Thursday, 17 September 2015

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ రామాయణం - బాలకాండ 1 Sampoorna Valimeeki Ramayanam By Braham Sree Chaganti Koteswar Rao Garu Bala Kanda 1st Day



బాల కాండ
మొదటి రోజు ప్రవచనము  

ఈనాడు శంకరభగవత్ పాదుల చేత ప్రతిష్టించబడినటువంటి  భారత దేశం నాలుగు మూలలా ఉన్నటువంటి నాలుగు పీఠాలలో సార్వభౌమ పీఠంగా పరిగణింపబడినటువంటి దక్షిణ భారత దేశంలోని శృంగగిరి పీఠానికి ఆద్వర్యం వహిస్తున్న పూజ్యపాదులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సందేశంతో  ప్రారంభమై,  వారి యొక్క అనుగ్రహ ఆశిస్సులతో ప్రారంభమైన ఈ శ్రీరామాయణ యజ్ఞ కార్యక్రమములో 42 రోజులపాటు 7 రోజులు ఒక కాండ చొప్పున 6 కాండలు, ఆరేళ్ళ నలభైరెండు రోజులలో పూర్తి చేసి చిట్ట చివర పట్టాభిషేకం వరకు శ్రీరామాయణాన్ని సంపూర్ణంగా ప్రవచనం చేసేటువంటి భాగ్యం నాకు కలగడం పరమేశ్వరుని యొక్కు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను.
శ్రీరామాయణం నిజంగా శ్రీరామాయణమే ఎందుచేత నేను ఈమాట అంటున్నానంటే... ఇప్పుడే మీరు పీఠాధిపతుల యొక్క అనుగ్రహభాషణంలో విన్నారు "వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే ! వేదః ప్రాచేతసా దాసిత్ సాక్షాద్రామాయణాత్మనా!!అంటారు. అందులో ఎంత గొప్ప మాట అన్నారంటే  "వేదవేద్యే పరే పుంసి" వేదముచేత ప్రతిపాదించబడినవాడు, వేదము చేత తెలియబడేటటుంటివాడు, వేదము ప్రమాణముగా ధర్మానుష్టానము చేసి మానవజన్మ తరింపజేసుకొని భగవంతుని యొక్క అనుభవాన్ని మనము పొందడానికి వీలైనటువంటి స్థితిని కలిగి ఉన్నవాడైనటువంటి పరమేశ్వరుడు రామ చంద్ర మూర్తిగా ఈ భూమండలం మీద అవతరించి పదకొండు వేల సంవత్సరములు కరచరనాదులతో నడయాడాడు. రాముడు వేదముచేత ప్రతిపాదించబడినటువంటి పరమేశ్వర శ్వరూపం ఆ భగవంతుడే రామునిగా వచ్చాడు. భగవంతున్ని ప్రతిపాదించేటటువంటి వేదం వాల్మీకి మహర్షి నోటివెంట శ్రీరామాయణంగా వచ్చింది. అందుకే శ్రీరామాయణానికి వేదోప బృంహణము” అని పేరు. వేదమే రామాయణం. "వేదం" దేన్ని ప్రతిపాదిస్తుంది ప్రధానంగా వేదమంతా ధర్మామే ప్రతిపాదన చేస్తుంది.
ధర్మమంటే ఏమిటిధయతేవ జనైరితి ధర్మం అని అమరకోశం, ధర్మం అంటే తెలుసుకోవడం ధర్మంలో ఒక భాగం, కేవలం తెలుసుకోవడం ధర్మం కాదు,  తెలుసుకున్నాడు అనుష్టించడు, అప్పుడది ధర్మమా అంటే? ధర్మం కాదు. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముడికి ఎన్ని తెలుసో ఎంత తెలుసో, రావణుడుకి అన్నీ తెలుసు - అంతా తెలుసు, కానీ రాముని ముందు రావణుడు ఎందుకు నిలబడలేక పోయాడు? ఒక్కటే కారణం తాను తెలుసుకొన్నది తాను విన్నది అనుష్టించాడు రామ చంద్ర మూర్తి, తాను విన్నది తాను తెలుసుకొన్నది  తన సౌకర్యానికి అనుగుణంగా మార్చుకొని దబాయించి బ్రతికే ప్రయత్నం చేస్తాడు రావణాసురుడు. ధర్మాన్ని మీరు తెలుసుకోవడం ప్రధానమెంతో  దాన్ని అనుష్టించడం కూడా అంతే అవసరం అనుష్టానానికి పనికిరానటువంటి ధర్మం  ఉపయోగంలేనిదౌతుంది.

  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
ఇంట్లో కర్ర ఉంది, వీధిలో కుక్క ఉంది, కుక్క మీ మీద పడడానికి ఉద్యూక్తమౌతున్న సమయంలో మీ ఇంట్లో కర్ర ఉందికదాని మీ మీద పడడం మానదు, మీ చేతిలో కర్ర ఉంటే కుక్క మీ మీద పడకుండా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః అన్న మాటకు అర్థం ఏమిటంటే? మీరు ధర్మాన్ని అనుష్టిస్తే మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. ధర్మం విషయంలో తెలుసుకోవలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంటుంది. ధర్మం ఇలా అనుష్టిస్తే అలా వెంటనే ఫలితం ఇవ్వాలని ఎక్కడా ఉండదు ఒకచో అలా ఉండచ్చు. ధర్మం ఏటువంటిదంటే పంట పండడం కోసమనిచెప్పి వ్యవసాయదారుడు భూమిని దున్నడం మొదలు పెడతాడు భూమిని దున్నగానే పంట పండుతుందా, భూమిని దున్నిన తర్వాత వర్షముపడే వరకు ఎదురుచూడాలి, వర్షము పడితే పంట పండుతుందా, విత్తనాలు వేయాలి, విత్తనాలు వేస్తే పంట పండుతుందా, మొలకలెత్తాలి, మొలకలెత్తినంతమాత్రాన పంట పండుతుందా, దానికి చీడా పీడా పట్టకుండా శష్య రక్షణ చేసుకోవాలి, ఆరుగాలములు శ్రమిస్తే చిట్ట చివర ఆ పంటా బాగా చేతికొచ్చి ఫలసాయాన్ని ఇస్తుంది. అప్పుడు కోత కోసి తెచ్చి పొలం గట్టునవేసి బస్తాలకెత్తి ఇంటికి తీసుకెల్లి దాచుకొనేపర్యంతమూ పండినపంట మీ చేతికొచ్చింది అని నమ్మకంగా చెప్పడం సాధ్యంకాదు. ధర్మం కూడా అంతే ఇవ్వళ మీరు ధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు. అధర్మం కూడా అంతే మీరు ఇవ్వాళ అధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు.
లోకంలో మీరు చూస్తూంటారు ఒక్కొక్కడు చాలా పాపాచరణంతో ఉంటాడు. ఈశ్వరునియందు భక్తి ఏమి ఉండదు, శాస్త్రము ఏమి వద్దందో అది చేస్తూ ఉంటాడు. కాని సర్వసుఖములు అనుభవిస్తూ ఉంటాడు. మనకేమనిపిస్తుందంటే ఆయన ఈశ్వరున్ని ధిక్కరించాడు కదా! ఆయనేం ధర్మాన్ని పాటించట్లేదు కదా? “ఆయనేం వేద ప్రమాణాన్ని అంగీకరించట్లేదుగదా సంతోషంగా, సుఖంగా ఉన్నాడు. అన్నీ వినీ... అన్నీ నమ్మి, అన్నీ విశ్వసించి వేదమును ప్రమాణముగా స్వీకరించి ధర్మమును అనుష్టించినటువంటి నేను కష్టాలు పడుతున్నాను.” ఏమిటి ఉపయోగం ఈ ధర్మాన్ని పట్టుకుంటే అనిపిస్తుంది. ధర్మం పట్టుకోవడం ఏటువంటిదీ అంటే, పంట పండడం కోసమని పొలం దున్నటంలాంటిది. పొలం దున్ని కష్టపడినవాడికి పంట ఎప్పటికైనా చెతికివచ్చినట్టే. ధర్మాన్ని అనుష్టించిన వాడికికూడా ధర్మం కాపాడితీరుతుంది అధర్మం ఇంటికి అంటుకున్నటువంటి చిన్నమంటలాంటిది చిన్న మంటే కదా నన్నేంచేస్తుందని పడుకున్నవాడికి చిట్ట చివరకు ఇల్లంతా ఎలా కాలి పోతుందో, ʻఅధర్మంలో మనం ఉన్నామని తెలుసుకొని అధర్మ పథంలోనుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోతే చిట్ట చివరకు జరిగేటటువంటి పరిణామం కూడా అలాగే ఉంటుందిʼ. కాంచన లంక ఉంది అంత బలగం ఉంది అంత గొప్ప సుఖాలను అనుభవించాడు పది తలకాయలున్నాయి, గొప్ప తపస్సుంది, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, పరమేశ్వరున్ని సాకారంగా ధర్శనం చేశాడు పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా తిరిగాడు చిట్ట చివరకు ఏమయ్యాడు. అధర్మాన్ని పట్టుకుంన్నందుకు కడుపునపుట్టినటువంటి బిడ్డలదగ్గర నుండి, భార్యా చిట్టి చివరకు ఏడుస్తూ యుద్ధ భూమిలోకొచ్చి నీవు అధర్మం పాటించడంవల్లే ఇటువంటి చావు చచ్చావని మండోధరి గుండెలుబాధుకొని ఏడ్చేటటువంటిస్థితిని రావణుడు పొందాడు.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
ప్రతిక్షణం ధర్మాన్ని అనుష్టించాడు. ఎంత ఓపికగా అనుష్టించాడంటే ఎన్ని కష్టాలైనారానీ ఆయనకి కావలసింది మాత్రం ఒక్కటే ధర్మం. ధర్మమా సుఖమా, ధర్మమా కష్టమా, ధర్మమా ప్రయోజనమా, ధర్మమా అడ్డదారా, ధర్మమా కోరిక తీరడమా  మీరు పక్కన ఏమి పెట్టి చూడండి శ్రీ రామ చంద్ర మూర్తి జీవితమంతా ఒక్కటే "ధర్మమే." వాలి అన్నాడు సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు, నాతో స్నేహం చేస్తే  రావణాసురున్ని నిగ్రహించి నీ భార్యను వేంటనే ఇప్పింతును, ఎందుకు సుగ్రీవునితో స్నేహం చేశావని అడిగాడు. నాకు కావలసింది ధర్మం, అధర్మాన్ని పాటించేటటువంటి నీతోటి స్నేహంవల్ల నా భార్యను తెచ్చుకోవడం నాకు అక్కరలేదు అందుకు నిన్ను నిగ్రహించాను అన్నాడు. తండ్రి మరణించాడు చెక్కు చెదరలేదు, భార్యను అపహరించారు చెక్కు చెదరలేదు, రాజ్యం పోయింది చెక్కు చెదరలేదు, జఠాయువు మరణించాడు చెక్కు చెదరలేదు. ఇలాకాదన్నయ్యా ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఇలా వెళ్ళు అన్నాడు తోడబుట్టినటువంటి లక్ష్మణమూర్తి నాకొద్దన్నాడు. కన్నతల్లి కౌసల్య అంది ʻనీతండ్రి ఇటువంటి ధురాత్ముడు కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్లంది వద్దమ్మ ధర్మం ప్రధానం అన్నాడుʼ, ఎన్ని పర్యాయాలు ఆయన మాట్లాడితే ధర్మం ధర్మం ధర్మం.
అయితే మీరు ఇక్కడొక మాట గమనించవలసి ఉంటుంది ధర్మం అంటే ఏది ధర్మం? ఉదా: కోటేశ్వరరావు చెపితే ధర్మం అవుతుందా..!, లేకపోతే ఎవరో నేనిది చెప్తానండీ ఇది ధర్మమంటే అవుతుందా, మనం చెపితే ధర్మం అవదు ʻవేదం చెపితే ధర్మం అవుతుందిʼ వేదం ఏమి చెప్పిందో అది ధర్మం. వేదమునకు వ్యతిరేకముగా చెప్పనటువంటి స్మృతి చెప్పినది ధర్మం, వేదమునకు వ్యతిరేకంగా చెప్పని స్మృతి చెప్పిన మాట పాటించినవాడిది ధర్మం. ఆ ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడే శ్రీరాముడు, ఆ ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు అంతిమంగా పొందేదంటే ఇదొక్కటే. పదకొండువేల సంవత్సరములు ఈ భూ మండలాన్ని పరిపాలించినటువంటి రామ చంద్ర మూర్తి  పడనటువంటి కష్టం లేదు ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన ఇతరులకు సుఖాన్ని ఇచ్చాడు, ఇతరులకు ఆనందమిచ్చాడు, ఇతరులకు సంతోషం ఇచ్చాడు తప్పా నేనింతకష్టంలో ఉన్నాననీ మీరెందుకు నవ్వాలని ఆయనెన్నడూ అడగలేదు అందుకే రాముడు ʻయోగిʼ అన్నారు పెద్దలు.
యోగి అంటే పైన ఎన్ని కష్టాలైనా రావచ్చు, కాని లోపల మాత్రం తాను నిర్వికారంగా ఉంటాడు. అందుకే... పుట్టినది కూడా నవమి తిథినాడు పుట్టాడు మహానుభావుడు. తొమ్మిది అంకెకున్న గొప్పతనం చూడండి మీరు ఎంతపెట్టి తొమ్మిదిని హెచ్చ వేయండి మల్లీ తొమ్మిదిగా మారుతుంది. 9X1=9, 9X2=18, ఎనిమిది ఒకటి దొమ్మిది 9X3=27 ఏడు రెండు తొమ్మిది 9X4=36 ఆరు మూడు తొమ్మిది 9X5=45 ఐదు నాలుగు తొమ్మిది ఏం చేసినా మళ్ళీ తొమ్మిదే అవుతుంటుంది, ఎన్నికష్టాలు బయట రానివ్వండి, ఎన్నివైక్లవ్యాలు కలగనివ్వండి లోపల మాత్రం రాముడెప్పుడూ ధర్మాన్ని పట్టుకొనే ఉంటాడు, ధర్మాన్ని పట్టుకోవడం అంటే ʻరాముడు రామాయణంలో మాట్లాడింది మీరు గమనించాలిʼ.
ఎప్పుడైనా రామాయణం చదవడం, రామాయణం వినడమంటే ఒక్క పర్యాయమనే మీరు అనుకోకండి. రామాయణాన్ని భహు కోణాలలో చదవండి, "రాముడు మాట్లాడితే" అని రామాయణం చదవండి ఒక్కసారి రాముడెప్పుడూ నేనిలాచెప్తాను అని అనడు, రాముడు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడంటే... "ఋషులిలా చెప్పారంటాడు,  పెద్దలిలా చెప్పారంటారు, శాస్త్రం ఇలా చెప్పిందంటాడు" తప్పా నేనిలా చెప్తాననడు రాముడు. తన నిర్ణయం కాదు తానేది చెప్పాలోకాదు శాస్త్రం ఏం చెప్పిందో చెప్తాడు, ఋషులేం చెప్పారో చెప్తాడు పెద్దలేం చెప్పారో చెప్తాడు, తాను ఎందుకు ధర్మాన్ని అనుష్టిస్తున్నాడో చెప్తాడు, తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొచ్చి మనుష్యజాతికంతటికి ఫలంగా అందించాడు. అటువంటి ధర్మాతుడైనటువంటి రామ చంద్ర మూర్తి మనుష్యుడిగా అవతారాన్ని స్వీకరించివుండి ఉండకపోతే అసలు మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనం ఇంత గొప్పవాడా మనిషి అన్న విషయమే లోకానికి అర్థమైవుండి ఉండేది కాదు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ʻరామావతార స్వీకారానికి ముందరే రామ నామం లోకంలో ఉందిʼ. రామావతారానికి ముందు రామ నామం లేకపోతే వాల్మీకి మహర్షికి రామ నామాన్ని ఏలాగ ఉపదేశంచేశారు ఋషులు,  ఆయనకు ఉపదేశం చేసిన తరువాత కదా రామ చంద్ర మూర్తి అవతారం వచ్చింది ఆయన వాల్మీకిగా మారిన తరువాత గదా రాముడు పుట్టింది. కాబట్టి 'రామా' అన్ననామం సాక్షాత్ ఈశ్వరుడి యొక్క నామమది అది రమయతీతి రామః లోకులనందరినీ రమింపజేసేటటువంటి నామం అంతటి మహోత్కృష్టమైనటువంటి శీల సంపదగలిగినటువంటివాడు రామ చంద్ర మూర్తి.
అందుకే రామాయణాన్ని రామ చంద్ర మూర్తిని ఎంతకాలం మనుష్యజాతి ఆరాధన చేస్తుందో, అంతకాలం మానవత్వం బ్రతికి ఉంటుంది. ఏనాడు రామ చంద్ర మూర్తిని మరచి పోతామో, ఏనాడు రామాయణం మనకు అక్కరలేదని అంటామో ఆనాడు మనిషీ మనిషిగా కనుపడుతున్న మనుష్యత్వం చచ్చిపోతుంది. మానవత్వం చచ్చిపోతుంది. నరత్వం చచ్చి పోతుంది. అదిపోయిననాడు నర జన్మ యొక్క ప్రయోజనమే పోతుంది. అందుకే మీరు చూడండి విష్ణువు దశావతారములను స్వీకరించాడు వేదోద్దారణ, మందరాభరణ, పృథ్వీ ధరణనిర్మాణా, ప్రహ్లాదత్రాణా, భలిప్రతారణా, నృపావనహంకారణా, వైదేహీరమణా, ధనుంజయ జయ వ్యాపారపారీన, ఛోనీద్వీవ్యత్ కరుణా, తమోహరణా తండ్రీ శ్రీవేంకటేశప్రభో ఇన్ని అవతరాలు స్వీకరించినా ఆ అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత మనం పిలిస్తే ఇక లక్ష్మీనారాయణలనే పిలుస్తాం. ఒక వామనమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయింది ఏమంటాం లక్ష్మీనారాణలనే, ఒక పరుశురాముడు లక్ష్మీనారాయణులే, ఒక మత్సావతారం లక్ష్మీనారాయణులే.
ఒక్క సీతా రామావతారంలో మాత్రమే యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములనే పిలుస్తాము. భార్యా భర్తలు ఏలా బ్రతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం. అన్నదమ్ములలో అన్నదమ్ములెలా బ్రతకాలో నేర్పినది రామావతారం, తండ్రీ కొడుకులు ఎలా బ్రతకాలో నేర్పిన అవతారం రామావతారం, ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. చిట్ట చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్నా రాజారాముడుగా సింహాసనం మీద కూర్చోవలసివస్తే ప్రజల్ని కన్న బిడ్డల్లా పరిపాలించ గలిగినటువంటి, ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంతరించుకొన గలిగినటువంటి స్థితిని పొందినటువంటి అవతారం రామావతారం. మీకు జీవితంలో అనుష్టాన పర్యంతంలో ఎక్కడ ఏవిషయం గురించి అనుమానమొచ్చినా "మీకు రామాయణం జీర్ణమైతే" మీకు వెంటనే శ్రీరామాయణం జ్ఞాపకానికి వస్తుంది. అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు జ్ఞాపకమొస్తుంది. రామాయణం మీకు జీర్ణమైతే మీ భాషతీరు మారిపోతుంది. "రామాయణం మీకు జీర్ణమైతే మాట ఎంత గొప్పదో మీకు అర్థమౌతుంది."


