ఈరోజు పరమపావనమైనటువంటి సుందర కాండ ప్రారంభం.
శ్రీరామాయణంలో ప్రతీకాండ గొప్పదే ప్రతీకాండ ధర్మములను ఆవిష్కరిస్తుంది.
ప్రత్యేకించి బాల కాండలో వచ్చేటటువంటి గంగావతరణం, షణ్ముఖోత్పత్తి
మొదలైనటువంటివాటికి ఎన్నడూ ఫలశృతి చెప్పనటువంటి మహర్షి ఫలశృతిని చెప్పారు అంటే...
అవి ఎంత పటుతరమైనటువంటి కాండలో మనం అర్థం చేసుకోవచ్చు. అయోధ్య కాండ ప్రత్యేకించి
గృహస్తాశ్రమ ధర్మాలన్నింటినీకూడా మనకీ విషదీకరిస్తుంది, అరణ్య కాండ మహర్షుల యొక్క
వైభవాన్ని తపస్సు యొక్క శక్తిని నియమాలను ఆచరించి ఈశ్వరాభిముఖులైనటువంటి
మహాపురుషుల యొక్క ప్రజ్ఞను వాళ్ళు శరారాన్ని ఎంత తృణప్రాయంగా విడిచిపెట్టి
ఊర్ధ్వలోకాలను చేరగలిగారో ఆ స్థితిని మనకు ఆవిష్కరించి చూపిస్తుంది. కిష్కింధ కాండ
స్వామి హనుమ యొక్క వైభవాన్ని ఆవిష్కరింపజేసి రామ చంద్ర మూర్తి యొక్క ధార్మికనిష్ఠా
జాజ్వల్యమానంగా ప్రకాశించినటువంటి కాండ కిష్కింధ కాండ, అందులో ప్రత్యేకించి హనుమకి
శాపవిమోచనం జరగడమనేటటువంటిది, సుగ్రీవుడి యొక్క బౌగోళిక జ్ఞానము, వానరులు
సీతాన్వేషణం కోసం బయలుదేరడం హనుమ యొక్క వాక్ వైభవం ఆయన ఎంతటి బుద్ధిమతాం వరిష్ఠం
అన్న విషయాలు మనకు కిష్కింధ కాండ అవలోకనముచేత కనపడుతాయి. ఈ కాండలూ ఏ కాండకి మహర్షి
పేరిచ్చారో ఆ కాండ యొక్క పేరుకి తగినట్లుగానే కథా వృత్తాంతం ఉంటుంది, ఒక్క బాల
కాండ విషయంలో మాత్రం రాముని బాల్యం అందులోనే అంతగా వివరింపబడిందీ అని
అంగీకరించడానికి యోగ్యమైన విషయంకాదు. ఎందుకంటే కృష్ణ భగవానునికున్నట్లు రామునికి
బాల్య క్రీడలు కానీ లీలలు కానీ ఏమీలేవు, ఆయన ఒక నరుడు ఎలా ప్రవర్తించాడో అలాగే
ప్రవర్తించాడు. కాబట్టి బాల కాండ అన్న పేరు దేనికొచ్చిందీ అంటే నిజానికది
విశ్వామిత్ర కథ చెప్పబట్టీ వచ్చిందీ అని చెప్పవలసి ఉంటుంది, సుందర కాండ
దగ్గరికొచ్చేటప్పటికీ మహర్షి కథా సంబంధమైన పేరు ఉంచలేదు కాండకి, సుందర కాండ అని
పేరుపెట్టాడు.
మీరు రామ చంద్ర మూర్తి యొక్క అష్టోత్తర శతనామ
స్తోత్రం చూస్తే అందులో రామునికి సుందరుడు అని పేరుంది, మీరు సీతమ్మతల్లి యొక్క అష్టోత్తరాన్నిచూస్తే
ఆవిడకి ʻబాలా త్రిపుర సుందరియై నమఃʼ అని ఆవిడకి పేరుంది, మీరు హనుమ గురించి చూస్తే
హనుమకి సుందరుడూ అని పేరుంది. అదేమిటీ ఆయన వానర స్వరూపం కదా ఆయన సుందరుడేమిటీ అని
అనుమానం రావచ్చు. ఆయనా ఆత్మసాక్ష్యాత్కారమును పొందినటువంటి వ్యక్తి, సీతామాత దర్శనము
అంటే “ఆత్మను తెలుసుకోవడం - ఆత్మగా నిలబడడం” అటువంటి మహత్తరమైనటువంటి స్థితిని
పొందినవారు కాబట్టి ఆయన సుందరుడు.
కాబట్టి ముగ్గురూ సుందరులే సుందరుల యొక్క కథా
సుందరి కథా చెప్పబడినటువంటి కాండ గనుకా సుందర కాండ. కాదు, ప్రధానంగా సుందర కాండ
యొక్క సౌందర్యమంతా ఎక్కడుందంటే ఉపాసన రహస్యములను చెప్పింది, ఈశ్వరోపానయందు
వచ్చేటటువంటి వైక్లవ్యాలు, ఈశ్వరోపసన చేసేటప్పుడు ఉండవలసినటువంటి జాగ్రత్తలు,
ఈశ్వరోపాసన చేసేటటువంటి వ్యక్తి పొందేటటువంటి ఇబ్బందులు దానికి నిలబడగలిగినటువంటి
ప్రజ్ఞ ఎలా సంతరించుకోవలసి ఉంటుంది, ఈ విషయాల్నీ చాలా గొప్పగా ఆవిష్కరించినటువంటి
కాండ అందుకే ఆ వైభవాన్ని దర్శనం చేసేటప్పుడు పెద్దలైనవారు తమదైన శైలిలో ఎవరు
ఇష్టమొచ్చినటువంటి మార్గంలో వారు సుందర కాండని అన్వయం చేసుకోగలిగారు. ఒక్కొక్కరు
దాన్ని జ్ఞాన మార్గంలో చూశారు, ఒక్కొక్కరు భక్తి మార్గంలో చూశారు, ఒక్కొక్కరు శ్రీ
విద్యా సాంప్రదాయంలో చూశారు, ఎవరు ఎలా చూసినా అలా చూడడానికి అవకాశం ఇచ్చిన కాండ
సుందర కాండ. మీరు ఒక మూర్తిని భిన్నమైనటువంటి అలంకారం చేశారనుకోండి అంటే... నేను
మీకు బాగా అర్థమయ్యేట్లు చెప్పాలంటే దశావతారాలని వేస్తుంటారు, లోపల ఉన్న ప్రధాన
మూర్తి ఒక్కటే ఉంటుంది, లేకపోతే అమ్మవారు ఉంటుంది అమ్మవారికి శారదా నవరాత్రులులలో
అవతారాలు వేస్తారు, విజయవాడ కనకదుర్గమ్మవారికి అలంకారం చేస్తారుకదాండి అలా
చెయ్యాలీ అంటే ప్రధానమూర్తి అంగీకరించాలి, ప్రధానమూర్తి అసలు అలా అలంకారం చెయ్యడానికి ఆ మూర్తి
ఒదిగితే ఆవిడ దానికి ఒదిగీ అలంకారము చేత మీరనుకున్నట్లు భాసించగలిగితేనే మీరు
చేయగలరు లేకపోతే మీరు అలా చేయడం కుదరదు.
సుందర కాండ యందు గొప్పతనమంతా ఎక్కడుందంటే సుందర
కాండని మీరు ఎలా చూద్దామనుకున్నారో మీకు అలా దర్శనమౌతుంది, అటువంటి స్థితిని
మహర్షి అందులో ఉంచగలిగారు. అందుకే దార్శనికులైన మహానుభావులు ఎందరో వారి వారి
దృష్టికోణాల్లో చూసి వారు వారు తరించారు. అటువంటి సుందర కాండలో రాముడు ఎక్కడా
కనపడడు, బాల కాండలో రాముడు కనపడుతాడు అయోధ్య కాండలో రాముడు కనపడుతాడు అరణ్య కాండలో
రాముడు కనపడుతాడు కిష్కింధ కాండలో రాముడు కనపడుతాడు యుద్ధ కాండలో రాముడు కనపడుతాడు,
సరే ఉత్తర కాండ విడిచిపెట్టండి, ఇకా... అసలు రాముడు ఎక్కువ కనపడని కాండ కేవలం
సుందర కాండే. ఎక్కడో చిట్టచివర వస్తారు ఆయన మళ్ళీ ఈ కాండ అంతా ప్రకాశించేది ఎవరూ
అంటే ప్రధానంగా ఇద్దరు కనపడుతారు ఒకరు హనుమా, ఒకరు సీతమ్మా. ఇందులో మళ్ళీ అసలు
ఎక్కడా పైకి కనపడనటువంటి రామ చంద్ర మూర్తి చాలా గొప్ప పాత్ర పోషిస్తాడు, ఎలా
పోషిస్తాడూ అంటే రామ కథయే ఆలంబనంగా సాగుతుంది, ఎప్పుడెప్పుడు రామ కథ హనుమ చెప్పారో
అప్పుడప్పుడు చాలా గొప్ప విషయమేదో జరుగుతుంటుంది, సుందర కాండలో రామ కథ ఎన్నిమాట్లు
చెప్పబడిందో ఎలా చెప్పబడిందో మీరు గమనించవలసి ఉంటుంది.
రామ కథ ఒకటే కదాండీ! రామ కథా మార్చడానికేముండదు
జరిగిన వృత్తాంతం యదార్థంగా ఉంటుంది అందుకనీ ఎప్పుడు అలాగే ఉంటుంది రామ కథా...
అలాగే ఉన్న రామ కథనీ హనుమ మాత్రం ఒకేలా చెప్పరు, ఒక్కొక్కసారి దీర్ఘంగా
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
చెప్తారు,
ఒక్కొక్కసారి చాలా తక్కువ చేప్తారు, ఒక్కొక్కసారి కుతూహలం రేకెత్తేటట్టుగా
చెప్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తారు, ఎప్పుడెప్పుడు ఎలా చెప్తే అలాంటి
ప్రయోజనాన్ని అది సాధించుకుంటుంది అన్నివేళలా ప్రయోజనాలు ఒకటికావు కానీ సాధనం మాత్రం రామ కథే...
మీరది గుర్తించుకోవలసి ఉంటుంది, ఎన్నో ప్రయోజనాలని సిద్ధింపజేశారాయన కానీ అన్ని
ప్రయోజనాలు సాధించుకోవడానికీ వాడబడినటువంటి ఉపకరణమూ రామ కథే, అన్నిచోట్లా రామ కథా
ఒకలా మాత్రం చెప్పలేదు. ఒకలా అంటే రామ కథని మార్చేశారు అని మీరు అనుకోకండి,
ఒక్కొక్క చోటా విస్తారంగా చెప్పారు, ఒక్కొక్క చోటా చాలా లఘువుగా చెప్పారు, ఎక్కడ
ఎంత చెప్పాలో అంత చెప్తారు అంటే మీ పరిస్థితిని బట్టి మీరు రామ కథని అలా విహంగ
వీక్షణంగా జ్ఞాపకం చేసుకున్నా అది మీకు ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి
శిద్దాన్నపుమూట. మీతో పట్టుకెళ్ళినటువంటి శిద్దన్నం ఎటువంటిదో... అనసూయమ్మ మాటలలో
చెప్పాలీ అంటే చేసినటువంటి తపస్సు వ్యక్తియందు ఎలా నిక్షిప్తమై ఉంటుందో అలా రామ
కథమీద అనురక్తి ఉండి మీరు రామ
కథని స్మరించడం అలవాటవ్వాలి కానీ రామ కథా స్మరణమే చాలు మహా మంత్రమై మీ కార్యమును
సాధించిపెట్టగలదు.
కాబట్టి సుందర కాండలో రామ కథా వైభవము
ప్రకాశిస్తుంది, రామ నామ వైభవం ప్రకాశిస్తుంది, రామ నామం ఎంత గొప్పదో సుందర కాండలో
ఒకటికి నాలుగుమాట్లు నిరూపిస్తారు. రామ కార్యం మీద వెళ్ళేటటువంటివాళ్ళకి కించిత్
మీరు స్వాగతం చెప్పీ వాళ్ళకి మీరు ఏదైనా చిన్న ఉపకారం చేద్దామూ అనుకున్నా మీరేం చేయలేరు ఎందుకంటే మీరు
చేయడమన్నది ఎప్పుడు పూర్తౌతుంది మీరు చేసింది ఆయన పుచ్చుకుంటే. ఇప్పుడూ
నేను ఆయనకు భోజనం పెట్టానండీ అన్నది ఎప్పుడు పూర్తౌతుంది పెట్టిన భోజనం ఆయన తింటే,
కానీ త్రికరణశుద్ధిగా మీరు పెడదామనికున్నారనుకోండి పెట్టకపోయినా పెడదామనుకున్నంత
మాత్రంచేతా దానిఫలితమేమిటో రామ కథ చూపిస్తుంది. రామ కార్యం చూపిస్తుంది, రామ
కార్యం... రాముడే కాదు రామ కార్యంమీద వెళ్ళుతున్నవాళ్ళని మీరు కేవలం
సత్కరించడానికి ప్రయత్నించినంత మాత్రంచేతా అది ఎంత శక్తినివ్వగలదో సుందర కాండ
చూపిస్తుంది. కాబట్టి సుందర కాండ రామ వైభవాన్ని రామ నామాన్ని రామ కథని
చూపిస్తుంది, ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండీ! మనకి అథాంగపూజ అని ఒకటుంది
అథాంగపూజా అంటే పురుష స్వరూపంగా మీరు ఈశ్వరున్ని కొలిస్తే అంటే మీకు ఈశ్వరుడు
పురుషుడా ఈశ్వరుడు స్త్రీయా అంటే ఈశ్వరుడు పురుషుడు కాదు ఈశ్వరుడు స్త్రీ కాదు
నపుంసకుడు కాడు, స్త్రీ పురుష నపుంసక మూర్తియునుగాక, తిర్యక్ అమర
నరాదిమూర్తియునుగాక, కర్మ గుణ బేధ సదసత్ ప్రకాశికాక, వెనుక నన్నియు తానగు
విభుతలంతు అంటారు పోతనగారు, అలా అసలు స్త్రీ స్వరూపమూ కాదు పురుష స్వరూపమూ
కాదు మీరు ఏ రూపంగా పట్టుకుంటారో మీ మనసు ఎలా పట్టుకోవడానికి ఇష్టపడుతుందో అలా మీరు
పట్టుకుంటారు.
ఒక్కొక్కరికి అమ్మగా పట్టుకోవడం తేలికా స్త్రీ
స్వరూపంగా పట్టుకుంటాడు, ఒక్కొక్కరికి తండ్రిగా పట్టుకోవడం తేలికా పురుష స్వరూపంగా
పట్టుకుంటారు పురుష రూపంగా పట్టుకుంటారు. ఈశ్వర రూపాన్ని పట్టుకోవడం మనసు యొక్క స్థితినిబట్టి
ఉంటుంది తప్పా పట్టుకున్న రూపం ఈశ్వరుడు మాత్రం కాదు ఎందుకంటే చిట్టచివరికి
మిగిలేది ఆయన స్వరూపం నిర్గణం మీరు అందులోకి కలిసిపోయి అ స్థితిని
అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు రామ కథా బలంలో సుందర కాండలో
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ప్రత్యేకించి
గొప్పతనం ఎక్కడుందంటే అథాంగపూజ అన్నది మనం నోటితో చెప్పేస్తాం ఎంత వేగంగా
చెప్తామంటే అథాంగపూజ అసలు ఎప్పుడూ అథాంగపూజా అన్నది మనసులోకి కూడా వెళ్ళదు,
అథాంగపూజకి మనం ఇచ్చేటటువంటి తక్కువ
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వరు. అంటే నా ఉద్దేశ్యంలో
మళ్ళీ మళ్ళీ అంటున్నాను మిమ్మల్ని ఉద్దేశించి కాదు, నాబోటిగాని గురించి చెప్పేది,
అథాంగపూజా అంటే పాదముల దగ్గర్నుంచి తలవరకూ పాదముల దగ్గర్నుంచీ తలవరకూ పూజ
చేసేటప్పుటు మీకు విగ్రహంలో కనపడవు ఇవన్నీ చాలా కష్టం మీరు చూడలేనివి ఎన్నో
ఉంటాయి, మీకు మూర్తి ఉన్నది ఎదురుగా మీరు ఆ మూర్తియందు చూడడం ఎన్నడూ కుదరనటువంటివి
ఉంటాయి “నాభిన్ పూజయామి” మీరు ఎప్పుడైనా చూశారా నాభిని, ఈశ్వరుని బొడ్డు
మీరు చూశారాండీ మీ ఇంట్లో ఎప్పుడైనా బొడ్డు కనపడిందా ఈశ్వరునిది. లేకపోతే
దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క నాభిస్తానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..? “కటిం
పూజయామి” నడుం భాగం మీకు ఎప్పుడైనా కనపడుతుందా ఈశ్వరున్ని వస్త్రం కట్టి ఉంటుంది, ఏ నియమూర్తి అభిషేకంలోనో
కనపడచ్చు. మరి అటువంటప్పుడు ఇవన్నీ మీకు ఎలా దర్శనమౌతాయి అంటే మనోనేత్రంతో
మీరు చూడవలసి ఉంటుంది, మనో
నేత్రంతో చూసేటప్పుడు పైకి నామం నడుస్తుంది మీరు వేసేటటువంటి పూవ్వు ఎక్కడ
పడుతూందీ ఆ పువ్వు పడినప్పుడు ఎలా ఉంటుందీ పడనప్పుడు ఎలా ఉంటుంది, పడితే
జారిపోయే స్థానాలేవి పడితే ఉండే స్థానాలేవి, మీరు పూవ్వు వేస్తే బహు మృదువుగా
వేయవలసిన స్థానాలేవి కొంచెం తేలికగా వేసే స్థానాలేవి ఇవి మీరు తెలుసుకుని మనసులో
ప్రజ్ఞతో ఉంటే ఆ స్థానం మీద వేసేటప్పుడు మీలో మార్పు ఉంటుంది అన్నిటికీ ఒకేలా
పూలువేయడం కుదరదు. ఇప్పుడూ కళ్ళమీద పూలువేస్తారండీ “నేత్రేయం పూజయామి” కన్నులమీద
పూజా, కన్నులమీద పూజా పాదాలమీద పూజా ఒకలాగే చేస్తారా..? ఇక్కడ ఇలా వేసేస్తారు
అక్కడ అలాగే వేసేస్తారా..! ఆయన కంట్లో తగల్దూ మీరు చాలా జాగ్రత్తగా పువ్వుని ఆయన
కనుబొమని నుంచి విడిచిపెట్టేయ్యాలి అంతే.
ఆఖర్నా సర్వాంగాణి పూజయామి అంటారు
తలనుంచి పువ్వులు పేస్తే పాదాలవరకు పడిపోవాలి ఇప్పుడు తలనుంచి పువ్వుల పాదాలవరకు
పడిపోతుండగా తలనుంచి పువ్వులు పాదాలవరకు ఒక్కసారి మెరుపులా ఆయన రూపం భాషించాలి అలా
మీకు కనపడితే మీరు బాగా ఉపాసన చేశారని గుర్తు. పోతనగారు చాలా చమత్కారాలు చేశారు
భాగవతంలో కదలినబాహు పదక్రమమున రవము సూపెడున్ నూపు రవులవాణి అన్నాడాయనా!
ఆయన చెయ్యి కదిలితే కంకణముల యొక్క ధ్వని వినపడింది అన్నారు. అదీ... వినపడాలీ అంటే
మీరు చేసేటటువంటి ధ్యానం అంత నిష్ఠతో ఉండాలి. సౌందర్యలహరిలో శంకరభగవత్ పాదులు కూడా
ఇదే ప్రతిపాదిస్తాడు కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ
చరణనిర్ణేజనజలమ్ అంటారు, అమ్మవారి కాళ్ళు
కడిగేశామంటారు అమ్మవారు పాదోదకం పుచ్చుకున్నారు అంటారు, అమ్మవారు పాదోదకం
పుచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే శంకరులు చెప్పారు అమ్మవారు పాదాలు కడిగిన నీళ్ళు
ఎర్రగా ఉన్నాయి అన్నారాయన ఎందుకున్నాయి అంటే అమ్మవారి పాదలకు లత్తుక ఉంటుంది ఆ
లత్తుక కరిగింది నీళ్ళు ఎర్రబడ్డాయి ఆ ఎర్రబడిన నీళ్ళు నేను పుచ్చుకున్నాను
అన్నారు, పుచ్చుకుంటే రుచి ఎలా ఉందయ్యా అంటే తీర్థం అన్నారు. సరస్వతీదేవి తాంబూళ
చర్వణం చేసిన నోటి యొక్క ప్రసాదం ఆవిడ యొక్క లాలాజలంతో కలసినటువంటిది ఎలా ఉంటుందో
అలా ఉంది ఆవిడపాదాలు కడిగిన నీళ్ళు అన్నారు ఇదీ ధ్యానమునందు అనుభవించినవాడు
చెప్పగలిగినమాట.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఇదీ అనుభవించారూ
అంటే మీకు బాహ్యంలో మూర్తి అక్కరలేదు ఇంకా మీకు బాహ్యంలో ఎదురుగుండా ఉంటే చెప్పడం
కాదు, మీ ఎదురుగుండా చూడవలసిన అవసరం లేకుండా చూడడానికి ఏ ఇంద్రియం పనికొస్తుందో
దాన్ని చూడకుండా ఆపాలి అంటే కంటిని రెప్పలచేత అచ్చాదన చేయాలి, కనురెప్పలు ఇలా
మూస్తే ఇప్పుడు మీరు ఏ మూర్తిని స్మరించారో ఆ మూర్తి మీకు ఒక్కసారి పాదాల
దగ్గర్నుంచి తలవరకు కనపడాలి, ఒక త్రిభంగిగా కృష్ణపరమాత్మను చెప్పూ అన్నాననుకోండి,
ఏకాలుమీద నిలబడుతాడు ఏకాలువంచుతాడు ఆ నడుం ఎంతవరకు ఉంటుంది వేణువెలా పట్టుకుంటాడు
నడుమెలా ఉంటుంది పంచెలా ఉంటుంది ఉత్తరీయం ఎలా వేసుకుంటాడు కంఠమెలా ఉంటుంది ముఖమెలా
ఉంటుంది చెవులెలా ఉంటాయి నెమలి ఈక ఎలా పెట్టుకుంటాడు కిరీటమెలా ఉంటుంది ఇవన్నీ
మీరు పాదాల దగ్గర్నుంచి తలవరకూ తలదగ్గర్నుంచి పాదాలవరకూ విడిచిపెట్టకుండా
చెప్పేశారనుకోండి ఇప్పుడేం చెప్పవలసి ఉంటుందంటే కృష్ణుడి విగ్రహం ఆయనకు అక్కర్లేదు
ఆయన మనసుమీద కృష్ణ ముద్రపడిపోయింది కదాండి ఇది ఉపాసన బలం అంటే ఆయన ఉపాసన
అంతగొప్పది. ఉపాసనకి పతాకస్థాయి పరీక్ష జరిగింది సుందర కాండలో సీతమ్మతల్లి
అడిగింది హనుమని రాముడితో తిరిగానంటున్నావుకదా నీవు వానరుడివి కదా రాముడు నరుడు
కదా ఏదీ ఎలా ఉంటాడు రాముడు చెప్పూ... అంది ఆయనా పాదముల దగ్గర్నుంచి తలవరకూ ఏవొక్క
అవయవాన్ని సభాముఖంగా చెప్పడానికి వీలులేని అవయవాలతో సహా వర్ణించేశాడాయన.
అంటే ఆయన దర్శనం అలా ఉంటుంది. అలా దర్శించారు
అంతగా ముద్రపడిపోయింది కేవలం రాముని యొక్క బాహ్యం తెలిసుండడం కాదు రాముని యొక్క
ఆంతర్యము తెలుసు రాముడు ఎవరు రాముడు ఏమిటో రాముడు ఎలా ఉంటాడో రామునిలాంటివాళ్ళు
ఇంకెవరైనా ఉన్నారా ఇవికూడా ఆయన చెప్పేశారు అంటే భక్తి యొక్క పతాకస్థాయి ఎలా ఉంటుందో
ఉపాసనా అంటే ఎలా ఉంటుందో సుందర కాండలో పరీక్షపెట్టబడింది. ఇదీ సౌందర్యోపాసనము
అంటారు సౌందర్యోపాసనము ఆంతరమైనటువంటి శీలవైభవమును ఉపాసన చేస్తూ బాహ్యమునందు మధుర
మధురమైన రూపాన్ని ముద్రవేసుకోగలిగినటువంటి శక్తి. ఇదీ హనుమ నిరూపించుకున్నారు ఎవరి
దగ్గర నిరూపించుకున్నారు అలా చెప్తే ఏమో రాముడు అలా ఉంటాడేమో కాదూ అంటే మనం ఎలా
చెప్పగలం ఆయన చూసొచ్చానంటున్నాడు ఏమో ఆలా రాముడు అలా ఉండడండీ రాముని
తొడలున్నాయండీ..! రాముని తొడలు అలా ఉండవు అనాలంటే రాముని తొడలు చూసుండాలి కదా మీరు
కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను అన్నమాటా... రాముని తొడలగురించి ఎవరో ఒకాయన ఇలా
ఉంటాయని చెప్పాడు రాముని తొడలలా ఉండవని చెప్పాను నేను, రాముని తొడలు అలా ఉండవంటే
మరి ఎలా ఉంటాయన్నాడు, కాదు ఇలా ఉంటాయి ఆయన తొడలు అన్నాడు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఇప్పుడు నేను
సాధికారికంగా చెప్పానూ అంటే నేను బాగా చూసి ఉండాలి కదా... లేదా నీవు ఖచ్చితంగా
చెప్పావబ్బాయ్ అలాగే ఉంటాయ్ అన్నాను. ఇప్పుడు నేనూ చూసినవాన్నే కదా... చూడడం
విషయంలో ఇంక అనుమానం లేదు మనకి ఆయన సర్వాంగములు అంగ ప్రత్యంగములు ఆయన స్వభావము
పూర్తిగా తెలుసున్నవ్యక్తి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంది ఎవరు సీతమ్మతల్లి.
రాముడు ఎవరో ఆమెకన్నా ఎవరికి తెలుసు, రాముడు ఎవరో తెలిసున్నవాళ్ళు లోకంలో ముగ్గురే
అని చెప్తారు మొట్ట మొదటివాడు పరమశివుడు రెండవది సీతమ్మ మూడవారు హనుమ అంతే ఇంక
నాల్గవపేరులేదు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గర చెప్తున్నారు ఏదీ రాముడు ఎలా ఉంటాడు
చెప్పూ అని అడిగిందావిడా. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకీ ఆమె సంతోషించింది అంటే హనుమ
యొక్క సౌందర్యోపాసనకీ అగ్నిపరీక్ష జరిగింది సుందర కాండలో సీతమ్మతల్లి
పాతివ్రత్యానికి అగ్నిపరీక్ష జరిగింది తరువాత యుద్ధ కాండలో. ఇద్దరూ అగ్నిపరీక్షే
ఎదుర్కొన్నారు ఒకరి అగ్నిపరీక్ష పైకి కనపడదు ఇంకొకరి అగ్నిపరీక్ష కనపడుతుంది.
ఇద్దరి అగ్ని పరీక్షలు చేసినవాడు మాత్రం కనపడకుండా కనపడిన రామ చంద్ర మూర్తే.
ఇదీ సుందర కాండా అన్న పేరు రావడానికి అసలు
ప్రధానమైన కారణం, ఆయన సుందరుడు దేనిచేత అయ్యాడంటే ఉపాసనా బలంచేత సుందరుడయ్యాడు,
బాహ్యమునందు సౌందర్యం ఎవరికి కావాలండీ... మీరు ʻసౌందర్యముʼ ఉంటుందన్నా...
అన్నది ʻవికారముʼ, అది పోతుందది అదేం ఉండదది. అది నశించిపోతుంది జజ్జరీభూతమైపోతుంది అయిపోతుంది
కాలిపోతుంది. కాలిపోయిన తరువాత పిడికెడు బూడిద ఎంత అందమని మీరు లోకంలో దేన్ని పిలిచినా దాని చిట్టచివరి
స్వరూపమేదీ అంటే ఒక దోసెడు బూడిద అంతే అంతకన్నా ఇంకొకలా ఉండడానికేం
అవకాశమేం ఉండదు. కాని ఆంతర
సౌందర్యము ఏది ఉందో అది ఈశ్వరోపసనమే ఆ ఈశ్వరోపాసనా సౌందర్యమునందు పతాకస్థాయి
చేరినవాడు ఎవరుటాడో వాడు కాలంతో సంబంధంలేకుండా పూజింపబడుతూనే ఉంటాడు, ఆయనే
మార్గదర్శిగా ఉంటాడు మిగిలినవాళ్ళకి. ఇక్కడా సాధకుడిగా ఆత్మ సందర్శనం చేసినటువంటి
ఆత్మ సందర్శనం అన్నమాట వాడితే అప్పుడు ఆత్మ దర్శనం చేయబడే వస్తువైతే మనం వేరొకరం
ఆత్మ అనుభవమునకు తెచ్చుకున్నవ్యక్తిగా అద్వైత దర్శనం చేసిన మహాపురుషుడిగా సుందర
కాండలో హనుమా చాలా గొప్ప స్థాయినిపొందీ కీర్తివహించారు మహానుభావుడు అందుకే ఒక
వానరుడు సుందరుడు ఎలా అయ్యాడో నిరూపించిన కాండ సుందర కాండ కాదు కాదూ అసలు బాహ్య
సౌందర్యం గొప్పదా అంతః సౌందర్యం గొప్పదా ఈ రెండిటికీ పోటీ పెట్టి చూపిస్తే ఏది
గొప్పదో ఏది దేన్ని పడగొట్టగలదో నిలబెట్టగలదో నిరూపించిన కాండ సుందర కాండ.
బాహ్యంలో కాంచన లంకకి అధిపతి రావణాసురుడు, అన్ని
వైభోగాలకీ శాసన కర్తా రావణాసురుడు. తల్లి సీతమ్మా పిడికెడు అన్నం తిన్నట్లు
కనపడదు, పట్టుపుట్టం మార్చుకున్నట్లు కనపడదు, అంగరాగములు అదుముకున్నట్లు కనపడదు
సంతోషంగా కూర్చున్నట్లు కనపడదు. కానీ ఈమె యొక్క శక్తి ముందు రావణుడి శక్తి ఎందుకైనా
పనికొచ్చిందా..? ఎందుకూ పనికిరాలేదు బాహ్యంలో మీరు నమ్ముకున్నవి ఏవైనా సరే మీరు ఆంతర ఉపాసన ఎక్కువున్న
వ్యక్తులపట్ల మీరు అమర్యాదగా ప్రవర్తించడం వల్లా నశించిపోతాయన్నది నిరూపించిన కాండ
సుందర కాండ. కాదు వాక్కు మనిషిని చంపేయగలిగినటువంటి అస్త్రము.
