బాల కాండ
మొదటి రోజు ప్రవచనము
ఈనాడు శంకరభగవత్ పాదుల చేత
ప్రతిష్టించబడినటువంటి భారత దేశం నాలుగు మూలలా ఉన్నటువంటి నాలుగు పీఠాలలో
సార్వభౌమ పీఠంగా పరిగణింపబడినటువంటి దక్షిణ భారత దేశంలోని శృంగగిరి పీఠానికి
ఆద్వర్యం వహిస్తున్న పూజ్యపాదులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ స్వామివారి యొక్క
దివ్యమైనటువంటి సందేశంతో ప్రారంభమై, వారి యొక్క అనుగ్రహ ఆశిస్సులతో
ప్రారంభమైన ఈ శ్రీరామాయణ యజ్ఞ కార్యక్రమములో 42 రోజులపాటు
7 రోజులు ఒక కాండ చొప్పున 6 కాండలు,
ఆరేళ్ళ నలభైరెండు రోజులలో పూర్తి చేసి చిట్ట చివర పట్టాభిషేకం వరకు శ్రీరామాయణాన్ని
సంపూర్ణంగా ప్రవచనం చేసేటువంటి భాగ్యం నాకు కలగడం పరమేశ్వరుని యొక్కు నిర్హేతుక
కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను.
ధర్మమంటే ఏమిటి? ధయతేవ జనైరితి ధర్మం అని అమరకోశం, ధర్మం అంటే తెలుసుకోవడం ధర్మంలో ఒక భాగం, కేవలం తెలుసుకోవడం
ధర్మం కాదు, తెలుసుకున్నాడు అనుష్టించడు, అప్పుడది ధర్మమా అంటే? ధర్మం కాదు. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా
పరిశీలనం చేస్తే రాముడికి ఎన్ని తెలుసో ఎంత తెలుసో, రావణుడుకి
అన్నీ తెలుసు - అంతా తెలుసు, కానీ రాముని ముందు రావణుడు
ఎందుకు నిలబడలేక పోయాడు? ఒక్కటే కారణం తాను తెలుసుకొన్నది
తాను విన్నది అనుష్టించాడు రామ చంద్ర మూర్తి, తాను విన్నది తాను తెలుసుకొన్నది
తన సౌకర్యానికి అనుగుణంగా మార్చుకొని దబాయించి బ్రతికే ప్రయత్నం చేస్తాడు
రావణాసురుడు. ధర్మాన్ని
మీరు తెలుసుకోవడం ప్రధానమెంతో దాన్ని అనుష్టించడం కూడా అంతే అవసరం
అనుష్టానానికి పనికిరానటువంటి ధర్మం ఉపయోగంలేనిదౌతుంది.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
లోకంలో మీరు
చూస్తూంటారు ఒక్కొక్కడు చాలా పాపాచరణంతో ఉంటాడు. ఈశ్వరునియందు భక్తి ఏమి ఉండదు,
శాస్త్రము ఏమి వద్దందో అది చేస్తూ ఉంటాడు. కాని సర్వసుఖములు అనుభవిస్తూ ఉంటాడు.
మనకేమనిపిస్తుందంటే ఆయన ఈశ్వరున్ని ధిక్కరించాడు కదా! ఆయనేం ధర్మాన్ని
పాటించట్లేదు కదా? “ఆయనేం వేద
ప్రమాణాన్ని అంగీకరించట్లేదుగదా సంతోషంగా, సుఖంగా ఉన్నాడు. అన్నీ వినీ... అన్నీ
నమ్మి, అన్నీ విశ్వసించి వేదమును ప్రమాణముగా స్వీకరించి
ధర్మమును అనుష్టించినటువంటి నేను కష్టాలు పడుతున్నాను.” ఏమిటి ఉపయోగం ఈ ధర్మాన్ని
పట్టుకుంటే అనిపిస్తుంది. ధర్మం పట్టుకోవడం ఏటువంటిదీ అంటే, పంట
పండడం కోసమని పొలం దున్నటంలాంటిది. పొలం దున్ని కష్టపడినవాడికి పంట ఎప్పటికైనా
చెతికివచ్చినట్టే. ధర్మాన్ని అనుష్టించిన వాడికికూడా ధర్మం కాపాడితీరుతుంది అధర్మం ఇంటికి అంటుకున్నటువంటి చిన్నమంటలాంటిది చిన్న మంటే కదా నన్నేంచేస్తుందని పడుకున్నవాడికి చిట్ట చివరకు ఇల్లంతా ఎలా
కాలి పోతుందో, ʻఅధర్మంలో మనం ఉన్నామని తెలుసుకొని అధర్మ పథంలోనుంచి బయటకు
వచ్చే ప్రయత్నం చేయకపోతే చిట్ట చివరకు జరిగేటటువంటి పరిణామం కూడా అలాగే ఉంటుందిʼ. కాంచన లంక ఉంది అంత బలగం ఉంది అంత గొప్ప సుఖాలను అనుభవించాడు
పది తలకాయలున్నాయి, గొప్ప తపస్సుంది,
ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, పరమేశ్వరున్ని సాకారంగా
ధర్శనం చేశాడు పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా తిరిగాడు చిట్ట చివరకు ఏమయ్యాడు.
అధర్మాన్ని పట్టుకుంన్నందుకు కడుపునపుట్టినటువంటి బిడ్డలదగ్గర నుండి, భార్యా చిట్టి చివరకు ఏడుస్తూ యుద్ధ భూమిలోకొచ్చి నీవు అధర్మం
పాటించడంవల్లే ఇటువంటి చావు చచ్చావని మండోధరి గుండెలుబాధుకొని
ఏడ్చేటటువంటిస్థితిని రావణుడు పొందాడు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
అయితే మీరు
ఇక్కడొక మాట గమనించవలసి ఉంటుంది ధర్మం అంటే ఏది ధర్మం? ఉదా: కోటేశ్వరరావు చెపితే ధర్మం అవుతుందా..!, లేకపోతే ఎవరో నేనిది చెప్తానండీ ఇది ధర్మమంటే
అవుతుందా, మనం చెపితే ధర్మం అవదు ʻవేదం చెపితే ధర్మం అవుతుందిʼ వేదం ఏమి చెప్పిందో అది ధర్మం. వేదమునకు వ్యతిరేకముగా చెప్పనటువంటి స్మృతి
చెప్పినది ధర్మం, వేదమునకు వ్యతిరేకంగా చెప్పని స్మృతి చెప్పిన మాట పాటించినవాడిది
ధర్మం. ఆ ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడే శ్రీరాముడు, ఆ ధర్మాన్ని ఎవడు
పట్టుకుంటాడో వాడు అంతిమంగా పొందేదంటే ఇదొక్కటే. పదకొండువేల సంవత్సరములు ఈ భూ
మండలాన్ని పరిపాలించినటువంటి రామ చంద్ర మూర్తి పడనటువంటి కష్టం లేదు ఇన్ని
కష్టాలు పడుతున్నా ఆయన ఇతరులకు సుఖాన్ని ఇచ్చాడు, ఇతరులకు ఆనందమిచ్చాడు, ఇతరులకు సంతోషం ఇచ్చాడు తప్పా
నేనింతకష్టంలో ఉన్నాననీ మీరెందుకు నవ్వాలని ఆయనెన్నడూ అడగలేదు అందుకే రాముడు ʻయోగిʼ అన్నారు పెద్దలు.
యోగి అంటే పైన
ఎన్ని కష్టాలైనా రావచ్చు, కాని లోపల మాత్రం
తాను నిర్వికారంగా ఉంటాడు. అందుకే... పుట్టినది కూడా నవమి తిథినాడు పుట్టాడు
మహానుభావుడు. తొమ్మిది అంకెకున్న గొప్పతనం చూడండి మీరు ఎంతపెట్టి తొమ్మిదిని హెచ్చ
వేయండి మల్లీ తొమ్మిదిగా మారుతుంది. 9X1=9, 9X2=18, ఎనిమిది
ఒకటి దొమ్మిది 9X3=27 ఏడు రెండు
తొమ్మిది 9X4=36 ఆరు మూడు తొమ్మిది 9X5=45 ఐదు నాలుగు తొమ్మిది ఏం చేసినా మళ్ళీ తొమ్మిదే
అవుతుంటుంది, ఎన్నికష్టాలు బయట రానివ్వండి, ఎన్నివైక్లవ్యాలు
కలగనివ్వండి లోపల మాత్రం రాముడెప్పుడూ ధర్మాన్ని పట్టుకొనే ఉంటాడు, ధర్మాన్ని
పట్టుకోవడం అంటే ʻరాముడు రామాయణంలో మాట్లాడింది మీరు గమనించాలిʼ.
అందుకే రామాయణాన్ని రామ చంద్ర మూర్తిని
ఎంతకాలం మనుష్యజాతి ఆరాధన చేస్తుందో, అంతకాలం మానవత్వం
బ్రతికి ఉంటుంది. ఏనాడు రామ చంద్ర మూర్తిని మరచి పోతామో, ఏనాడు
రామాయణం మనకు అక్కరలేదని అంటామో ఆనాడు మనిషీ మనిషిగా కనుపడుతున్న మనుష్యత్వం
చచ్చిపోతుంది. మానవత్వం చచ్చిపోతుంది. నరత్వం చచ్చి పోతుంది. అదిపోయిననాడు నర జన్మ
యొక్క ప్రయోజనమే పోతుంది. అందుకే మీరు చూడండి విష్ణువు
దశావతారములను స్వీకరించాడు వేదోద్దారణ, మందరాభరణ, పృథ్వీ ధరణనిర్మాణా, ప్రహ్లాదత్రాణా, భలిప్రతారణా, నృపావనహంకారణా,
వైదేహీరమణా, ధనుంజయ జయ వ్యాపారపారీన, ఛోనీద్వీవ్యత్ కరుణా, తమోహరణా తండ్రీ
శ్రీవేంకటేశప్రభో ఇన్ని అవతరాలు స్వీకరించినా ఆ అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత
మనం పిలిస్తే ఇక లక్ష్మీనారాయణలనే పిలుస్తాం. ఒక వామనమూర్తి అవతార పరిసమాప్తి
అయిపోయింది ఏమంటాం లక్ష్మీనారాణలనే, ఒక పరుశురాముడు
లక్ష్మీనారాయణులే, ఒక మత్సావతారం లక్ష్మీనారాయణులే.