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
నేనందుకే మీకు మనవి చేశాను, రామాయణాన్ని రామాయణంగా చదవకండి అని, రామాయణం జోతిష్య శాస్త్రం, రామాయణం వాస్తు శాస్త్రం, రామాయణం ధర్మ శాస్త్రం, రామాయణం వాక్కు, రామాయణం ధర్మ పరిపాలన, రామాయణం న్యాయం, రామాయణం సామాజిక శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం పర్యావరణం, రామాయణం గురు భక్తి, రామాయణం శిష్య ధర్మం మీ ఇష్టం రామాయణం ఎలా చదవండి అలా వస్తుంది. మీకిచ్చినది మట్టిముద్ద మీరు దాంతో మూకుడు చేసుకుంటారో, పళ్ళెం చేసుకొంటారో, ప్రమిద చేసుకుంటారో, గిన్నె చేసుకుంటారో, గరిట చేసుకుంటారో మీ ఇష్టం. రామాయణాన్ని మీరు ఎలా చూడలనుకొంటే మీకు అలా కనబడుతుంది. శ్రీరామాయణానికున్న గొప్పతనమేమిటంటే వాల్మీకి మహర్షి ఎవ్వరికీ కూడా కితాబులివ్వరు. రావణాసురుడు దుష్టుడని వాల్మీకి మహర్షి అనరు వాల్మీకి మహర్షి చెప్పేది "ఇలా చేశాడని చెప్తాడు."
తెల్లవారగట్ల లేచాడు పరి స్త్రీ పట్ల కామంతో మనసు కలిగింది. నీకు నచ్చి - నీవు కూడా అలా ఉండాలనుకొంటే నీ ఇష్టం, నీ తల కూడా తెగిపోతుంది. నీవు కూడా పుత్ర మిత్ర కళత్రాదులచే భంగపాటు పొందుతావు. రాముడు నిద్రలేస్తూనే నదీ స్తానం  చేసి సంధ్యావందనం చేస్తాడు. నీవు రాముడిలా ఉండాలనుకొంటే ఏడు తరాలు తరిస్తాయి. నీకు ఏది కావాలో నివ్వే నిర్ణయించుకో రాముడు గొప్పవాడనీ చెప్పరు, రావణుడు తప్పువాడని చెప్పడు. నువ్వు ఏది తెలుసుకోవాలో అది నీవు తెలుసుకొని అనుష్టించాలి, అది శ్రీరామాయణం యొక్క గొప్పనతం. అంత గొప్ప అవతారంలో రాముడు ఎప్పుడు మాట్లాడిన ఋషి వాక్కును సమర్థిస్తాడు, రాముడు ఎప్పుడు మాట్లాడినా వేద వాక్కును సమర్థిస్తాడు, రాముడు ఎప్పుడు మాట్లాడినా ధర్మమును సమర్థిస్తాడు, ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి.
మనం శ్రీరామాయణం వింటున్నది శృంగగిరి పీఠంలో వింటున్నాం, అదేమిటండీ పీఠం శాఖ కదా! అని మీరు అనచ్చు "ఆత్మావై పుత్రనామాసి" కొడుక్కి తండ్రికీ అభేదం, బింబానికి బింబం ఎందులోంచి వచ్చిందో ఆబింబం వచ్చినటువంటి లేదా  ప్రతి బింబం పుట్టిన బింబం రెండూ ఒక్కటే. అద్దం ముందు నిలబడితే నా ప్రతి బింబం కనబడితే ఆ ప్రతి బింబం బొట్టు పెట్టుకోలేదనుకోండి దిక్కుమాలిన ప్రతి బింబమా బొట్టు పెట్టుకోవద్దా తప్పుగదా అని ప్రతి బింబానికి బొట్టుపెడితే నాకు బొట్టు వస్తుందా, బింబానికి బొట్టు పెట్టుకుంటే ప్రతి బింబానికి బొట్టు వస్తుంది. బింబానికి ప్రతి బింబానికి, తండ్రికి కొడుక్కి, గురువుకి శిష్యుడికి అభేదం అయితే గుంటూరు శృంగగిరి శాఖకీ ఎక్కడో కర్ణ్నాటక రాష్ట్రాంలో ఉన్నశృంగగిరి పీఠానికి నా దృష్టిలో అభేదం.
శృంగగిరి పీఠంలో కూర్చొని శ్రీరామాయణం ప్రవచం చేయవలసి వస్తే నేను ఒక మాట చెప్పకుండా రామాయణాన్ని ప్రారంభం చేస్తే నేను ఒక పొరపాటును చేసినవాడినౌతాను. ఇన్ని పీఠాలను స్థాపించినటువంటి శంకర భగవత్ పాదుల  అవతార పరి సమాప్తి చేస్తూ ఒక మాట చెప్పారు. "వేదోనిద్య మదీయతాం సదువితం స్వకర్మ స్వనీష్ఠీయతాం" ప్రతిరోజు వేదం చదువుకో నీవు చేసే ఏ కర్మ అయినా వేదం ఎలా చెప్పిందో అలాగే చేయి అంతేకాని నీ స్వంత బుద్దితో ఏపనిని చేయవద్దు "వేదోనిద్య మదీయతాం సదువితం స్వకర్మ స్వీష్టీయతాం దుష్టకాష్టువిర్యంతాం " ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదాని నీ చిత్తము వచ్చినట్లుగా వాదము చేయవద్దు నువ్వు ఏది మాట్లాడినా "సృతిస్థిరపక్షీ స్వనీష్టీయతాం" ఉపనిషత్తులు ఏం చెప్పాయో, వేదమేంచెప్పిందో దాన్ని సమర్థించడానికి నీ వాక్బలాన్ని ఉపయోగించు. అంతేకాని ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడుకదాని నీ ఇష్టమొచ్చినట్లు నీవు మాట్లాడితే చూడలేదు లెక్క కట్టుకోలేదు అని నీవు అనుకోవద్దు.  లెక్క కట్టేవాడు ఒకడు ఉన్నాడు.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
మీరు చూడండి 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశులలో 8399999 జీవరాశులకు వాక్కు లేదు. ఒక్క నర జన్మకే వాక్కు ఉంది. మళ్ళీ ఈ నర జన్మలో కొంతమంది మాత్రమే మాట చెప్పగలరు కొంతమంది నరునిగా జన్మించినా నోరువిప్పి రామా అని గట్టిగా అనరా అంటే రామా అనలేరు. అది వారి దురదృష్టం కాని మనం భగవన్ నామమును పలుకగలము, భగవన్ నామమును పలికి తరించగలిగినటువంటి భాగ్యము మనకుంది. హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనీధీ! అని వేడుకున్నాడు పోతరాజుగారు. నాకు ఏమీ అక్కరలేదయ్యా స్వామీ నీ నామం నా నాలుక మీద నర్తింపజేయవయ్యాచాలు అన్నాడు. పవి పుష్పంబగు, నగ్ని మంచగు, నాకూపారంబు భూమిస్థలం బవు, శత్రుండతి మిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెన్నగా నవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాష ణోల్లాసికిన్ శివ! నీ నామము సర్వవశ్య కరుమౌ ! శ్రీకాళహస్తీశ్వరా! నాకు నీ శివ నామం నాలుక మీద నర్తించాలని కోరుకున్నాడు ధూర్జటి. భగవన్ నామము చెప్పుకుంటే చాలని ఆ నామం ఉన్నందుకు వెంపర్లాడారు అంత్యకాలమనుందు - నాయాసమున నిన్ను దలతునో తలపనో - తలతు నిపుడె నరసింహ! నరసింహ! - నరసింహ! లక్ష్మీశ! దానవాంతక! కోటి - భానుతేజ! గోవింద! గోవింద! - గోవింద! సర్వేశ! పన్నగాధిపశాయి! - పద్మనాభ! మధువైరి! మధువైరి! - మధువైరి! లోకేశ! నీలమేఘశరీర! నిగమవినుతఅని రెండు చేతులెత్తి నమస్కారం చేసి చిట్టచివర ప్రాణం పోయేటప్పుడు ఆవేళ యమదూత - లాగ్రహంబు వచ్చి ప్రాణముల్ పెకలించి - పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్చవమంది- కష్టపడుచు నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు బిలుతునో శ్రమచేత బిలువలేనో! తే, నాటికిప్పుడె భక్తి నీ - నామ భజన తలచెదను జెవిని వినవయ్య - ధైర్యముగను భూషణ వికాస! శ్రీధర్మ - పుర నివాస! దుష్టసంహార! నరసింహ ! దురితదూర! అని గుండెలు బాదుకున్నాడు నరసింహ శతక కర్త. ఆ భగవన్ నామము పలికేటటువంటి భాగ్యమున్న ఏకైక ప్రాణి సృష్టిలో కేవలం మష్యుడే అటువంటి మనుష్యుడికి ఇచ్చినటువంటి అధనపు వరం భగవత్ కథా శ్రవణం.
ఈశ్వరుని కథా వినగలడు ఆ ఈశ్వర కథ వింటేనే సమస్త సంసార - భ్రమణ - పరితాపోపశమనం అంటారు శంకరభగవత్పాదులు. గలంతీ శంభో త్వచ్ఛరిత - సరితః కిల్బిషరజో దలంతీ ధీకుల్యా - సరణిషు పతంతీ విజయతామ్ దిశంతీ సంసార - భ్రమణ - పరితాపోపశమనం వసంతీ మచ్ఛేతో - హృదభువి శివానంద - లహరీ! సంసార భ్రమణ పరితాపోపశమనం భగవంతుని యొక్క కథా శ్రవనము చేసి నోటితో జుర్రుకున్నటువంటి పదార్ధాలు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ దేహాన్ని పోసిస్తే. భగవంతుని యొక్క కథను చెవులతో జుర్రుకున్నటివాడు మళ్ళీ పుట్టవలసిన అవరము లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం! ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే!! ఆని భగవన్ నామామృతాన్ని చెవులలోనుంచి లోపలికి జుర్రుకున్నటువంటివాడు పునావృత్తిరహిత శాశ్వత శివ సాయిద్య స్థితిని పొందగడు.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
ఇటువంటి భాగ్యం కలిగినటుంటి ప్రాణి మనుష్యునిది ఆ మనుష్యుని యొక్క జీవితం ఎంత గొప్పదో అసలు నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించినటువంటి అవతారం రామావతారం. నరుడిగా జన్మించి రామ కథ వినకపోతే రాముని యొక్క గొప్పతనాన్ని వినకపోతే రాముడు మనకు చేసిన మహోపకారమేమిటో తెలుసుకొని కృతజ్ఞత ఆవిష్కరించకపోతే అంతకన్నా కృతఘ్నిడివి వెరొకరుండరు. నేనీ మాట ఎందుకంటున్నానో తెలుసాండి, రావణాసురుడు వరాలు కోరుకున్నాడు బ్రహ్మగార్ని, అందర్ని అడిగాడు ఒక్క నరవార్లని వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టావని బ్రహ్మగారు అడగలేదు. తానే చెప్పుకున్నాడు ఇంత మంది గురించి అడిగాను, నరవానరముల గురించి నాకు లెక్కెమిటి వాళ్లోక లెక్కలోకి వస్తారా? నేనసలు వాళ్ళ పేరెత్తను, అంటే నరునకు ఉన్నటువంటి విలువ ఏపాటిదో మీరర్థం చేసుకోవాలి. రావణాసురుడున్నకాలంలోనేగా రాముడూ ఉన్నాడు! రావణాసుర కాలంనాటికి నరుడికి ఉన్న విలువ నరుడికి ఉన్న గౌరవం అంత గొప్పది. ఆయన రాక్షసుడండీ... ఏదైనా మాట్లాడుతాడు, మీరెందుకు గుండెలు బాదుకుంటారు! అని అనచ్చు. జనక మహా రాజు మహాజ్ఞానిగా అంతటి మహాజ్ఞాని అయినటువంటి జనకుడు ఎదర వస్తుందిగా... సీతారామ కళ్యాణము అంతటివాడు ఆయనన్నాడు "మనుష్యుడు రాముడు ఆయనేమి ఎత్తుతాడు ఈ శివ ధనుస్సు" అన్నాడు.
మనుష్య జన్మ అంటే అంత చులకనాగా చూడబడినటువంటి రోజులల్లో, నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపించాడు. అందుకే ఆయన అవతార పరిసమాప్తి చేయాలంటే రావణ సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేయవచ్చు కాని ఆయన అలా చేయలేదు, ప్రతిజ్ఞచేశారు దశవర్ష సహస్త్రాణి, దశవర్ష శతానిశా నేను పదుకొండువేల సంవత్సరములు ఈ భూ మండలం మీద నడుస్తాను అన్నాడు. దేనికొరకు అంటే పదకొండువేల సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉండి, భార్యా సహితుడునై, బిడ్డల్నిని కని, ధర్మాన్ని అనుష్టించి ఒక నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపిస్తానన్నాడు రాముడు. అటువంటి నరుడి కథయైనటువంటి రామ కథ వినకపోతే రామునికి కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే, మనసారా రామ నామం చెప్పకపోతే, రామ చంద్ర మూర్తికి నమస్కరించకపోతే  ఆ జన్మ వృథా అయిపోయినటువంటి జన్మ.
అంతటి మహాత్ముడు రామ చంద్ర మూర్తి కాబట్టి  "వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే! వేదః ప్రాచేతసా దాసిత్ సాక్షాద్రామాయణాత్మనా!!" వేదము వేదోప బృంహ్మణమై రామాయణ కథగా భూ లోకంలో వచ్చింది. ఆ వేదము ఈశ్వరునియొక్క శ్వాస, ఈ వేదము వాల్మీకిగిరి సంభూత. వాల్మీకి అనబడేటటువంటి పర్వతములోనుంచి పుట్టినటువంటి ఒక జీవనది. వేదంలోకి మనం వెళ్ళి స్నానం చేయాలి, మనం వెళ్ళి దర్శనం చేయ్యాలిరామాయణం ప్రవహించి ఇంటింటి ముందునుంచి వెళ్ళిపోయినటువంటి గంగలాంటిది దక్షిణామూర్తి వేదం, శంకరాచార్యుల వారు రామాయణం, దక్షణామూర్తి ఎక్కడో ఒక్కచోట కూర్చొని ఉంటారు. సనకసనందనాదులు కూడా ఆయన కూర్చున్న చోటుకే వెళ్ళి నమస్కారం చేసి జ్ఞానోప లబ్ధిపొందాలి. శంకరాచార్యులవారు అలా కాదు  శంభోర్మూర్థి శరధిభూవనే శంకరాచార్య రూపా ఆ దక్షణామూర్తి మౌనం విడిచి పెట్టి ఆసేతు హిమాచలపర్యంతం పాదచారియై మూడు పర్యాయములు పర్యటించి, వేద విరుద్ధములైన వాదములను ఖండించి, మళ్ళీ వేదవిరుద్ధమైన వాదనలు ఈ భారత దేశములో ప్రవేశించకుండా కాపు పెట్టాలన్న ఉద్దేశ్యముతో తూర్పున జగన్నాథలో గోవర్థన పీఠము, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతి పీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నాలుగుచోట్ల నాలుగు పీఠములను కాపుపెట్టి గురు పరంపరను నిరంతరము కొనసాగేటట్టుగా మనను అనుగ్రహించి వేద విరుద్దములైన వాదనలను భారతదేశంలో ప్రవేశించకుండా రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి శంకరభగవత్పాదులు తానే ఆసేతు హిమాచలం పర్యటించి ప్రతి ఇంటిముందుకొచ్చి జ్ఞానబోధ చేసినట్లు రామాయణం అనేటటువంటి గంగా వాల్మీకి ఝరి సంభూతయై వాడ వాడలా ప్రవహించింది.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
రామ నామం రామ కథా తెలియని వాడు లోకంలో ఉండడు. ఏదైనా తెలియదేమో రామ కథా తెలియనివాడు రామ నామం తెలియనివాడు ఈ లోకంలో ఉండడు. మంచికైనా రామ నామం చెడుకైనా రామ నామం ఏమయ్యా అంతపని చేశావా రామ రామ అని అంటారు కదండీ, ఏదైనా చూడకూడనిది చూస్తే రామ రామ ఇలాంటిది చూశానేమండీ అంటాడు, ఏదైనా మంచి జరిగితే రామ రామ ఎంత మంచి మాట విన్నా ఇవ్వాల అంటారు. భారతీయ సంస్కృతిలో రామ నామం మమేకమైపోయింది. అటువంటి రామాయణం, అటువంటి రామ నామం ధర్మానికి ఆలవాలము. ధర్మాన్ని వ్యతిరేకించడం కన్నా ఘోరమైన పాపం లోకంలో ఇంకోటి ఉండదు. ఈవాల్టిరోజున రామాయణం యొక్క ఆవశ్యకత మరీ ఎక్కువ, ఎందుకు ఎక్కువో తెలుసాండీ, ఒకానొకప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే చాలా దోషం అటువంటిది ఈవ్వాళ ఏస్థితికి వచ్చేసిందంటే ధర్మాన్ని ధర్మము అని పేరుపెట్టి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదని ధర్మానికి ఇంకొక పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడే రోజులొచ్చాయి.
ఒకడు ఆవుని చంపేయలనుకుంటాడు, ఆవుని చంపేయండి అంటే మిగిలినవాళ్ళు బుద్దుందా లేదా అంటారు, అందుకని ఆవుని ఇంకొక క్రూర మృగం పేరు పెట్టి పిలిచి చంపేయమన్నాడువాడు, ఎంతటి గడుసరితంనం చూడండీ. పులిని చంపేయండి అన్నాడు, పులిని చంపేయండి అంటే చూడనివాడు ఏమనుకుంటాడు పులిని చంపేస్తే తప్పేముంది, వచ్చి ఊళ్ళ మీద పడిపోతాదనుకుంటాడు. అది పాముని చంపేయండి అన్నాడు. విన్నవాడు పాము అనుకున్నాడు, కాని అది ఆవు, ఆవుని చూపించి పాముని చంపేయ్ అంటాడు, వాడికి తెలియదా ఇది ఆవు అని తెలుసు. మరి ఆవుని చంపేయండని ఎందుకనడు. అంటే ఆవుని చంపేయండి అంటే ఆవుని చంపేయడమేమిట్రా అంటారని పాముని చంపేయండి అన్నాడు తెలిసి. ధర్మాన్ని ఆచరించకండి అంటే జనం తిరగబడతారని మూఢవిశ్వాల జ్యోలికెల్లకండి అంటున్నారు,  పేరు మార్చారు.
కానీ వ్యవస్థని ధర్మానికి దూరం చేస్తున్నారు. ఆ స్థితినుంచి మనం రక్షించబడాలంటే మనకున్న ఆధారమొక్కటే శ్రీరామాయణాన్ని వినాలి. శ్రీరామాయణాన్ని బాగా తెలుసుకోవాలి. శ్రీరామాయణాన్ని తరచి తరచి గమనించాలి. రామాయణం మనకు తెలుసున్న రామ కథే కదా అని అనుకోకండినేను మీకు యదార్థం మనవిజేస్తున్నాను. మీరు రామాయణాన్ని ఎన్నిమార్లు చదవండీ, ఎన్నిమార్లు వినండీ, మీకు రామాయణం కొత్త కోణంలో ప్రకాశిస్తుంది. రామాయణం కొత్త కోణంలో భాషిస్తుంది అంత గొప్ప రామాయణం. సరే నీవు చెప్పేది రామాయణం కదా రామాయణం గురించి ఎందుకు అంతసేపు చెప్తావ్, మేమేదైనా వింటాంకదా రామాయం, అసలు నీవు రామాయణ ప్రారంభం చేయ్ అని మీరు అంటారని నాకు తెలుసు శ్రీరామాయణ ప్రారంభం ఎక్కడ జరిగింది.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
