుపెట్టేసి ఇంట్లోపడుకోండి అన్నాడు. ఇప్పుడు డాక్టరుగారు నన్నూ చాలా బాధపెట్టేశాడండీ... అని క్రోధంపెట్టుకుంటారా, మిమ్మల్ని బాధపెడుతున్న వ్రణాన్ని తీసేశాడు కనుక మీరుసంతోషిస్తారా... నా పుండు నాకిచ్చెయ్యండి పట్టుకెళ్ళిపోతారంటారెంటీ ఎవరైనా, ఎవడూ అనడు పుండు పోయిందని సంతోషిస్తారు. పుండు తీసేసినటువంటి వైద్యుడిది ఎంత ఉపకారమో... ధర్మాన్ని కభళిస్తున్నటువంటి వాళ్ళని అంతరింపజేసి, ఆ శరీరంతో వాడువుండి ఇంకా అధర్మం, ఇంకా మహాపాపంచేసి లోకకంఠకుడై అందరిచేత నిందింపబడేటటువంటి స్థితినుండి ఆ శరీరాన్ని వినిర్ముక్తంచేసినటువంటి దయ పరమేశ్వరుడిది కాబట్టి అదికూడా ధర్మ సంస్థాపనయందు అంతర్భాగము.
కాబట్టి ధర్మానికి హానికలిగేటటువంటిరీతిలో ఆయన ప్రవర్తించాడు అంతే... తప్పా ఆయన అవతారస్వీకారం చేసిచంపడు అందుకే ఒక మాటచెప్తాడు భాగవతంలో... శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు దలిగి నాయందు వాఁడెన్నఁగలుగు నాఁడె హింసఁ జెందు.ʻశుద్ధ సాధులందుʼనన్నే నమ్ముకొని బతుకుతున్నటువంటి మహాభక్తులైనటువంటివారి జోలికివెళ్తే మాత్రం చంపేస్తాను, ʻశ్రుతులందు వేదాన్ని తిరస్కరించి బ్రతకడం, వేదాన్ని విమర్షించడం ఎక్కువైపోతే అవతారం తీసుకొని చంపేస్తాను, ʻగోవులందుʼ ఆవుల జోలికివెళితే చంపేస్తాను, ʻవిప్రకోటియందుʼ వేదంచదువుకొని, వేదాన్నినమ్మకొని బ్రతుకుతున్నవాళ్ళ జోలికెళ్తే చంపేస్తాను, ʻధర్మపదవియందుʼ ధర్మం జోలికెళ్తే చంపేస్తాను, ʻదలిగి నాయందుʼ చిట్టచివరిగా తనగురించి చెప్పాడు, అదేపనిగా నన్నునిందిస్తే చంపేస్తాను. తప్పా అన్యథా నేను ప్రతీ చిన్నవిషయానికీ అవతారం స్వీకరించిచంపను కాబట్టి ఇప్పుడాయన చంపడానికి కారణం చెప్తున్నాడు ఎందుకు చంపుతానో తెలుసా రావణాసురున్ని

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణమ్ ! సపుత్రపౌత్రం సామాత్యం సమిత్రజ్ఞాతిబాన్ధవమ్ !!
హత్వా క్రూరం దురాఽఽత్మానం దేవర్షీణాం భయావహమ్ !
దశవర్షసహస్రాణి ధశవర్షశతాని చ ! వత్స్యామి మానుషే లోకే పాలయన్పృథివీమిమామ్ !!
Related imageనేను రావణాసురున్ని చంపడానికి కారణం మిమ్మలందర్నీ భయపెట్టడం, భయంకన్నా మృత్యువు ఈ లోకంలో ఇంకోటిలేదండీ... మీ మానాన మీరు వేదాన్నినమ్ముకొని బ్రతుకుతూంటే, మిమ్మల్ని భయపడేలాచేస్తున్నాడు అందుకు చంపేస్తాను మీ అందరి హితంకోసం చంపేస్తాను చంపడం కూడా ఎలాచంపుతానో తెలుసా... విషవృక్షాలన్నికలిసి ఒక పేద్ద వనం పెరిగినట్లుగా పెరిగాయి రావణాసురిడితో పాటు. అందుకని సపుత్రం కొడుకులందరినీ చంపేస్తాను సైన్యాన్ని చంపేస్తాను తమ్ముళ్ళని చంపేస్తాను ఆయనవారన్నవారు ఎవడూ బ్రతకడానికి వీలు లేకుండగా అందర్నీ చంపేస్తాను అంత అధర్మంతో ఉన్నాడు రావణాసురుడు, రావణాసురుడితో అనుబంధమున్నవాడు అన్నవాడు ఈలోకంలో ఉండడు, వాళ్ళందర్నీ చంపుతాను దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ పదకొండువేల సంవత్సరములు ఈ భూ మండలాన్ని పరిపాలన చేస్తాను. మనిషి గొప్పతనమేమిటో నిరూపిస్తాను మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకనకాదూ, మనిషి అంటే ఇంత గొప్పవాడని” చెప్పడానికి నేను ఒకమనుష్యుడిగా ప్రవర్తించి మనిషి యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తాను, అందుకు “మనందరం ఋణపడ్డాము రామ చంద్ర మూర్తికి.” అందుకని దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ వత్స్యామి మానుషే లోకే ఈ మనుష్య లోకంలో తిరుగుతాను పాలయన్పృథివీమిమామ్ నేనూ ఈ భూమండలాన్ని అంతటినీ కూడా పరిపాలన చేస్తాను తతః పద్మఫలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధమ్ పితరం రోచయామాస తథ దశరథన్నృపమ్ !! ఆయన తనని తాను నాలుగుగా విభాగించుకున్నాడు, విభాగించుకున్నాడు అంటే ముక్కలై పోయాడు అని మీరు భావన చేయకూడదు. ఒక విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు నేను నలుగురిగా వస్తాను, నలుగురు మనుషులుగా వస్తాను. ఇప్పుడు నలుగురు మనుషులుగా రావాలంటే మనిషి ఏమవ్వాలి ఒక పురుషుడు యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీ యందు ప్రవేసించి ఈ రేతస్సు వీర్యమూ కలసి శుక్ర శోణితములు కలిసి ఒక బుడగయై ఒక తల్లి కడుపులో తల కిందకీ కాళ్ళు పైకీ పెట్టి ఆ చీకటిలో, కడుపులో అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ... పన్నెండు నెలలు మలమూత్రముల మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని అత్యంత హేయమైన తల్లి యోనిద్వారములో నుంచి నేను బయటికివచ్చి పుడితేతప్ప నన్ను మనుష్యుడూ అని పిలవరు.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
మీ కోసం మీ ప్రతిష్ట కోసం, మనుష్యుడు ఇంత గొప్పవాడని చెప్పడం కోసం, నేనింత కష్టపడి, పుట్టుక లేనివాన్ని, కడుపులో పడుకొని యోనిలోంచి పైకొచ్చి మనుష్యుడనిపించుకొని బ్రతుకుతానని ప్రతిజ్ఞచేశాడు. ఇది “రామ చంద్ర మూర్తి ఈ జాతికి చేసిన కృప.” మనుష్య జాతి ఋణపడిపోయింది రామ చంద్ర మూర్తికి కాబట్టి నేనూ తతః పద్మపలాశాక్షః కృత్వాఽఽత్మానం చతుర్విధమ్ పితరం రోచయామాస అలా తాను పుట్టడానికి ఏ తండ్రి కడుపున పుట్టాలి, వరించాడు తండ్రిని ఈయన కడుపున పుడతానూ అన్నాడు, ఎవర్నీ? దశరథ మహారాజుగారి కడుపున పుట్టడానికి నిర్ణయించుకున్నాడు. అందుకేటా... మనుష్యునిగా పుట్టాలి అనుకున్నాడు కాబట్టీ, ఆయన ఎవరికి కొడుకో ఆ తండ్రి పేరు చెప్పి చెప్తే ఆయన సంతోషిస్తాడట రామ చంద్ర మూర్తి చాలా సంతోషపడిపోయే పేరేమిటో తెలుసాండీదాశరథీ” ఆయన దగ్గరకి వెళ్ళి దాశరథీ అని పిలిస్తే పొంగిపోతాడట. ఎవరో మా నాన్నగారి పేరుతో నన్ను పిలుస్తున్నారని, అందుకే గోప రాజు గారు దాశరథీ శతకం చేస్తే... మకుటం మార్చలేదు. అన్ని పద్యాలకీ ఒక్కటే మకుటం దాశరథీ కరుణా పయోనిధీ అని పెట్టారు. కాబట్టి ఇక్కడ రామాయలయంలో ప్రతి రోజూ దాశరథీ శతకాన్ని పిల్లలు విజ్ఞాపన చేస్తున్నారు అని విన్నాను, నేనూ ఒక రోజు వచ్చి వింటానని కూడా చెప్పాను ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ నిలబడి చదువుతూంటే... వాళ్ళజన్మ ధన్యం కదాండీ... రామ చంద్ర మూర్తి కృపకి నోచుకుంటారు వాళ్ళు.