ఒక్క సీతా
రామావతారంలో మాత్రమే యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములనే పిలుస్తాము.
భార్యా భర్తలు ఏలా బ్రతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం. అన్నదమ్ములలో
అన్నదమ్ములెలా బ్రతకాలో నేర్పినది రామావతారం, తండ్రీ కొడుకులు ఎలా బ్రతకాలో నేర్పిన
అవతారం రామావతారం, ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన
అవతారం రామావతారం. చిట్ట చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్నా రాజారాముడుగా సింహాసనం
మీద కూర్చోవలసివస్తే ప్రజల్ని కన్న బిడ్డల్లా పరిపాలించ గలిగినటువంటి, ధర్మాన్ని
నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంతరించుకొన గలిగినటువంటి స్థితిని
పొందినటువంటి అవతారం రామావతారం. మీకు జీవితంలో అనుష్టాన పర్యంతంలో ఎక్కడ ఏవిషయం
గురించి అనుమానమొచ్చినా "మీకు రామాయణం జీర్ణమైతే" మీకు వెంటనే శ్రీరామాయణం
జ్ఞాపకానికి వస్తుంది. అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు
జ్ఞాపకమొస్తుంది. రామాయణం మీకు జీర్ణమైతే మీ భాషతీరు మారిపోతుంది. "రామాయణం
మీకు జీర్ణమైతే మాట ఎంత గొప్పదో మీకు అర్థమౌతుంది."
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
తెల్లవారగట్ల
లేచాడు పరి స్త్రీ పట్ల కామంతో మనసు కలిగింది. నీకు నచ్చి - నీవు కూడా అలా
ఉండాలనుకొంటే నీ ఇష్టం, నీ తల కూడా
తెగిపోతుంది. నీవు కూడా పుత్ర మిత్ర కళత్రాదులచే భంగపాటు పొందుతావు. రాముడు
నిద్రలేస్తూనే నదీ స్తానం చేసి సంధ్యావందనం చేస్తాడు. నీవు రాముడిలా ఉండాలనుకొంటే
ఏడు తరాలు తరిస్తాయి. నీకు ఏది కావాలో నివ్వే నిర్ణయించుకో రాముడు గొప్పవాడనీ
చెప్పరు, రావణుడు తప్పువాడని చెప్పడు. నువ్వు ఏది
తెలుసుకోవాలో అది నీవు తెలుసుకొని అనుష్టించాలి, అది శ్రీరామాయణం యొక్క గొప్పనతం.
అంత గొప్ప అవతారంలో రాముడు
ఎప్పుడు మాట్లాడిన ఋషి వాక్కును సమర్థిస్తాడు, రాముడు ఎప్పుడు
మాట్లాడినా వేద వాక్కును సమర్థిస్తాడు, రాముడు ఎప్పుడు
మాట్లాడినా ధర్మమును సమర్థిస్తాడు, ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి.
శృంగగిరి
పీఠంలో కూర్చొని శ్రీరామాయణం ప్రవచం చేయవలసి వస్తే నేను ఒక మాట చెప్పకుండా
రామాయణాన్ని ప్రారంభం చేస్తే నేను ఒక పొరపాటును చేసినవాడినౌతాను. ఇన్ని పీఠాలను
స్థాపించినటువంటి శంకర భగవత్ పాదుల అవతార పరి సమాప్తి చేస్తూ ఒక మాట
చెప్పారు. "వేదోనిద్య
మదీయతాం సదువితం స్వకర్మ స్వనీష్ఠీయతాం" ప్రతిరోజు
వేదం చదువుకో నీవు చేసే ఏ కర్మ అయినా వేదం ఎలా చెప్పిందో అలాగే చేయి అంతేకాని నీ
స్వంత బుద్దితో ఏపనిని చేయవద్దు "వేదోనిద్య
మదీయతాం సదువితం స్వకర్మ స్వీష్టీయతాం దుష్టకాష్టువిర్యంతాం " ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదాని నీ చిత్తము వచ్చినట్లుగా వాదము చేయవద్దు
నువ్వు ఏది మాట్లాడినా "సృతిస్థిరపక్షీ
స్వనీష్టీయతాం" ఉపనిషత్తులు ఏం చెప్పాయో,
వేదమేంచెప్పిందో దాన్ని సమర్థించడానికి నీ వాక్బలాన్ని ఉపయోగించు.
అంతేకాని ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడుకదాని నీ ఇష్టమొచ్చినట్లు నీవు మాట్లాడితే
చూడలేదు లెక్క కట్టుకోలేదు అని నీవు అనుకోవద్దు. లెక్క కట్టేవాడు ఒకడు
ఉన్నాడు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
ఈశ్వరుని కథా
వినగలడు ఆ ఈశ్వర కథ వింటేనే సమస్త సంసార - భ్రమణ
- పరితాపోపశమనం అంటారు శంకరభగవత్పాదులు. గలంతీ శంభో త్వచ్ఛరిత - సరితః కిల్బిషరజో దలంతీ ధీకుల్యా - సరణిషు పతంతీ
విజయతామ్ దిశంతీ సంసార - భ్రమణ - పరితాపోపశమనం వసంతీ మచ్ఛేతో - హృదభువి శివానంద -
లహరీ! సంసార భ్రమణ పరితాపోపశమనం భగవంతుని యొక్క కథా
శ్రవనము చేసి నోటితో జుర్రుకున్నటువంటి పదార్ధాలు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ
దేహాన్ని పోసిస్తే. భగవంతుని యొక్క కథను చెవులతో జుర్రుకున్నటివాడు మళ్ళీ
పుట్టవలసిన అవరము లేకుండా పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం! ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే!! ఆని భగవన్ నామామృతాన్ని చెవులలోనుంచి లోపలికి జుర్రుకున్నటువంటివాడు
పునావృత్తిరహిత శాశ్వత శివ సాయిద్య స్థితిని పొందగడు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
అంతటి
మహాత్ముడు రామ చంద్ర మూర్తి కాబట్టి "వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే! వేదః ప్రాచేతసా దాసిత్
సాక్షాద్రామాయణాత్మనా!!" వేదము వేదోప బృంహ్మణమై రామాయణ కథగా భూ లోకంలో
వచ్చింది. ఆ వేదము ఈశ్వరునియొక్క శ్వాస, ఈ వేదము
వాల్మీకిగిరి సంభూత. వాల్మీకి అనబడేటటువంటి పర్వతములోనుంచి పుట్టినటువంటి ఒక
జీవనది. వేదంలోకి మనం వెళ్ళి స్నానం చేయాలి, మనం వెళ్ళి
దర్శనం చేయ్యాలి, రామాయణం ప్రవహించి ఇంటింటి
ముందునుంచి వెళ్ళిపోయినటువంటి గంగలాంటిది దక్షిణామూర్తి
వేదం, శంకరాచార్యుల వారు రామాయణం, దక్షణామూర్తి
ఎక్కడో ఒక్కచోట కూర్చొని ఉంటారు. సనకసనందనాదులు కూడా ఆయన కూర్చున్న చోటుకే వెళ్ళి
నమస్కారం చేసి జ్ఞానోప లబ్ధిపొందాలి. శంకరాచార్యులవారు అలా కాదు శంభోర్మూర్థి
శరధిభూవనే శంకరాచార్య రూపా ఆ దక్షణామూర్తి మౌనం
విడిచి పెట్టి ఆసేతు హిమాచలపర్యంతం పాదచారియై మూడు పర్యాయములు పర్యటించి, వేద విరుద్ధములైన వాదములను ఖండించి, మళ్ళీ
వేదవిరుద్ధమైన వాదనలు ఈ భారత దేశములో ప్రవేశించకుండా కాపు పెట్టాలన్న ఉద్దేశ్యముతో
తూర్పున జగన్నాథలో గోవర్థన పీఠము, పడమర ద్వారకలో కాళికా
పీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతి పీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నాలుగుచోట్ల నాలుగు పీఠములను కాపుపెట్టి
గురు పరంపరను నిరంతరము కొనసాగేటట్టుగా మనను అనుగ్రహించి వేద విరుద్దములైన వాదనలను
భారతదేశంలో ప్రవేశించకుండా రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి శంకరభగవత్పాదులు
తానే ఆసేతు హిమాచలం పర్యటించి ప్రతి ఇంటిముందుకొచ్చి జ్ఞానబోధ చేసినట్లు రామాయణం అనేటటువంటి గంగా వాల్మీకి
ఝరి సంభూతయై వాడ వాడలా ప్రవహించింది.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
ఒకడు ఆవుని
చంపేయలనుకుంటాడు, ఆవుని చంపేయండి
అంటే మిగిలినవాళ్ళు బుద్దుందా లేదా అంటారు, అందుకని ఆవుని
ఇంకొక క్రూర మృగం పేరు పెట్టి పిలిచి చంపేయమన్నాడువాడు, ఎంతటి
గడుసరితంనం చూడండీ. పులిని చంపేయండి అన్నాడు, పులిని
చంపేయండి అంటే చూడనివాడు ఏమనుకుంటాడు పులిని చంపేస్తే తప్పేముంది, వచ్చి ఊళ్ళ మీద పడిపోతాదనుకుంటాడు. అది పాముని చంపేయండి అన్నాడు.