అంటే తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్! నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ర్ముని పుజ్గవమ్!! అన్నారు, అంటే ఒకానొకనాడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్నారు నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వస్తే, వచ్చిన నారద మహర్షి ఎటువంటివారో చెప్తున్నారు మొదట, ఏదో నారదుడొచ్చారు వాల్మీకి అడిగారు అది కాదు ఆ శ్లోకం, మీరా శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎటువంటి నారదుడు, ఎటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట,  తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్! నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ర్ముని పుజ్గవమ్!! ఈ శ్లోకం చెప్పేముందు మీకొక మాట మనవి చెయ్యాలి.
వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదడు వచ్చి సంక్షేప రామాయణాన్ని చెప్పిన తరువాత కదా రామాయణం ప్రచారంలోకి వచ్చింది. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చిన తరువాత రామాయణాన్ని ఎవరికి నేర్పారు. ఆయన రచన చేసి. మొట్టమొదట ఎవరికి నేర్పి ఉండాలి, ప్రవాహము అంటే ఎవరిద్వారానో వెళ్ళాలిగదా, మొట్ట మొదట లోకంలో దానిని ప్రచారం ఎవరితో ప్రారంభమయింది. వాల్మీకి రామాయణ రచనచేసి ఎవరికి నేర్పారు, వాల్మీకి రామాయణం రచన చెయ్యగానే నేర్పిన మొట్టమొదట శిష్యులు లవకుశులు. లవకుశులకు మొట్ట మొదట రామాయణం నేర్పుంటే, సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉందాలేదా, ఉంది, వాల్మీకి ఆశ్రమంలోకి సీతమ్మ వచ్చి లవకుశులు పెద్దవాల్లై  గురువుగారి దగ్గర శ్రీరామాయణాన్ని ఉపదేశం పొందడానికి యోగ్యమైనంత వయసు వచ్చేసిన తరువాత నారద మహర్షి వచ్చాడు. వచ్చి సంక్షేప రామాయణాన్ని చెప్పాడు. అప్పటివరకు రామాయణం లేదు లోకంలో అంతే. తరువాత కదా వాల్మీకి రచించాడు సంక్షేప రామాయణం విన్నతరువాత, కాబట్టి ఇప్పుడూ రామాయణ కథ ఏస్థాయిలో ఉంది. ఏ స్థితికి దగ్గర ఉంది రామాయణ రచన మొదలయ్యేటప్పటికి, రామాయణం పూర్తైపోయే స్థితిలో ఉంది, రామాయణం పూర్తైపోయైపోయే స్థితిలో రామాయణ రచన ప్రారంభమయింది.
ఇది మీరు గమనించాలి, రామ చంద్రమూర్తి పుట్టకముందు రామాయణాన్ని రచించలేదు వాల్మీకి, రామ చంద్ర మూర్తి పట్టాభిషేకానికి పూర్వం రామాయణ రచన జరగలేదు, రామాయణ రచన ఎప్పుడు జరిగినట్టు రామ చంద్ర మూర్తి పట్టాభిషేకం చేసుకొని, సీతమ్మ తల్లిని అడవులలో విడిచిపెట్టి, అడవులలో ఉన్న సీతమ్మని వాల్మీకి మహర్షి తన కుటీరానికి తీసుకెళ్ళి, లవకుశులు జన్మించి వారు పెరిగి పెద్దవాల్లై యోగ్యులై  విద్యాభ్యాసముచేసి, సంగీతవిద్యలో మంచి నిష్నాతులై వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని భోధచేసి నేర్చుకొని లోకంలో ప్రచారం చెయ్యగలిగినంత వయస్సు వాళ్ళకి వచ్చిన తరువాత నారద మహర్షి వచ్చాడు. అలా ఎందుకు జరగాలి, అంటే వచ్చినటువంటి మహానుభావుడు రామ చంద్ర మూర్తిగా వచ్చాడు, మనుష్యుడుగా నడిచి  చూపించేశాడు అప్పటికే, పదకొండువేల సంవత్సరాలు ఇంచుమించు పూర్తైపోతున్నాయి. జరిగిన కథ జరిగిపోయింది. జరిగిన కథ జరిగిపోయన తరువాత ఇప్పడు వచ్చాడు నారదుడు, జరిగిపోయిన కథలో అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం రామాయణంలో, అడుగుతీసి అడుగు వేస్తే ఎంత కథ చెప్పాలండి నారదడు వాల్మీకి మహర్షికి, రాముడు పుట్టుక ముందు దగ్గర్నుంచీ, చాలా కష్టపడీ రాముడు ఇలా మాట్లాడాడు, రాముడు అలా మాట్లాడాడు, సీతమ్మ రాముని దగ్గరకు ఇలా వెళ్లింది, దశరథ మహారాజు దగ్గరకు రాముడు ఇలా వెళ్ళాడు. రాముడు కౌశల్య దగ్గరకు ఇలా వెళ్లాడు, రాముడితో ఇలా మాట్లాడాడు ఇవన్ని నారదుడు చెప్పాలి. నారదుడు ఎలా చెప్పగలడు? చెప్పగలడు. సర్వజ్ఞుడు మహానుభావుడు, గురు శ్వరూపం కాబట్టి చెప్పగలడు. కాని అలా చెప్తూవెల్తే రామాయణం ఎవరు చెప్పినట్టవుతుంది. నారదుడు చెప్పింది వాల్మీకి రాసింది. మరి  వాల్మీకి రామాయణ రచనచేశారని మనం ఎలా చెప్పగలం, ఒకటే కారణం సంక్షేప రామాయణమే నారదుడు చెప్పాడు.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
కేవలం ఒక నూరు శ్లోకాల దగ్గర్లో రామ కథని ఒక్కసారి అల చిన్న మాల కింద అల్లి చెప్పి పోయాడంతే, మిగిలిన రామ కథ రాముడు ఎలా కదిలాడో ఎలా అడుగేశాడో ఎలా నడిచాడో ఎలా మాట్లాడాడో ఇవన్నీ వాల్మీకి మహర్షికి కనపడ్డాయి ఎప్పుడు? అయిపోయాక కదండీ..!, రాముడు పుట్టేశాక రాముడు మాట్లాడాక రాముడు పెళ్ళైపోయాక రాముడు యుద్దం చేశాక రాముడు అప్పుడు సితమ్మతో అతఃపురంలో ఇలా మాట్లాడాడని వాల్మీకి తెలిసింది. ఎలా తెలిసింది, రెండు కారణాలతో తెలియాలి రాముడు చెప్పాలి, రెండు వాల్మీకి ఊహచేయాలి,  రాముడు చెప్తే... అన్నీ అలా ఏకాంతంలో తాను సీతమ్మతో మాట్లాడినవి కూడా చెప్తాడా, ఆ మర్యాద పురుశోత్తముడైనవాడు, రెండు ఊహచేస్తే ఊహ నిజం కావాలని ఎక్కడుంది, అప్పుడు రామాయణం ʻవేదోప బృంహణంగాʼ ప్రమాణంగా ఎలా స్వీకరించి చెప్పుకొంటున్నారు ఈవాల్టికీనీ, కాబట్టి ఆ రెండింటికి మధ్యలో ఏదో ఉండి ఉండాలి ఇది మీరు నమ్మాలంటే గదా, ఇప్పుడు చెప్పండి రామాయణం ఓ కొత్త కోణంలో మీరు వినవలసి అవసరం ఉందాలేదా కదా ప్రారంభంలోనే.
కాబట్టి నారదుడు వచ్చాడు వాల్మీకికి చెప్పాడు అంతేవినకండీ, ఎటువంటి నారదుడు వచ్చాడు ఎటువంటి వాల్మీకికి చెప్తున్నాడు అసలు, ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాల్మీకి మహర్షి, అంటే సీతమ్మ తల్లి ఆయన ఆశ్రమంలో ఉంది, సీతమ్మ తల్లి ఊరట పొందడానికి కావలసిన వాతావరణం ఆ ఆశ్రమంలో ఉంది ఆయన నిరంతరము కూడా తపశ్వియై ఉన్నాడు. తపశ్వి అంటే కృత్యచాంద్రాయణనాది వ్రతములు చేసేవాడు, శుక్లపక్షంలో తిథులు పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ద పెంచుకొంటూ వెడుతారు, పౌర్ణమికి పూర్తిగా భోజనం చేస్తారు. బహుళ పక్షంలో ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ ఆమావాశ్య వచ్చేటప్పటికి పూర్ణంగా ఆహారము విడిచిపెట్టేస్తారు. ఇలా విడిచిపెట్టీ... నిరంతరమూ వేదము చదువుకొంటూ వేదముచేత ప్రతిపాదించబడిన పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడే అనుభనుభవంలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తారు. అహం బ్రంహాస్మి అదికదాండీ, శృంగగిరి పీఠానికి మహా వాక్యము అహం బ్రంహ్మాస్మి నేనే ఈశ్వరుడుని అన్న వాక్యాన్ని అనువపూర్వకం చేసుకోవాలి దానికీ వ్రతమంతా కర్మాచరణం, ఇప్పుడీ కర్మాచరణం అంతాచేసి తపిస్తున్న వాల్మీకి దేనిని గురించి తపిస్తున్నారు. బ్రహ్మముగా తనను తాను తెలుసుకొనుట కొరకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు యోగ్యమైన కాలం సిద్దించింది. యోగ్యమైన కాలం సిద్దిస్తే ఉపదేశం చేయడానికి ఎవరు రావాలి?, గురువుగారు రావాలి, గురువుగారి కన్నా మంగళ స్వరూపం ఈ లోకంలో ఉంటుందా ఇంకుండదు. అన్నిటికన్నా మంగళ స్వరూపం ఏదంటే గురువుగారే. గురువుగారి కన్నా గొప్పవాడు, గురువుగారి కన్నా అధికుడు లోకంలో ఉండరు నగురో రధికం నగురో రధికం నగురో రధికం నగురో రధికం శ్శివశాసనాత శ్శివశాసనాత శ్శివశాసనాత శ్శివశాసనాత గురువు కన్న అధికుడు ఇంక ఈ లోకంలో లేడు. మరి ఈశ్వరుడండీ! మీకో అనుమానం రావచ్చు ఈశ్వరుడి కన్న అధికుడు గురువే, ఎందువల్ల? అసలు గురువులేకపోతే ఈశ్వరిడి యొక్క అస్థిత్వం ప్రకటనం కాదు.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
సరికదా మీకొకమాటలో చెప్పాలంటే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్ర శేఖర భారతీ స్వామి వారి దగ్గర ఒక వ్యక్తి వెళ్ళి అన్నాడు, నాదగ్గర ఒకటికన్నా ఎక్కువ మంత్రాలు ఉపదేశం పొందినవి ఉన్నాయి. నేనొక మంత్రానికి ధ్యాన శ్లోకం చేసి మంత్రాన్ని అనుష్టిస్తుంటే, ఇంకో మంత్రం యొక్క ధ్యాన శ్లోకంలో స్వరూపం కనబడుతోంది, నన్నేం చేయమంటారు అని అడిగాడు. ఆయన అన్నారూ... మీకు ఉపదేశం చేసినటువంటి గురువుగారి పాదాలు మీకు కనపడుతుంటాయా, అయ్యో! నాకు చాలా ఇష్టమండి మా గురువుగారి పాదాలు నాకు బాగా జ్ఞాపకం. ఏమంత్రం చేసిన నీవు నీ గురువుగారి పాదాలు చూడు. అలా ఎలా కుదురుతుందండి అన్నారాయన! ఆ ధ్యానశ్లోకంలో ఆ రూపంలోకదా చూడాలి  ఏ మంత్రం  గురువుగారి పాదాలు ఎలా చూస్తావ్?, గురుర్బ్రహ్మా గురుర్విష్టుః గురర్దేవో మహేశ్వరః  గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఇక గురువుగారి పాదాలే ఆ దేవతలన్నీ, కాబట్టి గురువుగారి పాదాలు చూస్తూ నువ్వు ఏమంత్రం చెప్పినా ఆ మంత్రం సిద్దిస్తుంది. అయినప్పుడూ ఇప్పుడు గురుదర్శనమే మంగళకరమైనటువంటి దర్శనము, నారదుని యొక్క దర్శనము, నారదుని యొక్క పేరెత్తడం కన్నా గొప్పతం ఇంకోట్లేదు.
కాబట్టి ఇప్పడు రామాయణం ప్రారంభమైంది దేనితో ప్రారంభమైంది, గురువుగారి దర్శనంతో ప్రారంభమైంది, నారద మహర్షి దర్శనం గురువు యొక్క దర్శనం. ఎవరికి వాల్మీకికి రామాయణాన్ని నమ్ముకున్న జాతికి ప్రతినిధి, మనకేదర్శనంతో ప్రారంభమైందీ జగద్గురు దర్శనంతో మనకు ప్రారంభమైంది... కాబట్టి ఇప్పుడు ఎవరొచ్చారు? ఆ వచ్చినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి రాలేదు నారదుడు. ఆ వచ్చినటువంటివారు మహానుభావుడై తపస్స్వాధ్యాయనిరతం నిరంతరము తపస్సు చేసినటువంటివారు, మీతో ఒక మాట మనవి చేశాను తపస్సంటేఈ వ్రతమును ఆచరిస్తూ నిత్యనైమిక్తికకర్మలను వైక్ల్యవం లేకుండా అనుష్టించేటటువంటివారు నిత్య కర్మా అని ఒకటుంటుంది అది ఎప్పుడూ మానడానికి వీల్లేదు, సంధ్యావదనం ఉందనుకోండి అది ఎప్పడూ మానకూడదు. నైమిక్తికకర్మ ఉంది ఒక్కొక్క తిథినాడు ఒక్కొక్కటి చేయవలసి ఉంటుంది. శ్రీరామనవమి వచ్చిందనుకోండి ఎం చేయాలి?, శ్రీరామ నవమినాడు ఉదయం నుంచి రాత్రివరకు శ్రీరామ జయరామ జయజయ రామ అన్న పదమూడు అక్షరాల మంత్రాన్ని రాత్రివరకు చేసీ... రాత్రికి ప్రదక్షణం చేసి ఉపవాసం చేసి మరునాడు ఉదయం ఎక్కడ మీరు ఈ మంత్రం చెప్పారో అక్కడకు వచ్చి అక్కడికి వచ్చిన తరువాత ʻశ్రీ రామ పట్టాభిషేకం సర్గ శ్రీరామావతారం సర్గʼ ఈ రెండు సర్గలు పారాయణం చేయాలి. ఈ రెండు పారాయణం చేసి మొన్న శ్రీరామ నవమినాడు మేము ఈ పారాయణం కాకినాడలో అయ్యప్పస్వామి దేవాలయంలో చేశాము అవి. ఈ రెండు సర్గలు పారాయణం చేసి తదనంతరం ముందు పేదలకు అన్నదానం నారాయణ సేవగా చేసి, తరువాత తాను ఆహారంగా స్వీకరించాలి. అది శ్రీరామ నవమినాడు చేయవలసినటువంటి విధానం. దీనిని నైమిక్తికతిథి ఆచరణం అంటారు. ఒక్కొక్క తిథి ఒక్కొక్కలా చేయాలి, నిత్యకర్మ చేస్తూ నైమిక్తిక తిథులను చేస్తూ, కృత్యచాంద్రాయనాది వ్రతములను చేస్తూ,  ఎప్పుడూ వేదాన్ని అలా చదువుకుంటూ వేదము చెప్పినటువంటి హృయాన్ని, వేదము చెప్పినటువంటి మంత్రములలో ఉన్న సారమును అవగతం చేసుకొనీ బ్రహ్మమునీ అనుభవంలోకి తెచ్చుకొనేటటువంటి ప్రయత్నమును చెయ్యడానికి ఉపకరణంగా ఈ శరీరాన్ని వాడుకుంటుంన్నవారు.
ఎంత తేడా ఉందో మీరు గమనించాలి - మనమేం చేస్తామంటే, ఈ శరీరాన్ని పోషించి, ఈ శరీరమువలన ఎన్ని సుఖములను పొందవచ్చో అన్ని సుఖములను పొందడానికి సాధనగా దీన్ని వాడుతాం. ఇది ఎందుకూ అంటే, దీంతో అబ్బో ఎన్ని రుచులు చూస్తాడో, దీనికి ఎన్ని స్పర్శ సుఖాలిస్తాడో, దీంతో ఎన్ని వినకూడనివి వింటాడో, దీంతో ఎన్ని పీల్చకూడనివి పీలుస్తాడోవాల్లేం చేస్తారంటే దీన్ని సాధనంగా చేసుకొని దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ దీన్ని అడ్డుపెట్టుకుని దీని ద్వారా దేన్ని తెలుసుకొన్న తరువాత ఇది పడిపోయినా ఫర్వాలేదు అది తెలుసుకోవడానికి ఉపకరణంగా దీన్ని వాడుకుంటారు. ఏమిటో నువ్వు అలా అన్నావుగానీ!.. ఆ మాట స్ఫష్టంగా లేదని మీరు అంటారని నాకు తెలుసు.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
భగవాన్ రమణుల మాటలలో చెప్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనన్న మాటకీ తెలుసుకో వలసినది తెలుసుకొనేంతవరకు దీన్ని ఉపకరణంగా వాడుకోవడం అంటే ఏమిటని అడిగారు రమణమహర్షిని, ఆయన అన్నారూ... "భోజనం చేశాక విస్తర అవతల పారెయ్యడమే" అని అన్నారు. విస్తర్ని ఏం చెస్తారండీ, బాదమాకుల్ని తెచ్చీ, చీపురు పుల్లల్ని తెచ్చి, సన్నగా చీల్చీ, ముక్కలు చేసి, అన్నం తినేటప్పుడు ఊడిపోయి అన్నంలో కలసిపోకుండా, జాగ్రత్తగా కుట్టీ, ఆకు తెచ్చి వేసుకొని నీళ్ళు జల్లీ, తుడిచి, పదార్థాలు వేసుకొని అన్నమంతా తినీ ఉత్తరాపోషణం పట్టిన తరువాత అప్పుడు తీసుకెళ్లి ఆకును కుండీలో పెంటకుప్ప మీద పడేస్తారు. అంతేకాని ఆకు పుట్టిందెందుకూ, కుట్టిందెందుకనీ అంటే, చివరకు పెంటకుప్పమీద పడేయ్యండీ అంటే పడేస్తారా, దేనికి వాడుకోవాలో దానికి జాగ్రత్తగా వాడుకొని ఆ ప్రయోజనము అయిపోయిన తరువాత పెంటకుప్ప మీద విస్తరాకు పడేసినట్టు, దీన్ని సాధనంగా చేసుకొని దీనిలో ఉండి దీనితో తరించి దీనిలో ఉండి దీనివలన బ్రహ్మమంటే ఏమిటో తెలుసుకొని అనుభవములోనికి వచ్చిన తరువాత ఇది పడిపోతున్నా, ఇది నేనుకాదనే సత్యము ఎరుకలోకి రావడం వల్ల దీనిమీద బ్రాంతిలేకుండా ఇది పడిపోతున్నా సాక్షిగా చూసి ఇది పడిపోయిన తరువాత తాను ఒకటి ఏది మారని సత్యమో అది సత్యంగా నిబడిపోవడానికి నిత్యనైమిక్తిక కర్మాచరణము చేత తాను పొంద దలచిన స్థితిని పొందగలిగినటువంటి వారిని తపస్స్వాధ్యాయ నిరతుడని పిలుస్తారు.
ఇప్పుడు నారదడు అది, అంటే ఇప్పుడాయన సద్గుగురువూ... మహానుభావుడై ఉన్నాడునారదం ధదాతి ఇతిః నారదాః ఆయన జ్ఞానమిస్తాడు, కాబట్టి ఇప్పుడు తపస్స్వాధ్యాయనిరతం అటువంటివారు ఎక్కడికొచ్చారు తపస్వీ వాగ్విదా వరమ్! ఆయన ఎటువంటివాడు? వాక్ విధః వాక్ అంటే? వేదము, వాక్ అంటే? బ్రహ్మము, విధులు అంటే? తెలుసుకున్నవాడు. “విత్” అన్న పదంలోంచి వేదము అన్నమాటోచ్చింది. "ఏది తెలుసుకొన్న తరువాత ఇంకొకటి తెలుసుకోక్కర్లేదో అదే వేదము", ఇప్పుడు తెలుసుకోవడం ఒకెత్తూ తెలుసుకున్నదాన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞ ఒకెత్తు, ఒకాయన తెలుసుకున్నాడు కాని ఆయన చెప్పలేడు ఆయన చెప్తే అయోమయంగా ఉంటుంది, ఒకాయన స్పష్టంగా చెప్పగలడు తాను అనుభవించాడు అనుభవించినదానివైపుకు మిమ్మల్నీ తిప్పగలడు ఈ ప్రజ్ఞ ఉన్నవాడు. కాబట్టి వాక్విధాం వరః బ్రహ్మమును బాగా తెలుసుకున్నావాళ్ళల్లో శ్రేష్ఠుడైనవాడు తాను తెలుసుకున్నది శిష్యులను ఉద్ధరించడానికి క్రిందకుదిగొచ్చి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞకలిగినవాడు, ఇటువంటి వాక్విధాం వరం అటువంటి నారదున్ని ఎవరు ప్రశ్నించారిప్పుడూ... అడిగినవాడు వాల్మీక మహర్షి, ఆయననెటువంటివారు తపస్వీ తపస్సు చేస్తున్నవారు, తపస్సంటే మీకు ఇందాకే చెప్పాను, బ్రహ్మమును తెలుసుకోవాలని తాప్రత్రయంతో ఉన్నటువంటివాడు, బాగా వ్యగ్రతతో ఉన్నవాడు, ఇయ్యనా... నారదున్ని అడిగారు ఏమని అడిగారు?


