Tuesday, 26 January 2016

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - బాల కాండ 5 దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Bala Kanda 5th Day


బాల కాండ


ఐదవ రోజు ప్రవచనము



నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తిచేసే సమయానికి తాటకా సంహారం గురించి నేను మీతో మనవి చేసియున్నాను, మీరు ఈసందర్భంలో ఒకవిషయాన్ని గమనించే ప్రయత్నంచేయండీ! తాటకతండ్రి చాలా సదాచారం కలిగినటువంటివాడు, ఆయనేం దుర్మార్గుడుకాడు, దుర్భుద్దికాడు, చక్కటి ఆచారనిష్ట కలిగినటువంటివాడూని వాల్మీకి మహర్షేచెప్పారు. అందుకే శ్రీరామాయణాన్ని చదివేటప్పుడూ, శ్రీరామాయణాన్ని వినేటప్పుడూ చాలాజాగ్రత్తగా పరిశీలనం చేయవలసివుంటుంది. ఆయనయందు దోషం ఏమైనా ఉందా? దోషమేం లేదు దశరథ మహారాజుగారు పుత్రులు లేకపోతే ఎలా పుత్రకామేష్టి, అశ్వమేధం చేశారో అలా ఆయన కూడా చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సుచేశారు తపస్సుచేసి ఆయనవలన ఒక కుమార్తెనుపొందాడు చిత్రంగా ఆమె విశేషమైనటువంటి బలసంపత్తి కలిగినటువంటి కుమార్తెగా పరిణమించింది. ఆమెని ఒక యోగ్యుడైన వ్యక్తినిచూసి వివాహంచేశాడు ఏం అక్కడవరకు దోషం ఏముందీ? ఏం దోషంలేదు.
కానీ! శ్రీరామాయణంలో ఉన్నటువంటి గమ్మత్తేంటంటే... మొట్ట మొదట రామ చంద్ర మూర్తి ఎవరిని సంహారించడం ప్రారంభించారో, ఆ కుటుంబమే శ్రీరామాయణాన్ని చిట్ట చివర వరకూ కూడా శాసిస్తుంది రామకథని. రాముని జీవితంలో ఉన్న మనఃశాంతిని, రామునియొక్క కుటుంబంలోవున్న సభ్యులయొక్క మనఃశాంతిని, శ్రీరామాయణాన్ని శాసించినటువంటి కుటుంబం రామ చంద్ర మూర్తిచేత వధింపబడిన మొదటికుటుంబం. మీరు గమనించండీ! ఎందుచేతనంటే, తాటకని ఆయన సంహరించారు ఆమె కుమారుడు మారీచుడు ఆయన్ని సంహరించలేదు రామ చంద్ర మూర్తి మానవాస్త్రం పెట్టి కొట్టివదిలేశారు, మారీచున్ని చంపకుండా ఉండడమే రామాయణాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది మీరు గమనించండీ! మారీచున్ని రాముడు సంహరించి ఉండి ఉంటే... ఎందుకంటే సుభాహువుని చంపేశాడు మారీచున్ని కూడా చంపేస్తే ఏమో ఎలా ఉండి ఉండేదో శ్రీరామాయణం. తాటకనిచంపారు కానీ మారీచున్ని వదిలిపెట్టారు, ఆ వదిలిపెట్టేటప్పుడు కూడా ఆయనచెప్పారు లక్ష్మణ మూర్తితోటి, నేను ఇతనినిచంపట్లేదు వదిలేస్తున్నాను అని చెప్పారు. ఆ మారీచున్ని విడిచిపెట్టడం రామాయణ కథనంతటినీ తిప్పేసింది ఓమలుపు, ఇక్కడ మీకు నేను ఒకవిషయాన్ని మనవిచేయవలసి ఉంటుంది రామావతారం చాలా గొప్ప అవతారం, కృష్ణావతారం పరిపూర్ణ అవతారం, రామావతారానికి కృష్ణావతారానికీ ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసమొకటి కనబడుతుంది.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
మీరు చూడండి కృష్ణపరమాత్మా చాలా చంటిపిల్లవాడిగా ఉన్నప్పటి తనదగ్గరికి వచ్చినటువంటి రాక్షసులదగ్గర నుంచీ ఎవ్వరినీ వదిలిపెట్టడు అవకాశం దొరికిందీ అంటే చంపేయడమే. కురుక్షేత్రం వచ్చేంతవరకూ ఆయనేం ఆగడూ, కురుక్షేత్రం వచ్చేలోలే చాలా మందిని చక్కబెట్టేశాడు. పూతనాదులను, కంసున్నీ, జరాసంధున్నీ వీల్లందర్నీ అసలింకా... ఇంకా కురుక్షేత్ర యుద్ధం రాకముందే చాలామందినీ, ధర్మ వ్యతిరిక్తమైనటువంటి వాళ్ళనందర్నీ ఆయన నిగ్రహించాడు. రామావతారం ఏం చేస్తుందంటే... కొంత మందిని సంహరిస్తాడు, కొంత మందిని వదిలి పెట్టేస్తుంటాడు. ఇది మీరుకొంచెం జాగ్రత్తగాచూస్తే! మనుష్యునికి ఉండేటటువంటితత్వం అవతారమందు రామ చంద్ర మూర్తి  పాటించాడూ అనీ కనిపిస్తుంది అలా చేసి ఉండి ఉండకపోతే అవతార ప్రయోజనాన్ని సాధించుకోవడం కూడా కష్టమయ్యేది.
మారీచుడు లేకపోతే అంత సమస్థవంతంగా అసలు సీతాపహరణానానికి, రావణాసురుడికి ఉపకరించగలిగినటువంటి వేరొకరాక్షసుడు ఉండివుంటాడా... అన్నది కూడా కొంచం ఆశ్చర్యకరమైన విషయం. రెండూ రావణాసురుడు ఎంతటి మూర్ఖుడో తెలియాలీ అంటే... మారీచున్ని వదిలిపెట్టాలి, మారీచున్ని వదిలిపెట్టకపోతే రావణాసురునియొక్క మూర్ఖత్వం మీకు అర్థంకాదు. ఎందుకంటే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్ళుంటారు మీకు మహాభారతంలో ఒక మూర్ఖుడు కనబడుతాడు, శ్రీరామాయణంలో ఒక మూర్ఖుడు కనబడుతాడు. ఒకాయనకి యుక్తా యుక్త విచక్షణ లేనివాడు ʻదుర్యోధనుడుʼ అసలు ఆయన మంచేదీ చెడేదీ అన్న ఆలోచనచేశాడూ అని అన్నదీ మనకు అనిపించదు, ఆయన ఎప్పుడూ పక్కనున్నవాళ్ళ చెడ్డమాటలువింటుంటాడు, చెడునిర్ణయాలు తీసుకుంటుంటాడు, ఆయన పుట్టినప్పుడే కలిపురుషుడూ అని నిర్ణయంచేశారు. రావణాసురుడు అలాకాదు ఆయన బ్రహ్మవంశంలో జన్మించాడు ఆయన జన్మకూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలోవచ్చింది అసలు రావణాసురుడు జన్మించడమే కేవలం ఒకరకమైన అసూయచేత ఇలాంటిపిల్లాన్ని మనకికూడా కనేటట్టుగా మనకూతుర్ని ఆయన దగ్గరికి విశ్రవసుబ్రహ్మ దగ్గరికి పంపించాలనేటువంటి దురాలోచనచేత రావణాశురుని యొక్కతాత చేసినటువంటి ప్రణాళికవలన రావణాసురుడు జన్మించాడు. అతడు వేదంచదువుకున్నాడు ఆయనకు అన్నీతెలుసు ఆయనకి తెలియందేమీ లేదు, ఆయన తపస్సుచేశాడు చతుర్ముఖ బ్రహ్మగారియొక్క అనుగ్రహాన్నిపొందాడు, నిరంతరం శివున్ని ఆరాధనచేసేవాడు. ఆయనకీ ఇన్నితెలిసున్నాకూడా వచ్చినపెద్దసమస్య ఎక్కడాంటే... ఆయనకి ధర్మమూ తెలుసూ అధర్మమూ తెలుసు, సత్యమూ తెలుసూ అసత్యమూ తెలుసు, ఏది నిలబడుతుందో తెలుసు ఏది నిలబడుదో తెలుసు. ఇన్నీ తెలిసినా... ఒకరు చెప్పినా ఆయన వినడు ఒక్కొక్కసారి చాలా పెద్ద పొరపాటు వైపుకు వెళతాడు. రామ చంద్ర మూర్తీ చాలాపెద్ద పొరపాటుకేవెళతాడు, ఆపొరపాటే జరిగిపోయిందనుకోండీ రాముడుకి కాదు రాముడి కులగురువులు కూడా తలొంచుకోవాలి అంతపెద్ద పొరపాటువైపుకు అడుగేస్తాడు రాముడు, ఇది మనుష్య సహజం.
అందుకే నేను ఒకటికి నాలుగుసార్లు మనవిచేశా... రామాయణాన్ని భగవంతునికథా అన్నబుద్ధితో వినకండీని చెప్తూవుంటా నేను. ఎందుకంటే? మీరు రామాయణాన్ని కేవలం నరునికథా అనివిన్నారనుకోండీ, మీకు మీ జీవితాన్ని రామున్ని ఆదర్శంగా తీసుకొని ఎలాదిద్దుకోవచ్చో అర్థమవుతుంది. మీకు అలాకానప్పుడు ఏమవుతుందంటే... రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు రాముడు దేవుడుకాబట్టి చేశాడూ, రాముడు సీతమ్మ కోసం ఏడ్చాడూ ఆయన నటనకోసం ఏడ్చాడూ, రాముడు రావణసంహారం చేశాడూ దేవుడు కాబట్టి చేశాడూ మీకు ప్రతి దానికీ ఏమౌతుందంటే దేవుడుకాబట్టి ఆయనచేశాడూ. అప్పుడు రాముడు మీకెందుకుపనికొస్తాడు అప్పుడు రాముడు ఏంచేశాడో అది మీరుచేయడానికేంలేదు అందులో, అలాకాదు రాముడికథ, నరుడికథా... అని మీరువింటే రావణాసురిడికి ఉన్నటువంటి దోషమేదో, రామ చంద్ర మూర్తికి ఉన్నటువంటి సుగుమేదో మీకుబాగా అర్థమవుతుంది ఎంతచిన్నవాడు చెప్పనివ్వండీ, దానిలో ఉన్నటువంటి యోగ్యతని విచారణచేస్తాడు రామ చంద్ర మూర్తి. విచారణచేయడమంటే ఎలావుంటుందో తెలుసాండీ, తనబుద్ధికి నచ్చడమన్నదికాదు రాముడికి తనకి ఎవరో ఏదో ఒకటి చెప్పారు అది తనకు అనుకూలంగావుంది చేయడానికి బాగుంది ప్రయోజనం ఇచ్చేస్తుంది. ఇంకొకరు చెప్పారూ అది తక్షణ ప్రయోజనం ఇవ్వదు చాలాకాలం పడుతుంది ఏదో శాస్త్రాన్ని పాటించమంటున్నాడు, రెండిటిలో ఏదిపాటించాలి. అంటే రాముడు తక్షణప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి విషయాన్ని మొగ్గుచూపించడు, ఆయన శాస్త్రోక్తమైనవాక్కు ఏదోచూస్తాడు ఏది శాస్త్రం చెప్పింది ఏది ఋషిచెప్పాడు దానివైపుకు మొగ్గుతాడు అది చాలా గొప్పగుణం జీవితంలో.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
మీరు గమనిస్తూంటారు! మీరుచూడండీ, మీకులోకంలో అనేక రకములైనటువంటివారు సమన్వయమవుతుంటారు సాధరణంగా ఏంచేస్తారంటే... మిమ్మల్ని ఒకసలహా అడుగుతారు మీరో సలహాచెప్తారు వాళ్ళు వాళ్లేదోచెయ్యాలనుకుంటారు వాళ్ళు అలాగేచేస్తారు వాళ్ళు మీమాటేంపాటించరు. ఇది ఎక్కడనుంచి వస్తుందంటే ఈ గుణం ఇది రావణబుద్ధి అది మంచిబుద్ధికాదు అలా ఉండకూడదు. మీరు ఒక నిర్ణయంచేసుకునే ముందు పెద్దలైనటువంటివారు శాస్త్రోక్తమైన వాక్తుచెప్తే... మీరు వెంటనే అటువైపుకుమొగ్గి, నా అదృష్టం చాలామంచి మాటవిన్నాను, చాలా శాస్త్రీయమైనపలుకు పలికారని, కాబట్టి నేను అలాచేస్తాననిచెప్పి మీరు ఉన్నసంకల్పాన్ని విడిచిపెట్టగలిగివుండాలి. ఈబుద్ధి మీకు ఎక్కన్నుంచి వస్తుందంటే మీరు రామాయణంలో రామ చంద్ర మూర్తిని బాగాగమనిస్తే మీరు తెలుసుకోగలుగుతారు.
Image result for మానవాస్త్రంఅందుకే అది ఒకయక్షకుటుంబంది తాటక యక్షిణీ కుటుంబంనుంచి వచ్చింది, కానీ ఆవిడ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పాత్రపోషించిందంటే శ్రీరామాయణంలో ఆశ్చర్యకరమైనటువంటిదే ఇంక అంతకన్నా మనం ఇంకోమాట అనడానికివీల్లేదు. మొట్ట మొదట సంహరించినది తాటకనే అంటే ఆవిడ జీవితం ఏమైపోయిందంటే తనభర్త మరణించడానికి కారణమేదీ? విచారణ చెయ్యలేకపోయింది. అగస్త్యుడు నా భర్తని ఎందుకు చంపాడు అన్నది ఆలోచించివుండి ఉంటే ఆమె బలం ఏమో ఎందుకు ఉపయోగపడి ఉండేదో? ఆ ఆలోచన ఒక్కటిరాలేదు. రాకపోవడం ఆమె బలం దేనికిపనికొచ్చిందో తెలుసాండీ! అగస్త్యున్ని ఏమీ చెయ్యలేనూ అనితెలుసుకుంది “కోపం శేషేణ పూరయేత్ అని ఆర్యోక్తి. ʻఅత్తమీద కోపం దుత్తమీద చూపించాడుʼ అంటూంటారు చూశారా! అలా అగస్త్యున్ని ఏమీచెయ్యలేక అగస్త్యుడు తిరిగిన ప్రాంతంమీద పగపట్టింది ఏమైనా అర్థముందా? దానివల్ల ఏమైనా సంబంధముందా? ఇప్పుడు ఇంకెంత తీవ్రమైనస్థితిని పొందిందంటే నరభక్షకిగామారింది ఇప్పుడు నరభక్షకిగామారి రామ చంద్ర మూర్తి చేతిలో మరణించింది అక్కడితో పోయిందా... తన కొడుకు రాక్షసుడయ్యాడు మారీచుడు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
అందుకనీ దేవతలు సంతోషించారూ అని ఒకమాటచెప్తే, మీరు కేవలం దేవతలు సంతోషించారూ అనిచదివేయకండి. శ్రీరామాయణంలో మీరు కొన్నికొన్నింటిని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది రామాయణం చదివేటప్పుడు. ఒక విషయం జరుగుతుంటే దేవదుందుభిలు మ్రోగాయ్, పుష్పవృష్టి కురిసింది అంటారు మహర్షి, మీరు ఆగాలక్కడ ఆగి ఆలోచన చెయ్యాలి, ఈ సన్నివేషంలో ఇలా ఎందుకు జరిగింది, దేవతలు ఎందుకు సంతోషించారు దేవతలు ఎప్పుడు కూడా ధర్మం గెలవాలని కోరుకొనేటటువంటివారు. అంటే ఇక్కడ ఏదో గొప్పవిషయం జరుగుతుందన్నమాట విశ్వామిత్రుడితో రాముడు కలిస్తే... పుష్పవృష్టి కురిసింది, అంటే విశ్వామిత్రుడితో రాముడు కలవడమన్నది శ్రీరామాయణంలో చాలా పెద్దమలుపూ... మీరు ఆ కోణంలో రామాయణాన్ని ఓసారి చూడవలసివుంటుంది. ఒక్కొక్కసారి శ్రీరామాయణమంతా ఉంటుందండీ, యుద్ధ కాండలో మరీవిశేషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బయలుదేరితే పరాగముతోకూడిన గాలివీచిందీ అంటారు మహర్షి అంటే దుమ్ముతో గాలిరేగిందీ అంటారు, నక్కల నోట్లోంచి అగ్నిహోత్రంపడిందీ అంటారు, ఒక్కొక్కసారి ప్రకృతి పులకించిందీ అంటారు ఒక్కొక్కసారి ప్రకృతిశోషించిందీ అంటారు ఇవి వ్యక్తులలో ఉండేటటువంటి హృదయస్పందనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తుంటూంది. అది వ్యక్తిత్వంమీద ఆధారపడి ఉంటుంది తాను పదిమందికి పనికొచ్చేవాడై తనమనస్సుని అలా సంస్కరించుకోగలిగితే, ఖచ్చితంగా ఈశ్వరుడూ, ప్రకృతీ సంతోషిస్తారు మీరు అలా సంస్కరించుకోలేకపోతే, అత్యంత ప్రమాదకరమైన ధోరణికివెళుతారు.
తపస్సు మంచిదా తపస్సు చెడ్డదా అని నేను మిమ్మల్నో ప్రశ్న వేశాననుకోండీ! వెంటనే ఏంచెప్తారంటే, తపస్సు మంచిదే అనిచెప్తారు. నేనంటానూ తపస్సు మంచిదీ అనిచెప్పదూ, దేనికొరకు తపస్సుని వాడుతున్నావన్నది నిర్ణయించుకొ అనిచెప్తాను. రామాయణం మీకు బాగా అర్థమైతే, మీకు ఈప్రశ్న మీకు బాగా అలావాటౌతుంది. పూజచేస్తున్నాడు గొప్పా అని అడిగారనుకోండీ? పూజచేస్తున్నాడు గొప్పకాదూ, పూజవలన మనసు ఎంతసంస్కరించుకుంటున్నాడోచూడండీ అనిచెప్తాను. ఎందుకు చెప్తానంటే, సుందర కాండలో దీనిమీద శ్లోకాలు ఉన్నాయి “నియుజ్యమానాః చ గజాః సుహస్తాః ! సకేసరాః చ ఉత్పల పత్ర హస్తాః ! బభూవ దెవీ చ కృతా సుహస్తా ! లక్ష్మీః తథా పద్మిని పద్మ హస్తా !!” అంటారు మహర్షి. ప్రతిరోజు పూజచేస్తాడు రావణుడు లక్ష్మీదేవికి, సీతమ్మని కామదృష్టితో చూస్తాడు ఏమిటి దానివల్ల సంతోషము ప్రయోజనము.
Image result for పూజ విదానంనీవు ఏ ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాసనా అనేటటువంటిది ఎప్పుడూ కూడా ముందునడుస్తూండాలి, ఈ నడవడమన్నది ఏలావుండాలో తేలుసాండీ! పూజామందిరంలో కూర్చోవడం ధర్మామీటర్ తాలూకా ఆ ఉష్ణోగ్రతని చెప్పేటటువంటి చిన్ననాడి ఉంటుందే ముందు పొటమరించేటటువంటిది దాన్ని ఇలామీరు చేత్తోపట్టుకున్నారనుకోండీ మీశరీరంలో ఉష్ణోగ్రత ఎంతుందో అంతవరకూ అందులో ఉన్న పాదరస మట్టం ముందుకు వెళుతూనే ఉంటుంది. మీ పూజా మందిరప్రవేశం మీరు రాత్రిపడుకునేంతవరకూ మీలో ఉపాసన అలానడిపిస్తూ ఉండాలి తప్పా పూజామందిర ప్రవేశం దేనికొరకూ అంటే... కేవలం ఒకగంటసేపు ఏదో భగవంతుడుకి అగరవత్తులు చూపించడానికి, దీపం


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
చూపించడానికీ 23 గంటలు పాపకర్మ చేయడానికీ పనికొచ్చిందనుకోండీ, మీరుచేసే ఈగంటపూజ మిమ్మల్నిరక్షిస్తుందా అంటే రక్షించలేదూ. బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఏంచేస్తున్నారంటే సంభారములనువాడుతున్నారు అంతే. నేను ఏమని చెప్పవలసి ఉంటుందంటే దానిగురించి మీరు కొన్నిసంభారములను వినిమయంచేస్తున్నారు తప్పించి మీమనసుమీద దానిప్రభావమేమీలేదు మీమనసేమీమారలేదు అదిసంస్కరింపబడలేదు. మనసు సంస్కరింపబడనంత కాలం, మీరు తపస్సు చెయ్యండీ, పూజ చెయ్యండీ, పునస్కారం చెయ్యండీ, సత్కార్యాలు చెయ్యండీ, సన్మానాలు చెయ్యండీ ఏదిచెయ్యండీ నిరర్థకం.
http://www.teluguone.com/tonecmsuserfiles/Ravanasura_Tapassu_R.pngమీకు అందుకే శ్రీరామాయణంలో తపస్సు చేసేవాళ్ళు కనబడుతారు, తపస్సు చెయ్యనివాళ్ళూ కనబడుతారు. రాముడు తపస్సు చేశాడూ అని శ్రీరామాయణంలో ఎక్కడాలేదు ఆయన వెళ్ళిపోయి ఎక్కడో అరణ్యంలో ముక్కుమూసుకొనీ ఇన్నాళ్ళు తపస్సుచేశాడు, దేవతలు ప్రత్యక్షమయ్యారు అనిలేదు. తపస్సుచేశాడు రావణాసురుడు, రావణాసురుడు చేశాడు, కుంభకర్ణుడు చేశాడు, విభీషనుడు చేశాడు ముగ్గురూ చేశారు. నేను ఉత్తర కాండనుంచి ప్రస్తావనచేస్తున్నా, బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు నీకేం కావాలి అని అడిగాడు రావణాసురున్ని “నాకు చావువుండకూడదు అన్నాడు కుదరదు అన్నాడు” కుదరదు చచ్చిపోవలసిందే... చచ్చిపోవడం అంటే ఏమిటి శరీరంపడిపోవడం అదితప్పదు ఎవరికీనూ, ఇంకోవిషయం అడుగు అన్నాడు. అయితే నాకు వీళ్ళ వీళ్ళ వీళ్ళవల్ల నాకు మరణంవుండకూడదు అన్నాడు తథాస్తు. విభీషణున్ని అడిగాడూ నాకు నా బుద్ధి ఎప్పుడూ ధర్మమునుందు ఉండేటట్లుగా అనుగ్రహించూ అని అడిగాడు, ఇది. ʻకోరుకోవలసినది ఏదైనా ఉంటే...? వడపోసి మీరుచూస్తే అక్కడ దొరుకుతుంది సారాంశంʼ.
ఆయన అన్నాడు ఎప్పుడూ నాకు నాబుద్ధి ధర్మము వైపుకు నిలబడాలి అలా అనుగ్రహించూ అన్నాడు, ఆయన అన్నాడూ నీవు చిరంజీవివి, నీవు ఎప్పటికీ బ్రతికే ఉంటావు అన్నాడు. అడిగినవాడికి ఇవ్వలేదు అడగని వాడికి ఇచ్చాడు ఏమిటిదీ? ఇదీ శ్రీరామాయణం అంటే మీమ్మల్ని చిరంజీవిని ఏదిచేస్తుందంటే... మీ ధర్మమే మిమ్మల్ని చిరంజీవిని చేస్తుంది. మీ వంశాన్ని ఆచంద్రార్కంగా నిలబెడుతుంది అదొక్కటి విడిచిపెట్టి మీరు ఎన్నిపట్టుకున్నా అవిమిమ్మల్ని రక్షించేవికావు రావణుడు ఎన్నిపట్టుకోలేదు, ఏవిరక్షించించాయి రావణుడుపడకుండా. విభీషనుడు అన్నీవదిలిపెట్టి అన్నయ్యా తప్పట్లేదు వదిలేస్తున్నాను అని అన్నయ్యను వదిలిపెట్టి, లంకా సామ్రాజ్యానివదిలిపెట్టి ధర్మాన్నిపట్టుకున్నాడు రామున్నికాదు. మీరుబాగా గుర్తుపెట్టుకోండి. విభీషణుడు పట్టుకున్నది ధర్మాన్ని, మరి రామున్ని ఎందుకు పట్టుకున్నాడు “రామో విగ్రహవాన్ ధర్మః” కనుక పట్టుకున్నాడు. ధర్మమే రాముడుకనుక పట్టుకున్నాడు. రాముడు ధర్మంకాకపోతే, విభీషణుడు రామున్నిపట్టుకోడు. ఇప్పుడు విభీషణుడు ఏమయ్యాడు అప్పుడుకాదు ఇప్పటికీ లంకకురాజుగానే ఉన్నాడు కాంచనలంకకి. ఇదీ మీరు శ్రీరామాయణం వలన తెలుసుకోవలసిన సత్యం. తప్పా ఎప్పుడో తాటకా సంహారం అయిపోయిందీ ఎందుకు శ్రీరామాయణం నేను చెప్పడం ఎందుకు మీరు వినడం ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి, అంటే శ్రీరామాయణం మనుష్యజాతి ఉన్నంత కాలంచెప్పాలి అని బ్రహ్మగారు ఎందుకు అన్నారంటే...? మనిషిని మనిషిగా ఉంచగలిగినటువంటి కావ్యం శ్రీరామాయణం మీరు ఏదిసంస్కరించుకోవాలో శ్రీరామయణం నేర్పుతుంది. ఎంత తపస్సున్నా, ఎంత బలమున్నా మనస్సుని సంస్కరించుకోలేకపోతే... తాటక ఏం సాధించింది, మారీచుడు ఏం సాధించారు. ఇప్పుడు ఇటువంటి తాటకా సంహారం జరిగితే... ఆశ్చర్యమేమిటంటే దేవతలు సంతోషించారు, దేవతలు చాలా సంతోషిస్తే దేనికిసంతోషించాలి, బలము ఆధర్మము వైపుకు ఎక్కడ ఉపయోగిచబడుతుందో, బలమూ తను చేసినతప్పుని తెలుసుకోవడానికి సిద్ధపడకుండా అహంకారము అడ్డుపడి దుర్వినియోగం వైపుకే అడుగులు ఎక్కడ వేస్తుందో... అది త్రుంచబడిందని దేవతలు సంతోషించారు కదా...!