విన్నవాడు పాము అనుకున్నాడు, కాని అది ఆవు, ఆవుని చూపించి పాముని చంపేయ్ అంటాడు, వాడికి తెలియదా
ఇది ఆవు అని తెలుసు. మరి ఆవుని చంపేయండని ఎందుకనడు. అంటే ఆవుని చంపేయండి అంటే
ఆవుని చంపేయడమేమిట్రా అంటారని పాముని చంపేయండి అన్నాడు తెలిసి. ధర్మాన్ని
ఆచరించకండి అంటే జనం తిరగబడతారని మూఢవిశ్వాల జ్యోలికెల్లకండి అంటున్నారు,
పేరు మార్చారు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
ఇది మీరు
గమనించాలి, రామ చంద్రమూర్తి
పుట్టకముందు రామాయణాన్ని రచించలేదు వాల్మీకి, రామ చంద్ర
మూర్తి పట్టాభిషేకానికి పూర్వం రామాయణ రచన జరగలేదు, రామాయణ రచన ఎప్పుడు జరిగినట్టు
రామ చంద్ర మూర్తి పట్టాభిషేకం చేసుకొని, సీతమ్మ తల్లిని అడవులలో
విడిచిపెట్టి, అడవులలో ఉన్న సీతమ్మని వాల్మీకి మహర్షి తన
కుటీరానికి తీసుకెళ్ళి, లవకుశులు జన్మించి వారు పెరిగి
పెద్దవాల్లై యోగ్యులై విద్యాభ్యాసముచేసి, సంగీతవిద్యలో
మంచి నిష్నాతులై వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని భోధచేసి నేర్చుకొని లోకంలో
ప్రచారం చెయ్యగలిగినంత వయస్సు వాళ్ళకి వచ్చిన తరువాత నారద మహర్షి వచ్చాడు. అలా
ఎందుకు జరగాలి, అంటే వచ్చినటువంటి మహానుభావుడు రామ చంద్ర
మూర్తిగా వచ్చాడు, మనుష్యుడుగా నడిచి చూపించేశాడు
అప్పటికే, పదకొండువేల సంవత్సరాలు ఇంచుమించు
పూర్తైపోతున్నాయి. జరిగిన కథ జరిగిపోయింది. జరిగిన కథ జరిగిపోయన తరువాత ఇప్పడు
వచ్చాడు నారదుడు, జరిగిపోయిన కథలో అడుగు తీసి అడుగు వేస్తే
ధర్మం రామాయణంలో, అడుగుతీసి అడుగు వేస్తే ఎంత కథ చెప్పాలండి
నారదడు వాల్మీకి మహర్షికి, రాముడు పుట్టుక ముందు దగ్గర్నుంచీ,
చాలా కష్టపడీ రాముడు ఇలా మాట్లాడాడు, రాముడు
అలా మాట్లాడాడు, సీతమ్మ రాముని దగ్గరకు ఇలా వెళ్లింది,
దశరథ మహారాజు దగ్గరకు రాముడు ఇలా వెళ్ళాడు. రాముడు కౌశల్య దగ్గరకు
ఇలా వెళ్లాడు, రాముడితో ఇలా మాట్లాడాడు ఇవన్ని నారదుడు
చెప్పాలి. నారదుడు ఎలా చెప్పగలడు? చెప్పగలడు. సర్వజ్ఞుడు
మహానుభావుడు, గురు శ్వరూపం కాబట్టి చెప్పగలడు. కాని అలా
చెప్తూవెల్తే రామాయణం ఎవరు చెప్పినట్టవుతుంది. నారదుడు చెప్పింది వాల్మీకి
రాసింది. మరి వాల్మీకి రామాయణ రచనచేశారని మనం ఎలా చెప్పగలం, ఒకటే కారణం సంక్షేప రామాయణమే నారదుడు చెప్పాడు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
కాబట్టి
నారదుడు వచ్చాడు వాల్మీకికి చెప్పాడు అంతేవినకండీ, ఎటువంటి నారదుడు వచ్చాడు ఎటువంటి
వాల్మీకికి చెప్తున్నాడు అసలు, ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాల్మీకి మహర్షి, అంటే
సీతమ్మ తల్లి ఆయన ఆశ్రమంలో ఉంది, సీతమ్మ తల్లి ఊరట
పొందడానికి కావలసిన వాతావరణం ఆ ఆశ్రమంలో ఉంది ఆయన నిరంతరము కూడా తపశ్వియై ఉన్నాడు.
తపశ్వి అంటే కృత్యచాంద్రాయణనాది వ్రతములు చేసేవాడు, శుక్లపక్షంలో తిథులు
పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ద పెంచుకొంటూ వెడుతారు, పౌర్ణమికి
పూర్తిగా భోజనం చేస్తారు. బహుళ పక్షంలో
ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ ఆమావాశ్య
వచ్చేటప్పటికి పూర్ణంగా ఆహారము విడిచిపెట్టేస్తారు. ఇలా విడిచిపెట్టీ... నిరంతరమూ
వేదము చదువుకొంటూ వేదముచేత ప్రతిపాదించబడిన పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడే
అనుభనుభవంలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తారు. అహం బ్రంహాస్మి అదికదాండీ, శృంగగిరి పీఠానికి మహా వాక్యము అహం బ్రంహ్మాస్మి నేనే ఈశ్వరుడుని అన్న వాక్యాన్ని అనువపూర్వకం చేసుకోవాలి దానికీ వ్రతమంతా కర్మాచరణం, ఇప్పుడీ కర్మాచరణం అంతాచేసి తపిస్తున్న వాల్మీకి దేనిని గురించి
తపిస్తున్నారు. బ్రహ్మముగా తనను తాను తెలుసుకొనుట కొరకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు
యోగ్యమైన కాలం సిద్దించింది. యోగ్యమైన కాలం సిద్దిస్తే ఉపదేశం చేయడానికి ఎవరు
రావాలి?, గురువుగారు రావాలి,
గురువుగారి కన్నా మంగళ స్వరూపం ఈ లోకంలో ఉంటుందా ఇంకుండదు.
అన్నిటికన్నా మంగళ స్వరూపం ఏదంటే గురువుగారే. గురువుగారి కన్నా గొప్పవాడు, గురువుగారి కన్నా అధికుడు లోకంలో ఉండరు నగురో
రధికం నగురో రధికం నగురో రధికం నగురో రధికం శ్శివశాసనాత శ్శివశాసనాత శ్శివశాసనాత
శ్శివశాసనాత గురువు కన్న అధికుడు ఇంక ఈ లోకంలో
లేడు. మరి ఈశ్వరుడండీ! మీకో అనుమానం రావచ్చు ఈశ్వరుడి కన్న అధికుడు గురువే,
ఎందువల్ల? అసలు గురువులేకపోతే ఈశ్వరిడి యొక్క
అస్థిత్వం ప్రకటనం కాదు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
ఎంత తేడా ఉందో
మీరు గమనించాలి - మనమేం చేస్తామంటే, ఈ శరీరాన్ని పోషించి, ఈ శరీరమువలన ఎన్ని సుఖములను
పొందవచ్చో అన్ని సుఖములను పొందడానికి సాధనగా దీన్ని వాడుతాం. ఇది ఎందుకూ అంటే,
దీంతో అబ్బో ఎన్ని రుచులు చూస్తాడో, దీనికి
ఎన్ని స్పర్శ సుఖాలిస్తాడో, దీంతో ఎన్ని వినకూడనివి వింటాడో,
దీంతో ఎన్ని పీల్చకూడనివి పీలుస్తాడో? వాల్లేం
చేస్తారంటే దీన్ని సాధనంగా చేసుకొని దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ దీన్ని
అడ్డుపెట్టుకుని దీని ద్వారా దేన్ని తెలుసుకొన్న తరువాత ఇది పడిపోయినా ఫర్వాలేదు
అది తెలుసుకోవడానికి ఉపకరణంగా దీన్ని వాడుకుంటారు. ఏమిటో నువ్వు అలా
అన్నావుగానీ!.. ఆ మాట స్ఫష్టంగా లేదని మీరు అంటారని నాకు తెలుసు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
ఇప్పుడు నారదడు
అది, అంటే ఇప్పుడాయన
సద్గుగురువూ... మహానుభావుడై ఉన్నాడు, నారదం ధదాతి
ఇతిః నారదాః ఆయన జ్ఞానమిస్తాడు, కాబట్టి ఇప్పుడు తపస్స్వాధ్యాయనిరతం అటువంటివారు ఎక్కడికొచ్చారు తపస్వీ వాగ్విదా
వరమ్! ఆయన ఎటువంటివాడు? వాక్
విధః వాక్ అంటే? వేదము, వాక్ అంటే? బ్రహ్మము, విధులు
అంటే?
తెలుసుకున్నవాడు. “విత్” అన్న
పదంలోంచి వేదము
అన్నమాటోచ్చింది. "ఏది తెలుసుకొన్న తరువాత ఇంకొకటి తెలుసుకోక్కర్లేదో అదే
వేదము", ఇప్పుడు తెలుసుకోవడం ఒకెత్తూ తెలుసుకున్నదాన్ని
అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞ ఒకెత్తు, ఒకాయన
తెలుసుకున్నాడు కాని ఆయన చెప్పలేడు ఆయన చెప్తే అయోమయంగా ఉంటుంది, ఒకాయన స్పష్టంగా చెప్పగలడు తాను అనుభవించాడు అనుభవించినదానివైపుకు
మిమ్మల్నీ తిప్పగలడు ఈ ప్రజ్ఞ ఉన్నవాడు. కాబట్టి వాక్విధాం
వరః బ్రహ్మమును బాగా తెలుసుకున్నావాళ్ళల్లో
శ్రేష్ఠుడైనవాడు తాను తెలుసుకున్నది శిష్యులను ఉద్ధరించడానికి క్రిందకుదిగొచ్చి
మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞకలిగినవాడు, ఇటువంటి వాక్విధాం వరం అటువంటి నారదున్ని ఎవరు
ప్రశ్నించారిప్పుడూ... అడిగినవాడు వాల్మీక మహర్షి, ఆయననెటువంటివారు తపస్వీ తపస్సు చేస్తున్నవారు, తపస్సంటే మీకు ఇందాకే చెప్పాను, బ్రహ్మమును
తెలుసుకోవాలని తాప్రత్రయంతో ఉన్నటువంటివాడు, బాగా వ్యగ్రతతో
ఉన్నవాడు, ఇయ్యనా... నారదున్ని అడిగారు ఏమని అడిగారు?
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
శంకరాచార్యుల
వారు భాష్యం చేస్తూ "శ్రద్ధా" అన్న మాట గురించి ఒకమాట చెప్పారు శాస్త్రస్య గురువాక్యస్య
సత్యబుద్ధ్యవధారణం సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూఫలభ్యతే శ్రద్ధా అన్నమాటకు అర్థమేమిటంటే శాస్త్రము చెప్పినా గురువుగారు చెప్పినా
అది పరమసత్యము ఇక దానికి తిరుగులేదు, అదిగాని పాటిస్తే మనకు
ఫలితము వచ్చితీరుతుందని నమ్మడమే "శ్రద్ధా" అని పేరు. ఆ శ్రద్ధ ఎక్కడుందో
దానిలోంచి వినయమొస్తుంది అప్పుడు గురువుగారిని చూసి ఒంగి ఒంగి ఒంగి నమస్కరించి
మాట్లాడుతావు? ఎందుకు మాట్లాడడాయన?, ఆయనేం
చేతకాకో మాట్లాడకపోతే ఆనందించలేనివాడో కాడు? ఆయనొక్కడు
తనలోతాను ఆనందిచగలడు, మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?.