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
అయ్యా! మీరొచ్చారు చాలా సంతోషమండీ నాకూ... ఏ ఆపదలూ రాకుండా, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్టుచేయండి, నాకు సంతోషంగా ఉండేటట్టు, మా ఆశ్రమంలో ఆవులన్నీ ఎప్పుడూ పాలిచ్చేటట్టు చూడండి అని అడగలేదు, ఆయన ఒక చిత్రమైన ప్రశ్న ఒకటి వేశాడు? అది లోకంలో సాధరణంగా ఎవ్వరూ అడగని ప్రశ్న అందుకని రామాయణం పుట్టింది లేకపోతే రామాయణం పుట్టే అవకాశం లేదు మీరోకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞానం ఎక్కడ్నించి పుడుతుందీ అంటే.. ప్రశ్నను చక్కగా వేయగలిగినటువంటి శిష్య ప్రజ్ఞలోనుంచి పుడుతుంది నారదం పరిపప్రచ్ఛ పరి ప్రశ్న చేశాడు. ప్రశ్న అంటే? అడగటమే, నేను ప్రశ్నవేశానండీ అంటే అర్థమేమిటీ? నేను మిమ్మల్నీ అడిగానండీ అని అర్థం పరి ప్రశ్న అంటే? ఇది బాగా అర్థం చేసువాలి, నారదుడ్ని పట్టుకొనీ ఏదో అడిగేస్తే ఆయనేం చెప్పడు అలాగ ఆయనేం పరి ప్రశ్న చేస్తే చెప్పాడు ఆయన.
పరి ప్రశ్న అంటే, ప్రశ్న అంటే అడగటం పరి అంటే పరి అన్నమాటకు చెప్పాడు మహర్షి"పరి" అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండీ, ఇప్పుడు నేను ఎవరిని అడుగుతున్నానో, ఆ మహానుభావుడు నోరువిప్పి చెప్పినటువంటి మాట త్రికాలములయందు సత్యమే, ఆయన చెప్పినమాట మీద నాకు అవిశ్వాసమన్నమాట ఉండక్కర్లేదు. ఆయన అన్నారు అంటే... అది జరిగి తీరుతుంది అంతే ఆయన చెప్పింది చేస్తే ఆ ఫలితం వస్తుంది అంతే, ఆయన అటువంటి శక్తివంతుడు, ఈ నమ్మకుం మీకు ఉండి అడగడం మొదలుపెడితే  శ్రద్ధా... పరి ప్రశ్నకు ముందు ఏముంటుందో తెలుసాండీ శ్రద్దుంటుంది. శ్రద్ద లేకపోతే వినయమెలా వస్తుంది మీరు నాకు చెప్పండీ, ఇప్పుడూ నేను ఒకాయన దగ్గరకెళ్ళీ అయ్యా నమస్కారమండీ ఇలా ప్రణిపాతం చేసీ, నేలమీద పడీ, ఎంతో ఇదిగా రెండు చేతులు ఇలాచాచి, అయ్యా మీరు నాకు దయచేసి అనుగ్రహించి ఇది చెప్పాలని ఎందుకడుగుతాను, ఆయన శక్తి మంతుడని నేను నమ్మితేనూ, వీడిమొహం మీడికేమొచ్చు అనుకున్నారనుకోండి నీకేమీ తెలుసోమిటోయ్ అంటాము. అంటే వినయమెప్పుడుంటుంది ఆయన శక్తివంతుడని తెలిస్తే వినయమొస్తుంది. ఆయన శక్తిమంతుడు అని మీరు నమ్మడానికి  శాస్త్రంలో ఏమంటరో తెలుసాండీ ʻశ్రద్దాʼ అని పిలుస్తారు.
శంకరాచార్యుల వారు భాష్యం చేస్తూ "శ్రద్ధా" అన్న మాట గురించి ఒకమాట చెప్పారు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూఫలభ్యతే శ్రద్ధా అన్నమాటకు అర్థమేమిటంటే శాస్త్రము చెప్పినా గురువుగారు చెప్పినా అది పరమసత్యము ఇక దానికి తిరుగులేదు, అదిగాని పాటిస్తే మనకు ఫలితము వచ్చితీరుతుందని నమ్మడమే "శ్రద్ధా" అని పేరు. ఆ శ్రద్ధ ఎక్కడుందో దానిలోంచి వినయమొస్తుంది అప్పుడు గురువుగారిని చూసి ఒంగి ఒంగి ఒంగి నమస్కరించి మాట్లాడుతావు? ఎందుకు మాట్లాడడాయన?, ఆయనేం చేతకాకో మాట్లాడకపోతే ఆనందించలేనివాడో కాడు? ఆయనొక్కడు తనలోతాను ఆనందిచగలడు, మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?. నీకొరకు మాట్లాడుతున్నాడు? ఆయన త్యాగం చేశాడు, ఆయన కంఠానికీ శోషకలిగింది, అంటే బాధకలిగింది ఆయన ఊపిరికి ఘర్షణ కలిగింది, ఆయన శరీరానికి చమట పట్టింది దేనికొరకు? నీ కొరకు ఆయన నీకొరకు మాట్లాడుతున్నాడు... ఇది గుర్తిస్తే వినయం. ఈ త్యాగానికి నేనేమ్విగలను? ఆయనకు నీ కృతజ్ఞతా భావంతో నువ్వు నిలబడగలిగితే? అలా నీవు ప్రశ్నించగలిగితే పరి ప్రశ్నా అంటారు, ఇప్పుడు నారదం "పరిపప్రచ్ఛా" ఇలా ప్రశ్న వేయండి తప్పా... ఏదో ప్రశ్నవేస్తే రామాయణం వచ్చిందని మీరు అనుకోకండీ... పరి ప్రశ్న చేస్తే రామాయణం వచ్చింది.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
ఇప్పటి వరకు నారదుడు ఏమి మాట్లాడలేదు. మీరు బాగా గమనించండి, వచ్చాడంతే! లోపలికొచ్చారు వాల్మీకి మహర్షి చూశారు ఆర్గ్యపాదాదులిచ్చారు కూర్చోబెట్టారు, ఇప్పుడు పరి ప్రశ్న చేస్తున్నారు. ఏ ప్రశ్న వేస్తే అసలు రామాయణం గురించి చెప్పారాయన, వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆయన్నీ...
కో నస్మిన్ సామ్ప్రతిం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ! ధర్మజ్ఞ శ్చ కృతజ్ఞ శ్చ సత్య వాక్యో దృఢవ్రతః !!
చారిత్రేణ చ కో యుక్తః సర్వ భూతేషు కో హితః ! విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః !!
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః ! కస్య బిభ్యతి దేవా శ్చ జాత రోష స్య సంయుగే !!
పదహారు గుణములు అడిగారాయన, ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో ఈకాలంలో నేను ఉన్న రోజుల్లోనే నేను ఇప్పుడు శరీరంతోనే తిరుగుతోండగా నా మాంస నేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. అంటే అలాంటివారే ఉన్నారు. ఆయన భార్యయే తన ఆశ్రమంలోనే ఉంది. ఇది తెలుసా వాల్మీకికి, తెలియదనే చెప్పవలసి ఉంటుంది. మరి ఇప్పుడెందుకొచ్చిందీ ఈ ప్రశ్నా ఆయన నోటివెంట, అమ్మవారు వచ్చింది కాబట్టి వచ్చింది. అమ్మవారెందుకొచ్చింది?, అసలు రహస్యమేమిటంటే రామాయణం లోకానికి అందాలంటే సీతమ్మ యొక్క సేవాభాగ్యం వాల్మీకికి లభించాలి. సీతమ్మ సేవాభాగ్యం, సీతమ్మ సేవా భాగ్యమే శారదా దేవి సేవా భాగ్యం. అది అందితే నోటి వెంట ఈ ప్రశ్నవచ్చింది. నోటి వెంట ఒక్కప్రశ్న వస్తే యుగాలు మారిపోయినా మనుష్యుడుగా పుట్టిన ప్రతీవాన్ని తరింపజేయగలిగిన ఒక ఆది కావ్యం అయన నోటివెంట వచ్చింది. ఇది రావడానికి ముందు సీతమ్మ రావాలి. అందుకని ముందు సీతమ్మ వచ్చేసింది ఆశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుంది. ఆ రామాయణాన్ని ప్రచారం చేయ్యగలిగిన యోగ్యమైన శిష్యులను కూడా సీతమ్మే వాల్మీకికి ఇచ్చింది లవకుశుల రూపంలో. ఇది వాల్మీకిని సీతమ్మ తరింపజేసిన తీరు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, వాల్మీకిని తరించడానికి మొదటి కారణం సీతమ్మే, అందుకే ఆయన అన్నారు నేను చెప్పిన రామాయణానికి పేరేమిటో తెలుసాసీతాయా శ్చరితం మహత్ అన్నారు, "అది సితమ్మ చరిత్రా" అన్నారు.
తల్లీ... ఎంత గొప్ప తల్లో... మీరు ఆలోచించండి?, అందుకే సీతమ్మ ఒకరూ, శారదమ్మ ఒకరా.  కాదు సీతమ్మే శారదమ్మ కాబట్టే అంత జ్ఞానం వాల్మీకి కిచ్చి ఈ ప్రశ్న వేయించింది. ఎందుకు వేయించాలి?, సీతమ్మ వెళ్ళిపోతే రామావతారం వెళ్ళిపోతుంది ఇక సీతమ్మ వెళ్ళిపోతుంది. ఆరోజులు వచ్చేశాయి అప్పటికే ఆరోజులు వచ్చాయి, ఎందుకంటే అశ్వమేధయాగం చేసేశాడు రాముడు, అశ్వమేధ యాగం చేస్తే సీతమ్మ కనపడాలి, సీతమ్మ రామునికి కనబడితే వేరొకసారి ప్రాతివత్యం నిరూపించుకోమని చెప్తాడు, ఎందుకు చెప్తాడంటే ఎప్పుడూ లోకం కోసం తన కోసం కాదు ఈ మాట అనగానే ఆవిడంటుంది, నా ప్రయోజనం అయిపోయిందయ్యా నీ భార్యగా నీ వంశాన్ని నిలబెట్టడానికి ʻరామకథ నరుడి కథʼ బాగాగుర్తు పెట్టుకోవాలి. రామ కథా దేవుడు కథ అని చదివితే మీకు ఎంత పనికొస్తుందో నేను చెప్పలేను.  రామ కథ నరుడి కథా అని మీరు వినండి పనికొస్తుంది, అందుకే సీతమ్మ ఈ మాటంది. నేనెందుకొచ్చానో తెలుసా నీ పక్కకు? మీ వంశం తరించాలి? మీ వంశం తరించాలంటే మీకు పితృ ఋణం తీరాలి పితృ ఋణం తీరాలంటే బిడ్డలు కనాలి మీకు బిడ్డలు పుట్టాలి అంటే నా సహకారం కావాలి. నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డలు కూడాపోతారు పోతే నీకు పితృ ఋణం తీరదు, నీవు ఏక ప్రత్నీవ్రతుడవు ఇంకొక బిడ్డనీ ఇంకొక్క ఆడదానినీ స్వీకరించవు నీ వంశము ఆగిపోతుంది. నా కారణంగా నీ వంశం ఆగకూడదు నీ వంశం కొనసాగడానికి బిడ్డల్నిచ్చాను నా ప్రయోజనం అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నానని భూమిలోనికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తరువాత రామావతారం లేదు సరయూ నదిలోకి వెళ్ళి రామావతారం కూడా పూర్తిచేస్తాడు రాముడు, ఇప్పుడు రామావతారం పూర్తైపోకముందే సీతమ్మ రామాయణం పలికించాలి వాల్మీకితో పలికించాలంటే ఈ సన్నివేశాన్ని సృష్టించాలి నారదున్ని పిలిపించాలి.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
కాబట్టి వచ్చాడు మహానుభావుడు, వస్తే ఆయన ఇప్పుడు ఈ ప్రశ్న అడిగాడు? ఇప్పుడింత ఆర్తితో ఈ ప్రశ్న అనుకోకుండా నోటివెంట వస్తే తప్పా రామాయణం కథ ప్రారంభం కాదు. అందుకని అడిగాడు "కో నశ్విన్ సామ్ప్రతిం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్" ఈ కాలంలో నారద మహర్షీ ఇప్పటికిప్పుడు ఇప్పుడు నేను చూడడానికి వీలుగా నేనడిగిన మహానుభావుడు ఎవరైన్నా ఉన్నాడా... ఎవరు? పదాహారు గుణములున్నవాడై ఉండాలి, గుణమన్న మాటకు అర్థమేమిటంటే? తాను గురుముక తహా నెర్చుకున్నటువంటి విద్య ఏకాలమునందు ప్రవర్తనయందు ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశించేస్తే అది గుణముగా కనబడుతుంది. మా గురువుగారు నన్ను, నాయనా! ఒరేయ్ కోటేశ్వరావ్ “గోవులకు సేవ చేయరా”  అని చెప్పారనుకోండి? నేను అలా గుడిలోకి వెళ్ళిపోతున్నాను ఒక అరడజను అరటి పళ్ళుపట్టుకొనీ దేవాలయంలోకి వెడుతున్నాను, ఒక ఆవు నావంకచూసి ఇలా ఇలా ఇలా నోరుచాపింది నేను ఆ ఆవుని దవడ మీద ఒక్క దెబ్బకొట్టి గుడిలోకి వెళ్ళాను మా గురువు సంతోషించచ్చా! మా గురువుగారు చెప్తారు ఒరేయ్ “పరాశక్తికి, ఆవుకీ తేడాలేదురాని” చెప్పారు?. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను లోపలికెళ్ళి అర్చకుడికిస్తే నివేదన చేస్తారు, ఇక్కడో నా తల్లి ఎదురొచ్చి నాదగ్గర ప్రత్యక్షంగా తింటానని అడుగుతోంది. అమ్మా ఏమి భాగ్యం అక్కడింకా తొక్క తీసి పెట్టాలి ఇక్కడైతే తొక్కతో తినడానికి సిద్దంగా ఉన్నావు, నా చేత్తో పెట్టుకుంటాను రెండు చెప్పులిప్పి గభాలున చెతితో పెట్టాలి. పెడితే నీవు గురువాజ్ఞని అనుష్టానంలోకి తెచ్చుకున్నవాడని  ఇప్పుడు గుణముగా ప్రకాశిస్తుంది, కోటేశ్వరరావుగారండీ... వారి గురువుగారు చెప్పింది గుర్తుపెట్టుకొనీ ఆవుకి చెత్తో రెండు అరటిపండ్లు పెట్టాడు అదోగుణం, అంటే నేను నా గురుంచి చెప్పుకున్నాడని అనుకోకండీ నేనేమి అటువంటి పుణ్యకార్యాలను చెసినవాడిని కానండీ మహాప్రభో ఏదో ఉదాహరణకు చెప్పానంతే సోత్కర్షకోసం కాదు.
కాబట్టి గుణము అంటే విన్నదీ, చదువుకున్నదీ, ప్రవర్తనయందు ఆ సందర్భంలో ప్రకటనమైతే - ప్రకాశిస్తే గుణమవుతుంది. అలా ఉన్నాయా ఎవరికైనా, అలా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా, గురువుగారి దగ్గర నేర్చుకున్నవి నీ అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి గురువు ఏం చెప్పారో అలా ప్రవర్తించినవాడు ఉన్నాడా, మీరు ఇలా వినండి రామాయణాన్ని తరువాత కో నశ్విన్ సామ్ప్రతిం లోకే ఎప్పుడో కదా వామనమూర్తి ఉన్నాడు నరసింహావతారం ఉందిని చెప్పకు, ఇప్పుడున్నాడా? ఇది వాల్మీకి ప్రశ్నకో నశ్విన్ సామ్ప్రతిం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ వీర్యవంతుడు ఉన్నాడా, వీర్యవంతుడు అంటే ఎటువంటి యుద్ధయొచ్చినా చెక్కు చెదరకుండా, తాను తానుగా నిలబడి తనలో ఏ మార్పులేకుండా