అసలు మనుష్యుల చేతిలో చచ్చిపోతాను వానరుల చేతిలో
చచ్చిపోతాను అని అడిగాడు
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కానీ అలా కూడా అనలేదు నరవానరులు నన్నేం చేస్తారు
అన్నాడు. దానివల్లా వాళ్ళిద్దరి చేతిలో మరణిస్తాడు అసలు రావణాసురుడు మరణించింది
రెండు కారణాలకి చనిపోయాడు ఒకటి యధేచ్చగా విడిచిపెట్టబడినటువంటి ఇంద్రియములు, రెండు
ఆ ఇంద్రియ ప్రకోపములు చేత హద్దూ ఆపు లేకుండగా మాట్లాడినటువంటి మాటలు. పదినెలలు అమ్మవారితో ఏమాటలు
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మాట్లాడకూడనివి
మాట్లాడాడో దానివల్ల తన మరణానికి లొంగి తనకు తాను పచనం చేసుకుని సిద్ధంగా వండి
ఉంచాడు దాన్ని రామ చంద్ర
మూర్తి తిన్నారు. మాట మనిషిని ఎంతెత్తు ఎత్తగలదు మాట మనిషిని ఎంత కిందకు లాగగలదు
అని చూపించిన కాండ సుందర కాండ, కాదు బాలాత్రిపురు సుందరియైనటువంటి అమ్మవారు, మనం
శ్లోకం చెప్తుంటాం ప్రార్థనా శ్లోకం సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం అంటూ ఆ
తల్లి గురించి చెప్తూ... ప్రతి రోజూ ఒక మాట చెప్తూంటాం ఆవిడ చేతిలో ఒక అమృత పాత్ర
పట్టుకుంటుంది లేదా తేనె అనుకోండి పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం
బిభ్రతీం దానిమీద తుమ్మెదులు ఎగురుతుంటాయి, ఎవడెవడు ఇంద్రియములకు బానిస
అవుదామకుని భక్తితో అమ్మవారి పాదాలకు నమస్కారం చెయ్యడానికి సిద్ధపడలేదో వాడిని
ఇంద్రియ లౌల్యం నుంచి పడగొట్టి మాయలో తిప్పి వాడికి ఈశ్వర దర్శనము అవ్వడానికి
యోగ్యమైనరీతిలో బుద్ధి తిరగకుండా చేసేది ఆవిడే అందుకే ఆ తల్లి గురించి చెప్తూ
శంకరభగవత్ పాదులు సౌందర్యలహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి
అంటాడు ఆవిడ మహామాయా స్వరూపమై ఇంద్రియముల యొక్క లౌల్యములకు గురిచేసి మహా మాయలో
తిప్పి పడగొట్టనూ గలదు, ఆవిడే అనుగ్రహిస్తే మాయ అన్న తెర పైకెత్తేసి ఈశ్వర దర్శనం
చేయించి ఈశ్వరునిలో కలిపేయగలదు.
ఒకే సీతమ్మ శింశుపా వృక్షం కింద కూర్చుంది,
వచ్చి మాట్లాడుచున్నవాడు గొప్ప తపస్వి రావణాసురుడు ఏం అమాయకుడు కాడు వేదాలు
చదువుకున్నాడు. అటువంటివాడు ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నాడు అలా
మాట్లాడుతున్నవాడికి ఆవిడ అనుభవైక వేధ్యమైన వస్తువుగా కనపడుతుంది. ఈ సీతమ్మని నేను
అనుభవించచ్చు అనుకున్నాడు. అనుకున్నందుకు నశించిపోయాడు అన్నిమాట్లు వచ్చి చూశాడు
సీతమ్మని ఆవిడే స్వయంగా చెప్పింది కూడా పిచ్చాడా పాడైపోతావురా నీవు నన్ను
తెలుసుకోవట్లేదని చెప్పింది చెప్పినా అర్థం కాలేదు రావణుసురునికి. చెప్పకుండానే
పైన కూర్చున్నాయనకి ఇలా నమస్కారం పెట్టి స్తోత్రం చేశాడు. ఆవిడ ఇలా చూసినట్లు
కనపడదు మాట్లాడినట్లు కనపడదు కానీ తనెవరో తెలియజేసింది తెలియజేసి ఆయన్ని భవిష్యత్
బ్రహ్మను చేసింది. ఈయనకీ చెప్తున్నట్లు చెప్తూంది కానీ అది అర్థం చేసుకోలేని
తనానికీ పది తలకాయలు ఉన్నవాడికి పది తలకాయలు పడిపోయేటట్లు చేసింది ఇదీ ఆవిడ
త్రిపుర సుందరీతత్వం. అందుకే ఆయోధ్య కాండలో సుమంత్రుడు ఒక మాట బాలేన రమతే
సీతాబాలచంద్ర నిభాననా అంటాడు, ఆవిడా బాలాత్రిపుర సుందరిగా అందుకే అయోనిజ
కదాండీ ఆ తల్లీ అంటే... ఆవిడ చెప్పిందిగా అనసూయమ్మతో ధర్మేణ తనయా తవ అంది
అశరీరవాణి అమ్మా నేను నరకాంతనుకాను, ధర్మము చేత జనకుడికి కూతురిని అయ్యాను,
ఇప్పుడు కూడా నరకాంతగా ధర్మం పాటిస్తోంది, అందుకని ఆవిడ తనను తాను
రక్షించుకోంటుంది, కానీ ఆవిడ యొక్క త్రిపుర సుందరీ వైభవాన్ని ఆవిష్కరింపజేసింది
సుందర కాండలో.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కాదు అన్నిటికన్నా
గొప్పది పాతివ్రత్యము, ఆడది అంటే ఆఁ... అనుకొనేటటువంటివాడికి ఆడదాని గొప్పతనమేమిటో
తెలుసుకోవడానికి మార్గమిచ్చే కాండ సుందర కాండ. మీరొక తల్లిగా ఆరాధన చేయగలిగితే
మీరొక అమ్మతనాన్ని చూడగలిగితే మిమ్మల్ని ఎవరెష్టు శిఖరం మీద కూర్చోబెట్టగలిగినది
ఆవిడే మీరు చూడకూడని చూపు చూస్తే ఆవిడ ఇలా చూస్తున్నాడని గమనించి బట్ట సర్దుకు
కూర్చున్నంత మాత్రం చేత ఆవిడ పడిన బాధకి మీ పది తలలు తెగిపోతాయి. సుందర కాండలో
జరిగిందంతే... ఆవిడ సర్దుకు కూర్చుంది చూడకూడని చూపు చూస్తున్నాడని, పడిపోయాయి పది
తలకాయలు, పాతివ్రత్య వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ సుందర కాండ. కాబట్టి సుందర
కాండ మీరు ఎన్ని భంగిమలు ఎలా పెట్టి చూడండీ అన్ని రకాలుగా అది ప్రకాశిస్తుంటుంది,
అందుకే సుందర కాండ లాంటి కాండ సౌందర్యలహరి లాంటి స్తోత్రం ఇప్పటి వరకు ఈ
రెండిటిస్థాయి దాటినది అని చెప్పగలిగినంత స్థాయిలో మూడవది ఉన్నదీ అన్నది పెద్దలు
అనరు, పెద్దలైనవారు
ఏమంటారంటే లోకంలో రెండే ఉన్నాయి ఒకటి సుందర కాండ రెండు సౌందర్యలహరి ఇవి పారాయణ
క్రమం చేత వినడం చేత చెప్పడం చేత నమస్కరించడం చేత కేవలం గ్రంధాన్ని మీరు ఇలా
పట్టుకున్నంత మాత్రం చేత శక్తినివ్వగలిగినటువంటి అత్యంత వైభవోపేతమైన వాటిల్లో
సుందర కాండ సౌందర్యలహరి.
ఇప్పటికీ మీరు నమ్మండి నేను చెప్పిన మాట పెద్దలేం చెప్తారంటే ఏదైనా సమస్య
వచ్చినప్పుడు సుందర కాండలో ఒక పుల్ల పెడితే ఏ కాగితంలోకి వెళ్తుందో అక్కడ
పరిష్కారం ఉంటుందని చెప్తారు. సుందర కాండని నాకి తెలిసి ఇప్పటికీ ఎందరో
పెద్దలు పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు పువ్వులు వేసి నిర్మాల్యం తీస్తారు. సుందర
కాండ పుస్తకం కాదు సుందర కాండ సుందర కాండగా ఆరాధింపబడవలసినటువంటి
మహోత్కృష్టమైనటువంటి స్వరూపం. అసలు మహర్షి ఈ జాతికి శ్రీరామాయణంతర్గతంగా
అందించినటువంటి అమూల్యమైన కానుకా సుందర కాండ కాబట్టి రామ నామ వైభవము రామ కథా
వైభవము రామ కార్యమునందు సాయం చేస్తానన్నంత మాత్రం చేత కలిగేటటువంటి వైభవము సీతమ్మ
తల్లి యొక్క పాతివ్రత్య వైభవము సీతమ్మ తల్లి యొక్క బాలా త్రిపుర సుందరి తత్వము
రావణాసురుని యొక్క వాచాలత్వము, రావాణాసురుని యొక్క బుద్ధిమాంద్యము హనుమ యొక్క
బుద్ధి వైభవము హనుమ యొక్క ఉపాసనా బలం ఉపాసనా క్రమంలో వచ్చేటటువంటి వైక్లవ్యాలు
అన్నింటినీ మించి నమస్కారవైశిష్ఠ్యము, నమస్కారమన్నదానికి ఎంత గొప్పతనముందో కేవలం
ఒక్క నమస్కారం ఎంత సాధించగలదో చూపించిన కాండ సుందర కాండ అందుకే పెద్దలు ఒక మాట
చెప్తారు ఓషధి ఎటువంటిదో
నమస్కారం అటువంటిది ఓషధి దేనికి తీసుకుంటారు మీరు ఏదైనా అనారోగ్యం వస్తే
ఓషధి తీసుకుంటారు, ఒక ఓషధి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది జలుబు తగ్గుతుంది దగ్గు
తగ్గుతుందని.
పరమాచార్య స్వామి ఒకమాట అంటూండేవాడట చేసిన నమస్కారం ఎప్పుడూ కూడా ఏం
చేస్తుందంటే మిమ్మల్ని కాపాడవలసినటువంటి భరోసా ఇంకోళ్ళమీదకు తీసుకెళ్ళి పెడుతుంది.
మీరు ఇలా అన్నారనుకోండి ఇలా అనగానే
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
స్వీకరించినవాడు ఏం
చేయాలంటే నీకొక ప్రయోజనం చెయ్యాలి ఉత్తిగనే పుచ్చుకోకూడదు నమస్కారాన్ని ఓ
ఆశ్వీర్వచనం చెయ్యాలి, ఇప్పుడు మిమ్మల్ని రక్షించే భరోసా ఆయన పుచ్చుకుంటాడు. సుందర
కాండలో నమస్కారం చాలా రకాలుగా వస్తుంది ఏ నమస్కారం ఎలా వెడుతుందో అసలు ఎటుతిరిగి
నమస్కారం చెయ్యాలో దగ్గర్నుంచి ధర్మ సూక్ష్మాలను వివరించిన కాండ సుందర కాండ, సుందర
కాండలో ఇది దొరకలేదన్నది లేదు అని పెద్దలు చెప్తారు అన్నీ సుందర కాండలో ఉంటాయి
అని. కాదు అసలు మనుష్య జీవితంలో ఐశ్వర్యము అనేమాటకు అర్థమేమిటీ అని
చెప్పగలిగినటువంటిది సుందరకాండ ఒక్కటే, ఎందుకో తెలుసాండీ! లంకా పట్టణాన్ని
వర్ణిస్తుంది సుందర కాండ, అసలు ఆ కాంచన లంక గురించి ఏమి వర్ణన చేస్తారో ఎన్ని
సర్గలలో చెప్తారో మహర్షి, ప్రతి గది ప్రతి కిటికీ ఒక కిటికీ అక్కడ చూడాలంటే చాలా
కష్టమండీ కష్టమంటే ఏమిటో తెలుసా దృష్టి మరల్చలేరు చాలా కష్టం ఇలా చూసి ఇలా
తలతిప్పేయడం కుదరదు. కిటికీని చూస్తూ అలా ఉండిపోవాలి ఓ తలపుని చూస్తే అలా
ఉండిపోవాలి ఓ విమానం చూస్తే అలా ఉండిపోవాలి ఓ విగ్రహం చూస్తే అలా ఉండిపోవాలి
ఇవన్నీ వాడివికావు వాడు ఎత్తుకొచ్చినవి. ఊర్లో ఎక్కడెక్కడ ఎవరిదగ్గర ఏవి
అమూల్యమైనవి ఉన్నాయో వాటినన్నిటిని తెచ్చి ఓ చోటికి చేర్చాడు, అక్కడికెళ్ళినవాళ్ళ
దృష్టి తిప్పడం చాలా కష్టం అలా ఉంటుంది.
రసేంద్రియం ఆకర్షించేవి ఉంటాయి, మనసుని
ఆకర్షించేవి ఉంటాయి, కన్ను చెదిరిపోయేవి ఉంటాయి, మనసు అసలు నిలబెట్టడం
కుదరనటువంటివి ఉంటాయి ఇన్ని ఉన్నా మనసుని నిలబెట్టగలిగిన ప్రజ్ఞ ఎవరియందుందో వాడు సుందరుడు. హనుమ
మనసు కదిలిపోవడానికి ఎన్ని కావాలో అన్ని కనపడ్డాయి సుందరకాండలో, ఒక వ్యక్తి మనసు
చెదిరిపోవడానికి ఏవేవి చూస్తే చెదిరిపోతాయో అవన్నీ కనపడ్డాయి ఇన్నీ కనపడితే ఇవి
సీతమ్మ కాదని ఆయన వెళ్ళిపోయాడు, నయితి నయితి నయితి నయితి వాఖ్యముల చేత ఆత్మవైపుకు
అడుగు వేసేటటువంటి సాధకుని యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించిన కాండ సుందర కాండ. కాదు
ఐశ్వర్యము కాంచన లంకలో ఉన్నది ఐశ్వర్యము అనుకుంటాము అబ్బాఁ..హ్ ఎంత ఐశ్వర్యమండీ వాడిదీ... అనుకుంటాము, కాని
అది కాదురా ఐశ్వర్యమూ, ఐశ్వర్యము
అన్న మాటకు అర్థమేమిటో తెలుసా... తృప్తియే ఐశ్వర్యము తృప్తియే ఐశ్వర్యము
మీరు ఆలోచించండి నేనన్న మాట ఒకాయనకి
బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది ఇంతకన్నా ఏమిటండీ అంటాడు, ఒకాయనకి మంచి కలర్ టీవీ ఉంది
ఏదో విసిడియో ఏమోమో ఉన్నాయి రిమోట్లు చాలా ఉన్నాయి ఆయనకీ ఇంకా విదేశాల్లో ఇంకా ఏదో
ఉంది అది ఉంటే ఎంతబాగుండో అని అంటాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో తృప్తి చెందినవాడు
ఐశ్వర్యవంతుడా అన్నీ ఉండి ఇంకా ఏదో లేదని ఏడ్చినవాడు ఐశ్వర్యవంతుడా మీరు నాకు
చెప్పండి.
ఆకలేసి
అన్నం తినడానికి లేనివాడు దరిద్రుడే ఆకలేసి అన్నం తిందామంటే సమయంలేనివాడు
దరిద్రుడే అవునాకాదా మీరు
ఆలోచించండీ! ఒకాయనకి ఉన్నాయి ఇంట్లో అన్నీ ఆకలేస్తుంది తిందామంటే ఖాలీ ఏం ఉండదు
డబ్బు సముపార్జన ఎప్పుడు ఇలా చెవిలో సెల్లూ హడావిడీ పరుగు కాబట్టి అన్నం కూడా
తినలేడు దరిద్రుడే, ఒకాయనకి ఆకలేస్తుంది తిందామంటే తినడానికి లేదు వీడూ దరిద్రుడే
ఉన్న దరిద్రుడు లేని దరిద్రుడు ఇద్దరూ మాత్రం దరిద్రులే. బాహ్యంలో ఎన్ని ఉన్నా
తృప్తిలేక ప్రతిరోజు పుష్పకమెక్కి తిరిగి ఇంకా ఏదోలేదని అగ్నిహోత్రంలో నెయ్యిపోసి ఆర్పుదామనుకున్న
అజ్ఞాని ఎవరో
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
రావణాసురుడి రూపంలో
చూపిస్తారు. అటువంటివాన్ని రక్షించడానికి బాహ్యంలో ఏం పెట్టినా రక్షించలేవు,
ఆంతరోపాసన చేసిటువంటివాడికి తిర్యక్ లు కూడా ఉపకారం చేస్తాయి, ఇది నిరూపించిన కాండ
సుందర కాండ. అందుకే లంక యొక్క వైభవం గొప్పదా రామున్ని అనుసరించిన వానరులు
గొప్పవాళ్ళా అంటే రాముడికి నమస్కారంచేసి బయలుదేరినటువంటి వానరుడు సాధించగలిగిన
ప్రజ్ఞా తన ఊళ్ళో తన దగ్గర చుట్టూ కోట్ల మందిని పెట్టుకున్నవాడు తనను తాను తన
కొడుకుని రక్షించుకోలేకపోయాడు.
ఒక
భక్తి వైభవం ముందు ఈశ్వరోపాసనా వైభవం ముందు నిత్య తృప్తుని యొక్క స్థితి ముందు ఒక
బ్రహ్మజ్ఞాని ముందు ఒక ఆత్మని తెలుసుకున్నవాడి ముందు మిగిలినవి ఎలా వెల వెల బోతాయో
దేని వలన అసలు ఈ దేశంలో ఉపాసనా బలం ఇంత పేరు ప్రఖ్యాతులు ఈ దేశానికి వచ్చాయో...
చెప్పిన కాండ సుందర కాండ. కాబట్టి ఇంకేపేరు పెట్టమంటారు దానికీ... ఇన్ని సౌందర్యాలున్న కాండకి సుందర
కాండనాలా ఇంకో పేరు పెట్టాలా కథాంతర్గతంగా ఏదో ఒక కథ చెప్పినట్లౌతుంది అంతే, ఏ
ఘట్టాన్ని మీరు ప్రకాశింపజేస్తారు సుందర కాండలో ఉన్నటువంటి అన్ని సర్గలలో ఉన్న
అన్ని శ్లోకాలూ అమృత ఫలాలే ఒక్క చెట్టుకీ అద్భుతమైన పళ్ళు పండాయి మీరు ఈ పండు
కోసుకొని తిని ఈ పండు తిన్నా ఇంకో పండు తీసుకొని ఇంకోపండు తిన్నా అన్ని పళ్ళూ అంతే
ఘుమ ఘుమలాడుతూ ఉంటాయి. సుందర కాండ కూడా అంతే ఆ సుందర కాండ అన్న చెట్టుకు
పుట్టినటువంటి అన్ని పళ్ళూ మధురాతి మధురమే. మీరు ఏ శ్లోకాన్ని తీసుకుని అవధరించండి
మీకు ఎన్ని విషయాలనో లాగేసుకుంటుంది. లాగేసుకుని మీకు చూపిస్తుంది అంత ప్రజ్ఞని
ఆవిష్కరించగలిగినటువంటి కాండ సుందర కాండ. కాదు కాదూ దీనికి ఒక గొప్ప స్థితి ఉంది
పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఏం చెయ్యాలి సుందర కాండ చదువుకోవాలి కొడుక్కు
ఉద్యోగం రాలేదు ఏం చెయ్యాలి సుందర కాండ చదువుకోవాలి నాకు బాగా భక్తి కలగాలని ఉంది
ఏం చెయ్యాలి సుందర కాండ చదవాలి, మా ఇంట్లో ఏమిటో చాలా ఇబ్బందులుగా ఉంటుంది
ఇబ్బందులు తొలగిపోవాలి ఏం చేయను సుందర కాండ చదువుకో. ఉద్యోగం స్థిరపడాలి ఏం చేయాలి
సుందర కాండ చదువుకోవాలి, అన్నిటికీ మంత్రం సుందర కాండ చదువుకోవడం.
అన్నిటికీ మంత్రం సుందర కాండ ఎలా అవుతుంది నేను చెప్పడం
కాదు నీవు చదువుకొని చూడాలి, కొన్ని కొన్నిటికి సమాధానాలుండవు అనుభవంలోకి
తెచ్చుకోవడమే... అనుభవంలోకి తెచ్చుకుంటే సుందర కాండ గొప్పతనమేమిటో తెలుస్తుంది.
అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసాండీ అపమృత్యుదోషం వెంట తరుముకొచ్చేసి
గ్రసించడానికి పాశాన్ని వేసేస్తుండగా మృత్యుదేవత నోట రెండు కోరలకు చిక్కిన
బ్రతుగలరు ఒకవేళ బ్రతుకవ్చచూ అంటారు గయోపాఖ్యానంలో, అలా మృత్యు దేవతల యొక్క రెండు
కోరల మధ్యలోకి వెళ్ళి ఇంక నోటిలోకి గ్రసింపబడుతున్నవాడు తెలిసో తెలియకో సుందర కాండ
వింటే జారి కిందపడుతాడు ఇంత శక్తి ఆ సుందర కాండలో ఉంది దాన్ని మీరు అనుభవించడం మీద
ఉంటుంది. అందుకని ఏమీ తెలియకుండా కథా పరంగా విన్నా సుందర కాండే తెలిసి అన్వయాన్ని
విన్నా సుందర
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కాండే దాన్ని
అన్వయం ఎలా చేస్తారు మీ ఇష్టం ఎల్లాగైనా ఎంత దూరం మీరు ఆలోచించగలిగిన ప్రజ్ఞ
అమ్మవారు మీకిచ్చిందో అలా
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మీకు దర్శనమై
సంతోషింపజేస్తుంది. అందుకే అమ్మవారు ఎవరెవర్ని ఎలా అనుగ్రహించిందో అటువంటి
పెద్దలకి అలా అలా దర్శనీయమై దాన్ని అమృత ఫలంగా దాన్ని వారు అనుభవించి
ధన్యులయ్యారు. వారు మిగిలిన వారికి కూడా మార్గదర్శకులై మిగిలినవారిని కూడా
తరించడానికి మార్గాన్ని చూపించినటువంటివారై మహాపురుషులయ్యారు.
కాబట్టి చూడండి ఇప్పుడు సుందర కాండకున్నటువంటి
ఇంకొక గొప్ప స్థితేమిటో తెలుసాండీ! సుందర కాండ దగ్గరకొచ్చేటప్పటికీ చాలా శ్లోకాలని
శ్లోకములని పిలవరు మంత్రములని పిలుస్తారు అంటే మరి చాలా అక్షరాలు ఉంటాయి గదాండీ...
మరి అప్పుడు చాలా అక్షరాలు ఉంటే ద్వాదశాక్షరాలుంటే దాన్ని పంచాక్షరీ అనాలా
శతాక్షరీ అన్నాలా మాలా మంత్రము, అన్ని అక్షరములతో ఉంది కాబట్టి అది శ్లోకమైనా దాన్ని “మాలా మంత్రము”
అంటారు అదీ చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. కేవలం
విన్నంత మాత్రం చేతా పారాయణ చేతా చదువుకోవడం వల్లా వినడం వల్లా అంత శక్తి
ఆవిర్భవింపజేసేటటువంటి కాండ సుందర కాండ. సరే సుందర కాండ అన్న పేరు ఎందుకొచ్చిందీ
అన్నది ఒక్కటే కాదుగా నా ప్రసంగం కాబట్టి ఎక్కడెక్కడా సౌందర్యముందో అక్కడక్కడా
అందుతుంది ఆ సుందర కాండ అని అంటూనే ఉంటాను, కాబట్టి ముందే అంటూండం ఎందుకూ ఏదో
పరిచయానికి నాలుగు మాటలు ఇవి మీకు తెలియదని కాదు. కాబట్టి సుందరే సుందరో రామః
సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం ? అందులో అన్నీ సౌందర్యమే అంతా సుందరమే అంతా ఆనందమే.
కాబట్టి ఇప్పుడు సుందర కాండని ప్రారంభం చేస్తూ
మహర్షి అంటారూ తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః ! ఇయేష పదమ్ అన్వేష్టుం
చారణా చరితే పథి !! తతో రావణ నీతాయాః తత్ అన్న మాటతో ప్రారంభం చేశారు, సుందర
కాండని “తత్”తో మొదలు పెట్టి “తత్”తో పూర్తి చేశారు. తతో రావణ నీతాయాః అని
ఇక్కడ ప్రారంభం తతో మయా వాగ్భః అదీన భాషణా అన్న శ్లోకంతో పూర్తి. ఆ తత్ʼకి ఈ తత్ʼకి మధ్యలో మనం
ఉన్నాం. మనం ఏమౌతామంటే ʻతత్వమసిʼ అది నీవవుదువు
సుందరకాండ బాగా అర్థమైతే, కాబట్టి రెండు తత్ʼలు మంగళా చరణంతో
ప్రారంభం. తతో రావణ నీతాయాః రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి
ఉన్న జాడ కనిపెట్టడం కోరకనీ శత్రువులను మర్దించినటువంటి హనుమా చారుణులు
ప్రయాణించేటటువంటి మార్గంలో ప్రయాణించి వెళ్ళడానికి సంకల్పించి ఉన్నారూ, అది ఆ
శ్లోకానికి బాహ్యార్థం. ఈ శ్లోకంలో జీవం ఎక్కడంటే ఇయేష అది చాలా పెద్ద మాట
మూడు అక్షరాలు కానీ ఇందులో రావణ నీతాయాః అన్న చోట రావణ ʻవʼ గాయిత్రీ మహా
మంత్రంలో 12వ బీజాక్షరంతో ప్రారంభం. దాని యొక్క ఋషీ దాని యొక్క దేవతా ఎంతో
శక్తివంతమైనటువంటి స్వరూపాలు. అది బీజాక్షర స్వరూపంగా దాన్ని అలా ఉంచండి మళ్ళీ. తతో రావణ నీతాయాః రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి
యొక్క జాడ కనిపెట్టడానికి శత్రు కర్శనుడైన హనుమ బయలుదేరాడు. శత్రు కర్శనుడు అంటే
హనుమకి శత్రువులుండాలికదాండీ ఎవరో, ఉండి హనుమ వాళ్ళని చంపి ఉండాలి, ఉంటే హనుమ
ఫలానా శత్రువుల్ని చంపాడని చెప్పొచ్చు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మీరు కిష్కింధ
కాండలోనే కదా మీకు కనుపడ్డారు హనుమ, హనుమకి శత్రువులు ఎవరన్నా కనపడ్డంగానీ హనుమ
చంపడం కానీ మీరేమైనా విన్నారా కిష్కింధ కాండలో నేనేమైనా చెప్పానా మీకు నాకైతే
జ్ఞాపకంలేదు అలా చెప్పినట్లు, మరి ఎలా శత్రు కర్శనః అంటే... ఇక్కడ శత్రు కర్శనః
బాహ్యంలో శత్రువుల్ని చంపడం చాలా తేలికా అంతః శత్రువుల్ని తొక్కిపట్టడం అంత అంతః
శత్రువుల్ని గెలవడం చాలా కష్టం. ఎందుకో తెలుసాండీ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. బయటి
శత్రువులు నిర్మూలింపబడుతాడు. మీరు శారీరకంగా తీసేయవచ్చు శత్రువుని చంపేస్తాడు,
రాముడున్నాడనుకోండి చంపేస్తారు, హనుమ ఉన్నాడనుకోండి చంపేస్తారు. కానీ చంపేయడమన్నది
కుదరదు అసలు అంతః శత్రువుల విషయంలో మళ్ళీ వాళ్ళు ఏమౌతారంటే నిర్వీర్యమౌతారు కానీ
అదునుకోసం చూస్తూనే ఉంటారు అలా ఎదురు చూస్తూనే ఉంటారు, చిన్న అవకాశం
చిక్కిందనుకోండి అంతే ఊకలో పడ్డ నిప్పుకణం ఎలా రాజుకుంటుందో అలా రాజుకుంటుంది. కామః
క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త!
జాగ్రత! ఈ కామ క్రోధ లోభ మధ మోహ మాత్సర్యములనేటటువంటి అంతః శత్రువులు
నిగ్రహించగలిగినటువంటి ప్రజ్ఞశాలి మాత్రమే చేయగలిగిన సంకల్పాన్ని సాధకుడైన హనుమ
చేసి ఉన్నారు అని ఆ శ్లోకానికి అర్థం.
ఇప్పుడు ఆయన బాహ్య శత్రువుల్ని మర్ధించడం కాదు,
అంతః శత్రువుల్ని మర్థించారు అంటే లోపల ఉన్నటువంటి కామ క్రోధాదులను గెలిచినటువంటి
హనుమా! ఏ దర్శనానికి ఏది తెలుసుకోవడానికి వెళ్తున్నాడు, సీతమ్మ తల్లి జాడ బాహ్యం
ఆంతరం ఇవన్నీ గెలిచినటువంటి సాధకుడు చిట్టచివర తెలుసుకోవాలనే ప్రయత్నమేమిటంటే ఇది నేను కాదు ఈ శరీరం నేను కాదు
నేను ఆత్మ అన్న ఎరుకలోకి వెళ్ళాలి. నోటితో చెప్పడం కాదు అబ్బెబ్బే ఇది నేను
కాదండీ అని నాలా ఉపన్యాసం చెప్పడం కాదు, ఇది నేను కాదు లోపల ఉన్న వస్తువు నేనన్న అనుభవమునందు
స్థిరపడాలి, స్థిరపడి దీన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞలోకి వెళ్ళగలగాలి.
అదీ ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలికా అని అనుకోకండి, చాలా చాలా కష్టం ఎందుకూ
ఈ మాట అంటున్నానో తెలుసాండి, ఇప్పుడు నేను ఇది చెప్పాను ఆ ఫ్యాను ఆర్పేయండి నేను
ఇలా చూస్తాను చూసి అలా చూస్తాను ఏమో ఫ్యాను ఆరిపోయింది పెట్టండనీ అంటే దీని యొక్క
సుఖమునందు నాకు తాదాత్మకత ఉంది అంటే అందుకే అది ఆరిపోతే నేను దాని వంక చూస్తాను.