కాబట్టి అలా ఆయన ఒక మనుష్యుడుగా జన్మించడానికి అంగీకరించాడు తమేవ హత్వా సబలం సబాన్ధవం విరావణం రావణమగ్ర్యపౌరుషమ్ స్వర్లోకమాగచ్ఛ గతజ్వరశ్చిరం సురేన్ద్రగుప్తం గతదోషకల్మషమ్ !! రావణాసురున్ని అతని బంధుపరివారాన్ని సంహరించిన తర్వాత మహానుభావా మళ్ళీ మీరు మీ అవతార పరిసమాప్తి చేసి స్వర్గలోకానికి విచ్చేయవలసిందీ అని అక్కడ ఉన్న దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు, తప్పకుండా అలాగే వస్తాను అని ఆయన అంగీకరించారు, పుత్రకామేష్టి ప్రారంభం చేశాడు దశరథ మహారాజు గారు, ఇష్ఠి జరుగుతోంది, దేవతలందరికీ కూడా హవిస్సులిచ్చారు, ఆ ఇష్టి పూర్తవుబోతోంది, అక్మాత్తుగా ఆ అగ్ని గుండలోంచి ఒక గొప్ప స్వరూపము ఒకటి బయటికి వచ్చింది ఆ బయటికి వచ్చిన స్వరూపాన్ని వాల్మీకి మహర్షి ఇలా వర్ణణ చేస్తున్నారు.
తతోవై యజమానస్య పావకాదతులప్రభమ్ !  ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలమ్ !!
కృష్ణం రక్తామ్బరధరం రక్తాఽఽస్యం దున్దుభిస్వనమ్ !  స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రుప్రవరమూర్ధజమ్ !!
శుభలక్షణసమ్పన్నం దివ్యాఽఽభరణభూషితమ్ !  శైలశృఙ్గసముత్సేథం దృప్తశార్దూలవిక్రమమ్ !!
దివాకరసమాఽఽకారం దీప్తానలశిఖోపమమ్ !  తప్తజామ్బూనదమయీం రాజతాన్తపరిచ్ఛదామ్ !!
దివ్యపాయససమ్పూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియామ్ ! ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ !!
ఆ పుట్టినటువంటి మహాపురుషుడు యజ్ఞ గుండంలోంచి వచ్చినటువంటి ఆ పురుషుడూ... ఒక పేద్ద పర్వతం ఎంతుంటుందో అంత ఆకృతితో ఉన్నాడు, ఎర్రటి ముఖంతో ఉన్నాడు, నల్లటి, ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలూ, ఆయనకు ఉన్నటువంటి మీసాలూ సింహపు జూలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. పెద్ద పెద్ద కన్నులతో ఉన్నాడు, రెండు చేతులతోటి ఒక బంగారు పాయస పాత్ర పట్టుకున్నాడు, దానికి వెండి మూత ఒకటి పెట్టబడి ఉంది, ఒక్కసారి ఆ అగ్ని గుండంలోంచి ప్రభవించాడు. ఆయన మాట్లాడుతూంటే దుంధుభీ స్వరం ఏలా ఉందో అలా ఉంది మాట,

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
మధించినటువంటి ఒక పెద్ద పులి యొక్క విక్రమం ఎలా ఉంటుందో అడుగులు వేస్తుంటే అలా ఉంది, సభా అంతా విద్విగ్నులైపోయి ఆలా ఆయన వంక చూస్తున్నారు, ఆయన ఆ పాయస పాత్ర పట్టుకుని అగ్ని గుండంలోంచి బయటికి వచ్చారు వచ్చి నిలబడి దశరథ మహారాజు వంక చూసి, మహా రాజా నీ కొరకే ఆవిర్భవించాను అన్నాడు.
http://www.cherloyadavalli.org/Images/Chaganti/ChagantiRamayanam-4.jpgనేను ఏం చెయ్యాలో  చెప్పండీ అన్నాడు! దశరథుడు ఇదం తు నృపశార్దూల! పాయసం దేవనిర్మితమ్ ! ప్రజాకరం గృహాణ త్వం ధన్యమారోగ్యవర్ధనమ్ !!  నృపశార్దూల ఓ దశరథ మహారాజా... ఇది పాయసం దేవనిర్మితమ్ ఇది దేవతల చేత నిర్మించబడినటువంటి పాయసం, ఇది ప్రజాకరం గృహాణ త్వం ఇది నీవు స్వీకరించు, ఇది నీ భార్యలు తీసుకుంటే నీకు సంతానం కలుగుతుందిధన్యం నీకు ధనం కలుగుతుందిఆరోగ్యవర్ధనమ్ ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ పాయసాన్ని స్వీకరించు భార్యాణామనురూపాణామశ్నీతేతి ప్రయచ్ఛ వై ! తాసు త్వం ప్రాప్స్యసే పుత్రాన్యదర్థం యదర్థం యజసే నృప! ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని నీ కత్యంత ప్రియమైనటువంటి అనురూపవతులైనటువంటి భార్యలెవరైతే ఉన్నారో... వాళ్ళకి ఈ పాయసాన్ని ఇవ్వు, వాళ్ళు ఈ పాయసాన్ని తిన్న తర్వాత గర్భాన్ని ధరిస్తారు, నీకు చక్కటి సంతానం కలుగుతుంది అన్నారు. చాలా సంతోషించాడు ఆ పాయస పాత్ర తీసుకున్నాడు, ఆ వచ్చినటువంటి ఆ పురుషుడికి ప్రదక్షణం చేశాడు, నమస్కారం చేశాడు, ఆవచ్చిన పురుషుడు పాయస పాత్రనిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ పయస పాత్ర తీసుకొని వెళ్ళి ముగ్గురి భార్యల వంక చూశాడు
కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా ! అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః !!
కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రార్ధకారణాత్ ! ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమమ్ !!
అనుచిన్త్య సుమిత్రాయై పునరేవ మహీపతిః ! ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్ !!
ఆ పాయస పాత్రలో ఉన్న పాయసాన్ని ముందు సగం చేశాడు, రెండు భాగములు చేసి ఒక భాగం పట్టమహిషి గనుక కౌసల్యా దేవికి ఇచ్చాడు, సగం పాయసం కౌసల్య తిన్నది. మిగిలినటువంటి ఆ సగం పాయసాన్ని రెండు భాగాలు చేశాడు, ఒక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఇప్పుడు ఇంకొక పావు వంతు ఉంది, దీని కైకమ్మ వంక చూశాడు, కౌశల్యకి అర్ధ భాగము ఇచ్చాడు, సుమిత్రకి పావు భాగం ఇచ్చాడు, కైకమ్మకి పావు వంతు ఇవ్వలేదు, కైకమ్మ వంక చూసి ఆ పావు భాగాన్ని మళ్ళీ రెండు భాగాలు చేశాడు, రెండు ఏనిమిది వంతులు అయింది, ఒక ఎనిమిది వంతు కైకమ్మకు ఇచ్చాడు, మళ్ళీ అందులో ఎనిమిదో వంతు తీసుకొచ్చి సుమిత్రకిచ్చాడు.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు కౌశల్యకి అర్ధ భాగం ఇచ్చాడు, సుమిత్రకీ మూడు భై ఎనిమిదవ భాగము ఇచ్చాడు, కైకమ్మకీ ఒకటీ భై ఎనిమిదో

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
భాగము ఇచ్చాడు, ముగ్గురికీ కలిపీ అలా పాయసాన్ని పంచి పెట్టాడు. ఇప్పుడు రెండు సార్లు సుమిత్రకి ఇచ్చాడు, ఒక పర్యాయం కౌశల్యకి ఇచ్చాడు, ఒక పర్యాయం కైకమ్మకి ఇచ్చాడు, ముగ్గురు భార్యలూ ఆ పాయసాన్ని తీసుకున్నారు, చాలా సంతోషించారు. మనం గర్భవతులమౌతాం, సత్ సంతానం మన కడుపున కలుగుతుంది, మన జన్మ ధన్యమైందీ అనీ ఎంతో సంతోషిస్తున్నారు.