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
బయట మార్పు తేగలిగినవాడు ఎంతమందినైనా పడగొట్టగలిగినవాడు. అటువంటి వాడు ఉన్నాడా, ఉంటే వీర్యవాన్ సామ్ప్రతిం


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మం తేలుసుకొన్నావాడు ఉన్నాడా, ధర్మం తెలియడం అంటే? మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ధర్మం గురించి తెలుసుకోవడం అంటే ఏమిటో తెలుసాండి?. అధర్మం కూడా తెలియాలి, ధర్మమే తెలిస్తే..,? పూర్ణత్వం కాదు. ధర్మం తెలియడం అంటే - అధర్మం కూడా తెలియాలి. ఏది చెయ్యాలో తెలియడమంటే ఏది చెయ్యకూడదో కూడా తెలిడం. మీరు కొంచెం ఆలోచించండి నేను ఒక మాట అనేసి వదిలేశాను మీరు జవాబు చెప్పక్కర్లేదు చెయ్యమన్నది చెయ్యడం తేలికా, చెయ్యొద్దన్నది వదిలేయడం తేలికా, చెయ్యొద్దన్నది వదిలేయడమే చాలాకష్టం. మీరు చూడండి. నేనొక మంత్రమిస్తాను 11 మార్లు చెయ్యండి రోజూ ఒక్కమారు కూడా మీకు కోతి గుర్తు రాకూడదు అన్నానుకోండి. అలా చేయగలరా, ఇది వొద్దో అని ఏమంటమో అదే చేయబుద్దేస్తుంది?. దేవుడికి రెండు అగరవత్తులు పెట్టు అన్నానుకోండి, భయానికో భక్తికో రెండు అగరవత్తులు వెలిగిచ్చేయడం తేలిక, వద్దన్నది చేయకుండా ఉన్నవాడు ప్రజ్ఞావంతుడు. వొద్దన్నది చేయకుండా ఉండాలంటే అధర్మం తెలియాలిగదాండీ!, అధర్మం తెలియడం ధర్మం తెలియడం, ధర్మం పాటించడం ఆధర్మం విడిచిపెట్టడం. ఆధర్మం చేసినవాడిని కూడా ఉండకుండా చేయడం. ఎందుకంటే వాడివల్ల అధర్మం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇదీ ధర్మం తెలియడం.
కాబట్టి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కృతజ్ఞశ్ఛ అంటే ఎవరో తనకు ఉపకారం చేశాడు. ఏ వాడి అదృష్టమండీ వాడు నన్ను సేవించుకొన్నాడు అనడం కాదు. ఎంత మహానుభావుడండీ నిజంగా ఎంత ఉపకారం చేశాడండీ, ఎంత ఉపకారం చేశాడండీ, అని తలుచుతూ తలుచతూ పొంగిపోగలిగినటువంటి మనసుండడం. అసలు మనుష్య జన్మకు ఉండవలసిన ప్రధాన లక్షణం అదేనండీకృతఘ్నో నాస్తి నిష్కృతిః  కృతజ్ఞత లేనివానికి ఈవిషయం తెలియదు. అటువంటి కృతజ్ఞత ఉన్నవాడు ఉన్నాడా ఎవరైనా లోకంలో ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి. వెన్ను విరగి మీద పడిపోనీ నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టినవాడు ఎవడైనా ఉన్నాడాసత్యవాక్యో దృఢవ్రతః ఒక పని మొదలుపెడితే, అనుకున్నాం కానీండీ అది అలా అవుతుందా అని వదిలేశాం లేండీ ఇప్పుడు మార్చేశాం ఆ సంకల్పం అనకుండా, తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే? పిడుగులు పడిపోయినా ఆపనిని చెయ్యగలిగినటువంటివాడూ దాన్నివిడిచిపెట్టనటువంటివాడూ అటువంటి పూనిక ఉన్నటువంటివాడు ఉన్నాడాధృఢ వ్రతః. కాబట్టి కో నశ్విన్ సామ్ప్రతిం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణ చ కో యుక్తః ఆయన ప్రవర్తనను చూస్తే ఇక మీరు వేదం చదవక్కరలేదు. వేదం చదవక్కరలేదంటే వేదం చదవద్దనికాదు నా ఉద్దేశం. ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్పింది అని గుర్తు. అటువంటి ప్రవర్తన ఉన్నవాడు ఉన్నాడా! పడుకున్నా లేచినా మాట్లాడినా కూర్చున్నా నిల్చున్నా నడిచినా ఏం చేస్తున్నా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి నడవడిక కలిగినటువంటివాడు లోకంలో ఉన్నాడాచారిత్రేణ చ కో యుక్తః సర్వ భూతేషు కో హితః ఇంత బల పరాక్రమాలు ఉండీ కూడా సమస్త భూతముల పట్ల దయగలిగినవాడు ఈ లోకంలో ఉన్నాడా గుండెలు నిండా అంత కారుణ్యము ఉన్నవాడు ఉన్నాడా సర్వ భూతేషు కో హితః విద్వాన్ కః తెలుసుకోవలసిన వన్నీ సమస్తము తెలుసుకొన్నటువంటి విజ్ఞాని ఉన్నాడా అటువంటి విద్వాంసుడున్నాడా  విద్వాన్ కః కస్సమర్థశ్చ ఎటువంటి పనైనా సరే వీరు చెయ్యలేరు వీరు చెయ్యలేరు అనొచ్చోమోగాని ఆయన ఇది చెయ్యలేరు అని చెప్పడానికి ఒక పని లేకుండా ఏ పనులైనా చేయగలిగినవాడు ఒకడున్నాడా?.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఎప్పుడు మీరు చూసినా చూడాలనిపించేట్టుగా ఒకడున్నాడా, ఆయన యుద్ధం చేస్తుంటే వింటినారి లాగుతున్నాడు అందం, ఆయన ఇలా అడవిలో నడుస్తున్నాడు అందం, ఆయన కిరీటం పెట్టుకున్నాడు అందం, ఆయన పాద పీఠం మీద పాదం పెట్టాడు అందం, ఆయన జిల్లేడు పాలు పోసుకొని జటాజూటం కట్టుకున్నాడు అందం. ఆయన ఏమీలేదు నారచీర కట్టుకొని కోదండం పట్టుకొన్నాడు అందం, ఆయనకు కోపమొచ్చి కన్నులు ఎర్రబారాయి అందం, ఆయన బాల రాముడిగా పిలక పెట్టుకొని వెళుతున్నాడు అందం, సీతమ్మతో మాట్లాడుతున్నాడు అందం, నిద్ర పోతున్నాడు అందం, అసలు ఏది చూసినా అందం అబ్బా ఇప్పుడు అంతబాగుండడండీ ఆతరువాత బాగుంటాడండీ కొంచెం అలంకారం చేసుకొంటే బాగుంటుందండీ అనటానికి ఏమైనా ఉంటుందా... ఎప్పుడు నువ్వు చూసినా అలాగే చూడాలనిపించేటట్టుగా ఉండేవాడెవడైనా ఉన్నాడాకశ్చైక ప్రియదర్శనః ఎంతపెద్ద మాటండీ, నిద్రపోతుంటే చూశావు ఆ నిద్రపోతుంటే చూడాలండీ ఆయన సౌందర్యమూ ఆమాట ఎవరికైనా ఉంటుందాండీ లోకంలో, ఏమండీ ఆయన నిద్రపోతుంటే ఎంత బాగుంటారండీ అంటారా, ఎవండీ ఆయన నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటుంటే చూడాలండీ అందం, అంతందం ఎవరికైనా ఉందా, ఆయన యుద్ధం చేస్తే చూడాలండీ అందం ఎవరికైనా ఉంటుందా, ఎంతటి అందగాడు, ఆయన పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ ఆయనను ఆడవాళ్ళు మోహించడం కాదు పురుషులు మోహించారు అంతటి అందగాడు, కొన్ని కోట్ల మంది కంఠాలు కోశేశాడంతే! రామావతారంలో నెత్తుటి ఏర్లు పారించాడు అయినా అందం. భుజాలు అందం, గడ్డం అందం, చక్కిళ్ళందం, ఆజానుబాహుఆజానుబాహు అరవిందదళాయతాక్షం ఆ కళ్ళందం, కనుబోమ్మలు అందం, ఆ ముక్కందం, ఆ మూతందం,  ఆ గడ్డం అందం, ఆ కంఠం అందం అన్నీ అందమే.
అందమే రాముడు రాముడే అందం రాముడే అభిరాముడు అటువంటి వాడున్నాడా  కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో గొప్ప ధైర్యవంతుడున్నాడా లోకంలో, ధైర్యవంతుడంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధైర్యవంతుడు అన్నమాటకు అర్థమేమిటో తెసాండీ!, భయంలేనివాడు అని కాదు, దైర్యము అన్న మాటకు ఇంకో అర్థం కూడా ఉంది, ధైర్యము అంటే తాను ఏ పనిమీద బయలుదేరాడో ఆ పనికి అనుగుమైనటువంటి సంభారణములను మాత్రమే దగ్గరుంచుకొని ఆపనిమీద మాత్రమే దృష్టిపెట్టి ఆపనిని పాడుచేసేటటువంటి ఏ ఇతర ఆకర్షనీయమైనటువంటి వ్యవహారమైనా తోసిరాజని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నవాడున్నాడా, నేను ఏకపాతివ్రత్యం చేస్తానన్నాడు  భార్యను రావణాసురుడు ఎత్తుకుపోయాడు చాలామంది వచ్చి మీద పడ్డారు, ఆ మానాన్నగారు దక్షింనాయకులు మా వంశంలో చాలామంది దక్షింనాయకులున్నారు మా ఆవిడ నాదగ్గరలేదు కందాండీ అనీ... ఏమైనా పొరపాటుపడ్డాడా తాను ఏది అన్నాడో రామో దుర్నాది భాషతేః రెండు మాటలు నాకు రావమ్మ అన్నాడంతే లోకంలో అవతార పరిసమాప్తికి పనికొచ్చింది అలా ఉండగలిగినవాడున్నాడాఆత్మవాన్ కో జితక్రోధో కోపాన్నిగెలిచిన వాడున్నాడా, కోపాన్ని గెలవడం ఏంటండీ? అదేమైనా ఎందురుగుండా వచ్చి నిలబడుతుందా? కోపం ఎలా గెలుస్తారు?, ఆంటే క్రోధం ఎక్కడన్నుంచి వస్తుందో మూల స్థానాన్ని గుర్తెరగడం, వికార కారణాన్ని తెలుసు కోవడమే క్రోధాన్ని గెలవడం.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
అంటే మీరు చూడండీ నాకండీ? ఎంత కోపమొచ్చోసిందోండీ? అంటాడు, ఎంత కోపమెచ్చేసిందో  అంటే? ఎక్కడ నుంచి వచ్చింది? ఇక్కడ్నుంచే రావాలికోపం. ఇక్కడ్నుంచి రావడానికి అనువైన అవకాశం వాతావరణం నువ్విస్తే రావడానికి సిద్దంగా ఉంది, మంట పుట్టడానికి రైలు సిద్ధంగా ఉన్నట్లు నువ్వు అది కూడితే ఎంత వికారంగా ఉంటావో? నీ ముఖమేలా ఉంటుందో? ఎంత జేవురించుకొని ఉంటుందో?, ఎలా అరుస్తావో? నీ చేతులెలా ఉంటాయో? ఓసారి అ టైంలో వీడియోతీసి చూసుకోండి ఎలా ఉంటుంది? అసహ్యమేస్తుంది మనమీదమనకే. అదేంటండీ నేనలా ఉన్నానిపిస్తుంది?, ఇన్ని వికారములు ఇది వస్తే వస్తున్నాయని తెలుసుకొని, అది రాకుండా తొక్కిపెట్టగలిగిన వాడున్నాడా?, అలా ఉంటే జితక్రోధో,  అలాంటి వాడయ్యా లోకంలోఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అపారమైనటువంటి కాంతి కలిగినవాడున్నాడాద్యుతిమాన్ కో నసూచియకః అశూయను గెలిచినవాడున్నాడా తన్నకన్నా గొప్పవాడు కనపడితే ఆహా ఆహా హా మహాత్ములు ఎంత గొప్ప పరిశ్రమచేశారో? ఇంత గొప్పవాడయ్యాడని నమస్కారం చేసి తెలుసుకోవాలి. తనకన్నా తక్కువాడు కనపడితే ఈశ్వరానుగ్రహంతో ఇతడు వృద్ధిలోకి రావాని కోరుకోవాలి, క్రిందవాన్ని చూసి అహంకరించకూడదు పై వాన్ని చూసి అసూయ పడకూడదు. ఈ రెండు ఉన్నవాడున్నాడా? ద్యుతిమాన్ కో నసూచియకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే కోపం లేనివాడికి కోపం ఎలా వస్తుందండీ?, అంటే కోపం తెచ్చిపెట్టుకున్నట్లు నటించాలి అంతే. ఎందకు నటించాలి?. ఎదో పని చక్కబెట్టాలంటే కోపం వచ్చినట్టు ఇలా అంటాడు అంతే, ఇలా అనేసరికి అయ్యో బాబోయ్ కోపమొచ్చిందని హడలిపోయి అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఎవరికి కోపమొచ్చిందని అనిపిస్తే ముప్పైమూడు కోట్ల మంది దేవతలు కూడా వనికిపోతారో అలా కోపాన్ని తెచ్చిపెట్టుకొనేవాడే తప్ప అసలు కోపం రావడమన్నిది లేనివాడు లోకంలో ఉన్నాడా?, అలాంటి వాడు ఎవడైనా ఉంటే ఎప్పుడో ఉన్నాడని చెప్పవచ్చు ఇప్పుడున్నాడా? నేను చూడడానికి వీలుగా ఉన్నాడా? ఈ కాలంలో ఉన్నాడా? ఉంటే అటువంటి వాడిగురించి నాకు చెప్పూ నాకు వినాలని ఉంది అన్నాడు.
ఇప్పుడొస్తోంది రామాయణం ఇప్పుడు చెప్పాలి నారదడు ఎవరో  తెలుసా? ఆయన రాముడే! ఆయన ఇల్లాలే నీ దగ్గరుంది, ఆయన బిడ్డలే నీ దగ్గరున్నారు. వాల్మీకి మహర్షీ! ఆయనే ఆయోద్యాధిపతి, ఆయనే రామ చంద్ర ప్రభువు అని చెప్తే వాల్మీకి పొంగిపోవాలి కదాండీ... రామాయణ ఆవిర్భావం జరుగుతోందన్న మాట ఇవ్వాళ. ఇవ్వాళ రామాయణం పుడుతోంది ఆ సన్నివేశంలో ఉన్నాం మనం, ఇప్పుడు ఈ మాటలడిగారు అడిగితే నారద మహర్షి చాలా చమత్కారమైనటువంటి జవాబు ఒకటి చెప్పారు. ఆయనన్నారూ బహవో, దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితాగుణాః ! మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తై ర్యుక్తః శ్రూయతాం నరః !! చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావు. సాధరాణంగా లోకంలో మానవుల్లో నీవడిగినటువంటి పదహారు గుణములు ఒక వ్యక్తియందు ప్రకాశించేడివాడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఎవరై ఉండాలి నరోత్తముడై ఉండాలి సాక్ష్యాత్ శ్రీ మహావిష్ణువై ఉండాలి అటువంటివాడే కాని నరుడిగానే ఉన్నాడు. ఆయన విష్ణువంటే ఆయనే అంగీకరించడు ʻనేను