ప్రాజ్ఞులైనవారు దుఃఖపడుతున్న దీన్ని సాక్షిగా చూస్తారు. ఇది ఎలా ఉంటుందంటే
ఆరిపోయిన ఫ్యాన్ని నేను ఎలా చూస్తానో... బాధపడుతున్న దీన్ని పాపం ఇది బాధపడుతుంది
అని చూస్తారు.
ఓ కుక్కా ఓ కారుకింద పడి తన్నుకుంటుందనుకోండి,
తన్నుకుంటున్నటువంటి కుక్కను ఎలా చూస్తారో బాధ పడుతున్న దీన్ని అలా చూస్తారు. ఇది
బాధ పడుతోందంటారు మనం మీరు బాధపడుతున్నారంటారు. నాకు జ్వరమొచ్చిందంటారు. దీని బాధ
మన బాధ దీని బాధకి మనం సాక్షి. ఇది నేను ఇప్పుడు నోటితో చెప్పినంత తేలిక కాదండీ
ఇప్పుడు నేను చెప్పినది చాలా చాలా కష్టం. భగవాన్ రమణులకి సర్కోమా వస్తే ఆపరేట్
చేస్తామన్నారు ఆయితే ఆయనన్నారు ఆపరేట్ చేస్తే చేసుకోండి దాన్ని కోసుకుంటారా
పుండునీ కోసుకోండి మీ ఇష్టం కాదు చెయ్యి తీసేస్తాం అన్నారు. ఆయన అన్నారు నా
అదృష్టం ఈ చేతిమీద పుట్టింది కాబట్టి ఈ చేతినే తీసేస్తామన్నారు. ఒకవేళ ఏ తలమీదో
పుట్టుంటే కంఠం తీసేసేవారా అన్నారు ఆయన. అని దానికి కదా పుండు పుట్టింది దానికి
పుండు పుడితే మంత్తెందుకు మీరు కోసుకోండి చూస్తాను సాక్షిగా
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అన్నారు. పుండుకి
పుండు పుట్టింది కోసుకోండి అన్నారు. అంటే వాళ్ళన్నారు మీరు అలా అంటారేమో మేము అలా
చేయకూడదు ఎనస్తీషియా ఇస్తామన్నారు ఇచ్చి ఆపరేట్ చేశారు, చేసిన తరువాత నెత్తురు
కారుతోంది అందరూ వచ్చి అన్నారు అయ్యబాబోయ్ ఎంత రక్తం కారుతోందో అన్నారు. ఆయన
అన్నారు రక్తమా అది శమంతకమణి ఎర్రబంగారం పెడుతూంది ఈ రోజు అన్నారు.
ఆయన్ని తీసుకెళ్ళి ఓ గదిలో పడుకోబెట్టి హీటర్లు
పెట్టారు వెచ్చగా ఉంటుంది దానివల్ల బాధ తెలయకుండా ఉంటుంది పడుకుంటారని హీటర్
పెట్టకూడదట ఆపరేట్ చేస్తే అది తెల్లవారేటప్పటికి ఏమైపోయిందంటే ఒళ్ళంతా పొంగిపోయి
ఇలా ఎర్రగా నెత్తుటి గడ్డగా బద్దలయ్యేలా ఉంది శరీరం. డాక్టర్లని పిలిచారు
తెల్లవారిగట్ల వచ్చి, డాక్టర్లు వచ్చి అన్నారూ అసలు సర్కోమా అంటేనే పోటు, దాన్ని
ఆపరేట్ చేశాము అది ఆపరేట్ చేసినవాళ్ళకి హీటర్ పెడితే అసలు పిచ్చి కేకలు వేసేస్తారు
అంత పోటు వచ్చేస్తుంది. వొళ్ళు వొళ్లంతా పోటు వచ్చేస్తుంది ఎక్కడికక్కడ బద్ధలైనట్లు రక్తం వచ్చేస్తుంది
అంతే దాన్ని ఎలా ఓర్చారు అన్నారు, ఆయన్ని అడిగారు భగవాన్ పిలవచ్చుగదా మమ్మల్నీ
ఎందుకు పిలవలేదు అన్నారు. ఆయనన్నారూ మీరేమో దీనికి బాగుంటుందని పెట్టారు ఇదేమో
నాకు బాగులేదందీ ఏమిటీ తమాషా వాళ్ళు బాగుంటుందంటారు ఇది బాగులేదంటుందీ ఏదో చూద్దాం
చూస్తున్నాను అన్నారు. ఇది
వేరు ఆయనవేరు ఆయన దీన్ని చూసే సాక్షి ఆయనా బ్రహ్మజ్ఞాని అంటే. బ్రహ్మజ్ఞాని ఏం అంత తేలికగా
అనుకరిద్దామంటే దొరకడు సాధనా అంటే అంత తేలికనుకుంటున్నారా చాలా కష్టమండీ.
కాబట్టి తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు
కర్శనః మహానుభావుడైనటువంటి హనుమా శత్రువులను మర్ధించినటువంటివాడై అంతః
శత్రువులను అణచినటువంటివాడై ఆయనా రావణుని చేత అపహరింపబడిన సీతమ్మజాడ
కనిపెట్టడానికి వెడుతున్నారు బాహ్యం, ఆంతరం ఆత్మ అన్నది సత్యం కాని ఆత్మని మర్చిపోయి
ఇది నేను ఇది నేను ఇది నేను అనుకునీ నేను వెళ్ళిపోతాన్ నేను వెళ్ళిపోతాన్ నేను
వెళ్ళిపోతాన్ ఇక్కడ ఉండను అని వికారాలు చూపిస్తుంటే జుట్టు తెల్లగా మారిపోతుంటుంది
అంటే నాన్నా నేను ఎందులోంచి వచ్చానో అందులోకి నేను వెళ్ళిపోవడానికి సమయం
ఆసన్నమైపోతూంది. అంటే ఉండను ఇక వెళ్ళిపోతాను శక్తి క్షీణించిపోతూంది నీకు అదే
గుర్తు పూర్తిగా తెలుపైపోతూందంటే నీవు జాగ్రత్తపడిపో ఇంక నీవు ఉన్న సమయాన్ని
ఈశ్వరాభిముఖం చేసుకో అని చెప్తూంటుంది. ఇది చెప్తూంటే రంగేసేస్తే అదేం చేస్తుంది
అంటే దీని మీద తాదాత్మతతో దీనిమీద తాదాత్మతతో ఇది నేను ఇది నేను అంటే ఉంటుందా ఇది
ఉండను ఉండను అంటూంది, ఉండను ఉండను అని పడిపోతుంది పడిపోయిన తరువాత చూస్తాడు తాను
సాక్షిగా ఉండి. అరేరే దీని అసాధ్యం గూలా ఇది నేననుకొని ఎన్ని ఫేర్ అండ్ లౌలీలు
రాశానురా! ఇలా కాలిపోతూందీ దీనికోసం ఎంత అల్లరి పడ్డానురా అంటాడు. కాబట్టి తాను
ఎప్పుడో చూడ్డం కాదు ఇక్కడ చూడ్డానికి వీలుగా జ్ఞాన సముపార్జన కొరకు ఆత్మ నేనని తెలుసుకొని ఆత్మ తెలియదని
అడ్డుపడుతున్నటువంటి మాయాబరణమును తొలగించుకొనేటటువంటి ప్రయత్నం చేద్దామన్న సంకల్పం
ఎవరైనా అసలు జీవకోటిలో ఒకడు చేస్తే వాడు మహాత్ముడు.
అందరితో పాటు కొట్టుకపోకుండా నేను అసలు సత్యమును
తెలుసుకుంటానని ఎవడైనా సంకల్పం చేస్తే... అసలు ఆ సంకల్పమే చెయ్యడు, ఎందుకు చెయ్యడు
అందురు పెళ్ళి చేసుకున్నారు వీడు పెళ్ళి చేసుకుంటాడు, చేసుకోకపోయినా
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
చేసేస్తారు, అందరూ
పిల్లల్నీ కన్నాడు వీడు పిల్లల్నీ కన్నాడు అందరు పడుకుంటారు వీడు పడుకుంటాడు,
అందరు ఏడుస్తారు వీడు ఏడుస్తాడు అందరు నవ్వుతారు వీడు నవ్వుతాడు అందరూ జీతం
తెచ్చుకుంటారు వీడు తెచ్చుకుంటాడు, అందరూ తింటారు వీడు తింటాడు అందరూ ఏం
చేస్తున్నాడో వీడు అదే చేస్తున్నాడు. అందరూ చనిపోతారు వీడు చనిపోతాడు తప్పా అందరూ
తెలుసుకోంది తెలుసుకుంటానని అనేవాడు లోకంలో ఉండడూ. అలా ఎవడైనా అంటే ఇయేష ఆ
సంకల్పం చాలా గొప్పది. అలా
అన్నవాడు ఎవడో వాడు ప్రాజ్ఞుడు వాడు మహా పురుషుడు కారణ జన్ముడు అంటారు.
అటువంటి ఒక యోగి ఒక సాధకుడి గురించి మాట్లాడుతుంది సుందర కాండ కాబట్టి తతో రావణ
నీతాయాః సీతాయాః శత్రు కర్శనః ! ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి !!
బాహ్యంలో రావణాసురిడి యొక్క జాడ కనిపెట్టాలి రావణుడు ఎక్కడున్నాడు సంపాతి
చెప్పాడు, సంపాతి చెప్పింది నిజమేనని నమ్మకం, కాలిపోయిన రెక్కలు వచ్చాయి.
కాబట్టి అది నమ్మకం ఇప్పుడు దాన్ని
తిరస్కరించడానికి వీలులేని ప్రబలసాక్షం, నాకు ఇక్కడ్నుంచి కనపడుతూంది అన్నాడాయన
నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలిగితే కాంచన లంకలో సీతమ్ముంది. కాబట్టి
ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు, బయలుదేరుతున్నారూ అంటే లంకను బాహ్యంలో చేరాలంటే
సముద్రంలో ఈత కొట్టడం ఓ మార్గం సముద్రంలో ఓడెక్కడం ఓ మార్గం లేదూ కొన్ని కొన్ని
యోగ విద్యలు తెలిస్తే సముద్రం మీద నడక కూడా ఒక మార్గం. ఎందుకంటే నీటి మీద
నడిచేటటువంటి ప్రక్రియా నీటి మీద తేలేటటువంటి ప్రక్రియా కొన్నుంటాయి, యోగ సాధన చేత
వస్తాయి అదొక ప్రక్రియా, అలా కాకుండా ఆకాశంలో వెళ్ళడం ఒక ప్రక్రియా. అసలు ఏదీ
అంటుకోకుండా తాను పైనుంచి వెళ్ళిపోవడం అంటే ఈశ్వరుడియందు రమిస్తూ అన్నిటికీ సాక్షిగా ఉండి సాధన
చేసేటటువంటి ప్రక్రియ జ్ఞాన మార్గంలో వెళ్ళడం. ఆయనా ఎలా వెళ్తున్నారు చారణా
చరితే పథి చారుణులు అంటే మీకు కిష్కింధ కాండలోనే వచ్చింది. చారణులు అంటే వారు
ఎప్పుడూ కూడా లోకంలో మంగళ కరమైనటువంటి వార్తలను తీసుకొచ్చి చెప్తుంటారు, మనం అది
తెలుసుకోనప్పుడు వాళ్ళు వచ్చి చెప్తుంటారు. సుందర కాండలోనే కనపడ్డారు వాళ్ళు
హనుమకి కనపడ్డారు సీతమ్మ కాలిపోయిందనుకుంటుంటే చారణులు అనుకుంటూ వెళ్ళిపోతుంటే
విని ఆయన సీతమ్మ బతికుందనుకుంటారు.
చారణలు తిరిగే మార్గము అంటే భూమికి దగ్గరిగా
మంగళ వార్తలు చెప్తూ తిరిగేటటువంటి అటువంటివారి మార్గము, అటువంటి చారణలు ఎటు
తిరిగుతుంటారో అటువంటి మార్గంలో ఈయన వెళ్ళారు. అంటే ఈయన కూడా శుభవార్త
తీసుకొస్తారు వానరులకి ఏమిటా శుభవార్త సీతా దర్శనం అయ్యింది, సీతమ్మ జాడ పట్టుకుని
వస్తారు. కాబట్టీ తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః ! ఇయేష పదమ్
అన్వేష్టుం చారణా చరితే పథి !! దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మ వానరః !
సముదగ్ర శిరో గ్రీవో గవాం పతి రివా బభౌ !! మహర్షి అంటారు దుష్కరం అసలు
ఈ పని చేద్దామని ఎవడూ అనుకోడు, ఎవడూ చేద్దామనుకోని పనేముందో అది ఈయన
చేద్దామనుకుంటాడు. ప్రతివాడూ ఇంతకన్నా సుఖముంటుందా..? ఇంతకన్నా సుఖముంటుందా?
ఇంతకన్నా సుఖముంటుందాని అడుగుతాడు. అందరూ అయ్యబాబోయ్ అన్నదేదో ఈయ్యన దాన్ని
చేయడానికి సిద్ధపడుతుంటాడు. నూరు యోజనముల సముద్రం మీద ఎగురుతానంటున్నాడు, ఆత్మ
యొక్క
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అనుభవాన్ని
పొందుతానంటున్నాడు ఆంతరమునందు కాబట్టి దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మ
వానరః సాటిలేని పనిని సాధించడం కోసమని ప్రయత్నిస్తున్నటువంటి హనుమా... ఒక
వృషభం అంటే ఒక ఎద్దు ఎంత ఠీవిగా పర్వత శిఖరం మీద నిలబడుతుందో, నిలబడినప్పుడు ఇలా
తల ఎత్తి ఎలా నిలబడుతుందో అలా తల ఎత్తీ
ఆయన నిలబడి ఉన్నారు. దీని అర్థమేమిటో తెలుసాండీ వృషభం నందీశ్వరుడు,
నందీశ్వరుడైనటువంటి వృషభం ఏదైతే ఉందో గవాం పతి అంటే నందీశ్వరుడు.
నందీశ్వరునికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణముంది,
ఆయన జన్మ పశుత్వం కానీ నందీశ్వరుడు జన్మించడం సామాన్యుడుగా జన్మించాడాయన. ఒక
ఆలయంలో నిలబడినప్పుడు ఒక పశుశ్వరూపంగా నిలబడి ఉంటాడు కానీ లోకానికి పృష్టభాగం
ఇస్తాడు, ఈశ్వరుడిమీద దృష్టిపెడతాడు. నంది చూడండీ నంది వెనకాల ఏముంటుంది లోకమంతా
ఉంటుంది, నంది చూపుల్లో ఎవరుంటారు శివలింగం ఉంటుంది. నందీ ఎప్పుడూ మేళం చెయ్యండి
కళ్యాణం చెయ్యండి పిడుగులు పడనీయ్యండి వాన పడనీయ్యండి రోహిణీ కార్తే రానియ్యండి
అంటుకుపోతూండనీయ్యండి కార్తీక మాసమొచ్చిందని యుక్తా యుక్త విచక్షణ లేకుండా నందికి
తోక కిందకి తీసుకెళ్ళి దీపాలు పెట్టనీయ్యండి, అరిటిపండు తీసుకెళ్ళి ఏదో మనం పెడితే
తప్పా బతకలేడు అనుకున్నవాడిలా రెండు ముద్దులు తీసుకుని దాని మూతికి రాసేయండి గాజుఈగలూ వచ్చి
ముక్కులో తేలనీయ్యండి ఆయన మాత్రం అలాగే శివలింగాన్ని చూస్తూంటాడు. ఏం చేసినా ఆయన
దృష్టి ఇలా తిప్పరు, దృష్టి తిప్పకుండా శివున్నే చూసేటటువంటి నందీశ్వరుడు ఎలా
ఉంటాడో దృష్టి తిప్పవలసినవి
ఎన్ని కనపడినా తిప్పకుండా సీతమ్మ దర్శనమే చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు
వెడుతున్నాడు. అసలు ముందు ఆ సునిశిత ప్రజ్ఞ అంటే అన్నిటినీ చూస్తున్నా అన్నిటిలో
ఆవిడ్ని చూడ్డం ఆవిడ్ని వెతకడం. విశ్వమునందు విశ్వనాథుని వెతకాలి లోకమునందు
లోకేశ్వరున్ని వెతకాలి మీరు ఎక్కడ వెతుకుతారు ఇదే ఈశ్వరుడిగా కనపడాలి ఇది ఇదిగా
కనపడినంత కాలం మాయ, ఇది ఇదిగా
కనపడకుండా ఇదంతా ఒకటిగా ఈశ్వరుడిగా కనపడిందనుకోండి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని
మీరు పొందేసినట్లు.
కాబట్టి ఆ దృష్టితో ఆయన వెడుతున్నాడు ఇది గవాం
పతి రివా బభౌ అంటారు, అటువంటి దృష్టికోణంతో ఒక నందీశ్వరుడు వెడుతున్నట్లు
వెడుతున్నారు కాదు, నందీశ్వరుడే శాపమిచ్చాడు ఓరి రావణా! రేప్పొద్దున్న నీ ప్రాణం
తీయడానికి వానరులొస్తారూ అన్నారు, ఆ శాపమిచ్చినటువంటి ఏ రుద్రతేజస్సుతో కూడిన
నందీశ్వరుడున్నాడో ఆ నందీశ్వరుడు పరమ శివుడు అభేదం అందుకే నందికి శివునికి మధ్యలో
తేడా ఉండదు. ఆ నందీశ్వరుడే ఆ శివుడే అష్టమూర్తులయందు వాయువు ఒకటి గనుకా ఆయనే వాయు
స్వరూపంగా తన తేజస్సుని అంజనాదేవియందు పెట్టి పుత్రుడుగా పుడితే ఆత్మనావై
పుత్రనామాసి గనుగా శివుడు ఇప్పుడు హనుమగా ఉన్నారు గనుకా శివుడికి నందికి అభేదం
గనుకా నందియే లంకాపట్టణానికి వెళ్ళితే లంక యొక్క వినాశనము రావణాసురుని యొక్క పతనము
ప్రారంభమౌతుందని గుర్తు. లంక ఇన్నాళ్ళు ఇతరులనేడిపించింది, లంకా ఏడవడం మొదలౌతుంది.
లంకలో ఇప్పటివరకూ ఏడుపుల్లేవు లంక ఏం చేస్తుందంటే ఇతరుల్ని ఏడిపిస్తుంది ఇంక
ఇప్పుడు లంకేమౌతుందంటే ఏడ్వడం మొదలుపెడుతుంది. ఎందుకనీ ఇప్పటివరకు ఏడిపించడమే
లోకాన్ని అరిచేటట్టు చేయడమే వాడు పెద్దగా అరిచాడు కాబట్టి రావణా అని పేరు వానికి
అటువంటివాడు మొదటిసారి ఏడ్చాడు జీవితంలో ఏడ్చి చచ్చాడు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కొడుకు చచ్చిపోయాడు
తను చచ్చిపోవడమంటే ఏమిటో అప్పుడు తెలిసొచ్చింది వాడికి, ప్రహస్తున్ని చంపాడు హనుమా లంక లంకతట్నీ
కాల్చాడు లంకలో ఏడవనివాడులేడు అందర్నీ ఏడిపించినవాడు అందరినీ ఏడిపించేవాడు
బయలుదేరుతున్నాడు. నందీశ్వరుడు కపిరూపంలో వెళ్తున్నాడు ఇది చెప్పడానికే గవాం
పతి రివా బభౌ ఇది, ఇది సామాన్యమైన పనికాదు లంకనేడిపించడమంటే ఒక్కడే వెళ్ళి
కోట్ల కోట్ల మంది రాక్షస గణాలున్న చోటుకెళ్ళి ఒక్కడు నిర్భయంగా తనెవరో చెప్పి
ఎందుకొచ్చారో చెప్పి ఏం చేశారో చెప్పి నన్ను నీవేం పట్టగలవురా అని దాటేసి
వచ్చేశాడు వాళ్ళనేడిపించి. ఇది మామూలు ప్రజ్ఞ కాదు దుష్కరం నిష్ప్రతిద్వందం
చికీర్షన్ కర్మ వానరః ! సముదగ్ర శిరో గ్రీవో గవాం పతి రివా బభౌ !! అథ వైడూర్య
వర్ణేషు శాద్వలేషు మహాబలః ! ధీరః సలిల కల్పేషు విచచార యథా సుఖమ్ !! అథ మళ్ళీ
మంగళా చరణం అథ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః పచ్చగడ్డీ మెత్తగా ఉంది ఆ
మహేంద్రగిరి పర్వత శిఖరాలల మీద మెత్తగా ఉన్నటువంటి పచ్చగడ్డిమీద లక్ష్యం లేకుండా
ఆయన దాన్ని తొక్కుతూ ధీరుడై ఆయన యథా సుఖమ్ చక్కగా సుఖంగా విహరిస్తున్నాడు
తిరుగుతున్నారు. పచ్చగడ్డిమీద తిరగడానికి అది పెద్ద అల్లరేమిటండీ అది పెద్ద
విశేషమా..? అంటే పచ్చగడ్డి స్పర్శ సుఖానిస్తుంది, మీరు ఎప్పుడైనా మెత్తటి
పచ్చిగడ్డి మీద నడిస్తే పచ్చిగడ్డిమీద అబ్బా ఎంత హాయిగా ఉందో పచ్చిగడ్డిలో
నడుస్తూంటే అంటారు. సుఖము అన్నది స్పర్శచేత అనుభవింపబడుతూంటుంది ఎక్కువగా అటువంటి
సుఖములను తోసిరాజని ప్రయత్న పూర్వకంగా కష్టమైనదీ అని మనకనిపించేదాన్ని కష్టమన్నది అన్నది కూడా తెలియనిస్థితిలోకి
వెళ్ళగలిగినవాడు వెళ్తున్నాడని చెప్పడం. కాస్త కష్టంగా ఉంటుంది నేను
చెప్పినమాట నాకు తెలుసు, ఒక్క నీకే అర్థమయ్యిందా నీవు అన్నమాట అంటారు.
మొదట చూసినవాడికి ఏమనిపిస్తుందంటే అయ్యబాబోయ్
ఎంత కష్టమండదీ అనిపిస్తుంది, కూర్చున్నాయనకి లేదా ఆ పని మొదలు పెట్టినాయనకీ అది
కష్టమో సుఖమో తెలియని స్థితి వెళ్ళిపోతుంటాడు అంటే బాహ్య స్పర్శ పోతుంది. ఇది ధీరః
ఆ స్థితిలోకి వెళ్ళగలిగితే
సాధనయందు వ్యగ్రతను పొందాడని గుర్తు. మీరు నేనొక ఉదాహరణ చెప్తే బాగా
పట్టుకుంటారు మీరు భగవాన్ రమణులు చిన్నతనంలో అరుణాచలం గుళ్ళోకి వెళ్ళారు,
ఎందుకెళ్ళారో ఆయనకూ తెలియదు ఆయన వెళ్ళేటప్పటికి ఆశ్చర్యమేమిటంటే ఎవ్వరూ లేరు
అంతరాలయంలో ఆయన వెళ్ళి అప్పా నీవు పిలిచావు నేను వచ్చాను కౌగలించుకున్నారు,
బయటికొచ్చారు యజ్ఞోపవితం తీసి విసిరేశారు ఉన్నడబ్బు అవతలపారేశారు ఒంటిమీద బట్టలు
తీసి అవతల పారేశారు ఎవరో మంగలి వచ్చేశాడు శిరో ముండనం చేసేశాడు ఓ చోట కూర్చున్నారు
ఆయనా సాధన ప్రారంభించారు, పిల్లలు వచ్చి ఆయన మీద రాల్లేసి కొట్టడం మొదలు పెట్టారు
శరీరానికి దెబ్బలు తగిలి నెత్తురు కారుతుంది ఎవ్వరూ కనపడని చోటుకు
వెళ్ళిపోదామనుకున్నాడు, పాతాళలింగమని ఉంది అరుణాచల దేవాలయంలో ఇప్పుడు చాలా
బాగుంటుందనుకోండి ఆ పాతాళ లింగం దగ్గరికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు మీకు అక్కడ పాత
ఫోటో ఉంటుంది చూస్తే ఆశ్చర్యపోతారు ముళ్ళ కంచలతో ఉండేది అసలు లోపలికి ఎవ్వరూ
దిగేవారు కాదు. కాబట్టి అక్కడికి ఎవ్వరూ రారు, ఎవ్వరూ రారు కాబట్టి ఆయన ముళ్ళ
కంచెల్లో దిగి ఆ పాతాళ లింగం వెనక్కెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు మీరేమంటారు
నేనేమంటాను అయ్యబోబోయ్ అంటామా అనమా... ఆయనకదీ అమ్మయ్యా... చూశారా..! నాజోలికి
ఇప్పుడు ఎవ్వరు రారు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
వెళ్ళి ఆయన
కూర్చుంటే తెళ్ళు జెర్రులు ఎండ్రకప్పలు తొడలకింద చేరేవి చేరి కరిచేస్తుంటే రక్తం
అంతా కారిపోయి అట్టలు కట్టేసింది ఇదంతా కూడా చర్మం అంతా కూడా పోయి మాంసం ముద్దకింద
వేలాడిపోయింది. ఆయనకవేం తెలియవు ఆయన అలాగే ఉన్నాడు సమాధి స్థితిలో. మొదట సుఖమును కాదని ధీరుడై తరువాత
సుఖమా దుఃఖమా అన్న స్థితిని కూడా మర్చిపో గలిగినటువంటి స్థాయికి ఎదిగిపోతే అప్పుడూ
ఆత్మ అన్నది ఎరుకలోకి వస్తుంది. అంతటి సాధనా వ్యగ్రతలోకి వెడుతున్నాడు ఇదీ
పైకి కావ్యంలో అందగా మాట్లాడవలసి వస్తే అథ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః !
ధీరః సలిల కల్పేషు విచచార యథా సుఖమ్ !! ఆయనా పచ్చిగడ్డిమీద అటూ ఇటూ తిరుగుతూ
సుఖములను తోసిరాజని ఉన్నారు. ఇప్పుడూ స తస్య గిరివర్యస్య తలే నాగ వరా యుతే !
తిష్ఠన్ కపివర స్తత్ర హ్రదే నాగ ఇవా బభౌ !! హనుమా ఒక పెద్ద నీటి మడుగులో మధ్యలో ఒక ఏనుగు నిలబడితే ఎలా ఉంటుందో ఆ మహేంద్ర
పర్వతం మీద నిలబడినటువంటి ఆయనా అలా ఉన్నారు. ఇప్పుడు ఆయనా సీతాన్వేషణము కొరకు
బాహ్య కథా అని ఒకటుంది కదాండీ! సీతాణ్వేషము కొరకు లంకాపట్టాణానికి వెళ్ళాలి, ఎలా
వెళ్ళాలనుకుంటున్నారు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు మహర్షి చెప్పారు చారణా
చరితే పథి అంటే ఇప్పుడు ఆయన వెళ్ళడమూ మిగిలినవాళ్ళకు కనపడుతుంది మిగిలిన
వానరములకు కనపడుతుంది.
అసలు చూడండి ఒక్కొక్క విమానం ఎగిరిందనుకోండి
అసలు విమానం ఎగిరినట్లు మీకు తెలియదు అంత ఎత్తులో తిరుగుతుందనుకోండి ఉపగ్రహం
తిరుగుతోంది, మనం ప్రయోగించిన ఉపగ్రహం మీకేమైనా కనపడుతుందాండీ కనపడదు అంటే అంత
ఎత్తులో తిరుగుతూంది అది. అలా వెళ్ళలేదు హనుమా... ఎందుకో తెలుసా ఆయన
వెడుతున్నప్పుడు నాకో పెద్ద ప్రాణి ఆహారంగా దొరికిందని సింహిక చూసింది
నీడనిబట్టిలాగింది. అంటే నీడ పడేంత దగ్గరలోనే వెళ్ళారు చారణా చరితే పథి అది
చారణా చరితే పథి. కాబట్టి ఇప్పుడు ఆయన వానరములన్నింటికి కూడా కనపడింది ఆయన
ఎగురుతూండడం, పైన నిలబడినటువంటి దేవతలకి కనపడింది పైవారు పుష్పవృష్టి కురుపించారు
కింద ప్రాణులు చూసి వాల్మీకి మహర్షీ దివిశాక్తిక ప్రత్యక్ష ప్రచారం చేశాడు. అంటే
శబ్దములచేతా సుందర కాండలో హనుమ ఎలా వెడుతున్నారో మీకు కనపడుతుంది మీరు అలా
చూడ్డానికి వీలుగా ఉంటారు ఆ శ్లోకాలు అంత అందంగా ఇచ్చారు పైన ఎవరు నిలబడ్డారు కింద
ఎవరు ఉన్నారు. ఆయన ఎలా వెడుతున్నారు ఆ మూర్తి ఎలా ఉంది అన్నీ మీకు చూపిస్తూ
మాట్లాడారాయన. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరేముందు అంటే ఇది ఎగిరి ఆకాశంలోకి
వెళ్ళాలి పర్వతంలోంచి, ఆ ఎగిరి ఆకాశంలోంచి వెళ్ళేముందు నమస్కారం చేశారు ఎవరికి స
సూర్యాయ మహేన్ద్రాయ పవనాయ స్వయమ్భువే ! భూతేభ్య శ్చాఽజలితం కృత్వా చకార
గమనే మతిమ్ !! మీతో నేను మనవి
చేశానుగదాండి... నమస్కారమనేటటువంటిది ఆర్ష ధర్మంలో చాలా గొప్ప స్థాయిని
పొందుతుంది, ఏది తెలిసున్నా
తెలుసుకోలేకపోయినా సరిగ్గా వినయంగా నమస్కారం చెయ్యడం ఒకటి వస్తేచాలు మనిషి
అభ్యున్నతికి హేతువై కూర్చుంటుంది. భవ రోగాన్ని తీసేస్తుందండీ చావు
పుట్టుకను తీసేస్తుంది నమస్కారం అది అంతగొప్పది.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఒక చమత్కారమైన కవి
ఒకమాట అన్నాడు ఈశ్వరా కిందటి జన్మలో నేను నీకు నమస్కారం చెయ్యలేదు ఈ జన్మలో
పుట్టాను, ఈ జన్మలో నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నమస్కారం చెయ్యను అన్నాడు,
ఎందుకంటే చేశాను కాబట్టి మళ్ళీ ఇంక పుట్టుకలేదు కాబట్టి ఇదే ఆఖరి నమస్కారం,
నమస్కారం అంత గొప్పది. కాబట్టి స సూర్యాయ ముందు సూర్యుడికి నమస్కారం,
సూర్యునికెందుకు సూర్యభగవానుడు గురువు శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసేవాడు
గురువొక్కడే అందుకని గురువు ఇచ్చినటువంటి అనుగ్రహమేదుందో దానితో తుల్యమైంది
ఇవ్వగలిగినవాళ్ళు ఇంకెవ్వరూలేరు. కాబట్టి స సూర్యాయ ముందు సూర్య భగవానినికి
నమస్కారం గురువుగారికి మహేన్ద్రాయ ఇంద్రుడికి నమస్కారం ఇంద్రుడు ఇంద్రియములలో
కొన్నిటికి అధిపతియై ఉంటాడు, కాదు కాదు పైన దేవలోకానికి అధిపతియై ఉంటాడు, ఆయన
అనుగ్రహం కావాలి ప్రత్యేకించి చేతికి ఆయన అధిపతి ఇంద్రుడు. ఈ చేత్తోనే కదా ఇవ్వాలి
ఉంగరము ఈ చేత్తోనే కదా పుచ్చుకోవాలి ఆభరణము కాబట్టి స సూర్యాయ మహేన్ద్రాయ బాహ్యమునందు మహేంద్రుడికి నమస్కారం పవనాయ ఇక్కడ
చాలా మంది పెద్దలేమన్నారంటే పవనాయ అంటే వాయువుకి నమస్కారం చేశాడు అన్నారు కానీ
మళ్ళీ వెంటనే కింది శ్లోకంలో కూడా పవనాయాఽఽత్మ యోనయే తన తండ్రియైన వాయువుకిగదా ఉంది కాబట్టి రెండుమాట్లు నమస్కారం ఉండదుగా కాబట్టి
ఇక్కడ పవనాయా అన్న మాటకీ పూజయతే స్వజ్ఞానేన యోగిబృందం, స భగవాన్ ప్రత్యక్తత్వ
రూపో రామః రామునికి నమస్కారం ఇక్కడ వాయు శబ్దంచేత ఎందువల్లా అంటే పూజయతే
స్వజ్ఞానేన యోగిబృందం, స భగవాన్ కేవలం ఒక్క శ్రీ రామునికి కాదు, ఒక్క రామ శబ్దం వాయు శబ్దం చేత
ప్రతిపాదింపబడుతుంది. కాబట్టి రామునికి నమస్కారం ముందు శ్రీ కారం లేదు శ్రీ
కారం లేకపోతే ఏమైందీ సీతా సహితుడైన రాముడికి కాదు ఒక్క రాముడికి నమస్కారం ఇది
ఉపాసనలో దోషం.