ఈలోగా బ్రహ్మగారు దేవతలందర్నీ పిలిచారు, రావణాసురిడితో పాటుగా కొన్ని కోట్లమంది రాక్షసులు ఉన్నారు. సామాన్యమైన వాళ్ళేంకాదు వాళ్ళందరూ, వాళ్ళందరూ తెగతార్చబడాలి అంటే... రామ చంద్ర మూర్తికి సాయం చేయడానికి, అవతారం స్వీకరిస్తున్నటువంటి విష్ణువుకి సాయంచేయడానికి మీ అందరూ కూడా, మీ మీ అంశలతో, మీ మీ తేజస్సులతో ప్రాణులను సృష్టించాలి, నర వానరులచేత భంగపాటు రావణాసురుడికి ఉంది, పైగా వానరులచేత అవమానింపబడుతాడు అని నందీశ్వరుడు శపించివున్నాడు. కాబట్టి వానర ముఖాలతో వానరులుగా సృష్టిచెయ్యండి. మీ భార్యలయందు సృష్టించడం కుదరదు కాబట్టి. ఎందుకంటే పార్వతీ దేవి యొక్క శాపం ఉంది దేవతలకి ఇంక సంతానంకలగదు అదిఎందుకొచ్చిందన్నది రామాయణంలోనే ఎదర శణ్ముకోత్పత్తిలో వస్తోంది. శణ్ముకోత్పత్తి ఎక్కడిదో తెలుసాండీ... కుంభసంభవం కాళిదాసకృత చదవరు ఎందు చేతనంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండీ, ఒక గర్భం ధరించినటువంటి స్త్రీ కడుపులోకి ఒక జీవుడు ప్రవేశించినప్పుడూ ఆ తల్లి కడుపున పుట్టేటటువంటి పిల్లవాడు, కేవలం ఉద్దరిస్తాడని నమ్మకం ఉండదు. ఎందుకో తెలుసా... కొడుకులు చాలా రకాలుగా వస్తారు, ఒకడు శత్రుపుత్రుడుగా వస్తాడు, శత్రువు, వీడునన్ను ఇంత బాధపెట్టాడు, ఇంత బాధ పెట్టాడు అని తలుచుకు తలుచుకు తలుచుకు తలుచుకు ప్రాణం విడిచిపెడతాడు అదీ చాలా కోపంతో... ఆ లలితా సహస్త్ర నామ స్తోత్రంలో అమ్మవారి ఒక నామానికి ఒక ఈ పునర్జన్మ గురించి వ్యాఖ్యానం కూడా ఉంది.
కాబట్టీ వాడు అలా క్రోధం పెట్టుకు పెట్టుకు మరణిస్తే... ఈయనకి కొడుకుగా వస్తాడు, నాన్నగారు వాడ్నీ ఓరేయ్ నీవు ఇంజినీరింగు చదువు అన్నాడనుకోండీ... అదే నేను చదవను అంటాడు. ఒరే నీవు వ్యాపారం చేయ్, అదే నేను చెయ్యను అంటాడు, ఒరే నీవు అన్నం తిను నేను తినను అంటాడు, ఒరే ఆయనకి నమస్కారం చేయి అంటాడు, నేను చేయను అంటాడు వాడికి ఒకే ఒక లక్ష్యము ఎమిటంటే తండ్రి ఏడవాలి... తండ్రిని ఏడిపించడమే ప్రయోజము. మీరు చూడండి కొంత మంది కొడుకులు ఉంటారు, ఊళ్ళోవాళ్ళకి మంచివాళ్ళు తండ్రికి అన్నం కూడా పెట్టరు మా నాన్న పేరుమాత్రం ఎత్తకండీ అంటారు. ఎందుకో తెలుసాండీ..? వాన్నివదల్లేడు ఈయన పుత్రేషా ఎలా వదులుతారు వదల్లేరు, ఇంతకుముందు జన్మలో ఏడిపించిన ఏడుపు వాడు ఇప్పుడు ఏడిపిస్తాడు శత్రువు కొడుకుగా వస్తాడు. ఒక్కొక్కసారి అప్పు తీసుకొని తీర్చకపోతే... వాడు కొడుకుగా వస్తాడు. వాడేంచేస్తాడంటే అప్పైపోయేవరకు వీడిదగ్గర అన్నంతిని వెళ్ళిపోతాడు శరీరమొదిలేస్తాడు అప్పుడు వాడుచచ్చిపోయాడని వీడు ఏడుస్తూ కూర్చుంటాడు కాబట్టీ ఋణ పుత్రుడు శత్రు పుత్రుడు, సేవక పుత్రుడు మన్ని సేవించడంలో బాగా దగ్గరైపోయాడనుకోండీ సేవకుడు సేవించి సేవించి సేవించి యజమానినే తలచుకుంటూ ప్రేమతో మరణించాడనుకోండీ, ఆ సేవకుడు కొడుకుగా వస్తాడు వాడికి ఏ అలవాటు వస్తుందంటే...

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
నాన్నగారు వీధిలోకి వస్తే కుర్చీవేస్తాడు నాన్నగారు పడుకుంటే కాళ్ళు పడుతాడు, నాన్నగారు లేవగానే ఆయన ధంతధావనం చేసుకోవడానికి పరికరాలు ఇస్తాడు నాన్నగారు వీధిలోంచిరాగానే కాళ్ళుకడుగుతాడు తువ్వాలుతో తూడుస్తాడు.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
అక్షరంముక్క మాత్రంరాదు. ఓ వ్యాపారం చెయిద్దామంటే... ఒరేయ్ ఓ రెండు రూపాయలకు, ఓ అరటి కాయ ఇస్తార్రా.... పట్టుకెళ్ళి బేరమాడి అరిటి కాయలు పట్టుకురా అని తండ్రి పంపించారనుకోండి, నా కోతండ్రి చెప్పుకొని ఏడ్చాడు, అందుకని చెప్తున్నా, పేరుచెప్పడం బాగుండదు. ఆరు రూపాయలిచ్చి అరటి కాయలు ఒక్కొక్కటీ రెండు రూపాయలు ఉంటాయి, బెరమాడి పట్టుకురా... అన్నాడాయన. వీడువెళ్ళి అడిగాడు ఎంత అరటి కాయలు అన్నాడు. ఐదు రూపాయలకి మూడు అన్నాడు ఆయన, అంటే ఐదు రూపాయలకి మూడైతే ఒక్కొక్కటి ఎంతవుతుంది, భాగాహారం తెలియదు ఆయనకి, నాకు అనవసరం, ఆరురూపాయలకి మూడిస్తావా అన్నాడు తప్పకుండా ఇబ్బందేముంది తీసుకెళ్ళు అన్నాడు. ఇంటికొచ్చి చెప్పారండి, నాన్నగారండీ... మీ రెప్పుడూ బెంగపెట్టుకుంటారు నాకురాదని, అరటికాయ నాకు రెండురూపాయలుంటుందన్నారుగా, వాడు ఐదురూపాయలకి మూడిస్తాన్నన్నాడు. నేను రెండురూపాయలకి ఒకటి చొప్పున ఆరురూపాయలకి మూడుతీసుకొచ్చాను అన్నాడు ఇదేరా నా ఏడుపు అన్నాడు తండ్రి వాడు సేవకపుత్రుడు. వాడు మిమ్మల్ని బాధించడానికి లోపలవున్నప్రాణి ఏరూపంలో వస్తూందో మీకుతెలియదు. ఏదోస్తోందో... అందరూ ఉద్దరించేయడానికి వచ్చేస్తుంటారని చెప్పడానికి ఏమి ఉండదు. ఇప్పుడు కడుపులో ఉన్నటువంటిప్రాణి సంస్కరింపబడీ... ఆయన మీకు ఆనుకూల్యతతో, మీవంశాన్ని నాశనంచేసేవాడు కాకుండగా... వృద్ధిలోకి వచ్చేటటువంటివాడై... దీర్ఘాయుష్మంతుడై సంతోషము ఇవ్వగలిగినవాడు కావాలంటే... శాస్త్రంలో మర్యాద ఏమిటోతెలుసాండీ... గర్భిణీ స్త్రీ శ్రీ రామాయణంలో బాల కాండలో చెప్పిన  శణ్ముకోత్పత్తి వినాలి. ఆ శణ్ముకోత్పత్తి  వింటే కడుపులో ఉండే పిండానికి అటువంటి దోషాలేమైనా ఉంటే, ఆ దోశాలన్ని తొలగిపోతాయి. అందుకే శణ్ముకోత్పత్తి వినండి అంటూంటారు, లేకపోతే భాగవతం దశమస్కంద కృష్ణ లీలలు వినమంటారు. మనకీ రేపుకాని, ఎల్లుండికాని వచ్చేస్తుంది. రామ చంద్ర మూర్తి పుడితే విశ్వామిత్రుని వెంటవెళ్ళితే శణ్ముకోత్పత్తి గంగావతరణం వస్తాయి.