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు అసలు దీనికి మూలకందం తాటకా!? రావణుడా!, మీరు బాగా ఆలోచించండీ!? ఇలాంటి పనులు చెయ్యటంలో అగ్రగణ్యుడు ఎవరు? చనిపోయినటువంటి వ్యక్తి ఒక కింకరుడులాంటిది తాటక. నిజానికి తాటకపాత్ర చాలాచిన్నది రావణునితో పోలిస్తే, అందుకే విశ్వామిత్రుడన్నాడు నేనుచూడలేదు రావణాసురున్ని అన్నాడు. బ్రహ్మగారివలన వరాలుపొందాడు, లోకాన్ని క్షోభింపచేస్తున్నాడు, అతనురాలేదు అతని తరపున వచ్చిన రక్షసులువస్తున్నారు అనిచెప్పాడు ఆయన. ఆయన ఎంతసత్యం మాట్లాడుతాండండీ మహానుభావుడు! ఇప్పుడు వీళ్ళందరూ ప్రబలిపోవడానికి కారణమైనవాడు ఎవడూ? రావణుడు. ఇప్పుడు అసలు ఇక్కడ మొదలైనటువంటిపని అక్కడ వరకూవెళ్ళాలి, రావణ వధవరకూ వెళ్ళాలి. ఇక్కడ తాటకని చంపడానికీ ఎందుకు ముందుకొచ్చాడు రాముడు? కారణం చెప్పాడు, ధర్మం నాకు ప్రధానం. పితుర్వచననిర్దేశాత్పితుర్యచనగౌరవాత్ ! వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశఙ్కయా !! నిన్న మీతో మనవిచేశా! ఆర్ష ధర్మంలో ఎప్పుడు మాట్లాడినా “కర్తవ్యం” ఆ మాట చాలా చాలా పెద్ద మాటా, చాలా గంభీరమైనటువంటి మాట. ఇది మీరు పట్టుకోగలిగితే జీవితంలో సుఖశాంతులు ఎక్కడనుంచోరావు, ఎవరోతెచ్చి మీజీవితంలో శాంతిపెట్టలేరు, ఎవరోతెచ్చి సుఖాన్ని మీకు ఇస్తారనుకోవడం ఒకవెర్రంతే? అలా ఏం ఉండదు. సుఖము శాంతికి భంగకరములు మిగిలినవీ, బాగా గుర్తుపెట్టుకోండి నా వెర్రి, నా వ్యామోహం ఏమౌతుందంటే నా సంసారం చేస్తుంది, చేస్తే అప్పుడు నా సుఖ శాంతులకు అది భంగపాటౌతుంది అలా వ్యామోహం లేకుండా మీరు మీ కర్తవ్యమునందు నిష్టతో ఉంటే... మీరు ఎప్పుడు శాంతితో ఉంటారు, సంతోషముతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవతలూ కర్తవ్యతానిష్టతోవుండి ధర్మము కొరకు చంపినవాడెవడు, వ్యక్తిగతంగా ఏమైనా రాగద్వేశాలు ఉన్నాయా? రాముడికీ తాటకకీ? ఏంలేవు. అసలు ఆయనకి ఆ వనంకూడా తెలియదు, ఆయన ఎప్పుడూ తాటకనీ చూడలేదుకూడా, అగస్త్యుడితో రాముడికి పరిచయం ఉన్నట్లు ఇప్పటి వరకూ రామాయణంలో ఏంలేదు, మరీ ఎందుకు చంపాలండీ అసలూ?
https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcRLfDgD6hQx8j9AIlz2mkqRjC9dcsPBX1u2AdtUJhNUrcRng5-Nఅంటే ఒక పనిచేసేటప్పుడు మీ కొక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి, ఈపని ఎందుకు చేస్తున్నానూ? అసలా ఆలోచనే లేకుండా... ఏదో చేసేస్తున్నానూ... అది వద్దని చెప్పింది రామాయణం. మీఆలోచన మొట్ట మొదట ఏవిషయంలోనైనా స్పష్టంగా ఉండడం. ఎంతచిన్న విషయంలోనైనాసరే... స్పష్టమైన ఆలోచనా, స్పష్టమైన ప్రణాళికా ఉండాలి ఇదే ఇవ్వాళ లోపించినటువంటి విషయం. అలారం పెట్టుకుంటాడూ నిద్రలేవడు, కాలేజీకి వెళతాడూ చదువుకోడు, పరీక్షలొస్తుంటాయ్ టీవి పెట్టుకుంటాడు ఎప్పుడూ కూడా తనుచెయ్యవలసినదీ ఏదిచేద్దామనుకున్నాడో అదిచెయ్యడు. ఎందుకు చేస్తున్నాడో వాడికికారణం తెలియదు? నీవు ఇది ఎందుకుచేస్తున్నావని ఎవరైనా అడిగారనుకోండీ? చెప్పలేడు కారణంవుండదు. ఏదో ఒకటి చెయ్యాలిగదండీ అంటాడు. బి.టెక్ అయిపోయినతర్వాత ఏంచేస్తావని అడిగారనుకోండీ? హైదరాబాదు వెళ్ళిపోయి అక్కడ కంప్యూటర్ అదీ నేర్చుకుంటాను అంటాడు. దేనికి నేర్చుకుంటున్నావని మీరు అడిగారనుకోండీ? అందాక ఏదో ఒకటిచెయ్యాలి కదాండీ అంటాడు. అందాక ఏదో ఒకటిచెయ్యాలని చేసేవాడేకానీ, దీన్ని ఇందుకోసం చేస్తున్నాననిచెప్పేవాడు ఉండడులోకంలో... అసలు ఆయనకు లక్ష్యంలేదు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
రాముడు అలాకాదు “గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ” నేను గో బ్రాహ్మణుల హితము కొరకు, దేశక్షేమము కొరకు, రాజపుత్రున్ని కనుక నేను తాటకాసంహారం చేస్తున్నాను. ఆవిడది దోషమని నీవు ఏలాచెప్తున్నావు? నీవేమి తీర్పుచెప్పడానికి విన్నావా? గురువు నీవుచెప్పావు చాలు, ఇక మీకు అనృతదోశము ఉండదు. మీకు అవసరం లేదు మీరు అలాచెప్పరు. మీరు చెప్పారు నేను చంపేస్తున్నాను అంటే చిన్నవయసులో ఎంతపరిణతి ఉందోచూడండీ? నేను మీకు తరచూమనవి చేసేది ఇదే... శ్రీరామాయణాన్ని కేవలం ఏదోకావ్యం, ఎప్పటిదో పుస్తకం అదీ, ఎప్పడిదో రామాయణం అని మీరు అనుకోకండీ? మీరు మీ పిల్లలతోకలిసి భోజనంచేసేటప్పుడు శ్రీరామాయణంలో ఒక్క ఘట్టంగురించి మీరు మీపిల్లలతో మాట్లాడగలిగితే? చూశావా రామునియొక్క ఆలోచనాసరళి అంటే ఎలా ఉంటుందో అని రెండు శ్లోకాలు. కానీ ఆయన మనసంటే, ఆయన బుద్దీ అంటే ఎలా ఉంటుందో చూశావా? ఇది చాలా అవసరమైంది? ఇది నేర్చుకోవాలి మనిషి అన్నది మీ బిడ్డల్ని శ్రీ రామ చంద్ర మూర్తిగా తయారుచేస్తుంది కాబట్టీ రామాయణం ఇప్పడిదికాదు ఎప్పటికీ రామాయణం ప్రతివారికీ అవసరమే.
http://siliconandhra.org/nextgen/sujanaranjani/april2009/meditation.jpgకాబట్టి ఇప్పుడు దేవతలకి కావలసింది ఏమిటీ? ఎవరు ఇంత ధర్మవిచక్షణతో తాటకనిచంపారో? వాడే ఇంత ధర్మవిచక్షణతో రావణున్ని కూడా చంపుతాడనుకొన్నారు. కాబట్టి ఎవరు ఈ శక్తిని లోకరక్షణకు ఉపయోగించాడో, ఎవడు తనశక్తిని లోకాన్ని పాడుచేయడానికి ఉపయోగిస్తుంటే వాళ్ళనిచంపాడో వాడిశక్తిపెంచాలి. ఇప్పుడు మీరు బాగా అర్థంచేసుకొని ఉంటారు అదొక ఈక్వేషన్ అన్నమాట. మీరు దేవతలయొక్క అనుగ్రహం మీకుకలగాలి, మీకు కాలవాలంటే మీరుఎలావుంటే కలుగుతుందో తెలుసుకోండి. దేవతానుగ్రహం అనేది ఎందుకుకలుగుతుందీ? ఎవరికి కలుగుతుంది? అంటే మీరు లోకముయొక్క హితమును చూడగలిగినవారైతే... మీకొరకు దేవతలు వెంటపడుతారు గురువులవెంట. బాగా గుర్తుపట్టండి మీరు దేవతలవెంట పడడంకాదు మీకు లోకహితం మీకుతెలిస్తే మీకు హితంచెయ్యమని దేవతలు వెంటపడుతారు ఎవరివెంట గురువులవెంట వాడికి హితంచేయవయ్యా వాడికి హితంచేయవయ్యా వాడివల్ల లోకహితం కలుగుతుందంయ్యా అని వెంటపడుతారు.
అందుకని ఇప్పుడు దేవతలు ఏం చేశారు విశ్వామిత్రుడి దగ్గరకు పరుగెత్తుకొచ్చారు, పరుగెత్తుకొచ్చి ఏమని అడుగుతున్నారు నువ్వు నిన్నా “మన్త్రగ్రామం గృహాణ త్వం బలామతిబలాం తథా” మంత్రగ్రామాన్ని రాముడికి ఇచ్చావు రాముడేం చేశాడు “న శ్రమో న జ్వరో వా తే న రూపస్య విపర్యయః” నువ్వు దానివల్ల ఆకలి ఉండదూ, దప్పిక ఉండదూ, బడలిపోవు అన్నావు తాటకా సంహారం చేశాడు. ఎంతమంచి వాడయ్యా! ఇప్పుడీ బలం ఎవరిదగ్గర ఉండాలి? నీదగ్గర ఉన్నా నీవు కోప్పడకూడదు నీదగ్గర ఉండి ఉపయోగంలేదు ఎందుకని ఉపయోగంలేదు ఇకనీవు కోప్పడకూడదు నీవు బ్రహ్మర్షిత్వాన్నిపొందావు నీకు శత్రుమిత్ర భేదంలేదు అందర్నీ ప్రేమించేస్తున్నావు. కానీ లోకంలో ధర్మ సంస్థాపనకీ, చంపడానికి యోగ్యమైనటువంటి స్వరూపంతోవచ్చాడు నరుడిగావచ్చాడు “విష్ణువుగా రాముడు ఉండి ఉంటే”... ఈ లోకంలో బాగా జ్ఞాపకం


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
పెట్టుకోండీ? “విశ్వామిత్రుడు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదూ!” ఎందుకంటే ఆయన వేదవేద్యే పరే పుంసి వేదమే ఆయన దగ్గర నుంచి వచ్చింది అయినప్పుడు రామునికి ఉపదేశం ఎందుకండీ! రాముడికి ఉపదేశం ఉండదు భాషిస్తాయి ఆయన తనంత తానుగా ఉపయోగించగలడు. ఆయనకి ఇంకా వేరే ఒక గురువుగారి దగ్గర ఉపదేశాలుపొంది నేర్చుకోవలసిన అవసరం ఏమీ ఉండదు కానీ నరుడిగా ఉన్నాడు ఇప్పుడు విష్ణుస్వరూపంతో నాకు ఇవన్నీ తెలుసనీ ప్రయోగించడు ఒక గురువు ముందుకువచ్చి ఇవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండీ విషయాలు మీరూ...!
Image result for గురువు ఉపదేశం చేయుటరామాయణంలో చాలా పెద్ద రహస్యం ఇక్కడ దాక్కొని ఉంది, గురువు దగ్గరకి మీరువెళ్ళి అడగడమా... నాకు మంత్రమిమ్మనీ...? గురువు పిలిచి మీకుమంత్రమివ్వడమా...? అంటే... గురువే మీకు పిలిచిమంత్రమిస్తే అది సమ్మున్నతస్థితీ మీ అదృష్టం పండిందనిగుర్తు. ఇచ్చినమంత్రాన్ని మీరు అనుష్టించకపోతే, మీరు ఋణపడిపోతారు మంత్రానికీ, గురువుగారికి. మీరు వెంటపడ్డంవేరు బోర్డులుపెట్టి ఉపదేశాలుచేసేవికావు, ఇవ్వాళ పొద్దున్న ఇంతమందికి గురు ఉపదేశంచేస్తాం ఏదో ఇదిచేస్తాం అని బోర్డులుపెట్టీ వందరూపాయలు రసీదులు రాసి గురుపదేశాలు ఇచ్చేవి మంత్రోపదేశాలుకావు రామాయణం మాట్లాడేది? రామాయణం మాట్లాడేది సమున్నతస్థితిని మాట్లాడుతుంది. ఒక గురువు తనంతతాను ఉపదేశంచెయ్యాలి? ఎందుకు చేస్తాడు? దేవతా ప్రేరణచేత చేస్తాడు. ఇతనికి నేను ఈబలాన్ని ఇస్తే... ఇతనివల్ల ఈమంత్రానుష్టాన దేవతానుగ్రహం అతనిలోకివెళితే, ఆ అనుగ్రహంతో ఇతనులోకానికి ఏమైనా ఉపకారంచేస్తాడా...? ఈలెక్క గురువుగారు కట్టాలి. ఈలెక్క గురువుగారు కట్టకుండా... చిత్తమువచ్చినట్టూ అడిగినవాడికల్లా మంత్రాలు ఇస్తే... ఆయనెవరో నీకు తెలియదు ఆయన అడిగాడు నీవు ఇచ్చావు. ఎందుకా ఉపదేశం? అది అర్థం లేనటువంటి ఉపదేశం? ఉపదేశం ఇవ్వడమూ అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. అందుకే లెక్కకు మించిన శిష్యులు ఉండే అవకాశం ఉండదు యార్థానికి లోకంలో... చాలా జాగ్రత్తగా ఇస్తారు సాంప్రదాయనిష్టా అనేటటువంటిది ఇచ్చేటప్పుడు.
రామాయణం మనకు నేర్పుతుంది, ఇవ్వాళ సమాజంలో ఎక్కడెక్కడ ఏపొరపాట్లు దొర్లుతున్నాయో మీరు రామాయణం కోణంలోచూస్తే అర్థం అవుతుంది. ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతుందో... కాబట్టి ఇప్పుడు దేవతలు ప్రార్థనచేస్తున్నారు విశ్వామిత్రుడి దగ్గరికొచ్చి. ఏమని అడుగుతున్నారో చూడండీ! ఇది మీరు జాగ్రత్తగా జీవితంలో నేర్చుకోవలసినటువంటిస్థితి మనం బాగాపట్టుకోవలసినటువంటిస్థితి. కేవలం పూజా మీకు శక్తిని ఇవ్వచ్చూ, కానీ దాన్నితీసెయ్యడం కూడా దేవతలు వెంపర్లాడుతారు ఎందుకో తెలుసా? ఎందుకంటే భయం. పిల్లాడు ఏడుస్తున్నాడండీ! అల్లరి చేసేస్తున్నాడు ఇమ్మని, మీరు ఒక గాజు బొమ్మ ఇచ్చారు, ఇచ్చి మీరు బయటికి వెళ్ళిపోతారా... వెళ్ళరు మీరు ఏంచేస్తారంటే వాన్ని ఏలామభ్యపెట్టి గాజుబొమ్మ ఎలాతీసేసుకుందాం అనుకుంటారు, దానికోసం అవసరమైతే నైవేద్యంకోసందాచిన కర్జూరపండ్లు తీసుకొచ్చి నాన్నా తీయగా ఉంటాయి ఇవంటే నీకు ఇష్టంకదా అని మీరువాటిని వాడిచేతిలోపెట్టేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్టు తెచ్చుకుందామనీ గాజుబొమ్మతీసేస్తారు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgn3s7VpqWIE4nO9a6_K-bQK2qyhteSrMZb942265IHDR3XyQeJFbfSiojqQXINwRWd4czQgGZiS5GKRlZDngrNOsV0QL6_Oo3PTLdCGsLtP_JyjyKyWNvvoHfKpBByIV1-YbhA6wcEia0/s320/Vi%C5%9Bodhana%E1%B8%A5.jpgభగవంతుడు మీకు ఇచ్చేటటువంటి అభ్యున్యతిని కూడా... అంత జాగ్రత్తగానూ తీసేస్తాడు ఎందుకు తీసేస్తాడో తెలుసాండీ...? ధర్మ పదంలోలేడు వాడివలన ఉపయోగంలేదు అది ప్రమాదాలవైపుకే వెడుతోంది, అహంకారముప్రబలిపోయి ఏ విభూతియైనా అహంకారానికి కారణమైతే..? “ఏవిభూతి తానిచ్చింది అహంకారానికి కారణమైందో ఆవిభూతిని ఈశ్వరుడు తీసుకోవడం పెద్దగొప్పకాదని మీరు గ్రహించవలెను.” నేను చాలా అందగాన్నీ నేను ఎందుకు పేర్లు చెప్పాలి నేను చాలా అందగత్తెననీ అనిచెప్పి విపరీతమైనటువంటి అతిశయానికిపోయి చెయ్యకూడని పనులుచేస్తే, గీజర్ పేలిపోయినటువంటి మరుక్షణంలో ఆ అందం నశించిపోయింది, మరుగు నీళ్ళు ఒంటిమీద పడిపోయాయి. నేను ఇంతటివాన్ని నాలామాట్లాడగలిగిన వాడెవడూ? ఈశ్వరుడు దానిమూలాన్ని నొక్కేశాడు వాక్కురాలేదు అయిపోయింది. ఏవిభూతిని ఈశ్వరుడిచ్చాడో దానిని నీవు సమాజపరంచేసి పదిమందికి పనికొచ్చేటట్టు నిలబెడితే... నువ్వింక దానిగురించి బాధపడక్కరలేదు. ఈశ్వరుడు నీవ్వు నీకంఠం, నీఅభ్యున్నతి కొరకూ ఆయనే ఉపకరణములను నీదగ్గరకి చేరుస్తాడు. చేర్చి రక్షణచేస్తాడు నిన్ను, ఎందుకు రక్షిస్తాడంటే... అమ్మో! వీన్నినేను చూసుకోవాలి, వాన్నినేను అంటే “నా కొరకు రక్షింపబడువాడూ” అన్నాడు భాగవతంలో ఆయన. నాకొరకు నేను రక్షించుకోవాలివాన్ని. వాడికి ఆ తాపత్రయం లేదు, వాడు అలా అంకితం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అందుకని వాన్ని నేను పొదిగిపట్టుకుంటాను అంటాడు. ఇది లేదూ, నేను ఇచ్చింది ఎంత తొందరగా తీసేద్దామని చూస్తుంటాడు. ఎందుకంటే వీడు పాడుచేసేస్తాడు దానిని ఇంతే తేడా రామునికి రావణుడికి.
రాముడు వెడుతుంటే, బ్రహ్మగారు వానరుల్ని సృష్టించాడు దేవతలయొక్క అంశలతో. రావణుడు వస్తూవుంటే, ఒక్కొక్కర్ని తీసేస్తున్నాడు తాటకాదుల్నీ ఇంకా ఇంతకన్నా నేను మీకు శ్రీరామాయణాన్ని ఏం మనవిచేయనూ... దీనిధర్మంగురించి, కాబట్టి తాటకాసంహారం అంటే కేవలంతాటకా సంహారమని మీరు అనుకోవద్దూ తాటకాసంహార వృత్తాంతమునందూ ఇంతరహస్యందాగివుంది. నీ జీవితానికి పనికొచ్చేటటువంటి లేదా మనజీవితానికి పనికొచ్చేటటువంటి ఒక అంశం అందులో ఇమిడివుంది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి! మీరు ఏదో ఒకవిభూతిచేత గౌరవింపబడుతుంటారు. పదిమంది నాకునమస్కారం చేశారనుకోండీ! నేను ఇలావస్తూవుంటే కారుదిగీ..., ఓ వందమందివచ్చి నాకాళ్ళకి నమస్కారం చేశారనుకోండీ! ఇక నేను నాకాళ్ళ వంకచూసుకొని అహా! పాదములారా! ఎంతమందిచేత నమస్కరింపబడుతున్నారే... శారదకీ నాకు ఏమిటి తేడా? ఆవిడకు నమస్కారంచేశారు నాకునమస్కారం చేస్తుంన్నారు, అని నేనువిర్రవీగానుకోండీ! ఈశ్వరుడు ఓహో...! ఇన్నినమస్కారాలు నీకేపెడుతున్నావనుకుంటున్నావా? అన్నమాట అనీ... ఆయన ఏవిభూతి నాకువుండడంవల్ల నాకునమస్కరిస్తున్నారో ఆ విభూతిని తీసేయడానికి కూడా ఆయనకువచ్చు. ఎవడు నీకునమస్కారం చేసేవాడు? ఏదీ నీకుటుంబంగురించి, నీగురించీచెప్పూ ఉపన్యాసం, ఐదుగురు ఉంటారేమో? రాముడు గురించి చెప్తున్నావు కాబట్టి వింటున్నారు. నువ్వు రామకథ చెప్తున్నావు కాబట్టి నీకునమస్కారంచేస్తున్నారు, రామా! నీనామంచేప్తే నీకథ రెండుగంటలుచెప్తే ఇంతమంది నమస్కారమా? ఇంతమంది కూర్చొనివినడమా? తండ్రీ జన్మ జన్మలకీ ఈసౌభాగ్యాన్ని నాకు