సనాతన
ధర్మంలో మీరు ఏ మూర్తిని ఉపాసన చేసినా శక్తి పక్కన ఉన్న మూర్తికే చెయ్యాలి, శక్తి
పక్కన లేనటువంటి ఏ మూర్తికీ మీకు దైవంగా పూజ చేయడం కుదరదు అలా చేయకూడదు కూడా అది
దోషము ఉపాసనయందు. అందుకే రాముడికి
పూజ చేస్తే శ్రీ రాముడిగానే, లక్ష్మీనారాయణులను, సరస్వతీ బ్రహ్మలు, శివ పార్వతులు
జంటగా శక్తితో కలిసి ఉన్నవాళ్ళకే పూజ తప్పా ఒక్క రాముడికి పూజ చేస్తే మీరు
తట్టుకోలేరు ఇబ్బందులొస్తాయి అందుకే ఎప్పుడూ శ్రీ రామా అనడమేగాని రామ అనం. రామా
అని రాస్తామా శ్రీ రామా అని రాస్తామా..? శ్రీ రామా అని రాస్తాము ఆ శ్రీ కారమే
సీతమ్మ తల్లి, అందుకే ఆ సీతమ్మతల్లే పార్వతీదేవి శ్రీయన గౌరినా బరగు చెల్వకు
జిత్తము పల్లవింప భ ద్రాయితమూర్తియై అంటారు తిక్కనగారు విరాట పర్వంలో ఆ
లక్ష్మియే గౌరి ఆవిడే శక్తి స్వరూపము అందుకే శ్రీ సూక్తమూ అంటే అమ్మవారు శక్తి
స్వరూపిణి పార్వతిదేవికి చేసినా లక్ష్మీదేవికి చేసినా సరస్వతీ దేవికి చేసినా శ్రీ
సూక్తంతోటే శ్రీ రామునితో వస్తే శక్తి సహితుడైన రాముడు. శ్రీ పక్కన లేకపోతే
ఒక్కరాముడికి నమస్కారం సీతమ్మను వదిలిపెట్టినట్లు ఇది ఎక్కడిదాకా తీసుకెళ్ళింది
లంకదాకా తీసుకెళ్ళింది సీతమ్మతల్లి దర్శనం చేయించలే, మళ్ళీ ఎప్పుడు దిద్దుబాటు
మళ్ళీ ఇంకో నమస్కారం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై ఆవిడకి
కూడా నమస్కారం అప్పుడు అశోకవనం కనపడింది.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఉపాసనా వైక్లవ్యాన్ని దిద్దుతూంటుంది మన ఆరాధనా
ఎలా ఉండాలో మనం ఎలా ఆరాధన చెయ్యాలో
నేర్పుతుంటుంది. మరి శంకరాచార్యులవారికి గుడి ఎలా కట్టారండీ, ఆయనకి పక్కన శక్తి
ఉండదుగా... పెళ్ళి చేసుకోలేదుగా... అది గురు స్వరూపమయ్యా..! అందుకే ఆయనకి పూజ
చేస్తే పంచలచాపలివ్వడమూనూ ఆయనకి సెంటుకొట్టడమూనూ
స్ప్రే కొట్టడమూనూ రాజోపచారాలు చేయడమూనూ లేకపోతే మామూలు ఉపచారాలన్నీ ఆయనకి
ఇవ్వరు ఆయనకి ఇస్తే సత్యదండం రుద్రాక్షమాలా విభూతి ఆ తరువాత ఏదో కాషాయ వస్త్రం
ఇవిస్తాం. ఆయన జ్ఞానమును బోధించినటువంటి గురువు, కాబట్టి ఒక గురువుకి గురుపూజ
చెయ్యెచ్చుగానీ ఒక గురువుని తీసుకొచ్చి గురువు ఈశ్వరుడు ఎందుకని బ్రహ్మవిత్
బ్రహ్మైవ భవతి అది ఆయన స్థాయి, నీవు ఉపాసనకి ఈశ్వరోపాసన చెయ్యాలని కూర్చుంటే
మాత్రం పూజలో నీవు సశక్తి స్వరూపుడైనవానికి మాత్రమే పూజించేయాలి. పక్కన అమ్మవారు
ప్రకటనంగా స్త్రీ రూపంలో పక్కన అమ్మవారు కూర్చున్న మూర్తికి పూజ చేయాలి తప్పా అసలు
అమ్మవారి రూపంతో స్త్రీ
పక్కన లేని మూర్తిని ఈశ్వరుడిగా పూజ చెయ్యకూడదు నేను చెప్పట్లా సుందరకాండలో
చెప్పారు. సుందర కాండ తీర్పు అంతే అది. కాబట్టి స సూర్యాయ మహేంన్ద్రాయ పవనాయ
స్వయమ్భువే ముందు బ్రహ్మగారికి నమస్కారం చేసినాడు ఎందుకనీ, మహానుభావుడు
సృష్టికర్త కదాండీ ఆయనా ఆయనే కదా ఆయన అనుగ్రహం ఉంటే కదా ఏ అస్త్రములకు కట్టుబడడు
అని ఆయన అనుగ్రహం భూతేభ్య శ్చాఽజలిం కృత్వా సమస్త భూతములకు నమస్కారం ఎందుకనీ ఏమో
సీతాన్వేషణంలో రామ కార్యంలో నాకు ఎవరెవరు తోడుపడాలో అందరికీ నమస్కారం భూతేభ్య
శ్చాఽజలిం కృత్వా చకార గమనే మతిమ్.
కొంతమంది పెద్దలు అన్నారు కాదయ్యా ఇందులో ఒక
చమత్కారం కూడా ఉందీ హనుమ యొక్క పుట్టిన దగ్గర్నుంచి పెరుగుదలవరకూ నీవు పుట్టిన
పుట్టుకకు సార్ధకత పొందాలంటే నాకు ఈ సీతా దర్శనం వల్లనే అసలు నా పుట్టుకకు సార్ధకత
అన్న స్మరణ అంతర్లీనంగా ఉందన్నారు, ఎందుకనీ స సూర్యాయ పుట్టగానే సూర్యుని వంక వెళ్ళాను స సూర్యాయ
మహేంన్ద్రాయ ఇంద్రుడు నన్ను దవడమీద కొట్టాడు కిందపడ్డాను పవనాయ మానాన్నగారికి
కోపమొచ్చీ సమస్త భూతాలకు వాయువుని రాకుండా చేశారు స్వయమ్భువే బ్రహ్మగారు
పరుగెత్తుకుంటూ వచ్చి వరాలిచ్చారు. అప్పుడు నన్ను భూతేభ్య శ్చాఽజలిం కృత్వా సమస్తభూతములు సంతోషించాయి దేవతాగణములు నాకు
వరాలిచ్చాయి వీరివలన నేను ఏ అనుగ్రహాన్ని పొందానో ఈ అనుగ్రహములన్నీ నాకు సీతా
దర్శనములో అనుగ్రహించుగాకా... అని, ఫలవంతమగుగాకా అని కూడా ఉంది ఇందులోనే నేను మీతో
మనవి చేశాను గదాండీ బహుభంగిమల
మీరు ఎలా ఆలోచించగలిగితే అలా మిమ్మల్ని అమృతపాయుల్ని చేస్తుంది అంజలిం
ప్రాఙ్మఖః కుర్వన్ పవనాయాఽఽత్మ యోనయే ! తతో హి వవృధే గన్తుం దక్షిణో
దక్షిణాం దిశమ్ !! ఆయన వెళ్ళవలసినది దక్షిణ దిక్కుకి దక్షిణ దిక్కుకి వెళ్ళవలసినటువంటివారు
దక్షిణ దిక్కుకి ఎదురుగా నిలబడ్డారు ఇప్పుడు అటుగదా ప్రయాణం అటు ఎగరాలి, అటు
ఎగరాలి కదాని ఆ దిక్కుకు మాత్రం నమస్కారం చెయ్యకూడదు, ఎందుకని ఆ దిక్కుకు అధిపతి
యమధర్మరాజుగారు కాబట్టి నమస్కారం చెయ్యవలసి వచ్చి దేవతానుగ్రహం నీకు కావాలి అది
నీకు ఇహమునందు సమస్త భోగములను ఇవ్వాలంటే ఒక్క సంధ్యావందనంలో చేసే దిక్క్ʼదేవతా
నమస్కారం తప్పా ఇంక ఎప్పుడూ దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చెయ్యకూడదు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి
ఉన్నా దక్షిణాన్ని చూస్తూ నమస్కారం చెయ్యలేదు అంజలిం ప్రాఙ్మఖః కుర్వన్
తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేశాడు, తూర్పుకి తిరిగి పూజ చేసినా తూర్పుకి తిరిగి నమస్కారం
చేసినా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవతానుగ్రహం
కోరుకున్నాడు కాబట్టి ఆయన తూర్పుకు తిరిగి నమస్కారం చేశాడు అప్పుడు పవనాయాఽఽత్మ యోనమే తను ఎవరి కుమారుడో ఆ పవనునకు ఆ వాయుదేవునకు
కూడా నమస్కారం చేశాడు తండ్రికి, చేసి బాహుభ్యాం పీడయా మాస చరణాభ్యాం చ పర్వతమ్
బాహువుల చేతా చరణముల చేతా అంటే చేతులతో పాదములతో కూడా ఆ పర్వతాన్ని బాగా నొక్కాడు
పీడించాడు, పాదములతో ఇలా దట్టించడం కుదురుతుందికానీ చేతులతో నొక్కలేదు గదాండీ మరి
చేతులెలా కుదురుతాయి, అంటే మీరు ఒకటి గమనించండి శక్తి తాడనం చేసేటప్పుడు అంటే
కాళ్ళతో బాగా నొక్కేటప్పుడు చేతులు కూడా హూక్ అంటారు. చేతులు ఇలా అంటే మీరు బాగా
నొక్కగలరు చేతులు ఉపయోగించకుండా కాళ్ళొక్కటే ఇలా అనండీ మీరు ఇలా అనలేరు. అందుకే
చేతులు ఊపకుండా నడవండి చూస్తాను అదేంటి అలా నడుస్తున్నాడాయనా అంటారు. చేతులు ఊపుతూ
నడుస్తేనే వేగంగా నడవగలరు పరస్పర సంబంధం ఉంటుంది అంటే అంత శక్తితో పీడించాడు
గట్టిగా నొక్కాడు నొక్కితే మహర్షీ ఎంత సునిషిత ప్రజ్ఞతో చిన్న విషయాన్ని కూడా
విడిచిపెట్టకుండా మీకు ఆ దర్శనాన్ని ఎలా కృపచేస్తున్నారో చూడండి స చచాలాఽచలా శ్చాఽపి ముహూర్తం కపి
పీడితః ! తరూణాం పుష్పితాఽగ్రాణాం సర్వం పుష్పమ్ అశాతయత్ !! ఆయన ఆ పర్వతాన్ని గట్టిగా పాదాలతో నొక్కారటా
నొక్కేటప్పటికి ఆ పర్వతం ఇలా కిందికి దిగింది ఆయన యొక్క పాదముల యొక్క ఒత్తిడికి
అది ఇలా కిందికి దిగితే చెట్లు ఒక్కసారి కదిలాయి ఇలాగ మరి పర్వతం కదిలితే చెట్లు
కదలవాండీ అకస్మాత్తుగా ఇది ఊగిందనుకోండి వేదికా ఇవన్నీ కదులుతాయా కదలవా నేను కూడా
కదులుతాను కదా.
కాబట్టి తరూణాం చెట్లన్నీ కదిలాయి
చెట్లన్నీ కదిలితే చెట్లేం చేస్తాయి పువ్వులన్నీ వదిలేశాయి, అన్ని పూలూ
కిందపడ్డాయి ఇప్పుడు కొండా పువ్వులతోటి నిండిపోయింది అనుకోకుండా ఈయ్యన కూడా
పుష్పాభిషేకంలో తడిసిపోయాడు కొండ మీద ఉన్న పువ్వులతో కూడిన కొండా... అన్నట్లు
ఈయనున్నాడు. అలా నొక్కాడు మొదట నొక్కినప్పుడు చెట్లు కదిలాయి స చచాలాఽచలా శ్చాఽపి ముహూర్తం కపి
పీడితః ! తరూణాం పుష్పితాఽగ్రాణాం సర్వం పుష్పమ్ అశాతయత్ !! తేన చోత్తమ
వీర్యేణ పీడ్యమానః స పర్వతః ! సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః !! ఒక ఏనుగుకి మద జలం ఎలా కారుతుందో నేను ఇవ్వాళ
పొద్దున్నే వినాయకుడి వైభవం చెప్పేటప్పుడు మనవి చేశాను మధ జలం గురించి ఏనుగు యొక్క
మధ జలం ఎలా కారుతుందో అలా ఆ స్వామి హనుమా ఆ పర్వతాన్ని పీడిస్తే ఒక్కసారి
నీటిధారలు కారాయట ఆ పర్వతం నుంచి అంటే జలపాతములు నీటి కయ్యలు ఉంటాయి కదాండీ అవి
బాగా నొక్కుకుని ఒక్కసారి పైకి తనైందన్నమాట జలా తన్ని నీరంతా కూడా ఉబికింది గిరిణా
పీడ్యమానేన పీడ్యమానాని సర్వశః ! గుహావిష్టాని భూతాని వినేదు ర్వికృతైః సర్వరైః !!
ఆయన గట్టిగా పర్వతాన్ని ఇంకానొక్కారు ఒక్కమాటు నొక్కి విడుచిపెట్టరుగదా మళ్ళీ
ఎగరడం కోసమని పర్వతం నొక్కడం ప్రయోజనం కాదు ఆ నూరు యోజనములు ఎగరడానికి సరిపడినంత
వేగాన్ని పుంజుకోవడానికి ముందు సిద్ధపడుతున్నారు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
విమానముందనుకోండి
టేకాఫ్ అని ఉంటుంది వెళ్ళిపోవాలి ఆకాశంలోకి వెళ్ళిపోవాలీ అంటే అకస్మాత్తుగా ఉన్నది
ఉన్నట్లుగా ఇలా ఎగరదు ముందు వేగంగా భూమిమీద పరుగెత్తి మెల్లిగా ఇలా భూమిమీద ఏటవాలుగా ఆకాశంలోకి
లేస్తుంది, లేచి తాను కావలసిన ఎత్తుకి వెళ్ళానన్న తరువాత అక్కడికెళ్ళి అలా నిలబడి
ప్రయాణం మొదలుపెడుతుంది వేగంగా భూమిమీద పరుగెత్తి భూమిని విడిచిపెట్టినట్లు పర్వతం
నుంచి ఎగిరేముందు పర్వతాన్ని బాగా ఒక్కసారి తొక్కి చూస్తున్నారాయన ఎగురుతారన్నమాట
కాబట్టి ఇంకొక మాటు తొక్కారు గట్టిగా తొక్కితే గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని
సర్వశః ! గుహావిష్టాని భూతాని వినేదు ర్వికృతైః సర్వరైః !! పేద్ద పేద్ద
గుహలున్నాయి ఆ పర్వతంలో ఆ గుహల్లో పెద్ద పులులు సింహాలు ఇట్లాంటివన్నీ
పడుకున్నాయి, ఎప్పుడైతే గట్టిగా నొక్కారో ఆ గుహలు ఇలా మూసుకపోయాయి, మూసుకుపోతుంటే
ఒక్కసారి పైనున్న బండలు కింద పడుతుంటే పడుకున్నటువంటి జంతువులు ఒక్కసారి గుహలోంచి
దూకి బయటికొచ్చాయి, బయటికొచ్చేటప్పుడు కొన్ని రా గలిగాయి కొన్ని లోపలుండిపోయాయి
కొన్నింటికి నడుము వరకు వచ్చేటప్పటికి నొక్కేసింది గుహ.
ఇవన్నీ వికృతంగా పేద్ద పెద్ద అరుపు అరిచి
పరుగెడుతున్నాయి, ఒక్కసారి మహేంద్రగిరి అంతాకూడా క్రూర మృగముల యొక్క అరుపులతో
నిండిపోయింది తా స్తదా సవిషై ర్దష్టాః కుపితై స్తై ర్మహా శిలాః ! జజ్వలుః
పావకోద్దీప్తా బిభిదు శ్చ సహస్రధా !! ఇంకా గట్టిగా నొక్కాడు ఈసారి పర్వత గుహలైపోయాయి
పాముల యొక్క కలుగులు మూసుకపోయాయి ఇప్పుడు ఆ పాముల కలుగులు ఇంతంత కన్నాలేగదాండి
ఉంటాయి ఆ కన్నాలు మూసుకుపోతుంటే పాములు అయ్యబాబోయ్ పుట్ట కదిలిపోతుందనీ ఒక్కసారి ఆ
పుట్టలోంచి బయటికి వచ్చేయబోయాయి, సగం వచ్చాయి పుట్ట మూసేసుకుపోయింది
మూసేసుకునేటప్పటికి ఆ బాధతో అవి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద శిలల్నీ
కాట్లువేశాయి కాట్లు వేస్తే వాటి నోట్లోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రానికి ఆ
రాళ్ళకి తగిలీ ఆ పక్కనే అగ్నిహోత్రాన్ని ఉపశమింపజేయగలిగిన ఓషధులు ఎన్నో ఉన్నా
ఇన్ని పాములు ఏక కాలంలో కరవడంతోటీ ఆ మహేంద్రగిరి పర్వతమంతా కూడా పెద్ద
అగ్నిజ్వాలమైంది. ఒక యోగి
యొక్క స్థితియందు కలిగేటటువంటి యోగాంతర్గతమైనటువంటి రహస్యం ఇది. కాబట్టి
ఇప్పుడు ఆయన బయలుదేరుతూ యాని చౌషధ జాలాని తస్మిన్ జాతాని పర్వతే ! విషఘ్నా న్యఽపి నాగానాం న శేకుః
శమితుం విషమ్ !! ఆ పాములు కాట్లువేస్తే ఉపశమింపజేయగలిగినటువంటి ఓషధులు ఆ పర్వతం మీద ఉన్నా ఆ
అగ్నిహోత్రాన్ని చల్లార్చలేకపోయాయి ఇప్పుడు ఆయనా ఒక్కసారి బయలుదేరడానికి ఇంక అన్ని
విధాలా సిద్ధంగా ఉన్నారు, అక్కడ విద్యాధరులు పాల పాత్రలు పెట్టుకుని ప్రియురాళ్ళతో
కలసి కూర్చుని మంచి భోజనాలు మాంసాలు తింటూ మధ్య పానం చేస్తూ కూర్చున్నారు,
ఎప్పుడైతే పర్వత శిఖరాలు కదిలిపోయాయో అయ్యబాబోయ్ ఏదో ఉపద్రవం వచ్చిందనుకునీ వాళ్ళు
కాంచనపాత్రలు వాళ్ళు తెచ్చుకున్న బంగారు ఒరలలో పెట్టుకున్న కడ్గాలు కిందపెట్టి
ప్రియురాళ్ళని ఎడం చేత్తో కౌగలించుకుని తాను తింటూ ఆవిడకి పెడుతూ ఏదో
సంతోషిస్తున్నారు, పర్వతం కదిలిపోయేటప్పటికి వాళ్ళు అయ్యబాబోయ్ ప్రమాదం వచ్చిందని
కాంచన పాత్రలూ వదిలేశారు కత్తులు వదిలేశారు ప్రియురాళ్ళని మాత్రం చక్కలో
పెట్టుకుని ఒక్కసారి పైకెగరిపోయారు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
పైకెగరిపోయి వాళ్ళు
ఆకాశంలో నిలబడి చూస్తున్నారు అక్కడ్నుంచి ఏం జరిగింది ఒక్కసారి ఈ పర్వత శిఖరముల్నీ
కదిలిపోతున్నాయి ఏమిటి కారణమై ఉంటుందని వాళ్ళు విద్యాధరులు తమ ప్రియురాళ్ళతో కలిసి
చూస్తున్నారు. చూస్తున్నప్పుడు దర్శయన్తో మహావిద్యాం విద్యాధర మహర్షయః ! సహితా
స్తస్థుః ఆకాశే వీక్షాం చక్రు శ్చ పర్వతమ్ !! ఆ ఆకాశంలో నిలబడినటువంటివారు
బద్ధలైపోతుందా అన్నట్లుగా ఉన్న ఆ మహేంద్రగిరి పర్వతాన్ని చూస్తున్నారు ఏష పర్వత
సంకాశో హనూమాన్ మారుతాఽఽత్మజః ! తితీర్షతి మహా వేగం సముద్రం మకరాఽఽలయమ్ !! ఒక పర్వతం పర్వతం నుంచి బయలుదేరుతుందా
అన్నట్లుగా ఉన్నటువంటి ఆ హనుమా మొసళ్ళతో కూడినటువంటి ఆ సముద్రం మీద ఎగరడానికి
సిద్ధపడుతున్నారు అపారమైన వేగంతో రామాఽర్థం వానరాఽర్థం చ చికీర్షన్
కర్మ దుర్షరమ్ ! సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమ్ ఇచ్ఛతి !! ఏమి మహానుభావుడయ్యా..! ఈయ్యనా రాముని కొరకు
వానరుల కొరకు తను ఇంత కష్టపడుతున్నా అంత క్లేషపడుతున్నా పట్టించుకోకుండా రామ
కార్యం కోసం వానరులకోసం నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడానికి
సిద్ధపడుతున్నాడు ఎంతటి మహాపురుషుడు అని విద్యాధరులందరూ కీర్తిస్తున్నారు
దుధువే చ స రోమాణి
చకమ్పే చాఽచలోపమః ! ననాద చ మహా నాదం సుమహాన్ ఇవ తోయదః !!
బాహూ సంస్తమ్భయా
మాస మహా పరిఘ సన్నిభౌ ! ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ !!
మార్గమ్ ఆలోకయన్ దూరాత్ ఉర్ధ్వ ప్రణిహితేక్షణః !
రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమ్ అవలోకయన్ !!
ఆయన ఇంక బయలుదేరడానికి సిద్ధపడి రెండు పాదములను
ఆ పర్వత శిఖరములను గట్టిగా తొక్కిపెట్టాడు ఒక్కసారి మోకాళ్ళు వంచాడు బలాన్ని
తొడల్లోకి బాగా లాక్కున్నాడు నడుం సన్నం చేశారు ఊపిరి బాగా తీసి కుంభకంలో బిగపట్టారు,
ఊపిరి గుండెలనిండా నింపి ఆ వాయువుని కుంభించారు, కుంభించి ఇంక బయలుదేరడానికి
సిద్ధంగా రెండు చేతులు ముందుకు చాపారు ఆ తోకని ఒక్కసారి పైకెత్తి ఇలా ఊపారు, ఆ
తోకని నెలకేసి టపీమని కొట్టారు రెండు కన్నులతోటి అదేపనిగా ఆకాశంలోకి తాను
వెళ్ళవలసినటువంటి మార్గంలోకి చూస్తున్నారు ఒంటిమీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి,
సన్ననైనటువంటి నడుం బిగించబడినటువంటి పరిడల్లాండి బాహువులు అలా నిలబడి ఇక
ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి స్థితిలో కింద ఉన్నటువంటి వానరులందరూ
ఆశ్చర్యంగా ఆయన మూర్తి వంక చూస్తున్నారు ఆయన ఒక్కసారి కిందకి చూశారు చూసి వాళ్ళతో
అంటున్నారు
యథా రాఘవ
నిర్ముక్తః శరః స్వసన విక్రమః !
గచ్ఛేత్ త
ద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితామ్ ! న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకాఽఽత్మజామ్ !!
అనేనైవ హి వేగేనే
గమిష్యామి సురాఽఽలయమ్ ! యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యాఽమ్యకృత శ్రమః !!
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్ ! సర్వథా కృత
కార్యోఽహమ్ ఏష్యామి సహ సీతయా !!
ఉత్పపాతాఽథ వేగేన వేగవాన్ అవిదారయన్ ! సుపర్ణ మివ చాఽఽత్మానం మేనే స కపికుంజరః
!!
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఆయనా అక్కడ
ఉన్నటువంటి వానరులతో అంటున్నారు యథా రాఘవ నిర్ముక్తః శరః స్వసన విక్రమః రామ
చంద్ర మూర్తి తన ఎడమ చేతితో బంగారు కోదండాన్ని పట్టుకొని తన వింటినారిని విప్పి తన
కోదండం కింద కట్టి వింటినారిని ఆకర్ణాంతములాగి విడిచిపెట్టేటటువంటి బంగారుబాణం
ఏవిధంగా ప్రయానించి లక్ష్యంమీద పడుతుందో మధ్యలో ఆగదో అలా నేను కూడా లంకాపట్టణాన్ని
చేరిపోతాను, చేరిపోయి రామ కార్యాన్ని సాధిస్తాను ఇప్పుడు నాదాబలం రాముని చేతినుంచి
విడవబడినటువంటి బాణం యొక్క బలం రాముని బలమా, రాముని బలం బాణంలోకి వెళ్తూంది, రామ
బాణం కార్యాన్ని సాధిస్తే అది బాణం గొప్పతనం కాదు రాముడి గొప్పతనం. రాముడి
పరాక్రమం బాణంలోకి వెళ్ళింది అలా నేను ఈ నూరు యోజనముల దూరాన్ని గడచి వెడుతున్నానూ
అంటే అది నా గొప్పకాదు రామ చంద్ర మూర్తి గొప్ప అది ఆయన భక్తి
యథా రాఘవ
నిర్ముక్తః శరః స్వసన విక్రమః !
గచ్ఛేత్ త
ద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితామ్ ! న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకాఽఽత్మజామ్ !!
అనేనైవ హి వేగేనే
గమిష్యామి సురాఽఽలయమ్ ! యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యాఽమ్యకృత శ్రమః !!
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్ ! సర్వథా కృత
కార్యోఽహమ్ ఏష్యామి సహ సీతయా !!
నేను ఇది ధృతీ అంటారు అంటే మొక్కవోని పట్టుదల
చెదిరిపోకుండా గుండె నిబ్బరంతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ, నేను ఇటునుండి బయలుదేరి
కాంచన లంకని చేరుకుని నాలుగు అంగళాలు కూడా విడిచిపెట్టకుండా రావణ పాలితయైనటువంటి
లంకాపట్టణాన్ని వెతికినప్పుడు నాకు సీతమ్మ జాడ కనపడకపోతే లంకా పట్టణం నుంచి
బయలుదేరి స్వర్గలోకానికి వెళ్తాను అక్కడ కూడా వెతుకుతాను, సీతమ్మ తల్లి జాడ అక్కడ
కూడా కనపడకపోతే మళ్ళీ లంకాపట్టణానికొచ్చి పదితలల పురుగు రావణాసురున్ని పట్టి ఈడ్చి
తీసుకొస్తాను తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్న రామ చంద్ర మూర్తి యొక్క పాదారవిందములయందు
పారేసి వాడితో చెప్పిస్తాను ఎక్కడదాచాడో సీతమ్మని, కాబట్టి సర్వథా కృత కార్యోఽహమ్ ఏష్యామి సహ సీతయా అవసరమైతే రావణునితో సహా లంకాపట్టణాన్నంతటినీ
పెల్లగించి తీసుకొస్తాను నా బలం అటువంటిది అటువంటి ప్రజ్ఞతో బయలుదేరుతున్నాను మీరు
బెంగపెట్టుకోవద్దు అన్నారు. ఒక్కసారి ఆ పర్వత శిఖరములనుంచి, దీనిమీద సెంట్రల్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒకాయనా ఈ వేగం ఈ వెళ్ళినటువంటిదానిమీదా ఒక పరిశోధనా
పత్రాన్ని సమర్పించారు ఖచ్చితంగా అలా వెళ్ళేవాళ్ళు వేగాన్ని పుంచుకొని అలాగే
వెళ్ళుతారు సుందర కాండలో చెప్పింది సైంటిఫిక్ ప్రిన్సుపుల్స్ దృశ్యా నూటికి
నూరుపాళ్ళు నిజమే.
ఆ పర్వత శిఖరం నుంచి ఆయన ఎగిరి వెడుతున్నప్పుడు
మహానుభావుడు ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమ్ అన్వయుః ! ప్రస్థితం దీర్ఘమ్
అధ్వానం స్వబన్ధుమ్ ఇవ బాన్ధవాః !! తమ్ ఊరు వేగోన్మథితాః సాలా శ్చాఽన్వే నగోత్తమాః !