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
నరున్నిʼ అంటాడు. నేను ʻదాశరథినిʼ అంటాడు, నేను దశరథ మహారాజు కొడుకునయ్యా అంటాడు, నరుడిగా ఈ లోకంలో తిరుగుతున్న వాడున్నాడు అటువంటివాని గురించి చెప్తాను జాగ్రత్తగావిను అన్నాడు ఇదీ సంక్షేప రామాయణం.
నూరు శ్లోకాలతో ఇక్కడ ప్రతిరోజు సంక్షేప రామాయణం జరుగుతుందని అన్నారే, సంక్షేప రామాయణాన్ని పెద్దలు సాంప్రదాయంలో ఏమని పిలుస్తారో తెలుసాండీ, "మాలా మంత్రమూ" అని పిలుస్తారు. ఎందుకంటే శారదా తిలకమూ అనీ, మంత్రాల గురించి చెప్పేటటువంటిది బీజాక్షరాలను కూడి చెప్పే విషయము ఒకటుంది అందులో. అందులో పది అక్షరాల మంత్రంలో దాటిపోతే దాన్ని మాలా మంత్రమూ అని పిలుస్తారు. నూరు శ్లోకములతో ఉన్న సంక్షేప రామాయణము మాలా మంత్రం. అందుకే సంక్షేప రామాయణాన్ని పారాయణం చేస్తే అది రక్షణ చేస్తుంది మన్నాత్ ప్రాయతే ఇతిః మంత్రాః దాన్ని మననం చేస్తే అది కాపాడుతుంది, సంక్షేప రామాయణం కూడా అలా కాపాడుతుంది. సద్గురువులైనటువంటి నారద మహర్షి నోటిలోంచి పుట్టింది సంక్షేప రామాయణం మహానుభావుడు నేను చెప్తున్నానయ్యా వినూ అని చెప్తున్నాడు...
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్శ్రుతః ! నియతాఽఽత్మా మహా వీర్యో ద్యుతిమాన్ ధృతిమా న్వశీ !! ఇక్ష్వాకు వంశ ప్రభవో ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటివాడు ఉన్నాడయ్యా అని, మీరూ ఈ మాటను వినాలి, మొట్టమొదట ఎవరైనా రాముడు అని చెప్పలేదు ఎవరని చెప్పాడు?, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడున్నాడని చెప్పాడు ఒక వంశం తరించిపోతుంది ఒక వంశం పేరు శాశ్వతత్వాన్ని పొంతుంది అది మొదట ఇక్ష్వాకు వంశం. తరువాతది రఘువంశం, రఘు పుట్టిన తరువాత దానిని 'రఘు వంశం' అంటారు, వంశం మారిపోలేదు కాని వంశం పేరు రఘు వంశం అయింది. ఎలా అయిపోయింది అంటే రఘు గొప్పతనం అటువంటిది, ఆయన పేరుతో వంశాన్ని పిలిచారు, ఆ వంశంలో పుట్టాడు రామ చంద్ర మూర్తి, అంత గొప్ప వంశంలో పుట్టాడయ్యా ఇప్పుడు వంశానికి గొప్పతనం ఎక్కడ నుంచి వచ్చింది?. పుట్టి అలా ప్రవర్తించగలిగినవాళ్ళవల్ల వస్తుంది ఇక్ష్వాకు వంశ ప్రభవో, రామో నామ జనైశ్శ్రుతః  ఆయన్ని జనులందరూ "రాముడూ" అని పిలుస్తుంటారు రామో నామ జనైశ్శ్రుతః  ఎందువల్ల రమైతీతి రామః ఆయన అందర్నీ ఆనందింప జేస్తాడు రమంతే అశ్విన్ ఇతి రామః ఆయనయందు యోగులు రమిస్తారు. అంటే యోగులు రమించడమంటే బాహ్యములో తిరిగేటటువంటి మనస్సుని బుద్ధిని నిగ్రహించి వెనక్కి తిప్పే ఆత్మలోకి దింపి తాను ఒకటిగా నిలబడిపోయి పొందేటటువంటి ఆనందమేదో అది సాకారమును పొందితే రాముడు. కాబట్టి యోగులు రమించేటటువంటి స్వరూపమేదో దానికి రామా అనీ పేరు. కాబట్టి రామో నామ జనైశ్శ్రుతః నియతాఽఽత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమా న్వశీ నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ ఉన్నవాడు దానితో పాటుగా వశీ ఇంద్రియములను నిగ్రహించినటువంటివాడు.
ఇంద్రియాలను నిగ్రహించడమన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసి ఉంది. ఇంద్రియాల్ని నిగ్రహించండం అంటే ఏమిటో తెలుసాండీ?, మనసు దేన్ని చూస్తే, దేన్ని వింటే, కదిలిపోతోందో ప్రశాంతంగా ఉన్నది అలజడిని పొందుతుందో, దాన్ని చూడకుండా దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసాండీ!. ఒక త్రాచుపాము అలా వెళ్ళిపోతుంది గభాలున ఇలా చూశాడు అయ్య బాబోయ్ త్రాచుపాము అని ఓ పెద్ద గెంతు గెంత్యాడు. అది అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద రెండు కాళ్ళు వేసి త్రొక్కాడు, ఇప్పుడూ త్రాచుపాము తల పైకెత్తలేక పోతోంది, ఇప్పుడు తను త్రాచుపాము నా కాళ్ళకింద ఉంది  నన్నేం చేస్తుంది? అని ఉండగలడని మీరు అనుకుంటున్నారా?, అతను గడగడగడ వణికిపోతూ చెమట్లుపట్టేస్తున్నాయి. ఎందుకంటే నేను త్రాచుపాముమీద ఉన్నాను అది తోక కదుపుతోంది,  తోకతో కాళ్ళు చుడుతోంది, ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాచుపాము తనని ఏమీచేయలేదన్న స్థితిలో ఉన్నా,  ఎప్పుడో ఒకప్పుడు త్రాచుపాము మీద కాలుతీసేస్తాడు కంగారు పడిపోయి తీసేస్తాడు, ఎప్పుడో ఒకప్పుడు కాలు తీయడం కోసమే పాము చూస్తూ ఉంటుంది, పాము కాటు వేసేసి పుట్టలోకి వెళ్ళుతుంది లేకపోతే ఎక్కడికోక్కడికి వెళ్ళిపోతుంది.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
రావణుడు చేసే తపస్సు, రావణుని యొక్క ఇంద్రియ నిగ్రహం అటువంటిది. బలవంతంగా అణచిపెడతాడు, అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పీ ప్రలయ తాండవం చేసి రావణున్ని పడగొడుతుంది మండోదరి చెప్పింది, ఈ మాట నా సొంతం కాదు. రాముడు అలా కాదు విచారణ చేసి ఉంటాడు అర్థమనర్థం భావయనిత్యం అంటారు శంకరాచార్యుల వారు నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగామోహావేశం ! ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం  !! మనసు దేనిచేత కదిలిపోతోందో...  దాని యదార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తారు, విచారణ చేసి ఈ పాటిదానికా నా ఒంట్లో ఉన్నటువంటి శక్తినంతటిని ఖర్చు చేసేస్తున్నాను అనీ,  మనస్సుని మరల్చే ప్రయత్నముచేసి ఆ వస్తువు తన కళ్ళముందు కనపడినా ఇంక ఆయన మనస్సు చెక్కు చెదరదు ఆ స్థితిని పొందుతాడు. ఇది శంకరాచార్యుల వారు నేర్పుతారు లోకానికి, గురువులు చెప్పే మాటంటే అలా ఉంటుంది, ఆయన ఎంత చమత్కారంగా అన్నారో చూడండీనారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగామోహావేశం ఎందుకంత వెర్రెక్కి పోతున్నావు, యవ్వనం ఒంట్లో శక్తి ఉండి ఓపికున్నకాలంలో నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో రెండే వికారాలున్నాయి, శరీరపు ఊర్థ్వ భాగంలో రెండే రెండు చోట్ల మాంసపు ముద్దలు రెండు పైకి పోటమరించాయి, శరీర అధోభాగంలో మాంసం కొంత లోపలికి వెళ్ళిఉంది, ఈ రెండు వికారాలకోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింపజేసుకొన్నావు, ఇదా నీకు నర జన్మ ప్రయోజనము మనసి విచింతయ వారం వారం దీన్ని బాగా ఆలోచించు అన్నాడు, ఇది పట్టుకొందనుకోండి కంటిని మనసుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనసుతో మనసుకి ఇప్పుడా వస్తువు కనపడినా... ఇక మనసు కదలదూ, ఇదీ ఇంద్రియ నిగ్రహము ఇంద్రియాల్ని జయించడం అంటే అది.
ఇదీ రాముడు! అందుకే ద్యుతిమాన్ ధృతిమా న్వశీ అపారమైన శక్తితో ఉంటాడు, సంకల్ప శక్తితో ఉంటాడు, ఇంద్రియములను జయించినవాడై ఉంటాడు బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః ! విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః !! నిజంగా శ్రీరామాయణాన్ని ప్రతి శ్లోకం ప్రతిమాటా వ్యాఖ్యానం చేస్తే 42 రోజులు ఏంటండీ, నేను రిటైర్ అయిపోయేంత వరకూ చెప్పినా శ్రీరామాయణం అయ్యేదేం కాదు, కానీ ఏదో 42 రోజులల్లో పూర్తిచేసుకోవాలని అనిపించుకోవడం అంతే, కాబట్టి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ అన్ని విద్యలూ తెలిసున్నవాడు శ్రీమాన్ ఐశ్వర్యం ఉన్నవాడు శత్రు నిబర్హణః శత్రువులను నిగ్రహించ గలిగినటువంటివాడు విపులాంసో ఎత్తైన మూపున్నవాడు మహాబుహుః బలిసిన బాహువులున్నవాడు కంబుగ్రీవో శంఖం వంటి కంఠం ఉన్నవాడు మహాహనుః  చెక్కిళ్ళ పైభాగము చాలా ఉన్నతంగా ఉన్నటువంటివాడు అటువంటి మహానుభావుడు ఈ లోకంలోనే ఉన్నాడు ప్రజాపతిసమ శ్శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ! రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా !! రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ! వేదవేదాంగ తత్వ్తజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః !! ఎంత గొప్పగా మాట్లాడాడండీ నారద మహర్షి నిజంగా! ప్రజాపతిసమ శ్శ్రీమాన్ ఈ ప్రపంచాన్నంతటిని పోషించ గలిగినటువంటివాడు, సాక్ష్యాత్ శ్రీమహావిష్ణువు ధాతా రిపునిషూదనః శత్రువులను నిగ్రహించు గలిగినటువంటివాడురక్షితా జీవలోకస్య లోకాలన్నింటినీ రక్షించ గలిగినటువంటివాడుధర్మశ్య పరిరక్షితా ధర్మాన్ని రక్షించేటటువంటివాడు, ధర్మాన్ని రక్షిస్తాడు కాబట్టి అధర్మాన్ని నిగ్రహిస్తాడు కూడా ధర్మశ్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య తన ధర్మాన్ని తాను రక్షించుచుకొంటాడురక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా అందర్నీ రక్షిస్తే మరి స్వజనులెవరు అంటే ఆయననే నమ్ముకొని ఉన్నవాళ్ళెవరో వారి రక్షణయందు మరింత అప్రమత్తంగా ఉండేటటువంటి స్వరూపమున్నటువంటివాడు, అటువంటివాడు స చ సర్వగుణోపేతః కౌసల్యాఽఽనన్దవర్ధనః ! సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ !! ఇందులోంచెండీ! వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలలోంచే తర్వాత ఉపమానాలన్నీ వచ్చాయి.
ఇప్పటికీ మనం చూడండీ! మేరునగధీరుడండీ అంటాం ఆయన్ని పోల్చిచెప్పేటప్పుడు హిమవత్ పర్వతము వంటివాడు సముద్రము వంటి గాంభ్యీర్యమున్నవాడు అని చెప్పారు నారద మహర్షి, సముద్రం చూడండీ ఎంత గంభీరంగా ఉంటుందో సముద్రం కడుపులో ముత్యాలు రత్నాలు వజ్రాలు ఇన్నుంటాయి. ఇన్ని ఉన్నా కప్పి ఉంచుతుంది, సముద్రంలో బడబాగ్ని ఉంటుంది కాని తాను మాత్రం చల్లగా ఉంటుంది సముద్రం ఒడ్డుకొస్తుంది, వొచ్చి నీకాళ్ళు తాను కడుగుతుంది చేతకానిది ఎదురువచ్చి నీకాళ్ళు కడిగిందని మీరు ధూర్త తనంతో లోపలికెళ్తే  మిమ్మల్ని తనలో కలుపుకోంటుంది ఎదురొచ్చి నీదగ్గర వస్తోందిగదాని మీ కాలి చెప్పుతీసి అందులో వేస్తే తీసికొచ్చి ఆవతల పారేస్తుంది ఇది సముద్రం యొక్క గాంభీర్యం. తన ఉప్పు కయ్యగా ఉంటుంది పర్వదిన స్నానానికి పనికివస్తుంది ఇన్నిటిని కప్పిపుచ్చి నిలబడగలిగినటువంటి స్వరూపం సముద్రం. కడుపులో బడబాగ్ని ఉన్నా, సీతాపహరణమే జరిగినా, తండ్రే మరణించినా, రాజ్యమే పోయినా, అరణ్యంలో తిరిగినా, జుట్టు తీసేసినా, జిల్లేడుపాలు పోసుకొని ఆఖరుకు ఆ జడలు కట్టుకొన్నా, నారచీర కట్టుకొన్నా, పాదాలకు చెప్పులే లేకపోయినా, అగ్నిహోత్రాన్ని చంకన తగిలించుకొన్నా, అడవిలో మృగాన్ని బాణం పెట్టి కొట్టి చంపి చర్మం ఒలిచి మాంసం తీసి తెచ్చి సీతమ్మ ఒండితే తప్ప తినలేని స్థితిలో రాజారాముడైనటువంటివాడు బ్రతకవలసి వచ్చినా, తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో దాహమేస్తున్న ఏనుగు నదిలో తొండంపెట్టి నీళ్ళు తాగడానికి కూడా భయపడునటువంటి చలికాలంలో కూడా వెళ్ళి స్నానం చేయ్యగలిగిన మొనగాడు, ఇన్ని కష్టములు కడుపులో పెట్టుకొని కూడా పైకి చెక్కు చెదరకుండా ఉండగలిగినటువంటి గంభీరమూర్తి ఆయనయ్యా రాముడంటే అన్నాడు నారద మహర్షి.
కాబట్టీ సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ ధైర్యంలో హిమవత్ పర్వతం వంటివాడవు, పర్వతాన్ని చూడండీ వర్ష ధారల చేత కొట్టబడుతుంది, పిడుగులు పడిపోతాయి, ఆ పర్వతం మీదే చెట్లు పెరుగుతాయి, ఆ పర్వతం మీదే సింహాలు తిరుగుతాయి, పులులు తిరుగుతాయి, ఆ పర్వతానికి కన్నాలు పెట్టి పాములు పడుకొంటాయి, చిట్టెలుకలు పర్వత పాదం