నీకొరకు మాట్లాడుతున్నాడు? ఆయన త్యాగం చేశాడు,
ఆయన కంఠానికీ శోషకలిగింది, అంటే బాధకలిగింది
ఆయన ఊపిరికి ఘర్షణ కలిగింది, ఆయన శరీరానికి చమట పట్టింది
దేనికొరకు? నీ కొరకు ఆయన నీకొరకు మాట్లాడుతున్నాడు... ఇది
గుర్తిస్తే వినయం. ఈ త్యాగానికి నేనేమ్విగలను? ఆయనకు నీ
కృతజ్ఞతా భావంతో నువ్వు నిలబడగలిగితే? అలా నీవు
ప్రశ్నించగలిగితే పరి ప్రశ్నా అంటారు, ఇప్పుడు నారదం "పరిపప్రచ్ఛా" ఇలా ప్రశ్న వేయండి తప్పా...
ఏదో ప్రశ్నవేస్తే రామాయణం వచ్చిందని మీరు అనుకోకండీ... పరి ప్రశ్న చేస్తే రామాయణం
వచ్చింది.
ఇప్పటి వరకు నారదుడు ఏమి మాట్లాడలేదు.
మీరు బాగా గమనించండి, వచ్చాడంతే!
లోపలికొచ్చారు వాల్మీకి మహర్షి చూశారు ఆర్గ్యపాదాదులిచ్చారు కూర్చోబెట్టారు,
ఇప్పుడు పరి ప్రశ్న చేస్తున్నారు. ఏ ప్రశ్న వేస్తే అసలు రామాయణం
గురించి చెప్పారాయన, వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటంటే
ఆయన్నీ...
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
కో నఽస్మిన్ సామ్ప్రతిం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ! ధర్మజ్ఞ శ్చ
కృతజ్ఞ శ్చ సత్య వాక్యో దృఢవ్రతః !!
చారిత్రేణ చ కో
యుక్తః సర్వ భూతేషు కో హితః ! విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః !!
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్
కోఽనసూయకః ! కస్య బిభ్యతి దేవా శ్చ జాత రోష స్య సంయుగే !!
తల్లీ... ఎంత
గొప్ప తల్లో... మీరు ఆలోచించండి?, అందుకే సీతమ్మ ఒకరూ, శారదమ్మ ఒకరా. కాదు
సీతమ్మే శారదమ్మ కాబట్టే అంత జ్ఞానం వాల్మీకి కిచ్చి ఈ ప్రశ్న వేయించింది. ఎందుకు
వేయించాలి?, సీతమ్మ వెళ్ళిపోతే రామావతారం వెళ్ళిపోతుంది ఇక
సీతమ్మ వెళ్ళిపోతుంది. ఆరోజులు వచ్చేశాయి అప్పటికే ఆరోజులు వచ్చాయి, ఎందుకంటే
అశ్వమేధయాగం చేసేశాడు రాముడు, అశ్వమేధ యాగం చేస్తే సీతమ్మ
కనపడాలి, సీతమ్మ రామునికి కనబడితే వేరొకసారి ప్రాతివత్యం
నిరూపించుకోమని చెప్తాడు, ఎందుకు చెప్తాడంటే ఎప్పుడూ లోకం
కోసం తన కోసం కాదు ఈ మాట అనగానే ఆవిడంటుంది, నా ప్రయోజనం అయిపోయిందయ్యా నీ భార్యగా
నీ వంశాన్ని నిలబెట్టడానికి ʻరామకథ నరుడి కథʼ బాగాగుర్తు పెట్టుకోవాలి. రామ కథా దేవుడు కథ అని చదివితే
మీకు ఎంత పనికొస్తుందో నేను చెప్పలేను. రామ కథ నరుడి కథా అని మీరు వినండి
పనికొస్తుంది, అందుకే సీతమ్మ ఈ
మాటంది. నేనెందుకొచ్చానో తెలుసా నీ పక్కకు? మీ వంశం తరించాలి?
మీ వంశం తరించాలంటే మీకు పితృ ఋణం తీరాలి పితృ ఋణం తీరాలంటే బిడ్డలు
కనాలి మీకు బిడ్డలు పుట్టాలి అంటే నా సహకారం కావాలి. నేను నా శరీరాన్ని త్యాగం
చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డలు కూడాపోతారు పోతే నీకు పితృ ఋణం తీరదు, నీవు ఏక ప్రత్నీవ్రతుడవు ఇంకొక బిడ్డనీ ఇంకొక్క ఆడదానినీ స్వీకరించవు నీ
వంశము ఆగిపోతుంది. నా కారణంగా నీ వంశం ఆగకూడదు నీ వంశం కొనసాగడానికి
బిడ్డల్నిచ్చాను నా ప్రయోజనం అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నానని భూమిలోనికి
వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తరువాత రామావతారం లేదు సరయూ నదిలోకి వెళ్ళి
రామావతారం కూడా పూర్తిచేస్తాడు రాముడు, ఇప్పుడు రామావతారం
పూర్తైపోకముందే సీతమ్మ రామాయణం పలికించాలి వాల్మీకితో పలికించాలంటే ఈ
సన్నివేశాన్ని సృష్టించాలి నారదున్ని పిలిపించాలి.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
కాబట్టి గుణము
అంటే విన్నదీ, చదువుకున్నదీ,
ప్రవర్తనయందు ఆ సందర్భంలో ప్రకటనమైతే - ప్రకాశిస్తే గుణమవుతుంది.
అలా ఉన్నాయా ఎవరికైనా, అలా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా, గురువుగారి దగ్గర నేర్చుకున్నవి నీ అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి గురువు ఏం
చెప్పారో అలా ప్రవర్తించినవాడు ఉన్నాడా, మీరు ఇలా వినండి
రామాయణాన్ని తరువాత కో నశ్విన్ సామ్ప్రతిం లోకే ఎప్పుడో కదా వామనమూర్తి ఉన్నాడు నరసింహావతారం ఉందిని చెప్పకు, ఇప్పుడున్నాడా? ఇది వాల్మీకి ప్రశ్న? కో
నశ్విన్ సామ్ప్రతిం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ వీర్యవంతుడు ఉన్నాడా, వీర్యవంతుడు అంటే ఎటువంటి
యుద్ధయొచ్చినా చెక్కు చెదరకుండా, తాను తానుగా నిలబడి తనలో ఏ
మార్పులేకుండా
బయట మార్పు తేగలిగినవాడు
ఎంతమందినైనా పడగొట్టగలిగినవాడు. అటువంటి వాడు ఉన్నాడా, ఉంటే వీర్యవాన్
సామ్ప్రతిం
లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మం తేలుసుకొన్నావాడు ఉన్నాడా, ధర్మం తెలియడం అంటే? మీరు
బాగా గుర్తుపెట్టుకోవాలి, ధర్మం గురించి తెలుసుకోవడం అంటే
ఏమిటో తెలుసాండి?. అధర్మం కూడా తెలియాలి, ధర్మమే తెలిస్తే..,? పూర్ణత్వం కాదు. ధర్మం తెలియడం
అంటే - అధర్మం కూడా తెలియాలి. ఏది చెయ్యాలో తెలియడమంటే ఏది చెయ్యకూడదో కూడా తెలిడం.
మీరు కొంచెం ఆలోచించండి నేను ఒక మాట అనేసి వదిలేశాను మీరు జవాబు చెప్పక్కర్లేదు
చెయ్యమన్నది చెయ్యడం తేలికా, చెయ్యొద్దన్నది వదిలేయడం తేలికా,
చెయ్యొద్దన్నది
వదిలేయడమే చాలాకష్టం. మీరు చూడండి. నేనొక మంత్రమిస్తాను 11
మార్లు చెయ్యండి రోజూ ఒక్కమారు కూడా మీకు కోతి గుర్తు రాకూడదు
అన్నానుకోండి. అలా చేయగలరా, ఇది వొద్దో అని ఏమంటమో అదే
చేయబుద్దేస్తుంది?. దేవుడికి రెండు అగరవత్తులు పెట్టు
అన్నానుకోండి, భయానికో భక్తికో రెండు అగరవత్తులు
వెలిగిచ్చేయడం తేలిక, వద్దన్నది చేయకుండా ఉన్నవాడు
ప్రజ్ఞావంతుడు. వొద్దన్నది చేయకుండా ఉండాలంటే అధర్మం తెలియాలిగదాండీ!, అధర్మం తెలియడం ధర్మం
తెలియడం, ధర్మం పాటించడం ఆధర్మం విడిచిపెట్టడం. ఆధర్మం చేసినవాడిని కూడా ఉండకుండా
చేయడం. ఎందుకంటే వాడివల్ల అధర్మం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇదీ ధర్మం తెలియడం.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
అందమే రాముడు
రాముడే అందం రాముడే అభిరాముడు అటువంటి వాడున్నాడా కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో గొప్ప ధైర్యవంతుడున్నాడా లోకంలో, ధైర్యవంతుడంటే మీరు
బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధైర్యవంతుడు అన్నమాటకు అర్థమేమిటో
తెసాండీ!, భయంలేనివాడు అని కాదు, దైర్యము
అన్న మాటకు ఇంకో అర్థం కూడా ఉంది, ధైర్యము అంటే తాను ఏ
పనిమీద బయలుదేరాడో ఆ పనికి అనుగుమైనటువంటి సంభారణములను మాత్రమే దగ్గరుంచుకొని
ఆపనిమీద మాత్రమే దృష్టిపెట్టి ఆపనిని పాడుచేసేటటువంటి ఏ ఇతర ఆకర్షనీయమైనటువంటి వ్యవహారమైనా
తోసిరాజని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నవాడున్నాడా, నేను
ఏకపాతివ్రత్యం చేస్తానన్నాడు భార్యను రావణాసురుడు ఎత్తుకుపోయాడు చాలామంది
వచ్చి మీద పడ్డారు, ఆ మానాన్నగారు దక్షింనాయకులు మా వంశంలో
చాలామంది దక్షింనాయకులున్నారు మా ఆవిడ నాదగ్గరలేదు కందాండీ అనీ... ఏమైనా
పొరపాటుపడ్డాడా తాను ఏది అన్నాడో రామో దుర్నాది భాషతేః రెండు మాటలు నాకు రావమ్మ అన్నాడంతే లోకంలో అవతార పరిసమాప్తికి
పనికొచ్చింది అలా ఉండగలిగినవాడున్నాడా, ఆత్మవాన్ కో
జితక్రోధో కోపాన్నిగెలిచిన వాడున్నాడా, కోపాన్ని గెలవడం ఏంటండీ? అదేమైనా ఎందురుగుండా వచ్చి
నిలబడుతుందా? కోపం ఎలా గెలుస్తారు?, ఆంటే
క్రోధం ఎక్కడన్నుంచి వస్తుందో మూల స్థానాన్ని గుర్తెరగడం, వికార
కారణాన్ని తెలుసు కోవడమే క్రోధాన్ని గెలవడం.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
ఇప్పుడొస్తోంది
రామాయణం ఇప్పుడు చెప్పాలి నారదడు ఎవరో తెలుసా? ఆయన రాముడే! ఆయన ఇల్లాలే నీ దగ్గరుంది,
ఆయన బిడ్డలే నీ దగ్గరున్నారు. వాల్మీకి మహర్షీ! ఆయనే ఆయోద్యాధిపతి,
ఆయనే రామ చంద్ర ప్రభువు అని చెప్తే వాల్మీకి పొంగిపోవాలి కదాండీ... రామాయణ ఆవిర్భావం
జరుగుతోందన్న మాట ఇవ్వాళ.