అనుజగ్ముర్ హనూమన్తం సైన్యా ఇవ మహీ పతిమ్ !! ఆయన వెడుతున్నప్పుడు ఆయన తొడల వేగానికి ఆ పర్వత
శిఖరముల మీద పెరిగిన పెద్ద పెద్ద చెట్లుకూడా కూకటి వేళ్ళతో పెకలింపబడి ఆయనతోపాటు
వెళ్ళిపోయాయి చూడండి వేగంగా వెళ్ళిపోతుందనుకోండి ఒక వాహనం చిన్న చిన్న కాగితం
ముక్కలూ అవి కూడా వెళ్ళిపోతాయి దాని వెనకాల అలా ఆయన ఎంత వేగంతో ఎగిరారంటే ఆ
వేగానికి పెద్ద పెద్ద వృక్షములు పెకలింపబడ్డాయి చిన్న చిన్న చెట్లు పెకలింపబడ్డాయి
ఇన్ని ఒక్కసారి చెట్లు పెకలింపబడి ఆయన వెనకాల వెళ్ళిపోతూంటే ఎలా ఉందటటా... రాజు
వెంట సైన్యం వెళ్తున్నట్లు ఉందటా అంత
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
వేగంతో మహానుభావుడు
బయలుదేరారు. బయలుదేరి వెడుతున్నారు ఆ వెల్తున్నప్పుడు అంతవేగంతో ఆకాశ మార్గంలోకి
పుంజుకున్నారేమో ఆ వేగంతో ఒక్కసారి ఆయన ఆకాశ మార్గంలోకి వచ్చి ఇలా నిలబడితే
ఇక్కడ్నుంచి చూసేవాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నారటా తస్యాఽమ్బర గతౌ బాహూ
దదృశాతే ప్రసారితౌ ! పర్వతాఽగ్రాత్ వినిష్క్రాన్తౌ పంచాస్యా వివ పన్నగౌ ! ఐదు తలలు కలిగినటువంటి పాము ఎలా ఉంటుందో ఆకాశంలో
ఐదు తలల పాము వెడుతుంటే ఎలా ఉంటుందో అలా తన రెండు చేతులు ఇలా చాపి
వెళ్ళిపోతున్నటువంటి హనుమా ఐదు తలల పాము వెళ్ళిపోతుందా అన్నట్లుగా వెళ్తున్నారట పిబన్
ఇవ బభౌ చాఽపి సౌర్మిమాలం మహాఽఽర్ణవమ్ ! పిపాసుః ఇవ చాఽఽకాశం దదృశే స మహా
కపిః ! ఆయన ఆకాశంలో
వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని ఈయ్యన తాగేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు అంత వేగంతో
వెళ్ళిపోతున్నారు తస్య విద్యుత్ప్రభాఽఽకారే వాయు మార్గాఽనుసారిణిః ! నయనే
విప్రకాశేతే పర్వతస్థా వివాఽనలౌ ! అలా వెళ్తున్నప్పుడు బాగా చీకటిగా ఉన్నప్పుడు
ఒక పర్వతం దగ్గర నిలబడి చూస్తే దూరంగా పర్వత గుహలో రెండు కరములు
కాల్తున్నాయనుకోండి ఆ వెలుగుతున్న రెండు మంటలు చీకటి గుహలో ఎలా కనపడుతాయో ఆకాశ
మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క రెండు కళ్ళూ పచ్చగా మెరిసిపోతూ అలా
కనపడుతున్నాయి అంటే ముందునుంచి చూపించారు పిఙ్గే పిఙ్గాక్ష ముఖ్యస్య బృహతీ
పరిమణ్డలే ! చక్షుషీ సంప్రకాశేతే చన్ద్ర సూర్యా వివవోదితౌ ! ఆయనా లాంగూల
చక్రము అంటారు సూర్యునికి పరివేశం కడుతుంది ఇలా చక్రంలా కట్టి మధ్యలో సూర్యుడుంటాడు,
ఇల్లు కట్టాడంటుంటాడు చిన్నతనంలో ఆకాశంలో చంద్రుడు ఇల్లు కట్టాడంటుంటారు, గూడు
కట్టాడంటుంటారు, అలా ఆయన ఇలా ఎగురుతున్నప్పుడు పృష్టభాగం నుంచి ఆయన తోక ఇలా లేచి
ఆయన తల దగ్గరికి ఇలా వస్తే మధ్యలో ఉన్నటువంటి తేజో మూర్తియైన హనుమా లాంగూల చక్రం
మధ్యలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా ఉన్నారటా.
వెనక నుంచి చూస్తే ఆయన మహానుభావున్ని ముఖం
నాసికయా తస్య తామ్రయా తామ్రమ్ ఆబభౌ ! సంధ్యయా సమఽభిస్పృష్టం యథా
సూర్యస్య మణ్డలమ్ ! వెనక నుంచి చూసినప్పుడు బ్రద్దలైన మేరుగిరి పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది
ఆయన పృష్టభాగం. ముందుకొచ్చి చూస్తే ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమ్ ఆబభౌ ఆ
ముఖము ఆ ముక్కు ఇవన్ని ఎర్రగా సంధ్యారుణ కాంతులతో ఉండేటటువంటి సూర్య బింబం ఎలా
ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్నారు. ఉండి తస్య వానర సింహస్య ప్లవమానస్య సాగరమ్ !
కక్షాన్తర గతో వాయుః జీమూత ఇవ గర్జతి ! ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే ఆ రెండు
చేతులు ఇలా పెట్టి వెళ్ళిపోతున్నారేమో ఈ బాహు మూలములలోంచి గాలి విపరీతమైన వేగంతో
వెల్తూంటే ఒక రకమైనటువంటి మేఘ గర్జనలాంటి ధ్వని కలుగుతుందట ఆకాశంలో అలా
వెళ్ళిపోతున్నారు తిమి నక్ర ఝషాః కూర్మా దృశ్యంతే వివృతా స్తదా ! వస్త్రాఽపకర్షణే నేవ శరీరాణి
శరీరిణామ్ !! ఆయన యొక్క తొడల
వేగానికి సముద్రంలో ఉండేటటువంటి నీరంతా చాప చుట్టినట్టుగా చుట్టబడి ఒక్కసారి
పైకిలేచి ఆ కెరటాలు ఇలా మళ్ళీ పడిపోతున్నాయి, పడిపోయినప్పుడు మమ్మల్ని ఎప్పుడూ
ఎవ్వరూ చూడరుకదా అనుకుని ఆ సముద్ర గర్భంలో పడుకున్నటువంటి తిమింగళాలు మొసళ్ళు
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
తాబేళ్ళు
మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కసారి ప్రపంచానికి కనపడ్డాయట. ఎందుకనీ ఈ సముద్రమంతా చాప
చుట్టినట్టు పైకిలేచింది. లేచి ఆ కిరటం విరిగి పడిపోతుంది ఆయన
వెళ్ళిపోతున్నప్పుడు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఇక్కడున్నవన్నీ కనపడుతున్నాయి మళ్ళీ ఆ జలరాసి
పడిపోయి వెనక్కి వచ్చినప్పుడు ఇవన్నీ కనపడుతున్నాయట, మహర్షి ఎంత గొప్ప ఉపమానం
వేస్తారంటే వస్త్రాఽపకర్షణే నేవ శరీరాణి శరీరిణామ్ నిద్రపోతున్నాడనుకోండి నిద్రపోతున్నటువంటి
వ్యక్తిమీదకి గాలి విపరీతమైన వేగంతో ప్రసరిస్తే ఆయన ఒంటిమీద ఉన్న బట్ట తొలగిపోతే
గోప్యముగా ఉండవలసిన అవయవములు కనపడితే ఎలా ఉంటుందో అలా ఎప్పుడూ కనపడకుండా సముద్రంలో
ఉండేటటువంటి జంతువులు ఆ సముద్రం చాప చుట్టినట్టు చుట్టబడి పైకిలేస్తే కనపడ్డాయట
అంత వేగంతో వెళ్తున్నారు ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా ! వవృషుః
వర్షాణి దేవ గన్ధర్వ దానవాః !! ఆయన వెడుతున్న వేగాన్ని రామ కార్యం మీద ఆయన
నిష్టనీ చూసిన దేవతలు ఎంతో సంతోషించి పైనుంచి ఆయన మీద పుష్పవృష్టిని కురిపించారు,
పై నుంచి పుష్పవృష్టి క్రింద నుంచి ప్రాణులన్నీ చూస్తున్నాయి దేవ యక్షర గంధర్వ
కిన్నెర కింపురుషాది గణాలన్నీ నిలబడిపోయాయి ఆకాశంలో ఏమి వేగం ఏమి అద్భుతం ఏమి రామ
కార్యం గురించిన పట్టుదల ఏమి మహానుభావుడు ఏమి ప్రయాణం శ్లాగిస్తున్నారు తస్మిన్
ప్లవగ శార్దూలే ప్లవమానే హనూమతి ! ఇక్ష్వాకు కుల మానాఽర్థీ చిన్తయా మాస
సాగరః ! సాహాయ్యం వానరేన్ద్రస్య యది నాఽహం హనూమతః !! కరిష్యామి భవిష్యామి సర్వ వాచ్యో వివక్షతామ్
! అహమ్ ఇక్ష్వు నాథేన సగరేణ వివర్థితః ! ఇక్ష్వాకు సచివ శ్చాఽయం నాఽవసీదితుమ్ అర్హతి
!! ఆ సముద్రం తనలోనే
ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని బంగారు పర్వతం వంక చూసి అందటా ఎంత వేగంతో
వెళ్ళిపోతున్నాడో చూడు మహానుభావుడు అంత వేగంతో వెళ్తున్నాడే రామ కార్యంమీద ఆయన
వెడుతున్నప్పుడు నీవు నాలో ఉన్నావు బంగారు పర్వతానివి నీ మీద చెట్లున్నాయి దానికి
కందమూలాలున్నాయి పళ్ళున్నాయి తేనెపట్లున్నాయి నీవు ఒక్కసారి పైకిలేచి అంత అలసట
పొంది వెళ్తున్నటువంటి స్వామికి విశ్రాంతిని ఇవ్వద్దూ అహమ్ ఇక్ష్వు నాథేన సగరేణ
వివర్థితః ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి అరవై వేలమంది సగరులు భూమి మీద
తీసినటువంటి గోతులలో వచ్చి నిలబడినటువంటి నీటివలన ఏర్పడినటువంటి కారణం చేత నాకు
సాగరమని పేరు.
నేను ఇక్ష్వాకు వంశం వల్లా ఏర్పడ్డాను
అటువంటినేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామ చంద్ర మూర్తి కార్యముమీద
వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వద్దూ కాబట్టీ సముద్రాన్ని నేనేమిస్తాను నాలో
ఉన్న రత్నాలు పుచ్చుకుంటాడా ముత్యాలు పుచ్చుకుంటాడా ఉప్పునీరు తాగుతాడా నీ
దగ్గరైతే కందమూలాలున్నాయి తేనె పట్లున్నాయి మహానుభావుడు ఒక్కసారి పర్వతం మీద దిగి
కాస్త తెనె తాగి నీళ్ళు తాగి వెళ్తాడు కాబట్టి ఇవ్వద్దూ కాబట్టి లే హిరణ్యనాభం
మైనాకమ్ ఉవాచ గిరిసత్తమమ్ ! త్వమ్ ఇహాఽసుర సంఘానాం పాతాళ
తల వాసినామ్ ! దేవ రాజ్ఞా గిరి శ్రేష్ఠ పరిఘః సన్నివేశితః ! నీవూ ఒకానొకప్పుడు ఇంద్రుడు నీ రెక్కలు
తెంపేద్దామని వజ్రాయుధం ప్రయోగించినప్పుడు ఎగిరివచ్చి సముద్రంలో పడ్డావు, పడితే
వెళ్ళి సముద్రంలో పాతాళ లోకంలో రాక్షసులు ప్రతిరోజు పైకొచ్చేటటువంటి ద్వారానికి
అడ్డంగా పడ్డావు ఇంద్రుడనుకున్నాడు పోన్లే కదిలితే నేను చంపేస్తానని కదలదు
కదలకుండా బిలానికి అడ్డంపడింది కాబట్టి రాక్షసులు పైకిరారు ఉపకారం జరిగింది కదా
అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. రెక్కలున్నా ఎగరకుండా నీవు అందులో ఉన్నావు అప్పటినుంచి
ఇప్పుడు బయటికెళ్ళితే ఇంద్రుడు రెక్కలు తెంపేస్తాడేమోనన్న భయాన్ని పక్కనపెట్టు అంతటి
మహానుభావుడు వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంకెందుకు మనిద్దరం ఉండి
ప్రయోజనమేమిటీ ఎందుకా కందమూలాలు ఎందుకా తేనె అటువంటివాడికిచ్చిన అటువంటివాడికి
ఇచ్చిన ఆతిథ్యమేదో అదే ఆతిథ్యం.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
కాబట్టి లే పైకి తిర్యగ్
ఊర్ధ్వమ్ అథ శ్చైవ శక్తి స్తే శైల వర్ధితుమ్ ! తస్మాత్ సంచోదయామి త్వామ్ ఉత్తిష్ఠ
గిరి సగసత్తమ !! ఒక్కసారి పైకిలే నీకు శక్తి ఉంది నీవు పైకి లేవగలవు నిలువుగా
పెరగగలవు అడ్డంగా పెరగగలవు పక్కలకి పెరగగలవు తిర్యగ్ ఊర్ధ్వమ్ అథ శ్చైవ శక్తి
స్తే శైల వర్ధితుమ్ నీవు అలా పెరగగలవు కాబట్టి ఆ మహానుభావుడికి ఆతిథ్యం ఇవ్వు కురు
సాచివ్యమ్ అస్మాకం న నః కార్యమ్ అతిక్రమేత్ ! కర్తవ్యమ్ అకృతం కార్యం సతాం మన్యుమ్
ఉదీరయేత్ !! ఆయనకి మాకు ఉపకారం చేయడం కోసం ఆలస్యం లేకుండా నీవు హనుమకి ఉపకారం
చెయ్యాలి ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి కర్తవ్యమ్ అకృతం కార్యం సతాం మన్యుమ్ ఉదీరయేత్
మహానుభావులకి
కోపమెందుకోస్తుందో తెలుసా... చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే
వస్తుంది కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తరువాత అయ్యా ఏమీ అనుకోకు మీరు
వచ్చినప్పుడు నేను పిలవలేకపోయాను అని ఎక్కడో ఉన్నాను సముద్రంలో అంటే బాగుండదు
లేవాలంతే లే ఆలస్యం చేయకు వచ్చేస్తున్నాడు వెళ్ళిపోతాడు మహానుభావుడు ఉంటాడా
వెళ్ళిపోతాడు మళ్ళీ వేగంగా అందుకని ఆయనకి తొందరగా ఆతిథ్యం ఇవ్వు అన్నాడు. అలా
ఇస్తే కాకుత్స్థస్యాఽనృశంస్యం చ మైథిల్యా శ్చ వివాసనమ్ ! శ్రమం చ
ప్లవగేన్ద్రస్య సమీక్ష్యోత్థాతుమ్ అర్హసి ! అక్కడా శ్రీ రాముని యొక్క కష్టాన్ని ఆయన సీతమ్మ
కనపడలేదని పెట్టుకున్న బెంగని రాముని యెడబాటు చేత సీతమ్మ తల్లి పొందుతున్నటువంటి
బాధని అంటే దుఃఖాన్ని హనుమ యొక్క కార్యభారాన్ని గుర్తించు ఇటువంటి పరిస్థితిల్లో
రాముడు సీతమ్మకనపడలేదని బాధపెట్టుకున్నాడు, సీతమ్మ రామున్నుంచి దూరమైందని బాధలో
ఉంది వాళ్ళిద్దరి బాధను తీర్చడానికి ఇంత బాధకోర్చి ఆయన వెళ్తున్నాడు.
మనం ఇటువంటప్పుడు ఆతిథ్యం ఇవ్వకపోతే కాల్చనా మన
దగ్గర శక్తుండి, కాబట్టి లే పైకి లే అని అన్నాడు హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాఽమ్భసః ! ఉత్పపాత
జలాత్ తూర్ణం మహా ద్రుమ లతా యుతః ! ఆయన పెద్ద పెద్ద చెట్లతో లతలతో తేనెపట్లతో కంద
మూలలాతో బంగారు శిఖరాలతో ఆ మైనాకుడు సముద్రంలోంచి ఒక్కసారి పైకిలేచాడు, ఇప్పటివరకు
సముద్రం కనపడుతూంది, అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకిలేచాయి తనకు ఇష్టమైన చెట్లు
తేనెపట్లు పళ్ళూ కందమూలాలు అన్నీ కనపడ్డాయి దర్శయా మాస శృంగాణి సాగరేణ నియోజితః
! శాత కుమ్భ మయైః శృఙ్గైః సకిన్నర మహోరగైః ! పాములతోటీ చెట్లతోటీ ఉన్నటువంటి ఆ
బంగారు శిఖరాలు అకస్మాత్తుగా సముద్రంలోంచి పైకొస్తే చూసేటటువంటి హనుమ అనుకున్నారటా
మధ్యే లవణ తోయస్య విఘ్నోఽయమ్ ఇతి నిశ్చితః ! స తమ్ ఉచ్ఛ్రితమ్ అత్యర్థం
మహా వేగో మహా కపిః ! ఉప్పు సముద్రంలోంచి ఏమిటీ బంగారు సముద్రాలు లేవడమేమిటీ కాబట్టి ఇది ఖచ్చితంగా
విగ్నమే నేను రామ కార్యం మీద వెడుతున్నప్పుడు ఆ కార్యము జరగకుండా చూడడానికి ఎవరో
నాకు అడ్డోచ్చారు అనుకున్నారు అనుకుని ఉరసా పాతయా మాస జీమూతమ్ ఇవ మారుతః
ఒక్కసారి తన వక్షస్థలంతో కొడితే ఆ పర్వత శిఖరములు చూర్ణములై కిందపడిపోయాయి, అప్పుడూ ఆ పర్వతమనుకుందటా... స
తదా పాతిత స్తేన కపినా పర్వతోత్తమః ! బుద్ధ్వా తస్య కపే ర్వేగం
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
జహర్ష చ ననన్ద చ ! అబ్బాహ్ ఏమి వేగమయ్యా మహానుభావా వెళ్ళిపోతావేమోనని గభాల్నా పైకిలేస్తే అంత
వేగంతో కొట్టావు గుండెల్తో కొడితే కొండ చూర్ణములై కిందపడిపోయాడు ఎంత వేగమయ్యా అని
పొంగిపోయిందట ఆ పర్వతం మానుషం ధారయన్ రూపమ్ ఆత్మనః శిఖరే స్థితః మనుష్య
రూపాన్ని పొంది తన శిఖరం మీద తానే నిలబడ్డాడు మైనాకుడు.
నిలబడి దుష్కరం
కృతవాన్ కర్మ త్వమ్ ఇదం వానరోత్తమ ! నిపత్య మమ శృఙ్గేషు విశ్రమస్వ యథా సుఖమ్ !!
చాలా దుష్కరమైన కార్యాన్ని చేస్తున్నావు మహానుభావా వానరోత్తమా హనుమా! నీవు నిపత్య
మమ శృఙ్గేషు ఒక్కసారి నా శిఖరాల మీద దిగు విశ్రమస్వ యథా సుఖమ్ కాసేపు
విశ్రాంతి తీసుకుని సుఖాన్ని పొందవయ్యా... కృతే చ ప్రతికర్తవ్యమ్ ఏష ధర్మః
సనాతనః ! సోఽయం తత్ ప్రతికారాఽర్థీ త్వత్తః
సమ్మానమ్ అర్హతి !! తత్ ఇదం గన్ధవత్ స్వాధు కన్ద మూల ఫలం బహు ! తత్ ఆస్వాద్య
హరిశ్రేష్ఠ విశ్రాన్తోఽనుగమిష్యసి !! సముద్రుడూ నన్ను ప్రేరేపించాడు నీకు ఉపకారం
చెయ్యమని నీకు ఆతిథ్యమిమ్మని కాబట్టి ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగి
కందమూలములను తిని తేనె తాగి విశ్రాంతి పొంది మళ్ళీ బయలుదేరు అన్నాడు, చూశాడట హనుమా
ఆయనా... పైగా ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఒకటి చెప్పింది కృతే చ ప్రతికర్తవ్యమ్ ఏష
ధర్మః సనాతనః ఉపకారం చేసినవానికి తిరిగి ఉపకారం చెయ్యడం ఈ జాతి లక్షణం,
పరోపకారమన్నది ప్రత్యుపకారమన్నది ప్రధానంగా చెయ్యాలి, నీవలన నీవు ఎవరి కార్యం మీద
వెళ్తున్నావో ఆ రామ చంద్ర మూర్తి పుట్టిన ఇక్ష్వాకు వంశంలో సముద్రమేర్పడింది ఆ
సముద్రంలో నేను దాక్కున్నాను నాకు కూడా మీ నాన్నగారితో అనుబంధముంది అందుకని చెప్పి
అతిథిః కిల పూజార్హః ప్రాకృతోఽపి విజానతా ! ధర్మం జిజ్ఞాసమానేన కిం పున
స్త్వాదృశో మహాన్ !! అతిథిః కిల పూజార్హః ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి వస్తేనే అతిథి
దేవోభవా అని గౌరవిస్తాం, నీవంటి మహా ప్రాజ్ఞుడు ఇంతటి భక్తి తత్పరుడు ఏమీ కోరకుండా
రామ కార్యం మీద వెడుతున్నవాడివి ఇటువంటి వాడివి అతిథిగా నా ఇంటి ముందు నుంచి
వెడుతున్నప్పుడు నీకు ఆతిథ్యమివ్వద్దూ లేనప్పుడు ఇంక గృహస్తాశ్రమానికి
అర్థమేముంది, కాబట్టి మహానుభావా ఒక్కసారి దిగు దిగితే నీకు నేను పూజ చేస్తాను పూజితే
త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః ! తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాఽప్యఽత్ర కారణమ్ !! నీకు చేసిన పూజ నీ తండ్రికి చేసిన పూజ ఇందులో ఒక చిన్న
రహస్యముందండీ.
గురుగారు గురువుగారి భార్యా గురువుగారి కొడుకు
ముగ్గురూ కలిసి వచ్చారనుకోండి ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే... సాధారణంగా మనం ఏం
చేస్తామంటే గురువుగారికి గురుగారి భార్యకీ నమస్కారం చేస్తాము గురువుగారి కొడుక్కి
నమస్కారం చెయ్యము. కానీ గురువుగారి కొడుక్కి కూడా నమస్కారం చెయ్యాలి. ఎందుకో
తెలుసాండీ గురు పుత్రుడు గురుతుల్యుడు అంటారు గురువుతో సమానం గురువుగారి కొడుకు గురువుగారితో
కూడా వస్తే కొడుకుకి కూడా నమస్కారం చెయ్యాలి అది ధర్మం సూక్ష్మం నేను మీతో
యదార్థం తెలియజేస్తున్నాను. అలాగే గురువుగారి భార్యా మీకన్నా చిన్నదై ఉండవచ్చు కానీ ఆమె వందనీయరాలు ఆమెకు
నమస్కారం చెయ్యాలి. ఆవిడ ఎంత శక్తి కలిగింది ఆవిడ ఎంత చదువు చదివింది
ఆవిడకి ఏం తెలుసు అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. గురు పత్ని తల్లితో సమానం అందుకని తల్లికి చేసిన నమస్కారం కన్నా
కూడా ఎక్కువ ఫలితం గురు పత్నికి చేసిన నమస్కారం వల్ల వస్తుంది. కాబట్టి
నీకు చేసిన పూజ వాయువుకి చేసిన పూజ వాయువుతో నాకు మిత్రత్వం ఉంది వాయువు నాకు
ఉపకారం చేశాడు, కాబట్టి నేను నీకు ఉపకారం చెయ్యెద్దూ నేను నీకు పూజ చేస్తే నీ
తండ్రికి పూజ చేసినట్లు కాబట్టి మహానుభావా! నీకు నేను పూజ చెయ్యాలి ఏమిటి
మిత్రుత్వం మా నాన్నగారితో నీకు అంటావేమో...
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణోఽభవన్ ! తే హి
జగ్ముర్ దిశః సర్వా గరుడాఽనిల వేగినః !!
తత స్తేషు
ప్రయాతేషు దేవ సంఘాః సహర్షిభిః ! భూతాని చ భయం జగ్ము స్తేషాం పతన శఙ్కయా !!
తతః క్రుద్ధః
సహస్రాఽక్షః పర్వతానాం శతక్రతుః ! పక్షాం శ్చిచ్ఛేధ వజ్రేణ తత్ర తత్ర సహస్రశః !!
పూర్వ కాలంలో కృతయుగంలో పర్వతాలకి రెక్కలుండీ గరుత్మంతునిలాగా వేగంగా ఎక్కడికి
కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుండేవి అక్కడెక్కడో రామాయణం చెప్తున్నారంటే విందామని
అవి కూడా దిగేవి, దిగితే ప్రమాదం కదాండి పర్వతాలు దిగితే అందుకనీ జనమందరు గొడవ
పెట్టేసి ఇంద్రుడికి చెప్పుకున్నారు ఇంద్రుడు పర్వతాలు ఎగరకుండా ఎక్కడుండేవి
అక్కడే ఉండేటట్టు చేస్తానని వాటి రెక్కలన్నీ తరిమేశాడు అన్ని పర్వతాలకి రెక్కలు
పోయాయి చిట్ట చివర మైనాక పర్వతం దగ్గరికి వస్తున్నాడు దాని రెక్కలు కూడా
తరిమెద్దామని, రెక్కలు ఉండీ నేను ఎగురలేకపోయాను భయంచేత రెక్కలు ఉండి నేను ఎగరలేని
పరిస్థితుల్లో నీ తండ్రి వాయుదేవుడు నన్ను ఎత్తి తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు
కనపడకుండా... నేను రాక్షసులకు భూమి మీదకు వచ్చే బిలానికి అడ్డుపడ్డానూ అని
ఇంద్రుడు నన్ను విడిచిపెట్టేశాడు నా రెక్కలు తీసేయలేదు ఆనాడు వాయువు నన్ను
రక్షించాడు నీ తండ్రి నన్ను సముద్రంలో పడేశాడు నా రెక్కలు మిగిలాయి కాబట్టి
ఇప్పుడు ఆ తండ్రికి కొడుకువు నీవు ఆ తండ్రి కొడుకు వస్తున్నప్పుడు, కొడుకుకి పూజ చేస్తే తండ్రికి
చేసినట్లే, కొడుక్కి నమస్కారం చేస్తే తండ్రికి చేసినట్లే కాబట్టి నీకు నేను
చెయ్యెద్దూ?.
కాబట్టి మనిద్దరికి అనుబంధముంది సముద్రంతో
ఉండడమే కాదు ఇక్ష్వాకు వంశానికి నాకు నీతో ఉంది నీ తండ్రితో ఉంది కాబట్టి నీకు
నేను పూజ చెయ్యాలి కాబట్టి ఒక్కసారి దిగు దిగి పూజ స్వీకరించి వెళ్ళు ఈ మాట చెప్తే
మహానుభావుడు హనుమ చూసీ ఒక్కసారి అన్నాడటా... ప్రీతోఽస్మి కృతమ్ ఆతిథ్యం
మన్యుః ఏషోఽపనీయతామ్ ! త్వరతే కార్య కాలో మే అహ శ్చాఽప్యఽతివర్తతే !
ప్రతిజ్ఞా చ మయా దత్తా న స్థాతవ్యమ్ ఇహాఽన్తరే ! ఇతి
ఉక్త్వా పాణినా శైలమ్ ఆలభ్య హరిపుంగవః ! ఇప్పుడు ఆయనా ఆ పైన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ
అన్నారటా ప్రీతోఽస్మి కృతమ్ ఆతిథ్యం ఆ... అందుకున్నాను చాలా ఆతిథ్యం ఇచ్చినట్లే ప్రీతోఽస్మి నేను ప్రీతి పొందాను మన్యుః ఏషోఽపనీయతామ్ త్వరతే
కార్య కాలో మే అహ శ్చాఽప్యఽతివర్తతే నేను తొందర తొందరగా వెళ్ళిపోవాలి అవతల
సూర్యాస్థమయం కాకుండా వెళ్ళిపోవాలి, నూరు యోజనముల సముద్రాన్నిదాటి వెళ్ళిపోవాలి ప్రతిజ్ఞా
చ మయా దత్తా న స్థాతవ్యమ్ ఇహాఽన్తరే నేను ప్రతిజ్ఞ చేశాను మధ్యలో ఎక్కడా ఆగనని,
ఎక్కడ చేశారు యథా రాఘవ నిర్ముక్తః శరః స్వసన విక్రమః అన్నారుగా... రామ చంద్ర మూర్తి చేత ప్రయోగించిన
బాణం ఎలా వెళ్తుందో అలా వెళ్తానన్నారు, రాముడు ప్రయోగించిన బాణం వెడుతూ
వెడుతూ మధ్యలో ఓ పండు తిని వెళ్ళదుగా... కాబట్టి నేను ఎలా ఆగుతాను ప్రతిజ్ఞా
భంగమౌతుంది ఆగకూడదు వెళ్ళిపోవాలి.
కాబట్టి నీవు నాకిచ్చినట్లే నేను
పుచ్చుకున్నట్లే... ఇదిగో అని ఓసారి చెయ్యివేశారు అంటే ఎంత మర్యాదగా మాట్లాడుతారో
చూడండి, ఎంత అందంగా మాట్లాడుతారో చూడండి ఇవతలవారు చిన్నబుచ్చుకోకుండా చక్కగా ఓసారి
అలా మాట్లాడేసి ఆయన బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు, వెళ్ళిపోతే ఆ దేవతలందరూ కూడా
అన్నిసంఘాలు చూసి
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అన్నారటా తత్
ద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరమ్ ! ప్రశశంసుః సురాః సర్వే సిద్ధా శ్చ
పరమర్షయః !! దేవతలు సిద్ధులూ అందరూ అన్నారటా రెండవ దుష్కరమైన కర్మ చేశావు
అన్నారటా... మరి మొదటిదేమిటీ పర్వతం సముద్రంలోంచి పైకొస్తే చెయ్యిపెట్టి
వెళ్ళిపోయారు తప్పా అక్కడ ఆగలేదు మొదటిది ఇది ద్వితీయమైతే మరి ప్రథమదేమిటీ ఇయేష
అసలు సంకల్పం చేయడం గొప్పది, అసలా వెళ్తానన్న సంకల్పం చాలా గొప్ప. వెళ్తాన్న
సంకల్పమున్నా మేరు పర్వతం లాంటిది ఎదురొస్తే దిగకుండా ముట్టుకుని వెళ్ళిపోవడం
రెండో గొప్ప. ఇప్పుడూ ఆయన వెళ్ళిపోయారు హనుమా, ఇంద్రుడొచ్చాడు రెక్కలతో
నిలబడిందిగా మరి పర్వతం ఇప్పుడు తన రెక్కలు కత్తిరించేయద్దూ పైకి లేచింది కాబట్టి
ఇంద్రుడన్నాడటా... హిరణ్యనాభ శైలేన్ద్ర పరితుష్టోఽస్మి తే భృశమ్ !