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
మీగల్చు, ఇంక ఇంతకన్నా నాకు ఏంకావాలి తండ్రీ! నేను బ్రతికున్నన్నాళ్ళూ, నాఊపిరి నిన్ను స్తోత్రంచేస్తేచాలు, అంతకన్నా నాకు ఇంకేమివద్దని నీవు అడగగలిగితే... ఈ పూజనీయత పదిరెట్లు అవుతుంది. ఇది అనుషంగికం ఇంక దానిగురించి వెంపర్లాడక్కరలేదు అదే అయిపోతుంది. దానిగురించి నీవువెంపర్లాడడం మొదలెడితే... ఉన్నదిపోతుంది ఇదే దేవతానుగ్రహం అంటే... ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది మీరు రామాయణంలోంచి.
కాబట్టి ఇప్పుడు దేవతలువచ్చి విశ్వామిత్రున్ని అడిగారు ఏమనీ! ప్రజాపతేర్భృశాశ్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ ! తపోబలభృతో బ్రహ్మన్ రాఘవాయ నివేదయ !! పాత్రభూతశ్చ తే బ్రహ్మంస్తవానుగమనే ధృతః కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా !! ఎంత గొప్ప మాటలన్నారండీ చూశారా శ్లోకంలో “కర్యవ్యం” ఎప్పుడూ ఆ మాటే ఉంటుంది. ఓ బ్రహ్మన్ ఓ విశ్వామిత్ర మహర్షీ! నీకు భృశాశ్వస్య తనకు కలిగినటువంటి కుమారులు అస్త్ర స్వరూపములైనటువంటివారు, అస్త్రములన్నిటిని కూడా నీకిచ్చేశారు నీదగ్గరున్నాయి అస్త్రాలు, రాముడూ అస్త్రసంపద లేనివాడు పిల్లవాడు ఇంకా ఏమి తెలియనివాడు, నువ్విచ్చిన అస్త్రాలు కొన్నివున్నాయి, వాటితో ఏమి చేశాడు? తాటకా సంహారంచేసి లోకరక్షణచేశాడు. ఇప్పుడు ఆ అస్త్రాలు మిగిలినవి నీదగ్గర ఉండడంకన్నా నీవు వాటిని రామపరం చేసేసై రాముడికిచ్చేసై రాముడు నిన్ను అనువర్తించేవాడు. ఇదిపట్టుకోండి బాగా... ఈ మాటపట్టుకోండి పాత్రభూతశ్చ తే బ్రహ్మన్ ఏ మాట చెప్తున్నారో https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhOUf951B6F0QWQ-qFPGx02bewO4yCtQpNgd179Ge5Vkj7o-MeQ05kR3W72LCDGgFTr3R1_TdbUOGzqmHJpTdfWso6vfupZF1gwriYBh8NKr6Wxsds52rbi8RK6aO92yxrExrudbvubjZw/s1600/0101.jpgచూడండీ! అతను పాత్రత కలిగినటువంటివాడు ఇవ్వడానికి యోగ్యతకలిగినటువంటివాడు ఎందుచేత అతనూ స్థిరసంకల్పంతో నీకు శుశ్రూష చేస్తున్నాడు. ఇవ్వాళ వచ్చిందనీ ఇవ్వాళ ఇచ్చావనీ దానితో ఒక పనిచేస్తే దానివల్ల పదిమందిపొగిడితే... ఈ పొగడ్తలంతటికీ నాగొప్పతనమే అనడు ఎందుకు చంపానూ? విశ్వామిత్రుడు చెప్పాడు కనుకా! చంపడానికి ఉపకరణమేదీ విశ్వామిత్రుడు ఇచ్చాడు కనుకా... కాబట్టీ గౌరవమెవరిదీ విశ్వామిత్రుడిది. కాబట్టి విశ్వామిత్రుడు ఇవ్వకపోతే నా బ్రతుకు ఏమయ్యేదీ! కాబట్టి కింకరున్ని అని ఇంకా ఇంకా ఇంకా ఒంగి నమస్కారంచేస్తాడు. వాడికా ఇవ్వవలసింది..? పనికి మాలిన వాడికా... పనికి మాలినవాడికి ఇచ్చి ఎంత బాధపడుతున్నావో చూశావుగా! అది తీసేయడానికేవెళ్ళాలి. అందుకనీ ఈయనకి ఇచ్చేసేసై నీ అస్త్రాలన్నీ ఇప్పుడు మీరుపట్టుకున్నారా...! దేవతలు ఎవరికి శక్తిని ఇమ్మని ప్రార్థన చేస్తారో...?
నేను రామాయణ కోణంలోచూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటూంటుంది? నేను ఒకానొకప్పుడు పుష్కరాలకి వెళితే, ఒకాయనానూ నలుగురు కొడుకులు వాదనచేసుకొంటున్నారు నేను అనుకున్నాను ఏదో దెబ్బలాడుకుంటున్నారు. ఇదేమిటీ ఇలా దెబ్బలాడుకుంటున్నారు పుష్కరాలకొచ్చీ అనుకున్నాను. తీర దగ్గరికెళ్ళిచూస్తే... నలుగురు కొడుకులుకలిసి నాన్నగారిని నిర్భందిస్తున్నారు. నాన్నగారండీ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడూ, మీరు ఒకప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, మీరు ఇంతగౌరవంగా బ్రతకండనీ మాకుప్రతిరోజూ సంధ్యావందనం చేస్తేతప్పా పాలుత్రాగనిచ్చేవారుకాదు. అంతభక్తితో బ్రతకడం, అంత కర్తవ్యతానిష్టతో బ్రతకడం మీరు మాకునేర్పారు. మేం నలుగురం పెద్దవాళ్ళం అయిపోయాం. నలుగురూ ఎంత పెద్దవాళ్ళైపోయారూ అని నేను తరువాత పలకరిస్తే... ఒకాయన ఐఏఎస్, ఒకాయన ఐపీయస్, ఒకాయన పెద్ద డాక్టరూ, ఒకాయన పెద్ద ఇంజనీయరూ. నలుగురు కొడుకులూ నలుగురు కోడల్లూ మామగారిని అత్తగారినీ ప్రాధేయపడుతున్నారు? ఏమని అంటే పెద్దవాన్ని కాబట్టి నాది అధికారం.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
నాన్నగారూ ప్రతిరోజూ మీపాదాలు పట్టేటటువంటి సౌభాగ్యం తీసేయవద్దు, నాదగ్గరే ఉండండీ. తమ్ముళ్ళు ముగ్గురూ, మరదళ్ళూ మీగిలినటువంటి పిల్లలూ ఎన్నిమాట్లైనా రానివ్వండీ నాకు సంతోషమేగా మీగురించివస్తే...! మీరు మాత్రం అందరిదగ్గరా అన్నమాట అనొద్దు. నాదగ్గరేవుండాలి నాన్నగారండీ...! నాకున్న ఈ అదృష్టాన్ని తీసేయవద్దు, అంటే తండ్రి అంటున్నాడు మనకు ఊళ్ళోవున్న పెంకుటిల్లువుందికదా దాన్ని అమ్మేసి, మీ నలుగురికీ ఇస్తానంటున్నాడు పెద్దవాన్ని అయిపోయాను. వాళ్ళన్నారూ... పెంకుటిల్లు అమ్మేసేయండీ ఇంకొద్దు, కానీ! పెంకుటిల్లు అమ్మేస్తానూ అన్న ఆలోచనతో పాటు మేము ఒకటి చెప్తాం. మనకు అక్కడే ఒకచిన్న స్థలంవుంది మీరు ఆ అమ్మితే వచ్చిన డబ్బుతో మీకు ఇష్టమైన పెద్దశివలింగం పట్టుకురండీ. మీగిలిన డబ్బంతా నాన్నగారండీ సంపాదించాం కాబట్టి మేము ఇస్తాం, మీదే మీరు పెట్టినబిక్ష ఈశక్తి. శివాలయం కడుదాం అమ్మా మీరు కలిపి శివలింగం ప్రతిష్టచేయండీ ఇంత కష్టపడి మమ్మల్నీస్థితికి తెచ్చినందుకు మనవంశంలో పుట్టినవారందరూ, మా తాతగారు మా ముత్తాతగారు కట్టినటువంటి గుడీ అని అక్కడికివెళ్ళాలి. కాబట్టి నాన్నగారూ ఆడబ్బులు పంచద్దు నాన్నగారూ అని గుడికట్టండని అడుగుతున్నారు. నేను మురిసిపోయాను ఆ కుటుంబాన్నిచూసి, మీరు ఏవిత్తనాలు చల్లుతారో ఆ పంటలేపండుతాయి కదా!. మీరు బిడ్డలకీ ఏసంస్కారం నేర్పుతారో కర్తవ్యం, అలా అవ్వకపోతేనండీ... వదిలిపెట్టేయండీ... మీ కర్తవ్యం మీరు పూర్తి చేశారూ అదే మనకు ఫలితాన్ని ఇస్తుంది.
http://www.sannidanam.com/wp-content/uploads/2015/10/ram-viswamitra.jpgకాబట్టి రాముడికి అస్త్రాలు ఇవ్వు రాముడు రావణ సంహారంచేస్తాడు, రావణసంహారం చేస్తాడన్నమాట చెప్పారనుకోండీ? అది విశ్వామిత్రున్ని కించపరచడం అంటే ఎవరినిసంహరించాలో, దానికి ఏమివ్వాలో తెలియదా? అని అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఏమని అడగాలి? ఫలానా పనికి నీవ్వు ఇవ్వు అని అడగకూడదు మా పనికోసం నీవు ఇవ్వు అని అడగాలి ఏమిటి మా పనీ? వాళ్ళంటున్నారూ... కర్తవ్యం చ మహత్కర్మ చెయ్యవలసిన పెద్దపనొకటి ఉంది. ఎవరికోసం మా కోసం అది రావణుడు చనిపోతే ఎవరికండీ సంతోషం దేవతలకి. అందుకని విశ్వామిత్ర మహర్షి నీకు అందరు ఒకటేకదా మాకూ సంతోషం చెయ్యవలసిన పెద్దపనికోసం రామునికి ఈ అస్త్ర సంపదనంతటినీ కూడా ధారపోసేసై, చాలా సంతోషించాడు తప్పకుండా చేస్తాను అయిపోయింది దేవతలు వెళ్ళిపోయారు. రాముడికి లక్ష్మణుడికి కనపడాలా? ఇవన్నీ చెప్పడానికీ, కనబడనవసరం లేదు మీగురించి గురువు మనసులో ప్రచోదనంచేసేటప్పుడు, మీకుకనపడి అడగాలా? అక్కరలేదు మీకర్తవ్యంలో మీ ఆలోచనలో శుద్ధివుంటే... దేవతలు గురువుగారిని ప్రచోదనంచేస్తారు.
కాబట్టీ ఇప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించాడు ఆరోజు రాత్రి పూర్తైంది మరునాడు ఉదయం నిద్రలేచారు, చెయ్యవలసినటువంటి నిత్యకర్మ పూర్తిచేసుకున్నారు రామున్ని పిలిచారు. కూర్చో రామా! నేనునీకు ఇవ్వాళ దివ్యమైనటువంటి అస్త్రములు ఈ లోకంలో ఎవరికీ తెలియనన్ని అస్త్ర సంపదా నీకు నేను ఉపదేశం చెయ్యాలనుకుంటున్నాను.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
స్వీకరించు ఒక్కొక్క మంత్రం ఇస్తున్నాను అన్నాడు అవి మంత్రములకు కట్టుబడి ఉంటాయి. అస్త్రమూ అంటే దానికేం రూపమూ ఉండదు అది మీరు ఒక గడ్డి పరకని తీసుకొని మీరు సౌచంతో ఉండి అభి మంత్రించారనుకోండీ ఆ మంత్రాన్ని ఆ Image resultదేవతా శక్తి ఆ గడ్డిపరకని పట్టుకుని ఎదుటివాని మీదపడి చంపేస్తుంది అంతే... అవి మంత్రములచేత లొంగివుంటాయి ఆశక్తులు వాటిని అస్త్రములు అంటారు. శస్త్రములు అంటే పైకి కనబడతాయి కత్తి గుణపము గొడ్డలి ఇలాంటివి, కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని ఉపదేశం చేసేస్తున్నాడు దానివల్ల రాముడికి ఎన్నివస్తున్నాయి శక్తులు. అంటే దండచక్రమూ, ధర్మచక్రమూ, కాలచక్రమూ, విష్ణుచక్రమూ, ఇంద్రాస్త్రమూ, వజ్రాస్త్రమూ, మహాశూలమూ, బ్రహ్మశివరూపనామకాస్త్రమూ, ఐశీకాస్త్రమూ, బ్రహ్మాస్త్రమూ వీటితో పాటుగా మోదకీ, శిఖరీ అనేటటువంటి రెండు గొప్ప గధలు, ధర్మ పాశమూ, కాల పాశమూ, వరుణ పాశమూ, వరుణాస్త్రమూ, శుష్కమూ, ఆర్ద్రమూ అనేటటువంటి రెండు పిడుగులు, పైనకాస్త్రమూ, నారాయణాస్త్రమూ, శికరమూ, ఆగ్నేయాస్త్రమూ, వాయువ్యాస్త్రమూ, హైశిరస్సు, వామనాస్త్రమూ, విష్ణు శక్తీ, శివ శక్తీ, కంకాళమూ, ముసలమూ, పాతాలమూ, కంకణమూ విటితో పాటు నందనము అనేటటువంటి కడ్గమూ, మోహనాస్త్రమూ, ఐనాస్త్రమూ, సౌరాస్త్రమూ, వర్షాస్త్రమూ, తౌనమూ, శోషణమూ, సంతాపము, విలాపమూ ఇవి కాకుండా ఇంకా మదనమూ, తామసము, సౌమనమూ, సంవర్తనమూ, మౌసలమూ, మాయాధరమూ అలాగే తేజ ప్రభా, శిశిరమూ, ధరణాస్త్రమూ, సుధారుణాస్త్రమూ, శీతేషువు మొదలైనటువంటి అనేక అస్త్రములు సంకల్పించి విడిచినంత మాత్రంచేత కొన్ని లక్షలమందిని తెగతార్చగలిగినటువంటి మంత్ర శక్తుల్నీ ధారపోసేశాడు.
బాగా గుర్తు పెట్టుకోండీ! ఏమిచ్చాడని ధారపోశాడూ...! రాముడు ఏమైనా 16 రూపాయలు తాంబులములలో పెట్టి ఇచ్చాడండీ...? ఇవ్వగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు దేనికి ఇస్తాడంటే వినయానికి ఇస్తాడు రెండో కోణం నేను మాట్లాడను. కాబట్టీ ఎక్కడ ప్రజ్ఞ ఉంటుందో అది ఎక్కడ మళ్ళీ ప్రవాహాన్ని పొందుతుందంటే పల్లమున్నచోటుకే ప్రవహిస్తుంది. ఎక్కడ వినయముందో ఎక్కడ అధికారముందో అక్కడకే పంపుతారుదాన్ని అంతేకానీ ఏదో ఒకటి ఎవరికోవాళ్ళకి ఇచ్చేదామనిచెప్పి ఇవ్వడాలు ఏమీ ఉండవు ఆలాగ దానికి సభలుపెట్టీ టీవీలో య్యాడ్లిచ్చీ చేసేటటువంటివికావవి అవి నిజంగాగురువుగారి సంతోషంతో ఇచ్చేవి వేరుగావుంటాయి. కాబట్టీ ఇటువంటి అస్త్ర సంపదనంతటినీ కూడా రామ చంద్ర మూర్తికి ధరపోసి ఎన్నో అస్త్రములను ప్రయోగించడం ఉపసంహరించడం రెండిటినీనేర్పాడు. ఇప్పుడు ఈ అస్త్రాలకు సంబంధించినటువంటి మంత్రముల యొక్క అధిష్టాన దేవతలూ రామునికి వశవర్తులై చుట్టూవచ్చినిల్చొని నమస్కారం చేశారు. రామా! నీ ఆజ్ఞ ఏంచెయ్యమంటావు అని అడిగారు. మరి వెంటనే లొంగినప్పుడు అడగాలికదండీ ఏంకావాలనీ ఏం చేయమంటారు అని అడగాలి కదా...! ఏం చేయమంటావు అని అడిగారు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఇన్ని రాగానే చాపల్యం ఉంటే... ఒకటి సరదాగా ప్రయోగించి చూద్దాం ఏలా ఉంటుందోను అని చెప్పీ ఏదో ఒకటి గుర్తుతెచ్చుకొని అలా వాడిమీదవేస్తే బాగుంటుందేమోననీ చెప్పీ ఓ సారెల్లి దాన్నిచంపిరా అని ఏ ధర్భపుల్లో వేశాడనుకోండీ, వెంటనే విశ్వామిత్రుడు ఏం చేసినట్లంటే అపపాత్ర దానంచేసినట్లు. రాముడు అన్నాడూ... మీ మీ స్వరూపాలతో మీరు పైకి కనపడకుండా నాయందే స్మరణరూపంగా ఉండండి, నేను ఎప్పుడెప్పుడు దేని అవరంవస్తే దాన్నిస్మరిస్తాను అప్పుడు మీరు నాయందు ప్రకాశించి పైకొచ్చి ఉపకరించండీ అన్నాడు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
అంటే ఉన్నదికదాని ఉపయోగించడం కాదు ఎప్పుడు లోకరక్షణకు అవసరమో అప్పుడు ఉపయోగించగలిగిన పరిణతి ఎవరికుంది పిల్లాడికుందండీ! కాబట్టి ఎవరికిచ్చారు? పిల్లాడికిచ్చారు భగవత్ గీత ఎవరికిచ్చారు అర్జునుడికి ఇచ్చారు వయసు కాదు ప్రధానము, ప్రరిణితి ప్రధానము ఈ పరిణితిరావాలి, కాబట్టి ఇప్పుడు ఈ అస్త్ర సంపదనంతటినీ కూడా రామ చంద్ర మూర్తికి ఇచ్చిన తరువాత చాలా సంతోషించారు రామ లక్ష్మణులు ఇరువురూ కలిసి సంతోషించారు. మీరు శ్రీరామాయణంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది ఉపదేశం చేసేటప్పుడు భర్తకి చేస్తేచాలు ఆయనా భార్యకు చేసేస్తాడు, అలాగే అన్నదమ్ములలో రామ చంద్ర మూర్తికి ఉపదేశం చేసేస్తే చాలు విశ్వామిత్ర మహర్షి, రామ చంద్ర మూర్తి పాత్రతనెరిగి లక్ష్మణునికి ఉపదేశం చేసేసినట్లే, కాబట్టి రామ లక్ష్మణులకి ఇద్దరికీ అస్త్రసంపద తెలిసున్నట్లే ఇప్పుడు మీరు రామాయణాన్ని చూసేటప్పుడూ, రామునికే తెలుసూ లక్ష్మణున్ని పక్కకి పంపించేసి చెట్టుచాటుకోనూ, దూరంగానూ రావద్దనిచెప్పి రామునికి చేశారనుకోకూడదు. లేకపోతే రాముడే గ్రహించాడు కదండీ మరి లక్ష్మణుడు అయ్యో! నేనూ వచ్చాను గదా నాకేమిటి ఇవ్వట్లేదుగదా అని అనుకోవడానికివీల్లేదు. రాముడు లక్ష్మణునికి ఇచ్చాడు రాముడు విశ్వామిత్రుడి దగ్గర పొందీ, రాముడు లక్ష్మణునికి ఇచ్చాడు ఇదీ ఒక క్రమ పద్ధతిలో వెళ్ళే ఈ ఉపదేశం అని మీరు స్వీకరించవలసి ఉంటుంది.
తరువాత వారు ముందుకి వెళ్ళి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు, ఈ ఆశ్రమంలోనే నేను ఒక యాగం చెయ్యాలి అని సంకల్పం చేశానూ, ఈ ఆశ్రమమంటే నాకు మీద మిక్కిలి ప్రీతి అన్నాడు విశ్వామిత్రుడు. ఇది ఎవరి ఆశ్రమం ఎందువల్ల మీకు ఇంత ప్రీతి ఏర్పడింది అని అడిగాడు. ఎందుకనీ అంటే ఒక మాటుందండీ! విశ్వామిత్రుడు ఎక్కడో ఉండాలిగా అసలు, యాగం చేయడానికి ఇక్కడి వచ్చాడు కానీ, ఆయన ఎక్కడో ఉండాలి, ఆయన కూడా ఎక్కడో ఒకచోట ఉండి ఉంటాడుగా తపస్సు చేసుకోవడానికి ఎక్కడుంటాడు ఆయన, ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో “కౌషికీ నది” ఒడ్డున ఉంటాడు. ముందర చెప్తాడు ఆయన కౌషికీ నది ఒడ్డున ఉంటాడు, మరి ఇక్కడి ఎందుకు వచ్చాడు? అంటే కోటేశ్వరావు గారు కాకినాడలో ఉంటారు కదా గుంటూరుకి ఎందుకు వచ్చారు అంటే గుంటూరులో ఆయనకి ప్రీతి కరమైనవి కొన్ని ఉన్నాయి ఇక్కడ శృంగేరి పీఠం శాఖ ఉంది శారదాంబ ఉంది, హరిప్రసాదు గారు ఉన్నారు ఆయనకి ప్రీతి వచ్చాడు. అందుకని ఉన్నాడు అలాగే... అంటే విశ్వామిత్రుడు కూడా (ఆయనతో నన్ను పోల్చుకున్నాడు అని అనుకోకండీ! ఒక కారణాన్ని పోల్చాను అంతే) విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు? సిద్ధాశ్రమం మీద ప్రీతి సిద్ధాంశ్రమం మీద ప్రీతి ఎందుకు? అంటే చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాడు.
బలిచక్రవర్తి అహంకరించి తనదికానిది తనదిగాచేసుకొని దానాలుచేస్తూంటే... ప్రహ్లాదునియొక్క మనుమడుకనుకా ప్రహ్లాదుడికి వరమిచ్చాడుకనుకా, నిగ్రహించకూడదు కనుకా, దానంపట్టి అది తీసేసుకోవడం కోసమనీ కష్యపప్రజాపతికి కుమారుడుగా ఉదయించీ ఆ విష్ణువే వామనమూర్తిగావచ్చాడు. వచ్చి యజ్ఞవాటంలో యజ్ఞంచేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికివెళ్ళాడు, ఒక వటువు రూపంలోవెళ్ళాడు కోటిమంది రావడం ఒకెత్తు ఒక వటువు రావడం ఒకెత్తు వటువు అంటే అంతగొప్పవాడు. అప్పుడే ఉపనయనంచేసుకున్నటువంటివాడు కాబట్టి ఆ వటువు వచ్చేటప్పటికీ భాగవతంలో పోతనగారైతే... పొంగిపోయారు వడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాసస్థలంబెయ్యది య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడ నైతి నీ మఖము యోగ్యం బయ్యె నా కోరికల్ కడ తేరెన్ సుహ్రుతంబులయ్యె సఖులున్ కళ్యాణ మిక్కాలమున్! అంటాడు బలిచక్రవర్తి. ఓహ్...! నీవు వస్తూంటే అగ్నిశిఖలు ఎలా పైకివస్తున్నాయో చూశావా! చాలా సంతోషం వడుగా ఎవ్వరివాడవు ఎవ్వడవు? ఎక్కన్నుంచివచ్చావు? నీకు ఏంకావాలి చెప్పు ఇచ్చేస్తాను, వటువుకి ఇంక ఇవ్వడమంటే... తరించి పోతారండీ! వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో... కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో... ఏ మడిగేతే అది నీకు ఇచ్చేస్తాను రా...! ఏంకావాలన్నాడు? నాకెందుకయ్యా అవన్నీ, నీవు ఇవ్వనూకూడదూ నేను పుచ్చుకోనూకూడదూ... గొడుగో, జన్నిదమో, కమండలువో, నాకున్ ముంజియో, దండమో వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్, వామాక్షు లశ్వంబులెక్కడ? నిత్యోచిత కర్మమెక్కడ? మదాకాంక్షామితంబైన మూడడుగుల మేరయ త్రోవ కిచ్చుటదె బ్రహ్మాండంబు నా పాలికిన్ అవి ఇవ్వయ్యా? మూడడుగులభూమి ఇవ్వుచాలు? బ్రహ్మండమేమిటో చూపిస్తానన్నాడు ఇచ్చాడు, ఇచ్చాను అన్నాడు అంతే? చూపించేశాడు లెక్క కట్టి. ఏదైనా భూమి ఉంటే యజమాని తొక్కిచూడాలి శాస్త్రంలో... ఎక్కడోవుండి ఇక్కడ రిజిస్త్రేషన్ చేయించకూడదు. తనెల్లి తొక్కుకోవాలి పాదంతో, నీవు ఇచ్చావన్నావు కాబట్టి నేను తొక్కుతాను అన్నాడు కాబట్టి తొక్కేయ్? అంతే...


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై ! నంతై యదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై !!
నంతై  చంద్రునికంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై ! నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్దియై !!
రవిబంబం బుపమింప బాత్రమగు చత్రంబై శిరోరత్నమై ! శ్రవణాలంకృతమై గళాభారణమై, సౌవర్ణకేయూరమై !!
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటియై నూపుర ! ప్రవరంబై పదపీఠమై వటుడు తాబ్రహ్మన్డమున్ నిండుచోన్ !!
అంటారు పోతనగారు. అంతా నిండిపోయి మొత్తం ముల్లోకాల్నీ ఆక్రమించేశాడు ఆక్రమించి దేవేంద్రుడికి ఇచ్చేశాడు ఆరాజ్యాన్ని ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి. వామనమూర్తి అన్నీ ఇంద్రుడికి ఇచ్చేసిన తరువాతా, బ్రహ్మచారి రూపంలో కదాండీ ఉన్నాడు! వామనుడు పెళ్ళిచేసుకొన్నట్టులేదు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి ఆశ్రమంలో ఉండాలి అందుకనీ ఆ వామనమూర్తి సేదతీరడం కోసమనీ ఈ ఆశ్రమంలో వచ్చి ఉన్నాడయ్యా చాలాకాలం, ఇక్కడే ఉండీ బ్రహ్మచర్యంలో చెయ్యవలసినటువంటివిచేశాడు ఇక్కడకూర్చొని, బ్రహ్మచారిగా ఉంటే ఈశ్వరుడు కూడా తనకర్త్యవం తానుచేస్తాడు అందుకనీ సంధ్యావందనం చేసుకొనేవాడు అక్కడకూర్చొని ఆయనతిరిగాడు, ఏ చిన్ని చిన్ని పాదములతో ఈమూడు లోకములు కొలిచాడో... ఆపాదములతో ఇక్కడతిరిగాడు ఈ సిద్ధాశ్రమంలో. ఇక్కడ సిద్ధి పొందుతాను నేను కాబట్టి రామా! ఇక్కడ యాగం చెయ్యాలి అని నాకోరిక అందుకు నాకు ఇదిప్రీతి. కోరడానికి ఒక వస్తువు పట్లప్రీతి కూడా ఎంత గొప్పకారణం చూపిస్తున్నాడో చూడండి విశ్వామిత్రుడు. అందుకని నేను ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను నాయనా! ఇక్కడే యాగంచేస్తున్నాను. ఇక్కడ యాగంచేస్తుంటేనే రాక్షసులువచ్చి దానికి ప్రతిబంధకాన్ని సృష్టిస్తున్నారు కాబట్టీ ఇక్కడే యాగం జరుగుతోంది నీవు ఈసారి ఆ యాగం ఇబ్బంది రాకుండా రక్షించవలసిన బాధ్యతనీది తప్పకుండా గురువుగారూ! అన్నాడు, విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు.
అంటే... ఇలా అన్నానని మీరు ఏమీ అనుకోకండీ...! మీరు పెద్దలూ, మీకు అన్నీతెలుసూ, ఏదో తెలియనట్టు అలా ఉంటారూ..? వీడి ధూర్తతనం మాట్లాడనీ అనీ.... మనం చాలాపన్లు చేస్తూంటాం, ఏదైనా మీరు ఒక పుణ్యకార్యాచణ కొరకు పీఠల మీదకూర్చోవడం అనేది ఒకమాట ఉంటుంది. కూర్చున్న తరువాత మీరు ఏవరితో మాట్లాడుతారో? మీరు అప్పటి వరకు చేసిన పుణ్యకార్యాచరణఫలం వారిఖాతాలో పడిపోతుంది. ఒక్క గురువుగారైతేనే మినాహాయింపు. లెదా క్రతువుని దిద్దుబాటు