ఇవ్వాళ రామాయణం పుడుతోంది ఆ సన్నివేశంలో ఉన్నాం మనం, ఇప్పుడు ఈ మాటలడిగారు అడిగితే నారద మహర్షి చాలా చమత్కారమైనటువంటి జవాబు
ఒకటి చెప్పారు. ఆయనన్నారూ బహవో, దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితాగుణాః ! మునే
వక్ష్యామ్యఽహం బుద్ధ్వా తై ర్యుక్తః శ్రూయతాం నరః !! చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావు. సాధరాణంగా
లోకంలో మానవుల్లో నీవడిగినటువంటి పదహారు గుణములు ఒక వ్యక్తియందు ప్రకాశించేడివాడు
ఉండడు. కాబట్టి ఇప్పుడు ఎవరై ఉండాలి నరోత్తముడై ఉండాలి సాక్ష్యాత్ శ్రీ
మహావిష్ణువై ఉండాలి అటువంటివాడే కాని నరుడిగానే ఉన్నాడు. ఆయన విష్ణువంటే ఆయనే
అంగీకరించడు ʻనేను
నరున్నిʼ అంటాడు. నేను ʻదాశరథినిʼ అంటాడు, నేను దశరథ మహారాజు కొడుకునయ్యా అంటాడు, నరుడిగా ఈ
లోకంలో తిరుగుతున్న వాడున్నాడు అటువంటివాని గురించి చెప్తాను జాగ్రత్తగావిను
అన్నాడు ఇదీ సంక్షేప రామాయణం.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
నూరు శ్లోకాలతో
ఇక్కడ ప్రతిరోజు సంక్షేప రామాయణం జరుగుతుందని అన్నారే, సంక్షేప రామాయణాన్ని పెద్దలు సాంప్రదాయంలో
ఏమని పిలుస్తారో తెలుసాండీ, "మాలా
మంత్రమూ" అని పిలుస్తారు.
ఎందుకంటే శారదా తిలకమూ అనీ, మంత్రాల గురించి చెప్పేటటువంటిది
బీజాక్షరాలను కూడి చెప్పే విషయము ఒకటుంది అందులో. అందులో పది అక్షరాల మంత్రంలో
దాటిపోతే దాన్ని మాలా మంత్రమూ అని పిలుస్తారు. నూరు శ్లోకములతో ఉన్న సంక్షేప
రామాయణము మాలా మంత్రం. అందుకే సంక్షేప రామాయణాన్ని పారాయణం చేస్తే అది రక్షణ
చేస్తుంది మన్నాత్ ప్రాయతే ఇతిః మంత్రాః దాన్ని మననం చేస్తే అది
కాపాడుతుంది, సంక్షేప రామాయణం కూడా అలా కాపాడుతుంది. సద్గురువులైనటువంటి నారద మహర్షి
నోటిలోంచి పుట్టింది సంక్షేప రామాయణం మహానుభావుడు నేను చెప్తున్నానయ్యా వినూ అని
చెప్తున్నాడు...
ఇక్ష్వాకు వంశ
ప్రభవో రామో నామ జనైశ్శ్రుతః ! నియతాఽఽత్మా మహా వీర్యో ద్యుతిమాన్ ధృతిమా న్వశీ !! ఇక్ష్వాకు వంశ ప్రభవో ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటివాడు ఉన్నాడయ్యా అని, మీరూ ఈ మాటను వినాలి, మొట్టమొదట ఎవరైనా రాముడు అని చెప్పలేదు
ఎవరని చెప్పాడు?, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడున్నాడని చెప్పాడు ఒక వంశం తరించిపోతుంది ఒక
వంశం పేరు శాశ్వతత్వాన్ని పొంతుంది అది మొదట ఇక్ష్వాకు వంశం. తరువాతది రఘువంశం,
రఘు పుట్టిన తరువాత దానిని 'రఘు వంశం' అంటారు, వంశం మారిపోలేదు కాని వంశం పేరు రఘు వంశం అయింది. ఎలా అయిపోయింది అంటే
రఘు గొప్పతనం అటువంటిది, ఆయన పేరుతో వంశాన్ని పిలిచారు, ఆ వంశంలో పుట్టాడు రామ
చంద్ర మూర్తి, అంత గొప్ప వంశంలో పుట్టాడయ్యా ఇప్పుడు
వంశానికి గొప్పతనం ఎక్కడ నుంచి వచ్చింది?. పుట్టి అలా
ప్రవర్తించగలిగినవాళ్ళవల్ల వస్తుంది ఇక్ష్వాకు వంశ
ప్రభవో, రామో నామ జనైశ్శ్రుతః ఆయన్ని జనులందరూ
"రాముడూ" అని పిలుస్తుంటారు రామో నామ
జనైశ్శ్రుతః ఎందువల్ల రమైతీతి
రామః ఆయన అందర్నీ ఆనందింప జేస్తాడు రమంతే
అశ్విన్ ఇతి రామః ఆయనయందు యోగులు రమిస్తారు. అంటే
యోగులు రమించడమంటే బాహ్యములో
తిరిగేటటువంటి మనస్సుని బుద్ధిని నిగ్రహించి వెనక్కి తిప్పే ఆత్మలోకి దింపి తాను
ఒకటిగా నిలబడిపోయి పొందేటటువంటి ఆనందమేదో అది సాకారమును పొందితే రాముడు. కాబట్టి
యోగులు రమించేటటువంటి స్వరూపమేదో దానికి రామా అనీ పేరు. కాబట్టి రామో నామ జనైశ్శ్రుతః నియతాఽఽత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమా న్వశీ నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ
ఉన్నవాడు దానితో పాటుగా వశీ ఇంద్రియములను నిగ్రహించినటువంటివాడు.
ఇంద్రియాలను
నిగ్రహించడమన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసి ఉంది.
ఇంద్రియాల్ని నిగ్రహించండం అంటే ఏమిటో తెలుసాండీ?, మనసు దేన్ని చూస్తే, దేన్ని వింటే, కదిలిపోతోందో ప్రశాంతంగా ఉన్నది
అలజడిని పొందుతుందో, దాన్ని చూడకుండా దాన్ని వినకుండా
బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసాండీ!. ఒక త్రాచుపాము అలా వెళ్ళిపోతుంది
గభాలున ఇలా చూశాడు అయ్య బాబోయ్ త్రాచుపాము అని ఓ పెద్ద గెంతు గెంత్యాడు. అది
అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద రెండు కాళ్ళు వేసి
త్రొక్కాడు, ఇప్పుడూ త్రాచుపాము తల పైకెత్తలేక పోతోంది,
ఇప్పుడు తను త్రాచుపాము నా కాళ్ళకింద ఉంది నన్నేం చేస్తుంది?
అని ఉండగలడని మీరు అనుకుంటున్నారా?, అతను
గడగడగడ వణికిపోతూ చెమట్లుపట్టేస్తున్నాయి. ఎందుకంటే నేను త్రాచుపాముమీద ఉన్నాను
అది తోక కదుపుతోంది, తోకతో కాళ్ళు చుడుతోంది, ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాచుపాము
తనని ఏమీచేయలేదన్న స్థితిలో ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు
త్రాచుపాము మీద కాలుతీసేస్తాడు కంగారు పడిపోయి తీసేస్తాడు, ఎప్పుడో
ఒకప్పుడు కాలు తీయడం కోసమే పాము చూస్తూ ఉంటుంది, పాము కాటు
వేసేసి పుట్టలోకి వెళ్ళుతుంది లేకపోతే ఎక్కడికోక్కడికి వెళ్ళిపోతుంది.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
ఇదీ రాముడు!