అభియం తే ప్రయచ్ఛామి తిష్ఠ సౌమ్య యథా సుఖమ్ !! ఓయి నాయనా! బంగారు శిఖరములు
కలిగినటువంటివాడా... నీవు నేను చంపుతానన్న భయం ఉన్నా... రెక్కలు పోతే పోయాయి కాని
రామ కార్యంమీద వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలని పైకిలేచి ఆకాశంలో నిలబడి హనుమకి
ఆతిథ్యమిస్తాను అన్న కారణానికి నీ రెక్కలు నేను తరగను నీ రెక్కలు నీకుంటాయి
అన్నాడు. ఇప్పుడేమైంది రామ కార్యం కాదు రామ కార్యం మీద వెడుతున్నవాడికి సాయం
చెయ్యడం కాదు సాయం చేస్తానంటే, ఇంత తేనె తాగండీ అన్నందుకు రెండు పళ్ళు తినండీ అన్నందుకు ఉన్న రెక్కలు
నిలబడ్డాయి, మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలొచ్చాయి ఇక రామ కార్యం మీద
వెళ్ళినవాడు ఏం పొందాలి రాముడి కౌగిలింత పొందుతాడు ఇది హనుమ యొక్క
గొప్పతనం.
కాబట్టి ఇప్పుడు అటువంటి స్థితిని పొందారు
ఇందులో దుష్కరం అన్నప్పుడూ సాధనా పరంగా ఉన్నప్పుడు పెద్దలు ఒక విషయం చెప్తుంటారు
మేరు పర్వతాన్ని ఆయన కాదన్నాడు మేరు పర్వతమంటే బంగారు శిఖరం మామూలుగా బంగారానికి ఉండేటటువంటి
లక్షణమేమిటంటే లోబత్వాన్ని కల్పిస్తుంది. ఇప్పుడూ ఇంటికెళ్ళి ఉత్తరీయం
ఉందనుకోండి తీసేసి చమటపడితే ఏదో గుమ్మంలో పాడేస్తాము లేదా చైర్లో అవతల పాడేస్తాము,
రుద్రాక్షలు తీసి అలా గుమ్మంలో పాడేయను తీసుకెళ్ళీ ఓ బీరువాతీసి ఓ చెస్క్ తీసి
దాని పక్కన ఉన్నటువంటిది ఓ పళ్ళెంలాంటిది తోసి అందులో పెడుతాం భద్రంగా ఏం ఎందుకూ
రుద్రాక్షలపై భక్తి ఉంటే బాగునే ఉండు కానీ దాన్ని బంగారంతో చేయించాము అది దాని
లోభత్వము, కదా బంగారము
లోభకారకము బంగారము ఎప్పుడు దాచుకుందామంటుంది. అందుకే భగవాన్ రమణుల దగ్గరికి
వచ్చి ఒకాయనా అన్నారు డబ్బుకట్ట
తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి అక్కడ పెట్టారు ఆయన అన్నారు ఏమిటిదీ అన్నారు ఉంచుకోండి
అన్నారు ఉంచుకుని ఏం చేయను తిననుగా అన్నారు అంటే అదేంటండీ తినకపోవడమేమిటండీ తింటే
ఉపయోగపడాలి తినంది నాకెందుకూ మీకేమైనా కావాలంటే తీసుకెళ్ళిపోండి అన్నారు, అనీ...
మరి ఏం తీసుకుంటారు అదిగో ఆయన ఎవరో రెండు పళ్ళు తీసుకొచ్చారు పళ్ళుంటే ఏమధ్యాహ్నమో ఎప్పుడో తింటాను ఆ పళ్ళు చాలు
నాకెందుకు ఈ డబ్బు అన్నారు.
ఒకాయన బంగారు పెన్ను తెచ్చిచ్చారు రాసుకోండి
అన్నారాయన నాకొద్దు అన్నారాయన ఏం అన్నారు నాకు రిఫిల్ʼవి చాలా
ఉన్నాయన్నారు. నీవు ఇప్పుడిచ్చి ఏమంటావో తెలుసా మళ్ళీ వచ్చేయేడాది వచ్చి నా బంగారం
పెన్ను బాగుందా అంటావు నేను దాన్ని దాయలేను నావల్లకాదు. ఇదా ఎవడూ తీసుకెళ్ళడు
కాబట్టి నాకు ఇది చాలు అన్నాడు. మహానుభావుడండీ... భగవాన్ రమణుల దగ్గరికొచ్చి
ఇంకోయన అడిగాడు ఏమని ఒక పెద్ద ట్యాంకు కట్టిద్దామనుకుంటున్నాను
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఆశ్రమానికి
వచ్చినవాళ్ళకి నీళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎన్ని లీటర్ల కెపాసిటీ ట్యాంక్
కట్టిస్తే బాగుంటుందంటారు మీరేమీ
చెయకుండా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే బాగుంటుందన్నారాయన బ్రహ్మజ్ఞానమంటే అది
సద్గురువు అంటే అది కాబట్టి ఆయన మహానుభావుడయ్యాడు ప్రాథస్మరనీయులయ్యారు
సజీవగురువయ్యారు ఆయనా. కాబట్టి ఇప్పుడు రామ కార్యం మీద వెడుతున్నటువంటివాడికి
ఆతిథ్యం ఇస్తామన్న కారణానికి ఉన్నరెక్కలు నిలబడ్డాయి అంటే రామ కార్యం ఎంత గొప్పదో
చూపిస్తున్నారు మహర్షి. ఇందులోనే లోభకారకాన్ని తిరస్కరించడం, తిరస్కరించామన్నమాట
వేరు దానియందు మోహం లేకుండా ఉండగలగడం ఇది చూపిస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే నేను
మీకు దానికి సరియైన ఉదాహరణ చెప్పాలి అంటే...
త్యాగరాజ స్వామి ఆయన భిక్షాటనకి వెడితే ఆయన ఏమీ
పుచ్చుకోడు అని చెప్పి ఆయనేం చేశాడంటే ఎంతో సంతోషంగా కీర్తన పాడుకుంటూ
వెళ్ళినప్పుడు ఆయన యొక్క జోళిలో బంగారు కాసులు వేశారు. వేస్తే ఆయనేం చేశారంటే
ఇంటికి తీసుకొచ్చి చూశారు. చూస్తే అందులో బంగారు కాసులున్నాయి అయ్యెయ్యో... అన్నం
అపవిత్రమైపోయింది. ఇది బంగారు కాసులని పెంటకుప్పమీద పోసేసి “నిధిచాల సుఖమా రాముని
సన్నిధి చాలా సుఖమా” అని కీర్తన చేశారు. రామ కృష్ణ పరమ హంసా ఏమిటో ఈయ్యనా
డబ్బులొద్దు డబ్బులొద్దు డబ్బులొద్దు అంటాడూ ఈయన సంగతేమిటో చూద్దామనీ ఆయన తలగడాకింద
ఓ రూపాయి కాసు పెట్టారు వివేకానందులవారు రూపాయికాసు పెట్టారు చూద్దామని, రామ
కృష్ణపరమ హంసా పడుకోవడానికి వెళ్ళారు లోపలికి
వెళ్ళి ఆయన తల్పం మీద పడుకుని తలగడ మీద తలపెట్టి లేచి మంటలు మంటలు అని
అరిచారు, ఏమైందని శిష్యులు లోపలికి పరుగెత్తుకొచ్చి ఏమిటి మంటలు అన్నారు, ఇందులో
ఏమైనా డబ్బుపెట్టారా ఏమిటీ నా ఒళ్ళు మండిపోతుంది అన్నారాయన. చూస్తే రూపాయి కాసుంది
తీసేశారు. లోభకారకాన్ని జయించడమంటే ఏమిటో తెలుసాండీ... మొట్ట మొదట ఈశ్వరార్చన ప్రారంభంచేసినప్పుడు
ఈశ్వరునికోసమని మొదలుపెడుతాడు. కానీ అది ఏమైపోతుందంటే... మెల్లిమెల్లిగా
ప్రారంభంలో మొదలుపెట్టింది గుర్తుంపుని కోరుకోవడం మొదలు పెడుతుంది. పాలవాడు
వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడనుకోండి పాలావాడు ఈయన మహాభక్తుడనుకోవాలని గట్టిగా
చదువుతాడు శ్లోకాలు ఎందుకనీ పాలవాడు కనిపిస్తే నీకేమొస్తుందంటే వచ్చేనెలలో
రేటుపెంచడమేమైనా అనే ఉద్దేశ్యమో పాలు చిక్కగా పోస్తాడనే ఉద్దేశ్యమో..? కొంచెం
గట్టిగా శ్లోకాలు చదువుతాడు. ఒక్కొకడు అపార్ట్ మెంటులో పూజ చేశాడనుకోండి తప్పు
పట్టనుకానీ మొత్తం అపార్ట్ మెంటు అంతా పూజ చేసుకోవచ్చు అలా ఉంటుంది పూజ.
ఒక్కొక్కడు పూజ చేశాడనుకోండి ఆ తరువాత భార్య
గంటన్నరసేపు తుడవాలి ఆ పూజా మందిరాన్ని నీళ్ళు అక్షతలు పువ్వులు అన్నీ చేసేసి
ఏనుగు స్నానం చేసేసినట్లు వెళ్ళిపోతారు, ఈశ్వరుని మూర్తులు అలాగే ఉంటాయి అన్ని
చేసేసి అంత అల్లరి చేసేసి వెళ్ళిపోతాడు. పూజ చేస్తే మా గురువుగారు చేస్తుంటే
ముచ్చటేస్తుంది. పూజ చేసేముందు పదార్థాలన్నీ కుడిపక్కనుంటాయి పూజ అయిపోయిన తరువాత
పదార్థాలన్నీ పరికరాలన్నీ ఎడం పక్కకు వెళ్ళిపోతాయి ఏవీ
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
పూజ చేశాక
కుడిపక్కకు ఉండవు పాలు అభిషేకం చేస్తే కుడిచేతి వైపునుంచి తీసి ఇలా అభిషేకం అలా
ఎడం పక్కన పెట్టేస్తాడు. అన్నీ కలిపి చక్కగా ఓ పెద్ద పాత్రలోకి సర్దేసి చేతి
గుడ్డతో అక్కడ చేతులు తుడిచేసుకుని వెళ్ళిపోతారు. మీరు
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
తరువాత దర్శనం
చేసుకోవడానికి వస్తే అగరత్తులతో ఒక్క పువ్వుల చేత అలంకరింపబడిన స్వామి నివేదన
పళ్ళెంలో పళ్ళు కూడా అంత ఉబ్బిడిగా పెట్టి ఉంటాయి. ఆపిల్ పండు మీద స్టిక్కర్
ఉందనుకోండి... స్టిక్కర్ తో నైవేధ్యం ఎప్పుడూ పెట్టరు నైవేధ్యం చేసేముందు ఆపిల్
పండుమీద స్టిక్కర్ కూడా తీసేసి నైవేధ్యం చేసేస్తారు. నీవు తింటే తింటావా స్టిక్కర్
మరి ఈశ్వరుడికి ఎలా పెట్టావు స్టిక్కర్ తో వాడు అమ్ముకోవడానికి పెట్టాడు స్టిక్కర్
నీవు నైవేధ్యానికి నీవు పెట్టడమేమిటీ స్టిక్కర్ తీసేసి పెడుతాడు. ఆయన పూజ
చేసుకుంటూంటే కుడిచేతి పక్కన ఏమీ ఉండవు మీకు ఇవ్వడానికి తీర్థం తప్పా ప్రసాదం
తప్పా మీకు ఇవ్వడానికి ఏమీ ఉండదు. మళ్ళీ మీ చెయ్యి కడుక్కోవడానికి మీ దగ్గర ఉన్న
ఆచమన పాత్ర మిగిలినవన్నీ ఆయన పట్టుకెళ్ళిపోతాడు అందం.
అంటే చేయడం కాదు చేయడంలో కౌశలం చేయడంలో ఒక సోబబు
అది అదీ ఈశ్వరునియందు నిష్ఠతోచేసే పూజ, అది తనలో తాను రమించడానికి ఏకాంతంగా
చేసుకుంటాడు తప్పా పదిమంది చూడాలి పదిమంది బాగాపూజా దురంధరుడని తెలుసుకోవాలని
చేసేటటువంటి పూజాలా ఉండకూడదు. లోభాన్ని జయించగలిగి ఉండాలి ఈశ్వరార్చన ఎప్పుడూ కూడా
మీరు భగవంతుని విషయంలో ఉండేటటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడో తెలుసాండి నీకు జీతమిచ్చే
అధికారైనా కూడా నమస్కారం సార్ ఈశ్వరుడి గురించి ఓ రెండు మాటలు చెప్పారనుకోండి
ఎవడైనా ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తాడు, ఇంతపైనున్న తను తలవంచి ఆయన పాదాలు
పట్టుకుని నమస్కారంచేస్తారు మీరు
వద్దూ అనాలి తప్పా మీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సంతోషంతో నేనేమీ
దాన్ని విమర్ష చేయడంలేదు డబ్బిస్తారు బట్టలిస్తారు ఇంకోటిస్తారు ఇంకోటిస్తారు
ఏమౌతుందో తెలుసా... ఒకచోట మీరు, నేను ఎవ్వర్నీ విమర్షించుటలేదూ అని మీరు
గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది నేను ఎవర్నీ విమర్షించడం నా ఉద్దేశ్యం కాదు. ఒకచోట
సుందర కాండ చెప్తే ఓ యాభైవేలు ఇచ్చారనుకోండి ఇంకోచోట సుందర కాండ మొదలు పెడితే
వాళ్ళు యాభైవేలు ఇచ్చారు వీళ్ళు ఎంతిస్తారో అని ఉంటుంది. సుందర కాండ చెప్తుండగా
అయ్యా మీకు పదివేలు ఇస్తున్నానన్నారనుకోండివాళ్ళు, వాళ్ళు యాభైవేలు ఇచ్చారు వీడికి
అరవైఎనిమిది సర్గలు పూర్తిగా చెప్పడమేమిటీ అనేభావన వస్తే... అలా అనుకోకుండా
చెప్పగలిగితే అదృష్టమే... అయ్యా
రామ కథ చెప్పుకున్నవాడికీ రామ కార్యం మీద వెళ్ళినవాడికీ రాముడి విషయంలో మాటసాయం
చేసినవాడికి కాలిపోయిన రెక్కలూ యవ్వనమూ వచ్చాయి నీవ్వేం ఇవ్వగలవు నాకు దాంతో
సమానంగా రాముడు చాలు రామ కార్యం చాలు నీవేం ఇస్తాం అని అనగలిగిన నోరు కలిగినవాడిని నీవు గెలవడానికి
మార్గం నీకు తెలిసుండాలి.
నాకేం కావాలయ్యా రాముడే నావాడై ఉన్నప్పుడు నీవు
నాకేమిస్తావు నీకు నేనిస్తా రామానుగ్రహం అందిస్తా నీకు నీవు కూడా పైకిరా నీవు కూడా
వృద్ధిలోకిరా నీవు నేను ఇద్దరం కలిసి రామ కార్యం చేసుకుందాం చాలు మన జీవితాలకి ఇంక
ఇంతకన్నా ఏం కావాలండీ నన్ను నీవు నిన్ను నేను గౌరవించుకోవడానికా రాముడు అడగక్కరలేదయ్యా
ఇద్దరూ కలిసి రామ సేవ చేద్దాం రా ఇద్దరం రామ కోటి రాయిద్దాం ఇద్దరం రామ కథ చెప్తాం
ఇద్దరం సంతోషిద్దాం ఇహము నీవు లోభకారకాన్ని జయించగలిగివాడై ఉండు, లేకపోతే
ఏమైకూర్చుందంటే క్రమ క్రమంగా క్రమ క్రమంగా క్రమ క్రమంగా ప్రతి చిన్న విషయమును కూడా
సత్ కార్యమునకు బిరుదుకు వీటికి కట్టుబడిపోతుంది, కట్టుబడిపోయి ఎప్పుడు అటువంటివి
కోరుకుంటుంది మనస్సు ఇదేమైపోతుందంటే చివరికీ విద్యని అమ్ముకోవడం కింద
వెళ్ళిపోతుంది ఆ స్థాయిని పొందకుండా తన లక్ష్యమైన ఈశ్వరున్ని చేరుకోవాలన్ని
ఉద్ధేశ్యం ఉంటే అసలు వీటి గురించిన పట్టింపు మీకు ఉండకూడదు. త్రికరణశుద్ధిగా నీవు వాటిని
కోరకూడదు త్రికరణ శుద్ధిగా నీ సంకల్పం ఎప్పుడు ఎలా ఉండాలంటే రామ కథ చెప్పుకోవడం నా
జన్మకి చాలు ఇంక ఇంతకన్నా ఏమిటండీ అని ఇప్పుడు కాదు నా జీవుడు జన్మలు
మారినా రక్షిస్తుంది ఇదే రక్షిస్తుంది. ఇదీ ఎక్కువైనకొద్దీ వీడు ఎప్పుడు
చచ్చిపోతాడాని చూస్తుంది అది నా
ఆత్మని ఉద్దీపన చేస్తుంది అని నీవు అనుకుంటే చాలు అది లోభకారకాన్ని నీవు జయించగలవు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఇది జయించడానికి
హనుమ ఏ మార్గాన్ని అనుసరించారో నీవు కూడా ఈశ్వర ప్రస్తానమునందు ఈ మార్గమును
అనుసరించు, మనకు నేర్పుతుంది సుందరకాండ కాబట్టి ఇప్పుడు రెక్కలు నిలబడ్డాయి ఆయన
ముందుకి వెళ్ళిపోతున్నారు హనుమా, ఏమైనా బాదుందా అయ్యో బంగారు పర్వతము ఓసారి దిగితే
బాగుండు ఎదర శ్రావణ మాసం వస్తూంది ఓ చిన్న ముక్కిస్తే పోయేది చేయిస్తే బాగుండు
సువర్చలకి అని ఆయనేమైనా అనుకున్నాడా అలా పుచ్చుకోకుండా మళ్ళీ అంతః మధనం పడిపోకూడదు సంతోషంగా వెళ్ళిపోగలగాలి.
పొద్దున్నే చెప్పానుగదా ద్వైతం పుచ్చుకుంటే రెండుమాట్లు ఆలోచించు లేకపోతే తీసి
అవతలపారై ఇచ్చేస్తే ఒక్కసారే అసలు ఆలోచన ఉండకూడదు ఇచ్చేటప్పుడు అంత నిర్మలంగా అంత
భక్తితో ఉండాలి అందుకే మహాపురుషులైన వారి జీవితాలు మీరు చూడండీ పరమ నిరాడంబరంగా
ఉంటాయి, పరమ నిరాడంబరంగా వాళ్ళు ఎంతో తృప్తితో బ్రతుకుతుంటారు. ఎంత తృప్తితో
ఉంటారో ఎందుకా తృప్తీ అంటే వాళ్ళకొక్కటే ఈశ్వరుడు నావాడు ఇంక నాకింతకన్నా నాకేం కావాలన్న
తృప్తివాళ్ళది అది సాధించుకుంటే జీవితంలో అంతకన్నా మనుష్యజన్మకి ప్రయోజనం
లేదు కాబట్టి అయం వాతాఽఽత్మజః శ్రీమాన్ ప్లవతే సాగరోపరి ! హనూమాన్నామ
తస్య త్వం ముహూర్తం విఘ్నమ్ ఆచర !! ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు ఆ
మిగిలినటువంటి ఇతర సిద్దులు సాధ్యులు మొదలైనటువంటివాళ్ళు ʻసురసాʼ అనబడేటటువంటి
నాగమాతతో చెప్తున్నారు.
అమ్మా అయం వాతాఽఽత్మజః శ్రీమాన్
ప్లవతే సాగరోపరి సముద్రం మీద వెళ్ళిపోతున్నారు, ఆయన పేరు హనుమా హనూమాన్నామ తస్య త్వం
ముహూర్తం విఘ్నమ్ ఆచర కొద్దిగా ఒకసారి అసలు అంత శక్తితోనూ వెళ్ళగలరా వెళ్ళలేరా
ఏదీ అమ్మా ఒక పరీక్షపెట్టి చూడు ఒక విఘ్నం ఒకటి ఇవ్వు ఆయనకి, ఇస్తే ఏం చేస్తాడో
చూద్దాం రాక్షసం రూపమ్ ఆస్థాయ సుఘోరం పర్వతోపమమ్ ! దంష్ట్రా కరాళమ్ పిఙ్గాక్షం
వక్త్రం కృత్వా నభ స్సమమ్ !! బలమ్ ఇచ్ఛామహే జ్ఞాతుం భూయ శ్చాఽస్య పరాక్రమమ్ !
త్వాం విజేష్య త్యుపాయేన విషాదం వా గమిష్యతి !! నీవు భయంకరమైనటువంటి రాక్షస రూపాన్ని పొంది
“దక్షప్రజాపతి యొక్క కూతురు సురసా నాగమాత”, నీవు భయంకరమైన రాక్షస రూపంతో
పర్వతాకారంతో ఆయన దారికి అడ్డుగా నిలబడు నిలబడి ఆయనకి విజ్ఞాన్ని కల్పించు ఏం
చేస్తాడో చూద్దాం బలాన్ని చూపిస్తాడా రోషాన్ని చూపిస్తాడా బుద్ధిబలాన్ని
చూపిస్తాడా ఆయన ఎలా ప్రవర్తిస్తాడూ అన్నదాన్ని చూద్దాం, కాబట్టి అమ్మా ఏదీ
ఒక్కసారి ప్రతిబంధకాన్ని కల్పించు అన్నారు. ఇది మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది
పైకి చూడ్డానికి ఏంటండీ రాక్షసులెవరైనా చేస్తే అర్థముందికాని నాగమాత సురసని వీళ్ళే
అలా ప్రేరేపించడమేమిటండీ, పూవ్వులు కురిపించినవాళ్ళే ఇలాంటి పనులు చేస్తే రామ
కార్యానికి వాళ్ళు అడ్డురాలేదాని కాదు, ఒక్కొక్కసారి కించిత్ బాధపెట్టి శాశ్వత బాధ
తొలగిస్తారు, మీరు చూడండి పోలియో వ్యాక్సిన్ అని ఇస్తారు రోగ నిరోధక ప్రక్రియ
పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పోలియోను మీకు కల్పించగలిగిన క్రిమిని మీ
శరీరంలోకి పెడతారు అందుకే ఫ్రిజ్ లో పెడతారు కదాండి అది చచ్చిపోకుండా పోలియో
వ్యాధిని కల్పించగల క్రిమిని జాగ్రత్తగా ఫ్రిజ్ లో పెట్టి దాన్ని మీ శరీరంలోకి ఎక్కిస్తారు
ఎక్కిస్తే శరీరంలో ఉండేటటువంటి రక్త కణాలు ఆ పోలియో క్రిమితో యుద్ధం చేస్తాయి
యుద్ధం చేసి దాన్ని చంపేస్తాయి చంపేసినప్పుడు జ్వరమొస్తుంది, టీకా వేయించుకుంటే
జ్వరమొస్తుంది, ఒక్కరోజు జ్వరమొస్తుంది కానీ ఎప్పుడైనా పోలియో క్రిములు
లోపలికెళ్ళాయనుకోండి వాటిని ఎలా చంపేయ్యాలో రక్తకణాలకు అలవాటౌతుంది ఇక జీవితంలో
పోలియో రాదు. రెండు రోజులు పిల్లాడికి జ్వరమొచ్చినా ఫర్వాలేదుకానీ పోలియో వచ్చి
అంగవైకల్యం రాకుండా ఉండడం మంచిది కదూ శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని
కించిత్ ఇబ్బందిని కల్పించినట్లు, ఎదరెదర ఈయ్యనకి చాలా బుద్ధిబలం అవసరమౌతుంది శరీర
బలంతో పాటు గొప్ప బుద్ధిబలం కూడా అవసరమౌతుంది.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అటువంటి
బుద్ధిబలాన్ని ఈయ్యనయందు ప్రవేశపెట్టి చూపించడం కోసం ఒక్కసారి అమ్మా విజ్ఞాన్ని
కల్పించు చూద్దాం అని వాళ్ళందరూ కోరితే ఆతల్లి ఒక పెద్ద రాక్షసీ స్వరూపంతో
వచ్చింది అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మమాఽఽననమ్ నాకు నీవు దేవతలచేత ఇయ్యబడినటువంటి ఆహారానివి
కాబట్టి నిన్ను నేను భక్షిద్దామనుకుంటున్నాను నీవు నా నోటిలోకి ప్రవేశించు ఆయన
బుద్ధిబలానికి పరీక్షపెట్టిందావిడ ఇప్పుడు ఏవమ్ ఉక్తః సురసయా ప్రాజ్ఞలిః
వానరర్షభః ! ప్రహృష్ట వదనః శ్రీమాన్ ఇదం వచనమ్ అబ్రవీత్ !! ఇక్కడ మీరు
గుర్తించవలసింది ప్రహృష్ట వదనః శ్రీమాన్ మంచి సంతోషముతో జవాబు చెప్తున్నారు,
బంగారు శిఖరాలు కనపడినప్పుడు కాదని వెళ్ళిపోవడం తేలికా తనను బాధపెట్టేటటువంటి
రాక్షస స్వరూపము ఎదురుగుండా నిలబడి నీవు నా నోట్లోకి రా అంటే... అయ్యబాబోయ్ ఆ
బంగారం శిఖరం మీద కసేపు కూర్చుంటే గొడవదిలిపొయ్యేదేమో ఇదేంటీ, ఎందుకో ఈవిడొచ్చింది
అప్పుడు మోహం లేకుండా ఉండడం
ఎంత గొప్పదో ఇప్పుడు ఖేదం లేకుండా ఉండడం కూడా అంతే గొప్పది మోదం ఖేదం రెండూ
లేకుండా ఉండాలి కదాండీ! అప్పుడు దీన్ని కూడా గెలిచినట్లు కాబట్టి ఇప్పుడు
ఆవిడా నీవు నా నోట్లోకి రా అంటే ప్రహృష్ట వదనః శ్రీమాన్ “శ్రీమాన్” అంటారు
మహర్షి. మంచి ప్రహృష్టమైనటువంటి వదనంతో అంటే సంతోషము లోపల ఉన్నది బయటికి
వ్యక్తమైంది ఎందుకనీ పూతం పెడితే గదాండి బంగారానికి వన్నొచ్చేది, రామ కార్యం మీద
వెడుతున్నప్పుడు ఇటువంటి ప్రతిబంధకాలని కాదని వెడితే కదాండి సంతోషం వీటిని
గెలిస్తేగదా ఏదీ లేకపోతే ఇంకేది చేసేదేముంది ఎవ్వరైనా చేస్తారు కాబట్టి ఆయన ప్రహృష్ట
వదనః శ్రీమాన్ ఇదం వచనమ్ అబ్రవీత్ ! రామో దాశరథి ర్నామ ప్రవిష్టో దణ్డకా వనమ్ !
లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాఽపి భార్యయా !! అథ వా మైథిలీం దృష్ట్వా రామం చాఽక్లిష్టకారిణమ్ !
ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే !! అమ్మా! నేను రామ కార్యం మీద వెడుతున్నానమ్మా.
అమ్మా రామో దాశరథి ర్నామ ఎక్కడ రామ కథ
సంక్షిప్తంగా చెప్పాలో ఎక్కడ రామ కథ విశృతంగా చెప్పాలో అలా చెప్తారాయన దశరథ
మహారాజు కుమారుడైనటువంటి రామ చంద్ర మూర్తి దండకారణ్యంలో సీతా సహితుడై లక్ష్మణ
సహితుడై ప్రవేశిస్తే ఆయన భార్యని ఒక రాక్షసుడు అపహరిస్తే, అపహరించిన కారణంచేత ఆ
సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి వెళ్తున్నానమ్మా... అథ వా మైథిలీం దృష్ట్వా
రామం చాఽక్లిష్టకారిణమ్ సీతమ్మ జాడ కనిపెట్టి రామ చంద్ర మూర్తికి చెప్పి వచ్చి నీ
నోట్లోకొచ్చేస్తాను. అంటే ఆవిడందీ ఏవమ్ ఉక్తా హనుమతా సురసా కామ రూపిణీ ! అబ్రవీ
న్నాఽతివర్తేన్ మాం కశ్చిత్ ఏష వరో మమ !! నాయనా ఇది నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినవరం
నా నోట్లోకి వెళ్ళితే తప్పా నీవు వెళ్ళలేవు అంది,
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
అయితే అమ్మా నోరు
పట్టేద్దురు నోరు తెరు అన్నారు ఇద్దరూ పందెమేసుకున్నారు ఇయ్యన పెరుగుతున్నారు ఆవిడ
పెరుగుతుంది ఆఖరికి ఆయనేం చేశారు దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమమ్ !
సుసంక్షిప్యాఽఽత్మనః కాయం బభూ
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
వాంగుష్ఠ మాత్రకః !! ఒక్కసారి బొటనవేలంత అయ్యిపోయారు, చిన్న స్వరూపమైపోయి నోట్లోకి కదా వెళ్ళమంది
నా నోట్లోకి రమ్మంది ఒక్కసారి నోట్లోకెళ్ళి బయటికొచ్చేశారు,
వచ్చేసి అన్నారు అమ్మా నేను నోట్లోకి రమ్మన్నావు వచ్చేశాను వచ్చి బయటికొచ్చేశాను
అమ్మా నేను వెళ్ళిపోవచ్చుగా... ప్రవిష్టోఽస్మి హితే వక్త్రం
దాక్షాయణి నమోఽస్తు తే ! అమ్మా నీకొక నమస్కారంమమ్మా దాక్షాయినీ గమిష్యే
యత్ర వైదేహీ సత్యం చాఽఽసీద్వరమ్ తవ ! అమ్మా నేను ఇప్పుడెల్లి సీతమ్మజాడ
కనిపెట్టివస్తాను ఇక నేను బయలుదేరి వెళ్ళిపోవచ్చా నీకోక నమస్కారం, ఆవిడందీ అర్థ
సిద్ధ్యై హరి శ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యథా సుఖమ్ ! సమాఽఽనయస్వ వైదేహీం
రాఘవేణ మహాత్మనా !! నాయనా! ఎంత బుద్ధిబలంరా తండ్రీ నీదీ నోట్లోకి రా అంటే వచ్చి బయటికి
వెళ్ళిపోయావు కాబట్టి ఇదే బుద్ధివైభవంతో సీతమ్మజాడ కనిపెట్టి సీతారాములన్ని ఒకటి చేసినవారు
హనుమా అన్న కీర్తిని శాశ్వతముగా గడించెదవుగాకా... వెళ్ళిరా నా తండ్రీ అంది ఆవిడా
అంటే ఆయన ముందుకు వెళ్ళిపోయాడు.