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
Image result for మౌనంగా పూజ చేయడంచేయడానికి ఏదైనా దోషం జరుగుతుంటే చెయ్యోద్దను చెప్తానే... తప్పా!  మీరు అందుకే పదార్థాలను సిద్ధం చేసుకోవడం అన్నది అంతజాగ్రత్తగా చేసుకొంటారు. సహాయకుల్ని అంత  జాగ్రత్తగా పెట్టుకోవాలి, అంతే పూజచేసేటప్పుడైనా అంతే...? పూజకువెళ్ళేటప్పుడు శిష్యులు కానీ, భార్యకానీ ఎందుకు అమరుస్తారంటే..? ఆయన ఆరోజ ఏంచేస్తున్నాడనుకున్నాడో దానికి కావలసినవి అక్కడ సిద్ధం అవ్వాలి.
ఇంటికోడలికి సాంప్రదాయం తెలియడం అంటే అదే... మామగారు భర్తా పూజచేస్తుంటే, ఏమేమి ఉండాలో అవి సిద్ధంచెయ్యాలి కోడలు, ఆ కోడలికి తెలియదూ అంటే ఆ ఇంటి ఆ మర్యాద అమ్మాయి తేలేదూ అని అర్థం. మీ ఇంటికొస్తే పనిపిల్ల నాకు పాలిచ్చిందనుకోండీ! కోడలు చెప్పలేసుకొని తిరుగుతోందనుకోండీ! ఇంకోమాట చెప్పడానికి నేను వెళ్ళక్కరలేదు అని అర్థం గుర్తు. ఇంటి ఐశ్వర్యం ఏవరిమీద ఆధారపడి ఉంటుందండీ! కోడలు ఇంటికి వచ్చిన పెద్దలను సేవించడంమీద ఆధారపడి ఉంటుంది. పూజచేస్తూ మీరు అదేపనిగా సెల్ ఫోన్ పక్కనపెట్టుకొని మాట్లాడుతున్నారనుకోండీ... మీరుచేసిన పూజ ఎక్కడెక్కడ ఎంత భాగంచేశారో... ఆ ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. మీరు పూజచేసి లేసేటప్పటికి మీకు సున్నా ఏమీ ఉండదు. మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి అందుకే పూజాగృహంలోకి వెళ్ళి మళ్ళీ పూజాగృహంలోంచి బయటికొచ్చే పర్యంతమూ ఓ సంకేతం ఉంది ఓ చిటికె వేశాడనుకోండీ అలావాటు ఉంది. చిటికె వేశారనుకోండీ, లెదా తలుపు ఇలా అన్నారనుకోండీ అంటే ఆయనకి ఏదో అవసరంవచ్చింది అని అనుకోవాలి పూజలో ఏదో పదార్థంలేదు, మరిచిపోయారు కాబట్టి వెంటనే మీరురావాలి అక్కడికి కాబట్టి అదీ పెద్దలైనటువంటివారి పూజా అలా ఉంటుంది. భారతీతీర్థస్వామివారు అభిశేకం చేస్తుంటారు, ఎప్పుడైనా మాట్లాడుతారేమో చూడండీ? కూర్చున్నారంటే అయ్యిపోయేపర్యంతం మధ్య మధ్యలో ధారా పాత్రలో నీరు పోసి ఇలా చూస్తారు. కాక ధారా పాత్రలో నీరు పోశాను గదాని శివ లింగం మీద నీళ్ళు పడుతున్నాయో లేదో అని ఏవడ్నో పిలిచి కాస్త ఇలా మాట్లాడి మళ్ళీ నీళ్ళు పోస్తే ఇలా చెయ్యకూడదు మౌనం, మౌన దీక్ష తీసుకుంటారు ప్రత్యేకంగా...
అందుకనీ విశ్వామిత్రుడు మౌనంలోకి వెళుతున్నాడు, రామాయణం అందుకే మీకు నేను చెప్పింది రామాయణంలో ప్రతి చిన్నవిషయాన్ని చెప్తూంటారు, విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడూ.., మునులు రామునికి చెప్పారూ... రాముడు పరుగెత్తుకొచ్చి అడిగాడు నిద్రపోలేదు, పరుగు పరుగున వచ్చి మిగిలిన మునుల దగ్గర ఏమండీ ఎప్పుడు మొదలౌతుందండీ? ఎన్నాళ్ళుంటుందండీ? ఎన్ని రాత్రులుంటుందీ? ఎన్ని పగళ్ళు ఉంటుందీ? మహర్షి ఎంత సేపు కూర్చుంటారు? నేను ఎంత సేపు దీనికి సిద్ధంగా ఉండాలీ? ఏడు రాత్రులు ఏడు పగళ్ళూ జరుగుతుందీ, ఎప్పుడైనా రావచ్చు రాక్షసులు. కాబట్టి నీవు ఏడు రాత్రులూ, ఏడు పగళ్ళూ నీవు నిద్రపోకూడదు, కూర్చోకూడదు, నిలబడే యాగశాలచుట్టూ తిరుగుతూ ఉండాలి. పై నుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, పక్కనుంచి రావచ్చు. ధనుర్ధరుడవై ఇలా కోదండం పట్టుకొని కనపడగానే బాణం తీసి వేయడానికి సిద్ధంగా, కునుకు లేకుండగా తిరగాలని చెప్పారు. వాళ్ళు ఎప్పుడొచ్చారో తెలుసాండీ! 6వ రోజు వచ్చారు. ఎందుకు ఆరవ రోజు రావాలి? అంటే ఆయన అప్పటికి నిద్రపోక ఆరు రోజులు అయిందిగా... సహజంగా బడలిక ఉంటుందిగా... కాబట్టి ఇప్పుడు ఆయన కునుకు తీస్తూ మెళ్ళిగా ఉంటాడు కాబట్టి తెచ్చి రక్తం పోసేయొచ్చు, పాడు చెయ్యొచ్చు అని వారు 6వ రోజు వచ్చారు. ఏవరి ప్రణాళిక వారిది కదాండీ! పాడు చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు ఐనా రాముడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఉండగలిగాడూ? రాముడి గొప్ప అని మీరు అనుకొంటే నేను ఒప్పుకోను న శ్రమో న జ్వరో వా తే న రూపస్య విపర్యయః ఇచ్చాడు విశ్వామిత్రుడు ముందే ఆ శక్తి నీకు నిద్ర రాదు, నీ తేజస్సు చెడదు, నీకు ఆకలి వేయదు. ఏది రక్షించడానికి కావలసిన సంభారములన్నియూ దాన్ని విశ్వామిత్రుడుముందే ఇచ్చాడు. గురువుకి తెలుసు నీకు ఏది ఇవ్వాలో... నీవు అడగద్దు గురువుని.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
చంద్రశేఖర భారతీస్వామివారి దగ్గరి వెళ్ళి ఓ హై కోర్టు జడ్జి గారు వచ్చి నాకు ఫలానా మంత్రం ఇవ్వండీ అన్నారు. ఆయన అన్నారు మీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు? మీకు నేను ఏమి ఇవ్వాలో మీరు నాకు చెప్పక్కర లేదు అన్నాడు. అది గురువు అంటే...? పొంగి పోతాను నిజంగా చంద్రశేఖర భారతీగురించి చదివినా, చంద్రశేఖర పరమాచార్య గురించి చదివినా ఎందుకంటే సద్గువులు, మహాపురుషులు వాళ్ళు.
కాబట్టీ ఇప్పుడూ రాముడు మునులని అడిగాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు అద్యప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘమౌ యువామ్ ! దీక్షాం గతో హ్యేష మునిర్మౌనిత్వం చ గమిష్యతి !! ఇవ్వాల్టినుంచీ 6 రోజుల వరకు అంటే ఇవ్వాల్టితో కలిపి, 6 రోజుల పాటు విశ్వామిత్ర మహర్షి మౌనంలో ఉంటారు మాట్లాడరు. నీవు ఎక్కడకో వెళ్ళికూర్చుంటే, రామా... రామా... అని పిలవడానికి ఏమీ ఉండదు. ఆయన మౌనాన్ని నీవుకాపాడాలి అంటే....? గురువుగారు లోపల పూజచేసుకుంటుంన్నారు, భర్త పూజచేసుకుంటున్నారూ అంటే...? భార్యయొక్క ప్రధానకర్తవ్యం ఏమిటీ? ఆయన నీరాజనం ఇచ్చిబయటికి వచ్చేంతవరకూ ఆయన మౌనాన్ని పరిరక్షించడం. ఆయన మధ్యలో మాట్లాడవలసిన అవసరం కల్పించకూడదు. లేకపోతే నీ ఇల్లు ఎలావృద్ధిలోకి వస్తుంది ఆయనతో మాట్లాడిస్తే, ఆయనకు తపశక్తి లేకపోతే, ఈశ్వరానుగ్రహాన్ని పొందకపోతే, ఆయన అడుగుతున్నాడు ధర్మ పత్ని సమేతస్య సకుటుంబ సపరివారస్య వీలందరూ బాగుండడానికి నేను ఈపూజచేస్తున్నాను అంటున్నాడు. ఆ పూజ శక్తివెడితేగదా మీరందరూబాగుండడం, నువ్వే పాడుచేసేస్తుంటే ఆయనపూజనీ ఇంకేలాబాగుంటుంది ఇల్లు, ఇంక ఇంతకన్నా గొప్పవిషయమం ఏముంటుంది మా ఆయన చేసుకునేపని ఈ గంట మాట్లాడరాయన Come what may ఇంగ్లీషులో చెప్తుంటారే, ఫోనువచ్చింది రాయి ఒక కాగితం మీద, పూజలో ఉన్నారండీ కసేపాగి మాట్లాడుతారు. ఎవరికి ఇవ్వచ్చు ఫోను, ఒక్క గురువు గారైతే ఇవ్వచ్చు మినహాయించి, ఎవ్వరికీ ఇవ్వకూడదు గురువుగారికి మాత్రం దోషంలేదు. ఎంత పనిలోవున్నా గురువుగారువస్తే వేదికదిగిపోవలసిందే, వెళ్ళిప్రణిపాతంచేయవలసిందే... గురువుగారిపట్ల అమర్యదమాత్రం చెయ్యకూడదు. నేను తప్పుచెప్పాననుకుంటే గజేద్ర మోక్షంలోచదవండి అగస్త్యుడు అందుకే శపించాడు లేవకపోతే...
కాబట్టీ మిశ్వామిత్రుడిమౌనాన్ని నీవుకాపాడాలి, అదే యజ్ఞాన్ని కాపాడటం. మీరు చాలాజాగ్రత్తగా చదవాలి రామాయణాన్ని, యజ్ఞం కాపాడటం అంటే? విశ్వామిత్రుడు పిలిస్తేవెళ్తాంలేండీ అనిపడుకోవడం కాదు? ఏం అదేమిటండీ రామా అంటే రానా! నాకు తెలియదు కదా మీరుమౌనంలో ఉంటారని, నేనేదో పిలుస్తారు అని అనుకోకూడదు. కనుక్కోవాలి జాగ్రత్తగా మీరు పూజకుసహాయకుడిగా ఉన్నారు అంటే మీరు ఏంచెయ్యాలో మీకుతెలిసి ఉండాలిపూర్తిగానూ. ఆయన మౌనాన్ని నీవురక్షించాలి సుమా! ఇది మునులుచెప్పింది. తప్పకుండా అలాగే సిద్ధంగా ఉంటాను అన్నాడు. చాలా జాగ్రత్తగా కాపుకాస్తున్నారు నిజంగా మీరు ఈసన్నివేషాన్ని గమనించాలండీ! చిన్న పిల్లండీ... అది వాళ్ళపూనిక, అలా తిరుగుతూనే


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
ఉన్నారు వేదిచుట్టూ... వీళ్ళు చక్కగా వీళ్ళపని వీళ్ళుచేసుకుంటున్నారు. వేదమంత్రాలు చెప్పుకుంటున్నారు హవిస్సులిస్తున్నారు, అగ్నిహోత్రం ప్రభలుతోంది, కార్యం అయిపోతోంది, 6వ రోజు వచ్చేస్తోంది, అందరూ సంతోషంగా ఉన్నారు చక్కగా అయిపోతోంది అందరూ అన్నిపన్లుచేస్తున్నారు, ఎప్పుడూ అదే పనిమీద ఉన్నవాళ్ళలెరు చిన్నపిల్లలు ఇద్దరు ఊనషోడశవర్షో మే అన్నాడు దశరథుడు. నీకేం తెలుసు లేవయ్యా అహ వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ అన్నాడు అందుకే విశ్వామిత్రుడు. ఇద్దరూ ధనస్సులు పట్టుకొని అలా తిరుగుతూనే ఉన్నారు ఇలా ఆకాంశంలోకి చూస్తున్నారు, ఇలా పక్కలకి చూస్తున్నారు. నాకు అనిపిస్తుంది రామాయణంలో లేనిది ఏమిటండీ! అసలు ఏవరికైనా పెద్ద పెద్ద వాళ్ళకి భద్రతా సిబ్బందిగా నియమించేటటువంటి వాళ్ళకి రామాయణంలోంచే మీరు శిక్షణ ఇవ్వచ్చు, ఎలా ఉండాలో? అలా ఉంటాయి రామాయణంలో శ్లోకాలు అంత పరాకుగాచూస్తున్నారు.
ఇంతలో సంకేతం ఒకటి బయటికివచ్చింది, తెలియాలి ఎక్కడ ఏది జరుగుతోందో వేయికన్నులతో గమనించగలిగినటువంటి శక్తి ఉండాలి ప్రజజ్వాల తతో వేదిస్సోపాధ్యాయపురోహితా వాళ్ళు హోమంచేస్తూవుంటే... నెయ్యి మామూలుగావేస్తున్నా అగ్నిహోత్రం ఒక్కసారిపైకి గుభిల్లుమనిలేచి కిందకిదిగింది, అంటే ఉపద్రవం వస్తూందీ అనిసంకేతం. యజ్ఞంలో మీరు ఇస్తున్నదిదేవతలకండీ! హవ్యవాహనుడై అగ్నిదేవుడు పట్టుకెళుతున్నాడు అవిస్సుని దేవతలకి, ఆయనకు కూడా యజమానులయందుప్రీతి ఉంటుంది ఆయనకు కూడా రక్షకులయందుప్రీతి ఉంటుంది ధర్మనిష్టయందు ఆయన ఒక సంకేతంచేశాడు వస్తున్నారు రాక్షసులని జాగ్రత్తా! ఒక్కసారి పైకిలేచిదిగింది. రామ చంద్ర మూర్తి మరింత జాగ్రత్తగా ఓ..! యజ్ఞంలో అగ్నిహోత్రంలో అగ్నిపైకిలేచింది అంటే వస్తున్నారన్నమాట చాలా జాగ్రత్తపడ్డారు మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ యే ! అగమ్య భీమసఙ్కాశా రుధిరౌఘమవాసృజన్ !! మారీచుడు సుబాహువు ఆకాశమార్గంలోవచ్చి వెంటనే నెత్తురుతీసుకొచ్చి ఆరక్తాన్ని హోమగుండంలోపోశారు. ఒక్కసారి హోమగుండంలోంచి ధ్వనివస్తూ ఆరక్తంకలిసినటువంటి ఎర్రటిమంటా జాజ్వల్యమానంగా పైకిలేచింది చూశాడు రాముడు
మానవం పరమోదారమస్త్రం పరమభాస్వరమ్ ! చిక్షేప పరమక్రుద్ధో మారీచోరసి రాఘవః !!
స తేన పరమాస్త్రేణ మానవేన సమాహితః ! సంపూర్ణం యోజనశతం క్షిప్తస్సాగరసమ్ప్లమే !!
విచేతనం విఘూర్ణస్తం శీతేషు బలతాడితమ్ ! నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్ !!
రామో లక్ష్మణమబ్రవీత్ లక్ష్మణునితో చెప్తున్నాడు చూశావా... అదిగో వాడుమారీచుడు వాడువచ్చాడు, వీన్నిచంపను లక్ష్మణా మానవాస్త్రంతో కొడుతాను, ఈ మానవాస్త్రం మనిషిని సృహలేకుండా చేస్తుంది, వీడు గిరికీలు కొట్టుకుంటూ వెళిపోతాడు. నూరు యోజనముల సముద్రవతల పడిపోతాడువీడు అంత దూరం పడేటట్టుగా మానవాస్త్రంతో కొడుతానన్నాడు. అంతే ఆ మారీచుడు గిర గిర గిర తిరుగుతూ వెళిపోయాడు సఙ్గృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతమ్ ! సుబాహూరసి చిక్షేప సవిద్ధః ప్రాపతద్భువి !! ఆగ్నేయాస్త్రంతీసి సుబాహుయొక్క గుండెలకేసికొట్టాడు, అంతే సుబాహు వెంటనేగిలగిల తన్నుకుంటూ దూరంగావెళ్ళి అరణ్యంలో పడిమరణించాడు శేషాన్ వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః !


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్ !! మీగిలినటువంటి వాళ్ళందర్నీ వాయవ్యాస్త్రంపెట్టి కొట్టిచంపేసి వాళ్ళందర్నీవిసిరి దూరంగా అవతలపాడేశాడు. ఇప్పుడు రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్ అక్కడ ఉన్నటువంటి మునులందరు కూడా సంతోషిపడిపోయారు ఎందుకంటే విజ్ఞాన్నిపోగొట్టేశాడు యజ్ఞం పూర్తైపోయింది దేవతలందరూ సంతోషించారు. విశ్వామిత్రుడు తన శిష్యులవంక చూసుకొని, తన బిడ్డలవంకచూసి ఎంత సంతోషపడిపోతారో అంతసంతోషపడిపోయాడు. ఓహ్! చాలా సంతోషమయ్యా ఇది సిద్ధాశ్రమమని పేరువున్నందుకు సార్ధక్యత సంపాదించుకొంది నాకు సిద్ధినిచ్చింది. ఇక్కడయాగం పూర్తిచెయ్యగాలిగాను, ఏమిటిసిద్ధి. పుట్టినటువంటి రామ చంద్ర మూర్తికి కావలసినటువంటి అస్త్ర సంపదనంతటినీ ఇచ్చి, రామునిచేత తనయజ్ఞాన్ని రక్షింపచేయించుకొని తాను యజ్ఞప్రయోజనాన్నిపొందడం ఈకోర్కెతీర్చుకున్నాడు విశ్వామిత్రుడు.
అందరూ మీరు సహజంగా ఒకవిషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండీ, మారీచున్ని అంతదూరంకొట్టి, సుబాహుని చంపి, రాక్షసులను చంపి, అస్త్ర ప్రయోగంతో కనురెప్ప వేసితెరిచేలోపుగా ఒకమారు మాంసంపడడానికి వీల్లేకుండాకొట్టేశాడు రాముడు. అసలు లక్ష్మణుడు బాణప్రయోగం చేయడానికి అవకాశం ఇవ్వకుండాకొట్టేశాడు. చిన్నపిల్లాడు ఏంచేస్తారండీ అందరూ ఎవడి పనిమీద వాళ్ళువెళ్ళిపోతారా... ఏంచేస్తారు ఇప్పుడు హోమం అయిపోయింతర్వాత లేచిఎవరి దగ్గరకివస్తారు ఓయ్! చిన్నపిల్లలు ఎంతబాగాచేశారోయ్ అని మిమ్మల్నిచూస్తే ముద్దొస్తోందీ అని, చాలాసంతోషం రా... నాయనా! ఎంత వేగంగా కొట్టావురా వాళ్ళనీ, అలా ఎలా స్పురణకు వచ్చిందయ్యా, అలా ఆ మంత్రాలలెలా జ్ఞాపకమొచ్చాయయ్యా! ఇన్ని అస్త్రాలు ఉంటే ఏంపెట్టికొడదాం, వాడిబలం ఎంతుంటుందీ, అనిచూడడానికి వాడిబలప్రయోగంతో ఏదైనాచేస్తే పాడైపోయేది ఈహోమం. అందుకని వాడు ఏమీచేయడానికి వీల్లేకుండావస్తూంటేనే గురువుగారు చెప్పినటువంటివర్ణననుబట్టి వీడుమారీచుడు అని లెక్కకట్టి లక్ష్మణునితో చెప్పికొట్టేశావు? అబ్బాబ్బా! ఏం పిల్లాడివయ్యా? అని అందరూ పొగిడేస్తున్నారంటా, పొగుడుతారు కదా సహజంగా, పొగడ్తా మనిషి తల ఇలా నిలబడడానికి హేతువు. కదాండీ! అందులో పిల్లల విషయంలో మరింత ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని మీరుపొగిడేశారనుకోండీ... వాడువెంటనే ఏంచేస్తాడంటే నాఅంతమొనగాడు ఇంకెక్కడ ఉన్నాడు అంటారు. కాబట్టి విశ్వామిత్రుడుచూస్తున్నాడు, వీళ్ళందరూ పొగిడారుగా... హోమాన్ని రక్షించాడుగా యజ్ఞాన్ని.  ఏం చేస్తాడో చూద్దాం, ఎలా మాట్లాడుతాడో చూద్దాం, అహంకారమొస్తే దేనివల్ల తెలుస్తుంది, మాటలో తెలిసిపోతుంది.
Image result for రామ కృష్ణ పరమహంసగురువుగారిని రామకృష్ణ పరమహంస ఒకమాట చెప్తుండేవారు, ఓసారి ఆయన గంగానది దాటుతున్నారు పడవలో దాటుతుంటే అవతలి ఒడ్డున ఒకాయ కాలుమీద కాలువేసుకొని ఇలా చూస్తున్నాడు రామకృష్ణ పరమహంసవంక, పక్కన కూర్చుని ఉన్నాయ అన్నాడు పడవలోవున్నాయన, ఆయన ఎప్పుడు చూసినవచ్చి నీకునమస్కారంపెట్టి చాలాగౌరవంగా మాట్లాడేవాడుగా మరి మీరువస్తూంటే కాలుమీద కాలువేసుకొని కూర్చున్నారేమిటీ అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారూ... కాలుమీద కాలువేసుకు కూర్చోవడంకాదు నన్ను ఇప్పుడు పరమహంసా అని పిలువడు మీరుచూస్తూండండి, నేను గంగ ఒడ్డునదిగాకా హలో ఠాకూర్ అంటాడు ఎందుకోతెలుసా? అతనికి ఈమధ్య డబ్బుకలిసొచ్చింది అన్నాడు. ఆయన పడవదిగాడు హలోఠాకూర్! అన్నాడు ఆయన, అంటే మనుషులయొక్కస్థితి అలావుంటుంది ఏదైనా కలిసొస్తే... ఏ మహాపురుషుడి యొక్క అనుగ్రహమో కలిసొచ్చిందని మరిచిపోయి తల ఇలాపైకిలేస్తుంది.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
అందులో పిల్లలకేం తెలుసండి యుక్తా యుక్త విచక్షణా చూస్తున్నాడు విశ్వామిత్రుడు ఓసారి ఆ పిల్లల్ని రమ్మనూ అన్నాడు, ఇప్పుడువచ్చి ఏంగురువుగారూ ఏంటిసంగతి? అది అయిపోయింది ఇంకా నెక్ష్ట్ ఇంకా ఎవరినన్నాకొట్టాలా... అని అడిగాడనుకోండీ! ఓహో... చాలా ఎదిగిపోయావురోయ్? అనుకోవాలి గురువు గారు కదా! వాళ్ళన్నారు ఇద్దరూవచ్చి చేతులు కట్టుకుని నిలబడీ... ఇమౌ స్మ మునిశార్దూల కిఙ్కరౌ సముపస్థితౌ ! ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిమ్ !! అన్నారు. గురువుగారూ ఇమౌ స్మ మునిశార్దూల మునులలో మహోత్తమైనవాడా... కిఙ్కరౌ సముపస్థితౌ మీ దగ్గర నిలబడినవారు ఎవరో తెలుసా...! మీ కింకరులు నిలబడ్డారని గుర్తించండీ, “కింకరులు” అంటే ఆపని నేనుచెయ్యడమా, చెయ్యకపోవడమా అని ఆలోచించకుండా ఈపని చెయ్యడంవల్ల గురువుగారికి సంతోషంకలుగుతుందని, ఆలోచించినంత మాత్రంచేత ఆపనిని చేసేసి దానివలన సంతోషంపొందడమే.
శంకరభగవత్ పాదులకి భంగకరవ్యాధి వచ్చింది, ఆయన ఇలాకూర్చుంటే ఓ పావుగంటా... ఆయన యొక్క పుష్టభాగంలోంచి కారిపోయిన నెత్తుటిచేత ఆయన కట్టుకున్న కాశాయవస్త్రం ముద్దైపోయేది రక్తంతో... వెంటనే ఆయన ఆ వస్త్రంవిడిచిపెట్టి ఇంక స్నానంచేసి ఇంకో వస్త్రం కట్టుకునేవారు, తోటకాచార్యులవారికి పనేమిటంటే, ఈబట్ట పట్టుకెళ్ళడం ఉతకడం ఆరేయడం అంతే, ఇప్పుడూ గురువుగారి నెత్తుటి బట్టలు రోజు తీసుకెళ్ళి జాడించడమేమిటీ, ఆరేయడమేమిటీ, ఎంత శుశ్రూషకైనా అర్థం పర్థం ఉండక్కరలేదా, నేను పట్టుకెళ్ళి ఆబట్టలన్నీ ఆరేయడం ఏమిటీ? అని అనుకున్నారనుకోండీ... శంకరాచార్యులవారు అనుగ్రహించ వలసినపనిలేదు. తోటకాచార్యులువారు సహజంగా ఏం అంత తెలివైనవారేంకాదు. పద్మపాదాచార్యులువారు చాలాతెలివైనాయన. ఒసారి శంకరాచార్యులవారు పాఠం చెప్పేటప్పుడు, తోటకాచార్యులవారు రాలేదని ఆగారు, వాడు ఏమంత బుద్ధిశాలని పాఠం ఆపారు? వాడువింటే మాత్రంవస్తుందా? చెప్పేయండి పాఠం అన్నారు. ఓహో! ఇంత అహంకారమా అనుకున్నాడు ఒక్క సంకల్పం చేశారంతే... ఇక్కడ కూర్చొని శంకరభగవత్ పాదులు అంతే... తోటకాచార్యులవారికి గొప్పశక్తివచ్చేసింది. వస్తూనే విధితాఖిల శాస్త్ర సుధాజలదే మహితోపనిషద్కధితార్థనిదే హ్రిదయే కలయే విమలం చరణం తోటకాష్టకం ఉంది కదాండీ, దాంతోటి భవ శంకరదేశిక మే శరణం ఇవ్వాల్టికీ కూడా... అన్ని పీఠాలలో శంకరభగవత్ పాదులు నమస్కారం చెయ్యాలంటే తోటకాష్టకమే... తోటకాష్టకంతో నమస్కారంచేసి ఒంగి భూమినిముట్టుకుంటుంటాం. నేను ఈ సంవత్సరమైతే ఇక్కడి వచ్చేశాను కానీ, వైశాక శుక్ల పంచమికి శంకరభగవత్ పాదులకు శంకరజయంతి మా కాకినాడ పట్టణంలోచేస్తే, ప్రతిరోజు సాయంకాలం పొద్దున్నా ఈ తోటకాష్టకం తోటే శంకరభగవత్ పాదులముందు భూమిని ముట్టుకుని నమస్కారంచేసి అష్టకం చేసుకుంటాం. కాబట్టీ గురువు వినయానికి లొంగిపోతాడు, కాబట్టి ఎలా మాట్లాడుచున్నాడో చూడండి రాముడు ఇమౌ స్మ మునిశార్దూల కిఙ్కరౌ సముపస్థితౌ ! ఆజ్ఞాపయ యధేష్టం వై శాసనం కరవావ కిమ్ !! ఈపని చెప్పడమా ఈపని చెప్పకపోవడమా... ఎప్పుడూ రానివ్వద్దు. మీ కింకరులం యధేష్టం వై మీఇష్టమొచ్చినట్లు ఆజ్ఞాపించండి శాసనం కరవావ కిమ్ మీరు ఒకటిచెప్పాకా... అది అలాచెయ్యాలంటారా! అనడం ఉండదు ఇంకా... అది మాకుశాసనం. శాసనంచేసేవాడు ప్రభువు తానురాజకుమారుడు, తాను అంటున్నాడు ʻమీది మాకుశాసనంʼ ఇది గురు భక్తి అంటే... 