Image result for బ్రహ్మగారుకాబట్టీ ఇప్పుడు ముగ్గురికీ పాయసం పంచిపెట్టిన తరువాత బ్రహ్మగారు పిలిచి, పార్వతీదేవి శాపకారణంచేత మీ భార్యలయందు మీకు సంతానంకలగరు. కాబట్టి మీరు వానరకాంతలయందు మీరు మీ తేజస్సుని నిక్షేపించి, అప్సరసలయందు మీ తేజస్సుని నిక్షేపించి బలవంతులైనటువంటి పుత్రులు కలిగేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోండీ అని చెప్పాడు (అసంహార్యాను పాయాజ్ఞాన్ దివ్వయసంహన నాన్వితాన్!సర్వాస్త్రగుణసమ్పన్నా నమృతప్రాశనానివ !! అంమృతం తాగినవారు ఎంత బలాడ్యులై ఉంటారో... సర్వ శాస్త్రవిశారుదులై ఉన్నటువంటివాళ్ళు ఎలా ఉంటారో అలాంటి బిడ్డల్ని మీరుకనండి. రామ చంద్ర మూర్తికి సాయం చేయవలసి ఉంటుంది అన్నారు అప్సరస్సు చ ముఖ్యాసు గన్ధర్వాణాం తనూషు చ ! యక్ష పన్నగ కన్యాసు ఋక్ష విద్యాధరీషు చ !! కిన్నరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ !  సృజధ్వం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్ !! పూర్వమేవ మయా సృష్టో జామ్బవానృక్షపుఙ్గవః ! జృమ్భమాణస్య సహసా మమ వక్తద్రజాయత !!  ఆయనన్నాడు మీ భార్యలవలన సంతానంకలగదు కాబట్టి, గధర్వ కాంతలు, యక్ష కాంతలు, పన్నగ కాంతలు, నాగ కాంతలు, వృక్ష కాంతలు, విద్యాధర కాంతలు, వానర కాంతలు వీరియందు మీ తేజస్సును నిక్షేపించి, మీతో

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
సమానమైన బలం గలిగినటువంటి వీరులు సమానులైన వానర వీరుల్ని సృష్టించండి. నేను ఇతః పూర్వమే, నేను ఒకా నొకప్పుడు నా సభలో కూర్చొని ఆవులించాను, ఆవులించినప్పుడు నానోటిలోంచి వానరం ఒకటి బయటిదూకింది ఆయనకు జాంబవంతుడు

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
అని పేరు అందుకే, అన్ని విషయాలను బ్రహ్మగారిని ఎలా సంప్రదిస్తారో, శ్రీ రామాయణంలో వానరులందరు జాంబవంతున్ని సంప్రదిస్తుంటారు అది అక్కడ పెద్దతలకాయి, ఆయన కొడుకు ఇక్కడ పెద్దతలకాయి అందుకని జాంబవంతుడు పెద్దవాడు, మహా బలపరాక్రమాలు కలిగినటువంటివాడు.
Related imageఒకానొకనాడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో భూమిని దానంపట్టి ఆయన ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపైనంతై అనీ అంత పెద్దవాడైపోయి, భూమండలాన్ని ఆ స్వర్గలోకాన్ని అంతటినీ ఆక్రమణంచేసినప్పుడు 21 పర్యాయములు ప్రదక్షణచేశాడు జాంబవంతుడు అంతటిబలశాలి. కాబట్టి నా నోటివెంట జాంబవంతుడుపుట్టాడు మీరుకూడా సృష్టించండి అన్నాడు వానరేన్ద్రం మహేన్ద్రాభమిన్ద్రో వాలినమూర్జితమ్ ! సుగ్రీవం జనయామాస తపనస్తపతాం వరః !! ఇంద్రుని యొక్క అంశతో వాలి పుట్టాడు, అలాగే సుగ్రీవుడు అనబడేటటువంటి వానరుడు సూర్యుని యొక్క అంశతో జన్మించాడు అలాగే బృహస్పతిస్త్వ జనయత్తారం నామ మహాహరిమ్ ! “బృహస్పతి” తన అంశతో తారుడు అనే టటువంటి వానరున్ని సృష్టించాడు సర్వవానరముఖ్యానాం బుద్ధిమన్తమనుత్తమమ్ !! బృహస్పతి ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వాడో... ఈ తారుడు అను బడేటటువంటి వానరుడు కూడా అంతబుద్ధికలిగినటువంటి హరి వీరుడు ధనదస్య సుత్రశ్శీమాన్ వానరో గన్ధమాదనః కుబేరుని యొక్క అంశతో “కుబేర” పుత్రునిగా వానర రూపంలో  గన్ధమాధనుడు పుట్టాడు విశ్వకర్మాత్వజనయన్నలం నామ మహాహరిమ్ విశ్వకర్మ” యొక్క అంశలో నలుడు అనే టటువంటి వానరుడు జన్మించాడు. (వింటున్నారా గోపాల క్రిష్ణగారు, విశ్వకర్మ అంశలో నలుడు జన్మించాడు) పావకస్య సుత్రశ్శ్రీమాన్ నీలోగ్నిసదృశప్రభః అలాగే “అగ్ని హోత్రుని” యొక్క అంశతో నీలుడు అనేబడేటటువంటి వానరుడు జన్మించాడు.