అందుకే ద్యుతిమాన్
ధృతిమా న్వశీ అపారమైన శక్తితో ఉంటాడు, సంకల్ప శక్తితో ఉంటాడు, ఇంద్రియములను జయించినవాడై
ఉంటాడు బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్
శత్రునిబర్హణః ! విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః !! నిజంగా శ్రీరామాయణాన్ని ప్రతి శ్లోకం ప్రతిమాటా వ్యాఖ్యానం చేస్తే 42
రోజులు ఏంటండీ, నేను రిటైర్ అయిపోయేంత వరకూ
చెప్పినా శ్రీరామాయణం అయ్యేదేం కాదు, కానీ ఏదో 42 రోజులల్లో పూర్తిచేసుకోవాలని అనిపించుకోవడం అంతే, కాబట్టి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ అన్ని విద్యలూ
తెలిసున్నవాడు శ్రీమాన్ ఐశ్వర్యం ఉన్నవాడు శత్రు నిబర్హణః శత్రువులను నిగ్రహించ గలిగినటువంటివాడు విపులాంసో ఎత్తైన మూపున్నవాడు మహాబుహుః బలిసిన బాహువులున్నవాడు కంబుగ్రీవో శంఖం వంటి కంఠం ఉన్నవాడు మహాహనుః చెక్కిళ్ళ పైభాగము చాలా ఉన్నతంగా
ఉన్నటువంటివాడు అటువంటి మహానుభావుడు ఈ లోకంలోనే ఉన్నాడు ప్రజాపతిసమ శ్శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ! రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా !! రక్షితా
స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ! వేదవేదాంగ
తత్వ్తజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః !! ఎంత
గొప్పగా మాట్లాడాడండీ నారద మహర్షి నిజంగా! ప్రజాపతిసమ
శ్శ్రీమాన్ ఈ ప్రపంచాన్నంతటిని పోషించ గలిగినటువంటివాడు,
సాక్ష్యాత్ శ్రీమహావిష్ణువు ధాతా
రిపునిషూదనః శత్రువులను నిగ్రహించు గలిగినటువంటివాడు, రక్షితా జీవలోకస్య ఈ లోకాలన్నింటినీ రక్షించ గలిగినటువంటివాడు, ధర్మశ్య పరిరక్షితా ధర్మాన్ని రక్షించేటటువంటివాడు, ధర్మాన్ని
రక్షిస్తాడు కాబట్టి అధర్మాన్ని నిగ్రహిస్తాడు కూడా ధర్మశ్య
పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య తన ధర్మాన్ని
తాను రక్షించుచుకొంటాడు, రక్షితా స్వస్య ధర్మస్య
స్వజనస్య చ రక్షితా అందర్నీ రక్షిస్తే మరి
స్వజనులెవరు అంటే ఆయననే నమ్ముకొని ఉన్నవాళ్ళెవరో వారి రక్షణయందు మరింత అప్రమత్తంగా
ఉండేటటువంటి స్వరూపమున్నటువంటివాడు, అటువంటివాడు స చ సర్వగుణోపేతః కౌసల్యాఽఽనన్దవర్ధనః ! సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ !! ఇందులోంచెండీ! వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలలోంచే తర్వాత
ఉపమానాలన్నీ వచ్చాయి.
ఇప్పటికీ మనం
చూడండీ! మేరునగధీరుడండీ అంటాం ఆయన్ని పోల్చిచెప్పేటప్పుడు హిమవత్ పర్వతము వంటివాడు
సముద్రము వంటి గాంభ్యీర్యమున్నవాడు అని చెప్పారు నారద మహర్షి, సముద్రం చూడండీ ఎంత గంభీరంగా ఉంటుందో సముద్రం
కడుపులో ముత్యాలు రత్నాలు వజ్రాలు ఇన్నుంటాయి. ఇన్ని ఉన్నా కప్పి ఉంచుతుంది,
సముద్రంలో బడబాగ్ని ఉంటుంది కాని తాను మాత్రం చల్లగా ఉంటుంది సముద్రం
ఒడ్డుకొస్తుంది, వొచ్చి నీకాళ్ళు తాను కడుగుతుంది చేతకానిది
ఎదురువచ్చి నీకాళ్ళు కడిగిందని మీరు ధూర్త తనంతో లోపలికెళ్తే మిమ్మల్ని తనలో
కలుపుకోంటుంది ఎదురొచ్చి నీదగ్గర వస్తోందిగదాని మీ కాలి చెప్పుతీసి అందులో వేస్తే
తీసికొచ్చి ఆవతల పారేస్తుంది ఇది సముద్రం యొక్క గాంభీర్యం. తన ఉప్పు కయ్యగా
ఉంటుంది పర్వదిన స్నానానికి పనికివస్తుంది ఇన్నిటిని కప్పిపుచ్చి
నిలబడగలిగినటువంటి స్వరూపం సముద్రం. కడుపులో బడబాగ్ని ఉన్నా, సీతాపహరణమే జరిగినా, తండ్రే మరణించినా, రాజ్యమే పోయినా, అరణ్యంలో తిరిగినా, జుట్టు తీసేసినా, జిల్లేడుపాలు పోసుకొని ఆఖరుకు ఆ
జడలు కట్టుకొన్నా, నారచీర కట్టుకొన్నా, పాదాలకు చెప్పులే లేకపోయినా, అగ్నిహోత్రాన్ని చంకన
తగిలించుకొన్నా, అడవిలో మృగాన్ని బాణం పెట్టి కొట్టి చంపి
చర్మం ఒలిచి మాంసం తీసి తెచ్చి సీతమ్మ ఒండితే తప్ప తినలేని స్థితిలో
రాజారాముడైనటువంటివాడు బ్రతకవలసి వచ్చినా, తెల్లవారుఝామున
నాలుగు గంటల సమయంలో దాహమేస్తున్న ఏనుగు నదిలో తొండంపెట్టి నీళ్ళు తాగడానికి కూడా
భయపడునటువంటి చలికాలంలో కూడా వెళ్ళి స్నానం చేయ్యగలిగిన మొనగాడు, ఇన్ని కష్టములు కడుపులో పెట్టుకొని కూడా పైకి చెక్కు చెదరకుండా
ఉండగలిగినటువంటి గంభీరమూర్తి ఆయనయ్యా రాముడంటే అన్నాడు నారద మహర్షి.
కాబట్టీ సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ
హిమవానివ ధైర్యంలో హిమవత్ పర్వతం వంటివాడవు,
పర్వతాన్ని చూడండీ వర్ష ధారల చేత కొట్టబడుతుంది, పిడుగులు పడిపోతాయి, ఆ పర్వతం మీదే చెట్లు
పెరుగుతాయి, ఆ పర్వతం మీదే సింహాలు తిరుగుతాయి, పులులు తిరుగుతాయి, ఆ పర్వతానికి కన్నాలు పెట్టి
పాములు పడుకొంటాయి, చిట్టెలుకలు పర్వత పాదం
దగ్గర కన్నాలు పెడుతాయి, ఎలుక కన్నంపెట్టి తనలోకి దూరిందని
బెంగపెట్టుకోదు, ఒక ధూర్తుడు కాళ్ళతో పైకెక్కాడని
బెంగపెట్టుకోదు, వర్ష ధారలు కొట్టాయని కదలదూ, పిడుగులు పడ్డాయని చెక్కు చెదరదు, పులులూ సింహాలు
తిరుగుతున్నాయని బెంగపెట్టుకోదు, మహాత్ములు తనమీద
నడుస్తున్నారని పొంగిపోదు, తనమీద ఈశ్వరుడి దేవాలయం కట్టారని
పరవశించిపోదు, తాను అలాగే నిలబడి ఉంటుంది, చెక్కుచెదరక
నిలబడినటువంటి పర్వతం ఎలాంటిదో రాముడు అటువంటివాడు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
కాబట్టి సోమవత్ప్రియ దర్శనః లోకంలో మూడింటిని ఎంత చూసినా చూడబుద్ధే వేస్తుందట, ఎంత చూడండీ చూడబుద్ధేస్తుందీ, అందుకే పార్వతీ దేవీ వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టించింది, పసిపిల్లలకు కూడా సంతోషం కలిగించేవి మూడు ఏమిటో తెలుసాండీ గజ ముఖం,
చంద్ర బింబం, సముద్రం. మీరు సముద్రం ఒడ్డుకెళ్ళి ఎంతసేపూ కూర్చోండీ, ఎంతసేపూ
చూస్తున్నా సముద్రాన్ని అలా చూడాలనే అనిపిస్తుంది, చీకటి
పడిపోయిన తరువాత సముద్ర ఘోష అదో సంతోషం, వస్తోన్న కెరటాలు
అదో సంతోషం, చీకటి పడ్డాక దీపాలతో దూరంగా వెళ్ళిపోతున్న ఓడ
అదో సంతోషం, సుర్యోదయానికి సముద్రం ఆకాశం కలినట్లుగా
ఉదయిస్తున్న సూర్య బింబం అదో సంతోషం, ఆ పడుతోన్న ఎర్రకాంతి అదో
సంతోషం, సూర్యాస్తమయానికి సముద్రంలోకి కృంగిపోతున్నట్లుగా
అనిపించే సూర్యడు అదో సంతోషం. తిక్కనగారు విరాట పర్వంలో అంటారు, రాత్రయ్యేటప్పటికి ఆకాశం ఎలా ఉందటాంటే మంచి సంపన్నుడైన గృహస్తు ఇంట్లో
అలంకారం చేసినటువంటి పడకలా ఉందట, దానిమీద పూవ్వులు అవి అన్ని
వేస్తే ఎలా ఉందో అలా ఉందట, సూర్యోదయానికి ఆకాశం ఏలాఉందటా
అంటే తెల్లవారింతర్వాత పది మందీ చూస్తే దృష్టి దోషం తగులుతోందనీ, ఆ ఇంటి ఇల్లాలు దుప్పటిమీది పూవ్వులూ అవీ అన్నిపోయ్యేటట్టు ఒక్కసారి
రెండుచేతులతో ఇలా దుళిపేస్తే అన్నీ పోయిన తర్వాత ఆ దుప్పటి ఎలా ఉందో అలా ఆకాశం ఉంది
తెల్లారేకల్లా అంటారు. అలా ఆ సముద్రాన్ని చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో, పసిపిల్లల దగ్గర్నుంచీ కవులవరకూ, జ్ఞానులవరకూ,
సముద్రము ఆనందమే, పసిపిల్లాడికి ఏం తెలుసని
ఆనందం వృద్ధుడికి ఏం తెలుసని ఆనందం అందరూ సముద్రపు ఒడ్డుకెళ్ళి ఆనందం పొందుతారు.