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
శ్రీరామాయణం మనకు గురుభక్తిని నేర్పుతుందండీ! ఒక గురువుగారి దగ్గరికివెళ్ళడం అంటే... ఒక గురువుగారి దగ్గరనిలబడడం అంటే, ఒక గురువుగారితో మాట్లాడడం అంటే, గురువుశక్తిని తెలుసుకోవడం అంటే రామాయణం మీకు జీర్ణమైతే మీస్థితిమారిపోతుంది అంతగొప్పగా మాట్లాడుతుంది రామాయణం. అందుకే రామ చంద్ర మూర్తి అంటే రాశీభూతమైనటువంటి వినయం. సరే! ఎంతోసంతోషించాడు సంతోషించి అన్నాడు నాయనా! నేను ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞంకోసం ఇక్కడికివచ్చాను తిరిగి నేను హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను, ప్రస్తుతం మిథిలాధి పతియైనటువంటి జనక మహారాజుగారు చేసేటటువంటి యజ్ఞాన్ని చూసేందుకు వెళుతున్నాను, నీవుకూడా నాతోవస్తే బాగుంటుంది మనంవేళ్ళుదామని అన్నాడు.
Image result for vishnu bow and arrow with janakaఇప్పుడూ ఏదో తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెల్లిందనీ, నేను వేళ్ళుతున్నాను జనక మహారాజుగారి యజ్ఞంచూడ్డానికి నువ్వునాతో రా అంటే ఏమైనా బాగుంటుందండీ! అది విశ్వామిత్రుడు మాట్లాడవలసిన మాటకాదు అది. విశ్వామిత్రుడు వచ్చింది ఎందుకూ, రెండు కారణాలకు వచ్చాడు సమస్త అస్త్రసంపద రాముడికివ్వాలి, నామకరణం వశిష్టిడు చేసేశాడు, రాముడికి కళ్యాణం తనుచెయ్యాలి. అందుకే తస్య చింతయమానస్య మన్త్రిమధ్యే మహాత్మనః ! అభ్యగచ్ఛన్మహాతేజా విశ్వామిత్రో మహామునిః !!  అనికదా అన్నారు నిన్న వాల్మీకి మహర్షి, పెళ్ళిగురించి మాట్లాడుతుంటేవచ్చాడు ఆయన, ఎందుకంటే అది నీసబ్జెక్టుకాదు నాది ఇప్పుడు శీతాకళ్యాణం చెయ్యాలి, ఏమోయ్ నీకు పెళ్ళిచేస్తాను రా అంటే రాముడు ఏమంటాడు నిన్ననే చెప్పాడు తాటకమీద బాణంవేయమంటే పితుర్వచన నిర్దేశాత్పితుర్వచన గౌరవాత్ ఏమంటాడు, అది మా నాన్నగారు చూడవలసిన విషయమండీ అంటారు ఇప్పుడు తను ఏమౌతాడు. కాబట్టి నీకు పెళ్ళిచేస్తాను అని పిలవకూడాదు గురువుగారు అది వాళ్ళనాన్నగారు చూడవలసినపని కోడల్ని, కాబట్టీ ఏమనిపిలవాలి క్షత్రియులని ఏమాట ఆకర్షిస్తుందో దానికిపిలవాలి, కాబట్టి ఎంతచిత్రంగా... ఏమి విశ్వామిత్రుడండీ! అసలు విశ్వామిత్రుడి మాటతీరుచూస్తే... రామాయణంలో... మహానుభావా ఏమివాక్ సంపదయ్యా! అని అనిపిస్తుంది. (త్వంచైవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి !) అద్భుతం ధనురత్నం తత్ర తద్రష్టుమర్హసి !! నాయనా రామా! మిథిలా నగరంలో జనక మహారాజుగారియొక్క అంతఃపురంలో శివధనుస్సు ఉంది, ఎంతగొప్ప ధనుస్సో తెలుసా! దాన్నిరోజూ ధూపంవేసి పుష్పాలతో పూజచేస్తారు ఆ ధనుస్సు అంటే సామాన్యమైనది కాదు, దేవతలు ఇచ్చారు ఒక యజ్ఞంలోదాన్ని ఎక్కుపెడదామని చాలామంది ప్రయత్నం చేశారయ్యా, ఎందుకు ఎక్కుపెడదామనుకున్నారో తను చెప్పలేదండోయ్?, ఎందుకో తెలుసా అది ఎక్కుపెడితే సీతమ్మని ఇస్తారట జనకుడు (అన్నారట) అనిచెపితే? అనకూడనిది అని మనకెందుకులేండి ఆ గొడవ నాన్నగారుచూస్తారు అంటాడు. అందుకని అదిచెప్పలేదు విశ్వామిత్రుడు, ధనుస్సు ఎక్కుపెట్టడం చెప్పాడు అంతే... చెప్పకపోతే ఏంతప్పా? మరి సీతమ్మ గురించి చెప్పకపోవడం తప్పుకదండీ? అంటే అప్పుడు ఆయనేమంటారంటే... బ్రహ్మచారికి


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
నాకెందుకు ఆవిషయం? వాళ్ళనాన్నగారు చూసుకోవలసినవిషయం నేను ధనుస్సుగురించే చెప్పానయ్యా అంటాడు. విశ్వామిత్రుడికి మనం చెప్పలేము ఆయన ధర్మాత్ముడు కాబట్టి ఎంతగమ్మత్తుగా అన్నాడంటే... నాస్య దేవా న గన్దర్వా నాసురా న చ రాక్షసాః ! కర్తుమారోపణం శక్తా న కథఞ్చన మానుషాః !! ఎంతగమ్మత్తుగా మాట్లాడాడో చూడండీ! ఆ ధనస్సు ఎక్కుపెడదామని చాలామంది చూశారు రామా! దాన్ని దేవతలుచూశారు గంధర్వులుచూశారు అసురులుచూశారు రాక్షసులుచూశారు ఎవ్వరూ ఎక్కుపెట్టలేక పోయారు న కథఞ్చన మానుషాః ఇంక మనుషులేం ఎక్కుపెడతారులే అన్నాడు.
అంటె రాముడు పౌరుషవంతుడు, క్షత్రియుడు పౌరుషహీనుడైతే ఎలా పనికొస్తుందండీ! అది ఉత్తమగుణం భూప సభాంతరాళముల పుష్కల వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భతృహరి. ఉట్టప్పుడు మౌనంగా ఉండడం, ఏంటండీ ఈయనకు మాటలువచ్చా అన్నట్లుగా ఉంటాడు సభలోకి వెళ్ళిమాట్లాడాడా పుష్కళ వాక్తుర్త్వం అంతేగాని సభలోకివెళ్ళి తడబడకూడదూ, కిందకొచ్చి పుష్కలంగా మాట్లాడకూడదు కాబట్టి ఎక్కడ ఏదుండాలో అక్కడ ఆ సంపదుండాలి. కాబట్టి రాముడుకి ఈ మాటన్న తరువాత ఏమిటీ మనుషులు ఎక్కుపెట్టలేకపోవడం ఏమిటీ? గురువుగారు అలా అనకండీ నేను ఎక్కుపెడతానని అనకూడదు. అలా అని గురువుదగ్గర అధిక్షేపిస్తే... ఎక్కుపెడతావా? అని ఆ సమయమునకు నీకు ఆ బలము జోతకమగుకుండుగాకా! అని అన్నాడనుకోండీ ఏమైపోతాడు, గురువుగారి దగ్గర అది అనక్కరలేదు, గురువుగారి దగ్గర ఆశీర్వచనం అడుగు. తతాస్తూ అంటే ఎక్కుపెట్టాస్తావు అంతే... కాబట్టి రాముడు ఊరుకున్నాడు. రాముడు గురువుగారు అలా అన్నారని ఎదిరించకూడదు కానీ గురువుగారు ఇలా అంటున్నారేమిటి మనుషులెవరు ఎక్కుపెట్టలేరంటున్నారేమిటీ, మనం చూడాలి! అన్న ఉత్సాహం ఆ పిల్లాడికిరావాలి అందుకని ఇలా అన్నాడు. అందుకని రాముడు అన్నాడు గురువుగారు వెళదాంపదా అన్నాడు ఇది కళ్యాణానికి తీసుకు వెళ్ళడానికి విశ్వామిత్ర మహర్షి వేసుకున్నప్రణాళిక.
ఇప్పుడు కలిసిబయలుదేరారు బయలుదేరితేటా... విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోంచి బయలుదేరితే మునులందరూ వెంటవచ్చి వీడ్కోలుపలికారు బాగుంది మృగపక్షిగణాశ్చైవ సిద్ధాశ్రమనివాసినః ! అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిమ్ !! నివర్తయామాస తతః పక్షిసఙ్ఘాన్  మృగానపి ! పక్షులు మృగాలు కూడా ఆయనతోటే వచ్చేస్తున్నాయట, నేను ఇదీ మీతో మనవిచేసింది మహాపురుషులయందు జంతువులు, ప్రకృతీ అన్నీ అనుబంధంపెంచుకుంటాయి. విశ్వామిత్రుడు అన్నాడట, కాదు కాదు. నేనంటే సిద్ధాశ్రమం నుంచి వెడుతున్నాను, వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమన్నాక వెనక్కి వెళ్ళిపోయాయట కలిసి బయలుదేరారు. వెళ్ళిన తరువాత శోణా నదితీరంలో ఆ రోజురాత్రి నిద్రించారు. రాముడు అడిగాడు, అసలు ఈ శోణా నది ఏమిటీ, నగరాలేమిటీ, రాజ్యమేమిటీ, ఇది ఎవరిదీ దీన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? నాకు చెప్పండీ అని అడిగాడు. నాయనా మా వంశమునకుకర్త, బ్రహ్మ మానస పుత్రుడు, అయోనిజుడు, మహానుభావుడు కుషుడూ అనబడేటటువంటి ఆయన ఉన్నాడు, ఆయన భార్యపేరు ʻవైదర్భిʼ. ఆయనకీ నలుగురు కుమారులు కుశాంబుడు, కుశనాధుడు, అధూర్తరజసుడు, వసువు.
Image result for బ్రహ్మదత్తుడు


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
ఒకానొకనాడు కుషుడు వీలందర్నీ పిలిచి నలుగురు కుమారుల్నీ పిలిచి, మీరు ప్రజారక్షణము కొరకు నాలుగు నగరములను నిర్మించుకొని రాజ్యపాలన చెయ్యండని అన్నాడు. కుశాంబుడు-కౌశాంబినీ, కుశనాబుడు-మహోదయమును, అధూర్తరజసుడు-ధర్మారణ్యమును, వసువు-గిరివ్రజమును నిర్మించారు. ఇప్పుడు మనం ఉన్నప్రాంతాన్ని గిరివ్రజము అని పిలుస్తారు రామా! మనం ఈ రాజ్యంలో ఉన్నాం అని చెప్పి ఆయన ఒకమాట అన్నాడు కుశనాభస్తు రాజర్షిః కన్యా శతం అనుత్తమం ! జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘనందన !! కుశనాభ అనేటటువంటి రాజర్షికి ఆయనకి ఘృతాచీ అనేటటువంటి అప్సరస స్త్రీ వలన నూరుగురు కన్నెలు కలిగారు. వాళ్ళు అప్సరస యొక్క పిల్లలు కనుకా దేవతల యొక్క స్థితినిపొందారు అంత అందాన్నిపొందారు. వారు నూరుగురు యవ్వనవతులై ఒకసారి సాయంకాలం ఉద్యానవనంలో రకరకాలైనటువంటి వాద్య పరికరములను మోగించుకుంటూ తిరుగుతున్నారు. బాల కాండలో అత్యంత గొప్పసర్గల్లో ఇదొకటి. పైకికనపడదు కానీ, నిజంగా అసలు సనాతన ధర్మానికి సాంస్కృతి విలువలు పట్టి ఎక్కడుందో ఈ సర్గ చూపిస్తుంది. వీలందరూ అక్కడ నిలబడి ఉంటే, వాయువు వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు.
తాస్సర్వగుణసమ్పన్నా రూపయౌవనసంయుతాః ! దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమ్రవీత్ !!
అహం వః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ ! మానుషన్త్యజ్యతాం భావః దీర్ఘమాయురవాస్స్యథ !!
చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః ! అక్షయ్యం మౌనం ప్రాప్తాః అమర్యశ్చ భవిష్యథ !!
మీరు నరకాంతలుగా ఉన్నారు అప్సరసకు జన్మించినాకూడా, కాబట్టి మీయవ్వనం కొంతకాలానికి తరిగిపోతుంది. నేను వాయుదేవుడను మీరు నూర్గురు నాకుభార్యలుకండి నేను మీయందు అనురక్తుడయ్యాను, మీరు దేవతాత్వాన్నిపొందితే... మీయవ్వనం స్థిరంగావుంటుంది. అందుకని మీరునాకు భార్యలుకండీ అన్నాడు అంటే నూర్గులు కన్నెలు ఒకరితో ఒకరు మాట్లాడకుండా... ఏకకాలంలో నూర్గురుకలిసి ఒక్కటే మాటచెప్పారు. బాగా గుర్తుపెట్టుకోండి! ఒకరితో ఒకరు మాట్లాడుకొనికాదు. ఏకకాలంలో నూర్గురుకలిసి జవాబుచెప్పారు ఏమని మాభూత్స కాలో దుర్మేధః పితరం సత్యవాదినమ్ ! నావమన్యస్వ ధర్మేణ స్వయం పరముపాస్మహే !! పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి స ! యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి !! ఇప్పుడు మాకు, మమ్మల్ని అడిగితే అడిగావు దుర్మేధా! ఈలోకంలో ఏ ఆడపిల్లనీ ఏపురుషుడూ కూడా నేనునిన్ను వివాహమాడతానన్నమాట అడగకూడదు. అడిగినా బుద్ధివున్న ఏ ఆడపిల్లా తండ్రికి తెలియకుండా వేరొకన్ని తనభర్తగా అంగీకరించరాదు ఇది ఈ జాతికి ధర్మం. పితా హి ప్రభురస్మాకం మాకు మాతండ్రి దైవం, మాతండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికిచ్చి వివాహంచెయ్యాలో...? మా జీవితం భద్రంగా ఉండడానికి, ఎవరికి కన్యాదానం చెయ్యాలో, మా తండ్రికి తెలుసు దైవతం పరమం హి స మా కన్నులకు కనబడేదైవం మాతండ్రి యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ఈదేశంలో ఇప్పుడుకాదు ఎప్పటికీకూడా... ఆడపిల్ల తండ్రి మాటకాదని తనకు తానుస్వతంత్రించి భర్తను తానుఎన్ను కునేటటువంటి దుర్దినము రాకుండుగాకా... అన్నవారు వాళ్ళు ఇది ఈజాతి సంస్కృతికి మూలం.
దీనికి అనుగుణంగానే మనం ఏ రచనలుచేసినాచేయాలి తప్పా ఆడపిల్లల్నీ మగపిల్లల్నీ బరితెగించేతట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టి నీకు వందరూపాయల టికెట్టుకోసం లక్షలు లాభంరావడంకోసం మూడుగంటలు మారక ద్రవ్యంలాంటి సినిమాతీసి డైలాగులురాసి జాతిని పాడుచేసేటటువంటి నైతికమైనటువంటి అధికారము నీకులేదు. అది వాడికి లేకపోయినా అడగవలసిన అవసరం పెద్దలకుంది. మేం రామాయణానికి వారసులం మీ ఇష్టమొచ్చినట్లు నీవు రాయడానికి వీళ్ళేదని నిలదీసేటటువంటి రోజువస్తే తప్పా మనబిడ్డలని మనం రక్షించుకొనేస్థితి మనకురాదు మనం ఎందుకు రామాయణానికి వారసులమో, రామాయణం అంటే ఏమిటో మీరుగమనించెదరుగాక!