తేజసా యశసా వీర్యాదత్యరిచ్యత వానరాన్ అలా రమ్యమైనటువంటి తేజస్సులైనటువంటి వీర్యవంతులైనట్టి వానరుల్ని సృజించారు రూపద్రవిణసమ్పన్నావశ్వినౌ రూపసమ్మతౌ ! మైన్దం చ ద్వివిదం చైవ జనయామాసతుస్స్వయమ్ !! చాల రూపవంతులైనటువంటి తేజస్సు కలిగినటువంటి అశ్వినీ దేవతలు మైందుడు, ద్వివిదుడు అనేటటువంటి ఇద్దరు వానరుల్ని సృష్టించారు వరుణో జనయామాస సుషేణం వానరర్షభమ్ ! వరుణుడు సుషేణుడు” అనేబడేటటువంటి వానరున్ని సృష్టించాడు శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలమ్ !! అలాగే పర్జన్యుడు ఒక వానరకాంతయందు తనతేజస్సుని నిక్షేపించి శరభుడు అనేటటువంటి వానరున్ని సృష్టించాడు మారుతస్యాఽఽత్మజశ్శ్రీమాన్హనుమాన్నామ వీర్యవాన్ వజ్రసంహననోపేతో వైనతేయసమో జవే !! సర్వవానరముఖ్యేసు బుద్ధివాన్ బలవాన్పీ !! వాయు దేవుని యొక్క అంశతో అందరు వానరరులలోనూ కూడా బలాడ్యుడైనటువంటి వాడు, గొప్ప బుద్ధి బలం కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, రామ చంద్ర మూర్తి యందు అపారమైనటువంటి భక్తి కలిగినవాడు ఎవర్ని స్మరించినంత మాత్రము చేత బుద్ధి, వాక్భలమూ, ఆరోగ్యమూ కలుగుతాయో అంతటి తేజస్సంపన్నుడైనటువంటి శ్రీ హనుమా జనించారు. కాబట్టి వాయు దేవుని  యొక్క అంశతో వచ్చినటువంటి వాడు హనుమంతుడు ఇలా ఈ వానర వీరులందరూ సృజింపబడ్డారు.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
Related imageవీళ్ళు ఎంతటి బలం కలిగిన వారంటే... వీరుకాక ఇతర అంశలతో వచ్చినవారు కొన్ని కోట్ల వానరములు సృజింపబడ్డాయి. ఈ వానరములన్నీ కూడా తమ కాళ్ళచేత తాకించి ఈ భూమిని అతలా కుతలం చేయగలవు, సముద్రాన్ని కల్లోలం చేయగలవు, ఇవి నూరుయోజనముల సముద్రాన్నిగడచి వెళ్ళిపోగలవు, ఆకాశంలోకి ఎగరి మేఘాలను పట్టుకోగలవు, అరణ్యాలలో ఏనుగులను అవలీలగా పట్టుకొన్ని గిరగిరా తిప్పి విసిరేయగలవు, క్రూర మృగాలను చేతితో మద్ధించగలవు, పెద్ద పెద్ద వృక్షాలను పెకలించగలవు పెద్ద పెద్ద పర్వతాలను, శిలలను ఊపి, కదిపి, పైకెత్తి విసరగలవు, గోళ్ళతోటి తమ తొడలతోటి, పాదాలతోటి, చేతులతోటి, మోచేతులతోటి, గుద్ది కుమ్మి కరచి యుద్ధం చెయ్యగలవు, సమస్త అస్త్ర శస్త్రములు వాటికి తెలుసు, వాటి ఉపసంహారము వాటికి తెలుసు, అవి గాలిలో తిరగగలవు, నీటిలో తిరగగలవు, భూమి మీద తిరగగలవు అంత అపారమైనటువంటి మనోజవం, తేజస్సు, శక్తి, కలిగినటువంటి కొన్ని కోట్ల వానరములను దేవతలందరూ సృజించారు కాబట్టి వారములన్నీయు రామ చంద్ర మూర్తికి సహాయం చెయ్యడం కోసమని, ఈ భూమండలం మీద ప్రభవించారు.
పాయస పాత్రని తీసుకొని, తనభార్యలకి ఆ పాయసాన్ని పంచిపెట్టిన దశరథ మాహారాజు గారు యజ్ఞం పూర్తైపోయింతరువాత, ఎప్పుడెప్పుడు ఇంక తన భార్యలవలన తనకు పుత్రోదయం జరుగుతుందాని ఎదురు చూస్తున్నారు శ్రీమతాం గచ్ఛతాం తేషాం స్వపురాణి పురాత్తతః ! బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే !! దశరథ మాహారాజు గారు యజ్ఞానికి వచ్చిన వాళ్లదరికీ ఇచ్చిన విలువైనటువంటి వస్త్రాలను తాము ధరించి, ఆ హారములును వేసుకొని సంతోషంగా వచ్చినటువంటి అతిథులందరూ, తిరిగి రథాలెక్కి వెళ్ళిపోతున్నారు గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా ! ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్ !! బ్రహ్మణులను ముందుంచుకొని దశరథ మహారాజు గారుకూడా యజ్ఞం పూర్తిచేసి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు తనతో పాటు శాంతా ఋష్యశృంగుల్నీ తీసుకెళ్ళాడు, ఆయన దగ్గర అంతఃపురంలో కొంతకాలం ఉన్నారు శాన్తయా ప్రయయౌ సార్ధమృశ్యశృఙ్గస్సుపూజితః ! అన్వీయమానో రాజ్ఞాథ సానుయాత్రేణ ధీమతా !! శాంతతో కలిసి అంతఃపురంలో కొంతకాలమున్న ఋష్యశృంగుడు, తన మామగారైనటువంటి రోమపాదుడుతో కలిసి తరువాతి కాలంలో దశరథుడిచేత పూజలందుకొని ఆయనకూడా వెళ్ళిపోయాడు
తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః ! తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ !!
నక్షత్రేదితిదైవత్యే స్వోచ్చసంస్థేషు పఙ్చసు ! గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిన్దునా సహా!!
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతమ్ !
చైత్రమాసంలో పన్నెండు ఋతువులు పూర్తైన తరువాత ఒక సంవత్సరకాలం పూర్తైనతరువాత ఆరు ఋతువులూ పూర్తైయ్యాక చంద్రుడు బృహస్పతితో ఉండగా, కర్కాటక లగ్నంలో పునర్వసూ నక్షత్రంలో నవమీ తిథినాడు ఐదు గ్రహములు కుజుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటివారు ఉచ్ఛ స్థితిలో ఉండగా... సర్వలోకనమస్కృతమ్ అన్నిలోకములచేత నమస్కరించబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు, సాక్ష్యాత్తు శ్రీమహావిష్ణువు, కౌసల్యానంద వర్ధనుడై, రామ చంద్ర మూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించారు. కౌసల్యా దశరథులకి మొట్ట మొదటి కొడుకుగా మహానుభావుడు రామ చంద్ర

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
మూర్తి ఆవిర్భవించాడు కౌసల్యాజనయద్రామం సర్వలక్షణసంయుతమ్  !! విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనమ్ ఇక్ష్వాకు వంశమంతా తరించి పోయేటట్టుగా ఆ రామ చంద్ర మూర్తి ఈ లోకంలో ఆవిర్భవించగానే, దేవతలందరూ కూడా దుందుభిలు మోగించారు. అదిగో దేవదుందుభిలు మ్రోగినట్లే దేవాలయంలో దుందుభిలు మ్రోగుతున్నాయి మంగళధ్వనులు చేశారు, ఆ కౌశల్యాదేవి ఆ పక్కన పుట్టినటువంటి ఆ రామ చంద్ర మూర్తిని దగ్గరికి https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgqz_tI7VrKruk4pyHMkf_pmWHoz1JghcYk02SjRtYJZoYtWoxbypxQtHXT5ZI0DzQJHfFQt6Po162hHHAxINxGr1JIhkQsauS3dFEG8Ux5N2Z2k1W9NKiK5K6q4zmyiv33rAICwenh3eo/s320/rama-birth.gifతీసుకుంటే... ఇంద్రుడుతో కలసి ఉన్నటువంటి అధితి ఎలా ప్రకాశించిందో... అలా ప్రకాశించిందట తల్లి కౌసల్యా శుశుభే తేన పుత్రేణామితతేజసా ! యథా వరేణ దేవనామదితిర్వజ్రపాణినా !! భరతో నామ కైకేయ్యాం జఙ్ఞే సత్యపరాక్రమః ! సాక్షాద్విష్ణోశ్చతుర్భాగస్సర్వైస్సముదితో గుణైః !!  కైకేయీ భరతుడు అనబడేటటువంటి పేరు ఉంచబడవలసినటువంటి కుమారున్ని, రామ చంద్ర మూర్తి తరువాతి బిడ్డగా ప్రసవించింది, కాబట్టి రామ చంద్ర మూర్తి తరువాత పుట్టినటువంటివాడు భరతుడు అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ ! వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్ధసమన్వితౌ !! లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళిద్దరు ఆశ్లేషా నక్షత్రంలో కవల పిల్లలుగా సుమిత్రా దేవికి జన్మించారు పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః ! భరతుడు మీన లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో జన్మించాడు
గుణవన్తోనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః ! జగుః కలం చ గన్ధర్వా ననృతుశ్చాప్సరోగణాః !!
దేవదున్దుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా ! ఉత్సవశ్చ మహానాసీదయోధ్యాయాం జనాకులః !!
రథ్యాశ్చ జనసమ్బాధా నటనర్తకసఙ్కలాః ! గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః !!
ప్రదేయాంశ్చ దదౌ రాజా దూతమాగధవన్దినామ్ ! బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః !!