ఇప్పుడు దేవతలన్నారూ తత్ తృతీయం హనుమతో
దృష్ట్వా కర్మ సుదుష్కరమ్ ! సాధు సాధ్వితి భూతాని ప్రశశంసు స్తదా హరిమ్ !! ఇప్పుడు
మూడవ దుష్కరమైన కర్మ చేశారు హనుమా అన్నారు ఏమిటి మూడవ దుష్కరమైన కర్మ, ఒకటి ఇయేష
సంకల్పం ఇంకొకటి బంగారు పర్వతాన్నికాదని వెళ్ళగలగడం ఇప్పుడు మూడవది ఈవిడ
భయపెట్టింది భయపెట్టి ఎదురుగుండా వచ్చి నిలబడింది అంటే అమ్మబాబోయ్ అనిపించేటటువంటి
సందర్భం కానీ ఆయన ఏం బెంగపెట్టుకోలేదు లోపలికి వెళ్ళి పైకొచ్చాడు అది బ్రహ్మగారి
వరం నా నోట్లోకి వెళ్ళి రాకుండా వెళ్ళలేవంది ఆవిడ అంటే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తు
పెట్టుకోవాలి మీరు
చేసేటటువంటి పనికి పుణ్యముగా మార్చి పుణ్యమువలన ఫలితాన్ని నేను పొందుతాను అనే ఆ
సంకల్పం ఎప్పుడూ మంచిదికాదు. ఎందుకో తెలుసాండీ పుణ్యమౌతుందండీ ఏమౌతుంది
పుణ్యమైతే ఒక సుఖాన్ని మీకు ఇస్తుందది అది మారిందనుకోండి పుణ్యం అది సుఖం కింద
వస్తుంది ఇప్పుడు పాపంగా మారిందనుకోండి దుఃఖం కింద వస్తుంది దుఃఖంతో ఉన్నవాన్ని
ఇనుప గొలుసులతో కట్టినట్టు సుఖంతో ఉన్నవాన్ని బంగారు గొలుసులతో కట్టినట్లు బంగారు
గొలుసులతో కట్టబడ్డవాడు ఇనుప గొలుసులతో కట్టినవాన్ని చూసి ఒరేయ్ నిన్ను ఇనుప
గొలుసులతో కట్టేశాడురోయ్ అన్నారనుకోండి. వాడన్నాడు దేంతో కడితే ఏమిటి నిన్నూ
కట్టేశారుగా అన్నాడు. ఆ బంగారు గొలుసులతో కట్టబడితే ఏమిటి గొప్ప, బంగారు గొలుసులతో
కట్టబడ్డాడు అని ఓ కీర్తి అంతే.
కట్టబడ్డాడాలేదా మీరు చేసేటటువంటి కర్మ మీరు చేసేటటువంటి పని పుణ్యంగా మారి
ఆ పుణ్యం మిమ్మల్ని రక్షించాలని కోరకూడదు, ఎందువల్లో తెలుసాండీ అది జన్మ
పరంపరను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది పైగా పుణ్యం అంటూ వస్తే దాన్ని
అనుభవించడానికికొక శరీరం కావాలా అప్పుడు నేను పుణ్యమొకటే చేస్తానండీ, ఏం పుణ్యం వ్యయమైపోతుంది,
అప్పుడు పాపం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించద్దూ ఇప్పుడు ఆ పుణ్యమూ నాకొద్దు పాపమూ
నాకొద్దు రెండూ నాకొద్దు అన్నాననుకోండి చేసేది చేసేసి ఉమా పరబ్రహ్మార్పణవస్తు అని
నన్ను వాడుకున్నందుకు కృతజ్ఞతలు అన్నారనుకోండి ఈశ్వరుడు ఎంత సంతోషిస్తాడు
చూడండీ... ఇప్పుడు మీకు రావలసి జన్మలు ఇంక, ఈశ్వర ప్రీతికి హేతువౌతున్నారు, ఆ ఈశ్వర ప్రీతి కర్మలు చిత్త
శుద్ధితో చెయ్యగా చెయ్యగా... జ్ఞానావిర్భావమునకు కారణమౌతుంది, ఆవిర్భవించిన
జ్ఞానము పునరావృత్తిరహిత శాశ్వతశివసాహిద్య స్థితికి చేరిపోతారు, జ్ఞానమువలన మాత్రమే మోక్షము, జ్ఞానము,
చిత్తశుద్దితో కూడిన కర్మలవలన సాధ్యము. కాబట్టి కర్మ చిత్త శుద్ధితో
ఎందుకుచెయ్యాలండీ అంటే జ్ఞానం కోసం చెయ్యాలి. మీరు ఒకటి ఉదాహరణ చెప్పితే బాగా
పట్టుకుంటారు అన్నమొండుతుంటారు, అన్నవండేటప్పుడు కుక్కర్ శుభ్రంగా కడిగేసి అందులో
ఏదో డబ్బాడు బియ్యం పోస్తే రెండు డబ్బాలు నీళ్ళుపోస్తే దానికి మూత పెట్టేటప్పుడు
గ్యాస్ కట్ట జాగ్రత్తగా పెట్టి దానిమీదపెట్టి బాగా తిప్పిచూసి కదల్టంలేదని రెండు
హ్యండిల్సూ సరిగా వచ్చాయాలేదాని చూస్తారు చూసి దానిమీద ఓసారి చెయ్యి అడ్డుపెట్టి
చూసి ఓసారి ఓ చిన్న దెబ్బకొట్టి చూసి ఎక్కడ్నుంచైనా నీళ్ళు రావట్లేదు నమ్మకం
చేసుకుని ఇప్పుడు దాన్ని తీసి గ్యాస్ స్టౌ మీద పెట్టి ఓ ఇరవై నిమిషాలు పోయిన
తరువాత కంచం పెట్టేసుకుని కుక్కర్ దింపేద్దామని చూశారు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఉడికిందా అన్నము
ఉడకదు లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజా అన్నపుమెతుకుగా ఉడిగించగలిగినదేది
అగ్నిహోత్రము మీరు అగ్నిహోత్రాన్ని వెలిగించి కుక్కర్నిపెట్టి కూర్చున్నారనుకోండి
నీవు లోపల లెక్కపెట్టుకోకపోయినా ఒక డబ్బాతో పోసిన ప్రతి బియ్యపు గింజా నీటితో కలసి
తప్తమై అన్నము మెతుకులుగా మారిపోయినది నీవు దింపుక తినచ్చూ ఈల వేస్తుంది కదా...
అప్పుడు మీరు స్టౌ కట్టేసి అన్నం తినేస్తారు, అగ్నిహోత్రం ఎప్పుడు ప్రతి బియ్యపు
గింజనీ అన్నపు మెతుకుగా చేసిందో మీకు చెప్పాలా..? మీకు చెప్పక్కరలేదు కాని ఎప్పుడు
ఉడకదు వెయిట్ పెట్లేదనుకోండి ఆవిరంతా పైకిపోతుంది మీరు తాళమేసుకొని ఈలోగా గుళ్ళోకి
వెళ్ళివస్తానని వెళ్ళొచ్చేస్తే ఇదంతా పైకి కొట్టేస్తుంది ఆవిరి మెతుకులుకూడా పైకి
కొట్టేస్తాయి కదాండి. ఒక్కొక్కసారి కుక్కర్ పై ప్లేటు ఊడిపోయి ఎగిరిపోతుంది కింద
వేడెక్కువైతే మీరు చెయ్యవలసినటువంటి కర్మ కుక్కర్ని జాగ్రత్తతో అమరికతో కుశలంతో
అందంగా పెడితే ఎప్పుడు మీరు పెడితే అన్నమైందో మీకు తెలియదు అన్నమయ్యింది అలా మీరు
చిత్తశుద్ధితో కర్మ చేసుకుంటూ వెళ్తే ఒకనాడు జ్ఞానం ఆవిర్భవిస్తుంది.
ఎప్పుడావిర్భవించింది అది ఎవ్వరూ చెప్పలేరు దానికి ముహూర్తాలుండవు ఏ పంచాంగంలోనూ
ఉండవు అకస్మాత్తుగా ఈశ్వరుడిస్తాడు ఆ జ్ఞానాన్ని అది ఇస్తే ఏమౌతుందో తెలుసాండీ
మిగిలినవి కుక్షింభక్ష విద్యలు అంటే కడుపు నింపుతాయి. ఇదేం చేస్తుందంటే...
ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే ఈ జ్ఞానం శివానుగ్రహంగా
వస్తుందీ అని అందుకే పరమ శివుడు ఒకడే యమధర్మరాజుని తంతాడు మన్మథున్ని కాల్చుతాడు.
మళ్ళీ పుట్టడానికి కారణమైన కాముడి బాణం పడదు మళ్ళీ చావవలసిన రీతిలో యమధర్మరాజుగారి
పాశం పడదు. పుట్టుక చావు లేకుండా ఉండగలిగిన జ్ఞానమేదో ఆ జ్ఞానమును మీకు
ఈశ్వరుడిస్తాడు ఆ జ్ఞానమును ఎప్పుడిస్తాడో తెలియదు.
ఆ
జ్ఞానమిచ్చాడా ఏం కనపడుతుందో తెలుసాండీ! సత్యవస్తు దర్శనమౌతుంది నామ రూపాలు కనపడడం
మానేస్తాయి అప్పటివరకూ పైన వస్తువులు కనపడ్డాయి ఇప్పుడు వస్తువులు కనపడవు ఈశ్వరుడు
కనపడుతాడు. అంతటా ఈశ్వరుడే
అన్ని చోట్లా ఈశ్వరుడే ఆ కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాని స్థితి చాలా
విచిత్రంగా ఉంటుంది అయ్యబాబోయ్ ఏమిట్రా ఆయనా పిచ్చోడా ఏమిటీ అనుకుంటాం. ఆయన జ్ఞానం
మనకు అర్థం కాక ఆయన మనకు పిచ్చోడిలా మనకి కనపడుతాడు ఆయన విషయంలో మనం
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
పిచ్చోళ్ళము,
వీళ్ళేమిట్రా సంసారంలో ఇలా కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళకి ఎప్పటికి బుద్దొస్తుందా
పిచ్చోళ్ళకీ అని ఆయన అనుకుంటాడు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మనం పిచ్చోళ్ళ అని
మనం అనుకుంటాం ఒకరికి ఒకరు పిచ్చోళ్ళం, తప్పా ఆయన పిచ్చి నిజంగా జ్ఞానం ఆ పిచ్చి
మనకు ఎక్కితే మనం అదృష్టవంతులం. ఆ పిచ్చిరావాలి అది శాస్త్రంలో చాలా గమ్మత్తైన
విషయం అది ఆ స్థితి వచ్చిందనుకోండి ఇప్పుడు అభిషేకం చేస్తుంటాం మనం అభిషేకం
చేసేటప్పుడు అని నమః చోరాయచ న్మశ్శష్ఫ్యాయచ ఫేన్యాయచ నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ
వృక్షాయచ మంత్రం చెప్పేస్తుంటాం. అందులో అదో దరిద్రం నోటికి వచ్చిందంటే
గడగడగడగడ చెప్పేస్తుంటాం పదార్థం, పదార్థం తర్వాత గంగాజలం కూడా పోయం పూజైపోయింది,
అభిషేకంమైపోయింది, అభిషేకం చెయ్యడం కర్మ చిత్తశుద్ధితో చేసిన కర్మ జ్ఞానంగా మారడం
అంటే ఏమిటో తెలుసాండీ నమః చోరాయచ దొంగ
ఈశ్వరుడిగా నీకు కనపడాలి, దొంగ దొంగగా కనపడాలి, దొంగ రూపంలో ఈశ్వరుడొచ్చాడని నీకు కనపడాలి అలా కనపడితే
జ్ఞాన మొచ్చినట్లు లెక్కా అంతటా ఈశ్వరుడు కనపడాలి అంతేగాని మా అబ్బాయిలో కనపడుతున్నాడు
మా ఆవిడలో కనపడుతున్నాడు మా పక్కివాళ్ళలో కనపడులేదనరాదు. అంతటా ఈశ్వరుడు కనపడాలి,
కనపడితేనే జ్ఞానం.
నాకు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం వస్తూంటుంది
భగవాన్ రమణులు ఎప్పుడూ నా ఆశ్రమం అని అనేవారు కాదు, నా ఆశ్రమమమేమిటీ భక్తుల ఆశ్రమం
నేను అందులో ఉన్నాను అనేవారాయన, అంతేగాని గంట కొడితే వెళ్ళి కూర్చునేవారు
భోజనానికి తప్పా ఆయన వెళ్ళి భోజనం చేయడం అలాంటివేమీ ఉండేవి కావు బ్రహ్మజ్ఞాని
బ్రహ్మజ్ఞానే. కాబట్టి ఆయన లోపల తలుపులు గడివేసుకుని లోపల ఉన్నారు అంతేవాసులు లోపల
పడుకున్నారు ఆయనకి మంచాలు కుంచాలు లేవు కటికనేల చాప పడుకుంటారు, పడుకుంటే
దొంగలొచ్చారు లోపల ఏమైనా ఉన్నాయోమోనని వాళ్ళు తలుపు కొట్టారు తలుపు కొడితే
కిటికిలోంచి చూసి ఆయన అన్నారూ ఎవరు మీరు అన్నారు వాళ్ళన్నారు మేము దొంగలం అన్నారు
రండి స్వాగతం అని తలుపు తీశారాయన, అంటే ఛీ ఛీ ఛీ మాకో జాంబ్ స్యాటిస్పాక్షన్ ఏంటీ
ఆ తలుపు తీయడం వేసేసి అరవండి దొంగలు దొంగలు అను మేము తలుపులు బద్దలు కొట్టుకుని
లోపలికి వస్తాం. ఆయన అన్నారు వద్దూ ఎందుకలాగా నేనెం అరవను మీరు ఈశ్వరులు రండీ
మీకేమైనా కావాలా ఇదిగో ఇవి ఉన్నాయి మా దగ్గర మీ కేమైనా కావాలంటే తీసుకోండి
అన్నారు. అంటే వాళ్ళన్నారు బుద్ధిహీనుడా పిచ్చాడువా ఏంటీ? అరవాలి దొంగలు దొంగలని
అంతేగాని తీసుకోమంటేవేమిటీ తలుపేసుకో అన్నారు అంటే పోనీ మీకేమైనా తృప్తా అన్నారు,
అలాగే వేసుకుంటాను రండి అన్నారు వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేసుకుని వచ్చారు,
పారిపో అన్నారు ఎందుకన్నారాయన పారిపోవాలి దొంగలన్ని చూస్తే అన్నారు నేను అలా
పారిపోను నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడుమీలో అన్నాడు మిమ్మల్ని చూస్తూ నిల్చుంటాను
అన్నాడు బుద్దుందా లేదా నీవు పారిపో అప్పుడు మేము ఎత్తుకుపోతాము అన్నారు అందుకని
మాకు దొంగతనం చేసిన తృప్తి ఉంటుంది. మేము ఏదైనా పట్టుకెళ్తే మామూలుగా
పట్టుకెళ్ళకూడదు కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకుండాలి అందుకని పారిపో
అన్నారు, అంటే మీ తృప్తికి వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతా అన్నారు అలా పారిపోవడాలు
నేనేం చేయను అని ఆయన వెళ్ళిపోయారు, ఆలా పారిపోతున్న వాళ్ళని కొట్టి తీసుకొపోతే
మాకు సంతోషం అందుకని ఓ దుడ్డుకర్రతీసి నడుస్తున్నటువంటి రమణుల యొక్క కాళ్ళమీద
కొట్టారు కొడితే ఇంతంత బొబ్బలు వచ్చాయి కాళ్ళమీద ఆయనా నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ
వెళ్ళి కూర్చున్నారు అరుగుమీద.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
శిష్యులు
ఏడుస్తూ... ఏముంటాయండీ అందులో చాప అవీనూ... ఛీ ఛీ మరీ ఇంత అన్యాయమేమిటని
వెళ్ళిపోయారు పైగా తృప్తికూడా లేదు ఏమిటో ఈ మనిషికూడా పిచ్చాడిలాగని వెళ్ళిపోయారు,
ఆ చుట్టూ ఉన్నవారు అన్నారూ భగవన్ ఊఁ... అనండీ ఛావ గొట్టేస్తాం వాళ్ళని మిమ్మల్ని
కొట్టడమా ఇంతంత తట్లు తేలిపోయాయి కదాండీ అన్నారు. రమణులు అన్నారూ నాలుకానాదే పళ్ళూనావే అన్నం తినేటప్పుడు నా
నాలుక నా పళ్ళకుంద పడితే నా పళ్ళు పీకేసుకోనా అన్నాడట. అబ్బెబ్బే ఎలా
పీకేసుకుంటారు మన పళ్ళు కదా అందుకు ఓర్చుకోవడమే అన్నారు. ఆ సర్వేశ్వరుడే
దొంగరూపంలో వచ్చాడు ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు. మీరు పూలు
తెచ్చివేసినప్పుడు ఎంత తృప్తో వాళ్ళు కర్రలు పెట్టి కొట్టినప్పుడూ అంతే తృప్తి
అన్నారు ఆయన బ్రహ్మజ్ఞాని కదాండీ. స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు అది
నోటితో చెప్పినంత తేలికకాదు అది ద్వందాతీత స్థితినుండి అంతటా బ్రహ్మమునే చూడగలగటం అలా చూస్తే నమః
చోరాయచ జ్ఞానంగా మార్చింది నమః చోరాయచ గురించి నీవు ఆలోచిస్తూ ఈశ్వరా
నీవు దొంగలాగా కూడా ఉంటావాయ్యా... న్మశ్శష్ఫ్యాయచ అని అనుకుంటూ అభిషేకం
చేసి చేసి చేసి అంతటా ఆ బ్రహ్మమునే చూసి రమించిపోయేటటువంటివాళ్ళ ఆనందం వేరుగా
ఉంటుంది వాళ్ళ స్థితీ మీకు ఆ కన్నులలో కనపడుతుంది.
మనకు ఆవు కనపడుతుంది ఆయన ఇలా ఎడం చెత్తో ఇలా ఆవు
ముఖాన్ని దగ్గరగా పట్టుకుని మనందర్లో తన బిడ్డల్నీ ఈశ్వరున్ని చూసుకుంటూ సంతోషంగా
ఇలా చూస్తూ తెల్లగడ్డంతో అలా నిలబడిన భారతీ తీర్థులు మీకు కనపడ్డారనుకోండి, ఆయన్ని
చూసేటప్పటికి అసలు ఆ ఆవుని ఎడం చేత్తో ఇలా పట్టుకుని మిమ్మల్ని చూస్తున్న ఆ
వాత్సల్య మూర్తి యందు మీకు ఎంత ఆనందం కనపడుతుందో. ఒకసారి చూడండి అటూ ఎలా
చూస్తున్నారో ఆయనా... వీడు చెప్తున్నాడు రామాయణం అంటే ఎలా చెప్తున్నాడోయని, అది
వారి యొక్క తృప్తి ఆనందం
అంతటా బ్రహ్మమును చూడగలిగిన రమించగలిగిన స్థితి కన్నులలో వ్యక్తమౌతుంది.
కాబట్టి ఇది చూడడం చాలా గొప్ప విషయం అదే గొప్ప అంత తేలిక విషయం కాదు ఇది
ఎక్కడ్నుంచి వస్తుందంటే చిత్తశుద్ధితో కూడిన కర్మాచరణము వలనా... మీరు కర్మ చేసి
నాకు పుణ్యం వచ్చిందనుకోండి దిక్కుమాలిన పుణ్యంకింద ఉంటుంది అది ఏం చేస్తుంది ఏమీ
చేయదు ఎవడో పట్టుకొచ్చి ఒక గోలుసేస్తాడు. ఏం చేస్తారు చచ్చిపోయిన తరువాత తీసి
అవతలకు పారేస్తారు ఉంటుందా ఏమిటీ పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు. ఆఖరికి
తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని పంచెలు ఉండనీయ్యండి ఓ 6 గజాలో 8 గజాలో చైను గుడ్డు
తీసుకొచ్చి శరీరం మీద పాడేసి చెంబుతో కూడా పోయరు బిందెత్తి పోసేస్తారు తల నుంచి
పాదాలవరకు.
పోసేసి తాడు అది పట్టుకొచ్చి గట్టిగా వేసి
కట్టేస్తారు బొంత కర్రలకి కట్టేసి వల్లకాడికి తీసుకెళ్ళిన తరువాత బట్టతీసి అవతలకి
పాడేస్తారు చాకలి పట్టుకుపోతాడు ఏది నీవు పట్టుకుపోయేది తల్లి గర్భమునుండి
ధనముఁదేఁడెవ్వఁడు, వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు, లక్షాధికారైన లవణ మన్న మెకాని,
మెఱుఁగు బాంగారంభు మ్రింగబోఁడు, విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని, కూడబెట్టిన
సొమ్ము గుడవబోఁడు, పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి దానధర్మము లేక దాఁచి దాఁచి,
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ? తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు? భూషణ శ్రీ
ధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర కాబట్టి ఎవరికి కావాలయ్యా పుణ్యం. ఈశ్వరానుగ్రహం
చాలు నాకు మాకు మరు జన్మ వద్దు మేము
సుందర కాండ ఇరవై
తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
ఎంత తొందరగా
అటువైపుగా అడుగువేస్తాం అన్న స్థితికొరకు ఉత్సాహంతో ఈశ్వర కార్యం ఎందుకు
చేస్తున్నావ్ చేయకుండా ఉండలేక, పొద్దున్నే పేపరెందుకు చదువుతావయ్యా... చదవ కుండా
ఉండలేక కాఫీ ఎందుకు తాగుతావు తాగకుండా ఉండలేక, కాఫీ తాగందేకానీ ఏదీ నడవదండీ మనకూ
అంటాడు మనకంటాడు వాడికి, మనల్ని కూడా కలుపుతాడుదాంట్లోకి కాబట్టి అదెందుకు
తాగుతున్నావంటే తాగకపోతే నడవదుగనుక. మరి ఈశ్వరుడు ఊరికే వెళ్తున్నాను మరి
వెళ్ళకుండా ఉండలేను వెళ్ళు అంతేగాని వెళ్తే పుణ్యమొస్తుందని వెళ్ళకు, అన్నిటికీ
బేరమే దిక్కుమాలిన బేరము, ఈ బేరము ఉండకూడదు నిష్కామముగా చేయడానికి లోపల్నుచి
రావాలి అది చిత్తశుద్ధీ ఇది లోపలికెళ్ళిపోయింది. చిత్తశుద్ధితో కర్మాచరణ చేస్తే
జ్ఞానావిర్భావమునకు కారణమౌతుంది. ఇదీ ఈ అనుగ్రహమే రేపు సీతమ్మలో రాముడు కనపడుతాడు, విశ్వమునందు విశ్వనాథుడు
కనపడుతాడు అద్వైత దర్శనమౌతుంది భవిష్యత్ బ్రహ్మమౌతాడు మహానుభావుడౌతాడు.
దీనికి కారణం ఎక్కడుందో పట్టుకుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలో అందుకని అది
ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి అత్మ సౌందర్యమును ఉద్దేపింపజేసిన సుందర కాండ.
కనుకా ఇప్పుడు మూడవ దుష్కరమైన కార్యమును చేశాడు ప్లవమానం
తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ ! మనసా చిన్తయా మాస ప్రవృద్ధా కామ రూపిణీ !!
ఆయన ఆకాశంలో అలా వెళ్ళిపోతుంటే ఆ సముద్ర జలాల్లో పడుకున్నటువంటి సింహికా
అనబడేటటువంటి ఒక రాక్షసి చూసింది అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యా మ్యఽహమ్ ఆశితా ! ఇదం హి
మే మహత్ సత్త్వం చిరస్య వశమ్ ఆగతమ్ !! ఎంతో కాలంగా ఒక పెద్ద ప్రాణి దొరకాలని
చూస్తున్నాను ఒక పెద్ద ప్రాణి ఒకటి ఎగురుతుంది ఆకాశంలో ఇప్పుడు నేను దీన్ని
తింటాను అని తిర్య గూర్ధ్వమ్ అధ శ్చైవ వీక్షమాణ స్తతః కపిః ! దదర్శ స మహత్
సత్త్వమ్ ఉత్థితం లవణాఽమ్భసి !! తత్ దృష్ట్వా చింతయా మాస మారుతి ర్వికృతాఽఽననం ! కపి రాజేన
కథితం సత్త్వమ్ అద్భుత దర్శనమ్ !! ఛాయా గ్రాహి మహావీర్యం తదిదం నాఽత్ర సంశయః ! ఆయన వెంటనే అనుకున్నాడు ఓ... నేను
బయలుదేరుతున్నప్పుడు సుగ్రీవుడు నాతో చెప్పాడు దక్షిణ సముద్రంలో నీడ పట్టి
లాగగలిగినటువంటి ప్రాణి ఉందీ అని చెప్పాడు ఇదే, అందుకనీ నా గమన శక్తి కుంటుబడింది
వెళ్ళలేకపోతున్నాను, ఇది నన్ను పట్టుకుంటుంది నన్ను వెళ్ళనీయట్లేదు అది ఈయన్ని
తినడం కోసమని పెద్ద నోరు తెరిచింది.
ఎంత పెద్ద నోరంటే వక్త్రం ప్రసారయా మాస
పాతాళాఽతర సన్నిభమ్ ! ఘన రాజీవ గర్జంతీ వానరం సమఽభిద్రవత్ !! ఓ పేద్ద గర్జన చేస్తూ పాతాళము ఎలా ఉంటందో అంత
నోరు తెరిచింది తెరిచి ఎగిరి ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది వెంటనే సంక్షిప్య
ముహుః ఆత్మానం నిష్పపాత మహాబలః మళ్ళీ చిన్న శరీరాన్ని పొందారు పొంది ఒక్కసారి
దాని శరీరంలోకి వెళ్ళి దాని యొక్క మర్మాయవాలన్నీ కూడా తన గోళ్ళతో తెంచేశాడు
తెంచేసి మళ్ళీ అంతేవేగంతో పైకి ఎగిరాడు యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర యథా
తవ అలా పైకి వచ్చేసిన హనుమను చూసి ఆ దేవతలందరూ ఎంతో సంతోషించారు. సింహికా తన
ప్రాణము కోల్పోయి తన శరీరమును నీటిమీద తేలిపోయింది, ఇప్పుడు నాలుగో దుష్కర్మని ఆయన
సాధించాడు ఇదీ “సింహికా భంజనము” అంటారు. ఈ సింహికా భంజనమును చాలా జాగ్రత్తగా
అర్థము చేసుకోవచ్చు. చిత్తశుద్ధి కొరకు పుణ్య కర్మ ఇదీ చిత్తశుద్ధి కొరకో
పుణ్యంకోసమో అసలు చెయ్యడమంటూ మొదలు పెట్టడం తేలికా... మీ ఇంట్లో ప్రతిరోజూ దీపం
పెట్టండీ మీకు మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని నేను అన్నాననుకోండి మీరు దీపం
పెడుతారు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మనందరం చందనం
తీద్దాం కాబట్టి రేపు పొద్దున రండీ అన్నాననుకోండి అందరూ వస్తారు చందనము తీస్తారు,
మీ అందరూ అపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
ఈ శ్లోకం చెప్తాను, ఈ శ్లోకం చెప్పండి చెప్పేటప్పుడు మాత్రం కోతిని గుర్తు
చేసుకోకండి అని నేను అన్నాననుకోండి, అదే మీకు గుర్తుకొస్తుంది మీరు చూడండి, నేను ఈ
శ్లోకం చెప్పిస్తాను ఎవ్వరికీ కోతి గుర్తుకు రాకూడదు చెప్పేటప్పుడు అన్నాననుకోండి ఆపదామప
హర్తారం అని నేను అనగానే ఆపదా... గుర్తు రాదు కదా... గుర్తు రాదు కదా... అదే
గుర్తొస్తుంది. నిషిద్ధ కర్మ అంటే ఏది చెయ్యెద్దని వేదమందో అది చెయ్యకుండా ఉండడం
కష్టం ఏది చెయ్యమని చెప్పిందో అది కొంతైనా చేయడం విధి. పొద్దున్నే స్నానం చేయ్
తొమ్మిదింటికైనా చేస్తాడు పోని పన్నెండింటికన్నా చేస్తాడు చేయకపోతే పోని కనీసం
సాయంత్రం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను వేసవి కాలం కనుకా... అసలు చేయకుండా
ఉండరు ఏదో స్నానమంటూ చేస్తాడు ఒరే నాయనా అస్తమానం నీవు ఇదే పని చేస్తుండకురా...
అన్నాననుకోండి అది నా బలహీనతండని వెళ్ళిపోతాడు నిషిద్ధ కర్మ వద్దూ అన్న పని
చెయ్యకుండా ఉండలేకుండడం చాలా కష్టం. చాలా చాలా కష్టమండీ అసలు అందరూ దెబ్బెక్కడ తింటారంటే...
వద్దూ అన్నపనిని చెయ్యకుండా ఉండలేరు, టీవీ చూడకు అన్నాననుకోండి చూడకుండా
ఉండడమంటే ప్రాణం పోయినంతపని యుద్ధమే వస్తుంది ఆయన్నుంచి, ఎంత దిక్కుమాలిన పని
పెట్టాడురా వీడు అని, ఏమీ చెయ్యెద్దు శివా శివా శివా శివా అంటూ ఓ గంట కూర్చో
అన్నాననుకోండి గడియారం పట్టుకెళ్తారు రూంలోకి మీరు చూడండి ఎందుకో తెలుసా కళ్ళు
మూసుకుని శివా శివా శివా శివా అంటూ ఏమౌతుంది మహా అయితే గంటన్నర అవుతుంది అంతేకదా
కాని ఒక్కనాటికి అనడు అని ఒసారి ఇలా చూసుకుంటుంటాడు, ఎందుకనీ అంటే కష్టం
నిషిద్దకర్మని మీరు దాటలేరు చాలా చాలా కష్టమండీ నేను మీకూ... ఉన్న విషయాన్ని బాగా
అర్థమౌవడం కోసమో బాగా గుచ్చి గుచ్చి మాట్లాడటానికి కారణం అదే. మనిషి తరించేది
దేనివల్లో తెలుసాండీ అసలు వద్దన్న పని మానేయడం వద్దన్న పని మానేస్తే... చెయ్యమన్న
పని చెయ్యడం వినా ఇంకో మార్గముండదు.