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి స ! యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి !! ఈ మాట అంటే కోపం వచ్చింది వాయుదేవుడికి ఆయన వాళ్ళయొక్క శరీరములలోకి బాగాప్రవేశించి, వాళ్ళ శరీరాలు వంకర్లుతిరిగి పోయేటట్లుచేశాడు. చేసేస్తే వాళ్ళందరు కూడా కదలలేనిస్థితిలో... వెళ్ళిపోయి అంతఃపురంలో కిందపడిపోయారు. కిందపడిపోయి ఉంటే రాజైనటువంటి కుశనాబుడు తండ్రివచ్చాడు, ఏమమ్మా మీ అందరూ ఇలాకిందపడిపోయారూ అని అడిగారు. వాళ్ళన్నారు నాన్నగారూ వాయుదేవుడు మమ్మల్ని భార్యలుకమ్మని అడిగాడు, మేమందరం కలిసి ముక్తకంటంతో... ఒకమాటచెప్పాం, మేము నీకు భార్యలుకావడమన్నది మానాన్న గారిమీద ఆధారపడి ఉంటుంది. అది ఆయన చెయ్యాలి కన్యాదానం అన్నాం, కోపగించి మమ్మల్ని విరూపల్నిచేశాడు అన్నారు. ఆయన అన్నాడు ఏ మమ్మా మీకు తపశక్తి ఉంది కదా! మరి మీరు ఆయన్ని శపించలేదా... అని అడిగాడు. వాళ్ళన్నారూ... నాన్నగారూ శక్తి ఉంది కదాని కోప మొచ్చినచోటల్లా, తప్పుచేసిన చోటల్లా మనం శాపవాక్కు విడిచిపెడుతూవెళ్తే... ఈ లోకం ఉంటుందా అని అడిగారు వారు కాబట్టి మేము క్షమాగుణంతో ఓర్పుతో మేము వెనక్కువచ్చేశాము నాన్నగారూ అన్నారు ఇదీ రామాయణం అంటే. మీరు కోపగించ వలసినచోట ఓర్పుపట్టడం చాలాగొప్ప విషయం వెంటనే కుశనాబుడు అన్నాడూ
అలఙ్కారో హి నారీణాం క్షమా తు పురుషస్య వా ! దుష్కరం తచ్చ యత్ క్షాన్తం త్రిదశేషు విశేషతః !!
యాదృశీ వః క్షమా పుత్ర్యస్సర్వాసామవిశేషతః ! క్షమా దానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాః !!
క్షమా యశః క్షమా ధర్మః క్షమయా నిష్టితం జగత
అమ్మా! అలఙ్కారో హి నారీణాం ఆడ వాళ్ళకి అలంకారమమ్మా ఓర్పు, ఆడ వాళ్ళకేమీ మగవాళ్ళకు కూడా ఓర్పు ఉండాలి తల్లీ! అసలు ఈ మూడులోకాలు దేనివలన నిలబడుతున్నాయో తెలుసా...? ఓర్పువల్లే, ప్రతివాళ్ళు ఓర్పుదాటేస్తే... ఎవరి ఇష్టము వచ్చినట్లువాళ్ళు కోప్పడిపోతే, లోకంలో ఎక్కడ ఉండదమ్మా ఉండదూ... క్షమా దానం ఓర్పే దానం, క్షమా యక్షం ఓర్పే యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః క్షమయే ఈశ్వరుడు, క్షమా యశః ఓర్పే కీర్తి, క్షమా ధర్మః ఓర్పే ధర్మము, క్షమయా నిష్టితం జగత్ ఓర్పులో ఈ జగత్ అంతా నిలబడి ఉందమ్మా... ఓర్పు లేకపోతే ఈజగత్తులేదు తల్లీ అన్నాడు. ఔను నాన్నగారు అన్నారు. నాకు రామాయణం చదువుతూంటే నాకు ఒకటి అనిపిస్తూంటూంది, నిజానికి ఈ శ్లోకాలన్నీ మనం ఎవరికి చెప్పవలసి ఉంటుందంటే... యువతీ యువకులకీ, చిన్న పిల్లలకీ, చిన్న పిల్లలు శ్రీ రామాయణంలోంచి నేర్చుకోవాలి. కానీ ఇవ్వాళ మనజాతి దౌర్భాగ్యం ఏమిటంటే... శ్రీరామాయణంలో ఉంది రా అని మంచిమాట చెప్పడానికి కూడావీల్లేదు. రామాయణంలోది పిల్లలకు చెప్పకుడదు భాగవతంలోది చెప్పకూడదు భారతంలోది చెప్పకూడదు ఏదీ చెప్పకూడదు ఏది చెప్పచ్చు వాడు ఏదిచూసి పాడైపోతాడో అదిచూపించినా అడిగే వాడువుండడు అది మనస్థితి ఇవ్వాళ.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
కాబట్టి ఈ మాటలన్నాడు అన్న తరువాత కొంతకాలమైంది, ఇప్పుడు  ఈపిల్లకి ఇంక కన్యాదానం చెయ్యాలిగదా... ఆయన ఒకవరున్ని నిర్ణయించాడు తండ్రి. ఇది తండ్రి నిర్ణయించడమంటే... తండ్రి యోగ్యతాయెగ్యతలను నిర్ణయించడమంటే ఎలావుంటుందో చూడండి! తస్యాః ప్రసన్నో బహ్మర్షిర్దదౌ పుత్రమనుత్తమమ్ ! బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినస్సుతమ్ !! పూర్వకాలంలో మహానుభావుడైనటువంటివాడు “చూలి” అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవారు ఆయన నిరంతరతపస్సులో ఉండేవారు. ఒక గంధర్వకాంత ఆమెపేరు సోమద ఆమె ప్రతిరోజూ పరిచర్యచేసేది, ఆవిడ ఎందుకుచేస్తుందో ఆయన అడగలేదు. ఆమె చాలాకాలం పరిచర్యచేసింది, ఆయన తపస్సుచేసుకొన్నారు ఆయన ఒకనాడు అడిగారు నీవునాకు ఇంత సేవచేస్తున్నావు, నీకు వివాహంకాలేదు నీవు హాయిగా సంతోషంగా భర్తనిస్వీకరించి ఉండవచ్చు, నీవు ఎందుకు నాకు సేవచేస్తున్నావమ్మా అని అడిగాడు, అంటే ఆమె అన్నది, నీవలన నాకు బ్రహ్మవేత్త అయినటువంటి కుమారుడు కలగాలని అడిగింది ఆయన అన్నాడు తప్పకుండా. నీవు చేసినసేవకు నీకు అనుగ్రహిస్తాను అని “మనసా” బాగా జ్ఞాపంకం పెట్టుకోండి! ఇతరమైనటువంటి మైధునప్రక్రియ చేతకాదు. ʻమనసాʼ సంకల్ప శక్తిచేత ఆమెకు ఒక కుమారున్నికటాక్షించాడు ఆ పిల్లవానిపేరు బ్రహ్మదత్తుడు. ఆమె మహర్షినిసేవించి పొందిందిగనుకా... మహాత్ముడైనటువంటి కుమారుడు జన్మించాడు. ఆయన బ్రహ్మదత్తు గొప్పబ్రహ్మవేత్త, ఆయన్ని తీసుకొచ్చి నూర్గుర్ని కన్యాదానం చేశాడు. నూర్గురిని కన్యాదానంచేస్తే పాణిగ్రహనంచేయాలి ఆయన ఒక్కొక్కరి చెయ్యిపట్టుకున్నాడు. బ్రహ్మవేత్త అయినటువంటివాడు వాళ్ళచెయ్యిపట్టుకున్నప్పుడు లోపలవాళ్ళకి వంకర్లుకల్పించినటువంటివన్ని నిలబడలేక సరిగ్గాప్రసరించాయి వాళ్ళునూర్గురు సౌందర్యరాసులయ్యారు అత్తగారైనటువంటి సోమధ పరమసంతోషంతో కౌగలించుకొని కోడల్లను తీసుకొని ఇంటికివెళ్ళింది ఇదికథ.
అంటే పుత్రుని గొప్పతనానికి తల్లి ఎక్కడశ్లాగించాలో చూపించింది రామాయణం, ఇంటికి వచ్చినటువంటి కోడల్లకి వంకర్లులేకపోయినా వంకర్లుచూడ్డంకాదు, ఇంటికొచ్చిన కోడలికి ఎక్కడైనా చిన్నలోటుంటే దాన్నికొడుకుచేత కప్పబడేటట్టుచేసి, ఆమె పూజనీయురాలైయ్యట్టుచేసే సమర్థతతో కొడుకుకి అటువంటిబోధచేసి ఉద్దరించగలిగిన అత్తగారు ఈజాతికి అవసరం. అటువంటి అత్తగారు ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి అత్తాకోడలూ కూతురూ తండ్రీ కన్యాదానం, వరించడం, ప్రేమవిహారం, వైరివిహారం అన్నీ రెండుసర్గల్లో తీసుకొచ్చిచెప్పేశాడు మహర్షి కుశనాభోపాఖ్యానంలో. ఎవరికి చెప్తున్నారండీ ఇవన్నీ రాముడికి, నేను అందుకేచెప్పాను మీకు రామున్ని విశ్వామిత్రుడు ʻస్నాతకంʼ చేశాడని. వింటున్నాడు అలాగా ఊ... ఊ అని ఎలా మాట్లాడలో, ఆడపిల్లని ఏది అడగాలో... ఏది అడగకూడదో, ఆడపిల్ల అంటే ఎంతగొప్పదో, ఎలా స్వీకరించాలో, ఎలా నిలబెట్టుకోవాలో, తాను ఎలా భార్యమనుసు చూరగొనాలో, కళ్యాణం చేసుకోబోయేటటువంటి రాముడు, పెళ్ళికొడుకుగా గృహస్తాశ్రమం గురించి బాగానేర్చుకొనేటట్టు అతనితోనే ప్రశ్నవేయించి చెప్పకుండా చెప్తున్నాడు విశ్వామిత్రుడు. నీవు పెళ్ళిచేసుకుంటే ఇలా ఉండాలనిచెప్పట్లేదు అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు ఇదేమిటని అంటున్నాడు అక్కడో కథచెప్తున్నాడు ఇప్పుడు ఆకథ నాటుకోంటుంది. ఓ... ఇలావుండాలన్నమాట అని నేర్పుతున్నాడు ఇది ఎదర రామున్ని ఏకపత్నీవ్రతున్ని చేసింది ఇదీ రామున్ని అంతటి ఉదాత్తమున్నిచేసింది. ఒక గురువు ఒక శిష్యుని ఎలాతయారుచేయగలడో చూపిస్తుంటాడు విశ్వామిత్రుడు లోకానికి. అప్పుడూ ఎంతో సంతోషంగా ఈ వ్యవహారం నడిచిపోయింతరువాత ఆయన చెప్తున్నాడు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
Related imageమావంశానికి అంతటికికూడా కర్తా కుశుడు. ఆ కుశుడు, ఆ కుశుని యొక్క కుమారుడైనటువంటివాడు కుశనాభుడు ఒకానొకప్పుడు తన నూర్గురు కుమార్తెలకీ కూడా వివాహంచేసి పంపించేసిన తరువాత కొడుకుకోసమని పుత్రకామేష్టి యాగంచేశాడు. ఆ పుత్రకామేష్టి చేసేసమయంలో... మాతాతగారు అంటే కుశనాభునియొక్క తండ్రి, ఆయనవచ్చి ఒకమాటచెప్పాడు నాయనా! నీకు యోగ్యమైనటువంటి కొడుకు, నీవు కోరుకుంటున్నటువంటి లక్షణాలుగల కొడుకు ఈపుత్ర కామేష్టివల్ల కలుగుతాడు అని వరమిచ్చీ (ఏవముక్త్వా కుశో రామ! కుశనాభం మహీపతిమ్ !) జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనామ్ !!  ఆయన బ్రహ్మలోకాలకి వెళ్ళిపోయాడు కస్య చిత్త్వథ కాలస్య కుశనాభస్య ధీమతః ! జజ్ఞే పరమధర్మిష్టో గాధిరిత్యేవ నామతః !! పుత్రకామేష్టి చేయ్యడంవల్ల మాతాతగారైనటువంటి కుశనాభుడికి ʻగాధిʼ అనబడేడటువంటి కుమారుడు జన్మించాడు. ఆగాధి మాతండ్రి ఆగాధికి నేనుజన్మించాను. కాబట్టి మాతండ్రిగారు ఆయన స పితా మమ కాకుత్స్థ! గాధిః పరమధార్మికః ! కుశవంశప్రసూతోస్మి కౌశికో రఘనన్దన !! ఆ కుశునియొక్క వంశంలో నేనుపుట్టాను కాబట్టి నన్ను ʻకౌశికుడుʼ అని పిలుస్తుంటారు.
పుర్వజా భగినీ చాపి మమ రాఘవ! సువ్రతా ! నామ్నా సత్యవతీ నామ ఋచీకే ప్రతిపాదితా !!
సశరీరా గతా స్వర్గం భర్తారమనువర్తినీ ! కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానదీ !!
దివ్వా పుణ్యోదకా రమ్యా హిమవన్తముపాశ్రితా ! లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ !!
తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరతస్సుఖమ్ ! భగిన్యాం స్నేహసంయుక్తః కౌశిక్యాం రఘునన్దన !!
సా తు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్టితా ! పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాం వరా !!
నాయనా రామ చంద్రా! నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నాకు ఒక అక్కగారు ఉంది, ఆమె పేరుసత్యవతి. మా అక్కయ్యని మాబావ ఋచీకునికిచ్చి వివాహంచేశాడు మా నాన్నగారు. కొంతకాలం అయిపోయింతర్వాతా మాఅక్క భర్తగారు స్వర్గలోకానికి బయలుదేరాడు. మా అక్క ఎంతగొప్పదంటే... స శరీరంగా మాబావను అనుగమించి స్వర్గలోకానికివెళ్ళింది. వెళ్ళి తాను నదీస్వరూపంలో ఉండి లోకాన్నివుద్ధరించాలి అని ఆమెకూడా కుశునియొక్క వంశంలోపుట్టినది కనుకా కౌశికీ అన్న పేరుతో హిమాలయంలో పర్వత ప్రాంతంలో ప్రవహిస్తూంటూంది. ఆమె గొప్ప ధర్మాత్మురాలు, నాకు మా అక్క అంటే ఎంతో ఇష్టం. అందుకని మా అక్క నదీరూపంలో ఉంది కాబట్టి నేనుకూడా హిమాలయపర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటాను. ఇక్కడ సిద్ధాశ్రమంలో సిద్ధికోసం యజ్ఞం చేయడానికివచ్చాను రామా! నీ యొక్క శక్తి వలన ఆయజ్ఞం పూర్తి అయినది. ఇప్పుడు మనం మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం అనిచెప్పారట. అని చెప్తే రాత్రి బాగాచీకటి పడిపోయిందట, ఇప్పటికే నేను ఈ విషయలన్నీ చెప్పటంతో, చూశావా గుడ్లగూబలు అరుస్తున్నాయి, చూశావా ఆ రాత్రిపూట ఎగురేటటువంటి పక్షులు ఎగురుతున్నాయి, నరమాంస భక్షకులైన రాక్షసులు తిరుగుతున్నారు. చంద్రోదయం అయిపోయింది రామా! ఇంక నిద్రపో అన్నాడు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
Image result for విశ్వామిత్రుడుఅంత చీకటిపడిపోయిందని తెలియలేదు ఆయనకి చెప్తూంటే తన వంశంగురించి, అంత గొప్పగాచెప్పాడు. ఇప్పుడు రాముడు పడుకున్నాడట. మునులు అన్నారటా! కౌశికులు ఎందులో పుట్టారు, కానీ విశ్వామిత్రా నీవు పుట్టిన ఈవంశం ధన్యమైందయ్యా!, ఏమి అక్కా, ఏమి మహానుభావులూ, ఏమి కుశనాభుడూ, ఏమి ధర్మం లోకానికి ధర్మంనేర్పింది మీరయా మీకుటుంబం అన్నారట. రాముడు పడుకున్నాడు కానీ ఆ ఆడ పిల్లలూ, వాయువు అడగడం. కాదనడం, బ్రహ్మర్షిత్వం, విశ్వామిత్రుడు పుట్టటం, ఆ కౌశికీ ఆ భర్తని అనుగమించడం, స్వర్గలోకానికి వెళ్ళడం, ఆ నదీ స్వరూపాన్ని పొందడం, ఏమి ఆడవాళ్ళూ, ఏమి ఔన్యత్యం, ఎటువంటి ధార్మికనిష్టా లోపల ఇవన్నీ ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఎప్పుడో రాముడికి కనురెప్ప పడిందట. అంటే అంత మనుసులో నాటుకునేటట్లు చెప్తాడు.
ఇప్పుడు బయలుదేరి గంగానదిని దాటుతున్నారు, దాటుతుంటే ఏమి ఈనదీ అని అడిగాడు, అడిగితే ఆ గంగానది ఆవిర్భావం గురించి చెప్తూ, అత్యద్భుతమైన ఘట్టాన్ని ఒకదాన్ని ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి రామ చంద్ర మూర్తితో చెప్తున్నాడు. ఇది శ్రీరామాయణంలోని అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి శణ్ముకోత్పత్తి అంటారు. ఇది ఎంత అద్భుతమైనదంటే... గర్భినీ స్త్రీలుకాని ఈ సర్గని పారాయణంచేస్తే... తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంతానం ఉత్తమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా వారికిప్రసవం అవుతుంది అంత శక్తి ఇందులోనే ఉంది. ఇందులోనే వాల్మీకి మహర్షి “కుమార సంభవం” అనే మాటవాడారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే... వాల్మీకి  మహర్షి అసలు ఎప్పుడూ ఫలసృతిచెప్పరు ఈ సర్గచదివితే ఈ ఫలం వస్తుందనిచెప్పరు అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి, శణ్ముకోత్పత్తికీ ఫలసృతి చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో శణ్ముకోత్పత్తి ఒకటి ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నేపొందుతారు అని అంటారు అంత శక్తివంతమైనది ఇందులో ʻకుమారసంభవంʼ అన్నమాట వాల్మీకి మహర్షివాడారు దీన్నే కాళిదాసుగారు తీసుకొన్నారు తీసుకొని “కుమారసంభవం” అన్న గ్రంథాన్ని ఆ పేరుతోనే రచనచేశారు కానీ ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు పారాయణచేస్తే... ఈ శణ్ముకోత్పత్తినే వింటూ ఉంటారు.
Image result for tarakasuraకాబట్టి మీరు ఇప్పుడు అవధరించండీ! పురా రామ! కృతోద్వాహో నీలకణ్ఠో మహాతపాః ! దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే !! అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి నాయనా రామా! నీకు అంగదేశం గురించి చెప్పాను మన్మథుడు కాలిపోయాడు తరువాత పార్వతీ పరమేశ్వరులకి వివాహం అయింది ఎలా...? ఎలా అయింది మరి మన్మథుడు లేకుండా...! ప్రారంభమే ఒక గొప్ప విషయం. అందరి మీద బాణాలువేయాలంటే చేతిలో చెరుకువిల్లు, ఐదు పుష్పబాణాలూ పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మథుడు నేడు బాణాలువేసి అందరిలోనూ కామప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో... అదే పుష్పబాణాల్ని తీసుకెళ్ళి పరమశివుడి మీదకూడావేసి ఆయన మనసు కదిపి పార్వతీ దేవియందు అనురక్తుడు అయ్యేటట్లు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో, ఒక్క బాణాన్నితీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే, బహిర్ముకుడైనటువంటి పరమశివుడు కన్నుతెరచిచూసి తనమీదే బాణప్రయోగానికి సిద్ధపడుతున్నాడన్న మన్మథుడి మీద ఆగ్రహంచెంది మూడవ కన్నుతెరిస్తే, భస్మరాసియై మన్మథుడు క్రిందపడిపోయాడు. కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండాలి కదా! ఇప్పుడు మన్మథుడు లేడుగా, మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది. అంటే అమ్మవారు ఏంచేసింది అంటే... ఏ ఆయుధములను మన్మథుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది. ఐదు పుష్పబాణాలను చెరుకువిల్లును ఆవిడే పుచ్చుకుంది. “కామాక్షి” కంచి కామాక్షి అదే కదాండీ! చేత్తోపట్టుకుంది ఇదే... మనం లలితా స్వరూపం యొక్క వర్ణనచెప్తే ఇదేచెప్తాం రాగస్వరూపాపాశాఢ్యా ! క్రోధాకారాంకుశోజ్జ్వలా! మనోరూపేక్షుకోదండా! పంచతన్మాత్రసాయకా! ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే... ఇంతటి పరమ శివుడు వశుడైపోయాడు అయిపోయి తాళికట్టాడు సంసారంలోకివచ్చి ఆవిడ పక్కనకూర్చున్నాడు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
Image result for tarakasuraశంకరాచార్యులవారు దెప్పిపొడిచారు స్పరద్గణ్డాభోగప్రతిఫలితతాటంకయుగలం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ . యమారుహ్య ద్రుహ్యత్యవనిరథమ్ అర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్ఙితవతే... అన్నారు. అయ్యా! నీవు ఎంత గొప్పవాడివైనా మాతల్లి చెరుకువిల్లు, పుష్పబాణాలూ పట్టుకునేటప్పటికి లొంగవలసిందే... తాలి కట్టావా లేదా అమ్మమెడలో... తాళికట్టి అయ్యగావచ్చి అమ్మపక్కన కూర్చున్నావు. ఇప్పుడు ఆమె “శివకామ సుందరీ” ఆమె అంత సౌందర్యంతో ఎవరికి కోసంకూర్చుంది మనకు తండ్రినితెచ్చి కూర్చోబెట్టడానికి, ఆమె శివునికి సౌందర్యం, బాహ్య సౌందర్యంకాదు శివకామ సుందరీ. మరిమీకు నాకో అఖిలాండేశ్వరీ, జగజ్జననీ, మీనాక్షి, కామాక్షి, రాజ రాజేశ్వరీ, లలితాదేవి మనకి అమ్మ. మా నాన్న గారికి భార్య మానాన్నగారు మా అమ్మని కామదృష్టితో చూడచ్చు అది ఆయనకి ధర్మబద్ధం, నేను మా అమ్మగారిని పవిత్రదృష్టితో చూస్తాను. మా అమ్మగారు మా నాన్నగారికి శివకామ సుందరి, నాకు జగజ్జననీ, లలితా పరాభట్టారికా... వాగార్దావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమ శివుడి కొరకు. అమ్మ యొక్క అంతః సౌందర్యం అమ్మ తనం మనకొరకు. మనకు జగదాంబ, జగత్ జననీ ఆయనకీ భార్య. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్ళిచేసుకుంది మన్మథుడి గొప్పతనంతో పెళ్ళిచేసుకోలేదు మన్మథునికేమి చేసింది. శివున్ని తెచ్చి తనభర్తగా కూర్చోపెట్టుకొని పిచ్చాడా! ఇంకెప్పుడూ ఆయన మీద వేయకు బాణాలు, ఇగో మిగిలినవాళ్ళ మీదంటావా వేయ్, అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలోపెట్టింది.
ఇప్పుడు ఆయనేం చేశాడు శరీరం లేదు కానీ మునులను కూడా మోహపెడుతున్నాడు ఎందుకు పెడుతున్నాడు ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయూ పంచ విశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః ! రథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే... అంటారు శంకరభగవత్ పాదులు సౌందర్యలహరిలో. అమ్మ తన కడగంటిచూపుతో ఇలాచూసి వేయ్ బాణాలు ఫర్వాలేదూ లోకం మీదవేయ్ అంది అంటే అదేంటండీ, అలా పాడుచేసేయడం ఏమిటండీ అని అనుకోకండీ! అమ్మవారు ఆ శక్తి మన్మథునికి ఎందుకు ఇచ్చింది అంటే, మనం పితృఋణం తీర్చుకోవడానికి, తండ్రి ఋణం తీరాలంటే మనం సంతానాన్నికనాలి అందుకిచ్చింది అంతేకాని, అమ్మవారు


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
మన్మథునికి బాణాలు ఇచ్చిందండీ నేను పాడైపోయాను అని చెప్పడానికి నీకు వీలులేదు. నీకు ధర్మపత్నిని ధర్మేచ అర్థేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి అని పుచ్చుకున్నావ్! ఎందుకు మరి తగలపడ్డానికా ఆ మంత్రం ఎందుకు ఇంకా? ఎందుకా ప్రతిజ్ఞ ఇంకా? విచ్చల విడితనంతో ఆంబోతు తిరిగినట్లు తిరుగవద్దు అని గదాదాన్ని సృష్టించింది అమ్మవారు మన్మథ బాణము దేనికొరకు అంటే కేవలము నీ యొక్క పితృఋణం తీర్చుకోవడానికి అంతే...
Image result for పార్వతీ పరమేశ్వరులుకాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో విహరిస్తున్నారు పురా రామ! కృతోద్వాహో నీలకణ్ఠో మహాతపాః ! దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే !! వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలు పెట్టీ నూరు దివ్య సంవత్సరాలు పూర్తైపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదూ వాళ్ళకి బిడ్డా పుట్టలేదు. దేవతలందరూ కలుసుకున్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపడటం లేదంటే, కొత్తగా పెళ్ళైంది కదా నూరు దివ్య సంవత్సరములు నుంచి విహారం చేస్తున్నారు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి, ఓరేయ్! అసలు పార్వతీదేవియే శక్తిస్వరూపిణి, పరమశివుడు తెజపుంజం మహానుభావుడు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోణితములు కలిస్తే, తేజస్సులు కలిస్తే... ఈ లోకంలోకి ఒక క్రొత్త ప్రాణివస్తే, అసలు అటువంటి భూతమును, అంటే అటువంటి ప్రాణిని మనంచూడ్డం కుదురుతుందా...? అది ఎంత తేజోవంతంగా ఉంటుంది ఎవరు వహిస్తారు ఆ భూతాన్ని ఎవరు చూడగలరు ఆ ప్రాణిని కాబట్టి మనం పరమశివునివెళ్ళి అడుగుదాం మీరు రతీక్రీడ విరమించి బిడ్డల్నికనద్దూ అని అడుగుదాం.
అయితే మీరు నన్ను ఓ మాట అడగచ్చు ఏమండీ! బుద్ధుందా ఈ మాటకి, అసలు వాళ్ళు అన్నారనుకోండీ మీరు ఎలా చెప్పారని అడుగుతారు? అసలు దేవతలకి ఎందుకండీ ఈ వ్యవహారం? అలావాళ్ళు ఎందుకనాలీ? అంటే మాత్రం మేము ఎలా అంగీకరించగలం ఈవిషయాన్ని? మీరు ఖంగారు పడిపోకుండా ఉండండీ...! నేను తరువాత చెప్తాను ఎందుకు వస్తుందో...? కాబట్టి ఇప్పుడు వాళ్ళందరు కలిసి ఓ సమావేశం పెట్టకున్నారు. నిజమే అంటే, నిజమే...! అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు బయటనిల్చొని పెద్దకేకవేశారు (అభిగమ్య సురాస్సర్వే ప్రణిపత్యేదమబ్రువన్ !) దేవ దేవ మహాదేవ లోకస్యాస్య హితే రత !! ఓ దేవ దేవ మహాదేవ లోకములను రక్షించవలసినవాడా, అని కేకవేశారు. వీళ్ళకి ఏం ఉపద్రవం వచ్చిందోనని ఆయన బయటికివచ్చాడు. ఆయన్ని చూడగానే వీళ్ళందరు నేలమీద పడినమస్కారంచేశారు చని కైలాసము జొచ్చి శంకరు నివాసద్వారముం జేరి యీసుని దౌవారికు లడ్డుపెట్ట దల మంచుం జొచ్చి కుయ్యో మొఱ్ఱో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం చంబుజా సన ముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంభంభూనిన్ శంభునిన్ అంటారు పోతన గారు. అలా వీళ్ళందరూ ప్రణిపాతంచేశారు నేల మీదపడి సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి ! న లోకా ధారయిష్యన్తి తవ తేజస్సురోత్తమ !! అన్నారు మహానుభావా! నీవు పార్వతీ దేవితోకలిసి ఏకాంతంలో దివ్యక్రీడని అనుభవిస్తున్నావు, మీ ఇద్దరికీ బిడ్డపుడితే... ధుస్సాహం మేంతట్టుకోలేం అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసేయ్, ఆమెను ఆమె తేజస్సును ఆమె తేజస్సులోకి అణిచి వేయమను.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
మీరిద్దరూ ఒకరిపట్ల ఒకరు ఇటువంటి అభిముఖ్యంపొందకుండా... తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర ! త్రైలోక్యహితకామార్థం తేజస్తేజసి ధారయ !! తేజస్సును తేజస్సులో అణిచేసి ఇద్దరూ తపస్సుచేసుకోండి అన్నారు ఎంత అక్కరలేని విషయమండీ ఇది అంటే ఆయన అన్నాడూ, తండ్రి తనమండీ... తప్పకుండా మీకు అలాంటి ఇబ్బంది ఉంటుందంటే... నేను ఇటువంటి భూతమును సృష్టించను అలాగే వెళ్ళిపోతాను. కానీ, నేను ఇప్పటి వరకు పార్వతీదేవితో నూరు సంవత్సరములు నుంచి పార్వతీ దేవితో క్రీడించాను, ఆ కారణంచేత దేవతానాం వచశ్శ్రుత్వా సర్వలోకమహేశ్వరః ! బాఢమిత్యబ్రవీత్సర్వాన్పునశ్చైవమువాచ హ !! మీరు చెప్పినట్టేచేస్తాను, నా తేజస్సుని నాతేజస్సులోకి అణచి వేస్తాను కానీ యదిదం క్షుభితం స్థానాన్మమ తేజో హ్యనుత్తమమ్ ! ధారయిష్యతి కస్తన్మే బ్రువన్తు సురసత్తమాః !! ఇప్పటికే చాలాకాలంగా పార్వతీదేవి నేను క్రీడించివున్న కారణంచేత నా రేతస్థానం నుంచి తేజస్సు కదిలిపోయింది, ఇప్పుడు కదిలిపోయిన రేతస్సుపడిపోతుంది. నేను పార్వతీదేవియందు వదిలిపెట్టద్దు అని మీరు అంటున్నారు. మరి నేను నాతేజస్సుని ఎక్కడ విడిచిపెట్టను ఎవరు భరిస్తారుచెప్పండి అని అడిగాడు. భరించడం అని అనగానే వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారో తెలుసాండీ! భూమి గుర్తొచ్చింది, అన్నీ ఆవిడేగా భరిస్తుంది పాపం ఆవిడే భరించాలి.
Image result for పార్వతి భూదేవిఅందుకని వాళ్ళందరూకలిసి ముక్తకంఠంతో భూమిని చూపించారు, చూపించి ఏవముక్తాస్సురాస్సర్వే ప్రత్యూచుర్వృషభధ్వజమ్ ! యత్తేజః క్షుభితం హ్యేతత్తద్ధరా ధారయిష్యతి !! ఈ భూమి భరిస్తుందీ దీనిమీద వదిలేసేయ్యండి అన్నారు. భూమి ఏమనాలి? అదేమిటయ్యా? ఆయన భార్యయందు ప్రవేశపెట్టవలసినటువంటి శివతేజస్సు నామీద ఎలా విడిచిపెడతాడు? నేనెలా స్వీకరిస్తాను భూకాంత ఆమె స్త్రీ భూదేవి, నాలోకి ఎలా ప్రవేశిస్తుంది శివ వీర్యం. దోషం అవుతుందికదా నేను పుచ్చుకోను అనాలి కానీ ఆవిడ సంతోషించింది. శివ వీర్యం నాలోప్రవేశించడం అంటే అదృష్టంకదా అనుకొని, తప్పకుండా పుచ్చుకుంటాను అంది. అనేటప్పటికి పరమశివుడు ఏం చేశాడంటే... ఏవముక్తస్సురపతిః ప్రముమోచ మహీతలే ! తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికాననా !! ఆయన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టేశాడు అది ఉత్తరక్షణం భూమి అంతటా పాకేశింది. పాకేసి పర్వతాల్లో, నదుల్లో, సముద్రాల్లో, చెట్లలో పరివ్యాప్తమై ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక పెద్ద పేద్ద కేకలువేసింది ఆవిడా... తతో దేవాః పునరిదమూచుశ్చాథ హుతాశనమ్ ! ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః !! నా ఒళ్ళు మండిపోతూందీ... దగ్ధమైపోతూంది నాశరీరమంతా... శివ వీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను. దాని శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను నాలోకి వచ్చిన వీర్యాన్ని దేనిలోకి విడిచిపెట్టను అని అడిగింది ఆవిడ. ఇప్పుడు దేవతలు అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని అన్నారూ... ఒళ్ళు మండిపోతోంది అన్నావు కాబట్టి ఎవడి మండిస్తాడో వానిలోకి వదిలిపెట్టేయమన్నారు. అంటే అగ్నిహోత్రునిలోకి వదిలిపెట్టేయమన్నారు అంటె అవిడ ఇప్పుడేం చేసింది తనలో పడినటువంటి శివ వీర్యాన్ని అగ్నిహోత్రుడిలోకి వదిలిపెట్టేసింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయిందీ... పెద్ద పెద్ద అరుపులు, కేకలూ, ప్రార్థనలు హడావిడీ బయటికివెళ్ళిన శివుడు లోపలికి రాలేదు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
అమ్మవారికి అనుమానంవచ్చింది ఏంజరిగిందీ అని బయటికివచ్చి ఏం జరిగింది అని అడిగింది మేమందరం ఇలా ప్రార్థనచేశామమ్మా...  మీ ఆయన తేజస్సు భూమిలోకి వదిలి పెట్టాడూ, భూమి తట్టుకోలేక అగ్నిలోకి