రామ చంద్ర మూర్తి, లక్ష్మణ మూర్తి, భరత శత్రుజ్ఞులు ఈ లోకంలో ఆవిర్భవించగానే... ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. దేవదుంధుబిలు మోగాయి, పుష్పవృష్టి కురిసింది, దేవతలు సంతోషించారు, కోసల రాజ్యమంతటా ఉత్సవమే... వచ్చిన యాత్రికులందరూ కూడా సంతోషాన్ని ప్రకటించారు. పౌరులందరూ కూడా తమ ఇళ్ళల్లోనే పెద్ద పండుగ జరుగుతున్నట్టుగా పతాకాలు పైకెత్తారు, గొప్ప ఉత్సవం, ఎక్కడ చూసినా ఆనందం, దశరథ మాహారాజు గారికి సంతానం కలిగింది, అశ్వమేధం, పుత్రకామేష్ఠిచేస్తే అపురూపమైనటువంటి కొడుకులు సాక్ష్యాత్తు విష్ణువే కొడుకులుగా పుట్టారు. సర్వ గుణములతోటి శోభించేటటువంటి పిల్లలు, మనుష్య జాతిని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగినటువంటి ధర్మాత్ములు, ఏ మహానుభావుడి పేరు చెప్పుకుంటే పాపరాశి ధ్వంశమైపోతుందో... అటువంటి మహా పురుషులు ప్రభవించారనీ... వాళ్ళందరూ సంతోషంతో, నటీనటులందరూ నాట్యంచేశారట. నాటకాలు వేశాలరట, అందర్నీ వినోదింపజేశారట, నృత్యం చేసేవారు నృత్యం చేశారట, వంది మాగది, సూతులు మొదలైనవాళ్ళను దశరథ మహారాజు గారు పిలిచి కొన్నిలక్షల గోవుల్నీ బంగారు కాసుల్ని, ద్రవ్యాన్ని దానంచేశారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందర్నీ కానుకలతో సంతోషపెట్టారు రాజ్యమంతటా ఎక్కడ చూసినా ఎంతో సంతోషంగా ఉంది.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
Related imageపదకొండో రోజు పూర్తైయింది, పురిటిమైల తీరింది, తీరిన తరువాత ఆ పుట్టిన పిల్లలందరికీ పేర్లుపెట్టమని దశరథ మహారాజు గారు కులగురువైనటువంటివాడు, రోహితుడైనటువంటివాడు వశిష్ట మహర్షిని అభ్యర్తించారు. పెడితే తాతగారు పెట్టాలి లేకపోతే గురువుగారు పెట్టాలి. అంతేకాని లేక లేక పుట్టారనీ... పేర్లూ దశరథ మహారాజుగారు పెట్టుకోలేదు గురువుగార్ని పెట్టమన్నారు. ఈ లోకానికి వశిష్ట మహర్షి ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి మనకు ఇచ్చిన కానుక రామ నామం. అందుకని ఆ నామాన్ని చెప్పుకుంటే... రాబోవు తరాలన్నీ మనుష్యజాతి తరిస్తుందనీ ఒక్క ఒత్తులేకుండా అష్టాక్షరీ మంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, పంచాక్షరీ మహా మంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని ఏ రెండు బీజాక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకి అర్థమే ఉండదో... అటువంటి బీజాక్షరాల్ని తీసుకొని అగ్ని బీజం ఒకటి, అమృత బీజం ఒకటి  ఆ రెండిటినీ కలిపి రామా అని నామ కరణం చేశారు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయూసుతమ్ ! సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా !! పెద్దవాడికి ʻరామాʼ అని నామకరణం చేశారు. రెండవాడికి కైకేయీ సుతునికి ʻభరతాʼ అని నామకరణం చేశారు సౌమిత్రిం లక్ష్మణమిత లక్ష్మణ స్వామికి, ʻలక్ష్మణ స్వామీʻ అని సుమిత్ర యొక్క కుమారునికి నామకరణం చేశారు. నాల్గవవానికి చిట్టచివర పుట్టినవానికి ʻశత్రుజ్ఞుడుʻ అని నామకరణం చేశారు. ఈ పేర్లు ఎంత దూరదృష్టితో పెట్టారో... ఆ పిల్లలవంశం తరించడం కాదు మనుష్యజాతి తరించాలని పేర్లుపెట్టాడు.
నాకీ విషయం చెప్తూంటే ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది, ఈ రామ నామం పట్టుకుని తరించినటువంటి పట్టణాల్లో... ఈ గుంటూరు పట్టణం ఒకటి. ఎందుకో తెలుసాండీ... ఇక్కడే ఉంది లోకంలో రామాలయం ఉంటుంది, రామకోటి పందిరుంటుంది, రామనామ క్షేత్రమున్న ఊరు గుంటూరు. ఎందుచేతనంటే నాకూ పేర్లూ సరిగ్గా జ్ఞాపకమున్నాయో లేదో తెలియదుకానీ, పిచ్చయ్య దాసుగారు అనిచెప్పి మహానుభావుడు ఒకాయన వినుకొండలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సంతానం కలగకపోతే... అక్కడే గుంటా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే, ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామివారిని అర్చించారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆయనకు పుట్టినటువంటి కొడుకుకి ఆంజనేయుడు అనే పేరుంచారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వారు తరువాతి కాలంలో శ్రీశైలం దగ్గిరా నాకు జ్ఞాపకం ఉంటే, పెద్ద చెరువు అనుకుంటాను ఆ ఊరి పేరు ఆ ఊరికి వారు బదిలీ అయ్యారు. అక్కడ ఈ పిల్లవాడు చిన్న తనంలో మట్టి తవ్వుతూ... ఆడుకుంటున్నప్పుడు అతడికి రామ చంద్ర మూర్తి యొక్క విగ్రహం ఒకటి దొరికింది. ఆ దారు విగ్రహాన్నే తరువాతి కాలంలో మార్చి మార్చి ఎక్కడ తండ్రి పిచ్చయ్య దాసుగారున్నరో అక్కడే తండ్రి ఇంట్లో గోడలో గూడు కట్టి ఆగూట్లో రామ చంద్ర మూర్తి విగ్రహాన్ని పెట్టి ఆరాధించి తరించారు ఆంజనేయులు గారు.
ఆ మహానుభావుడు తనకి పెళ్ళవుతుంటే... నాకు పెళ్ళవుతున్నప్పుడు మావిడి తోరణాలు కూడా కట్టద్దని చెప్పీ... రామ నామం రాసినటువంటి తోరణాలు తన పెళ్ళి పందిరంతా కట్టించుకున్నారు. నాకు మంగళ వాయిద్యాలు వద్దూ, నేను మంగళ సూత్రం కడుతున్నప్పుడు మంగళ వాయిద్యాలు కాదు శ్రీ రామ నీ నామమెంత రుచిరా అని రామా రామా రామా అని అరండి అదే మంగళ ధ్వని అంటూ రామ నామం చెప్పించుకున్నారు. ఆ పిచ్చెయ్యదాసుగారు రామకోటి రాసిన మహానుభావుడు, చిట్టచివర ఒక బండిలో ఆ రామకోటి పుస్తకాలన్నీ పెట్టుకొని భద్రాచలం క్షేత్రంచేరి తెల్లవారితే శ్రీరామనవమి రేపిద్దువుగాని ఆ పుస్తకాల్ని అంటే ఏమో ఏరోజుమనది, ఈవ్వాలే ఇచ్చేస్తానని అష్టమి తిథినాడు, తనురాసిన రామకోటి పుస్తకాలన్నీ రామ చంద్ర మూర్తికి ఇచ్చేసి కొండ కింద పెద్దగా భజన చేస్తూ... రాత్రి ఒంటిగంటవేళ రామాలయం వంకచూస్తూ... రామా రామా రామా అని అరుస్తూ... శరీరం విడిచి పెట్టేస్తే... అవతల రామ చంద్ర మూర్తి కళ్యాణం జరుగుతుంటే... వచ్చిన భక్తులు కొన్ని వేలమంది రామనామం చేస్తుండగా... ఆయన పార్థివశరీరం కట్టెల్లోకాలిపోయి ఆయన తేజస్సు రామ చంద్ర మూర్తిలో కలిసిపోయింది అంతటి మహానుభావుడి కుమారులుగా పుట్టినటువంటి ఆంజనేయులుగారు, రామ నామ క్షేత్రాన్ని ఈ పక్కనే సమీపంలోనే ఏర్పాటు చేసి ఆయనకి దొరికిన విగ్రహాన్ని ఈ దేవాలయంలో ఉంచారు. అంత గొప్ప క్షేత్రం ఆ వంశంలో వచ్చినటువంటి మహాపురుషుడే ఇక్కడున్నాడు నిన్న ఆయన నన్ను పుష్ప మాలాంకృతుల్ని చేశారు అంత గొప్ప క్షేత్రం రామ నామం ఎంత గొప్పదో... చాటి చెప్పినటువంటి ఊళ్ళల్లో ఈ గుంటూరు ఒకటి మీ గుంటూరు అని అనను ఎందుకంటే తెలుసా... నాది కూడా గుంటూరే...