మీరు చూడండి ఎందుకో తెలుసా... మీరు శరీరాన్ని ఆపగలరు మనసుని
ఆపలేరు, శరీరాన్ని నీవు గుడికెళ్లద్దు అని కూర్చోబెట్టవచ్చు ఆపగలరు మనసుని
ఆపండి ఎక్కడికైనా వెళ్ళకుండా మీ తరం కాదు అది తిరుగుతుంది, ఇప్పుడసలు మీరు
చెయ్యెద్దన్నపన్లు ఆపేశారనుకోండి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒప్పుకున్న పనికోసం
తిరుగుతుంది, దానికి ఏమీ చేయకుండా అది ఉండలేదు కాబట్టి ఏం చేస్తుంది. పోల్లే
గుళ్లో పొమంటున్నాడుగా ఆగుల్లో అక్కడే నలుగురు కనపడుతారు ఏదో అక్కడే కాసేపు
ఎవర్నైనా పలకరించి వద్దామని అప్పుడు ఆ గుళ్ళోకి పోతాడు. అప్పుడు చెయ్యమన్నపనిమీదకి
ఎప్పుడు వెడుతుందంటే చెయ్యెద్దన్నపని ఆపగలిగితే, చెయ్యోద్దన్నపని ఆపలేకనే రాజ్యాలు
పోయాయి ఐశ్వర్యాలు పోయాయి తరాలు నశించిపోయాయి వంశాలు పతనమైపోయాయి తపస్సు చేసి
ఊర్ధ్వలోకాలకి వెళ్ళిన పదేసి తరాలు కిందపడిపోయాయి, ఎందువల్ల చెయ్యకూడని పని
చెసినటువంటివాళ్ళు వంశంలో ఒక్కడు పుట్టడం వల్లా... ఒక్కడు చెయ్యకూడని పని చేస్తే,
చెయ్యవలసిన పనులు ఎంతో నియమాలతో కష్టపడి సాధించుకున్న పితృదేవతలు పది తరాల వాళ్ళు
ఢాం అని కిందపడిపోతారు. ఒక్కడు లాగేస్తాడు అంతే ఎక్కడం చాలా కష్టం కిందపడిపోవడం
చాలా తేలికా అందుకే మీరు చూడండీ చిన్న తనంలో ఒక ఆట ఆడిస్తుంటేవారు జారుడు బల్లా
అని ఒక ఆటుండేది, జారుడు బల్లా ఆడేవాన్ని ఏం చేస్తారంటే ముందు ఇటువైపునుంచి మెట్లు
కడుతారు, అటువైపునుంచి జారేందుకు కడుతారు. వీడేం చేస్తాడంటే ఇటునుంచి కష్టపడి
మెట్లెక్కుతాడు అక్కడికి ఎక్కి ఏం చేస్తాడంటే కూర్చుని పట్టు వదిలేస్తాడు అంతే
కిందకి జారిపోతాడు మళ్ళీ పైకి ఎక్కాలంటే ఇటునుంచి ఎక్కలేడు ఎందుకంటే జారేవాళ్ళు
అడ్డొస్తారు. అందుకని ఇటునుంచి ఇటు పరుగెత్తీ మెట్లెక్కుతాడు ఎక్కి జారిపోవడానికి
చూస్తారు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మీరు చూడండి
జారిపోయేవాళ్ళు ఉంటారు వాళ్ళు జారిపోయే వరకు ఉండి తను జారిపోతాడు ఎక్కడం కష్టం
జారిపోవడం తేలిక జీవితంలో. తాతగారు పిల్లాన్ని పార్కుకి తీసుకెళ్ళి కసేపు ఆడిచ్చిన
తరువాత నీకు ఏమర్థమయ్యిందిరా..? అదే లక్ష్యం ఇట్నుంచి ఎక్కావు ఎక్కేటప్పుడు
పట్టుకుని ఎక్కావు అటునుంచి జారిపోవడానికి పట్టుకోవలసింది పట్టుకోకుండా వదిలేస్తే
చాలు జారిపోయావు, జారిపోవడం సుఖంలా అనిపిస్తుంది కానీ ఎక్కడమే గొప్ప. జారిపోయినవాడు ఎక్కడ మొదలు
పెట్టాడో అక్కడే ఉంటాడు ఎక్కినిలబడ్డవాడు అక్కడికన్నా ఎత్తులో ఉంటాడు
ఎక్కినిలబడ్డం నేర్చుకో జారిపోవడం నేర్చుకోకని నేర్పుతాడు అందువల్ల జారుడు
బండ ఆడిస్తారు పిల్లల్నీ. ఇప్పుడు పిల్లని ఆ ఆటలే ఆడించరు, ఇదీ నిషిద్ధ కర్మల పట్ల
చెయ్యవద్దూ అన్నపనిని చెయ్యకుండా ఉండగలిగిన ప్రజ్ఞ దేనివల్ల వస్తుందంటే మీరు మీ
మనసుకి అటువంటి సాధనని ఇవ్వగలిగితే... అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసాండీ...
దీన్ని కాల పరిమితికి గుర్తిస్తారు కొంతమంది ఏదో ఒక దీక్షా స్వీకారము చేసి ఏదో
ముప్పైరోజులో యాభై రోజులో నలభైరోజులో చేసి కొన్ని నియమాలకు కట్టుబడుతారు, కాని
నియమాలకు కట్టుబడినప్పుడు ఎలా ఉంటారంటే ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూస్తుంటారు.
ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూసి నియమం అయిపోగానే వెల్లువెత్తినట్టు బజారుకు
వెళ్ళిపోయారనుకోండి ఏమీ ప్రయోజనం ఉండదు దానివల్లా చేసేటటువంటి నిషిద్ధ కర్మకి
లొంగుబాటుకి ఎంత తొందరగా వస్తుందాని మెట్లెక్కినట్లుందది, మీరు నిషిద్ధకర్మను విడిచిపెట్టడం ఎలాగా అన్నది
నేర్చుకోవడం కోసం దీక్ష స్వీకరించారు, దీక్షలో ఉండగా మీరు ఎలా ఉన్నారో అలా మిగిలిన
జీవితంలో కూడా ఉండగలిగితే మీరు ఆ వ్యామోహాలకు వశులు కాలేరు అన్నది
నేర్చుకుని ఇప్పుడు ఉండగలిగిన పూనికి అప్పుడు తెచ్చుకోవాలి అంతేకాని ఇప్పుడొక్కటే
ఉండిపోయి అప్పుడు జారిపోదామంటే కాదు అందుకని అది ఏం చేస్తుందంటే అది లాగి
గుంజేసుకుంటుంది నిషిద్ధ కర్మ చాలా చాలా కష్టం చెయ్యమన్న పనిని చేయడం నిషిద్ధకర్మ
దేవుడెరుగు ఏదో ఒకటి చేయడం ఎవడైనా చేస్తారు, ఏవో తులసీదళాలు పట్టుకెళ్తాడు ఏమీ
చేయకపోయినా తువ్వాలు కట్టుకుని అగరత్తులు పట్టుకుని వెళ్తాడు.
ఎదో పాపం ఈశ్వరుడికి ధూపంలేదు ఏడుస్తున్నాడు అని
చెప్పి ఏదో అగరత్తులు తిప్పేసి అక్కడ పెట్టేస్తే... అక్కడితో ఆ గొడవ వదిలిపోతుంది,
అరటి పండు పూర్తిగా వొలిస్తే మళ్ళీ తినడానికి ఉండదు పాడౌతుంది, అందుకని గిల్లేసి
పెట్టేస్తే రాత్రి మనం తినేసేయ్యచ్చు. గిల్లేసి ఓ అరటిపండు పెడతారు అది పూర్తిగా
దాని భావన తెలిస్తే... వేరుగా ఉంటుంది. నివేదనా అనేటటువంటిది. భగవాన్ రమణులు
ఎందుకో నాకు వారే బాగా స్మరణలోకి వస్తున్నారు ఇవ్వాళ పోనిలేండి మహాపురుషుల స్మరణ
ఎప్పుడూ మంచిదే... రమణుల దగ్గరికి వెళ్ళి ఒకాయనా నైవేద్యం పెట్టడం అంటే ఏమిటీ అని
అడిగారు ఆయన్ని అంటే ఆయన ఓ చమత్కారమైన ఉపమానాన్ని చెప్పారు, వెనకటికి ఒకాయన
భార్యని అన్నాడూ ఒసేయ్ నేను ఇవ్వాళ గణపతి పూజ చేసుకుందామనుకుంటున్నాను అందుకని
కాస్తా చలివిడి అవి చేసి ఇవ్వవే అన్నాడు, అలాగేనండీ అని ఆవిడ చలివిడి తీసుకొచ్చి
అక్కడ పెట్టింది, ఆయనకెందుకు పుట్టిందో బుద్ధి ఆ చలివిడితోటి తెల్లగా ఉందిగదాని
గణపతిబొమ్మని తయారు చేశాడు, చేసి ఇప్పుడు అక్కడ పెట్టి పూజ చేశాడు, నైవేధ్యానికి
ఆవిడని పిలిచి అన్నాడూ ఒసేయ్ చలివిడితో వినాయకున్ని చేసుకున్నాను ఏదైనా
నైవేధ్యానికి ఇయ్యవే అన్నాడు, నీ మొహమోడ్చా ఇప్పుడు చలివిడి ఇచ్చానుగాదా ఇంకా ఏమిటీ
ఏం పెట్టుకుంటావో పెట్టుకో నేను ఇవ్వను అంది ఇప్పుడు ఆయనేం చేశాడంటే వినాయకుడి
బొజ్జగిల్లి చలివిడితో వినాయకుడికి నైవేధ్యం పెట్టాడు.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
చలివిడితోనే
ఉన్నాడుగా వినాయకుడు చలివిడి వినాయకుని బొజ్జగిల్లి వినాయకుడికే నైవేధ్యం పెట్టడం
ఎటువంటిదో ఆయన సృష్టిలోనే ఉన్న సమస్తాన్ని ఆయనకు ఇవ్వడం అటువంటిది. నీవు ఇవ్వడానికి ఏముంది ఆయన చేసిందే, ఆయనది
ఆయనకిచ్చి ఆయన ప్రసాదంగా తినడం దొరతనం, ఆయనది ఆయనకియ్యకుండా చూపించకుండా తినడం
దొంగతనం, ఈ భావన బాగా లోపల పాదుకుంటే చిత్తశుద్ధితో కూడిన కర్మ. కనీసం ఏమీ పోయినా పోనీ ఏదో గంటవాయిస్తున్నాడు
చిత్తశుద్ధి కాకపోయినా ఏదో చేస్తున్నాడు, అసలు అసలు మొదటి మెట్టంటూ ఎక్కేది
అప్పుడు కదా ఐదోమెట్టు ఆరోమెట్టు, వద్దురా అన్న పని చేయడం ఆపడం చాలా కష్టమండీ, ఇదీ
అక్కడ సురసకి నమస్కారం చేశాడాయన అందులోకి వెళ్ళాలి ఆ కర్మలోకి వెళ్ళి చిత్తశుద్ధితో కూడిన కర్మగా
మార్చాలి నాకు ఏ పుణ్యమూ అక్కరలేదు పాపమూ అక్కరలేదు ఈశ్వరా చేయకుండా ఉండలేక
చేస్తున్నాను అనాలి ఇక్కడా చెయ్యకుండా ఉండలేనటువంటి పరిస్థితిని నుంచి
తప్పించుకునీ చెయ్యకుండా ఉండలేనివాడవుతున్నాడు అందుకని దానికి నమస్కారంలేదు ఇంకా
దాని మర్మావయవాలు తుంచేశాడంతే అసలు దాని జోలికనేది ఉండకూడదు అంతే దాని మూలాలు
ఉండకూడదు అసలు దానివైపుకు వెళ్ళకూడదు అసలు అటువంటి ప్రజ్ఞ సంపాదించాలి కాబట్టి
ఇప్పుడు సింహికా భంజనం చేశారు, సింహికా భంజనం చేస్తే ఆ పైన ఉన్నటువంటి దేవతా
సంఘాలన్నీ ధృతి ర్దృతి ర్దాక్ష్యం స కర్మసు న సీదతి ! యస్య త్వేతాని చత్వారి
వానరేన్ద్ర యథా తవ ! ఈ హనుమకి ఉన్నట్టు ఎవరికి ధృతి దృష్టి మతి దాక్ష్యము అన్న
నాలుగు ఉంటాయో అటువంటివాడు తన జీవితంలో ఏకార్యానైనా సాధించగలరు. “ధృతి” అంటే
పట్టుదలతో కూడిన ప్రతిజ్ఞ ఇవ్వాళ సంకల్పం చేసి రేపు మానేయడం కాదు, మీరు చూడండి
కొంత కొంత మందీ చాలా చిత్రమైన సంకల్పం చేస్తారు నేనండీ ఇంక వచ్చే శనివారం నుంచి
సుప్రభాతం విష్ణుసహస్త్రం లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ ప్రతిరోజు చదువుతాని ఇంక
ప్రతి శనివారం రోజు దీపం పెట్టుకుంటాను అంటారు.
అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాడు మొదటి శనివారం
వెళ్ళిపోయి తులసీదళాలు కొనేస్తాడు పువ్వులు కొనేస్తాడు తెల్లవారుఝామున్న అల్లరి
చేసేస్తాడు స్నానం చేసేస్తాడు పట్టుబట్ట ఎక్కడంటాడు లోపలికెల్లిపోతాడు విష్ణు
సహస్త్రనామం ఓ అద్భుతంగా పైకి చదివేస్తాడు, ఆరు ఏడు వారాలు బాగానే ఉంటాడు, ఎనిమిదో
శక్రవారం నాడు ఏమంటాడో తెలుసాండి రేపు తెల్లవారితే దిక్కుమాలిన శనివారం ఆ విష్ణు
సహస్రనామం చదవాలి లక్ష్మీ అష్టోత్తరం చదవాలి ఇవన్నీ చదవడానికి అదే
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
గంటన్నరపడుతుంది
ఇప్పుడు మానేద్దామంటే తిరుపతి గుడినుంచి వెంకటేశ్వర స్వామి చూస్తాడు వీడు
చదువుతాడో లేడో అని
చూస్తున్నాడని అనుమానం, కాబట్టి ఇప్పుడు గట్టిగా అంటే అంత ఏడుస్తూ చదువుతున్నావా
అని తిడుతాడేమోనని భయం చదవడం మానేస్తే చదువుతానని చదవడం మానేశావని ఇంక
అక్కడ్నుంచి కొడుక్కు కొంచెం వొళ్ళు వేడిగా ఉందనుకోండి విష్ణు సహస్త్ర నామం
మానేశాను అందుకే జ్వరమొచ్చిందని అదో భయం అన్నీ దిక్కుమాలిన భయాలే సంతోషంగా
చేస్తాడా మూడు వారాలో నాలుగు వారాలో ఇంక అక్కడ్నుంచి అమ్మ బాబోయ్ ఈ శనివారం విష్ణు
సహస్త్ర నామం బాబోయ్ ఎవడు చేయమన్నాడు ఎవడు చేసిపోతాడు ఈ సంకల్పాలు. ఉత్సాహంతో చేయగలిగితే
చిత్తశుద్ధితో కూడిన కర్మ కానీ నిషిద్ధకర్మలు అలాగ కాదు అసలు ఉత్సాహంతో చేయడం
నిరుత్సాహంతో చేయడం అన్నది ఉండకూదు, అసలు చేయకూడదన్నది ఉండకూడదు దాని
ముఖ్యమే లేదు అసలు ఆ మాటేలేదు ఆ ప్రస్తావనేలేదు ఖుసి ఉండదు అంతే అంతగా
స్పందించగలిగితే మర్మావయవములను త్రుంచివేయుటా కాబట్టి అటువంటి ధృతి దృష్టి మతి
దాక్ష్యము, పట్టుదలా చేయవలసిన పని చేయుటా చిత్తశుద్ధి కొరకు కర్మాచరణమును చేయగలిగి
ఉండుటా ఈశ్వరుని యొక్క పథమునందు ప్రయాణం చేసేటప్పుడు వచ్చేటటువంటి సత్కారములను తన
లక్ష్యాన్ని చేరుకోవడం కోసం విడిచిపెట్టగలుగుటా వద్దు అన్న పనివైపుకు వ్యామోహమును
పొందకుండా ఉండుటా ఈ నాలుగు ఎవరు సాధిస్తారో వారు హనుమ ఏ స్థితిని పొందారో ఆ
స్థితిని పొందుతారు.
ఇప్పుడు ఆయనా ఆ నూరు యోజనములు సముద్రాన్ని దాటి
ఆ దక్షిణ తీరములో దిగారు సాగరస్య చ పత్నీనాం ముఖాన్ అపి విలోకయన్ ! స మహామేఖ
సంకాశం సమీక్ష్యాఽఽత్మానమ్ ఆత్మవాన్ !! ఆయనకి సాగర పత్నుల యొక్క ముఖములుగా కనుపడ్డాయట,
అంటే నదులు సంగమించేటప్పుడు ఆ నదులు సంగమించే చోటా దాన్ని సాగరస్యచ పత్నీనాం అవి
నదీ ముఖములు అని పిలుస్తారు, నదీ ముఖములు సాగరంలో కలుస్తుంటాయి వెళ్ళి. నదీ
ముఖములు కనపడుతున్నాయట నది ఆడది సాగరము పురుషుడు అందులోకి కలుస్తున్న ముఖాలు ఇంక
ఆయనా సీత్మ ముఖాన్ని చూడంకోసం చాలా ముఖాలు చూడాల్సివస్తుంది. ఇక్కడ మొదలు ఒక పత్ని
మొఖం చూడడం చాలా మంది పత్నుల ముఖాలు చూస్తాడు ఎందుకు సీతమ్మ ముఖం కనపడేవరకు అలా
చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ప్రారంభమది అన్వేషణ అది, దీని కొరకు ఆయన వచ్చింది కాబట్టి తత
స్స లమ్బస్య గిరేః సమృద్ధే విచిత్రకూటే నిపపాత కూటే సకేత కోద్దాలక నాళికేరే
మహాద్రి కూట ప్రతిమో మహాత్మా ! స సాగరం దానవ పన్నాగా యుతం బలేన విక్రమ్య మహోర్మి
మాలినమ్ నిపత్య తీరే చ మహోదధే స్తదా దదర్శ లఙ్కామ్ అమరావతీమ్ ఇవ ! ఆయనా అక్కడికివెళ్ళి
మొగలి పొదలు చెట్లు కొబ్బరి చెట్లతో అల్లారుచున్నటువంటి లంబ పర్వతమనే పర్వత శిఖరం
మీద దిగి ఆ త్రికూట పర్వతం యొక్క శిఖరం మీద ఉండి కాంచన లంకా పట్టణాన్ని
చూస్తున్నాడు, ఆ చూస్తున్నటువంటి స్థితిలో హనుమా నూరు యోజనముల సముద్రాన్ని దాటి
క్షేమంగా సంతోషంగా ఆవలి ఒడ్డున దిగారు అన్న శుభవార్త దగ్గర ఇవాల్టి మొదటి రోజు
ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని మీతో
మనవి చేయవలసి ఉంది రామ నామం చెప్పిన తరువాత ఆ విషయాన్ని చెప్తాను. ఎంతోసేపు కాదు
ఒక్క రెండు నిమిషాలు
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
రామ నామము రామ
నామము రమ్యమైనది రామ నామము !!రా!!
నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీ రామ
నామము !!రా!!
నీవు నేనను బేధమేమియు లేక యున్నది రామ నామము
!!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
బ్రహ్మసత్యము జగన్మిథ్యా భావమే శ్రీ రామ నామము
!!రా!!
భక్తితో భజియించువారికి ముక్తి నొసగును రామ
నామము !!రా!!
సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము రామ నామము
!!రా!!
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము
!!రా!!
రాకడయు పోకడయులేనిది రమ్యమైనది రామ నామము !!రా!!
నిర్వికారము నిర్వి కల్పము నిర్గుణము శ్రీ రామ
నామము !!రా!!
కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామ నామము
!!రా!!
జన్మ మృత్యు రహస్యమెరిగి జపించవలె శ్రీ రామ
నామము !!రా!!
పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీ రామ నామము
!!రా!!
పాలు మీగడ పంచదారల తత్వమే శ్రీ రామ నామము !!రా!!
అంబరీశుని పూజలకు కైవల్యమొసగిన రామ నామము !!రా!!
రామ నామ స్మరణ చేసిన క్షేమమొసగును రామ నామము
!!రా!!
సుందర కాండలో సంప్రదాయంలో ఏం చెప్తారంటే రెండు
సిద్ధి సర్గలు నడుస్తాయీ అని చెప్తారు, అందులో ఒక సిద్ధిసర్గా హనుమకి సీతమ్మతల్లియొక్క
దర్శనమైనటువంటి సర్గ. అత్యంత శక్తివంతమైనటువంటి సర్గగా చెప్పబడుతుంది శ్రీరామాయణం
మొత్తంమీద సుందర కాండాంతర్గతమై హనుమకి సీతమ్మతల్లి దర్శనం ఏరోజౌతుందో ఆరోజు
వచ్చేటటువంటి సర్గా చాలా గొప్ప సర్గ. అది చాలా గొప్ప ఫలితాలిస్తూందీని పెద్దల
యొక్క ఉవాచ. అలాగే రెండవ సిద్ధిసర్గ సీతమ్మతల్లి హనుమని చూసినటువంటి సర్గ, ఆవిడ
హనుమని చూశారు, హనుమ సీతమ్మని చూశారు, హనుమ సీతమ్మని చూసింది మొదటి సిద్ధిసర్గ,
సీతమ్మ హనుమచూసింది కూడా సిద్ధిసర్గే అంటారు. కాబట్టి రెండు సిద్ధిసర్గలు, ఈ రెండు
సిద్ధిసర్గలలో మొదటి సిద్ధిసర్గ ఎప్పుడొస్తుందంటే తాత్కాలికంగా నేనువేసిన
అంచనాప్రకారం ఆదివారనాటి ఉపన్యాసంలో బహుషః హనుమకి సీతమ్మతల్లి దర్శనమౌతుంది.
కాబట్టి ఆరోజు చాలా శక్తివంతమైన సర్గ నడుస్తుంది. ఆరోజు సీతమ్మతల్లికి
కుంకుమార్చచేస్తే... విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందీ అంటారు పెద్దలు.
సీతమ్మతల్లికి పూజాంటే సాధారణంగా ఏం చేస్తూంటారంటే...
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
లక్ష్మీసహస్రంతోటే చేయిస్తుంటారు, సీతా సహస్రంతో
పూజచేయడమనేటటువంటిది చాలా చాలా తక్కువ ఎందుకు అంటే అసలు సీతా సహస్రం అనేటటువంటిది,
ఎక్కడ కూడా లభ్యంకావట్లేదుకదాండీ అంటారు చాలా చోట్లా... నేను ఈ విషయాన్ని రామాయణ
ప్రసంగాలు చేసేచోట్లా చాలా చోట్లా విన్నాను. కానీ మా గురువుగారు సీతా సహస్రాన్ని
సంకలనం చేశారు అందుకనీ ఆ సీతా సహస్రనామ స్త్రోతంతో నామాలతో సీతమ్మతల్లి దర్శనం
హనుమకు జరిగేటటువంటి సిద్ధిసర్గ వచ్చేటటువంటి ఆదివారంనాడు సువాసినులకి ఒక
అత్యద్భుతమైనటువంటి మూర్తినిచ్చి రామ చంద్ర మూర్తి యొక్క ఎడమ తొడమీద
కూర్చున్నటువంటి సీతమ్మ అది ఎన్ని సంవత్సరాలకింద ఉన్న మూర్తో... అది సీతారాముల
అనుగ్రహంతోటే బయటికి వచ్చిందని మీరిది నమ్మండి నమ్మకపోండి.
అటువంటి మూర్తినిచ్చి సువాసినులతో సీతా సహస్రంతో
పూజ చేయించాలని, దానికీ రుసుమూ అదేమీలేదు అన్ని సంబారములు మూర్తులను కూడా పీఠంవారే
సరఫరా చేస్తారు. మీరు చెయ్యవలసింది ఏమిటంటే ఆదివారంనాడు దానికి సమయాన్ని చెప్తారు,
అదీ... మీరు అన్నివేళలా చేయాలని చేద్దామన్నా దొరికేటటువంటిదికాదది, రామాయణ
ప్రవచనంలో సుందరకాండ ప్రవచనం అవుతున్నప్పుడు సిద్ధిసర్గవచ్చినరోజున పీఠం
ప్రాంగణమందున అందులో శారదా పీఠంలో అందున సీతమ్మతల్లిని సీతమ్మనామాలతో సహస్రనామార్చన
ఒక సువాసిని చేసుకొనేటటువంటి అదృష్టం పొందడమంటే చాలా అపురూపమైనటువంటిస్థితి, అదీ
అంతతేలికగా ఏం లభించదులేండి, ఎందుకంటే సీతా సహస్రంతోటి పూజ చేసుకోగలరేమో కానీ
శ్రీరామాయణాంతర్గతంగా సుందర కాండ ప్రవచనంలో సిద్ధిసర్గవచ్చినప్పుడు పూజ చేసుకోవడం
కొంచెం కష్టంకదా..? అందుకనీ ఆ మహత్తరమైన అవకాశం ఆదివారమునాడు ఒక ప్రత్యేక
కార్యక్రమంగా రూపకల్పన చేశారు కానీ దీనికి ఒక పరిమితి ఉంటుంది, ఎందుకంటే లోపల
ఉంటుంది పూజ, ప్రాంగణానికో పరిమితి ఉందిగదా దానికి, కొన్ని వేలమందినో కొన్ని
వందలమందినో అది అకామిడేట్ చేయదు, దానికి సంఖ్యాపరిమితి ఉంటుంది కొంతమందికే
ఇవ్వగలరు ఆ టోకెన్సు. అవి రేపు ఉపన్యాసం అయిపోయిన తరువాత ఎవరు ముందు వెళ్ళితే
వాళ్ళకి ఇస్తారు, సువాసినులు మాత్రమే అర్హులుదానికి కాబట్టి పొందినవాళ్ళు సంతోషంగా
చేసుకోండి పొందనివాళ్ళు బెంగపెట్టుకోకండి, పూజ చేసినటువంటి కుంకంలో కొంత కొంత
కుంకాన్ని తీసి ఆ మొర్నాడు దాన్ని మీకు పొట్లాలు కట్టి అందించే ప్రయత్నం చేస్తారు,
కానీ చేసుకోవడం చాలా గొప్పవిషయం నేను అక్కరలేని విషయాలు చెప్పను మంచివిషయాన్ని
ప్రోత్సహించకుండా ఉండను కాబట్టి రేపు సాయంత్రం ప్రవచనం అయిపోయిన తరువాత ఆ
ఇవ్వబడినటువంటి టోకెన్సుని సువాసినులు తీసుకోండి, తీసుకుంటే చక్కగా ఆ టొకెన్సు చూపించి
మీరు రావచ్చులోపలికి ఎందుకంటే ఇన్నివందలమందికిస్తున్నామూ అని అన్నివందలమందికి హాయిగా
కూర్చుని పూజచేసుకునే ఏర్పాటు చెయ్యాలి. చక్కగా అందులో రామ చంద్ర మూర్తికి
పన్నెండు నామాలతో తులసిదళాలతో సీతమ్మతల్లికి సహస్రనామాలతో కుంకుమార్చచేసి మీరు
ధన్యులుకండీ సీతమ్మతల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. దానికి రేపు
సాయంకాలం ప్రవచనం అయిపోయిన తరువాత టొకెన్సు తీసుకుందురుకాని ఈ విషయం మీతో మనవి
చేయడం కోసమే ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది.
హరిప్రసాద్ గారు అంటున్నారూ లోపలైతే తక్కువమంది
పడుతారూ కానీ ఎండవేళ కూడా చేయించచ్చు ఎసి ఉంది కాబట్టి ఇక్కడైతే ఎక్కువ మందికి
అవకాసం ఇవ్వచ్చు కానీ ఎండెక్కితే కూర్చోలేరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మీరు
సాక్ష్యాత్ సీతమ్మస్వరూపాలు కాబట్టి ఎక్కువ మంది చేసుకోవాలీ అంటే... మీరు చల్లగా
ఉన్నవేళలో ఉదయం వచ్చేయాలి ఉదయం వచ్చి చక్కగా పూజ చేసుకుంటే అందంగా చేసుకోవచ్చు.
మీరు ఎక్కువ మంది పూజ చేసుకుందామూ అని ఉత్సాహం చూపిస్తే ఎంతమంది అసలు అటువంటి పూజ
చేసుకుందామనుకుంటున్నారో అలా అడిగానూ అని మీరు ఏమనుకోకుండా మన్నించి నేను అలా
అడిగినందు ఇంకొక భావనతో అనుకోకుండా మీరు నన్ను అలా అనచ్చా అని అనుకోకుండి అంటే
దాన్ని బట్టి ప్రాంగణాన్ని నిర్ణయం చేద్దామని మీరు ఎంత మంది
చేసుకుంటామనుకుంటున్నారో సువాసినులు ఒక్కసారి చెయ్యి ఎత్తితే తెల్లవారుఝామున
పెట్టి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎత్తిన చేతులని బట్టి లోపలికి సరిపోతుందిలే
అనుకుంటే లోపల ఆడిటోరియంలో పెట్టేద్దాం. ఇప్పుడు మీరో నిర్ణయానికి రండి, సరే రేపు
టోకెన్సు ఇచ్చిన తరువాత నిర్ణయాన్ని రేపు ప్రకటన చేస్తారు. దాన్ని బట్టి ఎల్లుండి
ఉదయం ఇక్కడుంటుందా లోపలుంటుందా అన్నది చెప్తారు మీరు ఆ ఇబ్బంది గురికావడం
అక్కరలేదు ఏమ్మా... అందుకనీ ఆ పూజలో పాల్గొనేవారు రాత్రి ఆ టొకెన్సు తీసుకోండి.
సుందర కాండ
ఇరవై తొమ్మిదవ రోజు ప్రవచనము
|
|
మంగళా శాసన
పరైః....