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
విడిచిపెట్టిందీ అన్నాడు. మీ ఇద్దరికి సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని అడిగామమ్మా అదే కోరిక కోరామమ్మా అనిచెప్పారు. ఆవిడ అందీ ఏ ఆడదైనా అమ్మకావద్దు అంటే ఒప్పుకుంటుందాండీ..! అథ శైలసుతా రామ! త్రిదశానిదమబ్రవీత్ ! సమన్యురశపత్సర్వాన్ క్రోధసంరక్తలోచనా !! ఎర్రబడిన కళ్ళతో అమ్మవారు అందీ... అక్కరలేని విషయంలో జోక్యంచేసుకున్నారు. మీరు చెప్పకూడనిమాట చెప్పారు. నన్ను తల్లినికావద్దూ అని శాశించారు. నాకు బిడ్డలు పుట్టకూడదూ అని వరమడిగారు, నాయందు ప్రవేశపెట్టవలసిన శివ వీర్యాన్ని భూ కాంతయందు ప్రవేశపెట్టారు కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను యస్నాన్నివారితా చైవ సఙ్గతిః పుత్రకామ్యయా ! అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథ !! అద్యప్రభృతి యుష్మాకమప్రజాస్సస్తు పత్నయుః ! ఏవముక్త్వాసురాన్ శసాప పృథివీమపి !! “ఇక నుంచి మీభార్యల వలన మీకు సంతానం కలగకుండుగాక, ఇక నుంచి దేవతలకు సంతానం ఉండదు.” అంది. కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ 33 కోట్లే. ఎందుకంటే ఇంక వాళ్ళకి సంతానం ఉండదు.
అందుకే బ్రహ్మగారు మొన్నటి రోజున దేవలల్నిపిలిచి మీ అంశలతో ఉండవలసిన వానరుల్ని అస్పరసలయందు, వానర కాంతలయందు, గంధర్వ, కిన్నర, యక్షిణి కాంతల యందు సృజించండి అని మీ భార్యలవలన మీకు పిల్లలు పుట్టరు పార్వతిదేవి శాపం ఉంది కనుక. అందుకనీ ఎప్పుడూ 33 కోట్లేనా ఇంక పిల్లలూ మనమలూ ఉండరా అంటే... ఉండరు. ఎందుకంటే పార్వతీదేవి శాపంతో  ఆగిపోయింది దేవతల యొక్క సంతానం. ఇప్పుడు ఆవిడ భూమివంక తిరిగింది. నీవు స్త్రీ కదా, నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది నువ్వు ఎలా పట్టుకున్నావు? నీవు ఎలా స్వీకరించావు నా భర్త యొక్క తేజస్సుని అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి ఆవిడని శపించింది. నువ్వు ఒక్క రూపంతో ఉండవు? భూమి అని పిలవబడినా... నీకు అనేక మైనటువంటి స్థితి కలుగుతుంది. ఒక చోట చౌటు నేల, ఒక చోట నల్ల నేల, ఒక చోట ఎడారి, ఒక చోట పంటపండే నేల ఇలా నీవు రకరకాలుగా అయిపోతావు అంతే కాదు భహుభార్యా భవిష్యసి ఒక్క భర్త ఉండడు నీ భర్త కానివాడి వీర్యం నీవు పుచ్చుకున్నావుగా...? నీకు ఇంక ఎంత మంది భర్తలో లెక్క ఉండరు? అందుకే రాజ్యాన్ని పాలించిన వాళ్ళందరూ భూమిపతులే ఎంత మంది ఆవిడకు భర్తలు లెక్కలేదు. కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి ! న చ పుత్రకృతాం ప్రీతిం మత్త్రోధకలుపీకృతా !! ఏ ఆడదైనా కోరుకొనేది ఏమిటంటే...? భర్తవలన కొడుకుని కనాలి ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి తల్లి సంతోషించేటట్లు ప్రవర్తించాలని కోరుకుంటాడు.
ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటీ సహించదో అది నీ యందు నిజమగు గాక! ఏ తల్లైనా ఏది సహించలేదు, ఎంత తప్పైనా సహిస్తుంది, కానీ అమ్మవంక ఆడదానిని చూసినట్లు చూశాడనుకోండి కొడుకు, అమ్మ మాత్రం ఒక్కనాటికి క్షమించదు. అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు. ఇంక ఇంతకన్నా... పవిత్రంగా మాట్లాడంకష్టం. అంతకన్నా నేను దిగిమాట్లాడను. కాబట్టీ అమ్మతన్నాన్నే చూడాలికొడుకు. కానీ నీ విషయంలో ఏమౌతుందో తెలుసా? కొడుకులందరూ నీకు భర్తలు అవుతారు? అందుకే భూమిపతీ, పతే ఆయన తరువాత ఆయన కొడుకు, ఆయనా భూమి పతే ఎంత ధారుణమండీ అదీ! ఒకాయన పరిపాలిస్తున్నాడు ఆయన భూమిపతి ఇప్పుడు కొడుకుపుట్టాడు ఇప్పుడు భూమికి ఏమవ్వాలి? కొడుకు ఆ భూమిపతి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇయ్యన ఏమౌతాడు ఈయ్యనా భూమిపతే తనకొడుకు తనకు భర్త ఇంతకన్నా ధారుణం ఏముందీ ఇదీ పార్వతి దేవిశాపం.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
కాబట్టీ న చ పుత్రకృతాం ప్రీతిం మత్త్రోధకలుపీకృతా ! ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్ఛతీ !! నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈశాపం అనుభవించండని లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళు ఇలా వేళ్ళు విరిచారు. ఓరేయ్! అక్కరలేని విషయంలో జోక్యంచేసుకున్నాం రా, ఏవడురా ఈ విషయం చెప్పింది అని అన్నారు వాడు ఉంటాడేమిటి ఇంకాను. ఇప్పుడు అందరూ భారంగా తల వొంచుకుని భారంగా ఇండ్ల కెళితే...? వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు? ఓరేయ్ ఎందుకెళ్ళావురా నీవు నీవల్ల నాకు ఇంకా బిడ్డలు కలగరని వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టీ ఇప్పుడు వాళ్లందరూ ఇళ్ళకు వెళ్ళారు స గత్వా తప అతిష్ఠత్పార్శ్వే తస్యోత్తరే గిరౌ ! హిమవత్ప్రభవే శృఙ్గే సహ దేవ్యా మహేశ్వరః !!  హిమాలయా పర్వత ప్రాంతంలో పర్వతీ సమేతుడై పరమశివుడు మాత్రం హాయిగాకూర్చొని తపస్సు చేసుకొంటున్నాడు. ఇంక వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టకూడదు అన్నారుగా... అందున ఆయన వెళ్ళి తపస్సు మొదలు పెట్టాడు.
Image result for tarakasuraగొడవెక్కడ వచ్చింది, ఇక్కడితో ఏమీ అయిపోలేదు గొడవ, తారకా సురుడు అని ఒకడు బయలుదేరాడు వాడికి తెలుసు ఈ విషయం, ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలుపుట్టరని తెలుసు. దేవతలకి బిడ్డలు పుట్టరని తెలుసు వాడికి వాడు బ్రహ్మగారి గురించి తపస్సుచేశాడు వాడు చాలాతెలివైనవాడు నాకు చావద్దు అన్నాడు అది కుదరదు అన్నాడాయన. అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకుపుడితే వాళ్ళచేతిలో చనిపోతాను అన్నాడు బ్రహ్మగారు ఏమన్నారు తధాస్థు అన్నారు. ఇంక వాళ్ళకుపుట్టరు నేను చావను అది వాడిధైర్యం. ఇప్పుడు వాడు ఎవ్వరిని కొట్టడం మొదలుపెట్టాడు, దేవతలనే. ఇప్పుడు వాళ్ళేం చెయ్యాలి మొన్న మీతో అన్నానుగా కన్సల్టెంట్ ఫిజిసియన్ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళందరు ఎక్కడికి వెళ్ళి అడిగారు, మీ ఇద్దరికి పిల్లలు కలగకూడదు, తపస్సు చేసుకోండని, వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరులని వాళ్ళిద్దరు తపస్సుకు వెళ్ళిపోయారు. ఇప్పుడెళ్ళి మీ ఇద్దరు బిడ్డలు కనండని అన్నారనుకోండి? ఇంకేమైనా ఉందా...? వద్దన్నావు అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడా? అంటే మీరు బాగాగమనించండీ! ఏదైనా ఆడది భరిస్తుంది కానీ, ఆడదాని అమ్మ తనానికీ, ఆడదాని భర్తను పంచుకోవడానికీ, ఇంకో ఆడదివస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదూ... అది ఈ జాతి క్షమించలేదు ఇదీ రామాయణం యొక్క తీర్పు.
కాబట్టి ఇప్పుడు వీళ్ళువెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వర్లని. కొడుకు పుడితే తప్ప వీళ్ళకి బ్రతుకు లేదు. ఎందుకని? వీళ్ళని చాలా బాధపెట్టేస్తున్నాడు తారకాసురుడు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక, పార్వతీ పరమేశ్వరులని అడగలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా, ఎలాగండీ పార్వతీ పరమేశ్వరులకి కొడుకు పుడితే తప్పా మేం రక్షించబడం, ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా? అని అడిగారు. అయితే ఆయన అన్నారూ శైల పుత్ర్యా యదుక్తం తన్న ప్రజాస్యథ పత్నిషు ! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః !! ఓరేయ్! పార్వతీ పరమేశ్వరులకి ఇంక పిల్లాడు పుట్టేటటువంటి విషయం మీరు నేను ఇక వెళ్ళి అడగడం అన్న విషయం ఇక మరిచిపోండి, పోనీ మన దగ్గరా


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
శివుని యొక్క తేజస్సు ఉంది ఇంకానూ... అగ్ని హోత్రుడు పుచ్చుకుని ఉంచాడుగా... అంటే ఆపిల్ పండు ఫ్రిజ్ లో పెట్టుకున్నటు, అగ్నిలో శివుని తేజస్సు ఉందిగా... పోనీ దాన్ని తెచ్చి ఎవరిలోకైనా నిక్షేపిద్దామంటే... మీ భార్యలెవ్వరికీ పిల్లలు పుట్టరు. ఆవిడ శాపం ఉందిగా... పైగా ఆ శివ వీర్యాన్ని భూకాంత పుచ్చుకుందనేగా అన్ని శాపాలు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని తీసికెళ్ళి ఇంకొళ్ళకి ఎవరికైనా ఇస్తామంటే, ఎవరు మాత్రం పుచ్చుకుంటారు, ఏ ఆడది మాత్రం పుచ్చుకుంటుంది. పుచ్చుకుంటే కదా పిల్లలు పుట్టడం. పార్వతీ దేవిని వెళ్ళి అడగలేం. పోనీ శివ వీర్యం ఉంది కాని ఇంకో స్త్రీలో ప్రవేశ పెట్టలేం. ఎలా? ఆలోచించి ఆయన తక్కువాడండీ చతుర్ముఖ బ్రహ్మగారంటే... అందుకే బ్రహ్మ అని అనను బ్రహ్మగారు అంటుంటాను. ఆయన సలహా లేకపోతే లోకం లేదు మన ఉపన్యాసమే లేదు ఆయన అన్నారూ... ఇయమాకాశగా గఙ్గా యస్యాం పుత్రం హుతాశనః ! జనయిష్యతి దేవానాం సేనాపతిమరిన్దమమ్ !! జ్యేష్ఠా శైలేన్ద్రదుహితా మానయిష్యతి తత్సుతమ్ ! ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః !! హిమవత్ పర్వతం ఉందే హిమవంతుడు, ఆయనకి ఇద్దరు బిడ్డలున్నారు. పెద్దమ్మాయి పేరు గంగా, రెండో అమ్మాయి పార్వతి, పెద్దమ్మాయి దేవతా స్త్రీలలోకి రాదు. ఆ అమ్మాయి స్వర్గలోకంలో ప్రవహిస్తూంది, ఇప్పుడు తనకు బిడ్డలు పుట్టలేదన్న బాధ ఎప్పుడు పోతుందంటే... తన భర్త యొక్క వీర్యము, తన అక్కగారిలో ప్రవేశపెడితే తన అక్క కొడుకు తన కొడుకేగా! అందుకని కొంచెం మనసు కుదుట పరచుకునీ పోన్లే బిడ్డపుట్టాడని సంతోషిస్తుంది. అక్క జోలికి వెళ్ళదు ఎందుకంటే కొంచెం ఆపుకుంటుంది. ఆప్యాయతా అన్నది ఒకటి ఉంటుంది. అక్క కొడుకు తనకొడుకుగా అవుతాడు కాబట్టి, కాబట్టి మనం పార్వతీదేవి కోప్పడకూడదు అంటే..., ఆ గంగాదేవి యందు ఈ శివ వీర్యాన్ని నిక్షేపించాలి.
ఇప్పుడు శివ వీర్యం ఎవరి దగ్గర ఉంది అగ్నిహోత్రుడి దగ్గర ఉంది ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చెయ్యాలి, గంగాదేవిలో విడిచిపెట్టాలి. గంగాదేవి ఒప్పుకోవద్దూ, కాబట్టి మీరు ఏం చెయ్యాలీ మీరేగా... వెళ్ళి ప్రార్థన చేశారు, మీరే వెళ్ళి అగ్నిహోత్రున్ని, గంగనీ వెళ్ళి ప్రార్థనచెయ్యండీ అన్నాడు. ఇప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏమి అనుకోవద్దు శివ వీర్యీం అగ్నిహోత్రుడి దగ్గరుంది అది నీవు పుచ్చుకో అంటే, ఛీ నేర్మూయ్ అంటే? అందుకని ఈ మాట ఎవరు చెప్పాలో ఒక్క పురుషుడు చెప్పాలి. పురుషులందరు చెప్తే అసహ్యంగా ఉంటుంది. మీరెళ్ళి అగ్నికి చెప్పండీ, అగ్నివెళ్ళి ఆమెకు చెప్తాడు. ఎందుకండీ ఇంత ఇబ్బందీ... అంటే ఇది గట్టిగా చెప్పుకునేది కాదు. ప్రయత్నం చేస్తున్నారు, పార్వతీ పరమేశ్వరులకి పుత్రుడు కలిగేటట్లు అని తెలిస్తే చంపి అవతల పారేస్తాడు ఆయన తారకాసురుడు. అందుకని ఎవరికీ తెలియకుండా జరిగాలి ఈ పనంతానూ, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అగ్నిహోత్రుడి దగ్గరకు వెళ్ళారు. అయ్యా ఎంత గొప్ప సలహా చెప్పావు, ఏదో ఓ కారుచీకటిలో కాంతిరేఖా కఠినమైన సత్యానికి సూక్ష్మమైన రంద్రం దొరికింది ఇక మీము అల్లుకుంటాం కథ అంతానూ అన్నారు తచ్ఛ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునన్దన ! ప్రణిపత్య సురాస్సర్వే పితామహమపూజయన్ !! బ్రహ్మగారికి పూజచేసి నమస్కారంచేసి బయలుదేరి అగ్నిహోత్రుడు దగ్గరికివెళ్ళారు. వెళ్ళి ఆయనతో అన్నారూ దేవకార్యమిదం దేవ!  ఇప్పుడు మాడ్లాడడం కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది దేవకార్యం ఏదో సరదాగా నీవు అక్కడ పట్టుకెళ్ళు ఇక్కడ విడిచిపెట్టూ ఇలాంటి మాటలు చెప్పడానికిరాలేదు. నీకు పిల్లలుపుడితే నాకెందుకూ పుట్టకపోతే నాకెందుకూ ఇలాంటి వాటిల్లో ఇక మేము జోక్యం చేసుకోం బుద్దొచ్చింది మాకు, కాక పోతే ఇది దేవకార్యం, ఇప్పుడు ఈపిల్లాడు పుట్టకపోతే, వీపులు పగిలిపోతున్నాయి తారకాసురిడివల్ల, అందుకని పుట్టాలి పిల్లాడు, కాబట్టీ సంవిధత్స్వ హుతాశన ! శైలపుత్ర్యాం మహాతేజో గఙ్గాయాం తేజ ఉత్సృజ !! నీలో ఉన్న శివ తేజస్సును పట్టుకెళ్ళి, గంగలో విడిచిపెట్టు. గంగ పుచ్చుకుంటే, గంగకు కొడుకు పుడితే, ఆపిల్లవాడు పార్వతీ పరమేశ్వరుని పుత్రుడికింద వస్తాడు అందుకని పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి, ఆ పిల్లవాడికి సేనా నాయకత్వం ఇద్దాం, వాడు సేనాధిపతి అయితే వాడిచేతిలో తారకాసురుడు చనిపోతాడు అందుకని నీవు వెళ్ళి గంగను అడుగు అన్నారు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
Related imageఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన మనస్సుతో ఆమె పుచ్చుకుంది అనుకోండీ! ఇదెక్కడ చికాకు వచ్చిందిరా అని అప్రసన్నమైన మనస్సుతోకానీ అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించడు. కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడకు చెప్పాలి కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు గర్భం ధారయ వై దేవి! దేవతానామిదం ప్రియమ్ అన్నాడు అమ్మ నీవు గర్భం ధరించాలమ్మా ఆవిడ కన్యా భర్తలేడు మరి నీవు గర్భం ధరించాలి అంటే అనదా ఆవిడా! దేవతానామిదం ప్రియమ్ అమ్మా ఇది దేవకార్యం. అందుకని నిన్ను అడుగుతున్నాను తప్పా మరి ఇంకో మాట అనుకోకు సమా తల్లీ! అందుకని ఆవిడ అర్థం చేసుకుంది, ఓహో! ఇప్పుడు ఇంతకన్నా లోకాన్ని రక్షించడానికి వేరే మార్గంలేదు. కాబట్టి శివ తేజస్సుని నాలోకి తీసుకుంటాను తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు దివ్యమైన రూపాన్ని ధరించి శివ తేజస్సును తనలోకి తీసుకుంది. ఇప్పుడు వీళ్ళ, బాగాగమనించండి! సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే ఎలాంటిదో తెలుసాండీ..! 33 కోట్లమంది దేవతలూ, ఇలా ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు కానీ శివ వీర్యం ఎందుకూ పనికిరాకుండా పోయిందనుకోండీ! గంగ కానీ అయ్యో బాబోయ్ నేను భరించలేకపోతున్నాను అని వదిలి అవతల పారేసిందనుకోండీ! ఇక అంతే, ఇక శివ వీర్యం లేదు ఉన్న శివ వీర్యం పాడైపోయింది. కాబట్టి ఇక పుత్రుడు కలగడు పుత్రుడు కలగకపోతే ఇక ఎప్పటికీ దేవతల రాజ్యం అన్నది ఇక రాదూ! తారకాసురుడే ఉంటాడు కాబట్టి ఇక మీరు నేను ఈ పురాణం చెప్పుకోవడం ఇవేవి ఉండేవి కావు ఆయనే తారకాసురుడే పరిపాలిస్తూ ఉండేవాడు కదా.
కాబట్టి ఇప్పుడు ఆ గంగవల్ల బిడ్డ పుట్టాలి వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు గంగ గర్భంధరించి బిడ్డని కంటుందా! ఇది, ఇంత చల్లటి గంగమ్మలోకి శివుని వీర్యం వెళ్ళింది, వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కేక వేసింది. అయ్య్ బాబోయ్ ఈ శివ వీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతుంది, నేను భరించలేక పోతున్నాను, నేను దీన్ని వదిలేస్తున్నాను, నేను ఎక్కడ వదిలేయను అంది ఆమె. వీళ్లందరూ నీరస పడిపోయారు అయ్యోయ్యోయ్యో! మన ప్రణాళికపోయింది అనే తప్పటికి
తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ ! దృష్ట్వా తన్మహిమానం స సమన్తాదవకీర్యత !!
ఆ తరువాత సమస్తతస్తదా దేవీమభ్యషిఞ్చత పావకః ! సర్వస్రోతాంసి పూర్ణాని గఙ్గాయా రఘునన్దన !!
తమువాచ తతో గఙ్గా సర్వదేవపురోహితమ్ ! అశక్తా ధారణే దేవ! తవ తేజ స్సముద్ధతమ్ !
దహ్యమానాగ్నినా తేన సమ్ప్రవ్యథితచేతనా !!


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
ఇప్పుడు ఈ తేజస్సుని ఎక్కడ వదిలి పెట్టేయను నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయి అన్నది ఆవిడ. అగ్నిహోత్రుడు చూసి అన్నాడూ బిడ్డ పుట్టాడోలేదో తరువాతి మాట, ముందసలు కలతపడిపోతున్నావు, కాబట్టి నీవు తట్టుకోలేక పోతున్నావు అథాబ్రవీదిదం గఙ్గాం సర్వదేవహుతాశనః ! ఇహ హైమవతీ పాదే గర్భోయం సన్నివేశ్యతామ్ !! అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల పాదముల యొక్క చెంతకు తీసుకెళ్ళి నీలోవున్నటువంటి శివ తేజస్సుని విడిచి పెట్టేసేయ్ అన్నాడు. గంగ తనలో ఉన్న శివ తేజస్సును తీసుకెళ్ళి హిమాలయా పర్వత పాదములయందు వదిలిపెట్టేసింది వదిలిపెట్టేసేటప్పటికి అదివెల్లి రెళ్ళుదిబ్బల్లో పడిపోయింది గడ్డిలో పడిపోయింది. ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి, పిల్లాడేమైనా వచ్చాడా! వాళ్ళికి ఇప్పుడు పిల్లాడు కావాలి ఇప్పుడు, వాళ్ళు చూస్తే సర్వం పర్వతసన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్ ! జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ !! సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశనసమప్రభవ్ ! తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాఞ్చనమ్ !! ఆ శివ వీర్యంలోంచి, ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో మొట్ట మొదట బంగారం పుట్టింది లోకంలో బంగారం పుట్టింది. బంగారం శివ వీర్యం అందుకే బంగారానికి శివ వీర్యం అని పేరు. బంగారం పుట్టి అక్కడ ఉన్న తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాఙ్చనమ్ ఆ గడ్డీ చెట్లూ అన్నీ బంగారు రంగులో మెరిసిపోయాయి ఒక్కసారి తరువాత వెండి పుట్టింది ఆ వెండిని చూశారు. తెల్లగా ఉంది వెండి అయిపోయింది. ఆ తర్వాత ఇంక మిగిలిన క్షారలలోంచి రాగి, ఇనుము పుట్టాయి, మిగిలి పోయిన మలం లోంచి తగరము సీసము పుట్టాయి తప్పా పిల్లవాడు మాత్రం కనపడలేదు.
అయిపోయింది మన ప్రణాళికంతా, పిల్లవాడు పుట్టలేదు అని దిగాలు మొఖాలు వేసుకొని పైనుంచి చూస్తున్నారు. ఆ రెళ్ళు దుబ్బల్లో, ఆ రాత్రి వేలల్లో తెల్లగా మెరుస్తాయే రెల్లు దుబ్బలు, ఆ రెల్లు దుబ్బల్లోంచి తత్ అగ్నినా పునః వ్యాప్తం సంజాతః శ్వేత పర్వతః ! దివ్యం శరవణం చైవ పావక ఆదిత్య సన్నిభమ్ !! బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసి పోతుండగా... ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాలకోసం ఏడ్చాడు, హమ్మయ్యా... పుట్టాడురా పిల్లాడు శివ పుత్రుడు జన్మించాడు మనబాధలు తీరాయని వాళ్ళందరు పొంగిపోయారు.
Image result for shanmukha“షష్టి” ఆరు ముఖాలతో శణ్ముఖుడై పుట్టాడు ఆ పుట్టినటువంటి వాడుకూడా... మహానుభావుడు ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి శణ్ముఖుడు పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి, ఆ కృత్యుకలనుపిలిచి మీరు పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు మేం పాలిస్తాం కానీ తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమమ్ ! దదుః పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః !! ఇప్పుడు పాలిస్తేగాని పిల్లాడు బ్రతకడు, కాబట్టి వాళ్ళన్నారు మేము పాలిస్తాం కానీ ఆపిల్లాన్ని మా పేరుతో పిలుస్తారా అన్నారు మా పిల్లాడని చెప్తారా అన్నారు అబ్బెబ్బే అలా ఎలా కుదురుతుందండీ అని అన్నారనుకోండి వాళ్ళు పాలివ్వకపోతే  పిల్లాడు? అందుకని వీళ్ళు వెంటనే దేవతలు అన్నారు తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ కార్తికేయుడు, కార్తికేయుడు అన్నాం కదా పాలు ఇవ్వండి అన్నారు. అమ్మ తనం ఎంత గొప్పదో చూడండి! ఇప్పుడు ఈ కృత్యుకలు ఆరుగురు వాడికి ఆరు ముఖాలతో ఉన్నవానికి ఆరుగురు పాలిచ్చారు. వాడు పాలు తాగాడు పుత్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః కార్తికేయుడు, కార్తికేయుడు అని మేం పిలవడం కాదు, మూడు లోకాల్లో పిలుస్తారు ఈ పిల్లాన్ని, సరేనా అన్నారు దేవతలు అప్పుడు వాళ్ళు పాలిచ్చారు. కాబట్టి కార్తికేయుడు, అగ్నిలో శివ వీర్యం చాలా కాలం నివ్వ ఉంచబడి, అగ్నిహోత్రుడు గంగలో ప్రవేశపేట్టాడు కాబట్టి “పావకీ” శరవణములు అంటే రెల్లు దుబ్బల్లోంచి పుట్టాడు కనుక “శరవణ భవ” ఎప్పుడూ శుద్ధమైనటువంటి బ్రహ్మ జ్ఞానం కలిగి ఉంటాడు కాబట్టి “సుబ్రహ్మణ్యం” తల్లి కడుపులోంచి స్కలనమై పుట్టాడు కాబట్టి “స్కందుడు” ఆయన ఉత్పత్తి చేతనే ఇన్ని పేర్లతో వచ్చాడు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
ఏమండీ! మీరు ఇంత గొప్పగా ఏదో పాపం నోరు కొట్టుకోని చెప్తున్నారు కానీ, మాకు అసలు అనుమానము మాత్రం అలా ఉండిపోయింది. మీరు మాకు మంగళం చెప్తామనుకుంటారేమో! అలా అనచ్చా దేవతలు, అలా అడగడం వల్ల కదా ఇంత కథొచ్చింది అలా ఎందుకడగాలి అసలు. అంటే మహానుభావుడు, శంకరభగవత్ పాదాచార్య స్వామి వారు బ్రహ్మసూత్రాలకి చేసినటువంటి వ్యాఖ్యానంలో ఒక చోట ఉదహరించారట దీని గురించి, దాని గురించి ఇలా ఎలా జరిగిందని కంచి కామ కోఠి పీఠాధిపతులు చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత మంది పౌరాణికులనో అడిగారట. ఆఖరికి ఒకాయన దీనిమీద పరిశోధన చేసి చేసి త్రిపురా రహస్యములో ఉన్నటువంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో దీని అసలు  వృత్తాంతం ఎక్కడుందో పరమాచార్య స్వామివారికి తీసుకొచ్చి చెప్పారు. త్రిపురా రహస్యంలో ఉంది దీని రహస్యం అక్కడ నుంచి అనుసంధానం చెయ్యాలి దానిని.
Image result for దేవ సేనానాయకుడుసనత్ కుమారుడు అని ఒకాయన బ్రహ్మమానస పుత్రుడు, ఆయన పుట్టుకచేత మహాజ్ఞాని. అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడూ తనలోతాను ఎప్పుడూ బ్రహ్మ జ్ఞానంలోరమిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు, నిద్రపోతే అంటే గుర్తు పెట్టుకోండీ! బ్రహ్మవేత్త నిద్రకు కూడా ఆయన సాక్షి. అటువంటి ఆయనకి కల వచ్చిందంటే, అవస్త ఏర్పడింది అంటే స్వప్నావస్థ. ఆ కలలో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్లు కలవచ్చింది. ఆయన తెల్లబోయి ఇదేమిటి నాకు కలరావడం ఏమిటి? కలరావడం అంటే...? మనసులో ఏదో కోరికుంది ఆ కోరిక కలలో కనపడింది. స్వప్నావస్తలోకి వెళ్ళాను, ఇది దోషం కదా నాకు ఇది అలా ఎందుకు జరిగింది? తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాన్నగారూ నాన్నగారూ నాకు కల ఇలా ఎందుకు వచ్చింది అసలూ అని అడిగారు. ఆయన అన్నారూ నాయనా నీకు ఇలా కల రావడానికి ఒక కారణం ఉంది. నీవు పూర్వ జన్మలో వేదాన్ని నేర్చుకొనేటప్పుడు, వేదంలో దేవతల గురించి, రాక్షసుల గురించి, దేవదానవుల గురించి యుద్ధాలు గురించి చదివి, ఈ రాక్షసులు ఎప్పుడూ వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పన్లు చేస్తుంటారు, వీళ్ళని పట్టుకొని చంపేయ్యాలని వ్యగ్రత పొందావు ఆ వ్యగ్రత జీవున్ని పట్టుకుంది. అది ఈ జన్మలో బ్రహ్మవేత్త అయినా ఆ వాసన జీవున్ని పట్టుకుంది అది ఇప్పుడు కలగా వచ్చింది. అది తీరాలంటే నీవు దేవసేనకి అధిపతి కావాలి. నీవు దేవసేనకి అధిపతివై రాక్షసులను సంహరిస్తే, ఆ కోరిక తీరుతుంది అంటే నాన్నగారూ నేను దేవ సేనాపతిని కావలసిందేనా అని అన్నాడు కావలసిందే అని అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చేశారు తన అనుష్టానంలో తను ఉన్నారు ఆయన.
ఈలోగ పరమ శివుడు ఒక సంకల్పం చేశాడు పరమ శివున్ని మించిన జ్ఞాని ఇంక ఈ లోకంలో లేడు ఎక్కడైనా జ్ఞానం అంటూ ఉంటే... అది కేవలం శాంకర భిక్ష పరమ శివుడి బిక్షయే జ్ఞానం. అందుకే ఆయన్ని ఓం ఈ శానః సర్వ విద్య నాం ఈశ్వరః సర్వ భూతానాం బ్రహ్మధి పతిః బ్రాహ్మణో ధీ పతిః బ్రహ్మ శివోమే అస్తు సదా శివోమ్ ఓం నమో మంగళములకు మంగళం


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
నా తండ్రి అంతటి మహాజ్ఞాని శంకరుడంటే. ఆయన దగ్గర నుంచే వెళ్ళాలి జ్ఞాన గంగా కాబట్టి పరమ శివునికి ఒకప్పుడు కోరిక పుట్టిందట నేను ఇప్పటిదాకా అన్ని విషయాలూ, చెప్పడం కానీ, నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గరా... ఓడిపోతే బయటివాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదు కదా... ఓడి పోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో... సన్మానంగా ఎప్పుడు మారుతుంది “పుత్రావిచ్చేత్ పరాజయం” తన కొడుకు చేతిలో తను ఓడిపోవాలి. తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే... ఓరేయ్! నేను శ్లోకానికి ఇన్ని అర్థాలు ఇన్ని మాట్లు చెప్పాను కానీ, నా కొడుకొచ్చి అకస్మాత్తుగా నాన్నగారండీ... శ్లోకానికి అర్థం ఇలా కూడా వస్తుంది కదా... అని అంటే... నాకు ఎప్పుడూ రాని ఆలోచన ఎంత గొప్పగా చెప్పాడురా... ఇలా చూస్తే అంత అసలు కథ మారిపోయింది. వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల వంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి. అలాంటి కొడుకు నా కడుపున పుడతాడా..? అనుకున్నాడట పరమ శివుడు కూడా... ఒకా నొకప్పుడు ఇప్పుడు సనత్ కుమారుల వారికి ఈ కోరికా, శివుడికి ఆ కోరికా!
Image result for బాల షణ్ముఖుడుఒకానొకప్పుడు పరమ శివుడు పార్వతీ అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతా కూడా విహారం చేస్తారు. శ్రీశైల పర్వతం మీద దిగుతారు భాగవతంలో చతుర్ధ స్కందం అనుకుంటాను. అందులో చెప్తారు దీనిగురించి, వాళ్ళిద్దరు విహారం చేస్తుంటే సనత్ కుమారుడు కనపడ్డాడు, కనపడితే వాళ్ళకి ముచ్చటేసింది. బ్రహ్మవేత్త, మహానుభావుడు బ్రహ్మజ్ఞాని పలకరిద్దామని వృశభ వాహనం మీద కిందకి దిగి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఇలా చూశారు. చూసి తనపని తాను చేసుకుంటున్నారు ఇద్దరు అలా నిలబడ్డారు ఆయనేం పలకరించలేదు. పలకరించకపోతే పరమ శివుడు అన్నాడు, ఏమయ్యా? లోపల సంతోషించాడు ఇది బ్రహ్మ వేత్త అంటే... ఏమయ్యా ఇంత సేపటి నుంచి నిల్చున్నాం కనీసం నీవు పలకరించలేదు మమ్మల్ని అన్నారు. ఏమిటి నీవు కొత్తగా కనపడ్డం ఏమిటీ? నాకు లోకమంతా నీవు తప్పా ఇంకోటి కనపడితేగా? నీవే కనపడుతున్నది. బ్రహ్మవేత్తకి ఏం కనబడుతుందండీ! విశ్వం కనపడదు విశ్వనాథుడు కనపడుతున్నాడు. లోకం కనపడదు లోకేశ్వరుడు కనపడుతాడు. కాబట్టి నాకు కనపడుతున్నదే నీవు నీవు నాకు కొత్తగా కనపడడం ఏమిటి? నాకు ఎప్పుడూ నువ్వేగా కనపడేది ఇందులో కొత్తదనమేమిటీ, అలా కూర్చున్నాను అన్నాడు లేచి మాట్లాడ కుండా అలా మాట్లాడితే శపిస్తాను తెలుసా? అన్నాడు. శపిస్తే ఏమౌతుంది స్వామీ? దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది. అది నేనైతేగా, నేను ఆత్మని. ఆత్మకి శాపం ఏమి ఉంటుంది. ఆత్మమే నేను, నేనే నువ్వు. ఉన్నది ఒక్కటే దానికి శాపం లేదు స్వామి. అందుకే నాకు భయం లేదు అన్నాడు. ఓహో! ఏమి ద్వంద్వాతీతుడవురా నాయనా! మహానుభావా, ఇది బ్రహ్మ జ్ఞానం అంటే.
కాబట్టి నిన్ను చూసి నేను మురిసి పోతున్నాను. నీకు ఏదైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నాడు ఆయన అన్నాడు వరమిస్తావా? మళ్ళి ఇదో మోహం, వరం ఇవ్వడం, శాపం ఇవ్వడం, ఏమిటి ఈ ద్వందాలు. నాకు ఏమీ అక్కర లేదు నీకేమైనా కావాలా నేను ఇస్తాను అన్నాడు అంటే పరమ శివుడు అన్నాడు ఈ మాట నీతో అనిపించడానికే నేను ఇంత సేపు నిల్చున్నాను. నీ లాంటి కొడుకు కావాలి, నీవు నాకు కొడుకువు అవుతావా అన్నాడు. అంటే సనత్ కుమారుడు అన్నాడు నీకే కొడుకును అవుతాను అన్నాడు అంటే పార్వతీదేవి అంది ఏమిటీ అది నీకే అని ఎందుకు “కే” కు దీర్ఘం ఇస్తున్నావు అని, నీ కే


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
కొడుకును అవుతానంటావేమిటి? నీ కే కొడుకునంటే నా కూ కొడుకువే అంది. అదొక్కటి అడక్కమ్మా అన్నాడాయన. అదేమిటయ్యా? అదేమిటి నీ లాంటి కొడుకు పుడుతుంటే నాకు కడుపున పుట్టక పోవటం ఏమిటీ? అమ్మా ఎంత పార్వతీ దేవి అయినా తల్లీ? నేను ఒక కడుపున పుట్టటం అంటే అమ్మా? తల కింద పెట్టీ కాళ్ళు పైకి పెట్టీ, తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలో నుంచి బయటికి రాలేనమ్మా అన్నాడు. శివ కుమారునిగా పుడతాను నీకు కుమారున్నే తప్పా అమ్మా నీ కడుపున మాత్రం పుట్టను అన్నాడు. అంటే ఆవిడ చిన్న బుచ్చుకుంది. అయ్యయ్యో, నేను కూడా కలిసి అడగక పోవడం వల్ల వచ్చింది. కానీ, నాకు కోరిక నీవు ఇంకొకలా తీర్చాలంది ఆవిడ ఎలా తీర్చనమ్మా అని అడిగాడు.
Image result for స్కందోత్పత్తినేను ఒకానొకప్పుడు భస్మాసురుడు, పరమ శివుని గురించి తపస్సుచేసి వరములు పొందాడు నేను ఎవరి తలమీద చేయ్యిపెడితే ఆయన భస్మమైపోవాలి అని పరమ శివుడు వరమిచ్చాడు. నీ మీదే పరీక్ష చేస్తానని పరమ శివుని వెంటపడ్డాడు. పరమ శివుడు “ఏదో ఒక హేల”, ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. లోకానికి ఓ పాఠం చెప్పడం కోసం సుమాండీ, చేతకాని వాడనిమాత్రం అనకూడదు ఇప్పుడు నేను శివ పురాణానికి అంతటికి వ్యాఖ్యానం ఎక్కడ చేయను. కాబట్టి ఆయన పరుగెడుతున్నట్లు నటించాడు ఆయన పరుగెడుతున్నట్లు నటిస్తే నేను వెంటపడి చంపితే బాగుండదు. భర్త పరుగెడుతున్నట్లుంటే, నేను కాసేపు కనపడకుండా ఉంటే పోతుందనీ, ఆవిడేం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది. అదే ʻశరవణ తటాకంʼ. ఆ శరవణ తటాకం హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంది. నీవు నా కడుపున పుట్టక పోయినా ఆఖర్నున పుట్టేటప్పుడు మాత్రం ఆ శరవణ తటాకం దగ్గరన్నుంచి పుట్టాలి, నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి అంతే, అంటే ఆయన మంత్రం “శరవణ భవ” సుబ్రహ్మణ్యడికి. అంటే ఆయన అన్నారు తప్పకుండా... అలా నేను పరమ శివుని యొక్క తేజస్సు చేతా... నీ తటాకం లోంచి పుడతాను. పంచ భూతాత్మకం పరమ శివుని లక్షణం కదా...! అందుకని పృధ్వీ స్వరూపంగా, అగ్ని స్వరూపంగా, వ్యాయు స్వరూపంగా, జల స్వరూపంగా, ఆకాశ స్వరూపంగా ఐదు స్వరూపాలతో పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపంగా... శివ శక్తుల యొక్క సమ్మేళనానికి పుట్టినటువంటి మెరుపు తీగలా, లోకంలో బ్రహ్మ జ్ఞానాన్ని బోధచేయడానికని, దేవ సేనాపతిని కావడం కోసమనీ, రాక్షస సంహారం చేయడం కోసం మీకు పుత్రులుగా పుడతానమ్మా అని సనత్ కుమారులవారు పరమ శివునికి వరమిచ్చారు.
అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వరుల సమాగం జరిగి, పార్వతీదేవి లోకివెళ్ళ కూడదు తేజస్సు. దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగి పోతే... రేపు పొద్దున్న ఉపాసనలు కష్టం అవుతాయి. అందుకని నాటకీయ సన్ని వేశం సృష్టించబడాలంటే దేవతలు వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనచేసి శివ తేజస్సు భూమి మీద పడాలి అది అగ్ని హోత్రంలోకి వెళ్ళాలి ఇది పంచ భూతాత్మకమై, ఆయన శణ్ముఖ స్వరూపంతో పైకి రావాలి, వచ్చి స్వామీ అని పేరు పెట్టుకోవాలి. “స్వామి” అన్న పేరు కేవలం సుబ్రహ్మణ్యుడిదే, మనం వెంకటేశ్వర స్వామి అంటాం మంచిదే తప్పని నేను అంటం లేదు కానీ, ఒక్క స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో, ఎక్కడెక్కడ తలచుకుంటామో, అక్కడక్కడ


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
సంతానమునకు ఏ విధమైన ప్రమాదము రాదు. సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషము కూడా ఉపసంహరిస్తుంది ఎక్కడ ఎక్కడ శణ్ముకున్ని ఆరాధన చేస్తాడో, అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది.
పక్కన ఉన్నటువంటి ద్రవిడ దేశం తమిళ దేశంలో... అంత ఐశ్వర్యం వచ్చింది, అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసాండీ? సుబ్రహ్మణ్యారాధన, వాళ్ళు విపరీతమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధ చేసినా, శణ్ముకునికి ప్రదక్షిణం చేసినా, ఆయనకి నమస్కారం చేసినా, జ్ఞానము, ఐశ్వర్యము, సంతానమూ, సంతానమునకు క్షేమము, ఆయువు, ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అంత శక్తి వంతమైనటువంటి సర్గా ఈ శణ్ముకోత్పత్తి సర్గ. అందుకే వాల్మీకి మహర్షి ఎప్పుడూ కూడా అసలు ఫలసృతి చెప్పరు కానీ ఈ శణ్ముకోత్పత్తి చెప్పిన తరువాత, అందుకే ఈ శణ్ముకునికి ఉన్న గొప్పతనమేమిటో తెలుసాండీ! ఆయనకీ ఒక గొప్ప విజయాన్ని సాధించాడు శణ్ముకుడు ఒక్కడే.
Image result for మురుగన్శైవ వైష్ణవాలు రెండు కూడా వియ్యమొందేటట్లు చేశాడు ʻశ్రీవల్లీ, దేవసేనాʼ ఇద్దరూ శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు, ఆయన మేనల్లుడు కదాండీ మరీ! ఏదో పండగ సెలవులకి ఇంటి వచ్చాడూ, ఇంటికొస్తే లక్ష్మీ దేవి ఆయన్ని చూసి అందట “మురుగన్” అని, మురుగన్ అంటే మేనల్లుడు అని. “మరుమగన్” అన్నాడట విష్ణువు. మరు మగన్ అంటే చాలా అందగాడూ, అని అన్నాడట. ఇద్దరూ అలా అనుకోవడం దేనికో తెలుసాండీ, మన పిల్లలకి బాగుంటాడు అని. వల్లి, దేవసేన ఇద్దర్నీ ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం చేశారు. వల్లీ, దేవసేన ఇద్దర్నీ తనకి భార్యలుగా చేసుకున్నాడు కాబట్టీ, శైవ వైష్ణవాలు రెండు కలిసి సుబ్రహ్మణ్యుడివల్లే వియ్యంపొందాయి అంతటి మహానుభావుడు ఆయన మహాజ్ఞాని. యుక్త కేశుడై గుండుతో గోచీ పెట్టుకొని నిలబడి ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాలలో స్వామి మలైలో అలా నిలబడి ఉంటాడు ఆయన ప్రణవానికి అర్థం చెప్తే, పరమ శివుడు అంతటివాడు తెల్లబోయి, ఎంత గొప్పగా చెప్పావురా! అన్నాడట. నాన్నగారూ అలా అంటే కుదరదూ, ఇది ప్రణవ రహస్యోపదేశం కదా... మీరు కూడా మడికట్టుకొనివచ్చి శిష్యుడుగా కూర్చోండీ చెప్తాను అన్నాడు. ఓరేయ్! ఎంత బాగాచెప్పావురా అని వచ్చి కూర్చునివిన్నాడు మహా శివుడంతటివాడు. ఇంత బాగా చెప్పినటువంటి కొడుకు పుట్టాలని గదా కోరుకున్నాడు “ఆత్మాదిచ్ఛేత్, పుత్రాధిచ్ఛేత్ పరాజయం” తండ్రి గారికి ఆ కోరిక తీరింది, అంతటి బ్రహ్మజ్ఞాని పుట్టాడు. ఆయనే తరువాతి కాలంలో కేవలం పాలుతాగి పెద్దవాడైపోయాడు అంతే... అయిపోగానే ఆయన్ని దేవసేనకి తీసుకొచ్చి పట్టాభిషేకం చేశారు. సైనాధిపతి అయిపోయాడు, తారకాసుని సంహారం చేశాడు, దేవతలందరూ సంతోషించారు. అమ్మ అందమంతా మూర్తీ భవించి ఉంటుంది అందుకే, ఇంతింత బుగ్గలూ, ఎర్రటి మనిషీ, ఆ హారాలు చిన్న పట్టుబట్టా, ఎప్పుడూ అమ్మ శక్తంతా చేతిలో శూలంగా పట్టుకుని ఆ కుంకుట ధ్వజం, ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ, ఎంత అందంగా ఉంటాడో, అందుకే శుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్ సంతానం కలుగుతుంది అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
Image result for సుబ్రహ్మణ్య షష్ఠి మల్లవరంప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధ పడుతున్నవాళ్ళు గర్భినీ అయినప్పటికి కడుపున ఎటువంటి బిడ్డలు పుడుతారో తెలియనివాళ్ళు వాళ్ళ ఆయుర్ధాయం బాగుండాలనుకునే వాళ్ళు సంతానం క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్నవాళ్ళూ రామాయణాంతర్గతమైన శణ్ముకోత్పత్తిని వినితీరాలి. ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలసృతి చెప్తూ ఓమాట చెప్పారు ఏష తే రామ గఙ్గాయా విస్తరోభిహితో మయా ! కుమారసమ్భవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ !! ఎవరు ఈ శణ్ముకోత్పత్తిని శ్రీ రామాయణంలో వింటున్నారో... వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా, అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధనసంపత్తి వృద్ధి కలుగుతుంది. రెండు విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రము చేత కలుగుతుంది. ఇక్కడే ఆయన కుమారసమ్భవశ్చైవ అన్నమాట వాడారు పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు కనుక ఆయనకు ఒక్కనికే కుమారః అన్న నామము. ఆయన భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః ! ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కన్దసాలోక్యతాం వ్రజేత్ !! ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ శణ్ముకోత్పత్తిని చేతులు కైమోడ్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటుంన్నారో... అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే... ఆ దోషము ఉపశమించి ఆయుర్ధాయం కలుగుతుంది ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ వాళ్ళ కొడుకులు మనమలు అందరూ క్షేమంగా ఉంటారు. ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవిపోయి వాళ్ళు వృద్ధిలోకి వచ్చి, వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ ఎవరు రామాయణం, సంపూర్ణ రామాయణం చెప్పించుకుని వినేటప్పుడు పరమ భక్తితో... దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారో వాళ్ళ శరీరం పడిపోయిన తరువాత స్కందసా లోకసాం వ్రజేత్ సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని వాల్మీకి మహర్షి సత్యం తప్పా ఆయన నోటి వెంటరాదని బ్రహ్మగారి వరం ఆయన ఎప్పుడూ ఫలసృతి చెప్పరు ఇక్కడ చెప్పారు అంత గొప్పది శణ్ముకోత్పత్తి.
విచిత్రమేమిటంటే, ఈశ్వర సంకల్పం అంటే చాలా గొప్పగా ఉంటుంది. నేను ఇవ్వాళ అసలు నేను ఏదైనా మాట చెప్తే చాలా జాగ్రత్తగా వింటారు హరిప్రసాద్ గారు, నేను చెప్పాను రేపు శుబ్రహ్మణ్యునికి అభిషేకం చేయించడి అని చెప్పాను, ఎందుకంటే ఇవ్వాళ అయింది కాబట్టి శణ్ముకోత్పత్తి రేపు స్వామికి అభిషేకం చేయించండీ! ఆయన చల్లబడుతాడు. రామాయణాంతర్గతంగా జరిగింది కాబట్టి అభిషేకం చేస్తే చల్లబడుతుంది మూర్తి. ఆయన చల్లబడిన అభిషేక తీర్థాన్ని మనం పుచ్చుకున్నాం అనుకోండీ, అది మరింత శక్తి వంతం. పాపం ఎవరైనా ఏదైనా సంతాన సంబందమైన సమస్యలలో ఉన్న వాళ్ళు ఆ తీర్థం పుచ్చుకొని ఉపశాంతి పొందితే, అంతకన్నా కావలసింది ఏముందీ? చెప్పానుగా నాకు వ్యక్తిగత అనుభవాలు చెప్పడం ఇష్టం ఉండదనీ, ఈ శణ్ముకోత్పత్తివల్ల ఉపయోగాన్ని, ఉపకారాన్ని పొందినవారు ఎంత మందున్నారో, నేను మొన్న కూడా... గోపాల కృష్ణ గారికీ ఒక సంగతి చెప్పాను, అంత గొప్ప శణ్ముకోత్పత్తి నేను నా జీవితంలోచూశా దానిగొప్పతనమేమిటో...! ఈ విషయం రేపు పొద్దున తెలిసిన తరువాత ఎందరో తల్లులు దీనివల్ల ఉపయోగం పొందినవాళ్ళు కన్నులలో నీళ్ళు పెట్టుకుని చెప్తారు యదార్థము నిజమేనని.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
మీకు ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్య పోయాను, తూర్పు గోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది అక్కడ ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు. ఇంతలావు పాము కోనేటిలో స్నానంచేసి శివలింగాన్ని  చుట్టుకొని ఉంటుంది. దానికి పిల్లలు పుట్టని వాళ్ళు నమస్కారంచేస్తే పిల్లలుపుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసినవారికి పిల్లలుపుట్టారు. ముఖ్య మంత్రులు కూడా వెళ్ళారు పీఠాధి పతులు కూడా అక్కడికి వెళ్ళేవారు. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల కొట్టుకొని శరీరం వదిలింది వదిలితే ఇప్పుడు అలాగె ప్రతిష్ట చేశారు. అక్కడ నేను ఆశ్చర్య పోయింది ఏమిటంటే, ఆ దేవస్థానం Image result for సుబ్రహ్మణ్య షష్ఠి మల్లవరంధర్మకర్త వచ్చి ఒకసారి ఒకమాట చెప్పాడు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యషష్టినాడు ఈ సుబ్రహ్మణ్య దేవాలయం వెనుకవచ్చి పడుకుంటారు. బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు, వాళ్ళకి కునుకు పడుతుంది. కునుకు పడ్డాకలేపేస్తారు. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకొని వస్తారండీ అని చెప్పాడు. నాకు అపనమ్మకం కాదు. చూడాలనిపించింది. మీరు కూడా వచ్చారేమో గోపాల కృష్ణ గారు నాతో! కాకినాడ నుంచి చాలా మందిమి కలిసి శుబ్రహ్మణ్య భుజంగస్తోత్రం చేశారు శంకర భగవత్ పాదులు. సుబ్రహ్మణ్యషష్టినాడు అందరం కలిసి చదువుదామని వెళ్ళాం. ఆరోజు నాకు ప్రసంగం కూడా ఏర్పాడు చేశారు. మీరు నమ్మరూ నేను తెల్లబోయానండీ! ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు, బిడ్డలు పుట్టరూ అనీ, బెంగ పెట్టుకున్న తల్లులూ, చంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకు నమస్కారం చేసుకుని, అపద్ధం కాదు. నేను ఎంతో మందిని అక్కడ అడిగాను ఏమమ్మా మీకు ఈయ్యన వలనే కలిగిందా సంతానం అని ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహం పొందామనీ, ఆ అదృష్టాన్ని పొందారు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అంటే... ఆయనకు నమస్కారం చేస్తే... ఎంత స్థితినైనా ఇస్తాడు.
మన అదృష్టం ఏమిటంటే... రామాయణం చెప్పుకుంటున్నదీ శృంగగిరి పీఠంలో, అదీ అమ్మవారి సన్నిధానం, రామ చంద్ర ప్రభువు యొక్క సన్నిధానం. ఇక్కడా శివాలయం ఉంది ఆ శివాలయంలో ఇటు పార్వతీ అటు గంగా ఉన్నారు. సాధారణంగా అలా ఉండరు ఆ గంగా మళ్ళీ ఇలా రెండు పాదాలు ఇలా పైకెత్తి కాళ్ళు పాదాలు కనపడేటట్టు వచ్చి, ఇలా గుడ్లు కనపడేటట్టుగా ఉంటుంది చక్కగానూ శివుడికి అటూ గంగా, ఇటు పార్వతీ ఉండి బయట సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు ఉంటారు.
రేపు మళ్ళీ ఒక్కసారి చక్కగా, అన్ని పదార్థాలతోటి అభిషేకం చేయించండి, చేయించి ఎవరెవరు అభిషేక తీర్థం తీసుకోవడం కోసం వస్తున్నారో, వాళ్ళందరికీ కూడా... ఒక అర్చక స్వామిని దానికినియోగించి, అందరికి లేదనకుండా పాపాం తీర్థం ఇప్పించండి. రామాయణాదులు ఉన్నది ఎందుకంటే... అందరికి ఉపకారం చేయడానికే ఉన్నాయి. మీకు ఉపకారం జరిగిననాడు. మీరు మాకు ఎవ్వరికీ వచ్చి చెప్పక్కర లేదు కూడా. మీరు మళ్ళీ వచ్చి సుబ్రహ్మణ్నేశ్వర స్వామి దగ్గరా, రామ చంద్ర ప్రభువు దగ్గరా, నమస్కారం చేసి, స్వామీ నీవలన ఉపకారం పొందామనీ, ఆయనకి చెప్పండీ... చాలు. మీరు మాకు చెప్పాలని కాని, మీరు చెప్తేనే సంతోషిస్తానని కాని నేను చెప్పను. ఎందుకు చెప్పనో తెలుసా? ఒక్కటే నమ్మకం నాకు. ఇది సత్యం!, సత్యం! సత్యం! పునఃసత్యం! ఇది ఆ శక్తి కలిగి ఉంది. అది నా నమ్మకం. కాబట్టి మీరు స్వామికి నమస్కారం చేయండి. ఇంత గొప్ప పీఠ ప్రాంగణాన్ని మీ అభ్యున్నతి కొరకు వాడుకోండి చక్కగా వచ్చి తీర్థం తీసుకోండి.


  బాల కాండ ఐదవ రోజు ప్రవచనము
 
చేస్తాను, ఎంత మందికైనా ఉపకారం చేస్తాను అని నేను ధన్యునైతాను అని తండ్రీ కొడుకులు ముచ్చటగా సిద్దంగా ఉన్నారు. హాయిగా రేపు అభిషేక తీర్థం తీసుకొని తరించండి. మీకు ఓపిక ఉందా! ఓ రెండు అరిటి పళ్ళో, ఓ పండో, ఓ కాయో తెచ్చి అక్కడ నైవేద్యం పెట్టుకోండి! కొబ్బరి కాయ శణ్ముకోత్పత్తి విన్నారు కాబట్టి! రేపు గంగావతరణం. అత్యద్భతమైన ఘట్టం శ్రీరామాయణంలో దానికీ మహర్షి ఫలశృతి చెప్పారు. ఇలా విన్నవెంటనే నీకు పోయింది పాపం అన్నారు మహర్షి. అసలు నిజంగా ఆ గంగావతర్ణం బహుభంగిమలు తిరుగుతుంది అంత గొప్పగా ఉంటుంది. రేపటి రోజున ఇవ్వాళ అనుకున్నాను గాని, శణ్ముకోత్పత్తి అయ్యేటప్పటికే తొమ్మిది అయింది కాబట్టి రేపు గంగావతరణాన్ని తప్పకుండా మనివి చేస్తాను మీరు తనివితీర విందురుగాని.
ఇవ్వాల్టికి శ్రీ రామ నామం చెప్పుకుని చక్కగా మనం మంగళా శాసనం చేసుకుందాం.

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామ నామము !! రా !!
బ్రహ్మ సత్యము జగన్మిత్యా భావమే శ్రీ రామ నామము !! రా !!
పసితనంబున అభ్యసించిన పట్టుబడి శ్రీ రామ నామము !! రా !!
ఎందరో మహానుభావులడెందమాయను రామ నామము !! రా !!
అచలమై ఆనందమై పరమాణువైనది రామా నామము !! రా !!
జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీ రామ నామము !! రా !!
జ్ఞాన భూములు నేడు గడచిన మౌన దేశము రామ నామము !! రా !!
జానకీ హృత్ కమల మందున అలరు చున్నది రామ నామము !! రా !!
చిత్త శాంతిని కలుగు జేసేడి చిత్ స్వరూపము రామ నామము !! రా !!
చూపు మానసమొక్కటై మరి చూడవలయూ ఈ రామ నామము !! రా !!
దూర దృష్టియు లేని వారికి దుర్లభము శ్రీ రామ నామము !! రా !!
బ్రహ్మ పుత్రాకరాబ్జవీణా పక్షమైనది శ్రీ రామ నామము !! రా !!
శాంతి సత్య అహింస సమ్మేళనమే శ్రీ రామ నామము !! రా !!
తల్లి వలె రక్షించు సుజను ఎల్లకారము రామ నామము !! రా !!
మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !! రా !!

మంగళా శాసన.....