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
ఏది, 42 రోజులువచ్చి రామాయణంచెప్పి అస్తమానం ఇక్కడికి వచ్చిచెప్తున్నప్పుడు నేను ఎందుకు గుంటూరువాన్ని కాను నేను గుంటూరువాన్నే... కాబట్టి మనగుంటూరు అంతగొప్పది. రామ నామాన్ని ప్రచారం చేసిన క్షేత్రాల్లో రామనామంతో ధన్యమైన క్షేత్రాల్లో గుంటూరు పట్టణం ఒకటి. కాబట్టి ఆ రామ నామమే చాలు ఆ ఒక్క నామం కాని నాలుక మీద ఉందా... తరింపజేయడానికి ఆ నామం చాలు. అంత గొప్ప నామాన్ని వశిష్ట మహర్షి ఆయన ఖర్మా ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేయడం, ఆయన పౌరోహిత్యం చేసింది ఎందుకూ అంటే... శ్రీమహావిష్ణువు మనుష్యుడిగా ఆవిర్భవిస్తాడు ఆయనకు నేను నామకరణం చెయ్యాలి, ఆయనకు నేను నామకరణం చెయ్యడం అంటే దశరథుడు పొంగిపోవడానికి పేరు పెట్టడంకాదు. ఆ పేరు ఒత్తు లేకుండా ఎవరైనా పలకగలిగినటువంటి నామంమై ఉండాలి. ఆ నామం పలికినంత మాత్రంచేత కొన్నికోట్ల జన్మలనుంచి వెంటాడి జీవున్ని పట్టుకున్నటువంటి పాపరాశి దగ్ధమైపోవాలి. అటువంటి నామాన్ని నేనుపెట్టాలి అని పరితపించి వశిష్ట మహర్షి మనుష్య జాతి ఎంత కాలముంటుందో అంతకాలం దాన్నితరింపజేయడానికి ఆ ప్రభవించినటువంటి స్వామికి, ఆ రామా అన్న నామ కరణం చెయ్యడం కోసమని పౌరోహిత్యం చేశారు. అటువంటి నామాన్ని మనకిచ్చారు. నడిచే దేవుడని పేరు గాంచినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ఎక్కడి వెళ్ళినా సరే రామ నామం రాయిస్తూ ఉండేవాడు.
నేను ఈ సందర్భంలో మీతో ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. పెద్ద వాళ్ళు రామ కోటి రాస్తూ ఉంటారు మంచిదే... కానీ మీరొకటి బాగా జ్ఞాపంకం పెట్టుకోండి, మన సంతోషం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పిల్లల యొక్క అభ్యున్నతి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత సేపూ రామ నామం మనం రాసే ప్రయత్రం చేస్తాం మంచిదే... కాని పిల్లలకి శ్రీ రామానుగ్రహం కలగాలీ అంటే... మామూలుగా వాళ్ళు ఇంట్లో కూర్చొని శ్రీ రామా అని రాసినా చాలు, అందునా సంపూర్ణ రామాయణ ప్రవచనాలు జరుగుతుండగా... శృంగగిరి పీఠంలో... శారదాదేవి మంటపంలో... రామ చంద్ర మూర్తి సన్ని ధానంలో... రామ కోటి పుస్తకాలు వాళ్ళకి ఇస్తే... భధ్రాచల క్షేత్రం నుంచి రాగి మాడలు రామ చంద్ర మూర్తివి తెప్పించి రామ చంద్ర మూర్తి పాదాల దగ్గర పెట్టి రెండు మూడు రోజులు అక్కడ వాటిని నిద్ర చేయించీ... పూజ చేసి పిల్లలతో రామ నామం రాయించీ... ఆ రామ నామం రాసినటువంటి పిల్లలందరికీ రామ మాడలిచ్చి మనం పంపిస్తే... తల్లి దండ్రులుగా, పౌరులుగా, రామ భక్తులుగా మనం పిల్లలకు అందించవలసినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని అందించి మనం కృతార్థులవుదాం. నేను మిమ్మల్నందర్నీ కోరేది ఒక్కటే... నేను ఎందుకు చెప్పానో చెప్పకుండా... హరిప్రసాదుగార్ని  ఒక విషయం అడిగా... అయ్యా మీరు భద్రాచలం నుంచి రెండు వేల మాడలు తెప్పించండీ అని అడిగాను ఆయన ఎందుకయ్యా రామ మాడలు అని నన్ను అడగలేదు ఆయన వెంటనే వాటిని తెప్పించేసే ప్రయత్నం చేస్తున్నారు, వచ్చేస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో...

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
మనందరం తరించడానికి, మనందరం సనాతన ధర్మంలో తరించినవారమని చెప్పడానికి, శృంగగిరి పీఠాధి పతులు భారతీ తీర్థ ఈ చారిత్రక సన్మివేషం చూసి, గుంటూరు పట్టణంగురించి పొంగిపోయి, తాను గుంటూరుపట్టణానికి రావాలని నిర్ణయం తీసుకొనేటట్టుగా మనం ఒక అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. మనందరి బిడ్డల్నీ కూడా... నేను ఏదో ఒక రోజు చెప్తాను, ఒకే ఒక గంట పరీక్షకు తీసుకొచ్చినట్టుగా... పిలల్లందర్నీ వైదిక దుస్తుల్తో తీసుకురండీ... మగ పిల్లలైతే ఓ నిక్కరూ చొక్కా వేసి బొట్టుపెట్టి తీసుకురండీ... ఆడ పిల్లలైతే చక్కగా లంగా ఏవిటంటారు దాన్ని ఇలా పవిటా... జాకెట్టు వేసుకొని చక్కగా చీర కట్టి తీసుకురండీ... ఆ పిల్లల్నీ రామ చంద్ర మూర్తి ఎదురుగుండా... శారదా దేవి ఎదురుగుండా... ప్రవచన మండపంలో... శివాలయంలో దేవాలయాల్లో వాల్లందర్నీ... హాల్ టికెట్టులేదు పిల్లలందర్నీ కూర్చోబెడదాం ఒక ముప్పై నిమిషాలో నలభై నిమిషాలో టైం ఇద్దాం... చాలు మనం వారి అభ్యున్నతికొరకు ఒక ముఫ్ఫైనిమిషాలు రామ నామం రాయించడానికి తీసుకు రాలేనంత స్థితిలో మనం ఉన్నామాండీ... ఆ మాట నువ్వెవరివిరా అనడానికి మాకు తెలుసు భాధ్యత అంటారు మీరు. మనం, మన పక్కింటి పిల్లలూ, ఆ పక్కింటి పిల్లలూ... ఇంత మంది పిల్లలు శ్రీ రామ నామం రాస్తూండగా... హరిప్రసాదుగారు వీడియో తీయించి, ఈ రామ నామం ఎన్ని లక్షలొచ్చిందో... శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామికి నివేదించండి, నివేదించి ఆయన సంతోషంతో ఆశీర్వచనం చేస్తున్నటువంటి శుభ పత్రికను శృంగేరి నుంచి తెప్పించండి, అందరికీ అది చదివివినిపించి, పెద్ద వాళ్ళతో రామ నామం రాయిస్తారు, కాదు పిల్లలందరితో రాయించి, పిల్లలందరికీ రాగి మాడలు ఇచ్చి పంపిద్దాం... వాళ్ళు జ్ఞాపకం పెట్టకొని మేము ఒకప్పుడు రామ నామం రాస్తే మా కిచ్చారు ఇది రామ మాడ అని, ఆ రామ మాడలన్నీ... చక్కగా పెట్టుకుంటారు.