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
దగ్గర కన్నాలు పెడుతాయి, ఎలుక కన్నంపెట్టి తనలోకి దూరిందని బెంగపెట్టుకోదు, ఒక ధూర్తుడు కాళ్ళతో పైకెక్కాడని


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
బెంగపెట్టుకోదు, వర్ష ధారలు కొట్టాయని కదలదూ, పిడుగులు పడ్డాయని చెక్కు చెదరదు, పులులూ సింహాలు తిరుగుతున్నాయని బెంగపెట్టుకోదు, మహాత్ములు తనమీద నడుస్తున్నారని పొంగిపోదు, తనమీద ఈశ్వరుడి దేవాలయం కట్టారని పరవశించిపోదు, తాను అలాగే నిలబడి ఉంటుంది, చెక్కుచెదరక నిలబడినటువంటి పర్వతం ఎలాంటిదో రాముడు అటువంటివాడు.
ఇది నారదడు నరుడిగా ఆయనకున్న లక్షణాలు చెప్తున్నాడు, ఇది నీవు సంతరించుకో కొన్నైనా ప్రతి దానికీ విఛలితుడువై పోవడంకాదూ ప్రతి చిన్నదానికి కదిలిపోవడం కాదు ధైర్యంగా నిలబడగలగాలి ఏం నాకు కాకపోతే ఎవరికివస్తాయి?, వస్తాయి కష్టసుఖాలనేటటువంటివి చేసుకున్న కర్మను అనుసరించి అన్నిటికి నిలబడగలిగినటువంటి స్థితి రామాయణమిస్తుంది విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియ దర్శనః ! కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీసమః !!  ఏమి శ్లోకాలు వాడారండీ ఈ సంక్షేప రామాయణంలో మహానుభావుడూ విష్ణునా సదృశో వీర్యే ఆయనతో పోల్చడానికి విష్ణుమూర్తి ఒక్కడే ఉన్నాడు, ఎందుకంటే ఇంక ఆయనతో పోల్చడానికి అటువంటివారు ఎవరుంటారండీ, విష్ణువుని విష్ణువుతోనే పోల్చాలి, కాబట్టి విష్ణువుతో సమానమైనటువంటివాడు సోమవత్ప్రీయ దర్శనః బాణం పట్టుకొని ఎదురుగుండా ఉన్న లక్షలమంది కంఠాలు తెగ కోసినాసరే, భక్తులైనవారికి మాత్రం ఆ స్వరూపాన్ని దర్శనం చేస్తూంటే ఎంత సంతోషంగా ఉంటుందో.
కాబట్టి సోమవత్ప్రియ దర్శనః లోకంలో మూడింటిని ఎంత చూసినా చూడబుద్ధే వేస్తుందట, ఎంత చూడండీ చూడబుద్ధేస్తుందీ, అందుకే పార్వతీ దేవీ వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టించింది, పసిపిల్లలకు కూడా సంతోషం కలిగించేవి మూడు ఏమిటో తెలుసాండీ గజ ముఖం, చంద్ర బింబం, సముద్రం. మీరు సముద్రం ఒడ్డుకెళ్ళి ఎంతసేపూ కూర్చోండీ, ఎంతసేపూ చూస్తున్నా సముద్రాన్ని అలా చూడాలనే అనిపిస్తుంది, చీకటి పడిపోయిన తరువాత సముద్ర ఘోష అదో సంతోషం, వస్తోన్న కెరటాలు అదో సంతోషం, చీకటి పడ్డాక దీపాలతో దూరంగా వెళ్ళిపోతున్న ఓడ అదో సంతోషం, సుర్యోదయానికి సముద్రం ఆకాశం కలినట్లుగా ఉదయిస్తున్న సూర్య బింబం అదో సంతోషం, ఆ పడుతోన్న ఎర్రకాంతి అదో సంతోషం, సూర్యాస్తమయానికి సముద్రంలోకి కృంగిపోతున్నట్లుగా అనిపించే సూర్యడు అదో సంతోషం. తిక్కనగారు విరాట పర్వంలో అంటారు, రాత్రయ్యేటప్పటికి ఆకాశం ఎలా ఉందటాంటే మంచి సంపన్నుడైన గృహస్తు ఇంట్లో అలంకారం చేసినటువంటి పడకలా ఉందట, దానిమీద పూవ్వులు అవి అన్ని వేస్తే ఎలా ఉందో అలా ఉందట, సూర్యోదయానికి ఆకాశం ఏలాఉందటా అంటే తెల్లవారింతర్వాత పది మందీ చూస్తే దృష్టి దోషం తగులుతోందనీ, ఆ ఇంటి ఇల్లాలు దుప్పటిమీది పూవ్వులూ అవీ అన్నిపోయ్యేటట్టు ఒక్కసారి రెండుచేతులతో ఇలా దుళిపేస్తే అన్నీ పోయిన తర్వాత ఆ దుప్పటి ఎలా ఉందో అలా ఆకాశం ఉంది తెల్లారేకల్లా అంటారు. అలా ఆ సముద్రాన్ని చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో, పసిపిల్లల దగ్గర్నుంచీ కవులవరకూ, జ్ఞానులవరకూ, సముద్రము ఆనందమే, పసిపిల్లాడికి ఏం తెలుసని ఆనందం వృద్ధుడికి ఏం తెలుసని ఆనందం అందరూ సముద్రపు ఒడ్డుకెళ్ళి ఆనందం పొందుతారు. ఆఖరికి తుఫాను సమయంలో సముద్రం చూడడం ఆనందం అదో సంతోషం కొంత మందికి. కాబట్టీ సముద్రం, రెండూ చంద్ర బింబం, చంద్ర బింబాన్ని ఎంతసేపూ చూడండీ సంతోషమే, రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారు సుందరకాండలో చంద్ర బింబాన్ని గురించీ ఏమి వర్ణణలో ఏమి సర్గలో కాబట్టి చంద్ర బింబం. మూడవది ఏనుగు ఏనుగు చూడండీ, వేంకటాచల క్షేత్రానికో, తిరుత్తనియే వేడితే ఆ ఏనుగు ముందు నిల్చుంటే పిల్లల్ని ఎంతసేపు నిల్చోపెట్టండీ సంతోషమే, ఆ తొండం ఇలా ఇలా ఆడిస్తూ ఆ ఏనుగు అలా నిలబడి అరటిపండిస్తే నోట్లోపెట్టుకొని ఆ దుమ్ముతీసి మీద పోసుకొని, స్నానం చేసీ, తెల్లటి దంతాలూ, దాని స్వరూపం, దాని చిన్న చిన్న కళ్ళూ, వెంట్రుకలూ, దాని తోక, పెద్ద పెద్ద కాళ్ళూ, ఇంతంత గోళ్ళూ, గుండ్రంగా పాదాలూ ఆ ఏనుగునీ ఎంతసేపు చూసినా అబ్బా ఇంకేం చూస్తాంలేండీ అని అనిపించదు అలా చూడబుద్ధేస్తుంది.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
 అలా చూడబుద్ధి వేస్తుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ముందు గణపతి యొక్క ముఖాన్ని తధేకంగా చూస్తే ఆ ధ్యాననిష్ఠ చేత విఘ్నములు తొలగిపోతాయి కాబట్టి పరమేశ్వరుడు అందరూ తొందరగా దృష్టిపెట్టి చూడడానికి వైముఖ్యం కలగనటువంటి ముఖాన్ని నా కొడుక్కిపెడితే అందరికీ ఉపకారం జరుగుతుందని ఏనుగు తలకాయ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు అది కారణం వినాయకుడికి ఏనుగు తలకాయ ఉండడానికి కారణాల్లో ఇదొకటి.
కాబట్టీ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియ దర్శనః ! కాలాగ్ని సదృశః క్రోధే క్రోధం కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటివాడు క్షమయా పృథివీ సమః ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. నిద్రలేస్తూనే భూమిని తంతాం భరిస్తుంది, మలమూత్రాలూ భూమిమీద విసర్జిస్తాం భరిస్తుంది, ఉమ్ము భూమి మీద వేస్తాం ఊరుకుంటుంది. పోనీ ఏదో పొరపాట్న వచ్చిందివేరు కానీ కావాలని ఒకరకమైన తాంభూలం వేసుకొని ఉమ్మడమే ప్రయోజనంగా నెత్తురు కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదేపనిగా ఉమ్మివేసేటటువంటివాన్ని కూడా భరించినటువంటి భూ మాత యొక్క ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి నిజంగా, కాబట్టీ అన్నం కావాలి నాగలిపెట్టి  అమ్మ గుండెలు మీద చీలుతాం, ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన పేరుతో గుణపాలుపెట్టి అమ్మ గుండెలు మీద గుచ్చుతాం, ఆఖరుకి ఇంత సంపాదించి, ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు, మా బాబాయిగారు, మా మేనమామ, మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్నవాళ్ళు ఊపిరి ఆగిపోగానే బెయటికి తీసికెళ్ళి చిరిగిపోయిన బొంతో, చాపో వేసి పడుకోబెట్టి, కొత్త చాపతెచ్చి నాలుగు కర్రలకేసి తాడేసి కట్టి తీసికెళ్ళిపోతూంటే, ఆఖర్న పుచ్చుకునేది ఈ తల్లొక్కతే. ఎవ్వరూ ఇంట్లో ఒక్కరాత్రికూడా ఉంచుకోరు యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే ! గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్కాయే !! అంటారు శంకర భగవత్ పాదులు. అటువంటిది ఈ తల్లికి ఎంత ఓర్పో ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఓర్పుందో అంత ఓర్పు కలిగినవాడయ్యా రామ చంద్ర మూర్తి.
కాబట్టీ ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ! కుభేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు అటువంటి త్యాగమున్నవాడు రామ చంద్ర మూర్తంటే సత్యే ధర్మ ఇవాపరః సత్యమూ, ధర్మమూ ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించుకుని కాపాడగలిగినటువంటివాడు త మేవంగుణసమ్పన్నం రామం సత్యపరాక్రమమ్ !! ఇన్ని గుణములు కలిగినటువంటి రామ చంద్ర మూర్తి సాక్ష్యాత్తుగా సత్యపరాక్రముడైనటువంటి వ్యక్తి, ఆయన పరాక్రమము సత్యమే పరాక్రమముగా కలిగినటువంటివాడు అటువంటి వాడు రామ చంద్ర మూర్తి అనీ ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు. సంక్షేపంగా అంటే బాగా వివరంగా కాదు అని అర్థం ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వివరంగా చెప్పలేదు కేవలం ఏదో విహంగవీక్షణం అంటారు చూడండీ ఎదో ఒక్కసారి స్థాలిపులాకన్యాయంగా ఒక్కసారి అలా చెప్పేసారు. ఎంత తేలిగ్గా చెప్పేశారంటే స జగామ వనం వీరః ప్రతిజ్ఞా మనుపాలయన్ ! పితు ర్వచననిర్ధేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్!! అంటూ... కానీ సంక్షేప రామాయణ శ్లోకాలండీ.. అవి నిజంగా మంత్రాలే... దశరథ మహారాజుగారు లేక లేక లేక లేక సంతానం కలగలేదని బెంగపెట్టుకొని అశ్వమేథ యాగం చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టిచేస్తే యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపవతులైనటువంటి తన భార్యలకిస్తే పెద్ద భార్యయైనటువంటి కౌసల్యాదేవి యొక్క గర్భాన్ని జన్మించినటువంటి సాక్ష్యాత్ విష్ణుశ్వరూపుడైన ధర్మాత్ముడైన రామ చంద్ర మూర్తి పినతల్లియైన కైకమ్మ 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలని రామ చంద్ర మూర్తిని, రెండు వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజుగారిని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యములందు నిలబెట్టడం కోసమని రామ చంద్ర మూర్తి రాజ్యాన్ని పరిత్యజించి నార వస్త్రాలు కట్టుకొని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అడవులకు వెళ్ళిపోతున్నాడు ఆ వెళ్ళిపోతోన్న సమయంలో


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమను దర్శయన్ ! రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా !!
జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా ! సర్వలక్షణ సమ్పన్నా నారీణా ముత్తమా వధూః! !
సీతాప్యను గతా రామం శశినం రోహిణీ యథా ! పౌరై రనుగతో దూరం పిత్రా దశరథేన చ !!
సాక్ష్యాత్తుగా దేవమాయయే శ్లోకంలో ఉన్న సౌందర్యమంతా రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనబడేటటువంటి సీతమ్మతల్లి, జనక మహారాజు గారియొక్క పుత్రి, అయోనిజయైనటువంటి తల్లి, స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడునటువంటి తల్లి, సర్వ లక్షణ సంపన్నయైనటువంటి సీతమ్మ, చంద్రున్ని రోహిని ఎలా అనుసరిస్తుందో అలా కష్టసుఖాల్లో నీతో కలసి ఉంటాను తప్ప, నేను అంతఃపురంలో ఉండనూ అని చెప్పి రామ చంద్ర మూర్తితో కలసి అరణ్యవాసానికి బయలుదేరింది సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామ చంద్ర మూర్తితో బయలుదేరాడు.
ముగ్గురూ అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండగా తనకు రాజ్యం కావాలని కోరక పోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమామ గారి ఇంటినుంచి తిరిగొచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే, నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుజ్ఞుడితో, వశిష్టుడితో, తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి, అన్నా... రామా! నాకొద్దూ ఈ రాజ్యం నువ్వే తీసేసుకోమ్మని ఎంత నిగ్రహించినా, ధర్మాత్ముడూ సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామ చంద్ర మూర్తి  నా తండ్రిని సత్యంలో నిలబెట్టంకోసం  నేను ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకీ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి, తన పాదుకలను తీసికెళ్ళి భరతునికిస్తే భరతుడు పాదుకులను పట్టుకుని నంది గ్రామానికొచ్చి సింహాసనం మీదపెట్టి రాజ్యం చేస్తుంటే, మహానుభావుడు చిత్రకూట పర్వతం మీదే ఉన్నట్లైతే వచ్చినటువంటి తల్లులూ సోదరులైనటువంటి భరత శత్రుజ్ఞులు జ్ఞాపకానికొస్తారనీ చిత్రకూటాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి ఉన్నటువంటి సమయంలో  అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకతైనటువంటి శూర్పణఖ వచ్చి రామ చంద్ర మూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడూ లేదా సంక్షేప రామాయణం ప్రకారం రాముడంటే రాముడు చేసే పనిని లక్ష్మణుని చేత చేయిస్తే రాముడు చేసినట్లే.
అందుకే రాముని చేత ముక్కు చేవులు కోయించబడితే ఆ శూర్పణఖ చేత ప్రేరేపింపబడిన ఖరదూషనాదులూ, త్రిశిరస్సు అనేటటువంటి పద్నాలుగు వేలమంది రాక్షసులు రాముని మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా పద్నాలుగువేల మంది రాక్షసులను నిగ్రహించినటువంటి రామ చంద్ర మూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణఖ వల్ల తెలుసుకొన్నటువంటి రావణాసురుడు ఆసూయతో సీతమ్మ తల్లి మీద మోహంతో, సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామ చంద్ర మూర్తి, శబరిని దర్శనం చేసి, తరువాత కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని నిగ్రహించి దశ దిశలకు వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి, నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకువచ్చి రామ చంద్ర మూర్తికి సీతమ్మ క్షేమ వార్త చెప్తే, రామ చంద్ర మూర్తి నీలుడిచేత, నీలుని యొక్క సహకారంతో సముద్రానికి సేతువుకట్టి, సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకువెళ్ళి, లంకా రాజ్యంలో వానర సహకారంతో రావణ కుంభకర్ణాది వీరులను నిగ్రహించి, తిరిగి మళ్ళీ ఆయోధ్యా పట్టణానికి వచ్చి పట్టాభిశక్తుడై పదకొండువేల సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలనచేసి, రామ రాజ్యం ఇలా ఉంటుందని చెప్పి లోకానికి చాటి చెప్పినవాడయ్యా శ్రీరామచంద్రమూర్తి అని సంక్షేప రామాయణాన్ని కథా రూపంగా శ్లోక రూపంగా  నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తే సంతోషించారు ఆ రామరాజ్యం యొక్క గొప్ప తనాన్ని నాలుగు శ్లోకాలు వినకపోతే మనం దోశం చేసినవాళ్ళం అవుతాం.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్ట స్సుధార్మికః ! నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః !!
న పుత్ర మరణం కిజ్ఞ్యిత్ ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్ ! నార్య శ్చావిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః !!
న చాగ్నిజం భయం కిజ్ఞ్చిత్ నాప్సు మజ్జన్తి జన్తవః ! న వాతజం భయం కిజ్ఞ్చిత్ నాపి జ్వరకృతం తథా !!
న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా ! నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ !!
నిత్యం ప్రముదితా స్సర్వే యథా కృతయుగే తథా ! అశ్వమేధశతై రిష్ట్వా తథా బహుసువర్ణకైః !! 
రామ చంద్ర మూర్తి రాజ్యం చేసేటటువంటి కాలంలో కొడుకులు మరణిస్తే పెద్దవాళ్ళైనటువంటివారు పిల్లలకు ప్రేత కార్యం చేయడం అన్నదిలేదు, స్త్రీలు విధవలై భర్తలు మరణిస్తే జీవించవలసినటువంటి దౌర్భాగ్యం లేదు, అందరూ పసుపు కుంకాలతో భర్త చేతుల మీదుగా వెళ్ళిపోయేటటువంటివారు, ఎక్కడా అగ్ని భయం ఉండేది కాదు,  జంతువులు నీళ్ళలో మునిగి మరణించడం అనేటటుంటిది ఉండేది కాదు, వాత భయం కాని అనారోగ్యం కాని జ్వరాలు ఏర్పడడం కాని, భయంకరమైన వ్యాధులు పుటమరించడం కానీ, దొంగతనం కానీ, క్షుద్ బాధ కానీ-ఆకలి బాధతో అలమటించటం కానీ, అశాంతి కానీ ఈ లోకంలో ఎక్కడా లేవు.
అశ్వమేధాది యాగములు చేసి ఎంతో మంది బ్రాహ్మణులకి బంగారాన్ని దానం చేశాడు గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ! అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః !! కొన్ని కోట్ల గోవులు దానం చేశాడు, కొన్ని కోట్ల బంగారు నాణ్యములను దానం చేశాడు ధశవర్ష సహస్రాణి దశవర్షశతాని చ! రామో రాజ్య ముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి!! రామో రాజ్య ముపాసిత్వా రాజ్యాన్ని ఉపాన చేశాడు మహానుభావుడు, అంత గొప్ప పరిపాలన చేసి  పదకొండువేల సంవత్సరముల పరిపాలన తర్వాత బ్రహ్మ లోకాన్ని చేరుకున్నాడు.
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ! ఈ రామాయణ కథ ఉన్నదే, ఈ రామాయణ కథ పాపములన్నిటినీ పోగొడుతుంది, ఇది వేదములతో సమానమైనది యః పఠే ద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే !! ఎవరు ఈ రామకథను వింటున్నారో వారి సర్వ పాపములు తొలగిపోతాయి  సత్యం సత్యం పునః సత్యం ఇందులో అనుమానమేమీ లేదు ఏతదాఖ్యాన మాయుష్యం పఠన్ రామాయణం నరః ఎవరు ఈ రామాయణాన్ని చదువుకుంటున్నారో, వింటున్నారో వాళ్ళకి ఆయుష్యు నిలబడుతుంది, అపమృత్యుదోషం తొలగిపోతుంది సపుత్రపౌత్ర స్సగణః ప్రేత్య స్వర్గే మహీయతే!! పుత్రుల్ని కొడుకుల్ని, మనమల్ని చూసిన తరువాత మూడు తరాలు చూసిన తరువాత సంతోషంతో సుఖశాంతులతో ఇహమునందు జీవించి ఆఖర్న తేలికగా శరీరం నుంచి ప్రాణం విడిపోయి జీవుడు సంతోషంగా భగవన్ నామం చేప్తూ స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఇంతటి గొప్ప అనుభూతిని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది రామాయణం. కాబట్టి ఎల్లరూ ఈ రామాయణాన్ని చదువుకోవాలి వినాలి, తరించాలి అని నారదమహర్షి వాల్మీకి మహర్షికి చెప్తే తధేక ధ్యానంతో ఆ మాలా మంత్రంగా చెప్పబడిన సంక్షేప రామాయణాన్ని విని పొంగిపోయిన హృదయంతో తన్వయత్వంతో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క స్థితి దగ్గర ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
రేపటి రోజున అసలు ఏలా ఆవిర్భవించిందో తన్వయత్వంలో ఉన్న వాల్మీకి మహర్షి ఎలా బయలు దేరారో? రామాయణం ఏలా వచ్చిందో?, ఏం జరిగిందో ఆ విషయాన్ని మీకు మనవి చేసి రామాయణా కథా ప్రారంభం చేసే అనుగ్రహాన్ని రామ చంద్ర ప్రభువు నాకు కృపచేయు గాక, రేపు ఖచ్చితంగా ఆరు గంటల ముప్పై నిమిషాలకు కథా ప్రారంభమైతుంది. లేకపోతే ఏడు రోజులలో బాల కాండ పూర్తికాదు కాబట్టి.
మంగళా శాసన పరై ర్మ దాచార్య పురోగమైః ! సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్ !!
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే ! చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ !!
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే ! శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ !!
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా !  శ్రవమ నయనజం వా మానసం వాపరాధమ్ !!
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో !!
సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తూ !
అందరూ ఒక్క నిమిషం కూర్చోండి..! కలియుగంలో అత్యంత పవిత్రమైందీ అనికదా మీతో మనవి చేశాను రామ నామం గురించి, శ్రీరామాయణం వినడం ఒక మహాద్భాగ్యం, నన్ను నమ్మండీ...  నేను చెప్తున్నానని నేను చెపట్లేదూ... జీవితంలో రామాయణం వినడమనేటటువంటిదీ కొన్ని కోట్ల కోట్ల కోట్ల కోట్ల జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్ఠం. అందునా సంపూర్ణ రామాయణం బాలకాండ నుంచీ-పట్టాభిషేకం వరకూ ఏక బిగిన మండల కాలం రామాయణం వినడమనేటటుంటిదీ సంభవమయ్యేటటువంటి విషయం కాదు. అది కేవలం పూర్వపుణ్యం రామానుగ్రహం ఉంటేనే సాధ్యమయ్యేటటువంటి విషయం. అటువంటి రామ కథ విన్న తరువాత మనం కేవలం లేచి వెళ్ళిపోవడంవల్ల ప్రయోజనం కన్నా రామ నామాన్నీ చెప్పి వెడితే చాలా బాగుంటుంది. రామ నామం కేవలం ʻరామʼ అనడం కన్నా పెద్దలు మనకొక మార్గాన్ని ఇచ్చారురామ రామ రామ అని మూడు మాట్లంటే ఆరోజు వాళ్ళు విష్ణు సహస్త్రం చెప్పిన ఫలితం. అది ఇంట్లో అంటేనే ఇంత ఫలితమిస్తే ఒక దేవాలయ ప్రాంగణంలో, అదీ జగత్ గురు పీఠప్రాంగణంలో ఎంత శక్తివంతమో ఆలోచించండీ, అందుకే రామ రామ రామ అని వేయ్యి ఎలా అవుతుందని మీకు అనుమానం ఉండచ్చు, అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సాంప్రదాయం ఉందిరా రెండుమా ఐదురామ రామ రామ అంటే 2x5, 2x5, 2x5 (2x5=10x2=20x5= 100x200x5=1000) రెండూ ఇంటూ ఐదు రెండూ ఇంటూ ఐదు రెండూ ఇంటు ఐదూ, రెండైదుల పది, పదిరెంట్ల ఇరువై, ఇరవై ఐదులు వంద, వందరెండ్ల రెండొందలు, రెండొందల ఐదుల వెయ్యి. ʻసహస్రనామ తత్యుల్యం రామ నామ వరాననాʼ కాబట్టి శ్రీ రామ రామ రామ అంటే విష్ణు సహస్త్రం చెప్పి వెళ్ళిపోయినట్టు. కాబట్టి నేనూ మకుటం అంటుంటాను, మకుటుం మీరందురుగానీ నేను దానికి వివరణ ఒకటి అంటుంటానూ... మీరు మీ అందరూ కూడా చక్కగానూ...


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము అని మీరంటారు...ఇలా అన్నప్పుడు రామ రామ రామ అంటే విష్ణు సహస్త్రనామం చెప్పినట్లవుతుంది. పైగా మీరొక్కటి గుర్తు పెట్టుకోండీ... నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను, వ్యక్తిగత అనుభవాల్ని వేధికలపై చెప్పడాన్ని నాకు ఇష్టముండదూ...  శ్రీరామాయణం జరగడం అందరికన్నా ముందే స్వామి హనుమా వస్తారు, అందుకే రామాయణం చెప్పేటప్పుడు, హనుమకోసం ఒక ఆసనం వేస్తారు, ప్రశ్చన్నరూపంలో వచ్చి కూర్చుంటారు. అదిగో ఆ ఆసం అదే, రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఖాలీగా ఉంచి ఉన్న ఆసనం ఎవరికంటే హనుమ కొరకే, దాని మీద వారు కూర్చొంటారు. అందుకే పుష్పాంలంకారంతో శోభిల్లింపజేస్తారు. ఇక పూలహారం వేశాం. రామనాం చెప్తుంటే ఆయన ఇలా చూస్తూ ఎవరా రామనాం చెప్తున్నారూ.. అని పొంగిపోతారు. రాముడూ, హనుమా ప్రీతిపొందేస్తారు...  అసలు సీతమ్మ పరవశించిపోతుంది. నేను ఇప్పుడే చెప్పాను వాక్కు ఉన్నది ఒక్క మనుష్య జన్మకి మాత్రమేనని...  అది మన భాగ్యవిశేషం చెప్పక తప్పదు. రోజూ అలా అనేం నేను మీతో గంటసేపూ చెప్పించను, ఒక్క పదకొండు పర్యాయాలు అందులో నాకు ఏది అనిపించాలనిపిస్తే అది అనిపిస్తుంటాను, నేను వివరణంతో కూడిన మాటంటానూ... మీరు  రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము అని మీరు అనాలి.
నేను గొప్పగా చెప్పట్లేదు...  మీతో ఒక మాట మనవి చేస్తా... నేను అయ్యప్ప స్వామి దేవాలంయలో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో ఇది అనిపించేవాళ్ళంరామాయణం అయిపోయిన తరువాత రామాయణం సిడీలు ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలకి వెళ్ళాయిఅయితే అమేరికా నుంచి నాకు ఫోన్లు వచ్చాయిగురువుగారు ఒక్కసారి వినండని... వాళ్ళు ప్రతిరోజూ రామాయణం వినేటప్పుడు ఖాళీ కుర్చి వేసి టేప్ రికార్డర్ పెట్టీఆరు ఇరవైఐదు అవుతుంటే కోటేశ్వరావు గారు ఉపన్యాసానికి వస్తున్నారని భావన చేసుకొనివాళ్ళు టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉపన్యాసం వినేసి నేను చెప్తుంటే వాళ్ళు రామ నామం చెప్తూ అమెరికాలో వాళ్ళందరూ కలిసి పట్టాభిషేకానికి ఊరేగింపుగా ఉపన్యాసంలో ఎలా చెప్పానో అలాగే పట్టాభిషేకం చేస్తూ వాళ్ళు నాకు ఫోన్ లో వినిపించారు. ఎందుకనీ అంటే నేను సముద్రం దాటి రానూ అని అన్నాను... అందుకని నేను వెళ్లలేదు చూడ్డానికి పాపం.
కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలలోనూ అలా చెప్పుకొని ఎన్ని కోట్ల రామ నామం జరిగిందో ఎన్నిచోట్ల చెప్పుకుంటారో, ఎన్నిచోట్ల పట్టాభిషేకాలు జరిగాయో, మళ్ళీ... ఆనాడు సంపూర్ణ రామాయణం చెప్పించాడు రామ చంద్ర ప్రభువు, ఈనాడు మళ్ళీ గుంటూరు శారాదా పీఠంలో చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చెప్పండీ... ఒక సాంప్రదాయానికి దీనిని ఆవిష్కరిస్తున్నాం, ఇవ్వాళ దీన్ని మీ ఆందరికీ కూడా బహుమానం చేస్తారు, మీ అందరూ కూడా చక్కగా ప్రతి రోజూ దీన్ని తీసుకొచ్చి రోజూ ఇందులోంచే నామాల్ని చదువుకోవచ్చూ... మీ ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు... ఇవ్వాళ మాత్రం నేను చెప్పింది మకుఠం చెప్పండీ... 108 నామాల్లో సంపూర్ణ రామాయణం  నామ రామాయణం అనీ ఇది కూడా మీకు బహుమానం చేస్తున్నారు, ఇది కూడా మీరు చదువుకోవచ్చు.


  బాల కాండ మొదటి రోజు ప్రవచనము
శ్రీ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
శ్రీ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
దారినొంటిగ నడచువారికి తోడునీడే రామ నామము  !! రా !
నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీ రామ నామము !రా !
కోరికొలచిన వారికెల్లను కొంగుబంగరు రామ నామము !రా !
అండపిండ  బ్రహ్మాండములకు ఆధారమైనది రామ నామము !రా !
బ్రహ్మసత్యం జగన్మిత్యా భావమే శ్రీ రామ నామము !రా !
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము !రా !
రాకడయు పోకడయులేనిదీ రమ్యమైనది రామ నామము !రా !
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీ రామ నామము !రా !
జీవితంబున నిత్యజపముగా చేయవలె శ్రీ రామ నామము !రా !
నిజస్వరూపము బోదకంబగు తారకము శ్రీ రామ నామము !రా !
వేదవాక్క ప్రమాణమములచే అలరుచున్నది శ్రీ రామ నామము !రా !
తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము శ్రీ రామ నామము !రా !
మంగళంబగు భక్తితోపాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !రా !

మంగళా శాసన పరై --