ఆఖరికి తుఫాను సమయంలో సముద్రం చూడడం ఆనందం అదో సంతోషం కొంత మందికి. కాబట్టీ
సముద్రం, రెండూ చంద్ర బింబం, చంద్ర బింబాన్ని ఎంతసేపూ చూడండీ
సంతోషమే, రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారు సుందరకాండలో
చంద్ర బింబాన్ని గురించీ ఏమి వర్ణణలో ఏమి సర్గలో కాబట్టి చంద్ర బింబం. మూడవది ఏనుగు ఏనుగు చూడండీ, వేంకటాచల క్షేత్రానికో, తిరుత్తనియే వేడితే ఆ ఏనుగు ముందు నిల్చుంటే పిల్లల్ని ఎంతసేపు
నిల్చోపెట్టండీ సంతోషమే, ఆ తొండం ఇలా ఇలా ఆడిస్తూ ఆ ఏనుగు
అలా నిలబడి అరటిపండిస్తే నోట్లోపెట్టుకొని ఆ దుమ్ముతీసి మీద పోసుకొని, స్నానం చేసీ, తెల్లటి దంతాలూ, దాని
స్వరూపం, దాని చిన్న చిన్న కళ్ళూ, వెంట్రుకలూ, దాని తోక, పెద్ద పెద్ద కాళ్ళూ, ఇంతంత గోళ్ళూ, గుండ్రంగా పాదాలూ ఆ ఏనుగునీ ఎంతసేపు
చూసినా అబ్బా ఇంకేం చూస్తాంలేండీ అని అనిపించదు అలా చూడబుద్ధేస్తుంది.
అలా చూడబుద్ధి వేస్తుంది కాబట్టి
ధ్యానం చేసేటప్పుడు ముందు గణపతి యొక్క ముఖాన్ని తధేకంగా చూస్తే ఆ ధ్యాననిష్ఠ చేత
విఘ్నములు తొలగిపోతాయి కాబట్టి పరమేశ్వరుడు అందరూ తొందరగా దృష్టిపెట్టి చూడడానికి
వైముఖ్యం కలగనటువంటి ముఖాన్ని నా కొడుక్కిపెడితే అందరికీ ఉపకారం జరుగుతుందని ఏనుగు
తలకాయ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు అది కారణం వినాయకుడికి ఏనుగు తలకాయ
ఉండడానికి కారణాల్లో ఇదొకటి.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
కాబట్టీ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియ
దర్శనః ! కాలాగ్ని సదృశః క్రోధే క్రోధం కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటివాడు క్షమయా పృథివీ సమః ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి
అంత ఓర్పు. నిద్రలేస్తూనే భూమిని తంతాం భరిస్తుంది, మలమూత్రాలూ
భూమిమీద విసర్జిస్తాం భరిస్తుంది, ఉమ్ము భూమి మీద వేస్తాం
ఊరుకుంటుంది. పోనీ ఏదో పొరపాట్న వచ్చిందివేరు కానీ కావాలని ఒకరకమైన తాంభూలం
వేసుకొని ఉమ్మడమే ప్రయోజనంగా నెత్తురు కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద
ఎర్రటి మరకలు పడేటట్టు అదేపనిగా ఉమ్మివేసేటటువంటివాన్ని కూడా భరించినటువంటి భూ మాత
యొక్క ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి నిజంగా, కాబట్టీ అన్నం
కావాలి నాగలిపెట్టి అమ్మ గుండెలు మీద
చీలుతాం, ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన పేరుతో గుణపాలుపెట్టి
అమ్మ గుండెలు మీద గుచ్చుతాం, ఆఖరుకి ఇంత సంపాదించి, ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు, మా బాబాయిగారు,
మా మేనమామ, మా ఆయన ఇన్ని బంధుత్వాలు
పెట్టుకున్నవాళ్ళు ఊపిరి ఆగిపోగానే బెయటికి తీసికెళ్ళి చిరిగిపోయిన బొంతో, చాపో వేసి పడుకోబెట్టి, కొత్త చాపతెచ్చి నాలుగు
కర్రలకేసి తాడేసి కట్టి తీసికెళ్ళిపోతూంటే, ఆఖర్న
పుచ్చుకునేది ఈ తల్లొక్కతే. ఎవ్వరూ ఇంట్లో ఒక్కరాత్రికూడా ఉంచుకోరు యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే ! గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్కాయే !! అంటారు శంకర భగవత్ పాదులు. అటువంటిది ఈ తల్లికి ఎంత ఓర్పో ఎన్ని అపచారములు
చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఓర్పుందో
అంత ఓర్పు కలిగినవాడయ్యా రామ చంద్ర మూర్తి.
కాబట్టీ ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ! కుభేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు అటువంటి త్యాగమున్నవాడు రామ
చంద్ర మూర్తంటే సత్యే ధర్మ ఇవాపరః సత్యమూ, ధర్మమూ ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని
రక్షించుకుంటాయో అలా రక్షించుకుని కాపాడగలిగినటువంటివాడు త మేవంగుణసమ్పన్నం రామం సత్యపరాక్రమమ్ !! ఇన్ని గుణములు కలిగినటువంటి రామ చంద్ర మూర్తి సాక్ష్యాత్తుగా
సత్యపరాక్రముడైనటువంటి వ్యక్తి, ఆయన పరాక్రమము సత్యమే
పరాక్రమముగా కలిగినటువంటివాడు అటువంటి వాడు రామ చంద్ర మూర్తి అనీ ఆ రాముని యొక్క
కథని సంక్షేపంగా చెప్పారు. సంక్షేపంగా అంటే బాగా వివరంగా కాదు అని అర్థం ఇది బాగా
గుర్తుపెట్టుకోండి, వివరంగా చెప్పలేదు కేవలం ఏదో
విహంగవీక్షణం అంటారు చూడండీ ఎదో ఒక్కసారి స్థాలిపులాకన్యాయంగా ఒక్కసారి అలా
చెప్పేసారు. ఎంత తేలిగ్గా చెప్పేశారంటే స జగామ వనం
వీరః ప్రతిజ్ఞా మనుపాలయన్ ! పితు ర్వచననిర్ధేశాత్
కైకేయ్యాః ప్రియకారణాత్!! అంటూ... కానీ సంక్షేప
రామాయణ శ్లోకాలండీ.. అవి నిజంగా మంత్రాలే... దశరథ మహారాజుగారు లేక లేక లేక లేక
సంతానం కలగలేదని బెంగపెట్టుకొని అశ్వమేథ యాగం చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టిచేస్తే
యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపవతులైనటువంటి తన
భార్యలకిస్తే పెద్ద భార్యయైనటువంటి కౌసల్యాదేవి యొక్క గర్భాన్ని జన్మించినటువంటి
సాక్ష్యాత్ విష్ణుశ్వరూపుడైన ధర్మాత్ముడైన రామ చంద్ర మూర్తి పినతల్లియైన కైకమ్మ 14
సంవత్సరములు అరణ్యవాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలని
రామ చంద్ర మూర్తిని, రెండు వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజుగారిని అడ్డుపెట్టి
నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యములందు నిలబెట్టడం కోసమని రామ చంద్ర మూర్తి
రాజ్యాన్ని పరిత్యజించి నార వస్త్రాలు కట్టుకొని చెప్పులు కూడా విడిచిపెట్టి
మహానుభావుడు అడవులకు వెళ్ళిపోతున్నాడు ఆ వెళ్ళిపోతోన్న సమయంలో
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
జనకస్య కులే
జాతా దేవమాయేవ నిర్మితా ! సర్వలక్షణ సమ్పన్నా నారీణా ముత్తమా వధూః! !
సీతాఽప్యను గతా రామం శశినం రోహిణీ యథా ! పౌరై రనుగతో దూరం పిత్రా
దశరథేన చ !!
ముగ్గురూ
అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండగా తనకు రాజ్యం కావాలని
కోరక పోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమామ గారి
ఇంటినుంచి తిరిగొచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే, నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుజ్ఞుడితో,
వశిష్టుడితో, తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం
దగ్గరికి వెళ్ళి, అన్నా... రామా! నాకొద్దూ ఈ రాజ్యం నువ్వే తీసేసుకోమ్మని ఎంత
నిగ్రహించినా, ధర్మాత్ముడూ సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామ
చంద్ర మూర్తి నా తండ్రిని సత్యంలో నిలబెట్టంకోసం నేను ఈ వనవాసానికి
వచ్చాను తప్ప నాకీ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి, తన
పాదుకలను తీసికెళ్ళి భరతునికిస్తే భరతుడు పాదుకులను పట్టుకుని నంది గ్రామానికొచ్చి
సింహాసనం మీదపెట్టి రాజ్యం చేస్తుంటే, మహానుభావుడు చిత్రకూట
పర్వతం మీదే ఉన్నట్లైతే వచ్చినటువంటి తల్లులూ సోదరులైనటువంటి భరత శత్రుజ్ఞులు
జ్ఞాపకానికొస్తారనీ చిత్రకూటాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి
ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకతైనటువంటి శూర్పణఖ వచ్చి రామ
చంద్ర మూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడూ లేదా సంక్షేప రామాయణం ప్రకారం రాముడంటే
రాముడు చేసే పనిని లక్ష్మణుని చేత చేయిస్తే రాముడు చేసినట్లే.
అందుకే రాముని
చేత ముక్కు చేవులు కోయించబడితే ఆ శూర్పణఖ చేత ప్రేరేపింపబడిన ఖరదూషనాదులూ, త్రిశిరస్సు అనేటటువంటి పద్నాలుగు వేలమంది
రాక్షసులు రాముని మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా పద్నాలుగువేల మంది రాక్షసులను
నిగ్రహించినటువంటి రామ చంద్ర మూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణఖ వల్ల
తెలుసుకొన్నటువంటి రావణాసురుడు ఆసూయతో సీతమ్మ తల్లి మీద మోహంతో, సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామ చంద్ర
మూర్తి, శబరిని దర్శనం చేసి, తరువాత
కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని నిగ్రహించి దశ
దిశలకు వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ సీతమ్మ తల్లి యొక్క
జాడ కనిపెట్టి, నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి
ఒడ్డుకువచ్చి రామ చంద్ర మూర్తికి సీతమ్మ క్షేమ వార్త చెప్తే, రామ చంద్ర మూర్తి నీలుడిచేత, నీలుని యొక్క సహకారంతో
సముద్రానికి సేతువుకట్టి, సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకువెళ్ళి,
లంకా రాజ్యంలో వానర సహకారంతో రావణ కుంభకర్ణాది వీరులను నిగ్రహించి,
తిరిగి మళ్ళీ ఆయోధ్యా పట్టణానికి వచ్చి పట్టాభిశక్తుడై పదకొండువేల
సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలనచేసి, రామ రాజ్యం ఇలా
ఉంటుందని చెప్పి లోకానికి చాటి చెప్పినవాడయ్యా శ్రీరామచంద్రమూర్తి అని సంక్షేప
రామాయణాన్ని కథా రూపంగా శ్లోక రూపంగా నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం
చేశారు. ఉపదేశం చేస్తే సంతోషించారు ఆ రామరాజ్యం యొక్క గొప్ప తనాన్ని నాలుగు శ్లోకాలు
వినకపోతే మనం దోశం చేసినవాళ్ళం అవుతాం.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
న పుత్ర మరణం
కిజ్ఞ్యిత్ ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్ ! నార్య శ్చాఽవిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః !!
న చాగ్నిజం భయం
కిజ్ఞ్చిత్ నాప్సు మజ్జన్తి జన్తవః ! న వాతజం భయం కిజ్ఞ్చిత్ నాఽపి జ్వరకృతం తథా !!
న చాఽపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా ! నగరాణి చ రాష్ట్రాణి ధన
ధాన్యయుతాని చ !!
నిత్యం ప్రముదితా స్సర్వే యథా
కృతయుగే తథా ! అశ్వమేధశతై రిష్ట్వా తథా బహుసువర్ణకైః !!
అశ్వమేధాది
యాగములు చేసి ఎంతో మంది బ్రాహ్మణులకి బంగారాన్ని దానం చేశాడు గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం
ప్రయాస్యతి ! అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో
మహాయశాః !! కొన్ని కోట్ల
గోవులు దానం చేశాడు, కొన్ని కోట్ల బంగారు నాణ్యములను దానం
చేశాడు ధశవర్ష సహస్రాణి దశవర్షశతాని చ! రామో రాజ్య
ముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి!! రామో రాజ్య ముపాసిత్వా రాజ్యాన్ని ఉపాన చేశాడు మహానుభావుడు, అంత గొప్ప
పరిపాలన చేసి పదకొండువేల సంవత్సరముల పరిపాలన తర్వాత బ్రహ్మ లోకాన్ని
చేరుకున్నాడు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
మంగళా శాసన పరై
ర్మ దాచార్య పురోగమైః ! సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్ !!
మంగళం
కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే ! చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ !!
ఉమాకాంతాయ
కాంతాయ కామితార్థ ప్రదాయినే ! శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ !!
కర చరణ కృతం
వాక్కాయజం కర్మజం వా ! శ్రవమ నయనజం వా మానసం వాపరాధమ్ !!
విహితమవిహితం
వా సర్వమేతత్-క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో !!
సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తూ !
అందరూ ఒక్క
నిమిషం కూర్చోండి..! కలియుగంలో అత్యంత పవిత్రమైందీ అనికదా మీతో మనవి చేశాను రామ
నామం గురించి, శ్రీరామాయణం వినడం
ఒక మహాద్భాగ్యం, నన్ను నమ్మండీ... నేను చెప్తున్నానని
నేను చెపట్లేదూ... జీవితంలో రామాయణం వినడమనేటటువంటిదీ కొన్ని కోట్ల కోట్ల కోట్ల కోట్ల
జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్ఠం. అందునా సంపూర్ణ రామాయణం బాలకాండ
నుంచీ-పట్టాభిషేకం వరకూ ఏక బిగిన మండల కాలం రామాయణం వినడమనేటటుంటిదీ
సంభవమయ్యేటటువంటి విషయం కాదు. అది కేవలం పూర్వపుణ్యం రామానుగ్రహం ఉంటేనే
సాధ్యమయ్యేటటువంటి విషయం. అటువంటి రామ కథ విన్న తరువాత మనం కేవలం లేచి
వెళ్ళిపోవడంవల్ల ప్రయోజనం కన్నా రామ నామాన్నీ చెప్పి వెడితే చాలా బాగుంటుంది. రామ
నామం కేవలం ʻరామʼ అనడం కన్నా పెద్దలు మనకొక మార్గాన్ని ఇచ్చారు, రామ రామ రామ అని మూడు మాట్లంటే ఆరోజు వాళ్ళు విష్ణు సహస్త్రం చెప్పిన ఫలితం. అది
ఇంట్లో అంటేనే ఇంత ఫలితమిస్తే ఒక దేవాలయ ప్రాంగణంలో, అదీ
జగత్ గురు పీఠప్రాంగణంలో ఎంత శక్తివంతమో ఆలోచించండీ, అందుకే రామ రామ రామ అని వేయ్యి ఎలా అవుతుందని మీకు
అనుమానం ఉండచ్చు, అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సాంప్రదాయం
ఉంది, రా రెండు, మా ఐదు, రామ
రామ రామ అంటే 2x5, 2x5, 2x5 (2x5=10x2=20x5= 100x200x5=1000) రెండూ ఇంటూ ఐదు రెండూ ఇంటూ ఐదు
రెండూ ఇంటు ఐదూ, రెండైదుల పది, పదిరెంట్ల
ఇరువై, ఇరవై ఐదులు వంద, వందరెండ్ల
రెండొందలు, రెండొందల ఐదుల వెయ్యి. ʻసహస్రనామ తత్యుల్యం రామ నామ వరాననాʼ కాబట్టి శ్రీ రామ రామ రామ అంటే విష్ణు సహస్త్రం చెప్పి
వెళ్ళిపోయినట్టు. కాబట్టి నేనూ మకుటం అంటుంటాను, మకుటుం మీరందురుగానీ నేను దానికి వివరణ
ఒకటి అంటుంటానూ... మీరు మీ అందరూ కూడా చక్కగానూ...
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
నేను గొప్పగా
చెప్పట్లేదు... మీతో ఒక మాట మనవి చేస్తా... నేను అయ్యప్ప స్వామి దేవాలంయలో
సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో ఇది అనిపించేవాళ్ళం, రామాయణం అయిపోయిన తరువాత రామాయణం
సిడీలు ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలకి వెళ్ళాయి, అయితే
అమేరికా నుంచి నాకు ఫోన్లు వచ్చాయి, గురువుగారు
ఒక్కసారి వినండని... వాళ్ళు ప్రతిరోజూ రామాయణం వినేటప్పుడు ఖాళీ కుర్చి వేసి టేప్
రికార్డర్ పెట్టీ, ఆరు ఇరవైఐదు అవుతుంటే కోటేశ్వరావు
గారు ఉపన్యాసానికి వస్తున్నారని భావన చేసుకొని, వాళ్ళు
టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉపన్యాసం వినేసి నేను చెప్తుంటే వాళ్ళు రామ నామం చెప్తూ
అమెరికాలో వాళ్ళందరూ కలిసి పట్టాభిషేకానికి ఊరేగింపుగా ఉపన్యాసంలో ఎలా చెప్పానో
అలాగే పట్టాభిషేకం చేస్తూ వాళ్ళు నాకు ఫోన్ లో వినిపించారు. ఎందుకనీ అంటే నేను
సముద్రం దాటి రానూ అని అన్నాను... అందుకని నేను వెళ్లలేదు చూడ్డానికి పాపం.
కానీ ప్రపంచంలో
ఎన్ని దేశాలలోనూ అలా
చెప్పుకొని ఎన్ని కోట్ల రామ నామం జరిగిందో ఎన్నిచోట్ల చెప్పుకుంటారో, ఎన్నిచోట్ల పట్టాభిషేకాలు జరిగాయో, మళ్ళీ... ఆనాడు
సంపూర్ణ రామాయణం చెప్పించాడు రామ చంద్ర ప్రభువు, ఈనాడు మళ్ళీ
గుంటూరు శారాదా పీఠంలో చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా భక్తి
శ్రద్ధలతో చెప్పండీ... ఒక సాంప్రదాయానికి దీనిని ఆవిష్కరిస్తున్నాం, ఇవ్వాళ దీన్ని మీ ఆందరికీ కూడా బహుమానం చేస్తారు, మీ
అందరూ కూడా చక్కగా ప్రతి రోజూ దీన్ని తీసుకొచ్చి రోజూ ఇందులోంచే నామాల్ని
చదువుకోవచ్చూ... మీ ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు... ఇవ్వాళ మాత్రం నేను చెప్పింది
మకుఠం చెప్పండీ... 108 నామాల్లో సంపూర్ణ రామాయణం నామ రామాయణం అనీ ఇది కూడా మీకు బహుమానం చేస్తున్నారు, ఇది కూడా మీరు చదువుకోవచ్చు.
బాల కాండ మొదటి రోజు ప్రవచనము
|
శ్రీ రామ నామము
రామ నామము రమ్యమైనది రామ నామము
దారినొంటిగ
నడచువారికి తోడునీడే రామ నామము !! రా !!
నారదాది మహా
మునీంద్రులు నమ్మినది శ్రీ రామ నామము !! రా !!
కోరికొలచిన
వారికెల్లను కొంగుబంగరు రామ నామము !! రా !!
అండపిండ
బ్రహ్మాండములకు ఆధారమైనది రామ నామము !! రా !!
బ్రహ్మసత్యం
జగన్మిత్యా భావమే శ్రీ రామ నామము !! రా !!
ఆంజనేయుని వంటి
భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !! రా !!
రాకడయు
పోకడయులేనిదీ రమ్యమైనది రామ నామము !! రా !!
నిర్వికారము
నిర్వికల్పము నిర్గుణము శ్రీ రామ నామము !! రా !!
జీవితంబున నిత్యజపముగా
చేయవలె శ్రీ రామ నామము !! రా !!
నిజస్వరూపము బోదకంబగు
తారకము శ్రీ రామ నామము !! రా !!
వేదవాక్క
ప్రమాణమములచే అలరుచున్నది శ్రీ రామ నామము !! రా !!
తల్లివలె
రక్షించు సుజనుల నెల్లకాలము శ్రీ రామ నామము !! రా !!
మంగళంబగు
భక్తితోపాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !! రా !!
మంగళా శాసన పరై --
No comments:
Post a Comment