ఒక వేళ రెండు వేల మంది కన్నా ఎక్కువ పిల్లలోస్తే... రిక్త హస్తాలతో వాళ్ళని పంపించద్దు... ఎంత మంది పిల్లల్నీ ఎవరెవరు తీసుకొస్తారో... ఇవ్వాల నుంచే మీరొక పుస్తకంలో ఒకరిని పెట్టి రాయించండి... ఎంత మంది పిల్లలొస్తారో చూసుకొని పది వేల మంది అయితే పదివేల మాడలు తెప్పించండి... అవసరమైతే... నేను లోను పెట్టైనా డబ్బిస్తాదానికి... తెలిసిందాండీ.. ఆ అవసరం రాదు నాకు తెలుసు... కాబట్టి మనం ఒక గొప్ప పని చేశామన్న తృప్తి మన జీవితంలో మిగిలిపోతే చాలు. పెద్దలతో కాదు, పిల్లలందర్నీ, ఎక్కడ చూసినా పిల్లలే... కూర్చోబెట్టీ చక్కగా... శ్రీ రామ నామం రాయించీ... వాళ్ళందరికీ రామ చంద్ర మూర్తి పాదాల దగ్గర పెట్టి పూజ చేసినటువంటి, ఆ మాడలు బహూకరించి, వాళ్ళు ఇంట్లో పెట్టుకుని రోజూ కళ్ళకు అద్దుకునేటటువంటి అలవాటు చేస్తే... వాళ్ళు రాసిన ఒక్కొక్క రామ నామం వాళ్ళని జీవితాంతం రక్షించేస్తుంది. ఏ ఆపదలు రాకుండా కాపాడుతుంది.

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఇంత పవిత్రమైన యజ్ఞంలో పిల్లలని వృద్ధిలోనికి తీసుకో రావడానికి నడుంకట్టి మీరు ఈ కార్యక్రం చేయవలసిందిగా సభా ముఖంగా... మిమ్మలందర్నీ అభ్యర్థిస్తున్నాను. కాబట్టి ఆ రామ లేఖనం పిల్లలతో ఎప్పుడు రాయిస్తాము అన్నది రేపు సాయంకాలం ఉపన్యాసంలో ప్రకటనం చేస్తాను... చక్కగా మీ పిల్లలెవ్వరికీ ఇబ్బంది కలుగనటువంటి రీతిలో... సమయాన్ని మనం నిర్ణయం చేద్దాం. పిల్లలందరూ వస్తే ఒక్క ముప్పై నిమిషాలు, అంతకన్నా అక్కర్లేదు, ఒక్క ముప్పై నిమిషాలు పిల్లలందరూ వచ్చి కూర్చుని టైం అంటే... టైం ఆరు నుంచి ఆరున్నర అంటే... ఆరు వస్తూంటేనే కాయితాలు ఇచ్చేస్తాం... వెళ్ళి కూర్చొని రాసేస్తారు. రాసేసింతర్వాత అందరికి రామ చంద్ర మూర్తి పాదల దగ్గర నుంచి మాడ ప్రసాదము చాలు ఇచ్చి పంపిద్దాం. వాళ్ళకొక గొప్ప సంస్కృతి అలవాటవుతుంది. సనాతన ధర్మానికి వారసులౌతారు. ఒక వేళ మీకు అందరికి నా ప్రతి పాదన ఆమోదయోగ్యమైతే... ఒక్క సారి కరతాళ ధ్వనులు చేయండీ నేను సంతోషిస్తాను. ఓ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పని మనందరమూ చేసి, దాన్ని శృంగగిరి పీఠాధి పతులకు పంపించి గుంటూరుపట్టణ వైభవానికి ఆయన సంతోషించి కదిలివచ్చే ఏర్పాటు చేద్దాం.
మంగళా శాసన...
ఇప్పుడొక్క సారి రామ నామం చెప్పి రామ చంద్ర మూర్తి ఆవిర్భవించినటువంటి రోజు ఒక్క పదకొండు పర్యాయాలు రామ నామం చెప్పి మనం బయలు దేరుదాం...
ఎంత పొంగి పోతాడో... రామ చంద్ర మూర్తి మీ అందరి భక్తికి
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామ నామము
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
గోచరంబగు జగతిలోపల గోప్యమైనది రామ నామము !!రా!!
బ్రహ్మ సత్యము జగ్నమిత్యా భావమే శ్రీ రామ నామము !!రా!!
భక్తితో భజియించు వారికి ముక్తి నొసగును రామ నామము !!రా!!
భగదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
సకల జీవుల లోనవెలిగే సాక్షిభూతము రామ నామము !!రా!!
ఆంజనేయుని వంటి భక్తుల ఆశ్రయము శ్రీ రామ నామము !!రా!!
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామ నామము !!రా!!
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీ రామ నామము !!రా!!
కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామ నామము !!రా!!
జన్మ మృత్యు రహస్యమెరిగి జపియించవలె శ్రీ రామ నామము !!రా!!
పసితనంబున అభ్యసించిన పట్టుపడు శ్రీ రామ నామము !!రా!!

  బాల కాండ మూడవ రోజు ప్రవచనము
 
జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీ రామ నామము !!రా!!
పాలు మీగడ పంచ ధారల తత్వమే శ్రీ రామ నామము !!రా!!
ఎందరో మహానుభావులడెందమాయను రామ నామము !!రా!!
వెంట తిరిగెడు వారికెళ్ళను కంటి పాపే రామ నామము !!రా!!
అచలమై ఆనందమై పరమాణువైనది రామ నామము !!రా!!
జానకీ హృత్ కమల మందున అలరు చున్నది శ్రీ రామ నామము !!రా!!
నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామ నామము !!రా!!
రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీ రామ నామము !!రా!!
పరమ పదవిని చేరుటకు దారిచూపుని రామ నామము !!రా!!
తల్లి వలె రక్షించు సుజనులనెల్ల కాలము రామ నామము !!రా!!


రేపటి రోజు అద్భుతమైనటువంటి సందర్భము రామ చంద్ర మూర్తి విశ్వామిత్రుడు కలుసు కుంటారు ʻగాయిత్రీ మహా మంత్రద్రష్ట విశ్వామిత్రుడుʼ విశ్వామిత్రుడు రామ చంద్ర మూర్తి కలుసుకున్నటువంటి ఘట్టం సామాన్యమైన ఘట్టం అనుకోకండీ... ఒక శిల్పాన్ని శిలలోంచి శిల్పి ఎలా చెక్కుతాడో... రామ చంద్ర మూర్తిని చెక్కినటువంటి, రామున్ని అంత గొప్ప రాముడుగా తీర్చిదిద్దిన ఘనత వశిష్ట, విశ్వామిత్రులది. అసలు విశ్వామిత్రుడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో... విశ్వామిత్రుడు రాముడు మాట్లాడు కుంటున్నప్పుడు ఎలా ఉంటుందో... అసలు విశ్వామిత్రుడు ఎంత గొప్పగా మాట్లాడుతాడో... ఆ బ్రహ్మర్షి వ్యక్తిత్వం అంటే ఏమిటో... అసలు వాల్మీకి మహర్షి ముచ్చటపడి బాల కాండ అని పేరుపెట్టుకున్నది, విశ్వామిత్రని దృష్టిలోపెట్టుకునే... ఆ రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞల నామ వైభవమేమిటో మిశ్వామిత్రుడుతో రాముడు కలిసివెళ్ళిడమంటే ఎలా ఉంటుందో... ఈ విషయాలన్నిటినీ మీకు రేపూ... ఆ ప్రవచనం చెయ్యగలిగిన భాగ్యాన్ని రామ చంద్ర మూర్తి తన నిర్హేతుక కృప నాకు కటాక్షించు గాక.
అంటే, రేపు ఎం జరుగుతుందో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే... అయ్యో... నిన్న నీవీమాట చెప్పుంటే మేం విందుంకదయ్యా... అని ఎవరైనా అంటారేమోనని ముందుగానే ఒక మాట చెప్తూ ఉంటాను.



No comments: